ఒకే రకమైన విశ్వాసముగల జనుల యొక్క సహవాసము
సహోదరుడా ఆర్మన్, ధన్యవాదములు. మన సహోదరుడుయొక్క పెదవులనుండి ఈ అద్భుతమైన వర్తమానము వినుట కొరకు ఈ రాత్రి ఇక్కడ ఉన్నందుకు మేము సంతోషించుచున్నాము, బుద్ధి ప్రేరేపణ ద్వారా, ఆయన చెప్పినట్లుగా ఈ గొప్ప సమాచారములను తీసుకొని వచ్చుటకు పరిశుద్ధాత్మ ద్వారా అభిషేకించబడి యున్నామని మనము నమ్ముచున్నాము : ప్రస్తుత దినమున దేవుని ముందు మరియు ఒకరి ముందు ఒకరు మనము ఏ విధముగా పరిశుద్ధముగా జీవించవలెను అనునది. ఈ దేవుని యొక్క గొప్ప పిలుపును మనము ఒప్పుకొని ప్రకటించుచుండగా, ఇక మరి ఎటువంటి అసభ్యకరమైన సంభాషణలు మన మధ్య వినపడకుండా మనమధ్య కేవలము పరిశుద్ధత ఉండవలెనని కోరెదము. దేవుడు మనలను తీసుకొని వచ్చిన ఈ సంగతి కొరకు మనము యోగ్యతతో నడువవలెను. మనము ఆలోచించగలిగిన లేక చేయగలిగిన వాటన్నిటికి పైగా, సమృద్ధికి మించిన దానిని మనము ఆశించుచుండగా, ఇప్పుడు మనము యాత్ర యొక్క ముగింపునకు వచ్చి యున్నాము. మరియు గుర్తించుకొనుము, మనము ఎడతెగక ప్రార్ధనలో ఉండవలసియున్నది. మరియు అన్నిటికీ పైగా, నీ జీవితమును గమనించుకొనుము. ఒకవేళ నీ యొక్క జీవితము గనుక దేవుని యొక్క పరిశుద్ధతకు సరితూగకపోయిన యెడల, అప్పుడు తిరిగి వెళ్ళి మరియు మళ్ళీ ప్రార్ధించుటకు 'ప్రారంభించుము; ఏదో తప్పు జరిగినది. చూశారా? ఆత్మ యొక్క ఫలములు అవి మన ద్వారా తెలియపరచబడేవిధముగా మనము జీవించవలసియున్నది. అదియే మనము జీవించవలసియున్నది.
మీకు తెలుసా, కొన్నిసార్లు శక్తివంతముగా ప్రసంగించగలిగెడి గొప్ప ప్రసంగీకులను మనము వినెదము, కానీ ప్రసంగించబడిన ఒక ప్రసంగము వినడము కన్నా జీవించగలిగిన ఒక ప్రసంగమును మనము చూచెదము (చూశారా?) ఎందుకనగా లోపల దేవుడు ఉన్నాడనుటకు అదియే రుజువైయున్నది.
2ఇప్పుడు, మనము సహవాసము యొక్క బల్ల యొద్దకు వచ్చుచున్నాము. మరియు ఇప్పుడు, ఇంకా, ఈ సహవాసపు బల్లలో పాలుపంచుకొనని వారు కొందరున్నారు, మరియు బహుశా మీరు మీ సొంత సంఘములలో తీసుకొనుము, కానీ ఒకవేళ మీరు తీసుకొనగలిగిన ఎడల మేము సంతోషించెదము, కావలసిన వారు, ఈ సంగతుల చుట్టూ మాతో సహవాసము చేయుము. మీరు వినుచున్న సువార్తకు తగినట్లుగా నడుచుకొనినంత కాలము మరియు దానిని ఒప్పుకొని దానిలో భాగమైయున్నంత కాలము, మేము ఎన్నడు ఎవరు అనే గీతలను గీయము (వ్యత్యాసమును చూపము).
మీరు ఈ సువార్తలో భాగమని మీరు ఎరిగియున్నారు. మనము దేనిని గూర్చి మాట్లాడుకొనుచున్నామో దానికి మీరు వ్రాయబడిన పత్రికలైయున్నారు. ఎంతకాలమైతే నిందాస్పదమగు దానిని ఏదో మనము చేయుదుమో, అప్పుడు మనము వినుచున్న దానికి మనము బుణస్థులమై యున్నాము. చూశారా? మనము ఏమి నమ్ముచున్నామో, _ దానినే మనము జీవించవలసియున్నది, మరియు ఏ రకముగా జీవించవలయుననగా అది ఎన్నడు నిందను తీసుకొని రాకూడదు, కానీ మనము చేయు మరియు చెప్పు ప్రతీ దానిలోనూ యేసుక్రీస్తును ప్రతీబింబింపవలయును. అది ఆ విధముగా ఉన్నది. దీని కొరకే మనము ఆయనను ప్రేమించెదము.
3మరియు ఇప్పుడు, ఈ రాత్రి, రెండవ కొరింథీలోని 11వ అధ్యాయములో కనుగొనబడిన ప్రభువు యొక్క బల్ల క్రమమును మనము చదువబోవుచున్నాము. మరియు మనము దీనిని చదివెదము మరియు వ్యక్తిగతముగా ప్రతీ ఒక్కరినీ…ఏలాగు, మనము దీనిని చేయుదుము, ఒకవేళ క్రొత్తవారు మన మధ్యన ఉన్న ఎడల, వారు లోపలికి వచ్చినప్పుడు ఒకరి తరువాత ఒకరిగా బల్ల చుట్టూ రమ్మని మనము ప్రజలను పిలిచెదము, రొట్టె ద్రాక్షారసమును తీసుకొనుము. మరియు ప్రతీ క్రైస్తవుడు యోగ్యుడే.
ఇప్పుడు, ఒకవేళ నీవు ఏమైయున్నావో అని రుజువు చేసే జీవితమును నీవు జీవించిన ఎడల… నీ హృదయమును నీవు పరీక్షించుకొనుము. మంచిది, ఒకవేళ దీనిని అయోగ్యముగా మనము తీసుకొనిన ఎడల, దీనిని ప్రస్తావించుటకు నన్ను నిశ్చయము చేసుకొననివ్వండి. ఇప్పుడు, మనలో మనము యోగ్యులము కాదు అని మనము ఎరిగియున్నాము. మనలో ఎవ్వరు కూడా. కానీ మనము మన సొంత యోగ్యతపై ఆధారపడుట లేదు,… కలిగియున్న ఆయనలో మనము విశ్వాసముంచుచున్నాము. మనము ఆయన యోగ్యతను విశ్వసించుచున్నాము, మన యొక్క ఆలోచనకు మనము చనిపోయి, మరియు ఆయన యొక్క ఆలోచనను మనము ఆలోచిస్తూ, ఆయన మనలను చేయమని ఆజ్ఞాపించిన వాటన్నిటిని మనము నమ్ముచూ ప్రతీ దానిని జీవించవలెను, మరియు ఏమి జీవించుచున్నామో వెనుకకు తిరిగి చూచుకొనవలెను, మరియు మన జీవితమంతా చూడవలెను, మరియు ఒకవేళ సువార్తకు తగనటువంటి సంగతులు మనము చేయుచున్న యొడల, అప్పుడు మనము ఈ సహవాసములో పాలుపంచుకొనకూడదు.
4కానీ ఒకవేళ మన యొక్క జీవితములు ఇతరులద్వారా చదువబడే రీతిగా మనము కార్యములను చేయుచున్నామని మనము అనుకొనిన యెడల, అది ఒకవేళ ఎవరైనా, "గతదినమున నేను ఈ వ్యక్తిని ఒక బారులో చూశాను", "ఈ వ్యక్తి నిలబడి అసభ్యకరమైన సరసోక్తులు చెప్పడం నేను విన్నాను." "ఈ స్త్రీ తప్పు చేయుచున్నది," అని చెప్పి మరియు వేలెత్తి చూపని యెడల, అప్పుడు, ఒకవేళ పరిశుద్ధాత్మ నీపై ఆరోపించుచున్నదని నీవు ఎరిగిన యెడల, అప్పుడు నీవు ఈ సంస్కారమును తీసుకొనవద్దు. కానీ ఒకవేళ మీరు జీవించుచున్నారని మీరు అనుభూతి పొంది, మరియు రక్తము క్రింద నీ పాపములన్నీ ఒప్పుకొనబడి యున్నవని నీవు వెనకకు తిరిగి చూచుకొనిన యెడల, అప్పుడు నీవు దానిని తీసుకొనవలెను. నీవు-నీవు దానిలో పాలిభాగస్థుడవై యున్నావు.
5ఇప్పుడు, పరిశుద్ధ యోహాను గ్రంథములోని… పరిశుద్ధుడైన పౌలు మనకు బుద్ధిచెప్పుచున్న లేఖనమును మనము చదివెదము. నన్ను క్షమించమని మిమ్ములను అడుగుచున్నాను, మొదటి కొరంధీయుల [గ్రంథములో, 11వ అధ్యాయము, 23 నుండి ప్రారంభిద్దాము.
నేను మీకు అప్పగించిన దానిని ప్రభువువలన పొందితిని. ప్రభువైన యేసు తాను అప్పగింపబడిన రాత్రి యొక రొట్టెను తీసుకొని:
దానిపైన కొద్దిగా మాట్లాడుటకు నాకు సమయము కలదని ఆశించుచున్నాను.
ఆయన అప్పగింపబడిన (మోసగింపబడిన) అదే రాత్రి (మీరు చూశారా?), ఆయన రొట్టెను తీసుకొనెను, మరియు ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించిన తరువాత, ఆయన దానిని విరచెను… చెప్పెను, తీసుకొని మరియు తినుము: మీ కొరకు విరగగొట్టబడిన ఇది నా శరీరము: నన్ను జ్ఞాపకము చేసుకొనుటకై దీనిని చేయుడని చెప్పెను.
ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన ప్రాతను ఎత్తుకొని, యీ పాత్ర నా రక్తములోనిదైన క్రొత్త నిబంధన; మీరు దీనిని త్రాగునప్పుడెల్ల నన్ను జ్ఞాపకము చేసికొనుటకై దీనిని చేయుడని చెప్పెను.
మీరు ఈ రొట్టెను తిని, యీ పాత్రలోనిది త్రాగునప్పుడెల్ల ప్రభువు వచ్చు వరకు ఆయన మరణమును ప్రచురించుదురు.
కాబట్టీ యెవడు అయోగ్యముగా ప్రభువు యొక్క రొట్టెను తినునో, లేక ఆయన పాత్రలోనిది త్రాగునో, వాడు ప్రభువు యొక్క శరీరమును గూర్చియు రక్తమును గూర్చియు అపరాధియగును.
కాబట్టి ప్రతీ మనుష్యుడు తన్నుతాను పరీక్షించుకొనవలయును; అలాగు చేసి ఆ రొట్టెను తిని, ఆ పాత్రలోనిది త్రాగవలెను.
ప్రభువు శరీరమని వివేచింపక తిని త్రాగు వాడు తనకు శిక్షా విధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు.
ఇందువలననే మీలో అనేకులు బలహీనులును, రోగులునై యున్నారు; చాలా మంది నిద్రించుచున్నారు.
అయితే మనలను మనమే విమర్శించుకొనిన యెడల తీర్చు పొందక పోదుము.
మనము తీర్పు పొందినయెడల లోకముతో పాటు మనకు శిక్షావిధి కలుగకుండునట్లు ప్రభువుచేత శిక్షింపబడుచున్నాము.
6ఒక అంశముగా నేను దానిని తెచ్చెదను: క్రీస్తై యున్న వాక్యము ద్వారా మనము తీర్పు తీర్చబడినప్పుడు, మనము శిక్షింపబడుదుము. ఒకవేళ మనము తప్పుచేయుచున్న యెడల, ఈ వాక్య ప్రమాణముగా మనము జీవించలేకున్న యెడల, మనము ప్రభువు ద్వారా శిక్షింపబడుదుము. మరియు ప్రభువు గనుక మనలను శిక్షించిన యెడల, అంటే మనము లోకముతో తీర్పు తీర్చబడకుండునట్లు, మనలను సరిచేయును. మనము లోకసంబంధులము కాదు. మనము లోకము నుండి వేరైన వారము, ఒక వేరైన జీవితమును జీవించెదము, ఒక ప్రత్యేకింపబడిన జీవితము. మనము ఎంతమాత్రము లోకము యొక్క జీవితము జీవిస్తూ మరియు ఒక క్రైస్తవుడిగా ఉండకూడదు. మనము ఒక అసాధారణమైన జీవితమును, ఒక ప్రత్యేకింపబడిన జీవితమును. జీవించవలెను. అటువంటి సాంఘిక హోదాలలో అని నా ఉద్దేశ్యము కాదు, కానీ ఆత్మ యొక్క ఫలమేమనగా, ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. అనే ఆత్మయొక్క ఫలములు మనలో కనబడులాగున ఒక స్వచ్చమైన పరిశుద్ధ జీవితమును మనము జీవించ వలసి యున్నది. కానీ మనము ఈ సంగతులు వినినప్పుడు, మనము అవి చేయకుండా ప్రభువుద్వారా శిక్షింపబడి యున్నామని మనము ఎరుగుదుము, అప్పుడు మనము శిక్షింపబడుదుము. మరియు దేవుని యొక్క కృపను బట్టి, మనము అ సంగతులకు పైగా జీవించుచూ ఒకవేళ మనలో మనము ఎటువంటి దోషారోపణ కలిగిలేని యెడల, అప్పుడు మనము లోకముతో తీర్పు తీర్చబడము, కానీ మనము లోకసంగతులన్నిటికీ పైగా జీవించుచున్నాము. చూశారా?
" కాబట్టి నా సహోదరులారా, భోజనము చేయుటకు మీరు కూడి వచ్చినప్పుడు ఒకని కొరకు ఒకడు కనిపెట్టుకొనియుండుడి.
మీరు కూడివచ్చుట శిక్షావిధికి కారణము కాకుండునట్లు, ఎవడైనను ఆకలిగొనిన యెడల తన యింటనే భోజనము చేయవలెను. నేను వచ్చినప్పుడు మిగిలిన సంగతులను క్రమపరతును."
7మనము ఎల్లప్పుడు దీనిపై గొప్ప బోధలు చేయుదుము, అది మనమందరము కలిసినప్పుడు, మనమేమి చూడలేకపోయినప్పటికీ, ఎవరిలోనో సరికానిది ఏదో ఉండుటను మనము గమనించుదము. ఈ సహవాస భోజనము భుజించుటకు మీరు వచ్చినప్పుడు, ఒకరికొరకు ఒకరు కనిపెట్టుడి, ఒకరికొరకు ఒకరు ప్రార్ధించుడి. ప్రార్ధన… ఎల్లప్పుడూ మనము ఈలాగు చేయుదుము : ఒకవేళ నీలో ఏదో పాపము ఉన్న ఎడల, అది ఏదో అనైతిక కార్యములేక ఒక విశ్వాసిగా నీవు చేసియున్నదేదో అయ్యుండవచ్చు, దేవుడు దానిని నీలో నుండి తీసివేసి, దానిని గూర్చి దేవుడు నిన్ను క్షమించులాగున నేను నీ కొరకు ప్రార్ధింపవలెను. మరియు ఏదో నాకు తెలియనిది … ఒకవేళ ఏదైనా నేను చేసిన ఎడల, మరియు అది తప్పు అని నాకు తెలియును, ఇప్పుడే నేను దానిని ఒప్పుకొనులాగున నీవు నా కొరకు ప్రార్ధించుము. నేను ముగించెదను, ఎందుకనగా ఎవడైతే అది ప్రభువు యొక్క శరీరమని వివేచింపక తిని, త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుట కొరకే తిని, త్రాగుచున్నాడు.
8మీరే ప్రభువు యొక్క శరీరమని ఎరిగియుండట అనే వివేచన, పాపములోను మరియు అతిక్రమము లోను దానిని మీరు వివేచింపలేరు మనము దానికి పైగా ఉండవలసియున్నది. అది మన ప్రభువు నీతిమంతుడని వివేచింపవలసి యున్నది, మరియు మనము ఒప్పుకొనిన మన పాపములన్నిటికీ, ఆయనే మన పరిహారమని మనము వివేచింపవలెను మరియు మన అతిక్రమమంతటి నుండి మనలను కడిగివేయుటకు ఆయన యొక్క ప్రాయశ్చిత్తము కొరకు ఎదురు చూస్తూ ఆయనయందు నమ్మకముంచెదము; అప్పుడు మాత్రమే అది ఎందుకొరకు ఇవ్వబడినదో అని ఆ ప్రభువు యొక్క శరీరమును మనము వివేచించెదము.
మరియు మళ్ళీ వివేచించుట ద్వారా, మన మధ్యలో, ప్రభువు యొక్క వధువు శరీరముగా, సువార్త విస్తరింపకుండా అడ్డుపడుచున్నదేదైనా తప్పు ఒకవేళ మనలో ఉన్నదేమో అని మనము వివేచించెదము, లేక కన్యకయైన వధువుగా ఆయన మనలను దేవుని ముందు నిలబెట్టుటకు అడ్డుగా ఉన్నదేదైనా ఇప్పుడే దానిని వివేచించెదము మరియు తప్పును కనుగొనెదము. ఒకవేళ అది తప్పెయున్న యెడల దానిని ఒప్పుకొనెదము. "ప్రభువా, దానిని గూర్చి నన్ను క్షమింపుము" అని చెప్పెదము.
9కాబట్టి, అది మనము చేసినదేదైనా కావచ్చును, నీవు చేసినది, నేను చేసినది కావచ్చును. అది ఉద్దేశ్యపూర్వకమైనది కాకపోవచ్చును, ఇప్పుడే, దానిని గూర్చి మనలను క్షమింపమని మనము దేవునిని అడిగెదము. మనము ఇక్కడ ఒక పాట పాడుచుండెడివారము "నేను నీ దగ్గర ఒప్పుకొనిన పాపములను, క్షమియించుము", నీవు చూచుచున్న రహస్యమైన పాపములను క్షమియించుము? వాటిని గూర్చి కనీసము ఎవ్వరికి తెలియదు, ఒక తెలియబడని పాపము. మేము ప్రార్ధించుచున్నాము, దేవా, వాటిని క్షమియింపుము.
ఇప్పుడే, అది చెప్పబడినది, "మీరు కూడివచ్చినప్పుడు, ఒకరికొరకు ఒకరు కనిపెట్టుడి", మరియు అది నిజముగా ఈలాగు ఉండును ఒకరి కొరకు ఒకరు ఎదురుచూచుడి. "ఎదురుచూచుట" అనగా "వేచిచూచుట", ఒకరి కొరకు ఒకరు వేచియుండుడి. మరియు ఇప్పుడు మనము దానిని చేయుదుము. నేను మీ కొరకు ప్రార్ధించెదను. ఒకవేళ మీరు ఏదైనా తప్పు చేసియున్నారని మీరు ఎరిగియున్న యెడల, "దేవా, నన్ను క్షమియించుము. అలా చేయుట నా ఉద్దేశ్యము కాదు. మరియు ఈ రాత్రి నుండి నీవు నాకు సహాయము చేసిన యెడల, నేను దానిని తిరిగి చేయను. నాకు అర్థమైనది, ప్రభువా, ఒకవేళ నీవు నన్ను క్షమియించిన యెడల దానిని నేను తిరిగి చేయను. మరియు నా ఒప్పుకోలును బట్టి "నీవు నన్ను క్షమియించియున్నావని నేను నమ్ముచున్నాను, నీవు నా పాపమంతటిని క్షమించియున్నావనే అనుభూతిని నా హృదయములో కలిగియుండి, క్రీస్తు యొక్క శరీరమును తీసుకొనుటకు నేను వెళ్ళుచున్నాను", అని చెప్పుము. అప్పుడు నీ రహస్య పాపము కొరకు నేను ప్రార్ధించెదను; నీవు నా వాటి కొరకు ప్రార్ధింపుము, అది దానిని గూర్చి బహుశా మనము ఎరిగియుండకపోవచ్చు, లోకముతో పాటు మనకు శిక్షావిధి కలుగకుండునట్లు చేయుము.
10మనకు ఇక్కడ లోకము అవసరము లేదు. ఇక్కడ ఆరాధించుటకు దేవుడు మనకు ఇచ్చిన ఈ చిన్న గుంపు ప్రజలు, మనమందరము మనలను ఆ స్వార్ధమనే దాని నుండి శుభ్రముగా ఉంచుకొనెదము; లోక కార్యములన్నిటి నుండి మన సంగతులను, మన పాపమును - మన జీవితములను శుభ్రముగా ఉంచుకొనెదము, దానితో మనము గుర్తించబడవద్దు. ఎత్తబాటు కొరకు మనలను మనము సిద్దపరచుకొనెదము. కాబట్టి ఇప్పుడు మనము ప్రార్ధించెదము, నిశ్శబ్ధముగా, ఒకరికొరకు ఒకరు, ఒక్క క్షణము. నేను నీ కొరకు ప్రార్ధించునట్లుగా నీవు నా కొరకు ప్రార్ధించుము. (సహోదరుడు బ్రాన్హాం ప్రార్ధించుచుండగా, 30 సెకన్లు నిశ్శబ్ధముగా ఉన్నది)
ప్రభువైన యేసు, అలా జరుగనిమ్ము, ప్రభువా, క్రీస్తులో పిల్లలుగా మరియు ప్రియమైన విశ్వాసులుగా మనమందరము కలిపి వచ్చెదము, అది దేవుని యొక్క మరుపు అనే జ్ఞాపకాలలో, ప్రభువైన యేసు యొక్క రక్తములో మన పాపములన్నిటిని ఇప్పుడు ఉంచెదము. దీనిని ఆయన నామములో మేము అడుగుచున్నాము - ఆమేన్.
11ఇప్పుడు, ఈ సమయములో ఈ పెద్దలు, వారు ముందుకు వచ్చెదరని నేను తలంచుచున్నాను. ఇక్కడ, ఇంకనూ అదే పద్ధతి ఉన్నదా? సహోదరుడు టోనీ జాబెల్, మరియు అతడు దానిని నడిపించును. మరియు ఒకవేళ ఎవరైనా ఇప్పుడు వెళ్ళిపోదలచిన యెడల మరియు ఈ సహవాసం కొరకు వేచియుండకూడదని కోరినవారు, ఈ రాత్రి మిమ్ములను ఇక్కడ కలిగియున్నందుకు మేము సంతోషించుచున్నాము. బుధవారపు కూడిక - బుధవారపు రాత్రి యొక్క కూడికను జ్ఞాపక ముంచుకొనుడి. మిగిలినవారు బలిపీఠము యొద్దకు వచ్చుచుండగా మీరు నిశ్శబ్ధముగా నిస్క్ర మించుడి. మరియు ఇక్కడ సహోదరుడు జాబెల్స్ జనులను బలిపీఠము యొద్దకు నడిపించును, మేము రొట్టె ద్రాక్షారసమును సిద్ధము చేసెదము. (మళ్ళీ నిశ్శబ్ధము)
12ఈ రొట్టె, ఇది ప్రభువైన యేసుక్రీస్తు యొక్క శరీరమునకు సాదృశ్యమై యున్నది. మరియు ఇప్పుడే పాట పాడినట్లుగా, "నా విశ్వాసము నీవైపే చూచుచున్నది." కేవలము మూడే ఆజ్ఞలు ప్రభువు ద్వారా మనకివ్వబడినవి, మరియు అవి బాప్తీస్మము, రొట్టె మరియు ద్రాక్షారసము తీసుకొనుట, మరియు పాదశుద్ధి ఇవియే ఆజ్ఞలు.
మరియు ఇది క్రీస్తు యొక్క విరుగగొట్టబడిన శరీరమును సూచించుచున్నది. ఈ రాత్రి దీనిలో పాలిభాగస్థులైన ప్రతీ వ్యక్తి "పరిశుద్దాత్మ యొక్క దీవెనలు వారి పైకి దిగిరావలెననునదియే నా ప్రార్ధన. మరియు రోగముతో ఉన్నవారు, పరలోకపు దేవుడు, మొదటగా ఐగుప్తులో చేదు వేర్లను మరియు ద్రాక్షారసమును … చేసినవాడు, దేవుడు మిమ్ములను స్వస్థపరచునని నేను నమ్ముచున్నాను, మరియు మీ ప్రయాణమంతటిలో మీమధ్యలో ఏ రోగము ఉండకుండును గాక. మరియు దీనిని మనము ఆయనకు అర్పిoచుచుండగా, పరలోక దేవుడు ఇప్పుడు మన వైపు చూచును గాక.
13ప్రభువైన దేవా, భూమ్యాకాశముల సృష్టికర్తా, నిత్యజీవాధిపతి, మరియు ప్రతీ మంచి ఈవులను ఇచ్చువాడా, ఈ ఆజ్ఞను బట్టి నీకు మేము వందనములు చెల్లించుచున్నాము, మేము సహవాసము చేయుచుండగా నిన్ను జ్ఞాపకము చేసుకొనుటకై మేము దీనిని చేయుదుము, అది ఉండినట్లుగా, దేవుని యొక్క కృప చుట్టూ సహవాసము కలిగియున్నట్లుగా, నీ యొక్క సన్నిధిలో దీనిని మేము చేయుదుము. ఒకరోజు మేము అయోగ్యులమని మేము మా సొంత హృదయములలో ఆలోచించుచున్నట్లుగా, ఇప్పుడు యేసుక్రీస్తుయొక్క రక్తము ఆ పాపము నుండి మనలను కడిగివేసెను, ఇప్పుడు క్రీస్తు యేసులో మనమందరమూ కలిసి పరలోకపు స్థలములలో నిలబడియున్నాము.
ఈ సముఖపు రొట్టె, తండ్రీ, ఈ ఉద్దేశ్యము కొరకే ఇది కాల్చ్బబడి ఇక్కడకు తేబడినది, విరగగొట్టబడిన శరీరమునకు సాదృశ్యముగా, దీనిని పరిశుద్ధ పరచమని అడుగుచున్నాము, ప్రభువా… ఆయన కల్వరిలో చేసిన దానికి ఈ శరీరము నలుగగొట్టబడినందు వలన కలిగిన శ్రమ, బాధ మరియు ఆ భక్తి. మన యతిక్రమముల నిమిత్తము ఆయన గాయపర్చబడెను, మన పాపముల నిమిత్తము ఆయన నలుగగొట్టబడెను. మన సమాధానార్థమైన శిక్ష ఆయనపై మోపబడెను, మరియు ఆయన గాయముల ద్వారా మనము స్వస్థపడియున్నాము. అందుకే ఈ రాత్రి మనము ఈ విరగగొట్టబడిన రొట్టెను తీసుకొనుచున్నాము. దేవా విశ్వాసులను దీవించి మరియు యేసుక్రీస్తు యొక్క శరీరమునకు సాదృశ్యముగా ఉన్న ఈ సముఖపు రొట్టెను పరిశుద్ధపరచుము - ఆమేన్.
14బైబిల్ చెప్పుచున్నది, "ఆ ప్రకారముగా ఆయన ఆ పాత్రను ఎత్తి, మరియు ఆయన త్రాగిన పిమ్మట, ఆయన తీసుకొని… చెప్పెను, తీసుకొని మరియు త్రాగుము; ఇది క్రొత్త నిబంధన యొక్క పాత్ర. దీనిని చేయునప్పుడెల్ల, ఆయన వచ్చువరకూ ప్రభువు యొక్క మరణమును మీరు చూపించెదరు". ఈ రాత్రి ఈ ద్రాక్షారసమును నేను నా చేతిలో పట్టుకొనియుండగా, యేసుక్రీస్తు యొక్క రక్తమునకు సాదృశ్యముగా ఉన్న ద్రాక్షపండ్ల యొక్క జీవము నుండి తీయబడినది ఇక్కడకు తీసుకొని రాబడినది. నేను దానిలోనికి చూచినప్పుడు మరియు నా పాపము పోకుండా ఉన్నప్పుడు, నేను ఆ రొట్టె, ద్రాక్షారసము యొక్క పాత్రలను తీసుకొనిన సమయము ఎన్నడునూ లేదు, అది ఇంక మరి ఏ సమయమును లేదు. ఒకవేళ అది ఎందుకొరకు ఇవ్వబడినదో అది జరుగకపోతే, అవును, మనము ఎక్కడ ఉండెడివారము?
అక్కడ ఆసుపట్రిలో, చనిపోవుచూ అక్కడ పడియున్నఒక వ్యాధిగ్రస్తుడను గూర్చి నేను ఆలోచించు చున్నాను: నేనే. అది ఆయన పొందిన గాయముల ద్వారానే నేను స్వస్థపరచబడ్డాను. అది ఉద్దేశించ బడిన ఉపయోగము కొరకు పరలోకపు దేవుడు ఈ ద్రాక్షారసమును దీవించును గాక.
ప్రభువైన యేసు, ఈ ద్రాక్షారసమును మేము నీకు సమర్పించుచున్నాము, యేసుక్రీస్తు యొక్క రక్తమునకు సాదృశ్యమగునట్లుగా ద్రాక్షాపండ్ల యొక్క రసము నుండి ఈ ద్రాక్షారసము తీయబడినది. మేము దానిని తీసుకొనుచున్నప్పుడు, తండ్రీ, రోగము మానుండి దూరమగును గాక. పాపపు, కోరిక మాలో నుండి తీసివేయబడును గాక. దీని తరువాత పరిశుద్ధమైన, ప్రత్యేకపరచబడిన జీవితమును మేము. జీవించుదుము గాక, యేసుక్రీస్తు యొక్క ప్రతీరూపమును జనులు మనలో చూచుదురు, మరియు మనము నమ్ముచున్న సువార్తకు యోగ్యమైనట్లుగా జీవితములోని మన నడక ఉండును గాక. అనుగ్రహించండి, తండ్రీ. మరియు అది ఉద్దేశించబడిన కారణము కొరకై ఇప్పుడు ఈ ద్రాక్షారసమును పరిశుద్ధపరచుము. యేసుక్రీస్తు యొక్క నామములో, ఆమేన్.