గురుతు (Token)

గురుతు (Token)

1మీరు కూర్చొన వచ్చును. అందరికి శభోదయము. ఈ ఉదయము ప్రభుని పనిలోనికి వచ్చినందుకు సంతోషించుచున్నాను, మరల వచ్చాము. తిరిగి మరల కలిసికొందుమో లేదో తెలియదు, కాని ప్రభువు ఒక మార్గమును ఏర్పరచెను. నేడు మనము ఆరాధనకు తిరిగి వచ్చాము.

ఈ దినము లేక ఈ ఉదయము ఆదివారపు పాఠములోని వాక్యమును బట్టి గొప్ప అనుభవమును పొందుదుమని ఆశించుచున్నాను. ఈ రాత్రికి మరల స్వస్థతా కూటముండును. ఆ తరువాత ప్రభురాత్రి భోజన సంస్కారముండును.

2ఇప్పుడు ఒక శిశువును మనము ప్రతిష్ఠించవలసి యున్నాము. ఎవరో తమ శిశువును ప్రతిష్ఠించవలెనని కోరినట్లు ఇప్పుడే సహోదరుడు నెవిల్ చెప్పెను. వారు ఈ సమయములో ఆ బిడ్డను తీసికొని రావలెనని కోరుచున్నాను. ఆర్గన్ లేదా పియానో యొద్ద మన సోదరుడు నిలచి యుండును. ఆ బిడ్డను పైకి తెచ్చెదరు. ప్రతిష్ఠ కార్యక్రమముండును. మనము వీలయినంత త్వరగా వాక్యములోనికి వెళ్ళుదము.

ఎందుకనగా వాక్యమును మనము విత్తవలెను. ఆదే ప్రధానమైనది. మనము సమయమును ప్రభువు యొక్క వాక్యమునకు ఇయ్యవలెను. ఈ దినమున ఈ ఆరాధనలో మిమ్మునందరినీ కలిసికొను అవకాశము కలిగినందుకు వందనములు చెల్లించుచున్నాను.

MATT 19:14•

MARK 10:14•

LUKE 18:16

 

3నేను తప్పకుండా పొరబడియుందును. సోదరీ, అది మంచిది. అక్కడున్నదని నేను తలంచాను. అది తప్పైయుండును. మంచిది. నేను నీకు చాలా వందనములు చెల్లించుచున్నాను. అది మరెవరి ద్వారానో జరుగునని తలంచాను, అందువలనే ఒక విధమగు కష్టము కలిగినది.

ఇప్పుడు, అందరూ చక్కగా యున్నారా? దేవునికి ధన్యవాదములు. ఓ, అవును, ఈ చిన్న పిల్లలు ఇచ్చటున్నారు. క్షమించండి. మంచిది, పెద్దను రమ్మని కోరుచున్నాను [స్పష్టతలేని మాట].

చక్కని ఇద్దరు చిన్న బాలికలు! చిన్న కన్నులు కలిగిన బాలికలు. హూ! అందముగా యున్నారు. ఆమె పేరు ఏమిటి? జెన్నిఫర్, లీ. సోదరి ఎక్కడ నుండి వచ్చారు? వెర్సయిలస్. ఇల్లినాయ్. ఎంత బాగున్నది!

4ఇప్పుడు బైబిలులో… మామూలుగా చిన్నపిల్లలకు వారు బాప్తిస్మమిచ్చుచుందురు. పిల్లలకు బాప్తిస్మమిచ్చుటను మనము నమ్ముట లేదు, ఎందుకనగా వారింకా పాపము చేయలేదు, ఎందుకనగా వారింకా పసివారు, అయితే పిల్లలను ప్రభువుకు ప్రతిష్ఠించుటను మనము నమ్ముచున్నాము. ఇప్పుడు నేను మరియు పెద్ద కలిసి ఆ పసివారి మీద చేతులుంచుము. జెన్నీ, అందురు గదా? మన తలలు వంచుదము. పరమ తండ్రి, ఈ ఉదయమున జెన్నిఫర్ అని పిలువబడు ఈ చిన్న బాలికను నీ యొద్దను తీసికొని వచ్చుచున్నాము. ప్రభువు కొరకు ప్రతిష్ఠించుట కొరకు ఆ తల్లి ఇంకా ఆ ప్రియులు చాలా దూరము నుండి ఆమెను ఇచ్చటికి తీసికొని వచ్చియున్నారు. నీవు నీ దినములలలో ఆటువంటి చిన్నపిల్లల మీద చేతులుంచితివని మేమెరుగుదుము. "ఇటువంటి చిన్న పిల్లలను నా యొద్దకు రానీయకుండా ఆటంకపరచకుడి. పరలోక రాజ్యము ఇటువంటివారిదే," అని చెప్పెను. ఆమె జీవితమును నీకు సమర్పించుచున్నాము. యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము. ఆమేన్.

5ఆ మరియొక బాలిక పేరు ఏమిటి? కోనీ లిన్. మంచిది. చిన్న కోనీ, నీవు నన్ను చిన్న వానిగా తలంచుకొనునట్లు చేశావు. ఏమిటి? నీవు భయపడితివా? అది పనిచేయదని నేను భయపడితినని, ఇప్పుడు తల్లితో చెప్పుచున్నాను. మంచిది. మన శిరములు వంచుదము. ప్రభువైన యేసూ, ఆ తల్లి ఈ చిన్న కోనీని ఈ ఉదయము మా యొద్దకు తీసికొని వచ్చినది. సర్వశక్తుడగువానికి సమర్పించకోరుకొనినది. నీవీ బిడ్డను పెంచవలెనని ఆమెకు ఇచ్చియున్నావు. ఆమె నీ యొద్దకు బిడ్డను తీసికొని వచ్చుచున్నది. చిన్న సోదరిని కూడా తీసికొని వచ్చినది. నీవు కృప చూపమని పరమ తండ్రి నీకు ప్రార్థించుచున్నాను. కుటుంబమును ఆశీర్వదించుము. చిన్న బాలికను దీవించుము. యేసుక్రీస్తు నామము పేరట ఈ బాలిక మిద మేము చేతులుంచుచుండగా నీవు దీవించుము. ఆమె జీవితమును నీ పని కొరకు సమర్పించుచున్నాము. ఆమేన్. దేవుడు నిన్ను నీ చిన్న బిడ్డను దీవించును గాక!

ఇక్కడ చాలా మంది చిన్న బిడ్డలున్నారు.

1SAM 1:11,20,27,28

 

6ఆ చిన్న బాలుని పేరు ఏమిటి? జోయల్ వాట్సన్. జోయల్ లీ వాట్సన్. చాలా చక్కని బాలుడు. చాలా పెద్ద నీలపు కండ్లు. మీరెక్కడ నుండి వచ్చారు? జార్జియా. మీరు దక్షిణాది నుండి వచ్చిరనుకొన్నాను. మంచిది. ఇతడు చక్కని జార్జియా పిల్లవాడు. మంచిది. చాలా చక్కని వాడు. మాట్లాడగలడు కూడా. నీవు మాట్లాడగలవా? మన శిరములు వంచుదము. పరమ తండ్రి, ఈ ప్రియమగు చిన్న బాలుని నీ యొద్దకు తెచ్చుచున్నాము. తల్లిదండ్రులిచ్చట నిలబడియున్నారు. అది వారి ఐక్యతను చూపించుచున్నది. నీవు వారికి ఈ చిన్న బాలుని ఇచ్చి పెంచమని చెప్పియున్నావు. వారు తిరిగి నీ యొద్దకే అతనిని తీసికొని వచ్చుచున్నారు. ఎంత చక్కని సన్నివేశమిది. ఆనాటి హన్నా వలె యున్నది. బిడ్డ కొరకామె ప్రార్ధించినది. దేవుడామెకు బిడ్డననుగ్రహించెను. ఆమె తిరిగి దేవుని ఆలయమునకు తీసికొని వచ్చి ప్రతిష్ఠించినది. ప్రభువా, ఈ చిన్నవాడు నీ దాసుడగునట్లుగా కృప చూపుము. తల్లిదండ్రులను ఆశీర్వదించుము. వానిని పెంచుటకు బలమును, ఆరోగ్యమును వారికిమ్ము. ఆ బిడ్డ దీర్ఘకాలము సంతోషముగా జీవించి, నీ దాసునిగా యుండవలెనని నీకు సమర్పించుచున్నాము. యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము. ఆమేన్. నిన్ను దీవించును గాక. అతనిని చక్కని వానిగా చేయుము. సమూయేలు వంటి మరియొక ప్రవక్త అగును గాక.

7ఇప్పుడిచ్చట ఇద్దరు చక్కని పిల్లలున్నారు. ముగ్గురున్నారా? మొత్తం కుటుంబము. మీ పేరు ఏమిటి? మైకేల్. నీ పేరేమిటి?పాల్. ఎంత చక్కని పేర్లు! మీ పేరు? దేబోరా. చాలా చక్కని పేరు. మైకెల్, పాల్ మరియు దెబోరా. మీ చివరి పేరు ఏమిటి? ఎల్లిస్? మంచిది, అది చాలా చక్కని ఇంటి పేరు. నీకు చెప్పుచున్నాను. అటువంటి చిన్న పిల్లలను చూచినప్పుడు నేను బాలునిగా యున్న రోజులు గుర్తుకు వచ్చును. వారిప్పుడు నీ కాలు తొక్కుదురు. ఆ తరువాత గుండెను తొక్కుదురు అని పాత సామెత యున్నది. కాని దాని యందు నాకు నమ్మకము లేదు. ప్రభువుకు వారిని సమర్పించుచున్నాము. ఇక్కడ మనకు ఒక బాధ్యత యున్నది. మీ చేతులలో దేవుడు వీరిని ఉంచెను. ఆయన నిన్ను ఒక బోధకునిగా చేసెను. నేనెల్లప్పుడు స్త్రీ బోధకుల గూర్చి చెప్పుచుందును, కాని ప్రతి తల్లియు ఒక బోధకురాలే, వీరే ఆమె సమాజము. తండ్రి పనిచేయుచుండగా, ఈ పిల్లలను సరిగా పెంచవలెను. నీకు ఒక బాధ్యత యున్నది. దేవుడు మీ ఇద్దరినీ దీవించు గాక. మీకు చక్కని చిన్న కుటుంబమున్నది.

MATT 19:14•

MARK 10:14•

LUKE 18:16

 

8మా పరమ తండ్రి, చిన్న మైకెల్ ను మేము నీ యొద్దకు తీసికొని వచ్చుచున్నాము. మొదట జన్మించిన వాని వలె కనబడుచున్నాడు. అతని మీద మేము చేతులుంచి యేసుక్రీస్తు నామములో ప్రతిష్ఠించుచున్నాము. ఆతని కుటుంబము ఈ చిన్న వారిని తీసికొని వచ్చినది. వారి సంరక్షణలో నీవు వీరిని యుంచావు. వారు శక్తిహీనులని గ్రహించిరి. నీ సహాయము కొరకు వచ్చిరి. వారి చిన్న కుటుంబమును నీకు ప్రతిష్ఠించవలెనని తీసికొని వచ్చిరి. ఇప్పుడు ఈ చిన్న మైకెల్ ను నీ సేవ కొరకు సమర్పించుచున్నాము. యేసుక్రీస్తు నామములో ఇతని జీవితమును ప్రతిష్ఠించుచున్నాము. అదే విధంగా చిన్న పాల్ మిద మేము చేతులుంచుచున్నాము. ఇతని జీవితమును యేసుక్రీస్తు కొరకు సమర్పించుచున్నాము. దేవుని మహిమార్థమై జీవించును గాక. చిన్న దెబోరా మీద చేతులుంచుచున్నాము. తండ్రి, ప్రతిష్ఠించుచున్నాము. యేసు క్రీస్తుకు జ్ఞాపకార్థముగా జీవించునట్లు చేయుము. "వారిని నా యొద్దకు రానియ్యుడి. వారిని ఆటంకపరచకుడి" అని ఆయన చెప్పెను. వారి మీద ఆయన చేతులుంచెను. ఈ చిన్న బాలిక యొక్క జీవితము దేవుని రాజ్యములో దీవించబడు గాక. తల్లిదండ్రులను ఆశీర్వదించుము. వారు ఎక్కువ కాలము సంతోషముగా జీవించుదురు గాక. వారి పిల్లలు దేవుని సేవించుటను వారు చూచెదరు గాక. దేవుని మహిమార్థమై ఈ ఆశీర్వచనమును మేము అడుగుచున్నాము. యేసుక్రీస్తు నామములో వీరిని ప్రతిష్ఠించుచున్నాము. ఆమేన్. మిమ్మును దీవించును గాక. మిమ్మును దీవించును. మీది కూడా చక్కని చిన్న కుటుంబము.

9నేను తలంచుచున్నది మీరెరుగుదురా? నేను బాలునిగా ఉండిన దినముల కంటే ఈ బాలికలు ఎక్కువ ఆందమును ఇప్పుడు పొందుచున్నారు. అవును! ఎంత పెద్ద అందమగు కన్నులు! ఆమె పేరు ఏమిటి? జోయనా. మీ ఇంటి పేరు? బ్లయర్. జోయానా బ్లయర్. ఆమె బొమ్మ వలె కనిపించుచున్నది గదా? వెనుక నున్న వారు చెప్పండి? అవును. జోయనా, నీవెట్లున్నావు? కొద్దిగా సిగ్గుపడుచున్నది. జోయనాకు చిన్న సిగ్గు వచ్చినది. చాలా చక్కని పిల్ల. మన తలలు వంచుదము. మా పరమ తండ్రి, ఈ బ్లయర్ కుటుంబపు ఐక్యతకు చిహ్నముగా చిన్న జోయనా వచ్చియున్నది. దినములు చెడ్డవని మాకు తెలియును. సాతాను అన్ని చోట్లకు చొరబడుచున్నది, నిరాశపరచుచున్నది. దినములలో చిన్న బిడ్డలు మరీ గురియగుదురు. ఆమెను వారు పెంచలేమని ఒప్పుకొనుచున్నారు. వారామెను సరిగా పెంచవలెనని కోరుచున్నారు. నీ దాసురాలిగా ఉండవలెనని కోరుచున్నారు. నిన్ను ఘనపరచుటకు ఈ బాలికను పెంచవలెనని వారు కోరుచున్నారు. నీకు ప్రతిష్ఠించవలెనని ఇప్పుడు వారామెను తీసికొని వచ్చియున్నారు. యేసుక్రీస్తు నామములో ఈమె మిద మేము చేతులుంచుచున్నాము. దేవుని రాజ్యము కొరకు ఈ చిన్న జోయనాను మేము ప్రతిష్ఠించుచున్నాము. దేవుని మహిమ కొరకే. ఆమేన్. బ్లయర్ సోదరుడా, దేవుడు నిన్ను దీవించును. ప్రభువు నీకు తోడుగా యుండును గాక.

10శుభోదయము అయ్యా. ఈ బాలుడు చాలా చక్కని వాడు. ఎట్లున్నావు? ఇటు వైపు నీవు తిరిగినచో చాలా చక్కగా యుందువు. అవును. చాలా చక్కని శిరస్సు , అందమగు ముఖము ఉన్నది. ఇతని పేరు ఏమిటి? దానియేల్ మార్కు, నీ చివరి పేరు? హార్డెన్. దానియేల్ మార్కు హార్డెన్. సహోదరుడు హార్టెన్ ఏ ప్రాంతము నుండి వచ్చెను? అవును. అసలు ఏ ప్రాంతము? న్యూయార్కు రాష్ట్రపు వ్యక్తి. యాంకీ కదా? అవును. అది గొప్ప రాష్ట్రము. నా జనులు కొందరచ్చట నివాసము చేయుచున్నారు. మా అంకుల్ ప్లాట్స్ బర్గ్ లో యున్నాడు. న్యూయార్క్ లో చాలా సంతోషంగా నేను గడిపాను. నేను తరువాత కూటమునకు న్యూయార్కు పట్టణమే వెళ్ళుచున్నాను. అక్కడున్న స్టోన్ చర్చికి వెళ్ళుదును. సరే. అతని పేరు మార్కు అని చెప్పారు కదా? డానియేల్ మార్కు చాలా చక్కని బాలుడు. మన శిరములు వంచుదము. ప్రభువైన యేసూ, ఈ చిన్న డానియేల్ మార్కును నీ యొద్దకు మేము తీసికొని వచ్చుచున్నాము. అతని జీవితమును సమర్పించుచున్నాము. దేవుని యొక్క భయ భక్తులలో ఈ బిడ్డను పెంచవలసిన బాధ్యత తల్లిదండ్రుల చేతులలో యున్నది. వారు శక్తిహీనులని గ్రహించియున్నారు. కాబట్టి ప్రభువా, నీ యొద్దకు తీసికొని వచ్చుచున్నారు. ఈ జీవితమును నీవు దీవించుము. మేము చెడ్డ దినములలో జీవించుచున్నామని ఎరుగుదుము. చిన్న పిల్లలను మేము చూచుచున్నాము. రేపు ఏమి జరుగునో మాకు తెలియదు. ఏది ఏమయినా గాని నీ చేతిలో వారిని ఉంచి విశ్వసించుచున్నాము. ఈ చిన్న బాలుని పైని మా హస్తములుంచి, అతని జీవితమును నీకు ప్రతిష్ఠించుచున్నాము. దేవుని రాజ్యములో సేవ చేయు జీవితము దయచేయుము. యేసు నామములో ప్రార్థించుచున్నాము. ఆమేన్. సోదరుడా, దేవుడు నిన్ను దీవించును. అతడు చక్కని బాలుడు. చిన్న మార్కును దేవుడు దీవించును.

వారిని లోనికి తీసికొని రండి,

పాపపు పొలములో నుండి వారిని తీసికొని రండి,

వారిని లోనికి తీసికొని రండి, తీసికొని రండి.

చిన్న వారిని యేసు నొద్దకు తీసికొని రండి,

అది చాలా అద్భుతము! సోదరీ, నీకు వందనములు.

11ఇక్కడ ఆదివారం ఎందరున్నారు? గత ఆదివారం ఎందరు ప్రార్థన చేయించుకొన్నారు? మీరు ఫలితములను అనగా స్వస్థతను పొందితిరని తలంచుచున్నాను. మీ చేతులు ఎత్తండి? ప్రార్థన చేయించుకొనిన వారు. ఇటు చూడండి, ప్రతి ఒక్కరూ చేయి ఎత్తిరి.

(అవును. నేను కూడా! నేను కూర్చొని వినగోరుచున్నాను…) చూడండి, ఏదో జరుగుచున్నది. ఆ తరువాత దానిని గూర్చి మీకు చెప్పెదను. కావున ఇప్పుడు చూడండి. అది మహిమకరముగాను, అద్భుతముగాను యున్నది. దానిని గూర్చి మనము మరియొక కూటములో మాట్లాడుకొందము. ఒక సమయములో అది జరుగనైయున్నది. దాని కొరకు మేము వందనములు చెల్లించుచున్నాము.

12నేను కెంటకీలో యున్నాను. ప్రతీ సంవత్సరము వెళ్ళుచుందును. నేను అక్కడ నా కొందరు స్నేహితులతో యున్నాను. అది కేవలము ఉడుతల వేట కొరకు కాదు. ఆ సంగతి మీకు తెలియును. కావున ఒక మహిమ కాలమును మనము అనుభవించుచున్నాము. ప్రభువా, మేము వందనములు చెల్లించుచున్నాము.

13నేను వెళ్ళవలసియున్నాను. ఈ కూటము తరువాత నేను ఇంటికి వెళ్ళుదును. కొంత సమయము తరువాత మరల వచ్చెదను. న్యూయార్కుకు కూటమునకు వెళ్ళుచున్నాను. ఆగుటకు కొద్ది సమయము మనకు దొరికిన యెడల మేము ఈ గుడారములో మరియొక కూటము ఏర్పాటు చేయుటకు సంతోషముగా అంగీకరించెదము.

శ్రివ్-పోర్టు వెళ్ళుటకు నేను మరల రావలసియున్నాను. ఆ తరువాత ఇంటికి వెళ్ళుదును. సెలవులలో ఇచ్చటికి రాగోరుచున్నాను. ప్రభుని చిత్తమయితే, కుటుంబమును తీసికొని వచ్చెదను. ఆ తరువాత జనవరిలో ఫీనిక్సులో నా కూటము జరుగును. అది సాంవత్సరిక కూటము. క్రైస్తవ పనివారల కొరకు అక్కడ జరుగును. దానికి దాదాపు ఒక వారము లేదా పది రోజులకు ముందు ఆ పెద్ద స్థలమును అద్దెకు తీసికొన గోరుచున్నాను. వారు యేసు-నామ జనులు. సహోదరుడు గార్షియా ఉండేవాడు. స్పానిష్ సోదరుడు, అది అద్భుతమగు పెద్ద స్థలము. ఈ మధ్యనే దానిని వారు నిర్మించిరి. కొన్ని వేల మంది కూర్చొనుటకు అది సరిపోవును. చాలా క్రొత్తది. వారి సమాజము చాలా చిన్నది. ఎప్పుడవసరమయితే అప్పుడు అద్దెకు తీసుకొనవచ్చునని వారు చెప్పిరి.

ఆ లోయలోని రమణీయ దృశ్యములను చూచుటకు బదులుగా, సంఘము నుండి సంఘమునకు వెళ్ళుటకు బదులుగా, అన్నీ ఒకే చోట లభ్యమగు ఆ పెద్ద స్థలములో కూడుకొనుట మంచిదని నేను తలంచుచున్నాను, చూడండి, అది వారు అక్కడ కలిగియున్నారు.

14మనము ఆలయమును అద్దెకు తీసికొనవచ్చును. దాని విషయములో ఇప్పుడే మనము ఆలోచించవలెను. క్రైస్తవ పనివారల సమావేశము జరుగును.

విదేశీ పర్యటన నిశ్చయమగు వరకు దక్షిణాదిన జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలలలో కూటములు జరుపుటకు తల పెట్టి యున్నాము, దక్షిణ ప్రాంతములు. ఇప్పుడే ఆఫ్రికాకు వెళ్ళ వచ్చును, చూడండి, ఇది క్రిస్మసు సమయము, వారికిది జూలై నాలుగు. చూడండి, అక్కడ వర్షము వలన చిత్తడిగా యుండును. ఆ కాలములో అక్కడికి మీరు వెళ్ళ లేరు. కాబట్టి ఆ తరువాతనే అచ్చటికి వెళ్ళుటకు అనుకూలముగా యండును.

వీలయినట్లయితే నార్వేలో ప్రారంభించుటకు ఉద్దేశించియున్నాము. ప్రభుని చిత్తమయితే ప్రపంచమంతటను, ఆఫ్రికాలోను ప్రారంభించుదుము.

కాని, ఇప్పుడు మా కొరకు ప్రార్థించండి. మిమ్మును మేము ప్రేమించుచున్నాము. దానిని మీరెరుగుదురు. మనము చేయకలిగిన దానంతటి కంటి ఎక్కువగా ప్రభువు చేయగలడు. అత్యధికమగు దానిని మనము ఆశించుచున్నాము.

15గొప్ప స్వస్థతా కూటము జరుగునని ఈ రాత్రి మేము నమ్ముచున్నాము. కొద్ది సేపు మాత్రమే నేను మాట్లాడుదును. ప్రభు రాత్రి భోజనము ఈ రాత్రికి యుండును. కావున దాదాపు ఇరవై లేదా ముప్పది నిమిషములు మనకు ప్రార్థన వరుస యుండును. అది అయిన వెంటనే ప్రభురాత్రి భోజనముండును. మాతో మీరుండవలెనని ఆహ్వానించుచున్నాము.

మేము సంతోషించుచున్నాము. మనకు రహస్య ప్రభురాత్రి భోజనము ఉండదు; ప్రతి విశ్వాసికిని అది వర్తించును.

లేఖనమును చదువు ముందుగా, మన శిరములను ఒక నిమిషము వంచవలెనని కోరుచున్నాను. నా మంచి స్నేహితుడగు సహోదరుడు లీ వైల్ ప్రార్ధనలో నడిపించవలెనని కోరుచున్నాను. దేవుడు తన వాక్యమును దీవించునట్లుగా సహోదరుడు వైల్ మన కొరకు ప్రార్ధించును. మా కొరకు అది చేయుదురా? [సహోదరుడు లీ వైల్ ప్రార్థించుచున్నాడు.]

EXOD 12:12,13

 

16ఇప్పుడు, నెమ్మదిగాను, గౌరవముగాను వాక్యమును మనము సమీపించుదము. ఈ ఉదయమున నేను నిర్గమ కాండము 12వ అధ్యాయము — 12 వచనము మరియు 13 వచనము కూడా చదువగోరుచున్నాను. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. ఈ రాత్రి ప్రభురాత్రి భోజనమునకు ముందుగా నిర్గమకాండము 12వ అధ్యాయము మొత్తం చదువుదును. యాత్ర కొరకు సిద్ధమగుటను 11వ వననములో మనము చూడగలము. యాత్రకు ముందు ప్రభురాత్రి భోజనము ఉండును. ఇప్పుడు దీనిని మనము బహు మర్యాదగా సమీపించగోరుచున్నాము. 12వ అధ్యాయము 12 వచనము:

ఆ రాత్రి నేను ఐగుప్తు దేశమందు సంచరించి, ఐగుప్తు దేశమందలి మనుష్యులలోనే గాని, జంతువులలోనే గానీ తొలి సంతతియంతయు హతము చేసి ఐగుప్తు దేవతలకందరికిని తీర్పు చేసెదను; నేను యెహూవాను.

మీరున్న ఇండ్ల మీద ఆ రక్తము మీకు గురుతుగా ఉండును. నేను ఆ రక్తమును చూచి మిమ్మును నశింపచేయక దాటిపోయెదను. నేను ఐగుప్తు దేశమును పాడు చేయుచుండగా మిమ్ము సంహరించుటకు తెగులు మీ మీదికి రాదు.

దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించును గాక!

EXOD 12:13

 

17ఒక అంశమును అందులో నుండి నేను తీసికొనగోరుచున్నాను. మూడక్షరముల చిన్నమాట: "గురుతు." (Token) గురుతు! ఆ మాట మీద నేను మాట్లాడగోరుచున్నాను. ఈ ఆదివారపు బడి పాఠమును బోధించగోరుచున్నాను. "గురుతు" అను మాట. "రక్తము మీకు గురుతుగా యుండును," అని వ్రాయబడియున్నది. ఆ బైబిలులోని "గురుతు" అను మాటను మనము వాడగోరుచున్నాము.

18ఇప్పుడు, మనకు తెలియదు; గడియారమును చూచినప్పుడు సమయము గతించుచున్నదని నాకు తెలియుచున్నది. ఇక్కడ చాలా లేఖనములు వ్రాసి యుంచాను. ఎక్కువసేపు మీతో నేను మాట్లాడనని నాకు తెలియును. ఇందులో ఉన్న మనము ఒకరితో ఒకరు కలిసికొనుట ఇదే చివరిసారి కావచ్చునేమో ఎవరికి తెలియును?

కాబట్టి మర్యాదగా సమిపించుదము. ఇది చాలా కఠినమని నాకు తెలియును. ప్రభువు ఆరాధన కొరకు చక్కని ఉదయమును ఇప్పుడు మనకు ఇచ్చెను - చాలా బాగున్నది. మనము మాట్లాడుకొనుబోవు విషయముల మీద మనసుంచుదము. మీరు ఏది తెలిసికొనవలెనని ప్రభువు కోరునో దానినే మీకు ఆయన అనుగ్రహించును.

19అందరికి కనబడవలెనని ఇక్కడ నేను నిలబడలేదు. మనము ధరించుకొన్న బట్టలు ఇతరులు చూడవలెనని ఇక్కడికి మనము రాలేదు. ఒక సంగతి కొరకు ఇక్కడికి మనము వచ్చియున్నాము. మన సోదరుడు ఆ ప్రార్థన చేసినవిధముగా: "వాక్యమును వినుట కొరకు మనము ఇక్కడికి వచ్చి యున్నాము - వాక్యము మన యొద్దకు వచ్చుచున్నది." అదే మనకు కావలెను, ఎందుకనగా అది ఒక్కటే మనకు కావలసియున్నది. మనకు సహాయము చేయునది, మనకు ప్రయోజనకరమగునది అదియే.

20మనము చనిపోవుచున్న జనులము. మానవులందరూ నిత్యత్వమునకు పరుగిడుచున్నారు. మన తీర్మానములను చేసికొనుటకు ఇంత సమయము దొరికినది. ఎటు మనము వెళ్ళుచున్నామో చూచుకొనవలెను. మన ముందే దారి యున్నది. మనము ఎన్నుకొనిన మార్గమును వెంబడించవలెను. ఆదామవ్వలను ఆయన ఆ విధముగానే ఉంచెను, మనలను ఆయన ఆ విధముగానే యుంచును.

EXOD 12:13

 

21మనము ఏమి చేసినా గాని, ఎంత విజయశీలురముగా యున్నా, క్రీస్తు లేకుండా జీవితములో పూర్తిగా మనము ఓడిపోయినట్లేనని తప్పక గుర్తుంచుకొనవలెను.

ఆయన వైపునకే మనము చూడవలెను, దానిని మనము అంగీకరించనియెడల అందరి కంటెను బుద్ధిహీనులమగుదుము. దానిని అంగీకరించుట మాత్రమే కాదు గాని, అంతకంటే గొప్ప అనుభవమునకు రావలెను. దానిని నీవు పొందిన తరువాత దానిని నీవు విడనాడుట గాని, అరలో పెట్టుట గాని చేయరాదు — దానిని మీరు వాడుకలో పెట్టుకొనవలెను.

వైద్యుని యొద్దకు ముందుకు వెళ్ళి దానిని తీసికొని అరలో పెట్టినచో ఎట్లుండును? నీవు ఆ మందును మింగవలెను. నిన్ను ఒక వ్యాధి పీడించుచున్నప్పుడు దానికి విరుగుడును తీసికొనవలెను. అది నీకు సహాయపడును. ఆయన నీకు ఇచ్చిన దానిని నీవు గ్రహించవలెను. ఆయన దానిని ఇచ్చిన రీతిగానే మీరు తీసికొనవలెను, ఎందుకనగా దానిని నీవు ఆలస్యము చేసినయెడల ఎంతో మార్పు వచ్చును.

మనకు ఎలాగు తెలియును, కాని ఈ రోజు యొక్క అంశాములో, నీవు ఒక క్షణములో చేసిన తీర్మానము, నీ నిత్య గమ్యమును నిర్ణయించును. దానిని ఆయన నీ చేతికి ఇచ్చిన రీతిగానే తీసికొనుము.

ఒక గురుతు… "రక్తము మీకు గురుతుగా యుండును."

22మొదట గురుతు అనగా ఏమిటి? ఇంగ్లీషు మాట్లాడు జనుల మధ్య అది తరచుగా వినబడును, ముఖ్యంగా అమెరికాలో.

నిఘంటువులో గురుతు లేదా సూచన అని యున్నది. వెల చెల్లించికొన్నదని అర్థము. కావలసిన వెల చెల్లించబడినది. రైలులో లేదా బస్సులో పయనించునప్పుడు వెల చెల్లించినట్లే.

నీవు ఎక్కీ డబ్బు ఇయ్యగా అతడు నీకు ఒక గురుతు ఇచ్చును. అది ఆ రైలులో పయనించుటకు తప్ప మరిదేనికినీ పనికి రాదు. అది ఆ రైలు అధికారులు ఇచ్చు గురుతు. నీవు వెలను దాని కొరకు చెల్లించితివి. ఆ గురుతు మరెందుకూ పనికి రాదు. మరో రైలులో పయనించుటకు పనికిరాదు. ఆ రైలుకు మాత్రమే పని చేయును. అది ఒక గురుతు.

23ఇప్పుడిచ్చట చూడండి, మనము దీనిని గూర్చి మాట్లాడుకొనుచున్నాము, దేవుడు ఇశ్రాయేలుతో మాట్లాడుటను ముందు చూచియున్నాము. "గొర్రెపిల్ల యొక్క రక్తము నాకు గురుతుగా యుండును."

ఇశ్రాయేలీయుల కొరకు గొర్రెపిల్ల వధింపబడినది. అది యెహోవా కోరిన గురుతు. అది తప్పక రక్తమై యుండవలెను. దేవుడు ఒక గురుతను తయారుచేసి ఇశ్రాయేలీయులకు ఇచ్చెను. మరి ఏ ఇతర గురుతు పనిచేయదు. మరి దేనినీ ఆయన గుర్తించడు.

EXOD 12:13,23

 

24లోకమునకు అది ఒక బుద్ధిహీనముగా కనబడును, అయితే దేవుకి, అది ఒక్కటే మార్గము, ఆయనకు ఆ గురుతు మాత్రమే కావలెను. అది తప్పకుండా అచ్చటుండవలెను. వెల చెల్లించనియెడల, ఆ గురుతు నీకు దొరకుదు.

నీవు ఉచితముగా పయనించు అర్హతను ఆ గురుతును బట్టి పొందగలవు. "నేను ఆ రక్తమును చూచి దాటిపోవుదును."

ఎట్టి సమయము… ఎట్టి భాగ్యము, నీవు దానిని కలిగియుండవలెను. "నేను రక్తమును చూచినప్పుడు దాటిపోవుదును."

ఆయన దానిని మాత్రమే గుర్తించును. దాని స్థానములో మరేదియూ నిలువజాలదు — ఏ ప్రత్యామ్నాయము లేదు, ఏ శాఖయు లేదు, మరేదియూ లేదు; అది మాత్రమే కావలెను.

"దానిని మాత్రమే నేను చూతును" అది దేవుడు చెప్పెను.

వారెంత నీతిగాయున్నాగాని, ఎంత మంచిగాయున్నాగాని, ఎంత చదువుకొన్నాగాని, ఎంత మంచి బట్టలు ధరించుకొన్నా గాని, గురుతు మాత్రమే కావలసినది. "ఆ గురుతును నేను చూచినప్పుడు దాటిపోయెదను."

ఆ రక్తమే గురుతు, యెహోవా కోరినది అదే; అది జరిగినది. రక్తమే గురుతుగా నిలబడినది. రక్తమే ఆ గురుతు, చూచారా.

25"దానిని నీవు తిను దినమున చనిపోవుదువు" అని దేవుడు చెప్పెను. విశ్వాసి యొక్క జీవితము కొరకు ఒక ప్రత్యామ్నాయ జీవము తీసికొనబడినది. దేవుడు కృప చూపి, చెడిపోయిన వ్యక్తి కొరకు ఆ ప్రత్యామ్నాయమును అంగీకరించెను.

తన బిడ్డ పాపముతో తనను అపవిత్రపరచుకొనెను, వాక్యమును విశ్వసించలేదు, అప్పుడు దేవుడు తన కృప చొప్పున ఒక ప్రత్యామ్నాయమును ఏర్పరచెను. దాని స్థానములో మరియొకటి చావవలసి వచ్చెను. మరేదియూ పని చేయదు.

GEN 2:17•

GEN 4:5

 

26ఆ కారణము చేతనే కయీను యొక్క యాపిలు పండ్లు, పీచ్ పండ్లు పనిచేయలేదు. రక్తమున్న జీవి అవసరమై యుండెను. ఆ బలి పశువులో నుండి జీవము వెడలిపోయెను. ఆ రక్తము ఒక గురుతుగా ఉండి దేవుని క్రమమును నెరవేర్చెను.

దేవునికి కావలసినది ఏమిటి? జీవము. ఒక జీవము వెడలిపోయినదని ఆ రక్తము సూచించుచున్నది. జీవము పోయినట్లుగా ఆ రక్తము సూచించుచున్నది. ఒకటి చనిపోయినదని అర్థమగుచున్నది. దేవుడు అదే కోరెను, ఒక జీవము అర్పించబడినది, రక్తము చిందించబడినది; రక్తము గురుతుగా నిలచియున్నది, జీవము పోయినదని సూచించుచున్నది. దేవుడు కోరిన జంతువు యొక్క ప్రాణము పోయినది — ఆ రక్తము గురుతుగా నిలబడినది.

EXOD 12:7

 

27విశ్వాసముంచు ఆరాధికుడు ఆ గురుతు వలన ఆ బలి ద్వారా గుర్తించబడును.

ఇప్పుడు, ఈ చిన్న విషయముల గూర్చి ఎక్కువసేపు నేను బోధించను. ఆ ఒక్క సంగతికీ ఈ ఆరాధనంతా సరిపోవును, కాని దానిని వివరించుటకు ఒక్కసారి నేను ఇచ్చట ఆగుదును. విశ్వాసి ఆ బలితో కూడా గుర్తింపబడవలెను.

ఒకవేళ అది కేవలము బలి అయితే — అది ఎక్కడో వధింపబడినది, ఆయన ఇచ్చినట్లయితే; కాని దాని ద్వారా గుర్తింపబడవలెను. దాని మీద అతడు తన చేతులనుంచవలెను, మొదటిగా, ఆ బలితో కూడా తన్ను తాను గుర్తించుకొనవలెను. అతడు ఆ చిందించబడిన రక్తము క్రింద నిలబడియుండగలడు.

అతనిని తప్పక ఆ రక్తము కప్పువలెను. అతనిని గుర్తించు గురుతు అదే, దోషియగు మానవునికి బదులుగా నిర్ధోషమగు ప్రత్యామ్నాయము వధింపబడినది. అతని స్థానములో అది నిలబడినట్లు రుజువయినది.

28ఎంత చక్కని దృశ్యము. ఓ! విమోచన, చూడండి. నీతిగా ఎంచబడెను, దేవుని యొక్క పరిశుద్ధ న్యాయము నెరవేరినది; మరియు దేవుడు చెప్పెను, "ఇప్పుడు, నీ జీవితము నాకు అవసరము."

పాపము చేసిన వ్యక్తి యొక్క ప్రాణమును తీయుటకు బదులుగా దేవుడు బలిని అంగీకరించెను. అమాయకమగు జంతువు చనిపోయినది. అది రక్తమున్న మృగము — యాపిల్ కాదు, పీచ్ కాదు.

సర్ప సంతానము అందరికీ తేటగా అర్థము చేయబడినది — రక్తమే కావలెను, ఫలములో నుండి రక్తము రాదు, ఈ అమాయకపు జంతువులో నుండి రక్తము వచ్చినది. ప్రాణము అందులో నుండి పోయినది. ఆ రక్తమే దానికి రుజువు. ఆ జంతువు చనిపోయినదని రక్తము చెప్పుచున్నది.

MATT 3:16

 

29ఆరాధికుడు రక్తమును తనకు అన్వయించుకొనుచున్నాడు. విమోచనలో అతడు గుర్తించబడినట్లుగా కనబడుచున్నది. ఆ బలిగా చంపబడిన దానిలో నుండి వచ్చిన రక్తము అతనికి గురుతుగా నిలబడియున్నది. ఎంత అద్భుతము! ఎట్టి దృశ్యమది! అది క్రీస్తుకు పరిపూర్ణ మాదిరి.

చిందించబడిన రక్తము క్రింద నేడు విశ్వాసి నిలబడియున్నాడు. బలితో గుర్తించబడియున్నాడు. అది బహు పరిపూర్ణముగా యున్నది.

ఆ జంతువు చనిపోయినది. ఆలాగే క్రీస్తు చనిపోయెను. గొర్రెపిల్ల అది అమాయకమగు జంతువని నేను తలంచుచున్నాను. దేవుడు యేసుక్రీస్తును గుర్తించవలసిన సమయము వచ్చినప్పుడు గొర్రెపిల్లగానే గుర్తించెను. ఆయన తన్ను తాను పావురముగా గుర్తుంచుకొనెను. పక్షులన్నింటిలోను పావురము అతి అమాయకమైనది, పవిత్రమైనది. జంతువులన్నింటిలోను గొర్రె అతి అమాయకమైనది, పవిత్రమైనది.

కావున మీరు చుడండి, ఎప్పుడైతే

MATT 3:16•

MARK 1:10•

JOHN 1:32

 

30యోహాను ద్వారా యేసు బాప్తిస్మమును పొందెను, దేవుని ఆత్మ పావురము వలె ఆయన మీదికి దిగి వచ్చుటను అతడు చూచినట్లు బైబిలు చెప్పుచున్నది.

అది తోడేలు లేదా అట్టి మరో ఇతర జంతువు కాదు. తోడేలు యొక్క స్వభావము పావురము యొక్క స్వభావమునకు సరిపడదు. పావురము యొక్క స్వభావము గొర్రెపిల్ల యొక్క స్వభావమునకు మాత్రమే సరిపోవును. ఆ రెండు స్వభావములు ఏకమగును. అవి ఒకదానితో ఒకటి సమ్మతించును.

LUKE 3:22

 

31ఇప్పుడు, మీరు ముందు నిర్ణయమును చూచారా? గొర్రెపిల్లగా ఆయన వచ్చెను, చూచారా. చూచారా, గొర్రెపిల్ల తీసికొని రాబడినది. అది గొర్రెపిల్ల. గొర్రెపిల్లగా జన్మించెను. గొర్రెపిల్లగా పెరిగెను, చూచారా.

కావున నిజమగు ఆత్మ మాత్రమే వాక్యమును చేరుకొనగలదు. ఆ రకమగు ఆత్మ మాత్రమే క్రీస్తును చేర్చుకొనగలదు. మిగతావన్నియూ దానిని పొందుటకు ప్రయత్నించినా గాని అది రాదు. తోడేలు మీద దేవుని ఆత్మను ఉంచండి, అది కోపముతో అక్కడ నుండి పారిపోవును. అది అక్కడ ఉండదు. పరిశుద్ధాత్మ ఎగిరిపోవును. అది అక్కడ ఉండదు.

32గొర్రెపిల్లకు బదులుగా ఆ పావురము వచ్చియుండినయెడల, అక్కడ మరో జంతువు ఉండిన యెడల ఏమగును? వెంటనే అది అక్కడ నుండి ఎగిరిపోయి యుండును. కాని ఆయన ఆ స్వభావమును మలచెను, అది ఒకటిగా మారెను. పావురము గొర్రెపిల్లను నడిపించెను; గమనించండి, అది గొర్రెపిల్లను వధకు నడిపించినది.

ఇప్పుడు, గొర్రెపిల్ల పావురమునకు లోబడినది, చూచారా. అదెక్కడికి నడిపించితే అక్కడికి ఇష్టపడి వెళ్ళినది.

33ఈనాడు నేను ఆశర్యపడుచున్నాను, దేవుడు మనలను ఒక పూర్తి సమర్పణ గల జీవితమునకు నడిపించుచున్నాడు. ఆయనను సేవించుటకు నడిపించుచున్నాడు, కొన్ని సార్లు మన ఆత్మలు తిరుగుబాటు చేయుచున్నవి గదా? మనము అసలు గొర్రెలుగా కనిపించుట లేదు, చూచారా.

గొర్రెపిల్ల విధేయత చూపును. గొర్రెపిల్ల ఆత్మ సమర్పణ చేయును. అది తన స్వంతదానిగా దేనినీ చెప్పుకొనదు. అది నిలబడి తన బొచ్చును కత్తిరించుకొనుటకు ఇచ్చును. అది మాత్రమే ఆలాగు చేయును. అది ఎన్నడూ మారు మాట్లాడదు. తనకున్న సమస్తమును అది త్యాగము చేయును. అది గొర్రెపిల్ల. అది తనకున్న సమస్తమును సమర్పించును. నిజమగు క్రైస్తవుడు ఎల్లప్పుడూ ఆలాగే యుండును. తమ్మును తాము సమర్పించుకొందురు, ఈ లోకము గూర్చి భయపడరు, కాని తనకున్నదంతయూ దేవునికి ఇచ్చెదరు.

34ఇప్పుడు పరిపూర్ణమగు గొర్రెపిల్ల క్రీస్తే. ఈ గొర్రెపిల్ల వధించబడెను. ఐగుప్తులో స్వాభావికమగు గొర్రెపిల్ల వధింపబడెను. రక్తము అన్వయించబడెను, అది గురుతుగా యుండెను. ఈ గొర్రెపిల్ల యొక్క రక్తము ఎందుకున్నది? మనము చనిపోయి ఆ బలితో కూడా గుర్తింపబడియున్నామని ఆ గురుతు సూచించుచున్నది. ఆ గొర్రెపిల్లయు మరియు ఆ రక్తమును అంగీకరించిన వ్యక్తియూ ఒక్కటిగానే గుర్తించబడుదురు — బలి మరియు విశ్వాసి ఏకమగుదురు.

మీరు మీ జీవితములో మీ బలి ద్వారా గుర్తింపబడియున్నారు. అదే నిన్ను ఈలాగు చేయును.

35రక్తము ఒక గురుతుగాను లేదా ఒక గుర్తింపుగాను యున్నది. ఆరాధికుడు గొర్రెపిల్లను వధించినట్లుగా ఆ రక్తము మాట్లాడును. గొర్రెపిల్లను అతడు అంగీకరించెను. ఆ గురుతును తనకు అన్వయించుకొనెను, అతడు సిగ్గుపడలేదు. ఎవరు చూచినా ఆతడు లెక్కచేయలేదు. అందరూ దానిని చూడవలెనని అతడు కోరెను. దాటిపోవు వారందరూ ఆ గురుతును చూచునట్లుగా ఉంచబడెను. అది అటువంటి స్థానములో ఉంచబడెను.

చూడండి, చాలామంది జనులు క్రైస్తవులు కాగోరుచున్నారు. వారు రహస్యముగా ఉండగోరుచున్నారు. వారు క్రైస్తవులని ఎవరికీ తెలియరాదనుకోనుచున్నారు. "నేను క్రైస్తవునిగా ఉండగోరుచున్నాను గాని ఫలాని వారికి ఆ సంగతి తెలియరాదనుకొనుచున్నారు. వారి అనుచరులకు దానిని చెప్పురాదనుకొనుచున్నారు," చూచారా.

అది క్రైస్తవ్యము కాదు. క్రైస్తవ్యము దాని గురుతును వెల్లడి చేయవలసియున్నది. బహిరంగముగాను, వ్యక్తిగత జీవితములోను దానిని చెప్పవలసియున్నారు. కార్యాలయములోను, వీధిలోను, శ్రమ వచ్చు సమయములోను, సంఘములోను వెల్లడి చేయవలెను. ప్రతి చోట దానిని బయలుపరచవలెను.

రక్తమే గురుతు, ఆ గురుతును తప్పక అన్వయించవలెను, లేని యెడల… ఆ నిబంధన అమలులో యుండదు.

36రక్తమే దానికి గురుతు. అదే గుర్తింపు. ఈ వ్యక్తి గుర్తించబడెనని గుర్తింపు అయినది. అతడు విమోచించబడెనని సూచన.

మీరు గమనించండి, ఏదీ జరుగక ముందే వారు విమోచించబడిరి. విశ్వాసము ద్వారా వారు రక్తమును అన్వయించిరి. అది వాస్తవంగా జరుగక ముందే విశ్వాసము ద్వారా రక్తము అన్వయించబడినది. అది జరుగనైయున్నదని వారు విశ్వసించిరి.

దేవుని ఉగ్రత ఆ దేశము గుండా వెళ్ళక ముందే రక్తమును అన్వయించవలెను. ఉగ్రత నుండి దిగి వచ్చిన తరువాత ఎవరూ ఏమి చేయలేరు.

ఇప్పుడు, అక్కడ మనకు ఒక పాఠమున్నది. నిజంగా ఒక క్షణము పాటు మీరు దీనిని ఆలోచించండి. చూడండి: అది జరుగక ముందే. ఒక కాలము వచ్చుచున్నది, అప్పుడు మీరిక రక్తమును అన్వయించలేరు.

37సాయంకాల సమయమందు గొర్రెపిల్ల వధించబడెను. దానిని పదు నాలుగు దినములుంచిరి. గొర్రెపిల్ల చంపబడెను, సాయంకాల సమయములో రక్తము అన్వయించబడెను. దానిని మీరు గ్రహించారా?

సాయంకాల సమయము వరకు గురుతు అమలులోనికి రాలేదు.

EXOD 12:6,7

 

38మనము జీవించుచున్న ఈ కాలము సాయంకాల సమయము. ఇది సంఘమునకు సాయంకాల సమయము. నాకు ఇది సాయంకాల సమయము. నా వర్తమానమునకు ఇది సాయంకాల సమయము. నేను చనిపోవుచున్నాను; నేను వెళ్ళిపోవుచున్నాను; నేను కదిలిపోవుచున్నాను, ఇది సువార్తకు సాయంకాల సమయము.

మనము నీతీకరణము గుండా వచ్చియున్నాము, కాని ఇది గురుతును అన్వయించుకోవలసిన సమయము. నేను మీతో ఒక సంగతి చెప్పవలసియున్నదని గత ఆదివారము చెప్పాను — అది ఇదే. ఈ సమయమున మీరు ఆటలాడలేరు. ఇది జరుగవలసియున్నది. అదెప్పుడయినా జరుగవలసియున్నచో, ఇప్పుడే జరుగవలెను, ఎందుకనగా దేశము మీదికి ఉగ్రత రాబోవుచున్నది. అది సిద్ధముగా యుండుటను మనము చూచుచున్నాము. ఆ గురుతు క్రింద లేని ప్రతిదియూ నశించును. రక్తము నిన్ను గుర్తించెను.

39గమనించుము, జంతు జీవము మానవునికి సరిపోదు. రక్తము చిందించబడినప్పుడు, జీవము వెడలిపోయినది, ఎందుకనగా అది ఒక ఐక్యత. ప్రాణమునకాధారమైన రక్తము ఆందులో నుండి వెడలిపోయెను. రక్తమే జీవమైయున్నది. రక్తము, ప్రాణము వేర్వేరు కావచ్చును గాని రక్తములోనే ప్రాణమున్నది. జంతుజీవము ఆరాధికుని మీదికి రాలేదు. ఈ గొర్రెపిల్ల యొక్క రక్తము చిందింపబడినది, ఆయన దానిని అన్వించవలసియుండెను, ఎందుకనగా ఆ జీవము పోయినది మరియు తిరిగి అది రాలేదు.

40ఎందుకనగా అది మానవుని మీదికి రాజాలదు, ఎందుకనగా జంతు జీవమునకు ఆత్మలేదు, తాను దిగంబరినని ఆ జంతువునకు తెలియదు. పాపమును అది గ్రహించదు. దానికి ఏమి తెలియదు. కావున అది జీవియే గాని జీవించు ఆత్మ కాదు. కాబట్టి ఆ జంతు జీవము మానవుని మీదికి తిరిగి రాలేదు, ఎందుకనగా ఆ జీవములో ఆత్మ లేదు.

ఇప్పుడు, ప్రాణమున్నది, రక్తమున్నది, జీవమున్నది, మరియు ఆ జీవములో ఆత్మ యుండవలెను. ఆత్మయే జీవమునకు స్వభావము. అది జంతువు గనుక దానికి ప్రత్యేకమగు స్వభావము లేదు. కావున దాని ప్రాణము పోవుట ద్వారా వెలువడిన రక్తము గురుతుగా నిలబడియున్నది.

కాని ఈ మహిమకరమగు స్థలములో, ఈ నిబంధన క్రింద రక్తమునకు ప్రాణమునకు మధ్య ఒక తేడా యున్నది. ఈనాడు విశ్వాసికి గురుతు పరిశుద్ధాత్మ — రక్తము కాదు, కాని అది దేవుని యొక్క పరిశుద్ధాత్మ. ఈనాడు సంఘము ఆ గురుతును కలిగి యుండవలెనని దేవుడు కోరుచున్నాడు. ఈ గురుతు తప్పక దేవునికి కనబడవలెను. మనలో ప్రతి ఒక్కరిలో దీనిని దేవుడు చూడగోరుచున్నాడు.

EXOD 12:7,23

 

41సాయంకాలపు నీడలు కనబడుచున్నవి. పై నుండి ఉగ్రత కుమ్మరింపబడుటకు సిద్ధముగా యున్నది. భక్తిలేని దేశముల మీద, భక్తిలేని అవిశ్వాసుల మీద, శక్తిలేని వేషధారుల మీద అది కుమ్మరించబడనై యున్నది. నేను దానిని నిలబడి చూచుచున్నాను. ఈ సంగతులు చెప్పక ముందే వాటిని చూచాను.

ఇప్పుడు మనము నీడలలో జీవించుచున్నాము. ఉగ్రత త్వరలోనే రాబోవుచున్నది. దేవుడు ఒక గురువును కోరుచున్నాడు. ఆ గురుతును నీవు పొందవలెను — ఆ గురుతు పరిశుద్ధాత్మ. అది ఒక్కటే మార్గము. దానిని చూచినప్పుడు మాత్రమే ఆయన దాటిపోవును, ఎందుకనగా అది యేసు క్రీస్తు యొక్క జీవము. విశ్వాసి మీదికి తిరిగి వచ్చియున్నది.

జంతువు యొక్క జీవము తిరిగి రాదు. కావున ద్వారము మీద రక్తము నుంచవలెను. ద్వారపు కమ్ముల మీద దానిని ప్రోక్షించవలెను. ఆ దారిన పోవు ప్రతివారును, మొత్తం జనమంతా, ఆ ఇంటిని దాటిపోవు వారందరూ ఆ ద్వారము మిద నున్న రక్తపు గురుతును చూచెదరు. ఆ ద్వారము యొద్ద ఒక ప్రాణము పోయినది. ఆమేన్!

42ఈనాడు ప్రతి విశ్వాసియు ఆ విధముగానే ఉండవలసియున్నాడు — పరిశుద్ధాత్మతో నింపబడవలెను. గొర్రెపిల్ల యొక్క రక్తము చిందించబడినట్లు గురుతు. ఆ గొర్రెపిల్లలో గల రక్తము తిరిగి వచ్చియున్నది. బహిరంగముగా దాని ముద్ర కనబడుచున్నది. దానిగుండా పోవు వారందరును, దాని గూర్చి చెప్పుకొందురు. నీ సహచరులు ఆ రక్తము చూచెదరు. రక్తము అన్వయించబడినదని గ్రహించుదురు. అది జీవపు గురుతు. ఆ రక్తము నీ మీద యున్నది. నీవు ఉగ్రత నుండి తప్పించబడుదువు. సభ్యత్వము కాదు. లేదండి.

జంతువు యొక్క జీవము విశ్వాసి మీదికి రాజాలదు, ఎందుకనగా అది జంతువు. మనస్సాక్షిని గూర్చి అది మాట్లాడుతున్నది. ఒక పరిపూర్ణమగు బలి రానున్నదని అది చూపించుచున్నది.

JOHN 1:14

 

43దేవుని కంటే పరిపూర్ణమైన బలి మరేది యుండును? దేవుడే స్వయంగా ప్రాయశిత్తము చేసెను. దేవుడు శరీరధారి అయ్యెను. ఆయనే స్వయంగా రక్తమును సృజించుకొనెను. దేవుని యొక్క జీవము ఎప్పుడయినా గాని ఆ విధంగానే తిరిగి వచ్చును, ఎందుకనగా మనమందరము శరీరేచ్ఛ వలన పుట్టియున్నాము.

ఇది లోక సంబంధమగు జీవము. ఆ జీవము నిలబడదు. దానికి ముందే తీర్పు తీర్చబడి శిక్ష విధింపబడినది. దానికి నీవు మెరుగులు దిద్దలేవు. దానిని మరమ్మత్తు చేయు విధానము లేదు. దానిని సున్నితము చేయు విధానము లేదు. దానిని బాగు చేయు విధానము లేదు.

అది చావవలసి యున్నది. దానికి ప్రత్యామ్నాయము కావలెను — యేసుక్రీస్తు జీవము — నీ లోనికి రావలసియున్నది, అదే పరిశుద్ధాత్మ, దేవుని గురుతు, ఆయన కుమారుడగు యేసుక్రీస్తు రక్తమును నీవు ఆంగీకరించవలసి యున్నావు.

నమ్మితే చాలునని లూధర్ దినములలో అనుకొనిరి. వెస్లీ దినములలో రక్తము నుందు విశ్వాసముంచిరి, రక్తము యొక్క కెమిస్ట్రీ. కాని ఇది చివరి దినము, గురుతు కావలెను. అప్పుడు ఎత్తబడెదవు. దానిని మీరు చూచారా?

44ఒక బిడ్డను కను స్త్రీలో నుండి నీరు, రక్తము, ఆత్మ వచ్చును. మామూలు జన్మలో నీరు వచ్చును; రెండవదిగా రక్తము వచ్చును; ఆ తరువాత జీవము వచ్చును.

ప్రభువైన యేసుక్రీస్తు యొక్క శరీరము ఆలాగే వచ్చును, నీరు, రక్తము, జీవము. సంఘమంతయూ, వధువు, అంతయూ ఆలాగే తయారయినది. నీతీకరణ, శుద్ధీకరణ, మరియు పరిశుద్ధాత్మ బాప్తిస్మము — అదే గురుతు.

HEB 11:37,40

 

45హెబ్రీ 11లో చెప్పబడినది అదే. "వీరందరు గొర్రె చర్మములను మేక చర్మములను కప్పుకొని తిరిగిరి మరియు అనాధులుగా యుండిరి. అయినను మనము లేకుండా వీరు పరిపూర్ణులు కాజాలరు."

46ఈ దినమున సంఘము గురుతుగా పరిశుద్ధాత్మ బాప్తిస్మమును పొందియున్నది — రక్తము చిందించబడినది, సంఘము మీద పరిశుద్ధాత్మ యున్నది. మనము లేకుండా వారు లేవలేరు. వారు మన మీద ఆధారపడియున్నారు. దేవుడు ఆ ప్రకారముగా వాగ్దానము చేసెను. ఒకరు అక్కడ ఉండవలసియున్నారు. వారెవరో నాకు తెలియదు, కాని దానిని పొందువారు కొందరుందురు!

దానిని బోధించు బాధ్యత మాత్రమే నాకున్నది! ముందుగా నిర్ణయించబడిన విత్తనము కొరకు చూడవలసిన పని దేవునిది! అది ఏలాగయినా అచ్చటుండును — అందరు ఎందుకనగా — వారిలో ప్రతి ఒక్కరు అక్కడ ఉండబోవుచున్నారు! ఒకరు ఒక దానితో — నీటి యుగము, రక్తపు యుగము, ఇప్పుడు పరిశుద్ధాత్మ గురుతు యుగము!

47గుర్తుంచుకొనండి, ఇశ్రాయేలు ఎన్నో దాటి వచ్చియున్నది, కాని సాయంకాలమున గురుతు కావలసి వచ్చెను. ఉదయ కాలము కాదు, సిద్ధపాటు కాలము కాదు. పదునాలుగు దినములు గొర్రెపిల్ల నుంచవలెను.

ఏదో రాబోవుచున్నదని ఇశ్రాయేలునకు తెలియును. ఆ విధముగానే లూధర్ ఎరుగును. ఆ విధముగానే వెస్లీ ఎరుగును. ఆ విధముగానే ఫిన్నీ, నాక్స్, కాల్విన్లు ఎరుగుదురు. అదే ఇది.

అగ్నిస్తంభము సంఘము మీదికి తిరిగి వచ్చు కాలము ఒకటున్నదని వారికి తెలియును. ఈ సంగతులు జరుగు కాలము ఒకటి వచ్చునని వారెరుగుదురు. కాని దానిని చూచుటకు వారు జీవించలేదు, కాని వారు దాని కొరకు ఎదురుచూచిరి.

ఏదో జరుగనై యున్నదని ఇశ్రాయేలునకు తెలియును, కాని సాయంకాల సమయములో గొర్రెపిల్ల యొక్క రక్తము గురుతుగా ఉండవలసి వచ్చెను. ద్వారము మీద అది యున్నది. గొర్రెపిల్ల ముందుగానే వధింపబడినది.

EXOD 12:6,13

 

48గొర్రెపిల్లయే ఎక్కడ చూచినా గాని కనిపించును. లూధర్ కాలములో గొర్రెపిల్ల కలదు. వెస్లీ కాలములో గొర్రెపిల్ల కలదు. ఇది గురుతు కాలము. ప్రతి ఇల్లు గురుతుచే కప్పబడవలెను. దేవుని యొక్క ప్రతి గృహము తప్పక గురుతుతో కప్పబడవలెను. దాని లోపట నున్న ప్రతిదియు గురుతుతో కప్పబడవలెను.

యేసుక్రీస్తు యొక్క శరీరమే దేవుని యొక్క ఇల్లు. మనమందరము ఒక్క ఆత్మ ద్వారానే ఈ గురుతులోనికి బాప్తిస్మము పొందియున్నాము. అందులో భాగమై యున్నాము. "ఆ గురుతును నేను చూచినప్పుడు, దాటిపోయెదనని," దేవుడు చెప్పెను. ఏ ఘడియలో మనము జీవించుచున్నామో చూడండి.

49రక్తము గుర్తించబడినది - విశ్వాసి గుర్తింపబడెను, ఎందుకనగా జీవము పోయియున్నది. తిరిగి రాలేదు, కావున ఆయన ఒక రక్తము కావలసియుండెను. ఒక పెయింట్ వలె, రక్తము ఆయనకు కావలసి యుండెను, జీవము వెడలిపోయెనని ఆ రక్తము చూపించుచున్నది.

ఇప్పుడు, అదే ఆత్మ ఇప్పుడు గురుతుగా యున్నది. పరిశుద్ధాత్మ, తనకుతానూ, గురుతుగా ఉండెను. రక్తము కాదు.

కల్వరి యొద్ద రక్తము చిందింపబడెను, అది నిజము, కాని రక్తము తిరిగి ఆయా మూల పదార్థములలోనికి పోయినది. ఏ ఆహారము తిని అది తయారయినదో, వాటిలోనికి తిరిగి చేరుకొనినది.

కాని మీరు చూడండి, ఆ రక్త కణము లోపల జీవమున్నది. దాని వలననే రక్తకణము కదలసాగినది. రక్తము లోనికి జీవము రాగానే, ఆ రక్తము కణముగా మారినది. అది తన స్వంత రూపమును పొందినది. ఆ తరువాత మానవునిగా మారినది. ఆ మానవుడే దేవుడు. శరీరధారి అయిన ఇమ్మనుయేలు. ఆ జీవము తిరిగి రక్తములోనికి వచ్చినది — దానిలోని వెళ్ళినది. అయితే సంఘము మీద పరిశుద్ధాత్మయే గురుతుగా యున్నది, వారు క్రీస్తును చూచెదరు.

HEB 13:8

 

50స్త్రీ మరియు ఆమె భర్త ఒక్కటిగా యగుదురు. వారు ఏక శరీరులు, ఆ విధముగానే క్రీస్తు మరియు ఆయన వధువు ఒక్కటే. వధువు యొక్క పరిచర్య మరియు క్రీస్తు యొక్క పరిచర్య ఒక్కటే.

గుర్తుంచుకొనండి, యేసు క్రియ చేయుచున్నాడు, మరియు దానిని ఆయన కొనసాగించుచున్నాడు. ముందు చేసిన ప్రకారమే ఇప్పుడును చేయుచున్నాడు. ఈ విషయమును థియోఫిలకు వ్రాసెను.

ఆయన మరణము ఆయనను ఆపు చేయజాలదు, లేదండి, ఆయన మరల వచ్చెను. మూడవ వ్యక్తి కాడు, కాని అదే వ్యక్తి. పరిశుద్ధాత్మ రూపములో తిరిగి వచ్చెను, మరియు పనిని కొనసాగించుచున్నాడు, అపోస్తలుల కార్యముల గ్రంధముము చెప్పుచున్నది.

"యేసుక్రీస్తు నిన్న, నేడు, నిరంతరము ఏకరీతిగా యున్నాడు." అదే గురుతు. అదే సూచన.

EXOD 12:13•

MARK 16:17•

ACTS 3:6

 

51శృంగారమును దేవాలయపు ద్వారము గుండా పేతురు యోహానులు పోవుచుండిరి. అక్కడ ఒక కుంటి వాడుండెను. అతడు తల్లి గర్భములో నుండి ఆలాగున వచ్చెను. అతనితో ఇట్లనిరి, "వెండి బంగారములు నా యొద్ద లేవు గాని, నాకు కలిగిన దానినే నీకిచ్చుచున్నాను. నజరేయుడగు యేసుక్రీస్తు నామములో లేచి నడువుము."

వారతనితో మాట్లాడిరి మరియు వారు విద్యలేని పామరులు, కాని వారు యేసుతో కూడా ఉండినవారని ఎరిగియుండిరి. చూడండి, ఆ గురుతు అక్కడున్నది, ప్రదర్శింపబడెను, చూచారా.

ఒక సోదరుడు అక్కడ కుంటితనముతోను, దరిద్రతతోను, నిరాశతోను పడియుండుటను వారు చూచిరి. క్రీస్తులో యున్న జీవమే వారిలోనూ యుండినది.

"నా నామమున వారు దయ్యములను వెళ్ళగొట్టుదురు."

"నేను, కాదు; మీరు. మీరు ఈ కొండను పొమ్మని చెప్పితే పోవును…" — నేను చెపితే కాదు. "మీరు ఈ కొండను పొమ్మని చెప్పితే పోవును."

ఓ, సోదరుడా, గురుతును ప్రదర్శించే సమయము ఆసన్నమయినది. దానిని మనము చూడగలము. ఇప్పుడు మనము అంత్యకాలములో యున్నామని ఎరుగుదుము. ఎన్నో రకముల వర్తమానములు వెలువడినవి. అద్భుతములు, సూచక క్రియలు జరిగినవి.

సంఘము ఏమి చేయవలనో ఇప్పుడు గుర్తించండి: గురుతు ప్రదర్శింపబడవలెను. "రక్తమును చూచినప్పుడు ఆయన దాటిపోవును." మరేదియూ పనిచేయదు. రక్తమే కావలెను.

ఇప్పుడు, పరిశుద్ధాత్మయే దేవుని నుండి వచ్చిన మన గురుతు.

ACTS 19:2

 

52ఒకసారి ఒక గొప్ప వేదాంత పండితుడు, చక్కని బాప్టిస్టు సోదరుడు, నా యొద్దకు వచ్చి ఇట్లనెను, "బ్రెన్హాం సోదరుడా, నీవు ఈ పరిశుద్ధాత్మను గూర్చి మాట్లాడుతున్నావు. ఇంక క్రొత్త సంగతి ఏమి లేదా? ఎన్నో తరముల నుండి దీనిని గూర్చి వినుచున్నాము."

మరియు నేను అన్నాను, "మంచిది, నేను.."

మేము పరిశుద్ధాత్మను పొందితిమి," అని అతడు అన్నాడు.

"నీవెప్పుడు దానిని పొందియున్నావు?" అనడిగాను.

"నమ్మినప్పుడే" అన్నాడు. అది బాప్టిస్టు సిద్ధాంతమని నాకు తెలియును. నీవు నమ్మినప్పుడే పరిశుద్ధాత్మను పొందియున్నావని వారందురు.

అపోస్తలుల కార్యములు 19వ అధ్యాయములో ఒక బాప్టిస్టు గుంపుకు పౌలు చెప్పినది వినుము. వారందరూ బాప్తిస్మమిచ్చు యోహాను ద్వారా మార్పు పొందిరి. యేసే క్రీస్తని బైబిలు ద్వారా నిరూపించబడెను.

ACTS 19:2,3,5,6

 

53అతడు ఎఫెసు తీరము గుండా వెళ్ళుచుండెను, కొందరు శిష్యులతనికి కనబడిరి. "మీరు నమ్మినప్పటి నుండి పరిశుద్ధాత్మను పొందితిరా?" అని వారిని అతడు ప్రశ్నించెను.

"అసలు పరిశుద్ధాత్మ ఉన్నదను సంగతియే మాకు తెలియదని," వారు చెప్పిరి.

అప్పుడు వారెట్లు బాప్తిస్మము పొందిరో అడిగెను. వారు బలిగా అర్పించబడిన గొర్రెపిల్ల యగు యేసుక్రీస్తు నామములో బాప్తిస్మము పొందలేదు. వారాయనతో అసలు గుర్తించబడనే లేదు. దానిని వారు నమ్మిరి - మందును కొని కూడా వేసికొననట్లే అది యున్నది. వారు యేసుక్రీస్తు నామములో తిరిగి బాప్తిస్మము పొందవలెనని పౌలు ఆజ్ఞాపించెను. ఈ విధముగా అతడు చేసినప్పుడు వారి మీదికి గురుతు దిగి వచ్చెను. వారు పరిశుద్ధాత్మ యొక్క క్రియలు మరియు సూచనలు ద్వారా గుర్తింపబడిరి. వారు భాషలతో మాట్లాడిరి, ప్రవచించిరి. దేవునిని మహిమపరచిరి.

వారు బలియైన గొర్రెతో గుర్తించబడిరి.

GAL 2:20

 

54పరిశుద్ధాత్మయే మన గుర్తింపు. అదే మనలను క్రైస్తవులుగా గుర్తించును — సంఘములలో మనకున్న సభ్యత్వము కాదు, మన బైబిలు పరిజ్ఞానము కాదు, మనకు ఎంత వరకు బైబిలు తెలియునన్నది కాదు; గ్రంధకర్త గూర్చి ఎంతవరకు నీకు తెలియును, గ్రంధకర్త నీలో ఎంత వరకు జీవించుచున్నాడు.

నీ స్వార్థము పోవలెను. నీవు కాదు… నిన్ను నీవు మృతునిగా ఎంచుకొనుము, ఆ గురుతు నీలో జీవించవలెను, నీ జీవము కాదు, ఆయన జీవము. ఇకను జీవించవాడను నేను కాను గాని క్రీస్తే అని పౌలు పలికెను. ఒకప్పుడు అతని జీవితము వేరు. ఇప్పుడు వేరే జీవితమును కలిగియున్నాడు. దేవుడు కోరుకొను గురుతును గుర్తించెను. మన యొక్క బలితో గుర్తింపబడెను. మన రక్షకుని యొక్క జీవము, పరిశుద్ధాత్మ మనలో యున్నది. ఎంత సానుకూలమైన గురుతు. మరే ఇతర గురుతు సరిపోదు.

ఓ, మై, దానిని గూర్చి నీవు గ్రహించితే చాలును. ఈ ఉదయమున దాని శక్తిని మాటలలో వ్యక్తము చేయగోరుచున్నాము. నీ ఆత్మలోనికి అది రావలెను. నీ చెవులలోనికి కాదు, నీ ఆత్మ లోనికి రావలెను. దాని యొక్క హామీని నీవు చూడగలవు. అది నీకు ఎంతో విశ్రాంతిని ఇచ్చును.

55నీవు ఒక నేరము చేసినయెడల, నిన్ను కోర్టులో పరిశోధించుదురు. నీవు దోషిగా రుజువైనయెడల చనిపోదువు. నిన్ను కరెంటు కుర్చీలోనో, గ్యాస్ గదిలోనో, లేక మరేదో బహిరంగ శిక్ష స్థలములోనో కూర్చోబెట్టెదరు — లేదా ఉరితీయ వచ్చును. శిక్షను విధించెదరు. నీవు దోషి.. ఆ సంగతి నీకు తెలియును. ఒక న్యాయవాదిని నీ తరపున నీవు పెట్టుకొననియెడల, నీకు చావు తప్పదు. అతడు నిన్ను బయటకు రప్పించును. కావున నీవు మంచి న్యాయవాది కొరకు వెదకుదువు. మంచి న్యాయవాదిని, తెలివిగల న్యాయవాదిని నీవు ఎన్ను కొందువు. నీ కేసును అతడు గెలిపించగలడని నమ్ముదువు. ఆ న్యాయవాదిని చూచి నీవు కొంత విశ్రాంతి పొందుదువు, అయినా గాని నీ మనస్సు ఆందోళనపడుచుండును. ఈ న్యాయవాది న్యాయము తీర్చునో లేదో, కేసు గెలుచునో లేదో, అని తలంచెదవు. అతనికి తెలివి ఉండును. అతనికి న్యాయ శాస్త్రము తెలియును. నీ కేసును తెలివిగా వాదించును. నీవు జీవించుటకు ఉపాయము ఆలోచించును.

అతడు తన వాదన ద్వారాను, తన తెలివి ద్వారాను అవతలి న్యాయాధిపతిని ఓడించును. ఇవన్నియూ నీకు ముందుగా తెలిసినా గాని నీ మనస్సులో ఎన్నో భయాందోళనలు ఉండును. అతడు కేసు గెలుచునో లేదో అనుకొందువు.

PS 23:4

 

56కాని ఈ సందర్భములో న్యాయాధిపతియే మన పక్షమున వాదించువాడాయెను. దేవుడే మానవుడాయెను. ఏ న్యాయవాదియూ ఆలాగున చేయజాలడు. ఎవరూ అట్టివారు మనకు దొరకరు. మోషే, ధర్మశాస్త్రము, ప్రవక్తలు ఎవరునూ ఆలాగు చేయలేకపోయిరి. కావున ఇప్పుడు న్యాయాధిపతియే రెండు పనులు చేయుచుండెను. ఆయన తన స్వంత చేతులలోనికే ధర్మశాస్త్రమును తీసికొనెను. దానికి వెలను స్వయంగా చెల్లించెను. అంతకంటే మనకు భద్రత ఏమున్నది? ఆయన తన స్వంత జీవమును తిరిగి మనకు ఇచ్చెను. దానిని ఆయన అంగీకరించినట్లుగా సాక్ష్యమున్నది. ఎంత సురక్షితము. "మరణాంధకారపు లోయగుండా నేను నడిచినను ఏ అపాయమునకు భయపడను; ఏలయనగా నీవు నాకు తోడై యున్నావు…"

GEN 2:7,9•

GEN 3:6•

JOHN 5:24

 

57ఆయనే రెండు పనులు చేయవలసి వచ్చెను. మన కేసును ఆయన వాదించెను. ఆయన యొక్క స్వంత ధర్మశాస్త్రము ద్వారా మనము దోషులముగా తీర్చబడియున్నాము. ఆయన వచ్చి దోషి యొక్క స్థానమును ఆక్రమించెను. అతని పాపమును ఆయన వహించెను. ఆయన దానిని తన మీదికి తీసికొని చనిపోయెను. ఆయనే వెలను చెల్లించెను. ఆయన తన రక్తమును చిందించెను. తన స్వంత జీవమును, తన స్వంత గురుతును మనకిచ్చెను.

మనము పరిపూర్ణులమైయున్నాము. కేసు కొట్టివేయబడినది. విశ్వాసికి ఇక ఏ పావము లేదు. ఓ దేవా, దయ చూపుము. జనులు దానిని చూడలేకపోవుచున్నారు. ఇక ఏ కేసు లేదు. "నా మాటలు విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచువాడే నిత్యజీవము గలవాడు. అట్టివాడు తీర్పులోనికి రాక, మరణములో నుండి జీవములోనికి దాటియున్నాడు.

కేసు ఉండెను. ఆ కేసు కొట్టివేయబడినది; ఇక ఏ కేసు లేదు. ఆమేన్!

సురక్షితముగా ఆ గురుతు వారికి అన్వయించబడినది. మరణము వారి తలుపు యొద్దకు రాలేదు. దానికి అక్కడికి వచ్చు ధైర్యము లేదు.

58అవును, గురుతు అన్వయించబడినది. ఇప్పుడు ఆ గురుతును గుర్తించుట జరిగినది. గురుతు వచ్చునట్లుగా ఇది జరిగినది. ఆ గురుతు దేవుని యొక్క జీవము. దేవుడు మొదట మానవుని తయారు చేసెను. అతడు కుమారునిగా యుండెను. ఆ కుమారుడు చెడిపోయెను, అతడు దేవుని మాటకు బదులుగా తన భార్య మాటను వినెను. తన భర్త మాటను వినుటకు బదులుగా, ఆ స్త్రీ అపవాది మాటను వినెను. అందువలన వారు మొత్తం చెడిపోయిరి. అంతయూ ఆపవిత్రమాయెను. ఆ విధముగా వారు చేసినప్పుడు, లోకము లోనికి పిల్లలను తీసికొని వచ్చుదురని దేవునికి తెలియును. ఆ మధ్య నున్న చెట్టును వారు తాకుటకు వీలు లేదు. వారు పాపముతో నిండియుండిరి; అందువలన పూర్తి మానవ జాతి పాపములో జన్మించెను.

బయటకు వచ్చు మార్గము లేదు.

59అప్పుడు దేవుడు దిగి వచ్చెను. వానిని తిరిగి తెచ్చుటకు ఒకే ఒక మార్గమున్నది. వానిని కుమారునిగా మరల తీసికొని రావలెను. ఆయన యొక్క ధర్మశాస్త్రము అతనిని దోషి అని ఖండించుచుండగా, ఆయన దానిని ఎట్లు చేయగలడు?

అప్పుడు, తండ్రి మనలో ఒకని వలె ఆయెను. ఆయనే నిజమగు గొర్రెపిల్ల. ఆయన యొక్క మనస్సులో ఉన్న ఉద్దేశ్యమదే. ఏదెను తోటలో ఆయన గొర్రెపిల్లగా గుర్తించబడుటకు అదే కారణము. గొర్రెపిల్ల మరియు పావురము ఒక సమయములో కలిసికొనును. గొర్రెపిల్ల మరియు పావురము ఏకమగును. అందువలన మనమందరమూ ఏకమగుదుమని ఆయనకు తెలియును. అటువంటి బలిగా యుండుటకు ఆయన ఇష్టపడెను.

ఇప్పుడు, గురుతు అన్వయింపబడును, ఇక మీదట మనము దూరస్థులము కాము, ఇక మీదట మనము పరదేశులము కాము, కాని దేవుని యొక్క కుమారులము మరియు కుమార్తెలమై యున్నాము. ఆదామవ్వలు స్త్రీ పురుషులుగా జత చేయబడిరి, వారు దేవుని కుమారులు మరియు కుమార్తెలుగా, ఆయన యొక్క గొప్ప త్యాగము చేత, క్రీస్తు యేసులో ఉన్నారు.

EXOD 12:13

 

60అందులో ఏ పొరపాటు జరుగుటకు వీలు లేదు, ఈ జీవ బీజము భూమిలో నాటబడవలసి యున్నది, ఈ శరీరము నాశనమగు విత్తనమే; మరియు జీవము — ఒకవేళ అందులో ఉన్న జీవము వక్రీకరించబడిన జీవమైతే, అది ఆ విత్తనముతోనే నశించును. కాని ఆయన అందులో నిత్యజీవమును ఉంచెను, తన స్వంత కుమారునిగా గుర్తించెను. అయితే పునరుత్థానమందు, ఆయన వానిని తిరిగి లేపును, మరియు ఏదియు నశింపదు. నా భావమును గ్రహించారా? అక్కడే ఉన్నది.

ఇప్పుడది నశించలేదు. దాని మీది జీవము ఉన్నది. అది ఒక గురుతు. ఆ చిన్న శరీరము మీద ఉన్నది, ఆ వ్యక్తి యొక్క ఆత్మ మిద యున్నది.

1JN 3:9

 

61అక్కడ ఒక గురుతు ఉన్నది, అది పరిశుద్ధాత్మ, అది దేవునికి చెందినది. అది ఆయనది. "ఆ గురుతును చూచినప్పుడు, నేను దాటిపోవును" — ఒక సానుకూలమైన గురుతు.

పరిశుద్ధాత్మయే మన గురుతు. మీరు పరిశుద్ధాత్మను పొందినప్పుడు మరణములో నుండి జీవములోనికి దాటి యుందురు, ఎందుకనగా మిలో జీవము ఉన్నది. మీరు ఏ మాత్రము నశించరు.

బైబిల్ చెప్పెను, "దేవుని మూలముగా పుట్టిన వాడు పాపము చేయడు." అతడు పాపము చేయజాలడు, ఎందుకనగా దేవుని బీజము వానిలో యున్నది… ఆమేన్! దేవుని యొక్క బీజము ఆతనిలో నిలచియున్నది. పాపరహితుడగు దేవుడు అతనిలో యుండగా అతడేలాగు పాపము చేయగలడు.

పాపరహితుడగు దేవునిలో అతడున్నాడు. అతడెట్లు పాపము చేయును? అతడేమి చేసినా గాని కప్పబడియున్నది. అతని మీద రక్తమున్నది. ఇప్పుడతడు నూతన సృష్టియై యున్నాడు. అతని యొక్క ఆశలు మరియు కోరికలు పరలోక సంబంధమైనవిగా యుండును, ఎందుకనగా అతడు గురుగు నుండి గోధుమ గింజగా మారియున్నాడు. అతని కోరికలు ఇంతకు ముందున్నట్లుగా లేవు, దానిని అతడు వెల్లడి చేయును. దానిని నేను నమ్ముచున్నానని చెప్పి కూడా, నీవింకా పాపములో నిలచి యుండవచ్చును. మై, నీవు మోసగించబడినావు. గురుతును తప్ప మరి దేనినీ నీవు బయలుపరచలేవు.

EXOD 12:13•

PS 23:4

 

62ముందుకు సాగిపొండని ఆజ్ఞాపించబడు వరకు ఇశ్రాయేలు వారు రక్తము క్రిందనే నిలచియుండవలెను. దాని క్రింద నుండి వారు తొలగిపోరాదు. వారు ఆ గురుతు క్రింద ఉన్నప్పుడు ముద్రించబడిన వారగుదురు. దానిని వారు విడిచి పెట్టరాదు. అర్థరాత్రి వరకును, బూరలు మ్రోగు వరకును వారు అక్కడే యుండిరి. బూరలు మ్రోగినప్పుడు వారందరూ వాగ్దాన దేశమునకు ప్రయాణమైరి. ఆ పాత పొట్టేలు కొమ్ములు ప్రతి ధ్వనించినవి. ప్రతివారు వారి వారి క్రమములో ముందుకు సాగిరి.

పరిశుద్ధాత్మతో నిండిన స్త్రీ లేదా పురుషులు ఆలాగే యుందురు. వారు ముద్రించబడుదురు, ప్రతి విధమగు ఆపద మరియు హాని నుండి వారికి రక్షణ యుండును. అతని నడకలో, అతని పనిలో, ఆతని మాటలో తన జీవమును వెల్లడి చేయును. అతని జీవితమంతా ఆ విధంగానే యుండును. స్త్రీలతో మాట్లాడినా, తన సహచరులతో సంచరించినా, మరే పని చేసినా గాని అక్కడ గురుతు వెల్లడి యగును. ఆమేన్.

మరణము వచ్చినా గాని అతడు భయపడడు; ఎందుకనగా దేవుడతనికి తోడై యుండును. ఆ గురుతు అక్కడున్నది. పునరుత్థానమందు అతడుండును. అంత్యదినమున దేవుడతనిని లేపును.

యేసు ఆలాగని చెప్పెను: "రక్తమును [గురుతును] చూచినప్పుడు దాటిపోవుదునని," ఆయన చెప్పెను. ఓ!

63గుర్తుంచుకొనండి, ఆ గురుతు ప్రదర్శిపబడనియెడల, ఆ నిబంధన చెల్లదు. అది నిజము. నిబంధన చెల్లదు. ఆ గురుతు అక్కడ లేనిచో ఆ నిబంధన అక్కడ ఉండదు. ఆ గురుతు నిబంధనకు సాక్షముగా యున్నది. దేవుడు వారితో ఒక నిబంధన చేసెను. కాని ఆ గురుతు అక్కడ ఉండవలసి యున్నది — లేనియెడల ఆ నిబంధనకు ఫలితము లేదు. దాని ప్రభావము కనబడదు.

చాలామంది యూదులు ఈలాగు చెప్పవచ్చును, "రండి, నా తలుపు మీద రక్తము లేదు గాని మీకొకటి చూపించెదను. నేను సున్నతి పొందిన యూదుడను. నేను సున్నతి పొందాను."

దాని భావము అది కాదు. [సహోదరుడు బ్రెన్హాం చిటికె వేసెను.] "నేను రక్తమును చూచినప్పుడు, నేను ఆ గురుతును చూచినప్పుడు."

"నేను బాప్టిస్టును, మెతడిస్టును, ప్రెస్బిటేరియనును, మరేదో గుంపు వాడను," అని నీవు చెప్పుకోవచ్చును, కాని ఆ గురుతును చూచినప్పుడు.

"నేను విశ్వాసిని. నా తల్లి ఈ సంఘ సభ్యురాలు; నా తండ్రి ఈ సంఘ సభ్యుడు; నేను బాల్యము నుండియూ ఈ సంఘ సభ్యునిగా యున్నాను," అని మీరు చెప్పవచ్చు.

దాని భావము అది కాదు. నేను అబద్ధమాడలేదు.. దొంగతనము చేయలేదు… దాని భావము అది కాదు.

"నేను బ్రెన్హాం గుడారమునకు చెందిన వానిని; నేను వాక్యమును నమ్ముచున్నాను. నేను ఇది చేశాను, అది చేశాను," అని నీవు చెప్పవచ్చును.

EXOD 12:6

 

64ఆ యూదులు కూడా, "మేము యెహోవాను నమ్మితిమి" అని చెప్పవచ్చు.

అతడు నమ్మినట్లయితే ఆ ఘడియ యొక్క వర్తమానమును నమ్మును. నిశ్చయంగా. చాలా వర్తమానములు ఉన్నవి. కాని ఇది ఈ ఘడియ యొక్క వర్తమానము, చూచారా. ఈ ఘడియ యొక్క వర్తమానమును నేను నమ్ముచున్నాను. సాయంకాల సమయములో రక్తము ప్రోక్షించబడినది.

"నేను యూదుడను'' అని వారు చెప్పవచ్చును.

ఈనాడు జనులు ఇట్లు చెప్పుచున్నారు, "నేను క్రైస్తవుడను. నా దీర్ఘకాల సభ్యత్వమును నీకు చూపించుదును. నేను ఎన్నడూ దొంగిలించలేదు. కోర్టులో నా పేరు ఎక్కడా లేదు. నేను ఎన్నడూ వ్యభిచారము చేయలేదు. నేను ఎటువంటి పొరపాట్లు చేయలేదు. ఒక్క పొరపాటు నాలో లేదు.

అందులో ఏమి గొప్పలేదు, లేదు, లేదు. ఎంత గొప్ప నిబంధనయున్నా గాని ఆ నిబంధనకు ప్రభావముండదు. అది ప్రయోజనము లేనిదిగా యుండును.

"నేను బైబిలు విద్యార్థిని" అని నీవు చెప్పవచ్చు.

65నీవేమైనా నేను లెక్క చేయను. ఆ నిబంధన లేనియెడల, నీవు దేవుని ఉగ్రతకు పాత్రుడవే. ఇది నిజము! అందువలన నీవు రక్షింపబడవు. నీ పాపము నిన్ను పట్టుకొనును.

పాపమనగా ఏమిటి? అవిశ్వాసము. నీవు వర్తమానమును నమ్మలేదు. నీవు వాక్యమును నమ్మలేదు. గురుతు యొక్క సాక్ష్యమును నీవు నమ్మలేదు. అది మన మధ్య గుర్తించబడినది. దానిని నీవు నమ్మలేదా? నీవు దానిని నమ్మకపోయినా గాని దానిని నీవు అన్వయించుకోవలసియున్నావు.

"దానిని నేను నమ్ముదును; అది సత్యమని నేను నమ్ముచున్నాను. అది సత్యమని నేను అంగీకరించుచున్నాను," అని నీవు చెప్పవచ్చును.

అంతవరకూ మంచిదే గాని, అయినను, దానిని నీవు అన్వయించుకోవలెను.

1COR 13:1-3

 

66ఇక్కడ ఒక యూదుడు నిలబడియున్నాడు, రక్తము ప్రోక్షించబడినది, గొర్రెపిల్ల వధించబడినది, "ఈయనే యెహోవా" అని చెప్పుచున్నాడు.

ఆక్కడ ఒక యాజకుడు నిలబడి ఇట్లు చెప్పుచున్నాడు, "అవును, అది సత్యమని నేను నమ్ముచున్నాను."

కాని అతని స్వంత ఇంటి మీద దానిని చల్లుకొనలేదు. ఆ గుంపుతో అతడు గుర్తింపచేసికొనలేదు. ఆ తలుపు మీద రక్తములు చల్లుకొనిన వారిని మూఢభక్తి గలవారిగా చూచెను. ఆ గుర్తింపు అతనికి వద్దనెను. అతడెంత గొప్ప యాజకుడయినా గాని, వాక్యమెంత అతనికి తెలిసినా గాని, ఎంత గొప్పగా పెరిగినా గాని, ఎంత గొప్ప కార్యము చేసినా గాని, పేదలకు ఎంత దానమిచ్చినా గాని, ఎంతగా త్యాగము చేసినా గాని లెక్కలోకి రాదు.

పౌలు ఇట్లనెను, "కాల్చబడుటకు నా శరీరమును ఇచ్చినా గాని, నాకున్న సమస్తమును పేదల కొరకు ఇచ్చినా గాని, పర్వతములను పెకలించు

విశ్వాసము నాకున్నాగాని, దేవదూతల భాషలతోను, మనుష్య భాషలతోను నేను మాట్లాడినా గాని, ఆ గురుతు నాకు అన్వయించబడనిచో నేను వ్యర్ధుడనే."

"గురుతు లేనియెడల…" ఈ రాత్రి నేను ఆ ప్రేమను గూర్చియే మాట్లాడుచున్నాను. ఇప్పుడు, అది అన్వించనియెడల, నేను వట్టివాడనే.

EXOD 12:13•

MATT 7:22,23

 

67నీవు దయ్యములను వెళ్ళగొట్టుట నాకు లెక్క కాదు. నీ విశ్వాస సహితమగు ప్రార్ధన ద్వారా స్వస్థతలు జరిగించ వచ్చును. నీవు మరెన్నో చేయవచ్చును, కాని ఆ గురుతు నీ మీద లేనియెడల, నీవు ఉగ్రత క్రిందకు వచ్చెదవు.

నీవు విశ్వాసివే కావచ్చును. నీవు వేదిక మీద నిలబడి సువార్తను బోధించవచ్చును. "ఆ దినమున అనేకులు నా యొద్దకు వచ్చి, ప్రభువా, ప్రభువా, నీ నామములో మేము ప్రవచించలేదా? నీ నామములో భోధించలేదా? నీ నామములో దయ్యములను వెళ్ళగొట్టలేదా?" అందురు. అప్పుడు వారితో ఆయన "అక్రమము చేయువారలారా, ఎన్నడూ మిమ్మును నేనెరుగను. నా యొద్ద నుండి తొలగిపోవుడి," అనును.

కాని ఆ గురుతును చూచినప్పుడు, ఆయన దాటిపోవును. ఈ ఘడియలో దేవుడు దానిని కోరుచున్నాడు. సాయంకాల-వర్తమానము గురుతునకు వర్తించును.

EXOD 12:13

 

68సాతాను అన్ని రకముల నకిలీలను తీసికొని వచ్చినది. కరచాలనములు, రుజువులు, ఇంకా అటువంటివి చాలా యున్నవి. వాటిని మరచిపొండి! ఆ గురుతును కలిగియుండవలసిన ఘడియ వచ్చియున్నది. నకిలీ కాదు, వేషధారణ కాదు, ప్రత్యామ్నాయము కాదు. మరేదియూ కాదు — గురుతే కావలెను. ఆ గురుతు మన మధ్య గుర్తించబడు ఘడియ ఇప్పుడు వచ్చియున్నది. ఆయన నిన్న, నేడు, నిరంతరము ఏకరీతిగాయున్న యేసు అని రుజువగుచున్నది. ఆయన వాక్యముతోనే యున్నాడు.

దానిని అన్వయించుకోవలెను. గురుతు కలిగి యున్నానని ఒకడు చెప్పుచూ, వాక్యమును తిరస్కరించుచున్నచో ఏమందుము? ఆలాగు చేయలేవు. ఆక్కడ గురుతు ఉండవలసియున్నది. ఆ రక్తము మీకు గురుతుగా యుండును.

ఇప్పుడు, పరిశుద్ధాత్మ — అదే రక్తములో ఉన్న జీవము మీకు గురుతుగా యున్నది. కొన్ని క్షణాలలో దానిని మనము చూద్దాము. పరిశుద్ధాత్మయే గురుతు. కేసు కొట్టివేయబడినది. అవునండి.

ROM 9:15•

HEB 13:8

 

69ఇప్పుడు, గుర్తుంచుకొనండి, నీవేమైయున్నావన్నది కాదు, ఎంత మంచిగా ఉన్నావన్నది కాదు, ఎన్నిసార్లు నీవు క్రిందికి మీదికి ఎగిరినావన్నది కాదు, ఎన్ని సంఘాలలో నీవు చేరావన్నది కాదు, ఎన్ని మంచి పనులు నీవు చేశావన్నది కాదు; గురుతు నీవు అన్వయించనియెడల, వాటన్నిటి వలన ఏమి ప్రయోజనము లేదు. ఇది సాయంకాల సమయము.

లూధర్ దినములలో అది పనిచేయవచ్చును. వెస్లీ దినములలో అది పనిచేయవచ్చు. కాని ఇప్పుడు అది పనిచేయదు. లేదు.

గొర్రెపిల్లను వధించుట అప్పుడు సరియైన పని. ఆ గొర్రెపిల్ల వధించబడుటకు ముందు చనిపోయిన వారి సంగతి వేరు. వారు తమ మంచి మనస్సాక్షిని బట్టి తీర్పు నొందుదురు. వారికి ఆ గొర్రెపిల్ల రక్తము అన్వయించబడలేదు. వారు ముందుగా నిర్ణయించబడినవారయితే దానిని కనుగొందురు. లేనియెడల వారు తెలిసికొనలేరు. అంతే. దేవుని వలనే జరుగును.

ఆయన తన ఇష్టము చొప్పున నీతిమంతులనుగా తీర్చును. తాను ఇష్టపడు వారి మీద ఆయన కృప చూపును. ఆయన శిక్షించగోరువారిని శిక్షించును. ఆయన దేవుడు. అంతే. ఆయన ఎవరిని కరుణించునో వారిని కరుణించును మరియు ఎవరిని శిక్షించునో వారిని శిక్షించును.

EPH 2:8

 

70సున్నతి పొందుట ద్వారా యూదుడు తాను విశ్వాసినని బహిరంగముగా చాటించుకొనును.

చాలామంది, ముఖ్యంగా మౌలిక వాదులు బైబిలును తీసికొని ఇట్లనుచుందురు, "నేను విశ్వాసిని."

"విశ్వాసము ద్వారా రక్షింపబడితినని" యేసు చెప్పెను.

నేను విశ్వాసిని, కాని పరిశుద్ధాత్మ బాప్తిస్మము చాలా అర్థములేనిది." అయితే గురుతును అన్వయించలేదు, అతడు ఎంతగా నమ్మినా గాని దాని వలన లాభము లేదు.

యూదుల యొక్క సున్నతి వలెనే యుండును. అతడు ఇట్లనును, "నేను యూదుడను. కాబట్టి ఆ మూఢభక్తి గలవారివలె నేను ఎందుకు ప్రవర్తించవలెను?"

EXOD 12:6,7,13

 

71మోషే అక్కడ వీధి చివరన నిలబడియున్నాడు, అతడిట్లు చెప్పుచున్నాడు, "సాయంకాల వర్తమానము ఇక్కడున్నది. పదునాలుగు దినములలో అది నెరవేరును. మీరందరూ సమాజముగా కూడి గొర్రెను వధించవలెను. ఇశ్రాయేలు సమాజమంతయూ కలిసి దానిని చంపవలెను. దాని మీద వారందరూ చేతులుంచవలెను. దానితో కూడా వారు తమ్మును గుర్తించుకొందురు. ఆ రక్తము ద్వార బంధముల మీద చల్లవలెను. తలుపు కమ్ముల మీద దానిని చల్లవలెను. ఆ రక్తము మీకు గురుతుగా యుండును. దానిని చూచినప్పుడు ఆయన దాటిపోవును. ఆయన మీకు ఏర్పరచిన గొర్రెపిల్ల యొక్క మరణమును మీరు అంగీకరించవలెను."

ఆ రక్తమే గురుతు అయి యుండెను.

ACTS 1:5•

ACTS 2:38•

ACTS 19:2,4

 

72ఇప్పుడు, ఆత్మయే మీకు గురుతు. "ఇంక మీరు కొద్ది దినములకు పరిశుద్ధాత్మతో నింపబడుదురు." రక్తము చిందింపబడినది. పెంతెకోస్తు దినమున ఆ గురుతు పంపబడెను. బలముగా వీచిన గాలి వలె వచ్చెను. ప్రతి అపోస్తలుని యొక్క ఇతివృత్తమూ అదే. "మీరు విశ్వసించినప్పటి నుండి పరిశుద్ధాత్మను పొందియున్నారా? మారుమనస్సు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రభువైన యేసుక్రీస్తు నామములో బాప్తిస్మము పొందుడి. అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరము పొందుదురు. అది ఒక గురుతు. (ఆమేన్!) మీరు మరణములో నుండి జీవములోనికి దాటి యున్నారు." అక్కడే మీరున్నారు.

యూదుల సంఘము కనుమరుగైనది, అన్యులు అలాంటి వకరతనములో ముందుకు వచ్చిరి. ఆమె ఇప్పుడు బయటకు వచ్చినది. అన్యులలోని శేషమును ఆయన తన నామము నిమిత్తము వధువుగా ఏర్పరచుకొనెను.

73నా యొక్క భావమును మీరు గ్రహించారా? ఇక్కడ లేఖనము ఏమి చెప్పుచున్నదో చూచారా? గురుతును చూపించకపోయినయెడల, ఆ నిబంధనకు ప్రభావముండదు. అది తప్పక యుండవలెను; ఎందుకనగా నీవు నమ్ముచున్నానని చెప్పి కూడా వాక్య ఉపదేశమును నీవు వెంబడించకపోయినయెడల నీవు నమ్ముట లేదని అర్థము.

నీవు సున్నతి పొంది యుండవచ్చును; నీవు సంఘములో చేరియుండవచ్చును, నీవు బాప్తిస్మము పొంది యుండవచ్చును; నీవు ఇటువంటివి ఎన్నో జరిగించియుండవచ్చును, అయినా గాని పరిశుద్ధాత్మ గురుతు లేనిచో అంతా వ్యర్థము.

ACTS 2:38•

ACTS 7:8•

ROM 4:3,11,22

 

74కొద్దిసేపటి క్రితం ఒక వేదాంత పండితుడు నాతో మాట్లాడుట గూర్చి చెప్పాను, "బిల్లీ, అబ్రాహాము దేవుని నమ్మెను. అది అతనికి నీతిగా ఎంచబడెను. ఇంక అంతకంటే మానవుడు నమ్మవలసినది ఏమిటి?" అనడిగాడు.

"డాక్టర్, అది నిజము. అది వాస్తవము. అతడు దేవుని నమ్మెను. ఆలాగని బైబిలు చెప్పుచున్నది. నీవు చెప్పినది సరియే. నీవు వచ్చినంత వరకూ అది మంచిదే" అన్నాను. కానాను దేశమును చూచుటకు పండ్రెండుమంది వేగుల వారు పంపబడిరి. వారు ఆ దేశమును వేగు చూడవలయును. వారు కానానునకు సూటిగా వెళ్ళలేదు గాని, చుట్టు తిరిగి వెళ్ళుచుండిరి. వారు సరిహద్దు గీత యొద్దకు వచ్చిరి. వారు అంతా బాగున్నదని గాని అందులో నివసించలేమని చెప్పిరి. "మీ బాప్టిస్టులు మంచివారే, మీరు చాలా దూరము వచ్చారు, కాని మీరు విశ్వసించినప్పటి నుండి పరిశుద్ధాత్మను పొందితిరా?" "గుర్తుచేసికొనండి, దేవుడు అబ్రాహాము యొక్క విశ్వాసమును గుర్తించెను. అతడు దేవునిని నమ్మెను. అది అతనికి నీతిగా ఎంచబడిను. అది నిజము. ఆ తరువాత సున్నతి ముద్రను దేవుడు అతనికి ఇచ్చెను. అది అతనికి ఒక గురుతు," అని చెప్పాను. అతని చర్మమునకు సున్నతి కాదు, అతని ఆత్మకు అది కావలెను. అతని విశ్వాసమును ఆయన (దేవుడు) గుర్తించినట్లుగా అదే గురుతు. ఆయన మనకు పరిశుద్ధాత్మను ఒక గురుతుగా ఇచ్చెను. ఆయన మనలను విశ్వాసులనుగా గుర్తించెను. "మారుమనస్సు పొంది ప్రతివాడును పాపక్షమాపణ నిమిత్తము ప్రభువైన యేసుక్రీస్తు నామములో బాప్తిస్మము పొందవలెను. అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరము పొందుదురు. ఈ వాగ్దానము…"

ROM 4:3,11,22

 

75ఇప్పుడు, మీరది పొందుకొన్నారా?

యూదులు ఎంతగా తమ సున్నతిని గుర్తించుకొన్నా గాని లెక్క లేదు. కాని గురుతును చూపించవలసియున్నారు. అది లేనియెడల నిబంధన అమలులో యుండదు. ఇప్పుడును అదే రీతిగా యన్నది. నీవేమి చేశావన్నది కాదు, ఎంతగా నీవు బైబిలును వివరించగలవన్నది కాదు — నీవు బైబిలు విద్యార్థివే కావచ్చును, విశ్వాసినని నీవు చెప్పుకొనవచ్చును, అయినా గాని ఆ గురుతు కావలెను.

"బ్రెన్హాం సోదరుడా, నేను మంచి బైబిలు విద్యార్థిని," అని నీవు చెప్పుకోవచ్చును. ఎవరు ఏది చెప్పినా నేను లెక్కచేయను. ఆ వ్యక్తి అందరికంటే మంచివాడు కావచ్చును. అతడు తన జీవితములో ఏ తప్పు చేసియుండకపోవచ్చును. దానితో దేవునికి ఏమి సంబంధము లేదు. [సహోదరుడు బ్రెన్హాం చిటికె వేసెను.] ఒక్కటి మాత్రమే కావలెను, అదే అవసరము, దానిని నీవు చేయజాలవు. నీవు స్వయంగా ఆ రక్తమును ద్వారా బంధపు కమ్ముల మీద చల్లుకొనజాలవు. గొర్రెపిల్ల చావనియెడల, గురుతు లేదు. గొర్రెపిల్ల చనిపోయినట్లుగా ఆ రక్తమే సానుకూలమైన గురుతు — నటించు-విశ్వాసము కాదు; ఆ గొర్రెపిల్ల చనిపోయినది.

76నీ గొర్రెపిల్ల చనిపోయినది అని పరిశుద్ధాత్మయే సానుకూలమైన గురుతు. నీవు ఆ గురుతును పొందియున్నావు. ఆయన జీవమే నీలో యున్నది, చూచారా. అందులో నటించు-విశ్వాసము లేదు. అందులో కపటము లేదు. అందులో అనుకరణ లేదు — అది నిజంగా యున్నది. దానిని మీరెరుగుదురు. నీకది తెలియును; అది లోకమునకు తెలియును. గురుతు అక్కడున్నది.

ఒక వ్యక్తి ఎంతో మంచివాడు కావచ్చును… ఒక బైబిలు విద్యార్ధి కావచ్చును, మంచి సంఘ సభ్యుడు కావచ్చును. చాలా సత్పురుషుడు కావచ్చును. ఒక శాఖకు అధిపతి కావచ్చును. రోమ్ యొక్క ప్రతినిధి కావచ్చును. అతడు ఎంత గొప్ప వాడయినా గాని, ఏమియూ లాభము లేదు.

77ఇశ్రాయేలు గూర్చి బైబిలు ఎరిగిన వారందరికి తెలియును. అది సంఘమునకు సాదృశ్యము, వాగ్దాన దేశమునకు గురుతు. అక్కడికే ఆమె పయనించుచున్నది. సాయంకాల సమయమయ్యెను, ప్రయాణము ప్రారంభమయినది, ఒకే ఒక ముఖ్య గురుతు కావలసియున్నది; అతడు ఎంతో గొప్ప యూదుడైయండవచ్చును; అతడు తన పంటలను ఎంతో జాగ్రత్తగా పెంచి యుండవచ్చును; తన పొరుగు వారి గూర్చి ఎంతగానో శ్రద్ధ వహించి యుండవచ్చును, ఎంతో గొప్ప క్రియాశీలకుడు కావచ్చును; ఎంతో మంచి సభ్యుడు కావచ్చును, దశమ భాగములు ఎంతగానో చెల్లించియుండవచ్చును — ఇవన్నియూ మంచివే; అందులో ఏమి తప్పు లేదు; అతడు సత్పురుషుడు అని జనులందరూ గుర్తించిరి — కాని ఆ రక్తపు గురుతు లేనియెడల, అతడు నశించును.

1COR 13:1,2

 

78ఓ, దేవుడు నాకు సహాయము చేయును గాక, ఇప్పుడును, ఆ టేపులో అది రికార్డు చేయునట్లు సహాయము చేయును గాక! నీవు సువార్త బోధించి యుండవచ్చును; నీవు దయ్యములను వెళ్ళగొట్టియుండవచ్చును; నీవు భాషలలో మాట్లాడి యుండవచ్చును; నీవు కేకలు వేసి యుండవచ్చును; ఆత్మలో నాట్యమాడి యుండవచ్చును; కాని గురుతు లేనిచో…

"అవి నా వలన అగునా?" అని నీవు చెప్పవచ్చు.

నీ వలన అగునని పౌలు చెప్పెను. "దేవదూతల భాషతోను, మనుష్యుల భాషలతోను నేను మాట్లాడియున్నప్పటికిని; పేదలకు నా ఆస్తి అంతా పంచి ఇచ్చినప్పటికిని; కాల్చబడుటకు నా శరీరమును అప్పగించినప్పటికిని; కొండలను పెకలించు విశ్వాసము నాకున్నప్పటికిని; అయినను నేను వట్టివాడనే. దాని మీద ఆధారపడ వద్దు. అది గురుతు. నీవెన్ని కార్యములు చేసినా గాని, ఎంత మంచివాడవైనా గాని, దేవుని ఉగ్రత దిగి వచ్చినప్పుడు, ఆ గురుతును మాత్రమే అది గుర్తుంచును.

EXOD 12:13

 

79ఆ గురుతు కొరకు వెల చెల్లించబడినది, అది అవసరము; యేసుక్రీస్తు యొక్క జీవమే వెలగా చెల్లించబడెను, ఆయన తన ప్రాణమును ఇచ్చెను, ఆయన ఆత్మ నీ మీదికి తిరిగి వచ్చియున్నది, గురుతుగా దానిని నీవు పొంది యున్నావు.

నీవు ఆ గురుతును ఆదివారము మాత్రమే కాక, దివారాత్రులు నీతో మోసికొని పోవలెను. అన్ని సమయమలలో ఆ గురుతును నీవు కలిగియుండవలెను.

ఆ రక్తము మీకు గురుతుగా యుండును. "నేను గొప్ప విశ్వాసిని." అని నీవు చెప్పుకొనవచ్చును. అది మంచిదే, కాని ఆ గురుతును నీవు నిరాకరించినయెడల, నీవెట్లు విశ్వాసివి కాగలవు? అది నీకు విరోధముగా మాట్లాడును. నీ సాక్ష్యమునకు, నీవు చేయు క్రియలకు వ్యతిరేకముగా అది మాట్లాడును. నీవు బైబిలు విద్యార్థివి, మంచి మనిషివి, సంఘ సభ్యునివి, మరేదో కావచ్చును గాని - వాటి వలన ఏ లాభమూ లేదు. అవునండి.

నీ తండ్రి ఒక భోధకుడు, కావచ్చును, నీ తల్లి ఒక పరిశుద్ధురాలు కావచ్చును, అది మంచిదే; వారికి వారు జవాబు చెప్పుకోవలెను.

JOHN 3:3,7

 

80నేను చెప్పినట్లు, ప్రజలు దేవునిని ఒక పెద్ద, ముసలి తాతగా ఊహించుకొనుచున్నారు. వీరు మనుమలుగా ఎంచుకొనుచున్నారు. వీరు రిక్కిలు, ఎల్విస్లు. వారిలో హానియు లేదు. దేవుడు కాదు, ఆయనకు మనుమలు లేరు; ఆయన తండ్రి. నీవు తిరిగి-జన్మించవలసియున్నది. ఆయన పెద్ద, మృదువైన, ముసలివాడు కాడు. ఆయన తీర్పు తీర్చు దేవుడు. ఆలాగని బైబిలు పలుకుచున్నది. ఆయన ఉగ్రత భయంకరము.

దానిపై నీవు నడచుచూ మరియు దేవుని యొక్క మంచితనము నీ పాపములోనే నిన్ను పరలోకము తీసుకొని వెళ్ళును, అని నీవు ఉహించుకొనవద్దు. ఆయన అది చేసినట్లయితే, ఇక్కడ ఉన్నవన్నియు… ఆయన వాక్యమును విశ్వసించుము లేదా నీవు — నీవు నశించెదవు. నీవు ఆయన వాక్యమును నమ్మినప్పుడు, ఆ గురుతు నీ మీద యుండును.

EXOD 7:1•

EXOD 8:6•

EXOD 9:23

 

81ఆ రాత్రి ఏదో ఒక సమయములో మరణము ఐగుప్తును తాకనై యున్నది. అది చాలాభయంకరమగు సమయము. వారికి ఉత్సవ దినములు. పండుగ దినములు. ఉపవాస దినములు ఉన్నవి. దేవుడు వారిని దర్శించెను. దేవుడు వారి మధ్య తన గొప్ప అద్భుతములను, ఆశ్చర్య కార్యములను చూపించెను. ఏమిటది?

ఇప్పుడు, ఒక్క నిమిషం ఆగండి. దేవుడు వారికి తన కృపను చూపెను. ఆయన వారికి ఒక అవకాశమును ఇచ్చెను. దానిని వారు కాలదన్నలేరు. దానిని వారు బుద్ధిహీనతని పిలువలేరు. అచ్చట ఎర్రమట్టి లేచినది. మహా ఉత్పాతము వలన ఎర్ర సముద్రము తయారయినది.

వడగండ్లు కురిసినవి. కప్పలు వచ్చినవి. దేవుడు ఒక స్థలమును ఏర్పరచెను. ప్రవక్త నోట తన మాటను ఉంచెను. అతడు పలికినది నెరవేరెను. దానిని వారు చూచిరి, దానిని వారు కాదనలేరు.

మోషే అందుకొరకే పిలువబడెను, మోషే దేవుని చేత పంపబడెను, ఎందుకనగా అతడు దేవుని మాటను మాత్రమే పలికెను. మోషేను ఒక దేవునిగా చేసెను.

వారికి మోషే ఒక దేవునిగా యుండెను. వారు ఏ వ్యత్యాసమును ఎరుగరు, కావున "నీవు ఒక దేవుని వలెను, అహరోను నీ ప్రవక్తగాను ఉండునని," దేవుడు చెప్పెను. (చూచారా?) "అతనిని దేవునిగా చేసెను. అతనిని, అతని స్వరమును దేవుడు వాడుకొనెను, అతనితో దేవుడు సృష్టించెను. అతడు పలికిన దానిని జనులు కాదనలేరు, ఎందుకనగా అది నేరుగా అక్కడే ఉండెను. అతడు చెప్పినట్లుగానే జరుగును."

ఓ, మై! ఆ సంగతులను చూపించెను. ఐగుప్తు దానిని చూచెను. సాయంకాల సమయము ముందు దానిని వారు చూచిరి. సాయంత్రమున వారది చూచిరి.

ఆయన తన మంచితనమును వారికి చూపించెను. వారిని స్వస్థపరచగలనని ఆయన నిరూపించెను.

2TIM 3:8

 

82మాంత్రికులు అదే పనిని చేయగోరిరి — వారు ఆనుకరణలు చేయువారు. ఎల్లప్పుడూ వారిని మీరు కనుగొందురు. యన్నే, యంబ్రెలు ఉండిరి, వారక్కడ నిలబడి యుండిరి. కాని వారు నిజమయిన దాని ముందు నిలబడలేకపోయిరి, వారది కలిగి లేరు. అది నిజము. వారు కొంత సేపు అనుకరణను కొనసాగించగలిగిరి, కాని ఆ తరువాత వారు తమ తప్పులో దొరికిపోయిరి.

చివరి దినములలో కూడా అదే జరుగునని బైబిలు చెప్పలేదా? "…యన్నే, యంబ్రెలు మోషేను ఎదిరించినట్లుగా…" - కాని వారి తప్పు బయటపడును. మరల అదే జరుగును. అక్కడే ఉన్నది.

వీరు వక్ర బుద్ధిగల మనుష్యులు, సత్యము విషయములో భ్రష్ట మనస్సు గలవారు. వాస్తవమును అంగీకరించరు. వారికి గొప్ప సంఘములు, గొప్ప కార్యములు ఉండవచ్చును. గొప్ప పనులు, ఉన్నత పదవులు, గౌరవములు ఉండవచ్చును, కాని ఆ ఘడియ చివరగా వచ్చుచున్నది. ఆ గురుతుతో నిలకడగా నిలచియుండుము. దేవుడు మనలను అదే చేయవలెనని కోరుచున్నాడు.

ఆయన వాక్యమును హత్తుకొని యుండుము. దాని నుండి కదల వద్దు. దానితోనే నిలచి యుండుము. ఆలాగున బైబిలు చెప్పుచున్నది.

మరణము సమీపించుచున్నది. దేవుడు వారికి కృపను చూపించెను, సూచక క్రియలను మరియు శక్తిని వారికి చూపించెను.

83ఇప్పుడు, ఒకటి రెండు నిమిషములు ఆ గడియారముపై ఆగుదము. ఆయన చివరి దినములలో ఏమి జరుగును అని వాగ్దానము చేసినది మన మనస్సులలో ఆలోచించుదము. వాటిని మనము కూడా గమనించామా లేదా అని నేను ఆశ్చర్యపోవుచున్నాను.

ఆయన ఈ కార్యములన్నీ చేసెను, అయినా గాని వారు మారుమనస్సు పొందుటకు లేదా ఆనాటి వర్తమానమును నమ్ముటకు ఇష్టపడలేదు. ఇంకను అది చేయుటకు వారికి ఇష్టము లేదు. ఆయన వారి ఎదుటనే దానిని బయలుపరచెను, నిశ్చయముగా వారికి దానిని తెలియజేసినప్పటికి…

అటువంటి సంగతులు జరుగుట నీవు చూచునప్పుడు, తీర్పు రాబోవుచున్నదని గమనించుము. దానికి అదే సూచన. ఈ కార్యముల తరువాత తీర్పు జరుగును. ఎల్లప్పుడూ ఆ విధముగానే ఉంటున్నది. అందులో ఏమి మినహాయింపు లేదు. కృప తరువాత తీర్పు వచ్చును. కృపను తిరస్కరించినప్పుడు, ఇక తీర్పు గాక మరేమి యుండును? ఎప్పుడూ అదే జరుగుచుండును.

MARK 16:17•

PHIL 2:5

 

84ఇప్పుడు, ప్రతి ఆత్మ సంబంధమగు సూచనయు దేవుని నుండియే వచ్చుచున్నది అని మనము చూచియున్నాము — దానిని చూడండి. గమనించండి. ప్రతి ఆత్మ సంబంధమగు సంఘటన వెనుక ఒక సూచన యున్నదని మీరు గ్రహించవలెను. మనము అనుకోకుండా ఇచ్చటికి రాలేదు. ఈ సంగతులన్నియును అనుకోకుండా జరుగుట లేదు. ఇవి ఒక గురుతు. త్వరగా సురక్షిత స్థలమునకు వెళ్ళమని అది హెచ్చరించుచున్నది.

నోవహు తన తరమునకు ఒక సూచనగా యుండెను; ఏలియా తన తరమునకు ఒక సూచనగా యుండెను; యోహాను తన తరమునకు ఒక సూచనగా యుండెను. ప్రతి ఒక్కటి… ఈ ఘడియ యొక్క వర్తమానమే ఒక సూచన. దానిని గమనించండి. అదేమి చేయుచున్నదో చూడండి, చూచారా. అది ఒక సూచన. ప్రతిదానిలోను ఒక భావమున్నది.

ఇటువంటి వర్తమానము మరే ఇతర సమయములోను వెలువడ లేదు. అది లూధర్ దినములో రాజాలదు. అది వెస్లీ దినములలో రాజాలదు. పెంతెకోస్తు దినములో కూడా అది రాజాలదు. ఏ కాలములోను ఇటువంటిది రాలేదు. అయినా ఇప్పుడు మనకు బైబిలులో వాగ్దానము చేయబడినది. మనము అంతమందున్నాము. మరేదియూ జరుగదు. ఈ సమయము వరకు అది ఆగవలసి వచ్చినది. ఇది ఒక గురుతుగా జరుగుచున్నది. ఆ గురుతు ఏమిటని ఆశ్చర్యపడుతున్నారా? ఓ చిన్న ప్రజలారా, ఓ సోదరుడా, సోదరీ, ఆ గురుతు క్రిందికి రమ్ము, త్వరగా రండి. మరే ఇతర ప్రత్యామ్నాయమును అంగీకరించవద్దు. ఆ పని మాత్రము చేయవద్దు, చూచారా.

దానిని అసలు ఊహించనేవద్దు. గురుతు అన్వయించబడినదను నిశ్చయతను పొందువరకు అక్కడే నీవు నిలచియుండుము. నీవు పూర్తిగా… క్రీస్తునకు కలిగిన మనస్సును నీవు కలిగియుండు వరకు కనిపెట్టుము; లోకపు బుద్ధిహీనత అంతయూ నీలో నుండి పోవలెను. నీ మనస్సు సంపూర్తిగా ఆయననే కోరుకొను వరకు వేచియుండుము. అప్పుడు, నీవు ఏదో జరుగుటను ఎరిగెదవు.

"నమ్మినవారి వలన ఈ సూచక క్రియలు కనబడునని," యేసు చెప్పెను. నటించు-విశ్వాసుల వలన కాదు, విశ్వాసుల వలన జరుగును.

ఆ విషయములో ఏమి మనము తప్పు అంచనా వేయరాదు. ఆ విధముగా ఎప్పుడూ నీవు చేయరాదు.

85ఈ ఘడియ యొక్క వర్తమానము సంఘమునకు ఒక సూచనయై యున్నది. జనులకు అది ఒక సూచన.

దానిని మీరు గ్రహించుచున్నారా? టేపులు వినువారు కూడా ఆలాగునే చేయవలెను. ప్రపంచములోని ఇతర భాగములలో ఉన్నవారు కూడా దీనిని గ్రహించవలెను. ఆ ఘడియ యొక్క సూచన ఇక్కడున్నది. మీరు అన్వయించుకోవలసిన ఒక గురుతు ఇచ్చటున్నది. మరే ఇతర సమయములోను అది రాజాలదు.

86ఆ సమయము కొరకు దేవుని యొక్క సిద్ధపాటును మీరు చూడండి. బైబిలు చెప్పుచున్న దానిని మనము ఎరుగుదుము. అవన్నియూ మనకు దృష్టాంతములుగా జరిగియున్నవి. గమనించండి, దేవుడు ఐగుప్తుకు తీర్పు తీర్చుటకు సిద్ధముగా యున్నాడు, అయితే ఆయన ముందు సిద్ధపాటును ఇచ్చెను. ఆ మొదటిసారి ఆయన ఏమి చేసెను? (ఆయన ఎన్నడూ తన క్రమమును మార్చుకొనడు.) మొదటిసారి, ఆయన తన సిద్ధపాటును చేసినప్పుడు ఒక వర్తమానముతో ప్రవక్తను పంపెను. ఆయన మొదటగా తన ప్రజలకు వర్తమానముతో ఒక ప్రవక్తను పంపెను.

ఆ తరువాత ఆయన ఈ ప్రవక్తను గుర్తించెను, గుర్తింపుగా ఆయన అగ్నిస్తంభమును పంపెను. దానిని ఆయన గుర్తింపచేసెను.

మూడవదిగా, ఆయన గురుతును పంపెను. ఇది ఆక్షరాలా నిజము. ఆ గురుతు… గురుతునకు భావము ఏమిటి? నిశ్చయత.

మొదటిగా, ఆయన వర్తమానముతో ప్రవక్తను పంపెను. అగ్నిస్తంభముతో ఆయన తన ప్రవక్తను గుర్తింపచేసెను. ఆ తరువాత ఆయన ఒక గురుతును పంపెను. ఈ రక్తము క్రిందికి రావలెను. నీ స్థానములో నీ బదులుగా చనిపోయిన దానిని నీవు అంగీకరించచలెను. ఆ రక్తమే గురుతుగా ఆయన చూచెను. నీవు వర్తమానమును వినియున్నావు. ఆగ్నిస్తంభమును నీవు విశ్వసించితివి. ఆయన నీ కొరకు ఏర్పరచిన ప్రత్యామ్నాయమును నీవు అంగీకరించియున్నావు. నీవు ఆ రక్తము క్రింద యున్నావు. ఆ జీవము నీ కొరకు అర్పించబడినది.

మై, అది ఎంత సంపూర్ణమైనది. మీరు రక్తము క్రింద యున్నారు.

87ఇప్పుడు, నీవు ఆత్మ క్రింద యున్నావు — పరిశుద్ధాత్మ క్రింద యున్నావు. నీవు ఈ దినపు వర్తమానమును నమ్ముచున్నావు. నీవు శక్తిని విశ్వసించితివి, నీవు అగ్నిస్తంభమును నమ్మియున్నావు. నీవు నీ నమ్మిక ప్రకారమే పనిచేయుచున్నావు.

HEB 6:4-6•

JAS 4:17

 

88ఇప్పుడు చూడండి, దానిని నమ్మినంత మాత్రమున చాలదు — అది ఉన్న చోటికి నడిచినంత మాత్రమున చాలదు, అది సరిపోదు. అది నిన్ను ఇంకా దిగజార్చును. "మేలు చేయనెరిగియుండియు ఆలాగు చేయనివానికి పాపము కలుగును," చూచారా.

వారు సరిహద్దు విశ్వాసులు… యేసు వారి గూర్చియే చెప్పెను, హెబ్రీ 6వ అధ్యాయములో ఇట్లున్నది, "ఒకసారి వెలిగించబడి మరియు పరిశుద్ధాత్మలో పాలిభాగమును పొంది, మంచి దేవుని యొక్క వాక్యమును రుచి చూచియు, లోకములో పడి భ్రష్టులయిన వారిని నూతనపరచుట అసాధ్యము. వారు మారుమనస్సు పొందకుండా దేవుని కుమారుని మరల తమ క్రియల ద్వారా సిలువ వేయుచున్నారు. వారు ఒకసారి పరిశుద్ధపరచబడిన ఆ రక్త నిబంధనను మీరుచున్నారు. ఆ రక్తమే వారిని పవిత్రపరచెను. అది గురుతు కాదు.

ఇప్పుడు రక్తము గురుతు కాదు, జీవమే గురుతు.

JOHN 1:1•

JOHN 15:7•

PHIL 2:5•

COL 3:3

 

89అక్కడ జీవముండదు, ఎందుకనగా అది జంతువు. అప్పుడు రక్తమే గురుతు. అక్షరాలా రక్తమును వారు ద్వార బంధపు కమ్ముల మీద చల్లవలెను; కాని ఇప్పుడు పరిశుద్ధాత్మ. దాని యొద్దకు మనము వచ్చుచున్నాము, ఒక క్షణము, దానిని రుజువు చేయుటకు, చూచారా.

ఆ జీవమే గురుతు. నీ ప్రాణము పోయినది, మరియు నీవు చనిపోయితివి. నీ జీవము గతించినది. నీవు క్రీస్తు ద్వారా దేవునిలో దాచబడియున్నావు, పరిశుద్ధాత్మ ద్వారా ముద్రించబడియున్నావు. క్రీస్తు యొక్క మనస్సు నీలో యున్నది, మరియు క్రీస్తు, మరియు బైబిల్, మరియు వాక్యము ఒక్కటే.

"ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, మరియు వాక్యము దేవుడై యుండెను." అప్పుడు నీవు, మరియు వాక్యము, మరియు దేవుడు, మరియు క్రీస్తు ఒక్కటిగా యున్నవి. "మీరు నా యందును, నా మాటలు మీ యందును నిలిచియుండినయెడల, మీకేది ఇష్టమో అడుగుడి, మరియు అది మీకను గ్రహించబడును…"

90మోషే యొక్క పెదవులలో ఆ శక్తిని ఉంచెను. ఆయన మాటతో అతడచ్చటికి వెళ్ళెను! అతడు కప్పలను రమ్మనగా, కప్పలు వచ్చెను. పేలు రమ్మనగా, పేలు వచ్చినవి. పొమ్మనగా, అవి పోయినవి. ఆమేన్!

కాని ఆ తరువాత, ఇశ్రాయేలీయులందరికిని గురుతు అవసరమాయెను. ఇశ్రాయేలు వారికందరికి ఈ గురుతు కావలెను. "ఆ గురుతును చూచినప్పుడు దాటిపోయెదనని," ఆయన చెప్పెను. ఓ, మై, మై! ఎంత గొప్ప నిశ్చయత.

91ఇశ్రాయేలు ఐగుప్తు నుండి బయటకు వచ్చుచున్నది, అది ఈ నాటికి ఒక మాదిరి. ఐగుప్తు ఒక సంఘము, మరియు ఇశ్రాయేలు వధువుకు సాదృశ్యముగా ఉన్నది. ఐగుప్తులో నుండి ఇశ్రాయేలు బయటకు వచ్చినట్లుగా, సంఘములో నుండి వధువు బయటకు వచ్చుచున్నది, చూచారా. ఎందుకనగా బయటకు వచ్చుటకు అక్కడ ఎదో ఉండవలసియున్నది, అది వెలుపలకు రావలసియున్నది. కావున, అది ఒక మాదిరి అయితే, ఐగుప్తులో సంఘమున్నది, పాపము మరియు లోకములో యున్నది, నీ గురుతు వారు లెక్క చేయరు. దానిని వారస్సలు నమ్మరు. కాని ఇశ్రాయేలు దానిని ప్రేమించెను, ఎందుకనగా వారికి రక్షణ.

ఓ, అది మనలను, మన హృదయములను ఆనందములో ముంచును.

EXOD 12:13

 

92సంఘమా, దానిని అన్వయించుకొనుము. తప్పిపోవద్దు. మీరది చేయరా? సూర్యుని అస్తమించనీయవద్దు. విశ్రాంతి తీసికొనవద్దు. దివా రాత్రులు శ్రమించుము. ఏమరపాటుగా యుండవద్దు. పిల్లలారా, అది పనిచేయదు. అది పనికిరాదు. నీకు తప్పకుండా గురుతును కలిగియుండవలెను!

"నేను నమ్ముచున్నానని, వర్తమానమును అంగీకరించుచున్నానని," నీవు చెప్పవచ్చును.

అది పరవాలేదు. అది మంచిది. అయితే నీవు తప్పకుండా గురుతును కలిగియుండవలెను. బ్రెన్హాం గుడారమా, నీవు వినుచున్నావా? నీవు తప్పకుండా గురుతును ప్రదర్శించవలెను. అది లేనియెడల, నీ విశ్వాసము వ్యర్థము. నీవు మంచి జీవితమును జీవించవచ్చును; వాక్యమును నీవు వినుచుండవచ్చును; నీవు సంఘమునకు వెళ్ళుచుండవచ్చును; సరిగా జీవించుటకు నీవు ప్రయత్నించవచ్చును. అది మంచిదే, కాని అంతే చాలదు.

"నేను రక్తమును చూచినప్పుడు"; అదే గురుతు, మరియు ఇక్కడ ఉన్న గురుతు…

ACTS 2:38

 

93ఆయన వాస్తవంగా ఆ రక్తము (chemistry)ను చూడవలెను, ఎందుకనగా దానిలో నుండి ఆ జీవము వెడలిపోయినది. అది ఒక జంతువు. కాని ఇక్కడ రక్తములో ఉన్న స్వంత జీవము, మరియు రక్తము కేవలము శుద్ధీకరణకు ఒక హెచ్చరిక లేక సూచన అయి యున్నది. అయితే స్వంత జీవమే గురుతు అయి యున్నది.

ఆ సున్నతి లేకుండా, ఆ గురుతు లేకుండా, నీవు ఆ నిబంధనలోనే యుండవు. అన్నియూ కలిసి సమకూడుచున్నవి.

వాక్యమునకు నేను సున్నటి పొందియున్నాను, మరియు కేవలము దానికే, అని నీవు చెప్పినట్లయితే, అప్పుడు నీవు వాక్యమును నమ్ముదువు. నీవు వాక్యమును నమ్మినయెడల, ఆ గురుతు నీ యొద్దకు రావలసియున్నది. "ప్రతివాడును మారుమనస్సు పొంది పాపక్షమాపణ నిమిత్తము యేసుక్రీస్తు నామములో బాప్తిస్మము పొందవలెను. అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరము పొందుదురు," అని ఆయన చెప్పెను. అక్కడే మీరున్నారు. ఓ, మై!

DEUT 27:3•

JOHN 6:63

 

94ఆయన వాగ్దాన దేశపు ప్రజల యొక్క సిద్ధపాటును గమనించండి. ఆయనేమి చేసెనో చూడండి. మొదటిగా, ఆయన తన ప్రజల కొరకు భూమిని సిద్ధము చేసెను. ఆయన వారి కొరకు స్థలమును ఏర్పాటు చేసెను. మరియు ఇప్పుడు, దానిని సిద్ధపరచుటకు ఇప్పుడాయన కొందరిని పంపించెను. వారు వాగ్దాన దేశపు జనులు. వాగ్దాన దేశములో యుండుటకు కొందరిని ఆయన ముందుగా నిర్ణయించెను.

మరియు ఆయన దానిని ఎలా చేసెను, ఒక ప్రవక్తను ఆయన వర్తమానముతో పంపెను, ఆగ్నిస్తంభము ద్వారా దానిని గుర్తింపచేసెను, వారు నిశ్చయత కలిగి విశ్రమించు ఒక గురుతును ఆయన వారికిచ్చెను. అది నిజము. అదే వారికి ఆదరణ.

ఐగుప్తు నుండి బయటకు వచ్చుచున్న ఇశ్రాయేలు ఒక మాదిరి. శాఖలలో నుండి బయటకు వచ్చుచున్న సంఘమునకు అది సాదృశ్యము. ఇప్పుడు, అని శాఖలు కాదు… వధువును గూర్చి నేను చెప్పుచున్నాను. కొందరు ప్రజలు, శాఖల వలె దిగజారిపోయిన, వారికంటే అధ్వాన్నమైన స్తితిలో కొందరు స్వతంత్రులు ఉన్నారు. గురుతును అన్వయించుకొనుట గూర్చి నేను మాట్లాడుతున్నాను.

గురుతు ప్రతి వాక్యముతోను అంగీకరించును, చూచారా. అది ఆలాగున జరుగవలసియున్నది, ఎందుకనగా అది వాక్యము. అది వాక్యములో ఉన్న జీవము. "నా మాటలు ఆత్మ సంబంధమైనవి, వాటిలో జీవము కలదు," అని యేసు చెప్పెను.

JOHN 6:39,40,44,54

 

95మోషే ఇశ్రాయేలులో తన పరిచర్యను ప్రారంభించినప్పుడు, గొప్ప ఆద్భుతములు జరిగినవి. ఐగుప్తులోని ఇశ్రాయేలీయులందరూ వెంటనే కూడికొని గోషెను యొద్దకు వచ్చిరి, తిరిగి గృహమునకు వచ్చుచుండిరి, ఎందుకనగా ఏదో జరుగబోవుచున్నదని వారికి తెలిసినది. ఓ, ఎంత చక్కని మాదిరి!

ఓ, వారు తూర్పు, పడమరల నుండి వత్తురు,

దూర ప్రాంతము నుండి వారు వచ్చెదరు.

(మీరా పాటను వినిరి. అది నిజము)

రాజుతో విందు చేయుదురు.

ఆయన అతిధులుగా భోజనము చేయుదురు.

ఈ యాత్రికులు ఎంత ధన్యులు!

ఆయన పరిశుద్ధ ముఖమును చూచెదరు

దైవిక ప్రేమతో ప్రకాశించెదరు.

ఆయన కృపలో పాలిభాగస్థులగుదురు.

ఆయన కిరీటములో ముత్యములుగా ప్రశించెదరు.

ఓ, యేసు త్వరగా వచ్చుచున్నాడు

మన శ్రమలన్నీ గతించును

ప్రభువు, ఈ క్షణములో వచ్చినచో ఏమగుదుము?

ఎవరు పాపరహితులుగా యున్నారు?

ఆలాగయితే మీకు ఆనందము.

లేనియెడల దుఃఖము, మహావేదన!

మన ప్రభువు మహిమతో వచ్చును.

మధ్యాకాశములో ఆయనను కలిసికొందుము.

గురుతును చూపవలెను. "అంత్యదినమున ఆయన వానిని లేపును." నిశ్చయంగా. ఆ దినములలోనే మనం ఉన్నాము.

96జనులందరూ గోషేనులో కూడుకొనిరి. వారు సిద్ధముగా యున్నారు. ఏదో జరుగబోవుచున్నదని వారికి తెలిసినది. మీరు బాతులను చూడండి, అవన్నియూ కలిసి ఒక వరుసలో ఎగిరిపోవును. తేనెటీగలను చూడండి, అవి సిద్ధపడును, వారిలో ఏదో ఒకటి పనిచేయుచున్నది. దానినే సహజ ప్రేరణ అందురు.

పరిశుద్ధాత్మ ప్రజలను ఆకర్షించును.

GEN 7:1,2

 

97ఓ, దేవుని యొక్క మహా ఉగ్రత కుమ్మరించబడబోవు కాలము వచ్చినప్పుడు, ప్రతియొక్క… రెండు బాతులు వచ్చుచున్నవి — ఒకటి మగది, మరొకటి ఆడది. రెండు హంసలు వచ్చుచున్నవి — ఒకటి మగది, మరొకటి ఆడది. రెండు గుర్రములు వచ్చుచున్నవి — ఒకటి మగది, మరొకటి ఆడది. వారిని ఏదో పులికొల్పుచున్నది — అవి ముందుగా నిర్ణయించబడినవి. మిగిలినవన్నియూ నశించినవి. ఓ, మిగిలినవన్నియూ నశించినవి!

అయితే లోనికి రావాలని ఈడ్పు కలిగినవన్ని, వర్షము రానున్నదని వాటికి తెలియును, అది ఒక గురుతు. వర్షము రాబోవుచున్నదని వాటికి తెలియును. ఎవరూ ఏమనుకొనినా అవి లెక్క చేయలేదు. వాటికి తెలిసిపోయినది. వాటి ఆంతరంగమందు ఏదో యున్నది, అది చెప్పెను, "త్వరగా అందులోనికి వెళ్ళండి, అది మాత్రమే సురక్షింత స్థలము." ఎందుకనగా దేవుడు ఒక ప్రవక్తను సిద్ధము చేసెను. ఓడను ఒక గురుతుగా ఆయన పంపెను. అవి రెండు రెండుగా అందులో ప్రవేశించినవి. జంతువులు లోనికి వెళ్ళినవి. ఓడ అడుగు భాగమునకు చేరుకొనినవి. ఆ ఓడకు బయట ఉన్న వారందరూ నశించిరి.

EXOD 12:13•

JOHN 1:14•

1COR 12:13

 

98గురుతుకు వెలుపల ఉన్నవారు, రక్తము క్రింద లేనివారు నశించిరి. పరిశుద్ధాత్మ గురుతుకు బయట ఉన్న వారందరూ నశించెదరు. ఎంత మంచివాడవయినా, ఎంత గొప్ప సంఘ సభ్యుడివైనా లెక్క కాదు — అటువంటి వారు నోవహు దినములలో చాలా మంది యుండిరి, అటువంటి వారు మోషే దినములలో చాలామంది యుండిరి, కాని వారు రక్తమును గురుతుగా అన్వయించుటలో విఫలమయిరి, వారందరూ నశించిరి.

ఓడలోనికి వెళ్ళుటకు నిరాకరించిన వారందరూ, నశించిరి. క్రీస్తు అను ఓడలోనికి రాని వారందరూ నశించెదరు. I కొరింధీ 12వ అధ్యాయములో చెప్పెను, "మనమందరము ఒకే ఆత్మ ద్వారా, ఒక్క శరీరములోనికి బాప్తిస్మము పొందియున్నాము…" మర్మమగు — సంఘము కాదు, కాని మర్మమగు — శాఖలు కాదు, యేసు క్రీస్తు యొక్క మర్మమగు శరీరము, "ఒకే ఆత్మ ద్వారా," అది పెద్దక్షరములతో వ్రాయబడిన ఆత్మ. ఈ ఒక్క శరీరములోనికి మనమందరమును బాప్తిస్మమును పొందియున్నాము.

అప్పుడు, ద్వారము మీద గురుతు ఉండెను, నీవు క్రీస్తులో ఉన్నావు, ఆయనే నీ యొక్క బలి, తీర్పును ఆయన భరించెను; ఆయన దానివైపు చూచినప్పుడు శాంతించును.

మీరు క్షేమముగా ఆయనలో యుందురు, ఎందుకనగా దేవుడు మరియు క్రీస్తు ఒక్కటే. ఆత్మయే శరీరము ధరించి, మన మధ్య నివసించినది. దేవుడు స్వయంగా నీతో నివాసము చేసెను. దేవుడు, తానె స్వయముగా, మరియు నీవు, తన స్వంత పిల్లలను, తన శరీరములో ఉంచుకొనెను. అక్కడే మీరున్నారు. రసాయనము కాదు గాని, ఆత్మ. "నేను మిమ్మును దాటిపోయెదను."

EXOD 12:6,7,12

 

99వారందరూ ఐగుప్తు నుండి వచ్చిరి, ఈ ఒక్క స్థలములో చేరిరి. ఈ గురుతు క్రింద వారుండిరి. వారు మెతడిస్టు, బాప్టిస్టు, ప్రెస్పిటేరియను, లూధరను, పెంతెకోస్తు మొదలగు శాఖలన్నింటిలో నుండి బయటకు వచ్చిరి. గురుతు క్రిందికి చేరుకొనిరి. అప్పుడుండిన రీతిగానే ఇది యున్నది.

అది ఆగ్నిస్తంభము — వారికి ప్రాతినిధ్యము వహించుచుండెను. ఒకరు మరియొకరికి చెప్పిరి, వారు ఇంకొకరికి చెప్పిరి, వారు మరొకరికి చెప్పిరి; మొదటి విషయము మీకు తెలుసా, వారందరూ వచ్చుట ప్రారంభమాయెను. వారు వచ్చుచున్నారు, మరియు వారు దేవుని యొక్క సూచనను గుర్తించిరి. "తీర్పు సమీపములోనే యున్నదని," వారు చెప్పిరి.

అప్పుడు ప్రవక్త ఇట్లు చెప్పెను, "నేను దేవుని యొద్ద నుండి విన్నాను. అక్కడ ఒక గురుతు ఉండును. మీరు గుమ్మము మీద రక్తము చల్లవలెను; గొర్రెపిల్లను వధించుడి, రక్తమును తలుపు మీద చల్లుడి. అది ఒక గురుతుగా ఉండును, ఎందుకనగా మరణము సమీపించుచున్నది."

100దేవుని సేవకునిగా ఈ రోజు నేను చెప్పుచున్నాను, ఆ గురుతు గుమ్మము మీద లేనియెడల, ఆత్మీయ మరణము సమీపించుచున్నదని గుర్తించుడి. సంఘములన్నియూ ప్రపంచ-సంఘ-సమితిలోనికి వెళ్ళుటకు సిద్ధమగుచున్నవి. అవన్నియు మరల కాథలిసిజం లోనికి వెళ్ళుచున్నవి. నిజముగా తిరిగి-జన్మించినవారు మాత్రమే దానిలో చేరకుండా ఉందురు!

గుర్తుంచుకొనండి, మీ పెంతెకోస్తు శాఖలు కాదు, ఎందుకనగా అవి ఎప్పుడో అందులో చేరినవి. అవి చచ్చినవని కనబడుచున్నవి. అవి నశించినవి. అవి బలిగా అర్పించబడినవి; వారు మరల అందులోనికి పోయిరి; వారాయనను గుమ్మము బయటకు త్రోసివేసిరి. కాని ఆయన గురుతు కొరకు చూచుచున్నాడు. ఎందుకనగా, వారు భాషలతో మాట్లాడుట ఒక్కటే ఆధారము చేసికొనియున్నారు.

భాషలు మాట్లాడుట మీద మాత్రమే నీవు ఆధారపడవద్దు. అక్కడ గురుతు ఉండవలెను. యేసుక్రీస్తు యొక్క స్వంత జీవము నీలో యుండవలెను. అది సున్నతి చేయుట కాదు, నీకు మొత్తం సున్నతి కావలెను. చివరకు నీవు, క్రీస్తు ఒక్కటగుదువు. క్రీస్తు నీలో యున్నాడు, మరియు నీ ద్వారా ఆయన జీవితము కనబడుచున్నది.

HEB 10:26-29

 

101ఇప్పుడు, ఐగుప్తు అంతటిలో నుండియూ… మరియు చూడండి, వారేమి చేసిరో మనము చూచుచున్నాము, కాలము సమీపించుచున్నది, మనము కూడా ఆలాగే చేయవలెనని ఆజ్ఞాపించబడెను. అది మీరెరుగుదురా? ప్రవక్త ఏమి చెప్పెనో గమనించండి.

హెబ్రీ 10వ అధ్యాయములో, ఇప్పుడు (మీరు చదువగోరిన యెడల) నాతో కలిసి అది చూడండి, ఇంకా ముందుకు వెళ్ళు ముందుగా ఒకటి లేదా రెండు వచనములు చదువగోరుచున్నాను. హెబ్రీ 10వ అధ్యాయము 26వ వచనము నుండి ఆరంభించుదము. చూద్దాం. హెబ్రీ 10వ అధ్యాయము 26వ వచనము.

మనము ఇష్టపూర్వకముగా పాపము చేయరాదు. [చూద్దాం, దానిని సరిగా చెప్పానా? ఆవును. అది సరియే.]

మనము సత్యమును గూర్చి అనుభవ జ్ఞానము పొందిన తరువాత బుద్ధి పూర్వకముగా పాపము చేసిన యెడల, పాపములకు బలి ఇకను ఉండదు,

గాని న్యాయపు తీర్పుకు భయముతో ఎదురు చూచుటయు, విరోధులను దహింపబోవు తీక్షణమైన అగ్నియు ఇక ఉండును.

ఎవడైనను మోషే ధర్మశాస్త్రమును నిరాకరించినయెడల, ఇద్దరు ముగ్గురు సాక్షుల మాట మీద కనికరింపకుండ వాని చంపించుదురు.

ఇట్లుండగా దేవుని కుమారుని పాదములతో తొక్కి, తాను పరిశుద్ధపరచబడుటకు సాధనమైన నిబంధన రక్తమును ఆపవిత్రమైనదిగా ఎంచి, కృపకు మూలమగు ఆత్మను తిరస్కరించినవాడు ఎంత ఎక్కువైన దండనకు పాత్రుడుగా ఎంచబడునని మీకు తోచును? [అది రక్తములో నుండి వచ్చును. ]

NUM 13:33

 

102నీవు సేవకునివి కావచ్చు, మంచి సభ్యునివి కావచ్చు, సత్పురుషునివి కావచ్చు, నీతిపరునివి కావచ్చు, దేవుడు నీ సిగెరెట్టు అలవాటును మాన్పించి యుండ వచ్చును. స్త్రీలారా, మీ పొట్టి బట్టలను దేవుడు మార్చి యుండ వచ్చును, మీ పొట్టిజుట్టును తీసివేసి యుండవచ్చును. ఆయనే ఈ కార్యములు చేసెనని మీరెరుగుదురు, అయినా గాని నీవు మరల వెనుకకు తిరిగి, మందున్న దానిని తృణీకరించినయెడల, ఆ నిబంధన రక్తమును అపవిత్రమైనదిగా పిలచినయెడల, నీకు గొప్ప ఉగ్రత యుండును. ఆ రకమే నిన్ను పరిశుద్ధపరచి ఇంతవరకు నడిపించుకొని వచ్చినది.

ఆ వేగులవారును ఆలాగే యుండిరి, వారు ఆ దేశ సరిహద్దు వరకు వచ్చిరి, ఆవలకు చూచిరి. మరియు "మంచిది, అది అక్కడ ఉన్నది అని నాకు తెలుసు, కాని ఆటంకము చాలా ఎక్కువగా యున్నది. మేము వారి యొద్ద మిడుతల వలె యున్నాము," అని చెప్పిరి. వారు ఆరణ్యములో నశించిరి. వారు సరిహద్దు విశ్వాసులు.

103ఇంత దూరము వచ్చి ఆగిపోవద్దు. "నేను వర్తమానమును నమ్ముచున్నాను," అని చెప్పుము. వర్తమానమునకు నీవు విధేయతను చూపు! క్రీస్తు లోనికి రమ్ము. "సహోదరుడు బ్రెన్హాం చెప్పిన ప్రతిమాటను నేను నమ్ముచున్నానని," నీవనవచ్చును.

అది మంచిదే, కాని కేవలము వర్తమానము చదివినట్లే అది యుండును. వర్తమానమును తీసికొనుము. దానిని నీ హృదయములోనికి అంగీకరించుము. నీకు గురుతు అవసరము. క్రీస్తులో యున్న జీవమే నీలో యున్నది. దానిని చూచినప్పుడు, ఆయన దాటిపోవును.

104ఈనాడు మనము భూమి మీద గొప్ప అంత్య-కాల సూచనలు చూచుచున్నాము. అది నిజమని మనమెరుగుదుము. ఈ వర్తమానము మీకు అందించవలెనని ఎంతో కాలము నుండి నేను ఎదురు చూచుచున్నాను ఆంత్యకాలపు సూచనలు మీరు చూచియున్నారు. దానిని మీకు నేను బోధించాను. దానిని మీకు క్రీస్తు చెప్పిన ప్రతి విషయము ద్వారాను చూపించాను. అది నిజమేనా? దానిని మీరు అంగీకరించెదరు. అంత్యకాలమందు, ఇంకేమి జరుగవలసినది నాకు కనబడుట లేదు.

"మృగము యొక్క ముద్ర ఏమిటి?" అని మీరడగవచ్చు. పరిశుద్ధాత్మను ధిక్కరించిన వారు ఎప్పుడో మృగము యొక్క ముద్రను పొందియున్నారు. శిక్ష ఆ తరువాత వచ్చును.

LUKE 4:18,19

 

105సునాద సంవత్సరములో ఇశ్రాయేలు వారికి బూర వినబడును, ప్రతి వారు… క్రీస్తు దానిని చదువుట మీరు గమనించారా? దానిలో సగమే ఆయన చదివెను, ఎందుకనగా ఆ సగము మాత్రమే ఆ సమయమునకు అన్వయించబడినది, చూచారా. "నలిగిన హృదయముగలవారిని దృఢపరచుటకును, చెరలో నున్నవారికి విడుదల చేయుటకు ఆయన నన్ను పంపెను. ప్రభువు యొక్క హితవత్సరము ప్రకటించుటకు ఆయన నన్ను పంపెను." మిగిలిన భాగమును ఆయన ఎన్నడూ చదువలేదు; ఆయన ఆ గ్రంధపు చుట్టను క్రింద పెట్టెను, ఎందుకనగా అది ఈ దినమునకు సంబంధించినది. అందులోని కొంత భాగమును మాత్రమే ఆయన చదివెను — అది ఆయన రోజుకు చెందినది.

ఈ దినము ఆయన చేయబోవుచున్నది ఇది. ఈ దినము దానిని ఆయన చెప్పుచున్నాడు. ఆయన యొక్క ఆభి షేకించబడిన ఆత్మ ద్వారా నేడు సంఘముతో ఆయన మాట్లాడుతున్నాడు. ఇదే ఆ ఘడియ. ఇదే ఆ సమయము. జనులారా, దానిని చేర్చుకొనండి; దానిని పొందండి.

LUKE 17:28,29•

JOHN 10:38

 

106గమనించండి! గొప్ప అంత్యకాలములను మనము చూచుచున్నాము, ఎక్కడ చూచినా ఎర్ర దీపములు; ప్రకృతిలో — ప్రకృతి దీపములను వెలిగించుట మనకు కనబడుచున్నది. సమయము సమీపించుచున్నది. దానిని సంఘము మీద మనము చూచుచున్నాము. దీపములు వెలుగుచున్నవి. ఉగ్రత వచ్చుచున్నది. ఆకాశములలో దానిని మనము చూచుచున్నాము. సముద్రము మీద దానిని చూచుచున్నాము. దేశముల మీద దానిని చూచుచున్నాము. సూర్యుడు, చంద్రుడు, నక్షత్రములు దానిని చూపించుచున్నవి. ఎక్కడ చూచినా సూచనలు కనబడుచున్నవి. జనుల మీదికి పరిశుద్ధాత్మ యొక్క ఆంత్య-కాల సూచనలు వచ్చుటను మనము చూచుచున్నాము.

లోతు దినములలో ఉండినట్లే యుండును. అప్పుడు మానవ శరీరము ద్వారా పరిశుద్ధాత్మ ఎట్లు పని చేసెనో చూడండి. దేవుడు శరీరమందు ప్రత్యక్షమాయెను. దేవుడే స్వయంగా మానవుడాయెను. ఆ దినమున ఆయన తన వధువులో ప్రత్యక్షమగును. అదే గురుతును చూపించును. చివరి దినములలో అదే విధముగా యుండునని యేసు చెప్పెను. దానిని మనము చూచుచున్నాము. అదే అగ్నిస్తంభమును మనము చూచుచున్నాము. దాని యొక్క చిత్రమును వారు తీసిరి. ఆంత్య-కాలపు సూచనలు సమీపములో కనబడుచున్నవి. అది ఇక్కడున్నదని మనము ఎరుగుదుము.

107వీటన్నింటినీ మీరు చూచుచున్నారు, మీరు నన్ను నమ్మినట్లయితే — నన్ను మీరు నమ్మనియెడల, ఈ సూచనలను నమ్మండి! వాక్యమును నమ్మండి! నేను మీతో చెప్పుచున్న దానిని గూర్చియే అవి మాట్లాడుచున్నవి.

నేను మీతో సత్యము చెప్పనియెడల, అది తిరిగి రుజువు కాదు. దేవుడు అబద్ధమును ఎన్నడూ బలపరచడు. దేవుడు సత్యమునే మాట్లాడును. నేను మీతో సత్యము చెప్పుచున్నట్లుగా ఆ మాటలే ధృవపరచుచున్నవి. నేను బోధించుచున్న వర్తమానము సత్యమని అవే సాక్షమిచ్చుచున్నవి. ఆ దినమున నది యొద్ద దేవుని దూత ప్రత్యక్షమైనది. ఇట్లు చెప్పెను, "నీ వర్తమానము క్రీస్తు రెండవ రాకకు ముందుగా వెళ్ళును. అందుకు క్రియలే సాక్ష్యము. ఆ దూత సత్యము చెప్పినదని మీరు నమ్మలేనియెడల క్రియలను చూచి నమ్ముడి. అంత్యకాలములో ఈ సంగతులు జరుగునని బైబిలు చెప్పెను. అవియే సాక్షమిచ్చుచున్నవి. నా మాటల కంటెను, ఎవరి మాటల కంటెను, అవియే ఎక్కువగా మాట్లాడుచున్నవి. అది ఆయన వాక్యము. అవి కాలమును గూర్చి సాక్షమిచ్చుచున్నవి.

MATT 24:34•

MARK 13:30•

LUKE 21:32

 

108ఈ గొప్ప, భయంకరమగు అంత్య-కాల సూచనలను ప్రజల మీద మనము చూచుచున్నాము. ఈ కాలపు గురుతులివి. భూమి మీద దేశములలో కలవరములు కనిపించుచున్నవి. ఇశ్రాయేలు తన స్వంత దేశములో చేరుట మనము చూచుచున్నాము. ఆరు కొనల దావీదు నక్షత్ర పతాకము రెపరెపలాడుచున్నది. ప్రపంచములో అది అతి పురాతన పతాకము. ఆమె ఒక దేశమయినది; ఆమె ఒక ప్రభుత్వము; ఆమె యొక్క స్వంత ప్రజలు దానిలో యున్నారు; అది రాజ్యముల సమాఖ్యలో యున్నది; ఆ దేశము గుర్తించబడినది' అది ఐక్యరాజ్య సమితిలో యున్నది; దానికి స్వంత డబ్బు యున్నది.

యేసు ఇట్లు చెప్పెను, "ఇవన్నియూ నెరవేరు వరకు ఈ తరము గతించదు." గుర్తుంచుకొనండి, ఇశ్రాయేలు ఒక దేశముగా ఉద్భవించిన రాత్రియే ప్రభువు యొక్క దూత నాకు ప్రత్యక్షమైనది. ఇది నిజము.

అక్కడ మనము అందరము.

109ప్రతిదియూ ఖచ్చితముగా సత్యమునే చూపించుచున్నది. నేను మీకు అబద్ధము చెప్పలేదు. మీతో నిజమే చెప్పియున్నాను. నేను చెప్పినది నిజమని దేవుడు సాక్ష్యమిచ్చెను. ఇప్పుడు గుర్తుంచుకొనండి, నేను మీ సోదరుడను; నేను మానవుడను. నేను కూడా మీ అందరి వంటి మనిషినే, కాని దానిని ఎవరో ఒకరు తీసికొని రావలసియున్నారు; దానిని ఎవరో ఒకరు చెప్పవలసియున్నాది. అది నా ఎన్నిక కాదు, అది ఆయన యొక్క ఎన్నిక. నేను మీతో సత్యము చెప్పియున్నాను, అది సత్యమని తిరిగి దేవుడు ధృవపరచెను.

ఈనాడు మనము భూమి మీద ఈ సంగతులను చూచుచున్నాము — ఓ, జనులారా, ఇది చివరి ఘడియ. ఆ గురుతును మీరు కలిగి యుండుడి, వీలయినంత తొందరగా, లేక ఆ గురుతులోనికి రండి; ఆ గురుతులోనికి రండి.

గొప్ప అంత్య-కాల సూచనను మనము చూచుచున్నాము, కాలము సమీపించియున్నది, మనలను హెచ్చరించుచున్నది; "సమయము సమీపించియున్నది."

110దీనిని హృదయపూర్వకముగా తీసికొనండి. మనము ఒకరినొకరు ప్రేమించవలెను. ఓ, మై. మనము ఎంతగానో ప్రేమలో యుండవలెను. ఒకరి మీద ఒకరు ఎన్నడూ చెడు పలుకరాదు. ఎవరయినా ఒకరు తప్పు చేసినయెడల, వెంటనే అతని కొరకు ప్రార్థన చేయండి. ఈ విషయములో మనమందరము దేవునిలో ఏకమై యున్నాము.

మనము సోదరీ మరియు సోదరులము. ఓ, భక్తిగా జీవించండి. దేవుని యొక్క కుమార్తెల వలె జీవించుడి. దేవుని కుమారుల వలె జీవించుడి. మాధుర్యముగా, దయగా, దీనులుగా జీవించండి. మీ మనస్సులోనికి ఏ చెడు రానీయకుడి మరియు చెడును ఆలోచించవద్దు; దానిని కొట్టివేయండి. అది మీ తలుపులు తట్టినయెడల, దానిని తోసేయండి — కేవలము మీ గురుతును చూపించండి. కేవలము నడుచుకుంటూ సాగిపోవుడి. "నేను రక్తము క్రింద ఉన్నాను."

JOHN 3:5

 

111గుర్తుంచుకొనండి, ఆ రాత్రి చాలామంది ఆ స్త్రీల యొద్దకు వచ్చి, "హే గెర్టీ, లిల్లీ, మీలో కొందరు, మీరు బయటకు రండి; ఈ రాత్రికి పార్టికి వెళ్ళుచున్నాము," అందురు.

"ఉహ్, ఉహ్, నేను రక్తము క్రింద యున్నాను. ఇక్కడే ఉండుటకు నేను గురుతు క్రింద యున్నాను. నా సృష్టికర్తను ప్రేమించుచున్నాను. ఈ రాత్రి దేశములో మరణమున్నది."

ఈనాడు భూమి మీద మరణమున్నది. తీర్పు కాచుకొనియున్నది; హెచ్చరిక వినబడుచున్నది — అణుబాంబులు, హైడ్రోజను బాంబులు, ఇంకా చాలా రకముల విపత్తులు దేశముల మీదికి రాబోవుచున్నవి. అవి ఎదురుచూచుచున్నవి. దేవుడు తన సంఘమును కదిలించుచున్నాడు, మరియు అన్నియూ చూపించుచు… చాలా సేపటి నుండి మనము గొర్రెపిల్లను చూచుచున్నాము. ఆయన చేయుచున్న దానిని మనము కనిపెట్టి చూచుచున్నాము. ఆయన స్వభావమును చూచుచున్నాము, కాని ఇప్పుడు గురుతును అన్వయించవలెను. దానిని అన్వయించుకోవలెను. అది ఒక్కటే అవసరము. "ఒకడు నీటి మూలముగాను, ఆత్మ మూలముగాను జన్మించితేనే గాని పరలోక రాజ్యములో ప్రవేశించలేడు."

ఒకరినొకరు ప్రేమించుకొనవలెను. విశ్వాసులు లోకము నుండి వేరు కావలెను. ఇప్పుడు దానిని మీరు తేలికగా తీసికొనరాదు.

112ఇప్పుడు, ఈ టేపును వినుచున్న మీరు, స్త్రీ మరియు పురుషులు, ఒక్క నిమిషము మీరు వినండి. నన్ను మీరు ఎప్పుడైనా నమ్మినట్లయితే, మీరు ఇప్పుడు నమ్మండి. ఇది ఎలాంటి సమయము అనగా — ఇది ఒకరితో ఒకరు పోట్లాడుకొను సమయము కాదు. బైబిలు యొక్క వర్తమానమును విశ్వసించండి. యేసుక్రీస్తును నమ్మండి, ప్రేమించుకొనుచూ ఘనపరుకొనుచూ, ఒకరినొకరు గౌరవించుకొనుడి.

పురుషులు తమ భార్యలను గౌరవించవలెను; మీ గృహములను గౌరవించుకొనండి. మీ కుటుంబములను ఐక్యపరచుడి, ఎందుకనగా గుర్తుంచుకొనండి, ఈ గొర్రెపిల్ల కుటుంబమునకు కావలెను, ఒకరికి కాదు. పూర్తి కుటుంబమునకు కూడా, అందరూ లోనికి రావలసియున్నారు. మనము ఒకరి నొకరు ప్రేమించుకొనుచుండవలెను, మరియు విశ్వాసులు ప్రపంచములో నుండి వేరు చేసికొనవలెను.

1COR 12:13

 

113గమనించండి, వారు వర్తమానమును గూర్చి ఇంకా చెప్పుకొన నారంభించలేదు. వారు రక్తమును అన్వయించుకొనుటకే వచ్చిరి. గురుతును అన్వయించుకొనిరి. మీరు తప్పక అది చేయవలెను.

సంఘ కాపరి నెవిల్, ఈ జనులు, ట్రస్టీలు, పెద్దలు, సోదరులు గమనించవలెను. లోకము యొక్క వెర్రితనమంతటిని ప్రక్కకు నెట్టి ముందుకు రావలసిన సమయమిది. అన్నీ ప్రక్కకు పెట్టండి. ఇంత వరకూ చాలా చూచాము. మనము నిశ్చయతను పొందియున్నాము, అక్కడే మనము సానుకూలముగా ఉన్నాము, మరియు గురుతును తప్పక అన్వయించవలెను.

అది లేకుండా, నీవు నశించెదవు. నీవది లేనిచో తప్పక నశించెదవు. దానిని నమ్ముచున్నానని చెప్పితే చాలదు. దాని క్రిందికి రావలెను. దాని లోనికి రమ్ము. దానిని ఎట్లు చేయవలెను? ఒకే ఆత్మ ద్వారా యేసుక్రీస్తు యొక్క శరీరములోనికి మనమందరము బాప్తిస్మము పొందియున్నాము, మీ పూర్ణహృదయముతో నమ్మండి. దాని క్రింద నుండక బయటకు నున్న వారి బాధ్యత ఆయనకు లేదు.

114ఎవరిది మాట్లాడుతున్నారు? [ఇది షార్ట్ వేవ్ రేడియో బ్రెన్హాం సోదరుడా, అని ఎవరో చెప్పిరి.] బయటి రేడియో ప్రసారమా? స్పీకరు గుండా వచ్చుచున్నది. అది మీరు వినుచున్నారా? బయటి రేడియో ప్రసారము. దానిని వారు కలిపి యున్నారు. కారులకు కలిపి యున్నారనుకొనుచున్నాను, క్షమించండి. ఎవరో ఏదో చెప్పిరనుకొన్నాను. ఎవరో నాకు ఏదో చెప్పగోరిరనుకొన్నాను. వారది వినలేదు. అదే కారణము. మీరు గ్రహించండి. నేను దానిని చెప్పాను. నేను చుట్టూ చూశాను. ఒక స్వరమును విన్నాను. ఎవరో ఏదో చెప్పుటకు లేచిరనుకొన్నాను. నాకేమి అర్థము కాలేదు. మీకు వందనములు.

అయితే విశ్వాసముంచుడి… దాని క్రిందికి రండి.

115"మనము ఈ రోజున అందరం కలిసి గోషేనుకు వెళ్ళుదము." గోషేనుకు పయనించుదము. మీ ఒంటెలను, ఎద్దుల బండ్లను సిద్ధపరచండి. జోనెసెస్ ను అచ్చటికి మనం తీసికొని వెళ్ళుదము. గోల్డ్ బెరైస్ ను, ఇతరులను తీసికొని వెళ్ళుదము. అందరం కలిసి గోషేనుకు వెళ్ళుదము. ఎందుకో తెలియునా? మోషే నేడు మాట్లాడనైయున్నాడు,'' అని ఇశ్రాయేలీయులు చెప్పుకొనలేదు.

కాదు, సోదరుడా. రక్తము క్రిందికి వెళ్ళవలెను. నిశ్చయంగా! దానిని గూర్చి మాట్లాడుట కాదు. దానిలోనికి రావలెను.

"నీకు తెలుసా, గోల్డ్ బెర్గ్, అది సత్యమని నాకు తెలియును," అని అందులో ఒకరనిరనుకొందము. "అవును సోదరుడా, అది సత్యమని నమ్ముచున్నాను. అది సత్యమని నాకు తెలియును.''

"లావిన్ స్కీ, దాని గూర్చి నీవేమనుకొనుచున్నావు?"

"అది నిశ్చయంగా సత్యము. దేవుడగు యెహోవా యొక్క శక్తిని నేను చూచాను. ఆ మాటను విన్నాను. ఆ దేశములో కప్పలు వచ్చుట చూచాను. అతడు చెప్పు వరకు ఆలాగు జరగలేదని నేనెరుగుదును. అది యెహోవా దేవుని వలననే కలిగినదని నాకు తెలియును." ఆదంతయూ మంచిదే.

"నీవు సున్నతి పొందావా?"

"అవును."

"నీవు విశ్వాసివా?"

"అవునండి."

EXOD 12:13

 

116సంఘ కాపరి మోషే మాట్లాడుటను వారు వినిరి, ఆ దినమున అతడిట్లు చెప్పెను, "మీరు ఆ రక్తము క్రిందికి రావలెను. 'రక్తము గురుతుగా యుండునని' దేవుడు చెప్పెను."

అది గురుతు. నీవెంత నమ్మినా లాభం లేదు. నీవు సున్నతి పొందినా లాభం లేదు. అది దేవుడు అబ్రాహాముకిచ్చిన నిబంధన. అయినా గాని నీవు రక్తము క్రిందికి రావలెను. అదియే గురుతు. "ఆ రక్తమును చూచినప్పుడు ఆయన ఇశ్రాయేలీయులను దాటిపోవును." నీవు శాఖకు చెందినా, చెందకపోయినా పరవాలేదు. నీవు తప్పకుండా రక్తము క్రిందికి రావలెను. మెతడిస్టు, బాప్టిస్టు, ప్రెస్బిటేరియను, పెంతెకోస్తు మరి దేనికి నీవు చెందినా గాని నీవు వ్యక్తిగతముగా అంగీకరించవలెను. నీవు రక్తము క్రిందికి రావలసి యున్నావు.

ఇప్పుడు, దానిని గూర్చి మాట్లాడితే చాలదు; దానిని పొందుము. నా మాట వినుము; నా మాట వినుము; ప్రభువు నామములో నా మాట వినుము.

రక్తము క్రిందికి రావలసియున్నావు. రక్తము క్రిందకు రాని వ్యక్తుల బాధ్యత ఆయనకు లేదు. ఆ రక్తము క్రింద లేనివారందరూ నశించెదరని దేవుడు తేటగా చెప్పెను.

LUKE 13:3,5•

1COR 12:13•

GAL 1:8

 

117ఆయన మాటలు నేను ఉపయోగించ వచ్చునా? "క్రీస్తుకు వెలుపట నున్న వారందరూ నశించెదరు."

క్రీస్తులోనికి మీరెట్లు రాగలరు? I కొరింధీ 12: "ఒకే ఆత్మ ద్వారా" — కరచాలనము ద్వారా కాదు, సభ్యత్వము ద్వారా కాదు, శాఖ ద్వారా కాదు. కాని వారు వాటి ద్వారానే ప్రయత్నించుచున్నారు. వారిలాగు చేయ వచ్చును, "కాని మనమందరము ఒకే ఆత్మ ద్వారా, ఒకే శరీరములోనికి బాప్తిస్మము పొందియున్నాము."

"మరియొక సువార్తను పరలోకము నుండి వచ్చిన యొక దూతయైనను మీకు ప్రకటించినయెడల అతడు శాపగ్రస్తుడవును గాక.

అదియే వర్తమానము. క్రీస్తులోనికి రమ్ము.

చూడండి, ఆ గురుతుకు ఎవరైనా వెలుపట యున్నచో, దేవునికి బాధ్యత లేదు. ఆ వ్యక్తి ఎవరైనా కావచ్చును. పెద్దవాడు కావచ్చు, చిన్నవాడు కావచ్చు, పేరున్న వారు కావచ్చు, లేనివారు కావచ్చు, పేదవాడు కావచ్చు, ధనికుడు కావచ్చు, దాసుడు కావచ్చు, స్వతంత్రుడు కావచ్చు, స్త్రీ కావచ్చు, పురుషుడు కావచ్చు; దేవునికి ఏమి బాధ్యత యుండదు. రక్తము యొక్క నిబంధన క్రింద లేనివారి పట్ల ఆయనకు బాధ్యత యుండదు. ఆయన బాధ్యుడు కాడు.

MATT 7:23

 

118"ఓ, ప్రభువా, నేనిది చేశాను; నేను దయ్యములను వెళ్ళగొట్టాను. ప్రభువా, ఇది చేశాను; నేను సువార్త బోధించాను," అని నీవు చెప్పవచ్చును.

"అక్రమము చేయువారలారా, నా యొద్ద నుండి తొలగిపోవుడి. మిమ్మును ఎన్నడూ నేనెరుగను." ఆయన గురుతును మాత్రమే గుర్తించును. దానిని మీరు వినుచున్నారా? "ఆమేన్!" చెప్పండి. కావున ఇప్పుడిది మీ మీద యున్నది.

ఒక రోజున నేను అరణ్యములో కూర్చొనియున్నాను, బాలురు ఆటు ఇటు తిరుగుచున్నారు, చెప్పెను, "ఇక్కడ రెండు రోజులు గడిచినది, నీవు ఏమి…" నేను ఒక్క ఉడుతను వేటాడలేదు. చెప్పుము, ఏమిటి సంగతి? అది అదే అయి యుండెను.

చెప్పెను, "నీవు దానిని అక్కడ పెట్టుము, అక్కడ దానిపైన." చెప్పెను, "నీవు చెప్పవలెను… దాని గూర్చి నాతో మాట్లాము." ఇప్పుడు, అది నీ ఒడిలోనే యున్నది. అది మీ పై యున్నది.

119పరిశుద్ధాత్మ యొక్క నిబంధన క్రింద ఉన్నప్పుడే ఆయన గుర్తించును. నీవు రక్షింపబడి, శుద్ధీకరించబడి, ఆయన శరీరములోనికి బాప్తిస్మము పొందినప్పుడే నీవు ఆ నిబంధనను పొందెదవు. నీవు ఆనుకరణను పొంది యుండవచ్చును, నీవు మంచిగానే యుండ వచ్చును, క్రిందికి - పైకి ఎగురు చుండవచ్చును, భాషలలో మాట్లాడుచుండవచ్చును, ఆత్మలో నాట్యము చేయుచుండవచ్చును. దాని వలన ఏమి ప్రయోజనము ఉండదు. ప్రభువు యొక్క నామములో దానిని వినుము! దానిని దేవుడు గుర్తించడు. అన్యులు ఆలాగున చేయుదురు! దయ్యములు ఆలాగు చేయును!

"నేను పండితుడను. నేను ఇది చేశాను, అది చేశాను" అని నీవు చెప్పుకొనవచ్చును. నీవెంత పండితుడవయినా, ఆయన లెక్క చేయడు. దయ్యము కూడా చాలా గొప్ప పాండిత్యము సంపాదించెను. ఆయన కేవలము గురుతును మాత్రమే గుర్తించును. అదే ఈ ఘడియ యొక్క వర్తమానము! అదే ఈ దినము యొక్క వర్తమానము. అదే ఈ కాలము యొక్క వర్తమానము. యేసుక్రీస్తు నామములో, దానిని చేర్చుకొనుము!

PS 121:2

 

120అపవాది నీ ముందు ఒక ప్రత్యామ్నాయమును ఉంచవచ్చును. మోసపూరితమైన ప్రేమ వలె అది యుండును, ఒక స్త్రీ తన భర్తను కాక మరో పురుషుని, ఒక పురుషుడు తన భార్యను కాక మరో స్త్రీని ప్రేమించుట చాలా సిగ్గుకరము. అది నిజమగు ప్రేమ కాదు. అది అపవాది. అవి వాడి క్రియలు. నిన్ను ఆ విధంగా అది శోధించును. త్రాగినప్పుడు చాలా సంతోషము కలుగునని చెప్పును. మద్యము త్రాగితే అంతా మరచిపోవుట జరుగునని అనుకొందురు.

అదియే మరణము. దేవుడే నీ సంతోషము. దేవుడే నీ బలము. వర్తమానమును ఎరుగుము. సత్యమును గ్రహించుము. ఇప్పటికి అదే చాలును. ఆయనే నాకు చాలును. నాకు కావలసిన వన్నియూ ఆయనలోనే యున్నవి. అదే మన బలము. "యెహోవా వలననే నాకు సహాయము దొరకును."

క్రైస్తవులారా, మీరు సంతోషము కొరకు ఆయన వైపు చూడండి, మీ బలము కొరకు ఆయన వైపు చూడండి; మీ సంతోషము కొరకు ఆయన వైపు చూడండి; ఆయనే నా సమాధానము; ఆయనే నా సంతోషము; ఆయనే నా ప్రేమ; ఆయనే నా జీవము. అదియే నిబంధన, తలుపు మీద ఉన్న గురుతు.

EXOD 12:13

 

121ఒక వ్యక్తిని ఆయన బాధ్యునిగా ఎంచడు, ఒక్క వ్యక్తి, నీవు ఎవరివైనా గాని ఆ గురుతు క్రిందనే యుండవలెను. అప్పుడే ఆయన నీ బాధ్యతను వహించును. గుర్తుంచుకొనండి, కుటుంబమంతయూ దాని క్రిందికి రావలసియుండెను. ఓ, మై! ఓ! గుర్తుంచుకొనండి, "మంచిది, నా తండ్రి బోధకుడు, సంఘ కాపరి నా సోదరుడే అని నీవనవచ్చు."

అది నిజమే కావచ్చును. అయితే నీ సంగతి ఏమిటి? గుర్తుంచుకొనండి, ఆ గురుతు ప్రదర్శింపబడినప్పుడే నీకు క్షేమము. ఒకడు ఆ గురుతు క్రింద యుండి అతని కుమారుడు వీధిలో తిరుగుచున్నయెడల అతనికి ప్రమాదము. అతడు నశించును. అతని తండ్రి రక్షింపబడును. లేదా కుమారుడు ఆ గురుత క్రింద యుండి, తండ్రి బయటయున్నచో అతడు నశించును. గురుతు మాత్రమే కావలెను — "ఆ గురుతును చూచినప్పుడు ఆయన దాటిపోవును." అది ఒక్కటే కావలెను.

"నా కుమారుడు బోధకుడని," నీవు చెప్పవచ్చు. నా కుమారుడు లేదా కుమార్తె కంటే మంచి వారెవరూ లేరని నీ తల్లి చెప్పవచ్చును. వారు చాలా మాధుర్యమైన వారే కావచ్చును. వారు పరిశుద్ధాత్మచే నింపబడి యుండవచ్చును, మరియు అలంటి ప్రేమ… వారు విధేయులు. కాని ఆ తల్లి మాట ఏమిటి?

"నీ తల్లి చాలా భక్తురాలని, ఆమె చనిపోయినయెడల పరలోకమునకు వెళ్ళును, ఎందుకనగా ఆమెకు గురుతున్నది, సహోదరుడా బ్రెన్హాం" అని నీవు చెప్పుకొనవచ్చును. కాని సోదరీ, నీ సంగతి ఏమిటి? మొత్తం కుటుంబమంతయూ దాని క్రిందికి రావలెను.

122మీరు అలసిపోయారా? కొద్ది నిమిషములలో నేను ముగించెదను. ఇప్పుడే నేను ఆపి మరల రాత్రికి చెప్పవచ్చును, కాని మీరు కొద్దిసేపు వేచియుండుటకు ఇష్టపడినయెడల, నేను త్వరగా ముగించెదను. దీనిని సూటిగా చెప్పి ముగించెదను. ఇప్పుడు మీరు దాని యొక్క అభిషేకము క్రింద యున్నారు. ఇప్పుడే మీరు దానిని గుర్తించినయెడల బాగుండును.

గురుతు ప్రదర్శింపబడినప్పుడు మాత్రమే. అప్పుడు, ఆ కుటుంబమంతయూ దాని క్రిందికి రావలెను. తండ్రి, తల్లి, మీరు ఎలా అనుభూతి చెందుచున్నారో నాకు తెలుసు. నేను కూడా పిల్లలను కలిగియున్నాను. వారు రక్షించబడునట్లుగా నేను చూడవలెను.

ఈ రోజు నాకు నేను చెప్పుకొనుచున్నాను. నాకు సోదరులున్నారు; నాకు ఒక సోదరి యున్నది; నాకు ప్రియులున్నారు. వారు కూడా రక్షించబడునట్లు నేను చూడవలసియున్నాను, కాని మరువద్దు. ఆ గురుతు క్రిందకు రానియెడల వారు నశించెదరు. వారికి పునరుత్థానము ఉండదు. అది నిజము. వారు గతించెదరు. గురుతు మాత్రమే వారిని రక్షించగలదు.

JOSH 2:1,9,18•

ROM 10:17

 

123యెహోవాను చూడండి. దానిని చదువుటకు మనకు, సమయము ఉండినచో బాగుండును. వ్రాసికొనండి. యెహోషువా 2 వఅధ్యాయము. అన్యురాలగు వేశ్య రాహాబు విశ్వసించినది.

తొమ్మిది గంటలయితే బాగుండుననుకొనుచున్నాను. ఆ అంశమును తీసికొని మీకు చెప్పగోరుచున్నాను [స్పష్టతలేని మాటలు].

ఈ అన్యురాలగు వేశ్యను ఆమె కుటుంబమును గమనించండి. ఆమె ఒక విశ్వాసి. ఆమె కుటుంబమంతయూ ఆ ఎర్రని దారము క్రిందికి రావలెను. అదియే గురుతు. వారందరూ దాని క్రిందికి రావలెను, లేనియెడల నశించెదరు.

వారు దేవుని యొక్క ఉగ్రత గూర్చి వినిరి; దేవుడు తన జనుల మధ్య అద్భుత కార్యములను, సూచన క్రియలను చేయుటను వారు వినిరి. దానిని వారు చేర్చుకోవలసి యుండిరి. ఆమె దానిని చేర్చుకొనవలసియున్నది. దేవుని నాశనపు దూత వచ్చుచున్నారు. అది వారెరుగుదురు. యెహోషువాయే ఆ దేవదూత. వారు వరుసలో యున్నారు. ప్రపంచమంతయూ ఆ విధముగానే నేడున్నది. దేవుని యొక్క తీర్పు వరుసలో యున్నది.

ఈ వేశ్యయగు రాహాబు వినినది, "వినుట వలన విశ్వాసము కలుగును." "మీ గూర్చి దేశమంతయూ కలవరపడుచున్నదని," ఆమె చెప్పెను. అది నిజము.

JOSH 2:10-13

 

124వేగులవారు ఆ దేశమును చూచుటకు పంపబడిరి. వారిని ఆమె గౌరవించినది. ఆమె రక్షింపబడగోరినది. ఆమె ఇట్లనినది, "మీ దేవుడే దేవుడని నేనెరుగుదును. ఆయన చేసిన గొప్ప కార్యములు మేము విన్నాము. ఓగుకు ఏమి చేసెనో విన్నాను. ఆయా జనాంగములకు ఏమి చేసెనో విన్నాను. ఆయనను అంగీకరించిన వారు రక్షింపబడుదురని నేను విన్నాను. ఆయనను అంగీకరించని వారు నాశనమగుదురని విన్నాను.

ఓ, మై. అక్కడే మీరున్నారు. "నేను జీవించగోరుచున్నాను, ఎందుకనగా వారు కవలము…"

JOSH 2:13•

JOSH 6:22,23

 

125దేవుడేమి చేయుచున్నాడో యెరికో వినుచున్నదని గమనించండి, కాని వారు ఆ హెచ్చరికను పెడచెవి బెట్టిరి. దేవుడు చేయుచున్న కార్యములను వినని ఏ శాఖయూ ఈ దేశములో లేదు, కాని వారు హెచ్చరికను ఖాతరు చేయరు. ఆయన యొక్క గొప్ప శక్తి, సూచక క్రియలు ప్రదర్శింపబడినవి. ఎర్ర సముద్రము గుండా వారు దాటి వచ్చిరి. ఎండిన భూమి మీద నడచినట్లుగా నడిచిరి. ఆయనే ఆలాగు చేసెను. ఆయన కప్పులను సృజించెను, పేలను సృజించెను, ఈగలు గాలిలోనికి వచ్చినవి. ఆయన మాట ద్వారా సృజింపబడెను. ఆయన ప్రవక్త ద్వారా దానిని చేసెను. అందులో ఏమి రహస్యము లేదు. దానిని వారెరుగుదురు.

"నేనిది విన్నాను గనుక ఈ అవిశ్వాసులతో కూడా నశించగోరుట లేదు," అని ఆహాబు పలికెను.

ఆ తరువాత తీర్పు జరుగునని ఆమె ఎరుగును, ఎందుకనగా ఆ వరుసలోనే వారున్నారు. అది ఆమెకు తెలియును. కావున ఆమెను తప్పించుటకు వారు ఒక మార్గమును ఏర్పరచిరి.

MARK 16:17•

JOHN 3:3,5•

JOHN 13:35

 

126యెరికో అను వారి యొక్క స్వంత పెద్ద సంస్థ ద్వారా దేవుని ఉగ్రతను ఎదిరించవచ్చునని వారు తలంచి యుందురు. వారియొక్క పెద్ద సంస్థ.

ఈనాడు చాలామంది ఆ విధముగానే తలంచుచున్నారు. నిశ్చయంగా దేవుడు దానిని చేయడని వారు చెప్పుచున్నారు. హవ్వకు సాతాను ఆ విధముగానే చెప్పెను. "ఓ, నిశ్చయంగా దేవుడేమి అనడని," చెప్పినది. ఆయన చేయుదునని చెప్పెను గనుక తన మాట ప్రకారమే జరిగించును.

"ఒకడు క్రొత్తగా జన్మించితేనే గాని — తిరిగి జన్మించిన వారి వల్లనే ఈ సూచక క్రియలు కనబడును. దీనిని బట్టి మీరందరూ నా శిష్యులని వారు తెలిసికొందురని," ఆయన చెప్పెను.

మంచిది, ఇది చేయాలని అనుకొంటిని.

127ఓ, ఏమి జరిగినది? వారిప్పుడు ఆపివేసిరి. "ఏ ఉజ్జీవము ఇకరాదని వారనుచున్నారు. అటువంటి వాటికి మా శాఖ మద్ధతు ఇవ్వదనుచున్నారు." "మా మధ్య అటువంటి బుద్ధిహీనపు క్రియలు వద్దనుచున్నారు." వారి కూటములకు వెళ్ళరాదని నిషేధించుచున్నారు. యెరికో నశించిపోవు క్రమములోనే యున్నది.

అయితే ముందుగా నిర్ణయించబడిన సంతానము కొరకు కొందరు టేపు బాలురు లోనికి చొచ్చుకొని వచ్చిరి. వారామె యొక్క ఇంటిలోనికి చొరబడి కొన్ని టేపులను వినిపించిరి. వర్తమానమును స్వీకరించుటకు ఆమె తన స్వంత ఇంటినే ఒక సంఘముగా చేసినది. (మీకు తెలుసా, వారు ఇంకా వారిని కలిగియున్నారు.) ముందుగా నిర్ణయించబడిన సంతానము యొద్దకు ఎదో విధముగా వర్తమానము చేరియున్నది. అది అక్కడికి ఎట్లు చేరినదో మనకు తెలియదు గాని మొత్తం మీద ఎలాగో చేరినది, కావున నీతిమంతులు అనీతిమంతులతో కూడా నశించరు. నేడు దేవుడు దానినే చూచుచున్నాడు. ఏలాగోలాగున అది వచ్చుచున్నది. ఏలాగో మనకు తెలియదు. వారు దానికి మద్దతు ఇవ్వకపోయినా గాని ఆ ముందుగా నిర్ణయించబడిన సంతానముండుట వలన అక్కడి అది చేరుచున్నది.

JOSH 2:18•

JOSH 6:17,23,25•

HEB 11:31

 

128ఆ వేశ్య ముందుగా నిర్ణయించబడినదని బైబిలు ఎరిగిన వారందరికి తెలియును. నిశ్చయంగా అంతే. అవిశ్వాసులతో పాటుగా ఆమె నశించలేదని బైబిలు చెప్పుచున్నది.

అది నిజము. కాని ఆమె ఆ ఘడియ యొక్క వర్తమానమును విశ్వసించినది. దేవుడు తన యొక్క వర్తమానికుల ద్వారా ఆమెకు ఒక సూచనను ఇచ్చెను. ఒక ఎర్రని దారమును కట్టుకొనమని వారు చెప్పిరి. ఆమె గాని ఆ దారమును ఆ మార్గములో కట్టుట మరచినట్లయితే, ఆమె నాశనమునకు ఆమెయే బాధ్యురాలు గాని వారు కారు. ఆమె దాని క్రింద ఉండని యెడల వారికి బాధ్యత లేదు. ఓ, మై!

రాహాబు ముందుగా నిర్ణయించబడిన విత్తనమై యున్నది. ఆమె ఎవరికి ఆశ్రయమిచ్చునో వారును బ్రదుకుదురు. తన తల్లిని, తండ్రిని తీసికొని రావచ్చును. ఐగుప్తులో నుండి ఇశ్రాయేలీయులు అప్పుడే విమోచన పొంది వచ్చిరి. ఆ గురుతు క్రింద లేనివారందరూ నశించిపోయిరి. రాహాబునకు ఒక సూచన, ఒక గురుతు ఇయ్యబడినది. యెహోవా నామము పేరట దానిని ధరించుమని వారు చెప్పిరి. వర్తమానికుని ఆమె ఎరుగును. ఉగ్రతా దూతయగు యెహోషువాను ఆమె ఎరుగును. అతడు దేవుని యొక్క నాశన దూతగా యున్నాడు. ఆమెకు అది తెలియును. అతడు ఆ గురుతును చూడవలెను. దానిని ఆమె తగిలించవలెను. అదియే ఆమెకు నిశ్చయత, వారందుకు ప్రమాణము చేసిరి.

దేవుడు కూడా ఆ ప్రమాణమును గౌరవించును. దాని క్రిందికి రాని వారందరూ నశించెదరు. దాని క్రింద ఉన్న వారందరూ జీవించెదరు.

129అదే ప్రమాణము నేడు మనతో యున్నది. ఏమియూ మారలేదు. వర్తమానమును నమ్మక, నశించువారితో కూడా నిన్ను నేను నశింపచేయనని చెప్పుచున్నాడు. ఆమె జరిగిన కార్యములను గూర్చి వినినది. దానిని ఆమె నమ్మినది.

ఆ పట్టణమంతటిలో ఆమెయు, ఆమె తండ్రియ, ఆమె సోదరులు మాత్రమే దానిని నమ్మిరి.

130ఎంత కొద్దిమందో చూచారా? అక్కడ ఒకరు, ఇక్కడ ఒకరు. ఒక రాజ్యములో నుండి చిన్న కుటుంబము బయటకు వచ్చినది. అది నిజమేనా? ఇక్కడ మనము నిశ్చయంగా వాస్తవములను గూర్చి చెప్పుకొనుచున్నాము.

మొదటగా ఆ మాదిరిని మీరు చూడండి, అప్పుడు దాని ప్రతి-మాదిరి మీకు అర్థమగును. మీరు ఆ నీడను చూడవలెను. అప్పుడు ఆ నిజమగు రూపమేమిటో గ్రహించగలరు.

ఆయన యొక్క శక్తి ప్రదర్శింపబడెను: తీర్పు రాబోవుచున్నది. రక్షింపబడవలెనన్నచో తప్పక వారది నమ్మవలెను. అవునండీ.

131ఈ వర్తమానికులు అచ్చటికి వెళ్ళిరి, నమ్మిక యుంచిన ఆ ముందే నిర్ణయించబడిన సంతానమును వారు పట్టుకొనిరి.

ఆమె తన గృహమును ఒక సంఘముగా వాడుకొనినది. వర్తమానికులను చేర్చుకొనినది. వారిని ఆ ఇతర సంఘములలోనికి రానీయలేదు. లేదండి. నిన్ను కూడా వారు రానీయరు. దానిని గూర్చి నీవు ఏమయినా నోరెత్తినచో బయటకు గెంటివేయుదురు.

ఆ పట్టణమంతటిలో వారు మాత్రమే నమ్మిరి. వారు గురుతు క్రిందికి వచ్చిరి. ఈనాడు మనము కూడా అదే చేయుట మంచిది. నీవు ప్రేమించుచున్న వారిని రక్షణలోనికి నీవు నడిపించగోరుచున్నయెడల ఇప్పుడే అందుకు పూనుకొనుము.

132ఆ పెద్ద పట్టణమును దేవుని ఉగ్రత నాశనము చేసినప్పుడు ఆ సూచన గురుతు ఆమె ఇంటిని క్షేమముగా ఉంచినది. ఆమేన్. ఏమిటి? ఆ గురుతే ఆమెకు సూచన. ఆ గురుతు ఆమె ఇంటిలో యున్నది. మిగిలిన పట్టణమంతయూ నేల మట్టమయినది. అది ఏమిటి? ఏమి జరిగినది?

యెహోషువా దేవుని యొక్క వర్తమానికుడు. దేవుడు స్వయంగా తన వర్తమానికుని యొక్క వర్తమానమును గుర్తించెను. ఆమేన్. దానిని అది రుజువు చేసెను; అది ధృవపరచబడెను. వారు వర్తమానమును గుర్తించిరి. ఆయన తన వర్తమానికుని యొక్క వర్తమానమును గుర్తించెను. మిగిలిన పట్టణమంతయూ నేలమట్టమాయెను, కాని రాహాబు యొక్క ఎర్రని దారము ఉన్న చోటు మాత్రము చెక్కు చెదరలేదు. మిగిలినదంతయూ నాశనమాయెను.

నాశనము చేయు దూతలు తిన్నగా అచ్చటికి వెళ్ళినవి. ఆ పట్టణములో యున్న సమస్తమును నాశనము చేసెను. ఒక్క వస్తువు కూడా మిగిలి యుండలేదు. ఎవరైనా ఏదయినా వస్తువు తీసికొన ప్రయత్నించినచో నాశన మగుదురు. వారందరూ వాటితోనే నశించిరి. మొత్తం సర్వనాశనమాయెను. "దానిని మరల కట్టుటకు పూనుకొనువాడు శాపగ్రస్తుడు. అతడు పునాది వేయగా మొదటి బిడ్డ చనిపోవును" అని చెప్పెను. ఆ విధముగా దానిని దేవుడు శపించెను. వారు చాలా నెమ్మదిగాను, క్షేమముగాను ఉన్నామనుకొనిరి — అందుకే కృప మరియు కరుణ వర్తమానమును తిరస్కరించిరి.

133ఈనాడు చాలామంది ఆలాగే అనుకొనుచున్నారు, "నేను ఈ సంఘమునకు చెందియున్నాను గనుక క్షేమముగా యుందును." అటువంటి బుద్ధిహీనతను నీవు ఎన్నడూ నమ్మవద్దు. ఆ రక్తము మీకు గురుతుగా యుండును.

ఇప్పుడు ఆత్మ మీకు గురుతుగా ఉండును. ఆ రక్తములో ప్రాణమున్నది.

134దానిని గూర్చి ఆలోచించుదము. అదే గురుతును వారు ఐగుప్తులో ఉపయోగించుకొనిరి. ఐగుప్తులో అదే జీవపు గురుతు యున్నది. అదే ఐగుప్తులో యుండెను. దేవుడు అదే గురుతులు అక్కడ ఉపయోగించుకొనెను.

యెహోషువా యేసుకు చక్కని మాదిరి. వర్తమానికులు బోధించిన దానికి అతడు నిజమగు సూచన. "ఆ గృహమును తాకవద్దు, దానిని యెహోవా కాపాడెను" అని యెహోషువా చెప్పెను. ఆమేన్!

ఆమె ఒక అన్యురాలు, వీధిలో తిరిగే వ్యక్తి, ఒక వేశ్య, అయితే ఆమె విని విశ్వసించినది, మరియు గురుతును ఆమె అన్వయించుకొనినది.

నీవు పాపములో ఎంతగా కూరుకొనిపోయినను పరవాలేదు. నీవేమి చేసినా లెక్కకు రాదు. అందులో ఏమి లేదు. నీవు గురుతును అన్వయించితే చాలును. అది నీ కొరకే. నీ హృదయములోని పోరాటమును నీవు గుర్తించిన యెడల ఆ గురుతును నీవు అంగీకరించెదవు, అది నీ కొరకే; నీవు గురుతును అన్వయించుకొనుము.

మరియు ఆ గొప్పవాడైన యోహోషువా…

JOSH 6:17,25

 

135"యెహోషువా" అను మాటకు యెహోవాయే రక్షకుడని అర్థము. యేసు అనగా రక్షకుడని భావము. యెహోషువా తన వర్తమానికులను ఎరుగును. ఆయన వర్తమానికులు తిరిగి వచ్చిరి. "మేము నీవు చెప్పినట్లే చేసియున్నాము."

అక్కడ ఒకామెను మేము కనుగొన్నాము. (మేము టేపులు వినిపించాము, మీకు తెలుసా.) "విశ్వసించిన ఒకామెను కనుగొన్నాము. ఆమెకు చెప్పాము, ఆ ఎర్రని గురుతు క్రిందికి వచ్చిన వారందరూ రక్షింపబడుదురని చెప్పాము. యెహోషువా, మేము బోధించిన దానిని నీవు గౌరవించవా?" అనడిగిరి.

"దానిని చేయుటకే నిన్ను పంపియున్నాను." ఆమేన్. దానిని దేవుడు ఘనపరచెను. ఆ ఇల్లు ఎన్నడూ నేలమట్టము కాలేదు.

యెహొషువా అచ్చట నిలబడి యుండెను. సమస్తమూ నాశనము చేయవలెనని సైగ చేసెను. రాహాబును, ఆమె జనులను మాత్రము తాకవద్దు అని చెప్పెను. మిగిలినవారి ఆస్తి అంతయూ నాశనమాయెను గాని, వీరి ఆస్తి మరియు గృహము క్షేమముగా యుండెను. ఆమేన్! ఆమేన్! అవి అక్కడే నిలచియున్నవి. కిటికీలో నుండి తొంగి చూడవలసిన అవసరము కూడా లేదు. ఆ యుద్ధము జరుగుచుండగానే వారా లేఖనమును చదువగలిగిరి.

ఆమె వచ్చి ఆ సైన్యాధిపతిని ప్రేమించినది, ఆమె బెత్లెహేముకు వచ్చినది, మరియు ఆమెకు ఒక స్వాస్థ్యము వారితో పాటుగా ఇయ్యబడెను. ఆమె ఒక గొప్ప పేరు గల కుమారుని కనినది. ఆ పేరుగల కుమారుడు మరొక పేరు పొందిన కుమారుని కనెను. ఆ కుమారుడు మరియొక పేరు గల కుమారుని కనెను. చివరకు ప్రఖ్యాతి గల కుమారుడు వారిలో నుండి వచ్చెను. ఓబేదు, యెషయి, దావీదు అనువారు వచ్చిరి. వేశ్యయగు రాహాబులో నుండి వచ్చిరి. దీనికి కారణము ఆమె వర్తమానికుని విశ్వసించినది. ఆమె గురుతను అన్వయించుకొనినది. ఆమె ఇట్లు రక్షించబడినది, లేనియెడల ఆమె వారితో పాటుగా నశించిపోయి యుండెడిది.

HEB 13:20

 

136ఇప్పుడు జాగ్రత్తగా వినండి. ఓ, దానిని మీరు గుర్తించారా? దాని క్రింద ఉన్న వారందరూ ఐగుప్తులో రక్షించబడిరి. దాని క్రింద ఉన్న వారందరూ యెరికోలో రక్షించబడిరి. దాని క్రింద ఉండు వారందరూ నేడు రక్షించబడుదురు. ఆ రక్తము, గొర్రెపిల్ల, యేసుక్రీస్తుకు మాదిరి.

హెబ్రీ 13:10 నుండి 20. దానిని చదువుటకు నాకు సమయము లేదు. వ్రాసుకొనండి. దానిని నేను చదువబోవుచున్నాను. అది నిత్య నిబంధన అని చెప్పబడినది. యేసుక్రీస్తు యొక్క రక్తమే నిత్య నిబంధనగా పిలువబడినది. అవును. "నిత్య నిబంధన."

అది నిత్యమగు నిబంధన. మనము విమోచింపబడినాము. అది శాశ్వతమగు నిబంధన. ఆ కాలమునకు ప్రత్యేకత యున్నది. విమోచింపబడిన తరువాత ఆ నిబంధన అయిపోవును. మరియొకటి ఎన్నడూ ఉండదు. సమయము గతించిన తరువాత, ఇక మరో నిబంధన మనకు అవసరము లేదు; కాని ఆ సమయము గతించు వరకే నిబంధన కావలెను.

JOHN 14:12•

2COR 3:3•

HEB 8:10•

HEB 13:20

 

137ఇప్పుడు, హెబ్రీ 13:10-20ని గుర్తుంచుకొనండి, ఒక నిత్యమగు నిబంధన. దేవుని రక్తము యొక్క వాగ్దానము మనలను పాపము నుండి విడుదల చేసియున్నది. ఆమేన్! ఆయనలో ఏ పాపము లేదు. పాపము, స్వార్థము, శరీర క్రియలు లేవు. ఆయనను ఆరాధించుడి. ఆయన వాగ్దానము చేసిన శక్తిని చూపించుడి. దేవుడు రక్తమును చిందించెను, గురుతును ఇచ్చెను, నిబంధన జనుల మీద యేసుక్రీస్తు యొక్క ఆత్మ యున్నది, "నా యందు విశ్వాసముంచువాడు నేను చేయు క్రియలు చేయును."

నిబంధనను వెల్లడి చేయవలెను, చూచారా. క్రొత్త నిబంధన — "నిబంధన" అనగా ఒప్పందము. అది సరియే గదా, వైల్ సోదరుడా? నిబంధన అనగా ఒప్పందము. క్రొత్త నిబంధన అనగా నూతన ఒప్పందము. పాత నిబంధన పాతది. గొర్రెపిల్ల క్రింద ఉండినది. ఆ జీవము విశ్వాసి మీదికి తిరిగి రాదు. క్రొత్త నిబంధన దేవుని యొక్క గొర్రెపిల్లది. ఆయన జీవము తిరిగి మన మీదికి వచ్చును.

రక్తమే ప్రాణము, చూచారా. రక్తమే ప్రాణముగా కొత్త నిబంధన చూపించుచున్నది. గొర్రెపిల్ల రక్తములో నుండి జీవము వచ్చును. అదియే క్రొత్త నిబంధన. నూతనమగు ఒప్పందము. "ఆ దినములయిపోయిన తరువాత, నా ఆజ్ఞలను నేను వారి మాంస హృదయముల మీద వ్రాయుదును, అని దేవుడు చెప్పెను. మీరు కలిగియున్న ఆ బండ యొక్క బల్ల పైన కాదు, గొర్రెపిల్ల రక్తములో — "అవును, ఇక్కడ రక్తము ఉన్నది. ఇప్పుడు, అది ఏమి చెప్పుచున్నది?" — అయితే మీ యొక్క హృదయము అను బల్లపై, చూచారా. ఆయన తన జనలుతో ఆత్మీయ నిబంధన చేసెను."

JOHN 14:12•

ROM 8:1

 

138ఆయన శక్తిని అది ప్రచురము చేయుచున్నది. యోహాను 14:12లో చెప్పబడినది, "నా యందు విశ్వాసముంచువాడు నేను చేయు క్రియలు చేయును.'' క్రొత్త నిబంధన అనగా నూతన ఒప్పందము, నూతన జీవము. దేవుడు కోరిన వాటినన్నింటినీ యేసు అనుగ్రహించెనని కనబడుచున్నది. తిరిగి మనలను నిజమగు కుమారులనుగా, కుమార్తెలనుగా చేసెను. రక్తము క్రిందనున్న వారికి ఏ శిక్షవిధియు లేదు.

రోమా 8:1, "కాగా ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షావిధియు లేదు — దానిని నమ్మువారు కాదు — క్రీస్తు యేసునందున్న వారు, వారు శరీరానుసారముగా నడచుకొనక ఆత్మానుసారముగా నడచుకొందురు."

నా మాటయే ఆత్మ అయి యున్నది. సరియా? ఓ, దానిలో నుండి వాక్యమును తీసుకొని మరికొన్ని గంటలు మాట్లాడగలను, కాని మనము త్వరగా ముగించుకొందము, మీరు చూచారా.

ఏ శిక్షా విధియు ఇక లేదు; పాపము నుండి విడుదల కలిగినది; ఈ లోక చింతల నుండి విడుదల కలిగినది. ఏ శిక్ష విధియు లేదు… ఎందువలన? "ఒకే ఆత్మ ద్వారా ఒకే శరీరములోనికి మనమందరము బాప్తిస్మము పొందియున్నాము." గొర్రెపిల్ల యొక్క రక్తము అన్వయింపబడినది. పరలోకపు దేవుడు నిన్ను అంగీకరించెను. ఆయన జీవము నీలో యున్నది, మరియు మీరు దేవుని కుమారులు మరియు కుమార్తెలు అయి యున్నారు.

మీ గుణలక్షణము దేవుని గుణలక్షణము అయి యున్నది. అది ఏమిటి? బలవంతముగా దానిని పొందితిరా? లేదండి. దేవుడు తీర్పు తీర్పు దేవుడు. ఆయన సరిచేయు దేవుడు. అది తప్పక క్రమములో ఉండవలెను. మరేదియూ పనిచేయదు. అటువంటి గుణలక్షణము నీవు కలిగియున్నావు, ఎందుకనగా నీవు నీ తండ్రి యొక్క గుణలక్షణమును కలిగియున్నావు.

1JN 3:21

 

139గమనించండి!

ఆ జీవము — గమనించండి! ఆ జీవము రక్తములో నుండి తీయబడినది. జీవమే తీయబడినది. ఆ జీవము, అది రక్తములో నుండి తీయబడినది. రక్తము అన్వయించబడినది, మరియు జీవము మనుష్యుని మీదకు రాలేదు, ఎందుకనగా జంతువు యొక్క రక్తము, జీవము కాదు… కాని చూడండి, మానవునికి బదులుగా ఒక మహోన్నత, మహోన్నత, మహోన్నత వ్యక్తిగా దేవుడే వచ్చెను. అందువలన మానవుడు కేవలము మానవునిగా ఉండిపోలేదు గాని దేవుని కుమారుడు మరియు కుమార్తెగా మారి యున్నాడు. ఆయనలో యున్న మహాన్నత, మహన్నత, మహన్నత జీవము నీ మీదికి తిరిగి వచ్చెను. నిన్ను పాపిగా ఉంచక మార్చెను. లోకపు సంగతులలో నుండియూ, సంఘ సభ్యత్వములో నుండియూ, శాఖల అనుచరణలో నుండియూ నిన్ను మార్చి, తిరిగి-జన్మించిన క్రైస్తవునిగా చేసెను. పరిశుద్ధాత్మతో నింపెను. నీలో నుండి దేవుని జీవము ప్రవహించుచున్నది. కొలిమిలో నుండి నిప్పు రవ్వలు ఎగిరినట్లుగా నీవు నడచుచుండగా సద్గుణము, ప్రేమ, సాత్వికము, పరిశుద్ధాత్మ బయటకు వచ్చుచున్నది. పరిశుద్ధాత్మ కదలుచున్నది, మాట్లాడుచున్నది. అక్కడే నీవు ఉన్నావు.

దేనివలన? వర్తమానమును వినుట వలన, అగ్నిస్తంభమును చూచుట ద్వారా, ధన్యకరమగు నిశ్చయత: నేను మరణములో నుండి జీవములోనికి దాటియున్నాను. అందువలన ఏ శిక్షా విధియు లేదు.

140"మన హృదయములు మన మిద నేరారోపణ చేయనియెడల, అప్పుడు మన ప్రార్థన వినబడును."

మనకు తెలుసు — మన హృదయములో పాపముండినయెడల, అది మనలను ఖండించును; అసలు మనము ప్రారంభించనే లేనట్లుగా యుందుము. మీరు పాపము నుండి విడుదల పొందవలెను. నీవు పాపములో నుండి విడుదల పొందుటకు ఒకే ఒక మార్గమున్నది. అది ఆయనలోనికి వచ్చుటయే. క్రీస్తు మాత్రమే పాపమును కప్పును, అదొక్కటే మార్గము.

నిబంధన రక్తమును గుర్తుంచుకొనండి, గురుతు లేకుండా నిబంధన రక్తమును గుర్తించుట జరుగదు. నీకది దుర్లభము, నీవది పొందలేవు… "నేను ఆయా క్రియలలో నుండి శుద్ధి పొందాను," అని నీవు చెప్పవచ్చు.

అది గురుతు కాదు. అది — ఆత్మీయే గురుతు. నీ మీద ఉన్న క్రీస్తు ఆత్మ; దానిని నమ్ముము.

JOHN 15:7

 

141ఇప్పుడు, చూడండి, వాగ్దానపు నిశ్చయతను వాక్యము మనకు ఇచ్చుచున్నది. ఇక్కడ ఎన్నో అంశములు నేను వ్రాసియుంచాను. దినమంతా బోధించినా తరగదు. దాని వైపు చూడవలెను, చూచారా. వాగ్దానపు నిశ్చయతను వాక్యము మనకు ఇచ్చుచున్నది, ఎందుకనగా అది వాగ్దానము. వాక్యమే వాగ్దానమై యున్నది. వాక్యమే దేవుడై యున్నాడు.

వాక్యము మనది.

మనము వాక్యముగా మారుచున్నాము, మరియు వాక్యము మనగా మారుచున్నది. "మీరు నా యందును, నా మాటలు మీ యందును నిలచియుండినయెడల…" అప్పుడు ఒక పెద్ద కుటుంబమగుచున్నాము. అది మనకు నిశ్చయత నిచ్చుచున్నది, ఎందువలన? అది మనలో భాగమైయున్నది. చూడండి. అది మనలో భాగమైయున్నది. ఎట్టి అంశము. మంచిది. మనకు వాగ్దానపు నిశ్చయతను ఇచ్చచున్నది.

142కొనబడినట్లుగా గురుతు చూపించుచున్నది, అంగీకరించినట్లుగా అది సూచించుచున్నది. నీవు వెలను చెల్లించకుండా ఆ చీటిని రైలు వారు నీకు ఇయ్యరు. దానిలో నీవు ప్రయాణము చేయవలెనన్నచో వెలను చెల్లించవలెను. అది ఒక్కటే మార్గము. అది నిజము. ఏమిటి? దానిని నమ్ముము; దానిని అంగీకరించుము.

దేవుని యొక్క పూర్తి వాక్యమునకు పూర్తి విధేయతను చూపుము. నీకు గురుతుగా మారు వరకు విధేయుడవగుము. సంపూర్ణ విధేయత — కొంత వరకు కాదు లేదా నీ శాఖ ఒప్పుకొను వరకూ కాదు. అంతయూ ఒప్పుకొనవలెను. వాక్యము అను క్రీస్తుకు పూర్తిగా విధేయత చూపవలెను. నిన్ను అది క్రీస్తులోనికి నడిపించును.

143నీవు అంతా లోపలకు వచ్చి కాళ్ళు మాత్రం బయట పెట్టినచో ఎట్లుండును? అంతా లోపలకు వచ్చి చేతులు మాత్రము బయట ఉన్నచో ఎట్లుండును? మనలో చాలామంది లోన ఉన్నారు, కాని హృదయములు ఇంకా బయటే యున్నవి చూచారా. అయితే మనము అది చేయము. పూర్తి, సంపూర్ణ విధేయత నిన్ను వాక్యమును ఒక్కటిగా చేయును. దానిని నీవు పూర్తిగా నమ్ముము. నీవు పూర్తిగా లోపటకు రావలెను. నీ ద్వారా అది పని చేయుటను గమనించుము.

నీవు వేషధారణతో కొనసాగలేవు. నీవు క్రైస్తవునివి. ఎవరు ఏమన్నా లెక్క లేదు, వారెవరూ నిన్ను తాకజాలరు; నీవు క్రీస్తులో యున్నావు. నీవు ఉనవలసినంత బహు క్షేమముగా యుందువు. మరణము ద్వారమును తట్టునప్పుడు, దానికి పట్టు లేదు, ఏమాత్రము లేదు. ఎందువలన? అది ఇప్పుడే ఇక్కడ నుండి బయటకు అడుగు వేయుచున్నది.

COL 3:3

 

144వయస్సు నీకు ఏమి చేయదు. నీవు వయస్సును దాటి వచ్చి యున్నావు. నీవు నిత్యత్వములో యున్నావు, ఎందుకనగా నీవాయనలో యున్నావు. ఆయన నిత్యుడు. నీవు యువకుడవయినా, ముసలివాడవయినా, మధ్య-వయస్కుడవయినా ఏమి తేడా లేదు. అందముగా ఉన్నా, కురూపిగా యున్నా, లావుగా యున్నా, లేకపోయినా ఏమి తేడా లేదు. దాని వలన ఏమి మార్పు రాదు.

నీవు ఈ సంగతులన్నిటిలోనికి వెళ్ళవద్దు. నీవు దానిలో నుండి దాటి యున్నావు. నీవు చనిపోయి యున్నావు. నీ జీవము క్రీస్తుతో కూడా దేవునిలో దాచబడియున్నది. పరిశుద్ధాత్మ ద్వారా మీరు ముద్రించబడి యున్నారు. క్రీస్తులో నడచుచున్నారు. క్రీస్తును మాత్రమే నీవు చూడవలెను. ఆయనలో నీవు నడువుము.

ఆ చిన్న పాట మనము పాడుచుండుటలో ఆశ్చర్యము లేదు:

నా మార్గమును ప్రతి దినము ప్రేమతో నింపుము,

పరలోక పావురముతో నేను నడచుచున్నాను;

పాటతోను, చిరునవ్వుతోను నా మార్గమంతయూ నడువుము

నింపుము…

145నేను మీ సోదరుడను. ఒక మనుష్యుడు ఎట్లు జీవించవలెనని దేవుడు కోరెనో ఆ మాదిరికర జీవితమును నేను జీవించవలెను. సోదరునికి సోదరునిగాను, సోదరికి సోదరునిగాను నేనుందును. సేవకునికి సేవకునిగా యుందును. మాదిరికే మాదిరికరముగా నేనుందును. ఈ వాక్యము క్రీస్తే అని లోకమునకు చూపించెదను, ఆయనలోనికి వచ్చినప్పుడు మాత్రమే ఆ విధముగా ఉండగలను, ఎందుకనగా నా యంతట నేను ఏమి చేయలేను; మీ యంతట మీరేమి చేయలేరు. అయితే వాక్యము, మీరు ఒక్కటి కావలెను, అప్పుడు ఆలాగున జీవించగలరు.

ఆయన పూర్తి నియంత్రణ కలిగియున్నప్పుడు, మీరు యేసుక్రీస్తు యొక్క సజీవ పత్రికలుగా చదువబడుదురు — ప్రతి వాక్యము నీలో… ఒకవేళ ఆయన ఆ మార్గములో వస్తే, "నేను ఇది చేయగోరుదును," మరియు మీ అందురు, "లేదు, లేదు, నేను దానిని నమ్మను." చూచారా, మీరు ఇంకనూ వాక్యములో లేరు, చూచారా — పూర్తిగా.

146ఇప్పుడు చూడండి. దేవుని యొక్క సంపూర్ణ వాక్యమునకు సంపూర్తిగా విధేయులగుడి. అప్పుడే మీకు గురుతు దొరుకును. మనము ప్రార్థించునప్పుడు ఆ గురుతును తప్పకుండ కలిగియుండి ప్రార్థించవలెను. "నేను ప్రార్థించాను గాని ప్రభువా ఏమి బాగవలేదు," అని నీవనుచుందువు. అయితే ఆగి ముందు ఆ గురుతు యొద్దకు వెళ్ళుము, ఎందుకనగా ఆ గురుతునే ఆయన గుర్తించును. మనము ప్రార్థించునప్పుడు, ఆ గురుతును చూపించవలెను: "ప్రభువా, నీకు పూర్తిగా విధేయత చూపాను. నా పాపములన్నియూ పూర్తిగా ఒప్పుకొన్నాను. నీవు నన్ను క్షమించితివని నమ్ముచున్నాను. నేను యేసుక్రీస్తు నామములో బాప్తిస్మము పొందియున్నాను. నా మీద పరిశుద్ధాత్మ యున్నది. నీ మహిమ కొరకే ఈ విషయమును అడుగుచున్నాను. ప్రభువా, నా అవసరతను తీర్చుము. ఇప్పుడది నాది. దీని కొరకు నేను అడిగాను. దీని కొరకు నేను ప్రార్థించాను. అది తప్పక నాకు కావలెను. నీ మహిమ కొరకే అది కావలెను," అని చెప్పుము.

ఆ వెనుక ఏదో లంగరువేయబడి యున్నది.

అది నీది, చూచారా. అది అంతా ఇక ముగిసినది; దాని పని అయిపోయినది. నేను దీని కొరకు అడిగాను. నేను దాని కొరకు అడిగాను. నేను తప్పక దానిని కలిగియుండవలెను. అది నీ యొక్క మహిమార్ధమై కావలెను. అప్పుడు, దానిని ఆయన నీకనుగ్రహించును. అది నీదేనని నీకు తెలియును. ఆ విధముగానే మన పిల్లలు, ఇంకా ఇతరులకు ఆ రక్తమును అన్వయించవలెను. దానిని నమ్ముము. ఆంతే.

ACTS 2:38

 

147మంచిది, ఆయన ఏమి చేయును? నీవు ప్రార్ధించునప్పుడు ఆ గురుతును చూపించుము. నీవు దేవుని యొక్క వాక్యమునకు పూర్తిగా విధేయత చూపించినట్లు దానివలన తెలియును. నీకు ఆ గురుతు కావలెను. నీవు ప్రతి మాటకు లోబడినట్లు అది చూపించును. అప్పుడు నీవును, వాక్యము ఒకటిగా మారెదరు. నీవేమై యున్నావో దానిని మాత్రము నీవు ఆడుగుచున్నావన్న మాట.

అప్పుడు, మీకు తెలియును, ఒకవేళ నేను దీనికి చెప్పినట్లయితే, "నా చేయి, ఆ జేబు రుమాలును అందుకో," అని చెప్పగా, అది లోబడును. చేయి దానికి విధేయత తెలిపినది. ఆ చేయి నాకు లోబడినది. ఎందువలన? అది నాలో భాగము గనుకనే. నీవు, వాక్యము ఒకటయినప్పుడు ప్రతి వాగ్దానము నీదే యగును. దేవునికి మహిమ వచ్చును. అది నీకు లోబడును. అప్పుడు నీవు చేయగోరు దానిని జాగ్రత్తగా నీవు చేసెదవు.

నీవు నీ చేయిని నిప్పు మీద పెట్టి ఉండమన్నా అది ఉండదు. ఆ అగ్నిలో ఏదో యున్నది, దేనినయినా అందుకొనమనగా, అది లోబడును. అది నిజము. మీరు చేయు దానిని జాగ్రత్తగా చేయవలసి యున్నారు.

ఆ కారణము చేతనే పరిశుద్ధాత్మ అరుదుగా బయటపడుచున్నది. నా భావమును మీరు గ్రహించవలయును. నిజమగు దేవుని దాసుడు వేషమును ధరించడు. వారు ఏదో ప్రదర్శనను చూపించరు.

మనము ప్రార్థించునప్పుడు, ఆ గురుతును చూపించవలెను; మనము పూర్తిగా లోబడితియని అందువలన తెలియును.

GEN 4:9,10

 

148రక్తము మాట్లాడుతున్నదని పౌలు చెప్పెను. రక్తము దానికది మాట్లాడజాలదని మనందరికిని తెలియును. అది ఒక జడ పదార్థము. అది నిజమేనా? ఎందరికిది తెలియును? కాని రక్తము మాట్లాడునని ఎందరికి తెలియును? దానిని మీరు ఆదికాండము 4:10లో చూడగలరు. దేవుడిట్లనెను, "నీ సోదరుని సంగతి ఏమిటి? నీకు విరోధముగా అతని రక్తము భూమిలో నుండి మొర పెట్టుచున్నది." ఆమేన్. అది నిజమేనా? అతని రక్తము మాట్లాడుచున్నది. హల్లెలూయా! దేవుడతని గూర్చి అడిగెను.

"నేను నా తమ్మునికి కావలివానినా?" అని అనెను.

"అతని రక్తము మొర పెట్టుచున్నది. అతని రక్తము కేకలు వేయుచున్నది," అని ఆయన చెప్పెను.

అది ఒక గురుతు. అతడు చంపబడెను అనుటకు అది ఒక గురుతు. అతని రక్తము అతనికి విరోధముగా మాట్లాడెను.

HEB 12:24

 

149ఇప్పుడు, మీరు దానిని ఆదికాండము 4:10లో చూడగలరు. హెబ్రీ 12:24 చదువుదము. హెబ్రీ 12:24లో ఇట్లున్నది, "హేబేలు రక్తము కంటే యేసు యొక్క రక్తము మరి శ్రేష్టమైన సంగతులను గూర్చి మాట్లాడుచున్నది."

"చూచారా, హేబెలు నీతిమంతుడు. అతడు చనిపోయెను; అతడు మరణించెను, అతడు నిర్దోషి, కాని అతడు అడ్డము వచ్చినందున చంపబడెను. అతడు దేవుని యొక్క ప్రత్యక్షతను కలిగియుండెను. నీతిమంతుడగు హేబెలు యొక్క రక్తము కయీనుకు విరోధముగా మాట్లాడెను. కాని యేసుక్రీస్తు యొక్క రక్తము మాట్లాడుట మాత్రమే కాదు గాని విమోచించెను. ఆమేన్.

అది శ్రేష్ఠమగు సంగతులను అనుగ్రహించెను. అది మిమ్మును కుమారులనుగా, కుమార్తెలనుగా చేయుచున్నది. దేవుని యొక్క ఉగ్రత నుండి అది మిమ్మును దాచుచున్నది. చూచారా, హేబెలు యొక్క రక్తము కయీనును దాచలేకపోయెను, కాని యేసు రక్తము దానిని చేయగలదు. ఆమేన్.

కావున, ఆ పాత కయీను నేడు మరల బయటకు వచ్చుచున్నాడు. నీవు వాక్యమును హింసించువాడివైతే అద్భుతములు జరుగు దినములు గతించినవనియు, ఇదంతా బుద్ధిహీనమనియు చెప్పెదవు. అది మొర్ర పెట్టుచున్నది. యేసుక్రీస్తు యొక్క రక్తము మొర్ర పెట్టుచున్నది, కాని దానిని నీవు అంగీకరించినయెడల క్షమాపణను పొందెదవు.

దానిని గూర్చి మరి కొద్దిసేపు చెప్పగోరుచున్నాను. రక్తము మరి శ్రేష్టమగు సంగతులు మాట్లాడుచున్నది.

JOSH 2:12,13

 

150క్షేమము కొరకు దానిని నమ్ముము; దానిని అన్వయించి చూడుము. దాని యందు విశ్వాసముంచుము. నీవు నమ్మవలసినది ఇచ్చటున్నది. నీ స్వంత క్షేమము నీకు కావలెను. నీ క్షేమము కొరకు నీవు విశ్వసించవలెను. అప్పుడు నీ పూర్తి కుటుంబము కొరకు దానిని నీవు విశ్వసించి, గురుతును అన్వయించవలెను.

నీవు చెప్పవచ్చు, "దానిని నేను ఎట్లు చేయగలను?"

అది నీదే అని ప్రకటించు. అది నీకు పనిచేసినట్లయితే నీవు, వాక్యము ఒక్కటిగా మారుదురు. ఆమేన్. ఆమేన్! చూచారా. అది మీ ఇద్దరి కొరకు పనిచేయును. నీవు మరియు వాక్యము ఒక్కటి అగుదురు. ఆ తరువాత నీ పిల్లలకు దానిని అన్వయించుము. నీ ప్రియులకు దానిని అన్వయించుము. రాహాబు వలె చేయుడి. ఆమె ఆ గురుతును తన తండ్రికిని, తన తల్లికిని, సోదరీ మరియు సోదరులకును అన్వయించినది. వారందరును లోనికి ప్రవేశించగలిగిరి. దానిని నీవు అన్వయించుము. "ప్రభువా, నా కుమారుని నేను తీసికొని వచ్చుచున్నాను." "నా కుమార్తెను తీసికొని వచ్చుచున్నాను. సాతానా, వారిని నీవు విడచిపెట్టుము. వారిని నేను విడిపించుచున్నాను. పరిశుద్ధాత్మ అను గురుతును నేను వారికి అన్వయించుచున్నాను." పరిశుద్ధాత్మ… "ఓ, నాలో నివాసము చేయుచున్న పరిశుద్ధాత్మా, నా కుమార్తెను పట్టుకొనుము. నన్ను నీవు అభిషేకించి యున్నావు గనుక వారిని విడిపించుచున్నాను" అని చెప్పుము. ఆయన దానిని చేయును. ఆమేన్.

ACTS 16:31

 

151వారు ఐగుప్తులో అదే చేసిరి. వారు యెరికోలో అదే చేసిరి. మీరు అపోస్తలుల కార్యములు 16:31 చదవండి. పౌలు శతాధిపతితో ఇట్లు చెప్పెను, "నమ్మిక మాత్రముంచుము. నేనే ఈ ఘడియ యొక్క వర్తమానికుడను. ప్రభువైన యేసుక్రీస్తు నందు విశ్వాసముంచుము. అప్పుడు నీవును, నీ ఇంటి వారును రక్షింపబడుదురు."

అది నిజమేనా? నీ ఇంటిని గూర్చి విశ్వసించుము. వారందరిని దాని క్రిందికి తీకొని రమ్ము.

ఇప్పుడు, పరమందున్న దేవుడు ఒక అద్భుతము చేయుటను మీరు చూచారు, తీర్పుకు ముందే అది జరుగును. దానిని మీరు నమ్మండి. "అవును, నేనేమి చేయగలను?"

"లేచి బాప్తిస్మము పొందమని," అతడు చెప్పెను.

పౌలు అతనిని తీసికొని వెళ్ళి మరియు బాప్తిస్మమిచ్చెను. "ప్రభువైన యేసుక్రీస్తు నందు విశ్వాసముంచుము, అప్పుడు నీవును, నీ ఇంటివారును రక్షింపబడుదురు," అని చెప్పెను.

దేనిని నమ్మవలెను? ప్రభువైన యేసుక్రీస్తును నమ్ముము. నీ ఇంటికి ఆ గురుతును అన్వయించుకొనుము. దానిని నీవు నీ ఇంటికి అన్వయించునప్పుడు నీవేమి చేయుదువు? చెత్తనంతటినీ త్రోసివేయుము. పొట్టి బట్టలు తీసివేయుము. పేకాటలు, సిగరెట్లు, టెలివిజను కార్యక్రమములు పోవలెను. వాటిని ఇంటి బయటకు త్రోసివేయుము. గురుతును నీవు అన్వయించుకొనుము. దాని కొరకు నీవు సంశయించవద్దు. దానినంతటినీ తీసివేయుము. నాట్యములు, విందులు, రాకెన్ రోలు ఆ మురికి పత్రికలు, లోకపు చెత్త బయటకు త్రోసివేయబడవలెను. ఈ స్థలమును పూర్తిగా శుద్ధి చేయవలయును.

EXOD 19:15

 

152యాకోబు తన భార్య పిల్లలతో ఆ విధముగానే చెప్పెను, "మీ వస్త్రములను ఉదుకుకొనుడి. ఆ దేవతలను పారవేయుడి." ఆమేన్.

బయటకు దాటు ముందుగా యెహోషువా ఏమి చెప్పెనో ఎరుగుదురా? "మీ వస్త్రములను ఉదుకుకొనుడి. మీ భార్యలకు వేరుగా యుండుడి, మరియు సిద్ధపడుడి. ఇంక మూడు దినములలో యోర్దానును దాటుదుము." ఆమేన్.

అతడు సిద్ధపడుతున్నాడు. గురుతును అన్వయించుచున్నాడు. ఆమేన్.

సిద్ధపడుడి. దానిని అన్వయించుడి. శుభ్రము చేయుడి. మీ పిల్లలను, మీ కుటుంబములను, మీ ప్రియులను దానిని నీలో చూడనిమ్ము. అది నిజము. అది క్రియ చేయును. అవునండి.

ఇప్పుడు, ప్రార్థనలో ఆలోచనతో, విశ్వాసముతో ఆ గురుతును అన్వయించుము. ప్రేమతో దానిని అన్వయించుకొనుడి. అది జరుగబోవుచున్నదని మీరు తెలిసికొనుడి. అంతే. దానిని నమ్మకముతో అన్వయించుడి, అది సహాయము చేయునని నమ్ముడి.

నీవు నీ బిడ్డతో ముచ్చటించినప్పుడు, నీ భర్తతో ముచ్చటించినప్పుడు, నీ భార్యతో ముచ్చటించినప్పుడు, నీ ప్రియులతో మాట్లాడినప్పుడు, అది సహాయము చేయునని నమ్మవలెను. అక్కడ నిలబడి ఇట్లు చెప్పుము, "ప్రభువా, వారిని నీ కొరకు విడిపించుచున్నాను; వారు నా వారు. ప్రభువా, వారిని నీ కొరకు తీసుకొని వచ్చుచున్నాను."

153దానిని అన్వంచుము, నీ చుట్టూ ఆట్టి వాతావరణమును సృష్టించుకొనుము. వారు అందులోనికి వచ్చెదరు. ఓ, నీవు గురుతును కలిగియున్నట్లయితే, శక్తితో నీ చుట్టూ ఆత్మను సృష్టించుము, అప్పుడు నీవు నడచునప్పుడు, నీవు క్రైస్తవుడవు అని ప్రజలు తెలుసుకొందురు. నీవు వారికి చెప్పుట వలన వారిని ప్రేమించిన వానివగుదువు. వారు నీ మాట నమ్ముదురు. నీవు చెప్పిన దానిని వారు హత్తుకొందురు. అంతే. ఆ గురుతును అన్వయించుము; దానితో కలిసి నడువుము. నీ ఇంటి వారిని విడిపించుము. ఇప్పుడే నీవు దానిని చేయవలెను, ఇది సాయంకాల సమయము.

ఇప్పుడు, మీరు చాలా కాలము నుండి దీనిని వినుచున్నారు; ఇది సాయంకాల సమయము. ఇది అన్వయించుకోవలసిన సమయము. ఈ దినములలోనే ఒక దినమున ఉగ్రత దిగి వచ్చును. అప్పుడిక మీకు సమయముండదు, చూచారా. నమ్మకముతో ఆ గురుతును అన్వయించుకొనుము.

HEB 9:14

 

154దానిని మీరు చదువగోరినయెడల, ఎఫెసీ 2:12 లో చదువగలరు. మీరది వ్రాసికొనండి, ఎఫెసీ. 2:12. ఆక్కడ ఈలాగు మిరు చదువగలరు, "మనము నిర్జీవ క్రియలను విడిచి పెట్టి సజీవ క్రియలతో సజీవుడగు దేవుని సేవించవలెను." ఆమేన్.

ఓ, మై! సజీవ క్రియలతో, సజీవ సూచనలతో. సజీవ సూచనలను మీరు నమ్ముచున్నారా? అలాగే, హెబ్రీ 9:11-14, వ్రాసికొనండి. సజీవ సూచనలు. సజీవ క్రియలు. దానిని అన్వయించండి. చచ్చిన ఆచారములు కాదు.

నీ కుమారుడుని తీసికొని వెళ్ళి సంఘములో చేర్చుట కాదు. ఒక చక్కని క్రైస్తవ బాలుడున్నాడు, మంచి స్నేహితుడు, చాలా చక్కని వ్యక్తి. అతడు వచ్చి ఇక్కడ బాప్తిస్మము పొందెను. అతని తల్లి వచ్చి అతనితో నీవింకా పెద్ద సంఘమునకు వెళ్ళితే బాగుండెడిదని చెప్పినది. పెద్ద సంఘములో బాప్తిస్మము పొందితే బాగుండునన్నది. అతనికయితే ఆ చచ్చిన ఆచారములు గిట్టలేదు.

155మృత క్రియలను, చచ్చిన దేవతలను మనము ఆరాధించుట లేదు. జీవముగల దేవునిని మనము ఆరాధించుచున్నాము. ఆయన తన రక్తమును చిందించెను. మనకు రక్తము అన్వయించబడినది. మనము కూడా జీవించుదుము. ఆమేన్. అవునండి.

ఏవో చచ్చిన ఆచారములను పూజించవద్దు. వారు గురుతును కూడా తిరస్కరించెదరు. అద్భుతములు జరుగు దినములు గతించినవని వారందురు. పరిశుద్ధాత్మ బాప్తిస్మము లేదందురు. అటువంటి దానిలో చేరడము ఎందుకు? దానిని చేయవద్దు.

గురుతును అన్వయించుడి, సజీవుడగు దేవునిని సేవించుడి, సజీవ క్రియలు, సజీవ సూచనలు కనబడును. రోగులు స్వస్థపరచబడుదురు, మృతులు లేచెదరు, ప్రవచనములు చెప్పెదరు, భాషలు మాట్లాడుదురు. వాటికి అర్థము చెప్పెదరు. ఎప్పుడూ అది తప్పిపోదు. ఫలానీ, ఫలాని సంగతులు జరుగునని చెప్పెదరు. పైన ఆకాశమందు సూచనలు కనబడును. భూమి మీద సూచక క్రియలు, అద్భుతములు కనబడును. ఆమేన్. ఈ దినములలో ఏమి జరుగునని బైబిలు చెప్పెనో అవే ఖచ్చితంగా జరుగును. సజీవ దేవుని సేవించుము. ఆ గురుతును అన్వయించుము.

2COR 6:17

 

156ఆ సంఘముల లోనికి వెళ్ళి చేరవద్దు. అవి మృత క్రియలు. వారసలు సూచక క్రియలనే నమ్మరు, కాని మనము నమ్ముదుము. ఆమేన్. అది తెలిసికొనుడి.

"సూచక క్రియ అనేదే లేదని వారందురు." వారు మాట్లాడునది బుద్ధిహీనత. అది వెర్రితనము. ఎందుకు, అలాంటి విషయము ఏమి లేదు. ఎందుకు, మీరు స్త్రీలు, అందరు… మీరు ఏమి ధరిస్తున్నారు…?" బైబిలు ఆలాగున చెప్పెను. "మీ జుట్టతో చేయునది ఏమున్నది…?" బైబిలు ఆలాగున చెప్పెను. అది కేవలము వ్యత్యాసము. తాక రాదు; ముట్ట రాదు; రుచి చూడ రాదు; ఆయన దేవుడు. ఇప్పుడు, ఆయన చెప్పిన దానిలో అర్థముండును.

HEB 13:8

 

157అది వెర్రితనమని వారనుకొనుచున్నారు, కాని విశ్వసించుచున్న మనకు అది సత్యమని తెలియును. అది ఆయన యొక్క సజీవ సన్నిధియని మనకు తెలియును. ఆయన భూమి మీద ఉండినప్పుడు ఏ కార్యములను చేసెనో, ఆ కార్యములనే చేయుచున్నాడు. ఆమేన్.

ఓ, "వారు అగ్నిస్తంభమును చూచినట్లుగా ఊహించుకొనుచున్నారని," చెప్పుచున్నారు.

ఓ, కాదు. ఓ, కాదు. మనము దేనిని ఉహించుట లేదు. పౌలు కూడా ఉహించుకొనెను అని వారు అనుకొనిరి. ఇశ్రాయేలీయులు ఊహాగానములో యుండిరని ఐగుప్తీయులు అనుకొనిరి, అయితే అది వారిని వాగ్దాన దేశములోనికి నడిపించెను. అవునండి. మనము ఉహించుకోము…

మీరు వ్రాసుకుంటున్నయెడల, హెబ్రీ 13:8. "యేసుక్రీస్తు నిన్న, నేడు, నిరంతరము ఏకరీతిగా యున్నాడు." ఆయన మారనివాడు. అది ఒక ఉహాగానము అని వారు చెప్పుదురు.

158ఇక్కడ నేను కొన్ని లేఖనములు వ్రాసి యుంచాను. ఆ లేఖనములు ఎక్కడున్నవో నాకు తెలియును. అందుకే వాటిని వ్రాసి యుంచాను.

అది ఆయన యొక్క సజీవ సన్నిధి అని మనకు తెలియును. ఈ ఆత్మలో ఆయన దానినే చేయుచున్నాడు. అది ఏదయినా ఆచారములోనికి, శాఖ లోనికి వెళ్ళిపోయియున్న యెడల అది క్రీస్తు నుండి రాలేదని వెంటనే మనకు తెలియును. అది నిజమేనా? నేను మిమ్మును ఏదో ఆచారములోనికి నడిపించుట లేదు. నేను ఏ శాఖ ద్వారా పంపబడలేదు. నేను మీ యొద్దకు ఆచారములను తీసికొని వచ్చుట లేదు. నేను మీకు శాఖలను బోధించుట లేదు. నేను మీకు దేవుని యొక్క వాక్యమును బోధించుచున్నాను. అది యేసుక్రీస్తు యొక్క పునరుత్థాన శక్తియై యున్నది. అది బయలుపరచబడినది — నాకు మాత్రమే కాదు గాని ఇచ్చయించు వారందరికిని బయలుపరచబడినది, చూచారా.

159మీరు నా సోదరులు. నేను గొప్ప వ్యక్తిని కాదు, మీరు తక్కువ వారు కారు. దేవునిలో మనమందరము అల్పులమై యున్నాము. మనమాయన చిన్న పిల్లలము. మనకేమి తెలియదు. నిజంగా మనము తెలిసికోవలసి యున్నాము. ఆయన తన చిత్తము బట్టి మనకు తెలియచేయుచున్నాడు. ఆయనకు మనము వందనములు చెల్లించవలెను. ఆయన ఆశీర్వచనములను మనము ఎరుగుదుము.

మరియు నాకు నేను ఈ సంగతులను పంచుకొనను; మీతో పంచుకోవాలని నేను కోరుచున్నాను. అందులో మీరు ప్రవేశించవలెనని కోరుచున్నాను, మరియు ఈ గురుతును మీరు పొందవలెనని కోరుచున్నాను. మీరింకా దానిని పొందలేదా? మీలో చాలామంది ఇంతకు ముందే పొందిరని నేనెరుగుదును — కాని ఇంకా మిలో పొందనివారున్నచో పొందండి. (చూడండి, నేను టేపులో కూడా మాట్లాడుతున్నానని మీరు గ్రహించవలెను.) ఈ ఆలయము వారికి నేను చెప్పుట లేదు. మనమందరమూ ఇచ్చటికి చేరియున్నాము, కాని వేలకొలది మంది ఈ టేపును విందురు. ఇది ఒక పరిచర్య. టేపుతో ఎవరయినా గాని యెరికోలో ప్రవేశింపవచ్చును. కావున ఆ ముందుగా నిర్ణయించబడిన సంతానమును పట్టుకొనగోరుచున్నాము, ఎందుకనగా ఉగ్రత వచ్చుచున్నది.

ZECH 14:7•

LUKE 17:28•

JOHN 14:19

 

160ఇది సజీవ దేవుని యొక్క సన్నిధియని మనకు తెలియును. ఆయనను తన యొక్క వాగ్దాన వచనము ప్రకారము దేవుడు లేపెనని రుజువు చేయుచున్నాడు. "ఇక కొంతకాలమైన తరువాత లోకము నన్ను చూడదు గాని మీరు నన్ను చూచెదరు. యెరికో, ఐగుప్తులు నన్ను ఇక చూడవు. అయినను మీరు నన్ను చూచెదరు, నేను [నేను, వ్యక్తిగత సర్వనామము] నేను మీతో యుందును. నేనే గురుతు. నా పునరుత్థానమే ఒక గురుతు. నేను చేయు క్రియలు మిమ్మును గుర్తించును — నేను మీలో యున్నట్లు గుర్తించును."

సాయంకాల వర్తమానము బయలు వెడలునప్పుడు — "లోతు దినములలో యుండినట్లుగానే, మనుష్యకుమారుడు ప్రత్యక్షమగు దినములలోను జరుగును." సాయంకాలమందు వెలుగు కలుగును. సాయంకాల సమయము లోనే దీపములు వెలుగును. దేవునికి మహిమ! నేను సమూహము నుండి పరుగిడి పోయి గోడపై నుండి దుముకునంత ఆనందము కలుగుచున్నది.

"సాయంకాలమందు వెలుగు కలుగును." అది నిజము. ఆ విధముగానే ప్రవక్త చెప్పెను. "నేను మీకు తోడై యుందును. లూధరు యుగములో నేనుందును; వెస్లీ యుగములో నేనుందును; పెంతెకోస్తు యుగములో నేనుందును. అయితే సాయంకాల మందు వెలుగుండును." శాఖలకు సంబంధించినవి ఆరిపోవును, అప్పుడు గురుతు అన్వయింపబడును.

వారందరూ యదార్థ హృదయులుగానే యుండిరి గాని నీవు లేకుండా వారు పరిపూర్ణులు కారు, కాని నీలో….

EXOD 12:13

 

161కాళ్ళు ముందుకు కదలవలెనన్నచో శిరస్సు ఆజ్ఞాపించవలెను. గుండెను తీసికొని పోవలెనన్నచో శిరస్సు పోవుట అవసరము. నోటిని తీసికొని పోవలెనన్నచో శిరసే ముందుగా పయనించవలెను, చూచారా. శిరస్సు ముందుగా కదలవలసి యున్నది.

ద్వారబంధపు కమ్ములకు గురుతను అన్వయించిన కాలములో మనం ఉన్నాము (చూచారా), "నేను ఆ రక్తమును చూచి మిమ్మును నశింపచేయక దాటిపోయెదను."

ఇప్పుడు నేను వీలయినంత త్వరగా ముగించవలెను. అయిదు లేదా మరో పది నిమిషములు తీసికొందును. తదుపరి ముగించెదను.

JOHN 14:12

 

162దేవుడాయనను మృతులలో నుండి లేపెనని నిరూపణ అయినది. దానిని మీరు నమ్ముచున్నారా? ఆయన నేడు మన మధ్య జీవించుచున్నాడు. మరియు "నేను" అనగా క్రీస్తు మరియు ఆయన యుగ సమాప్తి పర్యంతము మనతో యున్నాడు. యుగ సమాప్తి పర్యంతము ఆయన మనతో యుండును. అది ఆయన వాగ్దాన వాక్యము. దానిని ఆయన వాగ్దానము చేసెను. "నేను చేయు క్రియలు మీరును చేయుదురని ఆయన చెప్పెను."

అది మనకు బుద్ధిహీనత కాదు. అదే గురుతు. అది గురుతు అయి యున్నది.

EPH 4:30

 

163ఈ పవిత్రమగు రక్త బలిని మనము అంగీకరించియున్నాము. ఆయన త్యాగము చేసి చిందించిన రక్తమును స్వీకరించియున్నాము. ఆయనే మనకు జీవమును ఇచ్చెను. గురుతును ఇచ్చెను. వాగ్దానపు ముద్రను ఇచ్చెను. ఎఫెసీ 4:30లో ఇట్లున్నది, "మీరు రక్తమును దుఃఖపరచకుడి," కాదు. "మీరు పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి, మీరు నిబంధనలో యున్నారు — మీకు నిబంధన యున్నది; ఒక గురుతు; పరిశుద్ధాత్మయే ఒక ముద్ర…"

ముద్రించబడిన దానిని నీవు చింపరాదు. అది దేవుని ముద్ర గనుక దానిని నీవు చింపలేవు. "పరిశుద్ధాత్మను మీరు దుఃఖపరచకుడి, మీరు విమోచనా దినము వరకు దానితో ముద్రింపబడియున్నారు, అప్పుడు శరీరము లేపబడును."

1COR 12:13

 

164అది ఒక విత్తనము, ఒక సూచన, ఆ విత్తనము నిత్యజీవముతో మొలకెత్తినది, "జో, అనగా ఆయన స్వంత జీవము. అంత్యదినమున దానిని లేపుదునని ఆయన చెప్పెను.

క్రీస్తు యొక్క జీవము నీలో యున్నదను నమ్మికతో నీవు నడచెదవు. నీవాయనలో యున్నావు. "ఒకే ఆత్మ ద్వారా, మనమందరము ఒకే శరీరములోనికి బాప్తిస్మము పొందియున్నాము. పరిశుద్ధాత్మ ద్వారా ముద్రింపబడి యున్నాము." ఈ విధముగా విశ్వాసుల మధ్య ఆయన ఉన్నాడు. యేసు మనలను పైకి లేపు దినము వరకు ఆలాగే యుండును.

గురుతును అన్వయించుకోనండి. దాని వలననే మనకు మేలు కలుగును. ఈ బలివలన మనకు జీవము కలుగును. అది సత్యము. అది మనకు గురుతును ఇచ్చుచున్నది. మనము గురుతును అన్వయించుచున్నాము. అదియే ముద్ర.

ఇందులో మనము పాలిభాగస్థులము. ఎంత గొప్ప సంగతి. పాలిభాగస్థులము. ఈ ఒకే ఆత్మ ద్వారా ఆ మర్మమైయున్న శరీరములోనికి బాప్తిస్మము పొందుచున్నాము. మర్మమైయున్న శరీరమని నేను చెప్పిన మాట సరియేనా? మర్మమగు శరీరము. యేసుక్రీస్తు యొక్క మర్మమగు శరీరము.

తప్పు చెప్పినప్పుడు పరిశుద్ధాత్మ సరిచేయును. నేను మొద్దును గనుక తప్పు చెప్పెదను. యేసుక్రీస్తు యొక్క మర్మమగు శరీరము. యేసుక్రీస్తు యొక్క అదృశ్య శరీరము. మనకు విద్య అవసరము లేదు, మనకు పరిశుద్ధాత్మ అవసరము. ఆయనే అవసరమై యున్నాడు. విద్యగల వానిని, ఎక్కడో అది ఆటంకపరచి యుండును. కాని సరియైన దానిని గ్రహించగలడనుకొనుచున్నాను. మర్మమగు శరీరము. అది ప్రత్యేకమైన దానికొరకు ఉండును, లేనియెడల ఆయన చెప్పియుండేవాడు కాదు. ఇప్పుడాయన మనతో యున్నాడు. ఆయన ఈ వేదిక మీదనే యున్నాడు. ఆయన ఇప్పుడిచ్చట యున్నాడు. అది ఆయనే.

JOHN 6:39,40

 

165ఆయనలో మరణము లేదు. ఆయనలో దుఃఖము లేదు. ఆయనలో ఆయాసము లేదు. ఆయనలో పాపము లేదు. ఆయనలో వ్యాధి లేదు. ఆయనలో మరణము లేదు. మనము ఆయనలో యున్నాము.

సాతాను వచ్చి నీకు వ్యాధిని ఇచ్చినయెడల నీవు వెంటనే ఆ గురుతును తీసుకొని మరియు దానిని అన్వయించుము. నీ గురుతును తీసికొని అన్వయించుము. నీవు యేసుక్రీస్తు ద్వారా కొనబడియున్నావు. నీ వెల చెల్లించబడినదనుటకు సూచనగా ఆ గురుతున్నది.

"నీవు చనిపోయినప్పుడు నశించెదవు" అని వాడనును.

"అది తప్పు. నేను వెల పెట్టి కొనబడియున్నాను. నాకు గురుతున్నది. నేను వెలతో కొనబడియున్నాను" అని చెప్పుము.

"ఆ గురుతు అర్థమేమిటి?" ఆయనకు అదేమిటో తెలియును. ఆయనతో ఆటలాడవద్దు. అదేమిటో ఆయనకు తెలియును.

ఇప్పుడు, నీతో వాదించుచున్న కొందరు బోధకుల గూర్చి నీవు చెప్ప వచ్చును. సాతాను కాదు, వానికి బాగుగా తెలియును. ఓ, అవును. దానికి విరోధముగా వాడు రెండు మూడుసార్లు వచ్చును, మీకు తెలుసా, మరియు తప్పు చేయుటకు నిన్ను శోధించును. నీవు దేనిని గూర్చి మాట్లాడుతున్నావో సాతానుకు తెలియును.

కేవలము ఆ గురుతు చూపించుము, వాడు పారిపోవును.

JOSH 2:18•

JAS 5:16

 

166అది ఏమిటి? అది ముద్రించబడిన వస్తువు. దానినతడు విప్పలేదు. సరికాని దానిని వాడు ఇవ్వజాలడు. "నా పై నుండి నీ చేతులు తీయుము, నేను ముద్రించబడియున్నాను," అని చెప్పుము.

ఓ, మై! ఒక ముద్రింపబడిన ఉత్పత్తి. అవునండి. నీవు కొనబడితివి. ఆయన వాగ్దానమందు నీకు అచంచల విశ్వాసమున్నది గనుక ఆ గురుతును పట్టుకొనుము. వాడు పారిపోవుట గమనించుము. "నీతిమంతుని యొక్క విశ్వాస సహితమగు ప్రార్థన బహు బలముగలదై యుండును."

ఆ గురుతును తీసికొనండి. అందుకొరకే అది యున్నది. సాతాను నిన్ను శోధించుటకు వచ్చును. వాడు శోధించుటకు ఐగుప్తుకు వెళ్ళెను. ఆ దినమున రాహాబను వేశ్య వారిని దాచినది. ఆమె ఆ ఎర్రని దారమును కట్టుకొనినది. కొందరు సైనికులు ఆ దారమును చూచి నవ్వి యుందురు. ఈమెకు మతిపోయి యున్నది అనుకొనిరి. అటువంటిది ఎన్నడూ చూడలేదనుకొని నవ్విరి. డాక్టర్ జోన్స్ దానిని చూచి నవ్వెను.

అయితే అక్కడ, — ఎందుకనగా దేవుని యొద్ద నుండి వచ్చిన ఒక వర్తమానికుడు వారికి ఈ వర్తమానమును తీసుకొని వచ్చెను — మరియు వారికి చెప్పెను.

HEB 13:8

 

167ఐగుప్తీయులు ఏమని యుందురో మీరు ఉహించవచ్చును, "ఆ వెర్రివారైన ఆ పరిశుద్ధ గుండ్రాళ్ళను చూడుము, రక్తమును పూయుచున్నారు… ఇప్పుడు దానిని వారు శుబ్రము చేయాలంటే గందరగోళము అవ్వును కదా. ఓ, మై, వారి యొక్క చక్కని పెద్ద ఇళ్ళు, పూర్తిగా రక్తముతో నిండియున్నది! ఓ, ఎటువంటి దుర్వాసన. అది కొద్ది దినములలో భయంకరముగా మారును అని నేను సవాలు చేయుచున్నాను. అది ఏ మాత్రము పనికి రాదు. ఎందుకో మీకు తెలుసా? 'పరిశుద్ధ ఫాదర్,' ఫలానా ఫలానా, అని చెప్పిరి." ఎందుకనగా వారి మత గురువులు ఆలాగున చెప్పిరి. అయితే అక్కడ, అక్కడ — కాని అందులో చాలా అర్థమున్నది. దానిని నమ్ము మనకు అది అర్థవంతముగా యుండును.

"ఆయన వాక్యముందు మీకు అచంచలమైన విశ్వాసముండవలెను. ఇక ఎంత మాత్రము, మీరిప్పుడు హవ్వ వలె యుండరాదు. ఈ సందేహించు వారిలో ఒకని వలెనైనను యుండ రాదు — సాతానుతో రాజీపడరాదు; నీవు దేవుని యొక్క ప్రతి మాటను పట్టుకొనుము.

చూచావా, "ప్రభువు ఆలాగు చెప్పెను గదా?" అని హవ్వ చెప్పెను.

సాతాను ఇట్లన్నది, "కాని, నీ వంటి మంచి వ్యక్తికి ప్రభువు ఎన్నడూ ఆ విధంగా చేయడు. ఓ, నీవెంతో అందముగా యున్నావు."

ఓ, అవును, ఆయన నిన్ను ఏమి అనడు. కాని ఆయన ఆలాగున చెప్పలేదు.

"నా తండ్రి బోధకుడు లేదా సంఘ కాపరి," అని నీవు చెప్పవచ్చును.

అందువలన ఏమి లాభము లేదు. గురుతు లేనియెడల నీవు నశించెదవు — నీ మీదికి ఉగ్రత వచ్చును, అంతే. ఆయన ఆలాగు చేయుదునని చెప్పెను, మరియు ఆయన చేయును. అది దానిని స్థిరపరచును. ఆయన దానిని చేయుదును అని చెప్పెను.

"ఓ, అద్భుతములు జరుగు దినములు గతించినవి…"

అవును, అయితే ఆయన గతించినవి అని చెప్పలేదు. "నేను నిన్న, నేడు, నిరంతరము ఏకరీతిగా యున్నానని," ఆయన చెప్పెను. దానినే ఆయన నిరూపించుచున్నాడు.

ఇప్పుడు, మనకైతే, దానిని మనం ఎరుగుదుము. వారది నమ్మరు. కాని దానిని మనం నమ్ముచున్నాము. అది సత్యమని మనమెరుగుదుము.

EXOD 15:26

 

168అందులో యుండుట వలన మనము వాక్యములో భాగముగా యుందుము. ఆ గురుతును, ఆత్మను, వాగ్ధానమును తీసికొనుము. "ఆయనే స్వస్థపరచు యెహోవా." ఇప్పుడు, ఈ రాత్రి స్వస్థతా కూటము కొరకు సిద్ధపడుము. గురుతు తీసికొనుము. వాక్యమునకు దానిని తగిలించుము. వాక్యములో అచంచలమైన విశ్వాసము కలిగియుండుము — ఆయన బయటకు నడిపించును. ఆయనలో అపజయమునకు దారిలేదు.

ఇప్పుడు నేను గత కొద్ది వారములలో జరిగిన కొన్ని సంగతులను గూర్చి సాక్ష్యమిచ్చినచో బాగుండును. ఓ, దేనిని గూర్చి నేను సాక్ష్యమియ్యగలను. యేసు చేసిన కార్యములన్నియూ గ్రంధస్థము చేయవలెనన్నచో, భూలోకములోని గ్రంధములన్నియూ చాలవని లూకా చెప్పెను. మీకది తెలియును.

నా స్వంత పరిచర్యలోనే ఆయన చేసిన ఎన్నో కార్యములను చూచాను. ఈ వేదిక మీద వాటిని గూర్చి వ్రాసిన గ్రంధములు పేర్చుటకు చాలదు. నా పరిచర్యలో స్వయంగా నేను చూచిన కార్యములు వ్రాయుటకు ఇన్ని పుస్తకములు కావలెను.నా పరిచర్యలో ఆయన ఎంతో జయము పొందెను. ఆయన తన స్వంత పరిచర్యలో చేసినవాటికంటే ఇవి గొప్పవిగా యున్నవి. ఇప్పుడు, గుర్తుంచుకొనండి, ఆయనకు ఇప్పుడు ఎంతో జయము కలిగినది, నాకు కాదు — ఆయనకే. మహిమ, హల్లెలూయా!

169ఆయనకు నజరేతులో కంటే జెఫర్సన్ విల్ లోనే ఎక్కువ విజయము వచ్చినది. ఆయన ఆ దుష్ట పట్టణములో చేసినట్లుగానే ఈ దుష్ట పట్టణములోను చేసెను. ఆమేన్. మహిమ! అక్కడ ఆయన ఏ అద్భుతములను ఇక చేయలేదు, కాని ఇక్కడ చేసెను. చివరగా ఇక్కడికి ఆయన వచ్చెను. ఆయన ఇక్కడ పని చేసెను.

ఆయన మరెక్కడోకో వెళ్ళి ఈ కార్యములను జరిగించవచ్చు, కాని ఇక్కడే ఆయన సమస్తమును జరిగించెను. కాబట్టి ఆయనకు కపెర్నహూము లేదా నజరేతులో కంటే ఇక్కడే ఎక్కువ విజయము వచ్చెను. ఆయన భూమి మీద జరిగించిన సమస్త పరిచర్యలో కంటే ఇక్కడే, ఈ ఆలయంలోనే ఎక్కువగా అద్భుతములను జరిగించెను. అది నిజము. ఆయన జరిగించెను.

అయితే ఇప్పుడు మిగిలిన ప్రపంచము మాట ఏమిటి? ఆయన చేసిన కార్యములు అవి. ఇప్పుడు ఆయన చేసిన వాటిని గుర్తుంచుకొనండి. నేను చేసితినని ఎన్నడూ చెప్పుకొనుట లేదు, చూడండి, ఎందుకనగా వాటిని నేను చేయలేదు. నా వలన జరుగలేదు. నేను ఆయనను కేవలము ప్రేమించాను మరియు నన్ను నేను ఆయనకు సమర్పించుకొన్నాను. ఆయన చెప్పినదే చెప్పాను. పరిశుద్ధాత్మ ఇతరుల యొద్దకు వెళ్ళినది. వారు ఆయన చెప్పిన దానిని నమ్మిరి. ఆయనే క్రియలు చేసెను.

మనందరము ఆయనను నమ్మితే ఎంత బాగుండును! ఇప్పుడే మనందరము ఆయన యందు విశ్వాసముంచినయెడల, ఎన్నో కార్యములు చేయగలడు. ఈ పట్టణములో ఒక్క బలహీనుడును యుండుడు. అది నిజము. అందరూ ఆయనను విశ్వసించగలిగితే ఏమయినా జరుగును, చూచారా.

ఆయన యొక్క వాగ్దానమందు, వాక్యమందు అచంచలమైన విశ్వాసము కలిగియుండండి, మరియు సాతాను వెళ్ళిపోవును.

ఇప్పుడు, నేను ముగించబోవుచున్నాను.

GEN 9:13

 

170దేవుడు మరియొకసారి ప్రపంచమునకు మరొక గురుతును ఇచ్చెను. అది ఒక వర్ష ధనుస్సు. అది గుర్తున్నదా? ఆయన ఎల్లప్పుడూ తన గురుతు పట్ల నమ్మకస్థునిగానే యుండును, ఎందుకనగా దానిని ఆయన ఒక గురుతుగా ఇచ్చెను. ఇన్ని వేల సంవత్సరములలో ఏ ఒక్కసారియూ ఆయన తన గురుతు విషయములో తప్పిపోలేదు. అది నిజమేనా? ఎందువలన? దానిని ఆయన గౌరవించును. దానిని ఆయన ఇచ్చును. ప్రపంచమునకు ఆయన ఒక గురుతును ఇచ్చెను, ఇక ఆయన ప్రపంచమును ఎంత మాత్రమూ జల ప్రళయముతో నాశనము చేయడు. ఆ దినము నుండియు ఆయన ఎల్లప్పుడూ దానిని చూపించుచున్నాడు.

గాలిలో కొన్ని అంశాలున్నవి, అందువలన ఆ వర్ష ధనుస్సు ఏర్పడుచున్నది. వర్షము పడునప్పుడు సూర్యుడు బయటకు వచ్చును, దానిని చూపించును. ఎండ వలన నీరు ఎండిపోవును; ఆయన అక్కడ వర్ష ధనుస్సును ఉంచెను. భూమిని మరల నాశనము చేయునంత నీరు భూమి మీద పడదని అందుమూలముగా రుజువగుచున్నది. అది ఆయన యొక్క నిబంధన; అది ఒక గురుతు. "దానిని మీకు గురుతుగా ఇచ్చితినని," ఆయన చెప్పెను.

171ఆయన తన గురుతును గౌరవించెను. నోవహు దినములలో ఆయన తన గురుతును గౌరవించెను. ఇంకా ఆయన దానిని చూపించుచున్నాడు. ఐగుప్తులో ఆయన తన గురుతను గౌరవించెను. యెరికాలో దానిని ఆయన గౌరవించెను. దానిని ఈనాడు ఆయన గౌరవించుచున్నాడు. అది ప్రదర్శింపబడినప్పుడు తన గురుతును ఎల్లప్పుడు గౌరవించును.

ఇన్ని వేల సంవత్సరములలోను ఆయన ఆ గురుతును చూపించుచునే యున్నాడు. దానినెన్నడును ఆయన మరచిపోడు. ఆయన తన గురుతును మరువడు. లోకము ఎంతగా మారినా గాని వర్ష ధనుస్సు అచ్చటే యుండును. ఆయన తన గురుతును గౌరవించును.

ఇప్పుడును ఆయన ఆలాగే చేయుచున్నాడు. ఆయన తన గురుతును గౌరవించుచున్నాడు. సంఘము ఎంత మారిన లెక్క లేదు, అది ఎంత చేసినా, దేవుడు ఇంకా తన గురుతును గుర్తించును, మరియు కేవలము అది మాత్రమే. ఆయన చెప్పిన దానిని, ఆయన చేసిన దానిని ఎల్లవేళలా ఆయన గౌరవించును. దానిని మనము అంగీకరించి గౌరవించుచున్నాము. నేనది చేయుదును.

172మనము కూడా విశ్వాసముతో ఆ గురుతును సాతాను పై ఉపయోగించవలెనని ఆయన కోరుచున్నాడు. ఈ విగ్రహారాధనలను, శాఖలను ఖండించవలెను. ఆయన వాగ్దానము నిజమని మనకు తెలియును. ఆయన తాను వాగ్దానము చేయు దానిని జరిగించును. ఆయన సంఘము ఆలాగుండును.

వారు మొదటి స్థానమునకు రాలేకపోవుటలో ఆశ్చర్యము లేదు. మనము ఆ పరిస్థితిని వ్యంగ్యముగా చిత్రీకరించుట కాదు. వారు ఎక్కడికీని వెళ్ళరు. అందులో ఆశ్చర్యము లేదు. మరల శాఖ యొద్దకే వెళ్ళెదరు. అందులో మంచి బట్టలు ధరించిన వారు, ముస్తాబయిన వారు, చదువుగలవారు, పండితులు ఉన్నారు. ఎన్నడూ ఎక్కడికిని వెళ్ళవద్దు, ఎందుకనగా వారు దానినే చూపించెదరు: "నేను మెతడిస్టును, నేను ప్రెస్బిటేరియనును అందురు. వారికదే కావలెను.

ACTS 3:2

 

173కాని విశ్వాసులు గురుతును తీసికొనవలెను.

యేసు గలిలయలో దేనిని చేయనారంభించెనో దానిని ఇప్పుడును చేయుచునే యున్నాడు. తన గురుతు ద్వారా దానిని చేయుచున్నాడు. సంఘము మీదికి తిరిగి పరిశుద్ధాత్మ వచ్చియున్నది. అవి అపోస్తలుల కార్యములు కావు గాని అపోస్తలులలో యున్న పరిశుద్ధాత్మ కార్యములు. అదే ఒక గురుతు అయి యుండెను.

పేతురు మరియు యోహానులు శృంగారమను దేవాలయపు గుమ్మము గుండా వెళ్ళిపోవుచుండగా వారు చూచిరి. వారు విద్యలేని పామరులని ఎరిగి యుండిరి. వారు ఆ గ్రామీణ పదజాలములను ఉపయోగించియుందురు. వారిది మోటు భాష. వారికి వ్యాకరణము అర్థము కాదు. వారికి భేదము తెలియదు. లేఖనములోని లెక్కల గూర్చి వారికి తెలియదు, కాని వారు యేసుతో కూడా ఉండిన వారని వారు గుర్తించిరి. వారు ఆ గురుతు ప్రదర్శించవలసి యున్నది, ఎందుకనగా ఆయన సిలువ వేయబడుటకు ముందు అయన పై యున్న అదే ఆత్మ, పునరుత్దానము తరువాత వారిపై యున్నది. ఆమెన్!

HEB 13:8,20•

REV 1:18

 

174హెబ్రీ 13:8లో ఆయన ఆలాగే కనబడును, "యేసుక్రీస్తు నిన్న, నేడు, నిరంతరము ఏకరీతిగా యున్నాడు. అందును బట్టియే ఆయన జీవించుచున్నాడని మనకు తెలియును. మనము జీవించుచున్నామని మనకేలాగు తెలియును? ఆయన జీవించుచున్నాడు గనుకనే. మనము జీవించుచున్నామని మనకు తెలియును, ఎందుకనగా మనము ఆయన వలే యున్నాము. మనము ఆయనలో యున్నాము. "నేను జీవించుచున్నాను గనుక మీరును జీవించుచున్నారు," అని ఆయన చెప్పెను. మృతుడనైతిని గాని సదా కాలము జీవించుచున్నానని ఆయన ప్రకటనలో చెప్పెను.

మనము సిలువవేయబడినప్పుడు ఆయన మనలో జీవించును. మనము సదాకాలము జీవించుదుము. ఆయన జీవము మనలో యున్నది. ఆయనను అది బయలుపరచును. అందువలన ఆయన నిన్న, నేడు, నిరంతరము ఏకరీతిగా యున్నాడు.

వారు దానిని ఏలాగు కాదనగలరు? నీవేలాగు అది లేదనగలను? నీవు మృత క్రియలను చూచుచున్నావా? సజీవుడగు దేవుని సేవించుము. ఆయన నిత్యుడు. నిత్యమగు జీవపు నిబంధన యేసుక్రీస్తు రక్తములో యున్నది.

ఇంకా ముందుకు పోకుండా ఆగుదము. ఆయన కృప యొక్క గురుతులు, ప్రేమ యొక్క గురుతును మనము చూపించెదము. ఇప్పుడు, ఈ గురుతు అన్వయించకుండా…

JOHN 14:19,20•

EPH 2:6

 

175ఇప్పుడు, అది ఒక గురుతు. గురుతు అనగా ఏమిటి? ఆప్పు చెల్లించబడిది అనుటకు అది ఒక సూచనగా యుండును. చెల్లించవలసిన వెల చెల్లించబడెను. మన రక్షణ యొక్క వెల మరణమే, చూడండి, దానిని క్రీస్తు తప్ప మరెవరునూ చెల్లించలేరు. ఒక శాఖ యొక్క ఆత్మ కాదు, ఒక పోపు యొక్క ఆత్మ కాదు, ఎవరో మానవుని యొక్క ఆత్మ కాదు, ఎవరో పరిశుద్ధుని యొక్క ఆత్మ కాదు, కాని యేసుక్రీస్తు యొక్క ఆత్మ సంఘము మీద యున్నది, వెల చెల్లించబడినది అనుటకు అది ఒక గురుతు, దేవుడు కోరిన ప్రతి దానిని ఆయన చేసెను; మనము మరియు ఆయన ఏకమైయున్నాము. "నేను తండ్రి యందును, నా యందు తండ్రియు, నేను మీలోను, మీరు నా యందును యున్నట్లుగా ఆ దినమున తెలిసికొందురు."

గురుతును అన్వయించుము. ఆయన పునరుత్థానము యొక్క గురుతును అన్వయించుము, ఎందుకనగా మనము నీతిమంతులముగా తీర్చబడునట్లుగా ఆయన తిరిగి లేచెను. ఆయన మనలను తనతో కూడా లేపెను. ఇప్పుడు మనము పరలోక స్థలములందు కూర్చొని యున్నామ. యేసుక్రీస్తు నందున్నాము, గురుత యొక్క సహవాసము క్రింద ఉన్నాము.

1COR 12:13•

1PET 5:1

 

176ఇశ్రాయేలు అక్కడ కూర్చొని యున్నట్లగానే యున్నది, వీధులలో కేకలు వినబడుచున్నవి, వారు ఏ విషయములోనూ చింతించనవసరము లేదు. ఆ రక్తపు గురుతు చూపించితే చాలును.

ఇప్పుడు మనము దాని గూర్చియే చింతించవలెను. స్నేహితులారా, దానిని చేయుటలో శ్రమ యున్నది. ఇదెంతో కాలముండదు. శ్రమ కలుగుచున్నది. దానిని మనము ఎరుగుదుము. గురుతు కనబడునట్లుగా నిశ్చయత కలిగియుండుము, పరిశుద్ధాత్మయే ఆ గురుతు. "ఒకే ఆత్మ ద్వారా మనమందరము ఒకే శరీరములోనికి బాప్తిస్మము పొందియున్నాము. ఆయన మహిమలో పొలిభాగస్తులమై యున్నాము."

ఇప్పుడు వాగ్దాన దేశములోనికి సాగిపొండి. మీరాయనను ప్రేమించుచున్నారా? మీరు గురుతును విశ్వసించుచున్నారా? "నేను ఈ గురుతు క్రిందికి వచ్చునట్లుగా నా కొరకు ప్రార్థించుము, బ్రెన్హాం సోదరుడా," అని చెప్పుటకు ఎందరు ఇష్టపడేదరు. మన తలలు వంచుదము.

ACTS 2:39

 

177ప్రభువైన యేసూ, నీవు అతి గొప్ప కృపగలవాడవు! లోకము పాపముతో యుండినప్పుడు దానికి సహాయము చేయు వారెవరును లేరు. దేవుడు కృపతో పాపమును తీసివేయుటకు రాబోవుచున్న గురుతును ఛాయగా చూపించెను. దానిని కప్పుట కాదు గాని దానిని తీసివేయవలెను. యేసు సరయిన కాలములో వచ్చెను. ఆయన తన రక్తమును చిందించెను. తన స్వంత జీవమును ఇచ్చెను. మన పాపముల కొరకు ఒక పరిహారమును ఏర్పరచెను. ఆ తరువాత పరిశుద్ధాత్మ రూపములో తిరిగి ఆయనను మనకు ప్రసాదించెను. అదే ఇప్పుడు గురుతు. ఆయన వచ్చు వరకు సంఘము దానిని చూపించవలెను, ఏలయనగా అపోస్తలుడగు పేతురు ఇట్లు చెప్పెను, "ఈ వాగ్దానము మీకును, మీ పిల్లలకును, దూరస్థులందరికిని, ప్రభువగు దేవుడు ఎందరిని పిలచెనో వారికందరికిని చెందును."

ప్రభువా, నీ కృపను బట్టి, నీ సహాయము బట్టి ఈ వర్తమానము వినిన ప్రతి ఒక్కరిని నేను విడిపించుచున్నాను. వారిని దేవుని కొరకు విడిపించుచున్నాను. ప్రభువా, ఈ ఉదయమున ఇచట ఉన్నవారి కొరకును, టేపు వినువారి కొరకును నీకు ప్రార్థించుచున్నాను.

ముందుగా నిర్ణయించబడిన విత్తనము ఎక్కడయినా యున్నయెడల, ఈ చివరి దినపు వర్తమానమును వినునట్లు చేయుము. వారు ఇప్పుడే దీనము గాను, ఆనందముగాను వచ్పుదురు గాక! వారు సిలువ యొద్ద మోకరిల్లుదురు గాక! దేవుని కృపకు గురుతుగా యుందురు గాక! వారిని నీవు పిలచుచున్నావు. వారు పరిశుద్ధాత్మతో నింపబడుదురు గాక! యేసుక్రీస్తు యొక్క జీవపు గురుతును, ఆయన పునరుత్థానమును వారు ప్రచురము చేయుదురు గాక! ఈ భూమి మీద వారు నిలచియున్నంత కాలము ఆలాగుండునట్లుగా ప్రభువా, కృప చూపుము.

PROV 3:12•

HEB 12:6

 

178ప్రభువా, ఈ మాటలను నేను సరిగా చెప్పి యుండకపోవచ్చును. నేను చెప్పనియెడల పరిశుద్ధాత్మ ఆ మాటలను తీసికొని వారికి అందించబడవలసిన విధముగా అందించునట్లు చేయుగాక అని ప్రార్థించుచున్నాను. ప్రజలు కల్మషము లేకుండా తెలిసికొని గ్రహించెదరు. ప్రేమ సరిదిద్దునని వారికి తెలియచేయుము. మేము జీవించుచున్న ఈ ఘడియను బట్టి అది ఆలాగు జరుగవలెనని వారు గ్రహించుదురు గాక! ప్రభువు రాక సమీపించినది. ఎర్రని దీపములు వెలుగుట మేము చూచుచున్నాము. ప్రపంచమంతటా అవి కనబడుచున్నవి. సమయము సమీపించి యున్నది.

ఈ దినమున జనులు పరిశుద్ధాత్మను పొందుదురు గాక! నేను వారి కొరకు ప్రార్ధించి, ప్రభువైన యేసుక్రీస్తు నామములో నీకు అప్పగించుచున్నాను. మనము జీవించినంత కాలము అది మనకు గురుతుగా యుండును గాక! ఆలాగుండునని నీవు వాగ్దాము చేసియున్నావు. దానిని అడుగుట చాలా సులువే, ఎందుకనగా ఆలాగు జరుగునని నీవు వాగ్దానము చేసియున్నావు. ఆలాగు జరుగునని నాకు తెలియును. యేసు నామములో మేము ప్రార్థించుచున్నాము. ఆమేన్.

ఇప్పుడు, మనము తలలు వంచి ఒక నిమిషము ప్రార్థించుదము.

179విశ్వాసముతో, నమ్మకముతో నేను మీకు ప్రార్థించియున్నాను. నాకు తెలిసిన విధానము అదే. యధార్థతతో ప్రార్థించాను. దాని గూర్చి ఎట్లు ప్రార్థించవలెనో నాకు తెలిసిన విధంగా ప్రార్థించాను. చూడండి, దానిని నేను గ్రహించాను. అదేమిటో మీరెరుగుదురా? మీ యొక్క దశమ భాగములు మరియు ఆర్పణల వలననే జీవించుచున్నాను. అది మీ మద్దతు. ఈ సంఘములో మీరుండుటవలననే బోధించగలుగుచున్నాను. అది మీ యొక్క ప్రేమ. మీ యొక్క ఆమేన్లు. మీ యొక్క సహవాసము. మీరు దయగల మాటలు, పలుకుచున్నారు. ప్రపంచములో మీరెక్కడికి వెళ్ళినా అది అవసరము. దేశములో వివిధ రాష్ట్రములకు వెళ్ళుచున్నారు. మీ మాటల వలననే వర్తమానము కొనిపోబడుచున్నది. మిరే ఇది చేయుచున్నారు. క్రీస్తుతో కూడా మనము సహదాసులమైయున్నాము. మనము సోదరీ సోదరులము. ఆయన మనకు రాజు. మిమ్మును నేను ప్రేమించుచున్నాను. నేనుండు చోటులోనే మిమ్మును కూడా ఉండవలెనని కోరుచున్నాను.

దేశమంతా నేను తిరుగుచున్నాను. కొన్నిసార్లు మీతో మాట్లాడుచున్నాను. ఆదివారం ఉదయమున మిమ్ము ఇక్కడ కలిసికోవలెనని ఆశించుచున్నాను. మిమ్మును నేను ప్రేమించుచున్నాను. ఎల్లప్పుడూ మిమ్మును ప్రేమించాను. కొన్నిసార్లు చాలా కఠినంగా నేను మాట్లాడినది నిజమే, కాని అది సరిచేయుటకేనని తెలిసికొనుడి. మీరు చూడండి. నేను మిమ్మును ప్రేమించుచున్నాను గనుక ఆ విధంగా చేయుచున్నాను.

దానిని మీరు తప్పిపోరాదని కోరుచున్నాను. మీరది చెయుకూడదు.

180ఇప్పుడు, మీరు మధరముగాను, దీనముగాను, మీ నిండు హృదయముతో, లోతుగా దానిని అంగీకరించండి. "ప్రభువైన యేసూ, నాలో యున్నదంతయూ ఇప్పుడు తీసివేయుము. నీవలె నన్ను చేయుము. నా గర్వమంతయూ తీసివేయుము. నాలో నీకు అయిష్టముగా ఉన్నదంతయూ తీసి వేయుము. నాలో యున్న సమస్త చెత్తను, అవిశ్వాసమును ప్రభువా, ఇప్పుడు విడిచి పెట్టుచున్నాను. దానిని నేను బయటకు త్రోసివేయుచున్నాను. దేవుని యొక్క మధురమగు పరిశుద్ధాత్మ పావురము వలె నా మీదికి దిగి వచును గాక! నేను నిత్యముగా జీవించగోరుచున్నాను, ప్రభువా. ఈ సమయములో నీవు నాకు సహాయము చేయమని కోరుచున్నాను. ఇప్పుడే దానిని దయచేయుము.''

181మీరు ప్రార్థించుచుండగా, ఈ పాటను మనము పాడుచుందము. అందరం కలిసి నెమ్మదిగా పాడుదము. నేనాయనను ప్రేమింతును, ప్రేమ ద్వారా అది వచ్చును, ఎందుకనగా ఆయన ప్రేమయైయున్నాడు. ఈ చేతి గుడ్డల మీద నేను చేతులుంచుచున్నాను. ఈ రాత్రికి ముందే అవి జనులకు అందును.

నేనాయనను ప్రేమింతును, ప్రేమింతును,

ఏలయనగా ఆయనే మొదట నన్ను ప్రేమించెను;

నా రక్షణను కొనెను,

కల్వరి మ్రాను మీద.

నేనాయనను ప్రేమింతును, ప్రేమింతును

ఏలయనగా ఆయనే మొదట నన్ను ప్రేమించెను

(ఇప్పుడు మీ జీవితమును ఆయనకు సమర్పంచుకొనుడి.)

నా రక్షణను కొనెను,

కల్వరి మ్రాను మీద.

ప్రేమ, ప్రేమ, ప్రేమ. ఆయనను ప్రేమించుడి. ఆయన మీ కొరకు ఏమి చేసెనో చూడండి. ప్రేమ ద్వారానే అది జరుగును; ప్రేమవలన విధేయత వచ్చును; ప్రేమ అనునది కలుపును; ప్రేమ వలన వివాహము జరుగును. దాని కొరకే మనము సిద్ధపడుచున్నాము. గొర్రెపిల్ల యొక్క వివాహపు విందు. నా రక్షకుని పిలుపును నేను వినుచున్నాను, ఆయన నన్ను కూడా ప్రేమించుచున్నాడు.

మీ హృదయమంతటితో పాడండి, మీ లోనికి మాధుర్యమైనది ఒకటి వచ్చుచున్నదని భావించుకొనండి — అదియే పరిశుద్ధాత్మ.

ఎందుకనగా ఆయనే మొదట నన్ను ప్రేమించెను;

నా రక్షణను కొనెను,

కల్వరి మ్రాను మీద.

182జనులతో పాటు, ఈ సంగీతముతో పాటు నేనును చేతులు ఎత్తుచున్నాను. నేనేదయినా పాపము చేసినయెడల, నేను ఏదయినా పొరపాటు చేసినయెడల… ఇప్పుడు నేను మీ కొరకును, నా కొరకును ప్రార్ధించుచున్నాను. నేను ఏదయినా తప్పు చేసినచో, ప్రభువా, నా చేయిని నీకు చూపించుచున్నాను. నేను ఒప్పుకొనుచున్నాను. ప్రభువా, నా చేతిని నీకు చూపించుచున్నాను. మరల ఆ తప్పు నేను చేయగోరుటలేదు. ప్రభువా, నేను చనిపోవుచున్నానని నాకు తెలియును. శరీరముతో నున్న నేను ఈ లోకమును విడిచిపెట్టవలసియున్నాను. నిన్ను నేను కలుసుకొనగోరుచున్నాను. ప్రభువా, నా చేతులు నీకు సమర్పించుచున్నాను. ఆత్మతో నన్ను నింపుము. నీ ప్రేమ గురుతును నా మీద ఉంచుము. పరిశుద్ధాత్మను నాకిమ్ము. నేను మధురముగా, దీనునిగా జీవించునట్లు అది చేయును. క్రీస్తులో నున్న జీవితమును నేను జీవించునట్లు చేయుము. నా హృదయము ఇతరుల కొరకు మండునట్లు చేయుము. నాకు వీలయిన వారందరినీ నీ కొరకు సంపాదించు వరకూ దివా రాత్రులు నేను కష్టించి పని చేయునట్లు చేయుము.

యెరికోలోని వర్తమానికుల వలె నేనుండగోరుచున్నాను. నేను నాకు వీలయిన ప్రతి వ్యక్తి యొద్దకు వెళ్ళుదును. వారు రక్త నిబంధన క్రిందికి వచ్చునట్లుగా చూతును. గొర్రెపిల్ల రక్తము క్రిందనే వారికి గురుతు దొరకును.

183రక్తము శుద్ధి చేయును. రక్తము అన్వయించబడినట్లుగా ఆత్మయే గురుతు, చూచారా. రక్తము అన్వయించబడినది అనుటకు ఆత్మయే గురుతు. రక్తము అన్వయించనంత వరకూ గురుతు, అనగా పరిశుద్ధాత్మ రాదు. కాని రక్తము అన్వయించబడినప్పుడు గురుతుగా ఆత్మ వచ్చును, దానిని మీ పైకి తిరిగి పంపించును, రక్తము నందు మీకున్న విశ్వాసము అంగీకరించబడినదని గురుతు. మీ వెల చెల్లించబడినది. మీ వెల చెల్లించబడినది. ఆంతా ముగిసినది. కేసు పరిష్కారమయినది. మీరు క్రైస్తవులు. మీరు విశ్వాసులు. క్రీస్తు మీలో యున్నాడు, మీరు క్రీస్తులో ఉన్నారు.

… మొదట నన్ను ప్రేమించెను;

నా రక్షణను కొనెను,

కల్వరి మ్రాను మీద.

EXOD 12:13

 

184ఇప్పుడు దేవుని యెదట మీ హృదయములు వంచుడి. మీ సంఘ కాపరి సహోదరుడు నెవిల్ తన ముగింపు మాటలు పలుకును. చెప్పగోరినది చెప్ప వచ్చును. ఈ రాత్రి కూటమును మరువకుడి, స్వస్థతా కూటము. పెందలకడ రండి. ఏడు గంటలకు ప్రారంభించుదము. నేను ఏడున్నరకు వేదిక మీదికి ఎక్కుదును. అది సరేనా నెవిల్ సోదరుడా?

ఈ రాత్రికి ప్రభురాత్రి సంస్కారముండును. రండి, ఈ మధ్యాహ్నము దానితోనే నిలచియుండుడి. ఈ వర్తమానము మీలో నిలచియుండనీయుడి. గుర్తుంచుకొనండి, ఎన్నడూ ఈ వర్తమానమును విడువ వద్దు. జీవము అర్పించబడినట్లు గురుతుగా రక్తమున్నది, చూచారా. "నేను రక్తమును చూచినప్పుడు దాటిపోవుదును."

నీ హృదయమునకు రక్తము అన్వయించబడినట్లు పరిశుద్ధాత్మ గురుతు చూపించును. నీవు దానిని అన్వయించని యెడల ఆ గురుతు రానే రాదు. మీరు గ్రహించారా, "ఆమేన్" చెప్పండి. రక్తమును తప్పక అన్వయింపవలెను, అప్పుడు గురుతు వచ్చును. విమోచనా రక్తము అన్వయింపబడినట్లుగాను, నీ వెలను చెల్లించినట్లుగాను అదియే గురుతు. దేవుడు మిమ్ము దీవించును. సహదరుడు నెవిల్ వచ్చును.

Search Messages

0 / 0 matches
Enter characters above to process real-time text query scopes...