కాలమును మరియు సూచనను ఐక్యము చేయుట

కాలమును మరియు సూచనను ఐక్యము చేయుట

1శుభ సాయంకాలము. ఈ రాత్రి ఇక్కడుండుట మరియు ఈ స్థలములో నిలబడుట భాగ్యముగా ఎంచుచున్నాను.

ఈ ఉదయమున నేను ప్రార్థన చేసి దారిన వచ్చుచున్నాను… ప్రభువు కొరకు కనిపెట్టుచున్నాను. దారిన వచ్చుచూ ఒక రేడియో సేవకుని కార్యక్రమము వినుటకు త్రిప్పాను. అతడు సహోదరుడు స్మిత్, ఒక వర్ణ సోదరుడు. (మీలో ఎవరైనా ఈ ఉదయము ఆయన బోధ విన్నారా?) ఓహాయో వద్ద అని నమ్ముతున్నాను. అతడు బోధించుటను గూర్చి ఎవరో నాతో ఈలాగు చెప్పిరి. "నీవతని బోధ వినియుండ వలసినదే."

ఈ ఉదయమే ఆయన బోధ వినుట జరిగినది," అని చెప్పాను. ఈనాడు లోకములో పాపము ఎట్లు విస్తరిచుచున్నదో అతడు ఖచ్చితంగా చెప్పెను. ఆ స్టేషను కంటే ఇంకా దూరంగా నున్న మరొక దానివైపు త్రిప్పాను. వస్తూ మరొకరిది కూడా విన్నాను. ఇక్కడికి నేను వచ్చేసరికి సంఘమునకు హాజరగుటకు మరీ అంత ఆలస్యము కాలేదని చూడగా తెలిసినది, ఈ ఉదయము నేను వచ్చునప్పటికి. కనుక ఈ రాత్రి ఇక్కడుండుటకు, ప్రభువు యొక్క ఆరాధనలో సేవ చేయుటకు నిశ్చయంగా భాగ్యముగల జనులమే.

2ఒక రోజున వర్తమానము గూర్చి, సహోదరుడు నెవిల్ గూర్చి ఈ స్త్రీతోను, ఇప్పుడే మన యొద్ద నుండి వెళ్ళిపోయిన మన సోదరితోను మాట్లాడుతున్నాను. మనలను విడిచి పెట్టినది. అదెవరో మనందరకు తెలియును. ఆమె సోదరి వీవర్. ఈ రాత్రి బాప్తిస్మము పొందిన ఒక వ్యక్తిని గూర్చి ఇక్కడ ఆలోచించుచున్నాను. ఈ కొలనులో ఒకామెకు బాప్తిస్మమిచాను. వారామెను చక్రాల కుర్చీలో తేవలసి వచ్చెను. ఆమె కాన్సరుతో మరణించుచున్నది. ఆమె జీవించుటకు ఆ రాత్రి మాత్రమే యున్నది. వైద్యులు ఆశ వదలుకొనిరి. మరుసటి ఉదయాన ఆమె చనిపోవనై యున్నది. నేను ఆమె ఇంటికి వెళ్ళి దైవిక స్వస్థతను గూర్చి చెప్పుటకు ప్రయత్నించాను. ఆమె పదే పదే ఈలాగు పలికినది, "నా ఇంటికి నీవు వచ్చుటకు నేను యోగ్యురాలను కాను." "ఒక సేవకుడు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను తగిన దానను కాను. నేను పాపాత్మురాలను. అయ్యా, నేను ఈ విధంగా చనిపోగోరుట లేదు," అన్నది. ఇక్కడున్న గ్రేస్ వెబర్ నన్ను అక్కడికి తీసికొని వెళ్ళినది. నేను అప్పుడే కూటముల నుండి అలసిపోయి వచ్చాను. అక్కడ నేను ఆమె కొరకు ప్రార్థించుచుండగా, ఆమెకు వాక్యము చదివి వినిపించుచుండగా ఆమె రక్షింపబడినది. అప్పుడామె చేతిని కూడా ఎత్తలేని స్థితిలో యున్నది, కాని ఆమె అందరితోను కరచాలనము చేయగోరినది. అప్పుడే ఆమెలో ఏదో జరిగినది.

వారు కరచాలనము చేయుచుండగా, ఆమె ఒక కోళ్ళ గుంపు నొద్దకు వెళ్ళి తిరిగి వచ్చుటను దర్శనములో నేను చూచాను. "మంచిది, ఇప్పుడామె బాగుపడును" అని చెప్పాను. అది పద్దెనిమిదేండ్ల క్రితం మాట. ఆమె కాన్సరు నుండి ఆ తదుపరి తప్పింపబడినది. కాన్సరుతో ఆమె చనిపోలేదుగాని గుండెపోటు వలన ఆమె చనిపోయెను. ఆమెను వారు ప్రాణవాయువు క్రింద పెట్టిరి. ఆమె గుండెపోటు వలన మృతి పొందెను.

3చివరలో జనులు బయటకు వెళ్ళుచుండగా, అప్పుడు యేసు వచ్చెను అని వారు పాడుచున్నారు. నేనప్పుడు ఏదో ఆలోచనలో యున్నాను. అక్షరాలా అదే జరిగినది. ఆయన వచ్చి ఆమె జీవితమును పద్దెనిమిది సంవత్సరముల పాటు కాపాడెను. అదెంత ఖచితముగా యున్నది. ఆమె ఆ విధముగా యుండుటను బహుశా ఆ స్త్రీ ఎరుగదు. మరల దానిని ఆమె కలిగియుండ వచును. అప్పుడు, "యేసు వచ్చెను," అను భాగమును ఆ సమయములో పాడుట ఎంత చక్కగా తగి యున్నది.

4కూటముల కొరకు నేను కొద్ది ముందుగా నా గొప్ప సిద్ధపాటును చేసికొన్నానని తలంచుచున్నాను. నేను నిజంగా ఉద్రిక్తతలో యున్నాను. ఈ ఉదయమున నేనెంతో గలిబిలి అయి ప్రార్థించసాగాను. నేను ఇంటికి వచ్చాను, తిరిగి ఇక్కడికి చేరాను. పిల్లలు స్కూలులో హాజరగుటకు కుటుంబమును ఆరిజోనాకు ఇప్పుడే తీసికొని వెళ్ళాను. ఒక విధమగు విశ్రాంతి పొందుటకు తిరిగి ఇక్కడికి చేరాను. సహోదరుడు ఉడ్ మరియు ఇక్కడున్న కొందరు సోదరులతో వేటకు వెళ్ళుదును. ఈ వచ్చేవారము వేటకు వెళ్ళుదును. మేము కెంటకీకి వెళ్ళుచున్నాము. శ్రీమతి. వీవర్ చనిపోయిన రోజునే మేము ఇంటికి వచ్చుట జరిగినది. ఆ సమాధి కార్యక్రమములో సరిగ్గా ఆ సమయమునకు నేనిక్కడుండి సహోదరుడు నెవిల్నకు సాయపడగలిగాను.

GAL 5:22,23

 

5దాని గూర్చి మరీ ఎక్కువ చెప్పుటకు నేను ప్రయత్నించుట లేదు. మీకు తెలియును. చుట్టూ జనులు ఫిర్యాదు చేయుచున్నారు. ఎందుకనగా ఎడతెగక ఫిర్యాదులు చేయు స్త్రీ లేదా పురుషుని చూచుట అతి భయంకర సంగతులలో ఒకటై యున్నది. "దేవా, దాని నుండి నన్ను దూరముగా ఉంచుము," అని ఎప్పుడూ నేను అనుకొనుచుందును. చూడండి, అది విశ్వాసమును అన్ని వేళలా బలహీనపరచుచుండును. మీకది తెలియును. వయస్సు పెరుగుతూ ఉండగా, మనందరమూ ఏదో జరుగాలీ, ఏదో జరుగవలెను అని తలంచుచుందుమని నేనెరుగుదును. మీరు వయస్సులో పెరుగుచుండగా ఆ చిన్న సంగతులు వృద్ధి చెందుచునే యుండును. వారు ఆలాగే ఇప్పుడున్నారు. ఒక వ్యక్తి యొక్క జీవితమునకు సాతాను కిరీటము పెట్టుట అతి భయంకర సంగతులలో ఒకటి అని నేను తలంచుచున్నాను. ఎల్లప్పుడూ సణుగుతూ ఫిర్యాదులు చేయు వృద్ధురాలు లేదా వృద్ధుడు ఆలాటి వారేనని మీరు ఎరుగుడి. నేను ఆ స్తితికి రాకూడదని ఆశించుచున్నాను. నా భారములు నేను భరించు చోటికి నేను రాగలనని ఆశించుచున్నాను. నా జీవితము దేవుని యొక్క మహిమతో కిరీటము పెట్టబడవలెనని కోరుతున్నాను. ఆయన దీర్ఘశాంతము, దయాళుత్వము, సమాధానము, సాత్వికము మరియు పరిశుద్ధాత్మతో నింపబడుట.

6నా జీవితమంతయూ నన్ను వేధించుచున్న ప్రధానమగు సంగతి ఏమనగా నా నరముల ఉద్రిక్తత స్థితి. బాగా అలసిపోయినప్పుడు చాలా విసుగు చెందుదును. మీకు తెలియును గదా, ఎవరూ నా పట్ల చింత కలిగిలేరు అను భావన. మీరు కూడా అది కలిగియుందురు. అది, మరింత ఎక్కువగా కలిగి ఉండుట ఇప్పుడే జరిగినది. కొన్నిసార్లు అది మరీ చెడ్డగా పరిణమించును. అది ఒక ఉద్రేక పరిస్థితి. దానివలన అదే జరుగును. ప్రత్యేకంగా ఈ అనేక దర్శనములు చూచుట వలన చాలాసార్లు ఆలాంటి పరిస్థితికి వచ్చుచుందును. మీరు చూడండి. అది నన్ను ఆలాగు తొందరపరచును. నేను ఒక వ్యక్తి వైపు చూచీ ఈలాగు అనుకొందును, "ఇది ఒక దర్శనము. కాదు, కాదు, ఇది కాదు. అవును! ఇది అవును లేక కాదు?" చూచారా? దానికి ఎంత మూల్యము మీరు చెల్లించవలసి యుందురో గ్రహించలేరు. అందుకే మీరు ఆశర్యపడుచుందురు. ఇప్పుడు మీరు మా ధోరణిలో ఆలోచించెదురు, మీరు ఈలాగు తలంచుట కద్దు, "సరే, నేనేమి చేశాను? ఇక్కడ నేనున్నాను. నాకు ఏబది ఏండ్లు. ప్రభువు కొరకు ఏమి నేను చేయలేదు; నేను ముసలివాడనై పోవుచున్నాను. ఓ, మై." ఈలాంటి తలంపులను మనము "మన దుఃఖములు" అందుము. నా వయస్సులో నున్న మీలోని కొందరు సోదరులు "మనోచింతలను" కలిగియున్నామని చెప్పుట వాడుకగా విను చుండెడివారము. గుర్తున్నదా? తండ్రిగారు ఆ విధముగా మాట్లాడుట వాడుకగా వినెడివాడను, దాని భావమేమిటా అని నేను ఆశర్యపడెడివాడను, కాని ఆయన భావమేమిటో ఇప్పుడు నాకు స్వయంగా తెలియును. ఆ విధముగా మీరు అనుభూతిలోనికి వచ్చుచుందురు, కాని అందులో ఏది నిజము కాదు; అది కేవలము నీవు, నీవు మాత్రమే ఎరుగుదువు. చూడండి, అది మీరొక్కరే చేయుచున్నారని మీకు తెలియును.

7కనుక ఇప్పుడు నేను నామట్టుకు నేను నిమ్మళముగా ఉంచుకొన ప్రయత్నించుచున్నాను. త్వరలోనే వచ్చుచున్నదని నేను నిరీక్షించుచున్న ఆ పెద్ద త్రోపిడి కొరకు సిద్ధపడుచున్నాను. వెంటనే నేను న్యూయార్కునకు వెళ్ళవలసియున్నాను. అక్కడ ఒక కూటమున్నది, సభలున్నవి, అక్కడి నుండి ష్రివ్పోర్టుకు, అప్పుడు తిరిగి మరల ఫీనిక్సుకు వచ్చుదును. అప్పుడు అమెరికా దేశపు దక్షిణ సరిహద్దుగుండా పయనించుదును. ఇప్పుడు వారు విదేశీ ప్రయాణము కొరకు ఏర్పాట్లు చేయుచున్నారు. మనకు సాధ్యమైనంత త్వరలో ప్రారంభమగును. సంవత్సర మొదట తేదీ తరువాత బహుశా మార్చి, ఏప్రిల్ ఆ దరిదాపులా ఆరంభమగును. స్టాక్ హోల్మ్ లేదా ఆస్లోలో మొదలు పెట్టి ప్రపంచమంతయు పర్యటించుట వీలయితే ఈ తరువాత కార్యక్రమములో జరుగును.

8ఇప్పుడు నేను ఇంటికి చేరాను. కొద్దిగా ఒక విధమగు విశ్రాంతి పొందుటకై వచ్చాను. ఇది ఒక విధముగా నన్ను నేను ఆయత్తపరచుకొనుట అనుకొనవచ్చు. ప్రభుని చిత్తమయితే, కెన్టకీ నుండి వచ్చే ఆదివారము తిరిగి వచ్చెదను. అది ప్రభువుకు ప్రీతికరము, సహోదరుడు నెవిల్ మరో విధంగా భావించని పక్షమున తిరిగి వచ్చుదును. ప్రభుని చిత్తమయితే వచ్చే ఆదివారము ఆరాధన జరిపించుటకు ప్రయత్నించెదను. సహోదరుడు నెవిల్ ఇష్టపడుతున్న ప్రకారము ఆయన ఇష్టపడితేనే ఇక్కడ నేను ఉందును. అవునండి, సహోదరుడు నెవిల్ ఇష్టపడుచున్న ప్రకారము ఆయన కూడా ఇష్టపడితేనే ఆలాగు జరుగును. ఆయన చిత్తమేనని అశించుచున్నాను. ప్రభుని చిత్తమయితే తిరిగి త్వరలోనే మీ మధ్యకు వచ్చెదను అను తలంపుతో కొంతకాలము పాటు మిమ్మును ఎడబాసి వెళ్ళుచున్నాను.

9చిన్న వర్తమానములు, వాటిని నా వృదయములో చిన్న అంశములపై గ్రహించాను. దానిని మీకు వ్యక్తపరచవలెనని అనిపించుచున్నది. (చూచారా?) దాని చుట్టూ మనము సహవాసము చేయగలము. అట్టివి కొన్ని నా యొద్ద ఉన్నవి. గత కొద్ది దినములలోను అట్టివి అయిదారు నాకు వచ్చినవి. కొన్ని దినములు ఇచ్చట ఉడుతల వేటకు నేను వెళ్ళాను. పెన్సిలు, పేపరు తీసికొని అడవులలోనికి నేను వెళ్ళాను, చూచారా. ఆ సమయములో మంచి పగటి వెలుగు ఏర్పడుచున్నది. ఎక్కడో ఒక చెట్టుకు చేరబడి కూర్చున్నాను. నేను నిద్రకుపక్రమించనప్పుడు ప్రార్థించుట ప్రారంభించుదును. ప్రభువు నాకు ఏదో ఇచ్చును. దానిని గూర్చి చిన్న నోటు నేను వ్రాయుదును, చూడండి. నేను చెప్పునది మీరు గ్రహించిరనుకొందును. ఆ తరువాత నేను ఇక్కడికి వచ్చి దానినంతటిని ఒక చిన్న పుస్తకము మీద తీరుగ వ్రాయుదును. నన్ను పిలచినప్పుడు నేను వెంటనే ఆ వ్రాసిన దాని యొద్దకు పరుగిడి వెళ్ళి, దానిని చూచుకొని ఏది ప్రారంభించాలో విశ్లేషించుకొందును. చూడండి. ఇప్పుడు అదే జరిగినది.

10ఇప్పుడు నేను ప్రభువు యొక్క చిత్రమైనయెడల, ఆ పెద్ద పొడవైన వర్తమానములను కుదించుటకు ప్రయత్నించుదును, చూడండి; లేని యెడల ఆవి కొన్ని గంటలు పట్టును. గతరాత్రి సుమారు ముప్పది నిమిషముల పాటు షికాగోలో ఆ చక్కని పని చేయుటకు ప్రభువు నాకు సహాయము చేసెను. ఎవరో వచ్చి ఇట్లన్నారు, "నీవలాగు చేయగలవని నేననుకోలేదు గాని బాగా చేశావే?" రెండున్నర లేదా మూడుగంటలుండు వర్తమానమును అరగంటకు క్లుప్తీకరించాను. మీకు తెలియునా? కనుక ఈ రాత్రి నేను తొందరపడి మిమ్మును ఎక్కువసేపు నిలిపియుంచకుండా ఉండు పధకమును ఆచరణలో పెట్టుదును.

11దేవుడు మిమ్ము దీవించును. నేను ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినాగాని ఇక్కడున్న ఈ ఆలయము వంటిది నేనెన్నడూ చూడలేదు. ఇది గృహము. మధుర గృహము. వీవర్ కుటుంబము పట్ల నా సానుభూతి వ్యక్తపరచుచున్నాను. చనిపోయిన వ్యక్తిని బట్టి దుఃఖమును ఆ ప్రశస్త వర్ణ సోదరునితో పంచుకొనుచున్నాను. అతడు వెళ్ళిపోకముందు కొద్దిసేపు నేను అతనితో ప్రార్థించాను. చక్కని శీలము గలవాడు. ఇప్పుడతడు గృహములో దేవునితో కలిసియున్నాడు. అంతా అయిపోయినది. మీరును ఏమయినాగాని వెళ్ళిపోవలసియున్నారు. మనందరకు అది తెలియును. దేవుడు వారి ఆత్మలను విశ్రాంతిలో ఉంచును గాక! వ్యాధి, దుఃఖము, మరణము లేని ఆవలి దేశమును ఒక దినమున వారితో పాటు చేరుటకు ఆశించుచున్నాము. అంతవరకు సువార్త కొరకు ఏది మనము చేయగలమో అది చేయుదము.

12ఉద్రిక్తత గూర్చి చెప్పాను. ఈ ఉదయమున దాని గూర్చి నేను ప్రార్థించుచున్నాను. ఉద్రిక్తత లేని యెడల మీరేమి చేయుదురు? కాస్త దాని గూర్చి ఆలోచించండి. ఉద్రిక్తత అనునది జీవితములో ఒక భాగము. దానిని గూర్చి ఆలోచించినప్పుడు, అది నన్ను బలపరచినది. ఉద్రిక్తత లేని యెడల మీరు గుడ్డ బొమ్మవలె ఉందురు. మీకు ఏ అనుభూతులు ఉండవు. మీరు దేనిని గూర్చియూ పనిచేయజాలరు. భార్య భర్తల వలె అది యుండును. ఆమె ఏదయినా చేయదలచినచో అతనితో కలిసి పనిచేయుటకు ప్రయత్నించును. (ముఖ్యంగా క్రైస్తవులు) ఇద్దరూ ఏకమయినప్పుడు ఆమె చేసినది ఏమిటో అర్థమగును. ఉద్రిక్తత నిజంగా మిమ్ములను సన్నిహితము చేయును. అప్పుడు ఎవరైనా నీతో ఇట్లందురు, "నీవు మంచిగా ప్రవర్తించనందున నీ భార్య ఎంత ఉద్రిక్తతకు గురి అయినదో చూడు. నీవు మంచిగా ప్రవర్తించనందున నీ భర్త ఎంతగా ఉద్రిక్తతకు గురి అయెనో చూడు. అయితే అదంతయూ క్షమించబడినది. ఇప్పుడెంత హాయిగా ఉన్నదో ఆలోచించుకో…" కాబట్టి మీకు ఉద్రిక్తత కావలెను. అంతే!

13అనుభూతులను గూర్చి కాస్త ఆలోచించండి. నీకు ఏ అనుభూతులు, మరి బాధలు ఏవీ లేకపోయినచో ఎట్లుండును. అసలు నొప్పి అనునది లేనిచో ఏలాగుండును? నీకెట్టి, అనుభూతులు ఉండవు. చూచారా? నీకు అనుభూతులు అనునవి లేకపోయినచో నీ జ్ఞానేంద్రియములలో ఒకటి పోయినట్టే, చూచారా? కాబట్టి చూడండి ప్రతిదియూ మంచిదే. "దానిని సహించుటకు దేవుడు కృప నిచ్చును." అంతే మరి నేను ఆ కృపతో నిలబడినప్పుడు ఈలాగందును, "ఈ జీవితము సమాప్తమయిన తరువాత మరియొక జీవితము ఆవల యున్నది. దాని కొరకు మనము చూచుచున్నాము." ఉద్రిక్తత, ఈ సంగతులు మొదలగునవన్నియూ మనము జ్ఞాపకముంచుకొనవలెను.

14"నీకు ఏ బాధలు ఉండవు" అని చెప్పి కొందరు క్రైస్తవ్యమును పరిచయము చేయుదురు. కాదు, ఆలాగు ఉండదు. "మీకు ఉద్రిక్తతలుండవు," అని చెప్పెదరు. ఓ, కానేకాదు. నీవు క్రైస్తవునివి అయినప్పుడు నీ ఉద్రిక్తత పెరుగును, ఎందుకనగా నీవు లెక్కచేయక, సంతోషంగా, అదృష్టాన్ని లెక్క వేసికొనక నిశ్చింతగా ముందుకు పోదువు. ఎన్ని అడ్డములేర్పడినా ముందుకు పోదువు.

నీవు నిజమయిన క్రైస్తవునిగా మారినప్పుడు ప్రతి క్షణము నీవు ఆశ్చర్యపడుచుందువు. "నేను నా ప్రభువును సంతోషపరచుచున్నానా? ఆయన మాటను నేను వినకలుగుచున్నానా?" అని వ్యధ చెందుదువు. అది నిన్ను ఉద్రిక్తతలో ఉంచును. కావలికాయునట్లు చేయును. నీవు ఆ విధముగానే తయారు అగుదువు కాబట్టి ఉద్రిక్తత అనునది ఒక దీవెన. దానిని నీవు ఏమనుకొందువో ఆ విధంగానే అది యుండును. నీవు చూచు కోణములోనే అది కనబడును, చూచారా. నీవు ఆవలి ప్రక్కను కూడా చూడుము. నీవు ఎంత పలుచగా ఒక దానిని కోసినా గాని దానికి రెండు వైపులుండును, చూడండి. కనుక రెండు ప్రక్కలూ మీరు చూడవలెను.

"ఓ, ఏమి ఉద్రిక్తత ఇది? ఈ ఉద్రిక్తత లేకుండా నేను పుట్టి యుండినచో ఎంత బాగుండును?" అనుకొందును. ఈ ఉద్రిక్తత అనునవి లేనియెడల నేనిప్పుడు ఏమైయున్నానో ఆలాగు ఉండి యుండకపోదును. బహుశా నేను "క్రైస్తవుడినే కాకపోయెడి వాడినేమో. యేసుక్రీస్తు నొద్దకు నన్ను నడిపించినది ఉద్రిక్తతయే, చూచారా. కాబట్టి అది నాకు ఒక ఆశీర్వచనకారణమాయెను.

2COR 12:8-10

 

15కాబట్టి పౌలు ఆనాడు చెప్పిన రీతిగా, అతడు ఉద్రిక్తతలో యున్నాగాని, మరో దానిలో దేనిలో యున్నాగాని పభువుతో ఆలోచన చేసెను - దానిని మూడు సార్లు తీసివేయమని ప్రార్థించెను. ప్రభువు అతనితో ఈలాగు చెప్పెను, "నా కృప నీకు చాలును, పౌలు."

అప్పుడతడు ఈలాగనెను, "నా బలహీనతలయందే అతిశయించుదును. నేను ఎప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడను," చూచారా. అది దేవుని చిత్తము అయినంతకాలము, మంచిదే.

నన్ను మరీ ఎక్కువగా అది తొందరపరచుచున్నప్పుడు ప్రభువుతో నేను ఆలోచన చేశాను. అది నన్ను భయపెట్టినది. సుమారు పది లేదా ఎనిమిది సంవత్సరముల క్రితము ఆయన నాతో ఈలాగు చెప్పెను, "అది మరల ఎన్నడూ నిన్ను తొందర చేయదు." తిరిగి ఎన్నడూ అది నన్ను కలవరపరచలేదు. లేదండీ; దాని గూర్చి బాధపడవద్దు. దానిని నేను అనుభవించుచున్నాను గాని అది ఆక్కడున్నదని ఎరుగుదును; కాని అది నన్ను భయపెట్టనందున నేను ఆలాగే ముందుకు సాగిపోవుచున్నాను. దానిని బట్టి వందనములు చెల్లించుచున్నాను. "అది నిన్ను ఇక ఏ మాత్రము భయపెట్టదు," అని ఆయన చెప్పిన మాట "ఇక అది నీకు యుండదు" అన్న మాటకు సమానమే..

కనుక అది జరుగుట ఆయన చిత్తము. దానిని నేను హత్తుకొనుచున్నాను. "ప్రభువా, నీకు వందనములు. ఆ విధముగా నేను నడతును," అని చెప్పుదును.

MATT 21:21•

MARK 11:23•

JOHN 14:13,14•

JOHN 15:16•

JOHN 16:24•

PHIL 4:6•

1PET 5:7

 

16ఇప్పుడు, మనము ఒక్క క్షణము ప్రార్థనకు తలలు వంచుదము. ఎవరికైనా ప్రత్యేక విన్నపమున్నదా ప్రార్థనకు? (ఇక్కడ చేతిరుమాళ్ళు పడియుండుట నేను చూచుచున్నాను.) మీ చేతులెత్తండి. ప్రభువా, ఈ ప్రతి బిడ్డను ఆశీర్వదించుము.

మా పరమతండ్రి, ఇప్పుడు మేము నీ యొక్క గొప్ప, మహోన్నత కృపా సింహాసనమును సమీపించుచున్నాము, ఎందుకనగా రమ్మని మేము ఆహ్వానించబడితిమి. యేసుక్రీస్తు పిలుపు ప్రకారము మేము వచ్చుచున్నాము. మా యొక్క చింతలన్నింటితో మేము వచ్చుచున్నాము. ఆయన మీద చింత యావత్తు వేయుచున్నాము, ఎందుకనగా ఆయన మా కొరకు చింతించుచున్నాడు. ఆయన మా కొరకు చింతించుచున్నాడని ఎరుగుట వలన ఎంత గొప్ప ఆదరణ మాకు కలుగుచున్నది! ఆ పరలోకమందున్న గొప్ప దేవుడు, సృష్టికర్త, ఆయన సృష్టియైన మా కొరకు చింతించుచున్నాడు. ప్రభువా, దాని కొరకు మేమెంతయో సంతోషించుచున్నాము. మేము జీవించుచున్న ఈ కాలములలో అదెంత ఆదరణ! నీ వాక్యము నుండి తప్ప మరెక్కడ నుండియూ ఆదరణను పొందజాలమని అనిపించుచున్నది. నీ వాగ్దానమే మా యొక్క శరణ్యము. నీ వాగ్దానములో మేము మా మనవులను తెలియపరచుచున్నాము. "మీరు నా నామమున ఏది అడిగిననూ అది దయచేతును," అని నీవు వాగ్దానము చేశావు. ఇంకా ఈ గొప్ప వాగ్దానములన్నియూ ఉన్నవి. "అడుగుడి మీకియ్యబడును. 'కదలి పొమ్మని' ఈ పర్వతముతో చెప్పి సందేహించని యెడల అది కదిలించబడును." ఈ వాగ్దానములన్నిటినుండియు మేము మాకు కావలసిన దానిని పొందగలము.

ప్రభువా, చేతులు పైకెత్తబడినవి. కాబట్టి వారికి ఏవో అవసరతలున్నవి. నీవు వారి అవసరతలు ఎరుగుదువు. తండ్రి, వాటిని అనుగ్రహించుము. వారితో పాటు నేను నా ప్రార్థనలను నీ ముందుంచుచున్నాను. వారి చేతులతో పాటుగా నా చేయి కూడా ఎత్తబడినది. ఈ బల్ల మీద ఇక్కడకొన్ని చేతిరుమాళ్ళు ఉంచబడినవి. ఓ, జనులు ఎట్టి విశ్వాసము, ఎట్టి అచంచల విశ్వాసము కలిగియున్నారు. ప్రభువా, అందు మూలముగా నీవు నన్ను ఆశీర్వదించినట్లుగా కనబడుచున్నది. రోగుల కొరకు ప్రార్థించకలుగు సామర్థ్యమును అనుగ్రహించియున్నావు. ఏ చోటకు, ఎక్కడకు నేను వెళ్ళిననూ రోగుల కొరకు ప్రార్థించుట జరుగుచునేయున్నది. దేవా, ఇప్పుడు సహాయము చేయుము. ప్రజలు ఏ మనవులతో ఉద్దేశించి ఈ చేతిరుమాళ్ళను ఇక్కడ పెట్టారో ఆ మనవులను వారికి దయచేయుమని యధార్థముగా నేను ప్రార్థించుచున్నాను. నీ కృపను వారి మీద ఉండనిమ్ము.

JOHN 17:17•

JAS 5:15

 

17ప్రభువా, సహోదరుడు హిక్స్ అను ఒక స్త్రీ ఇక్కడ యున్నది. ఆమె ఎక్కడ నుండో విమానములో పయనించి ప్రార్థన కొరకు ఇక్కడికి వచ్చియున్నది; కాన్సరు రోగి. ఆమెను ఇక్కడికి తేవచ్చునా అని అడిగి తీసికొని వచ్చిరి. ఆ వ్యక్తి యొక్క జీవితమును రక్షించుమని దేవా నేను ప్రార్థించుచున్నాను. దానిని అనుగ్రహించుము. నా చిన్న మేనల్లుడు మైకీ రోగిగా అవతలపడియుండి వాంతులు చేసికొనుచున్నాడు. జ్వరము తీవ్రముగా యున్నది; ఇప్పుడే వెళ్ళెను. దానిని నీవు ఆపియున్నావని ప్రభువా, విశ్వాస సహితమగు ప్రార్థనతో నేను నమ్ముచున్నాను. నీకు నేను కృతజ్ఞుడను. నేను ఈ గదిని విడిచి వెళ్ళక ముందే జ్వరము పోయినదని నమ్ముచున్నాను.

ప్రభువా, ఇప్పుడు వీటన్నిటి కొరకు వందనములు చెల్లించుచున్నాను. నీ వాక్యమును మాట్లాడవలసిన వంతు నాపైబడినది. ప్రభువా, మాకు నీ వాక్యము ఇమ్ము. "నీ వాక్యమే సత్యము." మా ఆత్మలను దీవించి, ఈ రాత్రి దేవుని యొక్క వాగ్దానములు అనగా వాక్యము నుండి మాకు అవసరమగు కృపను చేరుకోను భాగ్యము దయచేయుము. ఈ మిగతా వారమంతయూ బ్రదుక కలుగునట్లు కృప చూపుము. అది దయచేయుము. మా సంఘ కాపరిని దీవించుము. బలమగు ఆత్మ కలిగిన ఈ యోధుని, ఆయన భార్యను, పిల్లలను, పెద్దలను, ట్రస్టీలను, ఈ భవనములోనికి వచ్చిన ప్రతి వ్యక్తిని, బయటనున్న వారిని దీవించుము. అది దయ చేయుము తండ్రీ, ఈ దీవెనలను యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము. ఆమేన్.

18ప్రభువు యొక్క వ్రాతలలో నుండి రెండు భాగములను నేను చదువగోరుచున్నాను. కీర్తనల గ్రంధము నుండి నేను చదువగోరుచున్నాను. 86వ కీర్తన. ఆ తరువాత పరి. మత్తయి 16 అధ్యాయము 1 నుండి 3 వచనములు చదువగోరుదును. కీర్తనలోని ఈ భాగమును అనగా అంతయూ కాదు గాని 11వ వచనము లేక దానికి పైగా కొద్ది సగమువరకు చదువగోరుచున్నాను.

దీనిని నేను బోధించు ముందుగా, ఈలాగు ప్రకటించగోరుచున్నాను. ఇది అంశము: "కాలమును సూచనను ఐక్యము చేయుట." "కాలమును సూచనను ఐక్యపరచుట." అది ఒక విధముగా చిక్కు మాట వలె కనిపించును. ఐక్యము చేయుట; చూచారా? కాలము; కాలమును ఐక్యపరచుట, ఇప్పుడు అదే జరుగుచున్నది. దాని యొక్క సూచన కాలముతో ఏకమగునట్లు చేయుట.

PS 86:1-11

 

19కీర్తన 86. దావీదు యొక్క ఒక ప్రార్థన:

యెహోవా నేను దీనుడను దరిద్రుడను, చెవి యొగ్గి నాకుత్తరమిమ్ము.

నేను నీ భక్తుడను. నా ప్రాణము కాపాడుము. నా దేవా, నిన్ను నమ్ముకొనియున్న నీ సేవకుని రక్షింపుము.

ప్రభువా, దినమెల్ల నీకు మొర్ర పెట్టుచున్నాను. నన్ను కరుణింపుము.

ప్రభువా, నా ప్రాణము నీ వైపునకు ఎత్తుచున్నాను. నీ సేవకుని ప్రాణము సంతోషింపచేయుము.

ప్రభువా, నీవు దయాళుడవు. క్షమించుటకు సిద్ధమైన మనస్సుగలవాడవు. నీకు మొర్ర పెట్టువారందరి యెడల కృపాతిశయము గలవాడవు.

యెహోవా నా ప్రార్థనకు చెవి యొగ్గుము. నా మనవుల ధ్వని ఆలకింపుము.

నీవు నాకు ఉత్తరమిచువాడవు గనుక నా ఆపత్కాలమందు నేను నీకు మొర్ర పెట్టెదను. [ఓ, అది ఆశ్చర్యకరముగా లేదా? నీవు నాకు జవాబు ఇచెదవు!]

ప్రభువా, నీవు మహాత్మ్యము గలవాడవు. ఆశ్చర్యకార్యములు చేయువాడవు. నీవే అద్వితీయ దేవుడవు.

ప్రభువా, దేవతలలో నీవంటివాడు లేడు. నీ కార్యములకు సాటియైన కార్యములు లేవు.

నీవు సృజించిన అన్యజనులందరును వచ్చి నీ సన్నిధిని నమస్కారము చేయుదురు. నీ నామమును ఘనపరచుదురు.

[ఇప్పుడు వినండి!] యెహోవా, నీ సత్యము ననుసరించి నేను నడచుకొనునట్లు నీ మార్గమును నాకు బోధింపుము. నీ నామమునకు భయపడునట్లు నా వృదయమునకు ఏకదృష్టి కలుగజేయుము. [ఐక్యత! చూడండి?]

MATT 16:1-3

 

20ఇప్పుడు నేను ఏకము చేయుటను గూర్చి మాట్లాడుతున్నాను; కాల సూచనను గూర్చి చెప్పుదును. ఇప్పుడు మత్తయి 16 అధ్యాయము.

అప్పుడు పరిసయ్యులును, సర్దూకయ్యులును వచ్చి ఆయనను శోధించుటకు ఆకాశము నుండి యొక సూచక క్రియను తమకు చూపుమని ఆయనను అడుగగా.

ఆయన ఇట్లనెను: సాయంకాలమున మీరు ఆకాశము ఎర్రగా ఉన్నది గనుక వర్షము కురియదనియు.

ఉదయమున - ఆకాశము ఎర్రగాను మబ్బుగాను ఉన్నది గనుక నేడు గాలివాన వచ్చుననియు చెప్పుదురు గదా. ఓ, వేషధారులారా, మీరు ఆకాశ వైఖరి వివేచింపనెరుగుదురు గాని ఈ కాలముల సూచనలను వివేచింపలేరు.

చదువబడిన వాక్యమునకు ప్రభువు తన కృపాశీర్వచనములను అను గ్రహించును గాక!

21ఇప్పుడు, మునము ఈ ఏకము చేయుటను గూర్చి మాట్లాడుచున్నాము, ఐక్యము చేయు కాలము; కాలమును ఐక్యము చేయు సూచనను గూర్చి మాట్లాడుకొనుచున్నాము. చూడండి, యేసు ఇక్కడుండినప్పుడు చివరిగా చదివిన లేఖన భాగమిది. దేవాలయ యాజకులు కాలమును లేక కాలము యొక్క సూచనను వివేచించు సామర్థ్యము కలిగిలేనందులకు ఆయన గద్దించుచున్నాడు. జీవించుచున్న కాలము యొక్క సూచనను వివేచించగలుగుట జనులకు ఎల్లప్పుడూ గొప్ప సంగతియే. (చూచారా), ఎందుకనగా దానిని దేవుడు తేట తెల్లముగా వ్రాయును. అందువలన ఎవరునూ తెలియదని తప్పించుకొనలేరు.

JOHN 8:19

 

22మామూలుగా నేను వెనక్కు వెళ్ళి, ఇతర సేవకుల నుండి, బైబిలు కాలములోని ప్రభువు యొక్క ఇతర దాసుల నుండి తీసికొందును. నోవహు కాలములోని సూచన, దానియేలు కాలములని సూచన, ఇంకా ఆయా సూచనలు, కాని ఈ రాత్రి సమయమును ఆదా చేయుట కొరకు ఆ విధానమును మార్చుకొందును. ఆ సమయము ఎటువంటిదో, ఏమిటో ప్రతి ఒక్కరూ తెలిసికోగలుగునట్లుగా ఒక సహజ కాల సూచనను దేవుడు వారికి ఇచ్చుట పరిపాటి. పరిసయ్యులు తమ కాలమును ఎరిగియుండవలసినది. ఆ కాలమేమైయుండెనో వారు తెలిసికొని యుండవలసినది. ఆయన మరియొక చోట ఈలాగు చెప్పెను, "మీరు నన్ను ఎరిగియుండిన యెడల, నా దినమును కూడా ఎరిగియుండెడివారు," చూచారా. మనము అర్థము చేసికొనుట చాలా గొప్ప సంగతి. చూడండి, "గ్రహింపు లేకుండా!"

2CH 26:5•

EZEK 4:4-6•

DAN 1:17•

AMOS 3:7•

MIC 1:8

 

23ప్రవక్తల గురించి వారెల్లప్పుడూ పలికినది ఈలాగునే, "అతనికి గ్రహింపున్నది. ప్రభువు యొద్ద నుండి దర్శనములు పొందుట వలన అది వచ్చినది. ఆనాటి ప్రవక్తల యొద్దకు యెహోవా యొక్క వాక్కు వచ్చెను." చూడండి, వారు గ్రహింపును దేవుని వాక్యము ద్వారాను ప్రవక్తల ద్వారాను పొందిరి. అప్పుడు ప్రవక్తలు ఒక సూచన ఇచ్చిరి. ఒక వ్యక్తి చాలా కాలము పాటు ఒక ప్రక్కకే పరుండుట, మరల తిరిగి మరొక ప్రక్క పరుండుట, ఒకడు బట్టలను విప్పివేయుట. ఓ, ఆలాగు వారు జీవించుచుండిన కాలములో ఎన్నో సూచనలను చూపించిరి, భూమ్యాకాశములను సృజించిన దేవుడు తన కాలమును సూచనల ద్వారా వెల్లడి పరచునట్లు తన చేతిపనిని చేసియున్నాడు. ఆ దేవుడే నేడును జీవించియున్నాడు. మనము జీవించుచున్న కాలమును మనము చూచుచుండగా ఎవరో, ఎక్కడో చూడవలసిన దానిని చూడకుండా అలక్ష్యము చేయుచున్నారని అవశ్యముగా చెప్పగలము, చూచారా. మనకు ఒక ఖచిత సూచనను ఇవ్వకుండా దేవుడెన్నడూ ఈ కార్యములను జరుగనీయడు. మనము అర్థము చేసికొనునట్లు సూచన ఇచ్చును.

MATT 24:43,44•

MATT 25:4•

1THS 5:2•

HEB 1:1•

2PET 3:10•

REV 3:3•

REV 16:15

 

24నేడును అలాగే యున్నది. బోధకులమగు మనము సరిగా చదువలేదు. అది అప్పటి వలెనే యున్నది. అది సమయమని వారు తలంచుట లేదు. అప్పుడు వారు బహు సమాధానముగా జీవించుచున్నామని తలంచిరి. వారు మెస్సీయా కొరకు ఎదురుచూచుట లేదు. తన రాకడ "రాత్రి జామున దొంగ వచ్చినట్లుండును" అని యేసు చెప్పెను. ఆయన రాకను గూర్చి జనులు తెలియని స్తితిలో యుందురు. కాని ఆయనను కలిసికొనుటకు వెళ్ళిన కన్యకలు కొందరున్నారు, వారిలో సగము మందికి డివిటీలలో నూనే యుండినందున సిద్ధపడిరి; వారు ఆ సూచన కొరకు కనిపెట్టి చూచుచుండిరి. ఈ రాత్రి వారి నిమిత్తమే నేను మాట్లాడుచున్నాను. (చూచారా), సూచన కొరకు ఎదురుచూచుచున్న వారి కొరకు; ఆయన డాకడ యొక్క సూచన.

LUKE 12:39,40

 

25ప్రభువు ద్వారా ఇవ్వబడిన ఈ సూచనలు విశ్వాసులకు మాత్రమే ఇయ్యబడినవి. అవిశ్వాసి ఎన్నడూ దానిని చూడడు. వారు వాటి మీద నుండియే వెళ్ళెదరు గాని వాటిని ఎన్నడూ చూడరు. ఈ రాత్రి ఈ వేదిక మీద ప్రభుని యొక్క దూత వాస్తవముగా వచ్చి నిలబడిందనుకొందము. నేను మిమ్మును చూచుచున్నంత యధార్థముగా అది యుండిననూ, మీరు దానిని చూడలేకపోవచ్చును, లేక మీరు దాని చూడ కలిగియుండవచ్చును. నాకు కనిపించక పోవచ్చును. మీకు తెలియునా? అది లేఖన పూర్వకము. అది అక్షరాలా సత్యము. మీకు తెలియును గదా పౌలు క్రింద పడిపోయెను గాని ఎవరునూ ఆ వెలుగును చూడలేదు.

MATT 3:16,17•

LUKE 3:22•

JOHN 1:32-34

 

26ఆ జన సమూహముల ముందు యోహాను నిలబడియున్నప్పుడు, ఆ వెలుగు ఆక్కడనే యుండెను. ఆ ఒడ్డున వేలాదిమంది నిలబడిరి. అందులో యాజకులు, భక్తపరులు, గోపువారు ఉన్నారు. దేవుని ఆత్మ పావురము వలె ఆయన మీదికి దిగి వచ్చుట చూచినట్లు యోహాను తనంతట తానే సాక్ష్యమిచ్చెను. "ఈయన నా ప్రియ కుమారుడు. ఈయనలో నివసించుటకు నేనానందించుచున్నాను," అని ఒక స్వరము పలికెను. యోహాను తప్ప మరెవరును అది చూడలేదు, చూచారా. కేవలము ఆతని కొరకు అది ఇయ్యబడెను.

జ్ఞానులకియ్యబడిన సూచన ఎట్లు పనిచేసినదో మీరు గమనించారా? వారు చూచిరి. వారు హెబ్రీయులు. వారు నిజంగా ఇండియా దేశపు ఖగోళశాస్త్రజ్ఞులు కారు. వారు హెబ్రీయులు. వారు తమ విద్యను ముగించుటకై ఆ ఖగోళ శాస్త్రమును ఆక్కడ వారు పఠించుచుండిరి. అందుకు వారు ఆ దేశములో యుండిరి. వారు యెరూషలేము వైపు చూచుచుండగా, ఆ మూడు నక్షత్రములను వారు చూచిరి. అవి, వారు ఏ జాతి నుండి వచ్చి ఆ తమ హాము, షేము, యాపేతు అను జన్మ మార్గముల నుండి వచ్చుట చూచిరి. ఆ నక్షత్రములను వారు తమ జనన మార్గములలో చూచిరి. అది వారి కొరకు ఒక సూచన. ఆ నక్షత్రములు ఏక వరుసకు వచ్చినప్పుడు మెస్సీయా భూమి మీద ఉండునని గురుతు.

MATT 2:2•

MARK 1:10,11

 

27ఓ, మై! "ఆయనెక్కడ? యూదులకు రాజుగా పుట్టిన ఆయనెక్కడ? తూర్పున మేము ఆయన నక్షత్రమును కనుగొని ఆయనను ఆరాధింప వచ్చితిమి. ఆయన ఎక్కడ?" అని వారు ప్రశ్నించుటలో ఆశ్చర్యము లేదు. బాలుడగు మెస్సీయా ఎక్కడో పరుండి యుండెనని వారికి తెలియును, ఎందుకనగా దేవుడు వారికి ఒక కాల సూచనను ఇచ్చెను. మానవుడు దేవుడు ఏకమై కలసిపోవుచున్నారను గురుతు. ఎంత గొప్ప ఏకత్వము! దేవుడు తన్ను తాను మానవ శరీరములో ఐక్యము చేసికొనెను, ఇంతకు ముందున్న వి ఐక్యతకన్ననూ ఇది అతి గొప్పది, ప్రధానమైనది. దేవుడు మానవునితో ఏకమాయెను. దేవునిగా ఉండు ఆయన యొక్క సంకల్పము విడిచి పెట్టి, తన గుడారమును చాచి మానవత్వమును స్వీకరించెను. ఐక్యత ద్వారా వారిలో ఒకడాయెను. ఏమిటది? అది దేవునికి మరియు మానవునికి మధ్య శాశ్వత సమాధానమును తీసికొని వచ్చెను. మనమెంత కృతజ్ఞత చూపవలెను!

ISA 26:11•

MATT 3:1

 

28ఇప్పుడు కాస్త ఆలోచించండి. ప్రతి మనిషి, ప్రతి ఖగోళ పరిశోధకుడు, ఆ నాటి ప్రతి వ్యక్తి నక్షత్రములనే తన గడియారముగా చూచెడివాడు. గోపుర శిఖరము మీద ఒక కావలివాడు యుండెడివాడు. అతడు అక్కడికి చేరుకొని గమనించెడివాడు. ఒక ప్రత్యేకమగు నక్షత్రము ఒక ప్రత్యేక గమనములోనికి మారుతున్నప్పుడు సమయమెంతయినదో అతనికి తెలిసిపోయెడిది. వాక్యములోనిది గుర్తున్నదా? "కావలివాడా, ఎంత వేళయైనది?" కావలివాడు తిరిగి వచ్చి అది ఏ ఘడియో, చెప్పెడి వాడు. చూడండి, వారు నక్షత్రముల ద్వారా సమయమును లెక్క కట్టెడి వారు.

ఈ నక్షత్రములు సరిగ్గా వరుసలో యుండుట ఈ ముగ్గురికి మాత్రమే కనబడి తక్కిన వారెవరికి కనబడకయుండుట వింతగా లేదా? చూచారా? చక్కగా వరుసలోకి వచ్చినవి. మీరును వాక్యముతో అలాగే వరుసలోనికి రావచ్చును, చూచారా. ఆ నక్షత్రములు ఏకమై, ఈ రాశిగా నుండుటకు ఐక్యమయినప్పుడు ఆ ముగ్గురు కూడా అదే సమయములో ఏకమయిరి. ఈ సంగతులు వాస్తవములుగా మారు వరకు మీరును దేవునితో వాక్యములో ఆలాగే ఏకము కాగలరు. మీరు వాటిని చూడగలరు, అవి నిజము అని ఎరుగగలరు, చూచారా. కాలము యొక్క సూచన! దానిని మీరు చూస్తూనే, "ఆ అది బుద్ధిహీనత!" అని చెప్పవచ్చును.

29కాని మాకయితే అది బుద్ధిహీనత కాదు. వాక్యముతో ఏకమయిన మాకు అదిక్కడున్నది. పాట్ సోదరుడా, అది అక్షరాలా నిజము. ఆ సూచన విశ్వాసితో ఏకమగుట మీరు చూచుచున్నారు. నేను ఈ విషయములను వారినే అనగా విశ్వాసులను ఉద్దేశించియే చెప్పుచున్నాను. అవిశ్వాసి దానిని ఎన్నడూ, చూడడు. ఈనాడు ఆయన భూమి మీద ఉండి యున్నచో ఎంత గద్దింపుగా అది యుండెడిది? మనలో చాలామంది బోధకులు ఈ సూచనను చదువలేకపోవుచున్నారు. ఇక్కడి ఈ ఆలయములో అనుదినము మనము చదువుచున్న సూచనలు చూచుచున్న సంగతులు వారు గ్రహించుట లేదు. ఇతరులు దానిని చదువుచున్నారు. గోడ మీది చేవ్రాతను చదువుతున్నారు, ఆయినాగాని ఇంకా ఎందరో నిర్లక్ష్యము చూపుచున్నారు. అసలు దానిని చూడనే చూడరు. అసలు అది వారికి ఏమికాదు. దానిని వారు గమనించరు.

LUKE 21:20

 

30ఇప్పుడు గమనించండి, దీనిలో ఆయన జాతీయ సూచనలను చూపించెను. దీనిని గూర్చి వారాయనను అడిగినప్పుడు సూచనలు చూడగోరెను; ఆయన వారికి జరిగిన సూచనలను ఇచ్చెను. ప్రపంచము యొక్క అంతము ఎప్పుడో, సమాప్తమునకు సూచన ఏమిటో వారు తెలిసికోగోరిరి. ఆయన వాక్యము ద్వారా ఎన్నో జాతీయ సూచనలను వారికి చూపించెను. ఆకాశమందలి ఆకాశ సూచనలు, భూలోక సూచన గూర్చి చెప్పెను. ఆయన వారికి సూచనలు, సూచనలు, సూచనలు, ఎడతెగకుండా సూచనలే ఇచ్చెను. (అక్కడ ఒక చోట ఆయన జాతీయ సూచనను వారికి చేసెను, "యెరూషలేము చుట్టూ రాజ్యములు పోగవుట చూచునప్పుడు (చూచారా), వారి శ్రమ సమీపములోనే యున్నదని మనకు తెలియును. యెరూషలేము సైన్యముతో ముట్టడి వేయబడుట మీరు చూచునప్పుడు ఇది తెలిసికొనుడి."

31దానికి ముందు ప్రపంచము ఏకమగును, టైటస్ అను ఈ గొప్ప రోమా సైన్యాధిపతి తన సైన్యములన్నీంటిని పోగుచేసి ముట్టడి వేసెను. దేవుడిచ్చిన కాలపు సూచనను యూదులు తిరస్కరించిన తరువాత వారికి ఆలాగు జరిగెను. టైటస్ తన సైన్యములను సమకూర్చి పట్టణమును తీసికొనుటకు వచ్చిన సమయము ఆదే. మొదటగా దేవుని వాక్యమునకు విరోధముగా ఆ దేవుని ప్రజలు (నామకార్థులు) ఏకము కావలసి యుండెను. దానికి ముందుగా ఆ దేశము దేవుని యొక్క ప్రజలకు విరోధముగా ఏకమవగలదు. చూడండి, ఐక్యత, ఏకమగుట, కలిసి ఒకటవుట.

మనము ఒక గొప్ప ఐక్యపరచు కాలములో జీవించుచున్నామని నమ్ముచున్నాను. నేను ఈ ఎర్రని దీపములను క్రిందికి దించుట, మెరుపు సూచనలు మొదలగు వానిని తీసికొనుచున్నాను (స్త్రీలు ప్రవర్తించు తీరు; పురుషులు ప్రవర్తన; సంఘముల వ్యవహారము), నా వృదయమంతటితో ఈ చిన్న గుంపునకు చూపించుచున్నాను. యేసు ప్రభుని రాకడకు ముందు సమయములో నున్న ఈ గొప్ప ప్రవచనాత్మక ఘడియలో మనము దేవుని వాక్యము యొక్క వరుసలోనికి వచ్చుచున్నామని నమ్ముచున్నాను. అందరమూ కలిసి సిద్ధమగుచున్నాము.

LUKE 21:20

 

32ఇప్పుడు, చూడండి, టైటస్ తన సైన్యములను ఏకము చేయు ముందుగా, ఇశ్రాయేలీయులు తమకు తాము ఏకమయి సన్నద్ధమగు ముందుగా యేసు మెస్సీయా కాడని నమ్ముదురు, వారాయనను విసర్జించిరి. ఆయనను బయటకు గెంటివేసిరి. ఆయనను సిలువవేసిరి. వారికొరకు పంపబడిన రక్షణను వారు నిరాకరించినప్పుడు దానిని చేయుటకు అందరూ ఏకమయిరి. ఇప్పుడు దానిని మనస్సులో పెట్టుకుని యుండుడి. ఆ ఘడియ యొక్క వర్తమానమును విసర్జించక అందరూ ఏకమయిరి దానిని వారు చేయవలసియున్నారు. వారది చేసినప్పుడు జాతీయ సూచన వెలువడును.

రాజ్యములు తమలో తాము ఏకమవనారంభించినవి. రోమను మరియు గ్రీకుల యొక్క ఈ గోప్ప సైన్యమును టైటస్ తీసుకొని వచ్చి యెరూషలేము గోడలను ముట్టడి వేసెను. అక్కడ ప్రజలను దిగ్భంధములో మంచెను. ఆకలితో మృతి పొందిరి. వారు చెట్టు బెరడులు తినిరి. జోసెఫస్ అను గొప్ప చరిత్రకారుడు దానిని మనకు చెప్పెను. వారు నేల మీద గడ్డి తినిరి. ఒకరిపిల్లలను ఒకరు ఉడక పెట్టుకుని కూడా వారు తినిరి; చూడండి, వారు పిచ్చివారి వలె చేసిరి. చివరకు టైటస్ సైన్యములను ముందుకు నడిపించెను. అతడు వెనుక కొండల మీద కూర్చొని యెరూషలేమును చుట్టూ చూచుచుండెను. అందులో ఉన్న ప్రజలేమో దేవుని చిత్తమును జరిగించుచున్నామని తలంచిరి. ఆ గొప్ప బోధకుడగు ప్రభువైన యేసు మాటను వారు వినక తిరస్కరించి చెప్పినది వినలేదు.

MATT 24:17•

MARK 13:15•

LUKE 21:21

 

33అందులో ఒక్క క్రైస్తవుడు కూడా పట్టుబడలేదు, ఎందుకనగా వారు సూచను చూచి కదలిపోయిరి, చూచారా. వారిట్లు చెప్పిరి, "మిద్దె మీద నున్న వాడు క్రిందికి దిగి రాకూడదు. పొలములో నున్న వాడు తిరిగి రాకూడదు. తన పై వస్త్రము కొరకు తిరిగి రారాదు. యూదయకు పారిపోవుడి. మీరు పారిపోవుట చలి కాలమందయినను, విశ్రాంతి దినమందయిననూ జరగకుండా ప్రార్ధించుడి." ఎందుకనగా చలి కాలములో కొండలన్నియూ మంచుతో నిండియుండును. విశ్రాంతి దినమున గవిని మూయబడును. (ద్వారము) అప్పుడు వారు క్లిష్ట దశలో చిక్కుకొందురు, చూచారా. ప్రభుని చిత్తము అయిన యెడల ఈ కార్యమును దేవుడెట్లు చేయునో చూద్దాం, దానిని త్వరలోనే చూచెదము.

34ఇప్పుడు గమనించండి, ఆ విధముగా ఉండరాదని వారు ప్రార్ధించిరి. దాని కొరకు ప్రార్ధించమని యేసు వారికి చెప్పెను. వారిలో ఒక్కరు కూడా అక్కడ చిక్కుకొనకుండా ప్రార్ధించిరి. వారు తప్పించుకొనిరి, ఎందుకనగా వారు సూచనను చూచి వెడలిపోయిరి; జరిగినదంతయూ అదే.

ఓ, మనము జీవించుచున్న కాలపు సూచనను నేటి సంఘములు మరింతగా చూడవలసియున్నవి! ప్రాణమును దక్కించుకొనుటకు సాధ్యమైనంత త్వరగా కల్వరి యొద్దకు పారిపొమ్ము, ఏదో ఒక సంఘము యొద్దకు కాదు. యేసుక్రీస్తు యొద్దకు. ఆయనతో నిన్ను ఏకము చేసికొనుము. ఏదో ఒక సంస్థతో కాదు లేదా ఏదో సంఘ ఆచారముతో కాదు. క్రీస్తుతో ఏకము కమ్ము, నిశ్చయంగా ఆయనతోనే ఉన్నావని ఎరుగుము. మరేదియూ నీవు తీసుకొనజాలవు. అది ఆయనే అను నిశ్చయత నీవు కలిగియుండవలెను. ఎట్టి ఐక్యతా సమయము!

JOHN 9:2,3,20,21

 

35వారు మెస్సీయాను తిరస్కరించిరని మనము కనుగొనుచున్నాము. తరువాత వారు తమలోతాము ఏకమై ఒక సమితిగా కూడి యేసును ఎవరయినా గాని ప్రవక్తగా చేర్చుకొన్నచో సంఘము నుండి వెలివేయుదుమని తీర్మానము రూపొందించిరి. మూయబడిన నేత్రాలతో జన్మించిన ఆ పుట్టి గ్రుడ్డివాని సంగతి గుర్తున్నదా? శిష్యులు ఇట్లడిగిరి, ఎవరు పాపము చేసిరి? అతడా లేక అతని తల్లిదండ్రులా?

"ఈ విషయములో ఎవరూ పాపము చేయలేదు; కాని దేవుని యొక్క క్రియ బయలుపరచబడునట్లు, తెలియచేయబడునట్లు ఈలాగు జరిగెను," అని యేసు చెప్పెను.

గుర్తుంచుకొనండి, తల్లియు, తండ్రియు చెప్పలేరని వారనిరి. వారు ఇట్లనిరి, "వీడు మా కుమారుడని ఎరుగుదుము, కాని ఎవరు స్వస్థపరిచిరో తెలియదు." ఎందుకనగా ఆయనను ప్రవక్తగా ఎవరయినా ఒప్పుకొనినచో వారు సంఘము నుండి వెలివేయబడుదురని యూదులు చెప్పిరి.

36అయితే, మీరు చూడండి, జరిగిన దేవుని క్రియలు, ఈ పిల్లవాడు ఆ గుంపునకు చెందినవాడు కాడు. "నాకు దృష్టినిచ్చిన ఈయన ఎక్కడి నుండి వచ్చెనో మీకు తెలియకపోవుట వింతగా నున్నదే?" అని అతడనెను, చూచారా. ఇప్పుడు దానిని అతడు చెప్పగలడు. చూడండి, అవే దేవుని కార్యములు. అతడు స్వస్థత పొందెను. బాగు చేయబడెను. దానిని అతడు చెప్పగలడు, ఎందుకనగా అతడు ఎక్కడనుండో తెచ్చినవి త్రాళ్ళను వారికి కట్టజాలడు. అతనికే ఆ క్రియలు జరిగెను, నిశ్చయంగా అతడు తన జీవితములో మొదటిగా చూచినది అదే. జరిగినదే చెప్పెను.

JOHN 9:2,25

 

37యూదులు యేసుకు విరోధముగా, ఆయన యొక్క మెస్సీయత్వమునకు విరోధముగా, ఆయన యొక్క మెస్సీయత్వపు వర్తమానమునకు విరోధముగా ఏకమయిరి. అదే సంగతి ఇప్పుడు జరుగుట మనము చూచుచున్నాము. సంఘమును నాశనము చేయుటకు కమ్యూనిజము ఏకమవుచున్నది. అదే రీతిగా సంఘము కూడా తనలోతాను ఏకమై సంఘముల సమాఖ్యగా, ప్రపంచ సంఘ సమితిగా ఏకమై, వాక్యమును, వర్తమానమును తిరస్కరించుటకు, నాశనము చేయుటకు పూనుకొన్నది. ఆ సంఘములు వాక్యమును త్రోసివేసిరి. వారు దానిని అంగీకరించలేరు, ఎందుకనగా అది వారి శాఖా ఆచారమునకు విరోధము. ప్రజల మధ్య ఎన్ని ఆగ్నిస్తంభములు వ్రేలాడినప్పటికిని, ఎన్ని సంగతులు ముందుగానే చెప్పినవి నెరవేరుచున్నాగాని, చివరి దీనమునకు ఆయన వాగ్దానము చేసిన గొప్ప సూచనలన్నియూ కనబడుచున్నా గాని, వారు మాత్రము నమ్మరు.

38కాబట్టి వారు తమలో తాము ఏకమగుచున్నారు. ఇక్కడున్న మా సంఘ కాపరి, అనేకులు, ఇంకా సంగతులు చదువుచున్నవారు మీరు చెప్పగలరు. ప్రపంచము యొక్క సంఘ ఐక్య ఉద్యమమును కలిగియున్నారు. దానికి పైన ఒక లూధరన్ సేవకుడున్నాడు. ఒక విపత్తు వచ్చినప్పుడు అది ఇక్కడున్న ఈ పొరుగున కూడా సంభవించును. ఆ ప్రపంచ సంఘ సమితితో మనము ఏకము కానియెడల మన సంఘము ఇక సంఘముగా పరిగణించబడదు. వారు ఒక స్టోరు గదిగా దీనిని వాడుకోవచ్చును. ఎవరయినా మరణావస్థలో నుండుట లేక బాధలో నుండుట మన సోదరులలో ఒక సోదరుడు చూచి ఆ వ్యక్తికి ఎట్టి ఆత్మీయ ఆశీర్వచనమునయినా అందించుటకు ప్రయత్నించినయెడల, అతనిని లేక మనలను కాల్చి చంపవచ్చును. అక్షరాలా నిజము. అట్టి పరిచర్య ఏదైనా చేసినందుకు ఫెడరల్ చెరసాలలో పదేండ్ల శిక్ష అనుభవించవలసియుండును, ఎందుకనగా మనము ఈ ఐక్యసంఘ ఉద్యమములో సభ్యులము కాలేదు గనుకనే. మృగము యొక్క ముద్రను మీరు చూచుటలేదా? చూడండి?

39ఈ ఏకమగు కాలము వచ్చుట ఇప్పుడు మనము చూచుచున్నాము. చూచారా? ఇప్పుడు గమనించండి! సంఘము తనకు తాను వర్తమానమునకు వ్యతిరేకముగా ఏకమగుచున్నది. అది ఆ విధముగా అయినప్పుడు రాజ్యము లన్నియూ కమ్యూనిజంలో ఏకమై మరల సంఘమును నాశనము చేయ ప్రయత్నించును. మొదటిసారి ఏమి చేసెనో సరిగ్గా అదే చేయుటకు ఉపక్రమించును, చూచారా. అది మరల జరిగినదే పునరావృతమగును.

ఇశ్రాయేలు మొదట వర్తమానమును తిరస్కరించవలసి యున్నది. వారు వర్తమానమును తిరస్కరించినప్పుడు, సైన్యము, జాతీయ జీవనము (ఇతర దేశములతో), కలిసి ఏకమయి సంఘమును నాశనము చేసెను. ఈనాడు వారు ప్రభువగు యేసు యొక్క వర్తమానమును తిరస్కరించిరి. వారు దానిని తిరుగ గొట్టిరి. ప్రపంచమంతటిలోని కమ్యూనిజము ఏకమై సంఘమునకు విరోధముగా లేచు కాలము ఇప్పుడు వచ్చియున్నది. చూడండి. అది ఆ విధముగా ఉండవలసియున్నది. ఇప్పుడు దానిని చెప్పుట కష్టము.

40యూదులకు అది నమ్ముట బహు కష్టము. వారిట్లు చెప్పుకొనిరి, "సోదరులారా, ఇప్పుడు రండి, మన దేవుడు మనకు తోడైయున్నాడు. కనుక మనము దేవాలయములోనికి వెళ్ళుదము. ఇప్పుడు మనము ప్రార్థించుదము. ఫలాని ఫలాని పరిశుద్ధ తండ్రి మనలను ప్రార్థనలో నడిపించును. గవిని మూయండి." టైటస్ ఆక్కడే దాదాపు సంవత్సరము, అంతకన్న ఎక్కువ కాలము, పట్టుబట్టి నిలబడెను. చూడండి, అక్కడే కావలి కాయుచున్నాడు, వారిని ఆకలికి గురిచేసి చంపెను. వారిలో కనీసము ఒక్కరు కూడా తప్పించుకొని బయటకు రాలేక పోయిరి. వారందరూ ఆకలి బాధతో చనిపోయిరి. అప్పుడతడు లోనికి వెళ్ళి గోడలను కూల్చివేసి ముందుకు పోయెను. అందులో ఉన్న ప్రతి ఒక్కరిని వధించెను, రక్తము నదులై పారినదీ.

41అది జరుగునని పాత నిబంధనలో యెహోవా యొక్క దూత ఎప్పుడో ప్రవచించెను. యాజకులగు ఆ మనుష్యులు, ప్రజలకు దానిని చెప్పుటకు నియమించబడిన వారు, ఆలాగు చెప్పుటకు బదులుగా యేసు వారిమధ్య వచ్చి నిలబడినా గాని ఆయనను ఏరుగలేని స్థితికి వచ్చిరి. ఆయనను ఏదో మాంత్రికుని వలె ఉపయోగించుకోగోరిరి, "ఏదీ ఒక ఇంద్రజాలము చేసి చూపించు. అదేలాగు జరిగిందో చూస్తాం! మాకు ఒక సూచన చూపించు!" అన్నారు. చూచారా, ఆయన ఎన్నో సంగతులు చేసి చూపించెను. అయిననూ వారు దానిని చూడలేకపోయిరి. చూచారా, వారాయనను విసర్జించిరి. ఆ దినము యొక్క వర్తమానము వారు తిరస్కరించిరి.

ఆనాటి సూచనను చూచుటలో వారు విఫలమయిరి. బైబిలు ప్రవచనము యొక్క సూచన వారియెదుటనే చూపబడెను, ఆయితే వారు, "ఇక పోదాం పదండి" అన్నారు. వారు పరిశుద్ధులు, వారి జీవితములను వ్రేలు పెట్టి మీరు చూపించుటకు తగరు, ఆలాగు కానిచో వారు యాజకులు కాలేరు. ఒక చిన్న పనికి సహితము యాజకుడు చంపబడును లేదా రాళ్ళతో కొట్టి చంపబడును. కనుక అతడు స్వచ్చమగు పవిత్ర జీవితమును జీవించవలెను. అతడు ఏదీయు చేయజాలడు, ఎందుకనగా దానిని బట్టి అతనిని రాళ్ళతో కొట్టి చంపుదురు, గనుక వారు గొప్పవారు. జనుల దృష్టిలో పరిశుద్ధులు, వారు వెళ్ళి ఈలాగు చెప్పెదరు, "మనకు దేవుడున్నాడు, ఆయన యుగములన్నిటను మనతో కూడా ఉన్న దేవుడు. ఆయన యొక్క పరిశుద్ధాలయములోనికి మనము వెళ్ళుదము. అది దేవుని యొక్క పరిశుద్ధ దేవాలయము." కాని మీరు చూడండి. ఆయన తన పరిశుద్ధాలయములోనే తిరస్కరించబడెను, చూచారా. "మనము దేవుని యొక్క మందిరము వరకు వెళ్ళుదుము. మనమ ఎన్నుకొనబడిన సంతతి అని హెబ్రీయులగు మీ అందరికీ తెలియును. మనముందరము ఇక్కడ ఉన్నాము. దేవుడు మన దేవుడు. అబ్రహము, ఇస్సాకు, యాకోబుల దేవుడు. ఆయన మనతో యున్నాడు. ఆవలనున్న సున్నతి లేని ఫిలిష్తియుల చేతిలో నుండి ఆయన మనలను విడిపించును. (అప్పటివలె) వారే రోమనులు, గ్రీకులు, వారి నుండి ఆయన మనలను విడిపించును. మనము యెహోవా మందిరములోనికి వెళ్ళుదుము. రండి," అని చెప్పిరి.

42అది మంచిగానే వినబడినది; కాని వారేమి చేసిరి? ఆ ఇంటి నిర్మాణకుడు ఆయన ఒక దీన గలిలయ వడ్రంగి రూపములో యున్నాడు. వారాయనను త్రోసి వేసిరి. దేవుడు తనకు సాటియై, తన వర్తమానికునిగా ఆ ఘడియకు ఆయనను బయలపరచినప్పుడు, వారు దానిని త్రోసి వేసిరి. వారందరూ యధార్ధముగా ప్రార్ధించుచుండిరి. వారి అర్పణలు దేవునికి అర్ధములేనివిగా కనబడెను. వారది చేసిరి! దేవుడు ఈ గొప్ప సైన్యము ఏకమై దానిని నాశనము చేయునట్లు చేసెను.

నేడు మనము చూచుచున్నాము, శాఖల ద్వారా సంఘములన్నియూ దేవుని యొక్క క్రమమును త్రోసివేసినవి. ఈ సంగతులను గూర్చి మిమ్మును వారు చెప్పనియ్యరు, సైన్సు దానిని చిత్రములు మొదలగువాని ద్వారా రుజువు చేయును, కాని వారు ఇంకా దానితో మాకేమి సంబంధము లేదనుచున్నారు. కనుక దానిని నాశనము చేయుటకు కమ్యూనిజము రూపొందుచున్నది. సరిగ్గా టైటస్ చేసిన రీతిగానే వారును చేయుదురని బైబిలు చెప్పుచున్నది. సరిగ్గా అలాగే!

43ఇప్పుడు, ఎక్కడ మనము జీవించుచున్నామో చూడండి? కాల ఏకత్వము ఈ సంగతులన్నియూ ఏకమగుట మనము చూచుచున్నాము. ఓ; ఎందుకు మనము ఆ సంగతులు చూచుటలో విఫలమగుచున్నాము! ఇక్కడి లేఖనములో మీరు చూచి, ఆయన ఎక్కడ వాగ్దానము చేసెనో గ్రహించగలరు. ఆయనేమి చేయునో చూడగలరు. అదిప్పుడు నెరవేరుట మనము చూచుచున్నాము. దేశములు ఏకమగుట మనము చూస్తున్నాము. వాదములు ఏకమగుట చూస్తున్నాము. సంఘములు ఏకమగుట మనము చూస్తున్నాము. ఇది ఏకమగు కాలము. ఇది ఏకమగు ఘడియ. ఈ యుగము యొక్క ఆత్మ ఇదే, "మనము ఏకము కావలసినయున్నాము." నీవు దేని గూర్చి మాట్లాడుచున్నావో ఆ ప్రతిదియు సంస్థగా మారుటను గూర్చిన సంభాషణయే. దానిని ప్రభుత్వము సహితము అంగీకరించును.

44అమెరికా దేశపు పౌరునిగా యున్న నాకు మీరు ఐదు డాలర్ల చెక్కును ఇచ్చినా గాని పేరును దాని మీద వ్రాసుకొని దైర్యము లేదు. చూడండి, అది నేను చేయలేను. చూడండి, ఇది ఏకమగు కాలము. ప్రతిదియు ఏదో ఒక విధమగు సమాఖ్య ద్వారానే వెళ్ళవలసియున్నది. మృగము యొక్క ముద్రను తీసికొని వచ్చినది ఐక్యతే, చూచారా. ఇది ఏకము చేయు కాలము, ప్రతిదియూ దానికొరకే సమకూడి జరగుచున్నది. నీ స్వంత కండ్లతోనే నీవు అది చూడగలవు. ఇది ఏకము చేయు కాలము. ప్రతిదియు కలిసి ఏకమగుచున్నది.

45తమకు మెస్సీయా అయిన యేసునకు వ్యతిరేకముగా యూదులందరూ ఏకమయిరి. కాబట్టి ఏమి జరుగుచున్నదో మనము చూచుచున్నాము. ఇప్పుడును అదే మనము చూడగలుగుచున్నాము. సంఘము ప్రపంచ సంఘ సమితిలో ఏకమై, దేవుని వాక్యమగు వర్తమానమును నాశనము చేయుటకు ప్రయత్నించిన తరువాత, సంఘమును నాశనము చేయుటకు కమ్యూనిజము ఏకమగుచున్నది. దానిని వారు వదిలించుకొనవలెనని వారు ప్రయత్నించుచున్నారు. వారు చేయగలిగినది కేవలము తమ మట్టుకు తాము ఒక ఆలోచనా సమితిగా సమకూడుటయే, ఎందుకనగా వారు వేరయిరి; ఇక్కడ ఒక చిన్న గుంపు, మెతడిస్టులు, బాప్టిస్టులు, లూధరనులు, ప్రెస్బిటేరియనులు, క్రీస్తు సంఘము మొదలగునవి అవి. వారేమియూ చేయలేరు, ఎందుకనగా దీనికి అది వ్యతిరేకము, దానికి ఇది వ్యతిరేకము, వారి సిద్ధాంతములు ఒకరిని ఒకరికి తూర్పు, పడమరలంత దూరముగానున్నవి. చూడండి, వారేమియూ చేయజాలరు. కాని ఒక్కసారి ఒక పెద్ద నాయకత్వము క్రింద ఏకమైనప్పుడు వారు చేయుదురు. అప్పుడు దానిని వారు సాధించెదరు.

46కాతలిక్కులు అలాగే ఏకమైయున్నారు. రోమను కాతలిక్కులు ఐక్యతతోనున్నారు. అధిక సంఖ్యాకులున్నది రోమన్ కాతలిక్కులే. గ్రీకు మరియు ఇతర కాతలిక్కులు రోమను కాతలిక్కులంత ఎక్కువగా లేరు. వారు కలసి ఏకమయిరి. ఆ కారణము చేతనే ఏకమై నిలబడగలిగిరి. ఏమి జరిగినాగాని, సమస్తమునకు పోపు మాత్రమే అధిపతి, చూచారా. ఎవరు ఏమి చెప్పినా అక్కరకు రాదు. "అతడు తప్పిపోలేనివాడు; అతడు దేవుని యొక్క ప్రతినిధి, అంతే; అతడే దేవుని తరువాత వా; నరకము, పరలోకము, పరిహారము మొదలగు వాటి మీద అతనికే అధికారమున్నది," చూచారా. కాబట్టి ఆ విషయములో చేయకలిగినది ఏదియూ లేదు. అతడు ఏది చెప్పితే అది జరుగవలసినదే.

MATT 15:6•

MARK 7:13•

REV 13:14

 

47ప్రొటస్టెంటు వారు కూడా ఆ విధంగానే ఒక శిరస్సును తమ కొరకు తయారుచేసికొనుచున్నారు. బైబిలు ఈలాగు చెప్పెను, "మృగమునకు పోలిన స్వరూపమొకటి తయారుచేయబడెను." ప్రతిమ అనగా ఏమిటి? దానిని పోలినదే అని అర్థము. అదేలాగున్నదీ. ఏమిటది? తమ్మును తాము ఏకము చేసికొనుట ద్వారా వచ్చెను. ఈ యుగము యొక్క ఆత్మ ఏకమగుటయే.

వర్తమానమును నాశనము చేయుటకు ఇప్పుడు ఏకముగా కూడుచున్నారు. వారు దానిని ఏలాగు నాశనము చేయగలరు? దేవుని యొక్క వాక్యమును వారెట్లు నాశనము చేయగలరు? ప్రభావము లేని దానినిగా చేయుట ద్వారానే. వారు ఆదీలో చేసినట్లుగానే ఆచారముల వలన నిష్ఫలముగా చేయుదురు. దేవుని వాక్యమును శక్తిహీనము చేయుదురు చూడండి. ఈ దేవుడు లేడను స్త్రీ చూడండి. ఆమె పేరు ఏమిటో ఇప్పుడు నేను మరిచిపోయాను; గుర్తుకు వచ్చినచో బాగుండును. నేను చాలా గుర్తుచేసికోవలెనని ఆలోచించుదును.

48ఒక రోజున ఈ ప్రపంచ సుందరి గూర్చి ఆలోచించుచున్నాను. అటువంటి వారు మరొకరు లేనిచో బాగుండునని అనుకొనుచున్నాను. మద్యపు గదులలోనికి వెళ్ళి విస్కీని విసిరి, సూచనలను ఇంకా వాటన్నింటిని బయటకు పారవేసినది. అటువంటి స్త్రీలు ఈ రోజున ఎందుకు కొందరు లేచుట లేదు? బయటకు వెళ్ళి ఆ దిగంబర చిత్రములను, తన స్వంత స్త్రీ జాతిని కించపరచు ఆ పటములను మొదలగు వానిని ఎందుకు చించి పారేయరు? ఇక మీదట అవి ఉండుట జరుగదు.

49ఈ స్త్రీ అయితే నాస్తికురాలు. ఇట్లన్నది, "ప్రజలకు చెందిన పాఠశాలలలో బైబిలును చదువుట రాజ్యాంగ విరుద్ధమని," అటువంటివి ఏవేవో అన్నది.

మీరు మరల గమనించారా? ఇప్పుడు వారిలాగు చెప్పు ప్రయత్నించుచున్నారు. లేఖనములను గొప్పగా అధ్యయనము చేసిన వారిట్లు చెప్పుచున్నారు, "బైబిలులో ప్రవచించబడిన ప్రవచనములలో ఎక్కువ భాగము పూర్తిగా తప్పు. ఎన్నడూ నెరవేరలేదు. దానిని గూర్చి మీరు విన్నారు మరియు చదివారు. వారు ఏదేదో అనుటకు ప్రయత్నించున్నారు; చూడండి, వారు వాక్యము యొక్క ప్రభావమును నశింపచేయుటకు ప్రయత్నించుచున్నారు. వారు దానిని నాశనము చేసి దానికి బదులుగా ఏదో ఒక సిద్ధాంత సరళిని, లేదా ఏదో ఒక మానవుని దానిని, వాక్యము కంటే మిన్నగా తమ కండ్లకు కనబడు దేనినో ఒక దానిని ప్రవేశపెట్ట చూస్తున్నారు. అపుడు వారు తమ ఆచారముతో దానిని నాశనము చేయుదురు. వారు దేవుని యొక్క వాక్యమును శాఖా సంబంధమగు రాజకీయము ద్వారానే నాశనము చేయుటకు ప్రయత్నించుచున్నారు.

50ప్రతి సంఘము తన స్వంత రాజకీయములను కలిగియున్నది. క్రీస్తు సంఘమునకు తన స్వంతది యున్నది. క్రైస్తవ సంఘమునకు తన స్వంతది యున్నది. బాప్టిస్టులు, మెతడిస్టులు, ప్రెస్పిటేరియనులు అందరూ తమదగు వేర్వేరు రాజకీయమును కలిగియున్నారు. ఇప్పుడు వారు దానికి దూరంగా పోవుచున్నారు, ఎందుకనగా వారు వేరయిరి. చూడండి, ఇంతకు ముందు వారు దానిని చేయలేకపోయిరి. ఇప్పుడు వారు దానిని చేయవలసియున్నారు. చూడండి, ఇది ఏకమగు కాలము. ఇప్పుడు వారు దానినంతటిని కలిపి చేయుచున్నారు. దానిని పేర్చి అందులో నుండి ఏమి వచ్చునో అని చూచుచున్నారు. గుర్రపు మాంసము నుండి లేదా తొట్టిలోని చెత్త నుండి ఒక రొట్టె ముక్క తయారు చేయుచున్నట్లుగానే యున్నది. వారు కూడుకొనుట అందుకు తప్ప మరెందుకు క్రుళ్ళిన బంగాళాదుంపలు, ఇంకా అటువంటి వానిని పిసికి కలిపినచో ఏమి తయారగునో చూడండి. నాకు నీశ్చయంగా అటువంటిది వద్దు. వద్దండీ! వారు అలాగే చేయుచున్నారు. చూడండి, యేసు ఒక కల్పితమైన వాడు అను నమ్ము జనులను వారు తీసికొనుచున్నారు. యేసు ఒక కట్టు కధ అని నమ్ము ఒక సంఘమును వారు చేరుకొనుచున్నారు; మరియొకరు ఆయన ఒక ప్రవక్త అని నమ్ముచున్నారు.

ఒకరయితే, "అద్భుతములు జరుగు దినములు అయిపోయినవి," అందురు.

మరొకరు, "అటువంటిది ఉండి యుండవచ్చును" అందురు.

AMOS 3:3

 

51వీరందరూ ఏకమయిరి; "సమ్మతింపకుండ ఇద్దరు ఎలాగు కూడి నడువగలరు?" అని బైబిలు అడుగుచున్నది, చూచారా. వారి యొక్క ఐక్యత అదే. దానికి పైగా ఒక గొప్ప పరిశుద్ధ తండ్రిని పెట్టుట మృగము యొక్క ప్రతిమను నిలబెట్టుటయే. బైబిలు అక్షరాలా అదే చెప్పెను. దానికి శిరస్సుగా ఇప్పుడు ఒక లూధరను యుజకుడున్నాడు. ఇది ఏకమగు కాలమని మనము చూచుచున్నాము. అదే విధంగా ఇప్పుడ కమ్యూనిజము మొదలగునవి ఏకముగా కూడుచున్నవి; లోకములోను, సంఘములోను కూడి ఏకమగుటే జరుగుచున్నది.

MATT 24:7•

MARK 13:8•

LUKE 21:10,11•

REV 13:14

 

52ప్రకృతి గమనించండి. ఓ, ప్రకృతిని గమనించినచో ప్రకృతి కూడా అదే చేయుచున్నది. ప్రకృతి దేవుని యొక్క సూచనల కాలెండరు. మీరది ఎదురుగా? ప్రకృతి పరిశీలించుడని యేసు వారితో చెప్పెను. సముద్రము గర్జించుచుండును. (చూచారా), ఇంకా వివిధ విషయములున్నవి. పలుచోట్ల భూకంపములు, జాతీయ పోరాటములు, ఆకాశమందు సూచనలు, భూమి మీద సూచనలు, ప్రతీచోట ఈ వచ్చుచున్న కాలపు సూచనలు కనబడుచున్నవి.

మేఘములను గమనించండి. మేఘములు తుఫానును తీసుకొని వచ్చు ముందుగా ఎట్లుండునో మీకు తెలియును. చాలా చిన్న మేఘములు ఒక చోట కలసి ఒక పెద్ద మేఘమగును. దీనికి చిన్న పాటి గాలి వీచును. దానికి చిన్న పాటి గాలి వీచును. అవన్నియూ కలసి వీచును. అప్పుడది గాలి వానగా మారును, చూచారా. తుఫానుగా వచ్చుటకు ముందు అవి ఏకముగా కూడవలసియున్నవి.

తమ ప్రాంతమును విడిచి పెట్టు ముందుగా కొంగలు, బాతులు ఏకముగా కూడికోనుటకు గమనించండి, చూచారా. అవి కలసి ఏకమగును. ఈ చెరువు నుండి ఆ చెరువుకు, ఇక్కడి నుండి అక్కడకు అవన్నియూ కలసి ఎగురుట మీరు చూడగలరు. అవి ఏకమై ఎగురుపోవుటకు సిద్ధపడును. చూడండి, అది ప్రకృతి. దేవుడు ప్రకృతిని సృష్టించెను. ప్రకృతి దేవుని యొక్క పధకము బట్టి పని చేయుచున్నది. అది ఒక ధర్మము. వ్రాయబడని దేవుని యొక్క ధర్మశాస్త్రమది. ఆ ప్రకృతి ఆయన యొక్క ధర్మశాస్త్ర ప్రకారము పని చేయును.

53సమాధి కార్యక్రమము నొద్ద మాట్లాడుతున్నట్లే, రసము సమాధిలోనికి పోవును, అనగా చెట్టు యొక్క అడుగు భాగమగు వేరులోనికి పోయి వసంత కాలములో పునరుద్దానమ పొందువరకు దాగియుండును. అది దేవుని యొక్క సూత్రము. అక్కడికి రసము వెళ్ళునట్లుగా ఏ జ్ఞానము చేయలేదు. నీవు దానిని బయటకు తీసిపారవేయలేవు. దానిని నీవు బయటకు తీసి పిండలేవు. దానిని దేవుడు విధానము కన్న మంచి విధానము నివేదియూ కనుగోలేవు. దేవునికి పరిపూర్ణమగు పద్దతి యున్నది. ఎప్పుడయితే ఆకులు రాలిపోవునో ఆయన రసమును అడుగు భాగమునకు పోయి దాగుకోనునట్లు చేయును. యోబు చెప్పెను, "నీ ఉగ్రత గతించు వరకూ గోతిలో నన్ను దాయుము," చూచారా. అది ఆ అడుగునకు వెళ్ళుచున్నది, ఎందుకనగా అది ప్రకృతి యొక్క ధర్మము. మంచుపడు కాలమునకు ముందు వెళ్ళును. ఇప్పుడు ఆకులు రాలుటకు తొందరపడుచున్నవి. ఎందువలన? అది ప్రకృతి యొక్క ధర్మము.

JOB 14:13

 

54బాతులు ఏకముగా పోగవును. ఒక నాయకుని వెనుక అన్నియూ ఎగురును. అక్కడ వాటికి ఎలాగో తెలియును. అవి ఎలాగు చేయుట జరుగునో నాకు తెలియదు. కాని ఒక ప్రత్యేక చిన్న బాతు నాయకుడు అని అవి ఎరుగును. దాని చుట్టూ అవన్నీయూ చేరి తటాలున గాలిలోనికి ఎగురును. ఇప్పటికి ఎప్పుడూ అవి ఆ చెరువు విడిచి వెళ్ళలేదనుకొందము, కాని అవి బహు తిన్నగా వెళ్ళిపోగలవు. తిన్నగా లూసియానాకు గాని లేదా టెక్సాస్నకు గాని, వరి పొలమునకు గాని పోగలవు. చూడండి, అవి ఎగురుటకు ముందుగా ఆ సంవత్సరము తాము జన్మించిన ఆ గృహమును ఆ సంవత్సరము పొడవునా ఎరిగిన ఆ పరిసరమును అవి విడిచి పెట్టవలెను, అవి కలసి ఏకమగును. ఆమేన్! మనము అంతే; తమ నాయకుని చుట్టూ గుమికూడవలెను.

55అయితే మానవునికే ఈ బాధ ఏర్పడినది. తమ నాయకుడిని అతడు ఎరుగడు. అవునండి! వారు ఒక శాఖ చుట్టూ గుమికూడుదురు. ఒక బిషప్పు లేదా ఒక మానవుని చుట్టూ వారు పోగవుదురు, కాని వారి నాయకుని చుట్టూ గుమికూడరు. (పరిశుద్ధాత్మ మరియు వాక్యము), చూచారా. వారిలాగు అందురు, "ఓ నేను ఒక చిన్న మూఢభక్తి గలవానిగా మారుదునేమోనని భయపడుచున్నాను. నేను తప్పటడుగు వేయుదనేమోనని భయపడుచున్నాను. ఓ, అక్కడే మీరున్నారు! ఆ చిన్న బాతు ఈలాగు అనినచో ఎట్లుండును? "అది రెక్కలు ఈకలు పెట్టు తీరు నాకు నచ్చలేదు, నేను దానిని వెంబడించుదునను నమ్మకము లేదు." అది గడ్డకట్టి చచ్చును. దానితో పాటు నీవు ఎగిరివెళ్ళినచో, నీవు అక్కడే దిగబడిపోయదవు. అది తనకు తానే ఏకమగుచున్నది, ప్రకృతి అలాగు చేయును.

కొంగలు తమకు తాము ఏకమవును. తమ నాయకుని చుట్టూ గుమికూడును; అవి కూడా అలాగే చేయును.

56తేనెటీగలు పోగవుట మీరెన్నడైనా గమనించారా? పట్టు పెట్టు ముందుగా తమకు తాముగా తేనెటీగలు ఏకమగును. రాణీ ఈగ చుట్టూ చేరును. అది నిజము. అది ఎక్కడికి వెళ్ళినను, అవన్నియూ అక్కడికేపోవును. అవును, అవేమి చేయును? పట్టు నిర్మించు ముందుగా ఏకమగును. ఖచ్చితముగా; ప్రతి ప్రకృతి ఆలాగే యున్నది.

ఊట ప్రవహించు ముందుగా చేపలు తమకు తాముగా ఏకమగును. ఆ సముద్రములో వాటిని నీవు కనుగొందువు. మనము "హంపీలు" అని పిలచు సాల్మన్ జాతి చేపలను చూడండి. ఆ ప్రవాహము వచ్చు ముందుగా అవి అక్కడికి వచ్చును. సముద్రములో వేలు, పదివేల కొలది పోగవుట మీరు చూతురు; ఉప్పు నీరు, కాని అవి వాస్తవానికి తీయ్యనీటి చేపలు. ఇక్కడ అవి ఆ తీయని నీటిలోనికి సంతానోత్పత్తి చేయుటకు వచ్చును. ఆ రుతుప్రకారము వచ్చి సంతానోత్పత్తి చేయును. ప్రతి నాలుగు సంవత్సరములకు ఆలాగు చేయును. సంతానోత్పత్తి చేసిన వెంటనే చనిపోవును. తాము చనిపోనైయున్నామని అవి ఎరుగును, కాని వాటిని నీవు ఏమి లేకుండా ఆపలేవు. అవి చేపల నిచ్చెనలను, ఇంకా అక్కడున్న ప్రతి వానిని దాటి అక్కడికి చేరును. తమ మరణమునకు వచ్చుచున్నట్లు వాటికి తెలియును. కాని ప్రకృతి సూత్రము వాటిని ఆలాగు చేయుచున్నది. తాము ఆ వృద్ధాప్యమందు అక్కడికి వెళ్ళి, సంతానోత్పత్తి చేసి చావవలెను అని వాటికి తెలియును. చిన్నపిల్లలు వచ్చును, అప్పుడు వాటిని ఎదో ఏకము చేయును. అవి మరల సముద్రములోనికి వెళ్ళును. అదే ఏకమగుట! అది ఒక ధర్మము. దేవుని యొక్క ధర్మమును నీవు అధిగమించలేవు.

57దేశములు విచ్చిన్నమగుచున్నవి, ఈ కాలములో అవి ఆలాగు చేయవలసియున్నవని మనము చూచుచున్నాము. దేశీయ కల్లోలము జరుగు ఒరవడిలో మనమున్నాము. దేశములు తమ సంబంధములను విచ్ఛిన్నము చేసికొనుచున్నవి. ప్రతి సంవత్సరము ఒక దేశము కమ్యూనిజంతో మ్రింగి వేయబడుట చూచుచున్నాము; ఇది కమ్యూనిజముతో మ్రింగబడుచున్నది. మన స్వంత దేశములో కూడా కమ్యూనిజమును తేనె పూతగా పూసిరి. అది ఆక్రమించును! చూడండి, అది దానిని చేయును. దానిని ఆపు మార్గము లేదు. ఎందువలన? టైటస్ ను ఎందుకు ఆపలేకపోయిరో ఆ కారణమే. ప్రజలు దేవునిని ఆయన వాక్యమును విసర్జించిరి. అవునండి! కనుక దానిని వారు చేయనైయున్నారు. అది ప్రగతిపధంలో ఉండుట చూస్తున్నాము.

నేను మామూలుగా కొన్ని గంటలు తీసికొందును. ఇప్పటికి నేను దాదాపు ముప్పది నిమిషములు తీసికొన్నాను, చూచారా. కాని దీనినంతటిని చెప్పుటకు నేను త్రోసికొనిపోవుచున్నాను. వారు ఇంటికి వెళ్ళినప్పుడు దానిని ఆధ్యయనం చేయండి.

MATT 24:7•

MARK 13:8•

LUKE 21:10,11

 

58గమనించండి, వారు ఇప్పుడే ఏకమగుచున్నారు. "సహోదరుడా బ్రెన్హాం, అది సత్యమా?" అని మీరడుగవచ్చు. వారు ఆర్మగెదోను యుద్ధము కొరకు వచ్చుచున్తారు. అక్షరాలా వారు అదే చేయదురు, చూచారా. ఇప్పుడు వారు దాని కోసమే ఏకమగుచున్నారు. అందుకే మనకు ఐక్యరాజ్య సమితి ఇంకా ఏవేవో యున్నవి. తూర్పు ప్రపంచము, కమ్యూనిజము మున్నగు వానికి వ్యతిరేకముగా పశ్చిమ ప్రపంచము ఏకమగుచున్నది. అంతయూ ఏకమగుచున్నది. సంఘములు ఏకము అగుచున్నవి. ప్రతిదియు కూడి ఏకమగుచున్నట్లు కనిపించుచున్నది. ఏకమగుటను, తమలో తాము ఐక్యమగుటను మనము చూచుచున్నాము

ఈ దేశములు ఏకమగుట, ఈ సూచనలు, జాతీయ సూచనలు, ఈ ప్రపంచములోని వివిధ స్థలములలో భూకంపములు, ఇంకా ఎన్నెన్నో సంగతులు ఇప్పుడు మనము చూచుచున్నాము. ప్రపంచమును ఏకముగా తెచ్చుచున్నది. జనులను ఏకముగా తెచ్చుచున్నది. సంఘములన్నింటిని ఏకముగా తెచ్చుచున్నది. ఈ సంగతులన్నియూ మనము చూచుచున్నాము. ఈ ఏకమగుటంతయూ కొనసాగుతుండగా మరొక ఏకమగుట కూడా జరుగుచున్నది. ఆమేన్! ఇప్పుడు నేను అదే మీకు చూపించగోరుచున్నాను.

59దేవుడు తన వధువును ఏకము చేయుచున్నాడు. ఆమె తూర్పు మరియు పడమర, ఉత్తరము, మరియు దక్షిణము నుండి ఏకమై వచ్చుచున్నది. ఏకముగా కూడు కాలము ఇది. ఇప్పుడది కొనసాగుతున్నది. ఆమె ఎందుకొరకు ఏక మవుచున్నది? ఎత్తబడుటకు! ఆమేన్! దేవుడామెను సిద్ధపరచుచున్నాడు. అవునండీ! ఏకము చేయుట! దేనితో ఆమె ఐక్యము చేయబడును? వాక్యముతో! "భూమ్యాకాశములు గతించునుగాని నా మాట ఎన్నడూ గతించదు." ఏ శాఖ లేక ఎవరు ఏది చెప్పినా గాని లెక్క చేయక ఆమె తన్ను తాను "యెహోవా ఈలాగు సెలవిచుచున్నాడుతో" ఏకము చేసికొనుచున్నది. ఆమె తన్ను ఐక్యపరచుకొనుచున్నది. ఆమె సిద్ధపడుచున్నది, ఎందువలన? ఆమె వధువు. అది నిజము. ఆమె తన్ను తాను పెండ్లి కుమారునితో ఏకము చేసికొనుచున్నది (చూచారా), వాక్యమే పెండ్లి కుమారుడు. "ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై యుండెను. ఆ వాక్యము శరీరధారియై మన మధ్య నివసించెను."

1THS 4:15

 

60సంఘము మరియూ వధువు మరియు వాక్యము అలాగు ఒక్కటిగా అగుచున్నది. చివరకు వాక్యము తానే పెండ్లి కుమారుని యొక్క పనిని నిర్వహించుచున్నది. ఆమేన్! మీరది చూచారా? ఒక కలయిక! "సంఘములో చేరుట," కాదు. ఇది కానే కాదు ప్రతీదాని నుండియూ పారిపోవుడి. యేసుక్రీస్తుకు కట్టబడుడి, చూచారా. అది ఏకమగు కాలము. దేవుడు తన వధువును కలుపుకొని ఏకము చేసి తిరిగి తీసుకొను వచ్చుచున్నాడు. ఖచ్చితముగా. ఆయన వాగ్దానము యొక్క మాటలను ఏకము చేయుచున్నాడు.

II థెస్సలొనియులు, 2 అధ్యాయము; 5వ అధ్యాయము ఇట్లు చెప్పుచున్నది: భూమి యొక్క మట్టిలో నిద్రించుచున్న పరిశుద్ధులు మేల్కోందురు. అప్పుడు మనము వారితో ఏకమగుదుము. (సజీవులగు మనము మృతులతో ఏక మగుదుము), అక్కడికి వెళ్ళక ముందే కలియుదుము, ఎందుకనగా అక్కడికి చేరినప్పుడు వధువు పూర్తియగును. జీవించి తమ్మును తాము వాక్యముతో ఏకము చేసికొనినవారు, ఆ విధముగానే వాక్యముతో ఏకము కాబడి, మృతి చెందినవారు కలసివచ్చెదరు. అక్కడికి వెళ్ళు ముందుగా, ఒక గొప్ప ఐక్యతా కలయికగా ఉండును. ఆమేన్!

61కమ్యునిజము లేవవలసియున్నది, ఈ మిగతా సంగతులన్నియూ లేవవలసియున్నవి, ఆవల సంఘము తనను తాను ప్రపంచ సంఘ సమాఖ్యలో ఏకము చేసుకోవలసియున్నవి; దేవుని వాక్యము క్రింద వధువు ఏకము కావలసియున్నది, అది చేయుటకు దేవుడు పరలోక సూచనలను సంగతులను పంపి, అక్క డ ఒక రాజ్యమున్నదని సంఘమునకు రుజువు చేయును. ఆమేన్.

JUDE 1:3

 

62దేవుడు; సమయమును ఏకము చేయుట! అవునండి! ఓ మై! ఇప్పుడు, గుర్తుంచుకొనండి, వాక్యము యొక్క ఏకము జరుగును. (తిరిగి మరల కలియును), విశ్వాసులకు ఒక్కసారిగా అప్పగించబడిన విశ్వాసము ఒక్కసారిగా తిరిగి తేబడును. ఇది ఈ రోజున మాత్రమే జరుగగలదు. అది జరుగు కాలము మాత్రము ఇప్పుడే ఎక్కడను ఎన్నడనూ అది ఎదుర్కొనబడలేదు; వారు శాఖలుగా వెళ్ళిపోయిరి. కాని ఇప్పుడు అది, ఏ శాఖా విధానమునకు చెందదు; ఎందుకనగా ప్రతి జాతి, ప్రతి రంగు, ప్రతి ఆచారము, స్త్రీ మరియు పురుషులు ఏకమగు కాలము ఇది. ప్రతిదియు క్రీస్తు ఆధ్వర్యములో పరిశుద్ధాత్మ బాప్తిస్మము ద్వారా తిరిగి వాక్యము యొద్దకు వచ్చును.

MAL 4:6

 

63సంఘమునకు ఇది ఏకమగు కాలము! ఓ, మై! ఈ సంస్థల ద్వారా బహు దూరముగా చెదరగొట్టబడిన ప్రతి మాటను ఏకము చేయుట జరుగును. రోమ్ లోని నైసియా వద్ద, వారు మొదటి సంఘమును సంస్థగా మార్చిరి. లూధరను సంస్థగా మార్చిరి. వెస్లీని సంస్థగా మార్చిరి. తక్కిన సంఘములన్నిటిని వారు సంస్థగా మార్చిరి. అది చేయుటకు వారు ఒక ఆచారమును దత్తత తీసుకొనిరి. దేవుడు ఒక దానిని పంపించినప్పుడు దానిని వారు చేర్చుకొనలేకపోయిరి. కాబట్టి ఇప్పటి వరకూ వాటన్నిటని ఏకము చేయుట సాధ్యము కాలేదు. "తండ్రుల యొక్క విశ్వాసము తిరిగి వధువుకు సమకూర్చబడుట, చివరి దినములో జరుగును," అని దేవుడు వాగ్దానము చేసెను. అది ఈ రీతిగానే యుండును. ఈ కాలములో తప్ప అది మరే కాలములోనూ జరుగదు. పరలోకము నుండి ఎట్టి సూచన వచ్చునో చూడండి! అగ్నిస్తంభముగా మన మధ్య వేలాడుచున్నది. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క సూచనలు మరియు అద్భుతములు మనతో యున్నవి. ఆయన మనతో మాట్లాడుచుండగా పొల్లుపోకుండా ఖచ్చితముగా జరుగుచున్నది. ఆమేన్! అప్పుడు మనమ ఎక్కడ నిలబడియున్నామో చూచుచున్నాము. కాలము ఏకము చేయబడుట!

64రాజ్యములు ఏకమవుట మనము చూస్తున్నాము. ప్రపంచము ఏకమవుట మనము చూస్తున్నాము. కమ్యూనిజము మనము చూస్తున్నాము. సంఘములు ఏకమవుట మనము చూస్తున్నాము. దేవుడు తానే వధువుతో ఏకమవుట మనము చూస్తున్నాము. చివరకు ఆయన సంఘము ఒక్కటగును, కలిసిన కుటుంబము వలే, (హల్లెలూయ) అవును! వానికవి ఏకమగుచున్నవి. దేవుడు ఏకమగుచున్నాడు! ఎందువలన? అగ్నిస్తంభము జనుల మధ్య వ్రేలాడుట. ఆదిమ సంఘ కాలము నుండి ఇంత వరకూ ఎన్నడునూ జరుగలేదు. నేడు మనము చూచుచున్న సంగతులను ఆది సంఘ కాలము తరువాత మరెవరునూ చూడలేదు. దేవుడు ఏడు ముద్రలను పంపి దాని ద్వారా మనకు ఒక సూచన ఇచ్చినప్పుడు మాత్రమే ఇది కేవలము సాధ్యమయ్యెను. పరలోకము నుండి ఏడు దూతలను క్రిందికి పంపెను. ఆ శాఖాలలోనున్న చెదిరిన వాక్యమును తిరిగి తీసుకొని వచ్చి మరల దేవుని యొక్క వాక్యముతో ముడివేయుటకు, ఆయన యొక్క పరిశుద్ధాత్మను తీసుకొని వచ్చుటకు అవి వచ్చినవి.

MAL 4:6•

JOHN 15:7

 

65యేసు చెప్పెను," మీరు నాయందును, మీ యందు నా మాటలను నిలిచియుండిన యెడల, మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహించబడును. దేవుడైన వాక్యముతో తిరిగి వధువును ఏకము చేయుటకు వచ్చును. అదే వాక్యము. సంఘము మరియు వాక్యము. సంఘము మరియు ఆచారము కాదు, సంఘము మరియు వాక్యము; వధువు మరియు వాక్యము ఏకముగా కలియుచున్నది. ఓ, మై! దేనిని తిరిగి సమకూర్చుట? అసలు పెంతెకోస్తు తండ్రుల విశ్వాసము, లూధర్ గుంపు ద్వారా చెదరగొట్టబడినది. (చూచారా?) లూధర్ వలన కాదు; లూధర్, వెస్లీ, ఇంకా ఆ గొప్ప మూల కర్తలు కాదు. వారు వెళ్ళిపోయిన తరువాత, ఒక సంఘము లేచినది. దానితో వారు ఒక సంస్థను తయారుచేసిరి. వారు ఆచారములను అంగీకరించిరి. ఏవేవో అనుసరించిరి. వారిగా దూరంగా వెళ్ళిపోయిరి. నేడు వారి వైపు చూడండి. ఇప్పుడు వారు ఆ ప్రపంచ సంఘ సమితిలోనికి వచ్చియున్నారు.

ఇప్పుడు, మీరు చూడండి; చివరి దీనములలో మీరు చూడండి, ముందెన్నడూ జరుగని సంగతులు ఇప్పుడు జరుగుట మనము చూస్తున్నాము. చూడండి, అది దేవుని యొక్క సూచన. ఈ ఏకమగుట యావత్తు కాలసూచన. దాని వైపు మనము జాగ్రత్తగా చూడగోరుచున్నాము. నిశ్చయముగా దానిని మనము పొందవలెను. వారు శాఖల కొరకు నిజ వాక్యమును విడిచిరి. వాక్యమును తీసికొనుటకు బదులుగా, వివిధ వ్యక్తుల ఆచారములను మరియు అభిప్రాయములను అంగీకరించిరి.

REV 10:7

 

66ప్రకటన 10 చెప్పెను, "ఏడవ దూత వర్తమానము." ఇప్పుడు గుర్తుంచుకొనండి, అది ఏడు బూరల యొద్దనే జరుగును. ఏడు దూతలు అక్కడ ఏడు బూరలనూదుచున్నవి. మనము తరువాత అక్కడికే వచ్చెదము. కాని అక్కడ గుర్తుంచుకొనండి, బహు సూటిగా అక్కడ చెప్పబడెను, "దేవదూతలు…" ఏడవ దూత యొక్క బూర కాదు, కాని "ఏడవ దూత యొక్క వర్తమానము." చూడండి, బూర దూత కాదు, వర్తమానపు దూత! చూడండి, దూత కేవలము బూరను ఊదెను, ఆ ఏడవదూత. ఏడవ దూత యొక్క వర్తమానపు దినములలో ఉండిన బూర దూత ఇదియే; చూడండి, అతని వర్తమానము సమాప్తమగునప్పుడు. చూడండి, అది సంఘ కాలపు వర్తమానము. ఈ సమయమున వర్తమానము, బూర కాదు, మరియు "వాక్యములో వ్రాయబడిన దేవుని యొక్క మర్మము తప్పక సమాప్తము కావలెను."

67మనము ఎట్టి దినమున జీవించుచున్నామో చూడండి! ఆ ముద్రల వైపు చూడండి. లూధరు, తక్కిన వారందరూ, ఆ గొప్ప సంస్కరణ కర్తలందరు వేదజల్లిన దేవుని వాక్యమును ఆ ముద్రలు ఒక్కచోటకు లాక్కొని వచ్చినవి. తిరిగి బైబిలులోనికి వచ్చుటను చూపించినవి. అవి అందులోనే యుండును. ప్రతి వ్యక్తి ఏ స్థానములో యుండునో, ఆ స్థానమును చూపించినవి. ఒక వ్యక్తి ఏమి చేయునో, సంఘమునకు ఏమి జరుగునో అవన్నియూ చూపించబడినవి. ఇంతకు ముందు వారు వాటిని విడిచిపెట్టిరి. దాని గురించి ఏమి తెలియని ఈ చివరి దినములలోని మనకు ఒక ప్రత్యేకమైనది జరుగుటను గూర్చి ముందుగానే చెప్పుబడెను. వార్తా పత్రికలు మొదలగునవి సహితము వీటిని ఎత్తి వ్రాసినవి. క్రిందికి వచ్చి, దానిని బయలుపరచి, మర్మములన్నింటిని ఒకటిగా ముడివేసినవి. ఆమేన్! సోదరుడా, అది నాకు జ్ఞానయుక్తముగానున్నది! నాకది దేవుని వాక్యవరుసలోనికి వచ్చుటయే యున్నది. ప్రజలు తలంపుతో ఏమి చెప్పుదురో దానిని నేను లక్ష్యపెట్టి విందును గాని, నాకయితే ఇదే సత్యము.

MATT 2:2

 

68బబులోను నుండి వచ్చుచూ జ్ఞానులు ఇట్లనిరి, "యూదుల రాజుగా పుట్టిన వాడెక్కడ? ఇప్పుడాయన భూమి మీదనే యున్నాడు. మేమాయనను కనుగొనవలసియున్నాము" అని కేకలు వేసిరి. అది నిజము. ఆయన వచ్చుట బహు సమీపముగా యున్నదని నేను నమ్ముచున్నాను. ఈలాగు చెప్పగలను, "ఇదిగో, పెండ్లి కుమారుడు వచ్చుచున్నాడు. అర్థరాత్ర కేక నేను వినుచున్నాను!" మనము అంత్యకాలములో యున్నాము. ఓ! మనము ఆ మడియలో జీవించుచున్నాము. గమనించండి.

ఎట్టి దినము! ఎట్టి కాలములో మనమ జీవించుచున్నాము! ఈ దేవుని యొక్క గొప్ప మర్మము సమాప్తమాయెను, దేవత్వము ఏమిటో మనకు చూపించబడినది. ఈ చిన్న వాదములు మొదలగునవి బయలుదేరి ఆయనను ఇదిగాను, మరికొందరు ఆయనను ఇది అని కొందరయితే అదీ అని చెప్పియున్నారు. ప్రభువు యొక్క దూత దిగి వచ్చి, వారి యొక్క వాదములన్నిటిని ప్రక్కకు లాగి, అందులో నుండి సత్యమును ఇవతలకు తీసి దానిని అందించెను. అది ఏ మాత్రమూ సందేహించని పరిపూర్ణతగా యున్నది. మరే విధముగాను మీరు వెళ్ళలేరు. అదిక్కడున్నది, ఆయన ఎవరైయున్నాడో తెలియచేయబడినది. చూడండి, సర్పసంతానము ఇంకా ఈ సంగతులన్నియూ ప్రజల మధ్య వింతగా యున్నవి, చూచారా. ఏమిటది? ఇది దేనికి గురుతు? ఏకమగుటకు!

MATT 25:6•

JOHN 14:20•

ACTS 9:3,4

 

69మలాకీ 4లో ఆయన ఏమి చెప్పెను? తిరిగి సమకూర్చుదును. అది పెంతెకొస్తు విశ్వాసమును తిరిగి సమకూర్చెదను. అదే పెంతెకొస్తు వర్తమానము గల జనుల యొద్దకు తిరిగి వచ్చుట. అదే పెంతెకొస్తు సూచన. అదే పెంతెకోస్తు రుజువు. అదే దేవుడు. అదే శక్తి. అదే బోధ. ప్రతిదియూ ఖచ్చితంగా అదే. పౌలును మార్గములో తాకి క్రిందపడవేసిన అదే ఆగ్నిస్తంభము యొక్క ప్రత్యక్షత, దమస్కుకు వెళ్ళుచుండగా పౌలును అదే తాకినది; ఆ దినమున ఆయన చేసిన అవే కార్యములను ఈనాడు మన మధ్య చేయుచున్నాడు. ఏకము చేయుట!

రాజ్యములు ఏకమగుట మనము చూచుచున్నాము. ప్రపంచము ఏకమగుట మనము, చూచుచున్నాము. సంఘములు ఏకమగుట మనము చూచుచున్నాము. వధువు ఏకమగుట మనము చూచుచున్నాము. వాక్యముతో వధువు ఏకమగుచున్నది. ఎందుకు? వాక్యమే దేవుడై యున్నాడు. పెండ్లి కుమారుడు (అనగా వాక్యము) వధువు, అనగా వాక్యమును విను వ్యక్తి, కలిసి ఏకమై వచ్చుచున్నారు. వివాహములో ఏకమగునట్లు వారేకమగుచున్నారు. చూడండి, వారు ఒక వివాహము కొరకు సిద్ధపడుచున్నారు. వారు ఒక్కటగుదురు. వాక్యము నీవే అగును, నీవు వాక్యముగా అగుదువు. యేసు ఈలాగు చెప్పెను, "ఆ దినమున ఏమగునో మీరెరుగుదురా? తండ్రి నా కనుగ్రహించిన వారందరూ నా వారగుదురు. నా వారందరూ నీ వారగుదురు. నీ వారందరూ నా వారగుదురు. నేను తండ్రి యందును, తండ్రి నా యందును, నేను మీలోను, మీరు నాలోను యున్నారని ఆ దినమున మీరు తెలిసికొందురు," చూచారా. "ఆ దినమున." ఏ దినము? ఈ దినము! దేవుని యొక్క దాచబడిన గొప్ప మర్మములు బయలుపరచబడుట మీరు కనుగొందురు. ఓ, అది నాకేంతగా ఇష్టము!

MAL 4:6•

LUKE 21:11

 

70గమనించండి, వారీనాడు చేయుచున్నట్లుగా ఇంతకు ముందు వాక్యము మరియు సైన్సును సరిపోల్చి చూడలేకపోయిరి. వారింతకు ముందు ఆలాగు చేయలేకపోయిరి. ఇప్పుడే వారలాగు చేయకలుగుచున్నారు.

గమనించండి, "ఆకాశమందు సూచనలు, ఆకాశమందు సూచక క్రియలు," అని ఆయన చెప్పెను. సైన్సు మరియు దేశియ సూచనలు. ఈనాడు వారు ఆకాశమందు గొప్ప సూచనలు వారికున్నవి. వారికి అంతరిక్ష పరిశోధకులు మున్నగు వారున్నారు. కాని ఈ అంతరిక్ష పరిశోధకులు ప్రపంచ సైన్పునకు ఏమి చేయగలరు? అది వారికీ భయమును తెచ్చును, అటువంటి దానిని వారు ఏ సమయములో పంపగలరో వారికి తెలియదు. ఈ బాంబులను జారవిడుచుదురు. మనమిక ఉండము, చూచారా. వారికున్న సూచనలు అవే, ఆకాశమందు భయంకరమగు దృశ్యములు, చూచారా. అవి వారికున్నవి, అణు క్షిపణులు ఇంకా ఆయా సూచనలన్నీ యున్నవి.

71ఒక స్థలమందు వారు కూడుకొని అక్కడ బాంబులు ఏవీ ఇక పేల్చ రాదని ఒక ఒప్పందము మీద సంతకము చేయుట ఒకనాడు మీరు చూచారు, కాని ఇప్పుడు వారు నీటి అడుగు భాగమునకు వెళ్ళి, ఆ ఎప్పటి వలెనే వాటిని పరీక్షించుచున్నారు, చూచారా. "మేము ఇది చేయము, మీరు కూడా చేయకుంటేనే అది అమలు జరుగును (కాని మేము ఇంటికి వెళ్ళి ఈ విధముగా దానిని చేయుదుము; నీవు కూడా ఆ విధంగానే అక్కడ చేయుదువని మాకు తెలుసు)," అని ఒక ఒప్పందముపై సంతకము చేయుచున్నారు, చూచారా. వారి మధ్య వారికే నమ్మకము లేదు. అక్కడ ఏమియూ లేదు, చూచారా. ప్రతివాడు మరొకరిని చూచి భయపడుతున్నాడు. అది ఒక భయపు సూచన.

LUKE 21:11

 

72సైన్సు, మరియు మానవుడు మరియు రాజ్యములు ఆకాశమందు ఒక భయంకర సూచనను ఉత్పత్తి చేసినవి. అది అక్షరాలా నిజము. ఇప్పుడు ఒకరంటే మరొకరికి భయము, ఇప్పుడు వారు కూడా ఆకాశమందు ఒక సూచనను కలిగియున్నారు. అది ఒక భయపు సూచన. అంతరిక్ష చోదకుని రూపములో నున్న మనిషి; అతడు ఒక అణు క్షిపణిని కలిగియుండవచ్చును, అక్కడ నుండి జార విడిచి మొత్తం దేశమును నాశనము చేయవచ్చును. ఒక అంతరిక్ష యాత్రికుని రూపములో వేచి అక్కడ నిలబడుచున్నాడు. వారు దానిని చేయకుండా ఆ పునాది ఏదీయూ లేదు. వారు నిశ్చయంగా అది చేయగలరు. వారు కోరిన వేళలో అది చేయగలరు. వారు కోరినట్లయిన ఇప్పటి నుండి పదిహేను నిమిషములలో దేశమును బూడిదగా మారగలరు. ఒకరు ఏమి చేయగలరో, తక్కిన వారును అదే ప్రకారము చేయగలరు. కాబట్టి మీరు చూడండి, వారికి ఒక సూచన యున్నది, కాని ఆ రకమగు సూచన వారిని భయకంపితులను చేస్తున్నది.

వారు కలిసి ఏకమగుచున్నారు, తమ శక్తులను కలిపి ఒక చోటకు తెచుచున్నారు. స్వేచ్ఛా ప్రపంచము తమ శక్తిని కలిపి ఏకము చేయుచున్నది. కమ్యూనిజము తన శక్తిని ఏకము చేసి, రష్యాతో కలుపుచున్నది. అందరూ అలాగే చేయుచున్నారు; కాని ప్రతి ఒక్కరు మరొకరిని గూర్చి భయపడుతున్నారు. చూడండి, అది ఒక భయపు సూచన. అది నిజము. అది ఒక జాతీయ సూచన, చూడండి.

ACTS 9:3

 

73కాని సంఘము ఒక ఆకాశ సూచనను పొందినది: ఒక ఆంతరిక్ష చోదకుడు! ఆమేన్! ఆగ్నిస్తంభ రూపములో నున్న యేసుక్రీస్తు; పాత నిబంధనలో ఉండిన వాడు, దమస్కుకు పోవు మార్గములో యుండగా సౌలును కలిసికొనినవాడు ఆయనే. ఆ యేసే ఈ రోజున ఇచ్చట యున్నాడు. అది ఏమి చేయును? అది భయమును తీసికొని వచ్చునా? అది ఒకరిని మరొకరితో ఐక్యపరచు ప్రేమను తీసికొని వచ్చును. ఆమేన్! ఒకరిపట్ల ఒకరికి సానుభూతిని తెచ్చును. అది దేవుని యొక్క ప్రేమను తెచ్చును. ఓ, మనలను ఏకము చేసి, వధువుగా ఒక ఐక్యతలోనికి తీసికొని వచ్చును. (క్రీస్తు శరీరము) దేవుడిచ్చుచున్న ఈ గొప్ప ఐక్యత. ఇప్పుడు అదే చేయుచున్నది.

వారందరూ తమలో తాము ఏకమవుచున్నారు, ఇక్కడ ఒక గుంపు మరో గుంపుతో పోరాడుటకు, ఇంకో గుంపుతో పోరాడుటకు ఇక్కడ ఒక గుంపు ఏకమవుచున్నవి. ఇక్కడ సంఘము వారి మధ్య నిలబడియున్నది. ఏమి జరుగునో నీవు గమనించుము. అది వారితో ఏకమగును. అది ఖచ్చితంగా నిజము. కాని ఇప్పుడు, అది భయము మరియు ఆశాభంగమును తీసికొని వచ్చును.

74కాని సంఘము, వధువు, ఒకే దేవుని ద్వారా ఏకము కాబడినది. ఒకే ఆత్మ క్రింద ఏకమైనది, దేవుని యొక్క ఆత్మ, దేవునితో ఒకే పరిశుద్ధ ఐక్యతలో దేవునికి ఒకే పరిశుద్ధ వధువుగా నుండుటకు ఏకమైనది. అది నిజము. పూర్తిగా సత్యము. శరీరము యొక్క ఐక్యత, శరీరము ఒక వధువుగా ఎదురుచూచుచున్నది. అది వధువుగా యున్న ప్రకారము మనమును వధువుగానే మనలను పిలుచుకొందుము. ఎందుకనగా ఇది వధువు ఐక్యపరచబడు కాలము. సంఘము అంత చేరువగా కూడి వచ్చుచున్నది. మనము ఒకరి నుండి ఒకరము దూరము కాజాలని ప్రేమను అది మనలో పుట్టించవలసియున్నది. అది నిజము. నీవు ప్రజలను ప్రార్థించమని యాచించనవసరము లేదు. దేవుని ఆరాధించమని జనులను నీవు అడుగనవసరము లేదు. ఏది సరియైనదో అది చేయుడని వారిని నీవు అడుక్కోనవసరము లేదు. వారెంత ప్రేమతో యున్నారంటే, ఆ క్రియలు చేయకుండా ఇక ఉండలేకున్నారు.

75ఒక అందమగు చిన్నది, ఒక చక్కని బాలిక, తాను ఎంతో పిచ్చిగా ప్రేమించుచున్న ఒక అందమగు యువకుని వివాహము చేసికోనైయున్నదనుకొందము. అది ఆమె యొక్క స్వంత జీవితముకన్న విలువగా కనిపించును. వారు వివాహము చేసికొనబోవుచున్నారని ఆమెకు వెంటనే తెలియును. ఆ వివాహ దినము సమీపించుచుండగా, ఆ చిన్నది అటూ ఇటూ తిరుగుచుండును, అని మీకు నేను చెప్పెదను, చూచారా. ఆమె సమస్తము సిద్ధపరచును; ఆమె పూర్తిగా అతనికి సమర్పించుకొనును. అది నిజము. అతనికి సంతోషముగా నుండు ప్రతిదియూ ఆమె చేయగోరును. అవును, ఈనాడు సంఘము యొక్క విధానము కూడా అలాగే అయి యుండవలెను. మన జీవితము క్రీస్తు ద్వారా దేవుని యందు దాచబడి పరిశుద్ధాత్మ ద్వారా ముద్రించబడియున్నది.

76ఇక్కడ నేను మీకు బోధించుచున్నది ఏమనగా, ఈ సూచక క్రియలు మరియు ఇంకా ఆయా సంగతులు జరుగుచున్నవనియే, దానిని చెప్పుటకు నాకు సమయము లేదు; ప్రభుని చిత్తమయితే మరొక వర్తమానములో అది చేయుదును. కాని ఇంకా ఒక చిన్న సంగతి సంఘములో లోటుగా యున్నది. దానిని మనము పొందుకోవలెను, నేను దాని అంచు మీదనే ఇప్పుడు ఉన్నాను, చూచారా. దానిని మనము పొందవలెను, నీవది పొందవలెను. నీవు దానిని పొందనిచో ఇక అంతే. దానిని నీవు తప్పకుండా పొందవలెను. చూడండి, ఏకమగు కాలము చేరువగుచున్నది, ఏలయనగా దేవుడు సంఘమును ఒక చోటకు సమకూర్చుచున్నాడు. ఆ గొప్ప ఐక్యతలోనికి వెళ్ళుటకు, పెండ్లిలోనికి వెళ్ళుటకు ఎత్తబడుట రానైయున్నది: మానవుడు దేవుడు అప్పుడు నిత్యత్వము కొరకు ఏకమవుదురు, కాల పరిమితి గల జీవులు నిత్యత్వముతో ఏకమవుదురు.

భూమి మీద మనుష్యకుమారుని రూపములో ఒకసారి అది జరిగినది. ఒక శక్తిని తీసికొని వచ్చుటకు ఆయన తన జీవమును ఇవ్వవలసి యుండెను. ఒక వ్యక్తిని ఈ శక్తితో ఏకము చేయుటకు, యేసుక్రీస్తు యొక్క వధువుగా నుండుట కొరకు ఆయన తన ప్రాణమును పెట్టవలసి వచ్చెను. ఇప్పుడు సంఘము క్రీస్తు యొక్క శరీరములోనికి తనను తాను ఏకము చేసికొనుచున్నది. అది తనకు తాను స్వాతంత్ర్యము పొందినది, ప్రతి చిన్న బంధకమును తెంచుకొన్నది, తన్ను తాను సిద్ధము చేసికొన్నది, కూడి వచ్చుచున్నది, వారి మధ్య ఐక్యతయున్నది; ఓ, ఒక ప్రేమ, సంతోషము, మరియు పరిశుద్ధాత్మ వారి మధ్య సంచారము చేయుచున్నది ఓ, మై, ఎట్టి కాలమిది!

77బాతులు సిద్ధమగుట మనము చూచాము. పొట్టి బాతులు సిద్ధ మగుట మనము చూచాము. తేనెటీగలు సిద్ధపడుట మనము చూచాము. వర్షము కొరకు మేఘమలు సిద్ధపడుట మనము చూశాము. ప్రతిదియు తన యొక్క గొప్ప తోపిడి కొరకు తనకు తానుగా ఎట్లు ఏకమవునో మనము చూచాము. మనము ఐక్యరాజ్య సమితి చూశాము. కమ్యూనిజంలో రాజ్యములు తమలో తాము ఎట్లు ఏకమగుచున్నవో మనము చూశాము. అవి ఈ పాశ్చాత్య ప్రపంచములో ఎట్లు తమకు తాము ఏకమవుచున్నవో మనము చూశాము. సంఘము తనలో తాను ఏకమగుట మనము చూశాము. ఇంకా అనేకులు చూశాము. మరే సమయము కూడా ఈ విధముగా నుండుట పూర్తిగా అసాధ్యము. ఇరవై సంవత్సరాల క్రితము ఈలాగు ఉండియుండెడిది కాదు. ఈ రీతిగా ఉండెడిది కాదు. పదేండ్ల క్రితము ఈలాగుండెడిది కాదు, ఇప్పుడే ఈలాగు ఉండవలసియున్నది. చూడండి, ఎందుకనగా ఈ వాదములు, ఈ సంగతులు ఈ స్థాయికి రాలేదు.

HEB 13:8

 

78ఇప్పుడు మేల్కొనండి! మిమ్మును మీరు దులుపుకొనుడి. త్వరగా చేయండి. మనమెక్కడున్నామో ఈ వైపు చూడండి. ఎక్కడున్నాము? జ్ఞానుల వలె ఆయన యొక్క వాక్యము వరుసలో మనమున్నాము. ప్రభువు యొక్క వెలుగు మన మార్గములలో ప్రకాశించుచున్నది. సర్వోన్నతుడగు దేవునికి మహమ! మనము ఎవరిని ప్రేమించుచున్నామో, ఎవరు మనలను ఈ చోటికి తీసికొని వచ్చెనో ఆ యేసుక్రీస్తును మనకు అనుగ్రహించినందులకు దేవునికి మహిమ కలుగును. ఆయన రక్తము యొక్క వెలతో కొనబడిన ఆయన ప్రజలము మనము.

ఓ, మై! ఏకమగు కాలము వచ్చినప్పుడు మనము ఒకరికొకరము ఆయనాత్మ యొక్క బంధకములలో ఒక్కటయినట్లుగా కనబడుదుము. అది ఆయన ఆత్మయే కాగలదా? నిశ్చయంగా, అది ఆయన ఆత్మయే. ఏమిటది? అది ఆయన వాక్యము. అది వాక్యము యొక్క ఆత్మ, ఆ వాగ్దానపు ఆత్మ మీ మీదికి వచ్చినప్పుడు, ఇక్కడే యున్నట్లుగా తన్ను తాను అది బయలుపరచుకొని చూపించుకొనును. ఈ ఆత్మ అదేనా? అరణ్యములో మోషేతో యుండినది అదే. యేసుక్రీస్తు పైనుండినది అదే. దమస్కు మార్గములో సౌలును కలిసికొన్నది అదే. ఆయనే నిన్న, నేడు, నిరంతరము ఏకరీతిగా యున్నాడు! ఆయన అదే కార్యమును చేయును!

1THS 4:15-17

 

79రాజ్యములు ఏకమగట మనము చూస్తున్నాము, సంఘ శిరస్సులు ఏకమగుట చూస్తున్నాం, కమ్యూనిజము ఏకమగుట చూస్తున్నాం, వాదములు ఏకమగుట మనము చూస్తున్నాం, ఈ సంగతులన్నియూ మనము చూస్తున్నాం; ఇప్పుడు వధువు వాక్యముతో ఏకమగుట మనము చూస్తున్నాం. ఓ, మై! సజీవులతో ఏకమవుటకు పరిశుద్ధులు లేచి వెళ్ళి, యేసుక్రీస్తుతో నిత్యమూ ఉండబోవు కాలమిది.

ఈ రాత్రి క్రీస్తుతో ప్రతి ఒక్కరూ ఏకమగుటకు దేవుడు, మనకు సహాయము చేయును గాక! మనకున్న సమస్తమూ ఆయనకు సమర్పించుదము. (మన ఆత్మ, దేహము, మనస్సు పూర్తిగా యేసుక్రీస్తుకు సమర్పించుదము) మరియు ఆ ఏకమగు కాలము కొరకు ఎదురుచూద్దాం.

దేవుని బూర మ్రోగునప్పుడు,

మరియు సమయము ఇక ఉండదు,

మరియు ఉదయము నిత్యము ఉండును,

ప్రకాశవంతముగా మరియు నిర్మలముగా;

క్రీస్తు నందు మృతులైనవారు లేచునప్పుడు.

మరియు ఆవలి గట్టున పోగవునప్పుడు,

అవాలి (సజీవుడైన పెండ్లి కుమారునితో),

కలిసి పట్టబడుటకు.

ఏకమగుట వైపు చూడండి! దేవుడు సంఘమును తన మాటతో ఏకము చేయుచున్నాడు. అప్పుడు వారిద్దరూ ఒక్కటే అగుదురు. "ఇది చెప్పుము — అది జరుగును. ఇది చేయుము, అది జరుగును. ఇది అదే; నీకంటే ముందున్నది, నేనే దానిని రుజువు పరచుచున్నది నేనే; నీతోనున్న వాడను నేనే."

మంచిది.

1THS 4:16•

HEB 11:40

 

80బూర మ్రోగు సమయము వచ్చునని ఇప్పుడు మనము కనుగొన్నాము. ఆక్కడ నిద్రించుచున్న పరిశుద్దులు మనము లేకుండా సంపూర్ణులు కాలేరు, మనపై ఆధారపడి, హెబ్రీ 11, వారు మేల్కొనినప్పుడు సజీవులై నిలిచియున్న వారితో ఏకమగుదురు. సంఘము వాక్యముతో ఏకమగుచున్నది, అప్పుడు సంఘము మరియు వాక్యము కూడి ఒక్కటి యగును. మృతులయిన పరిశుద్ధులు మరియు సజీవులగు పరిశుద్ధులు ఒక్కటిగా అగుటకు ఏకమవుదురు; అందరునూ కలిసి అవతల క్రీస్తుతో ఏకమగుటకు గొర్రెపిల్ల యొక్క పెండ్లి విందునకు వెళ్ళుదురు.

81ఇది ఏకముగా చేయబడు కాలము, సూచనలు ఎక్కడ చూచినా ఎగురుచున్నవి. రాజ్యములలో సూచనలున్నవి, కమ్యూనిజంలో సూచనలున్నవి, పాశ్చాత్య ప్రపంచములో సూచనలున్నవి, సంఘముల ఆలోచనా సమితిలో సూచనలున్నవి. పరిశుద్ధాత్మ యొక్క ఆధ్వర్యములో జరుగు కూటములో సూచన యున్నది. దేవుని యొక్క వాక్యము దానిని ధృవపరచుచున్నది మరియు అది సత్యమని చెప్పుచున్నది. ఆమేన్! ఏకమగుకాలము! ఏకమగుకాలము యొక్క సూచన!

మన తలలు వంచుదము:

1COR 15:52•

1THS 4:17•

REV 22:11

 

82ప్రభువైన యేసూ, నా దీన హృదయము ఆనందముతో గంతులు వేయుచున్నది, ఎందుకనగా సాధ్యమగు వాటిని చూచాను. (నేను మధ్య-వయస్సు మనిషిని), అయినను నీవు ఈ తరములోనే వచ్చుట సాధ్యమగు పరిస్థితులను చూచుచున్నాను. సజీవునిగా నిలచియుండి ఆ బూర మ్రోగుట చూతును. "అపవిత్రుడు ఇంకా అపవిత్రునిగానే యుండనిమ్ము. నీతిమంతుని ఇంకా నీతిమంతునిగానే యుండనిమ్ము. పరిశుద్ధుని ఇంకా పరిశుద్ధునిగానే యుండ నిమ్ము." ఓ, ప్రభువగు దేవా!

నిలబడి ఆలోచించుచుండగా, అకస్మాత్తుగా, కనురెప్పపాటులో, ఏమి జరుగుచున్నదో లోకము ఎరుగనప్పుడు, నీ ప్రత్యక్షత చూతుమనిపించుచున్నది. ఒక్క క్షణములో, గతించిన నీ ప్రియులు నీతో ఏకమవుటకు మరల వచ్చెదరు. ఒక్క క్షణములో, కనురెప్పపాటులో మేము మార్పు పొందుదుము; మన ప్రభువును మధ్యాకాశములో కలిసికొనుటకు కొనిపోబడుదుము. అక్కడ నిత్యమూ ఆయనతో కూడా ఉండుటకు ఆయనతో ఏకమగుదుము. మరల ఎన్నడూ ఆయన సన్నిధి నుండి బయటకు రాము.

83ప్రభువా, ఇప్పుడు మేము ఒక్క ఆత్మలో ఏకమైయున్నామని ఎరుగుట నేడు ఎంత గొప్ప సంగతి. ఒకే ఆత్మ అనగా పరిశుద్ధాత్మ, అది వాక్యమును తన గుప్పిటలో యుంచుకొని మాలోనికి వచ్చియున్నది. ఎంత గొప్ప కార్యమది, మమ్మును మేము యేసుక్రీస్తుతో ఏకము చేసికొనుటకు సమస్త లోకత్వము నుండి బయటకు వచ్చుట ఎంత గొప్ప భాగ్యము. ఒక దినమున, భౌతిక రూపములో, ఆయనకున్నట్టి మహిమ దేహము వంటి దేహముతో పెండ్లి విందునందు మేము కూర్చుందుమని తలంచుచున్నాము. అక్కడ వివాహమందు ఆయనతో ఐక్యపరచబడుదుము. రాబోవు కాలమంతటిలోను, అనగా అంతములేని నిత్యత్వమంతయూ పెండ్లి కుమారుడు మరియు పెండ్లి కుమార్తెగా జీవించుదుము.

ప్రభువగు దేవా, ప్రజలకు ఇది ఏదో ఒక కల్పిత కధ వలె ఉండకుండును గాక, అది ఒక వాస్తవముగా వారికి దాని నిమిత్తము ఆకలిదప్పులు కలిగి జనులుందురు గాక! వార్తా పత్రికలు చదువుచున్నారు, రేడియోలో వార్తలు వినుచున్నారు. ఇది ఏకమగు కాలమని చూస్తున్నారు. సూచనలు ప్రకాశమానముగా కనబడుచున్నవి.

LUKE 17:26

 

84ప్రభువగు దేవా, చివరి దినములలో వారేమి చేసిరో దానిని ఆ స్త్రీ రూపములో నీవు చెప్పియున్నావు. సంఘము చివరి దినములలో ఏమి చేయునో చెప్పితివి. సంఘ కాలములు ఎట్లుండునో, ముద్రలు ఎట్లుండునో, ఈ తక్కిన సంగతులన్నియూ ఎట్లుండునో చెప్పాను. నోవహు దినములలో ఉండినట్లుగానే ఉండుట మేము చూస్తున్నాము. సొదొమ లోతు దినములలో నుండినట్లుగానే ఉండుట మేము చూస్తున్నాము. దేవుని యొక్క దూత తన్ను తాను మానవ శరీరములో కనబరచుకొన్నది. ఆవు మాంసము తిని, ఆవు పాలు త్రాగినది. రొట్టె తినెను. అక్కడ నిలబడి, తన వెనుక ఏమి జరుగుచున్నదో చెప్పుకలిగినది. మనుష్యకుమారుని రాకడయందును అదే జరుగనని యేసు చెప్పెను.

ప్రభువగు దేవా, మేము పిరమిడ్ చూశాము. అదెట్లు మేము నిర్మించామో చూశాము. దానికి ఈ సంగతులన్నియూ ఏలాగు చేర్చామో మేము చూశాము. మేము అంత్యకాలమందున్నామని కనుగొన్నాము. ప్రధాన మూలరాయి కొరకు ఎదురు చూచుచున్నాము. దేవునికి మహిమ! ప్రభువా, ఇప్పుడు వెంటనే, నీవు జనులను మేల్కొలుపమని, దైవ ప్రేమ మరియు యేసుక్రీస్తు పట్ల, మేము ఒకరి పట్ల ఒకరము గౌరవము కలిగియుండునట్లు మమ్ములనందరిని సమకూర్చీ ఏకము చేయమని ప్రార్థించుచున్నాను.

MATT 24:37

 

85లోన విశ్రాంతి లేక, నిరీక్షణ లేక కూర్చునియున్న వారు ఈ రాత్రి ఎవరైనా ఇచ్చట యున్నచో దేవుని వైపు మీ చేతులెత్తి ఈలాగు చెప్పండి, "ప్రభువగు దేవా, నీతో నన్ను ఏకము చేయుము. నీతో నన్ను ఏకము చేయుము." సోదరుడా, దేవుడు నిన్ను దీవించును. దేవుడు నిన్ను దీవించును. నిన్ను ఆయన దీవించును. అవును. "ప్రభువా, నీతో నన్ను ఏకము చేయుము." అవును! ఓ, మై!

దేశములు విచ్చిన్నమగుచున్నవి, ఇశ్రాయేలు మేల్కొనుచున్నది,

ఆటు ఇశ్రాయేలు వైపు చూడండి, ఏకముగా కూడియున్నది. సర్వలోకములో నుండి ఇశ్రాయేలు వచ్చినది. తమలో తాము కూడుకొనుటకు వచ్చిరి. ఇప్పుడు వారు ఒక దేశముగా యున్నారు. ఇప్పుడు వారు ఒక ఏక దేశము: వారికి స్వంత పతాకము, స్వంత ద్రవ్యము, స్వంత సైన్యము, సమస్తమూ యున్నది; వారెప్పుడైనా ఒక రాజ్యముగా యున్నారంటే అది ఇప్పుడే. ఇశ్రాయేలు ఏకమగుచున్నది, రోమ్ ఏకమగుచున్నది, సంఘము ఏకమగుచున్నది, వధువు ఏకమగుచున్నది, ఆమేన్; ఆ గొప్ప సంయుక్తత వచ్చుచున్నది. ఏమిటది? ఇదంతయూ ఆ సూచన వైపునకే కదిలి సాగుచున్నది. ఆ పెద్ద ప్రధాన సూచన. యేసు ఆయన వధువు ఒక్కటిగా ఏకమగుచున్నది.

86తండ్రియగు దేవా, ఈ జనుల కొరకు నేను అడిగిన ఆశీర్వచనములను అనుగ్రహించుము. హృదయము, ఆత్మలందు మేము నీతో ఏకమగుదుము గాక! దానిని వాంఛించుచూ వారు చేతులెత్తియున్నారు. ప్రభువగు దేవా, మమ్మును శుద్ధీకరించి నీవారిగా చేయుము. ప్రభువా, అది అనుగ్రహించుము. ప్రభువా, అడుగుటకు మాకు తెలిసినది చేయకలిగినది అంతా అదే. మేము అడిగి దానిని పొందియున్నామని నమ్మినప్పుడు దానిని పొందుదుమని నీవు చెప్పియున్నావు, ప్రభువా, దాని కొరకు నేను చూచుచున్నాను. యేసుక్రీస్తు నామములో నీకు వందనములు చెల్లించుచున్నాను. ఆమేన్.

నేను ఆయనను ప్రేమించుచున్నాను,

నేను ఆయనను ప్రేమించుచున్నాను,

ఎందుకనగా ఆయనే మొదటిగా నన్ను ప్రేమించెను,

నా రక్షణను కొనెను,

కల్వరి వృక్షము పై (ఆమెన్; ఓ, మై)

అదిగో, పెండ్లి కుమారుడు వచ్చుచున్నాడు!

ఆ మధ్యరాత్రి కేకను నేను వినుచున్నాను!

మనము వెళ్లి కేక వేయుదుము, మనమందరము పట్టబడి,

మరియు ఆయనను మధ్యాకాశములో కలుసుకొందుము.

వేచియుండి మరియు ప్రార్ధన చేయుము, నా సహోదరుడా,

ఎవరైనా నీ కిరీటమును తీసుకోనివ్వక,

ఎందుకనగా నులివెచ్చని మరియు వెనకబడిన వారు

పెండ్లి వస్త్రమును దరింపరు. (అది నిజము)

MATT 21:22•

MATT 24:44•

MATT 25:6•

LUKE 12:40

 

87(అది నిజము.)

ఈ అర్ధరాత్రి కేక కొరకు మనము సిద్ధపడుదము. అది మీరనుకొనని ఘడియలో వచ్చును. ఒక కేక వినబడును. అవిశ్వాసుల ప్రపంచములో కాదు సుమా; అది ఒక రహస్యముగా యుండును. కాని దీనికొరకు చూచుచున్న విశ్వాసులు చూతురు. నక్షత్రములు ఒకే రాశిగా ఏర్పడుటను మీరు చూచుచున్నారా? చూచారా? అదేమి ఉత్పత్తి చేయును? మొదటిసారి ఏమి ఉత్పత్తి చేసెనో, అక్షరాలా అదే మరల ఉత్పత్తి చేయును. చూడండి, ఇక్కడ మనమున్నాము, సూచనలు వచ్చుచున్నవి.

ఆయన ధన్యకరమగు రాకడను గూర్చి సూచనలను మనము చూచుచున్నాము

అదిగో, అంజురపు ఆకులు ఇప్పుడు పచ్చగా మారుచున్నవి;

రాజ్యము యొక్క సువార్త ప్రతి రాజ్యమునకు వెళ్ళెను;

మరియు మనము సమీపముగా ఉన్నాము, అంతము చూడగలము.

సంతోషముగా, ఆయన యొక్క ధన్యకరమగు రాకడ వర్తమానమును ప్రకటించుదము.

88అది నిజమేనా? ఓ, ఆయన యొక్క ధన్యకరమగు ప్రత్యక్షతను గూర్చిన వర్తమానము ప్రకటించుడి! మనము అదే చేయవలసియున్నాము. అందరికి ఈలాగు చెప్పండి, "సిద్ధపడండి, దేవుని కలిసికొనుటకు సిద్ధపడుడి." ఆమేన్! నేనాయనను ప్రేమించుచున్నాను. ఓ, ఎంతగా నేనాయనను ప్రేమించుచున్నాను! ఇప్పుడు మనము లేచి నిలబడుదము. ఒకరినొకరము ఎడబాయుచుండగా, వెనుదిరిగి ఒకరితో కరచాలనము చేయుచూ ఈలాగు చెప్పండి:

మనము కలుసుకొనువరకు! (ఇప్పుడు కరచాలనము చేయండి)

మనము కలుసుకొనువరకు!

యేసు పదముల చెంత మనము కలుసుకొనువరకు;

మనము కలుసుకొనువరకు! …

గుర్తుంచుకొనండి, మీరు పిలుపునందుకొనవచ్చును. మన తరువాత కలయిక ఆయన పాదముల యొద్దనే!

మనము కలుసుకొనువరకు దేవుడు మీతో నుండును గాక!

89ఇప్పుడు, కాస్త ఆలోచించండి, మనము తిరిగి కలిసికొనుముందుగా, ఆదివారము ఉదయము లేదా బుధవారము రాత్రి మనము తిరిగి కలిసికొను ముందుగా, మీరు మొదట తెలిసికోవలసినది ఏమనగా, ఎవరో కనబడుట లేదు అన్న సంగతి. వీరు కనబడలేదు, వారు వెళ్ళిపోయిరి. ఓ, నీ భర్త కనబడకుండుట, లేదా నీ భార్య కనబడకుండుట, జాన్ భార్య కనబడకుండుట మరియు అక్కడ పిల్లలు కనబడకుండుటను గూర్చి ఆలోచించండి. ఓ, అదెట్లుండును! అంతా జరిగి పోయినది. (ఏమి జరిగినది?) నీవు విడిచి పెట్టబడితివి!

ఓ, ఎప్పుడైతే విడువబడినవారి విధిని గూర్చి చెప్పబడినప్పుడు, ఎలాంటి ఏడుపు మరియు విలపించుట,

వారు పర్వతములకు మరియు రాళ్ళకు మొరపెట్టిరి

(ఇశ్రాయేలు వలె, తిరిగి తన పట్టణము, ఆలయములోనికి వెళ్ళిన రీతిగా)

వారు ప్రార్దించిరి కాని వారి ప్రార్ధనలు ఆలస్యమాయెను.

(వారు వర్తమానము తిరస్కరించిరి.)

ఓ, సోదరుడా, నీవెన్నడూ ఆలాగు చేయవద్దు. నీవేది చేసినా సరే, ఆ కారణము కొరకు మాత్రము నిబ్బరముగా నిలబడుము! అవును!

90ఇప్పుడు తిరిగి మనము కలిసికొను వరకు ఇది చేయుదము.

యేసు నామము నీతో కొనిపోమ్ము,

సమస్త భారమునకు కేడెము వలె;

శోధనలు నిన్ను చుట్టుముట్టినప్పుడు,

(నీవేమి చేసెదవు?)

పరిశుద్ధ నామమును ప్రార్ధనలో ఉడుము.

ప్రశస్త నామము, ఓ ఎంత మధురము!

భూలోక నిరీక్షణ మరియు పరలోకపు ఆనందము;

ప్రశస్త నామము, ఓ ఎంత మధురము!

భూలోక నిరీక్షణ మరియు పరలోకపు ఆనందము.

మనము ఆలపించుచుండగా, ఇప్పుడు తలలు వంచుదము.

యేసు నామము వద్ద సాగిలపడి,

ఆయన పాదముల యొద్ద సాష్టాంగ నమస్కారము చేస్తూ,

పరలోకమందు రాజుల రాజుకు మనము కిరీటము ధరింపచేతుము.

మన యాత్ర ముగుయునపుడు.

(అది ఒక దినమున జరుగనైయున్నది.)

ప్రశస్త నామము, ఓ ఎంత మధురము!

(తిరిగి మనము కలిసికొను వరకు దేవుడు మీకు తోడై యుండుగాక!)

భూలోక నిరీక్షణ మరియు పరలోకపు ఆనందము;

ప్రశస్త నామము, ఓ ఎంత మధురము!

భూలోక నిరీక్షణ మరియు పరలోకపు ఆనందము;

Search Messages

0 / 0 matches
Enter characters above to process real-time text query scopes...