నిన్నునీవు తగ్గించుకొనుము
1నిశ్చయంగా యిక్కడ ఉండుటను నేను ప్రతి సారీ ఆస్వాదించుదును. మేము మీతో ఉండే మన ప్రయాణము ఇప్పుడు ఒక ముగింపును సమీపించుచున్నది. ఎందుకంటే వెను వెంటనే షికాగోలో మరొక కూటము జరుగనైయున్నది, మరియు అతి త్వరలో నేను కుటుంబమును ఆరిజోనాలో ఉంచవలసియున్నది. మరియు వాళ్ళింకా వారి వేసవి సెలవులు తీసుకోలేదు, మరియు కొన్ని రోజుల్లో నేను వారిని ఒక చిన్న విహారయాత్రకై తీసుకెళ్ళవలసియున్నది. మరియు, బహుశా తర్వాత నేను ఒక రోజు, ఒక ఆదివారము బయట ఉండి, ఆ తర్వాత వారము షికాగోలో మొదలు పెడతాను. ఆ తర్వాత ఒక సోమవారం తిన్నగా వెనక్కి వచ్చి వారిని ఆరిజోనా తీసుకు వెళ్ళవలసియున్నది.
2అందరూ తాజాగా ఉండే ఆదివారం ఉదయం వచ్చి ఆ సమయమును తీసికొనుటను అంటే నాకు అసహ్యము. నేను ఆదివారం రాత్రి, ఆదివారం రాత్రి మీరు ఎప్పుడూ అలసిపోయి, నీరసించి యుందురు, మరియు అప్పుడు ఆదివారం రాత్రి ఆరాధనను మన పాస్టర్కి అప్పగించుట - ఒక రకంగా అది మంచిది కాదు. అయినా అది చేయుట నేను యిష్టపడను, కాని ఆదివారం రాత్రి, ఒక ఆరాధన ఉంటే నేను ప్రజలను చాలా ఆలస్యమగు వరకూ ఉంచివేయుదును. వారిలో ఎందరో ఒక్క ఆరాధన నిమిత్తమై యిక్కడికి రావటానికి, దక్షిణము నుంచీ, మరియు ఉత్తరము నుంచీ, ఓ, పగలూ మరియు రాత్రి కారు నడుపుకుంటూ వచ్చి మరలా తిరిగి వెళ్ళుదురు. మరియు ఆ కారణము చేత నేను దానిని ఆదివారము ఉదయము చేయుదును, నేను వచ్చినప్పుడు, అది వారికి తిరిగి వెళ్ళుటకు అవకాశమిచ్చును.
విధేయులూ, విశ్వాసనీయులూ అయిన యాత్రికులు, ఎంతగా నేను వారిని మెచ్చుకుందునో కదా. వారు మంచు, వాన మరియు ప్రతి దాని గుండా, దేశపు అన్ని మూలల నుంచీ, వందల మైళ్ళు కారు నడుపుకుంటూ, ఒక చిన్న ఆరాధనకై యిక్కడికి వచ్పుదురు. కావున, వారి గొప్ప సహాయము వలన, మరియు నేను ప్రజలకు చెప్పుటకు ప్రయత్నించుచున్నది సత్యము అగుట వలన, అది నన్ను దేవునికీ మరియు ఈ ప్రజలకూ కృతజ్ఞుడినగునట్లుగా చేయుచున్నది.
3ఇప్పుడు, యిది సత్యమని నేను నమ్ముచున్నాను. నేను నా హృదయమంతటితో వేరే ఏదైనా యింత కంటే మంచిదని నేను అనుకున్నట్లయితే, నిశ్చయంగా నేను ముందు వెళ్ళుదును. అది సరియైనదా కాదా అని కనుగొనుటకు నేను ముందుగా వెళ్ళని ఏ చోటికైనా వెళ్ళమని నేను వేరెవారినీ అడుగను. నేను అప్పటికే ఆ అడుగు వేసి అది సత్యమని కనుగొననియెడల, దేవుని యందు ఒక అడుగు వేయుమని నేను ఏ వ్యక్తినీ అడుగను. ముందుగా, అది ప్రభువు యొక్క వాక్యమై యుండవలసియున్నది, తర్వాత నేను అడుగు వేసి అది సరియా కాదా అని చూడవలసియున్నది. మరియు అప్పుడు అది సరియైనదైతే, ఆ తర్వాత, "ఈ త్రోవలో పైకి రా" అని నేను చెప్పగలను. చూడండి, అది త్రోవను ఏర్పరచుట.
మరియు ఇప్పుడు ఏ సేవకుడైనా అలా చెయ్యాలని నేను అనుకుంటున్నాను, ముందుగా అతడే వెళ్ళవలసియున్నది. అతడొక నాయకుడిగా (leader - ముందు నడిచి త్రోవ చూపువాడు). ఉండవలసియున్నది, ప్రజల యొక్క నాయకుడిగా ఉండవలసియున్నది, అతడు స్వయంగా తన చేయి పెట్టని ఒక దాని గురించి మాట్లాడుట కాదు. మనము వెళ్ళి ప్రజలకు నాయకులుగా ఉండవలసియున్నది.
4ఈ ఉదయం, యిక్కడ బలిపీఠం వద్ద, నేను ఒక చాలా వి౦తైన, ప్రత్యేకమైన అనుభవమును కలిగియుంటిని, మరియు అది దాదాపు వర్తమానము యొక్క చివరి భాగము యొద్ద, ఆ విధంగా చెప్పాలని నేను ఉద్దేశించ లేదు. చూశారా? కాని అది యిప్పటికే చెప్పబడింది, మరియు ఇప్పుడు దాని గురించి నేనేమీ చెయ్యలేనని నేను అనుకుంటున్నాను. కాని తర్వాత నేను యింటికి వెళ్ళాను, దాని గురించి చదువుట మొదలుపెట్టాను.
మరియు ఈ రోజు చిన్న కుటుంబ సమావేశము జరిగింది, కేవలము నా సోదరుడు మరియు వారు. అమ్మ వెళ్ళిపోయింది. మరియు మేము ఆమె యింటి వద్ద కలిసేవారము, మరియు మేము ప్రభువుతో మాట్లాడే వారము. ఈ మధ్యాహ్నము మాట్లాడుట యందు మేము మంచి సమయమును కలిగియుంటిమి, మరియు టెడ్డీ మాతో ఉన్నాడు మరియు మేము కొన్ని పాటలు పాడుకున్నాము, కీర్తనలు మొదలగునవి వాయించాను.
5ఇప్పుడు వచ్చే ఆదివారం ఉదయం, దేవుని చిత్తమైనట్లయితే, సహోదరుడు నెవిల్లి అభ్యంతరము లేనట్లయితే, కేవలం స్వస్థత కొరకై ప్రతిష్ఠించిన, ఒక స్వస్థత కూటము కలిగియుండాలని నేననుకుంటున్నాను. మరియు ఈ ఉదయం వర్తమానముతో, దానిని తీసుకు వచ్చునట్లు ప్రభువు నన్ను నడిపించునట్లుగా తోచిన ఆ విధానమును బట్టి, నిజముగా నమ్ముటకు, మనల్ని కొంచెం ప్రోత్సహించవలసి యున్నది. మనము చుట్టూ తిరిగి, వివిధ విషయాలు చెప్పి వాటి గురించి మాట్లాడుతాము. కాని అది ఒక ముగింపునకు (showdown, ఆఖరు ప్రదర్శన, ముగింపు యొద్ద రుజువు చేయవలసి వచ్చుట) వచ్చినప్పుడు, అది ఏదో వేరైనది.
6ఒకరు నాతో చెప్పుచుండిరి, ఆ వెనుక ఉన్న నా సోదరుడు అనుకుంటాను, ఒక మనిషిని గురించి, ఒక సేవకుని గురించీ మరియు అతని సంఘములలో ఒకని గురించి ఒక చిన్న కథ చెప్పుచుండెను, మరియు అతడు ఒక దుంగపై నడవగలనని అన్నాడు.
అతడన్నాడు, "పాస్టర్, నిశ్చయంగా ప్రభువు మీతో ఉన్నాడు."
ఇతడన్నాడు, "నేను (దుంగను - తర్జుమాదారుడు) దాటి వెళ్ళేటప్పుడు మరొక దుంగను మోసుకుపోగలను."
"నిశ్చయంగా, ప్రభువు మీతో ఉన్నాడు." మరియు ఇతడు వెళ్ళి అది చేశాడు.
ఇతడన్నాడు, "నేను ఒకే సమయంలో ఒక దుంగను మోసుకుని, తోపుడు బండిని దొర్లించుకుంటూ వెళ్ళగలను."
"నిశ్చయంగా, పాస్టర్, ప్రభువు మీతో ఉన్నాడు. మీ విశ్వాసం ఏమైనా చెయ్యగలదు."
యితడన్నాడు, "నేను నిన్ను తోపుడు బండిలో ఉంచి దుంగను మోసుకుపోగలను."
అతడన్నాడు, "ఇప్పుడు, ఒక్క నిమిషం ఆగండి" చూశారా? అందులో స్వయంగా నిన్ను కలిపే సరికి అది వేరే సంగతి. చూశారా?
ఇప్పుడు, యిక్కడ "ఆమేన్" అనటం మనకు చాలా మంచిది. "అది నిజమని నేను నమ్ముచున్నాను," అని చెప్పుట మనకు చాలా మంచిది. కాని అప్పుడు దానిని కార్య రూపంలో ఉంచండి. దానిని క్రియలో చూపండి.
ACTS 5:15
7ఈ ఉదయం నేను ఆ మాటను తీసుకొనివచ్చినట్లుగా, ప్రజలు పేతురు యొక్క నీడలో యుండిరి, వారు ఎన్నడూ ప్రార్థన కొరకై అడుగ లేదు. నేను చాలా యిండ్లలోనికి వెళ్ళాను, దీనిని చూశాను. నేను వెళ్ళక మునుపు ప్రార్ధి౦చుదును, మరియు అలా అభిషేకంతో ఆ లోనికి వెళ్ళుదును, మరియు ప్రజల కొరకు ప్రార్ధన కూడా చేయను, ఇంటికి నడచుదును మరియు వారు స్వస్థత పొందుదురు. చూడండి, చూశారా? అది నిజం. ఇప్పుడు నేను, అది జరుగుట నేను చాలాసార్లు చూశాను. చూశారా? నీ విశ్వాసమును నిలుపుటకు నీకు ఒక స్థలము కావలసియున్నది. చూశారా? దానిని మీరు నమ్మవలసియున్నది. మరియు ఆ ఘడియ సమీపించుచున్నదని నేను నమ్ముచున్నాను, మరియు ఇప్పుడు ఆ…
మరియు యిది టేపు ఆరాధన కాదని నేను గ్రహించుచున్నాను. వారి సొంతమునకు వారు ఒక చిన్న టేపు చేసుకొనవచ్చును, గాని యిది దేశమంతటా వెళ్ళే టేపు కాదు.
8ఈ ఉదయం నేను మాట్లాడుచుండిన ఈ సంగతి మనలను ఒక ముగింపు యొద్దకు తీసికొని వచ్చినది, మరియు ఆ కారణము చేతనే, నేను వచ్చే ఆదివారము ఒక స్వస్థత ఆరాధన కొరకు తీసుకొనదలచుకున్నాను. ఎందుకంటే, నేను యింటికి వెళ్ళిన దగ్గర్నుంచీ, దర్శనముల గురించీ, మరియు ఏమి జరిగినదీ, మరియు అంతా మరియు దానిని తిన్నగా పైకి తీసుకు వచ్చి నేనివన్నీ ఎందుకు చేశానో మీకు చెప్పాను. మరియు తర్వాత ఈ ఉదయం ఇప్పుడు దానిని తిన్నగా ఈ చివరి ఈడ్పుకు తీసికొని వచ్చుట.
ఇప్పుడు, యిది నేను దేవుని కొరకు ప్రతిష్ఠ చేసికొనవలసిన సమయము, మరియు దేవుడు నాతో మాట్లాడవలసిన సమయము. చూడండి. మరియు నా సొంత జీవితములో నేను ఒక చిన్న మార్పు కలిగియుండవలసియున్నది. నేను చెడ్డవాడిని అనుకొనుట లేదు, కాని నేను ప్రజలకు మరి కొంచెం సమీపముగా ఉండాలని అనుకుంటున్నాను, చూశారా?
9నేను ఈ సువార్త సత్యమును చెప్పుటకు ప్రయత్నించిన ప్రజలు, మరియు వారు దీని వైపు వారి వీపు త్రిప్పుదురు, మరియు దీని నుంచి దూరంగా నడిచి, దీనిని చూచి నవ్వుదురు.
ఇప్పుడు, అది నాకు ఒక అవమానంలా అన్పిస్తుంది. నాకైతే, నేను పట్టించుకోను; కాని నేను చెప్పుతున్న సంగతులకు, వారికి సహాయము చేయుటకైన సత్యమది. ఒక పడవలో నుంచి బయటికి లాగుతున్నట్లుగా, మరియు, "ఇదిగో యిక్కడ ఉంది, దాటెయ్యి యిక్కడ, ఆ పొంగుతున్న ప్రవాహంలో నుంచి బయటికి రా; నువ్వు చచ్చిపోబోతున్నావు. అక్కడ నీవు నశించిపోబోతున్నాను," అనుట. మరియు వారు నిన్ను పరిహసించి, దూరంగా నడిచిపోవుట. సరే, వారు నడిచిపోయినట్లయితే, దాని గురించి నేనిక ఏమీ చేయలేనని నాకు అన్పిస్తుంది (చూశారా?), నేను చేయగల్గినది. కాని ఇప్పుడు ఆ తీరం ఒడ్డున పరుగెత్తి వారికి నచ్చజెప్పాలన్పిస్తుంది, "వెనక్కి రండి" అని. చూడండి నేను ఆ తలంపు కలిగియుండ వలసియున్నది. (చూశారా?), ఎందుకంటే యింకా లోనికి రాని వారు ఎవరో ఇంకా అక్కడ ఉన్నారని నాకు తెలుసు. మరియు అంత వరకూ నేను చేపలు పట్టబోతున్నాను . ఆయన… చివరి చేప పట్టబడే వరకూ అనెను. మరియు నేను - నేను అది చేయగోరుతున్నాను.
ఇప్పుడు, మరియు ఇప్పుడు, అది చేయుట కొరకై ఒక ప్రార్ధన కూటములో ఏదో ఒకటి జరుగుట కొరకై నేను ఎదురుచూస్తున్నాను, ఒకటి. మరియు ఆ చివరి ఈడ్పు, లేక మూడవ ఈడ్పు యొక్క దర్శనం మీతో అనేకులకు జ్ఞాపకముంది. మీకు గుర్తుందా, సరిగ్గా దానికి ముందు ఒకటి జరిగింది: నేను వెలుగు క్రిందికి వచ్చి ఆ స్థలమునకు వెళ్ళుట చూచితిని, మరియు "నిన్ను అక్కడ కలిసికొందును," అనెను. ఇప్పుడు నేను ఒకటి జరుగుట కొరకై ఎదురుచూస్తున్నాను.
10సంవత్సరాల క్రితం యిక్కడి ఆరాధనలూ మరియు వివేచనలూ నన్ను ఎంతగా బలహీన పరచేవంటే నేను తూలిపోయేవాడను. మీలో అనేకులకు అది గుర్తుంటుంది. నేను నిలబడి ఉంటే, సహోదరుడు జాక్ మూర్ ఒక భుజమునూ మరియు సహోదరుడు బ్రౌన్ మరొక దానినీ పట్టుకుని, ఆరాధన తర్వాత ఒక గంట పాటు నన్ను వీధి క్రిందికీ పైకి నడిపించవలిసిన స్థితికి చేరుకునే వాడిని, మరియు నేను కేవలం, జరిగినది, నేనెక్కడ ఉన్నాను, మరియు ఏమి జరుగుతున్నది అని ఆలోచించే ప్రయత్నం చేసేవాడిని. అంతట, రాత్రంతా అక్కడ పండుకొని, దాని గురించి ఆలోచిస్తూ, మరియు వెక్కిళ్ళ వచ్చునట్లు ఏడుస్తూ, మరియు మిగిలినదంతా, మరియు వారు మన ప్రభువైన యేసును ఎందుకు స్వీకరించలేదా అని ఆలోచించేవాడిని.
అప్పుడు ఆయన నాకు ఒక దర్శనమును చెప్పెను," ఒకసారి బ్రౌన్ సూట్ తొడుగుకొని, ఒక చిన్న శిశువును దుప్పటిలో చుట్టుకొని, నీ యొద్దకు వచ్చే స్త్రీని నీవు కలిసికొందువు, మరియు అప్పటి నుంచీ యింకా బలంగా ఒర్చుకునే శక్తిని పొందుదువు." సరే, మీ అందరికీ నేనది చెప్పాను. మరియు షికాగోలో, ఆ రాత్రి, ఆమె సొంత పాస్టర్ చేత పంపించబడ్డ ఆ చిన్న ప్రెస్బిటేరియన్ స్త్రీ ఆ శిశువుతో వచ్చినప్పుడు అది జరిగినది.
11అతని సహోదరుడని నేను నమ్ముతున్నాను, లేక వారిలో ఒకరు, అతడొక డాక్టరు. "సర్వశక్తిమంతుడైన దేవుడు తాకితేనే గాని ఆ శిశువుకు ఎలాంటి ఆశా లేదు," అని అతడు చెప్పెను. అతడు వెళ్ళెను .
ఆమె వెళ్ళి ఆమె పాస్టర్తో చెప్పింది. ఆమె పాస్టర్ చెప్పెను, "నేను యోగ్యుడను కాను," అతడు చెప్పెను, "ఈ దైవీక స్వస్థత పై పనిచేయుటకు, ఎందుకంటే దానిని చేయుటకు కావలిసిన ఆ విశ్వాసము నాకు లేదు, నాలో అది లేదంతే."
ఇప్పుడు, అది దాని గురించి నిజాయితీగా యుండుట. చూశారా? "అది నా యందు లేదు, అంతే" అని అతడు చెప్పెను. "కాని నేను సహో, బ్రెన్హాం కూటములలో ఒక దానికి వెళ్ళితిని, మరియు నీవు శిశువును సహో. బ్రెన్హాం యొద్దకు తీసుకెళ్ళాలని నేను సలహా ఇను."
మరియు డాక్టరు ఆ శిశువు విషయమై చేతులెత్తేసెను, మరియు ఆ శిశువు చనిపోనున్నది.
12మరియు అక్కడ వారి బడి కాలిపోయిన ఆ క్యాథలిక్ పిల్లల కొరకు నేను ఒక ఆరాధన లాంటిది నిర్వహిస్తున్నప్పుడు, ఆ చిన్న స్త్రీ లోనికి నడిచి వచ్చింది, మీకు తెలుసు. అది ఎప్పుడో మీకు గుర్తున్నది. మేము ఒక ఆరాధనను కలిగియుంటిమి, మరియు బ్రౌన్ రంగు సూటు వేసుకున్న ఆ చిన్న స్త్రీ తిన్నగా వేదిక క్రిందికి వచ్చెను. నా భార్య మరియు వారు అక్కడ కూర్చొనియుండిరి, మరియు నేనన్నాను - నేను తిరిగి, చుట్టూ చూసి వారక్కడ నిలిచియున్నారా అని చూచితిని, మరియు నేను వచ్చుటకు కొంచెం ముందు, బిల్లీ పాల్ మరియు వారు మాట్లాడుచుండిరని నేను నమ్ముచున్నాను, లేదా భార్య మరియు వారిలో కొందరు ఆ చిన్న శిశువుతో ఉన్న ఆ స్త్రీతో మాట్లాడుచుండుట జరిగినది. మరియు ఆ స్త్రీ వేదిక పైకి నడిచివచ్చింది, మరియు పరిశుద్ధాత్మ అంతటినీ బయలుపరచి శిశువును స్వస్థపరచెను.
నేను నడిచి వచ్చేశాను, మరియు అప్పటి నుంచీ నేను అలసిపోను, చూడండి, అది నన్ను ఎంతమాత్రమూ యిబ్బంది పెట్టదు, మరియు ఇప్పుడు, నేను తిన్నగా కొనసాగిపోతూ ఉందును.
13ఇప్పుడు, ఈ మూడవ ఈడ్పును నడిపించుటకై (చూశారా), ఏదో ఒకటి జరుగుట కొరకు నేను ఎదురుచూస్తున్నాను, మరియు బహుశా వచ్చే ఆదివారం స్వస్థతా ఆరాధనలో అది జరుగవచ్చును. నాకు తెలియదు, మనము చేయవలసినది, వ్యాధిగ్రస్తులను తీసికొని రమ్మని మీ ప్రజలకు చెప్పుటయే. ఇప్పుడు, ఒక స్వస్థత ఆరాధనకు, మనము వ్యాధిగ్రస్తుల పై పరిశుద్ధపరచుకొనవలసి యున్నది. వచ్చే ఆదివారం ఉదయం, ఎనిమిది లేక ఎనిమిదిన్నర సమీపంలో మీ వ్యాధిగ్రస్తులను యిక్కడికి తీసికొని రండి, వారు ద్వారములో ప్రవేశించునప్పుడు వారికొక ప్రార్ధనా కార్డు యిచ్చునట్లు మేము ఏర్పాటు చేయుదము, వారు ఏ విధంగా చేసినప్పటికీ, మరియు అప్పుడు, మనము ఒక ప్రార్ధనా వరుసలో రోగుల కొరకు ప్రార్ధి౦చి పరిశుద్ధాత్మ ఏమి చేయునో చూచెదము. మనం కేవలం ఆయనను నమ్మినట్లయితే ఆయన అద్భుతములు చేయునని నేను నమ్ముతున్నాను. చూశారా? కాని మన హృదయమంతటితో, ఇప్పుడు మనము ఆయనను నమ్మవలసియున్నది.
ఈ ఉదయం మనము మాట్లాడుతున్నట్లుగా, దేవుడు మనకు ఎంతో చూపించి, మరియు మనలను ఒక నిశ్చయమైన స్థలమునకు తీసికొనివచ్చిన, ఆ ఘడియ వచ్చియున్నదని నేననుకుంటున్నాను. ఆ చిన్న కొండ పైకి నెట్టుటకు, మరియు మీకు కావల్సినదంతా అదే, అప్పుడు అది దూరంగా తొలగిపోతుంది చూశారా? అది ఉన్నది ఉన్నట్లుగానే పోవుట, అదే విషయం, వివేచన ద్వారా అదే, మరియు ప్రవచనము ద్వారా అదే, కనిపెట్టుటకు.
14నేను కల్గరీ యొుద్ద నిలచియుంటిని. నన్ను మన్నించమని మిమ్ము కోరుతున్నాను… రెజీనా. రెజీనా యందలి క్వీన్సిటీ, మరియు ఎర్న్ బాక్టర్ అక్కడ నిలుచుండెను, మరియు మేము ఒక గుంపుగా, మరియు తిన్నగా యిక్కడ వేదిక పై ప్రభువు నాతో చెప్పెను, "యిది జరుగును, నీవు వారి హృదయ రహస్యములను తెలిసికొందువు." మరియు అది నిజం, మరియు దాని గురించి ఎన్నడూ నేను ఆలా ఆలోచించలేదు. ఆ రాత్రి నేను ఎర్న్ తో కలిసి వేదిక పైకి నడిచి రోగుల కొరకు ప్రార్ధించుట మొదలుపెట్టాను. మరియు యిక్కడికి ఒక మనుష్యుడు అలా వచ్చెను, అతడి జీవితమంతటినీ అలా పరిచెను; ఒక స్వస్థత ఆరాధనలో, కేవలం ఒక్క క్షణంలో, అలా జరగటం అప్పటి వరకూ అది మొట్ట మొదటిసారి, మరియు అప్పుడు నేను శ్రోతల వైపు చూశాను, మరియు యిక్కడ అది శ్రోతలు మరియు సంగతుల పైకి రావటం మొదలు పెట్టింది.
ఓ, మనము అవతలి ఒడ్డుకు చేరినప్పుడు. సంగతుల కొరకు కనిపెట్టుటకూ మరియు ప్రజల జీవితంలో సంగతులను చూచుటకూ, యింకా సగం కూడా ఎప్పటికీ చెప్పబడ లేదు. దాని గురించి నేనేమీ చెప్పను, దానినలా విడిచిపెట్టు (చూశారా?), నేను ఏమైనా చెప్పుటకు నిజంగా బలవంతం చేయబడని యెడల. మరియు ఇప్పుడు, తర్వాత అది అలా మొదలగుటకు నేను ఎదురు చూస్తున్నాను (చూశారా?), దేవుడు, ఆయన సొంత మార్గంలో, దానిని మొదలు పెట్టుటకై ఆయన సొంత సార్వభౌమత్వపు కాలము. మరియు, అది ఈ మిగిలిన జనులకన్నా ఎంతో దూరంగా ఉండు వాటిలో మరొకటి. చూశారా? మరియు అది జరుగుట కొరకై నేను ఎదురుచూస్తున్నాను.
15మరియు, ఓ, నేననుకున్నాను, బహుశా వచ్చే ఆదివారం నేను ఒక చిన్న స్వస్థతా ఆరాధన కలిగియున్నట్లయితే, బహుశా ఆ తర్వాతి ఆదివారం పిల్లలు మరియు వారితో నేను దూరమునకు పోవుదును, ఎందుకంటే వారు వెనక్కి వెళ్ళి స్కూలుకి వెళ్ళవలసియున్నది. మరియు తర్వాత ఆదివారం, నేను, ఎలాగూ షికాగోలో అక్కడి కూటములో ఉంటాను. మరియు ఆ తర్వాత సోమవారం వెనక్కి వచ్చి, మంగళవారం పిల్లలను స్కూలుకి పంపించుట కొరకు ఆరిజోనాకు వెళ్ళవలసియున్నది.
సరే, పాస్టర్, మీరేమి కనుగొన్నారు? ("సరే, నేను చాలా వింతైన విషయమును కనుగొన్నాను," అని సహో, నెవిల్ అంటున్నారు. - సంపా) మంచిది, అది చాలా మంచిది. ఇప్పుడు మేము దాని గురించి వినగోరుచున్నాము. కావున ఇప్పుడు, ప్రభువు మిమ్ములనందరినీ చాలా చాలా మంచిగా దీవించును గాక, మరియు వచ్చే ఆదివారము మిమ్మల్ని యిక్కడ చూచుటకై నేను నిరీక్షించుచున్నాను, మరియు బుధవారం రాత్రి.
16మరియు వినండి. మరియు ఆ బయట ఎంతో కఠినంగా ప్రయాసపడుతున్న ఈ చిన్న సంఘాలను మర్చిపోవద్దు, సాహో. రాడేల్, సాహో. జాక్సన్, సాహో. పార్నెల్, మరియు యితరుల సంఘాలను చూశారా? మరియు యిక్కడ మనము వారి సహోదరీ సంఘమని వారు తలంచుచున్నారు. మీరు చూశారా? మనము ఒక రకంగా వారికి ఒక చిన్న తల్లి గుంపుము. వారు యిక్కడి నుండి జన్మించిన వారే, పాస్టరు మరియు వెుదలగు వారు. మరియు ఆ వెనుక ఆ చిన్నవాడు, గత రాత్రి నేను అక్కడ కలిసిన ఆ సహోదరుడు, అలెన్, చిన్న సహోదరుడు అలెన్, ఇక్కడున్న సహోదరుడు కొలిన్స్ సహోదరుడు అలెన్తో కలియునని నేను ఆశిస్తున్నాను, అతనికి యితడు తెలియనట్లయితే, వారిద్దరూ మెథడిస్టు సేవకులు, మరియు వాక్యము యొక్క సత్యమును చూసియున్నారు.
17అది, మెథడిస్టు సంఘము యొక్క సంస్థ, ఆ మెథడిస్టు సంఘం, అది ఒక చక్కని జనుల గుంపు, అందులో ఉంది. వారు కాదని మీరు ఎన్నడూ అనుకోవద్దు. వారు (చాల మంచి వారు - తర్జుమాదారుడు). క్యాథలిక్ సంఘంలో వారు ఒక చక్కని ప్రజల గుంపుగా యున్నారు. ప్రెస్బిటేరియన్ సంఘంలో ఒక చక్కని గుంపు ఉన్నారు. మరియు అక్కడ ఆ స్థలములన్నింటా, ఆ వెలుగు వారి త్రోవల గుండా ప్రసరించుటకై ఎదురుచూస్తున్న పురుషులూ మరియు స్త్రీలూ ఉన్నారు. మీరు కేవలం దీనత్వంలోనూ మరియు మాధుర్యంలోనూ ఆ వెలుగును ప్రసరింపజేయుచూ ఉండండి.
మనల్ని మనం తగ్గించుకొనుట ద్వారా మనమందరమూ దేవుని సమీపించుదుము.
18మర్చిపోవద్దు, ఈ గుడారము దాని శక్తిని కోల్పోతుంది. నరకంలోని ప్రతి తుపాకీని సాతాను గురిపెట్టి ఉంచినది ఈ లక్ష్యము మీదనేనని గుర్తు౦చుకోండి. ఒకరు అనుకొనే దానికి భిన్నంగా మరొకరు చేయునట్లు వాడు చేస్తాడు. వాడు అది చేస్తున్నాడు. వాడు ఆ పనిలో ఉన్నాడు. అది వాడి వృత్తి, ఒకరు ఒకానొకటి అనునట్లుగా వాడు చేయగలిగినట్లయితే, ఒకరు మరొకరి గురించి, "సరె, విను ఫలానా - ఫలానా చేసినది నీకు తెలుసా?" అనునట్లుగా, మీరు దానిని వినవద్దు. మీరు దానిని ఎంత మాత్రమూ వినవద్దు. అది దెయ్యము. చూడండి, అది సాతాను. దానిని మీరు నమ్మవద్దు. ఒకరు చేసిన తప్పు ఏదైనా ఉన్నట్లయితే, వారి గురించి ప్రార్ధించండి.
మరియు స్వార్ధపూరితమైన విధంగా ప్రార్దించి, "నాకు తెలుసు. యిది నా విధి, ఆ సహోదరుడి కొరకు నేను ప్రార్దించవలసియున్నది," అనవద్దు. నిజంగా ఆ సహోదరి విషయమై నీవు నీ హృదయమునకు (భారమును - తర్జుమాదారుడు) తీసికొనుము. మరియు అలా మాట్లాడుచూ నిజంగా మధురంగా ఉండండి, మరియు జరిగే మొదటి సంగతి మీకు తెలుసా, వారు తిన్నగా మరలా ఆరాధనలో యుండుట కనుగొందురు. చూశారా? ఎందుకంటే, చివరికి మనము సూర్యాస్తమయమునకు వెళ్ళుచున్నాము.
19ప్రభువైన యేసు ఈ రోజులలో ఒక రోజు రానైయున్నారు.
మరియు, మీకు తెలుసా, అది ఎంత ఆకస్మాత్తుగా మరియు ఎంత తీయగా ఉంటుందని నేననుకుంటున్నానంటే, ప్రపంచములో ఉన్న వంద శాతంలో - వంద శాతంలో నూరవ వంతుకి ఎత్తబాటు ఎప్పుడు జరుగుతుందో ఎప్పటికీ తెలియదు. అది ఎంత నిశ్శబ్దంగా జరిగి పోతుందంటే ఎవ్వరికి దాని గురించి ఏమి తెలియదు. చూసారా? మరియు అక్కడ, "సరే, ఇప్పుడు, ఫలానా - ఫలానా?," అనే చిన్న గుంపులు ఉంటాయి.
"ఓ, అక్కడున్న ఒక ఉన్మాదుల గుంపు అంటున్నారు, అక్కడి నుంచి ఒక గుంపు వెళ్ళిందని అంటున్నారు - మరియు వారు.
అది నిజం కాదు. వాళ్ళెక్కడికో బయటికి వెళ్ళారు. మనము ఆ ఉన్మాదాన్ని చూశాము. చూశారా?"
"సరే, సరే, జెఫర్సన్విల్ అనే చోట ఆ చిన్న గుడారము యొద్ద, చాలా మంది సభ్యులు కనిపించుట లేదని వారంటున్నారు." చూశారా వారు దానిని పట్టించుకోరు (నమ్మరు - తర్జుమాదారుడు).
"ఓ అందులో ఏమీ లేదు (మీరు చూశారా?)", అని వారందురు.
అలా అది గతించిపోవును మరియు వారు దానిని ఎరుగరు.
1THS 4:16•
REV 22:11
20దేశమందంతటా వచ్చును, క్రీస్తు నందు మరణించిన వారు మొదట లేచెదరు. ఎత్తబాటు జరుగును; సంఘము గృహమునకు కొనిపోబడును. మరియు అప్పుడు శ్రమలు ఆరంభమగును, మరియు, ఓ, మై, ఆ సమయంలో మనమిక్కడ ఉండగోరుట లేదు. ఆ శ్రమలలో నేనిక్కడ ఉండగోరుట లేదు, వద్దు. ఆ సమయములో మనలో ఎవరైనా యిక్కడ ఉండుటను దేవుడు నిషేధించును గాక, ఎందుకంటే, "అపవిత్రుడు యింకనూ అపవిత్రుడుగానే ఉండనిమ్ము పరిశుద్ధుడు యింకనూ పరిశుద్ధుడుగానే ఉండనిమ్ము నీతిమంతుడు యింకనూ నీతిమంతుడు గానే ఉండనిమ్ము" లేదు.
గొర్రెపిల్ల తన విమోచనా గ్రంథముతో వచ్చెను, మరియు వధువు బయటికి తీసికొని రాబడెను; దానిని తిరస్కరించిన వారు ఒక శ్రమల కాలము గుండా వెళ్ళవలసి యున్నది, యూదుడూ, అన్యుడూ కూడా. ఎటువంటి ఒక శ్రమల కాలము! నాకది వద్దు. "ప్రభువా నన్నిప్పుడు శుద్దీకరించుము." అది ఒక మంచి నాజరీన్ సిద్దాంతము, కాదా? మరియు అది నిజము కూడా. అది నిజము. అది సరియైనది.
"ప్రభువా, యిప్పుడే నన్ను పరిశుద్ధాత్మతో నింపు. యిప్పుడే నాలో నుండి లోకమంతటినీ బయటికి తీసివేయి, ప్రభువా వద్దు." ఆ వృదుడైన నల్లజాతి సహోదరుడు చెప్పినట్లుగా, "అయ్యా నా టికెట్ నా చేతిలో ఉంది. అది యిప్పటికే పంచ్ కొట్టబడింది. ఆ ఉదయం నేను నది యొద్దకు వచ్చినప్పుడు, నాకు ఎలాంటి సమస్యలూ వద్దు." కావున అది దాదాపు నిజం. నాకు ఏ సమస్యలూ వద్దు. మీ టికెట్ చేతితో పట్టుకోండి, ఎందుకంటే మనం దాటి వెళ్ళనై యున్నాము. అలా దాని గురించి ఆలోచించండి, ఆ గొప్ప విమోచనా కాలము సమీపమున యున్నది.
2KGS 3:16•
MATT 24:21
21మరియు ఇప్పుడు మరొక విషయము, సహోదరుడు, పైన యుటికా యొద్ద, అతని పేరేమిటి? సహోదరుడు గ్రాహాం మరియు మరొక సహోదరుడూ అక్కడ పరిచర్య చేయుచున్నారని నేననుకుంటున్నాను, ఒక సహోదరుడు షాంక్స్ లేక అలాంటిదేదో, లేక సింక్? (నెవిల్ సోదరుడు, "సహోదరుడు స్నెలింగ్," అని చెప్పుచున్నాడు. - సంపా.) సహోదరుడు స్నెలింగ్ అంతటికీ కాపరి. ఇప్పుడు యుటికాలో సహోదరుడు స్నెలింగ్ కాపరి. వారి ప్రార్ధనా కూటము. ("గురువారం రాత్రి") గురువారం రాత్రి అనుకుంటాను. ఇప్పుడు మీకొక విషయం తెలుసా, గురువారం రాత్రి మనం అక్కడికి జారుకుని, వారికి కొంచెం సహవాసం చూపినట్లయితే, నిజంగా చక్కగా ఉంటుంది. చూశారా? మరియు సహోదరుడు జాక్సన్, అతడు అతని (ప్రార్ధనా కూటములు - తర్జుమాదారుడు) కలిగి యున్నప్పుడు, మనలో మనము ఒక చిన్న గుంపుగా సమకూడి వెళ్ళినట్లయితే.
22కేవలం ప్రార్ధిసూ ఉండండి, త్రవ్వుచూ ఉండండి. అవును, ఆగవద్దు. ఏలియ వారితో చెప్పినప్పటి వలే, అన్నాడు, "అక్కడ కందకములు త్రవ్వండి."
మీరు దిగి ఒక పాత తగరపు డబ్బాచప్పుడు విన్నట్లయితే, "నేను బాగా అలసిపోయాను," అని, దానిని మార్గము నుంచి ప్రక్కకు విసిరి త్రవ్వుచూ ఉండండి. చూశారా? కేవలము త్రవ్వుచూ ఉండండి, ఎందుకంటే మనము త్రవ్వవలసియున్నది. మనం కేవలం త్రవ్వ వలసియున్నది; అంతే. ఎందుకంటే, మీరు ఆ శ్రమలు తప్పించుకోగోరినట్లయితే, మీరు త్రవ్వటం మొదలు పెట్టుట మంచిది.
మరియు ఇప్పుడు, నా కొరకు, అక్కడ నాకు నేనే బోధించుకొనుచున్నాను. నేను యింతకు ముందు త్రవ్వినదాని కంటే లోతుగా త్రవ్వుట మొదలు పెట్టబోతున్నాను. ఎందుకంటే, నాకు అనిపిస్తుందీ, ఈ పరిచర్య మరలా దేశము యందును మరియు ప్రపంచము చుట్టూనూ, ఎందుకంటే ఇప్పుడు యిది దాదాపు ప్రపంచంలో ప్రతి చోటా తెలుసును. నేను మరలా వెళ్ళవలసియున్నది.
23భార్య నాతో అన్నది… గత ఉదయం నేనన్నాను, "నేను బయలుదేరినప్పుడు నీవు నాతో రావాలని నేను కోరుతున్నాను. ప్రభువు చిత్తమైతే, నేను జనవరి దగ్గర్లో బయలుదేరుతాను. నేను ఒక పూర్తి ప్రపంచ ప్రయాణము చెయ్యాలనుకుంటున్నాను, మొత్తం చుట్టూ చుట్టి, తిరిగి వచ్చి బహుశా వచ్చే వేసవిలో అమెరికాలో కూటములు ఉండవచ్చు."
మరియు ఆమె అన్నది, "నేను ముసలిదానను, రాలేను."
నేనన్నాను, "సరే, నేను దాదాపు ఎనిమిది సంవత్సరాల క్రితం విదేశాలకు వెళ్ళాను, మరియు ఎనిమిదేళ్ళ క్రితం కంటే యిప్పుడే నేను వెళ్ళడానికి కావల్సిన రూపులో ఉన్నానని నేననుకుంటున్నాను. చూశారా? ఇప్పుడు దాని గురించి నాకు యింకా ఎక్కువ తెలుసు."
24"నేను నీకు యిరవై అయిదు సంవత్సరాలు కేటాయించబోతున్నాను. నీవు నీరసించవు. నీవు ప్రయాణించగలుగుతావు, మరియు నేను నీకు భూమి మీద యిరవై ఐదు సంవత్సరాలు కేటాయించబోతున్నాను," నీవు పుట్టుక నుంచి యిరవైఐదు తీసుకుంటావా, లేక ఇరవై ఐదు నుంచి యాభై తీసుకుంటావా, యాభై నుంచి డెభ్బై ఐదు తీసుకుంటావా, లేక 75 నుంచి 100 తీసుకుంటావా అని ప్రభువు అన్నట్లయితే అనే అంశము మీదికి మేము వచ్చాము.
ఇప్పుడు భూమి మీద ఏదో ఒక కాలము కేటాయించబడిన ఏ నరుడైనా, ఆ కాలాన్ని దేవుని సేవకు వాడనట్లయితే, అతడు అత్యంత నిర్లక్ష్యంగా పనిచేయుచున్నాడు. అతడేమి చేయుచున్నాడనేది నాకు అనవసరం. ఇప్పుడు నీవు స్త్రీల కొరకు మనసు పగిలిన వాడిగా మరియు అలా ఉండగోరినట్లయితే, నీవు ఆ యవ్వన కాలాన్ని మొదటి 25 ఏండ్లను తీసుకొనుట మంచిది. చూశారా? నీవు ఒక వడ్రంగి, లేక మెకానిక్, లేక మరొకటి కావాలనుకుంటే నీవు రెండవ ఇరవై ఐదుని తీసికొనుట మంచిది. చూశారా?
25అంతట, "నా సంగతేంటి? నేను ఎక్కడిది తీసికొంటాను?" అనే విషయమై నేను ఆలోచించుచుంటిని. నేను డెభ్బై ఐదు నుంచీ వంద వరకూ తీసికొందును. నేను మరింత చురుకుగానూ, మరింత జ్ఞానముగలవాడిగానూ ఉందును. నేను మరింత స్థిరముగా నుందును. నేను ఏమి చేయుచున్నాను అను దాని గురించి నేను మరి యొక్కువ తెలిసికొని యుందును.
నేను గతసారి విదేశాలకు వెళ్ళినప్పటి కంటే ఎనిమిది లేక పది, సంవత్సరాలు పెద్ద వాడిని. నేను పాములను చంపుచున్నట్లుగా గంతులు వేయను. నాకు దాని గురించి మరింత ఎక్కువ తెలుసు. చూశారా? ఎలా అనేది నాకు తెలుసు. అది ఒక కూన్- డాగ్ ఒక కూన్తో పోరాడుతున్నట్లు ఉంటుంది, (కూన్ అమెరికాలో కన్పించే ఒక ముంగిస వంటి జంతువు. దానితో జగడమాడటంలో అవసరమైన మెళుకువ తెలిసిన కుక్కను కున్-డాగ్ అంటారు. - తర్జుమాదారుడు) (చూశారా?); వాడిని ఎలా పట్టుకోవాలో మీకు తెలుసు. ఆ లోపలికి దూక వద్దు; వాడు మిమ్మల్ని రక్కి పడేస్తాడు. చూశారా? వాడి తంత్రములు తెలిసికొని నేర్చుకుంటాము. కనుక మనము వాడి మెళుకువలన్నిటినీ తెలుసుకొనవలసి యున్నది, మరియు వాడు ఎలా సమీపిస్తాడు, మరియు వాడు ఏమిచేస్తాడు, వాడి పిడిగుద్దులను తెలిసికొని, అప్పుడు నీవు వాడి మీదికి వెళ్ళుటకు తర్ఫీదు పొందినవాడవు. మీరు చూశారా?
"కనుక ఇప్పుడు నేను నమ్ముతున్నాను," నేను భార్యతో అన్నాను, "నేను నలభై ఏండ్ల వయస్సు కలిగి వెళ్ళినప్పటి కంటే, ఇప్పుడే నేను మంచి రూపంలో ఉన్నానని నేను నమ్ముతున్నాను." చూశారా? మరియు ఇప్పుడు నాకు యాభై నాలుగు. నేను అప్పటి వరకూ బ్రదికి, ఇప్పుడు తిరగ గలుగుతున్నట్లుగా తిరగ గలిగినట్లయితే, నాకు వంద ఏండ్లు వచ్చినప్పుడు, నేను చేయగలిగితే… యేసు అంతకాలం వరకూ రానట్లయితే, ఇప్పటి కంటే అప్పుడే నేను వెళ్ళుటకు తగిన మంచి రూపములో ఉందునని నేను నమ్ముచున్నాను. చూశారా? ఎందుకంటే మీకు దాని గురించి మరి ఎక్కువగా తెలుసు; ఏమి చెయ్యాలి అను దాని గురించి మీకు మరి ఎక్కువగా తెలియును, మరియు దానితో ఎలా వ్యవహరించాలని, పరిస్థితిని ఎలా అదుపు చెయ్యాలి అనునది.
26ఇప్పుడు చాలా మంది ప్రజల్ని తీసుకుందాం, వారి మీద శస్త్రచికిత్స (ఆపరేషన్) జరుగబోతుంది . "నిన్ననే పట్టభద్రుడైన ఒక కొత్త డాక్టరని వారంటున్నారు, ఇప్పుడే వైద్య కళాశాల నుంచి బయటికి వచ్చాడు. అతడిప్పటి వరకూ ఒక్క ఆపరేషను కూడా చేయలేదు. అతనిని చెయ్యనివ్వండి."
"ఓ, వద్దు," మీరందురు, "ఏమీ చెయ్యవద్దు, ఆ కుర్రవాడు వద్దు. వద్దయ్యా అయినా నిశ్చయంగా వద్దు. అతడు నా మీద కత్తి ఉంచుట నాకు యిష్టం లేదు. సరే, అంతకంటే నేను ఆ క్రిందికి వెళ్ళి ఫలానా - ఫలానాని తెచ్చుకొందును. అతను చాలా ఆపరేషన్లు చేశాడని నేను విన్నాను. అది ఎలా చెయ్యాలో అతనికి తెలుసు." అది సంగతి. చూశారా?
అదీ ఆలోచన. నీవు దీనిని గురించి ఆలోచించుచున్నావు, మరి ఆత్మ సంగతేమిటి? వారెక్కడ ఉన్నారో మరియు త్రోవ ఏమిటో తెలిసిన ఒకరు నాకు కావలెను, దానిలో పయనించిన ఒకడు. అవును, నిశ్చయముగా.
27ప్రభువు నిన్ను దీవించును గాక. సరే సహో, నెవిల్, దేవుడు సహో, నెవిల్ను దీవించును గాక.
ఇప్పుడు మరచిపోవద్దు, వచ్చే ఆదివారం. [సహో, నెవిల్ మాట్లాడుతూ సహో, వేల్ ని పరిచయం చేస్తున్నాడు] నేను విశ్వాసులను క్షమాపణ కోరుచున్నాను, నాకు తెలియదు అక్కడ కూర్చుండుట, ఇక్కడ స్థిరపడిపోయాను. దేవుడు నిన్ను దివించునుగాక సాహో వేల్.
28[సాహో వేల్ చెప్పుచున్నాడు, అది ముందుగ నిర్ణయి౦పబడినది కాదు."] మంచిది. అది సరే. నేను స్వయంగా ఆయనను వినే అవకాశం నాకు దొరికింది. కూటములు మొదలగు వాటిలో అనేక సార్లు సహో. వేల్ నాకు ముందు మాట్లాడెను. ఆయన చాలా కాలం పాటు కూటములను పర్యవేక్షించారు. మరియు మంచి సహోదరుడు, మరియు కష్టమైన పనిని చేసెను. మరియు ఆయన మాట్లాడినప్పుడు సహో. వేల్ ప్రసంగం వినుటకు ఈ శ్రోతలు ఎప్పుడూ సంతోషించెదరని నేను నిశ్చయత కలిగి యున్నాను. సహో. వేల్ని దేవుడు దీవించును గాక.
29ఎంతగా చెప్పబడినదంటే, దీనిని యింత కంటే బాగుండునట్లు చేయుటకు నేను మరేమియు చెప్పలేను. ఈ ఉదయం తర్వాత సహో, వేల్ ఈ వర్తమానము తీసికొని వచ్చునట్లు చేసినది ప్రభువేనని నేను నిజముగా నమ్ముచున్నాను. ఎందుకంటే మీరు చూడండి, అది ఆలాగు పనిచేయవలసియున్నది. దానిని మనము దేవుని యొద్ద నుంచి అంగీకరించుదుము. ఏమిటి, అతడు ఎన్నో సంగతులు చెప్పుచుండెను; అతడు ఇప్పుడు చెప్పినదాని నుంచి సరిగ్గా ఇరవై ప్రసంగాలు నేను యిక్కడ వ్రాసియుంచుకొన్నాను.
అతడు చెప్పిన దానిని సమర్ధించుటకు నేను యిక్కడ ఒక ఉదాహరణ గురించి ఆలోచించుచుంటిని. ఇప్పుడు, సమయమెంత అయినదీ తెలిసికొనుటకు మనము ఈ గడియారమును చూచెదము. ఆ గడియారములో ప్రతి పరికరమూ ఒక దానితో ఒకటి సహకరించని యెడల, మనకు సరైన సమయము ఎన్నడూ తెలియదు. అది సరియేనా? మూడవ ఈడ్పు దేవుని కొరకై ఏదైనా చేయుట మనము చూడగోరినట్లయితే, దానికి మనమందరమూ అవసరము, మరియు మనందరి మధ్య సహకారమూ, దేవుని ముందు మనలను మనము తగ్గించుకొనుట, మరియు మన తప్పులను ఒప్పుకొనుట, మరియు ప్రార్దించుట, మరియు ఈ విషయములకై దేవుని విశ్వసించుట, అంతా కలిసికట్టుగా.
JUDE 1:3
30సహో వేల్ చెప్పినది నిజమని నేను నిజంగా నమ్ముచున్నాను, ఒక అపవిత్రమైన, నీతిమాలిన, అవిధేయమైన ఆలయంలో దేవుడు ఎన్నడూ తన ఆత్మను ఉంచడని. లేదు, దేవుడు మన ద్వారా స్వచ్ఛమైన ఆయన పరిశుద్ధాత్మ యొక్క సంగతులను జరిగించుటకు, దేవుని ఎదుట మనము స్వచ్చముగా నుండుటకై మన హృదయములను సమస్త వేషధారణ మరియు అతిక్రమము నుంచి శుభ్రపరచుకొను ఆ మార్గము ద్వారా అది రావలసియున్నది.
ఈ రాత్రి మీరు యింటికి వెళ్ళినప్పుడు, యూదా వ్రాసిన ఆ చిన్న గ్రంథమును మీరు చదివినట్లయితే, సహో, వేల్ చెప్పిన దానిలో చాలా సంగతులను మీరు నేర్చుకొందురని నేను అనుకుంటున్నాను. "పరిశుద్ధులకు ఒక్క మారే అప్పగించబడిన విశ్వాసమునకై నేను పోరాడుచున్నానని అతడు చెప్పెను. వారు దాని నుంచి తొలిగిపోయిరి. నాశన మనస్సుగల మనుష్యులూ, మొదలగువారు, లోపలికి ప్రవేశించి, మోసగించి ఏలాగు వారిని దేవుని యొక్క నిజ సంగతుల నుంచి దూరముగా కొనిపోయిరో. మరియు మనము ఆయనను పనిజేయనిచ్చిన ప్రకారమే ఆయన (మన ద్వారా - తర్జుమాదారుడు) పనిచేయును.
మరియు చెప్పుటకు ఎన్నో అద్భుతమైన సంగతులు ఉన్నవి.
31మీకు తెలుసా, ప్రజలకు అధికారం కావాలి, మరియు నిజంగా వారికి అధికారం అంటే ఏమిటో తెలియదు. చూశారా? దానితో ఏమి ఉండునొ వారికీ నిజంగా తెలియదు. ఎల్లప్పుడూ పైకి వెళ్ళే మార్గము క్రిందివైపునకే ఉంటుంది. మీకు అధికారం కావాలంటే, మీరు ఎంత దీనముగా ఉండగలరో చూసుకోండి. లోకపరమైన ఆలోచనలన్నింటీ నుంచీ నీవు నిన్ను దూరముగా తొలగించుకొని, దేవుని ముందు నిన్నునీవు తగ్గించుకొనుము, మరియు అప్పుడు భవనమంతా తిరుగాడుతూ బిగ్గరగా గోలచేయువానికంటే నీవు ఎక్కువ శక్తిని (అధికారమును - తర్జుమాదారుడు) కలిగియుందువు (చూశారా?) ఎందుకంటే నిన్నునీవు జయించుకొని క్రీస్తుకు సమర్పించుకొనగల సామర్థ్యము కలిగియుంటివి (మీరు చూశారా?), ఆయన ముందు నిన్నునీవు తగ్గించుకొనుట. అది నిజమైన శక్తి (అధికారము -తర్జుమాదారుడు).
మీరు నాకు ఒక దీనమైన సంఘమును చూపించండి, నిజంగా దీనమైనది, ఒక అహంకారము గల సంఘము కాదు, కేవలం ఒక తీయనైన, దీన సంఘము, దేవుని కృప మరియు శక్తిని అందులో కలిగియున్న సంఘమును నేను మీకు చూపించెదను. అది నిజం. దానికి అవసరమైనది అదే, దీనత్వము, దేవుని ముందు మనల్ని మనం తగ్గించుకొనుట, మరియు దేవుడు మన ద్వారా పని చేయుటకు అవకాశమిచ్చుట. బోలెడంత గోల చేయనక్కర లేదు.
1COR 13:3
32కొన్ని సార్లు, ఆ రైతు చెప్పినట్లు, అతడు తన బండిని తీసికొని పొలములోనికి వెళ్ళేను, మరియు అది ఒక గతుకును తాకిన ప్రతిసారీ, అది గణగణమంటూ కొనసాగినది. కాని అతడు తిరిగి వచ్చినప్పుడు, అతడు అదే గతుకును తాకినా అది ఏ చప్పుడూ చేయలేదు, ఎందుకంటే అది మంచి పదార్ధములతో నిండియున్నది.
కావున అది సరియైనదని నేను నమ్ముచున్నాను (చూశారా?). ఆత్మ యొక్క ఫలములు మన ద్వారా తెలియబడునట్లుగా, మనము దేవుని యొక్క మంచి పదార్ధములతో నిండి యుండుట. అతడు మొదటి కొరింథీయులు 13ను తరచుగా ప్రస్తావించినట్లుగా, "నేను నా శరీరమును తగులబెట్టుటకు యిచ్చిననూ, మరియు ఈ సంగతులన్నియు కలిగియున్నప్పటికినీ, ప్రేమ కలిగియుండకపోతే; అది శూన్యము, నాకు ఏ ప్రయోజనమూ లేదు" మరియు అది ఎటువంటిది. మీరు చూశారా? మనమది చేయగోరుచున్నాము.
33అన్నిటికంటే పైగా, మన వ్యక్తిగత ఆత్మల విషయమై మనము దేవునికి ఉత్తరవాదులమై యున్నాము, చూడండి.
అది మీరు పరలోకమునకు వెళ్ళుట. అది నేను వెళ్ళుచున్నానా, లేక అతడు వెళ్ళుచున్నాడా అనునది కాదు. అది నీవు వెళ్ళుట (చూశారా?), మరియు మొదట నీవే. మరియు దీనిని నీవు చూసి, మధురముగా ప్రభువు ముందుకు రావలసియున్నది. మరియు తనను తాను తగ్గించుకొనే మనిషినే దేవుడు హెచ్చించునని నేను ఎల్లప్పుడూ కనుగొనియుంటిని, తన రొమ్ము విరుచుకొని, అంతా తెలుసు, అతనికి నీవేమీ చెప్పలేవు. మరియు అహంకారి, మరియు సరే, అతడే ఎక్కడికీ చేరడు. కాని తనను తాను తగ్గించుకొని మధురముగా నడుచుకొనే వ్యక్తిని నీవు తీసికొనుము.
34మొన్న నేను ఒక మనిషితో మాట్లాడుచుంటిని. అక్కడ వారు ఒక సంఘమును సంస్థగా చేయుచుంటిరి. ఉండిన శాఖలో నుంచి బయటికి లాగుబడెను. మరియు [స్పష్టత లేని మాట] అది సహో. బోజే, మరియు అక్కడివారు దేవుడు ఆశీర్వదించుచున్న ఆ గొప్ప సంఘమును కలిగియుండిరి. మరియు అప్పుడు, తక్కిన వారివలె అలంకరించి, ఒక సంఘశాఖలోనికి విసిరివేయవలెననే తలంపు ప్రజలలో కలిగినది. మరియు వారది చేసినప్పుడు - ఆ లోపల ఉన్న దీన క్రైస్తవులు దానిని కోరుకోలేదు. వారి జీవితమంతా వారు దానికి వ్యతిరేకమైన బోధను వినియున్నారు, కావున వారు దాని నుంచి దూరముగా నడచిరి.
మరియు ఇప్పుడు వారికి ఒక సమూహమున్నది, మరియు ఇప్పుడు మరలా నాలుగు లేక అయిదు వేల మంది గల ఒక పెద్ద స్థలము గల సంఘముగా వారు లోపలికి వచ్చునట్లు దేవుడు వారిని దీవించుచున్నాడు, మరియు వారు తిరిగి మొదలు పెడుతున్నారు.
35ఒక రోజు, యిక్కడే, సరిగ్గా ఈ సంఘ కార్యాలయములో కూర్చుని ఉండగా, వారు నా దగ్గరికి వచ్చి, "సహో బ్రెన్హాం," అన్నారు. మరియు చెప్పెను (తరగతిలో నాయకులలో ఒకడైన, మరియు వారు), చెప్పాడు "మేమేమి చెయ్యాలి?"
"కాపరిగా ఉండుటకు, సంఘ శాఖలన్నింటిలోనూ ఏ ప్రతిష్ఠ లేని, ఆ జీవితమును జీవించే, ఒక నిజమైన, మంచి, వాస్తవమైన, మధురమైన సహోదరుని కనుగొనండి. మిగిలినది దేవుడు చూసుకుంటాడు. చూశారా?" అని నేనన్నాను. నేనన్నాను, "గొర్రెలను పోషించే ఒక మంచి కాపరి, దీనముగా మరియు అటువంటి విధముగా ఉండువాడు. తక్కినది దేవుడు చేయును, మీరు కోరినట్లయితే…
ఏదో పెద్ద అంతా - తెలుసు అనే రకం మనుష్యులు లోపలికి వచ్చుట కాదు, దీనిని క్రమములో ఉంచి, దీనిని యిలా ఉంచాలి, మరియు చుట్టూ ఉన్నవాటిని ఖండించుచూ (లేక కత్తిరించుచూ - తర్జుమాదారుడు). నేనన్నాను, "అది ఎన్నడూ పనిచేయదు, మీరు." అదే యిది, సంఘములో ప్రతి భాగమూ కలిసి పనిచేయవలసి యున్నది, మరియు అందులో నీ భాగమును నీవు నిర్వర్తించవలసియున్నది. కావున మనము ఏ కాలములో ఉన్నామో మనము చూచెదము. మనమనుకుంటున్న దాని కంటే మనము సమీపముగా ఉండి యుండవచ్చును.
36ఇప్పుడు, మనము సహో. వేల్ని మెచ్చుకొందుము, కాదా? (సంఘము, "ఆమేన్, చెప్పుచున్నది - సంపా). దేవుడు నిన్ను దీవించును గాక, సహో. వేల్ నీకు కృతజ్ఞతలు. మరియు ఈ రాత్రి మా యొద్దకు ఈ గొప్ప వర్తమానమును తీసికొని వచ్చినందుకు మేము ప్రభువునకు కృతజ్ఞతలు చెప్పుచున్నాము. మరియు యిది - కొన్ని నిమిషాల క్రితం నాకు ఒక చీటి వచ్చింది. మన సహోదరీలలో ఒకరు, ఆమెకు ఒక కలలో వచ్చినది, చెప్పగోరెను. సహోదరీ, నీవు దానిని నాకు రాసి పంపినయెడల, చాలును, నేను ఖచ్చితంగా నిజమైన కొన్ని కలలను ఆయన ఆమెకు యిచ్చియున్నాడు. మనము కలలన్నింటినీ అంగీకరించము. లేదు, లేదు. కాని అవి దేవునివైనప్పుడు, దేవుడు మనతో మాట్లాడుతున్నాడని మనము తెలిసికొనగోరుచున్నాము.
భాషలలో మాట్లాడు ప్రతి సంగతివలెనే, మనము దానిని నమ్మము; కాని జరుగబోవు ఒక దానిని చెప్పు అర్ధము చెప్పుట జరిగినప్పుడు, అది జరుగుట మనము చూసినప్పుడు, అప్పుడు దాని కొరకు మనము దేవునికి కృతజ్ఞతలు చెల్లించుదుము. చూశారా?
1COR 13:2
37అది సాఫీగా, మధురంగా, మరియు ప్రభువు యొక్క క్రమములో కొనసాగుతూ యుండుటను మనము కోరుచున్నాము.
కావున కేవలం గుర్తు౦చుకొనండి, మీ భాగము ప్రధాన భాగము (main spring) కావచ్చు లేదా అది ఒక చిన్న భాగము కావచ్చు లేదా మరొక చిన్న భాగము, లేక తీగెను చుట్టే ముల్లు కావచ్చు, అది ఏమైనప్పటికీ, లేదా అది గడియారము యొక్క సమయమును చెప్పే ముల్లు కావచ్చు. కాని అది ఏమైనప్పటికీ, దానిని ఉనికిలోనికి తెచ్చుటకు, యేసుక్రీస్తు యెుక్క సువార్తతో మనమంతా ఐకమత్యముగా ఉండుట అవసరము.
కొంచెం ఆలోచించండి. వరాలు అంత గొప్పవైనట్లయితే, మనము శక్తి అని పిలచునట్టివి; "నాకు కొండలను కదిలించే విశ్వాసమున్ననూ, నేను ప్రేమ లేనివాడనైతే, నేను శూన్యుడను," అని పౌలు చెప్పెను. దాని గురించి ఆలోచించండి! "మంచిది, నాకు బైబిల్ అర్ధమవుతుంది…"
"దేవుని యొక్క మర్మములన్నీ నేను అర్థం చేసికొన్నప్పటికీ [చూశారా?, అయినను బయటకు వెళ్ళి దానిని చేయండి.] ప్రేమలేని వాడనైతే నేను శూన్యుడను." నేనింకా ఎక్కడికీ చేరుకోలేదు. చూశారా? దేవుడిని ప్రేమించి దానివలన నిన్నునీవు తగ్గించుకొనుటయే, ముఖ్యమైన విషయము.
DEUT 6:5•
PS 10:17•
PROV 16:18,19•
PROV 29:23•
ISA 57:15•
MATT 15:12,17•
JAS 4:6•
1PET 1:22•
1PET 5:5•
1JN 4:7
38ఇన్ని సంవత్సరాలుగా రంగంలో ఉండి, ప్రపంచము చుట్టూ రకరకాల ప్రజల్ని చూడటం వల్ల, నిశ్చయంగా, ఇప్పుడు నాకు ప్రవేశించవలసిన ద్వారం గురించి కొంచెం తెలిసియుండాలి. మరియు దేవునితో నీవు ఎక్కడికైనా వెళ్ళగోరినట్లయితే, ఎన్నడూ ఒక అహంకారపు ఆత్మను నీ దరికి చేరనీయవద్దు. ఏ చెడు నీలోనికి రానియ్యవద్దు. యితరులు ఏమి చేసినా ఫరవాలేదు, వారు తప్పు చేసినట్లయితే, ఆ వ్యక్తికి విరోధంగా ఒక అభిప్రాయాన్ని (complex, ఒక అభిప్రాయం లోతుగా పాతుకుపోవటం వల్ల ఏర్పడే మానసిక రుగ్మత - తర్జుమాదారుడు) ఏర్పరచుకోవద్దు. చూశారా? నీవు దయ కలిగి మధురముగా ఉండుము. గుర్తు౦చుకోండి, మీరు పాపంలో ఉండగా దేవుడు మిమ్మల్ని ప్రేమించెను. మరియు దేవుని ఆత్మ మీలో ఉన్నట్లయితే, ఎదుటి వ్యక్తి తప్పులో ఉన్నప్పుడు, మీరు అతనిని ప్రేమించెదరు. చూశారా? కేవలం ఒకరినొకరు ప్రేమించి, వారి కొరకు ప్రార్ది౦డి. అన్నిటి కంటే పైగా, దేవుడిని ప్రేమించి ఒకరినొకరు ప్రేమించండి. యింకా దేవుని యెడల, మరియు ఒకరితో ఒకరు, దీనముగా ఉండుడి, మరియు దేవుడు దానిని దీవించును, మరియు ఆయన ఏమి చేయును అనునది చెప్పుట కష్టము.
సాధారణంగా, ఒక సంఘము సంఖ్యాపరంగా కొంచెం ఎదిగి, పెరిగినప్పుడు, లేదా అలాంటిదొకటి జరిగినప్పుడు, అప్పుడు వారు ఆ నిజమైన దాని నుంచి దూరంగా తొలగిపోవుదురు, నిజమైన దాని నుంచి.
39ప్రభువు నాకు ఆ నది పైన కనిపించి యిది చెప్పినప్పుడు మరియు నేను మొదట ప్రారంభించినప్పుడు, ఈ సంగతులను జరుగునట్లు చేసినది ఏమిటో మీకు తెలుసా? చాలా సంవత్సరాల క్రితం, కెనడాలో ఒక పేపర్లో, సహో. వేల్ దానిని చూశాడని నేనను కుంటున్నాను, ఆ నది యొద్ద ప్రభువు యొక్క దూత అగుపడుట, అది అసోసియేటెడ్ ప్రెస్ (Associated Press, ఒక వార్తా సంస్థ పేరు- తర్జుమాదారుడు) లో వచ్చినది, "బాప్తిస్మమిచ్చుచుండగా ఒక స్థానిక సేవకునిపై కనిపించిన మర్మమైన వెలుగు."
మరియు దానిని చేసినదేమిటో మీకు తెలుసా? మేము ఆ వీధి ఎదుట, దాదాపు ఇరవై అయిదు వందల మంది పట్టే షామియానాలో, గుడారపు కూటములు (tent meetings) కలిగియున్నప్పుడు, ప్రతి చోట నుంచీ వచ్చిన సేవకులు, "సహోదరుడా, ఒక్క నిమిషం ఇటు రా" అన్నారు. అప్పుడు నేను కేవలం ఒక బాలుడిని, ఓ, కేవలం ఒక కుర్రవానివలే మరియు వారన్నారు," ఆ ప్రజలను నీవు ఏక మనస్సుతో ఎలా ఉంచుచున్నావు. వారు ఒకరినొకరు ఎంతగా ప్రేమించుచున్నారంటే . ప్రజలు ఒకరినొకరు, (అలా - తర్జుమాదారుడు) ప్రేమించుట నేను చూసియుండలేదు."
40అది ప్రభువు. ఈ సంఘము దానిపైనే స్థాపించబడినది, ఒకరి యెడల ఒకరు దైవీకమైన సహోదర ప్రేమ కలిగియుండుట. ఒక స్థలమును విడిచిపెడుతున్నప్పుడు, నేను, ఒకరితో ఒకరు కరచాలం కూడా చేయలేము, ఒకరినొకరు ఎడబాయుటకు పసిపిల్లలవలే ఏడ్చుట. వారు ఒకరినొకరు అంత చక్కగా ప్రేమించుదురు. నేను వారి యింటిని సందర్శించుటకు వెళ్ళుదును, కొన్ని సార్లు కన్నీటి మరకలతో తెరచిన బైబిలు ఉండును. రాత్రి వేల లోపలికి రమ్కు అక్కడ తల్లిదండ్రులు సమకూడి, మరియు వారి చిన్నపిల్లలు చుట్టూ నేల మీద మోకరించి; మరియు తల్లిదండ్రులు వారి మోకాళ్ళపై ఏడ్చుచూ ప్రార్ధన చేయుచూ యుందురు. మరియు నేను తలుపు యొద్ద నిలిచి ఎదురుచూస్తూ ఎదురుచూస్తూ యుందును. మరియు వారు ప్రార్దించుట మానరు, నేను మెట్ల యొద్ద కూర్చుని, నేను కూడా ప్రార్ధి౦చుట మొదలుపెట్టుదును, వారి కొరకు ఎదురుచూస్తూ చూశారా? మరియు అది - అదే అది. మరియు వారు ఒకరినొకరు ప్రేమించిరి. వారు ఒకరినొకరు ప్రేమించిరి.
మేము నిలబడి ఆ పాత పాట పాడెడివారము,
మన హృదయములను క్రైస్తవ ప్రేమలో
కట్టి ఉంచు ఆ బంధము దీవించబడును గాక;
ఒకే రకమైన తలంపుల సహవాసము,
పైన ఉన్న దాని వంటిది,
మనము విడిపోయి వెళ్తునపుడు,
అది మనల్ని లోలోన బాదించును;
కొన్ని మనము హృదయములలో ఐక్యపరచబడి,
మరల కలిసికొనుటకు నిరీక్షించుదుము.
1THS 4:16,17
41నా హృదయంలో క్రీస్తునందు గొప్ప సంతోషముతో నేను దీనిని చెప్పుచున్నాను; ఈ రాత్రి వారిలో అనేకులు ఈ గుర్తించబడిన సమాధులలో నిద్రించుచున్నారు, మనము మరలా కలిసికొనే ఆ గొప్ప పునరుత్తానముకై ఎదురుచూస్తున్నాము. ఆ ఆత్మను ఎన్నడూ ఈ స్థలము నుంచి తొలగిపోనియ్యవద్దు. ఎప్పుడైనా అది జరిగితే, అప్పుడు మీ కాపరి ఎంత ధారాళంగా మాట్లాడును, ఆయన ఎంత చక్కగా దేవుని వాక్యమును తీసికొని వచ్చును, అనునది నాకు అనవసర౦, దేవుని ఆత్మ దుఃఖపరచబడినది. చూశారా?
సహవాసములో, మరియు సాధారణముగా మనకన్నియూ ఉండి, మరియు ఒకరినొకరు ప్రేమించినప్పుడు, అప్పుడు దేవుడు మనతో పనిచేయును. మరియు మనము సమయమును పాటించుచున్నాము, జనులు వచ్చి "నిజంగా దీనంగా ఉన్న ఒక సంఘమును నీవు చూడదలచినట్లయితే, ఒక్కసారి దేవుడిని నిజంగా ప్రేమించు ఒక సంఘమును, ఆ గుడారము దగ్గర ఆగి దానిని చుడండి ఒకరి యెడల ఒకరు వారు కలిగియున్న జాగ్రత్తను చూడండి, మన్ననలను; మరియు ఎంత విధేయతతో, సువార్త బోధించబడుచున్నదో, ఎలా ప్రతి విషయమూ క్రమములో ఉన్నదో" అనాలి. అది.
అప్పుడు వారు చూసి మనము ఏ కాలములో ఉన్నామో గుర్తించగలరు. దేవుని ఆత్మ మీ మధ్య సంచరించుటను మీరు చూస్తారు; గొప్ప సూచనలు, మరియు అద్భుతములు మరియు సంగతులు జరుగుతాయి. అది గనుక కలిసికట్టుగా పని చేసినట్లయితే, అది సమయమును చూపించుటయే. కాని అది పనిచేయనట్లయితే, అప్పుడు గడియారము ఆగిపోతుంది, యిక ఎంత మాత్రమూ అది సమయమును చూపించదు. కనుక మనము ఏ సమయములో జీవించుచున్నామో తెలిసికొనగోరినట్లయితే, ప్రతి ఒక్కరూ కలిసి సువార్త పనిచేయుట మాత్రం ప్రారంభించండి, ఒకరినొకరు ప్రేమించుచూ, దేవుని ప్రేమించుచూ, మరియు గడియారపు ముల్లులు వాటికవే మనము జీవిస్తున్న సమయాన్ని చూపిస్తాయి. దానిని నీవు నమ్ముతున్నావా? నిశ్చయంగా, ఆమేన్.
నిన్ను దేవుడు దీవించును గాక, సమృద్ధిగా.
JAS 5:16
42ఇప్పుడు మరిచిపోవద్దు; ఈ వారం రండి. మీకు తెలిసిన వ్యాధిగ్రస్తులు ఎవరైనా లోపలికి వస్తున్నట్లయితే, వారు వచ్చినప్పుడు, "నేస్తం నిన్ను అడగాలనుకుంటున్నాను. ఆదివారం ఉదయం టేబర్నికల్ యొద్ద రోగుల కొరకు ప్రార్ధన ఉంది. మరియు నీవు కొంతకాలం నుంచీ రోగివై యున్నావు,
"సరే, నాకు వెళ్ళాలని వుంది. నాకు ఎల్లప్పుడూ వెళ్ళాలనే కోరిక వుంది."
"ఇప్పుడు, మనము స్వస్థపరచబడునట్లు, ఏలాగు మనము, మన దోషములను ఒకరితో ఒకరు ఒప్పుకొనవలసి యున్నదో యాకోబు 5:14, 13, 14, 15 (చూశారా?) మనము స్వస్థత కొరకు రాక మునుపే మన దోషములను ఒకరితో ఒకరు ఎలా ఒప్పుకొన వలసియున్నదో, ఒక సహోదరుడు ఆదివారం రాత్రి వర్తమానంలో చెప్పుట నేను నిన్నాను. అవును. మన దోషములను ఒకరితో ఒకరు ఒప్పుకొని, మరియు ఒకరి కొరకు ఒకరు ప్రార్దించుట." చూశారా? చూడండి, అతడు ఈ రాత్రి మాట్లాడుచుండినది సరిగా దానిని గురించే, మార్కు 16తో ఆశీర్వచనములను మరలా లోనికి తీసికొనివస్తున్నది. వాటిని ఒక చోటికి తీసికొని రండి, మీరు దానిని కలిగియున్నారు, అప్పుడు స్వస్థతలు జరుగుతాయి.
JOHN 1:14•
1TIM 3:16
43యేసు వైపు చూడండి, ఉండ చుట్టిన ప్రేమ కట్ట తప్ప మరేమీ కాదు. చూశారా? ఆయన వ్యక్తపరచబడిన దేవుడు. ఆయన, దేవుడు, ఆయన ద్వారా తనను తాను వ్యక్తపరచుకొనెను, అద్భుతములూ మరియు సంగతులు జరుగుటలో ఆశ్చర్యము లేదు. ఆయన యొక్క దీనమైన మరియు ప్రతిష్ఠించబడిన జీవితం- దేవునిని తన ద్వారా తాను వ్యక్తపరచుటకై, దేవునిగా యుండుట నుండి, యిక్కడ భూమిపై మనుష్యునిగా ఉండుట వరకూ వచ్చుట, అదే ఆయనను అంత ఘనపరచుచున్నది. (మూలములో, "ఆయన ఏమై యున్నాడో అది యగునట్లు చేయుచున్నది." - తర్జుమాదారుడు) "యేసుని నాకు దేవునిగా చేసినదేమిటంటే, ఆయన తనను తాను తగ్గించుకున్న విధానము. ఆయన ఎంతో గొప్పవాడు, అయినప్పటికీ చిన్నవానిగా ఉండగలిగెను" అని నేను ఎల్లప్పుడూ చెప్తాను. చూశారా? అది నిజం.
ప్రభువు నిజంగా మిమ్ము చక్కగా దీవించును గాక, ఇప్పుడు మనము ముగించుటకై నిలబడుదుము. మనం దానిని ప్రయత్నం చేద్దాం (సహోదరీ, నీకు అది తెలియకపోవచ్చును), ఆ, "కట్టి ఉంచే ఆ బంధము దీవించబడును గాక." దానిని ఒక్క సారి పాడుదము, మీరు పాడెదరా? మాకు శృతిని అందించుము.
క్రైస్తవ ప్రేమలో మన హృదయములను
కట్టి ఉంచే ఆ బంధము దీవించబడును గాక,
ఒకే తలంపులు గల ఆ సహవాసము
పైన ఉన్నదాని వంటిది.
44ఇప్పుడు, మనము చివరి చరణము పాడుచుండగా, ఒకరి చేతులు ఒకరు పట్టుకొని, "సహోదరుడా, సహోదరీ దేవుడు నిన్ను దీవించును గాక. ఈ రాత్రి యిక్కడ మీతో ఉండుటకు నేను సంతోషించుచున్నాను," అని అందాము, "మనము విడిపోయి వెళ్ళుచున్నప్పుడు." చూడండి, అలాంటిది ఒకటి, అప్పుడు వెనుతిరిగెదము. ఇప్పుడు దానిని పాడెదము.
మనము విడిపోయి.
అది లోలోన మనల్ని బాధించును;
అయినప్పటికీ మనము హృదయములలో
జోడించబడి యుందుము,
మరియు మరలా కలిసికొనుటకై నిరీక్షించెదము,
మనము ప్రభువైన యేసును ఎంతగా ప్రేమించుచున్నామో కాదా? ఎంతగా.
మరలా మనము కలిసికొను వరకూ
యేసు పాదముల యొద్ద
మరలా మనము కలిసికొను వరకూ
మరలా మనము కలిసికొను వరకూ
దేవుడు మీతో ఉండును గాక!
మన కళ్ళు మూసికొని దానిని ఇప్పుడు ఆత్మలో పాడెదము.
మరలా మనము కలిసికొను వరకూ
మరలా మనము కలిసికొను వరకూ
యేసు పాదముల యొద్ద
మరలా మనము కలిసికొను వరకూ
దేవుడు మీతో ఉండును గాక మరలా మనము కలిసికొను వరకు!
45ఇప్పుడు, మన వంచిన తలలతో మనము కేవలము పిల్లలము, దేవుని పిల్లలము. దీనిని మనం ఆలాపించెదము. [సహో, బ్రెన్హాం మరియు సంఘము, "దేవుడు మీతో ఉండును గాక" అనే పాటను ఆలాపించుచున్నారు.] ఓ, అది ఏలాగు దేవుని యొక్క ఆత్మను మన యొద్దకు తెచ్చునో కదా. వారు రాతి పలకలపై కూర్చొనిన తొలి రోజులను మీరు ఊహించగలరా?
మరలా మనము కలిసికొను వరకూ దేవుడు మీతో ఉండును గాక!
మన తలలు వంచి, మన మధ్య క్రొత్తవాడైన, ఆ వెనుక ఉన్న సహో. అలెన్ని, ఒక ప్రార్థన చేసి ముగించెదరా అని అడుగుచున్నాను. సహో. అలెన్.