మొదట హెచ్చరించకుండా దేవుడు మానవునికి తీర్పు విధించడు

మొదట హెచ్చరించకుండా దేవుడు మానవునికి తీర్పు విధించడు

1"పదివేలమ౦ది దూతలు ఆక్కరలేదు. ఒక్క దూతయే ప్రపంచమును నాశనము చేయగలడు; కాని ఆయన నా కొరకు, నీ కొరకు చనిపోయెను." ప్రభుని చిత్తమయితే, ఆదివారము ఉదయాన నేను మాట్లాడబోవు, "క్రీస్తు ఏమైయుండెను?" అను అంశమునకు మూల మాట అదియే. ఆదివారము ఉదయమున బహుశా ఈ బాలికలు ఆ పాటను మన కొరకు మరల పాడుదురు. వీలర్ సోదరుడా, ఇద్దరు చక్కని స్త్రీలు నీ యొద్ద ఉన్నారు. వారు చక్కగా దుస్తులు ధరించారు, మేకప్ వేసుకొనరు, నిశ్చయంగా వారు నాకు క్రైస్తవుల వలె కనబడుచున్నారు. వారి పాటకు వారి ప్రవర్తన సరిపోయియున్నది. అది చాలా చక్కని సంగతి.

1JN 3:21

 

2ఇక్కడ మనకు పరిశుభ్రంగా కనబడు కొందరు స్త్రీలున్నారని ఒక రోజున నేను నా భార్యతో చెప్పాను. నేను దానిని ప్రశంసించుచున్నాను. వారికి పొడవైన జుట్టు, చక్కని ముఖములు, చక్కని దుస్తులు ఉన్నవి. నేను ఇక్కడికి వచ్చు ప్రతిసారి మిమ్మును అభినందించుచుందును. "వీరందరిని ఒకసారి వరుసగా నిలబెట్టి ఫోటో తీసికోవాలని ఉంది. మన సంఘము ఇచ్చట ఎట్లున్నదో ఇతర సంఘముల వారికి చూపించగోరుచున్నాను," అని మిడాతో చెప్పాను. మనం చెప్పిన సంగతులకు వీరు లోబడుచున్నారు. అందుకు సంతోషించుచున్నాము. దీనివలన మనకు మేలు కలుగుచున్నది. మన హృదయము మన మీద నేరారోపణ చేయనియెడల మన మనవిని దేవుడు వినును అని మనము ఎరుగుదుము.

3ఈ ఉదయమున నా స్నేహితుడు ఒకాయనకొద్ది నిమిషములలో చనిపోవుచున్నట్లు కనిపించెను. అప్పుడు తెల్లవారినది. నేను పడక మీద నుండి లేచి ఆ ముసలివాని కొరకు నేల మీద పడి ప్రార్థించాను. దేవుని కృపను బట్టి అతని ఆత్మ మరల అతనిలోనికి వచ్చినది. ఇప్పుడు చక్కగా ఉన్నాడు. ఈ రాత్రి మనతో పాటు అతడును దేవుని మహిమ కొరకు జీవించుచున్నాడు. అతడు వృద్ధ దాచ్ సోదరుడు, తొంబది-ఒక్క సంవత్సరములు. అతని జీవిత ప్రయాణము ముగిసి ఇరవై-ఒక్క సంవత్సరములయినది. కాని దేవుడు ఇలా తన కృపను, మేలును ఆయన పట్ల చూపినందుకు కృతజ్ఞతలు చెల్లించుచున్నాము.

4ఇప్పుడు సహోదరుడు నెవిల్ మరియు నేను ఒకరి ముఖము ఒకరము చూచుకొన్నాము. మరో ఆరాధన ఆదివారమునాడున్నదని నాకు తెలియును. నా సంఘ కాపరిని నేను కూర్చోనియ్యను. ఆయన బోధించుచుండగా నేను వినుటకు ఇష్టపడెదను.

ఆదివారము రాత్రి ఆయనిక్కడ బోధించినపుడు నా స్నేహితునితో కలిసి అల్పాహారము భుజించ వెళ్ళాను. ఇవాన్స్ దంపతులు, సాత్మన్ దంపతులు నాతో వచ్చిరి. వారంతా ఆ అద్భుత వర్తమానము గూర్చి చెప్పుకొనుచుండిరి. దాదాపు వారమంతా నేను ఆ వర్తమానము వల్లనే జీవించానని మీతో చెప్పుచున్నాను. ఉష్ణపక్షి తన్ను తాను దాచుకొన్నానని తలంచుట గూర్చి వారు మాట్లాడుతున్నారు, అది నిజము, తన తలను నేలలో దూర్చి ఎవరికి నేను కనిపించనని అనుకొనును, కాని శరీరమంతా బయటే యుండును. మనము కూడా కొన్నిసార్లు ఆలాగే యుందుము. మన తలను దేని వేనకో దాచుకొందుము, అయినను మనము పూర్తిగా కనబడుచునే యుందుము. ఆయన మనలను పూర్తిగా ఎరుగును. అందువలన ఆ ఉదాహరణను ప్రశంసించుచున్నాము.

5నేను సంఘముతో మాట్లాడగోరుచున్నాను. సహోదరుడు నెవిల్ మాతో ఎప్పుడూ మాట్లాడుచుండును. నేను మధ్య మధ్యలో వచ్చుచుందును. నేను వేషధారిగా ఉండగోరుట లేదు. మిమ్మును ప్రేమించుచున్నాను గనుక ఇచ్చటికి వచ్చుచున్నాను. నేను ఇంటి దగ్గర కూర్చొనలేక సంఘమునకు వచ్చుట లేదు.

ఇక్కడి వాతావరణము నాకు పడదు. ఈ ప్రాంతము నాకు పడదు. ఇక్కడున్న గాలి వలన నాకు ఎలర్జీ కలుగును. గాలి సోకిన వెంటనే నాలో మార్పు కలుగుచున్నది, అయితే దానికి ఏమి చేయజాలము. ఇక్కడ ఉన్నపుడు మనము ఎవరమూ ఆరోగ్యముగా ఉండము, ఎందుకనగా మనము ఎత్తయిన వాతావరణమునకు అలవాటు పడియున్నాము.

6అయితే మీ వలన నేను ఇచ్చటికి ఆకర్షించబడుచున్నాను. అది నిజమని మీరందరు ఎరుగుదురు. మీకు చాలామంది స్నేహితులు దొరకుదురు. దానిని బట్టి నేను కృతజ్ఞతలు చెప్పుచున్నాను. వ్యక్తిగతంగా నేను లెక్కపెట్టినపుడు ప్రపంచమంతటా మిలియనుల మంది యున్నారు. దాదాపు పది మిలియనుల మంది యున్నట్లు ఒకరు అంచనా వేసిరి. వారందరూ నాకు వ్యక్తిగతంగా తెలిసినవారు, కాని ఇంటి సంబంధులు మరి కొందరున్నారు. మీ జీవితములలో మాకు కొందరు ప్రత్యేక స్నేహితులుందరు. అది నేను చెప్పగలను. నా భార్య నాకు ప్రత్యకమైనది. ఆలాగే భర్తగా నేనామెకు ప్రత్యేకమైన వ్యక్తిని, ఆలాగే కొందరు ప్రత్యేక స్నేహితులు ఉందురు. మీరు వారిని కలిసికొని వారితో మాట్లాడుగోరుదురు. అక్కడ చిన్న స్థానములు ఉన్నవి.

ఈ చిన్న సంఘమును ఒక చెరువుండిన చోట నిర్మించాము. ఇది కట్టక ముందు చెరువున్నది. ఆ చెరువు చుట్టూ రోడ్డు వేసిరి. ఇప్పుడు దీని ప్రక్కనే వీధి యున్నది గాని అపుడిది చెరువు. నేను యువకునిగా ఉన్నపుడు ప్రభువు కొరకు ఒక సంఘము కట్టుటకు వెదికాను.

7ఇక్కడున్న యువకులు కొద్దిసేపటి క్రితం ఎంతో ఆసక్తితో ప్రార్థించుట నేను విన్నాను. నేను కూడా ఆలాగే ఊపిరాడని విధంగా ప్రార్థించేవాడిని. అయితే వృద్ధాప్యములో అది తగ్గిపోవును. నేను ఉడ్ సోదరునితో చెప్పినట్లుగా, మనము రెండవ గేరులో కదలుచున్నాము. నీవు డెబ్బై, లేదా ఎనబై సంవత్సరాల లోనికి వచ్చినపుడు చివరి గేరులో నడిచెదవు. అయితే నీవు అటు ఇటు తిరుగుచునే యుందువు. నీవు తిరిగినంత కాలము పరవాలేదు. ఆ తరువాత కొద్ది కాలమునకు నీవు అక్కడికి చేరెదవు.

8ఇప్పుడు ఈ బలిపీఠమున్న చోటనే పిచ్చి మొక్కలు ఉండెడివి. అక్కడ నేను ప్రార్థించుచుండేవాడిని. ఈ వేదిక ఏర్పాటు చేసిన చోటు వరకు నేను కారు నడుపుకొని వచ్చేవాడిని. ప్రభువగు దేవుడు దీనిని నాకు ఇచ్చెను. ఒక ఉదయమున దర్శనముతో నేను ఇక్కడ మూలరాయి వేశాను. అందులో నా సాక్ష్యమున్నది. "ఇది నీ సంఘము కాదు, నీవు సువార్తికుని పని చేయుము," అని ఆయన నాతో చెప్పెను. ఆ సమయంలోనే నేను విశాల ప్రపంచాన్ని, నీలమగు ఆకాశమును, జనులు వచ్చుటను చూచాను. ఆ సాక్ష్యమును మూలరాయిలో వేశాను. ఆ విధంగా దర్శనము వచ్చినా గాని నా ఆలోచన పెద్దగా లేదు; కాని ఏలాగయినా ఇది జరుగునని మాత్రం నమ్మితిని.

9ఈ వారంలో చాలామంది నన్ను చూచుటకు వచ్చిరి, ఎందుకనగా ఆదివారము నాడు ప్రభువు యొక్క కృపా సన్నిధి దిగి వచ్చినది. నేను సోమవారమే వెళ్ళిపోవలసి యుండెను.

పిల్లలకు ఇంకా సెలవులు ఇవ్వలేదు. ఆ తరువాత కొద్ది రోజులకు నేను విశ్రాంతి తీసికొందును. పిల్లలను కొద్ది దినములు విశ్రాంతికి తీసికొని వెళ్ళవలెనని కోరుచున్నాను. ఆ తరువాత వారు మరల బడికి వెళ్ళుదరు. కాబట్టి ఈ వారము చాలా మంచి అవకాశమని తలంచాను. వచ్చేవారము చికాగోలోని కూటమునకు వెళ్ళుదుదను.

ఇది అందరిని కలిసికొను అనుకూల సమయమని ఆత్మాభిషేకము ద్వారా గ్రహించాను. ఈ సమయములో కొందరినయినా నేను కలిసికొనగలను. ముందు కలిసికొన్నవారు ఇప్పుడు గదిలోనే కూర్చొనియున్నారు. ప్రభువు మాతో కలిసికొనెనో లేదో వారికే తెలియును.

10బిల్లీ కొందరు స్త్రీలను నా యొద్దకు తెచ్చి, పరిచయము చేసెను. అందులో ఒకామే లూయిస్-విల్ నుండి వచ్చినది, వారికి ఒక కుమార్తె ఇక్కడున్నది. వారు లూయిస్-విల్లోని చర్చ్-అఫ్-గాడ్ సంఘమునకు చెందిన వారు. ఇక్కడికి ఎవరు వచ్చెదరో, ఏమి అడుగుదురో పరిశుద్ధాత్మ నాకు ముందే చెప్పెను. వారు వేయు ప్రశ్నలు, వాటికి జవాబులు, వారి విన్నపములు, ముందే నేను పేపరు మీద వ్రాసియుంచాను. వారు వచ్చినపుడు పరిశుద్ధాత్మ ముందే నాకు చెప్పినట్లు వారికి చూపించితిని. నేను ఎవరిని కలిసికొందునో, వారెట్టి అభిప్రాయము కలిగియుందురో అంతా నాకు ముందే చెప్పబడెను. చూచారా? వారు వచ్చినపుడు ఇదంతా చూపించాను.

11నేను కారు నడుపుకొని ప్రార్థనా పూర్వకముగా వచ్చుచున్నపుడు చాలాసార్లు జరుగబోవు స్వస్థతా కూటములో ప్రార్థనా వరుసలో ఉండువారిని, వారి పేర్లను చూచుట జరుగును. ఇది సత్యము. వారు సంఘములో ఎక్కడ కూర్చొందురో, ఏ దుస్తులు ధరించెదరో, ఎట్లు కనబడుదురో ముందే చూచెదను. అయితే జనులకు ఇదంతా చెప్పకూడదు, జరిగినవన్నీ వారికి చెప్పకూడదు. వారికి అవసరమైనవే చెప్పవలెను. వారికి సహాయకరముగా నుండు సంగతులు, ప్రభువు వారితో చెప్పమన్న సంగతులు చెప్పెదను. నీవు చూచినదంతయూ చెప్పరాదు. అది మంచిది కాదు. ఆ విధంగా చెప్పినపుడు, నీవు ఇరుకులో పడుదువు. వాటినెట్లు ఉంచుకొనవలెనో ప్రభుని ఆత్మ ద్వారా నీకు తెలియును.

12జనులు నా యెదుట నిలబడి ప్రశ్నలు అడుగుచుందురు. నాకు ఖచ్చితంగా తెలియును గాని చెప్పను, ఎందుకనగా చెప్పకుండునట్లు నన్ను ఏదో బంధించును. గత బుధవారము ఒక ఖైదీ గూర్చి బోధించాను. మీకు గుర్తున్నదా? చూడండి, నీవు ఆ వ్యక్తితో చెప్పుగోరుదువు గాని చెప్పవద్దని ఏదో నిన్ను ఆటంకపరచును. "చెప్పవద్దని" ఆత్మ నీకు చెప్పును. దానిని చూడగలుగుట కూడా ఒక వరమే. "చేయవద్దన్నపుడు నీవు చేయకుండుట మేలు," లేనియెడల నీవు దేవునితో ఇబ్బందిలో పడుదువు.

13నిలబడుటకు మాత్రమే ఈ రాత్రి ఇచ్చటకు మనము రాలేదు. ప్రభుని వాక్యము వినగోరుచున్నాము. మీరందరూ ప్రార్థించారు. అందుకే ఇట్టి గొప్ప సమయము మనకు దొరికెను. నేను ఇక్కడికి వచ్చు ప్రతిసారీ ఒక అంశమును తెచ్చుచుందును. కొన్నిసార్లు సహోదరుడు నెవిల్ నా పట్ల ఎంతో దయచూపి, నేను ఏది చేయుట ఇష్టమో అది చేయునట్లుగా నడిపించును, "మీరు చేస్తారా, లేక అది చేస్తారా, లేక మాట్లాడుతారా?" అని అడుగును. ఒక అంశము తీసికొని నేను ప్రారంభించెదను. వచ్చే ఆదివారము తప్పక గుర్తుంచుకొనండి.

మనకు ఏమగునో తెలియదు, మనము చెప్పలేము. కొన్నిసార్లు ఇక్కడికి ఒక అంశము చెప్పవలెనని వచ్చినా పూర్తిగా దానిని మార్చి మరొకటి చెప్పుట జరుగును. నేను వాక్యములు వ్రాసికొందును. ఆ వాక్యములను ఉపయోగించి అంశమును ఎన్నుకొందును. నేను ఏదో చెప్పవలెనని తలంచెదను. I కొరింథీ 5:15, II కొరింధీ 7:1, మత్తయి 28:16 మొదలగు వాక్యములు వ్రాసికొని తెచ్చెదను. కాని కొన్నిసార్లు ఆ వాక్యములను తాకను. వాక్యమేమి చెప్పుచున్నదో నాకు తెలియును, కాని పూర్తిగా వేరే సంగతి బోధించెదను. కాబట్టి మనకు తెలియదు.

14ప్రభుని చిత్తమయితే ఆదివారము ఉదయము చాలా ప్రాముఖ్యమైన సంగతి బోధించెదను. ఈ కూటములకు అదే చివరి దినము. కాబట్టి కొద్దిగా ఆలస్యమైనా ఉండగలుగునట్లు సిద్ధపడి రండి. దాదాపుగా రెండు గంటల వరకు ఆరాధన జరుగవచ్చును. ఆ అ౦శము మీద సుమారు ముప్పయి లేదా నలుబది వచనములు వ్రాసియుంచాను. పరిశుద్ధాత్మ నాకు సహాయము చేయవలెను. ఆ వర్తమానమును నేను పట్టుకొని ఈ ప్రస్తుతకాలమునకు సరిపడునట్లు మలచవలెను.

15కావున షికాగో నుండి నేను తిన్నగా ఆరిజోనాకు వెళ్ళుదను. నాకు తెల్సినంత వరకు, అటు తర్వాత సంవత్సరము వరకు ఇక్కడికి తిరిగిరాను, బహుశ వచ్చే వేసవిలో, టాబర్నికల్ మరలా వచ్చుటకు ముందు, ఈ మార్గమున వెళ్ళుదును, ఎందుకనగా అన్ని కూటములు ముందున్నవి.

క్రిస్మస్ అయిన వెంటనే ప్రారంభమగు పూర్తి ప్రపంచ పర్యటనకు బిల్లీ ఏర్పాటు చేయుచున్నాడు. దాదాపు డిసెంబరు వరకు కార్యక్రమములు స్థిరపరచబడినవి. డిసెంబరు మొదటి వారము డల్లాస్ లో ఉందును. ఆ తరువాత జనవరికి పూర్తి ప్రపంచ పర్యటన జరుగును. అందుకు కార్యక్రమములు రూపొందించుచున్నాము. ప్రభువు నడిపింపును బట్టి నడచుదుము. నేను శాఖలకు వ్యతిరేకంగా మాట్లాడినను జనులు, సేవకులు ఎంతో ఓర్పు ప్రదర్శించుచున్నందుకు వారికి వందనములు చెప్పుచున్నాను.

16ఆ వెనుక పుస్తకములున్నవి. సహోదరుడు రాయ్ బోర్డర్స్ ఆహ్వానముల విషయములో పనిచేయును, ఎందుకనగా క్రిస్మస్ ఆయిన తరువాత సంవత్సర ఆరంభములో ప్రపంచమంతట నుండియు వేయి పైగా ఆహ్వానములు వచ్చును. గతంలో వెయ్యి ఆహ్వానములు వచ్చినవి. కాబట్టి ఎటు వెళ్ళవలెనో, ఏమి చేయవలెనో ప్రభువే నడిపించవలెను. ఆయన మీదనే ఆధారపడియున్నాము, ఎందుకనగా అన్ని చోట్లకు వెళ్ళలేను. ఒక ఎండాకాలములో ఎనిమిది లేదా పది ఆహ్వానములు కూడా మన్నించలేము. ఒక రాత్రి ఇక్కడ మరో రాత్రి అక్కడ గడిపినా కష్టమే, అయితే వారు రెండు లేదా మూడు వారములుండమని అడుగుచున్నారు. కొందరయితే ప్రభువు నడిపించినంత వరకూ ఉండమని కోరుచున్నారు. కాబట్టి ఎక్కడ ప్రారంభించవలెనో, ఏమి చేయవలెనో అర్థం కాదు. కాబట్టి వాటన్నింటిని ప్రభువు ముందుంచి, "పరమ తండ్రీ, నీవే మాకు చెప్పుము" అని అడుగుచున్నాము. ఈ విషయములో నాతో పాటు మీరును ప్రార్థించండి. దీనిని అధిగమించునట్లు ప్రార్థన సహాయమివ్వండి.

17ఈ ఆదివారం స్వస్థతా కూటమైన తరువాత సమయమును బట్టి దేవుని యొక్క మూడు విధముల ప్రణాళికను గూర్చి బోధించవలెనని యున్నది. జగత్తు పునాది వేయబడక ముందు నుండి ఉన్న దేవుని గొప్ప ప్రణాళిక అది. దాని యొక్క రెండవ భాగమును నేను తయారుచేయుచున్నాను. లేఖనములను ఎత్తి వ్రాయుచున్నాను. వాటిని సరయిన చోటులో ఉంచుచున్నాను.

ఇప్పుడు ఒక్క క్షణము తలలు వంచుదము.

HEB 13:20

 

18ప్రభువగు యేసూ, గొర్రెల మంద యొక్క గొప్ప కాపరీ, ఈ రాత్రి అతి పరిశుద్దమగు నీ కృపా నామములో ఇచ్చట చేరియున్నాము. ప్రభువా, నిన్ను ప్రేమించుచున్నాము. ఈ రాత్రి ప్రార్థన కూటము కొరకు, మా హృదయములలో ఆనందము కలుగచేసిన పాటల కొరకు నీకు వందనములు చెల్లించుచున్నాము. లోనికి వచ్చుచుండగా ఆ గానము విని చప్పట్లు కొట్టాము. ఆ తదుపరి మేము మోకాళ్ళూని నీవు మా పట్ల చేసినదానంతటికీ కృతజ్ఞతలను మేము మా హృదయములలో నుండి కుమ్మరించితిమి. మాతో ఇక ముందుకును నడువమని నిన్ను అడుగుచున్నాము.

ఇప్పుడు వాక్యము చదివి దాని గూర్చి జనులకు చెప్పవలసిన ఘడియ వచ్చి యున్నది. తండ్రి, మా ఆలోచనలలో నడిపించుము. నీవే మహిమ పొందుము. మా అందరికీ సహాయపడు విషయమును ఈ రాత్రి మా ద్వారా చెప్పుము. ఇంతకు ముందు కంటే నీకు సన్నిహితంగాను, మేలుకరముగాను మేము జీవించు ఉద్దేశ్యము మాలో పుట్టించుము. ప్రభువా, అందుకొరకే ఇక్కడికి వచ్చియున్నాము. నీ గూర్చిమరెక్కువగా తెలిసికొనవలెనని వచ్చితిమి. నీ వాక్య ప్రత్యక్షత ద్వారా ఈ రాత్రి నిన్ను నీవు మాకు బయలుపరచుకొనుము. మంచి క్రైస్తవులుగా ఉండుట ఎట్లో, ఈ చివరి దినములలో ప్రవర్తించుట ఎట్లో మాకు తెలియచేయుము. యేసు నామములో దీనిని అడుగుచున్నాము. ఆమేన్.

ISA 38:1-5

 

19నా దృష్టి యెషయా 38 అధ్యాయము మీద పడినది. యెషయా 38లో నుండి చదువుదము:

ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగము కలుగగా ప్రవక్తయు, ఆమోజు కుమారుడునైన యెషయా అతని యొద్దకు వచ్చి - నీవు మరణమగుచున్నావు, బ్రదుకవు గనుక నీవు నీ ఇల్లు చక్కబెట్టుకొనుమని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పగా.

అతడు తన ముఖమును గోడ తట్టు త్రిప్పుకొని - యెహోవా, యధార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడచుకొంటినో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేనెట్లు జరిగించితినో కృపతో జ్ఞాపకము చేసికొనుమని హిజ్కియా కన్నీళ్ళు విడుచుచు యెహోవాను ప్రార్థింపగా,

యెహోవా వాక్కు యెషయాకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చెను,

నీవు తిరిగి హిజ్కియా యొద్దకు పోయి అతనితో ఇట్లనుము, నీ పితరుడైన దావీదునకు దేవుడైన యెహోవా నీకు సెలవిచ్చునదేమనగా - నీవు కన్నీళ్ళు విడుచుట చూచితిని. నీ ప్రార్థన నేనంగీకరించియున్నాను. ఇంక పదిహేను సంవత్సరముల ఆయుష్యము నీకిచ్చెదను.

20చదువబడిన వాక్యమును ప్రభువు దీవించును గాక! చిన్న వర్తమానమునకు ఇది సాటిలేని అంశమని నేను నమ్ముచున్నాను. దానిని నేను ఈ విధంగా పిలచుదును: "మొదట హెచ్చరించకుండా దేవుడు మానవునికి తీర్పు విధించడు." ఈ రాత్రి అంశము ఇదే. దీని వెనుక నేపథ్యమును మనము చూడవలెను. ఒకనికి మరణమును కలుగచేయు ముందుగా దేవుడు హెచ్చరికను ఇచ్చును.

ప్రతివారికి ఇది వర్తించును. హెచ్చరిక లేకుండానే ఇతడు చనిపోయెను అని కొన్నిసార్లు మనము కొందరిని గూర్చి తలంచెదము. అది తప్పు. అతని హృదయములో ఏమున్నదో నీవెరుగవు. ఆ మానవ జీవితంలో ఏమి జరిగినదో నీకు తెలియదు, చూచారా. మొదటగా దేవుడు హెచ్చరించును, తరువాతనే ఏ మానవునికయినా మరణమును కలుగజేయును. అది ఒక సిద్ధపాటు. దేవుడు సార్వభౌముడు. ప్రతి మానవ హృదయమును ఆయన తట్టుచున్నాడు. వచ్చు అవకాశమును ఇచ్చును, కాని మనిషి దానిని కాలదన్ని మూర్ఖంగా వెళ్ళిపోవును. అది ఏదో ఆషామాషీగా ఎంచును, కాని దేవుడు మాట్లాడుచునే యుండును.

21జనులకు మొదట హెచ్చరిక ఇవ్వకుండా దేవుడు భూమి మీదికి తీర్పును ఎన్నడూ తీసికొనిరాడు. దేవుడు తాను చేయనైయున్న దానిని మొదట చెప్పును. ప్రజలకు ఒక అవకాశము ఇచ్చును. మంచి, చెడులను ఎన్నుకొనునట్లు చేయును. చూడండి, దేవుడెన్నడూ తన స్వభావము మార్చుకొనడు. ఆదిలో ఆయన ప్రారంభించిన కార్యక్రమము మారదు, ఎందుకనగా ఆయన అనంతుడు. ఆయన ఉద్దేశములు, ఆయన కార్యక్రమములు సరియైనవి. ఆయన వాటిని మారినచో ఇపుడేదో ఇంకా ఎక్కువ నేర్చుకొనెనని భావము. అనంతుడగు ఆయన నేర్చుకొనునా? ఆయన మొదటి నిర్ణయమే ఖచ్చితము. దానిని ఏనాడు ఆయన మార్చడు, చూడండి.

దేవుడు మానవుని సృజించి మంచి చెడులను ఎన్నుకొను ప్రదేశములో ఉంచెను. దానినతడు అంగీకరించునో లేదో చూడగోరెను.

22ఇక్కడ సహోదరుడు బేకర్ అను సేవకుని ఒక రోజున పరిచయ కార్యక్రమంలో కలిసికొన్నాను. సర్పసంతానము మీద ఆయన కొన్ని ప్రశ్నలు వ్రాసికొని వచ్చెను. ఇప్పుడు ఇక్కడ ఆయన నాకు కనబడుట లేదు. ఆయన ఆయన భార్య చక్కని వారు. కాని వారు ఈ సర్పసంతానము విషయములో కొన్ని సంగతులు అర్దము చేసికోలేదు. వారికి కొన్ని సంగతులు చెప్పాను. గర్భధారణ గూర్చి ప్రస్తావించాను. ఆ సోదరుడు రెండేండ్ల నుండి క్రైస్తవునిగా ఉన్నాడు. అయితే ఈ కొన్ని సంగతులు అర్థము కాలేదు.

EXOD 20:4•

EXOD 25:18

 

23మీరు పరిశుద్ధాత్మ మీద ఆధారపడవలెను, ఎందుకనగా బైబిలు చిక్కు కధ వలె యున్నది. ఒక వార్తాపత్రిక వలె కూర్చొని చదివిన చాలదు. అది మరుగైయున్నది. అవునయ్యా. దేవుడు మోషేతో "దేని స్వరూపమును చేసికొనరాదు," అని ఆజ్ఞలలో చెప్పెను. ఆకాశము వంటిది గాని, దేవదూత లేదా మరి దేని రూపమును చేసికొనరాదని చెప్పెను, అయినా అదే రోజున రెండు ఇత్తడి దేవదూతలను పోతపోసి కరుణాపీఠము మీద పెట్టమని చెప్పెను. కరుణా పీఠము ఎచ్చటున్నది? చూచారా? ఆయన వాక్యమును అర్థము చేసికొను ముందుగా మీరు దేవునిని, ఆయన స్వభావమును తెలిసికొనవలసియున్నారు. ఆయనే వాక్యమునకు తాళపుచెవిని కలిగియున్నాడు, స్వయముగా ఆయనే, ఆయన మాత్రమే దానిని ఉపయోగించి మరియు తెరువగలడు, మరియు ఆయనే దానిని ప్రత్యక్షపరచవలెను.

24తీర్పునకు ముందు మానవుని హెచ్చరించుట ఆయన స్వభావము. తీర్పునకు ముందు ఒక దేశమును హెచ్చరించును. ఆయనెల్లపుడు తన హెచ్చరికను ఇచ్చును. ఆ హెచ్చరికను మనము పాటించవలెను. అందుకు మనమే బాధ్యులము. దేవుడు ఒక పనికొరకు మనలను ఈ భూమి మీద ఉంచెను. ఆ పనిని మనము నెరవేర్చు బాధ్యులము. నిన్ను ఆయన ఏమి చేయవలెనని కోరుచున్నాడో, ఆయన యొద్దకు వెళ్ళి తెలిసికొనుము, చూచారా.

నీవు ఎవరి యొద్దకయినా పని చేయుటకు వెళ్ళినపుడు అతనిని ఏ పని చేయవలెనో అడిగెదవు. అది గడ్డి కోత కావచ్చు, కుప్ప నూర్పిడి కావచ్చు, అతనిని నీవడిగి చేయమన్నది చేయుదువు. నీ బాధ్యతలను తెలిసికొని పని చేయుదువు.

ఈ భూమి మీద మన జీవితము ఆలాగే యున్నది. ఆయన యొద్దకు మనము వెళ్ళి, "ప్రభువా, నన్నేమి చేయమందువు? నేనేమి చేయవలెను? ఇక్కడ నన్నెందుకుంచి యున్నావు?" అని అడగవలెను. గృహిణిగా పనిచేయమనవచ్చు, అంట్లు తోము పని అప్పగించవచ్చు. దేవుడు ఏది చేయమనినా దానిని నీవు నీవు చేయగలిగినంత శ్రద్ధగా చేయుము. అది ఎంత అల్పమైనదయినా గాని, అది ఏమైనను తప్పక చేయుము.

మీరు చెప్పుదురు, "మంచిది…" అసలు సంగతి ఏమనగా, మనలో ప్రతిఒక్కరు, ఇంకొకరి పని చేయవలెనని కోరుదుము. అందరమూ గొప్ప పనులే చేయగోరుచున్నాము.

25ఇటు చూడండి, ప్రతి చిన్న కదలికకు ఒక స్థానమున్నది. అన్ని చేతులుగా ఉండవు. సమయము చూచుటకు నేను ముల్లులను చూచెదను, అయితే ఆ లోపలి చిన్న చక్రము ఆగిపోయినచో సమయమును చూడలేవు.

మానవులును ఆలాగే యున్నారు. మనము క్రీస్తు శరీరమైయున్నాము. అందరము కలిసి సఖ్యతగా యుండవలెను, చూచారా. మనము ముల్లులను చూచి సమయమెంతయినదో తెలిసికొందుము, చూచారా. ప్రపంచమంతా ఆలాగే యున్నది. కాని నిన్ను కొందరు గమనించుచున్నారు. నీవు ఎంత చిన్న స్ప్రింగుగా ఉన్నా గాని, నీ పనిని నిర్వహించుము. నీ పనిని శాయశక్తులా నీ చేయగలిగినంత శ్రేష్టముగా చేయుము.

26ఒక దినమున దేవునికి మనము జవాబు ఇవ్వవలసిన బాధ్యత కలిగియున్నాము. భూమి మీదికి వచ్చు ప్రతి మనిషి ఒక బాధ్యతకు జవాబు చెప్పవలసియున్నాడు. మనలో చాలామందిమి గృహ నిర్వాహకత్వమునకు జవాబు చెప్పువలసియున్నాము. ఈ గృహ నిర్వాహకత్వపు పని దేవుని ద్వారా మనకు ఆప్పగించబడియున్నది. అది ఎంత చిన్నదయినా పరవాలేదు, ఇందాక గృహిణిగా కావచ్చు అన్నాను, అట్లయితే మంచి గృహిణిగా యుండుము. రైతుగా నున్నచో, మంచి రైతుగా ఉండుము. దేవుడు నీకు అప్పగించిన పనికి నీవు జవాబు చెప్పవలసియున్నావు, మంచి విధంగా నిర్వహించుము.

2KGS 16:20•

2KGS 20:1,3,7•

2CH 32:24•

PS 37:4•

ISA 38:1,3•

MARK 11:24

 

27హిజ్కియాను సిద్ధపడమని చెప్పెను. అతడు తన సృష్టికర్తను కలిసికోనైయుండెను. హిజ్కియా ఒక రాజు, గొప్పవాడు. ఇక్కడతని విన్నపము గమనించారా? "ప్రభువా, నన్ను కనికరించుము. నేను నీ యెదుట యధార్థముగా నడచుకొనియున్నాను. ఎట్టి సాక్ష్యము! నేడు మనకిది అవసరము. దేవుని ఎదుట ఒకని నడత ఆలాగు ఉండవలెను.

అతడు మరణమగునని చెప్పబడెను, అయినా గాని అతని విషయములో దేవుడు తన మనస్సు మార్చుకొనెను, ఎందుకనగా హిజ్కియా ఏదో చేయగోరెను. అతని హృదయ వాంఛలను తీర్చుదునని దేవుడు పలికెను. హిజ్కియా మరణకర రోగమునకు గురి అయ్యెను. కాన్సరు వంటి పుండు వచ్చెను. అది మామూలు కురుపు కాదు గాని, మరణమును కలుగుచేయు పుండు. దేవుడు ప్రవక్తను పంపి ఇతనికి మరణవార్త తెలియచేసెను. అయితే ఇంకా హిజ్కియా ఏదో చేయవలసి యుండెను.

MATT 17:20•

MARK 11:23

 

28నీవు దేవుని దగ్గర బ్రతిమాలినపుడు దానికి తగిన కారణము చూపించవలెను. నేను చాలాసార్లు ఈ వచనమును ఎత్తిచూపుచుందును, "ఈ కొండ లేపబడి మరో చోటకు వెళ్ళును గాక, అని చెప్పి హృదయములో సందేహించరాదు. ఆప్పుడది తప్పుక నెరవేరును." నీ గురి మీద నీకు అదుపుండవలెను, లేని యెడల అది జరుగదు, చూచారా.

ఇక్కడే మనలో చాలామంది తప్పు చేయుచున్నారు, "దీనిని చేయగల విశ్వాసము నాకున్నదని చెప్పుచున్నారు." అసలు అది తప్పు. నీవు ఆడుకొనుటకు దేవుడు నీకు తలాంతులు ఇవ్వడు.

కొద్ది సేపటి క్రితం అదే నేను చెప్పాను. నీవు ఆడుకోనుటకు దేవుడు నీకు దర్శనములు చూపించడు. అది చాలా పవిత్రమైనది. ప్రభువు నీకు అది చూపించును. ఆయనకు దాసునిగా ఉండుము. నీవు అందరూ ఫలాని తప్పు చేయుచున్నారని ఎత్తి చూపెదవు, అయితే నీవు దేవుడు చెప్పినది చేయుచున్నావా? దేవుడు ఒక సంగతి నీకు చెప్పినయెడల, నీవు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడని చెప్పగలవు. అది లేనియెడల నీవు మాట్లాడవద్దు.

2KGS 20:1,3,7•

ISA 38:1,3,5

 

29ఇప్పటి ప్రపంచము అప్పటి హిజ్కియా వలె యున్నది. ఒక హెచ్చరిక ఇవ్వబడుచున్నది. నిరంతరము ఒక హెచ్చరిక వినబడుచున్నది. సంఘమునకు హెచ్చరిక ఇయ్యబడుచున్నది. ఈ సంగతులన్నియూ వాటంతట అవి జరుగుట లేదు. ఈ సంగతులన్నిటి వెనుక ఏదో ఉన్నది. హిజ్కియా పుండు వలన రోగి ఆయ్యెను. ఇది దానికది జరుగలేదు. దేవుడు యెషయాను ఆక్కడికి పంపి అతడు మరణమగును గనుక ఇల్లు చక్కబట్టుకొనుమని చెప్పెను. హిజ్కియా ఏడ్చి దేవునితో ఇట్లు చెప్పుకొనెను, "నేను నీ యెదుట పరిపూర్ణ హృదయముతో నడచియున్నాను. ఒక మంచి కారణము కొరకు నన్ను మరల జీవింపచేయుము," అని ప్రార్థించెను.

దేవుడు మరలు ప్రవక్తకు, "నీవు తిరిగి వెళ్ళి మరియు అతడికి తెలియజేయుము," అని చెప్పెను.

2KGS 16:20•

ISA 38:3,5

 

30ఇప్పుడు, ఇది వింత కాదా? హిజ్కియా ఆ దేశములో చాలా గొప్పవాడు. హిజ్కియా ఒక రాజు, మరియు ఒక దైవజనుడు. అతడు యధార్థపరుడు. దేవుని ఎదుట అతడు వాదించుటయు, అందుకు దేవుడు అతనిని గద్దించకుండుటయు మనము చూతుము. "నేను నీ యెదట యధార్థ హృదయముతో నడచియున్నాను." అది ఎంత గొప్ప మాట, చూడండి.

"లేదు, హిజ్కియా, నీవు ఆలాగు నడువలేదు," అని దేవుడు చెప్పలేదు గాని, "ఇంకా నీకు జీవితము పొడిగించుచున్నాను," అని చెప్పెను. అతని మనవిని దేవుడు మన్నించెను. అతడు నిజంగా నీతిపరుడు. నిజంగా దేవుని దాసుడు.

31మన విన్నపము సరియైనదయినచో మనకు అడుగు వాక్కుండును. మన ఉద్దేశ్యము సరిగా యుండవలెను.

గత పదిహేను సంవత్సరముల నుండి దేశమంతటా ఒక నిరంతర హెచ్చరిక వినబడుచున్నది, "మారుమనస్సు పొందుడి లేదా నశించెదరు."

చూడండి. ఈ రోజు ఉదయం నేను నా భార్యతో అల్పాహారము తింటూ భోజనపు బల్ల యొద్ద మాట్లాడాను. ఆమె బిల్లిగ్రాహం గూర్చి ఆయన భార్య గూర్చి మాట్లాడినది. వారెంత సామాన్యులో జీవించుటకు కూడా ఎంత కష్టపడిరో చెప్పినది. నిజంగా, ఆయనను ప్రశంచించవలసినదే, ఎందుకనగా సంవత్సరానికి రెండు, మూడు మిలియను డాలర్లు ఆదాయము వచ్చినా దానిని ఆయన తీసికొనడు. ఆయన ట్రస్టు దానిని స్వీకరించును. తిరిగి ఆ కూటముల ద్వారా వచ్చిన డబ్బును సేవ కొరకే వినియోగించును. రేడియో కార్యక్రమములు నిర్వహించుదురు. బిల్లీ సంవత్సరమునకు ఇరవై-అయిదు వేల డాలర్లు మాత్రమే తన కొరకు తీసికొనును.

"ఆ ఇరవై-అయిదు వేలు ఎట్లు ఖర్చుచేయును?" అని ఆమె అడిగినది.

"ఆయనకు కావలసింది ఆయన ఉంచుకొనును. తన ఇంటి అద్దె ఇంకా తదితర ఖర్చులకు ఉపయోగించును. బిల్లీ గ్రాహం పట్ల నాకు చాలా గౌరవమున్నది, ఎందుకనగా ఆయన మారుమనస్సు వర్తమానమందించును," అని నేను సంభాషణలో చెప్పాను.

బిల్లీ గ్రాహంను దేవుడు లోకంలో ఒక ప్రత్యేక రీతిగా వాడుకొనుచున్నాడు. నేడు ఆయన వర్తమానము అందరికీ అవసరము. ఆయన వలన ఎందరో రాజకీయవేత్తలు, సంఘ సభ్యులు మారుమనస్సు పొందుచున్నారు. అయితే ఆయన చేయకలిగింది అంతవరకే.

HEB 13:8

 

32సహోదరుడు ఓరల్ రాబర్ట్స్ మరో గొప్ప ప్రభు సేవకుడు. ఓరల్ రాబర్ట్స్ కు సరిపోయిన వారెవరూ లేరు. ప్రభుని నామములో ఆయన దురాత్మలను వెళ్ళగొట్టు పట్టు కలిగియున్నాడు. దైవిక స్వస్థతను ఆచరణలో పెట్టుచున్నాడు. ఇది అక్షరాలా నిజము. పెంతెకోస్తుకు ఒక వర్తమానమున్నది.

సంఘ శాఖల ప్రపంచమునకు, చల్లబడిన ప్రపంచమునకు ఒక వర్తమానమున్నది.

మన చిన్న పరిచర్య చూడండి. "యేసుక్రీస్తు నిన్న, నేడు, నిరంతరము ఏకరీతిగా యున్నాడు," అను వర్తమానము వినబడుచున్నది. చూడండి, ఇదేమి చేయుచున్నది? ఆ వధువు గుంపును బయటకు పిలచుచున్నది. రెండు గుంపులలో నుండియు వారిని బయటకు పిలచుచున్నది. నా భావము మీరు గ్రహించారా?

HEB 13:8

 

33బిల్లీ గ్రాహం బోధించుచున్న వర్తమానమును దేవుడు స్థిరపరచుచున్నాడు. ఓరల్ రాబర్ట్స్ ప్రార్థన వలన దేవుడు స్వస్థపరచుచున్నాడు. యేసుక్రీస్తు నిన్న, నేడు, నిరంతరము ఏకరీతిగా యున్నాడు. ఇది ఈ మడియ యొక్క వర్తమానము. "మారుమనస్సు పొందుడి లేదా నశించెదరు," అనియే ప్రతి వర్తమానము చెప్పుచున్నది. అది సత్యము. "మారుమనస్సు లేనిచో నాశనమే." ఇక ఏ ఆశయు లేదు, అంతా అయిపోయినది. ఆయన రాక గూర్చిన హెచ్చరికలు లోకమంతా ఏనబడుచున్నవి. రెండు రకములగు సంఘములకు ఆయన రాకను గూర్చిన హెచ్చరిక వినబడుచున్నది.

34దేవుడు తండ్రిగా, కుమారునిగా, పరిశుద్ధాత్మగా; అనగా నీతీకరణము, శుద్ధీకరణము, పరిశుద్ధాత్మ అను మూడు రీతులలో ప్రత్యక్షమాయెను.

నామకార్థ సంఘమునకు దేవుడు మారుమనస్సు సందేశమిచ్చుచున్నాడు. పెంతెకోస్తు సంఘమునకు దైవిక స్వస్థత వర్తమానమును దేవుడిచ్చుచున్నాడు. వధువు వర్తమానములో దేవుడున్నాడు, చూచారా. కాబట్టి వారందరూ ఏదో ఒక దానిని గూర్చి బోధించుచున్నారు. లోకములో నుండి దేవుడు సంఘమును బయటకు పిలచుచున్నాడు. శాఖలలో నుండి పెంతెకోస్తుకు, పెంతెకోస్తు నుండి బయటకు దేవుడు సంఘమును పిలచుచున్నాడు.

లూధర్, వెస్లీలు ఆలాగే చేసిరి. చూడండి, అవన్నీ చక్కని మాదిరిగా యున్నవి. అందులో తప్పు దొరకదు. వాటి యొక్క చివరలు, ప్రక్కలు, బయట, వెలుపల, క్రమము, లేఖనముల ద్వారా పరిశీలించాను. అది సంపూర్తిగా సత్యము, చూచారా. అందులో ఏ తప్పు లేదు. ఆదివారము మరి లోతుగా దీనిని నేను బోధించెదను. మీ హృదయములో అది దిగును, మరియు అది మీలోనుండి అది ఎన్నడూ తప్పిపోకుండా ఉండాలని ఆశించిచున్నాను.

GEN 7:23•

GEN 19:14•

2KGS 20:17,18•

MATT 24:37,38•

LUKE 17:26,27

 

35ఇప్పుడు, దేవుడు తీర్చుకు సిద్ధపడమని హెచ్చరిక చేయుచున్నాడు. అణుబాంబులు నేడు సిద్ధముగా యున్నవి, అయితే వీటిని వదులు ముందుగా ఆయన ఒక పిలుపును ఇచ్చును. సొదొమలో ఆయన అదే చేసెను, "దానిలో నుండి బయటకు రండి! సిద్ధపడండి! ఒకటి జరుగనైయున్నది!"

మహా జలప్రళయముతో లోకము నాశనము చేయక ముందు దేవుడు నోవహు ద్వారా ఒక హెచ్చరిక చేసెను. ఆ లోకము పాపముతో నిండినది. అది ఈ దినము వంటిదే అని యేసు చెప్పెను, "నోవహు దినములలో ఎట్లుండెనో మనుష్యకుమారుని రాకడలోను ఆలాగే యుండును." స్త్రీలు ప్రవర్తన తీరు చూడండి. పెండ్లిండ్లు చూడండి. గొప్ప శాస్త్రీయ సాధనములను చూడండి. తెలివి వృద్ధి చెందినది. బాగ చదివిన వారు మేధావుల వర్గములోనికి వెళ్ళుచున్నారు. చిన్న దీన మంద ఒక మూలన కూర్చిని రానున్న తీర్పును తప్పించుకొనుటకు ఎదురుచూచుచున్నది. ఆ తీర్పు పంపక ముందు దేవుడు ఒక ప్రవక్తను పంపును.

హిజ్కియాతో ఆయనాలాగే చెప్పెను, "సిద్ధపడుము, తీర్పు రానైయున్నది."

ఆ సమయము కొరకు దేవుడు జనులను సిద్ధపరచును. నోవహు జనులను సిద్ధపరచెను, మరియు తీర్పుకు ముందు అది దేవుని పిలుపు.

JON 1:2•

JON 3:4

 

36ఆ సమయమునకు ముందే నీనెవెకు తెలియచేయబడినది. దేవుడు నేనెవేను తొంగి చూచెను. ఆ పనులను చూచి దేవుడు విసుగు చెందెను. అది అన్యుల యొక్క మహా పట్టణము. ఆ రోజులలో పట్టణములకు తీర్పు. ఈ రోజులలో దేశములకు తీర్పు. జనసంఖ్య విస్తరించిపోయినది. ఆ మహా పట్టణము పాపముతో నిండిపోయెను.

దేవుడు తన తీర్పును పంపక ముందు హెచ్చరిక వర్తమానమును అందించును. "అందులో నుండి బయటకు రండి! సరిదిద్దుకొనండి." ఆ మహా పట్టణము నలువది దినములకు నాశనమగునని ప్రవక్త చెప్పెను.

37ఆ విధంగా కొన్నిసార్లు జనులకు చెప్పుట చాలా కష్టము. ప్రవక్త జాగ్రత్తగా చూచుకొననియెడల ఆపదలో పడును, ఎందుకనగా ఆ పరిస్థితులలో అతడు కొద్దిగా రాజీపడు అవకాశము వచ్చును. వర్తమానమును కొద్దిగా తేలికచేయనుద్దేశించును. కాని దేవుని నుండి ఆజ్ఞ పొందిన నిజ ప్రవక్త ఎన్నడూ రాజీపడడు. పూర్తిగా విధిని నిర్వహించును.

ఆ కారణము చేతనే ఆయన ఏలియా అత్మను అంతగా ఉపయోగించుకొనెను. అతని ఆత్మ ఆయనాజ్ఞలను నెరవేర్చినది. చూచారా? వాక్యము నొద్దకు తిరిగి తీసికొని వచ్చినది. ఆయన మాటలను అక్షరాలా నేరవేరెను. వాక్యము నొద్దకు వారిని తిరిగి తీసికొని వచ్చినది.

JON 1:2•

JON 3:4

 

38నీనెవె పాపములో యుండుటను మనము చూతుము. అది అన్యుల పట్టణము గనుక ప్రవక్త కొంత సందేహించెను, వారు హెబ్రీయులు కారు. అది అన్యుల రాజ్యము, ప్రజలు అన్యులు. నీనెవె గొప్ప వర్తక ఓడరేవు. గొప్ప చేపల పారిశ్రామిక కేంద్రము. జనులు చేపలు వేటాడెడి వారు. అది గొప్ప పాప పట్టణమైయుండెను. విస్తారముగా డబ్బున్నది. ఎక్కడ డబ్బు, విస్తారముగా యుండునో, ఎక్కడ జనులు గొప్పవారని ఎంచబడుదురో అచట పాపము, హింస విస్తారముగా ఉండును.

దేవునికి అసహ్యము కలిగినది. కాబట్టి దేశములో నున్న ప్రవక్తకు, దేవుడీలాగు చెప్పెను, "ఇక నలుబది దినములకు నీనెవె నశించునని ప్రకటించుము."

నేను కొద్దిగా ఇబ్బందిలో పడుదునని యోనా తలంచెను. కాబట్టి అతడు తర్శీషునకు వెళ్ళి, కొద్దిగా విశ్రాంతి తీసికొందుననుకొనెను. ఇంక నలుబది దినములే యున్నవి, చూచారా.

అది అత్యవసర వర్తమానము, సమయము సమీపించినది. ఇతర సంగతులు, డిగ్రీలు, సంపాదించుట కొరకు సమయము పాడు చేయవద్దు. సమయము సమీపించినది. నేడు జనులు ఎట్లున్నారో చూడండి. పెద్ద బడులు కట్టుటకు ప్రయత్నించుచున్నారు. ఏవో గొప్ప పనులు చేయగోరుచున్నారు. మనము యేసు రాకడను గూర్చి బోధించుచుండగా, ఆ స్కూలు సంగతి ఎందుకు? మనకు మారుమనస్సు అవసరము.

39ఒక యువ మిషనెరీకి హడ్సన్ టేలరు చెప్పినట్లే యున్నది… ఒక చైనా యువకుడు ఆయన యొద్దకు వచ్చి, "టైలర్గారూ, ప్రభువైన యేసు నన్ను పరిశుద్ధాత్మతో నింపెను. నేను చాలా ఆనందంగా యున్నాను. నేను పది సంవత్సరాలు పనిచేసి నా డిగ్రీలు సంపాదించుకొందును," అనెను.

"కుమారుడా, డిగ్రీల కొరకు సమయం పాడు చేయవద్దు. దీపం వెలిగినచో వెళ్ళి బోధించు. డిగ్రీ కొరకు ఎదురు చూడవద్దు. నీ డిగ్రీలు సంపాదించే సరికి నీవు సగం కాలిపోయెదవు," అని ఆయన చెప్పెను.

అది వెలిగించబడినపుడు నీవింక ఏమి తెలిసికోనక్కర లేదు. అదెట్లు వెలిగించబడినదో చెప్పుము. ఎవరి స్థానమునో ఆక్రమించుటకు ప్రయత్నించవద్దు. నీకు సత్యము తెలిసినపుడు, వెళ్ళి ఇతరులకు చెప్పుము. "నాకు ఈ విధంగా ఇది వచ్చినది. దీనిని గూర్చి నా అనుభవము ఇది." అంతకంటే ఎక్కువ నీకేమా తెలియనక్కరలేదు, దానిని ప్రకటింపుము! మనము సాగుదాము! వర్తమానం అత్యవసరం, సమయం సమీపించియున్నది.

ISA 38:1•

JON 1:4-6

 

40"ఈ పుండుతో ఇతడెట్లు బాధపడునో ముందు చూద్దాం," అని యెషయా అనుకొనినచో ఎట్లుండును?

ఆక్కడికి వెళ్ళి వెంటనే అతనికిది చెప్పుమని దేవుడాజ్ఞాపించెను. చూచారా?

యోనాను దేవుడు వెళ్ళి చెప్పమని ఆజ్ఞాపించెను. ఓ, మై!

ఆ లోతయిన సముద్రములో అతడు ప్రయాణించుచున్న ఓడ తుఫానుకు చిక్కుబడినది. వారు లంగరు వేసి చేయవలసినవన్నీ చేసిరి, కాని ఏమి చక్కబడలేదు. పరిస్థితి చేతుల నుండి జారిపోయినది. అందరూ తమ తమ దేవుళ్ళకు ప్రార్థించుచున్నారు. యోనా విశ్రాంతి తీసికొనుచుండెను. బాగా నిద్రించుచుండెను. ఓడ దిగువ భాగమునకు వెళ్ళి, కాళ్ళు చాచుకొని నిద్రపోవుచుండెను. "ఓ నిద్రబోతా! లేచి నీ దేవుని ప్రార్థించుము," అని కేకవేసిరి. అక్కడ పొరపాటు ఏమిటో యోనాకు తెలియును.

నేడు కూడా ప్రతి మనిషి తన తప్పును ఎరుగును! చూచారా?

JON 1:12,13,17

 

41"ఇదంతయూ నా తప్పు. నా చేతులు కాళ్ళు కట్టి నన్ను సముద్రములో పడవేయుడి. ఈ శ్రమ పోవును" అని చెప్పెను. కాని వారు పెద్ద మనుషులు గనుక ఆలాగు చేయ ఇష్టపడలేదు. అయితే అతడు ప్రవక్త గనుక చెప్పినది నిజమై యుండునని గ్రహించిరి. యోనా ఇట్లనుకొనెను, "నేను విశ్రాంతి తీసికొందుననుకొన్నా దేవుడు తీసికొననియ్యుట లేదు. నేను ఆక్కడికి వెళ్ళి ఇది చెప్పుట కష్టము. అయినా నేను వెళ్ళి ఆ వర్తమానము అత్యవసరము గనుక చెప్పక తప్పేటట్టు లేదు."

దేవుడు సిద్ధపరచిన ప్రత్యేకమగు చేప యోనాను తన కడుపులో దాచి మోయుచుండెను. అది నినెవె తీరము వైపుగా ఆ జలములలో నుండి బయలుదేరినది. అది ఎంతో ప్రయాసపడియుండునని నేను తలంచుచున్నాను. ఆ ప్రత్యేకమగు సిద్ధపరచిన చేపలో దేవుడు తన వర్తమానమును పంపించుచుండెను. తనలో నున్న వర్తమానికుని తీసికొని బహు ప్రయాసతో అది బయలుదేరెను. అతడు వేరే ఓడ ఎక్కినా దేవుడు మరో ఓడను అతని కొరకు ఏర్పరచెను.

దేవుని మాట వినినచో దేవుడు గొప్ప కార్యములను చేయగల సమర్థుడు, చూచారా. త్రోవలేని చోట ఆయన త్రోవలను కలుగచేయును. ఆయనే మార్గము, చూడండి. నేడు కూడా వర్తమానము చాలా అవసరము. దేవుడు ఒక మార్గమును ఏర్పాటు చేయును.

42ఆమోసును మనము చూద్దాం… ఇతని గూర్చి నేను బోధించాను. ఆమోసు గాధ చదవండి. ఆమోసు మొదటి అధ్యాయము చూడండి. పాపమునకు తీర్పు వచ్చు ముందుగా ఇతడును ఒక హెచ్చరిక చేసెను. యూదులున్న ఒక పట్టణమునకు ఇతడు హెచ్చరిక ఇచ్చెను. అది ఒక గొప్ప యాత్రా కేంద్రముగా మారినది. అతని గూర్చి మాట్లాడిన ఆ ఉదయము ఒక ఉదాహరణ నేను చెప్పాను. బట్టతలవాడగు అతడు చిన్న కొండపైకి వచ్చెను. ఆ గొప్ప దేశము, ఆ జనులు జరిగించుచున్న పాపము చూచి అతని కళ్ళు చెమ్మగిల్లెను. తన తెల్లని గడ్డములో వేళ్ళు పెట్టుకొని సవరించుకొనుచూ దాని గూర్చి విలపించుచుండెను. ఎంత విషాదము! కానీ ఇతడెవరో వారెవరికి తెలియదు.

ఆ ప్రవక్తలను గూర్చి ఎవరూ ఎరుగరు, ఎక్కడో లేచి తమ పనిని చేయుదురు.

AMOS 3:3•

AMOS 4:12

 

43కాని అతడు పట్టణములోనికి "యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు" తో వెళ్ళెను. మారుమనస్సు పొందుడి, లేనిచో నశించెదరు! దేవుడు ఈ దేశమును నాశనము చేయును. భూమి మీద లేకుండా ఆయన తుడిచివేయును. మీరు మీ శత్రువులతో ఒక ఒప్పందము చేసుకొనియున్నారు. మీరు శత్రువుతో సమాధానముగా ఉన్నామని తలంచుచున్నారు గాని, అష్షూరులు అక్కడ సన్నద్దమగుచున్నారు. సమ్మతింపకుండా ఇద్దరు కూడి నడవలేరు.

దేవుడు మనలను వేరుగా ఉండమని కోరుచున్నాడు. లోకములో నుండి బయటకు రమ్మని పిలచుచున్నాడు. లోకముతోను, దేవునితోను కూడా జీవించుటకు ప్రయత్నించవద్దు. దేవుని పద్ధతులు, లోకపు పద్ధతులు అనుసరించవద్దు. ఎవరో ఒకరి కొరకు నీవు జీవించవలెను, ఏదో ఒకటి నీవు నమ్మవలెను.

AMOS 3:1

 

44ఆ జనులు మారుమనస్సు పొందని యెడల తప్పక తీర్పు జరుగునని ఆమోసు నిశ్చయంగా ఊహి౦చెను. (నేటికి ఇది వర్తించును.) ఇది ఆర్థికముగాను, అన్ని విధములుగాను వర్థిల్లుచున్న గొప్ప పట్టణము. వారు ప్రభుని చిత్తములో జీవించుచున్నామని తలంచిరి, ఎందుకనగా వారు వర్థిల్లుచున్నారు. కాని దేవుడు వర్ధిల్లుటకు మాత్రమే మూలము కాదని వారు గ్రహించవలసియుండిరి. కొన్నిసార్లు సంఘములు వర్ధిల్లి దేవుని నుండి దూరమగును.

EZEK 16:5,9,15,22

 

45ఒకసారి దేవుడు ఇశ్రాయేలును గూర్చి ఇట్లు పలికెను, "నీవు రక్తములో పడియుండగా, నేను కనుగొని నిన్ను కడిగి నా స్వంత బిడ్డగా చేసికొంటిని. నీవు పెరిగి అందగత్తెగా అయి వేశ్యవైతివి. ప్రతి విటునికి నీవు ఆశ్రయమిచ్చితివి," చూచారా. "కాని నీవు పేదవానివై అక్కరలో ఉండినపుడు నన్ను సేవించితివి. అయితే నేను నిన్ను దీవించి సమృద్ధిని కలుగజేసినపుడు, నీవు నా నుండి దూరమైపోతివి." ఆ విధంగా అది రుజువు చేయబడినది. ఓ, మై!

ఇప్పుడు, ఈ ఆమోసు నిజంగా ఆ దేశమును ఎండగొట్టెను. అతడు ఒక పశుల కాపరి. కాని అతడు వారికి సూటిగా చెప్పెను. వారు దేవునితో సమాధానపడని యెడల వారు చెలిమి చేసిన శత్రువే వారిని నాశనము చేయునని చెప్పెను.

46మన గర్విష్ట అమెరికా దేవుని ఉగ్రతను తప్పించుకొనలేదు. ఒకసారి ఇక్కడే చెప్పాను, ప్రతిదానికి అంతము వచ్చి యున్నది. ఏదీ ఇక కట్టబడదని నాకు తోచుచున్నది. రాజకీయమును బాగుచేయలేరు. దాని పని అయిపోయినది. సాంఘిక జీవితము కూడా పాడయినది. అంతా అవినీతి. ఇంక దేనినీ చక్కబరచలేము. ఎందులోనూ ఇక ఆశలేదు.

"సంఘము మాట ఏమిటి?"

సంఘమును కూడా బాగు చేయలేము, అది చాలా చల్లబడిపోయినది, మరియు ఏమియు మగిలిలేదు. ఒక్కపూట తిండి కొరకు జ్యేష్ఠత్వమును అమ్ముకొన్నట్లుగా అది యున్నది. ఇక తీర్పు కాచుకొని యున్నది. పరిశుద్ధాత్మ ఈ దేశమును సూచక క్రియలు, అద్భుతములతో కదిలించినది. ఆయనాత్మను వారు దుఃఖపరచిరి. ఆయన తన్ను తాను బయలు పరచుకొనియున్నాడు. గొప్ప ప్రత్యక్షత దయచేసెను. ఈ దినమునకు ప్రత్యక్షపరచబడిన దేవుని వాక్యము ఆయనే. అయినా వారింకా త్రోసివేయుచున్నారు, చూచారా. ఇంకేమి మిగిలియుండలేదు. దేవునితో ఎల్లప్పుడూ నీవు ఆలాగు చేయరాదు, చూచారా.

ISA 38:1,5

 

47మొదటగా ఆయన తన ప్రవక్తలను హెచ్చరికతో పంపును. ఆయన తన కార్యములను చేయు విధానమును, తన మార్గము మార్చుకొనడు.

ఆయన హెచ్చరిక చేసిన వెంటనే కొట్టడు. దీనిని మీరు గమనించవలెను. దేవుడు హెచ్చరిక చేయును గాని అదే సమయములో కొట్టడు. మీరు దానిని గమనించారా? ఆటువంటపుడు ప్రవక్తను హేళన చేయుదురు గదా? "నీవు అబద్ధము చెప్పితివి. నీవు నిజము పలుకలేదు," అందురు.

యెషయాను ఆలాగే అని యుండవచ్చు. రాజు మరణమగునని అతడు వెళ్ళి ప్రవచించెను గాని మరల వచ్చి అతడు బ్రదుకునని చెప్పెను.

JON 3:4

 

48యోనా ఆ వీధులలోనికి వెళ్ళి, "ఓ, ఈ పట్టణము నలుబది దినములలో నాశనమగును" అని చెప్పెను గాని, దేవుడాలాగు చేయలేదు.

చూచారా, మీరిది గమనించవలెను, దేవుడు హెచ్చరించిన ప్రతిసారి కొట్టడు. కాని ఆయన… అకడ ఒక విషయమున్నది, అపుడు ప్రవక్తను హేళన చేయుదురు. అయితే ప్రభుని వాక్యము యొక్క ప్రత్యక్షత కలిగిన ప్రవక్త దేవుని సూచనలను గమనించును. (వీరిట్టి వారే), చిచారా, అది వారి మాట కాదు, అయితే అది దేవుని మాట గనుక అది నెరవేరును. అది దేవుని వాక్కు అయినచో నెరవేరవలెను. దానిని ఒకే ఒకటి ఆపగలదు, అది త్వరితముగా వచ్చు మారుమనస్సు.

DAN 12:9,13

 

49గమనించండి, ఆమోసు, తన ప్రవచనము నెరవేరుటను చూచెను. ఆ పట్టణమును సిరియనులు వచ్చి ఎట్లు తీసికొందురో, వారి దుష్టత్వము వారినెట్లు సంహరించునో ఆమోసు చెప్పెను. లేఖనములో చూచినట్లయితే, ఆమోసు ప్రవచించిన ఏబది సంవత్సరములకు అది జరిగెను. మీరేమి తలంచుచున్నారు? ఆమోసు ప్రవచనము నెరవేరుసరికి ఒక తరము గతించెను. కాని అతడు చెప్పినది అక్షరాలా నెరవేరుట మీరు వాక్యములో చూడగలరు.

యోహాను ప్రకటన గ్రంధము చూచెను. అది అతని దినములలో జరుగలేదు. కాని ఇపుడది జరుగుట మనము చూచుచున్నాము, చూచారా.

దానియేలు ప్రవచించినది అతడు జీవించిన దినములలో నెరవేరలేదు. "దానియేలూ, నీ దారిన వెళ్ళుము. ఆ గ్రంధమును మూసివేయుము. నీవు నీ వంతు చొప్పున నిద్రించెదవు, కాని ఆ దీనమున లేచెదవు" అని ఆయన చెప్పెను, చూచారా.

ప్రవచించిన వెంటనే ఎల్లపుడూ జరుగకపోవచ్చును. ఆమోసు ప్రవచనము ఏబది సంవత్సరముల తరువాత నెరవేరెను. అయితే అది తప్పక నెరవేరినది!

50నిజమగు ప్రవక్త ఒక ప్రత్యేక వ్యక్తిగా నుండును, అనగా అందరికీ భిన్నమైన వ్యక్తి అని కాదు గాని, ప్రత్యేకమగు పనిని కలిగియుండును. అతనికి ఒక ప్రత్యేక పని ఇవ్వబడినందున దానిని చేయుటకు (ఇతరులకు కొద్దిగా వేరుగా) అతడు ఒక ప్రత్యేకమగువానిగా ఉండవలెను.

దేవుడు తన ప్రవక్తలను పక్షిరాజులుగా ఉండగోరును.

పక్షిరాజు ఒక ప్రత్యేకమగు పక్తి. అది పక్షియే గాని ఒక ప్రత్యేకత గలది. ఇతర పక్షుల కంటే ఎత్తుగా ఎగుర గలదు. ఇతర పక్షుల కంటే దూరంగా చూడగలదు. అది పైకి ఎగురునట్లుగా నిర్మించబడినది, అంత పైకి ఎగిరిన తరువాత క్రింద ఉన్న దానిని చూడలేకపోయినచో, ఏమి ప్రయోజనము, చూచారా. కాబట్టి అది ఒక ప్రత్యేక నిర్మాణము గల పక్షి అయియుండవలెను. అది డేగ కుటుంబములోనిదే, అయితే అవి తక్కువ జాతికి చెందినవి. మరియు అది తినునప్పుడు… వాటిలో చాలా వరకు రాబందులు. నలుబది రకముల గ్రద్దలున్నవి.

51సంఘములో కాపరియున్నాడు. అతడు ఒక ప్రత్యేక వ్యక్తి. అతడు జనుల సణుగుడు వినును, అతడు భారము మోయును. ఎద్దువలె శ్రమించును. ఒకరికి ఒకరు విరోధముగా నున్నపుడు ఈ రెండు కుటుంబములతో ఇతడు కూర్చొని, కారణములను తెలిసికొని మరల సఖ్యతను తీసికొని వచ్చును. (అతడు ఎవరి పక్షము వహించడు) అతడు సంఘకాపరి గనుక సంగతులనెట్లు పరిష్కరించవలెనో ఎరుగును.

సువార్తికుడు ఒక ప్రత్యేకమైన వ్యక్తి. అతడు అగ్నిగోళము వలె ఉండును. అతడు ఒక పట్టణము లోనికి వెళ్ళి తన వర్తమానమును బోధించును. ఆ తరువాత అతడు మరో చోటకు వెళ్ళును. చూడండి, అతడు ఒక ప్రత్యేకమగు వ్యక్తి.

ఉపదేశకుడు ఒక ప్రత్యేకమగు వ్యక్తి. అతడు ఆత్మ యొక్క ఆభిషేకము క్రింద ఉండి వాక్యమును పరిశుద్ధాత్మ ద్వారా ఒక చోటకు సమకూర్చును, సంమ కాపరి గాని, మరియు సువార్తికుడు గాని ఎవరూ అతనికి సాటి రారు.

అపోస్తలుడు ఒక ప్రత్యేక వ్యక్తి, అతడు అన్నింటిని క్రమములో పెట్టును. అన్నింటిని క్రమములో పెట్టుటకే దేవుడతనిని పంపును.

52ప్రవక్త ఒక ప్రత్యేకమైనవాడు. ప్రవక్త యొద్దకు యెహోవా యొక్క వాక్యము వచ్చును. అతడు నిద్రపోయి కలలు కనడు గాని, మెళకువగా ఉండియే తన అంతరాత్మతో దేవుని సంధించును. అది దేవుడు చేయవలసినది. జరుగుచున్న దానిని అతడు చూచును.

ప్రవక్త దూరము నుండియే రానున్న సంగతులను చూచును. దేవుని ఉగ్రతా పాత్రను ముందుగానే చూచును, చూచారా. "యెహావా ఈలాగు సెలవిచ్చుచున్నాడు, మీరు మారుమనస్సు పొందని యెడల దేవుడు ఈ పట్టణమును నాశనము చేయును," అని అతడు చెపును. ఎందువలన? అతడు ఒక పక్షిరాజు. అతడు బాగా ఆవతలకు చూడగలడు, క్రుమ్మరించబడబోవు పాత్రను ముందుగానే చూచును. ఎందువలన? అతడు ఒక పక్షిరాజు, ప్రవక్తలు ఆలాగే చూచుదురు. ఇక్కడ జరుగుచున్న దానిని చూచుట కాదు గాని, ఆవలి దానిని చూచును. రానున్న దానిని ముందే ప్రకటించును. దాని నీడను చూడకలిగినంత పైగా అతడు వెళ్ళును. "భూమిని చీకటి కమ్ముచున్నది. కటిక చీకటి కమ్ముచున్నది," అని చెప్పకలిగెను. అ౦త పైకి అతడు వెళ్ళును. సూర్యుడు ప్రకాశించుచున్నాగాని, రానున్న నీడను చూడకలిగెను. తాను చూచుచున్న దానినే అతడు చెప్పెను. ఇంకా అది ఇక్కడ జరగలేదు గాని, నిశ్చయంగా అది జరుగును! ఇది నిజము. జనులను కటిక చీకటి కమ్ముచున్నది. ఎన్నో సంవత్సరములకు ముందే జరుగునది తెలిసికొనెను.

ఆమోసు దేవుని ఆభిషేకము పొందిన ప్రవక్త. చీకటిని, తీర్పును అతడు చూచెను. సిరియా వారు వారి రధములతో వచ్చి జనులను సంహరించుట చూచెను. వారి మీదికి తీర్పు వచ్చుటను చూచెను. అది జరుగుటకు ఏబది సంవత్సరములకు ముందే చూచెను. అతడు ప్రవక్త గనుక ఆత్మలో కొనిపోబడి దూరము నుండియే చూడకలిగెను. ని౦పబడక ముందే నిండిన ఉగ్రతా పాత్రను చూచెను.

GEN 15:13-16

 

53అబ్రహాము ఆ విధంగానే యున్నాడు. దేవుడు అబ్రహాముతో ఇట్లు చేప్పెను, "నీ సంతానము ఈ దేశములోనికి వచ్చును. వారి సంతతి నాలుగు వందల సంత్సరముల పాటు యాత్ర చేయును. అపుడు వారిని బలమగు హస్తముతో తోడుకొని వచ్చెదను. అయితే ఇంకా అమోరీయుల పాపము పరిపక్వము కాలేదు," చూచారా. ఆ గిన్నె నిండునని దేవునికి తెలియును. ఆయన తన ప్రవక్తతో మాట్లాడుచున్నాడు. ప్రవక్తతో ఇట్లు ఆయన చెప్పెను, "అమోరీయుల గిన్నెను నీవు చూడుము, కాని ఇంకా వారి పాపము పరిపక్వము కాలేదు. ఇప్పుడు దాని గూర్చి ఏమియూ చెప్పవద్దు, కొంత ఓపిక పట్టుము, అది జరుగును. ఆ గిన్నె నిండును. నాలుగు వందల సంవత్సరములు నిండవలెను. వారిని మీ ఎదుట నుండి మిడుతలను తోలినట్టుగా తోలివేసెదను. నీ సంతానమును ఈ దేశములో స్థిరపరచెదను." ఆమేన్! ప్రభుని ప్రవక్త ఇట్లుండును.

HAB 2:3

 

54ఆయన ఒక దర్శనమిచ్చును, అది ఉగ్రతకు చెందినది కావచ్చు లేదా స్వస్థతకు చెందినది కావచ్చు. అది వెంటనే జరుగకపోవచ్చు, కాని అది ప్రభుని నామములో పలుకబడినదయితే తప్పక నెరవేరును, చూచారా. ఆయన నీతో మాట్లాడుట నీకు దీవెన. ఆయన ఒక విషయము చెప్పినా దానిని నీవు వెంటనే చూడలేకపోవచ్చును. ఇదెట్లు జరుగును? అని నీవనుకొందువు. "'యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు,' ఇది జరుగనై యున్నది. అది జరుగనైయున్నది," అని చెప్పినా ఏది జరుగలేదు గనుక అతడు చెప్పినది తప్పు అయియుండునని తలంచెదరు. దానిని నీవు నమ్మనందుకు నీకు తీర్పు జరుగును. అది ఏలాగయినా నెరవేరును! చూచారా? అది జరుగవలసియున్నది!

"అది ఆలస్యము కావచ్చు, గాని దాని సమయములో అది నెరవేరును" అని బైబిలు చెప్పుచున్నది. అది తప్పక నెరవేరును.

55ప్రవక్త దేనినో చూచును, తాను చూచిన దాని గూర్చి అతడు మాట్లాడును. అతడు చూచిన దానిని నీవు తలంపుతో గ్రహించలేకపోవచ్చును. ఇప్పుడు నీకు అది అర్థము కాదు. అతడు చెప్పినది దేవుని వాక్కు అయినచో దానిని జరుగనీయకుండా ప్రపంచములో ఎవరూ ఆపజాలరు. దేవుడు మాత్రమే ఆపగలడు. (అది నిజమని మీరు చూడండి).

చూడండి, ప్రవక్త తన దర్శనమును చెప్పును. కొన్నిసార్లు అతడు నీ స్వస్థత గూర్చిన మంచి సంగతులు చెప్పును. "ఆలాగు జరుగదు, నేను బాగుపడలేదు," అని నీవనుకొనవచ్చును. అపుడేమి జరుగును? దేవుని తీర్పులు నీ మీదికి వచ్చును. ఇది నిజము, చూచారా. నీవది నమ్మినయెడల బాగవుదువని యేసు నీకు వాగ్దానము చేసెను. నీవు నమ్మనియెడల అది నీకు జరుగదు. దానిని నీవు ఆంగీకరించవలసియున్నావు. దానిని నీవు నమ్మవలసియున్నావు, చూచారా. ఆదెక్కడ నుండి వచ్చెనో నీవు తెలిసికొనవలసియున్నావు, అందువలన దేవునిలో నీకు విశ్వాసము కలుగును; లేదా నీ యుక్క ప్రవక్తపై, చూచారా. దానిని నీవు నమ్మవలసియున్నది.

56ఈ ప్రవక్తలు చెప్పినది నెరవేరినట్లు మనము చూడగలము. ప్రజల మీద దేవుని ఉగ్రతను నిరోధించునది మారుమనస్సు మాత్రమే. ప్రవక్త ఉగ్రత వచ్చునని చెప్పినా దేవుని వస్త్రము దానిని రాకుండా చేయును. దేవుని వైపు తిరిగినయెడల ఊగ్రత నిలచిపోవును. దాని కొరకు వేచియుండక, వెంటనే మారుమనస్సు పొందుము. దేవుడు హెచ్చరించిన వెంటనే సరిచేసికొనుము.

2KGS 20:1,3,5,6•

ISA 38:1,3,5

 

57హిజ్కియా మంచివాడు, కాని దేవుడు హిజ్కియా సయమము ఆయిపోయేనని చెప్పెను. నేను నిన్ను తీసికొందును గనుక నీ ఇల్లు చక్కబెట్టుకొనుమని దేవుడు హిజ్కియాతో చెప్పెను.

"ప్రభువా, అది చేయుటకు నాకు పదిహేను సంవత్సరములు పట్టును. నాకు తెలియును గాని నా ఇంటిని చక్కబెట్టుకొనుటకు ఇంకా పదిహేను సంవత్సరములు కావలెను. వెంటనే ఆ పని చేయలేను. దానిని చేయుటకు నాకు సమయము లేదు. ప్రభువా, అది జరగని పని. మరో పదిహేను సంవత్సరములు నన్ను జీవించనిమ్ము. అపుడు నేను ఆలాగు చక్కదిద్దుకోగలను," అని హిజ్కియా కోరేను.

"నీ ఇంటిని చక్కబెట్టుకొనుము," అని దేవుడాజ్ఞాపించెను.

హిజ్కియా ఇట్లనెను, "ఈ సంవత్సరము అది నేను చేయజాలను. నాకు సమయము కావలెను. నేను ఫలాని పని చేయవలెను, ఫలాని వ్యక్తిని కలిసికొనవలెను, అది చేయుటకు నాకు పదిహేను సంవత్సరము పట్టును. అందుకు నాకు జీవము దయచేయుము. దానిని చేయుటకు కొద్దికాలము ఇమ్ము," చూడండి.

అందుకు దేవుడు ఒప్పుకొనెను. కాని అతడు ఎలాగయినా చనిపోవును.

2KGS 20:17,18•

ISA 39:6,7

 

58అతడు మరల ఆ కాలములో వెనుకకు జారిపోయెను, చూచారా.

చక్కబెట్టుకొనకుండా అతడు చనిపోయినా బాగుండేది. కాని ఇంటిని చక్కబెట్టు కొనుటకు పదిహేను సంత్సరములు అతనికియ్యబడెను. అతడు తొందరగా చేయలేక పదిహేను సంవత్సరములు అడిగెను. అతడు తనకున్న చిక్కులన్నింటినీ వదిలించుకొనుటకు కొంత సమయమడిగెను. నా ఇంటిని చక్కబెట్టుకొనుటకు నీవు ఆజ్ఞనిచ్చియున్నావు. నేను అది పదిహేను సంవత్సరములలో చేయలేను, ఎందుకనగా నాకు ఇక్కడ బాకీ ఉన్నది, మరియు నాకు అక్కడ ఉన్నది, మరియు చేయుటకు అక్కడ ఇంకొక కార్యము ఉన్నది."

అతడు భక్తిపరుడు. ఆయినా దేవుని మాట నెరవేరవలసియున్నది. ఏమయినా గాని అది నెరవేరును. ఆయన కొంత కాలము ఆగెను. ఆ సమయములో అతడు పాపము చేసెను. దేవుడిట్లనెను, "ఇతని కాలములో దానిని రప్పించను గాని ఇతని సంతానము మీదికి దానిని రప్పించెదను." మీరాగాధ చదివిరి.

JON 1:2•

JON 3:4,5,7,8

 

59కొన్నిసార్లు త్వరగా మారుమనస్సు పొందుట వలన దేవుని ఉగ్రత ఆగిపోవును. కనీసము కొంతకాలమయినా ఆగును.

నీనెవె పట్టణము నలువది దినములకు నాశనమగునని దేవుడు చెప్పమనెను. వారు మారుమనస్సు పొందిరి! "'యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు,' ఇక నలువది దినములలో ఈ చోటు నాశనమగును," అని ప్రవక్త వీధిలో ప్రకటించిన వెంటనే వారు మనస్సు మార్చుకొనిరి.

దేశమంతటా ఉపవాసమును రాజు చాటించెను. గోనెపట్ట కట్టుకొని బూడిద మీద వేసికొనిరి. పిల్లలు, పొలములోని పశువులు కూడా గోనెపట్ట కట్టుకొని బూడిద చల్లుకొనిరి. సర్వ శరీరులు ఉపవాసముండిరి." ఎట్టి మారుమనస్సు!

2KGS 20:5,6•

ISA 38:5

 

60ఇప్పుడు, మనము కనిపెట్టినయెడల, మనము గమనించాము, ప్రవక్త త్వరగా గమనించనియెడల, చూచారా, దేవుని యొద్దకు వెళ్ళనియెడల, నీవు అప్పుడే కనుగొందువు, నీవు కనిపెట్టనియెడల…

ఇప్పుడు యెషయాను చూడండి. అతడు తన ప్రవచనము చెప్పెను. మరల అరణ్యములోని తన గుడిసెలోనికి వెళ్లెను. ప్రార్థించుచున్న రాజుతో మరల దేవుడు మాట్లాడలేదు. ఆయన కార్యములు చేయు ఒక పద్ధతి కలదు. దేశములో ఒక ప్రవక్త యున్నాడు. ప్రభువు యొక్క వాక్కు ప్రవక్త యొద్దకు వచ్చును. అతనితో మరల ఇట్లు చెప్పెను, "యెషయా, నీవు వెళ్ళి అతని ప్రార్థనను నేను విన్నానని చెప్పుము. ఇల్లు చక్కబెట్టుకొనుటకు పదిహేను సంవత్సరములు కావలెనని కోరుచున్నాడు. అతని కన్నీటిని నేను చూచియున్నాను. ఎంతో పని చేయవలెనని కోరుచున్నాడు. అందుకు పదిహేను సంవత్సరములు కావలెనని కోరుచున్నాడు. పదిహేను సంవత్సరములు జీవించునని చెప్పుము."

ఎందువలన? "యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడని" చెప్పుమని యెషయాకు ఆజ్ఞాపించెను. అది ఆలస్యమగునే కాని జరుగుట తప్పదు; ఆ విధంగానే అతడు చనిపోయెను. కాని చెప్పెను… ఇంకా ఏదైనా మార్పు ఉంటె, యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు అని ఆయన పంపిన మనుష్యుని యొద్దకు వచ్చుటకు ఆయన బద్ధుడైయున్నాడు. యెషయాకు దేవుడు చెప్పెను, "తిరిగి వెళ్ళి మరియు అతడికి చెప్పుము."

JON 3:5•

JON 4:3-8

 

61ఇప్పుడు, యోనా మరో వైఖరిలో యున్నాడు, కొండ పైకి ఎక్కి ఇట్లు పలికెను, "నేను పుట్టకుండా ఉంటే బాగుండును." ఓ, అతడెట్లు పరితపించెనో చూడండి. దేవుడు ఒక సొర చెట్టును పెరుగనిచ్చి, అతనిని ఎండబారి నుండి రక్షించెను. అతనికి నీడ దొరికినది. ఇప్పుడు వారందరు నన్ను అబద్ధ ప్రవక్త అందురు గదా ఆనెను.

దేవుడతనితో ఇట్లు మాట్లాడెను, "ఆ పట్టణమును చూడు! యోనా, ఆ పట్టణమంతయూ గోనెపట్ట ధరించి బూడిద చల్లుకొన్నది."

ఆ చిన్న సొర చెట్టును గూర్చి చిన్న పురుగు తినివేయుటను గూర్చి అతనికి చెప్పెను. ఆ పురుగు సొరచెట్టును కొరికి వేసినది. ప్రభుని చిత్తమయితే, యోనా మిద ప్రసంగములను ఇక్కడ చేయుదును. తూర్పు గాలి వీచినది. ఇంకా చాలా ఆశ్చర్యకర సంగతులున్నవి. అవన్నియూ చక్కని సాదృశ్యములు. అందులో యేసుక్రీస్తును కూడా చూడగలము. బైబిలులోని ప్రతి మాట యేసుక్రీస్తును చూపించును. అది మన ఆదివారపుబడి పాఠము. కాబట్టి ప్రభుని చిత్తమైతే, ఆలాగు చేయుదుము.

62గమనించండి, కొన్ని సంగతులు మీరు… మీరు యధార్థంగా ఉన్నట్లతితే మరియు దేవుడు… ఇప్పుడు, మీరు గమనించవలెను.

ఇప్పుడు ఈ రాత్రి మరొక యోనాను వేదిక మీద చూపించగోరుచున్నాను.

ఒక రాత్రి కొందరు జనులు ఇక్కడికి వచ్చిరి. (అందులో కొందరు) ఒక స్త్రీ ఈ రాత్రి ఇక్కడ ఉండి యుండవచ్చును, కాబట్టి పేరు చెప్పను గాని మీరెరిగి యుందురు. వారు కెంటికి నుండి వచ్చిరి. చాలా సంవత్సరముల నుండి వచ్చుచున్నారు. మంచి ప్రజలు. వారు నాకు మంచి మిత్రులు. వారు నాకు నిజంగా స్నేహితులు. అటువంటి వారు సంమ ఉజ్జీవములో పాల్గొందురు. ఉజ్జీవము అయిపోయిన తరువాత భారమంతయూ పోవును. ఉయ్యాలలో ఉన్న పిల్లలందరూ ఇక్కడ తరగతులు జరుగుచున్నపుడు దొర్లుచుందురు.

63నాలుగు లేదా అయిదు సంవత్సరాల క్రితం ఒక రోజున నేను ఇంటికి వెళ్ళాను. ఈ యువతి పెండ్లి చేసికొని ఇద్దరు పిల్లలను కనినది (ఆమె ఎనిమిదేండ్ల వయస్సులో ఇక్కడ ఉయ్యాల ఊగెడిది), ఆమె ఆ సమయంలో మరణ స్థితిలో ఆస్పత్రిలో యున్నది. ఆమెకు అయిదు నెలల పసిపిల్ల యున్నది. ఆ పిల్ల చనిపోయినది, ఎందుకనగా ఆమెకు శస్త్ర చికిత్స చేయు అవకాశము లేకపోయెను. ఆమె అనగా తల్లి కూడా ఇక మరణించక తప్పదని వైద్యులు చెప్పిరి. ఆమెకు ఇక బ్రదుకు అవకాశము లేదు. చావు బ్రతుకుల మధ్య ఉన్నది.

వారు నాకు కబురు పంపినందున నేను చూచుటకు వెళ్ళాను. నేను ఆస్పత్రిలో ప్రవేశించాను. ఆమెకు ఆక్సిజను పెట్టిరి. ఆమెతో చిన్నగా మాట్లాడాను, "నేను నీకు గుర్తున్నానా?"

"నిశ్చయంగా, బిల్ సోదరుడా, నీవు నాకు జ్ఞాపకమే" అన్నదామె.

"నీవెంత జబ్బుగా ఉన్నావో నీకు అర్థమైనదా?" అనడిగాను.

"అవును. అందుకే మీకు కబురు పంపాను," అన్నది.

"ప్రభువుకు నీకు మధ్య సంబంధమెట్లున్నది?" అనడిగాను.

"ఇంకా నేను వెళ్ళిపోవుటకు సిద్ధపడలేదు," అన్నది.

మేము ఆక్కడ మోకరించి ప్రార్థించాము. ఆమె తల్లి, ఆమె భర్త ఇంకా అనేకులు ఆ గదిలో యున్నారు. ఆమె తల్లి మరియు భర్త ఏడ్వసాగిరి. ఆమె దేవునితో సరిచేసికొన్నది. (ఆమె దేవునితో ప్రమాణము చేసికొన్నది. దేవునికి వాగ్దానము చేసినది. ఆమె తన గత జీవితము గూర్చి పశ్చాత్తాపపడి దేవునిని క్షమాపణ అడిగినది. ఆమె ఆయనను ప్రేమించినది), ఆమె ఆ విధంగా పశ్చాత్తాపముతో ఏడ్చినది కొద్దిసేపటి తరువాత నేను వెళ్ళిపోయాను.

64మరుసటి ఉదయము మరల వారు నన్ను రమ్మని పిలచిరి. ఆమె ఆరోగ్య పరిస్థితి ఎట్లున్నదో వారు ఆ ఉదయము పరీక్షలు జరిపిరి. ఆమెలోని వ్యాధి పూర్తిగా మాయమైనది. ఆ విష ప్రభావమే ఆమెలో కనబడలేదు. వైద్యులు అమితాశ్చర్యముతో నిండి, "ఇది చాలా వింత" అని చెప్పుకొనిరి. ఆ విధంగా ఆమె మారినందున ఆమెలోని రోగము నిర్మూలించుటకు పెన్సిలిన్ కూడా ఇచ్చుట సాధ్యమైనది. ఆమెలో చనిపోయిన గర్భస్థ శిశువును కూడా ఆపరేషను చేసి తీసివేయగలమని వారు చెప్పిరి.

65ఆ రోజు రెండు మూడు పర్యాయములు వారామెను పరీక్షించిరి. ఆ రాత్రి చాలా ఆలస్యంగా కూడా పరీక్షించిరి. ఏమి వ్యాధి కనబడలేదు. పూర్తి ఆరోగ్యముగా యున్నది. ఆక్సిజనును తీసివేసిరి. అంతా చక్కగా యున్నది. ఆ మరుసటి ఉదయము వారు ఆపరేషను చేసి బిడ్డను బయటకు తీయగోరిరి.

నేను అక్కడికి వెళ్ళాను. ఇది జరిగినందున.. ఇప్పుడు, అది నాకు ఎన్నడు తెలియదు, నాకు తెలియదు. ప్రభువు దానిగురించి నాకు ఏమియు తెలుపలేదు. మీరు కావాలంటే ప్రజలను అడుగవచ్చు… ఆయన ఎన్నడు నాకు తెలుప లేదు. కాని, ఓ, మై, అలంటి సంగతిని చూచుట! ఆమె యొక్క బర్త, వచ్చి చెప్పెను, "బ్రెన్హాం సోదరుడా, ప్రభువైన యేసుకు నా జీవితము ఇచ్చెదను."

"మంచిది, నీవు మోకరించి, నీ భార్య చేయి పట్టుకొని, నీ సరైన మార్గమున నడువుము" అని చెప్పాను.

66ఆ తల్లి వచ్చి ఇట్లు చెప్పెను, "బ్రెన్హాం సోదరుడా, నేను నా పిల్లలు ఈ సంఘమునకు వచ్చుచూ, మానివేయుచూ చాలాసార్లు తొట్రిల్లుచున్నాము. అనేకసార్లు నీ ప్రసంగము విని పశ్చాత్తాప పడి వేదిక యొద్దకు వచ్చి సరిచేసికొన్నాము. కాని బ్రెన్హాం సోదరుడా, మేము వెనుకకు జారిన వారము. నా బిడ్డ పట్ల ప్రభువైన యేసు చేసిన మేలును బట్టి ఆయన యొద్దకు మరల వచ్చుచున్నాము." అది చాలా మంచిదే గాని ఆ కారణము వలన నీవు రాకూడదు.

అర్థరాత్రి పన్నెండు లేదా ఒంటి గంట సమయములో ఆమె తల్లి నిద్రపోయినది. ఆమె తల్లిని పిలచినది.

వెంటనే ఆ తల్లి లేచి, "ఏమి కావలెను" అని అడిగినది.

"నేను చాలా ఆనందంగా ఉన్నాను," అన్నది.

"నీవు ఆనందంగా ఉండుట బట్టి నాకు సంతోషంగా ఉన్నది," అన్నది తల్లి.

"నేను దేవునితో సమాధానము కలిగియున్నాను. ఓ, అదెంత చక్కగా యున్నది!" అన్నదామె.

మరికొద్ది నిమిషములకు మరల "అమ్మా" అని పిలచినది.

"ఏమి కావలెను? " అన్నది.

"నేను ఇంటికి వెళ్ళుచున్నాను," అన్నదామె.

"అవునమ్మా, మన ఇంటికి వెళ్ళిపోదుము, ఎందుకనగా రేపు వైద్యుడు ఆపరేషను చేయును. ఒకటి రెండు రోజులలో నీ కుట్లు మానిపోవును. నిన్ను ఇంటికి పంపివేయుదురు. నీవు ఆనందంగా నీ చిన్న బిడ్డలతోను, ప్రభువుతోను ఆనందముగా జీవించెదవు. మంచి క్రైస్తవురాలవగుదువు," అన్నది తల్లి.

"అమ్మా, నేను పరలోక గుమ్మమునకు వెళ్ళుచున్నాను," అన్నది.

"నిశ్చయంగా, ఈ జీవిత యాత్ర ముగిసిన పిదప వెళ్ళుదువు," అన్నది.

"ఇదే నా జీవితపు తుది యాత్ర," అన్నది.

"ఓ, ఏమయింది?" అన్నది తల్లి.

"ఇదే జీవిత చివరి యాత్ర. కొద్ది నిమిషములలో నేను వెళ్ళిపోవుదునమ్మా," అన్నది.

ఆమె ఏదో కలవరింపులో ఉన్నదని తల్లి తలంచినది. నర్సును పిలచెను, నర్సు ఆమె ఊపిరిని చూచినది. అతా మామూలుగానే యున్నది. అయిదు నిమిషములకు ఆమె చనిపోయినది.

ఆ తరువాత రెండు వారములకు నేను ఇంటికి వచ్చాను. ఆమె సమాధి కార్యక్రమమందు సహోదరుడు గ్రాహం మాట్లాడెను. నేను ఇంటికి వచ్చినపుడు ఆ బాలిక ఆ రాత్రి చనిపోయినట్లు నాకు మిడా చెప్పినది.

నేను తల్లిని చూచుటకు వెళ్ళాను. "అవును."

67నేనెందుకు ఆలాగు చేశానో నాకు తెలియదు, కాని ఇట్లన్నాను, "ప్రభువగు దేవా, నీవు ఈ క్రియ చేసితివని చెప్పి ఆ తల్లి, భర్త తదితరులు నిన్ను విశ్వసించిరి. నీవు ఆమె ప్రాణము ఎందుకు తీసివేసితివి? నీవు నాకు సమాధానము చెప్పవలెను."

ఆ విధంగా నీవు దేవునితో చెప్పినపుడు ఆయన నిన్ను బంటరిగా కూర్చోబెట్టును. ఆయన మనకు ఏది అచ్చియుండడు. నేనే ఆయనకు బాకీ యున్నాను. కొన్ని దినముల పాటు ఆ సంగతి బట్టి నేను కృంగిపోయాను. నేను ఒక ఏటి యొడ్డున ఉండగా, ప్రభువు ఒక దర్శనము ఇచ్చెను. నాకు ఈలాగు చెప్పెను, "వెళ్ళి ఆ తల్లితో ఇది చెప్పుము. 'ఒక విహార యాత్రకు వెళ్ళినపుడు ఆమె ఏటిలో మునిగి చనిపోవలసింది గదా? అది జరిగి ఒక సంవత్సరము అయినది. ఆ సమయములోనే ఆమె చనిపోయి యుండును, కాని ఆమె సిద్ధపడినపుడు ఆమెను తీసికొని వెళ్ళవలెనని నేను ఆపాను.' అందుకే ఇదంత జరిగినది మరియు నీవు అక్కడకి వెళ్ళావు."

నేను క్రిందపడి ఏడ్చాను. "ప్రభువైన యేసూ, నన్ను క్షమించు, నేను బుద్ధిలేని దాసుడను. ప్రభువా, ఆలాగు నేను పలికి యుండవలసినది కాదు," అన్నాను.

68నేను మరల ఆమె యొద్దకు వెళ్ళాను. ఆమె ఈ మార్కెట్ వీధిలో ఉండెడిది. నేను వెళ్ళి ఆమెతో, "ఒక ప్రశ్న వేయవచ్చా?" అన్నాను.

"తప్పకుండా బిల్" అన్నది.

"ఈ బాలిక ఒకసారి మునిగి చనిపోవలసినది కదా?" అనడిగాను.

"బ్రెన్హాం సోదరుడా, అది నిజము. ఆమె భర్త మరికొందరు ఆమెను ఏటిలో నుండి బయటకు తీసిరి. కృత్రిమంగా ఊపిరి కల్పించిరి. ఒక యంత్రము తెచ్చి ఆమె మ్రింగిన నీరును బయటకు తీసివేసిరి. ఆమె విహార యాత్రకు వెళ్ళినది. ఆమె ఇసుక మీద అడుగువేసి అది జారిపోగా, ఆ ఏటిలో పడిపోయినది. వారామెను గమనించలేదు. ఆమె క్రిందికి పైకి మునుగుట వారు ఒక్కసారే చూచిరి. వెంటనే పరుగిడి వెళ్ళి, ఆమెను బయటకు తీసిరి. ఆమె చనిపోయినట్లే తలంచిరి," అన్నదామె.

"అది ఆమె వెళ్ళిపోవలసిన సమయము," అన్నాను.

చూడండి, దేవుడు తాను చేయుచున్న దానిని ఎరుగును. ప్రభువు ముందుగా నాకు ఇదంతా చెప్పియుండినయెడల, నా వైఖరి ఆమె విషయంలో మారి యుండెడిది. "ప్రభువా, నేను నీకు రుణపడియున్నాను. నీవు ఇదంతా చెప్పితివి," అన్నాను. ఆయన మనకు ఏదియు అచ్చియుండడు!

ISA 45:9•

ROM 8:28

 

69ఒక రాత్రి ఒక కూటములో నేను నిలబడి ఒక సువార్తికుడు ఒక రోగికి ఈ విధంగా ప్రార్థన చేయుట విన్నాను, "దేవా, ఈ వ్యక్తిని స్వస్థపరచుమని ఆజ్ఞాపించుచున్నాను!" దేవునికి ఎవరు ఆజ్ఞాపించగలరు? చూచారా? అది తెలివిలేని మాట, దేవుడు తాను కోరినది చేయును.

"నీవు నన్నెందుకు ఈలాగు చేసితివి?" అని మట్టి, కుమ్మరివానితో చెప్పగలదా? చూచారా? చెప్పజాలదు! ప్రవక్త నోరు తెరువక ప్రభువు యొద్ద జవాబు వెదకినచో, జవాబు దొరకును, చూచారా.

ఒక వ్యక్తి సర్పసంతానము గూర్చి కొన్ని ప్రశ్నలు అడిగెను. తొందర పడకండి. గమనించి చూడండి. ప్రభుని ప్రేమించు వారికి సమస్తము మేలు కొరకే సమకూడి జరుగుచున్నవి.

JON 3:5,8

 

70నీనెవె వారు మారుమనస్సు పొందనియెడల వారి మీదికి దేవుని తీర్పులు వచ్చియుండెడివి. ప్రవక్త తప్పక వినవలెను. అది ఒక హెచ్చరిక!

ఈ దేశమునకు కూడా అదే జరుగును. "బ్రెన్హాం సోదరుడా, ఏ ఆశ ఇక లేదని గత ఆదివారం చెప్పావు. మరి ఇదేమిటి?" అని మీరనవచ్చును. దాని పిలుపును అది వినవలెను. హెచ్చరికను మన్నించవలెను. ఈ దేశము ముక్కలగు సమయము వచ్చును. దానిని నేను 1933లో చూచాను.

"మంచిది, అది జరుగలేదేమి?" అని మీరడగవచ్చు.

అది జరుగనైయున్నది! ముస్సోలిని అధికారములోనికి వచ్చుననియు, మాగినట్ లైన్ నిర్మించుదరనియు, కారు గ్రుడ్డు వలె రూపొందుననియు, ఒక కళాశాల కుర్రవాని వంటి వ్యక్తిని ఈ స్త్రీలు దేశాధ్యక్షునిగా ఎన్నుకొందురనియు చెప్పలేదా? అవి జరుగుటకు ముందే చెప్పబడెను. కాతలిక్కు ప్రెసిడెంటు గూర్చి ముప్పయి సంవత్సారాల క్రితమే చెప్పాను. ఆయన నాకు ఆ సంగతులన్నియూ చూపించెను.

ఆ సమయము సమీపించుచుండగా, ఆ గిన్నె నిండిపోవుచున్నది! బిల్లీ గ్రాహం, ఓరల్ రాబర్ట్స్ మొదలగు వారి ద్వారా మారుమనస్సు బోధించబడుచున్నది. ప్రవక్తలు మొదలగు వారు సూచక క్రియలు, అద్భుతములతో దేశమును ముంచెత్తియున్నారు, పాపము విస్తరించుచున్నది. అందుకే వారు మారుమనస్సు పొందుట లేదు.

1KGS 19:2•

1KGS 21:13,19,23•

1KGS 22:38•

2KGS 9:35

 

71చూడండి, ఏలియా ఎంత గద్దించినా ఆహాబు ఎన్నడూ మారుమనస్సు పొందలేదు. ఆహాబు మారుమనస్సు పొంది దేవుని ఎదుట నెమ్మదిగా నడచినయెడల ఆలాగు జరిగియుండెడిది కాదు. కాని ఆహాబు వచ్చి నాబోతు ద్రాక్షాతోటను తీసికొని అతని చంపెను. ఆ ప్రవక్త "యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడుతో" వచ్చెను. కాని వారేమి చేసిరి? ఆమె అతనిని చంపుదునని బెదరించెను. ఏమి జరిగినది? అతని ప్రవచనము నెరవేరినది. ఆహాబు రక్తమును కుక్కలు నాకెను. అతని మాట ప్రకారమే జరిగెను. ఆ గిన్నె నిండుట అతడు చూచెను.

ఆ కారణము చేతనే మికాయా ఆ సంగతి ప్రవచించెను, దేవుడు శపించగా ఇతడెట్లు దీవించును? అతని వాక్కు అతని ప్రవచనము వాక్యముతో సమ్మతించెను.

MARK 6:18,24

 

72హేరోదు ఎన్నడూ మారుమనస్సు పొందలేదు, "నీ సోదరుని భార్యను నీవు ఉంచుకొనుట ధర్మము కాదని," యోహాను చెప్పెను. అతడెన్నడూ మారుమనస్సు పొందలేదు. కాని అతడేమి చేసెను? ప్రవక్త యొక్క తలను ఆమె కోరెను. ఎంత దుష్టత్వములోనికి వెళ్ళెనో చూడండి. అతనికేమి జరిగినదో చూడండి. స్విట్జర్లాండులో ఈనాటికిని ఆ నీలపు నీరు మరుగుచున్నది. ఆయనను తిరస్కరించినందుకు అది జ్ఞాపకార్థముగా యున్నది. ప్రభువు గద్దించినపుడు అతడు మారుమనస్సు పొందలేదు. యోహాను చెప్పెను, ఏమయినా గాని దేవుడు గద్దించినపుడు మారుమనస్సు పొందవలెను, లేనియెడల ఉగ్రత వచ్చును! (రాజుగా వచ్చు, చక్రవర్తి కావచ్చు, ఎవరైనా గాని అంతే).

ప్రవక్తలు ఎన్నిసార్లు… ఇక్కడ వ్రాసియుంచాను, కాని సమయము పది నిమిషములే యున్నది.

2KGS 19:1•

JON 3:5,9•

ACTS 2:38,39

 

73మారుమనస్సు లేనియెడల నిశ్చయంగా తీర్పు వచ్చును! హిజ్కియా మారుమనస్సు పొందెను, చూడండి. నినెవె వారు మారుమనస్సు పొందిరి,

ఆహాబు ఎన్నడూ మారుమనస్సు పొందలేదు. నెబుకద్నెజరు ఎన్నడూ మారుమనస్సు పొందలేదు. నోవహు కాలములోని ప్రజలు ఎన్నడును మారుమనస్సు పొందలేదు. అందుకే తీర్పు వచ్చినది, చూచారా. కాని మొదట ఆయన అందరిని హెచ్చరించును. అందరికి హెచ్చరిక వినబడును.

సమయము సమీపించుట చూచుచున్నాము, హెచ్చరికను వినుచున్న ప్రతివారు ఉగ్రత రాకముందే త్వరగా పశ్చాత్తాపపడవలెను.

బ్రెహాం టాబర్నికల్ మీదికి దీనిని తీసికొని వచ్చుదము. చూడండి, ఈ సంగతులు విన్నాము. ఇది సత్యమని గ్రహించాము. ఇది సంపూర్ణ సత్యమని మనకు తెలియును. వాక్యము ఇట్లు హెచ్చరించుచున్నది, "మీరు మారుమనస్సు పొంది, పాపక్షమాపణ నిమిత్తము యేసుక్రీస్తు నామములో బాప్తిస్మము పొందినయెడల, మీరు పరిశుద్ధాత్మ అను వరము పొందుదురు. ఈ వాగ్దానము మీకును, మీ పిల్లలకును, దూరస్తులందరికిని చెందును," చూచారా?

74శ్రీ. డాచ్ కొంత కాలము క్రిందట నన్ను ఇట్లు అడిగెను, "బ్రెన్హాం సోదరుడా, నేను ముసలివాడినగుచున్నాను. బలహీనుడనగుచున్నాను, ఇప్పుడు నాకు తొంబై-ఒక్క సంవత్సరములు. నేను వెళ్ళిపోవుటకు సిద్ధముగా ఉన్నానని నీవు తలంచుచున్నావా? చనిపోవుటకు నేను సిద్ధముగా యున్నానని తలంచుచున్నావా? నేను రక్షించబడితినని తలంచుచున్నావా? "

"శ్రీ. డాచ్ నీవు ఎప్పుడయినా ఆరోగ్య పరీక్ష కొరకు వైద్యుని యొద్దకు వెళ్ళితివా?" అనడిగాను.

"అవును," అన్నాడు.

డాక్టరు ఏమి చేయును? తన పుస్తకము తీసి చూచును. మొదటగా గుండెను పరీక్షించును. స్టెతస్కోపుతో గుండెను పరీక్షించును. చేవితో వినును. ఆ తరువాత రక్త ప్రసరణను చూచును. అతని చేతిని చూచును. ఆ తరువాత మూత్రమును, రక్తమును పరీక్ష చేయును. అందులో కూడా ఏమి కనుగొననియెడల ఎక్స్-రే తీయును. అందులోను ఏమి దొరకని యెడల, డాచ్ నీవు ఆరోగ్యంగా యున్నావు అనును.

దేనిని ఆధారము చేసికొని డాక్టరు ఆలాగు చెప్పెను? తన వైద్య గ్రంధములోని పరిస్థితులను బట్టి చెప్పును. ప్రధాన శాస్త్రజ్ఞుని చిహ్నములను బట్టి దీనిని పరీక్షించును. కాబట్టి అతనికి తెలిసినంతవరకు నీవు శారీరకంగా బాగానే యున్నావు.

JOHN 5:24

 

75ఇప్పుడు, ఈ సందర్భములో ఆత్మకు పరీక్ష చేయవలెను, చూచారా. దేవుడు ఆత్మను పరీక్షించుటకు ఒకే సాధనమున్నది, అది వాక్యము. ఆయన వాక్యముతో పరీక్షించును. యోహాను 5:24లో యేసు ఇట్లు చెప్పెను, "నా వాక్యము విని," అనగా ఆ శబ్దమును వినుట కాదు. వినుట అనగా దానిని చేర్చుకొనుట. "నా వాక్యమును చేర్చుకొనువాడు." ఆమేన్! "దానిని వినువాడు." (దానిని నమ్మును, అందులో ఏమి లేదు. అది బుద్ధిహీనము అని పలుక వద్దు.) "నా వాక్యమును వినువాడు!" అది యేసు మాట! ఆయనే వాక్యము. "నా మాట విని, నన్ను పంపిన వానియందు విశ్వాసముంచువాడు మరణములో నుండి జీవములోనికి దాటియున్నాడు; అట్టివాడు తీర్పులోనికి రాక, ఇదివరకే దానినుండి దాటిపోయెను!" ఆమేన్! "నీ గుండె ఎట్లుకొట్టుకొనుచున్నది?" అని అడిగాను.

"నేను దానిని నమ్మితిని. దానిని నేను వింటిని. దానిని నేను చేర్చుకొంటిని," అని అతడు చెప్పెను.

"ప్రధాన నిపుణుని ప్రకారము, ప్రధాన శస్త్ర వైద్యుని ప్రకారము, నిత్యజీవము యొక్క ప్రధాన వైద్యుని ప్రకారము నీవు మరణములో నుండి జీవములోనికి దాటియున్నావు. ఎన్నడూ శిక్షలోనికి రావు," అని నేను చెప్పాను.

76"నీవు యేసుక్రీస్తు నామములో బాప్తిస్మము గూర్చి బోధించుట నేను విని వెంటనే వచ్చి నీ చేత బాప్తిస్మము పొందితిని. నేను ఇంతకు ముందున్న మనిషివలె లేను. నాకు ఏదో జరిగినది. ఇంతకు ముందు నేను దాని గూర్చి లెక్క చేయకుండా నా దారిని నేను వెళ్ళుచుండేవాడిని, కాని ఇప్పుడు ఇటువైపు తిరిగి నడవనారంభించాను. నా హృదయము దివారాత్రులు ఆయనకు దగ్గరగా జీవించవలెనని మండుచున్నది. దానిలోని ప్రతి మాటను నమ్ముచున్నాను! ప్రతి మాటకు నేను, "ఆమేన్" చెప్పుచున్నాను. అది నన్ను ఎట్లు నరికినా నేను బాధపడుట లేదు, దానిని తగినట్లు నేను ఉండగోరుచున్నాను. నాకు తెలిసినంత వరకు దానిని అనుసరించుచున్నాను," అన్నాడు.

"నీ హృదయ స్పందన సరిగానే యున్నట్లు నాకు తోచుచున్నది. ఇప్పుడు నీవు ఆత్మీయంగా చక్కగా యున్నావు," అన్నాను.

"బ్రెన్హాం సోదరుడా, రాకడలో నేను ఎత్తబడుదునా?" అనడిగాడు.

"ఎవరు వెళ్ళుదురో, ఎవరు వెళ్ళరో నా చేతుల్లో లేదు," అన్నాను.

"మంచిది, నేను బ్రతికియుండగానే రాకడను ఎదుర్కొనవలెనని బహుగా ఆశించుచున్నాను," అన్నాడు.

1COR 15:52•

1THS 4:15,17

 

77"మంచిది, ఆత్మకు చెందిన సైన్సు గ్రంధము ఇక్కడ ఏమి చెప్పుచున్నదో మనము చూద్దాం." II థెస్సలొనీయులు 5వ అధ్యాయములో అది ఈలాగు చెప్పుచున్నది, "'సజీవులమై నిలచియుండు మనము ప్రభుని రాకడను ఆటంకపరచము' (అడ్డగించము) నిద్రించుచున్న వారితోనే ఏకీభవించుదుము. దేవుని బూర మ్రోగును. నిద్రించువారు లేదా విశ్రాంతిలో యుండువారు మొదట లేతురు. వారు అమర్త్యతను ధరించుదురు. ఆ మీదట సజీవులమై నిలచియుండు మనము, రెప్పపాటు కాలములో మార్పు చెందుదుము, వారిని కలిసికొందుము; మధ్యాకాశములో ప్రభుని కలిసికొందుము. నీవు నిద్రించినా, నిద్రించకపోయినా, నీవు సమాధి చేయబడినా, చేయబడకపోయినా తిరిగి లేచెదవు. ఏదియు నిన్ను ఆపలేదు. అక్కడ నీవుందువు!" "డాచ్ సోదరుడా, నా మనుమల మనుమల కాలము వరకు యేసు రాకపోయినా, ఎంత ఆలస్యమైనా గాని ఆయన వచ్చినపుడు ఒక్క క్షణములో మార్పు చెందెదవు. ఇది నిజము. ఆమేన్," అన్నాను.

78ఉగ్రత రానున్నట్లే దీవెనయు రానున్నది. ఓ, ఈ రాత్రి ఏదో ఒక దాని కొరకు మనము ఎదురు చూడవలెను. నీ మీద ఉగ్రత పడినచో నీవు నాశనమగుదువు. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క పునరుత్థానము కొరకు ఎదురు చూడుము. ఆ దేవుడే దీనిని వాగ్దానము చేసెను. నాకు సంతోషముగా యున్నది!

ఆ సంతోషకరమగు వెయ్యేండ్ల పాలన కొరకు

ఎదురుచూచుచున్నాను.

మన ధన్యుడగు ప్రభువు వచ్చును.

ఎదురుచూచుచున్న

తన వధువును ఎత్తుకొనిపోవును.

ఓ, నా హృదయము ఆ మాధుర్య దినము కొరకు

ఆశతో ఎదురు చూచుచూ, మూలుగుచున్నది.

మన యేసు తిరిగి భూమి మీదికి వచ్చును.

అపుడు ఈ చీకటి ప్రపంచము యొక్క పాపము,

దుఃఖము, బాధ, మరణము అంతమగును.

వెయ్యేండ్ల సమాధాన పాలన యేసు సాగించును.

అది మహిమకరమగు పాలన;

("ఓ, మై! నిత్యము ప్రభువుతో ఉందుము, "చూచారా.)

ISA 11:9•

ISA 65:21•

1COR 15:54•

1JN 3:2

 

79దేవుడేమి చెప్పెను, అది నెరవేరును. "వారు ఇండ్లు కట్టుకొని అందులో నివాసముందురు. వారు ద్రాక్షాతోటలు నాటి వాటి ఫలములను తిందురు. వారు నాటని వాటిని ఇతరులు స్వతంత్రించుకొందురు. వారు వారి స్వంత ద్రాక్ష తోటలను నాటుకొందురు." ఆమేన్! ఆమేన్! "వారు నా పరిశుద్ధ పర్వతము మీద బాధకు గాని, నాశనమునకు గాని గురి కారు." హల్లెలూయా!

ఈ మర్త్యత, ఆమర్త్యతను ధరించుకొనును, మరణమును విజయము మ్రింగివేయును, ఆయనను ఉన్న రీతిగానే చూచెదము. ఆయన మహిమ శరీరములోనే ఆయనను చూతుము. ఓ, ఎట్టి సమయము రానున్నది!

HEB 12:1,2

 

80దేవుని వాక్యమును ప్రకటించిన ప్రవక్తలు మరియు దేవుడు ఈ ఉగ్రతలను గూర్చియు, రానున్న ఆశీర్వచనములను గూర్చియు చెప్పిరి. నాకు ఆనందముగా యున్నది. దేవుడు ముందు హెచ్చరించకుండా, ఎన్నడూ నాశనము రప్పించడు. ఈ దినములలో పరిశుద్ధాత్మ మన మధ్య గొప్పగా సంచరించుచున్నది. ఈ చివరి దినములలో సూచక క్రియలు ప్రత్యక్షపరచబడుచున్నవి. ఆయన సన్నిధి సంఘములో బయలుపడుచున్నది. ఆయన వాక్యము నేరవేరుచున్నది. ఒక దినమున దేవుని శక్తిచేత సంఘము ఆకాశములలోనికి కొనిపోబడును. మనలను సులువుగా చిక్కులు బెట్టుచున్న ప్రతి పాపమును విడిచి పెట్టవలెనని హెచ్చరిక వినబడుచున్నది. విస్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడగు యేసు వైపు చూచుచూ మన ముందుంచబడిన పందెములో ఓపికతో పరుగెత్తుదము.

81సంఘమా! దేవుడు నిన్ను దీవించును. మారని దేవుని హస్తము పట్టుకొనుము. ఆయన సన్నిధిని అనుభవించుచున్నచో ఆయనతో వెళ్ళుము. నీ హృదయములో ఏదయినా తప్పున్నచో సరిచేసికొనుము. ఎంతో సమయము మనకు లేదు. ప్రభుని రాకడ సమీపాముగా ఉన్నది. మీరాయనను నమ్ముచున్నారా? ఓ మై! ఆక్కడ అద్భుతముగా లేదా? ఆ పరదైసులో పాత యోధులందరూ నడచుట నేను చూచెదను! ఓ, మై! ఆ ఘడియ కొరకు ఎదురుచూస్తున్నాను.

82సముద్రముల అవతల నుండి సైనికులు తిరిగి వచ్చినప్పటి సంగతులు నా సోదరుడు చెప్పినవి నాకు గుర్తు వచ్చుచున్నవి, వారు యుద్ధ రంగముల నుండి వచ్చిరి, వారు స్టాచ్యు-అఫ్-లిబర్టీ యొద్దకు వచ్చినపుడు అన్నియూ అక్కడే విడిచి పెట్టెడి వారు. వారు ఆ విగ్రహమును చూచుటకు అన్నీయూ విడిచి పెట్టెదరు. మొదటగా వారు ఓడ మీద వచ్చునపుడు చూచెడి వారు, ఎందుకనగా అది చాలా ఎత్తులో యున్నది. ఆ చేయి చాపబడి యుండుట చూచి వారందరూ ఏడ్చెడి వారు. వారెంత గొప్ప వారయినా గాని నేల మీద పడి ఏడ్చెడి వారు. ఏమిటది? ఒక స్వేచ్ఛా చిహ్నము. వారు ప్రేమించినదంతయూ ఆ చిహ్నము వెనుకనే యున్నది.

ఓ, ఒక దినమున సీయోను అను ఓడ దరిచేరుటను నేను చూతును. జయ పతాకములు ఎగురుచుండును. యుద్ధము అయిపోయినది. జయము మనదే. హల్లెలూయా! మేము ఇంటికి వచ్చుచున్నాము. అక్కడ మరణము, పాపము, పాతాళము జయించబడినది. ఇక పాపము లేదు, మరణము లేదు, దుఃఖము లేదు. ఆ ఈల మోతను నేను విందును! ఓ, మనము ఆ పట్టణమును సమీపించుచున్నాము. అవునయ్యా. ప్రాచీన ఓడ దాని చోటుకు కదిలివచ్చుచున్నది. దేవా, ఆ ఘడియ కొరకు జీవించునట్లు సహాయము చేయుము!

PS 18:29

 

83ప్రభువైన యేసూ, సువార్త వెలుగును బట్టి నడచుటకు మేము శాయశక్తులా ప్రయత్నించుచున్నాము. ఆ గొప్ప సువార్త కొరకు నీవు చనిపోతివి. ఈ చెడ్డ దినములలో, చీకటి ఘడియలలో దానిని మేము చూడకలుగుచున్నందుకు వందనములు చెల్లించుచున్నాము. ఆ చిహ్నములు కనబడుచున్నవి. ఓ దేవా, గోడ మీది చేవ్రాత ఇదే. దానిని చూడకలుగుచున్నందుకు ప్రభువా, నీకు వందనములు చెల్లించుచున్నాము. విమోచన చాలా సమీపమందున్నదని ఎరుగుదుము. మేము బోధించుచూ దేశమంతా తిరుగుచున్నాము. నీవు గొప్ప సూచక క్రియలు చేయుట మేము చూచుచున్నాము. ప్రతి రోజు, ప్రతి సంవత్సరము నిన్నునీవు చూపించుకొనుచున్నావు. భూమి మీద ఆయన యొక్క ఆత్మ సంబంధమగు సూచన కనిపించని రోజు లేదు. గొప్ప సూచన దానిని మేము చూచుచున్నాము. దేవుని యొక్క మహా సైన్యము ముందుకు సాగిపోవుచున్నది.

ఓ, సంఖ్యలో ఎక్కువగా లేరు కాని ఎంత గొప్ప గుంపు. వారు నిత్యజీవము పొందిరి. వారు బలాడ్యులను జయించెదరు. ప్రాకారములను దాటి పోవుదురు. మరణము వారిని పట్టుకొనజాలదు. దానిని దాటి వారు వెళ్ళుదురు. ప్రాకారములను దాటిపోయెదరు. భూసంబంధమైన దానికి, దేవుని సంబంధమైన దానికి మధ్య తేడా యున్నది. ఆ గొప్ప నిత్యత్వములోనికి, దేవుని హస్తములోనికి పోవుదురు. ప్రభువైన దేవా, దీనిని బట్టి నీకు వందనములు చెల్లించుచున్నాము. సమయము సమీపించుచున్నదని మేమెరుగుదుము.

84దేవా, ఈ రాత్రి నిన్ను ఎరుగని వారు కొందరు ఇచ్చట ఉన్నట్లయితే, ఇంకా నీతో సమాధానపడనిచో, మెల్లని స్వరముతో వారి హృదయములతో మాట్లాడుము. "హెచ్చరిక వినబడుచున్నది గనుక ఇక ఎక్కువ ఆలస్యము చేయరాదని వారు గ్రహించెదరు గాక." ఓ దేవా, ఇప్పుడే వారు తమ గృహములను క్రమములో పెట్టుకొందురు గాక! అంతయూ చక్కదిద్దుకొందురు గాక. వారు క్రైస్తవులుగా ఉండియు ఇంకా చక్కదిద్దుకొని యుండకపోవచ్చును. వారు ఎంతో కాలము నుండి దీనిని చూచుచున్నారు. దానిలో విలువను వారు గమనించకయుందురు. యధార్థంగా, లోతుగా వాటిని ఆలోచించుటకు బదులుగా తేలికగా వారు వాటిని తీసికొనుచున్నారు.

ఓ దేవా, ఈ రాత్రి మమ్మును మేము పరీక్షించుకొని ఈ గొప్ప సంఘటనలన్నియు సంఘము ఎత్తబడుటకు హెచ్చరికలు మాత్రమేనని గ్రహించెదము గాక. పాపము, అవిశ్వాసము, సోమరితనముతో మేముండినయెడల రాకడలో ఎత్తబడము. ప్రభువా, అది మేము ఎరుగుదుము. అందుకే మాతో, మా హృదయాంతరంగములలో పరిశుద్ధాత్మ మంటను మండించుమని ప్రార్థించుచున్నాము. ఓ దేవా, మా ఆత్మలను నీ ఆశీర్వచనముతో నింపి మండించుము. అర్థము చేసికొనునట్లు మాకు సహాయము చేయుము.

85ఈ జనులందరినో ఇప్పుడు ఆశీర్వదించుము. మా ప్రశస్త సంఘ కాపరిని, ఆయన భార్యను దీవించుము. పెద్దలను, ట్రస్టీలను, సభ్యులను దీవించుము. మా పాపములు క్షమించుము. ప్రభువా, మా రోగములను బాగుచేయుము. మా హృదయములను మండించుము. ఒక హెచ్చరిక వర్తమానముతో ఇచ్చట నుండి మేము వెళ్ళెదము గాక. పాపములో ఉన్న ప్రజలను కలిసికొని వారికీలాగు చెప్పెదము గాక, "స్నేహితుడా, ఆ కార్యములు చేయుచున్నందుకు నీవు సిగ్గుపడుట లేదా? ఒక దినమున దేవుని కలిసికొనవలెనని ఎరుగుము!" దేవా, ఆ కృప దయచేయుము. వారిని ఇప్పుడు నీకు అప్పగించుచున్నాను. వర్తమానమును నీకు అప్పగించుచున్నాను. సమస్త జనులను నీ మహిమ కొరకు పని చేయునట్లు అప్పుగించుచున్నాను. యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము. ఆమేన్!

నేనాయనను ప్రేమించుచున్నాను

నేనాయనను ప్రేమించుచున్నాను

ఏలయనగా ఆయనే మొదట నన్ను ప్రేమించెను.

నా రక్షణను కొనెను,

కల్వరి మ్రాను మీద.

86మీరాయనను ప్రేమించరా? మనమేమైయున్నామో చూచుకొందము. స్నేహితుడా, మార్గములో ఎంత దూరము వచ్చావో చూచుకొనుము. లూధర్, వెస్లీ దినముల నుండి ఏ కాలము వరకు వచ్చియున్నామో చూడుము. మనమెక్కడున్నాయో చూద్దాం. పిరమిడ్ పై భాగమునకు చేరియున్నాము. దానిని దేవుడు ఇక్కడే రుజువు చేసెను. బైబిలు ద్వారా ఏడు ముద్రలు చక్కగా ప్రత్యక్షపరచబడినవి; ఆ ఏడు మర్మముల ప్రత్యక్షత చివరగా చూతుము, అందుకే కనిపెట్టుచున్నాము. తెల్లవారక ముందే ప్రభుని రాకడ, సంఘము ఎత్తబడుట సంభవించవచ్చును.

ఓ నేనాయనను ప్రేమించుచున్నాను

(ఇప్పుడు యధార్థంగా) నేనాయనను ప్రేమించుచున్నాను

ఏలయనగా ఆయనే మొదట నన్ను ప్రేమించెను.

నా రక్షణను కొనెను

కల్వరి మ్రాను మీద.

87ఇప్పుడు మౌనంగా యుందము. ఇక్కడున్న ప్రతి ఒక్కరు లోకమును విడిచిపెట్టవలెనని గ్రహించారా? స్త్రీ కనిన నరుడు కొద్ది దినములవాడై మిక్కిలి శ్రమనొందును. దానికి కారణము ఏమిటి? ఏదేను తోటలోని మరణ వృక్షములో నుండి మనము జన్మించాము. మనము చావవలసినదే. మనము మన తల్లి యొక్క గర్భఫలమై యున్నాము. మనము మరణించవలసియున్నాము. ఈ జీవము వేరు కాబడవలసియున్నది. యువకులయినా, ముసలివారయినా ఏమి భేధము లేదు. ఇక్కడ అందరి కన్న ముసలివారగు స్త్రీ, పురుషులు తమ పదిహేను సంవత్సరాల పిల్లలకన్న ఎక్కువ కాలము జీవించవచ్చును. ఎందరో పిల్లలు లోకములో చనిపోవుచున్నారు. కాబట్టి ఇప్పుడు నీవు ఏమి చేయుచున్నావు?

88ఇది నీ చివరి తరుణము కావచ్చును. ముసలివారైనా, యువకులైనా మీరు సంఘమునకు రావలెను. చేయకుండా ఏదీ విడిచి పెట్టవద్దు. నిజంగా ఆలోచించుము. ప్రతి పాపమును ప్రక్కకు పెట్టుము. సూటిగా దేవుని ముఖములోనికి చూచి, ఈలాగు ప్రశ్నించుము, "ప్రభువా, నిన్ను నేను సంతోషపరచుచున్నానా?" ప్రభువైన యేసూ, నేను ఇంకేమి చేయవలెను? ఈ జీవితము అయిపోయిన తరువాత నిన్ను సేవించు అవకాశము ఇక నాకుండదు. ఇదే నాకున్న సమయము. ప్రభువగు దేవా, నీవేమి చేయగోరుచున్నావో నాకు తెలియచేయుము. ఏదయినా గాని నేను సంతోషముగా చేతును.

యధార్థంగా దానిని మనము ఆలోచించుచున్నామా? చిన్నవారు దాని గూర్చి ఆలోచించుచున్నారా? మధ్య-వయస్సు వారు దానిని గూర్చి ఆలోచించుచున్నారా? ముసలివారు దానిని గూర్చి ఆలోచించుచున్నారా? యవ్వనులు దానిని గూర్చి ఆలోచించుచున్నారా? మనము వెళ్ళిపోవలసియున్నాము. తెల్లవారక ముందు మనము అందరము వెళ్ళము అని నీవు ఎలాగు ఎరుగుదువు? మనకు అది తెలియదు. "అది నన్ను చింతించునట్లు చేయును," అని నీవు చెప్పవచ్చు. అది నిన్ను చింతించునట్లు చేయకూడదు! సూటిగా చెప్పాలంటే, ఈ పాత తెగుళ్ళ గృహమును విడిచి పెట్టుచున్నందుకు నిజంగా నీవు సంతోషించవలెను.

89మరొక ప్రపంచము ఉన్నది. నీవు ఎంతో దూరము పోనక్కరలేదు. అది నీతోనే యున్నది. అది నీ చుట్టూ యున్నది. ఈ ప్రపంచమును తెలిసికొనుటకే దేవుడు అయిదు జ్ఞానేంద్రియములను ఇచ్చెను. అయితే జ్ఞానేంద్రియములకు అందని వేరే ప్రపంచము ఒకటున్నది, నీవు దానిని అందుకోలేవు, ఎందుకనగా దానిని నీవు కలిగిలేవు.

ఆదివారం రాత్రి ఈ అయిదు జ్ఞానేంద్రియములు గూర్చి చెప్పాను, (మీరు దానిని గ్రహించక పోవచ్చును.) చూపు, రుచి, తాకిడి, వాసన, మరియు వినుట. దృష్టిలేని యెడల నీవెట్లుందువు? (రుచి, వాసన, తాకిడి, వినికిడి గ్రహించు శక్తి యుండవచ్చును), సూర్యుడు అను వేరే ప్రపంచమున్నదని దృష్టి పొందినవారు చెప్పెదరు. నీవు దృష్టి లేక అన్నింటినీ తన్నుదువు. నీ ముందేమున్నదో నీకు తెలియదు. నీవు చూపులేనందున ఆ సూర్యుని గూర్చి చెప్పిన వ్యక్తి నీకు పిచ్చివానివలె కనబడును. ఇంతకు ముందు కూడా చాలామంది దానిని గూర్చి చెప్పిరి గాని, నీవు సందేహించితివి. కాని ఈ జ్ఞానేంద్రియము వలన ఇది వాస్తవమని గ్రహించెదము. అది ఒక నిజ చోటు. నీవు దానిని చూడగలవు. నీ జ్ఞానేంద్రియము దానిని తెలుపును.

90నీవు చనిపోయినపుడు ఆ అయిదు జ్ఞానేద్రియములు మారును. (మహిమ!) నీవు మరొక జ్ఞానేంద్రియము పొందుదువు. అది దీనికంటే వేయిరెట్లు మిన్నగా ఉండును. అది మరొక జీవితము. అందులో మరణము, దుఃఖము లేదు. ఇప్పుడు నీకు దాని గూర్చి ఏమి తెలియదు గాని, అక్కడికి వెళ్ళగానే తేటగా చూడగలవు. దానిని ఇప్పుడు నీవు అర్థము చేసికొనజాలవు. దానిని గ్రహించు జ్ఞానేంద్రియము లేనందున ఇక్కడ తడబడుదువు. "ఈ రాత్రి నాకు వింత అనుభూతి కలుగుచున్నది. గట్టిగా కేకలు వేసి చప్పట్లు కొట్టవలెననిపించుచున్నది." ఇది దేవుని దూత, చూచారా.

1COR 15:55•

2TIM 4:8

 

91ఎవరో చెప్పుదురు, మీకు తెలుసా, చూపు అను ఇంద్రియము లేని కొందరందురు, "అప్పుడప్పుడు నాకు ఏదో ఆదరణ కలుగుచున్నది, వెచ్చదనపు అనుభూతి కలుగుచున్నది."

"అది సూర్యుని వెలుగు" అని నీవందువు.

"సూర్యకాంతి ఏమిటి? దానిని నేనెన్నడూ చూడలేదే?" అనును. అతడెన్నడును దానిని చూడలేదు. అదేమిటో ఎరుగడు. దానిని చూడగల వ్యక్తి ఎవరో అతనికి దానిని గూర్చి చెప్పవలెను. ఓ, మై! చూచారా?

మనము మార్పు పొందెదము. మరణము గూర్చి భయపడవద్దు. మరణము ఒక భయపెట్టు దిష్టిబొమ్మ వంటిది. దానిని యేసు జయించెను. పౌలు కూడా మార్గాంతమునకు వచ్చినపుడు ఇట్లనెను, "మరణమా, నీ ముల్లెక్కడ? నీ భయమెక్కడ? సమాధి, నీ విజయమెక్కడ? నన్ను నీవు పట్టుకొందువా? యెరూషలేము వైపు చూపించెదను. అక్కడ ఒక ఖాళీ సమాధి యున్నది. మరణమును, పాతాళమును ఆయన జయించెను. నేనాయనయందున్నాను. నీవు నన్ను పట్టుకొనలేవు. నేను మరల లేచెదను." నా కొరకు ఒక కిరీటము సిద్ధపరచబడియున్నది. నీతిమంతుడగు న్యాయాధికారియగు ప్రభువు దానిని నాకిచ్చును. ఆయన నాకు మాత్రమే కాదు గాని, ఆయన రాకను ప్రేమించు వారికందరికి ఇచ్చును.

92మీరాయనను ప్రేమించుచున్నారు. ఆయన రాకడ మీరు చూడగోరుచున్నారు. ఆయన కొరకు మీరు కనిపెట్టుచున్నారు. అది పెద్ద గాధ. అది దీర్ఘ ఎదురు చూపు. అది ఒక ప్రేమ గాధ. ఆయనను చూచు వరకు నీవుండలేవు! ఓ, మై! ఆలాగే యుండును. ఆ సమయము కొరకు, ఆ ఘడియ కొరకు మనము ఎదురు చూచుచున్నాము. స్నేహితుడా, ఈ రాత్రి నీ హృదయము ఆలాగు లేనియెడల జాగ్రత్త పడుము. జాగ్రత్త! అపవాది నిన్ను మోసపుచ్చకుండా చూచుకొనుము. పరిశుద్ధాత్మ దాని సృష్టికర్త యొద్దకు వెళ్ళగోరుచున్నది, ఎవరూ చెప్పలేని ఒక ప్రేమ గాధ అది. అది వాస్తవము. అది నిజము.

దానికి ఇంకా "నీవు సిద్ధపడలేదను" హెచ్చరిక వినబడుచున్నచో, గుర్తుంచుకొనుము, దేవుడు మరొక దానికొరకు నిన్ను సిద్ధము చేయుచుండవచ్చు, చూచారా. మీరు సిద్ధంగా లేకపొతే…

93"నేను బాప్తిస్మము పొంది పరిశుద్ధాత్మతో నింపబడిన యెడల ప్రభువు నన్ను తీసికొని వెళ్ళును," అని నీవనుకొనుచున్నావా? అది నీవు జీవించుటకు సిద్ధపాటు. పరిశుద్ధాత్మను పొందువరకు నీవు జీవించుటకే తగవు. పరిశుద్ధాత్మను పొందినపుడు నీవు జీవించ అర్హత పొందెదవు. అది నిన్ను సిద్ధము చేయును, చూచారా.

నేను చనిపోవుటకు సిద్ధపడవలెను అని జనులు చెప్పుచుందురు. ఓ, నేను జీవించుటకు సిద్ధపడుచున్నాను. ఆమేన్. క్రీస్తునందు జీవించుటకు సిద్ధపడుము! పాపము, మరణము, పాతాళము మీద జయ జీవితము నీకు వచ్చును. ఇంతకు ముందే నాకు విజయమున్నది. ఆయనే నా విజయము. నేనాయనకు రుజువు, ఆయన జయమునకు నేను రుజువుగా ఉన్నాను. ఆమేన్! అంతే.

JOHN 5:24

 

94"అది పొందినట్లు నీకెట్లు తెలియును?" నేను దానిని పొందితిని. ఆమేన్. ఆయన తన కృపను బట్టి దానిని నాకు ఇచ్చెను. దానిని నేను తాకుచున్నాను. దానిని నేనెరుగుదును. నా జీవితములో అది పనిచేయుట నేను చూచుచున్నాను. అది నన్ను మార్చెను. ఇక్కడున్న ఈ గ్రంధము బట్టి నాకు నిత్యజీవమున్నదని తెలియుచున్నది. తీర్పులోనికి రాక మరణములో నుండి జీవము లోనికి దాటుదును, ఎందుకనగా నా కొరకు ఆయన తీర్పు పొందెను. ఆయన వెల చెల్లించెను గనుక నాకు ఎట్టి తీర్పు లేదు. నా కొరకు దానిని ఆయన భరించెను, నేనది అంగీకరించుచున్నాను. అవునయ్యా.

ఇక ఏ తీర్పు లేదు. ఏ మరణము లేదు. ఒక దినమున నేను ఈ సంఘమును, జనులను విడిచి వెళ్ళుదును. యేసు రాకడ ఆలస్యమైనచో. ఆలాగు జరుగినచొ, మై, నేను చనిపోలేదు. నేను చనిపోను, నాకు నిత్యజీవమున్నది. నిత్యజీవమున్న నీవు ఎట్లు చనిపోదువు? చూచారా? నిత్యమూ దేవుని సన్నిధిలో యుందుము. సదా ఆయనతో యుందుము. ఆమేన్! నా హృదయమును అది పరవసింప చేయుచున్నది. మరల నన్ను బోధించునట్లు చేయుచున్నది, చూచారా. అది నిజము.

ఓ, ఆయనాశ్చర్యకరుడు.

ఆయన ఆశ్చర్యకరుడు కాడా?

నా యేసు ప్రభువు ఆశ్చర్యకరుడు కాడా?

దేవుని వాక్యములో యున్నదానిని

కన్నులు చూచెను, చెవులు వినెను.

నా యేసు ప్రభువు ఆశ్చర్యకరుడు కాడా?

ఆ సాక్ష్యము నాకు ఇష్టము:

దేవుని వాక్యములో యున్న దానిని

చెవులు వినెను, కన్నులు చూచెను.

నా యేసు ప్రభువు ఆశ్చర్యకరుడు కాడా?

95ఓ, ఆయనను నేను ప్రేమింతును. ఆయనే నా సమాధానము, నా జీవము, నా నిరీక్షణ, నా రాజు, నా దేవుడు, నా రక్షకుడు, (ఓ, మై!) నా తండ్రి, నా సోదరి, నా సోదరుడు, నా స్నేహితుడు, నా సమస్తము! చూచారా? ఆట్టి చిన్న పాట మనము పాడెడి వారము. మాకు ఆ చిన్న పెంతెకొస్తు పాట మీకు తెలియునా? టేపు రికార్డరు ఆపు చేశారనుకొంటాను. ఆ పాట మనము పాడేవారము:

ఆయన నా తండ్రి, నా తల్లి,

నా సోదరి, సోదరుడు.

ఆయనే నాకు సమస్తము.

ఆయనే నాకు సమస్తము, ఆయనే నాకు సర్వస్వము;

ఆయనే నాకు సమస్తము, ఆయనే నాకు సర్వస్వము;

ఆయనే నా తండ్రి, నా తల్లి, నా సోదరి, నా సోదరుడు.

ఆయనే నాకు సమస్తము.

దానిని మనము పాడే పారము మీకు గుర్తున్నదా? ఎవరికయినా అది జ్ఞాపకమున్నదా? చాలా సంవత్సరాల క్రితం పాట. ఇంకా ఇలాగు పాడే వారము:

అది రక్తమని నేనెరుగుదును, అది రక్తమని నేనెరుగుదును.

అది నా కొరకగు రక్తమని ఎరుగుదును.

ఒక రోజు నేను నశించగా,

ఆయన సిలువపై చనిపోయెను.

అది నా కొరకగు రక్తమని ఎరుగుదును.

ఆ పాత పాట మీకు గుర్తున్నదా? ఇంకా మనము ఆనాడు పాడిన మరో పాట చూద్దాం:

ఓ, నాతో ఒక్క ఘడియ మేల్కొని యుండలేరా?

నేను ఆవలకు వెళ్ళవలెను, ఆవలకు వెళ్ళవలెను.

ఓ, నాతో ఒక్క ఘడియ మేల్కొని యుండలేరా?

నేను ఆవలకు వెళ్ళి ప్రార్థించవలెను.

నేను జయించుచున్నాను, జయించుచున్నాను,

నేను జయించుచున్నాను, జయించుచున్నాను;

యేసును నేను ప్రేమింతును, ఆయనే నా రక్షకుడు,

ఆయన నా వైపు చూచి నవ్వి మరియు నన్ను ప్రేమించుచున్నాడు.

96ఆ మూలన నల్లవాడగు స్మిత్ సోదరుడు కూర్చొని యుండేవాడు. ఓ! వారి గొంతు ఇంకా నాకు వినబడుచున్నది. నేను కూర్చొని అరచుచూ, గంతులేస్తూ యుండేవాడిని. వారంతా చప్పట్లు కొట్టుచుండిరి.

ఓ, నేను ఆవలకు వెళ్ళవలెను…

ఆ నల్ల సోదరులు కలిగియున్న ఆ తాళము, మీకు తెలుసా. ఆ నల్ల సోదరుల వలె ఎవరూ పాడలేరు.

నేను అచ్చట కూర్చొని "ఓ దేవా!" అను చుండెడివాడను. నేను దాదాపు ఇరవై సంవత్సరాల బాలుడను. ఆ కారు చుట్టూ తిరుగుతూ దేవునిని ఆ విధంగా స్తుతించి చప్పట్లు కొట్టేవాడిని. ఓ, ఎట్టి సమయమది! అది దేవుడు జనుల మధ్య కదలుచున్న ప్రారంభకాలము. ఇప్పుడు మనము బలమైన సంఘమముగా మారియున్నాము. సభ్యులు ఎక్కువ లేరు గాని, ఆత్మలో శక్తివంతులు. ఆమేన్. ఎంత అద్భుతము!

97టెన్నీసిలోని, చట్టనూగాలో ఒక దినము నాకు మరపురానిది. అది చట్టనూగా కాదు గాని మెంఫిస్. ఆ బయట నిలబడియున్న నల్లని స్త్రీని కలిసికొన్నాను. దానిని గూర్చి మీకింతకు ముందు చెప్పియుందును. ఆమె కుమారునికి సుఖవ్యాధియున్నది. ఆమె తలకు అతని షర్టు చుట్టుకొని బల్ల మీద ఆనుకొని యుండెను. ప్రభువు ఆ విమానమును వెళ్ళనియ్యలేదు. "ఈ వైపు నీవు వెళ్ళు," అని పరిశుద్ధాత్మ చెప్పెను.

నేను పాడుకొంటూ అటు వైపు నడిచి వెళ్ళాను. "నా విమానము బయలుదేరుటకు సిద్ధముగా ఉన్నది," అనుకొన్నాను.

"కదులు. ముందుకు సాగి వెళ్ళు," అని చెప్పుట విన్నాను. అది నా సేవ ప్రారంభ సమయము.

98ఆ చోట ఉన్న కంచెను ఆనుకొని చూస్తున్నాను. ఆ స్థలం చాలా చక్కగా యున్నది. అక్కడ ఒక వృద్ధ సోదరి నిలబడియున్నది. ఆమె ఆంట్ జెమిమా సోదరీలలో ఒకరిగా కనిపించెను. బాగా లావు బుగ్గలున్నవి. ఆమె జుట్టు, షర్టు నాకు గుర్తున్నది. ఆమె గేటుకు ఆనుకొని యున్నది. ఒక చిన్న పాట నేను పాడుచున్నాను. అదిప్పుడు గుర్తులేదు. ఒక ఉత్సాహకరమగు పెంతెకొస్తు పాట అది.

నేను పాట ఆపి, బాగా దగ్గరకు వెళ్ళాను. నడుచుచున్నాను. ఆమె నిలబడియున్నది. ఆమె లావు బుగ్గల మీద నుండి కన్నీరు కారుచున్నది. ఆమెను హత్తుకోవాలనుకొన్నాను. అంతలో ఆమె, "శుభోదయం పార్సన్," అన్నది.

"ఆంటీ, ఏమంటున్నావు?" అన్నాను.

"శుభోదయం పార్సన్" అన్నానని చెప్పినది.

"నేను పార్సన్ అని నీకెట్లు తెలియును?" అనడిగాను. దక్షిణాది వారు సేవకుని ఆలాగు పిలచుదురు.

"నీ రాక నాకు తెలియును" అన్నదామె.

"నేను వస్తున్నట్లు తెలియునా?" అన్నాను.

"అవును, పార్సన్, సీవు బైబిలులోని షునేమియురాలి గాధ ఎన్నడైనా చదివావా?" అన్నది.

"అవును, ఆంటీ, నేను చదివాను," అన్నాను.

ఆమె అన్నది, "అటువంటి బిడ్డను ఇమ్మని నేను నా భర్త ప్రభువును అడిగాము. ఆయన కొరకే పెంచవలెనని కోరితిమి. ఆయన ఆ ప్రకారమే ఇచ్చెను. అతడు చక్కగా పెరిగెను. పార్సన్, అతడు చెడు సహవాసములో పడిపోయెను. వానికి ఒక వ్యాధి వచ్చెను. మరణ దశలో అక్కడ పడియున్నాడు. ఇప్పటికి రెండు రోజుల నుండి అలాగే యున్నాడు. అతనికి స్ప్రుహ కూడా లేదు, అతడు చనిపోవునని వైద్యుడు చెప్పెను. అది ఒక సుఖవ్యాధి, నా బిడ్డ చనిపోవుట నేను చూడలేను. రాత్రంతా ప్రార్థించాను. ప్రభువా, నేను షునేమియురాలి వలె యున్నాను, కాని నీ ఎలీషా ఎక్కడ?" అనడిగాను.

వారిలో ఒకడ్ని, వారిలో ఒకడ్ని. వారిలో ఒకడ్ని, అని చెప్పుటకు ఎంతో సంతోషించుచున్నాను.

99"నేను నిద్రపోయి ఒక కల కన్నాను. ఆ కలలో నేను ఈ గేటు యొద్ద నిలబడియున్నాను. నీవు వీధిలో నుండి వచ్చుట చూచాను. నీ తల ప్రక్కన ఏదో యున్నది. నీ చేతిలో సూటుకేసు ఉండాలి," అన్నదామె.

"నేను దానిని 'పైబడి' అను హోటల్ లో విడిచి పెట్టాను," అన్నాను.

"నీవు సూటుకేసుతో యున్నావని నాకు తెలియును. నా బిడ్డ మరణించుచున్నాడు," అన్నది.

"నా పేరు బ్రెన్హాం," అన్నాను.

"పార్సన్ బ్రెన్హాం, నిన్ను కలిసికొనుటకు సంతోషించుచున్నాను," అన్నది.

"నేను రోగులకు ప్రార్థించెదను. నా సేవ గూర్చి ఎన్నడైనా విన్నావా?" అనడిగాను.

"లేదు, ఎన్నడూ వినలేదు. నీవు లోనికి రా," అన్నది. నేను లోనికి వెళ్ళాను.

ఒక పెద్ద మనిషి లోపల పడియున్నాడు. ఆమెకు నేను దైవిక స్వస్థత గూర్చి చెప్ప ప్రయత్నించాను, కాని ఆమెకు అందులో ఆసక్తి లేదు. ఆమె కుమారుడు రక్షించబడి మరియు చనిపోవుటకు సిద్ధముగా యున్నాడో లేదో మాత్రమే వినవలెనని ఆశించుచున్నది. దేవుడతనిని రక్షించెను.

ఒక సంవత్సరము తరువాత అతడు ఎర్ర టోపీ పెట్టుకొని స్టేషనులో కనిపించెను. ప్రభువు ఎట్లు పనిచేయునో చూడండి!

నేను తిరిగి వచ్చినప్పుడు… నేను వెళ్ళవలసిన విమానము ఏడు గంటలకే వెళ్ళవలెను, మరియు దాదాపు తొమ్మిదిన్నార అయినది. నేను టాక్సీలో వెళ్ళాను. నేను అడుగు పెట్టగానే, ఫలాని విమానము వెళ్ళిపోవుటకు సిద్ధముగా యున్నది, "ఫ్లైట్ నంబరు ఫలానా-ఫలానా, చివరి పులుపు," అని చెప్పుచున్నారు. నేను వెళ్ళి, అతనికి ప్రార్థించి తిరిగి వచ్చు వరకు ప్రభువు, ఆ విమానమును నిలిపియుంచెను, చూచారా. అంతే.

100"వారిలో ఒకరు" అను చిన్న పాట గూర్చి నేను ఆలోచించుచున్నాను. ఓ, ఆ పాటను ఎంత బిగ్గరగా చప్పట్లు కొట్టి పాడేవారమో!

వారిలో ఒకడ్ని, వారిలో ఒకడ్ని.

వారిలో ఒకడ్ని అని చెప్పుటకు ఎంతో సంతోషించుచున్నాను. (హల్లెలూయా!)

వారిలో ఒకడ్ని, వారిలో ఒకడ్ని,

వారిలో ఒకడ్ని అని చెప్పుటకు ఎంతో సంతోషించుచున్నాను.

వారు మేడ గదిలో చేరిరి.

ఆయన నామములో అందరూ ప్రార్థించుచుండిరి.

వారు పరిశుద్ధాత్మ బాప్తిస్మము పొందిరి,

సేవ చేయు శక్తి వచ్చెను;

ఆనాడు వారికి ఆయన చేసినది,

నీకును ఇప్పుడు చేయగలడు.

వారిలో ఒకడ్ని అని చెప్పుటకు ఎంతో సంతోషించుచున్నాను.

వారిలో ఒకడ్ని, వారిలో ఒకడ్ని.

వారిలో ఒకడ్ని అని చెప్పుటకు ఎంతో సంతోషించుచున్నాను.

(మీరు సంతోషించుట లేదా?)

101ఈ వచనము వినండి :

ఈ జనులు విద్యలేని వారయినా,

లేక గొప్పతనము లేకపోయినా,

వారంతా పెంతెకొస్తును పొందిరి.

యేసు నామమందు బాప్తిస్మము పొందిరి.

ఇప్పుడు వారు అంతటా చెప్పుచున్నారు.

ఆయన శక్తి మారలేదు.

వారిలో ఒకడ్ని అని చెప్పుటకు ఎంతో సంతోషించుచున్నాను.

వారిలో ఒకడ్ని, వారిలో ఒకడ్ని.

వారిలో ఒకడ్ని అని చెప్పుటకు ఎంతో సంతోషించుచున్నాను.

వారిలో ఒకడ్ని, వారిలో ఒకడ్ని.

వారిలో ఒకడ్ని అని చెప్పుటకు ఎంతో సంతోషించుచున్నాను.

ఓ, రా, నా సోదరుడా,

ఈ దీవెన వెదకుము.

అది నీ హృదయమును పాపము నుండి శుద్ధీకరించును.

ఆనంద గంటలు మ్రోగనారంభించును.

నీ ఆత్మను మండించును.

ఓ, ఇప్పుడది నా హృదయములో మండుచున్నది.

ఓ, ఆయన నామమునకు మపామ!

వారిలో ఒకడ్ని అని చెప్పుటకు

ఎంతో సంతోషించుచున్నాను. (మీరానందించుట లేదా?)

వారిలో ఒకడ్ని, వారిలో ఒకడ్ని,

వారిలో ఒకడ్ని అని చెప్పుటకు ఎంతో సంతోషించుచున్నాను.

ఓ, వారిలో ఒకడ్ని, వారిలో ఒకడ్ని,

వారిలో ఒకడ్ని అని చెప్పుటకు ఎంతో సంతోషించుచున్నాను.

102ఓ, మీరు ఆనందంగా లేరా? ఆ పాటను పాడుచుండగా మనము ఒకరితో ఒకరము చేతులు కలుపుదము. మీరేమందురు? ఆలాగు చేయుదము.

అందరం కలిసి పాడుదం:

వారిలో ఒకడ్ని, వారిలో ఒకడ్ని,

వారిలో ఒకడ్ని అని చెప్పుటకు ఎంతో సంతోషించుచున్నాను.

వారిలో ఒకడ్ని, వారిలో ఒకడ్ని,

వారిలో ఒకడ్ని అని చెప్పుటకు ఎంతో సంతోషించుచున్నాను.

ఓ, నా సోదరుడా, రా, ఆ దీవెన వెదకుము,

అది… ఆత్మ మండును.

ఆనంద గంటలు మ్రోగనారంభించును,

నీ ఆత్మను మండించును.

ఓ, ఇప్పుడు నా ఆత్మ మండుచున్నది.

ఓ, ఆయనకు మహిమ!

(మన చేతులు పైకెత్తుదము)

వారిలో ఒకడ్ని అని చెప్పుటకు సంతోషించుచున్నాను.

అందరూ కలిసి:

వారిలో ఒకడ్ని, వారిలో ఒకడ్ని.

వారిలో ఒకడ్ని అని చెప్పుటకు ఎంతో సంతోషించుచున్నాను.

వారిలో ఒకడ్ని, వారిలో ఒకడ్ని,

వారిలో ఒకడ్ని అని చెప్పుటకు ఎంతో సంతోషించుచున్నాను.

103మరల జాగ్రత్తగా వినండి, చూచారా:

వీరు విద్యలేని పామరులయినా

(వారు కళాశాలకు ఎన్నడూ వెళ్ళలేదు)

లోక పోకడ ఏమి లేదు.

వారంతా పెంతెకోస్తు దీవెన పొందిరి.

యేసు నామములో బాప్తిస్మము పొందిరి;

వారు అంతటా ప్రకటించుచున్నారు.

(మూల మూలలా)

ఆయన శక్తి మారలేదు.

వారిలో ఒకడ్ని అని చెప్పుటకు ఎంతో సంతోషించుచున్నాను.

ఓ, సంఘమా, పాడండి!

వారిలో ఒకడ్ని, వారిలో ఒకడ్ని

వారిలో ఒకడ్ని అని చెప్పుకొనుటకు ఎంతో సంతోషించుచున్నాను.

ఓ, వారిలో ఒకడ్ని, వారిలో ఒకడ్ని.

వారిలో ఒకడ్ని అని చెప్పుకొనుటకు ఎంతో సంతోషించుచున్నాను.

ఇప్పుడు మీ చేతిరుమాళ్ళు తీసికొనండి:

వారిలో ఒకడ్ని, వారిలో ఒకడ్ని,

వారిలో ఒకడ్ని అని చెప్పుకొనుటకు ఎంతో సంతోషించుచున్నాను.

ఓ, వారిలో ఒకడ్ని, వారిలో ఒకడ్ని.

వారిలో ఒకడ్ని అని చెప్పుకొనుటకు ఎంతో సంతోషించుచున్నాను.

ప్రభువుకు స్తోత్రము! ఆమేన్! మనము పిల్లల వలె యున్నాము.

దేవుడు నిరాకారుడు. నిజమేనా? అవునండి!

వారిలో ఒకడ్ని, వారిలో ఒకడ్ని.

వారిలో ఒకడ్ని అని చెప్పుకొనుటకు ఎంతో సంతోషించుచున్నాను.

వారిలో ఒకడ్ని, వారిలో ఒకడ్ని.

ఓ, వారిలో ఒకడ్ని అని చెప్పుకొనుటకు ఎంతో సంతోషించుచున్నాను.

104నీవు నిజంగా సంతోషంతో అది చెప్పగలవా? నీ చేతిని ఎత్తి, "ప్రభువుకు స్తోత్రము," అని చెప్పుము. వారిలో ఒకనిగా ఉన్నందుకు సంతోషించుచున్నాను. ఆనందముగా యున్నది.

ప్రభువగు దేవా, నేనెంతో ఆనందముగా యున్నాను. వారిలో ఒకడ్ని, వారిలో ఒకడ్ని! వారిలో ఒకడ్ని అని చెప్పుకొనుటకు ఆనందించుచున్నాను. ఓ దేవా, ఆలాగుండుటకు సహాయము చేయుము. దీపములు వెలుగనట్లుగా మాకు సహాయము చేయుము, ప్రభువా, మేము సీయోను వైపు సాగిపోవుచున్నాము. తండ్రి, దానిని అనుగ్రహించుము. యేసు నామములో మా జీవితములను నీ సేవకు సమర్పించుచున్నాము. ఆమేన్. ఆమేన్.

ఓ, సీయోను పైకి మేము సాగిపోవుచున్నాము

అది దేవుని సుందర పట్టణము.

ఓ, మేము సీయోనుకు సాగిపోవుచున్నాము.

ఓ, అందమగు సుందర సీయోను.

సీయోను పైకి మేము సాగిపోవుచున్నాము,

దేవుని యొక్క సుందర పట్టణము.

ప్రభుని ప్రేమించువారలారా, రండి,

మన సంతోషము తెలియచేయుదము.

మధుర ఐక్యతతో కలిసి పాడుదం.

మధుర ఐక్యతతో కలిసి పాడుదం.

ఆ విధంగా సింహాసనమును చుట్టుదము.

(ఓ, ఆత్మతో పాడండి!)

ఓ, మేము సీయోనుకు సాగిపోవుచున్నాము.

అది అందమగు, సుందర సీయోను.

సీయోను పైకి మేము సాగిపోవుచున్నాము

అది దేవుని సుందర పట్టణము.

మన దేవుని ఎరుగని వారు పాడలేరు,

కాని పరలోక రాజు పిల్లలు,

పరలోక రాజు పిల్లలు తమ సంతోషము అందరికి చెప్పెదరు,

తమ సంతోషము అందరికీ చెప్పెదరు.

దానిని మనం పాడుదము!

మేము సీయోనుకు సాగిపోవుచున్నాము,

ఓ, అందమగు, సుందర సీయోను;

మేము సీయోను పైకి సాగిపోవుచున్నాము,

అది దేవుని సుందర పట్టణము.

105ఓ, అది మీకు పులకరింత కలుగజేయుట లేదా? ఆ పాత పాటలు మీరు ప్రేమించుట లేదా? మీ ఇతర పాటలకన్న అవే నా కిష్టము. అవి మంచి, హృదయ స్పందన గీతములు. ఓ మై! వాటిని పాడినపుడు నాకెంతో బాగుండును. ఎంతో ఆనందము ఉబికి వచ్చును!

యేసు నామమును మాతో కొనిపొండి,

దుఃఖము, శ్రమతో నిండిన వారలారా;

అది ఆనందము, ఆదరణ మీకిచ్చును,

మీరు వెళ్ళు ప్రతిచోటకు దానిని తీసికొని పొండి!

ప్రశస్త నామము (ప్రశస్త నామము!),

ఓ, ఎంత మాధుర్యము (మధురము!)

భూలోక నిరీక్షణ, పరలోక ఆనందము ప్రశస్త నామము,

ఓ, ఎంత మాధుర్యము, భూలోక నిరీక్షణ, పరలోక ఆనందము.

ఓ, మేము సీయోనుకు సాగిపోవుచున్నాము.

అది అందమగు, సుందర పట్టణము

ఇప్పుడు మన తలలు వంచుదము:

యేసు నామములో వంగవలెను,

ఆయన పాదాలపై సాగిలపడి,

మన యాత్ర ముగుయునప్పుడు,

పరలోక రాజుల రాజు, మనము ఆయనకు కిరీటము ధరింపచేతుము.

ప్రశస్త నామము, ఓ ఎంత మధురుము!

భూలోక నిరీక్షణ మరియు…..

Search Messages

0 / 0 matches
Enter characters above to process real-time text query scopes...