ఇప్పుడు చెరలో నున్న ఆత్మలు

ఇప్పుడు చెరలో నున్న ఆత్మలు

1వందనములు. క్షణం మనము తలలు వంచుదము. పరలోకపు తండ్రీ, మరొకసారి ఈ విధముగా కూడుకొను ఆధిక్యతను నేడు మాకిచ్చినందులకై మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. ఏదో ఒక దినమున మర్త్యశరీరులముగా కడసారిగా కూడుకొందుమని ఎరిగియున్నాము. అటు తరువాత నీతో మహిమ స్థితిలో కూడుకొందుమని నిశ్చయత కలిగినవారమై మరియు అన్ని యుగములలో విమోచింపబడినవారెల్లరు అక్కడ కూడుకొందురని ఎరిగియున్నాము.

ఓ, ఆ ఘడియ చేరుటకై మా హృదయములు కనిపెట్టుచు ఆత్యాసక్తితో కొట్టుకొనుచున్నవి. దానితో, మా భీతులన్నియు అదృశ్యమైపోవుచున్నవి. మేము దేనికైనను వెరవవలసిన, దిగులు పడవలసిన అవసరత లేదు. నిత్యుడగు దేవుడు చేసిన వాగ్దానము వైపు మేము చూచుచున్నాము. అది సత్యము అని మేము యెరుగుచున్నాము. అందువలననే మేము జీవించుచున్నాము. ఈ మర్త్యశరీరము మార్పుచెంది, ఆయనను పోలినవారమగు ఘడియకును, సమయము కొరకే మేము జీవించుచున్నాము, మరియు అచ్చట వ్యాధిగాని, మరే దుఃఖముగాని, వేదనలు కాని మరేమి ఉండవు.

EPH 2:6

 

2ఓ, అప్పుడు అవి అన్నియు గతించిపోవును. హృదయానందముతోను, విశ్వాస మరియు ధైర్యములతోను ఆ దినము కొరకై మేము ఎదురు చూస్తున్నాము. ప్రభువా, అందునిమిత్తమే ఇచ్చట ఈనాడు కూడుకొంటిమి. మా తప్పులను ఒప్పుకొనుటకు, కృపను వేడుకొనుటకై చేరితిమి. మేము మానవమాత్రులము, మా జీవితమంతా పొరపాట్లే అని మేము యెరిగియున్నాము. అందునిమిత్తము ఈ ఉదయకాలమందు నీ బలిపీఠమును సమీపించుచున్నాము. నీ ఆశీర్వాదము కొరకు, మా బలమును విశ్వాసము పునరుద్ధీకరింపబడుటకు యధార్థ హృదయముతో మా తప్పిదములను ఒప్పుకొనుచు, పరలోకపు తండ్రి వైపు చూచుచున్నాము. మా పరలోకపు తండ్రి, ఈ ఘడియలో "పరలోకమందు యేసుతో కూడ కూర్చుండ బెట్టు" వాగ్దాన ప్రకారము మాకు ఆయన అనుగ్రహించునది మేము కూడుకొనియున్నాము. ఆయన వాగ్దానము వలన మేము మరణము నుండి జీవములోనికి ప్రవేశించితిమనియు, ఇప్పుడు ఆయనతో కూడ కూర్చుండబెట్టుటకు పరలోక వాతావరణములోనికి కొనిపోబడితిమని నిశ్చయతను గలిగితిమి. ఈ ఉదయకాలమందు మనము తెలిసికొనుటకు ఆయన కలిగియున్న విషయములు ఆయన మనకు బోధించును గాక. మరియు మా ముందుంచబడిన మా భావిజీవితాన్ని కొనసాగించుటకు కావలసినంత బలము కలిగియుండుటకు జీవాహారము మాకు దయచేయుము. దానిని దయచేయుము ప్రభువా, ఈ మా ప్రార్థన యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాము. ఆమెన్.

మీరు కూర్చుండవచ్చును.

3ప్రతి ఒక్కరికి ఉదయకాల అభివందనములు. ఈ ఉదయ కాలమందు మరల మీతో కూడ పరలోక వాతావరణమునందు ఆరాధించుటకు ఇక్కడ కూడుకొనుట అది సంతోషముగా నున్నది. కొంత ఆలస్యమైనది.

కొన్ని నిమిషముల క్రితము కొన్ని వాస్తవమైన, వాస్తవమైన దుఃఖకరమైన పిలుపులు వచ్చినవి. నేనిచ్చట నిలువబడియుండినంత వాస్తవముగా, ఒక పిల్లవాడు మరణ స్థితిలో నున్నాడని వార్త, ప్రభువు అతడి శరీరమును ముట్టి మార్గమున అతని పంపివేసెను. ఇక్కడ ఒక అబ్బాయి నిలువబడియున్నాడు; అతడు నాయొక్క సహోదరుని కుమారుడు. వారు ప్రారంభమునుండి కథోలిక్కులు, అయితే వారు వారి ఆరాధనకు ఈ ఉదయమున వెళ్లిరి. ఏదో వారితో ఇక్కడకు వచ్చుటకు చెప్పెను. అందువలన వారు వచ్చిరి. అచ్చట ఒక మార్పు కలిగినది గనుక వారు ఇంటికి వచ్చి, నీటి బాప్తిస్మము కొరకు సిద్ధపడుచున్నారు.

పిమ్మట అచ్చట… సరిగ్గా ఆశ్చర్య కార్యములు జరిగినవి. మన ప్రభువు ఎల్లవేళల యందు చేయుచుండును. ఎడతెగక ఆయన సరిగా చేయుచుండును. వారు లోపలికి రావలెనని వచ్చారు కాని, లోపలికి రాలేకపోయిరి. "లోపలికి వచ్చుటకు త్రోవలేకపోయెనని," వారు చెప్పిరి.

4"మంచిది, మీరు నాతో మాట్లాడగోరుచున్నారా?" అని నేను చెప్పితిని. మరియు "మీరు ఇంటికి వచ్చిన పిమ్మట, అచ్చట మనము మాట్లాడుకుందాము" అని నేను చెప్పితిని.

కావున ఇప్పుడు రాబోవు మీటింగునకు న్యూయార్కునకు గల నా మార్గమున సరిగా బాగ నుండగలదు అని నేను తలంచితిని … . అచ్చట ఒక దినము ఉండుటవలన, ఈ ఉదయమున నేనును మీరెల్లరును కలిగిన అగ్నితో నేను సేద తీర్చుకొనగలను అని నేను ఎరుగుదును.

మొన్నటి దినమున మధ్యాహ్నమున మేము ఇక్కడకు వచ్చితిమి.

5అటు పిమ్మట మేము వెళ్లవలసియున్నది… నేను వెళ్లదలంచినట్లయితే, ఈ మధ్యాహ్నమందే వెళ్లదలచుచున్నాను… వేకువనే ఉదయకాలమందు మేము బయలుదేరిన, వాస్తవమున వేకువనే ఇక్కడకు న్యూయార్కునకు మధ్యనున్న రహదారి పై మంచు పడియుండగలవు. వర్జీనియా, అల్గినీస్, పర్వత ప్రాంత ప్రదేశముల ద్వారాను, మరియు అదొర్నిదాక్స్ సరిగా వాని లోయ ప్రాంతము ద్వారాను నేను పోవలసియున్నది.

6గనుక మేము… సమయమునకు బయలుదేరితిమి. నేను మరచిపోతిని — అది ఒక నూత కార్యక్షేత్రం అచ్చట నున్నది - పాత సెయింట్ నికొలాస్ కార్యక్షేత్రమును తొలగించి, వారు నూతన కార్యక్షేత్రమును నిర్మించిరని నేను ఎరుగుదును.

నాకు తెలిసినంతవరకు, వాటిలో మొదటి రాత్రి మనము ఎన్నడును కలిగియుండునటువంటిది, కలిగియుండబోవుచున్నాము. గనుక ఆ గ్రేటర్ నూయార్కు పెంతెకోస్తు ప్రజల కూడికకు మేము కృతజ్ఞులము. అనేక సంఘాలు మాతో సహకరించుచున్నాయి. అందువలన ఇది ఒక గొప్ప సమయమై యుండునని నేను తలంచుచు, ఎదురు చూచుచున్నాము.

ప్రభువు చిత్తమైతే, వచ్చే వారములో ఏదో ఒక సమయమున తిరిగి మీ మధ్యకు రాగలము. దేవుని చిత్తమైన ఆదివారపు ఉదయ ఆరాధనకై ఇక్కడ ఆగవలేనని ఆశిస్తున్నాము.

అటు పిమ్మట, నేను యధావిధిగా ఎల్లప్పుడు చేయుచున్న రీతిగా నేను మరల తిన్నగా మా పాస్టరు పడవయందు మరల ప్రవేశించితిని. నీవు చూడుము, అడుగకుండనే అందు ప్రవేశించితిని … పిమ్మట, ఇక్కడ కూడుకొనిన చక్కని గుంపును, పట్టణములో నుండి ప్రజలు ఇచ్చటకు వచ్చుట నేను చూచుచున్నాను. ఈ రాత్రి పాస్టరునకు ఏ ప్రత్యేకమైన కార్యక్రమము లేనియెడల, ఒక చిన్న అరాధన బహుళ రోగుల కొరకు ప్రార్థించు చిన్న కార్యక్రమము జరిపించవలెనని నేను తలంచితిని. మీకు వందనములు.

7ఈ రాత్రి రోగుల కొరకు ప్రార్థించవలెనని మేము ఆశించుచున్నాము. దైవిక స్వస్థతను గూర్చి మాట్లాడి, రోగుల కొరకు ప్రార్థించెదము. మనము త్వరగా ప్రారంభించిన, త్వరగానే మనము వెళ్లిపోగలము గదా, పాస్టరు ఇష్టపడిన యెడల… సాధారణముగా 7.30 గంటలకు మీరు ప్రారంభించుదురు. అది సరేనా? ఈ రాత్రి 7.00 గంటలకే ప్రారంభించుటను గూర్చిన విషయము మరియు నన్ను 7.30 గంటలకే లోపలికి వచ్చు విషయమేమి?

అది అంతయు సరియైన యెడల 8.00 గంటలు లేక 8.30 గంటలకే నేను ముగించెదను. అప్పుడు ప్రజలు వెళ్లుటకు తగు సమయముగా అది ఉండగలదు. నేను 8.00 లేక 8.30 గంటలని చెప్పినప్పుడు ప్రతివారు నవ్వియుందురు. ఆ సమయమునకు బయటకు వెళ్లుదురని నేను ఆశించుచున్నాను. రోగుల నిమిత్తము ప్రార్థించుటకు ఎంత సమయము పట్టునో మనము ఎరుగము అని మీకు తెలియును. కాబట్టి ఈ కడవరి ఆకురాలు కాలము ముగింపునందు మిమ్మును విడిచిపోవు సమయము వరకు గొప్ప సమయమును మనము కలిగియుంటిమి; అనేక గొప్ప కార్యములతో ప్రభువు మనలను ఆశీర్వదించెను.

ఈ రాత్రి ప్రభుని చిత్తమైనయెడల, కొన్ని వారముల క్రితం కొలరెడోలో దేవుని వద్ద నుండి పొందిన చివరి దర్శనమును మాట్లాడ కోరుచున్నాను. ఈ రాత్రి అది రోగులు గాను, బాధలతో నున్నవారికి స్వస్ధతను కలిగించుటకు గల విశ్వాసమును పుట్టించవచ్చునని నేను తలంచితిని.

8ఇప్పుడు, ఈ ఉదయకాలమున నేను ఆరాధనకు వచ్చుచుండగా, నెలక్రితమున జరిగినది ఏదో నా హృదయమును తాకినది. అది ఆలాగుండవచ్చు.. ఇప్పుడు, నేను తలంచుచున్నాను వారు… వారు దీనిని టేపు చేయుచున్నారా? మంచిది. అందువలన టేపులు బయట ఎవరియొద్దకు వెళ్ళుచున్నావో నేను తెలుసుకొనగోరుచున్నాను.

ఈ ఉదయ కాలమున నేను ఏమి మాట్లాడువలెనో నేను చెప్పలేకున్నాను. ఫలాన అని నేను చెప్పలేను… అది వాస్తవము అని నేను ఎరుగుదును. ఆ వర్తమానములోని ఒక భాగము నా దగ్గర ఉన్నది, కాని నా మనస్సున దాని విషయమై ఒక ప్రశ్నకు నేను ఏదో ఒకటి చేయవలసియున్నది. అది చూచుటకు వాస్తవమైనదే, అయినను నేను లోపలికి వచ్చినందునను మరియు అది నాకు బయలుపరచబడినందునను, ప్రజలకు ఏదో తప్పిదమైనది చెప్పితిననియు, ప్రజలలో తప్పు అభిప్రాయము కలుగజేసిన వాడనగుదునని నేను భయపడుచుంటిని.

9నేను వ్రాసియుంచిన ఏ అంశములు ఇచ్చట నేను కలిగియున్నానో నేను మీతో ఏం మాట్లాడనున్నానో వాటిలో కొన్నింటిని తగ్గించుచున్నాను. ఎందుకనగా అవి మీకు మిక్కిలి కఠినమైనవిగా నుండకుండు నిమిత్తము నేను అట్లు చేయుచున్నాను. ఏలయనగా ఒక వ్యక్తిని నీవు చూచినయెడల… నేను ప్రభువైన దేవుడిని ప్రేమించుచున్నాను. ఆయనను నేను యెరిగియున్నాను అని చెప్పినయెడల, నేను మిమ్ము ప్రేమించుట ద్వారా దాని వ్యక్తపరచుటమైయున్నది. ఆ మార్గము మాత్రమే నేను ఎరుగుదును.

నాకు బయలుపరచబడిన దానిని మీకు దేనిని దాచకుండగోరుట లేదు. మరియు దానిని మీకు చెప్పకుండ ఉండలేను. అది మీకు తెలియజేయబడు విషయమైనయెడల దాచలేను. నేను బలముగా దానిని బోధించినయెడల కొందరిని నేను బాధపరచిన వాడనగుదునేమోయని నేను భయపడుచున్నాను. మరికొందరికి నచ్చవచ్చునని మీరు ఎరుగుదురు. అప్పుడు ప్రసంగ వేదికను మీరు సమీపించి, నీవు ఏమి చెప్పబోవుచున్నా దానిని చెప్పుటకు నీవు నడిపించబడుదువు. అంతే. అటు పిమ్మట నీవు ఏదో కొన్ని సమయములందు చెప్పవచ్చును. మరొకరు ప్రతికూలముగా దానికి ఏర్పడి, వారు ఆవలికి వెళ్లిపోవుదురు. "ఓ, ఫలానిది ఇది," అని మరొకరు చెప్పుదురు.

10అయితే, నేను మాటలాడబోవుచున్నవి ఊహించినవి మాత్రమే అని మీరు తెలిసికొనగోరుచున్నాను. మరియు ఊహించినవి అనగా అధికారము లేకుండ సాహసించి చెప్పబడినవని అర్థం. కాబట్టి అది సత్యమని నేను చెప్పుట లేదు, అయితే అది నా ఒక చిన్న ఆలోచన. దాని సరితూచుటకు దాని విషయము మీ ఆలోచనను తెలిసికొనుటకు మీ మధ్య పడవేసితిని.

మరియు అప్పుడు అది వాస్తవముగా అది వాక్యనుసారమైనది. ఏలయనగా, నేను ఏదియు బోధించకుండ ఉండు సమయము కాదు ఇది, అయితే అదింకా రానైయున్నదా? అది ఈ ఘడియందు వచ్చునా? ఈ విషయముల గూర్చిన భావమదేనా? అది ఈ సమయము కాదని నాలో ఉన్న సమస్తమును బట్టి తెలియజేయుచున్నాను. అది కాదని నేను తెలియజేయునది సరియని మీకు వినిపింపజేయుచున్నాను… అది రానున్నది, కాని అది వచ్చుటకు ఇంకను సమయమున్నదా? నాకు ఆశ్చర్యమును కలిగించునది అదే.

ఇప్పుడు, ప్రతివారు నేను ఎరుగనని చక్కగా యెరుగుదురు. నేను ఇప్పుడే… అది ఈ సమయమేనా? అలాగైన దేవుడు మనయెడల కృప చూపును గాక, అయితే అది ఆ సమయము కానిచో, అది రాబోవుచున్నది.

11ఆ ఇప్పుడు అది త్వరితముగా… ప్రభువు చిత్తమైన మన ముందు గొప్ప సేవా పరిచర్యయున్నది. క్రిస్మస్ తరువాత నేను ఇతర దేశములకు వెళ్లవలయును, యూరపు మరియు ఆసియాలకు ముఖ్యముగా యూరపునకు పర్యటించవలసియున్నది. మరియు అటు తరువాత తిరిగి యునైటెడ్ స్టేట్సు (అమెరికాకు) వచ్చి కొన్ని ఆరాధనలు జరిగించు నిమిత్తము వచ్చి తిరిగి దక్షిణ-ఆఫ్రికాకు వెళ్లవలసియున్నది. సెప్టెంబరు 2వ తారీఖున డర్బనులోను, 2వ తారీఖు నుండి బయలుదేరి 10వ తారీఖు వరకు 3 రోజుల ప్రయాణములో జోనన్నిబెర్గ్ వెళ్లి, అచ్చట నుండి మరల పర్యటన ప్రారంభించెదను. అది ఏప్రిల్ కావచ్చును. తరువాత స్కాండినేవియా దేశములగు నార్వేలోను, స్వీడను మరియు ఫిన్లాండ్, హాలెండు మరియు స్విట్జర్లాండ్, జర్మనీ ఆ యూరపు దేశములు పర్యటించాలి. కావున మా నిమిత్తము ప్రార్థనలో ఉండండి.

12ఇప్పుడు క్రిస్మస్ సమయము - క్రిస్మస్ అయిన వెంటనే మనము కొన్ని కూటములు కలిగియున్నాము. అన్నట్టుగా క్రిస్మస్ సమయమందు ఇచ్చట ఇంటి యొద్ద ఉండాలని అనుకొనుచున్నాము. క్రిస్మస్ కు పిల్లలు ఇంటికి రాగోరుదురు. మేము అరిజోనాను ప్రేమించుచున్నాము, కాని ఈ సంఘాన్ని, ప్రజలైన మిమ్మును తిరిగి కలిసికొనకపోవచ్చును. మేము ఎక్కడకు వెళ్లినను, మేము ఏది చేయుచుండినను, ఈ స్థలమును మరువలేము. ఇట్టి స్థలము మరొకటి లేదు. పిల్లలకు, నాకు, నా భార్యకు ఇది చాల ఇష్టమైన స్థలం.

ఏడు సముద్రాలు దాటి ప్రయాణము చేసినను మరియు ప్రతి స్థలమునకు వెళ్ళాను, కాని ఈ చిన్న స్థలము వంటిది, నాకు మిక్కిలి ప్రీతిపాత్రమైనది మరెక్కడ లేదు. ఒక మారు నీవు ఇక్కడి నుండి సరిగా వెళ్లగోరినయెడల… ఇచ్చట ఏదో ఉన్నది. ప్రపంచములో అంతంతట నేను బోధించాను గాని దైవాత్మవలన మన మధ్యనుండి నేను ఇక్కడ నిలబడిన స్థలమందు చేసిన కార్యములను వలె ఎన్నడును, మరెచ్చటను నేను ఎప్పుడు అనుభవించలేదు. అది వాస్తవము.

దేవా, నేను మూలరాయి అచ్చట వేసిన దానిని నిలబెట్టుము. "ప్రభువైన దేవా, దానిని పడనీయకుము" అని నేను చెప్పితిని.

"రెండు నెలలలోగ అది వాహనాలు మరమత్తు చేయు స్థలముగా మారునని" ప్రజలు అన్నారు.

"దేవా, దీనిని పడనీయకుము. యేసు తిరిగి వచ్చువరకు ఈ స్థలములో ఉన్న ప్రజలు నిన్ను స్తుతించు స్థలముగా ఉండనిమ్ము," అని నేను వేడుకొంటిని. ఆ విధంగానే అది నిలిచియుండునని నేను నమ్ముచున్నాను.

13ఇప్పుడు, ప్రభువు మనలను ఆశీర్వదించునట్లు అపేక్షతో బైబిలు వైపు మరలి లేఖనభాగమును కొంత చదువుదాము. నేను వ్రాసియుంచిన కొన్ని లేఖనభాగములు మరియు వ్రాసియుంచిన కొంత నోట్సు మీకు చూపుటకై ఇచ్చట ఉంచబడినవి, మరియు బైబిలులో మూడుచోట్ల నుండి నేను చదువ అపేక్షించుచున్నాను. వాటిని ప్రధమముగా మీకు ఇచ్చెదను.

యూదా పత్రిక నుండి 5, 6 వచనములు చదువకోరుచున్నాను. యూదా పత్రిక ఒకే అధ్యాయమును కలిగియున్నదని మీరు ఎరుగుదురు. పిమ్మట II పేతురు 2:4-5, తరువాత 1 పేతురు 3:18-20 ఈ ఉదయకాలమున ప్రభువు చిత్తమైన నా అంశము, "ఇప్పుడు చెరలో ఉన్న ఆత్మలు." అవి రక్షింపబడుటకు అవకాశము ఇక లేక, అవి నిరంతర శిక్ష విధింపబడినవై మూయబడినవి. అవి చెరలో బంధింపబడినవి. "ఇప్పుడు ఆత్మలు చెరలో బంధించబడినవి."

JUDE 1:5,6

 

14ఇప్పుడు, ప్రధమముగా యూదా పత్రికను చదువుకొందాము. ఈ పత్రిక యందు ప్రధమమున గుర్తించినట్లుగా నేను నమ్ముచున్నాను. అటు తరువాత II పేతురు; ఆ మీదట I పేతురు అని వ్రాసినట్లుగా నా నమ్మకం. ఇప్పుడు యూదా పత్రిక అంతయు చదువ నపేక్షించుచున్నాను. కాని, సమయము సద్వినియోగ పరచుటకు, ఏలయనగా ఇప్పటికే 10:30 గంటలైనది. ఇప్పుడు (యూదా పత్రిక) 5 వచనముతో నేను ప్రారంభించబోవుచున్నాను. యూదా యేసు క్రీస్తు యొక్క పోషింపబడిన సహోదరుడు అని మనము ఎరిగిన విషయమే. అతడు యేసేపు కుమారుడు.

ఈ సంగతులన్నియు మీరు ముందటనే యెరిగియున్నను, నేను మీకు జ్ఞాపకము చేయగోరుచున్నదేమనగా, ప్రభువు ఐగుప్తులో నుండి ప్రజలను రక్షించినను వారిలో నమ్మకపోయిన వారిని తరువాత నాశనము చేసెను.

ప్రధమముగా వారిని రక్షించెను - ఐగుప్తు నుండి వారిని బయటకు నడిపించెను. మరియు వారు వర్తమానములో కొనసాగనందున వారిని నాశనము చేసెను. మీరు గమనించితిరా.

మరియు తమ ప్రధానత్వమును నిలుపుకొనక, తమ నివాస స్థలమును విడిచిన దేవ దూతలను, మహాదినము జరుగు తీర్పు వరకు కటిక చీకటిలో నిరంతర పాశములతో ఆయన బంధించి భద్రము చేసెను.

అప్పుడు పరమందున్న దూతలు తమ ప్రధానత్వమును నిలుపుకొనలేక, పడిపోయి; కటిక చీకటిలో నిరంతర పాశముతో ఆయన బంధించి, ఈ స్థితిలో వారు ఆ మహాదినమున జరుగు తీర్పువరకు భద్రపరచెను. వారు తక్కిన అవిశ్వాసులతో అప్పుడు తీర్పు తీర్పబడెదరు.

2PET 2:4,5

 

15ఇప్పుడు II పేతురు 2వ అధ్యాయము 4వ వచనముతో ప్రారంభించెదము. ఈ పుస్తకము ఒకటి రెండు పుస్తకముల ముందున్నది.

దేవదూతలు పాపము చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టక, పాతాళ లోకమందలి కటిక చీకటిగల బిలములోనికి తోసి తీర్పుకు కావలిలో ఉంచబడుటకు వారిని అప్పగించెను;

మరియు ఆయన పూర్వకాలమందున్న లోకమును విడిచిపెట్టక, భక్తిహీనుల సమూహము మీదికి జలప్రళయమును రప్పించినప్పుడు, నీతిని ప్రకటించిన నోవహును మరి యేడుగురిని కాపాడెను. [దేవదూతలను విడిచి పెట్టలేదు - వారిని కటిక చీకటిలో నిరంతర పాశముతో బంధించెను, లోకమంతటిని విడిచిపెట్టక నోవహు వలన ఆరోపింపబడి నాశనము చేయబడెను.]

1PET 3:18-22

 

16ఇప్పుడు I పేతురు 3 అధ్యాయము 18 వచనముతో ప్రారంభించి చదువు కొందాము. ఇప్పుడు జాగ్రత్తగా ఆలకించుడి.

ఏలయనగా మనలను దేవుని యొద్దకు తెచ్చుటకు అ నీతిమంతుల కొరకు నీతిమంతుడైన క్రీస్తు తన శరీర విషయములో చంపబడియు ఆత్మ విషయములో బ్రతికింపబడి పాపముల విషయము ఒక్కసారే శ్రమపడెను. [శరీరము నందు మరణమును అయితే ఆత్మ వలన జీవింపజేసెను.]

దేవుని దీర్ఘశాంతము ఇంకను కనిపెట్టుచుండినప్పుడు పూర్వము నోవహు దినములలో ఓడ సిద్దపరచబడుచుండగా అవిధేయులైన వారి యొద్దకు అనగా చెరలో ఉన్న ఆత్మలు యొద్దకు ఆయన ఆత్మరూపిగానే వెళ్ళి, వారికి ప్రకటించేను. [చెరలో నున్న ఈ ప్రజలకు ఆయన ప్రకటించెను.]

ఆ ఓడలో కొందరు అనగా ఎనిమిది మంది నీటి ద్వారా రక్షణ పొందిరి. దానికి సాదృశ్యమైన బాప్తిస్మము ఇప్పుడు మిమ్మును రక్షించుచున్నది; అదేదనగా శరీర మాలిన్యమును తీసివేయుట కాదు గాని యేసుక్రీస్తు పునరుత్థానము మూలముగా దేవుని విషయము నిర్మలమైన మనసాక్షి నిచ్చు ప్రత్యుత్తరమే.

ఆయన పరలోకమునకు వెళ్లి దూతల మీదను, అధికారుల మీదను శక్తుల మీదను అధికారము పొందినవాడై దేవుని కుడి పార్శ్వమున ఉన్నాడు.

ఇప్పుడు మరల ప్రార్థించుకుందాము.

DEUT 19:15•

2COR 13:1•

EPH 2:6

 

17ఇప్పుడు, పరలోకపు తండ్రి మూడు సాక్ష్యములు కలిగిన లేఖన క్రమమును కనబడుచున్నది — లేఖనములో మూడు చోట్ల సాక్ష్యమిచ్చుచున్నది. "ఇద్దరు, లేక ముగ్గురు నోటి నుండి పలికిన సాక్ష్యము వలన ప్రతిమాట స్థిరపరచబడునని నీవు నీ వాక్యమందు తెలియజేసితివి."

ఓ, దేవా, నీవు ప్రజల వద్దకు వచ్చి ఈ వాక్య వర్తమానమును ప్రతి పురుషుడు, స్త్రీ, బాలుడు లేక బాలిక అవగాహనమగునట్లు నీవు అభిషేకించి వ్యాఖ్యానించి తెలియజేయుమని నేను ప్రార్ధించుచున్నాను. మరియు ఈ మూడు చోట్ల సాక్ష్యము సత్యమును గూర్చి ఇవ్వబడియుండుటను ఎరిగియున్నందున పరిశుద్ధాత్మను ఇప్పుడు మా పైకి పంపమని ప్రార్థించుచున్నాను.

ఈ ఉదయ కాలమందు రాజుగా మన మధ్యనున్న ప్రభువైన యేసుక్రీస్తు వైపు చూచుచున్నాము. ఆయనతో కూడ పరలోకము యందు కూర్చుండబెట్టబడితిమను విశ్వాసముతో నిలువబడియున్నాము. ఆయన వర్తమానమునకై మేము కనిపెట్టుచున్నాము.

ప్రభువా, మా ద్వారా మాటలాడుము. మాట్లాడు మా పెదవులను మరియు వినునట్టి మా చెవులను సున్నతి చేయుము. లేఖనమైయున్న ఆయనకు ఘనతయు, మహిమయు కలుగును గాక. ఆయన నామమున అడుగుచున్నాము. ఆమేన్.

18ఇప్పుడు, ఈ రాత్రి జరుగనున్న ఆరాధనలో స్వస్థతా ఆరాధనను ఇప్పుడు జ్ఞాపకము చేసికొందాము. ప్రార్థనా కార్డులు పంచు అవసరం లేదనుకుంటాను, గనుక రోగుల కొరకు యధారీతిగా ప్రార్థించుకొందాము. మీకు చెప్పుటకు నేను విషయమును కలిగియున్నాను. ఆ విషయము ఈ సమాజమును ప్రతి రకమైన రోగ స్వస్థత పొందు స్థానమునకు తీసికొనిపోవును అని నేను ఆశించుచున్నాము. మనము దానిని ఆ విధముగా నమ్మినయెడల, ఆ విధముగా సరిగా జరుగునని నేను ఎరుగుదును.

"ఇప్పుడు చెరలో ఉన్న ఆత్మలు" … "ఇప్పుడు చెరలో ఉన్నట్టి ఆత్మలు."

GEN 2:7•

EPH 2:5•

EPH 4:30•

COL 3:3

 

19మానవుని ప్రాణము, మానవుని శరీరము కాదు, అది ప్రాణమునై యున్నది; మరియు ఆ ప్రాణము ఆత్మయొక్క స్వభావమును ప్రత్యక్షపరచునదైయున్నది. మానవుని స్వభావమును ప్రత్యక్షపరచునదైయున్నది, మరియు మానవుని స్వభావమును గూర్చి చెప్పబడినప్పుడు… "మనము మరణించితిమి" అని ఆయన చెప్పినప్పుడు, మనము మరణించితిమి. మన జీవము క్రీస్తుతో కూడ దేవునియందు దాచబడి యున్నదని లేఖనము స్పష్టముగా తెలియజేయుచున్నది. తద్వారా పరిశుద్ధాత్మ వలన ముద్రింపబడితిమి.

ఇప్పుడు, మరణించినది నీ శరీరము కాదు. నీ ఆత్మయు మరణించలేదు. నీ ఆత్మ యొక్క స్వభావము మరణించినది. చూడుము. ప్రాణము (Soul) స్వభావమును తెలియజేయునదైయున్నది. నీవు తిరిగి జన్మించినట్లైన దేవుని స్వభావమును తెలియజేయు ప్రాణము ( Soul)నై యుందువు, లేనిచో లోక సంబంధ స్వభావమును తెలియజేయు ప్రాణమై (Soul) యుండును.

ఆరంభించు ప్రతిదానికి అంతము కలదు. కావున నీవు నిత్యజీవము కలిగియుండవలెననిన, ఆరంభములేని జీవము కలిగిన దానిని నీవు కలిగియుండు మార్గము మాత్రమే. మరియు ఆ విధముగా నీవు పుట్టినప్పుడే నీ జీవము ప్రారంభమగును.

దేవుడు నీ నాసికా రంధ్రములో జీవాయువును ఊదగా, నీవు జీవించు ప్రాణిగా (living Soul) ఆరంభించబడితివి. కాని నీవు ఎప్పు డైతే…

GEN 2:19

 

20నీలో ఉన్న స్వాభావికమైనది, నీలో ఉన్న లోకసంబంధమైన స్వభావమును కలిగియుంటివి. దేవుని నోటి నుండి వేరు చేయబడితివి. వాస్తవముగా మీరు ఒక జంతువునైయుంటిరి. అది వాస్తవముగా సరియే.

మనము క్షీరద జాతి (పిల్లలకు పాలిచ్చు జంతువు - Mammal) వారమునై యున్నామని ఎందరు ఎరిగియున్నారు? మనము వేడియైన రక్తము గల జంతువునైయున్నాము. అయితే మనము భూసంబంధమైన సృష్టియగుట వలన వాటివంటి వారమైయున్నాము. కాని ఆ క్షీరద జంతువు నుండి మనకు గల వ్యత్యాసము ఏదనగా దేవుడు. మనకు జీవాత్మను అనుగ్రహించెను.

ఇప్పుడు, ఇతర క్షీరద జాతి జంతువులు వస్త్రములు ధరించు అవసరత లేదు. మనము తప్ప ఇతర జంతువులు వస్త్రములు ధరించవు. మనము తప్ప ఇతర జంతువులు తమ సిగ్గును కప్పుకొనుటకు వస్త్రములు ధరించుట లేదు. మనము మాత్రమే ఆలాగు చేయుచున్నాము. ఏలయనగా మనము జీవాత్మను కలిగియున్నాము. అయితే చూడుము, దేవుడు, ఆదియందే మానవుడు ఏ రీతిగా ఉండబోవునది ఎరిగియుండెను. మరియు ఆయన భూమిని సృజించి, చిన్నజీవి మొదలుకొని పెద్ద మృగము వరకు అన్నిరకములైన జంతువులను ఆయన కలుగజేసెను; మరియు అన్నిటి కంటే మహోన్నతమైన జంతువుగా మానవుడు చేయబడెను.

GEN 1:27•

GEN 2:22•

GEN 3:19,20•

JOHN 4:24

 

21మరియు అటు తరువాత… మొదటి సృజించబడిన నరుడు, అతడు ఆత్మ నరుడైయుండెను; అనగా ఆత్మ స్వరూపియైన దేవుని (యోహాను 4) స్వరూపమందు అతడు సృజింపబడెను. "దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోను, సత్యముతోను ఆరాధించవలేను, మరియు నీ వాక్యమే సత్యము," అని చెప్పబడినది. కావున ఇప్పుడు మనము ఆత్మతోను సత్యముతోను ఆరాధించుచున్నాము. ఆయన ఆత్మ ఉనికియైయున్నాడు.

నేలను సేద్యపరచుటకు నరుడు లేకుండెను, అయితే దేవుడైన యెహోవా నేల మట్టితో నిర్మించెను. పిమ్మట అతని ప్రక్క నుండి తీసిన ఒక ఎముకను ప్రత్యుత్పత్తిని, అతనిలో నున్న స్త్రీ పురుషలను ద్విస్వభావము నుండి పురుషుని వేరుపరచెను. మరియు ప్రేమ అనబడు స్త్రీ తత్వమును బయటకు తీసివేసెను. ఆ ప్రేమను ఆయన హవ్వ అని పిలువబడు వ్యక్తియందు ఉంచెను. అప్పుడు ఆదాము తన భార్యను హవ్వ అని పిలిచేను.

అతని యందలి స్వాభావిక ప్రేమ (ఫిలియో ప్రేమ) అతని భార్య యందు ఉంచబడెను. అందువలన పురుషుడు ఈనాడు ఆ విధానమును బట్టి హత్తుకొను మార్గమేర్పడెను. మరియు ఆమెయు తిరిగి తన భర్త యొద్దకు వచ్చి అతనిని హత్తుకొనవలసియున్నది. పురుషుడు, పురుషత్వమును; స్త్రీ, స్త్రీ తత్వమునై (వేర్వేరు లింగాకృతులై) యుండిరి.

GEN 3:19

 

22మరియు అంతట గమనించిన, ఆయన నరుని తన స్వరూపమందు సృజించిన తరువాత, స్త్రీగాను మరియు పురుషునిగాను వారిని సృజించెను," నేలను సేద్యపరచుటకు నరుడు లేకుండెను, మరియు ఆయన అతనిని నేల మంటిలో ఉంచెను, కాబట్టి అతడు ఆ నేల మంటిగా నున్న మనుష్యుడాయెను.

ఈ మానవుడు క్షీరదమై యుండెను. అతడు ఒక జంతువునై యుండెను, కాని అతని యందు దైవఆత్మ ఉంచబడెను. జీవమును అతని యందుంచబడి, అతడు తనకిష్టమైన ఏదైన ఎన్నుకొను స్వాతంత్ర్యత గల ఒక ప్రాణిగా చేయబడెను. మరియ అటుతరువాత ఈ మనుష్యుడు…

23మనము ఏదోయైయున్నామని తలంచుకోవచ్చును. కేవలము జ్ఞాపకముంచుకొనుము, మనమేమైయున్నాము? ఒక మట్టి ముద్ద అయి యున్నాము. అంత మాత్రమే. ఏలయనగా, "నీవు మన్నే గనుక తిరిగి, మన్నునకే చేరుదువు."

ఒక వ్యక్తి తనకు కలిగిన కొద్దిపాటి విద్య, ఇతరమైనవి తలంచుచూ వీధి మార్గమున నడచుచున్న అతనిని నీవు చూచినప్పుడు, అతడు ఒకానొక దినమున అది ఇండియానా యొక్క నేల మట్టి ముద్దయే అని నీవు జ్ఞాపకముంచుకొనుము. ఆ వైభవము అంతా అదే (మట్టి ముద్ద), ఒక స్త్రీ - పురుష వస్త్రములు ధరించుకొని, సిగరెట్లు తాగుతూ ఈ దేశమంతా నాదే అని వీధులయందు గర్వముతో సడిచిపోవుచున్న ఈ స్త్రీ కూడ ఇండియానా నేల మన్నుగా, తిరిగి అదే మన్నయి పోనున్నది. గనుక మీరు ఏదో ప్రాముఖ్యమైన దానితో అరంభించబడలేదు. గమనించుము. అది వాస్తవమే. మీరును అదే అయి యున్నారు.

JOHN 3:7•

1JN 2:15

 

24అయితే, మీ యందున్న జీవము సంబంధముగా దేవుడు ఆ ప్రాణముతో పనిచేయుచున్నాడు.

అయితే సమ్మతించు ఆత్మయొక్క స్వభావమును ఆయన కలిగియున్నయెడల, అప్పుడు స్వాభావిక స్వభావము నశించిపోవును. లోకము యొక్క స్వభావము, దాని ప్రేమ నశించును మరియు లోకమందలి విషయములును నశించును; ఏలయనగా, "నీవు లోకమును లేక లోకమందలి విషయములను నీవు ప్రేమించినయెడల, దేవుని ప్రేమ నీయందుండ నేరదు."

ఈ స్వభావము నశించాలంటే, మరియు ఆ మనుష్యుడు తప్పక తిరిగి జన్మించాలి. అప్పుడు దైవిక స్వభావము నీయందు నివాసము చేయును. ఆది, అంతములు లేనివాడు దేవుడు మాత్రమే.

2COR 5:19

 

25కాబట్టి ఆయన నీతో పాలిభాగస్థుడాయెను, గమనించుము. ఈ మట్టి మనుష్యుని తీసుకొని, అతనియందు నిత్యజీవపు ఆత్మను ఉంచెను. ఎట్లనగా దేవుడు యేసుక్రీస్తును శరీరమందు ప్రతిబింబించి లోకమును తనతో సమాధాన పరచుటకు ఆయన యేసుక్రీస్తుగా మారునప్పుడు దేవుడు క్రీస్తులో ఉండి ఆయన వారి అపరాధములను వారి మీద మోపక, క్రీస్తు నందు లోకమును తనతో సమాధానపరచుకొనెను. ఆ పరిపూర్ణ వ్యక్తి ద్వారా అసంపూర్ణులుగా నున్న మనలో ప్రతి ఒక్కరును దేవునియందు విశ్వాసముంచి, క్రీస్తును అంగీకరించుట ద్వారా క్రీస్తుకు కలిగిన సంపూర్ణ సిద్ధిని మనము పొందినవారము అయితిమి.

PS 16:10•

ACTS 2:27•

1COR 15:22•

EPH 2:5•

PHIL 2:5•

COL 3:5,10•

REV 1:18

 

26ఆయన తన శరీరమును కుళ్ళిపోనివ్వలేదు, ఆయన ప్రాణమును పాతాళములో విడిచిపెట్ట లేదు, అయితే ఆయన మూడవ దినమున లేపబడెను. మరియు ఆయన నిత్యము నివసించువాడాయెను. అటువలె మన శరీరమును ఆయన మహిమగల శరీరమునకు సమరూపముగ మార్చును. అందువలన ఆయన మరణములోను, పునరుద్ధానమునందును పాలిభాగస్తులగునట్లు ఆయన నామములో… బాప్తిస్మము పొందితిమి. పాత మనుష్యుడు చనిపోయి నూతన సృష్టిగా ఆయన పునరుద్ధానములో పాలివారమైనట్టుగా సాక్ష్యము కలిగి ఉన్నాము. మనము ఆ మొదటి స్వభావమును పాతిపెట్టితిమి.

ఆ మొదటి స్వభావము గతించెను, ఇప్పుడు మనము ఆయన స్వభావమును కలిగియున్నాము. ఆయన మనలో నివసించుచున్నాడు, గనుక మన ఇష్టానుసారముగ మనము దేనిని చేయక, ఆయన చిత్తమును చేయుదము. మన సొంత ఆలోచనలను, మన సొంత మనస్సును మనము కలిగి ఉండము. మనము దేనిని ఆలోచింతమో అదే మన మనస్సైయుండును. యేసుక్రీస్తునకు కలిగిన మనస్సు ప్రతి విశ్వాసి కలిగి ఉండును. ఏ జీవమును మనము కలిగియున్నామో, దానినే మనము మాట్లాడుకొనుచున్నాము. ఆ భాగమును గూర్చియే ఇప్పుడు నేను ఆలోచించుచున్నాను. అదియే మనలోనున్న ప్రాణము.

GEN 12:10•

GEN 20:2

 

27ఇప్పుడు, మనము గమనించినయెడల, కొన్ని సమయాల్లో జరిగిన విషయాలను గూర్చి మనము ఆలోచించుతూ యుంటాము. "ఇవెందుకు జరిగాయి," అని మనలను మనము ప్రశ్నించుకుంటాం. మరియు ఇతరులను కూడా ప్రశ్నిస్తాము. కానీ మనం క్రైస్తవులయితే, అంతా సవ్యంగానే జరుగుతు వచ్చుచున్నదని తేల్చుకుంటాం. మీరును చూచితిరి ప్రతి క్రైస్తవుడును దానిని చూచెను. మనము ఎందుకు ఆలాగు చేసితిమో అని ఆశ్చర్యపడుచున్నాము. నేను ప్రధమముగా బైబిలు చదివినప్పుడు దేవుడు ఎందుకు "శారా, తన భార్య కాదని ఎల్లప్పుడు ఘనుడైన అబ్రహాము అబద్దమాడుటకు నడిపించెనో అని ఆశ్చర్యపడితిని." ఆ అబద్దములో అచ్చట నిలువబడుటకు, ఆ విషయమును జరిగించుటకు ఎట్లు సమ్మతించి, ఆ విధంగా చేయుటకు అతడు విడువబడెను. వాగ్దాన దేశమును విడువకూడదని దేవుడు అబ్రహామునకు ఆజ్ఞాపించియుండగ, అతడు ఎట్లు విడిచెను? వాగ్దాన దేశమును విడిచిన ఏ యూదుడైనను దేవుని యొద్ద నుండి వెనుకకు జారినట్లే, ఏలయనగా దేవుడు వారిని ఆ దేశమందు నిలిచి ఉండునట్లు ఆజ్ఞాపించెను. మరియు వారు దానిని విడిచిపెట్టిరి.

కావున అతడు గెరారునకు వెళ్ళెను.

GEN 20:1,3,7

 

28మరియు అప్పుడు ఫిలిష్తియ దేశములోని రాజైన అబీమెలెకు శారపై ప్రేమలో పడినవాడై ఆమెను వివాహము చేసికొనగోరెను. మరియు అతడు మంచి మనిషి, నీతిగల మనిషి. మరియు తరువాత ఆయన బహుషా… (ఇది పరిహాస్పదమైనదిగా వినిపించును, కాని, మీయొద్దకు దీనిని నిజమైనదిగా చేయుటకు). తరువాత ఆయన తన సాయంకాల స్నానము చేసి తన దుస్తులు ధరించి, మరియు తన ప్రార్థనలు చేసికొని పడక మీదికి వెళ్ళెను. ప్రభువు ప్రత్యక్షమై, ఆయనతో ఈలాగు చెప్పెను, "నీవు చచ్చినవాడివి సుమా!" మరియు ఆ మనుష్యుడు అసలు ఏమియూ చేయలేదు. ఆయన ఖచ్చితముగా అబ్రహాము మరియు శారాచే మోసగించబడెను. అది వాస్తవము. ఆయన చెప్పెను, "నీవు మరియొకని భార్యను తీసికొంటివి, మరియు నేను నీ ప్రార్థన ఆలకించను, నీవెంతగా ప్రార్థించిననూ, సరే, నీవు చచ్చినవంటివాడు, కానీ ఆ మనుష్యుడు నా ప్రవక్త."

GEN 16:2,3•

EZEK 4:6•

GAL 4:30

 

29దానిని అర్థము చేసుకొనుటకు కఠినముగా నుండును, కాని అది ఆలాగు కానిచో, కృప ఏమనునది మనకు తెలియకపోవును. అందమయిన శారాను భార్యగా అతడు కలిగియుండినప్పటికిని, ఎందుకొరకు, అతడు వెళ్ళి హాగరును వివాహమాడెను? అది చేయవలెనను కోరిక అతనికి లేకుండెను, కాని శారా ఆ విధంగా చెప్పెను. మరియు ప్రభువు, "శారా ఏమి చెప్పినదో నీవు దానిని వినుము" అని చెప్పెను. ఎందులకు? దాసీ మరియు దాసి కుమారుడు, స్వతంత్రురాలు మరియు దాసి కుమారునితో వారసత్వము పొందకుండునట్లు, అక్కడ ఇష్మాయేలు ఉండవలెను. నా ఉద్దేశ్యమేమైయున్నాది? చూడండి. ఇవ్వన్నియూ సాదృశ్యములై యున్నవి.

ఆ ప్రవక్త ఎందుకు వేశ్యను వివాహమాడి ఇద్దరు బిడ్డలను కన్నాడు. అది ఒక గురుతు. అతని కుడి ప్రక్క ఒకడు 340 రోజులు, మరో ప్రక్క కూడా అనేక దినములు అదే విధముగా ఎందుకు ఉండవలసి వచ్చెను? అది ఒక ముంగుర్తు. ఒకడు దిగంబరిగా తన వస్త్రములు విడిచినవాడై ఇశ్రాయేలీయుల ఎదుట నడిచెను. ఇవన్నియు కూడా జరుగబోవువాటికి ఛాయా దృశ్యములైయున్నవి. చూచితివా? ఇవన్నియు కూడా నెరవేర్చబడవలసియున్నవి. ఇవన్నియు సంభవించునప్పుడు, ఇట్లు అవి ఎందుకు జరుగుచున్నవి అని మనకు ఆశ్చర్యము కలిగించుచుండెను. అది, దేవుడు ఏదో మనకు జరుగబోవువాటిని ముందుగా చూపించుచున్నాడు.

30నేను చిన్నవాడుగా ఉండినప్పుడు (నా జీవిత చరిత్ర మీరెరుగదురు) అది ఇంకా నాకు జ్ఞాపకమున్నది. ఇప్పుడైతే నిన్న చెప్పినది ఈ రోజుకి జ్ఞప్తి ఉండదు. అయితే నా చిన్ననాటి దినములలో ఏదైన జరిగియుండిన దానిని జ్ఞాపక ముంచుకొనగలరు. (అటువలె మీరు కూడ ఉందురు) దీనిని గూర్చి చెప్పునప్పుడెల్ల పరిహాసముగా నుండగలదు. నేను ప్రాకుచున్న దినాల్లో పొడవైన దుస్తులనే వేసుకొనేవాడ్ని. నా వయస్సులో ఉన్నవాడు అట్టి పొడవైన దుస్తులనే వేసికొనే వారు. ఆ రోజుల్లో నేను ప్రాకుతూ, మా చిన్నాయన నడిచి వచ్చి కుంపటి యొద్ద నిల్చున్నప్పుడు, అతని కాలికి ఉన్న మంచును తింటూ ఉండేవాడిని.

31మరియు నా జీవితములో జ్ఞాపకమున్న మరొకటి, నేనేదైన ఒక దర్శనమును ఎప్పుడైనా కలిగియుండిననిన అదే తొలిసారి, నా జీవితములో ఎక్కువ భాగకాలము సమీపమునగల న్యూ-ఆల్బనీ అను పట్టణమునందు నివశించుదునని తెలుపబడెను. నేను పర్వతాల్లో పుట్టినవాడిని, ఒక వైద్యుడును లేని పరిస్థితులలోనే నేను జన్మించితిని. ఆ దర్శనములో చెప్పినట్లుగా, ఈ స్థలమందు దరిదాపుగా ఏబది సంవత్సరములు జీవించితిమి.

దేవుడనేవాడు ఎచ్చటనో ఉన్నాడు అను తలంపు నన్ను అనుక్షణం వెంటాడేది. నేను చిన్నవాడుగా నుండగా, దేవుడు నాతో మాట్లాడేవాడు. పొగ కానీ, ముఖ్యముగా త్రాగుడు ద్వారా కాని, స్త్రీ సాంగత్యము వలన మలినము చేసికొనవద్దని నన్ను హెచ్చరించెను. అప్పటి నుండి అవంటే నాకు భయం. యౌవ్వనుడుగా నుండి కూడ వాటి జోలికి పోలేదు.

32ఒకసారి నేను వేటాడుటకు వెళ్లుచుంటిని. వేటాడుట యందు నాకు ప్రీతిగల రెండవ స్వభావము నా యందుండెను. నేను జిమ్మిపూలే అనే కుర్రాడితో వేటాడుటకు వెళ్లుచుంటిని, ఆ అబ్బాయి మంచివాడు (అతని పిల్లవాడు చిన్న జిమ్స్ ఇచ్చట సంఘమునకు వచ్చుచుండెనని నేను తలంచుచున్నాను. ఒక్క చక్కని కుటుంబము, ఈ పూలె కుటుంబమును నేను బాగుగా ఎరుగుదము. జిమ్మీ, నేనును పసివారుగా నుండి స్కూలుకు వెళ్లు దినముల నాటి నుండి ఒకే కంచములో తినుచు, ఒకే మంచము మీద పండుకొనుచు ఒక్కటిగా జీవించుచుంటిమి… మేము ఆరు నెలల వ్యత్యాసము కలిగిన వయస్సుగల వారము.) జిమ్మీ ప్రేల్చుటకు సిద్ధముగా తన తుపాకినీ సిద్ధపరచియుండెను. అది ప్రేల్చుట వలన నా రెండు కాళ్ళగుండా ఆ గుండ్లు దూచుకొని పోయాయి. మరణ దశలో నున్న నన్ను ఆసుపత్రికి తీసికొని వెళ్లారు. (ఆ రోజుల్లో పెన్సిలిన్ గాని, అలాంటిది ఏదియు లేదు.) నా క్రింద రబ్బరు సీటు వేసియుంచారు. మరుసటి ఉదయము వారు శస్త్ర చికిత్స చేయుటకు నన్నక్కడ ఉంచినట్లు రాత్రి తెలిసికొంటిని. నన్ను తీసికొని వెళ్లి, నా గాయాలు శుభ్రము చేసిరి. పెద్ద మాంస కండరములు బయటకు వచ్చెను. వారు ఆ మాంసాన్ని కత్తిరించారు. నేను ఆ సమయములో ఒక మనుష్యుని చేతిని గట్టిగా పట్టుకున్నాను. ఆ వ్యక్తి పేరు ఫ్రాంకి ఇట్స్ - ఇటీవల ప్రాణహత్య చేసికొనిననాడు అతడు. అతని మణికట్టు చేతిని గట్టిగా పట్టుకొనియున్న నా చేతిని విడిపింపజేసిరి.

వారు నా కాలునకు శస్త్ర చికిత్స చేయుచుండగ, నేను కేకలు వేయుచు, అరచుచు తన్నుకొంటున్నాను. అప్పుడు నేను 14 సంవత్సరాల వయస్సుగల బాలుడను.

33నేను నిద్రించుటకు ప్రయత్నించితిని మరియు వారు… నేను మేల్కొంటిని. ఏదో ఒకటి కారిపోయి ఉండునన్పించినది. రక్తనాళము తెగియుండుట వలన ఆపులేకుండా రక్తము పోవుచుండెనని ఊహించితిని. వారు ఎక్సెరే తీసి చూసారు. అది మంచి రక్తనాళమునకు ఇరుప్రక్కల గీచుకొని గాయపడుట వలన ఆ రక్తము ఆగకుండా ప్రవహించుచున్నదని వారు చెప్పిరి. "అప్పుడు నేను ఇవి నా ఆఖరి క్షణాలు కావచ్చు," అని అనుకున్నాను.

ఆ విధముగ నా చేతులు పైకెత్తి క్రిందికి దించుతుంటే రక్తం ధారాపాతంగా కారిపోతుంది. నా స్వరక్తమందు నేను పరుండియున్నాను. అప్పుడు నేను గంట మ్రోగించి పిలువగా, నర్సు లోపలికి వచ్చినది. వేరే ఏ మార్గమును లేక బట్టలతో ఆ రక్తమును అద్దినది.

34ఆ మరుసటి ఉదయం ఆ బలహీన స్థితిలో నుండినప్పుడే వారు నాకు ఆపరేషన్ చేశారు. (ఆ దినములలో రక్తము ఎక్కించు విధానము లేకుండెనని మీరెరుగుదురు) వారు నాకు శస్త్ర చికిత్స చేసిరి వారు నాకు మత్తునిచ్చిరి. వారు అధికముగా నాకు మత్తునిచ్చుటలో వారు నన్ను లేపవలసిన అవసరత లేదని తలంచారు. అయితే 8 గంటల పిమ్మట ఆ మత్తు నుండి నేను మేల్కొంటిని. వారు నాకు మత్తును అధికముగా ఇచ్చిరి, వారు అనుకున్నారు, నేను… నేను లేచుట లేదు. వారు నన్ను లేపలేకపోయిరి.

35ఆ ఆస్పత్రిలో నా ప్రక్కన శ్రీమతి. రోడర్ నిలబడియుండుట నాకు జ్ఞాపకమున్నది. ఎన్నడు నేనామెను మరువలేను. ఏమి జరిగినను ఫరవాలేదు, నేను ఎన్నటికి ఆమెను మరువలేను. ఆ రోజులలో ఆమె యవ్వనురాలు. ఆమె భర్త కారులు తయారు చేయు కంపెనీలో సూపరింటెండెంటుగా నున్నారు. నా హస్పటల్ బిల్లును వారే చెల్లించారు. మా ఇంటిలో తినుటకు తిండి కూడా లేని రోజులవి. ఆ సమయంలో కొన్ని వందల డాలర్ల ఖర్చును మేమెట్లు భరించగలం?

అయితే ఆమె తన సంఘ సహకారము వలన కుక్లాక్స్ క్లాన్ అనువారు నా ఆస్పత్రి బిల్లును కట్టిరి. వారు నా పట్ల చేసిన దాన్ని నేనెన్నడు మరువజాలను. డాక్టరు రీడర్ కు వారా మొత్తం చెల్లించారు. ఆయన ఇంకా జీవించేయున్నారు, ఆయన పోర్టు విల్లాలో ఉంటున్నారనుకొంటాను. ఆయన ఈ కథను మీకు చెప్పును. నేను మరణించుచున్నానని వారు తలంచిరి.

36ఆ మత్తు విరిగిన తరువాత నాకేదో అనుభూతి కలిగినది. అది దర్శనమని నేను నమ్ముచున్నాను. ఎందుకంటే నేను ఎంతో బలహీనముగా ఉన్నాను. ఆమె ఏడుస్తూ వున్నది. నేను కండ్లు తెరిచేసరికి, ఆమె మాటలు వినిపించాయి. ఆ వెంటనే నేను నిద్రపోయాను. మధ్యలో రెండు మూడుసార్లు మేల్కొన్నాను.

ఏడు నెలల తరువాత నేను మరల డాక్టరు వద్దకు వెళ్ళాను. నా రెండు కాళ్ళు బాగా వాచిపోయాయి. నా రక్తం విషపూరితమై పోయింది గనుక రెండు కాళ్ళు తీసివేయాలని చెప్పారు. నేను చాలా గట్టిగా పట్టు పట్టాను. డాక్టరు రీడర్, డాక్టరు ఎరల్ అను వైద్యులు చివరకు నాకు ఆపరేషన్ చేసి, ఆ విషాన్ని కలిగించు భాగాన్ని విజయవంతంగా తీసివేశారు. దేవుని దయవలన నాకు చక్కగా కాళ్ళు దేవుడు ఇచ్చాడు.

కాని నాకు ఆఖరిగా కలిగిన దర్శనమునందు…

MARK 16:17,18

 

37నేను మొదటి దర్శనములో పరవశుడనైయుండగ, సర్వ సాధారణముగా నేను పాతాళములో ఉండినట్లుగా తలంచితిని… [అస్వస్థురాలగు ఒకామెకు సహో. బ్రెన్హాం ప్రార్థించుచున్నారు - సంపాదకులు.] మంచిది. అక్కడయున్న వారెవరో వారెల్లరు ఆమెపై చేతులుంచండి. ప్రార్థించుదం.

ప్రభువైన యేసూ, ఈ సోదరి, జబ్బుతో గదిలో పడిపోయి వున్నది. నీ ప్రతినిధులమైన మేము ఈమె పై చేతులుంచాము. నీ కృపను, నీ బలమును, శక్తిని, అనుగ్రహించుము. నమ్మిన వారివలన ఈ సూచన క్రియలు జరుగుననియు, మరియు ఇప్పుడు మా సహోదరి వ్యాధి నుండి బయటపడి, దేవుని నామ మహిమార్ధమై బాగుపడును గాక! ఆమెను నీకు సమర్పిస్తూ యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాము. ఆమేన్.

38ఆమెను గాలిలోనికి తీసుకొని వెళ్ళండి. అది భయంకరమైన, చెడు వ్యాధిగా ఉన్నది. అది వాస్తవము, కీడు రాబోతున్నదన్న అనుభూతిని నేను ఐదారు సార్లు ఈ వేదికపై నుండగా చవిచూచాను. ఆమె లేచిన వెంటనే గాలి ఉన్న స్థలమునకు తీసుకొని వెళ్ళండి. అది ఆమెకు మేలుగా నుండును. అది భయంకరమైన వ్యాధి అని మీరెరుగుదురు. మానవసృష్టిలో ప్రతి చదరపు అడుగున రోగములు ఆవరించియున్నవి. ఎవరైన కొంచెము నీరును కలిగియుండిన ఆమెపై కొద్దిగా నీళ్ళు చల్లండి. సాధ్యమైనంతవరకు ఆమెకు గాలి తగులనివ్వండి! ఇప్పుడామె బాగుపడినది. ఆమెను వెలుపలి గాలిలోనికి పోనివ్వండి. ద్వారములు తెరచి పెట్టండి. సాధ్యమైనంత వరకు ఆ విధముగా చేయుడి.

39ఇప్పుడు, ఈ సమయములో, నేను ఈ జీవితములో నుండి శ్రమలోనికి వెళ్ళిపోయినట్లుగా తలంచుచున్నాను. ఆ తరువాత ఏడు నెలలకు కార్మ్ కౌంటీ మెమోరియల్ ఆస్పత్రిలో రెండవ ఆపరేషన్ జరిగింది. మరో దర్శనం చూచాను. ఒక పెద్ద బంగారు సిలువ ఆకాశంలో కనబడింది. ఆ సిలువ నుండి దైవమహిమ ప్రవహిస్తోంది. నేను చేతులెత్తి నిలువబడియుండగ, ఆ మహిమ నా గుండెల్లోకి ప్రవహించినది. మరియు దర్శనం నన్ను విడిచి పోయింది. నేను పశ్చిమ దిశ యందు నిలబడ్డాను.

ఆ దర్శనం వచ్చిన సమయంలో నా తండ్రి నా ప్రక్కనే నిలబడి, నా వైపు చూస్తున్నారు.

40నన్ను ఈ సంవత్సరములందంతట ఎరిగినవారు నేను పశ్చిమదిశకు వెళ్ళకోరుచున్నానని ఎరుగుదురు. ఈ విషయం అది ఎట్లో మీరందరు ఎరుగదురు. పశ్చిమ దిక్కున ఎల్లప్పుడు ఏదో ఉన్నదని తెలియజేయుచున్నది. ఒకసారి ఖగోళ శాస్త్రజ్ఞడు అదే విషయమును గూర్చి తెల్పుచు నేను పశ్చిమమునకు వెళ్ళాలని చెప్పాడు. నక్షత్రముల ఆ వృత్త కాల పరిమాణమును అనుసరించి చూచిన నేను పుట్టిన నక్షత్ర కాలమును బట్టి చూడగా నేను పశ్చిమానికే వెళ్ళాలి గానీ తూర్పున ఏ కార్యసిద్ధి కలుగదని చెప్పాడు. నా జీవితాశ గత సంవత్సరం నెరవేరింది. పశ్చిమంగా పయనించి వచ్చాను.

41నేను అక్కడ ఎందుకు ఉన్నాను - అది ఎంతో హాస్యాస్పదమైన విషయము. నెలకు 110 డాలర్లు ఇంటి అద్దెకు చెల్లించుచు, ఎడారిలో నేను నిలుచుండుచుంటిని. మరియు వారు అన్ని సదుపాయములు అమర్చిన ఒక గృహమును ఇక్కడ ఏర్పాటు చేసియుండిరి, కాని అది ప్రభువును వెంబడించుటయైయున్నది. నేను చేయుటకు తెలిసికొనినదంతయు అదే. అక్కడ ఏలాంటి దర్శనాలు కలిగియుంటినో మీరెరుగుదురు.

ఇప్పుడూ, ఈ సందర్భమున నేను చెప్పబోవునదేమనగా…

42(మన సహోదరి కొంత బలహీనముగా నుండిన, రాయ్ సహోదరుడా, ఆమెను వెలుపలికి తీసికొని వెళ్ళి, ఇక్కడ ఉన్న ఒక గదిలో, ఆమెకు ఎక్కువ గాలీ మరేదైన కలిగియున్న దానిలో నుంచిన అది సరిగా నుండును, ఎందుకనగా… ఆమె మంచిగా నుండగలదని నేను తలంచుచున్నాను. ఆమె ఆనారోగ్యముగను, సొలయు స్థితిలో ఉన్నది. గాలి ఉన్న ఈ స్థలమునకు మీరు ఆమెను తీసికొని రావలెననిన నేను చెప్పుదును … రాయ్ సహోదరుడా, కిటికీని తెరవుము. ఆ సహోదరి రాగలిగిన యెడల చాలా బాగుండును. ఆమె ఇక్కడికి రాగోరినయెడల, ఆమె నడచుచూ వెళ్లుచుండగా, నా చేతులు ఆమెపైనుంచ గోరుచున్నాను. ఒక్క నిమిషము మీరెల్లరు నన్ను క్షమించండి.)

పరలోకపు తండ్రి, ఈ నీ కుమార్తె ఈ ఉదయ కాలమందు నీ వర్తమానము వినుటకు ఇక్కడకు వచ్చియుండగా, సాతానుడు వినకుండునట్లు పడగొట్టుటకు ప్రయత్నించుచున్నాడు, కాని "సాతాను ఆమెను పడగొట్టలేడని, యేసుక్రీస్తు నామమున నేను చెప్పుచున్నాను."

మంచిది, ఆ ద్వారము, నేను అనుకొనుచున్నాను…?… సహోదరులారా, అప్పుడు గాలి దానిగుండా మీ వైపు వచ్చును.

43ఎక్కడైతే ఇతర దేశములలో కుష్టరోగులును, క్యాన్సరు వ్యాధిగల వారిని ఒకరిపై ఒకరిని దొంతులుగా వేయబడిన వారిని పెద్ద భవనములలో ఆ రోగములతో దురంద వాసనతో ఊపిరి పీల్చుకొనుటకైన వీలు లేనట్లుగా అపరిశుద్ధము చేయబడియున్నవి. కుష్టరోగము అనగానేమో మీరు ఎరుగుదురు. చెవులు తిని వేయబడి, సగము ముఖము కలిగి చేతులు మొండిగాను, కాళ్లు, వాటి వేళ్లు తిని వేయబడి చీలమండలములు అతికించబడిన కట్టులతో ఒకరిపై ఒకరు వేయబడినవారై, వారిలో అనేకులు చనిపోవుచున్నారు. వారు ఈ వర్తమానము వినుటకు కూర్చబడియున్నారు.

44ఇప్పుడు, ఈ విషయములో ఏమి జరిగినదో నేను చెప్పెదను. నాకు కలిగిన దర్శనములో తిరిగి నేను వెళ్లనున్నాను, ఏలయనగా ఆ రెండు దర్శనములు, వాటిలో ఒకటి మీకు తెలియజేయుటకు వచ్చితిని. నేను పశ్చిమదిశకు బైటకు వెళ్లితిని. దానిని నేను ఎంతో కాలము నుండి ఆపేక్షించుచుంటిని.

ఈ ఉదయకాలము వర్తమానము యొక్క ఉద్దేశము - సంఘమును అందలి ప్రతిదియు వాని స్థలములో నుంచుట, నేను ఎరిగినంతవరకు దానిని ఉంచుటకు ఆయన నన్ను నడిపించును నేను దానిని అనుసరించినంత వరకు. ఇది నాకు తోచిందున ఈ సంఘమును దాని స్థలములో ఉంచబడునట్లు చేయుటకు నేను కోరితిని. ఇప్పుడు ఇది ఈ ఆలయము వారికి మాత్రమే ఉద్దేశించబడినది. మరియు ఈ దర్శనములో మొదటిగా, ఈ విధముగా జరిగియున్నది.

45ఆ దర్శనము కలిగినప్పుడు నేను ఎంతో బలహీనుడనైతిని, మరియు నాలోని రక్తమంతయు అంతమొందెను. మరియు నేను అంతములేని నిత్యత్వములోనికి వెళ్లిపోవుచున్నాను అని తలంచితిని. ఈ విషయమును నేను ఇంతకు ముందును చెప్పుటకు మీలో అనేకులు వినియున్నారు - అంతము లేని నిత్యత్వము లోనికి నేను వెళ్లిపోవుచున్నాను.

మొదటిగా, నేను మేఘముల వలె నున్న వాటి ద్వారా వెళ్లుచుంటిని. అటు పిమ్మట చీకటి ద్వారా క్రిందికి, క్రిందికి దిగిపోవుచుంటిని. ప్రధమముగా తప్పిపోయిన వారి ప్రదేశములలోనికి నేను వెళ్ళితిని. అచ్చట నేను పెద్దగా కేక వేసితిని. మరియు నేను చూడగా, దానికి ఏ పునాది లేదు. నేను పడిపోకుండ నిలుచుటకు ఏదియు లేదు - నిత్యత్వము మాత్రమే నేను పడిపోవుచున్నట్లు అనిపించుచున్నది. అచ్చట నిలువబడుటకు ఏదియు లేదు.

46ఇటీవల ప్రజలతో మహిమకరమగు స్థితిలో నేనుండిన దర్శనమునకును, దీనికిని ఎంత వ్యత్యాసము కలదు. అయితే, ఇందులో నేను పడిపోవుచుండగా చివరకు మా తండ్రి కొరకు కేక వేయుచున్నాను. నేను పసివాడుగా నుంటను బట్టి ఆ విధముగా చేసితిని. మా తండ్రి కొరకు అరచుచుంటిని, కాని మా తండ్రి అచ్చట లేదు. మా తల్లి కొరకు కేక వేసితిని, "ఎవరైనా నన్ను పట్టుకోండి!" మరియు అచ్చట మా తల్లియు లేదు. నేను అలాగే వెళ్లిపోవుచున్నాను. అంతట దేవుని కొరకు కేక వేసితిని. అచ్చట దేవుడును లేడు. అచ్చట ఏదియు లేదు.

47తరువాత కొంత సమయమునకు ఎంతో దుఃఖకరమైన మూలుగు ధ్వని నేను ఎన్నడు విననటువంటిది వింటిని, అది భయంకరమైనదిగా నుండెను. దాని వివరించలేము - అక్షరాలా మండుచున్న అగ్నిగుండము దీనికంటే ఓర్వదగినదిగా నుండును.

ఆ దర్శనములు ఎన్నడూ తప్పిపోలేదు. నేను ఎన్నడు కలిగియుండనటువంటి భయంకర హృదయ వేదన కలిగినది. మరి జరిగినదేమి… నేను దయ్యములు తిరుగుచున్న ధ్వనివంటిది వింటిని. నేను దానివైపు చూచినప్పుడు, పచ్చని రంగుల వేషమును కలిగిన స్త్రీలు అచ్చట నుండుట చూచితిని. మీరు వారి ముఖములు చూచినప్పుడు వారి నేత్రముల క్రింద పచ్చని రంగును కలిగియుంటిరి. ఈనాడు స్త్రీలు తమ ముఖములకు రంగులు వేసికొనిన రీతిగా వారి ముఖముండెను. వారు అదే రంగులు వేయబడిన ముఖములతోను, కన్నులతోను తిరిగి వెళ్లిరి. హో, హో, హో అని నేను కేకలు వేసితిని. "ఓ, దేవా, నాపై నీ కృప చూపుము, నీవు ఎక్కడ ఉన్నావు దేవా, నీవు నన్ను ఇచ్చటి నుండి తిరిగి వెళ్లనిచ్చినయెడల, మంచి పిల్లవాడుగా నేను ఉందునని ప్రమాణము చేయుచున్నాను," అని వేడుకొనుచుంటిని. అది మాత్రము నేను చెప్పగలిగితిని. దేవుడు ఎరుగును. న్యాయతీర్పు దినమందు ఏది నేను మీతో చెప్పితినో, దాని విషయము ఆయన నాకు తీర్పుచేయును. "ప్రభువైన దేవా, తిరిగి నన్ను వెళ్లనిచ్చిన నేను మంచి పిల్లవాడుగా నుండునని నేను నీకు ప్రమాణము చేయుచున్నానని," నేను అది మాత్రము చెప్పితిని.

48నేను తుపాకి దెబ్బతినినప్పుడు, అబద్దములునే చెప్పుచుంటిని. మరియు ఏవి చేయవలసియుండు వలెనో, దగ్గర దగ్గరగా అవన్నియు నేను చేసితిని. నేను చెప్పవలసినది ఒక్కటి మాత్రము గలదు… ఇక్కడ ఉన్నప్పుడే నేను దానినంతటిని నేను సరిగా చక్కపెట్టవలసియున్నది. నేను క్రిందికి చూడగా, నేను రెండు ముక్కలు ఎగురగొట్టబడినట్లుగా నుంటిని… దేవా, నాపై కృప చూపుము. నేను ఎన్నడును వ్యభిచరించ లేదు. నన్ను నీ వెరుగుదువు అని నేను చెప్పుచుంటిని.

ఆయన క్షమాపణను మరేదియు రాకమునుపే, "నేను ఎన్నడు వ్యభిచరించ లేదు," అని మాత్రము నేను చెప్పకలుగచుంటిని. వారు నన్ను అక్కడ నుండి తీసికొని వెళ్ళిరి. అచ్చట, "దేవా, నన్ను కరుణించుము, నీవు నన్ను తిరిగి వెళ్లనిచ్చినయెడల, మంచి పిల్లవానిగా నుంటాను," అని నేను అరచుచుంటిని. ఏలయనగా ఎక్కడనో దేవుడు ఉన్నాడని నేను ఎరుగుచున్నాను. నన్ను చుట్టుకొనియున్న ఆ భయంకరముగా అలసిపోయియున్న ప్రాణుల నుండి విడిపింపబడునట్లు సహాయము చేయుము. నూతనముగా ఇందు ప్రవేశింపబడినవాడనైతిని. అచ్చట భయంకర మరియు వికృతమైన నాస్తికత్వముతోను - చూచుటకు కన్ను గ్రుడ్డులు పెద్దగా చేయబడిన పెద్ద నేత్రములు కలిగి, తిరిగి పిల్లిని పోలి మరలి పోవుచుండెను. మరియు పచ్చని రంగుల వేషము కలిగిన వాటితో కొరుకుడు పుండ్లు కలిగిన వాటివలె ఏదో కలిగిన వారైపోవుచుండిరి. "హో, హో, హో."

ఓ, అది ఎటువంటి అనుభూతి!

49పిమ్మట ఒక రెప్పపాటు సమయములో నేను తిరిగి స్వభావిక జీవితమునకు వచ్చితిని. ఆ విషయము నన్ను బాధపెట్టినది. ఏదైన కానిమ్ము, అటువంటి స్థలమునకు నేను ఎన్నడును పోవుటకు ఇష్టపడను. ఏ మానవుడు అలాంటి స్థలమునకు వెళ్ళకూడదు. ఏడు నెలల తరువాత పశ్చిమ వైపు ముఖము త్రిప్పి నిలుచుండినట్లుగా దర్శనము చూచితిని. బంగారపు సిలువ నావైపు వచ్చుట చూచితిని. ఎక్కడనో నశించిపోవు వారి ప్రదేశములున్నట్లు నేను ఎరిగితిని.

50దాని విషయము నాలుగు వారాల క్రితము వరకు నేను దానిని సరిగా గ్రహించలేదు. నా భార్య… దీని విషయంలో ఏమీ ఆలోచించలేదు. నాలుగు వారముల క్రితము నా భార్య నేను టుసాన్ కు వస్తువులను కొని తెచ్చుటకు వెళ్లితిమి. మరియు మేము కూర్చొనియుండగా… నా భార్య నేను క్రింది అంతస్తుకు దిగిరాగా అక్కడ, ఆడంగితనమువారు (ఆడవారు కలిగినట్టుగా) పొడవైన జుట్టులు కలిగి వెంట్రుకలు వీపునకు ఆనునట్లుగాను, ముఖ భాగమునందు ఏటవాలుగా వ్రాలునట్లు దువ్వుకొనబడి, మడిమెలకు పైగా ప్యాంట్లుగా గల ఒక విధమైన వస్త్రములు ధరించినవారు కనిపించారు.

"అక్కడ ఉన్న వారందరు వారినే చూచుచున్నారు. స్త్రీలు నీటితో సవరించిన వెంట్రుకల కత్తిరింపుతో ఎత్తుగా ధరించిన ప్రకారము వారు తమ జులుపాలు పెంచుకొనియున్నారు అని మీరు ఎరుగుదురు. వారందరు క్రింది అంతస్థులో ఉన్నారు. ఒక యవ్వన స్త్రీ వచ్చి- "దానిని గూర్చి నీవు ఏమి తలంచుచున్నావు?" అని ఆమె అడిగినది.

అందుకు నేను - "నిన్ను గూర్చి నీవు సిగ్గుపడాలి, అది నీవు తలంచిన యెడల," అని చెప్పితిని. "నీ వలె వారు జుట్టు పెంచుకుంటారంటే, నీవేమో కత్తిరించుకొనుచున్నావు. మీ ఇరువరిలో ఒక్కరును సరియైన వారు లేరు," అని నేను చెప్పితిని.

51గనుక పై అంతస్తుకి నేను వెళ్లియుండి, అచ్చట నేను కూర్చుంటిని. (అది జే. సి. పెన్ని స్టోర్) అచ్చట ఎస్కలేటరు పై గదిలోనికి కొనిపోవునది అందుకలదు. అది కొందరిని పైనున్న గదికి తీసికొని వచ్చుచుండెను. అచ్చట వచ్చుచున్న స్త్రీలను, యౌవ్వనులను, వృద్దులను మరియు పలు రకములైన వారిని చూచుచుండగా, వాస్తవముగా నా కడుపు నందు అనారోగ్యత సంభవించెను, ముడతలు కలిగిన యౌవ్వనులు ప్రతి స్థలమందును పొట్టి అంగీలతో; అసహ్యమైన శరీరములతో మరియు కామవికార సంబంధమైన దుస్తులు ధరించిన స్త్రీలు, ఎతైన గోపురములవలె వెంట్రుకలు కలిగి వారు వచ్చుచుండిరి, నేను కూర్చుండిన కుర్చీ వెనుక ఆ ఎస్కలేటరు నుండి ఒకతె వచ్చుచుండెను, నేను నా తలను వంచుకొని అక్కడ కూర్చుండియుంటిని.

52మరియు నేను అటువైపు తిరిగి చూచితిని. వారిలో ఒకతె (స్పానిష్ భాష మాట్లాడుచు) మరొక స్త్రీతో వచ్చుచుండెను. ఆమె తెల్లని వర్ణముగల స్త్రీ స్పానిష్ తో మాటలాడుచుండెను. ఆమెను ఆకస్మిముగా చూచేసరికి నేను స్తంబించిపోయాను, ఎందుకనగా ఇంతకు ముందే అది నేను చూచినాను.

ఆమె కన్నులు (మీరు ఎరిగినట్లుగా స్త్రీలు ఈనాడు వారి కన్నులకు రంగులు వేసికొనినట్లుగా, సరిగా అట్లే పిల్లివలెను, పిల్లివలెను, పిల్లి కన్నులను పోలి, కంటి అద్దాలు కలిగి, పైకి నేత్రములు కలిగిన దానిగా నుండెను. వారి కన్నుల క్రింద పచ్చని రంగును పూసికొనియుండిరి. నేను పిల్లవానిగా నున్నప్పుడు (నా దర్శనములో) చూచినది సరిగ్గా అదే స్త్రీ. నేను వాటిని చూచినప్పుడు, నా శీరరమంతయు చలనములేనట్లాయెను. నేను చుట్టూ తిరిగి చూచినప్పుడు, ఆ భవనములో వారు వస్తువుల ధరల విషయము గొణుగుచుండుట చూచితిని.

53అది చూచినప్పుడు నేను రెప్పపాటు కాలము విస్మయముతో నుంటిని. నేను పాతాళములో చూచినది అదే. అచ్చట వారు అపవిత్రులైయుండిరి. వారు పాతాళములో ఉండుటవలన, వారి కన్నుల క్రింద పచ్చని నీలము రంగులు కలిగియుందురని నేను తలంచితిని. నలభై సంవత్సరాల క్రితం ఈ విధముగా పచ్చ - నీలము రంగు పూసికొనిన ఈ స్త్రీలను గూర్చి దర్శనము తెలియజేసెను. (నేను అప్పుడు పదునాలుగు సంవత్సరముల వయస్సు కలిగియుంటిని. దాదాపు నలుబది సంవత్సరములు అనగా ఇప్పుడు యాభై-నాలుగు సంవత్సరములు.) గనుక నలుబది సంవత్సరముల క్రితము, నలుబది అనునది తీర్పు సంఖ్య. కావున అది నలుబది సంవత్సరములకు నెరవేరినది..

ఇప్పుడు, అక్కడ …

54నేనది చూచిన తరువాత, నా భార్య వచ్చినప్పుడు కనీసం ఆమెతో మాటలాడలేకపోతిని. ఆమె శారాకు, మరియు పిల్లలకు పాఠశాలకు వెళ్లు నిమిత్తము కొనుటకు ప్రయత్నించుచుండెను, నేను కనీసం… నేను మాత్రము కనీసం ఆమెతో మాటలాడలేకపోవుచున్నాను. ఆమెకు ఏమియు చెప్పలేకపోవుచున్నాను. "బిల్లీ, నీకు ఏమైనదని?" అని ఆమె నన్ను ప్రశ్నించెను.

"ప్రియా, నేను చచ్చినవాడనుగా నైతిని" అని నేను చెప్పితిని.

"ఏమైనది? నీవు ఆనారోగ్యముగా ఉన్నావా?" అని ఆమె ఆడిగినది.

"లేదు. ఏదో ఒకటి జరిగినది సరిగ్గా ఇప్పుడే" అని నేను చెప్పితిని. ఆమె దానిని ఎరుగదు. ఈ టేపును తిరిగి ఇచ్చుటకు చూచుచున్నది. నేను ఎవరికిని దానిని చెప్పలేదు. సంఘానికి మొదట తెలపాలని నా వాగ్దానము. "మొదట సంఘానికి తెలుపు వరకు నేను కనిపెట్టుకొనియుండవలెనని," నేను తలంచితిని. అది నా వాగ్దానమైయుండెను. నా వాగ్దానాన్ని నిలబెట్టుకొనుటకు ప్రయత్నించుచుండెను. దీనిని మీరు ఈ రాత్రి తరువాత గ్రహించగలరు.

55అటు పిమ్మట, ఆ స్త్రీలు చెడు దృష్టిగల కన్నులు కలిగిన దానిని చూడగా, నా దర్శనాన్ని గ్రహించగలిగాను. అక్కడ చేరియున్న వారిలో స్పానిష్, ఫ్రెంచి, ఇండియా, మరియు తెల్లని వర్ణపు వారును ఎల్లరు కూడియుండి, వారి తల వెంట్రుకలు దువ్వుకొనిన తీరు చూచిన, తల పై పెద్ద పొదగా జూలును కలిగినట్లుండిరి, అటు పిమ్మట వెలుపలికి వారు వచ్చిరి. ఆ శిరస్సు జూలు ఆ రీతిగా వెనుకకు ఆరునట్లుగను, ఎత్తుగా పొదగా నుండునట్లు తలపై అమర్చిరి. రంగులు పూసుకొనిన చెడు కన్నులతో పిల్లి కన్నుల పోలినవారై వెనుకకు గీయుచుండిరి. ఆ దృశ్యం జె. సి. పెన్నీ దుకాణంలో ఉన్నంత వరకు నేను నా దర్శనములో మరల సాతాళములో ఉన్నట్లుగానే ఉండెను.

నేను చాలా భయపడిపోయాను, "నిజముగా నేను చావలేదు, ప్రభువా, చివరకు నన్ను ఇచ్చటకు వచ్చునట్లు నీవు చేసితివని," నేను తలంచితిని. నేను చూచిన ఆ దర్శనముగా వీరు ఊహూ, ఊహూ, అని గొణుగుచూ పచ్చని రంగు పూయబడిన విచిత్ర కన్నులతో, నిరాశ ముఖములతో తిరుగుచున్నవారుగా, ఆ ఎస్కలేటరు మెట్లను దిగి ప్రజల మధ్యలో వెళ్లుచున్న స్త్రీలను చూచి చకితుడనై మౌనినైతిని.

56నా భార్య నన్ను సమీపించగా, "నన్ను ఒక క్షణం ఒంటరిగా ఉండనిమ్ము, హనీ" అని నేను అన్నాను. "నీవు ఏమీ అనుకొననట్లైతే, నాకు ఇంటికి వెళ్ళవలెనని వుంది" అని చెప్పాను.

"నీవు ఆనారోగ్యముగా వున్నావా?" ఆమె అడిగినది.

"లేదు, ముందుకు తిన్నగా వెళ్లుదాం. హనీ, నీవు ఏమైన కొనవలసినది యుంటే కొనుక్కొని రా," అని నేను చెప్పాను.

"అంతా ముగించాను, తీసికొనవలసినవి ఏవి లేదని" ఆమె చెప్పినది.

"నీ చెయ్యి పట్టుకొని నడువనిమ్ము," అని అన్నాను నేను. నేను బయటకు నడిచితిని.

"విషయము ఏమిటి?" అని ఆమె అడిగినది.

అందుకు నేను ఆమెతో, "మిడా, అక్కడ నాకేదో జరిగినది" అని చెప్పితిని. ఆ స్థితిలో ఉండగా, "ఏ దినాల్లో మనము జీవించుచున్నాము? ఇది మూడవ ఈడ్పా?" అని నేను తలంచుచుంటిని. ఇప్పుడు ఇక్కడ నా వద్ద కొంత నోట్సు వున్నది.

57యేసు… యేసు ఆయన సేవలో, ఆయన ప్రజలకు బోధించిన తరువాత మనము యెరిగినది… (ఇప్పుడు ఈ విషయమును వాక్యానుసారముగా వాస్తవమైన దానిని తెలిసికొనబోవుచున్నాము.) యేసు ఆయన యొక్క సేవను ముగించిన తరువాత ప్రజలు ఆయన యొక్క సేవను తృణీకరించిరి. (ఇప్పుడు - మీరు జాగ్రత్తగా దీనిని పరిశీలించి, మీ స్వంత గ్రహింపు కలిగియుండుడి.) మొదట నేను చెప్పినది జ్ఞాపకము చేసికొనుడి. ఆయన బోధించిన తరువాత, ఆ దినమునకు వాగ్దానము చేయబడిన ఒకనిగా ఆయన వచ్చెను. ఆ విషయము మనమెల్లరము ఎరుగుదుము. యేసుక్రీస్తును లేఖనములు మెస్సియాగా గుర్తింపజేసెను. అది వాస్తవము. ఆయన మెస్సియా అని దేవుని వలనను, ఆయన వాక్యము వలనను దృడముగా బాహ్యమందు రుజువు చేయబడెను. ఆ విషయము ప్రశ్నించనక్కర లేదు… ఎవరైన ఆయన మెస్సీయా కాదని ప్రశ్నించగలరా? (అలాగు అడుగనుద్దేశించిన, వేదిక దగ్గరకు మీరు రావలెను) ఆయన మెస్సీయా అని సృష్టముగా గుర్తింపజేయబడెను.

దేవుడు ఆయనను గుర్తింపజేసెను.

ACTS 2:22

 

58పెంతికోస్తు పండుగ దినము తరువాత నాలుగు రోజులకు సన్నెద్రిన్ సభలో పేతురు నిలిచి చెప్పిన రీతిగా - నజరేయుడగు యేసు చేత అద్భుతములను, మహత్కార్యములను, సూచక క్రియలను మీ మధ్యను చేయించెను. ఆయన దేవుని వలన అంగీకరింపబడినవాడని, దానికి మనమెల్లరము సాక్షులము. అయినను మీరు దుష్టుల చేత జీవాధిపతిని సిలువ వేయించి చంపితిరి. అయితే దేవుడు ఆయనను మృతులలో నుండి లేపి, ఈ కార్యములు చేయించుచు, క్రీస్తు సజీవుడై యున్నాడు, వాస్తవమున నేడును జీవించుచున్నాడు," అని దేవునిగా ఆయన నిరూపింపబడియున్నాడు.

1PET 3:19

 

59ఇప్పుడు, తరువాత యేసు స్పష్టముగా వచ్చి తనను తాను గుర్తింపచేసుకొనెను. (దేవుడు ఆయనను గుర్తింపచేసెను) మరియు ఆయన ప్రవచించెను, మరియు అతని ప్రవచన దినముల తరువాత, లేఖనముల ద్వారా గుర్తింపబడిననూ, ప్రజలు ఆయనను త్రోసివేసిరి. అది వాస్తవము.

వారాయనను విసర్జించిన పిదప కూడ, ఆయన సువార్తను ప్రకటించెను. రక్షింపబడు వారికి ఇచ్చట అవకాశము కలిగినది. ఆయన బోధించుచున్నప్పుడు, ఎవరైనను రక్షింపబడుటకు అవకాశము అచ్చట ఉండెను అని గుర్తించండి. వారెవరో (ముందుగా ఏర్పరచబడిన వారు) మనము యెరుగము. అయితే ఆయన ప్రకటించుట కొనసాగించుచుండెను అని జ్ఞాపకముంచుకొనుము.

1PET 3:19•

REV 20:11

 

60ఆయన బోధించు దినముల పిమ్మట కూడ ఆయన సేవ పరిచర్య కొనసాగింపబడెను, ఏలయనగా అఖరి గుంపుగా పాతాళములో నున్న క్షమింపబడని ఆత్మలకును ఆయన బోధించెను. దానిని II పేతురు పత్రికను బైబిలు నుండి నేను స్పష్టముగా చదివించాను.

ఆయన వెళ్లి చెరలో నున్న ఆత్మలకు బోధించెను. (అది పాతాళము) న్యాయతీర్పు దినము వరకు బంధింపబడియున్నారు. ఏలయనగా, గనునించుము. ఇప్పుడే తీర్పు లేదు. మండుచున్న అగ్నిగుండముగల పాతాళము ఇప్పుడు ఇంకనూ లేదు. ఒక వ్యక్తి మండుచున్న నరకంలో ఉన్నాడని ఎవరైన చెప్పుచుండిన, అది తప్పు.

ఈ లోక న్యాయాధిపతి సహితము ఒక వ్యక్తిని విచారణ చేయకుండ శిక్ష విధించడు కదా! దేవుడు కూడ తన చట్ట ప్రకారము ఒక వ్యక్తిని విచారించకుండ మండుచున్న అగ్నిగుండములోనికి త్రోయబడనివ్వడు. అతడు కృపను త్రోసిపుచ్చెను, గనుక గమనించుము, అతడు ప్రధమముగా విచారణ చేయబడెను. ఆ విచారణ గొప్ప ధవళ సింహాసనము యొక్క న్యాయతీర్పు యెదుట జరుగును, అయితే అతడు ఇప్పుడు చెరసాల అని పిలువబడు బందీ గృహమందుండును.

61దేవుని కృపను బట్టి ఈ రెండు స్థలాలను నా దర్శనములో నేను చూచాను. (దేవ దూషణగా నుండునట్లు నేను దీనిని చెప్పుట లేదు. అది తప్పైనయెడల దేవుడు నన్ను క్షమించును గాక.) నేను ఆ రెండు స్థలములలోనికి వెళ్లితినని నేను నమ్ముచున్నాను. రక్షింపబడి, ఆశీర్వదింపబడినవారిని నేను చూచితిని. మరియు నశించిపోయిన వారిని మరియు వారెక్కడ ఉండేది నేను చూచాను. అందువలన మీ సహోదరుడిగా నేను దిగువనకు పోవు మార్గము నుండి పారిపొండి, అని హెచ్చరించుటకు ఈనాడు ఈ స్థలమందు నిలువబడియున్నాను. మీరెన్నడును ఆ మార్గమున వెళ్లకండి.

ఎక్కడ విమోచింపబడినవారు సమాధానముతో ఆనందించుచున్నారో, పైకి వెళ్ళు ఆశీర్వాదకరమైన ఆ మార్గమునందు నీవు జీవించుటకు సమస్తమును ఇవ్వబడియుండెను. వారు పాపము చేయలేరు, వారు దుఃఖపడరు. వారే కొలత లేక సంపూర్ణులైయున్నారు. ఆ రెండు స్థలములను చూచాను. ఆ విధముగ చెప్పుట ఒక వ్యక్తికి అది భయంకరమైన తెలియజేయు విషయమైయున్నది. అయితే దేవుడే ఆ మాటలకు తీర్పరి. ఆ రెండు స్థలములను నేను చూచితినని ధృడముగా నమ్ముచున్నాను. దానిని నేను నమ్ముచున్నాను.

62ఓ, నాశనకరమైన ఆ ప్రదేశము నందు ప్రవేశించుట ఏ వ్యక్తికైనను అది దూరమగును గాక. ఆ స్థలమందు నీవు నిలువబడిన యెడల, వేడిగా కాల్చబడిన తీగలను నీయందు దూచుకుపోవునట్లు ప్రతి విధముగా బాధింపబడుదువు; ఆ స్థలమందు దయ్యము ఆ విధముగా బాధ పెట్టకుండ నుండునట్టిది లేదు. మానవ బుద్ది లేక మనస్సు ద్వారా ఆ నాశనకరమగు స్థలములో జరుగుచున్నదానిని గ్రహింప శక్యము కాదు. దాని వ్యక్తపరచుటకు మరి వేరే ఏ మార్గమును లేదు. అటువలె ఆశీర్వదింపబడిన వారుండు స్థలము, మాటలతో వ్యక్తపరచలేనంత గొప్పదిగా ఉన్నది. అది ఎంతో భయంకరమైనది, మరి ఇదియైతే ఎంతో గొప్పగా నున్నది. ఈ ఉత్కుృష్టతమై దానినుండి, అది భయంకరమైనది.

కావున, ఎవరైనా విన్నట్లయితే…

63నేను వృద్దుడనైపోవుచున్నాను, ఎంత కాలము ఉంటానో నేను చెప్పలేను. నేను త్వరలో యాభై-ఐదు సంవత్సరములు వయస్సు కలిగియుందును. ఈ స్వభావిక జన్మమును బట్టి, ఇంకను ఎన్ని సంవత్సరాలు కలిగియుంటానో, నేను ఎరుగను. ఈ టేపు ఎక్కడికి వెళ్లునో నాకు తెలియదు. కాని విను వారెల్లరును, ఈ టేపు వినువారెల్లరు లేక ఈ టేపు ఎక్కడికి వెళ్లుచున్నదో దాని వినువారెల్లరును. ఆ నాశన కూపమునకు (పోకూడదని నా కోరిక) వెళ్లకండి. ఆ చెడ్డ దానిని నీవు చిత్రింపజేయజాలవు! మీరు ఏది చేయబోవుచున్నారో దీనిని ఎన్నడూ మరచిపోకండి, అట్లే ఆశీర్వదింపబడిన వారి స్థలమును (మరచిపోకండి) అపొ. పౌలుతో కూడ నేను చెప్పునది ఏమనగా - "కన్నులు చూడలేదు, చెవులు వినలేదు, తన్ను ప్రేమించు వారికి దేవుడు సిద్దపరచియుంచినది మానవ హృదయానికి గోచరము కానేరవు."

కాబట్టి ఈ టేపును వినుచున్న నీవు ఇంకను రక్షింబడనియెడల, ఈ టేపు యంత్రమును ఆపుము, పశ్చాత్తాప పడుము, దేవునితో సమాధానపడుము!

64నా ప్రధమ అనుభవమందు అనుభవించిన దీన్ని మీకు చెప్పుచున్నాను. నా హృదయ పూర్వకముగా దీనిని నమ్ముచున్నాను. ఆ దర్శనము నన్ను మోసపరచినదని నేను చెప్పినయెడల, దేవుడు నాపై కృప చూపును గాక! ఏలయనగా యదార్థ హృదయముతో నేను దానిని నమ్మితిని, నాకు ఇవ్వబడిన ఏ ఒక్క దర్శనము ఎన్నడును తప్పిపోలేదు. ఆ రెండు స్థలములలో నేను ఉంటీనని నేను నమ్ముచున్నాను. నాశనమునకు దిగిపోవు మార్గము ఏ వ్యక్తియు ప్రవేశింపకుండునట్లు దూరమగును గాక!

JOHN 20:21•

1PET 3:19

 

65యేసు తన పరిచర్యను ముగించిన తరువాత, ఎన్నడు రక్షణ పొందజాలని ఆత్మలకు సువార్తను బోధించెను. ఆ విషయమును గూర్చి ఇప్పుడు బైబిలు చెప్పుచున్నది. చెరలో ఉన్న పశ్చాత్తాపపడని ఆ ఆత్మల యొద్దకు ఆయన వెళ్లి, వారికి ఆయన బోధించెను, వారికి - కృప అనుగ్రహింపబడినప్పుడు, వారు కృపను తృణీకరించిరి. ఇప్పుడు వారు తీర్పుకై వేచియున్నారు.

ఓ, అది ఎలాంటి సమయమైయున్నది. ఓ, లోకమును కంపింపచేయబోవు ఆ వాస్తవమైన దానిని వారు చూచునట్లు చేయు మార్గముండినయెడల బాగుండును.

JOHN 20:21

 

66"తండ్రి నన్ను పంపినట్లుగా నేను మిమ్మును పంపుచున్నాను" అని యేసు స్వయముగా పలికెను.

ఆ తండ్రి ఆయనను నిరీక్షణగల సజీవులైన వారికి భోధించుటకు పంపినట్లుగా, నిరీక్షణ లేని వారికిని అదే వర్తమానము బహుకరించెను. నేడును అదే విధముగ లోకమునకు ఇది వర్తించుచున్నది. ఏలయనగా, మనలో నివసించుచున్న క్రీస్తు ఆత్మ ఆయన స్వభావమును మార్పు కలిగించదు లేక దేవుని పద్దతిని మార్చనేరదు. ఆయన ప్రతి తరములోను, ఒకే రీతిగా నుండును. ఆయన తప్పక మార్పులేనివాడుగానే ఉండును. "తండ్రి నన్ను పంపునట్లుగా, నేను మిమ్మును పంపుచున్నాను" అని చెప్పెను.

EXOD 32:10,12,32•

JOHN 14:12

 

67పరిచర్యల విధానమును తప్పక ఒకే మాదిరిగా నుండును. యోహాను 14:12లో ఆయన చెప్పినట్లుగా (మీలో కొందరు లేఖనములను వ్రాసుకొనుచున్నట్లు నేను చూచుచున్నాను) …"నేను చేయు క్రియలు నాయందు విశ్వాసముంచువాడును చేయును." నశించిపోవుచున్న వారికి, ఎన్నడు రక్షింపబడనేరని వారికి రోగ స్వస్థత, క్రియలలో బోధింపబడుచుండెను. ఆ పరిచర్య అట్టి క్రియలతోనే జరుగుచుండెను. అటువలె ఇది కూడ నుండును - అటువలె వుండేనా… నేను దీనిని ఈ రీతిగా చెప్పవలెనా?

కడవరి కాలములోను ఆయన సంఘము నందు యేసుక్రీస్తు యొక్క పరిచర్య తిరిగి ప్రవేశపెట్టబడెను. మనలో అనేకులు దానిని నమ్ముచున్నాము. మీతో నేను నమ్ముచున్నాను. ఇప్పుడు దీనిని నేను నమ్ముచున్నాను. ఆ నమ్మిక నాకు లేనియెడల, నేను మరేదో దాని చేసియుందును, ఏలయనగా ఇచ్చట నాలో ఉన్నది, తుదకు దాని విషయము వ్యాకులము కలిగియున్నాను. దేవుని ఆత్మ నీలో ఉండినయెడల ప్రజల విషయము వ్యాకులము కలిగియుండెదవు. ఒక లేఖనము నన్ను ఎల్లప్పుడు కలవరపరచుచుండెను: అదేమనగా - దేవుడు కలిగియుండిన ఉద్దేశ్యము కంటే మంచి ఉద్దేశ్యము మోషే ఎలాగు దేవునితో చెప్పగలిగెననునది. క్రీస్తు ఆత్మ మోషేలో నున్నందున అతడు చెప్పకలిగెనని నేను యెరుగు వరకు నాకు ఏది తోచకుండెను.

దేవుడు మోషేతో - "మోషే, నీవు వారినుండి వేరుకమ్ము, సమూలముగా వారిని నాశనము చేసెదను, నీతో నేను (వారికంటే గొప్ప జనాంగముగా) ప్రారంభించేదనని" చెప్పెను.

EXOD 32:32

 

68అందుకు మోషే - "దేవా," (అతడు మధ్యలో తన్ను తాను పడవేయబడినవాడై) నా పేరు జీవగ్రంథములో నుండి తుడిచివేయుము, నన్ను తీసివేయమని పలికెను.

ఏ ప్రజలు తనయెడల తిరుగుబాటు చేసిరో, వారి నిమిత్తము మధ్యవర్తిగా నిలబడునట్టుగా అతని హృదయము కనికరము కలిగినదాయెను. ఒక దేవుని సేవకుడు ప్రజలను గూర్చిన చింతన హృదయమునందు కలిగినప్పుడు, నిన్ను నీవు ప్రేమించుకొనుట కంటే ఎక్కువగా ప్రేమించు ప్రజల నుండి సత్యమును తెలియజేయక ఆటంకపరచబడి దేవుని యెదుట నన్ను నేను ఏ విధముగా నీతిమంతుడనని అనిపించుకొనగలను. ఒక వ్యక్తిని ఏ విధముగా చేతులు కలుపుట వలన, లేక ఏదో చిలకరింపు వలన ఏదో తప్పుడు బాప్తిస్మము, లేక మరి ఇతరమైన దానివలన తమ సంఘములో చేర్చుకొనగలను? మరియు తప్పుడు మార్గమునకు వారు అవలంబించునట్లు, బైబిలు ఎదుట నుంచబడియున్నదనియు అతడు ఆ వ్యక్తిని ప్రేమించుచున్నాడని ఎరుగునట్లు చేసి అబద్ధముగల ప్రాబల్యము క్రింద వారిని పొరబడజేయుట అతడు ఆ వ్యక్తిని ప్రేమించుటయేనా?

నా జీవమునకై బిక్షాటనము చేసినా, మరేది అదియైనను దేవుని యెదుటను, మానవుల యెడలను యధార్ధముగా నుండి సత్యమునే చెప్పనిమ్ము. మోసపుచ్చువాడుగా ఎన్నడూ నుండకుండ నన్ను ఉండనివ్వుడి. నేను ప్రేమించువారిని నేనెట్లు మోసము చేయగలను? నేను వారిని నొప్పించినను, నేను వారిని ప్రేమించుచున్నాను. అదే కారణమును బట్టి మీరు మీ బిడ్డను దండించెదరు, ఎందుకనగా మీరు వానిని ప్రేమించుచున్నారు. అతడు నీకిష్టమైనవాడు కాదు, అని కాదు దాని భావము, ఎందుకనగా నీవు వానిని ప్రేమించుచున్నావు. వాడు తప్పు చేసినయెడల, నీవు వానిని సరిదిద్దకపోయిన, అతడు మరణ పాత్రుడగును.

ACTS 9:3

 

69ఆనాడు జరిగినట్లుగానే సేవ, ఈనాడును అదే రీతిగా జరుగుచున్నది. రుజువులతో బయలుపరచబడిన దేవుని వాక్యము బోధింపబడెను. అది మానవుని వలన కలిగినది కాదు, అది తప్పక దేవుని వలననే బయలుపరచబడినది. అట్టి విధముగా జరుగవలసియున్నది.

గమనించండి. ఏ ఆత్మీయ క్రియలు సూచనలు యేసు జరిగించెనో, ఈనాడును ఈ భూమి మీద తిరిగి సంభవించును. ఆయన తాను మెస్సియా అని ఆత్మీయ సూచన క్రియల గురుతులతో తన్ను ప్రత్యక్షపరచుకొనునో, అదే ఆత్మీయ సూచక క్రియల మెస్సియాయని గుర్తింపబడెను; ఆయన ఈనాటికి మెస్సియాయే! ఆయన ఏమైయున్నాడో, ఏ భౌతిక గురుతుతో భూమిపై కనబడెనో, అదే ఒక వ్యక్తిని పరిశుద్ధ పౌలు అదే అగ్నిస్తంభముగా నుండుట చూచెను. అందు జరిగిన సంఘటనలన్నియు, తిరిగి అదే సంభవించుచున్నవి.

MATT 1:20•

JOHN 5:19

 

70తండ్రి చూపించు వరకు, ఆయన ఏదియు చేయలేదని యేసు తెలియజేసెను. తండ్రి పరిశుద్ధాత్మ అని మనమెరుగుదుము. అది దేవుని కార్యము జరిగించు ఒక కార్యాలయము. అది ఆలాగునుండనియెడల యేసుక్రీస్తు యొక్క తండ్రి ఎవరైయుందురు? దేవుడు ఆయన యొక్క తండ్రి అని యేసు చెప్పెను, మరియు పరిశుద్ధాత్మ ఆయన తండ్రి అని బైబిలు చెప్పెను. ఇప్పుడు, నీవు ఆయన అక్రమముగా పుట్టిన శిశువుగా నీవు ఎంచలేవు. ఎట్లనగా పరిశుద్ధాత్మ దేవుడుగా నుండినట్లు యేసు దేవుడైయున్నాడు.

గనుక దేవుడు - తండ్రి, కుమారుడు, మరియు పరిశుద్ధాత్మ అను మూడు కార్యాలయములుగ నుండిన ఒక్క దేవుని కార్యనిర్వహకత్వమై యున్నది. అదే ఒక్క దేవుని యొక్క మూడు గుణములైయున్నవి. దేవునిలో నీవు ఒక భాగమైయున్నావు. మరియు నేను దేవునిలో ఒక భాగమై యున్నాను; అయితే దేవుని సర్వసంపూర్ణత నేను కాదు, నీవును దేవుని సర్వసంపూర్ణత కాదు. యేసుక్రీస్తు ద్వారా దత్తత కుమారులమైన మనయెడల దేవుని గుణములు ప్రతిబింబింపజేయుచున్నది. ఆ దేవుడే శరీరధారియై, మన కొరకు మరణించుటకు వచ్చెను.

AMOS 3:7•

JOHN 5:19

 

71రాబోవు విషయములను పరిశుద్ధాత్మ ఎల్లప్పుడూ ఆయనకు చూపించెను, ఆయన ఎన్నడూ పొరపాటు చేయలేదు. అది ఎల్లప్పుడు సంపూర్ణతగలదై యుండెను. అది సరియేనా? ఆయన తనకు కీర్తి కలుగునట్లు పొందుకొనలేదు. దేవునికి మహిమ కలుగునట్లు చేసెను. "కుమారుడు స్వయముగా ఏదియు చేయడు, అయితే తండ్రి ఏమి చేయుట చూచునో దానినే చేయును" అని ఆయన చెప్పెను. పరిశుద్ధాత్మ తండ్రియైయున్నాడు. అది వాస్తవమేనా? "దావీదు కుమారుడవైన యోసేపూ, నీ భార్యయైన మరియను చేర్చుకొనుటకు భయపడకుము. ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది," అని చెప్పబడెను, గనుక పరిశుద్ధాత్మయే ఆయన తండ్రి మరియు పరిశుద్ధాత్మయే. జరుగబోవువాటిని యేసునకు చూపించెను - ఏ సంగతులు జరుగనుండెనో ఆయనకు చెప్పబడెను మరియు ఆయన దేవుడు-ప్రవక్తగా ఉండెను; ఎందుకనగా దేవుని వాక్యము ప్రవక్త యొద్దకు మాత్రమే వచ్చును. వాక్యము చిన్న రూపములో వచ్చినట్లుగా చూపించెను; కావున దేవుడు నానా విధములుగా మాటలాడిన దానిని వారు వ్రాసిరి, అయితే యేసు ఆ విధముగా ఏదియు వ్రాయలేదు, ఏలయనగా ఆయనే ఆ వాక్యమైయుండెను. అవును ఆయన దేవుని వాక్యము.

MATT 1:20•

JOHN 1:1•

JOHN 14:19•

JOHN 16:13

 

72గమనించుము, ఏ పరిశుద్ధాత్మ ఆయనలో ఉండెనో - "ఇక కొద్దికాలమైన తరువాత లోకము మరెన్నడు నన్ను చూడదు, ఆయినను మీరు నన్ను చూచెదరు. ఎట్లనగా నేను మీతోను, మీలోను యుగ సమాప్తివరకు ఉందును. నేను మీ యొద్దకు వచ్చెదను," అని ఆయన చెప్పెను. "నేను, ఆయనలో ఉండిన తండ్రి మీ యొద్దకు వచ్చెదము అనగా: పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు, నేను మీకు బోధించిన వాటిని బయలుపరచును మరియు జరుగబోవు సంగతులను మీకు తెలియజేయును," అని ఆయన చెప్పెను. అక్కడే మీరున్నారు.

MATT 28:20•

JOHN 1:32

 

73ఇప్పుడు, మనము గమనించిన, పరిశుద్ధాత్మ ఆనాడు సంఘములో పని జరిగించినట్లుగా, సరిగా ఈనాడును అదే పరిశుద్ధాత్మ వలన ఆ కార్యములను కలిగియున్నాము: ప్రారంభమునందు అగ్నిస్తంభము సరిగా ఎట్లు ప్రకటించెనో, అదే ఈనాడును, యేసు పైన అదే యోర్దాను నది యొద్ద వచ్చుట యోహాను చూచి ప్రకటించెను. అటువలె ఈనాడును మన మధ్య జరుగుచున్నది. శాస్త్రజ్ఞులు అన్ని విధములుగా (ఆ అగ్ని స్తంభమును) దానిని రుజువు చేసియున్నారు. దానిని వాదించుటకు వీలులేదు. అది శాస్త్రజ్ఞముగా - భౌతిక నిదర్శనమైయుండెను. మత సంబంధముగా కల్పితమైన తలంపు కాదు అది, అది మనో విజ్ఞాన సంబంధమైనది కూడ కాదు. "కెమరా యొక్క యంత్రమందలి నేత్రము కూడ ఆ మనో విజ్ఞానమును పట్టుకొనలేకపోయెను. ఆ వెలుగు కెమెరాలోని కటకాన్ని తాకినది," అని జార్జి. జె. లేస్సీ చెప్పెను.

74ఇక్కడ ఉన్న సంఘమైన నీ విషయమేమి, ఆరు లేక ఎనిమిది నెలల క్రితము నేను ఇచ్చట నిలువబడి - "నేను ట్యూజాన్, అరిజోనాకు వెళ్ళుచున్నాను అని యెహోవా ఈలాగు సెలవిచ్చెను" అని చెప్పుచుండిన విధముగ అచ్చట గొప్ప ప్రేలుడు, ఏడుగురు దూతలు కనబడుటను గూర్చి మీకు చెప్పితిని, అది మీకు జ్ఞాపకమున్నదా? ఇప్పుడు కూడా "లైఫ్ మ్యాగజీన్" అను పత్రిక ఆ ఫోటోలను తీసికొనునంతవరకు దేవుడు దాని యథార్థాన్ని తెలియజేయబడునట్లుగా చేసెను. ఆత్మీయమైనవి … ముందుగా చూచినది. సరిగ్గా అదే విధముగ దృశ్యమందు నెరవేరినది.

ఆ ఏడుగురు దూతలు చుట్టబడియున్న లేఖనములన్నియు, నా యొద్దకు తీసికొని వచ్చినా, ఏలయనగా బైబిలు నందలి మర్మములన్నింటిని ఏడు ముద్రలయందు మరుగుగా నుంచబడెను. దానిని మనము ఎరుగుదుము. దానితో ఆ గ్రంథము ముద్రించబడినది. ఆ సమస్త గ్రంథము యొక్క మర్మము ఆ ఏడు ముద్రలలో ఉంచబడినవి. ప్రభువు దానిని మనకు అనుగ్రహించును గాక.

AMOS 3:7•

JOHN 10:37

 

75ఈనాడు ఇక్కడ సరిగా హాజరై కూర్చుండిన వ్యక్తి అది సంభవించినపప్పుడు అతడు నాతో కూడ నుండెను.

"లైఫ్ మ్యాగజీన్" అను పత్రిక అక్కడ ఏమి సంభవించెనో దానినే సరిగ్గా రుజువు చేసెను. ఏలయనగా, ఆ విధముగా జరుగునని దేవుడు చెప్పెను గనుక దేవుడు ఆయన చెప్పిన మాట ప్రకారము జరుగునట్లు ఆయన వాక్య పక్షమున నిలువబడును. దానిని ఆయన చేయుదునని చెప్పినప్పుడు, దానిని ఆయన చేయును! కాబట్టి మీ మధ్యలో నున్న నావలె అతడేదో ఒక మానవుడు కాని, ఈ లోకపు వ్యక్తి కానీ కాదు, ఆయన నిత్యుడగు దేవుడు.

ఆయన ఒక మానవుని వాడుకొనును. అది సత్యము. మానవుడు లేకుండ ఆయన ఏదియు చేయడు, మానవుని ద్వారానే ఆయన సమస్తమును చేయును. ఆయను ఏర్పరచుకొనునది అదియే. ఎందుకో నేను ఎరుగను. సూర్యుని సువార్త ప్రకటించుటకు ఆయన చేసియుండవచ్చును, గాలిని సువార్త ప్రకటించుటకు ఆయన చేసియుండవచ్చును, ఆ కార్యములు చేయుటకు ఆయన గాలిని చేసియుండగలడు, కాని ఆయన మానవుని ఏర్పరచుకొనెను.

మానవుడు తిరిగి మానవునితో మాటలాడవలెనను ఆయన ఉద్దేశ్యమై యుండెను. తాను స్వయముగా కాదు కాని, "యెహోవా వాక్కు ప్రవక్త యొద్దకు వచ్చును." (ప్రవచించువారు, బోధకులు) మరియు ప్రవచించువాడు మూల వాక్యమును చెప్పి నిరాకరించిన, అతడు ఎట్లు నిజమైన ప్రవక్త కాగలడు? ఆతడు ఆ విధముగా నుండనేరడు, ఎందుకనగా అతడు వాక్యము యొక్క సత్యమును నిరాకరించుచున్నాడు. అటు పిమ్మట ఆ విధముగా ప్రకటింపబడనియెడల…

ఈ వాక్యము నందలి సత్యాసత్యములు పరిశుద్ధాత్మ ద్వారా బోధింపబడెను. అది వాగ్దానము చేయబడిన విధముగా ప్రతి వాగ్దానమును నెరవేర్చును. అందువలన అది సరియైనది లేక తప్పైనది మనము ఎరుగుదుము. యేసు కూడ చెప్పినదేమనగా - "నన్ను గూర్చి వ్రాయబడిన దానిని నేను చేయనియెడల, మీరు నన్ను విశ్వసించకండి," అని చెప్పెను.

ఈ విషయములను మనము ఇప్పుడు చూచుచున్నాము.

76జ్ఞాపకముంచుకొనుము, ఏడు ముద్రలు విప్పబడిన పని పూర్తి అయినది. ఆ బయలుపరచబడిన ఏడు సత్యములలో ఒకటి మాత్రము ఆయన మనకు తెలిసికొనుటకు అనుమతింపబడలేదు. ఏడవ ముద్ర సమయములో ఇచ్చట ఎందరు ఉండియుండిరి? మీరందరు ఉండియుందురని నేను ఊహించుచున్నాను. ఏడవ ముద్రను గూర్చి మనము తెలిసికొనుటకు ఆయన అనుమతించలేదు. ఆయన గదిలో నిలువబడి వాటన్నిటిలో ప్రతి ఒక్కటి సరిగా బయలుపరచెను. నా జీవితములో ఎప్పుడైన ఏదైన ప్రేరేపింపబడి బోధించినయెడల, అది అదేయైయుండును. అది సంభవింపబోవుచున్నదని తెలియజేసినది ఇచ్చట నిలువబడియున్న మీరు అది సత్యమని గుర్తించెదరు. విజ్ఞానశాస్త్ర జ్ఞానమునకును, విజ్ఞానశాస్త్ర పరిశోధకులకును, మరియు ప్రతి విధమైన దానికిని మానవ తలంపునకు అందని మర్మమును అది అచ్చట సంభవించునని రుజువు చేసెను. తిరిగి వచ్చి అది విప్పబడియున్నట్లు వినగలరు మరియు బయలుపరచబడిన ప్రతి మాటయు ఖచ్చితముగా సత్యమని మీకు బయలుపరచబడియున్నది.

మనము ఏ దినములో జీవిస్తున్నాము? మనము ఇప్పుడు ఎక్కడ ఉన్నాము?

MATT 24:36•

REV 8:1

 

77ఆరవ ముద్రలో ఏడు బూరలు ధ్వనించుచున్నవని జ్ఞాపకముంచుకొనుము… అది (ఆరవ ముద్రను) మనము కలిగినప్పుడు దానిని చూడగలము. ప్రతి ఏడు బూర ధ్వనులు ఆరవ ముద్రయందు సంభవించును. ఏడు అను సంఖ్య ఎల్లప్పుడు మర్మమైనది. ఆ ఏడు అనునది ముగింపునకు గురుతు అని గుర్తించుము. అది ప్రభువు యొక్క రాకడయైయున్నది. పరలోక మందు నిశ్శబ్దముగా ఉండెను. ఎవ్వరూ కదలలేదు. ఎందుకనగా - "పరలోకమందలి దూతలైనను నేను ఎప్పుడు తిరిగి వచ్చునది ఎరుగరు. నేనైనను ఆ ఘడియ ఎప్పుడైనది స్వయముగా ఎరుగను, తండ్రియే దానిని తన మనసునందుంచుకొనియున్నాడు" అని యేసు స్వయముగా చెప్పెను. ఆత్మయైయున్న దేవునికే అది తెలియును, కావున నేను దానిని ఎరుగను.

ఏడవ బూర ఊదినప్పుడు అది బయలుపరచబడలేదు, లేక ఏడవ దూత లేక… ముద్ర విప్పబడినది, ఏడవ ముద్ర విప్పబడినప్పుడు పరలోకమందు నిశ్శబ్దముగా ఉండెను; ఏమి సంభవించినది, అది తెలియపరచబడలేదు.

REV 10:6,7

 

78అయితే ఆరవ ముద్ర క్రింద ఏడు బూరలు ఊదబడినవి అప్పుడు గొర్రెపిల్ల ఆ దృశ్యమందు కనబడుట మనము చూచుచున్నాము. ఆయన కృపా సింహాసనమును విడిచెను. ఆయన విమోచనా కార్యాన్ని ముగించెను.

"ఆయన వచ్చి సింహాసనము నందు ఆసీనుడైయుండువాని కుడి చేతిలో ఆ గ్రంథమును తీసికొనెను. ఇక సమయము లేదు. పిమ్మట వెంటనే 10వ అధ్యాయములో 7వ వచనములో దూత ప్రత్యక్షమై - ఒట్టుపెట్టుకొని, "ఇక సమయముండదు గాని…" అని చెప్పెను. అయితే ఈ గ్రంథమునందు ఎవరు విమోచింపబడిరో వారి పేర్లు అందుండెను, అది విమోచనా గ్రంథము ఆయన విమోచించిన ప్రతిదియు ఆ గ్రంథమందు వ్రాయబడెను. ఎవరి కొరకు ఆయన మరణించెనో, వారందరు ఆ గ్రంథమందు వ్రాయబడియుండిరి. తాను ముందుగా నిర్ణయించిన వారినెల్లరిని సంపూర్ణముగా విమోచించువరకు ఆయన సిలువయందు రక్షించుట కాదు గాని, గొర్రెపిల్ల జీవగ్రంథమందు ముందుగానే తాను ఏర్పరచుకున్న వ్రాయబడిన ప్రతిదానిని విమోచించువరకు ఆయన ఆ మధ్యవర్తి స్థానమును విడిచిపెట్టక, ఆ గ్రంథమందు కడవరిగా పేరు ఉన్న వ్యక్తి విమోచింపబడువరకు తన మధ్యవర్తిత్వపు పనిని కొనసాగించుచునే యుండును. ఆయనకు మహిమ కలుగును గాక!

HEB 11:40•

REV 5:4

 

79అయితే, ఆయన అక్కడ నుండి లేచి వచ్చును. అ గ్రంథము ఎక్కడ ఉంచబడియన్నది? ఆ గ్రంథము సర్వాధికారియైన దేవుని ఆధీనములో (అనగా స్వాస్థ్యముగా కలవాని స్వాధీనమందు) ఉన్నది. యోహాను చుట్టు ప్రక్కల చూచెను, ఆ గ్రంథమును చూచుటకైనను ఎవడును అచ్చట లేకుండుటను బట్టి అతడు ఏడ్చుచుండెను. ముఖ్యముగా, మరుగైన మర్మమలు ఏమైయున్నవి విప్పబడుటకు అపేక్ష కలిగియుండెను. మర్మములు ఆ ఏడు ముద్రలలో ఉన్నవి.

ఏడు ముద్రలు విప్పబడినప్పుడు, పరిశుద్ధ గ్రంథము సంపూర్ణముగా తెరువబడినదిగా ఆయెను. ఏడు ముద్రలు ఏడు మర్మములతో ముద్రింపబడియుండెను. ఈ ఏడు ముద్రలు సమస్త మర్మమును కలిగి, అందు ఇమిడియుండెను, అది విమోచనా గ్రంథము - క్రొత్త నిబంధన. పాతది కాదు, మనము లేకుండ వారు పరిపూర్ణులు కారు" అని హెబ్రీ 11 అధ్యాయము క్రొత్త నిబంధనలో ఉన్నవారిని గూర్చి తెలియజేయుచున్నది.

ఇప్పుడు, విమోచకుడు మరణించితేగాని, విమోచన రానేరదు. విమోచనమునకు సాదృశ్యమైన గొర్రెపిల్లల రక్తము క్రిందనే వారున్నారు; విమోచకుని క్రింద కాదు — అయితే వారిని విమోచకుడు విడిపించలేదు, విమోచకుడు వచ్చువరకు వారు విమోచింపబడలేదు.

REV 5:1

 

80గమనించుము. ఇప్పుడు, విమోచకుడు రాగా … యోహాను చుట్టూ చూచెను. దేవుడు తన కుడిచేత ఏడు ముద్రలు గట్టిగా వేయబడిన గ్రంథమును కలిగినవాడై సింహాసనము నందు కూర్చుండియుండుట చూచెను. అందు సంపూర్ణ విమోచనను గూర్చి వ్రాయబడియున్నది. దానిని ఆదాము మానవ వంశావళి పోగొట్టుకొనెను. అది ఎక్కడికి వెళ్లినది? సాతానుడు దానిని తీసికొనలేక పోయెను. అతడు దానిని పోగొట్టుకొనునట్లు చేసెను.

అలాగైన ఆ గ్రంథము ఎక్కడికి వెళ్లినది? అది మానవ వంశావళికి చెందినది కాదు. ఆ ఆశీర్వాదము ఇప్పుడు వీరికి చెందినది కాదు ఏలయనగా, మానవాళి దానిని పోగొట్టుకొనెను. కావున ఆ గ్రంథము తిరిగి అసలైన ఏ యజమానునికి చెందినదో ఆయన యొద్దకే పోయెను; ఆయన దేవుడైయున్నాడు. దానితో ఆయన సింహాసనమునందు కూర్చుండి - ఏదో మనుష్యుని, ఏదో ఒకరిని దానిని తీసికొనుటకు ఆయన పిలుచుచున్నాడు.

REV 5:3-7

 

81యోహాను చుట్టూ పారజూచెను. "అయితే పరలోకమందేగాని, భూమి మీద గాని, ఆ గ్రంథమును విప్పుటకైనను, చూచుటకైనను ఎవనికిని శక్తి లేకపోయెను. ఆ గ్రంథమును విప్పుటకైనను చూచుటకైనను యోగ్యుడెవడును కనబడనందున," యోహాను బిగ్గరగా ఏడ్చుచుండెను. అప్పుడొక దూత - "యోహాను, ఏడ్వకుము, ఇదిగో, యూదా గోత్రపు సింహము దానిని విప్పుటకు జయము పొందినది యోగ్యమైనదని," చెప్పెను.

అప్పుడు యోహాను సింహామునకై చూచుచుండెను, అయితే అతడు చూచిన దేమి? ఒక గొర్రెపిల్లను, అది రక్తమయమైన ఒక గొర్రెపిల్ల. వధింపబడినట్లుండిన ఒక గొర్రెపిల్ల. ఎంత కాలము? జగత్తు పునాది వేయబడినప్పటి నుండి ఆ గొర్రెపిల్ల ముందుకు నడుచుచూ వచ్చి, ఆయన, "సింహాసనము నందు ఆసీనుడైయుండువాని కుడి చేతిలో నుండి ఆ గ్రంథమును తీసికొనెను." అంతట ఆయన సింహాసనము అధిష్టించు హక్కును పొందినవాడు, దానిపై కూర్చుండెను. జరుగవలసినదేదైయుండెనో అది అచ్చట ముగింపబడెను. ఎప్పుడు? ముద్రలు బయలుపరచబడినప్పుడు, కడసారిగా ఎవరి పేరు ఆ గ్రంథమందుండెనో, ఆ వ్యక్తి విమోచింపబడు సమయము వరకు ఆయన ప్రతి ఒక్కటీని విమోచించెనో, ఆ విమోచన కార్యము ముగియు వరకు ఆయన విమోచించుటకు వచ్చెను. "ఆయన నలుబది సంవత్సరముల క్రితం ఎందుకు ఆయన వారిని విమోచించలేదు? రెండు వేల సంవత్సరముల క్రితం ఎందుకు ఆయన వారిని విమోచింపలేదు?

REV 5:6,7

 

82ఆ గ్రంథమందు, జీవగ్రంధమందు వారి పేర్లు ఉండెను. వారిని విమోచించుట దేవుని ఉద్దేశ్యమైయుండెను, అందువలన ఆయన ఇచ్చట నిలువబడవలసియుండెను. జగత్తు పునాది వేయబడకముందే వారి పేర్లు గొర్రెపిల్ల జీవగ్రంథములో లిఖితములై యుండెను. ఆ గొర్రెపిల్ల వధింపబడవలసినదిగా ఆయనను దానితో పాటు ఉంచెను. వధింపబడిన ఆ గొర్రెపిల్ల ఇచ్చటకు వచ్చెను. మధ్యవర్తి పనిని జరిగించుటకు తిరిగి వచ్చుచున్నది.

ఆయనను గమనించుము. అచ్చట అనేకములైన అనుకరణలు చేయువారు, ప్రతి విధమైనవి అనేకములుగా ఉండును. అయితే వాస్తవముగా రక్షింపబడువారు ఎవరో ఉన్నారు - ఆ సంఘము ముందుగనే నిర్ణయింపబడినది. ఆమే (ఆ సంఘము) కళంకమైనను, ముడతయైనను అట్టిది మరేదైనను లేకుండు నిమిత్తము ఆ గొర్రెపిల్ల మరణించినది. ఆ గ్రంథమందు కడవరిగా ఎవరి పేరు ఉండెనో, ఆ వ్యక్తి విమోచింపబడిన వెంటనే ఆ గొర్రెపిల్ల ముందుకు వచ్చి, దాని కొరకు నేను విలువ చెల్లించి కార్యమును ముగించితిని, అని ఆ గ్రంథమును తీసికొనెను!

83దేవదూతలు, కెరూబులు, ఇరువది-నలుగురు పెద్దలు, (నాలుగు) జీవులు సమస్తమును తమ కిరీటములను తొలగించుకొని, ఆ సింహాసనము యెదుట సాగిలపడిరి. "నీవే యోగ్యుడవని" వారు చెప్పిరి. "అంతట పరలోకమందును భూలోకమందును భూమి క్రిందను సముద్రములో ఉన్న ప్రతి సృష్టమును, అనగా వాటిలో నున్న సర్వమును సింహాసనాసీనుడై యున్నవానికిని గొర్రెపిల్లకును స్తోత్రమును ఘనతయు మహిమయు ప్రభావమును యుగ యుగములు కలుగును గాక, అని చెప్పుట వింటిని," అని యోహాను చెప్పెను. "ఆమెన్." హల్లేలూయా, దేవునికి స్తోత్రములని బిగ్గరగా స్తుతించిరి.

ఆ గొప్ప ధ్వని పైకి వెళ్లినది. ఎందుకు? వారి పేర్లు ఆ గ్రంథములో నున్నట్లు గొర్రెపిల్ల బయలుపరచినది.

REV 5:11,12

 

84ఆ గొర్రెపిల్ల వారిని విమోచించెను, అయితే ఆయన ప్రతివారి పేరు బయలుపరచువరకు ముందుకు రాలేదు, ఇది ఆరవ ముద్ర క్రింద జరిగెను. ఏడవ ముద్ర విప్పబడుటకు ముందు ఇది జరిగెను. పిమ్మట గొర్రెపిల్ల, తాను విమోచించినవారి కొరకు వచ్చెను. ఆయన విమోచించిన వారిని తన స్వాస్థ్యముగా చేసికొనుటకు వచ్చుచున్నాడు.

ఆ గ్రంథమందు ముందుగనే ఆయన స్వాస్థ్యమును కలిగియున్నాడు. ఆయన చేతినుండి తీసుకొనుటకు… ఆయన దేనినైతే విమోచించేనో, దానిని స్వీకరించుటకై ఆయన వచ్చుచున్నాడు. అది ఆయన ముగించిన ఆయన పనియైయున్నది. దానిని స్వీకరించుటకై ఆయన వచ్చెను. ఓ, ఎటువంటి సమయము! అది రుజువు చేయుచున్నది. తిరిగి వచ్చి విమోచన గ్రంథమును తీసికొనినట్లుగా ఏడవ ముద్ర రుజువు చేయుచున్నది.

PS 8:5•

HEB 2:7,9•

REV 4:3

 

85గమనించుము. ఏడవ ముద్రను గూర్చి బయలుపరచునది ఏడవ దూత వర్తమానమైయుండెను. (ప్రకటన 10:7 - దానిని నీవు ఇప్పుడు చూచెదవు.) "భూమి మీదను సముద్రము మీదను తన పాదము మోపిన పరలోకము నుండి దిగివచ్చిన దూత (ఆయన క్రీస్తే) ఆయన శిరస్సున వర్షధనస్సును కలిగియుండెను. (ప్రకటన 1 అధ్యాయములో చెప్పబడినట్లుగా), మరల ఇచ్చటను శిరస్సు వర్షధనస్సును కలిగియుండుట చూడగలము. చూచుటకు సూర్యకాంత పద్మరాగమును పోలియుండెను. మరియు ఆ విధముగా.

ఇక్కడ ఆయన వచ్చుచున్నాడు, ఒక పాదమును భూమి మీదను, మరొకటి జలముల మీదను మోపి, తన కుడి చెయ్యి ఆకాశముతట్టు ఎత్తి (ఇంకను శిరస్సున వర్షధనస్సు కలిగియుండెను, అది ఒక నిబంధనను సూచించుచున్నది. ఆయన నిబంధన దూతయై యుండెను. దేవదూతల కంటే కొంచెము తక్కువవాడుగా శ్రమలను అనుభవించుటకు చేయబడిన క్రీస్తే ఆయనయై యుండెను. యుగ యుగములు జీవించుచున్నవాని తోడు (నిత్యుడగువాడు - తండ్రి, దేవుడు) ఇది సంభవించినప్పుడు ఇక సమయమనేది ఉండదు."

అది జరిగిపోయెను. అది అయిపోయినది; అది ముగింపబడెను.

REV 10:1,2,7

 

86లేఖనములు అటు పిమ్మట ఈ రీతిగా చెప్పుచున్నది - "ఏడవ భూసంబంధియైన దూత, వర్తమానకుని వర్తమానము ప్రకటించు కాలమున కడపటి ఏడవ సంఘ కాలము అతని సేవా ప్రారంభ దశలో ఈ భూమి మీద ప్రారంభింపబడినప్పుడు, ఆ సమయములో దేవుని మర్మమైయున్న ఏడు ముద్రలు బయలుపరచబడును. స్నేహితులారా, ఇప్పుడు మనమెక్కడ ఉన్నాము, అది ఇదేనా? ఆ సమయము ఇదేనా?

గమనించుము. సమస్తము సాధ్యము.

87ఆ గ్రంథమందున్న విమోచింపబడిన వారికై ఆయన వచ్చి విమోచించెను. విమోచింపబడనున్న వారెల్లరు ఆ గ్రంథమందున్నారు. జగత్తు పునాది వేయబడక ముందు ఏర్పరచుకున్న వారిని విమోచించుటకు ఆయన వచ్చుచున్నాడు. ఆయన విమోచించిన వారెల్లరు ఆ గ్రంథమందు వ్రాయబడియున్నారు.

88ఇప్పుడు నేను మిమ్మును ఒక ప్రశ్న అడుగవలెనని కోరుచున్నాను. ప్రజలైన మీరు ఈ టేపును జాగ్రత్తగా వినండి. అసహ్యమైన తలను, భయంకరమైన కన్నులు గలవారునగు అధునిక స్త్రీలకు విరోధముగా ఎందుకు ఈ వర్తమానము ఉన్నది? ఇది కడవరి దూత సందేశమేనా? ముప్పది-మూడు సంవత్సరముల క్రితము ఆ నదియొద్ద నాకేమి చెప్పాడో తెలుసా? "యోహాను పంపబడిన… చూచితివా? "క్రీస్తు మొదటి రాకడను తెలియజేయుటకై యోహాను ఆనాడు పంపబడిన రీతిగా, నీ వర్తమానము ఆయన రెండవ రాకడను చాటించును.

ప్రపంచమందంతట నేను చేసినది అదే. అప్పుడు ఆయన రాకడ తప్పక సమీపముగా నున్నది. ఇప్పుడు ఏమి సంభవించుచున్నదో గమనించుడి? ఎందుకు? నా తలను గోకుతూ, నా తలగడపై వాలిపోయాను; "నీకేమైంది?" అని ఆలోచించుచు నేను గదిలో నడుచుచుంటిని.

89కొన్ని దినాల క్రితము జాక్ మూర్ తో స్వారి చేయుచుండగా ఒక సమయమున (మీరు జాక్ మూర్ ను ఎరుగుదురనుకుంటాను, శ్రీవ్-పోర్టులో ఉన్న అతని యొద్దకు పోవుచుంటిని) ఇలా అడిగితిని, "జాక్ సహోదరుడా, ఈ భూమి మీద నాకు మిక్కిలి సమీప స్నేహితుడవుగా నేను కలిగినవాడవు నీవు కావా?" అని నేను అన్నాను. అతనిని అడుగుటకు ముందు నేను నా భార్యను అదే ప్రశ్న అడిగినాను. నా విషయము ఎవరైన ఎరిగియున్నారంటే … నాకు ప్రియముగా నున్న నా భార్య మాత్రమే నా అంతరంగమును ఎరిగియున్నది. ఒక దినమున ఆమెతో - ప్రియురాలా, సువార్త పనిచేయు పరిచారకుడను, నీ భర్తనైన నేను ఏ ఒకని ప్రేమించుచున్నానో ఆయనపై ఏలాటి దూషణను తెచ్చుటకు కోరుట లేదు. నిన్నును బాధపరచుటకు ఆపేక్షించుట లేదు. నీపైనను ఏలాంటి దూషణను తెచ్చుట లేదు. అలాంటి ఏదైన ఎప్పుడైన చేసి, నీకు హాని కలుగజేసియుండిన దేవుడు క్షమించును గాక. అది దేవునిని ఎంతగా దుఃఖపజేసియుండునని నీవు తలంచెదవు. నేను ఆయనను ఎంతగానో ప్రేమించుచున్నాను. నీవు నా భార్యవు, ఆయన నా రక్షకుడు మరియు నా దేవుడు. నేను నిన్ను ఒక ప్రశ్న అడుగగోరుచున్నాను. హాస్యముగా తీసికొనక సత్యమునే నాతో చెప్పుము" అని అన్నాను.

"నేను అంతగా చదివితినా…" అని నేను అన్నాను.

GEN 1:27

 

90మరియు నేను సంచారము చేసితిని … నేను విచిత్రముగ, కఠినముగా నున్న ఒక వేషము ధరించినవాడుగా నున్నాను. దానిని నేను గుర్తించితిని. "ఎటువంటి ఒక వ్యక్తి?" అని ప్రతి ఒక్కరు అంటున్నారు.

మంచిది, గమనించుము, నిన్ను నీవు ఆ రీతిగా చేసికొనలేవు. నీవు ఏమైయున్నావో దేవుని కృపవలనయై యున్నావు. "నేను కొద్దిగా నా మనస్సున తప్పిపోయి యున్నానా, నేను ఎటువంటివాడనైనది మీరు ఎరుగుదురు… ఎందుకు ఆ స్త్రీలను నేను దూషణ ఎడతెగక చేయుచున్నాను, నేను వారిని - ప్రేమించుచుండగా? నేను స్త్రీలను ద్వేషించువాడనని వారు చెప్పుచున్నారు, వాస్తవముగా నేను వారిని ద్వేషించుటలేదు… నేను స్త్రీలను ద్వేషించుచున్నానని వారు చెప్పుట అది తప్పుడు గ్రహింపే. నేను స్త్రీలను ప్రేమించుచున్నాను. వారు నా సహోదరీలు అని నా భావము.

నీవు తప్పులో ఉండుట నేను చూచి దానిని సమర్థించబోను. నేను ఎక్కువగా ప్రేమించుచున్నందున నేను దానిని నీ ముఖము యెదుట హెచ్చరించుచున్నాను. కొందరు పురుషులు చేయునది, అది ఒక విధమైన వ్యత్యాసము గల ప్రేమ. వాస్తవమున మీరు ఏమైయున్నారో, దానిని బట్టి నేను మిమ్మును ప్రేమించుచున్నాను. దేవుని కుమారుని (నరుని) సాటియైన సహాయముగా నీవు ఉన్నావు. నీవు అతనిలో ఒక భాగమైయున్నావు. నేను నిన్ను ప్రేమించుచున్నాను, ఏలయనగా నీవు నరుని స్వరూపమందు నిర్మించబడితివి. మరియు నరుడు దేవుని స్వరూపమందు సృజింపబడెను. కాబట్టి మీరు ఇద్దరు కూడా క్రీస్తునందు ఒక్కటై యున్నారు.

అందువలన నేను మిమ్మును ప్రేమించుచున్నాను. మరి ఇతరమైనదేదియు దానికి సరియైనది కాదు, దేవుడు దానిని ఎరుగను. నా జీవితమంతయు - అది సరియే. నేను మిమ్మును ప్రేమించుచున్నాను. నేను ఎందుకు ఎల్లప్పుడు నిలువబడవలసి వచ్చెను… స్త్రీలు బ్రెన్హాం బోధన వినుటకు వెళ్లుచున్నానని చెప్పినప్పుడు, వారు ఆ స్త్రీలతో - "మీ వెంట్రుకలు బాగుగా దువ్వుకొనండి. కత్తిరించిన మీ పొట్టి వెంట్రుకలు కనబడకుండునట్లు తలపై టోపీలా గాని మరేదైన తగిలించుకొని వెళ్లండి, లేనియెడల, అతడు మీ పొట్టి వెంట్రుకలను గూర్చి, మీరు రంగులు పూసుకొని ముస్తాబు చేసుకొనినదాని గూర్చి ఖండించుచు బోధంతా మీ గురించే చేస్తాడు" అని చెప్పుదురు.

వారు చేసినది అదే. "ఓ, అతడు మరొకరిని గూర్చి మాట్లాడును."

91"ప్రజలు నిన్ను ప్రవక్త అని నమ్ముచున్నారు… నీవెందుకు అలాగు చేయకూడదు? నీవు అటువంటి విమర్శించు బోధచేయుట కంటే, స్త్రీలు గొప్ప ఆత్మీయ వరములు పొందుకొనునట్లు ఎందుకు బోధించవు?" అని అతడు అనెను.

"ఎ.బి.సి అక్షరములు నేర్చుకొనకపోయిన, బీజ గీతమును వారేలాగు నేర్చుకొనగలరు?" అని నేను అన్నాను.

మొదటి నీవు సరి కావాలి. అధికముగా నేను బోధించుకొలది, అది మరీ అంత చెడుగుగా పరిణమించుచున్నది. "ఎందుకు ఈ పని నుండి విడిచిపోవు?" అని అప్పుడు మీరు అంటున్నారు.

అయ్యా, అది సరికాదు. దానికి సాక్షిగా, అచ్చట ఒక స్వరము ఉండవలసియున్నది. ఈ దినముల సేవ పరిచర్యయందు, ఇటీవల గొప్ప బోధకులలో ఒకడు నా పై అతని చేతులు ఉంచి, "బ్రెన్హాం సహోదరుడా, దేవుడు నీ హృదయములో నుండి స్త్రీలను విమర్శించు బోధను తొలగించునట్లును, స్త్రీలను వారి స్వేచ్ఛయందు వారిని విడిచి పెట్టుము నీవు అనుమతించిన నేను నీ కొరకు ప్రార్థన చేయబోవుచున్నాను," అని అతడు అన్నాడు.

"నీవు హోలినెస్ బోధకుడవు, దానియందు నీవు నమ్ముచున్నావా, అయ్యగారు?" అని నేను అడిగినాను.

"నిజముగా దానియందు నాకు నమ్మకము లేదు, కాని అది వారి…" అని అతడు చెప్పెను. "అది సరి కాదు" అని నేను చెప్పితిని.

"అది పాస్టరులు చూచుకొనే పని" అని అతడు చెప్పాడు.

"వారు (పాస్టరులు) ఆ విధముగా చేయుట లేదు," అని నేను అన్నాను.

ROM 5:5•

1COR 11:5

 

92ఎవరైనా దానిని చేయు బాధ్యతయైయున్నది. నది దాటవలసియున్నది. ఎవరైనా యొక్క మురికిని తొలిగించుకోవాలి. దానిని నేను చేయుటకు కోరుట లేదు. ఆ విధముగా నేను చేయగోరుట లేదని దేవుడు యెరుగును. స్త్రీలలో అనేకులు నా పిల్లలను పోషించిరి. మరియు నా కొరకు తమ ప్రాణములు ఎంతగానో పెట్టుచుండిరి.

పరిశుద్ధాత్మ ద్వారా కుమ్మరింపబడిన దేవుని కృపలో, నిరీక్షణ లేక నిత్యత్వముగల ఆగాధములోనికి పేద ప్రజలు దిగిపోవుచుండగా, దానికి విరోధముగా నేనిచ్చట నిలువబడి, చూచి కేక వేయకుందునని నీవు తలంచుచున్నావు? ఈ స్త్రీలు ఆగాధములో కూగిపడుచున్న గుంపులోనికి ఈ దేశపు ఆత్మ, (సంఘ శాఖ) సంఘపు ఆత్మ - క్రీస్తు ఆత్మ కాదు, వారిని త్రోసిపుచ్చుచున్నది. "దాని నుండి బయటపొండి, ఆ అపవిత్రత నుండి పారిపొండి" అని కేక వేయువాని స్వరమునైయున్నాను.

అలాంటి కార్యములను చేయుటకు అపవాదికి చోటు ఇవ్వకుడి. అది సరియైనది కాదు. అసెంబ్లీస్-ఆఫ్-గాడ్ అను మీరు స్త్రీలను వెంట్రుకలు కురుచగా కత్తిరించుటకు ఒప్పుకొనుచున్నారు, అయితే, మీరు స్త్రీలను మేకప్ చేసుకోనుటకును నిషేధించుచున్నారు. దానికి విరోధముగా ఎచ్చటను లేఖనము లేదు. అయితే వెంట్రుకలు కురచగా కత్తిరించు దాని నిషేధించునట్లు లేఖనము కలదు. "అటువంటి స్త్రీ దేవుని సన్నిధిలో ప్రార్థించుటకు కూడ యోగ్యురాలు కాదు" అని బైబిలు చెప్పుచున్నది. "ఆమె భర్త ఆమెను విడనాడవచ్చును. అపవిత్రమైన స్త్రీగా లోకమునకు తన్ను బయలుపరచుకొనుచున్నదని," బైబిలు చెప్పుచున్నది.

"ఆమె ఆ విధము తలవెంట్రుకలు కత్తిరించుకొనిన, తన భర్తను అవమానపరచుచున్నది." బైబిలు ఖచ్చితముగా అదే విషయమును చెప్పుచున్నది.

2KGS 9:10,30,36

 

93రంగులు పూసికొని అలంకరించు ఒక స్త్రీ ఆలాగు చేసినట్లు బైబిలులో కలదు. ఆమె యెజెబెలు అను స్త్రీ. ఆ రీతిగా ఉండినది అదియే. ఎప్పుడైన మేకప్ పూసికొనిన స్త్రీ బైబిలులలో కలదనిన, అది యెజెబెలు అను స్త్రీయే. ఆమెను దేవుడు అడవి కుక్కలకు ఆహారముగా విసరేశాడు. త్వరితముగా అది ఆమెను అవమానకరముగా మార్చినది మరియు ఆమె యొక్క… నీచమైన ప్రతిదియు అది యెజెబెలు అని పిలువబడుతున్నది. మీరట్లు చేయుటకు వీలులేదు. ఆ విధముగా చేయుటకు నిన్ను ప్రేరేపించునది ఏది? - అది దయ్యపు ఆత్మయే.

దానిని మీరు గుర్తించలేరు. మీరట్లు చేయరని నేను ఎరుగుదును. మీరు చాల మంచి ప్రజలు. మీరు మంచివారు. మీరు నాతో కరచాలనము చేయుచు నాతో మాటలాడుచున్నారు, మరయు మిమ్మును నేను ప్రేమించుచున్నాను.

MATT 26:39•

ACTS 20:27

 

94అది సరియే, అయితే నేను అది చూచినయెడల, నేనొక వేషధారిని కానా? "దేవుని సంకల్పమంతయు మీకు తెలుపకుండ నేనేమియు దాచుకొనలేదు" అని పౌలు చెప్పెను.

ఏ స్త్రీ లేక పురుషుని రక్తాపరాధము ఆ దినమందు నా మీద ఉండకుండును గాక, ఏలయనగా నేను మీకు సత్యమును ప్రకటించితిని దేవుడు నాకు తెలియజేసిన దానిని మీకు తెలియజేయుటకు నేను వెనుకాడలేదు, ఏలయనగా నేను మిమ్మును ప్రేమించుచున్నాను. నేను ఏమి చేయబోవుచున్నానో, దానితో మిమ్మును బాధపెట్టవలెనని కాదు సుమా? అయితే పవిత్రమైన దైవిక ప్రేమ, ఆ విధముగా చేయుటకు నిన్ను నడుపును.

"సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్దనుండి తొలగిపోనిమ్ము, అయినను నా ఇష్ట ప్రకారము కాదు, నీ చిత్త ప్రకారమే కానిమ్ము" అని యేసు కూడ సిలువ మరణము తొలగిపోవుటకు ప్రార్థించెను.

ACTS 20:27

 

95ఇట్లు మాట్లాడిన వ్యక్తివలె నేను ఆ రీతిగా ఉండబోవుచున్నానా? అన్ని విధముల చక్కగా నున్న విలువైన ఆ స్త్రీలను నేను ముక్కలుగా చేయుటకు వారిని కలిగియున్నానా? దేవుని కంటే ధనమును, సంఘ శాఖలను ప్రేమించు తోటి పరిచారక సహోదరులను నేను అచ్చట నిలువబడి హెచ్చరించుదునా? తమ హస్తములు నాపై వేసి, నన్ను ప్రేమించుచున్న నా అమూల్యమైన సహోదరులను… ఓ, నేను అది చేయవలసిన అవసరము ఉన్నదా?

ఓ, దేవా, ఆ విధముగా చేయకుండ ఉండనిమ్ము. "అయితే దేవుని సంకల్పము అంతటిని మీకు తెలుపకుండ నేనేమియు దాచుకొనలేదు." యధార్ధమైన ప్రేమ ఆ విధముగా చేయుటకు నన్ను నడిపించెను.

96ఈ వర్తమానము ఈ విధముగా ప్రకటింపబడుట అందువలననేనా? లోకంలో ఎచ్చటను ఈ విధముగా ప్రకటింపబడుట లేదు కదా? ఇప్పుడు అది ఎక్కడ ఉన్నది? వారు భయపడుచున్నారు, అయితే దానికి భయపడనక్కరలేదు. ఎల్లప్పుడు దేవుడు సరిగా అదే రీతిగా చేయుచుండును.

మంచిది. ఈ వర్తమానము వలన స్త్రీలు ఈ విధముగా దూషింపబడిరా? దానినేరుగరు … అది వారిని దూషించుట కాదు. అది నాకు చూపించబడినది, అయితే మరునాటి దినము వరకు అది నాకు తెలియపరచబడలేదు. దానివైపు చూడుము. మంచిది. అది ఈ సేవకు సరిగా తగియున్నది.

2KGS 9:7•

REV 17:5

 

97ఇప్పుడు, ఒక్క నిమిషము ఆగుము. ఇంతకు ముందు ఎన్నడైనా స్త్రీ ప్రాధాన్యత కలిగిన లోకముండెనా? అవును, చరిత్రానుసారముగా ఏలీయా దినములలో యెజెబెలు అను ఒక స్త్రీ ఉండెను. ఆమె దేవుని సంఘముపై అధిపత్యమును కలిగియుండెను, అని బైబిలు చెప్పుచున్నది. మరల కడవరి దినములలో దాని ఆత్మ సంఘ సంస్థల ద్వారా అదే పనిని జరిగించునని బైబిలు చెప్పుచున్నది. ఆమే ఒక మహావేశ్య, మరియు ఇతర సంఘములన్నియు దానివలె వేశ్యలుగా దానితో కూడ తయారగుదురు. అది సరియేనా?

ప్రకటన 17వ అధ్యాయములో "ఆమె మహావేశ్య, వేశ్యలకు తల్లి" అని చెప్పబడెను. అది ఒక పురుషుడు కానేరదు; ఒక స్త్రీయై ఉన్నది. వారెల్లరు అగ్ని సరోవరమందు త్రోయబడి మరియు కాల్చబడుదురు. అది సరియేనా? నీవు సరిగా గ్రహించితివి.

1KGS 19:18•

2KGS 9:36•

MATT 3:10

 

98గమనించుము, యెజెబెలు దృశ్యమునందు వచ్చినప్పుడు, దానికి విరోధముగా ఒక మనుష్యుడు నిలువబడియున్నాడు. దేవుడు ఆ మనుష్యుని లేపెను, అతడు ఎక్కడనుండి వచ్చెనో, మనము ఎరుగము. అతని సేవ పరిచర్య పూర్వ వృంత్తాంతమును గూర్చి; అతడు ఒక యాజకుడును కాదు లేక మరి ఏదియు కలిగినవాడు కాడు. అతని పేరు ఏలీయా, మరియు అతడు అడవిలో సంచరించుచున్న అడవి మనిషిని పోలినవాడు. చెట్టు వేరునందు గొడ్డలి పెట్టినవాడు, ఆనాటి వారు అతనిని ద్వేషించిరి. అంతమాత్రమే గాక, అతని సమాజమంతయు అతనిని నిరాకరించిరి. మరియు ఒకనాడు తాను ఒక్కడే దేవుని పక్షమున నిలువబడియున్నాని అతడు తలంచెను.

"కాదు, ఆయనకు ఏర్పరచుకొనబడినవారు నీతో కూడ 7,000 మంది కలరని," దేవుడు అతనితో చెప్పెను.

అదియే ఏర్పాటు చేసికొనిన గుంపు. ఎల్లప్పుడు ఆ విధముగానే ప్రత్యేకత గల గుంపు ఉండును. "భయపడవద్దు, ఏలీయా, సంఘ శాఖల వారు నిన్ను పర్వత శిఖరమునకు తరిమిరి, దానిని నేను ఎరుగుదును. నీ బోధను అంగీకరించిన వారు 7,000 మంది నా కొరకు ఉన్నారు" అని దేవుడు చెప్పెను.

1KGS 19:18•

MATT 14:6•

MARK 6:18,22•

LUKE 3:19

 

99అతని దినముల తరువాత, రోమ్ ఆ స్థానము కలిగి స్త్రీ యొక్క అధ్యికతగల దేశముగా మరల తయారైనది. అన్ని రకములుగా స్త్రీలు సొగసుగా రూపించుకొనుట వచ్చాయి. వారు ధరించుకొనునట్టి టోపీలు మరియు ఇతరమైనవి, అప్పుడు కూడ దేవుడు అదే ఆత్మతో - ఏలీయా ఆత్మతో ఒక వ్యక్తిని లేపెను. అది సరియేనా?

"ఇప్పుడే గొడ్డలి చెట్టు వేరున ఉంచబడియున్నదని" అతడు ప్రకటించెను.

తన భర్తను విడిచి, అతని సహోదరుడు హేరోదును వివాహము చేసికొనిన పురాతన రంగులతో అలంకరించుకొనిన స్త్రీ అతని కంటపడింది. ఆమె అతని సహోదరుడును, పెంపుడు తండ్రిగా నున్న హేరోదు వలన ఒక కుమార్తెను కలిగినది - ఆ స్త్రీ యొక్క కుమార్తె హేరోదియ, ఏలయనగా తన పెంపుడు తండ్రి అనబడు హేరోదునకు పుట్టినది. అటు పిమ్మట నాట్యమాడుటకు ఆ అమ్మాయికి నేర్పించినది. ఆ కుమార్తె తన తల్లివలనే చక్కగా ఆకర్షించు నాట్యకత్తెగా తయారాయెను. నాలుగు లేక ఐదుసార్లు వివాహము చేసికొని, తనకు ఇష్టమైన రీతిగా జీవింపవచ్చునని తలంచినది.

MAL 3:1•

MAL 4:1-3•

MATT 11:7-11•

MARK 6:18•

LUKE 7:24-28

 

100హేరోదు బయటకు వచ్చెను. వారంతా యూదులని జ్ఞాపకముంచుకొనుము. వారు సంఘ సభ్యులే.

యోహాను ప్రవక్తయని ప్రజలు నమ్మియుండిరి గనుక హేరోదు ప్రవక్త చెప్పు దానిని వినుటకు తన సంఘము నుండి బయటకు వచ్చెను. ఆ ప్రవక్త తిన్నగా నడుచుచూ వచ్చి వారిరువురి ముఖమునకు సూటిగా - "నీవు ఆమెను ఉంచుకొనుట పాపమని" అతడు గద్దించెను. అప్పుడు ఆమెకు ప్రేలుడుతో ఎగురగొట్టబడినట్లాయెను.

సర్వ సాధారణమైన ఒక వ్యక్తి - "హేరోదియా, నీవెలాగున్నావు" అని అడిగియుండవచ్చును. నీవు మా సంఘములో యుండుటకు మేము సంతోషించుచున్నామని ఈనాటి సువార్తికులు లేక కాపరులు చెప్పుదురు. కాని యోహాను అటువంటివాడు కాదు!

"మీరు ఎవరిని చూడ వెళ్లితిరి? ఎప్పుడు యోహానును చూడ వెళ్లితిరి? యాజకుని వలె వస్త్రములను ధరించిన ఒకని చూడ మీరు వెళ్లితిరా?" యేసు ప్రశ్నించెను.

లేదు, అట్టి వారు పిల్లలను ముద్దాడుచు మరియు మృతులను పాతి పెట్టుచుందురు.

"మీరు దేని చూచుటకు వెళ్లారు? గాలికి కదులుతున్న రెల్లునా?" అని ఆయన ప్రశ్నించెను.

"యోహానూ, నీవు మా యొద్దకు రా. మాది పెద్ద సంస్థ, నీవు మాకు బోధించినయెడల, నీకు ఎక్కువ జీతము ఇస్తాము," అని వారు అతని అడిగియుంటారు.

యోహానును కాదు. అతడు అటువంటి దానిని ఎన్నడూ అంగీకరించుటకు వెళ్లడు. మరి మీరు ఏమి చూడ వెళ్లితిరి? ప్రవక్తనా? అవును గాని ప్రవక్త కంటే గొప్పవానినని మీతో చెప్పుచున్నాను. "ఇదిగో నేను నా దూతను నీకు ముందుగా పంపుచున్నాను. అతడు నీ ముందు నీ మార్గమును సిద్ధపరచును, అని యెవని గూర్చి వ్రాయబడెనో అతడే ఈ యోహాను," అని ఆయన చెప్పెను.

అతడు ఆ వాగ్దానము చేయబడిన నిబంధన దూతయై ఉండెను. స్త్రీలు కనినవారిలో బాప్తిస్మమిచ్చు యోహాను కంటే గొప్పవాడు పుట్టలేదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను," అని ఆయన చెప్పెను.

MAL 4:5

 

101ఆ దినముల కొరకు అటువంటి వ్యక్తిని దేవుడు లేపెను. అరణ్యవాసియైన ఏలీయా వలె యోహాను పంపబడెను. గమనించితివా? ఆ ఏలీయా అత్మతోనే యోహాను వచ్చెను. స్త్రీ ప్రధానత్వ దినము మరల వచ్చినప్పుడు, ఆ ఆత్మ మరల ప్రభువు రాకడను ముందుగా వచ్చును అని అతడు చెప్పెను. భూమి భక్తిహీనులతో దహించబడిన బూడిదపై నీతిమంతులు ఆ దుర్మార్గుల భూడిదపై నడచి తమ కాళ్ల క్రింద నుండు బూడిదను దులిపివేసినట్టుగా చేయుదురని తెలియచేశాడు. ఈ వాగ్దానము మరలా ఈ దినముల నిమిత్తము చెప్పబడినది.

గమనించుము, దానిని పరిశుద్ధాత్మ వాగ్దానమును చేసెను. అది మనమిప్పుడు జీవించుచున్న సమయమునకు తగియున్నది.

MAL 4:5,6

 

102దానికొరకు ఎవరో ఒకరు లేవవలసియున్నది. అది తప్పక జరుగవలసియున్నది. ఏలయనగా మలాకి 4వ అధ్యాయము ప్రకారము అది "యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు" అనునదైయున్నది.

యెహోవా యొక్క మహా మరియు భయంకర దినమునకు ముందు సరిగా జరుగబోవు దాని సూచన అని ఆయన చెప్పెను. అదేమనగా, "నేను ఏలీయాను పంపుదును." అతడు వచ్చి ఏమి చేయును? - పిల్లల హృదయములను తండ్రుల ఉపదేశము వైపు త్రిప్పును. బైబిలు వైపు మరల త్రిప్పును. ఈ సమస్త సంఘ శాఖ బోధల నుండి బైబిలు బోధించు సత్యము వైపు తిరిగి వచ్చుటకు - దేవుని వైపు తిరిగి వచ్చునట్లు త్రిప్పబడు పనిని అతడు చేయును.

చూచితిరా, మనము ఎంత గొప్ప సమయములో జీవించుచున్నాము.

103వెనుకటి దినాల్లో ఆనాటి ఆధునిక స్త్రీలను ప్రవక్తలు గద్దించుటవలన వారిరువురు తమ ప్రాణాలు పోగొట్టుకొనునట్టి విలువ చెల్లింపవలసి వచ్చెను. స్త్రీ ఎలుబడిలో నున్నప్పుడు అది, వారిరువురి సమయములో ప్రతి ఒక్కటి స్త్రీ అధీనమునందు లోకముండెనని చరిత్ర రుజువు చేయుచున్నది.

104ఈనాటి దినమును గూర్చి చూడుము. ఈ దినాల్లో ఒక అధ్యక్ష్యుని మనము కలిగియుందుము. ఆ దినాల్లో జరిగినట్లు ఇప్పుడు తప్పక జరుగును. ఆమె సాక్షాత్తుగా అధ్యక్ష పదవిని కలిగినదగును. అతడు అర్థాలంకారయుక్తమున సరిగా ఉన్నాడు.

ఇటీవల కాలములో, ఒకానొక దేశములో, ప్రజలనుండి ఆమె ఎంత పేరు ప్రఖ్యాతలను సంపాదించుకొనినదనగా, "నేను ఆమె భర్తని" అని అధ్యక్షుడైన ఆమె భర్త గుర్తింపచేసికొనవలసివచ్చెను. అమెరికా సంయుక్త రాష్ట్రాల అధ్యక్షుడు! స్త్రీ కృత్రిమ సొగసును ప్రవేశపెట్టుట వలన స్త్రీలు దానిని అనుసరించుచున్నారు. యెజెబెలు చేసినట్లుగా.

"యెజెబెలు మతము" అను నా ప్రసంగమును మీరు వినియుందురు. దాని విషయము మీరు యెరుగుదురు. ఇప్పుడు మనము ఎక్కడ ఉన్నామో చూడండి? ఈ పట్టణములో ఒక వారము లేక రెండు వారముల క్రితము ఏమి జరిగిందో చూచారా? ఫెయిత్ లూథరన్ బోధకుడు సేక్రెడ్ హార్టు యొక్క కథోలిక్ మతగురువును ప్రసంగించుటకు ఆహ్వానించెను, ఆతడు వచ్చి ఆ రీతిగా చేసెను. పిమ్మట ఫెయిత్ లూథరన్ బోధకుడు కథోలిక్ మతగురువు నొద్దకు వెళ్ళి, కథోలిక్ వారికి బోధించాడు.

105ఇప్పుడు రోమ్లో క్రైస్తవ సంఘముల ఆలోచన సభా సమావేశము నిమిత్తమైన కదలిక ప్రారంభమైనది… ఈ పలువురకు పంపబడు ప్రకటన పత్రిక నా మంచి స్నేహితుడు డేవిడ్ డ్యూప్లెసిన్స్ కలిగియున్నప్పుడు నేను అచ్చట పదునాలుగు మైళ్ల సముద్ర చిన్న పాయయందు కూర్చుండియుంటిని, అది ఎంతో కాలము క్రితము కాదు, అతడు ఆ సంఘమును బబులోను లోనికి చేర్పించబోవుచున్నాడని నేను ఎరుగను, అయితే దాని విషయము హెచ్చరిక కేక వేసితిని. ప్రతి ఒక్కరు అప్పుడు, "ఓ, సంఘములన్నియు ఇప్పుడు ఒక్కటి కాబోవుచున్నవి" అని చెప్పుచుండిరి.

అవును, అది నాకు తెలియును. అవును సరిగా, ఏదైతే నేను ప్రవచన పుస్తకమందు 1933లో జరుగునని వ్రాసియుంటినో, అదే జరుగుచున్నది. ఆ విధముగా ఐక్యపరచుటకు కూర్పుచున్నది, ఆ సమకూర్పు సాతాను అని మీరు ఎందుకు తెలిసికొనలేక పోవుచున్నారు! అది ఆ విధముగా కూడుకొనిన కొంత సమయమునకు, సరిగ్గా వారు ఒక్కటిగా ఆయన వెంటనే సంఘ శాఖల పని ముగించబడును. సరిగా, అప్పుడు మీ క్రూర మృగము యొక్క ముద్ర వెలువడును అని బైబిలు చెప్పుచున్నది.

106దానిని గూర్చి విస్తరించి చెప్పుటకు నాకు సమయము లేకపోవుచున్నది.

ఇప్పుడు సుమారు పండ్రెండు గంటల పావు అయినది. దీనిని నేను త్వరగా ముగించాలని కోరుచున్నాను. ఈ విషయమును పొందుకోండి. ఇచ్చట నేను లేఖనములను మీ ముందు ఉంచుచున్నాను, వాటిని మీరు చూచినప్పుడు, ఇప్పుడు మనము ఎక్కడ ఉన్నాము అను విషయము తెలిసికొనుటకు సాధ్యమగును. కొన్ని నిమిషములలో పాటుగా మనము ఇప్పుడు ముగించుకొందాము.

107ఇప్పుడు, సరిగా ఏమి జరిగెనో గమనించి చూడుము. ఆనాటి దినములలో అలాంటి స్త్రీలను గద్దించు ప్రవక్తలు స్త్రీలను ద్వేషించువారని పిలువబడిరి. అది వాస్తవమే. ఆ విధముగా ఉండెనని చరిత్ర రుజువు చేయుచున్నది. ఒక్క నిమిషం ఆగుము. లేఖనములను వ్రాసికొనుచున్న మీరు I తిమోతి 5:6 వ్రాయకోరిన వ్రాసుకొనండి. "సుఖభోగముల యందు ప్రవర్తించునది…" (దేవునియందు ఆనందించునది కాదు, గనుక అది ఆ రీతిగా నుండును…) "సుఖభోగములందు ప్రవర్తించు ఆ స్త్రీ బ్రతుకుచుండియు చచ్చినదైయుండును," అని బైబిలు చెప్పుచున్నది.

పరి. పౌలు, ప్రవక్తయునైన అతడు చెప్పినది అదే. ఈ లోక సుఖభోగములో ప్రవర్తించుచున్న స్త్రీ బతికినను ఆమె చచ్చినదైయుండును. ఆమె కనికరమును నిరాకరించినయెడల, ఆమె తనకు ఇవ్వబడిన కనికరము పొందనేరనిదాయెను. అప్పుడు ఆమె కన్నులకు రంగు పూసికొనినదై, వెంట్రుకలు కురచగా కత్తిరించుకొనిన దానితో ఎచ్చట నుండును? ఆమె తనకు నియమించిన హద్దును మీరినదై తిరిగి ఆ స్థానమునకు వచ్చుటకు మార్గము కానదయ్యెను. ఆమెకు బోధించుటకు ఒక పరిచర్య అగత్యమైయుండును. అయితే, ఆ సమయమున అది (దేవుని కనికర సమయము) ముగిసిపోయియుండును అని జ్ఞాపకముంచుకొనుము. దానికై ఎంతగనో వెదకవచ్చును కాని, అది ముగిసిపోయెను - వ్యర్థమైన వెంటాడుటయే సరిగా!

JOEL 2:28•

1PET 3:19,20

 

108గొప్ప అద్భుతములు చూపించు పరిచర్య అచ్చట నుండును, (యావేలు ఆ విధముగా చెప్పెను) అయితే విమోచింపబడుటకు సమయము లేదు. ఆ సమయమంతయు గడచిపోయెను. గొర్రెపిల్ల తన విమోచన కార్యమును ముగించెను, ఆయన గ్రంథమును తీసికొనెను. యేసు ప్రధమముగా వారికి బోధించెను, అయితే ఆయనను నిరాకరించిరి మరియు ఆయన చెరలో ఉన్న ఆత్మలకు బోధించుటకు ఆయన ఆత్మగా వారిని వెంటాడి వెదకి వారికి బోధించెను కాని, వారు మారు మనస్సు పొందరైరి - ఏలయనగా వారి రక్షణ సమయము దాటిపోయెను.

అదే సేవా మరియొకసారి జరుగును. అదే మూడవ ఈడ్పు అయిన యెడల ఏమగును? - నిత్యముగా నశించినవారికి. అట్టి విధముగా జరిగినయెడల అది ఏమగును? అట్లది కాకుండ వలెనని నేను ఆపేక్షించుచున్నాను. అట్లు జరిగినయెడల ఏమి? ఒక్క నిమిషము సరిగ్గా దాని విషయము ఆలోచించుము. ఆలాగుండినయెడల నేమి? దేవుడు అట్లు జరగనివ్వకుండ చేయును గాక. నేను పిల్లలను కలిగియున్నాను. అయితే, అది ఎంతో సమీపముగా నున్నట్లు వాస్తవముగా అది కనబడుచున్నది.

నేను చిన్నపిల్లవానిగా నున్నప్పుడు ఎందుకు ఆ దర్శనము నాకు కలిగెను? దీనికి ముందు ఎన్నడు దాని విషయము నేను ఎందుకు ఆలోచించలేదు? మరునాడు ఆ గదిలో ఎందుకు పరవశుడనగుట జరిగెను? "ఇక్కడే అది ఉన్నది" అని చెప్పుచున్నది. "సరిగా ఇక్కడ ఊహూ, ఊహూ, ఊహూ అను నశించిపోవు ఆత్మల మధ్యనే ఖచ్చితముగా అది ఉన్నది." మరియు యేసు వారికి బోధించెను, సాక్షమిచ్చెను కాని, వారు పశ్చాత్తాపపడనొల్లరైరి. నేను వారికి ఎంత అధికముగా వారికి బోధించితినో, అంత చెడుగుగా వారికి కఠినత్వము కలుగుచుండెను. అచ్చట పశ్చాతాపపడుటకు అవకాశము లేకున్నది. పశ్చాతాపపడుటకు చోటు లేకున్నది.

REV 5:7•

REV 8:1

 

109ఏడు ముద్రలు విప్పుటకు సిద్దముగా నున్నప్పుడు గొర్రెపిల్ల ఏడు ముద్రలు గట్టిగా వేయబడియున్న తన గ్రంథమును తీసికొనెను. ఏడవ ముద్రను ఆయన మనకు మరుగుగా నుంచెనని జ్ఞాపకము పెట్టుకొనుము. ఆయన దానిని బయలు పరచలేదు. ఆ దేవుని దూత దిన దినము వారి విషయము చెప్పుచుండినప్పుడు, ఆ ఏడవ ముద్రను గూర్చి ఆయన చెప్పలేదు. "పరలోకమందు నిశ్శబ్దముగా నుండునని" చెప్పెను.

అది ఎవరికిని తెలియదు. అది ప్రభువు యొక్క ఆగమనమైయుండెను. "ఓ, అది కాదని" మీరు చెప్పుదురు.

అది మీరు తలంచినట్లు కాదు అని నేను నిరీక్షించుచున్నాను. దాని విషయము మరికొంత వ్రాసితిని, దానిని చూచుటకు ముందుకు సాగిపోదాము.

మంచిది.

1COR 14:34,35•

1TIM 5:6

 

110గుర్తుంచుకొనండి, "ఈ లోక సుఖభోగములందు ప్రవర్తించుచున్న ఆమె (లోక ఆశలను కలిగినదై, లోకస్తుల వలె అమె ప్రవర్తించుచున్నది. ఆమె ప్రార్థన మందిరమునకు వెళ్లుచు, భక్తిగల పరిశుద్ధమైన దానిగా ప్రవర్తించుచుండెను. అలాంటి ప్రవర్తన వలన ఏ మాత్రము ప్రయోజనము లేదు,) అయితే బ్రతికినదైయుండినను అది చచ్చినదే.

ఆమెయెడల సంఘ శాఖలు ఏమి చేసెనో చూడుము. పవిత్ర వాక్యమును బోధించుదానిగా వారు ఆమెను చేసిరి, అది బైబిలునకు వ్యతిరేకమైనది. వారు ఆమెను ఉపదేశకురాలుగా చేసిరి. లేఖనములు దానిని నిషేధించుచున్నది. మరియు ఆమెను ఏలికగాను నగరాధ్యక్షురాలుగాను, రాజ్య పాలకురాలుగాను సమస్తముగా రాష్ట్రమునందును, మరియు దేవుని ఇంటియందు సేవకురాలుగాను, ఎన్నడు చేయనటువంటి ప్రతి పాపము విషయములో ఆమె ఆరోపింపబడినను, వారు ఆమెను చేసిరి. ఆమె అలాంటి అవనీతికి హేతువాయెను. అది సరియని నేను చెప్పుట లేదు… ఆమె దోషి అని రుజువు చేయబడినది.

జన్మించిన ప్రతి శిశువు గ్రుడ్డివాడుగా పుట్టుటకు ఆమె ఒక్కటే హేతువు. ప్రతి సమాధి త్రవ్వుటకు ఆమెయే కారకురాలు. దుఃఖము, రోగములు పాపము చేయుటకు కారకురాలు ఆమె ఒక్కటే. ఆ ఒక్క స్త్రీ దానికి హేతువు కాకుండినయెడల అంబులెన్సు యొక్క గంట వాయించవలసిన అగత్యములేకుండును. ఏ ఏడ్చుటయు కలుగనేరదు, పాపము లేకుండును, మరణము లేకుండును, దుఃఖము లేకుండును, బాధయు లేకుండును, అయితే ఆ ఒక్క స్త్రీ వాటిని కలిగించుటకు కారకురాలయెను. ప్రసంగవేదిక పైకి ఆమె వెళ్లుటకు దేవుడు నిషేధించెను, అయితే అది అట్లు చెప్పబడినప్పుడు వారు ఆమెను ఆ రీతిగా ప్రవర్తించుటకు చేసిరి.

సంఘ శాఖ - అది ఎక్కడ ఉన్నదో గమనించితివా?

REV 13:8,16

 

111ఆమె ఒక దేవతయై ఉన్నది. దయ్యము ఎట్లు పనిచేయుచున్నదో చూడుము! ఎందుకు కథోలిక్ ప్రజలు స్త్రీలను తమకు దేవతలుగా చేసికొని వారికి పూజించుచున్నారు అది వాస్తవము. మేరీ దేవతా, మరియు ఆదిగా భక్తులను దేవుళ్లునుగా చేసికొని పూజించుచున్నారు. ప్రొటస్టెంటు వారిని తమలోనికి ప్రవేశించునట్లు చేయుటకు సంఘముల యొక్క సమాఖ్యగా (Ecumenical council) ఏర్పడిన కథోలిక్ వారు యేసును కొంత అధికముగా పూజించుట అను సాధకము వలన సహాయ పడగలదని వారు చెప్పినది జరుగుట నేను చూచుచున్నాను. ఓ, మార్పులేని పైన తీపి కలిగి దాని లోపల విషము కలిగిన దానివలె పైకి మేలు కలిగించునదిగా కనుపింపజేసి, దాని అంతమున కీడు కలిగియున్న మాటలు వారు చెప్పుచున్నారు… అది పురాతనమైన దయ్యము యొక్క కృత్యములే..

ఎవరి పేర్లు గొర్రెపిల్ల జీవగ్రంథములో వ్రాయబడలేదో, వారెల్లరు తమ నొసళ్ల మీద గురుతు వేయించుకొందురని బైబిలు చెప్పుచున్నది. నేను మాటలాడుచున్నది ముందుగా ఏర్పరచుకొనిన సంఘముతోనే - వెలుపటనున్న వారితో కాదు. లేదు, అయ్యా. ప్రతి సమూహము నుండి ముందుగా ఏర్పరచుకొనిన తన వారిని ఆయన వెలుపలికి లాగుచున్నాడు. వారి నిమిత్తమే ప్రతి సంఘ కాలములో ఆయన వచ్చుచు సంధించుచుండెను.

JOHN 8:44•

1COR 14:34•

1TIM 2:12

 

112ఆమె అచ్చట నిలువ బడియున్నది. చెప్పబడిన రీతిగా ఆమె అచ్చట నున్నది.

వాక్యమును బోధించుటకును, వాక్యమును ఉపయోగించుటకును ఆమె దేవతగానాయెను - ప్రతి పాపము చేయుటకు హేతువాయెను. "స్త్రీ ఉపదేశించుటకైనను, ఏలాటి అధికారము చేయుటకైనను ఆమెకు సెలవియ్యను." వారు లోబడి విధేయులై యుండవలెనని ధర్మశాస్త్రమును చెప్పుచున్నది. ఆమె దానిని చేయరాదు. అయితే వారు ఆమెను దేశమును ఏలుదాని గాను, నగరాధ్యక్షురాలిగాను, రాజ్యపాలికగాను చేసిరి; త్వరలో ఆమె అధ్యక్షురాలిగా కాగలదు. ఖచ్చితముగా. అక్కడే మీరున్నారు. జరిగింపబడు మార్గము అదియే. ప్రజలు ఆ రీతిగా చేయుదురు, ఏలయనగా వారు వాక్యమును లక్ష్యపెట్టరు. వారెన్నడు దానిని చూడరు.

అచ్చట నిలువబడియున్న యూదులకును, శాస్త్రులకును, ఎన్నికైనవారి వైపు చూడుడి. "మీరు మీ తండ్రియైన సాతాను సంబంధులైయున్నారని," యేసు చెప్పెను.

NUM 16:3,21,26•

MATT 7:21•

JUDE 1:5,11

 

113మీ యెదుట ఇప్పుడు సరిగా విమర్శింపబడుటకు నేను తీసికొని వచ్చినయెడల ఏమి? ఒక నిమిషము దానిని ప్రయత్నించుదము. ఆయనకు వ్యతిరేకముగా మాటలాడిన దేవుడు నన్ను క్షమించును గాక, కాని ఒక నిమిషము ఆగుము ఏదో మీకు చూపించబోవుచున్నాను. "మంచిది, దేవునికి మహిమ కలుగును గాక, నేను భాషలలో మాట్లాడుచున్నాను! హల్లేలూయా! దానిని నేను పొందియున్నానని నేను ఎరుగుదును. దేవునికి స్తోత్రములు," అని నీవు చెప్పినయెడల యేమి.

హూ, హూ నీవు చేసితివి. ఇశ్రాయేలు ప్రజలను జ్ఞాపకము చేసికొనుము. ఆయన వారిని బయటకు తెచ్చెను మరియు ఐగుప్తు నుండి రక్షించెను. అయితే వారికి అనుగ్రహించబడిన సందేశమును అనుసరించలేదు గనుక ఆయన వారిని నాశనము చేసెను. దేవుడు పరలోకము నుండి వారి కొరకు భూమి మీద కురిపించిన మన్నాను వారు తినిరి, మరియు వర్తమానికుని సన్నిధిలో వారు నిలువబడిరి, అగ్నిస్తంభమును జూచిరి, దేవుని శబ్దమును వినిరి మరియు దానిని ధృడపరచెను. "వారు అందరి కంటే పరిశుద్ధులనియు, ఇదియు, అదియు అను చెప్పు కోరహును వారు విశ్వసించనపేక్షించిరి. మనము తప్పక పరిశుద్ధులుగా నుండవలెను. దీనినంతయు మనము చేయవలసి యున్నది. ప్రజలందరును పవిత్రులైయున్నారు," అని కోరహు చెప్పుదానిని వారు నమ్ముటను అపేక్షించిరి.

"నిన్ను ప్రత్యేపరచుకొనుము. అక్కడ నుండి తొలగిపొమ్ము," అని దేవుడు చెప్పెను.

"ప్రభువు పక్షమున ఉన్నవారు నాతో కూడ రండి," అని మోషే తెలియజేసెను. అప్పుడు ఆయన భూమి నోరు తెరిపింపజేసి వారిని మ్రింగివేసెను.

JOHN 3:5•

JOHN 14:6•

ACTS 2:38

 

114వారు కూడా వాస్తవముగా మంచివారే. వారు చక్కని వారు. అవును, అయ్యా. అయితే అవి వారికి ఏ మేలు కలుగజేయలేదు. "ప్రభువా, ప్రభువా అని పిలుచువారు కాదు గాని, నా తండ్రి చిత్తమును చేయువాడే" అని చెప్పబడినది.

ప్రారంభించువాడు కాదు కాని, దాని ముగించువాడు లెక్కింపబడును. అక్కడ అడ్డదారులేవి లేవు. పందెము యొక్క అంతమున నీవు అనర్హుడివగుదువు. అచ్చట త్వరగా చేరుటకు అడ్డదారి లేదుఖనములు చెప్పుచున్న మార్గమున సరిగా నీవు రావాలి. "మారుమనస్సు పొందుము, పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుము, అప్పుడు పరిశుద్ధాత్మ అను వరము పొందుదురు," అని లేఖనము చెప్పుచున్నయెడల, దానిని మీరిపోవు ఏలాంటి అడ్డదారి లేదు. సంఘముతో లేదా సంఘ శాఖతో చేతులు కలుపుచు — మీరు ఆ మార్గమున వచ్చెదరు.

మీ నిమిత్తము మీరు మరణించి, దేవుని ఆత్మ ద్వారా జన్మించితేనే తప్ప, లేనియెడల మీరు నశించినవారే. అది వాస్తవము. వేరే భిన్నమైన మరొక మార్గము లేదు. "ఓ, నేను ఫలాని సంఘమునకు చెందాను," అని నీవు చెప్పవచ్చు. నాకు తెలుసు. అది మంచిదే. "నా యొక్క తల్లి సంఘము…" దానిని నేను అనుమానించను, అయితే నేను మాట్లాడుచున్నది నీతోనైయున్నది. నీవు ఆ మార్గమున మాత్రమే రావలసియున్నది, ఏలయనగా సులభమైన మార్గము వేరొకటి లేదు. తీర్పు సమయమున నీవు అపాత్రుడవగుచున్నావు. నీవు రావలసిన మార్గము ఒక్కటే. ఒక్కటే మార్గము గలదు. మరియు ఆ మార్గము క్రీస్తే, క్రీస్తు వాక్యమైయున్నాడు; ఆ వాక్యము మీయందు నివసించుచున్నది. ఆయన వాగ్దానము చేసిన దానిని తగు సమయమందు ఆ వాక్యము సనుస్తమును వివేచించును. మీరు దానిని గ్రహించితిరా? మంచిది.

ఇప్పుడు గమనించుము.

1TIM 2:5

 

115"వారు మంచి ప్రజలు" అని కొందరు చెప్పుచున్నారు." ఖచ్చితముగా. వారు మంచి ప్రజలు కారని నేను చెప్పుట లేదు. సెయింట్ సిస్సీలియా మరియు తదితరులు మంచి స్త్రీలు కాదని నేను చెప్పుట లేదు, వారు నా యొక్క తల్లివలె నున్నారు. అయితే నేను ఆమెకు ప్రార్థన చేయుట లేదు. ఏ మాత్రము చేయను. వారిలో అనేకమంది ప్రజలు మంచివారని నేను చూచితిని, అయితే వారు దేవతలు కారు — వారు స్త్రీలు. మానవుడు… దేవునికిని మానవునికిని, మధ్యవర్తి ఒక్కడే.

ఏల, ఏల, పెంతికోస్తు ప్రపంచ మనుష్యుడు — నా యొక్క ప్రియమైన సహోదరుడు డూప్లిసిన్ అందరికి వినపింపబడు ప్రకటన పత్రము గల ఉత్తరమును కలిగియుండెను. మీలో కొందరును, దానిని కలిగియుండవచ్చును, సంఘముల యొక్క సమాఖ్యలో పోపునకు ప్రక్కన కూర్చుండుట వలన ఎంతో ఆత్మీయములుగ నున్నట్లుండును. అది ఆత్మ యొక్క వివేచించుటయై యున్నది. అది సరియేనా? ఓ, ప్రభువు ఆత్మ అచ్చట ఉన్నది - మిక్కిలి ఆత్మీయముగా నున్నట్లు ఉండెను.

అక్కడే మీరున్నారు. ఎందులకు?

116ఏలయనగా సంవత్సరముల తరబడి ప్రొటస్టెంటు వారు ఐక్యతగా కూడుకొను అవకాశమునకై మనము పోరాడుచున్నదానికి సమయమై ఉన్నది. అది ఆ విధముగా జరుగునని బైబిలు దృఢముగా నిలువబడి మనతో చెప్పెను. మన నాయకులలో ఒక గొప్పనాయకుడు తిన్నగా అందు వచ్చి, "మనము చేయుచున్నది మంచిదని" చెప్పెను. ప్రొటస్టెంటు సంఘములన్నియు దాని కొరకు పడిపోవుచున్నవి.

"యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు" అను దానిని నీవు చూచినయెడల సరిగా అది అలాగే ఉన్నది… ప్రధమముగా వాక్యము దానిని చెప్పెను, పిమ్మట ప్రభువు యొక్క ఆత్మ చెప్పెను, 1933లో దేశములన్నియు యుద్ధములో ప్రవేశించు విషయము, మరియు యంత్రములు ఎట్లుండబోవునది, అంతమున ఏమి సంభవించుబోవునది, మరియు ఇతర విషయములు ప్రతి ఒక్కటి సరిగా ఎట్లు జరుగబోవువాటిని గూర్చి చెప్పబడెను. అవి ఇచ్చట మన కన్నుల యెదుటనున్నవి. అందు ఒక్కటి కూడ నెరవేరకుండ పోలేదు. అవి ఏ విధముగా రూపొందుచున్నవో ఇక్కడ మనము చూచుచున్నాము.

2KGS 9:7•

MATT 11:25•

MATT 15:14•

LUKE 10:21

 

117ఇటీవల యెజెబెలు మతమును గూర్చిన నా యొక్క వర్తమానము మీకు జ్ఞాపకమున్నదా. ఎలీషా ఒక ప్రాతఃకాలమున ఆ మార్గమున వచ్చి వారికి తెలియజేసినది జ్ఞాపకము చేసికొనుడి… ఆ విషయము పై నేను బోధించితిని. సంఘముల యొక్క సమాఖ్య ఆ మృగముతో ఐక్యత కలిగినప్పుడు, ఆ మృగము యొక్క ముద్రగా మారునని, మరియు అలంటి సమయము వచ్చునని నేను ఆ విధముగా భవిష్యత్తును తెలిపితిని. అది దానిని చేయచున్నది. నా యొక్క వయస్సు కాలములో నేను దానిని చూచుటకు జీవించితిని. ప్రొటస్టెంట వారు, మిలియన్ల కొలదిగా దానికి పడిపోవుచున్నారు. ఎందుకు? వారు దానికై కనిపెట్టుచుండిరి. వారు అంధులైపోయిరి!

గ్రుడ్డివారికి నాయకులైన గ్రుడ్డి వారలారా, గ్రుడ్డివారు గ్రుడ్డివారిని నడిపించినట్లైతే, వారందరూ గుంటలో పడరా? అని యేసు పరిసయ్యులతో చేప్పెను. వారు పడిపోవు గుంట (గోతు) అదియే. ఏ ఒక మనుష్యుడు ఎల్లప్పుడు నాతో నిలువబడి, నాతో మాట్లాడుచుండిన మరియు నాతో ఎల్లప్పుడును కూర్చుండు వ్యక్తి ఆ విధమున విశేషముగా ఎత్తి పొడుపున చెప్పినప్పుడు నేను ఎప్పుడైన ఎట్లు నమ్మగలను? చూడుము. అది వారి కన్నులకు మరుగైయున్నది - జ్ఞానులకును, వివేకులకును మరుగుచేయబడిన ఈ సంగతులు నేర్చుకొనుచున్న పసి బాలురకు బయలుపరచబడెను.

118ఏదోక దినమున నా ప్రాణమును దాని నిమిత్తము విలువగా చెల్లించవలసియున్నదని నేను యెరిగియున్నాను. అది సరియే. అది జరుగబోవుచున్నది, అయితే ఇచ్చట సత్యము తెలియజేయబడపోవుచున్నది.

పరిశుద్ధాత్మ సంకల్పము నిమిత్తము

బాప్తిస్మమిచ్చు యోహాను,

ప్రధమముగా చావవలసి యుండెను.

(కాని అతడు దానికి వెనుదీయలేదు),

అతడు ఒక మానవునిగా మరణించేను,

అటు తరువాత యేసు వచ్చెను,

వారు ఆయనను సిలువ వేసిరి;

ఆత్మ పాపము నుండి మానవుని రక్షించునని,

ఆయన బోధించెను.

(అది సరియేనా?)

పాపమునకు విరోధముగా స్తెఫెను ప్రకటించినప్పుడు,

అతనిని రాళ్ళతో కొట్టిరి.

వారికి అతడు కోపము కలిగించినందున

అతని తలను చితుక గొట్టునట్లు (రాళ్ళు దువ్విరి)

అతడు తన ఆత్మను అప్పగించి,

ఆత్మయందు నిద్రించెను.

ఆ విధముగా ప్రాణము పెట్టిన వారితో చేరుటకు

ఆ సమూహముతో చేరుటకు అతడు వెళ్లాను.

మరియు పేతురు, పౌలు, పరి. యోహాను

వారు వారి ప్రాణములను ఆహుతి చేసిరి.

ఏలయనగా సువార్త వెలిగింపబడుటకు.

(వారేమి చేసిరి?)

వారి రక్తము. పాత నిబంధనలోని ప్రవక్తలతో కలియునట్లు

సత్యమైన దేవుని వాక్యమును నమ్మకముగా

ప్రకటింపబడినందున.

యెందాక, నాథా, కీడు కలిగించిన వారెల్లరికి

తీర్పు చేయబోవుదువు,

అని బలిపీఠము క్రిందనున్న ఆత్మలు

కేకలు వేయుచున్నారు.

అయితే, అట్టి విధముగ ఆనేకులు

తమ ప్రాణము యొక్క రక్తమును ఇచ్చెదరు.

(అవును అది సరియే.)

ఆ పరిశుద్ధాత్మ యొక్క సువార్త నిమిత్తము,

రక్తము ప్రవాహమై యున్నది.

అది రక్తముతో ముంచబడుచున్నది.

(అవును, అది ఏదొక దినమున జరుగును,

అయితే ఎప్పుడు అది ముగియునో అని ఆ ఘడియ కొరకు నేను కనిపెట్టుచున్నాను.)

MARK 6:25•

ACTS 7:59•

1COR 2:2

 

119ఎవరో ఒక సహోదరికి ఒక స్వప్నము కలిగినది. దానిని ఆమె నాకు పంపినది. "నన్ను చంపుటకు ఒక సంఘము రహ్యసముగా ఒక మార్గమును సిద్దపరచినది. ఒక సమయమున నేను కారునుండి బయటకు వచ్చునప్పుడు మరియు లోనికి వెళ్ళునప్పుడు పేల్చబడునట్లు సిద్ధపరచిరి," అని చెప్పినది. అయితే ఆత్మ - "ఈ సమయమందు కాదు కాని, కొంతకాలము గడిచిన పిమ్మట జరుగునని" చెప్పెను.

దేనితోనైన నేను సమ్మతించిన దేవుడు క్షమించును గాక, సిలువ వేయబడిన యేసుక్రీస్తును తప్ప మరి దేనిని నేను యెరుగకుందును గాక, మనము భయంకర దినమందు నివసించుచున్నాము. పాపము దీనిని కలుగజేసినది. అవును, వారు సైఫెనును రాళ్ళతో కొట్టి చంపిరి. యోహాను తలను వారు చేదించునట్లు ఆమె చేసినది. మనము ఏ విధముగా చెల్లించవలెనో నేను యెరుగను, అయితే అది ఏదో ఒక దినమున జరుగును.

మంచిది, గమనించుము.

JOHN 6:49

 

120యోహాను సువార్తలో (ఆ విషయంలో మీరు ఆ లేఖనమును తెలిసికొన అపేక్షించిన), పరి. యోహాను 6:49, వారు మన్నాను తినిరి, అని యేసు చెప్పెను. "వారిలో ప్రతి ఒక్కరు చనిపోయిరి," అని చెప్పెను. "మంచిది, నా యొక్క సహోదరి, ఆత్మ యందు ఆ స్త్రీ నాట్యమాడుట నేను చూచుచున్నాను," అని చెప్పుచుంటిని.

ఓ, అవును, హూ, హూ, వారు ఆ విధముగా చేయుట నేను చూచితిని. "ఆమె భాషలు మాటలాడుచుండుట నేను చూచితిని. నేను ఆమెను చూసాను…"

అవును, ఆ దినమున అనేకులు నా యొద్దకు వచ్చి, మేము ఇవ్వన్నియు చేసితిమి అని చెప్పుదురు," అని యేసు చెప్పెను. అరణ్యములో వారు మన్నాను భుజించిరి, వారిలో ప్రతి ఒక్కడును నిత్యముగా వేరు చేయబడిరి," అని యేసు చెప్పెను. వారు మరణించిరి. నిత్యముగా వారు తొలగిపోయిరి. అచ్చట అరణ్యములోనే వారు నశించిపోయిరి.

HEB 6:4-6•

HEB 10:27•

JUDE 1:6

 

121హెబ్రీయులకు వ్రాసిన పత్రిక యందలి 6వ అధ్యాయమునందు - "ఒకప్పుడు సత్యమును ఎరిగిన దానియందు నడచుటకు నిరాకరించిన, వారికి పశ్చాత్తాప పడుటకు అవకాశము ఎన్నడు నుండదు" అని చెప్పబడిన దానిని మీరు జ్ఞాపకము చేసికొనుడి. సరిహద్దు, అని గమనించుము… ఆఖరిగా ఒక వ్యక్తికి సత్యమును బోధించినప్పుడు, వారు దానిని స్వీకరించుటకై, నిరాకరించిన (హెబ్రీ గ్రంథ ప్రకారము) ఈ లోకములో మరేదియు వారిని రక్షించుటకు మరెన్నడును ఉండదు.

వారు అంతమొందింపబడిరి. పశ్చాత్తాపమునకు అవకాశము లేదు. విమోచన లేదు, వారి కొరకు ఏదియు విడువబడలేదు. వారు నిత్యముగా వేరు చేయబడిరి. "మనము సత్యమును గూర్చి అనుభవజ్ఞానము పొందిన తరువాత బుద్ధి పూర్వకముగా పాపము చేసినయెడల పాపమునకు ఇకను బలి ఉండదు గాని, న్యాయ తీర్పునకు భయముతో ఎదురు చూచుటయు, విరోధులను దహింపబోవు తీక్షణమైన అగ్నియు నికను ఉండును," అని బైబిలు చెప్పుచున్నది. సువార్త యొక్క సత్యమును అద్భుత సూచన క్రియల ద్వారా రుజువు చేయబడినప్పుడు, వారు దాని నెరిగియు, దాని నుండి తొలగిపొయిన, వారు ముగిసిపోయిరి. వారి అంతము అదే. అది భయంకరమైనది, అయితే దానిని గూర్చి నేను చెప్పవలసియున్నది.

మరియు తమ ప్రధానత్వమును నిలుపుకొనక, తమ నివాస స్థలమును విడిచిన దేవదూతలను, మహా దినమున జరుగు తీర్పు వరకు కటిక చీకటిలో నిత్యపాశములతో ఆయన బంధించి భద్రము చేసెను అచ్చటికే ఈనాడు ఈ లోకము తిన్నగా నడచి వెళ్లుచున్నది, అచ్చట మారుమనస్సుకు అవకాశము లేదు అనునది జ్ఞాపకము చేసికొనుము.

MATT 23:26

 

122నేను చికాగో నుండి వచ్చిననప్పుడు అమెరికా, కూడ దానిని ఈ సంవత్సరమున పొందును లేక మరెన్నడు దానిని అది పొందుకొనదు అని నేను కొద్ది సంవత్సరమముల క్రితము చెప్పినది జ్ఞాపకము చేసికొనుడి. ఆమె (అమెరికా) ఎక్కడికి వెళ్లినదో గమనించుము? మూడవ ఈడ్పుగా నుండునేమో అది? నేను ఆశ్చర్యపడుచున్నాను. ఓ, దేవా, దాని నుండి అది దూరమగును గాక. ఆ మూడవ ఈడ్పునకు అది ఏమైనదో దానికి చెందినదా? అదేమై యుండునా? స్నేహితులారా, దాని విషయము ఇప్పుడు ఆలోచించండి. నేను దానిని అపేక్షించుట లేదు. "ఈ రకపు వేషదారులను గూర్చి…" (మీరు మత్తయి 23:7 లేఖన భాగమును వ్రాసికొనవలెననిన కోరినయెడల,) నేను దానిని కలిగియున్నాను, "దానిని చదువుడి," అయితే మీరు దానిని చూడుడి, "గ్రుడ్డి పరిసయ్యులైన మీరు," అని యేసు చెప్పెను.

MATT 23:27-33

 

123రెండు నిమిషముల వ్యవధి మీరు కలిగియున్నారా? మనము ఆ లేఖనము వైపు మరలుదము, ఏలయనగా దానిని చదువుమని నేను చెప్పితిని. అందు ఏదో విషయము ఉన్నది, దానిని చదువనపేక్షించుచున్నాను, కాని ముందుగా… ఒక్క నిమిషము, అందులో నుండి నేను కొంత తగ్గించగోరుచున్నాను. మత్తయి 28వ అధ్యాయము, ఒక నిమిషము. మంచిది, ఇప్పుడు 27వ వచనము నుండి ప్రారంభించుకొందాము. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. మీరు మీ గృహమునకు వెళ్ళినప్పుడు దానిని సంపూర్ణముగా చదువుకొనండి, మీరు అట్లు చేయనపేక్షించిన, మరి కొన్ని నిమిషములు అధికముగా కలిగియుందాము. ఇప్పుడు మత్తాయి 23వ అధ్యాయము 27వ వచనము ప్రారంభించెదము, గమనించండి.

"అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా … [మనుష్యుల యెదుట నీతిమంతులనిపించుకొను మనుష్యలతో ఆయన మాట్లాడుచున్నాడు.] వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా మీకు శ్రమ! మీరు సున్నము కొట్టిన సమాధులై యున్నారు [అనగా మృతులైన ప్రజలు] అవి వెలుపట శృంగారముగా అగపడును గాని లోపల చచ్చినవారి ఎముకలతోను కల్మషముతోను నిండి యున్నది." [అంతరంగమున వేషధారణను, అసూయలు, మరియు కలహములు కలిగి, నేను డాక్టరును ఫలానా, ఫలానాయై యున్నాను అని బాహ్యమున చెప్పుకొనుచున్నారు.]

అలాగే మీరు వెలుపల మనుష్యులకు నీతిమంతులుగా నగపడుచున్నారు. [సంఘముల యొక్క సమాఖ్యకు చెందిన మరియు పెంతికోస్తువారు అచ్చట కూర్చుండియుండుట చూడుము] "గాని, లోపల వేషధారణతోను అక్రమముతోన నిండియున్నారు." [అక్రమము అనగా నేమి? ఏదైతే సరియైనదని నీవు ముందుగా నెరిగియు దానిని నీవు చేయకుండుటయే - ఇప్పుడు, కనిపెట్టుము ఏ సంతానమునకు వారు చెందినవారని యేసు తెలియజేసినది గమనించుము.]

"అయ్యో, వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు ప్రవక్తల సమాధులను కట్టించుచు, నీతిమంతుల గోరీలను శృంగారించుచు [చూచారా? ఓ, ప్రవక్తలకు."]

మనము మన పితరుల దినములలో ఉండినయెడల ప్రవక్తల మరణ (రక్తము) విషయములో వారితో పాలివారమైయుండక పోదుమని చెప్పుకొందురు." [గమనించుము - ఆ దినములలో మేము ఉండినయెడల, ప్రభువు వాక్యమును మేము విశ్వసించియుండేవారమని చెప్పుకొందురు.]

అందువలననే మీరు ప్రవక్తలను చంపిన వారి కుమారులులై యున్నారని మీ మీద మీరే సాక్ష్యము చెప్పుకొనుచున్నారు.

మీరును మీ పితరుల పరమాణమును పూర్తిచేయుడి. [అదే ఇప్పుడును సరిగా జరుగుచున్నది. [ఇప్పుడు, ఇక్కడ ఆయన ఏమి చెప్పుచున్నాడో, గమనించుము.]

"సర్పములారా, సర్ప సంతానమా, నరకశిక్షను మీరేలాగు తప్పించుకొందురు?"

MATT 23:26,33,34

 

124అది నీవేలాగు చేయగలవు? సేవకులతో ఇప్పుడు అతడు మాటలాడుచున్నాడు. అది వాస్తవము - పవిత్ర మానవుడు అని పిలువబడువాడు. బైబిలు ముందుగా జరుగువాటిని గూర్చి నీవు తెలిసికొని ఆ సత్యమునకై నిలువబడి ప్రజలకు తెలియజేయక, పేలు పట్టి కంపుకొట్టే డాలరులకు సమ్మతించు నీవు ఏ విధముగ నిలువగలవు? లేదా కొంత పేరు ప్రఖ్యాతుల కొరకు మరియు ఎవరైనా నీ వీపు తట్టి డాక్టరు గారూ! అని పిలువనపేక్షించుచున్నావు.

నీవు ఆ ప్రజలను ప్రేమించుచున్నావని ఎలాగు చెప్పగలవు? నేను టేపు మీద కూడ బోధించుచున్నాను. అలాంటి ఆ విషయము జరుగుటకు నీవు అనుమతించుచు మరియు ఈ ప్రజలను ప్రేమించుచున్నానని నీవెట్లు చెప్పగలవు? పరిసయ్యులైన మీరు, మీరు గ్రుడ్డివారైయున్నారు. మీరు సర్పములు, మీరు సర్ప సంతానము నరకశిక్షను మీరు ఏ విధముగా తప్పించుకొనగలరు? ఎప్పుడైతే మీరు…? ఈ విషయములు తప్పైనవి అని యెరిగిన ఒక మనుష్యుడు అది సరియని ఎట్లు నిలువగలడు? తన సంఘ శాఖను వృద్ధి చేసికొనువాడు స్త్రీ, పురుషులకు సరికాదని ఎట్లు చెప్పగలడు? నరక కూపము నుండి మీరు ఎట్లు తప్పించుకొనగలరు? అది మీ కొరకు సిద్దపరచిబడియుండగా? మీరు ఏ విధముగా దానిని చేయబోవుచున్నారు? వినుము, ఇక్కడ ఆలకించి వినుము. అది ఏమిగా నుండబోవుచున్నది?

"అందుచేత [34వ వచనము] ఇదిగో, నేను మీ యొద్దకు ప్రవక్తలను పంపుదును, [నేను పంపుదును - భవిష్యత్కాలము. ఇచ్చట మరల మీ యొక్క పరిసయ్యులు వచ్చుచున్నారు.] జ్ఞానులను, శాస్త్రులను పంపుచున్నాను. మీరు వారిలో కొందరిని చంపి సిలువవేయుదురు, కొందరిని మీ సమాజమందిరములలో కొరడాలతో కొట్టి, పట్టణము నుండి పట్టణమునకు తరుముదురు."

MATT 23:30,31•

LUKE 11:47,48

 

125ప్రభువు యొక్క వాక్యముతో ప్రవక్తలను పంపుదునని ఆయన ముందుగా భవిష్యత్తును తెలియజేసెను, మరియు వారేమి చేయుదురు? వారి పితరులు దేనిని చేసిరో, దానినే వారు చేయుదురు, ఏలయనగా వారును అట్టివారునైయున్నారు. ఆత్మలు చావవు వాటిని కలిగియున్న మానవుడు చనిపోవును గాని, ఆ ఆత్మలు చావవు. "మీరు సంతానమైయున్నారు, ఆ సంతానమునకు చెందినవారని," ఆయన చేప్పెను. ఈ విషయము ఏ విధముగా నున్నవో సరిగా గమనించుము.

MATT 15:14•

ACTS 19:4,5•

1COR 11:15

 

126పరిశుద్ద. పౌలు ఎట్లు నిలువబడియుండి (అతడు ఒక ప్రవక్తయని నీవు నమ్ముచున్నావా?) స్త్రీ వెంట్రుకలను కురచగా, కత్తిరించుటను గూర్చి దోషారోపణ చేసెను, వారి సంఘ సంస్థలలో ప్రభువైన యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందని ప్రతి మానవుడు మరల బాప్తిస్మము పొందవలెనని ప్రకటించెను. అది సరియే.

వారు ఈనాడు రాజీపడినవారై, చుట్టు ప్రక్కల అనుకూలముగా నుందురు. దాని వ్యత్యాసమును వారు యెరుగరు. అది విచారకరమైనది. ఆ సమయము చెయ్యి దాటిపోయిన దీనిని గూర్చి నేను చెప్పవచ్చును. వారు గ్రుడ్డివారు, వారట్లు గ్రుడ్డివారుగా నుండుటకు నియమింపబడిరి. వారియెడల దేవుడు దయచూపును గాక. వారు దానిని చూడలేకున్నారు. "మీరు గ్రుడ్డివారు. అంధులైన శాస్త్రులును, పరిసయ్యులునునై మీరు ఉన్నారు. మీరు వేషధారులు. వారెల్లరు చదువుచున్న అదే వాక్యమును మీరు చదువుచున్నప్పుడు, మీరు ఇక్కడకు వచ్చి నాపై దోషారోపణ చేయుచున్నారు. ఖచ్చితముగా ఈనాడు ఉండవలసిన దానిని గూర్చి చెప్పబడిన ఆ వాక్యమునై నేను ఉన్నాను. నేను ఈ దినమునకు వర్తమానికుడుగా ఉంటిని. నేను మెస్సియానైయున్నాను," అని యేసు చెప్పెను. ఇంకా అనేక మాటలలో చెప్పెను; "నేను మెస్సియాను, దానిని రుజువు చేయుటకు నేను తప్పిపోతినా? నా విషయము వ్రాయబడిన ప్రకారము నేను చేయనియెడల, మీరు నాపై దోషారోపణ చేయుడి. మరియు అంధులైన పరిసయ్యులారా, మీ ప్రజలను మార్గము తప్పింపజేసినట్టి దానిలోనికి ఈ సముదాయమంతటిని నడిపించుచున్నారు…" అని చెప్పెను. "మంచిది, గ్రుడ్డివాడు గ్రుడ్డివానిని నడిపించుచున్నట్లు మీరు ఉన్నారు," అని చెప్పెను.

MATT 23:14•

MARK 10:40•

LUKE 20:47

 

127"ఓ, మేము పరి. పౌలు కాలములో ఉండినయెడల, పరి. పౌలు పక్షమున యుండేవారమని" మీరు చెప్పియుందురు.

వేషధారులారా. అతని ఉపదేశమును ఎందుకు మీరు అనుసరించరు? ఇప్పుడు మీరు చేయుచున్న దానినే మీరు చేసియుందురు, ఏలయనగా మీరు మీ పితరుల యొక్క సంతానమైయున్నారు. వారు మీ సాంప్రదాయక సంఘముల యొక్క పితరులు స్వనీతిపరులైన పరిస్యయులు, సదూకయ్యులు… అది వాస్తవము, మరియు ఇప్పుడు మనము జీవించుచున్న ఘడియ, మూడవ ఈడ్పు కావచ్చునని నేను ఆశ్చర్యపోవుచున్నాను. ఒక్క నిమిషము గమనించుము. "ఈ రకమైనవారు భయంకర శిక్షకు పొందుదురు," అని యేసు చెప్పెను.

అది భయంకరమైనది కాదా?

128ఒక సమయమున శత్రువు వచ్చి, ఈ దేశమును తీసుకొనబోవునప్పుడు ఒక గొప్ప అమెరికా వ్యక్తి - మధ్యరాత్రి సమయమున గుర్రము పైకి దుమికి మార్గముపై స్వారీ చేయుచు, వేదనతో "శత్రువు వచ్చుచున్నాడు!" అని అరచుచుండెను. అతడు పౌలు రోవర్ అను వ్యక్తి. నేనును అమెరికా వాడనే మరియు ఈ మధ్యరాత్రి ఘడియలో, నేను స్వారీ చేయుచు, "ఆయన వచ్చుచున్నాడు" అని చెప్పుటలేదు కాని, "ఆయన ఇక్కడ వున్నాడు." ఆయన వచ్చుచుండుట లేదు గాని, ఆయన ఇక్కడ ముందుగనే ఉన్నాడు. ఆయన జయించుట ముగించెను. ఆ పని ముగిసిపోవుటవలన నేను భయపడుచున్నాను. ఈ మధ్య రాత్రి ఘడియలో! — జయించుచున్నాడు.

129టుసాన్ యొద్ద ఏడుగురు దూతలు, ఏ సందేశమైయుండెనో మీకు జ్ఞాపకమున్నదా? దేవుని మర్మము - సమాప్తమగును అనునదియే. దాని తరువాత వెంటనే ఆ శ్రేణి దిగివచ్చుట జరిగెను… ఆ పర్వత విషయము మీరెల్లరు వినియుందురు. గమనించుము. సహోదరుడు ఫ్రెడ్ దాని కొన్ని చిత్రములు కలిగియున్నాడు. మరియు సహోదరుడు టామ్, నేనును కొన్ని చిత్రములు వాటిని కలిగియున్నాము. కొన్ని చలన చిత్రములును మరియు సమస్తము. (ఒక దినమున ఇక్కడ మీకు చూపించెదము. అది సరిగా ఎక్కడ జరిగినది చూపించెదము.)

ఈ ఘటన మీరెల్లరు ఎరిగినదే. ఆ మూడు (పర్వత) శిఖరములను - కనిపెట్టుము. మొదటిది, రెండవది, మూడవది, అది నీకు అన్వయించినవని ఆయన చెప్పెను.

REV 10:7

 

130దాని యొక్క ప్రాముఖ్యమైన చిత్రమును సహోదరుడు ఫ్రెడ్ కలిగియున్నాడు. అతడును, సహోదరి మార్త భూమి నుండి చెమ్మతో కూడిన మేఘములు పైకి వచ్చి వారిని కప్పి, మరుగుచేయబడిరి. వారిలో తక్కిన వారినెల్లరిని కూడ మరుగులో చేసినవి. అది మూడు ఈడ్పులను చూపించుచుండెను. ఒకటి ఇక్కడ, ఒకటి అక్కడ, ఒకటి మరొక చోట ఇక్కడ. ఆ ఏడు…

131గమనించండి.

మొదట మూడు; ఆ మూడు అను సంఖ్య పరిపూర్ణతయై యున్నది. అనగా ఈ సేవ ముందుకు సాగిపోయినప్పుడు ప్రధమమున రోగులు స్వస్థపొందుట మొదటి ఈడ్పు అయి యుండెను; రెండవది ప్రవచించుటయై ఉన్నది — ఆలోచనలలోని రహస్యమును వివేచించుట, వాక్యము స్వయముగా ప్రత్యక్షపరచబడెను, అది కృప. అయితే ఏడవది ముగింపును సూచించునని జ్ఞాపకముంచుకొనుము. ఇది సమాప్తి చేయు ఈడ్పు అయి ఉండునేమో? అది అంతయు ముగింపబడెను. అదేయై యుండగలదా? దానిని గూర్చి ఆలోచించుము. ఇప్పుడు నీవు ఎక్కడ ఉన్నావో సరిగా ఆలోచించుము. ఏడు ఎల్లప్పుడు ముగింపును సూచించునదై యున్నది - మూడు ఈడ్పులు.

JOHN 1:1•

JOHN 17:12

 

132యేసు యొక్క సేవ మూడు రకములుగా ఈడ్పులును కలిగియుండెను. ఆ విషయము నీవు ఎరిగితివా? గమనించుము. ఇప్పుడు కొద్ది నిమిషముల పాటు నీవు నీ జీవితంలో ఎన్నడూ ఉండనటువంటి యధార్థతతో ఉండుము ఆయన మొదటి ఈడ్పు రోగులను స్వస్థపరచుటయే యుండెను. ఆయన దానిని బట్టి ప్రజాళిలో బాగుగా ఎరుగునట్లు ప్రఖ్యాతినొందిన మనుష్యుడాయెను. ఆ విధముగా నుండుటవలన, ప్రతివారు ఆయనను విశ్వసించునట్లు కనబడెను. అది సరియేనా? ఆయన రోగులను స్వస్థత పరచుచు వెళ్లుచుండినప్పుడు, ప్రతివారు ఆయనను తమ సంఘములోనికి వచ్చుటకు అపేక్షించుచుండిరి. అయితే ఒకనాడు ఆయన చుట్టు ప్రక్కల కలయజూచి, ఆయన వాక్యమైయుండుట వలన, ప్రవచించుటకు ప్రారంభించెను. మోషే ఆయనను గూర్చి తెలియజేసిన ప్రవక్తయై యుండెను.

ఆయన వారి యొద్దకు వెళ్ళి, వారు ఏ విధముగా జీవించుచున్నారు మరియు వారు చేయువాటిని గూర్చి చెప్పుచుండినప్పుడు, ఆయన ప్రఖ్యాతినొందని వాడాయెను. అది అతని రెండవ ఈడ్పు. అదే మాదిరిగా మరల సరిగా సంభవించినదా అని నేను ఆశ్చర్యపోవుచున్నాను? ఒక నిమిషము సరిగా ఆలోచించుము. అది కాగలదా? మొదటిది, ప్రతివారిని స్వస్థతపరచుచుండెను. రెండవది… ఓ, కేవలము అది యేసే కావచ్చును, అది బయల్జెబూబు కావచ్చును, అది కావచ్చును… అదే సంగతి వారు ఆనాడు అచ్చట జరిగించిరి.

అదే ఆత్మలు అదే రకమైన ప్రజలలో జీవించును - నాశనమునకు పాత్రులైన ప్రజలు, వారెన్నడు రక్షింపపడజాలరు, ఏలయనగా వారు ముందుగనే నాశనమునకు విధింపబడియుండిరి… యూదా ఇస్కరియోతు వలె నాశనపుత్రుడుగా జన్మింపబడినట్లు, వారున్నారు. "యూదానా?" అని మీరు అనవచ్చు.

నిశ్చయముగా.

NUM 16:3,32

 

133అతడు అధిక మతనిష్టగలవాడని గుర్తుంచుకొనుము. అయితే అతడు వర్తమానమంతటిని అనుసరించినవాడు కాడు. ఆ వర్తమానములోని కొంత భాగమును మాత్రము తీసికొనగలిగెను. తక్కినది అతడు జీర్ణించుకోనలేకపోయెను. రోగ స్వస్థత మరియు అటువంటి కార్యములు, వారు అంగీకరించగలరు కాని, ఉడుతలు ఉనికిలోనికి వచ్చునట్లు దేవుడు మట్లాడుతున్న మాట యొద్దకు వచ్చినప్పుడు, అది వారి గ్రహింపుకు మించిన లోతైన విషయమైయున్నది. "అది అతను అర్థము చేసికొనలేడు." అతడు యూదా. అతడి ఆత్మ అంతవరకు మాత్రమే జీవించగలదు. దానిని మించి అతడు ముందుకు సాగిపోనేరడు.

మోషే ఎర్ర సముద్రమునందు మార్గము దాటిపోవుటకు తెరిచినటువంటివి జరిగినప్పుడు వారు అతనిని స్వీకరించి, వెంబడించిరి అది సరియే కాని, ఈలాంటివి, అలాంటివి, లేదా, మరి ఇతరమైనవి చేయలేదని తక్కిన విషయములను అతడు మాట్లాడుచుండినప్పుడు - "అతడు మన పై దేవునిగా తను చేసికొనుచున్నాడని," వారు తిరుగుబాటు చేసిన కోరహు అతని అనుచరులు; కావున వారు ఒక సంస్థను ఏర్పరచనపేక్షించగా, దేవుడు భూమి తన నోరు తెరచి వారిని మ్రింగివేయునట్లు చేసెను.

MATT 23:25,33•

LUKE 11:39

 

134యేసు రోగులను స్వస్థపరచు పరిచర్యను చేయుచున్నప్పుడు, వారి మధ్యలో ఆయన ఎంతో ఆశ్చర్యకరమైనవాడుగా నుండెను. "గలెలీయుడైన ఆ యౌవన ప్రవక్త. ఎందుకు, గ్రుడ్డివాడు చూచునట్లు ఆయన చేసెను. చనిపోయిన వానిని కూడ ఆయన లేపెను. అటువంటివి మూడింటిని జరిగించెను. వాస్తవముగా ఆయన చనిపోయిన వారిని బ్రతికించెను." అయితే ఒకనాడు ఆయన వారినెల్లరును కలయచూచి; "సర్పసంతానమా. మీరు పళ్లెమునకు వెలుపల శుద్ధి చేయుదురు. మీరు కనబడుటకు పరిశుద్దులుగా నుండుదురు గాని, మీ యొక్క అంతర్యమున మీరు సర్పముల గుంపు తప్ప, మరేదియు కాదు."

ఓ, సంఘ సంస్థను దోషారోపణ చేయు ప్రవచనము ప్రకటింపబడుట జరుగుచు వచ్చినప్పుడు, అది వారిని మార్పు కలుగజేసెను. అప్పుడు వారు ఆయనకు విరోధముగా లేచిరి. అది సరియే. చివరకు వారు ఆయనను ద్వేషించినవారై, ఆయనను సిలువవేసిరి.

JOHN 14:12•

JOHN 20:21•

1PET 3:19

 

135కాని మీరు ఆ పరిచర్యను చంపలేరు, ఆ పరిచర్య జీవించుచుండును. ఆ వర్తమానికుని నిద్రించుటకు మీరు అతని చంపగలరు, కాని ఆ వర్తమానమును చంపలేరు. అది వాస్తవము. ఆయన జీవించుచున్నాడు.

మరియు గమనించుము, మూడవ ఈడ్పు సంబంధమైన ఆయన సేవ వచ్చినప్పుడు, మొదటిదిగా రోగులను స్వస్థత పరచుచుండుట, రెండవదిగా సంఘ సంస్థలను గద్దించుట, వారేమైయున్నారు. వారేమి చేసినది, ఏది సంభవించుచున్నది, అదేమైయున్నది. ఏమి సంభవింపనున్నది. అది ఏమై రాబోవునున్నవాటిని గూర్చి ప్రవచించుచుండెను. ఆయన చేసినది అదియే. అది వాస్తవమేనా? కాని, ఆయన యొక్క మూడవ ఈడ్పును కలిగిన పరిచర్యను నశించుపోవుచున్న ఆత్మలకు ఆయన ఉపదేశించుచుండినప్పుడు, వారెన్నడును రక్షింపబడలేకుండిరి. ఎక్కడ కళ్లకు రంగులు పూసికొనిన వారు ఉండిరో, అక్కడే వారున్నారు. పాతాళములో ఉన్న ఆత్మలకు ఆయన బోధించెను, వారు కనికరమును అంగీకరించలేకపోయిరి, ఏలయనగా వారు దేవుని సన్నిధి నుండి నిత్యముగా వేరుచేయబడిరి. అయినను ఆయన ఎవరైయుండెనో, వారు గుర్తించవలసియుండెను, ఎందుకనగా దేవుడు వారి నిమిత్తము ఆయనను కలుగజేసినందున, అచ్చట ఆయన ఉండెను. అటువలె ఈ కడవరి దినము నందు ఆయన యొక్క సేవయుండియున్నయెడల, నేను ఆశ్చర్యపడుచున్నాను. ఆ దినమందు ఆయన చెప్పినట్లుగా, "నా తండ్రి నన్ను పంపినట్లుగా, నేను మిమ్మును పంపుచున్నాను. నేను చేసిన కార్యములను మీరును చేయుదురు."

136తప్పిపోయినవారు - వారెన్నడూ రక్షింపబడనేరరు; ఏలయనగా వారు కృపను తోసిపుచ్చిరి. అది ఆయన యొక్క మూడవ ఈడ్పు పరిచర్యయైయుండెను. ఇప్పుడు దాని విషయమై ఏదైన ఒక ప్రశ్న గలదా? ఆయన మొదటి ఈడ్పు, ఆయన రోగులను స్వస్థపరచెను. అది సరియేనా? ఆయన యొక్క రెండవ ఈడ్పు, ఆయన ప్రవచించుచుండెను. ఆయన మూడవ ఈడ్పు పరిచర్యను నిత్యముగా నశించుపోవుచున్న ఆత్మలకు ఆయన బోధించుచుండెను. ఆ మూడు పర్వత శిఖరములు, మరియు మొదలగునవి చెప్పబడినవి - నిత్యము తప్పిపోయినవారు.

GEN 8:4•

MATT 24:37,39•

LUKE 17:26

 

137నోవహు యొక్క సేవ - అన్ని పరిచర్యలు అదే రీతిగా జరిగినవి. నోవహు బోధించెను. అది అలాగే ఖచ్చితముగా ఉండెను. అతడు ఆ ఓడలోనికి ప్రవేశించెను. మరియు అతడు ఆ ఓడలోనికి వెళ్లిన పిమ్మట, ఏడు దినములు ఏమియు సంభవింపలేదు. అతడిచ్చిన సాక్ష్యము కోల్పోవునదాయెను… సోదోము, మరియు గోమొర్రెల విషయము. "మనుష్యకుమారుని రాకడకు ముందు, నోవాహు దినములవలెను, సోదోము దినములవలె నుండును.

నోవహు దినములను ఉదాహరణముగ ఆయన చెప్పెను. నోవహు మూడు ఈడ్పులను కలిగియుండెను. అతని మూడవ ఈడ్పు, ద్వారము మూయబడిన తరువాత నశించుపోవు వారిని గూర్చినదైయుండెను. దేవుడే ద్వారము యొద్ద కూర్చుండియుండెను, వెలుపలి వారు లోనికి వెళ్లుటకును, లోనివారు వెలుపలకు వెళ్లుటకు అవకాశము లేకుండెను. ఆ ఓడలో ఉన్నవారు… ఎతైన ఏడవ పర్వత శిఖరమున ఆ ఓడ ఆగియున్నది. పర్వతము - అది సరియేనా?

GEN 18:24,32•

MATT 24:37,38•

LUKE 17:26,27

 

138సొదోము దినములలో మొదటి ఈడ్పు నీతిమంతుడైన లోతును గూర్చినదైయున్నది. "సొదొమ యొక్క పాపములు ఆ నీతిమంతుని మనస్సును దినదినము నొప్పించుచుండెను" అని పరిశుద్ధ గ్రంథము చెప్పెను. స్త్రీలు ఆ దినములందు ఎట్లు ప్రవర్తించుచుండిరి మరియు ఎట్టి కార్యములు చేయుచుండిరి, "ఆ దినములు నోవహు దినములవలె నుండును…" వారు ఏమి చేయుచుండిరి? తినుచు, త్రాగుచు, పెండ్లి చేసికొనుచు, పెండ్లికి ఇచ్చుకొనుచు - స్త్రీలు. గమనించుము — స్త్రీలు. సోదొము దినములెట్లుండెను? స్త్రీలు, మరియు మొదటి సందేశము లోతు అయి యుండెను. వారు అతనిని హేళన చేయుచు, అపహాసము చేయుచుండిరి.

అప్పుడు ఆయన మరొక వర్తమానకుని పంపెను. వారిరువురు సోదోమునకు వెళ్లిరి. (సొదొమకు ఇది రెండవ ఈడ్పు) కడవరిగా వెళ్లిన వాని చూడుము. వారందరిపై కృష అత్యధికముగా విస్తరించెను, ఆ సమయ మందంతట కృప ఆవరించియుండెను. అచ్చటకు వెళ్ళిన ఆ మూడవ వర్తమానికుడు… మూడవ ఈడ్పు, ఆయన ఏమైయుండెను? ఆయన ఏ రకమైన పరిచర్యను కలిగియుండెను? ఆయన ఏర్పాటు చేసికొన్న వారితో కూర్చుండెను, ఆయన వెనుక ఏమి జరుగుచుండెనో దానిని వారితో చెప్పెను. అది వాస్తవమేనా? ఆయన ఆ బబులోనులో లేక సొదొములో ప్రవేశించినప్పుడు, ఆయన కనుగొనవలేనని ఆశించెను… అబహ్రాము విజ్ఞాపన చేసినట్లుగా యాభై మొదలుకొని పదిమంది నీతిమంతులు కనబడుదురేమోయని చూచుటకు ఆయన అపేక్షించేను, అయితే పదిమంది నీతిమంతులును కనబడరైరి.

"మంచిది, పదిమంది నీతిమంతులను కనుగొనుము," అని దేవుడు చెప్పియుండెను.

GEN 18:32•

2PET 2:8

 

139మీతో మరొక సంగతి చెప్పనియ్యుడి, సహోదరి, ఒక్క నిమిషము నీవు పురాతన మాదిరిని కలిగియుండవచ్చును, కాని నీవు కలిగియున్నది ఈ కామవికారము కలిగిన రాణీలు కలిగియుండలేదు. నీవు దేనినైతే కలిగియున్నావో, దానిని ఆమె ఎన్నడూ కలిగియుండనేరదు. నీవు వస్త్రములు ధరించుటలో స్త్రీకి తగినట్లుగా పురాతన మాదిరిగా ధరించుదువు. ఆ "పురాతన పరిశుద్ద గుండ్రాయిని చూడుడి," అని నిన్ను గూర్చి వారు ఆలాగు చెప్పవచ్చును. దాని విషయము నీవు చింతించ పనిలేదు. కామవికార పడుచు రాణిగా గల దానివైపు లోకము చూచునట్లు అది ఏదో అలంకరించుకొనినది, కాని అది ఆమె కలిగియుండలేదు. ఆమె దానిని ఎన్నడు కలిగియుండనేరదు. నిత్యముగా ఆమె తప్పిపోయినది. ఆమె నశించినది. గమనించితివా?

నీవు నీతియుక్తమైన ప్రవర్తనను సుశీలతను కలిగియున్నావు. అమె ఏదియు కలిగియుండలేదు. సశించు ఆత్మలను నరకములోనికి ఈడ్చుకొనిపోవు ఉచ్చులను కలిగియున్నది. గ్రుడ్డివాడు తిన్నగా అందులోనికి నడుచుచున్నాడు. నీవు విశేషమైనదేదో కలిగియున్నావు.

GEN 18:13•

GEN 19:24

 

140నీవు నీ సంఘ పుస్తకమునందు నీ పేరు కలిగియుండగ పోవచ్చును, అయితే ఈనాటి ప్రపంచము యెడల నున్న దేవుని ఉగ్రత నుండి నిన్ను తప్పించుటకు పట్టుకొనియున్నది, నీ యొక్క నీతిగల జీవితమే అని నీవు ఎరుగుము. లోకము దానిని నమ్మదు. పరిశుద్ధ గుండ్రాళ్ళు అని పిలువబడుచున్న స్త్రీలైన మీరు, ఎన్నిక లేని పురుషుడవైన నీవు ఏదియు ఎరుగవు, అయితే దీవారాత్రి మీ దేశము యొక్క పాపముల నిమిత్తము దేవునికి మొరపెట్టుము, ఆ దేవుని కోపము రగులు కొనకుండ ఆపుచేయువారు మీరై యుండగలరు. "పదిమంది నీతిమంతులను కనుగొనిన, నేను దానిని నాశనము చేయను." ఒకవేళ పది మందిని కనుగొనినయెడల.

"సాదోము దినములలో ఉన్న విధముగా అది ఉండును." నా భావమేమిటో చూచారా? "పదిమంది మెథోడిస్టులును నేను కనుగొనినయెడల; పదిమంది బాప్టిస్టులను నేను కనుగొనినయెడల; పదిమంది పెంతెకోస్తు వారిని నేను కనుగొనినయెడల; పదిమంది నాస్తికులను నేను కనుగొనినయెడల, పదిమంది పార్లమెంటు సభ్యులను నేను కనుగొనినయెడల; పదిమంది సేవకులను నేను కనుగొనినయెడల, అని కాదు." కాని, "పదిమంది నీతిమంతులను నేను కనుగొనినయెడల."

నీతిమంతుడు ఒక్కడే గలడు — ఆయన క్రీస్తే. ఆ పదిమందిలో క్రీస్తు జీవించుచుండెను. "నేను దానిని నాశనము చేయను."

GEN 18:15•

GEN 19:1,17

 

141అయితే కడపటి వర్తమానికుడు నశించినవారికి బోధించెను. ఆయన దానిలోనికి ప్రవేశించెను. ఏమి సంభవించినదని లేఖనము ఏమి చెప్పలేదు కాని, ఆ మరునాటి ప్రాతఃకాలమున అగ్ని కురిసేను. సరియే! ఆయన ఆ సూచక క్రియలు జరిగించిన తరువాత ఆయన తన ప్రవచనాత్మక పరిచర్య జరిగించిన వెంటనే, అగ్ని కురిసెను. "శారా ఎందుకు నవ్వెను?"

"నేను నవ్వలేదని" శారా చెప్పినది.

"అవును, నీవు నవ్వినావు," అని ఆయన చెప్పెను.

ఇప్పుడు, తరువాత వెంటనే ఆయన బబులోనులో లేదా సోదోములో ప్రవేశించెను. ఒక్క నీతిమంతుని వారిలో ఆయన చూడలేదు గనుక అగ్ని కురిసెను. లోతు అతని ఇద్దరు కుమార్తెలను ఆయన కనుగొనెను… ఇచ్చట నుండి వెలుపలికి వెంటనే వెళ్లుటకు ఆజ్ఞాపింపబడిరి. వారు వెలుపలికి వెళ్లిరి. ఆయన అందు ప్రవేశించెను. ఆయనకు ఇద్దరు దూతలను పంపెను అనునని జ్ఞాపకము చేసుకొనుడి. పిమ్మట ఆయనే స్వయముగా దానిలోనికి వెళ్లి, ఆ పట్టణపు వీధులలో ఏమేమి జరుగుచున్నవో చూచెను. అవన్నియు దేనితో నిండియున్నవి? ముఖములకు రంగులు పూసుకొనియున్న స్త్రీలతో నిండియున్న నశించినవారికి సందేశము వచ్చెను.

వారు ఏమి చేసిరి? ఆ సందేశము యెడల హస్యముతో నవ్విరి.

142ఈనాడు వారు ఏమి చేయుచున్నారు? — దానినే వారు చేయుచున్నారు. "నేను అసెంబ్లిస్ కు చెందినాను, నేను ఏకత్వానికి చెందినాను" అని చెప్పుకొనుచున్నారు. "దేవునికి మహిమ కలుగును గాక, నేను ఆత్మలో నాట్యమాడుచున్నాను. నేను భాషలతో మాట్లాడుచున్నాను…" ముందుకు పొమ్ము. "నేను అపేక్షించినయెడల, నా వెంట్రుకలు కత్తిరించుకొందును." "నేను దీనిని చేయుదును." "నేన పలానిది చెప్పుదును." "యేసు నామమున బాప్తిస్మము నేను పొందనవసరము లేదు. వారేది చెప్పినను నేను లక్ష్యపెట్టను. ఎలాగైతేనేమి పౌలు పురాతన స్త్రీలను ద్వేషించువాడు." మంచిది. ముందుకు పొమ్ము.

ఈ దినములలో ఒకనాడు, నీవు ఇంతకు ముందే చేయనియెడల, గీతను దాటిపోదువు! ఏది సరియైనదని నీవు యెరుగుదువో, అట్టిది చేయుటకు నీవు ఎన్నడు అపేక్షించలేవు. నేను ఏమి చెప్పితినో దానిని మీరు విన్నారా? అది ఒక విషయము… సహోదరా, సహోదరీ ఏది చెప్పబడెనో దానిని మీరు గుర్తించితిరా? ఆ కృపా సరిహద్దు గీతను నీవు దాటుదువు మరియు దానిని ఆ విధముగా చేయుటకు మీరు ఎన్నడూ కోరరు. మీరు ఇంకను సువార్తను విందురు. నిజమే, అయితే దానిని నీవు అంగీకరించవు, ఎన్నడూ దానిని నీవు స్వీకరించవు. కాని నశించినవారికి సువార్త ప్రకటింపబడును — వారు నిత్యముగా నశించినవారై; ఎన్నడూ వారు రక్షింపబడనేరరు. నీవు ఇంతకు ముందుగనే ఆ స్థలములో నున్నావు, మరియు నీవు దానిని ఎరుగవు. నీవు జీవించుచున్నావని అనుకొనినప్పుడు, నీవు సుఖభోగములందున్నావు అను తలంపు కలిగియుండగా నీవు మృతుడవైయున్నావు.

GEN 7:16

 

143ఆలకించుము. నాశనమునకు ముందు ఘడియ వర్తమానమును తిరస్కరించిన వారందరు — సువార్త మొదటిగా నశించినవారికి బోధింపబడెను, ముందుగా వారు వెళ్ళిరి, కృప లేకుండ.

నోవహు ద్వారము మూసేనను సాక్ష్యము. దేవుడు దార్వమును మూసెను. అతని మూడవ ఈడ్పు తరువాత. సోదోము యొక్క మూడవ ఈడ్పు తరువాత, ద్వారములు మూయబడినవి. ఇక కృప అనునది లేకపోయెను. పదిమంది నీతిమంతులైనను కనుగొనబడలేదు. రక్షింపబడుకుండునట్లు తప్పిపోయిన వారికి సువార్త ప్రకటింపబడెను, ఏలయనగా అది… ప్రతి కాలమందు ఆ విధముగా జరుగవలసియున్నది - న్యాయతీర్పునకు ముందు ప్రతి కాలములో వారికి పంపబడిన సందేశమును వారు నిరాకరించుదురు - అదే తీరున మరల వారు చేయుచున్నారా? ఆ నదికి దూరములో కనబడుచున్న అగ్నిస్తంభము అదియే కదా? ఆ సందేశములో ఆయన మాత్రమే యుండి స్త్రీలను ఖడించుచు, వారు ఉండవలసిన స్థానములను గూర్చి తెలియజేయుచు, అద్భుత సూచక క్రియల వలన రుజువు చేయబడిన దేవుని వాక్యము పై నిలచియుండుటకు బదులుగా, సంఘ శాఖతో ఏకీభవించిన సేవకులను గద్దించుచు, వాటిని జరిగించినవాడు ఆయనే అనియు, చదువులేని పామరుడైన ఒక పేద మనుష్యుడు కాదని స్పష్టముగా కనుపర్చుకొనలేదా? అది దేవుడే! ఇప్పుడు మనము మూడవ ఈడ్పునకు వచ్చితిమనియు, నిత్యముగా నశించిపోవుటకు తీర్పు విధింపబడినవారికి మూడవ ఈడ్పు పరిచర్య మరల మనము కలిగియుండలేదా?

144నేను పసిబాలుడుగా నున్నప్పుడు ఊహించలేని దూరమున నాకు చూపించిన దర్శనము కాదా ఇది? నేను పశ్చిమమునకు వెళ్లితిని, అచ్చట బంగారపు సిలువ యొక్క సువార్త ప్రకాశింపబడుచుండెను. మరియు పరలోకము నుండి సరిగా అటువలె సూచన బయలుపరచబడెను. నలుదిక్కుల కనబడు విస్తృత పిరమిడ్ వలే, ఆ సిలువ ఉండినట్లు కూడ నిర్మింపబడినట్లు జ్ఞప్తికి తెచ్చుకొనుచున్నాను. ఒకవేళ అది శిరస్సు భాగము ఎక్కడైతే అది ముగిసి మరియు ఇక్కడ ప్రారంభమై మరియు శిఖర భాగమునకు వచ్చెనా,

REV 5:7

 

145ఎలాగైతే లూధర్, వెస్లీ, పెంతికోస్తుతో ప్రారంభించబడి, ఫిరమిడ్ ఆకారముగా శిరస్సును పూర్తిచేయు స్థానమునకు వచ్చెను… శిరస్సు భాగమును పూర్తిచేయు రాతినిగలదై. అది అదే అయి యుండునా? అది అదే అయినయెడల, ఇప్పుడు మనము ఎక్కడ ఉన్నాము?

ఇది కావచ్చును… అది కాదు అని నేను ఆశిస్తున్నాను, కాని తప్పక ఇదే అయి యుండవలెను. అది జరుగబోవుచున్నది. సరిగా ఇప్పుడు వారు చేయుచున్న సేవను జ్ఞాపకము చేసికొనుము… వారి సేవ ఒకదాని ఒకటి చేర్చబడినట్లుగా ఉన్నది. అది ఆ విధముగా జరుగవలసినదే; దేవుడు మార్పులేనివాడు. దానిగూర్చి ఆలోచించుము. మీ ఆత్మీయ పండ్లతో మీ మనస్సాక్షిని కొరుకుము, అప్పుడు మనము ఎక్కడ ఉన్నామో కనుగొనుము. ఒకవేళ అది అదే అయితే, నీవు ఇంతవరకు ఎలా ఉన్నావో అలాగే నీవు ఉండియున్నయెడలనేమి. అప్పుడు నీవు నడచుచున్న… నీవు అంతమొందితివి. వెలుపల నున్నవారు, గొర్రెపిల్ల ముద్రలు వేయబడిన గ్రంథమును తీసికొనిన తర్వాత, ఆరవ ముద్ర విప్పబడి బయలుపరచెను మరియు అటువలె ఆ ముద్రలన్నియు విప్పబడినప్పుడు, అది ముగిసిపోయెను. అది జరుగవచ్చును. ఆలాగు జరుగదని నేను ఆశిస్తున్నాను; ఆ రీతిగానే జరుగవచ్చును.

మంచిది. ఇప్పుడు, అందుకోరకే ఈ మూడవ ఈడ్పు ఇంత ఆలస్యము చేయబడినదా?

146మొదటి ఈడ్పు, రెండవ ఈడ్పు ఒకదాని వెనుక మరొకటి దానిననుసరించి వెళ్లినవి అని గమనించుము. మొదటి ఈడ్పును నేను ప్రారంభించినప్పుడు, హృదయము యొక్క రహస్యములను నేను ఎరుగు సమయము వచ్చునని నేను చెప్పిన భవిష్యత్తును మీరు జ్ఞాపకము చేసుకొనుడి. మీలో ఎందరికి జ్ఞాపకమున్నది… చుట్టు ప్రక్కల నా కూడికలలో జరిగినవి మీరెల్లరు జ్ఞాపకము చేసికొనుడి. ఒకనాడు రాత్రి నేను రీజినా అను దానియందు ప్రవేశించి, ప్రసంగ వేదిక పైకి నడిచి వెళ్లితిని, అచ్చట సహోదరుడు బాక్సటర్, కొన్ని వేలమంది ప్రజలు ఉండిరి, ఒక మునుపష్యుడు ప్రసంగ వేదిక పైకి తిన్నగా నడుచుచు వచ్చెను, మరియు అది అచ్చట ఉండెను. అప్పటి నుండి అదే విధముగా అది ఉన్నది.

GEN 15:16•

2PET 3:9•

REV 12:5

 

147అయితే ఆ స్థలమును విడిచి సంవత్సరములైనవి, అనగా అయిదు సంవత్సరములు కావచ్చును. ఆ స్థలమును విడిచి… అది ఏమైయున్నది? ఇది ఏమి జరిగించినది? "దేవుని యొక్క దీర్ఘశాంతము." ఆదికాండమునందు ప్రారంభమందు కలిగియుండినట్లుగా అది ఎందుకు కలిగియున్నది. ఆయన ప్రపంచమును కలుగజేసినప్పుడు ఏడవ దినమందు ఆయన ఏమియు చేయలేదు అని గుర్తించుకొనుడి. ఆయన విశ్రమించెను. ఆ ఆరవ సంవత్సరమందు దేవుడు దీర్ఘశాంతము; ఎవరును నశించిపోకుండునట్లు, ప్రతివారును మారుమనస్సు పొందునట్లు కలిగియుండెను. దేవుడు దీర్ఘశాంతమును కలిగియుండెను.

మరియు ఆదికాండము 15:16లో (అది మీరు వ్రాయదలచిన యెడల అది 15:16) ఆయన అబ్రహాము అమోరీయుల దేశమందునప్పుడు, "అమోరీయుల అక్రమము ఇంకను సంపూర్ణము కాలేదు గనుక నాలుగవ తరము వారు ఇక్కడకు వచ్చెదరు" అని నిశ్చయముగా తెలిసికొనుమని అబ్రహాముతో చెప్పెను. అమోరీయులు వారు అన్యులు. ఇప్పుడు, "నేను ఇప్పుడు నిన్ను ఇచ్చటకు తీసికొనిపోవుట లేదు, ఎందుకనగా అన్యులైన అమోరీయుల అక్రమము ఇంకను సంపూర్ణము కాలేదు, అయితే నేను వారికి తీర్పు చేయుదును. నేను నీ యొక్క నాలుగవ తరమున వచ్చెదను, ఆ దేశమునకు ఇనుప దండముతో తీర్పు చేసెదను."

అది సరియేనా?

HEB 13:8

 

148దేవుని దీర్ఘశాంతి ఇంతగా సహనము కలిగియున్నదా - అదే సేవ ఎడతెగకుండ టేపుల మూలముగాను మరియు ఇతరమైన వాటి ద్వారాను, ప్రపంచమందంతట మరొకరెవరైన రక్షింపబడుటకు ఉండినవానిని కనుగొనుటకు వ్యాపింపబడుచున్నది; అయితే బహుశ ఇటీవల లోపలికి కడపటిగా వచ్చిన వ్యక్తివలె ఉండవచ్చును. ఆ అక్రమము అంత దీర్ఘకాలమును కలిగియుండునా? (హెబ్రీ 13:8) ప్రకారము, యేసు ఒకేరీతిగా నున్న యెడల, ఆయన వర్తమానము అదే రీతిగా నుండును; ఆయన చేయు కార్యమును అదే రీతిగా నుండును.

149మొదటి మరియు రెండవ ఈడ్పు విషయము ఎలాంటి ప్రశ్న లేనియెడల… మొదటి, రెండవ ఈడ్పును గూర్చి మీ మనస్సునందు ఏదైన ప్రశ్న ఉన్నదా? ఆయన చెప్పినట్లుగా అది నెరవేరుచు వచ్చెనా? అలాగైతే మూడవ ఈడ్పు విషయము ఎందుకు ప్రశ్నించాలి? మీరు ఎందుకు ప్రశ్నించాలి… మొదటి రెండును లేఖనముల వలన రుజువు చేయబడినవి. ఈ ఉదయ కాలమున మూడవది కూడ మీకు నేను లేఖనములతో పోల్చి తెలియజేసితిని. అది ఎక్కడ ఉన్నదో ఒకమారు లోకము వైపు చూడుము. ప్రవచన భాగము నెరవేరునట్లు - సత్యమును వారు ఎట్లు నిరాకరించిరి మరియు ఎట్లు దానిని లేఖనము సరిగా నిరూపించెనో చూడుము. ఇప్పుడు మనము ఎక్కడ ఉన్నాము? ఓ, దేవా, దయ చూపించుము. నా అంతరంగమందు హృదయము రక్తము కారునట్లు అది చేయుచున్నది. దాని విషయమేమి? ఇప్పుడు మనమెక్కడ ఉన్నాము?

150అప్పుడు ఉన్న ఏడు పర్వత శిఖరములను జ్ఞాపకముంచుకొనుము, (అవి మీకు చెప్పును). వాని వెనుక వేరొక పర్వత శిఖరము లేదు, అది భూభాగ ఖండమును విభజించు స్థానమునందు ఉన్నది. అచ్చట నుండి అది తిన్నగా ఎడారి భాగమునందుగా పోవుచున్నది — నిత్యత్వము స్థిరపరచబడుచున్నది. ఏడు శిఖరములు, నేరుగా భూఖండమును భాగించు స్థలము నందు ఉన్నవి. అది నేరుగా మంచి మరియు చెడ్డల మధ్య ఉన్నది. దానియొక్క అంతమందు, మూడవ ఈడ్పు కలిగి ఉండి, ఆ పర్వత శ్రేణిని ఆఖరి ఈడ్పుగా ముగించునదై ఉన్నది. అది సరియేనా?

మంచిది.

GEN 7:4

 

151నోవహు లోపల ప్రవేశించెను, ఏడు దినములు జరిగిపోయినవి. కాని, ఏమియు సంభవించలేదు. ఏడు దినములకు తర్వాత తీర్పు వచ్చినది. ముగించబోవు ఈ సమయమునందు, ఆలకించుడి. నోవహు కాలములో మాత్రమే వారు దాని గురుతును ఎరిగియుండినయెడల - (నేను ఇప్పుడు ముగించబోవుచున్నాను.) ఆ దినమందలి లోకము, కొంత సమయమునకు ముందు చదివిన లేఖనభాగము వలన దేవుడు రుజువు చేసిన ప్రకారము, ఆయన వారిని నాశనము చేసెను. వారికి దయ చూపకుండ నాశనము చేయలేదు.

వారికి ప్రవక్త ద్వారా ఆయన తన కనికరమును పంపెను. వారు దానిని నమ్మలేదు. దేవుడు దయగలవాడు గనుక వారికి తన దయను ఆయన పంపెను, కాని దానిని వారు స్వీకరించలేదు. మొదటిగా ఆయన ఎల్లప్పుడు తన దయను పంపును. కడపరి కాలమునకు గల గురుతు అని ఆ గురుతును వారు ఎరుగకుండినయెడల నేమి? మరియు వారు దానినంతటిని ఒక్కసారిగా చూచిరి, రక్షణ ద్వారము మూయబడెను… ఎవరు కూడ… మొదటిది ఏమనగా ద్వారము మూయబడినదని మీరెరుగుదురు. వారు ఎరుగవలసియుండినవారైన.. ఆ గురుతును ఎరిగినవాడు ఒక్కడు మాత్రమే, అతడు నోవహు, మరియు అతని అనుసరించువారు, వారు ఒక్కరు మాత్రమే దానిని ఎరిగినవారు. ఆ ఓడ యొక్క ద్వారము తలుపులు మూయబడినప్పుడు, నోవహు ఎరిగెను. రక్షణ సమయము సమాప్తమాయెనని నోవహు ఏరిగెను. అతడు దానిని ఎరిగియున్నాడు. అది వాస్తవము. వారు కేవలము ఆ గురుతును ఎరిగియుండినయెడల. ఓ, వారు ఆ కడవరి కాలపు గురుతును మాత్రము ఎరిగియుండినయెడల.

152ఆ వచ్చుచున్న (ఆయన) ఒకడు అచ్చట అబ్రహాముతో ఉండెనని వారు చూచినప్పుడు ఆనాటి అధునిక బిల్లీగ్రాము తాను ఓరల్ రాబర్టు సొదొము లోనికి వెళ్లిరి; వార వర్తమానము ఉపదేశించిరి, అది ఆ ప్రజలను గ్రుడ్డివారినిగా చేసినది. ఆనాటి మేధోడిస్టు అను పురాతన నీతిమంతులును, బాప్టిస్టులును - ఆనాటి వారి అక్రమమైన క్రియలను బట్టి లోతు తన నీతిగల హృదయమును దినదినమును నొప్పించు కొనుచుండెనను, గురుతును వారు కలిగియుండెనని వారు ఎరిగియుండిన యెడల మాత్రాననేమి.

మెథడిస్టు, బాప్టిస్టులు దేనిలోనికి మరలిరి? - లోతు చేసినట్లుగా, అదే చేయుదురు. కాని నీతిమంతులు అందుండి బయటకు వచ్చెదరు. తప్పనిసరిగా బిల్లీగ్రామే అందులోనికి వెళ్లినప్పుడు, ఆ విధముగా చేసినయెడల ఏమి కాగలదు.. ఆ తీర్మానము కొరకు చూవింగ్ గమ్ను నములుచు, నెమరవేయుచు, ఒకరితో ఒకరు పరిహాసము చేయుచు, నవ్వులాడుచు ముఖములకు రంగులు పూసికొని, ఏలాటి పరివర్తన (మార్పు) లేకుండా ప్రవర్తించుచున్నారు. మరునాడు బిల్లీ తిరిగి వచ్చి - 30,000 మందిని నేను పొందితిని, అని చెప్పెను. మరల ఒక సంవత్సరమునకు తిరిగి అచ్చటకు వచ్చి చూచిన, 30 మంది కూడ అచ్చట లేకున్నారు. "నేను నరకమునకు పోవుట లేదు, నేను పరలోకమునకు వెళ్ళుచున్నాను" అని నేను నిశ్చయము చేసికొంటిని.

గమనించితివా? పాపము నందు తిన్నగా చొరబడిపోయి అందుండి బయటకు రాలేని స్థితిలో ఉన్నారు.

MATT 23:37•

LUKE 13:34

 

153అదే సమయములో సువార్త శక్తితోను, సూచనలతోను, అద్భుత కార్యములతో అగ్నిస్తంభమును కలిగి ప్రకటింపబడెను, ప్రవచింపబడిన విధముగా అన్నియు సరిగా చెప్పబడిన రీతిగా జరుగుచుండెను … "పరిశుద్దుల గుండ్రాళ్ళ గుంపు అని హేళనగాను, మనస్సులను చదువుట గురించి చెప్పుటయే యున్నదనియు, ఏదో ఒక విధమైన మంత్ర ప్రయోగపు ఆత్మ వలన, దయ్యము వలన చేయుచున్నాడు అవి అన్నియు. అది అంతయు అంతే. మీరు నమ్మరా? అవి మన సంఘ సంస్థలో లేవు. వాటిని నమ్మకండి. దానితో మనకు ఏమి సంబంధము లేదని," వారు చెప్పిరి.

వారు ఆ సూచన మాత్రము ఎరిగియుండిన వారు దానిని ఎరిగియుండిన యెడల… "యెరూషలేమా! నీవు నీ దినమును ఎరిగినయెడల, నీవు నీ దినమును గుర్తించినట్లైతే, కానీ ఇప్పుడైతే నీ విషయము నీకు వదిలి పెట్టబడినది. నీవు కేవలము…" అని యేసు చెప్పెను… "ఓ, యెరూషలేమా, యెరూషలేమా, కోడి తన పిల్లలను రెక్కల క్రింద చేర్చునట్లు రాబోవు తీర్పు నుండి తప్పించుకొనుటకు నేను మిమ్మును చేర్చుకొంటిని, కానీ మీరు మీ దినమును గుర్తించరైతిరి. నీవు నీ దినమును ఎరిగియుండిన యెడల, ప్రవక్తలను, నీతిమంతులను రాళ్ళతో కొట్టి చంపియుండెడి దానవు కావు. మీరు లేఖనములందు నిలచియుండి, దానిని గుర్తెరిగినయెడల, నా రాకడ నీ అసత్యమునకు సూచన అని మీరెరుగుదురు. ఇప్పుడైతే మీరు గ్రుడ్డివారైయున్నారు. ఇప్పుడు, నీ సమయము గతించిపోయినది నీవు తిరస్కరించబడితివని," యేసు చెప్పెను. మరియు అది అదే. అది సరియే. నీవు కేవలము నీ సమయము గుర్తించినయెడల.

MATT 24:37,38•

LUKE 17:26,27

 

154గమనించుము, యేసు ఆ విధముగా బయలుపరచిన సమయమందు లోకమైతే ఎప్పటి మోస్తరు వెళ్ళుచుండెను. లోకము ఎప్పటివలెనే వెళ్ళుచుండెను. ఎందుకు? వారి సమయమును వారు గుర్తించరైరి. నోవహు ఓడలోనికి ప్రవేశించినప్పుడు, లోకము ఏ స్థితియందు నడుచుచుండెనో, అదే, సరిగా ఈనాడును, ఈనాటి లోకమును జరిగించుచున్నది. ఆనాటి అపహాసకులు, కామవిహార సమ్మేళనములు జరిగించిరి. ఈనాడు జరిగించుచుండినట్లుగా వారు తినుచు, త్రాగుచు, పెండ్లాడుచు, తనకు ఇష్టము వచ్చినట్లుగా పనులు చేయుచుండిరి. యధావిధిగా జరిగినట్లుగానే ఈడును సరిగా అదే జరుగుచున్నది. ఓ, పురాతన పరిశుద్ద గుండ్రాయి -ద్వారము మూసేనని చెప్పుదురు. అలాంటిది మీరు ఎప్పుడైన విన్నారా? అకడు ఏమి చెప్పుచున్నాడో మీరు ఎరుగుదురా? మనమంతా మునిగి చచ్చెదమని చెప్పుచున్నాడు. అది బుద్దిహీనత. నీరు ఎక్కడ ఉన్నవి?

"నోవహు దినములందున్న అపహాసకులు ఉండినట్లుగా మనుష్యకుమారుని రాకడలోను ఉండెదరు." మంచిది, నోవహు ఆ సూచనను తెలిసికొనియుండెను. లోతు దినములలోను అదే జరిగెను. యేసు దినములలోను అదే జరిగేను, గనుక ఈనాడును అదే జరుగును. సోదొములో జరిగినట్లుగా - అపహస్యము ఈ కడసరి దినములయందును జరుగును. అచ్చట వర్తమానికుడు నిలబడి ఉన్నాడని వారు ఎన్నడు ఎరుగలేదు… ఆ సందేశము దేవుని యొద్ద నుండి వచ్చినది. వారు వారియెడల పరిహాసము చేయుచు, తమ క్రియల (ప్రవర్తన) ద్వారా ఆక్రమము జరిగించుటకు ప్రయత్నించిరి. అది సరియేనా? "మాలో ఒక్కరుగా నుండుటకు మాతో కూడ చేరుటకు రండి." అది సరి కాదా? రండి, మాతో వచ్చి చేరిన, మాలోను, ఈ బాలురులోను ఒకరుగా ఉండగలరు. రండి, మాతో చేరండి.

వారి యొక్క సూచనను వారు ఏ మాత్రము యెరుగరు.

MATT 23:37•

LUKE 13:34

 

155ఈ వర్తమానము వారి ముఖము యెదుట ప్రకటింపబడుచున్నప్పుడు వారు దానిని గుర్తించరైరి… దేవుని యొక్క కోపము అగ్నిని, న్యాయతీర్పును వారు చూడలేకపోయిరి, గంధకపు అగ్ని కణముల జ్వాలలు ఆకాశమందు రగులుకొని మండుచున్నవి. అయితే దానిని వారు చూడలేకపోయిరి. వర్తమానికులు దానిని చూడకలిగెను, లోతు కూడ దానిని తెలిసికొనెను. ఆకాశమందు అవి సిద్దముగా నున్నట్లు అతడు ఎరిగియుండెను. వాస్తవముగా అదే ఈనాడును అటువలె నున్నది. సరిగ్గా అదే జరుగుచున్నది. కోపము రగులు కొనుచున్నది; అణుబాంబులు ఆకాశమందు వేలాడబడుచున్నవి. ప్రతిదియు అంతమునకు వచ్చి నిలిచియున్నవి. అదే ఈనాడును జరుగును.

ప్రజలను చూడుడి. మీరు ఎరుగుదురా … "బ్రెన్హాం సహోదరుడా, ఓ, దాని అంతటి విషయమేమి?" అని మీరు అడుగుచున్నారు. యధాప్రకారము చేయుచుండినట్లు ప్రజలు సువార్తను ప్రకటించుటకు పోవుచుందురు; వారు అది సువార్త అని చెప్పుచుందురు. దాని సమయము చేయి దాటిపోయినది. నోవహు దినములలో వారు అట్లు చేసిరి. లోతు దినములలో వారు అట్లు చేసిరి. యేసు దినములలో అట్లు చేసిరి. అది సరియేనా? యేసు యూదులకును దేవుని ఉగ్రతను గూర్చి చెప్పెను… "మీ సమయము చేయిదాటి పోయినది; మీ అంతము నిర్ణయింపబడెను."

"ఆ పరిశుద్ధ గుండ్రాయి అని పరిహాసము చేయుచుండిరి. వీడు ఏ పాఠశాల నుండి వచ్చెను? వీడు ఎక్కడ నుండి వచ్చెను…" అని చెప్పుదురని ఆయన చెప్పేను.

ఆయన తన మూడవ ఈడ్పు పరిచర్య కలిగియున్నాడని జ్ఞాపకము చేసికొనుము. అది నిజము. "ఎన్నో మారులు మిమ్మును చేర్చుకొనవలెనని అపేక్షించితిని" అని ఆయన చెప్పెను.

156లోతునకు దూత ద్వారా ఆఖరిగా పంపబడిన పిలుపు, అతడు ఏమైయుండినను ఈ దినము కొరకు దేవుడు సంధించునట్లు దేవుడు మానవ శరీరమందు తన్ను ప్రత్యక్షపరచుకొనిన సూచనగా కనుపరచి ఆఖరి కార్యమును జరిగించెను. అప్పుడు ఈ కార్యములన్నియు జరిగిపోయినవి.

నోవహు తన ఆఖరి సందేశమును ప్రకటించెను. అతని వెనుకనున్న ద్వారము మూయబడెను. అంత మాత్రము జరిగెను. దానిని చూచి అపహాసముతో నవ్విరి, దానిని గూర్చి హాస్యము చేసిరి. ఆలోచించుము. బోధించుటకు ఇంకను ప్రజలు పోవుచున్నారు. సంఘముల యొక్క సమాఖ్యలన్నియు కథోలిక్ సంఘముతో తాము వాగ్దానము చేసినట్లు చేరగలరు. సంఘ సంస్థలన్నియు ఏకముగా కూడి రాగలవు. కాని మృగము యొక్క ముద్ర అచ్చట సిద్ధముగా నున్నది. ఆ ముద్రను వారెల్లరు కలిగియుందురు. అప్పుడు వారు - "ఓ, హల్లేలూయా, దేవునికి స్తోత్రము. గత రాత్రి అనేక మంది రక్షింపబడిరి" అని చెప్పుచుందురు. దానిని వారు చేసిరా?

"ఆత్మలో వారు నాట్యమాడిరి, వారు భాషలు మాటలాడిరి." వాటన్నిటిని బట్టి ఏ ఒక్కటి కూడ అర్ధసహితముగా లేదు.

"ఓ, వారు విధేయులు, సాధువులు, తగ్గింపు స్వభావము గలవారు. అవును, అయ్యా, వారు ఆత్మమ ఫలమును పొందియున్నారు."

అది సూచన కాదు. ఏ మాత్రము కాదు. ఆత్మీయ ఫలము యేసునకు పరిసయ్యులకును మధ్యగల దాని గూర్చి మీతో నన్ను చెప్పనివ్వడి. గమనించుడి ఏ ఒక్కరు ఆత్మ ఫలమును కలిగియున్నారో చూడుడి. కొంత సమయమునకు వెనుక క్రీస్తునకు విరోధముగా చెప్పుచు నేను ప్రారంభించిన దానివలె నేను నిలువబడినయెడల నేమి? ఆ విధముగా నేను చెప్పుటను కూడ దేవుడు నన్ను క్షమించును గాక, అయితే ఏదైన ఒక విషయమును మీకు చూపించుటకు అట్లు మాట్లాడితిని.

157నేను మీ యొద్దకు వచ్చి - "మీ స్నేహితుడు ఎవరు చెప్పండి? అని మీ సమాజమును అడిగినయెడల నేమి. ఎవరు ఆత్మ ఫలమును చూపించెదరు? మీ పురాతన దయగల మతగురువే. మీరు ఆనారోగ్యముగా నున్నప్పుడు ఆసుపత్రిలోనికి నీ యొద్దకు ఎవరు వచ్చెదరు? మీ యొక్క పురాతన సాధువైన మతగురువు. అది వాస్తవము. మీరు కష్టపరిస్థితిలో వున్నప్పుడు, మీకు అప్పుగా పైస నిచ్చి ఎల్లప్పుడు ఆదుకొనువాడెవడు? మీరు అతని సమాజములో సభ్యులుగా నున్నారు, ఆ విధముగా అప్పుగా ధనము నిచ్చి ఆదుకొను ఫాదిరి నొద్దకు మీరు వెళ్లుటకు అపేక్షించుదురు, కారా?

మిమ్మును ఎల్లప్పుడు ప్రేమించుచు, దయచూపుచు, ఆత్మ ఫలమును చూపించువారెవరు? మీ యొక్క పురాతన దయగల ఫాదిరి. సమాజ మందిరములో సంవత్సరాల తరబడి చదివినవారెవరు, అతడి ముత్తాత, ముత్తాత, ముత్తాత, ముత్తాత, తాత ఎక్కడ నుండి వచ్చెను?వాక్యమును తెలిసికొనుటకు వాని జీవితమంతటిలో చదివి, ఎక్కవ శ్రమపడి డాక్టర్ పదవిని - పిహెచ్.డిలు మరియు ఎల్.ఎల్.డిలు అను పట్టములను కలిగి ఇచ్చట నిలువబడి ప్రతి ఆదివారము ప్రొద్దున తన సమాజమునకు అందించువాడెవడు? మీ యొక్క పురాతన దయగల మతగురువే."

MATT 15:14•

MATT 21:12•

MATT 23:33•

MARK 11:15•

JOHN 2:15•

GAL 5:22,23

 

158"'యేసు' అని పిలువబడు ఈ తిరుగుబాటుదారుడు ఎవరు? ఏ పాఠశాల నుండి అతడు వచ్చెను? ఏ పాఠశాల నుండి అతడు బయటకు వచ్చెను? ఆయన సహవాస సంబంధమును గూర్చి తెలియుజేయు పత్రము ఎక్కడ? ఏ సంఘ సంస్థకు ఆయన చెందియున్నాడు? కుటుంబ జీవితమును గూర్చి మీరెల్లరు వాదము కలిగియున్నప్పుడు, ఆయన ఏమి చేయును? మీ యొద్దకు ఎవరు వచ్చుచున్నారు? మీ యొక్క పురాతన దయగల మత గురువే. వారు ప్రయత్నించెదరు… మీరు మీ పొరుగువారితో ఇచ్చట విరోధముగా వివాదములు కలిగియుండగా, మీ పురాతన దయగల మత గురువు వచ్చుచున్నాడు, మిమ్మును సరిచేయుచున్నాడు. మీరందరు దేవుని పిల్లలు, మీరు ఆ విధమగా చేయకూడదని" చెప్పెను.

"అతడు చేయునది అది … ఈ నజరేయుడైన యేసు ఏమి చేయుచున్నాడు? వాటి విషయము చీల్చివేయుచున్నాడు. ఆయన ఏమి చేయుచున్నాడు? మీ యొక్క సంఘ సంస్థను జల్లించుచున్నాడు. ఆయన ఏమి చేయుచున్నాడు? "గుడ్డివారిని నడుపు గ్రుడ్డివాడు" అని మీ మతగురువులను పిలుచుచున్నాడు. "గడ్డిలో నున్న పాము" అని ఆయన వానిని పిలుచుచున్నాడు. దేవుడు అభిషేకించిన బలి అర్పణలు తీసికొని, అందున్న వ్యాపారము చేయుచున్న పిల్లలను త్రవ్వి, పడద్రోసి ధనమును పారవేసెను, ఆయన కోపముతో వారి నెల్లరిని కలయజూచెను. మీ మతగురువు ఎప్పుడైన ఈ రీతిగా చేయుట మీరు చూచితిరా? అలాగైన, ఇప్పుడు ఆత్మీయ ఫలమేది?"

2COR 3:2

 

159భాషలతో మాటల వలన కాదు, ఆత్మ యందు నాట్యమాడుట కాదు. ఒక సంఘములో చేరుట వలన కాదు, ఆత్మీయ ఫలము వలన కాదు; (క్రిష్టియన్ సైన్సు మిమ్మును దేనికైనను నమ్మునట్లు చేయగలను, యేసు క్రీస్తు దైవత్వమును కూడ కాదనుచున్నది) అది ఏది కాదు - కాని వాక్యము జీవించుట వలన ఉన్నది అది. అది అలాగున్నది. అయన మెస్సియా అనియు, ఆయన జీవించు వాక్యమైయున్నాడు, ఆ వాక్యము ప్రత్యక్షపరచబడెనని మాత్రము వారు చూడవలసియుండెను. ఏ ఒక్క పురుషుడు లేదా స్త్రీ దేవుని ఆత్మను పొందియుండిన - ఆ వాక్యము వారియందు తప్పక జీవించును. అదియే వారి హృదయమందలి గుండెకొట్టుకొనుటయై ఉన్నది, ముందుగా ఏర్పరచుకొనిన వారు. ప్రభువు వాక్యము వారి యొద్దకు వచ్చును. వారు ప్రజలకు వాక్యమై ఉన్నారు. ప్రతివారు చదువుటకై వ్రాయబడిన పత్రికలైయున్నారు. అది సరియేనా? మూడవ ఈడ్పుగా అది నుండును గదా?

GEN 7:7•

REV 5:7

 

160టేపు ప్రజలైన మీరు, టేపును వినుచున్న ప్రజలు ఈ సమయమున మీరు ఈ సమాజమును చూడవలేనని ఆపేక్షించుచున్నాను. అదే విధముగా మీరును అనుభూతి కలిగియున్నారని నేను నిరీక్షించుచున్నాను. ఆలాగు అది ఉండినయెడల నేమి? ఇక్కడ ఒక దానిపై ఒకటిగా ఉంచబడిన లేఖనమును చూచితిని. అదేమై ఉండగలదా? నిత్యము నశించినవారికి ఈ మూడవ ఈడ్పు సందేశము ప్రకటింపబడుచున్నది ఆ రక్షణ సందేశమును వారు నిరాకరించిరా? "మంచిది, సంఘము పోవుచున్నది…" అని నీవు చెప్పుచున్నావు.

వారెల్లరు అదే మార్గమున పోవుచున్నారు. అవును వారు అదే అనుసరించుచున్నారు. అయితే, ఈ సమయమందంతట నోవహు ఓడలో ఉండెను అని జ్ఞాపకము చేసికొనుము. క్రీస్తునందు వధువు ముద్రింపబడియున్నది. ఆఖరిగా చెప్పబడినవాడు విమోచింపబడవలెను. ఆరవ ముద్ర దానికది ఉత్పత్తి చేసెను. ఏడవ ముద్ర ఆయనను భూమి మీదికి తీసికొనివచ్చును. ఆ గొర్రెపిల్ల వచ్చి సింహాసనమందు కూర్చుండియున్న ఆయన కుడి చేతిలో ఉన్న గ్రంథమును తీసికొనెను - ఎవరినైతే ఆయన విమోచించేనో వారిని తన స్వంత సొత్తుగా కలిగియుండుటకు స్వామ్యాధికారపు హక్కును పొందుకొనెను. అది సరియేనా? మూడవ ఈడ్పు ఎల్లప్పుడును అదే తీరున ఉండును.

LUKE 17:28

 

161మూడు అనునది పరిపూర్ణత అయియున్నది. క్రీస్తు మరల స్వాభావిక మానవుల మధ్య తెలియపరచుకొనినప్పుడు, సేవ దాని సంపూర్ణతకు రాగలదు. "లోతు దినములలో వలె ఉండినట్లు" అని ప్రవచించిన రీతిగా, ఆలోచించుము. ప్రజలు రక్షింపబడుదురను ఉద్దేశ్యముతో బోధించుటకు వెళ్లుచున్నారు. వారు చేయుచున్నది సరియే అనియు మరియు వారి సంఘ సంస్థలు వృద్ధి చెందుచున్నవని నమ్ముచున్నారు. తప్పని సరిగా ఏ మాత్రము నిరీక్షణ లేదు. మరియు ఆ దర్శనము అలాంటిదైనయెడల, అది స్త్రీలకు బహు కఠినమైనది. మనము ఆ ఘడియకు వచ్చితిమి. తలుపు మూయబడెను. ముగిసిపోయెను. ఆ గ్రంథము ఇంతకు ముందే ఆయన హస్తమునందు ఉన్నది. దాని విషయము ఆలోచించుము.

162ఇప్పుడు ముగించుటకు ముందు, దీనిని సరిగా చెప్పనియ్యుడి. నేను ముగించుచున్నాను. నీటి ప్రమాదమును ఎదుర్కొను ఐర్లాండు విషయము చెప్పబడినది. ఆ నీటి ఒడ్డున నీటిలో మునిగియుండు జాతి గట్టుగలదు, దానిపై ఒక గొప్ప తిన్న కలదు, ఆ నీటి పోటుపోటు అలల ప్రవాహము సమయమున ఒక వ్యక్తి దాని మార్గమున పోవుచుండెను. ఈ అలల పోటుపాటు ఎరిగిన ఒక ఉదార స్వభావము గల వ్యక్తి ఆ చిన్న కొండపై నివసించుచుండెను. ఆ అలల పోటుపాటు దినములో ఎప్పుడు సంభవించునో అతడు ఆ సమయమును యెరుగును. ఈ నడుచుచూ ఆ మార్గమున పోవుచున్న వ్యక్తి ఆ సమయమును గూర్చి అజాగ్రత్త వహించెను. ఎందుకనగా అతడు "అంతా తెలుసు" అని చెప్పుచున్న విర్రవీగు గుంపునకు చెందినవాడు.

అతడు తన స్వంత ఉద్దేశ్యములనే పాటించువాడు. అతడు మంచి సౌష్టవముగా ఉన్నవాడు; నీతైనవాడు, బుద్దిశీలయైనవాడు; అయితే ఆ అలల యొక్క పోటుపాటు ప్రవాహము వచ్చు సమయము అతడు ఎరుగడు. అతడు ఆ దేశమును ఎరుగడు. చంద్రుడు (అస్తమించు) మునిగి పోవు లేదా భూమి వెనుక భాగమునకు మళ్లునప్పుడు ఆ అలల పోటుపాటు ప్రవాహమునకు సూచనగా నున్న సమయమని అతడెరుగడు.

GEN 1:2

 

163దేవుడు ఎప్పుడు తన ఆత్మను భూమి నుండి తొలిగించునో, సహోదరుడా, అప్పుడు అది ముగిసిపోయెను. అది అంతయు జరిగిపోయెను. ఆ చంద్రుడు ఎప్పుడైన తన స్థానము నుండి తొలగిపోయినయెడల ఆదికాండము 1వ అధ్యాయములో దేవుడు ప్రారంభించినప్పుడు నీరు భూమిని కమ్మినట్లుగా జరుగును. అయితే, చంద్రుడు అచ్చట అస్తమించు సమయమున, దాని ముఖము భూమి మరొక భాగమునకు త్రిప్పుకొనినప్పుడు, ఆ అలల ప్రవాహము పై బడునట్లుగా పరిగెత్తి వచ్చుచుండును. ఆ ఉదార బుద్దిగల పురాతన మనుష్యుడు దాని సమక్షమున నివసించుచుండిన వ్యక్తి దాని సమయమును యెరుగును. ఈ పడుచువాడైతే దాని విషయము నెరుగడు. దాని విషయము అతడు ఎప్పుడు నేర్చుకొనియుండలేదు. దాని విషయము అతడు ఏ మాత్రము శ్రద్ద కలిగియుండలేదు. ఈ ఉదార బుద్దిగల వృద్ధుడు పరుగెత్తుకొని వెళ్లి - "నా ప్రియ మానవుడా, ఇంకా ముందుకు సాగిపోవుటకు సాహసించకుము. వెంటనే వెనుకకు మరలి రమ్ము. అక్కడ ఒక గోడ ఉన్నది. ఆ గోడను నీవు ఎక్కలేవు. నీవు నశించిపోవుదువు. దాని సూచనలు అచ్చట నున్నవి. ఆ పోటు పొటుతో వచ్చు అలల ప్రవాహము నిన్ను లోపలికి ఈడ్చుకొని పోవును. మరియు నీవు తిరిగి రాలేవు. ఎంత మాత్రము ముందుకు పోవద్దు" అని చెప్పెను.

ఆ యవ్వనుడు చుట్టూ కలయ చూచి, అతనిని హేళన చేయునట్లుగా నవ్వెను. "నీవు వెళ్లి, నీ పని చూచుకోవయ్యా, నేను ఏమి చేయాల్లో ఏమి చేయకూడదో నాకు తెలుసు," అని ఆ పడుచువాడు చెప్పెను. ఆ అలల ప్రవాహము అతనిని లోపలికి ఈడ్చుకొని పొయినది.

164మనము తలంచులో ఆలస్యము కావచ్చును. అది నిన్ను చిక్కించుకొనును. ఏ మాత్రము ముందుకు పోవద్దు. ప్రజలారా, దానిని చేయకండి. దేవుని సేవకుడని మీరు ఎల్లప్పుడు నన్ను నమ్మినయెడల, ఈ ఉదయకాలమందు నా మాటను స్వీకరించుడి. నీవు దానిని ఎప్పుడైన చేయదలచిన యెడల, అది ఇప్పటికే చాలా అలస్యమైయుండ వచ్చును. అనేక లేఖనములు దాని విషయము చూపించుచున్నవి. ఆ విధముగా అది ఉన్నదని నేను చెప్పుట లేదు అని జ్ఞాపకముంచుకొనుము. నాకు తెలియదు, కాని నీవు నిదానించి చూడుము. ఇచ్చట పది పేజీలు తగ్గించితిని, ఏలయనగా వాటిని చెప్పుటకు భయపడితిని. శ్రీమతి. వూడ్ దానిని వ్రాసి పెట్టినది మరియు శ్రీ. పూడ్ కూడ నుండెను. నేను ఈ ఉదయ కాలమున వారిని చూడ వెళ్లునప్పుడు, "ఇంత వరకు గల లేఖనములను వారితో ఉంచితిని, ఏలయనగా వీటిని వారితో చెప్పలేను అవి టేపు చేయబడబోవుచున్నవని" చెప్పితిని.

అది ప్రజల యొద్దకు పోవును, ఈ వర్తమానమునకు నవ్వెదరు. అది సరియే. ఈ దినములలో ఒక దినము అది త్వరగా తిరిగి రాగలదు. సాగిపోవుడి. ఒక సంఘమునకు సభ్యుడవుగా మాత్రము ఉండుము. మీ వెంట్రుకలు కురచగా కత్తిరించుకొనుడి, మీ ముఖములకు రంగులు వేసికొని సాగిపొండి. ముగ్గురు దేవుళ్లునగా చేసికొని అన్యులుగా నుండునట్లు, మీ కిష్టమైనయెడల తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ముగ్గురు దేవుళ్లను కలిగియుండుడి. మీ యొక్క సంఘ సంస్థకు కట్టుబడియుండుటకు వెళ్ళుడి. మీరు అపేక్షించినయెడల, ఆ రీతిగానే చేయుడి. "నేను ఆత్మలో నాట్యమాడుచున్నాను, నేను భాషలు మాటలాడుచున్నాను. నేను దానిని కలిగియున్నారని," మీరు చెప్పుచున్నారు.

165దయ్యములును అట్టి వాటినే చేయుట నేను చూచియుంటిని. మంత్రవాదులు భాషలు మాటలాడుటను, దాని అర్థము చెప్పుటను, వాటిని అన్యభాషలో వ్రాయుటను, వాటిని విప్పిచెప్పుటను; మానవ కపాల పుట్టియందు రక్తము త్రాగుటయు, ఆ దయ్యములను పిలుచుటయు, ఆత్మలో నాట్యమాడుటయు నేను చూచితిని. మహమ్మదీయులు ఆత్మలో చీల్చబడిన కట్టబద్దను తీసికొని తమ వేళ్ళ క్రింద వాటిని తిప్పుచున్నంత వరకు నాట్యమాడుదురు మరియు ఈటెలను తమ ముఖముల గుండా ఆవలి వైపునకు బైటకు వచ్చునంతవరకు లాగుదురు కాని ఒక రక్త బిందువు బయటకు రాదు, మరియు ఇండియన్సు మూడు అడుగుల లోతును, మూడు లేదా నాలుగు అడుగుల వెడల్పును కలిగి గాలిచేత బొగ్గు అగ్నికణములు తెల్లని వర్ణముతో మండుచున్న అగ్నిలో నడుచుచుందురు. వారి పాదములు ఏదైన కాలినట్లు ఒక మచ్చయైన కనబడదు. అయితే యేసుక్రీస్తు అనునట్టిది ఒకటి కలదు అను దానిని వారు లేదందురు.

JOHN 1:1

 

166కాదు, కాదు, స్నేహితులారా. దానిని గూర్చి వాక్యము తెలియజేయుచున్నది. ప్రజలు మరియు వాక్యము ఒకటిగా ఉండవలెను. యేసు మరియు వాక్యము ఒకే రీతిగా ఉన్నది, ఆయన వాక్యమైయుండెను. ఆయన మానవత్వములో నివశించున్నప్పుడు వాక్యము ఆయన ఒకటేయై యుండినట్లు తెలియజేయుచున్నది. నీవు ఏమై యున్నావో, నీ యొక్క జీవితము చెప్పుచున్నది.

దేవుని యొక్క అద్దములో నిన్ను నీవు సరిగా చూచుకొనుము, "ఈ ఉదయకాలమున నేను ఎలాగు కనబడుచున్నాను?" అని ప్రశ్నించుకొనుము. మనము ప్రార్థించుచుండగా.

[సభికులలో ఒకరు బాషలో మాట్లాడుచు మరియు ప్రవచించిరి.]

నేను దేవుని యొద్ద నుండి దూరముగా తొలగిపోయి తిరుగుచున్నాను,

నేను ఇంటికి వచ్చుచున్నాను ఇప్పుడు,

(నీవు ఎప్పుడైన ఇంతవరకు ప్రార్థన చేయకుండిన ప్రార్థించుము)

నీ ప్రేమగల హస్తములను చాపుము,

ప్రభువా, నేను ఇంటికి వచ్చుచున్నాను.

ఇంటికి వచ్చుచున్నాను, ఇంటికి వచ్చుచున్నాను…

167నీవు పాడుచు వచ్చుచుండగా, నేను మిమ్మును ఏదో విషయము అడుగనపేక్షించుచున్నాను. నీ హృదయములో పాపము వలన నల్లగా నుండునట్టి ఏదైన డాగు ఉన్నదా? అటువంటిది ఉండిన యెడల, దాని నుండి పవిత్రపరచబడుటకు ఇదియే సమయము, ఇప్పుడు అనుకూల సమయము, కృప తొలగిపోకముందే. కృప తొలగిపోయిన యెడల ఈలాంటి అవకాశముండదని నేను నిరీక్షించుచున్నాను. అయితే, అది ఏ రీతిగా నుండవలసియుండునో, అట్లు ఉండక పోవునేమో?

ప్రజల మధ్యలో పరిశుద్ధాత్మ ఏమి చెప్పెనో వినండి. దీనిని నేను పొందుకొనిన తరువాత. అది మీకు స్వరముగా వినపింపబడినదై యున్నది మరియు అక్కడ… నీ యొక్క జీవితములో అంధకార సంబంధమేదైన ఉండిన యెడల, మేము పాడుచుండగా బలిపీఠము చుట్టుముట్టుటకు తిన్నగా మీరు వచ్చెదరా. సరిగా ఇప్పుడే. భారముతో ఇచ్చట నున్నవారు, జీవితమును చక్కపెట్టుకొనగోరువారు. ఉండిన, సమయమును ముందుకు పొడిగించకండి లేదా సమయమును దాటి పోనివ్వకుడి. సమయము ముగిసిపోలేదని నమ్మకముతో, నిరీక్షణతో రమ్ము, అయితే ఆ దినము ఈ దినములలో ఒక దినముగా రాబోవుచున్నది. అది ఈ దినమే కావచ్చు.

ఇదిగో, ప్రభువా నేను వచ్చుచున్నాను…

168సరిగ్గా మీ చుట్టూ మీ యొక్క నాసికా రంధ్రముల యందు జీవాయువుతో నిండియుండగా - టేపు చేయు ప్రజలు ఇప్పుడు ఇక్కడ జరుగుచున్నదను దాని మాత్రము చూడ కలిగినయెడల, ఒకరి తరువాత మరొకరు ప్రతి స్థలములో నుండి వచ్చిన వారు రోదన చేయుట చూడగలరు. నేను బాలునిగా నుండినప్పుడు నాకు కలిగిన దర్శనము ఇదియై యుండదా… అదే ఘడియేనా ఇది? ఆ సమయము ఇదియేనా? వారు అలసిన దృష్టిని కలిగి, మనో వ్యాకులముతో నున్నారు … ఇప్పుడు ఇచ్చట ఈ భూమి మీదనే నరకము సరిగా సృజింపబడినది.

బలిపీఠములు, మందిరములోని సావడి ప్రకారములు మరియు ప్రతి స్థలములు (ప్రజలతో) నిండియున్నది. ఇప్పుడు బలిపీఠము చుట్టి వచ్చుటకైనను మందిరములోని సావడి ప్రకారములందును, మరెచ్చటనైనను ప్రవేశించుటకును వీలు లేనిచో ఈ వందలాది ప్రజల మధ్య మీరు నిలుచున్న స్థలమందే, మీరు నిలువబడకలిగిన యెడల… "ప్రజలు తెలిసికొనునట్లు నేనిచ్చట నిలువబడి ఉన్నపాటున ప్రార్థించెదను" అని చెప్పుచుంటిని.

లేదా, మోకరించుడి, లేదా మీరెక్కడ ఉన్నారో మీరు అపేక్షించునట్లుగా నుండుడి. ఓ, మై! ఇక్కడ క్రింద కూర్చున్న వారిని, ప్రజలు క్రిక్కిరిసి నిలువబడియున్నందున చూచుటకు బహు కష్టతరముగానున్నది. దేవుడు క్షమించును గాక, దేవుడు క్షమించును గాక, నేను ఇప్పుడు చెప్పిన దాని నిమిత్తము నేను ఈ విధముగా అడుగ వచ్చునా. ప్రతివారు - నేను చెప్పిన దానిని గ్రహించియుండ వచ్చును, దేవుడు క్షమించును గాక. నాకును పిల్లలు ఉన్నారు, వారు ఇచ్చట లేరు. నాకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు కలరు. నాకు సహోదరులును ఉన్నారు. నేను నా ప్రజలను కలిగియున్నాను. వారు ఈ స్థలములో లేరు. కృప మనలను విడిచినందున దేవుడు క్షమించును గాక, ఇది అంతయు నటించుచుండుటయై ఉన్నది.

ప్రభువా, కృప విడువబడెనా? ప్రభువా, ఈ ఒక్క విషయములోని తప్పును కలుగునిమ్ము, ప్రభువా, ఈ సమయములో మాత్రము నన్ను తప్పిదస్తునిగా ఉండనిమ్ము, ప్రజలు ఇంకను రక్షింపబడుదురు అని కాదు అది. ప్రభువా, దానిని (కృపను) దయచేయుము. ప్రభువైన యేసుక్రీస్తు నామమున ఈ వినువారిని నీకు అప్పగించి, ప్రార్థించుచున్నాను.

169ప్రతి ఒక్కరును ప్రార్ధించండి, ఈ విధముగా … అది అట్లుండినయెడల ఏమి? అది ఏమైయున్నదో నేను ఎరుగను. అయితే అది అలాగుండినయెడల నేమి? మీరు మీ విధానములో ప్రార్థించుడి. మీకు తెలిసినట్లుగా మీరు ప్రార్ధన చేయుడి. ఇది సత్యమైయుండిన యెడల సరిగా ఏమగును. స్నేహితులారా, మనము ఏమి చేయవలెను? మనము చేయునది ఏమి? ఏమి సంభవింపబోవుచున్నది? ప్రతి ఒక్కరు ఇప్పుడు ప్రార్థించుడి. ఏ విధముగా నీవు ప్రార్థన చేయగోరుచున్నావో, ఆ రీతిగానే చేయుడి. దేవునికి మొర్రపెట్టి, మీ స్వంత ఇష్ట ప్రకారము ప్రార్థించి రోదన చేయుడి. ఓ, దేవా!

నీ ప్రేమగల హస్తములను విశాలముగా చాపుము.

ఓ, ప్రభువా, నేను ఇంటికి వచ్చుచున్నాను.

170ప్రభువా, దానిని ఎంతోకాలము క్రితము చేయవలెనని అపేక్షించితిని. నేను చాల సమయము తడవు చేసియున్నానా, ప్రభువా? అది చేయిదాటి పోయేనా? ఓ, దేవా, నీ దయగల హస్తమును చాపి నన్ను నీ దరికి చేర్చుకొనుము. ప్రభువా, నా హృదయములో ఏదో ఉండి నన్ను దానికై బతిమాలు కొనుచున్నది. మరొక మారు నీ కృప చూపుము. గొర్రెపిల్ల యొక్క గ్రంథములో నా పేరుండిన, నాతో ఇప్పుడు మాట్లాడుము ప్రభువా, ఇప్పుడే నన్ను దానిని పొందుకొననిమ్ము. దేవా, దయయుంచి చేయుము.

ఇంటికి వచ్చుచున్నాను, ఇంటికి వచ్చుచున్నాను,

ఎన్నడు (నేను ఎన్నడూ, మరెన్నడో ప్రభువా)

మరెన్నడు వట్టిగా తిరుగను,

నీ ప్రేమగల హస్తమును విశాలముగ చాపుము,

ఓ, ప్రభువా, నేను ఇంటికి వచ్చుచున్నాను.

JER 6:26•

AMOS 8:10

 

171వారు యేసుని గుర్తించినప్పుడు, తమ జ్యేష్ట కుమారుడు చంపబడినప్పుడు ఏడ్చినట్లుగా వారు ప్రలాపించెదరని బైబిలు చెప్పుచున్నది.

వెలుపటనున్న మీరు, మీ కారులలో నుండి షార్టువేవ్స్ ద్వారా వినుచున్న మీరు, ఈ కట్టడము చుట్టూ నిలువబడియున్న మీకు మీతో అనేకులు ఈ కట్టడము యొక్క గోడలకు మీ తలలను ఆనించి నిలువబడి యున్న మీరు, మీతో నేను చెప్పుచున్న రీతిగా - ప్రభువైన దేవా నన్ను కరుణించుము," అని చెప్పండి. స్నేహితులారా, సంపూర్ణ సద్భావముతో నుండుడి. మనము ఏ సమయమందు జీవించుచున్నామో, ఎక్కడ మనము ఉన్నామో? ఆలోచించుడి.

ప్రభువా, నేను ఇంటికి వచ్చుచున్నాను.

ఇంటికి వచ్చుచున్నాను, ఇంటికి వచ్చుచున్నాను …

HEB 13:8

 

172ప్రభువైన యేసూ, నేను ఎరిగియున్నట్లుగా ఉత్తమముగా వాటిని నేను చేసితిని. నేను ఎట్లు ఎరుగుదునో వాటినన్నింటిని నేను అట్లు చేసితిని. ప్రభువా, వందలాది ప్రజలు ఈ సమయమున నీ కృపా ద్వారము ఇంకను తెరచియుండగా నిన్ను అపేక్షించుచున్నారు. మనవి అంగీకరించుము ప్రభువా, ప్రతి పాపపు జాగును తుడిచివేయుము, ప్రభువా, నీ కృపా ద్వారములోనికి వీరిని తీసికొనుము ఈనాడు. నేను నా హృదయపూర్వకముగా విజ్ఞాపన చేయుచున్నాను, ఎవరో మాట్లాడుచుండుట మేము చూచుచుండుట మాత్రమే కాదు, కాని లేఖనము మమ్మును ఈ ఘడియకు తీసికొని వచ్చుచున్నది.

నేను పసిబాలుడుగా ఉన్నప్పుడు ఆ దర్శనమును కలిగియుంటిని, ఆ ప్రజలు ఆ స్థితియందుండుట చూచుచుంటిని. మరియు అదే నరకము అని నేను తలంచుచుంటిని - కృప భూమి నుండి సంపూర్ణముగ తొలగింపబడియుండెను, ఇప్పుడు నరకము అదే ఇక్కడ ఉన్నది. ప్రజలైతే, ప్రభువా, చూడ నసహ్యముగా నున్న స్థితిలోనున్నారు. సర్వశక్తికలిగిన దేవా, ఏర్పర్చుకొనిన ఈ సంఘముపై నీ యొక్క ఆశీర్వాదములు కుమ్మరించుము అని ప్రార్థించుచున్నాను, దేవా, అందువలన లోతు కలిగిన దానివలె, నోవహు కలిగినట్లుగా, యేసు కలిగినట్లుగా సాక్ష్యము యొక్క సేవను వారు కలిగియుందురు గాక. నిత్యముగా నశింపబడువారికి సాక్ష్యమిచ్చు సేవను వారు కలిగియుండునట్లుగా వీరును కలిగియుందురు గాక. దేవుని రాజ్యమునకై వారు ముద్రింపబడి అచ్చట నుండినను, యేసుక్రీస్తును గూర్చి - ఆయన నిన్న, నేడు ఒకే రీతిగా ఉన్నాడు, అవును యుగ యుగములు ఒకే రీతిగా ఉన్నాడు అని వారు సాక్ష్యము ఇచ్చుచుండిరి. ప్రభువా, కృప దయచేయుము. మా మానవులు నీవు అంగీకరించునట్లు యేసు నామములో అడుగుచున్నాము.

173మీరు ఏ విధముగా ప్రార్థించవలెనని అపేక్షించుచున్నారో, ఆ విధముగా ప్రార్థించుడి. మీరు తొందరపడకండి! మీరు తొందరపడకండి. ఒకవేళ నీ పేరు ఆఖరుగా ఆ గ్రంథమందుండిన? "

… నేను ఇంటికి వచ్చుచున్నాను,

ఇంటికి వచ్చుచున్నాను, ఇంటికి వచ్చుచున్నాను …

మీరు ప్రార్ధించుచుండగా, పాస్టరు మీతో కూడ ప్రార్థించును.

నీ ప్రేమగల హస్తమును విశాలముగ చాపుము,

ఓ, ప్రభువా, నేను ఇంటికి వచ్చుచున్నాను."

ఇంటికి వచ్చుచున్నాను, ఇంటికి వచ్చుచున్నాను,

ఎన్నడు మరెన్నడు వట్టిగా తిరుగను, (అవును, ప్రభువా.)

నీ ప్రేమగల హస్తమును విశాలముగ చాపుము,

ఓ, ప్రభువా, నేను ఇంటికి వచ్చుచున్నాను.

ఇంటికి వచ్చుచున్నాను, ఇంటికి వచ్చుచున్నాను …

ఎన్నడు మరెన్నడు వట్టిగా తిరుగను,

నీ ప్రేమగల హస్తమును విశాలముగ చాపుము,

ఓ, ప్రభువా, నేను ఇంటికి వచ్చుచున్నాను.

[బ్రదర్. నెవిల్ ప్రార్థించుచున్నారు - సంపా.]

EXOD 12:13

 

174… ప్రభువా, బెక్కి శారా, జోసఫ్ వారినందరిని రక్షించమని నేను ప్రార్థించుచున్నాను, ప్రభువా, నా బిడ్డలకు ఇది సంభవింపకుండ చేయుము. ప్రభువా, నా సహోదరులకు, నా స్నేహితులకు ఇది సంభవింపకుండ చేయుము, ప్రభువా. ప్రభువా, దీనిని అనుగ్రహించుము. మేము ఎరుగము. మేము ఎరుగము, కాని మేము ఏదో సంభవించవుట చూచుచున్నాము, ప్రభువా. మా ముందు కంపింపజేయు సూచనమై ఉన్నదా ఇది? దయచేయుము, ప్రభువా. మమ్మునెల్లరిని నీ సమీపమునకు త్వరగా లాగుకొనుము. మేము నిన్ను ప్రేమించుచున్నాము, నీవు మాకు కావాలి. నీ చిత్తము కానిమ్ము తండ్రి.

ఇప్పుడు పరిశుద్ధాత్మ మన హృదయములలో ఆదరణ నిచ్చుచున్నది. ఈ సమయములో నీకు మేము సాక్షులుగా ఉండుటకు మేము ప్రార్థించుచున్నాము, ఏలయనగా ఇది జరుగవలసియున్నదని మేము ఎరుగుదుము. ఈ సూచనలు కనబడుచున్నప్పుడు, కాలముల తరబడి ప్రవచించిన కడవరి సమయము నందు మనము జీవించుచు మనము దానిని ఎదుర్కొనవలసియున్నది.

అనేక సంవత్సరముల నుండి మనము చెప్పబడితిమి, ఇప్పుడు ఈ విషయము సంభవించునని మనము ఎరిగియున్నాము. ఇప్పుడు ఆ సంభవము ద్వారము యొద్ద వేచియుండుటను మనము చూడగలము. దేవుని భయంకర ఉగ్రత, ఏ ద్వారము పై రక్తము లేదో ఆ సున్నతిలేని వారిని నాశనము చేయుటకై వీధుల గుండా సంచరించుచున్నది, మరణ దూత బయలు వెళ్లినది. వారు అదే మారుమనస్సు లేని జీవితములో జీవించుచుండుగా, కృప లేనివారై, దేవుడు లేనివారై, ఎన్నడును రక్షింపబడనొల్లక, వారు జీవించుచుండినను మృతులైయున్నారు.

175దేవా, మేము ఎట్లు కృతజ్ఞతలు చెల్లింతుము. రక్షింపబడినవారి కొరకు నీవు ఉన్నావు. ఆ కడవరి దూత ఈ దేశము గుండా పోవుచూ, రక్తము క్రింద నుండకుండ వెలుపల నున్నవారిని కనికరములేని వారై చంపబడుచుండిన సమయ మందు, రక్తము క్రింద నుండి లోపల ఉన్న మా హృదయములకు ఎంత గొప్ప ఆశీర్వాదకరమై యున్నది.

అది మోషే యొక్క కడవరి ఈడ్పు. మొదటి ఈడ్పు నందు, అతడు యౌవనుడుగా నుండి ఇశ్రాయేలీయులతో మాట్లాడుచుండెను. రెండవ ఈడ్పు నందు, ఐగుప్తులోనికి వెళ్లి వారిని విమోచించెను; మూడవ ఈడ్పు నందు కడవరిగా వర్తమానమై యుండెను, అద్భుత కార్యములు జరిగించెను. మోషే విమోచింపబడిన వారితో వాగ్దాన దేశమునకు అతని మార్గమున నుండెను. ఓ, దేవా, దయచూపుము, యేసు నామమున ప్రార్థించుచున్నాను.

JOHN 3:5,7

 

176ఇప్పుడు, మిమ్మును నేను అడుగుచున్నాను. ప్రార్థించుచున్న మీరు, దేవుని కృపను పొందియున్నాను అను భావన కలిగిన మీరు, దేవుని రాజ్యమునందున్నాను అను చిత్తవృత్తి కలిగిన మీరు, క్రీస్తునందు మీ విశ్వాసము లంగరువలె పాతుకపోయి, నీవు క్రైస్తవుడవని నమ్ముటకు విశ్వాసముగల మీరు, నీవు తిరిగి జన్మించితివి; అందువలన నీవు క్రైస్తవుడవని ఎరిగిన మీరు, దేవుని కృప మీ యెడల పొడిగింపబడినదని విశ్వసించు మీరు, పరిశుద్ద రక్తము మీ హృదయముపై చిలకరింపబడినది. నీ ప్రతి పాపము క్షమింపబడినది, నీవు క్రైస్తవుడవైయున్నావు అను మీరెల్లరు సందేహించకుండా నిలువబడవలెనని నేను కోరుచున్నాను.

REV 22:11

 

177ప్రజలైన మీకు ఈ విషయమును గూర్చి మాట్లాడుట బహు కఠినమైనది. ఇక్కడ ప్రతి చోట నుండి ప్రజలు వేదిక యొద్దకు వచ్చుట చూచుచుండుటవలన నేను ఎంతో వందనస్తుడనై యున్నాను. మరియు మీరు… ఈ విషయము సత్యమని నేను ఎరుగను. కాని, ఒక దినమున అది అట్లు తప్పక ఉండును. అది ఆ రీతిగా రావలసియున్నది, అది ఈ సమయమై ఉండగలదు. ప్రతి మార్గమున, లోకము అదే స్థితిలో తీసికొనిపోవుచున్నది. ప్రజలు బలిపీఠము యొద్దకు ఇంకనూ వచ్చుచున్నారు; వారు ఇంకను మొఱ్ఱపెట్టుచున్నారు, అయితే అది వారికి ఏ మేలును చేకూరదు. అది ముగింపబడును. అది జరిగిపోబడును. దేవుని కృప అచ్చట లేకుండ ఉండును. "కరుణా పీఠముగల పరమ పవిత్ర స్థానము ధూమమయముగా నుండును," అని జ్ఞప్తికి తెచ్చుకొనుము. "అపవిత్రుడు, ఇంకను అపవిత్రుడుగానే నుండును; నీతిమంతుడు, ఇంకను నీతిమంతుడుగానే ఉండును, పరిశుద్దుడు ఇంకను పరిశుద్ధుడుగా నుండును."

అచ్చట కనికరము ఏ మాత్రము లేదు. గొర్రెపిల్ల ఆ గ్రంథమును తీసికొనినప్పుడు, ఆ కృపాకాలము చెయ్యి దాటి పోవును. దాని ముగింపు అంతయు అదియే. ఇప్పుడే అది జరుగుచున్నట్లుగా అది కనబడుచున్నది. అది మరియొక దినము కావచ్చును; ఆ దినము ఈనాడే కావచ్చును. రేపే చివరిది కావచ్చును … ఈ రాత్రే చివరిది కావచ్చును … ఇది కడవరి సంవత్సరముగా ఉండవచ్చును. స్నేహితులారా, నాకు తెలియదు. నాకు తెలియదని మీతో చెప్పుచున్నాను. అది నాకు చెప్పబడలేదు,

178అయితే గొర్రెపిల్ల జీవగ్రంథమందు ఎవరి పేరు ఆఖరిగా వ్రాయబడియున్నదో, ఆ వ్యక్తిని దేవుడు పిలిచి, విమోచించుటతో అదే దానియొక్క సమస్తమునైయున్నది.

గమనించుము, ఏలాగైతేనేమి, అచ్చట మరేమియు ఉండనేరదు. మరి వేరే మార్గము లేదు. అంతయు అదే. అది ముగించబడెను. అది సత్యమని ఎందరు ఎరుగుదురు? అది సత్యము. దానినే ఇప్పుడు మనము భావించుచున్నాము … ఏ సమాజమునకు ఇటువంటి సందేశమును తీసికొని వచ్చి, ఆసక్తితో బోధించి, హెచ్చరించితినో, వారు అభిరుచిగలవారుగా గ్రహించవలెనని నేను ఆపేక్షతో కనిపెట్టుచున్నాను. మరికొన్ని విషయాలు మిమ్మును ముక్కలుగా నగుటకు కంపనము కలిగించియుండును, అయితే వాటిని విడిచి పెట్టితిని. ఆ విధముగా చేయుటకు ఆపేక్షించితిని; ఏలయనగా నేను నిశ్చయత కలిగియుండలేదు, మరియు నేను నిశ్చయత లేకుండ ఎక్కడ నా కాలు మోపుదునో తేలికగా నేను నా అడుగు పెట్టుదును - అయితే, కేవలము మీకు చెప్పుచున్నాను.

JOHN 4:24•

1COR 1:18

 

179ఆలకించుడి. మీరు సంతోషించుట లేదా? నీ జీవితములో నీవు జరిగించినది నీవు ఆలోచింప కలిగిన దానికంటే అధికమైనదేదైన కలదా? అది జరిగిపోయినయెడల ఇప్పుడు ఏమగును? అది అంతయు ముగించబడినయెడల జరుగునదేమి? "ఓ, బ్రెన్హాం సహోదరుడా, ఉండవచ్చును గదా…" అని మీరు చెప్పుదురు.

అవును, వారు అదే త్రోవను పోవుచుందురు అని నేను యెరుగుదును. ప్రతి సమయములోను వారు అట్లు ప్రవర్తించిరి. దానిని మీకు లేఖనముల ద్వారా రుజువు చేయుచు, వివరించితిని. అలాగే లోకము సాగిపోవుచున్నది, అయితే అది ముగింపబడినది. సువార్తను బోధించు వెర్రితనము నశించుపోవు వారిని రక్షించుచున్నది, మనుష్యునికి అది వెర్రితనముగా ఉన్నది. అది దేవుని యొక్క జ్ఞానమైయున్నది. దేవుడు ఆత్మయై యున్నాడు. ఆయన ఆత్మీయ మార్గములో పని చేయుచున్నాడు. ఆయన అద్భుతములు - ఆశ్చర్యకార్యములు చేయుటకు జరిగించుచున్నాడు. మనమైతే మానవులము. పరిమితమైన వారము. మనము ఎరుగము. మనము దేనిని చూడగలమో దానిని యెరుగుదుము. అయితే మన అంతర్యములో ఏదో ఉన్నది, దానిని యెరుగము.

180నీవు ఈ గది నుండి వెలుపలికి నడిచి వెళ్ళినయెడల సూర్యకాంతిని నీ జీవితములో ఎన్నడూ చూడనియెడల, నీవు ఈ గదినుండి సూర్యకాంతిలోనికి లేదా ఏదో దానిలోకి నడిచినయెడల అది వెచ్చగా ఉండునని నీవెరుగుదువు. నీవు దానిని అనుభవించుదువు. నీ శరీరములో దానిని వ్యక్తపరిచే జ్ఞానేంద్రియము లేనియెడల, నీవు దానిని ఎరుగకయుందువు, లేదా నీకు దానిని చూచే జ్ఞానేంద్రియము లేనట్లయితే నీవు దానిని ఎరుగకయుందువు.

పచ్చని చెట్లను చూచుటకును, సృష్టిని చూచుటకు వేరే మార్గము లేదు. నీవు దృష్టిని కలిగియుండలేదు, ఎవరు ఎన్నడును దానిని కలిగియుండలేదు. మీ యెదుట ఏది ఉన్నదో, దానినే మీరెరుగుదరు, దాని విషయము మీ స్పర్శ తెలియజేయును. అది మీరు ఎరుగుదురు… "అది సూర్యుడనియు, అది ప్రతిబింబించుచున్నది, అది వస్తువులను చూపించుచున్నదని," నేను చెప్పుటకు ప్రయత్నించినయెడల, అది అక్కడ ఉన్నదని నీవు ఎరుగుదువు. ఎట్లనగా నీ యొక్క అనుభూతి వలన నీవు దానిని అనుభవము చేత తెలిసికొందువు. అది సరియేనా?

JOHN 15:13•

1PET 1:18,19•

1JN 4:7,8

 

181క్రీస్తు ఇక్కడ ఉన్నాడని మనము యెరుగుదుము. మీరు మీ కన్నులతో ఆయనను చూడక పోవచ్చును. ఇక్కడ ఉన్నాడని మీరు చూడక పోవచ్చును. అయితే, దర్శనము ద్వారా ఆయన ఇక్కడ ఉన్నాడని నేను మీతో చెప్పుచున్నాను. మేము దానిని అనుభవించుచున్నాము. ఇక్కడ ఏదో ఉండినట్లు మేము మెరుగు చున్నాము, అయితే దానిని మన పంచేంద్రియములు తెలియజేయనేరవు. దాని తెలియజేయునది దేవుని ఆత్మయే, క్రీస్తు ఇక్కడ ఉన్నాడని తెలియజేయుచున్నది. ఆయన మమ్మును విమోచించెనని నమ్ముచున్నాను. ఆయన గ్రంథములో మన పేర్లు వ్రాయబడియున్నవని నేను విశ్వసించుచు ఆత్మీయ అనుభవమును కలిగియున్నాను. గొర్రెపిల్ల యొక్క రక్తముతో మనము విమోచింపబడినామని నేను నమ్ముచున్నాను. నేను మిమ్మును ప్రేమించుచున్నాను, మీరును ఒకరినొకరు ప్రేమించుచున్నారని నేను యెరుగుదును.

ఓ, క్రైస్తవ ప్రేమయందు మన హృదయములను

బంధించిన బంధనము ఎంత ధన్యమైనది;

పరమందు దానిపలె నున్న

సెనరుగల మనస్సుతో కూడిన సహవాసము.

మనము తప్పక, ఒకరు యెడల ఎల్లప్పుడు ఆ భావన కలిగియుండవలెను. ఈలాంటి భావన అనుభవము కలిగి ఒకరి నొకరు ప్రేమ కలిగియుండుట వలన మనము దేవుని ప్రేమించిన వారమగుదుము. "తాను చూచిన సహోదరుని ప్రేమింపనివాడు, తాను చూడని దేవుని ప్రేమింపలేడు." తాను చూచిన సహోదరుని ద్వేషించినప్పుడు, తాను చూడని దేవుని ప్రేమించుచున్నాని ఎట్లు చెప్పగలడు? మనము ఒకరినొకరము తప్పక ప్రేమించువారమై యుండవలెను. ఆయన తన శత్రువుల కొరకు ప్రాణము పెట్టిన దానికంటే అధిక ప్రేమ లేదు, తద్వారా వారు ఆయన స్నేహితులుగా మారిరి.

182ఓ, ఆ పాట మీరేరుగుదురా? "క్రైస్తవ ప్రేమయందు మన హృదయములను బంధించిన బంధనము ధన్యమైయున్నది?" అది అద్భుతకరమైనది కాదా. బంధించిన బంధకము ధవ్యమైనది… సహోదరీ, దానిపై గల శ్రుతి మాకు ఇచ్చెదవా? ఒక నిమిషము దానిని వాయించుము… అది జరిగిపోయిన యెడల ఏమి కాగలరు? నశించిపోవు వారికి బోధించుట అను మూడవ ఈడ్పు ఇప్పుడు సంభవించినదిగా నుండిననేమి? దృష్టాంతములుగా కలిగినవన్నియు ఇప్పుడు సంభవించుచుండినయెడల జరుగునదేమి? ఆయనలో ఉన్నాము! మనము ఆయనలో ఉన్నాము. అద్భుతమైనదిగా అది ఉండుట లేదా? ఎటువంటి సహవాసము.

ఓ, క్రైస్తవ ప్రేమయందు మన హృదయములను

బంధించిన బంధనము ధన్యమైయున్నది.

(అది ఏమి చేయును ఇక్కడ)

పరమందున్న దానివలె

నెనరుగల మనస్సుగల సహవాసము.

MATT 6:10•

LUKE 11:2•

EPH 2:6

 

183అదేమిటి? నెనరుగల మనస్సుతో కూడిన సహవాసము. నీ రాజ్యము వచ్చును గాక; నీ చిత్తము నెరవేరును గాక. చూడుము, దేవుని మనము అదృష్టమును గూర్చి ఆలోచించు వ్యక్తిగాను, మనకు అనుకూలమగు వాటిని చేయుము, వీటిని చేయుమని ఒక పనివానికి ఆజ్ఞాపించినట్లుగా మనము చేయుటకు ప్రయత్నించుచున్నాము.

"నీ రాజ్యము వచ్చును గాక, పరలోకమందు ఏలాగో ఆలాగే భూమిమీద నీ చిత్తము నెరవేరును గాక అని ప్రార్థించుడి," అని యేసు చెప్పెను.

అప్పుడు పరలోకము మనకు తీసికొని రాబడుచున్నది. మనము పరలోకము వరకు కొనిపోబడితిమి. క్రీస్తుయేసులో ఇప్పుడు పరలోక స్థలములో మనము కూర్చుండియున్నాము. ఈ సందేశము సత్యమైయున్నదని మనమెల్లరము నమ్ముచున్నాము. దేవుని కుమారుడైన ఆ యేసుక్రీస్తు మనలను విమోచించెను. మనము పాడుచుండగా, మన కన్నులు మూసికొని, మన చేతులు పైకి ఎత్తుదాము:

క్రైస్తవ ప్రేమయందు మన హృదయములను

బంధించిన బంధనము ఎంత ధన్యమైనది;

పరమందు దానివలె నున్న

నెనరుగల మనస్సుతో కూడిన సహవాసము.

184ఒక్క చిరునవ్వైన లేదు. ఇది చిరునవ్వు కలిగియుండే సమయము కాదు. ఈ పాట రాగము యొక్క శృతిని వాయించుచుండగా గంభీరమైన సద్భావనతో వారితో కరచాలనము చేస్తూ, "క్రైస్తవుడా, దేవుడు నిన్ను ఆశీర్వదించును గాక" అని చెప్పండి. సద్భావనతో, దేవుడు నిన్ను ఆశీర్వదించును గాక అని చెప్పండి. నెవిల్ సహోదరుడా, దేవుడు నిన్ను ఆశీర్వదించును గాక, ఇప్పుడు మన చేతులు ఆయన వైపు ఎత్తుదము.

మనము దూరంగా వెళ్ళినప్పుడు,

అది మనలో బాధను కలిగించును;

కాని మనము ఇంకా హృదయములో కలిసికొందుము,

మరలా కలుసుకొనెదనని నిరీక్షించెదము.

MATT 6:9-13

 

185ఇప్పుడు, మన తలలు వంచుదము. భవిష్యత్తును ఏమైనది మనము ఎరుగక, ఈ సమయమందు ఒకరి చేతులు ఒకరు పట్టుకొందాము - అయితే, ఏవి జరిగి పోనున్నదో ఎరుగకయున్నాము. నేను యెరుగను. నేను చెప్పలేను. నేను యెరుగను. అయితే, ఈ ఉదయ కాలమందు బయలుపరచబడిన విషయముల అనుసరించి, ప్రభువు మనకు చెప్పిన ప్రార్థనను ప్రార్ధింతుము: నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తము నెరవేరును గాక, అని చెప్పబడిన రీతిగా, అందరు కలిసి దానిని చేయుదాము:

పరలోకమందున్న మా తండ్రి,

నీ నామము పరిశుద్ధపరచబడును గాక,

నీ రాజ్యము వచ్చును గాక,

నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు

భూమియందును నెరవేరును గాక.

మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయుము.

మా ఋణస్థులను మేము క్షమించియున్న ప్రకారము

మా ఋణములను క్షమించుము.

మమ్మును శోధనలోనికి తేక

దుష్టుని నుండి మమ్మును తప్పించుము.

ఏలయనగా, రాజ్యమును, బలమును, మరియు

మహిమయు నిరంతరము నీదైయున్నది.

ఆమెన్.

MATT 6:10•

MATT 26:30•

MARK 14:26•

LUKE 11:2•

1PET 3:19

 

186ఇప్పుడు మన హృదయములను వంచుదమా — వారు కీర్తన పాడి బయటకు వెళ్లారని బైబిలు చెప్పుచున్నది. వారు ఆ విధముగా లేఖనములందు వారు చేసినప్పుడు, అది రెండవ ఈడ్పు ఉండెను. ఎందుకనగా వారు ప్రభువు యొక్క రెండవ ఈడ్పు సేవను సిలువ వేసిరి అని జ్ఞాపకము ఉంచుకొనుడి. మరియు మూడవ ఈడ్పు సేవలోనికి ప్రవేశించెను, కొన్ని గంటలకు తరువాత ఆయన పాతాళమున ప్రవేశించెను, మరియు దేవుని కృపను నిరాకరించిన అవిధేయ ఆత్మలకు ఆయన బోధించెను.

ఓ కల్వరి గొర్రెపిల్లా,

నా విశ్వాసము నీతట్టు చూచుచున్నది.

దైవిక రక్షకుడా!

నేనిప్పుడు ప్రార్ధించుచుండగా వినుము,

నా పాపములన్ని తీసివేయుము.

ఓ, ఈనాటి నుండి సంపూర్తిగా,

నీవానిగా ఉండనిమ్ము.

నా జీవితము చీకటి చెడ్డ త్రోవలు తొక్కుచుండగా,

మరియు విచారమ నా చుట్టూ ఆవరించగా,

నీవేనా మార్గదర్శిగా ఉండుము.

చీకటిని వెలుగగా మార్చుము,

దుఃఖము, కన్నీరు తుడిచివేయుము.

ఓ, ఈనాటి నుండి సంపూర్తిగా,

నీవానిగా నన్నుండనిమ్ము!

187దేవుడు మిమ్మును ఆశీర్వదించి, మీపై ఆయన సూర్యుని, కృపను ప్రకాశింపజేయును గాక, మరియు ప్రభువు మీకు నిత్యజీవమును అనుగ్రహించి, ఈ లోక మందును, దీని తరువాత రాబోవు లోకమందును మీతో నుండును గాక. నిత్యజీవములో, యుగ యుగముల రానున్న కాలముల ద్వారా మీరు ఆయనను సేవించుదురు గాక.

ఆ స్థలమునకు మనము చేరు సమయము ఇదే అయితే, నేను ఏది భోదించుచున్నానో, దాని గురించి సిగ్గుపడువాడను కాను. ప్రతి ఒక్క సేవకుడు తాను సేవ చేయుచుండిన వారి సమూహముతో నిలువబడవలెను, మరియు తీర్పు తీర్చబడును. (నేను నా దర్శనములో చూచిన ప్రకారము). నేను ప్రకటించు సువార్త నిమిత్తము నేను కృతజ్ఞుడనైయున్నాను, ఏలయనగా పౌలు, తదితర భక్తులు ఇదే సువార్తను వారు ప్రకటించిరి.

మీ నిమిత్తము నేను సంతోషించుచున్నాను. క్రీస్తును మీరు మీ రక్షకుడిగా స్వీకరించినందులకై నేను ఆనందించుచున్నాను. ఆయనను ప్రేమించుడి, మరియు ప్రార్థించుడి, మరియు ప్రభువు చిత్రమైతే సాయంకాల సమయమందు 7:00 గంటలకు ఈ ఆరాధన స్థలమందు మిమ్మును చూచెదను. దేవుడు మిమ్మును ఆశీర్వదించును గాక. మీరు వెళ్లవచ్చును.

Search Messages

0 / 0 matches
Enter characters above to process real-time text query scopes...