నేనెలా జయించగలను?
1మనము ప్రార్థన కొరకు మన తలలు వంచెదము.
మా తండ్రి ఈ ఉదయము మరల కూడుకొను ఈ గొప్ప సమయము కొరకై, మరియు వాక్యమును తెరచి మా ముందు పెట్టినందులకు మేము మీకు కృతజ్ఞతలు చెల్లించుచున్నాము. మరియు ఇప్పుడు ప్రార్థనతో పరిశుద్దాత్మ ఏది మంచిదో దానిని అను గ్రహించునని, మరియు మేము ఈ ఆరాధనా స్థలమును ఈ రోజు వదిలిపెట్టి పోవుచున్నప్పుడు, మా హృదయములు నిండైన ఆనందముతో మరియు విడుదల చేయు మీ గొప్ప శక్తి , ప్రభువా, ఏ విధముగా అది చెరపట్టబడిన వారిని విడుదల చేసి, వర్తమాన - భూత - భవిష్యత్కాలములతో కార్యములను మాకు తెలియపరుచుచున్నది. మరియు ఈ కార్యములకు మేము స్తోత్రములు చెల్లించుచున్నాము.
మేము నీ వాక్యము చదువుచుండగా ఒక్కటిగా కూడియున్న మమ్ములందరిని మీరు ఆశీర్వదించవలయునని మేము ప్రార్థించుచున్నాము. మరియు మేము వదిలి వెళ్ళుచున్నప్పుడు, మేము మార్గములో పోవుచున్నప్పుడు మా హృదయములలో ఈ విధముగా చెప్పవలయును, "మేము మార్గములో ఉన్నప్పుడు ఆయన, పరిశుద్దాత్మ, మాతో మాట్లాడినప్పుడు మా హృదయములు మాలో మండలేదా అని."
REV 10:6
2ఈ రోజు ప్రతిచోట నున్న నీ వాక్య పరిచారకులను, ఈ నీ గొప్ప సత్యమునకై నిలిచియుండు నీ సేవకులను ఆశీర్వదించుము. వ్యాధిగ్రస్తుల కొరకు వారు చేయు ప్రార్థనలకు బదులిమ్ము. వ్యాధితో బాధపడు శరీరములను స్వస్థపరచుము
ప్రభువా, మీరు ప్రజల మధ్య సంచరించి ఎన్నుకొనబడిన విత్తనములను వెతికి, ప్రభువా, ఏదో ఒక మార్గములో ఆ వెలుగును వారి త్రోవలో ప్రసరింపజేయుము. ప్రభువా, సమయము గతించిపోవుచున్నదని మేము నమ్ముచున్నాము. సూర్యుడు వేగముగా పడమట అస్తమించుచున్నాడు. అంతట, అప్పుడు సమయము అక్కడ ఉండదు. దేవుడు ఆయన ప్రజలు ఏకముగా కలిసినప్పుడు, సమయము మరియు నిత్యత్వము ఒకటిగా మారును. మరియు దేవా, క్రీస్తుతో కూడా అతని వధువు అని పిలువబడు వారు కలిసినప్పుడు, ఆ సమయములో వారితో కూడా మేము లెక్కింపబడుదుమని మేము ప్రార్థించుచున్నాము. మేము సిద్దపడుచుండగా ఈ రోజు మాకు సహాయపడుము, రేపు మా కొరకు ఏమి ఉంచబడియున్నదో తెలియని స్థితిలో, మీరు మాకు ఉండగా, ప్రభువా; ఏమైనను మేము స్వీకరించుటకు సిద్దముగా ఉన్నాము. దేవుని యొక్క మహిమ కొరకు ఈ యొక్క ఆశీర్వాదమును యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము. ఆమెన్. మీరు కూర్చొన వచ్చును.
3ఈ ఉదయము నేను లోపలికి నడిచి ప్రజలు ప్రభువు యొక్క ఆరాధనకై ఏకముగా కూడుకొని యుండుటను చూచునప్పుడు, నిజముగా నేను చాలా సంతోషించుచున్నాను. ఇప్పుడు ఈ రోజు రాత్రి కొరకు మేము ప్రకటించుచున్నాము. ఈ రోజు రాత్రి స్వస్థతా ఆరాధన ఉండును. మేము వ్యాధిగ్రస్తుల కొరకు ప్రార్ధి౦చబోవుచున్నాము.
కొద్ది క్షణముల క్రితము నేను లోపలికి వచ్చుచుండగా, నా కుమారుడు బిల్లీ నాతో చెప్పెను, అక్కడ ఒక మర్యాదస్థుడు, చాలా బీద మనుష్యుడు చాలా దూరము నుండి నడుపుకుంటూ వచ్చియున్నాడు. "తండ్రీ, నేను అతనిని గదిలో ఉంచి యున్నాను," అని చెప్పెను.
4నేను చాలా ఆలస్యముగా గతరాత్రి వచ్చినందువలన ఈ ఉదయము ఏమి మాట్లాడవలయుననే ఆది వారపు పాఠశాల అంశమును నేను ఎక్కువగా ధ్యానించలేదు. అందువలన ఇంకొక సోదరుడు చెప్పిన (ప్రసంగించిన) దానిలో నుండి కొన్ని కార్యములను గ్రహించి గుర్తు ఉంచుకొని ఆదివారపు పాఠశాల అంశమును దానిలో నుండి ఈ ఉదయము కొరకు ఉంచుకొనియున్నాను. మరియు మేము సిద్ధపడుచుండగా, సాయంకాలపు ఆరాధన కొరకు సిద్దపడుడి.
మరియు బిల్లీ చెప్పెను, "అక్కడ వ్యాధిగ్రస్తుడు ఒకతను ఉన్నాడనెను," మీరు వెళ్ళి అతనిని చూడవలయునని నేను ఆశిస్తున్నాను. కావున ఇప్పుడే ఆ గదిలోనికి వెళ్ళాను, మరియు నా వయస్సులో ఉన్న ఒక సహోదరుడు, అతని భార్య అక్కడ ఉండిరి. మరియు పరిశుద్దాత్మ ఇప్పుడే మేమున్న గదిలోకి మా మధ్యలో దిగెను.
కొంచెం ఆలోచించండి, స్వస్థతా ఆరాధనలను గూర్చి చెప్పుచుండగా, మరియు ఆయన అక్కడ ఉండెను. చూచారా? మరియు ఆయన, అతడు చేసినదంతయు, మరియు ఆయన చేయుచున్న కార్యములను, ఈ శ్రమ ఎందువలన వచ్చినదో, మరియు ఆయన అక్కడ ఎక్కడ నుండి వచ్చినాడో, ఆయనను గూర్చిన సమస్తమును ఆ సహోదరునితో చెప్పెను. మరియు అక్కడ గొప్ప అంధకారమైన నీడ ఆ గదిలో ఉండెను. మరియు ఆ నీడ వెలుగుగా, వెలుగుగా, వెలుగుగా మరియు వెలుగుగా అగుటకు ప్రారంబించెను; అప్పుడు పరిశుద్దాత్మ పట్టుకొనెను.
5ఇప్పుడు, ఆ వ్యక్తి వెనుక ఎక్కడో ఉన్నాడని అనుకొనుచున్నాను. అతడు మరియు అతని భార్య ఈ కట్టడము లోపలికి రాలేరు. అయితే వారు ఆరాధన కొరకు ఏలాగైనను ఉండెదము అని చెప్పిరి. వారు వాషింగ్టన్, యాకియా దగ్గర పరిసరముల నుండి కారులో వచ్చిరి. మరియు అతడు ఒక సువార్త పరిచారకుడు. అయితే దేవుని కృప అక్కడ చూచుట కొరకై, అతడు వైద్యశాలలో ఉండి అనేక రకములైన చికిత్సలు పొందియుండగా పరిశుద్దాత్మ ఇదంతయు బయలుపరచెను. అతని కొరకు వెద్యులు, వారి శక్తికొలది అతనిని స్వస్థతపరచుటకై ప్రయాసపడుచుండగా, అతనిని శ్రమ నుండి మళ్ళించుటకై దేవుని యొక్క ఒక చిన్న స్పర్శ సరిపోయినది. వేగముగా తాకే చికిత్సలన్నియు (షాక్ ట్రీట్మెంట్) సరియే. దానిని "చీకటిలో పేల్చే పేల్చుడు" (ఏమిలేని చోటు వేయు బాణము) అని మేము పిలుచుదుము. మీకు తెలియునా అది మీకు చెడును చేయును. (చూశారా?) ఆ మందును మీరు వేసుకున్నప్పుడు మీకు తెలిసినదంతయు మీరు మరచి పోవుదురు. అయితే ప్రభువైన దేవుడు, ఎంతటనీ ఆయన కృప మరియు దయ నేను ప్రార్ధి౦చక మునుపే దేవుని యొక్క శాశ్వతమైన కార్యమేదో కావలసియున్నది. ఇది కొంతమట్టుకు నిశ్చలమైన దేవుని యొక్క కార్యమైయున్నది. ఆ నిజమైన స్పర్శ దానిని చేయవలసియున్నది. నేను దానిని చెప్పకూడదు. అయితే నేను పై నుండి చూచుచున్నప్పుడు, అతనిని ఇప్పుడు చూచుచున్నాను. ఏమిటి? ఈ రోజు అతను వచ్చునో రాడో నాకు తెలియదు.
6ఈ వారము నేను గడిపిన ఊరిలో… అక్కడ ఉన్న నా స్నేహితులను నేను ప్రేమించుచున్నాను. పెద్ద కూటములకు మునుపు అది నాకొక విశ్రాంతి కాలము. మీరు చూశారా? మరియు నేను ఇంటికి వెళ్ళి అక్కడ నుండి ఉడుతలను వేటాడుటకు ఆ ఈ సహోదరులతో వెళ్ళెదను. మరియు నేను నివసించు ఆ కుటుంబము, మరియు ఆ కుటుంబములు నిజముగా చాలా ప్రేమ గలవారు. మరియు ఆ మనుష్యుని సోదరుడు, స్నేహితులు వారు. మరియు వారిలో ఒకరు వేట కుక్కల౦టే చాలా ప్రీతి కలవాడు. తన పెరట్లో అతడికి చాలా కుక్కలున్నవి. మరియు అక్కడ నేను ఒక అందమైన వేట కుక్కను చూచాను; ఆ చిన్న కుక్క, సగం ఎత్తున్న కుక్కను — రెండు కుక్కల ఎత్తున్న కుక్క ఉన్నది. నేను దానిని పిలువగా ఆ యింటిలో అటు ఇటు తిరుగుచుండగా, నేను అనుకున్నాను, "మై, — జో అలంటి దానిని కలిగి ఉండుటకు ఇష్టపడడా అని."
7అరిజోనాలో ఆ కుక్కను వాడుకొనలేము. అతడు ముండ్ల చెట్టులో దూరుకొని ఆ కుక్క సంగతి ఇక అంతే. మరియు నేను చెప్పాను, "ఆ ప్రాంతములో కుక్కలు ఉపయోగించరు. ఉపయోగించ లేరు, ఎందుకనగా వాతావరణము, ముండ్ల చెట్టుతో నిండిన ప్రాంతము. ఆ కుక్కలు చనిపోవును. మరియు అది నిజము. ఒక వేట కుక్క అక్కడ బయట వున్న యెడల తోడేలు లేక ఏదైనా దానిని చంపివేయును.
కావున ఈ మనుష్యుడు నాతో చెప్పెను. "ఆ కుక్కను నీవు ఉంచుకొనుము." అయితే ఆ కుక్కను నేను తీసికొనలేను. అతడు చెప్పిన దానికి నేను అతనిని అభినందిస్తున్నాను. నేను తెలుసుకొన్నాను, అతనికి అభిమానము గల కుక్కలలో ఇది ఒకటని.
MARK 11:24
8మరియు ఈ మనుష్యునికి మంచి ప్రేమగల భార్య, బిడ్డలు కలరు మరియు ఒక రోజు ఆమె అతని కారులో వెనుకకు వచ్చునప్పుడు (ఆమె ఓల్డ్స్ మోబైల్ కారు కలిగియుండెను). ఆ చిన్న కుక్క చిన్న బిడ్డగా (కేవలము పప్పిగా ఉండెను), ఆమె ఆ కుక్కపైన కారును ఎక్కించినది. ఆ వెనుక ప్రక్క దారిలో రాళ్ళు ఉండగా ఆమె కారును ఆ చిన్న కుక్కపిల్లపై ఎక్కించుటచే, ఆ కుక్క కడుపు చిన్నాభిన్నమైనది. అతని భార్య కుక్కను జంతు వైద్య శాలకు తీసుకొని వెళ్ళుటకు బదులుగా… ఎందుకనగా వారు ఆ కుక్కని నిద్రింపజేసి మరియు చంపివేయుదురు. మీరు చూశారా? నాతో కూడా ఉన్న మరియొక యవనస్థుడు లేచి "ఆ అదిగాని నా యొక్క కుక్క అయితే, నేను దానిని కాల్చివేసియుందును," చెప్పెను; "అంతే, అది ఆ విధముగా కష్టపడవలసినదే."
నేను చెప్పాను, "సరి దానిని మనము కాల్చవద్దు. మనము కొంచెము సేపు వేచి యుందాము." అందరిని దూరముగా పంపించి, పోయి ఆ కుక్క కొరకు ప్రార్ధి౦చాను, మరియు ఆ చిన్న కుక్క పిల్ల, నా వెనుకనే వసారా వరుకు వచ్చినది. "మీరు ఏమైతే కోరుకొందురో, మీరు ప్రార్ధించినప్పుడు దానిని పొందినామని నమ్ముడి; మీరు దానిని పొందెదరు, అది మీకు ఇవ్వబడును." ఏమైనను. అదే మన దేవుడు, అది సరి కదా? అతడు ఆశ్చర్యకరమైన వాడు, అద్భుతమైన దేవుడు; మరియు నిజముగానే మనము ఈ ఉదయము ఆయనను ప్రేమించుచున్నాము, ఆయనను ఎదురు చూచుచున్నాము, మరియు తెలుసుకొని…
9ఈ సంఘ విశ్వాసులకు చెందిన ఒక మంచి సభ్యుని యొక్క తల్లి, తండ్రి - వృద్ద దంపతులను ఆ రోజు చూచాను. ఓ ఆ తల్లి వంద సంత్సరాల వయస్సుకు చేరువలో ఉండవచ్చునని నేను అనుకుంటున్నాను. మరియు అతని తండ్రి కూడా అదే వయస్సు. మరియు పన్నెండు సంవత్సరాలుగా అతని వెనుక భాగము కదలకుండా నిటారుగా అదే విధముగా పండుకొని ఉన్నాడు. అటు ఇటు తిరుగ లేడు. పన్నెండు సంవత్సరాలుగా అతడు అట్టే అక్కడే ఉన్నాడు. అతని వయస్సులో వున్న వృద్దాప్యురాలైన ఆ తల్లిని నేను ఊహించుచున్నాను. నూరు సంవత్సరములకు దగ్గరలో ఆమె వయస్సు వుండవచ్చునని, మరియు చింతించవలసిన కార్యమేదనగా ఆమె తన మతి స్థిమితిమును కోల్పోయిరి. ఆమె అనుకొనుచున్నది. ఆమెకున్నదంతయు ఎవరో ఎత్తికొని పోవుచున్నారని. మరియు ఇప్పుడు, టేబులు ప్రక్కగా కూర్చొని ఉన్న చిన్నవారేమి, పెద్దవారేమి అందరిని నేను చూచి మరి నేనడిగితిని, "మనము ఎక్కడికి పోవుచున్నాము? మనము ఏమి చేయుచున్నాము?" అప్పుడు నేను గడిపిన (నివసించిన ఇంటిలో) ఆ మర్యాదగల స్త్రీ, ఆమె యొక్క తల్లి, తండ్రి వారు. మరియు నేను చెప్పాను, "మీరు కూడా అదే మార్గము వైపు పోవుచున్నారు." అది ఖచ్చితముగా, మనలో ప్రతిఒక్కరు. చూశారా?
MATT 16:25•
MARK 8:35•
LUKE 9:24
10మన పాఠమును ప్రారంభించుటకు మునుపు ఒక్క క్షణము దానిని గూర్చి తలంచెదము. అక్కడికే మీరు పోవుచున్నారు. మీరు దేని కొరకు ప్రయాసపడుచున్నారు? కావున మీరు జీవించవచ్చును. మీరు దేని కొరకు జీవించుచున్నారు. కావున మీరు చనిపోవచ్చును. నిత్యజీవము కొరకు దేవుని యొక్క ఏర్పాటును మనము అంగీకరించని యెడల అది పిచ్చితనము కాదా మరి? దేనిని గూర్చి మనము తలంచగలము? ఏమి. ఏ కార్యము కూడా ఆకర్షింపబడకుండా మన తలంపులలొ ఉన్నది ఏమిటి? మనము వంద మిలియన్ల డాలర్లు కలిగియున్న ఏమి, మరియు మీరు ఒక ఇండియానా రాష్ట్రమునైనను లేక ఏ రాష్ట్రమునైనను మీరు కలిగియున్న, మరియు దేశమునైనను లేక ప్రపంచమంతటిని కలిగియున్నను? అధిక దినములు మీరు బ్రతికి, చివరకు మీరు అక్కడికే రావలయును. చూశారా? మరియు నిరంతరముగా ప్రతీ రోజు, ప్రతీ సారి మీ గుండె కొట్టుకొనునప్పుడు, మీరు తిన్నగా అక్కడకే పోవుచున్నారు. చూశారా, మీకు జయమే లేదు. మీరు ఓడిపోవు ప్రక్కలో ఉన్నారు, మరియు మీరు పోగొట్టుకొన వలసినదే. అయితే గుర్తించుకొనుడి, వాగ్దానము చెప్పుచున్నది, "నా నిమిత్తము తన జీవమును పోగొట్టుకొనువాడు దానిని సంపాందించుకొనును." ఇప్పుడు, జీవమును సంపాదించుకొనుట కంటే వేరొక ఐశ్వర్యము ఉండగలదా? ఒక వేళ మీరు ప్రపంచమంతటిని పొందినను, అయితే మీరు జీవమును సంపాదించినయెడల, సంపాదనలలో గొప్పదైన దానిని మీరు పొందియున్నారు. ప్రపంచము, ధనము వాటి కార్యములు మన నిత్యజీవము కంటెను మేలైన కార్యములు కాదని ప్రవక్త చెప్పుచున్నారు.
MATT 6:10•
MATT 10:39•
MATT 16:28•
MARK 9:1•
LUKE 9:27•
LUKE 11:2•
LUKE 17:21•
1COR 12:13
11నేను నా పాఠ్య భాగమును చూడవలసియున్నాను. ఇంతకు ముందు ఇప్పుడే మరల ప్రభువు యొక్క కృప అను మరొక చిహ్నమును చూచాను. కొన్ని వారముల క్రితము టెలిఫోను యొద్దకు పిలువబడినాను, మరియు ఒక ప్రేమగల ఈ సంఘసభ్యుడు లేక ఈ శరీరము… నేను ఎక్కువగా దీనిని దేవాలయము అని పిలుచుట కోరుటలేదు; నేను దీనిని ఈ విధముగా పిలువవలయునని….. ఏ విధముగా అనిన, నేను కొంతమంది ప్రజలతో మాట్లాడునప్పుడు వారు అడిగిరి, "సరి, మీరు ఏ సంఘమునకు చెందిన వారనిరి."
నేను చెప్పాను, "నేను చెందిన వాడను కాను."
"ఏ సంఘ శాఖకు నీవు చెందినవాడవు?"
"దేనికి కాదు," అని బదులిచ్చాను.
చెప్పెను, "సరి, నీవు దేనికి చెందినవాడవు?"
"నేను చెప్పాను, "ఒక రాజ్యము, ఒక రాజ్యము!" మరియు ఒకే ఆత్మ ద్వారా మేము ఆ రాజ్యములోనికి బాప్తిస్మము పొందియున్నాము, ఒకే ఆత్మ ద్వారా, అందరము ఈ రాజ్యములోనికి. యేసు చెప్పెను, "ప్రార్థించుడి: నీ రాజ్యము వచ్చును గాక, పరలోకమందు నీ చిత్తము జరుగులాగున భూమి యందును జరుగును గాక." ఇప్పుడు, మరియు ఆయన రూపాంతరపు కొండ ముందు నిలుచుకొని; ఆయన చెప్పెను, "ఇక్కడ నిలిచియున్న వారిలో కొందరు మనుష్యకుమారుడు తన రాజ్యముతో వచ్చుట చూచు వరకు మరణము రుచిచూడరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను." ఆ కొండపైన రూపాంతరము పొందినారని మనము చూచుచున్నాము. మరియు బైబిలు చెప్పుచున్నది. "దేవుని రాజ్యము మీలోనే వున్నది." కావున ఈ లోకము వారి గృహము కాదని ఆ రాజ్యము ప్రజలు బహిరంగంగా చాటి చెప్పుచున్నారు. ఇది మన నివాస స్థలము కాదు. ఆ యొక్క రాజు వచ్చి రాజ్యమును స్థాపించబోవునని మనము ఎదురు చూచుచున్నాము.
12నా తండ్రి వంటి ఒక వయస్సు మళ్ళిన సోదరుని కొరకు అత్యవసరముగా నేను పిలువబడితిని, మరియు అతడు… నాకు అతనిని గూర్చి ఎక్కువగా తెలియదు, అయితే అతడు ఇక్కడ అతడు నీటి బాప్తిస్మము కొరకు నేను తీసుకు వెళ్ళిన దినము గుర్తునది. అతడు త్వరలో తొంబై-యొక్క సంవత్సరముల వయస్సు చెందిన వాడగును. మరియు అతని ప్రేమ గల భార్య ఒక నర్సు, మరియు నన్ను పిలిచి అతని గుండె ఆగిపోయినదని చెప్పెను; అది కాకుండా (ఓ, నేను దానిని పలుకలేను — గుండె పోటు, కరోనరి గుండె పోటు అందురు, వందనములు) కరోనరి గుండె పోటు మరియు పరిపూర్ణముగా గుండె నిలిచిపోవుట. వైద్యుడు ఏ విధముగా నమ్మకము ఇవ్వలేడు. మరియు ఆ మనుష్యుడు చనిపోవుచున్నాడు, మరియు అతడు నన్ను పిలిపించెను.
1COR 15:52•
1THS 4:15,16
13నేను నా పాత ఫోర్డ్ (కారు)ను తీసికొని ఒహియోకు పోవుటకు చాలా వేగముగా బయలుదేరి పోవుచున్నాను. కారు చక్రములు సరిగ్గా బిగించనందు వలన టైర్లు చక్రము నుండి చీల్చుకొని వచ్చినవి. కావున, అందువలన అక్కడ నుండి లేచి పెట్రోలు బంకు నుండి సుమారు 11 గంటలకు బయటకి వచ్చాను. అతనిని గురించి చింతించుచుంటిని. నేను అతనిని ప్రేమించుచున్నాను, మరియు నాకు తెలియును, ఒకవేళ… అది ఆలాగు కొనసాగితే, ప్రభువు రాకడ ఆలస్యము అయిన యెడల, ఎందుకు, కొంత కాలములో ప్రతి ఒక్కరిని వదులుకొనవలసిన వారమైయున్నాము.
అయితే ఎత్తబడుటలో అది బాధించదు. చూశారా? కాదు. వారు అప్పుడు మొదట వచ్చెదరు. చనిపోయిన వారు విశేషమైన వారు. వారు మొదట వచ్చెదరు. చూడండి, ప్రభువు రాకడ వరకు సజీవులమైయున్న మనము నిద్రించిన వారిని అడ్డుపరచకయు లేక ఆటంక పరచకయు ఉందుము. దేవుని యొక్క బూర శబ్దము చేయునప్పుడు, మరియు క్రీస్తునందు మృతి పొందినవారు మొదట లేచెదరు. అప్పుడు మన కన్నులు మన ప్రియులను చూచునప్పుడు, ఒక్క క్షణములో, రెప్పపాటులో మనము మార్పుచెంది వారితో కూడా ఒక్కటిగా కలుసుకొందుము.
14మరియు నేను ఆ బంకు నుండి 11 గంటల ప్రాంతములో బయటికి వచ్చినప్పుడు, పరిశుద్దాత్మ నాతో చెప్పెను, "అతనిని గూర్చి కలత చెందకుము. అతనితో నీవు వీధిలో మరల కరచాలనము చేయుదువు, మరియు ఆతడు ఆలయమునకు వచ్చును." చనిపోవుచున్న తొంభై-ఒక్క సంవత్సరముల మనుష్యుడు. నేను అతని భార్యను, అతని ప్రియులను లిమాలో ఉన్న వైద్యశాలలో కలిసినప్పుడు, అతని పరిస్థితిని గురించి నాకు చెప్పిరి, నేను అక్కడ అతనిని చూచాను. మరియు అతడు చెప్పెను, "అయితే అతడు…. ఎదో వింతగా." చెప్పెను, "అతడు 11 గంటలకు కోలుకోనుటకు ప్రారంభి౦చెను." సరి, అది…. ప్రభువు వారికి అనేక కార్యములు చూపించెను; నేను వారికి చెప్పుటకు ముందుగానే మరియు వారికి తెలియును, ఎందుకనగా వారు నాకు మొదట చెప్పిరి. అతడు మార్పు చెందుటకు ప్రారంభించెను; వారికి తెలియును నేను వారికి సత్యమును చెప్పుదునని.
ఆ ప్రకారముగా గత ఆదివారము నేను లూయిస్విల్లో ఉన్న బ్లూ-బోర్ హోటల్కు వెళ్ళినప్పుడు అక్కడ నేను తలంచుచున్నాను, నూటికి ఏనభై శాతపు మంది ఈ సభకు చెందిన వారు. ఆదివారపు మధ్యాహానమున భోజనము చేయుటకై వారు అక్కడ కూడెదరు. ఆ వీధిలో ఎవరో నడచి వచ్చుట నేను చూచితిని? నేను మీకు చెప్పబోవుచున్నాను, ఆయన నాకు ఖచ్చితముగా చెప్పిన ప్రకారముగా, ఆ వీధిగుండా సహోదరుడు డౌచ్ నడచి వచ్చుట చూచినప్పుడు, నా హృదయము వణికినది. మరియు నేను అతనితో ఆ విధిలో కరచాలనము చేసాను.
15అప్పుడు నేను గత ఆదివారపు రాత్రి మళ్ళీ ఇక్కడకి వచ్చి, "ఐక్యమయ్యే కాలముల సూచన," అను అంశముపై మాట్లాడితిని. కావున… మరియు అతడు చెప్పిన విధముగా అది నెరవేరులాగున చేసినది, మరియు ఇక్కడ అతడు ఈ రోజు ఈ సంఘములో ఉన్నాడు. మన మధ్యలో దేవుని కృప వలన జయచిహ్నముగా ఉన్నాడు. ఆ యొక్క ఆక్సిజన్ గుడారములో అతడు ఉన్నప్పుడు, అతనితో కరచాలము చేసినప్పుడు, నేను చెప్పాను, "సహోదరుడు డౌచ్, నీవు స్వస్థతనొందెదవు. నేను నిన్ను సంఘములో మరల కలిసెదను. అది ప్రభువు ఈలాగు సెలవిచ్చుచున్నాడు." చూశారా? ఇప్పుడు ఇక్కడ సంఘములో ఈ స్థలములో అతడు కూర్చొని ఉన్నాడు — సహోదరుడు డౌచ్.
16మరియు నేను తప్పుగా అపార్ధము చేసికొనకుంటే, కొద్ది క్షణముల ముందు ఒక సువార్త సేవకునితో మాట్లాడుచున్నప్పుడు — పరిశుద్దాత్మ లోపలికి వచ్చి అన్ని కార్యములు ప్రత్యేకపరచినది, ఏ విధముగా అది నెరవేరినదని, ఆయన ఏమి చేసినాడని, ఏ విధముగా జరిగినదని మరియు ఏ విధముగా నెరవేరుచున్నది. అప్పటి నుండి జరుగుచున్న అన్ని కార్యములను మరియు అతని కుటుంబ గుణాతిశయములను వాటినన్నిటిని గూర్చి మరియు అన్ని ముగిసినవి అని అతనితో చెప్పెను, మరియు ఆ సువార్తికుడు కుడి ప్రక్క కూర్చొని యున్నాడు. అయ్యా! మీ చేతిని పైకెత్తగలరా? అదుగో అక్కడ అతడు, అతని భార్య ఖచ్చితముగా, ఇప్పుడే, మరియు ఇక్కడ సోదరుడు డౌచ్ కూర్చొనియున్నాడు.
ఓ, మై అతడు అద్భుతమైనవాడు కాడా? మునుపు జరిగిన, ఇప్పుడు జరుగుచున్న మరియు జరుగబోవు (వర్తమాన, భూత, భవిష్యత్ కాలములో) ఆ కార్యములు నెరవేరుచునే యున్నవి. ఒకటి, రెండు, మూడు సాక్షులు — జరిగిన కార్యములు, మీరు చేసిన కార్యములు; ఇప్పుడు జరుగుచున్న కార్యములు; మరియు భవిష్యత్ కాలములో నెరవేరుబోవు కార్యములు. మరియు ప్రతిసారి ఖచ్చితముగా, ఖచ్చితముగా వాక్యవరసలోనే. అది దేవుడు ఒక్కడే దానిని చేయగలడు. ఓ, ఈ కార్యముల నిమిత్తము ఎంతో సంతోషముగా లేమా?
17ఇప్పుడు, కొద్దిగా ఎక్కువ సముయుమును తీసికొనుటకు కారణము, బిల్లీ తన భార్యను, బిడ్డను తీసికొని రావటానికి వెల్తూ, మరియు అతడు, "తండ్రీ, నేను తిరిగి వచ్చు వరుకు ప్రసంగము మొదలు పెట్టవద్దు," అని చెప్పెను. అందువలన అతడు ఇప్పుడు తిరిగి వచ్చినాడని నేను అనుకొనుచున్నాను. నేను ఆ విధముగా ఎక్కువ సమయమును నేను తీసికొని యుండకూడదు, ఏమైనను మరియు నేను నాలుగు గంటల సేపు ఇక్కడ మిమ్ములను వుంచి బాధించుటను, తప్పింప చేయవలెనని ప్రయత్నించుచున్నాను. మరియు ముప్బై-ఐదు, నలుబది నిమిషములు చేయవలెనని (మీరు చూచారా?) మరియు దాని కొరకు ప్రయత్నించుచు…
ఇప్పుడు, ఒకసారి చికాగోలో నేను వాఖ్యానించబడ్డాను, నేను ముప్పై నిమిషములు లేక ఆ విధముగా, ముప్పై-ఐదు నిమిషములు ప్రసంగించాను, మరియు గత ఆదివారము రాత్రి ఒక నలుభై-ఐదు నిమిషములు మాత్రమే. బిల్లీ చెప్పెను, "డాడీ నీవు నిజముగా అభివృద్ది పొందుచున్నావు. నిన్ను గూర్చి దానికొరకు నేను గర్వపడుచున్నాను.
సరి, ఈ ఉదయము ఆదివారపుబడి పాఠశాల విధముగా… నేను ఎక్కువ సేపు మిమ్ములను ఉంచను; కావున మీరు బయటికి వెళ్ళి భోజనము ముగించికొని, రాత్రి స్వస్థతా కూటములకు రావచ్చును. ఈ రాత్రి మనము ప్రార్థనా వరుస పద్దతి అనుసరించి వ్యాధిగ్రస్తుల కొరకు ప్రార్థించెదము.
18వ్యాధిగ్రస్తులు ఈ పరిసరములలో ఎవరైనా ప్రార్ధింపబడవలయునని కోరిన యెడల, ఈ రాత్రి ఇక్కడికి వారిని పిలిచుకొని రండి. చూశారా? ఇప్పుడు ఎలాగైనను వారిని పిలిచుకొని రావలయుననిన పిలిచికొని రండి. చూడండి? ముఖ్యమైన కార్యము ఈ రాత్రి వారిని ఇక్కడికి పిలిచుకొని వచ్చుటయే. మనమందరము ఒక్కటిగా కలుసుకొనబోవుచున్నాము. ఆ విధముగా వేర్వేరు స్థలములకు వెళ్ళి వారిని కలుసుకొనుట కష్టమైన కార్యము. మరియు ఎవరైనా వదిలినయెడల మరియు మనస్సు బాధపెట్టినట్లగును. అయితే వారినందరిని నేను ఒక చోట కూడులాగున చేసిన యెడల, మరియు వారి కొరకు నేను ప్రార్థించెదను. ఇప్పుడు, ప్రజలు ప్రార్థనను కోరిన యెడల… మీరు చెప్పెదరు, "వారికొరకు కూడానా?" ఓ, నిశ్చయముగా వారు ప్రార్ధి౦పబడెదరు. వారిని లోనికి పిలిచుకొని రండి. ప్రభువుకు చిత్తమైన యెడల, అందరి కొరకు ప్రార్థించుటకై మనమిచ్చట వుండెదము, ఏలయనగా ఆ మూడవ ఈడ్పు సంచరించుటకు ప్రారంభించినది. మీరు చూశారా? అది ఇప్పుడు నాలో యున్నది. మరియు అందరి కొరకు నేను ప్రార్ధి౦చాలని కోరుచున్నాను.
19ఇప్పుడు, ఈ ఉదయము మనమందరము ఎరిగిన పాత లేఖన భాగములను త్రిప్పెదము, దానిలో నుండి గత రాత్రి నిద్ర ముంచుకొని వచ్చుచున్నందున త్వరత్వరగా కొన్ని (భాగములను) ఎత్తి మరియు కొన్ని లేఖన వాక్యములను దానితో కూడా వ్రాసి ఉంచియున్నాను. మరియు దానిని పూర్తి చేయుటకు, ఒకసారి ఈ పాఠమును ఉపయోగించినప్పుడు, "నేను విని దానిని వ్రాసికొని యున్నానని నేను అనుకొనుచున్నాను, ఏలయనగా కొన్ని అవసర సమయములో అది ఉపయోగపడ వచ్చును." అనేక సార్లు మనము దానిని చేయుదుము. నేను మీలో అనేకుల యొద్ద చిన్న కాగితములు ఉండుట గమనించాను. మరియు ఒక ప్రసంగి ఏదైనా కార్యమును చెప్పినప్పుడు, ఆ ముఖ్యాంశమును మీరు గ్రహించినప్పుడు, ఏదో కార్యము మీ లోపల మీకు తోచును. మురియు పరిశుద్దాత్మ ఆ కార్యమును చేసిన యెడల, ఆ ముఖ్యాంశము నుండి ప్రభువు కొరకు ఒక వర్తమానమును మీరు కట్టుటకు మొదలిడెదరు. మరియు అది సరియే; నేను ఎక్కడికి వెళ్లినను కూటముల యందు నేను గమనించుచున్నాను, ప్రసంగీకులు మరియు జనులు వ్రాసికొనుచున్నారు. అది సరియే. మనము ఇక్కడ ఉన్నాము — అందుకొరకే మనము ఇక్కడ ఉన్నాము, ఈ మార్గములలో ఒకరికొకరు సహాయము చేయుట కొరకే.
1COR 15:31•
REV 3:21,22
20మరియు ఇప్పుడు, ప్రకటన గ్రంధము 3వ అద్యాయము సంఘ కాలముల యొద్దకు మరల ఒక సంఘ కాలము. అయితే ఇప్పుడు, మనము… ఈ ఒక్క పాఠ్యభాగమును నేను తీసికొని, మరియు పరిశుద్దాత్మ సహాయముతో దానిని వంద సంవత్సరములు ప్రసంగించినను దానిలో ఉండు కార్యములను పొందజాలము, ఏలయనగా ఈ యొక్క పాఠ్యభాగములో మిగత అన్ని పాఠముల (బైబిలు గ్రందములోని పాఠములు వలె) ఒక దానితో ఒకటి జతపరచబడి యున్నది. మరియు ఈ ఉదయ కాలము నా యొక్క అంశముగా దీనిని ప్రసంగించ వలయునని కోరుచున్నాను. నేనెలా జయించగలను? ఇప్పుడు, దీనిని ఎన్నుకొన్నాను, ఎందుకనగా, ఆ ఉజ్జివము ఆత్మను మనము కోల్పోకుండా ఉండు కాలమిది. మనము ఉజ్జివమును అట్లే ఉంచుకొనవలయును, విడువకుండా ప్రతిరోజు పునరుద్దరింప వలయును. పౌలు చెప్పెను, క్రీస్తు తనలో జీవించులాగున, అతడు ప్రతిదినము చనిపోవలసి యున్నది. మరియు మనము ఎన్నడునూ ఆ ఉజ్జివమును మనలో చావనీయకూడదు.
ఇప్పుడు, ప్రకటన గ్రంధము 3వ అధ్యాయము, 21వ వచనము మొదలుకొని మనము చదివెదము:
నేను జయించి నా తండ్రితో కూడ ఆయన సింహాసనము నందు కూర్చుండియున్న ప్రకారము జయించు వానిని నాతో కూడ నా సింహాసనమునందు కూర్చుండ నిచ్చెదను.
సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినునుగాక.
REV 3:21
21మీరు ఆ యేర్పాట్లను గమనించారా? చూశారా, "నాతో కూడ నా సింహాసనము నందు కూర్చుండుట," నా సింహాసనము పైన కాదు, "నా సింహాసనమునందు." అది ఆయన యొక్క రాజ్యములో, చూశారా. మరియు ఇప్పుడు క్రీస్తు పాలించువాడు, దేవుని యొక్క సమస్త రాజ్యములో సింహాసనాధికారి, కావున సంఘము అతనితో ఉండునా, వధువు ఆయనతో ఆయన సింహాసనము నందు సమస్త రాజ్యములో ఉండును, చూశారా. "నా సింహాసనము పైన కాదు," అయితే "నా సింహాసనమునందు" (చూశారా), ఎక్కడ ఆయన రాజ్యము వ్యాపించునో. ఒక సింహాసనము రాజ్యముపై, మరియు ఒక రాజ్యము సరిహద్దులు ఉన్న వరుకు వ్యాపించుచు వచ్చును, మరియు ఈ రాజ్యము నిత్యత్వము నుండి నిత్యత్వము వరుకు. దానిని గూర్చి ఆలోచించండి.
22ఇప్పుడు, దీనిని ధ్యానించుచుండగా, నా యొక్క ఉద్దేశము ఇక్కడకి వచ్చే ప్రజలతో క్రైస్తవ సహవాసమునకు చేయుటకు మాత్రము కాదు. అయితే దానిని నేను ఆశించుచున్నాను. అయితే దానిని చేయుటకు నాకు అవకాశమున్న యెడల, నేను మీ గృహములకు వచ్చెదను, మరియు మీతో కరచాలనము చేయుదును, మీతో మాట్లాడెదను, కూర్చొని, మీతో భుజించి, చెట్టు నీడలో విశ్రమించి మరియు మాట్లాడుచు మీతో ఐక్య పడుదును. అయితే మనము ఇక్కడికి వచ్చునప్పుడు, మనము ఒక విశేషమైన ఉద్దేశము కొరకు మనమిక్కడ యున్నాము. ఇది సరిదిద్దు గృహముగా ఉన్నది. ఇది సింహాసనము. ఇది దేవుని యొక్క సింహాసనము మరియు న్యాయతీర్పు దేవుని యొక్క గృహము నుండి బయలు వెళ్ళును. మరియు ఇక్కడే మనము ఒక్కటిగా వచ్చెదము, ఒకరిపై ఒకరికి ప్రేమతో కూడెదము, ఏలయనగా క్రైస్తవులు మాత్రమే ప్రేమించుదురు, అయితే ఇక్కడ మనము పరిశుద్దాత్మ నాయకత్వము క్రింద యున్నాము. పరిశుద్దాత్మ మనమధ్య ఉన్నది. మరియు మనము ఇక్కడ మనలో లెక్కించుకొనుచున్నాము, మన యొక్క లేమి ఎక్కడని, లోతుపాటు ఎక్కడని చూడను, మనము ఎక్కడ ఉండవలయునో అక్కడికి వదలబడిన స్థానము నుండి అందుకొనుటకు ఇప్పుడు ఉన్న స్థానము నుండి ఎక్కడ మనము ఉండవలయునో అక్కడికి మరియు అదే మనము ధ్యానించబోవుచున్నాము. సువార్త సేవకులు వారి ప్రజల కొరకు ఆ కార్యములను ధ్యానించుదురు. వారు వారి ప్రజలను చూచి, వారి చిన్నబుచ్చు కార్యములను దానిని గూర్చి చెప్పుటకు ప్రారంభించుదురు.
1PET 4:17
23ఇప్పుడు, త్వరలో ఈ సంఘము ఈ సమయము ఒక చిన్న మెట్టు పైకి ఎదగబోవునని నేను తలంచుచున్నాను. ఈ ఉదయము ఈ కార్యములను మీకు చూపవలయునని నా యొక్క ఉద్దేశ్యము కాదు, అయితే నేను తలంచుచున్నాను, త్వరలో ప్రభువు చిత్తమైతే, మనము ముందుగా బూరలను బోధించాలని, మీరు తెలుసుకోవలసిన ఒకదానిని సంఘమునకు తీసికొని రావలయునని నేను అనుకొనుచున్నాను, ఇప్పుడు నేను నమ్ముచున్నాను.
REV 3:20,21
24మరియు ఇప్పుడు, ఈ జయించుటను గూర్చి మనము మాటలాడుచున్నాను. "జయము" అను పదము దాని అర్థమేమిలో మీకు తెలియును. మీరేదో ఒక దానిని జయించుటకు కలిగియుండవలెను. మరియు ఈ సంఘకాలము, ఈ లవొదికయ సంఘ కాలములో పరిశుద్దాత్మ కదలాడుచుండగా (దానిని ఇప్పుడు మనము ధ్యానించి యున్నాము) గద్దింపు అవసరమై యున్నది. లవొదికయ గద్దింపబడవలయును, ఏలయనగా అది క్రీస్తుకు భిన్నముగా ఉన్నందువలన అది (లవొదికయ) ఆ దినము క్రీస్తును వెలుపలికి నెట్టినది — వారి కాలములో, మరియు క్రీస్తు వెలుపలనున్నాడు; తిరిగి లోపలికి వచ్చుటకు ప్రయత్నించుచున్నాడు. అదియే ప్రేమ. తన సొంత గృహమునకు వెలుపలకు అతడు పెట్టబడిన పిదప, తిరిగి లోనికి వచ్చుటకు ప్రయత్నించుచు మరియు చెప్పుచున్నాడు, "తలుపు ఎవ్వరైతే తెరుచుదురో, అతని లోనికి నేను వచ్చెదను." చూశారా?
సమస్త సంఘములన్నియు ఆయనను వెలుపల పెట్టినవి. అయితే ఇప్పుడు గమనించండి, ఆయన యొక్క పిలుపు సంఘమునకొక్కటే కాదు: "జయించువానికి." చూశారా? సంఘమునకు కాదు, అది ఆమె అయి యున్నది (చూశారా?) సంఘ శరీరము, అయితే జయించువానికి, జయించు వ్యక్తి.
PROV 3:12
25ఇప్పుడు, మరియు లవొదికయ యొద్దకు వచ్చుచున్నది.
ఇప్పుడు మనము చూచాము, ఇది లవొదికయ కాలమని తెలుసుకున్నాము, మరియు ఈ కాలమునకు సరియైన గద్దింపు దేవుని యొద్ద నుండి కావలసియున్నదని ఎరిగియున్నాము. సూటియైన గద్దింపు దీనికి అవసరమైయున్నది. మరియు మన మత గురువులు చాలా మృదువుగా, మితిమీరిన ప్రేమతో, ఏ విధముగా వయస్సు చెందిన తాత తన మనువళ్ళతో ఉండునో, వారు ఏమి చేసినను అది సరియని మరియు వారు…
దేవునిని గూర్చి అధికముగా చెప్పి, చివరకు దేవుడు ఈ విధముగా ఉండునని దేవునిని ఎంతో గొప్ప ప్రేమగల తాతగా చేయుటకు ప్రయత్నించుచున్నారు. మీరు చూచారా? అయితే ఆయన కాడు. అతడు తండ్రి మరియు అతడు సరిదిద్దు, నీతిగల తండ్రి. ప్రేమ ఎప్పుడు సరిచేయును. చూశారా? ప్రేమ సరిదిద్దును. అది ఎంతగా బాధించినను పరవాలేదు, అయినను ఇంకనూ అది సరిదిద్దును. ఒక నిజమైన తల్లి తన బిడ్డలను సరిదిద్దును; ఒక నిజమైన తండ్రి సరిదిద్దును. చూడుడి, అయితే మీరు చాలా మృదువుగా మరియు అతి ప్రేమతో వారిని తప్పు చేయుటకు వదిలి…
26ఆ రోజు నేను ఒక దుంగను దాటుకొని పోవుచుండగా మరియు దానిపై నేను దూకాను. పైకి చూడటానికి ఆ దుంగ బాగున్నది. చూచుటకు బీచ్ వృక్షము యొక్క దుంగవలె పెద్దదిగా కనబడెను. అయితే దానిపైన దూకినప్పుడు, అది విరిగి సగము పడిపోయినది; అది నిజముగా క్రుళ్ళిపోయి ఉండెను. నేను చెప్పాను, "క్రైస్తవులు కూడా ఆలాగే మారుచున్నారు." వారు తెలుసుకొన లేని విధముగా పాపములోను, అతిక్రమములోను చనిపోయియున్నారు. వారు ఏ బరువును మోయజాలరు. వారికి జయించుట అంటే ఏమని తెలియదు. అప్పుడు నేను ఈ అంశమును గూర్చి యోచించాను: జయించుట, జీవమును నీలో పెట్టుట. అయితే జీవము బయటికి పోయినప్పుడు, అదే ఆ దుంగను అటువంటి పరిస్థితికి తెచ్చినది. చూశారా? మరియు నీళ్ళు ఉండు ఆ కొమ్మలో దానిని పెట్టినప్పుడు, మునుపటి కంటేను దాని పరిస్థితి చాలా మోసమైనది.
JAS 4:17
27మరియు ఒక క్రైస్తవుడుగా ఉండవలసిన ఒక క్రైస్తవుని తీసికొని ఉత్సాహముతో క్రీస్తుకు సేవ చేయవలెనన్న ఆ అనుభవము, దేవుని జీవము అతనితో నుండి పోనిమ్ము మరియు పిమ్మట ఒక సంఘములో (నామకార్ధ సంఘములో) అతడు జీవించిన యెడల అతడు చాలా త్వరగా రెండింతలుగా కుళ్ళిపోవును. (చూడుడి? అది సరియే!) దాని క్రింద జీవించుచునే.
కావున ఈ సమయపు వర్తమానమును లేక కనీసము వర్తమానము యొక్క ఈ భాగమునైనను, మనము అనుసరించుటకు ప్రయత్నించుచున్న యెడల మనము నిరంతరము విడువకుండా క్రీస్తు యొక్క జీవితములో జీవించవలసినవారమై యున్నాము. చూశారా? ఎందుకనగా ఆ విధముగా చేయక ఉండిన యెడల మీరు కార్యములను చేయవలయునని తెలిసియుండియు మరియు దానిని చేయకుండిన, బైబిలు చెప్పుచున్నది. "ఒకడు మంచి చేయవలయునని తెలిసి యుండియు మరియు దానిని చేయకుండినయెడల అది అతనికి పాపము." మరియు దేవుని జీవమునుండి వేరైపోయినప్పుడు అతడు కుళ్ళిపోవును. కావున మీరు ఫలించులాగున మీలో ఉన్న సమస్తముతో క్రీస్తు జీవములో నిలిచి యుండుటకు గట్టిగా ప్రయాసపడుడి.
MATT 24:24•
MARK 13:22
28ఇప్పుడు మనము జీవించుచున్న ఈ కాలమును చూచెదము. ఇది అన్ని కాలముల కంటేను గొప్పదైన కాలము. ఈ లవొదికయ సంఘకాలము అన్ని సంఘ కాలముల కంటేను గొప్పదైన కాలము, ఎందుకనగా ఇది కాలముల యొక్క ముగింపు మరియు నిత్యత్వముతో కలుపుట. మరియు ఇది భయంకరమైన పాపపు కాలము. మునుపు కంటెను ఈ కాలములో పాపము అధికముగా ఉన్నది. అన్ని కాలముల కంటెను ఈ కాలములో సాతాను యొక్క శక్తులతో పోరాడుట చాలా కఠినముగా ఉన్నది. చూశారా?
ఇక్కడ, ముందు కాలములో మొదటి సంఘ కాలములలో క్రీస్తుకు చెందినవాడని, క్రైస్తవుడని చెప్పుకొనిన యెడల అతని తల తీయబడును. అతడు చంపబడి, ఈ కష్టముల నుండి విముక్తి పొంది త్వరగా దేవుని సంధించుటకు పోవును. అయితే ఇప్పుడు, శత్రువు సంఘము పేరుతో వచ్చియున్నాడు; మరియు ఇది వంచింపబడు కార్యము. ఇది భయంకరమైన వంచనతో కూడిన కాలము. క్రీస్తు చెప్పెను, రెండు ఆత్మలు యించుమించు కడవరి దినములలో ఒకే విధముగా ఉండి, వీలైతే ఏర్పరచబడిన వారిని సహితము మోసపుచ్చునదై యుండును. చూడుడి, చూశారా? మరియు జ్ఞాపకముంచుకొనుడి క్రీస్తు కడవరి దినములకు ఎన్నుకొనబడిన జనులను గూర్చి పలికియున్నాడు. చూశారా? వీలైతే ఎన్నుకొనబడిన వారిని సహితము అది మోసపరుచును, అంత దగ్గరగా.
జనులు ఈ విధముగా జీవించుదురు — ప్రజల పవిత్రమైన, పరిశుద్దమైన జీవితము జీవించుదురు, పాపము చేయకుండా, వ్యభిచారము - త్రాగుబోతులు - అబద్దికులు - జూదగాళ్ళ కాకుండా; వారు దానికి పైగా జీవించవచ్చును, మరియు అయినను వారు దానితో కలిసి లేరు.
29ఇది జీవించు కాలమైయున్నది, క్రీస్తు యొక్క వ్యక్తిగత జీవితము, ఆయన శరీరములోని రసాయనము, ఆయనలో ఉండినది; మొదట, నీతిమంతుడుగా తీర్చబడుట, నీటి బాప్తిస్మము; రెండవది, వెస్లీ యొక్క తిరిగి జన్మించుట, శుద్దీకరణ, అది పరిశుభ్రపరచును; మరియు మూడవదిగా, పరిశుద్దాత్మ యొక్క బాప్తిస్మము క్రింద, శుద్దీకరించబడిన పాత్రను సేవకై వినియోగించుట… చూశారా? శుద్దీకరించుట — అను పదమునకు — గ్రీకు బాషలో అది రెండు అర్ధములు గలది "పరిశుభ్రపరచబడి మరియు సేవకై వేరు చేయబడుట." సేవకై వేరు చేయబడుట, ఇప్పుడు పరిశుద్దాత్మ దానిని (శుభ్రపరచబడిన దానిని) సేవలో పెట్టును. చూశారా?
MATT 12:43-45•
LUKE 11:24-26
30మరియు మనము గమనించుచుదము, అపవిత్రమైన ఆత్మలు ఒక మనుష్యుని నుండి పోయిన యెడల అతడు ఎండిన స్థలములో నడచును. సంఘము సరిగా దానినే చేసినది. బాప్తిస్టులు, మెతడిస్టులు శుద్దీకరణలో నమ్మెడి జనులు. మరియు యేసు చెప్పెను, బయటికి వెళ్ళిన ఆ అపవిత్రమైన ఆత్మ తిరిగి ఈ సంఘ శరీరము నొద్దకు వచ్చి, ఆ ఇళ్ళు అలంకరించబడి యుండుటను, పరిశుభ్రముగా ఉండుటను, శుద్దముగా జీవించుటను ఆ జీవితములను కనుగొనుచున్నది, అది సరియే. అయితే ఆ శుభ్రము చేయబడిన ఇళ్ళు నింపబడని యెడల బయటికి వెళ్ళిన ఆ అపవిత్రాత్మ మరియు ఏడు దయ్యములను వెంట బెట్టుకొని (తన కంటె మోసమైన దయ్యములను) లోనికి తీసుకోని వచ్చును. అప్పుడు ఆ స్థలము యొక్క కడపటి స్థితి మొదటి స్థితి కంటె చాలా ఘోరముగా ఉండును. వారు ఈ వెలుగును పొంది దానిని వెంబడించక ఉండుట కంటె వారు ఆ లూధరునులలోనే ఉండి ఉండ వచ్చును. కావున అది పెంతెకోస్తు. నా భావము మీకు తెలుసును. ఆ గృహము అలంకరించబడినది.
MATT 12:45•
LUKE 11:26
31ఆ రోజు నేను ఇంకొకరితో మాట్లాడుచుండగా, చెప్పాను, "వారు చాలా జాగ్రత్తగా యున్నారు, పరిశుద్ద గుంపులైన వారు కూడా పరిశుద్దాత్మను, పరిశుద్దాత్మ అని పిలువక (హోలీ గోస్ట్ ను, హోలీగోస్ట్ అని పిలువక) ఏలయనగా ఆ విధముగా పిలచినయెడల వారు పెంతెకోస్తులతో గుర్తింపబడుచున్నారు. వారు "హోలీ స్పిరిట్" (పరిశుద్దాత్మ) అని చెప్పుచున్నారు. చూచారా? హోలీగోస్ట్ అని చెప్పుట లేదు, ఏలయనగా పెంతెకోస్తులు వారు, సామాన్య జనులు దానిని బైబిలు చెప్పు విధముగా పిలుచుచున్నారు "హోలీగోస్ట్" అది "హోలీ స్పిరిట్" మరియు "హోలీగోస్ట్" రెండునూ ఒక్కటే. అయితే దానిని గూర్చి వారు చాలా జాగ్రత్తగా ఉన్నారు… వారు అన్యభాషలు మాటలాడు వారితో గుర్తింపబడుటకు ఇష్టపడకున్నారు, అది పరిశుద్దాత్మే. చూశారా? అప్పుడేమి జరిగినది? బాగుగా కడుగబడి, శుద్దీకరణలో తరుమగొట్టబడిన ఆ శత్రువు తిరిగి వచ్చి ఆ గృహము పరిశుద్దాత్మతో నింపబడకుండా ఉండుట చూచి, ఇప్పుడు సంఘము యొక్క స్థానము, స్థాపన సంఘముల ఐక్యకూటములో చేరి ప్రపంచ సంఘముల సభలో; మరియు దాని స్థానమిప్పుడు రోమన్ కాథలిక్ వారితోను, తక్కిన వారితోను ఐక్యపడుట ద్వారా; లూధరనుల నుండి బయటికి వచ్చిన (ప్రొటెస్టెంటులు తదువరి సంఘములు) దాని స్థితి, మునుపటి కంటె ఏడింతలు హీనముగా ఉన్నది. అదే మనుష్యుడు అంగీకరించు కార్యము.
EXOD 4:21•
EXOD 7:3,13•
MARK 8:18•
ROM 9:18•
REV 3:20
32మరియు పరిశుద్దాత్మను పొందిన తరువాత లవొదికయ సంఘమును గమనించండి. మరియు దాని జ్ఞానముతో, దేవుని ఆత్మ దానిలో ఉన్నదనుకొనుచు మరియు దేవుని క్రియలను కాదనుచు దానిని దయ్యము క్రియలు అని పిలుచుచు మరియు ఇదంతయు ఏమిటి? అక్కడే క్రీస్తు తన సొంత సంఘమునకు బయట ఉంచబడినాడు. చూడుడి, లవొదికయ వచ్చు వరుకు ఆయనను సంఘములో చూపలేదు. అయితే ఆయన లవొదికయలో సంఘములోనికి వచ్చినప్పుడు, ఆయనను ఆయన సంఘము బయట నెట్టబడెను, మరల లోనికి వచ్చుటకు ప్రయత్నించుచున్నాడు.
ఇప్పుడు చూడుడి, నీతికరణ ఆయనను ఎన్నడు లోనికి పెట్టలేదు. శుద్దీకరణ కేవలము ఆయన కొరకు స్థలమును శుభ్రపరచినది. అయితే పరిశుద్దాత్మ బాప్తిస్మము వచ్చినప్పుడు, అది ఆయనను ప్రజలలో పెట్టెను. అయితే నిన్న, నేడు, మరియు నిరంతరము ఏకరీతిగా మారనివాడు అని చూపినప్పుడు; ఆయనను త్రుణీకరించిరి, ఎందుకనగా వారు ఒక శాఖగా మారి, మరియు ప్రభువు యొక్క ఆత్మ వారి సంఘ శాఖలతో ఏకీభవించదు. మీరు ఇప్పుడు అర్ధము చేసుకొన్నారా? అది, వారు ఆయనను బయటపెట్టిరి: "ఆ టెలిపతితో (మనస్సు లేక మెదడులోని కార్యములను ఒకరి నుండి ఇంకొకరికి పంపుట) మాకు ఏమి సంబంధము లేదు; అది దెయ్యపు కార్యము. అది సోదె చెప్పుట, లేక…" చూశారా? వారికి అది అర్థము కాదు. కన్నులు౦డియు, చూడ లేకున్నారు; చెవులు౦డియు, వినలేకున్నారు. చూడండి, దేవుడు ఆయన చిత్తానుసారముగా మాత్రమే కళ్ళను తెరిపించును. ఆయన ఎవరిని కఠినపరచ వలయునని కోరుకొనునో, వారిని కఠినపరచును. మరియు ఎవరికి జీవమును ఇయ్యవలయునని కోరుకొనునో, వారికి జీవము నిచ్చును. అదే లేఖనములు చెప్పుచున్నవి.
33ఇప్పుడు, మనము ఉన్న కాలములను, ఈ పరిస్థితులు, మరియు ఎటువంటి కాలములు మునుపు ఉన్నవో చూచియున్నాము. మరియు ఆయనను బయటికి పెట్టిన ఈ కాలమును పరిశుద్దాత్మ గద్దించుచున్నాడు. అయితే వీటిన్నిటి మధ్య మీరు గమనించారా, "జయించువానికి" మోసమైన, ప్రపంచకార్యములతో ఉన్న ఈ సంఘ కాలములో కూడా "జయించు వాడెవడో?"
దేవునికి ఎల్లప్పుడు జయించువారిని ఆయన కలిగియున్నాడు అని మనము ఇక్కడ కనుగొనియున్నాము. ప్రతి కాలమునందును ఆయనకు జయించు ప్రజలు ఉండిరి. ఎల్లప్పుడు ప్రతి సమయము నందును, ఒక్కొక్క కాలములోను భూమిపై నుండు జనులలో, సాక్షిగా తన హస్తములను వారిపై పెట్టుటకు గాను, భూమిపై దేవునికి ఎల్లప్పుడు ఎవరో ఒకరుండుదురు. ఆయనకు సాక్షిగా లేకుండా ఎప్పుడు లేడు, కొన్ని సమయములలో ఒకడే ఉండును. అయితే ఎవరో ఒకరు జయించుదురు.
ఇప్పుడు, కొన్ని పాత పరిశుద్దులవలె.
REV 3:21
34మరియు ఒక మంచి వ్యక్తి, ఒక పండితుడు, ఏడు ముద్రల తరువాత చెప్పుచున్నాడు, అతడు ఇలా అడిగెను, "బ్రెన్హాం సోదరుడా, నీవు ఒక వింతైన మనిషివి." సంఘమునకు శ్రమల కాలము ఒక మాదిరిగా చూపకుండా మరియు ఏ విధముగా ఎత్తబడుటలో సంఘమును పెట్టెదవు?" అతడు చెప్పెను… నీవు చూడుము, ఒక మాదిరి ఉన్నయెడల ఒకటి ఉండవలయును… ఒక ముందు మాదిరి (ఒరిజినల్) ఉన్న యెడల ఒక మాదిరి (డూప్లికేట్ ) ఆ ముందు మాదిరి నుండి రావలసియున్నది. మరియు నేను చెప్పు నిజ కార్యము అంతటికి మాదిరి ఉన్నది. దానికి ఒక మాదిరి ఉన్నది. మీకు ఒక ఉదాహరణ ఉన్నది. మరియు బైబిలు చెప్పుచున్నది. రాబోవు క్రొత్త కార్యములకు పాత కార్యములు ఒక నీడ వలెనున్నవి. ఆయన చెప్పెను, "అయితే ఇప్పుడు, నీవు పాత నిబంధనను ఒక నీడగా తీసికొన్నావు, మరియు ఇప్పుడు," అతడు చెప్పెను, "ఈ సంఘముతో నీవేమి చేయబోవుచున్నావు?"
COL 2:17
35ఈ మనుష్యుడు వచ్చిన… ఒక గొప్ప వ్యక్తి, గొప్ప ఉపదేశకుడు, నాకు ఆప్తమిత్రుడు, చాలా మంచి మనిషి మరియు ప్రేమగల సహోదరుడు. మరియు ఆ సహోదరునికి విరోధముగా ఒక్క వాక్యమైనను చెప్పుటకు నేను ధైర్యము చేయను; క్రైస్తవునిగా నేను అలాగుచేయలేను. అతనికి విరోధముగా నేను ఏమి చెప్పును. అతడు ఆ ఒక్క అంశములో నాతో ఏకీభవించడు, అయితే అతడు నాకు అమూల్యమైన సహోదరుడు; మేము ఒకటిగా భోజనము చేయుదుము, ఓ అతడు ఒక సొగసుగాడు. నేను అతని యొక్క పత్రికలు తీసికొందును, అతని ప్రచురణలు చదివెదను; నా యొక్క అంశములలోని వాటిని కూడా అతను వ్రాయును, మరియు ఆ విధముగా. మరియు నేను అతను చెప్పు వాటిలో విని, అతని పుస్తకములో నుండియు నేను ఎన్నో పాఠ్యాంశములను తీసికొనియున్నాను. అతడొక గొప్ప వ్యక్తి, అయితే అతడు నాతో ఒప్పుకొనడు. అందరివలె ఏమి చెప్పినను సరి అని చెప్పక, నాతో కొన్నిటిలో ఏకీభవించక ఉండు నిష్కపటమును నేను మెచ్చుకొనుచున్నాను. అతని కని ఒక నిశ్చయము కలదు (నమ్మకము) మరియు దాని కొరకు అతడు నిలుచుచున్నాడు. నేను దానిని మెచ్చుకొనుచున్నాను. మరియు అతడు ఒక మంచి వ్యక్తి. ఓ, నేను ఉపదేశకుడను కాను లేక పండితుడను కాను. మరియు ఈ వ్యక్తి ఆ రెండును, ఉపదేశకుడు మరియు పండితుడై యున్నాడు.
36అయితే నేను అతనితో ఏకీభవించను, ఏలయనగా నేను దానిని చూచుట లేదు, అయితే అది రక్షణకు సంబంధించిన కార్యము కాదు; అది ప్రభువు రాకడకు సంబందించినది.
అతడు సంఘము పరిశుద్దపరచబడుటకు శ్రమలలోనికి వెళ్లవలెనని చూచుచున్నాడు. యేసుక్రీస్తు రక్తము సంఘమును శుద్దీకరించునని నేను చెప్పుచున్నాను. అది అక్కర లేదు… సంఘశాఖలు శ్రమలలోనికి వెళ్ళును, అయితే వధువు శ్రమలలో వెళ్ళదు. మీరు పెండ్లికి ముందు పరిశుద్దపరచబడవలసిన స్త్రీని వివాహమునకై ఎన్నుకొనెదరా? క్రీస్తు వధువు ఏర్పరచు కొనబడినది, మరియు ఆమె ఎన్నుకొనబడినది, మరియు ఆమె దేవుని యొక్క వధువు, యేసుక్రీస్తు యొక్క వధువు.
JOHN 5:24
37మరియు ఇప్పుడు, అతడు చెప్పెను, "దానిని దేనితో పోల్చి చూపెదవు? ఒకవేళ వధువు పోవునప్పుడు, ఆమె శ్రమలలో పోవలసియున్నది" అని చెప్పెను. "సంఘము శ్రమల కాలములో ఉండుననుటకు నా యొద్ద లేఖనములు ఉన్నవని?" చెప్పెను. "ఆరవ ముద్రను చదువమని? నేను చెప్పాను. అది అంతే, ఆమె సరిగ్గా శ్రమల కాలములో ఉన్నది." అయితే కనుగొనుము సరిగ్గా దానికి ముందే, వధువు ఎత్తబడును. ఆ సమయములో ఆమె మహిమలో ఉండును; ఆమెకు పరిశుద్దపరచబడుట అక్కర లేదు. చూశారా? "నాయందు విశ్వాసముంచువాడు నిత్యజీవము గలవాడు, వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి యున్నాడు." కావున ఉచితముగా నేను పూర్తిగా విడుదల చెందేలాగా నా స్థానమును అతడు తీసికొనెను. నేను మన్నించబడినప్పుడు, నేను మన్నించబడితిని. అతడు ఏ విధముగా నన్ను కుదువ అంగడి నుండి నన్ను విడిపించి మరియు స్పష్టమైన పత్రమును కలిగి యున్నాడు. ఆయన నన్ను కుదువ అంగడి నుండి విడిపించిన తరువాత దలారి ఇంకను నేను అతనికి చెందిన వాడని ఎలా చెప్పగలడు? నా యొద్ద వ్రాయబడిన పత్రము ఉన్నది, యేసుక్రీస్తు రక్తముతో వ్రాయబడినది. చూశారా?
ఇప్పుడు, ఆ స్థలమునకు మనము వచ్చి యున్నాము. అతడు అడిగెను, "ఇప్పుడు, నీవు చెప్పు ఆ ఎన్నుకొనబడిన వధువును నీవు ఏ విధముగా వేరుపరచి, మరియు ఇప్పుడు ఏ విధముగా వారిని ఒక మాదిరి క్రింద పెట్టెదవు?"
MARK 15:38
38నేను చెప్పాను, "చాలా మంచిది." "ఇదిగో ఇక్కడున్నదని," నేను చెప్పాను. ఇప్పుడు, మత్తయి 27వ అద్యాయము 51వ వచనము.." నేను దానిని చదివిన పిదప మనము సరియైన దానిని మనము కనుగొన్నాము. కావున మనము తెలుసుకొనవచ్చును, అది ఎన్నుకొనబడిన వధువు, మాదిరిగా పోల్చబడినదా లేదా అని. మత్తయి 27వ అద్యాయము 51వ వచనము అది సరి. ప్రభువు యొక్క సిలువ మరణమును గూర్చి ఈ వచనములలో మనము చదువుచున్నాము:
అప్పుడు దేవాలయపు తెర పైనుండి క్రింది వరుకు రెండుగా చినిగెను…
MATT 27:51-53
39ఇప్పుడు, అది చట్టము. చట్టము అంతటితో ముగిసినది, ఎందుకనగా ఆ తెర సమాజమును దేవుని యొక్క పరిశుద్ద వస్తువులను దూరముగా ఉంచెను. కేవలము అభిషేకించబడిన యాజకుడు మాత్రము లోపలికి పోవుచుండెను, అదియును సంవత్సరమునకు ఒక్కసారే. మీకు జ్ఞాపకమున్నదా? ఇప్పుడు దేవుడు తన స్వహస్తముతో, గమనించండి, పైనుండి క్రింది వరుకు, క్రింది నుండి పైన వరుకు కాదు — అది సుమారు నలుబది అడుగుల ఎత్తు — గమనించండి, క్రింది నుండి పై వరుకు కాదు గాని, మరియు పై నుండి క్రింది వరుకు — దేవుడు దేనిని చేసినాడని ఇది చూపుచున్నది — ఆ తెర రెండుగా చింపబడెను. ఎవరైనను వచ్చి ఆయన పరిశుద్దాత్మలో పాలుపుచ్చుకొన వచ్చును. చూచారా? అది సరి.
…పై నుండి క్రింది వరుకు; మరియు భూమి వణికెను, బండలు బద్దలాయెను;
సమాధులు తెరువబడెను; నిద్రించిన అనేక మ౦ది పరిశుద్దులు లేచెను.
వారు సమాధులలో నుండి బయటికి వచ్చి ఆయన లేచిన తరువాత పరిశుద్ద పట్టణములో ప్రవేశించి, అనేకులకు అగపడిరి.
MATT 27:52
40అక్కడే ఆ ఎన్నుకొనబడినవారు, ఆ వధువు; యూదా సంఘము అంతయు ఆ సమయములో బయటికి రాలేదు. వారందరు అదే బలి అర్పించిరి. వారందరు గొర్రేపిల్ల రక్తము క్రింద ఉండిరి, అయితే ఒక ఎన్నుకొనబడిన గుంపు ఉండిరి. మరియు ఆ ఎన్నుకొనబడిన గుంపు ఆ యొక్క సంభవము సంభవించినప్పుడు దానిని నిజముగా నమ్మిన వారు వారు ధృఢముగా, నమ్మకముగా. ఇప్పుడు నేను "జయించుట" అను వాక్యము నొద్దకు వచ్చుచున్నాను; ఇప్పుడు దానిని పట్టుకొనుడి. ఈ యొక్క జయించిన ప్రజలు, ఇతరులవలె నిజాయితిగా అదే బలిని సమర్పించిరి, అయితే నిజాయితిగా సమర్పించిరి, వారు ఈ లోక కార్యములను జయించిరి, ఎప్పుడైతే పాపపరిహారము వారి కొరకు సరిగా జరిగినప్పుడు — వారు ఆ సమయము వరకు పరదైసులో ఉండిరి — ఆ సమయములో వారు జయించిన వారై విశ్రాంతి పొందుచు, నిద్రించుచుండిరి (చూచారా?) — వారిలో అనేకుల యొక్క శరీరములు మన్నులో నిద్రించుచుండిరి. (చూచారా?) నిద్రించుచుండిరి…
1COR 15:51•
1THS 4:16•
REV 20:5
41మరియు మనకు సమయము ఉన్న యెడల దానియేలు యొద్దకు తిరిగి పోవుదుము. ఎప్పుడైతే దానియేలు, ఆ ఎన్నుకొనబడిన అతను జయించిన అతను… మరియు అతడు చెప్పెను, "పుస్తకమును మూసివేయుము దానియేలూ, నీవు నీ వంతులో విశ్రాంతి నొందెదవు. అయితే తన ప్రజల కొరకు నిలుచు అధిపతి వచ్చినప్పుడు, నీ వంతులో నీవు నిలిచెదవు. ఇదిగో ఇక్కడే దేవుని యొక్క ప్రవక్తయగు దానియేలు కడపటి కాలము వచ్చుటను చూచెను. మరియు అతడు చెప్పెను, "దానియేలూ, ఆ రోజు నీవు నీ వంతులో నిలిచెదవు." మరియు ఇక్కడ అతడు వచ్చెను, ఇశ్రాయేలు అంతయు కాదు, అయితే వధువుతో పోల్చబడిన ఇశ్రాయేలీయులు మాత్రమే.
ఇప్పుడు, తక్కిన ఇశ్రాయేలీయులు అందరికి పునరుత్థానము జరుగు వరుకు రారు.
DAN 12:9,13
42మరియు ఇప్పుడు, ప్రభువైన యేసుక్రీస్తు యొక్క రాకడలో, ఆయన యొక్క రాకడను ప్రేమించువారు, దాని కొరకు జీవించు వారు, అతడు ఆకాశములో అగుపించునప్పుడు, క్రీస్తునందు మృతి పొందిన వారు లేచి మరియు వారు ఒక క్షణములో మార్పు చెందెదరు. తక్కిన వారికి దానిని గూర్చి తెలియదు. గుర్తుంచుకొనుడి, నగరములో చాలా మందికి వారు కనబడిరి. చూడండి, ఎత్తబడుట మరియు అలాగే ఉండును. మనము ఒకరినొకరము చూచు కొందుము మరియు మనము వారిని చూచెదము. ప్రప౦చములో తక్కినవారు, వారిని చూడరు. ఆ సమయము కొరకు కాచుకొని రహస్యముగా పైకి ఎత్తబడెదము, మరల మహిమకరమైన ఆ వెయ్యేండ్ల పరిపాలన కొరకు భూమిపైకి మరల వచ్చెదము. మరియు అది ఆ వెయ్యేండ్ల పరిపాలనలో చనిపోయిన ఆ మిగిలిన వారు వెయ్యేండ్లు జీవించరు.
43మరియు అటు తరువాత అందరి యొక్క పునరుత్థానము జరుగును, అక్కడే ఇశ్రాయేలీయులు౦దురు…
అక్కడ మరియు గమనించిన యెడల, 12 అపొస్తులులు, 12 గోత్ర పితరులు, అందరు అక్కడ కనబడెదరు. మరియు అక్కడికి ఇంకను పోలేదు, ప్రభువు చిత్తమైన యెడల బైబిలులోని ఆ కార్యముల యొద్దకు పోయెదము, ఏ విధముగా సూర్యకాంత పద్మ రాగముల గోడలు, మరియు పన్నెండు రాళ్ళు, పన్నెండు ద్వారములు, పన్నెండు పునాదులన్నియు అక్కడ వర్ణించబడి యున్నది. ఇక్కడే ఆ పన్నెండు సింహాసనముల పై వారు కూర్చుండి, వారే ఆ రోజులలో వర్తమాన దూతలుగా ఉన్నవారు, వర్తమానమును నిరాకరించిన వారిపై న్యాయ తీర్పును తెచ్చినవారు. ఆమెన్! ఆ గొప్ప ఘడియ అక్కడే వచ్చుచున్నది.
అవును, ఎటువంటి రోజు, ఎటువంటి సమయములో మరియు మనము జీవించుచున్నాము. సంఘమా, మనము ఏ విధముగా మనలను పరిశోధించుకొనవలయును. మరియు ఇప్పుడు మనము రాబోవు సంగతులను గూర్చి మాటలాడు కొనుచున్నాము, ఇంకను జరుగబోవు సంగతులను; మరియు ఈ రోజు ఇక్కడ మనము నిలిపి మనము విశ్వాసములో సరిగ్గా ఉన్నామో లేమో అని పరిశోధించు కొనవలసిన వారమై యున్నాము.
GEN 7:13•
MATT 24:37•
LUKE 17:24
44ఇప్పుడు, మనము కొద్ది నిమిషములకు జయించిన వారిని కొద్ది మందిని గూర్చి ధ్యానించెదము. యేసుక్రీస్తు ఈ దినములను నోవాహు దినములతో పోల్చిన విధముగా. నాకు ఇంకను పది నిమిషములుండవలసి యున్నది; మరియు నాకు ఇంకా అది అర్ధగంట. నేను మొదటి పేజీని ఇప్పుడే మొదలు పెట్టాను. మరియు వాటిలో కొన్నింటిని వదిలి నేను…
గమనించండి! నోవాహు దినములలో, ఈ దినమునకు మాదిరిగా ఉన్నది యేసు దానిని గూర్చి చెప్పెను. "నోవాహ దినములలో జరిగినట్లు మనుష్యకుమారుడు వచ్చు దినములలో జరుగును." నోవాహు దినములలో వలె మనుష్యకుమారుడు వచ్చునప్పుడు జరుగును. గమనించండి, జళ ప్రళయమునకు ముందు లక్షలకు లక్షలుగా జనులు ఉన్నప్పటికిని, జయించిన వారు ఎనిమిది మంది. జయించిన ఆ ఎనిమిది మంది వారు నిజముగా, నిష్కళంకముగా జయించిరి. అక్కడ నోవహు ముగ్గురు కుమారులు, మరియు వారి భార్యలు, మరియు నోవాహు అతని భార్య. సరియైన సమయములో ఆ ఓడలో ప్రవేశించిన వారు ఎనిమిది మంది జయించిన వారు. వారు ఏ విధముగా దానిని చేయగలిగిరి? వారు దేవుని వాక్యమునకు చెవి యొగ్గిరి. వారు ద్వారమునకు వెలుపల పట్టబడ లేదు. ద్వారమునకు లోపల పట్టబడియున్నారు.
LUKE 17:26
45ఓ, నా ప్రియ స్నేహితులారా, ఆ ద్వారము మూయబడనీయకుడి. యేసు చెప్పెను, "ఆ దినములలో ఉన్న విధముగా మనుష్యకుమారుని రాకడయును ఉండును (వందనములు - సోదరుడా) — మనుష్యకుమారుని రాకడయును ఉండును." ఇప్పుడు, ఎవరైనా ద్వారమునకు వెలుపలకు చిక్కుబడి ఉన్నయెడల. వారిలో అనేకులకు మంచి ఉద్దేశము ఉండియుండ వచ్చును, "మరియు ఏదో ఒక రోజు అటువంటి కార్యము సంభవించినయెడల, మనము సోదరుడు నోవాహుతో లోనికి పోయెదము, 'ఏలయనగా అతడు మంచి వ్యక్తి.'" అయితే మీరు చూచిన యెడల, అది ఎనిమిది మందిని మాత్రమే లోపలికి తీసికొని రాగలిగెను.
ఇప్పుడు కుణ్ణంగా ఆలోచించుడి, మీరు ఇంకనూ బుద్దిహీనముగా ఉన్నయెడల, శీఘ్రముగా లోనికి ప్రవేశించుడి, అతి త్వరగా, ఏలయనగా ఏ క్షణములోనైనను ద్వారము మూయబడ వచ్చును.
MATT 24:37•
1COR 12:13
46దేవుని యొక్క ఏర్పాటులో ఎల్లప్పుడు ఒక మందసము యుండెను. నోవాహ దినములలో తన ప్రజలను రక్షించుటకు ఒక మందసము వుండెను. ధర్మశాస్త్రము దినములలో ఒక మందసము వుండెను, సాక్ష్యపు గుడారము ధర్మశాస్త్రపు దినములలో ఉండెను. వారు ఆ మందసమును ఆనుసరించిరి, మరియు ఇప్పుడు మూడవ సారిగా, నోవహు కాలము వలె, లోతు కాలము వలె, మరియు ఇప్పుడు ఒక మందసము వున్నది, ఆ మందసము ఒక సంఘశాఖ కాదు, లేక నీవు చేయు మంచి కార్యములు కాదు; అది ఒకే ఆత్మ ద్వారా. రోమా 8:1: దేవుని రాజ్యములో ఒకే శరీరములోనికి మనమ౦దరము బాప్తిస్మము పొందియున్నాము, ఒకే ఆత్మీయ బాప్తిస్మము. ఎంత మంచి, ఎంత చెడు ఎలా ఉన్నను పరవాలేదు. పరిశుద్దాత్మ బాప్తిస్మము ద్వారా మీరు ఆ రాజ్యములో ఉన్నారు. చూశారా? మీరు జయించుటకు అదొక్కటే మార్గము. జయించు వారందరూ చిందించబడిన రక్తము క్రింద ఉన్నారు, ఏలయనగా మీకు మీరుగా జయించలేరు. మీ కొరకు ఆయనే జయించును. మీరు విశ్రాంతి….
"బ్రెన్హాం సోదరుడా, మరియు అక్కడ నేను ఉన్నానని నేనెలా తెలుసుకొనగలను?" మీరు జీవించుచున్న జీవితమును గమనించండి. బాగుగా అన్ని కోణములలో చూడుడి. దానంతట అదే మీ యొద్ద నుండి పోయినదని గమనించి చూడుడి. లేక మీరు చాలా కష్టపడి మరియు లాగవలయునా (చూశారా?), ఆ విధముగా చేసిన మీరు మీ సొంత ప్రయాసముతో చేయుచున్నారు. అయితే ఆ విధముగా చేయుటకు ప్రయత్నించకుడి.
47ఏ విధముగా అనిన, చిన్న బిడ్డ చేతిని చొక్కా చేతుల రంధ్రములో దూర్చలేడు. (మీరు చూచారా?) ఆ చిన్న బిడ్డ పైకి క్రిందికి మరియు అన్ని విధముల ప్రయత్నించుచుండును. చూశారా? అతడు చేయలేడు. (చిన్న పసిబిడ్డ తన చేతులను తానుగా చొక్కాయి రంధ్రములో చేతులు వదల లేడు). "నీపై చొక్కా నీవే వేసికొనుము హనీ," అతడు చేయలేడు. అతడు తన చిన్న చేతులను పైకి, క్రిందికి ఎత్తును. మీ యొక్క నిబ్బరమైన చేయి దానిని చేయుటకు కావలయును. మరియు ఓ, ఎంత సంతోషముగా నేను నా చేతిని తండ్రికి సమర్పించి చెప్పెదను, "యేసు ప్రభువా, దానిలోనికి పోలేను. మీరు నాకు సహాయపడుడి. నాపై చొక్కాయి (నీతి అను వస్త్రము) వేయుడి. నేను ప్రయత్నించుటను వదిలి వేయుచున్నాను." మరియు ఆయనే దాని చేయనిమ్ము.
48ఆ చిన్న బిడ్డ ప్రయత్నించునో చూడుడి, "ఓ నేను చేయగలను; నేను చేయగలను." మరియు అతడు అన్ని చోట్ల ఉండి, అతడు చేయలేడు. మీరు చేయలేరు; నేను చేయలేను. అయితే మనము గట్టిగా ఆయనను పట్టుకొని ఆయన చేయుటకు అనుమతించిన యెడల, ఆయనకు పరిపూర్ణముగా సమర్పించుకొనినయెడల. "ఇక్కడ, ప్రభువా, నేను ఇక్కడ ఉన్నాను. నాకు-నేను ఏమి కాను. నేను సమర్పించుకొనుచున్నాను; నా చేతిని సరియైన స్థలములో మీరు పెట్ట౦డి." అదే గెలుపు; అదే జయించుట.
మీరు జయించవలసిన కార్యము ఏదనగా, మీ స్వయము (మీ సొంత మునస్సును) మీ తలంపులను, మీ కార్యములను మరియు మిమ్ములను పరిపూర్ణముగా ఆయనకు సమర్పించు కొనుటయే. ఆయన మీ కొరకు జయించును. ఆయనకు మార్గము తెలియును; మనకు తెలియదు.
ROM 9:16
49అయితే నోవాహు కాలములో ఎనిమిది మంది జయము పొందిరి, మరియు వారే లోపలికి వెళ్ళారు. వారు లోపల పట్టబడ్డారు. ఇప్పుడు చూడండి, స్నేహితులారా, వారు దీనిని టేపు చేయుచున్నారని నమ్ముచున్నాను. మరియు ఒక టెలివిజన్లో లేక టెలివిజన్లో కాదు, నన్ను మన్నించండి, టేపు, మీరు ఏమి చేసినను ఎవరు దీనిని ఇప్పుడు వినుచున్నాను, లేక ఇంక రాబోవు కాలములో వినినను, ఇప్పటికే ఆలస్యమైనది, మీకు మంచి అభిప్రాయములు ఉండవచ్చును, అయితే లోపలికి పట్టబడియుండుడి! ఇప్పుడు, కష్టపడి పోరాడకుడి. పొందగోరు వాని వలనైనను, ప్రయాసపడు వాని వలననైనను కాదు గాని, అయితే దేవుడు — దేవునికి అప్పగించుడి. మీరు పరిపూర్ణముగా ఆయనకు సమర్పించుకొని, మరియు సంపూర్ణమైన, ఇష్టపూర్వకమైన విశ్వాసముతో నడువుడి మరియు ఒక సంఘశాఖల నుండి ఇంకొక సంఘశాఖకు పోవుట కాదు. అక్కడికి, ఇక్కడికి పరుగెత్తుట కాదు. అది ఇది చేయుటకు ప్రయత్నించుట కాదు. అయితే మీకు మీరు దేవునికి సమర్పించుకొని ఆయనతో నడువుడి. సమాధానముతో, నెమ్మదిగా, ఏ ఆటంకము లేకుండా, ఆయనతో కూడా నడువుడి. అది సరియే.
వెనుకబడిన లేక విశ్వాసముతో కదలక నిలిచిపోయిన ఒక సహోదరునికి నేను చెప్పిన కార్యము అదే. చూశారా? "కేవలము ఆయనకు సమర్పించుకొనుడి. అతడు ఇక్కడ ఉన్నాడు, నీవు ఏమి చేసియున్నవో, ఎందువలన ఈ కార్యము ఏ కారణముచే నీవు చేసావో మరియు ఏ మార్గమున చేస్తున్నావో అన్నియు, నిన్ను గూర్చిన సమస్తమును ఆయనకు తెలియును; మరియు ఇప్పుడే నీవేమి చేయవలెనని ఆయన చెప్పియున్నాడు.'' నేను చెప్పితిని, "ఇప్పుడు నీవు చేయవలసిన ఒకే కార్యము, వెళ్ళి ఆయన చెప్పిన దానిని చేయుము. అది ఏమనగా, గడచిన వాటిని అన్నిటిని మరచి, రాబోవు దినములలో దేవుని యొక్క ప్రసన్నతతో ఆయన మహిమ కొరకు నడచి, జీవించుము."
జయించిన వారు ఎనిమిది మంది …..
1PET 1:7•
REV 3:21
50మరియు దానియేలు కాలములో సింహములు మరియు అగ్ని పరీక్ష యందు నిలిచి జయము పొందినవారు నలుగురు. ఇప్పుడు, మనము పరీక్షింపబడ వలయునని ఎదురు చూచుచున్నాము. వెనుక నున్న సోదరునికి అది ఒక మంచి పాఠముగా ఉన్నది. దేవుని యొద్దకు వచ్చువారు మొదలు పరీక్షింపబడవలయును! దేనితో పరీక్షింపబడవలయును? వాక్యముతో. అదే దేవుని పరీక్ష. మీరు దానిని నమ్ముచున్నారా? దేవుని యొద్దకు వచ్చువారు మొదట పరీక్షింపబడవలయును. ఒక నిజమైన బిడ్డ పరీక్షింపబడవలయునని అది చూపుచున్నది. (చూశారా?) మరియు పరీక్ష వచ్చినప్పుడు, మీకు ఒక శోధన వచ్చినప్పుడే గాని దానిని మీరు జయించగలరా లేదా అని చూచుటకే మీకు పరీక్షలు ఇయ్యబడుచున్నది. మరియు యేసు చెప్పెను, "జయించువానికి." పరీక్ష, మీకు జరుగు కార్యములలో పరీక్ష చాలా గొప్ప కార్యము. బైబిలలో ఈ విధముగా వ్రాయబడి యున్నది. అమూల్యమైన బంగారు కంటెను మనకు కలుగు శోధనలు శ్రేష్టమైనవి. ఇది పరీక్షింపబడుకాలము; ఇది… మనము శోధింపబడినప్పుడు, దేవుడు మనతో ఉన్నాడనుటకు అది చక్కని నిదర్శనము, దేవుని బిడ్డలందరు పరీక్షింపబడి, శోధించబడుదురు.
51మరియు దానియేలు, ఒక మనుష్యుడు, ఒక ప్రవక్త; షద్రకూ, మేషాకూ మరియు అబేద్నగోకు — దానియేలు ఒక ప్రవక్త, ఆ రోజులలో సంఘము యొక్క సంఖ్య అంతే, వధువు అని నా భావము. సంఘములో చాలా మంది ఉండిరి, సుమారు 20 లక్షలు అక్కడికి వెళ్ళారు. అయితే అక్కడ — జయించిన వారి సంఖ్య అంతే. జయించిన వారు పరీక్షింపబడిరి. జయించిన ప్రతివాడు పరీక్షింపబడ వలయును. మరియు వారు చెప్పినప్పుడు, "మీరు వాక్యములో చెప్పిన దానికి వెనుతీయుడి లేని యెడల వేడిమి గల అగ్ని గుండములో మీరు వేయబడుదురు." అయితే వారు వాక్యము తప్ప మిగతా అన్నిటిని నిరాకరించిరి.
1KGS 8:30•
DAN 6:7-12
52మరియు దానియేలుకు ఒక పరీక్ష ఇవ్వబడెను, అది అతడు వాక్యము చెప్పు కార్యమును చేయకూడదు, సొలొమోను ఈ విధముగా ప్రార్థించెను, ఆ మందిరమును ఆనుకొని, ఆ మందిరము వైపుకు తిరిగి ప్రార్ధించినయెడల పరలోకము నుండి దేవుడు ఆ ప్రార్థనలు విని అన్ని కార్యముల నుండి ఆయన వారిని విడిపించును. మరియు చెప్పిరి, (బబులోనులో) "ఏ మనుష్యుడైనను ఈ నిర్ణయించిన దినములలో ప్రార్ధించిన యెడల ఆ మనుష్యుడు సింహముల గుహలో పడద్రోయబడును. (మరియు మాదీయులు, పారసీకులమైన మేము మా చట్టమును తీసి వేయుటకును, మార్చుటకు వీలు లేదు)."
వారు అతనిని కపటోపాయము చేత బంధించుటకు వల పన్నిరి. ప్రవక్తకు (దానియేలు) అది తెలియునని నేను నమ్ముచున్నాను. అయితే అతనిని బంధించుటకు వారు వల పన్నిరి. అతడు విధేయుడై నడిచినాడు. అతడు ప్రార్థించు సమయము వచ్చినప్పుడు, అతనికి తెలిసియుండెను. తన స్వస్థలములో యెరూషలేములో బలిపీఠముపై దహనబలులు మండుచుండునని ఎరిగియుండెను. ఆ వేగు చూచువారిని గురించి దానియేలు భయపడలేదు. అతడు ఎవరికి భయపడక అన్ని తలంపులను తెరచి, బాహాటముగా దేవుని వైపు చేతులెత్తి ప్రార్థించెను. ఎందుకు? జీవించుటయో లేక మరణించుటయో, అతడు జయము పొందియుండెను; కావున అతడు పొందిన జయము లేక గెలుపు ఏ విధముగా ఉండినదనగా సింహములు కూడా ఆ విజయమును తినలేక పోయినవి. అతడు జయించెను.
షద్రకు, మేషాకు మరియు అబెద్నగో వారు ఏ విధముగా విజయమును పొందియుండిరనగా సింహము కూడా — ఆ అగ్ని వారిని దహించలేకపోయెను. మీకు తెలియునా జయమును కాల్చుటయో, తినుటయో, లేక ఏదైనను కఠినమైన కార్యము. చూశారా? కావున వారు దానిని పొందియుండిరి.
53నేను ఇంకొక గుణాలక్షణములను గూర్చి చెప్పబోవుచున్నాను. లోతు దినములలో — యేసు దానిని గూర్చి చెప్పెను — జయించిన వారు ముగ్గురే: లోతు అతని ఇద్దరు కుమార్తెలు. అతని భార్య సహితము జయించలేకపోయెను. ఆమె ప్రారంభించి బయటికి వచ్చెను; ఆమె ఒక మాదిరిగా ఉన్నది… (మనకు అధిక సమయము ఉండవలయునని కోరుచున్నాను; నాకున్న ముప్పై నిమిషములు ఎక్కువ సమయము ఉండవలయునని కోరుచున్నాను. ఇప్పుడు నాకున్న ముప్పై నిమిషములు అయిపోయినవి. చూచారా?) ఆమె చక్కగా సరియైన కార్యము చేసినది; ఆమె అన్ని వదిలి వచ్చెను. ఇప్పుడు, కొంతసేపు దీనిని గూర్చి మీకు చెప్పవలయునని యున్నాను.
మీలో అనేకులును ఎన్నో వదిలి వచ్చియున్నారు. బైబిలులో వెదికి కనుగొని అది సరియని తెలుసుకొనిన తరువాత మీలో అనేకులు అనేక కార్యములను వదిలి దేవుని కొరకు దృఢముగా వచ్చి నిలిచియున్నారు. సర్వోన్నతమైన దేవుడు నిరూపించుటను మీరు చూశారు — ఎవరో చెప్పిన నిరూపణను కాదు గాని, బైబిలు చెప్పుటను చూశారు, మరియు అదే ఇక్కడ చేయుచున్నది. అది సత్యమని మీరు చూచియున్నారు. కావున మీరు సొదొమను విడిచి వచ్చుటకు సిద్దముగా ఉన్నారు, సంఘశాఖలను వదిలి, ఒక సంస్థకు లేక శాఖకు మీరు అంటిపెట్టుకొనియున్న కార్యములను వదిలి, వ్రాయబడిన దేవుని వాక్యము ద్వారా తనను నిరూపించు క్రీస్తును పరిశుద్దాత్మ మూలముగా వెంబడించుచున్నారు. మరియొక విధముగా చెప్పవలయుననిన, మీరు శాఖకు బదులుగా పరిశుద్ద గ్రంధమును తీసుకొనియున్నారు. మీరు దానిని వెంబడించుటకు సిద్దపడియున్నారు.
54సరి, మీకు తెలియును లోతు భార్య అదే కార్యములను చేసెను. ఆమె లోతుతో బయటికి పోవుటకు సిద్దపడెను. ఆమె భర్తను వెంబడించుటకు, బిడ్డలను, తన ప్రియులను వెంబడించుటకు, అయితే ఆమె హృదయములో ఆ కార్యము లేదు. ఆమె ఇంకనూ ప్రప౦చమును ప్రేమించుచుండెను. కావున మీరు ప్రరంభించుదురు మరియు అయినను ఈ లోకము మీలో ఉండవచ్చును. చూడండి, ఆమె జయించలేక పోయెను. ఆమె ఆ మార్గముపైన ఉన్నప్పటికిని, ఆ కార్యము ఆమెను పడద్రోసెను. ఆమె కడపటి సారిగా దీర్ఘమైన, పెద్ద చూపు చూసినది. అక్కడే ఆమె చిక్కుబడెను. తిరిగి కూడా చూడకుడి! ఏ కోరికలు పెంచుకొనవద్దు! ముందుకు సాగుడి! కల్వరిపై మీ ధ్యాసనుంచి క్రీస్తు వైపు సాగిపోవుడి.
55చూశారా, ఆమె జయించిన స్త్రీలవలె ప్రారంభించినది. అయితే ఆమె జయించలేక పోయినది. ఓ, ఆమె సంఘశాఖలను వదిలి వేసినది. ఆమె వదిలినది. లోతుతో ఆమె సొదమను వదిలి బయటికి వచ్చినది, అయితే ఆమె వెనుదిరిగి తన వెంట్రుకలను కత్తిరించు కొనవలెనని కోరినది. అదేమిటని మీకు తెలియునా? ఆమె వెనుదిరిగి పోవలయునని కోరినది. ఆ పరీక్షలో ఆమె నిలువలేక పోయినది. ఆమె మరల వెనుదిరిగి తక్కిన వారు ఏమి చేయుచున్నారో చూడవలయునని అనుకున్నది. "ఓ, మీకు తెలియునా, నాకు మ౦చి స్నేహితులు అక్కడ ఉన్నారు. ఇదేదో ఒక చిన్న అడుగు వేయుట మాదిరి ఉన్నది. ఇది సరియో కాదో నాకు తెలియదు. ఈ మనుష్యుని మాటలుబట్టి, అతడు నా భర్తగా ఉన్నప్పటికిని, అయినను (చెప్పవలయుననిన మీ సంఘకాపరి మీకు ఆత్మీయ భర్తగా ఉన్నాడు. మీరు చూశారా ?) "ఇప్పుడు, అది సరియో లేక తప్పో అని నాకు తెలియదు. ఒక వేళ అతని బయల్పాటు సరికాదేమో?" మీరు పరిపూర్ణముగా తృప్తి చెందనియెడల, మీకు అది దేవుని వాక్యము అని పరిపూర్ణముగా తెలియదు, అందువలన మీరు పోలేరు. చూచారా? మీరు నిజముగా అమ్ముడుపోవలసి యున్నది. మీరు దానిని తెలుసుకొనవలసి యున్నది, ఏదో చెప్పుట కాదు, "సరి, అందరు చేయుటను చూచుచున్నానని, నేను ఒక సూచన చూచుచున్నానని" ఆ విధముగా వ్యక్తిగత బయల్పాటు కావలయును.
JOHN 6:49,58
56ఇశ్రాయేలు బయలుదేరి వచ్చినారని మీకు తెలియును… అదే కార్యమును నేను చెప్పి ఇక్కడికి తీసికొని రావలెననియున్నాను. ఇరువది లక్షల బలమైన గుంపుగా వారు బయలుదేరి కడపటికి ఇద్దరు మనుష్యులే మిగిలిరి. అది సరియే. వారు దేవుని క్రియలను చూచారు; వారు ఆత్మ ప్రత్యక్షతను చూచిరి, వారు ఐగుప్తులో గొప్ప అద్భుత కార్యములు జరుగుటను చూచారు. మరియు అవన్నియు చూచి వారు బయలుదేరి బయటికి వచ్చిరి, అయినను వారి హృదయములో అది లేదు. వారు జయించ లేదు. వారు కేవలము బయటకు వచ్చిరి. మరియు యేసు చెప్పెను, "వారు అరణ్య మార్గములో నశించి నిత్యముగా మరణించిరి." అట్లనగా, "శాశ్వతమైన వేరుపాటు." వారిలో ప్రతి యొక్కరు అరణ్యమార్గములో నశించి క్రుళ్ళిపోయారు.
NUM 13:30
57అయితే యిద్దరు మనుష్యులుండిరి, యెహూషువ మరియు కాలేబు. నిరూపించవలసిన సమయము వచ్చినప్పుడు — యెహోషువ, కాలేబుతో చేరి కేకలేసి మరియు చెప్పెను, "దాని జయించుటకు మన శక్తి చాలుననెను!" ఎందులకు? దేవుడు ఆ విధముగా చెప్పెను కనుక. మరియు వారు జయించిన వారు. వారు జయించిరి. ఆ యొక్క గొప్ప సమూహములో నిజముగా ఎన్నుకొనబడిన వధువును వాగ్దాన భూమికి నడిపించుటకు వారిరువురే ప్రత్యేకింపబడినవారై యుండిరి. యెహోషువ మరియు కాలేబులు సేనా నాయకుల వలె ముందు వరుసలో ఉండి వారిని నది దగ్గరకు నడిపించి, నది దాటి వాగ్దాన భూమికి తీసికొని పోయిరి. ఎందువలన? వారు వాక్యమును విశ్వసించుటవలన.
ఏది ఏమైనను.
58దాతాను లేచెను — దాతాను, కోరహు లేచి ఈ విధముగా చెప్పుటకు ప్రయత్నించిరి, "ఈ మనుష్యుడు మనందరికిపైగా ఉండవలయునని ప్రయత్నించుచున్నాడు; అతడు మిగత జనులందరి కంటెను మహా పరిశుద్దుడు," దేవుడు అతనిని సంపూర్ణముగా నిరూపించిన పిదప వారు చెప్పిరి. "మనము ప్రజలను గుంపులుగా చేర్చెదము. దానిని, దీనిని చేయదము. మనము మన సంస్థలను చేయుదుము; మనము చేసెదము." మరియు వారు మరణించి, నశించిరి. అయితే వారిలో ఆ ప్రజలు దేవుని వాక్యమును కలిగి యున్నవారు, మరియు దానితో నిలిచియుండిరి. వారు దానిలోనికి వెళ్ళారు. ప్రారంభించువాడు కాదు గాని; ముగించు వాడే. అనేకులు పరుగు పందెమును ప్రారంభించుదురు, కాని ఒక్కరు మాత్రమే దానిని ముగించగలరు. అనేక సంఘములు ప్రారంభించెదరు, అనేక గుంపులైన జనులు. ఒక గుంపు మాత్రమే ముగించును. అదే జయము పొందినవారు.
GEN 19:26•
NUM 16:3
59లోతు దినములలో. సరి, ఆమెకు తిరిగి చూడవలయునన్న ఆ గొప్ప కోరిక కలిగియుండెను. "ఓ, నేను ఫలానా-ఫలానా అక్కడే వదిలియున్నాను. ఎంతో ఉత్సాహమైన సమయములు గడిపియున్నాము. దానిని నేను ఎన్నడు మరువలేను," మరియు ఆగిపోయెను, నోవాహు దినములవలె. ఆమె ఆగిపోయెను, దయలేకుండా మరియు నశించెను. ఆ గడ్డ ఇంకనూ ఈ రోజు అక్కడే ఉన్నది. వారు చెప్పుదురు — నాకు తెలియదు — దానిలో నుండి ఒక చిన్న తునక మీరు విరిచినయెడల, మరల అది పెరుగును, ఒక ఉప్పు స్తంభము. "సొదొమ, గొమొర్రా" పటమును మీరు ఎప్పుడైనా చూచిన యెడల మీరు అక్కడ నిలిచి యున్న నిజమైన ఉప్పు స్తంభమును చూచెదరు.
ఇప్పుడు, ఉప్పు స్తంభమునకు మరియు అగ్ని స్తంభమునకు వ్యత్యాసమున్నది. అవును.
60ఇప్పుడు బాప్తిస్మమిచ్చు యోహాను కాలమును గమనించండి. బాప్తిస్మమిచ్చు యోహాను కాలములో జయము పొందిన ఆరుగురిని కనుగొనవచ్చును. ప్రతియొక్క తరము నందు జయము పొందినవారు ఉండిరి. యోహాను సమయుములో వారికి ఆరుగురు ఉండిరి; వారు యోసేపు మరియు మరియ, జెకర్యా మరియు ఎలీజబెత్, సుమెయోను మరియు అన్న, ఒక పురుషుడు మరియు ఒక స్త్రీ, ఒక పురుషుడు మరియొక స్త్రీ, ఒక పురుషుడు మరియు ఒక స్త్రీ. చూశారా? క్రీస్తు మరియు సంఘమునకు మాదిరి — క్రీస్తు మరియు సంఘము, క్రీస్తు మరియు సంఘము, క్రీస్తు మరియు సంఘము. చూశారా?
ఒక సహజమైన మనష్యునితో ప్రారంభించుటను గమనించుడి. లేదు, యోసేపు. యోసేపు సహజమైన మనుష్యుడు, అతడేమై యున్నాడు? ఒక వడ్రంగి. అటు పిదప ఒక యూజకుడు, అతడేమై యున్నాడు? చూశారా? ప్రభువు యొక్క ఆలయములో ఒక సేవకుడు, జెకర్యా. మరియు అక్కడ నుండి సుమోయోను, ఒక ప్రవక్త, మరియు ఒక ప్రవక్తి. చూడుడి, "నీతికరణ, శుద్ధికరణ, పరిశుద్ధాత్మ బాప్తిస్మము." ఆమెన్! మీరు దానిని చూచుట లేదా? పరిపూర్ణముగా. ఆరుగురు జయించిరి. మరియు మిగిలిన వారందరు వారి బలులను అర్పించిరి మరియు అన్ని కార్యములను చేసిరి, అయినను వీరు ఎన్నుకొనబడిన వారు. వారు జయించిరి.
61గమనించండి, ఒక్కొక్క సంఘకాలము అదే జయము పొందుట - ఒక్కొక సంఘకాలములోను కొందరు ఆ కాలములోని శోధనలను జయించుచుండిరి. నా యొద్ద లేఖనములున్నవి; దానిని ధ్యానించుటకు సమయమున్నదని నేను అనుకొనుట లేదు. అయితే మనకు తెలియును… ఒక్కొక్క సంఘ కాలములోను. ఇప్పుడును అదే విధముగా, అది ఎట్లనిన ఎవరో ఒకరు…
చూడుడి, నేను ఆరంభములో చెప్పిన విధముగా, మీరు పుట్టినప్పుడే ఓడిపోయిరి. మరియు ఆ జన్మ జీవము నొద్దకు మిమ్ములను తీసికొనిపోదు, ఎందుకనగా మీరు ఓటమిలో జన్మించిరి. మరియు మీరు ఓడిపోయిన లోకములో, ఓడిపోయిన ప్రజల మధ్య - మీకున్న ఓడిపోయిన మతశాఖల మధ్య, ఓడిపోయిన సంఘశాఖల యందున్నారు. మీరు ఏదో ఒక మార్గమున గెలుపు యొద్దకు రావలసియున్నది.
62ఇది ఒక లిల్లీ పుష్పము వలె వున్నది. ఉన్న చాలా అందమైన పుష్పములలో అది ఒకటని నేను తలంచుచున్నాను. రెండు తెగలకు చెందిన కాలా లిల్లీ మరియు కొలను లిల్లీలు అంటే నాకు చాలా ఇష్టము. కొలను లిల్లీ లేక నీటి లిల్లీ పుష్పము కంటె అందమైనది ఉన్నదని నేను అనుకొనుట లేదు. దాని యొక్క ప్రకాశము ఎంత బాగుండును. అదెక్కడ నుండి వచ్చినది? అది ఒక కొలను బురదలో, రొంపిలో అడుగున ఉన్న ఒక చిన్న విత్తనము. మరియు ఆ చిన్న విత్తనములో ప్రకాశించెడి ఆ గుణములు దానిలోనే ఉన్నవి. అది ఆ బురదలోనే ఉన్నప్పుడు. అయినను అది ప్రతిరోజు శ్రమపడవలసి యున్నది. దానికి తెలుసు ఏదో ఒకటున్నదని. అది నల్లగా ఉండును; అది మురికిగా ఉండును; అక్కడ రోత ఉండును. అది బంకమన్ను, ఆ బంక మట్టిలో ఆ విత్తనము జీవించుచున్నది. అయినప్పటికిని ఆ లిల్లీ (కలువ) ఆ బురద నుండి వచ్చి వెలుతురులో తన తలను నిటారుగా నిలిపి ఇంత కాలముగా దానిలో దాగియున్న దానినంతటికిని ప్రత్యేక పరచుచున్నది.
ఒకప్పుడు పాపములో ఉన్న ఒక జయించిన అతను, ఒకప్పుడు తప్పుడు కార్యములను చేసినాడని నేను తలంచుచున్నాను — దానిని గూర్చి ఇప్పుడు చింతించకండి — ఒకప్పుడు తప్పుడు కార్యములను చేసెను. ఇప్పుడు, ఏల మరలా ఆ కొలను వైపు చూచుచున్నారు? చూడుడి, మీలో ఉన్న…
63దేవుడు తన యొక్క ముందుగా ఏర్పాటునుబట్టి (చూశారా?) ఆ విత్తనమును జీవములోనికి తెచ్చెను, మరియు తననుతాను వ్యక్తపరచుచున్నది (చూశారా?), జీవమునకు వచ్చుట. వాటన్నిటికి పైన అది జయము పొందినది. చూడుడి, అది క్రింద తన్ను బయలుపరచకోలేదు. అది బయటికి వచ్చినప్పుడు తన్నుతానే బయలు పరచుకొనెను. అదే విధముగా మీరు మీ పాపములో, మరియు వ్యభిచారములో, మరియు అనేక ఇతర కార్యములలో మీరు జీవించునప్పుడు, మీరు మిమ్ములను బయలు పరచలేదు; అయితే ఒక విత్తనము దానిలో ఉండెను. మరియు ఆ విత్తనము జీవములోనికి వచ్చుటకు ఒక అవకాశము ఇవ్వబడెను. మరియు ఇప్పుడు మీరు యేసుక్రీస్తు సన్నిధిని ఉన్నారు, ఆ సూర్య కాంతితో ఉన్నారు. మీరు ఆదిలో ఉన్న విధముగా మీరు పైకి తీయబడిరి. నేను దేనిని గూర్చి చెప్పుచున్నానో గ్రహించుచున్నారా? మీరు ఆ వెలుగును చూచితిరి. మీరు విశ్వసించితిరి. మీ యొక్క హృదయమును మీరు తెరచియుంచిరి, మరియు ఇప్పుడు మీరు ఒక లిల్లీ పుష్పము.
MATT 6:29•
LUKE 12:27
64లిల్లీ (కలువ) పుష్పముపై నా ప్రసంగమును గుర్తుంచుకొనుడి: గౌవరప్రదమైన. లిల్లీ, అతడు ఎంత కష్టపడినను. అతడు వడుకను అక్కర లేదు, అయినను సాలోమోను తన సమస్త వైభవములో వీటిలో ఒక్క దానివలెననైను అలంకరింపబడలేదు. అతని (లిల్లి) వైపు చూడండి. అతడు పైకి ఎత్తబడెను… అతని కొరకు ఏమియు ఎత్తికొనలేదు. లిల్లీ తనను గూర్చి ఎప్పుడు చింతించదు. అతడు ఏమి చేయును, తన అందమును బయటికి వెదజల్లును. అతని జీవితము, ఇతరులు చూచుటకుగాను. అతనిలో ఏమున్నది, బురదలో ఉన్నప్పుడు అతనిలో నున్న కార్యమును అతని మహిమ చూచేలాగ అతని జీవితము బహిర్గతమగుచున్నది. ఇప్పుడు అతడు పైన ఉన్నాడు; అదే జయించిన అతను. అతడు బురదను జయించెను. అతడు లోక కార్యములను జయించెను, మరియు ఇప్పుడు అతడు చాలా తేటగా తన్నుతాను వెల్లడించుచున్నాడు. ప్రతి యొక్కరు అతని వైపు చూడవచ్చును, అతని జీవితమును, మీ యొక్క వ్రేలును అతని పై పెట్టలేరు. చూడండి, అతను నిజముగా జయించినవాడు. ఇప్పుడు అతనిని గురించి మీరేమి చెప్ప లేరు. అయితే చెప్పుదురు, "బురద నుండి బయటికి వచ్చెను." అయితే ఇప్పుడు అతడు బురద లోవల లేడు; అతడు దానిపై నున్నాడు. ఆమేన్! అతడు ముందు ఏ విధముగా ఉన్నాడని మీరు ఎత్తి పొడవలేరు. అతడు ఇప్పుడు ఏమైయున్నాడు? అతడు పైన ఉన్నాడు.
అప్పుడు తేనెటిగ వచ్చి చెప్పును, "అది అద్భుతమైన సువాసన. నేను వెళ్ళి నా వంతు పొందెదను."
అతడు (ఆ కలువ) తన హృదయమును తెరచి, "రండి; నన్నునేను అర్పించుచున్నాను." అతని యొద్ద నుండి సమస్తము తీసికొనబడుచున్నది. చూచారా? అతడు ఒక నిజమైన కాపరి. అతడు దేవుని యొక్క మహిమను వెల్లడి పరచుచున్నాడు, మరియు అతడు ఎక్కడ నుండి వచ్చియున్నాడో గమనించి చూడండి. ఆ విధముగా చేయుటకు అతడు జయించవలసియున్నది.
JOHN 13:4,5
65ఒకప్పుడు అతడు లేక ఆమె చిన్న వయస్సులో అందముగా, చక్కగా ఉండిరి. వారు అనేక విధములైన శోధనలు ఉండెను, కాని వాటిని వారు జయించిరి. చూచారా? వారు జయించిరి; ఇప్పుడు వారు క్రీస్తు యొక్క నిజమైన అందమును వారి జీవితములో వెల్లడిపరచుచున్నారు.
గమనించండి, బురదలో నుండి తననుతాను వ్యక్తపరచుకొనెను. ఏ విధముగా చేయవలయునని యేసు మనకు ఉదాహరణగా ఇచ్చియున్నాడు. ఇప్పుడు, మనము ఏ విధముగా జయించవలయునో తెలిసికొన గోరుచున్నాము. యేసు ఏ విధముగా చేయవలెనో మనకు చెప్పియున్నాడు. అణకువను చూడుడి, తువాలు తన నడుమునకు చుట్టుకొని మరియు శిష్యుల యొక్క పాదములను కడిగి మరియు వాటిని తుడిచెను. పరలోకమందలి దేవుడే తన్నుతాను తగ్గించుకొనెను.
మనము తగ్గించుకొనుటకు ఇష్టపడుట లేదు. అందువలననే స్త్రీలు వారి తల వెంట్రుకలు పెంచుటకు ఇష్టపడుట లేదు. కారణము ఏమనగా గౌరవించతగిన స్త్రీవలె దుస్తులు ధరించుటకు వారికి ఇష్టము లేదు, పురుషులు అదే విధముగా వారికి ఇష్టము లేదు. చూడుడి, అదే కార్యము… వారు చేయరు… వారు చిన్నబుచ్చుకొందురు. అయితే యేసు నిరంతరము)… ఆయన ఏమైయుండెనో చూడండి. గొప్పతనము (నేను ఒక కార్యమును చెప్పబోవు చున్నాను) — గొప్పతనము తన్నుతాను తగ్గించుకొనును. కృప తనను తగ్గించుకొనును — గొప్పతనము.
66నేను గొప్ప వారిని సంధించు అవకాశములు పొందియుంటిని. మరియు కొందరు మనుష్యులు దుస్తులు మార్చుకొని వారి జేబులలో ఏబది సెంట్లు గలగల అని శబ్దము చేయుచు, వారి యొద్ద చాలా డబ్బు వున్నట్లుగా చూపించుకొనుచు, డాంభికముగా , అటువంటి మనుష్యులు వారు ఏమిలేనివారై యుండియు అతడేదో గొప్పవాడని అనుకొను చుందురు. అయితే నేను గొప్ప వారితో నేను నిలిచియున్నాను, గొప్ప మనుష్యులతో వారు చినిగిన చేతులతో మణికట్టు దగ్గర మడిచి కుట్టిన అంచులతో మరియు వారు మీరు గొప్పవారని మీరు అనుకొనేలా వారు ప్రవర్తించుదురు. చూశారా, అణుకువయే గొప్పతనము. సంఘమా, దానిని మరువవద్దు. గొప్పతనము అనుకువలో బయల్పడును, నీవు ఏ విధముగా చక్కగా ఉన్నను… ఇప్పుడు మురికిగా అని నేను ఆ అర్ధముతో చెప్పుట లేదు; ఆత్మలో దీనత్వము. చూశారా? ఏదో బయటికి పోయి, కడుగుకొని శుభ్రముగా ఉండుట అని అర్ధము కాదు. అది… మీరు దానిని చేయవలెను, అది మీకు తెలియును. చూచారా? అయితే నేను వినయము గూర్చి, నిజమైన అణకువను గూర్చి మాటలాడుచున్నాను, ఏదో నటించుట కాదు, ఒక నిజమైనది అది. అది నిజమైన అణకువ.
MATT 26:61•
MARK 14:58
67యేసు ఏ విధముగా చేయవలెనో మనకు చెప్పెను. ఆయన జయి౦చెను. అనగా….. "అర్ధము పరీక్షకు నిలువబడుట," (అది సరియే!) ఆ పూర్వకాలపు పరిశుద్దులు చేసిన విధముగా, యేసు చేసిన విధముగా. ఆయన శత్రువుల మధ్య ఆయన పరీక్షకై నిలిచెను. ఆయన పరీక్షింపబడిన కార్యములన్నింటికి ఆయన ఎదురు నిలిచెను. ఆయనే మెస్సీయా అయినందువలన వ్యాధులును ఎదుర్కొనినప్పుడు, వారిని ఆయన స్వస్థపరచెను. మరణము ఎదుర్కొనినప్పుడు, ఆయన దానికి మరల జీవములోనికి తెచ్చెను. కల్వరిలో ఆయన స్వంత మరణములో, ఆయన తానే లోబడుటవలన దానిని జయి౦చెను. ఎందువలన? వాక్యము ద్వారా. "ఈ ఆలయమును మీరు నాశనమును చేయుడి, మరియు మూడు దినములలో నేను లేపెదను." వాక్యము ఆ విధముగా చెప్పెను. చూశారా? మరణము యొక్క ఉనికిలో ఆయన దానిని జయి౦చెను; ఆయన మరణమును జయించెను. పాతాళము ఉనికిలో ఆయన దానిని ఓడించి మరియు పాతాళమును జయించెను. అవును! సమాధి యొక్క ఉనికిలో ఆయన సమాధిని ఓడించెను. ఎందువలన? సమస్తమును వాక్యము ద్వారాను, లోబడుట ద్వారాను. ఓ, మై! ఆయనే నిజమైన మనుష్యుడు. మీకు ఉదాహరణముగా పెట్టుకొనుటకు అక్కడ ఆయనే. చూశారా? ఆయన సమస్తమును ఓడించెను, దానిని జయించెను.
JOHN 2:19•
HEB 4:15
68గమనించండి. శోధనలన్నియు ఆయనకే. మీకు అది తెలియునా? బైబిలు చెప్పుచున్నది, ఆయన సమస్త విషయములలోను మనవలెనే శోధింపబడినను, ఆయన పాపము లేని వాడుగా ఉండెను. అతడు త్రాగుడు ద్వారా శోధింపబడెను; అయన స్త్రీలతో శోధింపబడెను; ఆయన సమస్త కార్యముల ద్వారా శోధించుటకు ఉన్న అన్ని కార్యముల ద్వారా శోధింపబడెను; ఆయన ఒక మానవుడే. అయినప్పటికిని ఆయనపై ఒక్క మచ్చ కూడా మీరు పెట్టలేరు. అవునండి!
జయించుట అనగా "అపవాది యొక్క ప్రతి కుయుక్తులలో వాడిని గుర్తి౦చుట." అపవాది లేడని అనేక జనులు చెప్పుచుందురు; అది కేవలము ఒక తలంపు. దానిని మీరు నమ్ముటలేదా. నిజమైన సాతాను ఉన్నది. మనము ఇక్కడ ఉండుట ఎంత నిజమో, సాతాను నిజముగా ఉన్నాడు, నిజమైన సాతాను. మరియు వాడిని నిజముగా మీరు గుర్తించవలయును. వాడు సాతాను అని మీరు తెలిసికొనినప్పుడు మరియు వాడు నీకు విరోధముగా ఉన్నప్పుడు, మరియు అప్పుడు దానిని జయించుటకు మీలో ఉన్న దేవుడు, వానికంటె గొప్పవాడును మరియు బలవంతుడైనవాడని మీరు గుర్తించవలయును. మీలో ఉన్న ఆయన ఇంతకు ముందే వాడిని జయించెను, మరియు ఆయన యొక్క కృప వలన మీరు వాడికి సమానమైన వారు కారు, మరియు వానికంటె మీరు గొప్ప వారు. ఆమేన్! అక్కడే నిజమైన జయించుట.
మీరు గుర్తించినప్పుడు…
ROM 8:1•
1JN 4:4
69మీరు వెనుదిరిగి మరియు చెప్పిన, "నేను ఇది చేయుచున్నాను, అది చేయుచున్నాను." ఆ విధముగా అయిన యెడల, ఓ, ఓ, మీరు ఓడిపోయియున్నారు. అయితే క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షావిధియు లేదు. వారు శరీర ఇష్టప్రకారము నడువక, ఆత్మ ప్రకారము నడిచెదరు. అప్పుడు మీరు గుర్తించెదరు, మీరు జయము పొందినారని, వాడు సాతాను అని మీరు తెలుసుకొందురు. మీరు, నాకు వ్యాధి ఉన్నదని మరియు నేను దానిని వ్యాధి అని నమ్మను." ఓ, ఇది వ్యాధియే. సరి. మీకు కాన్సర్ వ్యాధి ఉన్నది; మీకు కాన్సర్ అని మీరు నమ్మరు; అది కాన్సర్. అది కాన్సర్. అయితే గుర్తుంచుకొనుడి, లోకములో ఉన్నవాని కంటెను మీలో ఉన్నవాడు గొప్పవాడు. మీలో ఉన్న పరిశుద్దాత్మ ఇంతకు ముందే ఈ కార్యమును జయించినాడని మీరు నమ్మవలయును. మరియు ఆయన నీలో ఉన్నాడు మరియు ఆయన ద్వారా జయించగలరు. అది ఖచ్చితముగా తెలివైన కార్యము. ఆయన ద్వారా మీరు జయించగలరు. ఖచ్చితముగా ఆ విధముగానే లేఖనములు వ్రాయబడియున్నది. జయించుట.
నేను త్వరపడవలయును. ఇప్పటికే నలబై-ఐదు నిమిషాలు అయిపోయినవి. ఇప్పుడు సమయము చాలా అగుచున్నది.
1JN 1:7
70గమనించండి, జయించుట. మీలో ఉన్న దేవుడు లోకములో ఉన్న వానికంటె గొప్పవాడు. మీలో ఉన్నవాడు (పరలోకపు దేవుడు) లోకములో ఉన్నవాని కంటే (ఈ లోకపు దేవుని కంటే) గొప్పవాడు.
వెలుగు ముందు చీకటి నిలువలేని విధముగా… వెలుగు ఉన్నప్పుడు చీకటి దాని ముందు నిలువలేదు… ఎంతటి చీకటి యైనను నేను లెక్కచెయ్యను, వెలుగు దానిని అణచి వేయును. అది నిలువ లేదు. దేవునికి మహిమ! మీరు వీలైనంత, మీరు కోరుకున్నంత చీకటిని తీసుకొని, వెలుగు ముందు నిల్చుటకు ప్రయత్నించండి. తర్వాత ఏమి జరుగునో చూడండి. మీలో ఉన్న ఆ ఒకటి వెలుగు. ప్రంచములో ఉన్నది చీకటి. కావున వెలుగు చీకటిని జయించినదని నిరూపించబడియున్నది. అదే విధముగా క్రీస్తునందున్న మనష్యుడు లోకములోని కార్యములను జయించి యున్నాడని ఎరిగియున్నాడు. (ఆమేన్) దానితో మీకు ఏ విధమైన బాంధవ్యము లేదు. మీరు స్వతంత్రులు. "ఆయన వెలుగులోనున్న ప్రకారము మనము వెలుగులో నడచినయెడల, మనము అన్యోన్యసహవాసము గలవరామై యుందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము మనలను సమస్త పాపముల నుండి పవిత్రులనుగా చేయును." అక్కడే మీరున్నారు.
1JN 4:4
71మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవానికంటె గొప్పవాడు. మీరు వెనుదిరిగి చూచినయెడల, మీరు ఖ౦డించబడివారై, మీరు ఇంకను లోకములో ఉన్నారు. అయితే మీరు దానికి పైగా జీవించినట్లైన, మీలో ఉన్న ఆయన చీకటి పైగా మిమ్ములను నడిపించెను. ఆ లిల్లీ పుష్పము వలె, ఆయన బురదలోనికి చీకటిపైగా ఉన్నాడు. ఆయన వెలుగులో ఉన్నాడు, ఆయన బురద నుండి పైకి రాకమునుపు ఆయనలో పెట్టబడి ఉన్న అందమును, అతడు ఇప్పుడు ప్రతిభి౦పజేయుచున్నాడు. ఆమేన్!
ఇప్పుడు, నేను గంతులు వేసి అరచు క్రైస్తవునిగా అనుభూతి చెందుచున్నాను. ఆదిలో దేవునిలో ఉన్నవన్నియు మరియు ఇప్పుడు బయటికి వచ్చుచున్నవి, జయించుట. అది పెంకును జయి౦చెను; అది బురదను జయించెను; జలములను అది జయించెను. అది సమస్తమును జయించి, జయించినదై దేవుని యొక్క సౌందర్యమును, మహిమను ప్రతిఫలించెను.
72ఆ విధముగానే ప్రతి విశ్వాసి చేయును. ఆ విధముగానే నోవాహు చేసెను. ఆ విధముగానే లోతు చేసెను. అదే మార్గము… అతను ఎటువంటి గందరగోళములో ఉన్నాడో గమనించండి. ఆ విధముగానే మోషే చేసెను. ఆ విధముగానే యొహూషువా చేసెను. ఆ విధముగానే దానియేలు చేసెను. ఆ విధముగానే షద్రకు, మేషాకు చేసెను. ఆ విధముగానే బాప్తిస్మమిచ్చు యోహాను చేసెను, జెకర్యా, ఎలిసబెత్ ఆ విధముగానే చేసిరి. ఆ విధము గానే సుమోయోను, ఆ విధముగానే అన్న, మరియు ప్రతి యొక్కొక్కరు చేసిరి. వారు వారి చుట్టవున్న బురదను జయించిరి, బురదలో చుట్టబడి యుండిరి, దానికి పైగా వారి తలలు పెట్టి దేవుని యొక్క మహిమను ప్రకాశింపచేసిరి. ఆ విధముగానే ఒక నిజమైన క్రైస్తవుడు చేయును.
MARK 1:13•
JOHN 15:7•
HEB 4:15•
1JN 4:4
73గుర్తించుకొనుడి, యేసు ఏ విధముగా అది చేయవలెనో మనకు చూపించెను. నలుబది రోజులు శోధన. యేసుక్రీస్తు, మనుష్యులెవ్వరు శోధింపబడని విధముగా, అధికముగా శోధింపబడెను. ఇప్పుడు, గమనించండి. ఆయన మనకు చూపించెను, ఏ విధముగా అది చేయబడెనని. (ఇప్పుడు, నేను ఇంకా కొద్ది నిమిషములలో ముగించెదను.)
చూడండి, ఆయన మనకు చూపించెను, ఏ విధముగా అది చేయబడెనని. ఏ విధముగా ఆయన దానిని చేసెను? వాక్యము ద్వారా? ఆ విధముగానే ఆయన చేసెను, ఎందుకనగా ఆయన వాక్యమై యున్నాడు. యేసు చెప్పెను, "నాయందు మీరును, మీ యందు నా మాటలను నిలిచియుండినయెడల…" మీరు మరల వాక్యము వైపుకు తిరుగుచున్నారు, వాగ్దానము చేయబడిన వాక్యము. ప్రతి క్రైస్తవునికి వాగ్దానము చేయబడిన వాక్యము ఏమిటి? "మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటె గొప్పవాడు." మరి నేనెలా జయించగలను? నేను కాదు, కాని మరి నాలో ఉన్న వాక్యము. వాక్యము దేవుడై యున్నాడు. అప్పుడు నేను ప్రంచములోని కార్యములను జయించగలను, ఏలయనగా వాక్యము నాలో ఉన్నది. "నా యందు మీరును, మీరు నాయందు నిలిచి యుండిన యెడల, మీకేది యిష్టమో అడుగుడి." పైకి వచ్చుటకు ముందుకు సాగుడి. మిగతా కార్యములవలె మీరు నిశ్చయముగా పైకి వచ్చెదరు. చూడండి? మీరు పైకి రావలసినవారై యున్నారు.
MATT 4:12•
LUKE 4:2
74నలభై రోజులు శోధనలలో, ఆయన దేవుని వాక్యము వలన జయి౦చెను. కొన్ని నిమిషములు ఒక కార్యమును నొక్కి చెప్పవలయునని కోరుచున్నాను. సాతాను ఆ శోధనలలో మూడు ప్రధాన కార్యములను ఆయనపై వేసెను. గమనించండి, ఎల్లప్పుడు అది మూడు సంఖ్యలో ఉండెను. దీనిని మరచి పోవద్దు. అధికమైనటు వంటి కార్యము నుండి స్వల్ప కార్యము వరకు సాతాను మూడు ప్రధాన కార్యములను ఆయనపై వేసెను. వాడి శక్తి మేరకు ఆయనను జయించుటకు ప్రయత్నించెను, అయితే ఆయన వాక్యమైయున్నాడు. ఆమేన్! ఆయన దేనిని ఉపయోగించెను? తననే, వాక్యము. సాతాను మూడుసార్లు తీవ్రముగా ఆయనపై పడినప్పుడు, ఆయన వాక్యముతోనే సాతాను సంధించెను. ప్రతి దాడిని, ఆయన వాక్యముతో జయించెను (ఇప్పుడు దీనిని గమనించండి!) గొప్ప కార్యము మొదలుకొని స్వల్ప కార్యము వరకు.
MATT 4:3,4•
MATT 16:13•
LUKE 4:3,4
75ఆయన యొక్క గొప్ప శక్తి ఉపయోగించవలెనని, వాడు ఆయనపై దాడిచేసెను. ఆయన వాక్యమని సాతానునికి తెలియును; ఆయన యొక్క స్థానమును సాతాను గుర్తించెను. అతడు ఆ విధముగా చేసినాడని మీరు నమ్ముచున్నారా? "నేను మనుష్యకుమారుడను." ఆయన యొక్క స్థానమును అతడు ఎరిగి యుండెను. అయితే ఆయన ఆకలి గొనినప్పుడు ఆహరము కొరకు ఆయన యొక్క శక్తిని తనకుతానే ఉపయోగించవలెనని సాతాను కోరెను. ఆయన యొక్క ఆకలిని ఆయనే తీర్చు కోవలెనని సాతాను కోరెను; ఆయన ఆకలితో ఉండెను. ఒక మనుష్యుడు ఆకలిగా ఉన్నప్పుడు, అతడు ఏమైనా చేయుటకు తెగించును. అతడు దొంగిలించును, బిక్షమడుగును, అప్పు చేయును, ఏమైనా చేయును. చూడండి, అతడు ఆ విధముగా ఆకలిగొని యుండెను. మరియు సాతాను ఆయనలో ఉన్న ఆ శక్తిని అతడెత్తుకొని తన కొరకై దానిని ఉపయోగించుకొనులాగున చేయుటకై తన మొదటి ప్రధాన అస్త్రమును అతనిపై ప్రయోగించెను. ఆయన తనపై ఆ శక్తిని ఉపయోగించుకొనలేదు. లేదు, ఇతరులపై దానిని వాడెను. అది సరియే. తన కొరకు కాదు గాని, ఇతరుల కొరకు దానిని ఉపయోగించెను; అది ఆయన కొరకు కాదు. అయితే ఆయన ఆ విధముగా ఉపయోగించుకొని యుండవచ్చును, ఆయన నిశ్చయముగా దానిని చేసియుండ వచ్చును.
PS 91:11•
MATT 4:4,7•
MATT 4:6•
LUKE 4:4,8•
LUKE 4:10
76అయితే సాతాను ఏ విధముగా లోబరచుకొనుటకు ప్రయత్నించునో చూడండి. మీరు సాతాను చెప్పు దానిని వినవలెనని కోరుచున్నాడు. ఆయన తండ్రి చెప్పిన దానిని చేసెను. అది సరి. అతడు చెప్పెను… ఎందుకు, సాతాను చెప్పెను, "ఈ విధముగా వ్రాయబడియున్నది, దూతలకు నిన్ను గూర్చి ఆజ్ఞాపించును…"
యేసు చెప్పెను, "నిజమే, అయితే ఈ విధముగాను వ్రాయబడియున్నది." అక్కడ మీరు గమనించండి. చూడండి, ఆయనెవరని అతడెరిగి యున్నాడు. సాతాను ఎరుగును… వ్రాయబడిన దానికంటెను తలంపులు చాలా లోతునకు వెళ్ళును. చూశారా, అది ప్రేరేపించును. ఆ విత్తనము దాని లోపల యుండెను (మీరు చూశారా?), అది నిజముగా అదే.
ఆయన చేసి యుండవచ్చును, ఆయన దానిని చేయలేదు. అయితే ఆయన సాతాను యొక్క ప్రతిపాదనలకు చెవియొగ్గ లేదు. ఇప్పుడు, ఇక్కడ ఒక మంచి కార్యము ఉన్నది. గమనించండి, మీరు దేవుని చిత్తమును నెరవేర్చుచున్నారని తలంచునప్పుడు, సాతాను మిమ్ములను తీసికొని తన ప్రతిపాదనలుగా చేయును, దానికి మీరు పడిపోవుదురు. అవునయ్యా! సాతాను నిజముగా చేయగలడు.
77ఇప్పుడు, ఉదాహరణమునకు మన సహోదరిలను తీసికొనెదము. వారు చక్కని వారు, మీరు (స్త్రీలు) వెంట్రుకలు పొడుగుగా పెంచుకొనినప్పుడు వారి యొద్దకు వచ్చి, మీరు గుర్తించలేదా, మీ యొక్క తల వెంట్రుకలు ఎంత చక్కగా ఉన్నాయో అని సాతాను పొగిడినప్పుడు, వారిలో ఒక విధమైన గర్వపు తలంపు వచ్చి, వారు హెచ్చైన వారనే తలంపు వారికి కలిగించును. పురుషులైన మీలో కొందరు నేను చెప్పిన దానిని గ్రహించారా. చూడండి, మరియు వాడు అదే విధమైన కార్యములను మీ ముందు కూడ పెట్టి గర్విష్టులుగా చేసిన విధముగా ఆ తలంపులను మీలోను కలిగించును. అది సరియే. చూడండి? మీరు దానిని జయించవలయును. మీరు దేవుని కొరకు జీవించుచున్నారని గుర్తుంచుకొనుడి. మీకు ఒకే ఒక లక్ష్యము, అది ప్రభువైన యేసుక్రీస్తు. యేసుక్రీస్తు కాకుండా వేరే ఏమైనా కూడా జీవితములో అది లెక్కలోనికి రాదు, ఆయన మాత్రమే. పిదప రెండవదిగా, నీ కుటుంబము; మూడవదిగా, నిన్ను గూర్చి నీవు తలంచకొనవలయును; అయితే మొదటి దేవుని కొరకు, పిదప నీ కుటుంబము కొరకు, దాని తర్వాత నీ కొరకు. మీరు మూడవ సంఖ్యలో ఉన్నారు, అదే మార్గము యొక్క అంతము. మిమ్ములను మీరు చివరగా పెట్టుకొనుడి; ఆయన ఆలాగు చేసెను.
JOHN 18:36
78ఆయనేమి చేసియుండి యుండవచ్చునో గమనించండి. చెప్పెను, "నేను నా తండ్రిని వేడుకొంటే ఇప్పుడే పన్నెండు సేనా వ్యూహముల కంటె ఎక్కువ మంది దూతలను నాకు పంపును, దానిలో ఒకడు ఈ ప్రపంచమును నాశనము చేయునని చెప్పెను." "ఈ లోకము నా రాజ్యమయితే మరియు నా ప్రజలు పోరాడియుందురు, అయితే నా రాజ్యము పైనున్న రాజ్యము." దానిని గ్రహించుడి. చూశారా, ఆయన ఆ విధముగా చేసి ఉండవచ్చును, అయితే ఆయన చేయలేదు. అయినను ఆయన సాతాను యొక్క కుయుక్తి తంత్రములకు చెవియొగ్గ లేదు.
ఇప్పుడు, ప్రజలు ఈ విధముగా చెప్పుటను మీరు వినియున్నారా, "దైవీక స్వస్థపరచువాడు ఉన్నాడని మీరు నమ్ముదురా… మీరు దైవీక స్వస్థపరులా… వెళ్ళి మీ దైవీక స్వస్థపరుని తీసికొని రండి; నా యొద్ద వ్యాధిగ్రస్తుడు ఒకడున్నాడు; అతనిని దైవీక స్వస్థపరుడు స్వస్థపరుచుటను నేను చూడవలయునని ఆశ పడుచున్నాను." చూడండి, అదే సాతాను? అతడు మీతో ప్రతిపాదనలు చేయుచున్నాడు. మీరు దేవుని మాట వినుటకు బదులు వాని మాటలు వినవలెనని ప్రయత్నించుచున్నాడు. అయితే ఒక నిజమైన దైవ సేవకుడు దేవునికి చెవియొగ్గి మరియు తండ్రి మొదట ఏమి చెప్పునో చూచును.
MATT 26:53
79ఆ చిన్న స్టాడ్స్క్లేవ్ శిశువు మాదిరి వారు కబురు పంపినప్పుడు, ఆ సోదరి స్టాడ్స్క్లేవ్ చెప్పెను, "సోదరుడా బ్రెన్హాం నేను జర్మనీ నుండి మాట్లాడుచున్నాను. అక్కడ అమెరికా సేనా దళమునకు చెందిన ఒక విమానము నన్ను ఒకే రోజులో జర్మనీకి తీసికొని పోయి, తిరిగి తీసికొని వచ్చుటకు సిద్దముగా ఉన్నది. అతడు ఒక అధికారి. మరియు ఆ బిడ్డ చనిపోయి అక్కడ వున్నది. మరియు ఆ పసి బిడ్డ తల్లి ఏడుస్తు చెప్పెను, "వినుడి! నాకు తెలుసును; ఆ రోజు ఉదయము చనిపోయిన బిడ్డను తన చేతులలో పట్టుకొని ఉన్న ఆమెను నేను ప్రత్యక్ష్యముగా అక్కడ నిలిచి చూచాను. మరియు సోదరుడు బ్రెన్హాం లేచి వచ్చి తన చేతులను ఆ చనిపోయిన బిడ్డపై ఉంచినప్పుడు దానికి జీవము వచ్చెను" అని ఆమె చెప్పి, "ఇది నా యొక్క బిడ్డ," బ్రెన్హాం సోదరుడా, మా కుటుంబములో ఇంత వరుకు ఏ మరణము సంభవించలేదు. చూశారా? మరియు ఈ చిన్న బిడ్డ ఒక ఉదయము వ్యాధి వచ్చి మధ్యాహ్నమే చనిపోయెను.
ఇక్కడ అనేకులు "ఈ బిడ్డ బ్రతుకును!" అని ప్రవచించుచున్నారు. మరియు ఆ విధముగా అనేకులు చెప్పుచు, ఓదార్చుచున్నారు.
నేను చెప్పాను, "సరి, అది బాగున్నది, సోదరి స్టాడ్స్క్లేవ్, కాని తండ్రీ ఏమి చెప్పునో నేను చూడవలయును" మరియు నేను అడవిలోనికి వెళ్ళి ప్రార్ధించితిని. మరల వచ్చితని, నేను మరలా అడవిలోనికి మరుసటి రోజు ఉదయము పోవులోపల ఆమె రెండు, మూడు సార్లు నన్ను ఫోనులో పిలిచి మాట్లాడెను. అయితే ఏమి కనబడలేదు.
డాక్టరు చెప్పెను "అది సరియే," అమ్మా, ఆ విధమైన విశ్వాసము నీకున్నయెడల, ఆ చిన్న బిడ్డను హాస్పిటల్ నుండి పంపించము. అక్కడనే ఉండనీ, మీరు ఆ బిడ్డతోనే (చనిపోయిన ఆ బిడ్డతోనే) ఉండుడి. అది పరవాలేదు."
స్టాడ్స్క్లేవ్ సోదరుడు ఆ సేన అధికారి యొద్దకు వెళ్ళి వారిని చూచిన పిదప వారు "అతనిని (బ్రెన్హాం గారిని) విమానములో తీసికొని వచ్చి మరల వదిలెదము," అని చెప్పిరి.
80ఆ రోజు ఉదయము జర్మనీకి తీసికొని వెళ్ళి రాత్రి లోపల తిరిగి వదులుటకు అక్కడ విమానము సిద్దముగా ఉండెను. జర్మనీలో ఉన్న హిదేల్బెర్గ్ ఆ బిడ్డ తిరిగి ప్రాణముతో లేచుట కొరకు. "దేవుడు నిశ్చయముగా దానిని చేయగలడు, అయితే ఆయన చిత్తము ఏమని మనము చూడవలయును" అని నేను చెప్పాను.
మరియు అక్కడకు (అడవి) వెళ్ళి రాత్రంతయు ప్రార్ధి౦చితిని; ఏమియు జరుగలేదు. మరల మరుసటి రోజు ఉదయము వెళ్ళి ప్రార్ధించితిని; ఏమియు జరుగలేదు. ఆ గదిలోనికి వెళ్ళి చూచినప్పుడు, ఆ వెలుగు తలుపు దగ్గరగా నిలుబడి చెప్పెను, "నీ చేతులు దానిపై పెట్టవద్దు. దానిని గద్దించవద్దు. అది దేవుని యొక్క హస్థము."
నేను ఫోనులో ఆమెతో మాట్లాడితిని; నీ బిడ్డను పాతిపెట్టుము అని సోదరి స్టాడ్స్క్లేవ్ తో చెప్పితిని. అది ప్రభువు హస్తము. అది దేవుని చిత్తము. ఆ బిడ్డ బ్రతికిన యెడల వేరే ఏదైనా జరిగియుండ వచ్చును. దేవుడు ఏ విధముగా నడుపునో ఆ విధముగా జరుగనిమ్ము. దాని కొరకు ఇప్పుడు ప్రయాసపడవద్దు. ఒక వేళ ఆ బిడ్డ బ్రతికినను, మీకు తెలియదు. దానిని అట్టే వదిలివేయుము.
జర్మనీ నుండి ఒక ప్రసిద్ధి చెందిన లూధరన్ ప్రసంగికుడు ఒక ఉత్తరము వ్రాసి ఈ విధముగా చెప్పెను, "ఏ విధముగా సోదరుడు బ్రెన్హాం గారిని అభినందించవలెనో నాకు తెలియలేదు, ఏలయనగా అతడు ఏమైనా చెప్పుటకు మునుపు దేవుని యొక్క ఖచ్చితమైన నిర్ణయము కొరకు వేచి యుండును. అది అంతే! దేవుని యొక్క నిర్ణయమును పట్టుకొనుడి. ఎవరు ఏమి చెప్పినను, అది ఏమైనను, సాతాను ముందు పెట్టు కార్యములకు లొంగవద్దు.
81మరియు సాతాను, "ఇప్పుడు తండ్రి యొక్కయు, కుమారుడు నామములో నీటి బాప్తిస్మము", అతడు దానికి మీరు ఆలోచించుటకు గాని కార్యములను మీ యెదుట పెట్టిన యెడల దానిని అట్టే వదిలి వేయుడి. దేవుడు వేరొక విధముగా చెప్పెను. మరియు "నీవు ఒక మంచి పురుషుడు, నీవు ఆ విధముగా చేయనక్కర లేదు. . నీవు ఒక మంచి స్త్రీ, నీవు ఆ విధముగా చేయనక్కర లేదు. నీవు ఆలాంటి కార్యములకు ఆలోచించ వద్దు. ఏదేమైనను, వాక్యము ఏమి చెప్పినను, వాక్యముతో మీరు నిలిచి యుండుడి. సాతాను యేసుపైన గొప్పగా పడినను యేసు మనకు ఉదాహరణను యిచ్చి యున్నాడు.
PS 91:12•
MATT 4:6•
LUKE 4:10,11
82మరియు రెండవ శోధనగా. నేను త్వరితముగా ముగించవలయును. (సమయము అతి వేగముగా పరిగెడుచున్నది). అతడు ఏమి చేయునో చూడవలయునని మరి ఇంకొక సారి ఆయనపై దాడి చేసెను. మరి ఆ విధముగా దేవుని సేవకులపై అదే విధముగా దాడి జరిపి వారేమి చేయుదురో చూడవలయునని యున్నాడు, "దేవునికి మహిమ. హల్లెలూయా, నేను విమోచింపబడినవాడను. నేను ప్రత్యేకమైన వాడిని చూశారా?"
"దేవాలయము పైకి ఎక్కి వచ్చి అక్కడ నుండి క్రిందకు దూకుము", ఆయనను ఆలాగు చేయమని సాతాను శోధించెను. ఇప్పుడు గుర్తించుకొనుడి. ఆయన శోధించబడెను. అది బహు కష్టముగా ఉండెను "నీవు ప్రజల మధ్య గొప్పగా ఉండవలయునని కోరిన యెడల ఈ దేవాలయముపై నిలబడి అక్కడి నుండి దూకుము" అని ఆయనతో చెప్పెను. చూచారా? "నీకు లేఖనములను ఇచ్చెదను దాని కొరకు, ఏలయనగా అది వ్రాయబడి యున్నది. "ఆయన నిన్ను గూర్చి తన దూతల కాజ్ఞాపించును. నీ పాదములెప్పుడైనను రాతికి తగుల కుండ వారు నిన్ను చేతులతో ఎత్తికొందురు." అతడు తన్ను తాను ఎవరని చూపించుకొను విధముగా, అతని అధికారము ప్రయోగించు లాగున .
ఏ నిజమైన దేవుని సేవకుడు ఆ విధముగా చేయడు. ఏ మనుష్యుడైనను తన రొమ్ము విరుచుకొని తానొక గొప్పవాడని, ఆ విధమైన కార్యములు చేసిన యెడల అతనిలో ఏదో తప్పున్నదని అర్థము. దేవుడు దానిని కోరలేదు. యేసు తననొక ఉదాహరణముగా ఉంచియున్నాడు. ఆయన చేసి యుండ వచ్చును. ఆయన నిజముగా చేసి యుండవచ్చును, అయితే ఆయన దానిని చేయలేదు. ఏ నిజమైన దేవుని సేవకుడు కూడ దేవుని శక్తిని ఉపయోగించకొని ఇతరుల కంటె గొప్పవాడని తనను చూపించుకొనడు.
EXOD 17:6•
NUM 20:8,11,12
83మోషే దానిని చేసినప్పుడు మీకు గుర్తున్నదా? దానిని జ్ఞాపకముంచు కొని యున్నారా? దేవుడు అతనిని ప్రవక్తగా చేసి అతడు కోరినదల్లా చేయుటకు శక్తిని యిచ్చియున్నాడు. అతడు ఆ బండ యొద్దకు వెళ్ళి రెండవ సారి దానిని కొట్టెను అది దేవుని చిత్తమునకు విరుద్దమైన కార్యము. "ఆ బండతో" మాట్లాడుము. దానిని తిరిగి కొట్టవద్దని దేవుడు చెప్పెను. మీరు మాదిరిగా ఉన్న కార్యములన్నియు మార్చివేయుదురు. ఆ బండే ఒకే ఒకసారి కొట్టబడ వలయును." అతడు ఆ విధముగా చేసినప్పుడు అతడు వాక్యములోని బలహీనతను అతడు మాట్లాడునట్లు ఉండెను. వాక్యము అతనికి చాలకుండెను. అవును, వాక్యమే అక్కడ కదులు చుండెను. ఆ బండ వాక్యమై యుండెను. చూసారా?
అతడు మొదట బండను కొట్టినప్పుడు నీళ్ళు దాని నుండి బయటికి వచ్చెను. మరి వారికి దాహము కలిగెను. "ఇప్పుడు తిరిగి వెళ్ళి ఆ బండతో మాట్లాడము." అది ఒక్కసారే కొట్టబడెను. చూడండి, వాక్యము సరిపడనంతగా లేదు. వాక్యము సరికాదని మోషే దానికి సాక్యమిచ్చినట్లు అయినది. అది మరల కొట్టబడవలయును.
కావున మోషే అక్కడికి వెళ్ళి, ఆ బండను ఆ విధముగా కొట్టెను; "బయటికి రమ్ము!" అని అతడు చెప్పెను. అవి రాలేదు, కావున మరల బయటికి రమ్మని దానిని కొట్టెను. "బయటికి రమ్మని నేను నీకు ఆజ్ఞాపించుచున్నాను," అని చెప్పగానే మరియు నీళ్ళు వచ్చెను.
"నీవు పైకి రమ్ము. ఇక్కడికి రమ్ము నిన్ను నీవే ఘనపరచు కొంటివి. నా శక్తిని నీవు తీసికొన్నావు. నన్ను పరిశుద్ద పరచుటకు బదులు నిన్ను నీవే పరిశుద్ద పరచుకొన్నావు. ఇప్పుడు నీవు ఆ భూమికి పోవుట లేదు. ఇక్కడ నుండి ఆ భూమి ఏలాగుండునని చూడుము. నీవు ఇక్కడే విడువబడుదువు," అని దేవుడు చెప్పెను. ఓ, మై! మోషే వంటి వాడు ఎవ్వరును లేరని మీకు తెలియును. ఓ, లేదు!
MATT 4:5-7•
LUKE 4:9,12
84యేసుతో తాను బలా బలాలు తేల్చుకొనవలసిన సమయములో వాడు చెప్పెను, "దేవాలయము పైకి ఎక్కి క్రిందికి దూకుము."
ఆయన చెప్పెను "ప్రభువైన నీ దేవుని నీవు శోధింవలదని వ్రాయబడియున్నదని" (ఆమేన్!) చూశారా? దాడి జరిపిన ప్రతి సారి ఆయన వాక్యముతో అతనిని సంధించెను.
ఏ నిజమైన సేవకుడు కూడ దేవుని శక్తితో తాను ఎవరని కనబరచుకొనడు. ఆ విధముగా అతడు చేసిన అతని హక్కులను పోగొట్టుకొనును.
LUKE 4:5-8
85మూడవ పెద్ద దాడి: మరి సాతాను తన రాజ్యమును ఆయనకు పోగొట్టుకొనుటకు కూడా సమర్పించెను. అతడు చేసెను. సాతానుడు చెప్పెను, "ఈ లోక రాజ్యములన్నిటిని చూచుచున్నావు కదా? ఇవన్నియు నావి. వీటితో నేను నా యిష్టప్రకారము చేసెదను నీ కొరకు నేను వాటిని వదులుకొనెదను." అయితే మీరు గుర్తుంచుకొనండి, ఆయన సిలువను వదులుకొనునట్లు చేయవలెనని వాడు ప్రయత్ని౦చుచుండెను. ఆయన ఆలాగు చేసినట్లయితే మనము నశించెడివారము. అతడు రాజ్యములను పొంది యుండవచ్చును. అయితే ఆయన వెన్నంటనే ఆయన తిరిగి రావలయును. ఆయన అప్పుడే చేయుటకై శోధింపబడెను. అది బహు కష్టమైన కార్యము. ఆయన తన యొక్క స్వతంత్ర్యము తీసికొని, సిలువ లేకుండా ఈ భూమికి రాజగునట్లు శోధింపబడెను. అయితే ఆయన ఆ విధముగా చేసియుండిన యెడల, ఆయన ప్రజలు మృతులై యుందురు. సాతానుడు చాలా సంతోషముగా ఆ కార్యమును ఆయన ముందు పెట్టి యుండును. అయితే ఆయన చెప్పెను, "సాతానా నా వెనుకకు పొమ్ము?"
ఆయన దానిని చేయలేదు.
MATT 4:8-10
86ఆయన వచ్చి, శ్రమనొంది, మరియు కఠినమైన ఎత్తు పల్లముల మార్గమును ఎన్నుకొనెను. ఆయన హింసింపబడు మార్గమును ఎన్నుకొనెను; మృత్యువు యొక్క మార్గమును ఆయన స్వీకరించెను. మనము ఉదయము ఆయన ఎన్నుకొనిన మార్గమును ఎన్నుకొనుటకు ఇష్టపడుచున్నామా? మనము చనిపోవుటకు ఇష్టపడుచున్నామా? మనము దేవుని కొరకు మనలను మనము సమర్పించుకొనుటకు ఇష్టపడుచున్నామా, ఆయనకు సేవ చేయుటకుగాను ఈ లోకమును మరియు దాని కార్యములను వదులుకోనుటకు ఇష్టపడుచున్నామా? గమనించండి?
ఇప్పుడు, ఆయన దానిని చేయలేకపోయెను. మనఃపూర్వకముగా దానిని వదులుకోనుట, సాతాను ఆలాగు ప్రయత్నించెను, కాని ఆయన చేయలేదు. యేసు శోధింపబడినప్పటికిని, ఆయన మనకొరకు జయించెను. ఆయన సమస్త శోధనలను నా కొరకు మరియు నీ కొరకు సహించెను. చూడండి, ఆయన దానిని అప్పుడే చేసియుండవచ్చును. అయితే ఎందుకొరకు ఇంకొక మార్గమును ఎన్నుకొనెను? మనము ఆయనతో కూడ ఉండుటకై. ఆయన ఆ విధముగా క్రయమును చెల్లించియుండగా, మనము ఎంత అనవసరముగా దానిని గ్రహించి, అంగీకరింపలేకున్నాము. గుర్తించుకొనుడి, ఏమైనను ఇక్కడ మనకు ఏమియు లేదు.
MATT 11:18•
LUKE 7:33•
JOHN 1:1•
JOHN 7:20•
JOHN 8:48
87మీరు ఒక వేళ వంద సంవత్సరములు జీవించినను, మీరు ఏ స్థితికి వచ్చెదరు? మీకు మతిస్థిమితము తప్పును, మరియు మీ మతి చెడిపోవును, కుంటితనము వచ్చి, వృద్దులై, మరియు వణుకుచుందురు. అలాంటి స్థితికే మీరు పోవుదురు. మరియు దాని ముగింపు అందే. మీరు ఇప్పుడే రండి. కార్యమును జయించుడి. దానిని ఏ విధముగా చేయుదురు? వాక్యము ద్వారా. వాక్యము ఏమి చెప్పుచున్నదో, దానిని మీరు చేయుడి. వినయముతో నడుచుకొనుడి; యేసు ముందు జీవించుడి.
ఆయన నీ కొరకు మరియు నా కొరకు అన్నింటిని సహించెను. ఆయన తన కాలపు పాపపు సంతతిని ఏ విధముగా జయించెనో, ఈ కాలపు పాపపు సంతతితో మనము ఏ విధముగా జయించవలెననుటకు ఆయన మనకు మాదిరిగా ఉన్నాడు.
గుర్తు౦చుకొనుడి, ఆయన భూమిపై వచ్చినప్పుడు అవిశ్వాసము ప్రతీ కాలములలో ఏ విధముగా ఉండెనో, అంతే అవిశ్వాసము అప్పుడును ఉండెను. అది కొంత కూడా ఆయనను ఇబ్బంది పెట్టలేదు. వారు ఆయనను దేవునికి బదులుగా దయ్యము అని పిలిచినను, మరియు ఇతర అనేక విధములుగా ఆయనను పిలిచినను అది ఆయనను కొంచెము కూడా ఇబ్బంది పెట్టలేదు. ఆయనకు ఒకే ఒక లక్ష్యము ఉండెను: తండ్రి యొక్క తలంపు; వాక్యమును కలిగియుండుట. వాక్యము దేవుడై యుండెను. ఆయనకు ఒకే మనస్సు ఉండెను.
REV 3:17
88మనము అనేక సార్లు వెనుతిరుగుటకు శోధింపబడెదము. మీలో అనేకులు స్థాపన సంఘములకు పోవుటకు శోధింపబడుదురు, వెను తిరిగి దానిని అంగీకరించుటకు, ఏలయనగా లోకమంతయు చెప్పుచున్నది, "నీవు ఏ సంఘశాఖకు చెందినవాడవు? ఏ సంఘముతో నీవు చేర్చబడియున్నావు?" మనమందరము కూడా మన సహోదరిలు వెనుదిరుగుటకు శోధింపబడుదురు. తిరిగి పోయి మిగతా సంఘశాఖలతో చేరి, అసెంబ్లీస్ ఆఫ్ గాడ్, చర్చీస్ ఆఫ్ గాడ్, లేక వాటిలో కొన్నిటితో చేరి పెంతేకోస్తు మాదిరిగా ఉండి, మరియు మీ వెంట్రుకలు కత్తిరించుకొని, మీరు ఇష్టపడిన విధముగా దుస్తులు ధరించెదరు. ఈ రోజులలో గొప్ప పాపమును, జనుల మద్య గొప్ప పాపమైన ఐహికతనము (ప్రపంచపు ఆశలు లేక లోకాశ) ఉండుచుండగా, చూశారా, మీరు ఆ విధముగా చేయుటకు శోధింపబడి, వెనుదిరిగి మనము జీవించుచున్న ఈ మూర్ఖత్వపు సంతతిలో పేరు ప్రఖ్యాతులు పొంద గోరుచున్నారు. పరిశుద్ద గ్రంధము చెప్పునట్లుగా, లవొదికయు కాలము, ఆమె ప్రపంచపు డాంభికము, గొప్పగా, నాకేమియు కొదువ లేదని చెప్పుకొనుచు మరియు ఆమె దిగంబరిగా నున్నదని ఎరుగక, దౌర్భాగ్యులను, దిక్కుమాలిన దానిగాను, గ్రుడ్డిగాను ఉన్నది. ఈ రోజు పాపము అదే. ఎప్పుడైతే మీరు దేవుని వాక్యమును విని, ఆ వాక్యము చెప్పిన దానికి ప్రపంచమునకు విరోధముగా ఉండి (మిమ్ములను) బయటికి రమ్మని పిలిచినప్పుడు అంతట మీరు మరొక మార్గమును ఎన్నుకొనినప్పుడు, మీరు లోకముతో గుర్తింపబడరు.
మీరు వెనుదిరుగుటుకు శోధింపబడెదరు.
1JN 2:15
89మీరు నాతో ఎల్లప్పుడు దానిని చెప్పెదరని నాకు తెలియును. నేను దానిని గూర్చి మీకు చెప్పి చెప్పి మీరు విసుగు చెందెదరని నాకు తెలియును. మీరు దానిని చేయుటను నేను చూచునప్పుడు నాకు కూడా విసుగనిపించును. నేను మీకు చెప్పదలచుకున్న ఈ పాపము… "మరల మరల చెప్పుట ద్వారా ఏమని?" మీరు అడగవచ్చును. ఆలాగైతే దానిని చేయుట మానుడి! వాక్యముతో మీ జీవితమును రక్షించుటకు ప్రయత్నము చేయుచున్నాను. నేను అలసిపోవుచున్నాను. కావున మనలను సరి చేసుకొనెదము. ఇది పాపము, అది చేయకూడదు. సరి అయ్యా!
మనము ఈ కార్యములన్నిటిని జయించవలయుననిన, మనము వీటి ద్వారా శోధింపబడవలయును, లోకము. "మీరు ఈ లోకమునైనను, లోకములో ఉన్నవాటినైనను ప్రేమించినయెడల, దేవుని ప్రేమ మీలో నుండదు," అని యేసు చెప్పెను.
90ఇప్పుడు, ఈ విధముగా చెప్పుచు: ఇంకా కొద్ది సమయములో జయించువారికి ప్రతిఫలము ఉన్నది.
నేను మీకు దీనిని చదువలయయనను కొనుచున్నాను. మీ బైబిల్ ను త్రిప్పండి. ప్రకటన గ్రంధము 3వ, 2వ అధ్యాయమునకు పోవుదుము. ఇక్కడ గమనించండి. జయించుటను గూర్చి ఈ కార్యములన్నిటిని చెప్పుచున్నాను… ఇప్పుడు, మిమ్ములను మీరే చూచుకొనుడి; ఆత్మీయ అద్దములో మిమ్ములను పరిశోధించుకొనుడి. మీరు జయించితిరా అని చూచుకొనండి.
REV 2:7,11,17
91ఇప్పుడు, ఎఫెసులో ఉన్న సంఘపు దూతకు మొదటి వర్తమానము, ప్రకటన 2వ అద్యాయము 7వ వచనములో అతడు ఏమి చెప్పెనో మీరు వినవలయునని నేను కోరుచున్నాను. ఇది ఆ యొక్క సంఘ కాలమునకు వారు చేసిన కార్యములన్నియు అతడు చెప్పెను, మొదలు ఉండిన ప్రేమను వదిలిరి. 7వ వచనము:
చెవిగలవాడు ఆత్మ సంఘములతో చెప్పుచున్న మాట వినును గాక, అతనికి… [ఆ వ్యక్తి, సంఘము కాదు]. జయించువానికి దేవుని పరదైసులో ఉన్న జీవవృక్ష ఫలములు భుజింపనిత్తును. [ఎఫెసులో జయించు వారిని చూడుడి.]
ఇప్పుడు, పిమ్మట వచ్చునది స్ముర్న. ఇప్పుడు, దానిలో జయించువారికి, దానిని మనము వినినయెడల. ఇప్పుడు, 11వ వచనము:
సంఘములతో ఆత్మ చెప్పుచున మాట చెవిగలవాడు వినునుగాక. జయించువాడు రెండవ మరణము వలన ఏ హానియు చెందడు. [చూశారా, జయించువాడు]
పెర్గములో ఉన్న ఇక్కడ జయించువానికి ఏమి ఉన్నదో మునము కనుగొనెదము. మనము 17వ వచనము చదివెదము, పెర్గములో ఉన్న సంఘమునకు వ్రాయబడినది.
చెవిగలవాడు. [అదొక వ్యక్తి, ఒక గుంపు కాదు, ఒకే ఒక వ్యక్తి. వధువు ఆ విధముగా వచ్చును, మీరు చూశారా, ఆ సంఘము నుండి.] చెవిగలవాడు ఆత్మ సంఘములతో చెప్పుచున్న మాట వినునుగాక, జయించువానికి మరుగైయున్న మన్నాను భుజింపనిత్తును. మరియు అతనికి తెల్లరాతి నిత్తును, ఆ రాతి మీద చెక్కబడిన యొక క్రొత్త పేరుండును. పొందిన వానికే గాని అది మరి యెవరికిని తెలియదు. [ఆ సంఘ కాలములో జయించిన వానికి ఇవ్వబడు కార్యము అది.]
REV 2:7,26,27•
REV 3:5•
REV 12:5•
REV 19:15
92అటు పిమ్మట తుయతైర. ఆ రోజులలో జయించువానికి ఏముండునని చూచెదము. మనము 26వ వచనమును తెరచెదము.
జయించు వానికి, అంతము వరుకు నా క్రియలు జాగ్రత్తగా చేయువానికి జనుల మీద అధికారము ఇచ్చెదను.
(అదిసరి)మరియు … . . ఇనుపదండముతో వారిని ఏలును, వారు కుమ్మరవాని పాత్రలవలె పగులగొట్ట బడుదురు. నేను నా తండ్రి వలన పొందినట్టు.
చూశారా? ఆయనతో ఆయన సింహాసనములో, క్రీస్తు రాజ్యములను (జనులను)ఇనుపదండముతో ఏలును, మరియు ఇక్కడ జయించిన సంఘము ఆయనతో కూడ ఇనుప దండముతో రాజ్యములను పగుల గొట్టుటకు కూర్చుండును.
మరియు ఇప్పుడు సార్టీస్ సంఘమును తీసికొనెదవు.ఇప్పుడు 3వ అధ్యాయములోని 5వ వచనము.
జయించువాడు ఆలాగున తెల్లని వస్త్రములు ధరించుకొనును, జీవ గ్రంధములో నుండి అతని పేరెంత మాత్రమును తుడుపు పెట్టక, నా తండ్రియెదుటను ఆయన దూతల యెదుటను అతని పేరు ఒప్పుకొందును. (సార్ధీస్ జయించు వారికి ఆ కార్యము)
REV 3:12,21,22
93ఇప్పుడు, 12వ వచనము తీసికొనెదము. ఇప్పుడు, ఇది ఫిలిదెల్ఫియలో ఉన్న సంఘమునకు 12వ వచనము.
జయించువానిని నా దేవుని ఆలయములో స్తంభముగా చేసెదను. అందులో నుండి వాడు ఇక మీదట ఎన్నటికిని వెలుపలికి పోడు. మరియు నా దేవుని పేరును, పరలోకములో నా దేవుని యొద్ద నుండి దిగి వచ్చుచున్న నూతనమైన యెరూషలేమును నా దేవుని పట్టణపు పేరును, నా క్రొత్త పేరును వాని మీద వ్రాసెదను.
జయించువారికి గల వాగ్దానములు ఏమిటని, గమనించండి. చూశారా? ఇప్పుడు, లవోదికయ, అది కడపటి సంఘకాలము; అక్కడను జయించువారు కొందరుండుదురు. అక్కడ గమనించండి! వారు… గుర్తించుకొనుడి ప్రతి సంఘకాలములోను, దానికి ముందు సంఘకాలములలోని వారికి అనుగ్రహింపబడిన అన్ని కార్యములను స్వతంత్రించుకొనును. ఇక్కడ గమనించండి. ఇప్పుడు, వారు ఆ విధముగా ఆ యొక్క అన్ని శక్తులను పొంది మరియు ఈ క్రొత్త నామములు మరియు వ్రాసియున్న ఆయన వాగ్దానము చేసిన అన్ని కార్యములు, మరుగైన మన్నా భుజించుటకు మరియు తక్కినవన్నియు. కడపటి సంఘ కాలమును గమనించండి. ప్రకటన 3:21:
జయించువానిని నాతో కూడ నా సింహాసనము నందు కూర్చుండనిచ్చెదను [ఆమేన్!] నేను జయి౦చి నా తండ్రితో కూడ ఆయన సింహాసనము నందు కూర్చుండియున్న ప్రకారము.
సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినునుగాక.
జయించు వారికి ప్రతిఫలము ఉన్నది. లిల్లీ (కలువ) పుష్పమా ప్రయాసపడుము. అది నీలో ఉన్నయెడల, బురదను ప్రక్కకు నెట్టి మరియు అన్నిటిని నెట్టి, పైకి వచ్చుటకు ప్రయాసపడుము. సరి అయ్యా! "నాతో కూడ నా సింహాసనముపై కూర్చుండుటకు."
MATT 20:20-23
94మీకు తెలియును, ఒకప్పుడు యాకోబు, యోహానుల తల్లి — దానిని చదువుటకు సమయము లేదు — యాకోబు, యోహానుల తల్లి వచ్చి ఈ స్థలమును అడిగెను. మీకు అది తెలియునా? మీకు అది జ్ఞాపకమున్నదా, "ప్రభువా నా కొడుకులలో ఒకడు ఈ ప్రక్కను, ఇంకొకడు ఇంకొక ప్రక్కను కూర్చుండుటకు సెలవిమ్ము." తన కుమారుల కొరకు తల్లి యొక్క వాంఛయైయున్నది అది. అయితే గమనించండి? అయితే ఆ స్థలము భూమికి పునాదివేయబడక మునుపే నిర్ణయించబడినది. ఆ సమయములో ఆ స్థలము ఖాళీగా లేదు. ఎందువలన? గమనించండి, అది ఎవరికైతే నిర్ణయించబడినదో వారికి అనుగ్రహింపబడును. చూడండి! ఆయన కుడి పార్శ్వమున కూర్చుండుటను, ఇంకొక ప్రక్క ఆయనకు సమీపముగా కూర్చొనుటకు ఇంకను ఎవరు జయించి రాలేదు. చూశారా, అది ఇంకను… ఆయన చెప్పెను, "నేను దీనిని అనుగ్రహించను… నేను అనుగ్రహించలేను, అయితే శోధనలకు పిదప అది ఇవ్వబడును." ఆమేన్! చూశారా? "నేను ఇవ్వలేను, అయితే శోధనలు వచ్చిన పిదప, వారు (జయించినవారు) కుడి ప్రక్కను, ఎడమ ప్రక్కను కూర్చొనెదరు." ఎక్కడో దూరములో ఆ ము౦దెరిగిన విత్తనము దానికొరకు కాచుకొనియున్నది. అది ఎవరికైతే వాగ్దానము చేయబడినదో వారికి ఇవ్వబడును. అక్కడ అది ఇవ్వబడును, అయితే పరీక్ష ఇంకనూ రాలేదు. అతడింకనూ జయించలేదు.
PS 68:18•
EPH 4:8•
2TIM 2:12
95చూడండి, ఆ రాజ్యములో ఆయన కుడి ప్రక్క ఒకరు, మరియు ఆ ఇంకొక ప్రక్క మరొకరు, వారికి ఆ స్థానములు ఇంకనూ జయించ లేదు. ఆ పరీక్ష ఇంకను ఇవ్వబడలేదు. చూశారా? అది ఇంకను జయించబడలేదు. పరిక్ష ఇంకనూ రాలేదు. అది రాబోవు కాలములో పడును. మనము క్రీస్తు కొరకు మరియు ఆయన వాక్యము కొరకు శ్రమలనుభవించిన యెడల, ఆయనతో మనము ఏలెదము; ఏలయనగా ఆయన వాక్యమై యున్నాడు. గుర్తించుకొనుడి, మనము ఆయన కొరకు, మరియు ఆయన వాక్యము కొరకు శ్రమలనుభవించిన యెడల ఆయన వాక్యముతో, ఆయనతో మనము పాలన చేయుదుము.
గమనించండి, ఆయన మనకు మాదిరిగా యున్నాడు. జయించి, అటు పిదప ఆరోహణుడాయెను. ఆయన మరణమును, నరకమును, వ్యాధిని, సమాధిని, సమస్తమును జయించెను. అటు తరువాత ఆరోహణడాయెను, చెరపట్టిన వారిని విడిపించెను, జనులందరికి వరముల నిచ్చెను. అది పాత నిబంధన, పాత నిబంధనలో జయించిన వారితో వారు ఆ విధమైన మనుష్యుని కొరకు ఎదురుచూచుచుండిరి మరియు అది పొందులోపల వారు చనిపోయిరి. అయితే ఆ ఎదురు చూచు మనుష్యుడు వచ్చినప్పుడు అది చనిపోయిన వారిని ఆటంకపరచ లేదు. ఆమేన్! ఎటు పోయినను ఏమి పోగొట్టుకొన లేదు. జీవించుటయో లేక మరణమో, అది ఏ విధమైన వ్యత్యాసము లేదు. అది ఆటంకపరచదు. చూడుడి, దాని కొరకు వారు ఎదురు చూచిరి…
JOB 1:21•
JOB 2:9,10•
JOB 19:25
96మరి యోబు కూడా దానికొరకు ఎదురుచూచుచుండెను. అతడు చెప్పెను, "అయితే నా విమోచకుడు సజీవుడనియు, తరువాత ఆయన భూమి మీద నిలుచుననియు నేనెరుగుదును." ఒక నీతిమంతుడును, లోపములేని ఒక మనుష్యుడుండెను. అతడు బలులు అర్పించెను; దేవుడు చెప్పినదంతయు అతడు చేసెను. అతడు భయభక్తులతో, మరియు ప్రవక్తల యెడల గౌరవముతో దానిని చేసెను. సాతాను మనలను శోధించుటకు వచ్చుచున్నట్టే, అతనిని శోధించుటకు అతని చుట్టు వచ్చెను. అతడు ఏమి చేసెను? అతడు నిశ్చయముతో నిలిచియుండెను.
మరియు అతని భార్య వచ్చి, "నీ వేల దేవుని శపించి మరణించ కూడదు. నీవు ఆ విధము ఉండుట చాలా దౌర్భాగ్యముగా ఉన్నది," అని చెప్పెను.
"నీవు మూర్ఖురాలివలె మాట్లాడుచున్నావు," అని అతడు చెప్పెను. ఇప్పుడు, అతడు ఆమెను మూర్ఖురాలు అని ఎన్నడు చెప్పలేదు, అయితే ఆమె ఆ విధముగా మాట్లాడెను. చూచారా? "నీవు మూర్ఖురాలి వలె మాట్లాడుచున్నావు, ప్రభువు ఇచ్చెను, ప్రభువు తీసికొనెను; ప్రభువు యొక్క నామమునకు స్తోత్రములు," అని చెప్పెను. అతడు జయించెను.
JOB 1:18,19•
JOB 2:8
97అతడు ఇరుగుపొరుగు వారు చెప్పుటను జయించెను. బిల్లాదు మరియు సంఘ సభ్యులు చెప్పుటను జయించెను. అతడు బిషప్ చెప్పిన దానిని జయించెను. అతడు కార్డినల్ చెప్పిన దానిని జయించెను. అతడు సంఘ శాఖల యొక్క హేళనలను జయించెను. వాక్యము న్యాయమైనదని నీతిమంతుడుగా చేసినదని నమ్మి అతడు దానిలో నిలిచియుండెను. ఆమేన్! సమస్తమును, అతని బిడ్డలను సహా బలి ఇయ్యవలసి వచ్చెను. అతడు చిల్లపెంకుతో పుండ్లను గోకుకొనుచుండెను. అయినను అతడు జయించిన వాడాయెను. ఆ భయంకరమైన శోధన వేళ కడపట జయించబడిన పిదప, అప్పుడు ఆ మేఘములు వెనుదిరిగెను.
JOB 14:7,10,13,21
98అతడు ప్రతీది క్రమముగా జరుగుకొనుటను చూచుచుండెను. "చెట్టు మరణించిన యెడల ఒక నమ్మకము ఉన్నది, అది తిరిగి జీవించును. మరియు ఒక విత్తనము నేలలో పడి క్రుళ్ళిపోవును. అది మరల జీవించును. అయితే ఒక మనుష్యుడు మరణించిన తన ఆత్మను వదులును; అతడు వృధా అయిపోవుచున్నాడు, మరియు అతని బిడ్డలు, కుమారులు వచ్చి అతని గౌరవార్ధము దుఃఖించుదురు; అయితే అతనికి తెలియదు. అతడు తిరిగి లేవడు. ఓ, అక్కడే అతనున్నాడు. ఇదేమి కార్యము? నేను ఒక విత్తనమే నేను ఒక విత్తనమున్న మనిషి మరియు నేను మంటికి పోవుచున్నాను. నేను తిరిగి లేవను; అక్కడే పడియుందును. ఓ, సమాధిలో నన్ను దాచుము, నీ యొక్క ఉగ్రము దాటిపోవు వరుకు నన్ను రహస్య స్థలమందు ఉంచుము. నాకొక వేళను కుదిర్చి నన్ను న్యాయతీర్పు చేయుము. బండలు తరిగి పోవులాగున, నీళ్ళు రాయిని తరిగిపోయేలా…" ఓ, ఈ కార్యములన్నిటిని అతడు చెప్పుకొనుచు ఉండెను. ఉదాహరణముగా లేక మాదిరిగా ఉంచబడిన ఆ కార్యములన్నిటిని, అదేమిటని అతడు చూడగలుగుచున్నాడు. ఓ, అతడు దానిని చూడలేకున్నాడు.
JOB 14:13
99రాడ్జెర్స్ సహోదరీ, బస్టీస్ సమాధిలో పెట్టు కార్యక్రయమములో నేను దానిని ప్రసంగించినది గుర్తున్నదా? చూడండి, ఏ విధముగా అతడు రాయిని తరిగి పోయేలా చేయును, మరియు ఆ కార్యములన్నియు ఎలా.
"ఓ, నీవు నన్ను సమాధిలో దాచి మరియు రహస్య స్థలమందు ఉంచెదవు." దానిని గూర్చి బలవంతము చేయుచుండెను. అతడు చెప్పెను, "నాకు తెలిసిన బాగుండును, పాపినైన నాపైన చేతులుంచుటకును మరియు పరిశుద్దుడైన దేవుడు మరియు ఆయనతో నా కొరకు మాట్లాడు అట్టి మనుష్యుని కొరకు నేను ఎక్కడికి పోగలను." ఓ, మై! "ఆయనక్కడ ఉన్నాడు. ఆయనక్కడ ఉన్నాడని నాకు తెలియును. దానిని చేయుటకు అక్కడ ఏదో కార్యము ఉన్నది. ఎక్కడో ఎవరో ఒకరున్నారు. ఆ వ్యక్తిని నేను ఎక్కడ కనుగొనగలను? ఎక్కడ నేను కనిపెట్టగలను? నేను ఆయన తలుపులు తట్టి, ఆయనతో మాటలాడెదను. ఎవరైన ఒకరు నాపై ఆయన చేతిని నాపైన మరియు దేవుని పైన ఉంచి మరియు ఆ మార్గమును ఎవరు కట్టగలరు." మాట్లాడవలయును… "నేను గనుక ఆ వ్యక్తిని కనుగొనగలిగినయెడల. ఓ, ఆయనెక్కడున్నాడు?"
JOB 19:25-27
100అతను తన సంఘములో వెదికి చూసెను; తన సంఘ శాఖలో వెదికి చూసెను; అటువంటి మనిషిని కనుగొనలేకపోయెను. అయితే ఒకేసారి మేఘములన్నియు వెనుకకు వెళ్ళెను, మరియు ఆ వ్యక్తి వచ్చుటను అతడు చూచెను. ఓ, అతని పాత హృదయము ఉత్సాహముతో కొట్టుకొనెను. అప్పుడు ఏదో జరిగెను. "నా విమోచకుడు సజీవుడని నేను ఎరుగుదును."
అక్కడ అటువంటరీ వ్యక్తి ఉండెను. ఆమేన్! ఇంకనూ అటువంటి వ్యక్తి ఉన్నాడు! "నా విమోచకుడు సజీవుడని నేను ఎరుగుదును. మరియు నా చర్మము క్రుళ్ళిపోయినను తరువాత శరీరముతో నేను దేవుని చూచెదను. నా మట్టుకు నేనే చూచెదను. కడపటి దినములలో ఆయన భూమి మీద నిలుచును."
1COR 15:51,52•
1THS 4:16,17•
HEB 9:28
101ఆ యొక్క ఈస్టరు ఉదయము ఆయన పునరుత్థానుడై మరియు యోబు యొక్క శరీరము ఒక గరిటెని౦డు బూడిదవలె ఉండెను, అతడు వేచి యుండెను; అతడు ఆ ఎన్నుకొనబడిన గుంపులోని వాడు. ఆయన సమాధి నుండి లేచినప్పుడు అతడు అబ్రాహాము, ఇస్సాకు, యోబులతో నగరములోనికి ప్రవేశించెను. ఓ మై! మహిమ! ఆమేన్! అటువంటి వ్యక్తి కొరకు వారు ఎదురు చూచుచుండిరి…
మరియు రెండవ సారి క్రీస్తు కొరకు కనిపెట్టుకొనువారు, ఆయన కృప వలన ఈ లోక కార్యములను జయించువారు, ఆయనకు మరియు ఆయన వాక్యమునకు తప్ప మిగతా ఇతర కార్యములన్నిటికి ఆయన యొద్దకు వచ్చుటకు, మీరు ఇతర ఏ కార్యమునకైనను కండ్లు మూసికొనిన యెడల అతడు మహిమలో ఇంకొక సారి అగపడును. "దేవుని బూర శబ్దము చేయునప్పుడు క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు, ఆ మీదట సజీవులమై నిలిచి యుండు మనము కనురెప్పపాటులో వారితో కూడ ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశమండలమునకు మేఘముల మీద కొనిపోబడుదుము."
JOHN 1:1
102ఒక వేళ నేను గరిటెడు బూడిదగానో లేక అతడు వచ్చుచున్నప్పుడు జీవించుచున్నను, నాకు అది ఏ వ్యత్యాసమైన కార్యము చేయదు. ఆమేన్! ఏమైనను పరవాలేదు, ఏలయనగా నేను దర్శనములో చూచాను. ఆ తెర వెనుకకు వెళ్ళి మరియు ఆయనను నేను చూచితిని, ఒకడు నిలబడి నాపై హస్తమును పెట్టగలిగెను, పాపినైన నాపైన, పరిశుద్ధుడైన దేవుడు; మరియు ఆయనే నా పాపపరిహారము. నేను నిలుచుచున్న కార్యము కొరకైన ఆయనే ఆ వాక్యము. ఆదిలో వాక్యముండెను; ఆయనే ఆ వాక్యము, మరియు ఆయన నా కొరకు అక్కడ ఉండును. ఆమేన్! నాలో ఊపిరి ఉన్నంత వరుకు నేను అరిచెదను. ఆయనే నా జీవము, నా పునరుత్థానము, మరియు ఇతర స్తలములు అన్ని సహితము క్రుంగిపోవు ఇసుక, ఇతర భూములన్నియు క్రుంగిపోవు ఇసుక.
REV 3:17
103వారు ఆ కార్యమునకై ఎదురు చూచుచుండినప్పుడు, ఏ విధముగా వారితో ఆయన కలిసికొనెనో, అదే విధముగా ప్రతియొక సంఘ శాఖల విమర్శలను జయించి, మనము జీవించు ఈ సంతతిలో, ఈ రోజులలో ప్రఖ్యాతి చెందిన పాపములను జయించు వారికి ఇతర సంఘ కాలములో ఆయన చేసిన విధముగా, ఆ క్రొత్త నిబంధన, పరిశుద్దుని యొద్దకు కూడా అదే విధముగా వచ్చును. ఆ సంఘకాలములో ఎవరు జయించినారో, దేనిని ఎవరు జయించిరి? "నేను ధనవంతుడను, నాకేమియు కొదువ లేదు, నాకు… ఓ, ఇవన్నియు నేనే మరియు ఇవన్నియు మరియు నేను వధువును, నేనే ఇది, నాకేమియు కొదువ లేదు." మరియు మీరు దిగంబరులును, గ్రుడ్డివారు అని తెలియకున్నది.
నేను చెప్పిన ఆ వంచించు కాలమును చూడుడి? ఆది ఆ కాలములో ఆ తెల్ల రాతిని పొందుటకు వారి తలలు నరుకబడినట్లు కాదు, వాక్యమునకై ఆ కొయ్యలలో కట్టి కాల్చబడి ఆ కిరీటమును పొందిన అటు వంటి బాధలు పడిన విశ్వాసుల వలె కాదు, అయితే ఇది భయంకరముగా వంచించు కాలము, వారికి సమస్తము ఉన్నదని వారు అనుకొనుచున్నారు, "సరి, నేను ఒక సంఘ సభ్యుని. నేను మంచి పురుషుని. నేను మంచి స్త్రీని. ఇది నేను చేయుచున్నాను; నేను అది చేయవలసిన పనిలేదు."
JOHN 1:14•
1JN 3:14•
REV 3:21
104"అయితే జయించువానికి!
ఈ లోక కార్యములను అన్నిటిని జయించిన వారు ఏమి చేయుదురు? వారందరు ఆయన వచ్చునప్పుడు ఆ ఎత్తబడుటలో పాల్గొని అందరు ఆయనతో కూడ ఆయన సింహాసనములో కూర్చుందురు. ఓ, మై! ఇక నాకు దేనిని గూర్చి చింత కలదు, ప్రపంచము ఏమి చెప్పినను మనము ఏల కలత చెందెదము? ఏవరేమి చెప్పినను మనమేల విచారపడెదము? ఆ గొప్ప పరిశుద్దాత్మ మన మధ్య ఉన్నాడు. ఆయన అగ్నిస్తంభము మనలను నడిపించుచున్నది. ఆయన వాక్యము మన మధ్య నిరూపించబడెను. ఆయన ప్రేమ మన హృదయములో కలదు. ప్రపంచము మన వెనుక నున్నది. మనము మరణమును దాటి జీవములోనికి ప్రవేశించి యున్నాము. ప్రపంచము మిమ్ములను వెర్రివారని తలంచుచున్నది, అయితే:
యేసు మాత్రము ఒంటరిగా ఆ సిలువను మోయవలెనా,
మరి ప్రపంచమంతయు ఏ బాధలు లేకుండా స్వేఛ్చగా ఉండవలయునా?
ప్రతి యొక్కరికి సిలువ కలదు,
మరి నాకును సిలువ వున్నది.
ముపై-మూడేండ్లుగా ఈ సువార్త సేవలో ఉన్నాను,
మరియు మరణము నన్ను విడిపించు వరుకు,…
ఈ పవిత్రమైన సిలువను నేను మోసెదను
నా యొక్క సహోదరులు నన్ను వదిలినను మరియు వారికి ఇష్టమొచ్చినట్లు నన్ను మాట్లాడినను, నన్ను ఏది క్రింద త్రోసినను, అయితే ఈ యొక్క వాక్యముపై, దీనిపై నేను ఒంటరిగా నిలిచెదను.
ఈ పవిత్రమైన సిలువ నేను మోసెదను
మరణము నన్ను విడిపించు వరకు
మరియు నేను ఎత్తబడి గృహమునకు పోయి.
ధరించుటకు కిరీటము,…
అదే మనమందరము కోరునది, అది కాదా? అదే మనము కోరునది. అదే మన నిరీక్షన మరియు విజ్ఞప్తి. మనకు యేసుక్రీస్తు తప్ప మరే తలంపులు లేవు. మరియు ఆయన నీతిపై మనము ఒంటరిగా నిలిచెదము, ఆయన నీతిలో ఆయన వాక్యములో, మరియు "వాక్యము శరీరదారియై మనమధ్య నివసించెను." మరియు వాక్యము ఇంకనూ తనను నిరూపించుచునే యున్నది.
105ఏ విధముగా జయించవలెను? వాక్యమును గైకొనుట ద్వారా, ఆ వాగ్దానమును అణకువతో, వినయముతో నడచుట ద్వారా,
ఈ పవిత్రమైన సిలువను నేను మోసెదను
మరణము నన్ను విడిపించు వరకు,
గృహమునకు వెళ్ళి ధరించుటకు ఒక కిరీటము…
ఆ బూర ధ్వనించినప్పుడు, నన్ను సమద్రములో మీరు సమాధి చేయ వచ్చును, అయినా, ఆ బూర నన్ను లేపును. నేను ఒక రోజు గృహమునకు వెళ్ళేదను. ఆమేన్! అంతవరకు నేను పోరాడుచుందును (ఆమేన్!) ఈ సిలువను మోసుకొని నా దృష్టిని మనుష్యులపై యుంచక, మరియు అక్కడున్న కల్వారి యందే నా దృష్టిని సారించి; ఏలయనగా ఆయన నాకు మాదిరిగా ఉన్నాడు, దానిని ఏ విధముగా చేయవలెనో అతడు నాకు చూపించి యున్నాడు. మరియు అనుదినమును ఆయనను మాదిరిగా పెట్టుకొని ఆయనను వే౦బడించెదము.
మార్గములోని ఒక్కొక్క అడుగులో నేను యేసును వెంబడించుచున్నాను,
మార్గములోని ఒక్కొక్క అడుగులో నేను యేసును వెంబడించుచున్నాను…
MATT 4:4,7•
LUKE 4:4,8•
ACTS 19:11,12•
HEB 13:8
106మీరు దానిని కోరుట లేదా? ఓ, ఏ విధముగా తలంచగలను: మార్గములోని ప్రతి ఒక్కొక్క అడుగులోను, ప్రతి రోజు ఆయనను వెంబడించుడి. మనము ప్రార్థించెదము.
యేసు ప్రభువా, ఏ విధముగా జయించవలయును అన్న కార్యమును ఇక్కడ నిలుచుకొని నేను గంట-పదిహేను నిమిషములుగా విశదపరచుచున్నాను. మీరు అది ఏ విధముగా చేయబడినదని మాకు చెప్పిరి. మీరు చెప్పుట మాత్రమే కాదు, మరియు ఏ విధముగా జయించబడినదని మాకు చూపిరి. మీరు మమ్మును నడిపించిరి. మీరు మాకు చూపించిరి. దానిని ఏ విధముగా జయించవలెనని, వాక్యమును మనలో గైకొని దానిని స్థిరముగా పట్టుకొనుడి. "ఈ విధముగా వ్రాయబడియున్నది," ప్రతి యొక్క శోధనలో, వినయముతో ఉండుడి మరియు అణకువతో నడచుకొనండి. అప్పుడు మేము నీ ద్వారా జయము పొందెదము, ఇది వరకే నీ యొక్క శక్తి ద్వారా మా శత్రువును జయి౦చెను. మరియు మనము చేయవలసిన ఒకే ఒక కార్యము పరిశుద్దాత్మ చిహ్నమును గురుతుగా ధరించుకొని విశ్వాసముతో అణకువగా ముందుకు సాగిపోవుటయే, మరియు అప్పుడు సాతాను వదిలి వెళ్ళ వలసినదే.
ఇక్కడ చేతి రుమాళ్ళున్నవి, అవి వ్యాధిగ్రస్తులకు గుర్తుగా ఉన్నవి. ప్రభువా వారు అవసరములో ఉన్నారు. పరిశుద్దుడైన పౌలు శరీరము నుండి వారు చేతి రుమాళ్ళు, గుడ్డలు తీసికొని యున్నారని, వారు ఎన్నడూ తప్పిపోని వాక్యములో చదివియున్నారు. అవి వ్యాధిగ్రస్తులపై ఉ౦చబడెను; అపవిత్రాత్మలు వారిలో నుండి వెళ్ళిపోయెను, మరియు గొప్ప అద్భుతములు జరిగెను. యేసు ప్రభువా, నేడును మీరు మారని దేవుడైయున్నారు.
JOHN 16:33•
HEB 12:1,2
107పౌలు ఈ వాక్యమును ప్రసంగించెను మరియు దీనిని వ్రాసెను, మేము అనుసరించుటకు ప్రయత్నించుచున్న ఇదే వాక్యము, ఏలయనగా అతడు పాత నిబంధనను తీసికొని అది ఒక ఉదాహరణగా చూపెను. పాత నిబంధన అంతయు క్రొత్త నిబంధనకు పరిపూర్ణ మాదిరిగా ఉన్నది. ఓ, ప్రభువా, మేము ఆ ఉదాహరణను వెంబడించుదుము గాక.
మనము మన ప్రభువును చూచిన, ఆయన ఏమి చేసెను, మరియు ఈ ఉదయమున ఆ పాత నిబంధన పరిశుద్దులు ఏ విధముగా దాటిపోయినారని మనము గుర్తించినాము. మరియు యేసు పునరుత్థానుడైనప్పుడు వారును ఆయనతో కూడా వెళ్ళిరి. మరియు ప్రభువా, ఆయన బూర ధ్వని చేసినప్పుడు మేము కూడా వెళ్ళెదమని నమ్ముచున్నాము. ఆ రోజు ఆ హెబ్రియలతో, వధువును చేర్చబడును మరియు మహిమలో వారికందరికి పెండ్లివిందు కలదు. వారు కాచుకొని యున్నారు. మీ యొక్క కృప మరియు దయ మాపై ఉండేలా ప్రార్ధి౦చు చున్నాము.
జయించిన వారు, ప్రభువా, జయించినవారు, మేము జయించిన వారుగా ఉండవలయునని కోరుచున్నావు. యేసు ప్రభువా మీరు ప్రపంచమును జయించిరి" మమ్ములను సుళువుగా చిక్కులబెట్టు పాపమును విడిచిపెట్టి, మన యెదుట ఉంచబడిన పందెములో ఓపికతో ఈ ఉదయమున ఇక్కడున్న ప్రతి ఒక్కొక్క సోదరుడును పరిగెత్తవలయునని నేను ప్రార్థించుచున్నాను.
మా పరలోక మందున్న తండ్రీ, హెబ్రియులకు వ్రాసిన పత్రికలో 12వ అధ్యాయములో పౌలు దీనిని గూర్చి మాటలాడెను. మన ప్రతి భారమును విడిచిపెట్టి, 12వ అద్యాయములో ఆయన దీనిని మాదిరిగా చూపిన ఈ క్రింది కార్యముల తరువాత పలికెను. జయించి వెళ్ళినవారు, పోలేనివారు, నులివెచ్చగా ఉండి వెంబడించిన వారు, మొట్టమొదటిగా వెంబడించిన వారు, వెనుకబడిన వారు, వెంబడించలేని వారు, వీరందరిని మాదిరిగా చూపించెను. పిదప అతడు మళ్ళీ చెప్పెను, "ప్రతి భారములను, మనలను చుట్టుకొనియున్న ప్రతి చిన్న కార్యమును విడిచిపెట్టి, విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడనైన యేసువైపు చూచుచు, మన యెదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరుగెత్తుదుము. ఆయనే మనకు ఉదాహరణను ఇచ్చాడు." తండ్రీ, ఈ ఉదయము దానిని చేసెదము.
PS 139:23,24
108ఇప్పుడు మన తలలు వంచియుండగా, సూక్ష్మముగా సరిచూచుకొనుము, నిజముగా మనలను మనము పరిశోధించు కొనెదము. అది కేవలము… కేవలము అంతే, మీ యొక్క యధార్దాత సరిచూసుకొనుము. మీరు ఇప్పుడు సరిచూచుకొనుచుండగా ప్రార్థనా పూర్వకముగా ఉండుడి, "నన్ను పరిశోధించుడి, ప్రభువా నన్ను శోధించుము. నాలో ఏమైనా చెడ్డ కార్యములు ఉన్నవేమో చూడుము. ఆ విధముగా ఉన్నయెడల ప్రభువా ఇప్పుడే ఇక్కడే వదిలివేయనీ. ఇక్కడ నేను తల వంచి నిలిచియుండు స్థలమే, నీ యొక్క బలిపీఠము. ఇప్పుడే, ఈ క్షణమే ఆ బలిపీఠము యొద్ద పెట్టుచున్నాను. నీ రక్తములోని శక్తి దానిని దహించి వేయును. ప్రభువా, నన్ను ఏదో ఒకటి పట్టుకొని బాధించుచున్నది, దానిని ఈ ఉదయము జయించవలయును. నీ వలన నేను దానిని జయించగలను, నీ వాక్యము ద్వారా అది చెప్పబడియున్నది. దానిని ఇప్పుడే క్రింద వదిలి యున్నాను, ప్రభువా, మరియు ఈ ఉదయము ఈ స్థలమును వదిలి పోవునప్పుడు దానిపై నా పాదములు పెట్టి నడచిపోయెదను, అవి దేవుని యొక్క బ్లీచ్ అను తొట్టిలో వేయబడినవని నాకు తెలియును. అవి ఎన్నడునూ గుర్తుకు తీసుకొనిరాబడవు. నేను ఇప్పుడు నా తప్పులు ఒప్పుకొనుచు మరియు కృపను కోరుచున్నాను.
మన తలలు వంచియుండగా, మన కన్నులు మూసియుండగా, మన హృదయములు తలంచుచుండగా, ఆత్మకు అదే బాటగా యున్నది. ఇప్పుడు మీరు ప్రక్కకు నెట్టివేయవలయునన్న ఏదైన కార్యము మీలో ఉన్నదా, ఈ ఉదయము మీరు జయించవలయునన్న కార్యమేదైనా ఉన్నదా , మీరు దానిని వదులుటకు చాలా కష్టపడి ప్రయత్నించినారా? అయితే ఈ ఉదయము ఆ విధమైన కార్యము వదిలి ఆయన చేసిన దానిని ఆంగీకరించుచున్నావా? మీ చేతులను పైకెత్తవలయునని నేను కోరుచున్నాను. "ప్రభువా, నేను జయించవలయునని కోరుచున్నాను. ఒక కార్యము నన్ను నిజముగానే తొందరపెట్టుచున్నదని" చెప్పుము.
109యేసు ప్రభువా, మీరు ఆ హస్తములను చూడుడి. ఇప్పుడు నేను నీ యొక్క సేవకుడుగా మరణమునకు, జీవమునకు మధ్య నిలుచుకొన్నవాడిగా, నన్ను మరియు ఈ జనులను ఇబ్బంది పెట్టు సమస్త కార్యములను నేను ఖండించుచున్నాను, మరి దానిని యేసుక్రీస్తు నామములో నేను అడుగుచున్నాను. దేవుని యొక్క బలిపీఠముపైన వేసి ఈ ఉదయము జయించి స్వతంత్రులై ఇక్కడ నుండి నడచి పోవుడి.
ప్రభువా, మా సహోదరీలకు ఇంతకు ముందు కృప లేకుంటే ఇప్పుడే అది అనుగ్రహింపబడనిమ్ము. మరియు అణకువను… తల్లి తన యొక్క బిడ్డలతో, గర్వముగా ఉండుట కంటె, ఆమెకు తెలుసును… ఆమె తన యొక్క చిన్న బిడ్డలకు బోధచేయును; ఆమె జీవితము ఒక ఉదాహరణ. తండ్రి, తల్లికి ఒక మాదిరిగా యున్నాడు, అతడు కుటుంబమునకు శిరస్సుగా ఉన్నాడు. మరియు ఆ తల్లి భర్తపై అదికారము చేయు స్త్రీగా ఉండుటకు ప్రయత్నించుచున్నది; ఆ విధముగా ఆమె ఎన్నడూ ఇక చేయదు. అతడు ఆమెను నేలపై వేయు చాపలాగా ఉపయోగించు కొనుచుండిన యెడల, ఆ విధముగా ఇక మీదట చేయకూడదు; ఆమె ఒక సహాయిని. దానిని అనుగ్రహించుము, ప్రభువా. మమ్ములను ఆటంకపరచు ఈ కార్యములన్నియు ప్రభువా, తీసివేయబడును గాక.
JOHN 16:33•
PHIL 3:13,14
110మా ముందున్న జీవకాలము కొరకు తండ్రి మమ్మును-మేము పవిత్రరచుకొనుచున్నాము, ఏలయనగా కడపటి దశకు రావలయునని మేము ఎరిగి యున్నాము, మరియు ఇప్పుడే మేము సిద్దపడవలయును. కావున ఈ ఉదయము ఈ అవకాశమును తీసికొని, ఈ వర్తమానము తరువాత, మీ యొద్దకు వచ్చుటకు మేము ఈ అవకాశమును వినియోగించుకొనుచున్నాము, ఏలయనగా మేము రావలయునని పిలువబడియున్నాము: "మీ చింతలు సమస్తము ఆయన మీద వేయుడి; ఏలయనగా ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు." ప్రభువా, మీరు అక్కరగలవారని నాకు తెలియును. మీరు మా కొరకు చనిపోవునంతగా మీరు అక్కరగొనియున్నారు. మీరు మా కొరకు చనిపోయినారని మేము నమ్ముచున్నాము. అంగీకరించునట్లు నిజముగా మేము చింతించుచున్నాము.
మమ్మును, శుద్ధికరించుము, ప్రభువా. పరిశుద్దాత్మతో నూతనముగా మమ్ములను నింపుము. పరిశుద్దాత్మ మా హృదయములను పరిపాలించుము. మహత్తరముగా, మేము నడచులాగున, పాతవి మరచి, మేము ఒకప్పుడు జీవించిన పేడను, బురదను మరచి, ముందున్న వాటి కొరకై వేగిరపడుచు, మన వెలుగు ఏ విధముగా మధురముగా, అణకువగా ప్రకాశింపవలయునని మార్గమున పోవు ప్రతివాడును, "ఆ కొండపైన ఒక క్రైస్తవుడు జీవించుచున్నాడు" అని చెప్ప వలయును. ఆ వ్యక్తి, ఆ స్త్రీ ఆ పురుషుడు, దేవుని యొక్క ఒక నిజమైన, పవిత్రమైన పుష్పముగా ఉన్నారు. వారు ఎల్లప్పుడు మధురముగా, దయతో, ఎల్లప్పుడు ప్రేమించువారిగా, మరియు మధురముగా, జ్ఞానముతో ఉందురు." దానిని అనుగ్రహించుము, తండ్రి. ఈ భూమి దప్పికొనునట్లు మేము ఉప్పువలె సారము కలిగి ఉండేలా చేయుము. ఈ జీవిత చింతలు మరియు ప్రపంచ కార్యములను జయించునట్లు శక్తిని అనుగ్రహించుము తండ్రీ. యేసు నామమున. ఆమేన్
నేను వినుచున్నాను (ఇప్పుడు, మన చేతులను పైకెత్తెదము.)
రక్షకుడు పిలుచుచున్నాడు,
దేనిని పిలుచుచున్నాడు? "బురద నుండి బయటికి రమ్మని." ఒక ఉన్నతమైన జీవితమునకు, ఆ విధముగా నీలో ఉన్న ఏదో ఒకటి ఆకర్షించుచున్నది. అది ఏమిటి? అది ఆయనే. బురదలో ఉన్న చిన్న పుష్పములారా, మీ యొద్దకు వచ్చు జీవమున్నది.
నా రక్షకుడు పిలుచుటను నేను వినుచున్నాను.
(అదే నిన్ను పిలుచుచున్నది. బురద నుండి బయటరీకి రమ్ము!)
…… వెంబడించుము, నన్ను వెంబడించుము.
JOHN 16:24•
1PET 5:7
111ఇప్పుడు, మీరు నిజముగా దానిని చేయుదురా? మీ కండ్లను ఇప్పుడు మూయుడి.
అతడు ఎక్కడికి నన్ను నడిపించునో నేను వెంబడించెదను. (ఇప్పుడు, దాని అర్ధము మిమ్ములను సమర్పించుకొనుటయే.)
ఆయన ఎక్కడికి నన్ను నడిపించునో, నేను వెంబడించెదను.
ఆయన ఎక్కడికి నన్ను నడిపించునో, నేను వెంబడించెదను.
నేను ఆయనతో వెళ్ళేదను, ఆయనతో చివరి వరుకు వెళ్ళేదను.
ఆయన ఎక్కడికి నన్ను నడిపించునో (ఇప్పుడు మధురముగా. గుర్తించుకొనుడి, మిమ్ములను అక్కడ సమర్పించుకొనుడి).
ఎక్కడకి ఆయన నడిపించునో (నేను ఇక్కడ ఉందును, ప్రభువా, ఇప్పటి నుండి నేను నిన్ను వెంబడించెదను. నేను దానిని అంగీకరించెదను. నేను దానిని నమ్మెదను.)
ఎక్కడకు ఆయన నడిపించునో (గుర్తించుకొనుడి,
మీ నోటి సాక్ష్యము కంటెను మీ జీవితము శబ్దముగా సాక్యమిచ్చును.
మీరు చెప్పుదానికంటెను మీ జీవితము నిరూపించును.) ఆయనతో వెళ్ళండి, ఆయనతో.
(ఎక్కడికి?) చివరి వరుకు.
మీరు మిమ్ములను పవిత్రపరచుకొనుడి, నిజముగా మీ హృదయాంతరములలో నుండి ఒక వేళ ఇదే మీరు ప్రార్థించుటకు అనుమతింపబడుటకు చివరి సమయమైన యెడల ఏమి జరుగును? ఒకవేళ ఆ విధముగా జరుగ వచ్చును. ఆ విధముగా నేను జరుగకూడదని నమ్ముచున్నాను. ఒకవేళ ఏర్పడ వచ్చును. మరియు నిశ్చయముగా, నిజముగా, నిశ్చయముగా. ఒక రోజు తలుపు మూయబడునని గుర్తించుకొనుడి; అప్పుడు అంతయు ముగియును. "అడుగుడి, మీరు దానిని పొందుకొనెదరు."
అక్కడ మీకు ఇవ్వబడుచున్న మహిమకరమైన కార్యములను తలంచి చూడుడి. ఆయన చేసిన దంతయు. "ప్రభువా నేను నమ్ముచున్నాను, నేను నమ్ముచున్నాను. మీరు నా కొరకు జయించినారని నేను నమ్ముచున్నాను. ప్రభువా, నేను నీతో నడువవలయునని, మీతో సమీపముగా జీవింపవలయునని కోరుచున్నాను. మీరెక్కడ ఉన్నారో నేను అక్కడే ఉండవలయునని కోరుచున్నాను."
REV 3:21
112మరియు గుర్తున్నది, మీరు మాకు చెప్పియున్నారు, తండ్రీ, మేము పైకి ఎత్తబడినప్పుడు ప్రభువుతో సదాకాలము ఉందుము. ఇప్పుడు ఆయన మాతో నడచుచున్నప్పుడు ఆయన ప్రసన్నతను చూచుచున్నాము. అయితే మరియు మేము… ఆయన ఇప్పుడు మన మధ్య ఉన్నాడనుటను తెలిసికొనినప్పుడు అది ఎంత గొప్ప కార్యము. ఆయనతో నిత్యముగా ఉన్నయెడల అది ఏ విధముగా ఉండును? మన కార్యములన్నిటిని మనము ఎంతో ప్రేమించుచున్నాము. మనము కారులో పోవచ్చును. వస్తువులను తీయుటకు అంగడికి పోవచ్చును. మనము వేటాడుటకు, చేపలు పట్టుటకు పోవచ్చును, లేక ఉల్లాసముగా ఏమి చేసినను, అయితే ఓ, సంఘము తెరువబడినప్పుడు (ఎత్తబడినప్పుడు) మనము మన ప్రభువును సంధించవలయునని యున్నాము. అన్ని కార్యములలోను అదే మహా గొప్ప కార్యము, ఆయన మనకు వాగ్దానము చేసిన కార్యములు. మరియు "ఎల్లప్పుడు ప్రభువుతో ఉండుటకును, ఆయనతో ఆయన సింహాసనములో కూర్చుండుటకును మరియు ఆయనతో సదాకాలము ఉండుటకును." ఓ, దేవా, మేము నమ్రతతో, మా వంచిన తలలతో దానిని అంగీకరించుచున్నాము, ప్రభువా. యేసుక్రీస్తు నామములో.
113మీరు ఈ సమయములో అన్ని బరువులను, అన్ని కార్యములను ఇప్పుడే వదిలి వాటిపైన నడవ౦డి. మీరు మీ చేతిని పైకెత్తి, "దేవుని కృప వలన పరీక్షను (శోధనను) నేను దానితో పోరాడక దానిని విడువని ఆయన (దేవుని) హస్తమును పట్టుకొని నేను నడిచెదను. సహోదరుడా బ్రెన్హాం, నేను పోరాడితిని; నేను సిగరెట్టు పట్టుట వదులుటకు ప్రయత్నించితిని. నేను వెంట్రుకలు పెంచుకొనుటకు ప్రయత్నించితిని. ఇది చేయుటకు ప్రయత్నించితిని, నేను ఇది చేసి యున్నాను. నేను కష్టపడి ప్రయత్నించితిని, బ్రెన్హాం సోదరుడా, నేను దానిని చేయలేను. "ఆ విధముగా చేయుటకు (మన సొంత ప్రయత్నము) ప్రయత్నించవద్దు. ఆయన యొక్క హస్తమును పట్టుకొని చెప్పుము, "తండ్రీ, నీ చేతిని నా చొక్కాయి చేతిలో పెట్టుము." చూశారా. నా యొక్క చేతిని మీకు ఇచ్చెదను; నేను నిన్ను చూచుచు నడిచెదను ప్రభువా. "అది జరుగును. మిమ్ములను ఒక నిజక్రైస్తవునిగా అతడు అలంకరించును. మీరు ఒక నిజక్రైస్తవులుగా ఉండెదరు.
ఈ రాత్రి మళ్ళీ మిమ్ములను నేను చూచువరకు దేవుడు మిమ్మును ప్రేమించి మరియు మీతో ఉండును గాక. మీరు నా యొక్క సువార్త బిడ్డలు. మీరు కొనబడిన వారు. మిమ్ములను ఇప్పుడు, తిరిగి మీ పాస్టర్ గారికే ఇచ్చెదను. నెవిల్ సోదరుడా.