మొర్రపెట్టనేల? పలుకుము!
1మన తలలు వంచియుండగా, ఒక్క క్షణము లేచి నిలువబడెదము. ఏదైనా ప్రత్యేకమైన విజ్ఞాపన ఉన్నదా? మీకున్న యెడల దేవునికి చేతులెత్తినప్పుడు దానిని తెలియపరచుడి మరి దాని ద్వారా, "ప్రభువా, నా అవసరము మీరు ఎరిగియున్నారు" అని చెప్ప౦డి.
2పరలోకపు తండ్రీ, దేవుని యొక్క గృహములో ఈ ఉదయము కూడుకొనుటకు మేము, ప్రత్యేకమైన జనులము, ఎందుకనగా అనేకులు దేవుని ఆలయములో ఉండవలయునని కోరుకొనియున్న ప్రజలు ఆసుపత్రిలో వ్యాధితో బాధపడుచు పడకపై ఉన్నారు, అయితే ఈ రోజు మేమిక్కడ కూడుకొనుటకు మీరు మాకు విశేషాధికారము నిచ్చియున్నారు. మరి ఒకరినొకరు చూచుకొనుటకు రాలేదు ప్రభువా, ఒకరి యెడల ఒకరికి గల సహవాసమును మేము ప్రేమించుచున్నప్పటికిని, దానిని మేము మా గృహములో చేయవచ్చును; అయితే ప్రియమైన బిడ్డలుగా, మరి సహోదరులుగా ఒక్కటిగా ఇక్కడికి మమ్ములను తీసుకు వచ్చిన ఆయనతో సహవాసము చేయుటకు మేమిక్కడికి వచ్చియున్నాము.
ఇప్పుడు మేము మీకు కృతజ్ఞతలు తెలుపుచున్నాము. మరి సరిగా మీతో సహవాసము చేయుటకు మాకు తెలిసిన ఒకే ఒక మార్గము, అది మీ యొక్క వాక్యము చుట్టు; మీ వాక్యము సత్యము. మేము ఇక్కడ ఆత్మీయ బలము కొరకు కూడియున్నాము; దానిని మేము కోరుచున్నాము, ప్రభువా. మేము మోయుచున్న శిలువలను సహించుటకు మాకు శక్తి అవరమైయున్నది. ఈ రోజు మీరు ఆ గొప్ప పరిశుద్దాత్మను పంపి మమ్ములనందరిని బలపరచవలయునని మేము ప్రార్ధించుచున్నాము. అటువంటి కార్యములు కావలయునని ఇక్కడ కూడియున్న జనులు తమ చేతులను పైకెత్తినప్పుడు, నీ ప్రజల యొక్క కోరికలను అనుగ్రహించుము. ప్రభువా, ప్రతియొక్కరికి బదులిమ్ము.
PS 34:7
3ఇక్కడ రోడ్డుపైన ప్రమాదము నుండి గత రాత్రి మా సోదరి అన్గ్రీన్ ప్రాణాలు కాపాడినందులకు మేము మీకు సోత్రములు చెల్లించుచున్నాము. వారియెడల మీరు కృప కలిగియున్నారు, ప్రభువా, అందుకొరకై మీకు మా వందనములు.
మరి ఇప్పుడు పరలోకమందున్న తండ్రీ, మేము యాత్రను కొనసాగించుచుండగా, మాకు సహాయము చేయుము — మాలో ప్రతి యొక్కరితోను ఉండవలయునని మేము ప్రార్ధి౦చుచున్నాము. మీరు మమ్ములను విడువక ఎల్లప్పుడు మాతో ఉండెదరని మేము తెలిసికొను లాగున, బాగుగా కట్టబడిన ఆ విశ్వాసములోని మీ శక్తిని మాకిమ్ము. ఆ సమయములో మాకు మేము సహయపడజాలము, ఆయనయందు భయభక్తులుగలవారి చుట్టు దేవదూతలు కావలియుందురని, మా పాదములు రాతికి తగులకుండా ఎత్తిపట్టుకొనెదరని మాకు తెలియును. ఇప్పుడు వాక్యమును ఆశీర్వదించవలయునని, మరి మా ద్వారా - మా అంతరంగములో మాట్లాడవలయునని, యేసుక్రీస్తు నామములో ప్రార్ధించుచున్నాము. ఆమేన్.
4బయట గల ఎండకి నేను కృతజ్ఞడనై యున్నాను. సూర్యుడు ప్రకాశించుచున్నాడు. ఈ ఉదయము చాలా చెడ్డగా (శీతోష్ణస్థితి) ఉండెను. ప్రత్యేకముగా దేశములో ఈ భాగములలో అని నేను అనుకొనుచున్నాను, మనకు చాలా మబ్బుగా, సొమ్మసిల్లిన విధముగా వాతావరణము ఉండెను; మరి ఇప్పుడు సూర్యరశ్మి వచ్చుట చూచుచుండగా, అది చాలా మ౦చిగా ఉన్నది.
ఈ రోజు చిన్న కుటుంబము యొక్క కలయిక - నా యొక్క సహోదరి (చెల్లెలు) గృహములో నా సోదరుల—నందరిని సందించితిని, మరి నగరములో చుట్టుప్రక్కలనున్న బందువులలో కొందరిని కలిసినాను. (అందరు కుటుంబ బందు వర్గము అక్కడ అతని చెల్లెలు ఇంటిలో కూడుకొనిరి) బ్రెన్హాం కుటుంబస్తులు అనేకులు, వారు లెక్కలో అనేకులు ఎట్లనగా, కెంటూకీ నుండి అందరు ఇక్కడికి వచ్చి కూడుకొనిన నగరమును బాడుగకు తీసికొనవలయును; ఏలయనగా వారు చాలా పెద్ద గుంపు. అది ఒక గృహమునకు తిరిగి వచ్చుట. మేమందరమును మా తల్లి ఇంటిలో కూడుకొనెదము. ఆమె మమ్ములను అందరిని ఒక్కటిగా కూడులాగున చేయు కట్టు-స్తంభము లాగున. అయితే దేవుడు పరలోకమునకు కట్టు-స్తంభమును కొనిపోయెను, మరి ఒకరోజు మనమందరమును అక్కడ సంధించబోవుచున్నామని నేను నమ్ముచున్నాను.
5మరి నేను ఆ దినమున మాట్లాడితిని - నేను చెప్పాను, "మీకు తెలియును, నేను ఇరవై లేక ముప్పై నిమిషములకు నా ఆదివారపు వర్తమానములను తగ్గించవలయునని, మరి అటు పిదప వ్యాధిగ్రస్తుల కొరకు ప్రార్ధించవలయునని" నేను చెప్పానని అనుకొనుచున్నాను. ఈ రోజు ఉదయము నేను దానిని గురించి తలపోసితిని, మరి గత రాత్రి నేను తలంచితిని, అప్పుడు సహోదరి డౌనింగ్ నన్ను (టెలిఫోను) పిలిచి మరి చెప్పెను - బిల్లీని పిలిచి చెప్పెను, ఆమె మరి సోదరి యున్గైన్ రోడ్డుపై పోవుచుండగా రోడ్డుకు అడ్డముగా జారిపడి గాయపడ్డారు. మరి బిల్లీ ఆ కిటికీ ప్రక్కనే ఉండెను… (అది ఏ సమయమని నాకు తెలియదు, ఈ రోజు ఉదయమునే ఉండవచ్చును, నేను కొద్దిగా అధికముగానే నిద్రించాను.) నేను వుడ్, సోదరుని చూచాను; లైటు ఆర్చబడియుండెను. మరి నేను ప్రార్ధించుటకు మోకాళ్ళు వంచినాను. అప్పుడు ఏదో నాతో చెప్పెను, "అది అంతయు సరిగా ఉన్నది." అప్పుడు నేను బిల్లీతో చెప్పితిని, "ఆమెతో సమస్తమును చెప్పుము, అన్ని సవ్యముగా ఉండునని నేను అనుకొనుచున్నాను."
ఈ ఉదయము వారిని చూచి నేను చాలా ఆనందపడితిని. ప్రభువు యొక్క గృహములో తిరిగి కూర్చొనియున్నారు. రోడ్డపై పిదప దేవుని యొక్క సువార్తను వినుటకు వందలకొలది మైళ్ల నుండి వచ్చువారు (వారు మిమ్ములను ప్రేమించుచున్నారు) అప్పుడు నేను తలంచాను. ఇరవై నిమిషముల వర్తమానము చాలా నిదానముగా నేను చెప్పినను అది ఏ మంచియు చేయదు. కావున నేను దీర్ఘముగా ప్రసంగించవలయునని అనుకొన్నాను.
కావున ఇప్పుడు ఈ సోదరుడు యున్గ్రెన్, ఆమె కుమారుడు ఈ ఉదయము "ఆయన ఎంత గొప్పవాడు" అను పాట పాడుచున్నారు. ఆయన నిన్నటి దినము మధ్యాహ్నమున కన్నను ఈ రోజు ఉదయుము ఎంతో సన్నిహితము, ఎందుకనగా పరలోకమందున్న గొప్ప దేవుడు అమూల్యమైన ఆ తల్లి మరియు సహోదరుని కాపాడి, రక్షించెను.
1PET 5:7
6ఇప్పుడు, ఈ రోజు ప్రభువుతో గొప్ప సమయమును మనము ఎదురు చూచుచున్నాము, మరి నా యొద్ద రెండు లేక మూడు వేర్వేరు పాఠ్యఅంశములు ఉన్నవి, వాటిని నేను చూచుచున్నాను, మరి ఈ రోజు ఉదయము దేనిపై మాట్లాడ వలయునని నేను ఇంకనూ కూర్చుకొనలేదు. వాటిలో ఒకటి ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. ఇప్పుడు ఆయన చింతించుచున్నయెడల మీరేల? బిల్లీ పౌలు… బిల్లీ పౌలు కాదు, నా ఇంకొక కుమారుడు యోసేపు ఈ పాఠ్యాంశమును చాలా కాలము క్రిందట కొని వచ్చెను. ఒక రోజు నేను గదిలో కూర్చొనియున్నాను. పటమును చూచి అతను చెప్పెను (మరి బిల్లీ, యోసేపుకు పడవలు అనిన చాలా ఇష్టపడును చిన్నపిల్లలు కనుక… మీకు తెలుసును పడవలు మరి గుర్రములు), మరి అతను నాతో చెప్పెను, "తండ్రీ, యేసుకు పడవ ఉన్నదా?"
మరి నేను చెప్పాను, "నాకు తెలియదు."
7కావున అతను అడిగి పోయిన పిదప నేను ఆలోచించుటకు ప్రారంభించితిని. "ఆయనకు ఒక పడవ ఉన్నాదా?" మరి దానిలో నుండి ఒక అంశమును తీసికొని నా పుస్తకములో గుర్తుంచుకొనితిని. "యేసుకు పడవ ఉన్నాదా?"
నేను ఇలాగే ఆలోచించుచుంటిని, ఆయన భూమిపై ఉన్నప్పుడు తాను జన్మించుటకు ఒక గర్భమును, పూడ్చి పెట్టుబడుటకు ఒక సమాధిని ప్రసంగించుటకు ఒక పడవను, అప్పు తీసికొనెను, అయితే ఆ పాత సీయోను ఓడను సరియైన మార్గమందు నడుపువాడు ఆయనే. నేను ఆలోచించు ఈ పాఠములో, ఆ అంశమును మనము తిరిగి పోవు లోపల చెప్పెదను.
మీకు తెలియును, ఈ గుడారము నుండి నేను మాటలాడుటకు ఇష్టపడుచున్నాను, ఏలయనగా ఇది నా యొక్క సొంత ఆలయము. పరిశుద్దాత్మ చెప్పు కార్యములన్నిటిని చెప్పుటకు స్వతంత్రము కలదని మనము భావించుచున్నాము. తక్కిన చోట్లలో వారు మిమ్ములను సరిగా ఆహ్వానించినప్పటికిని, మీరు ఇంకొకరి సహవాసములో ఆలయములో ఉన్నారు కావున మీరు ఆటంకపరచబడినట్లు అనుభూతి చెందుదురు, మీరు వారి తలంపులను, వారి బోధనలను గౌరవించవలసిన మర్యాదగలవారై యున్నారు.
8అక్కడ సోదరుడు బర్క్ హామ్స్ ప్రదేశములో ఈ వారము చాలా అద్భుతమైన సమయముగా ఉండెను. నేను జున్ను (చీస్) తయారు చేయు ఫాక్టరికి వెళ్ళితిని. (ఈ ఉదయమున అతను, అతని భార్య, కొడుకు, మరి వారందరు ఇక్కడ హాజరై యున్నారు). ఎల్లప్పుడును నేను అనుకొను విధముగా చీస్ ఫాక్టరి ఉండుననుకొన్నాను, నేను ఇంతకు ముందు వెళ్ళిన ఫాక్టరిల వలె. అక్కడ అసహ్యముగా, జారుచు ఉండును. అయితే నేను వెళ్ళిన ఆ చీస్ ఫాక్టరి చెత్తగా లేదు. అయితే నేను ఇంతకు మునుపు దర్శించిన అనేక ఫాక్టరిల కంటే శుభ్రముగా ఉ౦డెను. మరి నేను దానిని గుర్తించలేదు - నేను తలంచాను ఒక రోజు నూరు పౌండ్లు చీస్ తయారు చేయుచున్నారు, ప్రతిరోజు వారు ఆరు టన్నులు ఉత్పత్తి చేయుచున్నారు. మూడు ఫాక్టరిలు ఉత్పత్తి కొనసాగించుచున్నవి. "ఓ ఈ చీస్ అంతయు ఎవరు తినుచున్నారు" అని నేను అనుకొన్నాను. అయితే ప్రభువు ఈ మనుష్యుని ఆశీర్వదించెను, అతను తన స్వగృహములో చక్కటి గృహము - భయభక్తులు గల భార్య. వారు ఇప్పుడున్న విధముగా క్రీస్తు కొరకు ప్రతి రోజు జీవించకుండా ఉండుటకు మరి ఏ కారణము లేదు. అతని కుమారుని సంధించితిని, మంచి బిడ్డలు. మనము ఒకరియెడల ఒకరికి గల ఈ యొక్క సహవాసము కొరకు మనము కృతజ్ఞలమై యున్నాము.
ఇంతకు మునుపు వారియొక్క కాపరి ఎవరని నేను కనుగొన్నాను. నాకతను తెలియును — గుర్లే సోదరుడు, యునైటడ్ పెంతొకోస్తు విశ్వాసమునకు చెందినతను. అతనిని చాలా సంవత్సరముల క్రితము జోన్స్బారో, అర్కాన్సాస్లో కలిసితిని. మరి నాకు తెలియదు… వారు ఆయన వీరి పాస్టర్ అని, అయినను.
9ఈ రోజు సాయంకాలము కూటములను, ఇప్పుడు గుర్తు౦చుకొనుడి, మరి ప్రభువు చిత్తమైనయెడల రాబోవు ఆదివారము మరల మనము మాట్లాడవలెనని యున్నాము. మరి ఆ తరువాత ఆదివారము నేను చికాగో పోవలయును అటు పిదప నేను కొద్దిగా వేరే కార్యములున్నవి. నా కుటుంబమును తిరిగి ఆరిజోనాకు తీసికొని పోవలయును, బిడ్డలు పాఠశాలలలో చేరవలయును మరి అట్లయిన పాస్టరును తొందర చేయకుండ అతని ఆరాధనలను తీసికొని, కావున సహోదరుడు నెవిల్కు అతని సరాళ గుణమునకు మేము కృతజ్ఞలముగా ఉన్నాము. మీకు తెలియును, నేను అతనిని ఆహ్వానించుచున్నాను. మరి అతను… ఆ సోదరునిని నేను ఇష్టపడుచున్నాను… అతనిలో కపటము లేదు, స్వార్థపరుడు కాడు; మరి స్వచ్ఛమైన క్రైస్తవత్వము. నాకది ఇష్టము.
10ఇప్పుడు, లేఖనములోని కొన్ని వాక్యములను చదివి దానిపై ధ్యానించెదము, మరి నాకు తెలియదు ఈ దీర్ఘమైన వర్తమానము ఎంతసేపు మనము వదిలిపోవుదుమో అని, అయితే నేను తలంచుచున్నాను. చాలా సేపు ప్రసంగించుటను గురించి నేను ఆ రోజు మాటలాడుచుంటిని, మరి ఎవరో ఒకరు చెప్పారు, "సరి మీరు కొన్ని మర్మములను కొద్ది నిమిషములు మాత్రము మాట్లాడినయెడల దానిని మేము అర్ధము చేసికొనలేకున్నాము," మాట్లాడుచూ పోండి మరి ఆ పిదప అది బయటికి వచ్చును" అని చెప్పారు. అతను చెప్పెను… ఆ విధముగా చేయవలెనని మనము చేయవలెనని ప్రభువు కోరుచున్నాడేమో.
మరల మనము వంచెదము.
11ప్రభువా, ప్రసంగ వేదికపై మీ వాక్యము తెరువబడి యున్నది. మరి ఒకానొకరోజు కడపటిసారిగా అది మూయబడును. అప్పుడు వాక్యము శరీరధారియగును మరి ఈ ఉదయము ఈ సమయము కొరకు మేము స్తోత్రములు చెల్లించుచున్నాము. మరి మేము చదువబోవు వాక్యములోని సంగతులను మీ యొక్క పరిశుద్దాత్మ మాకు తెలుపనిమ్ము. మేము తెలిసికొనవలసిన కార్యములను పరిశుద్దాత్మ ఈ రోజు మాకు బోధచేయని, మరి దానికి ప్రత్యుత్తరముగా మేము ప్రతి యొక వాక్యమును చాలా జాగ్రత్తగా విని, దానిని గాఢముగా పదిలపరచుకొని, మరి టేపు ద్వారా వినువారు చాలా జాగ్రత్తగా విని, పరిశుద్దాత్మ ఏ కార్యమును బయలుపరచెవలెనని ప్రయత్నించుచున్నాడో దానిని మేము గ్రహించులాగున చేయుము; ఏలయనగా మీరు మమ్ములను అభిషేకించిన యెడల, ఆ అభిషేకము వ్యర్ధము కాదు అని మేము గ్రహించుచున్నాము. అది ఒక కార్యమునకై — ప్రభువుకు యుక్తమైనదిగా అది క్రియ చేయవలెను. మరి మా యొక్క హృదయములను, గ్రహింపు శక్తియు తెరువబడనీ ప్రభువా.
మేము మాట్లాడుటకు, స్వేచ్చనిమ్ము, వినుటకు స్వేచ్చను, మరి దేవుని వాక్యము నుండి వచ్చు కార్యములను, మేము వినిన దానిని నమ్మి దానిని విశ్వసించి అందులోనికి ప్రవేశించులాగున చేయుము, మరి రాబోవు ఆ గొప్ప దినమున నిత్యజీవములోనికి అది లెక్కించబడులాగున మమ్ములను ఆ విధముగా చేయనిమ్ము. ఈ దినమున మమ్ములను ఆశీర్వదించుము, మేము తప్పు చేయునప్పుడు మమ్ములను ఖడించుము. మా యొద్ద నున్న తప్పిదములను మేము గుర్తెరుగనిమ్ము, ఏ మార్గము సరిగా ఉన్నదో, ఆ మార్గములో మమ్ములను ఆశీర్వదించుము; ప్రస్తుత ప్రపంచములో ఏ విధముగా నడుచుకొనవలెయునో, ఏ మార్గములో పోవలయునో మమ్ము తెలుసుకొననిమ్ము, మేము జీవించులాగున మా కొరకు చనిపోయిన యేసు కీస్తుకు ఇక్కడ జీవించునప్పుడు, ఆయనకు ఘనత తెచ్చులాగున మమ్ములను చేయుము. దీనిని యేసు నామములో మేము అడుగుచున్నాము. ఆమేన్.
EXOD 13:21,22•
EXOD 14:10-25
12ఇప్పుడు, ఈ ఉదయము లేఖన భాగములోని రెండు చోట్ల నేను చదువవలెనని ఉన్నాను, అందులో ఒకటి నిర్గమ కాండము, చెప్పవలయుననిన రెండునూ నిర్గమ కాండము నుండి చదువబోవుచున్నాను. ఒకటి, 13వ అధ్యాయము మరి 21, 22వ వచనములు, మరి ఇంకొకటి 14వ అధ్యాయము, 10, 11. మరి 12వ వచనములు. మరినేను నిర్గమ కాండము 13:21 నుండి చదివెదను.
వారు పగలు రాత్రియు ప్రయాణము చేయునట్లుగా యెహోవా త్రోవలో వారిని నడిపించుటకై పగటి వేళ మేఘస్తంభములోను, వారికి వెలుగిచ్చుటకు రాత్రి వేళ అగ్నిస్తంభములోను ఉండి వారికి ముందుగా నడుచుచు వచ్చెను.
ఆయన పగటివేళ మేఘ స్తంభమునైనను. రాత్రి వేళ అగ్నిస్తంభమునైనను ప్రజల యెదుట నుండి తొలిగింపలేదు.
ఇప్పుడు, నిర్గమ కాండములో 14వ అధ్యాయము మరి 10వ వచనము.
ఫరో సమీపించుచుండగా ఇశ్రాయేలియులు కన్నులెత్తి ఐగుప్తీయులు తమ వెనుక వచ్చుట చూచి మిక్కిలి భయపడి యెహోవాకు మొర్రపెట్టిరి.
అంతట వారు మోషేతో ఐగుప్తులో సమాధులు లేవని ఈ అరణ్యములో చచ్చుటకు మమ్మును రప్పించితివా? మమ్మును ఐగుప్తులో నుండి బయటికి రప్పించి మమ్మును ఇట్లు చేయనేల? మా జోలికి రావద్దు, ఐగుప్తీయులకు దాసులవుగుదుమని అనిరి. మేము నీతో చెప్పిన మాట యిదే గదా, మేము అరణ్యమందు చచ్చుట కంటె ఐగుప్తీయులకు దాసులమగుటయే మేలని చెప్పిరి.
ఇంకను కొన్ని వాక్యములను నేను చదువబోవుచున్నాను.
అందుకు మోషే - భయపడకుడి, [ఇక్కడ జాగ్రత్తగా వినుడి.] .. మోషే ప్రజలతో భయపడకుడి, యెహోవా మీకు నేడు కలుగజేయు రక్షణను మీరు ఊరక నిలుచుండి చూడుడి; మీరు నేడు చూచిన ఐగుప్తీయులను ఇక మీదట మరి ఎన్నడును చూడరు.
యెహోవా మీ పక్షమున యుద్దము చేయును, మీరు ఊరకయే యుండవలెనని ప్రజలతో చెప్పెను.
అంతలో యెహోవా మోషేతో - నీవేల నాకు మొర్రపెట్టుచున్నావు? సాగిపోవుడి అని ఇశ్రాయేలీయులతో చెప్పుము. నీవు నీ కర్రను ఎత్తి ఆ సముద్రమువైపు నీ చెయ్యి చాపి దాని పాయలుగా చేయుము, అప్పుడు ఇశ్రాయేలీయులు సముద్రము మధ్యను ఆరిన నేల మీద నడిచిపోవుదురు.
ఇదిగో నేను నేనే ఐగుప్తీయుల హృదయములను కఠినపరచుదును. వారు వీరిని తరుముదురు, నేను ఫరో వలనను అతని సమస్త సేన వలనను అతని రధముల వలనను అతని గుర్రపు రౌతుల వలనను మహిమ తెచ్చుకొందును.
నేను ఫరో వలనను అతని రధముల వలనను అతని గుర్రపు రౌతుల వలనను మాహిమ తెచ్చుకొనునప్పుడు నేను యెహోవానని ఐగుప్తీయులు తెలిసికొందురనెను.
అప్పుడు ఇశ్రాయేలీయుల యెదుట సమూహమునకు ముందుగా నడిచిన దేవదూత వారి వెనుకకుపోయి వారిని వెంబడించెను. ఆ మేఘస్తంభము వారియెదుట నుండి పోయి వారి వెనుక నిలిచెను.
అది ఐగుప్తీయుల సేనకు ఇవ్రాయేలీయుల సేనకు నడుమ ప్రవేశించెను. అది మేఘము గనుక వారికి చీకటి కలిగెను గాని, రాత్రి అది వీరికి వెలుగిచ్చెను గనుక ఆ రాత్రి అంతయు ఐగుప్తీయుల సేన ఇశ్రాయేలీయులను సమీపించలేదు.
మోషే సముద్రము వైపు తన చెయ్యి చాపగా యెహోవా ఆ రాత్రి అంతయు బలమైన తూర్పు గాలి చేత సముద్రమును తొలగించి దానిని ఆరిన నేలగా చేసెను.
నీళ్ళు విభజింపబడగా ఇశ్రాయేలీయులు సముద్రము మధ్యను ఆరిన నేల మీద నడిచిపోయిరి. ఆ నీళ్ళు వారి కుడి యెడమ ప్రక్కలను వారికి గోడవలె నుండెను.
ఐగుప్తీయులును ఫరో గుర్రములను రధములను రౌతులును వారిని తరిమి సముద్ర మధ్యమున చేరిరి.
అయితే వేకువజామున యెహోవా ఆ అగ్ని మేఘమయమైన స్తంభము నుండి ఐగుప్తీయుల దండు వైపు చూచి ఐగుప్తీయుల దండును కలవరపరచి, వారి రధచక్రములు ఊడి పడునట్టు చేయగా వారు బహు కష్టపడి తోలుచుండిరి.
అప్పుడు ఐగుప్తీయులు ఇశ్రాయేలీయుల యెదుట నుండి పారిపోదము రండి, యొహోవా వారి పక్షమున మనతో యుద్దము చేయుచున్నాడని చెప్పుకొనిరి.
13ప్రభువు వాక్యము చాలా గొప్పది, దానిని చదువకుండా ఉండలేము. దానిని చదువుచుండగా, అది జీవముగా మారుచున్నది. ఈ రోజు ఉదయము ఈ పాఠ్యభాగములో, ఇది టేపు చేయబడుచున్నప్పటికిని, ఆరంభములో దీనిని చెప్పవలయుననియున్నాను. నాలోనేను కనుగొనుచున్నాను… మరి కారణమేమనగా నేను… నిన్న నేను వాక్యమును ధ్యానించుచుండగా — ఈ పాఠ్య భాగమునకు నేను కొనిరాబడితిని, అప్పుడు నేను తలంచితిని, "నేను ధ్యానించుచుండగా ప్రభువు చిత్తమైనయెడల దానిపై మాట్లాడవలయునని, ఏలయనగా అది నన్ను త్రోయుచున్నది. మరి మనమందరము చూచులాగున అది మనలను అక్కడికి కొనిపోవుచున్నదని నేను నమ్ముచున్నాను, మనము పైకి చూచులాగున చేసి, ఇప్పుడున్న ఈ రోజుకు పోల్చుకొనుచు కొద్దిగా దానిని ధ్యానించుదుము.
EXOD 14:15
14ఈ పాఠమునకు అంశమునకు మూడు పదములను నేను తీసికొనవలననియున్నాను, మరి అవి: మొర్రపెట్టనేల? పలుకుము! దేవుడు ఇక్కడ 15వ వచనములో మోషేతో చెప్పుచున్నారు, "నీవేల నాకు మొర్రపెట్టుచున్నావు? సాగిపోవుడి అని ఇశ్రాయేలీయులతో చెప్పుము. మరి మొర్రపెట్ట నేల? పలుకుము!
ఇప్పుడు, మనకొక పాఠము ఉన్నది, మరి పరిశుద్దాత్మ నడుపులాగున వీలైనంత తర్వలో దానిని నేను ప్రసంగించి ముగించెదెను. నేను తలంచవలయునని… ఈ పాఠములో శ్రమ వేళలో మోషే దేవునితో మొర్రపెట్టుచున్నాడు, మరి తిరిగి దేవుడు మోషేను గద్దించుచున్నాడు, ఎప్పుడనగా శ్రమలు ఉన్న ఆ సమయములో, మరి అది సహజమే, ఒక వ్యక్తి ఆ విధముగా మొర్రపెట్టుట, అప్పుడు మరల తిరిగి దేవుడు అతడిని ఆ విధముగా మొర్రపెట్టుటను ఏ విధముగా ఖండించుచున్నాడో ఎటువంటి గద్దింపు అది, ఆయనతో మొర్రపెట్టినందులకు. అది చాలా కఠినమైన కార్యముగా అగుపించుచున్నది.
2PET 3:9
15అనేక మార్లు లేఖన భాగమును మన యొక్క సొంత జ్ఞానముతో చూచిన యెడల అది చాలా కఠినముగా ఉండును, అయితే మనము ఆ విధముగానే చదువుచూ పోవుచుండినయెడల సర్వజ్ఞానవంతుడైన దేవుడు, ఆయన ఏమి చేయుచున్నారో అని మనము కనుగొనగలము. మరియు ఆయనకు ఈ కార్యములను ఏ విధముగా చేయవలయును, మనుష్యులతో ఏ విధముగా వ్యవహరించవలయునని తెలియును. మునుష్యునిలో ఏమున్నదని ఆయనకు తెలియును. అతని గురించి ఆయనకు తెలియును. మనకు తెలియదు. మన ఆలోచన ప్రకారము మాత్రమే మనకు తెలియును. మనుష్యునిలో నిజముగా ఏమున్నదని ఆయనకు తెలియును.
ఈ ప్రపంచములో ఒక వరపుత్రుడుగా మోషే జన్మించెను. అతడు ఒక విమోచకుడుగా, ఒక ప్రవక్తగా పుట్టెను. ప్రతి వ్యక్తి ఈ లోకములో జన్మించునప్పుడు, ఏ విధమైన ఆ సహజగుణములు కలిగిపుట్టునో, అతను అదే విధముగా తనలో సహజ గుణములు కలిగి జన్మించెను. అయితే నేను ధృడముగా నమ్ముచున్నాను దేవుని యొక్క సర్వజ్ఞానములో, ముందుగా నిర్ణయించబడిన ప్రకారము —
NUM 32:23•
ISA 46:10•
JOHN 6:37,44•
2THS 2:13
16అందరు నశించవలయునని దేవుడు కోరుకొనలేదు, అయితే అందరు మారుమనస్సు పొంది — అయితే ఆయన దేవుడైనందున, ఆది నుండిచివరి వరకు ఆయనకు తెలిసియుండవలయును, తెలిసియుండెను. చూశారా? ఆయనకు ఒకవేళ తెలియకుంటే, ఆయన అంతములేనివానిగా ఉండియుండరు; మరి ఆయన అంతములేనివానిగా ఉండకున్నయెడల, ఆయన దేవుడు కాడు. కావున ఆయన ఎవ్వరైనను నశించవలయునని నిశ్చయముగా కోరుకొనుట లేదు, అయితే ఆయనకు ఎవరు నశింపబడుదురో, ఎవరు నశింపబడరో తెలియును.
ఆ కారణము వలననే — యేసు భూమి పైకి, వచ్చిన ముఖ్య ఉద్దేశము ఏమనగా, దేవుడు తన భవిష్యత్ జ్ఞానములో ఎవరు రక్షింపబడవలయునని కోరుకొనియున్నాడో వారిని రక్షించుటకు, ఏలయనగా సమస్త ప్రపంచము తప్పు అని దండించబడెను. మరి దేవుని యొక్క ముందు నిర్ణయమని, ఆయనకు ఆది నుండి చివరి వరకు అన్నియు ఎరిగియున్నాడని దానిని చెప్పుచున్నాడని, బైబిలు చాలా తేటగా చెప్పుచున్నాడని ఈ కార్యములను ఈ విధముగా కాకుండా వేరే విధముగా బోధించవలయునని నాకు అనిపించలేదు. అందువలన ఒక వ్యక్తి తాను ఆ విధముగా లేకుండా తానేదో ఒక గొప్ప వ్యక్తి అని ప్రయత్నించినయెడల, వారు అట్లు నటించుచున్నారు, అతి తర్వలో మీరెవరని అది బయటపెట్టును. మీ పాపములు మిమ్ములను కనిపెట్టగలవు. మీరు వాటిని మూయలేరు. పాపమునకు ఒకే ఒక మూత ఉన్నది. అది యేసుక్రీస్తు యొక్క రక్తము, అయితే జగత్తుపునాది వేయబడక మునుపే దేవుడు మిమ్ములను పిలిచి యుంటేనే గాని అది ప్రయోగింపబడదు.
అందుకనే రక్తము చిందింపబడెను - త్రొక్కబడుటకు కాదు, పరిహసింస బడుటకు కాదు, చిల్లర కార్యముగా ఎంచబడుటకు కాదు, మరి చెడ్డగా మాట్లాడుట అటువంటి కార్యముల కొరకు కాదు; అది ఒక సరైన ఉద్దేశ్యము కొరకు చిందించబడెను. అది సరియే. దానితో ఆటలాడుటకు కాదు; పాపములు మూయబడకుండ ఉండునప్పుడు, పాపములు మూయబడినవని చెప్పి నటించుట కాదు. జగత్తుకు పునాది వేయబడక మునుపు ఎవరి పేరు గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథములో వ్రాయబడినవో, వారి పాపములు తప్ప ఇతర మనుష్యుల పాపములు మూయబడవు. యేసు ఆయనే చెప్పెను, "నా తండ్రి ఆకర్షించితే గాని ఏమనుష్యుడు నా యొద్దకు రాలేడు, మరి తండ్రి నాకు అనుగ్రహించిన వారు నా యొద్దకు వచ్చెదరు." కావున మీరు వాక్యములను అబద్దము చేయలేరు. అవి సత్యము కొరకు అక్కడున్నవి, మరి సరిదిద్దుటకు ఉన్నవి.
EXOD 1:11•
EXOD 2:1,2•
DEUT 34:1,6•
MATT 2:16,20•
MATT 17:3•
MARK 9:4•
LUKE 9:30
17మరి మోషే విశ్వాసము అను వరముతో పుట్టెను. మోషేకు గొప్ప విశ్వాసముండెను. అతనిని గురించి చెప్పునప్పుడు ఆ కార్యములకు వచ్చెదము. అతను గొప్ప కుటుంబములో పుట్టెను, మరి మనకు తెలియును, ఏ విధముగా అతని తండ్రి మరి తల్లి మరి… లేవీ కుటుంబము నుండి వచ్చెను, ఈ పాఠమునకు మునుపు నిర్గమకాండములో ఆ కార్యము, ఈ యొక్క గొప్ప గుణములు కలిగిన వ్యక్తిని గురించిన జీవిత కథ చాలా అద్భుతముగా ఇవ్వబడెను. బైబిలులో ఉన్న చాలా గొప్ప వ్యక్తులలో ఇతను ఒకడు, అతడు ఖచ్చితముగా ప్రభువైన యేసుకు ఒక మాదిరిగా ఉండెను.
ప్రభువైన యేసు వలె ఇతను పుట్టుక కూడా ఒక వింతైన పుట్టుక; ప్రభువైన యేసు వలె, హింసింపబడు వేళలో అతను పుట్టెను; ప్రభువైన యేసు వలె, అతను విమోచకుడుగా జన్మించెను; ప్రభువైన యేసు వలె, అతను శత్రువుకు తెలియకుండా దూరముగా ఉంచబడునట్లు అతని తల్లిదండ్రుల ద్వారా దాచబడెను; ప్రభువైన యేసు వలె, అతను సేవచేయు వేళలో వచ్చెను; ప్రభువైన యేసు వలె, అతను ఒక నాయకుడు; ప్రభువైన యేసు వలె, అతను ఒక ప్రవక్త; ప్రభువైన యేసువలె, అతను ధర్మశాస్త్రమును ఇచ్చెను.
మరి అతను రాతిపై చనిపోయినాడని తెలిసికొనియున్నాము, మరల అతను లేవవలయును మరి అన్నియు… ఏలయనగా ఎనిమిది వందల సంవత్సరముల పిదప ప్రభువైన యేసుతో మాట్లాడుచు అతను రూపాంతరపు కొండపై నిలుచుకొని యుండెను, చూశారా. దూతలు అతనిని తీసికొనిపోయిరి. అతను ఎక్కడ పూడ్చబడినాడో ఎవరికి తెలియదు; మరి సైతానుకు కూడా తెలియలేదు. మరి స్పష్టముగా, అతను పూడ్చబడినాడని నేను నమ్ముట లేదు. దేవునిని అతను తన జీవితకాలమంతయు వెంబడించిన రాతిపై అతను చనిపోయినప్పుడు, దేవుడు అతనిని కొనిపోయెను అని నేను నమ్ముచున్నాను. అతడు క్రీస్తుకు ఒక పరిపూర్ణ మాదిరిగా ఉన్నాడు. అతను ప్రజలపై రాజుగా ఉండెను; అతను ధర్మశాస్త్రమును ఇచ్చెను; ప్రజలను భరించు వ్యక్తిగా అతనుండెను; క్రీస్తులలో ఉన్న సమస్తమునకు అతను ఒక మాదిరిగా ఉండెను.
EXOD 1:8•
EXOD 2:10•
JOHN 4:18,19
18ఇప్పుడు, అతనిలో ఉన్న మంచి గుణము, గొప్ప వరముతో అతను జన్మించెను. ఆ కార్యమును జీవింప చేయుటకు ఏదో ఒకటి దానిపై ప్రసరింపబడవలయును. జగత్తుకు పునాది వేయబడక మునుపు మనలో ఉంచబడిన ఆ దేవుని విత్తనమును చూడుడి. మరి ఆ వెలుగు ఆ విత్తనముపై పడిన వెంటనే అది దానిని జీవింపచేయును, అయితే మొదట ఆ విత్తనముపై వెలుగు రావలసియున్నది.
ఆ బావి దగ్గర అటువంటి పరిస్థితులలో ఉన్న ఆ చిన్న స్త్రీని గురించి అనేక పర్యాయములు నేను బోధించినట్టు. ఆమె వ్యభిచార స్త్రీగా ఉన్నప్పటికిని, ఆమె జీవితము చాలా హీనముగా ఉన్నప్పటికిని, ఆ పరిస్థితులలో ఆమె ఉన్నప్పటికిని, ఆ పారంపర్యాచారము ఆమెను తాకలేదు. అయితే ఆ వెలుగు ఆమె మొదట తాకినప్పుడు, ఆమె దానిని గుర్తించెను, ఎందుకనగా దానికి బదులిచ్చుటకు అక్కడ ఏదో కార్యముండెను.
కరడు కరడును పిలిచినప్పుడు, ఆ పిలుపుకు ప్రత్యుత్తరమిచ్చుటకు ఒక కరడు ఉండవలయును. మరి మోషే ఇక్కడ ఒక ప్రవక్తగా జన్మించెను, ఫరో అంతఃపురములో ఈ లోకజ్ఞానముతో నిండిన ఒక పాఠశాలలో అతను పెంచబడెను. అతను పెంచబడిన సరో సెతి, యోసేపు ప్రభువు యొక్క ప్రవక్త అని అతనిపై (యోసేపు పై) గౌరవము కలిగిన వ్యక్తి. సెతికి తరువాత రామెసేస్ అను ఫరో వచ్చెను, రామెసేస్ యోసేపును గురించి లెక్క లేకుండెను. ఇప్పుడు అక్కడే కష్టములు ప్రారంభమైనవి — ఎప్పుడనగా యోసేపును గురించి తెలియని ఫరో లేచినప్పుడు.
అయితే ఈ గొప్ప గుణములు - పాఠములోని ముఖ్యమైన భాగమునకు వెళ్ళుటకు ముందు, కొద్దిసేపు ఆ గుణములను గురించి మాటలాడెదము. నేను పాఠ్య అంశమును కూర్చుకొనుటలో నాకొక వింతైన మార్గమున్నది, అటు తరువాత దానిని కట్టెదను, దానిని (ముఖ్యాంశమును) మేము కట్టుచుండగా, ప్రభువా ఈ ఉదయము మాకు సహాయపడుము.
EXOD 3:2
19విశ్వాసమనే గొప్ప వరముతో జన్నించిన మోషే దేవుని యొక్క జనులను విడిపించుటకు మండుచున్న పొద యొద్ధ అభిషేకింపబడి మరి ఆజ్ఞాపింపబడెను. ఇప్పుడు, ఆ వ్యక్తిలో ఉన్న గొప్ప గుణములు చూడుడి! అతడోక కార్యమునకై జన్మింపబడెను. అందులో దేవునికి ఒక సంకల్పము కలదు. ఇక్కడ మీరు కూడుకొనియుండుటకు దేవునికి ఒక సంకల్పము ఉద్దేశము కలదు. మీరు కనుక… ఆ స్థానమునకు వచ్చినయెడల దేవునికిని, మీకును ఎంత శ్రమ తగ్గించినవారగుదురు.
మోషే జన్మించెను (అటు పిదప అతను) అటు తరువాత అతను ఎక్కడ అభిషేకి౦పబడెనో అక్కడికి కొనిరాబడెను. మరి గమనించుడి, ఈ లోకజ్ఞానముతో నింపబడిన విత్తనము అక్కడ ఉండెను, ఈ జనులను విడిపించుటకు తాను జన్మించెనన్న విశ్వాసమంతయు అతనికుండెను, అక్కడ మండుచున్న పొద నుండి ఆ వెలుగు దానిపై పడునంతవరకు అది జీవము లోనికి రాలేదు, ఏదో అతను చదివిన దానిని చూచు వరకు కాదు గాని, అతని తన కండ్లతో దానిని చూచెను - ఏదో అతనితో మాట్లాడెను, అతను తిరిగి దానితో మాట్లాడెను. ఓ, ఏ విధముగా కార్యములను జీవము లోనికి తెచ్చుచున్నది.
20నేను తలంచుచున్నాను, ఏ వ్యక్తి అయినను … లేక స్త్రీ, బాలుడు లేక బాలిక, నేననుకొనుచున్నాను, వారి సొంత జ్ఞానముతో వాక్యము ఇట్లున్నది అట్లున్నది అని అనుకొనినయెడల, వాక్యమును నిజ రూపమునకు కొనవచ్చు ఆ వెలుగును సంధించువరకు వారిలో నిజముగా పరిపూర్ణమైన పునాది లేదు. నేను తలంచుచున్నాను, ఏ సంఘమైనను తన అనుభవములతో, ఎంతటి జ్ఞానముతో నిండుకొని యున్నను, మరి మంచి సిద్దాంతములతో ఉన్నప్పటికిని, ఈ వ్రాయబడిన వాక్యమును నిరూపించు సహజాతీతమైనది వారి జనుల మధ్య బయలుపరచబడి, వారు దానితో మాట్లాడి, మరల అది వారితో తిరిగి మాట్లాడితే గాని, ఆ సంఘము అభివృద్ది పొందదు.
GEN 15:16•
EXOD 3:2•
DAN 9:15•
ACTS 7:6•
1COR 15:51,52•
1THS 4:16
21ఇప్పుడు గుర్తు౦చుకొనుడి, మరి మోషే ఈ మండుచున్నపొదను సంధించినప్పుడు ఖచ్చితముగా ఆ వాక్యము నిరూపింపబడెను. అది వాక్యము. "ఈ స్వరము అంతయు ఏమి" అని మోషే చింతించనక్కరలేదు. ఇక్కడున్నది ఏమిటి? ఎందుకనగా ఆదికాండములో దేవుడు ఇంతకు మునుపే లేఖన భాగములలో వ్రాసియున్నారు, నీ జనులు ఈ పర దేశములో నివసించుదురు, అయితే నాలుగు వందల సంవత్సరముల పిదప వారు తిరిగికొని రాబడుదురు. ఇదే దేశమునకు తిరిగి వచ్చెదరు, అమోరీయులు అక్రమము ఇంకను పరిపూర్ణము కాలేదు.
ఇప్పుడు ఇశ్రాయేలీయులు ఒక అన్యదేశములో నివసించి సరిగా ఆదరింపబడక అక్కడ నాలుగు వందల సంవత్సరములు ఉండెదరు, అయితే దేవుడు ఒక బలమైన హస్తముతో వారిని వెలుపలికి తీసికొనివచ్చును అని వందలాది సంవత్సరములకు మునుపే దేవుడు చెప్పియున్నాడు. కావున మీరు చూడుడి, ఈ మండుచున్న పొదలో మోషే జ్ఞానముతో దీనిని ఎరిగెను, తన హృదయములో జన్మించిన ఆ విత్తనము అక్కడుండెను. మరి అతను వాక్యముతో తనకు గల సొంత జ్ఞానముతో నిండిన అనుభవముతో వారిని విడిపించి బయటికి తీసికొని వచ్చుటకు ప్రయత్నించెను, ఎందుకనగా ఆ కార్యమునకై తాను జన్మించితినని అతను ఎరిగియుండెను. వారు ఇప్పుటికే వాక్యము చెప్పబడినట్లు నాలుగు వందల సంవత్సరములు అక్కడ ఉన్నారని తెలిసికొనియుండెను.
ఇప్పుడు మనకు తెలిసినట్లు, ఒక వ్యక్తి కొన్ని క్షణముల ముందు రాకడ గురించి ఎత్తబడుట గురించి నన్ను అడిగెను. మనకు తెలియును, ఆ కాలమును మనము దాటియున్నామని. ఎత్తబడుట సమయము చాలా సమీపముగా ఉన్నది. మరి మనము ఎదురు చూచుచున్నాము. సంఘములను ఒక్కటిగా లాగి, మనము జీవించు ఈ శరీరములను మార్పు ప్రకృతి బాహ్యమైన బలమును మనకు ఇచ్చు ఆ "ఎత్తబడు విశ్వాసము"నకై నేలపై పడి చనిపోయినవారిని లేపు, లేక వాకిలి ము౦గిట చనిపోయినవారిని తిరిగి జీవమునిచ్చి లేపి మనకు ముందు నిలబెట్టు ఒక దేవునిని మనము చూచుచున్నాము. ఒక వ్యక్తిని పరిపూర్ణముగా తినివేయు కానర్స్ నుండి, ఒక ఆరోగ్యకరముగా బలవంతుడైన వ్యక్తిగా తిరిగి లేపు ఆ దేవునిని చూచునప్పుడు అది జనులకు "ఎత్తబడు విశ్వాసము" ఇవ్వవలసినదిగా యున్నది. మరి ఆకాశము నుండి ఆ వెలుగు మెరుపువలె ప్రసరింపబడి, ఆ బూర ధ్వనించినప్పుడు, క్రీస్తు యొక్క శరీరము శీఘ్రముగా ఒక్కటిగా చేర్చబడి, ఒక్క కణములో మార్పుచెంది పరలోకమునకు కొనిపోబడును.
సరి, ఆ విధముగా ఎదో ఒక కార్యము జరుగ వలసియున్నది, మరి మన బైబిలు పాఠశాలలు దానిని ఉత్పత్తి చేయజాలవు, అయినను వారు తెలివితేటలు గలవారు, కాని నీవు ఆ వెలుగును కలుసుకోవలసియున్నది! నీవు దానిని కనుగొనవలసియున్నది.
EXOD 3:7-9•
ACTS 7:6
22మరియు ఇక్కడ మోషే అతడి యొక్క గొప్ప పిలుపును వాక్యముపై ఆధారము చేసుకొనియున్నాడు, (అది గొప్పదై యుండెను) ఒకానొక దినమున ఈ వెలుగును కలుసుకొనెను, మరియు అదే వాక్యము అతడితో తిరిగి మాట్లాడెను. అప్పుడు అతడి అభిషేకమును పొందెను. అభిషేకించబడెను, అతని లోపల ఏమి ఉండెను — అది అతడి లోపల ఉండెను, తెలివిగలవారు దానిని నమ్మెను, అతనికి దేవునిపై గల నమ్మకమును బట్టిన విశ్వాసము తన తల్లియొద్ద నుండి అతనిని వేరుపరచెను. మరి ఇప్పుడు ఆ వెలుగు ముందర అతను తాకబడినప్పుడు అతను నమ్మునట్లు అది అభిషేకించెను, చూశారా?
ఎటువంటి అభిషేకము అది మరి అతను ఆజ్ఞాపించబడెను. ఇప్పుడు, మనకు తెలియును తన సొంత తెలివితో అతని తల్లి చెప్పిన సంగతులు అతను వినెను. అక్కడ ఏ కార్యములు జరుగబోవునని అతను ఎరిగియుండెను, ఆ రోజులో అతను జీవించుచున్నాడని మరి అతను ఎరిగియుండెను. అయితే ఇక్కడ అతను ఓడిపోయెనని కనుగొనెను, కావున అతను… అతని విశ్వాసము కొద్దిగా దిగజారియుండవచ్చును. అయితే అతను పొద దగ్గర వచ్చినప్పుడు, దేవుడు చెప్పెను, "నేను నా ప్రజల యొక్క మొర్రలను వినియున్నాను, మరి వారి పితరులకు అబ్రహాము, ఇస్సాకు, మరి యాకోబులకు నేను చేసిన వాగ్దానములను నేను గుర్తుంచుకొనియున్నాను, మరి నేను దిగివచ్చియున్నాను."
"నేను - వ్యక్తిగత సర్వనామము, "నేను వారిని విడిపించుటకు క్రిందకు వచ్చియున్నాను."
EXOD 4:2-7,12,17•
JOHN 15:5
23మరి ఇప్పుడు నేను దీనిని చేర్చి చెప్ప వలయునని యున్నాను… అది దేవదూషణ వాలె అగుపించినయెడల దేవా నన్ను మన్నించుము: "మనుష్యుని మూలముగా మాత్రమే నేను భూమిపై క్రియ చేయుట లేదు. నేను ద్రాక్షావల్లిని; మీరు తీగెలు, ఒక మనుష్యుని నేను కనుగొనినప్పుడు మాత్రమే నేను బహిరంగముగా చెప్పుదును, మరియు నేను నిన్ను ఎన్నుకొనియున్నాను, వారిని వెలుపలికి తీసికొని వచ్చుటకు నేను నిన్ను పంపుచున్నాను." చూశారా? ఇప్పుడు గమనించుడి, "నేను నీ నోటితో ఉండెదను మరి నేను ఈ కర్రను తీసికొనుము."
మరి మోషే చెప్పెను, "మీరు నన్ను పంపినారని, మరి మీరు నన్ను అభిషేకించితిరని మరి మీరు ఈ కార్యములన్నియు చేయబోవుచున్నారని వీటినన్నిటిని రుజువును నేను చూడవచ్చునా?"
"నీ చేతిలో ఏమున్నదని?" అడిగెను.
అతను చెప్పెను, "ఒక కర్ర."
"దానిని క్రింద వేయుము." — ఒక సర్పముగా అది మారెను; అతను పరుగెత్తెను.
ఆయన చెప్పెను, "దానిని పైకి తీయము" — మరల అది కర్రగా మారెను.
చెప్పెను, "నీ చెయ్యి నీ రొమ్మున ఉంచుకొనుము" — దానిని వెలుపలికి తీసినప్పుడు, మరి అది కుష్టముగలదై ఉండెను;
మరల నీ రొమ్మున ఉంచుకొనుమనగా, మరి అది బాగుపడెను.
EXOD 3:12,14
24దేవుని మహిమను చూచితిని అని చెప్పెను.
మోషే యొద్ద ఇంక ఏ విధమైన ప్రశ్నలు లేకుండెను. మీరు గమనించిన యెడల అతను తిరిగి ఎన్నడును అరణ్యవాసమునకు పోలేదు. అతడు అభిషేకింపబడెనని అతను ఎరిగియుండెను. అతని హృదయములో ఈ కార్యములన్నియు అతడు ఎరిగి యుండెను. ఈ యొక్క గొప్ప చక్కటి గుణలక్షణములు మరి అవన్నియు అభిషేకింపబడెను. ఇప్పుడు అతను సిద్దముగా ఉన్నాడు. అతను వెళ్ళుటకు సిద్దముగా ఉన్నాడు. ఐగుప్తు తట్టుకు అతను పోవుచున్నాడు. "నేను నీతో కూడా ఉందును" అని దేవుడు చెప్పెను. కావున అంతటితో అది ముగిసినది. "నేను నీతో కూడా ఉన్నయెడల," అను కార్యమును, తన హృదయములో ఉన్న ఈ గొప్ప పిలుపుకు మోషే తెలుసుకొనిన చాలును. మరి ఇప్పుడు, దేవుడు చెప్పెను, "నేను నీతో కూడా ఉందును."
ఇప్పుడు, మోషే చెప్పు దానిని దేవుడు రుజువుపరిచెను. మోషే చెప్పెను, "నేను ప్రభువును కలిసాను." మరియు అతడు చెప్పెను, "మీకు చెప్పుచున్నాను, ఉన్నవాడు అనువాడు నన్ను పంపియున్నాడు." చూశారా?
ఇప్పుడు వారు చెప్పిరి, "ఇదిగో ఒక వ్యక్తి ఇక్కడ, ఇంకొక యూదుడు, చాలా కాలముగా మనలను భానిసత్వము నుండి విడిపించుటకు ఇంకొక ప్రణాళికతో వచ్చియున్న మరియొక మూఢుడు." మరి మీకు తెలియును మరి జనులు బానిసలు లేక దాస్యములో ఉన్నప్పుడు, అనేకులు మాయధారి వేషములతో వారిని విడిపించెదమని వచ్చెదెరు, కావున మోషే — దేవుడు మోషేకు వాగ్దానము చేసెను, "నేను నీతో కూడా ఉందును; నీలో ఉందును. నా మాటలు నీ మాటలుగా ఉండును. నా వాక్యములు నీవు మాట్లాడుము, మరి నేనేమి చెప్పుదునో దానినే చెప్పుము."
EXOD 5:1,2•
EXOD 8:21,24•
EXOD 10:21
25కావున ఇప్పుడు మోషే అక్కడికి వెళ్లి ఈ పిలుపును వారికిచ్చి ఫరో ముందు నిలువబడి, మరి హెబ్రీయుల ప్రభువైన దేవుడు నాతో చెప్పెను, "బిడ్డలను బయటికి తీసికొని రమ్ము," మరి అతడు వారు వెళ్ళుటకు అనుమతింపలేదు. కావున అతను పెద్దల ముందు, ఫరో ముందు ఒక సూచనను చేసెను, మరి దేవుడు చేసిన సూచనలను.
అతను చెప్పెను, "రేపు ఈ సమయమునకు సూర్యుడు అస్తమించును. ఐగుప్తు అంతయు అంధకారముగా ఉండును." కచ్చితముగా అదే విధముగా జరిగెను. మరి అతను చెప్పెను, "ఈగల గుంపులు ఈ భూమిపై అంతయు వచ్చును," మరి అతను తన కర్రను చాపి ఈగలను పిలిచినప్పుడు, ఈగలు వచ్చెను. మరి అతను ప్రవచించెను, ఆయన ప్రవచించిన కార్యములన్నియు అదే విధముగా కచ్చితముగా సంభవించెను… అది దేవుడు, చూచారా.
EXOD 4:12
26అతని పుట్టుక నుండి దేవుడు అతనిని పిలిచెను, గొప్ప విశ్వాసము యొక్క లక్షణములను అతనిలో ఉంచెను, మరి ఆయన దిగి వచ్చి అతనిలో ఉన్న ఆ గొప్ప కార్యమును అభిషేకించి, అతనిని తన వాక్యముతో నింపి, అతడు చెప్పునవి క్రమముగా నిరూపించెను. ఎంతమంది డాంబికులు లేచినను, ఎన్ని ఇతర కార్యములు సంభవించినను; దేవుడు పలుకుచుండెను మరి మోషే గుర్తింపబడెను. మోషే… మోషే ఏమి చెప్పినను దేవుడు గౌరవించెను! ఆ మాటను మీరు ఎన్నడూ మరువకూడదని నేను కోరుచున్నాను. మోషే ఏమి చెప్పినను, దేవుడు గౌరవించెను, ఏలయనగా దేవుని వాక్యము మోషేలో ఉండెను. "నీ నోటితో నేను ఉండెదను. నీవు సరైన కార్యములను పలికెదవు."
ఇప్పుడు, దేవుడు చెప్పునది మోషే మూలముగా ఆయన దానిని మాట్లాడెను, అతడు చెప్పునది నిరూపించబడెను మరియు రుజువుచేయబడెను.
27ఇంకనూ అతని మర్మమైన పుట్టుకను అతని తల్లి ద్వారా అతనికి చెప్పబడెను, ఏ విధముగా విడిపించు సమయమునకు అతని పుట్టుక సమయము ఎంత చేరువలో ఉండెనో చెప్పబడెను. లేవీ పుత్రుడును, కుమారై అయిన అమ్రాము, మరి యాకెబెదు ఒక విమోచకుని పంపవలయునని ప్రార్ధి౦చిరి. వాగ్దానము చేయబడి అది నెరవేరు సమయము సమీపముగా ఉన్నప్పుడు, అది జనులను ఆకలితో ప్రార్ధించునట్లు చేయును. మరి నిస్సందేహముగా యోకెబెదు అనేక పర్యాయములు అతనికి చెప్పియుండవచ్చును. (అతని తల్లి - అతనికి ఉపాధ్యాయురాలిగా ఉండెను మునకు ఆ కథ తెలియును) ఆమె ఏ విధముగా ప్రార్ధించెనో అతనికి చెప్పెను. "మరి మోషే నీవు జన్మించినప్పుడు నీవు సరైన బిడ్డగా జన్మించితివి. నీవు ప్రత్యేకమైన బిడ్డవు. నీ యొక్క పుట్టుకలో ఏదో కార్యము సంబవించెను."
"నేను పిల్లలకు చాలా కాలము క్రిందట ఒక నాటకము వలె దానిని విశదపరచితిని మరి అమ్రాము గదిలో ప్రార్ధించుచుండగా, అతడు ఒక దూత తన ఖడ్గమును బయటికి లాగి ఉత్తరపు దిక్కున దానిని చూపుచుండుటను అతను చూచెను మరియు ఆ దూత చెప్పెను, "నీవు ఒక కుమారుని కలిగెదవు, అతడు దేవుని బిడ్డలను ఉత్తరము నుండి వాగ్దానము చేయబడిన భూమికి తీసికొనిపోవును." చిన్న బిడ్డలకు నాటకము వలె ప్రసంగించితిని, కావున వారు అర్ధము చేసికొనెదరు. పెద్దలైన మీకు పరిశుద్దాత్మ మీకు బయలుపరచును కాబట్టి మీరు గ్రహించుదురు, వారియొక్క జ్ఞానము ఆ స్థానమునకు ఎదగలేదు.
28ఇప్పుడు, అతని తల్లి ఈ కార్యములన్నియు చెప్పినను, మరి అతనికి ఇవన్నియు తెలిసినను, అయినను ఇంకొకరు స్పర్శిచుట కావలసియున్నది. ఉపదేశము బాగానే ఉండెను, అయినను అతనికి వ్యక్తిగత స్పర్శ అవసరమైయున్నది.
ఈ రోజు ప్రపంచమునకు కావలసినది అదే. సంఘమునకు కావలిసినదియును అదే. అందువలననే ప్రతియొక్కరు దేవుని కుమారులుగాను, కుమార్తెలుగాను ఉండవలయునని కోరుచున్నారు. ఆ విధముగా ఉండవలయుననిన మీకు వ్యక్తిగత సంబంధము అవసరమైయున్నది. చూశారా? ఏదో ఒకటి, అది ఏమైనా… వాక్యము సత్యము అని మీకు తెలియును; ఇది సరి అని మీకు తెలియును. అయితే అది మిమ్ములను సంధించినప్పుడు, ఆ కార్యము జరుగులు మీరు అప్పుడు చూచినప్పుడు, అప్పుడు మీరు తెలుసుకొందురు మీరు సరియైన మార్గములో ఉన్నారని. చూశారా? మరి గమనించుడి, అది ఎల్లప్పుడూ లేఖనముల ప్రకారముండును. అది వాక్యముతో సరిగా నిలచును, ఏలయనగా ఇది చేసెను.
అమ్రాము ప్రార్ధన లేఖనములతో ఖచ్చితముగా ఉండెను. వాగ్దానము చేయబడిన వాక్యముతో వారి ప్రార్థనలు ఉండెను. ఆ సమయములో దానిని చేయుదునని దేవుడు వాగ్దానము చేసియుండెను. దానికొరకు వారు ప్రార్ధించిరి, మరి ఇక్కడ సరైన బిడ్డ పుట్టెను. మరియు వారు…
HEB 11:23
29గమనించుడి! ఓ, దీనిని ఏ విధముగా నేను ఇష్టపడుచున్నానో, చూడుడి! చిన్న బిడ్డలందరిని ఫరో మరణమునకు అప్పగించుచున్న ఆ సమయములో, ఖడ్గమునకు వారికి ఎరగా వేయుచు, కావలికాయువాని ఖడ్గము; చిన్నబిడ్డలు మరణించులాగున వారిని పొడిచి చంపి, మొసల్లకు వారిని ఆహారముగా వేసి — చిన్న బిడ్డల దేహములను — హెబ్రీయుల బిడ్డల దేహములు తిని ఆ మొసళ్లు లావెక్కువరకు.
అయితే బైబిల్ చెప్పుచున్నది, ఆ తల్లి తండ్రులు ఫరో బిడ్డలను చంపమని ఇచ్చిన ఆజ్ఞలకు భయపడలేదు. వారు భయపడలేదు ఎందుకనగా ఆరంభము నుండి ఈ శిశువులో ఎదో ఒక ప్రత్యేకతను చూచిరి. ప్రార్ధనకు ఇది ప్రత్యుత్తరము అని వారు చూచిరి.
మరి ఇప్పుడు మోషే జరిగిన కార్యములన్నియును నేపథ్యముగా పెట్టుకొనెను, కావున మోషే ఇశ్రాయేలీయులను విడిపించు కార్యమునకై అతను పంపబడినాడని ఎరిగి యుండెను. చూడుడి, ఆ నేపథ్య కార్యములన్నియు కుప్పవలె ప్రోగెను. మీరేదైనా ఒక దానిని పొందినయెడల మరి, "ఇది జరుగబోవును" అను బైబిలులో చెప్పినదానిని తీసికొనివచ్చిన, మరి ఇక్కడ అది సంభవించి యున్నది. "ఇది ఆ సమయములో ఇక్కడ ఇది జరుగుచున్నది;" "ఇది వాస్తవముగా ఆ సమయములో అక్కడ అవి సంభవించుచున్నది. అప్పుడు అవన్నియు ఒక్కటిగా జతకూర్చబడి మరి మనకొక చిత్రమును చిత్రించును.
30ఓ, ఈ ఉదయము ఈ గుడారము ఏ విధముగా, ఈ వేళలో జనులైన మనము ఏ విధముగా, సోదరుడు నెవిల్, మన తల వెంట్రుకలు నెరయుటను చూచినప్పుడు, మరి మున భుజములు వంగిపోవుచుండగా ఈ ప్రపంచము ఇప్పుడున్నట్లుగా అల్లుకొని, ఊగులాడుటను చూచుచుండగా, మరి ఏ విధముగా మన చుట్టు ఉన్న పరిసరములను చూచుచు, మరి వాగ్దానము సమీపించుచుండుటను చూచునప్పుడు! అది అనేక మార్లు ఎవరైనా వెంటనే గంతులు వేసి దూకి మరి దానిని అర్ధము చేసికొనలేరని నేను అనుకొనుచున్నాను లేదా అర్ధము చేసుకొనవచ్చును, అయితే దానిని గ్రహించి దానిలోనికి వచ్చిన వెంటనే, అది దాదాపు నిత్యజీవమునకు తీసుకొని వెళ్ళును, కేవలము ఒక… అటువంటి ఎత్తబడు కార్యము మరియు దానిని గూర్చి ఎన్నడూ తెలియుదు. ఓ, సరిగా మనము చూచియున్న కార్యయములలోనికి చొచ్చుకొని పోయి, మరి తెలుసుకొని, అర్ధము చేసుకొనిన, మరి ఒకేసారిగా దానిలోనికి వెళ్ళుట. ఒక వ్యక్తి లేక స్త్రీ, బాలుడు లేక బాలిక బహుశా వారి హస్తములను పైకెత్తి మరి చెప్పెదరు, "మేము వెళ్ళెదము, యేసు ప్రభువా." మీరు చూశారా? ఓ, ఆ ఘడియ ఎంత సమీపముగా ఉన్నది!
DAN 9:15•
ACTS 7:6
31ఆ కార్యమునకై తాను జన్మించియున్నాడని తెలుసుకొన్నవాడై, మోషే హెబ్రియలు శ్రమపడుచుండుటను కిటీకీల గుండా చూచి వారిని గమనించెను. లేఖనముల యందు తిరిగి చూచిన మరి అది చెప్పుచున్నది, "మరి వారు నాలుగు వందల సంవత్సరములు వారికి చెందని దేశములో నివసించెదరు; (చూశారా?) అయితే బలమైన హస్తముతో నేను వారిని బయటికి పిలుచుకొని వచ్చెదను." అప్పుడు అతను పని అప్పగింపబడి, అభిషేకింపబడి, అతడు పుట్టేనని ఎరిగి — మరియు అతని యొక్క విశ్వాసము, చూడండి, తన విశ్వాసము ద్వారా ఆ జనులను చూచి, వారు దేవుని బిడ్డలు అని ఎరిగియుండెను, ఏలయనగా వాక్యము ఆ విధముగా చెప్పియున్నది. వారు ప్రపంచమునకు చెందినవారు కారు, తక్కినవారివలె వారు లేరు. వారు వ్యత్యాసముగా ఉండిరి. ఐగుప్తులో ఉన్న గొప్ప ఆకర్షణీయమైన కార్యములకై వీరు పిచ్చివారివలె మరియు మూఢభక్తిగలవారిగాను ఉండిరి, మరి అతను ఫరో యొక్క కుమారుడిగా ఉండి, ఆ రాజ్యమును స్వీకరి౦చు వ్యక్తిగా ఉండెను, అయితే అతను…
అతని అంతరంగమున ఎదో ఒక కార్యముండెను, ఒక నిజమైన విశ్వాసము ఆ కార్యములను చూడలేదు — అతను స్వంతంత్రించుకొనవలసిన ఆకర్షణీయమైన దానిని. అతను దేవుని యొక్క వాగ్దానమును చూచెను, మరి సమయము అతి సమీపముగా ఉండెనని అతను ఎరిగియుండెను. మరి ఆ మనుష్యుడు ఏమని తలంచియుండెను…
32ఒక రోజు దానిని గూర్చి ఆవలి గట్టున నేను అతనిని కలిసినప్పుడు, నేను అతనితో మాట్లాడవలెనని యున్నాను.
మీరు చెప్పవచ్చును, "అది వెర్రితనము, సహోదరుడా…"
కాదు, అది కాదు. దేవుని కృప వలన నేను అతనిని (మోషేను) కలువబోవుచున్నాను. అవును అయ్యా. ఒక రోజు నేను అతనితో మాట్లాడెదను — నేరుగా మోషేతో. మరి ఎట్లు అతనిని
అడుగుటకు ఇష్టపడెదననగా, బహుశా ఏ విధముగా అతని ఏర్పాటు అతను చూచినప్పుడు, ఏ విధముగా ఆ కలవరపాటు, దయ్యము చెప్పినప్పుడు, "ఆహా, నిన్ను జనులు నమ్మరు, ఆహా, దానిలో ఏమీలేదు"
EXOD 2:21,22•
EXOD 3:1-4,10•
LUKE 21:33
33అయితే అక్కడ ఆ విత్తనము జీవమునకు పైకి వచ్చినప్పుడు, అతనిని ఎదో తాకినది, మరి అతను ఎరిగెను ఎదో కార్యము సంభవింపబోవునని అతనికి తెలియును — అది ఏ సమయము అని తన గడియారములో చూచెను, మరి దానిని అతను ఎరిగియుండెను. దానిని అతను గమనించుచుండగా, ఏ విధముగా అతను తలంచియుండవలయును.
ఇప్పుడు, ఇవన్నియు ఒక్కటిగా అతను పొందినప్పుడు, అతను చూచిన ఈ గొప్ప కార్యమును — లేఖనముల సమయమును, తన తల్లి - తండ్రుల ప్రార్ధనను, మరి తన విచిత్రమైన పుట్టుక, ఒక వింతైన బిడ్డ మరి అతనిలో చాలా కాలముగా ఎదో ఉండెను, తన పాఠశాలలో అభ్యసించిన సొంత సైనిక విద్య బలముతో ఆ బిడ్డలను విడిపించగలనని, అయితే అది పనిచేయలేదు. అప్పుడు అతను అరణ్యమునకు పరిగెత్తిపోయి మంచి ఇథియోపియో అమ్మాయిని వివాహమాడి, మరి వారు గేర్షోము అను పేరుగల కుమారుడు కలిగియుండెను.
మరి ఒక రోజు మ౦దను కాచుకొనుచుండగా, ఉన్నట్టు౦డీ కొండపైన మండుచున్న పొదను అతను చూచెను. మరి అతను పైకి అక్కడికి పోయెను, మరి ఒక తెలివితో కూడిన కార్యము కాదు, ఒక ఊహ కాదు, ఒక భ్రమ కాదు, కండ్లతో చూచుమాయ కాదు, అయితే అతనిలో ఒక పొదలో ఒక అగ్నిస్తంభము అక్కడ అబ్రాహాము యొక్క దేవుడు - ఆ అగ్ని అలలవలె పోవుచుండెను, అయితే ఆ పొదను ఆ అగ్ని కాల్చలేదు. మరి లేఖనములలోని స్వరము, దేవుని స్వరము దానిగుండా అక్కడ మాట్లాడి మరి చెప్పెను, "నేను నిన్ను ఎన్నుకొనియున్నాను. నీవే ఆ వ్యక్తివి. ఈ ఉద్దేశము కొరకై నిన్ను నేను లేపియున్నాను. ఇక్కడ సూచనల ద్వారా నేను నన్ను నిరూపించెదను, నీవు క్రిందకు పోయి బిడ్డలను విడిపించెదవు, ఏలయనగా నా యొక్క వాక్యములు నెరవేరవలసియున్నది."
ఓ, ఈ రోజుకైన అతని వాక్యము నెరవేరవలసియున్నది! మనము ఆ ఘడియలో జీవించుచున్నాము. ఎవరు ఏమి చెప్పినను అక్కరలేదు, వాక్యము నెరవేరవలసియున్నది. ఆకాశమును, మరి భూమియు గతించును గాని, ఆయన మాటలు గతించవు.
34ఇప్పుడు, మోషే ఇవన్నియు ఒకటిగా కలిగియుండి, ఒక్కొక్క కోణము ద్వారా మరి చూచెను అది అతని విశ్వాసమును అభిషేకించెను. ఆమేన్! ఓ మై! ఎటువంటి తలంపు. ఇది లేఖనములలో చూపబడిన అదే కార్యము, అదే అదేమిటై యున్నదని నేరుగా చూపించుచున్నది. మరి దేవునిని గురించి పలుకుట, అక్కడ దానిని గురించిన నిదర్శనములు, అవి ఆ కార్యము నిమిత్తమై పోవుటకు అతినిలో ఉన్న విశ్వాసమును అభిషేకించినట్లయిన, అది మనకు ఏమి చేయవలసినదై యున్నది!
మనకు మారుమనస్సు కావలసియున్నది. మనకు ఉజ్జివము కావలసియున్నది. నాకు-నేను చెప్పుకొనుచున్నాను, నాకు ఒక కదలింపు అవసరమైయున్నది. నాకు ఎదో అవసరమైయున్నది. నేను చెప్పాను నాకు-నేనే లేక నన్ను గురించి మాటలాడు కొనుచున్నాను అని. నాకు మేలుకొలుపు అవసరమైయున్నది. మరి ఆ గొప్ప నిదర్శనమును గురించి నేను తలంచినప్పుడు — ప్రతియొక్కటి అక్కడ క్రమముగా ఉంచబడెను. మరి అది మోషే విశ్వాసమును అభిషేకించెను, మరి ఏమియు లేదని అతను చూచెను.
EXOD 2:15
35ఇక్కడ అతడు ఐగుప్తు నుండి పరుగెత్తెను అయితే వీటికి బదులుగా అతను ఒక తిరుగుబాటును లేక ఎదో ఆలాటి కార్యమును మొదటపెట్టి ఉండవచ్చును, మరి అతను లేచి సకలమును తలక్రిందులుగా చేయవలెనని ఒక ఉద్యమమును ఐగుప్తులో మొదటపెట్టి ఒక సైన్యమును తీసికొని మరి పోరాటము చేసియుండవచ్చును, అయితే మీరు చూడుడి… అతనికి వేలాదిమంది ఉండిరి. సైన్యములు అతని పక్క ఉన్నను దానిని చేయుటకు భయపడెను. అయితే ఇప్పుడు నలభై సంవత్సరముల పిదప అతను తిరిగి వచ్చుచున్నాడు, ఎనభై ఏండ్ల వయస్సువాడై తన చేతిలో ఒక కర్రతో. ఎందులకు? అతని హృదయములో దహించు కార్యము నిజరూపమును ధరించెను. అతడు అప్పుడు అభిషేకింపబడెను, మరి ప్రభువు ఈలాగు సెలవిచ్చుచున్నడును తాను కలిగియున్నాడని అతను ఎరిగియుండెను. ఇప్పుడు అతనిని అడ్డుపరచు కార్యము ఏదియును లేదు. అతనికి సైన్యములు అక్కరలేదు. దేవుడు అతనితో ఉండెను. అదే అతనికి కావలసినది - దేవుడు అతనితో ఉండెను.
ఓ, ఒక కార్యమును నిశ్చయముగా చేయుటకు దేవుడు మిమ్ములను పంపినాడని మీరు ఎరిగియున్నయెడల, మరి అది అక్కడ నెరవేరుటను మీరు చూచునప్పుడు, దాని స్థానమును వేరే ఏమియు తీసికొనజాలదు. అది అంతే.
36నాకు గుర్తున్నది మరి ప్రభువు నాతో అనేక కార్యములు సంభవించును అని చెప్పినప్పుడు మరి నేను ముందుకు పోయి అవి అక్కడ జరిగియుండుటను చూచి యున్నాను - ఓ ఎటువంటి అనుభూతి! పరిస్థితి అదుపులోనే యున్నది. అది అంతే, చూశారా? ఏలయనగా దేవుడు దానిని చెప్పియున్నాడు.
నాకు గుర్తున్నది… ఫిన్లాండ్లో చిన్న బాలుడు చనిపోయి లేపబడుట మీలో అనేకులు గుర్తుంచుకొనియున్నారు. మరి అప్పుడు… మోటారు వాహనము ఆక్సిడెంటులో చనిపోయిన అతను తిరిగి లేపబడెను. మరి రోడ్డుకు ఆ ప్రక్కగా నేను నిలుచుకొనియుంటిని మరి అటు ఇటు చూచుచు ఆ బిడ్డ నుండి దూరముగా నడచి వెళ్ళచుంటిని అప్పుడు వెనుతిరిగి చూడగా మరి ఏదో నా భుజముపై పెట్టినట్టుగా ఉండెను మరి నేను సోదరుడు మూర్ అని అనుకొంటిని - మరి ఎవ్వరు నా చుట్టూ లేరు.
మరి నేను వెనుతిరిగి చూసి, ఆ కొండ తట్టు చూడ తొడిగితిని. నేను చూచాను. నేను చెప్పాను, "సరి, ఈ కొండను ఎక్కడో చూచితిని, అయితే ఈ మార్గములో మేమెప్పుడు రాలేదు. వేరే మార్గములో మేము వచ్చియున్నాము. ఆ కొండ ఎక్కడున్నది?" మరి నేను ఆ కారు పగిలి (ఆక్సిడెంటు వలన నలుగగొట్టబడిన) అక్కడ ఉండుటను చూచాను అక్కడ ఆ చిన్న బాలుడు తన… "క్రాప్ వలె తలవెంట్రుకలు కత్తిరించుకొని (మేము ఇక్కడ పిలుచు విధముగా); అక్కడ పడియుండుటను చూచితిని. ఆ రోజు సోదరుడు వే క్రిందపడినట్లు; కండ్లు వెనుకకు త్రిప్పబడి, అతని చిన్న శరీర అవయవములు తిరుగగొట్టబడి, చిన్న పాదము సాక్సుల గుండా పోయి, కన్నుల నుండి, ముక్కు, చెవుల నుండి రక్తము మరి అతని చిన్న నిక్కరు తన నడుము దగ్గర బొత్తాములతో, అతని మేజోడు చాల కాలముగా వాడి పాతదైనట్టు ఆ చిన్న మేజోళ్లు లాగబడి పొడుగాయెను.
37మరి నేను చుట్టూ చూచితిని మరి ఖచ్చితముగా అది అక్కడ - రెండు సంవత్సరముల మునుపు పరిశుద్దాత్మ చెప్పినట్లు సరిగా, దేశములో పలు చోట్ల మీ బైబిళ్లలో ఇది జరుగునని మీరందరు వ్రాసికొనియున్న విధముగా.
ఓ అక్కడ… పరిస్థితి అక్కడ అదుపులో ఉన్నది! అతడు ఎట్లు చనిపోయి ఉన్నను పెద్ద కార్యము కాదు; ఎవ్వరు ఏమి చెప్పినను అక్కర లేదు; అన్నియు ముగిసినది. అతను తిరిగి జీవించవలయును.
నేను చెప్పాను, "చనిపోయిన ఈ బిడ్డ తిరిగి లేవకుంటే అప్పుడు నేను ఒక అబద్దపు ప్రవక్తను; దేవునిని తప్పుగా తెలియపరచుచున్నాను; రెండు సంవత్సరములకు మునుపు నా స్వదేశములో ఆయన ఇది జరుగునని చెప్పెను. "మరి అక్కడ ఈ సువార్త సేవకులందరు మరి అందరు బైబిలులోని మొదటి ఖాళీ పేజీలలో (దేవుడు చెప్పినది) వ్రాసికొనియున్నారు మరి ఇక్కడ ఖచ్చితముగా అది నెరవేరినది. ఆ బైబిలు మొదటి ఖాళీ పేజిలలో చదువుడి ఏ విధముగా రాళ్ళు నిండిన ఒక దేశములో మరి ఆ విధముగా రోడ్డుకు కుడి ప్రక్కగా చంపబడి యుండును. నేను చెప్పాను, "ఇదిగో ఇక్కడ అది; ఏదియును దీనిని ఆపజాలదు." పరిస్థితి అదుపులో యున్నది.
నా హృదయములో ఉన్న విశ్వాసము అభిషేకింపబడెను. ఓ, దానిని నేను వివరింపగలిగియుంటే! ఆ విశ్వాసము… దేవునిలో నాకు కలిగిన విశ్వాసము నాతో చెప్పెను, ఆయన ఎన్నడూ తప్పడు; నాతో చెప్పెను, "ఇప్పుడు అన్ని పరిస్థితులు అదుపులో ఉన్నవి. రెండు సంవత్సరములకు మునుపు నేను చూపినది సరిగా ఇక్కడ యున్నది, మరి ఇక్కడ క్రమముగా ఇది అమరియున్నది. నీవు చేయవలసిన ఓకే కార్యము వాక్యమును పలుకుటయే!" మరి ఆ చిన్న బాలుడు మరణము నుండి లేచెను. చూశారా?
38నేను తలంచుచు తిరిగి ఇక్కడ చూచుచున్నాను. సోదరుడు ఫ్రెడ్ సోత్మాన్ అక్కడ కూర్చొనియున్నాడు, సోదరుడు బేంక్స్ వుడ్ మరి ఇతరులు అలాస్కన్ రహదారిలో ఆ రోజు ఎట్లు నేను ఇక్కడ నిలిచి ఆలయములో మరి మీకందరికి చెప్పాను. జింకను పోలి నలభై-రెండు అంగుళముల కొమ్ములు గల ఒక జంతువు మరియు వెండి మూతి కలిగిన ఎలుగుబంటి. నేను ఇంతకుమునుపు అక్కడికి పోయి యుండలేదు… ఎట్లు ఆ విధముగా దానిని పట్టుకొనెదను, మరి ఎట్లు మరి ఎంతమంది నాతో కూడ యు౦దురు. మరి వారు ఏ విధముగా దుస్తులు ధరించియుందురు. అది మీకు సంభవించును, నీలో ప్రతిఒక్కరు అది సంభవించుటకు అనేక వారముల మునుపు.
మరి అక్కడ అక్కడికి పోయెదనని నాకు తెలియకుండునప్పుడు నేను అక్కడికి పోయినప్పుడు ఆ జంతువు అక్కడ యుండెను. మరి నేను వెళ్ళినప్పుడు… అది అసాధ్యమైనది, ఒక వేటగానికి తెలియును లేక ఈ టేపును ఒకవేళ లేక వినుచుండిన, ఒక జంతువు ముందు మీరు నడువలేరు; అది పైకెగిరి మరి పరుగెత్తును. అయితే అతడు (ఆ మృగము) పరుగెత్తలేదు.
39అక్కడ నా యొక్క మృగముల రూపములో (వేట ఆడిన పిదప మృగముల కొమ్ములు మొదలైనవి పెట్టు చోటు) అతడు వ్రేలాడుచున్నాడు. అక్కడ ఆ వెండి మూతి ఖచ్చితముగా అదే విధముగా… ఒక కొలబద్ద అక్కడ ఉన్నది, కొలుచుటకు ఒక టేపు సరిగా అది చూపుటకు … మరియు ఒక కొమ్ము, సాధారణముగా జంతువులపై కొమ్ములు అవి చనిపోయి ఎండినప్పుడు రెండు అంగుళములు ముడుచుకొనిపోవును. అయితే ఇది ముడుచుకొనిపోలేదు. అది ఖచ్చితముగా నలభై-రెండు అంగుళములు ముక్కుపై యుండెను. చూశారా? ఆ వెండి మొన అక్కడే యుండెను, అది సరిగా ఏడు అడుగుల పొడవు కలిగి, చూపబడినట్లు అన్నియు అట్లే, ఇప్పుడు అక్కడ ఉ౦డెను.
అయితే ఆ వ్యక్తి నాతో చెప్పినప్పుడు, "ఇప్పుడు చూడుడి సోదరుడు బ్రెన్హాం, మీరు చెప్పియున్న ఈ జంతువును మేము తెలుసుకొన్నాము, అయితే మీరు నాతో చెప్పారు. మీరు కొండ క్రిందికి పోవు లోపల అక్కడ కొందరు బాలురు, పచ్చని రంగు చొక్కాలు ధరించినవారు మీరు వెండి మూతి గల ఎలుగుబంటిని కనుగొందురు. (దానిని చూడలేదని ఆ వ్యక్తి ప్రవక్తతో చెప్పుచున్నారు.) నేను చెప్పాను, "అది ప్రభువు ఈలాగు సెలవిచ్చినది. దేవుడు అట్లు చెప్పెను."
"అయితే సోదరుడా బ్రెన్హాం," అతను చెప్పెను, "మైళ్ళ కొలది దూరములో ఇక్కడి నుండి నేను అన్నిటిని చూచుచున్నాను; అక్కడ ఏమియును లేదు. ఆ జంతువు ఎక్కడ నుండి వచ్చును?"
40నేను చెప్పాను, "ప్రశ్నించుట నా కొరకైన పనికాదు. దేవుడు అట్లు చెప్పి యున్నారు, మరి ఆయన యొహోవా యీరే ఒక ఎలుగుబంటిని ఆయన తీసికొని రాగలడు. అక్కడ ఒక దానిని ఆయన ఉంచగలడు." మరి ఆయన చేసెను, మరి అతడు అదిగో అక్కడ.
ఆ పరిస్థితి అదుపులో ఉన్నది. మరి మోషే ఈ కార్యమునకై లేపబడినాడని చూచినప్పుడు, మరి అతను పిలుపును ఇచ్చిన ఆ గొప్ప దేవుని ముఖాముఖిగా సంధించెను, ఆ గొప్ప దేవుడే అతనిని అభిషేకించెను, మరి అతనిని గుర్తించెను, మరి చెప్పెను, "ఇది నీ యొక్క పిలుపు పై యున్నది, మోషే నేను నిన్ను పంపించుచున్నాను. నా యొక్క మహిమను నీకు చూపించబోవుచున్నాను, మరి ఇక్కడ నేను మండుచున్న పొదలో ఉన్నాను. నీవు క్రిందకు పొమ్ము; మరి నేను నీతో కూడా ఉందును." అతనికి ఒక కర్ర కూడా అక్కరలేదు. అతని యొద్ద వాక్యముండెను, నిరూపింపబడిన వాక్యము. అక్కడికి అతడు వెళ్ళెను.
అతనిలో ఉన్న విశ్వాసమును అది అభిషేకించెను. జరుగుచున్న అన్ని సూచక క్రియలు, కడపటి దినములలో మనము జీవించుచున్నామని మనము కనుగొని చూచిన యెడల మరి అది మనలను అభిషేకించును. కడపటి దినములలో అవన్నియు జరుగునని లేఖనముల యందు అని పలుకబడియున్నవి. పరలోకము నుండి రాజకీయ శక్తుల వరకు, మరి జనుల యొక్క స్వభావము మరి ప్రపంచము దుర్నీతితో మరి స్త్రీల మద్య (నీతిలేని కార్యములు) కడపటి దినములలో వారు మరి ఏ విధముగా ఉండెదరు - మరి పురుషులు ఎట్లు౦డెదరు, సంఘములు ఏ విధముగా ఉండును, రాజ్యములు ఏ విధముగా వ్యవహరించును, మరి దేవుడు ఏ విధముగా చేయును. మరి ఇదంతయు ఇక్కడ మనపైనుండుటను మనము చూచుచున్నాము.
ఓ, అది మన విశ్వాసమును అభిషేకించుచున్నది. గొప్ప దశ - దశలుగా అది మనలో కదలాడుచున్నది, చూడుడి. ప్రపంచములోని ఇతర కార్యములతో అది మనలను వేరుపరచుచున్నది, చూశారా. మనము ఎంత కొద్దిగా ఉన్నప్పటికిని, పరవాలేదు; మనము ఎంత అల్ప సంఖ్యలో ఉన్నను; మనము ఎంతగా ఎగతాళిచేయబడినప్పటిని అది ఏ వ్యత్యాసము చేయదు. అది అంతయు అంతే. మనము దానిని చూచుచున్నాము, మనలో ఎదో కార్యమున్నది. ఈ వేళను చూచుటకు మనము ముందే ఎన్నుకొనబడియున్నాము, దానిని చూచుటకు మనలను ఏ కార్యము అడ్డుపరచదు. ఆమేన్! నిశ్చయముగా, దేవుడు దానిని మాట్లాడియున్నాడు. అది ఇంతకు మునుపే సంభవించియున్నది. మనము దానిని చూచి యున్నాము. ఓ, దీని కొరకు ఏ విధముగా మనము దేవునికి వందనములు తెలిపెదమ! ఓ! ఇక్కడ ఈ కార్యములు నెరవేరుటను మనము చూచునప్పుడు, అప్పుడు అది మీ విశ్వాసమును బయటికి కొనివచ్చును.
HEB 11:26
41ఇప్పుడు, మరల మనము చదివియున్నాము. మోషే ఐగుప్తు ధనము కంటె క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచెను. ఇప్పుడు క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచెను. ఇప్పుడు గుర్తుంచుకొనుడి: క్రీస్తు విషయమైన నింద. చూశారా?
క్రీస్తును సేవించుటను బట్టి వారికి నిందలు. మీరు ప్రపంచములో చాలా పేరు ప్రఖ్యాతులు గలవారిగా ఉన్నయెడల అప్పుడు మీరు సేవ చేయలేరు - మీరు క్రీస్తును సేవించుట లేదు. లేదు. మీరు చేయలేరు, ఎందుకనగా మీరు చూడుడి, దానితో కూడా నిందవచ్చును. ప్రపంచము యొద్ద ఎప్పుడు నింద కలదు.
వెయ్యేండ్ల సంవత్సరములకు మునుపు దానితో కూడ నిందయు వెళ్ళెను మరి మోషే ఫరో కావలసినవాడు (ఫరో కుమారుడు గనుక అతడు ఫరోగా రావలసియుండెను), ప్రజలందరి మధ్య దయను పొందినవాడై అతడు రాబోవు ఫరోగా ఉండెను, మరి అయినప్పటికి అతడు గొప్పదని ఎంచెను. ఐగుప్తు ఇచ్చు అన్ని కార్యముల కంటెను క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని అతడు ఎంచెను. ఐగుప్తు అతని చేతిలో ఉండెను. అయినను క్రీస్తు మార్గము ఎన్నుకొనుట నిందయని అతనికి తెలియును, అయితే అతనిలో ఏదో కార్యమున్నదని తెలుసుకొనుటలో చాలా ఆనందపడెను, అదే క్రీస్తు విషయమైన నింద గొప్పదని ఎంచులాగున అతనికి చేసెను. క్రీస్తు విషయమైన నిందకంటె … అతడు అలవరచుకొనిన లేక నేర్చుకొనిన అన్ని మాయమైన ఈ లోకకార్యముల కంటెను గొప్ప అని (తలంచెను). ప్రపంచములో అతడు పొందిన వారసత్వముగా పొందిన కార్యముల కంటెను అతని లోపల ఉన్న స్వస్థ్యము ఎన్నో రెట్లు గొప్పది.
42ఓ, ఈ రోజు మనము ఆ విధముగా ఉండి మరియు మనలో ఉన్న ఆ కార్యమును పరిశుద్ధాత్మ అభిషేకించునట్లు చేసినత్లైతే, ఆ విశ్వాసము, దైవికమైన జీవితము, క్రీస్తుకు అర్పించినట్లయితే.
ఇప్పుడు, అతనికి గల ఈ విధమైన విశ్వాసముతో అతడు నిందను ఒక గౌరవముగా ఎంచెను.
ఈ రోజు ఎవరైనా చెప్పిన, "ఏయ్, ఆ జనులలో నీవు ఒక్కడివా? వారిలో ఆహా…?"
"సరి … ఆ … హా …"
దానిని గురించి మీరు కొద్దిగా సిగ్గుపడుచున్నారు. అయితే అతడు దానిని ప్రపంచము కంటెను గొప్ప ధనముగా ఎంచెను, ఏలయనగా అతనిలో ఏదో కార్యముండెను. దానిని అతడు పలికి మరి చెప్పగలడు, "అవును, నేను దీనిని ఎంచుచున్నాను. ఇది చాలా మేలైన ఘనత వహించినది. వారిలో ఒకడిగా ఉండుటకు నేను ఆనందించుచున్నాను." చూశారా? "నేను ఒక ఐగుప్తీయుడిగా కాక ఒక హెబ్రీయునిగా నన్నునేను ఎంచుకొనుటకు నేను ఇష్టపడుచున్నాను."
43ఈ రోజు క్రైస్తవులు అదే కార్యమును చెప్పవలయును: ఈ లోక క్రమమును ఈ లోక కార్యములను వదులుకొని "నేను ఒక క్రైస్తవునిగా ఎంచబడుటకు ఆనందించుచున్నాను." ఎదో ఒక సంఘసభ్యుడిగా కాదు, అయితే లేఖనముల ప్రకారము జీవించు, తిరిగి జన్మించిన ఒక క్రైస్తవునిగా, సంఘ సభ్యుల ద్వారా ఒక మూఢభక్తి గలవానిగా నేను పిలువబడినప్పటికిని, నేను దానిని గొప్పగా ఎంచెదను. దేశములో లేక నగరములో నేను చాలా పేరుప్రతిష్టలు గలవానికంటెను దీనిని గొప్పగా ఎంచెదను. అమెరికా దేశమునకు అధ్యక్షుడిగా లేక ఈ భూమికంతటికి రాజుగా ఉండుట కంటెను నేను ఆ విధముగా ఉండెదను. (మీరు చూశారా?) నేను దానిని చాలా గొప్పగా ఎంచెదను, ఏలయనగా దేవుడు తనయొక్క దయ వలన జగత్తు పునాది వేయబడక మునుపే నన్ను చూచి నాలో ఒక చిన్న విత్తనమును అక్కడ ఉంచి, ఈ ప్రపంచ కార్యముల కంటెను నా యొక్క విశ్వాసముపైకి ఎగురులాగున, మరి ఇప్పుడు ఆయన నన్ను పిలిచెను, మరి నా యొక్క స్థానమును నేను ఎరిగియున్నాను -
44పౌలు చెప్పిన విధముగా అతని కార్యక్రమమును అతను ఎరిగియుండెను - చాలా గొప్పగా. ఓ ఆ దేవుడు గొప్ప వేద ఉపాధ్యాయుడైన గమాలీయేలు యొద్ద నుండి అతనిని పిలిచెను, అయితే క్రీస్తు కొరకు బలిగా పౌలు పిలువబడెను.
ఇప్పుడు, అదే కార్యము. గమనించుడి, మరి అటువంటి విశ్వాసముతో తాను ఏమి చూచుచున్నాడను కార్యము పై అతడు నమ్మకముంచలేదు. ఇప్పుడు, అతడు అక్కడ బంకమన్ను తొక్కునట్టి ప్రజలను, భానిసలను, ప్రతిరోజు చంపబడు వ్యక్తులను, జారీలతో కొట్టబడి, అపహ్యసించబడు వారిని తప్ప వేరే ఏమియు చూడలేదు. వారి యొక్క మత నమ్మకము మూఢ భక్తిగా ఉండెను. వారి మతమును గురించి తెలియని లేక ఎరుగని ఒక ఫరో అక్కడ మరి సింహాసనముపై కూర్చుండియుండెను. అతనికి దానిని గురించి ఏమియు తెలియదు. అతడొక విగ్రహారాధికుడు, కావున అతనిని అంటే …
ఈ రోజు వలె చిత్రీకరింపబడి యున్నది. మరి అక్కడే వున్నది ఒక వ్యత్యాసమైన మతము మరి ఏ విధముగా ఈ మోషే, ఆధ్యక్షుడు లేక గొప్ప వ్యక్తి అయిన ఫరోతో సింహాసనాసీనుడై యుండెను, అతను చనిపోయిన పిదప, అతడు వృద్దుడైనందు వలన అతని స్థానమును తీసికొనవలసినవాడు. మరి అయినప్పటికిని మోషే తలంచెను, ఆ పిలుపు… అతడు బయట అక్కడ చూచెను. మరి ఫరో బయటికి చూచిన అదే కిటికీ గుండా, ఏలయనగా అతను తన గృహములో ఉండెను. మరి ఫరో బయటికి చూచి చేతులు పైకెత్తు ఆ ప్రజలను, వారు ప్రార్ధించుట వలన కొరడాలు ఎత్తి వారిని చనిపోవువరకు కొట్టుట చూచెను. వారి యొక్క క్షీణించిన ఆ శరీరములకు సరిపడ్డ ఆహారమునియ్యక వారు ఆజ్ఞలకు లోబడునప్పుడు వారి లోపలికి కత్తులను పోనిచ్చిరి. సరి, వారు ఏమియు కానివారు అయితే ఒక మూఢభక్తిగల గుంపు, మనుష్యులుగా లెక్కింపబడలేదు;
1COR 11:15•
1TIM 2:9
45అయినను మోషే ఆతనిలో ఉన్న విశ్వాసము వలన వారిని చూచి మరి అతను చెప్పెను, "వారు దేవునిచే ఆశీర్వదింపబడిన ప్రజలు." ఆమేన్. నేను దానిని ఇష్టపడుచున్నాను.
మరి అటువంటి విశ్వాసముతో… ఐగుప్తు యొక్క మాయమైన కార్యములపై అతని దృష్టి పడలేదు; దేవుని యొక్క వాగ్దానముపై అది పడెను. ఐగుప్తు యొక్క మాయమైన కార్యములకంతటికి పై అతని విశ్వాసమనే పక్షిరాజు కన్నులు చూచెను. అతడు ఇప్పుడు ఒక పక్షిరాజుగా మారుచున్నాడనుటను మీరు గుర్తుంచుకొనుడి; అతడొక ప్రవక్త మరి అతని యొక్క పక్షిరాజు చూపు ఈ కార్యములకు పైన చూచెను. ఓ, దానిని ఎంతగా నేను ఇష్టపడుచున్నాను!
ఈ రోజు కూడా… ఈ రోజు క్రైస్తవులు వారి విశ్వాసమునకు బదులుగా వారేమీ చూచుచున్నారో, లేక వారేమి అర్ధము చేసికొనుచున్నారో అను ఇంద్రియములపై ఆధారపడుచున్నారు — మీ కండ్లతో మీరు చూచు మాయమైన కార్యములపై ఆధారపడియున్నారు. ఎట్లనగా స్త్రీలైన మీరు —మీ తల వెంట్రుకలను ఎల్లప్పుడు పెంచుకొనవలయుని నేను ఎల్లప్పుడు మీకు చెప్పుచున్నాను. మీరు మేకప్ వేయకూడదు; మీరు గౌరవింపతగిన స్త్రీలవలె మరియు క్రైస్తవులవలె నడుచుకొనవలయును. ఈ రోజు స్త్రీలు ఏ విధముగా అసభ్యముగా దుస్తులు ధరించుచున్నారో వీధులలో మీరు చూడుడి. సరి, మీరు అనుకొనవచ్చు, "సరి ఆమె సంఘమునకు చెందినదని; నేనేల ఆ విధముగా చేయలేకున్నాను?" చూశారా? "మరి ఆమె తన తలవెంట్రుకలు కత్తిరించుకొనును; నేనేల దానిని చేయలేకున్నాను? సరి, ఆమె చూచుటకు చాలా మంచిగాను, జ్ఞానవంతురాలివలె ఉన్నది… మరి ఆమె యొద్దనున్న వ్యక్తిత్వము నా యొద్ద లేదు. సరి, నేనేల దానిని చేయలేకున్నాను? నేను దానిని చేసితీరవలెను." మీరు దానిని చేసినయెడల, మీరు మీ విశ్వాసమును స్తంభింపజేయుచున్నారు. చూశారా? మీ విశ్వాసము ఎదుగుటకు మీరు ఒక అవకాశము ఇవ్వకున్నారు. దానిపై ఆరంభించుడి. (విశ్వాసమొదుగుటకు అవకాశమియ్యుడి)
నేను చెప్పిన విధముగా…
46ఎవరో చెప్పారు, "సోదరుడా బ్రెన్హాం, దేశము — ప్రజలు మిమ్ములను ఒక ప్రవక్తగా ఎంచుచున్నారు. మీరు ఈ కార్యముల కొరకు పురుషులను స్త్రీలను ఆ విధముగా అరుచుట మీకు తగదు. ఏ విధముగా ప్రవచింపవలెను మరి ఎట్లు వరములను పొందవలయును మీరు వారికి బోధించుట తగును."
నేను చెప్పాను, "వారి మొదట అక్షరములైన అ, ఆ, ఇ, ఈలు తెలియని యెడల వారికి ఏ విధముగా భీజగణితము భోదింపగలను?" ఇప్పుడు అక్కడ నుండి ప్రారంభించుడి. మిమ్ములను శుద్దీకరించుకొనుడి, కావున మీరు వీధిలో నడచునప్పుడు మీరు ఒక క్రైస్తవులవలె అగుపించెదరు, చూశారా? మరి ఆ విధముగా మీరు నటించలేరు, చూశారా? మీకు-మీరే ఆ విధముగా చేయలేరు. క్రీస్తు మీలోనికి రావలయును, మరి ఆ యొక్క విత్తనము అక్కడుండిన యెడల, ఆ వెలుతురు దానిని తాకినప్పుడు, అది జీవములోనికి వచ్చును. అది జీవములోనికి రానియెడల, అక్కడ జీవములోనికి వచ్చుటకు ఏమి లేదని అర్ధము, ఏలయనగా అనేక ఇతరులపై అది సరిగా నెరవేరబడినది. వెలుగు దానిని తాకిన వె౦టనే అది జీవము లోనికి వచ్చును.
MATT 10:25•
JOHN 4:25
47అది స్త్రీలకు ఒక గద్దింపుగా ఉన్నది, నాకు తెలియును, ఈ టేపు వినుచున్న వారికి లేక వినబోవువారికి, సోదరీ, ఇది మీకొకగద్దింపు. అది అట్లుండవలయును, అది అట్లుండవలయును, ఏలయనగా ఇది చూపించుచున్నది… మీరేమి చేసినారో నాకక్కరలేదు. మీ జీవితకాలమంతయు మీరు భక్తిగా ఉండియుండవచ్చును. సంఘములో మీరు జీవించియుండి ఉండవచ్చును, మీ తండ్రి ఒక దైవసేవకునిగా ఉండవచ్చును, లేక మీ భర్త ఒక దైవ సేవకునిగా ఉండ వచ్చును, అయితే మీరు దేవుని వాక్యమునకు అవిధేయత చూపినంతవరకు, అది అక్కడ వెలుగు లేదని చూపించుచున్నది. మీరు ఆ పరిశుద్దాత్మ యొక్క జీవితము బయటికి కొనిరాబడినప్పుడు, ఇతరులను అది తాకినప్పుడు గమనించుడి. వారు ఏమి చేయుదురో చూడుడి. అది వారిలోను తెచ్చినయెడల… ఆశ్చర్యపడనక్కరలేదు.
ఎటువంటి గద్దింపు ఆ పరిసయ్యలకు, యేసు వారి తలంపులను గ్రహించినప్పుడు, ఆయనను "బయెల్జెబూ" అని పిలిచారు, అయితే ఆ చిన్న వ్యభిచారి చెప్పెను, "ఎందులకు, ఈయన మెస్సీయా, ఆయన దీనిని చేయునని లేఖనములు చెప్పుచున్నవి." చూశారా? ఆ ముందుగా నిర్ణయి౦పబడిన విత్తనము అక్కడుండెను. మరి ఆ వెలుగు దానిని తాకినప్పుడు అది జీవములోనికి వచ్చెను.
దానిని మీరు అణిచిపెట్టలేరు, జీవమును మీరు దాచలేరు. మీరు సిమెంటు కంకరను గడ్డి పెరుగు చోటు గడ్డిపైన చలికాలములో ఆ గడ్డినంతటిని చంపిన పిదప, అటుపిదప వసంతకాలములో ఆ గడ్డి మరల ఆ కాంక్రీటు (సిమెంటు గచ్చు) చుట్టు పెరుగుట చూచెదరు, ఏలయనగా ఆ బీజము ఆ రాయి క్రింద నుండి మరి సూర్యుడు ప్రకాశింప మొదటపెట్టినప్పుడు, దానిని మీరు అదిమి ఉంచలేరు. అది దేవుని మహిమార్దమై అటు - ఇటు మార్గము చూచుకొని వెలుపలికి వచ్చి దాని తల నిటారుగా పైకి నిలుచును. చూశారా, మీరు జీవమును దాచలేరు.
వృక్షములలో గల జీవమును సూర్యుడు తాకినప్పుడు అది జీవించవలసినదిగా ఉండును.
MATT 5:28•
ROM 3:4
48మరి పరిశుద్దాత్మ ఒక వ్యక్తిలో గల వాక్యమనే జీవమును తాకినప్పుడు, అక్కడ అది దాని ఫలములనిచ్చును. కావున మీరు ఎంత సత్యముగా, నమ్మకముగా ఉన్నను, మీరు మాటలాడలేదని ఏ విధముగా మీరు చెప్పినను… ఈ స్త్రీలు ఈ అసహ్యమైన
దుస్తులు ధరించుచున్నారని అక్కడ మరి అలాటి కార్యములన్నియును, అవి వీధులలో అర్ధనగ్నము సర్వసాధారణమని మీరు చెప్పవచ్చును; మీరు ఆ విధముగా ఉన్నారని మీరు నమ్మకుండా ఉండవచ్చును, మీరు మిమ్ములను నమ్మునట్లుగా చేయలేరు. మీరు వ్యభిచారములో నిర్దోషి అని మీరు నిరూపింపవచ్చును, అయితే దేవుని గ్రంధములో మీరు వ్యభిచారము చేయుచున్నారు. యేసు చెప్పెను, "ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడు తన హృదయములో అప్పుడే ఆమెతో వ్యభిచరించినవాడగును. మరి ఆ విధముగా మీరు మిమ్ములను బహిర్గతపరచి యున్నారు. చూశారా, అక్కడ ఆ జీవము ఉంటేనే గాని మీరు దానిని చూడలేరు.
మీరు ఎవరినైనను చూచి చెప్పవచ్చు, "మంచిది, సోదరి జోన్స్ ను నేను ఎరుగుదును — సోదరుడు జోన్స్ ఒక వాక్యపరిచారకుడు, అతని భార్య ఇది మరి అది చేయును." అదేమి చేసినను నేను లెక్కచేయను, ఇది వాక్యమై యున్నది.
యేసు చెప్పెను, "ప్రతియొక్క మనుష్యుని మాటయు అబద్దము మరి నా మాటలు సత్యము." అది బైబిలు, మరి ఆ వెలుగు నిజముగానే దానిని తాకినయెడల, అది జీవములోనికి రావలసియున్నది. అది అచ్చట జీవములోనికి రావలసియున్నది.
LUKE 12:32
49ఇప్పుడు, మోషే యొక్క గొప్ప కన్నులు, అతని పక్షిరాజు దృష్టి ఐగుప్తు మాయలోక కార్యములకు పైగా చూచెను. ఒక నిజమైన క్రైస్తవ విశ్వాసి, సంఘమేమి చెప్పినను లెక్క చేయడు, ఎవరు ఏమి చెప్పినను, ఆ వెలుగు దానిని తాకినప్పుడు, దేవుడు తన్ను నిరూపించుటను వారు చూచుచున్నారు. ఆ అగ్నిస్తంభము అక్కడ వ్రేలాడుచు, సూచనలతో, అద్భుతములతో, వాక్యము దానిలోపల ఉన్నదని వాగ్దానము చేయబడిన ఆ కార్యము జీవమునకు వచ్చును. అది ఎంత స్వల్పముగా ఉన్నను మరి ఎంత తక్కువ సంఖ్యలో ఉన్నను లెక్కలేదు — దేవుని బిడ్డలు ఎల్లప్పుడును అల్ప సంఖ్యలో ఉందురు. చూశారా?
"చిన్న మందా భయపడకుడి, మీకు రాజ్యము అనుగ్రహించుటకు మీ తండ్రికి ఇష్టమైయున్నది." చూశారా? వారు దానిని పట్టుకొనిరి. ప్రతి సంఘ శాఖ నుండియు, ప్రతి క్రమము నుండీయు, అన్ని చోట్లనుండియు దానిలోనికి పంపించుటకు దేవుడు బద్దుడైయున్నాడు; వారు జీవమునకై నియమింపబడియున్నారని చూచుటకు.
LUKE 2:26,29,30,37,38•
1PET 3:20
50వృద్దుడైన సుమెయోనును చూడుడి, జీవమునకై నిర్ణయించబడెను. మెస్సీయా ఆలయములోనికి వచ్చినప్పుడు, ఒక చిన్న శిశువుగా తన తల్లి చేతులలో, సుమెయోను ఎక్కడో వెనుక ఒక గదిలో చదువుకొనుచుండగా, పరిశుద్దాత్మ అతనిని లేపెను, ఏలయనగా అతడు కాచుకొనియుండెను. ఆ జీవము అతనిలో ఉండెను. అతను చెప్పెను, "ప్రభువైన క్రీస్తును చూచువరకు నేను చావను." మరి అక్కడ ఆలయములో ప్రభువైన క్రీస్తు వచ్చెను. పరిశుద్దాత్మ అతను పనిచేయవలసిన ఆ స్థలము నుండి బయటికి తీసికొనివచ్చి అతను అక్కడ నడిచి ఆ శిశువును ఎత్తికొని మరి చెప్పెను, "నీ దాసుని సమాధానముతో పోనిచ్చుచున్నావు, ఏలయనగా నీ రక్షణ నేను కన్నులార చూచితిని."
రాత్రింబగళ్ళు ప్రభువుకు సేవచేయు వృద్ధురాలను, గ్రుడ్డిదైన అన్న అని పిలువబడు ఒక స్త్రీయును ఆ మూలయందుండెను. ఆమె కూడ జరుగబోవు కార్యమును ముందే తెలుపుచు మరి చెప్పుచుండెను, "మెస్సీయ వచ్చుచున్నాడు. ఆయన రాకడను నేను చూచుచున్నాను." ఆమె గ్రుడ్డిదైనప్పటికిని మరి అదే సమయములో ఆయన అక్కడున్నప్పుడు ఆమెలో ఉన్న ఆ చిన్న జీవము అది అక్కడుందునని ఎదురుచూచుచుండెను; ముందుగానే చెప్పుచు ఉండెను, అదక్కడ ఉందునని; అదక్కడ ఉందునని. అప్పుడు అదే వెలుగు, ఆ వెలుగు ఒక శిశువు రూపములో ఆ కట్టడములోనికి వచ్చెను, ఒక అక్రమమైన పద్దతిలో పుట్టిన బిడ్డగా, పొత్తిగుడ్డలతో చుట్టబడి, ఆ కట్టడములోనికి వచ్చుచున్నప్పుడు మరి ఆ పరిశుద్దాత్మ ఆ వృద్ధురాలైన, గుడ్డి ఆమెను తాకినప్పుడు, ఆమె ఆత్మ ద్వారా అక్కడికి ప్రజల యొద్దకు నడిపింపబడి, మరి అక్కడ ఈ శిశువు యొద్ద నిలువబడి మరి తల్లిని, శిశువును దీవించి మరి దానియొక్క భవిష్యత్తేమిటో అని చెప్పెను. చూశారా? — జీవమునకై నిర్ణయింపబడినది. చూశారా? వారిని గమనించుడి. వారు ఒక డజను మంది అయినను లేరు.
నోవహు దినములలో ఎనిమిది మాత్రమే రక్షింపబడిరి. అనేకులు కాదు, ఆ సమయములో జీవమునకై నిర్ణయింపబడిన అన్నియు లోపలికి వచ్చెను. ఒక్కొక్క యుగము లేక కాలములో పరిశుద్దాత్మ ఎట్లు పని చేయుచున్నాడో చూడుడి? — జనులను ఆకర్షించుట.
GEN 13:10,11
51ఇప్పుడు, మోషే విశ్వాసము ఏమి జరుగనుయున్నదో దానికై అతనిని నడిపించెను, కాని ఏమి జరిగినదో దానికి కాదు. ఈ రోజును చూచుట కంటెనె రేపటి దినమును చూడుడి. మాయమైన కార్యముల కంటెను వాగ్దానమును గమనించుడి. స్థాపింపబడిన సంఘ శాఖలను చూచుటకు బదులు జనులను గమనించుడి. చూశారా? దేవుడు ఆ విధముగా చేసియున్నాడు.
లోతు సొదొమలో ఉన్న ఆ మాయమైన అభివృద్ధిని చూడగలిగాడు. ఎక్కువ ధనమును సంపాదించగలుగుటను చూడగలిగెను లోతు. లోతు సోదొమకు పోయి అక్కడ తాను ప్రసిద్ధి పొందుటకు ఉన్న అవకాశములను చూడగలిగెను .అతడొక హెబ్రీయుడుగా ఉన్నందువలన, అతడు అధిక తెలివిపరుడుగా ఉన్నందువలన, అబ్రాహాము యొక్క సోదరుని కుమారుడుగా ఉన్నందువలన అతను గొప్ప వ్యక్తి గా అక్కడ సొదొమ తట్టుకు పోవుటకు ఎన్నుకొనెను.
లోతు యొక్క జ్ఞానము ఆకర్షణీయమైన అభివృద్ధిని చూచుటకు నడిపింపబడెను. లోతు యొక్క జ్ఞానము ఆకర్షణీయమైన ఆశీర్వాదములను చూచుటకు కొనిపోయెను. అయితే అతని విశ్వాసము ఏ విధముగా స్త్రంభించిపోయెననగా, ఆ విధమైన జీవితమును అగ్ని వచ్చి దహించివేయబోవుచున్నదని అతడు చూడలేకపోయెను. ఈ రోజు ప్రజలు ఆ విధముగానే యున్నారు. ఒక గొప్ప సంఘ శాఖకు చెందవలయునన్న అవకాశములను వారు చూచుచున్నారు. నగరములోని జనులతో ఒక సాంఘిక హోదా కలిగియుండవలయునన్న అవకాశములను వారు చూచుచున్నారు, అయితే వారు అవకాశమును చూడలేక… వారు వారియొక్క విశ్వాసము స్తంభించినదని చూడలేకపోయిరి.
అది అపార్ధము చేసికొనకుండ దానిని మరల నేను తిరిగి చెప్పుచున్నాను. ఈ రోజు స్త్రీలు సినిమా తరాల వలె నటించుటకు కోరుచున్నారని నేను చెప్పుచున్నాను. పురుషులు టెలివిజన్ లో నటించు హాస్యనటుడిగా వారు నడుచుటకు కోరుచున్నారు.
52ప్రసంగీకులు ఈ రోజు నవీన లాడ్డిల వలె వారి సంఘములను తయారు చేయవలెనని కోరుచున్నారు. సంఘ సభ్యత్వము మరి తదితర కార్యములు. వారు ఒక బిషప్ లేక పై విచారణ చేయువారి వలె లేక ఆ విధమైన ఎదో గొప్పగా సంఘ శాఖలతో కూడ పోయినయెడల ఆ అవకాశములున్నవని వారు చూచుచున్నారు, సజీవమైన దేవుని వాక్యము ప్రజలతో జీవించుచు, అది దేవుని శక్తితో నిరూపింపబడియున్నప్పుడు వారు ఆ లేఖనములను విడిచిపెట్టుచున్నారు. అయినను అది వారికి అక్కరలేదు. వారు చెప్పుచున్నారు, "ఆ విధమైన కార్యములతో మేము కలువుటకు మేము కోరుట లేదు. అది వారి సహవాస కార్డును (సంఘశాఖ సభ్యత్వము) తీసివేయును. అది వారి సంఘశాఖల క్రమమును తీసివేయును. అయినను లోతు వంటి మంచి వ్యక్తి అది తప్పని తెలిసియు సొదొమలో కూర్చొనియున్నాడు, చూశారా. చూడుడి, వారు దానిని చేసినయెడల వారేమి చేయుచున్నారు? వారిలో ఉన్న కొంచెము విశ్వాసమును వారు స్తంభింపజేయుచున్నారు. అది క్రియ చేయదు.
MAL 3:6
53ఇప్పుడు, మోషే అటువంటి వాటికి చోటియ్యక, మరి విశ్వాసమును ఉంచెను — ప్రపంచ కార్యములను స్తంభింపజేసెను. మీ యొక్క విశ్వాసము మాయమైన కార్యములు స్తంభింపజేయును లేక మాయమైన కార్యమును మీ విశ్వాసమును స్తంభింపజేయును. ఇప్పుడు, మీరు ఏదైనా ఒకదానిని తీసికొనవలయును. మరి మీరు చూడుడి, బైబిలు ఎన్నడును మారదు; దేవుడు మారడు. ఆయన మారని దేవుడైయున్నాడు.
మరి ఇప్పుడు ఈ రోజు మనము చూచుచున్నాము, ఈ దినములలో జనులు వారు పెద్ద కార్యములకై చూచుచున్నారు, పెద్ద సంఘ శాఖలకై. "నేను ఫలానా - ఫలానా దానికి చెందియున్నాను, చూశారా? మరి అక్కడికి వారు పోయి మరి చూచెదరు; వీధి జనులతో ఏ వ్యత్యాసము లేదు. మిగత ఏ కార్యములు లేవు… మీకు కావలిసిన ఏదో కొద్ది లోకజ్ఞానమును వారు కలిగియుందురు… దైవీక స్వస్తతను, అగ్నిస్తంభమును, దేవుని వెలుగును గురించి మీరు మాట్లాడినయెడల; "అది పిచ్చితనము," అని వారు చెప్పెదరు.
MATT 10:25•
MATT 12:32
54ఒక రోజు ఓ వ్యక్తి, ప్రభువు దూత యొక్క పటమును ఎత్తి పట్టుకొనెను, ఒక బాప్టిస్టు వాక్య పరిచారకుడు దానిని చూచి నవ్వెను, చూశారా. అది దేవదూషణము. దానికి క్షమాపణ లేదు.
అదే యేసు చెప్పియున్నారు. క్రీస్తు చేసిన అదే కార్యములను అది చేయుట మీరు చూచునప్పుడు, మరి ఆయన చెప్పెను, క్రీస్తులో ఆ క్రియలను వారు చూచినప్పుడు మరి — ఆయనే బలియైయుండెను — మరి వారు ఆయనను "బయల్జెబూ," ఒక దయ్యము, అని పిలిచిరి, ఏలయనగా ఆయన దానిని చేయుచుండెను. మరి ఇప్పుడు వారు చెప్పారు — ఆయన చెప్పెను, "దాని కొరకు నేను మిమ్ములను క్షమించెదెను, అయితే అదే కార్యమును పరిశుద్దాత్మ వచ్చి చేయునప్పుడు, దానిని విరోధముగా మీరు ఒక వాక్యము పలికినయెడల, అది ఈ ప్రపంచములో లేక రాబోవు ప్రపంచములో మీకు క్షమాపణ లేదు." చూశారా?
దానికి వ్యతిరేకముగా ఒక్క మాట చెప్పుటయే చాలు. చూశారా? మరి అప్పుడు — ఏలయనగా ఒకవేళ ఆ జీవము — మీరు నిత్యజీవమునకై నియమింపబడియున్న యెడల, దానిని మీరు చూచినప్పుడు ఆ జీవము ఉబికి బయటికి వచ్చును. ఆ బావి యొద్ద చిన్న స్త్రీ వలె మరి ఇతరులు వలె మీరు దానిని గుర్తించెదరు; అయితే అది అక్కడ లేనియెడల అది జీవమునకు రాదు, ఏలయనగా జీవములోనికి వచ్చుటకు అక్కడ ఏమియు లేదు. నా యొక్క వృద్ధురాలైన తల్లి చెప్పునట్లు, "దుంప నుండి మీరు రక్తము తీయలేరు, ఎందుకనగా దానిలో రక్తము లేదు.
DEUT 22:5
55ఇప్పుడు, అదే కార్యము, మరి మీరు కలిగియున్న కొద్ది విశ్వాసమును కూడా అది స్తంభింపజేయును.
లోతు ఆ ఆకర్షణను చూడగలిగాడు, అయితే ఆ ఆకర్షణీయ కార్యములను దహించు అగ్నిని చూచుటకు కావలసినంత విశ్వాసము లేకుండెను. ఈ రోజు మనకు ఆ విశ్వాసము ఉన్నదా అని నేను ఆశ్చర్యపడుచున్నాను? మనకు నేను ఆశ్చర్యపడుచున్నాను… పేరు ప్రతిష్టలు కావాలని కోరే స్త్రీలు, సంఘములోని ఇతర స్త్రీల వలె నడచుకొనవలెనని కోరుచున్నారు, మిగతా వారివలె ఉండవలెననుటను వారు చూచినయెడల — ముఖమునకు రంగులు పూసుకొని చక్కని స్త్రీల వలె అగుపించు అవకాశము౦డుటను వారు చూచుచున్నారు; వెంట్రుకలు కత్తిరించుకొని సొగసైన స్త్రీలు, పడుచువారివలె అగుపించుటను వారు చూచుచున్నారు, మరియు సినిమా తరలవలె నడచుకొనుచున్నారు; అయితే ఇలాంటి కార్యములు చేయు స్త్రీ గౌరవింపతగదు అని బైబిల్ చెప్పుచున్నదని తెలిసికొనిన వారి విశ్వాసము స్తంభింపబడలేదా అని నేను ఆశ్చర్యపడుచున్నాను. మరి పురుషుని దుస్తులు ధరించు స్త్రీ దేవుని యెదుట హేయమైనది — వారు ధరించు పురుషుల చొక్కాలు ఆలాటిని మరి పొట్టి దుస్తులు. జనులు ఆ విధముగా చేయుట వారికి అలవాటైపోయినది. సంఘమునకు పోవుటకు మీకున్న కొద్ది విశ్వాసము వారిని స్తంభింపచేయనియెడల నేను ఆశ్చర్యపడుదును. మీరు చూశారా? అది అటువంటి కార్యమును చేయును.
GEN 12:11,14•
GEN 18:1•
1PET 3:6
56లోతు దానిని చేసెను మరి అది అతనిని స్తంభింపచేసెను మరి అక్కడున్న అతని జనులను మరి అది స్తంభింపచేసినది. వారు దానిని చూడలేకపోయిరి, అయితే అబ్రహాము నిరూపింపబడిన విశ్వాసముతో అతను ఆకర్షణీయమైన కార్యములను చూడలేదు, వాటితో అతనికి ఏ పనియులేదు. అతను శారాతో తాను జీవించుటకు కష్టపడవలసియున్నాను — అరణ్యవాసములో ఫలింపని భూమిలో అతను బహుకష్టముగా ఉన్నను జీవించెను, అయినప్పటికిని ఆకర్షణీయమైన కార్యములను లేక పేరుప్రఖ్యాతులు పొందు కార్యములను వారు చూడలేదు అని బైబిలు చెప్పుచున్నది. శారా ఆ దేశములోనే చాలా అందమైన స్త్రీ అని; ఆమె చాల చక్కనిది. అందరు స్త్రీల కంటెను ఆమె చాలా చక్కని స్త్రీ. మరి ఆమె తన భర్తకు లోబడి అతనితో ఉండెను మరి అతనిని తన ప్రభువని ఆమె పిలిచెను, దానిని గురించియే బైబిలులో క్రొత్త నిబంధనలో చెప్పబడియున్నది. "విశ్వాసమునకు విధేయురాలుగా ఉండువరకు నీవు ఎవరి కుమార్తెవు." చూశారా — తన భర్తను ప్రభువని పిలిచెను.
మరి ప్రభువు దూత ఆలయమును లేక అక్కడున్న వారి చిన్న గుడారమును దర్శించెను మరి వారికి చెప్పెను - వారు నివసించుటకు ఒక గృహము కూడా లేకుండెను, వారు ఫలింపని భూములలో నివసించుచుండిరి, అక్కడ మీరు గమనించుడి. మరి ఆ రోజుల విధముగానే ఈ దినము కూడా పోల్చబడి, ఆ విధముగా ఉండుట మీరు చూచుచున్నారా?
HEB 11:24,25
57ఇప్పుడు, మోషే తన గొప్ప విశ్వాసముతో మరల చెప్పగలుగును, ఇప్పటి ఈ ప్రపంచపు కార్యములకు "వద్దు" అని చెప్పి, మరి సరియైన నిర్ణయము తీసికొనును. దేవుని బిడ్డలతో శ్రమలను అనుభవించుటను అతడు ఎన్నుకొనెను. దానితో కూడా అతను పోవుటకు నిర్ణయించుకొనెను. ఎందులకు? — అతని విశ్వాసము. అతను వాగ్దానమును చూచెను. కడపటి కాలమును అతడు చూచెను, రేపటి దినమును అతడు చూడగలిగెను, మరి తన విశ్వాసమును వాటిని చూడ అనుమతించెను. మరి తాను ఫరోకు పిదప అతనే ఫరో అవుదునని, తాను ఫరో కాగలుగుటకు ఉన్న అన్ని అవకాశములను అతని కండ్లు చూచుచుండగా అతడు వాటిని లెక్క చేయలేదు. అతను రేపటి దినమును చూచెను.
ఓ, మరి ప్రజలు ఆ విధముగా చేసిన ఎట్లు౦డును! ఈ ఇప్పటి ప్రపంచమును చూడకుడి. ఇప్పటి ప్రపంచము తట్టు మీరు చూచిన యెడల, దానితో మీరొక నిర్ణయము చేసికొనుడి. రేపటి దినమున జరుగు దేవుని వాగ్దానమును చూచి, దానికి (ఈ లోక కార్యములకు) మీ కండ్లను మరుగుపరచుకొనుడి. అతని విశ్వాసము వలన అతను కోరుకొనగలిగెను. ఫరో యొక్క కుమారుడు అని పిలువబడుటకు అతను నిరాకరించి మరి అబ్రాహాము యొక్క కుమారుడని పిలువబడుటను అతను ఎన్నుకొనెను. అతను ఏలాగు, మరి సమస్త రాజ్యములన్నియు — ఐగుప్తు ప్రపంచమును ఆధీనములో ఉంచుకొనెను. అతను ప్రపంచమునకే రాజు, సింహాసనమును తీసుకొనుటకు ఇక్కడ అతను నలుబది సంవత్సరముల యవ్వన వయస్సులో ఉండెను, అయితే అతను ఎన్నడూ తన జ్ఞాన….
HEB 11:26
58రోజంతయు అతను చుట్టూ పడియున్న అంతఃపుర స్త్రీలను చూడుడి. ఆ మాయమైన కార్యములను గమనించుడి, త్రాగి తందనాలాడుచు, అర్ధనగ్నముగా అతనికి విసరుచు అతనికి ముందు నటనమాడు వారిని ప్రపంచము నుండి పలుమూలల స్త్రీలు, మరి నగలు, ద్రవ్యము ధనము, అక్కడున్న అతని సేన అంతయు అతను చేయవలసిన ఒకే ఒక కార్యము ఏదనగా, అతను కూర్చొని తనకైన గొప్ప ఆహారమును భుజించుచు మరి చెప్పవలయును, "కోటులో లేక దండులో ఉన్న ఫలానా సంఖ్యలోని సైన్యమును అచ్చటికి పంపి; ఆ రాజ్యమును వశపరచుకొనుడి. నేను అది కావలయునని నేను కోరుకొనుచున్నాను." అతడు చేయవలసిన దంతయు అదే; అక్కడతను కూర్చొనియుండగా, అతనికి గాలి విసిరి, అతని నోరు తెరచి పట్టుకొని, అర్ధనగ్న స్త్రీలు ద్రాక్షరసము లేక మధ్యమును అతనికి పోసి, వారి చేతులను అతని చుట్టూ వేసి, అతనికి ఆహారము తినిపించుచు — ప్రపంచములో ఉన్న అందమైన స్త్రీలు.
అక్కడున్న ఆకర్షణ అ౦తయు, అక్కడ అతని ప్రక్కన పడియు౦డెను, అయితే అతనేమి చేసెను? దానికి చాలా దూరముగా అతను చూచెను. దాని కొరకై అగ్ని సిద్దముగా ఉండెనని అతనికి తెలియును. ఆ వరుసలో మరణము ఉండెనని అతనికి తెలియును, చూశారా. అదేమిటని అతను ఎరిగియుండెను, తృణీకరించబడిన మరి నిరాకరించబడిన జనులను అతను చూచెను, మరి అతను విశ్వాసము ద్వారా క్రీస్తు నిమిత్తమైన నిందల వలన కలుగు బాధలు అనుభవించుటను ఎన్నుకొనెను. మరి దాని ద్వారా అతను తన్నుతాను, "నేను అబ్రాహాము యొక్క కుమారుడను; నేను ఫరో కుమారుని కాను. మీరు నన్ను ఒకవేళ మతగురువుగానో (బిషప్) లేక పరిచారకునిగానో (డీకన్) లేక ప్రధాన మతగురువుగా (ఆర్చ్ బిషప్) లేక ఒక పోప్ గానో చేసినయెడల నేను ఈ కార్యము యొక్క కుమారుని కాను. నేను అబ్రాహాము యొక్క కుమారుడను, మరి ప్రపంచ కార్యములతో నన్నునేను వేరుపరచుకొని యున్నాను." ఆమేన్, ఆమేన్ మరి ఆమేన్!
విశ్వాసము ద్వారా దానిని చేసెను.
59ఆ ఆకర్షణ కార్యములను తొలగించుకొనెను. అటు తరువాత తాను అధ్యక్షునిగా ఉండపోవు ఆ అవకాశమును నెట్టి వేసెను, అటు పిదప ప్రధాన మత గురువుగా లేక తదుపరి ఎన్నికలలో పై విచారణ చేయువానిగాను ఉండు అవకాశములను లేక ఎదో ఒక స్థానమును, వాటన్నిటిని అతడు దూరముగా ఉంచెను. దాని తట్టు చూచుటకు, అతడు నిరాకరించెను.
ఇప్పుడు, "నేను మతగురువు లేక అధ్యక్షునిగా (బిషప్) అయిన యెడల నేను లోపలికి నడిచెదను. ప్రజలు చెప్పుదురు, "పరిశుద్ద తండ్రీ, లేక డాక్టరు ఫలానా - మరి - ఫలానా (బిరుదుతో పిలిచెదరు) లేక "ఫలానా - ఫలానా పెద్ద మనిషి. వారు ఏ విధముగా … అందరు పరిచారకులు ఆ కూడికలో, నా వీపు వెనుక నన్ను తట్టి మరి చెప్పెదరు, చెప్పుము బాలుడా, అతనిలో ఎదో కార్యమున్నది. నేను మీకు చెప్పుచున్నాను, ఓ! ష్-ష్-ష్,నిశ్శబ్దముగా ఉండండి; బిషప్ (మత గురువు) ఇక్కడ వచ్చుచున్నాడు. అతడేమి చెప్పినను అది చట్టము. "ఇక్కడ ఫలానా - ఫలానా అతను వచ్చుచున్నాడు." అతడిని చూచుటకు జనులు లోకముపై ఎగిరెదరు, మరి అతని కాళ్ళను మరి చేతి ఉంగరమును ముద్దుపెట్టుకొనవలయునని మరి ఆ విధముగా. కాధలిక్కులకు ఎటువంటి అవకాశము, ప్రొటెస్టెంటులకు ఎటువంటి అవకాశము - మత గురువుగానో లేక పై విచారణ చేయువానిగానో లేక ఎదో కార్యము ఒక సంస్థలో ఒక గొప్ప వ్యక్తిగా ఉండుట.
ఓ, అయితే మీరు చూచిన విశ్వాసము యొక్క కన్ను (విశ్వాస దృష్టి) దానిక౦టే పైన చూచును. దేవుడు ఆ సమస్త కార్యములు నశింపబడును అని చెప్పినప్పుడు, మరి దాని అంతమును మీరు చూచెదరు. మీ విశ్వాసము ఆ పక్షిరాజు కన్ను, దానికి పైగా మిమ్ములను పైకెత్తి మరి మీరు రేపటి దినమును చూచెదరు, ఈ రోజును కాదు, మరి అబ్రాహాము యొక్క సంతతిగా పిలువబడుటకు కోరెదరు.
60ఫరో, విశ్వాసము లేనందువలన దేవుని బిడ్డలను మూఢులుగా చూసెను — విశ్వాసము లేదు. అతడేమి చెప్పెనో దానికి భయపడనందువలన అతడు వారిని బానిసలుగా చేసెను. అతడు దేవునికి భయపడలేదు. అతడు తానే దేవుడని తలచెను. అతడు కొలిచిన అతని దేవుళ్ళని అతడు తలంచెను — అతను తానే ఒక అధ్యక్షుడు (బిషప్), అతను ఒక ప్రధాన విచారణకర్త — అతని దేవుడే అది చేసియున్నాడు అనుకొనెను; ఇక్కడ ఈ కార్యమునకు ఏమిలేదు. కావున అతడు వారిని బానిసలుగా చేసెను. అతడు వారిని చూచి నవ్వెను — ఈ రోజు ప్రజలవలె వారిని గేళి చేసెను, కచ్చితముగా అదే కార్యము.
ఆశీర్వదింపబడిన ఆ జనులు వాగ్దానపు భూమిలో ఉండుటను మోషే విశ్వాసము చూచెను. వాగ్దానము నొద్ద వారిని కొనివచ్చుట మిగుల కఠినమైన పోరాటముగా ఉండి ఉండవచ్చును, అయితే వారితో పోవుటకు మోషే ఎన్నుకొనెను. (ఏ విధముగా దానిపై ఇంకనూ విపులముగా నేను ప్రసగించగలను, అయితే నా సమయము గతించిపోవుచున్నది. చూశారా?)
61గమనించినయెడల, వారిని త్రిప్పుట కఠినమైన కార్యముగా ఉండి ఉండవచ్చును. "వారితో కూడా పోయి మీరు జీవించవలయును. వారిలో నీవు ఒకనిగా ఉండవలయును, మరి వారు అప్పటికే చాలా జ్ఞానవంతులై ఉన్నందువలన మీరు వారిని కదల్చలేరు. చూశారా? అయితే అక్కడ ఏదో ఒకటి సంభవించి యుండవలయును. వారి యందు సహజాతీతమైనది ఏదో ఒకటి నిరూపించబడియుండవలయును. అది బహు కఠినమైన కార్యముగా ఉండి ఉండ వచ్చును. మరి సంఘ శాఖలు మిమ్ములను అంగీకరించవు, మరి ఈ కార్యములన్నియు జరుగును. మీరేమి చేయవలెనో అని గందరగోళముగా ఉండును, అయినను, నీ నిర్ణయము చేసుకో."
"నేను వారిలో ఒకనిని." అతని విశ్వాసము దానిని చేసెను. అతని విశ్వాసము ప్రకాశించెను. సరి అయ్యా. దానిని అతడు చూచెను.
ఆ వాగ్దానమునకు వారిని కొనిపోవుట కష్టమైన కార్యము, కాని ఏమైనను సరే అని వారితో కూడా పోవుటను అతను ఎన్నుకొనెను. వారు అతనికి ఏమి చేసినను, మరి అతనిని ఎంత నిరాకరించినను, అతను వెళ్ళెను, మరి వారితో కూడా పోవుచుండెను.
మీరు చదువుచున్నారని నేను అనుకొనుచున్నాను! అది సరి. ఏమైనను సరే వారితో పొమ్ము. వారిలో ఒకనిగా, అది సరి, ఏలయనగా ఇది నీ యొక్క కర్తవ్యము. ఒకవేళ కఠినమైన పోరాటము, అనేక ఇబ్బందులలో పోవలసియుండును, అయినను ఏలాగైనను పొమ్ము.
62అయితే అతని విశ్వాసము వాక్యమును ఎన్నుకొనులాగున చేసెను మరి ఆకర్శణీయమైన కార్యములను కాదు. అతడు వాక్యమును తీసికొనెను. అదే మోషే యొక్క విశ్వాసము చేసినది.
విశ్వాసము దేవుని హీనమైన దానిని చూసినప్పుడు — గుర్తుంచుకొనుడి, ఇప్పుడు ఇక్కడ ఆకర్శణీయమైన కార్యములు, ఉన్నతమైనవి, ప్రపంచమునకు రాజు. మరి దేవునిచే వాగ్దానము చేయబడినది ఎక్కడ? — బురద గుంటలో, శరీరమ౦తయు బురద పూసుకొని, అయితే మరి విశ్వాసము, మరి విశ్వాసము దేవుని యొక్క హీనమైన దశను చూచినప్పుడు, దానిని అది గొప్పగా ఎంచును, మరి ప్రపంచము చూపించు శ్రేష్టమైన కార్యముల కంటె దానిని అమూల్యముగా ఎంచును! అవునండి! మరి అప్పుడు విశ్వాసము దానిపై దృష్టియుంచినప్పుడు, విశ్వాసము అప్పుడు దానిని చూడగలుగును.
ఎప్పుడైతే వాక్యముపై గల విశ్వాసము వాక్యము ప్రత్యక్ష్యమగుటను చూడగలిగినప్పుడు అది ఆకర్శణీయమైన ఈ లోకకార్యముల కంటెను మరి ప్రధాన మతగురువుగా నుండుట కంటెను మీరు మాట్లాడుగలుగునంత ప్రతి కార్యము కంటెను ఎక్కువైనది. విశ్వాసము దానిని చేయును. మీరు బహుగా చెడ్డది చూడవచ్చును, తృణీకరింపబడిన, త్రోసివేయబడిన ఎటువంటి కార్యమైనను అది చాలా క్షీణదశలో మిగుల చెడ్డగా ఉన్నప్పటికిని మరి అయినప్పటిని ప్రపంచము ఉత్పత్తి చేయు శ్రేష్ఠమైన వాటికంటెను తక్కువగా అగుపించు దేవుని కార్యములను విశ్వాసము లక్షలకొలది మైళ్లు ఉన్నతముగా ఎంచును. ఆమేన్!
ఆ విధముగా ఆ పాటను మనము పాడెదము, "ప్రభువు కొరకై నీచముగా ఎంచబడు ఆ కొద్దిమందిలో వారి మార్గమును నేను తీసికొనెదను …" చూశారా? ఓ, మై!
63దేవుడు ఏ కార్యములను చేయవలెనని కోరుకొనునో విశ్వాసము దానిని చూచును, మీరు చూచారా.
ఓ, ఇది లోపలికి పోవుచున్నదని నేను అనుకొనుచున్నాను! ఇప్పుటి కాలమును విశ్వాసము చూడదు. ఇక్కడ దీనిని విశ్వాసము చూడదు. దేవుడు ఏమైతే కోరునో మరి ఆ క్రియలను జరిపించునో వాటిని విశ్వాసము చూచుటకు ఎదురు చూచును. అదే విశ్వాసము చేయును. దేవుడు దేనినైతే కోరునో, దేవుడు కోరునది నెరవేరులాగున చేయుటను అది చేయును మరి విశ్వాసము వీటి ద్వారా పనిచేయును.
విశ్వాసము ఒక దూరదృష్టి. అది తన దృష్టిని తగ్గించదు. అది తన గురిని తప్పదు. ఆమేన్! ఏ షూటర్ అయినా వ్యక్తి దానిని ఎరుగును, చూశారా? అది చాలా దూరమును చూచును; ఇది ఒక టెలిస్కోపు; అది ఒక బైనాకులర్, ఇక్కడ చుట్టు ప్రక్కల ఉన్న కార్యములను మీరు దానితో చూడరు. ఇది ఏ కాలము అని చూచుటకు మీరు బైనాకులర్స్ ను ఉపయోగించరు. చూశారా? దానిని మీరు ఉపయోగించరు, అయితే మీరు చాలా దూరమును చూచుటకు మీరు ఉపయోగించుదురు మరి విశ్వాసము దానిని చేయునో, విశ్వాసము దేవుని యొక్క బైనాకులర్స్ ను ఎత్తుకొనును - రెండింటిని, రెండు ప్రక్కలను, క్రొత్త మరి పాత నిభంధన గ్రంధమును మరి ఆయన చేసిన ప్రతియొక్క వాగ్దానమును చూచును మరి విశ్వాసము దూరములో ఉన్నవాటిని చూచును. మరి విశ్వాసము ఇక్కడ ఇప్పటి పరిస్తితిలెన్నున్నను దానిని ఎన్నుకొనును. అతను ముగింపును చూచును.
ఈ తట్టు చూచుటకు తన దృష్టిని క్రిందికి వేయడు; అతను దూరముగా చూచును. అతను వాక్యముపై మధ్యలో ఉంచును. విశ్వాసము దానినే చేయును. ఒక వ్యక్తిలో ఉన్న ఆ యొక్క విశ్వాసము ఆ కార్యములను చేయును.
DEUT 22:5
64ఇప్పుడు గమనించుడి. ఫరో గొప్ప అని పిలిచెను, దేవుడు హేయమైనదని పిలిచెను. ఫరో చెప్పియుండవచ్చును, "మోషే చూడు ఇక్కడ ఏల నీవు తదుపరి ఫరోవు ఇక్కడ నుండి నేను పోవునప్పుడు, ఈ రాజదండమును నీ చేతికిచ్చెదను. ఈ రాజ దండమును నీ చేతి కిచ్చెదను; ఇది నీదే." చూశారా? ఇప్పుడు ఇది చాలా గొప్పైనది. "నీవు ఒక గొప్ప వ్యక్తి కాబడెదవు, మోషే. నీవు ఒక మతగురువుగా కాబడేదవు. నీవు ఈ విధముగా, అటు కాబడెదవు, లేక మరొకటి. మమ్ములను వదలిపోకుము, నీవిక్కడే ఉండిపొమ్ము," అయితే మీరు చూడుడి, అతనో (ఫరో) దానిని గొప్ప అని పిలిచెను, మరి దేవుడు దానిని హేయమైనదని పిలిచెను.
ఇప్పుడు స్త్రీలైన మీరు ఒక్క నిమిషము ఆలోచించుడి - పురుషులైన మీరు. ప్రపంచము గొప్ప అని దేనిని పిలుచునో, దేవుడు రోత అని పిలుచును. పురుషుల దుస్తులను స్త్రీలు ధరించుట హేయమైన కార్యమని బైబిలు చెప్పుట లేదా? దానిని చేయుటవలన మీరు చాలా సమర్ధులని అనుకొనుచున్నారు, చూశారా. దయ్యమునకు స్త్రీ శరీరమును మీరు కనుపరచుచున్నారు; అదంతే. కావున దానిని చేయవద్దు.
లోక కార్యములలో జీవించు పురుషులైన మీరు దీనిని నొక్కుకొనుచు, కౌగలించుకొనుచు మరి ఏ భార్యలు అటువంటి కార్యములు చేయకుండా వాటిని వదలమని చెప్పుటకు మీకు తగినంత ధైర్యము లేదు; మిమ్ములను గురించి సిగ్గుగా ఉన్నది — నాకు మీరు సొదొమలోని వారివలె ఉన్నారు. మరి మిమ్ములను దేవుని కుమారులని పిలుచుకొనుచున్నారు. మిమ్ములను నొప్పించవలయునని కాదు, అయితే మీకు సత్యము చెప్పవలయుననుటకే. ప్రేమ సరిదిద్దును. అది ఎప్పుడూనూ అట్లే.
ఆమె బిడ్డపై అక్కర లేకుండ, సరిదిద్దకుండా, మరి కొట్టకుండా మంచి గుణములతో పెంచకుండని యెడల, ఆమె తల్లి కాదు. అది సరియే.
65ఇప్పుడు ఏమి జరిగినదో ఇప్పుడు గమనించుడి. దీనిని మోషే దర్శనములో చూచెను మరి ఫరో దానిని గూర్చి చెప్పెను, "ఇదొక గొప్ప అని."
"ఇదొక హేయమైన కార్యము" అని దేవుడు చెప్పెను. కావున దేవుడు చెప్పినదే మోషే ఎన్నుకొనెను.
ఇప్పుడు గమనించుడి, దేవుడు ఏమి చూడవలయునని అనుకున్నాడో విశ్వాసము దానిని చూచును, చూశారా. దేవుడేమి చూచునో విశ్వాసము దానిని చూచును. మరి వివేకము, ఇంద్రియములు, లోకము దేనినైతే మీరు చూడవలయునని కోరునో దానిని చూచును. గమనించుడి, హేతువాద కారణములు…. "ఎందుకు, అది మనుష్య ఇంద్రియములే; సరి, ఇది మంచిది కదూ అని కారణములను చూపించును." చూశారా? అది ఖచ్చితముగా వాక్యమునకు విరుద్దమైన కార్యములకు మీ ఇంద్రియములను ఉపయోగించిన లోకము దానినే మీరు చూడవలయునని కోరుచున్నది. అయితే విశ్వాసము దాని వైపు చూడదు; దేవుడేమి చెప్పునో విశ్వాసము దానిని చూచును, చూశారా? మీరు చేయకుడి — మీ హేతువాద కారణములను పడద్రోయండి…
1COR 3:16
66లోకము మీరు దేనిని చూడవలయునని కోరునో కారణములు చూపు ఇంద్రియములు దానిని చూచును - పెద్ద సంఘ శాఖలు.
"నీవు ఒక క్రైస్తవుడివా?"
"ఓ, నేను ఒక ప్రెస్బిటేరియన్, మెతడిస్తు, లూధరన్, పెంతెకోస్టు," ఇంకా ఏమి. "నేను ఇది, అది, లేక వేరే ఇంకొక" — అదంతయు ఇంద్రియములు. "నేను మొదటి సంఘమునకు చెందుదును; ఓ, నేను కాధలిక్కును," నేను ఇది, అది." చూశారా?
దానిని మీరు చెప్పవచ్చును. ఇప్పుడు, అది ఇంద్రియుములు. మీరు దానిని చెప్పుటకు ఇష్టపడుచున్నారు, ఏలయనగా అది ఒక సంఘ శాఖ, ఒక గొప్ప … "సరి, ప్రపంచములోని వేరే ఏ ఇతర సంఘముల కంటెను మాకు అధిక సభ్యులు కలరు, చూశారా?" అయితే ఒకే ఒక నిజమైన సంఘము కలదు, మరి దానిలో మీరు చేరలేదు; దానిలోనికి మీరు జన్మించియున్నారు, చూశారా. మరి మీరు దానిలోనికి జన్మించినయెడల, జీవించు దేవుడు తననుతాను కనపరచుకొనుటకు మీ ద్వారా తాను క్రియ చేయగలడు, చూశారా? అక్కడే దేవుడు నివసించును — ఆయన యొక్క సంఘములో.
ప్రతి రోజు దేవుడు సంఘమునకు వెళ్ళును — సంఘములో జీవించును, ఆయన మీలో జీవించును. మీరు ఆయన సంఘము. మీరు ఆయన యొక్క సంఘము. మీరు దేవుడు నివాసము చేయు గుడారము. జీవించు దేవుని యొక్క సంఘముగా మీరున్నారు. మరి జీవించు దేవుడు తనయొక్క జీవించు దేవుని జీవులలో జీవించిన యెడల అప్పుడు మీ యొక్క క్రియలన్నియు దేవునివి. ఆ క్రియలు లేనియెడల అక్కడ దేవుడు లేడు. ఆ విధముగా మీరు ప్రవర్తించుటకు ఆయన మిమ్ములను చేయలేదు, ఆయన ఇక్కడ తన వాక్యములో తన (బ్లూ ప్రింట్) నమూనా ఫటములో "దానిని చేయవద్దు," అని ఆయన చెప్పినప్పుడు, మరి మీరు పోయి దానిని చేసినయెడల. చూడుడి, అది తప్పైన కార్యము. అప్పుడు మీరు దానిని త్రుణీకరించినయెడల మీలో ఆ జీవము లేదని అది చూపుచున్నది, చూశారా. అది సరి.
67విశ్వాసము మోషేను విధేయత అను దారిలో నడిపించెను. గమనించుడి, మోషే… అక్కడొక యవ్వన ఫరో; అక్కడొక యౌవ్వన మోషే — ఇరువురును అవకాశముతో ఉన్నారు.
ప్రజల యొక్క నిందనలను మోషే చూచెను మరి ఐగుప్తు అంతటికంటెను దీనిని గొప్ప ఐశ్వర్యములుగా ఎంచెను, మరి అతను విశ్వాసము ద్వారా నడిపింపబడెను. వాక్యములో ఉన్న దానిని అణకువ దారిలో నడిపించి మరి చివరిగా మహిమలోనికి అది అతనిని నడిపించెను. అమర్త్యమైన — ఎన్నడూ చనిపోని — దేవుని సన్నిధిలో.
దృష్టి, మరి ఇంద్రియ జ్ఞానములు, మరి ఆకర్షణీయమైన కార్యములు ఫరోను అతని మరణమునకు నడిపించెను, మరి ఐగుప్తు యొక్క నాశనమునకు; అతడి యొక్క రాజ్యము, మరియు అది అతనికి ఎన్నడూ తిరిగి రాలేదు.
68అక్కడే మీరున్నారు. దీని తట్టు చూడుడి, మీరు మరణించుదురు. దాని తట్టు చూడుడి, మీరు జీవించెదరు. ఇప్పుడు, మీ యొక్క ఎన్నిక చేసుకొనుడి.
ఏదెను తోటలో ఆదాము, హవ్వలకు ముందు అదే కార్యమును దేవుడు ఉంచెను, చూశారా. విశ్వాసము ద్వారా మీరు ఎన్నుకొనవలసియున్నది. ఇప్పుడు గమనించుడి, దృష్టి ఫరోను అతని మరణమునకు, మరి అతని నగరము యొక్క పతనమునకు నడిపించెను. మోషే తన యొక్క విశ్వాసమువలన ఫరోకు భయపడలేదు, చూశారా. ఫరో ఏమి చెప్పెనో అతను లెక్కచేయలేదు. ఫరో యొక్క బెదిరింపులకు ఏ విధముగా అతని తల్లి - తండ్రి భయపడలేదో, అతను కూడా ఫరోకు భయపడలేదు. మరి ఐగుప్తు నుండి ఇశ్రాయేలును నడిపించు వ్యక్తి తానే అని మోషేకు నిర్ధారణ అయినప్పుడు, ఫరో ఏమి చెప్పినాడో అతను లెక్కచేయలేదు. అతనిని గురించి మోషే భయపడలేదు. ఆమేన్, ఆమేన్, ఆమేన్! నేనెమి చెప్పుచున్నానో (నా భావము) మీరు చూడుడి.
విశ్వాసములో భయము లేదు. దానిని గురించి విశ్వాసమునకు తెలియును. నేను ఎల్లప్పుడు చెప్పినట్లు, విశ్వాసమునకు పెద్ద కండరములు మరి రొమ్ముపై వెంట్రుకలు ఉండును. "మూయుము!" అని విశ్వాసము చెప్పును, మరి అందరు మూయుదురు. అదంతే. "నేనెక్కడ ఉన్నానో (ఏ స్థానములో) నేనెరుగుదును!"
మిగతా అందరు చెప్పిరి, "సరి, బహుశా అతను చేయును." అయితే మీరు లేచి నిలువబడి మీ కండరములను చూపించవలయును. అది అంతే; విశ్వాసము దానిని చేయును.
69గమనించుడి, తన పిలుపును దేవుడు నిరూపించిన పిదప మోషే ఫరోకు ఎన్నడూ భయపడలేదు. దాని కొరకు అతను పిలువబడెనని మోషే నమ్మినప్పుడు, దేవుడు అక్కడ అతనితో చెప్పినప్పుడు, "నీవు దాని కొరకు పంపబడినావని," క్రిందకు పోయి, ఫరో ముందట, తక్కిన వారి ఎదుట దానిని చేయుటకు పంపబడెను అని కనపరచుకొనెను, ఫరోను గురించి మోషే ఎన్నడును భయపడలేదు.
గమనించుడి, ఫరో తన తెలివిని మోషే పై ఉపయోగించినప్పటికిని. చూడుడి. ఆ అతడు చెప్పెను, "నేను నీకు చెప్పెదను ఏమని, నీతో ఒక ఒప్పందము చేసికొనెదను," (ఆ రోగములు, ఉపద్రవ బాదలు అతనిని దహించిన పిదప) చెప్పెను, "నేను నీతో ఒక ఒప్పందము చేసికొనెదను. మూడు దినములు మాత్రము ఒక చిన్న ఆరాధనకు వెళ్ళుము. కొంచెము దూరము తప్పనిచ్చి మరి దానిని దాటి ఆవలి తట్టుకు పోవద్దు." అయితే మీకు తెలియునా ఫరో యొక్క శరీర జ్ఞానము (ఇంద్రియములు) ఒక సరిహద్దు వారికి ఇచ్చి దానిని దాటి పైకి పోవద్దని అతనితో చెప్పెను. "మీరు ఆ కొంచెము దూరము పోయి మరి ఇంకా ముందుకు వెళ్ళవద్దు."
ఆలా౦టి వారిని ఈ రోజు మనము కలిగిలేమా? "మీరు కేవలము సంఘములో చేరినట్లయితే, అది చాలును."
EXOD 10:11
70అయితే, మీకు తెలియునా మోషేకు గల విశ్వాసము. "కొంత-వరకు భక్తిగా ఉన్న చాలును" అను దానిని నమ్మలేదు.
అతను చెప్పెను, "మేమందరము పోయెదము. కడపటి వరకు పోయెదము. అది సరి. వాగ్ధాన భూమికి మేము పోవుచున్నాము. మేము ఏదో కొంతవరకు పోయి ఒక సంఘ శాఖను ఏర్పరచి మరియు అక్కడే నిలువము. మేము ముందుకు పోయెదము." ఆమేన్. "నేను వాగ్దాన భూమికి పోవుచున్నాను. దేవుడు మాకు వాగ్దానమిచ్చెను."
ఈ రోజు ప్రసంగ వేదికలపై నిలుచు ఎంతమంది ఫరోలు మనకు గలరు? — సంఘ శాఖల అధికారులు. "ఇప్పుడు, మీరు దీనినో మరి దానినో చేసిన చాలును, అంతే… సరి, చూడుడి, కొంతమట్టుకు."
అయితే మోషే చెప్పెను, "ఓ, లేదు! లేదు, లేదు, లేదు. చూశారా?
ఫరో చెప్పెను, "సరి, ఎందుకు చేయకూడదు — అటువంటి మతమును లేక దైవభక్తిని నీవు కలిగియుండబోయినయెడల, నీవేమి చేయవలెనో నేను చెప్పెదను. నీవును మీలో కొద్దిమంది పెద్దలు మరి పోయి ఆరాధించుడి, చూశారా? నీవు మరి పెద్దలు మాత్రము పోయి ఆరాధించుడి, ఏలయనగా మీరందరూ అటువంటి దైవభక్తిని కలిగియుండవచ్చును, అయితే జనులమద్య దానిని తీసికొనిరావద్దు."
EXOD 10:26
71మోషే ఏమి చెప్పెనో మీకు తెలియునా? "ఒక డెక్క కూడా వదలము. మేమందరము ఎట్లయినను చివరి వరకు పోయెదము. మేమందరము పోయెదము! వారందరు పోవు వరకు నేను వెళ్ళను, మరి నేనిక్కడ ఉన్నంతవరకు, నేను నీ చేతులలో ఉన్నాను! ఆమెన్. వారు కూడా వెళ్ళు వరకు నేను వెళ్ళను. అంతే."
ఓ, ఎటువంటి సాహసముగల సేవకుడు! ఆమేన్. "వారిని నాతో కూడా కొనిపోవలయునని యున్నాను, ఏలయనగా నేను మాత్రము పొందియున్నాను - మరి నేను కూర్చొని చెప్పెదను, "మంచిది, ఇప్పుడు, ఇది సరి - కాదయ్యా; మాకు ఆ ప్రజలందరు కావలయును. మాలో ప్రతియొక్కరు పోయెదము." ఆమేన్. అతను చెప్పెను, "మా గొర్రేలను కాని లేక వేరే ఏదైనను మేము వదలి వెళ్ళము. ఒక డెక్క కూడా వదలము. మేమందరము వాగ్ధాన భూమికి వెళ్ళెదము. (ఆమెన్) — మాలో ప్రతి ఒక్కరు. ఒకవేళ మీరు ఒక గృహస్తురాలైనను, ఒకవేళ నీవొక చిన్న పనిమనిషివైనను, లేక నీవొక వృద్ధురాలైనను, లేక యవ్వనస్తుడవైన, లేక లేక వృద్దుడవైన, లేక ఏమైనను; మనమందరము నిశ్చయముగా వెళ్ళెదము. మనలో ఒకరు కూడా వదలబడము. ఆమెన్. మనలో ప్రతియొక్కరు వెళ్ళెదము లేక మనము ఏ కార్యము కొరకైనను నిలుచు ప్రసక్తి లేదు." అది సరి.
మై, మతము లేక భక్తి అక్కడ వాదించబడినది, ఆ విధముగా జరిగినది కదూ? ఓ, మై. లేదు, మోషే కేవలము "నామమాత్రపు భక్తిని," ఇక్కడ నమ్మలేదు. లేదు, దానిని నమ్మలేదు. అవునండి. ఓ, మై. దానిపై మనము ఈ రోజంతయు ప్రసంగించవచ్చును, అయితే నేను నా పాఠ్యభాగమునకు వెళ్ళవలసియున్నది, మరి ప్రసంగించవలయును.
EXOD 9:6,10,23•
EXOD 10:13,22•
EXOD 12:29,31,32
72దీనిని గమనించుడి. ఎంత చక్కగా ఉన్నది — ఓ, దీనిని నేను ఇష్టపడుచున్నాను. ఫరో చివరికి ఏమి చెప్పాడో మీకు తెలియునా, "బయటికి పొమ్ము!" మోషే స్వరము ద్వారా దేవుడు అతనిని వ్యాధులతో మొత్తెను. ఆయన సమస్తమును కొట్టెను. చేయగలిగినదంతయు అతను చేసెను. అతను నిలిపెను… పగటివేళ సూర్యుడు అస్తమించు లాగున చేసెను; అతను సమస్తమును చేసెను. అతను పగలును చీకటిగా మార్చి, కప్పలను, ఈగల గుంపును, పేలును మరి సమస్తమును రప్పించెను; అగ్ని, పొగ, మరియు అతడి కుటుంబములో మరణము మరియు సమస్తము. చివరకు ఫరో "వదలి బయటికి పోండి" అని చెప్పులాగున ఆయన సమస్తమును చేసెను. మీకున్న సమస్తమును తీసికొని మరి పొమ్ము, "ఓ మై. దేవునికి స్తోత్రములు!
దయ్యమునకు ఏమి చేయవలెనో తోచని స్థితిలో పడవేయబడులాగున ఒక వ్యక్తి పరిపూర్ణముగా దేవునికి సేవ చేయుట ద్వారా చేయగలుగును అని నేను చాలా సంతోషపడుచున్నాను. "ఓ మై. దూరముగా పోండి, దానిని నేను ఇంక వినుటకు ఇష్టపడుటలేదు," అని సైతాను చెప్పువరకు కేవలము దేవునికి పూర్తిగా లోబడుడి. అది సరి. దానిని మీరు చేయగలరు — పరిపూర్ణముగా.
EXOD 12:31,32
73ఇక్కడ చూశారా, దేవుడు మోషేకు వెనుక ఉండకుండినయెడల అప్పుడు అతడు హాస్యాస్పదముగా ఉండును, అయితే దేవుడు అక్కడే ఉండి అన్నియు నిరూపించుచుండెను. అతడు చెప్పినదంతయు నెరవేరెను.
మరి ఫరో ఒక మత గురువుగా ఉన్నందువలన, అతడు ఆ స్థానమును కాపాడుకొనుటకు అక్కడే అతడుండవలయును. అతడు "వద్దు" అని చెప్పలేడు, ఏలయనగా అప్పటికి అది నెరవేరుచుండెను. చూశారా? అతడు దానిని నిరాకరించలేడు, ఏలయనగా అది అప్పటికే జరుగుచుండెను. కావున చివరికి అతడు చెప్పెను, "ఓ, మీరు బయటికి వెళ్ళిన చాలు; నీవు చెప్పునది నేను వినలేను. ఇక్కడి నుండి వెళ్ళ౦డి; మీకున్న సమస్తమును తీసుకొని వెళ్ళ౦డి." ఓ, మై.
EXOD 8:6,24•
EXOD 10:22
74ఇప్పుడు, మనము మోషేను కనుగొందుము, అతడి కొరకు దేవుడు ఎన్నో చేసిన తరువాత మరియు ఎన్నో సూచనలు మరియు అద్భుతములు….
ఇప్పుడు, తదుపరి పదునైదు నిమిషములకు ఇక్కడ దీనిని ముందుంచు కొనెదము. చాలా జాగ్రత్తగా గమనించుడి.
మోషే ఈ యొక్క స్థానమునకు వచ్చెను, అతడే స్థానమునకు వచ్చెననగా… దేవుడు చెప్పెను, "నేను నీతో ఉన్నాను. నీవు ఈగల గుంపులు రమ్మని చెప్పగా మరి అక్కడ ఈగలు వచ్చెను. "అది సృష్టించుట. ఎవరు భూమిపై అంధకారమును కొనిరాగలరు, దేవుడు తప్ప? "చీకటి కలుగును గాక అని నీవు చెప్పిన పిదప అక్కడంతయు చీకటాయెను. కప్పలు రావలయునని నీవు చెప్పిన వెంటనే, ఫరో ఇంటిలో సహితము కప్పలు వచ్చెను, ఫరో పడకలపై గొప్ప కుప్పలుగా కప్పలు పేర్చబడెను." సృష్టికర్త… "మరి నేను నీ ద్వారా మాట్లాడితిని, మోషే, మరి నా వాక్యములు నీ పెదవుల ద్వారా సృష్టింపజేసెను. ఫరోకు ముందు నిన్ను నేను ఒక దేవునిగా చేసితిని." అవును, అయ్యా. "నేను ఈ అన్ని కార్యములను చేసియున్నాను, మరి అక్కడ వారొక స్థలమునకు వచ్చిరి" — ఒక చిన్న శోధన వచ్చెను, మరి మోషే "నేనేమి చేయుదును?" అని మొర్రపెట్టుట ఆరంభించెను.
75మీరు గమనించవలయునని కోరుచున్నాను. ఇప్పుడు ఇక్కడ ఇదొక గొప్ప పాఠముగా ఉన్నది. దీనిని నేను ఇష్టపడుచున్నాను, చూశారా. చూడుడి. ఇక్కడ మనము చదివినయెడల మోషే - ఆ బిడ్డలందరు భీతినొందినప్పుడు - కర్తవ్యముగా ఫరో వారిని వెంటాడుచు వచ్చుట చూచినప్పుడు.
దేవుడు సమస్తమును క్రమముగా జరిపించెను; ఆ ప్రయాణములో వారు బయలుదేరులాగున ఆయన చేసెను. సంఘమంతయు ఒక్కటిగా ఉండులాగున ఆయన చేసెను. వారు పిలువబడిరి; ప్రతి సంఘశాఖ నుండి వారు వచ్చియున్నారు; వారందరు ఒకటిగా కూడిరి. మోషే అక్కడ వెనుకంజ వేసి మరి చెప్పెను, "ప్రభువా నేనేమి చేయవలెను?"
ఆయన చెప్పియుండును, "మంచిది, పోయి దీనిని చేయుము. సరి, ముందుకు పొమ్ము. ఇప్పుడు, మోషే ఇది చేయుటకు నేను నిన్ను పిలిచి యున్నానని నీవు ఎరుగుదువు."
"అవును, ప్రభువా."
"సరి, నీవు పోయి దీనిని పలుకుము; అది" — ఈగల గుంపు ఇక్కడ వచ్చెను. "దీని కొరకు పలుకుము" — అది ఇక్కడ వచ్చెను. "దీనిని చేయుము" — ఇక్కడ ఇది వచ్చెను. ప్రతియొక్కటియు ప్రభువు సెలవిచ్చునదిగా ఉండెను, ప్రభువు సెలవిచ్చుచున్నాడు, ప్రభువు సెలవిచ్చుచున్నాడు!
ఇప్పుడు, అతను చిక్కులో పడెను.
76మరి దేవుడు చెప్పుచున్నాడు, "ఇప్పుడు, వారు ప్రయాణమునకు ఆరంభించులాగున చేసిరి; వారందరు పిలువబడినవారు. సంఘములన్నియు ఒక దగ్గర యున్నది, కావున వారిని ప్రయాణములో పెట్టితిని. ఇప్పుడు మోషే, వారిని ఆవలితట్టుకు తీసికొని పొమ్ము. నేను నీకు చెప్పియున్నాను. చూశారా, నేను కూర్చొని మరి కొద్దిసేపు విశ్రాంతి తీసికొ౦దును.
మోషే చెప్పెను, "ఓ ప్రభువా ఇక్కడ వచ్చుచున్నారు చూడుము! ఫరో ఇక్కడ వచ్చుచున్నాడు. ప్రజలందరు… నేనేమి చేయవలయును! నేనేమి చేయవలెను!" చూడుడి అక్కడ అది ఒక మానవుడు కదా. మొర్రపెట్టుటకు ఆరంభించెను, "నేనేమి చేయవలెను?"
ఇక్కడ మోషే పరిపూర్ణముగా మానవ స్వభావమును వెల్లడిపరచుచున్నాడు — ఎల్లప్పుడు ఏదో ఒక కార్యమునకు దేవుడు మన వెనుక ఉండి మనలను తోయవలయునని మనము కోరుచున్నాము. ఇప్పుడు, ఈ రోజు మనమే అది. అన్ని కార్యములు మనము చూడవలసిన అన్ని కార్యములు చూచిన పిదప, అయినను ఏదైనా చేయుటకు దేవుడు మిమ్ములను వెనుక నుండి తోయవలెనని మీరు కోరుచున్నారు. చూశారా? మోషే నెమ్మదిగా ఉండి చెప్పెను, "దేవా, నేను నిన్ను అడుగబోవుచున్నాను, మరి మీరేమి చెప్పెదరో చూడవలయును."
"ఔను, ఔను," మీరు చెప్పెదరు, "మంచిది, సరి, నేను కూడా దానిని చెప్పెదను." చూశారా?
అయితే ఇక్కడ దేవుడు కార్యము కొరకు అతనిని నిర్ణయించెను, అతనితో కూడా ఉన్నాడని నిరూపించెను మరి ఇక్కడ అతను పరిస్థితులు అక్కడ ఎదురైనప్పుడు మరి అప్పుడు అతను మొర్రపెట్టతొడగెను," నేనేమి చేయగలను? ప్రభువా, నేనేమి చేయగలను?"
EXOD 14:13
77ఇప్పుడు గుర్తు౦చుకొనుడి, అతడు ఇదివరకే ఇక్కడ ప్రవచించెను, అతడు చెప్పెను, "ఈ రోజు చూచు ఈ ఐగుప్తీయులను, మీరు మరెన్నడును చూడరు." మరి వెంటనే అప్పుడు మొర్రపెట్ట ఆరంభించెను, "దేవా మేమేమి చేయగలము?" అక్కడ ప్రవచించి ఆ ఇంపైన కార్యము చేసిన పిదప. చూశారా, ఏమి జరుగనైయున్నదో అతను వారికి చెప్పియుండెను. దేవుని వాక్యము అతనిలో ఉన్నయెడల, అది అతనిలో ఉండెను. మరి దానిని అతను చెప్పినప్పుడు, అది నిజముగా నెరవేర బోవుచున్నది - అతను దేనిని చెప్పాడో అది నెరవేరబోవుచున్నది, మరి అతను మొర్రపెట్టుచున్నాడు, "నేనేమి చేయగలను?"
ఓ, అది మానవ స్వభావము కాదా. అట్లయిన అది నేను కాదా! అట్లయిన అది నేను కాదా! ఆయన ఇదివరకే నిరూపించెను. నీవు ఏమి చెప్పినను జరుగును. నేను నీతో కూడా యున్నాను. మరి ఇక్కడ ఒక్క క్షణములో ఒక పరిస్థితి లేచినది. "నేనేమి చేయవలెను? నేనేమి చేయవలెను, ప్రభువా? ఆహా, ప్రభువా నీవెక్కడ ఉన్నావు? అయ్యో నీవు నన్ను వినుచున్నావా? నేనేమి చేయవలెను?" మరి ఆయన అతనిని ఇదివరకే నిర్ణయించెను, మరి అతనిని నిరూపించెను, మరి రుజువు పరచెను, మరి అతని ద్వారా సమస్తమును క్రియ చేసెను, మరి ఇక్కడ - "దేవా!" ఓ మై, పూర్తిగా తెలియపరచుచున్నాడు.
మానవుడు ఊరుకనే యుండి మరి దేవుడు నెట్టవలయునని కోరుచున్నాడు.
EXOD 8:24
78మరి అయినప్పటికిని ఈ కార్యమునకై దేవుడు అతనిని అభిషేకించెనని అతనికి తెలియును, ఇది చేయుటకు, అతని అధికారమును దేవుడు స్పష్టముగా నిరూపించెను. జనులు విమోచింపబడుటకు అది సమయము. దేవుడు తన ఆశ్చర్యకరమైన అద్భుతము ద్వారా వారినందరిని ఒకే గుంపుగా చేర్చెను. (మీరు నన్ను వెంబడించుచున్నారా?) వారినందరినీ ఒకే గుంపుగా — అతని హక్కులను నిరూపించెను. లేఖనము ఆ విధముగా చెప్పియున్నది. ఇక్కడొక సూచన; ఇక్కడే ఒక రుజువుపరచబడిన కార్యము కలదు. అతను (మోషే) చెప్పినవన్నియు ఇక్కడ… అప్పుడు వారి మధ్యలో ఒక్క ప్రవక్తగా అతను వచ్చెను. అతనేమి చెప్పినను, దేవుడు దానిని ఘనపరచెను, మరి ఈగలను సృష్టించి పైకి తీసికొని వచ్చుటకు కూడా మరి శూన్యములో కార్యములను సృష్టించెను. మరి దేవుడు అతనికి వాగ్దానము చేసిన కార్యములన్నియు ఇక్కడ అతను చేసెను. అయినప్పటికి ప్రభువు సెలవిచ్చునది పై అతను కాచుకొనియుండవలెనని కోరెను, చూశారా.
నిరూపించబడిన అతని పిలుపే ప్రభువు సెలవిచ్చునది అని అతను ఎరిగి యుండవలయును. అతనికి నిర్ణయింపబడిన ఆ కార్యము ప్రభువు సెలవిచ్చునది. దానిని మీరు గ్రహించితిరా? ఎందువలన అతను ప్రభువు సెలవిచ్చునది పై కాచుకొనియుండును?
EXOD 1:8•
EXOD 14:15
79"ప్రభువా, నేనేమి చేయగలను? ఇదిగో ఇక్కడ ఇంతవరకు ఈ ప్రజలను నేను తీసికొని వచ్చియున్నాను. ఇక్కడ ఇటువంటి పరిస్తితి: ఫరో వచ్చుచున్నాడు; వారందరు మరణించబోవుచున్నారు. నేనేమి చేయవలెను? నేనేమి చేయవలెను?" అని అతడు కోరెను.
వారేమి చేయబోవుచున్నారని అతను ఇదివరకే ఊహించియుండెను. సరిగా ఏమి చేయవలెయునో అతడింతకు మునుపే చెప్పియుండెను. తాను పెరిగిన ఆ దేశము యొక్క క్షీణతను అతడు ముందే చూచెను. మీరు అర్ధము చేసికొన్నారని నేను అనుకొనుచున్నాను. "ఇకమీదట ఎన్నడును మీరు వారిని చూడరు అని మోషే ఇదివరకే చెప్పియుండెను. దేవుడు వారిని నశింపజేయును. చాలా కాలముగా మిమ్ములను వారు అపహిసించిరి. దేవుడు వారిని నిర్మూలము చేయును." వారికేమి సంభవింపనైయున్నదని అతడింతకు మునుపే ఊహించెను మరి "ప్రభువా, నేనేమి చేయవలెను?" అక్కడ మానవ స్వభావమును చూడుడి? "నేనేమి చేయవలయును? ప్రభువు సెలవిచ్చునది కొరకు నేను కాచుకొని ఉందును." సరి, అయ్యా. "నేను ప్రభువు ఏమి చెప్పునో చూచి అటుపిదప దానిని నేను చేసెదను. గుర్తుంచుకొనుడి, యోసేపును గురించి తెలియని ఒక ఫరో లేచియుండెను, మీకు తెలియునా — ఆ సమయములో, సరిగా ఆ సమయములోనే, చూశారా. మరి మోషే లేచి మరియు ఆ దేశము యొక్క చివరి దశను చూచెను.
80మరి ఇక్కడ అది జరుగుబోవు స్థలములో సరిగా అతనున్నాడు మరి అప్పుడు అతను మొర్రపెట్టెను, "నేనేమి చేయవలెను, ప్రభువా? నేనేమి చేయవలెను?" చూశారా?
అది ఒక మనుష్యుడు కాదా? అది మనుష్యుని స్వభావము కాదా? "నేనేమి చేయవలెను?" అతను ఇదివరకే… ప్రవచించెను. అతడు చెప్పినవన్నిటిని దేవుడు ఘనపరచెను, మరి అతను ఆ కార్యమునకే పిలువబడెను, ఆలాగైన "నేనేమి చేయవలయును?" అని ఎందులకు అతడు చెప్పవలయును. ఒకవేళ ఏదైన అవసరమున్నయెడల దానికొరకు అతను పలుకవలయును. అతనికియ్యబడిన విశ్వాసమనే వరమును ఆ కార్యమును చేయుటకు మోషే ఉపయోగించవలయునని దేవుడు కోరుచున్నాడు. మరి అతను అక్కడ వేచియుండి చెప్పెను, "ఇప్పుడు ప్రభువా నేనొక చిన్న బిడ్డను, ఇప్పుడు మీరు నాకు చెప్పుడి. సరి, నేను పోయి ఇది చేయుదును. నా యొద్ద ప్రభువు సెలవిచ్చినది కలదు."
"సహోదరుడా, అది ప్రభువు సెలవిచ్చినదా?"
"అవును, అవును, మోషే సోదరుడా, అది ప్రభువు సెలవిచ్చినది."
"అవును, సరి. ఇప్పుడు దానిని మనము కలిగియున్నాము, ప్రభువు సెలవిచ్చునది" - మరి అది నెరవేరినది. ఒక్కసారి కూడ అది తప్పిపోలేదు. ఎన్నడూ తప్పిపోలేదు.
మరి ఇక్కడ ఆ పరిస్థితులలో, మరల ఎదురాయెను. ఇప్పుడు వారిని ప్రయాణములో ఉంచెను. సంఘము ఇదివరకే బయటకు పిలువబడెను. ప్రయాణములో వారిని ఉంచెను, మరి వారు ముందుకు పోవుచునేయున్నారు. మరి మోషే మొర్రపెట్టుటకు తొడగెను,
"ప్రభువా, ఇది ప్రభువు సెలవిచ్చినదా? నేనేమి చేయవలెను?"
సరి,
EXOD 8:17,24
81తాను స్పష్టముగా నిరూపించి మోషేలో తాను ఉంచిన ఆ వరములో గల విశ్వాసమును అతను కలిగియుండవలయునని, దేవుడు కోరి యుండెను. మోషేకు మరి జనులకు స్పష్టముగా దేవుడు నిరూపించెను తన వాక్యము ద్వారానే చెప్పబడి జరిగిన అన్ని కార్యములు జరిగినవి. అది స్పష్టముగా గుర్తింపబడెను. దానిని గురించి ఇంకనూ అతడు చలించనక్కరలేదు, చూశారా? దానిని గురించి తలంచనక్కరలేదు, ఏలయనగా అది ఇదివరకే విశదపరచబడెను. ఈ కార్యములన్నియు అతను ఇదివరకే చేసియున్నాడు. అతను పలుకుట ద్వారా పేలు, ఈగలు సృష్టింపబడుట వలన దేవుని వాక్యము అతనిలో ఉన్నదని నిరూపింపబడెను. కావున ఇక్కడ అటువంటి పరిస్థితులు అతని ముందుండగా ఏమి చేయవలయునని ఆయనను అతను అడుగుచున్నాడు, చూశారా. ఓ, మై!
మనలోనికి ఇది పోవుచున్నదని నేను నమ్ముచున్నాను, మరి మనము చూడవచ్చును మనము ఎక్కడున్నామని, చూశారా? దానిని గొప్పగా మనము తలంచులాగున అది చేయుటలేదా? మోషేను గురించి తలంచుట, అతని తప్పులు చెప్పుట, మరియు మనము చూచుకొనుట.
EXOD 2:3•
EXOD 14:15•
ACTS 7:30
82అక్కడ అతను నిలుచుకొనియున్నాడు, చూశారా. ఆ కార్యము జరుగు దినము, సమయము అదే అని లేఖనములు చెప్పుట అతను ఎరిగియుండెను, మరియు ఒక అగ్నిస్తంభములో దేవుడు అతనిని సంధించెనని కూడా అతనెరిగియుండెను. అతను పలికినవన్నియు జనులు ముందు ఆ అద్భుత కార్యములు జరిగించినది దేవుడే తప్ప ఎవరు చేయలేని సృష్టింపబడిన కార్యములు అక్కడ నెరవేరుటను చూచినప్పుడు - ఆ స్వరము దేవుని స్వరము అని చూపుచున్నది. మరి ఇక్కడ వాగ్ధాన భూమికి నడిపించుకొని వచ్చుచున్న జనులతో ఒక పరిస్థితి ఎదురైనది మరి అప్పుడు అక్కడ నిలుచుకొని మొర్రపెట్టెను, "నేనేమి చేయవలెను?"
అది ఒక మానవుడు ఎదో కావలయునని, సోదరుడు రాయ్ స్టాటర్ (అక్కడ తలుపులకు బయట కూర్చొనియున్నాడని నేను నమ్ముచున్నాను) ఒకప్పుడు నాతో చెప్పెను, ఎవరో ఒకరు ఎదో కార్యము నాకు చేసినారని. మరి నేను చెప్పాను, "మంచిది, నేను దీనిని చేసాను మరి ఇప్పుడు దానిని…"
మరి అతను చెప్పెను, "బ్రెన్హాం సోదరుడా, ఈ రోజు నీ భుజములపై ఆనుకొననిమ్ము, మరి రేపు వారిని నడిపించుము."
మరి మనుష్యులు ఆ విధముగానే చేయుదురు. ఈ రోజు భుజములపై ఆను కొందురు మరి రేపటి దినమున వారిని నడిపించుము. మోషే అదే చేసెను. అతనిని నిర్ణయించిన పిదప దానిని చేయుటకు మరి నిరూపించిన తరువాత దేవుడు అతనిని నడిపించువలసియుండెను. మరి జనులు చెప్పియుండవలయును, "మోషే వాక్యమును చెప్పుము. అక్కడ నీవు చేయుటను నేను చూచియున్నాను. అక్కడ దేవుడు నిన్ను ఘనపరచెను. ఈ రోజు మరి నీవు మారకయున్నాము." ఆమేన్. చూశారా? "దానిని చేయుము!" ఆమేన్. అతనికి అది ఎరిగియుండవలసి యున్నది, అయితే అతను చేయలేదు. అది సరి.
అప్పటి వలె, ఇప్పుడు కూడా అట్లే వున్నది. మనము కనుగొనియున్నాము దానిని - కావున అతను చెప్పెను…
EXOD 14:15
83దేవుడు అనేక మార్లు చెప్పియున్నారు. ఆ కార్యముపై దేవుడు విసుగు చెందియుండవచ్చును. "దానిని గురించి నా యొద్ద ఏల మొర్రపెట్టుచున్నావు? నన్ను గురించి ఇది వరకే నేను నిరూపించియుండలేదా? ఆ కార్యము కొరకై నిన్ను పంపియున్నానని నేను నీకు చెప్పలేదా? పోయి దీనిని చేయుమని నేను నీకు చెప్పియుండలేదా? ఇది నేను చేసెదనని నేను వాగ్దానము చేసియుండలేదా, నీ నోటితో నేనుందునని, నేను నీ ద్వారా పలికి మరి దీనిని నేను చేసి మరి నీవు సూచనలను, అద్భుతములను చూపలేదా, దానిని నేను వాగ్దానము చేయలేదా? ఖచ్చితముగా అదే విధముగా చేసి నీ చుట్టు ఉన్న ప్రతియొక శత్రువును నేను నాశనము చేయలేదా? మరి ఇప్పుడు నీవు ఎర్ర సముద్రము నొద్ద నీ కర్తవ్యముతో నిలువబడి దానిని నీవు చేయమని చెప్పినప్పుడు మరి ఇంకనూ ఏల కేకలేయుచూ, నాతో మొర్రపెట్టుచున్నావు? నన్ను నీవు నమ్ముట లేదా? దీనిని నీవు చేయుటకై నిన్ను నేను పంపియున్నానన్న కార్యమును నీవు చూచుటలేదా?
ఓ, అది మనుష్యుడు కానియెడల, మై! కావున కేవలము దానిపై చాలా విసుగు చెందియుండవచ్చును.
EXOD 14:15
84మరి ఆయన చెప్పెను, "అది నీకు కావలసియున్నదని నీకు తెలియును. నీకు తెలియును నీవు ఈ బిడ్డలను వాగ్ధాన భూమికి తీసికొనిపోవలయుననిన… అది కచ్చితము… నీవు మూల నిలబెట్టబడియున్నాము. నీవు చేయవలసినదేదియు లేదు. కావున అవసరమైయున్నది, ఎందుకొరకు నా యొద్ద మొర్రపెట్టుచున్నావు? నా యొద్ద నీవేమి ఎదురు చూచుచున్నావు? ఎందుకొరకు నన్ను పిలుచుచున్నావు?" జనులకు నన్ను నేను నిరూపించలేదా? నీకు నేను నన్ను నిరూపించలేదా? దానిని నేను పిలువ లేదా? అది లేఖన ప్రకారము లేదా? ఆ భూమికి నేను జనులను తీసికొని పోయెదనని వాగ్దానమునియ్యలేదా? నేను దాని చేయుదునని నిన్ను పిలిచి చెప్పలేదా? దానిని చేయుటకు నేను నిన్ను పిలిచి చెప్పలేదా, మరి నీవు కాదు, నేను ఆ కార్యమును (వాగ్ధాన భూమికి జనులను చేర్చుట) చేసెదనని చెప్పలేదా? మరి నేను పోయి నీ పెదవులతో ఉండెదను. నీవేమి చెప్పినను నేను దానిని నిరూపించి, రుజువుపరచితిని. దానిని నేను చేయలేదా? అప్పుడు మరి ఏదైనా చిన్న కార్యము మొలకెత్తిన యెడల, నీవేల పసిబిడ్డవలె వ్యవరించుచున్నావు? నీవొక పురుషుని వలె ఉండి యుండవలయును. జనులతో పలుకుము!" ఆమేన్. "అప్పుడు ముందుకు సాగుము." ఆమేన్. అక్కడే మీరున్నారు. "మొర్రపెట్టవద్దు, పలుకుము!" ఆమేన్.
ఓ దానిని నేను ఇష్టపడుదును. "నా యెడల దేనికొరకు మొర్రపెట్టుచున్నావు? జనులతో పలుకుము, నీ యొక్క ఉద్దేశమునకై ము౦దుకు సాగిపొమ్ము." అది ఏమైనను, వ్యాధైనను లేక ఏమైనను, చనిపోయినవారిని లేపుట లేక అదేమైనను, పలుకుము! దానిని నేను నిరూపించియున్నాను. జనులతో పలుకుము."
EXOD 14:15•
LUKE 17:28•
LUKE 21:25,26•
2THS 2:3,4
85ఎటువంటి గుణపాఠము! ఎటువంటి గుణపాఠము! ఓ, మై! ప్రయాణములో ఈ యొక్క దశలో మన మెక్కడ నిలువబడియున్నాము. గమనించుడి ఇప్పుడు ఎక్కడున్నాము - సరి అయ్యా! - మూడవ ఈడ్పు. గమనించుడి, ప్రభువు రాకడ చాలా సమీపముగా ద్వారముల యొద్దనే ఉన్నది మనము అక్కడే ఉన్నాము.
అతడు ఆ కార్యమునకై అభిషేకింపబడెను అయినను ఇంకనూ ప్రభువు సెలవిచ్చున్నాడు కొరకు కాచుకొనియున్నాడు. దానివలన వారిలోని అవిశ్వాసమును చాలినంతవరకు దేవుడు చూచియున్నాడు. ఆయన చెప్పెను, "ఇక పై మొర్రపెట్టవద్దు; పలుకుము! నేను నిన్ను పంపియున్నాను."
ఓ, దేవా! ఈ ఉదయమున ఈ సంఘము ఎట్లు ఉండియుండవలయును! దేవుడు అగ్నిస్తంభములో పరిపూర్ణముగా నిరూపించెను, సొదొమ దినములలో వలె సూచనలు మరి అద్భుతములు ఆయన చెప్పెను. అది (ఆ విధమైన దినములు) తిరిగి వచ్చును. ఇక్కడ ప్రపంచము దాని స్థితిలో, అక్కడ రాజ్యములు అదే స్థితిలో, అక్కడ స్త్రీలు అదే స్థితిలో, పురుషులు అదే స్థితిలో, అక్కడ సంఘము అదే స్థితిలో, అక్కడ సమస్తమును. మూలపదార్ధములు, సూచనలు - ఫైయింగ్ సాసర్స్, మరి అన్ని రకములైన మర్మమైన కార్యములు, మరి సముద్రము గోషి౦చుచు, సముద్రపు అలల పోరు, మనుష్యుల యొక్క గుండెపోటు (జబ్బు), భయము, కలవరపరచు కాలము, రాజ్యముల మద్య మనస్ఫర్దలు, సంఘములు పడిపోవుట.
86మరి పాపపు మనిషి అందరికి, అన్నిటికి పైన లేచి, దేవుడని పిలువబడుచు, దేవుని యొక్క ఆలయములో కూర్చొని (దేవునివలె) తన్ను తాను చూపించుకొనుచున్నాడు. ఓ, మై! అది ఈ దేశమునకు వచ్చియున్నది!
మరి సంఘమంతయు స్థాపింపబడి (శాఖగా మారి) మరి అందరు ఒక్కటిగా కూడి ఆ మహా వేశ్య యొద్ద వేశ్యలుగా ఉన్నారు, మరి అన్ని కార్యములును సరిగా వేశ్యరికపు మార్గములో ఉన్నవి. అది వేశ్యా వృత్తి! అదేమిటి? స్త్రీలు వారి వెంట్రుకలను కత్తిరించు కొనవచ్చును అని చెప్పుట, స్త్రీలు పొట్టి దుస్తులు ధరించుకొనవచ్చునని చెప్పుట, పురుషులతో అది చేయవచ్చును, మరి వారు ఇది చేయవచ్చును అని ప్రాసంగీకులు చెప్పుట, దీనిని చేయుము, మరి సాంఘిక సువార్త మరి కార్యములు. దేవుని యొక్క నిజమైన వాక్యముతో అది వ్యభిచారము చేయుచున్నది, మీరు చూచుట లేదా? మరి దేవుడు సంఘ శాఖ కాని లేక స్థాపింపబడని ఆయన నిజమైన వాక్యమును మనకు పంపించి యున్నాడు! అది ఏ త్రాళ్ళతో కట్టబడియుండలేదు, మరి ఒక అగ్నిస్తంభమును మనకిచ్చెను, ముప్పది సంవత్సరములుగా మనతో ఇప్పుడున్న పరిశుద్దాత్మ, మరి అన్ని కార్యములు ఆయన చెప్పి నెరవేరినవన్నియు ఖచ్చితముగా, ఆయన ఏ విధముగా ఉండునని చెప్పెనో, అదే విధముగా ఉన్నవి.
EXOD 14:15•
2SAM 7:3
87"జనులతో పలుకుము; మరి మనము ముందుకు సాగిపోవుదము." ఆమేన్. మనకొక ఉద్దేశము కలదు, అదే మహిమ. దానిలోనికి మనము పోయెదము. వాగ్ధాన భూమికి మనము పోవుచున్నాము. నమ్మినవారివలన సమస్త కార్యములును సాధ్యమగును."
"జనులతో పలుకుము. దానిని నేను నిరూపించలేదా, మీ మధ్యలో నా పటమును (ఫోటో) ఉండులాగున మరి అన్నియును, నేను మీతో కూడా ఉన్నానని నిరూపించబడుటకు చేసిన అన్ని కార్యములను నేను చేయలేదా? కొద్ది వారముల క్రిందట పత్రికలలో వేసిన విధముగా మూడునెలల ముందు నీవు ప్రసంగవేదికపై ఆ విధముగా జరుగునని చెప్పి - మరి అక్కడ అది జరుగుచున్నప్పుడు మరి నిరూపింపబడినప్పుడు -విజ్ఞానమునకు కూడా దాని గురించి ఏమి తెలియలేదు. మరి నేను చేసిన సమస్తమును, మరి ఇంకనూ నీవు కాచుకొనియున్నావు. జనులతో పలికి నీ యొక్క ఉద్దేశము కొరకు ముందుకు సాగిపొమ్ము." ఆమేన్
దావీదుతో నాతాను చెప్పలేదా - నాతాను ప్రవక్త - ఒకప్పుడు అభిషేకింపబడిన రాజైన దావీదును కూర్చొని చూచుచు, అతడు చెప్పెను, "నీ హృదయములో ఉన్నదంతటిని చేయుము, ఏలయనగా దేవుడు నీతో ఉన్నాడు. దావీదుతో చెప్పెను, "నీ హృదయములో ఉన్నదంతటిని చేయుము; దేవుడు నీతో ఉన్నాడు."
JOSH 1:5•
JOSH 3:10•
JOSH 10:12
88యెహోషువా దేవుని కొరకు ప్రజల కొరకు భూమిని గైకొనుటకు అభిషేకింపబడెను. పగలు చాలా కొద్దిసేపు ఉండెను; అతడు అభిషేకింపబడి ఆ కార్యమును నెరవేర్చుటకు అతనికి చాలా సమయము కావలసియుండెను. యెహోషువ — ఒక మానవుడు. అతడు అభిషేకింపబడెను. దేవుడు అతనితో చెప్పెను, "నేను మోషేకు తోడైయుండినట్లు, నీకును తోడైయుండును." ఆమేన్. "ఆ భూమి, వారికి నేను ఇచ్చెదను. నీవు పోయి అక్కడికి పోయి అమోరీయులను మరి ఇతరులను, ఫిలిష్తియులను మరి పెరిజ్జీయులను మరి ఇతరత్ర అందరిని నీవు నిర్మూలము చేయవలెనని నేను నిన్ను కోరుచున్నాను. నేను నీకు తోడైయుండును. నీ జీవితకాలమంతయు ఏ మనుష్యుడు నీకు ముందుర నిలువలేడు. ఎవరు నీకు తొందర నియ్యరు. అక్కడికి దానిలోనికి పొమ్ము."
మరి యొహోషువ ఆ ఖడ్గమును ఎత్తి మరి చెప్పెను, నన్ను వెంబడించుము." మరి అతను అక్కడికి పోయి మరి ఇక్కడ అతను పోరాడుచున్నాడు. మరి అదేమిటి? అతను శత్రువును ఓడించెను. వారు ఇక్కడ అక్కడ గుంపులు గుంపులుగా ఉండిరి. రాత్రివేళ వచ్చునప్పుడు వారందరు ఒక్కటిగా కూడి, ఒక దండుగా, ఒక పెద్ద బలముతో అతనికి విరోధముగా వచ్చిరి, మరి సూర్యుడు అస్తమించుచుండెను. అతనికి అధిక వెలుతురు అవసరమైయుండెను. సూర్యుడు అస్తమించుచుండెను! అతడు తన మోకాల్లూని, "ప్రభువైన దేవుడా, నేనేమి చేయగలను? నేనేమి చేయగలను అని అడుగలేదు. అతను పలికెను! మరి అతనికి ఒక అవసరముండెను మరి చెప్పెను, "సూర్యుడు అట్లే నిలువుము" మరి అతను మొర్రపెట్టలేదు. అతడు ఆజ్ఞాపించెను. "సూర్యుడు అట్లే నిలువుము." నాకు దీనివలన అవసరమైయున్నది. నేను దేవుని యొక్క సేవకుని, ఈ కార్యమునకై అభిషేకి౦పబడితిని మరి నాకు ఒక అవసరము కలదు. అట్లే నిలువుము మరి నీవు ప్రకాశింపకుము, మరి చంద్రుని (చూచి) నీవు ఉన్నచోటిలో అట్లే నిలువుము, "అతను పోరాడువరకు, అందరిని తరిమికొట్టు వరకు.
మరి సూర్యుడు అతనికి లోబడెను.
JOSH 10:12•
JUDG 15:15
89మొర్రపెట్టలేదు, అతను సూర్యునితో పలికెను. చెప్పెను, "నీవు అట్లే నిలువుము. సూర్యుడా అక్కడ అట్లే నిలువుము, మరి చంద్రుడా నీవెక్కడున్నావో అక్కడే నీవుండుము." "ప్రభువా, ఇప్పుడు నేనేమి చేయగలను? నాకు ఇంకా కొద్దిగా సూర్యుని వెలుగునిమ్ము" అని అతడు మొర్రపెట్టలేదు. అతనికి సూర్యుని వెలుగు అవసరమైయుండెను, కావున దానిని అతడు ఆజ్ఞాపించెను, మరి సూర్యుడు అతనికి లోబడెను. ఓ, మై! అట్లే నిలువమని అతడు ఆజ్ఞాపించెను.
సమ్సోను, అభిషేకముతో పెరిగెను, దేవునిచే నిర్ణయింపబడి, శక్తితో నింపబడిన ఒక వరమునియ్యబడి ఫిలిష్తియుల దేశమును నాశనము చేయుటకు అతడు నియునింపబడెను - నిర్ణయింపబడెను, భూమిపై పుట్టెను, ఫిలిష్తియులను నిర్మూలము చేయుటకు దేవునిచే అభిషేకింపబడెను. ఒక రోజు వారు అతనిని పట్టుకొనిరి ఆ పొలములో అతని యొద్ద ఖడ్గము లేదు, ఈటె లేదు, మరి వెయ్యిమంది ఆయుధములతో ఫిలిష్తియులు ఒకేసారి అతనిపై పడిరి. "ఓ ప్రభువా, నేను దర్శనము కొరకు వేచియున్నాను? ఓ, ప్రభువా, నేనేమి చేయవలెను? ఇప్పుడు నేనేమిచేయవలెను" అని అతడు వంగి అడిగెనా? అతనికి తెలియును, అతను అవసరములో ఉన్నాడని. అతడు ఏమి కనుగొనలేదు, అయితే గాడిద దవడు ఎముకను తీసికొని వెయ్యిమ౦ది ఫిలిష్తియులను కొట్టెను. ఆమేన్! అతడు దేవుని యొద్ద మొర్రపెట్టలేదు. అతని యొద్దనున్న అభిషేకింపబడిన వరమును అతను ఉపయోగించెను. ఆ కార్యమునకై అతను పంపబడినాడని అతను ఎరిగియుండెను. అందుకొరకే అతను జన్మించినాడని ఎరిగియుండెను. అతను ఒక వరముతో అభిషేక్షింపబడినాడని ఎరిగి, వెయ్యి మంది ఫిలిష్తియులను కొట్టెను. అతను దేవుని యొద్ద మొర్రపెట్టలేదు. దేవుడు అతని నిర్ణయి౦చెను, అతను చేసిన ఇతర కార్యముల ద్వారా అతను నిరూపింపబడెను, మరి అతను ఫిలిష్తియులను నాశనము చేయుటకు నిరూపింపబడిన, అభిషేకింపబడిన దేవుని యొక్క సేవకుడు మరి దానిని అతడు చేసెను! పరిస్తితులు ఎట్లున్నను దానిని లెక్క చేయక అతడు చేసెను. అతడు ఏదియు అడగలేదు. అది అతని కార్యము. దేవుడు అతని ద్వారా చేయుచున్నాడు. అతనొక గాడిద ఎముకను తీసికొని ఫిలిష్తియులను కొట్టుటకు పోయెను.
JUDG 15:15
90ఏ విధముగా ఎందులకు ఫిలీస్థీయులు ధరించియున్న ఒకటిన్నర అంగుళము గల ఆ ఇత్తడి కవచములకు ఆ గాడిద ఎముక తగిలిన యెడల ఆ ఎముక 10 లక్షల ముక్కలుగా చెదరియుండును మరి ఆ ఎముకతో అతను వెయ్యిమందిని కొట్టి, చంపి ఇంకను ఆ ఎముకను తన చేతితో పట్టుకొని నిలిచియుండెను. ఏ ప్రశ్నలు అడులేదు. అతను మొర్రపెట్టలేదు. అతను పలికెను. వారిని నిర్మూలనము చేసెను.
ఓ, మై! ఫిలిష్తియులను తీసికొనుము. "ప్రభువా, ఫిలిష్తియులను నేను గైకొనవచ్చునా, ప్రభువా? దానిని చేయుటకు మీరు నన్ను పంపియున్నారు. అవును, ప్రభువా, ఫిలిష్తియుల ఈ దేశమును నిర్మూలము చేయుటకు మీరు నన్ను పంపియున్నారని నాకు తెలియును. ఇప్పుడిక్కడ నా చుట్టూ వారితో వెయ్యిమంది. నా యొద్ద ఏమియు లేదు. ప్రభువా, ఇప్పుడు నేనేమి చేయగలను." ఓ, మై! అతనిని ఏ కార్యము ఇప్పుడు అడ్డుపెట్టదు. ఆ కార్యమునకై అతడు అభిషేకింపబడెను. ఏదియును నిన్ను బాధించదు. లేదు, ఏ ఒక్క కార్యము కూడా. హల్లెలూయా!
అతని దగ్గరయున్న దానిని తీసికొనివారిని కొట్టెను. అది సరి.
JUDG 16:3
91శ్రతువులు అతనిని చుట్టుముట్టి మరి చెప్పిరి, "గోడల లోపు ఇప్పుడు అతనిని పెట్టి యున్నాము, ఇప్పుడు అతనిని పట్టుకొనియున్నాము. ఈ స్త్రీతో లోపల అతనిని పట్టుకొనియున్నాము. ఇప్పుడు అన్ని చోట్ల అన్ని వైపులను మంచి గట్టి లేక దృఢమైన తలుపు మనకున్నది మరి అతను బయటికి వెళ్ళలేడు. అతనిని మనము పట్టుకొని యున్నాము."
సమ్సోను మొర్రపెట్ట లేదు, "ఓ, ప్రభువా, ఈ సంఘ శాఖతో నన్ను వారు చుట్టుముట్టి యున్నారు. నేనేమి చేయుదును? వారితో నేను కలువబడియున్నాను. నేనేమి చేయగలను?" అతను ఆ విధముగా చేయలేదు. అతను సాధారణముగా బయటికి నడచి, ఆ ద్వారములను క్రిందకు లాగి తన భుజముపై వేసుకొని దానితో నడచి వెళ్ళెను. ఆమేన్!
ఆ కార్యమునకై అతడు అభిషేకింపబడెను. దేవుని ద్వారా అతను పిలువబడెను - అతనిని బందీగా పెట్టలేదు. లేదు, అతను తలుపులను తనతో తీసికొనిపోయెను. దానిని గురించి అతను ప్రార్ధించలేదు. దానిని చేయవలనా లేక చేయకూడదా అని అతను దేవుని అడగలేదు. అతని యొక్క కర్తవ్యములలో అది సరిగా ఉన్నది. ఆమేన్! ఆమేన్! ఆమేన్! కర్తవ్యము యొక్క క్రమములో సరిగా.
"ఏల నాకు మొర్రపెట్టుచున్నావు? పలుకుము, మరి సాగిపొమ్ము." ఆమేన్. "మొర్రపెట్టకుము, పలుకుము." ఇప్పుడు అతను మూలుగుటను, ఏడ్చుటను వదలివేసెను. పలుకుటకు కావలిసిన విధముగా అతడు ఎదిగియుండెను. అది సరి. అతని ముందు నిలుచు ఎటువంటి ఫిలిష్తియుడైనను, అతని అభిషేకింపబడిన వరమైన శక్తితో వారిని నిర్మూలము చేయగలుగునని అతను ఎరిగియుండెను. ఆమేన్.
92అయితే మనకు దానిని గురించి తెలియదు, మీరు చూశారా. మనమింకను మన నోటితో సీసాతో ఇంకను పసిబిడ్డలము మరి… దానిని అతను ఎరిగియుండెను! ఆ ఉద్దేశమునకై దేవుడు అతనిని లేపినాడని అతని జీవిత కాలమంతయు ఏ ఒక్కటి అతని ముందు నిలువజాలదని (అతను ఎరిగియుండెను), ఏదియును అతనిని నిర్మూలము చేయదు. మోషే వలె అతడు ఆ కార్యమునకై లేపబడెను - ఏదియును అతనిని ఆపలేదు. ఏ అమాలేకీయులును లేక వేరే ఏదియును అతనిని ఆపజాలదు. వాగ్దాన భూమికి అతను పోవుచున్నాడు. సమ్సోను తాను ఆ మార్గములో ఉన్నాడని ఎరిగియుండెను.
యొహోషువకు తెలియును ఆ భూమిని స్వతంత్రించుకొందునని. అతను నిరూపింపబడియున్నాడు. దేవుని వాక్యము దానిని వాగ్దానము చేసియున్నది, మరి దానిని అక్కడ పరిశుద్దాత్మ రుజువుపరచుచున్నది.
EXOD 14:15
93అతను తన మార్గములో ఉన్నాడు కావున అతని మార్గములో ఏదియును అడ్డుగా నిలువదు. లేదయ్యా. దేవుని యొక్క కార్యము వరుసలో సరిగా దేవునితో, అతని మార్గములో నిలుపుటకు ఏదియును లేదు, కావున అతడు సునాయాసముగా ఆ తలుపులను ఎత్తుకొని తన భుజములపై వేసికొనెను - అవి సుమారు నాలుగు లేక ఐదు టన్నుల బరువు కలవి - వాటితో కొండపైకి నడచి వెళ్ళి, వాటిపై కూర్చుండెను - అతని మార్గములో ఏదియును నిలువలేదు. అతనికి దేవుని యొద్ద నుండి పొందిన అభిషేకించబడిన వరము కలదు.
అతను మొర్రపెట్టు పనిలేదు, "ప్రభువా, ఇప్పుడు నేనేమి చేయవలెను." దానిని చేయుటకు అతను ఇదివరకే అభిషేకింపబడెను. అది ప్రభువు సెలవిచ్చినది. "వారిని తొలగించు కొనుము!" హల్లెలూయా! "వారిని తొలగించుకొనుము! ఆ కార్యము కొరకే నేను నిన్ను లేపియున్నాను." ఆమేన్.
"ప్రభువా నేనేమి చేయవలెను? ఇక్కడ ఎర్ర సముద్రము నొద్ద నేనేమి చేయగలను?"
"ఇక్కడే ఒక పర్వతమును ఒక సూచనగా నేను నీకిచ్చియున్నానని నేను నీకు చెప్పలేదా? నీవు తిరిగి ఆ కొండ యొద్దకు వచ్చి ఆ భూమిలోనికి ఈ జనులను తీసికొని పోయెదవు. ఆ ఉద్దేశము లేక కార్యము కొరకై నేను నిన్ను పిలువలేదా? నీ మార్గములో వేరే ఏదైనను నిలిచిన యెడల నీ వేల చింతించుచున్నావు. పలికి మరి ముందుకు సాగుము." ఆమేన్ మరియు ఆమేన్. "ఈ కార్యము కొరకే నేను నిన్ను పిలిచియున్నాను."
1SAM 17:36
94దావీదు, అతనెరిగియుండెను, అతడు అభిషేకింపబడినాడని, మరి చక్కగా గురి చూచికొట్టగలడు అని నిరూపించబడియుండెను. అతనికి తెలియును, వారు ఎరుగుదురు అతడొక మంచి గురి చూచి కొట్టగల నేర్పరి అని. దావీదు అభిషేకింపబడెను; దానినతడు ఎరిగి యుండెను. మరి అతడు గొల్యాతు ముందు నిలబడినప్పుడు, అతడు మొర్రపెట్టలేదు, "ఓ, దేవా, ఇప్పుడు నేనేమి చేయవలెను? అయితే, అయితే, గడిచిన కాలములో నీవేమి చేసితినో నేనెరుగుదును. నేను ఒక ఎలుగుబంటిని చంపులాగున నీవు చేసితివి, మరి ఒక సింహమును చంపులాగున నీవు చేసితివి, అయితే అక్కడున్న గొల్యాతు గురించి ఏమి?" ఆలాగున అతడు చేయలేదు; అతడు కేవలము పలికెను. అంతే అతడేమి చెప్పెను? "వారివలె నీవు అయ్యెదవు." అతడు పలికి మరి ముందుకు సాగెను.
అతడు ఒక ప్రార్ధనను కూడా ప్రార్ధించలేదు; అతడేమి అర్పించలేదు. అతడు అభిషేకింపబడినవాడని అతడెరిగెను. ఆమేన్. అతడు అభిషేకింపబడెను మరి ఆ వడిసెల సరైనదిగా రుజువుపరచబడెను. అతని అభిషేకముపై అతనికి విశ్వాసముండెను. కొట్టబడవలసిన ఒకే చోటైన ఆ శిరస్రాణము మధ్య నేరుగా ఆ రాయి పోయి కొట్టులాగున దేవుడే ఆ రాయిని నడిపించునని అతనికి విశ్వాసముండెను. అతడక్కడ నిలుచుకొని యుండెను.
1SAM 16:12•
1SAM 17:28,36,37,42,45
95అతనికి తెలుసును తాను సరిగా గురి చూచి కొట్టగలడని. ఆమేన్. ఆ విధముగా దేవుడతని చేసెనని అతడెరిగియుండెను. ఆమేన్. అతడొక సింహమును చంపినాడని అతనికి తెలియును. అతడోక ఎలుగుబంటిని చంపినాడని అతడెరిగి యుండెను, అయితే అది తన ఇహలోకపు తండ్రి యొక్క స్వాధీనమును తెలుపుట. ఇక్కడ తన పరలోకపు తండ్రి ఆధీనము. ఆమేన్.
అతనక్కడ "నేనేమి చేయవలెను ప్రభువా?" అని చెప్పలేదు. అతను పలికి మరి చెప్పెను, "నీవు సింహము వలె మరి ఎలుగుబంటి వలె అయ్యెదవు, మరి నేను వచ్చియున్నాను." దేవునికి మహిమ! అవును, అయ్యా.
అతను పలికి ఈ గొల్యాతును సంధించుటకు ముందుకు సాగెను (ఓ, మై!) తన తక్కువ స్థాయిని మరచి లేక పట్టించుకొనక, అతడు ఎర్రని వర్ణము చూపు చిన్న వ్యక్తి అని మీకు తెలియునా. అతడు చాలా ఎతైయిన మనిషి కాదు, చూచుటకు అంతటనీ అందగాడు కాడు. పొట్టిగా ఒక విధమైన మనిషి అతను. ఎర్రని రంగుగల వాడని బైబిలు చెప్పుచున్నది. ఇప్పుడు అతని శరీర కొలత ఎంత ఉన్నను మరి అతని వలన సాధించ వీలగునో కాదో లక్ష్యము లేదు…
మీకు తెలియునా, మతగురువు అతనితో చెప్పెను, "ఇప్పుడు ఇక్కడ చూడు కుమారుడా, ఆ మనిషి ఒక మత వేదాంతి. చూశారా? అతడు ఒక వీరుడు. ఆతడు వీరుడుగానే పుట్టెను, మరి అతని యౌవ్వన ప్రాయము నుండి అతను వీరుడుగానే పుట్టెను, మరి అతని యౌవ్వన ప్రాయమునుండి అతను వీరుడుగా ఉంటున్నాడు; మరి నీవు అతనికి ఏ మాత్రము సరితూగవు."
మరి అతని సహోదరులు చెప్పిరి, "ఓ నీలో కొంటెతనము కలదు. అటువంటి కార్యమును చేయుటకు నీవు ఇక్కడకు వచ్చియున్నావు; ఇంటికి తిరిగిపొమ్ము." అది అతని తొందరపెట్టలేదు. ఎందులకు? - అతను అభిషేకింపబడియున్నాడని అతడు ఎరిగెను.
"సింహము నుండి నన్ను విడిపించిన దేవుడు, ఎలుగుబంటి పంజా నుండి నన్ను విడిపించిన దేవుడు, అంతకంటెనే అధికముగా నన్ను ఫిలిష్తియుని నుండి తప్పించును. ఇక్కడ నేను వచ్చియున్నాను. ఇశ్రాయేలు ప్రభువైన దేవుని నామములో నిన్ను సంధించుచున్నాను." ఆమేన్.
ప్రార్ధించుచూ ఉండలేదు - అతను ఇంతకు ము౦దే ప్రార్ధి౦చెను; జగత్తుకు పునాది వేయబడక మునుపే దేవుడు అతనిలో నుండి ప్రార్ధించెను. ఆ కార్యమునకై అతడు అభిషేకింపబడెను. అతడు పలికి మరి ముందుకు సాగిపోవలయును. అది ఒక్కటియే దానిని గూర్చి అతడు చేయవలసినది. ఊరకే పలికి మరి ముందుకు సాగిపొమ్ము.
ఓ, దానికున్నదంతయు అదే. అతడు లెక్క చేయలేదు…
1SAM 17:28,36,49-51
96అతని సంఘ శాఖ సహోదరులను, అక్కడ నిలిచి అపహసించు వారిని కూడా, మీకు తెలియును. ఓ, సరి. అక్కడ వారు నిలుచుకొని చెప్పుచున్నారు, అపహసించుచు మరి ఎగతాళి చేయుచు చెప్పుచున్నారు. (అతని సహోదరులు మీకు తెలియునా) మరి చెప్పిరి. "ఆహా, ఆహా, నీవు ఊరక కొంటెతనముగలవాడిని." అది అతనిని ఏ మాత్రము కూడా కదల్చలేదు. "నీవు ఇతరుల కంటె వేరుగా ఉండవలయునని కోరిన నీవు, దానిని చూపించవలసినదే."
అది చూపబడవలసిన కార్యము, కావున అది ಅట్లే ఉండును. అయితే వారు తమ మానవ జ్ఞానముతో, మాత్రమే చూడగలిగారు. దావీదు అభిషేకింపబడిన నూనె అతనిపై ఉన్నదని ఎరిగియుండెను. అతనికి ఏ విధముగా వ్యత్యాసవు కలుగజేయలేదు. అతను చెప్పెను, "ఆ ఫిలిష్తియుడు సింహము మరి ఎలుగుబంటి వలె అగుదువు, ఏలయనగా ఇక్కడ నేను వచ్చియున్నాను." అది సంభవించుటకు ముందే అతడు దానిని ఊహించెను. అతడేమి చేసెను? — అతడు ఎలుగుబంటిని చంపెను; అతడు సింహమును చంపెను. అతడు సింహసమును పడద్రోసెను. దేనితో? — ఒడిసెలతో, మరి ఒక ఖడ్గము తీసికొని అటు పిదప సింహము, అతడు సింహమును ఖడ్గముతో చంపెను. అదే కార్యమును అతడు గొల్యాతుకు చేసెను. ఒక రాయితో అతనిని పడద్రోసి మరి అతని కత్తిని వర నుండి లాగి అతని తలను అక్కడే నరికి అందరి ముందర… అది సంభవించక మునుపు అతడేమి ఊహించెను? — "మరి నీవు వాటివలె ఉందువు." ఎందులకు? అతను వాక్యమును పలికెను అది ఆ విధముగా జరుగునని మరి అప్పుడు అది నెరవేరులాగున ముందుకు సాగెను. ఆమేన్. ఓ సోదరుడా! అతను పలికి ఆ రోజు పరిస్థితిని తన అదుపులోనికి తీసికొనెను.
MATT 10:8
97ఒక వ్యక్తి మాట్లాడవలసిన సమయము ఎప్పుడైనా ఉన్నయెడల, అది ఇప్పుడే (ముగించునప్పుడు ఇంకా కొద్ది నిమిషములు, మీరు ఇంకా కొద్ది నిమిషములు సహించిన యెడల ఇక్కడ నేను ఇంకా కొన్ని కార్యములను వ్రాసికొనియున్నాను, కొన్ని లేఖనములు నేను తీయవలయునని యున్నాను.)
పేతురు శృంగారమను తలుపు నొద్ద పడియుండు ఒక వ్యక్తికి స్వస్థత నొందుటకు చాలినంత విశ్వాసము ఉన్నదని అతను కనుగొనినప్పుడు పేతురు మొర్రపెట్టలేదు. అతడు పోయి రాత్రంతయు ప్రార్ధించలేదు మరి లేక పగలంతయు ప్రార్ధన, లేక దీర్ఘ ప్రార్ధన చేయలేదు మరి, "ప్రభువా, నేను ప్రార్ధి౦చుచున్నాను, మీరు ఇప్పుడు ఈ బీద కుంటి మనుష్యునికి సహాయపడుడి," అని ప్రార్ధించలేదు. అతనికి విశ్వాసమున్నదని నేను చూచాను. నాకు తెలుసును అతడొక విశ్వాసి అని, మరి నేను అతనిని అడిగియున్నాను, అతని చెప్పెను (కుంటివాడు) అతనికి విశ్వాసమున్నదని - నేనేమి అతనికి చెప్పితినో అతను నమ్మెను. మీరేమి చేసితిరో దానిని గురించి నేను అతనికి చెప్పితిని, మరి ఇప్పుడు నేను తలంచుచున్నాను, ప్రభువా … మీరు ఒక ప్రభువు ఈలాగు సెలవిచ్చుచున్నాడు నాకియ్యగలరా అతని కొరకు?"
లేదు, అతడొక అభిషేకింపబడిన అపొస్తులుడని అతడెరిగియున్నాడు. యేసుక్రీస్తు అతనికి అధికారమునిచ్చియున్నాడని అతనికి తెలియును. "రోగులను స్వస్థపరచుడి, చనిపోయినవారిని లేపుడి, కుష్ట రోగులను శుద్దపరచుడి, దెయ్యములను వెళ్ళగొట్టుడి; ఉచితముగా మీరు పొందినలాగున, ఉచితముగా ఇయ్యుడి." ఆయన చెప్పియున్నాడు, "పేతురు పోయి దానిని చేయుము!" అతను ప్రార్ధించుచూ ఉండనక్కర లేదు, అతను అధికారము పొందియున్నాడు.
ACTS 3:6,7•
ACTS 5:15
98అతడేమి చెప్పెను? అతను చెప్పెను, "యేసుక్రీస్తు నామములో …" యేసు క్రీస్తు నామమును అతడు పలికెను, మరి ఆ మనుష్యుడు అక్కడ పడియుండెను. అతను తన చేతితో అతనిని (కుంటి మనుష్యుని)పట్టుకొని లేవనెత్తి మరి చెప్పెను, "నీ కాళ్ళపై నిలువుము!" అతని పాదములును, చీల మండలును బలము పొందువరకు అతను అతనిని పట్టుకొనియుండెను, మరి అతను (కుంటివాడు) లేచి నడుచుటకు ఆరంభించెను.
ఎందులకు? రాత్రంతయు ప్రార్ధన కూటమును అతను జరుపలేదు. అతను దేవుని యొద్ద మొర్రపెట్టలేదు. ఈ కార్యమునకై అతను అభిషేకింపబడినాడని యేసుక్రీస్తు పెదవుల ద్వారా చెప్పియున్నారని అతను రూఢిగా ఎరిగియుండెను. అతను పలికి మరి అతనిని లేవదీసెను, ఏలయనగా ఈ కార్యమునకై అతడు అభిషేకము పొందిన అపొస్తులుడని అతనికి తెలియును.
అతని నీడలో ఉండు ప్రజలు ఎన్నడూ చెప్పియుండలేదు, "ఓ అపొస్తలుడైన పేతురు, రమ్ము, మరి మా కొరకు మొర్రపెట్టుము, మరి విశ్వాసముతో కూడిన ప్రార్ధన దేవునితో మా కొరకు ప్రార్ధించుము." లేదు, కాదు, ఆ విధముగా వారు చెప్పలేదు. వారెరుగుదురు అతడు అభిషేకింపబడి మరి నిరూపింపబడిన దేవుని అపొస్తులుడని. కావున వారు చెప్పిరి, "ఊరకే అతని నీడలో మనము పడెదము. మీరు ఒక వాక్యమును చెప్పనక్కరలేదు. అది మాకు తెలియును; దానిని మేము నమ్ముచున్నాము." వారిలో జీవముండెను. ఆ అపొస్తులుడు అందరి యొద్దకు పోలేక పోయినను మరి వారికి వారే — దానిలో వారు ఒక భాగమైయున్నారు.
MATT 9:20•
ACTS 5:15
99మోషే చెప్పెను, "ఇది నేను మాత్రము పోవుట కాదు. మేమందరము పోవుచున్నాము. మేమందరము ఒక కార్యమును చేయవలసియున్నది. మేమందరము అభిషేకి౦పబడవలసియున్నది." మరి వారు ఆ అపొస్తులుడు అక్కడ నిలిచి వ్యాధిగ్రస్తుని స్వస్థపరచుట చూచిరి మరి అతను చేసిన కార్యములు — వారికి తెలుసును వారియొద్దకు అతను రాలేదని, వారు ఎన్నడు ఎన్నడూ చెప్పలేదు, "పేతురు వచ్చి ప్రార్ధించి ఇప్పుడు కాచుకొని యుండుము ప్రభువు సెలవిచ్చుచున్నాడు నీవు పొందువరకు మరి వచ్చి నాకు చెప్పుము. ప్రభువు ఏమి చెప్పునో చూడు." వారు చెప్పిరి, "మనము అతని నీడలో మాత్రము ఉంటే చాలు, ఏలయనగా యేసుక్రీస్తులో ఉన్న అదే దేవుడు అతనిలో ఉన్నాడు మరి అదే కార్యము జరుగుట మనము చూచుచున్నాము." కావున వారు యేసు వస్త్రపు అంచును తాకిరి మరి అతడి నీడలో పడియుండిరి మరి యేసు ఈ వ్యక్తిలో ఉండెను. ఆ నీడ (పేతురు నీడ) వారిపై పడినయెడల వారు స్వస్థతనొందెదరు. మరి బైబిలు చెప్పుచున్నది, వారిలో ప్రతి యొక్కరు స్వస్థతనొందిరి. రాత్రంతయు ప్రార్ధనాకూటములు లేవు అని చెప్పిరి, "ప్రభువా ఈ అపొస్తలుని యొక్క నీడలో నేను పోయి ఉండిన…" లేదు, అది వారికి తెలిసియుండెను. ఆ వెలుగు వారిని తాకెను. వారి హృదయములు ఉప్పొంగి, వారి విశ్వాసము బయటికి వదలబడెను. ఆమేన్. వారు దానిని నమ్మిరి. దానిని చూచిరి. పౌలు చేతి రుమాళ్ళు - అదే విధముగా, (ఇప్పుడు, ముగించునప్పుడు).
MATT 9:17,22,25•
MARK 5:9,12•
LUKE 8:30
100మూర్చ రోగముగల అగ్నిలో దూకు పిచ్చివానిని, బాలుని, అతని యొద్దకు వారు తీసికొని వచ్చినప్పుడు యేసు మొర్రపెట్టలేదు. "తండ్రీ, నేను నీ కుమారుని నీవు నన్ను ఇక్కడికి పంపి ఇది చేయమని మరి ఫలానా - ఫలానా; మరి అందువలన ఈ బాలుని నేను స్వస్థపరచవచ్చునా? అని ఆయన అడుగలేదు. ఆయన ఎన్నడూ చెప్పలేదు, ఆయన పలికెను, "సాతాను అతనిలో నుండి బయటికి రమ్ము!" ఆయన పలికెను మరి ఆ బాలుడు బాగుపడేను.
ఆయన రెండువేల దెయ్యములున్న సేనను సంధించినప్పుడు, యేసు మొర్రపెట్టలేదు; దెయ్యములు కేకలు వేసినవి. "నీవు మమ్ములను వెళ్ళగొట్టిన ఎడల (ఓ, మై!) అక్కడున్న ఆ పందుల మందలోనికి పోవుటకు అనుమతినిమ్ము."
యేసు ఎన్నడూ చెప్పలేదు, "తండ్రి ఇప్పుడు దీనిని నేను చేయగలను?" ఆయన చెప్పెను, "అతనిలో నుండి బయటికి రమ్ము," మరి ఆ దయ్యములు పరుగెత్తినవి. నిశ్చయముగా, ఆయన మెస్సీయా అని ఆయనకు తెలియును.
JOHN 11:21,25,27,43•
COL 2:9
101లాజరు యొక్క సమాధి యోద్ధ (అతను చనిపోయి నాలుగు దినములు అయినవి) వారు చెప్పిరి, మీరు ఇక్కడుండిన యెడల ప్రభువా, అతను చనిపోయి ఉండడు."
ఆయన చెప్పెను, "నేనే పునురుత్దానమును మరియు జీవమును…" ఎక్కడ, ఎప్పుడు, లేక ఎలా అని కాదు. "నా యందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రదుకును." ఆమేన్. ఆయన ఎవరని ఆయనకు తెలియును. ఆయన ఏమైయున్నాడని కూడా ఆయనకు (యేసుకు) తెలియును. ఆయన ఇమ్మానుయేలని ఆయనకు తెలియును. ఆయనే పునరుత్దానమని ఆయనకు తెలియును. ఆయనే జీవమని ఆయన ఎరిగియుండెను. దైవత్వము యొక్క సర్వపరిపూర్ణత ఆయన శరీరములో ఉన్నదని ఆయన ఎరిగియుండెను. ఆయన అక్కడున్న కొద్ది ప్రజలను చూచెను. మరి దేవుడు ఆయనతో (యేసుతో) ఏమి చెప్పెనో, దేవుడు ఏమి చేయమని చెప్పెనో కూడా ఆయన చూచెను, మరి ఆయన అక్కడికి పోయెను.
ఆయన ఎన్నడూ చెప్పలేదు, "ఇప్పుడు వేచియుండుడి, నేను మోకాల్లూనెదను మరి మీరందరు మోకాల్లూని ప్రార్ధించుడి. ఆయన చెప్పెను, "ఈ కార్యము నేను చేయగలనని మీరు నమ్ముచున్నారా?" ఆమేన్. దానిని ఆయన అడిగెను. అది ఆయన కాదు; అది వారే.
"అవును, ప్రభువా, ఈ లోకమునకు రావలసియున్న దేవుని కుమారుడవు నీవే అని నేను విశ్వసించుచున్నాను." ఓ, మై! అక్కడే ఆయన గుర్తింపబడెను. ఏదో ఒక కార్యము సంభవింపవలసియున్నది.
"లాజరు బయటికి రమ్ము!" ఆయన పలికెను, మరి ఆ చనిపోయిన వ్యక్తి బయటికి (ప్రాణముతో) వచ్చెను. నేను దీనిని చేయగలనా? అని చెప్పలేదు. ఆయన పలికెను అంతే. విశ్వాసము సంధించినప్పుడు, ఆ కార్యము జరిగినది.
EXOD 8:24•
EXOD 14:15
102ఆయన మాట్లాడెను - ఆయన పలికెను మరి గ్రుడ్డివారు చూపు పొందిరి; కుంటి వారు నడచిరి; చెవిటివారు వినిరి; దయ్యములు కేకలు వేయుచు మరి బయటికి వచ్చెను; చనిపోయిన వారు జీవముతో లేచిరి — సమస్తమును. ఎందులకు? ఆయన ప్రార్ధించలేదు; ఆయన మెస్సీయగా అభిషేకింపబడెను. ఆయనే ఆ మెస్సీయా, ఆయనే మెస్సీయ అని, ఆయన ఎరిగియుండెను. ఆయన స్థానమును ఆయన ఎరిగి యుండెను. ఆయన ఎందుకొరకు పంపబడినాడో ఆయన ఎరిగియుండెను. విశ్వాసికి ఆయన మెస్సీయ అని, తండ్రి అతనిని గుర్తెరిగియున్నాడని ఆయనకు తెలియును; మరి ఆయన విశ్వాసముతో ఉన్న ఆ విశ్వాసిని సంధించినప్పుడు, ఆయన వాక్యమును మాత్రమే పలికెను. దయ్యములు చెల్లాచెదిరినవి. అవును అయ్యా. పలుకుము; మొర్రపెట్టకుము, పలుకుము! ఆమేన్.
అతని దేవుడు అతని కిచ్చిన హక్కును (అధికారమును) ఆయన ఎరిగి యుండెను, అయితే మనము తెలిసికొనకున్నావు. ఆయన ఎవరని ఆయనకు తెలియును; మనకు తెలియుట లేదు.
మోషే మరచిపోయెను. సమ్సోను గ్రహించెను. ఇతరులు గ్రహించిరి. యొహోషువ గ్రహించెను. మోషే మరచిపోయెను. దానితట్టు మోషే యొక్క ధ్యానమును దేవుడు త్రిప్పవలసియుండెను. ఆయన చెప్పెను, "నా యెడల ఏల మొర్ర పెట్టుచున్నావు? ఆ కార్యము చేయుటకై నేను నిన్ను పంపియున్నాను; పలుకుము! నీ యొద్ద కార్యమునకై (ఉద్దేశము నిమిత్తము) సాగిపొమ్ము. ఈ పర్వతమునకు మీరు రావలయునని నేను నీకు చెప్పియున్నాను; బిడ్డలను తీసికొని వారిని నడిపించి తీసికొని రమ్ము. పలుకుము, చాలును; నీ మార్గములో ఏమున్నదో నాకక్కరలేదు, దానిని నీ మార్గము నుండి తోలగిపోనిమ్ము, దానిని చేయుటకు నేను నీకు అధికారమును ఇచ్చియున్నాను. నేను పలికితిని — నీవు ఈగలను, పురుగులను మరి అటువంటి కార్యములను నీవు పలికియున్నావు. ఇప్పుడు ఎందులకు నీవు తడబడుచున్నావు? నీవెందులకు నా యొద్దకు వచ్చి ఈ కార్యములను గురించి మొర్రపెట్టుచున్నావు? ఊరకే పలుకుము, మరి అది సాగిపోవుటను గమనించుము, అంతే. "ఓ మై! ఓ దానిని నేను ఏ విధముగా ప్రేమించుచున్నాను.
MATT 3:17•
MATT 17:5•
MARK 9:7•
MARK 16:17,18•
LUKE 3:22•
JOHN 2:19
103ఇక్కడ యేసు… ఆయన చెప్పినదంతయు, ఆయన వాక్యమును పలికెను మరి ఆ విధముగానే జరిగెను. ఆయన తన కుమారుడని దేవుడు సరిగా నిరూపించెను. "ఈయన నా ప్రియ కుమారుడు, ఇతనియందు నేను ఆనందించుచున్నాను. ఆయనకు చెవియొగ్గుడి."
ఆయనను గమనించుడి. (దీనిని నేను ఇష్టపడుచున్నాను.) ఆయనను విమర్శించువారి ముందు ఆయన ధైర్యముగా, ఎంత గంభీరముగా నిలుచుండెను. ఆయన చెప్పెను, "ఈ ఆలయమును పడగొట్టుడి, మరి నేను నా తండ్రిని ప్రార్ధించెదను మరి ఆయన దానిని గూర్చి ఏమి చేయునో చూచెదను. ఈ ఆలయమును పడగొట్టుడి, మరల దానిని నేను లేపుదును." లేదు: నేను ఆశించుచున్నాను; నేను ప్రయత్ని౦చబోవుచున్నాను - నేను దానిని చేయుదును?! ఎందుకు? - లేఖనములు ఆ విధముగా చెప్పుచున్నవి. ఆయన తన శరీరమును లేపును అని చెప్పు అదే లేఖనము, మనకు అధికారమును, శక్తిని ఇచ్చియున్నది. ఆమేన్! "నా నామములో వారు దయ్యములను వెళ్ళగొట్టుదురు; కొత్త భాషలలో వారు మాట్లాడెదరు; పాములను ఎత్తిపట్టుకొందురు, లేక మరణకరణమైనదేది త్రాగినను అది వారికి హాని చేయదు. రోగుల మీద చేతులుంచినప్పుడు, వారు స్వస్థత నొందుదురు."
"నీవేల నాకు మొర్రపెట్టుచున్నావు? పలుకుము మరి ముందుకు సాగిపొమ్ము." ఓ, ధైర్యముగా — "ఆలయమును పడగొట్టుము, మరల దానిని నేను లేపుదును."
MATT 17:20•
MATT 21:21•
MARK 11:23•
JOHN 14:12•
JOHN 15:7
104ఓ, ఇప్పుడు గుర్తుంచుకొనుడి, (మనము ముగించబోవుచున్నాము) అది ఆయనే - యోహాను 14:12: "నేను చేయు క్రియలు నాయందు విశ్వాసముంచువాడును చేయును." అది సరియా? ఇది చెప్పినది ఆయనే. యేసు మార్కు 11:24లో చెప్పెను, "ఈ కొండను చూచి మీరు చెప్పిన … ("మీరు ఈ కొండతో ప్రార్ధించమని కాదు.") "ఈ కొండతో, 'ఎత్తబడి' (సముద్రములో పడవేయబడుదువని) అని మీరు చెప్పి మీ మనస్సులో సందేహింపక మీరు చెప్పినది జరుగునని మీరు నమ్మినయెడల జరుగును." ఇప్పుడు మీరు బహుశా జరగవచ్చునని అనుకొనిన ఎడల, అది జరుగదు, అయితే మీలో ఏదో కార్యము - ఆ కార్యమునకై మీరు అభిషేకింపబడిన, మరి అది దేవుని చిత్తమని తెలిసినయెడల, అప్పుడు మీరు చెప్పిన అది జరిగి తీరవలసినదే. "మీరు…" ఆయనే దీనిని చెప్పెను: "నా యందు మీరును, మీ యందు నా మాటలును నిలిచియుండినయెడల, మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును." ఓ, మై! ఓ, మై! నేనేమి చెప్పుచున్నానో గ్రహించారా?
105దీనిని మన్నించుడి, అయితే ఇది నాలో నుండి వచ్చుచున్నది. దానిని నేను చెప్పి తీరవలయును. ఆ రోజు ఆ అరణ్యములో అక్కడ ఆయనే చెప్పెను "నీకు ఏ వేటయును లేదు," మరి ఆయన మా ముందర మూడు ఉడుతలను సృష్టించెను. అదేమిటి? వాక్యమును పలుకుట, అక్కడ అవి ఉండునని పలుకుము, మరి అక్కడ, మరి అక్కడ మరి అక్కడ అవి యున్నవి. దానిని ఆయనే చేసెను. చార్లీ, రాడ్నీ ఆయనే అక్కడ కెంటకీలో, నెల్లీ, మార్గీ మరి తక్కిన మీరందరు, ఆయనే అది, అదే దేవుడు మరియు అక్కడ చాలా కాలము మునుపు మోషేతో మాట్లాడెను మరి చెప్పెను, "నాతో ఏల మొర్రపెట్టుచున్నావు? వాక్యమును పలుకుము." ఆయనే వాటిని (ఉడుతలను) అక్కడ సృష్టించెను. అది ఆయనే. అది అతనే. ఓ, మై!
ఒక సంవత్సరము మునుపు దర్శనమును ఇచ్చినది ఆయనే ఆ (దర్శనములో) చెప్పెను మేమక్కడికి పోయెదము, మరి ఈ ఏడు ముద్రలు మరి అవి ఎలా ఒక గొప్ప ఉరుము వలె అది మొదలిడునప్పుడు ఉండి, ఒక పిరమిడ్ ఆకారములో ఉండును. అక్కడ మరి చూడు లైఫ్ అను పత్రికలో దానిని ప్రచురించిరి - అక్కడ గోడపై వ్రేలాడుచున్నది. దానిని చెప్పినది ఆయనే.
JOSH 1:5•
JOSH 3:7
106ఆయనే ఆ రాత్రి రోడ్డులో పోవుచుండగా నా సోదరుని ఇంకా కొద్దిసేపటిలో కాటువేయబోవు పెద్ద భయంకరమైన విష-సర్పమును చూచితిమి. ఆయన చెప్పెను, "దానిని బంధించుటకు వేరే ఏదైనను చేయుటకు నీకు శక్తిలేక అధికారము ఇయ్యబడియున్నది."
అక్కడ వెనుక కూర్చొనియున్న నా యొక్క తలవెంట్రుకలు నెరసిన భార్యతో పలికిన ఆయనే ఇతను - ఆయనే ఆ రోజు ఉదయము ఆ గదిలో నన్ను లేపి ఆ గది మూల నిలుచుకొని చెప్పెను, "ఏమైనా చెప్పుటకు, ఎక్కడికైనా పోవుటకు, లేక ఏమైనా చేయుటకు భయపడకుము, నీవెక్కడికి పోయినను ఎన్నడూ మారని ఆయన సన్నిధి నీతో కూడా ఉండును."
ఆయనే అక్కడ దూరములో సబీనో కన్యానులో (ఒక స్థలము) సుమారు మూడు నెలల క్రిందట నేను ప్రార్ధించునప్పుడు, ఏమి సంభవించునో అని ఆశ్చర్యపడుచుండగా మరి అక్కడ నేను నిలుచుకొనియుండగా ఒక ఖడ్గము నా చేతిలో పడెను మరి చెప్పెను, "ఇది రాజు యొక్క ఖడ్గము." ఆయనే అది.
"మోషేకు నేను తోడైయున్నట్లు, నిన్ను నేను పంపుచున్నాను" అని నాకు చెప్పిన ఆయనే అది.
107ముప్పై సంవత్సరములకు మునుపు ఆ నదిలో ఒక చిన్న బాలుడుగా, అక్కడ చిన్న ప్రసంగీకునిగా నదిపై ముప్పై సంసత్సరములకు మునుపు నిలుచుకొని యున్నప్పుడు — ఆ వెలుగు మరి అదే అగ్నిస్తంభము పరలోకము నుండి క్రిందికి దిగి అక్కడ నిలిచి చెప్పినప్పుడు, ఆయనే అది, మరి చెప్పెను, "బాప్తిసమిచ్చు యోహానును క్రీస్తు యొక్క మొదటి రాకడకు ముందు నేను పంపినట్లు, నీ యొక్క వర్తమానము రెండవ రాకడకు ముందుగా వెళ్ళును" - సర్వ ప్రపంచమునకు. నా యొక్క సొంత కాపరి దానిని గురించి హేళన చేసినప్పుడు, అది ఏ విధముగా జరుగును? అయితే అది సరిగా లేక ఖచ్చితముగా అదే విధముగా సంభవించినది. అది సరి. దానిని చెప్పిన వ్యక్తి ఆయనే. సరి అయ్యా!
ఓ, ఏ విధముగా ఆ యొక్క దర్శనమునకు ప్రవచనముగా ఆయన చెప్పెను, "అది నెరవేరినప్పుడు." ఆయనే అది చెప్పెను, "మీలో ఒకరు ప్రవచనము చెప్పిన లేక దర్శనము చూచిన మరి దానిని చెప్పినయెడల, మరి అది నెరవేరినప్పుడు, అప్పుడు గుర్తుంచుకొనుడి అది ఆ వ్యక్తి కాదు, అది నేను. నేను అతనితో ఉన్నాను." ఓ, మై! నేను పోయి మరి ఏమి చెప్పెదను, అది ఆయనే, అది ఆయనే, అది ఆయనే.
HEB 13:8
108అక్కడ దిగి వచ్చినది ఆయనే … ఆ నదిపై అగ్నిస్తంభము అక్కడ దిగి వచ్చినదని వారికి నేను చెప్పినప్పుడు మరి వారు దానిని నమ్మలేకపోయారు. అది ఆయనే అక్కడ వారిమధ్య… బాప్తిస్టు ప్రసంగీకునితో ముప్పై వేల జనుల ముందు ఆ రాత్రి సామ్ హోస్టన్ హలులో అప్పుడు ఆ ప్రభువు దూత అక్కడ నిలుచుకొని అతని (దూత) ఫోటో తీసికొనెను. (ఫోటోగ్రఫీ వారు ఫోటో తీసినప్పుడు ప్రభువు దూత అగ్నిస్తంభము రూపములో ఫోటోలో పడెను.) అది ఆయనే, నిన్న, నేడు, మరియు నిరంతర౦ మారనివాడు. ఈ కార్యములు ఎక్కడ జరుగునని చెప్పినది ఆయనే. ఇది చెప్పినది ఆయనే. ఈ కార్యములన్నియు జరిపించినది ఆయనే. ఆయన నిన్న, నేడు, మరియు నిరంతర౦ మారనివాడు. ఆయన ఆ విధముగా చేసెదనని చెప్పిన ప్రకారము అన్నియు ఖచ్చితముగా ఆయన చేసెను. ఆమేన్.
నేనేల కాచుకొని యుండవలయును? వాక్యమును దేవుడు నిరూపించి యున్నాడు. అది సత్యము. మనము పయనించెదము. మనము నడిచెదము. మనము నడిచెదము. మనము ప్రభువు యొక్క అడుగు జాడలలో పోయెదము, అన్ని సందేహములు అన్ని పాపములు ప్రక్కకు నెట్టి. గృహమును శుద్దీకరించుకొని; బాగుగా కడిగి. జూనియర్ జాక్సన్ యొక్క దర్శనములో చెప్పినట్లు, దీపములు తప్ప ఇంకేమియు, మిగిలి ఉండలేదు - లేక ఆయన కలలో, (ఆయన ఒకవేళ ఇక్కడ కూర్చుండియుండిన). దీపములు తప్ప ఇంకేదియు మిగిలి ఉండలేదు, మరి వాటికి బంగారు పట్టిలు వాటిచుట్టూ ఉండెను - ఆ రోజు రాత్రి అతడు (జూనియర్ జాక్స్సన్) నాకిచ్చిన కలలో. ఓ మై!
LUKE 17:28,30
109కొల్సిన్ సోదరుడా, ఆ చేపను గూర్చి చింతించవద్దు. అది తెల్లనిది; దానిని ఏ విధముగా ఉపయోగించవలెనో, లేక వాడవలయునో నీకు తెలియలేదు. దానికి వ్యతిరేకముగా ఉన్న అన్ని కార్యములను ప్రక్కకు నెట్టుము. ఇది ఎంతగా మూఢత్వముగా ఉన్నను గుర్తు౦చుకొనుము, ఇది సత్యము, కొన్ని సమయములలో ఇతర కార్యములన్నియు…. ముందుకు సాగిపొమ్ము.
పరిశుద్దాత్మ అది, మృతులలో నుండి యేసుక్రీస్తును లేపినది అదే దేవుడే. ఉనికి లోనికి వచ్చునట్లు వాక్కును పలుక గల దేవుడు, మోషే దినములలో జీవించిన అదే వ్యక్తి, ఈ రోజు కూడ మారనివాడు. ఈ కడపటి దినమున ఆయన పిలుపు, ఆయన నిరూపించబడియున్నాడు, "సొదొమ దినముల వలె మనుష్యకుమారుడు వచ్చు దినములలో ఉండును." ఆయన చేసెను… అక్కడ సొదొమ ఉండెను. అక్కడొక బిల్లీ గ్రహం మరి ఒక ఓరల్ రాబర్ట్స్ అక్కడుండిరి మరి సంఘము ఆయన రెండు చోట్లను వాగ్దానము చేసిన అదే సూచనలతో ముందుకు సాగిపోవుచున్నది, మరి వారు అక్కడ యున్నారు. దానిని చెప్పినది ఆయనే. ఓ, ప్రభువా, నాకు ధైర్యమునిమ్ము, అదే నా ప్రార్ధన. నాకు సహాయపడుము, ఓ ప్రభువైన దేవుడా.
ఇక్కడితో నేను నిలుప వలయును. ఆలస్యమగుచున్నది.
110"నాతో ఏల మొర్రపెట్టుచున్నావు? నేను నీతో కూడా ఉన్నానని నిరూపించియుండగా, నీవేల నాతో మొర్ర పెట్టుచున్నావు? నీలో వ్యాధిగ్రస్తులను నేను స్వస్థపరచలేదా? అని ఆయన చెప్పలేదా? సరిగా అక్కడ జరిగిన కార్యములను నేను ముందే నీకు చెప్పియుండలేదా? మీ సంఘకాపరి దానిని చేయలేడు. అతను చేయలేడు. అతనొక మనిషి. "అది నేనే, ప్రభువు," అని ఆయన చెప్పును. దానిని చేసినదే ఆయనే. ఈ కార్యములను అతనికి చెప్పినది నేనే. అది అతను (మోషే) కాదు. అది నా యొక్క స్వరము. మీలో చనిపోయిన వారిని లేపినది నేనే. వ్యాధిగ్రస్తులను స్వస్థపరచునది నేనే. జరుగబోవు కార్యములను చెప్పినది నేనే. రక్షించునది నేనే. వాగ్దానమును ఇచ్చునది నేనే.
దేవా ముప్పది-మూడు సంవత్సరములకు మునుపు ఆయన (దేవుడు) నాచేతిలో ఉంచిన వాక్యమనే ఖడ్గమును పట్టుకొని మరి మూడవ ఈడ్పులో ముందుకు సాగుటకు నాకు ధైర్యము నిమ్మని అడుగటయే నా ప్రార్ధన. మనము మన తలలను వంచెదము.
EXOD 14:22
111పరలోకపు తండ్రి, సమయుమ గతించుచున్నది, అయితే వాక్యము అమూల్యమగుచున్నది. మనము దానిని చూచులాగున మనతో ఎన్నడూ మారని క్రీస్తు యొక్క ప్రసన్నత మరల మరల మనలను సంధించుచున్నది. మీ యొక్క మంచితనమునకు ఏ విధముగా మమ్ములను కాపాడి మరి ఆశీర్వదించితిరి. దానికొరకై ఎట్లు మేము ఏ విధముగా మేము మీకు కృతజ్ఞతలు చెల్లించుచున్నాము. కృతజ్ఞతలు చెల్లించుదుము.
ప్రభువా, నేను ఈ చేతి రుమాళ్ళ నా చేతిలో పట్టుకొనియుండగా - విశ్వాసము గల జనులు దీనిని విశ్వసించెదరు. ప్రతియొక్క దయ్యము, ప్రతియొక వ్యాధి ఈ ప్రజలయొద్ద నుండి వెళ్ళిపోనిమ్ము. ఇక్కడున్న దేవునిది కాని ప్రతియొక దురాత్మను వ్యాధిగల ప్రతి ఆత్మను, అన్ని వ్యాధులను మరి భాదలను నేను ఖండించుచున్నాను. మనుష్యుని యొక్క నీడలో మనము ఉండుటలేదు, అది సరైనను, మనము సువార్త యొక్క నిరూపించబడిన సువార్త యొక్క నీడలో ఉంటున్నాము.
ఆ గొప్ప అగ్నిస్తంభము ఈ యొక్క కట్టడములో అటు, ఇటు కదలాడుచుండగా, అదే (అగ్నిస్తంభము) ఆ దేవుడు క్రిందకు చూచినప్పుడు, మరి ఎర్రసముద్రము చీలి వారికి దారి నిచ్చెను. అప్పుడు ఇశ్రాయేలీయులు దాని మధ్య నడిచిపోయిరి. అయితే ఇప్పుడు, ఆయన చూచుచుండగా ఆయన యొక్క సొంత కుమారుని రక్తముతో చిలుకరించబడియున్నది - అప్పుడు దయ మరి కృప… మేము అణకువతో ఉందుము గాక; ఈ రోజునుండి మేము మొర్రలిడుటను వదలనీ. ఈ యొక్క కార్యమునకై మీరు మమ్ములను పిలిచినారని మేము నిజముగా గుర్తెరుగని. ఇదే సమయము. యేసుక్రీస్తు నామముతో దీనిని నేను పలుకుచున్నాను. ఈ స్థలము నుండి ప్రతియొక్క వ్యాధి వెళ్లిపోవును గాక.
112ఈ రోజు యేసుక్రీస్తు నామమును పిలుచు ప్రతియొక వ్యక్తి మరి స్త్రీ తమ జీవితములను పవిత్రపరచుకొననిమ్ము. ప్రార్ధనా వేదికపై నా యొక్క జీవితమును కూడా సమర్పించి పవిత్రపరచుకొనుచున్నాను. నేను క్రిందకు దిగి నన్ను గురించి నేను సిగ్గుపడి మరి, ఎక్కడ నుండి నన్ను తీసినారో, ఆ నేల వైపు నా తల త్రిప్పుచున్నాను.
ప్రభువైన దేవుడా, నా యొక్క అవిశ్వాసము నిమిత్తము, నా యొక్క బలహీనతల నిమిత్తము సిగ్గుపడుచున్నాను. దానిని మన్నించుడి ప్రభువా; నాకు ధైర్యము నిమ్ము. మాకందరికి ధైర్యము నిమ్ము, మోషే వలె నేను అనుభూతి చెందియున్నాను - మేమ౦దరము ఆ మార్గములో ఉన్నాము. ఏ ఒక్కరిని కూడ మేము వదల నిష్టపడుట లేదు. ప్రభువా, ప్రతి యొక్కరిని మేము తీసికొనిపోదలచియున్నాము. వారందరు నీ వారు. వారిని నీ కొరకు నేను పొందియున్నాను. ప్రభువా, ఈ జనులను ఈ రోజు ఆశీర్వదించుము; దానిని దయచేయుము. వారితో నన్ను కూడా ఆశీర్వదించుము. తండ్రీ, మరి నీ నామము సుత్తింపబడును గాక. నీ యొక్క మహిమ నీదే. ఇప్పుడు మమ్ములను మేము సమర్పించుకొనుచుండగా, ప్రభువా, మాకు నిత్యమైన విశ్వాసము నిమ్ము.
113ప్రభువా నేను ఈ బైబిలుపై ఈ వేదికపై నా జీవితమును నీకు సమర్పించుచున్నాను. మీరు ఇచ్చు ప్రతియొక వాగ్దానము పై నేను ఆధారపడియున్నాను, అవి రూఢి పరచబడునని నాకు తెలియును, మరియు అవి సత్యములని నేనెరుగుదును. ప్రభువా, నాకు ధైర్యము నిమ్ము. నేనేమి చేయవలెనో, మరి మాట్లాడవలయునో నన్ను నడిపింపుము. ఈ సంఘములో నున్న అందరితో పాటు నన్నునేను సమర్పించుకొనుచున్నాను. యేసుక్రీస్తు నామములో, ఆమేన్.
నా విశ్వాసము నీ తట్టుకు చూచుచున్నది,
కల్వరి గొర్రెపిల్లవైన నీవు,
దైవీక రక్షకా!
ఇపుడు నేను ప్రార్ధి౦చుచుండగా వినుము,
నా యొక్క పాపములన్నిటిని దూరముగా తీసివేయుము,
ఓ, ఈ దినము నుండి నేను పరిపూర్ణముగా నీకు చెందనీ!
దీనిని పాడుచుండగా, ఇప్పుడు మనము నెమ్మదిగా లేచి నిలువబడెదము. ఆయన తలకు మన చేతుల నెత్తుదము.
ఇప్పుడు దేవునికి మిమ్ములను సమర్పించుకొనుడి.
ఇపుడు నేను ప్రార్ధించుచుండగా వినుము,
నా యొక్క సందేహములన్నియు తీసివేయుము
ఓ దినము నుండి నేను పరిపూర్ణముగా నీకు చెందనీ!
114ఇప్పుడు, మనయొక్క చేతులు పైకెత్తి: [సహోదరుడు బ్రెన్హాం చెప్పునది సమాజము మరలా తిరిగి చెప్పుచున్నది.] ప్రభువైన యేసు, మీకు నన్ను నేను సమర్పించుకొనుచున్నాను. ఒక పరిపూర్ణ సేవతో కూడిన జీవితము, స్వచ్చముగా, ఎక్కువ విశ్వాసముతో నేను మొర్రపెట్టుచున్నాను, ఇంతవరకు గడచిన జీవితములో నేను చేసిన సేవ కంటెను రాబోవు నా జీవితములో నేను ఇంకను మీకు అంగీకారమైన సేవకునిగా ఉండగోరుచున్నాను. నా అవిశ్వాసమును మన్నించుము. మరి ఒకప్పుడు పరిశుద్దులకు అనుగ్రహించిన ఆ విశ్వాసము మాకు తిరిగి అనుగ్రహించుము. యేసుక్రీస్తు నామములో నేను మీకు నన్ను అంకితము చేయుచున్నాను. మనము మన తలలు వంచియుండగా …
జీవితములో సంభవించు చీకటి చిక్కులు పై నేను నడచునప్పుడు,
మరి భాదలు నన్ను చుట్టుముట్టియుండగా,
నన్ను నడిపించు మీరుండుము,
ఈ రోజు అంధకారమంతయు పోవులాగున ఆజ్ఞాపించుము,
నా యొక్క భయములన్నియును కడుగుము,
నిన్ను వదలి నేనెన్నడును త్రోవ విడిచి పోకుండును గాక.
115ఇప్పుడు మన తలలు వంచియుండగా; ఈ రోజు ఉదయకాలమున వర్తమానము మీకు మంచి చేసినదని మీరు అనుభూతినొందుతున్నారా? మీకు ధైర్యము నిచ్చినదా? మీకిచ్చియుంటే దేవునికి మీ హస్తములను ఎత్తి చెప్పుడి, "దేవా, నీకు స్తోత్రములు." ఇప్పుడు అది నాకు ధైర్యము నిచ్చినది, నాకు ఎంతగానో సహాయపడినదని నేను గుర్తించుచు నా రెండు చేతులను పైకెత్తియున్నాను.
నేను చెప్పిన కొన్ని కార్యములు, దానిని నేను చెప్పవలయునని అనుకొని యుండలేదు అయినను దానిని ఇదివరకే చెప్పియున్నాను. అది నాకొక గద్దింపుగా ఉన్నది. నేను చేయుదునని తలంచియుండ లేని అనేక కార్యములలో ఆ మార్గములో నన్ను నేను కనుగొనియున్నాను, నేను తలంచని ఎన్నో మహత్కార్యములు నేను చేసియున్నాను. అయితే పలుకుటకు బదులు అనేక సమయములు కేకలు వేయుట లేక మొర్రపెట్టుటలో నన్ను నేను కనుగొనియున్నాను. దేవా, ఈ సమయము నుండి నేను ఇంకను ఎక్కువగా సమర్పితమైన సేవకునిగా ఉండుటకు సహాయపడుము. నా కొరకు మాత్రము ప్రార్ధించుట లేదు, మీ కొరకు కూడా ప్రార్ధి౦చుచున్నాను, క్రీస్తు శరీరముగా మనమందరము ఒక్కటిగా ఈ ప్రపంచము నుండి పిలువబడియున్నాము. ఆ వాగ్ధాన భూమికి మనలను సిద్దపరచుకొని, ఆ మార్గమును గురించి మాటలాడుటకు దేవుడు నాకు బలము నియ్యవలెను. ఆ యొక్క పరీక్షను లేక శోధనను మీరు పొగొట్టుకొనకుండా మార్గమును సిద్దపరచులాగున. దేవుని యొక్క కృప వలన నేను మీకు చెప్పెదను. మనకు ముందుగా నడచిన ఆయన యొక్క అడుగుజాడలను నేను వెంబడించెదను, మరి…
"ఈ పవిత్రమైన శిలువను నేను మోసెదను,
మరణము నన్ను విడిపించు వరకు ;
మరి అప్పుడు ఇంటిలో ధరించుటకు ఒక కిరీటము,
నాకు అక్కడొక కిరీటమున్నది."
తండ్రీ దీనిని మేము మీకు పవిత్రముగా సముర్పించుచున్నాము. నీ కుమారుడైన యేసుక్రీస్తు నామమున. ఆమేన్
116ఈ ఒక పవిత్రమైన జీవితమునకు మీకు స్తోత్రములు ప్రభువా. వీరే మిమ్ములను సమర్పించుకొని - మధురముగా, తగ్గించుకొని, ఆత్మలో నడిచి, క్రైస్తవులవలె నడిచి, ముద్దాడి, దుస్తులు ధరించి, ఇంపుగా మరి తగ్గించుకొని, ఇప్పుడు అటువంటి జీవితము మా యొద్ద నుండి పోకుండ మాలో అటువంటి జీవితము ఉండనిమ్ము - వాక్యము మూలముగా దేవుని స్వరము పలుకుచున్నది - వరముల ద్వారా పలుకుచున్నది. ఒక వరము వచ్చి, ఇంకొకటి దానిని బయలుపరచుచున్నది. ఇంకొక వరము వచ్చి అదే కార్యమును బయలుపరచుచున్నది. చూశారా! అది నిజముగా ఈ కాలముతోను, వాక్యముతోను సరిగా ఉన్నది. దేవుడు మనతో ఉన్నాడు. దాని కొరకు ఏ విధముగా ఆయనకు మనము స్తోత్రములు చెల్లించగలము, ఇప్పుడు మన తలలు వంచబడియుండగా - మన సోదరి ఒక రాగమును దానిపై వాయించును.
నీతో యేసు నామమును తీసికొనిపొమ్ము,
ప్రతి యొక్క వలకు కాపుదలగా;
మరి శోధనలు నిన్ను చుట్టు ముట్టినప్పుడు,
ఆ పరిశుద్ద నామమును ప్రార్ధనలో శ్వాసించును.
దానిని చేయుము, వాక్యమును పలుకుము.
ఆయన నామమును పలుకుము.
మనము (ఆరాధన) వదలిపోవుచుండగా ఇప్పుడు పాడెదము.
నీతో యేసు నామమును తీసికొని పొమ్ము
దుఃఖములో, శోకములో ఉన్నబిడ్డా,
సంతోషము మరి ఆదరణ అది నీకిచ్చును,
నీవెక్కడికి పోయినను దానిని తీసికొని పొమ్ము,
అమూల్యమైన నామము ……
ఇప్పుడు, ఒకరి చేతులు ఇంకొకరి చేతులతో కరచాలనము చేయుచు మరి చెప్పెదము.
నీ కొరకు నేను ప్రార్ధి౦చెదను సోదరుడా,
నీవు నా కొరకు ప్రార్ధించుము.
"భూలోకము యొక్క నమ్మకము మరి పరలోకపు సంతోషము; అమూల్యమైన నామము, ఓ ఎంత తియ్యది!
భూలోకము యొక్క నమ్మకము మరి పరలోకపు సంతోషము.
ఇప్పుడు మన తలలు వంచియుండగా, తరువాత చరణమును మనము పాడెదము.
"ఎల్లప్పుడు యేసు నామమును తీసికొని పోమ్ము,
ప్రతియొక్క వలకు కాపుదలగా;
మరి శోధనలు నిన్ను చుట్టి ముట్టినప్పుడు,
ఆ పరిశుద్ద నామమును ప్రార్ధనలో శ్వాసించుము.
అమూల్యమైన నామము, ఓ ఎంత తియ్యనిది!
భూలోకము యొక్క నమ్మకము మరి పరలోకపు సంతోషము;
అమూల్యమైన నామము,
ఓ ఎంత తియ్యనిది!
భూలోకము యొక్క నమ్మకము
మరి పరలోకపు సంతోషము.
JOHN 5:24
117ఇప్పుడు మన తలలు వంచియుండగా, మన హృదయములు దానితో యేసు చెప్పిన ఈ మాటలను గుర్తుంచుకొని, "నా మాట విని నన్ను పంపిన వానియందు విశ్వాసముంచువాడు నిత్యజీవముగలవాడు; వాడు తీర్పు లోనికి రాక మరణములో నుండి జీవము లోనికి దాటియున్నాడు."
మనము దానినెరిగి, దేవుని కృప వలన దానిని మన హృదయమందుంచుకొని, ఈ ఉదయము ఒక పవిత్రమైన సమర్పణతో, ఈ రోజు నుండి మన జీవితము మార్చబడి మన తలంపులందు మనమింకను వాస్తవముగా జీవించెదము. దేవుని ఏమి మనము అడుగుదుమో దానిని నమ్ముచు మనము తియ్యగా, అణకువతో జీవించుటకు ప్రయత్నించెదము, దేవుడు దానిని ప్రతియొక్కరికి అనుగ్రహించును. ఏ మనుష్యునికి లేక ఒకరికొకరు విరోధముగా మనము పలుకము. మన శత్రువుల కొరకు మనము ప్రార్ధించి మరి వారిని ప్రేమించవలయును. మనకు చెడు లేక కీడు చేసిన వారికి మంచి చేయుము. దేవుడే ఎవరు సరి అని ఎవరు తప్పు అని న్యాయము తీర్చును. అయితే దీనిపై మరి మనతలలు వంగి యుండగా మన మంచి స్నేహితుడైన సోదరుడు లీవెల్ ను ప్రార్ధనతో సంఘస్తులను పంపివేయవలెనని నేను అడుగబోవుచున్నాను. సోదరుడు వేల్.