దేవుని మర్మమైయున్న క్రీస్తు బయలుపరచబడెను
1నెవిల్ సోదరుడా, కృతజ్ఞతలు ప్రభువు నిన్ను దీవించును గాక. ప్రార్థనకై తలలు వంచి ఒక్క క్షణము నిలబడే యుందము.
2కృపగల పరమ తండ్రీ, అది మా మీద ఉదయించిన రీతిగానే, నేడు ఉదయమున మరల నిన్ను సమీపించుచున్నాము. ఈ ప్రస్తుత దినము మేమెట్లు జీవించవలెనో, మేము జీవించుచున్న దినము యొక్క సమయము ఏమిటో తెలిసికొనుటకు, మరియు నీ వాక్యమును బోధించుటకై ఈ ఉదయము మేము కూడుకోవలెను. నేటి మా ఆలోచలకు, హృదయములకు నీ పరిశుద్ధాత్మ నడిపింపు కావలెను. మాకు అవసరమగు ప్రతి వాక్యము తెలిసికొను నట్లుగా మమ్మును నడిపించుము మీరు ఏదైతే మాతో మాట్లాడాలనుకుంటున్నారో దానిని చేర్చుకొనుటకు మా నోళ్ళను, హృదయములను బాగుగా తెరువుము. దేవుని వాక్యమును నీవు మాత్రమే బయలుపరచెదవని ఎరిగియుండి, సరిగా లేని వాటిని మేము చేర్చుకొనకుండా మా నోర్లు మూయుము.
ఇప్పుడీ చిన్న సంఘమును విడిచి ప్రపంచములోని ఇతర భాగములకు వెళ్ళవలసిన సమయము వచ్చినది. ప్రభువా, వారిని నీకు అప్పగించుచున్నాము. వారు నా కనుగ్రుడ్డుగా యున్నారని అనగలను. సత్య వాక్యము మరియు ఆత్మ ద్వారా వారు నీకు పుట్టిరి. ప్రభువా, వారిని దీవించుము. ప్రభువా, క్రీస్తు ప్రేమ యొక్క బంధములలో వారు సన్నిహితంగా ముడి వేయబడునట్లుగా నీవు వారిని దీవించుమని నేను, ప్రార్థిస్తున్నాను.
3౩ మా ప్రియ సంఘ కాపరిని దీవించుము. నీ వాక్యమును బయలుపరచి, దానితో చిన్న మందను మేపునట్లుగా పరిశుద్ధాత్మతో ఆయనను అభిషేకించమని ప్రార్థించుచున్నాను.
ఇక్కడున్న ఈ చిన్న సంఘము గూర్చి కొద్ది కాలంక్రితం నీవు దర్శనము చూపించావు. ఆహారమును నిలువ చేయవలెనని చూపించావు. ఇదంతా అవసరమగు ఒక సమయము వచ్చును. సహో. సాద్‌మన్ మరియు వుడ్‌లు మరో దేశమునకు వెళ్ళుటకు సిద్ధపడి యుండుట మేము చూచి యున్నాము. కాని ఆ సమయం కొరకు ఇక్కడ ఆహారమును దాయవలెనని నీవు చెప్పావు. ప్రభువా, విధేయతతో ఆ పని నేను చేయుచున్నాను.
ఈ ఉదయకాల పాఠమునకు మా ఆలోచనలకు నీవు సహాయము చేసి నీవు దేవుడవై యున్నట్లుగా చూపించుకొనుమని నేను ప్రార్థిస్తున్నాను. ప్రభువా, ఇది నీ వాక్యము, నీ సత్యము. ప్రభువా, దీనిని జనులు భుజించి, బాగా ఎదుగునట్లు సహాయము చేయుము. ఇది దేవుని కృపయై యున్నది. ఇది ఈ దినమునకు దేవుని యొక్క గొప్ప కృప అని వారుచూడగలుగుదురు గాక! వచ్చిన వారిని, ఇంకా రాదలచిన వారిని దీవించుము. తండ్రీ, నీవే మహిమ తెచ్చుకొనుము. యేసు నామములో దీనిని అడుగుచున్నాము. ఆమేన్.
ఇపుడు ప్రభువు మీ ప్రతి ఒక్కరిని దీవించును గాక
4ప్రారంభమునకు ముందు ఇక్కడ ఒక బాలుని మనము చూచాము. కాలిన్స్ ఆ బిడ్డ పేరు అని నమ్ముచున్నాను. కొంతసేపటి క్రితం తండ్రిని నేను కలిసికొన్నాను. ఆ చిన్న బిడ్డను ప్రతిష్ఠించవలెనని వారు కోరిరి. కాలిన్స్ దంపతులు ఆ చిన్న బిడ్డను ముందుకు తెచ్చిన యెడల ఇపుడు ఆ ప్రతిష్ఠ కార్యక్రమమును ప్రారంభించుదుము.
5వీరు క్రీస్తు శరీరములోని విధేయులగు సభ్యులు, చూడండి. ఇది క్రీస్తు యొక్క శరీరము. ఇది ఆయన శరీరములోని ఒక భాగము. మందిరంలోని భాగమని నేను ఎన్నడు చెప్పలేదు. వారు ఈ చిన్న బిడ్డను ప్రతిష్ఠించగోరుచున్నారు. నేను పిల్లలను ఎత్తుకొనునప్పుడు నా భార్య అసూయపడును. నెవిల్ సోదరుడా, రాగలిగినచో ముందుకు రమ్ము.
6నీ మొదటి పేరు ఏంటి సహోదరుడా? సహోదరుడు మరియు సహోదరి క్లైడ్ కాలిన్స్. మన ప్రశస్త సహోదరుడగు రెవరెండ్. కాలిన్స్, విల్బుర్, వారికి కాలిన్స్ సంఖ్య పెరిగిపోతూ ఉంది అని నేను చూస్తున్నాను, చాల చక్కని చిన్ని బాలుడు. సిస్టర్ కాలిన్స్ ఈయన వయస్సు ఎంత? దాదాపు నలుగు నెలలు. మరియు ఈయన పేరు ఏమిటి? మార్క్ డేవిడ్, అది చాల మంచి పేరు. నేవు చాల చక్కని బాలుడిలా కనిపిస్తున్నావ్. చెప్పాలంటే, ఈయన ఒక రకంగా పెద్ద బాలుడు కూడా. నాకు తెలుసు ఇక్కడి తల్లులు మరియు స్త్రీలు ఈ చిన్ని బాలుడిని అభినందిస్తున్నారు. అది ఒక బొమ్మా? మంచిది, మనము తలలు వంచినట్లైతే.
7పరలోకపు తండ్రి, ఇక్కడికి ఒక యవ్వన తండ్రి మరియు తల్లి వారి కలయిక ద్వారా జన్మించిన ప్రశస్తమైన చిన్ని మరుష్య ముద్దని చేతిలో పట్టుకొని ప్రభువైన దేవుని కొరకు తీసుకోని వచ్చారు. వారు ఎంతో మర్యాదతో ఈ మార్క్ డేవిడ్ను దయ చేసిన మహోన్నతునికి ప్రతిష్ఠించుట కొరకు, చక్కని ఆరోగ్యము మరియు ఒక చక్కని బాలుడు వారి సంరక్షణతో దేవుని మహిమ నిమ్మితం పెంచబడుటకు. ప్రభువా తండ్రిని మరియు తల్లిని ఆశిర్వదించండి, వీరి తొట్టి ఎన్నడు ఖాలీ కాకుండా లేక వీరి గృహము ఎన్నడు ఎండిపోకుండును గాక. ఈ తండ్రి క్షేమంగా మరియు ఈ చిన్నవాడికి ఆహారమును సమకుర్చుటకు పనిచేయుటకు దీవించండి. మరియు తల్లి క్షేమంగా ఉండి దానిని సిద్దపరచుటకు, మరియు వారి హృదయములు సిద్దపరచి ఈ బాలుడు ఎదుగు సమయములో హితబోధ నేర్పుటకు దయచేయుము ప్రభువా.
8ఇప్పుడు ఈ చిన్న ప్రియమైన మార్క్ డేవిడ్ వారి చేతుల నుండి నా వద్దకు వస్తున్నాడు. ఈ సంఘపు పెద్దతో ఇక్కడ మీకు ప్రభువైన యేసు క్రీస్తు జీవిత సేవ కొరకు ఇస్తున్నాను. దయచేయండి ప్రభువా, ఈయన జీవితములో నుండి మహిమను పొండుకోనండి. ఈయన ఎక్కువ కాలము జీవించును గాక, నీకు ప్రియమైన యెడల నీవు వచ్చు పర్యంతము జీవించును గాక. అలాగైన యెడల వచ్చు కాలములో ప్రభుని వర్తమానము తీసుకోని వచ్చును గాక. దయచేయండి. ఈయనను ఆరోగ్యముతో సంతోషముగా, దేవుని ఎదుట ఎల్లప్పుడు సరైనది చేయుటకు ఈయన హృదయము ఉంచుము. ప్రభువైన ఏసుక్రీస్తు నామమున మేము ఈ బలుడను నీకు ప్రతిష్ఠించుచున్నాము. ఆమెన్. దేవుడు మిమ్ములను దీవించును సహోదరి కాలిన్స్ మరియు ఈ చిన్న బాలుడు మరియు సహోదరుడా కాలిన్స్. దేవుడు మీతో ఉండును గాక.
వారిని లోనికి తెండి, వారిని లోనికి తెండి,
పాపపు పొలములలోనుండి వారిని లోనికి తెండి,
వారిని లోనికి తెండి,
వారిని లోనికి తెండి,
చిన్న వారిని యేసు నొద్దకు తెండి.
అది నాకు ఇష్టము చూడండి, అపవాదికి అవకాశము రాకముందే వారిని క్రీస్తు నొద్దకు తీసికొని రండి. సేవా జీవితముకై వారిని ముందే ఆయనకు సమర్పించుట జరిగినది.
9డాచ్ కుటుంబములోని వారెవరైనా ఈ రోజు వచ్చిరా? లేక రాలేదా? మీరెవరైనా ఎరుగుదురా? శ్రీమతి డాచ్ వచ్చినదా? సహో. బ్రవున్ ఇచ్చటున్నాడా? సహో. డాచ్ ఇంకా మనతో యున్నాడు. నాకు చాలా ఆనందము. అది అద్భుతము! సహో. డాచ్ దాదాపు చనిపోయెను. మరీ ఎక్కువ మనము అడుగలేము. మరీ ఎక్కువగా మనము చెప్పలేము. దేవుడతనికిచ్చిన దాని కంటె ఇరవై-ఒక్క సంవత్సరములు ఎక్కువే జీవించెను. అది ఒక సామాన్య జీవన కాలము. అతడు జీవించునని చెప్పిన కాలము కంటె ఎక్కువ కాలమునే దేవుడతనికి ఇచ్చెను.
ACTS 2:38
10ఒక ఉదయమున అతడు చనిపోవుచున్నట్లుగా మాకు ఫోను వచ్చినది. మేము త్వరపడి వెళ్ళాము. ప్రభువగు దేవుడు నిజముగా ఆయన పట్ల ఎంతో మేలు చూపి ఆ ప్రాణమును కాపాడెను. అతడు ప్రభుని రాకకై సిద్ధపడి ఎదురుచూచుచున్నాడని నేను తలంచుచున్నాను. మనందరము ఒకరినొకరము ఎత్తి పట్టుకొనవలసి యున్నాము. ఈ ముసలి వ్యక్తి నాకు తండ్రి వంటి వాడు. ఆయన పాత సంఘములో కూర్చోని యుండుట నాకు గుర్తున్నది. (గతంలోనిది) యేసు క్రీస్తు నామములో నీటి బాప్తిస్మము గూర్చి చెప్పినప్పుడు ఆ వెలుగు కనిపించినప్పుడు అతడు ముందుకు వచ్చెను. అతడు ఎనుబది-ఏడు, ఎనుబది-ఎనిమిది సంవత్సరముల వృద్ధుడు. కర్ర పట్టుకొని వచ్చి ఇట్లనెను, నేను వెంటనే బాప్తిస్మము పొందుదును. ఎవరో వెళ్ళి ఆయనకు బట్టలు తెచ్చిరి. ఆయన మరొకసారి వరకు ఆగలేక పోయెను. వెంటనే వచ్చెను. నాకది ఇష్టము. (ఆయనతో నేను మాట్లాడాను) ఇట్లు నాతో చెప్పెను. బ్రెన్హాం సోదరుడా, నేను బాగయ్యానని నీవు తలంచుచున్నావా?
"వైద్య పరీక్షకై ఎప్పుడైనా డాక్టరు యొద్దకు వెళ్ళావా?" అని నేనడిగాను.
"అవును" అన్నాడు.
వైద్యుడు చెవులలో యంత్రమును పెట్టి అతని గుండె ఎట్లు కొట్టుకొనుచున్నదో చూచెను. గుండె కొట్టుకొనుటను, రక్త ప్రసరణను, మూత్ర పరీక్షను చూచెను. శరీర పరిస్థితిని చూచుయంత్రములను ఉపయోగించెను. వైద్య నిపుణులు ఆయా అంశములను వ్రాసిన పుస్తకం యొక్క వెనుక వైపుచూచును. ఏదైనా పొరపాటు జరిగినచో కనిపెట్టెదరు. ఆ విధంగానే అతడు చేయును.
JOHN 5:24
11"నా ఆత్మకు ఒకే ఒక్క పరీక్ష యంత్రమున్నది. అది బైబిలు" (చూచారా?) నేను మీకు పరీక్ష ఇచ్చెదను." "యోహాను 5.24 లో ఆయన ఇట్లు చెప్పెను. 'అతడు నా మాట వినును… కేవలము కూర్చొని వినుట కాదు. దానిని చేర్చుకోవలెను" చూచారా "దానిని చేర్చుకోవలెను, దానిని నీవు నమ్మవలెను. అది సత్యమని నీ అంతరంగంలోనిది ఏదో నీకు చెప్పును. దానిని నీవు అంగీకరించవలెను. దానిని నీవు నమ్మవలెను. అది నీది అతడువినును, అది ఇది వరకే నీది, నా మాటలు, నన్ను పంపిన వానిని నమ్మును. దానిని మీరు నమ్ముచున్నారా?" అని నేను చెప్పితిని.
"నేను నమ్ముచున్నాను" అని ఆయన చెప్పెను.
అయితే ప్రధాన వైద్యుడు ఏమి చెప్పుచున్నాడో నేను చెప్పెదను. "మరణములో నుండి జీవము లోనికి దాటి యున్నావు. తీర్పు లోనికి గాని శిక్షలోనికి గాని రావు. నాకు తెలిసినంత వరకు గ్రంథముల ప్రకారము పరీక్ష పాసయి యున్నావు" అని నేను చెప్పితిని.
ఈయన దాదాపు వంద సంవత్సరముల వృద్ధుడు. సంఘపు మనిషి కానేకాడు. కాని మొదటి సారిగా అతని మార్గములో వెలుగు ప్రకాశించగానే దానిని అతడు చేర్చుకొనెను. అక్కడ పడియున్న విత్తనము ముందుగానే నిర్ణయించబడినది. అవును అయ్యా, దానిని వెలుగు తాకగానే వెంటనే అందులోనికి జీవము వచ్చినది.
12ఇప్పుడు, ఈ రోజు చాలావేడిగా యున్నదని నాకు తెలియును. ఈ విధంగా క్రిక్కిరిసియున్న చోటకు ఆరాధనకు మిమ్మును రమ్మనుట నాకు కష్టముగానే తోచుచున్నది. కాని నేను వెళ్ళిపోవు ముందుగా దేవుని కృప చేతమరొక ఆరాధనను జరుప వలెనని తలంచుచున్నాను. కొద్ది కాలము మట్టుకు మిమ్మును ఎడబాయుదును.
బుధవారముతో ప్రారంభమగు కూటముల కొరకు రేపు రాత్రికి షికాగో పయనమవుదును. సాధ్యమైతే కొద్దిగా పెందలకడనే వెళ్ళవలెననుకొనుచున్నాను. కూటముల పరంపరను ప్రారంభించుటకు ముందుగానే విశ్రాంతి తీసికొందును. వారు వాటిని కలిగియున్నారని నేను నమ్ముచున్నాను. ఇక్కడే దానిని చూచుచున్నాను. దానిని గూర్చి ముందే ప్రకటించి యున్నారు. అది మారెన్‌గో అని పిలువబడుచున్నది. దానిని మేరీగోల్డు ఏరియా అందురు. అక్కడ బుధవారము రాత్రి నుండి ఆదివారము వరకు కూటములు జరుగును. శనివారము ఉదయమున సంపూర్ణ సువార్తికుల అల్పాహార విందు జరుగును. వారెక్కడ ఈ విషయమును ప్రకటించిరో నాకు సరిగా తెలియదు. శనివారము సాయుంకాలము లేన్‌టెక్‌లో జరుగును. దానిని గూర్చి ముందుగా ప్రకటించబడినదని ఇక్కడ నేను చూచితిని.
13మీరు ఆ ప్రాంతమునకు చుట్టు ప్రక్కల లేక ఆ ప్రాంతములో యున్నచో రండి. అవి మనమిక్కడ తరచుగా ఎప్పటికీ జరుపుకొను సువార్త కూటముల వలె యుండును. చాలా వరకు ఇక్కడ బోధించిన వర్తమానములే అక్కడ బోధించబడును. ఇక్కడ మనము టేపును తయారు చేయుచున్నాము. చూచారా? వారిలో గలిబిలి ఏర్పడవచ్చు. వారు వినవలెనని కోరిన యెడల, ఇక్కడ చేయబడిన టేపును వారు పొందవచ్చు, అది వారికే వదిలేయుచున్నాను. అయితే మనస్వంత వేదిక పై నుండి ఇవి వచ్చుచున్నవి. బయటకు వెళ్ళినప్పుడు నేను అంత లోతయిన సంగతులు బోధించను, ఎందుకనగా అందులో చాలామంది అనుభవము లేనివారు. కాని ఇక్కడయితే దేవుడు చెప్పమని నా హృదయములో పెట్టిన దానిని నేను చెప్పు హక్కు కలిగి యున్నాను. కాబట్టి మన టేపులు ఇచ్చట తయారగును, చూచారా. వారిప్పుడు ఆ గదిలో యున్నారు. వారు తలలను అద్దపు ముసుగులతో కప్పుకొనియున్నారు. వారు రికార్డులతో కూర్చోని యున్నారు.
14మీరు కూటమునకు రాగోరినట్లయితే మిమ్ములను సంతోషముతో ఆహ్వానించు చున్నాము. మీరు ఆ స్థలమును ఎరుగనిచో సంపూర్ణ సువార్తకు చెందిన వారెవరినయినా సంప్రదించ వచ్చును. లేదా సహో. కార్ల్‌సన్ దీనిని గూర్చి తెలుపును. లేదా ఫిలదెల్పియ సంఘము వారు చెప్పెదరు. ఎవరయినా గాని ఆ స్థలమునకు ఎలా వెళ్ళవలెనో మీకు సలహా ఇచ్చెదరు.
15వచ్చే సోమవారము మధ్యాహ్నము గాని లేదా సాయంకాలము గాని నేను తిరిగి వచ్చెదను. పిల్లలను మరల స్కూలులో చేర్చుటకు మంగళ వారము ఆరిజోనాకు వెళ్ళెదను. తిరిగి ఎప్పుడు వచ్చెదనో సరిగ్గా తెలియదు, ఎందుకనగా, ఏమి చేయవలెనో ఆయనే నన్ను నడిపించవలెనని నేను కోరుచున్నాను.
ఒక వింత సంగతి జరిగినది. ఇది టేపు అగుచున్నదని నాకు తెలియును కాని, ఇది చెప్పవలెను. దర్శనములు, పరిశుద్ధాత్మ యొక్క నడిపింపులు మనకున్నవి. అదెట్లు నడిపించుచున్నదో ఆ ప్రకారమే నడువగోరుచున్నాను. దర్శనములకు బహు ఉన్నతమైన సమయములో ఒకటైన గత సంవత్సరములో వచ్చిన దర్శనములు నా సేవలో ఇంత వరకు ఎన్నడూ రాలేదు. ముందుగానే జరుగబోవు సంగతులను ప్రజలకు తెలియచేశాను. వాటిని మీరు ఎరుగుదురు. అక్షరాలా చెప్పినట్లే జరిగినవి.
16తిరిగి మనమందరము ఒకరినొకరము చూచుకొనుచున్నాము. ఈ స్థలములోయున్న వాతావరణము నాకు నిజంగా నచ్చదు. ఎందుకనగా, ఇక్కడికి నేను వచ్చిన వెంటనే నాకు జబ్బు చేయును. నేను పర్వత శిఖరముల మీద నుండి ఈ లోయలోనికి వచ్చి యున్నాను. ఇక్కడికి వచ్చిన పది నిమిషములకే నాకు జబ్బు చేసినది. (వాతావరణము వలన) తల బరువుగా యున్నది. అంతా మసకగా కనిపించుచున్నది. ఇందులో నుండి నేను బయటకు రావలెను.
1SAM 15:22
17నా భార్యతో మాట్లాడాను. కాని, ఈ సంఘమునకు నేను ఈ ప్రజల గూర్చియే వచ్చుచున్నానని ఆమెకు చెప్పాను. నేను నా జీవితంలో అన్ని స్థలములలో కన్న సువార్తను ఉపదేశించుటకు వచ్చుటకై ఇది నాకు ఇష్టమైన స్థలము. టేపు తయారు చేయుటకు మిగతా స్థలముల కంటె ఈ స్థలము పది రెట్లు ఎక్కువ అనుకూలముగా కనిపించుచున్నది. "దేవుడు కార్యము చేయుచున్న చోటనే నిలిచి యుండుడని" నేను మీతో అందుకే చెప్పుచున్నాను. ఆయన మొదటిసారి నన్ను పిలచినప్పుడు నేను వెళ్ళలేదు. అందుకే నేను వచ్చినప్పుడు కొన్ని కఠిన పరిస్థితులు ఎదుర్కొన్నాను. బలి అర్పించుట కంటె లోబడుట శ్రేష్ఠము.
18నేను ఈ ఆలయమునకు తరచుగా వచ్చి బోధించుచున్నాను. ఈ పట్టణమునకు చెందని వారిని గుర్తించాము. ఆఫీసులో బిల్లీ పాల్ ఉండును. అతని ద్వారా ఎప్పుడయినా మీరు మమ్మును సంప్రదించవచ్చును. ఇక్కడికి తిరిగి వచ్చిన తరువాత ప్రభుని చిత్తమయితే ఏడు బూరలు, ఏడు తెగుళ్ళు గూర్చి చెప్పెదను. ఏడు పాత్రలు గూర్చియు చెప్పెదను. కొద్దిగా వాతావరణము చల్లబడినప్పుడు వత్తును. ప్రభుని నడిపింపు ప్రకారమే వచ్చుదును.
19ఒక రోజున నేను వచ్చినప్పుడు నాకు ఎవరో ఒక వ్యక్తిగత చెక్కును ఇచ్చిరి. నాకు మాత్రమే దానిని ఇచ్చిరి. దానికి పన్ను లేదు. కాని నాకు ఒక అవసరమున్నదని బిల్లీ ఎరిగి దానిని మార్చవలెనో లేదో అని న్యాయవాదిని అడిగెను. అందుకు న్యాయవాది, "ఈయన అమెరికా పౌరుడు గనుక ఎందుకు మార్చలేడు?" అని ప్రశ్నించెను. చూచారా? ఏ పౌరుడైన దానిని చేయగలడు. దానికి పన్ను లేదు.
20అయినా గాని, అతడు (బిల్లీ) సంతృప్తి చెందక మరొక అధికారి యొద్దకు వెళ్ళెను. అతడు కూడా అదే విధంగా చెప్పెను. "అమెరికా దేశపు పౌరునికి దానిని మార్చుకొను హక్కున్నది." అయినను అతడు సంతృప్తి చెందక మెరిల్ మిల్లర్‌ను పిలచెను. (అతడు ఇండియానా రాష్ట్ర పన్ను అధికారులకు అధ్యక్షుడు) అతడు కూడా ఆ ప్రకారమే చెప్పెను. (ఐక్ మరియు మిల్లర్) "ఆ చెక్కు అన్యాక్రాంతము చేయబడినది." (చూచారా.) దానిని ఒక్కరు మాత్రమే అన్యాక్రాంతము చేయగలరు. దాని మీద ముద్ర వేయజాలరు.
21నేను, చెక్కులను మార్చను. అయితే అప్పుడు ఆలాగు జరిగినది. చాలా మంది కూటముల యొద్ద చెక్కులు ఇచ్చెదరు. ప్రభుత్వమే వాటిని గూర్చి చూచుకొనును. "నా పేరు విలియం బ్రెన్‌హాం" అని వ్రాయవలెను. నేనే సంతకము చేయుదును. అప్పుడు చెల్లించెదను. కాని నేను పన్నుల రూపములో 300,000.00 డాలర్లు బాకి పడి యున్నాను. అక్కడే ఈ సందేహము వచ్చినది. నేను ఆ చెక్కును ఇచ్చిన వెంటనే ఏజంటు వచ్చి "నా కేసును మరల పైకి తీయవలెనని" చెప్పెను. అందుకే కష్టమాయెను.
22సహో లీ వైల్ ఇక్కడ కూర్చొని యున్నాడు. (ఇది చెప్పినా పరవాలేదనుకొనుచున్నాను) అతడు ఒక బాప్టిస్టు పండితుడు. (ఒక నాడు ఈకొలనులో అతనికి యేసు క్రీస్తు నామములో బాప్తిస్మము ఇచ్చాను) సహో లీ వైల్. అతడు నిజంగా ఒక చక్కని వ్యక్తి. క్రీస్తు నందు సోదరుడు. ఇంతకు ముందు అతడు మనకు బోధించెను. ఉన్నత విద్యను అభ్యసించెను. అంతే కాకుండా ఆత్మ నడిపింపు గలవాడు. వెలుగు అతని మీదికి వచ్చినప్పుడు అతడు దానిని తప్పించుకొనిపోబోయెను గాని పోలేక పోయెను. కావున ఒక ఉదయము అతనికి నేను బాప్తిస్మము ఇచ్చాను. ఇక కాలయాపన చేయకుండా మేము వెళ్ళి మా వస్త్రములను, ధరించి లోనికి పోయి "యేసుక్రీస్తు నామములో అతనికి బాప్తిస్మము ఇచ్చాను."
23అతడు అంత చక్కని ఆత్మీయ ఆహారము తీసికొనినందున కొద్దిగా మాట్లాడుటకై శారీరక ఆహారమును కూడా మనము తీసుకోవలెనని నేనుతలంచాను. కాబట్టి మేము బ్లూబోయర్ యొద్దకు వెళ్ళాము. అక్కడ కూర్చొని ముచ్చటించాము. "ప్రజలు నీ గూర్చి ఆ విధంగా మాట్లాడుచుండగా ఎందుకు ఊరుకొనుచున్నావని నన్ను జనులు అడిగిరి." నాకు తెలిసిన వారిలో సహో వైల్ చక్కని వ్యక్తి. కాని అతడు కొద్దిగా తొందర పాటు వ్యక్తి. నేనెల్లప్పుడూ ఆ విషయంలో అతనిని వాదించుట మీరెరుగుదురు. (వైల్ సోదరుడు ఏమీ అనుకోడని తలంచుచున్నాను.) తొందర పడకుండా నెమ్మదిగా కూర్చోమని చెప్పాను. దేవుడే అన్నియూ చూచుకొనును.
అతడు చెప్పెను "నీదంతయు సరియే బహు మేధావులైన జనులను అతడు సంధించినప్పుడు అతడు గొప్ప మేధావిగా ఉండునని నేనెరుగుదును." అక్కడే దానిని ఏలాగు వ్యక్తపరచవలెనో అతడు ఎరుగును. మరియు వారు నిలుచుటకు కూడా ఇక స్థలం ఉండదు. అంతా అదియే.
2SAM 16:9,11
24నేను వైల్ సోదరునితో ఇట్లు చెప్పాను. (మేము బ్లూ బోయర్ యొద్ద కూర్చొన్నాము) చూడు "దావీదు ఒక నాడు తన స్వంత కుమారునిచే సింహాసనము మీద నుండి త్రోసివేయబడెను. అది తన తిరుగుబాటు. ఇశ్రాయేలు చీలిపోయినది. దావీదు సింహాసనమును అతని స్వంత కుమారుడే తీసికొనెను. దావీదు ఏడ్చుచూ పట్టణములో నుండి వెళ్ళిపోవుచుండెను. అతడి చివరకాల వర్తమానమును ఇష్టపడని ఒకడున్నాడు. మీకు తెలుసా అతడు ఆయనను లెక్కచేయడు. వాడు ఒక చిన్న కుంటి మనిషి. దావీదును హేళన చేసి దావీదు ముఖము మీద వాడు ఉమ్మి వేసెను. దావీదు అంగరక్షకుడు కత్తి తీసి నా రాజు మీద ఉమ్మివేసిన ఈ కుక్క వంటివాని తలను నరికి వేయుదుననగా, వాని జోలికి పోవద్దని దావీదు చెప్పెను. ప్రభువే ఆలాగు చేయుటకు వానికి సెలవిచ్చెను. అందుకే అతడు నా మీద ఉమ్మి వేసి హేళన చేసెనని దావీదు పలికెను. "ఆ విధంగా చేయుటకు యెహోవా అతనికి సెలవిచ్చెను." ఆ గాధను మనమెరుగుదుము. అతడెట్లు తిరిగి చెప్పెనో చూడండి. సహో. వైల్ ఆ విధంగా ప్రవర్తించుటకు చాలా కృప కావలెనని చెప్పెను.
25తిరిగి వచ్చి ఆఫీస్‌లోకి ప్రవేశించక ముందే, ప్రభుత్వ అధికారి బిల్లీ పాల్‌ను పిలిచి ఈ సంగతిని గూర్చి చెప్పెను. నేను వైల్ ఇంటికి వెళ్ళాము. (అది మధ్యాహ్న సమయము).. నేను గదిలోనికి వెళ్ళి "నా భార్యతో ఈ విషయం చెప్పగోరాను."
నేను వెళ్ళిపోకముందే దాని గూర్చి మాట్లాడాను. "దేవుడే నిన్ను అచ్చటికి పంపెనని నేనెరుగుదును; మనందరికి అది తెలుసు, తిరిగి రమ్మని ఆయన ఎన్నడు నీకు చెప్పలేదు. అందుకు నేను చింతించాను," అని ఆమె చెప్పెను.
26నేను అన్నాను మంచిది, "నేను నీ కొరకు, పిల్లలకొరకు ఆలోచిస్తున్నాను. నా మట్టుకు నాకు పెద్ద చింతలేదు. నేను ఎక్కడికి వెళ్ళినను ప్రభుని చిత్తానుసారమే సేవచేయగోరు చున్నాను." ఆ విషయాన్ని నేనామె యొద్దకు వెళ్ళి చెప్పాను. నేను వెళ్ళి టోపి తీసిపైన పెట్టాను. ఓ, పన్నులు వసూలు చేసే అధికారి! మనం తప్పక బయటికి వెళ్లవలెను … అని ఎవరో ఏదో చెప్పెను. కేవలం ఆకస్మిక తనిఖీ వంటిది. సహో. వైల్‌తో ఏమి చెప్పానో దానిని ఆలోచించకపోయే, అతని జోలికి పోవద్దు. దేవుడే ఆలాగు అతనికి సెలవిచ్చెనని నేను చెప్పాను. ఆ మాట నేను చెప్పిన వెంటనే గోడ మీద ఒక వెలుగు ప్రకాశించి అక్కడ రాయబడింది. (అక్కడే నా భార్య, సహో. వైల్ కూర్చొనియున్నారు), "ఆరిజోనాకు తిరిగి రమ్ము. ఆరిజోనాకు తిరిగి రమ్ము" అను మాటలు గోడ మీద రాయబడినవి. అదియే సత్యం ఆమేన్. తిరిగి ఆరిజోనాకు వెళ్ళాను.
27ఈ వారము గొప్ప ఆశీర్వచనముల వారము. ఏడు ముద్రలు గూర్చి బోధించినప్పటి నుండి ఎందరో నన్ను కలిసికోవలెనని ఎదురు చూచుచుండిరి. ఈ వారం వారితో నేను మాట్లాడాను. కొందరు పట్టణపు వెలుపల నుండియూ దేశపు నలుమూలల నుండియూ వచ్చి యున్నారని సందేహించకుండా చెప్పగలను. వారితో మాట్లాడుటకు ముందు ఆ ఉదయము నేను గదిలో కూర్చొని యుండగా వారిగూర్చి పరిశుద్ధాత్మ నాకు చెప్పగా నేను వ్రాశాను. వారు ఎరిగియున్నదంతయూ, వారు ప్రశ్నలను ఏవిధంగా వక్రీకరించదలచిరో వారడుగబోవు ప్రశ్నలు, వారి కలలు గూర్చి ముందే నాకు తెలియ చేసెను. వాటికి అర్థము నాకు చెప్పబడినది.
ఆ బయట గదిలో జనులుండిరి. నేను వెళ్ళి వారిని మాట్లాడమన్నాను. వారు నాతో ఆయా సంగతులు ముచ్చటించగోరిరి.
1KGS 10:1,3•
2CH 9:2•
MATT 12:42•
MATT 18:19,20•
LUKE 11:31
28అంతట నేనిట్లు చెప్పాను, "ఇక్కడ మనము సహవాసమునకు రాలేదు; ఒకరితో ఒకరము సహవాసము చేయుటకు ఇచ్చటకు మనము రాలేదు. మీ హృదయములలో, మీ మనస్సులలో కొన్ని ప్రశ్నలున్నవి. వాటి గూర్చి మీరు నేను వాటిని పరిష్కరించగోరుదును." అభ్యంతరపడుచున్నారు మరియు దానిగూర్చి మీకు తెలియదు. దేవుని సహాయముబట్టి గుర్తుంచుకొనండి. దక్షిణ దేశపు రాణి కూడా కొన్ని ప్రశ్నలతో వచ్చినది. ఆమె సొలొమోను యొద్దకు వచ్చినది. సొలొమోను జవాబు చెప్పలేనిది ఏదియూ అచ్చట ఉండలేదని బైబిలు చెప్పెను. "సొలొమోను కంటె గొప్ప వాడిచ్చట ఉన్నాడు. (చూచారా? ఇది నిజము.) ఎక్కడ నా నామమున ఇద్దరు ముగ్గురు కూడియుందురో వారి మధ్యను నేనుందునని" ప్రభువైన యేసు వాగ్ధానము చేసెను. వారు ఆలోచించునది, కోరునది, అడుగునది, బయలు పరచబడును. ఇపుడు మీకు తెలియని వాటి గూర్చి మీకు కొన్ని ప్రశ్నలున్నవి. దానిగూర్చి ఏ విధంగా సమీపించవలెనో మీకు తెలియుట లేదు. దాని గూర్చి మీకేమి చేయవలెనో తోచుట లేదు.
PS 34:7
29"ఆయన యందు భయభక్తులు గలవారి చుట్టూ దేవుని దూత కావలి యుండునని వాక్యములో చెప్పబడినది. కాగా పంచేంద్రియములు బయలు పరచని ప్రపంచం కలదు. పంచేంద్రియములు ఈ లోకములో మాత్రమే ఉపయోగపడును. నీకు స్పర్శ జ్ఞానము లేనియెడల నీవు దేనిని తాకిన అనుభూతి పొందవు. అయితే మరొక ప్రపంచములో ఈ తాకిడి వలన ఏమి ప్రయోజనము లేదు. నీకు ఈ లోకములో చూపులేని యెడల ఏమియూ తెలిసికొనలేవు. కాబట్టి దేవుడు ఈ పంచేంద్రియములను నీకు ఇచ్చి ఈ సంగతులను తెలిపెను. కాని విశ్వాసమను మరియొకటున్నది. విశ్వాసమను నిచ్చెన ద్వారా నీవు ఎక్కెదవు. చివరకు నీవు పైకి పోయి మరొక ప్రపంచమును చేరుకొందువు. అదియే దర్శనం అక్కడ నీవు చూతువు. నీకు కండ్లు లేనియెడల ఏమి చూడలేవు. స్పర్శలేని యెడల దేనినీ గ్రహించలేవు. చూడని వానికి అంతయూ మర్మముగానే యుండును. అది అతనికి చిక్కు ప్రశ్నగానే మిగులును."
30నాతో కలిసి మాట్లాడుట కొరకు… మేము అక్కడికి వెళ్లకముందే దేశములోని ఉత్తర, దక్షిణ, తూర్పు, పశ్చిమ ప్రాంతముల నుండి జనులు వచ్చిరి. వారు ఏ ప్రశ్నలు నన్ను అడుగవలెనని వచ్చిరో ఆ ప్రశ్నలను వారిని పేపరు మీద వ్రాసియుంచుకోమని చెప్పాను. నేను వారి ప్రశ్నలను, వాటికి జవాబులను వ్రాసి వారికి ఇచ్చినప్పుడు ఏ మాత్రము వారి ప్రశ్నలకు, నేను వ్రాసిన వాటికి తేడా రాలేదు. (అడుగక ముందే చెప్పాను) ప్రభువు గొప్పవాడు. ఆయనకు సమస్తమూ తెలియును అయినా గాని అందులో నుండి బయటకు వచ్చుటకు నాకు మూడు రోజులు పట్టినది. ఒక రకంగా నేను చీల్చబడ్డాను.
ఇప్పుడు, మనము వెళ్ళక ముందు దీని నుండి పోవాలనుకున్నాను…
31వ్యక్తులకు చెప్పవలసిన సరియగు మార్గము, నిజమైన విధానం ఒకటున్నది. తెలిసిన ప్రజల గూర్చి చెప్పుట కాదు. ఆలాగు చెప్పుట ఘోర నేరము. అందువలన ఒకరినొకరు కాల్చుకొని చనిపోవుచున్నారు. జనులందరి యెదుట ఇటువంటి బహిరంగ స్థలములో వ్యక్తులను గూర్చి చెప్పుట నేరము. అందుకు శిక్షపడును. అది ఈ వేదిక పై ఇలా జనుల మధ్యలో చెప్పబడితే అది వేరేవాళ్ళని కాల్చుటకు చేయును, లేదా మరొకటి. అది కారాగారశిక్ష పడేలా చేస్తుంది.
32కాని ఈ విధంగా మీరు కూర్చొని యుండగా పరిశుద్ధాత్మ దానిని బయలుపరచును. దీనిని మనము గ్రహించవలెను. వారు నన్ను రహస్యముగా అడుగుదురు. దాని గూర్చి నేనేమీ చెప్పను. నేను వారికి దేనినైతే చెప్పానో దానిని వారు బయటకు చెప్పాలనుకుంటున్నారో, లేదో అది వారికే వదిలివేయుచున్నాను, చూచారా. అది మా ఇద్దరి మధ్య ఉండును — రహస్య సమావేశమది. ఒక మనిషిని గూర్చి పరిశుద్ధాత్మ సవివరముగా కూర్చోబెట్టి అన్నీ చెప్పును. అప్పుడు అంతయూ సద్దుమణుగును (చూచారా?) — పరిశుద్ధాత్మ.
33వారిచ్చటకు రాక ముందే వారి ప్రతి ఒక్కరి గూర్చి నాకు పరిశుద్ధాత్మ చెప్పుట కేవలము కృపా కార్యము. నా జీవితంలో ఎన్నడూ చూడని వారు దేశ పలు ప్రాంతముల నుండి వచ్చిరి. వారి ప్రశ్నలను వ్రాయుట, వాటికి జవాబులిచ్చుట ఎప్పుడూ జరిగే పనియే.
34ఒక సోదరునికి సర్ప సంతానము గూర్చి కొన్ని ప్రశ్నలు వచ్చెను. దానికి నేను వారి అర్థ-గంట సమయం దాటింది గనుక జవాబు సరిగా ఇవ్వలేకపోయాను. దానికి జవాబును పేపరు మీద నేను వ్రాసి యుంచాను. అతని ప్రశ్నలన్నింటికీ వెంటనే అతడు జవాబు పొందనందున, పేపరు మీద వ్రాసి ఇచ్చాను. అతడింకా దానిని తీసికొననిచో అది బిల్లీ పాల్ యొద్ద ఉన్నదని తెలియచేయుచున్నాను. అతడు ఇక్కడ కూర్చొని యున్నాడని నేనెరుగుదును. కొద్ది క్షణముల క్రితం అతనిని నేను చూచాను. నీ ప్రశ్నలకు నేను పేపరు మీద జవాబు ఇచ్చాను. వెళ్ళి తీసికోవచ్చును.
35ఓ! ప్రభువు ఎంత మంచివాడు! అందరూ బాగున్నారని నేను తలంచుచున్నాను. సహో. డాచ్ ను మనము జ్ఞాపకము చేసికొందము. అతడు ప్రశస్తమగు సోదరుడు. (ఇపుడు నేను ఈ చేతి రుమాళ్ళ కొరకు ప్రార్థించుచున్నాను) — ఆ ప్రశస్త సోదరుని మీ ప్రార్థనలలో జ్ఞాపకము చేసికొనండి.
36సహో. అంగ్రెన్ నాకు కనబడెను గాని సోదరి అంగ్రెన్ ఎక్కడున్నదో నేను చూడలేదు. ఆమె బాగున్నదనుకొందును. నిశ్చయముగా ఆమె అతని ప్రక్కనే కూర్చొనును. నేను సంతోషించుచున్నాను. ఆమె మరియు ఆమె కుమార్తెయగు సోదరి డవునింగ్ రోడ్డు ప్రమాదములో అత్యవసర స్థితిలో యుండిన రాత్రి మమ్మును పిలచిరి. దేవుని కృపలేని యెడల వారక్కడే ఇద్దరు ముక్కలయి పోయి యుండెడి వారు. వారు ట్రెయిన్ ఎక్కి ఇచ్చటికి చర్చికి వచ్చారు.
37మీ అందరినీ గుర్తుంచుకొందును. మిమ్మును నేను ప్రేమించుచున్నాను.
దానిని దేవుడెరుగును. మిమ్మును ప్రేమించుచున్నాను. జార్జియా, ఆలబామా, టెన్నీస్ మొదలగు ప్రాంతముల నుండి మంచుతో జారిపోవుచున్న రోడ్ల మీద కార్లు నడుపుకొని వచ్చిరి. ఒక్క ఆరాధనకు అంత ప్రయాస పడివచ్చిరి.
38ఒక రోజున సహో. డాచ్ వద్ద నుండి అత్యవసర పిలుపు వచ్చినది. ఓహియోలోని లైమా అంత దూరమున్నదని నాకు తెలియలేదు. ఒక్క గంతులో వెళ్ళిపోవచ్చుననుకొన్నాను. నేను ఎంతో పెందలకడ బయలుదేరి వెళ్ళినా, మధ్యాహ్నము 10 గంట వరకు అక్కడికి చేరుకోలేదు. ఆ విశాల రోడ్డు మీద వేగపు హద్దును దాటకుండా వచ్చాను. దక్షిణము నుండి, పశ్చిమము నుండి, ఉత్తరము నుండి వచ్చుచున్న వారెంత దూరము నుండి వచ్చుచున్నారో తెలియుచున్నది.
మిమ్మును నేను ప్రేమించుచున్నాను. ఆ కారణము చేతనే నేను బహు యదార్థముగా ఉండగోరుచున్నాను.
39పాత కాలపు వారు నాకు కనబడుచున్నారు. సహొ. క్రీచ్, తదితరులు నాకు కనబడుచున్నారు. వారందరూ సంవత్సరముల తరబడి నాతో కలిసి పని చేయుచున్నారు. మేమంతా కలిసి యున్నాము. నేను మేరీ జో యొక్క పటముచూచాను. (కొద్ది రాత్రుల క్రితం చూచాను) ఆమె సన్నగా, చిన్నగా యుండినది. ఇపుడామెకు పెండ్లి అయినది. పిల్లలు పుట్టిరి. క్రీచ్ దంపతులు. నేను, మిడా కూడా నల్లని జుట్టుతో యవ్వనులముగా ఉండేవారము. ఇపుడు మా జుట్టు తెల్లబడిపోయినది. మా భుజములు వంగి పోయినవి. చూడండి, అటువంటి వారిలో ఒక విశేషమున్నది. అది మిమ్మును పట్టుకొనును. వారితో మీరుండగోరుదురు. చూడండి? అట్టివి తలంచునప్పుడు నీ మనస్సు వెనక్కు లాగును. ఇక్కడున్న యవ్వనులకు మరియు వృద్ధులకు, వారిని మాదిరులుగా చూపుచున్నాను. ప్రభుని రాకకై మేము చూచుచున్నాము.
40ప్రభుని చిత్తమయితే ఈ ఉదయ కాలమున దేవుని అనాది సంకల్పం అను ఆదివారపు పాఠమును బోధించెదను. దానిని దేవుడు నా హృదయములో ఉంచెను. నాకు తెలిసినంత వరకు ఇప్పటికిదే చివరి ఆరాధన.
41ఈ సంఘ బాధ్యతలు నెరవేర్చుటకు ఇక్కడున్న సహో. నెవిల్‌ను మీరు మరువ వద్దని కోరుచున్నాను. పరిశుద్ధాత్మ నడిపింపు క్రింద ఆయన ఉన్నాడు. ఈ వర్తమానమును ఆయన విశ్వసించి, నా వలెనే బోధించును.
మీకు వీలయినప్పుడు వచ్చి సహో. నెవిల్ వర్తమానము వినండి. అతడు నిశ్చయముగా మీకు మేలు చేయును. నాకది తెలియును. అతడు యేసు క్రీస్తు యొక్క ఉన్నతమైన దాసుడు. నా చిన్నప్పటి నుండియు ఆర్మన్ నెవిల్‌ను నేనెరుగుదును. ఏ మాత్రము అతడు మారలేదు. ఇంకా దేవునికి దగ్గరగా వచ్చాడు. అతనిని మొదటిగా నేను అతని మెతడిస్టు వేదిక మీదకు నన్ను ఆహ్వానించినప్పుడు చూచాను. ఈ ఆలయమునకు తిరిగి వచ్చి నేను ఇట్లన్నాను. "ఒక రోజున అతడు యేసు క్రీస్తు నామములో బాప్తిస్మము పొందును." ఇప్పుడతడు నిజంగా వర్తమానములో యున్నాడు. నిజమగు యోధుడు.
42సహో. నెవిల్ ఎన్నో పోరాటములను, హృదయ వేదనలను ఎదుర్కొనెను. ఈ ఆలయములో అతడు వాటిని చూపించడు. అయితే ప్రభువు ప్రజల జీవితములను చూచు కృప నాకిచ్చెను. అందును బట్టి ఇది నాకు తెలియును. చూచారా? అతడు నిశ్చయంగా, ఎన్నో శ్రమలు, బాధలు అనుభవించెను. వాక్యమునుతీసికొని వచ్చుచున్న మోషే యొక్క చేతులను యెహోషువా, కాలేబులు ఎత్తి పట్టుకొనినట్లుగా మీరు ఆయనను ఎత్తి పట్టుకొనుడి.
JOHN 13:35•
1JN 4:7,11
43అన్నిటి కంటె ముఖ్యముగా ఒకరి నొకరు ప్రేమించుకొనుడి. ఒకరి నొకరు ప్రేమించుడి. అపవాది ఏమి చెప్పినా వినవద్దు. ఇప్పుడు మీరు ఒక గొప్ప, పెద్ద, మాధుర్యమగు గుంపుగా యున్నారు. కాని నా హెచ్చరికను మరువ వద్దు. చూచారా? సాతాను ఈ విధంగా మిమ్మును ఉండనియ్యడు. ఎవరినైనను వాడు గురిగా ఉంచుకుని దానినంతటినీ పేల్చివేయును. వాడు ఒక విమర్శకుని లేదా అవిశ్వాసిని మీ మధ్యకు తీసికొని వచ్చును. వాడు వచ్చి కూర్చొని నెమ్మదిగా మీతో సహవాసము చేయును. అతడు తన విషమును మెల్లగా ప్రక్కనున్న సోదరునికి ఎక్కించును. దానితో అతడు సంఘమును పాడుచేయును. అట్టి వారి పక్షము మీరు వహించవద్దు. అట్టి దానితో మీకేమి సంబంధము లేదు. మీరు ఒకరిపట్ల ఒకరు దయ, ప్రేమ కలిగి మాధుర్యముగా ఉండండి. అందుకు కారకులగు స్త్రీ పురుషులెవరైనా గాని వారును రక్షించబడునట్లు ప్రార్థించండి. వారి కొరకు ప్రార్థించి, మీరందరూ హత్తుకొనియుండండి. మీ సంఘ కాపరితో నిలచియుండండి, చూడండి. ఆయన మీ కాపరి. మీరాయనను గౌరవించవలెను. అతడు మిమ్మును నడిపించును. ఆ విధంగా చేయుటకు అతనిని దేవుడు నియమించెను.
44ఇప్పుడు, దానిని మీరు గుర్తుంచుకొన్నారా? శత్రువు వచ్చును. అట్టి సమయంలో ఇంకా ఎక్కువగా మీరు దగ్గరవండి. అపవాది వాడుకొను విరోధియైన వ్యక్తి బయటికి పోవును లేక లోనికి వచ్చి మీలో ఒకడై యుండును. అది అంతే అతడి నుండి మిమ్మును వేరుపరుచుకోవద్దు. మనందరమూ ఒక్కటే.
"నా ఎడమ చేయి మంచిది కాదు, అది నా కుడి చేయికాదు గనుకదానిని నేను నరికి వేయుదునని" చెప్పలేను. ఆయన నా ఎడమ చేయి. ఆయనను అక్కడే నేనుంచగోరు చున్నాను. నా చిన్న వ్రేలును నేను తీసివేయను. అది నాకు కావలెను. నా శరీరములో ఏ చిన్న భాగమైనా నాకు అవసరమైనదియే. దేవుడు మనలను ఒక శరీరముగా ఉంచెను. ఒకరితో ఒకరము మంచి సంబంధము కలిగి జీవించవలెను.
JOHN 13:35•
HEB 10:25
45మీరిప్పుడు దానియొక్క టేపుల కలిగియున్నారు. మనము ఏమి నమ్ము చున్నామో దాని మీద మీరు టేపులు కలిగియున్నారు. సంఘ క్రమశిక్షణ గూర్చిన టేపులు మనకున్నవి. దేవుని సంఘములో మనమెట్లు ప్రవర్తించవలెనో, ఇక్కడ మనందరము ఎట్లు కలిసి యుండవలెనో పరలోక స్థలములందు ఎట్లు కలిసి కూర్చుండవలెనో అందులో యున్నది. ఇంటి యొద్ద కూర్చోవద్దు. మీ హృదయమందు దేవుడున్నచో మీరు ఇంటి యొద్ద తలుపులు వేసికూర్చొనక మీ సోదరునితో సహవాసము చేయుటకు పరుగెత్తి వచ్చెదరు. మీరా విధంగా భావించని యెడల మీరు ఇప్పుడు ప్రార్థించవలెనని చెప్పుచున్నాను, ఎందుకనగా మనము అంత్యదినములలో ఉన్నామని" బైబిలు హెచ్చరించుచున్నది. "ఆ దినము సమీపించుట మనము చూచునప్పుడు మరి ఎక్కువగా క్రైస్తవ ప్రేమ, దైవ ప్రేమలతో ఒకరి నొకరు ప్రేమించుకొనుచు ఉండవలెను. యేసు క్రీస్తుతో కూడా పరలోక స్థలములందు మనందరము కలిసి కూర్చొనవలెను. "ఒకరిని ఒకరము ప్రేమించుకొనుచుండవలెను. ఇందు వలన మీరు ఆయన శిష్యులని జనులందరు తెలిసికొందురు."
అది మంచిది. కలిసి యుండండి.
JOHN 13:35•
EPH 6:11•
HEB 12:15•
1JN 4:7
46ఒక సోదరుడు చిన్న తప్పిదములో ఉన్నట్లు నీకు తెలిసిన యెడల ఇట్లు తలంచుము. (సోదరి అయినా గాని) "ప్రభువా, నాలో ఎట్టి ద్వేషము మొలకెత్తకుండునట్లు సహాయము చేయుము, ఎందుకనగా అది అతనిని ప్రభావితము చేయును. అందువలన క్రీస్తు నా జీవితములో నుండి తొలగిపోవును." అసూయ, ద్వేషము, క్రోధము అనునవి విష ఆమ్లముల వంటివి. నీలో నుండి పరిశుద్ధాత్మను అవి తీసివేయును. అందువలన ఆయన ఈ ఆలయములో నుండి పారిపోవును. దేవుని ఆత్మను అది చంపును. ఇక్కడ నుండి దానిని తరిమి వేయుము. నీ సంఘకాపరి బాధపడును. చూచారా? దానిని మీరు చేయవద్దు. అంత సన్నిహితంగా మీరు అతుకబడి యుండుడి. గత రాత్రి సహోదరుడు (సేవకుడు) కొక్కెమును కలిగియుండుటను గూర్చి సాక్షమిచ్చినట్లుగా (దానిని దర్శనములో చూచెను) కొక్కెమును తీసుకొనుము. ఆ కొక్కెములు దేవుని సర్వాంగకవచములున్నవి. కేవలము దానిని లాగుడి, బిగించుడి, ఒకరికొకరు సన్నిహితంగా మెలగుడి. ఏమైనా గాని ఒకరినొకరు ప్రేమించుకొనుడి. ఇతరుల గూర్చి చక్కగా చెప్పండి. ఒకరి గురించిన మంచి సంగతులు చెప్పుకొనుడి. అప్పుడు దేవుడు మిమ్మును దీవించును.
47ప్రభుని చిత్తమయితే ఈ ఉదయమున ఆయన కృప మరియు సహాయము ద్వారా ఇక్కడ కొన్ని ప్రశ్నలకు వాక్యానుసారమగు జవాబు ఇచ్చెదను. (రికార్డరులుపని చేయుచున్నవనుకొంటాను.) దేవుని కృపను బట్టి ఇప్పుడు వీటిని సమీపించుటకు ముందుగా వర్తమానమును అందించెదను. మొదటగా ప్రార్థించుకొందము.
ACTS 20:29
48ప్రభువగు యేసూ, వారి సంపూర్ణతయైన వాక్యముతో, మారని దేవుని హస్తముతో, వారు కలిసియుండవలెనని ఈ సంఘమనే శరీరమునకు చెప్పుచున్నాను. తోడేళ్ళు ప్రవేశించునని పౌలు హెచ్చరించిన రీతిగా వీరిని నేను హెచ్చరించుచున్నాను. నీవు అప్పుడుండిన దేవునిగానేయున్నావు. శత్రువును ఆలాగే యున్నది. ఈ సహవాసము మరియు ఈ ప్రేమ బంధము యేసుక్రీస్తు యొక్క జనుల మధ్య సదా నిలచియుండు గాక!
ప్రభువా, ఈ ఉదయము వాక్యము చదువుచుండగా మాకు సహాయము చేయుము. వారిని కలిపియుంచుటకు పరిశుద్ధులకు ఒక్కసారే అప్పగింపబడిన, విశ్వాసములో సంఘమును సంపూర్ణంగా స్థాపించుటకు, దానిని మాకు పరిశుద్ధాత్మ బయలుపరచునుగాక. నీవు రెండు సంవత్సరముల క్రితం దర్శనము ఇచ్చి యున్నావు. ఆ దర్శనములో నేను చక్కని కాయగూరలు, ఆహారము నిలువ చేయబడి యుండుట చూచాను. దానిని నేడు మేము నిండు కొలతతో స్వీకరించుదుము గాక! ప్రభువా, దానిని అనుగ్రహించుము. ఈ మేము జీవించుచున్న ఘడియలోని యేసుక్రీస్తును బయలుపరచును గాక. యేసుక్రీస్తును మాకు బయలుపరచి మాకు ముందున్న పనిని నెరవేర్చుటకు కావలసిన బలమును, ఆత్మీయ శక్తిని అనుగ్రహించును గాక! తండ్రీ, దీనిని మాకు దయచేయుము.
49ఈ నీ బిడ్డలను దీవించుము. దేశములోని వివిధ ప్రాంతముల నుండి ఈ ఉదయమున ఇచ్చటకు అనేకులు వచ్చియున్నారు. ఈ ఉదయము చాలా ఎండగా యుండి చెమట పట్టి యున్నది. దీనంతటిలోను పరిశుద్ధాత్మ సన్నిధిని మేము అనుభవించుచున్నాము. మేము జాన్ వెస్లీ, కాల్విన్, సాక్స్, ఫిన్నీ మొదలగు వారి గూర్చి ఆలోచన చేయుచున్నాము. వారు కనీసము ఫాన్ లేకుండ గదులలో కూర్చొని చెమట కార్చిరి. ఆ స్త్రీలు చక్కగా తమ శరీరములను కప్పుకొనిరి. వారు కూటములలో కూర్చొని యుండగా దుస్తులు చెమటతో తడిసిపోయెడివి. అయినను వారు దేవుని వాక్యమును విని తమ ప్రాణములను పోషించుకొనిరి. ప్రభువా, ఇపుడు వారు ఎక్కడో విశ్రాంతి తీసికొనుచున్నారు. ప్రభుని రాకడ కొరకు కనిపెట్టుచున్నారు.
2COR 3:2•
GAL 5:22•
EPH 5:9
50తండ్రీ, మమ్మును ఏకము చేయుము. పరిశుద్ధాత్మ మమ్మును నడిపించి దారి చూపును గాక! నీ సేవ చేయు దీర్ఘ జీవితమును మాకు ఇమ్ము. నీ వాక్యము నుండి గొప్ప వర్తమానమును ఈ ఉదయము మేము ఆశించు చున్నాము. అనుగ్రహించుము. అది ప్రతి హృదయము తాకును గాక! ప్రభువా, ఈ పెదవులు సత్యము మాట్లాడునట్లు సహాయము చేయుము. విను హృదయములు సత్యమును చేర్చుకొనునట్లుగా కృప చూపుము. నిత్యజీవపు మహా వక్షములుగా వారు ఎదిగి యేసు క్రీస్తు మృతులలో నుండి లేచి మన మధ్య సజీవుడుగా ఉన్నాడను సంగతి వారెరుగుదురు గాక! మమ్మును ప్రేమతోను, ఆత్మ ఫలములతోను నింపుము. ఆ ఉన్నతమైన కార్యమునుండి వేల సంవత్సరములయిన తరువాత కూడా ఇంకా క్రీస్తు జీవము దాని యొక్క రుజువులు మాలో స్త్రీ, పురుషులు, బాల, బాలికలు చూడ కలుగుదురు గాక! తండ్రీ, దానిని దయ చేయుము. నీ మహిమార్థమై వీటిని యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాము. ఆమేన్.
51ఇపుడు వాక్యమును చదివెదను. మీరు పెన్సిలు, పేపరు తెచ్చి సిద్ధముగా ఉన్నారని తలంచుచున్నాను. సహో. నెవిల్ నెమ్మదిగా కూర్చోని యున్నాడు. నా కోటును తీసివేయుదును. ఈలాగు చేయుచున్నందుకు క్షమించండి, కాని చాలావేడిగా యున్నది.
COL 1:15-29
52కొలస్సీయులకు వ్రాసిన పత్రిక మొదటి అధ్యాయము తీయగోరు చున్నాను. మీరు ఇంటికి వెళ్ళిన తరువాత ఈమొత్తం అధ్యాయము చదవండి. కాని ఈ ఉదయము 15 వచనము నుండి 29 వచనము వరకు చదువుదము. వీలయినంత సహనమును చూపండి. గడచిన దినములలో ఆలయములో చెప్పిన సంగతులనన్నింటిని మరల మీ మనస్సులలోనికి దైవ సహాయము బట్టి తీసికొని రావలెనని కోరుచున్నాను. నేనేమి చెప్పానో ఎందుకు చెప్పానో ఏమి చేసానో ఎందుకు చేసానో దానికి కారణమే ఇది. 15 వచనము నుండి చదువుదము.
ఆయన అదృశ్య దేవుని స్వరూపియై సర్వ సృష్టికి ఆది సంభూతుడై యున్నాడు. ఏలయనగా, ఆకాశమందున్నవియు, భూమియందున్నవియు, దృశ్యమైనవి గాని, అదృశ్యమైనవిగాని,
అవి సింహాసనము లైనను, ప్రభుత్వములైనను, ప్రధానులైనను, అధికారము లైనను, సర్వమును ఆయనయందు సృజింపబడెను. సర్వమును ఆయన ద్వారాను, ఆయనను బట్టియు సృజింపబడెను.
ఆయన అన్నిటి కంటె ముందుగా ఉన్నవాడు. ఆయనే సమస్తమునకు ఆధార భూతుడు. సంఘము అను శరీరమునకు ఆయనే శిరస్సు.
ఆయనకు అన్నిటిలో ప్రాముఖ్యము కలుగు నిమిత్తము ఆయన ఆదియై యుండి మృతులలో నుండి లేచుటలో ఆది-సంభూతుడాయెను.
ఆయన యందు సర్వసంపూర్ణత నివసింప వలెననియు, ఆయన సిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును, అవి భూలోకమందున్నవైనను, పరలోకమందున్నవైనను వాటినన్నిటిని ఆయన ద్వారా తనతో సమాధాన పరచుకొనవలెననియు తండ్రియు అభీష్టమాయెను. [19 వచనము నొక్కి చెప్పెదను.]
మరియు గత కాల మందు దేవునికి దూరస్థులను, మీ దుష్క్రియల వలన మీ మనస్సులో విరోధ భావము గలవారునై యుండిన మిమ్మును కూడా. [ఆ సమాధానపరచుట గమనించండి.]
తన సన్నిధిని పరిశుద్ధులుగాను, నిర్ధోషులుగాను, నిరపరాధులు గాను, నిలువబెట్టుటకు ఆయన మాంస యుక్తమైన దేహమందు మరణము వలన ఇప్పుడు మిమ్మును సమాధానపరచెను.
పునాది మీద కట్టబడిన వారై స్థిరముగా ఉండి, మీరు విన్నట్టియు, ఆకాశము క్రింద ఉన్న సమస్త సృష్టికి ప్రకటింపబడినట్టియు ఈ సువార్త వలన కలుగు నిరీక్షణ నుండి తొలగిపోక విశ్వాస మందు నిలిచియుండిన యెడల ఇది మీకు కలుగును. పౌలను నేను ఆ సువార్తకు పరిచార కుడనైతిని.
ఇప్పుడు మీ కొరకు నేను అనుభవించుచున్న శ్రమల యందు సంతోషించుచు సంఘము అను ఆయన శరీరము కొరకు క్రీస్తు పడిన పాట్లలో కొదువైన వాటి యందు నా వంతు నా శరీరమందు సంపూర్ణము చేయుచున్నాను.
దేవుని వాక్యమును అనగా యుగములలోను, తరములలోను మరుగు చేయబడియున్న మర్మమును సంపూర్ణముగా ప్రకటించుటకు మీ నిమిత్తము నాకు అప్పగింపబడిన దేవుని ఏర్పాటు ప్రకారము నేను ఆ సంఘమునకు పరిచారకుడనైతిని.
అన్య జనులలో ఈ మర్మము యొక్క మహిమైశ్వర్యము ఎట్టిదో అది అనగా మీ యందున్న క్రీస్తు మహిమ నిరీక్షణయై యున్నాడను సంగతిని దేవుడు తన పరిశుద్ధులకు తెలియపరచగోరి ఇప్పుడు ఆ మర్మమును వారికి బయలుపరచెను.
ప్రతి మనష్యుని క్రీస్తు నందు సంపూర్ణునిగా చేసి ఆయన యెదుట నిలువబెట్ట వలెనని సమస్త విధములైన జ్ఞానముతో మేము ప్రతి మనుష్యునికి బుద్ధి చెప్పుచు, ప్రతి మనుష్యునికి బోధించుచు ఆయనను ప్రకటించుచున్నాము.
అందు నిమ్మిత్తము నాలో బలముగా కార్య సిద్ధి కలుగజేయు ఆయన క్రియా శక్తిని బట్టి నేను పోరాడుచూ ప్రయాసపడు చున్నాను.
53దీనిలో నుండి ఒక అంశమును నేను తీసికొనగోరుచున్నాను. పూర్తి బైబిలును పునాదిగా వేసికొనుచున్నాను. అంశము: "బయలుపరచబడిన దేవుని మర్మమే క్రీస్తు." దేవుని మర్మమై యున్న క్రీస్తు బయలుపరచబడెను. ఆదివారపుబడి పాఠముగా దీనిని నేను తీసికొందును. అందరమూ కలిసి చదివి, దీనితో సహవాసము చేసెదము.
54ప్రపంచము ప్రారంభము కాక ముందే ఈ దేవుని యొక్క మర్మము రహస్యముగా ఉండెను. అప్పుడే దేవుని మనస్సు యొక్క వెనుక భాగమునకు వెనుక ఇది ఉండెను. ఆయన దానిని సాధించ ప్రయత్నించుచుండెను మరియు ఆయన తన్ను తాను బయలుపరచుకొనుటకు వెనుక ఒక ఉద్దేశ్యము కలిగియుండెను. ఎందుకనగా, ఆదిలో ఒక చంద్రుడు గాని, నక్షత్రము గాని, అణువు గాని, పరమాణువు గాని లేకుండెను: ఆయన దేవుడు. కాని ఆ సమయమున ఆయన దేవునిగా ఇంకా యుండలేదు, ఎందుకనగా దేవుడు ఆరాధనకు పాత్రుడు. ఆయనను ఆరాధించుటకు ఎవరూ లేరు. కాబట్టి ఆయన యొక్క గొప్ప మనస్సులో ఈ గుణ లక్షణములను వ్యక్తపరచగోరెను. ఆయనలో ప్రేమ యుండెను. ఆయనలో తండ్రి యుండెను. ఆయనలో కుమారుడుండెను. ఆయనలో రక్షకుడుండెను. ఆయనలో స్వస్థపరచు వాడుండెను. ఈ గొప్ప లక్షణములన్నియూ ఎప్పుడో ఆయనలో వ్యక్తపరచు వాడుండెను. ఈ గొప్ప లక్షణములన్నియూ ఎప్పుడో ఆయనలో వ్యక్తపరచుటను మనము చూసాము, అవి దేవునిలో ఉన్నవి.
JOB 38:4,7
55కాబట్టి నా ఉద్ధేశ్యములో ఆయన మొదటిగా దేవదూతలను చేసెను. అవి ఆయనను ఆరాధించెను, అందువలన ఆయన దేవుడాయెను. ప్రారంభించెను. (నా ముందు వర్తమానములో దానిని వివరించ ప్రయత్నించాను) దేవదూతలు ఆయనను ఆరాధింపసాగినవి. భూమి మీద అణువు అనునది లేనప్పుడు ఇది జరిగెను. అది శూన్యము. అది అంధకారము. చంద్రుడు, సూర్యుడు నక్షత్రములు ఏమీ లేవు. అప్పుడే ఆయన దేవుడు. ఆయన యోబును ఇట్లడిగెను. "ప్రపంచమునకు పునాది వేసినప్పుడు నీవెక్కడుంటివి? (చూడండి?) ఉదయ నక్షత్రములు కూడి పాడినప్పుడు, దేవుని కుమారులు సంతోషించినప్పుడే నీవెక్కడుంటివి? చూచారా? భూమి అనునది లేక ముందే జరిగిన సంగతి ఇది."
GEN 1:2
56దేవునికి ఒక ఉద్దేశ్యము మరియు దాచబడిన మర్మము ఉండెను. ఈ ఉదయము దానిని గూర్చి మాట్లాడగోరుచున్నాను. ప్రపంచము అనునది పుట్టక ముందే దేవుని మనస్సులో దాగియున్న ఈ మర్మము మనము జీవించుచున్న ఈ ఘడియలో అదిబయలుపరచబడెను. చూచారా. ఇప్పుడు మీరు జరిగిన దానిని తేటగా అర్థము చేసికొనగలరు. (చూడండి?) ఏమి జరిగినదో దానిని నేను నమ్ముతున్నాను.
MATT 24:36•
MARK 13:32•
REV 8:1•
REV 10:4
57దేవుని యొక్క గొప్ప మర్మము. అది ఒక రహస్యము. దానిని రహస్యముగా ఆయన దాచెను. దానిని గూర్చి ఎవరూ ఏమీ ఎరిగియుండలేదు. దేవదూతలు కూడా దానిని అర్థము చేసికొలేదు. ఆయన బయలుపరచలేదు. ఆ కారణము చేతనే ఏడవ ముద్ర విప్పబడినప్పుడు నిశ్శబ్దముండెను. అది మనఏడవ మర్మము.
యేసు ఈ భూమి మీద ఉండినప్పుడు ఆయన ఎప్పుడు వచ్చునో అని వారు తెలిసికొనగొరిరి. "అదెప్పుడు జరుగునో కుమారునికి కూడా తెలియదని" ఆయన చెప్పెను. చూడండి, దీనినంతటినీ దేవుడు తనలో యుంచుకొనెను. అది ఒక రహస్యము. ఆ కారణము చేతనే అర్థగంటసేపు పరలోకమందు నిశ్శబ్దము ఉండెను. ఏడు ఉరుములు తమ స్వరములను పలికినవి. ప్రభుని రాక గూర్చి వ్రాయవద్దని యోహానుకు ఆజ్ఞాపించబడెను.
ఆయనెట్లు వచ్చునో, ఎప్పుడు వచ్చునో అను సంగతి మాత్రము ఇంకా బయలుపరచబడలేదు. అది తెలియకుండుట మంచిది.
58బైబిలులోనున్న ప్రతి మాదిరిలోను ఆయన దానిని చూపించెను మరియు బయలుపరచెను.
కాబట్టి బైబిలు యావత్తు క్రీస్తులో నున్న దేవుని మర్మము యొక్క ప్రత్యక్షతయై యున్నది. దేవునికిగల ఒకేగురిని, దేవుడు సాధించగోరిన ఒక ఉద్దేశ్యమును మొత్తం బైబిలు వ్యక్తపరచుచున్నది. మరియు బైబిలులోని విశ్వాసుల కార్యములన్నీ దేవునియొక్క ఉన్నతమైన గురిని వ్యక్తపరచుటకు మాదిరిగా ఉన్నవి. ఈ చివరి దినమున ఆయన దానిని బయలుపరచెను మరియు చూపించెను. ప్రభువు తనమనస్సులో కలిగియుండి, వ్యక్తపరచినదంతటినీ దేవుని సహాయం ద్వారా ఇక్కడ ఈ ఉదయం మనం చూసెదరు. మరియు అప్పుడు దీనిని ప్రజల యొద్దకు తెచ్చుటకు దేవుడు బయలు పరచిన దానిని విడమరచి చెప్పుటకు ప్రయత్నించెను.
LUKE 24:13-15,25
59ఇప్పుడు, దీనిని మీరు వ్రాసికొవలెనంటే చాలాచోట్ల నుండి నేను చదివెదను. లూకా సువార్త 24వ అధ్యాయములో దానిని కనుగొందుము. ఇద్దరు అపోస్తలులు ఎమ్మాయి మార్గమున వెళ్ళుచుండిరి. యేసు తన పునరుత్థానము తరువాత వారికి కనబడెను. ఆయన మరణమును గూర్చియు, ఆయన పడిన శ్రమల గూర్చియు వారు తలపోయుచూ ఏడ్చుచూ యుండిరి. ఆయనను గూర్చి సంభాషించుచూ వారు ఎమ్మాయి దారిన వెళ్ళుచుండిరి. ఆయన పడిన వేదనవలన లాభమేమియు లేదని వారనుకొనిరి. తమ ప్రభువును వారు తీసుకుని సిలువ వేసిరి. అందుకే వారు ఏడ్చుచూ పోవుచుండిరి. అయితే ఆయన దారిలో వారితో కూడా కలిసి క్రీస్తునుగూర్చి వారితో మాట్లాడుచుండెను
"ఓ! అవేకులారా, మందమతులారా, కీర్తనలు మరియు ప్రవక్తలు చెప్పిన వన్నియూ మీరు నమ్మలేదు" అని ఆయన పలికెను.
ఆయన ఏమి చేయుచున్నాడో చూచారా? ప్రవక్తలు పలికినది, కీర్తనలలో చెప్పబడినది అంతా ఆయనను గూర్చియే అని అపోస్తలులుకు ఆయన చెప్ప ప్రయత్నించు చుండెను. దానిని వ్యక్తపరచెను.
60ఈ ఉదయము నేను ఉపదేశించకుండా పాఠమును బోధించుటకు కారణము ఇదే. ఒక అంశమును తీసికొన్నచో దానిపై బోధించి ముగించెదము. కేవలము దీనిని మనము బోధించెదము.
PS 22:1,16,17
61కీర్తనలన్నీ మరియు ప్రవక్తలందరూ ఆయనను గూర్చియే చెప్పచున్నవని చెప్పెను. కాబట్టి పాతనిబంధన అంతయు కొత్త నిబంధన అంతయు, కీర్తనలన్నియు రాగములు పాడబడిన, పాటలు గూర్చే పాడబడినవని అది చూపుచున్నది.
22వ కీర్తన చూడండి. కీర్తనను పాడి దానిని ఆ సిలువ మరణముతో పోల్చి చూడండి. "నా దేవా, నా దేవా, నన్నెందుకుచేయి విడిచితివి? నా ఎముకలన్నియూ బలము తప్పినవి. వారు నా పాదములను, చేతులను గాయపరచిరి." అక్కడి దేవాలయములో వారు ఆ పాట పాడుచునే ఆయనను సిలువ వేసిరి. చూడండి. వారు గొప్ప మత నాయకులు, గొప్ప బోధకులు, గొప్పవారు (అయినా గ్రుడ్డి వారయిరి) ప్రవక్తలు రాసినది చదువుతూనే ఉండి, కీర్తనలను పాడుతూనే వారు చేయుదురని చెప్పబడిన నేరమును చేసిరి. ఈ ఉదయమున అదే జరుగుచున్నది.
62జాగ్రత్తగా వినండి, గడియారము వైపు నేనసలు చూడను. దీనిని మీకు చెప్పెదను. చూడండి, దేవుని మనస్సులో ఆది నుండి యుండిన ఆ తలంపు ఆ పండితులకు మరుగుగా యుండెను. ముందుగా నిర్ణయించబడిన కొద్దిమంది మాత్రమే దానిని వినిరి.
ప్రవక్తల కాలము నుండియు ఉండిన లేఖనములను పరిశోధించండి. ఈ రీతిగానే యున్నది. ఇక్కడ యేసు ప్రవక్తలను, కీర్తనలను ఎత్తి చూపుచున్నాడు. వారందరూ ఆయనను గూర్చియే పలికిరని ఆయన చెప్పెను. చూచారా. కాని, ఈ యూదుల బోధకులు, రబ్బీలు, ధర్మశాస్త్ర ప్రవీణులు, పండితులు అంతకు ముందున్న వారు చేసిన దానినే చేసిరి.
JOHN 5:39
63చూడండి, ఆయన మరల ఇట్లనెను, "లేఖనములను పరిశోధించుడి, అవి నన్ను గూర్చి సాక్షమిచ్చుచున్నవి." మొత్తం లేఖనములను పరిశోధించుడి. నేనేమి చేయప్రయత్నించుచున్నాను? బైబిలు మాత్రమే సరయినదని మీకు చూపించుచున్నాను.
JOHN 1:1,14
64ఒక రోజున ఒక వైద్యశాలలో నిలబడి ఒక సోదరితో మాట్లాడుచున్నాను. శాఖల గూర్చి వివరించి చెప్పమని ఆమె అడిగినది. కొందరు శాఖా జనులతో ఎందుకు వ్యతిరేకించుచున్నామో ఆమె అడిగినది. వాక్యము దగ్గరకే తిరిగి రావలెనని మీరు తెలిసికొనుడి, ఎందుకనగా వాక్యమే దేవుడై యున్నాడు. చూచారా? తానే వాక్యమై యున్నానని యేసు ప్రకటించెను. అదే వాక్యము దానితో విబేధించుకొనునట్లుగా నీవు చేయలేవు. "ఆదియందు వాక్యముండెను. వాక్యము దేవుని యొద్ద ఉండెను. వాక్యము దేవుడై యుండెను. ఆ వాక్యమే శరీరధారి అయ్యెను." చూచారా.
LUKE 24:27•
JOHN 5:39•
JOHN 10:37,38
65ఇక్కడ ఆయన ఇట్లు చెప్పెను, "లేఖనములను పరిశోధించుడి.; అవి నన్ను గూర్చి సాక్షమిచ్చుచున్నవి. అందులో నిత్యజీవము గలదని మీరు తలంచుచున్నారు. (అది సత్యమే) అవే నన్ను గూర్చి సాక్షమిచ్చుచున్నవి. వాటివలన నాకు సాక్షమియ్యబడెను. నేను చేయుదునని వాగ్ధానము చేయబడిన కార్యములు చేయని యెడల, నా మాట వినవద్దు. కాని నేను ఆ క్రియలు చేసిన యెడల మీరు నన్ను నమ్మలేకపోయినా, ఆ క్రియలను చూచి నమ్ముడి, ఎందుకనగా అవి ఆయనే వాక్యమని సాక్షమిచ్చుచున్నవి.
అంత వివరముగా అది లేదని మీరనవచ్చును. అయితే మీరు లేఖనములను పరిశోధించుడి. మోషేయు, ప్రవక్తలును, ధర్మశాస్త్రమును, కీర్తనలును ఆయనను గూర్చి మాట్లాడినవి తిరిగి లేఖనములు కూడా ఆయనను గూర్చి సాక్షమిచ్చుచున్నవని ఆయన చెప్పెను.
GEN 1:1•
JOHN 1:1•
HEB 13:8
66మొత్తం బైబిలుకు ఆయనే ప్రధాన అంశము. మీరు బైబిలు చదవండి. ప్రతి వచనములోను క్రీస్తును మీరు చూచెదరు. ఒకవేళ మీకు కనబడని యెడల మరల వెళ్ళి చదవండి. బైబిలులోని ప్రతి వచనములోను మీరు క్రీసును చూడని యెడల దానిని మరల చదవండి. ఎందుకనగా మీరు దేనినో తప్పిపోయిరి. క్రీస్తే బైబిలు అయి యున్నాడు. ఆయనే వాక్యము. "అదియందు దేవుడు సృజించెను" అను మాటలో క్రీస్తును చూతురు. అక్కడ నుండి ప్రకటనలోని "ఆమేన్" వరకూ ప్రతి మాటా యేసుక్రీస్తును గూర్చి సాక్షమిచ్చుచున్నవి.
అందుచేతనే ఈ కలుపబడిన గ్రంథములుగా పిలువబడిన II దానియేలు , మకాబీ గ్రంధము, ఆగస్ పర్గెటరీ ఇంకా అనేకము. అయితే వాటిని గూర్చి లేఖనములో చెప్పబడలేదు, చూచారా. మిగిలిన వాటి అంశము అందులో లేదు పాప విమోచనకరమగు స్థలము (పర్గెటరీ) బైబిలులో ఆధారం లేదు. పరిశుద్ధుల మధ్యవర్తిత్వము అను దానికి అందులో చోటు లేదు. శాఖకు అందులో చోటు లేదు. మానవ సిద్ధాంతములకు బైబిలులో చోటు లేదు, చూచారా. అవన్నియూ గ్రంథములో కనబడవు.
జనులు వాటిని కలిపి అన్నింటి కలగలు పైన చిక్కు సమస్యను తయారు చేసిరి. దానిని వారు సత్యమైనదిగా మార్చలేరు. "అది నిన్న, నేడు, నిరంతరము ఏకరీతిగా యున్నది."
67దానిని సరిగా జతపరచినయెడల మానవ పతనము మరియు నూతన జన్మను గూర్చి మొత్తం వివరణ అందులో యున్నది. సృష్టి యొక్క పూర్తి చిత్రము మరియు యేసుక్రీస్తు యందు బయలుపరచబడిన దేవుని యొక్క పూర్తి పథకం అందులో ఉన్నవి. ప్రతి చిన్న వంపు మరియు మూల చక్కగా పొందుపరచబడిన సంపూర్ణ చిత్రమిది. ఇది దేవదూషణ అనినా ఉద్ధేశం కాదు, కాని ఇది కేవలం చిక్కు సమస్యను అమర్చినట్లుంది. ఆ కారణము వలనే నేడు భయంకరమగు పటములను చూచుచున్నాము. "విశ్వాసులని" చెప్పుకొనుచున్నారు. చెట్టు మీద నుండి ఆవుగడ్డిని అందుకొనుచున్నట్లున్నది. అది పని చేయదు. ఏ మార్గమయినా ఆయనను చేరుకొను మార్గమే అందురు. అది తప్పు ఆయన ఒక నిర్దిష్టమైన విషయంలో తప్ప "నిన్న, నేడు, నిరంతరము ఏకరీతిగా యున్నాడు," చూడండి. అప్పుడు మీరు మీ చిత్రమును నాశనము చేయుచున్నారు.
JOHN 14:12
68ఆయన ఏకరీతిగాయున్నాడని బైబిలులో చెప్పబడినది.
యోహాను 14:12. "నా యందు విశ్వాసముంచు వాడు నేను చేయు క్రియలు చేయును."
"అది మరొక కాలమునకు చెందినదనుచున్నారు."
అక్కడ నీవు మరల నీ చిత్రమును తప్పుగా చేయుచున్నావు. చేపలు ఉండుటకు సాధ్యపడని మండుచున్న ఇసుక గల ఎడారిలో ఒకడు చేపలు పట్టుటకు వెళ్ళునా? అట్టి వానిని నీవు సమృద్దిగా చేపలు దొరకు గలిలయ యొద్దకు తీసికొని రావలెను. చిత్రము సరియైనదిగా కనబడునట్లు నీవు అది చేయవలెను. దేవుని యొక్క గొప్ప చిత్రము. దానిని నీవు ఒక్క మార్గములోనే చూడగలవు. యేసుక్రీస్తు నీవు చూచుట ద్వారానే దానిని చూడగలవు. పూర్తి బైబిలు అక్కడున్నది. బైబిలు యొక్క ప్రధానా౦శము ఆయనే.
HEB 13:8
69నీవు ఒక అంశమును ఇక్కడి ఏ ప్రదేశంలోనుండైనా తీసుకుంటే, ఒక ఉపదేశకుడు నెమ్మదిగా ఉండుట అనునది కష్టతరమేనని మీరు ఎరిగియున్నారు. అతడు దానితో కొనసాగిపోవుటకు కోరుచున్నట్లు కనబడును, కానీ మనము బోధించుచున్న దాని యొద్దకు నీవు తిరిగి రావలెను.
బైబిలు ఒక ప్రవచన గ్రంథము. అది ఒక చారిత్రక గ్రంధము. అది ఒక ప్రేమ గ్రంథము. అది పాటల గ్రంథము. అది జీవగ్రంథము. అందులో నీవు క్రీస్తును కనుగొందువు. ఆయన ప్రవక్తలలో యుండెను. ఆయన కీర్తనలలో యుండెను. ఆయన చరిత్రలో యుండెను. ఆయన బైబిలులో జరుగబోవు సంగతులలో యుండెను. ఆయన ఆదిలోను, ఆ తరువాతను కూడా ఉండెను. అందువలన ఆయన ఏమాయెను? ఆయన నిన్న, నేడు నిరంతరము, ఏకరీతిగా యున్నాడు.
HEB 13:8
70ఆయన నిన్న, నేడు, నిరంతరము ఏకరీతిగా యున్నట్లు కనిపించని ఇంకేదో అందులోనికి నీవు చొప్పించినచో సహో. లీ నీవెచ్చటికి వెళ్ళుచున్నావు? నీ వద్ద ఒక గొప్ప పటమున్నది. ఆయనే చరిత్రయై యున్నాడు. (చూచారా?) ఆయన ప్రవక్త. ఆయన కీర్తన. ఆయనే సమస్తము. నీవు ఆయనను సమస్తముగా చేసికొనని యెడల నీ పటము ఎట్లా కనబడును? దానిని నీవు చూడ కలుగుచున్నావా? మంచిది.
HEB 13:8
71నీ పటము ఎట్లా కనబడును? ప్రవక్తలుగా ఉన్నాడు ఆయనే వారిలో ఉండెను. ఆయనే కీర్తనలలో యుండెను. ఆయనే చరిత్రలోయుండెను. రాబోవు కార్యములు ఆయనే అయియున్నాడు. "నిన్న నేడు నిరంతరముగా యున్నాడు." (హెబ్రీ 13:8. వ్రాసికొన వలెననుకుంటే) ఆయనే ప్రధానుడు. దానిని మనమునమ్ముచున్నాము. లేదా ఆయన అలాగు అయ్యుంటే మన మాటలలోను మన ఆలోచనలలోను, మన పాటలతోను, మన నడకలోను ఆయనే ప్రధానుడుగా యుండును. మన జీవిత ప్రధానాంశము ఆయనే అయియుండవలెను. ఆయనే బైబిలునకు ప్రధానాంశము. ఆ బైబిలు మనలో యున్నది. మనము చేయు ప్రతి కార్యమునకు, మనము చేయు చెప్పు ప్రతిమాటకు, మన ప్రతి ఆలోచనకు క్రీస్తే ప్రధానాంశమై యుండవలెను. కదా? మంచిది.
COL 1:16,18
72మన సమస్తమునకు ఆయన శిరస్సుగా చేయబడెనని మనము తలంచుచున్నాము. కొలస్సీ పత్రికలో అది వ్రాయబడినది. మనము దేనిని పరిగణనలోకి తీసుకున్నను, ఆయన మన కొరకు చేయబడెను. గనుక మన సమస్తమునకు ఆయనే ఆధారభూతుడు. పాపి మాట ఏమిటి? అని మీరడుగ వచ్చును. దానిని అతడు అంగీకరించని యెడల ఆ పాపికి ఆయన న్యాయాధిపతి అగును. దానిని అంగీకరించు విశ్వాసికి ఆయన మహిమయై యున్నాడు. సమస్తమును ఆయన కొరకు, ఆయన ద్వారా తయారు చేయబడెను.
పగటి యొక్క మహిమను వివరించుటకు రాత్రి కావలెను. గౌరవమును పొందుతున్న పాత్రకు ప్రేమను, శ్రద్దను వ్యక్తము చేయవలెనన్న చిన్నచూపు చూడబడుచున్న పాత్ర కావలెను. పవిత్రముగా జీవించుచున్న స్త్రీని చూపించవలెన్న నీతిని విడిచి దుస్తులు ధరించిన చెడ్డ స్త్రీని ముందు చూపవలెను. నిజమైన విశ్వాసిని, లేదా నిజ క్రైస్తవుని వ్యక్తము చేయవలెనన్న ఒక దొంగ, ఒక మూర్ఖుడు కావలెను. విశ్వాసి అనగా ఏమిటో అర్థము చేసికొనుటకు ముందు వేషధారిని చూపవలెను.
COL 1:16
73కాబట్టి ఆయనే సమస్తమును చేసెను. ఆయన మనందరి కొరకు సమస్తమును చేసెను. సమస్తము ఆయన కొరకు, ఆయన ద్వారా కలిగెను. అది సత్యము గనుక మన గుర్తింపు ఆయనతో యుండవలెను. మనలను మనము ఆయనతో గుర్తింప చేసికొనవలెను, ఎందుకనగా ఆయన తన్నుతాను మనతో గుర్తింపచేసికొనెను. మనమాయనతో గుర్తించబడవలెను. ఏలాగు? ఆయన కొరకు జీవించుట ద్వారా, మామూలుగా ఒప్పుకొనుట కాదు.
చాలా మంది ఒప్పుకొన్నామందురు. కాని "నీవు క్రైస్తవుడవా?" అని అడగండి.
"నేను మెతడిస్టును" అందురు. "నీవు క్రైస్తవునివి" కాదని దాని వలన తెలియుచున్నది. మెతడిస్టు ఏమి చేయునో చూడండి.
"నేను బాప్టిస్టును" అనును. బాప్టిస్టు ఏమి చేయునో చూడండి.
"నేను కాతలిక్కును." వారేమి చేయుదురో చూడండి.
74కాని, నీలో తన క్రీస్తును గుర్తించినప్పుడే నీవు నిజంగా క్రైస్తవుడవని తెలియును. వారందరూ దీనిని గ్రహించెదరు గాక! టేపుపై వినుచున్న ప్రతి ఒక్కరు దానిని పొండుకుంటారు అని ఆశిస్తున్నాను. చూచార?
"నేను పెంతెకొస్తు" అని నీవందువు. దాని వలన ఏమి లాభము లేదు.
75క్రీస్తు నీలో గుర్తింబడును. ఆయన నిన్ను ముందుగా గుర్తించును.
"నీవు భాషలతో మాట్లాడ వచ్చును." దయ్యములు కూడా మాట్లాడుచున్నవి. నీవు గట్టిగా కేకలు వేయ వచ్చును. మహమ్మదీయులు, బౌద్దులు మొదలగు వారందరూ అరచెదరు. పాములచే నాట్య మాడించుచూ ఇండియా వారు గట్టిగా కేకలు వేయుదురు, చూచారా. వారందరూ అరచెదరు. అన్ని గుంపుల వారు మతముల వారు అరచి గోల చేయుదురు. బంతి ఆటను చూచు వారు అరచెదరు. నీలో క్రీస్తు గుర్తించబడినప్పుడు, తానే గుర్తింపబడినప్పుడు నీవు క్రీస్తును పోలియుందువు. క్రైస్తవుడు అను మాటకు క్రీస్తును పోలిన వాడని అర్థము. అదే నీ గుర్తింపు. ఆయనే మన గుర్తింపు గనుక ఆయన కొరకు జీవించుట ద్వారా మనము ఆయనతో గుర్తింపబడుదుము.
76గమనించండి, ఈ గొప్ప రహస్య మర్మములో దేవుడు మూడు విధముల ఉద్దేశ్యమును కలిగియున్నాడు. జగత్తు పునాదికి ముందే ఆ సంకల్పమును ఆయన కలిగి యుండెను. అందులో మూడు ఉద్దేశ్యములున్నవి. ఈ ఉదయము ఆ మూడు విధముల ఉద్దేశ్యమేమిటో తెలిసికొందము. ఇక్కడున్నదేవుని సహాయము ద్వారా ఆయన దానిని చూడగలడని నేను నమ్ముచున్నాను.
ఈ మూడు విధముల సంకల్పము ఏమిటో మనము కనుగొనవలెను.
77మొదటిగా దేవుడు తన్నుతాను జనులకు ప్రత్యక్షపరచుకొనగోరెను. గొప్ప యెహోవా దేవుడిగా ఉండి ఆయన ఆ పనిని చేయజాలడు. ఆయన కాలమును, నిత్యత్వమును, శూన్యమును కప్పిన వాడు. అంత గొప్పవానిగా ఆయన జనులకు బయలుపరచుకొన్నచో ఆయన బహు మర్మముగానే మిగిలి యుండెడి వాడు. ఆది అనునది లేనివాడు ఆయనే. మీరు వందలాది మిలియనుల, ట్రినియనుల వెలుగు సంవత్సరములను దాటి వెళ్ళినా గాని ఆ గొప్ప వానిని చేరలేరు. ఆయన అనంతుడు. నిత్యత్వములో యున్నవాడు.
78ఆయన ఏమి చేయవలెనని కోరుచున్నాడు, "మనుష్య కుమారునిగా" మారుటయే దానిని వ్యక్తపరచుటకు ఆయనకు గల ఏకైక మార్గం. ఏలయనగా ఆయన తండ్రి, అందుకే యేసు మనుష్యు కుమారునిగా పిలువబడెను. చూడండి, ఆయన దేనిని గూర్చి మాట్లాడుచున్నాడో వారిలో చాలామంది ఎరుగరు. మీరు గ్రహించారా? ఆయన తన్నుతాను బయలుపరచుకొనగోరెను. ఆయన యొక్క గొప్ప ఉద్దేశ్యములు మూడింటిలో ఇది ఒకటి. ఆయన తన్నుతాను వ్యక్తపరచుకొనగోరెను. క్రీస్తు తన్నుతాను బయలుపరచుకొనుటకు మానవులతో గుర్తింప చేసికొనగోరెను.
79రెండవదిగా: ఆయన తన విశ్వాసుల శరీరములో ప్రధాన భాగముగా ఉండగోరెను. ఆయన తన వధువులో జీవించగోరును, తన జనులలో జీవించగోరును.
80ఆదాము, హవ్వలలో ఆయానాలాగు జీవించెను, కాని పాపము వారిని వేరుచేసెను. ఇప్పుడు దానిని పొందు మార్గమున్నది. ఓ! దీనిని గూర్చి ఆలోచించితేనే నాకు గొప్పగా యున్నది. దేవుని ఉద్దేశ్యమేమిటో చూచారా?
అయితే ఆదామవ్వలను ఆయన ఎందుకు ఆ విధంగా యంచలేదు? అలాగయితే ఆయన ఎన్నడునూ తన సంపూర్ణతను, పూర్తి లక్షణములను వ్యక్తపరిచి యుండ కలిగెడి వాడు కాడు. ఆయన తండ్రి అన్నమాట సత్యమే గాని ఆయన రక్షకుడు కూడాయై యున్నాడు. ఆయన రక్షకుడని "నీకు ఎట్లు తెలియును" అని మీరడుగుదురు. నాకు ఆ అనుభవమున్నది గనుక అది చెప్పెదను. చూచారా, చూచారా? ఆయన రక్షకుడు. దానిని ఆయన వ్యక్తపరచుకొనవలసి యున్నాడు. అయితే ఏలాగు ఆయన దానిని చేయగలడు? క్రీస్తు ద్వారానే. ఆయన కుమారుడెట్లు కాగలడు? క్రీస్తు ద్వారానే. ఆయన స్వస్థపరచువాడెట్లు కాగలడు? - క్రీస్తు ద్వారానే. చూడండి, అన్ని సంగతులు ఆ ఒక్క యేసుక్రీస్తు అను వ్యక్తిలోనే ఇమిడి యున్నవి.
COL 1:19•
COL 2:9
81దానిని నేను ఆలోచించుచుండగా శాఖలు తెరమరుగగుచున్నవి. ప్రతిది అదృశ్యమగుచున్నది, చూచారా. దేవుని యొక్క గొప్ప ఉద్దేశ్యము నాకు కనబడు చున్నది. ఆయన తన్నుతాను బయలుపరచుకొనుచున్నాడు. థైవత్వము యొక్క సంపూర్ణత శరీరరీత్యా క్రీస్తు నందు బయలుపరచబడెను. తరువాత దైవత్వం యొక్క సర్వపరిపూర్ణతను శరీరరీత్య జనులలోనికి తెచ్చుటకై ఆయన ప్రధాన స్థానమును కలిగియుండవలెను. అధికారిగాను, నాయకునిగాను ఉండగోరుచున్నాడు.
ACTS 16:6,7
82"యేసు క్రీస్తుకు ఖైదీయగు" పౌలు అను ఒక వర్తమానమును ఒక రాత్రి ఇక్కడ బోధించాను. ఆ టేపును మీరు సంపాదించుకొనండి. దేవుడు నిన్ను తనకు ఖైదీగా చేసికొనినప్పుడు, నీవు ఆత్మ చెప్పినది మాత్రమే చేయుదువు.
పౌలు గొప్ప పండితుడు. ఆనాటి గొప్ప రబ్బీ లేదా బోధకుడగు గమలియేలు యొద్ద చదివెను. అతనికి గొప్ప ఆశయములున్నవి. అతడు తెలివిలో గొప్ప వాడు. గొప్ప అధికారి. ఆ దేశములోనే గొప్ప వ్యక్తి. కాని యేసుక్రీస్తును వ్యక్తపరచుటకు, వాక్యములో ఒక భాగమగుటకు అతడు సమస్తమును త్యాగము చేయవలసివచ్చెను. (కొందరు సోదరులు అతనిని పిలచిరి), ఒక చోటకు వెళ్ళవలెనను ఉద్దేశ్యము అతనికి ఉండెను. కాని తన స్వచిత్తము నెరవేర్చకుండా ఆత్మ అతనిని అడ్డగించెను. సగం ఆత్మ సంబంధులు దీనిని గమనించిన ఎంత బాగుండును! చూచారా? అతడు తన స్వచిత్తము జరిగించకుండా అడ్డగింపబడెను. "ఆత్మ నన్ను అడ్డగించెను." అతడు క్రీస్తు ఖైదీ.
ACTS 16:16,18
83ఒక రోజున సోదె చెప్పు ఒకతె అతనిని వెంబడించినది. దయ్యమును వెడలగొట్టు శక్తి తనకున్నదని పౌలుకు తెలియును, గాని దైవచిత్త ప్రకారమే చేయగోరెను. దిన దినము ఆమె అతనిని వెంబడించి కేకలు వేసినది, కాని ఒకరోజున ఆత్మ అతనికి అనుమతి ఇచ్చినది. అపుడతడు ఆమెలో ఉన్న ఆత్మను గద్దించెను, చూడండి. ఖైదీగా ఉండుట ఏమిటో అతనికి తెలియును.
EXOD 8:21,24
84మోషే: క్రీస్తును కనుగొనుటకు తన జ్ఞానమును విడిచిపెట్టవలసి వచ్చెను. ఒక ఖైదీ అయ్యెను. అప్పుడు దేవుడు అతనిలోయున్న లోకమునంతటినీ దులిపి వేసెను. అతడు గొప్పవాడే, కాని ఒక దినమున అగ్ని స్తంభము యొక్క సన్నిధిలో నిలువబడి యుండెను. అతడు నోటి మాంధ్యముగలవాడు. తాను మాట్లాడలేనని చెప్పెను. దేవుడు ఒక ఖైదీని కలిగియున్నాడు. తన స్వంత పరిశోధన వలన ప్రయత్నించుట కాదు. అతడు అక్కడికి వెళ్ళి క్రియ చేయకలుగు శక్తితో దేవుడతనిని నింపవలసి యుండెను. "ప్రభువా నీవు చెప్పమన్నదంతయూ నేను ఫరోకు చెప్పాను, కాని అతడు మాట వినలేదు" అని అతడు చెప్పెను.
అయితే, "నీ కర్రతీసికొని తూర్పు వైపు చాపి ఈగలను రప్పించుము" అని చెప్పెను. (అది దేవుని మాట. దేవుడు మాట్లాడుచున్నాడు); ఈగలు ఉనికి లోనికి వచ్చినవి, ఎందుకనగా అతడు ఒకఖైదీ, ఫరో దేనివలనను అతడిని త్రిప్పలేడు. ఎవరునూ ఏ విధముగాను అతడిని త్రిప్పలేరు. దేవుని వాక్య సంకెళ్ళలో అతడు ఒక పూర్తి ఖైదీగా యుండెను. యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడుతో అతడు కట్టుబడి యుండెను.
85దేవునికి అటువంటి వారు కావలెను! అప్పుడాయన వారిలో తన ప్రాధాన్యతను వెల్లడించుకోగలడు. చూచారా? క్రీస్తు తప్ప మరెవరిని ఎరుగని వారు దేవునికి అవసరము. నా భావము గ్రహించారా? మంచిది. అది రెండవ సంగతి.
మొదటిగా, ఆయన తన్ను సంపూర్తిగా బయలుపరచుకొనెను. క్రీస్తు నందు దేవుడు. రెండవదిగా, ఆయన సంఘములో దీని ద్వారా ప్రధానునిగా ఉండగోరుచున్నాడు. (ఆది ఆయన శరీరము, వధువు) వారి ద్వారా ఆయన తన్నుతాను బయలు పరచుకొనవలెనన్న యెడల ఆయనకచ్చట ప్రథమ స్థానముండవలెను. మంచిది.
మూడవది, మొదటి ఆదాము యొక్క పాపము వలన పతనమై పోయిన రాజ్యమును తిరిగి దాని యొక్క సరయిన స్థానములోనికి వచ్చుట. ఆయన ఆనాడు తన జనులతో కలిసి చల్లని సాయంకాలమున తిరుగుచూ వారితో మాట్లాడి సహవాసము చేసే స్థితిలోనికి తీసుకొనివచ్చుట. అయితే ఇప్పుడు పాపము మరియు మరణము ఆయన సన్నిధి నుండి, ఆయన యావత్తు సముఖము నుండి వారిని వేరుచేసెను. దానిని మీరు చదివారా? జగత్తు పునాది వేయబడక ముందే ఆయన తన యొక్క గుణలక్షణములన్నింటినీ ఏమైయుండెనో వ్యక్తము చేయునాశించెను.
86కాబట్టి త్రిత్వవాదులెవరైనా గాని కొద్దిసేపు స్వేచ్ఛగా ఆలోచించండి. మీరు తండ్రిని, కుమారుని, పరిశుద్దాత్మను ముగ్గురు దేవుళ్ళు కారని చూడగలరు. అవి ఒకే దేవుని యొక్క మూడు గుణలక్షణములు. చూచారా. తండ్రిగా ఆయన బయలుపడెను. ఒక తండ్రిగా ఉండవలెనని ఆయన కోరుకొనెను. ఆయన తండ్రిగా ఉండెను. ఆయన కుమారునిగా ఉండెను. ఆయన పరిశుద్దాత్మగా ఉండెను. తండ్రి మరియు పరిశుద్దాత్మ కలిగియున్నది ఒకే ఆత్మ. మీరు చూడలేదా? అర్థమైనదా? - ముగ్గురు దేవుళ్ళు కాదు. నిన్ను విగ్రహారాధికునిగా చేయుటకు అపవాది నీకాలాగు చెప్పెను. చూడండి? ఒకే దేవుడు మూడు గుణలక్షణములలో వ్యక్తమాయెను. తండ్రిగాను, రక్షకునిగాను, కుమారునిగాను, స్వస్థపరచువానిగాను ఆయన ఉండగోరెను. (చూచారా?) — ఆలాగు ఆయన బయలుపరచబడెను.
COL 1:19•
COL 2:9
87టేపు వినుచున్న వారు కూడా ఈ ఉద్దేశ్యమును గ్రహింపకలుగునట్లు నేను కొద్ది వివరణ ఇవ్వగోరుచున్నాను, వారును చూడగలరు. ఈ అంశమును చెప్పవలెనన్న చాలా సమయము పట్టును. నేను చెప్పబోవుచున్న దానిని మీరు అర్థము చేసికొని చూడ కలిగినంత వివరముగా చెప్పవలెనని కోరుచున్నాను, చూచారా.
దేవుడు యేసుక్రీస్తు నందు వ్యక్తమాయెను. ఆయనే తండ్రి, ఆయనే కుమారుడు. ఆయనే పరిశుద్ధాత్మ. దైవత్వము శరీరమందు సంపూర్ణముగా ఆయనలో నివసించెను. ఇప్పుడు దైవత్వం యొక్క సర్వపరిపూర్ణత శరీరంగా తన సంఘంలో అగ్రగామిగా ఉన్నది. దేవునిలోనిదంతయు క్రీస్తులో కుమ్మరించబడెను. సంఘములో, సంఘ శాఖలలో కాదు గానీ, విశ్వాసులలో కొద్ది నిమిషములలో దానిని చూతుము. మీ మనస్సులలో నుండి దానిని సంపూర్తిగా తొలగించును, చూచారా. ఆయన మనకు అనుమతి ఇచ్చిన యెడల దేవుని సహాయముచే దానిని మీకు చూపించెదను.
MATT 11:25•
LUKE 10:21•
COL 1:20•
HEB 13:8
88ఇప్పుడాయన ఉద్దేశ్యము ఏమిటి? కుమారునిగా తన్ను బయలుపరచుకొనుట (చూడండి?) ఆయన యందు శరీరరీత్యా దేవత్వము సంపూర్తిగా నివసించెను. కొలస్సీ పత్రిక చూచాను. లేఖనమంతటిలోను దేవుని యొక్క ఉద్దేశ్యము అదే.
ఈ కుమారుని యొక్క జీవము ద్వారా ఆయన సిలువ ద్వారా (రక్తమే ఆయన సిలువని చెప్పబడినది), వధువు అనే శరీరమును తిరిగి తనతో సమాధాన పరచుటకేనని వ్రాయబడినది. (అమె హవ్వ - రెండవ హవ్వ) దేవుడు మోషే తదితరులను సాదశ్యముగా ఉంచెను. (ఆదామవ్వలు ఒక మాదిరిగా ఉన్నారు) వారు క్రీస్తు, వధువుకు సాదృశ్యంగానున్నారు. (ఆయన చివరి ఆదాము, సంఘము చివరి హవ్వ) వాక్యమునకు వ్యతిరేకముగా రెండవ హవ్వ నిలబడి రాజీపడిన యెడల మొదటి హవ్వ చేసినదే చేసినట్లుకాదా? అది "మరొ కాలమునకు చెందినది" అనవద్దు. అది ఈ కాలముదొ, మరొ కాలమునకు అది సంబంధించినదని ఆయన చెప్పెనేమో కొద్ది నిమిషములలో చూద్దాం. ఆయన నిన్న, నేడు, నిరంతరము ఏకరీతిగా యుండగా అది మరొ కాలమునకు ఎట్లు చెందును? దానిని దేవుడు ఉద్దేశపూర్వకంగానే జ్ఞానులు, వివేకుల నేత్రములకు మరుగుచేసి యుంచెను. ముందుగా నిర్ణయించబడిన పసిపిల్లల వంటివారికి దానిని బయలు పరచెను. దానిని చేర్చుకొనుటకు వారు ముందుగానే నిర్ణయించబడిరి.
JOHN 8:44
89అన్ని కాలములను పరీక్షించండి. ఆ వెలుగు తాకగానే కొందరు వెనుదిరిగిరి. గొప్ప మేధావులు, మహా యాజకులు, రబ్బీలు, గొప్ప ఉపదేశకులు, నికోదేము వంటి అధికారులు, పాండిత్వపు మెరుగుదిద్దుకొన్న వారు దానిని అర్థము చేసికొనలేక పోయిరి. ఆ గొప్ప యాజకులు, రబ్బీలు వాక్యమును ఇతరులకు నేర్పిరి. వారు దాని యొక్క జ్ఞానమును ఎరుగుదురు. మీరు మీ తండ్రియగు అపవాది సంబంధులు. వాని క్రియలే మీరు చేయుచున్నారు అని ఆయన చెప్పెను.
పరిశుద్దులారా, దానిని గూర్చి ఆలోచించండి! వారి జీవితములను మీరు వేలు పెట్టి చూపించలేరు. వారి తండ్రులు, తాతలు, ఇంకా పితరులు కూడా అట్టి వారే వారు తప్పు చేసిన సిగ్గుతో చనిపోవుదురు. మరణించే వరకూ రాళ్ళతో కొట్టబడెదరు. కాని ఇక్కడ యేసు నిలబడి వారిని "దయ్యపు గుంపు" మరియు మతసంబంధమైన జనులు అని పిలచెను.
90ఆ గొప్ప ప్రతక్షత గూర్చి ఇప్పుడు వినండి! ఆయన తన రక్త సంబంధమును పునరుద్దరించగోరెను. తిరిగి సంపాదించుకొనుటకై ఆయన వారిని నశించిపోనిచ్చెను. దానిని మీరు గ్రహించారా? వారిని స్వేచ్చా జీవులుగా చేసి పాపమును చేసినా అడ్డుకొనలేదు. వారిని పాపము చేయునట్లుగా ఆయన చేయలేదు మరియు ఆయన దేవునిగా అప్పుడు వారు పాపము చేయునట్లుగా తానే చేసి అందుకై ఉన్నాడు. వారిని శిక్షింపవలసి వచ్చును, కాని ఆయన మానవులలో భాగస్వామి అయ్యెను. అప్పుడు మానవున్ని స్వేచ్చగా జీవించుటకు వదిలివేసెను. చూచారా? నేడును నీ పట్ల ఆయన ఆలాగే ప్రవర్తించుచున్నాడు. చూడండి? మీ ఇష్టమొచ్చినట్లు మీరు ప్రవర్తించుచున్నారు; నీవు ఒక స్వేచ్ఛా వ్యక్తివి.
కాబట్టి మొదటి మానవుని ఆయన ఆ విధంగా చేసెను. కడపటి వానిని కూడా ఆయన ఆ విధంగానే చేయును. ఆయన ప్రతి ఒక్కరిని ఆలాగే ఉంచవలెను, లేని యెడల ఆయన మొదట చేసినది తప్పు అగును. అందరూ ఆ మూలము మీదనే యుందురు.
1COR 6:9•
REV 18:3
91ఇప్పుడాయనను గమనించండి. వాడు దానిని చేయునని ఎరిగియుండియు, మానవుని పాపము చేయుటకు విడిచిపెట్టి అతడిని తిరిగి విమోచిస్తే దానివలన ప్రయోజమేమి? (ఆయన ముందే ఎరుగును) రక్షకునిగా ఆయన గుణలక్షణమును అది ప్రదర్శించుచున్నది. వాడు పాపము చేయునని ఆయనను తిరస్కరించుట ద్వారా చావవలసియున్న భార్యను ఆయన విడిపించుటకు తన స్వంత ధర్మశాస్త్రము వలన వచ్చిన శిక్షను పైన వేసికొనుటకై యేసుక్రీస్తు తానే దేవునిగా మారుటలో ఆ సంకల్పమంతయు ఉంచబడింది.
హవ్వ వాక్యము నుండి దూరమై తన సహచరునికి దూరమాయెను. సంఘము వాక్యము నుండి వేరై శాఖతో చేరెను. దేవుని యొక్క వాక్యాధికారమును ఆమె తిరస్కరించి, మానవ జ్ఙానము, ప్రపంచ తెలివి వలన జారత్వము జరిగించినది. అది చక్కగా యున్నదా? అది ఆత్మ సంబంధ వ్యభిచారమని బైబిలు చెప్పుచున్నది. బైబిలులోని ఏ వాక్యమును తిరస్కరించినా, దానికి స్వంత అర్థము ఇచ్చినా, అది నీ భర్తయగు దేవునికి విరోధముగా వ్యభిచారము చేసినట్లే యగును. ఒక వ్యభిచారి ఎన్నడును పరలోక రాజ్యములో ప్రవేశించజాలదని మన మెరుగుదుము. మొదటగా హవ్వ చేసిన పొరపాటే అది.
COL 1:18
92మరల గమనించండి? ఆ మూడు విధముల ఉద్దేశ్యము ఏమిటి? యేసు క్రీస్తు నందు ఆయన తన్నుతాను బయలుపరచుకొనెను. యేసు క్రీస్తు ద్వారా శరీరములోనికి ఆయన వచ్చి దేనిలో ప్రధానునిగా ఉండగోరెను?పోగొట్టుకొనిన ఏదేనును తిరిగి పునరుద్దరించుటకు పోగొట్టుకొనిన దానిని తిరిగి సంపాదించుటకు అది ఒక్కటి మాత్రమే క్రమము తప్పియున్నది. మిగిలిన ఆయన కార్యములన్నీ క్రమములోనే యున్నవి.
పడిపోవుటకై స్వేచ్ఛా జీవిగా మానవున్ని ఆయన వదిలి పెట్టెను, ఎందుకనగా రక్షకునిగా తనలో ఉన్న గుణలక్షణమును ప్రదర్శించుట కొరకే (చూచారా?) — ఆయనలో రక్షకుని గుణలక్షణముండెను. ఒకటి నశించితేనే గాని దానిని రక్షించుటఅనునది యుండదు. మానవుడు పతనమై నశించెను. ఆయన రక్షకునిగా మారి తనస్వంత ధర్మశాస్త్రమును అంగీకరించెను. ఆ గొప్ప కాలమును, శూన్యమును కప్పిన గొప్ప యెహోవాగా ఉండి ఆయన ఆ విధంగా చేయలేడు. ఆయన మానవునిగా మారవలసి వచ్చెను. నశించిన మానవునివలె ఆయన పతనమైపోయిన మానవునితో ఆయన రక్త సంబంధమును స్వీకరించి మానవునిగా మారెను. (ఆమేన్!) దేవుడు శరీరధారి అయ్యేను. హల్లెలూయా! నేను అత్యానందముతో యున్నాను. లోపల ఏదో ఉన్నది.
93దేవుడు దేవునిగా ఉండకుండా నా వంటి వాడాయెను. నన్ను ఆయనవలె చేయుటకు ఆయన నా పాపమును భరించెను. దేవుని యొక్క కుమారులు మరియు కుమార్తెలుగా చేసెను, ఏలననగా ఆయన నిత్యుడగు తండ్రి. ఆయనలో ఉన్నఆ గుణలక్షణం బయటకు రావలెను. (చూచారా?)
ఇపుడు మూడు రకముల దేవుని ఉద్దేశ్యము చూచారు. తనను తాను బయలుపరచుకొట కొరకే ప్రపంచము నశించినది. ఆయన తన్ను బయలుపరచుకొనెను. ఒక మానవునిగా ఆయన వచ్చి రక్షకునిగా మారుటకే తన సిలువ రక్తము ద్వారా వారిని సమాధానపరచెను. సంఘమును రక్షించి, సంఘములో ప్రథమ స్థానము పొందుటకు ఆయన మరణించవలసి వచ్చెను.
REV 17:1,5
94ఇప్పుడు గుర్తుంచుకొనండి. అది ఇక ఎన్నడూ ఒక శాఖగా ఉండలేదు ఉండదు, ఉండబోదు. ఆయన ప్రధానునిగా ఉండగోరుచున్నాడు. ఆయన వాక్యమై యున్నాడు. ఆమేన్! అందులోనికి ఏ మానవ సిద్ధాంతమునయినా గాని ఎట్లు చేర్చగలరు? అందువలన ఆ సంఘము ఒకవేశ్యగా మారును. ఎవరి మాటలు గాని, ఎవరి సిద్ధాంతములుగాని, ఏ శాఖ మాటను గాని తీసికొనుట తప్పు. అది వేశ్య. వేశ్య పిల్లలని ప్రకటన 17 వ అధ్యాయము చెప్పుచున్నది. రోమను కాతలిక్కు సంఘము మహా వేశ్యయై యున్నది. ప్రొటస్టెంటు వారువేశ్య యొక్క పిల్లలై యున్నారు. అది ఎవరైనా చదివి అర్థము చేసికొనగలిగినంత తేటగా యున్నది. సంఘ కాలములను మనము చూచాము. మీరు కోరినచో ఆ టేపులలో దానిని చూడగలరు. నిశ్చయంగా బైబిలు తప్ప మరొక సిద్ధాంతమును దేనిని కలిపినా అట్టి వారు దేవుని దష్టికి వేశ్యలగుదురు. హవ్వ కూడా అదే చేసినది. వాక్యము అనగా క్రీస్తు నుండి దూరమైనది. మంచిది.
EPH 1:1
95జగత్తు పునాది వేయబడక ముందే ఆయన మనస్సులో ఆయన దాచుకున్న మర్మమును మనము చూచాము. దీనిని గూర్చి కొంత చదివెదరా? దానిని మనము చదువుదము. మీకు చాలినంత సమయమున్నదా? దానిని మనము చదువుదము. ఎఫెసీయులకు వ్రాసిన పత్రిక 1వ అధ్యాయము ఆరంభము నుండి చదువుదము. క్రీస్తు యొక్క మూడు విధముల ప్రత్యక్షత గూర్చిన ఆదివారపాఠము కొనసాగును, చదువుదము.
దేవుని చిత్తము వలన క్రీస్తు యేసు అపోస్తలుడైన పౌలు ఎఫెసులో నున్న పరిశుద్ధులును, క్రీస్తుయేసు నందు విశ్వాసులునైన వారికి శుభమని చెప్పి వ్రాయునది. [చూడండి. ఇది లోకస్థులకు వ్రాసినది కాదు.]
1COR 12:13•
EPH 1:2,3
96యేసు క్రీస్తులోనికి మీరెట్లు రాగలరు? సంఘములో చేరుట వల్లనా? కాదు. నూతన జన్మద్వారా! ఒక్క ఆత్మ వలన మనందరము ఒక్క శరీరము లోనికి బాప్తిస్మము పొంది యున్నాము. (I కొరింధీ 12), చూచారా. వారితో అతడు మాట్లాడుచున్నాడు. బయటి ప్రపంచమునుద్దేశించి వ్రాయబడలేదు. దీని విషయములో పాపితో మాట్లాడుట లేదు, ఎందుకనగా పాపికి దాని గూర్చి ఏమి తెలియదు. పాపులనుద్దేశించి పౌలు ఈ మాటలు వ్రాయుట లేదు. "యేసుక్రీస్తులో నున్న గుంపుకు అని అతడు వ్రాసెను."
మన తండ్రియైన దేవుని నుండియు ప్రభువైన యేసుక్రీస్తు నుండియు మీకు కృపయు, సమాధానమును కలుగును గాక!
మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రియగు దేవుడు స్తుతింపబడును గాక. ఆయన క్రీస్తు నందుపరలోక స్థలములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకనుగ్రహించెను. (ఎక్కడ?)
EPH 1:3-5
97పరలోక స్థలములు. ఓ, నాకు సమయమున్నచో ఎంత బాగుండును! పరలోక విషయముల గూర్చి నా బైబిలులో గీత గీసి యుంచాను. పరలోక స్థలములనగా ఏమిటి? (ఒక్క క్షణము) క్రీస్తు నందు విశ్వాసికి గలస్థానమే పరలోక స్థలము చూచారా? క్రీస్తునందున్న విశ్వాసి పరలోక స్థలములలో నిలబడును.
ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన యెదుట పరిశుద్ధులమును, నిర్ధోషులమునై యుండవలెనని జగత్తు పునాది వేయబడక మునుపే ప్రేమ చేత ఆయన క్రీస్తులోమనలను ఏర్పరచుకొనెను.
ఆయన [ఎందుకు?] ఎన్నుకొనెను? జగత్తు పునాది వేయబడక ముందే మనలను పుత్రస్వీకారం ద్వారా క్రీస్తు యేసు ఆయనకు ఆయనే. అది ఆయన యొక్క మహా ఆనందమగు చిత్తము.
EPH 1:5
98ముందుగా నిర్ణయించబడుట అను మర్మము చూడండి. క్రీస్తు లేక ఏదైనను భూమిమీద లేకముందే ఆయన తన వధువునును ఎన్నుకొనెను. (ఆయన గొప్ప మర్మము చూడండి) వాక్యమును నమ్మక హవ్వ పడిపోవునని ఆయన ఎరుగును. ఆయన పడిపోని ఒక వధువును ఎన్నుకొనెను. ప్రపంచమంతా ఏమి చెప్పినాగాని ఆయన వాక్యమునే హత్తుకొనును. వారు అక్కడ నిలబడుటకు ముందుగా నిర్ణయించబడిన వారు. వాక్యమునే పట్టుకొందురు. యేసుక్రీస్తు ద్వారా వారు దత్తపుత్రులయిరి. ఆ మహిమకరమగు రీతిలో నిలబడుటకు వారిని ముందుగానే నిర్ణయించెను.
GEN 2:21,22•
JOHN 1:1
99మీరు ఈ రహస్యము చూచారా? పడిపోయిన హవ్వను తిరిగి ఇచ్చెను. ఆమె సంఘమునకు ముంగురు (సాదృశ్యము). ఇప్పుడు చూడండి. దేవుడు ఆదాము ప్రక్కను చీల్చి అతని రక్తమాంసములలో నుండి హవ్వను తీసెను. అతని ఆత్మను విభాగించి పురుషత్వం నుండి స్త్రీతత్వమును తీసి హవ్వలో ఉంచెను. అతని ప్రక్కటెముకలో నుండి హవ్వను చేసెను. ఆ విధముగానే దేవుడు క్రీస్తు యొక్క ప్రక్కలో నుండి రక్తమును, నీటిని తీసెను. (క్రీస్తు వాక్యమైయున్నాడు), వాక్యముతో ఆయన సంఘమును తయారు చేసి యున్నాడు. హవ్వ, అనగా, ఆయన సంఘము. తన శరీరము నుండి కారిన రక్తము వలన విమోచించబడి తిరిగి ఆయనను చేరెదము. ఇప్పుడు దానిని మీరు చూచారా? జగత్తు పునాది వేయబడినప్పటి నుండి దాగియున్న గొప్ప మర్మము ఇప్పుడు తేట తెల్లమయినది. అది అన్ని కాలములలోను అలంకార రూపములో కనబడినది. ఇప్పుడు గమనించండి. ఆయన చేసిన దానిని చూడండి. ఎఫెసీ పత్రికలోను, ఇతర చోట్లను చూడగలరు.
కాలక్రమంగా ఆయన తన యొక్క మర్మమును నెమ్మదిగా విప్పుకొనుచూ వచ్చుచున్నాడు. ఇప్పుడు మీరు గ్రహించారా?
100ముందుగా చూపబడిన దృశ్యము ఇప్పుడు ఏమయినది? ఆయన ఆదాము యొక్క ప్రక్కను తెరచి అతనిలోని మాంసముతో ఆదామే అయ్యున్నటువంటి హవ్వను చేసెను. వధువు వాక్యముగా ఉండవలెను, ఎందుకనగా ఆయన వాక్యమై యున్నాడు. ఆమె మానవ సిద్దాంతముల మీద నిలబడజాలదు; శాఖ మీద ఆమె నిలబడజాలదు; మంచి నడవడి మీద ఆమె నిలబడజాలదు; ఆమె వాక్యము మీద మాత్రమే నిలబడవలసియున్నది, ఎందుకనగా ఆమె అందులో భాగమై యున్నది. ఆమె క్రీస్తు నుండి తీయబడినది, చూచారా.
101సంపూర్ణ ఎత్తబాటును గూర్చి నిశ్చయత కలిగియుండండి… లూధరు ఒక భాగము; వెస్లీ ఒక భాగము. ప్రవక్తలు ఒక భాగము. ప్రత్యక్షతలోవారు శరీరమును నిర్మించుచున్నారు. వారు పాదములు కాలివ్రేళ్లు, చేతులు, మిగిలినవి అలా శిరస్సు వరకూ అదే సంపూర్ణ ఎత్తబాటును తయారు చేయును. (కొద్ది నిమిషములలోదానిని చూద్దాం), ఇది వాక్యశరీరం, వాక్యశరీరమే క్రీస్తు. ఆమేన్! దానికి నీవు వెలుపట యున్నచో నశించెదవు. నీవెంత మంచి వాడవయినా గాని, ఎంత మంచి సంబంధము. సహవాసము లేదా సంస్థను కలిగి యున్నాగాని, వాక్యమునకు వెలుపట నీవున్నచో నశించెదవు.
MATT 11:30•
JOHN 8:29•
JOHN 10:38•
JOHN 15:7
102"మీరు నాలోను (వాక్యము), నా వాక్యము మీ యందును నిలచి యుండిన యెడల మీకేది ఇష్టమో అడుగుడి…" ఎందుకనగా, నీవు వాక్యము ఒక్కటైయున్నారు. ఆయన ప్రధానుడు. ఆయనకు ఏలుబడి అధికారమున్నది. నీవు ఆయనకు బందీవి. లోకము చనిపోవును. ఇతరులు ఏ విధంగా జీవించుట నీవు చూచినా గాని నీవు మాత్రము వేరుగా ఉందువు. నీవు ఖైదీవి. నీవాయన కాడితో నున్నావు. "నా కాడి తేలికయైనది." "(క్రీస్తు యొక్క కాడితో, ఆయన వాక్యము ద్వారా నీవు కట్టబడియున్నావు.) తండ్రి కిష్టమైనదే నేను చేయుదును. నేను ఆయననని మీరు నమ్మని యెడల, వాక్యమును నమ్ముడి." అది పరిపూర్ణముగా ఉన్నది.
గమనించండి.
EXOD 2:3•
MATT 5:27,28
103చూడండి. అన్ని కాలములలోను ఆయన నెమ్మది నెమ్మదిగా తన మర్మమును ప్రవక్తల ద్వారా, మాదిరుల ద్వారా బట్టబయలు చేయుచున్నాడు. ఆయన తన్నుతాను బయలుపరచుకొనుచు ఆ విధంగా కొనసాగుతున్నాడు.
ఆయన మోషేలో తన్ను వ్యక్తపరచుకొనెను. మోషేను చూడండి. పిల్లలను శ్రమపెట్టుచున్న కాలములో జన్మించెను. విమోచకునిగా ఉండుటకు అతడు పుట్టెను. యేసును ఐగుప్తు లోనికి కొనిపోయి దాచినట్లే, మోషేను తుప్పలలో దాచిరి. కొండ ఎక్కి మొదటి ప్రసంగం అందించెను. (కొండ మీది ప్రసంగము), "మీరు వ్యభిచరించరాదు" అను మాటను విన్నారు గదా? కాని నేను మీతో చెప్పునదేమనగా, "ఒక స్త్రీని మోహపు చూపుతో చూచువాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచరించిన వాడగును." ఆయన ధర్మశాస్త్రమును ఇచ్చినవాడు; ఆయన యాజకుడు; రాజు; నాయకుడు — కచ్చితముగా.
GEN 37:4,24,28•
GEN 39:4•
GEN 40:21,22•
MATT 26:15•
MATT 27:3,38•
MARK 15:27•
LUKE 23:43
104ఆయన తన్నుతాను యోసేపులో వ్యక్తపరచుకొనెను. శాఖల మధ్య అతడు జన్మించెను. (అతని సోదరులు). అతడు ఆత్మ సంబంధిగా ఉన్నందున వారతనిని నిష్కారణముగా ద్వేషించిరి. అతడు దర్శనములను చూచెను. అతనితో దేవుడుండెను. అతడు కలల భావము చెప్ప కలిగెను. అతని సోదరులు అతనిని ద్వేషించిరి. అతడు తన అన్నలచే దాదాపు ముప్పది వెండి నాణెములకు అమ్మబడెను. ఆయన కూడా అతని సోదరులలో ఒక సోదరుడగు యూదా ఇస్కరియోతు ద్వారా ముప్పది వెండి నాణెములకు అమ్మబడిన రీతిగానే.
అతడు గుంటలోనికి త్రోయబడెను. చచ్చిన వాని వలె ఆయ్యెను. అది సత్యము అతడు చనిపోయెనని ఆ తల్లిదండ్రులకు తెలిపిరి. అతడు గోతిలోనికి త్రోయబడియు అందులో నుండి పైకితీయబడి ఫరో కుడి పార్శమున కూర్చుండబెట్టబడెను. చెరసాలలో అతడెంతో శ్రమ పొందెను. అక్కడ ఇద్దరు ఉండిరి. వారిలో ఒకడు రక్షించబడెను, ఒకడు నశించెను. ఆయన కూడా సిలువ మీద మన పాపము కొరకు శ్రమపొందెను గనుక సిలువ వేయబడుటను చెరసాలలో ఉండుటను అక్షరాలా పోల్చవచ్చును. (మనమే శిక్షార్హులము) ఒక దొంగ నశించెను, మరొకడు రక్షణ పొందెను. చూచారా. కచ్చితముగా.
GEN 39:4•
AMOS 3:7
105ఆ తరువాత రాజగు ఫరో కుడి ప్రక్కన కూర్చుండబెట్టబడెను. రాజు పాదముల యొద్ద అతడు కూర్చోన పెట్టబడి, ఐగుప్తు అధికారమంతయూ వశపరచుకొన్నట్లు అతడు కలకనిన రీతిగానే అతని దర్శనము నెరవేరినది. అతడు చెరసాలలో పడవేయబడినప్పుడు చాలాసార్లు దానిని చదివి యుండును, అతని మీసములు తెల్లబడినవి, అయినా గాని అతని దర్శనము ఏదో ఒక దినమున నెరవేరునని ఎరిగి యుండెను.
అది జరుగునన్న తలంపు అతనిలో తిరుగుతూ యున్నది. (బుధవారము రాత్రి నేను చెప్పాను), చూచారా. అది జరుగవలసి యున్నది. దేవుడు చెప్పెను గనుక అది నెరవేరవలసి యున్నది. అతడు ఒక ఋజువు చేయబడిన ప్రవక్త మరియు అది నెరవేరవలసియున్నది, ఎందుకనగా, అది దేవుని వాక్యము, మరియు వాక్యము కేవలము ప్రవక్త యొద్దకే వచ్చును.
DEUT 18:19,22•
JOHN 15:5•
ROM 14:11
106మరియు ప్రవక్త అనగా వ్రాయబడిన దైవవాక్యమును బయలు పరచువాడని అర్థము, భవిష్యత్ సంగతులు ముందే చెప్పును లేక చూచును.
"మీ మధ్య ఒక ప్రవక్త లేచి కొన్ని జరుగబోవు సంగతులను గూర్చి చెప్పినప్పుడు అవి జరుగని యెడల అతని మాట నమ్మకుడి." అయితే అది జరిగిన యెడల నేను అతనితో యున్నానని నమ్ముడి. మీరతనికి భయపడుడి, ఎందుకనగా నేను అతనితో యున్నాను. చూచారా? అదియే ఋజువు. అది సత్యమో, కాదో అక్కడనే తెలియును. దేవుడు తన మాట ద్వారా, తన జనుల ద్వారా తిరిగి మాట్లాడుచున్నాడు.
చూడండి. దేవుడు కేవలం జనుల చేతనే మానవుని ద్వారానే మాట్లాడును. "నేను ద్రాక్షావల్లిని మీరు తీగెలు." ద్రాక్షావల్లి ఫలించదు. కొమ్మలే ఫలించును. గమనించండి. ఎల్లపుడూ అంతే.
GEN 41:40,43,44•
ISA 45:23•
JOHN 14:6•
PHIL 2:10
107యోసేపును చూడండి… యోసేపును మొదట కలిసికోకుండా ఎవరియొద్దకు వచ్చుటకు గాని, మాట్లాడుటకు గాని వీలు లేదు. కుమారుని ద్వారా తప్పు ఎవడును తండ్రి యొద్దకు రాడు. యోసేపే సింహాసనము మీద నుండి లేవగానే బూర మ్రోగును. ప్రతి మోకాలు వంగును. యోసేపు వచ్చుచున్నాడు. మహిమ! ఒక దినమున ప్రతి మోకాలు వంగును. ప్రతి నాలుక ఒప్పుకొనును. ఆయన తన తండ్రి సింహాసనము విడిచి వచ్చును. (చూచారా?) "ఆయన దేవుని కుమారుడని ప్రతి వారు సాక్షమిచ్చెదరు." కాని అప్పటికి సమయము దాటిపోవును; దానిని ఇప్పుడే చేయండి.
MATT 23:37•
LUKE 13:34,35
108దావీదును కూడా మాదిరిగా మనము చూడవచ్చును. (కొద్దిసేపటి క్రితం చెప్పాను) అతని స్వంత వారే అతనిని సింహాసనము మీద నుండి తొలగించిరి. స్వజనులే అతనిని తిరస్కరించిరి. చెరసాలలోనికి వెళ్ళినట్లుగా అతడు కొండ ఎక్కెను. (అదే ఒలీవకొండ) తన సోదరులు, తన స్వంత వారు తిరస్కరించుట ద్వారా అతడు చెరసాల వంటి జీవితము గడిపెను. అతడు ఏడ్చుచూ ఎక్కెను. అది క్రీస్తు ఆత్మ. "ఆయన కూడా యెరూషలేము వైపు చూచి ఏడ్చెను. యోరూషలేమా, ఎన్ని సార్లు నిన్ను హెచ్చరించితిని? ఆయన ఒక విసర్జించబడిన రాజు. ఎనిమిది వందల సంవత్సరముల తరువాత దావీదు కుమారుడు విసర్జించబడి, యెరూషలేము వైపుచూచి ఏడ్చి," "ఇప్పుడు నీ ఘడియ వచ్చినది" అనెను.
109అవన్నియూ ఆయనకు మాదిరిగా ఉన్నవి. (మాదిరి) అయినా ఆ మర్మము ఇంకా దాగియుండెను. వారు చేయుచున్న దానిని వారే ఎరుగరు. వారు దానిని చేయుటకు ఆత్మ ద్వారా నడిపించబడిరి. అని మాత్రమే వారెరుగుదుదు ఆ గొప్ప ప్రత్యక్షత చివరి దినములందు బయలుపడును. మోషేలోను, దావీదులోను, యోసేపులోను, ఏలియా మొదలగు వారాలోను ఆయన తన్ను బయలుపరచుకొనెను. మనము ఈ ఒక్కొక్క ప్రవక్తను తీసికొని వారి జీవితములను చూచినచో, యేసుక్రీస్తు సంపూర్ణముగా కనబడును. అయిననూ ఆయన తన రహస్యమును పూర్తిగా చెప్పలేదు. అంత్యదినములలో ఆయన దానిని చెప్పెదనని వాగ్ధానము చేసెను. దాని కొరకు కనిపెట్టు చున్నారు. దానిని ఆయన పూర్తిగా వ్యక్తపరచక ముందే అది పూర్తిగా అర్థమగునని వారు మర్మములతో వ్రాసియున్నందుకు యేసు తండ్రికి వందనములు చెల్లించెను. (చూచారా?), అది మర్మయుక్తంగా వ్రాయబడినది.
110ప్రభువు యొక్క రాకడయు మర్మముగానే యున్నది. ఆయన ఎప్పుడు వచ్చునో, ఎట్లు వచ్చునో మనకు తెలియదు, కాని ఆయన వచ్చుచున్నాడని మనకు తెలియును, చూచారా. ఆ విధముగానే ఈ చివరి దినము కొరకే అన్ని దేవుని మర్మములు ఎదురు చూచుచున్నవి. అది పూర్తిగా అయిన తరువాత దానిని ఆయన బయలుపరచును. ఆయన తానుచేసిన దానిని చూపించును. ఎన్నడూ ఆయన తన మర్మమును పూర్తిగా వివరించలేదు.
ఏడు ముద్రలతో దీనిని పోల్చి చూడండి. మొదటి సంఘ రాక కొరకు దేవుడు మార్టిన్ లూధరును వాడుకొనెను. (సంఘ కాలము) ఆయన జాన్వెస్లీని వాడుకొనెను. ఆయన వారిని క్రమ ప్రకారము తీసికొని వచ్చి వారి వారి సంఘ కాలములలో బయలుపరచెను. ఎవరైనా గాని బైబిలు యొద్దకు వెళ్ళి దానిని కనుగొనగలరు.
అది అంత గొప్ప సంగతిగా ఉండుటకు కారణము ఆయన దానిని గూర్చి ఇక్కడ చెప్పి ఏడు ఉరుములను చూపించుటయే
111లైఫ్ పత్రిక మేఘపు వెలుగు యొక్క వత్తమును ప్రచురించినది. ఇంకా వారు దానిని అర్థము చేసికొనలేక పోయిరి. వెళ్ళి ఆ మర్మములు బయలుపడు వరకు కనిపెట్టుము అని చెప్పెను. అది కొన్ని నెలలకు జరుగుటకు ముందే చెప్పెను. ఆ తరువాత అది ఆయన ఏ విధంగా జరుగునని చెప్పెనో అక్షరాలా ఆ విధంగానే జరిగెను.
ఆ పటమును మీరు గమనించారా? కుడి ప్రక్కను దూత యున్నది. ఆయన యదార్థముగానే దిగివచ్చెను. ఆయనకు రెక్కలున్నవి. తల ప్రక్కకు చూచుచున్నది. అది ఆ పటములోనే యున్నది. అది జరుగుటకు కొన్ని నెలల ముందే అది కనబడెను. పతనమై పోయినవారిని కూడా సంపాదించి సమకూర్చబడిన విశ్వాసుల శరీరమును తిరిగి తెచ్చి బయలుపరచుటకై ఆయన వచ్చుచున్నాడని చెప్పబడింది.
112లూధరు వచ్చెను. అతడు నీతీకరణమును మాత్రము బోధించెను. అది కాలమును దంచివేసినది ఆ కాలమేమిటో అతడెరుగడు. తరువాత వెస్లీ వచ్చెను. అతని కాలములో అతడు దంచివేసెను, చూచారా. దానిలో నుండి ఎన్నో అబద్ధ బోధలు పుట్టెను. ఇతర సంఘములు లేచినవి. ఇక్కడ పెంతెకొస్తు వచ్చినది దంచివేసినది. వారును సంస్థగా మారి చనిపోయిరి. (కొద్ది నిమిషములలో దానిని చూద్దాం) - మరల మరణమే ప్రాప్తించెను.
ఈ మర్మము లన్నింటినీ ఆయన బయలుపరచెను. అందుకు ప్రత్యక్షత వచ్చినది. ఈ చిన్న చిన్న సిద్దాంతములు చూడండి. లూధర బోధ వినండి. వెస్లీ బోధ వినండి. ఇంకా పెంతెకొస్తు, తదితరుల బోధవినండి. అందరును సంస్థగా మారి, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ బాప్తిస్మమునే తీసికొనివచ్చిరి. వారికి తేడా తెలియలేదు. చివరి దినములలో ఈ మర్మములన్నియూ బయలుపరచబడును. ఎందువలన? దేవుడు తన హృదయములో దాచి యుంచిన గొప్ప మర్మము ఈ చివరి దినములలోనే ప్రత్యక్షపరచబడును.
113దానిని మీరు గ్రహించారా? మీరు గ్రహించనిచో మరల ఈ టేప్ యొద్దకు రండి! ఎంత కాలము నేను మీతో ఉందునో నాకు తెలియదు. ఇది యెహోవా సెలవిచ్చుచున్న సత్యమని మరచిపోవద్దు. ఇది సత్యము. ఇది లేఖనము.
చివరి ఏడు ముద్రలలోని మర్మములను ఇవి పోలియున్నవి. ముద్రలు విప్పబడినవి. ప్రతి సంఘకాలము వచ్చినది. ఎన్నో చెదరియున్న మర్మములున్నవి. అది చెదరి పోవలెననునది దేవుని ఇష్టము కాదు. ఆయన వచ్చి ఆ చెదరిన బోధలను మరల ఏరి వాటిని ఆదినుండియూ బయలుపరచును. సంఘమును గూర్చిన మూడు ఉద్దేశ్యములు ఆయన ఎట్లు కలిగి యున్నాడో ఇప్పుడు క్రీస్తు యొక్క మర్మమును ఆయన బయలుపరచును. బయలు పరచిన విధముగానే వాటిని ఏరి పూర్తి కార్యమును అది బయలుపరచబడును గాక!
MATT 16:13•
MARK 8:27•
LUKE 9:18
114ప్రత్యక్షత అనగా, "బయలుపరచుట" అని వెబ్‌స్టర్ నిఘంటువులో యున్నది. ప్రత్యక్షత అనగా దైవ సత్యము అనియు వ్రాసెను. క్రీస్తు తన్నుతాను తన సంఘమునకు బయలుపరచుకొనుటయే క్రీస్తు విధానంలోని ప్రత్యక్షత.
ఇప్పుడు ఎవరైనా నన్ను ప్రశ్నించవచ్చును. చూడండి ఆయన పేతురుకు తెలియచేసికొనెను. మీరు చదువుడి. (వ్రాసికొనండి): మత్తయి 16:15,17. దానిని చెప్పెదను. "మనుష్య కుమారుడనగు నన్ను ఎవరని జనులు చెప్పుకొనుచున్నారు?" అని ఆయన అడిగెను.
MATT 16:14,15•
MARK 8:27,28•
LUKE 9:19,20
115"నీవు ఏలియావని కొందరు, ప్రవక్తలలో ఒకనివని కొందరు, యిర్మీయావని కొందరు చెప్పుకొనుచున్నారు."
కాని ఆయన దానిని అడుగలేదు. నేనెవరినని ఇప్పుడు మీరు తలంచుచున్నారు? అని ఆయన అడిగెను. ఆయన సంఘముతో మాట్లాడుచున్నాడు. చూచారా? "నేనెవరినని చెప్పుకొనుచున్నారు"?
ఈనాడు "ఆయన వేదాంతియని చెప్పుకొనుచున్నారు. ఇది సామాజిక మతమనుకొనుచున్నారు. ఆయన మంచి మనిషి అనుచున్నారు. ఆయన బోధసత్యమని మనము నమ్మవలెనని చెప్పుచున్నారు. దానిని జీవించుట కష్టమని కొందరు చెప్పుచున్నారు. దానిని పాటించినచో మనము మంచి వారమగుదుమని కొందరు చెప్పుచున్నారు. మనకు సంఘములు ఉండుట మంచిదే అనుచున్నారు." శాంతి క్లాస్ కథవలె అదియున్నది.
ఏదో ఒక సంఘము దానిని మనము వ్యక్తము చేయుట కాదు. అది నీతో జీవించు జీవితము కాదు. ఆయన నీ లోనికి వచ్చి జీవించును. మానవ జ్ఞానముతో గ్రహించలేని విధముగా నీవు ఒక ఖైదీవి అగుదువు. నీవు ఆత్మచేత నడిపించబడుదువు. నీ కెట్లు తెలియును?
JOHN 1:1
116"నా మతిపోయినట్లున్నదని" నీవు చెప్ప వచ్చును. ఒక వేళ మతిపోయిన వ్యక్తి ఆలాగు చేయ వచ్చును. కాని నీవు క్రీస్తు మనస్సు కలిగి యున్నప్పుడు నీ ద్వారా క్రీస్తు బయలుపడును. అది ఆయనయే అని చూపించుచున్నది. నీవు నీ మతి పోగొట్టుకొనలేదని అందువలన తెలియును. కొందరు జనులు భ్రమవలన పిచ్చివారగుచున్నారు. అది తప్పు. అది దయ్యపు పని. అసలయినది పొందకుండానే అనుకరణ చేయించుచున్నది. అది ఒక నకిలీ, చూచారా. కాని ఒక నిజ వ్యక్తి తన స్వంత ఆలోచనలను, యోచనను పోగొట్టుకొనును, అనగా గ్రుడ్డిగా అలాగు చేయడు. నీ సరయిన జ్ఞానమునే వాడుదువు. క్రీస్తు నిన్ను తీసికొని నీ ద్వారా ఆయన బయటకు వచ్చును. లోకమునకు నీవు పిచ్చి వానిగా కనబడుదువు. నీవు పిచ్చివానివయితే, నిజంగా పిచ్చివానివగుదువు. అప్పుడు దయ్యము నిన్ను పూర్తిగా వశపరచుకొనలేదు. అపవాది వాక్యమునకు విరోధంగా నిన్ను చేయుటకు నడిపించును. కానీ క్రీస్తు నిన్ను స్వాధీనము చేసికొనినప్పుడు నీ ద్వారా ఆయన తన వాక్యమును వెల్లడి చేయును, ఎందుకనగా ఆయన వాక్యమై యున్నాడు! అప్పుడు నీవు క్రీస్తు యొక్క ప్రత్యక్షతను చూడగలవు. ఏదో ఒక విధమగు భ్రమ కాదు. కాని నిజముగా క్రీస్తు వచ్చును. నీ ద్వారా ఆయన తన్నుతాను బయలుపరచును. ఎంత చక్కగా యున్నది!
MATT 7:14•
MATT 16:15•
MATT 24:37•
MARK 8:28•
LUKE 9:20•
LUKE 17:26
117ఇప్పుడు చూడండి. నేనెవరినని చెప్పుకొనుచున్నారు? అని ఆయన అడిగెను. పన్నెండు మంది ఉన్న సంఘమును ఆయన అడుగుచున్నాడు. ఆనాడున్న మిలియనుల మందిలో ఆయన తన సంఘమగు పండ్రెండు మందినే ప్రశ్నించెను.
నోవహు దినములలో ఎన్నో మిలియనల మంది యుండిననూ ఎనిమిది మందిని ఆయన ప్రశ్నించెను, చూచారా. ఆయనిట్లు చెప్పెను, "నోవహు దినములలో ఉండినట్లుగానే మనుష్య కుమారుని రాకడలోను ఉండును. (చూచారా?) ఎనిమిది ఆత్మలు రక్షించబడెను. ఎనిమిది మంది మాత్రమే రక్షించబడుదురని నేను చెప్పుట లేదు, అది తప్పు. నేనెన్నడూ ఆ విధంగా చెప్పను. ఎత్తబడు ఆ చిన్న గుంపులో ఎందరుందురో నేను చెప్పలేను. కాని అది ఒక చిన్న గుంపు" అని మాత్రము చెప్పగలను. ఏలయనగా "ఆ ద్వారము ఇరుకుగాను, ఆ త్రోవ సన్నగాను యున్నది. దానిని కనుగొనువారు కొందరే."
COL 2:9•
REV 7:9
118అన్ని కాలములలోను రక్షించబడిన విశ్వాసులు ఒక క్రయధనమిచ్చి విమోచించబడిన శరీరముగా అక్కడ ఉందురు. ఒక గొప్ప సమూహముగా కూడుదురు. "ప్రకటన 7" దానిని బయలు పరచుచున్నది: ఏ మనుష్యుడూ లెక్కింపజాలని గొప్ప సమూహము. అన్ని యుగముల లోనివారు కూడియుందురు. వారికి బయలుపరచబడినంత బైబిలు వెలుగులో వారు నడిచిరి. లూధరు కంటె ఎక్కువ వెలుగు వెస్లీకి కలదు. వెస్లీ కంటె పెంతెకొస్తు వారికి ఎక్కువ వెలుగు ఉండెను. చూచారా? ప్రవక్తల కాలము నుండి అది మరింత ఎక్కువ అయి చివరకు క్రీస్తు శరీరమందు దైవత్వము సంపూర్తియైనది.
సంఘములో నున్న క్రీస్తు తెలియచేబడెను. దేవుని యొక్క ప్రత్యక్షతలో ఉన్న పూర్తి విషయం ఏమనగా హవ్వను తిరిగి యధా స్థానములో ఆమె భర్తతో (గమనించండి) కూడా కూర్చొన నిచ్చుట, మరియు దేవుడు సంఘమునకు భర్త, మరియు సంఘము ఆయన యొక్క వధువు.
MATT 16:16-18•
MARK 8:28•
LUKE 9:20
119"నీవు సజీవుడగు దేవుని కుమారుడవగు క్రీస్తువు" అని పేతురు చెప్పెను.
ఇపుడు చూడండి! "సీమోను బర్యో-యోనా నీవు ధన్యుడవు! (యోనా కుమారుడని దానికి అర్థము, చూచారా?) — నీవు ధన్యుడవు. రక్తమాంసములు దీనిని నీకు బయలు పరచలేదు గాని పరలోకమందున్న నా తండ్రియే దీనిని నీకు బయలుపరచెను." (ఏదో స్కూలు నుండి దీనిని నీవు నేర్చుకొనలేదు) చూడండి! ఆయన ఇట్లు చెప్పెను. నీవు పేతురువు. దేవుని యొక్క ముందు నిర్ణయించబడిన బీజముగా ఉన్నావు. ఈ వెలుగును నీవు చేర్చుకొన్నావు. పరలోక రాజ్యపు తాళపు చెవులు నీకిచ్చియున్నాను. యేసుక్రీస్తు ఎవరో అను ఈ ప్రత్యక్షత మీద, "ఈ బండమీద, నేను నా సంఘమును కట్టుదును." దాని యెదుట పాతాళ లోకద్వారములు నిలువజాలవు. తండ్రి, కుమార, పరిశుద్దాత్మ అను బండ మీద కాదు, ఆయన రెండవ వ్యక్తి కాడు. (చూచారా?) "బండ మీద నా సంఘమును కట్టుదును, పాతళలోక ద్వారములు దానిని కదిలించలేవు." దానికి వ్యతిరేకమైన అధికారాన్ని కలిగియుండలేవు. "యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షత అను బండ మీద ఆయన తన సంఘమును నిర్మించును."
JOHN 1:1•
COL 1:27
120చూడు! నీలో నున్న క్రీస్తే ఆ ప్రత్యక్షతా జీవమునకు కేంద్రము చూచారా. నీలో నున్న క్రీస్తు జీవము ఆ ప్రతక్షతకు కేంద్రముగా ఆయనను చేసినది. బైబిలులో నున్న క్రీస్తు బైబిలును ఒక పూర్తి క్రీస్తు ప్రత్యక్షతగా చేయుచున్నాడు. నీలో నున్న క్రీస్తే సమస్తమునకు సంపూర్ణ ప్రత్యక్షతగా నిన్ను చేయుచున్నాడు. దేవుడేమి చేయ ప్రయత్నించుచున్నాడో నీవు చూచుచున్నావా?
"నూతన జన్మ అనగా ఏమిటి? నూతన జన్మ అనగా ఏమిటి బ్రెన్‌హాం సోదరుడా"? అని నీవడుగుదువు. అది యేసుక్రీస్తు నీకు వ్యక్తిగతముగా ప్రత్యక్షమగుటయే. ఆమేన్! చూచారా? ఒక సంఘములో చేరుట కాదు. కరచాలనము చేయుట కాదు, నీవు ఇంకేదో వ్యత్యాసమైన దానిని చేయుట కాదు. నీవు ఒక సంఘ క్రమము పలికావు. క్రీస్తుకు బైబిలుకు సంబంధించినవి కాని కొన్ని నియమములకు లోబడి జీవించెదనని వాగ్ధానము చేశావు. నీకు బయలుపరచబడిన వాక్యమే ఆయన ఎవరేమి చెప్పినా గాని ఏమి జరిగినా గాని అది క్రీస్తే. పాస్టరు, యాజకుడు, మరెవరయినా గాని — అది నీలో ఉన్న క్రీస్తే. ఆ ప్రత్యక్షతపైనే సంఘము కట్టబడియున్నది.
JOHN 1:1•
ROM 8:3
121"నేను లూధరనను"; "నేను బాప్టిస్టును"; "నేను ప్రెస్బిటేరియనను," అని నీవందువు. దాని వలన దేవుడు ఏమి చలించడు. దేవునికది అక్కర లేదు. ఏమిటిది? క్రీస్తే బయలుపరచబడుటయై యున్నది. ఆయన వాక్యమై యున్నాడు. వాక్యము ప్రత్యక్ష పరచబడినప్పుడు దానికదే వ్యక్తమగును, చూచారా. యేసుక్రీస్తు పట్ల దేవుని ఉద్దేశ్యము అదే. తన్నుతాను ఆయన వ్యక్తపరచుకొనును. తన స్వంత ధర్మశాస్త్రమును తీసికొని దాని ద్వారా జీవించును. మరణము ద్వారా ఆయన తన ధర్మశాస్త్రమును నెరవేరును. ఒక మహిమ కరమగు వధువును ఆయన కొరకు తెచ్చుటకు తిరిగి విమోచించుటకు, దానిని త్రోసివేయక, కేవలము దేవుని వాక్యమునే నమ్ముటకు హవ్వ వలె మానవజ్ఞానమును నమ్మకుండుటకు శరీరమందున్న పాపమును శిక్షించుటకు దేవుడగు క్రీస్తు శరీరమందు చనిపోయెను. మీరు గమనించారా?
అది క్రీస్తు యొక్క ఉద్దేశ్యము. అది దేవుని యొక్క ఉద్దేశ్యము. క్రొత్త జన్మ దానిని బయలుపరచును.
MATT 24:35•
MARK 13:31•
MARK 16:17•
LUKE 21:33
122ఒక వ్యక్తి తిరిగి జన్మించి యున్నానని చెప్పి ఈ చివరి దినములలోని దేవుని వాగ్దానములను ఈ చివరి దినమునకు చెందినది కాక మరొక కాలమునకు చెందినవని చెప్పినయెడల అతడు సాతాను వలన భ్రమపరచబడెనని గ్రహించదగును. క్రీస్తును నిన్నటి వానిగా చేయునుగాని నేటి వానిగా చేయడు. దానిని నమ్ముచున్నానని చెప్పి తన ద్వారా బయలుపరచకపోతే , మార్కు 16లో యేసు ఇట్లు చెప్పెను, "నమ్ము వారి వలన ఈ సూచక క్రియలు కనబడును." "సర్వ లోకములోను, ప్రతి కాలములోను అవి కనబడును." దయ్యములను వెళ్ళగొట్టుదురు. అన్యభాషలు మాట్లాడెదరు. ఈ గొప్ప వరములు, ప్రత్యక్షతలు అతనిలో కనబడును. వారు చేయకపోవచ్చు, కానీ చేయగలరు. "భూమ్యాకాశములు గతించినా గాని ఆయన మాట గతించదు."
ACTS 4:13
123ఆ విధముగా క్రీస్తు ఒకనిలో తన్నుతాను బయలుపరచుకొనును. అతడు జ్ఞాని అయినా, అ,ఆ లు రానివాడయినా సరేకావచ్చును. సగం మంది అపోస్తలులు విద్యలేని వారు. కాని వారు క్రీస్తును ఎరుగుదురు! పేతురు, యోహానులు ఏ సెమినారీకి వెళ్ళలేదు గనుక జనులు వారి మాటలు వినరు. అయితే ఆ గుమ్మము యొద్ద కుంటి వానిని వారు స్వస్థపరచినప్పుడు వారు క్రీస్తుతో ఉండిన వారని వారు గమనించి వారి మాటలు వినిరి. వారు క్రీస్తుతో ఉన్నవారని ఎరిగిరి.
124నూతనజన్మ అనగా క్రీస్తు — అది ఒక ప్రత్యక్షత. దేవుడు నీకు ఈ గొప్ప మర్మము బయలుపరచెను. అదియే నూతన జన్మ. ఎక్కడైతే ప్రత్యక్షత పరిపూర్ణముగా పొందుపరచబడి తాను చేసినటువంటి అవే క్రియలు, అవే కార్యములు ద్వారా దేవుడు వ్యక్తపరచే వాక్యమును బయలుపరి, ఏ ఆ గొప్ప సమూహములో చేరినప్పుడు, నీవేమి చేయబోతున్నావు? ఓ! సంఘము దాని స్థానము ఎరుగవలసి యున్నది! ఒక దినమున అది ఎరుగును సంఘము తన స్థానమును గుర్తించినప్పుడు ఎత్తబాటు జరుగును.
ఇపుడు చూడండి! "బ్రెన్‌హాం సోదరుడా! అదేమిటి? అని నీవనవచ్చును." ఓ! అది సత్యము.
MATT 16:17,18
125మీరు గమనించారా? పౌలు శారీరకంగా యేసును ఎన్నడూ ఎరుగడు. పౌలు ఆయనను ఎరుగడు. ఒక దర్శనము, ఒక ప్రత్యక్షత ద్వారా మాత్రమే ఆయనను అతడెరుగును. నిజమేనా? పేతురు వలె పౌలు కూడా ఒక ప్రత్యక్షతవల్లనే యేసును ఎరుగును.
పేతురు ఆయనను శరీర రీతిగా చూచెను, కాని శరీరము వలన అతడు ఎరుగలేదు. యేసు చెప్పెను, "రక్తమాంసములు దానిని నీకు బయలుపరచ లేదు. నా స్వంత జీవితము కూడా దానిని నీకు బయలుపరచలేదు, కాని పరలోకమందున్న నా తండ్రియే దానిని బయలుపరచెను. ఆయన దేవుని వాక్యమైయున్నాడు. ఈ బండ మీద నా సంఘమును కట్టుదును. శరీరము ద్వారా పేతురు ఆయనను తెలిసికొనలేదు."
మనుష్యులు ఆయనను తాకిరి మరియు ఆయనతో నడిచిరి.
ACTS 9:5•
HEB 13:8
126అపోస్తలులకంటె పౌలు గొప్ప అనుభవము పొందెను, చూచారా. వారిట్లనిరి, పౌలా, నీ కంటె మేము గొప్ప ప్రత్యక్షతను పొందితిమి. నీకు తెలియునా? నేను ఆయనతో నడిచాను. ఒక రోజున ఆయనతో నేను చేపలు పట్టాను. ఆయన మాట్లాడుట విన్నాను. నాతో కూడా ఆయన ఒక దోనేలో కూర్చొనెను. ఆయన చూపించిన స్థలమునకు వెళ్ళి విస్తారముగా చేపలు పట్టితిమి. మేము ఈ కార్యములు చేసితిమి చూడు! ఆయన క్రియలు మేము కళ్ళారా చూచాము."
కాని ఆయన మృతి పొంది, సమాధి చేయబడి, తిరిగి లేచిన తరువాత పౌలు ఆయనను చూచెను. ఇశ్రాయేలీయులను నడిపించిన అగ్నిస్తంభములో ఆయన ప్రత్యక్షమగుట అతడు చూచెను. యూదుడగు పౌలు దానిని చూచి "ప్రభువా" అని పిలువ లేదు, కాని అతడు అక్కడ నిన్న, నేడు, నిరంతరం, ఏకరీతిగాయున్న వాని బయలుపాటును చూచెను. "నిన్న ఉన్న దేవుడను నేనే. మండుచున్న పొదలో మోషేతో మాట్లాడినట్లే అదే వెలుగు. అదే అగ్ని స్తంభములో నేను వచ్చి యున్నాను" అని ఆయన చెప్పెను. హెబ్రీ పత్రికలో ధర్మశాస్త్రమును, కృపను ఆయన వేరుచేయుటలో ఆశ్చర్యము లేదు. అదే అగ్ని స్తంభమును అతడు కలిసికొనెను. "నీవు హింసించుచున్న యేసును నేనే," అనెను.
JOHN 1:1•
ROM 16:25•
EPH 5:32•
COL 2:2•
REV 10:7
127ఈనాడును ఆయన అదే రీతిగా యున్నాడు. అదే అగ్ని స్తంభము ఆయనను వ్యక్తపరచుచున్నది. అదే రీతిగా ఆయన బయలుపరచు కొనుచున్నాడు. జగత్తు పునాది వేయబడక ముందు నుండి దాగి యున్న దేవుని మర్మమును బయలుపరచుచున్నాడు. దానిని చూడుము!
ప్రత్యక్షత ద్వారా మాత్రమే పౌలు ఆయనను ఎరిగెను. పేతురు ఆయనను ప్రత్యక్షత ద్వారానే ఎరిగెను. అతడు ఆయనతో నడిచెను. ఆయనతో మాట్లాడెను. ఆయన వాక్యమై యున్నాడని మీతో నేను చెప్పితిని. ఒక పండితుడు కూర్చొని దానిని చదివిన యెడల అతని మనస్సు అతనికిష్టానుసారమగు రీతిలో నీ మనసును త్రిప్పును; ఎందుకనగా అతడు జ్ఞాని, మేధావి. ఒక కాతలిక్కు మత గురువును గాని బైబిలు యందు అంతగా శిక్షణ పొందిన వేదాంతిని గాని, బాప్టిస్టు, ప్రెస్బిటేరియను మొదలగు వారినెవరినయినా గాని తీసికొనండి. నీకేమీ తెలియదన్నట్లుగా నీవు ఆలోచించునట్లు చేయును. ఎందువలనో ఎరుగుదురా? ఎందుకనగా, శరీరరీత్యా ఆయనను, అనగా వాక్యమును అతడు ఎరుగును.
MATT 16:17,18
128కాని ఆయనను నీవు ప్రత్యక్షత ద్వారా ఎరిగినప్పుడు మాత్రమే రక్షించబడుదువు. నేను ప్రెస్బిటేరియను సిద్దాంతము తీసికొని పెంతెకొస్తు వారిని బంధించ గలను. బాప్టిస్టు సిద్దాంతము తీసికొని పెంతెకొస్తు వారిని ఏమి తెలియనివారిగా తేల్చి చూపగలను. కాని అది కాదు; అది ఆయన సంఘము కాదు. ఆయన తన్నుతాను ప్రత్యక్ష పరచుకొన్నదే ఆయన సంఘము. ఆమేన్! దానిని మీరు చూచారా? ఆయనే దేవుడని వాక్యము ద్వారా బయలుపరచబడినది.
GEN 4:3•
JOHN 1:1
129"తండ్రి, కుమారుడు, పరిశుద్దాత్మ" అని చెప్పి ఎట్లు నీవు బాప్తిస్మము ఇయ్యగలవు? అది అన్యుల బోధ. తండ్రి, కుమార, పరిశుద్దాత్మ నామములో ఎన్నడూ ఎవరూ బాప్తిస్మము పొందినట్లుగా బైబిలులో ఒక్క లేఖనము కూడా లేదు. ఆలాగు చేయుచున్న నీవు యేసు క్రీస్తును ఎరుగుదునని ఎట్లు చెప్పగలవు? (ఆయనే వాక్యము.)
యేసు మాత్రమే అనువారున్నారు, కేవలము బాప్తిస్మమునకు మాత్రము వారు యేసు నామము ఉపయోగించెదరు. నాకు వ్యక్తిగతంగా నలుగురు లేదా అయిదుగురు యేసు మాత్రమే అను గుంపు వారితో పరిచయమున్నది. మీ శాఖ మిమ్మును ఎక్కడికి నడిపించుచున్నదో చూడండి? అది చీకటి. కయీను బోధ, రక్తమునకు బదులుగా అతడు ఫలములు తెచ్చెను.
JOHN 1:1•
EPH 3:3
130కాని ప్రత్యక్షత యేసుక్రీస్తు రక్తము వలన వచ్చినది. ఆయనే దేవుని యొక్క రక్తము. మరియు గర్భములో రక్తము సజింపబడెను.
పౌలు ప్రత్యక్షత ద్వారానే ఆయనను ఎరిగెను. ఈనాడు ఆయనను మనమును ఆలానే ఎరుగుదుము. ఆయనను తెలిసికొనుటకు అది ఒక్కటే మార్గము. "నేను మెతడిస్టును" అని చెప్పవద్దు. అందువలన లాభము లేదు. "నేను బాప్టిస్టును," అందువలన లాభము లేదు. "నేను కాతలిక్కును," అందువలన లాభము లేదు. కాని దేవుడు తన ప్రత్యక్షత ద్వారానే నీకు ఆ వాక్యమును బయలుపరచెను. ఆయనే వాక్యము. నీకు అది బయలుపరచబడెనని ఎట్లు ఎరుగుదువు? అది దానంతట అది జీవించి, నీ ద్వారా వ్యక్తపరచుకొనును.
ఆ గొప్ప ప్రత్యక్షతను సంఘములు ఎప్పుడో మరచిపోయినవి. ఇది నిజము. సత్యము యొక్క ప్రత్యక్షతను అవి మరచిపోయినవి. లూధరు ఒక గొప్పవానిగా లేచెను. ఆనాటి ప్రత్యక్షత అతనికి ఉన్నది. కాని ఏమి జరిగినది? కొందరు గుంపుగా చేరి ఆ బోధను నానా విధములుగా మార్చ వేసిరి. (ఈనాడు అట్టి వారిని మనము రికీస్ అనుచున్నాము.)
GEN 17:5,15•
ACTS 13:9
131బైబిలులోని సంఖ్యాశాస్త్రము మీకు తెలిసినయెడల అది తెలియును. ఎల్విస్, రిక్కీ అనునవి లేఖన పూర్వకముగా ఏమిటని ఎరుగుదురు. (నీ పేరు) ఈ చివరి దినములలోని జనులకు అట్టి విధములగు పేరులే వచ్చునని యేసు చెప్పెను. అబ్రాము పేరును అబ్రహాము గాను, శారయి పేరును శారాగాను ఆయన ఎందుకు మార్చెను? సౌలును పౌలుగా ఎందుకు మార్చెను? సీమోనును పేతురుగా ఎందుకు మార్చెను? చూచారా? నిశ్చయంగా అందులో ఏదో యున్నది. ఈ దినము వరకు ఆ పేరును పలుకజాలము. ఆ కారణము చేతనే నేడు ఈ భూమి మీద అట్టి నరకపూరితమగు నామములున్నవి. అందుకు ఈ క్రియలే కారణము. మొత్తం మానవ జాతి చెడిపోయినది. దాని పని అయిపోయినది, చూచారా. అందుకే ఇది ఇట్లున్నది.
EXOD 14:22•
NUM 14:23,33
132ఇపుడు చూడండి. ఆ దినమున లూధరు బోధ సరిపోయినది. అతనికి ప్రత్యక్షత యున్నది, కాని అతడు వెళ్ళిపోయిన వెంటనే వారేమి చేసిరో చూడండి. వెస్లీకి ఒక వర్తమానము ఉండెను; అదేమి చేసెనో చూడుము, వారేమి చేసిరో ఆ మొదటి కాలపు పెంతెకొస్తు వారిని చూడండి. ఇశ్రాయేలీయులకు అగ్ని స్తంభము, ప్రవక్త ఒక బలి పంపబడినట్లే వీరికి కృప పంపబడెను. వారి మధ్య ఆయన కనబడెను. ఐగుప్తు నుండి, ఎర్ర సముద్రము నుండి వారిని బయటకు తెచ్చెను. వారికి గొప్ప పదవులు కావలసి వచ్చినవి గనుక ధర్మశాస్త్రమును కోరుకొనిరి. దానితో వారు ఏదో చేయవలెనని తలంచిరి. వారేమి చేసిరి? వారు అరణ్యములో నలువది ఏండ్లు త్రోవ తప్పి తిరిగిరి. వారి ఏ సంస్థ కూడా అక్కడికి చేరలేకపోయెను.
EXOD 13:21•
NUM 13:30•
NUM 14:35•
JOHN 6:31,48,49,51
133కాలేబు, యెహోషువాలు ఇద్దరు మాత్రమే అక్కడ నిలబడి, "మనము దానిని జయించగలము," అని చెప్పిరి. వాక్యము వైపు చూడు వారిలో ప్రతి ఒక్కరు అరణ్యములో చనిపోయిరి. వారు నిత్యముగా గతించిరి అని యేసు చెప్పెను. లూధర్, వెస్లీ తదితరుల కాలములో చూపినట్లుగానే ఆయన వారి కాలములో తన దీవెనలను, బలమును వారికి చూపించెను. లేదా?
"మా పితరులు అరణ్యములో మన్నాను తినిరి" అని చెప్పిరి.
"వారందరూ చనిపోయిరి" అని ఆయన పలికెను. వారు నిత్యముగా గతించిరి. దేవుని నుండి వేరయిరి. వారి శవములు అరణ్యములోనే కుళ్ళిపోయినవి. చూచారా? వారు చనిపోయిరి. "పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారమును నేనే" అని ఆయన చెప్పెను గాని, వారు గ్రహించలేకపోయిరి. దానిని వారు చూడజాలక పోయిరి.
MARK 16:15
134మంచిది, సంఘము దానిని ఎప్పుడో మరచిపోయినది. వారు జ్ఞానముతో నిండిన వర్తమానమును, జ్ఞానులను, సభ్యత్వమును, వాక్య సత్యపు ప్రత్యక్షతకు బదులుగా తెలివితో కూడిన వర్తమానమును అంగీకరించిరి.
ఇప్పుడు ఇటు చూడండి. నేడు వారీలాగు చెప్పుచున్నారు, "దేవుడు మమ్మును సర్వలోకమునకు వెళ్ళి రోగులను బాగుచేసి, సువార్తను ప్రకటించి, దయ్యములను వెళ్ళగొట్టమని ఆజ్ఞాపించియున్నాడు" అని నీవు నమ్ముచున్నావా? "
" ఓ! అది నిజమేనని నేననుకొనుచున్నాను, కాని…" చూచారా?
135"ఒక నాడు ఒకామె నాతో మాట్లాడుతూ, సంఘములన్నియూ ఐక్యతగా ఉండుట మంచిది అన్నది."
ఏ ఒక్కటి మరో దానితో కలిసియుండలేదు అన్నాను. అక్కడ ఒక కాతలిక్కు నిలబడియున్నాడు. అతనిని నేను అడిగాను, "నీ సంగతి ఏమిటి? నీవు మెతడిస్టువు, అతడు కాతలిక్కు, మీరు ఒకరితో ఒకరు కలిసి పోగలరా?" "ఈ పోపు వీరినందరినీ కలుపవలెనని ప్రయత్నము చేయుచున్నాడు. అటువంటి రకమగు జనులందరికి అది మంచి పనిగానే కనబడును, కాని దేవుని సంఘమునకు దానితో పనిలేదు" అని చెప్పాను. అది ఈ సముదాయమునకు బయట ఉండును. దానిని నీవు వారితో ఏకము చేయజాలవు. ఒకరు ఒకటి, మరొకరు ఇంకొకటి నమ్ముదురు. మెతడిస్టులు చిలకరించెదరు; బాప్టిస్టులు ముంచెదరు — వారిద్దరూ పరిశుద్ధాత్మ యొక్క సంపూర్ణ శక్తిని తిరస్కరించెదరు.
"మేము నమ్మినప్పుడే పరిశుద్దాత్మను పొందితిమి" అని వారందురు.
MATT 24:35•
MARK 13:31•
MARK 16:17•
LUKE 21:33•
JOHN 14:12•
ACTS 19:2
136"మీరు నమ్మినప్పటి నుండి పరిశుద్దాత్మను పొందితిరా?" అని బైబిలులో ప్రశ్నించబడెను. పుట్టినది మేము దీనిని చేసాము అని వారందురు. మేము బైబిలు మీద ఆధారపడియున్నాము అని మెతడిస్టు వారందురు. నమ్మిన వారివలన ఈ సూచన క్రియలు కనబడును" అని యేసు చెప్పెను. అయితే అది ఎక్కడున్నది? "నేను చేయు క్రియలు మీరును చేయుదురు. ఆయన యందు విశ్వాసముంచిన ప్రతి వారు చేయుదురు." అది ఎక్కడున్నది? ఆయన మాటలలోనే! "భూమ్యాకాశములు గతించును గాని, నా మాటలేమాత్రమును గతించవు." ఇపుడది ఎక్కడున్నది? చూచారా?
ఇది దీనిని చూపించుచున్నది…
137అది ఏమిటి? సంకరపు స్థితిని చూపుచున్నది. ఇటు చూడండి! సంకరము చేసిన గింజలను చూడండి. అవి చాలా పెద్దగా, అందంగా యుండును. కాని దానిని మీరు నాటండి. ఏమి వచ్చును? ఒక చిన్న మొలకపైకి వచ్చి పసుపుగా మారి ఎండిపోవును. ప్రతి శాఖ కూడా అలాగే యున్నది. దేవుని వాక్యముతో మానవ మాటలు కలుపుచున్నారు. అది సంకరమగుచున్నది. అద్భుతములు, సూచక క్రియల వరకు వచ్చి దేవుని వాక్యము నమ్ముటను గూర్చి యేసు ఏమి చెప్పెననగా పసుపుగా మారి, "దానిని మేము అంగీకరించము" అని చెప్పుదరు. వెనక్కు పోయెదరు.
NUM 13:30,33
138కానాను వేగు చూచుటకు వెళ్ళిన వారు ఆలాగే యున్నారు. వారు చూచి వచ్చి ఇట్లనిరి, "ఓ! వారి ముందు మేము మిడుతల వలె కనిపించాము. వారిని జయించలేము. అమాలేకీయులు గొప్పవారు! అని చెప్పి వెనుదిరిగిరి." దేవుని వాక్యమును నమ్మి ఆదేశమును నేను మీకిచ్చెదను అని దేవుడు చెప్పాడని ఎరిగియుండి యెహోషువా, కాలేబులు ఇట్లనిరి, "దానిని జయింప గలుగుట కంటే ఎక్కువైన శక్తి మనకు కలదు."
నీ పుట్టుక మీదనే అది ఆధారపడి యుండును. దేవుని వాక్య మూలముగా నీవు జన్మించినట్లయితే, దేవుని వాక్యమునకే తన సంఘములో ప్రాధాన్యత లభించును. అందుకొరకే ఆయన చనిపోయెను. "ఆయన తన సంఘములో తనకు ప్రాధాన్యత ఉండవలెననియే ఆయన ఉద్దేశ్యం." ఏది ఏ విధంగా కనిపించినా గాని మొదట దేవుని వాక్యమును ప్రకాశింపనియ్యుము. తెలివిగల వారి మాటలను నేను లెక్క చేయను. వారితో మనకు పని లేదు. "దేవుని వాక్యము" చెప్పెను గనుక మనము జయించెదము.
"నా సంఘములో ఆలాగు బోధించినట్లయితే, ఆ నాలుగు స్తంభములే మిగులునని" ఒక వ్యక్తి నాతో అన్నాడు.
"నేను వాటికే బోధించెదను" అన్నాను. దేవుని వాక్యమాలాగు చెప్పుచున్నది. దానిని మనము చేయగలము. దానిని చేయుమని దేవుడు చెప్పెను. ఆమేన్!
MATT 10:25•
MATT 12:24•
MARK 3:22•
LUKE 11:15•
JOHN 1:1•
HEB 4:12
139ఇక్కడ వారు సాకులు చెప్పుచున్నారు, చూచారా. అందుకే వారు దేవుడు తన్నుతాను ఋజువు చేసుకునే ఈ దినములలోని అంత్యకాల వర్తమానమును చూడలేని గ్రుడ్డివారయిరి. దానిని వారు ఒక విధమగు ఆత్మ లేదా మరో విధంగా పిలచుచున్నారు. ఒక మానసిక భ్రమ అనుచున్నారు. యేసు ఇక్కడుండిన సమయములో వారనిట్లుగానే వీరును దీనిని ఏదోగా చెప్పుకొనుచున్నారు. ఆయనను వారు "బయల్జెబూబు, మాంత్రికుడు" అనిరి. మనస్సులను చదివెడి వాడనిరి. చూచారా? ఆయన అక్కడ నిలబడి జనులను చూచి వారి హృదయములలోని రహస్యములను వివేచించ కలిగెను, బైబిలు ఆలాగు చెప్పుచున్నది. హెబ్రీ 4వ అధ్యాయములో లేదా? "దేవుని వాక్యము సజీవమై, రెండంచుల ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగలదియై మనస్సులోని ఆలోచనలను పరిశోధించి బయటకు తెచ్చును." ఆయనే ఆ వాక్యము. ఒక వ్యక్తిలో ఆ వాక్యము ప్రధమ స్థానము పొందినప్పుడు మరల అదే జరుగును, ఏలయనగా అది వాక్యము. ఆమేన్! ఇక నుండి ఈ విషయంలో తొట్రిల్లవద్దు. ఇది పూర్తిగా తేటగా యున్నది. చూచారా. మంచిది.
MATT 10:25•
MATT 12:24•
MARK 3:22•
LUKE 11:15
140అందుకే వారు గ్రుడ్డివారయిరి. క్రీస్తు భూమి మీద ఉండినప్పటి విధముగానే. ఓ! వారును ఆలాగే సందేహించిరి. "ఆయన బయల్జెబూబు." ఆయన అక్రమంగా పుట్టినవాడు. వింత మనిషి, దయ్యము పట్టినవాడు. అతడు సమరయుడు, మరియు అతనిలో భూతమున్నది. అందుకే అవన్నియూ చేయుచున్నాడు" అనిరి. కాని వారాయన అవన్నియూ చేయ కలుగుట చూచిరి.
MATT 12:31,32•
LUKE 12:10
141"అందుకు మిమ్మును క్షమించెదను" అని యేసు చెప్పెను. (దేవుని వాక్యమును - దేవుని క్రియలను దురాత్మ అని పిలచుట.) అందుకు, "నేను మిమ్మును క్షమించెదను, కాని ఒక దినమున పరిశుద్దాత్మ వచ్చును. దానికి విరోధముగా ఒక్క మాట మాట్లాడిన క్షమాపణ యుండదు. ఈ లోకములో గాని, రాబోవు లోకములో గాని మాట్లాడినా క్షమాపన దొరకు. (ఆ గొప్ప దినమున) చూడండి. అది తేటగా లేఖనములో వ్రాయబడియున్నది; ఆ దినమున చాలా తెలివిగల వారు, గొప్ప సంస్థల వారు వచ్చెదరు. వారిని ఆయన ఖండించును. వారు పరిశుద్దాత్మను దూషించిరి, పరిశుద్ధ గుండ్రాళ్ళు మరియు ఏవేవో అసహ్యకరమగు పేర్లు పెట్టి పిలచిరి. దేవుని సంఘము దానిని ఎప్పుడు భరించుచునే యున్నది.
ACTS 24:14
142పౌలు కూడా అగ్రిప్ప యెదుట ఇట్లు చెప్పెను, "మీరు వెర్రి అని పిలచుచున్న విధానములోనే (పిచ్చి) నేను మన పితరుల దేవున్ని ఆరాధించుచున్నాను."
[టేపు పై ఖాలీ.]… క్రీస్తు యొక్క ఎంత గొప్ప సత్యమిది. అది "ఒక శాఖ" అని నేడు జనులు చెప్పుచున్నారు. ఆయన యేసు క్రీస్తునీలో నూతనజన్మ ఆ ప్రత్యక్షతను ఇచ్చినది. ఆయన తన మాటలను వ్యక్తపరచునట్లుగా మీరు ఆయనకు ప్రాధాన్యత ఇవ్వవలెను. ఈ చివరి దినమునకు ఆయన వాగ్ధానము చేసిన దానిని తాను పనిచేయుచున్న శరీరము ద్వారా నెరవేర్చును. ఆమేన్. అక్షరాలా దేవుని వాక్యము ప్రత్యక్షమయినది.
గమనించండి. మంచిది.
ISA 6:9•
MATT 11:25•
MATT 13:13•
MATT 15:14•
LUKE 6:39
143క్రీస్తు దినములలో యుండినట్లే ఇపుడున్నది. క్రీస్తు ప్రత్యక్షతకు తాళపు చెవిని దేవుడే పట్టుకొనియున్నాడు. దానిని మీరు నమ్ముచున్నారా? వేదాంత పాఠశాలలు దానిని కనుగొనలేవు. మత్తయి 11:25 మరియు 27లో యేసు ఈలాగు చెప్పెను. (మీరు చదువగోరిన యెడల) "జ్ఞానులకు, తెలివిగలవారికి నీవు దీనిని మరుగుచేసి నేర్చుకొను పిల్లలకు బయలుపరచినందుకు పరమందున్న తండ్రియగు దేవునికి వందనములు చెల్లించుచున్నాను." చూచారా?
ఆనాటి పండితులను చూడండి, ఆ యూదులు చక్కని వారు. పరిసయ్యులకు, సద్దూకయ్యులకు, హేరోదీయులు మొదలగు వారందరికీ గొప్ప సంస్థలున్నవి. (చూచారా?) — ఆ గొప్ప సంస్థలను చూచి యేసు ఇట్లనెను, "మీరు గ్రుడ్డివారు, మరల గ్రుడ్ది వారికి త్రోవ చూపుచున్నారు. యెషయా మీ గూర్చి పలికినది సరియే. మీరు చెవులుండియు వినరు, కళ్ళుండియు చూడరు." యెషయా ఆత్మ ద్వారా దీనిని పలికెను. "పరమందున్న దేవుడు మీ నేత్రములకు గ్రుడ్డితనము కలుగ చేసెను. హవ్వ వలె మీరును తెలివిని అంగీకరించుచున్నారు. దేవుని ఆత్మ గూర్చి మీకేమియూ తెలియదు. కాబట్టి నడిపించు వారితో సహా అందరూ గోతిలో పడిరి. గ్రుడ్డివానితో పాటుగా నడిపించువారును పడిరి," ఎందుకనగా "నడిపించువాడును గ్రుడ్దివాడే. గ్రుడ్డివారు గ్రుడ్డి వారికి త్రోవ చూపుచున్నారు. ఇద్దరూ గుంటలో పడుదురు."
MATT 16:13,16-18
144దేవుని చేతిలో మాత్రమే ఆ తాళపు చెవి ఉన్నది.
కొద్దిసేపటి క్రితం నేను ఒక వాక్యము చదివాను. ఆ లేఖనములో ఆయన అదే వ్యక్తపరచెను. "నేనెవరినని" మనుష్యులు చెప్పుకొనుచున్నారు? అని ఆయన అడిగెను. అందుకు పేతురు, "నీవు క్రీస్తువు. సజీవ దేవుని కుమారుడవు" అని చెప్పెను. బర్‌యోనా, సీమోనూ, "నీవు ధన్యుడవు, రక్తమాంసములు దీనిని నీకు బయలుపరచ లేదు గాని పరలోకమందున్న నా తండ్రి దీనిని నీకు బయలుపరచెను. ఈ ప్రత్యక్షత మీద మాత్రమే నేను నా సంఘమును కట్టెదను. పాతాళ లోక ద్వారములు దానియెదుట నిలువజాలవు" అని ఆయన పలికెను. చూచారా.
ఇపుడు చూడండి.
145ఏ పాఠశాలా, ఏ వేదాంతీ బైబిలులోని, ఏ బోధతో, ఏ పాఠశాలల సముదాయమూ దానిని గూర్చి ఏమీ ఎరుగదు. దానిని గూర్చి తెలిసికొన లేరు. దానిని గూర్చి వారు తెలిసికొనుట వారికి అసాధ్యము. బాగా నేర్పు సంపాదించిన అధ్యాపకులు మొదలగు వారి నేత్రములను కూడా దేవుడు మూసెను. వారికి యేసు ప్రత్యక్షపరచబడుట అనేది ఆయనతో ఒక ప్రత్యేకమైన వ్యక్తిగత సంబంధము. ఆయన "నాకు ప్రత్యక్షమైనాడని" నీవన వచ్చును. బైబిలులోని క్రీస్తు జీవితము ఎట్లున్నదో నీ జీవితము అలాగుండని యెడల నీ ప్రత్యక్షత తప్పు.
MATT 7:16,20•
MATT 12:33•
MATT 15:14
146గుమ్మడి కాయలోని జీవమును నీను తీసి పియర్ పండులో ఉంచిన యెడల, అది గుమ్మడి కాయలనే కాయును. "వారి ఫలములను బట్టి వారిని మీరు తెలిసి కొందురు." మీరు ఒక (ద్రాక్షావల్లిని) తీసికొనండి. (అది ముందుగా ద్రాక్షలనే ఫలించును) దానికి మీరు నిమ్మ కొమ్మను అంటు కట్టిన యెడల నిమ్మకాయలు కాయును. పియర్ కొమ్మ అంటు కట్టిన యెడల పియర్ పండ్లు కాయును. యూపిల్ కొమ్మ అంటు కట్టిన యెడల యాపిల్ పండ్లు కాయును. అంటు కట్టబడిన కొమ్మ జీవమే దానిలో కనిపించును.
ప్రతి శాఖయు దాని జీవమును ఫలించుచున్నది. కాని అది అసలు ద్రాక్షావల్లి అయినచో ఎప్పుడునూ ఆ ముందు ఫలములనే ఫలించును. యేసు క్రీస్తు యొక్క జీవమును విశ్వాసుల శరీరములో ఉంచినపుడు ఆయన ఫలములే తిరిగి ఫలించును. దాని వలన మరో అపోస్తలుల కార్యముల గ్రంధము వ్రాయబడును, ఎందుకనగా అదే జీవము. నా భావము గ్రహించారా? దాని నుండి మీరు దూరంగా పోలేరు. ఇది నీలో ఉన్న క్రీస్తు జీవము. పరిశుద్దాత్మ ద్వారా అది నీ లోనికి ఎక్కించబడియున్నది. నీ ద్వారా ఆ జీవము వచ్చును.
MATT 16:18
147గ్రుడ్డి నాయకులు గ్రుడ్డివారిని నడిపించుచున్నారు…
చూడండి, దేవుడు మాత్రమే ఆ తాళపు చెవిని పట్టుకొని యున్నాడు. ఏ వేదాంతి నీకు చెప్పలేడు. అది వారికి మరుగు చేయబడినది. దాని గూర్చి వారికేమీ తెలియదు. "నాకు పి.హెచ్.డి ఎల్.ఎల్.డి ఉన్నదని" నీవన వచ్చును. నిజమగు విశ్వాసి దేవుని నుండి దూరంగా వెళ్ళడు. నేను దేవుని నమ్ముచున్నాను. విద్య వలన దేవుని తెలిసికొలేవు. దానిని గూర్చి వివరించుట ఎట్లో దాని ద్వారా ఆయన తెలియబడడు.
దేవుడు సామాన్యత చేతనే తెలియును. అధికంగా విద్యలేని పామరులకే యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షత దొరకును. చూచారా? నీ పాండిత్యము కాదు. ఇది యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షత. "ఈ బండ మీద నేను నా సంఘమును కట్టుదును." మరే ఇతర బండలను అంగీకరించడు. మరేవీ అంగీకరించబడవు. రోమను బండ కాదు. ప్రొటస్టెంటు బండ కాదు. స్కూలు కాదు. మరేదీ కాదు. నిశ్చయంగా క్రొత్తజన్మ ద్వారా యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షత మీదనే, అక్కడ ఆయన పుట్టును. తన స్వంత జీవమును నీలోనికి ఎక్కించును. నీ జీవము పోవును. నీ ద్వారా క్రీస్తు యొక్క జీవము ప్రధానమైనదిగా వచ్చును. దానిని జనులు చూచెదరు. ఆయన జీవించిన అదే జీవితం ఆయన చేసిన క్రియలు, సూచనలు, అద్భుతములు నీ ద్వారా జరుగును. దానికి వెలుపటగానున్నదంతయూ వ్యర్థమే.
దేవుని యొక్క గొప్ప ప్రత్యక్షత బయలుపడుచున్నది.
1COR 2:1-4
148ఈ ప్రత్యక్షతలోపించుట వల్లనే మన మధ్య ఎన్నో విభజనలు, ఎంతో హేళన, ఉంటున్నది. ప్రజలకు ఆ ప్రత్యక్షత లోపించినది. అందుకే ఈ శాఖలు వచ్చినవి. బోధకులకు కూడా ఆ ప్రత్యక్షత లోపించినది.
క్రీస్తు యొక్క గొప్ప ప్రత్యక్షతను పౌలు పొందిన తర్వాత I కొరింధీ 2వ అధ్యాయములో ఇట్లు చెప్పెను. మీరిది వ్రాసికొని తప్పక చదవండి. "నేనెన్నడూ మీ యొద్దకు జ్ఞానంతో రాలేదు" అని అతడు చెప్పెను. జ్ఞానము గల అతనిని చూడండి. పాడిత్యం గల అతనిని చూడండి. "అట్టి మాటలతో నేన్నడూ మీ యొద్దకు రాలేదు." (I కొరింధీ 2వ అధ్యాయము.) ఒక్క క్షణము ఆగి వచనములు నాతో చదువగలరా? నేను చదివెదను. టేపును విను వారికి కూడా ఇది సహాయపడును. I కొరింధీ 2వ అధ్యాయము. గొప్ప అపోస్తలుడగు పౌలు ఇక్కడ చెప్పినది వినండి గొప్ప మేధావియైన దైవదాసుడు చెప్పినది విందము.
సహోదరులారా, నేను మీ యొద్దకు వచ్చినపుడు వాక్చాతుర్యముతో గాని, జ్ఞానాతిగయముతో గాని దేవుని మర్మమును మీకు ప్రకటించుచు వచ్చిన వాడను కాను, [డాక్టర్ పౌలు, పలనా-పలానా అని చెప్పుకోలేదు.]
నేను, యేసుక్రీస్తును, అనగా సిలువ వేయబడిన యేసుక్రీస్తును తప్ప మరి దేనిని మీ మధ్య ఎరుగకుందునని నిశ్చయించుకొంటిని
మరియు బలహీనత తోను, భయముతోను, ఎంతో వణకుతోను మీ యొద్ద ఉంటిని.
"మీ విశ్వాసము మనుష్యుల జ్ఞానమును ఆధారము చేసికొనక దేవుని శక్తిని ఆధారము చేసికొని యుండవలెనని, నేను మాటలాడినను, సువార్త ప్రకటించినను జ్ఞానయుక్తమైన తియ్యని మాటలను వినియోగింపక పరిశుద్దాత్మయు, దేవుని శక్తియు కనుపరచు అదే సువార్త.
MARK 16:15•
1COR 2:5-8
149యేసు ఇట్లనెను, "మీరు సర్వలోకమునకు వెళ్ళి సువార్తను ప్రకటించుడి." "బోధించుడి" అని చెప్పలేదు. "ప్రకటించుడి," అనగా దాని శక్తిని వెల్లడి చేయుడని అర్థము. అప్పుడు ఈ సూచక క్రియలు కనబడును. బోధవలన అది జరుగుదు. ఈ సూచక క్రియలను కనుపరచుటకు నిజంగా అసలైన ఆత్మ కావలెను. చూచారా? ఇది వినండి!
మీ విశ్వాసము మనుష్యుల జ్ఞానముపై ఆధారపడక, దేవును శక్తిపై ఆధారపడి ఉండవలెను.
ఓ మై! చుడండి, మనుషుని మార్చుటకు. ఆయన్ మారనివాడు అయి ఉండగా, నేను ఆయన "మారేవాడు అని నేని చెప్పలేను," ఒక వేళా నేను అలా చెపితే, అది నాకు చూపిస్తుంది. కచ్చితముగా ఒక నాకు అది చెప్పును, మరియు నాకు ప్రత్యక్షత లేదు అని అది తెలుపుతుంది, దేవుని మూడు విధముల మర్మము, చూచార.
పరిపూర్ణులైన వారిమధ్య జ్ఞానమును బోధించుచున్నాము. అది ఈ లోక జ్ఞానము కాదు. నిరర్థకులై పోవుచున్న ఈ లోకాధికారుల జ్ఞానమును కాదు.
దేవుని జ్ఞానము మర్మమైనట్లుగా బోధించుచున్నాము. [దేవుని యొక్క మూడు విధముల మర్మము చూడండి], ఈ జ్ఞానము మరుగై యుండెను. జగత్తు పునాది ముందుగానే దీనిని దేవుడు మనమహిమ నిమిత్తము నియమించెను.
అది లోకాధికారులలో ఎవరికి తెలియదు. అది వారికి తెలిసియుండినయెడల మహిమా స్వరూపియగు ప్రభువును సిలువ వేయక పోయి యుందురు.
"అక్కడున్న రబ్బీలు, బోధకులు గూర్చి తప్పుగా చెప్పుచున్నావు" అని మీరు నన్ననవచ్చును. ఆయనను ఎవరు సిలువ వేసిరి? మనము బాగా వెనుకకు వెళ్ళి దానిని చదవవచ్చును (చూచారా?) ప్రభుని చిత్తమయితే మనము చప్పుకొనవలసినది చాలా యున్నది. ఇంకా ఆలస్యమవకుండా సమయము కాపాడుటకై చదువుట లేదు.
ఇప్పుడు, అది లేక, ఇప్పుడు…
ACTS 19:12
150ఈ గొప్ప మేధావియగు పౌలు ఎన్నడూ కూడా తన వేదాంత పదములను ప్రజల మీద ప్రయోగించుటకు ప్రయత్నించలేదు. అతడు దీనుడై ప్రభుని వాక్యమును అంగీకరించెను. వాక్యమును అతడు జీవించెను. అది ఆయన ద్వారా వ్యక్తపరచబడెను. అతడు ఎంతో భక్తితో జీవించెను గనుకయే అతనిలో యేసుక్రీస్తు జీవించుట వారు చూచేంతవరకూ రోగుల మీద ఉంచుటకై అతడి చేతి గుడ్డలను వారు ఆశించేంత వరకూ అతడు భక్తిని కలిగియున్నాడు. అది క్రీస్తు యొక్క జీవము. "ఏలియా దానిని ఎప్పుడో చేసాడు - తన కర్రను చనిపోయిన వానిపై ఉంచెను. ఆ దినములు ఇక లేవని మీరనవద్దు."
ఇప్పుడు లోకము ఆలాగు తలంచినది. ఆనాటి జ్ఞానము గలయాజకుడు, సంఘము ఆలాగే తలంచిరి.
ACTS 5:15•
1COR 2:4•
PHIL 3:8,10•
HEB 13:8
151కాని విశ్వాసులు వేరైన దానిని ఎరిగియుండిరి. ఏలియాలో నున్న క్రీస్తు ప్రత్యక్షతను వారు చూచిరి. పౌలులో కూడా అదే జీవము వ్యక్తపరచబడుట చూచిరి, ఎందుకనగా అతడు ప్రవక్త, చూచారా. అతడు జరుగబోవు సంగతులను ముందే చెప్పెను. అక్షరాలా ఆప్రకారమే జరిగెను. ఒక ప్రవక్త యొక్క దైవ గుర్తింపు అదే అని వారెరిగియుండిరి అతడు దేవుని ప్రవక్త అని వారెరిగిరి. వారిని నీవేమీ కదిలించ జాలవు.
పేతురు కూడా జరుగబోవు సంగతులను ముందే చెప్పెను. అతని నీడ కొరకు జనులు పోగయిరి. ఆమేన్! అదే సంఘము. దానిని వారు నమ్మిరి.
పౌలు ఏమి చెప్పెను? "నాకు పి.హెచ్.డి, ఎల్. ఎల్. డి. ఉన్నది గనుక వారు నన్ను నమ్మిరి," అని చెప్పెనా? కాదు. నేను అవన్నీ మరచి పోయాను. మానవ జ్ఞానము లేదు. ఆయనను పునరుత్థాన శక్తి ఆయనను ఎరుగుదును. దేవుని శక్తిని ప్రచురపరచుచూ నేను మీ యొద్దకు వచ్చితిని," అని అతడు పలికెను.
HEB 13:8
152ఏమిటది? యేసుక్రీస్తు నిన్న, నేడు, నిరంతరము ఏకరీతిగా చేసెను.
యేసు చేసిన కార్యములనే పౌలు చేసెను. వారు దేవునిని చూచిరి. మండుచున్న పొదలో ప్రత్యక్షమైన గొప్ప తండ్రి, పౌలునకు ప్రత్యక్షమాయెను. ఇక్కడ కూడా ఆయన ప్రత్యక్షమగుచున్నాడు. ఆయన అన్ని కాలములలోను అదే రీతిగా యున్నాడు. నిన్న, నేడు, నిరంతరము ఏకరీతిగా ఆయన ఉన్నాడు. అవి దేవుని యొక్క మూడు విధములు తన సంఘమును విమోచించుచున్నాడు; రాబోవు రాజ్యములో ప్రధానుడై యున్నాడు. ఆమేన్! మీరది చూచారా? అది చాలా పరిపూర్ణముగా యున్నది.
JOHN 6:37,44,65
153ఓ! చూడండి. క్రీస్తు యొక్క దైవ ప్రత్యక్షతను పరిశుద్దాత్మ మాత్రమే అనుగ్రహించును. ఏ స్కూలు ఆ పని చేయలేదు. ఏ పండితుడు దానిని ఇవ్వలేడు. ఎంత విద్యావంతుడైనా, ఎంత భక్తిగలవాడైనా దానిని ఇవ్వజాలరు. ఏ మనిషి దానిని ఇవ్వజాలడు. నేనిది గట్టిగా చెప్పగలను. ఎందరు క్రైస్తవులు తిరిగి జన్మించారు? (చేతులెత్తండి) పరిశుద్దాత్మతో నింపబడితిరా? మంచిది. అయితే ముందుకు వెళ్ళుదము. గమనించండి. ఆయన దానిని ముందుగా నిర్ణయించబడిన వారికి మాత్రమే ఇచ్చును. "తండ్రి నాకనుగ్రహించిన వారందరూ నా యొద్దకు వత్తురు. మొదట తండ్రి అనుగ్రహించితేనే గాని ఎవడును నా యొద్దకు రాడు."
MATT 10:25•
MATT 12:24•
MARK 3:22•
LUKE 11:15•
JOHN 4:16-18
154ఆ యాజకులు ఏమనిరో చూడండి, ఇతడు "బయల్జెబూబు. ఇతడు సోదె చెప్పువాడు. ఇతడు దయ్యము."
ఆరుగురు భర్తలతో జీవించుచున్న ఒకామె ఆయన యొద్దకు వచ్చినది. ఆమె అయిదుగురితో జీవించినది. ఇపుడు మరొకనితో యున్నది.
"వెళ్ళి నీ భర్తను తీసికొని రమ్మని" యేసు చెప్పెను.
"నాకు భర్త లేడు" అన్నదామె.
"అవును నీకు ఆరుగురున్నారు." "ఇంతకు ముందు అయిదుగురుండిరి." "ఇపుడు నీతో జీవించుచున్న వాడు నీ భర్త కాడు" అన్నాడు.
"అయ్యా…" అన్నదామె. ఏమిటి? వెలుగు తాకినది.
ఆ వెలుగు యాజకులను తాకినప్పుడు ఆయనను "సోదె చెప్పువాడు" అన్నారు. చూచారా? అక్కడ జీవము లేదు. సంకరము. సంస్థలలో యున్నవారు మృతులే.
JOHN 4:19,25,26,29
155కాని ఈమె సంకరము కాదు.
అయ్యా! నేను గ్రహించుచున్నాను అన్నదామె. ఆమె పెద్ద కండ్లు ప్రకాశించుట నేను చూడగలను. ఆమె బుగ్గల మీద నుండి నీరు కారుచుండెను. అయ్యా! "నీవు ప్రవక్తవని నేను గ్రహించుచున్నాను." మెస్సీయా కొరకు నేను ఎదురు చూచుచున్నాను. "మెస్సీయా వచ్చినప్పుడే ఈలాగే జరుగునని తెలియును. ఆయన ఈ సంగతులను చెప్పును" అన్నది.
"నేనే ఆయనను" అన్నాడాయన.
"ఓ! ప్రభువా…" అని ఆమె కుండను అక్కడే విడిచి పెట్టినది. "వచ్చి చూడుడి. నేను చేసిన వన్నియూ నాతో చెప్పిన ఈయన మెస్సీయ కాడా?" అన్నది. ఆ విత్తనమును వెలుగు తాకినది. ఆ జీవము అక్కడున్నది. అది బయటకు వచ్చెను.
నేడును అదే జరుగుచున్నది.
156ఒక్క నిమిషము ఆగుము. "పాస్టరు మూడీ ఆ రోజున దీనిని చెప్పెనో లేదో చూచెదను" అని వేదాంత పండితులు పలుకుచున్నారు. పాస్టరు మూడీ నిశ్చయంగా ఆ దినమున జీవించెను, కాని ఇప్పుడు కాదు. లూథర్ తన దినమున జీవించెను గాని వెస్లీ దినమున కాదు. వెస్లీ తన దినమున జీవించెను గాని పెంతెకొస్తు దినమున కాదు. పెంతెకొస్తువారు ఆ దినమున జీవించిరి గాని ఈ ఘడియలో కాదు. మనము చివరి ఘడియలో ఉన్నాము. నిశ్చయంగా! వారి సంస్థలే దీనిని రుజువు చేయుచున్నవి. వాక్యము తన బలముచొప్పునే బయలుపరచబడినది. వారు శాఖలను రూపొందించి ఆ నిజమగు గోధుమల మధ్య గురుగులను కలిపిరి. అది చనిపోయినది. పిచ్చి పంట పండినది. ఇది నిజము. ముండ్ల పొదలు, గచ్చ పొదలు లేచినవి. అసలు గోధుమ చనిపోయినది. అంతట వారు మరల పొలమును దున్ని కొన్ని అసలయిన విత్తనములను నాటిరి, కాని వాటిని ఇవి అణచి వేసెను.
JOEL 2:25•
MAL 4:6•
HEB 13:8
157కాని ఈ చివరి దినములలో దేవుడు తన రక్తముతో కడుగబడిన వారిని తీసికొని వచ్చెదనని చెప్పెను. వారక్కడ ఉండుటకు ముందుగా నిర్ణయించబడిరి. వారక్కడ ఉండ వలసియున్నారు. దేవుడాలాగు చెప్పెను. మలాకీ 4 లో నున్న గురుతు చూడండి. తిరిగి పునరుద్దరించి చివరి దినములలో ఆయన ఈ గొప్ప కార్యములను చేతునని వాగ్దానమిచ్చెను. ఆయన ప్రత్యక్షతను తీసికొని వచ్చును. ఎందుకొరకు దానిని ఇచ్చును? (మలాకీ 4?) తండ్రుల యొక్క విశ్వాసము వైపుకు పిల్లలను త్రిప్పుటకు, చూచారా. అదే కార్యమును అదే అగ్ని స్తంభమును ఆయన రంగము మీదికి రప్పించును. అవే సూచక క్రియలు, అవే అద్భుతములు, అదే యేసు తిరిగి కనబడును. మారని వానిగా ఆయనను చూపించును. మారని వానిగా ఆయన గూర్చి బోధించును. మారని వానిగా ఆయనను చూపించును. మారని వానిగా ఆయన గూర్చి బోధించును. ఆయన నిన్న, నేడు, నిరంతరము ఏకరీతిగా ఉన్నాడని నిరూపించును. "మెతడిస్టు గొంగళి పురుగు, బాప్టిస్టు మిడుత, మెతడిస్టు పసర పురుగు, కాతలిక్కు చీడ పురుగు ఇన్ని సంవత్సరములు తినివేసిన పంటను తిరిగి ఇచ్చుదునని" ఆయన చెప్పుచున్నాడు. ఈ పురుగులన్నీ ఆ విశ్వాసమును తిని వేసినవి. శాఖ అనుమొదలు మిగిలినది. విత్తనము అక్కడ లేదు. కాని "నేను తిరిగి ఇచ్చెదనని" యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఈ సూచక క్రియలు, అద్భుతములు వారిని విడిచిపెట్టినవి. కాని "అసలు ఋజువు చేయబడిన చెట్టును తిరిగి ఇచ్చెదనని" ఆయన సెలవిచ్చుచున్నాడు. ఆ ప్రవక్త ఒక ప్రవక్త. అతని మాట నెరవేరును. ఆమేన్.
AMOS 3:7•
2PET 1:21
158అన్ని కాలములను యేసుక్రీస్తు యొక్క దైవ ప్రత్యక్షతను పరిశుద్దాత్మ మాత్రమే అనుగ్రహించెను. మరువ వద్దు, అన్ని కాలములలోను! ప్రభుని వాక్యము ఎవరి యొద్దకు వచ్చును? ప్రవక్త యొద్దకు మాత్రమే. ఇది నిజము. అవునా? మొదట ఆ ప్రవక్త ఋజువు చేయబడవలెను. అతడు ప్రవక్తగా చెప్పుకొని నందున కాదు గాని, ప్రవక్తగా అతడు జన్మించెను. మరియు ప్రవక్తగా నిరూపించబడును. అతడు చెప్పినదంతయూ వాక్యమై యుండి నెరవేరున, చూచారా. పరిశుద్దాత్మ ద్వారానే ప్రభుని వాక్యము వచ్చును. "ఆ కాలము నాటి వారు పరిశుద్దాత్మచే ప్రేరేపించబడి వాక్యమును వ్రాసిరి" అని బైబిలులో యున్నది. (చూచారా?)
MATT 3:17•
MARK 1:10,11•
LUKE 3:22•
JOHN 1:26,32,34
159చూడండి, పరిశుద్దాత్మ చూపించని యెడల బాప్తిస్మమిచ్చు యోహాను ఎన్నడునూ యేసును ఎరిగి యుండెడి వాడు కాడు. నిజమేనా? గొప్ప ప్రవక్తయగు బాప్తిస్మమిచ్చు యోహాను వచ్చి ఇట్లనెను. "ఇప్పుడే మీ మధ్య ఒకాయన నిలబడియున్నాడు. ఆయన ఒక సామాన్యునిగా యున్నాడు. ఆయనే దేవుని గొర్రెపిల్ల." "పరలోకము నుండి దేవుని ఆత్మ (పరిశుద్దాత్మ) దిగి వచ్చి ఆయన మీద పావురము వలె నిలిచియుండుట చూచాను. అంతట ఒక స్వరము." "ఈయన నా ప్రియ కుమారుడు. ఈయన యందు నేనానందించుచున్నానని" పలికినది. ఏమిటది? "ఆయనను చూపించితినని పరిశుద్దాత్మడు చెప్పెను."
ROM 8:29,30•
EPH 1:5,11
160నేడు కూడా ఆయనను నీవు ఆ విధంగానే ఎరుగ గలవు. పరిశుద్దాత్మ ద్వారా మాత్రమే దేవుని యొక్క మూడు రకముల ప్రత్యక్షతను పొందగలవు. నీవు దానిని చూచుటకు ముందుగా నిర్ణయించబడవలెను, లేని యెడల దానిని నీవెన్నడూ చూడలేవు. దానిని చూచుటకు నీవు ముందుగా నిర్ణయిండబడని యెడల ఎన్నడూ దానిని ఎగతాళి చేసి పోయెదవు. దేవుడు నీకు బయలుపరచుకొని తన్ను తాను రుజువు చేసికొన్నాగాని నీ మానవ జ్ఞానము వలన నీవు దానిని గ్రహించజాలవు, చూచారా. చూచుటకు నీవు ఎన్నుకొనబడనిచో దానిని నీవు చూడవు.
161"నేను వీరిని ఎన్నుకొందును, వారిని ఎన్నుకొందును," అని దేవుడెన్నడూ చెప్పడు. ఆయన అనంతుడు గనుక ఆయనకు ముందుగానే నీ గూర్చి తెలియును. ఆయన అనంతుడు గనుక ఆయనకు సర్వమూ తెలియును. అంతము ఆయనెరుగును. ఆది లోనే ఆయన అంతమును కూడా చెప్పగలడు. ఆయన దేవుడు. అవును. ఆయనా విధంగా లేని యెడల ఆయన దేవుడు కాడు. ఆయన అనంతుడు.
ISA 40:3•
MAL 3:1
162పరిశుద్దాత్మ చూపించనియెడల యోహాను ఎన్నడూ ఆయనను తెలిసికొని యుండెడి వాడు కాడు. (లేదు, అయ్యా) ఉన్నత విద్య గలవారికి దేవుడు తన మర్మమును ఎట్లు దాయునో చూచారా? దానిని చూచుటకు ముందుగా ఎవరైతే నిర్ణయించడ్డారో వారికి సామాన్యముగానే బయలుపరచును. ఇంకా అనేకులు అక్కడ నిలబడియుండగా వారికి ఆ పావురము కనబడలేదు. వారికి ఏ స్వరము వినబడలేదు, ఎందుకనగా అది కేవలము ముందుగా నిర్ణయించబడిన సంతానము కొరకే పంపబడినది. నిశ్చయంగా అతడు ముందుగా "నిర్ణయించబడెను." 712 సంవత్సరముల క్రితం యెషయా జన్మించెను. అతడు ఆత్మలో ఈ మానవ జ్ఞానము నుండి పైకెత్తబడి "ప్రభుని మార్గము సరళము చేయుడి అని అరణ్యములో కేకవేయు ఒకని శబ్దము" అని పలికెను. యెషయా చూచిన దానిని మలాకీ చూడలేడా? పాత నిబంధనలోని ప్రవక్తలు పలికిన దానినంతటిని ఈ గొప్ప ప్రవక్త చివరి యుగములో లేచి నిలబడి ముద్రించెను, చూచారా. అతడు ముందుగా "నిర్ణయించబడినవాడా?" అని మీరడుగవచ్చు. మలాకీ కూడా నిశ్చయంగా ఆయనను చూచెను.
MAL 3:1•
MATT 3:17•
MATT 11:10,14•
MARK 1:11•
LUKE 3:22•
JOHN 1:14,15,34
163"నాకంటె ముందుగా నేను ఒక దూతను పంపియున్నాడు. (మలాకీ 3) ఆ పంపబడిన వాడితడే. ఇతనిని చేర్చుకొనుడి," అని యేసు చెప్పెను. చూచారా. ఆ వర్తమానము చూచుటకు నిశ్చయంగా అతడు ముందుగా నిర్ణయించబడెను. అతడు పావురము దిగుటను చూచుటలో ఆశ్చర్యపడనక్కర లేదు. అరణ్యములో ఇశ్రాయేలీయులతో ఉండిన వెలుగు. అక్కడ కదలి వచ్చినది. "ఈయన నా ప్రియ కుమారుడు. ఈయన యందు నేనానందించుచున్నాను" అని దేవుడే చెప్పెను. దేవుడు, మానవుడు ఏకమయిరి. నేనాయనను చూచాను. "ఆయన అద్వితీయుడు." దానికి నేను సాక్షిని అని యోహాను పలికెను. ఆమేన్!
అక్కడే మీరున్నారు సామాన్యత. ఒక పాత-కాలపు బోధకుడు ఉండేవాడు. అతని తండ్రి ఒక గొప్ప వేదాంతి. అతడు స్కూలు నుండి చదివి వచ్చెను. అతడు తన తండ్రి శాఖలోనికి వెళ్ళెను. అది దేవుని చిత్తము కాదు.
LUKE 1:31,35,36,39,41,43,44
164అతడి పుట్టుక యొద్దనే దేవుడతనిని తాకినప్పుడు అతడు పరిశుద్దాత్మను పొందెను. అది అతని పుట్టుకకు మూడు నెలల ముందే జరిగెను. మరియ అక్కడికి వెళ్ళినప్పుడు చిన్న యోహాను తన తల్లి గర్భములో యుండెను. అతనికి ఆరు నెలల వయస్సు. ఆ చిన్న కండరములు ఇంకా కదలుట లేదు. మరియ భయపడినది. ఆ చిన్న కండరములు ఎదుగుచున్నవి. కాని అతని తల్లియగు ఎలీసబెతుకు ఏమి జీవమున్నట్లు కలబడలేదు. మరియ వచ్చి ఆమెను కౌగిలించుకొన్నది. దేవుడు నాతో మాట్లాడి యున్నాడు. "నేనును ఒక బిడ్డను కనుదును."
"నీవు, యోసేపును పెండ్లి చేసికొన్నావా"?
"లేదు."
"మరియ, ఇదెట్లు సాధ్యము."
"పరిశుద్దాత్మ నన్ను కమ్ముకొనును. అది నాలో సృజింపబడును. అతనికి నేను యేసు అని పేరు పెట్టుదును. అతడు దేవుని కుమారుడు."
యేసు అను మాట చెప్పగానే ఆ చిన్న యోహాను అరచుచూ, గంతులు వేయ సాగెను. తన తల్లి గర్భములో చిందులు వేసెను. ఆమె ఇట్లన్నది. "ప్రభువగు దేవుడు స్తుతింపబడు గాక! నా ప్రభువు యొక్క తల్లి ఇక్కడున్నది." నా ప్రభువు యొక్క తల్లి అన్నది. ఆమె ప్రభువు యొక్క తల్లి. "ఆమె వందన వచనం నా చెవిని పడగానే, నా గర్భములోని శిశువు ఎంతో సంతోషముతో గంతులు వేసెను."
JOHN 1:32
165అతనికి ఎట్టి సెమినరీ అక్కర లేదు అనుటలో ఆశ్చర్యంలేదు. ఏది అతడు నేర్చుకోనవసరము లేదు. ఏదో దేనినో అతడికి ఉపదేశించినది అతనికి ఒక ప్రాముఖ్యమగు పనియున్నది. అతడు అరణ్యవాసి అరణ్యములోనికి వెళ్ళి కనిపెట్టెను. అక్కడే దేవుడతనికి ప్రత్యక్షత అనుగ్రహించెను. (ఓ! మరల ప్రత్యక్షతవచ్చుట చూడండి!) "ఆయనెవరో నేను మీకు చెప్పెదను. ఆయన ఒక వాక్యము నీ యొద్దకు వచ్చి నీవు రావలసియున్నది. ప్రవక్త. (గత ఆదివారపు ప్రశ్నకు ఇదే జవాబు. చూచారా.) "యోహాను, నీవెవరివో నీకే తెలియును. నెమ్మదిగా ఉండుము. ఏమి చెప్పవద్దు. అక్కడికి వెళ్ళి ఆయనను చూడుము. పరలోకము నుండి ఒక వెలుగు సూచనగా దిగివచ్చును. ఒక పావురము వాలును. అది నీవు చూచినప్పుడు ఆయనే" అని గుర్తించుము.
MATT 3:14,15•
JOHN 1:29
166ఆ కారణంచేతనే యేసు నీటిలోనికి నడిచి వచ్చెను. యోహాను ఆయన మీదికి పావురము దిగి వచ్చుట చూచి "ఇదిగో దేవుని గొర్రెపిల్ల. ఈయనే! లోక పాపము మోసికొని పోవువాడు ఈయనే" అని చెప్పెను.
యేసు తిన్నగా నీటిలో యున్న యోహాను యొద్దకు వచ్చెను. యోహాను యొక్క రెండు కన్నులు యేసు యొక్క రెండు కన్నులకు కలిసికొనెను. (వారు శరీర రీత్యా దగ్గర బంధువులు. ఎందుకనగా, మరియ మరియు ఎలీసబెతులు రక్త సంబంధులు) వారి కన్నులు కలిసినవి. దేవుడు, తన యొక్క ప్రవక్త అక్కడ నిలబడియున్నారు. (ఆమేన్) నేను నీ వలన బాప్తిస్మము పొందవలసి యుండగా, నీవు నా యొద్దకు ఏల వచ్చితివి? అని యోహాను అడిగెను.
"ఇప్పటికీలాగు కానిమ్ము. నీతి యావత్తు ఈలాగు నెరవేరవలసి యున్నది" అని యేసు చెప్పెను.
MATT 3:16,17•
LUKE 3:21,22
167యోహాను ఎందుకాలాగు చేసెను? ఆయన బలియైయున్నాడు. (యోహాను ఒక ప్రవక్త; అతడెరుగును), బలి అర్పించబడక ముందుగా కడుగబడవలెను. ఆ విధంగానే ఆయనకు బాప్తిస్మము ఇచ్చెను. అప్పుడు ఆకాశము తెరువబడెను. ఆ పావురము ఆయన మీదికి దిగినది. ఒక స్వరము ఇట్లన్నది, "ఈయన నా ప్రియ కుమారుడు. ఈయన యందు నేనానందించుచున్నాను. కింగ్ జేమ్సు అనువాదములో, ఈయన యందు నివసింపగోరుచున్నాను" అనియున్నది. "ఈయన నా ప్రియ కుమారుడు. ఈయన యందు నేనానందించుచున్నాను," (లేదా నివసించగోరుచున్నాను. ఏదయినా అనవచ్చును.) అది అతనికి బయలుపరచబడినట్లు మనము చూతుము. ఇతరులు అక్కడే నిలబడినా ఆ స్వరము వినబడలేదు. పరిశుద్దాత్మ మాత్రమే దానిని బయలుపరచును.
MARK 1:10,11•
ACTS 9:2-4
168పౌలుకు అదే విధముగా ఆయన తనను తాను బయలుపరచుకొనెను. అతడు ముందుగా నిర్ణయించబడిన విత్తము. అతడు విద్య సంపాదించిన సౌలుగా నున్నప్పుడు సంఘమును పట్టుకొని చీల్చవలెనని ఉద్దేశించెను. ఎందుకనగా, నేను డాక్టర్. సౌలును, గమాలియేలు ఆధ్వర్యములో విద్య నభ్యసించాను. (నేను మూడీ బైబిలు ఇనిస్టిట్యూట్ లేక మరొకదాని నుండి వచ్చానని చెప్పుకొనుచున్నారు.) నేను పండితుడననుకొని యుండును. అతడు దేనిగురించి మాట్లాడుచున్నాడో అతడెరుగును. ఆ పరిశుద్దుల గుంపును చీల్చివేయ కోరెను. అక్కడికి వెళ్ళి అల్లరి చేయుచున్న వారినందరిని బంధించి హింసించుటకు అధికార పత్రము పొందెను. ఈ దైవిక స్వస్థతను ఆపివేయ ప్రయత్నించెను. "ఆ పత్రమును జేబులో ఉంచుకొని దారిన పోవుచుండెను." దాదాపు 11 గంటల పగటి వేళ అతని ముఖమును ఒక వెలుగు తాకగా అతడు నేల మీద పడిపోయెను.
ACTS 9:15,16•
ROM 8:29,30•
GAL 1:17•
EPH 1:5,11•
PHLM 1:1,9
169ఎందువలన? అతడు ముందుగా నిర్ణయించబడిన విత్తనమైయున్నాడు. నేనతనిని ఏర్పరచుకొనియున్నాను. నా నామము నిమిత్తము అతడు ఎన్నో శ్రమలు అనుభవించవలసియున్నాడు. వాటిని అతనికి చూపించెదను. అన్యుల యొద్దకు అతనిని నేను పంపుదును. వారతనిని అన్ని విధముల తృణీకరించుదురు. అయినను అతడు నా నామమును భరించును.
పౌలు అక్కడి నుండి లేచి వెళ్ళెను. అతడు నేర్చుకొన్నదంతయూ పోవలెను. (అరేబియా ఎడారిలో మూడున్నర సంవత్సరములు గడిపెను) — అతడు వాక్యమును నేర్చుకొనెను. అతడే వాక్యముగా మారెను. అతడు ఒక బందీగా మారెను. ప్రేమ బంధకములతో అతడు ఇప్పుడు వచ్చుచున్నాడు. నా సెమినారీ అనుభవమంతా పోయినది. నేను యేసు క్రీస్తుకు బంధీనయితిని. (ఆమేన్!) నా సోదరుడగు ఫిలెమోను, నేను క్రీస్తుకు బందీనైతిని. ఆయన నాతో చెప్పునదే నేను చెప్పెదను."
MATT 16:18•
ROM 8:29,30•
EPH 1:5,11
170అటువంటి బందీలు నేడు దేవునికి అవసరము. వాక్యమునకు ఆయన చిత్తమునకు కావలెను. పౌలు ఆలాగు మారెను. అతడెంత జ్ఞానము నేర్చుకొన్నా గాని లెక్క లేదు. దేవుని నతడు ప్రత్యక్షత ద్వారానే ఎరిగెను. అతనిలో నుండిన జ్ఞానమంతయూ బయటకు పోయినది. ప్రత్యక్షత వచ్చినది. ఆ బండ మీద సంఘము కట్టబడినది.
చూడండి, అతడు ముందుగా నిర్ణయించబడిన సంతానము. ఆయనెవరో పరిశుద్దాత్మ మాత్రమే నీకు చూపించును. వారందులో నుండి తండ్రిని, కుమారుని, పరిశుద్దాత్మను బయటకు లాగుచున్నారు, చూచారా. కాని పరిశుద్దాత్మ బయలుపరచబడిన పరలోకము యొక్క ప్రభువైన దేవునిగా ఆయనను ప్రత్యక్షపరచును, అది ఆయనే.
COL 1:19•
COL 2:9
171ఇపుడు చూడండి: ప్రవక్తలు కాదు, రాజులు కాదు, మరెవరూ కాదు. క్రీస్తు మానవ శరీరమందు సంపూర్ణునిగా మొదట దైవత్వం యొక్క సర్వపరిపూర్ణత బయలు పరచబడెను. అదియే ప్రత్యక్షత! ఒక వచనము పాడుదము.
దేశములు ముక్కలగుచున్నవి; ఇశ్రాయేలు మేల్కొనుచున్నది.
(అవును గదా?)
ప్రవక్తలు ముందుగా చెప్పిన సూచనలు:
అన్యుల దినములు లెక్కించబడినవి. (సంఘము శాఖగ మారినది)
భీతులు ప్రజ్వరిల్లినవి.
ఓ! విడవబడిన వారలారా,
మీ స్వంత వారియొద్దకు తిరిగిరండి!
(మీరు వారి నుండి త్రోసివేయబడితిరి)
విమోచనా దినము ఆసన్నమయినది.
భయముతో మానవుల గుండెలు చెదరిపోవుచున్నవి.
వారి హాలీవుడ్ సరసోక్తుల వలన సంతోషము వచ్చుట లేదు. రాత్రి పూట సమాధి దగ్గరకు వెళ్ళుచున్న బాలుడు ఈల వేసినట్లు అదియున్నది.
ఆత్మతో నింపబడుడి, మీ దివిటీలు శుభ్రపరచి వెలుగనియ్యుడి!
పైకి చూడండి! మీ విమోచన దగ్గర పడినది.
దొంగ ప్రవక్తలు అబద్దమాడుచున్నారు.
దేవుని వాక్యమును వారు త్రోసివేయుచున్నారు.
యేసు క్రీస్తే మన దేవుడు. (అది నిజము)
ఈ తరము దేవుని ప్రత్యక్షతను నిరాకరించుచున్నది.
కాని అపోస్తలులునడచిన దారినే మనము నడచుచున్నాము.
విమోచనా దినము దగ్గరయినది.
మానవుల గుండెలు భయముతో కూలిపోవు చున్నవి.
ఆత్మతో నింపబడుడి. మీ దివిటీలు శుభ్రపరచి వెలుగనియ్యుడి.
పైకి చూడుడి! మీ విడుదల సమీపించినది.
MATT 7:16,20•
JOHN 1:1
172సోదరుడా, ప్రత్యక్షత పొందుము. ఈ తరము దేవుని ప్రత్యక్షతను నిర్లక్షము చేయుచున్నది, చూచారా. అబద్ద ప్రవక్తలు దానిని చేయుచున్నారు. వారి ఫలములను బట్టి మీరు వారిని తెలిసికొందురు. వారు సంకరపు జనులు. వారు దేవుని వాక్యమునకు బదులుగా ఒక సంస్థ వలన పుట్టిన వారు. వాక్యమై యున్న క్రీస్తు ద్వారా దేవుడు తన ప్రత్యక్షతను తెలియచేయును.
ఓ మై!
173ఇక్కడ మనము ఆగ గలము, కాని మరల వచ్చినప్పుడు చెప్పెదను. ముందుకు వెళ్ళుదమా? త్వరపడుదము. దీని తరువాత మీరు విశ్రాంతి తీసికొన వచ్చును. మంచిది.
అదే విధానము. ముందుగా నిర్ణయించబడిన సంతానమును చూడండి.
MATT 17:2,5•
MARK 9:2,7•
LUKE 9:29,35•
JOHN 1:14
174ఆయనెవరో పరిశుద్దాత్మ మాత్రమే మీకు చూపించ గలదు. ప్రవక్తలు, రాజులు చూపించలేరు. దేవుడు శరీరమందు ప్రత్యక్షమాయెను. ఆయన సంపూర్ణుడుగా యున్నాడు. ఆయన సంపూర్తిగా బయలు పరచబడి లోకమునకు తెలియచేయబడి యున్నాడు.
రూపాంతరపు కొండ మీద చూడండి. దేవుడే సాక్షము ఇచ్చెను. "ఈయన నా ప్రియ కుమారుడు. ఈయన మాటవినుడి." అక్కడ ధర్మశాస్త్రమునకు ప్రతినిధిగా మోషే నిలబడి యుండెను. ప్రవక్తల ప్రతినిధిగా ఏలియా అక్కడ నిలబడి యుండెను. కాని వారు గతించి పోయిరి, ఆయన ఇట్లు చెప్పెను. "ఈయన నా ప్రియకుమారుడు: ఈయన మాట వినుడి." ఇక్కడ ముగ్గురు ప్రతనిధులుగా యుండిరి. ధర్మశాస్త్రము, ప్రవక్తలు, మరియు క్రీస్తు. ఈయనే అని ఆయన చెప్పెను. దేవుడు సంపూర్ణముగా ప్రవక్తలలో ప్రత్యక్షము కాలేదు. ధర్మశాస్త్రము వలన ప్రత్యక్షము కాలేదు, కాని క్రీస్తులో ప్రత్యక్ష పరచబడ్డాడు. ఆయనే ఆ ప్రత్యక్షత.
MATT 17:5•
MARK 9:7•
LUKE 9:35•
COL 2:9
175క్రీస్తు కృపామయుడు. ధర్మశాస్త్రము నిన్ను చెరసాలలో ఉంచును, కాని బయటకు తీసికొని రాజాలదు. ప్రవక్తలు దేవుని న్యాయమును బట్టి నిన్ను దోషిగా తీర్చి అందుకొరకు నిన్ను చంపుదురు. ఇది నిజము. ముందుగా నిర్ణయించబడిన సంతానం తెలుసుకొనునట్లుగా యేసు దేవుని యొక్క ప్రేమ మరియు ప్రత్యక్షత అయ్యున్నాడు. ఆయన నిన్ను పిలచును. ఈయనే ఆయన. ఈయన మాట వినుడి. దైవత్వము యొక్క సంపూర్ణత తెలియచేయబడి యున్నది. ఈ మర్మము యొక్క రహస్యము ఇప్పుడు తెలియచేయబడి యున్నది. దేవుడే ప్రత్యక్షమాయెను. దేవుడు, మానవుడు ఒక్కటయిరి. క్రీస్తు అనగా "అభిషిక్తుడు." దైవత్వము యొక్క సర్వపరిపూర్ణత శరీరముగా అభిషేకించబడినందున ఆయన అభిషిక్తుడాయెను. ప్రజలు ఏలాగు సందేహించ కలుగుచున్నారు?
176ఒకప్పుడు మోషేలో ఆయన ఒక భాగమై యుండెను. దావీదులో ఒక భాగమై యుండెను. కాని, ఇక్కడ సంపూర్ణుడుగా ఆయన ప్రత్యక్షమాయెను —దేవుడగు ఆయన భూమి మీద సంపూర్ణుడిగా నిలబడెను. ఎందుకనగా, ప్రజల పాపము నిమిత్తము ఆయన మరణించుటకు అందువలన ఆయన తన సంఘమును పవిత్రీకరించుటకు, ఆ సంఘములో ఆయనే సంపూర్ణముగా ప్రధానుడిగా ఉండి, చివరి దినములకు ఆయన వాగ్ధానము చేసిన ప్రతి వాగ్ధానమును తన సంఘముకు బయలు పరచుటకు. చూచారా. ఇప్పుడు వినండి. ఇపుడు కొద్దిగా మీకు మీరే గిల్లుకొనండి.
గమనించండి.
JOHN 1:1•
JOHN 14:12•
HEB 13:8•
REV 1:8
177యేసు ఏమిటి బయలుపరచెను? దేవునినే చూపించెను. ఆయన దేవుడు. ఆయన దేవుడై యండవలెను. ఏ మానవుడు చనిపోలేడు. ఏ ప్రవక్త చనిపోలేడు. ఆయన దేవుడు. ఆయన ప్రవక్తలకు దేవుడ. ఆయనే ప్రవక్తలైయున్నాడు. ఆయనే రాజులై యున్నాడు. ఆయనే చరిత్ర అయ్యున్నాడు. రానున్నవాడు ఆయనే. ఉండిన వాడు, ఉన్నవాడు, ఈ దినమున ఉండువాడు ఆయనే. నిన్న, నేడు, నిరంతరము ఏకరీతిగా యున్నాడు. ఆ ఉద్దేశ్యము కొరకే ఆయన బయలు పరచబడెను. ఆ ఉద్దేశ్యము ద్వారానే ఆయన ఒక సంఘమును సంపాదించెను. దేవుని యొక్క సంపూర్ణతగా నుండిన ఆయన ఈ చివరి దినములలో దేవుని యొక్క ప్రతి వాగ్దానమును నెరవేర్చును. సంఘములో ఆయనే ప్రధమ స్థానమును పొందును. (ఆయనే ప్రాధాన్యతను పొందవలసియున్నాడు), సంఘములో ఆయనది ప్రథమ స్థానము. యేసు చెప్పెను, "నా యందు విశ్వాసముంచువాడు నేను చేయుక్రియలు చేయును. అంతకంటె గొప్పవియు చేయును, ఎందుకనగా నేను తండ్రి యొద్దకు వెళ్ళుచున్నాను," చూచారా. అది ఆయన ఉద్దేశ్యము. అదియే ప్రత్యక్షత.
నేడు ఆయన దానిని చూడగల వారి కొరకు వెదకుచున్నాడు. వారు వాక్యమును చూడవలెను.
178యేసు ఆలాగే దానిని చూచెను, ఆ దినమునకు ఆయన ఖచ్చితముగా జన్మించెను. ఆయన యొక్క ప్రతి కదలికను దేవుడు వ్యక్తపరచెనను. ఆయనే దేవుని యొక్క ప్రత్యక్షత — దేవుడు బయలుపరచబడెను.
MAL 4:5,6•
JOHN 1:1•
JOHN 14:12
179ఇప్పుడాయన ఒక సంఘమును తన ఆత్మ మరియు రక్తముతో శుద్దీకరించుచున్నాడు. కాగ ఈ చివరి దినమునకు ఆయన ఉద్దేశించిన ప్రతి వాగ్దానమును ఆయన బయలుపరచును.
ఇప్పుడు, ఇతరులు విడిచిపెట్టిన దానిని తిరిగి వెళ్ళి సమకూర్చుట ఈ చివరి దినములలో అతడు చేయును. ఏడు ముద్రల యొక్క మర్మమంతటినీ ఆయన పరిశుద్దాత్మ బయలుపరచును, చూచారా. ఆయన తన్ను తాను వ్యక్తపరచుకొను చున్నాడు. అది ఆయన ఉద్దేశ్యము. అందుకొరకే ఆయన మరణించెను. ఆయన మూడు విధముల ప్రత్యక్షతలలో అది రెండవది. మొదటగా ఆయన క్రీస్తులో తన్ను తాను వ్యక్తపరచుకొనెను. ఆ తరువాత సంఘమునకు ఆయన తన్ను బయలుపరచుకొనెను. అదే విధంగా క్రీస్తే వాక్యమై యున్నాడు. సంఘములో వాక్యముగా మరానప్పుడు సంఘము కూడా వాక్యముగా మారును, కాని వారు ఆ సంకరపు శాఖను అంగీకరించినప్పుడు వారి ద్వారా ఆ వాక్యము ఎట్లు వెళ్ళును? అది నాటబడినది. ఆ తరువాత అది బయటకు తన్నుకొని వచ్చును, చూచారా. విద్యుచ్చక్తి స్వేచ్చగా ప్రవహించును. (అదే దేవుని వాక్యము), దాని కది వ్యక్తమగును. "నేను చేయుక్రియలు మీరును చేయుదురు. చివరి దినములలో ఇది నెరవేరును. ఇదిగో, నేను ప్రవక్తయగు ఏలియాను పంపుదును. అతడు పిల్లల హృదయములను తండ్రుల యొక్క విశ్వాసము వైపునకు త్రిప్పును."
GEN 2:17•
GEN 3:3•
JOHN 6:63•
COL 2:9
180ఆయన తన సంఘము ద్వారా తన యొక్క సంపూర్ణ దైవత్వమును వ్యక్తపరచుకొను ఒక కాలము వచ్చును. (ఆయనే దైవము) ఆయన తన సంఘములో ప్రధానునిగా యుండును. ఏమిటి? ఆయన అభిషిక్తుడు. ఇప్పుడు జనులు అభిషేకము పొందిరి. అనగా అభిషేకముపొందిన పెండ్లి కుమారుడు మరియు తిరస్కరించిన దానిని వారు అంగీకరించినందునే.(ఆదాము కూడా) వాక్యాభిషేకముతో తిరిగి వచ్చుచున్నారు. "నా వాక్యమే ఆత్మ" అని ఆయన చెప్పెను, చూచారా. వాక్యముతో అభిషేకము జరిగెను. హవ్వ త్రోసివేసినదానిని మనము అంగీకరించాము. ఆ సంకరపు స్థితి ఎట్లున్నదో చూడండి. హవ్వకు వాడాలాగే చేసెను.
ఆయన హవ్వతో ఇట్లు చెప్పెను, "దీనిని చేయవద్దు దానిని చేయవద్దు. నీవు ఆలాగు చేయవద్దు. ఈలాగు చేయవద్దు."
GEN 3:4,5•
EPH 5:27
181సాతాను ఇట్లనెను, ఓ! నీకు తెలుసా ఆమె వాని మాటను విన్నది. కాని ఈ చివరి దినములలో హవ్వ ఆలాగు చేయదు, ఎందుకనగా ఆలాగు చేయకుండుటకు ఆమె నిర్ణయించబడినది. దేవుడు దానిని చేయగలడు. ఆయన సంఘము మచ్చ, ముడత లేనిదిగా యుండునని ఆయన చెప్పెను. ఆయన మహిమతో ఆమె నిలబడి యుండును. ఆయన వాక్యము ప్రత్యక్షపరచబడినది. ఆమె లోకమునకు ఒక గురుతుగా యుండును. లోకములో ఆమె ప్రత్యేకముగా ఉండును. ఆమెను లోకము చూచి ఈ విధముగా అనును, ఆమె "పరిశుద్ద గుండ్రాయి." ఆమె మన గుంపునకు చెందినది కాదు. అది మంచిదని నాకు తెలియును. ఆమె ఇక్కడున్న గుంపుకు చెందును.
MATT 13:46•
1COR 12:13
182ఒక రోజున ఒకతను నన్ను ఇట్లడిగెను. (నాతో నిలబడి అతడు మాట్లాడెను) — "మీరే శాఖకు చెంది యున్నారు"? "దేనికి చెందలేదు అన్నాను."
"ఏమిటి?"
"దేనికి చెందలేదా?
"ఒక రాజ్యమునకు చెందియున్నాను" అని చెప్పాను.
"అందులో నీవెట్లు చేరితివి."
"అందులో నీవు చేరలేవు. అందులో జన్మించవలెను."
"అది ఏ రాజ్యము"?
మర్మమై యున్న యేసుక్రీస్తు శరీరము. ఒక్క ఆత్మ ద్వారానే మనందరము ఒక్క శరీరము లోనికి బాప్తిస్మము పొందియున్నాము. అందువలన ఆయన రాజ్యమునకు చెంది యుందుము. మన జీవితములు అమెరికావి కావు. మనము జర్మనులము కాము. మనము ఏమి కాము. మనము క్రైస్తవులము. మనము ఆత్మలో స్థిరపడి నడుచుచున్నాము. ప్రేమకు బానిసలము. (లోక సంగతుల నుండి వేరైతిమి), లోకములో మనకున్న హక్కులను అమ్ముకొనియున్నాము. ఈ గొప్ప వెలగల ముత్యమును కొని యున్నాము. పరిశుద్దాత్మ మన నడకలో ప్రత్యక్షమగును. అదే ఆయన యొక్క నిజమగు సంఘము. నీవు నేను అదే అయియున్నాము. ఏదో ఒక సిద్దాంతము చెప్పుచున్న రీతిగా కాదు గాని, దేవుని వాక్యము ద్వారానే దేవున్ని మనము సేవించవలెను.
JOHN 1:1•
JOHN 10:33•
2COR 3:14•
2COR 4:4•
1JN 2:11
183ఈ అభిషిక్తుని గమనించండి. క్రీస్తే నన్ను తాను తెలియపరచుకొని యున్నాడు. (ఓ దేవా!) ఇప్పుడు చూడండి. ఆయనకే ప్రధమ స్థానము. యేసు క్రీస్తులో దేవుడు సంపూర్తిగా ప్రత్యక్షమాయెను. దేవుని యొక్క గొప్ప మర్మము. ఈ ప్రత్యక్షత యొక్క గొప్ప వెలుగు ఈ లోక జ్ఞానులకు గ్రుడ్డి తనం కలుగచేసి యున్నది.
యేసుక్రీస్తు దినములో అది వారికి గ్రుడ్డితనం కలుగజేసినది. (ఆయన ఈ భూమి మీద ఉండగా) నీవు దేవునిగా చెప్పుకొనుచున్నావు. నిన్ను నీవు దేవునితో సమానునిగా చేసికొనుచున్నావు అనిరి. ఆయన దేవునితో సమానుడు కాడు. ఆయనే దేవుడు. చూచారా, వారది గ్రహించలేదు.
మీలో కొందరు…
JOHN 4:25,26
184నేను దేవుని కుమారుడనని యేసు ఎన్నడూ చెప్పుకొనలేదని నాతో కొందరు నాస్తికులు పలికిరి. నిశ్చయంగా అది నిజము. నీ బైబిలును నీవెరుగవు.
బావి యొద్ద స్త్రీతో ఆయన ఏమి చెప్పెను? చూచారా? ఆయన ఆమెతో ఏమనెను?
"మెస్సీయా వచ్చునని నేనెరుగుదును. ఆయన వచ్చినప్పుడు ఈ కార్యములు చేయును."
"నీతో మాట్లాడుచున్నవాడు ఆయనే" అని చెప్పెను. పౌలు తదితరులకు కూడా ఆయన ఆలాగే చెప్పెను.
గమనించండి. ఇప్పుడు సంఘమునకు ప్రధమ స్థానమున్నది.
ROM 8:29,30•
EPH 1:5,11
185దేవుని యొక్క గొప్ప మర్మము ఈ లోక జ్ఞానులకు ఎల్లప్పుడూ గ్రుడ్డితనమే కలుగ చేసినది. దానిని వారు గ్రహించలేక పోయిరి. వారు దానిని అర్థము చేసికొనలేదు. సాతాను దానిని అర్థము చేసికొజాలదు. దానిని తక్కిన వారెవరూ అర్థము చేసికొనలేదు. దానిని అర్థము చేసికొనుటకు ముందుగా నిర్ణయించబడిన వారు మాత్రమే దేవుడు, క్రీస్తు ఒక్కటే అని అర్థము చేసికొనిరి. కాని వారు ఆయనను ప్రతి సారి ముగ్గురుగా చేయుచున్నారు, చూచారా. నిశ్చయంగా ఇది నిజము.
COL 1:27
186గమనించండి. రెండవదిగా — నీలో బయలుపరచబడిన క్రీస్తే మహిమకు నిరీక్షణయైయున్నాడు. క్రీస్తులో ఆ గొప్ప దేవుడు ప్రత్యక్షమాయెను. ఇప్పుడు క్రీస్తు నీలో ప్రత్యక్షమాయెను. మనము తొందరపడుదము.
చూడండి. ఒకప్పుడు దేవుని గొప్ప రహస్యము, ఆయన మనస్సులోయున్న గొప్ప మర్మము. ఇప్పుడు విశ్వాసి యొక్క హృదయములో ఉంచబడినది అనగా క్రీస్తు యొక్క శరీరములో జగత్తు పునాదికి ముందే దేవుని మనస్సులో యండిన ఆ గొప్ప రహస్యము ఇప్పుడు బయలుపరచబడినది. దానిని గూర్చి ఆలోచించుము స్నేహితులారా? దానిని మనము నిశ్చయంగా గ్రహించలేదు. నేను చూడవలసిన విధంగా చూడలేక పోయాను. మీరును ఆలాగే యున్నారని ఖచ్చితంగా చెప్పగలను, చూచారా.
187కాని దేవుని యొక్క గొప్ప మర్మము, నిత్య దేవుడు రహస్యముగా ఉంచినది. ఇప్పుడు యేసు క్రీస్తునందు బయలుపరచబడినది. అదిప్పుడు ఆయన సంఘమునకు ఇవ్వబడినది. ఒకప్పుడు దేవుని మనస్సులో ఉన్నది. ఇప్పుడు క్రీస్తు శరీరంలో ఉన్నది. యేసు తన సంఘమును ప్రేమించుచున్నాడు. అది ఆయన యొక్క వధువు. ఆమెతో ఆయన రహస్యములు చెప్పుచున్నాడు. నీ భార్యతో నీవెట్లు మాట్లాడుదువో నీకు తెలియును. ఆమెను నీవెంతగానో ప్రేమించుదువు. నీ రహస్యము లన్నియూ ఆమెతో నీవు చెప్పెదవు. నీ తరువాత స్థానము ఆమేదే. ఆమె నిన్ను ప్రేమించును. అదెట్లుండునో నీకే తెలియును.
ROM 16:25•
EPH 3:3
188సంఘముతో క్రీస్తు ఆలాగే చేయుచున్నాడు, చూచారా. ఆమెకు తన రహస్యములను ఆయన తెలియ చేయుచున్నాడు. కేవలం రహస్యములు మాత్రమే. ఈ సరసమాడు వారికీ కాదు; ఆయన యొక్క భార్య గూర్చి నేను మాట్లాడుచున్నాను, చూచారా. మంచిది. ఇప్పుడు చూడండి.
ఆయన రహస్యముల యొక్క ప్రత్యక్షతను తన కృపనుబట్టి వారికి తెలియచేసెను. ఎటువంటి కృప దేవునిది… జనులారా, అది నేనెరుగుదును. దేవుడు తన రహస్యమును మొత్తం సంఘముతో పంచుకొనును. వారు దానిని చేర్చుకొనవలెను, చూచారా. ఇది కేవలము వ్యక్తిగతంగా ఒక ప్రజల గుంపుకు కాదు. మొత్తం సంఘమునకు అని గ్రహించవలెను అది కేవలం నీకు నాకు కాదు గానీ సంఘమునకు. ఆయన అందులోనికి ప్రవేశించగోరుచున్నాడు. "వారెందుకు దానిని చేర్చుకొనరు?" అని నీవన వచ్చును. వారు చేర్చుకొనరు. వారు చూడలేరని యెషయా చెప్పెను, చూచారా.
2TIM 3:1-9
189ప్రవక్తయగు పౌలు చెప్పెను, "చివరి దినములలో జనులు గర్వాంధులును, దేవుని కంటె సుఖమును ఎక్కువగా ప్రేమించువారును, సజ్జన ద్వేషులను, అజితేంద్రియులును, అనురాగరహితులును అయియుందురు. గర్వాంధులుగాయుందురు." (చూచారా?) పైకి భక్తి గలవారి వలె ఉండియు దాని శక్తిని ఆశ్రయించని వారునై యుందురు. అట్టి వారి నుండి దూరమగుము. స్త్రీలు ఇంటింట తిరుగుచూ ఊసులు చెప్పెదరు. దురాశలకు లోనగుదురు. జుట్టు కత్తిరించుకొందురు. పొట్టి బట్టలు ధరించుదురు. ఇతరులను వ్యర్థముగా సంభాషణలోనికి లాగెదరు. వారు సత్యజ్ఞానమును ఎన్నడూ ఎరుగలేరు. చూచారా?
యన్నే, యంబ్రే అనువారు మోషేను ఎదిరించినట్లుగా వీరును ఎదిరించెదరు. ఒక సంఘమును, ఒక గుంపును వారు కూడబెట్ట గలరు, కాని యేసు "తన వధువు కొరకు" వచ్చినప్పుడు వారిమోసము బయటపడును. ఆయన తన వధువును వెంటబెట్టుకొని వెళ్ళును. ఇది నిజము. వారి మోసము బయటపడును.
DEUT 22:5•
ROM 16:25•
1COR 11:5•
EPH 3:3
190దానిని చూడండి. ఆయన తన కృప చేత వారికి తన రహస్యము తెలియపరచెను. చూడండి, ఈ గొప్ప మర్మము, ప్రత్యక్షత నీకు బయలుపరచబడినది. దానిని నీవు గుర్తించినప్పుడు లోక సంగతులను విసర్జించెదవు.
నేను మరల మీ యొద్దకు ఒక సారి వచ్చెదను. దానిని నేను చెప్పను; దానిని మీకు చూపించగోరుచున్నాను — దానిని టేపు చెప్పును. ఈ టేపు ప్రపంపచమంతా వెళ్ళును, చూచారా. ఈ స్త్రీలు పరిశుద్దాత్మ బాప్తిస్మము పొందామని చెప్పుకొనుచున్నారు. మీ జుట్టును ఎదుగనీయుడి. బైబిలు దానిని గూర్చి చెప్పుచున్నది. జుట్టు కత్తిరించుకొనుట అవమానము. అట్టి స్త్రీకి పరిత్యాగమిచ్చు హక్కు ఆ భర్తకున్నది. బైబిలు దానిని చెప్పుచున్నది. ఆమె జుట్టు కత్తిరించుకొని తన శిరస్సును అవమానపరచుచున్నది. జుట్టు కత్తిరించుకొనిన స్త్రీ ప్రార్థించుటకు తగదు, చూచారా. వృదులైన పొట్టి దుస్తులు ధరించుచున్నది. పురుష దుస్తులు స్త్రీ ధరించుట దేవునికి హేయము. అది ఎక్కడో కంపుకొట్టుచున్న స్నానాల గది అంత అపవిత్రము, అసహ్యము, చూడండి. దేవుని నాసికారంధ్రములకు కంపుకొట్టుచున్నది. ఆలాగుండి నీవు ప్రార్థన చేయగోరుచున్నావు. దేవుడు దానిని త్రోసివేయును. నిజము.
EXOD 20:8,14•
EXOD 31:13-15•
LEV 20:10•
ISA 5:14•
ISA 28:10-13•
ISA 56:2•
MATT 5:28•
HEB 13:8
191"బ్రెన్‌హాం సోదరుడా, నీవు పాత నిబంధన గూర్చి మాట్లాడుచున్నావు." అని నీవనవచ్చును. ఆయన నిన్న, నేడు, నిరంతరము ఏకరీతిగా యున్నాడు. అది దేవుని యొక్క పూర్ణ ప్రత్యక్షత. దేవుడు ఒక్కసారి చెప్పిన దానిని మరల ఎన్నడూ మార్చడు. దానిని ఆయన ఎక్కువ చేయునే గాని మార్చడు. ధర్మశాస్త్రము మరింత వృద్ది చేయబడినది. మార్చలేదు గాని హెచ్చించబడినది.
"వ్యభిచారము చేయువాడు మరొక శిక్షకు పాత్రుడు. (ఇది హెచ్చింపబడినది) ఒక స్త్రీని మోహము చూపుతో చూచుటయే" ఇప్పుడు పాపము. ఆయన ఎన్నడూ ఆజ్ఞలను మార్చలేదు. దానిని ఆయన హెచ్చించెను. "సబ్బాతు దినము గుర్తుచేసికొనండి. దానిని పరిశుద్దముగా ఆచరించుడి." వారములో ఒక రోజును ఇప్పుడాయన హెచ్చించి యున్నాడు.
దేవుని ఆత్మను కలిగియుండుట ద్వారా విశ్రాంతి వచ్చును. సూత్రము వెంబడి సూత్రము, ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ; ఇక్కడ కొంచెము, అక్కడ కొంచెము; మేలైన దానిని చేపట్టుము. నత్తి పెదవుల ద్వారాను, ఇతర భాషలతోను నేను ఈ జనులతో మాట్లాడెదను. అదియే విశ్రాంతి, అది ప్రభుని సన్నిధి నుండి వచ్చిన నెమ్మది. అయినను వారు దానికి చెవినియ్యరు. తమ తలలు ఊచి ఆశాఖలలోనికి వెళ్ళిపోవుదురు. ఇదే విశ్రాంతి - సబ్బాతును ఆచరించే మీకు సబ్బాతు దినము హెచ్చింపబడినది. (చూచారా?) ఆయన మారడు. దానిని ఆయన హెచ్చించెను. వారిని చేర్చుకొనుటకు పాతాళపు ద్వారములు విశాలము చేయబడినవి.
192అంత్యకాల వర్తమానమును ఇప్పుడు ఎందుకు విసర్జింపబడినదో మీరు చూడగలరు. మీరు గ్రహించగలరా? ఏ శాఖలేదు ఆయన మర్మము యొక్క ప్రత్యక్షతయే కావలెను, చూచారా. ఏ శాఖ లేదు. ప్రత్యక్షతయే అవసరము. ఒక శాఖ ద్వారా దేవుడు తెలియబడడు. ప్రత్యక్షత ద్వారా ఆయన తెలియబడును.
తన శరీరమైన క్రీస్తులో దేవున్ని తన శరీరమైన వధువులో క్రీస్తును చూడండి. దేవుడు క్రీస్తులో ప్రత్యక్షమాయెను. క్రీస్తు వధువులో ప్రత్యక్షమాయెను. ఆదాము శరీరములో నుండి ఆయన స్త్రీని తీసెను. ఆమె పడిపోయెను. వాక్యమై యున్న క్రీస్తు శరీరములో నుండి ఆయన తన వధువును తీసెను. ఆమె శాఖల బోధ ద్వారా పతనము కాదు. ఆమె కల్తీలేని వాక్య ప్రత్యక్షతతో తిరిగి వచ్చును. ఈ టేపును విను ప్రతి స్త్రీ, ప్రతి పురుషుడు గ్రహించగలరని తలంచుచున్నాను, చూచారా. ఆమె రెండవ హవ్వ. ఆమె తన భర్తకు అపనమ్మకత్వముగా జీవించదు. తన పరిశుద్దతను పాడుచేసికొనదు. ఎవరేమి చెప్పినా గాని ఆమె ఈ వాక్యముతోనే నిలచి యుండును. ఎన్ని సార్వత్రిక సంఘ ఉద్యమములు వచ్చినా గాని నీవు కదలవు.
EPH 5:27
193త్వరలోనే వారు ఒక హింసను తీసికొని రాబోవుచున్నారు. అన్ని సంఘములను మూయుదురు. దానిని మీరు చూచెదరు. శాఖలలో చేరని ఆలయములను వారు గోదాములుగా ఉపయోగించుదురు. సార్వత్రిక సంఘ ఉద్యమమునకు చెందని వారెవరూ ఇతరులకు ప్రార్థించరాదని ఆంక్షలు వచ్చును. ఆలాగు ప్రార్థన చేయువారిని అక్కడే కాల్చి వేయుదురు. ఇప్పటికే అది తయారయినది. లూధరను వ్యక్తి దానికి అధిపతిగా యున్నాడని వారు చెప్పిరి. అది వచ్చి యున్నది. మీ పత్రికలలోనే దానిని మీరు చదువగలరు. అది సత్యము.
వారేమి చెప్పినా గాని ఆ సంఘము మాత్రము ఈ వెలుగులో చెక్కు చెదరక యుండును. గతంలో ఆ విధంగా రుజువయినది. మరల ఆలాగే జరుగును. ఇది దేవుని వాక్యము. ఈ సార్వత్రిక సంఘ ఉద్యమములన్నియూ పోవును. ఆమె మచ్చ, ముడత లేనిదిగా యుండును. ఆమె అచ్చట నిలబడును.
JOHN 8:46•
JOHN 10:37
194చూడండి, దేవుడు క్రీస్తు శరీరములో ప్రత్యక్షమాయెను. మీరు ఆ చక్క, ఈ మూడు విధముల ప్రత్యక్షతను చూచారు. సంఘమే క్రీస్తు శరీరము. అందులో ఆయన యొక్క వాగ్ధాన వాక్యము ఋజువగు చున్నది. క్రీస్తు ద్వారా అది ప్రత్యక్షమైన రీతిగానే. ఇది యున్నది. "నాలో పాపమున్నదని ఎవరు నిరూపించగలరు? తండ్రి క్రియలు నేను చేయని యెడల నమ్మకుడి. ఏ విషయంలో తప్పిపోయాను? మీ శాఖలవారు దానిని చేయుచున్నామని చెప్పుకొనుచున్నారు గదా? ఇప్పుడు నాకు చూపించండి, ఎక్కడ నేను మెస్సీయగా ఉండుటలో విఫలమయ్యానో చూపించండి. మెస్సీయా వచ్చినప్పుడు ఏ గురుతులు కనబడునని దేవుడు చెప్పెనో, అవి కనబడ లేదా? వాటిలో ఏవి నేను నెరవేర్చలేదో చెప్పండి?" అని చెప్పెను, చూచారా. దేవుడు తన శరీరములో యున్నాడు.
JOHN 14:12
195"నేను చేయు క్రియలు మీరును చేయుదురు." చూడండి, ఆ దేవుడు మారలేదు, చూచారా. నేను చేయుక్రియలు మీరును చేయుదురు. ఇంతకన్న గొప్పవియు చేయుదురు, ఏలయనగా నేను తండ్రి యొద్దకు ఎక్కిపోవుచున్నాను. సంఘము ఇంకొద్దిసేపు వెలుగులోయుండును. చూచారా? తన వాగ్దాన వాక్యము క్రీస్తు శరీరములో తన వాగ్దానములను దేవుడు ఋజువు చేసినట్లే క్రీస్తు అదే క్రియలను క్రీస్తు శరీరమైన సంఘంలో చేయుచున్నాడు. ఈ చివరి దినమున దేవుడు తన మర్మమును వధువు వృక్షముకు బయలు పరచుచున్నాడు. ఆదిలో యుండిన ఫలములనే ఈ వధువు వృక్షము ఫలించుచున్నది.
196చూడండి, ఈ చెట్టు ఒక కొమ్మను వేసినది - అది లూధరు శాఖ. అదేమి చేసెను? ఆ చెట్టు ఎదుగుచుండగా, దానితో పాటు ఫలములును వచ్చినవి. అయితే ఏమయినది? - వారు శాఖగా మారిపోయిరి. కొమ్మలను ఆ తోటమాలి (తండ్రి, వ్యవసాయకుడు) కత్తిరించెను. "అది చనిపోయినది" అనిరి. కాని వెస్లీ వచ్చెను; అంతా చక్కగానే జరిగినది. ఏమయినది? ఫలము మరల చెట్టు లోనికి వెళ్ళినది. అతడు ద్రాక్షావల్లిని నరికి వేయగా "అది చనిపోయెను."
నాకు ముప్పయి-మూడు సంవత్సరముల సంఘ చరిత్ర తెలియును. సంస్థగా మారిన ఏ సంఘమయినా గాని చనిపోలేదేమో నాకు చూపించండి? మరల ఎన్నడైనా తిరిగి లేచేనేమో చూడండి? ఉజ్జీవమువల్లనే అది లేచును, చూచారా. అది అక్కడ లేదు. అది పూర్తిగా గతించిపోయినది.
PS 1:3
197ఆ వ్యవసాయకుడు ఏమి చేసెను? వచ్చి దాని కొమ్మలు కత్తిరించెను, చూచారా. అది శాఖా సంబంధమగు ఫలములను ఫలించినది. (నారింజ చెట్టుకు నిమ్మకాయలు కాసినవి), కాబట్టి ఆయన వాటిని కత్తిరించెను.(చూచారా?), కాని చెట్టు యొక్క గుండె ఎక్కడున్నది? - మధ్యలో యున్నది. ఆయన పైవరకు దానిని కత్తిరించెను. వేరులో విత్తనమున్నది. నీటి కాలువల యోరను నాటబడిన చెట్టును పోలియున్నారు. (అతడు దేవుని ధర్మశాస్త్రమును, ప్రేమను తన హృదయములో చేర్చుకొనును) — అతడు నీటి కాలువల యోరలను నాటబడిన చెట్టువలె యుండును. ( 1 కీర్తన) దాని ఆకులు వాడవు. దాని కాలములో అది ఫలించును. మొదటగా పక్వమునకు వచ్చు ఫలము ఏది? పైనున్న భాగము ఎందువలన? దాని మీద వెలుగు పడును. ఆమేన్! నేరుగా చెట్టు యొక్క పై భాగము మీదనే ఈ చివరి దినములలో ఆయన ఒక వధువు వక్షమును ఉనికి లోనికి తీసికొని వచ్చుచున్నాడు.
GEN 2:17•
GEN 3:3•
GAL 3:13
198గుర్తుంచుకొనండి, ఆయనే జీవ వక్షము. అది సర్ప సంతానమునకు విరోధము. ఆయనే ఆ స్త్రీ యొక్క సంతానము. ఆ తోటలోని జీవ వక్షము వారు తమ చేతులు చాపి ఆ జీవ వృక్షఫలమును తెంపి తినినచో నిత్యము బ్రదుకుదురు. నీవు నిత్యమూ జీవించుటకు ఆయనే జీవవక్షమైయున్నాడు. ఆయన మాటయే జీవము. అది అప్పటి వాక్యము (ఏదేను తోటలో దేవుని వాక్యమును హవ్వ త్రోసివేసినది) — ఇప్పుడైతే ఇక్కడ వాక్యమైయున్న క్రీస్తు బయలుపరచబడెను. ఆయన జీవ వృక్షముగానే ఈ భూమి మీదికి వచ్చెను. దానిని మీరు నమ్ముచున్నారా? రోమ్ ఏమి వేసినది? దానిని ఆయన నరికి వేయవలసి వచ్చెను. ఆయన ఒక అవమానపు చెట్టును ఎక్కెను. (మ్రాను మీద వ్రేలాడువాడు శాపగ్రస్తుడు), మానవ జాతి కొరకు ఒక శాపముగా మారెను. దాని వలన ఆయన ఒక వధువు వక్షమును తీసికొని వచ్చెను. అది ఏదేను తోటలోని భార్య, భర్తల వలే తీసికొనుము తిరిగి పునరుద్దరింపబడిన జీవ వృక్షము. ఓ, దేవునికి మహిమ! ఆ దేవుడే అదే వాక్యముతో భార్య, భర్తల వలెనే ప్రత్యక్షపరచబడెను. అదే వధువు వృక్షము మరల తెలియచేయబడినది.
199(గమనించండి) దానిని తెలియజేయుట.
ఎంత చెప్పినా ఇది తరగదు. చూడండి, క్రీస్తు వృక్షము, ఏదేను తోటలోని శరీరము — ఇపుడు క్రీస్తు ఆయన యొక్క మర్మమును ఈ వధువు వృక్షమునకు తెలియజేయుచున్నాడు, రెండవ ఆదాము (ఆయనే అని మీరు నమ్ముచున్నారా?) పడిపోయిన తన భార్యను ఆయన మరల విమోచించి తన గృహమునకు తీసికొని వచ్చెను. అదే ఈనాడు క్రీస్తు ఆయన సంఘము, అనగా ఆయన భార్యను విమోచించెను. ఇప్పుడు మూడు విధముల మర్మము అర్థమైనదా? దేవుడు క్రీస్తులో ప్రత్యక్షమాయెను; క్రీస్తు సంఘములో ప్రత్యక్షమాయెను; ఆదిలోని ఆదామవ్వలు ఉండిన స్థితికి మరల మనలను తెచ్చుటకే ఒకే రక్తము, ఒకే ఆత్మ మొదలగు వాటి ద్వారా చేయబడ్డారు. గనుక పురుషుడు మరియు స్త్రీ ఒక్కటే.
GEN 9:4•
ROM 4:8•
ROM 8:29,30•
EPH 1:5,11
200ఆత్మతో కూడిన క్రీస్తు రక్తమే సంఘము, ఎందుకనగా రక్తములోనే ప్రాణమున్నది. పరిశుద్దాత్మ బాప్తిస్మము వలన ఆయన శరీరము లోనికి మనము వచ్చుచున్నాము. అది కేవలము ఆయన శరీరమును ఆయన వాక్యమును గుర్తించును. ఒక శాఖ దానిని ఎన్నడూ అంటుకొనజాలదు. అది ఒక ప్రత్యక్షత ఆమె దానిని ఎరుగును. హవ్వ కూడా అలాగే ఎరుగును, కాని పడిపోయినది. కాని ఆమె ఆ విధంగా పడిపోదు.ఆమె నియమించబడినది. హల్లెలూయ పడి పోకుండా యుండుటకు ఆమె నిర్ణయించబడినది. ఆమె తప్పిపోదు. అందుకు ఆమె ముందే ఏర్పరచబడినది. దేవుడు ఎవరిని పాపిగా ఎంచడో వారు ధన్యులు. నేను మాట్లాడుచున్న దానిని మీ సేవకులు ఎరుగుదురు. ఇక్కడ రెండు డజనుల మంది యున్నారు. చూచారా? "దేవుని చేత నిర్ధోషీ అనిపించుకొనిన వాడు ధన్యుడు." అని దావీదు పలికెను.
PS 32:2•
ISA 65:21,22•
EPH 1:3•
EPH 2:6
201చూడండి, ఆయన విమోచించి, మానవ శరీరములో నిత్యజీవము ఇచ్చి మరల గృహమునకు తోడ్కొని వచ్చెను. తినుచూ, త్రాగుచూ, నిరంతరము జీవించెదవు. యెషయా ఇట్లు చెప్పెను. వారు ఇండ్లు నిర్మించుకొని వాటిలో కాపుర ముందురు. ద్రాక్ష తోటలు వాటి వాటి ఫలములను తిందురు. వారు కట్టని వాటిని ఆక్రమించరు. వారి పిల్లలు ఆక్రమించరు, కాని వారు తమ సంతానముతో కూడా అక్కడుందురు. అతడు దానిని నిర్మించి అందులో నివసించవలెను. ఆమేన్! ఏమిటది? ఆయన వధువు ఆయనతో కూడా తిరిగి వెళ్ళుచున్నది. ఆనాటి అసలయిన ఆదామవ్వల స్థానమునకు తిరిగి తీసికొన రాబడినది మరణము వెనుకకు విసిరివేయబడినది. వారు సిలువ వైపుకు చూచెదరు. అక్కడ మరణము వెల చెల్లించబడినది. ఇప్పుడు విశ్వాసమును బట్టి మనము ఆయనతో కూడా పునరుత్థానము పొంది పరలోక స్థలములందు కూర్చొనియున్నాము. మనలను ఏది విమోచించినదో దాని వైపు చూచుచూ రాబోవు భర్త కొరకు ఎదురు చూచుచున్నాము. ఆయనతో కూడా గృహమునకు వెళ్ళెదము.
REV 1:8
202ఆదామవ్వలలోను, ప్రతి ప్రవక్తలోను, అన్ని కాలములలోను, దేవుని యొక్క మూడు రకముల ప్రణాళిక నెరవేరినది. రానున్నవాడు ఆయనే — ముందుండినవాడు ఆయనే, ఇపుడున్నవాడు ఆయనే, ముందుండబోవు వాడు ఆయనే. ఇదంతయు దేవుని వాక్యము యొక్క సంపూర్ణ ప్రత్యక్షత. ఆదామవ్వలు విమోచించబడి తిరిగి ఇంటికి వెళ్ళిరి. దేవుడు తన్నుతాను తెలియపరచుకొనెను.
REV 19:15•
REV 21:24-27•
REV 22:2,5
203ఆయన దావీదు సింహసనము మీద కూర్చొనును. అవునా? ఇనుప దండముతో అన్ని రాజ్యములను ఏలును. ఇరు వైపుల చెట్లుండును, ప్రతి దేశమునకు ఈ ఆకులు స్వస్థతనిచ్చును, జనులు ఆకుల వలన బాగవుదురు. రాజులు తమ మహిమను అందులోనికి తీసికొనివచ్చెదరు. నిషిద్దమైనదేదియూ అందులో ప్రవేశించదు. దివా రాత్రులు సీయోను పర్వతము మీద వెలుగుండును. విమోచించబడినవారు ఆ వెలుగులో నడిచెదరు. ఓ! హల్లెలూయా!
ఆలోచించగా ఇది ఒక మర్మమగు గాధ వలె కనిపించదు. ఇది ఏదో ఒక వేదాంత ఊహ కాదు. ఇది యేసుక్రీస్తు యొక్క వాక్యము ద్వారా ప్రత్యక్షతయై యున్నది. ఇది అన్ని కాలములలోను ప్రకాశించి సత్యముగా రుజువయింది. ఈ కాలములోను ఇది సత్యమే. ఇక్కడను ఇది సత్యమే. నాతోను ఇది సత్యమే, నీతోను ఇది సత్యమే. ప్రతి పురుషుడు ఈ ప్రత్యక్షతను పట్టుకొనవలెను. ఆమేన్.
PHLM 1:1,9
204చూడండి, దేవుడు తన్నుతాను తెలియచేసికొనుచున్నాడు. ఇప్పుడు ఆయనకు నీవొక ఖైదీగా జీవించే జీవితము ద్వారానే ఆయన నాడి కొట్టుకొనుచున్నది. నీవాయన ప్రేమ ఖైదీవి. ప్రపంచము నిన్ను ఎగతాళి చేయవచ్చును, "బయటకురా" అని పిలువ వచ్చును. నీవు వెళ్ళగలవు, కాని ఒక బంధీవి. స్త్రీలు హాలీవుడ్ తారలవలె ప్రర్తించగలరు, కాని నీవు ఖైదీవి గనుక, ఆలాగుండలేవు. ఆమేన్! నీవు క్రీస్తు బంధీవి. ఇతరులు ధూమము, మద్యము సేవిస్తూ ముందుకెళ్తుండవచ్చు. ఆ విధంగా ఉండికూడా వారు క్రైస్తవులుగా, సంఘ పెద్దలుగా, బోధకులుగా చలామణి అయ్యెదరు. కాని నీవాలాగుండ లేవు; నీవు బంధీవి. నీవు వాక్యమునకు బంధీవి. అవును! అవును!
205ఆయన తన మర్మమును రెండవ ఆదాము అయిన క్రీస్తు ద్వారా విమోచించబడిన తన వధువు వక్షముకు బయలుపరచి యున్నాడు. మొదటి ఏదెనును ఆక్రమించుటకు తిరిగి గృహమునకు వెళ్ళుచున్నారు. మరణము, వ్యాధి, దుఃఖము, అవమానము నుండి విడుదల పొందిరి. నిత్యజీవముతో ఇంటికి వెళ్ళు చున్నారు. వినండి. చాలా మంది తప్పు అభిప్రాయము కలిగియున్నారు. క్రైస్తవులుగా జనులను మార్చ వలెనను ఆలోచన తప్పు. ఆ ప్రభుత్వము దేవుని ఆలోచనలో లేదు.
"ఆయన ప్రభుత్వము ద్వారా మనము క్రైస్తవులనుగా మార్చ వచ్చును," అని మీరనవచ్చును.
కాని అది కాదు.
"వారు త్రాగరు, అబద్దమాడరు అందువు."
మీకు తెలుసా మిమ్ములను మహమ్మదీయులు తలదన్నియున్నారు . ఆఫ్రికాలోని అన్యులు అంతకంటె గొప్ప శాసనములను కలిగియున్నారు. (నల్లవారు) క్రైస్తవ్యములో లేని కట్టడలు ఆ తెగల మధ్యయున్నవి అవి క్రైస్తవ్యములోని ఉత్పత్తియైన దేనినైనా చేయగలురు.
206షుంగాయ్ అను తెగ మధ్యకు నేను వెళ్ళాను. ఒక యువ స్త్రీ నిర్ధిష్టమైన వయస్సు వచ్చినప్పుడు పెండ్లి చేసికొనని యెడల ఆమె తన తెగను, తన తెగ యొక్క అలంకరణను విడిచిపెట్టి పోవలెను. ఆమె పట్టణములోనికి పోవును. ఆమె బలవంత పరచబడినది. ఆమె పెండ్లి కాక ముందు కన్యత్వ పరీక్షకు నిలబడవలెను. ఎవరితోనయినా వ్యభిచారము చేసినతో ఆ వ్యక్తి ఎవరో చెప్పవలెను. వారిద్దరూ చంపబడెదరు.
మన నామకార్థ క్రైస్తవులను వీరు తలదన్నియున్నారు. ఆ విధమగు శాసనము చేసినచో, ఆ నామకార్థ క్రైస్తవులలోనూటికి తొంబది-తొమ్మిది శాతము మంది పగటి వెలుగు ముందే చనిపోవుదురు. ఇది నిజము. స్త్రీ పురుషులిరువురూ ఆలాగే యున్నారు. ఇది నీకు తెలుసా, ఇది నిజము.
"నేను పవిత్రంగా యున్నాను" అని చెప్పితే చాలదు.
MATT 5:28
207"ఒక స్త్రీని మోహపు చూపుతో చూచువాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచరించినవాడగును." దాని మాట ఏమిటి? పురుషుల ఎదుట ఆ విధంగా కనబరచుకొనుచున్న సోదరీ, నీ సంగతి ఏమిటి? నీవు చేసిన దానికి నీవు దోషివి.
"ఓ! పరవాలేదు అని పాస్టరు గారనుచున్నారు." చేసిన దానికి నీవు దానిని చెప్పుటకు అతడు భయపడుచున్నాడు. ఎందుకు? దానిని గూర్చి సూటిగా చెప్పినచో అతని శాఖయొక్క ప్రధాన కార్యాలయము నుండి బహిష్కరణ ఉత్తరువులు వచ్చును. వారు సంకరపు జాతివారు వారు వాక్యమును తీసికొనరు అది నిజమని వాక్యము చెప్పెను. అది సత్యమని యేసు చెప్పెను. ఆయనే శిరస్సు.
JOHN 14:20•
JOHN 16:4•
JOHN 17:21-23•
2COR 5:19
208ఇప్పుడు చూడండి, దేవుడు తన్నుతాను బయలుపరచుకొనుచున్నాడు. ఒక ప్రభుత్వము ద్వారా మనము జనులను క్రైస్తవులనుగా చేయుట కాదు. క్రీస్తులో దేవుడున్నట్లుగా, నీలో క్రీస్తు ఉన్నాడనే ప్రత్యక్షతను బట్టియే అతడు మారవలెను. క్రీస్తులో దేవుడు ఎలాగుండెనో అలాగే నీలో క్రీస్తుండును. క్రీస్తులో దేవుడు జరిగించిన కార్యములు నీలో క్రీస్తు జరిగించును. క్రీస్తులో కనబడిన దేవుని ఆశ్చర్య కార్యములు క్రీస్తు నీలోను చేయును. ఓ! ఇది ఆశ్చర్యము కదా! ఓ! అది నాకు ఇష్టము.
ఆ దినమున (అది ఈ దినమే) ప్రత్యక్షత బయలు పరచబడినప్పుడు నేను తండ్రి యందును, తండ్రి నాలోను, నేను మీలోను, మీరు నాయందును ఉన్నారని తెలియును. (ఈ ప్రత్యక్షత బయలుపడినప్పుడు) నేను, తండ్రి ఒక్కటిగా యున్నామని మీరు ఆ దినమున తెలికొందురు. నేను తండ్రి యందును, తండ్రి నా యందును ఉన్నామని ఎరుగుదురు. ప్రత్యక్షత వచ్చినప్పుడు నేను మీలోను, మీరు నా యందును ఉందుము.
అక్కడే మీరున్నారు. మూడు విధముల ప్రత్యక్షత చూచారా? తిరిగి వచ్చుటకే.
యేసే దేవుని వాక్యము. దానినే ఆయన బయలుపరచెను.
JOHN 1:1
209ఆయన వాక్యమై యుండని యెడల వాక్యమును బయలు పరచియుండెడి వాడు కాడు. ఆయన ఒక గొప్ప వేదాంతి వలె ఉండియుండును. ఆ రకమగు నిజమైన మెస్సీయా కొరకు లోకము ఎదురు చూచుచున్నది. అవునా? అది ఆయనే. ఈ రోజు కూడా వారు ఆయన కొరకు ఎదురు చూచుచున్నారు. బిల్లీగ్రాహంను, లేదా ఏదో సంస్థ వారిని బాప్టిస్టు వారిని మించిపోయి తామెక్కడ ఉన్నారో వారు ఎరుగరని బాప్టిస్టులకు చూపేవాని కొరకు లోకం ఎదురుచూస్తుంది. వారు దాని కొరకు నిశ్చయంగా ఎదురుచూచుచున్నారు. సజీవ దేవుడగు క్రీస్తు యొక్క సూచక క్రియలు మరియు దీనత్వము కొరకు సంఘము ఎదురుచూచుచున్నది.
JOHN 14:11•
JOHN 16:4•
JOHN 17:21-23•
JOHN 20:21
210యేసు గొప్ప వేదాంతి కాడు. ఆయన ఒక సామాన్యుడు. వడ్రంగి వాని కుమారుడు. (ఆలాగు పిలువబడెను), చూచారా? "నేను ఏది చేయుదునని బైబిలు చెప్పెనో దానిని బయలుపరచుటలో ఎక్కడ నేను తప్పిపోయానో మీలో ఎవరైనా చూపించగలరా?" అని ఆయన ప్రశ్నించెను.
నేడు సంఘము కూడా ఆలాగే చేయును. క్రీస్తు జరిగించినవాటినే ఇప్పుడు సంఘము జరిగించుచున్నది. "ఆ దినమున నేను తండ్రి యందును, తండ్రి నాయందును, నేను మీ యందును, మీరు నాయందును ఉన్నారని తెలిసి కొందురు" చూచారా. సీయోనుకు వెళ్ళుచున్నాము. ఎక్కడికి ? రాజ్యముకు "ఆ దినమున ఆయన మనలో ఈ విధముగా ఉండెనో తెలియును."
JOHN 14:20•
JOHN 17:18
211ఇక్కడ చూడండి. ఇది చక్కగా యున్నది. దీనిని మీరు తప్పిపోవద్దు. ఇప్పుడు అందరూ జాగ్రత్తగా వినవలెను, మీరు అరణ్యములలో యుండి టేపు వినుచున్నా గాని దీనిని తప్పిపోక వినండి. తండ్రి నన్ను పంపినట్లుగా నేను మిమ్మును పంపుచున్నాను అని యేసు చెప్పెను, చూచారా. ఇపుడు గమనించండి. ఆయనను పంపిన తండ్రి ఆయనతో కూడా వచ్చి తన్ను ఋజువు చేసుకొనెను, ఏలయనగా ఆయన వాక్యమైయున్నాడు. మిమ్మును పంపిన ఆ యేసే ఈ దేవునినే ఋజువు చేయుటకు మీతో వచ్చును. మీలో ఉండును. తండ్రి నన్ను పంపినట్లుగా నేను మిమ్మును పంపుచున్నాను. నా వలన మీరు బ్రదికెదరు. (నేను తండ్రి వలన జీవించుచున్నాను), ఆయనెవరు? — వాక్యమే. వాక్యము ద్వారానే నీవు జీవించెదవు. ఆ అంశము మీద నేను రెండు గంటలలో ఎలాగు పూర్తిగా ప్రసంగించగలను. (చూచారా?)
చూడండి, ఆయనను పంపిన తండ్రి ఆయనతో కూడా వెళ్ళెను. తండ్రి పంపినట్లుగానే మనలను పంపు—
MATT 28:20•
JOHN 14:12,19•
JOHN 20:21
212- యేసు మనతో కూడా వచ్చును… "ఇక కొంచెము కాలము అయిన పిదప లోకము నన్ను చూడదు. అయినను మీరు చూచెదరు, ఏలయనగా నేను వ్యక్తిగత సర్వనామం. నేను అనునది వ్యక్తి, యేసు మీలోను, మీతోను యుగసమాప్తి పర్యంతము ఉందును. నేను చేయు క్రియలు మీరును చేయుదురు." ఇప్పుడు, వెనక్కి వెళ్ళి ఆయనేమి చేసెనో చూడండి. ఇప్పుడు మీరు చేయుచున్న వాటిని వాటితో పోల్చి చూచుకొనుడి.
GEN 18:22,30•
GEN 19:11•
MATT 24:37•
LUKE 17:26,28,30•
2COR 4:4
213"నోవహు దినములలో ఉండినట్లుగానే మనుష్య కుమారుని రాకడలోను ఉండును. లోతు దినముల వలెను ఉండును." ఆధునిక బిల్లీగ్రాహం, ఓరల్ రాబర్ట్‌లు సొదోమ లొనికి వెళ్ళి సొదొమ వారికి బోధించిరి. సువార్త వలన వారి కన్నులు గ్రుడ్డివాయెను. (చూచారా?) ఒక దూత వెనుక ఆగిపోయెను. (వర్తమానికుడు) అతడు అబ్రహాముతోను, ఎన్నుకొనిన గుంపుతోను నిలచియుండెను. ఎట్టి గురుతు ఆయన ఇచ్చెను? చూచారా? ఆయనను అబ్రహాము ఏమని పిలచెను? ఎలోహిం. దేవుడు శరీరమందు ప్రత్యక్షమాయెను. చివరి దినములలో యేసే వధువు యందు దేవుడు తనలో ప్రత్యక్షమైనట్టుగా ప్రత్యక్షమగునని చూపించుకొనుచున్నాడు. (ఆయనలో దేవుడుండెను) దీనికి అంతము లేదు. ఇది దేవుని యొక్క ప్రత్యక్షత. ఇది నిత్యమైనది. ఇది ముందుకు కొనసాగిపోవుచుండును.
214గమనించండి. మొదటి ఆదామవ్వల వలెనే (పాపము వారిని వేరు చేయక ముందు మరణము సంప్రాప్తియించక ముందు) — ఇప్పుడు క్రీస్తే రెండవ ఆదాము. మరణము నుండి ఆయన తన వధువును విమోచించును. జీవమిచ్చి మొదటి ఏదెను యొద్దకు తీసికొని పోవును. తన వధువుకు తిరిగి దేవునితో సహవాసమును పునరుద్దరించును. ఏదెను తోటలో వారు మరల భార్య-భర్తలుగా యుందురు. క్రీస్తు మరియు ఆయన వధువు.
ISA 65:24,25•
1COR 15:28
215ఆ దినమున తండ్రికి రాజ్యము అనుగ్రహించబడును. ఆయనే సర్వములో సర్వమగును. "ఆయన మాట్లాడుచుండగా నేను విందును." దావీదులో క్రీస్తును చూతుము. మొత్తం మానవజాతి మీద ఆయన రాజుగా సింహాసనమధిష్టించును. "వారి ఆలోచనను ఆయన ఎరుగును. వారడుగక ముందే ఆయన జవాబిచ్చును. గొర్రెపిల్లయు, సిహమును కలిసి మేత తినును. సింహము ఎద్దు వలె గడ్డి తినును. అవి కలిసి మేయును. కలిసి పండుకొనును. దేవుని పరిశుద్ద పర్వతము మీద అవి హాని కలిగించకుండా నివసించును." తిరిగి మొదటి ఏదెను వచ్చును. మూడు విధముల ఉద్దేశము అచ్చటున్నది. ఓ దేవా! దానిని తెలిసికొనుటకు సహాయము చేయుము. దానిని తెలిసికొనుటకు మాకు సహాయము చేయుము.
216ఇంకాముందుకు మనము వెళ్ళుచుండగా జాగ్రత్తగా వినండి. అసలు ఏదెను యొద్దకు మరల వెళ్ళుచున్నాము. ఆయన మూలముగా మనము జన్మించినప్పుడు ఆయనతో నింపబడుదుము. ఆయన జీవము మీలో యుండును. మన క్రియలన్నియూ ఆయనను వెల్లడి చేయును. ఒక చెట్టులోని జీవము తీసి మరొకదానిలో పెట్టినట్లుండును. ఒక పియర్ చెట్టులోని జీవమును యాపిల్ చెట్టులో ఉంచిన యెడల ఆ యాపిల్ చెట్టు పియర్ ఫలములను ఫలించును, ఎందుకనగా ఆ జీవరసము పియర్ చెట్టు అయి యున్నది. కాబట్టి అది ఆలాగు ఫలించవలసి యున్నది. మన క్రియలన్నియూ ఆయనను వెల్లడి చేయును. ఆయన పేరు మనకున్నది.
అది నిజమేనా? ఆయన నామమును మనము భరించవలెను.
REV 1:18
217గుర్తుంచుకొనండి, ఇప్పుడు మనమాయన వధువు అయి యున్నాము. ఆయన ఆత్మ గర్భమును ధరించియున్నాము. ఓ! సంఘము పిల్లలను కనుచున్నది. (చూచారా?), ఆయనాత్మ వలన గర్భము ధరించి ఆయన నామమును భరించుచున్నాము. ఆయన జీవమును కలిగి యున్నాము. ఆయన జీవపు రుజువులను కనబరచుచున్నాము. ఆయనకే ప్రాధాన్యత ఇచ్చుదుము. ఆయన చనిపోలేదని ఆయన పునరుత్థానము వలన రుజువగుచున్నది. సదా ఆయన జీవించియున్నాడు. ఇది నిత్య జీవము! ఆయన యందు మనమును జీవించియున్నామని ప్రపంచమునకు వెల్లడగుచున్నది.
ROM 8:29,30•
EPH 1:4,5,11•
1PET 1:20
218నీకెట్లు తెలియును? నీవు సంఘ సభ్యునివి అయినందునా? కాదు. క్రీస్తు నీ ద్వారా జీవించుచున్నందునే తెలియును. ఆయనాత్మతో గర్భము ధరించి యున్నావు. గనుక ఆయనకు బంధీవైతివి. నీవు సువార్తకు, వాక్యమునకు కట్టుబడి యుందువు. ఆ విధంగా నీవు బిడ్డలను కనెదవు — ఎందుకనగా నీవాయనకు బందీవైతివి.
నీవు వ్యభిచారము చేయజాలవు, ఎందుకనగా నీవు ముందే గర్భము ధరించి యున్నావు. ఆమేన్! ఆ గర్భములో జీవము కలదు. నీవు ఆయన ముందు నిర్ణయములో యున్నావు. ఆ విత్తనము జీవమును పొందును. లోకము అందులో ఏ విధంగానూ ప్రవేశించజాలదు. ఒక గంటసేపు దీనిని నేను చెప్పగలను. మీరు అర్థము చేసికొనగలరని నమ్ముచున్నాను. క్రీస్తు మాత్రమే చాలును. ముందే ఆ కార్యము సమాప్తమైనది. బీజము అచ్చటున్నది. ఎప్పుడది ఉంచబడినది? జగత్తు పునాది వేయబడక ముందే, నిత్య జీవమునకు ఆయన మనలను ముందే నిర్ణయించెను. జీవము ఆబీజములో ప్రవహించుచున్నది. ఇతర విత్తనములు దానిని గ్రహించజాలవు, కాని ఈ విత్తనము వెంటనే దానిని గ్రహించును. ఈ బీజములోనికి రాగానే, వెంటనే గర్భము మూయబడును. మిగిలిన విత్తనములన్నియూ నశించును. (చూచారా?) నీవు క్రీస్తు చేత చుట్టు ముట్టబడి బంధీగా అగుదువు. నీలో నున్న క్రీస్తు జీవము వలన సూచన క్రియలు కనబడును. చూడండి? ఆయన జీవపు సూచక క్రియలు, ఆయన పునరుత్థాన రుజువు గాను నిత్య జీవము గల లోకమునకు నిరూపణగాను ఆయనలో మనము జీవించుచున్నామనుటకు ఋజువు గాను ఉన్నవి. దానిని గూర్చి ఆలోచించండి! మన విమోచకుడగు దేవునితో సజీవులమై యున్నాము. ఆ ఉద్దేశ్యముతోనే ఆయన మనలను సజించెను. మరియు ఆయన యొక్క సుజనాత్మక జీవము మనలో ఉన్నది. (సంఘము) దేవుని వాక్యము బట్టి మోషే పలుకగానే ఈగలు వచ్చెను. ఈగలను సృజించిన దేవుడు ఉడుతలను సృజించగలడు, చూచారా.
EXOD 8:5,6•
PHLM 1:1,9
219దేవుడు తనకు ఇష్టమయిన దానిని చేయగల [స్పష్టతలేని మాటలు] దేవుడు.
మారని దేవుడు (సృజి౦చే జీవము — చూచారా?) నీవు బంధీవి; ఆయన మాట్లాడుమను వరకు నీవు మాట్లాడలేవు. నీవు దేవుని మాటను మాత్రమే పలుకుదువు. ఆ విధంగా ఆయన వెల్లడియగును. ఏ సమయంలో పలుకవలెనో ఆయనకు తెలియును. చూచారా? మోషే తన కర్ర పట్టుకొని కప్పలు వచ్చుగాక అనగా, కప్పలు వచ్చెను. దేవుడే ఆ కప్పలు వచ్చునట్లుగా పలికెను. దానిని మోషే ప్రసారము చేసెను. ఎక్కడ చూచినా కప్పలే. అవి ఎక్కడ నుండి వచ్చినవి? ఎవరికీ తెలియదు. ముందు అవి అచ్చట ,లేవు. కాని సష్టికర్తయగు దేవుడు ఒక మానవుని ద్వారా పని చేసెను. జీవ రాసులను సజించెను. మొదటి కప్పను చేసిన దేవుడు రెండవ కప్పను కూడా చేయగలడు. అన్ని కప్పలను ఆయనే చేసెను. ఓ! చూచారా? మొదటి ఉడుతను ఆయన సృజించెను. రెండవ ఉడుతను ఆయన సృజించెను. ఏ ఉడతయూ లేనిచోటనే ఆయన అన్నియూ సృజించును. ఆయన తన ఇష్టానుసారము చేయును. ఆయన దేవుడు! ఆయన దేవుడు; ఆయనయే జీవము.
దానిని గూర్చి ఆలోచించుచుండగా నాకు వణకు పుట్టుచున్నది.
220ఓ! ఆయనతో జీవించుటకు నేను ప్రేమించెదను — ఆయనతో ఇంటికి చేరెదను! సదాకాలము ఆయనతో జీవించుటకు గృహమునకు వెళ్ళెదను. నిత్య జీవము పొందెదను.
ఇది దేవుని ప్రేమ యొక్క గొప్ప మర్మము. అది వెల్లడి అయినది. దేవుడు, మానవుడు ఏకమయిరి. చూచారా? దేవుడు, మానవుడు ఏకమగుటే పూర్తి సంగతి. అక్కడ దేవుడు మానవుడు ఒక్కటయిరి. ఇచ్చట దేవుడు, మానవుడు ఒక్కటయిరి. చూచారా? ఏమిటిది? - ఆయనాత్మతో నింపబడుట. ఆయనకు ప్రథమ స్థానము ఇచ్చుట. ఇది దేవుడు సాధించినది. ఆయన క్రీస్తులోను, క్రీస్తు మనలోను యుండుట దేవుని ఉద్దేశమై యున్నది. అందరము ఒకే పరిశుద్దాత్మను కలిగియున్నాము. క్రీస్తు ద్వారా బయలుపరచబడిన అతీతమైన సృజనాత్మక శక్తి ఇక్కడను ప్రత్యక్షపరచబడియున్నది.
GEN 1:1
221దేవుడు మోషేతో కప్పలు వచ్చును గాక అని పలుకమనెను. "ఆయనే నిలబడి ఒక నాడు ఈ నీరు ద్రాక్షారసమగు గాక అనెను." ఆమేన్! చూచారా? ఆయన అదే దేవుడు, ఆయన మారడు. మానవునిలో దేవుడున్నాడు. ఇది ఆయన ప్రత్యక్షత. దీనిని ఆయన బయలుపరచుచున్నాడు. దీనిని ఆయన చేయ ప్రయత్నించుచున్నాడు. మానవుడు సృజించలేడని దేవుని వాక్యము చెప్పుచున్నది. (దేవుడే సృష్టికర్త) మానవుడు సృజించలేడని దేవుని వాక్యము చెప్పుచున్నది. (దేవుడే సష్టికర్త), మానవుడు కాదు. దేవుడే సష్టికర్తగా మానవునిలో యున్నాడు. ఇప్పుడది ఆయన సంఘము. (ఆమేన్!) ఆయనతో జీవించుటకు పరలోక గృహము చేరుచున్నది. సంఘమునకు దేవుడు సదా నిత్య ప్రేమను వెల్లడి చేయుచున్నాడు.
222వినండి! జాగ్రత్తగా వినండి. దీనిని మీరు తప్పిపోరాదు. దీనిని అంగీకరించని ఈ సంఘమయినా గాని, ఏ ఇతర గురుతు అయినా గాని, ఏ ఇతర సహవాసమయినా గాని, ఏ ఇతర ప్రభుత్వమయినా గాని, ఏ ఇతర సాక్షమయినా గాని, ఏ ఇతర సిద్దాంతమయినా గాని, ఏ శాఖ అయినా గాని దీనికి వెలుపల ఉండును. దీనిని మాత్రమే దేవుడు గుర్తించును. సహవాసము కాదు, సంఘము కాదు, సిద్దాంతము కాదు, శాఖ కాదు, మరేది కాదు; ప్రతిదియూ చచ్చినదే. క్రీస్తే నీలో జీవించి ప్రథమ స్థానము పొందునట్లు ఆ కొమ్మలన్నియూ కత్తిరించబడవలెను. సంస్థ కత్తిరించబడవలెను. నీవు ఇతర అభిప్రాయములను కలిగి యున్నచో వాటిని కత్తిరించవలెను. నీ తల్లి నీవు పరిశుద్ద దొర్లువానివని చెప్పిన యెడల ఆ అభిప్రాయమును కత్తిరించవలెను. నీ భర్త నిన్ను పొట్టి దుస్తులు ధరించమని కోరుచున్నచో దానిని కత్తిరించవలెను, చూచారా. నీవు క్రీస్తు ఏకమగుటకు అడ్డముగా యున్న ప్రతి దానిని కత్తిరించవలెను, చూచారా.
223ఆలోచించండి!
సజీవుడగు క్రీస్తు యొక్క సజీవ వాక్యపు, సజీవ సన్నిధి నీలో యుండును. క్రీస్తు సజీవుడు! అది సజీవ సన్నిధి. అది సజీవ వాక్యము. గమనించండి! ఆయన తన స్వంత వ్యక్తిగత ప్రత్యక్షత ద్వారా తన సంఘమును నిరూపించును. సభ్యులను కాదు. మోషే దినములలో ఆయన ఆలాగు చేయలేదు. ఎవరి కాలములో నయినా ఆయన ఆలాగు చేయలేదు. ఈ ప్రపంచము నాశనమగు దినము వరకు ఆయన ఆలాగు చేయడు. లోతు దినములలోను ఆయన సభ్యత్వమును లెక్క చేయలేదు. వ్యక్తిగత ప్య్రత్యక్షత కావలెను. దేవుడు శరీరమందు ప్రత్యక్షమాయెను. (చూచారా?) - వ్యక్తిగతముగా ప్య్రత్యక్షత.
MATT 13:3•
MARK 4:3•
LUKE 8:5
224గుర్తుంచుకొనండి! దాని గూర్చి ఆలోచించండి. మనము జీవించుచున్న ఈ గొప్ప శాఖ సంబంధమగు కాలము వంటి దినములలోనే, వారును ఆయనాత్మకు జన్మించిరి. మరియు సజీవుడగు దేవుడు తన సజీవ వాక్యమును తీసికొనుచున్నాడు. దానిని వ్యక్తిగతముగా ఆయన బయలుపరచుచున్నాడు. వాక్యమును తీసికొనుచున్నాడు. వాక్యములోనే ఈ జీవమున్నది. విత్తనము లోనికి అది వచ్చును. (వాక్యమే విత్తనమనియు మనము విత్తువాని ఉపమానములో చదివాము), వాక్యములోయున్న క్రీస్తు జీవము వ్యక్తిగతంగా నీలోయుండును. నీవు చేయజాలని దానిని అది ఋజువు చేయును. నీవు కాదు గాని, ఆయనే దానికి మూలమని ఆయన రుజువు చేయును. నీవు ఆయనకు ఒక వధువుగా ఒక ప్రేమ బానిసవగుదువు.
GEN 1:1•
1COR 15:28•
COL 1:16•
COL 3:11•
REV 1:8•
REV 22:16
225భూమ్యాకాశములను, అందున్న సమస్తమును సృజించిన సజీవ దేవునికి వందనములు కలుగును గాక! ఆయన అల్ఫా మరియు ఓమేగా. ఆది, అంతమునై యున్నాడు. ఆయన భూత - భవిష్యత్ - వర్తమాన కాలములలో యున్నవాడు. దావీదు యొక్క వేరు మరియు చిగురు ప్రకాశించుచున్న వేకువ నక్షత్రము. ఆయనే సమస్తములో సమస్తము అయి యున్నాడు.
MATT 24:40•
LUKE 17:34,36
226ఒక వ్యక్తికి ఆయన తన వ్యక్తిగత ప్రత్యక్షతను తన సన్నిధిని ఇచ్చును. తన్ను తాను బయలుపరచుకొనును. ఈ దినమునకు ఆ సజీవ వాక్యము వాగ్ధానము చేయబడినది. నీ ద్వారా అది వ్యక్తమగుచున్నది. దేవుని యొక్క గొప్ప ప్రత్యక్షత వెల్లడి యగుచున్నది. చూడండి, ఎప్పుడూ వ్యక్తిగతంగానే ఆయన తన్ను కనుబరచు కొనును గాని ఒక గుంపులో కాదు — వ్యక్తితోనే ఆయన తన్ను గుర్తింప చేసికొనును. మీరది గ్రహించారా? మెతడిస్టుతో కాదు, బాప్టిస్టుతో కాదు, ప్రెస్బిటేరియనుతో కాదు, లూధరన్‌తో కాదు, పెంతెకొస్తుతో కాదు, వ్యక్తిగతంగానే ఆయన మాట్లాడును. నేను ఒకరిని స్వీకరించి ఒకరిని విడిచి పెట్టెదను. వారిని నేను వేరు చేసెదను. ఇది నిజము. ఇద్దరు పొలములో యుందురు, ఒకరు కొనిపోబడుదురు. ఒకరు విడిచి పెట్టబడుదురు. ఇద్దరు మంచము మీద ఉందురు, ఒకరు కొనిపోబడుదురు. ఒకరు విడిచిపెట్టబడుదురు. ఒక గుంపు కాదు. వ్యక్తిగతముగా ఆయన ప్రత్యక్షత ఇచ్చును. పరిశుద్దాత్మ చేత నింపబడి గర్భము ధరించిన దేవుని బిడ్డకు అది ఒక వ్యక్తిగత ఋజువు. అతడు దేనిని లెక్క చేయక దేవునికి లోబడును. పరిశుద్దాత్మ ఆ వ్యక్తిలో జీవించును. జనులకు, లోకమునకు అతనిలో ఉన్న వాక్యము రుజువగును. ఆ వ్యక్తిగత ప్రత్యక్షతను అందరూ చూచెదరు.
227లోకము దానిని చూడకుండా ఎంత గ్రుడ్డిగా నడచిపోవుచున్నది? కాతలిక్కులు, పరిశుద్ద పాట్రిక్‌ను చనిపోవు వరకు గుర్తించలేక పోయిరి. ఆ తరువాత గుర్తించిరి. పరిశుద్ద మార్టిన్‌కు కూడా వారాలాగే చేసిరి. వారతనిని గుర్తించలేదు. అన్ని కాలములలోను వారాలాగే చేసిరి. జోన్ ఆఫ్ ఆర్క్‌కు వారాలాగే చేసిరి. ఆమెను మంత్రగత్తె అని కాతలిక్కు సంఘము కాల్చి వేసినది, ఎందుకనగా ఆమె ఆత్మ సంబంధురాలు. ఆ తరువాత నూట-ఏబది సంవత్సరములకు వారు ఆ పరిశుద్దుల సమాధులను త్రవ్విరి. పశ్చాత్తాపపడిరి.
ROM 8:29,30•
EPH 1:5,11
228వారి కన్నుల ఎదుటే అది వెళ్ళినా దానిని వారు గుర్తించలేదు. చివరకది పోయినది. దేవుడు భూమి పునాది వేయక ముందే నిర్ణయించిన బీజము మాత్రమే దానిని గుర్తించినది. నోవహు దినములలోను ఆలాగే జరిగినది. మోషే దినములలోను, ఏలియా దినములలోను, ప్రవక్తల దినములలోను, యేసు దినములలోను, ఈ ఘడియవరకును ఆలాగే జరుగుచున్నది. దేవుని వాక్యముతో గర్భము ధరించిన వ్యక్తి ద్వారా వాక్యము దానికదే వెల్లడియగుచున్నది. దేవుని చిత్తమునకు లోబడిన వ్యక్తి ద్వారా వాక్యము మాత్రమే ప్రత్యక్షమగును. ఆ వ్యక్తి దేవునికి బంధీ.
MATT 10:30•
MATT 16:17,18•
LUKE 12:7•
JOHN 6:39,40,44
229"నా సంఘమునకు" దానితో ఏమి సంబంధము లేదని నీవు చెప్పవద్దు. అది వ్యక్తిగత విషయము. ఈ బోధకు నరకమంతా వ్యతిరేకముగా యున్నది. ఈ సత్యమునకు నరకమంతయూ విరోధమే. అయినా ఇది సత్యము. "పేతురు, యోహాను మొదలగు వారు ప్రత్యక్షతను పొందిరి గనుక సంఘమంతా రక్షించబడినట్లే" అని యేసు చెప్పలేదు. అది వ్యక్తిగత ప్రత్యక్షత. నేను నీకు చెప్పుచున్నాను. వారికి కాదు నీకు ఆయన వారందరితో కాదు గాని పేతురుతోనే ఇట్లు పలికెను. "నీవు పేతురువు. ఈ బండమీద నేను, నా సంఘమును కట్టుదును పేతురు అను మాటకు బండ అని అర్థము." బండ అనగా ఒప్పుకొనినవాడు లేదా ప్రత్యేకమైన వాడని అర్థము.
సంఘమనగా బయటకు పిలువబడినది. (చూచారా?), ఈ బండ మీద అనగా ఈ ప్రత్యక్షత మీద ఆయన తన సంఘమును కట్టును. "రక్తమాంసములు దీనిని నీకు ఎన్నడూ బయలుపరచలేదు. కాని ఈ ప్రత్యక్షత మీద (పిలువబడిన గుంపు) నేను నా సంఘమును వారిలో కట్టుదును. పాతాళ లోక ద్వారములు దాని ఎదుట నిలువజాలవు. మీ తల వెండ్రుకలలో ఒక్కటియు నశించదు. నీవు వాడవు అంత్యదినమున నేను నిన్ను లేపుదును. నీకు నేను నిత్య జీవమిచ్చి అంత్యదినమున లేపుదును." అదియే ప్రత్యక్షత. ఇది మూకుమ్మడి కాదు గాని, వ్యక్తిగతము; గుంపు కాదు, వ్యక్తియే. దానికి పాతాళము విరోధముగా యున్నది.
ISA 29:13•
MATT 15:7,8•
MATT 23:29-33•
MARK 7:6
230కాని, ఆయన తన మర్మమును తన ప్రియ వధువుకు మాత్రమే బయలుపరచెను. వారు మాత్రమే చూడగలరు. యెషయా మీ గూర్చి పలికినది సరియే. మీరు వేషధారులు. గడ్డిలోని పాముల వంటివారు. ఓ! మేము ఆ గొప్ప పరిశుద్ద ప్రవక్తలకు గోరీలు కట్టితిమని చెప్పుకొందురు. వాటికి మీరు అలంకరణలు చేయుదురు. కాని అందులో మీరు వారిని పెట్టితిరి అని ఆయన చెప్పెను. నిజమే గదా?
ఆనాటి కాతలిక్కు సంఘములతోను ఆయన అదే చెప్పెను. ఆ రోమ్‌లోని నైసియా సభ ప్రారంభమునకు ముందు పంపబడిన ప్రవక్తలను వారాలాగే చేసిరి. ఆ పాత ప్రవక్తలు ఆకులు, మిడుతలు తినిరి. సరయిన బట్టలు లేక యుండిరి. గొర్రె చర్మము చుట్టుకొనిరి. బైబిలు సత్యము కొరకు వారు నిలబడిరి.
కాని కాతలిక్కు సంఘమునకు మేధావులు కావలసి వచ్చిరి. పరిశుద్ద ఐరేనియస్, పొలికార్పు, మార్టిన్ మొదలగు వారు వచ్చిరి. వారేమి చేసిరి? వారిని సమాధులలో పెట్టిరి: జోనాఫ్ ఆర్క్, పరిశుద్ద పాట్రిక్, మొదలగు వారిని ఆలాగే చంపిరి. కాని కొంత కాలము తరువాత జోనాఫ్ ఆర్క్‌కు చేసిట్లుగానే వారి సమాధులను కూడా శ్రు౦గారించుచున్నారు. వారిని చంపినది కూడా వారే.
MATT 23:27•
LUKE 12:32•
REV 17:2
231అందుకే ఆత్మ ఈలాగు పలికినది. "సున్నము కొట్టిన గోడలారా, మీరు వేషధారులు. మీరేదో గొప్ప చెప్పుకొనుచున్నారు. మీరు వాక్యమును విడిచి పెట్టి అందుకు బదులుగా మానవ తెలివితేటల అభిప్రాయమును స్వీకరించియున్నారు. మీలోనున్న వాక్యము అనే దేవుని బీజము వలన గర్భము ధరించక, వాక్యమును విడిచిపెట్టి యున్నారు. సంకరపు మాటను మీరు తీసికొనియున్నారు."
అది వేశ్యవలె కూర్చొనియున్నది అని చెప్పినందుకు ఆశ్చర్యపడనక్కరలేదు. అది ఆత్మ సంబంధ జారత్వమును జరిగించినది. దేవుని సంగతులను బోధించక మానవ ఆచారములను జనులకు బోధించినది. కాని ఆయన ఇట్లు చెప్పెను, "చిన్న మందా, భయపడకుడి! మీకు రాజ్యమనుగ్రహించుట మీ తండ్రి యొక్క మంచి చిత్తమైయున్నది." నిశ్చయంగా. దానిని మనము పొందుదుము.
REV 17:1,2,4,5
232బైబిలులోని ప్రకటన గ్రంధములో ఈ గొప్ప పట్టణము భూ రాజుల నందరినీ పరిపాలించి నట్లు వ్రాయబడియున్నది. అది వేశ్య అని చెప్పబడినది. అది జారత్వము చేసినది. దాని చేతిలో ఒక గిన్నె యున్నది. అది అపవిత్రతతో నిండి యున్నది. దాని జారత్వములన్నియూ అందులో యున్నవి. దానికి కుమార్తెలున్నారు: అవి ప్రొటస్టెంటు సంఘములు. ఆమె నుండి బయటకు వచ్చిన వారందరూ దాని తప్పుబోధను, బాప్తిస్మమును అనుసరించుచున్నారు. పరిశుద్దాత్మ బాప్తిస్మము పొందుటకు బదులుగా, కరచాలనము చేయుచున్నారు. వధువుగా పెండ్లి కుమారుని యొక్క నామమును స్వీకరించుటకు బదులుగా: తండ్రి, కుమారుడు, పరిశుద్దాత్మ అను బిరుదులలో బాప్తిస్మమిచ్చుచున్నారు. "దాని వలన పెద్ద తేడా లేదని మీరందురు," కాని తేడాయున్నది.
నా చెక్కు మీద "రెవరెండు లేదా సంఘకాపరి" అని యున్నచో అది చెల్లదు. బ్యాంకుల్లో దానిని తిరస్కరించెదరు.
చూడండి. మంచిది.
233మర్మమంతయూ ఆయన వాగ్ధానము చేసినట్లు ఆయన వధువుకు తెలియచేయబడెను. ఈ మర్మము యొక్క ప్రత్యక్షతా సత్యమునకు పాతాళము విరోధముగా యున్నది. అయితే వధువు దాని మీద నిలబడి యున్నది. అదే ఆమె స్థానము.
సంఘమా, నీవెందుకు ఆకలిగొనుచున్నావు? నీవెందుకు దప్పిగొనుచున్నావు? ఈ దాచబడిన మర్మమును తండ్రి నీకు బయలుపరచ ప్రయత్నించుచున్నాడు, కాని నీవు ఎన్నో ఇతర సంగతులను నీ నుండి రానిచ్చుచున్నావు. నీ ఉద్యోగము, నీ భార్య, నీ భర్త, నీ పిల్లలు, ఈ లోక విచారములు, నీ సంఘకాపరి మొదలగు వారి గూర్చియే నీ ఆలోచన యున్నది. వాటి యందే నీవు మనసుంచుచున్నావు. నీ హృదయములో ఆకలి, దాహము అందుకొరకు యుండరాదు. దేవుడు తన ప్రత్యక్షతను నీకు బయలుపరచగోరుచున్నాడు. (చూడు?), ఇవే చివరి దినములు.
ఇపుడు గమనించండి.
234మరల వెనక్కి చూద్దాం దానంతటిని నేను చెప్పలేను, చూచారా. ఒక్క నిమిషము ఇటు మీరు చూడవలెనని కోరుచున్నాను. కొద్ది నిమిషములలో ముగించెదను. మీరు దృష్టిని ఇటు నిలుపుడి.
COL 1:18
235చూడండి. కొలస్సీయులకు వ్రాసిన పత్రిక 18 వచనములో ఇట్లున్నది.
సంఘమను శరీరమునకు ఆయనే శిరస్సు. ఆయనే ఆది సంభూతుడును, మృతులలో నుండి తిరిగి లేచిన వారిలో ప్రథముడును అయి యున్నాడు. అన్నింటిలోను ఆయన ప్రథమ స్థానము పొందవలసియున్నాడు.
EPH 1:22,23•
EPH 4:15,16•
COL 1:18•
COL 2:19
236సంఘమును ఆయన యొక్క శరీరమునకు ఆయన శిరస్సుగానున్నాడు. ఆయనకు ప్రథమ స్థానమియ్యవలెను. ఇప్పుడు వినండి. ముగించుకొందుము.
శరీరమునకు ఆయన శిరస్సుగా ఉండవలసి యున్నాడు - ఆయన వధువు శరీరముగా యున్నది. ఆదాములో నుండి మాంసము ప్రక్కటెముక తీయబడినట్లే, ఆయన నుండి వధువు తీయబడినది. (చూచారా?) మరణం నుండి ఆ వధువు జన్మించినది, చూచారా. అవిశ్వాసమను పాపము యొక్క మరణం నుండి ఆమె జన్మించినది ఏది చంపినది అవిశ్వాసమే. నిజమేనా? దేనియందు అవిశ్వాసము? దేవుని యందునా? కాదు. "ఆమె దేవుని నమ్మినది. దేవుడు లేడని ఆమె అన్నాదా? లేదు. ఆమె నాస్తికురాలు కాదు. ఆయన వాక్యమును నమ్మనని కూడా ఆమె చెప్పలేదు." ఆమె అంతయు నమ్మెను, కాని వాక్యములో చిన్న మాట నమ్మలేదు, చూచారా.
ACTS 10:34•
REV 22:16,18,19
237బైబిలులోని ప్రకటన గ్రంధములో యేసు ఇట్లనెను, "యేసు అను నేను ఈ సంగతులు గూర్చి మీకు సాక్షమిచ్చుటకు నా దూతను పంపియున్నాను. దానికి ఎవరును ఒక్క మాట చేర్చరాదు. ఒక్క మాట దానిలో నుండి తీసివేయరాదు." ఒక స్త్రీ దేవుని మాటలోని ఒక్క మాటను సందేహించినందున ఈ గుండెపోటులు, దుఃఖము వచ్చినవి. ఒక మాటను నీవు సందేహించునట్లుగా మరల ఆయన చేయునా? ఆలాగయితే ఆయన అన్యాయస్థుడగును. చూడండి, ఆలాగయితే ఆయన దోషియగును ఇక్కడ ఒకాయన నిలబడియున్నాడు. ఒక్క మాటను సందేహించినందున, గుండెపోటులను కలుగజేసినవాడు ఆయనే అతడు కొన్ని సంవత్సరముల అనుభవమును పొందిన తరువాత, బైబిలులోని ప్రతి దాని కొరకు ముందుకు వెళ్లి, దాని కొరకు తమ జీవితములను సైతం ఇచ్చెవారితొ ఇలాగు చెప్పెను, "ఓ, మీరు వెళ్లి భుజించుడి. ఎలాగయినను నేను మిమ్మును తిరిగి తీసుకు వస్తాను." [స్పష్టతలేని మాటలు] దేవుడు మనుష్యులను బట్టి గౌరవించడు. ఇపుడు గమనించండి.
EPH 1:22,23•
EPH 4:15,16•
COL 1:18•
COL 2:19
238దేవుని వాక్యమును నమ్మక చేసిన పాపము నుండి జన్మించిన శరీరమునకు ఆయనే శిరస్సు ప్రతి శాఖ, ప్రతి సిద్దాంతము ఇందుకు క్షమాపణ పొందవలెను. (చూచారా?) వాక్యము నందు అవిశ్వాసము. ఆయనే ఆ జీవవాక్యమై యున్నాడు, చూచారా. వాక్యమునకు మాత్రమే జీవమున్నది, తక్కిన ఈ మాటయినా గాని సంకరపు మాటయే. అదెంత చక్కగా కనబడినా గాని లెక్కలేదు. అది వాక్యము కాదు. వాక్యమే జీవమును ఇచ్చును. హవ్వ ఒక మానవ గ్రహింపు ద్వారా వ్యక్తిగత జ్ఞానము కొరకు దానిని అమ్మివేసినది. (నేడు సంఘములను చూచారా?) మోషేకు దేవుని పట్ల గొప్ప గ్రహింపుయున్నది. కాని ఆ మండుచున్న పొద యొద్ద దేవుని కలిసికొనినప్పుడు తన వైఫల్యమును చూడకలిగెను. మోషేకు ఆ మండుచున్న పొదయే కరువైనది. శాఖకు కరువైనది వాక్యము కలిగియున్నది.
ఆయనే శిరస్సు, పునరుత్థానమునకు ప్రథమ ఫలము.
EPH 1:22,23•
EPH 4:15,16•
COL 1:18•
COL 2:19
239(మీరు అనుమతించినచో, మరికొద్దిగా ఈ ప్రత్యక్షత గూర్చి చెప్పెదను. మంచిది, మంచిది; ఇప్పుడు కేవలము కొద్దిసేపు.) మృతులలో నుండి లేచిన వారిలో ఆయనే ప్రథమ ఫలము.
నిజమేనా? అయితే ఆయన ఎవరు? తన సంఘమను శరీరమునకు ఆయనే శిరస్సు, ఆమె ఆయనకు వధువు. కాబట్టి వధువు అను శరీరము శిరస్సును అనుసరించవలెను, ఎందుకనగా ఆమె ఆయన పునరుత్థానములోను, మర్మములోను, పాలి భాగస్థురాలైయున్నది. దానిని పొందకుండా ఆమె ఉండుట అసాధ్యము. దేవుని యొక్క మర్మములో ఆమె భాగమై యున్నది. దేవుడు తన్నుతాను బయలుపరచుకొనెను. వాక్యము ద్వారా పైకెత్తబడెను, కాగా ఆయన తన సంఘమునకు ప్రత్యక్షపరచును. అదే వాక్యము ద్వారానే పైకెత్తును.
EPH 1:22,23•
EPH 4:15,16•
COL 1:18•
COL 2:19
240శిరస్సు సమాధిలో నుండి తిరిగి లేచిన ప్రకారముగానే శరీరమును ఆయనను అనుసరించి ఏదెనుకు వెళ్ళును. కుటుంబమునకు పురుషుడు శిరస్సు. పెండ్లి కుమారుని శరీరము వధువు అయి యున్నది. ఆమె (వధువు) శిరస్సును వెంబడించును. శిరస్సు బయలుపరచబడి, నిత్యజీవముతో తిరిగి వచ్చినది. శరీరము దానిని తప్పక వెంబడించవలెను, ఎందుకనగా వారు మరల భార్య-భర్తలుగా యుందురు. ఆమేన్! అదే వాక్యముతో నీవు గర్భము ధరించవలెను. అదే ఆయన శరీరము. వాక్యమును నీవు స్వీకరించినప్పుడు ఆయన శరీరమును నీవు ధరించి ఆయన వలె మారుదువు. నీవు ఏదో మానవాచారము తీసికొనుట కాదు గాని, వాక్యమునే తీసికొనవలెను. (ఆ అంశము మీద ఈ మధ్యాహ్నమంతా బోధించ గలను. చాలా ఆశ్చర్యముగా నున్నది కదా? దానిని గూర్చి ఆలోచించండి), ఎందుకనగా శరీరముతో శిరస్సు అతుకబడి యున్నది. వాక్యమే శిరస్సు, అదే వాక్యము — ఒకే అధికారము. శాఖలు, పరిశుద్ద తండ్రులు మొదలగువన్ని చచ్చినవి, అవి పేడవలె ఉన్నవి. క్రీస్తు అను ఒకే అధికారము యున్నది. శరీరము వాక్యమును మాత్రమే గుర్తించును.
ACTS 4:12
241తండ్రి, కుమార, పరిశుద్దాత్మ నామములో ఎవరు బాప్తిస్మము పొందిదో నాకు చూపించండి. నీవు దేనిని గుర్తించావు? మీకు తెలియును. నేను టేపు ద్వారా వేలాది మందితో మాట్లాడుచున్నాను. ప్రపంచమంతా మనకు టేపు పరిచర్య యున్నది. ఏ నామములో నీవు బాప్తిస్మము పొంది యున్నావు? మరి ఏ నామము వలనను రక్షణ కలుగదు. ఆకాశము క్రింద ఇయ్యబడిన ఏ నామములోను బాప్తిస్మము పొందజాలము. యేసు నామములోనే రక్షణ. (వాక్యము చెప్పబడినట్లుగా), నీవు క్రీస్తు నందు విశ్వాసము కలిగి యున్నానని చెప్పి మరేదో నామములో బాప్తిస్మము పొందినచో, నీవు సంకర జాతివానివగుదువు.
నీవు ఆ సంఘము వలె లేవు, ఆ బోధను నీవు వెంబడించుట లేదు.
242కాతలిక్కు జనులారా, (చూడండి?) అపోస్తలుల వారసత్వం ద్వారా పేతురుకు అతడు వారసుడని చెప్పుకొనుచు అతడి అధికార పరిధి క్రిందికి ఎట్లు వెళ్ళుదురు. కాని ఈ పోపు, ఈ సంఘము, మొదటి వాక్యమునకు విరోధముగా బోధించుచున్నది. ఆయన తన సంఘమును అద్భుతములు మరియు సూచక క్రియల ద్వారా గుర్తించును. ఆ మారని వాక్యము ఈనాడు పరిశుద్దతతో ముందుకు తేబడుచున్నది. ఆయన అక్కడ ఉన్నాడని అదే పునరుత్థానమును చూపించుచున్నది. దేవుడు తన జనుల మధ్య జీవించుచు అవే కార్యములను జరిగించుచున్నాడు. ఇప్పుడు రోమ్ అధికారమును నీవెట్లు గుర్తించగలవు? మన అధికారము పరలోకమందున్నది. నేను రోమ్‌కు వెళ్ళుట లేదు. నేను చనిపోయినప్పుడు పరలోకమునకు వెళ్ళుదును. చూచారా? మన అధికారము పరలోక మందున్నది.
COL 1:18•
1TIM 2:14
243భార్య, భర్తను వెంబడించునట్లుగా శరీరము శిరస్సును వెంబడించవలసి యున్నది. ఆదాము మోసపుచ్చబడలేదు గాని అతడు హవ్వతో నడిచెను. హవ్వ మోసపుచ్చబడెను. ఆమె పాపము చేసెను. మొత్తం శరీరము, ప్రభువైన యేసు వలన పునరుత్థానము పొందెను. ఆయన సమాధిలో నుండి బయటకు వచ్చెను. ఆయన యొద్దకు ఆమె రావలెనన్న ఆమె విడిపించబడవలెను. దానిని మీరు చూచారా? చూచారా? అది అయిపోలేదు. విమోచన కొనసాగుచున్నది.
JOHN 1:1•
REV 5:6,7
244ఆ ముద్రలను మీరు చూచారా? ఆయన మధ్యవర్తిగా యుండి విమోచన కార్యము జరిగించుచున్నాడు. కాని ఒక రోజున ఆయన వచ్చి తాను విమోచించిన వారిపేర్లు వ్రాయబడియున్న గ్రంథమును తెరచును. ఈ గ్రంథములోఉన్న వారందరూ ఆయన వారే, అనగా విశ్వాసులు పుస్తకములోని పదములు. ఆయనే వాక్యము. ఆ గ్రంధములో వాక్యమున్నది. ఆయన జగత్తు పునాది వేయబడక ముందే వధింపబడిన గొర్రెపిల్లయైయున్నాడు. ఈ విమోచనా గ్రంథములో అపుడే వారి పేర్లు వ్రాయబడినవి. నేను ఇక్కడ ఆయన తన వాక్యములో యుండి అపుడు చేసిన కార్యములనే చేయుచున్నాడు. ఆమె మరో అధికారమును గుర్తించజాలదు. లేదండి. బిషప్పు కాదు; మరెవరూ కాదు; ఆమె క్రీస్తు అను ఒక్క అధికారమును మాత్రమే అంగీకరించును. క్రీస్తు వాక్యమైయున్నాడు. ఓ మై! దానిని నేను ప్రేమించుచున్నాను. అవునయ్యా.
EPH 1:22,23•
EPH 4:15,16•
COL 1:18•
COL 2:19•
REV 17:4•
REV 22:18,19
245శరీరము సమాధి నుండి తిరిగి లేచినట్లే ఆయన శరీరమును ఏదెనులో ఆయనతో ప్రవేశించును. కాబట్టి శరీరము మరే ఇతర అధికారము గుర్తించదు. వాక్య అధికారము మాత్రమే గుర్తించునను. దాని లోనికి ఏ శాఖయు ఏమి ఎక్కించలేదు. దానికి ఏ ఒక్కటి ఎవరు చేర్చరాదు. దానిలో నుండి ఒక్క మాటయు ఎవరూ తీసివేయరాదు లేదా కలుపరాదు — వారు దానిలో నుండి తీసివేసిరి; అప్పుడే చనిపోయిరి, సంకరపు వారయిరి. ఇక్కడ ఆమె తన చేతులలో ఏమి పట్టుకొన్నదో చూడండి, తన జారత్వము వలన కలిగిన అపవిత్రతను పట్టుకొన్నది. ఆమె ఏ వాక్యమునయితేనే నమ్మినట్లు చెప్పుకొన్నదో దానికి వ్యతిరేకముగా ఆత్మీయ వ్యభిచారము చేసి యున్నది, చూచారా.
EPH 1:22,23•
EPH 4:15,16•
COL 1:18•
COL 2:19
246కాబట్టి వాక్యము లేని యెడల మరేమియూ లేదు. ఇది నిజము.
అది నిజమని నీకెట్లు తెలియును? వాక్యమైయున్న ఆయన బయలుపరచబడెను, చూచారా. వాక్యము చక్కగా బయలుపరచబడినది. అది సంఘమునకు శిరస్సు అయియున్నది. ఆయనే వాక్యము. ఆయనే శిరస్సు. ఆయన చక్కగా గుర్తించబడెను. తన స్వంత ఆత్మ ద్వారా ఆయన ప్రత్యక్షపరచబడెను. సంఘములో ఆయన ప్రత్యక్షమాయెను. (వ్యక్తిగా), ఆయన తన పూర్తి శరీరపు ప్రత్యక్ష రుజువుకు చూపించుచున్నాడు. మానవ ఆచారములు ఇక నీకు అక్కర లేదు. శాఖలు నశించినవి, కాని శిరస్సు శరీరమందు గుర్తించబడినది. ఆ శరీరము యొక్క శిరస్సును వ్యక్తిగత గుర్తింపులు నిరూపించినవి. (చూచారా? ఆయన తన్ను గుర్తింపచేసికొనెను) దేవుని వాక్యమై యున్న క్రీస్తు అను ఒకే అధికారము క్రింద మనమందరము ఏకమైయున్నాము. ఏ సంఘము క్రింద కాదు.
LUKE 17:21•
EPH 1:22,23•
EPH 4:15,16•
COL 1:18•
COL 2:19
247మన శిరస్సు ఒక రాజ్యమైయున్నది.
"పరలోక రాజ్యము మీలోనే యున్నది" అని బైబిలులో యేసు చెప్పెను. మనము ఒక శాఖ కాదు. మనము ఒక రాజ్యమునకు చెందియున్నాము. దేవుని వాక్యమే ఆ రాజ్యము. అది మన స్వంత జీవితములకు ఆత్మ మరియు జీవమునై యున్నది. వాక్యము, దేవుడు ఒక్కటే అయిన, ఆ దినముల వలనే ఈనాడును ప్రతి వాగ్దానమును నెరవేర్చును. నేడు ఆయన సంఘములో వాక్యము మరియు దేవుడు ఒక్కటై యున్నారు. శరీరము నందలి అధికారము ఈ చివరి కాల వర్తమానమును తీసుకుని వచ్చుటకు విమోచించబడినదై పునరుత్థానము ద్వారా మృతులను లేపుచున్నది. ఆదియందు ఏదెను తోటలో యుండిన ఆదామవ్వల వలె మరల పునరుద్దరించబడుదురు. దేవుని యొక్క మూడు విధముల మర్మము, ఆయన శరీరమే. ఓ మై!
ఇప్పుడు జాగ్రత్తగా వినండి. ఆనాటి ఇశ్రాయేలీయుల మాదిరిని చూడండి.
248(ఎక్కువ సమయము తీసికొనుచున్నానా? ఇరవై పేజీలు చెప్పవలసి యున్నాను. చూచారా. ఇప్పుడు కొద్దిగా చెప్పెదను. ప్రభుని చిత్తమైతే వచ్చే వేసవి వరకు మిమ్మును విడిచిపెట్టెను, చూచారా.)
EPH 1:22,23•
EPH 4:15,16•
COL 1:18•
COL 2:19
249ఇప్పుడు గమనించండి. ఆనాటి ఇశ్రాయేలీయులవలె మనమును ఒకే అధికారము క్రింద ఐక్యపరచబడియున్నాము. దానిని మీరిప్పుడు గ్రహించారా? ఆనాటి ఇశ్రాయేలీయులకు ఒకే దేవుడుండెను. ఆయన అగ్నిస్తంభము వలన ఋజువు చేయబడెను. ప్రవక్త ద్వారా వాక్యముగా తను బయలుపరచెను. ఆయన తన విధానము మార్చుకొనలేడు. అదే దేవుడు, అదే అగ్నిస్తంభము, అదే విధానము మారలేదు. అది అంతే పరిపూర్ణముగా యున్నది. లేదా? చూడండి?
EXOD 13:21•
DEUT 6:4•
MARK 12:29
250ఒక్కడే దేవుడు.
ఇశ్రాయేలీయులకు ఎందరు దేవుళ్ళునారు? ["ఒక్కడే" అని జనులు జవాబిచ్చిరి.] వధువుకు ఎందరున్నారు? ["ఒక్కడే" అని జనులు పలికిరి.] ఎప్పుడయినాగాని ఎందరుందురు? ["ఒక్కడే" అని జనులు పలికిరి.] నిశ్చయంగా! చూచారా. పరిశుద్దాత్మ నాయకత్వము వహించును. గొప్ప ప్రవక్తయగు మోషే దినములలో అది అగ్నిస్తంభముగా ఉండెను. నిజమేనా? వాగ్దాన దేశమునకు వెళ్ళుచున్నారు.
MARK 16:20•
ACTS 9:3•
ACTS 15:14
251క్రైస్తవ యుగములోను ఒకే దేవుడున్నాడు. పౌలు అను ప్రవక్తకు అగ్నిస్తంభముగా ఆయన ప్రత్యక్షమాయెను. దేవుని నామము నిమిత్తము కొందరు జనులను తీసికొని వచ్చుటకు అతనిని దేవుడు అన్యుల కొరకు అతడిని ఎన్నుకొని పంపెను. నిజమేనా?
ఈ చివరి దినములలో ఆయన ఆ విధముగానే దిగివచ్చి తన్నుతాను వెల్లడి చేసుకొనును. అవే సూచక క్రియలు, అవే అద్భుతములు, అదే అగ్నిస్తంభము, అదే సువార్త, అదే వాక్యము, అదే ప్రత్యక్షతలు కనబడుచున్నవి.
JOHN 1:1•
PHLM 1:1,9•
HEB 13:8•
1JN 3:14•
REV 14:4
252మార్కు 16 మరియు అనేక చోట్ల వాగ్దానము చేసినట్లుగానే ఆయన శరీరము క్రియలను కనబరచును.
ఆయన శరీరము సమాధిలో ఉండలేదు. పునరుత్థానములో ఆయనతో పాటు గుర్తింపబడెను. మీరు గ్రహించారా? ఆయన యందు విశ్వాసముంచిన వారి శరీరములు కూడా సమాధిలో యుండవు. ఆయన వచ్చునప్పుడు ఆయనతో గుర్తించబడుదుము, ఎందుకనగా ఆయన తన శరీరమగు వధువును తిరిగి లేపుట కొరకే చనిపోయెను. అది ఆయన శరీరమని గుర్తించండి, ఎందుకనగా అది వాక్యము. అది ఆయనతో కూడా గుర్తించబడును. శాఖల మొదలగు వానికి కాకుండా ఆయన వాక్యమునకే అది పూర్తిగా విధేయురాలయియున్నది. ఆయన వాక్యమై యున్నాడు, చూచారా. మన పునరుత్థానమునకు ప్రథమ ఫలమును పొందియున్నాము. (మనము మరణములో నుండి జీవము లోనికి దాటి యున్నట్లు ఎరుగుదుము), ఆయనకు బంధీలమై యున్నాము. దేవుడు తన వ్యక్తిగత అధికారమును మనకు నిరూపించుచున్నాడు, కాగా నిన్న, నేడు, నిరంతరము ఏకరీతిగా యున్నాడు గనుక ఆయన తన సంఘము ద్వారా అప్పుడు చేసిన క్రియలనే చేయుచున్నాడు. ఆయన నా యందు, నేను ఆయన యందు ఉన్నాము మరియు ఆలాగు. ఇది నిజము.
JOHN 1:1
253ఆయన శరీరము సమాధిలో లేదు. ఆయన పునరుత్థానమందు గుర్తించబడియున్నది. ఆయన ఇప్పుడు ఆయన ఉన్న రీతిగానే ఇక ముందు ఉండును.
వినండి! ఆయన వాక్యము పైకి లేచి యున్నది. (ఆయనే వాక్యము) లూధర్, వెస్లీ, కాలములలో యున్న వాక్యము పూర్తి శక్తితో పైకి లేచుచున్నది. అది సంచరించ ప్రారంభించినది. అప్పుడు ఇంకొద్దిగా సంచరించినది. ఇప్పుడది గుర్తింపును పొందుచున్నది, చూచారా. గమనించండి. శరీరములోయున్న జీవము, సమీపములోయున్న రాకడలో ఎత్తబడుటకు ప్రత్యక్ష నిదర్శనమై యున్నది. తన సంపూర్ణ ప్రత్యక్షతలో శిరస్సు మరియు శరీరము ఒక్కటగుట అనునది శరీరము త్వరలోనే శిరస్సును కలిసికొనబోవుటకు సిద్దపడినది అని చూపించుచున్నది.
"దేశములు బ్రద్దలగుచున్నవి. ఇశ్రాయేలు మేల్కొనుచున్నది…"
254నా మాటలు గ్రహించారా? విమోచించబడిన వానికి తన శరీరమునకు జీవమునిచ్చుటకు (ఎందుకు?) ఆయన ప్రారంభించును. మధ్యవర్తిత్వపు పని ముగిసినది. ఆయన జీవమును శరీరమునకు ఇచ్చుచున్నాడు. ఇది ఎత్తబడుటకు ఋజువై యున్నది.
ఇంకొద్దిసేపు మీరు ఓపిక పట్టండి. దీనిని మీరు తప్పిపోక వినవలెను. ఈ టేపును ఇప్పుడు నేను ముందుకు తీసుకొనవలెను, ఎందుకనగా ఇంత దూరం వచ్చాము.
మరొక గొప్ప సంగతి నేను చెప్పగోరుచున్నాను, ఒకవేళ నేను కొద్దిగా ముందుకు వెళ్ళుదును.
DAN 2:41-43
255దీనిని గమనించుచూ వినండి. ఇదే గొప్ప సంగతి. దీనిని మనము కనిపెట్టవలెను. చివరి దినములలో, మొదటి దినములో జరిగిన క్రియలు నిశ్చయంగా జరుగును, చూచారా. ఆదామవ్వలు భార్య-భర్తలుగా యుండిరి. వారిలో పాపము లేదు - ఆ తరువాత పడిపోయిరి. దీనిని జాగ్రత్తగా వినండి.
(ఆమె మోసపుచ్చబడెను), దానికి కారకులెవరు? — లూసిఫరు. మొదటిసారి చేసినట్లే లూసిఫరు ఇప్పుడును చేయుచున్నది. నెబుకద్నెజరు. అన్యుల రాజ్యమునకు రాజుగా నుండెను. అన్యభాషలను, దర్శనములను, స్వప్నములను తెలియచెప్పగల ఒక ప్రవక్త యున్నట్లుగా అతడు అన్యజాతికి తెలియచేసెను. అన్యుల యొద్ద నుండి వాటిని ప్రక్కనపెట్టి అది ఎట్లు వచ్చెనో చూడండి. మాదీయులు పారసీకులు అనగా ఇనుముగానున్నారు. పాదములు అన్యుల రాజ్యమును చూపించుచున్నవి.
256ప్రారంభము చేసినట్లే లూసిఫరు చివరి దినములలోను చేయుచున్నది. లూసిఫరు ఏమి చేసెను? దేవునితో మానవునికి గల సహవాసమును లూసిఫరు మొదట వేరు చేయును. క్రీస్తు యొక్క రాజ్యము కంటె గొప్ప సంస్కతి, గొప్ప అందము, గొప్ప వైభవముతో కనబడవలెనని అది తలంచెను. ఒక వేళ మీరు దానిని అర్ధం చేసుకోనట్లయితే, మీరు మీ చేయి పైకి ఎత్తండి. నేను మరల చెప్పెదను. మీరు చుడండి? లూసిఫరు ఆదిలో. వాడి యొక్క హృదయములో వాడి ఆలోచన ఏమిటంటే దేవునికంటే ప్రకాశమానమైన మరియు గొప్పనైనది పరలోకములో కలిగ ఉండాలని (అది నిజమేనా?) క్రీస్తు రాజ్యముకంటే ఎక్కువ నాగరికత, ఎక్కువ అందమైన, ఎక్కువ శోభ. వెయ్యేండ్ల పాలనలో మనకు కార్లు, విమానములు ఉండునని మీరు తలంచుచున్నారా? లూసిఫరు చేయుచున్న దానిని చూచుచున్నారా?
257ఈ పెద్ద తెలివిగల శాఖల దానినే చేయుచున్నవి. అది చేయుటకే అవి పోగు చేయుచున్నవి, చూచారా. అవి కూడుకొని శాఖలుగా మారుచున్నవి. ఒకదాని కంటె మరొకటి పెరిగి పోవలెనని తలంచుచున్నవి. ఇప్పుడు వారు ఏమి చేయవలెనో తెలియనంత వైభవము సంపాదించి యున్నారు. కాతలిక్కు సంఘముతో ఏకమగుచున్నారు, చూచారా. శాఖల యందు విశ్వాసముంచని జనులను త్రోయుట కొరకు లూసిఫరు మరల ఒక గొప్ప రాజ్యమును నిర్మించుచున్నది. వారి సంఘ భవనములను కూడా తీసికొని సామానులు దాయు గదులుగా చేయుచున్నారు. పాస్టర్లకు హక్కు లేకుండా చేయుచున్నారు. దీనిని వినిన తరువాత లేదా చూచిన తరువాత దేవుని వలన పంపబడిన వ్యక్తి ఎన్నడూ ఒక శాఖలో జీవించి యుండలేడు. దానిని అతడు చూచి బయటకు వచ్చును. నిశ్చయంగా! చూచారా? దీనిని విమర్శనాత్మకంగా చెప్పుట లేదు; ప్రత్యక్షపరచబడిన దానిని చూడమని నిజంగా చెప్పుచున్నారు. (చూచారా?)
ISA 14:13•
JUDE 1:6
258గమనించండి, ఈ చివరి దినములలో లూసీఫరు మరల అదే చేయుచున్నది. దానిని మీరు చూడగలరా? అపవాది అదే చేయుచున్నది. సంకర సంఘమును నిర్మించుచున్నది. సంకర సభ్యులను తయారు చేయుచున్నది. వాక్యమునకు బదులు తెలివిని; తిరిగి జన్మించుటకు బదులు, మానవజ్ఞానమును ఇచ్చి సంకరము చేయచున్నది. క్రీస్తు యొక్క చిన్న మందను కనబడకుండా చేయుటకు ఒక జ్ఞాన యుక్త రాజ్యలమును నిర్మించుచున్నది, చూచారా. పడిపోయిన దేవదూతలు దానిని చేసినవి. ఒకప్పుడు వారు క్రీస్తుకు చెందిరి, కాని ఆయన మాటను కొట్టివేసి లూసీఫరు మాటను వినిరి అని బైబిలు చెప్పుచున్నది. అది నిజమేనా?
ISA 14:13•
JUDE 1:6•
REV 13:14,15
259ఇపుడు జాగ్రత్తగా వినండి. పడిపోయిన దేవదూతలు. ఎటువంటి దేవదూతలు? లూధరనులు, వెస్లీయనులు, కాతలిక్కులు, పెంతెకొస్తువారు ఆ దేవదూతలవలెనె తమ మొదటి స్థితిని కాపాడుకొనక సంస్థలలో పడిపోయి పతనమయిరి. నైసియా యొద్ద లూసిఫరుకు ముఖ్య పట్టు దొరికినది. వారేమి చేసిరి? మృగము యొక్క స్వరూపము తయారు చేయుట కొరకు వారు సేవకులనందరినీ సమాకూర్చి ఒక గొప్ప సార్వత్రిక సమాఖ్యను స్థాపించిరి. (బైబిలు చెప్పుచున్నది) క్రైస్తవ సంఘముల తలుపులను మూయించుచున్నది. లూసిఫరు యొక్క పని చూచారా? దేవుని యొక్క మర్మమును, మూడు విధముల ప్రత్యక్షతను మీకు చూపించగోరుచున్నాను.
260వారేమి చేసిరి? హవ్వ వలెను, పతనమైన దూతలు కూడా జ్ఞానమునకు, హేతుబుద్దికి అమ్ముడు పోయిరి.
వెస్లీ ఒక దైవజనుడు, కాని అతనిని ఎవరు వెంబడించిరి? పతనమయిన దేవదూతలు అందులో చొరబడిరి. దేవదూతలు మొదట ఎవరు? దేవుని యొక్క సృష్టి, కాని లూసిఫరు యొక్క జ్ఞానము కొరకు పడిపోయిరి. వారేమయిరో మీరెరుగుదురు — పడిపోయిన దేవదూతలయిరి. దైవజనుని నుండి వచ్చిన సంస్థలు భూమి మీద సత్యమును స్థాపించిన వెళ్ళినవి. కాని ఆ సత్యము ప్రకటించబడక ముందే, క్రీస్తు యొక్క నిజ ప్రత్యక్షత నిరూపించబడక ముందే పడిపోయిన దూతలు అక్కడికి వచ్చి శాఖలను తయారు చేసినవి.
ఆ కారణము చేతనే ఏడు ముద్రల యొక్క మర్మము బయలుపరచబడవలసి వచ్చెను. ఇప్పుడు మీరు చూసారా? వారు దేనిని వదిలిపెట్టారో… లూధరు, ఒకవేళ వెళ్ళియుంటే, అది అక్కడ ఉండేది. వెస్లీ, ఒకవేళ వెళ్ళియుంటే, ఒకవేళ పెంతెకొస్తు వెళ్ళియుంటే — వారు ఏమి చేసేవారు?
ROM 8:29,30•
EPH 1:5,11
261ఇప్పుడు, ఒక్కటి మాత్రమే ఇప్పుడు జరుగును. అంత్యకాలమున ఒక వర్తమాన ముండును. దానిని మరేది వెంబడించదు. ప్రపంచ సంఘ సామ్రాజ్యము ఇప్పుడు స్థాపించబడినది. ఏ శాఖయు, మరేదియూ ఇపుడు దానిని అనుసరించజాలదు. నీవు దానిలో ఉండుట లేక ఉండకపోవుట మాత్రమే జరుగునున. చెట్టుపై భాగమున ఫలము లున్నవి. ముందుగా నిర్ణయించబడిన ఫలము మీద వెలుగు ప్రసరించుచున్నది. క్రీస్తును పోలిన ఫలముగా అది పరిపక్వమగుచున్నది. ఆయనలో నున్న ఆత్మ, మాధుర్యము, సువాసన బయలు వెడలుచున్నది. దానిని మీరు చూచిరని తలంచుచున్నాను! ఒక్క రోజులోనే అంతా నేను చెప్పగోరుచూ, అలసిపోయాను.
262వారు హేతుబుద్దికి, శాఖల తెలివికి, అమ్ముడు పోయిరి. "ఆ సంఘమునకు పట్టణమేయరు వెళ్ళును గనుక నేను అందులోనే చేరుదుననుకొనుచున్నారు," చూచారా. మెతడిస్టుగా లేదా ప్రెస్బిటేరియనుగా ఉండగోరుచున్నారు. వారెక్కడున్నారో చూడండి? వారు గతించిపోవుదురు. ఆ శాఖలు కత్తిరించబడినవి; చచ్చినవి అని మీతో చెప్పాను. అవి ఇక క్రీస్తుతో ముడిపెట్టబడి లేవు; వారు అదే జీవమును తెచ్చుచున్నారు. అవి నిమ్మ పండు వలె యున్నవి, పుల్లని జాతికి చెందిన ఏ పండు అయినా గాని పుల్లని చెట్టుకు అంటు కట్టుట ద్వారా పొందవచ్చును. ఒక నారింజ చెట్టు నుండి ద్రాక్షకాయలను మీరు కాయించగలరు. ఆ కొమ్మ చెట్టులో ఉన్నా గాని అసలు గుణమును పొగొట్టుకొనదు. (అది పుల్లని జాతి ఫలము), దాని జీవమునే అది మరల బయటకు తెచ్చును. శాఖలు ఆ పనినే చేయుచున్నవి. సంఘమును పేరు పెట్టుకొన్నవి. అసలు చెట్టు, అసలు ఆత్మ, వధువు అయి యున్నది. శాఖ నుండి కాదు గాని, క్రీస్తు నుండియే ప్రత్యక్షత వచ్చును.
గమనించండి.
263శాఖ ఏమిచేయ ప్రయత్నించుచున్నది? లూసిఫరు వలె తన్ను హెచ్చించుకొనుచున్నది. సంఘముగా, వధువుగా వారు పిలచుకొనుచున్నారు. (ప్రకటన 17 గూర్చి చెప్పుకొన్నాము), అది అబద్ద వధువు. క్రీస్తు యొక్క చిన్న మంద అసలు వధువుగా ఉన్నది. దీనముగా ఉన్న దేవుని వాక్యసత్యము కంటె హెచ్చుగా లూసిఫరు తన్ను హెచ్చించుకొని ఆలోచించుకొనుచున్నది. ప్రత్యక్షతా జ్ఞానమునకు బదులుగా సెమినరీ విద్యను, వేదాంతమును అందించుచున్నది, దానితో విర్రవీగుచున్నది. వారి గుంపుకు నీవు చెందనిచో, నీవు పనికిరానట్లే అనుచున్నారు.
GEN 3:4•
GEN 4:3
264[టేపు మీద ఖాళీయున్నది.].. ఆదిలో హవ్వకు లూసిఫరు చెప్పినట్లే ఇప్పుడును యున్నది. "నిశ్చయంగా దేవుడు మనలను చేర్చుకొనును; మనము పేదలకు ఆహారము పెట్టాము (అది మంచిదే). కచ్చితముగా ఆయన మనలను చేర్చుకొనును; మనము చాలా గొప్ప శాఖ; మనది అందమగు సంఘము. ఎందుకు, మన గొప్ప భవనములు చూడండి? మన గొప్ప సభ్యత్వము చూడండి. మేము మిలియనుల కొలదిగా యున్నాము. నిశ్చయంగా దేవుడు ఈ గుంపును తిరస్కరించడు. కయీను కూడా అదే చేసెను. తాను శ్రమపడి, దున్ని, పని చేసి పండించిన పొలములో నుండి అందమగు ఫలములను అతడు తెచ్చెను. గొర్రెపిల్ల యొక్క దీన రక్తమును తిరస్కరించి పండ్లు తీసికొని వచ్చెను.
265నన్ను నేను హెచ్చించుకొనుటకు గాని, నా వ్యక్తిగత ప్రత్యక్షత ఇచ్చుటకు గాని నేను దీనిని చెప్పుట లేదని స్త్రీ పురుషులు దేవుని కృప వలన తలంచుదురు గాక. నేను మీకు సత్యము మాత్రమే చెప్పుచున్నాను. వారు చేయుచున్న దానిని మీరు చూడలేరా? నేను దీనిని కఠినంగా గట్టిగా చెప్పుచున్నాను, అయితే ఏదైనా మేలు చేయాలంటే, ఒక మేకును అది లోనికి దిగువరకు దానిని కొట్టవలెను (చూచారా?), మీరు దానిని చూచువరకు.
GEN 2:21,22
266ఇప్పుడు, జనులకు చెప్పుచున్నాను. "ఎంతో కాలము నుండి యున్న మీ కాతలిక్కు సంఘమును చూడవద్దు. మీ గొప్ప మెతడిస్టు సంఘమును చూడవద్దు. మీ పితరులను చూడవద్దు." ఎందుకనగా వారు ప్రభుని వాక్యమును మీరిరి. హవ్వ, ఆదాము నుండి ఏర్పడిన రెండవ ఉత్పత్తి, కనుకనే ఆమె దేవుని వాక్యములోని చిన్న మాటను సందేహించినది. దీనికి కారణం అదే.
MATT 15:6•
MATT 24:24•
MARK 7:13
267నేడు మరల లూసిఫరు తన పని చేయుచున్నది. గుర్తుంచుకొనండి, కమ్యూనిజం అంత్యక్రీస్తు కాదు. క్రీస్తువిరోధి క్రీస్తుకు దగ్గరగా కనిపించును, సాధ్యమైతే ఏర్పరచబడినవారిని సహితము వాడు మోసపుచ్చునని యేసు చెప్పెను. (మత్తయి 24). మానవునికి దేవునితో గల ఐక్యతను లూసిఫరు మరల తెంపుచున్నది. హేతుబుద్దితో దేవుని వాక్యమునకు హద్దులు గీయుచున్నది. వాడు తలంచినదే సరియనుచున్నాడు. తన ఆలోచనతో దేవుని వాక్యమును తెంపుచున్నాడు. యేసు దినములలోను వాడు ఆలాగే చేసెను. యేసు ఇట్లనెను, "మీరు, మీ ఆచారముల ద్వారా దేవుని వాక్యమును జనులలో ప్రభావము లేనిదిగా చేయుచున్నారు. శాఖలు తమ సంస్థాగత తెలివి ద్వారాను, హేతు బుద్ది ద్వారాను, దేవుని వాక్యమును ప్రయోజనము లేనిదిగా జనులకు చూపించుచున్నవి. ఇది సత్యము. దానిని వారు చూడలేరు. "బైబిలు దేవుడెక్కడ?" అని వారడుగుదురు. ఆయన ఇచ్చట యున్నాడు. ఆయనే ఎదైయున్నాడో ఆయన బైబిలు.
ACTS 1:8
268ఇప్పుడు గమనించండి, లూసిఫరు యుక్తిగా వచ్చి దైవ, మానవ ఐక్యతను విచ్ఛినము చేయుచున్నాడు. స్వయం శక్తి మరియు ఔన్నత్యములను వాగ్ధానము చేసివాడు ఏదెనులో ఆలాగే గొప్పగా శోధించెను. "మీరు మాతో ఉంటే బిషప్పు అవుదురు. మీరు జిల్లా పెద్ద అగుదురు. ఇంకా గొప్ప పదవి ఇచ్చుదుము అనుచున్నారు." చూచారా? పెంతెకొస్తు వారు, కాతలిక్కు వారు ఆలాగే యున్నారు, చూచారా. దేవుని వాగ్ధానము మరియు వాక్యమునకు వెలుపట ఉండినచో గొప్ప అధికారమును పొందుదురని పెద్ద అబద్ద వాగ్దానము చేయుచున్నది. పరిశుద్దాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందెదరు. నీవు బిషప్పు లేదా పెద్దవి అయినప్పుడు కాదు, చూచారా. కాని లూసిఫరు మరల తన పని చేయుచున్నది.
ఈ సంఘము దానిని గ్రహించినదా? నేను చూచునట్లుగా మీ చేతులు ఎత్తుండి. మంచిది, అయితే ఎక్కువ సేపు ఉంచను.
దేవుని వాక్యము యొద్ద నుండి దూరంగా తీసికొని పోవుచున్నది, చూచారా.
269రోమ్‌లోని నైసియా యొద్ద వాడాలాగే చేసెను. కాన్‌స్టంటయిన్ వారికేమిచ్చెనో చూచారా? మీరు సంఘకాలములను చదవండి. వారికి క్రీస్తు తప్ప మరేది లేదు. వారు చిన్న పాత ఇండ్లలోను, రాళ్ళ చావిడిలందు కూడుకొనువారు. నైసియా సమితి, నైసియా పూర్వ సమితి, నైసియా పితరులు మొదలగు సంఘ చరిత్ర గ్రంధములను చదవండి. వారికేమియూ లేదు. కాని వారు ఈ సమితి వలన కన్ని రోమా అన్యాచారములను క్రైస్తవ్యములోనికి ఎక్కించిరి. పరిశుద్దులు, బిషప్పులు వచ్చిరి. పోపు మొదలగు బుద్దిహీనతంతయు వచ్చెను. కాన్‌స్టంటయిన్ ఏమి ఇచ్చెను? ఏ వేదాంతి అయినా గాని నాకు చెప్పవచ్చును. వారికి ఆస్తిని ఇచ్చెను. వారికి కావలసిన స్వేచ్ఛ ఇచ్చెను. మానవ జ్ఞానము మరియు సంస్కతి కొరకు దేవుని వాక్యమును ప్రక్కకు త్రోసి వేసిరి. ఏదెను తోటలో లూసిఫరు అదే చేసెను. వారక్కడే చనిపోయిరి. రోమ్‌లోని నైసియా యొద్దనే పెంతెకొస్తు సంఘము చనిపోయెను, కాని చివరి దినములలో వధువు వక్షములో పునరుత్థానము చెందును.
270గమనించండి, లూసిఫరు దేవుని యొక్క వాక్యముతో కాక శోధనలు మరియు శక్తి గల అబద్ద వాగ్దానములతో వచ్చును. (ఆది నుండి వాడు యుక్తి గలవాడే) రోమ్‌లోని నైసియా యొద్ద వాడు అదే చేసెను. ప్రపంచ సంఘ సమస్య ద్వారా కూడా వాడిప్పుడు అదే చేయుచున్నాడు.
"అందరం ఏకమవుదము." "నాతో కూడా సర్వ సంఘ సోదరులందరు ఏకమవండి. మనమంతా ఒక్కటే," అని పోపు చెప్పుచున్నాడు. అది నిజమే. సంస్థలను బట్టి మీరంతా ఒక్కటే. కాని క్రీస్తు వధువుకు దానితో సంబంధము లేదు. సోదరుడా, ఆమెను నీవెన్నడూ అందులో ముంచలేవు.
MAL 4:5,6
271అంత్యదినములలో దేవుని పిల్లలకు అసలు విశ్వాసమును తిరిగి ఇచ్చుదునని వాగ్ధానము చేసెను. (మలాకి 4). దేవుడిట్లు పలికెను, "లోకము అగ్నితో కాల్చబడక ముందు, ఇదిగో, నేను ప్రవక్తయగు ఏలియాను మీ కొరకు పంపించెదను. అతడు పిల్లల విశ్వాసమును తిరిగి సమకూర్చును." అతడు మొదటగా రానున్న ఏలియా కాడు. ఇక్కడ మనము ఏలియా దుప్పటి, అంగీ మొదలగు వాని గూర్చి బోధించుటలేదు. కేవలము దేవుని వాక్యమునే బోధించుచున్నాము. చూచారా, అదే ఆయన చెప్పెను. చాలా రకముల ఏలియాల గూర్చి మనం విన్నాము, అది బుద్ది హీనత. మనము దీనిని ఎరుగుదుము దాని గూర్చి నేను చెప్పుట లేదు. ఆత్మ సంబంధమగు మనస్సు గలవారు దానిని గ్రహించెదరు. సమయము లేదు గనుక దీనినంతటిని టేపు చేయజాలము.
ఇప్పుడు, చివరి దినములలోని వాగ్దానమును చూడండి.
MAL 3:1•
MAL 4:1-3•
MATT 11:7,9,10•
LUKE 7:24,26,27
272యేసు మత్తయిలో చెప్పెను, 11 లేదా 6 అధ్యాయములలో యుండును. కాదు. 11 వ అధ్యాయము 6 వచనము. యేసు నిజమైన మెస్సీయాయో కాదో తెలిసికొని రమ్మని యోహాను తన శిష్యులను పంపెను. మిమ్మును ఎవరు పంపిరని యేసు వారినడిగెను. మీరేమి చూడవచ్చితిరి? గాలికి కదలుచున్న రెల్లునా? ఒక ప్రవక్తనా? మరేమి చూడవచ్చితిరి? ఇదిగో ప్రవక్త కంటె గొప్పవాడిచ్చటున్నాడు. ప్రవక్తల ద్వారా పలుకబడి వాడితడే. ఈయనను మీరు చేర్చుకొనుడి అని ఆయన అనెను. యోహాను ప్రవక్త కంటే గొప్పవాడు; అతడు నిబంధన దూత. మీరు దీనిని చేర్చుకున్నట్లయితే ప్రవక్తల ద్వారా పలుకబడిన వాడితడే. "నాకు ముందుగా నా దూతను పంపుచున్నాను," అని ఆయన చెప్పాడు. మలాకీ 4 అది కాదు. ఎందుకనగా, మలాకీ 4లో రానున్న ఏలియాను చూడండి. భూమి మహావేండ్రముతో లయమగును. ఆ ధూళి మీద నీతిమంతులు వెయ్యేండ్ల పాలనలో నడచెదరు. కాబట్టి అది ఇతడు కాదు, చూచారా.
JOHN 14:12
273వాగ్ధానము నెరవేరుటను ఇప్పుడు మనము చూచాము. క్రీస్తే నిజమగు అధికారము — తన వధువులోనికి వచ్చుచున్నాడు. ఆది యందు ఆయన చేసిన కార్యములనే చేయుచున్నాడు. తన వాక్యమును నెరవేర్చి సిద్దపడుచున్నాడు. యోహాను 14:12 లో ఆయన ఇట్లు చెప్పెను, "నా యందు విశ్వాసముంచువాడు నేను చేయు క్రియలు చేయును." ఇప్పుడు క్రియలలోను సూచనలలోను, జీవితములోను శిరస్సు, శరీరము ఏకమగుచున్నవి. దేవుని యొక్క జీవము బయలు వెళ్ళు చున్నది. దేవుని ద్వారా ఆయన యొక్క అంత్యకాల వాగ్ధాన వాక్యము నెరవేరుచున్నది. ఇది చివరి దినములకు ఆయనిచ్చిన వాగ్దానము. మీరు ఆత్మ సంబంధులయితే దానిని గ్రహించెదరు.
REV 19:7,9
274పెండ్లి విందు సమీపమందున్నట్లు మనము చూడగలము. గుర్తుంచుకొనండి, తిరిగి మిమ్మును ఎన్నడూ నేను చూడకపోవచ్చు, కాని పెండ్లి విందు సమీపమందున్నది! వాగ్దాన ప్రకారము ఆ రాజ్యము, గొప్ప వెయ్యేండ్ల పాలన. సంఘము ఎత్తబడుట, దుష్టుల నాశనము సమీపమున యున్నవి. ఆరవ ముద్ర కింద ఈ లోకము మహాప్రళయము ద్వారా పవిత్రీకరించబడును. లోకములోని చెడుగు మరియు పాపము పూర్తిగా తీసివేయబడును. అది మరల రూపుదిద్దబడును. రాబోవు యుగములో చక్కని వెయేండ్ల పాలన సాగును. ఈ గొప్ప మూడు విధముల ప్రత్యక్షతను మనము చూతుము. క్రీస్తు నందు దేవుడు, సంఘములో క్రీస్తు, రాబోవు రాజ్యము. ఆదామవ్వలు తిరిగి విమోచించబడి, ఏదెను తోటలోనికి వచ్చెదరు మరియు అది క్రీస్తు మరియు తన వధువును చూపించుచున్నది. ఆయన వాగ్దాన ప్రకారము ఆ రాజ్యము తిరిగి సమకూర్చబడును. దేవునికి స్తోత్రము! ఈ మూడు విధముల మర్మము యొక్క ప్రత్యక్షత ద్వారా (రహస్యము) వాక్యము బయలుపడుచున్నది. ఆయన యొక్క అధికారము, వ్యక్తిత్వము కనబడుచున్నది.
275"దేవునికి మహిమ! మేము అరచుచున్నాము. హల్లెలూయా. మేము పాడుచున్నాము" అనవద్దు. అది కాదు. నేను ఒక మిషనెరీని. నేను ఏడు సార్లు ప్రపంచమంతయూ పర్యటించాను, చూచారా. అన్యులు, దయ్యములు, నాట్యమాడి కేకలు వేయుట నేను చూచాను. శరీర సంబంధమగు ఎన్నో ప్రత్యక్షతలను నేను చూచాను. అవి శరీరానుసారమైనవి.
ROM 6:4•
ROM 8:11•
1COR 15:20
276కాని నేను క్రీస్తు యొక్క ఆధిపత్యమును గూర్చి మాట్లాడుచున్నాను.
చూడండి, అసలైన శిరస్సు ద్వారా మనము గుర్తించబడినప్పుడు దయ్యముల ప్రశ్నలకు మనము జవాబు ఇయ్యగలము. ఆమేన్! మహిమ! దయ్యముల ప్రశ్నలకు మన యొద్ద జవాబుండును. క్రీస్తు లేచియున్నాడు, వెల చెల్లించి, ఆయన శరీరమును లేపియున్నాడు. దాని ముందు అపవాది నిలబడజాలదు.
ఆ కారణము చేతనే ఈ సార్వత్రిక రాజ్యములు స్థాపించబడుచున్నవి. అందు వల్లనే ఇప్పుడు ఇవన్నియూ జరుగుచున్నవి. అపవాది అందుకే ఉన్న విధముగానే ఊళ వేయుచున్నది. క్రీస్తు తిరిగి లేచుట వలన వాడి తంత్రములు పటాపంచలైనవి. శరీరమునకు ఆధిపత్యము కలుపబడినది. మహిమ!
ROM 6:4•
ROM 8:11•
1COR 15:20•
GAL 2:20
277నేను నా వశమున లేనని తలంచవద్దు. మన యొద్ద అపవాదికి జవాబున్నది. "నేను కాను, క్రీస్తే; ఆ వాక్యము నాలో జీవించుచున్నది." ఇది నా అభిప్రాయము కాదు; ఇది ఆయన శక్తి. నా ఉద్దేశము కాదు; ఇది ఆయన మాట. దీనిని ఆయన వాగ్దానము చేసెను, అది ఇచ్చటున్నది. ఇది జరుగునని ఆయన చెప్పెను గనుక అది ఇక్కడ జరుగుచున్నది. మన యొద్ద ఆయన జవాబున్నది.
క్రీస్తు తిరిగి లేచెను మరియు మన విమోచనకై వెలచెల్లించెను. దేవుడు క్రీస్తులో ఏలాగు ప్రత్యక్షమాయెను అనగా, ఆయన రక్తమాంసములను ఇచ్చెను, ఆ రక్తములో ప్రాణమున్నది, మరియు శరీరం విమోచించబడవలెను; ఈ విమోచించబడిన శరీరములో దేవుడు ఆ దినమున చేసినట్లుగానే, ఈ దినపు వాక్యము ఆయన అనుగ్రహించుచున్నాడు. ఓ! మహిమ! దానిని మీరు చూచారా? ఎప్పుడు నేను ఆపుదును?
దీనిని గమనించండి.
ROM 8:29,30•
EPH 1:5,11
278మనము నీతిమంతులముగా తీర్చబడి దేవుని సన్నిధిలో నిలబడియున్నాము. బిందెడు నీళ్ళలో ఒక సిరా చుక్క ఎట్లు కలిసిపోవునో చూడండి? ఆ సిరా చుక్కను మీరు ఎన్నటికి కనుగొనలేరు. అది ఎక్కడికో వెళ్ళిపోయినది. అది మరల ఎన్నడూ తిరిగి రాదు. ఒకడు నిజంగా విమోచించబడినప్పుడు, అతని పాపములు కనబడవు. (అది ముందుగా నిర్ణయించబడిన బీజము. కాబట్టి దానిని చూచును మరియు దానిని అంగీకరించును), అది పోయినది. అది వేరు కాబడినది. యేసుక్రీస్తు యొక్క రక్తములో అది ఇంకిపోయినది. మరెన్నడూ జ్ఞాపకము చేసికొనబడదు. దానిని దేవుడు మరచిపోవును. అట్టి వ్యక్తి దేవుని సన్నిధిలో దైవకుమారునిగా మరియు దైవకుమార్తెగా నిలబడును. ఆమేన్! ఆమేన్!
ఇప్పుడు మనము దేవుని కుమారులము. ఇక ముందుకు అగుదుమని కాదు గాని అయి యున్నాము. ఇప్పుడు మనము విమోచించబడియున్నాము.
1JN 3:2
279సాతానుకు మనము జవాబు చెప్పగలము. దేవుడు తన్ను తాను బయలుపరచుకొనెను. దేవుడు ఈ దినపు వాగ్దానమును నెరవేర్చి తన్ను రుజువు చేసికొనెను. హల్లెలూయా! ఆధికారము ఇక్కడున్నది. (ఆమేన్!) — క్రీస్తు, ప్రభువుగా లేచి యున్నాడు, ఆయన యొక్క పునరుత్థాన శక్తి ఆయనను ప్రత్యక్షపరచినది. ఇదే అపవాదికి జవాబు.
280ఆ కారణము చేతనే చచ్చినట్లు పడియున్న ఒకనిని చూచి, బ్రదుకుము అని పరిశుద్దాత్మ చెప్పినందువలన పలుకగలుగుచున్నాము. పదిహేను గంటల క్రితం చనిపోయిన బిడ్డ మెక్సికోలో తిరిగి లేచినది. నాకు దర్శనమందు ఆయన ఇట్లు చెప్పెను, "ఆమెను బ్రదుకమని చెప్పుము. ఆ పిల్ల బ్రదుకును." ఆ ఉదయము 9 గంటలకు బిడ్డ చనిపోయినదని వైద్యులు ధవీకరించిరి. ఆ రాత్రి 11 గంటలకు ఆమె తిరిగి లేచినది. నేడు సజీవురాలుగా జీవించుచున్నది.
281ఏమిటిది? మానవుల పనికాదు. శిరస్సు మరియు శరీరము ఒక్కటయినది. దేవుడు తన జనులలో ప్రత్యక్షమగుచున్నాడు. ఆ కారణము చేతనే భార్య-భర్తలు ఇద్దరుగా ఉండక ఒక్కటిగా యున్నారు. దేవుడు ఆయన సంఘము ఒక్కటై యున్నారు. క్రీస్తేనీలో యున్నాడు. ఇది దేవుని యొక్క గొప్ప ప్రత్యక్షత. దేవునికి మహిమ! ఆయన నామము కూడా ధరించియున్నాము. ఆయన పేరు యేసు, అనగా అభిషిక్తుడు. ఆ కారణము చేతనే ఆయనను యేసు అని పిలచిరి. దేవుడు ఆ శరీరమందు బయలుపరచినట్లే ఇది క్రీస్తు యొక్క అభిషేకించబడిన శరీరముగా ఋజువగుచున్నది. ఆయన శరీరము ఈ శరీరులను విమోచించుచున్నది.
అందువలన దేవుని యొక్క మూడు విధముల ప్రత్యక్షత క్రియా రూపము ధరించినది. వెల చెల్లించి ఆయన తిరిగి లేచి రాజ్యములోనికి ప్రవేశించెను. మనము విమోచించబడితిమి. దానిని దేవుడు బయలుపరచెను, నిరూపించెను, చూచారా.
JOHN 14:13,14•
JOHN 15:7,16•
JOHN 16:23
282క్రీస్తు ఎదుట మనము నీతిమంతులముగా తీర్చబడి నిలబడియున్నాము. ఆయన తీర్పు తీర్చలేడు, ఎందుకనగా ముందే ఆయన తన శరీరమందు తీర్పు తీర్చెను. అందులో నేను భాగమైయున్నాను. ఆయనలో నేను ఎట్లు భాగమయ్యాను? "మీరు నాయందును, నా యందు మీ మాటలును నిలిచి యుండిన యెడల, తండ్రి నామమున మీరేమి అడిగినా గాని అది మీకు అనుగ్రహించబడును." నీతి మంతులముగా తీర్చబడితిమి. దేవునికి మహిమ!
HEB 13:8
283ఓ, దానిని లోకము చూచిన యెడల ఎంత బాగుండును! ఎందుకు? అక్కడే మీరున్నారు. క్రీస్తు యొక్క శరీరము సజీవముగా యున్నది. విమోచించబడి నిలబడి యున్నది. ఆయన దృష్టిలో నీతిమంతులముగా తీర్చబడితిమి? — మనము ఆయన జయమై యున్నాము. సంఘమే ఆయన జయ చిహ్నము. ఆయన జయమును సూచించు ఈ మహిమకరమగు సువార్తను చివరి దినములలో మనము పట్టుకొని ముందుకు వచ్చుచున్నాము. దీని కొరకే ఆయన చనిపోయెను. ఆయన జయమునకు మనము రుజువై యున్నాము. ఆమేన్! ఆయన తిరిగి వచ్చుట మనము చూతుము. ఆయన జయశీలునిగా సంఘము మధ్య జీవించుచున్నాడు. అదియే ఆయన యొక్క విజయం. ఆయనను ఏదియూ సమాధిలో నిలిపి యుంచలేదు. మనలను కూడా ఏది నిలిపియుంచజాలదు. మనము ఎప్పుడో లేచి యున్నాము, ఎందుకనగా మనము ఆయన వాక్యము యందు అవిశ్వాసము అనే మరణము నుండి లేచియున్నాము. శాఖ సంబంధమగు ఆచారముల నుండి లేచియున్నాము. నిత్య వాక్యమును నమ్ముచున్నాము. నిత్యుడగు దేవుడు తానే మనలో పని చేయుచున్నాడు. ఆయన నిన్న, నేడు, నిరంతరము ఏకరీతిగా యున్నట్లు తనను బయలుపరుచుకొనుచున్నాడు.
JOHN 14:12•
REV 22:18,19
284ఇప్పుడు వాక్యము శిరస్సులో నుండి శరీరములోనికి కదిలియున్నది. ఏమిటిది? అదే వాక్యము. దానికి మరేదియూ చేర్చజాలము. దాని నుండి మరేమియూ తీసివేయజాలము. అదే వాక్యము శిరస్సు నుండి కదిలి, దినము సమీపించుచున్న కొలది శరీరములోనికి వచ్చుచున్నది. వారిరువురు ఒక్కటై యున్నారని బయలుపరచుచున్నది. వారు భార్య-భర్తలు. వారు ఆయన శరీరములో శరీరము. వాక్యములో వాక్యము, ఆయన ప్రాణములో ప్రాణము, ఆయన ఆత్మలో ఆత్మ అయి యున్నారు, చూచారా. ఆమేన్! దానిని మీరెట్లు తెలిసికోగలరు? అదే సాక్షమును, అదే ఫలమును, అదే వాక్యమును, అదే క్రీస్తును బయటకు చూపించుట ద్వారా. (చూచారా?) అదే జీవము, అదే దేవుడు, అదే ఆత్మ, అదే వాక్యము, అదే గ్రంధము, అవే గురుతులు కనబడును. (ఆమేన్!) "నేను చేయు క్రియలు మీరును చేయుదురు." ఓ! హల్లెలూయా! మై!
1PET 3:19
285బయలుపరచబడిన ఆయన శరీరములోని వాక్యమును గమనించండి. ఆయన మరణమునకు, ఆయన జయమునకు అదే కారణము. ఆయన శరీరమందు మాత్రమే చనిపోయెను. ఆత్మ యందు మరణించలేదు. ఆయన ఆత్మ పాతాళమునకు వెళ్ళి చెరలోనున్న ఆత్మలకు బోధించెను. ఇది నిజమేనా? ఆయన శరీరము మాత్రమే చనిపోయెను. దానిని ఆయన తిరిగి లేపెను. (జీవింప చేసెను) అది ఆయన శరీరము (అనగా, వాక్యము) సంవత్సరముల తరబడి అది పడి యున్నది, కాని అది క్రమేణా లేచి సంస్కరణలో నిలబడినది, ఇప్పుడామె తన కాళ్ళ మీద నిలబడినది.
EZEK 37:3,4,8,10
286ఓ! నాకు సమయమున్నచో బాగుండును! యెహెజ్కేలు లోనికి వెళ్ళి ఆ ఎండిన ఎముకలను గూర్చి చూపించగోరుచున్నాను. ఈ ఎముకలు తిరిగి బ్రదుకునా? అని అతడడుగగా, ప్రవచించుము అని చెప్పెను. ప్రవచనమెట్లు వచ్చును? ప్రవక్త ద్వారానే వచ్చును. అది ప్రభువు యొక్క వాక్యము. ఎండిన ఎముకలారా, యెహోవా వాక్కు వినుడి. వాటి మీదికి నరములు, చర్మము వచ్చినది ఒక బలమగు సైన్యముగా వారు లేచి సీయోను వైపు కదలసాగిరి. దేవునికి మహిమ! ఆయన విజయ శీలుడు.
ప్రభువు చేత కొనబడిన వారు
సంతోషముతో సీయోనుకు వచ్చెదరు.
ఆయన పరిశుద్ద పర్వతమును
ఏది నాశనము చేయదు, అంటుకొనదు.
JER 12:9
287ఆయన తన పునరుత్థాన జీవితమును రుజువు చేసెను. ఆయన తన్ను తాను బయలుపరచుకొనెను.
వధువు అందరికీ వేరుగా నున్నది. ఆమె ఒక స్వతంత్రురాలు. పొడవాటి ముక్కు గల పిట్ట తక్కిన వాటికి భిన్నంగా ఉండును. బైబిలు ఆ పిట్టను గూర్చి చెప్పుచున్నది. ఆయన నామమును ధరించుకొన్నది. ఆయన జీవము ఆమెలో యున్నది.
పక్షిని వారెట్లు చేసెడి వారో ఎరుగుదురా? ఆ రెండును తెల్ల పక్షులే. ఒక దాని తలను ఛేదించి దాని రక్తమును మరో పిట్ట మీద పోసెడి వారు. అప్పుడు ఆ తెల్లని పిట్ట ఎర్రని రంగును ధరించెడిది. అది ఆ రక్తము పైన పోయబడినప్పుడు రెక్కలు విదిలించుచుండగా, ఆ రక్తము పరిశుద్దుడు, పరిశుద్దుడు అని కేకలు వేసెడిది. ఆ విధంగా ఆ నేల తడిసెడిది. ఆ విధంగానే క్రీస్తు కూడా తన జత కొరకు చనిపోయెను. ఆయన మనలో తన రక్తమును పోసెను. (ఆయన ప్రాణమే ఆ రక్తము) ఆయన రక్తము "పరిశుద్దుడు, పరిశుద్దుడు, పరిశుద్దుడు" అని ప్రభువుకు మొరపెట్టుచున్నది. అది వింతగా కనబడు పక్షి. నిశ్చయంగా ఆ విధంగానే యున్నది. కాని వధువును ఆయన గుర్తించును. ఆమె అందరిలోను ప్రత్యేకముగా కనబడును. "మీరిద్దరు జీవించినంత కాలము ఆమెను హత్తుకొని యుండుము." ఆయనను, "వాక్యమును మాత్రమే నీవు హత్తుకొని యుండవలెను." వ్యభిచారము చేయరాదు, శాఖ యొక్క గురుతులుండ రాదు, సిద్దాంతపు ఆచారముల గురుతులండ రాదు. వాక్యమగు ఆయనతోనే నీవుండవలెను. "కదలని బండయగు క్రీస్తు మీదే నేను నిలబడియున్నాను. తక్కినదంతయూ కూలిపోవు ఇసుకయే" అని ఎడ్డీ పెర్రోనెట్ పలికెను.
JOHN 1:1
288అది వాక్యమై యున్న క్రీస్తులో ఉన్నది. ఆయన వాక్యమై యున్నాడు. ఆయన వాక్యమై యుండెను. ఆయనలో భాగమై యున్న సంఘము కూడా వాక్యమే యగును. వ్యక్తిగతంగా ఆయన ద్వారా గుర్తించబడును. ఆయన సొత్తయి యున్నారు. ఆమె ఆయన ద్వారాను, ఆయన కొరకు ఆయన చేత, ఆయన కొరకు మాత్రమే విమోచించబడి యున్నది. ఇది నిజము.
అపవాది ఎందుకు మొరుగుచున్నదో చూచాము — ఇది బయలుపరచబడుతున్నందువలననే.
MATT 24:7•
MARK 13:8•
LUKE 21:11•
REV 10:6
289మనము అపాయకరమైన కాలములో యున్నాము. గుర్తుంచుకొనండి, ఈ సంగతులు నారంభించినప్పుడు ఒక సమయముండదని లేఖనము చెప్పుచున్నది. ఆమె కనుమరుగవును. ప్రత్యక్షతను మనము చూచుచున్నాము: భూకంపములు చూడండి — వేయి మంది అక్కడ చనిపోయిరి. భూకంపములు; ఆకాశములో భయంకర దృశ్యములు — అగ్ని గోళముల వంటివి కనబడుచున్నవి, ఎగిరే పళ్ళెములు కనబడుచున్నవి. అదేమిటో వారెరుగరు. అసలు గ్రహించలేకున్నారు.
GEN 18:1,2,22•
LUKE 21:11
290సొదొమ నాశనము కాబడక ముందు దేవదూతలు దిగి వచ్చి సొదొమను పరీక్షించెను. గుర్తించారా? అది మీకు గుర్తున్నదా? అక్కడ ముగ్గురు కనబడిరి. అందులో ఒకరు అబ్రహాముతో నిలచెను. గుర్తున్నదా? తీర్పును పరీక్షించుటకు ఆకాశము నుండి వచ్చిన వెలుగుల వలె వారున్నారు. అవి ఎక్కడ కనబడుచున్నవో చూడండి. పెంటగాన్ తదితర పరిసర ప్రాంతములలో కనబడుచున్నవి. అది ప్రపంచ తీర్పు, సొదొమ, సంఘముల బయట ప్రతినిధిగా ఒకాయన యున్నాడు — ఆయన క్రీస్తే, తన్నుతాను బయలుపరచుకొనుచున్నాడు, చూచారా. పైన ఆకాశమందును, క్రింద భూమి మీదను సూచక క్రియలు కనబడుచున్నవి. నిశ్చయంగా. గుర్తించబడెను.
LUKE 11:19,20
291ఓ, దీనిని చూచి అపవాది మొరుగుచున్నది. వాక్య వాగ్దానము యొక్క బయలుపరచబడిన సత్యము అమెలోనే యున్నది. వారికి జవాబు లేదు. యేసు రాకలో పరిసయ్యులు ఆలాగే యుండిరి. నేనను దేవుని వ్రేలి వలన దయ్యములను వెళ్ళగొట్టుచున్న యెడల మీరెవరి వలన వెళ్ళగొట్టుచున్నారు? అని ఆయన వారిని అడిగెను. ఆయన ఒంటరిగా నిలచెను. ఆయన సంఘమును ఒంటరిగానే నిలబడును. ఆమె ఎవరితోను విజ్జోడు కాదు. ఆయన దేవునిచే గుర్తింపబడెను. దేవుడు ఆ శరీరములో నివసించెను. అవే క్రియలను సంఘము కూడా చేయుచూ ఆయన శరీరముగా గుర్తించబడుచున్నది. ఆమె ఆయన శరీరము. చివరి దినములకు ఆయన వాగ్దానము చేసిన వాక్య సత్యము బయలుపరచబడి యున్నది. ఆమె మాత్రమే దాని పక్షముగా నిలబడును. అందుకే అపవాది మొరుగుచూ ఈ గొప్ప సంస్థలను లేపుచున్నది. ఆమెను మూసివేయవలెనని కోరుచున్నది. కాని వారెన్నడూ దానిని చేయలేరు. ఆమె మూత పడదు గాని పైకి ఎత్తబడును.
బయలుపరచబడిన వాక్య శక్తి ద్వారా ఆమె ఇప్పుడు లేచి యున్నది. అది ఆమెకు వాగ్దానము చేయబడినది. ఆమేన్!
292ఒక వధువు ఆ వాగ్దానమును ఎట్లు పట్టుకొనునో చూడండి. "ఆయన నా కొరకు వచ్చునని చెప్పెను. దానిని నేను నమ్ముచున్నాను," చూచారా. అవును. ఆమె తన శిరస్సును, తన విమోచకుని, తన భర్తను, తన రాజును, తన ప్రభువును, తన ప్రియుని, తన రక్షకుని ఏర్పాటు చేయబడిన స్థలములో కలిసికొనును. వారిని కలిసికొనుటకు ఆయనకు ఒక చోటున్నది. పెండ్లి కుమారుడు దేనిని మరువడు. గుర్తింపుగా ఉంగరమును తెచ్చును. ఆమె ధరించుటకు పెండ్లి వస్త్రములు తెచ్చును, చూచారా. ఆమెను ఏర్పాటు చేయబడిన స్థలములో ఆయన కలిసికొనును. అది మధ్యాకాశము. అన్ని ఏర్పాటు చేయబడినవి. ఆయన పెండ్లి విందును సిద్దపరచి యున్నాడు. ముందే ఏర్పాటు చేసికొబడిన అతిధులను ఆహ్వానించుట జరిగినది. పరిచర్య చేయుటకై సిద్దముగా దేవదూతలు నిలబడి యున్నవి. ఓ!
ఓ! మధ్యాకాశములో ఒక కలయిక జరుగును.
అది మాధుర్యము, తియ్యని కూటమి.
నిన్ను నేను కలిసికొందును.
అచ్చట నిన్ను కలిసికొందును
ఆకాశమునకు అవల ఆ గృహమున్నది.
అట్టి గానమును ఈ మర్త్య చెవులు ఎన్నడూ వినలేదు.
అది మహిమకరముగా ఉండునని నేను నొక్కి చెప్పెదను.
దేవుని స్వంత కుమారుడే అక్కడ నాయకుడు.
(ఆయనే దేవుని యొక్క పూర్ణ ప్రత్యక్షత.)
మధ్యాకాశపు కూటము. (ఓ! ఇప్పుడాయన
ప్రత్యక్షతలను గమనించండి.)
మోషే పొదలో దాయబడిన కథను మీరు విన్నారు.
భయములేని దావీవు, అతని వడిసెల గూర్చి మీరు విన్నారు.
కలల కను యోసేపు గాధను మీరు విన్నారు.
దానియేలు సింహముల మధ్య ఉండుట గూర్చి పాడుకొన్నాము.
ఓ! ఇంకా ఎందరో బైబిలులో యున్నారు. (ప్రత్యక్షపరచబడిరి)
వారినందరినీ చూచుటకెంతో ఎదురు చూచుచున్నాను.
ప్రభువు మనందరిని వారితో కలియనిచ్చును.
అది మధ్యాకాశ కూటము.
మధ్యాకాశములో ఒక కూడిక జరుగును.
అది మాధుర్యము, తియ్యదనము కలిగి యుండును.
అక్కడ నేను మిమ్మును కలిసికొని అభినందించెదను.
ఆకాశమునకు అవల ఆ గృహమున్నది.
ఆ గానమును ఈ మర్త్య చెవులు ఎన్నడూ వినలేదు.
అది మహిమకరమని నేను ప్రకటించెదను.
దేవుని స్వంత కుమారుడు దానిని నడిపించును.
అది మధ్యాకాశము కూడిక.
ROM 16:25•
EPH 1:9•
EPH 3:3,4,9•
EPH 5:32•
COL 2:2•
REV 10:7
293మీకది ఇష్టముగా లేదా? ఆయన గొప్ప మర్మము యొక్క మూడు విధముల ప్రత్యక్షత బయలుపరచబడి యున్నది. ఆయనే ప్రధానుడు. ఓ! దానిని పాడుదము. ఇంక ఎక్కువ నేను బోధించలేను. నాకెంతో బాగున్నది, చూచారా.
ఓ! మధ్యాకాశములో ఒక కూడిక
అది మాధుర్యమైనది, తియ్యనైనది.
అక్కడ నేను మిమ్మును కలిసికొని అభినందించుదును.
ఆకాశమునకు ఆవల ఆ గృహమున్నది.
అట్టి గానమును ఈ మర్త్య చెవులు ఎన్నడూ వినలేదు.
అది మహిమకరమని నేను చెప్పగలను.
దేవుని స్వంత కుమారుడు దానిని నడిపించును.
అది మధ్యాకాశపు కూటము.
(మీరు వెళ్ళుచున్నారా? దేవుని కృపను బట్టి వెళ్ళుదుము.)
ముండ్ల పొదలలో దాయబడిన చిన్న మోషే గూర్చి మీరు విన్నారా?
భయము లేని దావీదు మరియు అతని వడిసెల గూర్చి విన్నారా?
(అవన్నియూ మాదిరులు.)
కలలు కను యోసేపు కథను మీరు విన్నారు.
దానియేలు సింహముల మధ్య ఉండుట గూర్చి మీరు తరచుగా పాడిరి.
ఓ! ఇంకా ఎందరో బైబిలులో యున్నారు.
(అది ఆయనే.)
వారందరినీ నేను కలిసికొన ఎదురు చూచుచున్నాను.
ప్రభువే వారిని మనము కలిసికొనునట్లు చేయును.
అది ఒక కూడిక
(కాని ప్రధాని ఒక్కడే)
ఓ! మధ్యాకాశములోఒక కూడిక యుండును.
అది మాధుర్యము, తియ్యదనము.
అక్కడ నేను మిమ్మును కలిసికొని అభినందించుదును.
ఆకాశమునకు అవతల ఆ గృహమున్నది.
అట్టి గానమును ఈ మర్త్య చెవులు ఎన్నడూ వినలేదు.
అది చాలా మహిమకరమని నొక్కి చెప్పెదను.
దేవుని స్వంత కుమారుడు నాయకుడుగా ఉండును.
అది మధ్యాకాశములో కూటము.
294మనము ఒకరినొకరము అక్కడ కలిసికొందుము. మీరు మెతడిస్టులు, బాప్టిస్టులు, మరెవరయినా గాని, దేవుని ఆత్మ మూలముగా తిరిగి జన్మించినచో, ఒకరినొకరము చేతులు కలుపుకొని ఈ పాట పాడుదము.
ఓ! మధ్యాకాశములో ఒక కూడిక యుండును.
అది మాధుర్యము, తియ్యదనము.
అక్కడ మిమ్మును నేను కలిసికొని అభినందించుదును.
ఆకాశమునకు అవల ఆ గృహమున్నది.
అట్టి గానమును ఈ మర్త్య చెవులు ఎన్నడూ వినలేదు.
అది చాలా మహిమకరమని నేను నొక్కి చెప్పెదను.
దేవుని స్వంత కుమారుడు నాయకుడు.
మధ్యాకాశములో ఆ కూడిక యుండును.
ఓ! అది చాలా అద్భుతము, చూచాచా. ఆయన ఏమైయుండునో చూడండి? స్నేహితులారా, ముగించుకొనుచున్నాము. దాదాపు 2 గంటలయినది. చూచారా? బోజనము చేయు వరకు వేచియుండండి. ఇంకా చాలా పేజీలు ఉన్నవి. చూచారా? ఇక్కడ మనము ముగించవలసి యున్నాము. దీనికి అంతము లేదు.
ROM 16:25•
EPH 1:9•
EPH 3:3,4,9•
EPH 5:32•
COL 2:2•
REV 10:7
295ఇది ఒక ప్రత్యక్షత. దేవుని వాక్యము నిత్యమై యున్నట్లుగా ఇదియు నిత్యమై యున్నది.
చూడండి. దేవుని యొక్క మూడు విధముల గొప్ప మర్మము బయలు పరచబడి యున్నది. దేవుడు క్రీస్తునందు ప్రత్యక్షమాయెను. నశించిపోయిన హవ్వను విమోచించి అసలు స్థితికి తీసికొనివచ్చుటకు క్రీస్తు తన సంఘములో ప్రత్యక్షమాయెను. ఓ! ఆ దినమున గొప్ప సంగతి జరుగును! దానిని మనము నమ్ముచున్నాము. దానిని మీరు నమ్మరా?
ఆ పాటను నేను ప్రతిసారి గుర్తుచేసికొందును.
AMOS 3:7
296ఆయన తన్ను దానియేలు, మోషే మరియు యిర్మియాలలో బయలుపరచుకొనెను. వారెవరు? ప్రవక్తలు. గొప్పవారు ప్రవక్త యొద్దకు దేవుని వాక్కు వచ్చును, చూచారా. యోసేపు కల కనుటకు గూర్చిన గాధ మీరు విన్నారు (చూడండి?) దానియేలు సింహపు బోనులో యుండెను. వారెవరో మీరెరుగుదురా? — ప్రవక్తలు, చూచారా.
కాని దేవుడు తాత్కాలికంగా వారిలో మాదిరిని కనుబరచుకొనెను. ఆయన తన్ను ఆదాములో మాదిరిగా కనుబరచుకొనెను. ఆదాముకు సరి అయినది ఏమిటో తెలియును. తన భార్య తప్పు చేయుచున్నది గనుక ఆమెను విడిపించుటకు ఆయన నడిచి వచ్చెను. క్రీస్తు పాపము చేయలేదు, కాని ఆయన తన మీద పాపమును వేసికొనెను. ఆ రీతిగా తన నశించిన బిడ్డను విమోచించెను. చూచారా? ఆయనకు మాదిరి.
…………… మోషే పొదలలలో యుండెను.
భయము లేని దావీదు,
అతని వడిసెల గూర్చి విన్నారు.
యోసేపు కలగనుటకు గూర్చిన గాధ మీరు విన్నారు.
(ప్రవక్త)
దానియేలు సింహముల మధ్య ఉండుట గూర్చి తరచూ పాడితిమి.
ఓ! ఇంకా అనేకులు బైబిలులో యున్నారు.
మరియు నేను ……………
(వారు బైబిలులోయున్నారు.)
మరియు నేను…………
ఆయనలో వారందరూ ప్రత్యక్షమయిరి, చూచారా. ఆయన లేకుండానే వారందరూ గతించిరి. చూచారా? నేను ఆయనలో భాగమై యుండవలెను. ఆమేన్! చూడండి?
వారిని కలిసికొనుటకు నేను ఎంతో ఎదురు చూచుచున్నాను.
(ఇది నిజము.)
కాని దేవుని యొక్క స్వంత కుమారుడే నాయకుడు.
మధ్యాకాశములో కూడిక యుండును.
1COR 12:13•
HEB 11:40
297హెబ్రీ 11లో ఇట్లున్నది. మనము లేకుండా వారు సంపూర్ణులు కాలేరు. మెదడు, జ్ఞానము, శిరస్సు లేకుండా చేతులు, కాళ్ళు, పరిపూర్ణము కాజాలవు, చూచారా. మనందరము ఆయనలో పరిపూర్ణులమై యున్నాము. కాబట్టి మనందరము ఒక్క ఆత్మ ద్వారా, ఒక్క శరీరములోనికి బాప్తిస్మము పొందియున్నాము. తీర్పు నుండి విడిపింపబడి యున్నాము. పాపము నుండి దాటియున్నాము. (మరణమును దాటితిమి) ఆమేన్! దేవుని యొక్క స్వంత కుమారుడే నడిపించును. మధ్యాకాశములో కలిసికొందుము. మీరాయనను ప్రేమించుచున్నారా?
నేనాయనను ప్రేమించుచున్నాను.
ఏలయనగా ఆయనే …….
ప్రభువైన యేసు, పరిశుద్దాత్మ యొక్క అభిషేకమును, ఈ చేతి రుమాళ్ళ మీదికి దిగనిమ్ము. ప్రభువా, రోగులను బాగు చేయుము…
ఆయనెట్లు ప్రత్యక్షమాయెను? ఏలయనగా ఆయనే మొదట నన్ను ప్రేమించెను. ఆయనేమి చేసెను?
కల్వరి మ్రాను మీద
నా రక్షణను కొనెను.
PS 34:7•
MATT 18:20
298ఆ గొప్ప నిబంధన దూత, అరణ్యములో మోషేతో కూడా ఉండినవాడు, దమస్కు మార్గములో పౌలును కలిసికొనినవాడు. మనము ఈ పటము తీయునట్లు అనుమతించెను; ఆయనే ఒక రోజున లైఫ్ పత్రికలో యున్నాడు. వాక్యము మారలేదు, దేవుడు మారలేదు, ఆయన విధానములు మారలేదు, ఆయన త్రోవ మారలేదు, ఆయన వాగ్దానము మారలేదు. ఎక్కడ నా నామమున ఇద్దరు - ముగ్గురు కూడి యుందురో వారి మధ్యను నేనుందును. కాబట్టి ఆయన ఇచ్చటున్నాడు. దేవునికి భయపడు వారి చుట్టూ ఆయన దేవదూతలు కావలి యుండును. ఆయన వాక్యమును హత్తుకొన్న వారి చుట్టూ మాత్రమే యుండును. దేవునికి భయపడకుండా ఎవరును ఆ వాక్యమును గౌరవించలేరు.
ఈ ఉదయమున ఆయన ఇచ్చటున్నాడు. ఆయనను ఆత్మతో మనము ఆరాధించుచున్నాము.
299ఓ! ఇది కఠినమగు వర్తమానము. ఇంకా ఎక్కువగా మనము ఆత్మతో ఆయనను ఆరాధింపవలసి యున్నామని తలంచుచున్నాను, చూచారా. మీ కండ్లు మూసికొని మరల ఆ పాట పాడండి. నేనాయనను ప్రేమించెదను. "నేనాయనను ప్రేమించెదను." మీరాయన వైపు చేతులు ఎత్తండి.
నేనాయనను ప్రేమించెదను,
ఏలయనగా ఆయనే మొదట నన్ను ప్రేమించెను.
కల్వరి మ్రాను మీద
నా రక్షణను కొనెను.
ఓ! ఆయనెంతో మనము ప్రేమించవలసి యున్నాము!
తండ్రి యందు విశ్వాసము, కుమారుని యందు విశ్వాసము,
పరిశుద్దాత్మ యందు విశ్వాసము,
ఈ ముగ్గురూ ఒక్కటే;
దయ్యములు వణకును, పాపులు మేల్కొనెదరు.
యెహోవా యందలి విశ్వాసము దేనినయినా కదిలించును!
300ఆమేన్! దేవునికి మహిమ! మనమాయనను ఎంతో ప్రేమించవలెను. ఇప్పుడు మీ హృదయములలో ఆయనను ఆరాధించుడి. ఆయనను గౌరవించండి. ఆయనెంత చక్కగా క్రియ చేసెనో ఆలోచించండి. ఆయన మనకొరకు చేసిన దానిని చూడండి. ఇన్ని సంవత్సరముల దర్శనములలో ఏ ఒక్కటి తప్పిపోలేదు. ఆయన చెప్పిన ప్రతిదియూ నెరవేరును. ఆయనేలాగు జరుగునని చెప్పెనో, ఖచ్చితంగా అలాగే జరుగును.
301మిమ్మును ప్రేమించుచున్నాను. చిన్న పిల్లలారా, దేవుని ఆజ్ఞలను మీరు మరచిపోవద్దు. ఒకరినొకరు ప్రేమించుకొనండి. పాపినయినా, పరిశుద్దునయినా గాని ప్రేమించండి. ఎవరినయినా ప్రేమించండి. మీరు ప్రేమించలేని యెడల దేవుడు సహాయము చేయునట్లు ప్రార్థించండి, ఎందుకనగా దేవుడు పాపులను ప్రేమించెను.
ఒకడు తప్పిదము చేసినా గాని ప్రేమించండి. వారి పాపములలో పాలిభాగస్థులు కాకుండుడి, చూచారా. అతని పాపములో పాలివాడవు కావద్దు. ద్వేషముతో కాక మాధుర్యముతో గద్దించండి. యేసుక్రీస్తు ద్వారా కలుగు జీవము గూర్చి, నిరీక్షణ గూర్చి తియ్యగా అతనికి గుర్తుచేయుడి పరిశుద్దాత్మ ద్వారా ఆయన మీకు ప్రత్యక్షమాయెను.
యేసు నామమును నీతో కొనిపొమ్ము.
దుఃఖము, బాధతో నిండిన బిడ్డా!
అది నీకు ఆదరణ, ఆనందము ఇచ్చును.
ఓ! దానిని తీసికొనుము… (ఇపుడు మరచి పోవద్దు,
వెళ్ళు ప్రతి చోటకు కొనిపొండి.)
ఓ! ప్రశస్త నామము…(మనకు ఆయన పేరున్నది.
ఆయన పేరు మనకు పెట్టబడినది.)
భూలోక నిరీక్షణ, పరలోక ఆనందము.
ప్రశస్త నామము, ఓ! ఎంత మాధుర్యము!
భూలోక నిరీక్షణ, పరలోక ఆనందము.
302మరల మిమ్మును కలిసికొను వరకు నేను మీకు ఒక చిన్న రహస్యమును ఇచ్చెదను. మనము నిలబడి యుండగా దీనిని జ్ఞాపకము చేసికొందము. గుర్తుంచుకొనండి:
యేసు నామమున వంగుచు,
ఆయన పాదముల యొద్ద సాష్టాంగ పడుచు.
రాజాధిరాజుగా పరమందు ఆయనకు మనము కిరీటమిచ్చెదము
(మనమే కిరీటము ధరింప చేయుదుము.)
మన యాత్ర పూర్తి అయినప్పుడు.
ప్రశస్త నామము. ఓ! ఎంత మాధుర్యము!
నీరిక్షణ యొక్క………
మూడు విధముల ప్రత్యక్షత ఏమిటి? — పరలోక నిరీక్షణ మరియు ఆనందము ఆయనలో ప్రత్యక్షపరచబడెను.
ప్రశస్త నామము. ఓ! ఎంత మాధుర్యము!
భూలోక నిరీక్షణ, పరలోక ఆనందము.
JOHN 1:1
303ఏమిటి? భూలోక నిరీక్షణ మరియు పరలోక ఆనందము. సమస్తము క్రీస్తులో ప్రత్యక్షమాయెను. క్రీస్తులోనే దేవుడు. సంఘము మరియు సమస్తము ప్రత్యక్షమాయెను. క్రీస్తే బైబిలు అయి యున్నాడు. వ్రాయబడిన వాక్యమే బైబిలు. ఆయనే వాక్యము. శరీరము లోనికి జీవము ఈ వాక్య ప్రత్యక్షత వల్లనే వచ్చుచున్నది. ఓ! ఇది ఆశ్చర్యముగా లేదా?
యేసు నామమును తీసికొనుము…
(జాగ్రత్తగా వినండి.)
ప్రతి ఉరి నుండి తప్పించు కేడెము అదే. (దానిని మీరు మరువకుడి.)
నిన్ను శోధనలు చుట్టు ముట్టినప్పుడు.
(ఏమి చేయాలి?)
ఆ పరిశుద్ద నామమును ప్రార్థనలో ఊదుము.
ప్రశస్త నామము, ఓ! ఎంత మాధుర్యము!
భూలోక నిరీక్షణ, పరలోక ఆనందము;
ప్రశస్త నామము, ఓ! ఎంత మాధుర్యము!
భూలోక నిరీక్షణ, పరలోక ఆనందము.
304దీనిని ఎరుగక పోవచ్చును. (మీరు ఆత్మ సంబంధులయితే ఆత్మీయ సంగతులను గమనించగలరు) దీనిని దేవుడెరుగును, కాని మీరు గడియారము చూడండి, రెండు గంటలు — రెండవ ఈడ్పు అయిపోయినది; మూడవ ఈడ్పు సమీపించినది.
యేసు నామము యెదుట వంగవలెను.
ఆయన పాదముల యొద్ద సాష్టాంగ పడవలెను.
పరమందు రాజాధిరాజుగా ఆయనకు కిరీటము ధరింప చేతుము.
మన యాత్ర పూర్తి అయిన పిదప.
ప్రశస్త నామము…. (రెండవ ఈడ్పు తెలియచేయబడినది.)
భూలోక నిరీక్షణ, పరలోక ఆనందము
ప్రశస్త నామము, ఓ! ఎంత మాధుర్యము!
భూలోక నిరీక్షణ, పరలోక ఆనందము.
305ఆత్మ ఆ గీతమును తీసికొని ఉచ్చ స్థాయిలో అలపించుట మీరు గమనించారా? తరువాత ఈడ్పు దగ్గరవుచున్నది. ఆమేన్!
యేసు నామమును నీతో కొనిపొమ్ము.
(నీవనుకొన్న దాని కంటె ముందే కావచ్చు!)
…దుఃఖము, బాధతో నున్న బిడ్డా.
అది నీకు ఆదరణ, ఆనందము ఇచ్చును.
నీవు వెళ్ళు ప్రతి చోటకు దానిని తీసికొని పొమ్ము.
ప్రశస్త నామము, ఓ! ఎంత మాధుర్యము!
భూలోక నిరీక్షణ, పరలోక ఆనందము.
ప్రశస్త నామము, ఓ! ఎంత మాధుర్యము!
భూలోక నిరీక్షణ, పరలోక ఆనందము.
(ఇప్పుడు శోధనలు వచ్చినచో ఏమి చేయుదువు?)
యేసు నామమును నీతో కొనిపొమ్ము.
ప్రతి ఉరి నుండి నిన్ను తప్పించును. కేడెముగా నుండును.
నిన్ను శోధనలు చుట్టు ముట్టినప్పుడు.
(అపనమ్మకము చెందవద్దు) (కేవలము గుర్తుంచుకో.)
ప్రార్థనలో ఆ పరిశుద్ద నామము ఊదుము.
ప్రశస్త నామము, ఓ! ఎంత మాధుర్యము!
భూలోక నిరీక్షణ, పరలోక ఆనందము.
ప్రశస్త నామము, ఓ! ఎంత మాధుర్యము!
భూలోక నిరీక్షణ, పరలోక ఆనందము.
306మనము ఇప్పుడు తలలు వంచుదము. అందరూ మర్యాదగా ఉండండి.
యేసు నామమున వంగవలెను…
[అన్య భాషలో వర్తమానము రాగా ఎవరో దానికి అర్థము చెప్పిరి.]
ఇప్పుడు మీరు గ్రహించండి. ప్రభువు యొక్క ఆత్మ ఇప్పుడు అన్యభాషలో ఈ కూటములోనికి దిగినది. తెలియకుండానే ఒకతను దానిని పలికెను, దేవుని వాక్కు తెలియకుండానే మరొక వ్యక్తి దాని భావమును చెప్పెను. అది ప్రభువు యొక్క వాక్యము. మీకు గుర్తున్నదా? శత్రువు వచ్చుచుండగా ఏమి చేయవలెనో వారికి తెలియదు. వారేమి చేయుదురు? ప్రభువు యొక్క ఆత్మ ఒకని మీదికి దిగి వచ్చి చేయవలసిన దానిని బయలుపరచెను. ఓ మై!
ఇప్పుడు దీనముగా మన తలలు వంచుదము.
దేవుడు మిమ్ము దీవించును.
తిరిగి మనము కలిసికొను వరకు, తిరిగి కలిసికొనువరకూ,
యేసు పాదముల యొద్ద తిరిగి మనము కలిసికొను వరకూ;
తిరిగి మనము కలిసికొను వరకు, తిరిగి కలిసికొనువరకూ,
తిరిగి కలిసికొను వరకూ, దేవుడు మీకు తోడైయుండు గాక!