పెట్టుబడులు
1ఇప్పుడు నిలబడియున్న ఈ సమయములో ఆయనతో మాట్లాడుటకు, మనము ఒక్క క్షణం మన తలలను వంచుదాము. మా ప్రియ పరలోకపు తండ్రీ, ఇక్కడ ఈ చికాగో పట్టణమందు మరలా మేము నిలబడి ఈ సువార్తను ప్రకటించుటకును, ఈ పట్టణమునందున్న మంచి సహృదయముగల ఈ క్రైస్తవ జనాంగము, తమ ప్రజలు రక్షింపబడునట్లుగా చూచుటకై, యధార్ధముగా మేము మీకు ఎంతో కృతజ్ఞతలను చెల్లించుచున్నాము. మరియు తండ్రీ, యేసు చెప్పియున్నట్లుగా, మొదటిగా నీవు ఆకర్షించితేగాని నీ యొద్దకు ఎవడును రాలేడని, మేము ఎరిగియున్నాము.
ఇప్పుడు ముందుగా, నిర్ణయింపబడియున్న విత్తనములు ఈ పట్టణమునందున్నవి, ఈ సువార్త యొక్క వెలుగును పొందుకోకుండా వారిని ఏదియు మరుగుపరచజాలదని మేము నమ్ముచున్నాము. ప్రభువా, మీరు దానిని అనుగ్రహించండి. మీరు దానిని కనిపెట్టుచూ ఉండినయెడల, నిశ్చయముగా అది దాని గమ్యమును చేరగలదు. వర్తమానమును మీరు మాట్లాడిన, ఎవరినైతే మీరు ముందుగా నిర్ణయించితివో వారు ఈ సువార్త యొక్క వెలుగును చూచునట్లుగా నీవు చేయగలవని నేను విశ్వసించుచున్నాను.
తండ్రీ, పాపపు అలలో చిక్కుకొని మునిగిపోవుచున్న ప్రతీ అవిశ్వాసపు హస్తమును మాకు తెలిసినంతవరకు మా శాయశక్తులన్నింటినీ ప్రయోగించి, ఈ గొప్ప సాయంకాల సువార్త యొక్క వెలుగుతో మేము మా వెలుగును ప్రకాశింపజేయుచూ వారిని లేవనెత్తి మీ యొద్దకు తీసుకొని వచ్చునట్లుగా చేయుము. ఓ, మా యెదుట ఎన్నో భయంకరమైన పరిస్థితులను మేము ఎదుర్కొనుచున్నాము. అయితే మేము నిశ్చయతను కలిగి… "వరదవలె శత్రువు మీదికి వచ్చినప్పుడు, దేవుని యొక్క వాక్యము వాటన్నిటికి పైగా ఒక ధ్వజమును లేపును," అని తండ్రి నీవు వాగ్దానము చేసితివి. కాబట్టి మేము నీకు వందనస్తులమై యున్నాము.
మరియు ఇప్పుడు, ఈ దినమున మేము స్థిరపర్చబడునట్లుగా సహాయము చేయుము. ఈ ఉదయ కాలము యొక్క సునాధమును బట్టి, ఈ అద్భుతమైన పాటలు కొరకు మరియు సాక్ష్యముల కొరకు మరి అట్టిది ఏదైన గాని, అందుకొరకు నేను నీకు కృతజ్ఞతలను చెల్లించుచున్నాను. ప్రభువా, ఇప్పుడు మేము నీ వాక్యము వైపు చూచుచుండగా, ఈ దినము కొరకు మేము బలమును పొందుకొనునట్లుగా ఆకర్షించుము. యేసు నామమున దీనిని మేము అడుగుచున్నాము. ఆమేన్.
2మీరు కూర్చొనవచ్చును.
నేను మీ దగ్గరకు వచ్చునట్లుగా, మీతో వుండునట్లుగా మీరిచ్చిన మంచి ఆహ్వానము కొరకు మీకు నా కృతజ్ఞతలు. పాటను పాడి వినిపించిన ఆ చిన్న అమ్మాయికి వందనములు చెప్పగోరుచున్నాము, అది ఎంతో అద్భుతముగా వుండెను. ఇదివరుకు ఆ పాటను నేను వినలేదు గాని, ఆమె పాడిన ఆ పాటను వినుట నాకిదే మొదటిసారి అని నేను నమ్ముచున్నాను. బహుశా, మెల్ జాన్సన్ అక్కడకు వచ్చినప్పుడు, ఆ పాటను పాడమని అడిగితిని, "నన్ను జ్ఞాపకం చేసుకొన్నప్పుడు," అనే పాట. మా గృహముయందు ఆ పాట గలదు. ఇంకొకటి క్రొత్తది కావాలని నేను ఆశించుచున్నాను. బిల్లీ పౌల్ ఈ పాటల మీద మంచి ఆసక్తిని కలిగియున్నాడని నేను అనుకోనుచున్నాను. ప్రజలు తమ కార్యాలయములోవున్న సమయములో మరియు ఈ లోకములో జనులు అటు ఇటు తిరుగులాడుచుండగా, బిల్లీ పౌల్ ఈ పాటలను నిదానముగా వారికి వినిపించును. మీరు మీ కార్యాలయములలో ఉన్నప్పుడు మెల్ జాన్సన్ యొక్క పాటలను తరచుగా టేపుల ద్వారా వినగలరు.
మరియు నేను అలసటగా నున్నప్పుడు, ఆ అలసటను పోగొట్టుకొనుటకు ఏదైన ఒక గదిలోకి వెళ్ళి కూర్చొని ఆ స్పీకర్లను తెచ్చుకొని మరల ఆ పాటలను నేను వినుచుందును.
3కాబట్టి ఈ అద్భుతమగు గాయకులను మనము కలిగియుండుట చాలా గొప్ప విషయము.
మనము ఆ యోర్దాను నది అవతలి గట్టును దాటే సమయమును గూర్చి నేను తలంచుచుంటిని. నది అవతలి గట్టును దాటి వెళ్ళిపోయిన మెల్ జాన్సన్, ఐనర్ ఎక్బర్గ్, మరియు అలాంటి అనేక గొప్ప గాయకులు కలిసి తమ చక్కటి స్వర్ణము వంటి స్వరముతో పాడిన ఆ పాటలను అచ్చట ఆలకించవలెనని నేను ఆశించుచున్నాను. కావున మనము ఆ సమయము కొరకై ఎదురు చూచుచున్నాము.
ఈ సమయంలో ఇక్కడ మన మధ్య వున్న నా మంచి స్నేహితుడగు డాక్టర్ లీ-వైల్ గారికి నా వందనములు తెలియజేయుచున్నాను, అతడు మాజీ బాప్టిస్టు సేవకుడు — ఒక మంచి మేథావి, ఒక అద్భుతమైన వ్యక్తియైయున్నాడు — అతడే ఈ వారమున నా యొద్దకు వచ్చి, తనదైన శైలిలో ఈ పరిచర్యను ఈ విధముగా చేయుటకై, ఈ కూటము ఇచ్చట జరుగునట్లుగా అతడు నాకు గొప్ప సహాయము చేసెను.
4రోగుల కొరకు ప్రార్ధించుట, దానినే మనము "స్వస్థతారాధన" అని చెప్పుచున్నాము. అనేకసార్లు జనులయెదుట మనము ఇటువంటి ఆరాధనలను జరిపితిమి. బహుశా, మనము వారిని స్వస్థపరచలేము గాని, కేవలము జనుల కొరకు ప్రార్ధన మాత్రము చేయగలమని మనము గ్రహించితిమి.
కొద్ది దినముల క్రితము, "సోదరుడా బ్రెన్హాం, నీవు ఫలానా-ఫలానా వారిని స్వస్థపరచితివా?" అని ఎవరో అడిగిరి.
నేను చెప్పాను, "నా జీవితములో నేనెవ్వరినీ స్వస్థపరచ లేదు. కాని నా ప్రార్థనలకు నేరుగా జవాబును పొందుకొనుచున్నాను, ఎందుకనగా యేసు దానిని వాగ్దానము చేసెను, మరియు దానిని నేను నమ్ముచున్నాను."
EXOD 13:21•
JOHN 16:28•
ACTS 9:6
5ఆ రోజు రాత్రి గొప్ప పరిశుద్ధాత్మ అగ్నిస్తంభము రూపమున ఫోటోలో పడుట నాకు జ్ఞాపకము గలదు. దానిని గూర్చి నిర్గమ 13:22 లేదా 21లో ఉన్నదని నేను నమ్ముచున్నాను. "వారిని నడిపించుటకై పగటివేళ మేఘ స్తంభములోను, వారికి వెలుగిచ్చుటకు రాత్రివేళ అగ్నిస్తంభములోను ఉండి వారికి ముందుగా నడుచుచు వచ్చెను." మరియు ఆ అగ్నిస్తంభము మోషేతో ఉండి అతనికి ముందు నడిచినట్లుగానే, అది వారికి ముందుగా నడుచుచు వెళ్ళెను.
మరియు దేవుని కుమారునిగా, ఒక మానవునిగా శరీరమందు ప్రత్యక్షమైన ఆయనే యేసుగా పిలువబడెను. "నేను దేవునియొద్ద నుండి దిగివచ్చియున్నాను, మరల తిరిగి దేవుని యొద్దకే తిరిగి వెళ్ళుచున్నాను," అని ఆయన చెప్పెను. ఆయన తిరిగి వెళ్ళిపోయిన తర్వాత, ఆరోహణమై వెళ్ళిపోయిన తర్వాత…
సౌలుగా ఉన్న పరి. పౌలు మార్పుచెందక మునుపు, ఆ వెలుగు అతనిని తాకి క్రింద పడగొట్టిన ఆ అనుభవము పౌలునకు ఎంతో గంభీరమైన విషయముగా నుండెను. ఇప్పుడు గమనించండి, అతడు ఒక యూదునిగా వుంటూ, "ప్రభువా" అనే భావమునిచ్చు పదముతో ఎవరినీ అతడు ఆలాగున పిలువజాలడు గదా! "ప్రభువా! ప్రభువా! నన్నేమి చేయగోరుచున్నావని?" అతడు అడిగెను, చూశారా. అదే అగ్నిస్తంభము ద్వారా తన ప్రజలగు ఇశ్రాయేలీయులు నడిపించబడి యున్నారని లేదా ఆ అగ్నిస్తంభమే తన జనులను వెంబడించెనని పౌలు ఎరిగియున్నాడు. అందునుబట్టియే "ప్రభువా, నీవెవరవు? నన్నేమి చేయగోరుచున్నావు?" అని అతడు ఆ విధముగా బిగ్గరగా కేకలు వేయుచూ అడిగెను.
"నేను యేసు," అని ఆయన చెప్పెను.
ACTS 9:5
6మరలా ఈ చివరి దినములయందు మనము చూచునట్లుగా అది మన యొద్దకు తిరిగి వచ్చియున్నది.
హూస్టన్, టెక్సాస్ లో ఆ రాత్రి మొట్టమొదటిసారిగా అధికారపూర్వకముగా ఫోటో తీయబడినప్పుడు… డాక్టర్ బోస్వర్త్ తో ఒక సహోదరుడు, బాప్టిస్టు సేవకుడు దైవిక స్వస్థతను గూర్చి చర్చించుచుండగా, బహుశా మీలో అనేకమంది అక్కడ వుండి యుండవచ్చును. నేనొక దైవిక స్వస్థపరచువాడని డాక్టర్ బెస్ట్ చెప్పెను.
"ఒకవేళ రోగులను స్వస్థపరచువాడు యేసుయని నమ్ముచూ, నేను రక్షణ సువార్తను ప్రకటించుచున్నట్లయితే - ఎందుకనగా వాక్యము ఆ రీతిగానే చెప్పియున్నది, అది నన్ను దైవిక స్వస్థపరచువానిగా చేసినయెడల, రక్షణయందు నమ్మికయుంచువానికి అది దైవిక రక్షణను ఇచ్చువానిగా చేస్తుంది, ఎందుకనగా అది మారని అదే వాక్యమైయున్నది," అని నేను అన్నాను. మీరు చూడండి."
ఆయన యోహోవా యీరే మరియు యోహోవా రాఫా.
7దేవుని యొక్క సమస్త విమోచనా నామములన్నియు యేసుక్రీస్తునందు సూచింపబడియున్నవి. వీటన్నిటి ద్వారా "దేవుడు" ఏమైయున్నాడో చూడగలుగుచున్నాము. గొప్ప గుణాలక్షణములతో ఆయన పరలోకమందు దేవునిగా ఉండుటకు ముందే, అచ్చట ఏమియు లేకముందే… ఆయన ఆరాధనకు కర్తయైయుండెను. ఆయన ఆ విధముగా ఆరాధనకు పాత్రుడుగా కాకమునుపు సహితము ఆయన దేవునిగానే యున్నాడు. ఆయన నిత్యుడైయున్నాడు. ఈ గుణాలక్షణములన్నియు ఆయనయందు ఇమిడియున్నవి. ఆయనయందున్న ఈ గుణాలక్షణములన్నియు ప్రదర్శించబడుచున్నప్పుడు ఆయన తండ్రిగాను, కుమారునిగాను, రక్షకునిగాను, మరియు స్వస్థపరచువానిగాను ఉన్నాడు. అవి ఆయన యొక్క గుణాలక్షణములై యుండి వాటంతటవి ఆయనయందు ప్రత్యక్షపర్చబడుచున్నవి.
కావున ఆహ్లాదకరమగు ఈ మంచి సహవాసమును కలిగియుండు అవకాశమునుబట్టి మరియు రక్షణ కర్తయగు దేవుని యొక్క గుణాలక్షణముల ద్వారా రక్షణ యొక్క నిశ్చయతను మనము కలిగియున్నందుకు మనము ఎంతో కృతజ్ఞతులమైయున్నాము మరియు ఆయన నామము స్తుతింపబడను గాక.
8ఇప్పుడు, ఈ సంగతులను వివరించగల సమర్థుడగు సహోదరుడు వైల్ కు నేను కృతజ్ఞతలను తెలుపుచున్నాను. అందరికీ తెలిసినట్లుగా నేను వేదాంతిని కాను. నేను కనీసపు విద్యార్హత కూడా లేనివాడను. ఈ చిన్న సహోదరుడు మూడీ బైబిల్ ఇనిస్టిట్యూట్ నుండి వచ్చియున్నాడని నేను వినియున్నాను, "ఆ బాలునివలె చక్కటి విద్యాభ్యాసమును నాకు కూడా ఉండిన బాగుండుని" నేను తలంచితిని. దీనినిగూర్చి దేవుడు అతనికి దర్శనమును ఇచ్చి, అతడిని తన కొరకు ఉపయోగించుకొనునని నేను ఆ దేవునియందు నమ్మకమును కలిగివున్నాను. మార్గమున కొనసాగిపోవుచూ, నేను వృద్దుడనగుచుండగా — ఈ యవ్వనస్తులు ముందుకు వచ్చి ఈ సువార్తను కొనిపోవుచూ ఇప్పుడు ఉండుదానికన్నా ఇంకా శక్తివంతమైన మార్గములో వాడబడవలెను.
తరమువెంబడి తరము గతించుపోవుచుండగా, శత్రువు లోపలికి ప్రవేశించును. అంత్యదినమున క్రీస్తును మనము సంధించువరకు దేవుడు మన ప్రమాణమును అధికముగా, అధికముగా, ఇంకా అత్య అధికముగా, హెచ్చించుచూ, కాపాడును గాక. ఏదేమైనా సరే, దీనికొరకు దూరదృష్టితో చూస్తూ మనము ముందుకు సాగిపోయెదము.
9ఇప్పుడు జ్ఞాపకముంచుకొనండి, ఈ వారమంతటిలో జరుగబోవుచున్న కూటముల కొరకు మరియు ఆఖరి కూటము వరకూ ప్రతి ఒక్కరిని మరియు సంఘ శాఖ సంస్థలన్నింటిని కూడా రమ్మని ఆహ్వానించుచున్నాము. ఈసారి ఆ అవకాశమును కలిగియున్నామని నేను చెప్పగలను. నేను ఆ ప్రజలకు వ్యతిరేకినైయున్నానని మీ మనస్సులో ఎన్నడూ తలంచవద్దు. ఆ జనులను నేను ప్రేమించుచున్నాను. అయితే సంఘ శాఖల యొక్క విధానములే వారితో సహవాసము చేయనీయకుండా అభ్యంతరపరచుచున్నవి. ఆ కారణము చేతనే…
నేను ఇప్పుడు దక్షిణ ఆఫ్రికాకు వెళ్లనైయున్నాను, గత పర్యాయము నేనచ్చటకి వెళ్ళినప్పటికీ, మరలా నేను ఆహ్వానింపబడితిని, ఎందుకనగా ఫుల్-గాస్పల్-బిజినెస్-మెన్ వారికి ప్రసంగించుట కొరకు కొన్ని అంశములను కలిగియున్నాను. నేను ఏ సంఘ శాఖకు సంబంధించినవాడిని కాను. ఫుల్-గాస్పల్-బిజినెస్-మెన్ అనేది ఇప్పటివరకు అది ఒక సంస్థ కాదు గాని, ఎప్పుడైతే అది ఒక సంఘ సంస్థగా మారునో, అప్పుడు నేను దానిని విడిచిపెట్టుదును, ఎందుకనగా అది ఒక సంస్థ. ఒక క్రమమగు నిర్మాణము సరియైనదే గాని, ఒక సంఘ సంస్థగా మారిపోవుట సరి కాదు.
అందుచేతనే మనము…
10ఆఫ్రికా యొక్క తెగలవారి మధ్య, తూర్పు ప్రాంతాల యందు ఆంగ్ల-భాషను మాట్లాడు ప్రజలు గలరు. వారు అసెంబ్లీ-ఆఫ్-గాడ్-పెంతకోస్తు వారైయున్నారు; పశ్చిమ ప్రాంతమునందున్న ఆఫ్రికన్లు బయోర్ జాతికి చెందిన వారు, వారు డచ్ దేశమున నివసించెదరు. ఏ. ఏఫ్. ఆఫ్ ఎమ్., ఆఫ్రికన్-అపోస్థలిక్-మిషన్స్-ఆఫ్-ఆఫ్రికా సంస్థకు చెందినవారిగా వారిని చెప్పుకొనెదరు. అక్కడ రెండుగా విభజింపబడియున్న రెండు తెగలు గలవు.
వారు మూడుసార్లు బాప్తిస్మమును ఇచ్చెదరు. వారిలో ఒక తెగకు చెందినవారు ముందు ప్రక్కకు ముంచుతూ, తండ్రి కొరకు ఒకసారి, కుమారుని కొరకు ఒకసారి, పరిశుద్ధాత్మ కొరకు ఒకసారి; ఒక్క దేవునికి బదులుగా ఆయనను ముగ్గురు దేవుళ్లుగా చేయుచున్నారు. ఇంకొక తెగకు చెందినవారు వెనుక ప్రక్క నుండి మూడుసార్లు ముంచెదరు. అనగా తండ్రి కొరకు ఒకసారి, కుమారుని కొరకు ఒకసారి పరిశుద్ధాత్మ కొరకు ఒకసారి, మూడుసార్లు మూడు విధములుగా బాప్తిస్మమును ఇచ్చెదరు, తండ్రి కొరకు ఒకసారి, కుమారుని కొరకు ఒకసారి, పరిశుద్ధాత్మ కొరకు ఒకసారి.
వారిలో ఒకరీలాగున చెప్పుచున్నారు, "మేము ఆయన మరణములోనికి బాప్తిస్మము ఇచ్చుచున్నాము, ఆయన చనిపోయినప్పుడు ముందుకు వ్రాలెను." ఇంకొకరు ఈలాగున చెప్పుచున్నారు, "ఎవరైతే పాతిపెట్టబడుచున్నారో, వారిని వెనుకకు పాతిపెట్టియున్నావు." కావున వారు ఆ విధముగానే యున్నారు.
"బ్రెన్హాం సహోదరుడా, ఆఫ్రికా మిమ్మల్ని పిలుచుచున్నది. ఒకసారి రండి. దయచేసి ఈ సిద్ధాంతములను గూర్చి బోధించగలరా?" అని వారిలో ప్రతి ఒక్కరూ నాకు ఉత్తరములను వ్రాసి మరియు ఇచ్చట సంతకము చేసెదరు.
మంచిది, అలాంటి వారియొద్దకు నేను వెళ్ళజాలను. గమనించారా, నేనెన్నడూ వెళ్ళ….
11నేను ఒక బాప్టిస్టు మిషనరీగా నియమించబడితిని. నా యొక్క బాప్టిస్టు సహోదరులంటే గొప్ప మర్యాదను నేను కలిగియున్నాను, మరియు నేను వారిని ప్రేమించుచున్నాను. కాని అనుగ్రహింపబడియున్న ఆ వరముల యొక్క ఆజ్ఞ ప్రకారముగా నేను బాప్టిస్టు సంఘ శాఖ కొరకో లేక ప్రెస్బెటేరియన్ సంఘ శాఖ కొరకో పంపబడలేదు, కాని సంఘము కొరకు మాత్రమే నేను పంపబడితిని. నేను వారి మధ్య ఒక స్వతంత్రుడిగా నిలువబడవలసియున్నది. కాని వారికొరకు వ్యక్తిగతముగా పరిచర్యను చేయలేను, అయితే వారితో ఒక సహోదరునిగా కలిసి యుండవలసియున్నది. యాకోబు త్రవ్వించిన ఆ మూడవ బావివలె, అందరి కొరకు అచ్చట స్థలముగలదని నేను నమ్ముచున్నాను. మరియు దానినే నేను విశ్వసించుచున్నాను. ప్రతిఒక్కరి కోసము, ఎవరైతే దీన్ని త్రాగ వాంఛించుచున్నారో వారందరి కోసము ఆ జీవ ఊట యొద్ద స్థలము కలదు.
12ఇప్పుడు ఒకవేళ నేను అలాంటి బావిని కలిగియుంటే, నేను వారిని "విరోధులని" చెప్పుటకు ఆశించను, గాని ఈ వర్తమానమును అంగీకరించని ప్రజలు కూడా నాకు గలరు. అసలు వారిని గూర్చి తప్పుగా భావించను. ఎందుకనగా, యేసు సహితం భూమిమీద ఉన్నప్పుడు అనేకులు ఆయనను వ్యతిరేకించిరి. ఆలాగుననే ప్రతిఒక్కరు అదే పరిస్థితిని ఎదుర్కొనిరి. అలాగుననే ప్రతీ కాలమందు దేవుని వర్తమానమును అంగీకరించనివారు ఈ లోకములో గలరు. అందునుబట్టి ఆ వ్యక్తి పట్ల లేదా ఆ జనుల పట్ల లేదా ఆ సంఘ శాఖ పట్ల ఆవగింజంత కూడా వ్యతిరేకమును కలుగజేయదు. అది ఇంకనూ అలాగే యున్నది. దానికొరకు నేనెంతో కృతజ్ఞుడనై యున్నాను. మరణము నుండి జీవములోనికి దాటియున్నాననే ఒక రుజువును కలిగియున్నానని నేను ఎరిగియున్నాను. సహోదరులు ఏమి చేసినప్పటికినీ లెక్క లేదు, అయిననూ వారిని ఇంకనూ నేను ప్రేమించెదను, మీరు గమనించితిరా. నా హృదయ అంతరంగములో నుండి నేను వారిని ప్రేమించెదను, ఎందుకనగా అది ప్రేమ. దేవుడు నా సహోదరుల కొరకు నా హృదయములో ఆ ప్రేమను పెట్టియున్నాడు. ప్రభువు దీవించును గాక!
13దేవుని వాక్యమును మనము చదువుటకు ముందుగా, ఇక్కడ కూర్చొనియున్న ఒక యువ సేవకుడగు నా స్నేహితుని గూర్చి… అతడు ఒక క్లిష్టమగు సమస్యలో ఉన్నాడు, అతడు మరియు అతని భార్యతో కలిసి ఎల్లప్పుడూ నా గృహమునకు వచ్చుచుందురు, మరియు అతని మనస్సులో ఏదో ఒకటి వుంటూ మాట్లాడేవాడు కాదు. "సహోదరుడా, బ్రెన్హాం, ప్రభువు నన్ను తన సేవకు పిలచెనా? దానిని గూర్చి నీవేమి తలంచుచున్నావు," అని నన్ను ప్రశ్నించి అడిగెను.
ఒక మంచి బైబిలు తర్పీదు కేంద్రము నుండి వచ్చిన ఈ యవ్వనస్తునిలో దేవుని సేవ చేయుటకుగల సామర్థ్యమును నేను గమనించితిని గాని, అతడికి ఒకటి కొదువగా యుండెను. ఆ మోషేవలె అన్ని రకముల తర్పీదును పొందినవాడైననూ… మోషేలో గల లోపమేమిటి, మండుచున్న పొద అనుభవము. సహోదరుడగు రుడ్డెల్ కూడా అదే లోపముగల వాడే. ఒక దినమున మండుచున్న పొదవలెనే అగ్నిచేత పట్టబడినాడు. మరియు సహోదరునికి పట్టణమునకు వెలుపల సంఘము గలదు. అది జెఫరసన్-విల్లోనే ఉన్నదని నేను అనుకుంటున్నాను. ప్రభువు కొరకు ఒక నిజమగు పరిచర్య జరుగుచున్నది. మన గుడారమునకు సంబంధించిన సహ సంఘములలో అది కూడా ఒకటై యున్నది. ఇక్కడ ఎక్కడో ఆ వెనుక కూర్చొనియున్నట్లుగా సహోదరుడు డాన్ రుడ్డెల్ ని నేను చూచితిని, ఆయన ఆశించురీతిలో నన్ను ఉపయోగించుకొని ఈ ఉదయ కాలమున పరిశుద్ధాత్మ వాక్యమును మాట్లాడునట్లుగా సహోదరుడు డాన్ రుడ్డెల్ లేచి నిలబడి ప్రార్థించవలెనని నేను కోరుచున్నాను. "మనము మన తలలు వంచుచుండగా, సహోదరుడా డాన్ నీకిష్టమైతే, [సహోదరుడు డాన్ రుడ్డెల్ ప్రార్థించుచున్నాడు.] ఆమేన్.
MARK 10:17-22
14ఇప్పుడు మనము లేఖన భాగమును చదువుకొనెదము, నా మనస్సులోవున్న దానిని చెప్పాలనుకున్నాను గాని ఈ వ్యాపారస్తుల యొక్క స్వరమును గూర్చి వినిన పిదప ఈ ఉదయకాలమున నేను నా మనస్సులో ఉన్నదానిని మార్చుకొనియున్నాను. దీనిని గూర్చి నాయంతట నాకొక ఉద్దేశ్యము గలదని మీరెరుగుదురు. మరిప్పుడు మనము పరి. మార్కు సువార్త 10వ అధ్యాయము 17వ వచనము నుండి ఆరంభించెదము, ఆ విధముగానే ఇచ్చట ఈ క్రింద వ్రాసానని నేను నమ్ముచున్నాను.
ఆయన బయలుదేరి మార్గమున పోవుచుండగా, ఒకడు పరుగెత్తుకొనివచ్చి ఆయన యెదుట మోకాళ్ళూని - సద్బోధకుడా, నిత్యజీవమునకు వారసుడగుటకు నేనేమి చేయుదునని ఆయననడిగెను.
…యేసు - నన్ను సత్పురుషుడని ఏల చెప్పుచున్నావు? దేవుడొక్కడేగాని మరి ఎవడునూ సత్పురుషుడు కాడు.
నరహత్య చేయవద్దు, వ్యభిచరింపవద్దు, దొంగిలవద్దు, అబద్ద సాక్ష్యము పలుకవద్దు, మోసపరచవద్దు, నీ తల్లిదండ్రులను సన్మానింపుము అను ఆజ్ఞలు నీకు తెలియును గదా అని అతనితో చెప్పెను.
అందుకతడు బోధకుడా, బాల్యము నుండి ఇవన్నీయు అనుసరించుచునే యుంటినని చెప్పెను.
యేసు అతని చూచి, అతని ప్రేమించి నీకు ఒకటి కొదువుగానున్నది, నీవు వెళ్ళి నీకు కలిగినవన్నీయు అమ్మి బీదలకిమ్మ. పరలోకమునందు ధనము కలుగును: నీవు వచ్చి నన్ను వెంబడించుమని చెప్పెను.
అతడు మిగులు ఆస్తిగలవాడు, గనుక ఆ మాటకు ముఖము చిన్నబుచ్చుకొని, దుఃఖపడుచు వెళ్ళిపోయెను.
చదివిన తన వాక్యమునకు ప్రభువు తన దీవెనలను జత చేయును గాక.
15మన చుట్టూ కూడియున్న ఫుల్-గాస్పల్-బిజినెస్-మెన్ వారితో నేను చెప్పవలసిన ఒక చిన్న సంగతి గలదు. సేవకులమైన మనము ఎరిగినట్లుగా, వారిలో కొందరు నా దగ్గర, "నీవు ఒక ప్రసంగికుడవు కదా? నీ చుట్టూవున్న ఈ వ్యాపారస్థుల మధ్యలో ఉంటూ వీరితో నీవేమి చేయుచున్నావు?" అని అడిగిరి.
"నేను కూడా ఒక వ్యాపారస్థుడినే" అని నేను అన్నాను.
"నీవు ఏలాంటి వ్యాపారమును చేయుచున్నావు," అని వారు నన్ను అడిగిరి.
"నిత్యజీవము యొక్క నిశ్చయతను గూర్చి," నేను బోధించుచున్నాను, గాని భీమాను గూర్చి కాదు. గమనించారా? "నిశ్చయతను గూర్చి" అని నేను చెప్పాను. "ఆశీర్వాదకరమగు నిశ్చయత, యేసే నా స్వాస్థ్యము! ఓ, దైవిక మహిమకరమగు భవిష్యత్తుకు ఎలాంటి సూచన! దేవునిచేత క్రయ మూల్యముగా చెల్లించి ఇచ్చిన వారసత్వపు రక్షణ, ఆయన రక్తములో కడుగబడి, ఆయన ఆత్మ ద్వారా జన్మించితిని. ఆ విధమగు వ్యాపారస్తునిగా ఉండి వ్యాపారము చెయ్యాలని నేను ఆశించుచున్నాను. వ్యాపార సంబంధమగు కార్యములను గూర్చి మాట్లాడుటకు వారికి ఒక వ్వవహారిక భాష గలదు. కావున ఇచ్చట కూర్చొనివున్న వ్యాపారము చేయు పురుషులకు మరియు వ్యాపారము చేయుచున్న స్త్రీలకు కూడా నేను చెప్పుచున్నదేమనగా, నేను ఈ అంశమును తీసుకొనగోరుచు, దానిని ఈలాగు పిలుచుచున్నాను, "పెట్టుబడులు" (Investments).
16వ్యాపారము చేయువారెవరైనా గాని ఇంచుమించు మంచి లాభాన్ని చేకూర్చే వ్యాపారమందే పెట్టుబడిని పెట్టాలని ఆసక్తిని కలిగియుందురు. నీవొక వ్యాపారివైతే అధిక లాభాన్ని ఇచ్చే దానిపైనే నీ పెట్టుబడులను పెట్టుటకు ఆసక్తిని చూపెదవు. ఒక వ్యాపారస్థుడు మంచిదానియందే పెట్టుబడులను పెట్టుటకు ఎల్లప్పుడూ ఎదరు చూచును. మన పెట్టుబడిని ఒక మంచిదానియందు పెట్టుట మనకు యుక్తమైనదని మీకు తెలుసు. మన పెట్టుబడిని దేనిపై పెట్టాలనే దానిగూర్చి నేనెరిగిన శ్రేష్ఠమైన దానిని ఈ ఉదయ కాలమందు నేను మాట్లాడగోరుచున్నాను. దీనిని మీరు చాలా శ్రద్దగా ఆలకించవలెనని నేను కోరుచున్నాను. నా అంశము: "పెట్టుబడులు."
17ఇప్పుడు అదృష్టమును వరించవలెననే ఆశలతో వ్యాపారమును చేయాలని ఆశించే వ్యాపారస్తులైన వారందరికీ అది మంచి పద్దతి కాదు. అదృష్టమును వరించాలనే ఆశతోనే జూదమును ఆడే మార్గమును ఎన్నుకొనుచున్నారు, గాని జూదమనేది ఒక నేరపూరితమైనది. దీనిని పెట్టుబడిగా పెట్టి మనము జూదమాడుటకు ఆశించకూడదు, ఎందుకనగా అది ఎంత మాత్రము సరియైనది కాదు. ఇక్కడ ఉన్న వారిలో కొందరు రాత్రికి రాత్రే ధనవంతులుగా మారుటకు కోరుకొనుచున్నారని మీరెరుగుదురు. సరిగ్గా ఒక స్థిరములేని దానిని ఒక దళారి లేక మరేవరైనా గాని చాకచక్యమైన మాటలతో మిమ్మల్ని భ్రమపరచుచూ మీ యొద్దకు వచ్చి మీతో మాట్లాడిన, అచ్చటి నుండి నీవు వెళ్ళిపొమ్ము. అలా కాకుండా ఆ మాటలను నమ్మి నీవు ఆకర్షించబడినయెడల, ఆ తర్వాత జరిగేది ఏమిటో నీకు తెలుసా, నిన్ను నీవే ఆత్మహత్య చేసుకున్నట్లేయగును, అలా జరిగిన తరువాతే నీవు నీ కళ్ళును తెరుచుకొనెదవు. అయితే ఒక నిజాయితీపరుడైన వ్యక్తిగా, మనస్సాక్షిగల వ్యాపారస్థునిగా ఒక మనిషి ఉండినయెడల, మొదటగా నమ్మదగిన, మంచి స్థిరమైన, నాణ్యతగల ఒక ప్రాచీన వర్తక సంస్థను కనుగొనుటకు ప్రయత్నించును.
ఒక మంచి వ్యాపారస్థుడు ఎప్పుడూ తన ధనమును జేబునందు దాచుకొనడు నీవు ఆ విధముగా చేయకుండా… నీవు నీ ధనమును జేబులోనే ఉంచు కొనినట్లైతే, నీవు అభివృద్ధి చెందలేవు. కాని దాని ద్వారా ఇంకా ఎక్కువగా నీవు సంపాదించాలని ఆశించినట్లయితే దానిని పెట్టుబడుల రూపములో ఏదోక దానిపై పెట్టుబడిగా ఉపయోగించెదవు. ఆ తర్వాత అది ఏ విధముగా వర్దిల్లుచున్నదో నీవు చూడగలవు.
18ఇప్పుడు, ఈ విధమైన వ్యాపార సంబంధమగు షరతులను మనము కూడా కలిగియుంటే ఎట్లుండునని నేను తలంచితిని. నేను దేనిని గూర్చి చెప్పబోవుచున్నానో, దానిని మనము ఆ విధముగా ఆలోచించుట ఒక మంచి యుక్తమైన విషయమని నేను తలంచుచున్నాను.
మనమిప్పుడు కనుగొనినదేమనగా మీరు గనుక… అడ్డదారిలో "రాత్రికి రాత్రే ధనవంతులుగా" మారిపోవుటకు నేడు ఈ లోకమందు అనేక కార్యములు మనకు గలవు. వారు ఇచ్చట నుండి అచ్చటకు మరియు అచ్చట నుండి ఇచ్చటకు ఎగురుచూ మారిపోవుచూ వుందురు. మరియు నా స్నేహితుడొకడు తన జీవితములో సంపాదించి పొదుపుతో దాచి ఉంచుకొనిన డబ్బును, "ఇక్కడ నీ డబ్బును పెట్టుబడిగా పెట్టు, అది అలాగు అవుతాది, ఇది ఇలాగు అవుతాది," అని ఎవరో చెప్పిరి. అతడు తన ముందున్న రంగు రంగుల చిత్రమును చూస్తూ మురిసిపోతూ తన జీవిత కాలమంతా సంపాదించి పొదుపుతో దాచుకొనిన డబ్బంతటిని దానియందు పెట్టుబడిగా పెట్టెను, కాని కొద్ది దినములలోనే ఆకస్మాత్తుగా రాత్రికి రాత్రి తన డబ్బునంతటినీ అతడు కోల్పోయెను. వారు ఆ కంపెనీని మూసేసి అచ్చట నుండి కనుమరుగైపోయారు.
అటువంటి ఒక తంత్రమును అతని ముందు పెట్టగా అతడు ఎంతో బుద్దిహీనుడైపోయెను. అయితే ఒక బుద్ధిమంతుడు, దీర్ఘముగా ఆలోచించు వ్యక్తి అటువంటి కుయుక్తి పరులతో వ్యాపారమును చేయడు, గమనించారా.
19మొదటిగా నీవు పొదుపు చేయాలనుకుంటున్న సంస్థను గూర్చి కొంత అన్వేషించి తెలుసుకొనుట యుక్తమైనది. అదే యుక్తమగు కార్యము. ఆ పొదుపు సంస్థ మోసపూరితమైనదని నీకు తెలిసినయెడల, వారు ఆశ కలిగించు ఏ విధమైన పధకములనైననూ నీ ముందుంచిన యెడల దాన్ని నీవు నమ్మవద్దు సుమా. నీవు ఒక మంచి వ్యాపారవేత్తవైన యెడల, నీ జీవిత కాలమంతా నీవు సంపాదించిన సంపదను నీ అదృష్టమును పరీక్షించుకొనుటకు అటువంటి మోసపూరితమగు సంస్థలో నీవు ఎన్నడూ భీమా చేయవద్దు, నీ పెట్టుబడులను పెట్టవద్దు.
ఇప్పుడు మాట్లాడుచున్న దీనికి సాదృశ్యముగా, "రాత్రికి రాత్రే దానిని చెయ్యుము," అనేటువంటి మత సంబంధమగు అనేక కార్యములు ఈ అంత్యకాల మందు వచ్చుచున్నవి, ఈ రోజు రాత్రి నీవు ఒక మధుపానశాలలో అసహ్యముగా పాటపాడే గాయకురాలివి కాని మరుసటి దినమున సువార్తను ప్రసంగించుచున్నావు. ఆ విధమైన వాటిల్లో ఉంటూ నేను సువార్తను ప్రసంగించ లేను. లేదు. మొదటిగా ఒక వ్యక్తి తాను ఏమైయున్నాడో దానిని రుజువుపరచుకోవలసియున్నదని నేను తలంచుచున్నాను.
20అటువంటి కార్యములను పెంతెకోస్తు సంఘ సంస్థ చేయుటవలననే మనలో అనేకమందిని దిగజారిపోవునట్లుగా అది చేసినదని నేను తలంచుచున్నాను, ఎందుకనగా ఎచ్చటో ఒకచోట వేదికపై అసభ్యముగా నాట్యము చేస్తూ అందరి ముందు తన వస్త్రములను ఒక్కొక్కటిగా తీసివేస్తూ నగ్నముగా తనను ప్రదర్శించుకొనే స్త్రీ, మరియు రాత్రి సమయములలో మధుపాన శాలలో పాటలు పాడే స్త్రీ, తన చంక క్రింద బైబిలుని పెట్టుకొనివచ్చే స్త్రీని చూచి, " ఆమెను ప్రసంగించుటకు ప్రభువు పిలిచెను," అని చెప్పుచున్నారు. సరే, మంచిదే, ఆ విషయములో నాకు ఏ సందేహము లేదు. కాని ఆమెను ప్రభువు పిలిచినట్లైతే, మొదట ఆమె నిరూపించబడవలసియున్నది అని నేను తలంచుచున్నాను. అది నిజము.
దానిని నిరూపించుకోనిమ్ము… కొంచెము వేచి చూడండి, ఆ విత్తనమును ఎదగనివ్వండి, అప్పుడు దానిలో ఏరకమైన జీవముగలదో చూచెదము. వారు జనులతో సహవాసమును కలిగియున్నప్పటికీ ఆమె యొక్క సాక్ష్యము లేక అతని యొక్క సాక్ష్యము నమ్మదగినది కానేరదు. వారు ఆమెను, లేక అతనిని చూచినప్పుడు, వారు ఎక్కడో ఒక చోట మద్యపాన శాలయందు కనబడవచ్చును. కాని మరలా మరుసటి రాత్రి సువార్త కూటమునందు పాల్గొనెదరు. అయితే "ఎంత మోసగత్తా?" అని జనులు అంటారు.
కాని కొంత కాలము తర్వాత ప్రజల మధ్య ఆ పట్టణములో ఆమె చక్కగా జీవించుచూ, ఆమెలో కలిగిన మార్పును వారు చూచిన తర్వాతే, అప్పుడు ఆమె యొక్క సాక్ష్యము నిలుచును. ఆ సమయము వచ్చేవరుకు, ఆమె సాక్ష్యము స్థిరపరచబడువరుకు, ఆమె చక్కని సామాన్యమైన జీవితమును జీవించుచూ కొనసాగిపోవుటయే శ్రేష్ఠమైనది.
ROM 10:17
21"రాత్రికి రాత్రి ధనవంతులగుటను" మనము ఆశించవద్దు. ఆ ఆశను మనలో ఉంచుకోకూడదు, ఎందుకనగా మీ డబ్బును మీ దగ్గర ఉంచుకొనినయెడల, దొంగలు వచ్చి దానిని పగులగొట్టి దొంగిలుదురని నేను చెప్పగోరుచున్నాను. నీవు దేవుని కొరకు ఏదైననూ నీ హృదయమునందు కలిగియున్నట్లైతే, దానిని బహిర్గతం చేయకుండా, "సరే, ఆ తర్వాత చేస్తాను, ఆ తర్వాత చేస్తాను," అని ఆలస్యము చేసిన, ఇక అది నీ హృదయములోనే మగ్గిపోవును. నీ హృదయములో ఒకప్పుడు దేవునిని సేవించాలనివున్న ఆ చిన్న ఆశ, మెల్లగా నీ యొద్ద నుండి తీసివేయబడును. దెయ్యము నీలోనుండి ఆ హృదయ వాంఛను ఆ విధముగా తీసివేసిన తర్వాత, ఇక నీవు దేవునిని సేవించాలనే ఏ ఆశను నీవు కలిగియుండలేవు.
ఒకవేళ ఇప్పుడు నీ హృదయములో ఏదైనా చిన్న ఆశను గనుక నీవు కలిగి ఉన్నట్లైతే, ఈ ఉదయకాలపు అల్పాహార వేళలో నీ హృదయములోవున్న ఏదో ఒక కార్యమే నిన్ను ఇచ్చటకు తీసుకొని వచ్చియున్నది. నీలో ఏదో ఒకటి ఉన్నది. "వినుట వలన విశ్వాసము కలుగును, దేవుని వాక్యము వినుట వలన కలుగును." నీ హృదయమునందు ఏదో ఒక ఆశను నీవు కలిగియున్నావు లేకపోతే అసలు నీవు ఇచ్చటకు రాలేవు. దేవుని కొరకు ఏదో ఒకటి చేయాలనే నీలోవున్న ఆ ఆశ కొరకు ఏదో ఒకదానిలో చేరుట, లేదా కరచాలమును చేయుట, లేదా, చిలకరించుట, లేదా ఏదో వ్యర్ధమైన వాటియందు చేరుట తగదు. కాని స్థిరముగా స్థిరపరచబడిన నిజమైన ఒకదానిని, సమస్తమందు యధార్ధముగా ఉండు ఏదో ఒక దానిని నీవు కనుగొనవలయును.
MARK 10:19,20•
JOHN 14:21
22కొన్ని నమ్మకమైన వ్యాపార సంస్థలు తమకు వచ్చు లాభములో ఒక వంతు భీమాదారునికి చెల్లించును. అలాంటి వాటిల్లోనే మీ ధనమును మీరు పొదుపు చేసుకొనుట మీకు లాభసాటిగా ఉండును. ఈ ఉదయకాలమున నేను ఈ విధముగా తలంచుటకు కారణమేమనగా, ఈ గుంపులోనున్న, ధనవంతుడైన ఈ యవ్వనస్తుడు, ఈ యవ్వనస్తుడిని గూర్చి మనకు తెలియునని నేను నమ్ముచున్నాను. ఇతడు ధనవంతునిగా పిలువబడుచున్నాడు. అతడొక యవ్వనస్తుడు మరియు మంచి గుణశీలమును గలవాడనుటలో ఏ సందేహము లేదు. అతను ఒక మంచి గృహములో నుండి వచ్చియున్నాడు. అది బహుశా ఒక మంచి మత సంబంధమైన గృహమైయుండును. అతడు ఆ మార్గము గుండా ప్రభువగు యేసు యొద్దకు వచ్చి చేరెను.
యేసు అతని చూచి, "ధర్మశాస్త్రమందలి ఆజ్ఞలను అనుసరించుమని," చెప్పెనని మీరెరుగుదురు.
అందుకతడు, "బాల్యము నుండే ఇవన్నియు అనుసరించుచున్నానని, వాటన్ని టినీ నేను చేయుచున్నానని," చెప్పెను.
మీరు గమనించండి, ఇతడు ఒక మంచి పరిస్థితుల్లో ఎదిగినవాడు. అనగా అతని స్థితిగతులన్నింటిని గూర్చి, ఎందుకనగా బహుశా ఏదో సామాన్యముగా అతడు యేసునొద్దకు వచ్చెనేమో అని తలంచవద్దు. కాని యేసును గూర్చి ఏదో ఒకటి ప్రత్యేకమైన దానిని ఎరిగినవాడై, దానిపట్ల అతని దృష్టి ఆకర్షించబడెను, అతను వెళ్ళుచున్న సమాజమందిరము నందు లేనిదేదో ప్రత్యేకమైనది యేసులో గలదని కనుగొనెను. మీరు గమనించారా.
MARK 10:21
23మరియు గొప్ప స్థలమగు మూడీ బైబిలు ఇనిస్టుట్యూట్ నుండి వచ్చినట్లుగా ఈ యవ్వనస్తుడు ఇచ్చట సాక్ష్యమును కలిగియుండుటలో ఏ సందేహము లేదు; కాని మీరు చూడండి, ఒక దినమున అతడు ఏదో ఒక భిన్నమైనదానిని కనుగొనెను, అందులో ఏదో ప్రత్యేకత గలదు. మరియు అతనికి దొరికిన ఆ అవకాశమును సద్వినియోగము చేసుకొనెను.
ఈ యవ్వనస్తునికి దొరికిన ఈ అవకాశమును పెట్టుబడిగా పెట్టెను. బహుశా అతడు గొప్ప సంపదను కలిగినవాడుగాను, అధికారిగాను, ఒక వ్యాపారవేత్తవలె ఉండెను. "యేసు అతనిని చూచి ప్రేమించి; ఆ యవ్వనస్తునిలో ఆసక్తిని కలిగియుండుటను కనుగొనెనని," పరిశుద్ధ గ్రంధము చెప్పుచున్నది. అతడు మంచి వ్యక్తిత్వమును, మంచి గుణాలక్షణములు గలవాడై, ఎంతో గౌరముతో ప్రభుయేసును సంధించుటకు వచ్చెను.
MARK 10:17
24ఈ దినమువున్న ఒక తుంటరి యవ్వనస్తునివలె అతడు ప్రభుయేసు యొద్దకు ఏ భయభక్తులు లేనివానివలె వచ్చి, "నీవు ఇచ్చటకు వచ్చి ప్రసంగించు," అని చెప్పలేదు.
అతడావిధముగా ప్రభుయేసును సంధించలేదు, ఆ విధానముగా రాలేదు. అతడు వచ్చి ఈ విధముగా చెప్పెను, "సద్బోధకుడా," గమనించారా. "బోధకుడా లేక ఉపదేశకుడా! నిత్యజీవమును పొందుటకు నేనేమి చేయవలెను?"
ఇప్పుడు మీరు గమనించండి! యేసులో ఏదో ఒక ప్రత్యేకమైనది అతడు కనుగొనెను. అతడు దేవుని ఆజ్ఞలను అనుసరించుచు పాటించుచున్నప్పటికినీ, ఆ సమాజ మందిరములో మంచి విశ్వాసముగల భక్తిపరుడుగా ఉన్నప్పటికినీ, జీవమును పునరుత్పత్తి చేయునదేదో ప్రభుయేసులో గలదని అతడు కనుగొనియుండెను.
25ధర్మశాస్త్రమునందు జీవమనునదేదియు లేదు. జీవము… ధర్మశాస్త్రము, నన్ను క్షమించును, అది ఒక రక్షకభటునివలె నీ పాపములను గూర్చి నేరారోపణ చేయుచుండును. కాని దానియందు కృప లేనందువలన అది నీ పాపమును క్షమించజాలదు. అది నీ పాపములను ఎత్తి చూపుచూ నీవొక పాపివని చెప్పుచుండును. దానినే తారుమారుగా చేసిరి, కావుననే దానిని ఒక సంఘ సంస్థ రూపముతో క్రైస్తవ్యములోనికి సిద్ధాంతములను లేక చట్టములను, క్రైస్తవ్యము యొక్క చట్టములను తీసుకొనివచ్చి, మేము మీ పాపములకు పరిహరించెదమని ప్రకటించిరి. మరియు మనము కలిగియున్న ఎంతో సామర్థ్యముగలవారు జ్ఞానవంతమైన కార్యములను లోకమునకు చూపించుచున్నారు.
కాని మీరు చూచిన, వారు చెప్పుచున్న విధానములతో వాటిని జనులు తీసుకొనుచున్నట్లుగా మనము కనుగొనలేము, ఎందుకనగా అందులో ఏ విధమైన జీవములేదు, గమనించారా. దానిలో ఏదో ఒక దానిని మనము కనుగొనవలయును… ప్రతి మనిషి ఎచ్చటోవున్న దానిని తెరకు ఆ ప్రక్క వైపు చూచుచున్నారు, ఒకప్పుడు తాను ఎక్కడ ఉన్నాడో, ఎక్కడి నుండి వచ్చెనో, ఏదో ఒక దినమున మరలా తిరిగి తన గమ్య స్థానమునకు చేరుకొనునని అతడికి తెలుసు. ప్రతి ఒక్కరూ దానినే చూడాలని ఆశించుచున్నారు, ఆ తెర వెనుక ఏమున్నదో తెలుసుకొనుటకు ఆశించుచున్నారు.
MATT 12:43-45•
LUKE 11:24-26
26ఒక అద్భుతమైన చిత్రము… యేసు చెప్పెను, "అపవిత్రాత్మ ఒక మనుష్యుని వదిలిపోయిన తరువాత… [మీరు గమనించారా, ఆయన ఎన్నడూ ఇలా, ఒక మనుష్యునిలో నుండి దానిని బయటకు తరిమివేసినపుడు…" అని చెప్పలేదు, కాని అది తనంతట తాను వదిలి వెళ్ళిపోయినప్పుడు] అపవిత్రాత్మ ఒక మనుష్యుని వదిలిపోయిన తరువాత, అది విశ్రాంతి వెదుకుచు తిరుగుచుండును. విశ్రాంతి దొరకనందున - నేను వదిలివచ్చిన నా యింటికి తిరిగి వెళ్ళెదననుకొని వచ్చి, ఆ యింట ఎవరును లేక ఆ యిల్లు ఊడ్చి, అమర్చియుండుట చూచి, వెళ్ళి తనకంటే చెడ్డవైన వేరొక ఏడు అపవిత్రాత్మలను, దెయ్యములను, పిశాచములను వెంటబెట్టుకొని వచ్చును, అవి దానిలో ప్రవేశించి అక్కడనే కాపురముండును. అందుచేత ఆ మనుష్యుని కడపటి స్థితి మొదటి స్థితికంటే చెడ్డదగును."
ఆ అపవిత్రాత్మ తనంతటతానే బయటకు వెళ్ళి, మరలా అదే తిరిగి వచ్చుటను మీరు గమనించితిరా? అయితే అప్పటికే ఆ ఇల్లు ఆక్రమించబడియున్నట్లయితే, ఆ అపవిత్రాత్మ మరలా లోపలికి ప్రవేశించుటకు అవకాశమే లేదు. కాని మీరు చూడండి, ఆ ఇల్లు ఊడ్చబడి, శుభ్రము చేయబడియుండుట కనుగొనెను.
27ఒక నీతిమంతుని గూర్చి ఇదెంత చక్కని దృశ్యముగా ఉన్నది. ఈ దినమున జీవించుచున్న ఒక మనుష్యుని గూర్చి ఈ విధముగా మనము ఆలోచించుచు, అతడు ఒక జూదగాడైయుండియు జూదమును ఆడుటను మానివేయుటవలన మరియు తన భార్యకాని వేరొక స్త్రీతో షికార్లు తిరుగుటను మానివేయుటవలన, త్రాగుబోతై త్రాగుటను మానివేయుటవలన, నూతన సంవత్సర దినమున ఒక క్రొత్త పేపరును తిప్పినట్లుగా ఒక సంఘములో చేరుటవలన తాను పరలోకమునకు వెళ్ళెదనని అనుకొనుచున్నాడు. మీరు గమనించారా, అతడు ఎంత మాత్రమునూ మారుమనస్సు పొందినవాడు కాదని మీరు తెలుసుకోండి. వాస్తవముగా అతడు పశ్చాత్తాపము చెందలేదు. అతడు ఒక నీతిమంతుడు మాత్రమే. ఈ నీతిమంతులను లేక నీతులను చెప్పేవారిని దయ్యము బుద్దిలేని తన కార్యములకు ప్రాతినిధ్యము వహించునట్లు చేసుకొనుచున్నది. అసలైన, నిజమైన జీవించుచున్న క్రీస్తు యొక్క శక్తిని వారు పొందుకోలేదు. గమనించారా.
వారు…
JOHN 15:5
28ఈ లోకము క్రీస్తును చూడాలని ఆశించుచున్నది. యేసు, "నేను ద్రాక్షావల్లిని, మీరు నా తీగలు," అని చెప్పెను. మరియు ఆ మొదటి తీగ విస్తారమైన ద్రాక్షలను ఇచ్చునప్పుడు, ఎందుకనగా ఆ మూల ద్రాక్షావల్లి నుండి ఈ మొదటి తీగ శక్తిని మరియు జీవమును పీల్చుకొనుచున్నది. మొదటి ద్రాక్షావల్లి నుండి మొదటి తీగ వచ్చుటవలననే వారు అపొస్తుల గ్రంధమును వ్రాసిరి. ఆ విధముగానే ఆది సంఘమందు పరిశుద్ధాత్మ క్రియ చేసినది, అదే పెంతెకోస్తు సంఘమైయుండెను. మరియు మనము విశ్వాసించునదేమనగా, ఈ మూల ద్రాక్షావల్లి వేరొక కొమ్మను తీసుకొని వచ్చినను వారు కూడా మరియొక అపోస్తుల కార్యముల గ్రంథమును వ్రాసెదరు, ఎందుకనగా ఆ మూల ద్రాక్షావల్లిలో ఉన్న అదే జీవము దానిలోను గలదు.
మరియు ఆ మొదటి ద్రాక్షా తీగ ఫలించి ద్రాక్షా ఫలములను ఫలింపజేసిన తరువాత, పిదప అదే తీగ పుచ్చ కాయలను గాని లేదా దోస కాయలను గాని లేదా గుమ్మడి కాయలను గాని ఫలింపజేసిన, అవి ఆ మూల ద్రాక్షావల్లి యొక్క జీవము నుండి రాలేదని మనమెరుగుదుము. కాబట్టి, నేననుకొనుచున్నాను, ఎట్లైతే మనల్ని మనము పెంతెకోస్తులుగా పిలవబడుచున్నామో, దాని ప్రతినిధులుగా రుజువుపరుచుకొను విషయములో విఫలమయ్యాము. ఒక నిజమైన సంగతేమనగా, క్రీస్తు మన కొరకు ప్రాతినిధ్యము వహించుచూ, ఇప్పుడు ఆ క్రీస్తే పరిశుద్ధాత్మగా మరియు జీవము యొక్క ఆత్మగా ప్రాతినిధ్యము వహించుచున్నాడు, చూడండి.
అందుకే, మనము ఆత్మ సంబంధమగు అనుభూతులను ప్రదర్శించువారమై మరియు ఆనందమును ప్రదర్శించువారమై యున్నాము. అది మంచిదే; అయితే అంతకంటే ఉన్నతమైనది అచ్చట గలదు. అక్కడ ఆత్మ యొక్క ఫలము దానిని ప్రతిబింభించుచున్నది, ఈ ఆత్మ యొక్క ఫలమును అనగా క్రీస్తులోయున్న ఆ ఆత్మ ఫలముల కొరకే ఆత్మ సంబంధమైన ఆకలిని కలిగియుండు మానవుడు ఎదురుచూచుచున్నాడు.
COL 2:9
29మరియు యేసులో ఉన్నటువంటి లక్షణము అది, ఎందుకనగా యేసు ఒక సామాన్యమైన వ్యక్తి కాదు. యేసు దేవుడైయున్నాడు. ఆయన ఒక నిమిత్తమాత్రుడగు దేవుడు కానేరడు. ఆయన ఒక ప్రవక్త మాత్రమే కాదు. ఆయన ఒక ప్రవక్తయైయున్నప్పటికీ ఆయన దేవుడు-ప్రవక్తయైయున్నాడు. ఆయన ఆలయమై దేవుని యొక్క సమస్తము ఆయనలో నివాసమైయుండెను. "దైవత్వము యొక్క సర్వసంపూర్ణత ఆయన శరీరములో నివసించెను." దేవుడే మానవుడై మరణమవుటకు దిగి వచ్చెను.
ఆత్మ స్వరూపిగా దేవుడు చనిపోవుటకు సాధ్యమవ్వదు, ఎందుకనగా ఆయన మరణించలేడు. ఆయన నిత్యుడైయున్నాడు. ఆయన ఎంత మాత్రము మరణించలేడు. అయితే దేవుడు ఆ శ్రమను అనుభవించుట కొరకే తనను తాను ఆ విధముగా చేసికొని, ఆ బాధను మరియు వ్యధను అనుభవించెను. దేవుడు నిత్యమైన ఆత్మస్వరూపిగా ఉంటూ శ్రమను అనుభవించుటకు సాధ్యమవ్వదు. కాబట్టి ఆయన మానవునిగా దిగివచ్చి, ఆయన బాధను, దుఃఖమును మరియు నొప్పిని అనుభవించుచూ, ప్రతి ఒక్కరి నిమిత్తమై, ఏదేను తోటలోవున్న ఆదాము మరియు హవ్వలవలె బాధ, శ్రమ, శోధనలగుండా ఒక మానవుడు వెళ్ళు విధముగా వెళ్ళి వాటన్నింటిని అనుభవించెను. ఆయన ఈ విధముగా శరీరధారియగుటకు, ఒక క్రమము ప్రకారముగా, తన స్వంత చట్టమును నెరవేర్చుటకై, తనకుతానుగా తన స్వంత చట్టమును తన పై వేసుకొనెను. అందుకొరకు ఆయన ఎంత మాత్రము రెండవ వ్యక్తిని కేటాయించ కూడదు. ఆయన ఎంత మాత్రమునూ మూడవ వ్యక్తిని కేటాయించకూడదు. వేరే ఏ వ్యక్తిని అందుకొరకు కేటాయించకూడదు గాని, ఆయనే ఆ వ్యక్తిగా దానిని చేయవలయును, గమనించారా. ఆయనే దానిని చేయవలయును.
JOHN 1:14•
1TIM 3:16•
1JN 3:8•
1JN 4:9
30ఒకవేళ ఆయన ఈ భూమి ఉన్నప్పుడున్న అదే కొలత ప్రకారమైన చట్టపూర్వకమైన అధికారము నాకున్నయెడల, ఈ సంఘముతో, ఈ ఉదయమున, "ఆ స్తంభము వైపు ఎవరైనా చూచినయెడల, అతడు చనిపోవును," అని నేను చెప్పిన, ఈ యవ్వన కాతలిక్కు స్త్రీ ఇచ్చట కూర్చొని ఆ స్తంభమువైపు చూడగా…
"ఆమె మన మధ్యకు ఇప్పుడే క్రొత్తగా వచ్చినది, అన్ని అయిపోయిన తరువాత ఇప్పుడే కొత్తగా వచ్చిన ఈమెను చనిపోనిద్దామా?" అని నేను చెప్పి, ఆ తర్వాత మరలా, "కాని ఆమె పట్ల నేనెంతగానో చింతించుచున్నాను, కావున, ఆమె స్థానములో ఇచ్చటవున్న ఇతడిని చనిపోనివ్వండి" అని నేను చెప్పగలనా? చెప్పలేను. అది పద్దతి కాదు.
"సరే, ఆమెకు బదులుగా ఆ స్థానంలో నా కుమారుడు బిల్లీ పౌల్ ని చనిపోమని," నేను చెప్పగలనా?
అది కూడా యుక్తమైనది కాదు, ఎందుకనగా, ఈ శ్రమ అంతయు మరొకరిపై మోపబడి, మరియు నన్ను దానినుండి వేరుపరచినది. దేవుడు నీతిమంతునిగా యున్నట్లు, నేను కూడా నీతిమంతునిగా యుండుటకు నేను చేయదగిన మార్గము ఒక్కటి మాత్రమే వున్నది, అదేమనగా ఆమె యొక్క స్థానమును దేవుడు తీసుకొన్నట్లుగా, ఆమె యొక్క స్థానమును నేను తీసుకొనవలయును. కాబట్టి దేవుడు శరీరధారిగా ప్రత్యక్షమై, మరణము నిమిత్తము శ్రమనొందుచూ, మరణమును పొందుటకు ఆయనకు గల మార్గము ఇది మాత్రమే, దీని ద్వారానే ఆయన మనకు విమోచనను తీసుకొని రావలయును.
ధర్మశాస్త్రములోని ఆజ్ఞలు కంటే అంతకన్నా ఉన్నతమైనదేదో యేసునందు గలదని ఆ యవ్వనస్తుడు చూచెను.
31ఇప్పుడు మర్యాదస్తుడగు ఆ యవ్వనస్తుడు, కనీసము మనకున్న విశ్వాసమంత విశ్వాస ప్రయత్నమును కూడా అతడు చేయలేదని నేను గ్రహించుచున్నాను. మనమేమి చెప్పుటకు ప్రయత్నించుచున్నామో దానిని వ్యక్తపరుచుటకు సామర్థ్యము లేని ప్రతినిధులముగా మనము వున్నాము. నేను కూడా అలాగే వున్నాను, అందుకొరకు నేను నా హృదయమును మరియు నా తలను దించుకొనుచున్నాను. ఈ దినమున సంఘము కొరకై నాకు ఇవ్వబడియున్న వర్తమానమును బట్టి చూస్తే! నేనొక సామర్థ్యములేని ప్రతినిధిని. నా జీవితములో ఏదైతే సరియైనదో దానిని చేయుటకే నేను ప్రయత్నించాను, నా జీవితములో ఎన్నో ఎత్తు-పల్లములు గలవు. కావున నేనేమైయున్నానో నన్ను చూడండని నేను మీతో చెప్పుట లేదు. కాని నేనేమి చెప్పుచున్నానో, నేను ఎవరిని గూర్చి మాట్లాడుచున్నానో, ఆ ప్రభువైన యేసును మరియు ఆయనలో వున్న రక్షణ వైపే చూడమని నేను మీతో చెప్పుచున్నాను.
32ఈయనయందు నిశ్చయముగా దేవుడున్నాడని ఈ యవ్వనస్తుడు కనుగొనెను. ఆయన ప్రజల హృదయములోని అంతరంగమును చూస్తూ వారిలోవున్న తప్పిద మేమిటో కనగొని వాటిని గూర్చి వారియొద్ద చెప్పగలుగుచున్నాడనియు మరియు చనిపోయినవారిని సహితము సజీవులుగా ఆయన లేపగలుగుచున్నాడనియు అతడు చూచెను. ధర్మశాస్త్రము ఎన్నడూ ఆ రీతిగా చేయలేదనియు, తాను వెళ్ళు తన స్వంత సంఘము కూడ ఏ విధమైన అద్భుతములను చేయుటకు ఆస్కారము లేదనియు, అయినా అబ్రాహాము, ఇస్సాకు మరియు యాకోబుల యొక్క దేవుడు జీవముగలవాడని, ఆయన సజీవుడైయున్నాడని అతడు ఎరిగియుండెను. అయితే దేవునిలో వున్న సమస్తము మానవ రూపమున యేసుయని పిలువబడుచున్న ఈయనలో ఉండుటను అతడు చూచి, అందుకొరకు అతని హృదయములో దాహమును కలిగియుండెను.
ఇవన్ని అతడు ఎరిగియున్నప్పటికిని, అతడు ఒక సంఘమునకు చెందిన ఒక సభ్యుడైయుండెను. ఒక మంచి సంఘ సభ్యుడుగా యుండెను. బహుశా, అతని తండ్రి ఆ సంఘమునందు ఒక ధర్మకర్తగానో, గొప్ప కార్యనిర్వాహకత్వమును లేదా ఏదైన పదవిని కలిగిన సభ్యుడై, ఆ సంఘ సంస్థ యొక్క కార్యాలయములో ఒక ముఖ్య సభ్యునిగా యుండవచ్చును. ఆ యవ్వనస్తుడు ధర్మ శాస్త్రము యొక్క నియమముల ప్రకారము వాటిని ఎంతో గౌరవించుచు మరియు వాటియందు భయభక్తులను కలిగి పాటించుచు ఎదిగెను; అయినప్పటికిని వాటికన్నా ఇంకా ఉన్నతమైనదేదో ఒకటి గలదని దానిని కనుగొనుటకై తృష్ణతో అన్వేషించుచుండెను.
LUKE 17:26•
ROM 13:11
33ఈ ఉదయకాలమున ఇచ్చటవున్న ప్రతి పురుషుని, స్త్రీల హృదయములయందు కనుగొనిన ఏదో ఒక యధార్ధతమైనది వుండునని నేను నమ్ముచున్నాను.
మొదట సారి మీకు లభించే మంచి అవకాశమును జారవిడుచుకొని మళ్ళీ రెండవ అవకాశము కొరకు ప్రయత్నించుటకు మీరు మరలా వెనుకకు తిరిగి రాలేరని జ్ఞాపకముంచుకొనండి; దానిని పొందుటకు ఇప్పుడే ప్రయత్నించండి. ఒక చెట్టు ఏ వైపు ఒలిగి ఉండునో, ఆ వైపే అది పడిపోవును. దీనితరువాత మారుమనస్సు పొందుటకు వేరే లేఖనము లేదు. ఇదే మీకు మంచి తరుణమైయున్నది.
నేడు అదెంత ప్రసిద్ది చెందినదైనా గాని దానితో లెక్క లేదు. పాపములకు ప్రాయశ్చిత్తము చేయు మధ్యవర్తులైన మనుష్యల గురించి చెప్పే విషయము పరిశుద్ధ గ్రంథమునందు ఎచ్చటా లేదు. అసలు అలాంటి విషమేమియు లేదు. దీనిని గూర్చి మెక్కాబీస్ యొక్క గ్రంథములో వ్రాయబడియున్నది లేక వేరే ఏదో ఒక పుస్తకమందు గలదు. అయితే అది దానికి జతచేయబడలేదు.
కేవలము ఆ ఒక్క పుస్తకమునందే ఆ విషయము సూచించబడినది. అయితే దీనిని గూర్చి పరిశుద్ధ గ్రంథమునందు ఎచ్చటా సూచించబడలేదు. మరియు వాటన్నిటి తరువాత, అతడు చనిపోయిన తరువాత అదే ధనవంతుడైన యవ్వనస్తుని గూర్చి యేసు, "మరణము తరువాత, అక్కడ ఒక మహా అగాధము గలదు, ఏ మనుష్యుడును దాన్ని దాటి వెళ్ళకుండునట్లుగా అది అచ్చట యున్నది," అని చెప్పెను, గమనించారా. మరియు ఇంకొక అవకాశమే లేకుండా అచ్చటే అది సమాప్తమగుచున్నది. ప్రతిదానిని ఇక్కడే మనము తీర్మానించుకొనవలసియున్నది. యేసు చెప్పినట్లుగానే అది ఖచ్చితముగా అట్లే వుండును.
34ఇప్పుడు దీనిలోనుండి ఒక దానిని మనము కనుగొనగలము. దీని కొరకు మీరు ఆకలి కలిగియున్నను, దీనిలో పాలిభాగస్థునిగాయగుట లేక పాలిభాగస్థునిగా కాకుండా పోవుట నీ హస్తములో గలదు. జీవము యొక్క మూలము క్రీస్తునందు గలదు. ఈ యవ్వనస్తుడు దానిలో పాలిభాగస్థుడగునట్లుగా ఆశించెను. దానిని అనుగ్రహించుటకే యేసు అచ్చట యుండెను. అదే నూతన జన్మయైయున్నది. ఇప్పుడు నూతన జన్మను స్వీకరించుటకు అవకాశమును కలిగివున్నాము, దానిని పొందుకొనుటకే నేడు మనమిచ్చట ఉన్నాము, దానిని పొందుకొనుట ద్వారా మనము దేవునిలో ఒక భాగమై, దేవుని కుమారులుగాను మరియు కుమార్తెలుగాను మారుచున్నాము. గమనించారా, మీరు దీనిని అర్థము చేసికొనగలుగుచున్నారా?
MATT 15:14•
LUKE 6:39
35గమనించండి. అది ఒక పాపమువలె ఉన్నట్లుగా, సంఘము దాని స్థానమును ఎంతో కాలము క్రితమే మరచిపోయినది. సంఘము ఒక సంస్థగా మారిపోయి గ్రుడ్డిదానివలె నడుచుచు నిజ సత్యము నుండి దూరముగా తొలగిపోయినది, అదేలాగున్నదనగా, ఒక గ్రుడ్డివాడు మరొక గ్రుడ్డివానికి దారి చూపుచూ నడిపించుచున్నట్లుగా ఉన్నది. చూడండి, నేను ఒక నల్లని సిరా చుక్కను నా కలములో నుండి తీసుకొని నీళ్ళున్న ఒక గిన్నెలో బ్లీచ్ ను వేసినయెడల, నల్లని సిరా చుక్క తెల్లగా మారి, దాని నల్లని రంగును అది పోగొట్టును. స్త్రీలు ఉపయోగించు బ్లీచ్…
మంచిది, నేను చిన్న బాలునిగా ఉన్నప్పుడు ఒకవేళ నా చొక్కాపై ఏదైన ఒక మరక ఉన్నట్లయితే, దానిని పోగొట్టుటకు బోగ్గుతో తయారు చేయబడిన నూనె లేక టర్పంటైన్ మరేదో వాడి ఆ మరక యొక్క రంగును పోగొట్టుటకు అమ్మ ప్రయత్నించేది. అయితే ఈ మరక పూర్తిగా పోకుండా ఇంకా అలాగే వుండి, అది ఒకే చోట ఉండకుండా అటు, ఇటు వ్యాపించును. కాని ఇప్పుడు మన దినములలో "బ్లీచ్" అనే ఒక పదార్దము తయారు చేయబడియున్నది. ఇప్పుడు ఈ బ్లీచ్ ను చొక్కా మీద ఉన్న మరక మీద వేసిన వెంటనే పూర్తిగా దానిని అది తొలగించుచున్నది.
36మంచిది, దేవునికి ఒక చట్టము గలదు, గొర్రెపిల్ల యొక్క రక్తము క్రింద మన పాపములు ఎంతమాత్రము పరిహరించబడవు; అది కేవలం పాపమును చెల్లాచెదురు చేయును. మానవుడు పాపము చేసినప్పుడు, అతడు గొప్ప అగాధమునకు అవతలి వైపుకు దాటుకొని వెళ్ళిపోయెను. అతడు ఎప్పుడైతే పాపమును చేసెనో, దేవుని యొద్ద నుండి తొలగిపోయి, మరలా తాను దేవుని యొద్దకు తిరిగి రాలేనంత దూరముగా తొలగిపోయి, దేవుని నుండి తననుతాను వేరుపరుచుకొని అతడు దూరముగా తొలగిపోవును. అయితే దేవుడు అత్యంత కనికరముగలవాడై, గత వేలాది సంవత్సరములుగా అతడికి బదులుగా ఒక ప్రత్యామ్నయమును అంగీకరించెను, కాని అది ఎంత మాత్రము మన పాపములను తీసివేయజాలదు; అది కేవలము మన పాపములను కప్పును.
కాని… ఉత్పత్తి చేయబడ లేదు, అయితే దేవుడు, తనలోవున్న సృష్టించగల శక్తితో, ఒక రక్త కణమును సృష్టించెను. ఆ కణము ఎటువంటి లైంగిక సంపర్కము యొక్క అవసరత లేకుండానే కన్యక యొక్క గర్భములో సృష్టించబడినది. ఈ రక్తము పాపములను కప్పివేయుట మాత్రమే గాక అది పూర్తిగా పాపములను తీసివేయుచున్నది. ఆ పాపములు అసలు కనబడనంత దూరముగా అదృశ్యమైపోయి దేవుని తలంపులో కూడా ఇక మరెన్నడూ జ్ఞాపకమునకు రావు. ఇది ఆ అగాధమును దాటి వెళ్ళుటకు ఒక వంతెనగా ఉండదు గాని, ఇది సంపూర్తిగా ఆ అగాధమును తొలగించుచున్నది, ఆ…
ఆ నల్లని సిరా చుక్కను సీసాలోవున్న ఈ బ్లీచ్లో వేసి చూడండి, మరలా ఆ నల్లని రంగును మీరు అసలు కనుగొనలేరు.
37ఆ రంగు ఎక్కడి నుండి వచ్చినది? రంగులను తయారుచేయు విధానముతో దానిని ఇప్పుడు మనము కనుగొందాము, అదెలాగో నాకు తెలియదు. నేను ఒక రసాయన శాస్త్రవేత్తను కాను గాని నేను దీనిని ఈలాగు చెప్పగలుగుచున్నాను. ఇక్కడ ఒక రసాయనిక శాస్త్రజ్ఞుడు కూర్చొనియున్నట్లయితే, నేను మానసిక సమస్యను గలవానిగానో లేక నేను ఈ పదములను ఉపయోగించినయెడల, నేనేమి మాట్లాడుచున్నానో నాకే తెలియదని అతడు తలంచును. నేను ఏ భావముతో చెప్పుచున్నానో దానిని మీరు తెలుసుకొనవలయును, ఇప్పుడు ఆ రంగును గూర్చి చెప్పుకొందాము..
మొదటిగా అది ఒక రకమగు రసాయనము. దానిలోనుండే అది వచ్చినదని మనము చెప్పెదము. మంచిది, అట్లైతే ఈ రసాయనము (లవణము) ఎక్కడ నుండి ఉత్పన్నమగుచున్నది? అది ఒక రసాయనముగా వుండి మరియొక రకమగు రసాయనముతో కలుపబడి ఒక రంగుగా తయారగుచున్నది. రంగులన్నింటికి మూలమగు రంగు ఒక్క తెలుపు రంగు మాత్రమే గలదు. మంచిది, ఇది అందరికీ తెలుసు. మిగతా రంగులన్నీ మూలమగు ఈ తెలుపు రంగు నుండే కలిగినవి. ఏ రంగు లేదు కాని తెలుపు రంగు మాత్రమే గలదు. ఉన్నదంతా రంగులన్నింటికి మూలమగు ఒక్క తెలుపు రంగు మాత్రమే ఉన్నది.
ఇప్పుడు, ఈ రసాయనమును మనము కనుగొనిన, ఒక్క నిమిషము మనము వెనుకకు వెళ్ళి చూడవలసి యున్నది. బహుశా, అది ఒక అణువు ద్వారా కలిగినదని మనము కనుగొని చెప్పవచ్చును. మంచిది, దానిని ఈలాగు మనము చెప్పవచ్చును, పరమాణువు బి-1, పరమాణువు బి-సి, నాలుగుసార్లు, నలుపు రంగు తయారగును. ఒకవేళ అది పరమాణువు బి-8 సార్లుగా ఉన్నట్లయితే దానినుండి (pink) గులాబీ రంగు వచ్చును. మరియు అణువు పరిమాణములు మరియు అణువు పరిమాణములు మరియు ఫలానా, ఫలానా నుండి నలుపు రంగు వచ్చును. ఇప్పుడు మానవ జ్ఞానము దానివెనుక యుండుటను మనము చూడగలము. ఆ జ్ఞానమే దానినుండి నలుపు రంగును తెచ్చినది.
మరి అట్లైతే ఆ జ్ఞానముకంటే ఇంకా అతీతమైనది, దానికన్నా ఎంతో అతీతమైన దానిని మీరు గైకొనినట్లైతే, అది ఒక సృష్టించబడిన కార్యముగా ఉన్నంతవరుకు, అది ఒక సృష్టికర్త నుండియే రావలసియున్నది. అచ్చట ఒక సృష్టికర్త లేకుండా సృష్టమనునది ఉండ జాలదు. ఇప్పుడు మానవ జ్ఞానము నుండి ఆ రంగు వచ్చినప్పుడు, అది ఏ రంగైనా గాని అది ఒక వంకర కార్యమేయగునని మనము కనుగొన్నాము.
38మరియు ఒక దేవుని కుమారునిగా మారుటకు గల స్వఛమైన, శుద్ధమైన మార్గమును తప్పనిచ్చి వేరే మార్గమున వచ్చు ఏ మార్గమైనాగాని అదొక వంకర కార్యమేయగును. మరి పాపమనగా ఏమిటి? నీతియుక్తమైన కార్యము వంకరగా చేయబడుట. వ్యభిచారము అనగా ఏమిటి? మీరు ఫలించి, అభివృధి పొంది విస్తరించి భూమిని నిండించుడని అని దేవుడు చెప్పిన నియమమును తారుమారు చేయుట. అబద్దమనగా ఏమిటి? నిజమైన దానిని తప్పుగా చెప్పుట. అందుచేత మీరు గమనించండి, మొత్తమంతయూ వంకరగా చేయబడియున్నది.
మరియు స్వచ్ఛమైన మూల రంగు తెలుపు. అది నలుపు రంగుగా ఉన్నప్పటికి మనము మరలా ఆ తెలుపు రంగుని పొందుకోగలము, ఎందుకనగా అది ఎక్కడో తారుమారు చేయబడెను. కాని ఈ నల్లని సిరా చుక్కను ఆ బ్లీచ్ లోనికి వేసినట్లయితే, ఈ బ్లీచ్ ఆ నలుపునంతటినీ తీసివేసి, మరలా ఆ బ్లీచ్ వలె తెల్లగా మారిపోయి తెలుపు రంగును తీసుకొని వచ్చుచున్నది. అయితే మీరెన్నటికీ ఆ నల్ల రంగును కనుగొనలేరు. ఇక ఎప్పటికీ కనబడకుండా దానితో అది అదృశ్యమైపోయినది.
ACTS 10:45,46•
1COR 12:1,10
39ఇప్పుడు, మీ ఉద్రేకమంతటితో పెంతెకోస్తు జనులవలె పైకి క్రిందకి మనము ఎగుర వచ్చు… నేనునూ చేయుదును. అది మంచిదేయని నేను నమ్ముచున్నాను. మనము కూడా అన్యభాషలు మాట్లాడుటకు ఇష్టపడుచున్నాము. అది దేవుని యొక్క వరమని నేను నమ్ముచున్నాను. మీరు ఒక క్రమమైన పద్దతిలో దేనిని చేసినను సాతాను దానిని అనుకరించి అట్లే అది కూడా చేయును, కాని గమనించండి, అందులో ఏదో పొరపాటు గలదని అది చూపించుచున్నది. క్రీస్తు యొక్క జీవము సంఘము ద్వారా ప్రవహించి వెళ్ళవలసిన విధానములో అది లేదు. శరీరము, వధువు వెళ్ళవలసిన విధానము గుండా అది వెళ్ళుట లేదు. చివరిగా ఎచ్చటో ఏదో ఒకటి దానిని అడ్డుకొనుచున్నది.
గమనించండి. ఇప్పుడు నీవు నీ పాపములను ఒప్పుకొనిన యెడల, మరియు నీ పాపములు దేవుని కుమారుని యొక్క "బ్లీచ్" అనబడే రక్తములో పడవేసినయెడల, ఆ రక్తము పాపమును ఎంతగా పరిహరించుననగా ఆయనకు ఇక ఎన్నటికీ జ్ఞాపకములో ఉండనంతగా దేవుని యొక్క మరుపు అనే సముద్ర అగాధములో అవి పడవేయబడి, ఆయన దృష్టిలో అవి మరెన్నడూ జ్ఞాపకములోకి రావు. అట్లైతే అది… ఒక మానవునికి ఏమి చేయుచున్నది. అది అతనిని ఒక దేవుని కుమారునిగా చేయుచున్నది, నీవు ఒక పాపివనే సంగతిని మరెన్నడూ దేవుడు జ్ఞాపకము చేసికొనడు. నీవు ఒక దేవుని కుమారుడవు, నీవు ఒక దేవుని కుమార్తెవు, పాపమును జ్ఞాపకము చేసుకొనుటకు ఇక ఎంత మాత్రము అవకాశమే లేదు. మరుపు అనే సముద్రమగు బ్లీచ్లో సంపూర్ణముగా నీ పాపములను దేవుడు పడవేయుచున్నాడు.
నీ కోసము చిందించబడిన క్రీస్తు రక్తమే సంపూర్ణముగా మరుపు అను సముద్రమైయున్నది. అందుచేత, యేసుక్రీస్తు యొక్క కృప ద్వారా తండ్రి మరియు కుమారుడు ఏకమై ఉన్నట్లుగా, నీవు మరియు దేవుడు ఏకమై ఉందురు. దీనికొరకు నీవేమియు చేయలేదు గాని, ఇది కేవలము దేవుని కృప వలన మాత్రమే జరిగినది. మీరు ఆయన యొక్క కుమారులు మరియు కుమార్తెలై, ఆయన యొక్క ఆశీర్వాదములకు, ఆయన శక్తికి, ఆయన యొక్క జీవమునకు భాగస్వాములైయున్నారు. నీవు ఆయన యొక్క కుమారుడవైయున్నందున ఆయన యొక్క జీవము నీలో వున్నది.
ఓ, సంఘము దానిని గ్రహించగలిగినటైతే, దానికొరకు ప్రాతినిధ్యము వహించుచున్నవారుగా మనము మాత్రమే ఉండగలము.
JOHN 14:12•
JOHN 15:7
40నాయందు మీరును మరియు మీయందు నా మాటలును నిలిచియుండినయెడల, మీకేది ఇష్టమో అడుగుడి." చూడండి! గనుక "నేను చేయు క్రియలు, నాయందు విశ్వాసముంచువాడును చేయును. వాటికంటే మరి గొప్పవియు అతడు చేయునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను." [యోహాను 14:12] అని యేసు చెప్పుటలో ఏ ఆశ్చర్యము లేదు. ఎందుకనగా, దేవుడు యేసుక్రీస్తులో ఉన్నరీతిగానే, ఒక విశ్వాసియందు కూడా దేవుడు ఉండును. ఆయన క్రీస్తులోవున్నంత సంపూర్ణతగా కాదు గాని, ఆయనలో వున్న విధముగానే నీలోను ఆయన ఉండును, ఎందుకనగా నీవు యేసుక్రీస్తు ద్వారా దేవుని కుమారుడవైయున్నావు.
41ఓ, ఆ యవ్వనుడు మరియు అతని సంఘము ప్రభువు యేసులో వున్న ఒక ప్రత్యేకమైన జీవమును వారు చూచియుందురు. ఆ యవ్వనస్తుడు యేసు యొద్దకు వెళ్ళవలెనని తలంచినప్పుడు, అతని సంఘము దానిని వ్యతిరేకించినప్పటికినీ, దానిని గూర్చి తెలుసుకోవాలనే ఆత్రుత, అందుకొరకు ఒక దప్పికను అతడు కలిగి ఉండి, దేనిని లెక్క చేయకుండా సాహసించి అతడు ప్రభుయేసు దగ్గరకు వచ్చెను. మరియు నిత్యజీవము కొరకు తన పెట్టుబడిని పెట్టుటకు అవకాశమును కలిగియుండిన ఈ యవ్వనస్తుని గూర్చి నేను తలంచితిని; అయితే ఆ విధమైన దానియందు పెట్టుబడి పెట్టుటకు అతడు ఆసక్తిని చూపించలేదు. అతడు తన స్నేహితులతో కలిసి జీవమును కొనసాగించుటకు, మరియు అతడు చేయుచున్న కార్యములలో నిమగ్నమైపోయి తన జీవమును కొనసాగించుచు మరియు వారితో అనుబంధమును కలిగియున్నప్పటికిని పరవాలేదు; అయినను ఆయన యొద్ద తనను సమర్పించుకొనుటకు అతడు ఇష్టపడలేదు.
MARK 16:17
42సంఘమునకు లేఖనములను గూర్చి తెలిసినను అక్కడే గొప్ప సమస్యగలదని నేడు మనము కనుగొన్నాము. ఇప్పుడే బైబిలు కళాశాల విద్య ముగించి వచ్చి ఇచ్చట కూర్చొనివున్న ఈ యవ్వనస్తునికి, వీరికి మరియు ఇచ్చట కూర్చొనివున్న ఈ బాప్టిస్టు సహోదరునికి ఆ వాక్యము గూర్చి తెలుసు. వారు ఈ వాక్యమును అభ్యసించిన విధ్యార్థులు. వారు దానిని అభ్యసించినా గానీ… వారు, "మంచిది, దానిని మేము నమ్ముచున్నాము, మేము అంగీకరించుచున్నాము," అని చెప్పెదరు. ఇది వ్యాధిని బాగుచేయు ఒక మందు సీసావలె యున్నది, చూశారా. ఇది లోక నీతికి సంబంధమగు స్వస్థత కాదు గాని, ఇది ఆత్మ సంబంధమగు క్రీస్తు యొక్క జీవమును ఉత్పత్తి చేయును, గమనించారా. ఈ సువార్తను మీరు గైకొనినయెడల, అప్పుడు మీరు ఈ సువార్తలోని ఒక భాగముగా మారెదరు. మీరు ఈ సువార్తలో ఒక భాగముగా మారినప్పుడు, పెంతెకోస్తు దినమునందు పేతురు, యాకోబు మరియు యోహాను మరియు మిగిలిన వారేవిధముగా చేసిరో వారివలె, మీ జీవితము కూడా జీవించే మరొక అపోస్తులుల కార్యముల గ్రంధమువలె ఉండును. అటువంటి జీవితమును తప్పనిచ్చి వేరేవిధమైనదేదియు అది ఉత్పత్తి చేయదు.
మార్కు సువార్త 16వ అధ్యాయమునందు, "నమ్మిన వారివలన ఈ సూచక క్రియలు కనబడును," అని యేసు చెప్పెను. అయితే ప్రజలు సెమినరీలు, బైబిలు పాఠశాలలు ద్వారా దానిని నేర్చుకోవాలని ఆశించుచున్నారే గాని తమంతట తాముగా దానిని పొందుకోవాలని వారు ఆశించుటలేదు. అయినప్పటికినీ దానిని వారు పొందితిమని తలంచుచున్నారు. అవును. దానిని వారు పొందితిమని తలంచుదురు గాని వారి క్రియలకంటే వారి మాటలన్ని పెద్ద శబ్దముగా వినబడుచుండును. గమనించారా, మీరు ఏమైయున్నారో మీ జీవితమే దానిని రుజువు చేయును.
MARK 4:39•
JOHN 11:43
43కాబట్టి ఇతడు ఆత్మీయ సంబంధమగు వాటియందు ఆసక్తి లేనివాడుగా యున్నాడు, అయినప్పటికినీ ఈ గొప్ప పెట్టుబడియనేది ఏదో ఒక్క రాత్రిలో జరిగిపోయే కార్యము వంటిది కానే కాదు. యేసు అతనితో, "రమ్ము, వచ్చి దీనిలో ఇప్పుడే దుముకుమని," చెప్పే ఒక విషయము కాదు ఇది. యేసు దేవుని కుమారుడనే విషయమును తేటతెల్లగా గుర్తించవలయును.
చనిపోయి సమాధిలోవున్న ఒక మనిషి సమాధి యొద్దకు వెళ్ళి, "లాజరూ! లేచి బయటకురా," అని ఒక మనిషి ఏలాగు చెప్పగలడు, మరి ఆయన దేవుడు కాదా? పది వేల దయ్యములు సముద్రపు అలలను భయంకరముగా ఉప్పొంగునట్లుగా చేస్తూ, ఆ రాత్రి సమయమున పడవ అమరమున తల వాల్చుకొని నిద్రించుచున్న యేసును మరియు ఆయన శిష్యులును సముద్రపు అలలతో ముంచివేయాలని ప్రయత్నించే దెయ్యములను, ఆ తుఫానును ఆయన పడవ అమరమున లేచి నిలబడి, "నిశ్శబ్దమై ఊరకుండమని" గద్దించగానే, ఆ తుఫాను మరియు తరంగముల పొంగు ఏలాగున అణగిపోయెను? అది ఆయన మాటకు లోబడియున్నవి గదా!
PS 14:1•
PS 53:1•
MARK 10:17
44మానవ హృదయము యొక్క లోతులలోనికి చూచి నీవు ఫలానా-ఫలానా, ఫలానా-ఫలానా కార్యములను చేయుచున్నావని ఒక మానవుడు ఏలాగు చెప్పగలడు? ఆయన దేవునిగా ఉన్నందుననే గదా అలాగు చెప్పగలిగెను? ఆ కార్యములే తేటతెల్లగా ఆయనను దేవునిగా రుజువుపరుచుచున్నవి.
అయితే కేవలము కల్పితమైన ఆలోచనలకో లేక ఏదో ఒక మూఢ భక్తిపరునిగా ఉండుటకో అతడిని పెట్టుబడిని పెట్టమని అడుగలేదు. ఏ విధమైన దానిపై తన మూల ధనమును పెట్టుబడిగా పెట్టబోవుచున్నాడనేది అతనికి స్పష్టముగా రుజువుపరచబడినది. "ఇప్పుడు, దీనిని గురించి నాకు తెలియదు" అని ఒకవేళ అతడు చెప్పినట్లైతే, కాని మీరు చూడండి, అతడు ఆయనను "సద్బోధకుడా" అని పిలిచెను. మరియు ఆయనలో ప్రత్యేకమైనదేదో ఉన్నదని అతనికి తెలుసు. అయినప్పటికినీ నిత్యజీవమునకు సంబంధించిన ఔషధమును తీసుకొనుటకు అతడు సిద్దముగా లేడు, ఎందుకనగా దానికొరకు ఏదో ఒకటి చేయమని యేసు అతడిని అడిగెను.
ఈ దినములలోవున్న మనుష్యుల మధ్య దానిని చెయ్యనివ్వకుండా వారిని ఏది ఆటంకపరుచుచున్నది. వారు దేవుడున్నాడని నమ్ముచున్నారు. మంచి జ్ఞాణముగల మనుష్యులెవరూ లేరు గాని దేవుడున్నాడని ఎరుగుటయే జ్ఞాణమైయున్నది, ఎందుకనగా అతడు దేవునిని గుర్తెరుగకపోయినయెడల, అతడు బుద్ధిహీనుడని పరిశుద్ధ గ్రంధము తేటగా చెప్పుచున్నది, అతడొక బుద్దిహీనుడు, గమనించారా. "బుద్దిహీనులు తమ హృదయములో దేవుడు లేడని అనుకొందురని," పరిశుద్ద గ్రంధము చెప్పుచున్నది. ఒకవేళ ఈ యవ్వనస్తుడు దేవుడున్నాడని విశ్వసించి యున్నయెడల, సమస్తము నుండి వేరుపరుచుకొని తనను వెంబడించమని ప్రభుయేసు అతడిని చూచి అడిగినప్పటికినీ, ఆ యవ్వన వ్యాపారవేత్త ఈ విధమైన దానియందు తన పెట్టుబడిని పెట్టుటకు అతడు ఇష్టపడలేదు.
45ఏ మనిషిలో లేని ఏదో ఒక ప్రత్యేకమైనది యేసులో ఉండుటను అతడు కనుగొనెను. ఆ యాజకులలో లేని ప్రత్యేకమైనదేదో యేసులో ఉన్నదని అతడు చూచెను. అక్కడ అతడు ఎరిగియున్న ఉపదేశకులలోగాని, రబ్బీలుగా పిలువబడే బోధకులలోగాని ఎవరిలోను లేని ఒక ప్రత్యేకమైనదాన్ని యేసు కలిగియుండుటను చూచెను. కాని యేసులో ఉన్నదానిని గుర్తించి మరియు అదే ఆయనను దేవునిగా చేయుచున్నదని అతడు కనుగొనెను.
"మంచిది, నేను వెళ్ళినట్లయితే, ఇవన్నీ చేయనవసరములేదు… అదేమైయున్నదో అక్కడకు వెళ్ళి నేను దానిని తెలుసుకుంటాను" అని అతడు తలంచెను. కాని అచ్చటకు వచ్చుటకు ఒకే ఒక్క మార్గము కలదని అతడు కనుగొనెను. కావున నేడు ఈ లోకము నేర్చుకోవలసిన మార్గము అదేయగును. క్రీస్తే ఆ మార్గము. ఆ మార్గము ఒక సంఘము కాదు, ఏదో ఒకదానిలో అనుబంధమును కలిగి ఉండుట కాదు, ఆ మార్గము సంఘ శాఖ కాదు. అవన్నీ మంచిదే, ఆ విధానమందు నాకు వారియందు ఏ వ్యతిరేకము లేదు. అయినప్పటికిని అదే క్రీస్తుయని, మరియు అదే నూతన జన్మకు మార్గమైయున్నదని గ్రహించవలసియున్నది.
MATT 5:14,15•
MARK 4:21•
LUKE 8:16•
LUKE 11:33•
HEB 13:8
46మనుష్యులారా, ఈ పట్టణమునకు సంబంధించిన వ్యాపారవేత్తలారా, మీరిచ్చటకు వచ్చి కూర్చొనియుండగా మీ యొక్క సంఘములను నేను ఖండించుట లేదు. మీరు ఇచ్చటకు వచ్చినందులకై మిమ్ములను మేము అభినందించుచున్నాము. ఈ ఉదయ కాలమందు మీకు గొప్ప నిశ్చయతనే ఒకదానిని అమ్మవలెనని నేను ప్రయత్నించుచున్నాను. దీనిని మీకు అమ్ముటకు నేను ప్రయత్నించుటలేదు గాని దీనికి నేను ఒక ప్రతినిధిగా ఉన్నాను. ఇవ్వబోయే ఈ భీమా ఉచితముగా మీకు ఇవ్వబడుచున్నదని నేను చెప్పకోరుచున్నాను. అది యేసుక్రీస్తు నిన్న, నేడు, మరియు నిరంతరము ఏకరీతిగా ఉన్నాడనే వాక్యము ద్వారా, మారని ఆయన యొక్క అదే క్రియల ద్వారా, మారని ఆయన యొక్క అదే సూచనల ద్వారా, మారని ఆయన యొక్క అదే సువార్త ద్వారా మరియు మారని దేవుని వాక్యము ద్వారా ఈ భూమిమీద నేడు అది చాలా చక్కగా గుర్తింపబడియున్నది. ఆ విధముగానే ఆయన వీటిద్వారా ఖచ్చితముగా రుజువుపరచబడియున్నాడు.
ఈ ఉదయకాలమందు మీరు ఏదో ఒక కారణమునుబట్టి ఇక్కడ వున్నారు. ఎందువలన? ఎందువలన, మీరిక్కడ వున్నారు? నీలోవున్న ఏదో ఒక మెల్లని శబ్దము దానిని గూర్చి చెప్పుచున్నది. ఇప్పుడు మిమ్మల్ని మీ సంఘమును విడిచి పెట్టమని నేను చెప్పుట లేదు. కాని నీవు నీ సంఘము నుండి ఇచ్చటకు వచ్చినప్పుడు ఉన్నదానికంటే ఇచ్చటి నుండి ఒక మంచి యోగ్యమైన వ్యక్తిగా నీ సంఘమునకు నీవు వెళ్ళినప్పుడు, కొండమీద పెట్టడిన ఒక దీపమువలె నీవు ప్రకాశించుచుందువు. కాని ఒక దీపమును ఎవ్వరూ గంప క్రింద పెట్టి మరుగు చేయజాలరు గదా! నీవు నిత్యజీవమునుగలవానిగా ఉండెదవు.
REV 3:17
47నేడు జనులు ఏ స్థితియందు ఉన్నారో సరిగ్గా అది వారిని అదే స్థితియందు ఉంచుచున్నదని ఇప్పుడు మనము కనుగొనివున్నాము. పరిశుద్ధ గ్రంధము ఇచ్చట ఈ రీతిగా చెప్పుచున్నది… ఇక్కడ వ్రాయబడిన ఒక లేఖనము నా యొద్ద ఉన్నది. దాన్ని నేను ఒక మాదిరిగా చూపించాలని ఆశించుచున్నాను. యేసు, ప్రకటన 3వ అధ్యాయములో ఈ విధముగా చెప్పెను, లవొదికయ సంఘము, చివరి సంఘ కాలమది. అవును, మనమందరమూ ఈ చివరి కాలమందు జీవించుచున్నామని నమ్ముచున్నాము. ఇదే చివరి సంఘ కాలము.
ఈ ధనవంతుడైన యవ్వనస్తునితో ఇప్పుడు ఈ సంఘ కాలమును సరిపోల్చి చూస్తూ, వారిని కూడా సరిపోల్చి చూద్దాము. ఇప్పుడు, "లవొదికయ సంఘము చాలా ధనవంతురాలు, ధనవృధి చేసుకొని, ఏ కొదువలేనిది"గా ఉండునని యేసు చెప్పలేదా? నేడున్న సంఘము యొక్క పరిస్థితి అలాగే వున్నది కదా? అయినప్పటికీ లూధరు, వెస్లీ మరియు పెంతెకోస్తుయనే మూడు సంఘ కాలముల ద్వారా క్రీస్తు తనను బయలుపరచుకొనియున్నాడు. నీతీకరణము, శుద్దీకరణము, మరియు పరిశుద్ధాత్మ బాప్తిస్మము, వరములు యొక్క పునరుద్దరణ; వ్యక్తిగత గుర్తింపు ద్వారా ఆయన తనను వారిమధ్య బయలుపరచుకొను… ధనవంతులైన యవ్వన అధికారులను మీరు, చికాగో పట్టణములోని వ్యాపారవేత్తలారా, ఈ ఉదయ కాలమున…
MATT 5:6•
LUKE 6:21•
REV 3:20
48లవొదికయ… మిగతా అన్ని సంఘ కాలములలో యేసు వారిమధ్య ఉండుటను మనము కనుగొనవచ్చును; అయితే ఈ లవొదికయ సంఘ కాలమున మాత్రమే సంఘమునకు వెలుపల నిలబడి వుండి, తలుపు తట్టుచు, లోపలికి వచ్చుటకు ప్రయత్నించుచున్నాడు. సంఘములు వాటియొక్క తలుపులు మూసివేసినప్పటికినీ (కొంత సమయము క్రిందట ఒక సహోదరుడు చెప్పినట్లుగానే) ఎంతో పరిపూర్ణమైన క్రీస్తు యొక్క పోలికయందు ఆయన తన సంఘమందు బయలుపడి రావలసిన కాలము ఈ సంఘ కాలమందేయగును. అయినను, "ఎవరైనా ఆకలి లేదా దప్పిగొన్నట్లయితే…" ఆయన సంఘమునకు వెలుపల నిలువబడి ప్రేమతో తలుపును తట్టుచున్నాడు. మీరు దీనిని అర్థము చేసుకున్నారా?
ఎక్కడైతే ఆ తలుపు మూసివేయబడియున్నదో మీరు ఊహించి చూడండి, అదే లవొదికయ సంఘ కాలమగును. అది ఆ విధముగానే ఉండునని పరిశుద్ధ గ్రంధము చెప్పుచున్నది.
ACTS 2:38
49ఆ విధమైన వర్తమానమునకు మరియు ఆ విధమైన వర్తమానికునికి మీ యొక్క మతశాఖ తలుపులను మూసివేసినట్లైతే… నాకు కాదు. నేను మీ సహోదరుడిని, మరియు మీతో సహ-దాసుడను. అయితే క్రీస్తు సంఘమును పరిశుద్దపరుచు ఉద్దేశ్యము కొరకే, పరిశుద్ధాత్మయే ఆ వర్తమానికునిగా వుండి, మానవుల ద్వారా తనను తాను బయలుపరచుకొనుచుండెను.
మరిప్పుడు ఈ నిత్యజీవము కొరకు నీవు ఈ అవకాశమును వినియోగించుకొని నీ పెట్టుబడిని నీవు పెట్టవలసియున్నది. నీ వ్యాపారము న్యాయమైనదిగా మరియు గొప్పదై యుండవచ్చును గాని, నీ స్వకీయ జీవిత రక్షణ కంటే మరే వ్యాపారము గొప్పది కాదు, గమనించారా. నీవు ఆ అవకాశమును కలిగియున్నావు.
MARK 10:22
50నీ సంఘము ఆయనను వెలుపలనే ఉంచవచ్చును, సంఘములన్నీ ఆయనను వెలుపలనే ఉంచవచ్చును. కాని యేసు ఎన్నడూ కేవలము ఒక సంఘము కొరకు మాత్రమే రాడు లేక ఒక ప్రత్యేకమైన గుంపు కొరకు రాడు. ఆయన వ్యక్తిగతముగా సంధించుటకు వచ్చును. "మీరు పరిశుద్ధాత్మను పొందుదురు," ఇది కేవలము వ్యక్తిగత అనుభవమైయున్నది. ఇప్పుడు ఆయన అందుకొరకు మాత్రమే వచ్చును.
ఇప్పుడు ఆ యవ్వనస్తుడైన అధికారి తనకు దొరికిన మంచి అవకాశమును జారవిడుచుకుంటూ మోమాటము లేకుండా అతడు వెనుదిరిగి పోయినట్లుగానే, ఈ లవొదికయ సంఘ కాలము కూడా తన పెట్టుబడిని పెట్టుటకు మంచి అవకాశమును కలిగివుండియు గ్రుడ్డిగా దానిని త్రోసివేసినదని మనము కనుగొనగలము. ఆలాగుననే ఈ లవొదికయ సంఘము కూడా గ్రుడ్డిగా ఆయనను త్రోసివేసి వెనుదిరిగి పోయి ఆయనను సంఘమునకు వెలుపలకు నెట్టివేసినది. వారి ప్రేమ…
51కాబట్టి ఈ యవ్వన అధికారి ఏమి చేసెను? అతడేమి చెప్పెను? అతడు విచారముతో వెళ్ళిపోయెను, ఎందుకనగా అతడు మిగుల ఆస్తిపరుడైయుండెను. అది అతడికి లభించిన ఒక గొప్ప అవకాశమై ఉన్నప్పటికీ, గొప్ప ఐశ్వర్యవంతునిగా అతడు ఉన్నందున, అది తన సంపదకు ఆటంకముగా ఉండునని అతడు తలంచెను.
నేను ఆశ్చర్యపడుచుందును, ఒక వ్యక్తి, కివానీస్ అనే సాంఘిక సమాజము నందుగాని లేదా సమాజమునందుగాని లేదా సంఘమునందుగాని, ఒక సంఘ కాపరిగా కాని, ఒక గొప్ప సంఘ శాఖయందు పేరు ప్రఖ్యాతలు కలిగి ఉండినయెడల, ఆ యవ్వన ధనవంతునివలె అదేలాగ అవకాశము లభించినను దాని నుండి దూరముగా తొలగిపోవును మరియు తన తలను త్రిప్పుకొని అచ్చట నుండి చల్లగా తప్పించుకొని వెళ్ళిపోవును, ఎందుకనగా సంఘములో నీవు కలిగియున్న నీ స్వాస్థ్యమును అది భంగపరుచును.
నీవు నీ సంఘమునందు అనేక కార్యములలో నాయకునిగా వుండవచ్చు, నీ సంస్థయందు ఎంతో గొప్పవాడవై యుండవచ్చు, కాని ఈ ఉదయ కాలమున అలాంటి కార్యములన్నింటి నుండి తొలగిపోవుట చాలా అవశ్యము. మేము ఈ, ఈ సంఘములకు చెందినవారమని చెప్పుకొనేవారు, ఈ ఉదయ కాలమున వ్యాపారవేత్తలుగా ఇచ్చట కూర్చొనివున్న మీకు ఇది ఆశ్చర్యముగా ఉన్నదా? దీనిని గూర్చి ఆలోచించుము. ఈ సంపన్నుడైన యవ్వన అధికారి తనను సమర్పించుకొనుటకు వచ్చినను అచ్చట నుండి వెనుదిరిగి వెళ్ళిపోయెను, క్రీస్తు తన శిష్యులవైపు తిరిగి, సంఘ కాలములలో ఈ అంత్యదినములయందు ఆ విధముగానే ఉండునని చెప్పెను.
ఇప్పుడు, ఈ చికాగో పట్టణమునకు ఆ అవకాశము వచ్చినది, ఇప్పుడు నీవు ఒక మంచి తీర్మానమును నిర్ణయించుటకొరకై అది మీ ముందు ఉంచబడినది. సమయము గతించిపోవుచున్నది. నీవు తీసుకోవలసిన నిర్ణయము ఒక్కసారి మాత్రమే, గనుక తప్పక మంచి నిర్ణయమును గైకొనవలసియున్నది. ఆయన ఆత్మతో జన్మించుటకు, క్రీస్తు కొరకు ఒక మంచి తీర్మానమును ఇప్పుడే గైకొనుము.
MATT 6:21•
LUKE 12:34
52ఇప్పుడు ఈ ధనవంతుడు లోకమును ప్రేమించుచున్నాడు, గనుకనే అటువంటి తీర్మానమును గైకొని వెనుదిరిగిపోయెను. అతడు యేసు క్రీస్తుని ప్రేమించి ఆయనతో సహవాసము కలిగి వుండుటకంటే, తన సంస్థను ఎక్కువగా ప్రేమిస్తూ దానియందు సహవాసమును కలిగి వుండుటకే అతడు ఆశించెను. ఈ ఉదయకాలమున మీలో చాలామంది ఈ విధముగా, "మంచిది, నేను ఒకానొక పెంతెకోస్తునకు చెందినవాడిని. నేను ఆ విధముగా చేసినట్లైతే, నేను ఒకానొక పరిశుద్ద గుండ్రాయిగా పరిగణించబడుదును." ఇప్పుడు, ఎలాగైతేనేమి? నీ ధనమెక్కడ వుండునో నీ హృదయము కూడా అక్కడే వుండును. అది నీ సంఘమందు ఉన్నదా? అది నీ వ్యాపారమునందు ఉన్నదా? లేక అది పరలోకమునందు ఉన్నదా? "మీ ధనమెక్కడ ఉండునో అక్కడనే మీ హృదయము ఉండును." కాబట్టి ఈ ఉదయ కాలమున నీవెందుకు నీ జీవితము కొరకు పెట్టుబడిని పెట్టకూడదు? బహుశా, ఏదో ఒక దినమున నీ వ్యాపారము బూడిదగా మారును.
2PET 3:7,10,12
53నేనెరుగను గాని, ఆ సోదరుడు దానిని ప్రవచించెను. మరియు సోదరులైన మీరు, సముద్ర తరంగముల యొక్క అలల కంటే అది ఇంకా భయంకరముగా ఉండవచ్చును. అయితే నేనొక విషయము చెప్పగోరుచున్నాను. ఈ భూమి అగ్నితో కాల్చబడునని పరిశుద్ధ గ్రంధము చెప్పినదానిని నేనెరుగుదును. మరియు ఈ చికాగో పట్టణమున అగ్ని విపత్తు ఎన్నడూ సంభవింపక యుండవచ్చును గాని రాబోవు దినములయందు అది సంభవించిన ఏమగును. మరియు దేవుడు… ఈ చికాగో పట్టణము దేవుని ఉగ్రత నుండి తప్పించుకొనజాలదు, తప్పించుకోలేదు.
ఒక ప్రియమైన స్నేహితుడు జాకీమూర్, "సువార్తను త్రోసివేసి, వారి ఇష్ట ప్రకారముగా కార్యములను చేస్తూ, ఈ లోకములోవున్న పాప సంబంధమైన కార్యములతో జీవించుచు, అవినీతిగా ప్రవర్తించుచు మరియు లోక సంబంధమైనవన్నింటిని చేసినను ఒకవేళ దేవుడు వాటిగూర్చి పట్టించుకోకుండా ఈ తరము వారిని క్షమించినయెడల, మరి అలాగైతే అగ్ని గంధకముతో కాల్చి బూడిద చేసిన సొదమ, గొమెర్రాలోని వారిని ఆయన మరలా జీవముతో లేపి వారిని కాల్చివేసినందుకు ఆయన వారికి క్షమాపణ చెప్పవలసి వుంటుందని," చెప్పియున్నాడు.
MATT 16:24•
MARK 8:34•
MARK 10:21•
LUKE 9:23•
ACTS 24:14
54కావున వారు నిరాకరించిరి, వారు దానిని విసర్జించిరి. మరియు క్రీస్తు ఈ భూమిమీద ఉన్నప్పుడు వారు ఆయనను ముఖాముఖిగా చూచిరి, ఆయన తన సేవను ప్రపంచ వ్యాప్తముగా అందరికీ తెలుయునట్లుగా గొప్ప ఆర్బాటముగా చేయలేదు. అతి పెద్ద ఉజ్జీవమంటూ ఏదైనా వుంటే, అది క్రీస్తు యొక్క కదిలింపుగా ఉన్నది. అదే ఆయనలో గల తగ్గింపు. అంతెందుకు, ఆయన ఈ భూమిపై సేవచేయుచున్న దినములలో, ఆయన తన పరిచర్యను ముగించి వెళ్ళిపోయేంత వరుకు కూడా పాలస్తీనాలోని యూదులకు మూడులో ఒక వంతువారికి కూడా ఆయనను అసలు ఎరగనివారు గలరు. ఎంతో కాలము గతించి పోయేంత వరుకు కూడా సంభవించిన కార్యములను గూర్చి వారికి తెలియనే తెలియదు.
కావున ఈ ఉదయకాలమున వ్యాపారవేత్తలుగా, మనలను మనము సమర్పించుకుంటూ యేసు క్రీస్తునందు మనము మన పెట్టుబడిని పెట్టుటకు గల ఈ ప్రత్యేకమైన దినమును గూర్చి ఆలోచించండి. పరలోకమునందుగల ఆ గొప్ప నిధిని సంపాదించుకొనుట కొరకు, ఈ లోకమందున్న వాటిపైగల మీ వాంఛలను సమస్తమును విడిచి మిమ్ములను మీరు సమర్పించుకొనుటకు మీరు సిద్దపడండి. యేసు చెప్పినట్లుగా, "మీ సిలువ నెత్తుకొని వచ్చి, మీరు నన్ను వెంబడించుడి."
"ఎంతో ప్రసిద్ధి చెందిన, వైద్యుడుగారైన మీరు, మా సంఘమునకు వచ్చి ఇచ్చట మాతో మీరు ఉన్నందుకు మాకెంతో భాగ్యము. ఓ, డీకను, మీరు ఉండుట చాలా మంచిది…" అని అందరూ మెచ్చుకొనేలాగా ఈ లోకమునవున్న పేరు ప్రఖ్యాతులతో ఆయన యొద్దకు మీరు రాలేరు.
గమనించండి, ఇది ఒక సిలువ, మరియు పిచ్చివాడని, మూఢభక్తి గలవాడని, వారు నిన్ను ఆ రీతిగా పిలువవచ్చు. నీవు కూడ పౌలువలె శోధింపబడుదువు. "వారు మత భేదముని పేరు పెట్టు ఈ మార్గము చొప్పున నా పితరుల యొక్క దేవునిని నేను ఆరాధించుచున్నానని," పౌలు చెప్పెను. దేవుని కొరకు యుక్తమైన నిర్ణయములను తీసుకొని, మనకన్నా ముందే మంచి మాదిరిగా జీవించినవారు మన ముందు అనేకులు గలరు.
MAL 3:6•
JOHN 1:1
55మరియు జ్ఞాపకముంచుకొనుడి. పరి. పౌలును మరియు ధనవంతుడగు ఈ యౌవ్వనస్తుని, ఇద్దరిని పోల్చిచూడండి. పౌలు అనే ఈ మనిషి ముందు కూడా ఒక గొప్ప అవకాశమును ఉంచినప్పుడు, దానికొరకు అతడు తనను సమర్పించుకొని మరియు దానిని అంగీకరించెను.
ఇప్పుడు, వారు ఎట్టి తీర్మానమును తీసుకున్నారో నీవు చూడగలవు, మరియు ఆ స్థలమందు నిన్ను నీవు ఉంచుకొని ఇప్పుడు నీవు తీసుకోబోయే తీర్మానము ఎట్లుండునో జాగ్రత్తగా చూచుకొనుము. నీవు దేవుని వాక్యముపై ఆధారపడవలెను. అది మారనిది… దేవుని వాక్యము, దేవుని వాగ్దానము మారనిది. దేవుడు ఒక కార్యమును చేయలేడు, చెయ్యరానిదేదో వారు చేసి, దేవుడు అసలు మొట్టమొదటే ఏదో పొరపాటు చేసెనని దానిగూర్చి వ్యతిరేకముగా చెప్పెదరు. లేదు. దేవుడు అలాగు చేయడు. దేవుడెన్నడూ మారని వాడు. ఆయన దేవుడైయున్నాడు, మరియు దేవుడు వాక్యమైయున్నాడు.
MATT 12:32•
MARK 3:29•
LUKE 12:10
56ఇప్పుడు దేవుని కుమారుడెవరనేది ఈ వాక్యము చక్కగా రుజువుపరచెను. ఇతర వ్యక్తులలో లేని ఏదోక ప్రత్యేకత యేసునందు కలదని అతడు చూచెను. కాని దానిని పొందుకోవాలంటే చెల్లించవలసిన వెల ఎంతో అమూల్యమైనది. లవొదికయ సంఘము అందుకొరకు నేడు ఎంతో గొప్ప మూల్యమును చెల్లించవలసియున్నది.
అయితే గుర్తించుకొనండి, అందుకొరకే యూదుల సమాజ మందిరమ నుండి వారు బయటకు వెళ్ళిపోయిరి. వారు ఆయనను యూదుల సమాజ మందిరములో నుండి వెలుపలకు వెళ్ళగొట్టిరి, ఎందుకనగా ఆ యూదుల సమాజ మందిరమునందు ఆయనకు స్థలము లేదు. నేడున్న సంఘ సంస్థలు కూడా క్రీస్తును వారి సంఘ సంస్థల నుండి వెలుపలకు త్రోసివేసిరి. ఆయనే సజీవమగు ప్రత్యక్షతయే, తద్వారా ఆయన తనను నిరూపించుకొనుచున్నాడు. రుజువు పరచబడిన దేవుని వాక్యమునకు వ్యతిరేకముగా ఏ వ్యక్తియు నిలువజాలడు. ఆనాడు ఆయన ఏ అద్భుత కార్యములను చేసెనో అదే అద్బుత కార్యములు తన జనుల ద్వారా చేస్తూ క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఆయన తన ప్రజలలో జీవించుచున్నట్లుగా తనను నిరూపించుకొనుచున్నాడు. దీనికి వ్యతిరేకముగా ఒక్క మాట మాట్లాడినను అది మన్నింపతగనిది. ఈ లోకములో గాని లేదా రాబోవు లోకమందుగాని దీనికి వ్యతిరేకముగా ఉన్నదేదైనను అది ఎన్నటికీ మన్నింపతగనిది.
GEN 18:10,13,22,29,32•
LUKE 17:28
57ఇది చివరి సంఘ కాలమైయున్నది. ఇది మరేయితర సంఘ కాలముల వంటిది కాదు. ఈ సంఘ కాలమందు అది ఈ విధముగానే ఉండవలసియున్నది. ప్రతీ గడియారము, మనము ఒక నిర్ణీత సమయమును కలిగియున్నట్లైతే, అది తనంతట తానే ఈ కాలమందు సరిపోల్చుకొనుచు దానిని నిరూపించును. దేవుని వాక్యము ఇప్పుడు నెరవేరియున్నది, పిలువబడిన సంఘమునకు చిట్టచివరి వాక్యము…
సొదొమ మరియు అబ్రాహాము దానికి మాదిరిగా యున్నాడు. సొదొమ గూర్చి ఖచ్చితముగా ఎంతగానో ఆయన వ్యక్తపరచియున్నాడని ఇప్పుడు జ్ఞాపకముంచుకోండి, గమనించారా. ఆయన, "లోతు యొక్క దినములలో సొదొమకు సంభవించిన విధముగా యుండునని చెప్పియున్నాడు. ఈ ఆధునిక కాలపు బిల్లీ గ్రహంను చూడండి, దూతలైయున్న ఇద్దరు వర్తమానికులు సొదొమలోనికి వెళ్ళిరి. దానిలోనున్న ప్రజలను బయటకు రమ్మని పిలుచుచుండిరి, అక్కడ ఒకవేళ నలువది మందైనా నీతిమంతులను వారు కనుగొని యున్నయెడల, లేదా కనీసము పదిమందైనా ఉన్నయెడల, ఒకవేళ దేవుడు తన మనస్సు మార్చుకొనియుండును, కనీసం అక్కడ పదిమందిని కూడ వారు కనుగొనలేకపోయిరి.
ఈ గొప్ప సువార్తికుడైన బిల్లీ గ్రహం మరియు జాక్ షూలెర్ యొక్క మెథడిస్టు జనులగు మీరు, మరియు ఓ, ఓరల్ రాబర్ట్స్ యొక్క పెంతెకోస్తు ప్రజలగు మీరు, అచ్చట బబులోనులోనున్న వాటికి తగినట్లుగా వున్న ఈ సంఘ సంస్థలతో మీరేవిధముగా ఏకీభవించుచున్నారు?
LUKE 17:30
58అయితే గుర్తుంచుకొనండి, అబ్రాహాము అటువంటి వారితో ఏ ఒక్కరితోను సరిపోల్చబడుట లేదు. అతడు ఒక పట్టణము కొరకు ఎదురు చూడలేదు; అతడు దేవుని రాజ్యము కొరకు ఎదురుచూచెను. అతడు ఒక చిన్న గుంపుతో ఉండెను. అబ్రాహాము దగ్గరకు వచ్చిన ఆ ముగ్గురు మనుష్యులలో ఒకరు అతని దగ్గరే ఉండి, ఆయన ఆ గుడారమునకు వెనుక నిలిచియుండి ఒక సూచన ద్వారా తానెవరో అతనికి చూపించెను. ఎట్లనగా, ఆయన గుడారమునకు వెనుక వైపున తిరిగి యుండెను, ఆ గుడారము లోపలవున్న శారా తన హృదయములో ఏమి అనుకొని నవ్వుకున్నదో దానిని ఆయన తెలుసుకొనెను, అదే హృదయ రహస్యములను వివేచించు ఆత్మయైయున్నది. యేసు దానిని స్పష్టముగా చెప్పెను…
దానిని ఇప్పుడు జ్ఞాపకముంచుకోండి, సొదొమ కాలిపోయేంత వరుకు అచ్చట వేరే ఏ సూచన ఇవ్వబడలేదు. అదేవిధముగానే ఈ భూమిమీద అగ్ని పడుటకు ముందుగా, ఆయన తన సంపూర్ణతతో, తన సంఘమందు క్రీస్తు తన శక్తితో బయలుపడుటను ఆఖరి సూచనగా సంఘము చూడబోవుచున్నది. నోవాహు దినములలో జలప్రళయము వచ్చినట్లు ఆ గతమువలె కాదు, కాని లోతు దినములలో ఆకాశము నుండి అగ్ని కురియునట్లుగా, అని జ్ఞాపకముంచుకోండి. లోతు దినములలో జరిగిన విధముగానే, ఈ దినములలో ఏ విధమైన పరిచర్య జరుగుననే మాదిరిని క్రీస్తు వ్యక్తపరిచెను. అదే విధముగా ఆయన సంఘమందు పరిశుద్ధాత్మ సంచరించుటను ఇప్పుడు మనము చూచుచున్నాము. అప్పుడున్నట్లుగానే ఇప్పుడున్న ఈ లవొదికయ సంఘ కాలము యొక్క పరిస్థితి ఉండుటను మనము కనుగొన్నాము.
MARK 16:15,17•
JOHN 14:19
59ఈ మనుష్యుడు ఆ భీమాలో తన పెట్టుబడిని పెట్టి హక్కుదారునిగా ఎందుకు అవ్వలేకపోయెనో ఇప్పుడు మనము కనుగొందాము: ఎందుకనగా అతడు లోక కార్యములలో బహుగా ఐక్యమైపోయి వాటిని విడిచి రాలేకపోవుట వలననే. మరియు ఈనాటి సంఘము యొక్క పరిస్థితి కూడ ఆ విధముగానే వున్నది.
యేసు ఈలాగు చెప్పలేదా, "నమ్మువారికి ఈ సూచక క్రియలు వెంబడించును," దీనికి వ్యతిరేకముగా నిలబడు మానవుని యొక్క సాధారణ జ్ఞానమైనా, పోపైనా, సర్వాధికారియైనా లేదా వేరేదైనా గాని దానిని త్రోసివేయును. ఎంతవరకు? "సమస్త ప్రపంచము, ప్రతి ప్రాణి," ఈ విధముగా చెప్పి యుండలేదా, "కొంత కాలము, ఈ లోకము, ఈ లోక విధానము ఇక నన్ను చూడదు లేక సంఘ పద్దతులు," అని యేసు చెప్పలేదా, సంఘ సిద్ధాంతములతో, పద్ధతులతో, ఈ లోక పద్ధతులతో, ఈ లోక కార్యములతో ఆయనను చూడగలమని వారు తలంచుదురు.
60ఈ లోకము యొక్క మేధాశక్తితో ఎంతమంది మానవులు లేచినను లెక్కలేదు, ఎందుకనగా దేవుని యొక్క రాజ్యము ఎన్నటికీ ఈ లోక సంబంధమైనది కాదు.
ఆ ప్రజల్ని నేను తీర్పు తీర్చుట లేదు గాని, సాతాను యొక్క కుయుక్తిని మీకు చూపించుటకు నేను ప్రయత్నించుచున్నాను. వారు దానిని గ్రహించలేరు. అది ఎంత గొప్పదైనా నాకు లెక్క లేదు. పెంతెకోస్తులైన మీరు కోరుకొను… ఏకత్వపువారగు మీరు త్రిత్వమును వెంబడించు వారందరితో ఐక్యమగుటకు కోరుకొనుచున్నారు. మరియు ఆ విధముగానే త్రిత్వము వారు ఏకత్వమును వెంబడించు వారందరితో మరియు చర్చ్-ఆఫ్-గాడ్ వారితోను మరియు ఇంకా అనేకులతో, ముప్పైకు పైగా ఉన్న సంఘ సంస్థలన్నిటితో, అందరూ ఒక్కటిగా ఏకమవ్వవలెనని ఆశించుచున్నారు. మెథడిస్టులు, బాప్తిస్టులు, మరియు మొదలగు మీరందరూ అదే విధముగా అందరితో ఐక్యమవ్వాలని కోరుకొనుచున్నారు.
JOHN 18:36•
REV 13:14
61మరియు ఆ రీతిగా ఈ సర్వ సంఘ శాఖల యొక్క సమాఖ్య, తమ తమ సమస్యలను గూర్చి చర్చించుటకు వారందరూ ఈ వారమందు సమకూడుచూ ఏకమవ్వాలని కోరుకొనుచున్నారు. దానిని వారు చేయుదురు. దానిని వారు చేయుదురని పరిశుద్ధ గ్రంధము చెప్పుచున్నది. "వారు ఆ మృగము కొరకు ఒక ప్రతిమను తయారు చేయుదురు." అది ఎచ్చటి నుండి వచ్చుచున్నదో దాని వెనుక దాగియున్న మర్మమును మీరు చూడగలుగుచున్నారా? "మృగము" అనగా శక్తి లేదా అధికారమై యున్నది. అది ఒక అధికారమును కలిగియుండును గాని, అది తప్పుడు అధికారమైయున్నది.
నా రాజ్యము ఇహలోక సంబంధమైనది కాదు. ఒకవేళ ఇదేయైతే ఆయన దూతలు దానికొరకు పోరాడుదురని యేసు చెప్పెను. "నా రాజ్యము పై నుండి వచ్చియున్నది," అని ఆయన చెప్పెను. ఏదో గొప్ప దానిని సాధించుటకు దేవుని యొక్క రాజ్యము సంఘ సంస్థయందు ఉండదు. అది దేవుని యొక్క శక్తియై యున్నది, పరిశుద్ధాత్మ మానవ జీవితములో నివాసమైయున్నది.
JOHN 1:1,14•
JOHN 6:63
62(ఇప్పుడు త్వరపడెదము. ఎక్కువ సమయము మిమ్మును ఇచ్చట ఉంచగోరుట లేదు. ఇప్పటికే చాలా సమయము మిమ్మల్ని ఇచ్చట వుంచాను. ఇప్పుడు కొద్ది నిమిషములైనా నాకు గలవా? అవును, సరే, త్వరగా చూద్దాము. ఇప్పుడు నేను దేనిని గూర్చి మాట్లాడుచున్నానో మీరు గ్రహించుచున్నారని నేను తలంచుచున్నాను.)
ఇప్పుడు ఈ నిత్యజీవమనే భీమాగల హక్కుదారులను గూర్చి, నిత్యజీవము కొరకై పెట్టుబడిని పెట్టినవారిని గూర్చి, దేవుని వాక్యమనే భీమా గల హక్కుదారులను గూర్చి, అటువంటివారిని కొందరిని గూర్చి ఇప్పుడు అన్వేషించి చూద్దాము. జ్ఞాపకముంచుకొనండి, దేవుడు అక్షర రూపములో వున్నాడు. "నా మాటలు ఆత్మయు జీవమైయున్నవని," యేసు చెప్పెను. ఆయన దానిని అలాగే చెప్పెనా? ఆయన ఈ విధముగా కూడా చెప్పియున్నాడు. పరి. యోహాను సువార్త మొదటి అధ్యాయమునందు, పరిశుద్ధ గ్రంధము మనకు చెప్పుచున్నదేమనగా, "ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుడై యుండెను, ఆ వాక్యము శరీరధారి అయ్యెను." మీతో ఇప్పుడు చెప్పిన రీతిగానే, "ఆయన మన మధ్య నివసించెను."
HEB 13:8
63ఆయన ఇంకనూ నిన్నటివలె మారనివానిగానే వున్నాడు. ఉండిన విధముగానే వాక్యము ఉన్నది మరియు ఉన్న విధముగానే వాక్యము ఉన్నది మరియు ఆ వాక్యము ఉన్నట్లుగానే వచ్చును. పరశుద్ధ గ్రంధములోనున్న సమస్తమూ ఆయనే. మీరు పరిశుద్ధ గ్రంధమును చదువుచున్నప్పుడు యేసును చూడలేకపోయినయెడల, మీరు మరల తిరిగి వెనుకకు వెళ్ళి, ఆ వాక్యములను చదువుచూ పరిశీలించి కనుగొనుట మంచిది. ఎందుకనగా, ఇది యేసుక్రీస్తు యొక్క సాక్ష్యమైయున్నది. పాత నిబంధన ఛాయగా వుంటూ మరియు క్రొత్త నిబంధన నెరవేర్పుగా యున్నది.
అందుచేత యేసు - ఆయన ఉన్నవాడుగానే ఉన్నాడు (అది చరిత్ర), ఆదిలోనున్న ఆయనే మరలా తిరిగి వచ్చెను (ప్రవచనము). ఆయనే ప్రవచనమైయుండెను, ఆయనే చరిత్ర, ఆయనే కీర్తనలు, ఆయనే ప్రభువగు యేసుగా, ఆయనే పరిశుద్ధ గ్రంధములోవున్న జరుగనైయున్న కార్యములుగా వున్నాడు. కాబట్టి పరిశుద్ధ గ్రంథములో ఉన్నవాడు ఆయనే, యేసుక్రీస్తుగా సాక్ష్యరూపంలో ఉన్నవాడు ఆయనే. పరిశుద్ధ గ్రంథము ఆయనను దేవుని వాక్యమని పిలుచుచున్నది.
మరియు ఒక ప్రమాణము మీదనే దేవుడు ఈ లోకమునకు తీర్పు తీర్చును. ఆయన నిన్ను ఇక్కడ వుంచి, నిన్ను తీర్పు తీర్చినయెడల, అట్లైతే దానికంటూ ఏదోక ప్రమాణము కలిగియుండవలయును. "యేసుక్రీస్తు ద్వారా" అని నీవు అనవచ్చు. ప్రతీ మనుష్యుడు దానినిగూర్చి తనకంటూ ఒక భావనను కలిగియున్నాడు.
64ఇక్కడవున్న చిన్న అమ్మాయి, ఆమె కాతలిక్కు చెందినది. నా పూర్వ స్థితి కూడా కాతలిక్కు చెందినదే, మీకు అర్ధమయ్యింది. నేను ఒక ఐరిష్ వాడను. ఇప్పుడు గమనించండి, కాతలిక్ సంఘము వారు తామే ఆ నిజ సంఘమని చెప్పుచున్నారు. కాని ఇప్పుడు చూచిన, ఎన్నో వివిధ రకములగు కాతలిక్ సంఘములు కలవు, వాటిల్లో ఏది నిజమైన సంఘము? అది దేనికి చెందినది? అది ఒకవేళ రోమన్ కాతలిక్ సంఘమైనయెడల, అట్లైతే గ్రీకు ఆర్తోడాక్స్ సంఘము నశించును. ఒకవేళ అది గ్రీకు ఆర్తోడాక్స్ సంఘమైనయెడల, అట్లైతే రోమన్ కాతలిక్ సంఘము నశించును.
అది ఒకవేళ లూధరన్ సంఘమైనయెడల, మెథడిస్టు సంఘము నశించును. అది ఒకవేళ మెథడిస్టు సంఘమైనయెడల, బాప్టిస్టు నశించును. అది ఒకవేళ పెంతెకోస్తుయైనచో, మిగిలిన సంఘములన్నీ నశించును. ఒకవేళ అది ప్రెస్బిటేరియన్ అయినయెడల, పెంతెకోస్తువారు నశించుదురు. గమనించారా, ఇది చాలా గందరగోళ పరిస్థితిగా యుండును. మీరు దానిని అర్ధము చేసుకోలేరు. ఏది సరియైనది?
వాటిల్లో ఏదియూ కూడా సరియైనది కాదు.
JOHN 14:6•
HEB 13:8
65యేసు, "నేనే మార్గము" [మరియు ఆయనే వాక్యమైయున్నాడు] మరియు ఆయనే సత్యము, జీవమునైయున్నానని," చెప్పియున్నాడు. ఈ మార్గము ద్వారా తప్ప వేరొక మార్గమున ఎవరును రాజాలరు. మీ సంఘము ద్వారా మీరు రాలేరు, మీ సంఘ సిద్దాంతము ద్వారా మీరు రాలేరు, మీ ప్రార్ధన ద్వారా మీరు రాలేరు. మీరు "యేసు" ద్వారా మాత్రమే రావలసియున్నది. ఆయనే దేవుడు. ఆయనే వాక్యము. ఆయనే మార్గము. ఆయనే సత్యము. ఆయనే జీవమైయున్నాడు.
వెలిగించబడని ఒక దీవిటిని ఇక్కడ వుంచి దానిని నీవు వెలిగించినట్లైతే, అది కాంతిని వెదజల్లును. అది దేనిని ప్రతిబింబించును? మొట్టమొదటగా అది వెలిగించినప్పుడు ఏలాగు ప్రతిబింబించెనో, అదే వెలుగును అది ప్రతిబింబించును. దేవుని యొక్క సువార్త ప్రత్యక్షమైనప్పుడు, ఆయన నిన్న, నేడు మరియు నిరంతరము ఒక్కటే రీతిగా యున్నాడు. మీరు దానిని గమనించితిరా?
MATT 4:4•
LUKE 4:4•
JOHN 14:12
66ఇప్పుడు, పెట్టుబడిని పెట్టియున్న భీమా యొక్క హక్కుదారులగు కొందరిని గూర్చి మరియు మానవ జ్ఞానముగల వారియొక్క గొప్ప దినములలో ఏమి సంభవించినదో మనము పరిశీలించి చూద్దాము? మరియొక పది లేక పదిహేను నిమిషములలో దానిని గూర్చి ధ్యానించి మనము ముగించెదము.
నోవాహు దేవుని వాగ్దానమందు మరియు దేవుని వాక్యమందు తన పెట్టుబడిని పెట్టెను. మరియు ఏది దేవుని వాక్యమైయున్నదో దానియందు నోవాహు తన పెట్టుబడిని పెట్టెనని జ్ఞాపకముంచుకోండి. ఒక వ్యక్తి దేనిమీదైతే తన పెట్టుబడిని పెట్టునో దానిని సాతాను గమనిస్తూ ఉండి వెంటనే అచ్చటకు వచ్చి నీవు కలిగియుండు ఆ భీమాను సాతానుకు సాధ్యమైనయెడల నీ నుండి దానిని తీసుకొని వెళ్ళిపోవునని జ్ఞాపకముంచుకొనండి. "మనుష్యుడు రొట్టెవలన మాత్రము జీవించడు," అని వ్రాయబడియున్నది. అది భౌతికమగు జీవము కొరకు, "అయితే దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును." అది కేవలము దానిలోని ఒక్క భాగము మాత్రమే కాదు. అది ఒక చిన్న ముక్కవంటి ఇచ్చట కొంచెము, అచ్చట కొంచెము కాదు గాని, "దేవుని నోటనుండి వచ్చు ప్రతి మాటవలని మనుష్యుడు — జీవాహారము ద్వారా జీవించును. దేవుని వాక్యమనగా ఏమిటి? అది జీవము. ఆత్మయు, జీవమైయున్నది. ఆ వాక్యము ప్రత్యక్షమైనప్పుడు, "నేను నా తండ్రి యొద్దకు వెళ్ళుచున్నాను గనుక నేను చేయు క్రియలు నా యందు విశ్వాసముంచువాడును చేయును, వాటికంటే మరి గొప్పవియు అతడు చేయును."
67నోవాహు తన పెట్టుబడిని పెట్టేటప్పుడు, దానిని అతడు పరిశోధించి చూచి తన పెట్టుబడిని పెట్టెనని మనము కనుగొంటిమి. కావున నా సోదరుడా, నీవు దీనిని చేయుదువా? ఒక శోధన సమయమనేది నీకు లేనియెడల, నీవు ఇంకా నీ పెట్టుబడిని దానిమీద పెట్టలేదని తెలియుచున్నది. ఎందుకనగా, నీ శత్రువు నీ వెనుకనే నిలబడి నీ వీపు వెనుక తుపాకీని గురిపెట్టి ఉంచి మరియు తన విల్లుతో అంబులను సంధించుచూ, ప్రతీ విషపు ఈటె ద్వారా నీపై దాడి చేయుటకు సిద్దముగా ఉంటూ, మత సంబంధమగు ప్రతీ ఆచారముకు నిన్ను బానిసగా చేస్తూ, వ్యర్ధమైన ప్రతి చిన్న ఆలోచనను నీలో పుట్టించుచూ, జ్ఞానయుక్తమైన రాక్షసునివంటి ప్రతీ గొల్యాతును నీ యొద్దకు పంపించి, నీతో యుద్దము చేయును. మిమ్ములను చుట్టుముట్టుటకు మీకంటే ఎత్తైన వారిని మీ యొద్దకు ఆ సాతాను పంపించును. సహోదరులారా, మీరు దీనులైన, అమాయకులైన మరియు పామరులైన సహోదరులతో సహవాసము చేయుచున్నారు. కాని సాతాను అధ్యాత్మికమైన విషయములయందు రాక్షసులవంటి జ్ఞానులను, గొప్ప వేదాంత పాఠశాలల నుండి మేధావులను మీ యొద్దకు పంపించి, నిజ ప్రత్యక్షతకు వ్యతిరేకముగా అనేక కార్యములను మీకు వివరించుచూ, నిజ సత్యము నుండి మీరు తొలగిపోవునట్లుగా చేయును.
అయితే మీ పెట్టుబడిని, మీ యొద్ద గల మీ భీమా పత్రము మీద పరిశుద్ధాత్మ ద్వారా ముద్రింపబడి మరియు భద్రపరచబడియున్నప్పుడు దానిని తుడిచివేసి, చెల్లనిదిగా ఏదియు చేయజాలదు.
68ఏ మనిషికి దేవుని సువార్తను రహస్యముగా ప్రకటించుటకు హక్కు లేదు, ఆ ఎడారినందు అతడు సువార్త పరిచర్యయందు దేవునితో ఒంటరిగా నిలువబడి యుండును. ఈ లోకపు మానవ జ్ఞానముతో వాక్యమునకు వేరే అనువాదమునిచ్చి వివరించి చెప్పినను దానినుండి నిన్ను దూరముగా తొలగిపోవునట్లుగా చెయ్యదు. అది నిజము. ఆ అనుభవమును నీవు పొందుకున్నావని నీవెరుగుదువు, దానిని నీవు కలిగి ఉన్నావు. వ్యర్ధమైనదానిని వారెంతగా వివరించి నీకు చెప్పినను, కాని వేచియుండుము - ఏదో నీలో సంభవించుటను, ఆ అనుభవము నీకు చేసినదానిని నీవెరుగుదువు. దానిని నీవు నీ కన్నులతో చూచితివి. దానితో నీవు మాట్లాడితివి, అది మరలా నీతో మాట్లాడినది, దానితో అది నిన్ను ముద్రించినది, మరియు నీవు దానిలో ఒక భాగమైతివి.
మానవ జ్ఞానముగల ఆ రాక్షసుని నుండి నీవు దూరముగా తొలగిపోయెదవు. నేడు ఈ లోకమున అటువంటివారు మనకు అనేకులు గలరు. మరియు వారిలో కొంతమంది ప్రమాదమైనవారు కూడా గలరు. వారు తత్వ జ్ఞానులుగా తర్పీదును పొందినవారు లేదా తత్వ జ్ఞానులవలె మాట్లాడుటకు తర్పీదును పొందినవారు. అటువంటివారినే వారు ఉపయోగించుకొనెదరు. ఎందుకనగా, వారేమి చేయుచున్నారో వారెరుగుదురు. అయితే ప్రభువు నీకు తోడైయున్నయెడల, దావీదు, నీవు భయపడవద్దు.
JOHN 8:29•
PHIL 2:5
69గమనించండి, నోవాహు తాను దేనిమీదైతే పెట్టుబడిని పెట్టెనో దానినిగూర్చి అతడికి సందేహము కలుగునట్లుగా సాతాను ప్రయత్నించెను. ఆకాశములోనున్న మేఘములలో వరము వచ్చుటకు అసలు ఏ సూచనలు లేనేలేవని చెప్పుచూ నోవాహును అపహసించుచు, పరిహాసించే శాస్త్రవేత్తలు ఆ దినములలో వుండిరి. ఆ దినములలోనే పరిహాసకులు ఉన్నట్లైతే, రాబోవుచున్న ఈ అంత్యదినములలో, హృదయమందు దేవుని వాక్యమును విశ్వసించుచు మీ పెట్టుబడిని దానియందు పెట్టినప్పుడు, నేడు కూడా దేవుని వాక్యమునకు విరుద్దముగా మాట్లాడేవారు ఉందురు, ఎందుకనగా చూచుటకు అది బుధిలేని కార్యముగా వారికి కన్పించును.
కాని, మీరు గమనించాలి, మీరు మీ స్వంత జ్ఞానమును ఉపయోగించ కూడదు. "నేను తలంచాను… నేను అనుకొనుచున్నాను.. నేను…" మీకు కలుగు ఆలోచన ప్రకారముగా లేదా తలంపు ప్రకారముగా కార్యమును చెయ్యకూడదు. "క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగియుండుడి," అని పరిశుద్ధ గ్రంధము చెప్పుచున్నది. ఆయన ఎల్లప్పుడూ తండ్రిని సంతోషపెట్టు మనస్సు గలవాడైయుండెను, ఎందుకనగా ఆయనే వాక్యము. కావున మనకు కలుగు ఆలోచన ప్రకారముగా మనము చెయ్యకూడదు. ఆయనేమి చెప్పెనో దానియందు మాత్రము మనము విశ్వాసమును కలిగి ఉండవలయును.
"మంచిది, నేను దానిని వివరించలేను," అని చెప్పినత్లైతే. లేదు. నీవు వివరించి చెప్పగలిగినయెడల, నీవు దేవుని గూర్చి కూడా వివరించగలవు. నీ భౌతిక సంబంధమగు జ్ఞానముతో నీవు దేవుని ఎరుగలేవు. విశ్వాసము ద్వారానే నీవు దేవుని ఎరుగ గలవు. ఏ విధముగా దేవుని విశ్వసించవలెనో నీవు ఎరుగుటకు గల మార్గము అదొక్కటే. అసలు దానిని నీవు వివరించి చెప్పలేవు. ఎవరూ దానినిగూర్చి వివరించి చెప్పలేరు. వివరించి చెప్పుటకు నీకు అసాధ్యము. చెప్పలేవు. ఎవ్వరూ దేవునిని గూర్చి వివరించి చెప్పలేరు. దేవునిని గూర్చి ఎవరో ఏదో వివరించి చెప్పుట ద్వారా నీవు దేవునిని కనుగొనలేవు. నీవు ఆయనను విశ్వసించవలయును. దానిని విశ్వసించుట మాత్రమే సరిపోదు. ఇప్పుడు దానిని నీవు నమ్మవలసియున్నది. ఇప్పుడు గమనించుము.
DAN 1:8
70మరియు ఒక దినమున నోవాహు పెట్టిన గొప్ప పెట్టుబడికి రాబడి చెల్లించబడినది. అతనికి కలిగిన శ్రమలయందు నిలుచుటవలన, అపహాసకుల పరిహాసములందు అతడు నిలుచుటవలన, అన్ని పరిస్థితుల మధ్య మరియు ఆ దినమునందున్న లోక విధానములకు విరుధముగా అతడు నిలుచుటవలన మరియు మత సంబంధమగు సమస్తము అతడిని వ్యతిరేకించుచున్నను వాటన్నిటిని అతడు ఎదుర్కొని నిలుచుటవలన, తాను పెట్టిన పెట్టుబడికి తన జీవమును రక్షించుకొనుట ద్వారా అతడి రాబడి చెల్లించబడినది.
ఇప్పుడు, వ్వాపారస్థులారా, మరొక విషయమును మీకు నన్ను చెప్పనివ్వండి. ఒక దినమున దానియేలు తాను ఆశించిన దానియందు తన పెట్టుబడిని పెట్టెను. అతడు చేసిన కార్యము ఈ లోకమునకు నచ్చక, ఈ లోకము అతడిని త్రోసివేసినది. అతడు దేనినైతే నమ్మెనో దానిని నమ్మని జనుల మధ్యకు అతడు కొనిపోబడెను. అయితే అతడు దేనిని నమ్మెనో దానియందు తన పెట్టుబడిని పెట్టి దానినే అతడు గమనించుచుండెను. అతడు తన హృదయమున ఒక ఉద్దేశ్యమును కలిగినవాడై, తాను పెట్టిన పెట్టుబడిని అతడు పాడుచేసుకోలేదు, అతడు దానిని నాశనము చెయ్యలేదు, గమనించారా. అది తన జీవమునకే అపాయమునను కలుగజేయునదిగా యున్నను, అతడు తన హృదయమున ఒక ఉద్దేశ్యమును గలిగి, దేవుని యందు తన పెట్టు పెట్టుబడిని చేసెను. అవిశ్వాసము ద్వారా తాను పెట్టిన పెట్టుబడిని అతడు పాడుచేయలేదు.
PHIL 2:5•
2PET 1:20
71దానిని అవిశ్వసించ వద్దు, నీవు పెట్టుబడిని పెట్టినప్పుడు దానియందే నిలిచియుండుము. విశ్వాసించుటకు నీవు సిద్దముగా లేనట్లయితే పెట్టుబడిని పెట్టవద్దు. అయితే దానియందు పెట్టుబడిని పెట్టుటకు నీ మనస్సు సిద్దముగా ఉన్నట్లయితే క్రీస్తు మనస్సు నీలో ఉన్నట్లగును.
"సరే, ఇది అదియని మరియు అదేయని," నీవు చెప్పెదవు.
దానిని నీవు కనిపెట్టియుండుట మంచిది. అది వాక్యము కానియెడల దానిని అలాగే విడిచి పెట్టుము. దేవుని వాక్యము ప్రాథమిక వాస్తవము మరియు సత్యమైయున్నది గాని వ్యక్తిగత అనువాదము కాదు. అది ఆ విధముగానే ఉండునట్లుగా వ్రాయబడినది… ఈ పరిశుద్ధ గ్రంధమునుబట్టి దేవుడు ఒకవేళ సంఘమును తీర్పు తీర్చునట్లైతే, అప్పుడు ఈ పరిశుద్ధ గ్రంధమునే ఆధారము చేసుకుని తీర్పును తీర్చునట్లుగా దేవుడు గమనించుచూ ఉండవలసియున్నది, అది ఏ విధముగా వ్రాయబడవలసియున్నదో ఆ రీతిగానే అది వ్రాయబడియున్నది. ఏ స్వకీయ అనువాదము దానికి అవసరము లేదు! మెథడిస్టు వారు దానిని ఒక విధముగా అనువాదము చేసెదరు. బాప్టిస్టువారు వేరొక విధముగా అనువాదము చేసెదరు, మరియు ఇంకా అనేకులు అనేక విధములుగా దానిని అనువాదము చేసెదరు. అట్లైతే మీరు చేసిన అనువాదమును నిరూపించుటకు తీసుకొని రండి, వాటిల్లో ఏదోకటి మాత్రము ఖచ్చితమౌతుంది. అది మానవుని తలంపు, అచ్చట నుండి వారు పారిపోవుదురు.
72ప్రతీసారి దేవుడు, లూథర్, వెస్లీ, జాన్ స్మిత్, కాల్విన్, నాక్స్, ఫిన్నీ, మూడీ లేక అలాంటి అనేక గొప్ప సంస్కర్తలను లేపుచున్నాడు. పిదప, వారు మరణించిన తరువాత వారు దానిని ఒక సంస్థగా మార్చివేయుచున్నారు. మరియు అందులో నుండి మంచి కళాశాల పట్టబద్రులు బయలుదేరి, వారి స్వంత అనువాదమును అందులో ప్రయోగించుచూ దానిని వారు ఒక సంఘ సంస్థగా తయారు చేయుచూ, సరిగ్గా అక్కడే వారు ఆత్మీయముగా చనిపోవుచున్నారు. ఏ సంఘమైనా గాని ఒక సంస్థగా స్థాపించబడిన తరువాత ఆ సంఘము ఇక ఎన్నడూ జీవముతో జీవించి ఉన్నట్లుగా చరిత్రయందు ఎచ్చటా చూడలేము.
జీవములేని అటువంటి ఒక సంఘమందు వారెన్నడైనా గొప్ప ఉజ్జీవమును పొందగలిగితిరా? సంఘమును ఒక సంస్థగా మార్చివేసినప్పుడు అది జీవములేనిదై మరణించును. రోమన్ కాతలిక్ సంఘము నుండి, మొదట రోమన్ కాతలిక్ సంఘముగా ఆవిర్భవించుటకు ముందుగా అది ఒక రోమన్ సంఘముగా ఉండినది. పెంతెకోస్తు కాలమునందు అది ఒక రోమన్ కాతలిక్ గా మారినది. కనీసం మూడు వందల సంవత్సరముల తరవాత, రోమ్ యందు, "నైసియా" సమావేశములో అపోస్థలిక్ కాతలిక్ సంఘమే రోమన్ కాతలిక్ గా మార్పుచెంది, అందులో మానవ-కల్పిత ఆలోచనలను, రోమనుల యొక్క అన్య సంబంధమగు ఆచారములన్నిటినీ లేఖనములలో వారు చొప్పించిరి. ఇక అప్పటి నుండి ఆ సంఘము జీవములేనిదిగా వున్నా దానిలోనే వారు పడివుంటూ, అనేక సభ్యులను అందులోకి చేర్చుకుంటూ, ఏమీ చేయలేని నిర్జీవమైన సంఘముగా అది మారిపోయినది.
సంస్కర్తగా దానిలో నుండి వెలుపలికి వచ్చిన లూధర్, దేవుని యొక్క సేవకునిగా, నీతిమంతుడు విశ్వాసమూలముగా జీవించునని, దేవుని కృప ద్వారా జీవించుననే వాక్యమును గూర్చి బోధించెను. కాని కాతలిక్ సంఘము, "దేవుడు తమ సంఘములోనే వున్నాడని, సంఘమునకు బయట రక్షణ లేనేలేదని," చెప్పెను.
LUKE 8:11•
JOHN 1:1
73ఈ మధ్య కాలములో ఒక యాజకునితో సంభాషణ జరిగినది. అతడు, "బ్రెన్హాం గారు, నీవు పరిశుద్ధ గ్రంథమను గూర్చి మాట్లాడుటకు ప్రయత్నించుచున్నావు. ఇదే సంఘము! దేవుడు తన సంఘములోనే ఉన్నాడని," చెప్పాడు.
"ఎక్కడ ఉన్నాడో నాకు చూపించు!" అని నేనన్నాను. దేవుడు తన వాక్యములో ఉన్నాడని పరిశుద్ధ గ్రంథము చెప్పుచున్నది. ఆయనే ఆ వాక్యము. నీలో వాక్యము ఉన్నట్లైతే, అది మరలా దేవునినే ఉత్పత్తి చేయును. "దేవుని వాక్యము విత్తనమై యున్నది, ఆ విత్తనము దాని జాతినే అది ఉత్పత్తి చేయును," అని ఆయన చెప్పెను. అది ఒక దైవిక జీవమును ఉత్పత్తి చేయును, అది యేసుక్రీస్తు కోసము సంపూర్ణముగా ప్రతిష్టించబడిన జీవమునే ఉత్పత్తి చేయును.
DAN 3:17
74ఇప్పుడు దానియేలును చూడండి! అతడు దేవునిపైన పెట్టుబడి పెట్టిన పిదప, ఆ సింహపు బోనులో నుండి అతడి ప్రాణమును రక్షించబడుట ద్వారా అతని రాబడి అతనికి చెల్లించబడినది. ఒక దినమున ఆ హెబ్రీయుల పిల్లలు తాము నిర్ణయించుకొనిన దానిమీద తమ పెట్టుబడిని పెట్టిరి. ఆ దేశమందు ఒక ప్రకటన ఈ విధముగా ప్రకటించబడెను అదేమనగా, ఆ హెబ్రీయుల పిల్లలకు నిజమైన మార్గమున దేవుని ఏ విధముగా ఆరాధించవలెనని చెప్పబడెనో దానికి విరుద్ధముగా అందరూ ఏకముగా కూడి వచ్చి, ఈ గుంపుతో ఏకమై రాజు నిలువబెట్టించిన ప్రతిమను ఆరాధించవలెననే శాసనము ప్రకటించబడెను. కాని వారు జీవము గల దేవునియందు తమ పెట్టుబడిని పెట్టియుండిరి. "మమ్మల్ని అగ్ని గంధకములలో త్రోసివేసినను మేము దానిని చేయము. ఈ దేవుని వాక్యముతోనే మేము నిలచి యుండెదము," అని వారు చెప్పిరి. అది వారి జీవితములను రక్షించినది, అది ఆ దేశమును జీవముగల దేవునివైపుకు త్రిప్పునట్లుగా చేసినది, గమనించారా, ఎందుకనగా దేవునియందు పెట్టిన పెట్టుబడిని వారు సంరక్షించుకొనగోరిరి. అవునండీ!
MATT 7:15,16,20•
ACTS 5:36
75పేతురు చేపలను పట్టు ఒక జాలరి, అతడొక వ్యాపారస్థుడు. అతడు చేపల వ్యాపారమును చేయువాడు. ఆ సముద్రమునందు పట్టు చేపలను అమ్ముచూ, వ్యాపారము చేసెను. ఆ దినములలో అదొక గొప్ప కార్యముగా యుండెను. అది… ఇచ్చటవుండు చికాగో నగరమునగల తీర ప్రాంతము నివసించువారివలెనే వారు కూడా ఆ తీర ప్రాంతమునందే నివసించుచుండిరి. అతడు వృత్తిరిత్యా చేపలను పట్టుటయందు మంచి నైపుణ్యముగలవాడై, వాటిని అమ్మే వ్యాపారస్తుడై యుండెను. అయితే, అతడొక కఠిన స్వభావముగల మనిషి, ఎందుకనగా అతడొక పరిసయ్యుడు, అతని తండ్రి ఒక వృధుడైన పరిసయ్యుడుగా ఉండెను.
కాని ఒక దినమున… (నేను ఒక కథ చదువుచుంటిని. ఇది ఒక వాస్తవమైనదిగా ఉండకపో వచ్చును, బహుశా వాస్తవమైనది కాదు. అయితే ఇది ఒక పరిక్షకు సాధృశ్యముగా వర్తించునని నేను తలంచుచున్నాను.) [టేపు ఖాళీగా యున్నది.]
"… కాని నీకు తెలుసా, కుమారుడు యింకనూ రాలేదు, ఆయన నీవు జీవించుచున్న దినమున రావచ్చునేమో. ఇప్పుడు జ్ఞాపకముంచుకొనుము, మీ తండ్రివలె, నేను దీనిని చెప్పాలని ఆశించుచున్నాను. మతసంబంధమైన మూఢులెందరో లేవవచ్చును, అనేకమంది అబద్ద ప్రవక్తలు రాబోవుచున్నారు."అయితే, "మీరు వారి క్రియలవలన తెలుసుకొందురు," అని యేసు ఈ దినమును గూర్చి చెప్పెను. ఫలములు అనగా ఆత్మయొక్క ఫలములని అర్ధము. గమనించండి, "మీరు వారిని ఎరుగుదురు, అటువంటివారు మీ మధ్య చాలా మంది ఉందురు," అని ఆయన చెప్పెను. ఖచ్చితముగా ఉందురు.
అయినను, "మీ మధ్య మేధావులవంటి ఉపదేశకులు, గొప్పవారు లేచెదరని మీరెరుగవలెనని నేను ఆశించుచున్నాను," అని ఆయన చెప్పెను. [వారిలో ఒకడు లేచి నేను క్రీస్తుకు చెందినవాడినని ప్రకటించుకొనుచుండగా, నాలుగువందల మంది అతనిని వెంబడించిరి, అతడివలన వారు అరణ్యములో నశించిపోయిరి, ఎందుకనగా అది వాక్యమునకు వ్యతిరేకమైన కార్యము.]
NUM 12:6•
DEUT 18:15,22•
AMOS 3:7
76ఆయన చెప్పెను, మెస్సియ్యాను మీరు జ్ఞాపకము చేసుకొనవలెనని నేను ఆశించుచున్నాను, ఆయనపై గుర్తించదగిన ఒక ఆనవాలను ఆయన కలిగి ఉండును మరియు ఆయన ఒక ప్రవక్తయై యుండును. మనము హెబ్రీయులము, మరియు ప్రభువైన దేవుడు ఏమని చెప్పెననగా మనము…
ఆయన మన కొరకు ప్రవక్తలను పంపించెను, ఎందుకనగా ప్రవక్తల యొద్దకు మాత్రమే ప్రభువు వాక్యము వచ్చును. అది నిజము. "మీ మధ్య ప్రవక్త ఒకడు వుండినయెడల, నేను ప్రభువునై అతనితో మాట్లాడుదును. అతడు చెప్పినదంతయు నెరవేరుచుండును, మీరు అతని మాటను వినండి, అది జరుగక పోయినయెడల అతనిని నమ్మకండి, అతనికి మీరు భయపడవద్దు. కాని అతడు చెప్పినది జరిగినయెడల, అతడేమి చెప్పినను అతనిని గూర్చి భయపడండి," అని ఆయన చెప్పెను.
మరియు "దేవుడు నావంటి ఒక ప్రవక్తను మీ మధ్య లేపును. ఆయన మీతో చెప్పునది వినండి," అని మోషే చెప్పియుండెను.
"ఇప్పుడు ఈ మెస్సయ్యా ఒక ప్రవక్తయై యుండును. ఆయన ఒక విద్యావేత్త కాదు, ఆయన ఒక యాజకుడు కాదు, ఆయన ఒక మతాచార్యుడు కాదు గాని ఆయన ఒక ప్రవక్తయై యుండునని జ్ఞాపకముంచుకోండి."
LUKE 5:4,5,8,10
77అక్కడ సీమోను ఒక దుంగపై కూర్చొనియుండగా, బహుశా ఆ దినమున అంద్రెయ అతనిని సముద్రపు దరికి తీసుకెళ్ళెను. యేసు ఎచ్చట ఉండెనో… రాత్రంతయూ శ్రమపడిన తరువాత వారు తమ వలలను పరిశీలించగా, వారికి ఏమియూ దొరకలేదు. వారచ్చటనే విచారముతో కూర్చొండిరి. యేసు, ఈ పేతురు వద్దనే నావను అడిగి తీసుకొని, దానిపై యేసు కూర్చొని బోధించుచుండగా… ఆయన చుట్టూ జన సమూహము గుమికూడియుండగా, యేసు ఆ నావపై కూర్చొని వారికి అనేక విషయములను గూర్చి బోధించుచుండగా, బహుశా పేతురు తన చేతి వ్రేలును తన చెవిలో సగమువరకు పెట్టుకొని ఆయన కూర్చొనియున్న నావకు ప్రక్కన కూర్చొని ఆయన మాటలను ఆలకించుచూ ఉండ వచ్చును.
"గత రాత్రంతయూ శ్రమపడిన ఏ చేపలు మీకు లభించలేదని నాకు తెలుసు, అయినను మీ నావను లోతునకు నడిపించి చేపలు పట్టుటకు మీ వలలు ఈ ప్రక్కన వేయండి, మీ నిమిత్తము పట్టబడుటకై చేపలు వేచి యున్నవని," ఆ నావ దగ్గరకు వచ్చి, పేతురు వీపు వెనుక తట్టు నిలిచి యేసు చెప్పెను.
ఆయన కేవలం ఒక్క మాట మాత్రమే చెప్పెను. అతడు తన వలను లోతుగా వేసిన తరువాత లాగుట ప్రారంభించిరి, ఆ వల నిండా చేపలుండెను. తన తండ్రి చెప్పిన ప్రకారముగానే మెస్సీయ్యా ఒక ప్రవక్తగా వుండునని ఆయన గూర్చి చెప్పెను. అప్పుడు పేతురు, "ప్రభువా, నన్ను విడిచి పోమ్ము, నేను పాపాత్ముడను," అని చెప్పెను.
"సీమోను భయపడకుము, ఇప్పుడు సత్యమును కనుగొన్నావు. ఇకమీదట నీవు మనుష్యులను పట్టు ఒక జాలరిగా ఉందువని," ఆయన పేతురుతో చెప్పెను.
పేతురు తన చేపలను, వలలను, అతని వ్యాపారమును సహితము విడిచి పెట్టుటకు సిద్దపడెను. యేసుక్రీస్తుయందు అతడు తనయొక్క సంపూర్ణమైన పెట్టుబడిని పెట్టెను, ఎందుకనగా అతడు వాగ్దానము చేయబడిన మెస్సీయాను తన కనులారా చూచెను. ఆయన పలికిన మాట ప్రత్యక్షమగుటచేత, ఆయనే మెస్సీయాయని అది చూపించెను. పరిసయ్యుడైన వృద్దుడగు తన తండ్రి ఏదైతే చెప్పెనో, దానిని గూర్చి వాక్యము ఏమి చెప్పుచున్నదో దానిని పేతురు ఎరిగియున్నాడు. "ఆ మెస్సీయ్యా మానవ రూపమును ధరించిన వాక్యమైయుండును. ఆయన ఒక ప్రవక్తయై వాగ్దానము చేయబడిన మెస్సీయ్యాగా రావలసియున్నది." ప్రవచించబడిన వాగ్దానముగా ఇప్పుడు ఆయన అచ్చట ఉన్నాడు. గుర్తింపబడిన మరియు రుజువుపరచబడిన వాక్యమును పేతురు చూచుటవలననే తన పెట్టుబడిని దానియందు పెట్టెను.
JOHN 3:2
78గత రాత్రి నేను మాట్లాడినట్లుగా నతానియేలు తన పెట్టుబడిని పెట్టెను. ఆ బావి యొద్ద స్త్రీ కూడా ఆలాగుననే చేసినది కదా! నికోదేము గొప్ప వేదాంత పండితుడు. అతడు గొప్ప పండితుడని ఎవరో ఒకరు ఈ ఉదయం చెప్పిరి. నికోదేము కూడా వచ్చి తన పెట్టుబడిని పెట్టగోరెను. యోహాను సువార్త 3వ అధ్యాయంలో ఈ గొప్ప వ్యక్తియగు నికోదేము వ్యక్తపరచిన దానిని మీరు గమనించవలెనని నేను కోరుచున్నాను. అతడు ఒక సాధారణమైన వ్యక్తి కాదు. వేదాంత పండితుడైన ఇతడు ఏమని చెప్పెనో గమనించి చూడండి. ఆ సన్హే౦ద్రియా సభలో, ఆ సమాజమందు, ప్రభుయేసు పరిచర్యను గూర్చి వారు తర్కించుటలో ఏ సందేహము లేదు. ఆయన గలిలయకు చెందిన ప్రవక్తగా పిలువబడినప్పటికినీ, అచ్చట వారు ఆయనయొక్క పరిచర్యను గూర్చి పరిశీలించిరి. దీనిని మీ తలలపై నుండి దాటి వెళ్ళిపోనివ్వకండి.
అతడు ఒప్పుకొనిన ఒప్పుకోలును గమనించండి, నికోదేము యేసుతో, "రబ్బీ! మేము పరిసయ్యులము, మేము అనుసరించుచున్న దానిని నీవు ఎరుగుదువు… [నీవు బోధించుచున్న దానిని మేము ఒప్పుకోలేము. దానిని గూర్చి తెలుసుకోవాలని కూడా మేము ఆశించకూడదు, ఎందుకనగా మేము మా స్థానమును కోల్పోయెదము, మేము మా పూటకూటి కోసము పెట్టుబడిగా పెట్టిన మా రొట్టెను, వెన్నను మేము కోల్పోయెదము. మరియు ప్రజల మధ్యలో మాకున్న పలుకుబడిని మా స్థానమును మేము కోల్పోతాము. గలిలయవారివలె లేక ఆ చేపలను పట్టు జాలర్లవలె మేము వెలివేయబడుదుము. మేము నీ గూర్చి భావించుచున్నదేమనగా… నీవు చాలా ఒక నీచమైన బుద్దిగల మనిషిగా, నరముల ఉద్రిక్తతగలవానిగాను, కోపిష్టివని, ఒక వెర్రివాడవనియు, ఒక మంచి నిర్ణయమును తీసుకునే మనస్తత్వము లేనివాడవనియు భావించుచూ, అందువలననే నిన్ను మా సంఘములో బోధించుటకు ఎన్నడూ పిలువకూడదని మేము తీర్మానించుకున్నాము.] అయితే మేము గుర్తించినదేమనగా, నీవు దేవుని యొద్ద నుండి పంపబడిన బోధకుడవనియు, దేవుడు ఒకనికి తోడైయుంటే గాని ఈలాంటి కార్యములను చేయలేడని మేము ఎరుగుదుము," అని చెప్పెను.
JOHN 3:1,2
79నికోదేములు, మనలో అనేకులు నికోదేములాంటివారు గలరని మీరు చూడగలుగుచున్నారా. "అతడు రాత్రి వేళయందు వచ్చెనని," వారు చెప్పుచున్నారు. అతడు తన పెట్టుబడిని పెట్టాలని వచ్చెను, 24 గంటలు ఆ బ్యాంకు తెరచి ఉంటుందని తెలిసి తన పెట్టుబడిని పెట్టుటకై అతడు ఆయన యొద్దకు వచ్చెను. అది రాత్రి సమయమైనప్పటికినీ ఆ బ్యాంకు తెరవబడి యుండెను. ఇచ్చట ఈ చికాగో పట్టణమునందు ఈ ఉదయకాలమున ఆ బ్యాంకు తెరచి ఉన్నది. ఒకవేళ ఇప్పుడే నీ పెట్టుబడిని నీవు పెట్టగోరినట్లయితే, ఇది 24 గంటలు తెరవబడియే యుండును. తలుపులు తెరవబడియుండి, హృదయ పూర్వకమైన ఆహ్వానముతో అతడిని ఆహ్వానించుటను అతడు కనుగొనెను. ఆ గృహము పైకి అతడిని తీసుకొని వెళ్ళి, చంద్రుని వెన్నెలలో కూర్చొని సంభాషించుటకు ప్రారంభించిరి.
పిదప అతడు తన పెట్టుబడిని పెట్టుటకై నిర్ణయించుకొనెను. అతడు మొట్టమొదటగా ఒక ఒప్పుకోలును చేసెను. అదేమనగా, నీవు దేవునియొద్ద నుండి వచ్చిన బోధకుడివని మేమెరుగుదుము. దేవుడతనికి తోడైయుంటేనే గాని నీవు చేయుచున్న సూచక క్రియలను ఎవడు చేయలేడని ఆయనతో చెప్పెను. దానిని మేము ఎరుగుదుము."
ఇప్పుడు, అతడు "మేము" అని చెప్పెను. అనగా వారియొక్క ఆలోచన సభ, వారి సంస్థ యొక్క ఆలోచనా సభ్యులు కూడా ఉన్నారు. ఐక్య సమావేశ సభ్యులు వారిలో గలరు. మన సంఘములన్ని అందులో చేరాలని ప్రయత్నించుచున్న ఫెడరేషన్-ఆఫ్-చర్చస్ వంటిది లేక ప్రపంచ ఆలోచనా సమాఖ్య వంటి దానిని వారు కలిగియుండిరి.
మరియు అతడు ఇలా, "మేము దానిని గ్రహించితిమి" అన్నాడు. అయితే వారిలో ఏ ఒక్కడూ మెచ్చుకొనుటకు ఇష్టపడుట లేదు. ఆ ధనవంతునివలె, వారు కూడా తమ యొక్క లోక సంబంధమగు ధనముతోనే ఉండుటకు ఆశించిరి.
80వ్యాపారము చేయుచున్న నా స్నేహితుడా, ఈ ఉదయకాలమున, ప్రియమైన పురుషులారా లేదా స్త్రీలారా! ఆ వెలను లెక్కించుటకు మీకు సామర్ద్యము గలదా? పరిశుద్ధాత్మ యొక్క బాప్తిస్మమును అంగీకరించుటకు అది మిమ్మల్ని మిక్కిలిగా ఆటంకపరుచుచున్నదా? మీ వ్యాపారము దానియొద్దకు రానీకుండా మిమ్మల్ని ఆటంకపరుచుచున్నదా? ఈ భూమిపై మీకున్న ఈ వ్యాపారము మిమ్మల్ని ఆటంకపరుచుచున్నదా, లేక సంఘములో మీకున్న స్థానమును అది మిమ్మల్ని తల క్రిందులుగా చేయునని నిన్ను భంగపరుచుచున్నదా? లేక నిత్యజీవముకంటే మరేదైనా మిమ్మల్ని ఆటంకపరుచుచున్నదా? ఏ విధమగు భీమా కావాలని నీవు ఆశించుచున్నావో దాని ఆధారమునుబట్టే అది ఉండును. నికోదేము చాలా గొప్ప వ్యక్తి, అచ్చటకు వెళ్ళుటకు అతనికి ఎంతగానో వ్యతిరేకత ఉన్నప్పటికినీ, అతడు ఈ భీమాని అంగీకరించెనని జ్ఞాపకముంచుకోండి.
LUKE 24:49
81ఈ విధమగు భీమాదారులను, మనము లూకా సువార్త 24:49లో కనుగొనగలము. కొద్ది క్షణములలో నేను ముగించబోవుచున్నాను. ఈ భీమా (పాలసీ) దారులందరూ లూకా 24:49 లో, వారి పెట్టుబడిని అందులో పెట్టుటవలన వారందరూ పాలిభాగస్తులుగా చేయబడిరి. నీవు ఒక భీమాను కలిగియున్నయెడల దానికి చెల్లించవలసిన లాభములను అది చెల్లించునని మీరెరుగుదురు. చాలా సార్లు, నీవు నీ యొక్క బీమాకు వచ్చిన లాభములను నీవు తీసుకొనెదవు. మంచిది, వారు ప్రభువైన యేసు క్రీస్తును విశ్వసించిరి, వారు ఆయనను తమ స్వంత రక్షకునిగా అంగీకరించిరి. కాని భీమాకు చెల్లించవలసిన రుసుము చెల్లించబడి యున్నదనియు, యేసు లూకా 24:49లో, "ఇదిగో నా తండ్రి వాగ్దానము చేసినది మీ మీదికి పంపుచున్నానని," వారితో చెప్పియున్న వాగ్దానమును వారు గ్రహించియుండిరి.
ISA 28:10,11•
JOEL 2:28,32
82యోవేలు 2:28 మరియు ఇంకా అనేక లేఖనములు దీనినిగూర్చి వాగ్దానము చేసియున్నవి. యెషయా 28:10లో అని నేను నమ్ముచున్నాను. "ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, సూత్రము వెంబడి సూత్రము, సూత్రము వెంబడి సూత్రము; కొంత ఇచ్చట, కొంత అచ్చట చెప్పుచున్నాడని వారనుకొందురు. నిజమే అలసిన వారికి నెమ్మది కలుగజేయుడి. ఇదే నెమ్మది, ఇదే విశ్రాంతి అని చెప్పినవాడు నత్తివారి పెదవులచేతను, అన్యభాషలతోను ఈ జనులతో మాట్లాడుచున్నాడు." "సమస్తమును పరీక్షించి మేలైన దానిని చేపట్టుడి."
యోవేలు 2:28లో "తరువాత నేను సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరింతును. మీ కుమారులును మీ కుమార్తెలు ప్రవచనములు చెప్పుదురు. మీ ముసలివారు కలలు కందురు, మీ యవ్వనులు దర్శనములు చూతురు. ఆ దినములలో నేను పనివారి మీదను, పనికత్తెల మీద నా ఆత్మను కుమ్మరింతును. ఆ దినమున యెహోవా నామముబట్టి ఆయనకు ప్రార్థన చేయువారందరును రక్షింపబడుదురు." దేవుని లేఖనములను బట్టి, యేసుక్రీస్తును అంగీకరించుట ద్వారా వారి జీవితమును భీమా చేయుటవలన వారు పొందుకోవలసిన ప్రతిఫలమును వారు పొందుకొని యుండుటను ఈ జనులు గ్రహించెదరు.
ISA 28:11•
JOEL 2:28,30
83వ్యాపారస్థులారా, మీరు ఏదో ఒక సంస్థకు చెందినవారై యుండవచ్చును. అయితే అక్కడ రాబడి ఉండవలెను. మీరు క్రీస్తును అంగీకరించి యుండవచ్చును, మీరు బహుశా క్రైస్తవ బాప్తిస్మము ప్రకారముగా యేసుక్రీస్తు నామములో బాప్తిస్మము పొంది యుండవచ్చును, ఈ కార్యములన్నింటిని మీరు చేసియుండవచ్చును. అయినప్పటికినీ మీరు పెట్టిన పెట్టుబడులకు తప్పక రాబడి రావలసియున్నది.
మరియు లూకా 24:49లో చెప్పబడిన రీతిగా, వారు ఆ రాబడిని పొందుటకై మేడ మీదవున్న గదికి ఎక్కి వెళ్ళిరి. వారందరూ ఒక సమాజముగా ఏకముగా కూడి యుండి ప్రభు రాక కొరకై వారు కనిపెట్టుచుండిరి. వారు ఆ విధముగా కేవలము రెండు లేక మూడు దినములు మాత్రమే కనిపెట్టుకొని ఉండలేదు. మరియు ఆచ్చట ఉన్నవారిలో ఎవరో లేచి, బహుశా మత్తయి వుండవచ్చు, అతడు పన్ను వసూలుచేయు ఒక ప్రభుత్వాధికారి, బహుశా అతడు చాలా మేధావియై ఉండును. అతడు లేచి ఈలాగు చెప్పసాగెను, "ఒక నిమిషం ఆగండి! మనమెందుకు ఇంత సుదీర్ఘ సమయము వేచియుండాలి? ఇక్కడకు ఎక్కి రమ్మని ఆయన చెప్పి యుండెను, మనము ఇక్కడ వేచియున్నాము. ఇప్పటికి ఎనిమిది దినములుగా మనము వేచియుంటిమి. ఇప్పుడిక మనము మన పరిచర్యను కొనసాగించుటకు ముందుకు సాగిపోవచ్చునని నేను తలంచుచున్నాను."
అయితే దేవుని వాక్యము ఆ విధముగా చెప్పలేదు. "నత్తివారి పెదవులతోను అన్యభాషలతోను నేను ఈ జనులతో మాట్లాడెదను. నా ఆత్మను వారిపై కుమ్మరించెదను. సూచనలను, అద్భుతములను వారికి కనపరచెదను." వారియొద్ద గల భీమా మంచిదని రుజువుపరచే గుర్తింపు కొరకు వారు కనిపెట్టుచుండిరి.
ROM 4:22
84కొద్దికాలము క్రిందట ఒక మంచి బాప్టిస్టు సహోదరునితో మాట్లాడుచుంటిని. అతని పేరును నేను చెప్పను, ఎందుకనగా అతడు అందరికి చాల పరిచయమైన వ్యక్తి, ఒక గొప్ప సంఘములోనున్న ఒక మంచి వ్యక్తి. అతడు నా దగ్గరకు వచ్చి, "బిల్లీ! ఈ సంగతులతో సమైఖ్యముగా నుండక, నీవెందుకు ఎల్లప్పుడు అటువంటి విషయములతోనే నిలిచియుందువు" అని అడిగెను.
"ఎటువంటి విషయములతో?" అని నేను అడిగాను. "నేను నా జీవితమును క్రీస్తుతో ఐక్యపరచుకున్నాను," అని నేను చెప్పాను.
"అసలు నీవు కూడా ఒకప్పుడు బాప్టిస్టువేయని నీకు తెలుసు. చూడు, అబ్రాహాము దేవుని నమ్మెను. అది అతనికి నీతిగా ఎంచబడెను అని పరిశుద్ధ గ్రంధము చెప్పుచున్నదని," అతడు చెప్పెను.
"అది నిజమే!" అని నేనన్నాను.
"దేవునియందు విశ్వామును కలిగియుండుటకంటే… లేదా, అబ్రాహాము దేవుని నమ్మెను?" అని అతడు అన్నాడు.
"సరే, నీవు నమ్ముచున్నావా?" అని నేను అడిగాను.
" అవును, నేను దేవుని నమ్ముచున్నాను," అని అతడు అన్నాడు.
"బాప్టిస్టు సిద్ధాంతమును గూర్చి నాకు తెలుసు, దాని ప్రకారముగా నీవు తలంచుచున్నదేమనగా, నీవు పరిశుద్ధాత్మను పొందుకున్నావని నీవు నమ్ముచున్నావా?" అని నేను అడిగాను.
"అవును, నిశ్చయముగా. నేను విశ్వసించినప్పుడే దానిని నేను పొందితిని, ఎందుకనగా ఆ వాక్యమందు ఆలాగున్న కారణముచేతనే, నేను దానిని విశ్వసించుచున్నాను," అని అతడు అన్నాడు.
"పరిశుద్ద పౌలు, అపోస్తులుల కార్యములు 19వ అధ్యాయములో చెప్పిన దానికి అది ఎంత వ్యత్యాసముగా యున్నది," అని నేను చెప్పాను.
ACTS 19:2-6
85అక్కడ ఇదివరకే బాప్తిస్మమును పొందినవారు కొందరు గలరని అతడు కనుగొనినప్పుడు, వారు బాప్తిస్మమిచ్చు యోహాను ద్వారా క్రీస్తు యొద్దకు నడిపించబడినవారు, పౌలు వారిని చూచి, "మీరు పరిశుద్ధాత్మను పొందితిరా? మీరు విశ్వసించినప్పుడు మీరు పొందుకోవలసిన రాబడిని మీరు పొందితిరా?" అని అడిగెను. నీవు నమ్మినప్పుడు కాదు, కాని "నీవు నమ్మిన తరువాత."
"పరిశుద్ధాత్ముడున్నాడన్న సంగతియే మాకు తెలియదు," అని వారన్నారు.
"అయితే మీరు ఏలాగు బాప్తిస్మము పొందితిరి?" అని పౌలు వారిని అడిగెను.
"మేము యోహాను యిచ్చిన బాప్తిస్మమును తీసుకున్నప్పుడే దానితో అది సమాప్తమై పోయినది," అని వారు చెప్పిరి.
"లేదు. అది ఇప్పుడు చెల్లదు. యోహాను మారుమనస్సు విషయమైన బాప్తిస్మమును యిచ్చెను. అది పాపక్షమాపణ కొరకు కాదు. ఎందుకనగా క్రీస్తు యొక్క పాపపరిహార బలియర్పణము సమర్పించబడలేదు," అని పౌలు వారితో చెప్పెను.
"వారది వినినప్పుడు, అచ్చట వారు యేసుక్రీస్తు నామమునందు బాప్తిస్మమును పొందిరి. పౌలు వారిమీద చేతులుంచినప్పుడు, వారి మీదికి పరిశుద్ధాత్మ దిగెను. అప్పుడు వారు ప్రవచించిరి మరియు అన్యభాషలు మాట్లాడిరి. వారు ఆ మొదటి స్థానమున నిలచియుండునట్లుగా పొందుకోవలసిన రాబడిని వారు పొందుకొనిరి."
JOHN 6:37,44,65•
ROM 4:22
86"అలాగైతే, అబ్రాహాము దేవుని నమ్మెను? అది అతనికి నీతిగా ఎంచబడినదని ఉన్నదే, అంతకన్నా మించి మనిషి వేరేమైనా చేయగలడా?" అని అతడు అడిగెను.
"నిజముగా, అతడు దేవునిని నమ్మెను; అయితే దేవుడు సున్నతియను ముద్ర ద్వారా దానిని రుజువుపరచెను. ఇప్పుడు నీవు ఒక విశ్వాసివని చెప్పుకొనినప్పుడు, నీవు పరిశుద్ధాత్మ ద్వారా ముద్రించబడువరకు దేవుడెన్నడూ నీ విశ్వాసమును గుర్తించడు. దానిని ఆయన ముందుగా నిర్ణయించబడిన ఒక విత్తనముగా గుర్తించునని," నేను చెప్పాను.
బాప్తిస్మము గూర్చి అదే ఒక మంచి వాక్యమైయున్నది. మీరు చూచారా, మీకు అర్ధమైనదా? అది నిజము. నిశ్చయముగా అదే నిజము. "నా తండ్రి ఒకనిని ఆకర్షించితేనే గాని ఎవడును నా యొద్దకు రాడు. నా తండ్రిచేత ఆకర్షించబడు వారందరూ నా యొద్దకు వచ్చెదరు." దేవుని వాక్యము అనేక స్థలములకు బయలు వెళ్ళువరకు సువార్తను ప్రకటించుట మన బాధ్యతయైయున్నది. కొన్ని త్రోవ ప్రక్కన పడిపోవును, కాని కొన్ని విత్తనములు మంచి నేలన పడి దానిలోనుండి జీవమును ఉత్పత్తి చేయుచూ ఎన్నో రెట్లుగా ఫలించును. వారు దానిని ఇప్పుడే చూచెదరు.
కావున మీరు దానిని కనుగొనెదరు, వారు వెళ్ళి పొందుకోవలసిన రాబడిని పొందుకొనిరి.
ACTS 9:3,5
87అవును.
అదే ఆత్మ ద్వారా, ధనవంతుడైన యవ్వనస్తుడగు పౌలు దీనిని గుర్తించి అతడు దమస్కునకు వెళ్ళు మార్గమున ఉండగా అతడు తనను మార్చుకొనెను. ఎందుచేత? అతడు అగ్నిస్తంభమును చూచెను మరియు అది వేరేదో కాదు గాని, అది అదే యేసుయని అతడు ఎరిగెను. ఆ అగ్నిస్తంభము దేవుడని ఎరిగిన పిదప అతడు బిగ్గరగా ఏడ్చెను. మరియు యేసే ఆ దేవుడై యున్నాడు. మరియు పౌలు చూచినప్పుడు… పౌలు పరిశుద్ధ గ్రంధమును అభ్యసించిన పండితుడు, అతడు మంచి ఉద్దేశ్యమును కలిగియుండెను. అతడు ఒక గొప్ప వేదాంత పండితుడు. అతడు గొప్ప విద్యావంతుడగు గమలియేలు యొద్ద శిక్షితుడైయుండెను. ఏదోక రోజు ఒక యాజకుడుగా లేక ప్రధానయాజకునిగా అవ్వాలనే మంచి ఆశయమును అతడు కలిగియుండెను. అతడు గొప్ప మేధావి, గొప్ప పండితుడు, అనేక విషయముల యందు ప్రావీణ్యత గల గొప్ప వ్యక్తి.
కాని ఎప్పుడైతే… ఈ మూఢ భక్తులు, వారికి ఏదైతే బోధింపబడి నేర్పించబడినదో దానిని మోసుకొని వెళ్ళుచూ, ఇక్కడ నుండి అక్కడకు, అక్కడికి, ఇక్కడికి దూకుచూ, తిరుగుచు ఉండెదరు. ఈ పౌలు క్రైస్తవులను చూచి తమ మత సిద్ధాంతములకు భిన్నమైన గుంపువారని తలంచెను. కావున దమస్కు మార్గమున అతడు వెళ్ళుచుండగా, నేను చెప్పినట్లుగా… అతడు ధనవంతుడు అతడు చాలా మంచి వ్యక్తి, యవ్వనస్తుడు, సమస్తమును ఎరిగిన మంచి విద్యావంతుడు, అనేక గొప్ప అవకాశములు అతడి ఎదుట కాచుకొని యుండెను.
గొప్ప ధనవంతుడగు ఆ వ్యాపారస్తునికినీ, గొప్ప ధనవంతుడైన వ్యాపారస్తుడగు ఈ పౌలుకు గల వ్యత్యాసమును గమనించండి? ఒకరేమో దానిని అంగీకరించిరి, ఒకరేమో దానిని నిరాకరించి వెనుదిరిగి వెళ్ళిపోయెను. గమనించండి.
ACTS 9:5,6•
HEB 13:8
88పిదప, అకస్మాత్తుగా ఒక వెలుగు ద్వారా అతడు బలముగా తాకబడి క్రింద పడెను. అచ్చట ఒక అగ్నిస్తంభము నిలిచియున్నది, దానిని అతడు గుర్తించెను. అతడు "ప్రభువా! నీవెవరవు?" అని అడిగెను.
"నేను యేసును" అని ఆయన అన్నాడు.
క్రీస్తు మరియు దేవుడు ఇద్దరు వ్యక్తులు కారని, వారు ఒక్కరేనని పౌలు దేవుని గూర్చిన బయలుపాటును పొందిన వెంటనే దానియందు తన పెట్టుబడిని పెట్టుటకు అతడు సిద్దపడెను. నేడు అదే కార్యమును మనము చూడగలమా అని నేను ఆశ్చర్యపడెదను.
పౌలు ఒక యూదుడైనను దానిని చూచిన పిదప, "అరణ్యమునందు తన ప్రజలను నడిపించిన ఆ దేవుడే నన్ను నడిపించెననియు, అది ఆయన తప్ప వేరేవరో కాదని మరియు ఆయన పేరు "యేసు" అని అతడు విశ్వసించెను. "నేను ఉండినవాడను" నుండి ఆయన "నేను ఉన్నవాడు"గా ఉన్నాడు. "ఉన్నవాడు" అనునది నిత్య నిత్యమైయున్నది, అది నిత్యము. "నేను ఉన్నాను, నేను ఉంటాను" అని కాదు. అయితే "నేను ఉన్నవాడను," వర్తమాన కాలము, మరియు అన్ని యుగములలోను, "ఆయన నిన్న నేడు నిరంతరము ఒక్కటే రీతిగా ఉన్నాడు." అప్పుడు పౌలు "ప్రభువా! నీ కొరకు నా పెట్టుబడి పెట్టగోరుచున్నాను, నాపట్ల నీవేమి చేయవలెనని కోరుచున్నావు? ప్రభువా! నన్ను నీవేమి చేయాలని ఆశించుచున్నావు? నేనేమి చేయాలి? ఓ, దేవా! నేనేమి చేయగలను?" అని బిగ్గరగా అడిగెను.
MARK 16:15,17•
1COR 2:1,4
89మూడున్నర సంవత్సరములు అరేబియాకు వెళ్ళి తాను దర్శించినది అదే దేవుడా కాదాయని కనుగొనుటకు అతడు లేఖనములను పరిశోధించెను. అతడు దానిని తెలుసుకొని మరల వెనుకకు తిరిగి వచ్చెను. తాను దేనియందు తర్పీదు పొందెనో అదంతా, తనలోవున్న సంఘ శాఖల సిద్ధాంతములన్నీ, విద్యయందు తనకు గల ప్రావీణ్యత సమస్తము అతనిలో నుండి వెడలిపోయినవి.
మరియు అతడు కొరింథీయులతో ఉన్నప్పుడు ఈలాగు చెప్పెను, "మీ యొద్దకు నేను వచ్చినప్పుడు వాక్చాతుర్యముతో గాని, జ్ఞాణాతిశయముతో గాని రాలేదు, ఎందుకనగా మీ విశ్వాసము మనుష్యుల జ్ఞానమును ఆధారము చేసుకొనక… నేను ఒక మేధావినని, గొప్ప వ్యక్తిననే తలంపులపై మీరు ఆధారపడుదురేమోనని. అయితే జ్ఞానయుక్తమైన తియ్యని మాటలను వినియోగింపక, శక్తితోను మరియు ప్రత్యక్షతలతోను, పరిశుద్ధాత్మను కనుపరచు దృష్టాంతములనే వినియోగించితిని." మార్కు సువార్త 16వ అధ్యాయములో యేసు కూడా అదే కార్యమును గూర్చి చెప్పెను కదా, మీరు సర్వలోకమునకు వెళ్ళి సువార్తను ప్రకటించుడని చెప్పెను," అనగా దేవుని శక్తిని ప్రదర్శించుచూ నిరూపించుట! ఎందుకనగా, కేవలం సువార్తను ప్రకటించుట ద్వారా మాత్రమే ప్రయోజనము లేదు, అది అనేకులను తీసుకొనిరాజాలదు. మీరు దానిని అంగీకరించవలెను, పిమ్మట దేవుని శక్తిని కనురపచుచూ నిరూపించవలెను, "ఈ సూచనలు వారిని వెంబడించును," ఎందుకనగా అది వాక్యమైయున్నది.
PHIL 3:7,8
90పౌలు కొరకు మహోన్నతమైన నిత్యజీవము చెల్లించబడెనని ఇప్పుడు మనము కనుగొంటిమి. అది ఎంతటి సాహసోపేతమైన నిర్ణయముగా యున్నది!
దేవుడు నాకు సహాయము చేసినయెడల, నేను ముగించెదను. మీరు ఎంతో చక్కని జనులు. నేను మీ యొక్క సహనమును పరీక్షించుచున్నానని నాకు తెలుసు. నన్ను క్షమించండి. కాని కేవలము ప్రయత్నించుచున్నాను, నేను… ఈ విధముగా మాట్లాడుటకు, ఇచ్చట నిలబడి ప్రసంగించుటకు తగినంత అర్హత నాకు లేదు. ఇది ఎంతో ఉన్నతమైనది. నావలన సాధ్యమవ్వదు… నా స్వశక్తితో నేనిచ్చట నిలబడలేను. ఒక ఉపదేశకుడిగా మాత్రమే నన్ను నేను చూపించుకోగలను. దీనిని చేయుటకు నాకు సాధ్యమవ్వదు, ఎందుకనగా లోకసంబంధమగు జ్ఞానము నాకు లేదు.
అయితే కేవలము వాక్యసంబంధమగు ఖచ్చితమైన బయలుపాటును నేను కలిగియున్నాను. వాక్యము జీవమై అది దేనినైతే చేయునని పలికినదో దానినే అది ఉత్పత్తి చేయును, చూచారా. అది అపోస్తులులకు జరిగినా, పౌలుకు మాత్రమే జరిగినదా, దానియందు తన పెట్టుబడిని పెట్టుటకై తాను ఎరిగియున్న సమస్తమును పెంట కుప్పగా తలచి వాటన్నింటిని మరచిపోతినని పౌలు చెప్పెను.
"నేను ఫలానా - ఫలానాయని, నేను ఫలానా దానికి చెందినవాడనని, నా తల్లి ఫలానాకు చెందినది," అనే దానిని నీవు మరచిపోవలసి యున్నది. నీవు నీ పెట్టుబడిని పెట్టాలని ఆశించినయెడల, దానిని నీవు తప్పక మరచిపోవలయును. కావున ఆ కార్యమును త్వరపడి తీసుకోవలసిన నిర్ణయము కాదా? నిత్యజీవమును త్రోసివేస్తూ తాను పెట్టవలసిన పెట్టుబడిని పెట్టకుండా ఆ యవ్వన ధనవంతుడైన వ్వాపారవేత్త దానినుండి తొలగి వెళ్ళిపోయినట్లుగా నీవు ఆ యవ్వన వ్యాపారవేత్త వలె వుండవద్దు, అతడు చేసిన కార్యము ఎంతటి తొందరపాటు చర్యగా ఉన్నది.
91నేను మీ ధనమును పెట్టుబడిగా పెట్టమని చెప్పుటలేదు. దానితో నీవేమి చేయాలనుకుంటున్నావో అది నీకు సంబంధించినది. నీ ధనమును సువార్త సంస్థలకు ఇవ్వాలనుకున్న లేదా సువార్తికులను పంపించుటకు వినియోగించాలనుకున్న దానిని దేనికొరకు ఉపయోగించినను అది నీకు సంబంధించినది. దానిని గూర్చి నాకు తెలియదు. దేవుడు దానిని గూర్చి చూచుకొనును. నేను నీ జీవిత భీమాను గూర్చి మాట్లాడుచున్నాను. "నీ సిలువనెత్తుకొని, వచ్చి నన్ను వెంబడించుము. నిన్ను పిలచుచున్న వారందరు ఎంతటివారైనను వారివైపు చూడవద్దు గాని, వచ్చి నన్ను వెంబడించుము." ఇప్పుడు దీనిని చేయుటకు మౌనివై ఉండవద్దు. అతడు అనాలోచితముగా చాలా బుద్దిలేని కార్యము చేసెను, ఖచ్చితముగా అది నేడు లవొదికయ యుగమునందున్న ఈ ప్రజలు ఈ భీమాను నిరాకరించుచున్న విధముగా ఉన్నది. ఈ జనులు దీనిని చేయుటకు ఇష్టపడుట లేదు; వారు దానిని చేయగోరుటలేదు.
PS 37:35,38•
PS 73:17
92వారు సరిగ్గా ఆ ధనికుడైన యవ్వనస్తునివలె వున్నారు. కొద్ది నిమిషములు అతడి ముగింపు ఏ విధముగా ఉండెనో నేను చెప్పినయెడల ఫర్వాలేదు కదా? కొద్దిసేపు ఈ ధనికుడైన యవ్వనస్తున్ని చూద్దాము. అతని ముగింపును చూచి పిదప మనము దీని ముగించెదము.
అతని వైపు చూడండి. అతడు ఒక వ్యాపారవేత్తయని మనము చూచాము. మరియు అతడు తన వ్యాపారమును వర్దిల్లునట్లుగా చేసుకొనెను. గనుక, వ్యాపారస్తులారా, నీవొక క్రైస్తవునిగా ఉండుటవలననే వర్దిళ్ళుచున్నావని ఎన్నడూ తలంచకూడదని జ్ఞాపకముంచుకోండి. దేయ్యము… దావీదు, ఒకసారి ఇలా అన్నాడని నేను నమ్ముచున్నాను, "భక్తిహీనుడు ప్రబలి మొలిచిన చోటనే విస్తరించిన చెట్టువలె వాడు వర్ధిల్లియుండెను." కాని దేవుడు అంటున్నాడు, "అయినను ఒకడు ఆ దారిని పోయి చూడగా వాడు లేకపోయెను, నేను వెదకితిని గాని వాడు కనబడకపోయెను." భక్తిగలవానికి, భక్తిహీనునికి మధ్యవున్న బేధము అదే. భక్తిహీనుని యొక్క అంతమును చూడండి.
93ఎర్న్ బాక్సటర్ — నా యొక్క సమకాలికులలో ఒకరు. చాలా మంచి సంస్కారము గల మనిషి. కెనడాలో నివసించుచున్న ఎర్న్ బాక్సటర్ ను గూర్చి మీలో చాలా మందికి తెలుసు. అతడు ధీరుడైన సేవకుడు. ఒక రోజు అతను నాకు ఒక కథను చెప్పాడు. "బ్రెనాం సహోదరుడా, మనము సైకిళ్ళును తొక్కేవారిమి. నేను చిన్న బాలునిగా ఉన్నప్పుడు, మా అమ్మ కొరకు మేము బజారుకు వెళ్ళి, కిరాణా సామానులను కొని తీసుకొని వచ్చేవారము. ఆ విధముగా సైకిలు తొక్కుతూ వెళ్ళేటప్పుడు నేను సైకిలు యొక్క హేండిల్ బార్ ను అసలు చేతితో పట్టుకోకుండానే నడుపుతాను. స్విన్ అను పేరుగల కంపెనీ వారు, ఒక అడుగు వెడల్పు కలిగి మరియు భూమి పై రెండు అడుగుల ఎత్తుపై పెట్టబడిన చెక్క పై ఎవరైతే ముప్పై గజాల దూరము వరకు పడిపోకుండా సైకిల్ ను నడుపగలరో, ఆ బాలునికి ఒక సైకిలు ఉచితముగా ఇవ్వబడునని," స్విన్ అనే కంపెనీవారు ప్రకటించిరి. "మేము ఆలాగున చేయగలమని మనలో అందరికీ తెలుసు," అన్నాడు.
మరియు అతడిలా అన్నాడు, "అక్కడ ఒక ఆడంగివలె ఉండు బాలుడున్నాడు. అతనితో మేమెన్నడూ స్నేహము చేయము, ఎందుకనగా అసలు అతనికేమి తెలియదన్నట్లు అతడు ఉండును గనుక అతడికంటే మాకే అన్ని తెలుసని మేము తలంచేవారిమి. ఆ కంపెనీవారు ప్రకటించిన పోటీలో పాల్గొనుటకు సామర్థ్యము గలదో లేదో గాని అతడు కూడా ఆ పోటీలో పాల్గొనెను.
కాని ఏమి జరిగినదో మీకు తెలుసా? సైకిలును తొక్కలేక మధ్యలోనే మేమందరము బోర్లా పడ్డాము, కాని అతడు మాత్రమే చివరి వరుకు సైకిలును తొక్కుతూ వెళ్ళి పందెమందు గెలిచి, ఆ స్విన్ కంపెనీ సైకిలును బహుమతిగా పొందుకొని దానిని తొక్కుకుంటూ వెళ్ళెను. దానిని గూర్చి మాకేమి అర్ధమవ్వక మేమందరము ఒకచోట అతడిని కలుసుకొని, జాన్ నీవు దానిని ఏలాగు సాధించగలిగితివనేది తెలుసుకోవాలని మేము ఆశించుచున్నాము," అని అడిగాను.
"మంచిది. అబ్బాయిలు! ఏమి జరిగినదో నేను మీకు చెప్తాను. మీరందరూ ఏమి చేయుచున్నారో నేను గమనించేవాడిని, కాని మీలా కాకుండా వేరేవిధముగా నేను నేర్చుకున్నాను. మీరు గమనించండి, మీరు దానిమీద కూర్చున్నప్పుడు వారు మిమ్మల్ని ముందుకు తోసేవారు. మీరు దానిని చక్కగా నడిపేవారు. నాకంటే మీరందరూ చాలా చక్కగా సైకిలును తొక్కెదరని మీకందరికి తెలుసు, ఎందుకనగా చేతులతో [హ్యండిల్-బార్ ను] పట్టుకోకుండా సైకిలును నేను నడపలేను," అని అతడు అన్నాడు.
94[మరియు నేను కూడా సిలువను పట్టుకొనకుండా నేను ముందుకు సాగిపోలేను, మీరు చూచారా. ఈ వాక్యము నా జీవితము యొక్క భాగమైయున్నది. ఇదే మీకు కూడా కావలసియున్నది. పరిశుద్ధాత్మ అనే హ్యండిల్-బార్ యొక్క మార్గ దర్శకత్వము లేకుండా నేనేమి మాట్లాడలేను, ఈ పరిశుద్ధాత్మయే నాలో సంచరించుచు మరియు నన్ను నడిపించుచున్నది.]
"నేను అలా చేయలేను… మీవలే నేను సైకిలును నడపలేను. అయితే మీరు ఒక తప్పిదము చేసిరి. అదేమనగా సైకిలును తొక్కేటప్పుడు క్రింద పడిపోకుండా ఉండుటకై మీరు క్రిందవైపే చూస్తూ నడిపేవారు. అందువలననే మీరు ఉద్రిక్తత చెందుచూ క్రింద పడిపోయిరి. నేను సైకిలు మీద కూర్చున్నప్పుడు వారు నన్ను ముందుకు త్రోసిరి. కేవలము నా దృష్టినంతా ఆ మార్గ అంతము వైపే చూస్తూ, నిలకడగా వెళ్ళుచూ నేను చేరవలసిన గమ్యమును చేరితిని."
ఇప్పుడు, వ్యాపారస్తులారా, మీరు ఈ లోక సంబంధమైన వ్యాపారమువైపు చూడవద్దు. నీ వ్యాపారము ఒకవేళ రేపో లేదా మరేదో ఒక రోజున అది పతనమై పోవచ్చును; అయితే నీవు పెట్టుబడి పెట్టిన భీమా యొక్క రాబడిని పొందుకొనే గమ్యము యొక్క అంతముయందే నీ దృష్టిని నిలుపుము.
MATT 5:3•
LUKE 12:18•
LUKE 16:20,21
95ఈ ధనవంతుడు ధనవృద్ధిని విస్తరింపజేసుకొనెను. అయితే చివరగా అతడి జీవితకాల అంతిమ దినమందు తన రాబడిని పొందుకొనే దినము వచ్చుటను మనము కనుగొంటిమి. ఎంతగానో వర్ధిల్లిన తన సంపదను భద్రపరుచుకొనుటకై అతడు దురాశతో, తన కొట్లను విప్పి నూతన కొట్లను కట్టెను. ఓ, అతని వ్యాపారము చాలా అభివృద్ధి చెందెను. అతడు తన సంఘములో ఒక సభ్యుడుగా ఉండెను.
మీరు "అవునా?" అని అడగవచ్చును.
అవును, సోదరుడా, అది నిజము. అతడు తన సంఘములో ఒక సభ్యుడుగా ఉండెను. ఒక రోజు రాత్రి, అతడెంత గొప్పవాడైనను ఆత్మ విషయములో చాలా పేదవాడే…
డబ్బు విషయములో మనము పేదవారముగా ఉండనవసరము లేదని మీకు తెలియును, ఆత్మ విషయమై దీనులముగా ఉండవలసియున్నది. మత్తయి సువార్త 5వ అధ్యాయములో, "ఆత్మ విషయమై దీనులైనవారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది" అని యేసు చెప్పెను. [సంఘ శాఖ కాదు గాని], "పరలోక రాజ్యము."
ఆత్మ విషయములో దీనుడగు ఒక పేదవాడు అతని ఇంటి ముందు పడి ఉండగా, అతడిచ్చు రొట్టె ముక్కలవలననే ఈ పేదవాడు ఆకలి తీర్చుకొనుచుండెను. మరో మాటలలో చెప్పాలంటే, ఈ ధనికుడు అతడిని దాటి వెళ్ళుచున్నప్పుడు, ఈ పేదవాడు భిక్షమును అడుక్కునే దానిలో బహుశా, అతడెంతో కొంత డబ్బులను వేసియుండవచ్చును లేక వేరేదైన రీతిగా అతడు సహాయము చేసియుండవచ్చును. "వారు చక్కని ప్రజలని మీకు తెలుసు, నేను వారికి వ్యతిరేకిని కాను. ఎప్పుడన్నా ఒకసారి వారి ఉదయకాలపు అల్పాహారమునకు నేను వెళ్ళెదను," అని అతడు చెప్పవచ్చును. కొన్ని రొట్టె ముక్కలను ఇచ్చి అంతటితో చాలని మీరు సరిపెట్టుకో వచ్చును.
"ఓ, నా భార్య ఆ కోవకు చెందినది. కాని నాకున్న స్థితినిబట్టి నా వ్యాపారపు సహచరులతో నేను సంతోషించుచున్నాను," అని అతడు అనుకొనును. ఆ గర్వముతోనే తాను చేసిన మంచి కార్యము యొక్క ఫలమును కోల్పోయెను.
LUKE 16:22
96అయితే లాజరు, ఆత్మ విషయములో దీనుడైనవాడు, అతని కురుపులను కుక్కలు నాకుచుండగా, అతనికి గల వ్యాధిని బాగుచేసుకొనుటకు తగిన మందులు కూడా అతని యొద్ద లేవు.
అయితే ఒక రాత్రి అతడు మరియు ఆ ధనవంతుడు కూడ చనిపోయెను. వారు చనిపోయినప్పుడు, పరిశుద్ధ గ్రంధము చెప్పుచున్నదేమనగా, ఆత్మలో దీనుడైన లాజరు అబ్రాహాము రొమ్మున ఆనుకొనుట కొరకై దేవదూతలచేత కొనిపోబడెను. ఎవరైతే తన పెట్టుబడిని నిత్యజీవమునందు పెట్టుదురో, అది అతనిని నిత్యజీవమునకు తీసుకొనిపోవును. ఇక్కడ భూమి మీద ఉన్నదాని కొరకు లాజరు జీవించలేదు. అతనికి ఏ పేరు ప్రతిష్టలు, ఏమియు లేవు. ఆ ద్వారము దగ్గర అతడు ఒక భిక్షగానివలె వుండెను. అతనికి ఏది లేదు, అతని దగ్గర డబ్బు లేదు. అతనికి అసలేమి లేదు. అతనికి స్నేహితులు లేరు, అయినప్పటికినీ అతడు ఒక విశ్వాసిగా ఉండెను. అతడు తన పెట్టుబడిని పెట్టెను. కుక్కలు అతని కురుపులను నాకుచుండగా, అతడు ఆ వీధిలో పడి చనిపోయెను. పరిశుద్ధ గ్రంధము "అబ్రాహాము రొమ్మున ఆనుకొనుట కొరకై అతడు దేవదూతలచేత కొనిపోబడెనని," చెప్పుచున్నది.
MARK 10:21•
LUKE 16:23,24,26
97మరియు అదే రాత్రియందు ధనికుడైన ఆ అధికారి, గొప్ప ఐశ్యర్యవంతుడిగా జీవిస్తూ చనిపోయెను. మరి ఇప్పుడు అతడు పొందుకోవలసిన రాబడులను కూడ పొందుకొనెను. మేధావివైన ఒక బోధకుడు అచ్చటకు వచ్చెను, అతడు తన కాలరును పైకి ఎత్తుకొని, యాజకుని వస్త్రములను ధరించుకొని, జెండాను సగము వరుకు దింపి మర్యాదను చెల్లించుచూ, పుష్ప గుచ్చములు పెట్టుటకు ఆ స్థలము చాలలేదు. ఓ, గొప్ప వారందరూ, వ్యాపారస్థులందరూ అచ్చటకు వచ్చి పాల్గొనిరి. బ్యాంకు అసోసియేషన్ యొక్క అధిపతి మరియు ఇంకా అనేకులు ఆ సమాధి కార్యక్రమంలో పాల్గొనుటకు వచ్చిరి. అంతేకాకుండా, అతడిని భద్రపరచిన శవపేటికను మోసుకొని వెళ్ళువారు కూడా వచ్చి యుండిరి.
ఆలాగుననే మేధావియైన సేవకుడు లేచి ఈలాగు, "మన ప్రశస్త సోదరుడు, ఎన్నోసార్లు విధవరాండ్ర కొరకు బ్యాంకు చెక్కులను వ్రాసి ఇచ్చెను. చాలసార్లు మన సంస్థకు సంబంధించిన కార్యక్రమాలకు చేయూతనిచ్చి ఆర్ధికముగా సహాయపడెను," అని చెప్పియుండవచ్చును. ఆ సంధర్బముగా వ్యాపార వేత్తలు లేచి నిలబడి, చనిపోయిన ఇతడిని గూర్చి పొగుడుచూ, అనేక మాటలను మాట్లాడిరి. ఈ లోక సంబంధమైన పొగడ్తలను అతడు పొందుకొనెను. అతడు దేనిమీదైతే తన పెట్టుబడిని పెట్టెనో అది ఆ విధమైన ప్రతిఫలమును పొందుకొనునట్లుగా చేసెను. ఈ లోకరీతిగా అతడు చాలా గొప్ప ఐశ్వర్యవంతుడుగా యుండెను. అయితే దేనియందు అతడిని పెట్టుబడి పెట్టమని యేసుక్రీస్తు చెప్పెనో, దానిని అతడు తృణీకరించుటవలన పరిశుద్ధ గ్రంధములో చెప్పుచున్న ప్రకారముగా, "ఆ పాతాళము నుండి అతడు తన కన్నులు పైకెత్తి చూచెను." దేనియందు నిశ్చయతను కలిగి లాజరు తన పెట్టుబడిని పెట్టెనో, అతడు అబ్రాహాము రొమ్మున భద్రముగా ఆనుకొని, ఆదరణ పొందుచూ, అటు ఇటు తిరుగుచు మంచి స్థితియందు ఉన్నాడు.
ఈ ధనవంతుడు పాతాళమునందు బిగ్గరగా ఏడ్చుచున్నాడు. ఇప్పుడు గమనించండి. మీరనవచ్చును, "అతడు ఒక క్రైస్తవుడు కదా…" నిజమే!
"తండ్రివైన అబ్రాహామా! [అతడు ఒక యూదుడు], "నీకు మొర్రపెట్టుచున్నాను. ఆత్మ విషయములో దీనుడై తన పెట్టుబడిని ఏ నిశ్చయతయందు పెట్టెనో ఆ లాజరును పంపుము. నాకు వచ్చిన అవకాశమును నేను జారవిడుచుకున్నాను, కాని నాయందు కనికరము చూపి, తన వ్రేలికొనను నీళ్ళలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపుము. నేను ఈ అగ్నిజ్వాలలో యాతన పడుచున్నానని కేకలు వేసి చెప్పెను."
"కుమారుడా! నీకు ఇవ్వబడిన అవకాశమును నీవు కోల్పోతివి."
అవును. "నీకున్నదానినంతటినీ అమ్మి, నీవు వచ్చి నన్ను వెంబడించుము. నీ సిలువ నెత్తుకొని దీనిలో నీ పెట్టుబడిని పెట్టుము," అని యేసు ధనవంతుడైన యవ్వనస్తుడికి అవకాశమును ఇచ్చెను. అయితే అది అతనికి సాధ్యమవ్వని గొప్ప కార్యముగా యుండెను. "ఇప్పుడు లాజరు నెమ్మదిగా యున్నాడు, నీవు నరకయాతన అనుభవించుచున్నావు. అంతేగాక అక్కడి వారు మా యొద్దకు దాటి రాజాలకుండునట్లును, మీకును మాకును మధ్య మహా అగాధముంచబడియున్నదని," అబ్రాహాము చెప్పెను.
LUKE 16:23
98పాపపరిహార స్థలమున్నదని చెప్పే సిద్ధాంతము మరియు ఇంకా అటువంటి సిద్దాంతములన్నింటినీ అది బ్రద్దలుచేసి దానిని తునాతునకలుగా చేయుచున్నది. పైన చెప్పబడిన వాక్యము యేసుక్రీస్తు చెప్పిన మాటలు. అయ్యా, సమయము గతించుపోవువరకు వేచి యుండవద్దు. నా ప్రశస్తమైన మొండి పట్టుగలవాడా, క్రీస్తులో నుండి తొలగిపోయిన సోదరుడా.
దీనియందు నీ పెట్టుబడిని పెట్టుటకు అనేక దినములు వేచియుండవద్దు. ఇంకొక దినము ఎప్పుడైనా దానిని చేద్దాములే అని అతడు తలంచి ఉండవచ్చును. దక్షిణ ప్రాంతమందు ఈ విధముగా చెప్పే ఒక సామెత గలదు, "పాతాళము దానికదే మంచి ఉద్దేశ్యములతో అమర్చబడియున్నది," చూడండి. మంచి ఉద్దేశ్యములు కలిగివున్నను ప్రయోజనమేమియు లేదు. మందు సీసాపై అది ఏ విధముగా వాడాలని వ్రాయబడియున్నదో మొదట దానిని చదివి ఆ ప్రకారముగా దానిని ఉపయోగించినట్లయితే, దాని ఫలితమును నీవు పొందెదవు. ఆయన రక్తముతో నీ పేరున నీ హృదయమందు సంతకముచేసి దానియందు నీ యొక్క పెట్టుబడిని పెట్టుము, చూచారా. గమనించండి.
ఆ ధనవంతుడు పడుచున్న దురవస్థ వైపు చూడండి. అతడు పాతాళములో తన కన్నులను పైకెత్తి చూచెను. అతడు దేనియందు పెట్టుబడిని పెట్టెనో దానికి తగిన ప్రతిఫలమును అనుభవించుచున్నాడు.
LUKE 16:28-31
99కాబట్టి అతడు ఏమి పలుకుచున్నాడో ఇచ్చట గమనించండి, అతడు అన్నాడు, "తండ్రివైన అబ్రాహామా! నా సహోదరులను ఇక్కడికి రానివ్వవద్దు, నేను చేసిన అదే తప్పిదమును వారు కూడా చెయ్యకుండునట్లుగా అచ్చటకు వెళ్ళి వారికి ఈ సువార్తను చెప్పుట కొరకు భూమి యందు నేను సంపాదించిన సంపదను, నాకున్న నా సమస్త స్వాస్థ్యమును యిచ్చెదను. నీవు గనుక దీనిని చేయక పోయినట్లయితే, వారు నావలె నరక యాతన పడుదురు."
ఈ ఉదయకాలమున యూదుడవైన నా స్నేహితుడా, లేక అన్యుడవైన నా స్నేహితుడా? మీరు అతడివలె కఠినముగా ఉండకుడి.
"లాజరును మరల వెనుకకు పంపించుము, ఈ వర్తమానమును వారి దగ్గరకు తీసుకొని వెళ్ళి చెప్పనిమ్ము" అని అతడు అబ్రాహాముతో చెప్పెను. ఓ, ఇప్పుడు ఆ ధనవంతుడు ఒక సేవకుడువలె సేవ చెయ్యాలని ఆశించెను. ఇప్పుడు దానిని అంగీకరించుటకు మనస్సు కలిగినది. కాని ఇప్పటికే సమయము గతించిపోయినది. ఇప్పుడు దానిని చేయుటకు సాధ్యపడదు. అతడు జీవించుచున్న సమయమున దానిని చెయ్యుటకు అతడికి ఒక అవకాశము లభించెను, కాని ఆ అవకాశమును అతడు జారవిడుచుకొని, ఆయనయందు తన పెట్టుబడిని పెట్టలేక పోయెను.
"అచ్చట వారికి ప్రవక్తలు గలరు, దేవుని వాక్యము మరియు ధర్మశాస్త్రము ఏమి చెప్పుచున్నవో ఆ మాటలను వారు కలిగియున్నారు," అని అబ్రాహాము చెప్పెను.
ధనవంతుడు, "అవును, కాని మృతులలో నుండి ఒకడు లేచి వెళ్ళినయెడల అతడు మృతులలో నుండి లేచియున్నాడనే నిరూపణ ద్వారా సువార్తను బోధించినట్లయితే అప్పుడు వారు దానిని నమ్ముదురు," అని చెప్పెను.
"మృతులలో నుండి ఒకడు లేచి వెళ్ళిననూ వారు నమ్మరని," అబ్రాహాము చెప్పెను.
MATT 6:21•
LUKE 12:34•
JOHN 3:7
100ఈ దృశ్యము జరిగి రెండు వేల సంవత్సరములు గతించిపోయినది. 1963వ సంవత్సరమున ఈ ఉదయకాలపు వేళలో మన మధ్య ఒకరు ఉన్నారు, ఆయనే మృతులలో నుండి లేచిన క్రీస్తుగా రుజువుపరచబడెను. ఆయనలో ఏ జీవమైతే ఉన్నదో, అదే జీవమును తన సంఘమందు ఉంచి, ఆయన తన వాక్యమును నెరవేర్చుటకు ఆయన చేసిన అదే కార్యములు సంఘము చేయునట్లు చేసెను. ఈ ఉదయకాలమున సోదరుడా, సోదరీ, దీని కొరకు నీ పెట్టుబడిని పెట్టెదవా! భయభక్తులతో మనము మన తలలు వంచియుండగా, మీ జీవితములను క్రీస్తుకు సమర్పించుకొనుము.
ఈ మాటలను వ్యర్థము కానివ్వద్దు. "నీవు తప్పక తిరిగి జన్మించవలయును." నీవు తప్పకుండా. ఇప్పుడు, నీవేదో కేకలు పెట్టాలని, ఆర్బాటం చేయాలని, భాషల్లో మాట్లాడాలని నేను చెప్పుటలేదు. నీ హృదయ అంతరంగములో నుండి నీ పాపముల నిమిత్తము నిజమైన పశ్చాత్తాపము చెంది, మరల తిరిగి జన్మించాలనేదే నా భావము. సంఘ సంస్థలు నిజ వాక్యమునకు విరుద్ధమైనవిగా ఉన్నవని నీవు ఎరిగినను, నీ స్వనీతి సంబంధమైన ఆలోచనలతో మరియు గర్వముతో, పేరు ప్రఖ్యాతలు కొరకు నీవు ఎల్లప్పుడు నీ సంఘ సంస్థలోనే, ఆ పెద్ద సంఘములోనే నిలిచియుండుటకు ఆశించినయెడల, ఇక ఎన్నటికీ నీవు మరలా తిరిగి జన్మించలేవు, మూలలో ఇరుక్కు పోయివున్న ఆ సంస్థలో ఉంటూ, నీవు ఏమి చేయాలనుకున్నా అది వ్యర్థమే. గమనించండి, నీ ధనమెక్కడ వుండునో, నీ హృదయము కూడా అక్కడనే వుండును.
ACTS 2:41•
ACTS 18:8
101ఓ వ్యాపారస్థులారా, ఈ ఉదయకాలమున యేసుక్రీస్తునకు ఒక ప్రతినిధిగా, ఆ నిత్యజీవము కొరకు, నిత్యజీవపు భీమాని మీరు చేయాలని నేను మిమ్ములను కోరుచున్నాను, ఆ క్రీస్తే నా ప్రభువు, నాకు ఉన్నతమైన యజమానుడు, నేను ఈ లోక సంబంధమైన కార్యముల విషయమై మృతుడనై, ఆయన కొరకు మాత్రమే జీవింపగోరుచున్నాను. మన స్వంత మనస్సును ఉపయోగించక ఆ పౌలువలె, మోషే వలె మనము ఆయనకు ఖైదీలమై ఆయన మనస్సును మనము కలిగి ఉందుముగాక. నిన్ను గూర్చి ఎవరేమన్నా గాని దానిని లెక్క చేయకుండా, నీవు ఆ వాక్యమునకు ఖైదీగా మారిపొమ్ము. పరిశుద్ధాత్మయే నిన్ను నడిపించును. పరిశుద్ధాత్మయే నీవు వెళ్ళకూడని స్థలమునకు నిన్ను వెళ్ళనివ్వకుండా కట్టడిచేయును, ఇది నీవు రాకూడని స్థలమైనయెడల పరిశుద్ధాత్మయే నిన్ను రాకుండా నిరోధించును. నీవు వెళ్ళకూడదనుకునే స్థలమునకు ఆయన నిన్ను వెళ్ళనిచ్చును. నీవు వెళ్ళగోరుచున్న స్థలములకు వెళ్ళకుండా నిన్ను దూరముగా ఉంచును. నీవు ఒక భీమా కావాలని ఆశించుచున్నావా? పెట్టుబడిని పెట్టుటకు నీవు ఇష్టపడుచున్నావా?
మెథడిస్టు ప్రజలును మరియు అనేకమంది పెంతెకోస్తులు పిలుచునటువంటి బలిపీఠము పిలుపును ఇచ్చుటకు ఇచ్చట స్థలము లేదు, కావున నీవెచ్చట కూర్చొని ఉన్నావో ఆ స్థలమే నీవు తీర్మానించుకొనే ఒక బలిపీఠమై యున్నది. "విశ్వసించిన వారందరూ బాప్తిస్మమును పొందిరని," పరిశుద్ధగ్రంధము చెప్పుచున్నది. నీవు పశ్చాత్తాపము పడగోరుచున్నట్లయితే, నీవు తప్పు చేసియున్నావని తెలుకొనుము, ఈ విధమగు భీమాలలో ఒకదానిని నీవు కూడా ఎన్నుకొనుట నీకు మేలు, ఇట్టిదానిని ఆశించుట మంచిది. మరియు నీవు దీనిని గూర్చి మరోలా భావించుటలేదని నేను నమ్ముచున్నాను. "భీమా" అనే మాటను నేను చెప్పుచున్నప్పుడు, అది దైవదూషణ కరమగు మాటగా మీకు ధ్వనించుటలేదని నేను నమ్ముచున్నాను. నేను మాట్లాడుచున్న అంశము కొరకే నేను దానిని ఆ విధముగా చెప్పవలసియున్నది. మరియు మీరు ఆ నిత్యజీవమును ఆశించుచున్నట్లయితే, యేసుక్రీస్తులో మీ పెట్టుబడిని పెట్టుమని, ఇప్పుడే దానిని గూర్చి గట్టిగా ఆలోచించమని ప్రాధేయపడుచున్నాను.
102ఇప్పుడు విజ్ఞాణ శాస్త్రము ప్రకారముగా, భూమ్యాకర్షణ శక్తి నీ చేతులను క్రిందికి లాగుచున్నది. కాని నీలో ఒక జీవము ఉన్నది, అది భూమ్యాకర్షణ శక్తిని ఎదిరించగలుగుచున్నది, అందువలన నీవు నీ చేతులను పైకెత్తగలుగుచున్నావు. మరియు నీలోవున్న ఆ జీవము నీతో చెప్పుచున్నట్లయితే, ఈ ఉదయకాలమందు, ఆ ధనవంతుడైన యవ్వన అధికారివలె కాకుండా; నేను ఒక మంచి పురుషునివలె లేక ఒక మంచి స్త్రీవలె జీవించినను నా యొద్ద ఆ భీమా లేదు. ఆ నిశ్చయత లేదని నేను నమ్ముచున్నాను. ఏమైనా గాని దానిని నేను తీసుకొనగోరుచున్నాను.
నీ హృదయ రహస్యములను ఎరిగినవాడై మరియు ఎవరైతే నీతో మాట్లాడుచున్నడో, సమస్త సృష్టికి కారణభూతుడెవరో, ఆయనే దానిని నీకు అనుగ్రహించుచున్నాడు. నీపేరు ఏమిటో ఇప్పుడే ఆయన నీతో చెప్పగలడని నీకు తెలుసా, ఆయన నీ కొరకు దానిని చేయుచున్నాడు; "అవును, ప్రభువా! ఈ ఉదయ కాలమునందు నాకు ఈ అవకాశమును ఇచ్చినందుకు నేను నా చేతులను నీవైపుకు ఎత్తుచున్నాను. దయచేసి నన్ను కనికరించుము, ప్రభువా! ఉదయమున ఆ పరిసయ్యునివలె నిత్యజీవము లేకుండా వట్టివాడగా ఈ తర్పీదు గృహములో అభ్యసించిన కార్యములను త్రోసివేస్తూ నేను పారిపోలేను. దేవా, నా పట్ల నీకున్న ప్రణాళికను నేను అంగీకరించుచున్నాను, నాలో నీ జీవము ఉండునట్లుగా నేను స్వీకరించుచున్నాను. నా జీవితములోనున్న వాటిన్నింటిని త్వజించి, నేను నీ వాక్యమునకు ఖైదీగా ఉండునట్లు చేయుము." "సోదరుడా బ్రెన్హాం, నా కొరకు ప్రార్ధించండి. దేవుని కొరకు నా చేతులను పైకెత్తుచున్నాను. సోదరుడా బ్రెన్హాం, నీ కొరకు కాదు గాని దేవునికి చూపించుటకు నా హస్తమును పైకెత్తుచున్నాను. దీనిని ఎవరైతే నాకు అనుగ్రహించెనో ఆ దేవుని యందు నేను నా పెట్టుబడిని పెట్టగోరుచున్నాను."
MATT 24:35•
MARK 13:31•
LUKE 21:33
103ప్రతి ఒక్కరి కన్నులు మూసియున్న, ప్రతి ఒక్కరి తలలు వంచియున్న ఈ సమయమున ఇప్పుడు మీరు మీచేతులను పైకెత్తైదరా.
ప్రజల్లారా, దేవుడు మిమ్మును దీవించునుగాక. మీరెవరైనను ఫర్వాలేదు… సేవకులను నేను చూస్తున్నాను. అది నిజము. యధార్ధముగా ఉండండి. చూడండి, సేవకులు అతీతులుకారు. నేరుగా చెప్పాలంటే, వారు కాపరులైయున్నారు. మొదటిగా స్థానమును తీసుకోవలసినది వారైయున్నారు. మంచిది. నేను ప్రార్థించుటకు ముందుగా అచ్చట ఇంకా ఎవరైనా ఉన్నారా? అవును. దేవుడు మిమ్మును దీవించును గాక! దేవుడు మిమ్మును దీవించును గాక! అక్కడ పైనున్న బాల్కానీలో ఎవరైనా ఉన్నారా, నిన్ను దీవించును గాక! అవును, ప్రతీ చోటనయున్న మీ హస్తములను ఆయన చూచుచున్నాడు.
ఇప్పుడు, యధార్ధముగా, మీ చేతులను క్రిందికి దించండి, ఇప్పుడు మీ యొక్క తీర్మానమును మీరు చేసిరి. ఇప్పుడు నేను ప్రార్ధించుచుండగా, ఎవరైతే గొప్ప దేవునిగా వుండి శరీరము నందు ప్రత్యక్షమైయున్నారో, ఆయనే మనకొరకు మరలా పరిశుద్ధాత్మ రూపమున తనను అనుగ్రహించుకొనుచూ, ఆయన నీ హృదయములో నివసించి నీలోయున్న ప్రతీ సమస్యలను, సందేహముగా ఉన్న సమస్త ప్రశ్నలకు జవాబును ఇచ్చుచూ, నీ జీవితమనే పుస్తకమునందు "క్షమించబడెను" అని వ్రాసి, పునరుత్థానము యొక్క నిశ్చయతను మరియు నిత్యజీవమును నీకు ఇచ్చుచూ, నీ పేరును జీవగ్రంధమందు వ్రాసెను, ఎందుకనగా క్రీస్తు నీలో పునరుత్థానుడయ్యెను. నీవు ఈ విధమైన కూటములయందు ఆయన యొక్క కదలికను చూచుట ద్వారా, చనిపోయిన వారు మృతులలో నుండి తిరిగి లేచుచు, రోగులను స్వస్థపర్చుచుచు, హృదయ రహస్యములను బయలుపరచుచు, భవిష్యత్తు కార్యములను పరిపూర్ణముగా వివరించి చెప్పుచు, చెప్పిన కార్యములు సంభవించుచు, సంవత్సరముల తరబడి సంవత్సరములుగా ఎన్నడూ ఏదీ కూడా విఫలమవ్వక, ఆయన తన్నుతాను మీ యెదట రుజువుపరుచుకొనుచున్నాడు, ఎందుకనగా అది వాక్యమైయున్నది.
"ఆకాశము మరియు భూమియు గతించుపోవును గాని నా మాటలలో ఎన్నడూ విఫలమవ్వదని," యేసు చెప్పెను. ఆ కారణముచేతనే అది ఎన్నటికీ విఫలమవ్వదు, అది ఈ కాలము కొరకు వాగ్దానము చేయబడిన వాక్యమైయున్నది.
GEN 2:9•
LUKE 2:7,12,16
104పరలోకపు తండ్రీ, మేము సాయంకాలమందున్నాము. ఆ ఏదేను తోటలో నుండి వచ్చిన జీవవృక్షము నీవే అని పరిశుద్ధ గ్రంథములో చెప్పిన దానిని మేము ఎరుగుదుము. మరియు అచ్చట ఉంచబడిన ఆ సెరూపములు అగ్ని జ్వాలలవంటి ఖడ్గములను కాపలాగ ఉంచితివి, ఎందుకనగా మానవుడు చెయ్యిచాచి, జీవవృక్ష ఫలములను తీసుకొని తిని అతడు నిరంతరము జీవించునేమోనని ఆ జీవవృక్షమును కాపాడుచూ సంరక్షించియున్నావు.
అయితే ఇప్పుడు అదే అగ్నిజ్వాలల ఖడ్గము దేవుని వాక్యమై ప్రజలను ఆ వృక్షమునొద్దకు తిరిగి వచ్చునట్లుగా, ఆ జీవవృక్షమే ఈ భూలోకమున ఎంతో సౌందర్యముగా ఆ పశువుల శాలలో జన్మించి, గొర్రెలు, పశువులు ఎచ్చట విశ్రాంతి కొరకు కట్టబడియున్నవో, అచ్చట ఆ చిన్న పసిబిడ్డ రూపమున యెహోవా యేడ్చుచు, పరుండబెట్టెను. ఓ, ప్రతీ పురుషుల, స్త్రీల హృదయములలో, అదెంత ఉద్వేగభరితమైన కార్యమై వింతగొల్పుచున్నదో కాదా.
మరియు అప్పుడు, ఈ లోక పాపముల కొరకు శ్రమలను అనుభవించుచూ యెహోవా ఆ సిలువపై మరణించుచుండెను. అది ఆయన చేయవలసిన కార్యము కాదు, కాని ఆయన దానిని చేసెను. ఆయన కృప దానిని చేయునట్లుగా ఆయనను బలవంతము చేసెను. ఆయన ప్రేమ, "దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను," మరియు ఆయన ప్రేమ దానిని చేయునట్లుగా ఆయనను బలవంతము చేసినది. ఎందుకనగా ఒక రక్షకుడుగా ఈ మానవ జాతికి ఆయన తనలో ఉన్న గుణాలక్షణములను ప్రదర్శించాలని… వారు తప్పిపోవలసియుండెను. అచ్చట ఏదియూ తప్పిపోకూడదు. సమస్తమునూ ఆయన పరిపూర్ణముగా చేసెను. అయితే అవినీతిని మనుష్యులయందు చొప్పించుట ద్వారా సాతానుడు దానిని వంకరగా మార్చివేసెను, కాబట్టి ఆయన దానిని విమోచించవలసియుండెను, మరియు ఆయన దానిని చేసెను.
105ఓ, నిత్యుడగు దేవా! దయతో వచ్చి ఇక్కడయున్న ప్రతి హృదయముతో మాట్లాడుము. మరియు ఈ దినమున తమ చేతులను పైకెత్తిన వారిలో, నేను వారిని అభ్యర్థించుచున్న సమయములో తమ చేతులను పైకెత్తిన వారు బహుశా కొద్దిమంది ఉండవచ్చు, ఎవరిలోనైనా నిజమైన స్పందన లేకపోయినను, ఇప్పుడు దానిని వారిలో కలిగియున్నారు. దేవా, ఈ దినము నుండి వారి స్వంత జీవితమును, యేసుక్రీస్తు కొరకు మరియు ఆయన వాక్యము కొరకు వారి జీవితాంతము తమ పెట్టుబడిని పెట్టుటకై రక్తముతో సంతకమును చేయుదురు గాక.
ఆ గొప్ప వృక్షము, ఆ గొప్ప జీవవృక్షము, ఆయన భూమిమీదికి వచ్చినప్పుడు శపించబడిన వృక్షమునందు, రోమీయుల వృక్షమునకు కరముగా వ్రేలాడదీసి, రోమీయుల ఈటె ద్వారా వారు దానిని నరికివేసిరి. కాని అచ్చటే ఒక వధువు వృక్షమును ఆయన విమోచించెను, తన పోలికవలెనే ఉండునట్లుగా ఆ వధువు వృక్షమును మార్చివేసెను. ఏదేను తోటలో ఉండిన హవ్వ అనబడే ఆ వృక్షము పతనమై పోయెను. ఆదిలోవున్న ఆ హవ్వ పడిపోయెను, ఆదాము హవ్వతో నడచి బయటకు వెళ్ళిపోయెను. కాని ఇప్పుడు కడపటి ఆదాము వచ్చెను, రెండవ ఆదాము, ఆయన ఆమె కన్నులను తెరచి, తన హవ్వను స్వీకరించుటకు వచ్చుచున్నాడు.
PS 1:3•
JER 17:8•
JOHN 6:39,44,65•
JOHN 10:28,29
106ప్రవక్త చెప్పినట్లుగానే, దావీదు సెలవిచ్చినట్లు, "నీటి కాలువల యోరను నాటబడిన చెట్టు ఫలమిచ్చు రీతిగ," ఈ చివరి దినములలో ఆ జీవజలములను వధువు వృక్షమునకు ప్రభువా, దయ చేయుము. వ్యర్దమైన ఈ మతశాఖల కొమ్మలన్ని టిని తన భర్త ద్వారా కత్తిరించబడి, దేవుని ఆత్మ ఆ చెట్టు కొమ్మ చివరన తిరిగి క్రొత్తగా చిగురించుచూ, ఆ వృక్షము యొక్క హృదయములో నుండి దేవుని వాక్యము పుట్టుకొని వచ్చును గాక! దానిని దయచేసి అనుగ్రహించుము ప్రభువా! ఇంకా ఎక్కువ ఫలములను వారు ఫలించనిమ్ము.
వారి స్థితి లాజరువలె ఉండును గాక! భూమి మీద తమ మార్గమును ఆ విధముగా ఉండునట్లు తీసుకున్నట్లైతే, వారియొక్క నిధి భూమిమీద గాక పరలోకమునందు ఉన్నదని వారు ఎరుగుదురు గాక!
ఈ వ్యాపారవేత్తలను, ఈ స్త్రీ వ్యాపారులను, వారికి ఏదైతే సంబంధించి యున్నదో వాటిని దీవించండి, ప్రభువా! ఈ వర్తమానము యొక్క ప్రోద్బలముతో ఇప్పుడు వారిని నీకు మేము సమర్పించుచున్నాము. నీవు వాగ్దానము చేసిన రీతిగా, ప్రభువా! నీవు దానిని అనుగ్రహించుము. నేను నీ సేవకునిగా వారిని నీకు సమర్పించుచున్నాను. "నా తండ్రి ఆకర్షించనిదే ఎవడును నా యొద్దకు రాలేడు," అని నీవు చెప్పావు. ప్రభువా, వారు తమ చేతులను పైకెత్తియున్నారు.
ఇప్పుడు వారిని నీకిచ్చుచున్నాను. ఈ ఉదయకాలపు వర్తమానము యొక్క ప్రేమ కానుకగా నీ వాక్యమును బట్టి వారిని ప్రభువా, అంగీకరించుము. ఆ దినమువరకు ప్రభువా, నీవు వారిని కాపాడుము. "నా చేతిలో నుండి ఎవ్వరును వారిని అపహరించలేరు. మరియు అంత్యదినమునందు వారిని లేపుదును," అని నీవు చెప్పావు. వారు తమ జీవాణువును స్వీకరించుదురు గాక! అది మాత్రమే విత్తనముగా మొలకెత్తి పైకి వచ్చును, అది కేవలము దేవుని మాటవలన మాత్రమే చిగురించును. ప్రతి మనుష్యుని యొక్క మాట నిరర్ధకమగును. అది చనిపోవును. అది చిగురించి మరలా మొలకెత్తదు. కాని నీవు నా వాక్యము," అని చెప్పితివి. పరిశుద్ధ గ్రంధమందు ఏదైతే చెప్పబడెనో, అది ఎన్నడూ విఫలమవ్వదు," అది జీవము. ఏ జీవము క్రీస్తులో ఉంటూ వాక్యము ద్వారా ఏదుగునో, అట్టి జీవమును దయచేయుము. ఈ ఉదయ కాలమున దానిని వారు పొందిరి.
నీ సేవకునిగా ఈ ప్రార్ధనను నీకు నేను సమర్పించుచున్నాను. యేసుక్రీస్తు నామమున దీనికి జవాబును దయచేయుము. ఆమేన్.
107ప్రభువైన యేసుక్రీస్తు మిమ్మును దీవించును గాక. ఆలస్యమైనందుకు ఇంతసేపు మిమ్మును ఉంచినందుకు నేను చింతించుచున్నాను. నన్ను క్షమించండి. ఇక్కడ చేతులెత్తియున్న ప్రతి ఒక్కరు, ఒక మంచి క్రైస్తవ సంఘమునకు వెళ్ళుచు, పరిశుద్ధాత్మ నింపుదలను పొందుకొని జీవించగలరని నాకు వాగ్దానము చేయగలరా? మరియు మీరు ఎన్నడూ క్రైస్తవ బాప్తిస్మమును పొందనియెడల, ఆ క్రైస్తవ బాప్తిస్మమును పొందుకోండి. నా సహోదరుడా, యేసుక్రీస్తు కొరకు మీ యొక్క స్థానమున మీరు నిలబడండి. మరలా మనము ఈ రాత్రి కూటమున కలుసుకునేంతవరకు, దేవుడు మిమ్మును దీవించును గాక. మరియు ఈ ఆరాధనను తిరిగి సహోదరుడు కార్ల్సన్ కు అప్పగించుచున్నాను.