క్షమాపణ
1మనమందరమూ అలాగే నిలబడి కొద్ది క్షణాలు ప్రార్ధనకై మన తలలు వంచుదాం.
మా పరలోకపు తండ్రీ, రక్షింపబడిన వారి మధ్యలో మమ్ములను నిలువబెట్టి, సంఘము యొక్క ఆ పాత మధురమైన "ప్రభువా, నేను నమ్ముచున్నాను" అనే పాటను పాడి స్తుతించడానికి ఇచ్చిన గొప్ప ఆధిక్యతను బట్టి నీకు కృతజ్ఞతలు. కాలములు గుండా మా పితరులలో ఏ విశ్వాసం ఉందో అదే ఇప్పుడు తన కుమారుల హృదయాలలోను చూస్తున్నాము. "మేము కనాను, స్వతంత్ర భూమికి వెళ్ళే మార్గంలో ఉన్నామని" ఇప్పుడే ఆ పాటలో మేము విన్నాము. ఈ రాత్రి మేము ప్రార్ధిస్తున్నాం, తండ్రీ, ఇక్కడ బహుశా ఇంకా చాలా మంది ఆ ప్రాంతానికి వెళ్ళాలని నిర్ణయం తీసుకోలేదేమో - అటువంటి వారు నీ మాటను కేవలం నమ్మడానికి సహాయం చేయండి. ఈ రాత్రే వారందరూ చివరిగా ఒక నిర్ణయం తీసుకొని, యేసుక్రీస్తును రక్షకునిగా అంగీకరించి, ఆయన ఆత్మతో నింపబడుదురు గాక.
సంపూర్ణ సువార్త వర్తకుల సంఘం మరియు దాని నీతిని బట్టి నీకు వందనములు చెల్లిస్తున్నాము. మా దేశములోని కొందరు మనుష్యులు, ఈ వ్యాపార ప్రపంచంలో కూడా వాళ్ళు నిన్ను సేవించుటకు కొంత సమయం తీసుకొని, ఇతరులకు చెప్తున్నారు, వాళ్ళ సంపాదన నీ కొరకు వ్యయపరుస్తున్నారు, ఇంకా ఇతరులకు సహాయం చేస్తున్నారు. ఈ విధంగా చేస్తూ వాళ్ళు దేవుని రాజ్యపౌరులుగా తయారవుతున్నారు అని సంతోషిస్తున్నాను.
2ఇక్కడ ఉండి పరిచర్య చేస్తున్న సేవక సహోదరులను బట్టి ఈ రాత్రి నీకు వందనములు చెల్లిస్తున్నాను. వారు చీకటిలో ఉన్న ప్రపంచానికి దివిటిలు పట్టుకుని దేవుని మహిమకు వెళ్ళు మార్గాన్ని చూపించుచున్నారు. జీవము గల దేవుని సంఘంలో ఉన్న ప్రతీ ఒక్కరినీ బట్టి, ఇంకా నూతనముగా చేర్చబడుతున్నవారిని బట్టి నీకు వందనములు. ఎవరెవరు ఏ అవసరతతో వచ్చారో వారికి ఆ వాక్యమును విభజించి వారికి నీ మాటలను తెరువమని ప్రార్ధిస్తున్నాను. ఈ రాత్రి ఈ కూటము ముగించబడిన తరువాత, ఎవరి గృహాలకు వారు వెళ్ళిన తరువాత, నీ రాజ్యములో క్రొత్తగా జన్మించిన శిశువులు చేర్చబడడానికి సహాయం చేయండి. ఓ ప్రభువా! ఈ రాత్రి ఒకవేళ ఎవరైనా తీవ్ర అనారోగ్యంతో వస్తే, వారిని గొప్ప వైద్యునిగా నీవే తాకుము ప్రభువా. వారికి నీ శక్తిని అనుగ్రహించుము ప్రభువా, మేము దీనముగా నిన్ను స్తుతిస్తూ, యేసు నామములో దీనిని అడుగుచున్నాము. ఆమెన్.
మీరిప్పుడు కూర్చోవచ్చు.
3నా జీవితంలో ఇదొక ముఖ్యమైన గొప్ప కాలము, నేను ఈ విధంగా ప్రజల ముందు నిలబడి నా జీవితం యొక్క సంతోషానికి కారణమైన యేసుక్రీస్తును గూర్చి చెప్పడం మరియు ఆయన నాకేమైయున్నాడో, అంతే కాదు, నేను కలిగిన సంతోషాన్ని ఇతరులు కూడా (లేనివాళ్ళు) ఇది కలిగి ఉండాలని వారికి పంచడమే నా ధన్యత. నేను మరొక రోజు మాట్లాడాను. నేను చిన్న బోధకుని వలె ఉండాలని (ఇది ముప్పై-మూడవ సంవత్సరములు గల పరిచర్య), నేను మంచి పేరుగల యవ్వన భోధకుని జీవించాను. కానీ ఇప్పుడు అది దాటియున్నాను, మరిప్పుడు ముసలి బోధకుని వలె అగుచున్నాను.
కాని ప్రతి రోజు, ఆయన… పాటలో చెప్పినట్లుగా, "మునుపటి రోజుల కంటే మరింత మధురంగా ఎదుగుచున్నాడు." నేను మొదలయ్యి ఇప్పుడు సగం దాటిపోయిన తరువాత అస్తమించు సూర్యుని వైపు చూస్తున్నాను, క్రీస్తు నాకు రోజు, రోజుకి మరింత ఎక్కువ అవుతున్నారు. ఇటువంటి గొప్ప ధన్యత నాకు కలిగినప్పుడు, సమాజంలోని వర్తకులు మరియు స్త్రీల మధ్య నిలబడి, వాళ్ళకు ఎక్కువ అవసరమైన విషయాన్ని చెప్పడానికి అంటే ఈ ప్రపంచంలో ఉన్నవాటి కంటే గొప్పది, అదే నిత్యజీవము… నిత్యజీవితం కంటే మరి గొప్పది, దానిని మించినది మరొకటి లేదని నేను తలంచుచున్నాను.
4మీరు చిన్నపిల్లలగా ఉన్నప్పుడు, మీరు ఈ విధంగా ఆలోచిస్తారు, ఒక బాలుడు అయితే బొంగరములు ఆడుతారు మరియు చిన్న బాలిక అయితే కాగితపు బొమ్మలు కత్తిరిస్తాది. అటు తరువాత, మీ చదువులు. అప్పుడు, గోధుమరంగు లేదా నీలిరంగు కన్నులు గల అమ్మాయిని మీరు వివాహం చేసుకుంటారా? ఆ తరువాత ఇంటికి అద్దె చెల్లిస్తారు, పిల్లలను చదివించాలి. మరియు మీరు ఎక్కడ ఉన్నట్లు?
కాని ఏదో ఒక వాస్తవము ఉన్నది అని చెప్పడానికి నేను చాలా సంతోషిస్తున్నాను, ఇదంతా అయిపోయిన తరువాత, అప్పుడు మీరు వీటన్నింటి కంటే మరేదో గొప్పదానిలోనికి ప్రవేశిస్తారు… అవేమనగా… అవి చాలా అవసరమైనవి. మనము మన పిల్లలకు తప్పకుండా ఒక తల్లిగా, ఒక తండ్రిగా, మన గృహాన్ని అలాగే వాళ్ళకి చదువును అందిస్తున్నాం. కానీ, అంత చేసినప్పటికి అవి నశించిపోతాయి. అవి పోతాయి. కానీ నాకు తెలిసినంతవరకు అతి గొప్పది నిత్యజీవము. నేను బాలునిగా ఉన్నప్పుడు అది నాకు తృప్తిని కలిగించింది. ఇప్పుడు మధ్య-వయస్కుడిగా ఉన్నప్పుడూ తృప్తినిచ్చింది. అలాగే నా జీవితం చుట్టూ తెరలు దిగుతున్నప్పుడు కూడా నేను తప్పక తృప్తి చెంది ఆనందిస్తాను, ఎందుకనగా నేను ఎవరికోసం నా జీవితాన్ని గడిపానో ఆయనను కలుసుకుంటాను కాబట్టి.
5ఇప్పుడు, ఇక్కడ దీని అంతటికి అధ్యక్షుడుగా ఉన్న సహోదరుడు టోని మరియు మీ సహవాసంలో నేను ఈ రాత్రి మీతో ఉండడాన్ని బట్టి సంతోషిస్తున్నాను. అలాగే సహోదరుడు కార్డ్ విలియమ్స్ ఇంకా ఇతర ప్రముఖులును, ఇక్కడికి విచ్చేసిన సందర్శకులను బట్టి, నేను చాలా సంతోషిస్తున్నాను. మేము ఇక్కడ ఉండడాన్ని ఆనందిస్తున్నాము.
ఒకసారి నేను మాట్లాడుచున్నాను, రాబిన్సన్ మెమోరియల్ ఆడిటోరియం, అర్కాన్సాస్ నందు అని అనుకొనుచున్నాను, ఎందుకనగా అక్కడ చాలా సంవత్సరాల నుండి చంక-కర్రల సహాయంతో నడుస్తూ, వీధిలో కూర్చుని, పెన్సిల్స్ అమ్ముకునే వ్యక్తి అక్కడ స్వస్థపరచబడ్డాడు. అతను కాళ్ళు చేతులు పక్షవాతం కలిగి గుండ్రంగా మెలితిరిగి పడి ఉన్న స్థితిలో చూసి జనులు చాలా బాధపడ్డారు.
ఒక రాత్రి ఆయన కూటమునకు వచ్చాడు. అతనికి ప్రార్ధన కార్డు లభించింది. మరియు లైనులో వచ్చి స్వస్థపరచబడ్డాడు.
6ఆ తరువాత రోజు అతను తన చేతి-కర్రలు వెనకపెట్టి వీధిలో అటు ఇటు తిరుగుచూ సాక్ష్యమిచ్చుచున్నాడు. అప్పుడు నేను మాట్లాడ ప్రయత్నించాను. అటు తరువాత అతడు లేచి అన్నాడు, "బ్రదర్ బ్రెన్హాం, నేను చివరలో కనకరించబడ్డాను. తరువాత నీవు మాట్లాడుట నేను విన్నప్పుడు, నీవు నాజరిన్ వాడవని అనుకొన్నాను." అవును అతడు అదే. "ఇక్కడ చాలా మంది పెంతెకొస్తు వారిని నేను చూచాను. కొంత మంది చెప్పారు, నువ్వు కూడా పెంతెకొస్తువాడవని. నువ్వు బాప్టిస్టువని లేక బాప్టిస్టు సంఘములో ప్రతిష్టించబడ్డావని నువ్వు చెప్పడం నేను విన్నాను" అనెను. మరియు చెప్పెను, "నేను గందరగోళములో ఉన్నాను. అసలు నువ్వు ఏమిటి?"
"ఓ, అది చాలా సులువు అని నేను అన్నాను. నేను పెంతెకొస్తు నజరేతు బాప్టిస్టునని" కనుక అంతా కలిపే అని.
7నేను పెంతెకొస్తు ప్రజల మధ్యకు కొన్ని సంవత్సరాల క్రితం వచ్చినప్పుడు, దేవుడే నన్ను మీ మధ్యకు పంపించారు, ఆయన తన రోగగ్రస్తులైన పిల్లలకు ప్రార్థించమని నాకు ఆజ్ఞాపించారు. నేను ఏదైతే శాఖాపరమైన సంఘాన్ని ఆనాటి కాలంలో కలిగి ఉన్నానో వాళ్ళు రోగులకు ప్రార్ధన మీద లేక దైవిక స్వస్థత మీద విశ్వాసముంచలేదు. అది వారికి వింతగా ఉండేది. నేను ఒక పరిశుద్ధ గుండ్రాయిలా అయ్యాను అని వాళ్ళు నన్ను అన్నారు మరియు మంచిది, బహుశా నేనొక పరిశుద్ధ గుండ్రాయి అయి ఉండవచ్చు. అది నాకు తెలియదు, కాని నేను ఏమైయున్నానో అది నాకు చాలా ఎక్కువైన ఆనందాన్ని ఇచ్చేది. కొంతమంది నన్ను చూసి వీడికి మతిభ్రమించిందని అన్నారు. నేను చెప్పాను, "అప్పుడు నన్ను ఈ మార్గంలో ఒంటరిగా ఒదిలేయండి, ఎందుకనగా అంతకు ముందుకన్నా ఇప్పుడే నేను చాలా సంతోషిస్తున్నాను, కనుక నేను ఈ మార్గంలో బాగున్నాను. మరియు నేను… మాటల్లో చెప్పలేని ఆనందమది.
అయితే నేను పెంతెకొస్తు వారి మధ్యకు వచ్చినప్పుడు, వారు ఒక్క గుంపే అని నేను అనుకొన్నాను. మరియు ఇక్కడ కనుగొన్నది ఏంటంటే నేను వచ్చిన బాప్టిస్టు సంఘము వారి వలె వీరు కూడా చాలా గుంపులు కలిగియున్నారు. అప్పుడు నేను ఏ గుంపు పక్షము వహించను, నేను వారందరి మధ్యను నిలబడి ఈ విధంగా చెప్పాను, "మనము సహోదరులము" చూశారా. మరియు అప్పటి నుండి నేను ప్రదర్శించే తీరు అదే కష్టము, ప్రార్ధన మరియు విశ్వాసముతో జీవము గల దేవుని గొప్ప సంఘము ఐక్యముగా ఉండుట చూడాలి.
8మరియు సంపూర్ణ సువార్త వర్తకులు ఒక స్వతంత్ర వ్యవస్ధను ఏర్పాటు చేసారు, (ఎందుకనగా వారు ఒక సంస్థ కాదు; వాళ్ళు స్వతంత్రులు) మరియు అది అన్ని గుంపులను స్వతంత్రించుకొన్నది. వాళ్ళు ఇప్పుడు నాకు ఒక చోటును ఇచ్చి, వాళ్ళ రెక్కల క్రిందకి నన్ను తీసుకున్నారు. క్రైస్తవ వర్తకులకు బోధించే అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు గొప్ప భాగ్యంగా ఎంచుకుంటున్నాను, ఎందుకనగా అన్ని గుంపుల మధ్య నేను నా నమ్మకాన్ని వ్యక్తపరచగలను. మరియు అది నాకు గొప్ప విషయమై యున్నది. మరియు నేను ఒక సంస్థకి చెందియున్నాను, అదే సంపూర్ణ సువార్త వర్తకుల సంఘం.
మరియు అది చేయుటకు, అది ఇప్పుడు ఆఫ్రికాలో ఉన్నది. సరైన విధానంలో దక్షిణ ఆఫ్రికాలో దిగువన చేయాలని ఆశిస్తున్నాం. అక్కడే దక్షిణ ఆఫ్రికా దిగువన దేవుడు నాకు గొప్ప మీటింగ్ ను ఇచ్చి ఆయనే అద్భుతం చేశారు. ఒక్క మధ్యాహ్నాన కూడికలోనే 80 వేల మంది నల్ల స్థానికులు క్రీస్తును రక్షకునిగా అంగీకరించారు. వాళ్ళు 80 వేల మందిగా నమోదు చేయబడ్డారు.
ఆ తరువాత ఉదయం డర్బాన్ మేయర్, సిడ్నీ స్మిత్ గారు ఫోన్ చేసారు. ఆ కూడిక స్ధలం నుండే, 2,00,000 గల వస్తువులు ఆ స్టేడియంలో రేస్ ట్రాక్ పై (పరుగు పందెం బరి) పై ఉన్నాయి. "మీ కిటికీ తలుపు దగ్గరకు వెళ్ళి కిటికిలో నుండి చూడండి." అప్పుడు అక్కడికి 7 వ్యాన్లు నింపబడి ఉన్నాయి. ఆ గొప్ప ఇంగ్లీషు ట్రక్ లు ఇంచుమించు ఒక గది పొడవు ఉంటాయి. ముందు రోజు స్వస్థపరచబడిన వారు వదిలివెళ్ళిన చంకకర్రలు, చక్రాల కుర్చీలుతో నిండి ఉన్నాయి. ఆ ట్రక్కులు వెనకాల నడుస్తూ, చేతులు గాలిలో పెట్టి కొద్ది నిమిషాల ముందు నువ్వు పాడిన అదే పాట "కేవలము నమ్ముము, సమస్తమూ సాధ్యమే," అని పాడుచూ వెళ్ళుచున్నారు.
9అప్పుడు నేను, నా హృదయంలో నేను అనుకున్నాను, "ప్రభువా, నా జీవితంలో ఇది గుర్తుండిపోయే రోజు, కొద్ది రోజులు… నేను అక్కడ మూడు రోజులు మాత్రమే ఉన్నాను. ఇప్పుడు అక్కడ నుండి మరలా తిరిగి వస్తున్నాను. అక్కడ మూడు రోజులు కూడా ఏమి జరిగిందన్న విషయాలు నాకు తెలియదు. అదంతా దేవుడు ఒకే ఒక అద్భుతంతో వేదిక మీదికి దిగివచ్చి కుక్కవలె కాళ్ళు చేతులతో నడుస్తున్న ఒక బాలుడిని మామూలు మనిషి వలె నిలబెట్టి, ప్రజలందరూ చూస్తుండగా బాగుచేసెను. ముందు రోజు ఆ ప్రజలకు ఎంతో భద్రత కల్పించవలసివచ్చినది, ఎందుకనగా వారి తెగల మధ్య యుద్ధం జరుగుతున్నది. మరియు ఇప్పుడు వారు ఎంతో సమాధానముతో ఒకరి చేతులు ఒకరు పట్టుకొని చుట్టూ నడుస్తూ, "కేవలం నమ్ముము, సమస్తము సాధ్యమే" అని పాటలు పాడుచున్నారు.
నేను మీకు చెప్పుచున్నాను, ఆ గొప్పదైన పాత సువార్త సామాన్యతలో ఉన్ననూ, క్రీస్తు యొక్క పునరుద్ధానపు సామాన్యతలో అది ప్రసంగించబడుచున్ననూ దానియొక్క శక్తిని ఎన్నటికీ కోల్పోదు. మరియు ప్రతిదినమూ అది నాకెంతో దగ్గరవుచున్నది.
10ఈ రాత్రి మీరు ఒక వర్తకులై మరియు ఏ వర్తకుల సహవాసము లోనికి రానట్లయితే, నేను మిమ్ములను ఈ సంపూర్ణ సువార్త వర్తకుల సహవాస ములోనికి రమ్మని ఆహ్వానిస్తున్నాను. మీరు ఏ సంఘమునకు సంబంధించనివారైనప్పటికీ, లేక ఏ సంఘములో ఉన్నా అది పరిపూర్ణముగా మంచిదే. "సంపూర్ణ వర్తకుల సహవాసం," అనే పేరును కలిగియున్నది, కాని అది సంపూర్ణ సువార్తకు చెందిన వ్యక్తే చేయనవసరం లేదు. మెధడిస్టులు, బాప్టిస్టులు, లూథరన్లు, ప్రెస్బిటేరియన్లు, ఇంకా కాథలిక్లు యాజకులైనా మరెవరైనా ఫర్వాలేదు.
మీకు తెలుసు, నేను నమ్ముచున్నాను యాకోబు ఒక బావిని తవ్వించాడు మరియు ఫిలిష్తియులు అక్కడ నుండి అతనిని వెళ్ళగొట్టారు. దానికి "వైరము" అని పేరు పెట్టాడని నేను నమ్ముచున్నాను. మరలా ఇంకొక బావిని తవ్వాడు, వారు దాని నుండి అతడిని మరలా వెళ్ళగొట్టారు. దానిని "జగడము" అని పిలిచాడు. వాళ్ళు మూడవ బావి తవ్వారు. అప్పుడు యాకోబు "మా అందరికీ సరిపడే స్థలం ఉంది" అన్నాడు. కాబట్టి అది ఇదే అని నేను అనుకొనుచున్నాను; మనందరికి సరిపోయే స్థలము ఉన్నది. ఈ ట్యూసాన్ ప్రాంతంలో మిమ్ములను కలిగి ఉండుటను బట్టి మేము సంతోషించెదము.
11ఫీనిక్స్ కూడికను మరచిపోవద్దు. మరియు ఇప్పుడు, ఇక్కడ ఈ వేదికపై ఉండి మేము వాటికోసం ప్రచార ప్రకటన చేయడం లేదు, ఎందుకనగా దానిని కానీ ఇవి అన్నియు సంపూర్ణ వర్తకుల సువార్తకు భాగమై ఉన్నవి. కనుక వచ్చే డిశంబరు లేదా కొందరు జనవరి 19 నుండి 23 వరకు రామడాలో జరగనైయున్ననాలుగు రోజుల సభలలో బోధించాలి మరియు రోగగ్రస్తుల కొరకు ప్రార్ధించాలి. అవును అవి 19న మొదలై నాలుగు రోజులు జరుగు సభలు.
మరియు మీ ట్యూసాన్ ప్రజల కొరకు, తరువాత ఆదివారం రాత్రి, వ్యాధిగ్రస్తుల కొరకు ప్రార్ధించబోతున్నాను. ఎవరి మధ్యన అంటే దేవుని సమూహ సంఘాలు గ్రాంట్వే, బ్రదర్ ఆర్నాల్డ్ మాక్స్ సంఘం. ఒకవేళ మీలో ఎవరైనా అస్వస్థతతో ఉండి ఇక్కడికి రాగోరితే, దేవుని చిత్తమైతే రోగుల కొరకు వచ్చే ఆదివారం రాత్రి ప్రార్ధన చేస్తాను.
ROM 8:28-32
12మరియు ఇప్పుడు మీరు దేవుని మెండైన దీవెనలు పొందుకొందురు గాక. మీరు బైబిలును కలిగి ఉంటే, నేను త్వరగా వాక్యంలోనికి వెళ్ళాలని ఆశిస్తున్నాను, ఎందుకనగా నాకు తెలుసు, మీలో చాలా మంది రేపు ఉదయం పనులకు వెళ్తారు. లేఖనాల నుండి ఈ రాత్రి నేను మీతో మాట్లాడతాను, రోమీయులకు వ్రాసిన 8వ అధ్యాయము 28వ వచనము మొదలుకొని 32వ వచనము వరకు చదువుదాం. రోమా 8:28:
దేవుని ప్రేమించువారికి, అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి, మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని యెరుగుదము.
ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్టుడగునట్లు. దేవుడెవరిని ముందు ఎరిగెనో, వారు తన కుమారునితో సారూప్యము గలవారవుటకు వారిని ముందుగా నిర్ణయించెను.
మరియు ఎవరిని ముందుగా నిర్ణయించెనో వారిని పిలిచెను: ఎవరిని పిలిచెనో వారిని నీతిమంతులుగా తీర్చెను: ఎవరిని నీతిమంతులుగా తీర్చెనో వారిని మహిమపరచెను.
ఇట్లుండగా ఏమందుము? దేవుడు మన పక్షమున నుండగా మనకు విరోధియెవడు?
తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుకతీయక మన అందరి కొరకు ఆయనను అప్పగించినవాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు?
ROM 3:23•
ROM 8:32
13దేవుడు ఈ చదువబడిన వాక్యంతో కలిపి ఆయన దీవెనలు మనకు అనుగ్రహించును. ఇప్పుడు నేను "క్షమాపణ" అనే అంశంను గూర్చి మాట్లాడబోవుచున్నాను. "ఆయన మన కోసం అన్నీ ఇచ్చారు" అని ఈ రాత్రి బైబిలు చెబుతుంది. మంచిది, మనము అన్నింటిని గురించి మాట్లాడుకోలేకపోవచ్చు, కాని ఆయన ఇచ్చిన కొన్ని విషయాలలో ఒక్కదాని గురించి అదే "క్షమాపణ" గురించి మాట్లాడుదాం. నేను అనుకుంటున్నాను "క్షమించబడడం" అనేవి ఒక అద్భుత పదం. ఎందుకనగా మనమందరము పాపం చేసి అపరాధులుగా ఉన్నాం. మనమందరమూ పాపులమై దేవుని కృపను పొందలేకపోవుచున్నాం మరియు దేవుడు, తన కుమారుని ద్వారా మన అసమానతలను తొలగించి, మన పాపములను క్షమించెను.
14మరియు ఈ క్షమాపణ అనే పదం ఎప్పుడో ఒకసారి చదివిన కథను గుర్తు చేస్తుంది. అవును నేను నమ్ముచున్నాను అది విప్లవాత్మక యుద్ధంలో జరిగిన కధ. అక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు, అతను ఒక జవాను, తన క్రిందస్థాయి జవాను ఏదో ఒక తప్పు చేశాడు. కోర్టులు అతనిని నిర్ణయించి, కాల్చి చంపమని ఆజ్ఞాపించాయి. అతడు యుద్ధం జరుగుచున్న సమయంలో తన ఉద్యోగ విధులను నిర్లక్ష్యం చేశాడని నేను నమ్ముచున్నాను.
అతని తోటి వ్యక్తి అతనికి జరిగిన విషయమై చాలా చింతించి, ఇది అతడిని రక్షిస్తు౦దని చివరికి అతని కోసం గొప్ప అధ్యక్షుడైన లింకన్ గారి దగ్గరకు వెళ్ళాడు. లింకన్ గారు ఒక క్రైస్తవుడు మరియు ఉన్నతమైన వ్యక్తి, ఆ వర్తమానికుడు లింకన్ గారిని కలిసేటప్పుడు, లింకన్ గారు తన రథముపై స్వారీ చేస్తున్నారు. వెంటనే అతను "లింకన్ గారి కాళ్ళ దగ్గరపడి, అయ్యా, లింకన్ గారు, అమెరికా సంయుక్త రాష్ట్రాల అధ్యక్షులు గారూ! నాపై దయ చూపండి" అని రోధి౦చాడు. మీరు క్రైస్తవులని, ఎంతో దయాహృదయులని విని ఒకరి కోసం జాలి చూపమని వేడుకుంటున్నాను అని చెప్పాడు.
ఇంకా అతను ఇలా చెప్పాడు, "నా స్నేహితుడు, సైనికుడిగా ఒక చోట ఉద్యోగ విధులను నిర్వర్తిస్తున్నాడు, ఇంతలో తుపాకీల శబ్దం కాలుస్తున్నారు. అతను మనస్సు కలవరం చెంది ఉద్యోగ విధులును వదిలివేశాడు. లింకన్ గారు, అతను అలా కావాలని చేయలేదు, అయ్యా అతను చాలా మంచి వ్యక్తి కాని ఇప్పుడు, ఈ రోజు నుండి వారం రోజులలో అతనిని చంపమని కాల్చే గుంపునకు ఆజ్ఞాపించారు. అతనిని రక్షించే వేరే మార్గం ఏదీ లేదు, మీరే అతనికి క్షమాభిక్ష కలిగించమని సంతకం చేయండి."
15లింకన్, తన కళ్ళ నిండా కన్నీరుతో, తన దగ్గర ఉన్న పెట్టెలో నుండి ఒక పేపరు తీసి ఇలా వ్రాశారు. "అబ్రహం లింకన్ అను నేను ఈ మనుష్యునికి క్షమాభిక్ష పెడుతున్నాను, అతనిని చంపవద్దని" అతని పేరు సంతకం చేసి ఇచ్చారు.
అప్పుడు ఆ వ్యక్తి దేవుని దీవెనలు అధ్యక్షులుకి ఇచ్చి తిరిగి అతను జైలులో ఉన్న తన స్నేహితుని దగ్గరకు వచ్చి అతనితో ఇలా చెప్పాడు, "ఇదిగో నీ క్షమాపణ నా దగ్గర ఉంది." అతను ఆ పేపరును లోపలికి పంపి, అతనికి చూపించాడు.
అప్పుడు జైలులో ఉన్న వ్యక్తి "నన్ను హేళన చేయవద్దు. ఇదిగో ఇక్కడే నేను చంపబడబోవుచున్నాను మరియు ఇంకా అటువంటి వాటితో ఎందుకు? ఇవేమి నేను నమ్మను. ఇది నన్ను రక్షిస్తాదని నేను నమ్మను. "అబ్రహాం లింకన్ అని ఏ మనిషైన ఆయన పేరు మీద సంతకం చేయవచ్చు."
అప్పుడు ఆ స్నేహితుడు, "కాని ఇది నిజంగా అమెరికా అధ్యక్షులు సంతకం" అని మరియు "నువ్వు క్షమించబడ్డావు" అని చెప్పాడు. మరియు ఆ మాటలు విని జైలులో వ్యక్తి వెనక్కి తిరిగి నడుచుకుంటూ వెళ్ళిపోయాడు.
మరియు అప్పుడు అమెరికా సంయుక్త రాష్ట్రాల అధ్యక్షుడైన అబ్రహాం లింకన్ గారి నుండి విడుదల పత్రం, అందులో ఆ వ్యక్తిని చంపవద్దు విడుదల చేయమని, కాని ఆ వ్యక్తిని చంపేసారు. కావున ఆ కేసు అమెరికా అత్యున్నత న్యాయస్థానమైన ఫెడరల్ కోర్టులో నలిగి, చివరికి ఈ విధముగా తీర్పు తీర్చబడింది. ఒక క్షమాపణ అనేది క్షమాపణగా అంగికరించబడెంత వరకు అది క్షమాపణ కానే కాదు, అని కోర్టు తేల్చి చెప్పింది.
16కాబట్టి ఈ రాత్రి నేను చదువుచున్నాను, "దేవుడు మనకు అన్నింటిని దయచేసాడు, మరియు ఆయన క్షమాపణ కూడా ఇచ్చారు. అది ఎవరైతే దేవుని మాటగా క్షమాపణను అంగీకరిస్తారో అది వారికి క్షమాపణను కలుగజేస్తుంది. కాని ఒక వేళ మీరు దానిని మామూలుగా క్షమాపణ అని మీరు చదువుకుని వెళ్తే అది మీకు వర్తించదు, మీరు క్షమించబడినట్లు దాని భావము కాదు. దేవుడు నీకు బదులుగా ఆయన కుమారుడను మరణింపజేసింది. నీవు క్షమాపణను నీదిగా నీవు అంగీకరిస్తావని, అప్పుడే అది క్షమాపణ అవుతుంది.
దోషాల నుండి విడిపింపబడ్డాము, అదే ఈ స్ధానంలో పెట్టాలని ఆశిస్తున్నాం. దేవుని నుండి వచ్చిన క్షమాపణ మనలను దోషాల నుండి విడిపించింది. ఏదో ఒక తత్వ సిద్దాంతముల వైపు తట్టు తిరిగి మనము వెళ్ళే మార్గమే బాగుంది అని అందులో కలిగే చిన్న అనుభూతితో సంతృప్తి చెందడం, అదే నిజము అని అనుకోవడం కాదు గాని, మరి సంఘములోనికి చేర్చబడడం లేదా కొంచెం సిద్దాంతం తీసుకోవడం అదే కాదు. కాని కల్వరి యొక్క శక్తి ద్వారా మిమ్ములను అదే దోషాల నుండి విడిపించింది. ఏదో మిమ్ములను విడిపించింది. ఇంక దోషము అనేది లేనే లేదు. బైబిలు ఇలా చెబుతుంది, నేను నమ్ముచున్నాను రోమీయులకు వ్రాసిన పత్రిక 5:1లో "కాబట్టి యిప్పుడు క్రీస్తు యేసునందున్నవారికి ఏ శిక్షావిధియు లేదు, శరీరానుసారముగా నడిచేవారు కాదు, ఆత్మానుసారముగా నడిచేవారు."
ROM 8:1,32•
2COR 5:17•
COL 3:1,2
17ఇప్పుడు ఒక వ్యక్తి లేదా స్త్రీ పాపం నుండి విడిపింపబడిన తరువాత వాళ్ళకు లోకంలో ఉన్న వాటి వైపు వెళ్ళాలనే కోరిక ఏ మాత్రం వారి హృదయంలో ఉండదు. అతడు ఉచితంగా క్షమించబడ్డాడు మరియు క్రీస్తు యేసులోనికి నూతన సృష్టిగా మారతాడు. మరియు అతని యొక్క ఆశలు అన్ని పైనున్నవాటిపైనే, క్రీస్తు అతనిని సరైన రీతిలో దేవుని చేతిలో ఉంచాడు. అతను స్వేచ్చగా విడిపింపబడ్డాడు. అతనికి ఎవరో ఒక యాజకుడు లేదా ఎవరో ఒక సంఘపు పెద్ద అతనికి చెప్పనవసరం లేదు. అతనికి అతను క్షమించబడ్డాడు అని తెలుసు, ఎందుకనగా అతను దానిని మూలాల నుండి అంగీకరించాడు. తన కోసమే దేవుడు క్షమాపణను యేసుక్రీస్తు ద్వారా పంపారని పాపం నుండి మనం విడిపింపబడ్డామనేది, నిజంగా, అది ఎంత చక్కని అనుభూతి కదా!
18నేను చెప్పాను, దాస్యము నుండి విడుదల ప్రకటన అయినప్పుడు దక్షిణాన ఉన్న బానిసలు చాలా సంవత్సరాల క్రితం, ఒక రోజు ఉదయాన్న చాలా స్వేచ్ఛగా సూర్యుని ఉదయాన్ని చూస్తారు. వారందరూ ఆ పాతకాలపు చెట్లు నాటే పద్ధతి నుండి బయటికి వచ్చారు. చాలా మంది యవ్వనస్తులు ఆ పర్వతం శిఖరం పైకి ఎక్కారు, ఎందుకనగా వాళ్ళు సూర్యున్ని మొదటిగా చూడాలని మరియు తరువాత పెద్దవారు, వారి కంటే కొంచెం క్రింద ఉన్నారు. పర్వతం అడుగున స్త్రీలు మరియు పిల్లలు ఉన్నారు. మరియు వారు చాలా సమయం ఆ పగటి వెలుగు కోసం వేచి ఉన్నారు. ఎందుకనగా బానిస కట్లు, కఠోరమైన శ్రమలు వారి యొక్క జీవితాన్ని దుఃఖముతో నింపివేశాయి. అందుకే వారు ఆ క్షమాపణ అనే రోజు కోసం ఎంతగానో ఎదురు చూస్తారు.
మరియు ఆ దాస్యం నుండి విడుదల ప్రకటన అయిన వెంటనే, ఆ ప్రత్యేకమైన రోజున వారు ఎంతో స్వేచ్చగా సూర్యుని వెలుగును చూశారు. ఆ పర్వతాల పైకి ఎంతో ఆతురతగా ఎక్కి గంటల తరబడి ఆ సూర్యుని ప్రకాశాన్ని చూశారు. ఓ, ఈ రాత్రి పాపులకు కూడా మీరు క్షమించబడ్డారు అనే తపన కలిగి ఉండాలి. ఎందుకనగా మీరు క్షమించబడ్డారు. మీరు యేసుక్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించిన నిమిషంలోనే మీరు క్షమించబడ్డారు. అప్పుడు మీరు క్షమించబడినారు.
వారు చెప్పారు, ఆ యావ్వనస్తులు ఎదురుచూస్తున్నారు. ఎప్పుడైతే సూర్యుడు తూర్పున ప్రకాశించడం మొదలుపెట్టాడో, వారు క్రింద ఉన్న పెద్దవారికి వినబడేటట్లుగా కేకలు వేయడం ప్రారంభించారు. "మనం స్వేచ్చను కలిగి ఉన్నాం"; ఆ పెద్దవారు అడుగున ఉన్న స్త్రీలకు మరియు పిల్లలకు వినబడేటట్లు, "మనం స్వేచ్చాపరులం" అని కేకలు వేశారు." —ఎందుకనగా సూర్యుడు ప్రకాశిస్తూ పైకి వస్తున్నాడు.
GEN 2:17•
REV 20:10
19ఓ, ఎప్పుడైతే మానవులు పాపమునకు అమ్మబడ్డారో, అప్పుడు దేవుని కుమారుడు ఆ సమాధిలో నుండి ఉదయాన్నే ఎలా పైకి లేచారో, మన న్యాయోచితమైన దాస్య విముక్తికై దేశాలు అన్ని కూడా అలాగే కేకలు వేయాలి, అదే తగినది అని నేను అనుకుంటున్నాను. "మనము పాపము నుండి శాపము నుండి విడిపింపబడ్డాము. కల్వరి ఒడంబడికను బట్టి స్వేచ్చగా క్షమించబడాము." ఇంతకంటే గొప్పది ఏది కూడా మానవజాతికి ఇవ్వబడదు.
ఏదేను తోటలో ఎప్పుడైతే మానవుడు పాపం చేశాడో, అప్పుడే అతనికిని, నిత్యజీవమునకు పెద్ద అగాధమును ఏర్పరచుకున్నాడు. ఆ కాలంలో, అంటే మొదట్లో, మనిషి దేవునితో నిత్యత్వాన్ని కలిగియున్నాడు. అతనికి బలహీనతలు, రోగాలు, దుఃఖము లేదా మరణం కూడా లేవు. మనిషి మరణించడానికి తయారు చేయబడలేదు. నరకం మనిషి కోసం తయారు చేయబడలేదు. అవును నరకం (మానవజాతి) కోసం కాదు, సాతాను మరియు అతని దూతల కొరకు మాత్రమే. మనుషులను దేవుడు ఎందుకు చేశాడంటే, భూమి మీద దేవుని కుమారులు మరియు దేవుని కుమార్తెలుగా ఉండటానికే. కాని మనిషి ఎప్పుడైతే పాపం చేసి, మంచి - చెడు అనే సరిహద్దు రేఖను దాటి వెళ్ళాడో, అప్పుడే అతను దేవుని నుండి వేరు చేయబడ్డాడు. తనకు తానుగా ఒంటరిగా వేరు చేయబడ్డాడు. అతను పూర్తిగా సర్వస్వాన్ని కోల్పోయాడు. అతను మరల వెనుకకు తిరిగి రాలేడు, ఎందుకనగా అతను పాపం చేశాడు.
అయితే దేవుడు అధిక కృపాసంపన్నుడు గనుక మనకు బదులుగా ప్రత్యామ్నాయ వ్యక్తిగా ఉన్నారు. ఎందుకనగా ఆయన చెప్పారు, "నీవు దీనిని తిను దినమున, నిశ్చయముగా ఆ రోజే చస్తావు," మరియు దేవుని న్యాయము మరియు ఆయన పరిశుద్ధత, చావు అని అన్నది, ఎందుకనగా అది ఆయన వాక్యము. ఆయన తన మాటను స్థిరము చేయును, ఎందుకనగా ఆయనే దేవుడు కాబట్టి.
GEN 2:17
20మరియు ఇప్పుడు, మానవజాతి యెడల ఆయన కలిగి ఉన్న ప్రేమ ఎప్పటికి ఆయన నుండి విడిపోనిది మరియు ఏదేను తోటలో ఆయనకు ఆయన పిల్లలకు ఉన్న ఎంతో అన్యోన్యంగా ఉన్న సమయంలో, గుండె పగిలిపోయే సమయం. ఆయన అన్ని సమయాల్లోను తన మాట స్థిరపరచును. ఆయన చెప్పారు, "నీవు దీనిని తిను దినమున, నిశ్చయముగా ఆ రోజే చస్తావు." అప్పుడు, మనము దీనిపై నమ్మకం ఉంచవచ్చును, అదేంటంటే దేవుడు ఏది చెప్పినప్పటికీ అది నిజం. అది అలా జరగాలి అంతే. దేవుడు తన మాటలని వెనక్కి తీసుకోడు, చూడండి, ఎందుకనగా ఆయన అంతములేనివాడు మరియు శాశ్వతమైనవాడు. మరియు ఆయన మొదట తీసుకున్న నిర్ణయమే, అన్ని సమయాల్లో పాటించే నిర్ణయం దాని నుండి ఆయన నేర్చుకొనెను. ఆయన అంతము లేనివాడు, దానితో ప్రారంభించడానికి మరియు చివరిగా దేవుడు ఏదైనా చెప్తే, అదే అసలైన మార్గము. అది ఎన్నటికి మారదు ఎందుకనగా అదే అసలైన సరియైన నిర్ణయం.
అటుతరువాత ఆయన నిర్ణయానికి తగినట్లుగా అంశాలపైన తన మార్గములో ఆయన స్పందిస్తారు, ఆయన ఎలా స్పందించారో అదే రీతిలో కడవరకూ ఆయన ఆ అంశాలపై తన నిర్ణయాన్ని కలిగి ఉంటారు. చివరికి, ఆయన ఒకవేళ మనిషిని రక్షించడానికి ఒక మార్గమును ఏర్పరచితే, ఆ మొదటిగా ఏర్పరచిన దానినే చివరి వరకూ ఆయన అదే రీతిలో ఉంచుతారు. మరియు దేవుడు ఒకవేళ రోగులను స్వస్థపరుస్తానని ఆయన వాగ్దానం చేస్తే, మీరు దానిని విశ్వాసంతో దానిని నమ్మగలిగితే, అదే రీతిలో ఆయన చివరి వరకూ ఆ మార్గములోనే ఉంచుతారు. ఆయన దానిని వెనక్కి తీసుకోరు, చూడండి. ఆయన నిరంతరం ఒక్కటే రీతిగా, ఒకే మార్గము ఉన్నారు.
21ఇప్పుడు, దేవుడు ఏదేను తోటలో పడిపోయిన మానవుని కొరకు ఒక ప్రత్యామ్నాయ వ్యక్తిగా అంగీకరించబడి, మరియు ఆ త్యాగపూరితమైన రక్తము ద్వారా మార్గము సరాళమైనది. రక్తము ద్వారా వెల చెల్లించబడినది. మరియు అదియే ఎప్పటికినీ ఒక్కటే రీతిగా ఉండును. అక్కడ దానికి వేరుగా లేదా బదులుగా మరొకటి ఏదీ లేదు, ఆ రక్తం స్థానంలో మరొకటి లేనేలేదు. అదియే రక్తము. దేవుడు తన పిల్లలను తిరిగి తన వద్దకు చేర్చుకొనే ఒకే ఒక్క మార్గము, అది ప్రత్యామ్నాయంగా ఉన్న ఆయన రక్తము మాత్రమే, వేరే ఏదీ కూడా వెలగా చెల్లించబడదు. ఏదీ కూడా చెల్లించలేదు. దేవుని మొదట నిర్ణయమే అసలైన నిర్ణయము మరియు అదియే నిత్యజీవము. మరియు అది మనకు సత్యమని తెలుసు అది ఏమిటంటే దేవుడు ఎన్నడు అబద్దమాడడు మరియు ఆయన తన మాటని వెనక్కి తీసుకొనడు. ఆ కాలము నుండి కూడా దేవుడు ఒకే మార్గము కలిగి ఉన్నాడు, మరియు ఒకే స్థలంలో మనుషులతో సహవాసము కలిగి ఉన్నాడు.
ఇప్పుడు, అంశం…
MATT 9:24,25•
MARK 5:39-41•
LUKE 8:52-54•
JOHN 11:25,26
22ఇప్పుడు, మరణం అనే పదం అర్థం ఏమిటంటే, విడదీయబడడం. మనము ఈ విధంగా మరణిస్తే, ఇలా అని కాదు… మన శారీరక మరణం, ఈ విధమైన మరణం కాదు. యేసు చెప్పారు, "నా యందు విశ్వాసముంచినవారు, మరణించినప్పటికీ వారు జీవిస్తూనే ఉంటారు: ఎవరైతే నాయందు విశ్వాసముంచి జీవిస్తారో, వారు ఎన్నటికినీ చనిపోరు." ఇప్పుడు, ఇక్కడ "మరణం" అనే పదం చెబుతున్నది ఏమిటంటే, దేవుని సముఖము నుండి వేరుపరచడం అని అర్థం. కాని శారీరక మరణం ఇక్కడ మనం పొందేది ఎంత మాత్రము అది మరణం కాదు. మనము ఇంకా దేవుని సముఖమునందు ఉన్నాము. మనము ఈ స్థలం నుండి ఆయనకు దగ్గరగా ఉన్న స్థలంలోనికి మార్చబడతాము, అది కూడా ఆయన సమక్షంలో. అది మనము మరణంగా పిలిచే మరణం కానే కాదు… అది కూడా ఇక్కడ ఇలా పిలుస్తాము.
గుర్తుంచుకోండి, వారు ఆయనతో ఈ బాలిక చనిపోయింది, యాయీరు కుమార్తె అన్నారు. ఆయన "ఆమె చనిపోలేదు, కాని నిద్రించుచున్నది." మరియు వారు ఆయనను వెక్కిరంతగా నవ్వకున్నారు. ఎందుకనగా వారి దృష్టిలో ఆమె చనిపోయింది, చనిపోయిన బాలికను నిద్రించుచున్నది అని చెప్పారని వారు ఆయనను తిరస్కరించారు. కాని యేసు చెప్పారు, "ఆమె నిద్రించుచున్నది," మరియు ఆయన వెళ్ళి, ఆమెను మేల్కొలిపెను, మరియు ఆమె తిరిగి జీవాన్ని పొందుకొనెను.
23ఇప్పుడు, ఆదాము నుండి ఇప్పటి వరకూ మనిషి తనకు తానుగా ఒక ప్రత్యామ్నాయాన్ని ఏర్పరచుకోవాలని చూశాడు. దేవుడు తనకు చేసిన దానికంటే మరి ఇంకా ఎక్కువగా ఏదో చేయాలని తన శక్తికి మించి శ్రమపడ్డాడు. మరియు అది సహజంగా మనిషిలో ఉన్నది. మనిషి ఎప్పుడూ కూడా ఇంకా ఏదో మంచిగా, రకరకాల మార్గాలలో ఏదో చేయాలని ప్రయత్నిస్తాడు. దేవుని యొక్క ప్రణాళికలోనికి మనిషి తన సొంత ఆలోచనల్ని ప్రవేశ పెట్టాలని చూస్తాడు. అందుచేతనే మనము వేరు చేయబడి ఈ రాత్రికాల సమయములో ఇలా నిలబడి ఉన్నాం, అంతే కాదు ప్రపంచంలో ఉన్న క్రైస్తవ ప్రజలు అనేక అడ్డంకులు, శాఖాపరమైన ఆటంకాలతో వేరుపరచబడ్డాం. మనము… ఈ విధంగా అవ్వడానికి కారణం తెలుసా? మనిషి తన సొంత ఉద్దేశాల్ని, సొంత ఆలోచనల్ని దేవుని ప్రణాళికలోనికి ప్రవేశింపజేస్తున్నాడు. మొన్నటి ఆదాము మొదలుకొని నేటి వరకూ కూడా, నేను చెప్పిన మార్గంలోనే ఉన్నారు.
ఏదేను తోటలో ఆదాము దేవునిని ఎదుర్కోవడానికి తప్పు చేశాక ఆకులు గుడ్డలుగా కట్టి కప్పిపుచ్చడం ఆ విధంగా ఆలోచించాడు. అతను అతనిగానే అది చేశాడు. ఆ విధంగా చేయడం ద్వారా అతను విద్యను, ఎతైన కట్టడాలను, నగరాలను, విగ్రహాలను, నాగరికతను, శాఖలను నేర్చుకున్నాడు. కాని అది ఇప్పటికీ అలానే ఉంది; దేవుడు తన అంశాలు అన్నింటిని రక్తము ద్వారా మాత్రమే అంగీకరిస్తారు. అది అంతే.
24విద్య పూర్తిగా విఫలమైంది. ఎక్కువ విద్య గనుక అభ్యసిస్తే ఒకరి నుండి ఒకరం పూర్తిగా దూరమవుతాం. శాఖలు కూడా పూర్తిగా విఫలమయ్యాయి. ఒక శాఖ కంటే మరొక శాఖ ఎక్కువని తలంచుచూ మనకు మనమే సరిహద్దు గీతలు, ఆటంకములు కలుగజేస్తూ, సహవాసాన్ని ముక్కలు చేస్తున్నాం. ఇంక నాగరికత అంటారా, అది చాలా వరకూ గందరగోళాన్ని తీసుకువచ్చింది. నగరాలు, ఎతైన కట్టడాలు మరియు ఇంకా మరెన్నో ఎక్కువైనవి అన్ని కూడా విఫలమైనాయి. మరియు ఆయన రక్తము క్రింద, దేవుని ప్రణాళిక ఇంకా అలానే నిలిచియున్నది.
ఈ రక్తము ఖచ్చితముగా ప్రదర్శించబడవలసిన రక్తము. తోటలో… పూర్వకాలములో ఏ మాత్రము, ఇశ్రాయేలీయులు ఒక గొర్రెపిల్లను చంపి, దాని రక్తాన్ని ద్వారబంధాల మీద, తలుపు అడ్డ, నిలువ కమ్మెలపై ఉంచమని దేవుడు చెప్పారు. అక్కడ పరిస్థితి ఏమైనప్పటికీ, గురుతు అక్కడ ఉండాలి. అప్పుడు అక్కడ ఉన్న మనుష్యులు సున్నతి చేయబడిన ఇశ్రాయేలీయులు అనబడుదురు. వారు బాహాటముగా "మేము యెహోవా చెప్పిన ప్రతి మాటను నమ్ముచున్నాము." కాని అది దానిని వెళ్ళగొట్టలేకపోయెను. వారు ఖచ్చితముగా ఆ గురుతును చూపించాలి, ప్రదర్శించాలి. రక్తము ఖచ్చితముగా చూపించబడాలి. ఈ రాత్రి కూడా అదే జరగాలి. ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి దానిని నుండి యేసుక్రీస్తు యొక్క రక్తము ప్రతి ఒక్క క్రైస్తవుడ్ని కడిగిందని నేను నమ్ముచున్నాను.
25ఇప్పుడు ఆ కాలములో, ఆ గురుతు ద్వారముపై ఖచ్చితముగా ఉండాలి. అది నిశ్చయముగా అక్కడ ఉండాలి, ఆ గృహము ఎంత మత సంబంధముగా ఉన్ననూ, ఆ ప్రజలు ఎంత మత సంబంధముగా ఉన్ననూ, వారు వాళ్ళ పిల్లలను ఎంత ఉన్నతంగా తీర్చిదిద్దిననూ, వాళ్ళు ఎంత చక్కగా సంఘమునకు వచ్చినను, వారు దేవుడు చెప్పిన ప్రతి మాటను ఎంతో చక్కగా పాటిస్తూ కనిపించిననూ, ఇంకా ఆ చివరి ఒక గంట సమయములో అక్కడ రక్తము గనుక ప్రదర్శించకపోతే, జీవము మరియు మరణము మధ్య తేడా చూపించబడినది. ఒక ఆరాధికుడిని స్థానంలో ఒక నిరపరాధిని ఆ రక్తము చూపించినది. ఆ ఎర్రటి రక్తం దానికి అదే తలుపుపై ఒక గురుతుగా ఉన్నది. మరియు ఆ గృహము రక్తము క్రింద సురక్షితముగా ఉన్నదని ఆ రక్త బాంధవ్యము చూపించుచున్నది.
ఇప్పుడు, అది ఒక మాదిరియైయున్నది.
26ఇప్పుడు, మరలా ఈ చివరి దినాల్లో, మరలా మనము అదే గడియలలోనికి దేవుడు తన సంఘమును విడుదల చేయుటకు సిద్ధముగా ఉన్నాడు. నేను దానిని నమ్ముచున్నాను మరియు ఖచ్చితముగా రక్తము ఒక జ్ఞాపక చిహ్నంగా నిలిచియున్నది, ఏ విధముగా ఆ గురుతు ఆ నాడు చేసిందో అలాగే అది ఈ రోజుల్లో కూడా అవసరమై ఉన్నది కాని, ఇప్పుడు ఈ రోజుల్లో ప్రభువైన యేసు యొక్క రక్త బాంధవ్యము కలిగిన రక్తాన్ని గురుతుగా ప్రతి ఒక్కరి హృదయమనే తలుపు మీద వేయించుకోవాలి, కాని ఎవ్వరూ అలా చేయడం లేదు. అయితే మీరు చూడండి, ఆ కాలములో ఒక జంతువు చనిపోయింది, అదియే గొర్రెపిల్ల, మరియు ఆ జంతువు చనిపోయిందని చెప్పడానికే, దాని రక్తము ఆ ద్వారబంధాలపై ఉన్నది. ఆ ఆరాధికుని మీదకి ఆ జంతువు యొక్క జీవం రాదు, ఎందుకనగా జంతువుకి ఆత్మ లేదు. అందుకనే ఆ జంతువులో ఉన్న జీవం ఆ ఆరాధికుని మీదకు రాదు.
EXOD 12:13
27అయితే ఈ రోజు, దేవుని యొక్క సొంత కుమారుని రక్తము మనలను క్షమించడానికి, విమోచించడానికి ఎప్పుడైతే కల్వరి యొద్ద చిందించబడిందో, ఆ రక్తములో ఉన్న జీవం ఏదో కాదు అది దేవుని జీవమే. పరిశుద్ధాత్మ తిరిగి ఆయన సంఘము మీదకు, ఆయన విశ్వాసుల మీదకు వచ్చును, మరియు ఈ చివరి దినాల్లో అదే ఒక గురుతుగా ఉన్నది. ఏ పురుషుడు మరియు స్త్రీ వారికి ప్రత్యామ్నాయముగా (బదులుగా) యేసుక్రీస్తు యొక్క మరణమును అంగీకరించియున్నారో వారిని ఆయన దాటుకొని పోవును. మరియు పరిశుద్ధాత్మ సాక్ష్యమిచ్చుచున్నది.
"నేను దానిని పొందుకున్నానని" నీవు చెప్పావు. అయిననూ నీవు ఇంకా ఈ లోకంలోనే జీవిస్తున్నావు, నీవు ఇంకా లోకానుసారంగా, లోకం వలే జీవిస్తావు, అందుకే నీ జీవితములో పరిశుద్ధాత్మ అనే రుజువు నిన్ను తాకేంత వరకూ ఆ జీవము నీదే అన్న రుజువు నీ జీవితములో నువ్వు కలిగియుండవు. "నేను ఆ రక్తమును చూశాను" ఈ చివరి దినాలలో ప్రతి ఒక్క పురుషుడు మరియు స్త్రీ కూడా ఈ గురుతును రుజువుగా ఆధారంగా కలిగి ఉండాలి, అదే దేవుని అవసరతయై ఉన్నది.
MATT 28:20•
JOHN 3:5•
JOHN 14:17,19•
HEB 10:2•
HEB 13:8
28యేసు చెప్పారు, "నిజంగా, నిశ్చయముగా నేను మీకు చెప్తున్నాను, ఒకడు నీటి మూలముగాను, ఆత్మమూలముగాను తిరిగి, జన్మిస్తేనే తప్ప, అతడు దేవుని రాజ్యమును ఎన్నడు చూడనేరడు?" కావున అది అన్ని సమయాలలో (ఆయన) దేవుడు ఏర్పరచిన దేవుని కార్యము — రక్తము.
ఆ రక్తమే పాత నిబంధనలో ఉన్నది; ఆ రక్తమే కొత్త నిబంధనలో ఉన్నది. పాత నిబంధనలో ఈ రక్తబాంధవ్యం ఎలా ఉందంటే, మంచి జీవం తిరిగి రావాలి. ఒక ప్రత్యామ్నాయంగా ఒకరిని బలిచేసే విధంగా ఉన్నది, కాని ఆరాధికుడు తన గొర్రెపిల్లను తెచ్చి బలి అర్పించినప్పటికీ అతను తిరిగి తన మనస్సాక్షికి దోషిగానే వెళ్ళేవాడు. కాని ఈ మార్గములో, ఒకసారి ఆరాధికుడు పరిశుద్ధము చేయబడిన తరువాత తన అంతరాత్మలో ఇక ఆ పాపం ఉండదు, అతను చనిపోయిన, గతించిపోయిన, మరియు మీరు మరణం నుండి జీవములోనికి మారారు. మీరు క్రీస్తు యేసులో మరల తిరిగి నిత్యజీవాన్ని పొందుకొని జీవిస్తున్నారు, మీలో పరిశుద్ధాత్మడు నివాసం చేస్తున్నాడు, ఎందుకనగా నీలో తిరిగి యేసుక్రీస్తు జీవితాన్ని తీసుకువస్తున్నాడు. అందుకే బైబిలు చెప్పుచున్నది, హెబ్రియలకు 13:8, "యేసుక్రీస్తు నిన్న, నేడు, నిరంతరము ఏకరీతిగా ఉన్నాడు."
దేవుడు తన సంఘములన్నియు అజాగ్రత్తలేని శాఖలుగా, విశ్వాస గుంపుగా రంగు లేదా మరి ఏదైనప్పటికి ఆయన తన సంఘములన్నియు ఆ గొప్ప స్థితికి చేరి, యేసుక్రీస్తు యొక్క మరణాన్ని ఒక చిహ్నంగా చూపాలని ఆయన ఎంతగానో, (ఎన్నో గంటలు) ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నారు. "కొద్ది క్షణములు," ఆయన చెప్పారు, "ఈ లోకము ఇక నన్నెంత మాత్రము చూడదు; కాని మీరు నన్ను చూస్తారు: ఎందుకనగా నేను జీవిస్తున్నాను, మీరును జీవిస్తున్నారు. ఈ యుగ సమాప్తి వరకు నేను మీలోను, మీతోను ఉంటాను." యేసుక్రీస్తు నిన్న, నేడు, నిరంతరము ఏకరీతిగా ఉన్నాడు.
29నేను కొంతమంది క్రైస్తవులు, దేవుని కోసం అభిషేకంచబడిన స్త్రీ పురుషులను వాదించడం చూసాను. వారు సాక్ష్యం చెప్పడానికి సిగ్గుపడతారు, "ఆమెన్" అని చెప్పడానికి సిగ్గుపడతారు, సియోను పాటలు పాడటానికి సిగ్గుపడతారు, వారు అన్నిచోట్లా సిగ్గుపడతారు. యేసుక్రీస్తు సువార్త కొరకు సిగ్గుపడని ప్రజలను నాకు కావాలని ఆశపడుచున్నాను. నేను ఆశపడేది ఒకవేళ నాస్తికత్వంలాగా అనిపించినా గాని, వారు సిగ్గుపడరు. అక్కడ జీవితం కంటే ఎక్కువగా ఏదో జరిగింది. అదే జీవితం. ఆ జీవితం నిత్యత్వాన్ని కలిగి ఉన్నది, ఎందుకనగా వారు దేవుడిని ఒక ప్రత్యామ్నాయ వ్యక్తిగా కలిగి ఉన్నారు.
30నేను ఈ విధంగా పాడడాన్ని ఇష్టపడతాను. నేను తిరిగి వచ్చేసరికి వారు కొంతమంది కొరకు ప్రార్ధిస్తున్నారు, కొద్ది క్షణాలు ముందే అది లోపలికి తీసుకురాబడింది. మరియు అది ప్రార్ధనా అని, మాట్లాడడానికి మాత్రమే కాదు. నేను కూడా అక్కడ ఉన్నాను మరియు నేను పాటలు వింటున్నాను, చప్పట్లు కొట్టడం చూస్తున్నాను. మరియు మేము ఆశ్చర్యపోయాము… వారిలో కొందరు, నేను చూశాను, వారు పరుగెత్తుతూ, క్రింద నేలపడి దొర్లుతూ ఉన్నారు — వారు దానిని ఏమంటున్నారో తెలుసా? — ఆత్మతో నాట్యామాడుట."
మొదటిసారి, నేను దానిని విమర్శించాను, నేను ఈ పెంతెకొస్తు ప్రజలు ఆత్మలో నాట్యామాడుతున్నారు అని చూసి - "ఏమిటి ఇది? ఇది ఒక రకమైన మూర్ఖత్వం, అర్ధరాహిత్యం" అని భావించాను. ఆ తరువాత నేను బైబిలు చదువుచున్నప్పుడు ఆత్మలో నాట్యమాడడం గురించి కనుగొన్నాను. దెయ్యం కూడా అచ్చం ఇలానే కాపీ కొట్టి అసలైన దానిని తీసివేసి రాక్-అండ్-రోల్ మరియు మొదలగునది అందులో నింపింది; కాని అసలు సిసలైన నాట్యం దేవుని నుండి వస్తుంది. అవును అది నిజం. మరియు నాట్యం అనేది ఎల్లప్పుడు విజయం ద్వారా వస్తుంది.
EXOD 15:20•
1SAM 17:54•
1SAM 18:6
31దావీదు ఎప్పుడైతే గొల్యాతును చంపాడో, మరియు ఈ ఎర్రగా అగుపడే చిన్న బాలుడైన దావీదు, ఆ పేద్ద తలకాయను (గొల్యాతుది) ఈడ్చుకొని నగరంలోకి వస్తుంటే, ప్రజలు నాట్యమాడుతూ కలుసుకున్నారు. వారు విజయాన్ని కలిగి ఉన్నారు. దేవుని యొక్క శక్తిని బట్టి, మోషే ఎప్పుడైతే ఎర్ర సముద్రాన్ని దాటారో, మరియు మరొక ప్రక్క ఇశ్రాయేలు ప్రజలను తీసుకెళ్ళాడు, మిర్యాము అయితే తంబుర చేత పట్టుకొని, మరియు యెరూషలేము కుమారైలు అందరూ ఆ మార్గంలో సముద్రం మధ్యలో పైకి, క్రిందకి వెళుతూ, ఆ తంబూర వాయిస్తూ మరియు ఆత్మలో నాట్యం చేస్తూ వెళ్ళారు. అది ఒక పాత పెంతెకోస్తు కూటమిలాంటిది కాదా! నేను అటువంటి దానిని నా జీవితంలో చూడలేదు. నాతో నాకున్న సమస్యల్లా, నాకు సరైన విజయమే లేదు. కాని నువ్వు చివరగా ఆ విజయాన్ని పొందాలంటే, మరియు యేసుక్రీస్తు యొక్క రక్తము నీకు గుర్తుగా రావల్సిందే.
2SAM 6:16,23
32గొప్ప కీర్తనాకారుడు, బైబిలులో ఉన్న దావీదు నాకు గుర్తున్నాడు. అతను గొల్యాతును చంపి గొప్ప పని చేసినందుకు, అతనికి సౌలు కుమార్తె ఇవ్వబడినది. మరియు ఆమె ఒక రకమైన ముడుకునే స్వభావం, ఎవ్వరితోనూ మాట్లాడని స్వభావం కలిగిన విశ్వాసురాలు. దేవుని మందసం దేవునికి దూరంగా చాలా కాలం ఉన్నది, ఆ మందసంపై దేవుని ప్రసన్నత కనబడుతూ ఉన్నది అనడానికి, దానిపైనున్న అగ్ని స్థంభం అని చెప్పవచ్చును. సౌలు పరిపాలన కాలంలో ఫిలిష్తియులు వచ్చి దానిని తీసుకొని వెళ్ళారు. మరియు ఒక రోజు, ఎప్పుడైతే దావీదు దేవుని మందసం, దేవుని గృహానికి తిరిగి రావడం చూసాడో, దానికి ముందుగా పరుగెత్తుకొని వెళ్ళి మరియు అతడు దేవునిని స్తుతించుచు, పాటలు పాడుచూ, దేవుని సమక్షంలో నాట్యమాడాడు. దావీదు యొక్క ప్రవర్తనను అలా చూసి సౌలు కుమార్తె అతనిని చాలా అసహ్యించుకొన్నది. రాజకుమార్తె అయిన తన సమక్షంలో, తన భర్త, అదే ఆమె యవ్వన అందమైన భర్త అలా తప్పుగా ప్రవర్తించుట ద్వారా ఆమెకు అవమానంగా భావించింది. మరియు దావీదు ఇలా చెప్పెను, "నేను ఇలా చెయ్యడం నీకు ఇష్టం లేకపోతే ఇంకా కొద్దిసేపు ఇలానే చూడు అనెను." మరియు ఆ మందసం చుట్టూ గుండ్రంగా ఇంకా అలా గుండ్రంగా దాని చుట్టూ తిరుగుతూ, ఆత్మలో నాట్యం చేస్తూ తిరిగాడు. ఆమె అది చూసి ఇంకా అసహ్యించుకొన్నది. మరియు దేవుడు ఆమెను ఒక శాపంతో శపించాడు.
ఓ, యేసుక్రీస్తు రక్తము ద్వారా విజయము, క్రీస్తు పునరుత్తానం అనే గుర్తు, ఆయన సంఘములో ఆయన జీవము నివసించుచున్నది. ఆయన రక్తము క్రింద ఉన్న సహవాసము తప్ప వేరొక సహవాసము మార్గము లేనేలేదు. మన సంఘ శాఖలు మనలను వేరుపరుస్తాయి మరియు ఒకరు, "అది తప్పు," మరియు ఇంకొకరు "ఇది ఇలాగ, అది అలాగ, లేదా మరొకలాగా," అని చెప్తారు.
33పెంతెకోస్తు అనేది అసలు మన విధానం. ఎవ్వరు చెప్పకపోయినా లేదా చెప్పినా సరే, ఆనాటి కాలంలో ఆ సంఘము పెంతెకోస్తు దినమునే బైబిలు ప్రకారము ఆ పెంతెకోస్తు దినమున ఏ ఆత్మ అయితే ఆ రోజు వారి మీదికి వచ్చిందో, అదే ఆత్మ ప్రతీసారీ క్రమం తప్పకుండా దిగి వస్తుంది. ఎప్పుడైతే పరిశుద్ధాత్మడు ప్రజల మధ్యకు వస్తారో, అప్పుడు వారు అదే రీతిలో ప్రవర్తిస్తారు.
నన్ను ఒక విషయం చెప్పనివ్వండి, నేను అన్యమతస్తులు ఉండే చోటికి ఒక ప్రత్యేక అధికారముతో ప్రయాణమై వెళ్ళాను మరియు అక్కడ ఆ దీవులు దుప్పటి పరచి ఉన్నట్లు కొన్ని దీవులు కలవు. అక్కడ హోటేన్టాట్ అను తెగ స్త్రీలు ఉన్నారు. వారు నుంచుని చూస్తున్నారు. వారితో మనం ఒక ద్విభాషి ద్వారా మాత్రమే మాట్లాడగలం. వారి జీవితంలో ఎన్నడూ యేసుక్రీస్తు పేరునే వినలేదంట. నేను వారికి ఒక కథ చెప్పి, దేవునిని పొందుకున్నవారు ఎవరో చేతులు పైకి ఎత్తమన్నాను. మీరు ఇక్కడ పరిశుద్ధాత్మను పొందుకున్నప్పుడు ఎలా అయితే చేతులు పైకి లేపారో, వారు కూడా అలానే చేశారు. ఇది ఏమి సూచిస్తున్నది, నిత్య సంఘటనగా ఉన్నది. అదియే సర్వశక్తిమంతుని శక్తియై ఉన్నది, దేవుడు తన పిల్లలపై చూపిస్తున్న గుర్తుగా ఉన్నది, వారు ఎరుపైనా, నలుపైనా , తెలుపైనా లేదా మరేవిధంగానైనా వారు ఉన్నప్పటికీ. అది ఒక్కటే ఆయన సహవాసము ఇచ్చిన స్థలం.
2KGS 18:22
34నిమ్రోదు ఒక శిఖరాన్ని మరియు నెబుకద్నేజరు ఒక పట్టణాన్ని మరియు ఇంకా ఎన్నో చేశారు. వారు ఇవన్నీ శాస్త్రవేత్తలు మరియు ప్రతిదాని ద్వారా అలా చేశారు, కాని చివరకు నిలిచి ఉన్నది మాత్రం ఆయన రక్తమే… అదే విధంగా దేవుడు కూడా ఒక నిర్ణయాన్ని తీసుకున్నారు, అదేమిటంటే ఒక నిర్దోషియైన ప్రత్యామ్నాయ వ్యక్తిగా ఆయనే మనుష్యుల దోషాలకు క్షమాపణ కలిగించే స్థానంలో వచ్చారు, మరియు ఈ రాత్రి సమయం వరకూ అది అలానే ఉన్నది, మరియు అది ఎన్నటికిని మారదు.
యోబు దాని ప్రకారమే జీవించాడు — బైబిలులో ఉన్న గ్రంధాలలో యోబు గ్రంధము పురాతనమైనది. ఆ మనుష్యునికే అన్నిసంభవిస్తున్నప్పటికీ, ఆయన మాత్రం దేవుని యందు ఎంతో దృఢంగా ఉన్నాడు, ఎందుకనగా ఆయనకు తెలుసు, ఆయన యెహోవా అవసరతలు అన్నియు కలిగి యున్నాడు. ఆయన చేసేది ఆయనకు ఒప్పు అని తెలుసు. అబ్రాహాము కూడా అదే విధంగా, ఇంకా మరెందరో ఇశ్రాయేలీయులకు ఒకే ఒక స్థలంలో సహవాసం కలిగి ఉన్నారు, అది కారుచున్న రక్తము. యెరూషలేం నందు మనుష్యులు ఎక్కడైనా, ఏ ప్రాంతంలోనైనా ఆరాధించడానికి తగును, అది ఎప్పటి నుండి అంటే అక్కడ ఒక అర్పణ ఉన్నది, అది లేకపోతే ఆరాధనయే లేదు, మరియు ఆ అర్పణ ఏదో కాదు రక్తమే.
MARK 16:15-17
35ఈ రోజుల్లో, ఈ దినాల్లో ఇప్పటికి పూర్తిగా సంపూర్ణ విద్యా విధానాలు కలిగిన దేశాలు కానివ్వండి, మరియు అత్యున్నత నాగరికత కలిగినవి కానివ్వండి, మరియు మన అన్ని సైన్సు పరిశోధనలు అణువులను విచ్చిన్నం చేయడం, మరియు ఏదైనా చోటు చేసుకున్నప్పటికీ, ఒక రాకెట్ను చంద్రుని మీదకు పంపడం, ఒక ఉపగ్రహాన్ని పంపడం, ఏది ఏమైనప్పటికీ, మన అన్ని సైన్సు పరిశోధనలు, మన అన్ని శాఖలు, మన విద్యా విధానం అంతా, మన అన్ని పాఠశాల అవి అన్నియు వాటి ప్రారంభానికి ముందుగానే అవి కేవలం దేవుని యొద్ద నుండి మాత్రమే వచ్చినవి.
దీనిని బట్టి మనము మన హృదయాన్ని ఆ సర్వశక్తిమంతుడైన దేవుని శక్తికి, ఆయన చిత్తానికి మనలను అప్పగించుకోవాలి మరియు అప్పుడు పరిశుద్ధాత్మ ఒక గురుతుగా ఆ మనుష్యునిలోనికి వస్తుంది. "నమ్మినవారి వలన ఈ సూచక క్రియలు వెంబడి౦చును." అది ఎన్నటికి ఆ విధంగా నిలిచి ఉంటుంది. క్రీస్తు ఈ విధంగా చెప్పారు, "మీరు సర్వలోకమునకు వెళ్ళి, సర్వసృష్టికి సువార్తను ప్రకటించండి. నమ్మి బాప్తిస్మము పొందినవాడు రక్షింపబడును; నమ్మని వానికి శిక్ష విధింపబడును. నమ్మినవారి వలన ఈ సూచక క్రియలు వెంబడి౦చును." ఇది పరిశుద్ధాత్మ యొక్క లక్షణం, ఎందుకనగా ఆరాధికుడిని దేవుడు అంగీకరించాడు, యేసుక్రీస్తు యొక్క ఆత్మ మరియు జీవం ఆ ఆరాధికునిలోనికి వచ్చినందుకు.
36ఆ పాతకాలంలో, చిందించబడిన రక్తము క్రింద ఉన్న యూదులను మీరు ఊహించగలరా? ఇక్కడ అతడు ఆ మార్గము క్రిందికి దిగి వస్తున్నాడు. అది పాపాలకు ప్రాయశ్చిత్తం చేసుకునే రోజు, అతడు ఒక బలిని అర్పించబోతున్నాడు. అతనికి ఒక చక్కని క్రొవ్విన దూడను తెచ్చెను. అది యెహోవాకు బలి అర్పణ లేదా మనము ఒకవేళ అతను ఒక చక్కని, క్రొవ్విన గొర్రెపిల్లను కలిగి ఉన్నాడు అనుకుందాం. అప్పుడు యాజకుడు వచ్చి ఏదైనా దోషము ఆ పశువుపై ఉన్నదా అని చూచును. మరియు అప్పుడు అతడు ఆరాధన స్థలమునకు వెళ్ళును. అప్పుడు అతను తను పాపిని అని ఒప్పుకొని గ్రహించును. అతడు ఏ తప్పు చేశాడో, ఒప్పుకుంటాడు.
ఇప్పుడు, అతడు ఆ బలిపశువు మీద తన చేతులు ఉంచుతాడు. ఆ విధంగా తన చేతులు ఆ బలిపశువు మీద ఉంచడం ద్వారా తనే బలి అవుతున్నట్లు భావిస్తాడు. ఆ తరువాత ఎప్పుడైతే ఆ బలిపశువు మెడను వధిస్తారో లేదా దానిలో జీవం తీయబడుతుంది. అప్పుడు ఆ చేతులు తన మీద పెట్టుకుంటాడు. అతని జీవం కూడా పోయింది అని భావిస్తాడు, ఎందుకనగా ఆ బలిపశువు గిలగిల కొట్టుకుంటూ చనిపోతున్నప్పుడు మరియు ఆ రక్తము తన చేతుల మీద చిమ్మినప్పుడు చాలా బాధపడతాడు; అతడి కోసమే తన స్థానంలో ఈ బలి పశువు బలైందని గుర్తిస్తాడు. మరియు అతడు నీతిమంతునిగా తీర్చబడి, తిరిగి వెళ్తాడు, ఎందుకనగా అతడు యెహోవా కట్టడాలను నెరవేర్చెను.
37మరియు ఈ రోజుల్లో సరిగ్గా క్రైస్తవుల మధ్య కూడా అదే విధంగా జరుగుతుంది. చాలా రోజులు సండే స్కూలుకు రాకుండా, చాలా రోజులు ఆదివారాలు ఒక సంవత్సరంలో రాకుండా ఉండటం, ఒక కార్డులో సంతకం పెట్టినట్లుగా ఉండటం. తరువాత ఆరు నెలలు నేను త్రాగను అని దేవుని దగ్గర ప్రమాణం చేయడం. ఇవన్నీ అలా లేవా? ఆ కల్వరిలో ఆయన మన కోసం కార్చిన రక్తముపైన యేసుక్రీస్తు తలపైన, ఆయన క్షమాపణ పైన, దేవుడు ఇచ్చిన బలియాగంపైన మనము మన చేతులు ఉంచుచున్నాము. అప్పుడు ఆయనను మనము బాప్తీస్మము ద్వారా గుర్తించుచున్నాం, మరియు ఆయన చనిపోయి తిరిగి లేచెనని, మనము ఆయన నామములో పాతిపెట్టబడియున్నామని, ఇంకా మనము క్రీస్తులో ఒక నూతన జీవితాన్ని పొందుకొని, ఎదిగి, అందులోనే జీవించాలని గుర్తిస్తాము. మనము ఇదంతా ఎప్పుడు చేయగలమంటే యదార్థంగా జీవించినప్పుడే చేయగలం.
38ఈ విధంగా చేయండి, యెహోవా ఆజ్ఞలను పాటించండి అలా ఎవరు చేస్తారో వారే నీతిమంతులుగా తీర్చబడతారు. ఇప్పుడు యూదుడు కూడా నీతిమంతుడిగా తీర్చబడ్డాడు, ఎందుకనగా యెహోవా ఆజ్ఞ ప్రకారం చేసినందుకు. చివరిగా. అదే సరైనది. యెహోవా చేసినదే అది, అదే ఆయనకు కావల్సినది. కాని చివరికి అదే కుటుంబం సంప్రదాయంగా మారినది. అదిగో పాపాల ప్రాయశ్చిత్తం రోజు వచ్చింది మరియు యూదులు ఏదో ఒక తప్పు చేస్తు ఉంటారు. అతడు చెప్తాడు, "అవును, పాపాల ప్రాయశ్చిత్తం రోజని నేను నమ్ముచున్నాను. నేను కూడా ఒక గొర్రెపిల్లను బలి ఇవ్వాలి." చూడండి, ఇది ఒక కుటుంబ సంప్రదాయంగా మారింది. వాళ్ళు దానిని నిష్కపటముగా చేయడము లేదు. కేవలము కుటుంబాలు కొన్ని చేస్తున్నాయి, కాబట్టి మనం కూడా చేయాలి. "వాళ్ళు ఏమి పనులు చేస్తున్నారో మనం కూడా అవే పనులు చేయాలి. అన్ని కుటుంబాలు చేస్తున్నాయి, మనం కూడా అలాగే చేయాలి తప్పకుండా."
సరిగ్గా అదే మన క్రైస్తవ్యం కూడా కలిగియున్నది. మన పెంతెకొస్తు కదలికలు వలె అది కూడా ఉన్నది. అది ఒక కుటుంబ సంప్రదాయం వలె ఉన్నది. చూశారా, మన బలులు ద్వారా మనం మరణించామని మనకి మనం గుర్తించలేకపోతున్నాము. మనము ఇలా చెప్తున్నాం, "ఓ, మేము క్రైస్తవులము, ఎందుకనగా నేను సంఘమునకు వెళ్ళి, అందులో నమోదు చేసుకోన్నాము."
నీవు సంఘములో నమోదు చేసుకోవడం మంచిదే. కాని నువ్వు గుర్తించబడేంతవరకూ కూడా నీ చేతులు ఆయనపై ఉంచాలి, మరియు నీవు, ఆయన ఒక్కటవ్వాలి; క్రీస్తు ఆత్మ నీలోనికి, నీవు క్రీస్తులోనికి మార్చబడేవరకూ: నీవు దేవుని కుమారుడు మరియు కుమార్తెగా మారునంతవరకు… అక్కడ వారు ఉండాల్సిన విధముగా యదార్థముగా ఉండుటలేదు. ఎయిడ్ ఒక మతాచారముగా మారుచున్నది. ఈ విధంగానే ఇప్పుడు చాలా మంది ప్రజలు మతాచారంగా క్రైస్తవులు అవుతున్నారు.
39ఇక్కడే కొద్దిసేపు క్రితం, ప్రార్ధనా వరుసలో ఉన్న ఒక యవ్వన స్త్రీని, "నీవు క్రైస్తవురాలివా?" అని అడిగాను.
ఆమె అన్నది, "మంచిది, నేను ఒక అమెరికన్ని, నేను మీకు అర్థమయ్యేలా చెప్తాను."
ఇప్పుడు, నీవు అమెరికన్ని అని చెప్పుట ద్వారా ఏమైనా దానితో చేయగలవా — ఒక అమెరికన్, గొప్పగా అమెరికన్ని అని చెప్పవచ్చును, కాని అది నువ్వు క్రైస్తవుడవని చెప్పుట లేదు. నీవు మరల తిరిగి జన్మించవలసినదే.
మరొక స్త్రీని అడిగాను, "నీవు క్రైస్తవురాలివా?" అని.
ఎందుకు, "మీకు అర్థమయ్యేలా చెప్తాను, నేను ప్రతి రాత్రి ఒక కొవ్వొత్తు వెలిగిస్తాను."
ఆ విధంగా దానితో ఏదైనా మనం చేయగలమా? మీరు క్రీస్తుతో కూడా గుర్తించబడియున్నారు మరియు ఆయన జీవం మీలో నివసించుచున్నది. ఎప్పుడైతే మనము క్రీస్తుతో కూడా గుర్తించబడతామో, ఎప్పుడైతే క్రీస్తు మనలో జీవిస్తారో, అది మతాచారాం కానే కాదు. అప్పుడది ఒక సంఘమునకు సంబంధించినది కాదు. అది అంతా చాలా మంచిదైయున్నది. అయితే మీరు చూడండి, నిజమైన యదార్థత…
MATT 6:9,10•
LUKE 11:2
40మనము స్వస్థత కూడికలకు వచ్చినప్పుడు, ఆ వరుసలో తెలివైన వారిని గుర్తిస్తాము, వారితో "పశ్చాతాపపడమని మాటిమాటికి ప్రజలకి చెప్పాలి," చూశారా. మీరు అలా వెళ్ళున్నప్పటికీ…
మన ప్రార్థనలు ఒక సంప్రదాయంగా మారినవి. మనము రాత్రి సమయములో మోకరించి, ఇలా చెప్పాము, "ప్రభువా, ఫలానాది దీవించు, మరియు అది దీవించు, ఇది చెయ్యాలి. సహో యోహాను అన్ని చెయ్యడానికి సహాయం చెయ్యి." నువ్వు దేవునిని ఒక అదృష్ట వ్యక్తిని చేస్తావు, లేదా నీవు పని కోసం పంపిన ఒక రకమైన చిన్న పిల్లాడిలా చేస్తావు. "దేవుడా, నాకు నువ్వు ఇది చెయ్యి, మరియు అది చెయ్యి, మరియు అలా చెయ్యి, ఇలా చెయ్యి." యేసు మనకు అలా ప్రార్థన చెయ్యమని చెప్పలేదు. ఆయన ఇలా ప్రార్థించమని చెప్పారు, "పరలోకమందున్న మా తండ్రి! నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు జరుగుచున్నట్లు, భూమి మీదను జరుగును గాక." కాని మనమైతే మనకి ఏది కావాలో, దాని కోసం మనం దేవునికే ఆజ్ఞాపిస్తున్నాం.
మరియు సంఘము చల్లారిపోవడానికి అదే కారణమైయున్నది. అందుకే ఆ గొప్ప ఉజ్జీవం, అది ఇప్పుడే నేలను తాకగా, అనేక మిలియన్ల మంది సంఘములోకి వెళ్తున్నారు. దైవికమైన వేదనను మరియు నీలో పరిశుద్ధాత్మను దాని కార్యాలయములో పనిచేయనివ్వక, మరియు నీలో నూతన జీవితాన్ని కల్పించనివ్వక, మరియు అది నిన్ను ఎంతో ఆకలిగా నీవు సంఘమునకు వెళ్ళకుండా — వారి అనుభవాలను వారు ఆ చోటులో పంచుకుంటున్నారు, మరియు అలా వారు సాంప్రదాయంగా వెళ్తున్నారు. అప్పుడు, అది ఏమైనది. టిక్కెట్ల మీద సంతకం పెట్టి నమోదు అయ్యి… మొదలగునవి; నీలో క్రీస్తు జీవితాన్ని కలిగి ఉండాలి, అది అతడిని సంఘమునకు వెళ్ళునట్లు చేయును. నీలో ఏదో నిన్ను ఆ విధంగా నెట్టుతుంది.
41ఒక చిన్న ఇంటర్వ్యూలో ఒక యవ్వనస్తునితో నిన్న ఈ విధంగా చెప్పాను. నేను "ఒక గేమ్ వార్డెన్ గా, ఇండియానాలో ఉన్నప్పుడు తరచుగా నేను ఒక చిన్న సెలయేరు వెంబడి వెళ్ళేవాడిని. మరియు అక్కడ… నేను నా జీవితంలో ఎన్నడూ చూడనటువంటి, ఎల్లప్పుడూ సంతోషంగా ఉండే సెలయేరు అది. ఇండియానాలో ఉన్న గొప్ప సెలయేరులు, చక్కని చల్లని నీటిలో నీటిబుడగలు కలిగి, సున్నపురాయి నీళ్ళు కలిగి ఉంటాయి. ఒక రోజు నేను ఆ సెలయేరు దగ్గర కూర్చొని, దానితో మాట్లాడాలనుకున్నాను. అది ఎలాగంటే మోషే మండుచున్న పొద దగ్గరకు వెళ్ళి మాట్లాడినట్లు, అని నేను తలంచుచున్నాను. మరియు నేను చెప్పాను, "ఓ చిన్న సెలయేరా! నీవు అన్ని సమయాల్లోనూ నీటి బుడగలు కలిగి ఉంటున్నావు, నీ సంతోషానికి కారణం ఏమిటి? ఒకవేళ నేను శీతాకాలంలో ఇక్కడికి వస్తే, నీవు నీటిబుడగలుతో ఉంటున్నావు. ఒకవేళ నేను వసంతకాలంలో, వేసవిలో, ఆకురాల్చే-కాలంలో ఎప్పుడు వచ్చినప్పటికీ, నీవు నీటి బుడగలతో నిండి సంతోషంగా ఉంటున్నావు. అది ఎందుకనగా ఒకవేళ కుందేళ్ళు వచ్చి మరియు నీలోని నీటిని త్రాగుచున్నందున, నీవు సంతోషంగా ఉండి ఉండవచ్చునా?
మంచిది, ఇప్పుడు అది గనుక మాట్లాడితే, ఇలా చెప్పవచ్చు - "కాదు, అది - మీరు అనుకున్నది కాదు."
నేను చెప్పేవాడిని, "మంచిది, ఒకవేళ జింకలు నీ దగ్గరకు వచ్చి మరియు నీలోని నీరు త్రాగుచున్నందున నీకు సంతోషం."
అది చెప్పవచ్చును, "కాదు, అది కూడా కాదు."
నేను చెప్పేవాడిని, "ఇప్పుడు, మంచిది, అది ఎందుకనగా ఒక వేళ నేను ఒకసారి అలా నీ దగ్గరకు వచ్చి మరియు నీలోని నీటిని త్రాగుతానని నీకు సంతోషం."
"కాదు, అది కానేకాదు. వారందరూ నా దగ్గరకు వచ్చి మరియు త్రాగుచున్నందుకు సంతోషమే, కాని నేను అన్నివేళల నీటి బుడగలతో సంతోషంగా ఉండటానికి అది కారణం కానే కాదు."
"మంచిది, మరి నువ్వు అలా నీటి బుడగలు కలిగి సంతోషంగా ఉండటానికి ఏంటి కారణం? మరి నువ్వు అంత సంతోషం కలిగి, నిరంతరం వేగముతో పారుచున్న విధమునకు కారణం ఏమిటి?"
ఒకవేళ అది గనుక మాట్లాడితే, ఇలా చెప్పింది, "అది నేను కాదు. అది నా వెనుక ఉండి, నన్ను నెట్టుచున్నది ఏదో ఒకటి అయ్యి ఉన్నది."
JOHN 4:14
42అదియే క్రైస్తవ అనుభవం కలిగి ఉన్న మార్గము. ఏదో ఒకటి కలిగి నువ్వు పని చేయడానికి ప్రయత్నించడం లేదా; అది ఏదో నీలో ఉండి, నీ వెనుక ఉండి నడిపిస్తుంది. అదియే నిత్యజీవం. అది నిన్ను కదిలింపజేస్తుంది, వేగముతో స్రవింపజేస్తుంది. ఎలాగంటే ఆ బావి దగ్గర స్త్రీతో ఆయన ఇలా చెప్పెను, "అది ఏమనగా, బావులలో నీళ్ళన్నియు, నిత్యజీవపు ఊటలుగా ఉద్భవిస్తాయి." ఎప్పుడైతే ఆరాధికునిలో క్రీస్తు గుర్తింపబడతారో అది ఆరాధికునిలోనూ ఉండును, ఎందుకనగా ఆయనకు తెలుసు, ఆయన జీవించుచున్నాడని. కాని మనము అది ఒక సంప్రదాయంగా మారుటను కోరుకోవడం లేదు.
AMOS 5:21•
ROM 4:21
43దేవుని ఆజ్ఞలుగా చేసుకున్న ఒక స్థలానికి ఇశ్రాయేలీయులు ఎప్పుడైతే వచ్చారో, అక్కడికి వారు వాళ్ళ బలులతోను, ఒక సంప్రదాయంగా వచ్చిన చోటికి, గొప్ప శక్తిమంతుడైన యెషయా ప్రవక్తను, "యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు" అని దేవుడు అతనిని వారి మధ్యకు పంపెను. ఎక్కడో ఒక చోట, ఏదో ఒక విధంగా, ఒక మనిషి భయపడకుండా ఉన్నది ఉన్నట్లుగా చెప్పడానికి దేవుడు అతనికి తన హస్తాన్ని తోడుగా అందిస్తాడు. అది ఏ ప్రాంతంలోనైనా, మరెక్కడైనా సరే…
మీరు ఒకసారి యెషయా 1వ అధ్యాయములో, యెషయా లేచి ఇలా చెప్పెను. నేను దానిని ఇక్కడ వ్రాసాను. ఆ ప్రజలకి యెషయా ఇలా చెప్పెను, "యెహోవాకు మీరు అర్పించు బలులు, నైవేద్యములు అవి దుర్గంధము కలిగి అసహ్యము కలిగించేవిగా ఉన్నవి. ఆయన వాటిని తృణీకరించెను," మరియు దహనబులులగు పొట్టేళ్లును బాగుగా మేపిన దూడల క్రొవ్వును మరియు ఇంకా అన్నియు, దేవుడు ఆజ్ఞాపించి చేయమనిన ప్రతిదానిని కూడా దేవుడు నీచముగా ఎంచెను. ఎందుకనగా వారు దానినంతటిని ఒక మతాచారంగా మార్చారు, అందుకే వాటిని అసహ్యించుకొనెను, దానిని మతాచారంగా వారు మార్చివేశారు.
మనము ఒక సంప్రదాయంగా, ఒక మతాచారంగా ఎప్పుడైతే వచ్చామో, మరియు అప్పుడు కూడా ఆయన మాటను బట్టి ఉన్నది ఉన్నట్లుగా సరిగా కూడా చెయ్యొచ్చును. "యెహోవా ఈలాగు సెలవిచ్చు చున్నాడు" అని మనం తెలుసుకొని, దాని దగ్గరకు రావాలి. ఒకవేళ దేవుడు వాగ్దానం చేస్తే, ఆ వాగ్దానానికి దేవుడు కట్టుబడి ఉంటాడు. అన్నివేళలలో ఆయన సమర్ధుడు. "ఆయన సర్వశక్తిమంతుడు," అబ్రహాము చెప్పిన విధంగా, "ఆయన వాగ్దానము చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడు." ఆయన అన్నివేళలా తన మాటను నెరవేర్చుటకు సమరుడైయున్నాడు.
44ఇప్పుడు, యెషయా వారితో ఇలా చెప్పెను. వారు చేయుచున్న ఇవి అన్నియు కూడా, వారు యదార్థత లేకుండా చేశారు. మిగిలిన వారందరూ చేస్తున్నారు కాబట్టి నేను కూడా అలా చేయాలి అని చేశారు. అంతే కాదు వారు అలా ఎందుకు చేస్తున్నారంటే, అది యెహోవాకు అవసరము గనుక, మరియు మా కుటుంబాలు అన్ని చేశాయి మరియు మా తల్లులు చేశారు, మరియు మా తాతలు అలానే చేశారు. వారు ఎందుకు అలా చేశారు?
ఇప్పుడు, మేము కూడా అలానే చేస్తాము. "మా తాతగారు ప్రెస్బిటేరియన్, అందుకని నేను కూడా ఒక ప్రెస్బిటేరియన్ని."
"మా నాన్నగారు ఒక బాప్టిస్టు, అందుకని నేను కూడా ఒక బాప్టిస్టుని."
మరియు ఇంకా, "మరియు మా నాన్న ఒక పెంతెకొస్తు, కావున నేను కూడా ఒక పెంతెకొస్తుని." అది అలా కాదు.
45మనము దేవుని దగ్గర ఎక్కడ వేరుచేయబడ్డామో దానిని గుర్తించే స్థానమునకు మనము వచ్చాము. మనము దేవునిని నుండి వేరు చేయబడ్డాం, మరియు మనము చిందించబడిన యేసుక్రీస్తు రక్తము అనే దాని ద్వారా వచ్చుచున్నాము. మనమందరమూ ఈ సమానమైన ప్రాంతంలో ఆ రక్తము క్రింద మెథడిస్టు, బాప్టిస్టు, లూథరన్, ప్రెస్బెటేరియన్, పెంతెకొస్తు వలె అందరం కలుసుకుంటాము. వారు సా౦ప్రదాయంతో లేదా మతాచారంతో కాదు, వారు ఒకే ఒక్క దాని క్రింద కలుసుకుంటారు, మరియు అది ఏదో కాదు అది కేవలం యేసుక్రీస్తు రక్తం క్రిందనే కలుసుకుంటారు.
ఎప్పుడైతే ఆ సంఘం వాటి మత సాంప్రదాయాల నుండి, ఆచారాలను విడిచి వారు దేవుని అసలైన ప్రణాళికలోనికి తిరిగితే, అటువంటి మనుష్యులు సంఘములో చేర్చబడటం కాదు గాని, దేవుని రాజ్యములో నూతనముగా జన్మిస్తారు. అప్పుడు ప్రతి చోట దేవుని రాజ్య సహవాసము ఏలుబడి చేయును. మరియు అప్పుడు "సముద్రమును నీళ్ళు కప్పునట్లుగా ఆత్మ భూమినంతటినీ కప్పును," ఎప్పుడైతే మనము ఆ స్థానానికి వస్తామో, అప్పుడు మనుష్యులు వారి భేదాలను మరచిపోయి, అందరూ కలసి ఆ రక్తము క్రింద సహవాసమునకు వచ్చెదరు.
మనమందరమూ బాప్టిస్టు ఆచారము క్రిందకి, లేదా ప్రెస్బిటేరియన్ ఆచారము క్రిందకి, లేదా మెథడిస్తు ఆచారము క్రిందకి, పెంతెకొస్తు ఆచారము క్రిందకి రానే రాము. అయితే మనమందరము యేసుక్రీస్తు రక్తము క్రింద సహవాసము కలిగి, కలుసుకొందుము, ఎందుకనగా దేవుని అసలైన ప్రణాళిక అదియే. అది నిజము. ఆమెన్. అక్కడే క్షమాపణ ఉన్నది.
1JN 1:7
46ఒక మెథడిస్టు, బాప్టిస్టును చూసి మరియు తన తలను ప్రక్కకు త్రిప్పవచ్చును మరియు ఒక బాప్టిస్టు, పెంతెకొస్తును చూసి అలా చేయవచ్చును మరియు బాప్టిస్టు వారు పెంతెకొస్తు వారికంటే తక్కువ సంప్రదాయం కలిగి ఉండవచ్చును. కానీ వారందరూ ఆ సిలువ క్రింద కలుసుకోగా, యేసుక్రీస్తు యొక్క రక్తము ప్రతి ఒక్కరి పాపమును కడిగి, వారిని క్రీస్తు యేసులోనికి నూతన జీవిగా సృష్టిగా మార్చును. అతడు ఒక సహోదరుడు! అతడు ఏ గుంపుతో ఉన్నప్పటికీ అది మనకు అవసరం లేదు, అతడు ఒక సహోదరుడు. ఎందుకనగా మనమందరమూ ఆ ఒక్క స్థలమునందే కలుసుకుంటాము. అది దేవుడు చేసే విధానమైయున్నది. అది మనిషి తయారు చేసుకొని తనకు తాను ఎక్కించుకొని లోపల ప్రవేశపెట్టుకున్న సంగతులునైయున్నవి. కాని దేవుని అసలైన ప్రణాళిక ఏమిటంటే, యేసుక్రీస్తు రక్తము క్రింద మనలను క్షమించాలని. అదియే దేవుడు చేయాలనుకున్న దేవుని ప్రణాళిక, అవును.
REV 19:7•
REV 22:17
47ఆ రోజులలో వారి సంప్రదాయాలను, ఆచారాలను, చూసి ఆ గొప్ప ప్రవక్త ఎంతో ఏడ్చి ఇలా చెప్పెను, "మీ ఆచార సంప్రదాయాలు శక్తిహీనమైనవి. అవి దుర్గంధము కలిగి హేయమైనవిగా నా ముందున్నవి. అసలు వాటిలో విశ్వాసమే లేదు." వారు ఏమి చేయుచున్నారో దానియందు కొంచెం కూడా విశ్వాసం లేకుండా ప్రజలు అర్పణలు అర్పిస్తున్నారు. ఇప్పుడు, మనకి మనమే ఆ ప్రశ్న వేసుకొందాం. ఈ రోజుల్లోనూ అలాగే జరుగుతున్నట్లుగా లేదా? ఈ రోజుల్లో కూడా ఇటువంటి నిజమైన సంఘటనలు ఎక్కడో ఒక చోట ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పడానికి బాధతో, అసహ్యించుకోవాల్సి వస్తుంది. ఎక్కడో ఏదో ఒక విషయం తప్పుగా ఉన్నది.
ఎందుకు, ఈ సంఘము మరిప్పుడు ఉన్నదాని కన్నా రోడ్డుపై కొన్ని మిలియన్ల మైళ్ళ దూరంలో ఉండతగునా? యేసు తన సంఘము సిద్ధపడుట కొరకు ఎదురుచూచుచున్నారు. ఆయన వధువు తన్నుతాను సిద్ధపరచుకొన్నది. మనము ఆ శక్తి సామర్థ్యాలు కలిగి యున్నాము. పరిశుద్ధాత్మ ఇక్కడ ఉన్నాడు. రోగులను స్వస్థపరచడానికి, క్రీస్తు చేసిన ప్రతీదీ చేయడానికి దేవుడు ఇక్కడ ఉన్నారు. నాకు నేనుగా పరిశుద్ధాత్మ ద్వారా దానిని ఇక్కడ నిరూపించగలిగాను. కాబట్టి ఆ శక్తి సామర్ధ్యాలు ఇక్కడ ఉన్నవి.
దేవుడు మనము ఆ సంప్రదాయాల నుండి తొలగి మరియు తిరిగి ఆయన కుమారుడైన క్రీస్తు రక్తము క్రిందకు వచ్చి మరియు జీవము గల దేవుని సంఘముగా మారాలని ఎదురు చూస్తున్నారు. మెథడిస్టు, బాప్టిస్టు, లూథరన్, ప్రెస్బిటేరియన్, ఇంకా మరెవరైనా. "కోరినవారు వచ్చి, ఆ జీవ జలములు దేవుని నుండి ఉచితంగా పొందుకోవచ్చును." అది అంతయు కూడా నాలో ఉన్నది అని నేను నమ్ముచున్నాను. మనలో… దానిని చేయుటకు దేవుడు పరిశుద్ధాత్మను క్రిందికి పంపియున్నాడు. కానీ మనము, మన మతాచారాలతో, యదార్థత లేకయే మనము వెళ్ళుచున్నాము, ఎందుకనగా అది మన యొక్క సంప్రదాయం, మరియు ఎందుకనగా అది మన యొక్క మతాచారం. పాపం చేసామనే నిజమైన బాధలేకుండా, పశ్చాతాపడకుండా, యదార్థత లేకుండానే మనము వెళ్ళుచున్నాము.
PS 126:5•
AMOS 5:21
48మరుసటి రాత్రి కాలిఫోర్నియాలో జరిగిన ఒక గొప్ప కూటమిలో మన యొక్క గొప్ప పేరుగాంచిన సహోదరులను నేను గుర్తించాను. మరియు ఆ కూటమిలో నేను గమనించాను, కొంత మంది యవ్వనస్తులు క్రిందికి దిగి వచ్చారు. ఎవ్వరూ చేయని విధంగా ఆ సహోదరుడు చేసినందుకు నేను అతనిని అభినందిస్తున్నాను. ఒకవేళ మీ స్థితి, చివరి దినాల్లో ఆయన ఏ చోటును తీసుకున్నారో, అదే రీతిగా మీరును ఉండాలి. మరియు నేను ఆ ప్రజలను బలిపీఠం నుండి క్రిందికి దిగడం చూసాను, ఒక నిర్ణయం తీసుకోవడం, బాలికలు జిగురును నవలడం, బాలురు ఒకరిని ఒకరు గిల్లుకోవడం, ప్రజలు నవ్వడం, దేవునిని దుఃఖపరిచే విధమైన మార్గములో రావడమే కదా అది. నీవు దోషనిర్ధారణ ద్వారా మాత్రమే రావాలి. దేవుడు, అతి పాతదైన పెంతెకొస్తు విధానమును పంపెను, పరిశుద్ధాత్మ ఉజ్జివము పాపమును కూకటివ్రేళ్ళతో సహా తొలగించి, ప్రతి పురుషునికి మరియు స్త్రీకి మారుమనస్సును తీసుకొని వచ్చును.
"నేను మరల తిరిగి సంఘమునకు వెళ్ళి మరియు నేను నా సహవాసమును నూతనపరచుకొందును, అని చెప్పుట కాదు. నా కార్డుపై సంతకము చేసెదను." అది మంచిదే, కాని నీవు తాపీ పని చేయువానితో విపరీత ప్రవర్తన కలిగిన వారితో మరియు ఇంకా దేనితో కలిసినా మరియు నీవు ఆ ఫలితములనే పొందుకొందువు. కాని మనము యేసుక్రీస్తు రక్తము అనే దేవుని క్షమాపణా పరిహారము క్రిందకు వస్తే, అప్పుడు అక్కడ యదార్ధత పెట్టబడవలయును. దేవునికి యదార్థత కావాలి.
ఒకవేళ ఆయన దాని కొరకు ఆయన ఏకైక కుమారుడుని ఇచ్చుట అనే వెల చెల్లించినట్లయితే, మనము దానిని ఏ విధంగా పొందుకోగలము, ఒక చిన్న చిరునవ్వు చిందించడం ద్వారానా, సంఘములో చేర్చబడటం ద్వారానా, ఒక నిర్ణయపత్రం తీసుకొని, దానిని సంఘములోనికి తీసుకెళ్ళుట ద్వారానా మరియు దేని ద్వారా అది జరుగును? అది దేవుని అవసరత కాదు. "పిడికెడు విత్తనములు చేత పట్టుకొని యేడ్చుచు పోవు విత్తువాడు, సంతోషగానము చేయుచు పనలు మోసికొని వచ్చును." మనకి పనలు మోసికొని వచ్చేవారు కావాలి.
49ఒకసారి ఒక గొప్ప సువార్తికుడు ఇలా చెప్పడం విన్నాను, ఒకసారి మేమంతా అల్పాహారానికి హాజరవుతున్నప్పుడు, అతను బైబిలును తీసుకున్నాడు (మరియు నేను అతనిని ఎల్లప్పుడూ అభినందిస్తాను) అతను చెప్పాడు, "ఇదిగో ఇదియే నిలుచునది, అది దేవునికి అవసరమైనది," అతను చెప్పాడు, "నేను పట్టణములోనికి వెళ్ళెదను, నేను ఉజ్జీవం కలిగి ఉండెదను." ఇలా చెప్పెను, "ఇరవై లేదా ముప్పైవేల మంది నిర్ణయం తీసుకుంటారు." నేను నాలుగు లేదా ఐదు సంవత్సరాలు, ఒకవేళ రెండు సంవత్సరముల తరువాత తిరిగి వస్తాను," మరియు ఇలా చెప్పెను, "నేను అప్పుడు 15 లేదా 20 మందిని కనుగొనలేను? ఇలా చెప్పెను, "అపొస్తలుడైన పౌలు పట్టణములోనికి వెళ్ళెను మరియు అతడు ఒకనిని మార్చెను. మరుసటి సంవత్సరం పౌలుగారు వచ్చేసరికి ఆ మార్చబడిన వ్యక్తి ద్వారా 30 లేదా 40 మందిని పొందెను." అప్పుడు ఆయన ఇలా చెప్పెను, "అది బద్ధకస్తులైన బోధకులు వాళ్ళ పాదములు బల్లపైన ఉంచి మరియు బయటకు వెళ్ళి ప్రజలను కలవరు."
50తన సహోదరుని కొరకు కేక వేసిన పిలుపుకై మరియు అన్నింటిపై తనకున్న దృఢ విశ్వాసాన్ని బట్టి నేను అతనిని అభినందిస్తున్నాను, కానీ నేను అతడిని ఈ ప్రశ్న అడగాలని అనుకుంటున్నాను: "వెళ్ళడానికి ఏ సంఘములు లేని సమయంలో, పౌలు గారి తరువాత వచ్చిన బోధకులకు ఎవరు బోధించారు?"
అది ఏమిటి? పౌలు గారు అతనిని ఆచారము నుండి లేదా కార్డుపై సంతకము చేయడం నుండి తీసుకువచ్చి పరిశుద్ధాత్మ బాప్తిస్మములోనికి అతనిని చేర్చెను. ఇదంతా ఎప్పుడంటే అతని ఆత్మ దేవుని కొరకు మండుచున్నప్పుడు అతడు సాక్ష్యమిస్తూ మరియు విషయాలన్నీ చెప్పాలి. అతని ఆత్మ అంతయు కూడా అగ్ని జ్వాలలతో మండుచున్నది, అది దేవుడే అక్కడ పెట్టెను. ఒక పురుషుడు లేదా స్త్రీ రక్షింపబడ్డారు అనడానికి ఈ రాత్రికాల సమయములో ఆ గుర్తు అవసరమైయున్నది — ఎవరైతే వారి ఆత్మలతో పాటు వేరొక ఆత్మల రక్షణకై తొందరగా వెళ్తారో వారిని గమనించండి.
51ఆ బారులో పనిచేసే వ్యక్తికి అతను ఒకసారి ఇలా అన్నారు… చిన్న బాలుడు వచ్చి మరియు అన్నాడు, "అయ్యా, బార్టెండర్ గారు?"
"ఏంటి కుమారుడా" అని అతను అన్నాడు
అతను చెప్పాడు, "నీ గుర్తు క్రింద ఉన్నది."
అతడు చెప్పాడు, "మంచిది, ధన్యవాదములు, కుమారుడా."
అందుకని అతడు బయటకు నడిచి వెళ్ళెను, మరియు ఆ చిన్న బాలుడు తన చేతులతో పట్టుకొని అతని వెనుక ఉన్నాడు మరియు ఆ వ్యక్తి ఆ బాలుని చూచెను. మరియు అక్కడ ఒక గొప్ప మద్యం సేవించే గది, ఆ ఇత్తడి పళ్ళెముపై ప్రదర్శించబడినది. అతడు తన బట్టలు మురికి కాకుండా ధరించే వస్త్రం తీసుకొని మరియు దానిని శుభ్రంగా మెరుగుపెట్టెను. అతడు చెప్పాడు, "కుమారుడా, నీవు పొరపాటు చేశావు. నా గుర్తు పైన ఉన్నది."
అతడు చెప్పాడు, "కాదు, అయ్యా," అని "అది కాదు. "నేను అంటున్నది మీ మంచి గుర్తు."
అతడు చెప్పాడు, "అదియే నేను కలిగి ఉన్న మంచి గుర్తు."
అతడు చెప్పాడు, "ఓ కాదు. చూడు, అక్కడ ఉన్నది." అక్కడ ఆ కాలువ ప్రక్కన ఒక త్రాగుబోతు పడియున్నాడు. అతడు కలిగి ఉన్న మంచి గుర్తు అదియే (అవునయ్యా), ఎప్పుడైతే ఒక వ్యక్తిని అతడు చూశాడో, ఆ వ్యక్తి లోపల ఏదైతే అమ్ముచున్నారో దాని ప్రభావము క్రింద ఉన్నాడు.
మరియు మనము ఒక వ్యక్తి ఎప్పుడైతే పరిశుద్ధాత్మ చేత ప్రభావితం చేయబడుట చూస్తామో, ఆ వ్యక్తి జీవితం ఆ పాత పెంతెకొస్తు అగ్నిచే మండింపబడు వరకూ, అదియే ఆ వ్యక్తి జీవితంలో ఎన్నటికీ చూడలేని మంచి గుర్తు అయి ఉన్నది, ఎలాగంటే ఆ వ్యక్తిని దేవుడు రక్షించాడు అని చెప్పగలము. అదియే మంచి గుర్తు.
ఇప్పుడు, అది మనకి ఎలా వస్తుంది? ఒక సంఘములో చేర్చబడటం ద్వారా కాదు; కాని యేసుక్రీస్తు ద్వారా ఆయన క్షమాపణను అంగీకరించుట ద్వారా, ఎందుకనగా ఆయన మన కొరకు ఒక నిరపరాధియైన ప్రత్యామ్నాయ వ్యక్తిగా ఉన్నారు.
2TIM 3:1-7
52పాపము కొరకై యదార్థత లేదు, అసలైన దుఃఖము లేదు. అతడు చెప్పాడు, అతని ముఖాన్ని ఆ మత సంప్రదాయాలు లేదా మతాచారాలకు దాచబడి ఉంటాడు. వారి ప్రార్థనలు చాలా శక్తిహీనమైనవి. ఓ, తప్పకుండా. వారు ప్రార్ధించారు, వారు పైకి వెళ్ళి మరియు వారి ప్రార్ధనలు చెప్పారు. వారు వాళ్ళ బలులు అర్పించారు. అది ఒక మాదిరియైనది.
మీకు తెలుసా, II తిమోతి, 3వ వచనము, లేదా II తిమోతి 3వ అధ్యాయములో, మనకు అదే విషయము చెప్పబడినది, అది ఈ చివరి దినాలలో సంభవించేది? బైబిలు ఇక్కడ ఈ విధంగా చెప్పినది, "అంత్యదినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొనుము. ఏలాగనగా మనుష్యులు స్వార్దప్రియులు, ధనాపేక్షులు, బింకములాడువారు, అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు, అనురాగరహితులు, అతిద్వేషులు, అపవాదకులు, అజితేంద్రియులు, క్రూరులు, సజ్జన ద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవము నెక్కువగా ప్రేమించువారు. పైకి భక్తి గలవారి వలె ఉండియు దాని శక్తిని ఆశ్రయించనివారునై ఉందురు: ఇట్టి వారికి విముఖుడవై యుండుము. పాపభరితులై నానావిధములైన దురాశల వలన నడిపింపబడి, యెల్లప్పుడును నేర్చుకొనుచున్నను, సత్యవిషయమైన అనుభవజ్ఞానము ఎప్పుడును పొందలేని అవివేక స్త్రీల యొక్క యిండ్లలో చొచ్చి, వారిని చెరపట్టుకొని పోవువారు వీరిలో చేరినవారు."
ఇప్పుడు, ఆ అదే ఆచారములలో గనుక సంఘము, పైన చెప్పిన విధముగా ఉంటే, వారి మత సంప్రదాయాలతో, ఇక్కడ మరలా తిరిగి అదే మత సంబంధమైన ఆచారములు, శక్తిహీనతను చూస్తాము.
53"ఓ, వారు చెప్పారు, "వాళ్ళు సాంఘికవాదులు," కాదు, వాళ్ళు కాదు. "భక్తి గల వారి వలె ఉండియు.." వారు సంఘానికి వెళతారు. సంఘంలో ప్రవేశం పొందుతారు. వారు ఎక్కువ కాలం గుడిలో తమని తాము ఏవో చేస్తూ కనబరుచుకొంటూ మరియు బయటికి వెళ్ళి బయటి వాళ్ళలా వేరుగా జీవిస్తూ ఉండటానికి ప్రయత్నిస్తారు. వారి హృదయాలలో మంట లేనేలేదు. అస్సలు ఏమి లేదు. వారు మిగిలిన వారి యందు ఆసక్తి కనబరచరు. "వాళ్ళు కావాలనుకుంటే ప్రతి ఒక్కరూ కూడా మరణించి మరియు పోతారు. మనము రక్షించబడినాము అని అనుకుంటూ ఉంటారు. మిగిలిన వారిని వెళ్ళనివ్వండి."
అది నిజమైన క్రైస్తవ్యము కాదు. క్రైస్తవ్యం అనేది, నశించిన దాని వెనకాల వెళ్ళేది, వెళ్ళి ఆ సహోదరుడిని సంపాదించు, దాని కొరకు ఏదో ఒకటి చెయ్యి. మనము రక్షింపబడ్డాము అని చెప్పుకొనుచున్న తరువాత కూడా అలాగే రెండు చేతులు కట్టుకొని నిలబడి మరియు పురుషులు మరియు స్త్రీలు అలా మరణిస్తూ ఉండడము చూస్తూ, మరియు స్త్రీలు కురచదుస్తులు ధరించుకొని మరియు ముఖానికి రంగులు పూసుకొని, అందరూ కలిసి అలాగే సంఘమునకు వీధులలో నడుచుకుంటూ వెళ్ళడం, మరియు సిగరెట్టులు వాళ్ళ చేతులలో పెట్టుకొని, మరియు రంగులు ముఖం నిండా పూసుకొని లేదా పులుముకొని వీధుల గుండా పైకి, క్రిందకి తిరుగుచున్నారు. వారు అచ్చం నక్కలు లేక తోడేళ్ళ వలె లేదా మరొకదానిలా, మరియు పురుషులు కూడా వీధులలో పైకి, క్రిందకి తిరుగుతూ, సంఘములలో చేరుతూ మరియు అటువంటివి చేస్తున్నారు. మరియు అదే క్రైస్తవత్వం అని పిలుచుచూ మరియు సమాధానము కలిగి ఉన్నామా?
AMOS 5:21
54ట్యూసాన్ పట్టణంలో అపొస్తలుడైన పౌలు నడిస్తే ఏమి జరుగును? ఇప్పుడు, నేను చెప్పుచున్నాను, "ఆయనను తెల్లవారే ముందే జైలులో పెట్టి ఉంచుదురు. అది నిజం. ఎందుకు? ఆ విధంగా ఆయన వారిని సరిచేయకుండా ఉండలేరు, ఎందుకనగా ఆయన ఆత్మ దేవుని కొరకు మండుచున్నది. అవును. కాని మనము సంఘంలో చేర్చబడ్డాము. మీరు చూడండి, మన ఆచారములన్నియు దేవుని ముఖము యెదుట కంపుకొట్టుచున్నవి.
"యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు" అన్నదానితో వచ్చు ప్రవక్త ఈ రోజు మనకు అవసరమై యున్నది. మరియు అన్ని విషయాలను చక్కగా, లోతుగా ఒలిచి మరియు అవి అన్నియు కంపుకొట్టుచున్నవి అని చెప్పువాడు. మన శాఖలు పెరిగిపోయాయి. మన సంఘములు ఎంతో పెద్దగా మరియు మునుపటి కంటే ఎంతో చక్కగా, సుందరముగా ఉన్నవి. మనము అక్కడ ఒక గొప్ప అధునాతన సంగీత వాయిద్యములు వాయిస్తూ, పాడుచూ మరియు తంబురతోను, డప్పు వాయిస్తూ లేదా ఇంకా మరేదో వాయిస్తూ, అసలు నిజమైన పెంతెకొస్తు అగ్ని మన ఆత్మలలో మండించడానికి బదులు గొప్పగా ఏర్పాటు చేయబడిన సంఘాలలోని బెంచీల వరుసలలో కూర్చుని ఈ రోజులలో అనేక మంది మరణిస్తున్నారు. మన పాదముల క్రింద ఈ ప్రపంచం మరణిస్తుంది.
అవును, అయ్యా.
55దేవుడు ఒక క్షమాపణను కలిగి ఉన్నాడు, మరియు ఆ క్షమాపణ కేవలం యేసుక్రీస్తు ద్వారా మాత్రమే. విద్య, ఆచారము, శాఖలు, సైన్సు ఏదీ కూడా ఆ స్థానమును తీసుకొనలేవు. అది రక్తము క్రింద ఉన్నది. అది ఆచారము క్రింద ఉన్నది. ఆచారము క్రింద కాదు, కాని యేసుక్రీస్తు రక్తము క్రింద ఉన్నది, దేవుడు పాపుల కొరకు ఏర్పరచిన మార్గము, అదే మనము ఎప్పటికీ కలుసుకోవలసిన ఒకే ఒక మార్గమైయున్నది. నేను మీకు చెప్తాను, మీరు ఒక మెథడిస్తుని తీసుకోండి, బాప్టిస్టుని తీసుకోండి, మరియు ఒక ప్రెస్బిటేరియన్ని, మరియు ఒక లూథరన్ని, మరియు ఒక పెంతెకోస్తుని మరియు వారిలో ఉన్న ప్రతీ ఒక్కరు ఆ రక్తం క్రిందకు రానిమ్ము. వారు సహోదరులైయున్నారు. తరువాత వారిలో ఇక ఎంతమాత్రము ఆర్భాటము ఉండదు. కాదయ్యా, వారు సహోదరులై యున్నారు. వారు అన్నింటిని ఒకేలా చూస్తారు.
కాని మెథడిస్టువారు, బాప్టిస్టు వారితో బాప్తిస్మము క్రమం విషయమై రచ్చ కలిగి ఉందురు, మరియు ఏకత్వము వారు త్రిత్వము వారితో లేదా త్రిత్వము వారు ఏకత్వము వారితో మరియు ఇంకా మరెక్కువ. సమస్యను చూడండి మరియు వెంట్రుకలు నిలబడును. కాని వారిద్దరూ సిలువ క్రిందకు వచ్చినట్లయితే, మరియు అక్కడ ఏమి జరుగునో మీరే చూడండి. [టేపు పై ఖాలీ].
"… మరియు నేను మరణించే వరకూ అలానే ఉండును. తరువాత మధురమైన, రమణీయమైన ఆకట్టుకొనే పాటలో రక్షించుబడుటకు ఈ శక్తిని నేను పాడెదను; ఈ దీనమైన అస్పష్టముగా, నత్తిగా మాట్లాడు నాలుక సమాధిలో నిశ్శబ్దంగా ఉంచబడును."
JOHN 3:16•
JOHN 6:37,44•
ACTS 2:39•
ROM 8:29
56నేను ఈ రాత్రి సాక్ష్యమిచ్చుచున్నాను, అదేమనగా యేసుక్రీస్తు రక్తం మెథడిస్తుని, బాప్టిస్టుని, లూథరన్ని, ప్రెస్బిటేరియన్ని, మరి ఇంకా ఎవరినైనప్పటికీ అతనిని నా సహోదరునిగా మార్చును. అవునయ్యా. తన తోటివానిలో ఏదో ఉన్నది, ఎందుకనగా అతని ఆత్మ - ఒక సహోదరుడు. అతను ఒక మోసం చేసేవాడు మరియు ఇంకా మరేదో కాదు; అతడు క్రీస్తులో ఒక సహోదరుడు. అతడు బైబిలు గ్రంథములో వ్రాయబడిన ప్రతి మాటను నమ్ముతాడు.
బైబిలు గ్రంథాన్ని వ్రాసిన పరిశుద్ధాత్మ దానిని ఎలా నిరాకరించగలదు? ఒక వ్యక్తిలో జీవించుచున్న పరిశుద్ధాత్మ ఎలా చెప్పగలదు, "ఓ, అది కేవలం ఆయన శిష్యులలో మాత్రమే."
యేసు చెప్పెను, "కోరినవారందరూ."
పేతురు ఇలా చెప్పెను, "ఈ వాగ్దానం మీకును, మీ పిల్లలకును, దూరస్తులందరికీ, అనగా దేవుడు తన యొద్దకు పిలిచిన వారందరికీ ఈ వాగ్దానం చెందుననెను." దేవుడు పిలిచినవారందరూ పరిశుద్ధాత్మను పొందుకుంటారు.
ఇక్కడ ఆయన ఇలా చెప్పెను "ఆయన ఎవరిని ముందుగా నిర్ణయించెనో, వారిని ఆయన ఎరుగును." ఆయన ఎన్నుకున్న వారిని
మరియు ఆయన వారిని అంగీకరించెను. "నా తండ్రి ఆకర్షించుకుంటేనే తప్ప, ఎవడును నా యొద్దకు రాడు", "నా తండ్రి నాకు అనుగ్రహించిన వారందరూ నా యొద్దకు వచ్చెదరు" అని యేసు చెప్పెను.
57"మనము ఉద్రేకముతో వస్తామా? ఆ విధంగా సంఘములో చేరుటకు వస్తామా? మనము నరకానికి వెళ్ళడం ఇష్టం లేక వస్తామా? లేదా, మనము దేవునిని ప్రేమిస్తున్నాము, ఎందుకనగా ఆయన ఏకైక కుమారుడిని మనకి ఇచ్చినందుకు వస్తున్నామా? ఆయనను నమ్మకున్నవారికి నిత్యజీవాన్ని ఇస్తారని వస్తున్నామా? ఒకవేళ మనము వస్తున్నాము, ఎందుకనగా దేవుడు మనకు ప్రేమ అనే త్యాగాన్ని ఇచ్చినందుకా? మనము దానిని అందరి యెదుట ప్రదర్శించాలి, అది చూపించాలి?
దేవుడు శక్తిహీనమైన మతాన్ని అసహ్యించుకొంటాడు. వారి మతానికి శక్తి లేదు. మరి అతను ఈ దినము కొరకై ఏమి చేయవలయును? అతడు అసహ్యించుకొనును… ఎందుకనగా దేవుడు ప్రతిసారీ బైబిలులో… బయట… బైబిలుకి ఒక ప్రక్క ఉన్నాడు, ప్రతిసారీ కొన్ని సంగతులలో సంస్కరణ, లేదా ఉజ్జివము వచ్చినప్పుడు, అది తిరిగి గొప్ప శక్తితోను మరియు సూచనలతోను వచ్చినది. ఎప్పుడైతే లూధర్ వచ్చాడో, ఎప్పుడైతే వెస్లీ వచ్చాడో, ఎప్పుడైతే ఈ సంఘ సంస్కర్తలు వచ్చారో — -సాంకీ, ఫిన్నీ నాక్స్, కాల్విన్, మరెవరు వచ్చినా, ఎక్కడికి వచ్చినా, వారు ఆధారాలతో, శక్తి కలిగి వచ్చారు. దేవుడు ఎక్కడ ఉన్నాడో, ఆయన ఒక అతీతమైనవాడు. దేవుడు తనకు తానుగా ఎక్కడ ప్రదర్శించబడునో, అక్కడ అతీతమైనది యుండును.
MATT 21:13•
MARK 11:17•
JOHN 3:16•
JOHN 8:44
58ఆ దినమున యేసు నొద్దకు వచ్చిన ఆ పరిసయ్యులను చూడండి, మరియు వారు సాత్వికమును మరియు తియ్యనిదనమును గూర్చి మాట్లాడారు. "ఆ పాత యాజకుని కంటే ఎవరు తియ్యగా ఉండగలరు? వారి యాజకుడు కంటే గొప్పవారు ఎవరు ఉన్నారు? మీరు పుట్టినప్పుడు ఆయన వస్తాడు. ఒకవేళ మీ ఇరుగుపొరుగు వారి మధ్య రచ్చ జరుగుతుంటే ఆయన వచ్చి మరియు సమాధానపరుస్తాడు. మరియు ఆయన ఎల్లప్పుడు ఒక శాంతికాముకుడు. ఆయన ప్రేమించే వ్యక్తి, ఆయన అటువంటి వాడని మీకు తెలుసు. నీవు ఒకవేళ ఆపదలో ఉంటే, ఆయన దగ్గరకు వెళ్ళవచ్చు, ఆయన నీకు సహాయం చేస్తాడు. ఎంత మంచి వ్యక్తి అతను?
అప్పుడు, ఈ నజరేయుడైన యేసును గూర్చి మాట్లాడుదాం. ఈ యాజకుడు, ఆయన తండ్రి ఎవరో మనకు తెలుసు, ఆయన తండ్రికి తండ్రి తెలుసు, ఆయన తండ్రికి తండ్రి. ఆయనను గుర్తించడానికి ఒక పాఠశాల కూడా ఇక్కడ మనం కలిగియున్నాము. ఈ నజరేయుడైన యేసు ఎవరు? ఏ పాఠశాల నుండి ఈయన వచ్చారు? ఏ సంస్థకు ఈయన చెందినవాడు? ఆయన అన్నింటిలో ఆర్బాటము తప్ప ఇంకేమి చేస్తున్నాడు?
మన యొక్క ఆ పాత మంచి యాజకుని గురించి ఆయన ఏమి చెప్పుచున్నాడు? "అతడు దెయ్యమునకు చెందినవాడు," అని యేసు చెప్పెను. మీరు … మీ తండ్రి అపవాదియైయున్నాడు మరియు మీరు ఆ అపవాది క్రియలనే చేస్తున్నారు. మీరు ఊహించగలరా? ఆయన దేవాలయములోనికి వెళ్ళి, అక్కడున్న ప్రజలను కోపంతో చూసి, అక్కడ యెహోవాకు బలి ఇవ్వడానికి ఉంచిన వాటిని తన్ని పడవేసి "లేఖనములో ఈ విధంగా వ్రాయబడినది, నా తండ్రి ఆలయము ప్రార్ధనా ఆలయము, మరియు మీరు దానిని దొంగల గుహగా చేసియున్నారా," అని గట్టిగా అరిచెను.
ఆయన ఒకవేళ ఈ రోజు మన అధునాతన సంఘాలలోనికి వస్తే ఆయన ఏమి చేయును? అక్కడ ఉన్న ఇంకొన్ని బల్లలు కదులుతాయి! సంఘాలలో వరుసగా వేసిన కుర్చీలు, బల్లలు ఎగిరిపడతాయి, ఎందుకనగా ఆయన వాటిని ముక్కలుగా చేస్తాడు. అవును. అప్పుడు జరిగినదే మరలా జరుగును. యేసు లేఖనముల ప్రకారముగా చేస్తారని మీకు తెలియదా? ఆయనే వాక్యము. ఆయన ఏదో వ్రాయనవసరం లేదు. ఆయనే వాక్యము. ఆయన జీవించుచున్న వాక్యమైయున్నాడు. కాని దానిని ప్రజలు గుర్తించడములో విఫలమయ్యారు.
59మరియు ఈ రోజులలో ఒక మనిషి, ఏ సిద్దాంతాల మీద… యేసు ఈ ప్రపంచము మొత్తానికి ఈ సూచనలను మరియు ఈ దీవెనలు వాగ్దానం చేశారు, మరియు దేవుడు ఎవరినైతే ముందుగా పిలిచాడో వారిపై పరిశుద్ధాత్మ ప్రారంభంలో ఎలా కుమ్మరించబడిందో అదే కార్యము ఇప్పుడును చేయవలయును. ఒక వ్యక్తి తనకు తానే ఒక క్రైస్తవుడను అని ఎలా పిలుచుకోగలడు, మరియు వాక్యాన్ని నిరాకరించి మరియు పరిశుద్ధాత్మ ఆయనలో ఉన్నాడని ఎలా చెప్పగలడు? పరిశుద్ధాత్మ అయితే ప్రతీ దేవుని వాక్యానికి "ఆమెన్" అని చెప్పును. అది ఖచ్చితంగా నిజము.
ఓ, సహోదరుడా, మన విద్యావ్యవస్థలు అన్ని మనల్ని దాని నుండి దూరంగా తీసుకుని వెళ్ళాయి. మరియు మన శాఖలు అన్ని కూడా ఒక్కొక్కటిగా క్రీస్తు నుండి మనలను దూరం చేశాయి. కాని, ఏమిటి? అవి అన్నియు ఆ విధంగానే చేస్తూ ఉంటాయి. మరియు మీరు ఒక ప్రత్యామ్నాయాన్ని తీసుకోండి, ఏదైనా ఒక విషయాన్ని అది అంజూరపు ఆకుల కన్నా మరి ఎక్కువైనది కాదు. దేవుడు దానిని తిరస్కరించును. కాని ఎప్పుడైతే సంఘము యేసుక్రీస్తు రక్తము క్రిందకి వస్తుందో, వారిపై ఆ పరిశుద్ధాత్మ అనే గురుతుతో, అప్పుడు మీరు మరలా తిరిగి సహోదర ప్రేమను, చూచెదరు. పూర్తి శక్తితో నింపబడియున్న ఒక సంఘాన్ని మీరు చూస్తారు. మీరు చూడబోవు…
HEB 13:8
60దేవుడు శక్తి లేని మతాన్ని అసహ్యించుకొంటాడు! అది శక్తిని పొందుకోవాలి! నిశ్చయముగా, మనిషిని పాపం నుండి రక్షించేంత శక్తి అది. యేసుక్రీస్తు వాగ్దానము చేసినట్లుగా, ఆ శక్తి సూచనలు మరియు వింతలు మరియు అద్భుతాలు చేసేదిగా ఉంటుంది. వారు దేవుని మాటపై, మాట వలన ఏమి తెలియనివారు, తిరిగి వచ్చి మరియు దానిని నమ్మి, మరియు వారు లక్ష్యాన్ని లేదా గమ్యాన్ని చేరుకున్నారు. నువ్వు కూడా అలాగే దేవుని వాక్యంలో సున్నా అయిన యెడల, ఆ వాక్యం నిన్ను నీవు అనుకున్న లక్ష్యానికి తిరిగి చేరుస్తుంది. అది అలా చేయును, ఎందుకనగా యేసుక్రీస్తు నిన్న, నేడు, నిరంతరము ఒక్కటే రీతిగా ఉన్నారు. దేవునికి శక్తిలేని మతం అంటే ఇష్టం ఉండదు. దేవుడు అటువంటి దానిని అసలు కోరుకోడు. దేవుడు జీవించుచున్న వాడని తనకుతాను చూపించాలని కోరుకుంటున్నాడు. మనకు ఉన్న గొప్ప నిరీక్షణ పునరుత్తానం. అది నిజమేనా? మన జీవితంలో నిరీక్షణ పునరుత్తానమే, యేసుక్రీస్తు పునరుత్తానం.
MATT 28:20•
JOHN 12:14
61మీరు చూడండి, దేవుడు ఆయన సంఘములో పని చేయాలనుకుంటున్నాడు. యేసు చెప్పెను, "ఇదిగో నేను యుగసమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉండెదనని వారితో చెప్పెను. నేను చేయు క్రియలు మీరును చేయుదురు." యోహాను 14:12, "నేను తండ్రి యొద్దకు వెళ్ళుచున్నాను గనుక నేను చేయు క్రియలు నాయందు విశ్వాసముంచు వాడును చేయును, వాటి కంటె మరి గొప్పవియు అతడు చేయునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను." ఇప్పుడు, సంఘము దానిని నిరాకరించి, వెళ్ళు వెళ్ళండి అనేక మందిని తీసుకు రండి, మన సంఘము గొప్పదిగా, ప్రఖ్యాతి చెందాలి అంటున్నారు.
ఇప్పుడు, నేను మిమ్మల్ని ఒకటి అడగాలనుకుంటున్నాను. దేవుడు తన సంఘములో పని చెయ్యాలనుకుంటున్నాడు, మరియు సంఘమైతే దాని యొక్క సంఘ సిద్ధాంతాలు, నమ్మకాలు ద్వారా పని చేయాలని ప్రయత్నిస్తున్నది. మరియు ఆ రెండు ఒకే చోట కలిసి పని చెయ్యలేవు. మీరు ఆ సిద్దాంతాలను విడిచిపెట్టి, మరియు మీరు క్రీస్తుని లోపలికి రానివ్వండి. మరియు మీరు దానిని ఎలా చేయగలరు? ఎప్పుడైతే అతను ఆ రక్తమును చూచి, తన పవిత్రమైన హృదయంతో ఆ రక్తాన్ని ఆపాదించుకున్నాడో, మరియు ఒక చేయి యేసుక్రీస్తుపై ఆనుకొని ఉంచాడో, మరియు యదార్ధమైన హృదయంతో దేవుని యెదుట తన తప్పులన్నింటినీ ఒప్పుకొని మరియు పరిశుద్ధాత్మ ద్వారా జన్మించినప్పుడు, దేవుని కార్యములు వెంబడించును, ఆలాగున చేస్తే ఆయన చెప్పినట్లు జరుగును. అవును, సంఘము దాని సిద్ధాంతాల ద్వారా పనిచేసి, మరియు నేను ఎంత ఎక్కువ మంది సభ్యులను కలిగి ఉన్నాను అంటుంది. దేవుడు అయితే ఆయన శక్తి గలిగిన రక్తము ద్వారా పనిచేసి, క్రైస్తవులను తిరిగి జన్మించిన వారిగా పొందుకోవాలని ఆయన కోరిక. రెండింటికి అదియే అసలైన వ్యత్యాసం.
అలా చెయ్యాలంటే నీవు తప్పనిసరిగా తిరస్కరించాలి… ఇది ఇలా చెయ్యాలనుకుంటే, వారు, నీవు పరిశుద్ధాత్మను ధిక్కరించవలసినదే మరియు ఆయన చేయు శక్తిగలిగిన కార్యములను తిరస్కరించి సంఘ సిద్ధాంతమును అనుసరించాలి. మనము ఒకవేళ క్రైస్తవునిగా అవ్వాలనుకొన్నప్పుడు, ఒక తప్పును అంగీకరించే ముందు సత్యాన్ని నీవు చూడవలసియున్నది. నీవల్ల కాదు … ఒక తప్పు చేసే ముందు, నీవు దేవుని వాగ్దానము పైగా నడిచిపోవాలి. ఎందుకనగా, అన్నివేళల్లోనూ ఒక ఎర్రని లైటు నీ ముందర వెలుగుతుంది — "అదియే వాక్యము."
HEB 13:8
62మీరు చెప్పుదురు, "మంచిది, అది వేరొక రోజు కొరకు." ఇది ఈ రోజు కొరకు, ఎందుకనగా క్రీస్తే వాక్యమైయున్నారు. అది నిజమేనా? యోహాను 1వ అధ్యాయములో: "ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను. వాక్యము దేవుడైయుండెను. ఆ వాక్యము శరీరధారియై, కృపా సత్యసంపూర్ణుడుగా మన మధ్య నివసించెను." మరియు బైబిలు చెబుతుంది, "ఆయన నిన్న, నేడు, ఒక్కటే రీతిగా ఉన్నాడు." కావున, క్రీస్తు వాక్యమైతే ప్రతీ వాగ్దానము సత్యము, మరియు అది నిన్న, నేడు, మరియు నిరంతరము ఒక్కటే రీతిగా ఉండును. అది అలానే ఉండవలయును. దానిని నమ్మి మరియు క్రియ చేయుటకు ఒక తిరిగి జన్మించిన విశ్వాసము అవసరమైయున్నది. మరి, నీవు దానిని ఒక ఆచారముతో చేయలేవు. అది అక్కడ పనిచేయదు. నీవు తప్పకుండా ఆ రక్తము దగ్గరికి రావాల్సిందే, మరిదేనికన్ననూ ఖచ్చితముగా.
ఇశ్రాయేలు చెప్పిన తరువాత …
JOHN 1:1,14
63ఇశ్రాయేలీయులకు యెషయా చెప్పిన తరువాత, అదే వారి ఆచారములు వలన వారి నైవేద్యములన్నియు హేయుముగా చేసిరి, అక్కడ వేరొక ప్రవక్త ప్రత్యక్షమైనాడు. (ముగించడానికి ముందు). తెరపైకి వేరొక గొప్ప ప్రవక్త వచ్చారు, మరియు ఆయనే బాప్తిస్మము ఇచ్చు యోహాను. ఇప్పుడు, ఆయన ఒక గొర్రెపిల్లను చూపిస్తూ… కేవలం ఇశ్రాయేలీయుల కొరకు మాత్రమే కాదు, గాని ఆదాము యొక్క పడిపోయిన జాతి అంతటి కొరకు. అతడు చెప్పెను అక్కడ… దేవుడు ఒక గొర్రెపిల్లను పంపుచున్నాడు. మరియు అన్యులకు, యూదులు మరియు కోరినవారందరి కొరకు ఈ గొర్రెపిల్ల పంపబడును.
అది ఎక్కువ కాలము కాదు, ఆ గొర్రెపిల్ల దాని సిలువ అనే బలిపీఠంపై మేకులతో చీలలు కొట్టబడింది. ఆయన రక్తం చిందించబడింది. పరిశుద్ధాత్మ తిరిగి వచ్చింది. ఇప్పుడు, ఎప్పుడైతే ఆ పాత గొర్రెపిల్లయైన జంతువు చంపబడిందో, ఆ జంతువు యొక్క ఆత్మ తిరిగి రాలేదు, కావునా ఆ రక్తము ఒక దేశము మొత్తానికి పూయబడింది. కాని ఇప్పుడు, ఆదాము నుండి వచ్చిన జాతి మొత్తానికి, దేవుని యొక్క గొర్రెపిల్లగా ఆయన రక్తాన్ని చిందించి, ఆరాధికుని పైకి వచ్చుటకు ఆ సూచన పరిశుద్ధాత్ముడుగా తిరిగి వచ్చినది. ఇప్పుడు, దేవుడు కోరుకొనేది అదియే. ఆ రోజు వాళ్ళు చేసింది అదే. మరియు వాళ్ళు కూడా ఈ రోజుల్లో అదియే చేస్తారు.
ఇప్పుడు, ఎవరైనా ఒక వ్యక్తి పాపభారంతో ఉన్నాడని నీవు అనుకుంటే మరియు నీవు తప్పు అని నీవు ఎరిగియున్నట్లయితే, విను, ఒక క్షమాపణ ఉన్నది. మరియు ఆ క్షమాపణ దేవుని గొర్రెపిల్ల ద్వారా వచ్చినది. నీవు దానిని నమ్ముచున్నావా? అది గొర్రెపిల్ల ద్వారా — గొర్రెపిల్ల రక్తము ద్వారా వచ్చియున్నది.
64నాకు ఒకసారి ఒక చిన్న కథ చెప్పబడినది. అది నాకు చాలా ఉపయోగపడినది. కొద్ది రోజుల క్రితం ఒక బాబు అపహరింపబడెను. నేను అనుకుంటున్నాను మీరందరూ బైబిలు చరిత్రను మరియు సంఘ చరిత్రను గ్రహింపు కలిగి ఉన్నారు. మరియు దానిలో… నేను దానిని ఫాక్స్ అని నమ్ముచున్నాను. కాదు, అది కాదు. అది నైస్సియా తండ్రులు, లేదా సెయింట్ పాట్రిక్ జీవితము. సెయింట్ పాట్రిక్ నిజానికి … ఆయనకు అది ఒక పేరుగా ఇవ్వబడింది. ఆయన పేరు సుస్కాట్ మరియు అతనిని సముద్రపు దేశదిమ్మరుల గుంపువారు అపహరిపబడెను, పందులను పెంచే వృత్తిలో బానిసగా పెట్టారు.
మరియు ఈ కథ అంతా కూడా ఒక చిన్న బాలుడుని అపహరించి మరియు ఓడ మీద విదేశాలకు తీసుకు వెళ్ళి మరియు అతడు తన పని తాను చేసుకుంటూ ఉన్నాడు. మరియు ఆ ఓడ నడిపే ముసలి కెప్టెన్ ఒక రోజు బాగా అనారోగ్యం పాలై చనిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆ సముద్ర మార్గం మధ్యలో పాత ముసలి పొడవైన గెడ్డంతో ఆయన (క్యాబిన్) గదిలో పడి ఉన్నాడు. మరియు ఆయన తన చేతి క్రింద పనివాళ్ళని, అక్కడ పనిచేసే వారిని పిలిచి, "మీలో ఎవరిదగ్గరైనా బైబిలు ఉందా?" అని అడిగెను. "నేను బాలునిగా ఉన్నప్పుడు, క్రైస్తవునిగా పెరిగాను మరియు నేను చనిపోవుచున్నాను" మరియు - "పురుషులారా! నాకు ఈ విధంగా చనిపోవడం ఇష్టం లేదు, మీలో ఎవరి దగ్గరైనా దేవుని వాక్యం ఉందా?" అని అడిగెను. "ఇక్కడ ఉన్న ఏ వ్యక్తి దగ్గరైనా దేవుని వాక్యం ఉందా?" అని అడిగెను.
ISA 53:5•
1PET 2:24
65చివరిగా, అక్కడ గుంపుగా ఉన్న మనుషులలో నుండి, ఒక చిన్న బాలుడు లేచి నిలబడి, మరియు ఇలా చెప్పెను, "అయ్యా, నా దగ్గర బైబిల్ ఉన్నది. నేను క్రైస్తవుడను. బైబిలును నాతోనే ఉంచుకుంటాను."
అతను చెప్పాడు, "ఇక్కడికి రా, కుమారుడా." అతడు అడిగాడు, "నీవు అంటున్నది నీ దగ్గర బైబిలు ఉన్నది అనే కదా?"
ఆ బాబు చెప్పాడు, "అవును." అతడు అన్నాడు, "నా తల్లి మరియు తండ్రి క్రైస్తవులు, మరియు నేను ఎప్పుడో చిన్న పిల్లవానిగా ఉండగానే నా జీవితాన్ని క్రీస్తుకు అప్పగించాను, మరియు నేను ఎక్కడికి వెళ్ళినా, నాతో పాటు ఆయన వాక్యాన్ని తీసుకు వెళతాను" అనెను. అంతే కాదు, బైబిలును నా హృదయంపై ఎల్లప్పుడు ఉంచుతాను మరియు అది నా హృదయంలో ఉండాలని" అని చెప్పెను.
అతడు, "నేను చనిపోకముందే, నా కోసం దానిలో నుండి ఏదైనా వాక్యాన్ని చదువు, నా కుమారుడా," అనెను.
మరియు ఆ చిన్నవాడు యెషయా 53 మరియు 5వ వచనమును తీసి, మరియు ఈ విధంగా చదవసాగాడు, "మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను. మన దోషములను బట్టి నలుగగొట్టబడెను. మన సమాధానార్ధమైన శిక్ష అతని మీద పడెను. మరియు ఆయన పొందిన గాయముల చేత మనకు స్వస్థత కలుగుచున్నది."
మరియు ఎప్పుడైతే ఆ బాలుడు చదివాడో, ఆ ముసలి కెప్టెన్,
"నువ్వు అలాగే చదువవా?" అని అనెను.
ఆ చిన్న బాలుడు, "నన్ను ఒక విషయం ఇక్కడ చెప్పనివ్వండి" అనెను.
మరియు ఆ ముసలి కెప్టెన్ ఆ కుర్రవానితో సరే, "నువ్వు చెప్పాలి అనుకున్నది చెప్పు," అని పలికెను.
ఆ బాలుడు, "నేను నా క్రైస్తవ తల్లి దగ్గర నుండి అపహరింపబడక ముందు, మీకు తెలుసా, ఆమె నా కోసం ఆ లేఖనమును ఎక్కువగా చదివి వినిపించేది. మరియు మీకు తెలుసా, ఆమె ఎలా చదివి వినిపించేదో?" అని చెప్పెను.
మరియు ఆ ముసలి కెప్టెన్, "నాకు తెలియదు, నా కుమారుడా, నీ క్రైస్తవతల్లి నీ కొరకు ఎలా ఆ వాక్యము చదివి వినిపించేదో తెలుసుకోవాలని ఉంది."
66ఆమె చెప్పెను… అతడు చెప్పెను, "ఇదిగో ఆమె చదివే విధానం: 'ఆయన విల్లీ ఫ్రిట్స్ దోషముల కొరకు గాయపరచబడెను. ఆయన విల్లీ ఫ్రిట్స్ పాపముల కొరకు నలుగగొట్టబడెను; విల్లీ ఫ్రిట్స్ శిక్షాదండన ఆయన మీద మోపబడెను; మరియు ఆయన పొందిన కొరడా దెబ్బలు చేత విల్లీ ఫ్రిట్స్ స్వస్థత పొందెను,'" అని చదివాడు.
ఆ ముసలి కెప్టెన్, "అది నాకు నచ్చింది. అది నాకు నచ్చింది" అని చెప్పెను. "ఓ, నా పేరును కూడా అందులో చేర్చి చదువు నా కుమారుడా!" నువ్వు చదవగలవు," అని పలికెను.
ఆ బాలుడు చెప్పాడు, "ఒకసారి నన్ను అలా ప్రయత్నించనివ్వండి." "ఆయన జాన్ క్వార్డ్స్ దోషముల కొరకు గాయపరచబడెను. ఆయన జాన్ క్వార్డ్స్ పాపముల క్రొరకు నలుగగొట్టబడెను. జాన్ క్వార్డ్స్ యొక్క సమాధానార్ధమైన శిక్ష ఆయన మీద పడెను. మరియు ఆయన పొందిన దెబ్బల చేత జాన్ క్వార్స్ స్వస్థత నొందెను."
కన్నీళ్ళు జలజల రాలుతూ, ఆ ముసలి కెప్టెన్ గెడ్డం ద్వారా క్రిందకి వస్తున్నప్పుడు, ఆయన ఇలా చెప్పెను, "నాకు నా దుస్తులు తెచ్చి ఇవ్వండి. యేసుక్రీస్తు నన్ను స్వస్థపరిచారు. నేను నా జీవితాన్ని ఆయనకు ఇస్తాను" అని చూశారా.
ISA 53:5
67ఓ, నా స్నేహితులారా, అక్కడ ఓకవేళ మీ పేరుపెట్టి చదివితే, ఓ, ఒకవేళ నా పేరు పెట్టి చదివితే, "ఆయన విలియం బ్రెన్హాం దోషముల కొరకు గాయపరచబడెను. ఆయన నలుగగొట్టబడెను…" ఒక సంఘము కాదు, ఇది కాదు, ఆచారము కాదు, కాని "నా పాపముల నిమిత్తము ఆయన నలుగగొట్టబడెను: నా సమాధానార్ధమైన శిక్ష ఆయన మీద మోపబడెను; మరియు ఆయన పొందిన దెబ్బల చేత విలియం బ్రెన్హాం స్వస్థత పొందెను." ఓ, మన పేరును లేఖనములలో పెట్టి చదివినట్లయితే, మరియు నిజంగా అర్థం చేసుకుంటే, అది ఏమి చేయునో అదే జరుగును. మన పేరును అందులో పెట్టి, నిజంగా ఆయన నా దోషముల నిమిత్తం గాయపరచబడెను, నా పాపముల నిమిత్తం నలుగగొట్టబడెను, అని గ్రహిస్తే మనము ఆ క్షమాపణను పొందుకుంటాము.
1PET 2:24
68హెబ్రీ 9:11లో మనము ఇంకొక సంగతిని గ్రహిస్తాము, ఆ క్షమాపణ, ఆరాధికునికి సంపూర్ణ సిద్ధిని కలుగజేసి, పాపం నుండి విడిపించి మరియు తనకు తానే ఆ నిర్జీవ ఆచారముల నుండి కడిగివేయును. ఎప్పుడైతే మనము నిజంగా ఆ రక్తము క్రిందకి వస్తామో, అప్పుడు మనము ఆ నిర్జీవక్రియలు గల ఆచారముల నుండి కడుగబడతాం. హెబ్రి 9 లో లేఖనములు ఈ విధంగా చెప్పుచున్నవి. చూడండి: "నీ మనస్సాక్షిని ఆ నిర్జీవ ఆచార క్రియల నుండి కడుగుకొనుము."
అప్పుడు, నీవు అలా చేసినట్లయితే, నువ్వు బాప్టిస్టువైనా, నువ్వు మెథడిస్తువైనా, నువ్వు పెంతెకొస్తువైనా, మరెవరివైనా సరే నువ్వు మరచిపో మరియు ఆ నిర్జీవ వ్యర్ధ ఆచారాలను కూడా మరిచిపో, మరియు ఆ రక్తం దగ్గరకు రా దాని దగ్గరకు రమ్ము. నీ పేరును అందులో పెట్టి చదువు, మరియు అప్పుడు ఇలా చేయుము, అప్పుడు అలా చేసి రొట్టె విరిచే బల్ల యొద్దకు రమ్ము, అప్పుడు ఎవరు తప్పు, ఎవరు ఒప్పు అని కనుగొని, ఏ విధంగా ఆ సహభోజనమును ముగించాలో లేదో జరిగిస్తూ, నీ సహోదరుడులో ఉన్న చెడు కార్యములను పొగొట్టేలా చూడాలి. నువ్వు అలా చెయ్యలేవు. నీలో ఏదో లేకపోతే నీవు చెయ్యలేవు గాని, నీలో ఏదో ఒక శక్తి ఉండి చేయిస్తుంది, మీరు చూశారా. నీ పేరు గనుక వాటిలో ఉంచి చదవకపోతే మరియు నీవు చెయ్యలేవు. అది నిన్ను శుద్దునిగా చేస్తుంది, అది నిన్ను కడిగివేయును.
HEB 9:14•
1JN 1:7•
1JN 4:20
69ఆయనను గుర్తుచేసుకుంటూ ఆయన సిలువ ఎదుట మోకరిస్తే, అది ఒక క్యాథలిక్ యాజకుడైనా, ప్రెస్బిటేరియన్ అయినా, మరి ఎవరైనప్పటికీ సరే, ఆ వ్యక్తి వచ్చి ఆయన పేరు అందులో పెట్టి చదివితే, "అదిగో ఆ యాజకుడు యొక్క అతిక్రమముల కొరకు ఆయన గాయపరచబడెను. ఇదిగో ఈ మెథడిస్ట్ కొరకు, ఈ బాప్టిస్ట్ కొరకు, ఈ పెంతెకొస్తు కొరకు ఆయన గాయపరచబడెను." ఏమిటి? "మన అతిక్రమముల కొరకు గాయపరచబడెను." నా పేరు, నీ పేరు, మరి ఎవరైనా సరే. అప్పుడు, మనము దానిని నమ్మెదము, అంతేగాని ఆ ఆచారము చెప్పింది కాదు. వాక్యము ఏమి చెబుతుంది! అప్పుడు అందరమూ కలిసి ఆ సిలువ యెదుట మోకరించుదాం. మనమందరమూ సహోదరులం.
ఓ, అవును, ఆ ఆచారాలు అన్నింటి నుండి కడుగబడి, మనకి మనమే ఆ పాత నిర్జీవ ఆచారముల నుండి కడగబడదాం. అక్కడ నలభై రాష్ట్రాల మత గురువులు, అక్కడ నలభై గొప్ప యాజకులు, అక్కడ కార్డినలు మరియు బిషప్లు, మరియు పోప్లు, గట్టిగా అరుస్తూ, "అక్కడ నుండి లేండి! మిమ్మల్ని నాశనం చేసుకొనవద్దు."
కాని నీ సహోదరుడు చుట్టూ నీ చేతులు ఉంచుము, సహోదరుడా అక్కడ ఏదో నిజమున్నది. ఆయన పొందిన అదే క్షమాపణ క్రింద నీవు క్షమాపణ కలిగి ఉన్నావు. మీరు సహోదరులు, మరియు అది మీ సహోదరుల కంటే ఎక్కువగా మిమ్ములను అంటుకొని కలిసి ఉన్నది. దేవునికి మనలను సమీపస్తులుగా తీసుకొని వెళ్ళుటకు, అది (క్షమాపణ) ఎంతో కొంత అయి ఉన్నది. మరియు నీవు ఎప్పుడైతే దేవునికి దగ్గరగా అవుతావో, అప్పుడు మీరు ఒకరికి ఒకరు దగ్గరవుతారు. "నీవు చూచుచున్న నీ సహోదరునిపై నీవు అసహ్యం లేదా అయిష్టం చూపుచూ మరియు నీవు చూడని దేవునిని ఎలా ప్రేమించగలను అని చెప్పగలవు? అలా చెబితే సత్యము ఎంత మాత్రమును నీలో లేదు, మరియు నీవు అబద్ధికుడవగుదువు."
కాని నీవు ఎప్పుడైతే ప్రభువైన యేసుక్రీస్తు రక్తము ఉన్న స్థలమునకు వచ్చావో, అప్పుడు ఆయన రక్తం నీ ప్రతి పాపమును కడిగివేయును, అప్పుడు మనమందరమూ సహోదరులము. అప్పుడు అక్కడ మనలో ఏ బేధము లేదు. మనపై తగిలించిన ఆ పాత పేర్లు ఉన్నా మనకు అవి పెద్ద విషయాలు కాదు.
70అక్కడ నాకు గుర్తున్నది, వేరొక రోజు నేను గేట్ దాటి వెళ్ళాను మరియు అక్కడ కూర్చున్న కొంత మంది సహోదరులను సూచిస్తూ ఉన్నాను, ఎందుకనగా అక్కడ నేను పశువుల మందను మేపెడివాడను. మరియు అక్కడికి వస్తూ ఉండే, ఆ ఫారెస్ట్ అధికారి (రేంజర్) ఆ వసంత కాలమంతా ఆ అడవిలో తిరిగే అన్ని పశువులను గుర్తుపెట్టుకుంటాడు. మరియు అతడు గమనించాడు. అతడు ఎన్నడు… వారు అన్ని రకములైన జాతులు కలిగి ఉన్నారు. కాని అతడు ఎన్నడూ ఆ జాతి గుర్తించలేదు. అతడు రక్తము కొరకు చూస్తూ ఉండేవాడు. మరియు అది ఇక్కడ ఉన్న శుద్ధమైన హెర్ఫోర్డ్ (ఒక రకపు జాతి) వలె ఉండాలి, లేదా అది అక్కడ ఉన్న ఆర్ఫాజో అడవిలో వెళ్ళదు, ఎందుకనగా హెర్ఫోర్డ్ పశువులన్నియు గుంపుగా అక్కడ మేస్తాయి. దానికి శుద్ధమైన హెర్ఫోర్డ్ పశువుల రక్తము ఉండాలి.
71నేను అనుకుంటున్నాను, ఈ చివరి కాలములో అలాగే
ఉండును. ఆయన ఈ విధంగా "నీవు మెథడిస్టువా? లేక బాప్టిస్టువా? అని అనడు. అదే ఒక పెద్ద ప్రశ్నయై యున్నది. ఈ రోజుల్లో - నీవు ఎవరవు? నీవు మెథడిస్టువా, బాప్టిస్టువా?"
నేను అన్నాను, "కాదు."
"మరి నీవు ఎవరవు?" ఒక ప్రెస్బిటేరియన్? లూథరన్? నజరేతువాడవా? పెంతెకొస్తువా?"
"కాదు."
"నీవెవరవు?"
"ఒక క్రైస్తవుడను."
ఒక క్రైస్తవుడవు. రక్తపు గురుతు, చూశారా — రక్తము క్రిందనే. అనగా ప్రతి ఒక్క సహోదరుడు, సహోదరి ఆ రక్తము క్రింద ఉన్నవారు, నా యొక్క సహోదరుడు, సహోదరి అని అర్థం. మరి ఎక్కువగా క్రీస్తు ఎదుట మనము యదార్ధముగా ఉందుము. మనము, యాజకుడు, బోధకుడు, ఇంకా మరెవరైనా, ఆ బలిపైన మన రెండు చేతులు ఉంచి మరియు ఇలా చెప్పుదుము, "మేము నేరము చేసిన పాపులము. నీ కృపను పొందుకోవడానికి మేము యోగ్యులము కాదు, ప్రభువా, కాని నీవు మా స్థానంలో నీ కుమారుని మరణించడానికి మా కొరకు పంపించావు, మరియు మేము దానిని స్వేచ్చగా అంగీకరించాము."
ఓ, ఇప్పుడు మేము సహోదరులమయ్యాం.
72ఆ పాత గొడవ అంతా పోయింది, అవి అన్నియు పోయాయి. మేము నిష్కపటముగా క్షమించబడినాము. ఆ ఆచారముల నుండి కడుగబడి, పాపాలు నుండి కడుగబడి మరియు క్షమించబడినవానిగా నీవు వెళ్ళు పాత సంగతులన్నియు గతించిపోయెను. ఆ పాత హంగామా అయిపోయింది. బాప్టిస్టులు, మెథడిస్టులు మరియు ప్రెస్బిటేరియన్లు అందరూ కూడా ఆ ఒకే రక్తము క్రింద కడుగబడి మరియు అందరూ సహోదరులుగా మారెను. ఆచార పద్ధతుల హంగామా పోయి, సహవాసము ఇక్కడ ఏర్పడినది. మరియు అక్కడ మాత్రమే సహవాసమును చూడగలం.
ఈ సంపూర్ణ సువార్త వర్తకుల కూటమిలో నేనూ ఎక్కువ మంది ప్రెస్బిటేరియన్లు నిలుచుండడం, వారు మాట్లాడగలిగిన దాని కంటే ఎక్కువ గట్టిగా అరవడం, భాషలతో మాట్లాడటం నేను చూచాను. మరియు అమెరికాలో ఉన్న గొప్ప ప్రెస్బిటేరియన్లలలో కొందరు ఇక్కడ ఉండటం. జిమ్ బ్రౌన్ అనే గొప్ప ప్రెస్బిటేరియన్ను మీలో ఎంత మంది ఆయనను కలుసుకున్నారు, అటువంటి ఆయన ఇక్కడ ఉండి మరియు ఆత్మలో నాట్యం చేస్తూ భాషలు మాట్లాడుతూ మరియు ఇక్కడికి తీసుకుని రాబడ్డారు. ఆయన అమెరికాలోని ఒక గొప్ప ప్రాముఖ్యమైన ప్రెస్బిటేరియన్ సంఘములో పాస్టర్. లూధరన్స్, మెథడిస్టులు, ప్రెస్బిటేరియన్లు, అందరూ కలసి. అది ఏమిటీ? వారందరూ రక్తం క్రిందకి వచ్చారు. వారికి ఏ అడ్డు లేదు. అక్కడ మతశాఖ అడుకట్టలు కూడా ఏమీ లేవు. మనమంతా ఒక్కటే! మనమందరమూ క్రైస్తవులము. మనకు ఉన్న అన్ని పరిస్థితులు ఒక్కటే, అవును.
ఇక్కడ, ఈ మధ్యనే.
73(ముగింపులో), అక్కడ ఒక పురుషుడు మరియు ఒక స్త్రీ, భర్త మరియు భార్య విడిపోతున్నారు. మరియు వారు కలిసి ఉండాలని అనుకున్నారు. వారు మానసిక వైద్యులు దగ్గరికి వెళ్ళారు, వాళ్ళైన వారి మనస్సులను కలుపుతారేమో అని, కాని వారి వలన కాలేదు. కలిసి జీవించడానికి ఆలోచించిన మార్గములు లేదా ప్రతీ దాని దగ్గరకు వెళ్ళారు కాని వారికి ఇంకా వివాదమై మరియు చివరికి, వారు విడిపోయారు. మరియు వారు ఒకరి ఎదుట ఒకరు, ఒకరి సమక్షంలో మరొకరు కలిసి ఉండలేకపోయారు మరియు వారి గొడవ ఇంకా పెద్దదైంది. కాబట్టి, వారు విడాకులు తీసుకుందామని నిశ్చయించుకున్నారు. కాబట్టి, వారు డబ్బులకి ఒక లాయర్ ను మాట్లాడుకొని, వారికి విడాకులు మంజూరు చెయ్యమని అడిగారు.
మరియు అతడు అన్నాడు, "మంచిది, ఇప్పుడు, ముందు ఈ పని చేద్దాం," అన్నాడు, "ఈ స్థలాన్ని అమ్మేద్దాం." మీరు అన్ని విధాలా ఆలోచించి, కష్టార్జితమైన ఆస్తి స్థలాన్ని అమ్మి, సమానంగా పంచి మరియు స్థలమమ్మిన డబ్బుతో విడాకులు తీసుకుందాం."
74కాబట్టి భర్త మరియు భార్య కలిసి వెళ్ళారు. వారు ఇంటికి వెళ్ళారు. మరియు వారు నివసిస్తున్న గదిలోనికి వెళ్ళారు, మరియు ఆమె, "నేను దీనిని తీసుకుంటున్నాను" అని చెప్పింది.
మరియు అతడు, "అయితే నేను ఇది తీసుకుంటాను" అన్నాడు. మరియు వారు మరల గొడవపడి మరియు వారు వేడిచేసిన ఆహారము వారితో, ఒకరు వేరొకరు తెచ్చుకున్నారు.
కొద్దిసేపటికి, వారు ఇలా అనుకున్నారు, "మంచిది, నీవు ఇది తీసుకుంటానంటే నేను నీకు ఇది ఇస్తాను."
అలాగే ఇవ్వు అనుకున్నారు, మరికొద్ది సేపటికి అలా వెళ్ళారు.
తరువాత వారు పార్లర్ కు మరియు ఇంకా అనేక చోట్లకి వెళ్ళారు మరియు వంట గదిలోనికి, మరియు బెడ్ రూమ్ లోనికి వెళ్ళారు. వారికి రావాల్సిన వాటాలు విభజించుకున్నారు.
75అప్పుడు చివరిగా వారికి ఆ పాత వస్తువులు భద్రపరిచే గదిలో ఏవో కొన్ని వస్తువులు ఉన్నాయని గుర్తు వచ్చింది. కావున వారు ఆ పాత గదిలోనికి వెళ్ళి, మరియు వారు ముఖ్యమైన వస్తువులు ఉన్న ఆ పాతదైన దానిని బయటికి తీసారు. మరియు వారు వాటన్నింటిని బయటకు తీసి చూడడం మొదలుపెట్టి, "ఇది నీ కొరకు, మరియు ఇది నా కొరకు," అని అనుకొనెను.
మరియు చివరిగా వారిద్దరి కళ్ళు ఒక చిన్న వస్తువు మీద పడ్డాయి, మరియు వారిద్దరూ తొందరగా పోటీపడి ఆ వస్తువును పట్టుకొని లాగుకున్నారు. మరియు వారిద్దరూ ఒకరినొకరు అలా లాగుకుంటూ చూసుకున్నారు. అది ఏమిటి? అది ఒక జత తెల్లని చిన్న బూట్లు, అవి వారి పాపాయికి చెందినవి. ఆ పాప ఇప్పుడు జీవించి లేదు, అవి వారిద్దరికి చెందిన భాగమై ఉన్నవి. అందుకే ఆ పాప చిన్న బూట్లను ఇద్దరూ రెండు చేతులతో గట్టిగా పట్టుకొని లాగుకుంటున్నారు. నిజంగా, ఆ బూట్లు ఎవరికి చెందుతాయి? ఎవరివి అవి? అవి వారి ఇద్దరికీ చెందుతాయి. వారి వస్తువులను సమానముగా ఇద్దరూ కలిగియున్నారు.
మరి కొద్ది నిమిషాలలోనే, ఒకరిని ఒకరు చూస్తుండగానే, కన్నీళ్ళు రావడం ప్రారంభమై, వారి బుగ్గల మీదుగా కారుతూ క్రిందకు పడ్డాయి. అది ఏమిటి? ఎందుకని? వారు అన్నింటినీ భాగాలుగా పంచుకున్నారు, కాని ఒక వస్తువు దగ్గరకు వచ్చేసరికి పంచుకోలేకపోయారు, ఎందుకనగా వారు ఇద్దరికి సంబంధించినది ఆ ఒక్కటీ, అదే వారి కుమార్తె మరియు ఆమె పరలోకంలో ఉన్నది, అప్పుడు ఇంక గొడవ పోయింది. మరికొద్ది నిమిషాలలోనే, వారు ఒకరి ఒక్ళో ఒకరు చేతులు కలిపి ఉన్నారు. విడాకులు సమస్య పోయింది. అక్కడ ఆ వాతావరణం అంతా శాంతి నెలకొంది.
76మరియు, సహోదరులారా, ఈ రాత్రి నన్ను ఒక విషయం చెప్పనివ్వండి. మనము సంఘములో సభ్యత్వం తీసుకుని, వెళ్ళి రావడం కాదు ముఖ్యం, అలా కోరవద్దు. కాని నేను మిమ్మల్ని ఇది అడుగుచున్నాను, మనము ఒక విషయంలో ఒకదానిని సమానంగా, అందరమూ ఒక్కటే కలిగి ఉన్నాము, అది యేసుక్రీస్తు. ఆయన మన అందరిలో సమానంగా ఉన్నాడు. మనమందరమూ బాప్టిస్టులము కాలేము, మనమందరమూ మెథడిస్టులము కాలేము, మనమందరమూ త్రిత్వము (లేదా) ఏకత్వము లేదా మరేదియు కాలేము, మనము ఆ విధంగా ఉండలేము. కాని ఒక విషయం మనందరిలో సమానంగా ఉన్నది. అదే దేవుని కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువు క్షమాపణ అనే బహుమతి మనందరిలో ఉన్నది. ఆయనలో ఉన్నవి అన్నీ మనలో ఉన్నవి. కాని మనము దానినే మొదటగా అంగీకరించాలి. దేవుడు మనకు అనుగ్రహించిన క్షమాపణను అంగీకరించినప్పుడు, మిగతావన్నియు మనకు లభిస్తాయి.
అది మన విద్యావ్యవస్థల ద్వారా, శాఖాపరమైన సిద్ధాంతాల ద్వారా రాదు గాని, కేవలం యేసుక్రీస్తు రక్తం ద్వారా మాత్రమే వస్తుంది. ఒక్కదానినే సమానంగా అందరిలో కలిగి ఉన్న మనము మరియు ఒక్కటిగా, మనమందరమూ ఆయన సిలువ క్రింద కలుసుకుందాం. నీవు దానిని నమ్ముచున్నావా? మనమందరమూ ప్రార్ధనకై కొద్ది నిమిషములు తలలు వంచుదాం. [ఒక సహోదరి విన్న వాక్యం ద్వారా ప్రేరేపింపబడి మాట్లాడుచుండెను.] ఆమెన్.
77మన తలలతో పాటు తప్పకుండా మన హృదయాలను వంచి, అవును మన హృదయాలను కొద్ది నిమిషాలు తలలతో పాటు వంచి ఇలా చెప్పుదుము, "ఓ ప్రభువా, నేను చేసిన ఆ ఆచారములన్నిటినీ, నా విరిగి నలిగిన మనస్సుతో, అవి ఒప్పా లేక తప్పా అని ఇప్పుడు నేను అడుగుచున్నాను?"
ఇప్పుడు పరిశుద్ధాత్ముడు హృదయము అంతటిని పరిశోధింపనియ్యండి. మరియు అది ఏ విధంగా, ఎచ్చట అది ఉండాలో అలా లేకుంటే మరియు నీవు ఈ ముగింపు ప్రార్ధనలో నీవు ఒక్కసారి దానిని గుర్తుచేసుకో, మన పాపములకు ప్రాయశ్చిత్తం కలగాలంటే మనమందరమూ ఆయన రక్తము అనే ఒక్కదాని క్రిందనే కలుసుకోవాలి. మనము ఎప్పుడైతే అలా చేస్తామో, అప్పుడు మనము ఈ ప్రపంచంలో ఉన్న అన్నింటి నుండి కడుగబడతాం. మరియు నీవు నీ చేతులు రెండూ దేవుని కొరకు పైకెత్తి మరియు దేవుడు నిన్ను జ్ఞాపముంచుకొనమని ప్రార్ధించవా? అయితే ఇలా చెప్పు, "నన్ను జ్ఞాపకముచేసుకో ప్రభూ," దేవుడు నిన్ను దీవించును గాక, ఓ, నా చేతులెత్తి! "నన్ను జ్ఞాపకముచేసుకో, ప్రభువా."
78మనము ఈ భూమి మీద విహారయాత్రలకు తిరుగుతున్నట్లుగా తిరగడానికి ఇంకా ఎక్కువ రోజులు లేవని నీవు గమనిస్తున్నావా? "మంచిది, నేను చిన్నవాడిని కదా అని నీవు చెప్పువచ్చును." నాకు తెలుసు… కాని, ఈ ప్రపంచంలో ఈ రాత్రే అనేక మంది యవ్వన ప్రాయంలో ఉన్న సహోదరి, సహోదరులు చాలా మంది, వందల కొలది మరణిస్తున్నారు. లేదు, ఎంత ఊపిరి నీలో మిగిలియున్నదో దానిని మాత్రమే నీవు కలిగియున్నావు. నీవు ఈ సమయము నందు ఇలా చెప్పగలవా, "ఓ ప్రభువైన దేవా నీవు యేసుక్రీస్తు రక్తము ద్వారా ఇచ్చిన ఆ క్షమాపణను నేను అంగీకరించాను అని నీ రెండు చేతులు పైకెత్తి చెప్పగలవా? ఇప్పుడు నీవు రక్తమనే గుర్తు ద్వారా వచ్చిన పరిశుద్ధాత్మను నా మీదికి దిగి రానిమ్ము, నేను ఇప్పటివరకూ పరిశుద్ధాత్మను పొందుకోలేదు. అది నాకు తెలుసు. మరియు నేను మీరు చెప్పిన ఆ మాటల మార్గంలో నేనూ ఆనందించాలని, అదేదో నేను పొందుకోవాలని కోరుకుంటున్నాను, ఆ విధంగా నా పాపములన్నింటినీ పొగొట్టుకొని మరియు ఈ ప్రపంచంలో ఈ ప్రేమ ఉన్న ప్రపంచంలో నేను కూడా ఒక నూతన జీవిగా, జీవితాంతం గడపాలని ఉన్నాను. అది నా హృదయంలో ఉండాలని కోరుకుంటున్నాను. మరియు దేవా! నేను నా చెయ్యిని బ్రదర్, బ్రెన్హాం గారి కొరకు ఎత్తుట లేదు, కాని నా చేయి నీ కొరకు ఎత్తుచున్నాను - మరియు నీకు నా హృదయం తెలుసు."
మరియు దానిని ఎవ్వరూ చూడలేరు. కేవలం దేవుడు ఒక్కడు మాత్రమే దానిని చూడగలడు. మరియు ఇలా చెప్పుము, "దేవా, నాకు ఆ గుర్తు కావాలి, అది ఆ రక్తమును నాపైన గుర్తుగా పూసుకొనియున్నాను. మరియు నాకు అది కావాలి." నీ చేయి పైకెత్తి, "బ్రదర్ బ్రెన్హాం, నా కొరకు ప్రార్ధన చెయ్యవా," అని చెప్పు. ప్రభువు నిన్ను దీవించును గాక. అది మంచిది.
79నీవు ఏదైనా, నీవు మెథడిస్తువైనా, బాప్టిస్టువైనా, ప్రెస్బిటేరియనువైనా, మరి కోరినవారందరి కొరకు. ఇప్పుడు నేను ఆ సంఘాలు అన్నింటికి వ్యతిరేకత కలిగి చెప్పడం లేదు. వారు, వారందరూ సరే. కాని, నేను చెప్పదలచుకున్నది ఏమిటంటే, అవి అన్నియు మిమ్మల్ని రక్షించలేవు. మీరు చూశారా? అది దేవుని క్షమాపణ, క్షమించే కృప వలన మనము పొందుకోగలము. మరియు అది ఒక సంఘం ద్వారా చెప్పబడదు గాని యేసుక్రీస్తు రక్తము ద్వారా మాత్రమే జరుగును. అదియే మన ప్రత్యామ్నాయ బలి, మనము ఆయన మీద చేతులు ఉంచి మరియు ఇలా చెప్పెదము, "ఇప్పుడు, నేను నాకు బదులుగా దీనిని (ఆయనను) అంగీకరిస్తున్నాను. దేవా నాపై నీ కృపను చూపించుము."
మరియు ఒకవేళ మంచి మనస్సాక్షి యదార్థతతో సంఘంలో చేర్చబడిన సంఘ సభ్యులు ఇక్కడ ఉన్నారేమో. నా హృదయమంతటితో నేను నమ్ముచున్నాను, వారు యదార్ధతతో సంఘంలో సభ్యత్వం పొందారని. కాని, నీవు నాతో చెప్పవచ్చు, "బ్రదర్ బ్రెన్హాం, నిజంగా ఇంకా నా హృదయం ఆ పాత ఆచారాల నుండి మరియు ఆ సంగతులన్నింటి నుండి కడగబడలేదు. నేను నా సంఘమునకు వ్యతిరేకంగా మీరు మాట్లాడినా నేను నమ్ముతాను, ఒకవేళ బైబిలు అలానే చెబుతుంది అని చూపిస్తే, అదే చెప్పండి, సంఘం తప్పుగా వ్యవహరిస్తుందని బైబిలు ద్వారా నిరూపిస్తే, నేను ఇంకా నేను నా హృదయమంతటితో అంగీకరించలేకపోతున్నాను. నేను అలా చేయలేకపోతున్నాను, కాని నేను అంగీకరించాలి. నా కొరకు ప్రార్ధించండి." నీవు నీ చేయి పైకెత్తి, "ప్రార్థించమని అడగగలవా?" నేను చేస్తాను. అవును. నేను తప్పకుండా ప్రార్ధిస్తాను." దేవుడు నిన్ను దీవించును గాక. అది మంచిది. అది శ్రేష్టమైనది.
"నేను, దేవుడు ఆయన బైబిలులో ఉంచిన ఆయన మార్గమును, ఆయన చెప్పిన ప్రతి మాటను, ప్రతి విషయాన్ని అంగీకరించాలని నేను కోరుచున్నాను. మరియు నేను యేసుక్రీస్తు యొక్క రక్తము నాపైన ఉండాలని కోరుచున్నాను."
80మరియు ఎప్పుడైతే ఆ రక్తము మనపై పూయబడిందో అదే గుర్తు… చూశారా, ఆ రక్తము వలన ఒక గుర్తు ఇవ్వబడినది అక్కడ, మరియు అదియే పరిశుద్ధాత్మ మరియు పెంతెకొస్తు దినమున, పరిశుద్ధాత్మ ఎప్పుడైతే క్రిందికి వారి మీదికీ దిగివచ్చిందో, ఆ రోజు అక్కడ ఉన్న ప్రజలకు ఏం జరిగిందో మీకు తెలుసా, మరియు అది అన్నికాలములలోను ఆ ప్రజల మీదికి దిగి వచ్చినట్లుగానే, అది అదే రీతిగా తన కార్యము జరిగించును. పేతురు, "మీరు మారు మనస్సు పొంది, పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి. అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరము పొందుదురు. ఈ వాగ్దానము మీకును, మీ పిల్లలకును దూరస్తులందరికిని, అనగా ప్రభువైన మన దేవుడు తన యొద్దకు పిలిచిన వారికందరికిని చెందునని వారితో చెప్పెను."
ఒకవేళ అది పది పైసలు అయితే ఇక్కడా పది పైసలే, బయట కూడా పది పైసలే. అది మరి ఎక్కడ ఉన్ననూ అది పది పైసలే. ఒకవేళ ఇది ఇక్కడ వజ్రం అయితే, అక్కడ (బయట) కూడా అది వజ్రమే. ఒకవేళ ఇది ఇక్కడ ఇల్లు అయితే, అక్కడ కూడా అది ఇల్లే, మరియు ఒకవేళ ఇది ఆ పెంతెకొస్తు దినమందు దిగి వచ్చిన పరిశుద్ధాత్మ అయితే, అదే పరిశుద్ధాత్మ ఈ రోజుల్లో ఒకే విధంగా ఉన్నది. మరియు నీవు ఆ అనుభవాన్ని ఎన్నడూ కలిగి లేకపోతే? మనం ప్రార్ధించే సమయంలో దానిని ఇప్పుడే అంగీకరించు, నీవు అలా చేస్తావా?
JOHN 3:3•
ACTS 2:39
81మా పరలోకపు తండ్రీ, సూర్యుడు త్వరగా అస్తమించుచున్నాడు, సమయము ఇంక ఎక్కువగా ఏమియు లేదు, ఒక రోజు ఆ గొప్ప ప్రధాన దూత నిత్యత్వం నుండి కాలము అనే తెర మీదికి దిగి వచ్చును. మరియు దేవుని బూర ధ్వని వినబడినప్పుడు మరియు ప్రతి పురుషుడు మరియు స్త్రీ, సత్యమైన దేవుని వాక్యము వారికి తెలిసిన దానిని జవాబుగా చెప్తారు. దేవునిని మనము భూమిమీద కలిగి ఉండాలంటే కొన్ని నియమాలు, అర్హతలు కలిగి ఉండాలి, వాటి ద్వారానే మనకు తీర్పు తీర్చబడుతుంది. మరియు మనము ఒకవేళ సంఘం యొక్క మన శాఖాపరమైన నియమ నిబంధనలు గనుక తీసుకుని ఉంటే మనము ఎంతవరకూ దానిని కోల్పోతాం! మరియు ఏ శాఖా సిద్దాంతం సరైనది? దానిని బట్టి మనము తికమకపడతాము అవుతాం. మనం ఏం చేయాలో మనకి తెలియదు.
కాని అక్కడ ఒక నాణ్యత కలిగినది ఉన్నది, అదియే దేవుని వాక్యం. మరియు నీ వాక్యం చెప్పింది, "ఒకడు తిరిగి జన్మిస్తేనే తప్ప, అతడు ఎన్నటికినీ దేవుని రాజ్యమును చూడలేడు." మరో మాటలో, దానిని అతడు అర్ధము చేసుకోలేడు. అతడు దానిని తప్పక, విశ్వాసము ద్వారానే అంగీకరించి, మరియు తిరిగి జన్మించాలి, మరియు అప్పుడు అతడు అర్థం చేసుకుంటాడు. "చూడడం" అంటే అర్ధం చేసుకోవడం.
82మరియు మనము ఈ రాత్రి, ఈ వర్తకుల నగరంలో ఉన్న ఈ భవనము అంతటిలో ఉండి, చేతులు పైకెత్తిన అనేకమంది కొరకు మరియు స్త్రీలు, బాలురు మరియు బాలికల కొరకు దేవునికి ప్రార్ధిస్తూ, వారు నిజంగా యదార్ధతతో వారి చేతులు పైకెత్తారని నేను నమ్ముచున్నాను. ఇప్పుడు వారికి ఒక గొప్ప నమ్మకం కలగకపోతే వారు ఆ చేతులను పైకి ఎత్తలేరు. మరియు వారితో ఉన్న పరిశుద్ధాత్మ వారు అనుసరిస్తున్నది తప్పు అని నిరూపించి, మరియు వారిని సత్యమైన, సరియైన గట్టి నమ్మకం కలిగించేలా తీసుకువచ్చింది. మరియు వారు "ఓ గొప్ప సృష్టికర్త ఏదో ఒక రోజు నిన్ను మేము కలుసుకుంటామని గుర్తెరిగి, నీ కొరకు మా చేతులు పైకెత్తుచున్నాము," మరియు వారు యదార్థత కలిగి ఉన్నారని నేను నమ్ముచున్నాను, ప్రభువా మరియు నేను వారందరి క్రొరకు మధ్యవర్తిగా ఉన్నాను. ఈ రాత్రి నేను నమ్ముచున్నాను, ప్రభువా వారిలో చేతులు ఎత్తిన ప్రతి ఒక్కరూ కూడా జీవితాంతం నీ పరిశుద్ధాత్మను పొందుకోకుండా ఎవ్వరూ మరణించకూడదని నేను ప్రార్ధిస్తున్నాను. వారికి దయ చేయండి, ప్రభువా, వారందరూ యేసుక్రీస్తు బహుమానాలు పొందుకోవాలని ఆశిస్తున్నాను. అలా జరగనీయండి ప్రభువా అని నేను ప్రార్ధిస్తున్నాను.
నశించిపోతున్న వారిని రక్షించండి.
JOHN 6:44•
ROM 8:29,30•
REV 17:8
83ఎవరైతే క్రీస్తును అంగీకరించారో, వారిని నీ పరిశుద్ధాత్మతో నింపండి. వారి ఆత్మలపైన, పరిశుద్ధాత్మను కుమ్మరించండి తండ్రి నీ నామమునకే మహిమ కలుగనీయండి. యేసూ, మీరు మాతో చెప్పారు, "మొదటిగా నా తండ్రి ఆకర్షిస్తేనే తప్ప ఏ మనుష్యుడును నా యొద్దకు రాడు." "మరియు వినుట వలన విశ్వాసము కలుగును, మరియు దేవుని మాట వినుట వలన కలుగును," మరియు ఇప్పుడు దేవుని వాక్యము బోధింపబడుచున్నది, వినుట వలన విశ్వాసము కలుగును. మరియు వారు దేవుని వద్దకు ఆకర్షించబడ్డారు, ఎందుకనగా బైబిలు చెబుతుంది, "దేవుడెవరిని ముందుగా ఎరిగెనో, వారిని ముందుగా నిర్ణయించెను. మరియు ఎవరిని ముందుగా నిర్ణయించెనో, వారిని పిలిచెను. మరియు ఎవరిని పిలిచెనో, వారికి నిత్యజీవమిచ్చెను."
మరియు ఇప్పుడు, ఈ ప్రపంచం ముందుగా జరిగిన ప్రారంభంలోనికి తిరిగి వద్దాం, నీవు వారి పేర్లను గొర్రెపిల్ల జీవగ్రంథమందు లిఖించావు మరియు ఈ రాత్రి పరిశుద్ధాత్మ వారిని పిలుచుచున్నది. మరియు ఈ రాత్రి పరిశుద్ధాత్మ వారిని పిలుచుచున్నది. మరియు వారు తమ చేతులు పైకెత్తారు. ఇప్పుడు, వారికి నిత్యజీవాన్ని ఇవ్వు ప్రభువా, దేవుని మహిమ కొరకు ఈ విధంగా అడుగుచున్నాను, ప్రభువా. పరిశుద్ధాత్మ వారి హృదయాలలోనికి దిగి వచ్చి మరియు వారి నిర్జీవ క్రియలు మరియు ఆచారముల నుండి వారి అంతరాత్మలను కడిగి మరియు పూర్తి స్వేచ్చ క్షమాపణను వారికి ఇచ్చును గాక. మరియు వారిని పరిశుద్ధాత్మ ప్రత్యక్షతతో నింపి, వారు ఈ రోజు నుండే ఆ చీకటి గడియలు నుండి అంటే సొదొమ రోజులలో ఏ విధంగా ప్రజలు జీవించారో, ఎలా స్త్రీలు ముఖానికి రంగులు పుసుకున్నారో, ఆ చీకటి కార్యాలైన మద్యం, సిగరెట్టు, వ్యభిచారం మొదలైన వాటి నుండి వారిని దూరం చేయండి.
ఓ, ప్రభువైన దేవా, స్త్రీలు మరియు పురుషుల మధ్య పెరుగుతున్న తగాదాలను జ్ఞాపకం చేసుకోండి. నీ పరిశుద్ధాత్మను వారికి అర్థమయ్యే రీతిలో నీ పరిశుద్ధ అగ్నిని వారి మీదికి పంపి, దేవుని మంచితనము వారిలో నింపబడునట్లు చూడుము, ప్రభువా. మరియు నీ సిలువ చెంతకు వచ్చిన ప్రతి పాపిని నీవు ఆలాగున మార్చుము. ఆ విధముగా దయ చేయుము, ప్రభువా, ఎందుకనగా ఎక్కడ వారందరూ పడిపోయారో మరియు అక్కడే వారు క్షమాపణను కనుగొందురు. మెథడిస్టు, బాప్టిస్టు, ప్రెస్బిటేరియన్, పెంతెకొస్తు మరియు అందరికీ ఆలాగు చేయుము, ప్రభువా. దయ చేయండి. ఇప్పుడు వారు నీవారైయున్నారు. నీవు వారికి ఈ విధంగా అనుగ్రహిస్తావని నమ్మి నేను వారిని నీ చేతులకు అప్పగిస్తున్నాను. ప్రభువైన యేసుక్రీస్తు నామములో. ఆమెన్.
ROM 10:17
84మీరు ఆయనను ప్రేమిస్తున్నారా? ఇక్కడ కొద్ది క్షణాలు పరిస్థితి వేరుగా ఉన్నది. ఈ పాత మధురమైన చక్కని పాటను కలిసి పాడదాం. నేను దీనిని పాడుటకు ఇష్టపడుచున్నాను. మీకు తెలుసా, కొన్నిసార్లు ప్రసంగంలో మీరు కొన్ని విషయాలను తొలగించండి అని అంటారు కాని గిలాదులో ఉన్న గుగ్గిలము స్వస్థపరిచేదిగా ఉన్నది, అటువంటిది మీ మనస్సులను స్వస్థపరచలేదా? మీరు పాడగలిగితే, మనమందరము కలిసి ఆ పాత, చక్కని మధురమైన పాటను పాడుదాం. "నేను ఆయనను ప్రేమించుచున్నాను, నేను ఆయననను ప్రేమించుచున్నాను, ఎందుకనగా ఆయనే మొదటిగా నన్ను ప్రేమించెను." మీకు ఆ పాట తెలుసా? ఎవరైనా నా కొరకు ఆ పాటను నడిపించండి.
నేను ఆయనను ప్రేమించుచున్నాను,
నేను ఆయనను ప్రేమించుచున్నాను
ఎందుకనగా ఆయనే మొదటిగా నన్ను ప్రేమించెను,
మరియు నా రక్షణనూ కొనెనూ
ఆ కల్వరి వృక్షముపైనే.
85అందరమూ దానిని పాడుదాం. ఇప్పుడు, "నేను ఆయనను ప్రేమించుచున్నాను," అని మీరందరూ పాడుచుండగా, మీలో ఎంతమంది బాప్టిస్టులు ఇక్కడ ఉన్నారు? మీ చేతులు పైకెత్తండి. ప్రెస్బిటేరియన్? లూథరన్? నజరేతువారు? పరిశుద్ధ యాత్రికులు, పెంతెకొస్తు వారు ఎంతమంది? మై….. అందరు! అందరు కలిసి. మనము ఇప్పుడు ఏమి చేశాము? ఆ క్షమాపణా కృప ద్వారా, ఎప్పుడైతే మనమందరమూ ఆయన సిలువ చెంతకు వచ్చామో. మనమందరమూ క్షమించబడినాము, సంఘం ద్వారా కాదు గాని ఆయన కల్వరి ద్వారా మాత్రమే. మనము పాడుచుండగా, ఇప్పుడు మెథడిస్ట్, బాప్టిస్టు, మరియు పెంతెకొస్తువారితో కరచాలనము చేద్దాము.
నేను ఆయనను ప్రేమించుచున్నాను,
నేను ఆయనను ప్రేమించుచున్నాను,
ఎందుకనగా ఆయనే మొదటగా నన్ను ప్రేమించెను,
మరియు నా రక్షణను కొనెను,
ఆ కల్వరి వృక్షము పైన.
ఇప్పుడు, అందరు వినగలుగునట్లు మనము పాడెదము. మనము కేవలము మన తలలను వంచి మరియు మన రెండు చేతులు దేవునికి ఎత్తుదము. మన పూర్ణహృదయముతో ఆయనను ప్రేమించినట్లయితే, మనందరము ఆలాగు చెప్పెదము.
నేను ఆయనను ప్రేమించుచున్నాను,
నేను ఆయనను ప్రేమించుచున్నాను,
ఎందుకనగా ఆయనే మొదటగా నన్ను ప్రేమించెను,
మరియు నా రక్షణను కొనెను,
ఆ కల్వరి వృక్షము పైన.