నేరారోపణ

నేరారోపణ

1నెవిల్ సోదరుడా, వందనములు ఇప్పుడు ప్రార్ధనకై కొన్ని నిముషములు నిలువబడుదుము. తలలు వంచుదము. చేతులు పైకెత్తి మీ విన్నపములను తెలియజేయుము. కేవలము దేవునికే, చెప్పుడి, "నేను…" మీరాయనను అడుగు దానిని మీ మనస్సులో నుంచుకొని మీ పూర్ణహృదయంతో నమ్ముడి, నేను కూడా మీ కొరకు ప్రార్థించుచుందును.

2పరమ తండ్రీ, ఈ అంధకార దినమున నీ సన్నిధి మేము వచ్చుటను భాగ్యముగా ఎంచుచున్నాము. దేవుని సూర్యకాంతి ప్రకాశతను కనుగొనుచున్నాము. ప్రజల ద్వారా పరిశుద్ధాత్మ గానము చేయుటను వినుచున్నాను. లోపల కొద్దిపాటి కాంతి మాత్రమే యున్నది. దీని కొరకు నీకు వందనములు. మా హృదయము చుట్టూ సూర్యకాంతికై వందనములు. దానికై ఎంతగానో నీకు కృతజ్ఞతలు చెల్లించవలసియుంది.

ఈ సమాజంలో నీ ప్రజలు నీకై చేతులు చాపియున్నారు. ఈ ఉదయమున నీవు వారి హృదయ వాంఛలను తీర్చుదువని నమ్మి విన్నపములతో నీ యొద్దకు వచ్చి, తండ్రీ, వారి మనవులను గ్రహించుమని నేను ప్రార్థించుచున్నాను. ఎక్కడ చూచిన అనేక మనవులున్నవి. ఈ బల్లపై ఎన్నో పేర్చబడినవి. ప్రజలు రోగము బారినపడి బాధపడుచున్నారు. సుదూరము నుండి ఫోనులు చేస్తున్నారు. రోజుకు సుమారు ఏభై వస్తున్నాయి. ఓ, దేవా, మేమేమి చేయదము? ప్రభువా, మమ్ము నడిపించుము. ఎటు వెళ్ళాలో, ఏమి చేయాలో మాకు తెలియదు, గాని అన్ని విషయములలో నీవు మమ్మును కాపాడగలవు. వాటిని మాకనుగ్రహించుమని నిన్ను ప్రార్థించుచున్నాను. అది మరణ ప్రాయము. నీ ద్వారా మాకెట్టి జీవితము ఇవ్వబడినను దానిని నీ ద్వారా నీవు వాడవలెనని మేము కోరుచున్నాము, తండ్రీ.

ప్రభుని వాక్యము వినుటకై పాటలు పాడుటకై ప్రార్థన అర్పించుటకై ఈ రోజు మేము కూడుకొనియుండగా మమ్ము దీవించుము. ప్రార్ధనాలకించుము. పాటలలో మాకు ఆనందము, నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడుము. యేసు నామమున అడుగుచున్నాము. ఆమేన్. కూర్చొనండి.

3వేచియుండి, ఆకలి - దప్పికలతో నున్న జనులకు జీవాహారమును విరచుటకు వేదికపై నిలబడుట అనునది గొప్ప భాగ్యము, మరి ఎక్కడనూ అటువంటి స్థలము నేను ఎరుగను. ఇది చాలా గొప్ప ఆధిక్యత.

మొదటగా, నేను అడుగునది రైట్ కుటుంబము వారెవరైనా ఇచ్చట ఉన్నారా? హాటీ గాని, ఆర్విల్ గాని? ఆర్విల్ నాతో నున్నాడా, హాటీ? వీలయితే అతడు నేను చెప్పిన దానిని ఇంటికి వెళ్ళి వెంటనే తేగలడేమో అడగండి. వారి చిన్న కుక్కకు అక్కడుంచిన దానిని ఈ ఉదయమున నేను తీసుకొని రావటం మరచి పోయాను. ఈ ఆరాధన అయిపోయిన తరువాత, వీలయితే ఇంటి వైపుగుండా వెళ్ళమని అడుగుచున్నాను.

4హట్టీ యొక్క సోదరి ఎడిత్ చిన్నప్పటి నుండి కుంటిగానే యున్నది. ఇప్పుడామె ఒక స్త్రీ అయినది. ఆమె చాలా వికృత రూపంలో యున్నది. ఆమె మొదటిసారిగా దానికి గురయినప్పుడు, ఒక సంవత్సర క్రితం, నేను వారి ఇంటికి వెళ్ళి వెంటనే ఆమె బాధ ఏమిటో దేవుని కృప సహాయము వల్ల కనుగొన్నాను. ఆమె అవయవములు అతుక్కొని పోయినవి. వాటిని ఆమె కదపలేకపోవుచున్నది. అది ఆమె యొక్క ఉధృతమగు నరముల ఒత్తిడివలన ఏర్పడినది. శారీరకంగా అమెకే పొరపాటు లేదు. కాని ఆమెకు ఆరునెలల ప్రాయంలో వచ్చిన బాల పెరాలిసిస్ వలన ఆ విధంగా జరిగింది. జీవితమంతా ఆమె మొరపెడుతూ ఏడుస్తూనే యున్నది. చాలా సంవత్సరముల నుండి ఆమెకు మేము ప్రార్ధన చేస్తున్నాము గాని ఒక సంవత్సరము నుండి మాత్రమే ఆమె సంతోషంగా నుంటున్నది.

5ఆమె మెనోపాజ్ వలననే జీవితములో మార్పు సంభవించినది. ఆమె నరములు అద్భుతమగు స్థితిలో నున్నవి. ఆమె ఇక కొద్ది గంటల్లో తాను మరణించుదుననియు ఇక బ్రతుకుట జరుగదనియు మనస్సులో అనుకొన్నది.

బలముగ, ఆరోగ్యముగా నున్న స్త్రీలకు భయంకర సమయము వచ్చును. మీకు తెలుసు గదా? కొన్నిసార్లు హార్మోనులను తీసికొనవలసియుండును. ఆ సమయములో వైద్యశాలలకు వెళ్ళి, షాక్ ట్రీట్మెంట్ కూడా తీసికొనవలసియుండును.

మానవులకు జీవితములో రెండు మార్పులుండును. బాలుని నుండి పెద్దమనిషిగా మార్పు జరుగును, బాలిక నుండి స్త్రీగా మార్పు జరుగును. సుమారు పదహారు, పదిహేడు సంవత్సరముల వయస్సులో నున్నవారిని నమ్ముట వీలు కాదు. ఆ యవ్వన ప్రాయంలో నా కుమార్తె రిబ్కా యున్నది. ఆమె కొరకు ప్రార్ధించండి. బిల్లీ ఉన్నాడు. ఓ, మనమందరము ఆ వయస్సు నుండి దాటి వచ్చాము, వారును దానిగుండా రావలసియున్నారు, గనుక వారిని మనము భరించవలెను.

6ఇప్పుడు ఎడిత్ ఏడు సంవత్సరముల మార్పును కలిగియున్నది… ప్రతి ఏడు సంవత్సరములకు నీ జీవితము మార్పు చెందును. కాబట్టి డెబ్బది ఏడేండ్లు అనగా, చాలా కఠినమైనది. అది పూర్తి మార్పు, స్త్రీలకది బాధగానుండును. పురుషులు కొన్నిసార్లు ఆ సమయములోను వింతగా ప్రవర్తించుచూ, భార్యలను కూడా విడిచిపెట్టుచుందురు. కాని స్త్రీలు ఆ తరువాత ఆపరిపక్యముగా నుందురు. మనమందరము ఆ విధంగానే వెళ్ళవలెను. మనము ఒకరినొకరు భరించుకొని పరస్పర విషయ అవగాహానను తప్పక కలిగియుండుటను మరువరాదు.

చిన్న ఎడిత్ ఆ స్థితిలో నున్నది. ఆమె చాలా బరువును కోల్పోయినది. చాలా రూపు మారిపోయినది. వారు దివారాత్రులు ఆమెను సరిచేయుచున్నారు. ఈ ఆలయము నుండి ఇంకా దీనికి చెందిన ఆలయములకు త్రిప్పుచున్నారు. రైట్ కుటుంబమును మీరు వెళ్ళి చూడండి; దానిని వారు తప్పక అభినందించుదురని చెప్పగలను. మీరు వెళ్ళి కొంతసేపు కూర్చొని, మాట్లాడి కరచాలనం చేసిరండి. స్నేహపూర్వకంగా దర్శించండి. అంత తేలికగా మాటను మనము మరచిపోతాము, మీకు తెలుసా. అది మన స్వగృహాల్లో ఏర్పడితే, అప్పుడు ఎట్లుండును? వారిని కూడా ఆ రీతిగానే మనము ఆలోచించాలి. మనం కష్టంలో ఉన్నప్పుడు ఎవరైన దర్శించినచో, ఎంతగా అభినందిచుదుమో అంతగానే వారును అభినందించుదురు. రైట్ కుటుంబము తప్పక అభినందించునని ఖచ్చితంగా చెప్పగలను. ఈ స్థితిలో వారున్నారని తెలిసినచో మీరు తప్పక వెళ్ళియుందురని నాకు తెలుసు. మీకు తెలియదు గనుకనే ఈ ఉదయాన నేను తెలియజేస్తున్నాను.

7వెళ్ళి రైట్ కుటుంబమును దర్శించి, ఎడిత్ ని ఓదార్చిండి. తాను వికారంగా కాక మంచిగా కనబడుతున్నదని ఆమెతో చెప్పండి. ఆమెను మనము ఎత్తిపట్టుకొన్నచో, ఆమె బాగవును. అందుకే ఇక్కడ మనం ఉన్నాం. ఆమె మన సోదరి. అట్టి బిడ్డను ఈ సమయంలో మనం పట్టుకోవలసియున్నాం. నేను శోధనలగుండా వెళ్ళుచున్నప్పుడు ఎవరైనా నన్ను ఆదుకోనాలి అనుకొందును. మీరు అంతే గదా.

ఇక్కడికి కూడికొనుచున్న వారిలో చాలా కాలం నుండి వస్తున్నవారిలో రైట్ కుటుంబం ఒకటి. స్లాటర్ దంపతులు కూడా అట్టివారే, కొద్దిక్షణాలు క్రిందట వారిని చూచి నేను చేయి ఊపాను. నేను ఆ మూలకు కారు నడుపుకొని వస్తూ అనుకొన్నాను. "ఎన్ని ఒడుదుడుకులు వచ్చినా, ఈ స్లాటర్ దంపతులు ఎంత స్థిరంగా తమ సంఘంలో స్థానంలో కూర్చొనియున్నారు?" రైట్ కుటుంబం అట్టిదే. వారిని మీరు అభినందించుదురు. అభినందించుదురు. చూచారా? వారిపట్ల మన అభినందన చూపుదము.

8ఈ రోజున నేను పెద్ద వర్తమానం అదించుదును. అది నేరారోపణను గూర్చినది. ఈ రాత్రికి ప్రభురాత్రి భోజనము పాదశుద్ధి మొదలగునవి ఉన్నవనుకొంటాను. సంఘ కాపరి మాట్లాడును, ఆయనందించు ప్రభుని వర్తమానమును వచ్చి అనుభవించండి. సంస్కారము పాదములు కడుగుట కూడా అప్పుడుండును. ఈ రాత్రి నిజంగా భారమైన రాత్రియే. ఇంకెక్కడకీ మీరు వెళ్ళనిచో మిమ్మును సంతోషంగా ఇక్కడకు ఆహ్వానించుచున్నాను.

డాన్ రెడ్జెల్ ను, సహో. జాక్సన్ ను, వచ్చిన సోదరీ సంఘముల జార్జియా సంఘమును కాయుచున్న సహో జాక్ పామర్ ను అభినందించుచున్నాను. కొన్ని సమయములయందు, మనకు కుడికలు కలిగియున్నప్పుడు, మమ్మును దర్శించుటకు వచ్చిన వారిని మా ఆరాధనలలో పాల్గొనుచున్నవారిని పూర్ణహృదయముతో మేము అభినందించగోరుచున్నాము.

9ఈ ఉదయకాలమున నా మంచి స్నేహితుడగు లీ-వైల్ ఆయన భార్యను నేను చూస్తున్నాను. మొదటగా సహోదరి వైల్ ను గుర్తించారు. అప్పుడు సోదరి వీని చూచుటకు చుట్టూ వెదికాను. (ఆ పాత దక్షిణ సామెత ఏమిటి?) — "ఇంకొక దానితో సర్దుబాటు చేయుట" చూచారా? ఆ కూటములో నాకు సహాయము చేయుటకు అతడి కొరకు ప్రతిదినము నేను వెదికాను. లీ వచ్చినచో ఆయనను బోదించనీయండి, నేను రోగులకు ప్రార్థించుదునని చెప్పాను. చాలా వెదికాము గాని ఎన్నడూ కనుగొనలేక పోయాను; ఈ ఉదయాన లీ దంపతులకు ఇక్కడుండుట చాలా సంతోషము.

మనము అర్థము చేసుకొనిన వారు అనేకులు ఇక్కడుండవచ్చు. పికాగోకు వచ్చిన ఒక సోదరిని నేను ఇక్కడ చూస్తున్నాను. ఆ గుంపులో పేర్లు నాకు తెలీదు గాని మీరెక్కడ నుండి వచ్చినా, మిమ్మును అభినందుచున్నాను.

10ఈ ఉదయాన అభిషేకించబడుటకు వచ్చిన ఇద్దరు యువకులను చూచాను. (సేవలో యువకులుగా అయినాగాని) ఇద్దరు నల్లజాతి సోదరులు న్యూయార్క్ నుండి వచ్చిరి. ఫిలడెల్ఫియా సంఘము నుండి పత్రములను తీసికొని వచ్చి ఇక్కడున్నారు. న్యూయార్కలోని వారి సేవను దీవించునట్లుగా వారిపై చేతులుంచియున్నాము. అక్కడ మనకు రెండు మూడు చిన్న సంఘములున్నవి. ఆ గుంపులో మిలానో ఒకడు. వారిని మేము అభినందించుచున్నాం. అక్కడున్న వారు జరిపించుటకు మరో ఇద్దరు అక్కడ నుండి వెళ్ళుచున్నారు. వీటన్నిటిని బట్టి ఆనందించుచున్నాము. ప్రభువు మిమ్ము సమృద్ధిగా ఆశీర్వదించు గాక.

1TIM 1:6•

HEB 5:1

 

11నేను చుట్టూ చూస్తుండగా మీలో అనేకులు కనబడుచున్నారు; అందరి పేర్లు పిలువలేము, కాని ఆయన అర్ధము చేసుకొనును అని నాకు తెలుసు.

ఇప్పుడు మన సోదరి పియానో వాయించి, పాట పాడును, లేదా వారి కొరకు వచ్చి ఒకపాట పాడవచ్చును:

ప్రవక్తను నిప్పుతాకగనే

అతడు ఎవరూ లేనంతగా పవిత్రుడాయెను,

"మన కొరకు ఎవరు వెళ్ళుదురని," దేవుని స్వరము పలికినప్పుడు,

"ఇదిగో నేనిచ్చటున్నాను. నన్ను పంపమని" అతడు జవాబిచ్చెను.

ఒక సేవకుని అభిషేకించుటకు చేతులుంచుటయే… ఇప్పుడు, మనము ఎరిగియున్నాము సేవకుని అభిషేకించుటకు చేతులుంచుట వాక్యానుసారమైనది. అందుకే మన కడవరి వర్షపు సోదరులు లేదా బాటిల్ ఫోర్డు జనులు చేతులుంచినప్పుడు మహిమలు అనుగ్రహించబడునని తలంచి అంతా గందరగోళము చేశారు. ఇప్పుడు, మనము చేతులుంచుట వలన వరములు వస్తాయి అని మనము నమ్ముము. మనము ఇంతకు మునుపే చూచిన దానికి ఆమోదము తెలుపుచూ మనము చేతులుంచుచున్నాము. చూచారా? అది ఒక "ఆమేన్!" చూచారా?

2TIM 1:6

 

12వారు తిమోతి తదితర సోదరులపై చేతులుంచినప్పుడు, వారిలో వరము ఉన్నది అని వారు తెలుసుకున్నారు. "నీ అవ్వయగు లోయినుండి నీకు వచ్చి నీలోనున్న వరమును అభివృద్ధి చేయమని" వారన్నారు. దీనిని వారు తిమోతీలో చూచారు; కాబట్టి పెద్దలు అతనిపై చేతులుంచి అభిషేకించిరి, అంతకుముందూ ఏమి చూపించని వానిపై చేతులుంచలేదు. చూచారా? వారు కేవలము దీవెనలడిగిరని, మనము అందరము దానిని నమ్ముచున్నాము. ఆత్మీయ వరములను మనము వారిపై కుమ్మరించలేదు; వారిని మనము గుర్తించి మరియు వాటిని పొందినట్లుగా అనుమతించి చేతులుంచుదుము, అట్టి జనుల కొరకు దేవుడా విధముగా కార్యములను చేయునని మనము నమ్ముదుము.

ఇక్కడ ఈ మధ్యనే అభిషేకము నొందిన సహో మెకిన్నీ అను మెతడిస్టు సేవకుడు ఆ వెనుక ఈ ఉదయాన కూర్చొని యుండుట గమనించాను. (కిన్నీ లేదా మెకిన్నీ) ఓహియోలోని డాచ్ దంపతులు. ఆ గుంపుతో నుండుటకు ఆయన అభిషేకించబడెను. మనందరం కూడికొనినప్పుడు, చిన్న స్థలములన్నియూ ఏకమయినప్పుడు అద్భుతముగా నుండును. శాఖ కాదు, ఏ బంధకములేదు, అయితే యేసుక్రీస్తుకే తప్ప ఎవరికీ జతచేయబడలేదు (చూచారా?), ఉన్నత స్థలములలో వారు కూర్చొండపెట్టబడి యున్నారు.

13సరే, సోదరీ ఆ పాటను మరోసారి పాడుదం. ప్రవక్తను నిప్పుతాకినప్పుడు అను పాటను కలిసిపాడుదము.

ప్రవక్తను నిప్పుతాకినది,

అతనిని పవిత్రము చేసినది.

"మన నిమిత్తము ఎవరు వెళ్ళుదురని? దేవుని స్వరము అడుగగా,

ఇదిగో నేనున్నాను పంపమని జవాబిచ్చెను.

నా ప్రభువా, మాట్లాడుము; నా ప్రభువా, మాట్లాడుము;

(సోదరులు కోరినచో రావచ్చు.)

మాట్లాడుము, నేను జవాబిచ్చుటకు త్వరపడియున్నాను.

చేతులుంచుటకు తక్కిన సేవకులు రావచ్చును. ఈ ఆలయ సహవాసులు, సహో రద్దేల్, సహో లాంబ్ తదితరులు.

మాట్లాడుము, "ప్రభువా, నేను వెళ్ళుదునని" జవాబిచ్చుదును.

ఓ, మిలియనుల మంది పాపము, అవమానముతో చనిపోవుచున్నారు;

వారియొక్క విషాద, చేదు మొరను వినుము;

వారిని రక్షించుటకై, సోదరులారా త్వరపడండి.

"ప్రభువా, నేనిచ్చటున్నానని" త్వరాగా జవాబు ఇయ్యండి.

మాట్లాడుము ప్రభువా; మాట్లాడుము ప్రభువా;

మాట్లాడుము, నేను నీకు త్వరగా జవాబిచ్చుదును.

మాట్లాడుము ప్రభువా; మాట్లాడుము ప్రభువా;

మాట్లాడుము "నన్ను పంపుము ప్రభువా! మాట్లాడుదును."

"సోదరుడా నీ పేరేమిటి?"

"ఓర్లండో హంట్"

"సహో ఓర్లండో హంట్, న్యూయార్క పట్టణము నుండి, అవునా?"

"జోసెఫ్ కోల్మన్."

"జోసెఫ్ కోల్మన్."

నా సోదరులారా, సమూహము వైపునకు తిరుగండి.

14సహో హంట్, కాల్మన్లకు వారి హృదయములలో దేవుని పిలుపు యున్నది. మనం ఇపుడే ఒక పాట పాడితిమి, "మిలినియంముల మంది పాపము, అవమానములతో చనిపోవుచున్నారు," వారా విషాద చేదు కేకను విన్నారు. వారిని రక్షించుటకు త్వరపడండి సోదరులారా, అని మనము అడిగాము. చూచారా? ఎంత తొందరగా జవాబు, "ప్రభువా, నేనిక్కడున్నాను!" ఆ విధంగానే ఈ ఉదయాన వారు జవాబిచ్చిరి.

ఈ సంఘ, ఈ గుంపు సోదరులముగా మనము కుడిచేతి సహవాసమునిచ్చి మన మద్దతుతో యేసుక్రీస్తు సాక్షులుగా మనము వారిపై చేతులుంచి అనుమతించుదము. సువార్తలో ఘనమైన దానిని, సరియైన దానిని మనము బలపరచుదం. దేవుడు తన మహిమ కొరకు వీరిని వాడుకొనునట్లుగా, ఎడతెగక ప్రార్థించుదం. న్యూయార్కులో వారి సేవలు సమృద్ధిగా గొప్పవిగా నుండు గాక. పరలోక రాజ్యములోని ప్రశస్తమగు పనలను తెచ్చు పూర్ణమగు సేవా జీవితములు వారికనుగ్రహించబడు గాక. వారు దీర్ఘకాలము సంతోషముగా జీవించుదురు గాక. ప్రభువైన దేవుడు తన నిత్య సన్నిధితో వారికి మంచి బలము ఆరోగ్యమునిచ్చి, నిత్య గృహములో పరలోక విశ్రాంతికి యేసుక్రీస్తు వారిని పిలుచు వరకు సేవలో భద్రపరచును గాక.

15ఇప్పుడీ సంఘము తలలు వంచుము, వారిపై చేతులుంచుటకు సేవకులు ముందుకు వెళ్ళుచుండగా.

మా పరమ తండ్రి, యేసుక్రీస్తు ప్రభుని నామములో సోదరులపై చేతులుంచుచున్నాము. మాకు తెలిసినంత వరకు నీతిగానున్నాడు. సేవకు వారి జీవితములో నీవిచ్చిన పిలుపు కొరకు వందనములు. ప్రభువా, ఆత్మలను రక్షించుటకు, విడుదల కలిగించుటకు, చెరలోనున్నవారిని వ్యాధిగ్రస్తులుగా నున్న వారికి, శారీరకముగా, ఆత్మీయంగా, మానసికంగా బాధలోనున్న వారికి విమోచన నిచ్చుటకు ఈ సోదరుని ద్వారా మాట్లాడుదుము. ప్రభువా, నిజమగు పరిచర్యను ఇమ్ము, తన మార్గాంతమందు వెనక్కి చూచి, ఆ పొడవైన బాటలో ప్రతి శత్రువును ఎట్లు దేవుని కృపచే బంధించకలిగెనో చూచునట్లుగా వాడుకొనుము. మా ప్రభువగు యేసుక్రీస్తు ద్వారా అడుగుచున్నాము. ఆమేన్!

16సహో కోల్మన్ పై కూడా సాక్షులుగా మేము హస్తములుంచుచున్నాము. ప్రభూ! అతని పిలుపుకు అనుమతినిమ్ము, ఈ సంఘమునకు చెందిన గుంపుయైన మేము క్రీస్తు దాసునిగా ఇతనిని నమ్ముచున్నాము. ఆశీర్వదించుము. గొప్ప శక్తిగల పరిచర్యను ఇమ్ము, ప్రభునికై ఆత్మలను జయించును గాక. బందీలను విడిపించండి. తాను నివసించు జనాంగము చుట్టూ నున్న సాతాను శక్తులను విరుగగొట్టండి. ఫలవంతమగు జీవితమును ఇవ్వండి ప్రభూ! ఈయన కూడా తన మార్గాంతమునకు వచ్చునప్పుడు, తాను నడిచివచ్చిన పొడవైన బాటలో యేసుక్రీస్తు కృపచే దేవుని ఘనపరచుటకు శత్రువుల యొక్క ప్రతి ఆటంకమును ఎట్లు విరుగగొట్టెనో చూడ కల్లుటకు కృపనిమ్ము.

పరమ తండ్రీ, ఈ మనుష్యులు దేవుని పంటలో ఆ విధంగా జీవించి పనిచేయుదురు గాక. నీ ఆశీర్వాదనములను వారిపై నుంచుము. మా గొప్ప యజమాని యొక్క పాదములనొద్ద మేమంతా కూడికొను సమయము వరకు నీ ఆశీర్వచనములను వారిపై నుంచుము. యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాము. ఆమేన్!

దేవుడు నిన్ను దీవించును గాక, సాహో హంట్, నీకు నమ్మకమైన పరిచర్య దయచేయును. దేవుడు నిన్ను దీవించును గాక, సహోదరుడా, మరియు నీకు కూడా నమ్మకమైన పరిచర్య దయచేయును. దేవుడు నిన్ను దీవించును గాక.

ప్రవక్తను నిప్పు తాకినప్పుడు,

అది అతనికి ఎంతో పవిత్ర పరచినది,

"మనపక్షముగా ఎవడు పోవునని" దేవుని స్వరము అడిగినప్పుడు,

"నేనిక్కడున్నాను, పంపుము" అని అతడు జవాబిచ్చెను.

ఓ, ప్రభువా, మాట్లాడుము. (అనేక యవ్వన హృదయములతో

ఆయన మాట్లాడును గాక.) మాట్లాడుము,

నీకు జవాబిచ్చుటకు త్వరపడుము.

నా ప్రభూ, మాట్లాడుము; నా ప్రభూ, మాట్లాడుము, మాట్లాడుము;

"ప్రభువా, నన్ను పంపుమని!" జవాబు నిచ్చెదను.

17ఈ చివరి దినములలో సువార్తకై పొలములోనికి పంపు సేవకులకు ఈ సంఘము సాక్షిగా నుండి గొప్ప ఘనులను ఈ ఉదయకాలమున దేవుడిచ్చినందుకు ఆయనకెంతగానో వందనములు చెల్లించుచున్నాము. నా సోదరులారా, దేవుని కృప మీకు తోడైయుండు గాక. ఆయన మిమ్మును విదేశములకు ప్రపంచములోని ఈ యేసుక్రీస్తు యొక్క నిగూడ ఐశ్వర్యమును గూర్చి బోధించుటకు పంపించును గాక. ఈనాడు లోకము చాలా అవసరతో నున్నది.

ఈ ఉదయకాల కూటములో ఆయా మంచి విషయములను ఎన్నో మనము మాట్లాడుకొనవచ్చును. నిజముగా కొన్నిసార్లు ఈ భయంకర సమయమును సమీపించుటకు నేనిష్టపడను.

గత ఆదివారం, ఇక్కడ లేనివారు మూడవ నిర్గమము వర్తమానం వినియుండరు, ఆ టేపులు మీరు కోరినచో నిజంగా ఆనందించగలరు: మూడవ నిర్గమము.

18మనకేమున్నది? ఇక్కడొక వ్యాదిగల కుర్రాడు, లేదు ఇంకేమైనానా? ఓ, ఒక కుంటిపిల్లవాడున్నాడు. అవును! ప్రభువతని మెండుగా దీవించును గాక. సరే. ఆరాధన అంతములో ఏమైనను వ్యాధిగ్రస్తుల కొరకు ప్రార్థించుదును.

మూడవ నిర్గమము అను వర్తమానమును వినమని మిమ్మును కోరుచున్నాను. మూడుసార్లు దేవుని యొక్క దూత, ఆ వెలుగు భూమిపై మూడు నిర్గమములలో ఎట్లు ప్రజలను పిలిచినచో చక్కగా చూపించబడినది. అది నాకెంతో గొప్పగా నుండినది: మూడవ నిర్గమము.

నా కోటును తీసివేయుదును, క్షమించండి. ఈ ఉదయాన ఆలయంలో చాలా వేడిగా నున్నది. విసనకర్ర మాత్రమే మనకున్న ఎయిర్ కండిషను. మీరు మీ స్వశక్తిని ప్రయోగించవలెను. కాబట్టి చల్లగా నుండు పద్దతిని ఒక రోజున మనము ఏర్పాటు చేయవలయును, వీలైనంత త్వరగా చేయుదుము.

EXOD 13:21•

JOHN 13:3

 

19మూడవ నిర్గమము వినండి. మనకు చాలా నిర్గమములున్నవి, కాని దేవుడు అగ్నిస్థంభ రూపములో దిగి వచ్చి జనులను బయటకు పిలచిన మూడు నిర్గమముల స్థలములను మనము ఖచ్చితంగా మన చేతినుండి చూడవలెను. అది జనులను వేరుపరచుట.

ఆయన తన మొదటి నిర్గమములో పిలచినప్పుడు వారిని అగ్నిస్థంభముగా ముందునుండి దేశమునకు నడిపించెను. వారి ఎదుట ఆ తరువాత ఆయన యేసుక్రీస్తు అను మనుష్యునిగా కనబడెను. (ఆయన దేవుని యొద్దనుండి వచ్చి, దేవుని యొద్దకు తిరిగి వెళ్ళెను.) ఆప్పుడాయన విసర్జించబడెను. అప్పుడాయన ఐగుప్తులోవలె వారున్న స్థితిలో నుండి బయటకు రమ్మని వారిని పిలిచెను. వారు ఐగుప్తీయుల పాపపు మార్గములలో దూరముగా పోయిరి. దేవుడు వారిని బయటకు పిలిచెను.

రెండవసారి వారు రోమా సామ్రాజ్యము క్రింద చెరలోనికి పోయిరి. నిజమయిన ఆరాధన నుండి దూరమై, ఆచారములోనికి పోయిరి. అప్పుడు దేవుడు మరల ఒక నిర్గమమును పంపెను. మానవులను నడిపించు మానవునిగా ఆయన కనబడెను.

EXOD 13:21•

1COR 15:52,53•

1JN 3:2

 

20మొదటి నిర్గమములో ఆయన అగ్నిస్థంభముగా నుండెను. ఆ తరువాత ఆయన గొర్రెపిల్లగా భూమిపైకి వచ్చెను. వెయ్యేండ్ల పాలనకు మాదిరి. ఇప్పుడాయన సంఘమును నడిపించుచున్నాడు. ఆయన నున్నట్లుగానే చూతుము. ఆయనవలె మనమును మహిమ శరీరమును పొందుదుము.

ఈనాడు సువార్త వెలుగు నుండి వెలుగు ప్రతిభింభించుచున్నది. అగ్నిస్థంభమును చూడకలుగుచున్నాము. సైన్సు దానిని చూచినది; అది పత్రికలలో యున్నది, ప్రపంచమంతా ప్రచురింపబడినది; అవే సూచనలు, అవే గురుతులు కలిగి అదే అగ్నిస్తంభమని శాస్త్రీయంగా, ఆత్మీయంగా గుర్తించబడినది. ఎప్పుడూ దాని సూచనలు మారలేదు.

ఎంతో మతోన్మాదము, భ్రమలు ఉన్న ఈ దినముల మధ్య దేవుడు తన్నుతాను గుర్తింపచేసికొనుచున్నాడు. దీనిని మనము కొనుగొన్నాము. భూమిపై నున్న ఈ మన గుడారము శిధిలమైపోయినను మరియొకటి కాచుకొని యున్నది. ఈ ముసలి శరీరము, జబ్బులు, బాధలు, అన్నియు మారిపోయి ఆయన వంటి మహిమ శరీరమును పొందుదుము. అపుడాయనను ఉన్నపాటున చూతుము. ఈనాడు ఎక్కడ మనము వెళ్ళవలెననుకొనుచున్నామో, ఆ దేశములోనే మనముందుము. ఓ, ఆ వాగ్దాన దేశమునకు నేను వెళ్ళుదునను పాట పాడవలెనంతగా పరవశుడనై పోవుచున్నాను. అది మన బాప్తిస్మపు పాట గనుక ఏ విధంగానైనా బాప్తిస్మ కార్యక్రమమంలో పాడుదురు.

21ఇక్కడున్న సోదరులకు, ఎక్కడున్నాగాని టేపులు వినుచున్న వారికి నేను చెప్పుచున్నాను. ఈ వర్తమానము ఎవరినీ ఉద్దేశించి చేయుటలేదు. వ్యక్తినుద్దేశించి కాదు. ఎవరిమీదా, ఏ సంఘం మీద, దేవుని మీదా విశ్వాసం లేని మూఢభక్తి గల వారము కాదు. మేము మాత్రమే గొప్ప అని అందరినుండి విడిపోయే గుంపు మాది కాదు. మేము సంఘము కోసమే, కాని పరిశుద్ధాత్మ ద్వారా ఈనాడు ప్రత్యేకతను మేము హేతుపూర్వకంగా సూచించుచున్నాము. మనం విభజింపబడకుండా అందరం కలిసి సహవాసం చేయాలని మేము నమ్ముచున్నాం. మెతడిస్తులు, బాప్టిస్తులు, ఏకత్వవాదులు, త్రిత్వవాదులు ఇంకా ఉన్నవారంతా విడిపోయి ఉండకూడదని మేము భావించుచున్నాం. ఆయన మహిమకరమగు రాకకు ఎదురు చూస్తున్న యేసుక్రీస్తు శరీరముగా అంతా ఐక్యతతో కలిసి ఉండవలెనని మేము కోరుచున్నాము? అసలు వారు వేరు కాకూడదు.

1PET 1:20

 

22అయితే మనలను వేరుచేయునది కొన్ని ప్రాధమిక హేతువులు. దానిని ధ్యానించినప్పుడు మనలను వేరు చేయునది చర్మపు రంగు కాదు అని గ్రహించాను. ఎందుకనగా పసుపు, నలుపు, గోధుమరంగు, తెలుపురంగుల వారందరూ వివిధ శాఖలలో యున్నారు. మనం తినే ఆహారం వల్లకూడా విభజన రాదు. మనందరం ఒకే ఆహారం తింటున్నాం. ఒకే రకముగా బట్టలు మనం ధరించుకొంటున్నాం. కాని ప్రాధమికంగా నాకు కనబడేది ఎక్కడనగా, సువార్త బోధ యొక్క మార్గమును మానవుడు తప్పిపోవుటయే. తప్పు, ఒప్పులను చూపించు మార్గము ఖచ్చితంగా మనకుండి తీరాలి. దానికి ఒకే మార్గము, వాక్యమునకు స్వంత అనువాదము చేయుట కాదు గాని దానిని ఉన్నది ఉన్నట్లుగా చదివి, నమ్ముటయే.

REV 17:5

 

23ప్రతి వ్యక్తియు తన స్వంత అర్ధమును చెప్పి తేడాను సృష్టించుచున్నాడు.

అది మనలను కాతలిక్కు సంఘము యొక్క అసలు సంస్థ యొద్దకే తీసికొని వచ్చును. కాతలిక్కు సంఘము దేవుడు తన సంఘములో నున్నాడని నమ్మును, వాక్యముతో దానికి పనిలేదు. దేవుడు తన సంఘములో నున్నాడు. ప్రొటస్టెంటులను మనము ప్రకటన 17లో అవన్నియు కలిసిపోయినట్లుగా చూడగలము. అన్ని సంస్థలకు కాతలిక్కు సంఘము తల్లి, ప్రొటస్టెంటు స్థలంలో గ్రుడ్డిగానయినను కాతలిక్కు సంఘము యొక్క స్వభావమును మనము చూడగలము. కాతలిక్కు సంఘమును బైబిలు మహావేశ్యయనియు, ప్రొటస్టెంటు సంఘమును వేశ్యయనియు పిలుచున్నది. తన వివాహ ప్రమాణములకు నమ్మకంగా జీవించనిది వేశ్య చెడ్డది. మన మంతా క్రీస్తు వధువుగా ప్రకటించుకొనుచూ ఆపనమ్మకంగా ఉంటున్నాం. ఏది మనుష్యులను అపనమ్మకస్తులుగా చేయును? తన వధువై జీవించుటకై దేవుడేర్పరచిన క్రమశిక్షణయగు బైబిలునకు భిన్నముగా జీవించుటయే (అది నా స్వంత ఉద్దేశ్యము), బైబిలు తప్పిపోని దేవుని వాక్కు అని నా నమ్మకము.

2TIM 3:15

 

24కాబట్టి ప్రొటస్టెంటు సంఘము ఒక సంస్థను కలిగియుండుటకు గాను వాక్యము నుండి తొలగిపోయినది. ఒక సంస్థను తయారు చేసికొన్నది.

అభిషేకించబడి అనేకమంది సేవకులు నా అధ్యయన గదిలోనికి వచ్చి చెపు మాట ఇది, "బ్రెన్హాం సోదరుడా, నీవు ప్రజలకు అట్లాంటి సవాలులు చేస్తున్నావు. దానికి ఎదురుగా ఏ వ్యక్తి నిలబడలేక పోవుచున్నాడు. అది సత్యమని వారిరుగుదురు."

"మీరెందుకు ఆ విధంగా చేయకూడదు?" అని నేనంటాను.

"నేను ఆ విధంగా అన్నచో ఇక నేను రొట్టెముక్కలు భిక్షమెత్తికొనక తప్పదు. నాకొక సేవ ఉన్నది. ప్రభువు వద్దనుండి నేను దానిని పొందాలి. జనుల వద్దకు నేను వెళ్ళాలి. నాకెవరూ వెనక బలపరచువారు లేరు," అని చెప్పెదరు.

క్రీస్తే మనలను బలపరచువాడని, బైబిలే మనలను బలపరచునదని నీవు గ్రహించావా? కాని … చూచారా. అందువలననే ప్రొటస్టెంటు సంఘము సరిగ్గా కాతలిక్కు సంఘమువలె ఉన్నది.

25ఇంత కఠినంగా అనకూడదు, కాని కాతలిక్కు సంఘము బైబిలు చెప్పేదానిని లెక్క చేయదు. వారు బైబిలు నమ్మెదరు, కాని (చూచారా?) కాతలిక్కు సంఘము అపొస్తలలు వారసత్వము మీదనే ఆధారపడినది. అందుకే వారు పోపులను వారసులుగా నియమించారు. వారు పేతురును మొదటి పోపు అందురు. వారు చాలా గట్టిగా దానిని నమ్మెదరు.

ప్రొటస్టెంటులు ఒకచోట నైసియా, రోమ్ వద్ద ఆలోచన సరిచేసి కాతలిక్కు సంఘమును సంస్థగా మార్చినట్లే, వీరును ఒక సంస్థను రూపొందించారు. ఆ రెండు ఒకటే. వారు సంస్థను తయారు చేయుటకు వాక్యమును విడిచారు. గొప్ప సత్యములు ఈనాడు వెలికి వచ్చినప్పుడు వారు వింతగా చూస్తున్నారు. క్రొత్తగా ఉన్నది వారికి కేవలము సంప్రదాయమే ఆధారము. మనకు బైబిలు తప్ప మరో ఆధారము లేదు. దేవుని పరిశుద్ధ వాక్యము తప్ప మరొకటి లేదు. అక్కడే మనము నిలబదవలెను.

LUKE 23:33

 

26ఈ రోజు నేను దేవుని పరిశుద్ధ వాక్యమును లూకా సువార్త నుండి దానిపై నేనొక ఆలోచనను చేశాను. దానిగూర్చి మాట్లాడెదను. లూకా 23వ అధ్యాయము. మరియు నేను ఒక వచనమును చదువగోరుచున్నాను; ఈ ఉదయాన మాట్లాడుటకు మూలముగా నాకు కావలిసినది అది మాత్రమే. లూకా సువార్త 23:33.

వారు కపాలమనబడిన స్థలమునకు వచ్చినప్పుడు అక్కడ కుడివైపు, ఎడమవైపున ఒకనిని ఆ నేరస్తులను ఆయనతో కూడ సిలువవేసిరి.

చదువబడిన ఆ వాక్యములోని నాలుగు మాటలను నేను తీసికొని మాట్లాడుతాను. అవి: అక్కడ వారు ఆయనకు సిలువ వేసిరి. ఈ దినము యేసుక్రీస్తును మరలా సిలువ వేయుచున్నందున ఈనాటి శాఖాసంఘములను, ఇంకా అనేక స్వయం పోషణలను న్యాయవిమర్శ చేయుచున్నాను. వాటిపై నేరము మోపుచున్నాను.

ఈ ఉదయము అది "నేరారోపణగా" పిలువబడును.

1PET 4:17

 

27ఈ వేదికను ఈ సంఘము కోర్టు గదిగా నేను వాడుకొనుచున్నాను. దేవుని ఇంటి యొద్దనే ఆరంభమగునని బైబిలు చెప్పుచున్నది. ఇది న్యాయ సింహాసనమువలె నున్నది. సాక్షులు, ఆరోపణలు మొదలగునవి ఇక్కడున్నట్లుగా యున్నది.

ఈనాడు నాకు దేవుని వాక్యమే సాక్షి. ఈనాటి సంఘములకు వ్యతిరేఖంగా నేను నేరారోపణ చేయుచున్నాను. దీనిలోనికి పాపిని నేను తీసికొనిరాను. సంఘములు సంఘముతోనే మాట్లాడుచున్నాను. అది టేపులపై యుండును. సాధ్యమైనంత త్వరగా నేను మాట్లాడుదును.

యేసుక్రీస్తును రెండవసారి సిలువ వేసినందుగాను ఈ తరముపై నేరము మోపుచున్నాను!

28ఈ యుగములోనే దానిని నేను ఋజువు చూపించుదును. నేను నేరారోపణ చేయవలెనన్నచో నేరపు ఋజువును చూపించవలెను. ప్రధాన న్యాయమూర్తి ముందు నిలబడి నేరమును రుజువు చేయవలసియున్నాను. ఈ నేరారోపణలో నాకు నేనే న్యాయాధికారిని.

దేవుని వాక్యమే నాకు సాక్షి. సిలువ వేసినందుకు ఈ తరముపై నేరము మోపుచున్నాను.

29మొదటిసారి సిలువ వేసిన జనులపై నున్నది ఆత్మయే ఈనాటి జనులపై కూడానున్నదని నేను చూపించుదును. అదే పనిని వీరు చేయుచున్నారు. వారు సిలువ వేసిరి. అప్పుడు వారు శారీరకముగా దేవుని కుమారుడగు యేసుక్రీస్తును సిలువ వేసిరి. ఇప్పుడు కూడా వారు అదే దృక్పదముతో ఆత్మీయముగా సిలువ వేయుచున్నారని నేను తప్పక చూపించుదును.

మరియు ఇప్పుడు, ఈ రోజు, అదే వాక్యము, అదే పరిశుద్ధాత్మ ద్వారా, మరియు అదే వాక్యము ద్వారా, సంఘములు ఎక్కడ నిలబడుచున్నవో చూపించగోరుచున్నాను: ఈ రోజు వారు అదే కార్యమును చేయుచున్నారు; మరియు బైబిల్ చెప్పుచున్నది, వారు అదే చేయుదురు అని; మరియు మనము జీవించుచున్న ఈ దినమే అని రుజువు చేయుదును.

అది కొద్ది సంవత్సరాల క్రితం జరిగిందని చెప్పను. ఏభై సంవత్సరాల క్రితం అది జరుగలేదని చెప్పగలను. కాని ఈ రోజు అది జరిగిన సమయము పదేండ్ల క్రితం అది జరుగలేదు, కాని ఈనాడే అది జరుగుతుంది, ఎందుకనగా సమయం గతించుచున్నది. మనం అంత్యకాలంలోనున్నాము. మనం ఈ దేశం నుండి మరో దేశానికి దాటిపోయేందుకు సిద్ధముగానున్నామని, ఆయన సేవకునిగా నేను నమ్ముచున్నాను.

కాబట్టి మారుమనస్సు పొందు సమయం ఈ దేశానికి పోయింది. ఈ దేశం పశ్చాత్తాపడదని నేను నమ్ముచున్నాను. కృపను, తీర్పును మధ్యనున్న గీతను అది దాటినదని నమ్ముచున్నాను. అది త్రాచులో తక్కువగా తూగుచున్నదని నమ్ముచున్నాను.

LUKE 17:26,28•

JOHN 12:48

 

30"సహో, బ్రెన్హాం, నీ కేసును నీవు ప్రారభించుచు ముందుగా, నీవెట్లు రుజువు చేయుదువు?" ఈ విధంగా, జలప్రళయమునకు ముందున్న లోకమును దేవుడు ఏ పాపము నిమిత్తము నాశనము చేసెనో అవే పాపముల నిమిత్తము మనము దోషులము సొదామ, గొమొర్రాలలోని లోకమును నాశనము చేసిన పాపమే మనమూ చేయుచున్నాము. మనముందు అన్నిటి యొక్క ఆత్మీయ రుజువు పడియున్నది. లోకమునంతటికీ తెలిసిందే. ఆ తరముల పైకి వచ్చిన కృపను తిరస్కరించనందున తీర్పు వచ్చినది. కృప, తీర్పు, రెండూ దేవుని నుండియే వచ్చెను. కాబట్టి అదే కృపను తిరస్కరించినచో, ఆ రోజులలో చేసినట్లుగానే చేయును. వారిని వదిలినచో దేవుడు అన్యాయస్తుడగును.

నా స్నేహితుడగు జాక్ మూర్ ఒకప్పుడు అన్నాడు, "ఈ దేశమును శిక్షించనిచో ఆ దినమున దేవుడు సొదొమ గొమెర్రాలను లేపి వాటియందు క్షమాపణ చెప్పుకొనవలసి యుండును."

JER 5:21•

MATT 13:13,14

 

31ఇప్పుడు, వారు ఆత్మీయంగా ఆ విధంగానే చేయుచున్నారని మనకు తెలుసు. వారు ఏ ఉద్దేశంతో, ఏ రీతిగా ఆయనను సిలువ వేశారో, ఈ రోజున ప్రభుని సిలువ వేయుచున్నారు. వారు ఈ పనిని అసూయ, ఆత్మీయ గ్రుడ్డితనమువలన చేస్తున్నారు. వారు చుడగోరరు, వినగోరరు. యేసు, ఈ భూలోకముతో ఇట్లనెను, "యెషయా మీ గూర్చి పలికినది సరియే; మీరు కండ్లుండియూ చూడరు, చెవులుండియూ వినరు."

అదే కారణము, అదే ఉద్దేశ్యము, వారు క్రీస్తును నూతనముగా ఈనాడు సిలువ వేయుచున్నారు. (కొంత సమయము తరువాత మనము దానిలోని వెళ్ళుదము), అదే కారణమును బట్టి ఆనాడు సిలువ వేసిరి. వారు దానికి వ్యతిరేకంగా ఇంకేమీ చెప్పలేదు; వారు సవాలు చేయుటకు ధైర్యం చేయలేదు. అక్కడున్న రుజువు వారికి తెలుసు; బైబిల్ ఆ విధంగా చెప్పుచున్నదని వారెరుగుదురు; వారు చేయగలిగిన ఒక్క పని, దానిని దూషించుటయే. అది ఖచ్చితము. కావున… ఇదంతా, అదే కారణము వలన…

JOHN 1:1,14•

HEB 13:8

 

32ఇప్పుడు దానిని ఆధారంగా యేసుక్రీస్తును నూతనముగా ఈ తరము పిల్లలు కోరుచున్నారని దోషము, నేరమును మోపి సవాలు చేయుచున్నను. మన స్వార్ణపు శాఖా చేతులతో జీవాధిపతిని వారు ఆయన జీవమునీయరాగా సిలువవేయుచున్నారు.

"అదే వ్యక్తినా?' అని మీరడగవచ్చు.

ఆదియందు వాక్యముండెను… వాక్యము దేవుడై యుండెను. వాక్యధారియై బయలుపరచబడెను. వాక్యము శరీరధారియైనది. వారా శరీరమును మరణమునకప్పగించిరి; ఎందుకనగా వాక్యము ప్రత్యక్షమాయెను. హెబ్రీ 13:8, "యేసుక్రీస్తు నిన్న, నేడు, నిరంతరము ఏకరీతిగానున్నాడు." అదే వాక్యము. అదే కారణముతో వాక్యమును సిలువ వేయ ప్రయత్నించుచున్నారు.

MATT 27:29,30,35•

MARK 15:20,24•

LUKE 23:34•

JOHN 19:23

 

33నా అంశమును విడగొట్టెదను, నాలుగు మాటలున్నవి. మొదటగా 'అక్కడ' అను పదమును వివరించుదము. ప్రపంచంలో అతి పరిశుద్ధ పట్టణము యెరూషలేము. ప్రపంచంలో అతి భక్తిగల పట్టణము. వారు - లోకములో అతి మతాసక్తిగలవారు. పస్కా అను గొప్ప మత పండుగ వద్ద. అది గొప్ప మతస్థలము భక్తిగల పట్టణము. అన్ని సంస్థలకు పెద్దది, గొప్పది. ప్రపంచపు మారుమూలల నుండి గొప్ప మతనిష్ట గలవారు కూడుకొనిరి. వారు సిలువ వేసిరి, అతి అవమానకరమగు మరణము — దిగంబరిగా ఆయన నుండి బట్టలన్నీ తీసివేసిరి. ఒక వ్యక్తికి అది నీచాతినీచ మరణము. నిందను ఆయన తృణీకరించెను. ఆయన బట్టలన్నీ తీసివేసిరి. ఆయన చుట్టూ ఒక చింపిరి గుడ్డ చుట్టిరి. అది సిగ్గుకరమగునది…

NEH 11:1•

JOHN 2:13,23•

JOHN 11:55•

GAL 3:13

 

34అక్కడ (ఆ గొప్ప మతనిష్టగల పట్టణము) వారు చాల మత భక్తిగల జనులు, ఆయను (అతి అవమానకరమగు మరణము) సిలువ వేసిరి (అతి ప్రశస్త వ్యక్తి).

ఈ లోకమును నిందించుటకు అది చాలును! అక్కడ, ఆ గొప్ప మత సంస్థ అన్ని సంఘములోనికి పెద్దది. ఒక స్థలములో కూడుకొన్నది. వారు అన్ని జాతుల కంటెను మతాసక్తిగలవారు. ఆ జనులు దేవుని ఆరాధించువారుగా పేరు పొందిరి. వారు గొప్ప మత పండుగలో కూడుకొనిరి. పస్కా కడుగుట అది. వారు దాస్యములో నుండి స్వాతంత్ర్యములోనికి వచ్చినప్పుడు జరిగినది. అక్కడ ఆ మతాసక్తిగలవారు ఆ సమయంలో ఆ గొప్ప మతపండుగను. గొప్ప మతస్థలము వద్ద జీవాధిపతికి చేయకలిగిన అవమాన కార్యమును చేసిరి: ఒకని దిగంబరుని చేసి మ్రాను మీద వ్రేలాడదీయుట; వారు ఆరాధించు ధర్మశాస్త్రము చెప్పునది, "మ్రాను మీద వ్రేలాడ దీయబడువాడు శాపగ్రస్తుడు." ఆయన మన కొరకు శాపమాయెను. ఆయన బట్టలు తీసివేసి, కొట్టి, హేళన చేసి, సిలువకు గొట్టిరి. రోమా ప్రధాన శిక్షక్రింద ఆయనను సిలువవేసిరి.

35తుపాకితో చంపబడుట ఈనాడు అతి అవమానమైన మరణము కాదు. కారు ద్వారా చంపబడుట, నీటిలో ముంచబడుట, అగ్నిలో కాల్చబడుట, ఈనాడు అవమానకరమగు మరణము కాదు; అయితే ఈనాడు అతి అవమానకరమగు మరణము ఏమనగా, బహిరంగ ప్రధాన శిక్ష. ప్రపంచము యావత్తు నిన్ను ఖండించి దోషిగా పిలుచును. ఆయన నిర్దోషిగా నుండగా ఆయనపై ప్రపంచమంతా చేతులు వేసి దోషియని పిలిచెను. ఆయన తన శత్రువుల క్రింద మరణించెను. స్నేహితులు, చట్టము ద్వారా కాదు, శత్రు సిలువ క్రింద, జీవాధిపతి, అతిశ్రేష్టుడు, అట్టివాడు ఇంతకు ముందు జీవించియుండలేదు, లేక ఇకముందు జీవించడు, యేసుక్రీస్తు — ఆయనే, అతి ప్రశస్త వ్యక్తి. దానిని మనస్సులో నుంచుకొని ఈనాడు మనము వేదికను నిర్మించుదము.

JOHN 2:13

 

36మీరు ఉహించగలరా, యెరూషలేము వంటి స్థలము వద్ద 2,500 సంవత్సరములు లేదా ఎనిమిది తొమ్మిది సంవత్సరములు అయి యుండవచ్చు. అప్పటికి దేవాలయమును నిర్మించి ఎంతకాలమయినదో నాకు తెలియదు. ఎనిమిది వందల సంవత్సరములని నేనూహించుచున్నాను. వారు మెస్సీయా వచ్చునని ఎదురు చూస్తున్నారు. పస్కా అరాధనకు వారు కూడుకొనిరి. దానిగూర్చి ఆలోచించు. పరిసయ్యుల సద్ధూకయ్యుల ప్రధానులందరూ దేవుని ఆరాధించుటకు కూడిరి. అతి పరిశుద్ధ స్థలము అయిన యెరూషలేము, దేవుని ఆలయము, దేవుని ప్రజలు, దేవుని తీసికొని ప్రధాన శిక్షతో ఆయనకు సిలువవేసిరి. ఎలాంటి సంగతి.

LUKE 23:33

 

37ఆ నాలుగు మాటలు: అక్కడ వారు ఆయనను సిలువ వేసిరి. నీవింకా బైబిలు చూపించవచ్చు. కాని బైబిలు సత్యమంతా ఆ నాలుగు మాటలలో గుప్తమైయున్నది. నేనయితే వివరించవలసిన అవసరమున్నది గాని బైబిలుకు ఆ పనిలేదు. అదంతయూ సత్యమే. కాబట్టి బైబిలు దానంతట అది ఏమియూ వివరించపనిలేదు, ఎందుకనగా అది యదార్ధము.

ఈ నాలుగు పదములలో సత్యము యొక్క గొప్ప గొలుసు యున్నది. దానిని వివరించ యత్నించుదును. వివరించినచో ఒక గ్రంథాలయము తయారగును. ఆ నాలుగు మాటలు వివరించు మార్గము నాకు లేదు. అయితే ఇప్పుడు, గ్రంథకర్తను బట్టి ఆయన సహాయము వలన ప్రజలు అర్థము చేసికొనురీతిగా వివరించుదును.

మనముందు ఏమున్నది? అతి పరిశుద్ధ స్థలములో, అతి మతనిష్టగల జనులు అతి అవమానకరమగు మరణమును అతి ప్రశస్త వ్యక్తికి వేసిన మొదటి సిలువ, మన యెదుటనున్నది. ఓ, అది ఎంత విరుద్ధము! ఓ మై, అది అవమానకరమైనది!

JOHN 4:20

 

38మొదటి మాటయగు అక్కడ నుండి తీసికొందాం: నేరారోపణకు ముందుగా, కొన్ని నిముషములు దానిపై మాట్లాడుదును. దానిని మనము వివరించుకొని, వారేమి చేసిరో కనుగొన్నచో, మన నేరారోపణ నిజమో - కాదో అర్థమగును. యెరూషలేము అతిపరిశుద్ధ స్థలము, ఎందుకనగా 'ఆలయము అక్కడున్నది.' ఈ ఒక్క స్థలములోనికి ఆదాధనకు యూదులందరూ కూడుకొందురు. ఆరాధనకు గొప్ప చోటు యెరూషలేములో యున్నది. వ్రాయబడిన ప్రకారము, "అందరూ ఆలయములో ఆరాధించవలెను." మంచిది, ఎందుకనగా అది ఆరాధనా కేంద్రము.

"ఓ, మేము గొప్ప కూటములకు వచ్చామని," వారు ఈనాడు చెప్పుచున్నారు. వాటికను పట్టణమును తెరచుట, పోపుల గొప్ప అభిషేకము మనకున్నది. మొతడిస్టు కూటపు స్థలమునకు, బాప్టిస్టు కూటమునకు రోమ్ కు మనము వెళ్ళుదమని వారు చెప్పుకొనుచున్నారు. అదే క్రైస్తవ్యమునకు కేంద్రమని వారు అనుచున్నారు.

39గత యుద్ద సమయములో రోమ్ పతనమయినప్పుడు, ఈ జర్మను సైనికులు (మీలో చాలామందికి తెలుసు) వాటికను పట్టణమునకు వచ్చి అమెరికనులను కాల్చుచూ ముందుకు సాగిపోయిరి. ఆ యుద్ధములో యున్న సాహో ఫంక్, సాహో రాబర్సన్, సాహో బీలర్ తదితర సోదరులకు తెలియును. ఆ పట్టణములో అమెరికనులపై తుపాకీ పేల్చకూడదని మనము ఆజ్ఞలు జారీచేశాం. మీరు అక్కడి వారికి గురిగా నిలబడిరి. ఇంగ్లాండులోని వెస్ట్-మినిష్టర్ అబ్బేలో మాత్రము కాల్చవచ్చు. వాటికనులో వద్దు గాని, అక్కడ పేల్చవచ్చని ప్రొటస్టంటులు కూడుకొని చెప్పిరి. ఆ రాత్రి అధ్యక్షుడగు రూజ్వెల్ట్ రేడియో ప్రసారము నేను విన్నాను, "ఎ ఫైర్ సైడ్ టాక్" అను ప్రసంగమది. రోమ్ పతనమయినదంటే అదెంతో అవమానము, ఎందుకనగా క్రైస్తవ్యమునకది శిరస్సు అని చెప్పెను. ఒక ప్రొటస్టెంట్ ఆ మాట చెప్పుటకు నీవు ఊహించగలవా?

40క్రైస్తవ మత కేంద్రముగా దానిని మనము చూస్తున్నాం. యెరూషలేము వలె ఉన్నది. సనెడ్రిను, పరిసయ్యులు, సద్దూకయ్యలు అందరూ యెరూషలేము ఎక్కిపోయిరి. అది నిజంగా మత ప్రధాన కార్యాలయము.

సంస్థా జీవితములో రోమను కాతలిక్కు సంఘము అన్నింటికీ తల్లియని నీవు అంగీకరించవలెను. నిశ్చయంగా ఆమె అదే. మరియు అది పెంతెకొస్తు నుండి ప్రారంభమై సంస్థగా మారినది. ప్రొటస్టెంటులమయిన మనము ఆ సంఘమునకు చిన్న చెల్లెళ్ళము.

ఆనాడు యెరూషలేము, ఈనాడు వాటికన్ పట్టణము అని మనము చెప్పుకొనవచ్చును.

JOHN 4:20•

HEB 9:22,26•

1JN 1:7

 

41ఆనాడు జనులందరూ ఆరాధనకు యెరుషలేము వచ్చుచుండిరి. యేసు దినములలో వారెందుకు ఆ విధంగా చేసిరి? అందరూ యెరూషలేము నొద్ద ఆరాధించవలెనని వారెందుకు చెప్పిరి? ఎందుకనగా మానవునితో దేవుడు సహవాసము చేయు స్థలము ఒకే ఒకటున్నది; అది బలి రక్తము క్రింద. అందుకే వారు యెరూషలేమునకు వచ్చిరి. రక్తము క్రింద తప్ప మరెక్కడనూ ఆయన మానవుని ఎన్నడూ కలిసికొనడు, నీవు రక్తమును దిక్కరించినప్పుడు. నీకు దేవుని కలుసుకొను మార్గము తీసివేయబడినట్లే. దేవుడు తన మొదటి నిర్ణయమును ఏదెనులో తోటలు చేసెను. చిందించబడిన బలి రక్తము క్రిందనే మానవుడు ఆరాధించవలసియున్నాడు.

HEB 9:26

 

42ఆ ఒక్క స్థలములోనే దేవుడు మానవుని కలిసికొనును; ఈనాడు కూడా మానవుని దేవుడు చిందింపబడిన బలి రక్తము క్రిందనే కలిసికొనును, చూచారా.

నీవు మెతడిస్తువైనా, ప్రెస్బిటేరియనువైనా, నీవు భేదము విస్మరించి (రోమను కాతలిక్కు లేదా ఏమైనా గాని) చిందించబడిన రక్తము క్రిందికి వచ్చినచో మనిద్దరిని దేవుడు అక్కడ కలిసికొనును. అక్కడే మనందరమూ కలిసి సహవాసముతో ఆరాధించగలము. నీవు మెతడిస్తువైనందున, లేదా పెంతెకోస్తువైనందున ఆయన నిన్ను కలిసికొనడు. ఒకే షరతు క్రింద ఆయన నిన్ను కలిసికొనును. అది చిందింపబడిన రక్తము క్రింద; నీ పాపములు ఒప్పుకొనినచో, అవి ఆయన సన్నిధిలో నుండి తొలగించబడును. రక్తము ఎల్లప్పుడూ ఆయన ఎదుట నుండును, కాబట్టి చిందింపబడిన రక్తము ద్వారానే ఆయన నిన్ను చూడగలడు. నీ పాపములు ఒప్పుకొననిచో, హిమము వలె తెల్లనగుదువు (చూచారా?); లేనిచో, నీవక్కడ ఉండవు. సహవాసము చేయజాలవు.

HEB 10:10,12

 

43ఆ కారణమును బట్టియే సంఘములో జరుగుచున్నవాటిని నీవు చూడలేకపోవుచున్నావు. వారు రక్తమును నమ్ముచున్నామని ఒప్పుకొందురు, కాని రక్తము క్రిందకు, అనగా, వాక్యము క్రిందకు వచ్చు సంకల్పమును తృణీకరించుదురు. ఆ వాక్యమును దేవుడు ఘనపరచు మార్గము ఒకేఒకటున్నది. "నేను రోమను కాతలిక్కును; ఇది జరగాలి అని నేను కోరుచున్నాను," అని నీవు చెప్పినచో, నీవెన్నడూ వాక్యమును ఘనపచజాలవు. మెతడిస్తు, బాప్టిస్టు, పెంతకొస్తు ఎవరైనా ఆ పనిచేయజాలరు. చిందించబడిన యేసుక్రీస్తు రక్తము ద్వారా ఆయన కృప, కరుణను బట్టియే నీవు ఏమైనా చేయగలవు. ప్రభువా వాగ్దానము స్వతంత్రించుకొనుచున్నానని చెప్పుము. నీవు నిజంగా దేవుని రక్తము క్రింద నున్నచో, దేవుడు తన వాక్యమును చేయుటకు బద్దుడగును. కాని మొదటిగా నీవు రక్తము క్రింద నుండవలెను. ఇప్పుడు నీవు అది చూచావా?

PHIL 2:12

 

44వారు అద్భుతములను నమ్మకపోవుటలో ఆశ్చర్యము లేదు. సహజాతీతమైనవి నమ్మకపోవుటలో ఆశ్చర్యములేదు. వారు వానిని ఖండించుటలో ఆశ్చర్యములేదు. ఆనాడు వారు ఏ కారణముచే ఖండించిరో, ఈనాడు వీరును ఆ కారణము చేతనే ఖండించుచున్నారు. నీవు దోషివి. కొందరు సోదరులు తగ్గించుకొని తమ సిద్దాంతాలను మొదలగునవి విడిచి, దేవుని వాక్యమును తీసికొని నడిచి వచ్చి, పాపములు ఒప్పుకొని, రక్తము క్రిందికి వచ్చి, నమ్మినచో - వారిని పిచ్చివారని పిలుచుచున్నారు. మనము చెప్పునట్లు, వారిని వర్గీకరించి పిలచెదరు (అది ఈ వేదిక పై వాడుట మంచి పదము కాదు, కాని మీరు అర్ధము చేసుకొందురు), అతడొక వింతవ్యక్తి అందురు. మనందరమూ అంతే కదా? చూచారా? అవిశ్వాసి విశ్వాసికి ఒక వింతవ్యక్తి, మరియు ఒక విశ్వాసికి అవిశ్వాసి ఒక వింతవ్యక్తి. కావున వింతవ్యక్తి ఎవరు? చూచారా? వ్యాపారికి రైతు ఒక వింతవ్యక్తి; రైతుకు ఒక వ్యాపారి వింతవ్యక్తి, చూచారా. కాబట్టి ఏదిఏమైనా అతడు ఎవరు?

నేను చెప్పుదును, రక్షణ అనునది మనుష్యుడు మరియు దేవునికి వ్యక్తిగతముగా ఉండే సంబంధము; ఒక వ్యక్తి స్వంత రక్షణను భయముతోను, వణుకుతోను కొనసాగించును. దానిని వాక్యము క్రింద నుంచుటకంటె క్రీస్తు దాసునిగా లేదా ఈ ఉదయ అధ్యాపకునిగా నాకు మరే ఆధారము తెలియదు. మరెచ్చటను దానిని నేనుంచలేను.

ROM 5:9•

1PET 1:18,19•

1JN 1:7

 

45రక్తము క్రింద మాత్రమే ఆరాదించువాడిని దేవుడు కలిసికొనును, అందుకే వారు యెరూషలేము నొద్ద కూడుకొనిరి. దేవుడేర్పరచిన బలి గొర్రెపిల్ల క్రీస్తే. ఈనాడు మానవుని దేవుడు కలిసికొనుట ఒకే ఒక మార్గము, యేసుక్రీస్తు రక్తము క్రిందనే. మరెక్కడయిననూ అది ఖండింపబడినది; దేవుడు ఎన్నడూ దానిని వినడు. ఈనాడు నానా రకముల ఉద్రేకములు, నానా రకముల వాదములు, కదలుచూ, ఎగురుచూ, రక్తము, నిప్పు, పొగ మరేదయినా రప్పించవచ్చు; కాని జీవితము వాక్యముతో సరిపోల్చబడనిచో, దేవుడు దానిని గుర్తించడు. నీవు బయటనున్నావు గనుక ఇంకెంత ప్రయత్నించినా లాభములేదు. ఆ రక్తము జాగ్రత్త క్రిందికి వస్తేనే కాని దేవుడు నిన్నెన్నడూ కలిసికొనడు. అది నిజము.

GAL 4:26

 

46కాబట్టి వాక్యములో మనకొక యెరూషలేము ఉన్నట్లు చూచాము. (సంఘము); అది పరలోకమందున్నది. పరలోక యెరూషలేము, అక్కడ దేవుడు దేవుడే. మరియు ఈనాడు కొన్ని సిద్దాంతములు లేదా మరేదో ద్వారా యెరూషలేమును తయారుచేయు యత్నించుచున్నాం. మెతడిస్తులు ప్రధాన కార్యాలయమును యెరూషలేము నొద్ద ఏర్పాటు చేయ తలంచుచున్నారు; కాథలిక్కులు రోమ్ వద్ద ఆ విధంగానే ఆయా స్థలములలో తమ ప్రధాన కార్యాలయమును, అనగా, ఒక యెరూషలేముగా తయారు చేసికొనుచున్నారు. కాని మన యెరూషలేము పైనున్నదనియు, అది విశ్వాసులందరికీ తల్లి అనియు బైబిలు చెప్పుచున్నది.

LEV 16:15•

LEV 17:11

 

47ఇప్పుడు, క్రీస్తు ఏర్పాటు చేయబడిన గొర్రెపిల్ల, అదెంతగా తగియున్నదో నేడు గమనించండి. యెరూషలేము ఆగిపోవుటను అది చూపించుచున్నది. ఎప్పుడు? ఆ ఘడియ వరకు అది ఉపయోగములో నున్నది; ఆ దినము వరకు గొర్రెపిల్ల రక్తము సరియే. కాని ఇప్పుడు సిలువనొద్ద అది మారిపోయెను. పాత క్రమము పోయినది. క్రొత్తది వచ్చినది, బలివద్ద గొర్రెపిల్ల యున్నది. అర్పణ గొర్రెపిల్ల స్థలములో నున్నది. వారు అక్కడ చేయవలసిన రీతిగానే దానిని ఖండించుచూ అదే పనిని చేస్తున్నారు. అది నిజం.

ఈ చివర దినమున పరలోక వెలుగును ఈ అద్భుత రీతిలో చూచుటకు గాను దేవుడు దీవించబడును గాక. ఎందుకనగా సంఘములు ఈనాడు అదే పనిని చేయుచున్నవి. ఆ ఘడియ వరకు ఆ సంస్థ మతము ఖండించబడి మరియు క్రీస్తు వాక్యమును బలియర్పించుచున్నది అని నిరూపించబడినది, అప్పటి నుండి వాక్యము వచ్చెను మరియు వాక్యము మాత్రమే. ఆ పాత పస్కా గొర్రెపిల్ల దాటిపోయెను. సిలువ దినము వద్ద క్రీస్తే మన గొర్రెపిల్ల ఆయెను. దేవుని వాక్యమును సంఘశాఖ సిలువ వేసిన దినమున, వాక్యమునకు బదులుగా సిద్దాంతమును అంగీకరించినది, ఆ దినమున వాక్యము పూర్తి ప్రభావములో వచ్చును. అది ఈ మధ్యనే జరిగినది.

MATT 23:27,31

 

48రెండవది గమనించండి: మొదట అక్కడ, యెరూషలేము; రెండవది, వారు. ఎవరు వారు? యూదులు, ఆరాధకులు. దాన్ని ఆలోచించు. ఎవరిని ఆరాధించుచున్నామని చెప్పుచున్నారో, ఆయననే ఆరాధించువారు చంపుచున్నారు. తెలివిగల తర్పీదునొంది డాక్టరు డిగ్రీలు గల యాజకులు ఆ పని చేయుటను ఊహించారా? యాజకుడు కాకముందు ఒక ప్రత్యేక తరము లేదా గోత్రము నుండివారు రావలెను. వారు లేవీయులు కావలెను. వారి పితరులు యాజకులు; వారికి వ్యతిరేకముగా ఏ చిన్న తప్పు ఉండరాదు, ఉన్నచో, రాళ్ళతో కొట్టి చంపబడుదురు. ఏ కరుణా లేదు. అట్టి పవిత్ర జీవితము జీవించవలెను. పరిశుద్ధత? నిశ్చయంగా, కాని స్వంత-నిర్మితమైన పవిత్రత. వారు తమ సంఘము కొరకు తమ ముఖమును చూపించుటవలె ప్రవర్తించవలసియుండిరి. యేసు చెప్పిన రీతిగా, లోపల, "చచ్చిన శవముల ఎముకలు."

ఈ వాక్యము సత్యమని నమ్మియూ, తెలిసియూ, రాజీపడి, ఏదో ఒక సంస్థ ఎదుట ముఖమును చూపించు వ్యక్తిపై నేనెంతగానో నేరారోపణ చేయవలెను. దేవుని వాక్యముపై వారిని నేరస్తులనుగా తీర్చు హక్కు నాకున్నది.

MATT 23:30,31•

HEB 6:6

 

49గమనించండి, వారు ఆరాధకులు వాగ్దానము కొరకు చూస్తున్నవారు, సంవత్సరములు, యుగముల తరబడి చూస్తున్నవారు, చేయుటకేమీ వారికి లేదుగాని, ఎడతెగని సెమినరీలున్నవి; కాని వారు వాక్యమును తమ పాఠశాలల బోధనకు అనుగుణంగా విభజించిరి, దానిలోని సత్యమును వారు తప్పిపోయిరి. వారు యాజకులు, ఆనాటి సేవకులు; అక్కడ, అనగా, ప్రధాన కార్యాలయములో, ఆనాటి సేవకులు - దేవునినే చంపుచున్నారు, గొర్రెపిల్లను. ఎవరిని ఆరాధించుచున్నామని వారు చెప్పిరో, ఆయననే చంపిరి.

ఈనాడు అభిషేకించబడిన ఈ సేవకులపై నేరారోపణ చేయుచున్నాను! వారి సిద్దాంతములు, వారి శాఖలలో తాము ఏ దేవుని పేమించి, సేవించుచున్నామని చెప్పుకొనుచున్నారో - ఆ దేవున్నే ప్రజల కొరకు సిలువ వేయుచున్నారు. యేసు ప్రభుని నామమున ఈ సేవకులపై నేను నేరారోపణ చేయుచున్నాను, వారి బోధలను బట్టియే, అద్భుతములు జరుగు దినములు గతించినవని, యేసుక్రీస్తు నామమున నీటి బాప్తిస్మము సరియైనది కాదు మరియు చాలదు అని వారు బోధించుచున్నారు. ఈ మాటలలో దేనిపైనయిననూ వారు తమ సిద్దాంతములను ప్రత్యామ్నాయంగా రూపొందించినచో, వారు దోషులని నేను నేరము మోపుచున్నాను. వారి చేతులపై యేసుక్రీస్తు రక్తమున్నది. రెండవ సారి క్రొత్తగా ఆయనను సిలువవేసిన అపరాధమున్నది. బహిరంగముగా ఆయనను సిలువ వేయుచున్నారు. ఆ స్థానములో మరేదో కల్పించి, వారివ్వవలసిన దానిని తీసివేయుచున్నారు. పేరు ప్రతిష్టల కోసము సంఘ సిద్దాంతమును రూపొందించుచున్నారు.

50అక్కడ వారు, వారు, బాగుగా ఎరిగినవారెవరైనా ఉంటే వారు - ఆ సేవకులే. అందరికన్నా బాగా ఎరిగినవారు ఎవరైనా ఉన్నారు అంటే, అది ఈ దినము యొక్క సేవకులే! బిషప్పులు, ఆర్చిబిషప్పులు, సేవకులు, దైవత్వంలో డాక్టరు పట్టా పుచ్చుకొన్నవారు ఏదో బేధముగా తెలిసికోవాలనుకొందురు. కాని ఎందుకు వారు సఫలులు కాలేకపోవుచున్నారు? ఎంత విరుద్ధము! ఇప్పుడు మనముందున్నది విరుద్ధమే. దేవుని ఆరాధించువారమని వారు చెప్పుకొనుచూ, జీవాధిపతిని చంపుచున్నారు.

వారు… అక్కడ వారాయనను సిలువ వేసిరి, మరియు ఇక్కడ వారు, మరలా అదే పనిని వారిక్కడ చేయుచున్నారు. ఏలయనగా ఆయనే వాక్యము. ఈనాడు ఆయన వాక్యము యొక్క ప్రతిబింబమైయున్నాడు, ఆయన ఎవరి ద్వారానో ప్రతిబింబించ యత్నించుచున్నాడు.

51ఈ జనులు సమూహమును దేవునికి దూరంగా ఉంచిరి. ఏడైన అక్కడ జరిగినచో సమాజంలో దానిని దాటించి వేధికపై నుండి దానిని ఖండించెడివారు, "అది వెర్రితనము గనుక దానికి దూరంగా ఉండుడని," చెప్పెడివారు. వారావిధంగా చెప్పుచూ 1963లో యేసుక్రీస్తును సిలువ వేసిరి — ఆనాటివారి వలె, వీరును అపరాధులు. ఇది బాధాకరమగు ప్రకటన గాని ఇది సత్యము.

సరిగ్గా ఈనాడు వారు అదే చేయుచున్నారు. క్రీస్తును సిలువ వేసిరను ఈ మూలము మీద, వాక్యమును తీసికొనెదను. ఈ మూలము మీద దానిని ప్రజల నుండి తీసివేసిరి. అక్కడ వారు సరిగ్గా అదే చేశారు. దేవుడు తన స్వంత కుమారుని ద్వారా దానిని ప్రతిబింబించుచూ రుజువు చేయనారంభించగా, ఎవరిని వారు ప్రేమించుచున్నామని చెప్పిరో, ఆ యెహోవా లేఖనముల ద్వారా తాననుతాను బయలుపరచుకొనెను, ఖచ్చితముగా తానేమి చేయుదునని చెప్పెనో, వారి యెదుట ప్రతిబింబించెను. వారియొక్క సంఘపు గుంపు యొక్క ప్రేమవలన మరియు అలాంటి వాటిని బట్టి, వారు జీవాధిపతిని శిక్షించిరి.

JOHN 3:2•

HEB 6:6•

HEB 13:8

 

52అదే గుంపును ఈ రోజున నేను దేవుని యెదుట, దేవుని వాక్యమును బట్టి దోషులని నేరారోపణ చేయుచున్నాను, వారదే చేయుచున్నారు. ఈ తరమునకు నేరము ఆరోపించబడినది.

హెబ్రి 13:8 మరువవద్దు. ఆయన నిన్న, నేడు, నిరంతరము ఏకరీతిగా యున్నాడు.

వారాయనను ఎట్లా నేరస్తునిగా చేసిరి? ఎందుకనగా వారి సిద్దాంతములు ఆయనను అంగీకరించినందున వారి హృదయములలో ఏదో భేదమున్నది. యోహాను సువార్త 3వ అధ్యాయములో నికోదేము దానిని వ్యక్తము చేయలేదా? "రబ్బీ, పరిసయ్యులము, బోధకులము అయిన మేము నీవు దేవుని యొద్ద నుండి పంపబడినవాడివని యెరుగుదుము. దేవుడు నీతోయుంటేనే గాని ఈ కార్యములు నీవు చేయజాలవు." చూచారా. వారిలో బాగా పేరుపొందిన ఒక వ్యక్తి ద్వారా బాహాటముగా వారు సాక్ష్యమిప్పించారు. అయినను వారి మత సిద్ధాతంతముల వలన క్రీస్తును సిలువ వేసిరి. ఈనాడు అపొ. కార్యములు 2:38 చదవని వ్యక్తి ఏ ఒక్కడూ క్రైస్తవులలో లేరు. నావలె వారందరు చదువుదురు, కాని వారి సంఘ సిద్ధాంతముల వలన శాఖా టికెట్లు తమ జేబులో నున్నందున (సహవాస కార్డులని వారు చెప్పుకొనుచున్నవి మృగపు ముద్రలు) వారు యేసుక్రీస్తును నూతనముగా సిలువ వేయుచున్నారు. జాతిపైకి శిక్షను తీసికొని వచ్చుచూ, ఇది చేయుదునని వాగ్దానము చేసిన దేవునినే వారు దూషించుచున్నారు.

MATT 16:3•

JOHN 5:46•

JOHN 8:46

 

53అక్కడ వారు పాపులు కారు, ఆనాటి సంఘము వాక్యమైయున్న ఆయనలో తప్పులు పట్టుకొనిరి. అవునా? వాక్యమైన వానిలోనే తప్పులు కనుగొనిరి. దేవుని బయలుపాటు ద్వారా, ఒక వ్యక్తి ద్వారా వాక్యముతో పరిశుద్ధాత్మ పనిచేయుచుండగా, వారును అదే విధంగా తప్పులు వెదకుచున్నారు. ఆయన క్రీస్తేనని వారికెట్ల తెలియును? ఆయన కార్యములే ఆయనను రుజువు చేసినవి. నాలో పాపముందని ఎవడు నిరూపించగలడని ఆయన అడిగెను. లేఖనములు చెప్పినట్లుగా నేను చేయనిచో, ఎవరైనాగాని ఎక్కడైనా నేను విఫలమయ్యానని చెప్పినచో, నేను మెస్సియానని ఒక్క గురుతు తప్పిపోకుండా చూపించనిచో, మీకు వాగ్దానము చేయబడిన వానిని నేనేనని రుజువు కానిచో, నన్ను నమ్మకుడి అనెను.

అందుకు వారు, "మాకు మోషే ఉన్నాడు. మేము మోషేను నమ్ముదుమని" పలికిరి.

"మీరు మోషేను నమ్మియుండినచో నన్నును నమ్మియుందురు. మోషే నా దినములు చూచి ఇప్పుడు జీవించగోరెను. మోషే ప్రవక్తల గుండా బహు దూరంలో అది చూచెను. మీరు ఆ దినములో జీవించుచూ ఖండించుచున్నారు. వేషధారులైన మీరు ఆకాశమును వివేచించకలరు, గాని కాల సూచనలను వివేచించలేరు," అని ఆయన చెప్పెను.

JOHN 1:1,14•

HEB 6:6•

HEB 13:8

 

54అడక్కడే ఉన్నది, కాల సూచన ఇది.

వారాయనను ఎట్ల వర్గీకరించిరి? ఒక మూఢభక్తి గలవానిగా, పిచ్చివానిగా. వాక్యమైయున్న ఆయనలో వారు తప్పులు పట్టుకొనిరి. ఆయనే వాక్యము. యోహాను 1వ అధ్యాయము దానిని రుజువు చేయును: ఆదియందు వాక్యముండెను. వాక్యము దేవునియొద్ద నుండెను, ఆ వాక్యమే శరీరధారియై మనమధ్య నివసించును.

ఆయన దేవుని యొక్క సజీవ వాక్యము, ఎందుకనగా ఆయన తన ద్వారా దేవునిని వ్యక్తము చేసెను. ఆయన పరిపూర్ణునిగా దేవుని వాక్యమును అప్పగించుకొనెను. ఆయన మరియు వాక్యము ఒక్కటే. ఈనాడు సరిగ్గా సంఘము కూడా అలాగే ఉండవలసియుండెను, దేవుని వాక్యము ఎల్లప్పుడూ ఒక్కటే. ఆచరణలో నీవు దానిని తిరస్కరించుచూ అందులో భాగముగా ఎట్లుండగలవు? ఆ విధంగా చేయుటకు కారణము జనులు కాదు. ఆ కారణమును బట్టి ఈ జనులు తమ పిల్లలను "రిక్కి" మరియు "రిక్కెటా" అని పిలుచుటను గురించి దేవుడు నాతో మాట్లాడియున్నాడు అనుకుంటాను. కారణమేమనగా స్వార్దపు శాఖలు తాము జీవించుచున్నట్లే వారిని కూడా జీవింపజేయుచున్నారు. వారు సత్యమును సిలువవేసిరి, మరియు ప్రజలు దానిని దేవదూషణగా తయారు చేశారు — వారు దానిని దేవదూషణగా లేదా ఇంకేదోగా చేస్తున్నారు. వారు ఆలయానికి వెళ్ళి ఏ దేవుని సేవించుటకు వెళ్ళుచున్నారో, అదే దేవుని దూషించుచున్నామని వారెరుగరు.

కాబట్టి ఈ యాజక గుంపును ఈనాడు నేను నేరస్తులని పిలుచుచున్నాను. దేవుని వాక్య అధికారము క్రిందను, యేసుక్రీస్తు నామములోను, ఈ తరము ఆయనను మరల సిలువ వేయుచున్నారని నేరారోపణ చేయుచున్నాను.

గమనించండి, ఆయన నిన్న, నేడు, నిరంతరము ఏకరీతిగానున్నాడు. దేవుని వాక్యము ఒక మానవునిలో బయలుపరచబడినది.

LUKE 1:35•

JOHN 19:7•

COL 2:9

 

55రెండు కల్వరిలను, రెండు నేరారోపణలను పోల్చి చూడండి. "ఆయన తానే దేవునిగా నుండెను గనుక తనపై ఏ మానవునికి అధికారము ఇయ్యలేదని" మరువద్దు. యేసును సిలువ వేసిన ఆ ఉదయమున ఆలోచన సభవారు చేసిన నేరారోపణ ఏమిటి? తానే దేవుడనని చెప్పుకొనెను — ఆయనే దేవుడు; మరియు ఆయన సబ్బాతును అతిక్రమించెను — ఆయనే సబ్బాతుకు ప్రభువు. ఆయన తానే దేవుడనని చెప్పుకొనెను గనుక వారు ఆయనను ఖండించిరి. "నీకది చేయుటకు హక్కు లేదు. నీకు ఏ హక్కు లేదు. ఏదైనా వచ్చినట్లయితే, అది మా ప్రధాన యాజకుని ద్వారా రావలెననిరి."

ఇప్పుడు, దానిని ఈనాటి కల్వరితో పోల్చండి. ఎప్పుడైతే దేవుడు (అది తండ్రిని ఎంతో సంతోషపరచెను, దేవుడు, ఆత్మ, తన స్వంత కుమారుని లేపెను) పరిశుద్ధాత్మ ద్వారా మరియను కమ్మినప్పుడు, ఆయన సేవ చేయగల మరియు తన ఉద్దేశము నెరవేర్చగల ఒక శరీరము తయారయినది. క్రీస్తులో దేవుడుండెను, దైవత్వము యొక్క సర్వ పరిపూర్ణత ఆయనలో నుండెను, జనులకు దేవుడేమైయుండెనో అదంతయూ ఆయనలో ప్రతిబించెను, ప్రతి వ్యక్తి ఎట్లుండవలెనని దేవుడు కోరేనో అది లోకమంతటికి తెలియజేయబడెను: ఒక కుమారుడు మరియు కుమార్తె. ఆయన ఒక్క మనుష్యుని తీసుకొని అది చేసెను. కేవలము ఆయన వారి సంస్థల పదవులలో చేరనందున, వారాయనను ఖండించి మరియు సిలువ వేసిరి.

MATT 19:21,22•

JOHN 1:14•

ACTS 9:3,6

 

56ఆనాటి కల్వరిని నేటికి పోల్చండి! సంస్థాగతమగు విమతము వలన, దేవుని వాక్యము సంకల్పము తెలిసికొనవలసిన పండితులు మధ్యనున్న భేదముల వలన, దేవుడు వాక్యమునకు విధేయులైయుండు చిన్న గుంపును ఎక్కడో ఎన్నుకుని వారి ద్వారా పనిచేయవలసి వచ్చెను. అది అలాగు కాదని వారు చెప్పలేరు. ఆయనది చేయడని వారు అనరు, ఎందుకనగా వారి సమూహమే అందుకు సాక్షి. వారి ఎదుటనే అది ఉన్నది. వారు దానిని కాదనలేరు. ఆయన వాగ్దానములను వారు కాదనలేరు, ఎందుకనగా తాము నమ్మితిమని చెప్పినదానిని ఆయనను రుజువు చేసెను. దేవుడు వాక్యమును తీసికుని రానైయున్న మెస్సీయాను ఒక మానవుని ద్వారా చూపించెను. వారాయనను వదిలించుకో చూచారు. మెస్సీయాను వదిలించుకొనుట ఒక్కటే తాము ముందుకు వెళ్ళు మార్గమనుకున్నారు. వారాయనను త్రోసివేయజూచిరి. వారు విద్యావంతులై యుండియు వారి గ్రుడ్డితనము మరియు అలక్ష్యము వలననె అది చేశారు. వారు తెలివిగలవారు. లోకరీత్యా చాలా మేధావులు, గతరాత్రి మనము పోల్చి చూచిన విధముగా. ఆ ధనికుడగు యవ్వనుని వెలుగు తాకగానే ఏంచేశాడో చూడండి. ఒక చురుకైన వ్యక్తిని ఆయన తిరస్కరించెను. పౌలు అను మరో తెలివిగల వానిని వెలుగు తాకినది. అతడేమి చేసెను? దానిని అంగీకరించెను. క్రీస్తును తెలిసికొను నిమిత్తమై తనకు తెలిసినదంతా అతడు మరచెను. అది అతని జీవితమును సువార్తకు తగినట్లుగా చేసెను. (గత ఆదివారపు రాత్రి వర్తమానము.)

57ఈ రోజు అది అక్కడే ఉన్నది. బహుశా, వెళ్ళిపోయిన ఒక వ్యక్తిని తాకినదనుకోండి, దేవుని పిలుపున్నది, విన్నాడు, ఏదో పాఠశాలకు వెళ్ళి కొంత సిద్ధాంతం నేర్చుకొనెను. అతడు తాను నేర్చుకొనిని సిద్దాంతముతో జీవించి తీరవలెను లేదా తన సహవాస కార్డును విడిచిపెట్టవలెను. ఆ విధంగా అతడు చేసినచో అతడిని కొట్టివేయుదురు. ఎవరూ అతనిని చేర్చుకొనరు, ఎందుకనగా ఒకసారి అతడు దేనికో చెందిన వ్యక్తి. ఆ వ్యక్తిలో ఏదో పొరపాటు యుండియుండునని వారు అందురు. వారు తమ సమాజములో చేర్చుకొనరు. వారు ఒకే ఒక సూచన కొరకు చూచుచుందురు. వారు నమ్మినది అతడు నమ్మునా లేదా అని అతడు మెతడిస్తు అయి కార్డు కలిగియుండియు, ఏకత్వమో, త్రిత్వమో, లేదా మరో సహవాసములోనయినా ఉన్నచో… అతనికి ప్రధానకార్యలనము వారు చిన్నచూపు చూచి, మానసిక పరీక్ష చేసి, అతని మెదడు తవ ఎదుట మాట్లాడకలుగు స్థితిలో ఉన్నదో లేదో చూచెదరు. ఆ విధంగా అతడు లేనిచో, అతని వెళ్ళగొట్టుదురు. అది నిజము.

LUKE 11:20•

JOHN 10:33•

JOHN 14:12•

JOHN 19:7•

HEB 6:6

 

58కాని చూడండి, జనసమూహము ప్రభుని హస్తమును కనిపెట్టి చూడవలసియున్నది. ఆ అభిషేకము దేవుడిచ్చినదో కాదో చూడవలెను. అదే మనము చూడవలసియున్నాము. కాని ఈ రోజున వారు నూతనముగా దేవుని కుమారుని సిలువ వేయుచున్నారు. దేవుని కృపవలన ఒక వ్యక్తి దేవుని పిలుపును పొందినప్పుడు, అతని ద్వారా దేవుడు బయలుపరచబడును. "నేను చేయు కార్యములు మీరును చేయుడి" అని ఆయన చెప్పెను.

మనమెట్టి దినమున జీవించుచున్నామో గుర్తించండి. వారు ఆ సిలువనే తీసికొనుచున్నారు, ఈ ఉదయాన మనము తీసికోగలము మరియు అదే కారణము… ఇప్పుడు, వారు ఏది సత్యమో ఎరుగుదురు, కాని అసూయ, భేదమువలన… యేసు వారితో ఏమనెను? నేను దేవుని వ్రేలివలన దయ్యములను వెళ్ళగొట్టినచో, మరి మీరు దేనివలన వెళ్ళగొట్టుచున్నారనెను? వారే మీకు తీర్పరులు, నేను దేవుని వ్రేలివలన వాటిని వెళ్ళగొట్టుచున్నాను.

వారన్నది వినండి, "ఇది దేవుని వ్రేలని నీవు రుజువు చేయగలవా?" ఆయన అడిగిన ఆ ప్రశ్నను నేను వినగోరుచున్నాను. ఆ విషయంలో వారు చాలా తెలివైనవారు.

గమనించండి! ఆయన దేవుడని చెప్పుకొనెను గనుక (ఆయన దేవుడే).. "ఆయనను మాపై తీర్పరిగా నియమించిన వాడెవడు" అన్నారు.

2TIM 3:16•

HEB 6:13,15•

2PET 3:9

 

59అదే పాత స్వరం మరల వినబడుచున్నది. "బైబిలు మానవుని ద్వారా వ్రాయబడినది," గనుక "దానివలన మేము జీవించము" అన్నారు. అది దేవుని వాక్యము; అది దేవుడే.

నేను నిన్న ఒక మనిషితో మాట్లాడుతూ ఉన్నప్పుడు ఇట్లు అన్నాడు, "ఎవరో ఒక మనిషి బైబిలు వ్రాసియుండును."

అందుకు నేనన్నాను, "అవును, ఆయన పేరు దేవుడు," అన్నాను. యోబు గ్రంథము నుండి క్రొత్త నిబంధన వరకూ ఉన్న భాగములు వేర్వేరు వ్యక్తులు నాలుగు వేలు లేదా అంతకన్నా ఎక్కువ సంవత్సరముల వ్యవధిలో వ్రాశారు. వారు ఒకరికొక్కరికి తెలియదు. వేర్వేరు దేశములలో జీవించారు, కాని ఏ ఒక్కమాట కూడా ఒకదానికొకటి పొత్తులేనిది లేదు. ఎవరైనా గాని యేసుక్రీస్తు రక్తము క్రింద వచ్చి అక్కడి వాగ్దానములను స్వాధీనపరచుకొనవచ్చును. దేవుడు వాటిని నెరవేర్చబద్దుడు. కాని వారు ఆ పనిచేయరు. వారు వచ్చి "ఓ దేవా, నేను ఏదో చేయగోరుచున్నాను. నాకొక గొప్ప వరమిమ్ము. హల్లెలూయా! ప్రభువా, దేవునికి మహిమ! నేను దానిని పొందాను అని నమ్ముచున్నాను. హల్లెలూయా!" అని చెప్పుదురు. అదెన్నడూ పనిచేయదు. నీవెంతో మానసిక శాస్త్రమును తేవచ్చును, కాని అది పనిచేయదు. ఆ పశ్చాత్తాపమును దేవుడు గుర్తించవలెను; దేవుడు దానిని చేయవలయును. చాలా చెప్పుకొనవచ్చును గాని మీకది అర్థమయి యుండును అని ఆశిస్తున్నాను.

REV 22:18,19

 

60చూడు! వారిపై వాక్యమును అధికారము చేయనీయరు. "మీరందరూ వెనుకకు రండి; మీరు తప్పు బాప్తిస్మము పొందారు. మీరు కాతలిక్కు సంఘములో బాప్తిస్మం పొందారు" అని నేను చెప్పుచున్నాను.

"అది మాకు చెప్పుటకు నీవెవరవు?" నేను కాదు; అది వాక్యము. మీరేమి నమ్ముచున్నారో నాకవసరం. బైబిలు చెప్పుచున్నది విను. ఆ విధంగా మేము జీవించమని అంటారా? నీవు చేసినచో బైబిలు తీర్పు క్రింద నీవుండు. "దానికి ఒక మాట చేర్చినా, ఒకటి అందులో నుండి తీసివేసినా గాని నీ పేరు జీవగ్రంథములో నుండి తీసివేయబడును"; ఆ వ్యక్తి సేవకుడు లేదా మరో యాజకుడు ఎవరైనా కావచ్చు. నీవు ఈ వాక్య అధికారము క్రిందికి రావలెను, ఎందుకనగా అది వాక్యము. అది దేవుడని బైబిలు చెప్పుచున్నది. "అది మమ్మును ఏలరాదు," అనుచున్నారా. వారు సిద్దాంతములను, శాఖలను ఇంకా చిన్నచిన్ని వాటిని నమ్ముకొని మానవుల ఆలోచనలను దత్తము చేసికొని, దేవుని వాక్యమునకు బదులుగా మరేదో తీసికొనుచున్నారు.

MARK 15:11

 

61వారేం చేశారు? బరబ్బాను తీసికొని, మొదట సిలువలో, దేవుని కుమారుని అప్పగించిరి. వాడు హంతకుడు. ఈ రోజు వారు ఏదో మానవ విశ్వాసమును తీసికొని అబద్ధమును నమ్మి, మరణ మార్గమును ఎన్నుకొని, జీవమార్గమును నిరాకరించుచున్నారు, దేవుని వాక్యము. నేను ఈ తరమును ఖండించుచున్నాను, ప్రభుని వాక్యములో వారు తప్పు అని నేరారోపణ చేయుచున్నాను. వారు సిలువ వేసిన నేరస్తులు, ఆత్మను సిలువవేయ యత్నించుచున్నారు.

2TIM 3:5

 

62ఎక్కడ చూచినా ఉజ్జీవం కోసం వారు అరుస్తున్నారు. జనుల ద్వారా వాక్యము పనిచేయనప్పుడు నీవు ఉజ్జీవమునెట్లు పొందగలవు? ఎవరైనా నాకు దానిగూర్చి జవాబునీయండి. అసలు ఉజ్జీవమునే నీవు కాదనుచున్నావు గదా? పైకి భక్తిగలవారని ప్రవచన చెప్పినది నిజమే. జీవవాక్యమును వారి స్వంత ఆచారములే నిరాకరించినవి. వారి సిద్దాంతములు, వారి స్వంత ఆచారములు ఈనాడు ఉజ్జీవమునిచ్చు దానిని నిరాకరించుచున్నవి. అవునండీ! వాక్యమునకు బదులుగా వారు శాఖను, వారి ఆచారములను తీసికొని ఆయన వాక్యమును సిలువ వేయుచూ ప్రజలతో వాక్యమునకు ప్రభావము లేకుండా చేయుచున్నారు. (దేవుడు వాగ్దానము చేసినట్లుగా చేయుట వారు చూస్తున్నారు) చాలా తేటగా దేవుని వాక్యమును వారు చూస్తున్నారు గాని, హేళన చేసి దానికి దూరమైపోవుచున్నారు. అది దేవదూషణ వాక్యమునే వారు సిలువ వేయుచున్నారు. ఎందుకు వారు సిలువ వేయుచున్నారు? వాక్యమును సిలువ వేయుట అనగా, దేవునినే సిలువ వేయుట. దేవుని కలిగియున్న శరీరమును, దేవుని కుమారుని వారు సిలువ వేసెను; దానిని వారు సిలువవేయగలిగెను, కాని వారు దేవుని సిలువ వేయలేదు. నిత్యజీవమునకు ముందుగా నిర్ణయించబడిన అనేక కుమారులను ఆయన తీసికొని వచ్చుటకుగాను బలిగా అర్పించబడెను. వారప్పుడు ఆ విధంగా చేయకలిగిరి, కాని ఇప్పుడు వారు ఆ విధంగా చేయజాలరు. వారు ఆ విధంగా చేయలేరు, ఎందుకనగా వాక్యము తనకుతానే జీవించును. అయితే వారు…

MATT 11:25•

MATT 15:6•

MARK 7:13

 

63వారేమి చేయుదురు? వారెట్ల రూపొందిరి? బోధకుడవైన నీవు ఏమంటావు? ఆయనను వారు సిలువవేయుచున్నారు గదా? నీవు నీ వేదికనెట్లా నిర్మించుచున్నావు? వారి సిద్దాంతముల ద్వారా జనులపై సువార్త యొక్క ఫలితములను వారు సిలువవేయుచున్నారు. అదే సిలువ మరణము: ఈ గొప్ప సంఘములు, శాఖలు ఒక సిద్దాంత గీతను గీసి జనులను కూర్చుండబెట్టుచున్నారు; దేవుని వాక్యము వారిపై ప్రభావము చూపించుటలేదు, ఎనుకనగా క్రీస్తు ఏవి జరుగునని చెప్పెనో వాటినే వారు ఖండించుచున్నారు. అవి వారి సిద్దాంతములకు అనుకూలముగా జరుగుట లేదు, ఆయన వచ్చునని వారు తలంచిన రీతిగా ఆయన రాలేదు. దేవుడాయనను పంపిన మార్గములో ఆయన వచ్చెను, ఖచ్చితముగా వాక్యముతో ఆయన వచ్చెను. జ్ఞానులకు తెలివిగల వారికాయన వాటిని మరుగుపరచి, నేర్చుకొను పిల్లలవంటి వారికి దానిని ఆయన బయలుపరచెననుటలో ఆశ్చర్యములేదు. నీకు అర్ధమైనదా?

MARK 7:13•

MARK 16:15-18•

HEB 13:8

 

64వాక్య ప్రభావమును వారు సిలువ వేసిరి.

కొన్ని వచనములిచ్చటనున్నవి. అందులో రెండు లేదా మూడు ఉదహరించుదును. వారు వాక్యమునెట్ల సిలువ వేసిరని నీవు ప్రశ్నించవచ్చు. హెబ్రి 13:8లో యేసుక్రీస్తు నిన్న, నేడు, నిరంతరం ఏకరీతిగా ఉన్నానడని చెప్పినప్పుడు, "ఆయన ఆ విధంగా" నని వారనుచున్నారు. చూచారా? సరే. యేసు తన చివరి వాగ్దానములో సంఘమునకు, "మీరు సర్వలోకమునకు వెళ్ళి, సర్వసృష్టికి సువార్తను ప్రకటించుడని" చెప్పెను. నమ్మినవారి వలన ఈ సూచక క్రియలు కనబడును. (మార్కు 16) — సర్వలోకమునకు, సర్వసృష్టికి ఇంకా సగం మందికి కూడా సువార్త చేరలేదు. యేసుక్రీస్తు నామమును సహితము వినకుండా ప్రతి సంత్సరము మిలియనుల మంది మరణించుచున్నారు. కాబట్టి అది ఇంకనూ దేవుని యొక్క ఆజ్ఞయే. అధిపతి జారీచేసినదే; అది ఇంకనూ దేవుని ఆజ్ఞయే. "…సర్వలోకమునకు సర్వసృష్టికి సువార్తను ప్రకటించుట. నమ్మి బాప్తిస్మము పొందినవాడు రక్షించబడును; నమ్మనివానికి శిక్ష విధింపబడును. నమ్మినవారివలన ఈ సూచక క్రియలు కనబడును. "నా నామమున వారు దయ్యములను వెళ్ళగొట్టుదురు; క్రొత్తభాషలు మాట్లాడుదురు; వారు సర్పములను ఎత్తిపట్టుకొన్నను, మరణకరమైనది త్రాగినను ఏ హానిచేయదు; రోగులపై చేతులుంచినప్పుడు బాగుపడెదరు." కాని వారు అది ఆ తరమునకే గాని మనకు కాదని చెప్పి దేవుని ఆజ్ఞను ప్రభావము లేనిదిగా చూపుచున్నారు. ప్రజలకు వాక్యము యొక్క ప్రభావామును సిలువ వేయుచున్నారు. ఆమెన్!

ACTS 2:13,37

 

65పేతురును పెంతెకొస్తు దినమున చెప్పెను, పరలోక రాజ్య తాళపుచెవులను యేసు అతడికి ఇచ్చియుండెను, "మీరిక్కడ ఏది చెప్పితే అక్కడది జరుగుననెను." పరిశుద్ధాత్మను పొందుటకు ఏమి చేయవలెనని పెంతెకొస్తు దినమున వారడిగిరి. అక్కడున్న కొందరిని వారు

గమనించుచూ హేళన చేసిరి, నత్తిగా, గంతులేస్తూ పడుతూ, లేస్తూ త్రాగిన వారివలె ఉన్నారని చెప్పారు. "వారంతా క్రొత్త మద్యముతో మత్తులైరని," చెప్పిరి.

ACTS 2:15-19

 

66అక్కడ పేతురు అను పేరుగల ఒకాయన పరలోక రాజ్యపు తాళపుచెవులు కలిగియుండి, లేచి నిలబడి, "మీరునుకొనుచ్నుట్లుగా వీరు మత్తులు కారు. పగలు మూడు గంటల వేళయే కదా? (అపొ.కా. 2) కాని పలుకబడినది ఇదే," చూచారా. మరల వాక్యము నొద్దకు, ఆత్మ ఇంకనూ వాక్యమేనని, మరియు వాక్యము ఇంకనూ ఆత్మగా, దేవుని యొక్క వాక్యము అని చూపించుచున్నాడు. (యోవేలు ప్రవక్త పలికినట్లుగా, యోవేలు 2:38) "అంత్యదినములలో సర్వశరీరుల మీదను నా ఆత్మను కుమ్మరించెదను." నిలబడి ఆ ప్రవక్త మాటలను వినండి. అతని వైపు చూడండి. నిర్భయంగా ఆ గుంపు వద్ద నిలబడి ఖండించుచూ నేరారోపణ చేయచున్నాడు. "ఇది లేఖనము. ప్రవక్త యోవేలు పలికినది ఇది. సర్వ శరీరుల మీద నా ఆత్మను కుమ్మరించెదను. మీ కుమారులు కుమార్తెలు ప్రవచించుదురు. నా దాసులు, దాసీలపై నా ఆత్మను కుమ్మరించుదును. పైనున్న ఆకాశమందును, భూమి, అగ్ని, పొగ స్తంభములు, ఆవిరిలలో వారు నవ్వి హేళన చేసిరి. వారు తీర్పుకు వెళ్ళిరి. పట్టణము దహించబడినది. వారు ఒకరి పిల్లలను ఒకరు తినిరి. ఈనాడు ప్రపంచమంతా చెదరిపోయిన ఒక జనాంగమున్నది. పరిశుద్ధాత్మ ఇంకనూ వాక్యమైయుండి, వాక్యమును జీవింపచేయుచున్నదని అది చూపించుచున్నది.

JOHN 1:14•

JOHN 14:12•

HEB 6:6•

HEB 13:8

 

67యేసుక్రీస్తు ఒక వ్యక్తి, మానవుడు, దేవుడు. హల్లెలూయా! ఆయన దేవుని ప్రత్యక్షత. ఒక్కొక్క దేవుని వాగ్దానమును చూపించు ఆ యుగములో శరీరధారియైన దేవుని వాక్య ప్రతిబింబమే అది. పరిశుద్ధాత్మ ఈనాడును అలాగేయున్నది. వ్రాయబడిన వాక్యముపై అది దేవుని ఆత్మ. ఆయన నిన్న, నేడు, నిరంతరము ఏకరీతిగా నున్నాడని చేయుటకు దానిని ప్రతిబింబింపచేయు మనుష్యుల కొరకు వెదకుచున్నాడు. యోహాను 14:12: నేను చేయు క్రియలు మీరును చేయుదురు — యేసుక్రీస్తు నిన్న, నేడు, నిరంతరము ఒక్కరీతిగా యున్నాడు, చూచారా. దానిని ప్రతిబింబించుటకే ఆయన నిరంతరము చూచుచున్నాడు.

వారు దానిని చేయలేకపోయిరి. ప్రజలు తమ శాఖల గూర్చి అతిగా ఆలోచించిరి. వారి చిన్న గూళ్ళను సంఘములుగా పిలుచుకొని ఆయన మాట వినలేదు. ఈనాడు కూడా అదే పని వారు చేయుచున్నారు. నూతనముగా ఆయనను సిలువచేయుచున్నారు.

MARK 1:4•

LUKE 3:3•

ACTS 2:14,15,37-39

 

68పేతురు పెంతెకోస్తు దినమున చెప్పెను, "యెరూషలేము, యూదయలలో కాపురమున్న మనుష్యులారా? నా మాట ఆలకించుడి. "వీరు మత్తులు కారు, మీరు నెమ్మదిగా నిలబడినచో అదేమిటో నేను చూపించగలను." అతడు ముందుకు వెళ్ళి వారికి వివరించెను. వారి హృదయములు గ్రుచ్చుకొనినప్పుడు వారు, "మేము రక్షించబడుటకు ఏమి చేయవలెను? అని అడిగిరి. దీనిని మేము పొందాలంటే ఏం చేయాలి? నీ మాట నిజమని మేము ఒప్పించబడితిమి."

అందుకతడు, "ప్రతివాడును మారుమనస్సు పొంది యేసుక్రీస్తు నామమున పాపక్షమాపణ నిమిత్తము బాప్తిస్మము పొందుడి. అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరము పొందుదురు. ఇది మీకును, మీ పిల్లలకును దూరస్తులందరికిని ప్రభువైన మన దేవుడు పిలిచిన వారికందరికిని చెందును." ఇదే వారు పొందుటకు చేసినది: మారుమనస్సు పొంది యేసుక్రీస్తు నామములో బాప్తిస్మము పొందిరి.

ACTS 2:40

 

69ఈనాడు రోమను కాతలిక్కు సంఘము దాని స్థానములో తండ్రి, కుమార, పరిశుద్ధాత్మను దత్తము చేసినది. ప్రభురాత్రి భోజనమునకు బదులుగా, నాలుక బయటకు చాపి దానిమీద ఒక చిన్న రొట్టె ముక్కను వేసికొనుచూ, యాజకుడు ద్రాక్షరసము త్రాగుకొనుచున్నాడు, నీవు ఏకమైనావని చెప్పెదరు. పరిశుద్ధాత్మ దానిని సవాసమని పిలుచుచుండగా, వారు దానిని "పరిశుద్ధ యూకారిస్టు" అని పిలుచున్నారు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ అను త్రిత్వ బాప్తిస్మము ఇచ్చుచున్నారు. దానిగూర్చి బైబిలులో ఎన్నడూ మాట్లాడలేదు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ యొక్క నామము ప్రభువైన యేసుక్రీస్తు, దీనిని మీరు మూర్ఖతరము వారికి చూపించినప్పుడు, వారేమి చేయుదురు? దానిని హేళన చేసి, "మా సంఘము ఆ విధంగా బోధించుటలేదు" అని చెప్పుదురు. అప్పుడు నీవు దోషివగుదువ. జనులనుండి యేసుక్రీస్తు శక్తిని తీసివేసినందుకు దేవుని సిలువ వేసిన కారణమున నీ మీదకు వచ్చాను. వాక్యమునే వారికి నీవు సిలువవేసి యున్నావు. నీ సహవాసముతో కలిపి నీవు ఖండించుదువు. అది వారిని మరణ ఉరిలోనికి నడిపించును.

70గత ఆదివారము సువార్తికుని గూర్చి చెప్పాను. మార్టిన్ లూధర్ కింగ్ ఆ ప్రశస్త జనులను ఊరిలోనికి నడిపించుకొని వెళ్ళాడు. ఎవరైనా ఆ వ్యక్తితో మాట్లాడియుండినదో? నేను మాట్లాడియుందును. చిన్న బడి గల్లంతువలన. చూచారా? ఎంతో గొప్ప బేధము. రంగును బట్టి ఆ జనులు ఆ వ్యక్తితో చేరుటకు ఇష్టపడలేదు, వారు ఖండింపబడి మరియు మరణించారు. దానికి వ్యతిరేకముగా పోరాడవద్దు.

ఐరిష్ వారని, జర్మనులని విని కొందరు వారితో కలియరు. క్రైస్తవులకు అది ఉండరాదు; వారు కలిసి మెలగవలెను. ఆ వ్యక్తి క్రైస్తవుడు, సేవకుడయిన అతడు జనులను తిరుగుబాటుకు పురికొల్పకూడదు. వారావిధంగా మిలియనుల మంది చనిపోయేట్లు చేశారు. అది మరో విప్లవమును లేపును. ఆలాగు చేయుట అవమానకరము.

ACTS 2:38

 

71అదే ఇక్కడ కూడా జరుగుచున్నది. మరలా అదే నిజం. అది నిజము, చూచారా. జనులు సత్యమును చూచినచో ఎంత బాగుండును. "మా సంఘము అది నమ్మదు. మాకు ఇంకో మార్గమున్నది," అంటారు. అది సరియైన మార్గం కాదు. అది సంగతి కాదు.

"పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడును మారుమనస్సు పొంది, యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందవలెనని అతడు చెప్పెను." ఇప్పుడు, వారది చేయరు. ఓ, అయిన వారేమి చేయుదురు? ఎన్నో వందల కొలది సంగతులు అలాంటివి ఉన్నవి, అందులలో ఇది ఒక్కటి, మనము వీలైనంత త్వరపడి వెళదాము.

MARK 16:15-17

 

72ఇప్పుడు రెండో సిలువ వేయుట. వాక్యమునకు బదులుగా ఒక వ్యక్తి తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ సిద్దాంతమును నమ్మినచో నామమునకు బదులుగా బిరుదులను అంగీకరించినచో జనులకతడు ఏమి చేయును? జనులపై వాక్యము యొక్క ప్రభావమును అతడు సిలువవేయును. మార్కు 16 ఆ తరమునకు మాత్రమేనని చెప్పినచో, ఏమి జరుగును? యేసు, వారితో మాట్లడుచూ, "సర్వలోకమునకు వెళ్ళి, సర్వసృష్టికి సువార్త ప్రకటించుడి. నమ్మినవారు మరియు బాప్తిస్మము పొంది రక్షించబడును; నమ్మనివానికి శిక్ష విధించబడనును. నమ్మిన వారివలన ఈ సూచక క్రియలు కనపడును…" అని చెప్పెను గదా? ఎంతవరకు? ప్రతిదేశము, ప్రతి జాతి, ప్రతి నాలుక, ప్రతి జనాంగము, ప్రతి వ్యక్తికి, ఓకే సువార్త ఒక వ్యక్తి దానిని బైబిలులో నుండి కత్తిరించ యత్నించినచో - జనులకు సువార్త ఇచ్చు ప్రభావమును సిలువ వేయుచున్నాడన్నమాట. కాబట్టి యేసుక్రీస్తు నామము నీపై నేను నేరారోపణ చేయుచున్నాను: ప్రభువును చంపిన అపరాధము నీపై యున్నది!

73సంఘమాయనను ద్వేషించినది. ఎందువలన? ఆయన వారి దేవుడైనందుననే. వారాయనను తమ మెస్సీయాగా తిరస్కరించి, ద్వేషించిరి. అట్టి మెస్సీయా వారికక్కడ లేదు. ఈనాడు సంఘమూ అదే చేస్తున్నది. వాక్యమును తోసివేయుచున్నారు. వారికది అక్కరలేదు; వారు ఏ సిద్దాంతములు నమ్మవలెనని నేర్పించబడిరో, వాటికి అది విరుద్ధము. వాక్యమే మెస్సియా. నీవు నమ్ముదువా? వాక్యము యొక్క ప్రతిబింబము ఏమిటి? మెస్సియా యొక్క ప్రతి బింబము, మన మధ్యనున్న పరిశుద్ధాత్మయే. ఆయనందతటికి ఆయనే ప్రతిబించుచున్నాడు, ఈ సిద్ధాంతములు మరియు ఆచారమలతో కలవని దీపములు ఎప్పుడయితే ఆయన కనుగొనునో వాటి గుండా ఆయన చూచుటకు మరియు వెలుగునిచ్చుటకు ఆయన ప్రయత్నము చేయుచున్నాడు.

MATT 25:7

 

74వారు లేచి దివిటీలు శుద్ధి చేసుకొని తుడిచిరి గాని, అది చాలా ఆలస్యమైనది. చివరి దినములలో పరిశుద్ధాత్మను పొందు ప్రయత్నములో ఈ లూధరనులు, ప్రెస్బిటేరియనులు, మెతడిస్తులు వచ్చుట చూచినప్పుడు, వారు పొందరని నీవు తెలిసికొనుము. వారు భాషలలో మాట్లాడుచూ క్రిందికి, పైకి గంతులు వేయవచ్చును, కాని ఏం జరుగునో గమనించుము. ఆమె పని అయిపోయినదనుటకు ఇది కాల సూచన. మనం అంతములో నున్నాం. "పైకి ఎక్కి రమ్మను" సవాలును సంఘము ఏ సమయంలోనైనా వినవచ్చును. ఆమేన్! సరిగ్గా క్రమములో కూర్చొని యున్నది. దేవుడు అనగా, యేసుక్రీస్తు యధార్థముగా నుండునన్న విషయమును పరిశుద్ధాత్మ ఆయనకిష్ణుల ద్వారా రుజువు పరచుచున్నది. క్రిందికి దిగి వచ్చి, ఆ బొమ్మను తీసికొని, దానిని చూపించి, సూచనలను తయారుచేసి దానిని గూర్చియు, అన్ని సంగతులు గూర్చియు మాట్లాడుచూ, ఖచ్చితముగా ఆయన ఏమి చేయుదునని చెప్పెనో వాటన్నిటిని చేయుచున్నాడు. వాక్యానుసారంగా ఆయన తాను చేయుదును అని చెప్పినవాటిని ఆయన చేయుచున్నాడు. ఏదో సిద్దాంతము లేక మానవునికి ఉద్దేశ్యము కాదు: చాలా రక్తము, నిప్పు, మరియు పొగ, మొదలగు విషయములు చూస్తున్నాం; కాని ఒకే లేఖనమైన, మెస్సీయా రుజువు.

ఎన్నో అనుకరణలు, మరియు అనుకరణ చేయువారు, మరియు మొదలగునవి, అయితే అవన్నియూ నిజమైన వాక్యము శ్రేష్టముగా ప్రకాశించునట్లుగా చేయుచున్నది. అది నిజం. ఆత్మ సంబంధమగువారు తన ఒప్పులను వివేచించగలరు.

MATT 3:9,10•

MATT 23:27,33

 

75ఆయనను నిరాకరించిరి. వారి మెస్సీయాను వద్దన్నారు. "మాకాయన వద్దు." ఈ రోజున అంతే. "నేనక్కడికి వెళ్ళి వారివలె ప్రవర్తించినచో బాగుండదు, కాబట్టి వద్దు" అంటున్నారు. సరే. నీకు వద్దులే; నీ కవసరం లేదు కూడా, చూచారా. ఈనాడు అంతే.

ఆయన సరిగానే గుర్తించబడినను వారాయనను వద్దనిరి. ఆయనను వారు ద్వేషించిరి. ఎందువలన? వారి సంఘకాపరులను ఆయన పాపముల గుంపు అని పిలిచెను. "మీరు సున్నము కొట్టిన గోడలు, సమాధులవంటివారు. బయట మీరు అంగీలలో కాలర్లతో అలంకరించుకొన్నారు గాని, లోపల చచ్చినవారి ఎముకలతో నిండియున్నారు" అని చెప్పెను. ఆయనేమీ వారిని బుజ్జగించలేదు. ఒక చిన్న గలిలయుడు, వడ్రంగివాని కొడుకు, వారితో ఏమీ రాజీపడకుండా మాట్లాడెను.

ఆయనకు ముందుగా వచ్చిన యోహాను (ఇంకో రాజీపడని వ్యక్తి), అదే రీతిగా మాట్లాడెను, "మీరు వచ్చి అబ్రహాము మా తండ్రి అని చెప్పవద్దు. దేవుడు ఈ రాళ్ళవలన అబ్రహామునకు పిల్లలను పుట్టించగలడు." అవునండి! ఇదిగో "గొడ్డలి చెట్లవేరున ఉంచబడియున్నది. ఫలింపని ప్రతిచెట్టయు నరకబడి, అగ్నిలో వేయబడును." అవునయ్యా! దేవుడు తన వాక్యముయెడల ధృఢముగా, కఠినముగా, మొండిగా నుండును. అవునండీ!

DEUT 18:15•

JOHN 4:18•

ACTS 3:22•

ACTS 7:37

 

76గమనించండి యేసు, వాక్యము ద్వారా రుజువుపరచబడెను… నన్ను వినుచున్నారా? తానే మెస్సీయా అని వాక్యము ద్వారా దేవునిచే యేసు గుర్తింపబడెను. అది నిజమేనా? అది నిజమో కాదో మనము కొద్ది నిముషములు పేతురు నేరారోపణను చూద్దాం. దేవుని కుమారుడు పిలువబడిన మనుష్యునిగా ఆయన తరచుగా దేవునిగా గుర్తింపబడెను. అది నిజం. ఆయన సరిగానే గుర్తించబడినప్పటికిని, వాగ్దాన వాక్యము బయలుపరచబడినను వారు గ్రహించలేదు. మెస్సీయా వచ్చునప్పుడు ఒక ప్రవక్తగా వచ్చును. ఈ సంగతులన్నియు జరుగును అని మోషే చెప్పెను. మురికి స్థితిలో బావినొద్ద నిలుచున్న స్త్రీ ఏమి గుర్తించినది? దేవుడు చివరి దినములలో బయటకు త్రోయబడిన వారిని లోనికి లాగునని.

LUKE 14:16,18,20,23,24

 

77ఒకసారి పెండ్లివిందును గూర్చి నేను బోధించినది గుర్తున్నదా? "నేనొక పెద్ద విందు చేయించాను. అందరినీ రమ్మని ఆహ్వానించాను గాని వారంతా ఏవో నెపములు చెప్పసాగిరి" అని ఆయన చెప్పెను.

"అది మా సిద్దాంతములను పాడుచేయును గనుక మేము రాము." "నాకు భార్య ఉన్నది; ఆమె నన్ను రానీయదు" అని మరొకడు చెప్పెను.

"ఇక్కడున్న ఒక సంఘమునకు నేను పెండ్లి చేయబడితిని. నా తల్లి మెతడిస్తు, లేదా బాప్టిస్టు, లేదు కాతలిక్కు కనుక నేను అక్కడకు వచ్చి నిలబడలేను."

అందుకాయన, "మీరు వచ్చి నా విందును రుచి చూడనేరరు. కాబట్టి బయటకు వెళ్ళి వేశ్యలను, వ్యభిచారులను, త్రాగుబోతులను, ఎవరినైనా గాని బలవంతము చేయండి. వారిని తెండి, మరియు నేను సరి చేయుదును. నేను నా విందు సిద్ధపరచాను. నా బల్ల సిద్ధపరిచియున్నాను. నా అతిధులుగా ఎవరో అక్కడ ఉండాలి కదా?" అన్నాడు. వారు రాలేదు; అది యూదులను ఖండించుట. ఈనాటి మాట ఏమిటి?

"నేను ప్రెస్పిటేరియనుకు చెందినవాడను."

"నేను లూథరన్ను."

"నేను ఏకత్వ వాదిని."

"నేను ద్విత్వ వాదిని."

"నేను ఇది; నేను రాలేను…"

నీవక్కడే ఉన్నావు. "నీవు ఎన్నడూ రాలేవు!" ఆయన చెప్పింది సరిగ్గా అదే. అది నిజం.

JOHN 10:38

 

78సరిగానే బయలుపరచబడిన మెస్సీయా, సరిగానే బయలుపరచబడిన వాక్యము, వాగ్దాన వాక్యము. వాక్యమును వాగ్దానము చేసిన దేవుడు మెస్సియా ఎట్లుండునని చెప్పెనో, ఆ రీతిగానే ఆయన వచ్చి నిలబడెను. ఆయన వారితో, "నేనిక్కడ తప్పిపోయాను? ఒక నరునిగా నన్ను నమ్మనిచో నేను చేయు క్రియలు చూచి నమ్మండి. నేనెవరినో అవి చెప్పుచున్నవి. నేను మెస్సీయానని అవే చెప్పుచున్నవి. మీరు నన్ను నమ్మనవసరము లేదు, ఎందుకనగా మీరు ఆ యోసేపును గూర్చి నేను జన్మించిన ఆ చిన్న గుడిసెను గూర్చి నా తండ్రి వడ్రంగి అనియు మీరు లోచించుచున్నారు," అని చెప్పెను.

MARK 6:2-4•

JOHN 5:19

 

79ఆయన గలిలయలోనికి వచ్చినప్పుడు, వారు, "హే! ఈ వ్యక్తి ఎవరు? వీని సోదరులు సెఫ్ మొదలగువారు కారా? ఇతని చెల్లెండ్రు మనలో లేరా? యోసేపు, మరియలు వీని తల్లిదండ్రులు కారా? ఈలాంటి వ్యక్తి మీకు ఎక్కడ నుండి వచ్చాడు? ఏ బడి నుండి చదివి వచ్చాడు? ఈయనకు ఏ సహవాసపు కార్డు లేదు. ఏ అధికార పత్రములు లేవు. ఇతడు మీకు ఎక్కడ దొరికాడు?" ఆయనను చూచి అభ్యంతర పడిరని బైబిలు చెప్పుచున్నది. ఆయన అనేక గొప్ప కార్యములు చేయకుండా వారియొద్ద నుండి తిరిగి పోయెనని చెప్పబడెను. "ప్రవక్త స్వదేశములో ఘనతను పొందడని ఆయన చెప్పెను గదా?"

ఆయన సరిగానే మెస్సీయాగా బయలుపరచబడెను. తానేమీ తనకుతానుగా ఘనపరచుకోలేదు; తండ్రి నాకు చూపించినదే గాని ఏదియూ నేను చేయలేదని ఆయన చెప్పెను. ఆయన మెస్సీయాయో కాదో అడుగమని సవాలు చేసెను.

JOHN 4:15,19

 

80ఆ చెడిపోయిన పేరుగల స్త్రీని చూడండి; ఆమె దానిని గుర్తించినది. ఆమె నైతికంగా చెడినదే, ఎవరూ దానిని కాదనలేరు. దేవుని ధర్మశాస్త్రము దానిని ఖండించినది. ఆమె నైతికంగా చెడిపోయినది. నీవేమైయున్నావో దానిని బట్టి ఆయన తీర్పు చేయడు. నీవెంత వాడివైనా, ఎంత చిన్నవాడివైనా గాని ఆయనేమి చూడడు. నీ హృదయమును ఆయన తీర్పు చేయును. నీవేమి కాగోరుచున్నావోనని ఆయన చూచును. ఆమె తన యెదుట ప్రకాశించిన ఆ చెత్తవలె నుండగోరలేదు. అదే ఆమె కోరిక, అప్పుడామె ఏమైయున్ననూ వచ్చుటకు సిద్ధపడినది. దేవుడు హృదయమును తీర్పు చేయును. మానవుడు పై వేషమును బట్టి తీర్పు చేయును. దేవుడు హృదయమును చూచును. ఆమె నీవేమైయున్నా గాని ఆ వెలుగు ప్రకాశించినది మరియు అది దానిని స్థిరపరచును. నిత్యజీవ సారమును ఆమె పట్టుకొన్నది.

HEB 13:8

 

81అది సత్యమని నేను యెరిగి చూచుట నాకెంతో ఆశ్చర్యముగా నున్నది. దానితో నేను నిలబడెదను. పరలోకమందున్న దేవుడు లేచును. దేవుని యొక్క గొప్ప కాలమున అవతలగా నా స్వరము ఆ అయస్కాంత టేపులపై వినబడును. చివరి దినమున ఈ తరమును అది ఖండించును. [టేపు పై ఖాలీ.]… ఆయనింకా యేసుక్రీస్తుగానే - నిన్న, నేడు, నిరంతరము ఏకరీతిగా గుర్తించబడుచున్నాడు. దేవుని వాక్యమును బట్టి వారిపై నేను నేరారోపణ చేయుచున్నాను.

పదిహేను నిముషముల సమయమున్నది గనుక వెంటనే మరో వాగ్దానము నొద్దకు వెళ్ళాలి.

82బయలుపరచబడిన దేవుని వాగ్దాన వాక్యమును గుర్తించనందున వారాయనను సిలువవేసిరి. ఆయనెందుకు సిలువ వేసిరి? నీవూహించగలవా? ఒక్క నిముషం వెనక్కి వెళ్ళుదును. అట్టివానిని వారెందుకు సిలువ వేశారు?

ఒకప్పుడు నేను దావీదు ఇంటి యొక్క అధిపతి అను పుస్తకమును చదివినాను. అది డాక్టర్ ఇంగ్రాహమ్ వ్రాసెను. గొప్ప పుస్తకము, ఒక నాటకము. అదీనా అను ఒక స్త్రీ వలన కొన్ని ప్రాచీన వాక్య భాగములు తీసికొనబడినవి, అవి కొంత వరకు సత్యమే. ఆమె తన విద్య ముగించుటకు పాలస్తీనా నుండి ఐగుపులోని కైరోకు వెళ్ళినది. క్రీస్తు దినములలో ఆమె అక్కడుండెను. ఆమె తండ్రికి వ్రాసినట్లుగా ఊహించబడినది. అది మీరు చదివితే చాలా బాగుండును; అది చాలా బాగుంది: "దావీదు ఇంటియొక్క అధిపతి." అదే వ్యక్తి "అగ్నిస్తంభము" అను గ్రంథము వ్రాసెను. దానిని "పది ఆజ్ఞలుగా" ("The Ten Commandments.") సిసిల్డిమిల్ చిత్రం నిర్మించారు.

83ఇప్పుడు, ఆ పుస్తకములో మనము కనుగొందుము, అదీనా వ్రాసెను. మరియు చెప్పెను, సిలువ వేయబడిన ఆ దినమున, ఏడు దయ్యములను ఆమె నుండి వెళ్ళగొట్టిన మగ్దలేన మరియా, జనుల ముందు పరిగెత్తి, మరియు చెప్పెను, "ఆయన ఏమి చేసెను? ఆయన ఏమి చేసెను? కేవలము రోగులను స్వస్థపరిచెను మరియు చెరలోనున్న వారిని విడుదల చేసెను. ఆయన మంచి తప్ప మరి ఏమి చేయలేదు? చెప్పండి!"

ఆవరణలో ఒక వ్యక్తి ఆమెను చెంపపై కొట్టి, "నీ యాజకుని ముందుగా నీవా అల్లరి స్త్రీని నమ్ముదువా?" అని అడిగెను.

నీ వక్కడే యున్నావు, చూచార. ఆయనేమి చేసెను? ఆయన ఏమీ చేయలేదు. ఎందుకాయనను వారు సిలువ వేసిరి? ఎందుకు? ఆయనెవరో వారు గుర్తించనందున. ఈనాడూ అంతే. బోధకులు, ఈనాటి జనులు, మన ఆధునిక ఉపాధ్యాయులు ఎంత గ్రుడ్డివారయిపోయారంటే, ఇది మంత్రశక్తి అని, దయ్యము అని, మానసిక విద్య అని, ఏదో యుక్తి అని, ప్రజలను నమ్మించుచున్నారు. ఈ దినము యొక్క ప్రత్యక్షపరచబడిన దేవుని వాక్యమును వారు నమ్మలేనట్లుగా వారు చేస్తున్నారు. ఇది చివరి రోజు సూచన.

ACTS 4:13

 

84సంఘములు, మీరు వారి సంస్థలకు చెందనిచో వారంటారు, "ఇదీ అదే వేషము. అదొక మోసము. ఫలాని వారిని చూడండిక్కడ." కాని ఆ నిజ విషయమును అబద్దమని వారిని రుజువు పరచమనండి. అది తప్పు అని ఒక్కసారయినా నిరూపించమనండి. వారది చేయలేరు. అదెన్నడూ తప్పుగా తెలియదు, ఎందుకనగా అది దేవునిది. చూచారా? కాని వారు ఎత్తిచూపాలనుకొని ఆలోచిస్తారు. "అది గొప్ప పేరుగల వ్యక్తిది కాదు గదా? అది చిన్న గుంపు. వెలివేయబడిన వారివలెనున్నారు. మేము వారిని సంఘంలో నుండి బయటకు త్రోసివేశాం. వారింతకుముందు మా గుంపులోనివారే, చూచారా, కాని వారిప్పుడు దీనితో దానితో వెళ్ళిపోయారు, వాళ్ళతో కలిసిపోయారు. అదేమిటో, వారెవరోచూడు అని అందురు." నేను ఖాతరు చేయను. పేతురు, యాకోబు, యోహానులను గూర్చి వారలాగే చెప్పియుందురు. "చదువులేని అనాగరికులు వారు" అని వారనియుందురు. కాని ఆ సమయంలో ఏదో జరిగినది; దానిని వారు గమనించాలి. వారు యేసుతో నుండిరి. అదే మార్పును తెచ్చినది, చూచారా.

MATT 15:14

 

85ఆయనెవరైయుండెనో వారెరుగరు కనుక వారావిధంగా చేసిరి. ఆ దినమున వారి మధ్యన వాక్య ప్రత్యక్షత నిలబడి యున్నదని వారెరుగరు… అది ఒక రోజున, అది నిజం. వారి ధర్మశాస్త్రము మొదలగునవన్నీ, ఆ ధర్మశాస్త్రమే ఆయన నరునిగా ఒక రోజున వచ్చునని గుర్తించుచున్నవి. వారు ఒక భాగం స్వీకరించిరి మరో భాగం వదిలేశారు.

ఈ రోజున కూడా వారదే చేయుచున్నారు. వారికొక సంఘమున్నది. యేసుక్రీస్తును నమ్ముచున్నామని చెప్పెదరు గాని, నేటి జీవించుచున్న ఘడియను దిక్కరించుదురు! మరలా ఆ పాత సామెత గుర్తువస్తున్నది: మానవుడెప్పుడూ దేవుడు గతంలో చేసిన వానిని గూర్చి స్తుతించును. భవిష్యత్తులో ఆయన చేయనైనున్న వానిని చూచును, కాని ఇప్పుడు చేయుచున్నవానిని అలక్ష్యము చేయును, మరియు దాని ద్వారా ఖండింపబడును. దేవుడు ఆశ్చర్యకరుడని వారు తలంచుదురు: ఆయనెంత గొప్పవాడు; ఆయనేమి చేయగలడో కదా; ఆయన రానైయున్నాడు; ఒక రోజున ఎత్తబడి గృహము చేరెదము; అయితే ఈ రోజున వాక్యానుసారముగా ఆయన చేయుచున్న సూచనలను మరియు అద్భుతములను లక్ష్యపెట్టక నిరాకరించుదురు. "గ్రుడ్డివాడు, గ్రుడ్డివారికి త్రోవ చూపినయెడల, వారిద్దరూ గుంటలో పడుదురని," యేసు చెప్పెను. ఈ చివరి దినములలో దేవుడు మన కన్నులు తెరుచునట్లుగా ప్రార్ధించుము.

MATT 12:24•

MARK 13:22

 

86ఈనాడు వారదే చేయుచున్నారు. ఆయన నెరుగక సిలువ వేయుచున్నారు. ఆయనను తిరస్కరించుచున్నారు. ఈనాటి సంగతులను వారు త్రోసివేయుచున్నారు. వారు క్రీస్తును అక్షరాలా సిలువవేయుట లేదు గాని పరిశుద్ధాత్మను దేవదూషణ చేయుచున్నారు. "వారెట్ల పరిశుద్ధాత్మను దూషించగలరు? గతంలో వారెట్లు దూషించారు? అప్పుడు వారు దేవదూషణ చేయలేకపోయిరి; అప్పటికింకా పరిశుద్ధాత్మ రాలేదు. వారు యేసును "బయల్జెబూబు" అన్నారు, ఎందుకనగా ఆయన వారి హృదయ రహస్యములను తెలిసికొనకలిగెను, "ఇది దయ్యమని వారన్నారు. ఆయన అదృష్టము చెప్పేవాడని వారన్నారు. జాతకము చూచి చెప్పుచున్నాడన్నారు. ఆయన దయ్యము గాక మరెవ్వరు కాదు," అన్నాడు. నాలువందల సంవత్సరములు వారికి ప్రవక్త లేడు, వారందులోనే పెరిగారు. వారికి వారి ధర్మశాస్త్రమున్నది. "వీడు బయల్జెబూబు," అని వారన్నారు.

MATT 12:31,32•

LUKE 17:26,28•

HEB 6:6

 

87యేసు చెప్పెను, "దానిని నేను క్షమించెదను కాని పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు ఒక్క మాట దానికి విరోధముగా మాట్లాడినను అదెన్నడూ మీకు క్షమించబడదు." ఏ విధముగాను అది క్షమించబడదు. కృప చూపబడదు. నీవు దూషించి మరియు దేవుని ద్వారా బయలుపరచబడిన ఆత్మను (చూడండి, వాక్యము ఆలాగున చెప్పుచున్నది; ఆత్మ దానియొక్క రుజువు), దేవుని వాక్యమును, అపవిత్రమైనదని నీవు పిలిచినచో కృపకు, తీర్పుకు మధ్యనున్న గీతను నీవు దాటినట్టే. నీకెన్నడూ క్షమాపణ దొరకదు. అందుకే నేను ఈ తరముపై బయలుపరచబడిన దేవుని కుమారుని దూషించి, సిలువ వేసిన నేరారోపణ చేయుచున్నాను, ప్రవక్తలందరికి ఆయన వాగ్దానమది. చివరి దినములలో క్రీస్తు తనకుతాను, నోవాహు మరియు సొదొమ దినములలో నుండినట్లుగానే యుండును.

దేవదూషణ ద్వారా దేవుని కుమారుని నూతనముగా వారు జనులను సిలువవేయచున్నారు. ఆయనే బయలుపరచబడిన వాక్యము. దానికి విరోదముగా పలికిన ఒక్క మాట కూడా క్షమించబడదు. అప్పుడు నీవేమి చేయుదువు? నీ వెక్కడ నిలబడెదవు? వారు శిక్షకు పాత్రులు, దేవుని ఉగ్రత కుమ్మరింపబడు ఘడియ ఎదురు చూస్తున్నది. ఆయన వారిని ముక్కలు చేయును.

MATT 16:3•

JOHN 10:37,38•

JOHN 19:7

 

88ఈనాటి తరపు జనులు బయలుపరచబడిన దేవుని వాక్యముకంటె మానవ-కల్పిత శాఖలను, సూత్రములను, బోధలను ఎక్కువగా ప్రేమించుచున్నారు. ఓ! ఎక్కువ సమయముండినచో బాగుండును. ఈనాటి తరమువారు దేవుని ప్రత్యక్షతను త్రోసివేసిరి, కాని మనము అపొస్తలులు త్రోక్కిన బాటను నడిచిపోతున్నాం. అది నిజం.

"ఇతరులు కూడా అది చెప్పుచున్నారని" నీవు అనవచ్చు. దానిని దేవుడు బయలుపరచెను.

యేసు చెప్పెను, "ఈ క్రియలు నన్ను గూర్చి చెప్పని యెడల మీరు మీ దారిని పోవచ్చును. అది నా యంతట నేను చెప్పుచున్నానని అనుకోవచ్చును. కాని క్రియలు మాట్లాడుచున్నప్పుడు, ఆ క్రియలు మీరు నమ్మవలెను, ఎందుకనగా అదే ఘడియ రేపు సూర్యుడుదయించునో లేక మబ్బు వాతావరణముండునో ఆకారపు ఎర్రదనము ఛాయలను బట్టి చెప్పెదను. మీరీ కాల సూచనలను బాగుగ ఎరుగుదురు, కాని దేవుని మీరు ఎరిగియుండినచో నా దినమును కూడా బాగుగా ఎరిగియుండెడివారు."

వారన్నారు, "నీవు మరీ అతిగా మాట్లాడుచున్నావు. నిన్నునీవు దేవునిగా తయారు చేసికొనుచున్నావు." వారాయనను సిలువపై నుంచిరి.

JOHN 14:12•

JOHN 15:7•

HEB 13:8

 

89ఈనాడు పరిశుద్ధాత్మ మూడో వ్యక్తి కాదు; అది దేవుడే, తనకుతానె, మానవ శరీరములో ప్రత్యక్షమాయెను. యేసుక్రీస్తు రక్తము ద్వారా జీవమును అనుమతించి ఆయన ద్వారా ప్రతిబింబించినది. బయలుపరచబడిన వాక్యమునే వారు సిలువ వేసిరి. మీరు అర్దం చేసుకొనుచున్నారా? ఆయన వాక్యము ద్వారా ఈ దినమున ఈ కార్యములు జరుగును. ఆయన కార్యముల వలన ఈ జనుల మధ్య దేవుని కుమారుని ప్రత్యక్షతను మరియు బయలుపాటును ఈనాటి జనులు నిరాకరించుచూ క్రీస్తును సిలువ వేయుచున్నారు.

అదే దేవుని కుమారుని వలన అదే ప్రత్యక్షత ఏర్పడుచున్నది, ఎందుకనగా ఆయన యోహాను 14:12లో "నేను చేయు కార్యములు మీరును చేయుదురనియు. హెబ్రి 13:8లో "ఆయన నిన్న, నేడు, నిరంతరము ఏకరీతిగా నున్నాడనియు." యోహాను 15లో, "నా యందు మీరును, మీయందు నా మాటలును నిలిచియుండిన యెడల, మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకనుగ్రహించబడుననియు వ్రాయబడియున్నది." అవునండి!

90గుర్తుంచుకొనండి, ఆ పనిచేసినవారు చాలా భక్తిగల జనులు. వారు వెలుపల వారు కారు. ఆనాటి దినమునకు వారే భక్తిపరులు. ఈనాడు భక్తిగలవారు కూడా ఆ పని చేయుచున్నారు. అదే సిలువ వేయుట ఈనాడు జరుగుచున్నది.

తొందరగా. అక్కడ వారాయనను సిలువ వేసిరి. అప్పుడు నిశ్చయంగా బయలుపరచబడిన దేవుని వాక్యమును వారప్పుడు విసర్జించిరి. వాక్యమునకు బదులు సిద్దాంతములను అంగీకరించిరి. ఈనాడు వారును అదే చేయుచున్నారు కారా? సరిగ్గా అదే చేయుచున్నారు. ఆయనే వాక్యము నిరాకరించిరి. మీరొక్క విషయము తప్పిపోకూడదని కోరుచున్నాను. ఆయనే వాక్యము, ఆయనను వారు నిరాకరించినప్పుడు - వాక్యమును వారు నిరాకరించిరి. ఆయనను వారు నిరాకరించినప్పుడు చివరగా ఆయనను సిలువ వేసిరి. ఈనాడు వీరును అదే చేసిరి. దేవుని వాక్యమును నిరాకరించి, మత నమ్మకములకు అంగీకరించి, ఆయనను వారి సమాజముల ఎదుట బహిరంగముగా సిలువ వేసిరి. పరిశుద్ధాత్మ కార్యమును సిలువ వేసిరి. వారు అపరాధులు, నేను వారిని యేసుక్రీస్తు నామమున నేరస్తులనుగా తీర్చుచున్నాను.

91దేశములో ఆయన కదలికను పదిహేను సంవత్సరముల నుండి నేను చూస్తున్నాను. అయినను వారింకా తమ మత సిద్దాంతములనే పట్టుకొనియున్నారు. వారు దోషులు! సంఘములనన్నింటిని వెలుపలకు తెచ్చి ఒక గొప్ప సోదరత్వ ఐక్యతను పెంతెకోస్తు ఇంకా తక్కిన వారందరి మధ్య వాక్యము నెలకొల్పులు. కాని ఆ విధంగా వారు చేయుటకు బదులుగా దానిని వారు తిరస్కరించిరి. దిక్కరించి హేళన చేసి, దానినిప్పుడు సంఘ సమాఖ్యగా పిలుచుచున్నాను. అది దయ్యపు పధకము." కొంత నూనె ఇప్పుడు మనము కొందమని," చెప్పుటకు ప్రయత్నించుచున్నారు. వారు విసర్జించబడిరి మరియు యేసుక్రీస్తును సిలువవేసిన దోషులు. నీవు దేవుని మాటలే తీసుకొనవలెను లేదా… నీ యొక్క మాటలు పనిచేయవు, చూచారా.

JOHN 1:1•

HEB 6:1-3,6•

HEB 13:8

 

92బయలుపరచబడిన దేవుని మాటలు వారు నిరాకరించి, తమ సిద్దంతములనే పట్టుకొనిరి. ఈనాడు కూడా వారదే చేయుచున్నారు. యోహాను 1లో, ఆయనే వాక్యము. హెబ్రి 13:3లో, ఆయన నిన్న, నేడు, నిరంతరము మారనివాడు.

ఆయననిప్పుడు వారు నూతనముగా సిలువ వేయుచున్నారు. మనమది చేయగలమని బైబిలు చెప్పుచున్నదని నీవెరుగుదువా? ఎంతమంది అది చదువగోరుచున్నారు? మరో పావుగంట నాకీయగలరా? నూతనముగా సిలువ వేయుచున్నారు. హెబ్రి 6వ అధ్యాయులో కొంత చదువుదము, దేవుని కుమారుని నూతనముగా మనము సిలువ వేయుచున్నాము. అది సాధ్యమో కాదో చూద్దాం. "రెండోసారి ఆయనను సిలువవేయుట జరుగదని నీవనవచ్చు." అది నిజమో కాదో చూద్దాం. దేవుని వాక్యము సత్యము. అవునా? హెబ్రి 6:1:

కాబట్టి నిర్జీవ క్రియలను విడిచి, మారుమనస్సు పొందుటయు దేవుని యందలి విశ్వాసమును, బాప్తిస్మమును గూర్చిన బోధయు, హస్తనిక్షేపణమును, మృతుల పునరుత్తానమును, నిత్యమైన తీర్పును అను పునాది మరల వేయక క్రీస్తును గూర్చిన మూలోపదేశము మాని సంపూర్ణులమగుటకు సాగిపోదము.

దేవుడు సెలవిచ్చినయెడల, మనము చేయుదము.

HEB 6:4-6•

HEB 10:26

 

93చూచారా? పౌలు ఈ విషయములు తెలిసికొనుట పూర్తిగా అవసరమని చెప్పుచున్నాడు. బాప్తిస్మము, హస్తనిక్షేపణము, పునరుత్తానము, రెండవ రాకడ ఇవన్నీ నిత్యమైనవి; అది నిశ్చయంగా సత్యములు, ఇప్పుడు గమనించండి!

అది అసాధ్యము…

నాతో చదవండి - కేవలము ఒక్క వచనము. మీరు నాతో చదవాలని నేను కోరుచున్నాను, నాలుగవ వచనం:

ఒకసారి వెలిగించబడి పరలోక సంబంధమైన వరమును రుచిచూచి పరిశుద్ధాత్మలో పాలివారై,

దేవుడు దివ్యవాక్యమును రాబోవు యుగసంబంధమైన శక్తుల ప్రభావమును,

అనుభవించిన తరువాత తప్పిపోయినవారు తమ విషయములో దేవుని కుమారుని మరల సిలువ వేయుచు, బాహాటముగా ఆయనను అవమానపరచుచున్నారు. గనుక మారుమనస్సు పొందునట్లు వారిని మరల నూతన పరచుట అసాధ్యము.

ఆ మాట నాదా? అయినను తెలిసికొనిన వ్యక్తి…. గుర్తుంచుకొనండి, వారెన్నడూ దానిని పొందరు; వారు సరిహద్దు విశ్వాసులు. దేవుని వాక్య జ్ఞానము పొందిన తరువాత (దానిని చదువుట, చూచుట ద్వారా నీవు పొందవచ్చు), దానిని తిరస్కరించినచో, నీవు రక్షించబడుట అసాధ్యము! అదెప్పుడైనా నీవు చదివితివా? సత్యజ్ఞానమును పొందితివా? నీవు అర్ధము చేసికొన్నావు గాని పొందలేదు.

NUM 13:30,31

 

94వెళ్లిపోయిన విశ్వాసుల వంటివారు… యాత్రకు మాదిరిగా నున్నది. ఈ మూడవ నిర్గమము తక్కిన వాటివలెన యుండును.

వెనుకటిది చూడండి! ఒక్క నిముషం చూపించెదను. ఇశ్రాయేలు పన్నెండు గోత్రములలో నుండి పండ్రెండుమందిని బయటకు లాగిరి. వారే శాఖాధిపతులు. వారిని వాగ్దాన దేశము అంచునకు తీసికొని వెళ్ళి, రానున్న మంచివాటినన్నింటిని గూర్చి చెప్పిరి, చూపించిరి. అది మేము చేయజాలమనరి వారు సణుగుకొంటూ వచ్చిరి. కాని ఆ పండ్రెండు మందిలో ఇద్దరు, అనగా, యెహోషువా, కాలేబులు అన్నారు, "అది మాదని దేవుడు చెప్పెను గనుక దానిని తేలికగా స్వాధీనపరచుకొందుము." (వారు వాక్యమును చూచిరి). నిజమేనా?

NUM 13:31•

JOHN 3:2

 

95ఏమిటిది? సరిహద్దు విశ్వాసులు, చూచారా. వారు నిజంగా సంఘంలోనే పుట్టారు. వారు జనులను నాయకులు, చెప్పాలంటే వారు బిషప్పులు. సత్యమని వాక్యము చెప్పిన చోటుకు నడిచి వచ్చిరి. అక్కడొక భూమియున్నది. వారింతకు ముందెన్నడూ అచ్చట లేరు. అదక్కడున్నదని కూడా వారెరుగరు. కాని అదక్కడున్నదని వారు చూచుటకు వచ్చిరి. అదిక్కడుండెను. యెహోషువా కాలేబులు వెళ్ళి, ఒక ద్రాక్షతీగెలను తెచ్చిరి; ఆ మంచి భూమి యొక్క రుచిని వారు చూచిరి. వెనుకకు పోయి, మనము చేయగలమనిరి [చూచారా]. మనము స్వాధీనపరచుకొందుము.

యేసుక్రీస్తు కాలములో కూడా అట్టి గుంపున్నది: "రబ్బీ, నీవు దేవుని నుండి దిగి వచ్చిన బోధకుడవని మేమెరుగుదుము. నీవు చేయు కార్యములను ఏ మానవుడునూ చేయజాలడు. దేవుడక్కడుండి యున్నాడని మేము గుర్తించాము." చూచారా? సరిహద్దు విశ్వాసులు. ఎందుకు వారంగీకరించలేదు? ఎందుకు వారు స్వీకరించలేదు? అంచున, ఒడ్డున ఉన్నారు.

96ఈ మూడవ నిర్గమములో కూడా వారున్నారు: అదే గురుతు, అదే ప్రత్యక్షత, అదే క్రీస్తు, అదే పరిశుద్ధాత్మ, అవే క్రియలు, అదే దేవుడు, అదే వర్తమానము, కాని వారు స్వీకరించలేదు. వారు తమ సహవాస కార్డును తీసివేయవలసియుందురు. ఏమిటది? వారికొక సత్యజ్ఞానమున్నది. అది నిరాక్షేపముగా సత్యమని వారు చూచిరి. దానిని వారు కాదనలేరు. పత్రికలు తాము చూచినట్లు సాక్ష్యమియ్యవలసియున్నది. పటములు, పత్రికలు, రుజువులు, మృతుల పునరుత్తానము, రోగులను గూర్చి వైద్యులిచ్చిన సాక్ష్యము; ఆయన వలననే అవి జరిగినవని వారు చెప్పవలసియుందురు. ప్రవచనములు, ఇన్ని సంవత్సరములలో ఏ ఒక్కసారి కూడా జరుగకుండా పోలేదు. అక్షరాలా ప్రతిఒక్కటి జరిగినది. అది దేవుడే గాని మరొకటి కాదని వారు చెప్పగలరు. కాని దానిని వారంగీకరించరు.

HEB 6:4-6

 

97షికాగోలోని సేవకుల గుంపు, మూడువందలకు పైగా నున్నవారు యేసుక్రీస్తు నామములో బాప్తిస్మము పొందుటకు వచ్చారు. వారెక్కడున్నారు! నెల ఎక్కువ చెల్లించవలసి వచ్చెను. వారు చెల్లించలేదు. ఏమిటది? ఆ విధంగా వారు చేసినప్పుడు ఏమవుదురని బైబిలు చెప్పుచున్నది? కృప తీర్పుకు మధ్యగా వేరైరి, "ఒకసారి వెలిగించబడి (దానిని చూచియు), సత్యజ్ఞానమును పొంది, దేవుని వాక్యజ్ఞానము రుచి చూచినవారు; దాని నుండి వేరై తొలగిపోయినచో, వారిని నూతన పరచుట అసాధ్యము, మంచిది ఇప్పుడు, నేను వచ్చుదును" అని చెప్పవచ్చు.

98ప్రెస్బిటేరియనులు, బాప్టిసులు, మెతడిస్టులు, లూథరనులు, పుల్-గాస్పిల్ బిజినెస్ వారు, వారు లోనికి వచ్చామని చెప్పుచూ వర్తమానమును త్రోసివేయుచున్నారు. అక్కడ వ్యక్తిగతముగా నుండినచో, మంచిదే, గాని సంఘములు కాదు. దానిని పొందుటకు నీవు సంఘమును విడిచి రావలెను, చూచారా. అది నిజం. వ్యక్తులు మంచి వారె.

ప్రెస్పిటేరియను సంఘము పరిశుద్ధాత్మను పొందుటకు వెళ్ళుచున్నదని అనుకొనుచున్నవా. నీవెన్నడూ అనుకోవద్దు! మెతడిస్టులు అది చేయుదురని అనుకొనుచున్నవా? నీవెన్నడూ పొందజాలవు. త్రిత్వవాదులగు మీరు ఎన్నడైనా యేసుక్రీస్తు నామములో బాప్తిస్మము పొందుకొనుచున్నారా? మీరెన్నడూ అది చేయరు; కాని వ్యక్తులు బయటకు వచ్చి పొందుదురు. అది నిజం. అది ఆయన రాకకు సూచన! కాని సత్యమును చూచి నిరాకరించిన సంఘములు, ఆలోచనలు, వారికి అసాధ్యము…

NUM 13:31,33•

HEB 10:26•

HEB 13:8

 

99యేసుక్రీస్తును సిలువ వేయటవలన వారు దోషులు. దేవుని వాక్యమును బట్టి వారిపై నేను నేరారోపణ చేయుచున్నాను.

"నీవు వారిపై ఎట్లు నేరారోపణ చేయుదువు, సహోదరుడా బ్రెన్హాం?" చివరి దినములలో దేవుడు స్పష్టముగా తన వాక్యములో గుర్తింపును పొందెను. ఆయన నిన్న, నేడు, నిరంతరము ఏకరీతిగా యున్నాడని తన్నుతాను తెలియపరచుకొనెను; కాని వారు చల్లగా త్రోసివేయుచున్నారు. పరిశుద్ధాత్మను దూషించుట ద్వారా నీవు యేసుక్రీస్తును సిలువవేసిన అపరాధివి. అది నిజం.

హెబ్రి 10లోనికి తీసికొని వెళ్ళెదను. అసాధ్యమని మాత్రము చెప్పుట కాదు గాని, దేవుని నుండి నిత్యముగా ఎడబాటు కలుగునని వాక్యము చెప్పుచున్నది. మరల నీవెన్నడూ దేవుని సన్నిధిలోనికి రాజాలవు. నీవు పరిశుద్ధాత్మను హేళన చేసి తిరుగద్రోయరాదు.

నీవు వాక్యమును రుచి చూచావు. సరిహద్దు విశ్వాసులు. "ఓ," వారు విశ్వాసులు కారని నీవు అనవచ్చు. వారు విశ్వాసులైనా లేదా విశ్వాసులని చెప్పుకొనువారైనా, కాని వాక్యము వద్దకు వచ్చేటప్పటికి… వారు ఇశ్రాయేలు; రక్తము క్రిందనే వారు వచ్చిరి. మోషే సూచనల క్రింద వారు వచ్చిరి; ఆ సూచక క్రియలు పనిచేయుటకు వారు చూచారు.

"అవతలకు మిమ్మును కొనిపోదునని," దేవుడు చెప్పెను.

అయితే రానైయున్న వాగ్దాన వచనము దగ్గరకు వచ్చినప్పుడు, వారేమన్నారు? "ఓ, మేమది చేయలేమనిరి." వారు ఆ ద్రాక్ష గెలలతో, రుజువులతో వచ్చారు. ఆ భూమి మంచిదని రుజువైనది. దేవుని మాట నిజము.

"దానిని మీకిచ్చెదనని," దేవుడు చెప్పెను — కాని పరిస్థితులు!

"వారి ముందు మిడుతలవలె మేము కన్పించుచున్నాము. మేము వెళ్ళలేము," అన్నారు. ఏది ఏమైనా…

MATT 3:9•

LUKE 3:8•

HEB 6:4,6

 

100కొన్ని సంవత్సరాల క్రితం అంటే ఈ పాత కట్టడం ఇక్కడున్నప్పుడు ఒకాయన వచ్చి నాతో మాట్లాడుచూ, " బిల్లీ, నీవటువంటి ప్రసంగములు చేశావంటే ఇక ముందు నీవు ఆ నాలుగు స్తంభాలకే బోధించవలసియుందువు," అన్నాడు.

నేను చెప్పాను, "నేను నాలుగు స్తంభాలకే బోధించుదును, ఎందుకనగా దేవుడు ఈ స్తంభముల వలన అబ్రహాముకు పిల్లలను పుట్టించగలడు." అంతే; అది సత్యము. నేను చెప్పాను, "నీవు కాదని రుజువు చేయగలవా? చూపించుము." ఏకాకిలాగే కనపడవచ్చు, కాని సమయం వచ్చినప్పుడు భేదం కనబడును. అవును! అదే ఈ బేధమును కలుగచేయును. సరే.

ఇక్కడ వారు తమ స్వంత సిద్దాంతములలో ఆయనను నూతనముగా సిలువ వేయుచున్నారు. హెబ్రి 6వ అద్యాయములో చూద్దాం. మనకు తగిన సమయము ఉన్నది. ఒకసారి వెలిగించబడి పరిశుద్ధాత్మలో పాలివారై పడిపోయిన వారిని మరల నూతన పరచుట అసాధ్యము… అంతవరకు వెళ్ళుటకు మనకు సమయము లేదు, ఎందుకనగా చదువుటకు నాకు మరొక లేఖనమున్నది.

దేవుని కుమారుని వారు నూతనముగా సిలువ వేయుచున్నారన్న మాటను గమనించండి. వారేమి చేశారు? ఏమిటి? రుచి చూచియు, సత్యమని తెలిసికొనియు, దానిని నిరాకరించినవారు. వారేమి చేయుదురు? అది అసాధ్యము…

MATT 27:35•

MARK 15:24•

JOHN 19:17,18,23

 

101ఈ దేశం అదే చేసినది. ఈ జనులు అదే చేశారు. ఈ సంఘములు అదే చేసినవి. వారు దానిని త్రోసివేసిరి. వారు వర్తమానమును సిలువ వేసిరి. జనులకు సత్యమును వారు సిలువ వేసిరి. వారు యేసుకు ఎట్లు చేసిరి? వారాయనను అవమానపరచిరి, ఆయన వస్త్రములు తీసివేసిరి సిలువపై వ్రేలాడదీసిరి, మేకులతో కొట్టిరి, జీవాధిపతిని సిలువ వేసిరి. వారు తమ సిద్దాంతములతో ఈనాడు అదే చేస్తున్నారు. అదే పని చేసిరి. అన్నింటిని వారు విసర్జించారు. మంచితనమును, సువార్త వస్త్రమును ఒలిచివేసిరి. దానినెక్కడో ఉంచి ఆయనను సిలువపై వ్రేలాడదీసిరి. ఓ, మై! ఎందుకు?

JOHN 6:63•

ROM 3:4•

HEB 13:8

 

102అక్కడ వారాయనను సిలువ వేసిరి… ఇప్పుడు, చివరి మాట; ప్రశస్తమగు వ్యక్తిని ఎందుకు వారట్లు చేసిరి? ఆయన వారికి తెలియనందున, ఈ రోజున వారెందుకు చేయుచున్నారు? ఇది సత్యమని తెలియనందున. దాని విషయములో వారు మూగవారు, గ్రుడ్డివారు. వారికది తెలియదు; అదే కారణము. దేవుని వాక్యము నుండి వారి సిద్దాంతములు ఆచారాములు వారిని దూరంగా తీసుకొనిపోయెను.

ముగింపులో జాగ్రత్తగా వినండి. అది చాలా వేడిగా నున్నదని నాకు తెలుసు; నేను వేడిగానే యున్నాను. కాని, ఓ ,సోదరులారా! ఈ వాక్యము నీకు జీవము నిచ్చును. చూడు! ఎప్పుడో జరుగునని నేను చెప్పుటలేదు. ఇపుడే మనకు ఇక్కడ జరుగుచున్నది, జరుగబోవునది కాదు, అది ఇప్పటికే జరుగుచున్నది. "ఆయన ఏమి చేసియున్నాడో మనము ఎరుగుదుము; అయన ఏమి చేయబోవుచున్నాడో మనము ఎరుగుదుము," కాని ఇప్పుడు, ఆయన ఏమి చేయుచున్నాడో మనము చెప్పుచున్నాము. చూచారా? ఇదే మన ఘడియ. ఎత్తబడును చూచుటకు మనకు జీవించకపోవచ్చును. ఈనాడే నేను చనిపోవచ్చును; ఈనాడే మీరూ చనిపోవచ్చు. నాకు తెలియదు. కాని ఎత్తబడుట వచ్చుచున్నది; అది వచ్చినప్పుడు, మనమక్కడ ఉందుము; బాధపడకండి, అన్ని యుగములలోను నమ్మి ఎదురుచూచిన వారందరూ అచ్చట ఉందురు. వారు ఆ దినపు వెలుగులో నడిచారు. ఇక్కడొక వెలుగు ఉన్నది. యేసుక్రీస్తు నిన్న, నేడు, నిరంతరము ఏకరీతిగాయున్నాడు. నీవు సిద్దాంతాలు విడిచిపెట్టి వాక్యమును నమ్ముము. ఇదే సత్యము. వాక్యమే సత్యము; యేసు చెప్పెను, "నా వాక్యమే ఆత్మ, నా వాక్యమే జీవము." జీవమును తిరస్కరించిన నీవు జీవమునెట్లు పొందుదువు? సిద్ధాతంతము మరణము, వాక్యము జీవము? మరణము తీసికొనుటకై జీవవాక్యము త్రోసివేయుదువా? ఆ రెండిటిని ఒకేసారి ఎట్ల స్వీకరించగలవు? నీవది చేయజాలవు. ప్రతిమనిషి మాట అబద్ధమే, ప్రతి సిద్దాంతము అబద్దమే; దేవుని వాక్యమే సత్యము.

ACTS 2:38•

ACTS 8:16,17

 

103క్రొత్త నిబంధనలో ఏ స్థలంలోనైనా గాని తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామమున ఎన్నడైనా , బాప్తిస్మము పొందినట్లుగా వ్రేలుపెట్టి చూపించమని ఎవరినైనా గాని, బిషప్పునైనా గాని, నా అధ్యయనంలోకి వచ్చిన ఏ వ్యకినయినా గాని, ఈ జనసమూహము ఎదుట ముందు వచ్చిన వారిని గాని ఎవరినైనా సరే, నేను సవాలు చేయుచున్నాను. (ఈ టేపులు ప్రపంచమంతా వెళ్ళునని నాకు తెలుసు). పరిశుద్ధాత్మను పొందిన అందరూ ఆ విధముగానే బాప్తిస్మము పొందినట్లుగా నేను వాక్యములోనే నిలిచియుండి చూపుదును. వేరే విధముగా బాప్తిస్మము పొందినవారు పరిశుద్ధాత్మను పొందుటకు మరల బాప్తిస్మము పొందిరి. దాని గురించి నీవు ఏమి చేయబోవుచున్నావు? నీ ఆచారములోనే ఉందువా? నీ సిద్ధాంతములోనే ఉండి చచ్చెదవా! నీవు దోషివి, జీవాధిపతిని, వాక్యాధిపతిని నీవు నీ చేతులతో జనుల యెదుట సిలువ వేసితివి.

JOHN 1:14•

JOHN 8:46•

JAS 2:19

 

104ఇప్పుడు, వారేం చేశారు? అది వారెరుగరు. ఈనాడు మనుష్యులు అలక్ష్యంగా వెళ్ళిపోవుచున్నారు. అది సత్యమని వారెరుగరు. అదొక వాదమని వారు తలంచుచున్నారు. ప్రత్యక్షత ఆత్మలోనికి వచ్చునంత లోతుగా వారు త్రవ్వటలేదు. వారు చాలినంత ప్రార్థించుదురు. వారు చాలినంతగా దేవుని పిలువరు. అంతా వారు తేలికగా తీసికొందురు, "ఓ, మంచిది, దేవుడు ఉన్నాడు అని నేను నమ్ముతాను. నిశ్చయముగా!" దయ్యము కూడా అలాగే నమ్ముచున్నది. నమ్ముచున్నామని కొందరనుకొనుచున్న దానికంటే దయ్యము ఎక్కువగా నమ్ముచున్నది; దయ్యము నమ్మి, వణకుచ్నుది. ప్రజలు ఏదో నమ్మి వెళ్ళిపోతున్నారు గాని దయ్యము వణుకుచ్నుది. తన తీర్పు వచ్చునని యెరుగుచున్నది. ప్రజలు నమ్మి కూడా తీర్పు వచ్చునని భయములేకుండా యున్నారు.

ఆయనను సిలువ వేసిన శిక్ష దోషము వారిపైనున్నది. నిశ్చయముగా! ఆదిలో వారెట్ల దోషులుగా కనుగొనబడిరో, అదే రీతిగా వాక్యము ద్వారా దోషులుగా ఈ తరము కనబడుచున్నదని నేను నేరారోపణ చేయుచున్నాను. అది నిజం. యేసు చెప్పెను, "ఎవరు నన్ను నేరస్థునిగా ఎంచగలరు?" అన్నాడు. ఆయన శరీరధారియైన వాక్యము. ఈ రోజు ఆ వాక్యమే శరీరధారియైనది.

ACTS 2:22

 

105పేతురు అపొస్తలుల కార్యముల గ్రంథములో తన నేరారోపణ తెలియచేసెను. దాని చదువుదాం. వారేమి చేయుచున్నారో పేతురు చూచినప్పుడు, ఆత్మ మాట్లాడెను. పేతురు యేసును సంరక్షించుచున్నాడు. సువార్తను నేను పరీక్షించుచున్నాను. వాక్యమైయున్న క్రీస్తు అను నరుని చంపిన నేరారోపణను ఆయన చేస్తున్నాడు. నరునిలో ప్రత్యక్షమయిన వాక్యమును వారు చంప యత్నించినందున, వారిపై నేరారోపణ చేయుచున్నాను. పేతురు ఏమన్నాడో గమనించండి. ఆయన నీతిగల కోపము బహు ప్రచండముగా లేచినది. అపొ. కార్యములు 2:22 చదవండి:

ఇశ్రాయేలు వారలారా, ఈ మాటలు వినుడి: దేవుడు నజరేయుడగు యేసు చేత అద్భుతములను, మహత్కార్యములను, సూచక క్రియలను మీ మధ్యను చేయించి ఆయనను తన వలన మెప్పుపొందిన వానిగా మీరు కనపరచెను. ఇది మీరు విరుగుదురు.

వారెట్ల అనుకొన్నారో నేనూహించగలను! అది వినండి.

ఇశ్రాయేలు వారలారా… రాజులు, సంఘస్తులు, పరిశుద్ధులు, యాజకులు, దేవుని బిడ్డలను కొనుచున్నవారు, ఈ మాటలు వినండి. నజరేయుడగు యేసు మీ మధ్య దేవునిగా రుజువాయెను.

ACTS 2:23

 

106ఇప్పుడు, యాజకులకు, జనులకు నేను చెప్పుచున్నాను, నజరేయుడగు యేసు, పరిశుద్ధాత్మ, అయన ఇక్కడ పరిశుద్ధాత్మ వ్యక్తిగా నున్నాడు - ఆయనలో నున్న జీవము అదే. ఆయనిక్కడ జనుల ద్వారా పనిచేయుచూ, సూచనలు, అద్భుతముల ద్వారా కనపరచుకొనుచున్నారు. ఇక్కడ ఆ గోడలపైన అది వ్రేలాడుచున్నవి. శాస్త్రీయ రుజువు గుర్తింపు ఏర్పడినది. చనిపోయిన వారు ఈనాడు సజీవులగుచున్నారు. కాన్సరుచే తినివేయబడినవారు, ఈనాడు బాగున్నారు. గ్రుడ్డివారు ఈ రోజున చూస్తున్నారు. కుంటివారు ఈనాడు నడచుచున్నారు! ఆయనే నజరేయుడగు యేసు.

దేవుడు నిశ్చయించిన సంకల్పమును ఆయన భవిష్యత్ జ్ఞానమును అనుసరించి అప్పగింపబడిన ఈయనను మీరు దుష్టులచేత సిలువ వేయించి చంపితిరి, [ముందే నిర్ణయించబడిన ఆయన పని].

HEB 13:8

 

107అది నేరారోపణా? ఆయన ఏమి నేరారోపణ చేయుచున్నాడు? ఆ సన్హేద్రిను సభను. ఈ ఉదయమును సంఘ సామాఖ్యపై నేను నేరారోపణ చేయుచున్నాను. పెంతెకోస్తువారిపై నేరారోపణ చేయుచున్నాను. ప్రెస్బిటేరియనులు, బాప్టిస్తులు, ప్రపంచములోనున్న ప్రతి శాఖవారిపై నేను నేరారోపణ చేయుచున్నాను. దుష్టత్వము, స్వార్ధముతో జీవవాక్యమును మీరు తీసికొని, జనులయెదుట దాని దూషించి, ఆయన నిన్న, నేడు, నిరంతరము ఏకరీతిగా నున్నాడని రుజువు చేయుటకై మన మధ్య లేపిన దానిని మనము వెర్రితనమని పిలుచుచూ సిలువ వేశాము. ఈ తరముపై నేరము మోపుచున్నాను!

MAL 4:5,6•

MARK 16:17•

ACTS 2:23,24

 

108ఆయనను సజీవునిగా దేవుడు రుజువు పరచెను. ఇదే ఆయన వాక్యమని దేవుడు నిరూపించెను. అయితే మీకు సిద్దాంతములు కొన్ని మతవిశ్వాసములు తప్ప మరేమియున్నవి? ఎందుకనగా మీరు దేవుని వాక్యమును, జీవమును తిరస్కరించారు. దానివలననే ఇవన్నియూ మీకు దొరుకును. అవును! ఓ, మనం, ఎటువంటి ఘడియలలో జీవించుచున్నాము.

ఓ, పేతురు చెప్పెను, "మీరు దుష్ట చేతులతో ఆయనను సిలువవేయించి చంపితిరి."

మరణము ఆయను బంధించియుంచుట అసాధ్యము గనుక దేవుడు మరణ వేదనలు తొలగించి ఆయనను లేపెను.

మీ సిద్దాంతములు, మీ శాఖలు, సంస్థలు, పై భక్తి ద్వారా ఆయన పునరుత్తాన శక్తిని మీరు తిరస్కరించియున్నారు. కాని ఆ ఘడియ వచ్చియున్నది; చివరి దినములివి, మలాకీ 4 ప్రకారము ఆయన చివరి దినములలో జనుల హృదయములను అసలయిన ఆశీర్వచనము, అసలయిన పెంతెకోస్తు విశ్వాసముగల తండ్రుల వైపునకు త్రిప్పుననియు, ఒకనిని ఆయన చివరి దినములలో లేపుననియు దేవుడు వాగ్దానము చేసెను. మీరు దానిని కాదనలేరు, దానిని మీరు ఎదిరించలేరు. ఇప్పుడు మిమ్మును మిమ్ములను దోషులనుగా ఎంచుచున్నారు. మిమ్మును దోషులని ఖండిచుచున్నాను, మరియు మీ దుష్ట, స్వార్థ, శాఖా చేతులతో జనులయెదుట దేవుని వాక్యమును సిలువవేసిరని దేవుని ఎదుట నేరారోపణ చేయుచున్నాను. మీరు దోషులు మరియు తీర్పునకు సిద్ధముగా నున్నారనియు నేను చెప్పుచున్నాను. ఆమెన్! అవునయ్యా!

పేతురు చెప్పినట్లుగానే, నేనునూ చెప్పుచున్నాను. ఆ తరము వారిని మారుమనస్సు పొందుమని చెప్పెను. ఈ జనులు దేవుని ముందుకు వచ్చి వాక్యము యొక్క అసలు విశ్వాసము నొద్దకు వచ్చి మారుమనస్సు పొందుమని నేను చెప్పుచున్నాను. పరిశుద్ధాత్మ నొద్దకు రండి, ఎందుకనగా దేవుడు దానిని మార్చనేరడు. "నమ్మినవారి వలన ఈ క్రియలు కనబడును." దేవుడు చెప్పినప్పుడు, నిత్యముగా ఆయన ఆ మాటలతోనే నిలిచియుండవలసియున్నది; అది ఆయన మాట.

MARK 16:17,18

 

109"కరచాలనము," లేదా "సంస్కారము" లేదా అట్టిది మరేదో, లేదా ఏదో సిద్దాంతము, లేదా ఏదో అభిప్రాయము నీవు వ్యక్తం చేయవచ్చు. దానిని ఏ మనిషి అయినా, త్రాగుబోతయినా, ఏ అవిశ్వాసి అయినా, ఏ అనుకరణ కర్తయినా, ఏ వేశ్య అయిన ఆచారములను అనుకరించ గలుగును. కాని యేసు చెప్పెను, ఇది గుర్తింపు: "నమ్మిన వారందరి వలన ఈ సూచనలు కనబడునని ఆయన చెప్పెను (ఎదో బహుశా కావచ్చు కాదు, అవి జరుగును)… నమ్మినవారివలన, తరములవరకు: నా నామమున వారు దయ్యములను వెళ్ళగొట్టుదురు; క్రొత్త భాషలు మాట్లాడుదురు; సర్పములను ఎత్తిపట్టుకొందురు; విషకరమైనదేదయినా త్రాగినను, వారికి హాని చేయదు; రోగులపై చేతులుంచినప్పుడు, వారు బాగుపడెదరు; రోగులను స్వస్థపచెదరు; మృతులను లేపుదురు; దయ్యములను వెళ్ళగొట్టెదురు; ఉచితముగా పొందిన దానిని ఉచితముగా ఇచ్చెదరు."

ఈనాడు ఎక్కడ చూచినా గాని ఈ పెద్ద డబ్బు తయారు చేసికొను ప్రణాళికలే కనబడుచున్నవి; వారు పూర్తిగా తీర్పుకు లోనగుటలో ఆశ్చర్యములేదు. అవును! ఓ, మై!

JOHN 1:1

 

110ఇప్పుడు చూద్దాం. అవును! మారుమనస్సుకు పిలుపునీయండి. ఇప్పుడు నా నేరారోపణ ఇదే.. ఈ క్రొత్త కల్వరి - సంఘము. అది పరిశుద్ధ స్థలముగా పిలువబడుచున్నవి. పెద్ద వేదికలు, కాతలిక్కు వేదిక, కాతలిజం అను వేదిక. మెతడిస్టు, బాప్టిస్టు, ప్రెస్బిటేరియను, లూథరను, పెంతెకోస్తు అను ఈ అతిపరిశుద్ధ స్థలములందే ఆయన బహు కఠినమగు గాయములను పొందుచున్నాడు — ఒక క్రొత్త కల్వరి, అదెక్కడున్నది? పరిశుద్ధ స్థలములో, అది సంఘము. ఆయనెక్కడ సిలువ వేయుట? సంఘ కాపరుల నుండి. మీరు వేషధారులు, అంతకంటే మీకు ఎక్కువే తెలుసు! నేను కోపంగా లేను, కాని నాలో ఎదో కదుపుచున్నది. దేవుడు మీ మధ్య పరిపూర్ణముగా గుర్తింపబడెను.

ఈ ప్రక్కలో బల్లెపు పోటుల ఆయనెక్కడ పొందెను? ఈ గాయములు ఆయనెచ్చట పొందెను? కల్వరి మీద. ఈనాడు ఆయనెక్కడ పొందెను? వేదికలోనే. అదెక్కడనుండి వచ్చెను? యెరూషలేము. అదెక్కడ నుండి వచ్చెను? శాఖలు, ఆయనను ప్రేమించుచున్నామని చెప్పి, వారే చేశారు. ఈనాడు వారే చేయుచున్నారు. ఆయన రెండవ కల్వరి, వాక్యమునకు వ్యతిరేకించినందు వలననే ఆయనకు గాయములు అయినవి… అవే ఆయనను గ్రుచ్చును. ఆయనెవరు? ఆయనే వాక్యము. ఆయనే వాక్యము. గట్టిగా ఆయనెక్కడ పొడువబడెను? ఆనాటి వలెనె, వేదికపై, పరిశుద్ధ స్థలములో.

HEB 4:12

 

111ఈ తరముపై నేరారోపణ చేయ హక్కు నాకున్నది. యేసుక్రీస్తు సువార్తను బోధించు సేవకునిగా అది చేయు హక్కు నాకున్నది. ఆయన దేవుడని సూచనలు రుజువు చేయుచున్నవి. ఈ తరమునకు వ్యతిరేకముగా నాకు నేరారోపణను తెచ్చు హక్కున్నది, ఎందుకనగా ఆయనకు గట్టి గాయములు వేదికమీదనే ఏర్పడినవి. అక్కడే వారు విమర్శించిరి, "అట్టిది వినుటకు వెళ్ళవద్దని చెప్పిరి. అది దయ్యమునకు చెందినదన్నారు." ఆయనను ప్రేమించవలసిన స్థలములోనే ఆ విధంగా చేసిరి.

యేసు జరుగునని చెప్పిన సూచనలు జరుగుచున్నవి. వాక్యము రెండండచులు ఖడ్గము, ఎట్టి ఖడ్గము కంటెను వాడిగలది, హృదయాలోచనలను పరిశోధించును; దానిని వారు దయ్యము అనుచున్నారు. ఎక్కడ నుండి? వేదికలు, పరిశుద్ధ స్థలములు నుండియే. ఓ, దేవా, ఎట్లు క్రిందికి చూతువు? కేవలము కృపవలననే, అంతే, కృప. మనము తీర్పుకు తప్ప మరి దేనికిని యోగ్యులము కాము. మనము ఇప్పటికే అక్కడ ఉన్నాము.

MARK 7:7,8•

2TIM 3:5•

HEB 6:6

 

112దాని గూర్చి ఆలోచించు. ఆయనకు క్రూర గాయములు వేదికపైనుండియే ఏర్పడినది. ఆయన క్రొత్త కల్వరి అదియే. వేదిక వద్దనే వాక్యమును వారు సిలువ వేసిరి. అది వారెట్లు చేసిరి? పాకి భక్తిపరులను వారియొక్క వేషము వలను. అది ఖచ్చితముగా!

అపహాసకుల గుంపువలన ఆయనకు కిరీటము పెట్టబడినది. అపహాసకులే ఆయనను సిలువ వేసిరి. హేళనతో ముండ్ల కిరీటమును పెట్టిరి. ఆయన నూతనముగా సిలువ వేయబడుచున్నాడా? మానవ-కల్పిత సిద్దాంతములచే ఆయన వివస్త్రుడాయెను. వాక్య విరుద్ధ, శాఖా బోధకుల మూలంగా దానిని వారు దిగంబరిగా చేసి, అవమానముతో ఖండించిరి.

"వారు వ్యర్ధముగా నన్ను ఆరాధించుచున్నారని," యేసు చెప్పెను. వ్యర్ధము. ఏ మంచి చేయదు. వారెవరిని ఆరాధించిరి? ఆ దేవునినే. ఆయన మొదటి సిలువ మరణములో వారు అదే దేవుని ఆరాధించిరి, అది వ్యర్దమైన ఆరాధన. ఈనాడూ అంతే. వ్యర్థముగా ఈ శాఖలను కట్టుచున్నాడు. ఈ సెమినర్లను వ్యర్ధముగా నిర్మించుచున్నారు. కాని వాక్యమును తిరస్కరించి హితబోధకు బదులుగా మానవ ఆజ్ఞలను, సిద్దాంతములను వ్యర్ధముగా బోధించుచున్నారు. ఆయన వాక్యమునకు మారుగా మానవోక్తులు ఉంచి, జీవాధిపతిని సిలువ వేసిన నేరస్తులు. దిగంబరి చేసి, పొడిచి, కిరీట ధరింపచేసిరి — "వారు నన్ను వ్యర్ధముగా ఆరాధించుచున్నారు."

1COR 11:15

 

113పొడవైన జట్టుతో వీధిలో నడుస్తూన్న స్త్రీలను చూచి, పురాతన పోకడలో ఉన్నారని చెప్పి హేళన చేయుచున్నాను. వారు అపహాసకులు, గుర్తుంచుకొనండి. మీరు పెట్టుకున్న కిరీటమదియే. అది మీ మహిమ అని దేవుడు చెప్పెను. దానిని గర్వముగా ధరించండి. హల్లెలూయా! నీ ప్రభువు కొరకు ముండ్ల కిరీటమును గర్వముతో ధరించు! సిగ్గుపడకుము. ఆయనది చెప్పెను. ఈనాటి యెజెబెలలు, ఈ వేదిక వేశ్యలు, క్రీస్తును సిలువ వేయువారు ఏమి అన్నప్పటికి, దానిని గర్వముతో ధరించుము. దేవుడా రీతిగా చెప్పెను గనుక దానిని అనుసరించుము.

అపహాసకులచే తిరిగి ముండ్ల కిరీటమును పొందుచున్నాడు; వేదికపై నుండి సిద్దాంతముల ద్వారా గాయములు చేయుచున్నారు.

అది ఆయన క్రొత్త గొల్గొతా. ఆయనెక్కడికి కొనిపోయిరి? పొడవాటి పై-వస్త్రము గల సంగీత గుంపులు, పొట్టి దుస్తులు ధరించిన స్త్రీలు, జట్టు కత్తిరించుకొన్న స్త్రీలు, రంగు పూసికొనిన ముఖములు, తలాంతులతో దేవదూతల వలె అలంకరించుకొనిన గాయకులు, ఆయన నూతన గొల్గొతా: ఈ ఆధునిక వీధుల్లో బట్టలు విప్పువారు, సొదొమ గొమొర్రాల వద్దవలె చట్టపు రక్షణ క్రిందనున్నారు.

DEUT 22:5

 

114ఒక చిన్న ఆడ కుక్క వీధిలో నడిచిపోతున్నది; కొన్నిసార్లు దాని వెనక ఒక్క మగ కుక్క కూడా వెళ్ళదు. ఫలానా సంగతి జరగినచొ దాని వెనుక వాటిలో ప్రతియొక్కటి పరుగెత్తును. దానికేదో జరిగినది; ఎందుకో నీకు తెలుసా. ఈ స్త్రీలు బట్టలు తీసి ఎందుకు వీధుల్లో వెళ్తున్నారు? అది ఇదే విషయము కాదు అని నాకు చెప్పవద్దు. అది ఒక గుర్తింపు. పురుషులను ఖండిచవద్దు. కాని వారు సొదమ చట్టరక్షణ క్రిందనున్నారు. అక్కడ ఆడవారుండుట చట్టవిరుద్ధమని నేను చెప్పుచున్నాను. వేదికపైనున్న బోధకులు యాజకుల వస్త్రమునకు బదులుగా, ఆడువారి వస్త్రములు ధరించుకొనవలసియున్నారు! వారక్కడ నిలబడి అనుమతించుచున్నారు, మరియు వ్యతిరేకంగా మాట్లాడుటకు సిగ్గుపడుచున్నారు, ఎందుకనగా వారి శాఖ వారిని బయటకు పంపివేయును. జనులకు దేవుని వాక్యము నీవు సిలువ వేయుచున్నావు, అది పురుషుని వస్త్రములు స్త్రీలు ధరించుట హేయము అని చెప్పుచున్నది. దానిని నేను ఖండించుచున్నాను. జనుల యెదుట వాక్యమును సిలువవేసిన నేరమును వారిమీద మోపుచున్నాను. జట్టు కత్తిరించుకొనిన స్త్రీలు, జనములో పొట్టి దుస్తులు ధరించుచు, సంగీత గుంపులో నిలబడుచున్నారు.

115ఒక రోజున ఒకామె నాతో, "వారెక్కడ ఉందురు?" అని ప్రశ్నించినది.

నేనన్నాను, "లోకమంతటిలో నుండి ఒక డజను మందిని ప్రభువు ఎన్నుకొనమని నాకు చెప్పినచో, నేను మరణించునంతగా భయపడుదును." ఆత్మీయ విశ్వాసము ద్వారా నిలబడి వారిని పరీక్షించుచున్నాను, మురికితో, అపవిత్రతతో సిగరెట్లు త్రాగుచూ, అసహ్యంగా జీవించుచూ, చక్కగా బట్టలు ధరించి పాటలు పాడెదరు. "వారలా ఉండి, నేను మాత్రం ఆ విధంగా ఉంటే ఏమిటని," జనులు అనుకొనుచున్నారు.

ఒక క్రైస్తవుని జీవితము అనునది పరిశుద్ధత మరియు పవిత్రతతో కూడిన జీవితము. అవునండి. వారి మురికి, అపవిత్రతను బట్టి యేసుక్రీస్తు నామములో వారిపై నేరారోపణ చేయుచున్నాను. సువార్తను నీచమైన స్థితికి వారు తెచ్చారు. దానిని గట్టిగా పట్టుకొన్న వారిని వెర్రివారని చెప్పుచున్నారు. "అది పాత పద్దతి," అని చెప్పుచున్నారు. బుద్ధిహీనత! క్రీస్తు నామమున వారిపై నేరారోపణ చేయుచున్నాను.

2THS 2:11,12

 

116ఈనాటి ఆధునికముగా వీధుల్లో బట్టలు విప్పుట, గాయక బృందాల్లో పాటలు పాడుట, సిగరెటు త్రాగుచూ, మురికి సరసోక్తులు చెప్పుకొంటూ, ముగ్గురు నలుగురు భర్తతో జీవించుచు, తర్వాత స్వరము ఉంది కదా అని సంగీత కచేరీలో పాడుచుందురు. బుద్ధిలేని ఆత్మీయంగా క్షీణించిన మీరు మీ కార్యముల వల్లనే విసర్జించబడిరి. అందరూ చదివే బైబిలు మీరూ చదువుచున్నారు; కాని మీరు దేవుని ఆత్మను త్రోసివేశారు, చివరకు మీరు బైబిలు చెప్పినట్లుగా గొప్ప మోసమును నమ్మి, దానివలన శిక్షకు పాత్రులగుదురు. మీరు సరియిన వారనుకొనచున్నారు, కాని మీరు ఏ అబద్ధమును నమ్మి సత్యమనుకొనుచున్నారో దాని వలననే ఆ మోసము వలననే కొట్టివేయబడుదురని బైబిలు పలుకుచున్నది. కాబట్టి దేవుని వాక్యము ద్వారా నేను నేరారోపణ చేయుచున్నాను. మీరు జనులకు అబద్దము బోధించి, క్రీస్తు యొక్క సూత్రములను, పరిశుద్ధతను పైనున్న జీవమును సిలువ వేయుచున్నారు.

ఒక వ్యక్తి వీధిలోనికి నడిచి వెళ్ళి, ఇంకనూ ఒక వేరయిన వ్యక్తిగా నుండవచ్చును.

117బోధకులు ఆట స్థలములో నిలబడి సిగరెట్లు త్రాగుకొంటూ అడ్డుబండలుగా నుంటున్నారు. మురికి పనులన్నీ వారివే. జట్టు కత్తిరించుకొని, రంగులు పూసికొని, పొట్టి దుస్తులు ధరించుకొని, పాటలు పాడుచూ, "సోదరీ! ఇది, అది" అని చెప్పుకొంటారు. వాటిని బైబిలు ఖండించుచున్నది! అది నిజం. వినోదములకు వెళ్ళుచూ, అన్నీ చేయుచూ, కూడా ఇంకా సంఘ సభ్యులుగా, సాక్ష్యమును కొనసాగించు మరియు ఇష్టానుసారంగా జీవించుదురు.

నేను అంతా ప్రెస్బిటేరియనులను గూర్చి మాట్లాడుచున్నానని తలంచవద్దు. ఈ పెంతెకోస్తవారి గూర్చి నేను మాట్లాడుచున్నాను. అది నిజం. ఒకప్పుడు నీవు సత్యమెరుగుదువు, కాని దానిని తీసికొనలేవనుకొనుచున్నావు. నీ కాపరిని నీవు బలపరచవు. దానిని ఖండించినట్లయితే నెలకు కొన్ని వందల డాలర్లు వచ్చే ఉద్యోగము, బోధించుటకు చక్కని పెద్ద సంఘము నీకుండదు. ఏమీ అడ్డం చెప్పకుండా ఇష్టానుసారంగా వెళ్ళిపోనిచ్చెదవు. ఆ సంస్థ అతనిని బయటకు త్రోసివేయును గనుక ఆ విధంగానే అతడు చెప్పవలసియుండును. కాబట్టి ఏశావువలె ఒక్క పూట లోకపు కూటి కొరకు జ్యేష్టత్వమును అమ్ముకొనుచున్నాడు. దానికతడు ఏమి పొందును? ఇద్దరు గుంటలో పడును [స్పష్టతలేని మాట]. వారిని సువార్త యొక్క వేశ్యలని నేను నేరారోపణ చేయుచున్నాను.

118కొద్దికాలం క్రితం పెంతెకోస్తులోని ఒక గొప్ప హోదాకు చెందిన ప్రసిద్ద గాయక బృందము వద్ద నేనున్నాను. నాలుగు లేదా అయిదు కచేరీలు చేరిన ఆ స్థలంలో సహోదర అధ్యయనం నిమిత్తం నేనక్కడుండుట జరిగినది. అది పెంతెకోస్తు సంస్థలోని ఒక గొప్ప చక్కని గుంపు. ఓక్లహామా వద్ద నేనీ సేవకుల ఆధ్వర్యంలో ఉన్నానని వారెరుగరు. సేవకుడు తన వేదికనెక్కు ముందుకు చదువుకొను దిగువ స్థలంలో నేనున్నాను. నేనక్కడుండగా రంగులు వేసి కొన్ని ఈ పిల్లిలాంటివారు వచ్చారు. వారిలో ఏ ఒక్కరికి పొడవైన జట్టు లేదు; అందరూ జట్టు కత్తిరించుకొని యున్నారు. అందరూ రంగులు పూసికొన్నారు. అందరూ అంగీలు ధరించారు. వారంతా చుట్టూ నిలబడిరి. మరో వ్యక్తికి మిషనెరీ చందా పట్టుకున్నారు. గిన్నెతో ఒక గ్రుడ్డివానివాలె నటించుచూ వెళ్ళి, అర్పణను గూర్చి బహుగా దూషణ చేయుచూ ఆ చోటికి వచ్చి "ఆ మెస్సీయా" అను పాట పాడుచున్నాడు (ఓ, మై!); దానివలన మంచిపని జరుగవచ్చు గాని దానికి ప్రతిధ్వని లేదు. అది చచ్చినది. ఓ, మై! అక్కడే మీరున్నారు. అదే నూతన గొల్గొతా.

HEB 6:6

 

119ఒకవేళ అచ్చటికి పొడవాటి జట్టుతో, రంగు లేకుండా ఒక స్త్రీ వచ్చినచో ఎట్లుండును. ఆమెను గేళి చేయుదురు. ఆమె గాని ఆ విధంగా చేయుటకు నిలచినచో అక్కడున్న ముప్పది, నలుబది యువకుల గుంపు హేళన చేసియుందురు. ఆ ఎన్నుకోబడిన పెంతెకొస్తు గుంపు వారిని గూర్చి ఒక్క మాట గాని అనియుంటే ఆమెను వెంటనే బయటకు త్రోసివేయుదురు. ఒకవేళ సువార్త బోధకుడు దానిగూర్చి ఒక్క మాట అన్నచో, ఆ సంస్థ నుండి బయటకు బహిష్కరించి యుందురు. వీరు దేవుని కుమారుని నూతనముగా సిలువ వేయుచూ బహిరంగముగా అవమానపరచుచున్నారు. ఆయన సువార్తను బోధించుచున్నామని చెప్పుకొంటున్న మీరు ఆయనను సిలువ వేయుచున్నారు. ఆయన సజీవుడని చివరి దినములలో ఆయన శక్తి ప్రత్యక్షత వాక్యము ద్వారా బయలుపరచుచుండగా, ఆయనను విసర్జించుచున్న ఈ తరముపై నేరారోపణ చేయుచున్నాను.

అవును, వారు పవిత్రమగు బయలుపరచబడిన దేవుని వాక్యమునకు వ్యతిరేఖులు. దానిని వారి సంస్థలు అంగీకరించవు.

120పెద్ద సంఘములు, శాఖలే ఆయనకు క్రొత్త కల్వరి; నేను మరల చెప్పెదను. వారి ఆధునిక బట్టలు విప్పువారే వారి యొక్క గాయక బృందము. ఆనాటి యాజకులవలెనె ఈనాటి శాఖ ప్రధాన యాజకులు కూడా, "మాకొక సూచక క్రియను చూపించమని" అడుగుచున్నారు. అది మొదటి సిలువ. ఈనాడూ అంతే. వారిట్లు చెప్పుచున్నారు, "మంచిది, నీవు చనిపోయిన వారిని లేపావు కదా? మరి అక్కడికెందుకు వెళ్ళకూడదు? నీ భార్య సమాధుల దొడ్డిలో నున్నది; నీ పిల్ల సమాధులు దొడ్డిలో నున్నది."

వారాయనతో అన్నారు, "నీవు మృతులను లేపావని విన్నాం. మాకు ఒక పెద్ద సమాధుల దొడ్డి అక్కడున్నది. వచ్చి వారందరినీ లేపుము…" ఓ, అజ్ఞానము అజ్ఞానమును పుట్టించును.

పెద్ద సంఘములు, పెద్ద గాయక బృందాలు, ఈనాటి ప్రధాన యాజకులు: "వచ్చి! మా శాఖ చేయలేని ఒక అద్బుతమును చూపించుము."

121అర్కాన్సాస్ లోని జోన్స్బరోలో ఒక చిన్న రేడియో వర్తమానము కొద్దికాలము క్రిందట ఒక స్త్రీ స్వస్థపడుట గురించి చెప్పినప్పుడు, ఒక వ్యక్తి వచ్చి నన్ను ఇలా అన్నాడు. ఈయన ఒక ప్రత్యేక శాఖ సంఘమునకు చెందినవాడు. అతడు వచ్చి, "నాకు ఒక అద్భుతమును చూపించమని ఎవరైనా సవాలు చేయుచున్నానని" అన్నాడు. నేను వెళ్ళి వైద్యుని పిలచి, కాన్సరుతో నుండిన ఒక వ్యక్తి బాగుపడెను. ఇరవై ఏండ్ల నుండి చక్రాల కుర్చీలోనున్న ఒక స్త్రీ; తన కీళ్ళ నొప్పులు నుండి బాగుపడినదని చూపించాను. నేనప్పుడు వారితో, "ఇప్పుడు నాకు వేయిడాలర్లు కావాలని," నేను దానిని తీసుకోని అడిగాను.

అందుకతడు, "అది ఇక్కడ కాదు. అది టెక్సాస్ లోని మేకోలో మా ప్రదాన కార్యాలయంలో" అన్నాడు.

MATT 15:14•

MATT 27:42•

LUKE 6:39

 

122"సరే, అక్కడకు వెళ్ళి తీసికొందాం," అని చెప్పాను. "రేపు వెళదాం ఏర్పాట్లన్ని చేయుము" అన్నాను. "వీరంతా ఖచ్చితంగా కాన్సరుతో నున్నట్లుగా వైద్యుడు చెప్పుచున్నాడు. సరే, జాబితాతో వారున్నారు - ఎక్స్-రే. ఇరవై సంవత్సరాల నుండి చక్రాల కుర్చీలో నున్న ఈ స్త్రీని పొరుగు వారందరూ ఎరుగుదురు. ఆమె ఇప్పుడు చక్కగా నడుస్తున్నది. ఎందరో వైద్యులు చెప్పగలరు; ఆమె ఈ రోజున సజీవంగా ఉంది. నీవు వేయి డాలర్లు ఇస్తానని చెప్పావు గదా; దానిని నేను మిషనెరీ నిధికి ఇచ్చేస్తాను, అన్నాను. అది నాకు కావాలి.

"అది టెక్సాస్లోని వేకోలో, నున్నది" అని అన్నాడతడు.

"మనము రేపు వెళదాం" అని నేను అన్నాను.

అందుకతడు, "ఒక్క నిముషం నేను చెప్పేది విను. నాతో ఒక చిన్న పిల్లను తీసికొని వెళ్ళెదను. బ్లేడుతో ఆమె చేతిని కోసెదను, దానిని మా సోదరుల ఎదుట బాగు చేయుము; వారు నాకు డబ్బు ఇచ్చెదరు" అన్నాడు.

"నీవు దయ్యానివి" అన్నాను.

"నీవు దేవుని కుమారుడవైతే, సిలువ దిగిరమ్ము. నిన్నెవరు గుద్దిరో చెప్పుము" అన్నారు. ఆయన తలచుట్టూ ఒక బట్ట చుట్టి ఆయనను, "నీవు ప్రవక్తవైనచో ఎవరు కొట్టిరో చెప్పుమనెను."

"నీవు దేవుని కుమారుడవైనచో, సిలువ దిగిరా."

గ్రుడ్డివారిని నడిపే గ్రుడ్డి బోధకులు. వారికి మానసిక స్వస్థత అవసరము. ఆ విధంగా మాట్లాడినవారికి అదే కావలెను. నిశ్చయంగా.

MATT 10:25

 

123బాగుగా తెలిసిన ఆ పాత పిలుపు వినండి, "ఒక అద్భుతమును మాకు చూపించు. బోధకుడా, నీనుండి ఒక అద్భుతము చూడగోరుచున్నాము," ప్రతి దినము, ప్రతి ఘడియ అది జరుగుచునే యున్నది. కాని వారు హాజరు కాలేదు. వారు వచ్చి చూచినా గాని దానిని బయల్జెబూబు అన్నారు. "మేము కోరినవిధంగా మాకు అద్భుతము చేసి చూపించు బోధకుడా, అని వారడిగిరి (అంతే!), మేము మా ఇష్టం వచ్చిన చోటికే వెళతాం, మాకు ఇష్టమొచ్చినట్లే చేస్తాం!" అన్నారు. ఓ, అవును! ఆయనతో వారికి ఏ సంబంధము లేదు. లేదయ్యా! అందుకే వారి మధ్యనుండి ఆయనను తీసివేసిరి. అవునయ్యా! ఈనాడూ వారదే చేయుటకు ప్రయత్నించుచున్నారు. సంఘ సమాఖ్యల ద్వారా, చివరికి వారు దానిని చేయట సాధించుదురు. వారందరూ వెళ్ళుచున్నారు, ఆ బాగుగా తెలిసిన కేకయే వినబడుచున్నది.

REV 3:20

 

124ఇక్కడ మరల మనము అత్యంత మతపరమైన స్థలమును, శ్రేష్టమగు మెరుగుదిద్దబడిన వేదాంతులను ఆయనకు వ్యతిరేకముగా కేకలు వేయుటకు చూస్తున్నాం. ఆ గొప్ప వేదాంతులు భేదమును తెలిసికొనవలసినవారు, ఉన్నత సంఘములు, గొప్ప తర్ఫీదు గల వేదాంతులు ఆయనను వారిమధ్య నుండి త్రోసివేసిరి. వారికది అక్కరలేదు. "అది తప్పు, బ్రెన్హాం సోదరుడా" అని నీవనవచ్చు. అయితే నీవిక్కడ "సంఘ కాలములను" గూర్చి బోధించుటను వినజాలవు. ఆయనను బయటకు త్రోసివేసినది లవొదికయ సంఘము ఒక్కటే అను మాట నీవు వినలేవు. ఆయన వెలుపట నుండి లోపటకు రానైయుండి, తలుపు తట్టుచున్నాడు. ఆయన వలన వారికి ప్రయోజనము లేనందున, ఆయనను వారు బయటకు త్రోసిరి. నూతనముగా ఆయనను వారు సిలువ వేసిరి. ఆమెన్! ఎంతకాలం వెళ్ళగలం?

2TIM 3:2-6

 

125II తిమోతి 3లో ప్రవక్త ముందుగానే చెప్పిన దేవుని మాటను జ్ఞాపకము చేసికొనండి. (ఒకవేళ మీరు వ్రాసుకున్నట్లయితే; చదువుటకు మనకు సమయం లేదు) చివరి దినములలో అపహాసకలు వచ్చెదరు. ఏలాగనగా మనుష్యులు స్వార్థప్రియులు, ధనాపేక్షులు, బింకములాడువారు, అహంకారులు, దూషకారులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞతలేనివారు, అపవిత్రులు, అనురాగ రహితులు, అతిద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవునికంటే సుఖానుభవమును ఎక్కువగా ప్రేమించువారు, పైకి భక్తిగలవారివల నుండియు దాని శక్తిని ఆశ్రయించనివారు, అట్టివారికి విముఖుడవై యుండుము. ఎందుకనగా ఇట్టివారే అల్లరిగా, జుట్టు కత్తింరించుకొని, పొట్టి దుస్తులు ధరించుకొని, ముఖానికి రంగులు పూసికొని, ఆయా స్థలములకు తిరుగుచూ అనేకులను చెరలోనికి నడిపించుచున్నారు. అది నిజం. చివరి దినములలో అట్టివారికి దూరముగా నుండుము.

ప్రవక్తకు మనము లోబడుదాము. చివరి దినములలో అట్టివారికి విముఖుడవు కమ్ము. మీరిక్కడున్నారు. (ఇప్పుడు నేను సంఘమునకు చెప్పుచున్నాను.) అవును! దాని నుండి దూరమై పొమ్ము.

126ఈనాటి సేవకులు ఈ విషయం తెలసికోవాలి. యేసును ఆయన దినములలో వారు తెలిసికొనియుండవలసినది. దానిని వారిప్పుడు తెలిసికొనవలెను; కాని వారది ఎరుగరు.

ఆయన దినములలోని యూదా బోధకులు ఆ దినమునే వారాయనను ఎరిగి యండవలసినది, అలాగుననే ఈనాడు దేవుని యొక్క స్పష్టమగు బయలుపరచబడిన వాక్యమును చూడవలెను. ఆయన వాక్యమైయుండెను, తానే వాక్యమని ఆయన రుజువు చేసెను. ఆ దినమునకు ఆయనే వాక్యమని రుజువు చేసెను. ఈ ఘడియ యొక్క వెలుగు, మరియు ఆయనే ఈ దినము యొక్క వాక్యమని దేవుడు రుజువు చేసెను. అప్పుడు వారు తెలుసుకొనవలసియున్నది, మరియు ఇప్పుడునూ వారు తెలుసుకొనవలసియున్నది. అపుడాయనను వారు సిలువ వేసిరి, ఇప్పుడు ఆయనను సిలువ వేయుచున్నారు. దానిని గూర్చి నేను నేరారోపణ చేస్తున్నాను. నిజము. అది నా ద్వారా ప్రజ్వరిల్లుచున్నది. దాని కొరకు వారు వెల చెల్లించునట్లు దేవుడు వారిని చేయును గనుక, నేను నేరారోపణ చేయుచున్నాను.

MATT 23:37

 

127ఆ దినమున యొక్క యూదులు… ఈ దినమున మరల భూమిపై దేవుడు, యేసు చెప్పెను, "యెరూషలేమా! యెరూషలేమా, నిన్నొక పెద్ద గుంపుగా ఎన్ని మార్లు నేను ప్రోగుచేశాను, కాని మీరు కూడికొనలేదు." ఈ చివరి దినమున దేవుడు జనులందరినీ ఏకము చేయ ప్రయత్నించుచున్నాడు గాని, వారు వినరు. నీ సిద్ధాంతమే నీకు కావాలి. మీరు నాశనమునకు అప్పగించబడిరి. యెరూషలేము అదే పొందినది. ఆమె చీల్చబడి, దహించబడినది; ఆమె ఇక లేదు. అదే ఏదో ఒక దినమున ఇక్కడ ఉన్న పెద్దవాటన్నింటికి జరుగును. మీ పెద్ద సిద్దాంతములు, శాఖలు అన్నియూ నశించి మరియు చనిపోవును, గాని దేవుని వాక్యము నిత్యమూ మరియు సదాకాలము జీవించును.

128స్నేహితులుగా పిలువబడిన వారి ఇంటినుండియే ఆయనకు లోతయిన గాయములు ఏర్పడినవి. అగి! దాని గూర్చి ఆలోచించు! సేవకులారా, దానిగురించి ఆలోచించండి! ఆయనకెక్కడ గాయములయినవి? ఆయనకు స్నేహితులుగా పిలువబడినవారి ఇంటిలోనే. అప్పుడు ఎలాగు ఉండేనో, ఇప్పుడూ అదే జరుగుచున్నది. దాన్ని గూర్చి ఆలోచించు! కల్వరి వద్ద ఆయనచుట్టూ గుమిగూడిన వారు రాక్షసులు, నరహంతకులు కారు కాని, ఆయన్ను ప్రేమించుచున్నామని చెప్పిన సేవకులే. ఈనాడు సువార్త పూర్తిగా గుర్తింపబడుచున్నప్పటికిని, ఆయన పునరుత్తాన గొప్ప సూచనలు మనమధ్య రుజువు అగుచున్ననూ, మీ పైకి ఎగిరేది వీధి కాదు కాని, సేవకులుగా పిలువబడుచున్నవారే. ఆయనకు ప్రేమించవలసినవారే ఆయన చుట్టూ గుమిగూడిరి. "మా మధ్యలో మేము దానిని కలిగియుండము. ఆ వ్యక్తి మమ్ములను ఏలవద్దు. మేము మద్దతు ఇవ్వము; ఈ పట్టణములో దానికి మేము సహకారము నియ్యము. అది ఈ మార్గమున వచ్చినచో అది ఏదో భూతము వలన కలిగినదే, కాని మరొకటి కాదు. అది దయ్యము అని వారనుచున్నారు." దేవుని వాక్యమును తెలియక, గ్రుడ్డివారు, గ్రుడ్డివారిని నడిపించుచున్నారు… ఆలోచించు! అప్పుడు ఎలాగు ఉండేనో, ఇప్పుడూ అలాగే ఉన్నది. ఆలోచించు!

129ఈ స్వస్థపరచు శక్తి, ఈ ప్రస్తుత లోకమును ప్రేమించు స్థితి నుండి స్త్రీ మరియు పురుషులకు విడుదల, జట్టు కత్తిరించుకొనుట, యొజెబెలువలె ముఖానికి రంగులు వేసికొనుట, క్రైస్తవులని పిలిపించుకొంటూ వారి పనులు చూచండి. సిగరెట్లు త్రాగుట, మురికి సరసోక్తులు, ఒక మిషనరీ సొసైటీ ఏర్పరచురకొనుట, మరియు వస్త్రములు కుట్టుకొనుట, మరియు అల్లికలు, వారు మాటలు, పుకార్లు చర్చించుకొనుట, వీధుల్లో పొట్టి దుస్తులు ధరించి తిరుగుట, అలాంటివి అన్నీయు చేయుచు, మరియు ఇతర స్త్రీల ఎదుట క్రైస్తవులమని పిలిపించుకొనుచున్న వారు ఆ విధంగా ప్రవర్తించుచున్నారు.

తాను రాజు కొడుకునని తన ప్రవర్తనను ఎరిగియున్న ఒక బానిస కథను మీకు చెప్పాను, జ్ఞాపకమున్నదా. మనము అట్లే ఉండవలసి యున్నాము? స్త్రీ మరియు పురుషులు…

130ఈ యాజకులు, ఈ వేదికల యొద్ద ఆయను ముక్కలుగా చేయుచున్నారు, ప్రజల మధ్యలో వారు అలంటి జీవితమును వారు ఆమోదించుచున్నారు — వారు ఆయనకు గాయములు చేయుచున్నారు. వారిని వాటినుండి విడిపించు శక్తిని నిరాకరించుచు, ఆలాగు చేయుటను ఆమోదించుచున్నారు; స్త్రీ జట్టు కత్తిరించుకొనుట, ముఖానికి రంగు రాసుకొనుట, పొట్టి దుస్తులు ధరించుట దేవుని వాక్యమునకు విరుద్ధమైనది. అది దేవుని వాక్యముకు విరోధమైనది, కాని వారు దానిని ఆమోదించుచూ, మరో కల్వరిని తయారు చేయుచున్నారు. ఎక్కడి నుండి? వీధి నుండా? మధ్యశాల నుండా? వేదిక నుండి, నేరుగా వేదిక నుండే.

GEN 6:2•

MARK 16:9•

LUKE 8:2•

LUKE 17:29•

JOHN 19:7•

HEB 13:8

 

131మరల వారి కేక ఏమిటి? "తాను దేవుడనని చెప్పుకొనుచున్నాడు." ఆయన దైవత్వమును వారు కాదనుచున్నారు. అయనను బ్రద్దలు చేసి మూడు లేదా నాలుగు దేవుళ్ళనుగా చేయాలనుకొనుచున్నారు. ఆయనే దేవుడు; దేవుడైయుండెను; ఎల్లప్పుడూ ఆయన దేవుడుగానే యుండును. నిన్న, నేడు, నిరంతరము ఒక్కటే. ఒకే దేవుని గూర్చిన నీవు చెపితే వారు నిన్ను చూచి నవ్వుదురు. మేము పవిత్ర త్రిత్వమును నమ్ముచున్నాము, అని వారు చెప్పుదురు. నేను ఒకే పరిశుద్ధ దేవుని నమ్ముచున్నాను. స్వస్థపరచు శక్తి విమోచించుటకు, ప్రజలను ఈ లోక ప్రేమ నుండి విడిపించుటకు. మగ్ధలేనే మరియను విడిపించునట్టుగా విడిపించు శక్తి ఆయనకున్నది.

గుర్తుంచుకొనండి, ఆమె కూడా చిన్న రంగులు పూసికొనిన యెజెబెలే. ఆమెలో ఏడు దయ్యములుండెను. ఈనాటి వీధుల్లోని ఆధునిక వస్త్రములు వేసికొనిన స్త్రీలవలెను ఆమె ఉండెను. ఎక్కడికయినా గాని వెళ్ళి చూడు. వివస్త్రలయిన స్త్రీలకు వంగి నమస్కరించు జనులను గూర్చి నీవు నమ్మనిచో, వెళ్ళి వీధిలో చూడు. సొదొమ దినములలో నున్నట్లుగానే నేడును జరుగును. నీవు నమ్మనిచో చూడు. ఎక్కడికయినా వెళ్ళిచూడు. ఒక వార్తాపత్రిక విప్పిచూడు; ఒక మాగజైన్ను చూడు; ఆ బిల్-బోర్డును చూడు. నీకేమీ కనబడుచున్నది? అది చెప్పినది జ్ఞాపకముంచుకొనండి, "దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కనివారని చూచి, వివాహము చేసికొనిరి."

ఇంగ్లాండులోని అసభ్యతను చూడండి. ఇక్కడ ఉన్న కుంభకోణము చూడుము. సమస్తము విషయాలు ఒక వేశ్యా గృహముగా తయారగుచున్నవి.

132అదెందువలన? ఎందుకు రష్యా కమ్యూనిజం అయింది? కాతలిక్కు సంఘము యొక్క దుష్టత్వము, అపవిత్రత మరియు శక్తిహీనత వల్లనే. ఈ దేశం కూడా కాతలిక్కు సంఘములో ఏకమైపోవుచున్నది. సంఘముతో ఏకమై పోవుచున్నది. సంఘములన్నియూ దానితో కలిసిపోవుచున్నవి. కాతలిజం, కమ్యూనిజం ఏకమగుచున్నవి. ఇక్కడే వారు దానిని చేయుచున్నారు. ఎందువలన? వారు తమ్మును వేరుచేసి, ప్రత్యేకమగు జనులనుగా చేయు సువార్తను నిరాకరించిరి. బుద్ధిహీనత! ఖచ్చితముగా సరిగ్గా అదే కారణము.

133భోజనము కోసము సువార్తికులు వేదికపై నిలబడి సమాజ సిద్దాంతమును చెప్పుచున్నారు. నేను ఫలాని-ఫలాని దానికి చెందినవాడను అని చెప్పుకొనుచున్నారు. విద్యతో దేవుని వాక్యమును మ్రింగివేయుచున్నారు.

మగ్ధలేనే మరియవలె ఈ పిచ్చితరమునకు విడుదల కావలెను. ఆ గుడ్డలు వేసికొని వీధుల్లోనివారికి వస్త్రములు ధరింపజేసి స్త్రీలవలె ప్రవర్తింపచేయు శక్తి. ఆమెను క్రైస్తవ స్త్రీగా మార్చు శక్తి ఆయనకే యున్నది. వారాశక్తిని తిరస్కరించి, కల్వరి యొద్దనున్న ఆయనను సిలువ వేసిరి.

దిగంబరతకు బదులుగా దుస్తులు ధరింపజేసి, స్త్రీవలె నుండునట్లుగా చేసి క్రైస్తవులవలె ప్రవర్తింపచేయు సువార్తను పరిశుద్ధాత్మను వారు వెర్రితనముగా పిలచుచూ, వారి సమాజములో దిగి దానిని తెచ్చి కలుపవద్దనియు, ఆ విధంగా చేసినచో - తమ స్త్రీలు కూడా ప్రభావితులై వారివలె నుండగోరుదురు గనుక, పొమ్మని చెప్పుచున్నారు. వారేం చేశారు? ఆనాడు వారు చేసినట్లే, వీరును చేయుచున్నారు. వారు వాక్యమునే సిలువవేసి అది మరొక యుగమునకని చెప్పుచున్నారు. మరల వారిపై నేను నేరారోపణ చేస్తున్నాను. అవునండీ! అప్పుడు వారు నేరము చేసినట్లే ఇప్పుడును వీరు చేస్తున్నారు.

JOHN 8:44

 

134ఆ ముసలి సేనను బట్టలు ధరింపచేసిన గురుతు. బట్టలు తీసివేసికొనువాడు పిచ్చివాడని మీరు మరువకండి. ఒక స్త్రీ మాటేమిటి? సేన పిచ్చివాడు; బట్టలుంచుకొనలేదు. దేవుడు తన శక్తిచే వారు తిరిగి బట్టలు వేసుకొనునట్లు చేసెను. మంచి మనస్సు నిచ్చెను. యేసు పాదములనొద్ద వాడు కూర్చుండెను. ఆ ముసలి బర్తలోమియా చూచునట్లుగా చేసిన శక్తి ఏమిటి? వారి సిద్దాంతముల మధ్యనే ఆతని కన్నులు తెరచెను. ఈనాడు ఎంత అవిశ్వాసము భూమిమీద నున్నదో, ఆనాడూ కూడా అంతే అవిశ్వాసముండెను, కాని అదెన్నడూ ఆయనను ఆపలేదు; ఆయన ముందుకు పోయెను. వారి కొరకేమీ ఆయన రాజీపడలేదు; మీరు మీ తండ్రియగు అపవాది సంబంధులు, అని వారితో చెప్పెను. ఆయన దానినంతటిని పూర్తిగా ఖండించెను.

LUKE 23:18

 

135సమాధిలో నుండి లాజరును పైకి లేపకలిగిన ఆయన విధవరాలికి తన కుమారుని ఈయకలిగిన శక్తి, (ఓ, దేవా!) ముందు జరుగువాటిని చెప్పగలిగిన శక్తి, "అక్కడ రెండు గాడిదలుండెను. "రెండు మార్గముల యొద్ద కట్టబడిన గాడిదపిల్ల యున్నది," మరియు అవన్నియూ ఆయన ముందే చెప్పెను; ఆ శక్తిని కలిగియుండినది ఆయనే, "ఆయనను సిలువవేయుడి. మా జనులమధ్య ఆయన వద్దు, మా బోధలను ఆయన కలుషితము చేయుచున్నాడు" అని వారు ఆయనను సిలువవేసిరి.

ఈనాడు అదే జరుగుచున్నది, "పరిశుద్ధాత్మ మాకు వద్దు." "దానితో మాకేమి పనిలేదు: "అది ఖండించును, మరియు మా జనులకు ఈ విషయములు చెప్పును, మరియు మా సంస్థలో అది కలియుట మాకయిష్టం. అది మా సిద్దాంతాలకు విరుద్దం" అని చెప్పి, మరల ఆయనను సిలువ వేయుచున్నారు. ఓ, మై!

ఇప్పుడు గమనించండి, మనము ముగించుచున్నాను; ముగించాలి. వారు మరలా, దానిని మూఢత్వము అని పిలుస్తున్నారు.

JOHN 8:48

 

136వారాయనను మూఢ వ్యక్తి అన్నారు. ఆయనకు మతిపోయిందన్నారు. ఈయన సమరయుడు, పిచ్చివాడు," అని ఆ పరిసయ్యలు యేసును అన్నమాట బైబిలు తెలిసిన వారందరికి తెలియును. "పిచ్చివాని వెనుక పిచ్చివారందరూ వెళ్ళుచున్నారు. అతడు బయల్జెబూబు" అని వారు అన్నారు.

మరలా, వారదే చెప్పుచున్నారు: "అదొక రకమైన మాంత్రిక విద్య. అదృష్ట జాతకము, అంటున్నారు. మరలా ఆయనను అవమాన సిలువపైనుంచుచున్నారు. ఏ సిలువ? ఏమి అవమానము? ఆయనే బయలుపరచబడిన వాక్యము, వారు దానిని గేళి చేయుచున్నారు, అది దయ్యము లేదా మరేదో అని జనులకు చెప్పి హేళన చేస్తున్నారు.

MARK 3:22-30

 

137"దేవుని యొక్క పరిశుద్ధ కార్యములను అపవిత్రాత్మ వలన జరుగుచున్నవని వారు చెప్పుచున్నారని," ఆయన పలికెను. ఆయన వాక్యమును అవమానపరచి, దానిని అబద్దమని, వెర్రితనమని, పైకి చెప్పగోరు వారికి క్షమాపణ లేదు.

"దానివద్దకు వెళ్ళకండి. ఆ కూటములకు హాజరుకాకండి," అని చెప్పుట ఏమిటి? వారు తమ శాఖల సిద్దాంతపు మేకులను తీసికొనుచున్నారు. ఈ సుఖానుశక్తిగల బోధకులు, లోకస్తులు, భక్తిహీనులు శాఖాపిచ్చిగలవారు. ఆ శాఖల మేకులను తీసికొని తమ వేధికలపై నుండి దేవుని కుమారుని వారు సిలువ వేయుచున్నారు. వారిది ఎందుకు చేయుచున్నారు? మానవ పొగడ్త వారికిష్టము. అ సంఘము వారికిచ్చు హోదాలను దేవుని యొక్క వాక్యము కంటె ఎక్కువగా ప్రేమించుచున్నారు. నేను వారిని ఖండించుచున్నాను. వారు లోకమునకు చెందినవారు గనుక వాక్యమునకు చెందినవారు కాదు. వేషదారుల కాలంలో మనం జీవించుచున్నాము!

REV 22:18,19

 

138నా ప్రభువుకు ఈ కల్వరి ఒక్కటి చాలదా? మీరెందుకు చేయుచున్నారు. ఆయనను ప్రేమించవలసిన మీరే. ఇది ఆయన వాక్యమని ఎరిగిన మీరే ప్రకటన 22వ అధ్యాయములోని "ఈ మాటకు ఇంకొకటి చేర్చువాడు లేదా దానిలో నుండి ఒకటి తీసివేయువాడు…" అది చదువకలిగిన మీరే ఆలోచిస్తున్నారా? ఎందుకు చేస్తున్నాడు. ఆయనకు ఒక కల్వరి చాలదా? ఆయనకు పరిరక్షకునిగా నేను నిలుచున్నాను. ఆయన న్యాయవాదిని. దేవుని వాక్యమును బట్టి నేరారోపణ చేయుచున్నాను. మార్గములను మార్చుకొనండి, లేనిచో నరకమునకు పోవుదురు; మీ శాఖలు మూలమగును. న్యాయాధికారి సమక్షములో మీపై నేరారోపణ చేయుచున్నాను. మీరు పైకి భక్తీగలవారి వాలె, వేషధారులారా? దానిని మీరేమందురు? ఒక్క కల్వరి చాలదా?

MATT 23:29•

ACTS 2:23

 

139పేతురు చెప్పినట్లుగా, "మీ శాఖల తండ్రులు ఈ పనిచేయలేదా?" "జీవాధిపతిని దుష్టచేతులతో మీరు సిలువ వేసిరని," సైఫను కూడా నేరారోపణ చేసెను.

యేసు కూడా అదే చెప్పెను గదా, "మీ పితరులు ప్రవక్తలను సమాధుల నుంచలేదా? ఆ తరువాత వాటిని మీరు శృంగారించారు."

అన్ని కాలములోను నీతిమంతుని అలాగే చేశారు. అందుకే నేను ఈ ఉన్నత, మెరుగుపెట్టబడిన, సంఘమునకు వెళ్ళు క్రీస్తును విసర్జించుచున్న గుంపుపై నేరారోపణ చేయుచున్నాను. పైకి భక్తిగల వారివలె ప్రవర్తించుచూ, నా క్రీస్తును రెండవసారి సిలువవేసిరి, ఈ మాటలు మరో దినముకనియు, మరియు ఈ దినమునకు కాదని మీరు జనులకు చెప్పుచూ సిలువ వేయుచున్నారు. నేను నేరారోపణ చేయుచున్నాను. ఆనాడు సిలువవేసిన ఆ నేరస్తులవలెనె మీరును దోషులే. మారుమనస్సు పొంది దేవునివైపు తిరుగండి, లేనిచో నశించెదరు!

EXOD 32:26

 

140మరలా నేను చెప్పుచున్నాను, ఇక్కడ, ఈ సంఘములు; వారు, ఆ బోధకులు, దేవదూషణ ద్వారా సిలువ వేసిరి; ఆయనను, వాక్యమును. దేవుడు కృపచూపు గాక! టేపులో అది కలిసిపోవచ్చు గనుక మరల చెప్పెదను. ఇక్కడ, ఈ సంఘములు; యాజకులు; సిలువవేసిరి, దేవదూషణ ద్వారా; ఆయనను, వాక్యమును. మరల అది జరుగుచున్నది అనుటలో ఆశ్చర్యము లేదు.

మధ్యకు పగిలిన బండల మధ్య, అంధకార మేఘముల మధ్య

నా రక్షకుడు శిరము వంచి మరణించెను.

కాని చిరిగిన తెగ మార్గమును బయలుపరచెను

పరలోక ఆనందమునకు అంతము లేని పగలునకు.

నేను దీనిని ఈ సమూహమునకు కొరకు టేపుపై చెప్పుచున్నాను. పరిశుద్ధాత్మ ఆవేశము క్రిందనుండి ఇది చెప్పుచున్నాను, "ప్రభువు పక్షమున ఎవరున్నారు? అట్టివారిని ఈ వాక్యము క్రిందికి రానీయండి." దేవుడు తప్పకుండా ఈ దుష్టలను, క్రీస్తును-నిరాకరించు, క్రీస్తును-విసర్జించు తరమును ఆయనను దూషించినందుకు గుర్తించబడిన ఆయన వాక్యమున సిలువవేసినందుకు తీర్పులోనికి తెచ్చును. మీరు తీర్పుకు వచ్చెదరు. దానిని నేను నేరారోపణ చేయుచున్నాను! "యెహోవా పక్షమున నున్నవారు నా యొద్దకు రండని," మోషే చెప్పెను. అగ్నిస్తంభము అక్కడ ఒక రుజువుగా వ్రేలాడుచున్నది. యెహోవా పక్షమున ఎవరు? వారు వచ్చి వాక్యమును తీసికొని, తన సిద్దాంతమును తిరస్కరించి, అనుదినము యేసుక్రీస్తును వెంబండించుడి, ఉదయమును నేను మిమ్ము కలిసికొందును.

ప్రార్థన నిమిత్తమై మన తలలు వంచుదాం.

141ఓ, ప్రభువైన దేవా, నిత్యజీవదాతా మరియు వాక్య కర్తా, యేసు ప్రభువు మృతులలో నుండి లేపినవాడా, అవిశ్వాస తరము ఎదుట సరిగ్గా గుర్తించబడినవాడా; ఆ ఉదయాన చాలా కాలం మాట్లాడాను. సంఘము పట్టలేనంత జనం వచ్చారు. చుట్టూ జనం వచ్చారు. చుట్టూ నిల్చునియుండిరి. ప్రపంచమంతటికీ, వివిధ స్థలములకు టేపులు వెళ్ళు సిద్ధంగా నున్నవి. సువార్తికులు తమ పఠనంలో విందురు. వారికొరకు ప్రార్థించుచున్నాను, ప్రభూ. వారి హృదయాలలోనికి దూసికొనిపోయి, ఒక రోజున కెంటకీలో ఒక మెతడిస్తు సేవకుడు వచ్చి నాతో పలికిన రీతిగా పలుకుదురు గాక. "నేను ఏడు సంఘకాలములను గూర్చి వినుచున్నప్పుడు ఆ బబులోను గోడల నుండి దూరంగా పొమ్మని చెప్పినట్లు విన్నాను. నేను విడిచిపెట్టి వచ్చాను. ఎటు వెళ్ళాలో, ఏమి చేయాలో నాకు తెలియదు, కాని నేను విడిచిపెట్టాను," అని చెప్పాడు. యవ్వన భార్య, ఇద్దరు - ముగ్గురు పిల్లలతో నున్న ఆ యువకుని ధైర్యమును దేవుడు ఆశీర్వాదించును గాక.

LUKE 23:34

 

142దేవా! అనేకులు దేవుని వాక్యమునకు త్రోవ కనుగొందురు గాక! జీవమునకు ఒకే మార్గము, ఏలయనగా ఆయనే వాక్యము. ప్రతి ఒక్కరి కొరకు ప్రార్ధించుచున్నాను, తండ్రీ. కొన్నిసార్లు ఇవి చెప్పినప్పుడు క్రూరముగా కనిపించును గాని, ప్రేమతోనే చెప్పుచున్నాను; ఎందుకనగా ప్రేమ సరిదిద్దును. అలాగుననే ఈ జనులు అర్ధము చేసికొనునట్లు సహాయము చేయుమని ప్రార్థించుచున్నాను, దేవా, సరిచేయుటకేనని వారు అర్ధము చేసికొందురు గాక.

వారిని సరిచేయవలసిన నీవు సిలువనొద్ద ప్రార్ధించావు. "తండ్రీ, వీరిని క్షమించుము. వీరు గ్రుడ్డివారు; వారేమి చేయుచున్నారో వారెరుగరు." ఈనాడు తమ సిద్దాంతములు, శాఖలు, జీవవాక్యమునకు బదులుగా తీసికొని మరణ వాక్యమును సిలువ వేయుచున్న సేవకుల కొరకు ప్రార్థించుచున్నాను. జనుల ఎదుట సత్యమును వారు విమర్శించుచున్నారు. ఆయన సత్యమును బయలుపరచుచున్నాడు. వారి కొరకు ప్రార్థించుచున్నాను, తండ్రీ, మరల పెండ్లి విందుకు వారిని పిలువుము. ఈసారి వారు నెపములు చెప్పకుండా వచ్చునట్లుగా చేయుము. చివరి పిలుపు అప్పుడే వెళ్ళిపోయినదని నేను గ్రహించుచున్నాను. ఇప్పుడు చాలా ఆలస్యం కావచ్చు. కాని అది కాదని నేను నమ్ముచున్నాను.

JOHN 14:19•

HEB 13:8

 

143ఇక్కడున్న ఈ చిన్నసమూహమును దీవించుము. ఈ కొద్దివందల మంది జనులు ఈ ఉదయమును ఇచ్చట కూడికొనిరి. ఇది చాలా ఎండ సమయము, చాలా దీర్ఘ-ప్రసంగము బహుగా రెండుగంటల పైగా వినియున్నారు. చాలామంది భోజనము చేయలేదు. స్త్రీలు, పిల్లలను ఎత్తికొని నిలబడిరి. వారు ప్రతి మాటను పట్టుకొనుచున్నారు.

ప్రభువా, ఆ జనులను నేను పోగొట్టుకొన్నచో తీర్పు దినమున నాకేమీ జరుగునో నేను గ్రహించియున్నాను. వారిని వాక్యము నొద్దకు తీసికొని వెళ్ళి, వాక్యము వద్ద జీవింపచేయగోరుచున్నాను. నేను అనుభవపూర్వకంగా ఎరిగియున్నాను. నీవు నిన్న, నేడు, నిరంతరము ఏకరీతిగా, యేసుక్రీస్తులో నున్న గొప్ప పరిశుద్ధాత్మగా నున్నానని చెప్పుచున్నాను. నీవారీతిగా చెప్పియున్నావు. "కొద్దికాలమైన పిమ్మట లోకము నన్ను చూడదు కాని మీరు నన్ను చూచెదరు, ఎందుకనగా నేను మీతోను, మీలోను ఉందును," అని చెప్పితివి. ఇది నీవేనని నేను యెరిగియున్నాను, ప్రభువా. నీవు మా మధ్య అవే కార్యములు చేయుచున్నావు గనుక నిన్ను మేము నమ్ముచున్నాము.

ROM 3:25•

1JN 2:2

 

144ఈ రోజు పూర్తిగా మమ్ము నీకు సమర్పించుకొనుచున్నాము. ఈ సమాజము వద్ద ఆ పని చేయుచున్నాము. దేవుని సేవకు మమ్ము మేము లోతయిన అర్పణ చేసికొనునట్లు సహాయము చేయుము. ఈ టేపులు ఈ సమయంలో వినుచున్న స్త్రీ - పురుషులు, బాలబాలికలు, బయటనున్నవారు, అందరూ ఆ పని చేయుదురు గాక.

ప్రభువా, శక్తితో ఈ జనము మధ్య సంచరించు రోగులను బాగుచేయుము. అక్కడొక కుంటి కుర్రాడున్నాడని వారు చెప్పారు. ఈ గొప్ప సన్నిధిలో మేము కూర్చొనియుండగా, ఆ గొప్ప పరిశుద్ధాత్మడు అది చేయనని మాకు తెలుసు. రేడియో, టెలివిజను ద్వారా దేశములోనికి నీ వాక్కును పంపి స్వస్థపరచావు. అదే ఈ క్షణమున నీవు చేయగలవు. ఈ మాటలు విన్న ప్రతివ్యాధిగ్రస్తుని, కుంటివానిని, బాధపడుచున్నవారిని నీవు స్వస్థపరచుము, అనుగ్రహించుము, వారికొరకే నా ప్రార్ధన. నా హృదయంలో క్రీస్తు ప్రేమతో, అవసరతలో నున్నవారికై వేదనతో, మా పాపములు రోగముల కొరకు మధ్యవర్తిగా బలిపీఠము మీదనున్న రక్తసిక్తమగు గొర్రెపిల్ల ద్వారా వీరికొరకు ప్రార్థించుచున్నాను. ఈ జనులపై కృప చూపుము. ప్రభువా, ఆ జనుల మధ్య మోషే నిలబడి మరియొక తరుణము కొరకు అడిగినట్లుగా, నేను అడుగుచున్నాను. "కొద్దికాలము వారిపై కృప చూపుము, మరియొక తరుణము నిమ్ము. ఇంకొద్దిగా సువార్తను వారిలోనికి వెళ్ళనిమ్ము."

JOHN 6:37•

EPH 1:4•

REV 21:27

 

145ప్రభూ, వారు శిక్షకు పాత్రులు అయితే జీవగ్రంథములో చివరి పేరు వ్రాయబడువరకు నీ గొప్ప కృపను చూపించమని ప్రార్థించుచున్నాను. దైవ వాక్యమునకు విరుద్ధముగా ప్రార్థించుట కఠినము కాదు. జగత్తు పునాది వేయబడక ముందే నీ వాక్యము వారిని నిర్ణయించి, వాగ్దానము చేయబడి, బయలుపరచబడెను. ప్రభువా, ఆ గ్రంథములో పేర్లున్నవారిని నీవు రక్షించుటకు కఠినము కాదని నా భావము, ఎందుకనగా "తండ్రి నాకనుగ్రహించిన వారందరూ నా యొద్దకు వచ్చెదరని," యేసు చెప్పెను. ఇవ్వబడితేనేగాని ఏ వ్యక్తియూ రాజాలడు.

దేవా, ఈ మాటలు పడు ప్రతిచోటను అనగా టేపు, ఈ జనులలో పరిశుద్ధాత్మ పనిచేసి, జగత్తుపునాది వేయబడుకముందే జీవగ్రంథములో పేర్లు వ్రాయబడి నిత్య జీవమునకు నిర్ణయించబడిన ప్రతి వ్యక్తియూ బయటకు వచ్చునట్లుగా ప్రార్ధించుచున్నాను. "ఇదే మార్గము, దీనిలో నడువుము" అని ఆ నెమ్మదిగల చిన్న స్వరము ఈనాడు వారితో మాట్లాడుటను విందురు గాక! తండ్రీ, అనుగ్రహించుము. యేసు నామమున అడుగుచున్నాను.

146మీ తలలు వంచియుండగానే, ఇది సత్యమని మీరు నమ్ముచున్నట్లయితే.. (రోగుల కొరకు, బాధపడచుచున్నవారి కొరకు వచ్చిన ఈ చేతి గుడ్డలపై నా చేతులుంచుచున్నాను.) యదార్థంగా మిమ్మునొక ప్రశ్న అడుగుచున్నాను. మాట్లాడుటకు మాత్రమే నేనిచ్చటకు రాలేదు. నేను అలసిపోయాను; బాగా అలసిపోయాను. ఇంతకు ముందువలె యువకునిగా లేను, మన దినములు లెక్కించబడినవి నాకు తెలుసు, దేవుని రాజ్యము కొరకు నేనుంచవలసిన ప్రతి చిన్నదానిని ఉంచవలసి యున్నానని నాకు తెలుసు. నాకు తరుణము దొరికిన ప్రతి సమయంలోనూ బోధించాలి. నాకది ఇష్టమున్నా లేకపోయినా గాని చేయవలెను. చేయగోరి నేనిచ్చటకు వచ్చాను. మిమ్మును ప్రేమించుచున్నాను. కఠినంగా చెప్పాలని నేను ఈ సంగతులు చెప్పను; నాలో ఒక ఉద్రిక్తత ఉన్నది. బయలుపరచినదే నన్ను ఈ పనులన్నీ చేయుటకు బలవంతము చేయుచున్నది. నేను దయతో ప్రేమతో చెప్పుచున్నాను. పురుషులను, స్త్రీలు నేను చీవాట్లు పెట్టాలని కాదు, సోదర - సోదరీలారా; అది నా భావము కాదు. కరకుగా నున్న ప్రభుని దిద్దుబాటు కొరడాగల చోటకు మాత్రమే మిమ్ము తేవాలనుకొనుచున్నాను. ఇప్పుడే మీరు రావాలని కోరుచున్నాను. దానిని ఆలస్యం చేయవద్దు; మీరు చాలాకాలం ఎదురుచూడవచ్చు.

147పూర్ణహృదయంతో ఈ జనసమూహం ఎదుట సమర్పించుకొని ప్రభు పక్షమున నుండగోరుచున్నవారు, ఎక్కడున్నాగాని, ఈ టేపులు విని ఆ నిర్ణయం వచ్చినా గాని, మీ తలలు వంచి… అది మీ యొక్క భావము కానిచో - మీ చేతులెత్తవద్దు. మీరు నిజంగా సరైన జీవితమును కలిగి ఆయన వద్దకు రాగోరుచున్నచో - చేతులెత్తమని కోరుచున్నాను. ప్రభువు దీవించును. నిందననుభవించుటకు క్రీస్తుకు నూతనముగా జీవితము అర్పించుకొనుచున్నావు. "ఈనాడు నేను నింద ననుభవించుటకు ఇచ్చయించుచున్నానని చెప్పుము. నేను నా రెండు చేతులూ పైకెత్తియున్నాను. నాపై యేసుక్రీస్తు నింద తీసికొనగోరుచున్నాను. నన్ను ఏమని వారు పిలిచి హేళన చేసినా గాని, అది ప్రభుకొరకు, దానిని గర్వముతో నేను ధరించుదును," అని చెప్పుము.

148మీరందరు ఆ విధంగానే చేయగోరుటలేదా? మీ చెతులెత్తి "దేవుని కృపవలన నేను ఆ విధంగా ఉండగోరుచున్నానని" చెప్పుము.

ఆయన నామము నిమిత్తము నిందననుభవించుట గొప్ప భాగ్యమని శిష్యులు వెంబడించిరి. ఏదో హాలీవుడ్ తార లేదా ఏదో టెలివిజను, లేదా ఏదో సంఘసభ్యుని, లేదా మరేదో నిందను భరించగోరుచున్నావా? లేక యేసుక్రీస్తు వాక్యనిందను భరించగోరుచున్నావా? ప్రభువా? వాక్య నిందను నాకిమ్ము. ఆయన దేవుని వాక్య నిందను భరించెనని నాకు తెలుసు. నన్ను కూడా దానిని మోయనిమ్ము ప్రభువా," అని చెప్పుము.

"మరియు ఈ సమర్పణ సిలువను నేను మోసెదను,

మరణము వరకు నన్ను విమోచించును,

అప్పుడు గృహమునకు పోయెదను, ఒక కిరీటమును ధరించుదును."

మనకొరకు ఒక రోజున ఒక కిరీటముండును. ఇప్పుడే అది తయారగుచున్నది. ఈ భూజీవితము ముగిసిన పిదప అది సరియేనని మనకు తెలియును.

ఇప్పుడు, జనులను వేదిక వద్దకు తెచ్చుటకు స్థలము లేదు. మీరున్న స్థలమే వేదిక అనుకోండి. "నమ్మినవారందరూ…" మనము ప్రార్ధించుదము.

JOHN 17:17

 

149పరమ తండ్రీ, ఈ స్థలములోనున్న ప్రతి వృద్ద, యవ్వన చేయిపైకి లేచినట్లుగా నాకు తోచుచున్నది. ఈ టేపులు వినబడు ప్రతిచోట జనులు తమ చేతులెత్తి గదిలో మోకాళ్ళూనునట్లుగా, ప్రతిసారి నేను ప్రార్థించుచున్నాను. తల్లిదండ్రులు వెళ్ళి, ఒకరి చేతులు ఒకరు పట్టుకొని "చాలా కాలము నుండి మనం సంఘ సభ్యులుగానున్నాం. క్రీస్తు నొద్దకు వద్దాం," అని చెప్పండి. ప్రభువా, దానిననుగ్రహించుము.

ఇక్కడున్న వారిని దీవించుము. సమర్పణ జీవితమును వారికిమ్మని, ప్రభువా, ప్రార్థించుచున్నాను. ప్రభూ! అందులో చాలామంది మంచివారే. నీవారే వారు; సత్యము మాత్రము ఎరుగరు. ప్రభువా, నీ సత్యమును వారికి చూపించుము. "నీ వాక్యమే సత్యము."

యోహాను సువార్త 17వ అధ్యాయములో నీవు చెప్పిన దానిగూర్చి నేను ఆలోచించుచున్నాను." సత్యము ద్వారా వారిని పవిత్రపరచుము. నీ వాక్యము సత్యము." నీ వాక్యము ఇంకను సత్యమని మరలా చెప్పుదును. అది దేవుడే గనుక ఎల్లప్పుడూ సత్యము. ఈ సిద్దాంతములు, శాఖలు లోక విషయములు, వీటన్నింటి నుండి వారిని కడిగి శుద్ధిచేసి వాక్యపు సమర్పణ జీవితము. నిమ్ము అనుగ్రహించు, ప్రభూ! ఇప్పుడు వారు నీవారు. అది చేయుదనని నీవు వాగ్దానమిచ్చావు. నీ దాసునిగా వారి తరుపున నేను ప్రార్థించుచున్నాను. యేసుక్రీస్తు నామమున.

150ఇప్పుడు, మీ తలలు వంచి యుండగా, ప్రార్థనను కొనసాగించుచూ పాట పాడుదము.

యేసు దానినింతయూ చెల్లించెను,

నేనంతయూ ఆయనకు ఋణస్తుడను (దానినిగూర్చి ఆలోచించు!)

పాపము ఎర్రని మచ్చను విదిలెను,

ఆయన దానిని హిమము వలె తెల్లగా కడిగెను.

ఈ సంఘములోని ఒక సోదరుడు ఒక కోటు కొరకు నిన్న నేను ఒకచోట నిలబడి కొలతలిచ్చుచున్నాము. "నీ కోటు వేడిగా కనబడుచున్నది, కాని నేను చల్లనిది కొన్నాను," అని అతడన్నాడు.

అది కత్తిరించుటకు నేను తీసికొని వెళ్ళగా అతడు "నీ కుడిభుజం వంగిపోయినది. ఒకప్పుడు నీవు ఎక్కువ బరువు దానితో మోసియుంటావు," అన్నాడు.

నేననుకొన్నాను, "అవును, పాపభారము, కాని యేసు దానినంతయూ చెల్లించివేసెను." దానిని పాడుచుండగా మనము విందము.

యేసు దానినింతయూ చెల్లించెను,

నేనంతయూ ఆయనకు ఋణస్తుడను (నా జీవితమంతా);

పాపము ఎర్రని మచ్చను విడిచెను,

దానిని ఆయన హిమమువలె తెల్లగా కడిగెను.

151దేవా, ఈ లోకమున ధ్యానసమయములో మాకు కృప చూపము, ప్రభువా, హృదయములో దానిని నాకిమ్ము. జనులకు ఆహారము ఆలస్యమయినా గాని ప్రభువా, ఇది మాంసముకంటె గొప్పది. ఇది జీవము. "నా మాట ఆహారము" అని నీవన్నావు. మా ఆకలి హృదయములు దానినే భుజించును.

ప్రభువా, మమ్ము తీసికొనుము, మలచుము. వారితో నన్నూ తీసికొనుము. నేను వారితో వెళ్ళగోరుచున్నాను. విశ్వాసము ద్వారా ఇప్పుడు కల్వరియొద్దకు నేను వెళ్ళుచున్నాను. ఈ జనసమూహములో నేను వెళ్ళుచున్నాను. ప్రభూ! నన్ను మలుచుము. నేను తప్పిదము చేశాను. చాలాసార్లు, ఈ మధ్య నేను బోధించుట మానేయాలనుకున్నాను. ప్రజలు నేను చెప్పేది వినరు. వారు ఎప్పటి వలె చేసికొంటూపోవుచున్నారు. నాకు నిరుత్సాహము వచ్చింది. ఏదో నాలో అల్లుకొన్నది. ఓ, దేవా, రెండు ఆదివారముల క్రితం అక్కడ నీవు నాకొక గురుతు ఇచ్చావు. బైబిలు చదువుచూ మోషేతో నీవు చెప్పినది చూచాను. కలవలె వున్నది. ఆ కొండ కూడా ఆయనకు గురుతుగా నుండెను. దాని అంతములో నాకు తెలిసినదేమనగా, చాలమంది రోగులను విడిచిపెట్టుదునని ప్రవచనపూర్వక సేన మాత్రమే కాదు గాని, వాక్యమును బోధించి, రోగులకు ప్రార్థించునది కూడా ఆ నేలపై చచ్చిపడియున్న వ్యక్తిని తిరిగి సజీవుని చేశావు. అది నిజమని నీవు నిర్ధారించావు. నీవెల్లపుడూ నీ వాక్యమును స్థిరపరచుదువు.

152ఇప్పుడు ప్రభువా, నీ సింహాసనము ఎదుట నేనున్న ఈ సమయములోనే దానిని స్థిరపరచుము. ఈ జనులందరినీ తీసికొనుము ప్రభువా, మాలోనుండి లోకమును తీసివేయుము. మేము నీ సన్నిధిలో యుండగా నన్ను నీవు తీసికొనుము. వాక్యము ద్వారా వాక్యమును తీసికొని మా హృదయములను తాకుము. దేవా, ఇప్పుడే లోకమును, ఐహిక విచారములను మాలోనుండి దూరపరచుము. ప్రేమ, దయ, మాధుర్యము, ఆత్మఫలములను, ఫలించు సమర్పణగల క్రైస్తవులనుగా మమ్ము చేయుము. ప్రభువా చేయవా? నీ సింహాసనము ఎదుట మేమున్నాము. మాలో ప్రతిఒక్కరిలోను పాపము ఎర్రని డాగును వదిలి వెళ్ళినది, కాని నీ రక్తము దానిని తీసివేసినది దేవా? హిమమంత తెల్లగా దానిని చేసినది. నీ కొరకు మేము కనిపెట్టుకొని యుండగా దానిననుగ్రహించుము. మమ్ము తీసికొనుము; మేము నీవారము. నీకు మా జీవితములు సమర్పించుకొంటున్నాము. యేసుక్రీస్తు నామమున అనుగ్రహించుము. ప్రభువా మాలో ప్రతిఒక్కరికి దయచేయుము.

ప్రభువా, నా హృదయమును తాకుము; నా పొరపాట్లన్నియూ నేను చూచుచున్నాన్నాను. దేవా, ఈ సమయము నుండి నీకు సహాయపడుటకు ఉత్తమ స్థితిలో నేను జీవించెదను. ఈ ఉదయమున నూతనముగా నా హృదయమును సమర్పించుకొనుచున్నాను. నా యాజక సోదరులపై కఠినముగా, ప్రభువా, ఈ నేరారోపణ చేసియున్నాను. నీ ప్రేరణ ద్వారానే అది చేశాను. దానిని చేయమని నీవే చెప్పినట్లుగా నేను తలంచుచున్నాను. ప్రభూ! ఇపుడది నా భుజములపై నుండి పోయినది. అది పోయినందుకు సంతోషము, తండ్రీ. దానిని గూర్చి ఇష్టమొచ్చినట్లుగా చేయనిమ్ము దానిని వారంగీకరించునట్లు నేను ప్రార్థించుచున్నాను.

ప్రభువా, ప్రతి ఒక్కరిని క్షమించుమని ప్రార్ధించుచున్నాను. గొప్ప ఉజ్జీవము నుంచి అది జరుగుటకు ముందు సంఘము మధ్యకు గొప్ప శక్తి వచ్చును గాక. ఆ ప్రార్థన చేయుట కష్టము కాదు, ఎందుకనగా అది నీ వాగ్దానము.

ప్రభువా, ఆ మూడవ ఈడ్పు కోసం మేము చూస్తున్నాము, అది మా మధ్య గొప్ప కార్యములు చేయునని మాకు తెలుసు.

153ప్రభువా, నేను నీవాడను. నాకు తెలిసిన విధంగా పూర్తిగా నన్ను నేను సమర్పించుకొని ఈ బలిపీఠముపై ఉంచుకొనుచున్నాను. ప్రభువా, నాలోనుండి లోకమును తీసివేయుము, నశించిపోవువానిని నాలోనుండి తీసివేసి, నశించనివి నాకిమ్ము. అదే దేవుని వాక్యము. వాక్యము నాలోను, నేను వాక్యములోనే జీవించువారకు సన్నిహితముగా నేను వాక్యముతో నుందును గాక. ప్రభువా, అనుగ్రహించుము. దానినుండి ఎన్నడునూ నన్ను తిరుగనీకుము. రాజ ఖడ్గమును బహుగట్టిగా, దగ్గరగా నేను పట్టుకొందును గాక. ప్రభువా అనుగ్రహించుము.

మమ్ములనందరినీ ఆశీర్వదించుము. ఈ ఉదయాన నూతనముగా మా హృదయములను నీకు సమర్పించుకొనియున్నాము. మేము నీ దాసులము, సేవకొరకు యేసు నామములో మేము నీవారము.

యేసు దానినంతయూ చెల్లించెను. (సహో నెవిల్,

దేవుడు నిన్ను దీవించును గాక!)

అంతయూ నేనాయనకు రుణస్తుడను;

ఎర్రని డాగును పాపము విడిచెను,

హిమమువలె తెల్లగా ఆయన దాని కడిగెను.

Search Messages

0 / 0 matches
Enter characters above to process real-time text query scopes...