పౌలు, క్రీస్తుకు ఒక ఖైదీ
1… ఇచ్చట మరలా ప్రభువైన యేసు నామములో ఇది వరకు మీరు చేసిన గొప్పవియు మరియు మహత్తరమైన కార్యములను గూర్చి వినుటకు ఇప్పుడు మేము ఆసక్తితో నిలబడియుండగా, అది మా విశ్వాసమును హెచ్చించుచూ మరియు ఈ రాత్రి మేము అడిగినవన్నియు అనుగ్రహించబడునని నమ్మునట్లు మమ్మును అభిషేకించెను. వారిలో ప్రతి ఒక్కరిని మీరెరుగుదురు, (వారు కోరినవన్నియు,) మరియు ప్రభువా ఎవరైతే మరణమునకు చాలా సమీపముగానున్నారో వారి కొరకు ప్రత్యేకముగా మేము ప్రార్థించుచున్నాము. వారి ప్రాణమునకు ఒకవేళ ముందుగానే సమాధానము లేనియెడల దయచేయండి; మరియు వారి శరీరములకు స్వస్థతను దయచేయండి. ప్రభువా దీనిని అనుగ్రహించండి. మా యొక్క కూడికను ఆశీర్వదించండి. మేము ప్రభువా, ఈ బుధవారపు రాత్రి ప్రార్థనా కూటములో మేము ప్రార్థించుచున్నాము, ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడియుండెదరో, నీవు మాతో ఉందువని ఎరిగియుండి మేము కూడుకొని యున్నాము… మరియు ప్రభువా, ఈ రాత్రి మాకు నీ యొక్క వాక్యమును దయచేయమని నిన్ను వేడుకొనుచున్నాము. మాతో మాట్లాడుము, ప్రభువా, మరియు మా హృదయములను ప్రత్యేకముగా కరుగదీయుము, దాని వలన మా ముందున్న ఆ గొప్ప సమయమునకు మేమెట్లు క్రమశిక్షణగలిగియుండవలెనో తెలుసుకొనునట్లు మాతో మాట్లాడండి; నీ రాకడ సమీపముగా ఉన్నది అని నమ్ముచున్నాము.
2COR 3:2
2విశ్వాసము వారికెంత ప్రియమైనదో మరియు విశ్వాసమనగా ఏమిటో తెలుసుకొనుటకు ప్రారంభించుచున్న ప్రజల కొరకై ఇప్పుడు నీకు కతజ్ఞతలు చెల్లించుచున్నాము. మరియు రానున్న కూటముల గూర్చి ఎరిగినవారమైయుండి నీవేదైన కార్యము చేయుదువని; ప్రభువా నీకు కతజ్ఞతలు చెల్లించుచున్నాము. నీవు ఆకాశపు వాకిళ్ళు తెరచి, ఈ దినముకై దేవుడు వాగ్ధానము చేసిన వాగ్ధానములను ఈ అంత్య-దినములో కుమ్మరించుటకు సమయము సమీపించియున్నదని నమ్ముచూ ఆ ప్రాచీన దినములలో వలె మేము ఎదురు చూపుతో వేచియున్నాము.
ఇప్పుడు, ప్రభువా ఈ దినమున మేము వినినట్లుగా ప్రతీ చోట అవసరతలో వున్నవారందరికి దేశముల చుట్టు ప్రక్కల వారికి మీరు తోడైయుండవలెనని మేము కోరుచున్నాము ప్రభువా వారి అవసరతలు తీర్చండి. మరియు ప్రపంచమంతట ఈ గొప్ప కార్యముకై ఎందరైతే ఎదురుచూచుచున్నారో వారి మధ్య దేవుని యొక్క గొప్ప హస్తము కదలింపబడుట చూడవలెనని మేము ప్రార్థించుచున్నాము. మా పాపములను క్షమించండి. ప్రభువా, నీ ఆత్మతోను మరియు నీ వాక్యముతోను మమ్మును వెంటాడండి తద్వారా విధేయులైన దాసులమై మేము క్రమ శిక్షణ కలిగి, దేవుని చిత్తమునకు విధేయులమైన సేవకులమై యుందుము. ప్రారంభ క్రైస్తవులు ఏమి చేసిరో మమ్ములను జ్ఞాపకము చేసికోనివ్వండి మరియు మా హృదయములో ఆలోచించనివ్వండి. నీతో వ్యక్తిగతముగా సంబంధము కలిగియున్న ఆ జనులను మేము కలిసికొనినయెడల మేము ఎటువంటి ప్రజలను కలిసినవారిగా ఉందుము. వారి ముఖములు విశ్వాసముతో మరియు ఆనందముతో వెలిగించబడి ఉండెను వారు జనుల మధ్య నడచుచుండగా వారి జీవితములు దేవుని యొక్క సజీవ వాక్యమైయుండి, (మనుష్యులందరి చేత చదువబడునట్లు) వ్రాయబడిన పత్రికలవలెనె ఉండెను. దేవా మరొకసారి దానిని అనుగ్రహించుము.
REV 20:4,6
3ప్రభువా పరిశుద్ధాత్మ మాలో జీవించునంతగా మరియు మాలో నుండి మా ద్వారా మాట్లాడు నంతగా మా జీవితములు మీకు లోబడియుండునట్లు చేయండి. మేము వీధిలో నడచుచూ మరియు లోకముతో చేతులు కలుపుచుండగా మేము వారివలె ఉండరాదని మా మనస్సులలో గుర్తించుకొనెదము గాక; మరియు ప్రభువా, మేము ప్రక్కకు తొలగి భూమిపై వారి స్థానాన్ని బట్టి మేము వారికే చోటు ఇచ్చెదము గాక. మేము వేరొక లోకము యొక్క ప్రతినిధులుగా వున్నామని ఎరిగియుండి, మేము వెనుక స్థలమునే తీసికొనెదము గాక. అధికారములోనికి వచ్చుచున్న వేరొక రాజ్యము మాకు ఉన్నది. ప్రభువు, మరియు మా గొప్పరాజు త్వరలో వచ్చును, మరియు తన అధికారము క్రిందనున్న రాజులందరిని ఆయన తీసికొనును, మరియు ఆయనే పరిపాలించును మరియు ఆయనతో పాటు భూమిపై వెయ్యి సంవత్సరములు పాలన చేసెదము మరియు నిరంతరము ఆయనతో ఉండెదము.
ప్రభువా, ఇది మనస్సులోవుంచుకొని, ఇప్పుడు మా ప్రార్థన యొక్క జవాబు కొరకై మేము కనిపెట్టుచున్నాము. మా ఒప్పుకోలు వైపు మేము చూచుచున్నాము, నీ గొప్ప చిత్తమునకు వ్యతిరేకముగా ఒకవేళ మేమేదైనను చేసినయెడల, ఏదైన చెప్పినయెడల, లేదా ఏదైన తలంచినయెడల, యేసు క్రీస్తుయొక్క రక్తము మమ్మును శుద్ధిచేయును గాక.
తన భర్తను షికాగో దారివైపు చూచెనని సహోదరి చెప్పునట్లు, ప్రభువా మమ్ములను నడిపించుము. ప్రభువైన దేవా, వారిని మీరెక్కడైతే వాడుకొనగలుగుతారో అచ్చటికి వారిని నడిపించండి. తద్వారా వారు ప్రభువైన యేసు ఎవరో ఎరుగక చీకటిలో తడువులాడు ఇతరులకు వెలుగు నిచ్చు జ్యోతులవలె ఉండెదరు గాక. ఈ గొప్ప ఘడియ కొరకు మేము ఎట్లు సిద్ధపడవలెనో మేము ఎరుగునట్లు (సరిచేయు నీ వాక్యమును వినుటకై) ఇప్పుడు ఈ కూటమును నీకు అప్పగించుకొనుచున్నాము. యేసు నామములో మేము దీనిని అడుగుచున్నాము. ఆమేన్.
4నేను కొద్దిగా దీనిని ఊహించలేదు. నేను… ఇక్కడ ఇంటి దగ్గర వుండి, నేను నిజముగా ఎక్కడకో వెళ్ళవలెను, అత్యవసరముగా, ప్రార్థనా కూటమునకు రాకుండా ఇంటి వద్ద నేను కూర్చొనియుండుట చాలా చెడు అని భావించుచున్నాను. మరియు నాకు నేను కనీసం నా కుటుంబమైనను ఊహించలేదు, మరియు నేను నేరుగా బయలుదేరితిని. మరియు కావున, "నేను ప్రార్థనా కూటమునకు వెళ్ళుచున్నాను," అని చెప్పితిని. మరియు ఆమె సిద్ధపడి వచ్చుటకు కనీసం సమయము లేకుండెను, కావున నేను వచ్చునట్లు ఆమెకు తెలియకుండెను.
5కావున నేను సహోదరి యొక్క సాక్ష్యమును వినుట బట్టి సంతోషించుచున్నాను. అక్కడ, ఆ సహోదరుడు, దక్షిణ కరోలిన లేదా ఉత్తర కరోలినాలో వెలుగును గూర్చి, ఎక్కడో… గ్రీన్విల్, అదేనా? దక్షిణ పైన్స్, అవును, సహోదరుడు లీవైల్ ఈ రోజు ఇక్కడ ఉన్నాడు. ఈ దినమున బాప్తీస్మపు ఆరాధనలో ఈ రోజు నేనతనికి బాప్తీస్మము ఇచ్చితిని. సహోదరుడు లీవైల్, అక్కడున్న సేవకులలో ఒకడని మీరెరుగుదురు. సహోదరుడు పార్కర్ థామస్, అక్కడ ఒక…
సహోదరి నీడచే కమ్మబడిన ఒక సమయము నాకు జ్ఞాపకము వచ్చుచున్నది. అది ఒక గొప్ప నిర్థారణయైయున్నది, అదేమిటో చూచుటకు… కొన్ని సమయములలో పరిశుద్ధాత్మ మనలను ముందుకు సాగిపోవునట్లు అనుమతించును. మరియు మన విశ్వాసమును పరీక్షించును మరియు ఇతరుల విశ్వాసమును పరీక్షించును. మీరు సూటిగా దేనివైపైనా చూచునప్పుడు మరియు దేనినైనా చూచునప్పుడు మరియు దానిని గూర్చి చెప్పినప్పుడు… ఇతరులు చూచెదరు మరియు దానిని కానలేరు, అది అక్కడలేదని వారు చెప్పెదరు. చూశారా? అయితే అది అచ్చటనే యున్నది.
MATT 3:16•
MARK 1:10•
JOHN 1:32•
ACTS 9:3,7•
ACTS 22:6,9
6ఇప్పుడు, పౌలుపై వ్రేలాడుచున్న ఆ వెలుగును ఎవరూ చూడలేరు, అయితే అది అచ్చటనే యున్నది. పావురము మరియు ఆ వెలుగు రూపము పరలోకము నుండి క్రిందికి వచ్చి యేసుపై వ్రేలాడుటను యోహాను తప్ప మరెవ్వరునూ చూచియుండలేదు. అయితే, అది అచ్చటనే యున్నది. చూశారా? కావున, తరువాత ప్రజలకు ఈ అగ్ని స్థంభమువలెనున్న ఈ వెలుగును గూర్చి నేను చెప్పుచున్నప్పుడు, దానిని ఎవ్వరూ నమ్మగోరలేదు; అయితే ఇప్పుడు కెమెరా యాంత్రిక కన్ను దానిని గుర్తించెను.
మరియు దురాత్మ చీకటిగా ఉండునని నేను వారితో చెప్పితిని. అది కేవలము మన జీవితములవలెనున్నది, మనము కప్పబడియున్నాము. మరియు మనము… మనము వెలుగై యున్నచో మనము… పగటి యొక్క వెలుగుతో మన జీవితములు సరితూగినయెడల మనము వెలుగులో నడుచుచున్నాము. కేవలము మీరు పగటివేళలో బయటకు చూచి, "నేను సూర్యున్ని చూచుచున్నాను," అన్నట్లుగా అది వున్నది. మీరు సూర్యుని యొక్క ప్రతిబింబమును చూచుచున్నారు. అది సూర్యుని యొక్క ఛాయయైయున్నది. అది నేరుగా సూర్యుడు కాదు, అయితే సూర్యుడు ఉన్నాడు అని అది నిరూపించుచున్నది. చూశారా? సూర్యుడున్నాడు అని అది ఋజువు చేయుచున్నది.
7మరియు ఇప్పుడు, నేను చూచుచుండగా, మీరక్కడ కూర్చొనియున్నారు, గాలి విసురు కొనుచున్నారు, మాటలాడుచున్నారు, దాని భావమేదనగా మీరు జీవించుచున్నారు; అయితే అది కేవలము జీవము యొక్క నీడయైయున్నది. ఎందుకనగా దేనికైననూ ఒక నీడను చేయుటకు దానిలో చీకటి ఉండవలసియున్నది. చూడండి, ఏలయనగా నీడను చూచుటకు, ఒక నీడ కొంత చీకటిని మరియు కొంత వెలుగును కలిగియుండవలసి యున్నది. అది పూర్తిగా చీకటియై యుండదు, మరియు అది పూర్తిగా వెలుగైయుండదు. అది చీకటియైయుండినచో, అది నిజముగా చీకటిగానే ఉండును. అది వెలుగైయుండినచో, ఇక ఇక్కడ నీడ అనునది ఉండదు, నీడ ఉండుటకు అచ్చట ఏదియునూ లేదు; అయితే అది చీకటి మరియు వెలుగుతో కలిసియుండినయెడల, అది ఒక నీడను చేయును కావున మనము నిజముగా వెలుగు యొక్క ఛాయయైయున్నాము.
ఇప్పుడు, మీరు ఎక్కడి నుండో ఒక వెలుగును ప్రతిబింబింపజేయుచున్నారు. మీరు క్రైస్తవులైనయెడల, ఇది ఒక ఛాయయైయుండి, మీకు మరణము లేనటువంటి ఒక జీవితమున్నదని అది నిరూపించుచున్నది, ఎందుకనగా ఈ జీవితములో మరణమున్నది. చూశారా? అయితే ఇది ఒక నీడయైయున్నది, ఏలయనగా మీరు జీవించుచున్నారు, కదిలే జీవులుగా, చూచుట, ఆలోచన, కదలిక మరియు మాటలాడుట మరియు శరీరము యొక్క ఐదు ఇంద్రియములు అను సామర్ధ్యములతో మీరున్నారు. అయిననూ మీరు చనిపోవుచున్నారని మీరెరుగుదురు. మరియు ఎంతో శ్రమ వుండును. మీకు తెలియును, అది కేవలం అది ఒక ప్రతిబింబమై యున్నది. (చూశారా?), జీవము మరియు మరణము రెండూ మిళితమైయున్నవి.
8భౌతికమైనది చావవలసియున్నది, అయితే మీరు మర్త్యమైన మీ జీవితములలో, పరలోకపు వెలుగును ప్రతిబింబింపజేయుచున్నయెడల, అప్పుడు మీరు దేవుని యొక్క నిత్యవెలుగును ప్రతిబింబించుచున్నారు. పిదప మీరు మరణించినప్పుడు మీరు ఆ వెలుగు నొద్దకు తప్ప మరెక్కడికి వెళ్ళలేరు, ఎందుకనగా మీరు దానినే ప్రతిబింబించియున్నారు. మీరు చీకటి ప్రపంచపు వారైనయెడల, మీరు దానినే ప్రతిబింబించెదరు, మరియు మీరు వేరే ఏ దారికి కాక చీకటియొద్దకే వెళ్ళెదరు. చూశారా? కావున మనము ఒక ప్రతిబింబములో ఉన్నాము. కావున పరిశుద్ధాత్మ వెలుగును మరియు జీవమును ప్రతిబింబించునట్లు మరణము మరియు చీకటిని ప్రతిబింబింపజేయుటను మనము చూచుచున్నాము.
9మరియు ఆ రెండు ఇచ్చటనున్నవి.
వారము చివరలో, బహుశా ఆదివారమునకు, బిల్బోర్డు వద్ద మీరు పటములు వ్రేలాడదీయు స్థలములో పెట్టుటకు మనకు చిన్న చిత్ర పటము పెద్దదిగా చేయబడి తీసుకురాబడుచున్నది. మీరు దానిని గమనించితిరో లేదో నేనెరుగను. మరియు తరువాత ఒక వారము క్రితము నేను మిషనరీగా వెళ్ళిన జమైకాలో, మేము టేపులను ప్రపంచమంతటికీ పంపియున్నాము; మరియు ఏడు ముద్రలు జమైకా దీవులలోని మారుమూల స్థలములలోనికి పంపబడినవి. మరియు ఆ నీటి పర్వతము వెనుక (Blue Mountain) అదంతయూ ప్రాచీన కాలం నాటి స్థలమైయున్నది. మరియు స్థానికులు, కొన్ని సార్లు వారు టేపు రికార్డర్లు కలిగియుండెదరు, మీరు పాత విక్ట్రోలా ( Old Victrola) వంటిది యున్నట్లు అది వుండును, మరియు దానికి కొక్కెమును తిప్పవలెను, మరియు అది పనిచేస్తుంది, మరియు ఎవరైనా ఒకరు ప్రతి కొన్ని నిమిషములకు దానిని త్రిప్పవలెను.
10ఈ గుంపువారు చిన్న బ్యాటరీని, ఆరు వోల్టుల బ్యాటరీని లేదా ఏదైనా లేక మరొకటి కలిగి యుండి, మరియు వారందరూ కలిసి కట్టుగా కూడుకొని (ఈ రాత్రి ఇక్కడున్నట్లుగా) ముద్రలను వినుచుండిరి, అదేయని నేను నమ్ముచున్నాను. మరియు నేను మాటలాడుచుండగా, అదే అగ్నిస్థంభము ఆ గదిలోనికి వచ్చుటను వారు గమనించియుండిరి, ఎక్కడైతే ఉండెనో అక్కడికి కదిలి వచ్చి మరియు దానిపై నిలిచెను. మరియు వారు వెళ్ళి ఒక కెమెరా తీసుకొని వచ్చిరి మరియు దాని పటము తీసిరి, మరియు అది సరిగ్గా అదే రీతిగా ఉన్నది. అది ఇక్కడే సరిగ్గా అక్కడే వ్రేలాడుచున్నది. ఇప్పుడు, అది పెద్దదిగా చేయబడి మనకు వచ్చుచున్నది కావున మీరు దానిని చూచునట్లు అక్కడ నోటీసు బోర్డు వద్ద మనము దానిని ఉంచవచ్చును.
11ఈ దినమున మనలను తన సన్నిధిలోనికి తీసుకొని వచ్చిన దేవుని కృపకై మనమెంతగానో కృతజ్ఞులమై యున్నాము. ఇప్పుడు నేనిక్కడ చూచి ఏదైనా కనుగొనగలనని తలంచుచున్నాను, ఏదైనా పాఠము లేక ఏదైనా - నేను మాటలాడిన ఏదైనా కార్యము, లేక ఏ విధమైనటువంటి ఒక… ఇక్కడ నా వద్ద ఒక పుస్తకములో కొన్ని అంశములు వ్రాసికొనియుంచియున్నాను. నేను ఒక దానిని కనుగొనినయెడల, బహుశా మనము ప్రార్థించుచుండగా ఏదైనా అంశముపై ఏమైనా చెప్పుటకు ప్రభువు నాకు దయచేయును.
ఇప్పుడు, మనము ఆదివారము కొరకు కనిపెట్టుకొనియున్నాము.
12ఆదివారము, నేను వర్తమానములలో మాటలాడుచునుంటిని, నీవేల నాకు మొరపెట్టుచున్నావు, ప్రజలతో మాటలాడుము మరియు ముందుకు సాగిపోమ్ము అను దానిపై మిమ్ములను ఇక్కడ చాలా సమయము వరకు ఉంచితిని.
ఇప్పుడు, ఆదివారము ఒక స్వస్థతా కూటమైయున్నది, అప్పుడు రోగులకు ప్రార్థన చేయబడును. ఇప్పుడు, మీరు రోగి చుట్టూ ఉండెదరు, మరియు మనము ప్రార్థించినప్పుడు వారు స్వస్థత పొందనియెడల అక్కడ ఆ రోగము ఉండుటకు ఏదో కారణముండియున్నది. మరియు ప్రభువు చిత్తమైతే ఆదివారం ఉదయం కేవలం ఒక చిన్న ప్రసంగము కొరకు… కావున నేను ఒక స్వస్థతా కూటమును కలిగి మరియు ప్రజలందరి కొరకు ప్రార్థించబోవుచున్నాను. మరియు ప్రజలు ద్వారములోనికి రాగానే లేదా వారు ఎప్పుడు వచ్చెదరో అప్పుడు, వారికి ప్రార్థనా కార్డులను ఇచ్చుటకు బిల్లీపాల్ లేదా వారిలో ఎవరైననూ, ఆదివారం ఉదయం ఎనిమిది గంటలకల్లా, మందిరం తెరువబడగానే ఇచ్చట ఉండెదరు.
13మరియు ఇప్పుడు … పిదప నేను వీటిని ముడివేయగోరుచున్నాను… ఎందుకొరకు కొందరు స్వస్థత పొందలేదు అన్న కారణముల గూర్చి కొద్దిగా లోపలి దృష్టిని ప్రభువు నాకు ఇచ్చునని నేను నమ్ముచున్నాను. మరియు నేను అది గ్రహింపు లోపమని నేను నమ్ముచున్నాను: మరియు నేను బహుశా, ప్రభువు చిత్తమైతే ఆదివారం ఉదయం దాని గూర్చి మనము మాటలాడెదమని నేను నమ్ముచున్నాను.
ఇప్పుడు, బుధవారం రాత్రి ప్రార్థనా కూటము అది కేవలము మనము ఎక్కడ కలిసి ప్రార్థించుదుమో మరియు కూడుకొనెదమో అక్కడ చిన్న కూటమైయున్నది;
14మరియు కొన్ని సార్లు, నేను ఈ దినమున నేను కనుగొన్న ముఖ్యమైన కార్యములలో ఒకటి ఏదనగా, మనము నమ్ముచున్న దానిపట్ల యధార్థత లోపించుటయని నేను నమ్ముచున్నాను. చూడండి, చూశారా? దేవుడు ఈ దినమున ఏమి చేసెనో దానిని జాన్ వెస్లీ దినములలో చేసినయెడల అది ఏమి చేసియుండును? సంఘము ద్వారా, ఆత్మ ద్వారా మరియు విజ్ఞాన శాస్త్రము ద్వారా ఋజువు చేయబడి ఆయన చేయుచున్న కారణము?
ఇప్పుడు మనము చూచుచున్నవి మార్టిన్ లూథర్ దినములలో లేదా మరే దినములలోనైనా చేయబడిన యెడల… మరియు అది అది కదలికలో నున్నది - అది గుర్తించబడవలసియున్నది. మరియు దేవుని వాక్యము ఇక్కడ దానిని ప్రకటించుచు మరియు అది జరుగుటకు ముందే దానిని గూర్చి తెలియజేయుచున్నది. మరియు పిదప ప్రవచనము ద్వారా మరియు ఆయన పరిపూర్ణముగా జరుగునని చెప్పిన కార్యములను చూపించుచు ఖచ్చితముగా ఆయన ఏమి చెప్పెనో అట్లే అది జరుగుచున్నది, మరియు మంచిది, అది నా గూర్చేనాయని ఆశ్చర్యపోవుచున్నాను? "దాని భావము గూర్చి ఆశ్చర్యపోవుచున్నాను సంఘమంతయూ, లేక నేను కూడా నిజముగా ఇందులో కలుపబడితినా?" అని అనుచూ, మనమింకనూ దానిపట్ల విముఖతను చూపుచూ ఆశ్చర్యపోవుచున్నాము. ఆదివారం ఉదయం మనలను కొద్దిగా వెలుగించునటువంటి ఆ కొన్ని సూత్రముల గూర్చి నేను మాటలాడుటకు ప్రయత్నించెదనని నేను తలంచుచున్నాను.
15ఇప్పుడు, ఈ రాత్రి నేనొక దానిని కనుగొనియుంటిని మరియు ఇక్కడ దాని వైపు తిరిగితిని, నేను వచ్చుటకు ముందు నేను ఇట్లు తలంచితిని. "సహోదరుడు నెవిల్ గూర్చి ఏమిటి … నేను అచ్చటకు వెళ్ళినచో మరియు అతడు లేచి బోధించుము," అని చెప్పినచో ఏమగును అనుకొని, అలా కొంచెము కూర్చొని నేను కొన్ని లేఖనములు వ్రాసుకొనుట మంచిదని తలంచితిని, ఎందుకనగా అతడు ఒక ప్రియమైన సహోదరుడని నేనెరుగుదును, మరియు మనము ఆయనను అభినందించెదము.
16వాక్యము కొరకు మనము ప్రార్థించుటకు ముందు, ఒక సహోదరుని గుర్తించవలెనని కోరుచున్నాను. ఈ సమయములో కనీసం నేను అతని పేరైననూ పిలువలేను (వారిరువురు) వారు నాకు ప్రియమైన స్నేహితులు. వారు సేవకులు మరియు సువార్తికులై యుండి, సువార్త పొలములో బయటకు వెళ్ళువారైయున్నారు. వారు ఈ వర్తమానములను వినియున్నారు, మరియు వారు వివిధ సంఘ శాఖల నుండి బయటకు వచ్చియున్నారు. ఇద్దరు యౌవనస్థులు. మరియు ఆ అబ్బాయిలు… వారిలో ఒకరు ఎంతగా ఆసక్తి కలిగియుండెననగా, అతడు ఇటివలె ఒక కూటము యొక్క ముగింపులో టూసాన్ వచ్చియుండెను. నేను వ్యాపార వేత్తల అల్పాహారపు సమయములో ఉన్నానని, నేను నమ్ముచున్నాను. అప్పుడు ఈ చక్కని యౌవనస్థుడు వచ్చెను.
మరియు అతను… వారు కెన్సాస్ నుండి వచ్చియుండిరి, మరియు వారికి వివాహము చేయుటకై వారు మార్గాంతమున ఇచ్చటికి వచ్చియుండిరి. దేవుడు ప్రార్థనలు విని మరియు జవాబు ఇచ్చునా అని మీ ప్రార్థనలపై నమ్మికయుంచు ప్రజల విషయమై నేను ఆలోచించినప్పుడు, నేను దానిని అభినందించుదును; మరియు యౌవనస్థులు జీవితమును ప్రారంభించుట, ఈలాగున. మరియు నిన్నటి దినమున నేను వారికి వివాహము చేయవలెనని వారు ఇచ్చటికి వచ్చినప్పుడు, ఇండియానా రాష్ట్ర చట్టము వారి వివాహమునకు ముందు వారి రక్త పరీక్ష కూడా అవసరమని కోరినప్పుడు, మూడు దినములు వారు వేచియుండవలసి వచ్చెను. కావున శుక్రవారము ఉదయం వరకు వారు వివాహము చేసికొనలేదు.
17మరియు ఆ చివరన అతడు లేచి నిలబడి మరియు అతను ఎవరో, అతని ప్రియమైన ఆ యువతి ఎవరో చెప్పవలెనని సహోదరుడిని, మరియు ఆ ప్రక్కన సహోదరుడిని నేను అడుగుచున్నాను. [సహోదరుడు సాక్ష్యమును ఇచ్చెను.]
మీకు ధన్యవాదములు. మనము నిశ్చయంగా ఈ యవ్వన రాయబారులను ప్రభువైన యేసు యొక్క పనికొరకై, దేవుడు వారి మార్గములో వారిని త్వరపెట్టునట్లు ఆశీర్వాదములను దయచేయాలని కోరుచున్నాము. మరియు ప్రభువు యొక్క రాకడకై, నేను సంతోషముతో కనిపెట్టుచుండగా, యవ్వన పురుషులు మరియు యవ్వన స్త్రీలు, వారి హృదయములో క్రీస్తును సేవించవలెనన్న ఉద్ధేశ్యము కలిగియుండుట చూచుచుండగా, అది ఈ విధంగా వారు లేచుట నన్ను పులకరింపజేయుచున్నది. నా సహోదరి, సహోదరుడా, ప్రభువు మిమ్మును అత్యధికముగా దీవించును గాక!
EPH 3:1•
PHLM 1:1
18ఇప్పుడు నా జీవితములో ముందెన్నడూ మాటలాడనటువంటి ఒక చిన్న పుస్తకమును మనము త్రిప్పెదము. అది ఫిలొమోను పత్రికైయున్నది. నేను కొద్దిగా ఐరిష్ వాడనైనందున మరియు నా క్రింది పండ్ల చుట్టు నేను తీగెను కలిగియున్నందున, నేను కొన్నిసార్లు ఈ పేర్లను సరిగ్గా, అవి ఎట్లు పలుకవలెనో నాకు తెలిసినప్పటికినీ నేను వాటిని పలుకలేను, మరియు చదువు సరిగ్గా లేని కారణముచేత కొన్నిసార్లు నేను వాటిని సరిగ్గా పలుకలేను. కావున, ఫిలోమోను అని వెనకాల ఎవరో చెప్పిరి, అదే దాని సరైన ఉచ్ఛరణ అని నేను తలంచుచున్నాను.
ఇప్పుడు మొదటి వచనం, కేవలం దానిలో నుండి ఒకటి లేదా రెండు పదములు నేను తీసికొనగోరుచున్నాను.
యేసుక్రీస్తునకు ఖైదీయైన పౌలు…
మరియు ప్రభువు చిత్తమైతే, ఈ రాత్రి పాఠ్యాంశము కొరకై నేను దానినే ఉపయోగించగోరుచున్నాను. ఒక ఖైదీ.
ROM 1:1•
2COR 1:1•
EPH 3:1•
PHLM 1:1
19ఇప్పుడు, పౌలు తన గూర్చి తాను ఒక ఖైదీగా సంబోధించుటను మీరు అతికష్టముగా ఊహించగలరు, ఒక తిరిగి జన్మించిన వ్యక్తి, పరిశుద్ధాత్మతో నింపబడినవాడు; అయినను తనను తాను ఒక ఖైదీ అని పిలచుకొనుచున్నాడు. మరియు ఇప్పుడు, కొరింధీయులనుద్ధేశించి అతడు మాటలాడుచున్నప్పుడు, "యేసుక్రీస్తు యొక్క అపోస్తలుడనైన పౌలు…" అని సంబోధించుటను మనము కనుగొనుచున్నాము. మరియొకసారి తిమోతి మరియు ఇతరులనుద్ధేశించి అతను మాటలాడుచున్నప్పుడు, "దేవుని చిత్తమువలన యేసుక్రీస్తు యొక్క దాసుడనైన, పౌలు," అని సంబోధించెను. ఇప్పుడు ఫిలొమోనుకు అతడు వ్రాయుచున్నప్పుడు "యేసుక్రీస్తు యొక్క ఖైదీయైన పౌలు…" అని ఆయన చెప్పెను. "అపోస్తలుడైన పౌలు," ఒకరాత్రి దానిపై నేను ప్రసంగించగోరుచున్నాను. "దాసుడైన పౌలు," అను దానిపై ప్రసంగించెదను. మరియు పిదప, "ఖైదీయైన పౌలు" అయితే ఈ రాత్రి ఈ పాఠ్యభాగములలో ఒక దానిని తీసుకొనిన అది కొన్ని గంటలు పట్టునని యెరిగియుండి, ఖైదీయైన పౌలు అను దానిని ఈ రాత్రి తీసికొనుటకు నేను ఇష్టపడుచున్నాను మరియు "ఒక ఖైదీ" అను పాఠ్యభాగమును తీసుకొనెదను. ఇప్పుడు ఒక్క క్షణము మనతలలు వంచెదము.
EPH 3:1•
PHLM 1:1
20ప్రభువైన యేసు, భౌతికముగా సామర్థము కలిగివున్న ఏ మనుష్యుడైనను ఈ పరిశుద్ధ గ్రంథమునందలి పేజీలను త్రిప్పగలడు, అయితే అది ఏ ఉద్ధేశ్యముతో చెప్పబడెనో అదే వెలుగులో పరిశుద్ధాత్మ మాత్రమే దానిని అనువదించగలడు. పౌలు, గొప్ప మహత్తరమైన ప్రవక్తయై యుండెను. అయినను తనను తాను ఒక ఖైదీగా పిలచుకొనుటను గూర్చి, అది ఎట్లు సంబోధించబడెనో అర్థము చేసికొనుటకు ఆయన వచ్చి మాకు సహాయము చేయవలెనని మేము అడుగుచున్నాము. మేము ఆయనపై కనిపెట్టుకొనియుండగా పరిశుద్ధాత్మ దానిని మాకు బయలుపరచును గాక, యేసు క్రీస్తు నామములో. ఆమేన్.
EPH 3:1•
PHLM 1:1
21ఇప్పుడు, పౌలు, ఆయన ఈ పత్రికను ఫిలోమోనుకు వ్రాసినప్పుడు ఆయన ఎట్లు చెరసాలలో కూర్చొనియుండెనో, ఈ పట్టణము యొక్క చెరసాలలో ఒక ఒక ఖైదీగా ఎట్లుండెనో, నేను ఊహించగలను మరియు ఆయన స్థానమును బట్టి వాక్యము యొక్క భావమేమైయున్నదో అతను బాగుగా ఎరిగియుండెను. అతను ఇనుప కడ్డీల చేత చుట్టుముట్టబడెను; అతన్ని ఎవరైనా స్వేచ్ఛగా వదిలినట్లైతేనే అతను స్వేచ్ఛగా వదిలి పెట్టబడును, మరియు ఒక ఖైదీయనగా ఎట్లుండునో అతనికి తెలియును. మరియు పిదప మరలా, నేను నమ్ముచున్నాను, అపోస్తలుడు అనగా కేవలం ఒక చిన్న… అతడు తన ప్రస్తుత పరిస్థితిని బట్టి, భౌతికముగా అతడు అక్కడ చెరసాలలో కూర్చొనియుండుటను బట్టి, ఖచ్చితముగా దీనిని వ్రాయుట లేదు, అయితే అతను ఆత్మీయముగా యేసుక్రీస్తుకు ఒక ఖైదీగా ఉండుటయను తన ఇష్టమును వ్యక్తపరచుచూ వ్రాయుచుండెనని, నేను నమ్ముచున్నాను.
JOHN 1:14
22ఇప్పుడు, మనమందరము మనకిష్టమొచ్చిన నిర్ణయములు తీసుకొనేంత స్వేచ్ఛగా జన్మించాము. దేవుడు న్యాయముగా దానిని చేసియుండెను, ఎందుకనగా ఆయన ప్రతివ్యక్తిని అదే పునాదిపై పెట్టియుంచెను లేక అతడు తప్పుడు వ్యక్తిని, లేనియెడల అతను స్వేచ్ఛ జన్మ విషయములో మొదటి మానవుని తప్పుడు పునాదిపై పెట్టినట్లగును.
చూడండి, ఆదాము మరియు హవ్వవలెనె ఈ రాత్రి ఖచ్చితముగా మనమున్నాము. అక్కడ ఏ వ్యత్యాసము లేదు. మనముందు కూడా సరియైనది మరియు తప్పిదమైనది ఉంచబడెను. జీవము మరియు మరణము, మనము మన యొక్క ఎన్నికను చేసికొనవచ్చును. దానిని ఎన్నుకొనే విషయం అది మీకే వదిలివేయబడినది. చూశారా? అదే విధముగా ఆదాము మరియు హవ్వ చేసిరి. మీరు చూడండి, మరియు వారు తప్పుడు ఎన్నికను చేసికొనిరి.
మరియు ఇప్పుడు దానిని బట్టి మానవ జాతంతయు మరణము యొక్క శిక్ష క్రిందకు తీసుకురాబడినది, మరియు పిదప దేవుడే మానవ రూపములో క్రిందికి వచ్చెను. మరియు ఆ మరణమును తీసికొనెను మరియు మరణము యొక్క అపరాధ రుసుమును చెల్లించెను. దానిని బట్టి ఆయన వారు, స్వేచ్ఛగా ఉండుటకు కోరినవారు స్వేచ్ఛగా వెళ్ళవచ్చును. ఇప్పుడు, ఆయన ఆదాము మరియు హవ్వల వలె కాక వేరొక విధానములో మనకు చేసినయెడల, ఎక్కడో ఒక దగ్గర పడవేసి ఆయనే బయటకు లాగుచూ, మరియు ఇట్లు చెప్పినయెడల, మీరు కోరినను లేక కోరకపోయినను నేను మిమ్మును రక్షించెదను. అటువంటప్పుడు ఆయన ఆదాము మరియు హవ్వలను తప్పుడు పునాదిపై పెట్టినవాడగును. అయితే మనలో ప్రతి ఒక్కరము జీవ, మరణముల మధ్య దేనినైనా ఒకదానిని ఎన్నుకోవలసిన వారిగా ఉన్నాము. మనము దానిని చేయవలెను.
23నేను ఇంతకు ముందే తెలియజేసినట్లు, నీ జీవితము రుజువు చేసినయెడల… నీవు ఏ ప్రక్కన ఉన్నావో నీ జీవితము ఖచ్చితముగా రుజువు చేయును. నీవు ఏ ప్రక్కన ఉన్నావో నీవు చెప్పినను నేను లెక్క చేయను. నీవు అనుదినము ఏమి చేయుదువో అదే నీవేమైయున్నావని రుజువుచేయును. మీరు పాత నానుడి వినియుండ వచ్చును, "నీ సాక్ష్యమును నేను వినలేనంతగా నీ జీవితమే ధ్వనించుచున్నది." చూడండి, మీ క్రియలే అంతపెద్దగా ధ్వనించుచున్నవి.
నేను ఎల్లప్పుడూ కేకలు వేయుట మరియు ఎగురుట గూర్చి నమ్మికయుంటిని, అయితే "నీవు జీవించుచున్న దానికన్నా ఎక్కువగా ఎగరవద్దు, ఎందుకనగా లోకము దానిని గమనించుచున్నది," అని ఎల్లప్పుడూ నేను చెప్పుచుంటిని. నీవు ఎంతగా జీవించెదవో అంతగా మాత్రమే నీవు ఎగరవలెను, కావున ఏలయనగా ఎవరో నిన్ను గమనించుచున్నారు.
24మరియు ఇప్పుడు ప్రజలు మందిరమునకు రానప్పుడు. వారు… వారిలో చాలా మంది దానిని చేయరు. మరియు వారిలో కొందరు యధార్థ ప్రజలై యుండియు రాలేక పోవుచున్నారు. వారు సంఘములో ఎంత అనైతికతను చూసియున్నారనగా దానితో వారు ఇక చేయవలసినది ఏదియు కలిగియుండగోరుట లేదు. అనేకసార్లు దాని గూర్చిన స్వచ్ఛమైన తలంపును మనము మాటలాడుకొనియున్నాము; మీరు వారిని నిందించలేరు (చూశారా?) అది తమను తాము క్రైస్తవులమని పిలచుకొనుచు ప్రజలు వారి వారి విధానములో జీవించుటవలనై యున్నది. లోకమునకు పెద్ద ఆటంకము వారేయైయున్నారు: వారెవరనగా పురుషుడు మరియు స్త్రీ, క్రైస్తవులమని కనబరచుకొంటూ మరియు వారు చెప్పుకొనుదానికి భిన్నమైన జీవితములు జీవించువారైయున్నారు. ఖచ్చితముగా సరియే.
MATT 25:41
25ఇప్పుడు, తీర్పు దినమున క్షోభలు (నిరూత్సాహములు) కలుగును. ఇప్పుడు, పాపియైనవాడు, అక్రమకారుడు, జూదగాడు, వ్యభిచారి; నరకాగ్నిలోనికి వెళ్ళుడి అని చెప్పుట వినినప్పుడు అతను క్షోభ (మనోవ్యధ)కు గురికాడు. అతను ఎంత మాత్రము క్షోభ చెందడు, అయితే ఏ వ్యక్తియైతే తనకు తాను సంఘము యొక్క విశ్వాసము వెనుక దాగుకొని యుండునో, అది ఆ అబ్బాయే తీర్పు దినమున క్షోభను ఎదుర్కొనును. చూశారా? క్రైస్తవులమని కనబరచుకొనుట మరియు ఏదో భిన్నమైన విధానములో జీవించుట. అతడు క్రైస్తవత్వమును ప్రారంభించి మరియు ఏదో భిన్నమైన రీతిలో జీవించుటకంటె, అతను అసలు అటువంటిదేదైనను కనుబరచుకొను దానిని చేయకుండుట మంచిది, ఎందుకనగా మనకు అతనే పెద్ద ఆటంకమైయున్నాడు, క్రైస్తవుడనని కనబరచుకొని మరియు ఏదో వ్యత్యాసమైన జీవితమును జీవించు అతనే ఆటంకమైయున్నాడు.
26ఎల్లప్పుడూ, మీ జీవితమును అద్భుతములు చేయుటకు నీవు ఎంతశక్తిని కలిగియున్నావను దానిని బట్టి తీర్పు తీర్చకుము, మరియు మనకు వాక్యము యొక్క జ్ఞానమెంత వున్నదో దానిని బట్టి మనలను మనము తీర్పు తీర్చుకొనవద్దు, అయితే ఎల్లప్పుడు నీకు నీవు తీర్పు తీర్చుకొనుము… అయితే నీవు ప్రస్తుతం జీవించుచున్న జీవితము ఏ రకమైన ఫలమును కాయుచున్నదో వెనుక తిరిగి దానిని చూచుకొనుము. అరిజోనాలోని ఫినెక్స్ య౦దలి వ్యాపారవేత్తల కూటములో కొంతకాలము క్రితం నేను బోధించిన విధముగా యేసు యొక్క ప్రతిబింబము — క్రైస్తవ జీవితమును ప్రతిబింబించుట.
నేను కెంటకీలో జన్మించితినని చెప్పియుంటిని, అది చాలా ప్రాచీనమైనది, ప్రత్యేకముగా నేను బాలుడిగా నుండినప్పుడు, మరియు ఈ ఫలాన చిన్నవాడు, ఆ విధముగా కాక మనము ఇక్కడ కలిగియుడినట్లు తనకెన్నడూ అటువంటి ఒక గృహమును కలిగినవాడు కాదు. ఎక్కడైతే చక్కని స్త్రీలు గృహములో వారి తలవెండ్రుకలను సరిగ్గా ఉంచుకొనుటకు అద్దములలో చూచుకొనెదరో. అయితే అతడు ఒక చిన్న అద్దము కలిగియుండెను, అది వెలుపల ఒక చెట్టుకు బిగించబడియుండెను. ఆ చెట్టుకు బిగించబడియున్న ఆ చిన్న అద్దములో ఎక్కడైతే ముఖం కడుగుకొను తొట్టి వుండెనో, అక్కడ తన తల్లి మరియు తండ్రి కడుగుగొని మరియు వారి జుట్టు దువ్వుకొనెదరు. మరియు ఆ విధముగా, ఆ చిన్న అద్దము చెట్టుకు వ్రేలాడదీయబడియుండెను.
27వాస్తవముగా, అటువంటి గృహమునే మేము కలిగియుంటిమి. అద్దములో గనుక ఎవరైనా చూడదలచినట్లెతే, పిల్లలమైన మేము ఒక పెట్టెను తెచ్చుకొని మరియు దాని పైకి ఎక్కి మరియు ఈ అద్దములోనికి చూసెడివారము, దానిని ఒక చెత్త కుండిలో నుండి నేను తెచ్చుకొంటిని. అది అక్కడ కెంటకీలో కాదు; అది ఇక్కడ ఇండియానాలోని యుటికా పైక్ నొద్ద జరిగెను.
ఇప్పుడు, ఈ చిన్నవాడు తనను తాను ఎన్నడూ ఆ విధముగా చూసుకొన్నవాడు కాదు; అంతట అతను పట్టణమునకు అతని మామ్మగారిని దర్శించుటకు వచ్చియుండెను. మరియు ఆ గదిని దర్శించుచుండగా, ఆ మామ్మగారి తలుపుకు పూర్తిగా అద్దము బిగించిన ఇంటిని కలిగియుండెను మరియు ఆ చిన్నవాడు ఆ గదిలోనికి పరుగెత్తెను. తన ఎదుట అద్దములో వేరొక పిల్లవాడిని చూచెను; మరియు ఆ చిన్నవాడు కూడా పరుగిడుచుండెను గనుక అతడు కొన్ని నిమిషములు ఆగి మరియు ఆ పిల్లవాడు ఏమి చేయబోవుచున్నాడో చూడవలెనని తలంచెను. మరియు అతను ఆగినప్పుడు, ఆ పిల్లవాడు కూడా ఆగెను, అతను తన తలను త్రిప్పినప్పుడు, పిల్లవాడు కూడా తన తలను త్రిప్పెను. అతడు తన తలను గోకెను, ఆ పిల్లవాడు కూడా తన తలను గోకెను. చివరిగా, అతడు పరిశీలించుటకు దగ్గరగా నడిచి వెళ్ళెను, మరియు అతడు చుట్టూ చూచెను (మరియు అతని తల్లి మరియు అతని మామ్మ గారు ఆశ్చర్యముగా అతనిని గమనించుచుండిరి) ఓ, అమ్మా, అది నేనే అని అతడు చెప్పెను.
28"కావున మనము కూడా దేనినో ప్రతిబింబించుచున్నాము," అని నేను చెప్పితిని. చూడండి, మన జీవితము ప్రతిబింబించబడును. మరియు ఇప్పుడు, నోవహు దినములలో మనము జీవించినయెడల; మనము ఎవరి పక్షమున ఉండెదము? మోషే దినములలో మనము ఎవరి పక్షమున ఉండివుందుము? ఆధునిక యెజెబేలు వలె ప్రభువు యొక్క సేవకులందరు లోకపు పద్ధతిలోనికి తరుమబడి మరియు సంఘము మరియు యాజకులందరు ఆమెకు లోబడినట్లు లోకమంతా నవనాగరికతలోనికి మ్రింగివేయబడినటువంటి ఏలియా ప్రవక్త దినాల్లో ఎటు పక్షమును కోరెదము, మీరు పేరు ప్రఖ్యాతల వైపు నిలిచెదరా లేక ఏలియాతో నిలిచియుండెదరా?
JOHN 12:42
29ఇప్పుడు, ప్రభువైన యేసు దినములలో ఈ ఖ్యాతిలేని వ్యక్తి గూర్చి మనము తలంచినప్పుడు, లోకము లేని విద్య లేనివాడు, అతడు అసలు పాఠశాలకు వెళ్ళినట్లు దాఖలాలే వారు కనుగొనలేదు మరియు ఎటువంటి సెమినరీ అనుభవము లేదు, మరియు అక్రమమైన జన్మ అను పేరుతో అతడు పెరిగెను, మరియు పిదప వారు బోధింపబడిన దానికి వ్యతిరేకముగా ఒక సువార్తను ప్రకటించుచూ అతడు బయటికి వచ్చెను.
మరియు సేవకులను మరియు వారి సంస్థలను, మరియు ఆయా వాటిని, ఖండించుచుండెను. మరియు ఆ ఫలాన ప్రవక్త అని పిలువబడుచున్న అతని బోధను కనీసం వినుటకు ఎవరైతే వెళ్ళెదరో వారిని సమాజ మందిరము వెలుపల నుంచెదరనియు అది ఒక మరణకరమై పాపమనియు సంస్థలు ప్రకటించిరి. వారు లెక్క చెప్పవలసియుండెను వారు ఆరాధించు ఒకే ఒక మార్గమేదనగా గొర్రెపిల్ల రక్తము క్రిందయైయున్నది. వారు ఈ బలియొద్దకు రావలసియుండెను. మరియు-మరియు పిదప వారు సమాజము నుండి వెలివేయబడెదరు, మరి అది ఎటువంటి ఒక గొప్ప కార్యమైయున్నది.
30మరియు ఈ వ్యక్తి అటువంటి వాటిని నిర్లక్ష్య౦ చేసెను, అయినను ఆయన లేఖనములలో ఖచ్చితముగా నుండెను, అయితే దానిని వారు ఎరిగిన విధానము కాదు.
ఎవరి పక్షమును మీరు వహించెదరు? చూడండి, ఇప్పుడు… మీరు జీవించుచున్న మీ జీవితము సరిగ్గా అప్పుడు మీరు ఏమి చేయుదురో దానినే ప్రతిబింబించును, ఎందుకనగా మీరింకనూ అదే ఆత్మను కలిగియున్నారు. చూశారా? ఇప్పుడు మీరు వారితో వారి పక్షము వహించినయెడల, మీరు అప్పుడును అదే చేసియుందురు, ఎందుకనగా మీరు ఇప్పుడు కలిగియున్న అదే ఆత్మ అప్పటి ప్రజలలో ఉండెను.
చూశారా, దయ్యము తన ఆత్మను తీసికొనడు, వాడు ఒక వ్యక్తిలో నుండి ఇంకొక వ్యక్తిలోనికి వెళ్ళును. దేవుడు కూడా తన ఆత్మను తీసికొనడు, అది ఒకరి నుండి ఇంకొకరిలోనికి వెళ్ళును. కావున, ఏలియాపై వున్న అదే ఆత్మ ఎలీషా మీదికిని, అదే ఆత్మ బాప్తీస్మమిచ్చు యోహాను మీదికిని వచ్చెను. ఆ రీతిగానే క్రీస్తుపైనున్న అదే పరిశుద్ధాత్మ శిష్యులపైకి వచ్చెను, మరియు ఇంకా ఇతరుల పైకి, మరియు ఇంకా ప్రజల మీదికి వచ్చుచున్నది.
చూశారా? దేవుడెన్నడూ తన ఆత్మను తీసికొనడు. కావున అక్కడే మనము ఎన్నిక చేసికొనుటకు విడిచిపెట్టబడితిమి.
JOHN 1:1•
ACTS 22:3•
EPH 3:1•
PHLM 1:1
31మరియు ఇక్కడ పౌలు తాను ఖైదీగా వుండుటను బట్టి ఎటువంటి విచారమును వ్యక్తపరచుచున్నట్లుగా నాకు అగుపించుట లేదు, కాని అతను తాను వ్రాతపూర్వకంగా తెలియజేయుచుండెను… పౌలు ఈ పత్రికను ఆ కలముతో వ్రాయుచుండగా, దానిని వ్రాయుటకు పరిశుద్ధాత్మయే అతనిలో దానిని కలిగించెనని నేను నమ్ముచున్నాను. కనీసం ఈ రాత్రియైననూ పౌలు ఎందుకు దానిని చేసెనో మన పాఠములోని పాఠ్య సందర్భము ద్వారా చూపించగలము, ఏలయనగా అది లేఖనాధారమైనదై యుండెను. మరియు లేఖనానుసారమైనది నిత్యమైనదై యుండెను. మరియు నేను నమ్ముచున్నాను, ఆ మురికి కుపమైయున్న ఆ చెరసాలలో కూర్చొనియుండి, పౌలు వ్రాయుచుండెను… తన సహోదరునికి లేఖ వ్రాస్తూ తాను యేసుక్రీస్తు వాక్యమునకు ఒక ఖైదీనని చెప్పుచున్నాడు; కావున అతడు తన చుట్టూ ఉన్నదాని గురించి అతడు వ్యక్తపరచుచుండెను.
ఇప్పుడతడు చెరసాలలో ఉండెను, కాని క్రీస్తు సేవకునితో అతడు చెప్పునది దాని గూర్చి కాదు; (తన తోటి సేవకునితో) యేసు క్రీస్తు వాక్యమునకు తాను ఒక ఖైదీనని అతడు చెప్పుచున్నాడు, ఏలయనగా "క్రీస్తు వాక్యమైయున్నాడు."
ACTS 22:5
32మరియు
పౌలు తాను జీవించిన దినములలో ఒక గొప్ప విధ్వాంసుడై యుండెను. అతనికి గొప్ప ఆశయములు కలవు. అతడు మనుష్యులచే తర్ఫీదు ఇవ్వబడిన వ్యక్తియై యుండెను.
అతడు వెళ్ళ గలిగిన అత్యున్నతమైన పాఠశాలలో గమలియేలు అని పిలువబడు ఒక గొప్ప బోధకుని వద్ద అతడు తర్ఫీదు పొందెనని, నేను చెప్పగలను. ఉదాహరణకు మనము చెప్పవలెనన్న వీటన్ లేక బాబ్ జోన్స్ వంటి గొప్ప పాఠశాలలు — అతడు ఒక వాక్య పరిచారకునిగా బోధింపబడెను. అతడు గొప్ప విద్యా వేత్తయైన మరియు తెలివి, జ్ఞానముగల బాలుడైయుండి, ఒకానొక దినమున తన ప్రజలకు ఒక యాజకునిగా లేక ప్రధాన యాజకునిగా అగుటకు ఒక ఉన్నత ఆశయము కలిగియుండెను.
JOHN 1:14•
ACTS 9:2•
ACTS 22:3•
EPH 3:1•
PHLM 1:1
33అతడొక ఆశయమును కలిగియుండెను, మరియు ఈ ఆశయ సాధనకై అతడు తన జీవితమంతయు వెచ్చించి, తర్ఫీదు నొందెను. బహుశా ఎనిమిది లేక పది సంవత్సరముల వయస్సు నుండి పట్టా, మరియు డిప్లమాలు మరియు మిగతావన్నియు పొందు వరకు ముప్పై లేక ముప్పై-యైదు సంవత్సరములు వెచ్చించెను మరియు పండితులతో సరితూగ గలవాడై యుండెను. అతడు యెరూషలేములో ఉన్న ప్రధాన యాజకుని యొద్ద నుండి కూడా ఉత్తర్వులు కలిగియుండెను. ఈ గొప్ప సౌలు, దమస్కునకు వెళ్ళి అతడు బోధించు దానికి వ్యతిరేకముగా ఎవరైననూ దేవుని ఆరాధించినచో అటువంటి వారందరిని కనుగొని మరియు వారిని బంధించి, చెరసాలలో పెట్టి, మరియు అవసరమైనచో అతడు అనుకొనినయెడల వారికి మరణ దండన సైతం విధించుటకు వ్రాత పూర్వకంగా వ్యక్తిగత ఉత్తర్వులు పొందుకొనియుండెను.
అతడు ఉన్నతమైన ఆశయములు కలిగియుండెను. ఇప్పుడు, అతడు తర్పీదు పొందిన దానంతటినీ — దానంతటినీ దేవుడు అతని నుండి తీసివేసెను. తన ఉద్ధేశ్యమేమై యుండెనో మరియు తన తండ్రి తన డబ్బును దేనికైతే ఖర్చుచేసెనో, తన తల్లిదండ్రుల ఆశయములను, అదంతయూ… అతని యొద్ద నుండి తీసివేయబడెను, ఏలయనగా దేవుడు మరొక దానిని కలిగియుండెను. అందువలన, తన జీవితములో అతడు కలిగియున్న ఉద్ధేశ్యమును బట్టి, వాక్యమైయున్న యేసుక్రీస్తుకు అతడు ఒక ఖైదీ ఆయెను.
EXOD 13:21•
ACTS 9:4,5•
ACTS 22:7,8
34ఆ దమస్కునకు వెళ్ళు మార్గము పౌలును మార్చి వేసెను.
బహుశా ఉదయం పదుకొండు గంటల ప్రాంతంలో అతడు అచ్చట మొత్తబడెను, మరియు ఒక స్వరము ఈ విధముగా చెప్పుటను వినెను, "సౌలా, నీవేలా నన్ను హింసించుచున్నావు?" మరియు అతడు పైకి చూచెను, మరియు పైకి చూచుచూ, ఒక యూదుడైయుండి, ఆ అగ్నిస్థంభము ఇశ్రాయేలు జనాంగము నడిపించిన ప్రభువేనని తెలిసికొనెను, ఏలయనగా అది అదేయని అతడు ఎరిగియుండెను.
మరియు గుర్తుంచుకొనండి, అది ప్రభువేనని సంతృప్తిచెందునంత వరకూ ఈ హెబ్రీయుడు దేనిని ప్రభువని ఎన్నడు పలుకువాడు కాదు, ప్ర-భు-వు, ఎలోహిం, ఏలయనగా అతడు తర్ఫీదు నొందిన ఒక పండితుడైయుండెను. మరియు అతడు పైకి చూచినప్పుడు, అతడు ఈ వెలుగును చూచెను — అది ఆ అరణ్యముల ద్వారా తన ప్రజలను నడిపించిన అగ్నిస్తంభమై యుండెను. అతడు, "ప్రభువా," ఎలోహిం, "ప్ర-భు-వా," అనెను. "ప్రభువా, నీవెవరవు?"
ACTS 9:4,5•
ACTS 22:7,8
35"నేను యేసును," అను సమాధానము ఈ తత్వవేత్తకు బహు ఆశ్చర్యమును కలిగించి యుండవచ్చును. అతడు ఎవరికైతే వ్యతిరేకముగా నుండెనో ఆయనేయైయుండెను. అది ఎటువంటి మలుపై యుండెను.
ఓ, తాను హింసించుచున్నాడని అకస్మాత్తుగా తెలుసుకొనుట, ఈ వ్యక్తికి గంభీరమైన అనుభవముగా ఉండి యు౦డవచ్చును (తనకున్న ఆశయములన్నిటిని బట్టి) అతడు చేయదలచుకున్న ముఖ్య ఆశయముల నుండి ఇంకనూ ప్రక్కకు లాగబడుటయైయన్నది. అతడు ఎవరినైతే హింసించుచుండెనో ఆయనే "నీవు నన్నేల హింసించుచున్నావు?" అని చెప్పుట, ఈ అపోస్తలునికి ఎటువంటి గొప్ప ఆశ్చర్యమును కలిగించియుండును.
ఇక్కడ మనము చెప్పుకొనవలసిన మరొక చిన్న మాట… వారు సంఘమును పరిహాసము (ఎగతాలి) చేయునప్పుడు, మీరు గమనించండి, వారు నిజముగా సంఘమును పరిహసించుట లేదు; వారు యేసును పరిహసించుచున్నారు. "నీవు నన్నేల హింసించుచున్నావు?" పౌలు తనకున్న జ్ఞానమంతటితో దీనిని ఏలాగు నమ్మగలిగెను… అతడు హింసించుచున్న ఈ గుంపుది, అతడు తాను స్వయంగా సేవించుచున్నానని చెప్పుకొనుచున్న దేవుడే అని ఏలాగు నమ్మగలిగెను?
నేననుకొనుచున్నాను — వివరములోనికి వెళ్ళకుండా — ఇచ్చట నా ఉద్ధేశ్యమును తెలుసుకొనుటకు మనమందరమును మంచి తర్ఫీదును కలిగియున్నామని నేను తలంచుచున్నాను. ఈ దినమున కూడా అదే కార్యము జరుగుచున్నది.
ACTS 9:8,10,11,17•
ACTS 22:4,11,12
36పౌలు, తాను ఎరుగకుండుట ద్వారా - అయినను జ్ఞానము మరియు తెలివైనవాడై యుండెను, అతడు హింసించుచున్న ఆ చిన్న నిరక్షరాస్యులై తమ దీనత్వములో ఈ మనష్యుని గొప్పవానిగా అంగీకరించిన ఆ గలిలయుల కంటెను ఎంతో తెలివైనవాడై యుండెను. అయితే పౌలు తన గొప్ప ప్రసంగములో, తన జ్ఞానములో, దానిని అంగీకరించలేకపోయెను.
మరియు ఈ మార్గములో ఇది అతనికి ఒక గొప్ప మలుపైయుండెను. మరియు అతడు గ్రుడ్డితనముతో మొత్తబడెను, అందుచేత అతడు తన కర్తవ్యమును నెరవేర్చలేకపోయెను, అయితే తిన్నని అనబడిన వీధిలోనికి కొనిపోబడెను మరియు ఒక వ్యక్తి గృహము… అంతట అననీయ అనబడు ప్రవక్త వచ్చెను, అతడు వచ్చుటను ఆయన తన దర్శనములో చూచెను, అతడు ఎచ్చటనున్నది చూచెను — అతడు వున్న ఈ చోటునకు వచ్చెను, లోనికి వెళ్ళి ఈ విధముగా చెప్పెను "సహోదరుడా సౌలూ, మార్గములో నిన్ను దర్శించిన ప్రభువు, నేను నీపై చేతులుంచుట ద్వారా నీవు చూపుపొందుటకును, పరిశుద్ధాత్మతో నింపబడుటకును నన్ను పంపించెను"
GAL 1:17,18
37అదేమిటో చూడండి?
అది పౌలుకు ఎటువంటి విషయమైయుండును!
చూడండి, తాను తర్ఫీదు పొందినదంతయూ వ్యతిరేకముగా చేయుటకేయైయున్నది. అయితే, ఇప్పుడు తనకున్న విద్య అంతయూ దేనికీ పనికి రాకుండా పోయెను. ఇప్పుడు, అతడు ఒక అనుభవము పొందియుండెనని గ్రహించెను. కావున ఇచ్చట మనకు మరొక గుణపాఠమున్నది: అదేదనగా, కేవలం అనుభవము మాత్రమే సరిపోదు. అది ప్రభువు యొక్క వాక్య ప్రకారమైన అనుభవమై యుండవలెను.
అయితే, దీనిని చూచిన తర్వాత, దీనిని తనకంటే ముందుగా మరియొకరు పొ౦దుకొనుట ఒక గొప్ప కార్యమని ఎరిగియుండి, అతడు మూడున్నర సంవత్సరములు అరేబియా ఎడారిలో గడిపెను, పరిశుద్ధ గ్రంథము తీసికొని, అప్పుడున్న పాత నిబంధనను తీసికొని మరియు తాను కలిగియున్న ఈ అనుభవము లేఖనానుసారమైనదో లేదో, పోల్చి-చూచుటకు అచ్చటకు వెళ్ళెను.
GAL 1:17,18
38ఇప్పుడు, మంచిది, అది కేవలం "ఒక చిన్న గాలి విసిరింది, అని నేను అనుకొనుచున్నాను?"అని చెప్పి అతడు వెళ్ళిపోయినచో ఎట్లుండును. "నేను జ్ఞానులను వెంబడించెదను." ఇప్పుడు, అతడు దేనికో ఒక ఖైదీగా మారవలెను — ఒక ఖైదీ. కావున దానిని అతడు పోల్చి చూచినప్పుడు, అతడు హెబ్రీ పత్రికను ఒక మాదిరిగా ఉండునట్లు వ్రాయగలిగెను.
చూడండి, మూడున్నర సంవత్సరములు వాక్యములో నిలిచియుండి మరియు తనను పిలచిన అదే దేవుడు అతనిని వెనుకకు తోడుకొని వెళ్ళి మరియు తన జ్ఞానమంతటినీ మార్చి వేయుచుండెనని గ్రహించెను. అతడు ఆలోచించిన ప్రతిదానిని మార్చి వేసెను. తాను తర్ఫీదు నొందిన ప్రతి దానిని, తన ఆశయములన్నింటిని అతని నుండి పూర్తిగా తుడిచి వేసెను, మరియు అతడు ఒక ఖైదీగా మారెను.
దేవుని ప్రేమ మరియు అటువంటి ఒక ప్రత్యక్షత ఎంత గంభీరముగా నుండెననగా, అతడు దాని నుండి తప్పించుకొనలేక పోయెను. దేవుని కలుసుకొను ప్రతి నిజ విశ్వాసి యొక్క నిజ అనుభవము అట్లేయుండును. నీవు సంధించునది ఎంత గొప్ప కార్యమైయున్నదనగా… నీవు మిగిలిన ప్రతిదానికిని ఒక ఖైదీయై యుండెదవు. చూడండి, నీవు ప్రతిదాని నుండి వేరై నీకు-నీవుగా దీనికి ఒక ఖైదీయై యుందువు.
MATT 13:45,46
39పరలోక రాజ్యము, ఒక వ్యక్తి ముత్యములు కొనునట్లుగా ఉన్నది, అని యేసు ఒకానొక సమయమున చెప్పినట్లుగా అది ఉన్నది. అంతట ఆ గొప్ప ముత్యమును మనము కనుగొనెదము, దానిని పొందుటకు అతడు తనకున్నదంతయూ, అమ్మి వేయును. మరియు ఇచ్చట ఇది కూడా దానివలెనె ఉన్నది. నీవొక జ్ఞానయుక్తమైన ఆలోచన కలిగియున్నావు. నీవు ఒక వేదాంత అనుభవమును కలిగియున్నావు, అయితే నీవు సరియైన దానిని కనుగొను సమయము ఆసన్నమైనప్పుడు, నీవు ప్రతిదానిని తెంచివేయుదువు, మరియు నీకు నీవుగా దానిలో మూయబడుదువు.
GAL 1:18
40అది ఏమైయున్నదో పౌలు ఎరిగియుండెను. అతడు ఏదో ఒకదానికి ముడివేయబడి యున్నాడని అతడు కనుగొనెను. మనము గుర్రమును బంధించు లాగుతో, సిద్ధపరచినప్పుడు అది దేనినో ఒకదానిని లాగుతుంది. పౌలు ఈ అనుభవము తరువాత, మరియు పరిశుద్ధ గ్రంథమును మూడున్నర సంవత్సరములు తాను పొందిన అనుభవముతో పోల్చి చూచిన తర్వాత, దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా అతనినిఎన్నుకొనెనని అతడు గ్రహించెను. అతనికున్న అనుభవముతో సువార్తను అన్యులవైపుకు లాగెను. ఆత్మ తనంతట తానే అతనిని బంధించెను.
GAL 1:17
41ఈ దినమున, క్రీస్తు సేవకులుగా మనము బంధింపబడుచున్నాము, పట్టబడియుండుట. అది లేకుండా మనము ఎక్కడికి వెళ్ళ జాలము — వాక్యముతో ముడివేయబడుట! ఎవరేమి చెప్పి నను లెక్కలేదు; మీరు దానితో ముడివేయబడియున్నారు. మీరు దాని నుండి వైదొలగకుండునట్లు దాని విషయమై ఏదో ఉండియున్నది. మీరు పరిశుద్ధాత్మ ద్వారా దానితో ముడివేయబడియున్నారు. మరియు అది మిమ్మును వాక్యముతో ముడివేసియున్నది, ఎవరేమి చెప్పినను లెక్కలేదు. మిమ్మును వెంబడించునది ఎల్లప్పుడూ, వాక్యమైయున్నది. దానితో బంధింపబడి, దానితో ముడివేయబడి; ఆత్మ ద్వారా వాక్యముతో అతడు బంధింపబడి యున్నాడు.
అతనికున్న సమస్త విషయములు మరియు అనుభవములు మరియు ఆశయములు తొలచివేయబడి అచ్చట, ఆ అరేబియా ఎడారి వెనుక భాగములో పడియుండెను. ఇప్పుడు, మనము కూడా ఆ విధముగా ఒలిచివేయబడవలెనని ఈ దినమున కనుగొనుచున్నాము. మరియు జనులు ఒలిచివేయబడుటకు ఇష్టపడరు. మెథడిస్టు సహోదరుడు తన మెథడిస్టు బోధను కొద్దిగా పట్టుకొనియుండగోరును. బాప్తిస్టు సహోదరుడు తన బాప్తిస్టు బోధనుకొద్దిగా పట్టుకొనియుండగోరును, అయితే నీవు పరిపూర్ణముగా ప్రతి దాని నుండి ఒలిచివేయబడవలసియున్నావు. మరియు నూతనముగా తిరిగి జన్మించి మరియు పరిశుద్ధాత్మ నిన్ను నడిపించిన కొలది అక్కడి నుండి నీవు తీసుకొనవలసియున్నది. నీవు ఈ విధముగా చెప్పజాలవు, "మంచిది, మా నాన్న సంఘములోనికి వెళ్ళి మరియు దానిని పొందినప్పుడు, అతడు సంఘ కాపరితో కరచాలనము చేసెనని," చెప్పెను. మరియు అతడు ఒక మంచి సంఘ సభ్యుడు, అది అతనిని సంతతికి సరిపడినదైయుండ వచ్చును గానీ మనము మరొక సంతతిలో ఉన్నాము.
ఇప్పుడు, మనము ఈ దినమునకై పరిశుద్ధ గ్రంథము యొక్క సమయమునకు తప్పక రావలసియున్నాము.
42యాజకుడు కూడా బంధింపబడి యుండెను, అయితే మీరు చూడండి, వారు వేరొక కోణములో వచ్చియుండిరి. మరియు వారు-వారి పాత నిబంధనబంధకములను తొలగించి నూతనబంధకములోనికి వెళ్ళుటలో విఫలులైరి. మరియు ఈ దినమున మనము దానినే కనుగొనుచున్నాము. మేము సంఘ కాలములు, పరిశుద్ధ గ్రంథము, మరియు ఇతర అంశముల నుండి రుజువు చేసినట్లుగా మనము సంఘ శాఖల యుగము నుండి తప్పక వచ్చియున్నాము, కాని ఇప్పుడు పరిశుద్ధాత్ముడు తానే స్వయముగా దిగి వచ్చి తనను తాను రుజువుచేసికొని మరియు తనను తాను కనబరచుకొని, తాను వాగ్ధానము చేసిన ప్రతి వాగ్ధానము ఋజువగునట్లుగా చేయు స్వేచ్ఛా యుగములో మనమున్నాము.
ఓ, మై ఎటువంటి గొప్ప సమయము, మరియు దానిని అతడు ఎరుగును… మరియొక విషయము… దీనికి బంధీయై యుండి ఇతర స్థలములకు అతడు వెళ్ళలేడని అతడు ఎరిగియుండెను. అతడు ఒకవేళ వెళ్ళదలచినను అతడు వెళ్ళలేడు. అతడు తనను ఆహ్వానించిన సహోదరుల యొద్దకు వెళ్ళవలెనని అతని ఆశయములు బలవంతము చేసినను, వేరే విధముగా చేయుటకు అతడు ఆత్మలో ఒత్తిడి చేయబడెను. అతడు తన సొంతము కాదు.
JOHN 1:1
43కొంత మంది ఈ విధముగా చెప్పవచ్చును, "సహోదరుడా, సౌలు లేక సహోదరుడా పౌలు, మాకు అతి పెద్ద సంఘముండినందున నీవు ఇచ్చటకు రావలెనని మేము కోరుచున్నాము. మాకు అతి పెద్ద సమాజమున్నది. మీకు వచ్చు కానుకలు గొప్పగా ఉండును…" మరియు ఇంకా ఆ విధముగా, కానీ ఆత్మలో ఒత్తిడి చేయబడినవాడై, అతడు ఈ విధముగా తలంచెను, "ఇచ్చట నాకు ఒక సహోదరుడు ఉన్నాడు, నేను వెళ్ళి ఈ సహోదరుని రక్షించవలెను; ప్రభువు నొద్దకు నడిపించవలెను." మరియు అయిననూ వేరొక చోటికి వెళ్ళుటకు ఆత్మలో అతడు ఒత్తిడి చేయబడెను, అతడు నిజముగా ఒక ఖైదీయైయుండెను.
ఓ, దేవా, ఆ విధముగా మమ్ములను ఖైదీలుగా చేయుము, మా స్వార్థ ఆశయముల నుండి, మరియు మా స్వంత తీర్పుల నుండి, మరియు మా మంచిగా ఆలోచించు తలంపుల నుండి, యేసు క్రీస్తుకు ఒక ఖైదీగా చేయుము. నేను తలంచుచున్నాను, "నేను యేసుక్రీస్తుకు, ఒక ఖైదీని అనునది: ఒక గొప్ప మాట."
మరియు గుర్తుంచుకొనండి, ఆయన వాక్యమైయున్నాడు. ఎవరేమి తలంచిననూ ఫరవాలేదు; అది వాక్యమైయున్నది. చూడండి, మీరు వాక్యమునకు ఒక ఖైదీ అయినయెడల, ఏ సంఘ శాఖ అయినను మిమ్మును దాని నుండి మల్లించలేదు. అది వాక్యమైయున్నది. నీవు కేవలం దానికి ఒక ఖైదీవై యున్నావు అంతే. అది చెప్పిన ప్రకారమే నీవు చేయవలెను.
ACTS 16:6•
EPH 3:1•
PHLM 1:1
44ఇప్పుడు, అతడు వెళ్ళ తలచిన కొన్ని స్థలములకు అతడు వెళ్ళలేకపోయెను. ఆత్మ, అతనిని వెళ్ళుటకు అనుమతించలేదు. "నేను అచ్చట, ఒక గొప్ప కూటమును కలిగియుందును" అని పౌలు తలంచి, అనేక సార్లు ఒకానొక స్థలమునకు అతడు వెళ్ళుటకు ప్రయత్నించుట మీకు గుర్తున్నది, అయితే ఆత్మ అతనిని వెళ్ళనీయలేదు.
ఇప్పుడు, అది పౌలు ఒక ఖైదీయని స్పష్టముగా చెప్పి రుజువుచేయుచున్నదా? యేసు క్రీస్తుకు ఒక ఖైదీ, ఆత్మచేత ఆయన వాక్యమునకు బంధింపబడియుండెను. ఓ, నేను దానిని ఇష్టపడుచున్నాను. అతడు బంధింపబడెను, అతడు సంకెళ్ళ చేత, ప్రేమ బంధకముల చేత దేవుని చిత్తమును మరియు దానిని మాత్రమే చేయుటకు బంధింపబడెను. అతడు ఒక ఖైదీయైయుండెను. అతడు ప్రేమ బంధకములలో ఉండెను. అతడు క్రీస్తుతో జతపరచబడెను. అతడు మరి దేనితోనూ జతపరచబడలేడు. అతడు ఆయనతోనే జతపరచబడెను, మరియు అతడు ఎచ్చటికి నడిపింపబడునో, అచ్చటికే వెళ్ళవలెను, ఈ ప్రక్క గానీ, ఆ ప్రక్క గానీ, మార్గము ఎంత పచ్చగానున్నను నాయకుడు ఎటు వెళ్ళునో అటువైపే దాసుడు వెళ్ళవలెను.
45ఓ, ఈ రాత్రి, బ్రన్హం గుడారముగా వున్న మనము మన స్వంత శరీరములకు, మన స్వంత ఆశయములకు ఖైదీలుగా ఉన్న మనము, సంపూర్ణముగా లొంగిపోయి మరియు మనము ఆయనతో జతపరచబడెదము. లోకము ఏమి చెప్పిననూ, లోకము ఏమి చేసినను లెక్కలేదు, మనము ప్రేమ-బంధకములచే బంధింపబడియున్నాము మనము ఖైదీలమైయున్నాము. నేను నాట్యమాడలేనంతగా నా కాళ్ళు క్రీస్తుతో జతపరచబడెను. ఈ నవీన నాగరిక స్త్రీలు కవ్వించుచూ అసభ్య వస్త్రధారణతో ఉండుట వీధిలో చూచినప్పుడు, నా తలను త్రిప్పుకొనునట్లుగా; నా కళ్ళు క్రీస్తుతో జతపరచబడెను. ఈ లోకమును నేను ప్రేమించలేనంతగా నా హృదయము ప్రేమతో ఆయనకు జతపరచబడెను. నా ఆశయములేమిటో నేనెరుగనంతగా, నా చిత్తము ఆయనతో ముడివేయబడెను. ప్రభువా, నీవెక్కడికి నడిపించితే అక్కడికి నేను వచ్చెదను, నేను ఒక ఖైదీగా ఉండెదను. చూశారా?
ACTS 16:16-18
46పౌలు నిజముగా ఒక ఖైదీయై యుండెను. అతడు ఎటువంటి తప్పుడు ప్రకటనలు చేయుట లేదు. అతడు వాక్యముకై వేచి యుండుటకు మరలా పరిశుద్ధాత్మ ద్వారా తర్ఫీదు పొందెను. ఇప్పుడు, అతడు ఒక విధానములో తర్ఫీదునిచ్చెను. అతడు ప్రభువు కొరకు వేచియుండుటకు పరిశుద్ధాత్మ ద్వారా తర్ఫీదు పొందెను. అతని ఆశయములు ఏమైయున్నను లెక్క చేయలేదు.
ఇప్పుడు, పరిశుద్ధాత్మ సహాయము వలన, ఒక విషయమును తెలియపరచబోవుచున్నాను. ఇప్పుడు, మనము కేవలం ఒక సంఘటనను తీసుకుందాము, ఒక దినమున పౌలు మరియు సీల ఒకనొక పట్టణములో ఎక్కడైతే అతను ఉజ్జీవ కూటములు నిర్వహించుచుండెనో, అక్కడ ఒక దురాత్మ-పట్టిన బాలిక అతనిని వెంబడించుచుండెను; అతని వెనుక కేకలువేయుచు వచ్చుచుండెను. మరియు ఒక అపోస్తలునిగా, పౌలుకు ఆ స్త్రీలోని దురాత్మను గద్దించుటకు అధికారము కలిగియుండెనని అతడు ఎరిగి యుండెననుటలో ఎటువంటి సందేహము లేదు; అయితే మీరు గమనించితిరా? అకస్మాత్తుగా పరిశుద్ధాత్మ అతనితో మాటలాడు వరకు దినదినము అతడు కనిపెట్టుచుండెను, "ఇదియే సరియైన ఘడియ," అని ఆయన చెప్పెను.
47"అప్పుడు అతను ఓ దురాత్మ, ఆమెను వదిలి బయటకు రమ్ము," అని చెప్పెను.
చూడండి, ప్రభువుకై వేచియుండుటను అతను ఎరిగియుండెను. మరియు ఈ దినమున అనేకులు అక్కడే వాక్యము పై నిందను తెచ్చుచున్నారు. వారు ఒక ఆశయముతో బయటికి వెళ్ళెదరు, అటువంటి ఒక కార్యమును బట్టి ఎన్ని ఉజ్జీవములు చల్లారిపోయెను? ఏలయనగా సువార్తికుడు ప్రభువు ఏమి సెలవిచ్చునో చూచుటకు వేచియుండుటలేదు.
కొంతమంది "ఇచ్చటకు రండి," అని చెప్పినప్పుడు, మరియు వారు వెంటనే వెళ్ళుదురు, ఎందుకనగా "వెళ్ళుడి" అని వారి సంఘము చెప్పియుండెను. మరియు పరిశుద్ధాత్మ దానికి భిన్నముగా ఏదైనా చెప్పుము, అయినను రాష్ట్ర ప్రెస్బిటర్ కానీ, లేక మరొక పదవి కానీ, లేక ఒక పెద్దగా కాని, లేక ఒక బిషప్పుగా కాని, లేక ఏదో ఒకటి పొందవలెనన్న మానవుని కోరిక — "నీవు తప్పని సరిగా వెళ్ళవలెను" అని లాగుచుండును, మరియు అయినను అతనికి మంచిదేదో తెలియును. పరిశుద్ధాత్మ "ఇక్కడికి వెళ్ళుము," అని చెప్పుచుండెను. చూడండి, అతడు తన సంస్థకు బానిసయైయున్నాడు. అతడు సంస్థకు ఒక ఖైదీయైయున్నాడు. కాని అతడు క్రీస్తుకు బానిసైతే, అతడు పరిశుద్ధాత్మ ద్వారా నడిపించబడును. చూడండి, అతడు కాడి మోయుచున్నాడు, ఒక ఖైదీ. మరి ఏది ఏమి చెప్పిననూ అది ఏ బేధమును కలిగించదు. అది ఒక మ్రోగెడు కంచు మరియు గణగణలాడు తాళమునైయున్నది. అతడు కేవలం దేవుని యొక్క స్వరమునే వినును, మరియు అది బయలువెళ్ళినప్పుడే అతడు మాట్లాడును. అతను ఏమియూ చెప్పడు.
48కొందరిట్లు చెప్పెదరు, "ఓ, సహోదరుడు జోన్స్ లేక సహోదరుడు రాబర్ట్…" లేక ఈ రోజున మన దేశంలోనున్న గొప్ప వ్యక్తులు టామి హిక్స్, లేక ఓరల్ రాబర్ట్, లేక సహోదరుడు టామి ఆస్బార్న్, వారిలో కొంత మంది గొప్ప సువార్తికులై యున్నారు. ఒకవేళ ఎవరైననూ ఈలాగు చెప్పినయెడల, "టామి ఇక్కడకు రండి, మీరు గొప్ప దైవజనులైయున్నారు," (లేక ఓరల్), మరియు అన్ని విధములుగా పట్టబడి, మరియు "వ్యాధిగ్రస్తుడైన మా అంకుల్ ఇక్కడ పడియున్నారు. మీరు ఇక్కడకు రావలెనని నేను కోరుచున్నాను. అతనిని స్వస్థపరచుటకు మీరు శక్తికలిగియున్నారని నేను నమ్ముచున్నాను." చూశారా?
మరియు పరిశుద్ధాత్మ అతనితో ఈలాగు చెప్పవచ్చును, "ఇప్పుడు కాదు." అయితే, ఆ వ్యక్తితో కలిగియున్నస్నేహమునుబట్టియైనను, అతడు ఆయనతో వెళ్ళ బద్ధుడైయున్నాడు. అతను వెళ్ళనియెడల, అతడు ఆ వ్యక్తికి శత్రువుగా మారును. మంచిది, "అతను ఫలానా మరియు ఫలానా వ్యక్తి దగ్గరకు వెళ్ళి, ఆ బిడ్డను లేక ఆ బాలుని స్వస్థపరచెను," అని ఆ వ్యక్తి చెప్పెను. అతడు స్వస్థపరచెనని నేనెరుగుదును; మరియు సంవత్సరములుగా అతడు నా స్నేహితుడు, మరియు అతడు నా స్థలమునకు రాడు." అయితే ఒకవేళ అతను వెళ్ళకూడదని పరిశుద్ధాత్మచే ఆటంకపరచబడినయెడల, అతడు వెళ్ళకుండుట మంచిది. ఒకవేళ అతను దేవునికి బానిసైనయెడల, తన స్నేహితుని అతడు ప్రేమించును, అయిననూ అక్కడకు వెళ్ళుటకు అతను పరిశుద్ధాత్మ ద్వారా నడిపించబడుటయే మంచిది; ఏలయనగా దానివలన ఏ విధముగాను ఎటువంటి ప్రయోజనము జరుగదు. దానిని నేను ఎన్నోసార్లు అనుభవించితిని.
ACTS 14:8-10•
ACTS 27:10
49అయితే పౌలు కేవలం ఆత్మ తనను ఏమి చేయమని చెప్పునో దానికై వేచి యుండెను. ఆత్మ యొక్క నడిపింపు కొరకు వేచియుండుట మంచిది.
అతను ఒక రాత్రి బోధించి మరియు నడిచి వెళ్ళుచుండగా, ఒక కుంటివానిని చూచెను. మరియు ఆకస్మాత్తుగా ఆత్మ అతనితో మాటలాడెను, "నేను గ్రహించుచున్నాను," అని అతడు చెప్పెను. ఏ విధముగా? ఓడ పగిలి ఒక ద్వీపమునకు వారెట్లు వెళ్ళెదరో గ్రహించిన విధముగా చూశారా? "నీవు స్వస్థపడుటకు విశ్వాసము కలిగియున్నావని నేను గ్రహించుచున్నాను. లేచి నీ కాళ్ళపై నిలబడుము! యేసుక్రీస్తు నిన్ను బాగుచేసెను."
అక్కడే నీవున్నావు; అతడొక బానిసైయున్నాడు. అతడు అక్కడ ఒక వారము ఉజ్జీవ కూటములు పెట్టిననూ ఏమియూ జరుగకపోవును, అయితే పరిశుద్ధాత్మ పలుకుటకు అతడు వేచియుండెను. చూడండి, ఆ విజ్ఞాపనకు అతడు బద్ధుడైయున్నాడు.
EPH 3:1•
PHLM 1:1
50ఇప్పుడు, మీరు "సహోదరుడా బ్రన్హం, ఆదివారము మీరు ఏమి చెప్పిరో దానిని మీరు ఖండించుచున్నారు," (ఈ సమయమంతా మీరు వేచియుండుటను గూర్చి), అని మీరు చెప్పెదరు. అయితే మీరు గుర్తుంచుకొనండి, "వ్యాధిగ్రస్తులు మరియు బాధింపబడు వారి మధ్యకు నేను నిన్ను తిరిగి పంపుచున్నాను," అని ఆ రహదారిపై నాతో మాట్లాడి చెప్పినది పరిశుద్ధాత్ముడైయున్నాడు. చూశారా? ఇది పరిశుద్ధాత్మకు విధేయత చూపుటయైయున్నది. నిశ్చయముగా, ఆయన దానిని చేయుమని చెప్పువరకు నేను వెళ్ళలేదు. యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు, అను దానిని నేను పొందువరకు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు, అను దాని గూర్చి నేను వేచియుంటిని. ఇప్పుడు వ్యత్యాసము అదే అయియున్నది. చూశారా? ఇప్పుడు, వ్యత్యాసం చూపునది అదేయైయున్నది.
అవును, అతడు దేవుని వాక్యము కొరకై వేచియుండెను. అతడు దేవుని చిత్తమునే జరిగించుటకు ఆత్మలో నొప్పించబడెను. అప్పుడు, అతను యేసుక్రీస్తునకు ఒక ఖైదీ ఆయెను. స్నేహితులారా, మనము కూడా కేవలము ఖైదీలుగా మారినయెడల.
JOHN 1:1
51ఇప్పుడు, వేడిగానున్నదని నేను ఎరుగుదును, అయితే నేను మరో ఇద్దరి గూర్చి చెప్పగోరుచున్నాను. మంచిది, నేను ఇక్కడ ఆరు లేక ఎనిమిది మంది గూర్చి వ్రాసుకొనియున్నాను, కాని నేను కేవలం ఒకరు లేక ఇద్దరు గూర్చి మాత్రమే చెప్పెదను.
మనము ఇప్పుడు, మోషేను గూర్చి చూచెదము. అతడు ఒక విమోచకునిగా జన్మించెను, మరియు అతడు విమోచకునిగా జన్మించెనని అతనికి తెలియును. అయితే నేను మోషేను గూర్చి చెప్పుటకు ముందు, నేను ఈ వ్యాఖ్యానము చెప్పగోరుచున్నాను: దేవుడెల్లప్పుడూ సత్యముతో సేవించు ఏ వ్యక్తినైననూ తనకు ఖైదీగా చేసికొనును. ఒక వ్యక్తి తనకు కలిగిన ప్రతి కోరికను త్యజించవలెను, అతడు ఏమైయున్నాడో దానంతటినీ, ప్రతిదానిని: అతని జీవితమును, ఆత్మను, శరీరమును, చిత్తమును, కోరికలను, మరియు సమస్తమును, మరియు దేవుని సేవించుటకై వాక్యమైయున్న క్రీస్తుకు ఒక పూర్తి ఖైదీగా మారవలెను.
నీవు నీ మంచి తీర్మానమునకు వ్యతిరేకముగా నడువవలసి వచ్చును. బహుశా ఒకానొక సంస్థ వారు నిన్ను ఒక స్థానమునకు తీసికొని వచ్చి నీవు మెరయునట్లు నీకు ఏదైనా ఒక గొప్ప దానిని నీకిచ్చెదరని నీవు అనుకొనవచ్చును. అయితే నీకు-నీవుగా ఏమి కనుగొనెదవు? కొంత కాలమైన పిదప నీవు నీకు-నీవుగా ఓడిపోతివని కనుగొనెదవు. దేవుడు ఆయనకు ఇష్టపూర్వకంగా ఖైదీగా మారే ఒక వ్యక్తి దొరికేంతవరకు…
52దేవుడు ఖైదీల కొరకు చూచుచున్నాడు. ఆయన ఎల్లప్పుడు దానినే చేసియున్నాడు. నీవు దానిని లేఖనముల ద్వారా కనుగొనవచ్చును. ఒక వ్యక్తి ప్రతి దానిని ఎదిరించి క్రీస్తుకు ఒక ఖైదీయై యుండవలెను… తద్వారా, నీవు క్రీస్తుతో తప్ప మరి దేనితోను సంబంధం కలిగియుండలేవు. నీ తండ్రియైనను, నీ తల్లియైనను, నీ సహోదరుడైనను, నీ సహోదరియైనను, నీ భర్తయైనను, నీ భార్యయైనను, ఎవరైనను నీవు కేవలం క్రీస్తుతోనే సంబంధము కలిగియుండెదవు, మరియు ఆయనతో మాత్రమే. అప్పుడు దేవుడు నిన్ను వాడుకొనును. అప్పటి వరకు నిన్ను వాడుకోలేడు.
కొన్నిసార్లు బయటికి వెళ్ళినప్పుడు నేను జనులతో కఠినముగా మాటలాడెదను. చూడండి, నేను మీరు విడిపింపబడవలెనని ప్రయత్నించుచున్నాను. మీరు ప్రారంభించు స్థలము ఒకటి కలిగి ఉండవలెను. జుట్టు కత్తిరించుకొను స్త్రీలను వారి క్రైస్తవ్య మతమును పట్టుకొని ముందుకు కొనసాగుట.
"అది ఒక చిన్న విషయమే," అని నీవు చెప్పెదవు. మంచిది, నీవు ఎక్కడో ప్రారంభించవలసియున్నది. కావున నీవు నీ అ,ఆ,ల (abcs) వద్దనే ప్రారంభించుము, చూశారా? మరియు ఏది ఏమైననూ ఇహలోకపు చూపుల నుండి కత్తిరించబడుము, మరియు క్రీస్తుకు ఒక ఖైదీగా మార్చబడుము, మరియు పిదప నీ ఆఖరి బంధములు తెగిపోవునంత వరకు కత్తిరించబడవలెను. అప్పుడే నీవు ఒక ఖైదీవి. నీవు ఆయన పట్టులో ( grip) ఉండెదవు. ఆయన నిన్ను తన స్వాధీనంలో ఉంచుకొనును.
EXOD 2:3,4,7-9•
EXOD 12:40•
HEB 11:23
53ఇప్పుడు, తాను ఒక విమోచకునిగా జన్మించెనని మోషే ఎరిగియుండెను; ఆయన దానిని ఎరిగియుండెను, మరియు మోషే అక్కడ తన తల్లి తనతో చెప్పిన దానిని ఎరిగియుండి, ఎటువంటి కోరికను కలిగియుండునో మీరు గమనించారా. ఆమె అతనికి దాదిగా యుండెను.
ఆ చిన్న కుమారుడైన మోషే జన్మించినప్పుడు తన తల్లి ఈ విధముగా చెప్పెననుటలో ఎటువంటి సందేహము లేదు, "మోషే, నీవెరుగుదువా, నీ తండ్రియైన అమ్రాము మరియు నేను ఎడతెగక ప్రార్థించినప్పుడు, ఒక విమోచకుడు వచ్చుటకు ఇదియే సమయమని మేము వాక్యమును చూచి గుర్తించితిమి మరియు మేము ఈ విధంగా ప్రార్థించితిమి: "ప్రభువైన దేవా, ఆ విమోచకుడిని మేము చూడగోరుచున్నాము. ఒక రాత్రి దర్శనములో ప్రభువు నీవు జన్మించెదవని మాతో చెప్పెను, మరియు నీవే ఆ విమోచకుడవైయుందువని చెప్పెను. మేము రాజు యొక్క ఆజ్ఞలకు భయపడలేదు. రాజు ఏమి చెప్పెనో దానిని మేము లెక్క చేయలేదు. పిదప నీవు ఒక విమోచకునిగా జన్మించితివని మేము ఎరిగియుంటిమి. ఇప్పుడు, మోషే, మేము నిన్ను ఇక పెంచలేమని ఎరిగియుంటిమి. (ఇప్పుడు, వారు ఐగుప్తులో నాలుగు వందల సంవత్సరముల నుండి యుంటిరని గుర్తుంచుకొనండి), చూశారా? మరియు మేము నీకు సరియైనది ఇవ్వ తలంచితిమి, సరియైన విద్యాభ్యాసము, సరియైన తర్ఫీదు; కావున నేను నిన్ను తీసుకొని మరియు ఒక చిన్న పెట్టెలో పెట్టి నైలు నదిలో విడిచిపెట్టితిని. మరియు ఆ ప్రవాహము ఆ పెట్టెను పొదలగుండా తీసుకొని వెళ్ళుచుండగా నేను ఒత్తిడికి గురియైతిని, మరియు అది కొన్ని మైళ్ళు ప్రయాణము చేసి నేరుగా ఫరో రాజు మందిరము వైపు తిరిగెను, ఎక్కడైతే తన ఫరో కుమార్తె యొక్క స్నానపు వాటిక యుండెనో అటు వైపు తిరిగెను, మరియు నిన్ను పెంచుటకు ఒక స్త్రీ కావలెనని నేను ఎరిగియుంటిని, (మరియు ఆ దినములలో బహుశా పిల్లలను పెంచుటకు వారికి సీసాలు లేవు, మరియు అందువలన వారికి ఒక పాలిచ్చు స్త్రీ కావలసి వచ్చెను. కావున…) మరియు మిర్యాము, నేను ఆమెను పంపితిని మరియు ఆమె అచ్చట నిలచి ఈలాగు చెప్పెను, పాలిచ్చు స్త్రీని ఎక్కడ కనుగొందునో నేనెరుగుదును, మరియు వచ్చి నన్ను తీసుకొని వెళ్ళెను మరియు మోషే … (తలుపులన్నియు వేసియుండెను) హనీ, ఇప్పుడు నీకు 16 సం.,ల వయస్సు, మరియు నీవు ఫరోకు కుమారునిగా ఉండబోవుచున్నావు మరియు ఒకనొక దినమున ప్రజలను ఇక్కడి నుండి తీసుకొని వెళ్ళు విమోచకునిగా నీవు ఉండబోవుచున్నావు."
54మోషే యొక్క ఆశయములు పెరుగుచుండెను అమ్మా, నేను చదువుకుంటాను, నేను చదువగలిగినదంతయు చదివెదను. నేను ఏమి చేయుదునో నీవెరుగుదువా? నేనొక సైనికుడినగుటకు కష్టపడి చదివెదను, మరియు ఈ ప్రజలను ఇక్కడి నుండి ఎట్లు తీసికొని వెళ్ళవలెనో నేనెరుగుదును. నేనొక గొప్ప జనరల్, బిషప్పు, మీకు తెలియును, అది ఎట్లు జరుగవలెనో నేనెరుగుదును, మరియు నేను వారిని బయటకు తీసుకొని వెళ్ళెదను. నేను నా పిహెచ్. డి, లేక ఎల్. ఎల్. డి. ని పొందెదను. నేను - దానిని నేను చేయుదును.
తండ్రియైన షినికివలె, అతని పుస్తకములు మీరు ఎప్పుడైనా చదివినయెడల మీకు తెలియును. మంచిది. ప్రొటస్టెంట్ వారిందరిని విమోచించుటకు అతడు బయలు వెళ్ళెను, మీరెరుగుదురా, మరియు ఆయనే ఒక ప్రొటస్టెంటుగా మారెను, కావున… కొన్ని సంవత్సరముల క్రితం ఈ గొప్ప యాజకుడు, తండ్రియైన షినీకి, మీరు అతని పుస్తకము తెప్పించుకొని మరియు దానిని చదువవలసియున్నది. వారు అతనిని తండ్రి అని పిలిచెదరు, అయితే అది సహోదరుడు షినీకియైయున్నాడు. ఆ విధంగా మనము ఏ మనుష్యుని తండ్రి అని పిలువము.
కావున అతను పరిశుద్ధ గ్రంథమును చదువుటను మనము కనుగొనెదము, దానివలన అతడు అక్కడికి వెళ్ళి ప్రొటస్టెంటు మతమును తప్పని ఋజువుపరచగోరెను, బహుశా అతను పరిశుద్ధ గ్రంథమును చదువుటకు వెళ్ళెనని నేను తలంచుచున్నాను, పరిశుద్ధాత్మ అతని పైకి వచ్చెను, మరియు అతడు పరిశుద్ధాత్మను పొందుకొనెను, మరియు అతడు వారిలో ఒకనిగా మారెను.
ACTS 7:22
55కావున పిదప, దీనిని గమనించండి, మోషే సమస్త తర్ఫీదును పొందెను, ఏలయనగా అతడు ఎరిగియుండె… అతడు చాలా తెలివిగలవాడు, చాలా విద్యనభ్యసించినవాడు. గొప్ప జ్ఞాని, అతని వంటివారెవరు లేకుండెను… అతను ఐగుప్తీయులకు కూడా బోధించగలడు. అతడు వారి మానసిక వైద్యులకు బోధించగలడు. అతడు వారి మిలటరీ జనరల్ కును సైనికశక్తిని గూర్చి బోధించగలడు. అతను ఒక గొప్ప వ్యక్తియైయుండెను, మరియు ప్రజలు అతని గొప్పతనమును బట్టి మోషేయెడల భయము కలిగియుండిరి.
ఓ, ఎటువంటి విద్యావేత్త, మై, అతను ఒక ఆర్చి బిషప్పు లేక ఒక పోపు వలెయుండెను. అతను ఒక గొప్ప వ్యక్తి మరియు అతను ఒక గొప్ప పరాక్రమశాలియైయుండెను. మరియు అతను దీనిని చేయుటకై జన్మించెనని ఎరిగియుండెను. మరియు గొప్ప ఆశయములతో దానిని చేయుటకై తర్ఫీదు పొందెను.
56ఈ దినమున వలెనె, ఆ మనుష్యులు ఇటువంటి పాఠశాలలో తర్ఫీదు పొందెనని నేను చెప్పను… నేను దానిని చెప్పుట లేదు. ఇప్పుడు, ఇచ్చట పశ్చిమాన ఉన్న విధముగా, వారు నూట-యాభై మిలియన్ డాలర్లతో ఒక పెంతెకోస్తు వేదాంత పాఠశాలను నిర్మించబోవుచున్నారు. చూశారా, ఒక నూట-యాభై మిలియను డాలర్ల పాఠశాల. నా మట్టుకైతే అది సువార్త పొలములో బోధించు మిషనరీలకై యుండవలెను.
అయితే ఏది ఏమైనను, వారు అక్కడి నుండి బయటకు వచ్చినప్పుడు వారు ఏమి చేయుదురు? వారు ఏమి అనబడుదురు? ఒక రిక్కీల గుంపు, ఖచ్చితముగా అంతే. మరియు వారు ఆ విధముగానే బయటకు వచ్చెదరు. ఆ మిగిలినవారందరు అదే విధముగా నుందురు. మరియు అదే వరుసలో నుందురు.
EXOD 2:12•
ACTS 7:22,24,30•
GAL 1:17
57మరియు మనము కనుగొన్న విధముగా మోషే తన తర్ఫీదంతటిలో, మరియు ఈ దినమున తర్ఫీదునంతటితో గొప్ప ఉన్నత ఆశయాలతో పెద్ద బిషప్పులను చేయుచు మరియు ఇంకా ఆ విధముగా చేయుచూ, మనము ఏమి చేయుచున్నాము? మన ఆశయాలు కేవలము మోషే యొక్క ఆశయాలవలె అగుచున్నవి. చూశారా? దేవుడు ఒక వ్యక్తిని తన చేతిలోనికి తీసికొనుటకు ముందు, ఆయన అతని యొక్క ఆశయములన్నింటిని ఒలిచివేయవలసియుండెను. ఆయన అతని సమస్త తర్ఫీదును తీసివేయవలసియుండెను.
అతను వెళ్ళెను మరియు అతను విమోచించెను… అతను ఒక ఐగుప్తీయుని చంపెను మరియు అతను అట్లు చేసినప్పుడు, అతడు తప్పిదములో వుండెనని అతడు కనుగొనెను, అతడు దానిని చేయలేకపోయెను. దానిని చేయుటకు మార్గము అది కాదు. మరియు దేవుడు అతనిని అరణ్యములోనికి కొనిపోవలసి వచ్చెను, అరణ్యములలోనికి, ఒక ఎడారి స్థలము.
మీరు గమనించండి, ఈ వ్యక్తుల కొరకు వర్తమానము కలిగివున్న దేవుడు వారిని ఎడారి లోనికి తీసికొని వెళ్ళుట అనునది ఒక వింతగా ఉన్నది. ఆయన పౌలుకు తర్ఫీదు ఇచ్చుటకై, ఆయన యొక్క గొప్ప దర్శనములన్నియు ఏమైయున్నవో తెలియజేయుటకై అతనిని ఎడారిలోనికి తీసికొని వెళ్ళెను. "ఎడారిలోనికి వెళ్ళుట," ఫలాన ఎడారిలోనికి వెళ్ళుట మరియు దేవుడు తాను ఏమి చేయవలెనో పూర్తిగా చెప్పువరకు అతను అక్కడనే ఉండెను.
ACTS 7:29,30
58మోషే కాలములో ఆయన అతనిని ఎడారిలోనికి తీసికొనిపోయెను, నలుబది సంవత్సరములు అతనిని అక్కడ ఉంచెను మరియు అతని వేదాంత విద్యనంతటిని మరియు అతని ఆశయములన్నింటిని ఒలిచి వేసెను. ఓ అతను వెనుదిరిగి తన అపజయమును చూచుటకు అది ఎటువంటి సమయము మరియు ఈ రాత్రి, మనము కూడా మన ఆశయములను చూచినప్పుడు ఆ రీతిగానే చేయవలసినవారమై యున్నాము.
ప్రభువు కొన్ని సంవత్సరముల క్రితము రోగుల స్వస్థతను మరియు అటువంటి దానిని పునరుద్ధరించుటకు ఏదైనను చేసియుండెనోయని చూచుటకు స్వస్థత కూడికలను చూడుడి. ప్రతీ ఒక్కరూ, ప్రతీ సంస్థ వారికొరకు ఒక స్వస్థపరచు వానిని తెచ్చుకోవలసి వచ్చెను, ఏలయనగా అది వారి సంస్థలోనికి రాలేదు. మరియు మనము ఏమి చేసితిమి?
ఒక్క క్షణము మనము చూచెదము. మోషే చేసిన కార్యమునే మనము చేసితిమి. మనము వెళ్ళి ఒక అద్భుతమును తయారు చేయుటకై ఎంతగానో ప్రయత్నించితిమి. నేను "ఒక వ్యాధిని వెళ్ళగొట్టితిని" — "నా చేయి పై రక్తమును కలిగియున్నాను." ఒక అద్భుతమును తయారు చేయుట. మరియు, మనము దేనిని పొందుకొంటిమి?
కొంతమంది వ్యక్తులు ఎంతగానో శ్రమించి విసిగిపోయి మరియు త్రాగుబోతులుగా, మతి స్థిమితము లేనివారుగా మారిపోయిరి మరియు వారి మనస్సులు అవాంతముగ పెంతెకోస్తు భావము నుండి తిరిగి ఒక సంస్థను తయారు చేయుట మరియు అటువంటి కార్యములవైపు మలచబడినది.
చూచారా,
JOHN 3:3,5•
ACTS 2:38•
ACTS 7:30
59మనము ఏమి చేశామో, చూడండి, ఒకనొక ఐగుప్తీయుని చంపితిమి. అది నిజము. మరియు మనము ప్రయత్నించితిమి, మనము శ్రమించితిమి, మనము చెల్లించితిమి, మనము దేనినో తయారుచేయుటకు లేక అటువంటి విషయముల కొరకు మన గొంతులు పోయేవరకు సంపూర్ణ రాత్రి ప్రార్థన కూటములలో రాత్రంతయూ శ్రమించితిమి; మరియు పూర్తిగా ఓడిపోతిమని కనుగొంటిమి. ఎడారికి వెళ్ళవలసిన అవసరత మనకున్నది. అది నిజము. అవునండీ!
వీథి కూటములు మరియు ఇబ్బందులు. మనము ఎందుకు వదిలి వేయకూడదు? మీరు చేయవలసినది అదేయైయున్నది. వెనుదిరిగి మరియు వదిలివేయుము. ఎందుకు, వారేమి చేసిరో మనమూ అదే చేసితిమి, మోషే ఏమి చేసెనో అదే చేసితిమి. దానివలన ఎటువంటి ప్రయోజనము లేదు. నలువది సంవత్సరముల తరువాత అతడు తనకు-తాను, దేవుని వాక్యమునకు ఒక ఖైదీ అని తెలిసికొనెను.
60ఆ గొప్ప దీవెన వచ్చిన తరువాత మరియు దేవుడు మనకు చెప్పినటువంటి ఈ గొప్ప విషయములన్నిటి బయలుపాటు, మనము ఏలాగు తిరిగి జన్మించవలెననునది, మరియు ఏలాగు పరిశుద్ధాత్మను పొందవలెననునది, యేసుక్రీస్తుని నామమున బాప్తీస్మము మరియు ఇక్కడున్న ఈ కార్యములన్నియు వచ్చిన తరువాత మనము ఏమి చేయుటకు ప్రయత్నించుచున్నాము. మీరు చూడండి. జనులు ఆ వాక్యముతో నిలచియుండుటకు బదులు, దానిని అదుపు చేయుచున్నారు — వారు ఏమి చేసిరి? వారు ముందుగానే ఓడిపోయిన వారి యొక్క స్వంత సంస్థాగత సిద్ధాంతముతో ప్రారంభించిరి, మరియు సత్యము వలెనే కనిపించుదేనినో తయారు చేయుటకు ప్రయత్నించిరి.
61నేను అక్కడే ఆపుట మంచిది. చూశారా? మీరు నా భావము తెలిసికొనుటకు సరిపడ జ్ఞానమును కలిగియున్నారని నేను నిశ్చయతతో ఉన్నాను. చూశారా? అయితే ఎందువలన? అది ఏమి చేసెనో చూడండి. దాని గూర్చి ఆలోచించండి. దేవుని లేఖనములను ధిక్కరించుచూ పరిశుద్ధాత్మను జీవమును: మానసిక వెర్రితనముగా పిలచుచూ — అటువంటి వారిని తమ సంఘములోనికి వచ్చుటకు అడ్డగించుచూ సమస్తమూ సంస్థాగతమయిపోయిన ప్రజలున్న ఒక దేశము తప్ప ఈ రాత్రి మనము కలిగియున్నదేమిటి మరియు సర్పసంతానము, నిత్య భద్రత, మరియు పరిశుద్ధాత్ముడు బయలుపరచి వాక్యముగా ఋజువు చేసిన విషయములను గూర్చి ఒక్క మాటయైననూ చెప్పుటకు మీరు వారు అనుమతిని ఇవ్వరు.
వారు వచ్చి అది తప్పు అని నిరూపించుటకు మేము వారికి సవాలు మీద సవాలు చేసితిమి. వారు కలిగియన్నదేమిటి? లూథర్ మరియు తక్కిన వారు ఏమి కలిగియుండిరో దానినే కలిగి యుండిరి. చూశారా?
ఒక ఐగుప్తీయుని చంపిర. అదేమైయున్నది? బహుశా అది ఒక వ్యక్తిని దొంగతనము చేయుట ఆపియుండవచ్చును లేక తన భార్యపట్ల నమ్మకముగా జీవించు నట్లు చేసియుండవచ్చును, అయితే దానివలన అతనికి ఏమి ప్రయోజనము కలుగునట్లు మీరు చేయుదురు? ఒక సంఘ సభ్యునిగా చేయును. "వచ్చి, మా సమూహములో చేరుము,"
EXOD 2:12
62చూడండి, అతడు తన వ్రేళ్ళతో చూపించగల తన 40 సంవత్సరముల తర్ఫీదు యొక్క విజయము ఏదనగా — కంపు కొట్టుచూ చనిపోయిన అచ్చట పడియున్న ఒక ఐగుప్తీయుడు.
ఈ రాత్రి కూడా ఆ రీతిగానే ఉన్నది. మనము చూపించగల ఒకే ఒక కార్యమేదనగా మనలను దాటుకొని వెళ్ళుచున్న ఈ ఉజ్జీవమును గూర్చి తెలియపరచుటయే, ఐగుప్తీయుల రాత్రి గురించి హాటెంటాట్ కు ఎంత తెలియునో అట్లే దేవుని గూర్చి ఎరుగని కంపు కొట్టుచున్న సంఘ సభ్యులకు అంతే తెలియును. అది నిజము. దేవుని వాక్యము గూర్చి వారికి చెప్పుము. నేను "దానిని నమ్మను. నీవు చెప్పునది నేను లెక్కచేయను. దానిని నమ్ముటలేదు," అని వారు చెప్పుదురు. దాని గూర్చి ఎత్తి చెప్పుట ఒక భయంకరమైన కార్యమైయున్నది. మనకున్న శ్రమలు మరియు కష్టములు మరియు మనకున్న వాటన్నిటిని బట్టి అట్లున్నది.
2PET 2:22
63బహుశా మనము ఒక పెద్ద పాఠశాల వైపు చూపించవచ్చు; అయితే అది మృతమైనది! మనము ఒక సంస్థ వైపు చూపించవచ్చు, కాని అది మృతమైనది! అది కంపు కొట్టుచున్నది. అది మనము మొట్టమొదటి బయటికి వచ్చిన దానివలె ఉన్నది. మనము వెనుదిరిగి వెళ్ళుట ఒక కడగబడిన పంది బురదలో దొర్లుటకు మళ్ళినట్లును మరియు కుక్క తన వాంతికి తిరిగినట్లుగా ఉన్నది.
ఒక చచ్చిన ఐగుప్తీయుడు…
EXOD 2:12•
EXOD 3:2,6,8,10•
ACTS 7:30,32,34
64"మోషే నీకు జనుల గూర్చి ఎటువంటి చింతయూ లేదా? నీవు దీనికొరకై పిలువబడితివని," మోషేని ఎరిగినవారు, అది ఎవరో ఒకరు చెప్పెననుటలో ఎటువంటి సందేహము లేదు.
"జనులపట్ల నీకు చింతలేదా?"
"లేదండి."
"మంచిది, నీవు దీనిని చేయుటకు ఎందుకు బయలుదేరితివి? నీవు దీనిని చేయుటకు ఎందుకు ప్రయత్నించితివి? తక్కిన వారితో నీవెందుకు వెళ్ళుట లేదు?"
దేవుని వాక్యమును బయలుపరచు మండుచున్న పొద వద్ద అనుభవమును పొందు వరకు మోషే అచ్చటనే ఒలవబడుచుండెను. "నేను అబ్రహాము, ఇస్సాకు, మరియు యాకోబుల దేవుడను; నేను నా వాగ్ధానమును జ్ఞాపకము చేసికొనియున్నాను; మరియు వారిని విమోచించుటకు నేను దిగి వచ్చియున్నాను; మరియు దానిని చేయుటకు నేను నిన్ను పంపుచున్నాను."
అది అంతే.
EXOD 3:2,5•
EXOD 4:10•
ACTS 7:22,30,33
65అతను ప్రజల యొక్క ఆశయములను కాదు, లేక ప్రజల యొక్క కోరికలను కాదు, కాని అతడు వాక్యమును చూచెను. అంతట అతను ఏమాయెను? ఐగుప్తీయులను ఎదుర్కొనుటకు అతడు ఎంత మాత్రము ఇష్టపడలేదు, అయితే అతడు ఒక ఖైదీ ఆయెను! ఆమేన్.
సంవత్సరములు పరుగిడుచూ, ఒలవబడుచూనుండెను, అయితే పిదప మండుచున్న పొద వద్ద అతడు ఒక ఖైదీగా మారెను. ఆ బలవంతుడైన మోషే తన జ్ఞానమంతటితో. ఐగుప్తులో మాటలయందు లేక కార్యములయందు మోషే గొప్ప ప్రవీణుడైయుండెనని, పరిశుద్ధ గ్రంథము చెప్పుచున్నది.
అయితే మండుచున్న పొద యొక్క సన్నిధిలో ఆ గొప్ప తత్వవేత్త ఏమి చేసెను? గమనించండి. అతడు కేవలము తన శక్తిహీనతను ఒప్పుకొనెను. అతడు దేవుని వాస్తమైన ఉద్ధేశ్యమును చూచినప్పుడు, అతడు దానిని చేయలేనని ఒప్పుకొనెను. అయినను వారతనికి ఇవ్వగలిగినంత వేదాంత పాండిత్యమంతటిలో అతడు తర్ఫీదునొందెను, వారి అత్యున్నత పాఠశాలలో తర్ఫీదు నొందెను, అయినను పొదలో వ్రేలాడుచున్న ఆ అగ్నిస్థంభమును చూచినప్పుడు అతడు ఏమి చేయగలిగెను. అతడు చెప్పెను, "నేను నోటి మాంద్యము గలవాడను."
"ప్రభువా, నేను వెళ్ళుటకు నేనేపాటివాడను?" "మోషే, నీ చెప్పులు విడువుము. నేను నీతో మాటలాడగోరుచున్నాను. క్రింద కూర్చొనుము — నీ చెప్పులు సహితం. నేలపై సాగిపడుము, నేను నీతో మాటలాడ గోరుచున్నాను."
EXOD 3:4,12-14•
EXOD 4:1,2,20
66కనీసం మాటలాడలేకపోయెను. చివరిగా, ఒక ఎన్నుకొనబడిన ఖైదీ, ఒక ఎన్నుకొనబడిన ప్రవక్త, పౌలు ఎన్నుకొనబడిన రీతిగా.
మోషే ఎన్నుకొనబడిన విమోచకుడైయుండెను, చివరిగా దేవుడు తాను ఎన్నుకొనిన వానిని తనకు ఖైదీగా చేసుకొనెను. ఓ, హల్లెలూయా! దేవుని వాక్యము అతనిని నడిపించినట్లుగానే అతడు నడవగలిగాడు.
"నన్ను ఎవరు పంపితిరని నేను చెప్పవలెను?"
"నేను ఉన్నావాడను."
"నేను ఎలాగు చేయగలను?"
"నేను నీతో నుందును."
"చిత్తము ప్రభువా, నీవు చెప్పినట్లుగానే ఇదిగో నేనున్నాను."
"ఓ, మై, అది… "అతడు ఒక ఖైదీయైయున్నాడు. అతడు తన ఉన్నతమైన ఆలోచనకు వ్యతిరేకముగా వెళ్ళుచుండెను."
ఇప్పుడు, అతడు ఒక సైన్యమును ఆజ్ఞాపించుటకు తర్ఫీదునొందెను, "ఖడ్గము పైకెత్తి," ముందుకు వెళ్ళుటకు తర్ఫీదునొందెను, "రథములన్నియు సరియైన వరుసలో, ఈటెలు పడుచుండగా," ఆ విధముగా అతడు జయించపోవుచుండెను. అది అతనికున్న తర్ఫీదైయుండెను, కాని అతడు ఈలాగు చెప్పెను, "నేను దేనిని ఉపయోగించబోవుచున్నాను?"
" నీ చేతిలోనిది ఏమిటి?" అని ఆయన అడిగెను.
ఒక కర్ర! కొన్నిసార్లు దేవుడు చేయు కార్యములు మానవ తలంపునకు అపహాస్యముగా నుండును. అతని చేతిలో ఒక కర్రను కలిగియుండెను. వ్రేలాడుచున్న గడ్డము, ఎనభై సంవత్సరముల వయస్సు, ఒక గాడిదపై ఆయన భార్య, ఆమె ఒడిలో కూర్చొనియున్న చిన్న బిడ్డ, ఆ చిన్న కర్రతో వ్రేలాడుచూ ముడుతలుపడిన చేతులు గలవాడై, కేవలం తన తలను పైకెత్తి చూచుచుండెను, ఏలయనగా అతడు "యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు" అను దానిని కలిగియున్నాడు. ఏమిటి? (అతడు చివరికి లంగరువేయబడెను!)
67అతడు ఒక ఖైదీయైయుండెను.
"వాక్యము నన్ను కదిలించినప్పుడే నేను కదిలెదను. వాక్యము ఎప్పుడు మాటలాడునో అప్పుడే నేను మాటలాడెదను."
"నీవు ఎక్కడికి వెళ్ళుచున్నావు?"
"నాకు ఒక కర్తవ్యం ఉన్నది. ఫరో ఎదుట నిలచుట. దేవుడు నన్ను పంపెనని ఈ కర్ర వలన అతనికి చూపించవలసియున్నది."
"దాని తర్వాత నీవు ఏమి చేయబోవుచున్నావు?"
"నేను దీనిని చేసిన పిదప ఆ తర్వాత కార్యమును ఆయన సిద్ధపరచును."
అక్కడే నీవున్నావు. ప్రథమ కార్యమును చేయుటయే నీవు చేయవలసిన కార్యమైయున్నది. అది నిజము. లొంగిపోవుట. ఒక ఖైదీగా మారుట. నీ గూర్చి గాని వేరే దేని గూర్చి గాని ఆలోచించకుము. ఒక ఖైదీగా మారుము.
EXOD 4:10
68మోషే ఒక ఖైదీగా మారెను. అతనికి కనీసం మాటలాడుట కూడా రాదని ఒప్పుకొనెను. నేను చివరిగా, దేవుడు అతనిని తన హస్తములోనికి తీసుకున్నప్పుడు, దేవుడు అతనిని ఎక్కడికి నడిపించెనో అక్కడికే అతను నడవగలిగెను. ఎక్కడికి… ఆయన అతనికి వాక్యమును చెప్పెను. అది వాక్యమేనని అతడు ఎరిగియుండెను. అంతట అక్కడే అతడు వాక్యమును మరియు పరిశుద్ధాత్మకు తనను-తాను అప్పగించుకొనెను. దేవుడు, మోషేను తన చిత్తప్రకారము ఆయన స్వాధీనములోనికి తీసుకొనెను.
ఆయన అదే కార్యమును పౌలు పట్ల జరిగించెను. అవునా? ఆయన మొనదేలిన చిన్న ముక్క, దూషించే యూదుడైన పౌలును స్వాధీనపరచుకొనెను. పౌలు, తన పి. హెచ్. డి మరియు ఎల్. ఎల్. డిలతో వుండెను, కానీ "వాక్యము, నిమిత్తము తాను ఏ విధముగా శ్రమపడవలసినది నేను అతనికి చూపించబోవుచున్నాను," అని ఆయన చెప్పెను.
EXOD 3:6,7•
ACTS 7:32,34
69మరియు పిదప పౌలు అక్కడ కూర్చొనియుండెను, మరియు వాక్యమును చూచుచు అది యేసు అని గుర్తించెను, అంతట అతను తన చేతులెత్తి ఆయన స్వాధీనములోనికి వెళ్ళెను. దేవుని ప్రేమ అతడిని వాక్యము యొక్క స్వాధీనములోనికి తీసుకొని వెళ్ళెను. అన్యుల ఎదుట అతడు నా నామమును భరించును. అతడు అచ్చటకు వెళ్ళెను.
మోషే, నేను నీ పితరుల దేవుడను, నేను అబ్రహాము, ఇస్సాకు, మరియు యాకోబుల దేవుడను. నాకు జ్ఞాపకమున్నది, నేను వారికి వాగ్ధానము చేసితిని, మరియు ఆ వాగ్ధాన సమయము సమీపించినది. మరియు నా ప్రజల యొక్క శ్రమను నేను చూచితిని. నా వాగ్ధానమును నేను జ్ఞాపకము చేసుకొనుచున్నాను. మరియు నేను నిన్ను స్వాధీనపరచుకొనుటకు దిగి వచ్చితిని. వాక్యము ఏమి చెప్పుచున్నదో మీరెరుగుదురా.
EXOD 3:1,2,4•
EXOD 4:3,4•
1SAM 17:40•
ACTS 7:29-31•
ACTS 9:3,4•
ACTS 22:3,6,7•
GAL 1:17•
HEB 13:8
70అచ్చటకు వెళ్ళుటకు నిన్ను స్వాధీనపరచుకొంటిని, అచ్చటకు వెళ్ళి నా ప్రజలను విమోచించుటకు శక్తితో నిన్ను స్వాధీనపరచుకొంటిని. ఆ కర్రతో నీవు ఒక అద్భుతమును చూచితివి గనుక దానిని ఒక సాక్ష్యముగా నీ చేతిలోనికి తీసి కొనుము. దావీదు వడిసెలను తీసుకొనిన విధముగా.
తన్ను-తాను సమర్పించుకొని, మరియు అతను బయలు వెళ్ళెను. చివరిగా దేవుడు, తనకు విధేయుడై, దేవుని వాక్యము నడిపించితే తప్ప ముందుకు నడవలేని ఒక వ్యక్తిని తీసికొని స్వాధీనపరచుకొనెను. ఈ దినమున ప్రజలు కేవలం ఆలాగు చేసినయెడల.
అంతట అతను ఆయనకు ఖైదీగా ఆయెను — ప్రేమకు ఒక ఖైదీ, దేవుని యొక్క ప్రేమ బంధములో బంధించబడుట, పౌలు దేవుని ప్రేమ బంధములో బంధించబడినట్లు, కేవలం పౌలు వలె. వారిరువురు ఒకే రీతిగా తర్ఫీదునొందిరి. మోషే సైనిక బలము చేత ఇశ్రాయేలీయులను విడిపించుటకు తర్ఫీదునొందెనని మీరు ఎరుగుదురు. పౌలు ఆ దినములలో మత ఛాందస శక్తి ద్వారా వారిని రోమీయుల హస్తముల నుండి విడిపించుటకు తర్ఫీదునొందెను. గమలియేలు ఆధ్వర్యములో గొప్ప తర్ఫీదు పాఠశాలలు వెలసెను, మరియు వారిరువురు ఎడారిలోని కివెళ్ళిరి; భిన్నమైన వ్యక్తులుగా తిరిగి వచ్చిరి.
వారిరువురు అగ్ని స్థంభమును చూచిరి, మరియు వారిరువురూ ప్రవక్తలై యుండిరి. అది నిజమేనా? వారిద్దరూ ప్రవక్తలు, మరియు వారిద్దరూ అగ్నిస్థంభముతో మాటలాడిరి. అది ఖచ్చితముగా సరియే, విమోచించుటకు వచ్చుచున్నారు. అక్కడే వారున్నారు. ఒక ఎడారిలోనికి వెళ్ళిరి. వారు తమ గృహములను విడిచి మరియు అరణ్యమునకు వెళ్ళిరి. దేవుని చిత్తమును కనుగొనుటకు, తమ ప్రజలను, మరియు సమస్తమును విడిచి వెళ్ళిరి.
వారు ఒక విధానములో తర్ఫీదునొందిరి: దేవుడు వారిని మరొక విధానములోనికి మార్చెను. మరియు వారు తమకి ఇష్టము వచ్చిన రీతిలో పనిచేయుటకు కాదు కానీ, దేవుడు కోరిన రీతిలో పనిచేయునట్లు పూర్తిగా ఖైదీలైతిరి. ఆయన నిన్న, నేడు, నిరంతరము ఏకరీతిగా ఉన్నాడు.
GEN 37:7
71ఇంకొక కార్యమును ఎత్తిచూపించునట్లు, మనకింకా పది నిమిషముల సమయమున్నదా? నేను నిజముగా త్వరపడి, మరొక వ్యక్తిని తీసికొనెదను. నా యెదుట ఇప్పుడు ఒకనిని చూచుచున్నాను. అతని పేరు యోసేపు. అతను ఒక ఎన్నుకొనబడిన కుమారుడై యుండెను. అతను యేసు క్రీస్తునకు ఒక పరిపూర్ణ మాదిరిగానున్నాడు. అతను ఒక ప్రవక్తగా జన్మించెను. అతడు కూడా ఒక ప్రవక్తే. చూశారా? మరియు ఇప్పుడు, అతడు దర్శనములు చూడగలడు, మరియు అతడు ఇంకనూ చిన్న బాలునిగా ఉన్నప్పుడు, తాను సింహాసనముపై కూర్చున్నట్లు, మరియు తన సహోదరులు తనకు సాగిలపడినట్లుగా అతడు తనను గూర్చి తానొక దర్శనమును చూచెను.
అయితే గమనించండి. అతను ఒక గొప్ప వ్యక్తినని అనుకొనెను. చూడండి, మరదంతయూ - అయితే దేవుడు ఏమి చేయవలసి వున్నది? ఆయన తక్కిన వారికి చేసినట్లు గానే చేసెను, ఏలయనగా మోషే ఒక విమోచకుడైయుండెను, పౌలు ఒకవిమోచకునిగా ఉండెను, మరియు ఇప్పుడు యోసేపు ఒక విమోచకుడైయుండెను. అతడు తన ప్రజలను కరువు నుండి రక్షించెను.
GEN 37:7,36•
GEN 39:1,4,20
72దేవుడు అతనికి ఏమి చేయవలసియున్నది? అతనిని చెరసాలలో వేయవలసియున్నది, నేరుగా చెరసాలలోనికి.
అవునండి, అతడు తన అన్నల చేత ఒక ఐగుప్తీయునికి అమ్మబడెనని గుర్తుంచుకొనుడి, మరియు వారు అతనిని పోతీఫరునకు అమ్మిరి, మరియు పోతీఫరు అతనికి కొద్దిగా స్వేచ్ఛను ఇచ్చెను, మరియు మొదటి కార్యమేదో మీకు తెలియునా, అదియే అతని యొద్ద నుండి తీసివేయబడినది. మరియు అక్కడ చెరసాలలో అతను కూర్చొని మొర్రపెట్టుచు, మొర్రపెట్టుచునుండెను. దేవుడు దానిని తీసివేయవలసియున్నది.
ఇప్పుడు, గమనించండి. అయితే అతడు చెరసాలలోవున్న సమయమంతయూ అతడు సింహాసనముపై కూర్చొండుననియు మరియు తన సహోదరులు అతనికి నమస్కరించుదురనియు చెప్పబడిన ఆ దర్శనమును గుర్తుచేసికొనుచుండెనని నేను నమ్ముచున్నాను, ఏలయనగా అతనికి బహుమానము దేవుని యొద్ద నుండి వచ్చునని అతడుఎరిగియుండెను, మరియు అది నెరవేరునని అతడు ఎరిగియుండెను.
73మనము కేవలము దానిని మన మనస్సులలో ఉంచుకొనినయెడల, ఏమనగా దేవుని వాక్య ప్రకారము ఈ అంత్య-దినములలో ఆయన ఒక సంఘమును కలిగియుండును, ఒక జనమును ఆయన కలిగియుండును, మరియు ఆయన వాగ్దానము చేసిన ఈ కార్యములను, ఆయన జరిగించును. ఆయన చేయుదునని చెప్పెను, మరియు మనము ఆ సమయములోనే ఉన్నాము, మనమక్కడే ఉన్నాము. ఇప్పుడు కేవలం, ఆయనతో బంధింపబడునట్లు, మనలను నిజమైన ఖైదీలనుగా చేయుటకు ఆయన ప్రయత్నించుచున్నాడు.
మనము పాడెడు ఆ పాత పాట మీకు తెలియునా: మరియు అంతట "నేను దేవునితో బంధింపబడితిని; ఓ, దేవునితో బంధింపబడ గోరుచున్నాను?" ఇప్పుడు, దీనిని గూర్చి నేను ఆలోచించినప్పుడు దేవునితో బంధింపబడుట అనగా మరేదో కాదు, నీవు కేవలం దేవుని సెలవుచొప్పుననే కదిలెదవు. నీవు కేవలం దేవుడు ఏమి చెప్పునో దానినే చేసెదవు. అప్పుడే నీవు దేవునితో బంధించబడితివి.
GEN 39:20
74ఇప్పుడు, గుర్తుంచుకొనండి, అతను ఆలోచించుచుండెను. అతడు తనకు-తానుగా పూర్తిగా విఫలుడాయెను. అతనికి తెలిసినదంతయు, అతను గ్రహించినదంతయు, మరియు సమస్తము; అతడు పూర్తిగా విఫలుడాయెను. అది పనిచేయలేదు. ఎవరునూ అతని మాట విననటువంటి పరిస్థితిలో అతను ఉంచబడెను. మరియు అతను ఒక ఖైదీ.
అవిశ్వాసులు నమ్మనటువంటి పరిస్థితిలో అతడు ఉంచబడెను. నా భావమును మీరు గ్రహించితిరా? అతని పరిచర్య ఏమాత్రము ప్రభావము చూపలేదు; ప్రజలు వారి తలలు తిప్పుకొనిరి. వారు చెరసాలలో అతని పట్ల ఎటువంటి శ్రద్ద చూపలేదు. అతని పరిచర్య ఏలాంటి మంచి చేయును? అతను చెరసాల చువ్వల మధ్య నుండి వారికి బోధించవచ్చును — వారు వీథిలో నడిచిపోవుదురు. చూశారా? అయితే అతడు ఒక ఖైదీ ఆయెను చక్రము తిరిగి సరైన స్థానములోనికి వచ్చు వరకు దేవుడతనిని ఒక ఖైదీగా వుంచెను, మధ్యరాత్రి.
మహిమ! — పూర్తి వైఫల్యము.
GEN 37:7•
GEN 39:20•
GEN 41:13,14,40•
ACTS 16:26
75చివరిగా, దేవుడే తన చెరసాలలో అతనిని (యోసేపును) కలుసుకొనెను. పౌలు వలె, ఆ తక్కినవారి వలె, ఆయన అతని యొద్దకు వచ్చెను మరియు అతను అక్కడి నుండి బయటపడునట్లు ఆయన అతనికి ఉన్న వరమునే ఆయన వాడుకొనెను. ఖచ్చితముగా, ఆయన అతనిని చెరసాలలో నుండి బయటకి తెచ్చెను. అతడేమి చేసెను? ఆయన అతనిని చెరసాల నుండి బయటకి తెచ్చిన వెంటనే, రాజు ద్వారా అతనికి అధికారమియ్యబడెను. అతని క్రిందినుండెడివాడు, అయితే ఇప్పుడు రాజు ప్రక్కన కూర్చొండెను. అతను బంధీ గృహము నుండి తీసుకురాబడెను. మరియు అతడేమి చెప్పినను జరుగునట్లు అతనికి అధికారము ఇవ్వబడెను. ఆమేన్.
అతడు తన చెరసాలలో, అతడు ఆ ఉద్ధేశ్యము కొరకే జన్మించెనని ఎడతెగక స్థిరముగా గుర్తుంచుకొనెను. అతడు ఒక రాజు ప్రక్కన కూర్చుండుటకై జన్మించెను, మరియు తక్కిన వారందరునూ అతనికి మోకాళ్ళుని నమస్కరించెదరు. అతని దర్శనము ఆ విధముగా అతనికి చెప్పెను. ఆమేన్. అయితే అతని దర్శనము పూర్తిగా నెరవేరుటకు ముందు, అతడొక ఖైదీగా మారవలసియుండెను. ఆమేన్. అంతట అతడు ఒక పరిపాలించు వాడాయెను. మరియు అతడు బంధీగృహము నుండి బయటకు వచ్చి మరియు దేవుని వాక్యమునకు ఒక ఖైదీయైనప్పుడు, దేవుడు తన నోటితో ఏది పలుకుటకు చెప్పునో, దానినే అతడు పలుకును, అంతట దేవుడు తన ద్వారా కదిలెను!
MATT 17:20•
MARK 11:23
76గమనించండి, మోషే తన స్వచిత్తము వలన ఫరో యొక్క చెరసాలను బంధించుటకు శక్తిగలిగి యుండెను. మీరు "ఈ కొండను కదిలిపొమ్మని చెప్పినయెడల." అతడు ఫరో యొక్క చెరసాలను బంధించుటకు శక్తిగలిగియుండెను. వారు సంఘ పెద్దలైనను, ప్రెస్బిటర్లుయైనను, లేక వారు దేశ ప్రతినిధులైనను లేక వారెవరైనను, "నేను మిమ్మును బంధించెదను," అని అతడు చెప్పెను. ఆయన దానిని చెప్పెను మరియు వారట్లే బంధించబడిరి అది అంతే. అతడు తన స్వంత మాటచేత మరియు తన స్వచిత్త ప్రకారము దానిని చేయగలిగియుండెను. ఆమేన్. దేవునికి మహిమ.
ఓ, నా మాట నిలబెట్టుకొనుటకు నాకు కేవలం మూడు నిమిషముల వ్యవధి మాత్రమే ఉన్నది.
HEB 11:26
77ఇప్పుడు, లోకము యొక్క ఖైదు నుండి దేవుని యొక్క ఖైదీగా అతడు మారెనని మనము కనుగొంటిమి. పౌలు అదే రీతిగా, మరియు మోషే అదే రీతిగా మారెను. తన స్వంత ఆలోచనకు ఖైదీయైయుండుట నుండి దేవుని యొక్క ఖైదీగా మారుట. మరియు అతడు బయటికి వచ్చినప్పుడు అతడు దేవుని యొక్క శక్తిని కలిగియుండెను.
మరియు అతడు పౌలుగా మారినప్పుడు… ఎప్పుడైతే మోషే యొక్క స్వంత ఆలోచన… అతడు లొంగిపోయెను మరియు ఒలిచివేయబడెను. అతడు క్రీస్తు యొక్క వాక్యమునకు ఒక ఖైదీగా మారెను. అతడు కేవలం ఎక్కడికి నడిపించబడుననగా… మీరు చెప్పవచ్చును, క్రీస్తు… అతడు ఐగుప్తు ధనము కంటే క్రీస్తును గూర్చిన నింద గొప్ప భాగ్యముగా ఎంచుకొనెను. అందుచేత పౌలు వలె క్రీస్తుకి అతడు ఒక ఖైదీగా ఉండెను.
78మరియు గుర్తుంచుకొనండి, ఆ ముగ్గురు ప్రవక్తలైయుండిరి చూశారా? మరియు వారు దేవుని చిత్తమునకు మరియు మార్గములకు ఒక ఖైదీగా ఉండుటకై వారు తమ స్వంత చిత్తము నుండి విడిపింపబడవలసియుండిరి. మరియు అతడు తన స్వంత మాటచేత బంధించు శక్తి గలిగియుండెనని మీరు ఇప్పుడు గుర్తుంచుకొనండి; అతడు తన స్వంత మాట చేత విడిపించు శక్తిగలిగియుండెను. "నా రాజు యొక్క నామమున నేను నిన్ను విడిపించుచున్నాను," అని అతడు చెప్పగలిగియుండెను. ఆమేన్!
ఫరో యోసేపును తన కుమారునిగా చేసుకొనెను.
MATT 17:20•
MARK 11:23•
JOHN 1:1,14•
JOHN 14:12•
JOHN 15:7•
HEB 13:8
79క్రీస్తు తన ప్రేమకు ఖైదీలైన వారిని, తన కుమారులుగా చేయును మరియు ఆయన తాను కలిగియున్న అదే శక్తిని వారికి అనుగ్రహించును: పరిశుద్ధ యోహాను 14:12లో ఆయన చెప్పిన విధముగా "నాయందు విశ్వాసముంచువాడు నేను చేయు క్రియలు చేయును." "అంతకంటే గొప్ప కార్యములునూ చేయును."
ఇప్పుడు, క్రీస్తు ప్రేమకు ఖైదీయైనవాడు తన రాజైన క్రీస్తు ద్వారా శక్తి అనుగ్రహించబడును. ఆమేన్. మరియు ఈ కొండతో ఇక్కడ నుండి కదిలి పొమ్ము అని హృదయములో సందేహింపక మీరు పలికినది జరుగునని విశ్వసించినయెడల ఆలాగు జరుగునని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. "మీరు నా యందు నిలిచిన యెడల మరియు నా వాక్యము మీయందు నిలచినయెడల." మీరు నాకు కట్టుబడిన యెడల… ఏలయనగా ఆయన మరియు ఆయన వాక్యము ఒక్కటే. "ఆదియందు వాక్యము ఉండెను మరియు వాక్యము దేవుని యొద్ద ఉండెను మరియు వాక్యము శరీరధారియై మన మధ్య నివసించెను," నిన్న, నేడు మరియు నిరంతరము ఏకరీతిగా ఉన్నాడు. "మీరు నాలో నిలిచియున్నయెడల [ఇక్కడ మరియు అక్కడ కాదు] …నాలో నిలిచియున్నయెడల, మరియు నా మాటలు మీయందు, మీకేది ఇష్టమో అడుగుడి [లేక మీకు ఇష్టమైనది పలుకుడి], మరియు అది మీ కొరకు జరుగును." ఆయన శక్తిగలిగి యుండెను.
GEN 41:14
80గమనించండి, అతడు బయటకు వచ్చుటకు ముందు, అతడు బయటకు తీసికొనపోబడి మరియు కత్తిరించబడవలెను. అతడు తన రాజును కలవడానికి ముందు కొన్ని విషయములు కత్తిరించబడవలెను. చూశారా?
ఓ, దేవుడు కొన్నిసార్లు తన ప్రజలను ఆ విధంగా బయటకు తీసుకు వెళ్ళును మరియు వారి స్వచిత్తములను కొన్నింటిని కత్తిరించి వేయును. ఆయన కేవలం వారికి ఇష్టమొచ్చిన రీతిగా వారు చేయలేరని వారికి చూపించును. నా భావమును మీరెరుగుదురు. వారు చేయదలచినది చేయుటకు వారికింకను స్వాతంత్య్రము లేదు. వారు పరిపూర్ణ శక్తిలోనికి వచ్చి మరియు క్రీస్తుకు ప్రేమ-బానిసలుగా అవుటకు ముందు, వారు కత్తిరించబడవలెను మరియు తరువాత అర్పింపబడవలయును. వారిని కత్తిరించి మరియు పిదప అభిషేకించబడిన వారిగా వారిని బయటికి తీసికొని వచ్చుటకు, ఆయన వారిని ఏ ఉద్ధేశ్యము కొరకై అభిషేకించెనో ఆ పనిని పూర్తి చేయునట్లు, దానిని చేయుటకు ఆయన కొన్నిసార్లు వారిని అరణ్యమునకు తీసికొని వెళ్ళును. నా భావమును చూశారా? సహోదరులారా, మనము అంత్య-కాలములో ఉన్నాము.
81ఆయన తక్కిన సమయములన్నిటిలో ఏమి చేసెనో గుర్తుంచుకొనండి. ఆయన ఎల్లప్పుడు ఒక వ్యక్తిని తీసికొని మరియు ఆయనకు ఒక ఖైదీగా చేసుకొనును. మరియు దేవుని చిత్తమును తెలిసికొని దేవుని వెంబడించుటకై తన స్వంత వారిని త్యజించి, అతనికి తెలిసినదంతయు త్యజించవలెను, తన తర్ఫీదంతటిని మరియు మిగతా వాటన్నిటిని మరిచిపోవలెను. మానవుడు చేయవలసిన దానిని మరియు దేవుడు చేయవలసిన దానిని అతడు ఒకే సమయములో చేయలేడు. అవి రెండు ఒకదానికొకటి విరోధముగా నున్నవి.
నీవు ఒకే సమయములో తూర్పునకు మరియు పశ్చిమమునకు వెళ్ళలేవు; నీవు ఒకే సమయములో కుడివైపునకు మరియు ఎడమవైపునకు వెళ్ళలేవు; నీవు ఒకే సమయములో సరియైన దానిని మరియు తప్పైన దానిని చేయలేవు; నీవు ఒకే సమయములో మానవుని మరియు దేవుని వెంబడించలేవు. లేదండి, నీవు దేవునినైనను వెంబడించెదవు లేదా మానవునినైనను వెంబడించెదవు.
ఇప్పుడు, నీవు దేవుని వెంబడించుచున్నయెడల మరియు నీకు నీవుగా దేవునికి లోబడి యుండినయెడల, అప్పుడు నీవు ఆ వాక్యమునకు, ఆ చిత్తమునకు, ఆ దేవునికి ఒక ఖైదీగా యుందువు. ఏది ఏమైనను నీవు దానికి ఒక ఖైదీవై యుందువు.
HEB 13:8
82వినండి, మనము అంత్య-కాలములో యున్నాము, మరియు ఆఖరి నిమిషములు గతించి పోవుచుండగా నేను దీనిని గౌరవముతోను మరియు మర్యాదతోను చెప్పుచున్నాను. చూడండి. దేవుడు, నా ఉద్ధేశ్యప్రకారము, ఈ అంత్య-దినములలో కోతకాలముకై ఒక పనిముట్టును తప్పక కనుగొను మరియు కనుగొనవలయును మరియు కనుగొనును. ఆయన పంటను నూర్చుటకు ఒక పనిముట్టును కనుగొనవలసియుండెను.
ఏ వ్యవసాయకుడైనను తన కోతకు వెళ్ళునప్పుడు, దానిని చేయుటకై అతడు ఒక పనిముట్టును కలిగియుండవలెను. నిశ్చయముగా, అతనికి ఒక పదునైన కొడవలి లేక అటువంటిది ఏదైననూ, దాన్యమును నూర్చుటకు ఏదైన ఒక పనిముట్టు కావలెను. మరియు పంట కోతకు వచ్చియున్నది.
దేవా, నీ హస్తములలోనికి మమ్మును తీసికొనుము. నీ ప్రేమకు మమ్ములను బానిసలుగా చేయుము. మేము జీవించుచున్న ఈ దినమున, ఈ పాప శాపలోకమునకు, యేసుక్రీస్తు నిన్న, నేడు, నిరంతరము ఏకరీతిగా యున్నాడని తెలియజేయుటకై మమ్మును పనిముట్టుగా వాడుకొనుము.
నా మట్టుకైతే: దేవా, నన్ను ఒక ఖైదీగా ఉండనిమ్ము. నా సహోదరులందరూ నన్ను త్రోసివేసిననూ; నా స్నేహితులందరూ నన్ను త్రోసివేసిననూ; యేసుక్రీస్తుకు మరియు ఆయన వాక్యమునకు; నేను ఒక ఖైదీగా ఉండగోరుచున్నాను, పరిశుద్ధాత్మడు ఏమి సంభవించునని చెప్పెనో వాటిని అదే కార్యముల చేత దేవుని వాక్యము ఋజువుపరచుటను చూచుటకై పరిశుద్ధాత్మ ద్వారా ఆయన వాక్యమునకు ముడివేయబడ గోరుచున్నాను. నేను యేసుక్రీస్తుకు ఒక ఖైదీగా ఉండగోరుచున్నాను. మనము ప్రార్థించుకొనెదము.
83ఈ రాత్రి నేను ఆశ్చర్యపోవుచున్నాను, మనము తలలు వంచియుండగా, మనము ఏదో కావాలని కలిగియున్న ఆశను లేక మనము ఏదో తలంచుకొను ఒక స్వార్థమైన కోరికను మనము ప్రక్కకు పెట్టెదమా?
ఈ రాత్రి ఒక యౌవ్వన బాలుడు ఈ తట్టు తిరిగి "నేను ఆ రీతిగా ఉండగోరుచున్నాను." "నేను ఎదిగినప్పుడు, నేను పలానా అయ్యెదను," అని చెప్పిన యెడల, నేను ఆశ్చర్యపోవుదును. దేవుని చిత్తము మీ జీవితములో కదలుటను గమనించి లేదు, లేదు, ఇప్పుడు "నా ఆశయములన్నియు తొలగిపోయెను. గత కొన్ని దినములుగా పరిశుద్ధాత్ముడు నాతో మాటలాడుచున్నాడు. ఈ అంత్య-దినమునకై నూర్చుటకు దేవునికి ఒక పనిముట్టువలె నన్ను-నేను సమర్పించుకొనుచున్నాను," అని నీవు చెప్పినయెడల నేను సంతోషించెదను.
ఒక యౌవ్వన బాలిక మంచి స్త్రీ యొక్క గుణలక్షణము కొరకైన ఆశయములు కలిగి యుండవచ్చును, లేక ఒక అందమైన స్త్రీ, లేక ఒకానొక దినమున హాలీవుడ్ను నీ భవిష్యత్తుగా ఎంచుకొనియుండవచ్చును, నీ ఆశయములను దేవుని సన్నిధిలో ఆయన వాక్యమునకు సమర్పించుకొనుటకు ఇష్టపడక, దేవుని పిలుపును నీ జీవితములో విననియెడల, నేను ఆశ్చర్యపడుదును? నీవెవరవో దేవుడు ఎరుగును.
84ఇక్కడ దగ్గరలో బోధుకుడు ఉండినయెడల, లేక ఒక సేవకుడు, లేక సంఘములో పని చేయు వ్యక్తి… (నేనిచ్చటకు అప్పుడప్పుడు వచ్చెదను; నాకు ఈ రాత్రి ఇక్కడ కూర్చున్నవారిలో మూడవ-వంతు భాగము నాకు తెలియదు. అయితే నేను… కేవలం కొద్ది మందినే యెరుగుదును.) కాని ఈ విధముగా చెప్పుటకు ఇక్కడ ఎవరైననూ ఇష్టపడినయెడల నేను సంతోషించెదను, "ఎవరేమి చెప్పినను నేను లెక్కచేయను. ఇప్పుడు, నేను దేవునియొక్క బానిసను. ఏది ఏమైననూ నేను ఆయన వాక్యమును బోధించెదను. నా సంస్థ నన్ను తోసివేసినను, ఆ వాక్యముతోనే నేను నిలచియుండెదను. నేను దానిని చేసెదను. దేవుని యొక్క చిత్తమే, నా చిత్తము. నా చిత్తమే, దేవుని చిత్తము. యేసు క్రీస్తుకు నేనొక ఖైదీగా నుందును. ఆయన కృప మరియు సహాయము వలన నేను దీనిని చేసెదను." మనము మన తలలు వంచియుండగా దీనిని గూర్చి ఆలోచించుడి.
ఈ రాత్రి ఎంత మంది ఆ ఆశయమును కలిగియున్నారు? మీరు, మీ చేయి పైకి ఎత్తెదరా? నేను కూడా ఎత్తెదను. నేను, "సంపూర్ణముగా సమర్పించుకొనెదను." ఇప్పుడు, మనము తలలు వంచియుండగా, నెమ్మదిగా ఇప్పుడు, దీని గూర్చి ఆలోచించుడి, మీ ప్రార్థించుచుండగా.
నా సమస్తమర్పింతును, (నేను అన్నిటిని సమర్పించుకొనెదను)
నా సమస్తమర్పింతును, (నేను పూర్తిగా లోబడెదను)
నాదు ధన్య రక్షకా నీకిత్తును నా సమస్తము.
నా సమస్తమర్పింతును,
(నిజముగా మీ భావము అదేనా? నేను ఒక ఖైదీగా ఉండగోరుచున్నాను. ప్రభువా నన్ను తీసికొనుము, నన్ను ఈ రాత్రి కుమ్మరి యింటికి తీసుకువెళ్ళి, నన్ను పూర్తిగా పగులగొట్టి మరియు నన్ను తిరిగి మలచుము)
నాదు ధన్య రక్షకా నీకిత్తున్ నా సమస్తము,
నా సమస్తమర్పింతును.
85పరలోకపు తండ్రీ, వారు ఇంకనూ కొనసాగుచుండగా, పాటను ఒక్క క్షణము ఆపి, ఈ సమయమున మీతో మాటలాడుట చాలా ఉపయోగమని నేను తలంచుచున్నాను. నేను సమస్తమర్పింతును అని జనులు తలంచుచుండగా, తండ్రీ, దీనిని చేయుటకు ఇది మాకు ఒక చివరి అవకాశము అన్నట్లు దీనిని చేయుదము గాక. మనము యధార్థముగా వచ్చెదము మనలను సమర్పించుకొనుటకు ఉదికిన వస్త్రములతో, కడగబడిన అంతరాత్మలతో, కడగబడిన చిత్తములతో, కడగబడిన ఆశయములతో ప్రభువు బల్ల యొద్దకు రండి,
86మరియు దేవుడు తన వాక్యమును తీసికొని మనలను ఆయనతో ముడివేయును — దేవుని యొక్క వాక్యము. మరియు ఇప్పుడు ఈ రాత్రి నుండి మన హృదయము చుట్టూ ఆ భారము గ్రుచ్చుకొనుటను వినుచుండగా పరిశుద్ధాత్ముడు మనలను అంగీకరించును గాక. నీ వాక్యము యొద్ద నేను నిన్ను స్వీకరించెదను. "ఇప్పుడు, నీ స్వంత ఆలోచనలు ఆలోచించకుడి; నా ఆలోచనలు ఆలోచించుడి. నా చిత్తమును ఆలోచించుడి; నేను మిమ్మును నడిపించెదను."
దేవా, మా అందరికి ఇది ఒక అనుభవముగా ఉండునట్లు దయచేయండి. ఇక్కడ కూర్చున్న యౌవనస్థులు, భార్య-భర్తలు, మరియు కాబోయే భార్య-భర్తలు. ఇక్కడ బోధకులైన పెద్దవారు ఇక్కడ కూర్చొనియున్నారు, ఆ మార్గములోనున్న వారు. ప్రభువా, ఇచ్చటనున్న సహోదరుడు నెవిల్ మరియు నేను నిచ్చెన పైకి ఎక్కుచున్నాము. ఇప్పుడు మా దినములు లెక్కించబడి యున్నవి. ఇదివరకంటే ఇప్పుడు మా అడుగులు జాగ్రత్తగా పడుచున్నవి. మేము ఎక్కడ అడుగిడుచున్నామో, మేము గమనించుచున్నాము. భౌతికంగా మాటలాడినయెడల, ఒకప్పటివలె మా అడుగులు అంత ఖచ్చితంగా లేవు. అయితే ప్రభువా, ఈ మర్త్య-జీవితము గతించి పోవుటను మేము చూచుచుండగా, నీవు మా చేయి పట్టుకొననియెడల ఎవ్వరి అడుగులు స్థిరపరచబడవు.
87ఇప్పుడు, దేవా, మమ్మును అంగీకరించుము — నీవు అంగీకరించెదవా? రాత్రి మా హృదయములను మరియు మా చిత్తమును నీ చేతుల్లోనికి తీసికొనుము, మరియు మేము వాక్యమునకు, క్రీస్తుకు ఖైదీలమగునట్లు చేయుము. మేమిచ్చట దైవీక జీవితములు జీవించెదము గాక. ప్రభువా, ఈ స్త్రీలు, ఈ యవ్వన స్త్రీలు, ఈ యవ్వన పురుషులు బాలబాలికలు వారి జీవితములు సమర్పించుకొందురు గాక. ప్రభువా వారి ఆశయములు యేసుక్రీస్తును సేవించుటకు మరియు ఆయన దైవిక కృప మరియు చిత్తములకు ఖైదీలగునట్లు అనుగ్రహించుము, ప్రభువా.
ప్రభువా, అది మాత్రమే చేయుటకు నాకు తెలియును. ఈ విరువబడిన చిన్న మాటలను, నీవు సరిగ్గా సమకూర్చెదవని నమ్ముచున్నాము, ఎందుకనగా ఇక్కడ చాలా వేడిగాయున్నది. మరియు ప్రజలు వినగోరుచున్నారు, కాని ఇక్కడ నిజమైన వేడియున్నది, మరియు బహుశా పనులు చేసుకొనుటకు వారు త్వరగా ఇంటికి వెళ్ళవలసియున్నది. అయితే ఈ విత్తనాలు వారి హృదయములో పడనిమ్ము - ఒక ఖైది.
MATT 16:25•
MARK 8:35•
LUKE 17:33•
JOHN 12:25
88ఇంటికి వెళ్ళి భార్యతో ఈలాగు చెప్పండి. ఈ మధ్యాహ్న కాలమున లేక సాయంకాలమున పడక ప్రక్కన వారు ప్రార్థించుటకు ప్రారంభించక ముందు… ఒకరి వైపు ఒకరు చూచి ఈలాగు చెప్పుడి, ప్రియతమా, "ఈ రాత్రి దాని గూర్చి ఏమిటి? మనము నిజముగా క్రీస్తుకు మరియు ఆయన చిత్తమునకు ఖైదీలుగా వున్నామా, లేక మన స్వంత చిత్తప్రకారము మనము చేయుచున్నామా?"
ప్రతిచోట యవ్వన స్త్రీ, పురుషులు, ముఖ్యంగా ఈ రాత్రి వర్తమానము వినినవారు, వారికి వారు అదే ప్రశ్నను వేసుకొందురు గాక. "నేను నా స్వంత జీవితమును త్యజించి — ఒక ఖైదీగా ఉండుటకు ఇష్టపడుచున్నాను." "తన ప్రాణమును కాపాడుకొనగోరువాడు దానిని పోగొట్టుకొనును, కాని నా నిమిత్తము తన ప్రాణము పోగొట్టుకొనువాడు దానిని కాపాడుకొనును."
తండ్రీ, అది నీ కొరకై ఒక ఖైదీయగుట అని మేము ఎరుగుదుము. మా స్వంత ఆశయములను మరియు మా కోరికలను పోగొట్టుకొని వాటిని కనుగొనెదము, అప్పుడు మేము నిత్యజీవము కలిగియుందుము. ప్రభువా అనుగ్రహించండి.
89ఇప్పుడు నాకు తెలిసిన ఒకే ఒక్క కార్యమేదనగా, నీ చేతులకు సమర్పించుకొనుటయై యున్నది. మరియు అది ఫలభరితమై అంత్యకాల కోతకై గొప్ప పనిముట్లను తీసికొని వచ్చును గాక. స్త్రీ, పురుషులు, బాలబాలికలు దేవుని సంపూర్ణ చిత్తమునకు లోబడి మరియు యేసు క్రీస్తునకు ఖైదీలుగా మారవలెను; ఆయన ప్రేమకు క్రీస్తు ద్వారా దైవిక ప్రేమకు సంకెళ్ళతో బంధింపబడుట. దీనిని ఆయన నామములో అడుగుచున్నాము.
నా సమస్తమర్పింతును (లేచి నిలబడెదము)
నా సమస్తమర్పింతును
నాదు ధన్య రక్షకా నీకిత్తున్,
నా సమస్తము, నా సమస్తమర్పింతును.
కళ్ళు మూసుకుని మరియు చేతులు పైకెత్తి మరలా దానిని పాడెదము.
నా సమస్తమర్పింతును
నా సమస్తమర్పింతును
నా ధన్య రక్షకా నీకిత్తున్, నా సమస్తము
నా సమస్తమర్పింతును.
90ఇప్పుడు, మనము మన తలలు వంచినయెడల, "యేసు నామమును మీతో తీసుకొని వెళ్ళుడి," అను ముగింపు పాట పాడుచుండగా, ఇక్కడ ఉన్న ఆ సహోదరుని నేను అడుగగోరుచున్నాను… నేను అతని పేరు మరచిపోయాను. చీకటిని గూర్చిన దర్శనము వచ్చిన సహోదరి స్వస్థత పొందుటను గూర్చి… మరియు గుర్తుంచుకొనండి, వెను దిరిగి చూడగా ఆ తెర లేకపోయెను. ఆమె విశ్వాసము దానిని చేసెను. నీవు ప్రార్థనతో ముగించినయెడల, సహోదరుడా నీవు చేసెదవా? మరియు మనపై దేవుని ఆశీర్వాదముల కొరకై అడుగుడి.