మీలో నున్నవాడు
1సహోదరుడా నెవిల్, మీకు వందనములు. ప్రభువు మిమ్ము దీవించును.
మనము ప్రార్థించుటకు ఒక్క క్షణము లేచి నిలబడుదము. ఇప్పుడు మన శిరములు వ౦చుదము. ఈ ప్రార్థనలో జ్ఞాపకము చేసుకోవాలని కోరువారందరూ చేతులెత్తి, "దేవా! నన్ను జ్ఞాపకము చేసికొనుము," అని చెప్పండి.
2అతి పరిశుద్దుడవును కృపయు కలిగిన దేవా, ఈ జనులను వారి విన్నపములతో పాటుగా మీ యెదుటకు తీసికొని వచ్చుచున్నాము. వారు జ్ఞాపకము చేసుకొనవలెనని అడిగిరి. నేను కూడా అందుకై నా చేతిని కూడ ఎత్తియున్నాను. మాపట్ల కృప చూపవలెనని నీకు ప్రార్థించుచున్నాను. మా అవసరతలను నీవెరుగుదువు. నీవు ప్రార్థించమని మాకు నేర్పించిన రీతిగా ప్రార్థించుచున్నాము: "నీ రాజ్యము వచ్చు గాక! పరలోకమందు నెరవేరుచున్నట్లుగా నీ చిత్తము భూమి మీదను నెరవేరును గాక." తండ్రీ, ఈ రాత్రి మేము కృప కొరకు వేడుకొనుచున్నాము, ఆత్మ యొక్క స్వాతంత్ర్యము కొరకు అడుగుచున్నాము. దాని ద్వారా సువార్త సత్యమును తీసుకొనురాగల సామర్థ్యము మరియు మీ సంఘము కొరకు ఈ ఘడియ యొక్క వర్తమానమని మేము దేనినైతే నమ్ముచున్నామో, దానిని తీసుకొని వచ్చుటకు కృపను అడుగుచున్నాము. ప్రభువా, చివరి దినములలో మేము కూడ బయటకు పిలువబడు సంఘములోని ఒక భాగమైయున్నామని ప్రార్థించుచున్నాము. తండ్రి, మేము అందులోని భాగముగా లేనట్లయితే ఆ భాగముగా ఉండుటకు ఏమి చేయవలెనో మాకు బయలుపరచుము. ఈ పరీక్షా ఘడియలో మాకు కృపను, శక్తిని దయచేయుము. ఈ భూమిమీద నివసించుచున్న ప్రతివారికి ఇది పరీక్షా సమయము. మమ్మును నడిపించుటకు, తీసుకొని వెళ్ళుటకు నీ పరిశుద్దాత్మను మాకు ఇమ్ము. చివరగా ముగింపులో విశ్వాసులందరు ఎదురు చూచుచున్న ఆ నిత్యజీవమునకు వారసులమగుటకు నీ యొద్దకు సమాధానముగా వచ్పుదుము గాక. కాలారంభము నుండి అందుకొరకే ఎదురు చూచుచున్నారు. ప్రభువా, మాకు సహాయము చేయుము. యేసు నామములో అడుగుచున్నాము. ఆమేన్. మీరు కూర్చోవచ్చును.
LUKE 11:2•
ACTS 20:27•
EPH 1:4
3ఈ రాత్రి ఇక్కడుండు భాగ్యమును కలిగియున్నందుకు, యేసు ద్వారా మనకియ్యబడిన దేవుని కృపను బట్టి నిశ్చయముగా కృతజ్ఞతలు చెల్లించుచున్నాను.
ఈ ఉదయకాల వర్తమానము గూర్చి చెప్పెదను. అందరూ క్షుణంగా అర్థము చేసికోవలెనని కోరుచున్నాను. అంత సమయము కాదని నేను దేవుని నమ్ముచున్నాను. చూచారా? కాని వర్తమానము సత్యము. వర్తమానము నిజము. ఇది ఆ సమయము కానియెడల మరో సమయము దానికుండును. కాని ఇదే ఆ సమయము వలె కనిపించుచున్నది. ఆనాటి పౌలు చెప్పిన రీతిగా నాకును చెప్పవలెననిపించుచున్నది, "సమస్తమును మీకు వెల్లడిచేయుటకు నేను వెనుకాడుట లేదు"; చూడండి, ప్రతిదియు జరుగవలసియున్నది.
4ఈ ఉదయమున నేను ఒక పని చేశాను. దానిని చెప్పినందుకు నన్ను క్షమించండి. నేను తప్పుగా ఒక సోదరుని పేరును పిలిచాను. నేనది చేసియుండవలసినది కాదు. ఒక వ్యక్తి పేరును నేనెన్నడూ చెప్పను. మరియు అతని చేతిలో ఈ టేపు పడినయెడల అతడేమనుకొనునో గదా! నేను అతనిని చూడవలెనని మరియు అతనితో మాట్లాడవలెనని కోరుచున్నాను, ఎందుకనగా ఆ సోదరుడు గొప్పవాడు, మంచివాడని నేను తలంచుచున్నాను. ఈ వేదిక మీద నుండియే అతడు బోధించెను. ఆ సోదరుడు డేవిడ్ డ్యుప్లెసిస్. అతని పేరును పిలువవలెనని నా భావము కాదు. వర్తమానము గూర్చి మరియు మొదలగువాటి గూర్చి నేను కలవరము చెందాను. "ఇదే ఆ సమయము కావచ్చును" అనుకొన్నాను. ఆ సోదరుని పేరు పొరపాటున ప్రస్తావించెను. "ఇదే ఆ సమయము కావచ్చును" అనుకొన్నాను. ఆ సోదరుని పేరు పొరపాటున ప్రస్తావించాను. నేనది చేయకూడదు. ఆలాగు చేసినందుకు నన్ను క్షమించండి. సహోదరుడు డేవిడ్ డూప్లెసిస్ ను నేను ప్రేమించుచున్నాను. ఆయన మన సోదరుడు. అటువంటి చాకచక్యముగల వ్యక్తి వాక్యములో మరింతగా ఉపదేశము పొందితే తప్పక బాగుండునని నాకనిపించుచున్నది.
అదేమిటో నేను చెప్పెదను. డేవిడ్ నేను కలసి ఒకప్పుడు సంభాషించుకొన్నాము.
5ఒకసారి అతడు నా కూటములో మాట్లాడెను. ఈ వేదిక పై నుండియే అతడు మాట్లాడెను, లేదా పాత చర్చి కావచ్చు, మొత్తం మీద ఈ వేదిక మీద నుండియే మాట్లాడెను. ఎక్కడనుండైతే తిరిగి వచ్చానో, ఆ దక్షిణాఫ్రికాలో అతని సోదరుడగు జస్టస్ దక్షిణాఫ్రికాలో నాకు అనువాదకుడు. వారు చక్కని కుటుంబములో నుండి వచ్చిరి, ఒక పెంతెకోస్తు గృహము, చాలా చక్కనివాడు. ప్రపంచ పెంతెకోస్తు కాన్ఫరెన్సులో ఒకసారి డెవిడ్, విశ్వ పెంతెకోస్తు ఆసెంబ్లీ యొక్క చెయిర్మన్ గా వ్యవహరించెను. అధ్యక్షులలో ఒకనిగా అతడు ఉండెను. ఆ తరువాత అతడు అమెరికాకు వచ్చి గోర్డన్ లిండ్సెతో టెక్సాస్లో స్థిరపడెను. అటు తరువాత ఆ యా స్థలములలో బోధించనారంభించెను.
6ఒకచోట ఆ సోదరుడు తప్పు చేసెనని నేను తలంచుచున్నాను. నేను లేదా ఎవరయినా తప్పు చేయవచ్చును. అతడు కొన్ని ఒడిదుడుకులకు గురి అయ్యెను. అతడు ఆహ్వానము మీద ప్రిన్స్టన్ విశ్వవిద్యాలయములోను, ఆయా స్థలములలోను బోధించనారంభించెను. తాను చేయుచున్నది సరియేనని తలంచెను. వాక్యాహారమును అందించుచుండెను. చూచారా గొప్ప ఆనందము! అంతే కాదు. సంపూర్ణ సువార్త వ్యాపారవేత్తలు నా ప్రపంచవ్యాప్త కూటములకు ఆర్థిక సహాయము చేయుచుండిరి, చూచారా. వారిని నేను ప్రేమించెదను, చూడండి, కాని నిశ్చయంగా వారి సూత్రములతో నేను సమ్మతించను. వారు ప్రారంభించిన మూల సూత్రములను దాటిపోయిరి. ఇప్పుడు వారు మామూలు ఒక సంస్థవలె మారుచున్నారు, చూచారా. వారు పెంతెకోస్తుగా యుండుటకు ప్రయత్నించుట లేదు, కాని తక్కినవాటన్నింటితో పెంతెకోస్తును మిశ్రమము చేయ ప్రయత్నించుచున్నారు.
MATT 8:12•
MATT 13:24,50•
MATT 22:13•
MATT 24:51•
MATT 25:8,30
7అద్భుతమగు సామర్థ్యముగల సహో, డుప్లెసిస్ వంటి వ్యక్తి నిద్రించుచున్న కన్యక నూనెను కొన వెళ్ళుచుండగా సమయము అయిపోయినది అను లేఖనమును బాగుగా ఎరిగియుంటే ఎంత బాగుండును. చూచారా? గుర్తుంచుకొనుడి, ఆమె నూనె కొన వచ్చినదిగాని నూనె మిగిలి లేదు. అది లేఖనము. "మీ నూనెలో కొంత ఇమ్మని" ఆమె అడిగినది సంఘమునకు, కాని ఆమెకు అది దొరకలేదు. ఆమె క్రిందికి, మీదికి ఎగిరి, భాషలు మాట్లాడి ఏదేదో చేసియుండవచ్చును, కాని దేవుని స్వంత వాక్య ప్రకారము ఆమెకు అది దొరకలేదు. ఆమె వెలుపట చీకటిలోనికి త్రోసివేయబడినది. అక్కడ ఏడ్పును, పండ్లు కొరుకుటయు ఉన్నది. ఏర్పరచుకొనిన వధువు లోనికి వెళ్ళిపోయినది. బుద్ధిగల కన్యకల దివిటీలలో నూనెయున్నది.
PROV 26:11•
LUKE 13:28
8ఈ మధ్యనే ఒకాయనకు జరిగిన దానిని నేనెరుగుదును. అది ఏమిటి, వీరు చక్కని వారు, కాని చిన్న పొరపాటు, నా భావము గ్రహించండి, జనుల మధ్య చిన్న తేడాయున్నది. మొదటి సంగతి చూడండి, దానిని దేవుడే చేయుచున్నాడని వారు తలంచుచున్నారు. మరియు చాలాసార్లు దానిని అపవాది చేయుచున్నది, చూచారా.
హేరోదు ఎదుటికి వచ్చు ఒక అవకాశము యేసుకు దొరికెను. చాలామంది ముందుకు వెళ్ళు తరుణము ఆయనకు కలిగినది గాని వారందరూ ఆయనను తమ స్వార్ధము కొరకు వాడుకొనిరి, చూచారా. పెంతెకోస్తులో కూడ వారందరూ ఆలాగే చేయ ప్రయత్నించుచున్నారు. పెంతెకోస్తు వాటిలోనుండి వేరుగా ఉండుటకు బయటకు వచ్చినది. "కుక్క తన వాంతికిని, పంది బురదలోనికి తిరిగి పోయినట్లు" గానే ఇది యున్నది. ఇప్పుడది తిరిగి విశ్వసంఘ సమితిలోనికి కలిసిపోవుచున్నది, చూచారా. అది చాలా విచారము. అది ఒక అవమానము.
9దేవా, నన్ను చిన్నగాను, దీనునిగాను ఉంచుము; అప్పుడే ఆయన తన సత్యమును బయలుపరచగలడు. చూడండి, నేనెన్నడూ దానిని చేయగోరుట లేదు. లోకపు వెలుగులు, జిలుగులు నాకు అక్కల్లేదు; ప్రభువు యొక్క తృణీకరించబడిన కొద్దిమంది పక్షమున నేనుందును. వాక్యముతోనే నేను నిలచియుందును.
10ఇప్పుడు, విశ్వ క్రైస్తవ సమితి వాటికన్ తో ఒకటిగా చేయబడుచున్నది. వారు వాక్యము విషయములో ఒకటిగా కాగలరని మీరు నమ్ముచున్నారా? వారు సంస్థ విషయములో కావచ్చును, కాని వాక్యము విషయములో కాదు. ఇది నిజము, కాబట్టి రాజీపడునది ఏదీ లేదు, చూచారా. ఒక సంస్థ ఏదయినా గాని ఒకటే. దాని వరుస మారదు: తల్లి మరియు కూతరు. కాని ఈ వాక్యము యొద్దకు వచ్చినప్పుడు కాథలిజంనకు నేను ఎంత వ్యతిరేకముగా యున్నానో అంతే విరోధముగా మెథడిస్తు, బాప్టిస్తు, ప్రెస్బిటేరియనుకు యున్నాను, ఎందుకనగా వాక్యప్రకారము అవి తల్లి, కుమార్తెలే. ఈ వాక్యముతోనే నేను నిలబడియున్నాను, చూచారా. దీని ప్రతి మాట నాకు అధారము.
11ఈ ప్రశస్త సోదరుడు, ఆయన మరియు ఆయన భార్య నాకు సన్నిహిత స్నేహితులు. మీలో చాలామంది ఆ పత్రికను చూచారు. అతని భార్య జాక్విలిన్ కెనెడీవలె కనిపించినదని నాకు ఎవరో చెప్పిరి. ఒక రకంగా తల కత్తిరించుకొన్నది. పొదవలె ఆ జుట్టున్నది. అటువంటి దేవుని చేత పంపబడిన ప్రశస్త సోదరుడు తన భార్యను అలాగెట్ల అనుమతించెను? ఏమిటది? ఆమె అన్నివేళలా అటువంటి జనులతో సాంగత్యము చేయుచున్నది. ఒక మంచి వ్యక్తి చెడ్డ స్త్రీని వివాహము చేసికొన్నప్పుడు ఆ స్త్రీ మంచిదన్నా అగును లేదా అతడు చెడ్డవాడన్నా అగును. మీ సహచరులెవరో చూపించండి, మీరెట్టి వారో చెప్పగలను, చూచారా. ఒకే జాతి పిట్టలు కలిసి నివసించును. మెరయుచున్న వాటినుండి దూరముగా ఉండండి!
12మెక్సికో శ్రేణిలో నున్న అరిజోనా కొండల పైకి ఎక్కి ఒక రోజున ఒక గనిని చూచాను. సహో. సాద్మన్ మరియు నేను ఉన్నాను. (ఇక్కడే కూర్చొనియున్నాడు) నేను త్రవ్వి చూడగా బంగారంవలె కనిపించిన పదార్ధము దొరికినది. కాని అది బంగారము కాదని చెప్పే మార్గము ఒకే ఒక్క మార్గము యున్నది, అది బంగారముకంటే ఎక్కువగా మెరయుచున్నది. మరియు బంగారము మెరియదు, అది ప్రకాశించును, చూచారా. దానిని "వెర్రి బంగారము" అందురు. అది రాయి కంటె విలువ తక్కువయినది. దానిని ఇనుప పైరయిట్ అందురు. జలములు మరియు ఆమ్లములు దానిని కరిగించలేవని శాస్త్రజ్ఞలు అందురు. దానిని బంగారముగా మార్చుట అసాధ్యము. అది బాగుగా మెరయును. కాని అందులో రసాయనములు లేవు. వేషధారణ క్రైస్తవ్యము ఆ విధంగానే యున్నది. అది మెరయును గాని హాలీవుడ్ ను ఇష్టపడును; కాని సంఘము సువార్తతో ప్రకాశించును, చూచారా.
13బిల్లీ ఒక సోదరిని ఇక్కడ నాకు చూపించెను. ఆమెకు లైఫ్ అను పత్రిక వచ్చుచున్నది. ఈ బొమ్మను ముద్రించి ప్రచురించిరి. అది ఏడు దూతల యొక్క పటము. దానిని తీసి నాకు పంపిరి. ఇది ఆ పఠము. దూతలు వర్తమానమును తీసికొని వచ్చి తిరిగి వెళ్ళుచున్నట్లున్న బొమ్మ అది. అది పిరమిడ్ ఆకారములో యున్నది. అది జరుగుటకు మూడు నెలల ముందే నేను చెప్పాను. అక్షరాలా ఆ విధంగానే యున్నది. ఆలాగే ఉండునని చెప్పాను. అవునా? ఒక దూతను గమనించండి. అతని రెక్కలు వెనక్కు ఉన్నవి. మీకు గుర్తుండును. "అతను తన తలను… ఇటువంటి వేగముతో వచ్చుచున్నాడు" అని చెప్పిరి. అక్కడ మీరు రెక్కలను కూడ చూడలేదా? అక్కడ ఆ దూత యుండెను. అక్షరాలా చెప్పిన విధంగానే యున్నది.
14ఇప్పుడు, దేవుడు మాత్రమే దానిని చేయగలడు. ఇక్కడ ఒక ఫోటో కూడ యున్నది. అది ఒక స్త్రీ యొక్క బొమ్మ…
"ఈ వ్యక్తిని మరణము యొక్క ఛాయ కమ్మినది. ఒక చీకటి కమ్ముకొన్నది" అని వివేచనలో చెప్పుట మీరు వినుచుందురు.
ఇప్పుడు వారందరు, "మంచిది, అతను కేవలము ఆలాగు చెప్పును." చూడండి, జనులు అంత దూరంగా చూడలేరు. వారు నీతో కలిసి కేకలు వేయగలరు. వారు నీతో మాట్లాడగలరు; కాని శరీరముతోను, ఆత్మతోను నమ్మవలసిన ఘడియ వచ్చేసరికి అది వారు చేయలేరు. కాని మీరు చూడండి, అందులో దేవుడున్నయెడల నిజమే పలుకును. ఇదే చరిత్రకు చివరి కాలము. ప్రపంచ చరిత్రకు ఇదే ముగింపు. ఇది ముగియనై యున్నది. ఒక నాటికి ఇక సమయముండదు. దేవుడు ప్రతిదానిని ఆత్మీయంగాను, శాస్త్రీయంగాను ధృవపరచుచున్నాడు.
"ఒక అగ్నిస్తంభము ఒక నక్షత్రమువలె కనిపించినది" అని ఒక చిన్న బాలునిగా ఉన్నప్పుడు చెప్పాను.
15ఎంతమందికి గుర్తున్నది, ఆ పాత కాలములో వారు దానిని "నక్షత్రము" అని పిలచెడివారని? ఈ నదియొద్ద ఆయన ప్రత్యక్షమయినప్పుడు "బాప్తిస్మమిచ్చు యోహానువలె నిన్ను పంపుచున్నాను" అని చెప్పెను.
ఇప్పుడు చివరిగా, అది క్రిందికి దిగి వచ్చెను మరియు దానియొక్క పఠమును తీసిరి. ఇక్కడ ఎక్కడో ఆ ఫోటో ఒకటి యుండేది. అవును, ఆ మూలన అది ఉన్నదని వారు చెప్పుచున్నారు. కాని నాకది కనపడదు. అది సత్యమని శాస్త్రీయంగా రుజువయినది.
మరియు ఇప్పుడు, జనులను నీడ కమ్మియున్నదని చెప్పుదును. ఇక్కడ ఒక స్త్రీ యొక్క పఠమున్నది. యంత్రముతో అన్ని ఫోటోలు తీసినట్లుగానే దీనిని తీసిరి. ఒక వ్యక్తి దానిగూర్చి ఆశ్చర్యము చెందెను. ఒక స్త్రీతో నేనిట్లు చెప్పాను, "నిన్ను మరణ ఛాయ కమ్మియున్నది. క్యాన్సరు అను చీకటి నిన్ను కమ్మియున్నది. ఆమె ఆ ఫోటో తీసినది. నాకు తెలిసినంత వరకు ఆ స్త్రీ ఇక్కడికి సాక్ష్యమిచ్చుటకు వచ్చియున్నది. ఈ రాత్రి దానిని మనము విందుము, చూచారా. ఆమె మీద ఒక నల్లని తెర కమ్మియున్నది. ఇది సత్యమని శాస్త్రీయంగా నిరూపించబడినది. ఆ స్త్రీ "బాగయినది" అని చెప్పిన వెంటనే వారు మరల ఫోటో తీసిరి. ఆ నీడ అక్కడ లేదు అప్పుడు, ఆ లెన్సుకు ఏమి తాకినది? ఆమె బాగయినదని చెప్పినప్పుడు, ఆ లెన్సు అక్కడే ఉన్నది కదా? చూచారా?
ఇక్కడ నిలబడి దూతలు వచ్చుచున్నట్లు మీకు చెప్పాను.
16సహో, ఫ్రెడ్ ఒక సాక్షి (కొద్దిసేపటి క్రితం సహో, ఫ్రెడ్ను ఇక్కడ నేను చూచాను. ఇక్కడే ఉన్నాడను కొన్నాను, కాని నాకు కనబడుట లేదు. ఓ! ఆ వెనుకయున్నాడు. అది నిజము.) అతడు నేను నిలబడియున్నచోటకు ఒక మైళు లేక రెండు మైళ్ళ దూరంలో నిలబడి ఆ ప్రేలుడు వినెను. అది వెళ్ళినప్పుడు, రాళ్ళు దొర్లినవి మరియు ప్రతిది జరిగెను. అది నిజమేనా, ఫ్రెడ్ సోదరుడా? ఆ వర్తమానముతో పంపబడిన దూతలు అచ్చటుండిరి. నేను వెళ్ళక ముందు వారు ఏ విధముగా నిలబడెదరో మీకు చెప్పాను మరియు ఇక్కడ ఏ విధముగా యుండెదరో నేను మీకు చూపించిన ప్రకారముగా ఇక్కడ వారు పిరమిడ్ ఆకారములో యున్నారు. దేశమంతటా ఎన్నో ఫోటోలు తీయబడినవి. మెక్సికోలోనికి వెళ్ళినది. ముప్పయి మైళ్ళ ఎత్తులో, ఇరవై ఏడు మైళ్ళ వైశాల్యంలో అది వ్యాపించెను. తేమ కూడా చేరనంత ఎత్తులో అది యున్నది. తేమ ఎనిమిది లేదా తొమ్మిది మైళ్ళ ఎత్తుకంటె పైకి వెళ్ళజాలదు. తేమ వెళ్ళలేనంత పైకి అది వెళ్ళినది, చూచారా. అది ఇరవై-ఏడు మైళ్ళ విస్తీర్ణంలో, ముప్పది మైళ్ళ ఎత్తున యున్నది. లైఫ్ పత్రిక దానిని వ్రాసినది, లేదా లుక్ పత్రికలలో ప్రచురించిరి. ఏది అది? లుక్ లేదా లైఫ్? లైఫ్ లైఫ్ పత్రిక! మే 17 సంచిక. అదియే.
17అది సత్యమని శాస్త్రీయంగా నిరూపించబడినది. కాబట్టి దాని విషయంలో మాకు చింతలేదు. శాస్త్రీయంగాను, ఆత్మీయంగాను అది రుజువైనది; చెప్పినది నెరవేరినది. కాబట్టి ఏడు ముద్రల యొక్క వర్తమానము ముగింపులో యున్నది. మొత్తం బైబిలు యొక్క వర్తమానము ఇదే. ఏడు ముద్రలు క్రొత్త నిబంధనను ముగించి ముద్రించును. అది నిజము. ప్రవచనాత్మక నెరవేర్పు ద్వారాను, శాస్త్రీయ రుజువు ద్వారాను, వాక్యము ద్వారాను సత్యమని తేలినది. దానికి ముగ్గురు సాక్ష్యము ఇచ్చిరి, అనగా అది సత్యము.
1THS 5:2
18కావున మనము అంత్యకాలములో యున్నామని తెలియుచున్నది; మనమిక్కడ యున్నాము. ఎంత దూరంలో యున్నామో నాకు తెలియదు; దానిని ఆయన మనకు తెలియచేయడు, ఎందుకనగా ఆయన రాక "రాత్రియందు దొంగ వచ్చినట్లుగా" యుండును. కాని నా స్నేహితులారా, సోదరీ, సోదరుడా, ఏమయినా గాని మనము సిద్ధపడుదము. మనలను మనము పవిత్రపరచుకొందము. చూశారా, లోకము ఎప్పటి వలెనె యుండును. అది జరిగినదని వారికి ఎన్నడూ తెలియదు. కృపా ద్వారములు మూయబడును. బోధకులు రక్షణను బోధించుచునే యుందురు. జనులు పశ్చాత్తాప పడునట్లు చేయుదురు. అంతా ఎప్పటివలె కొనసాగుచుండును. ఇతర యుగములలో ఆలాగే జరిగినది. ఈ యుగములోను ఆ విధంగానే జరుగును. ఎత్తబడుట చాలా ఆకస్మికముగాను, అంత త్వరగాను ఉండును లోకమునకు వారేమయిరో అర్థము కాదు. ఎట్లు కనబడకుండా పోయిరో తెలియదు. ఇది నిజము. దానిగూర్చి వారేమీ ఎరుగరు. ఆయన వచ్చి ఆమెను ఎత్తికొనిపోవును. అది వెళ్ళిపోవును, వారికి దానిగూర్చి ఏమి తెలియదు. కాబట్టి ప్రార్థనలో యుండండి. నా కొరకు ప్రార్ధించండి. మీ కొరకు నేను ప్రార్థించెదను. ఆ ఘడియ ఎప్పుడు వచ్చునో మనకు తెలియదు, కాని అది త్వరలో రానున్నదని నమ్ముచున్నాము. మెరయుచున్నవాటికి దూరమవ్వండి. సువార్తతో నిలచియుండుడి, చూచారా. అక్కడే నిలచియుండి ప్రార్ధించండి.
19బిల్లీ నాకు ఒక చిటీ వ్రాసి ఇక్కడుంచెను, "ఎవరో తమ బిడ్డను ప్రతిష్ఠించగోరుచున్నారు." అది నిజమయితే, అవునా? చేతులెత్తండి. అవును, ఇద్దరు పిల్లలున్నారు. మంచిది. వారిని ఇటువైపు తీసుకొని రండి. సహోదరుడు నెవిల్ పిల్లల ప్రతిష్ఠ కొరకు మన సోదరి పియానో యొద్దకు వచ్చి పాటను వినిపించవలెనని కోరుచున్నాను. దేనిని మేము విడచిపెట్టడము ఇష్టము లేదు.
గుర్తుంచుకొనండి, రేపు రాత్రి ఈ వేళకు ప్రభుని చిత్తమయితే న్యూయార్కు పట్టణములో యందును, "మంచి విశ్వాస పోరాటము" పోరాడుటకు యుద్దరంగమునకు అక్కడకు మేము వెళ్ళుచున్నాము.
ఇచ్చటకు రమ్ము; ముందుకు వచ్చినచో బాగుండును. వారిని నేను పట్టుకొందును. వందనములు.
మరియు ఇప్పుడు, మనము… ఎందరు నా కొరకు ప్రార్థించెదరు? దేవుని చిత్తమయితే ఒక వారము తరువాత (సహోదరుడు నెవిల్ కు అది ఇష్టమయినట్లయితే) ఆదివారము నాడు లూసియానాకు వెళ్ళుచూ ఈ సంఘములో ఒక కూటమునకు ఆగుదును.
20మీ దయనుబట్టి మీ అందరికి వందనములు చెల్లించగోరుచున్నాను. ఆ స్త్రీ నాకు ఆ క్యాండీ పంపినది. నేను ఎంతో మెచ్చుకొనుచున్నాను. ఆమె ఎవరో తెలియదు. ఒక కాండీ పెట్టెను ఎవరో నాకు పంపిరి మరియు కొన్ని చిన్న బంతులవలె యున్నవి. నిజంగా మాధుర్యంగా ఉన్నవి. ఇప్పుడు వాటితో నా కడుపు నిండిపోయినది. మరియు నేను వందనములు చెల్లించుచున్నాను. ఆ చిన్నవి లెక్కలేదనుకొనుచున్నారా? నిశ్చయంగా, అవి చిన్న ప్రేమ చిహ్నములు. చాలామంది ఆ యా చిన్నప్రేమ కానుకలు పంపిరి. వారు ఇచ్చినవి బిల్లీ పాల్ నాకు చూపించెను. అవి నాకు అందినవి, చూచారా, వాటిని నేనెంతగా ప్రశంసించానో మీరెరుగరు! దేవుడు మిమ్ము దీవించును. నేను వాటిని మరువను. (చూచారా) ఆయన ఇంకెంతగా గుర్తుంచుకొనునో గదా? "వీరిలో మిక్కిలి అల్పులగు వారికి మీరు చేసితిరి గనుక నాకు చేసినట్లే? చూచారా. ఇప్పుడు, కృప చూపువాడు కృపను పొందును.
SONG 2:1
21ఇప్పుడు, మనకు ఇక్కడ కొందరు చక్కని చిన్నవారున్నారు. వారిని లోనికి తెండి అను పాటను పాడవలెనని కోరుచున్నాను, తరువాత, మంచిది, ఒక్క నిమిషము సోదరులు ఇచ్చటకు రండి.
మై, ఇక్కడ మొదటివాడు, చిన్న గోధుమ రంగు నేత్రములు కలిగి నా వైపు చూస్తూ, పెద్దగా చక్కగా నవ్వుచున్నాడు. చిన్న పాప. ఈమె పేరు ఏమిటి? షారోన్ రోస్, నాకైతే అది గొప్ప పేరు. వెళ్ళిపోయిన నా చిన్నపాప తరువాతనా, ఈమె పుట్టక మునుపే ఈ పేరు పెట్టారా, ఒకవేళ చిన్న అమ్మాయి అయితే, మీరు షారోన్ రోస్ అని ఆమెకు పేరు పెట్టాలనుకున్నారా. ఆలాగు ఉండవలసినది. మీకు తెలియునా ఏమిటో? అది మీకు తెలియునో లేక తెలియదో నేనైతే ఎరుగను. ఒకవేళ నా భార్య ఇక్కడ నిలబడియుంటే, ఆమె దాదాపు స్పృహ కోల్పోయి యుండేది. ఇటువంటి రకమైన దుస్తులే నా చిన్న కుమార్తెయైన షారోన్ రోస్ ప్రతిష్ఠ కార్యక్రమమప్పుడు ధరించెను. ఈమైతే జీవించును గాక; ఎక్కడ, నా దానినైతే దేవుడు పైకి తీసుకువెళ్ళెను. మీ చివరి పేరు ఏమిటి? శ్రీమతి మరియు గుడ్మాన్. మీరు ఈ పట్టణములోనే వారేనా? చికాగో వారు. సోదరుడా మరియు సోదరి గుడ్మాన్. దేవుడు మిమ్మును దీవించును.
22మరియు మీకు తెలియునా, నా చిన్న షారోన్ ఆలాగే కనబడేది. ఆమె ఎలాగు కనబడెదో గుర్తున్నవారు ఇక్కడ ఎవరూ లేరని నేను ఊహించుచున్నాను. ఆమె తల్లివలె ఆమెకు చిన్న గోధుమ రంగు నేత్రములు కలిగియుండెను. నల్లటి జుట్టు కలిగి నిజముగా చక్కని చిన్న అమ్మాయి. కేవలము పాపకు వయస్సు ఎంత? ఐదు నెలలా, దేవుడు ఆమెను పిలిచినప్పుడు ఆమెకు యెనిమిది నెలలు. దాని తరువాత నేను ఆమెను చూచాను. మీకు ఆ కథ తెలియును. అది టేపుపైన మీ యొద్ద యున్నదా, షారోన్ రోస్ వాక్యము నుండి వచ్చినది. "షారోన్ యొక్క రోస్" అను దానినుండి నేను మార్చాను. మరియు ఆయనకు తన బలిపీఠముపైన ఒక చిన్నది అవసరమాయెను, కావున ఆయన దానిని తీసుకొనెను. మరియు నేను ఆమెతో పాటు మరల ఉండెదను. ఇక్కడ భూమిపైన ఆమె జీవించవలసిన జీవితము మీ చిన్న షారోను పూర్తి చేయును గాక. మరియు నా షారోను నాతోపాటు మహిమలో యుండునని నేను తలంచిన ప్రకారము, ఈమె మీతో పాటు మహిమలో ఉండును.
23ఎలాగున్నారు మీరు. మీరు ఒక చిన్న విషయమును స్నేహపూర్వకముగా మాట్లాడండి. దీనిని చూడండి. ఈమె ఎల్లప్పుడు నవ్వుచునే యున్నది.
ప్రియమైన దేవా, నేను ఒక చిన్న షారోన్ రోస్ ని పట్టుకొనియుండగా, ఆమె చిన్న నిధిగా యున్నది. నా హృదయములో నేనేమి తలంచుచున్నానో నీకు తెలియును ప్రభువా, కాబట్టి నేను దానిని వ్యక్తపరచనవసరము లేదు. మా హృదయములకు ఈ రత్నములను ఇచ్చిన ఆ ప్రభువైన దేవునికి మహిమ కలుగును గాక. ఈ గుడ్మాన్ గృహమును దీవించుము. అటువంటి రత్నము వారింట్లో యున్నందుకు ఆ తల్లిదండ్రులు ఘనపరచబడును గాక. ప్రభువా, వారింట్లో అది నిలిచియుండును గాక, మరియు రేపు అనునది యున్నట్లయితే, రేపటి కొరకు ఘనపరచబడిన స్త్రీగా చేయుము. మరియు ఇప్పుడు, ప్రభువగు దేవా, మీ ఉదాహరణ ద్వారా చేయమన్నది, మాకు నీవు ఆజ్ఞాపించిన దానికి లోబడుచున్నాము. నీవు చిన్నపిల్లలను నీ చేతిలోకి తీసుకొని, వారిని దీవించి, "చిన్నపిల్లలను నా యొద్దకు రానీయుడి" అని చెప్పినారు. నీవు నీ దాసులకు నీ పనిని కొనసాగించమని చెప్పినట్లుగా, వారు నీ యొక్క సేవకుడిగా నా యొద్దకు పాపను తీసుకొని వచ్చుచున్నారు. మరియు ఇక్కడ నీ సేవకులమైన సహో. నెవిల్, సహో. కాప్స్ మరియు నేను నిలబడియున్నాము. మరియు ఇప్పుడు, ప్రభువైన దేవా, తల్లిదండ్రుల యొక్క చేతుల నుండి మేము చిన్న షారోన్ రోస్ గుడ్మాన్ను మీకు యిచ్చుచున్నాము, యేసుక్రీస్తు నామములో మేము సేవకొరకై ఈమె జీవితమును ప్రతిష్ఠ చేయుచున్నాము. ఆమేన్. దేవుడు మిమ్మును దీవించును! ఇది గాకుండా ఇంకా ఐదుగురు చిన్నవారున్నారా! ఎంత బాగున్నది! సహో. గుడ్మాన్ దేవుడు నిన్ను దీవించును. సహోదరి గుడ్మాన్ దేవుడు నిన్ను దీవించును. మరియు చిన్న షారోన్ని దేవుడు దీవించును గాక.
24ఎలాగున్నావు సహోదరుడా? ఇప్పుడు మనము చూచెదము, నేను ఆర్నేట్ ఆర్నెట్. ఆర్నెట్, అది నిజము. అది నిజమా? విల్లియం, విల్లియం ఆర్నేట్? జేమ్స్ విల్లియం ఆర్నెట్. అతను ఒక మంచి బాలుడు. మీకు తెలియునా, కొన్ని విషయములు మనకు సాధారణముగానే ఉంటాయి. ఇతనికి మరియు నాకు ఇదివరకే అలాగున్నది. పేర్లు ఆలాగేయున్నవి. మరియు తరువాత మేము మా జుట్టును ఒకేలాగ విభాగించుకున్నాము, మీరు గమనించారా, జిమ్మి ఇతను ఒక మంచి అబ్బాయి. అందుకే నీవు జేమ్స్ అని అతనిని పిలిచావని అనుకొనుచున్నాను? జేమ్స్; అలాగైతే మంచిది. ఇతనిని పట్టుకొనవచ్చునా అని నేను ఆశ్చర్యపడుచున్నాను? నాకు తెలియదు. ఇప్పుడు, జిమ్మీ సరే, మనము నిజమైన స్నేహితులము. నీకది తెలియును. నీకు తెలియదా? మంచిది. మన తలలు వంచుదము, ప్రభువైన దేవా, నీవే ఈ గృహమును దీవించావు. ఈ చక్కని చిన్న అబ్బాయితో అర్నెట్ గృహమును దీవించావు. మరియు నీవు అతని తండ్రిని, అతని తల్లిని, అతను ప్రేమించు వారందరిని దీవించుమని నేను ప్రార్ధించుచున్నాను. వారు క్రైస్తవులు. అతని తండ్రి ఆ సిగిరెట్లతో మరియు వివిధ సంగతులతో ఎంతో కష్టముతో పోరాడెను. ఒక రోజున అది "ప్రభువు ఈలాగు సెలవిచ్చుచున్నాడు" ద్వారా వచ్చినది. ఇతను పట్టినపట్టు విడువని స్త్రీవలె యుండెను. అదేమనగా ఆమె అక్కడికి వెళ్ళవలెనని అనుకున్నది. అతను తన వ్యాపారములో నష్టపోయినను మరియు ప్రతీది నష్టపోయినట్లు కనబడినను, ఇతను ఇతను తనయొక్క డబ్బులో నుండి కొంత భాగమును తీసికొని మరియు ఇంటర్వ్యూ కొరకు ఎంతో ఎదురుచూచెను. అది ఒక ఉదయమున జరిగినది. అది జరుగబోవుచున్నదని అతను నమ్మియుండెను. ఓ దేవా, వారి కలయిక యొక్క ఫలముగా ఈ చిన్న అబ్బాయిని నీవు దీవించావని, ఇప్పుడు అతను తీసుకొని వచ్చుచున్నాడు. యేసుక్రీస్తు నామములో ఈ చిన్న జేమ్స్ విల్లియం అర్నెట్ను నేను దీవించుచున్నాను. అతనికి దీర్ఘాయుషును ఇవ్వుము. రేపు అనునది యున్నట్లయితే, రేపటి కొరకు అతనిని నీ సువార్తకై ఒక అర్హతగల వ్యక్తిగా చేయుము. మరియు చివరిగా రాబోవుచున్న రాజ్యములోనికి మేమందరము కలిసి అక్కడ ఉందుము గాక! నేను మీ సేవకులము, మేము మా చేతులను అతనిపై పెట్టుచున్నాము. మరియు అతని జీవిత సేవకొరకై యేసుక్రీస్తుకు ప్రతిష్ఠ చేయుచున్నాను. ఆమేన్.
25నిన్ను దీవించును.
ఇంకా ఇద్దరున్నారా? వీరంతా ఒకే వారేనా, మంచిది. నేను నిన్ను లేవనెత్తుటకంటే, నీవే నన్ను దాదాపు లేవనెత్తగలవని నేను నమ్ముచున్నాను. మరియు ఇది. ఆల్ఫ్రెడ్ మరియు మారా, జనులు కూడా పిల్లలను చూడాలని నేను ఇష్టపడుచున్నాను. వారు చిన్నగా, యువకులుగా యున్నప్పుడు వారు అందముగా ఉంటారని నేను అనుకొనుచున్నాను. ఇప్పుడు మన చేతులు వారిపైన పెట్టెదము. మరియు సర్వశక్తిగల దేవా, మేము మీ దాసులము. అదే రీతిగా మా చేతులు ఈ పిల్లలపైన పెట్టుచున్నాము. ఇప్పుడే ఇక్కడ ప్రతిష్ఠ చేయబడిన చిన్న అబ్బాయి యొక్క చిన్న సోదరుడు మరియు సోదరిపై మా చేతులు పెట్టుచున్నాము. తల్లిదండ్రుల యొద్దనుండి యేసుక్రీస్తు యొక్క చేతులలోకి జీవిత సేవకొరకై ప్రతిష్ఠ చేయుచున్నాము. యేసుక్రీస్తు నామములో మేము మా చేతులను పెట్టుచున్నాము. ఆమేన్. దేవుడు మిమ్మును దీవించును. ప్రభువు మీతో ఉండును.
26ఈ యౌవ్వనస్తుడు. ఇతనొక మంచి బాలుడు. ఆ విధముగా నా జుట్టును నేను విభాగించేవాడిని. ఇతని పేరేమిటి? కెయిత్. హెర్రెల్ కెయిత్ వాకర్ ఎంత చక్కని అబ్బాయి. నాకు తెలియదని నేను ఆశ్చర్యపడుచున్నాను. నన్ను ఇదివరకే చూచినట్లుగా నావైపు ఇతను చూచుచున్నాడు. ఇతనిని పట్టుకొనవచ్చునా అని నేను ఆశ్చర్యపడుచున్నాను? అది నిజమేనా కెయిత్? ఓ, ఇతను ఒక మంచి బాలుడు. నిశ్చయంగా, ఒక ప్రియమైన చిన్న అబ్బాయి కాదా? హెర్రెల్ హెర్రెల్, హెర్రెల్ కెయిత్ వాకర్ సర్వశక్తిగల దేవా, మేము మా చేతులను చిన్న టెర్రెల్ కెయిత్ వాకర్ పైన పెట్టుచున్నాము. తల్లిదండ్రుల యొక్క చేతులలో నుండి ఇతనిని క్రీస్తు యొక్క చేతులలోకి ఇతనిని సర్వశక్తిగల దేవునికి ప్రతిష్ఠ చేయుచున్నాము. తల్లిదండ్రులు ఎంతో కోరిన విధముగా ఈ అబ్బాయి దేవుని యొక్క బోధనలో పెంచబడవలెను. రేపు అనునది ఉండినట్లయితే, ఈ ప్రతిష్ఠకు అర్హతగల ఒక దాసునిగా ఇతనిని చేయుము. మీ సేవకులమైన మా చేతులను ఈ పిల్లవాడిపైన పెట్టుచున్నాము మరియు ప్రభువైన యేసుక్రీస్తునకు ఇతనిని ప్రతిష్ఠ చేయుచున్నాము. ఆమేన్. సోదరుడా వాకర్ నిన్ను దీవించును. ఈమె సోదరి వాకర్ కదా? ఇది నిజముగా బాగున్నది. మీరు ఒక మంచి అబ్బాయిని కలిగియున్నారు మరియు దేవుడు మిమ్మును దీవించును గాక.
27మంచిదండి. అవును. ఈ చిన్న అమ్మాయి వలన మన సోదరుడు గ్రిమ్సే లేక గ్రాంబై. నేను దానిని కలిపివేశాను. నేను ఒక సోదరుడు గ్రిమ్సేను కలిగియుండెను, నేను ఆలోచిస్తూ ఉండగా… సహోదరుడు గ్రాంబై ఈ చిన్న అమ్మాయిని తీసుకొని వచ్చెను. మరియు ఆమె జన్మించినప్పుడు, ఆమె ముఖములో ఒక పెద్ద ముడియుండెను. మరియు ఆమె కొరకు ప్రార్ధించాను. మరియు ఆ ముడి పోయినది. మరియు ఇప్పుడు వారు ప్రార్ధించుటకు కోరెను ఎందుకనగా ఈ తల్లితండ్రులు క్రైస్తవులేనా? వారు క్రైస్తవులు కారు మరియు దురాత్మ పాపను తీసుకొనుచున్నదని వారు భయపడుచున్నారు. మరియు అది పోవలెనని వారు కోరుచున్నారు. మనము ప్రార్ధించెదము. ప్రభువైన యేసు, ఈ పాప పైన, బలిపీఠముపైన, ఆమె ఆనుకొనుచుండగా, ఆమె యొక్క నోటిలోని ఒక ట్యూమర్ ముడిని తీసివేయబడునట్లు నీవు కృప చూపించినావు. ఇప్పుడు ఒక దుర్మాత పాప యొక్క జీవితమును తీసుకొనుటకు ప్రయత్నించుచున్నది. నీవు ఈ అమ్మాయిని ఏలాగు వాడుకోగలవో మరియు అది చేయుటకు ప్రణాళికను వేయుచుండగా, సాతానుడు ప్రణాళికను చుట్టుకొనుటకు ప్రయత్నించుచున్నాడు. కాబట్టి యేసుక్రీస్తు నామములో ఈ పాప యొద్దనుండి వాని చేతులను మరియు వానినే దూరముగా వెళ్ళిపోవలెనని మేము సాతానునికి ఆజ్ఞాపించుచున్నాము, ఎందుకనగా మేము దేవుని మహిమార్థమై ఆమెను ప్రభువైన యేసుక్రీస్తునకు ఇచ్చుచున్నాము. ఆమేన్. సోదరుడా గ్రాంబై, నీవు నమ్ముము. విశ్వాసముంచుటకు పాప చాలా చిన్నదిగా యున్నది కాని అది జరుగును.
28నేనాయనను ప్రేమించుచున్నాను. మీరు ప్రేమించుచున్నారా? ఆయన ఆశ్చర్యకరుడు. 8:30 గంటలకే ఈ రాత్రి ముగించుదునని అందరికి వాగ్దానము చేశాను. అరగంట నాకున్నది. దానిగూర్చి ఇప్పుడు నాకు తెలియదు. దాని కంటే కొద్దిగా నేను ఆలస్యము చేయవచ్చును. కాని మనమిప్పుడు…
PS 34:19
29ఈ ఉదయమున సహో డాచ్ను చూచినందుకు సంతోషించుచున్నాను. ఇంకొకాయన ఎటు వెళ్ళెనో నాకు తెలియదు. కాని ఈ ఉదయ కాలమున ఆయనవలె యున్న మరో ఆయన ఆ వెనుక కూర్చొనియున్నారు. "ఇందులో సహో. డచ్ ఎవరు?" అని అడిగాను. వర్తమానములో నేను నిమగ్నమై యున్నప్పుడు వారిని గుర్తుపట్టలేను. సహో డాచ్ ఎప్పుడూ ఒకేలా కనిపించును. ఆ స్థితిలో ఆయనను చూచుచున్నందుకు ఎంతో సంతోషించుచున్నాను.
ఈ మధ్యనే టుసాన్ నుండి దూరపు ఫోను పిలుపు వచ్చినది. అతనికి ఏదో జరిగినది గనుక మరల ప్రార్థించమని కోరిరి. సహో డాచ్ కు తొంబది ఏండ్లు లేదా తొంబది-ఒక్క సంవత్సరములు. మరియు నీ శరీరము కృంగిపోవును. కాని "నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకము. అయినను దేవుడు వాటన్నింటి నుండి అతనిని తప్పించును." మరియు కొన్నిసార్లు ఇక నిలువజాలని స్థితికి శరీరము వచ్చునప్పుడు ఒక హస్తమును అతడు పట్టుకొనియున్నాడని ఎరుగుదును. ఒక మట్టి ముద్దగా మారినా, చివరి దినములలో దానిని తిరిగి లేపుదునని దేవుడు వాగ్ధాన మిచ్చెను. అందుకు నేనెంతో వందనములు చెల్లించుచున్నాను.
30యేసుక్రీస్తు నామములో బాప్తిస్మము పొందుటకు సహో డాచ్, నీటి కొలనులోనికి వచ్చిన రోజు నాకు గుర్తున్నది. మార్చుకొనుటకు బట్టలు లేకపోయినా గాని బాప్తిస్మము పొందవలెనని ఆశించెను. అతని పట్ల దేవుడు కృప చూపెను. ఆలోచించండి, దేవుడు వాగ్ధానము చేసిన కాలముకంటె ఇరవై సంవత్సరములు ఎక్కువ బ్రదికెను, చూచారా. అది కృప కాదా? పూర్తిగా గుండె వ్యాధితో ఒక రోజున అతడు పడియుండెను. గుండెపోటు దానికి తోడయినది. దేవుడే ఆయనను స్వస్థపరచని యెడల లేవజాలడు. ఆ తరువాత ఆయనకు వైద్యుడుగా నున్న వ్యక్తి చనిపోయెను. నిజమేనా? అతడు ఒక యూదుడగు వైద్యుడు. అతడు ఒక రోజున హాలులో నాతో ఆయన గూర్చి సంభాషించెను, కాని ఇప్పుడా వైద్యుడు లేడు, చూచారా. మై, ఓ ప్రభువా, నీ ప్రేమ ఎంత లోతయినది! ఓ ప్రభువా, నీ ప్రేమ ఎంత గొప్పది!
31ఇక్కడ కొన్ని చేతిరుమాళ్ళున్నవి. కొద్ది క్షణములలో మేము వాటికి ప్రార్ధించనైయున్నాము. కాని కొద్దిసేపు విశ్వాసము మీద మీతో మాట్లాడగోరుచున్నాను. మరియు ఆ తరువాత మనము ఏమి చేయబోవుచున్నామో ప్రభుని నడిపింపును చూతుము. మంచిది. ఆయనకే వదిలి పెట్టుదము. అదే మంచి విధానము.
ఓ, పరలోక స్థలములందు కలిసి కూర్చొనియున్నాము! బ్లూ-బోర్ నుండి బయటకు వచ్చిన తరువాత ఈ రోజు నా స్నేహితులు కొందరితో మాట్లాడాను. "మీరు ఆరాధనకు ఉందురు గదా?" అనడిగాను.
"అవును," అనిరి.
"మీరు బహుశా పన్నెండు లేక ఒంటి గంటల వరకు కారు నడుపుకొని వెళ్ళవలసియుందురు" అన్నాను. ఉదయము 6:00 గంటల ప్రాంతములో వారు ఇంటికి చేరుకొందురు. అంత దూరము వెళ్ళవలెను. గుర్తుంచుకొనండి, వారు మానవులే. నావలె అలసిపోదురు. టెన్నిస్సీ మరియు చుట్టుప్రక్కల ప్రాంతములకు వారు వెళ్ళవలసియున్నారు. ప్రభువు వారిని దీవించును.
32నేను చెప్పవలసిన సంగతులు చాలా యున్నవి. సమయమంతా చాలదు, కాని తరుచుగా మిమ్మును చూచుటకు నాకు సమయము లేదు. కాబట్టి ఏలాగయినా మీతో ముచ్చటించుట నాకు ఇష్టము. కాని మీ గూర్చి నేను తలంచుచున్నదంతయూ చెప్పలేదనుకోండి, చూచారా. సోదరులారా, వారితో నేను చెప్పగోరుచున్నాను; వారిలో కొందరు తమ సంఘములను విడిచిపెట్టిరి.
ఇక్కడ ఈ ఉదయమున సహో, జాక్సన్ ఎవరో సోదరుడు మాట్లాడిన అన్యభాషకు చక్కని అనువాదము ఇచ్చెను. అది దేవుని మూలముగా వచ్చినదే అని ధృవీకరించెను. మీరు గమనించారా, అది తప్పు కాదని ఆయన ఎన్నడూ చెప్పలేదు. అది ఆలాగు కాదని ఆయన ఎన్నడూ చెప్పలేదు. ఆయన వినుటకు హెచ్చరికను అనుగ్రహించెను, చూచారా. కాబట్టి సహో, జూనియర్ తన సంఘమును పంపించివేసి ఇక్కడికి వచ్చెను. సెల్లర్స్ బర్గ్ దగ్గర్లో యున్న ఇతర సంఘముల వారును ఆ ప్రకారమే చేసిరని నాకు అర్ధమయినది.
సహో, రద్దెల్ ఈ ఉదయమున ఇచ్చటుండెను. ఈ రాత్రి ఇచ్చటున్నారో లేదో నాకు తెలియదు! మంచిది, ఈ రాత్రికి ఇచ్చటేయున్నారు! రద్దెల్ సోదరుడా, ప్రభువు నిన్ను దీవించు గాక! నేనూ ఆలోచించే వాటిని నేను వ్యక్తపరచలేకపోవుచున్నాను. కాని బహుశా… మంచిది, అద్దరికి వెళ్ళినప్పుడు పదివేల సంవత్సరములు నీతోపాటు కూర్చొందును. మీరు చూడండి. అప్పుడు మనం అన్నీ మాట్లాడుకోవచ్చును.
MATT 9:37•
MATT 24:24•
LUKE 10:2•
JOHN 6:44•
REV 21:27
33కోత పండియున్నది గాని పనివారు కొద్దిమందిగా యున్నారు, లోతుగా ఇప్పుడే మనము తవ్వుదము, ఒకవేళ ఒక పాపి కూర్చొని ఉండవచ్చును. ఈ రాత్రి వారి జీవితమే పూర్తిగా మారిపోవచ్చును. ఈ ఉదయకాలము కాక ఈ రాత్రి గ్రంథములు మూయబడవచ్చును. ఆ పేర్లన్నియూ విమోచించబడిన తరువాత ఇక ఒక్కరును ఉండరని మరువకుడి.
ఇప్పుడు, నేను లేఖనమును చదువక ముందు అందరూ జాగ్రత్తగా వినండి. విమోచింపబడు వారందరి పేర్లు దేవుడు గొర్రెపిల్ల జీవగ్రంథములో ప్రపంచము సృజింపబడక ముందే వ్రాసియుంచెను. ఎందరు దీనిని ఎరుగుదురు? ఇది లేఖనము. చివరి దినములలో క్రీస్తువిరోధి నిజమైనదానివలె కనిపించును; యూదావలెనె సమస్తమూ ఉండును, సాధ్యమయితే ఏర్పరచబడిన వారిని కూడా మోసము చేయును. అది నిజమేనా? దేవుడు పంపనిచో ఏ మానవుడు యేసునొద్దకు రాలేడు. దేవుడనుగ్రహించిన వారందరు ఆయన యొద్దకు వచ్చెదరు. ఆయన గ్రంథమందు ఆ చివరి పేరు ఎప్పుడైతే తీసికొందునో…
ROM 9:16•
REV 21:27
34చూడండి, లూథరు కాలములోని వారందరిని ఆయన బయటకు లాగెను. వెస్లీ కాలములోని వారందరిని ఆయన బయటకు లాగెను. పెంతెకోస్తు కాలములోని వారందరినీ మరియు వివిధమైన కాలములోని వారందరినీ ఆయన బయటకు లాగెను. వారిచ్చటున్నారు, తీర్పులోనికి తేబడరు, వారెత్తబడుచున్నారు. జగత్తు పునాది వేయబడక ముందే వధించబడిన గొర్రెపిల్ల జీవగ్రంథములో వ్రాయబడిన చివరి పేరు విడిపించబడగానే ఆయన పని ముగియును. ఆయన తాను విమోచించిన దానిని స్వీకరించుటకు ముందు వచ్చును. అది మన హృదయములను ద్రవింపచేయును. వేయి సంవత్సరములు పాటు ఆ తరువాత ఎదురు చూచిన ఏ ఒక్కరూ విమోచించబడరు. మరియు జగత్తు పునాది వేయబడక ముందే పేరు వ్రాయబడియుంటేనే విమోచించబడును. వారెవరు? నాకు తెలియదు. ఎవరికీ తెలియదు, చూచారా. దేవునికి మాత్రమే తెలియును. మన ప్రతియొక్క పేర్లు ఆ గ్రంథమందున్నదని నేను నమ్ముచున్నాను. నాది అక్కడున్నచో తప్పక నేనచ్చట ఉందును, అక్కడ లేనియెడల నేనుండను, అది అంతే. చూడండి, అది కేవలము దేవుని పని. "ఇచ్చయించగోరువానివలన కాదు, పరుగెత్త వానివలన కాదు గాని, కృపజూపు దేవుని వలననే సాధ్యమగును," చూచారా.
35పూర్ణ యధార్థత మరియు గౌరవముతో ఇప్పుడు మనము వాక్యమును సమీపించుదము. మనము చేయవలసినది అదే అని నేను అనుకొనుచున్నాను, చూచారా, వ్యర్థమైనది ఆపి యధార్థంగా, మర్యాదగా యందము! బిల్లీ గ్రాహం కూటములోని ఒప్పుదల గూర్చి టెలివిజనులో చూచాను. బిల్లీ గ్రాహంకు వ్యతిరేకిని కాను. గత రాత్రి కాలిఫోర్నియోలో అద్భుతమగు వర్తమానము ఆ వ్యక్తి బోధించెను. కొద్దికాలం క్రిందట నేను బోధించిన వర్తమానము వలె అది ఉన్నది. "నీవు త్రాసులో తూయగా తక్కువగా కనబడితివి." ఎందరది చూచారు? చాలామంది అనుకొనుచున్నాను.
DAN 5:27
36చూయింగ్ గమ్ నములుకొంటూ, నవ్వుతూ ఒకరినొకరు గిల్లుకొంటూ ఆ జనులు బల్లల మధ్యనుండి వచ్చుట మీరు గమనించారా? జీవ-మరణముల మధ్య నడుచుట అది కాదు. పాపము పట్ల పశ్చాత్తాపపడుట మరియు క్షమాపణ అది కాదు, చూచారా. దానిని కేవలము బిల్లీ ఏమనెనంటే? "తీర్మానము చేసికొనుట." అది చల్లారిన తీర్మానము. అది పనికిరానిది. అది అసలయిన తీర్మానము కాదు. పాపము గూర్చి నీవు పశ్చాత్తాపపడి మరియు దానినుండి మళ్ళిపోవలెను. బిల్లీయే ఈ మాట కూడా చెప్పెను, "ముప్పయి వేలమందిలో ముప్పయి మంది కూడా సంవత్సరం తిరిగి వచ్చేసరికి మిగులుట లేదు." "న్యూయార్క్ సంగతి ఏమిటి? అని మరుసటి దినమున అడిగెను. గొప్ప కూటము ఇక్కడ జరిపాను గాని ఏమయినది? ఇదివరకు యున్నదానికంటే పాపం పెరిగిపోయింది."
2PET 3:10,12
37ఇంకా అధమ స్థితికి ఇది వచ్చును!
జాతీయ పశ్చాత్తాపము అనేది ఉండదు. దేశము పాడైపోయినది. కేవలము వ్యక్తివైన నీవే ఆలోచించుకోవలెను. సిద్ధపడకపోయినచో అది కూడా పోవును. యవనులగు మీరు దీనిని గుర్తుపెట్టుకొనవలెను. నేను చెప్పినది ఎంతవరకు తప్పో - ఒప్పో ఆలోచించండి. చూడండి, ఎంతవరకు సహో. బ్రెన్హాం (అది సహో, బ్రెన్హాం కాదు), పాపము పెరిగి - పెరిగి చివరకు ఒక దినమున ఆకాశములు అగ్నితో అంటుకొనును. అది భూమిమీద పడును. భూమి మహావేంద్రముతో లయమగును. కాని విమోచించబడినవారు ఇక్కడ ఉండరు, అప్పటికే వెళ్ళిపోయెదరు.
MARK 11:12-26
38ఇప్పుడు, మార్కు సువార్త 11వ అధ్యాయములోను; I యోహాను 4:4లోను. మరియు మత్తయి 28:20లోను నేను చదువగోరుచున్నాను.
ఇప్పుడు, మొదటగా మార్కు సువార్త 11వ అధ్యాయము 12 వచనము నుండి 24 వచనము వరకు నేను చదువగోరుచున్నాను. మనము చదువుచుండగా జాగ్రత్తగా ఇప్పుడు వినండి. చిన్న సాక్ష్యమునకు, కొద్ది హెచ్చరిక మాటలకు ఇది నాందిగా యుండును. అటు తరువాత ప్రభువు కొరకు మనము ఏమి చేయవలెనని కోరుచున్నాడో చూద్దాం. అందరూ కూర్చొనేయుండి ప్రార్ధనా పూర్వకంగా యుండండి.
మార్కు 11:12:
మరునాడు వారు బేతనియ నుండి వెళ్ళుచుండగా ఆయన ఆకలిగొని:
ఆకులు గల ఒక అంజూరపు చెట్టును దూరము నుండి చూచి, దాని మీద ఏమైనను దొరుకునేమో అని వచ్చెను. దాని యొద్దకు వచ్చి చూడగా ఆకులు తప్ప మరేమియు కనబడలేదు; ఏలయనగా అది అంజూరపు పండ్ల కాలము కాదు.
అందుకాయన - ఇక మీదట ఎన్నటికిని ఆ పండ్లు ఎవరును తినకుందురు గాక అని చెప్పెను. ఇది ఆయన శిష్యులు వినిరి.
వారు యెరుషలేమునకు వచ్చినప్పుడు ఆయన దేవాలయములో ప్రవేశించి, దేవాలయములో క్రయ విక్రయములు చేయు వారిని వెళ్లగొట్ట నారంభించి, రూకలు మార్చు వారి బల్లలను, గువ్వలమ్మ వారి పీటలను పడదోసి,
దేవాలయము గుండ ఏ పాత్రయైనను ఎవనిని తేనియ్యకుండెను.
మరియు ఆయన బోధించుచు - నా మందిరము సమస్తమైన అన్యజనులకు ప్రార్ధన మందిరమనబడును అని వ్రాయబడలేదా? అయితే మీరు దానిని దొంగల గుహగా చేసితిరనెను.
శాస్త్రులును ప్రధాన యాజకులును ఆ మాట విని, జన సమూహమంతయు ఆయన బోధకు బహుగా ఆశ్చర్యపడుట చూచి, ఆయనకు భయపడి, ఆయననేలాగు సంహరించుదమా అని సమయము చూచుచుండిరి.
సాయంకాలమైనప్పుడు ఆయన పట్టణములో నుండి బయలుదేరెను.
ప్రొద్దున వారు [అది మరొక రోజు], మార్గమున పోవుచుండగా ఆ అంజూరపు చెట్టు వేళ్ళు మొదలుకొని ఎండియుండట చూచిరి. [ఇరవై-నాలుగు గంటలలో అద్భుతము జరిగినది. "ఎవరూ దాని ఫలము తినరు" అని ఆయన చెప్పెను. అప్పుడది జరిగినట్లు కనిపించలేదు; కాని తరువాత రోజుకు ఎండిపోయెను.]
అప్పుడు పేతురు ఆ సంగతి జ్ఞాపకమునకు తెచ్చుకొని - బోధకుడా, ఇదిగో నీవు శపించిన అంజూరపు చెట్టు ఎండిపోయెనని ఆయనతో చెప్పెను.
అందుకు యేసు వారితో ఇట్లనెను - మీరు దేవుని యందు విశ్వాసముంచుడి.
ఎవడైనను ఈ కొండను చూచి - నీవు ఎత్తబడి సముద్రములో పడవేయ బడుమని చెప్పి, తన మనస్సులో సందేహింపక, తాను చెప్పినది జరుగునని నమ్మినయెడల వాడు చెప్పినది జరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను.
అందుచేత ప్రార్ధన చేయునప్పుడు మీరు అడుగుచున్న వాటినెల్లను పొందియున్నామని నమ్ముడి, అప్పుడు అవి మీకు కలుగునని,
మీతో మీకు ఒకని మీద విరోధమేమైనను కలిగియున్నయెడల మీరు నిలువబడి ప్రార్ధన చేయునప్పుడెల్లను వాని క్షమించండి.
అప్పుడు పరలోకమందున్న మీ తండ్రియు మీ పాపములు క్షమించును.
మీరు క్షమింపనియెడల పరలోకమందు మీ తండ్రియు మీ పాపములు క్షమింపడు. [అది షరతు మీద యున్నది.]
39I యోహాను 4:4ను నేను చదువగోరుచున్నాను.
చిన్నపిల్లలారా, మీరు దేవుని సంబంధులు, మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవానికంటె గొప్పవాడు గనుక [జాగ్రత్తగా వినండి!] మీరు వారిని జయించియున్నారు.
మరల దానిని, ఇప్పుడు చదివెదను:
చిన్నపిల్లలారా, మీరు దేవుని సంబంధులు. మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవానికంటె [క్రీస్తువిరోధిని గూర్చి మాట్లాడుచున్నాడు] గొప్పవాడు గనుక మీరు వారిని జయించియున్నారు.
40ఇప్పుడు మత్తయి సువార్త 28వ అధ్యాయము 20 వచనము:
నేను మీకు ఏయే సంగతులను ఆజ్ఞాపించితినో వాటినన్నిటిని గైకొనవలెనని వారికి బోధించుడి. ఇదిగో, నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పెను…
ఇప్పుడు, ఈ రాత్రి దానినుండి ఒక అంశము తీసికొనుచున్నాను. ఆ అంశము: "మీలో నున్నవాడు." ప్రార్ధన కూటము కొరకు విశ్వాసమును నిర్మించుటకు దీనిని నేను ఉపయోగించెదను. మరియు ఎంత త్వరగా…
MATT 28:20
41ఇంతకు ముందే నేను చెప్పినట్లుగా జరిగిన సంఘటనలు మీ ముందుంచెదను. ఆలయములో ఆ సంగతులు చెప్పుటకు వేచియుందును. మరియు ఇతరులు వినాలని ఆశించినయెడల టేపు ద్వారా వాటిని తెలిసికొందురు, కాని నేను ఇచ్చటికి వచ్చి వాటిని చెప్ప చూతును. క్రైస్తవ సోదరులనేకులు ఇప్పుడు నేను చెప్పబోవుచున్న ఈ సంగతులకు సాక్షులుగా యున్నారు. అందులో ఒకరిచ్చటున్నారు. అతడు సహో, బాంక్స్ ఉడ్, ఇంకొకాయన డేవిడ్ వుడ్ ఇచ్చటున్నారు. సహో ఇవాన్స్, ఆయన కుమారుడు రోనాల్డ్ కూ సాక్షులే. మన ఘనుడగు పెద్ద సహో వీలర్ కూడా సాక్షిగా ఇచ్చటున్నారు. మరియు ఇంకొక వ్యక్తియుండెను, అతను సహో, మన్ న్యూ అల్బనీ నుండి వచ్చిన సహో, మన్ ఇచ్చటున్నారా? మెథడిస్తు బోధకుడగు ఆయనకు ఈ మధ్యనే యేసుక్రీస్తు నామములో బాప్తిస్మము ఇచ్చాను. ఇది జరిగినప్పుడు ఆయన అచ్చటున్నాడు.
42కొన్ని సంవత్సరముల నుండి నా హృదయంలో గాఢమగు భారమున్నది. అది నేనేదో తప్పు చేసినట్లనిపించుచుండెది. ఎక్కడ తప్పున్నదాయని చూచుటకు నా జీవితమును పదే, పదే పరిశోధించుకొన్నాను. "ప్రభువా, నేను ఏదయినా తప్పు చేసినయెడల దానిని నాకు బయలుపరచుము. మరియు నేను వెళ్ళి, సరి చేసికొందును," అని చెప్పాను. కాని నాకేదియూ బయలుపరచబడలేదు. "నేనవరినయినా గాయపరిచానా? ఏదయినా చేయకుండా మానితినా? చాలినంతగా చదివానా? చాలినంతగా ప్రార్థించానా? అని ప్రశ్నించుకొన్నాను. నేను చదివి, ప్రార్ధించి ఈలాగడిగాను, "దానిని నాకు బయలుపరచుము. ఎవరినయినా, ఎక్కడయినా బాధపెట్టానా? అలాగు చేసినట్లయితే నేను దానిని సరి చేసెదను. కేవలము నాకు చూపించుము; ఈ భారము మోయలేను." గత అయిదు సంవత్సరముల నుండి, బయటి నుండి నేను వచ్చినప్పటి నుండి నా హృదయములో భారమున్నది.
43నేను కొండకు వెళ్ళాను. నేను సముద్రపు దరికి వెళ్ళాను. చాలా స్థలములకు వెళ్ళి ఎంతో ప్రార్ధించి, ప్రార్ధించి, ప్రార్ధించాను. అయినా అది పోలేదు. నేను ఏమైనా చేసేనేమో అని అన్ని విధాలుగా నేను ఆలోచించాను. కాని, ఇంకా ఆ భారము విడువలేదు, నేను దాస్యత్వములో యున్నట్లుగా ఉన్నాను. ఈ ఉదయము వర్తమానమును తీసికొని వచ్చినప్పుడు అది పోవునేమోనని వింతగా తోచినది. దీనిని దేవుడు బయలుపరచకుండా ఉంచుచున్నాడా? నాకు తెలియదు. చూడండి. ఇవన్నియూ నా మనస్సులో యున్నవి. అలాగున్న వ్యక్తి హృదయము ఎట్లుండునో మీరూహించగలరు, చూచారా. జరుగుచున్న దానిగూర్చి ఆలోచించి జనులకు చెప్పవలసిన బాధ్యత యున్నది. కొందరు తప్పుగా అర్థము చేసికొందురు, కొందరు ఇటు పోదురు, కొందరు అటు పోదురు, అదెట్లుండునో మీరెరుగుదురు; కొందరు నమ్ముదురు, మరియు కొందరు నమ్మరు… అయినా దానిని నీవు చెప్పవలసియున్నావు.
44బాధ కలిగించకుండా, దానిని ఎట్లు చెప్పగలవు? ప్రభావము చూపించకుండా, దానిని ఎట్లు చెప్పగలవు? జనులను ఎత్తి చూపించకుండా, దానిని నీవెట్లు చెప్పగలవు? వారిని ఎత్తి చూపించుట కాదు గాని వారిని ప్రేమించుచున్నందుకే అని నీవెట్ల చెప్పగలవు? కఠినంగాను, మరియు కరకుగాను ఉండియు నీవు ఎట్ల ప్రేమించగలవు? ఓ, దానినెట్ల నీవు వ్యక్తపరచగలవు? దానిని వ్యక్తపరచనియెడల నాకు శ్రమ! చూచారా? మరియు నీవు అక్కడే యున్నావు. అది నిన్ను ఉద్రిక్తతలోను, బాధలోను ఉంచుటలో ఆశ్చర్యము లేదు.
45ప్రతి సంవత్సరము కొలరాడోలో నాతో వేటకు వచ్చు ఒక సహోదరుల గుంపును కలిసికొనుటకు నేను అరిజోనా నుండి వచ్చుచున్నాను. "వేటకు వెళ్ళుట ఎందుకు? కారణమేమిటి?" అని కొందరు ప్రశ్నించుచున్నారు. చూడండి, ఇక్కడ మీరు నింపబడుచున్నారు, నేను ఖాళీ అగుచున్నాను. అక్కడ నేను నింపబడుదును, దాని ద్వారా మీకు ఇచ్చి నన్నునేను ఖాళీ చేసుకొనుటకు. చూచారా? వేటకు మాత్రమే నేను వెళ్ళుట లేదు. వేట దొరకు స్థలములను దాటి వెళ్ళిపోవుట నాతో వచ్చు జనులకు తెలియును, వేట జంతువులను నేను దాటిపోవుదును వాటిని ఏమాత్రము నేను ముట్టుకోను. నేను మట్టుకోను.
46ఇప్పుడిక్కడ కొంతకాలం క్రితం క్రైస్తవ పనివారల కొరకు వేటాడనారంభించాను. "బిల్లీ, నీవు వేటకు వెళ్ళినప్పుడు నాకు ఒక ఆవును, నాకు ఒక ఆంభోతును తెచ్చిపెట్టుము, నాకు ఒక కణుజును తెచ్చిపెట్టుము, ఇది తెచ్చిపెట్టుము లేక అది తెచ్చిపెట్టుము లేక మరేదో తెచ్చిపెట్టుము" అని వారందురు. నేను వెళ్ళి ఎడా పెడా వేటాడేవాడిని. జంతువులు దొరకునట్లుగా ప్రభువు నాకు కృప చూపెడివాడు, చక్కని వేట, వారేమో కూర్చొని తమ పనిని గూర్చి ముచ్చటించెడివారు.
ఇక మీదట ఎప్పుడూ ఆలాగు చేయవద్దని ప్రభువు నాతో చెప్పెను. నాకును అది మంచిగా కనబడలేదు గనుక ఇక ఎన్నడూ ఆలాగు చేయనని వాగ్ధానము చేశాను. "అది అత్యవసరమైనయెడల, ఎవరికైనా అది అవసరమైనయెడల మాత్రమే వేటాడుదును" అని చెప్పాను. వారికి మాంసము కొనుటకు చాలా డబ్బు యున్నది. కాబట్టి నేనెందుకు ఈ పని చేయాలి? నీవు వాడనియెడల ఆ జంతువును బ్రదుకనివ్వు.
47కావున నేను ఏకాంతముగా వెళ్ళవలెనని కోరుకొందును. నాతో వేటకు వచ్చిన వారికి తెలియును. ఎవరితోను నేను వేటాడను. నేను ఒంటరిగా యుండుటకు వెళ్ళుదును. రాత్రులందు వారితో నేను సహవాసము చేయుదును. చాలామంది సేవకులే గనుక వారితో నేను కలిసి ప్రార్థించెదను. ఈ సంవత్సరం సహో. పామర్ ఆ కొండలలోనికి వచ్చెను. సహో. పామర్ను ఇందాక ఎక్కడో చూచాను అని నేను నమ్ముచున్నాను… ఇదిగో ఇక్కడ సహో. పామర్ కూర్చున్నాడు. సహో, బాబ్ లాంబర్ట్ ఈ ఉదయము ఇచ్చటనే యున్నాడు. ఎక్కడో అతని గొంతు వినుట జరిగినది. ఇంకా అతడు ఇక్కడే యున్నాడనుకొనుచున్నాను. మార్టిన్ యొక్క ఇద్దరు బాలురు ఇచ్చటనే యున్నారనుకొనుచున్నారు. వారు మార్టిన్ కుమారులేనా? సహో, మార్టిన్ ఒక రోజున నన్ను నీవు పిలిచావు, అది మంచిది. ఆ సేవక సోదరుని బాలుడు బాగుపడెను.
48ఆ రోజున ఫోనులో నేను ప్రార్ధించిన అతడు, ఆ బాలుడిచ్చటున్నాడా? అతని పేరు మరచిపోయాను. ఆర్కన్సాస్ నుండి వచ్చెను. ఆతని భార్య నన్ను పిలచెను. అతని యొక్క ఒక ప్రక్క భాగము, వాచి జ్వరముతో చావ సిద్ధమైయుండెను. అదే వ్యక్తి హాట్-స్ప్రింగ్స్ కూటములో పిలువబడెను. అతను ఆ కూటములలో పాల్గొనెను. మరియు అతను ఒక చక్కగా కనబడు వ్యక్తి. అతడు ఇక్కడ ఉన్నట్లయితే ఇప్పుడతడు లేవలేడను కొనుచున్నాను. అతని పేరు మరచిపోయాను. అతని పేరు ఆలోచించలేక పోవుచున్నాను. బ్లయర్! సహోదరుడు బ్లయర్ హాట్-స్ప్రింగ్స్ కూటములో పాల్గొనెను. ఎందరు ఆ చోటకు వచ్చిరి? నన్ను "అబద్ద ప్రవక్త" అని పిలుచుటకు అపవాది అతనిని తీసికొనిపోవుటకు ప్రయత్నించుచున్నదని పరిశుద్దాత్మ ఆ యువకుని పిలచి చెప్పెను. మరియు అది సత్యమని అతడు సాక్ష్యమిచ్చెను. అపవాది చేయుచున్న పనిని మీరు చూచారా? అతడు వైద్యుల యొద్దకు వెళ్ళడు. వైద్యులయందు అతనికి నమ్మకము లేదు. ఈ వ్యాధి ద్వారా ఇతనిని చంపుదునని సాతాను తలంచెను, చూచారా. కావున ఆ విధంగా నన్ను దూషణపాలు చేయగోరెను. పరిశుద్దాత్మ కృపతో అతనిని పిలచెను. మరియు అది చేయవద్దని అతనితో చెప్పెను (ఆ వ్యక్తి అపరిచితుడు) ఆలాగు చేయవద్దని అతనితో చెప్పెను.
49ఇంకొక రాత్రి అతని భార్య నన్ను ఫోనులో పిలచి ఇట్లు చెప్పినది, "బ్రెన్హాం సోదరుడా, అతడు చనిపోవుచున్నాడు అని నేను నమ్ముచున్నాను. బాగా ఉబ్బిపోయెను. జ్వరము వలన మతి దాదాపు పోయినది. సహో, బెన్హాంను పిలువమని ఆఖరి మాట అతను చెప్పెను."
"ఏదైన యున్నదా ఉన్నదా, నీ పర్సులో చేతి రుమాలు ఉన్నదా?" అనడిగాను.
"లేదు," అన్నది. (నేను టుసాన్లోను ఆమె ఆర్కన్సాస్లోను ఉన్నది.)
"మరేమున్నది?" అనడిగాను.
"స్కార్ఫ ఉన్నది" అన్నదామె.
ఆ గుడ్డ మీద నీ చేతిని వేయుము. ఇంకొక చేతితో ఫోన్ ను పట్టుకొనుము" అని చెప్పాను. దేవుని కృప చూపమని, శత్రువును గద్దించమని ప్రార్ధించాను.
ఆమె వెళ్ళి ఆ గుడ్డను అతనిపై ఉంచినది; మరుసటి ఉదయమే అతడు నాకు ఫోన్ చేసెను! ఇరవై-నాలుగు గంటలు లేక అంతకంటే తక్కువ సమయములోపే నన్ను పిలిచెను.
50మన ప్రశస్త సోదరుడగు రాయ్ రాబర్సన్ ను ఇంకా నేను చూడలేదు. మరియు మీకు తెలియునా, సహో, రాయ్ ఒక రకమగు సైనికుడు. అతడు ఇప్పుడు ఇక్కడ ఉన్నట్లయితే దానిని నేను విమర్శగా చెప్పుటలేదని అతనికి తెలియును. అతడు సైన్యములో సార్జెంటు (హవల్దారు)గా పనిచేసెను అని మీకు తెలియును. సైన్యములో అటువంటి పనిని చేయుట చాలా కష్టము. "మంచిది, ఈ ఆత్మీయ సంగతులన్నియూ ఎవరికో గాని," అతని కొరకు కాదు! కాని ప్రభువతనిని కాపాడెను. అతడు చనిపోయియుండవలసినదే; అతడు మరణించెనని తలంచి చాలాసేపు పడవేసిరి. ప్రభువతనిని బాగుచేసెను! అప్పటి నుండియు అతడు ఆయనను వెంబడించెను. ఈ దర్శనములు, "ఆత్మీయ సంగతులు" అతనికి తెలియవు.
51మరియు ఇక్కడ చాలాకాలము క్రితము కాదు, నేను అక్కడికి అతనిగూర్చి వెళ్ళక మునుపు సహో, రాయ్ కి ఇవ్వబడిన దర్శనము చాలామందికి తెలుసు. నేను అక్కడ కొండ మీద ఆ వెలుగులో నిలబడియుండుట మరియు ఒక స్వరము నా యొద్దనుండి వచ్చుచుండుట చూచాడు. అది సమస్త సందేహమును సహో, రాయ్ లో నుండి తీసివేసెను.
మరొక రాత్రి అతడు విపరీతమగు జ్వరముతో ఎంతో జబ్బుగా నుండెను. వైద్యుడతనికి మందులు ఇచ్చెను. సమస్తమూ చేసెను, అయినా మరియు తరువాత అవి ఏ మంచియును చేయలేదు. అతడు అసలు కదలలేని స్థితికి వచ్చెను. కాళ్ళు చేతులు చచ్చుపడినవలె యుండెను.
ఒక జర్మను .88 తుపాకితో ఆ చిన్న సోదరుడు ముక్కలవుటకు కాల్చబడెను. అతని సహచరులందరూ మరణించిరి గాని అతడు గాయములతో బయటపడెనని నేను అనుకొనుచున్నాను. అక్కడ అతను ముక్కలవుటకు పేల్చబడెను.
ఏమి జరిగినదో మీరు ఎరుగుదురా? ఘనురాలైన అతని భార్యతో నేను చెప్పాను, సహోదరి. రాబర్సన్, ఆమె చెప్పెను… "ఏదైనా అక్కడ ఉన్నదా?" అని అడిగాను. నేను అక్కడేమున్నది? అనడిగాను.
"ఒకప్పుడు నీవు ప్రార్ధించిన ఒక చేతిరుమాలున్నది" అని ఆమె చెప్పెను. "వెళ్ళి తీసికొని" రమ్మున్నాడు.
నేను టుసాన్లో యున్నాను. (ఆమె తన చేతిని అక్కడే వేసినది), ప్రార్ధన గద్దించాను. "రాబర్సన్ సోదరీ! అది పోవును" అన్నాను.
"అది వెళ్ళిపోబోవుచున్నది, దానిని చెప్పుము" అని ఏదో నాతో చెప్పింది. అరగంటలో జ్వరము పోయినది. అతను వంట గదిలో ఏదైనా తినుటకు దొరుకునేమోనని వెదకసాగెను, చూసారా.
"ఎన్నడూ మీ నమ్మకమును జారవిడుచుకోవద్దు" అని మీతో నేను చెప్పుటకు ప్రయత్నించుచున్నాను. నా గూర్చి అపవాది మీతో చెప్పనివ్వకండి, ఎందుకనగా చాలా చెప్పుచున్నాడు కాని మీరు నమ్మికయుంచుడి; ఎందుకనగా ఆలాగు ఉంచనియెడల మీకేమీ జరుగదు. నన్ను ఒక మానవునిగా చూడవద్దు, నేను మనిషినే. నేను తప్పులతో నిండియున్నాను. కాని ఆయనగూర్చి నేను చెప్పుచున్నదానిని చూడండి. అది ఆయనే, ఆయన మాత్రమే చేయగలడు.
52మేము కొలొరెడోలో యున్నాము. చాలా ఎండిపోయియున్నది. వేట దొరకుట లేదు. ప్రభువు సహో వీలర్ ను దీవించి మంచి వేటను ఇచ్చెను. అందుకు మేము చాలా సంతోషించాము. అడవులలో అతడు వేటాడుట అదే మొదటిసారి. మరియు ప్రభువతనిని దీవించెను. ఇరవై సంవత్సరాల నుండి ఎదురు చూచుచున్న పెద్ద జంతువును కొట్టాను. సహో, బాంక్స్ మరియు నేను చాలా కాలము నుండి దానికొరకు ఎదురు చూచుచున్నాము. ఆ వేడి ప్రాంతములో తుపాకితో కొట్టాను. దానిని చలి ప్రదేశములోనికి తెచ్చేసరికి ఉబ్బిపోయినది. గాజు కవచములో ఉంచినా సరే అలాగయినది. చాలా అంగుళాల మందంలో వ్యాకోచించెను. దానికి దెబ్బ తగలని చోట అనగా చెట్ల మధ్య నిలబడి తుపాకీ పేల్చాను; మానవత్వంతో నేను ఎప్పుడు కొట్టు స్థలములో కొట్టినట్లయితే, అది దానిని ఒక సెకెండులో అది చంపును. కాని అది ఎంతో ఎత్తులో దానికి తగిలినది, అది అలా ఎగిరి క్రిందపడిపోయినది.
53బిల్లీ నాతో యుండెను, "అదిగో పడిపోయినది" అన్నాడు. నేను కూడా అలాగే తలంచాను. దగ్గరకి వెళ్ళి చూడగా అది కాదు. "చెట్టుకు తగిలింది కాబోలు" అని అతడనెను. నేను పైకి క్రిందికి చూచాను. చెట్టు మీద మచ్చ నాకు కనపడలేదు. మరియు తరువాత దానికొరకు నేను వెదక నారంభించాను. ఒక హెచ్చరిక గురుతు కనబడినది. మాకంటె పైన వంద మంది మనుష్యులున్నారు. దీనికి సహో. పామర్ మొదలగు వారు సాక్షులు. సహో, ఎవన్స్ అక్కడుండెను. సాహో, వైల్క్ ఎవన్స్, మరియు అతని కొడుకు రానీ ఉన్నారు. కొద్దిసేపటి క్రితం పిలిచాను అనుకొనుచున్నాను. మాకు పైన పెద్ద గుంపు ఉన్నది. వారు దానిని ఆవుల శిబిరము అందురు. ఆవుల కాపరులు అక్కడ యుండెదరు మరియు వేరుగా ఉంచుదురు. నేను కూడా ఆ పనిని చేశాను. పశువులను మేపి వేరుపరచేవాడ్ని.
54మరియు అప్పుడు… దాదాపు అక్కడ వందమంది ఉండిరి. కాని ఆ ప్రాంతములో మంచు తుఫాను వచ్చునని హెచ్చరిక విన్నప్పుడు వెంటనే పారిపోవుట మంచిదని ఎవరికైనా తెలియును. అందువల్లనే సహో. పామర్ తదితరులు పెందలకడనే వెళ్ళిపోయిరి, ఎందుకనగా వారి కారులో శక్తివంతమగు రేడియో లేదు. వాతావరణము గూర్చి తెలిసినప్పుడు ఎన్ని వారాలయినా మీరుండగలరు. "మంచు తుఫాను వచ్చుచున్నది" అని వినిరి. వాతావరణ హెచ్చరిక వినిరి. పత్రికలు, రేడియోలు ప్రకటించినవి. గుంపు తరువాత గుంపు వాస్తవికముగా అక్కడున్న చుట్టు ప్రక్కల సమస్తము అందరూ తరలిపోయిరి. అప్పుడు వారంత వెళ్ళిపోయారు, ఎందుకనగా అక్కడ నుండి వెళ్ళిపోవలెనను వారికది తెలియును.
55కాని రెండు దుప్పిలను వేటాడు లైసన్సుగల నా సోదరులు యుండెను, మరియు వారు వెళ్ళుటకు ఇష్టపడలేదు. కాబట్టి "సరే, ఇక్కడే యుందుము" అని అన్నాను. కాని నాకు ఆరు రోజులలో ఒక కూటము రాబోవుచున్నది. నేను తిరిగి టుసాన్ కు వెళ్ళవలసియున్నది.
కాబట్టి నా చిన్న భార్య, ఇప్పుడు మాకు పెండ్లయి ఇరవై-రెండేళ్ళయినది. మరియు ఇరవై యేండ్లు, పెండ్లి రోజున ప్రతిసారి అక్కడుందును. అనుకోకుండానే ఆలాగు జరిగినది. నాకు ఒక చిన్న స్థలము యున్నది. నేనెల్లప్పుడూ అక్కడికి వెళ్ళి, ప్రార్థించెవాడిని మరియు నేను ఆమెను తీసుకొని వెళ్ళిన స్థలమువలె అది కనిపించేది.
మీకు తెలియునా, నేను ఒక కార్యమును చేశానని మీకు తెలుసా, మా హానీమూన్ కొరకు మరియు వేటాడుటకు వెళ్ళుట కొరకు నా యొద్ద వెచ్చించే డబ్బు లేదు గనుక నా భార్యను హనీమూన్ కొరకు వేటకు తీసుకొని వెళ్ళాను. కాబట్టి మేము న్యూయార్కులో యున్నాము. నా గుర్తున్నది నేను కట్టెలందించుటలో మరియు కొన్ని కార్యములలో ఆమెకు సహాయము చేశాను. మా పెండ్లి రోజు వచ్చినప్పుడెల్లా నాకు ఆ చోటు జ్ఞాపకము వచ్చును. అక్టోబరు ఇరవై-మూడున ఆ స్థలంలో రుతువు ఆరంభమగును. ఇరవై సంవత్సరాల నుండి నేను ఇంటి యొద్ద లేను, ఎల్లప్పుడు అక్కడే ఉండేవాడిని.
56ఆ రోజు మా పెండ్లి రోజు, "ఇప్పుడు మీరంతా ఇక్కడే ఉండగోరినయెడల ఇక్కడ బహుశా ఒక నెలపాటు మనందరం ఉండిపోవలసివచ్చునని" వారితో ఆ చలిమంట యొద్ద చెప్పాను, ఎందుకనగా ఒక్క రాత్రిలో ఇరవై అడుగుల మంచుపడుట నేను చూచాను. వెళ్ళినప్పుడు చాలా ఎండగాయుండును. ఆ మరుసటి రోజునే అంత మంచుపడును. గుడారము కప్పబడును. అదంతా కరిగిపోవువరకు నిలచియుండక తప్పదు. అది అడవిలో పదిహేను లేదా ఇరవై మైళ్ళ దూరము. అత్యవసరమైనచో, హెలికాప్టర్లు పంపి రక్షించుదురు. మామూలుగా ఎవరూ చనిపోరు. కాని అక్కడ ఉండిపోవలసి వచ్చును.
57వాతావరణ హెచ్చరికను వినగానే ఎక్కడి వారక్కడ వెళ్ళిపోదురు. మేము అక్కడే యున్నాము. మరియు నేనిలా చెప్పాను, "ఆలోచించుకొనండి. మీరు ఉండగోరిన యెడల నేనును మీతో యుండి వేటాడుదును. నా భార్యను పిలచి, "సంతోషకరమగు పెండ్లి రోజు" అని చెప్పుదును. కాబట్టి నేను చెప్పాను, "అప్పుడు కొన్ని తేయాకు కాపీ విత్తులు మొదలగు తిను పదార్ధములు తెచ్చుకొందము, ఎందుకనగా ఇచ్చట మనము ఉండిపోవలసివచ్చును." అప్పటికే మా రొట్టెలు అయిపోయినవి. చాలా కాలము నుండి నేను అట్లు (pan cakes) తినలేదు. దాదాపు ఇరవై-ఒక్క రోజుల పాటు కెనడాలో అవే నేను తిన్నాను. అవి నాకు చాలా ఇష్టము. కాబట్టి రొట్టెలు తెచ్చుకోగోరాను.
58కావున వారందరూ ఉండుటకే ఇష్టపడిరి. ఇక వేరే చేయవలసినది లేదు. ఉండుట తప్ప సహో, మన్ మరియు నేను బయటకు వెళ్ళాము. మరియు మేము క్రిందికి వెళ్ళి మరియు నాకు తిను పదార్ధములు తీసుకొనెను. నేను నా భార్యకు ఫోను చేయసాగెను గాని ఎటువంటి జవాబు లేదు. ఎవరూ జవాబు ఇవ్వలేదు. గంటసేపు కిరాణ సామాను కొట్టు వచ్చువరకు ఆగాను. కొని మరల వెళ్ళి నేను ఫోను చేశాను. ఆమె జవాబు ఇవ్వలేదు. నేను సోదరి ఎవన్స్ ను పిలువసాగాను. ఆమె ఇక్కడున్నదనుకొనుచున్నాను. మరియు నేను చెప్పాను… ఎవన్స్ దంపతులు ఇచ్చటేయున్నారు.
కాబట్టి నేను సహోదరుడు ఎవన్స్ కొరకు సోదరి ఎవన్స్ను పిలిచాను. ఆమె ఇట్లన్నది, "నేను సోదరి బ్రెన్హాంను పిలచి ఆనందకరమగు పెండ్లి రోజు శుభాకాంక్షలు తెలియచేయుదును." కాని ఆమె కూడా పిల్లల కొరకు కొన్ని కిరాణ సామానులకు మార్కెట్టుకు వెళ్ళినది.
మరియు తరువాత మేము తిరిగి వచ్చాము; మరుసటి ఉదయము ఆకాశములో మేఘములు తప్ప ఇంకేమీ కనబడలేదు. ఆ ఆకురాలు కాలమంతా వాన రానందున చాలా పొడిగాయున్నది. ఆ పొడిగా నున్నందున వారు వేట కాలమును మరికొన్ని దినములు పొడిగించిరి.
59మంచిది, ఆ సోదరులతో ఆ ఉదయం నేను ఇట్లు చెప్పాను, "మొదటి వర్షపు చినుకులు రాలుచున్నవి. మొదటి మంచు పడుచున్నది. మొదటి మంచూ - వడగండ్లతో కూడిన వాన పడుచున్నది, ఏదయినా ఇక జరుగవచ్చును. మరో పదిహేను నిమిషములలో మీ చేయి మీకు కనబడదు, చూచారా. విపరీతంగా గాలులు వీచును. మీకు ఈ ప్రాంతము సంగతి ఎంత తెలిసినా నాకు లెక్క లేదు. ఇక్కడే యున్నచో మీరు చనిపోదురు, ఎందుకనగా కొన్నిసార్లు మీరు ఊపిరి పీల్చలేరు. ఆ మంచు వడగండ్లతో కూడిన వాన బలముగా పడును మరియు మీరు అక్కడే చనిపోవుదురు. ఆ మంచుపడుట ప్రారంభించగానే మీరు సాధ్యమైనంత త్వరగా బసకు చేరుకోవలెను."
60మంచిది, "మీరు వెళ్ళి అక్కడ కూర్చొనండి. నేను కొండపైకి వెళ్ళి రాళ్ళను దొర్లించి మరియు మొదలగు కార్యములు చేసి దుప్పిలను బెదిరించుదును. మరియు వాటిని క్రిందికి పరిగెత్తించవలెను, మీరు వచ్చిన వాటిని వేటాడండి" అన్నాను.
నేను పైకి ఎక్కనారంభించాను, "ది సాడిల్" అను స్థలమునకు నేను ఎక్కాను. నేను తరచుగా అక్కడి నుండి దాటి "క్వాకర్ నాబ్" అను చోటకు వెళ్ళుచుందును. ఇంకా పైన కాంటినెంటల్ డివైడున్నది. ఆ సాడిల్ అను చోటకు వెళ్ళేసరికి మేఘములు నల్లబడుచున్నవి. ఒక్క కారు కూడా కనబడలేదు. ఆవుల కాపరులు మాత్రమే బయట ఉన్నారు. మరింతగా వాతావరణము చెడిపోయినది. కాబట్టి కొద్ది నిమిషాలలో వర్షము కురియసాగినది. మంచిది, నా తుపాకిని తీసికొని నా కోటు క్రింద పెట్టాను. అది తడవకుండా జాగ్రత్తపడ్డాను. పరుగిడి ఎలుగు బంతి వచ్చునెమో అని చెట్టు క్రింద కూర్చొని వేటాడుటకు గురిపెట్టాను. "ప్రభువా, దేవా, నీవే ఆ గొప్ప యెహోవావు, నిన్ను ప్రేమించుచున్నాను" అని ప్రార్ధించాను.
61నాకెన్నో అనుభవములున్నవి! సహో. పామర్ తదితర సోదరులకు పక్షిరాజు యుండు చోటును చూపించాను. అది ఎగురుట ఆ రోజు నేను చూచాను. ఆ చోటు లోనే అదియుండును. నాకది ప్రత్యేకమగు సంగతి కాదు. ఆ కొండలలో ప్రభువుతో నా అనుభవములు లెక్కకు మించియున్నవి. కాబట్టి ఆయనను చూడకుండా మీరక్కడికి వెళ్ళలేరు. ఆయన ప్రతిచోట ఉన్నాడు.
నేనక్కడ కూర్చొనియుండగా, మంచు వాన ఆరంభమాయెను. గాలి ఆ విధముగా తీవ్రమైనది. "నాకు క్రిందికి పోవు దారి తెలియును గాని ఇక్కడ నుండి ఇప్పుడు వెళ్ళిపోవుటయే మంచిది" అనుకొన్నాను.
కాబట్టి నేను చెప్పాను… క్రిందికి చూచాను గాని అసలేమీ నాకు క్రింద కనబడుట లేదు. మేఘములు ప్రయాణము చేయుచున్నవి. మంచు కురియుచున్నది. అదే మంచు తుఫాను! "ఒక గొప్ప మంచు తుఫాను రానున్నదని" ముందే వాతావరణ కేంద్రము వారు చెప్పిరి.
62సహో, టామ్ ఇచ్చటున్నాడు. సహో, టామ్ సింప్సన్ కెనడా నుండి వస్తూ వాతావరణ హెచ్చరికను వినెను. ఆ ప్రాంతము గుండా వెళ్ళుట మంచిది కాదని అతనికి సలహ ఇయ్యబడెను, ఎందుకనగా "గొప్ప మంచు తుఫాను రానున్నది" అని ఈ వాతావరణ కేంద్రము చెప్పెను. టామ్ సోదరుడా! నీవెచ్చటున్నావు? నేను అనుకొనుచున్నాను, అవును ఇక్కడే యున్నాడు. మంచు తుఫాను రానున్నది! అందరూ దానిని ఎదుర్కొన సిద్ధపడిరి.
63నా తుపాకీని మరల నా ఎర్ర షర్టు క్రింద దాచుకొని కొండ దిగనారంభించాను. సాడిల్ అను చోట నుండి అరమైలు ముందుగు రాగనే పెద్ద మంచు చినుకులు రాలసాగినవి. కొండమీద నుండి గాలి సుడివలె తిరిగి వచ్చుచున్నది. ఇక నాకు క్రింద ఏమీ కనబడుటలేదు. నా ముందు ఇరవై అడుగులు లేదా ముప్పయి అడుగులు మాత్రమే నాకు కనబడుచున్నది. "లిటిల్ హాగ్ బాక్" అను చోటకు నేను దిగివచ్చాను. సెలయేటి దగ్గరకు వచ్చినట్లయితే నాకు దారి తెలియును. కాని అది వడిగా ప్రవహించితే నేనేమి చేయజాలను.
64మరియు తరువాత నేను క్రిందికి దిగడము ప్రారంభించాను మరియు నేను సగం దూరం క్రిందికి దిగి వచ్చేశాను. నేను మాట్లాడుచున్నప్పుడు మీరు వినుచున్నట్లుగానే అంతే తేటగా ఏదో నాతో చెప్పెను, "ఆగి తిరిగి వెళ్ళుము!" అని ఒక స్వరము నాతో చెప్పుట విన్నాను.
మంచిది, "నేను దేనిగూర్చి ఆలోచిస్తున్నాను? నా మనస్సు ఆ విధంగా పలుకుచున్నదేమో," అని నేను అనుకొన్నాను. మరియు నేను ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేకపోవుచున్నాను.
ఆ ఉదయం డేవిడ్ నాకు శాండ్విచ్ తయారు చేసెను. తన తండ్రిని కూడా నాతో పాటుగా పంపుటకు ఉల్లిపాయ, తేనె ఇయ్యగోరెను. మాకదే యున్నది గనుక అతడు నాకు అల్పాహారము సిద్ధపరచెను. దానిని చుట్టి నాకిచ్చెను గాని అందులో ఏమున్నదో తెలియదు. దానిని నేను షర్టు క్రింద పెట్టుకొన్నందున షర్టు తడిసినది. కాబట్టి అది తడిసినది. నేను అనుకున్నాను, "నేను కేవలము ఆగి దీనిని తిందును మరియు అప్పుడు అన్ని బాగుండును కావచ్చు." కాబట్టి నేను ఆ శాండ్విచ్ ను బయటకు తీశాను. దాదాపు 10 గంటలయినది. నేను దానిలోనిది తినసాగాను, "నాకేమీ ఇప్పుడు పరవాలేదని" దానిని తినిన తరువాత అనుకొన్నాను. నేను ముందుకు కదలసాగాను గాని, "బయలుదేరిన చోటికే తిరిగి వెళ్ళుము!" అని ఏదో చెప్పెను.
65"ఆ తుఫాను గుండా వెళ్ళుటయా?" అరమైలుకంటే ఎక్కువ ముందుకు వచ్చాను. ఆ చీకటిలోనికి వెళ్ళవలెనా? కొద్దిదూరం కూడా కనబడుట లేదు. నేను ముసలివాడినగుచున్నాను. మరియు నేను ముప్పయి-మూడు సంవత్సరాల నుండి నేను క్రైస్తవునిగా యున్నాను. అదెంత హాస్యాస్పదముగా కనబడినా గాని, ప్రభుని మాట ఏమిటో నాకు తెలియును! ప్రభువు చెప్పినదే చేయవలెను!
మరియు నేను తిరిగి సాడిల్ యొద్దకు తడుముకొంటూ వెళ్ళాను. మంచుగడ్డ బహు కఠినముగా పడచున్నది. చాలా చీకటియగుచున్నది. నా కోటు తగిలించి కూర్చొన్నాను. నా తుపాకీని షర్టు క్రింద మూశాను. "ఇక్కడ నేనేమి చేయుచున్నట్లు? ఎందుకు నేను వెనక్కు వచ్చాను?" అనుకొన్నాను.
GEN 1:1•
MATT 8:26•
LUKE 8:24
66కొద్ది నిమిషములు నేను ఆగాను. మరల నేను ఎక్కసాగాను, నేనెప్పుడు వినాలని కోరుచున్న ప్రకారము బహు తేటగా ఒక స్వరము వినబడినది. "భూమ్యాకాశములకు నేనే సృష్టికర్తను! గాలిని, వానను రప్పించువాడను నేనే?" నేను టోపీ తీసివేశాను.
"గొప్ప యెహోవా, అది నీవేనా?" అనడిగాను.
ఆయన ఇట్లు చెప్పెను, "సముద్రము మీద గాలిని రప్పించువాడను నేనే. అలలను క్రిందికి పోజేయువాడను నేనే. భూమ్యాకాశములను నేనే సృజించితిని. నీవు పలుకగా, ఆ ఉడుతలను ఉనికిలోనికి రప్పించినవాడను నేను కానా? నేనే దేవుడను."
ఒక స్వరము నీతో మాట్లాడునప్పుడు, వాక్యముతో దానిని నీవు జోడించుకొనవలెను. అది వాక్యానుసారము కానియెడల, దానిని విడిచిపెట్టు. అదెంత తేటగాయున్నా గాని నేను లెక్కలోనికి తీసుకోను, దానినుండి నీవు దూరము కమ్ము.
"అవును, ప్రభువా" అని నేను అన్నాను.
"ఆ తుఫాను మరియు గాలులను పొమ్ముని పలుకుము మరియు అవి పోవును" అని ఆయన చెప్పెను. ఇప్పుడు నా ఎదుట ఈ బైబిలున్నది, అందులోనే నా జీవము యున్నది.
నేను నిలబడి ఇట్లన్నాను, "ప్రభువా, నీ స్వరమును గూర్చి నేను సందేహించుట లేదు. మేఘములారా, మంచు, తుఫాను, వడగండ్లారా మీరు ఆగిపొండి. యేసుక్రీస్తు నామములో మీ మీ స్థలములకు పొండి! వెంటనే సూర్యుడు బయటకు వచ్చి నాలుగు రోజుల వరకు ప్రకాశించవలెను. మా వేట ముగించుకొని, నా సోదరులతో తిరిగి వెళ్ళిపోవు వరకు ఆలాగు ప్రకాశించవలెను."
67చాలా తీవ్రంగా గాలి "హోరు" మను శబ్దమును ఇచ్చుచున్నది. ఆ గాలి "హుష్, హష్, హష్" అని ఆగిపోయినది.
నేను నిజంగా కదలకుండా నిలబడిపోయాను. జరుగుచున్న దానిగూర్చి ఆశ్చర్యపడుచూ సోదరులు అచ్చట నిలబడిరి. మంచు మరియు తుఫాను ఆగిపోయినది. ఒక సుడిగాలి కొండల మీద నుండి వచ్చి మేఘములను ఇటు అటు చెల్లాచెదురు చేసినది. మేఘములు తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణములకు చెదరిపోయినవి. కొద్ది నిమిషములలో సూర్యుడు చక్కగా వేడి ప్రకాశించుచుండెను. ఇది సత్యము! ఇది సత్యమని దేవునికి తెలియును! నేను టోపీ తీసివేసి, చుట్టూ చూస్తు నిలబడిపోయాను.
నేను పూర్తిగా అచేతనంగా నిలబడిపోయాను.
"దేవుడు సృష్టికర్త, అంతా ఆయన చేతిలోనేయున్నది. ఆయన నాకు ఏమి చెప్పుచున్నాడు?" అని ఆలోచించసాగాను.
నేను నా తుపాకీని తీసికొని, తుడిచి, కొండ దిగుటకు వెనుక తిరిగి నడువటము నారంభించాను. నాతో మరల ఎవరో ఇట్లనిరి, "నీవు ఈ అరణ్యములో నాతో కూడా ఎందుకు కొన్ని అడుగులు నడువకూడదు, ఎందుకు నాతో నడువకూడదు?"
"అవును, ప్రభువా, నా పూర్ణహృదయముతో నడతును; నీతో నడచుట అనునది నేను చేయకలిగిన గొప్ప కార్యములలో ఇది ఒకటి," అని చెప్పాను. కాబట్టి భుజమునకు తుపాకీ తగిలించుకొని దానిలోనుండి క్రిందకు నడువ నారంభించాను. ఆ కలప చెట్టును ఎవరూ గొడ్డలితో ఎన్నడూ తాకలేదు. దానిగుండా అక్కడ నడువ నారంభించాను.
68వేటగాళ్ళు నడచు ఆ త్రోవలో నేను వెళ్ళుచుండగా, ఇట్లనిపించినది, "ఆ చోటికి నేను వెళ్ళుదును. నిన్న మా యొక్కపెండ్లి రోజు మరియు నేను కొద్ది నిమిషములు అక్కడ నిలువబడెదను, మీడాకు చిన్న అభివందనము చేసినట్లుగా యు౦టుంది. ఆ తరువాత ఈ ఎక్కువ చెట్లుగల వైపుకు వెళ్ళుదును." మరియు నేను అనుకున్నాను, "నేను అక్కడకు నడిచి వెళ్ళెదనని నమ్ముచున్నాను, మా పెండ్లి రోజుకు ఒక అభివందనమువలె యుంటుంది. పిమ్మట ఆ చీకటి కలప వృక్షములోనికి ఆ ప్రక్కవైపు క్రిందికి వెళ్ళెదను మరియు చుట్టూ తిరిగి ఇంకా ముందుకు వెళ్ళి, కర్రల్ పీక్స్ గుండా ఆ వెనక్కువచ్చుదును." కేవలము నడుచుచు ఆనందించుచున్నాను.
"తండ్రి, నీవు నాతో నడచుచున్నావని నేను ఎరుగుదును, ఎంత గొప్ప భాగ్యము! ఇంతకంటె గొప్పవారితో నేనెన్నడూ నడువలేను; దేవునితో నడచుట!" అనుకొన్నాను.
69ఆ వెచ్చని సూర్యకాంతి, నేను పర్వతాలగుండా బయటకు వచ్చుచుండగా తగులుచున్నది.
ఇంధనము నింపుకొనే స్టేషన్ యొద్ద ఆగాను, "అందమైన దినము!" అనుకొన్నాను. మూడు రోజులు గడిచాయి. నాలుగు రోజులు గడిచే వరకు దేశము యొక్క ఆ భాగములో వర్షము కురియలేదు. ప్రతి దినము సూర్యుడు ప్రకాశించెను. అది నిజమేనా, సహోదరులారా? చూచారా? మరియు ఆకాశంలో ఒక్క మేఘము లేదు.
ఇంధనము నింపుకొను స్టేషన్ కు నేను బయటకు వచ్చాను, "ఎంత ప్రకాశమగు దినము!" అనుకొన్నాను.
"అవును. నిశ్చయంగా!"
"చాలా పొడిగా యున్నది" అన్నాను.
"ఇది చాలా వింత. నీకు తెలియునా, వారు మాకు చెప్పారు ఒక పెద్ద మంచు తుఫాను వచ్చుచున్నదని, కాని ఆకస్మాత్తుగా అది ఆగిపోయినది!" అని అక్కడి వ్యక్తి చెప్పాడు.
70నేను న్యూ-మెక్సికో సరిహద్దుకు వచ్చాను. నేను, నా కుమారుడగు బిల్లీ కలిసి ఆ ఉదయం బయలుదేరే ముందు, "నిశ్చయంగా ఒక చక్కటి రోజు" అనుకొన్నాము.
"అవును, నిశ్చయంగా!"
"చూడుము, అది చాలా చక్కగా ఎండిపోయున్నది" అన్నాను.
"అవును, అది ఎండిపోయినది!"
"మీరిక్కడి వారేనా?" అని ఆ వ్యక్తి నడిగాను.
"కాదు. నేను విస్కాన్సిన్ నుండి వచ్చాను, లేక మరొక చోటినుండి వచ్చాను, అని చెప్పెను. దాదాపు ఇరవై నంవత్సరాల నుండి ఇచ్చటేయున్నాను కాబట్టి ఇక ఇదే నా స్వస్థలము అనుకోవచ్చు" అన్నాడు.
"నేను ఊహిస్తున్న ప్రకారము అయితే నీవు స్థానికుడవే. ఇప్పుడు చాలా ధూళిగా వాతావరణము మారినది" అన్నాను.
"నీకు తెలుసా, ఒక వింత కార్యము జరిగినది! మంచు విపరీతంగా పడి మంచు తుఫాను రానున్నదని వాతావరణ కేంద్రము వారు చెప్పిరి. ఆ విధంగానే ప్రారంభమైనది గాని ఆగిపోయినది!" అన్నాడు.
"అవును" అన్నాను.
నేను ఇంటికి వచ్చాను. మరియు సహో, టామ్ చెప్పెను మంచు తుఫాను రానున్నది గనుక ఆ మార్గంలో పయనించవద్దని చెప్పబడెను. అతడు ఆ ప్రాంతము గుండానే వచ్చెను. ఒక్క వాన జల్లు లేక ఏదీ కూడా రాలేదు, చూడండి, ఆయన ఎల్లప్పుడున్న ప్రకారముగానే, ఆయన ఇంకనూ దేవుడే, చూచారా.
71అక్కడికి నడుచుకుంటూ వెళ్ళుచున్నాను, నేను ఆలాగు వెళ్ళుచున్నాను… ఇప్పుడు, ఈ భాగము యొక్క టేపును నా భార్య అందుకొనదని నమ్ముచున్నాను. చూచారా, కాని ఒక్క సంగతి మీతో చెప్పబోవుచున్నాను. మరియు ఇప్పుడు నేను మీకు చెప్పును… నేను కేవలము మీకు నిజమే చెప్పుచున్నాను. చూచారా, మరియు అది చేయుటకు ఇది మాత్రమే మార్గము. పెండ్లి రోజున కూడా ఈ విధంగా నేను వెళ్తున్నా ఆమె ఎందుకు నా గూర్చి ఫిర్యాదు చేయలేదని తరచూ నేను ఆశ్చర్యపడుచుందును? నా మనస్సులో నేనే నిర్ణయము తీసుకున్నానో మీరెరుగుదురా? "ఇంటిలో చాలామంది జనులుందురు. నాకెంతో ఉద్రిక్తతగా యుండును. నేనెల్లపుడూ దేవుని గూర్చి బైబిలు గూర్చి మాత్రమే మాట్లాడగోరుదును. ఆమెకు కొద్దిగా విశ్రాంతి కావలెను గనుక నేను కొన్ని రోజులు వేటకు వెళ్ళుదును" అనుకొన్నాను. నేను దానిగూర్చి ఆలోచిస్తూ అక్కడికి వెళ్ళుచుందును.
72అందుకు నేను ఆమెకు క్షమాపణ తెలుపుకొనుచున్నాను. అటువంటి ఆలోచనలను క్షమించమని దేవుని అడిగాను. "ఆమె కష్టించి పనిచేయును. ఎప్పుడూ వంటగదిలోను, మరెక్కడో యుండి పనిచేయును" అని నాలో అనుకొన్నాను.
ఆమె మీ అందరికీ తెలియును. ఎప్పుడూ ఆ వాషింగ్ మెషిన్ కు ఖాళీయుండదు. కాబట్టి నేను బయటకు వెళ్ళి, నేను ఆమెను లాగి "అంతగా ఉతకవద్దు. నాతో మాట్లాడు… చూడు. నిన్ను నేను ప్రేమించుచున్నాను. నాకు నీవు ఏదయినా చెప్పాలని కోరుచున్నాను. నేనును నీతో సంభాషించగోరుచున్నాను" అని చెప్పేవాడిని.
"మంచిది, నేను మాట్లాడుచున్నాను గదా?" అని చెప్పి మరల ఉతక నారంభించినది. బహు కష్టపడుచున్నది.
"నీవాలాగు చేయడము నాకు ఇష్టము లేదు, నీవు ఇక్కడ నా ప్రక్కన కూర్చొని మాట్లాడు" అన్నాను.
"ఓ బిల్, నాకు చేయవలసిన పని ఎంతో యున్నది!"
"సరే, ఆమె పని సమయాన్ని పాడుచేయకూడదు" అనుకొన్నాను. ఆ విధంగా ఆలోచించుచూ వెళ్ళిపోయాను.
ఇప్పుడు, గుర్తుంచుకొనండి, అక్కడ నేను బైబిలు ఉంచాను, ఎందుకనగా నేను వాక్యము ముందు నిలబడియున్నానని మీరు చూచెదరు.
నేను నడచి వచ్చుచుండగా, ఏదో నాకు జరిగినది.
73మొదటగా, ఆమెను హానీమూన్ కు అక్కడ పైకి తీసికొని వెళ్ళిన సంగతి గుర్తుకు వచ్చినది. ఆమె అందముగా యుండెడిది. చక్కని నల్లని జుట్టు. చక్కని గోధుమ రంగు నేత్రాలు కలిగియుండిన, చిన్న బాలికగా ఉండెడిది. మీకు తెలియునా, ఆమెను నేను ఆ చెక్కల మీద నుండి ఎత్తి దించేవాడిని. కొన్ని ఎలుగుబంటులను చంపిన ఆ స్థలమునకు, ఆమెను తీసుకొని వెళ్ళుటకు ప్రయత్నించాను మరియు సమస్తమూ చేసాను. ఆ ఎలుగుబంటులు దొరుకు చోటు ఆమెకు చూపించగోరాను. ఆమె నా ఆవుల కాపరి బూట్లు వేసికొన్నది. (అది దాదాపు ఇరవై-రెండు సంవత్సరముల లేక ఇరవై-ఒక్క సంవత్సరముల క్రిందటి మాట. ఇంకా అంతకంటే ముందే అని నేను అనుకొనుచున్నాను. మేము 1941లో పెండ్లి చేసికొన్నాము.) ఆమెను నేను ఎత్తికొని ఆ దూలముల మీద నుండి దాటించాను, మీకు తెలియునా.
మరియు నేను అనుకున్నాను, "ఆమె నాతో అన్నియూ సహించినది. ఆమె జుట్టు తెల్లబడిపోయినది." అవును. నేను తలంచాను, మంచిది, మరియు నేను వెళ్ళాను: "ఆహా." కొన్ని రోజుల నుండి నేను గడ్డము గీసికోనందున తెల్లగా వెండ్రుకలు నాకు కూడ కనబడుచున్నవి. నా గడ్డము బయటకు ఇక్కడ అంటుకొని తెల్లగా కనబడుచున్నది. నేను అనుకున్నాను, "ముసలి అబ్బాయి, ఇప్పుడు ఇక నీ పని అయిపోయినది. చూడండి, కాబట్టి నీవు చేయవలసినది ఎదైన యుండినయెడల, త్వరగా చేయుట మంచిది. నీవును ముసలివాడి వగుచున్నావు," చూచారా.
74ఆ విధంగా నేను నడచుకుంటూ వెళ్ళుచుండగా, ఒక సంగతి జరిగినది. ఆకస్మాత్తుగా ప్రతి కదలికలోను, సూత్రములోను నేను బాలునివలె కనిపించసాగాను. నేను ఒక బాలునివలె యున్నానని తలంచాను. మరియు నా తల క్రిందికి వంగి యుండెను, మరియు నేను పైకి చూడగా, ఆమె నా ముందు తన చేతులు చాచి నిలబడియుండుట నేను ఎప్పుడు చూచినట్లుగానే తేటగా కనబడినది, అక్కడ ఆమె తన చేతులను చాచి నా కండ్లయెదుట నిలబడినది. మరియు నేను ఆగిపోయాను. నా ముఖమును నలుపుకొని మరల చూచాను. "మిడా, నా ప్రియురాలా, నీవేనా?" అన్నాను.
నేను ఇక్కడ చూచాను, నేను తలంచాను, "ఇప్పుడు ఏమి జరిగినది?" "అవును నేను ఆయనతో నడచుచున్నాను." అనుకొంటూ చుట్టూ చూచాను. వెంటనే అది మారిపోయి, నేను మరల ముసలివానివలె కనిపించసాగాను. నా ముందు నుండి దర్శనము పోయినది.
మరియు నేను ఆగాను; నా టోపిని మరల తీసివేశాను, నా గుండెమీద పెట్టుకొన్నాను. నేను ఇట్లన్నాను, "యేసూ, అనేక సంవత్సరముల నుండి నా హృదయము భారముతో నిండిపోయినది. నేను భారముతో యున్నానని నీకు చెప్పనక్కర లేదు. నేను పశ్చాత్తాపపడితిని, నేను మారిపోయాను, నాకు తెలిసినదంతయూ చేశాను. అయినా ఈ భారము ఇంకా నన్నెందుకు వీడుట లేదు?"
75నేను నడిచి వెళ్తునే యున్నాను. నా ముందున్న చిన్న గుట్టను ముప్పది లేదా నలుబది గజాలు ఎక్కాను. ఆ చిన్న గుట్టను ఎక్కడము ప్రారంభించాను. నాకు నిజముగా చాలా నీరసముగా యున్నట్లు అనిపించినది. బాణము ఆకారమువలె నున్నదానిని ఎక్కసాగాను గాని చాలా బలహీనముగా యున్నాను. తూలిపోవుచున్నాను. మరల నా టోపీని పెట్టుకొన్నాను. నా తలను ఆనించాను. అది ఒక చెట్టువలె కనిపించినది. నేను తలను ఆనించి అక్కడ నిలబడియున్నాను. నా వీపుకు సూర్యుని వెచ్చదనము తగులుచున్నది, "వానను గాలిని ఆపిన దేవుడు ఈయనే" అనుకొన్నాను.
"పాట్, పాట్, పాట్మని ఏదో వెళ్ళుచున్న శబ్దము నాకు వినబడినది.
నేను అనుకున్నాను, "ఏమిటది? నీరు క్రిందపడుచున్నది. సూర్యుడు బయటకు వచ్చెను. ఆ నీరు ఏమిటి?" అని క్రిందికి చూడగా, నా కన్నుల నుండి నీరు కారుచున్నది. నెరసిన గడ్డము మీద నుండి కారుచున్నది. నా యెదుట దేవుడు ఎండిపోయేటట్టుగా జేసిన ఆ ఎండిన ఆకుల మీద పడి ధ్వని వచ్చుచున్నది. మరియు నేను చెట్టుకు ఆనుకొని ఇలాగు నిలబడియున్నాను. చేయి క్రిందికి పెట్టి, చెట్టుకు తల ఆనించాను. మరో చేతిలో రైఫిల్ యున్నది; అక్కడ ఏడుస్తూ నిలబడియున్నాను.
76"దేవా, నీ దాసునిగా ఉండుటకు నేను తగను. నన్ను క్షమించుము. నేను అనేక పొరపాట్లు చేశాను. ప్రభువా, చేయాలని తప్పులు చేయలేదు. నీవు నాపట్ల ఎంతో మేలు చూపియున్నావు" అన్నాను.
నా కన్నులు మూసియుంచాను; "స్టాంప్, స్టాంప్, స్టాంప్" అను ఏదో వెళ్ళుచున్న శబ్దమును విన్నాను.
నా కండ్లు తెరచాను. మరియు నా ముందుకు వచ్చి మూడు లేళ్ళు నిలబడినవి. సహో, ఎవన్స్ కు ఒకటి, సహో. ఉడ్స్ కు ఒకటి, నాకు ఒకటి అనుకొన్నాను, చూచారా. వాటికొరకే నేను ఎదురు చూచుచున్నాను. నా తుపాకీని తీశాను. "నేను ఆ పని చేయలేను, కాని ఆ పని చేయనని దేవునికి వాగ్ధానము చేశాను" అని అనుకున్నాను, చూచారా. "ఆలాగు చేయనని ఆయనకు వాగ్ధానము చేశాను."
"కాని అవి నీ ముందున్నవి" అని ఎవరో నాతో చెప్పిరి.
మరియు నేను తలంచాను, "అతనిని దేవుడు నీకు అప్పగించెను" అని ఒకసారి దావీదుతో ఒకతను అనెను. రాజగు సౌలు దొరికెనని మీకు తెలియునా?
"అతను అక్కడ యున్నాడు! అతనిని చంపుము!" అని యోవాబు అతనికి చెప్పెను.
"దేవుని చేత అభిషేకించబడిన వానిని ముట్టవద్దు," అనెను.
77ఆ చక్కని లేళ్ళు నా ముందు నిలబడి నావైపు చూచుచున్నవి. "అవి దూరము పోజాలవు. వాటికి పోవు దారి లేదు. నాకు ముప్పది గజముల దూరములో యున్నవి. నా చేతిలో రైఫిల్ యున్నది. మూడు నిలబడి చూస్తున్నవి. కాని నేను చంపలేను. మరియు మూడు లేళ్ళు ఉన్నవి. అవి అది ఒకటి ఆడు జింక మరియు రెండు పెద్ద జింక పిల్లలు. నేను రైఫిల్ తీయలేకపోయాను. నేను అనుకున్నాను, "నేను చేయలేను? నేను కదలలేదు. కేవలము అక్కడే నిలబడియున్నాను. "నేను దానిని చంపలేను. నేను చంపనని దేవునితో వాగ్ధానము చేశాను" అని అన్నాను. ఆ సోదరులకు ఆ లేళ్ళు అక్కర లేదు, చూచారా. "నేను వాటిని చంపలేను, నేను వాటిని చంపలేను, అంతే."
78మరియు ఆ ఆడు జింక ముందుకు నడుచుకుంటూ వచ్చినది. ఇప్పుడు వినండి. నాలుగు లేదా అయిదు రోజుల నుండి దాదాపు వందమంది వాటిని వేటాడుటకు ప్రయత్నించుచున్నారు. భయపడినావా? మొదటిగా ఎరుపు గుర్తు (నేను ఎర్రని టోపీ, ఎర్రని షర్టు ధరించాను), మొదటి ఎరుపు గుర్తు చూచి అవి పోవలెను; కాని అవి ఇంకా నిలబడేయున్నవి, ఆ మూడును నావైపే చూస్తున్నవి.
"తల్లివైన నీవు, ఆ రెండు పిల్లలను తీసికొని అడవిలోనికి పొమ్ము. మీరు నా చేతిలోయున్నారు. మీ ప్రాణము నా చేతిలో యున్నది, కాని నేనేమీ మీకు హాని చేయబోను. నేను చంపనని దేవునితో వాగ్ధానము చేశాను" అని చెప్పాను, చూచారా. ఆ తల్లి ఇంకా దగ్గరకు వచ్చెను; ఆమె నావైపు చూచెను. మిగతావి అన్ని నా దగ్గరకు వచ్చాయి; నా చేతులలోనిది తినగలిగినంత దగ్గరగా అవి వచ్చెను. కావున ఆమె చుట్టూ తిరిగినది, ఆ మూడు కలిసి వెనుకకు కొంత దూరము నడిచినవి.
మరియు ఆమె వెనుదిరిగి మరల నా యొద్దకు వచ్చినవి. నేను అసలు కదలకుండా నిలబడియున్నాను. "మీరు అడవిలోనికి పొండి; నాకు కూడా అడవిలో జీవించుట చాలా ఇష్టము! (చూచారా?) "మీ ప్రాణము నా చేతిలోయున్నది, కాని నేనేమీ చేయను. మీరు నన్ను తప్పించుకు పోజాలరు. మీకు తెలియును, మీరు నన్ను తప్పించుకు పోజాలరని" అన్నాను. మూడు క్షణములలో ఆ మూడింటిని నేను చంపగలను, అంత వేగంగా పేల్చగలను; అవి తప్పించుకోలేవు, నా ప్రక్కనే నిలబడినవి. "నేను మిమ్మును విడిచిపెట్టుదును, పోయి జీవించండి," అన్నాను. నేనక్కడే నిలబడితిని. అవి నడుచుకుంటూ అడవులలోనికి వెళ్ళిపోయినవి.
JOSH 1:5
79ఆ విధంగా నేను ముఖమును తుడుచుకొన్నాను, మరియు అప్పుడు వెంటనే, ఏదో జరిగినది. మేఘములో నుండి కాదు, నీలాకాశములో నుండి ఒక స్వరమును తేటగా విన్నాను. ఇదంతా కొద్ది క్షణములలో జరిగినది. "నీవు నీ వాగ్ధానమును జ్ఞాపకము చేసికొన్నావు కదా?" అని ఆ స్వరము పలికినది.
"అవును, ప్రభువా" అన్నాను.
"నేను కూడా నా వాగ్దానమును జ్ఞాపకము చేసికొన్నాను. నేను ఎన్నడూ నిన్ను విడవను, ఎడబాయను," అని ఆయన చెప్పెను. ఆ భారము నా హృదయములో నుండి పోయినది. అప్పటి నుండి మరెన్నడూ అది నాలోనికి రాలేదు. ఎన్నడూ రాకుండు గాక!
ఆ తరువాత నేను టుసాన్ కు వచ్చాను. నేను క్రిందికి వచ్చినంతవరకూ అంత వింత మరెప్పుడూ జరుగలేదు. దేవుడే ఆ ఘడియను అనుగ్రహించెనని నమ్ముచున్నాను, ఏదో జరుగుటకు సమయము దగ్గరైనదనుకొనుచున్నాను.
80సత్యమును మనము అంగీకరించితే చాలును. ఇప్పుడు ఒక్క క్షణము, ఈ వాక్య భావమును మనము గ్రహించగలిగినచో చాలును! "లోకములో ఉన్నవానికంటె మీలో నున్నవాడు గొప్పవాడు." దానిని మనము అర్ధము చేసికొనలేము గాని దానిని నమ్ముచున్నామని చెప్పుదుము. అది సత్యమని మనకు తెలియును గాని నిజంగా దానిని గ్రహించుట లేదు. "లోకములో ఉన్నవానికంటె మీలో నున్నవాడు గొప్పవాడు." గొప్పవాడిగాయన్న నీలో అది ఏమిటి? అది అభిశక్తుడైన క్రీస్తు! క్రీస్తులోయున్న ఆ దేవుడు నీలో యున్నాడు. "లోకములో ఉన్నవానికంటె మీలో నున్నవాడు గొప్పవాడు."
అప్పుడు ఆయన మీలో యున్నట్లయితే గనుక ఇకను జీవించువారు మీరు కారు. ఆయనే మీలో జీవించుచున్నాడు, చూచారా. అది మీరు ఆలోచించుట కాదు. దీనిని గూర్చి మీరనుకొనుట కాదు గాని దీనిని గూర్చి ఆయన చెప్పినది వినండి, చూచారా. అప్పుడు ఆయన మీలోయున్నయెడల, ఆయన చెప్పిన దానిని ఆయన సంపూర్తిగా నిరాకరించడు. ఆయన దానిని త్రోసివేయలేడు. కాని ఆయన తాను చెప్పినదానిని ఆయన నెరవేర్చును. ఆయన ఒక వ్యక్తిని కనుగొనుటకు ప్రయత్నించుచున్నాడు, అతని ద్వారా ఆయన తననుతాను స్వయముగా రుజువుపరచు కొనగోరుచున్నాడు.
1JN 4:4
81దాని అర్ధము ఆయన ప్రతివారి పట్ల దానిని నెరవేర్చవలసియున్నాడని కాదు. ఇశ్రాయేలీయులను నడిపించిన కాలములో మోషే ఒక్కడే ఆయనచే ఎన్నుకోబడెను. మిగిలినవారందరూ వర్తమానమును కేవలము వెంబడించిరి, చూచారా. దానిని అనుకరించుటకు కొందరు ప్రయత్నించుటకు లేచిరి. దేవుడు పలికెను, "మిమ్ముల్ని మీరు వేరుపరుచుకొనండి!" - మిగిలినవారిని మ్రి౦గినట్లు చేసెను, చూచారా. చూచారా?
JOHN 1:1•
JOHN 11:43
82కాని ఇప్పుడు, "మీలో నున్నవాడు లోకములో ఉన్నవానికంటె గొప్పవాడు." యేసుక్రీస్తులో యున్నట్లే దేవుడు మీలోయున్నాడు. ఎందుకనగా, దేవుడు ఏమైయున్నాడో, అదంతయూ క్రీస్తులో కుమ్మరించినాడు. మరియు క్రీస్తులో ఉన్నదంతయూ, ఆయన సంఘములో కుమ్మరించెను, చూచారా. అది దేవుడు మీలో యున్నాడు. "మీలో నున్నవాడు."
ఆయనకు గాలులు, మరియు అలలు లోబడుటలో ఆశ్చర్యము లేదు. ఆయన మాటలకు లోబడెను, ఎందుకనగా అది ఆయన ద్వారా దేవుని వాక్యమైయున్నది. ఆయన నరుడే గాని ఆయన శరీరధారియైన వాక్కు, చూచారా. ఆయన పలికినప్పుడు మానవ పెదవుల ద్వారా దేవుడు మాట్లాడుచుండెను, చూచారా. గాలులు మరియు అలలు సద్దుమణిగినవి అనుటకు ఆశ్చర్యము లేదు. గాలులలో మరియు అలలు సృష్టించిన సృష్టికర్తే ఆయనలో ఉండెను. ఇప్పుడు దానిగూర్చి ఆలోచించండి! నేను ముగించు లోపు మీరు దానిని గురించి ఇప్పుడు లోతుగా ఆలోచించండి. ఆయన మాటకు దయ్యములు చచ్చుపడినవి. అందుకు ఆశ్చర్యమేమి లేదు! అది ఆయనలోనున్న దేవుడు. అది క్రీస్తులోనున్న దేవుడైయున్నాడు. దయ్యములు చచ్చుపడినవి. ఆయన మాట పలుకగా, తిరిగి వెనుకటివలె మట్టిగా మారుచున్న మృతలు లేచుటలో ఆశ్చర్యమేమీ లేదు. ఏలయనగా ఆయనే వాక్యము. లాజరు చనిపోయి నాలుగు దినములాయెను. కుళ్ళుకంపు కొట్టుచుండెను. అతని ముఖము, ముక్కు, ఆ సమయానికి రాలిపోయి యుండును. "లాజరూ! బయటకు రమ్ము!" అనెను. చనిపోయినవాడు లేచి తన పాదములపైన నిలబడెను. ఎందువలన? ఆయన దేవుడు. క్రీస్తులో నున్నవాడు దేవుడు. మృతులు ఆయన సన్నిధిలో నిలువలేకపోయిరి! అది క్రీస్తులోనున్న దేవుడు.
GEN 1:1
83ఇప్పుడు గుర్తుంచుకొనండి, దేవుడు గాలిని సృష్టించెను; అది గాలి. దేవుడు అలలను సృజించెను; అది నీరు. కాని వాటిలోనికి అపవాది చొరబడి నాశనమును తీసుకొని వచ్చుటకు అల్లకల్లోలము చేసెను. దేవుని కుమారులుగా నుండుటకు దేవుడు నరులను చేసెను. కాని అపవాది వారిలో ప్రవేశించినందున కలవరము వచ్చెను (చూచారా), ఆ గాలులలోనికి అపవాది ప్రవేశించి తుఫానును తెచ్చెను. గాలిని సృజించిన దేవుడు గాలితో, "నేను ఎక్కడైతే నిన్ను సృష్టించానో, అక్కడికి తిరిగి వెళ్ళుము" అని చెప్పలేడా? ఆ కొలరాడో కొండపై భాగమున ఆ రోజున నిలబడియున్న సృష్టికర్త ఆయన కాడా? చూచారా? ఒక చేప ముక్కను తీసుకొని మరియు దానిని విరచి మరియు ఇంకొక ముక్క పెరుగునట్లు చేసినది ఆయన కాడా? అసలు అది కూడా ఆయన చేయనవసరము లేదు. దానిని ఆయన చెప్పితేనే జరుగును. ఉడుతలను సృష్టించిన సృష్టికర్త ఆయన కాడా? క్రీస్తులో నున్నవాడు మనలోను యున్నాడు! చూచారా? ఆయన చేసిన క్రియలే ఇప్పుడు అది చేయును, అదే కార్యము. ఆయన మాట పలుకగా చనిపోయినవారు లేవవలసినదే.
84చూడండి, "చనిపోయిన యొక్క జనుల గూర్చి దేవుడు అయిదు రీతులుగా చెప్పెను. ప్రభువు దర్శనమిచ్చి, వారియొద్దకు వెళ్ళి మరియు వారిని తిరిగి లేపెను. అటువంటి ఒకాయన ఇచ్చట కూర్చోనియున్నాడు. ఇక్కడే కూర్చొనియున్నప్పుడు, ఆ వ్యక్తి చనిపోయెను. మరియు ఇప్పుడిక్కడ, ఈ రాత్రి సజీవుడిగా యున్నాడు. గుండెపోటుతో కూలిపోయెను. అక్కడ అతని భార్య యున్నది, ఆమె ఒక నర్సు. మేము వెళ్ళి చూచేసరికి అంతా అయిపోయినది. కండ్లు మూతపడినవి. ఇప్పుడీయన సజీవునిగాయున్నాడు. "ఇక్కడ మనలో నున్నవాడు లోకములో ఉన్నవానికంటె గొప్పవాడు!" చూచారా?
85ఆయన గొప్పవాడు! ఆయన దేవుడు, సృష్టికర్త! గాలులు, అలలు ఆయనకు లోబడవలసియున్నవి. దయ్యములు కదలలేకపోయినవి. సమస్త ప్రకృతి ఆయనకు లోబడెను, ఎందుకనగా ఆయన ప్రకృతికి సృష్టికర్తయై యున్నాడు. ఓ, దానిని గూర్చి ఆలోచించినప్పుడు శరరీము గగుర్పొడుచును. అప్పుడు ఈ సంగతులు మనము గ్రహించగలము. మీరు చూడండి, ఏమిటది? ఆయన నరుడు కాడు. మానవుడది చేయలేడు. మానవుడు సృష్టిలో ఒక భాగము, చూచారా. కాని అది గాలులు మరియు అలలు సృష్టికర్తకే లోబడును, చూచారా. మరియు సృష్టికర్తయే దానిని చేయగలడు, "ఏలయనగా మీలో నున్నవాడు లోకములో ఉన్నవానికంటె గొప్పవాడు." ఆయన సృష్టికర్త, లోకములో ఉన్నవాడు గలిబిలిని కలిగించును. మీలో నున్నవాడే సృష్టికర్త, ఆ గాలులను తయారుచేసినది ఆయనే. ఆయన దయ్యమును గద్దించి, ఆ గాలులలో నుండి బయటకు వెళ్ళగొట్టగలడు మరియు అక్కడ ఒక నెమ్మదియగును. ఆయన దయ్యమును గద్దించి ఆ తుఫానులో నుండి బయటకు వెళ్ళగొట్టగలడు మరియు అక్కడ తుఫాను యుండదు. ఆయన సృష్టికర్త, "లోకములో ఉన్నవానికంటె మీలో నున్నవాడు గొప్పవాడు."
MATT 4:8•
LUKE 4:5•
1JN 4:4
86చూచారా, అపవాది ఈ లోకసంబంధి. లోకము వాడికి చెందును. ఎప్పుడూ అది అపవాదిదే. "వేకువ చుక్కా, ఓ, లూసిఫరు! నీవెట్లు పడితివి?" చూడండి. ఈ లోకము వాడికి చెందినది. అది పరలోకము నుండి బయటకు వెళ్ళగొట్టబడినప్పుడు, వాడు తిరిగి దానియొద్దకు వచ్చాడు, చూచారా.
"ఈ రాజ్యములన్నియూ నావి. వీటిని నా ఇష్టానుసారముగా చేయుదును" అని క్రీస్తుతో చెప్పినవాడే వీడు. ఇవి వాడికే చెందినవి, మరియు 'లోకములో నున్నవాడు' వాడే.
యోహాను తన శిష్యులకు ఇట్లు చెప్పెను, "రానున్న క్రీస్తువిరోధిని గూర్చి మీరు విన్నారు. అవిధేయులగు పిల్లలలో ఇప్పటికే వాడు ఇక్కడ పనిచేయుచున్నాడు; కాని చిన్నపిల్లలారా, మీరు ఈ లోక సంబంధులు కారు. మీరు దేవుని సంబంధులు; మీలో నున్నవాడు లోకములో ఉన్నవానికంటె గొప్పవాడు." ఆయనే మీలోనున్న క్రీస్తు!
JOSH 10:12•
ISA 14:12
87భూమాకాశ్యములను సృష్టించిన ఆయనే యేసుక్రీస్తు అను వ్యక్తిత్వములో ప్రత్యక్షమాయెను; క్రీస్తులో దేవుడుండి, లోకమును తనతో సమాధానపరచు కొనుచున్నాడు. "బ్రెన్హాం సోదరుడా! ఆయన దేవుని కుమారుడే గదా," అని మీరందురేమో. మంచిది, ఆయన నిరంతరము, నిత్యుడగు దేవుడో, కాదో మనము కనుగొందాము.
యెహోషువాలో నున్నవాడు సూర్యునికంటె గొప్పవాడు. యెహోషువా ఒక మనిషి, పాప-సహితుడుగా జన్మించెను. నీవలె, నావలెయుండెను. దేవుని ఆజ్ఞవలన పరుగిడుచున్న సూర్యునికంటె యెహోషువాలో నున్నవాడు గొప్పవాడు. సూర్యుని ప్రకాశించమని దేవుడు ఆజ్ఞాపించెను. దేవుని సూత్రముల వలన అది అదుపు చేయబడి, పాలింపబడుచుండెను. కాని దేవుని సూత్రముల కంటే యెహోషువా లో నున్నవాడు గొప్పవాడు; ఎందుకనగా సృష్టికర్తయే స్వయముగా యెహోషువాలో ఉండెను. యెహోషువా సూర్యుని వైపు చూచి ఇట్లనెను, "నీవున్న చోటనే ఆగుము. మరియు నేను ఈ యుద్ధమును ముగియు వరకు వరకు చంద్రుడా, నీవెక్కడైతే యున్నావో, అక్కడే వ్రేలాడుము." సూర్యచంద్రులు ఆయనకు లోబడెను, ఎందుకనగా యెహోషువాలో నున్నవాడు సూర్యచంద్రులకంటె గొప్పవాడు; యెహోషువాలో నున్నవాడు!
2COR 5:19
88మోషేలో నున్నవాడు ఐగుప్తుకంటె గొప్పవాడు. ఐగుప్తు సైన్యము ప్రపంచము గొప్పది. ఆ సమయములో వారు ప్రపంచమును జయించువారు. కాని మోషేలో నున్నవాడు ఐగుప్తులో ఉన్నవానికంటె గొప్పవాడు, ఎందుకనగా మోషే ఐగుప్తును జయించెను. ప్రకృతికంటె మోషేలో నున్నవాడు గొప్పవాడు. ఎన్నడైన మీరు ఆలోచించారా, దేవుడు తన మాటను తీసుకొని మరియు మోషేకు ఇచ్చి మరియు చెప్పెను, "నీవక్కడికి వెళ్ళి మరియు సూర్యుడు, ప్రకాశించకుండునట్లు ఆజ్ఞాపించు," మరియు సూర్యుడు గాడాంధకారముగా మారెను! అది నిజమేనా? సూర్యుని ఆయన ప్రకాశింపచేయగలడు మరియు మబ్బులను వెనక్కు పంపించగలడు, లేక ఆయన సూర్యుని చీకటిగా మార్చగలడు. ఆయన దేవుడు; ఆయన తనకిష్టమైన దానిని చేయగలడు, నమ్ము బిడ్డలో ఆయన ఉన్నాడు! ఆమేన్. అది అంతే.
EXOD 8:2,21
89అక్కడ ఒక్క ఈగ కూడా కనిపించుట లేదు. అది బహుశా చలికాలము కావచ్చును. ఈగలు లేవు, కాని దేవుడు మోషేతో చెప్పెను. "వెళ్ళి, నా మాటలు పలుకుము మరియు నీవేమి పలుకవలెనో - నీ మనస్సులో నేనుంచుదును. మరియు నీవు అక్కడకు వెళ్ళి, నేల మీది ధూళి తీసి గాలిలోనికి విసరుము."
"ఈగలు వచ్చును గాక!" అని పలికెను. దాదాపు కొన్ని అంగుళముల ఎత్తున ఈగలు వచ్చెను. కొద్ది గంటలలో నేల ఈగలతో నిండిపోయెను. అది నిజమేనా? ఆయన సృష్టికర్త!
అక్కడ ఏ కప్పలు లేవు, కాబట్టి అతడు తన కర్రను చాపి, "కప్పలు వచ్చును గాక!" అనెను. ఎక్కడ చూసినా కప్పలే, భూమి మొత్తం కంపు కొట్టెను. అది నిజమేనా?
EXOD 14:15,16•
1JN 4:4
90అతడు ఎర్ర సముద్రము నొద్దకు వచ్చెను మరియు అది అతని మార్గములో యుండెను. "సముద్రముతో మాట్లాడుము" అని దేవుడు చెప్పెను. మోషే సముద్రముతో మాట్లాడెను. సముద్రము కంటె మోషేలో నున్నవాడు గొప్పవాడు. అది నిజమేనా? ఓ, మై! ఇప్పుడు, మీరు చూడండి, లోకములో ఉన్నవానికంటె మోషేలో ఉన్నవాడు గొప్పవాడు. లోకములోనున్న సమస్త ప్రకృతికంటె మోషేలో నున్నవాడు గొప్పవాడు. అతడు ప్రకృతికి ఆజ్ఞాపించెను. దేవుడు ఏదైతే అతనికి చెప్పమని చెప్పెనో, అతను పలికెను మరియు అది అతను చెప్పినట్లుగానే జరిగెను.
ఆ దేవుడే ఈ రాత్రి మనతో యున్నాడు! మనతోనే కాదు, మనలోనే యున్నాడు! ఆయన మనలో నున్నట్లు ఆయన రుజువు చేసెను. "లోకములో ఉన్నవానికంటె నీలో నున్నవాడు గొప్పవాడు." లోకమునకు మనము ఎందుకు భయపడవలెను?
91ఒకనాడు ఇక్కడ ఏదో రకమైన ఒక డైనోసరు యొక్క పన్నును కనుగొనిరి. దానిగూర్చి మీరందరూ విన్నారని నేను అనుకొనుచున్నాను. ఇక్కడ నయాగారా జలపాతము యొద్ద అది దొరికెను. "ఆరు పౌనుల బరువున్నది" అని వారు చెప్పిరి. అది ఒక మనుష్యునిలో నుండి వచ్చినదని వారు చెప్పెదరేమో అని నేను తలంచాను, కాని చివరకు అది ఒక చరిత్రకు ముందున్న జంతువు ఎముక అని తేల్చిరి. బహుశా ఒక కాలములో ఆ జంతువులు భూమిమీద జీవించినవి. అవి ఇప్పుడెక్కడున్నవి? ఆ డైనోసరులను సర్వశక్తుడగు దేవుడు భూమి మీదికి తిరిగి ఆజ్ఞతో రప్పించగలడు. మరో గంటలో అవి నలుబది మైళ్ళ పొడవున వ్యాపించగలవని మీకు తెలియునా? దేవుడు ఈగలతో భూమిని నాశనము చేయగలడని మీరెరుగుదురా? ఆయన ఈగలను రప్పించగలడు. అవి చనిపోయిన తరువాత అవి ఎచ్చటికి పోవును. ఇంటి ఈగలు ఏమి జరుగును? మిడుతలు ఏమగుచున్నవి? చలికాలము వచ్చును. మైనస్ నలుబది డిగ్రీల చలి ఉండును. మరుసటి వసంత కాలమున ఎచ్చట చూచినా, మిడుతలు కనబడును. అవెక్కడ నుండి వచ్చినవి? ఆయనే సృష్టికర్త, వాటిని ఉనికి లోనికి తెచ్చుటకు పలికినవాడు ఆయనే! ఆయన దేవుడు! ప్రకృతి ఆయన మాటకు లోబడును.
92మన సోదరులలో చాలామంది ఉత్తేజముతో నిండిపోయి, దేవుడు ఒక ప్రత్యేక పని చేయుదునని చెప్పినప్పుడు, వారు దానిని యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడనుచున్నారు, కాని అది కాదు. అందుకే ఆలాగు జరుగుట లేదు. కాని దేవుడు నిజంగా నీతో చెప్పినప్పుడు, అది జరుగవలసియున్నది, దేవుడు చెప్పినట్లే అది జరుగవలసియుండెను. దేవుడు దానిని పలికినప్పుడు, అది జరుగవలసినదే.
ఐగుప్తులో నున్నవానికంటె మోషేలో ఉన్నవాడు గొప్పవాడు. ఫరో ఏదైన చేసినదానికంటె మరియు అతని మంత్ర విద్యలన్నిటికంటె మోషేలో నున్నవాడు గొప్పవాడు. మాంత్రికులలో ఉన్నవానికంటే మోషేలో ఉన్నవాడు గొప్పవాడు, చూసారా. సర్వసృష్టి కంటెను మోషేలో నున్నవాడు గొప్పవాడు.
ISA 1:7•
ISA 65:25
93గొప్పవాడు… సింహముల కంటెను దానియేలులో నున్నవాడు గొప్పవాడు. ఆకలి గల సింహములను ఆయన ఆపకలిగెను. కాబట్టి, ఏదైనా ఒకదానిని ఆపకలిగితే, ఆపిన దానికంటె ఆయన గొప్పవాడు. కావున ఆకలిగానున్న సింహములు దానియేలును తినుటకు ముందుకు వచ్చెను. సింహములో నున్నవానికంటె దానియేలులో నున్నవాడు గొప్పవాడు.
ఇప్పుడు, సింహమును మొదట సృజించినప్పుడు, అది మానవునికి స్నేహితునిగా యుండెను. అపవాది దానిని ఆ విధంగా చేయునట్లు చేసినది. అది నిజము. వెయ్యేండ్ల పాలనలో తోడేలు మరియు గొర్రెపిల్ల కలిసి మేయును మరియు సింహము ఎద్దువలె గడ్డిమేయును. మరియు ఎద్దుతో కలిసి పండుకొనును. వెయ్యేండ్ల పాలనలో అవి హాని చేయవు లేక నాశనము కలిగించవు. అపవాది వెళ్ళిపోవును. దయ్యము అడవిలోని జంతువులు చీల్చుకొని తినునట్లు మరియు అలాంటి కార్యములు చేయునట్లు చేస్తున్నది, అందుకే అవి అలాగు చేయుచున్నవి. ఆ విధముగా చేయిస్తున్నది సాతానుడు. కాని సింహములో ఉన్నవానికంటె దానియేలులో నున్నవాడు గొప్పవాడు, చూచారా. సింహములో ఉన్నవానికంటె ప్రవక్తలో నున్నవాడు గొప్పవాడు.
ISA 65:25•
DAN 6:22
94అగ్నికంటె ఆ హెబ్రి పిల్లలలో నున్నవాడు, వారిలోనున్నవాడు గొప్పవాడు. ఎందుకనగా వారు అగ్నిలోనికి త్రోయబడిరి; వారిలో నున్నవాడు వారితో నుండి వారిని అగ్ని అంటుకొనకుండా చేసెను. ఆ అగ్ని గుండమును ఎప్పటికంటె ఏడు రెట్లు వేడిగా చేసిరి. అది నిజమేనా? లోకములో యున్నవానికంటె హెబ్రీ యువకులలో నున్నవాడు గొప్పవాడు.
అక్కడ నెబుకద్నెజరు… లేక బెల్లస్సరు.. నెబుకద్నెజరు అని నమ్ముచున్నాను, ఎప్పటికంటె ఆ అగ్నిగుండమును ఏడు రెట్లు వేడిచేయమని రాజగు నెబుకద్నెజరు ఆజ్ఞాపించెను. అపవాదిచే ప్రేరేపించబడి వారిని చంపగోరెను, ఎందుకనగా వారు దేవుని వాక్యము కొరకు నిలబడిరి, మరియు వారిని అగ్నిగుండములో వేసెను (ఎప్పటికంటె అది ఏడు రెట్లు వేడిగా నుండెను) అయినా అది వారిని కాల్చలేదు. లోకములో నున్నవానికంటె షద్రకు, మేషకు, అబెద్నెగోలలో యున్నవాడు గొప్పవాడు. నిశ్చయంగా! ఓ, మై!
1KGS 17:1•
ISA 1:7•
MARK 11:24•
ACTS 14:15•
JAS 5:17
95ఇత్తడివలె మారిన మేఘములకంటె ఏలియాలో నున్నవాడు గొప్పవాడు, ఎందుకనగా మూడున్నర సంవత్సరముల పాటు వర్షింపని ఇత్తడివలె మారిన మేఘములను అతడు ఆజ్ఞాపించి వర్షము రప్పించెను. ఏలియాలో నున్నవాడు మరణము కంటె గొప్పవాడు, ఎందుకనగా అతను మరణించే సమయము వచ్చినప్పుడు, ముసలివాడై, అలసిపోయిన, ఆ ప్రవక్తను దేవుడు చూచెను. యెజెబెలును, ఆమె యొక్క సమస్త రంగులను, మరియు ఆధునిక క్రియలను ఇతడు గద్దించెను. మరియు అతడు ఒక రకముగా అలసిపోయెను. కాబట్టి హనోకువలె నడిపించి ఇంటికి తీసికొని వెళ్ళుటకు కూడా దేవుడు ఇష్టపడలేదు. ఆయన ఒక రధమును పంపించి ఇంటికి తోడ్కొని వెళ్ళెను. యెరూషలేములోను, యూదయలోను, కొండలలోను ఉన్నవానికంటె ఏలియాలో నున్నవాడు గొప్పవాడు. మరణముకంటెను ఏలియాలో నున్నవాడు గొప్పవాడు. సమాధికంటెను ఏలియాలో నున్నవాడు గొప్పవాడు, ఎందుకనగా అతడు సమాధిని, మరణమును తప్పించుకొనెను. మరియు ఒక రథములో అతడు ఇంటికి వెళ్ళెను, చూడండి. ఏలియాలో నున్నవాడు గొప్పవాడు.
"ఓ, మంచిది, అతను ఒక గొప్పవాడు" అని మీరనవచ్చు.
ఒక్క నిమిషము ఆగండి! "అతడు నావంటి, మరియు నీవంటి స్వభావముగల మనుష్యుడే," అని బైబిల్ చెప్పెను. ఇది నిజము. తాను ప్రార్ధించినది పొందినట్లు అతడు నమ్మి, ప్రార్థించెను. యేసు మనకు అదే చెప్పెను, "మీరు ప్రార్థించునప్పుడు అడిగియున్నవాటిని పొందియున్నామని నమ్ముడి, అప్పుడవి దొరకును." అతడు ఆసక్తితో వర్షము కురువవద్దని ప్రార్ధించెను మరియు అది మూడున్నర సంవత్సరముల వరకు వర్షించలేదు, చూచారా. ప్రకృతికంటె మీలొనున్నవాడు గొప్పవాడు.
2KGS 2:11•
JOB 19:25•
JOHN 6:39,40•
1JN 4:4
96అయితే రోగుల స్వస్థత మాట ఏమిటి? చూచారా? రోగముకంటె మీలో నున్నవాడు గొప్పవాడు, చూచారా. ఎందుకనగా అది ఒక ఆటంకము. దేవుని సూత్రములకే ఆ రోగము అడ్డుగా యున్నది. మంచిది, నీ జీవిత కార్యక్రమమునే ఆటంకపరచుచున్న అపవాదికంటె నీలో నున్నవాడు గొప్పవాడు. ఆయన సృష్టికర్త మరియు స్వస్థపరచువాడు. "లోకములో నున్నవానికంటె మీలో నున్నవాడు గొప్పవాడు," చూచారా. ఏలియాలో నున్నవాడు గొప్పవాడు. కాలముకంటె, యెషయాలో నున్నవాడు గొప్పవాడు; ఎందుకనగా ఆ ప్రవక్తలందరూ కాలమును ముందే చూచిరి, గ్రహించారా.
శరీరము తిను పురుగులకంటె, మరణముకంటె, సమాధికంటె, యోబులో నున్నవాడు గొప్పవాడు, ఎందుకనగా అతడు ఒక దర్శనము ద్వారా ప్రభువు యొక్క రాకడను చూచెను మరియు, "నా విమోచకుడు సజీవుడనియు, అంత్యదినమున ఆయన భూమి మీద నిలుచుననియు నేనెరుగుదును. నా శరీరమును పురుగులు తినివేసినగాని నా దేహముతోనే నేను దేవుని చూచెదను" అని చెప్పెను, చూచారా. మరణముకంటెను యోబులో నున్నవాడు గొప్పవాడు; ఎందుకనగా మరణము అతనిని తీసికొన వెళ్ళ ప్రయత్నించెను మరియు అది అతనిని తీసుకొని వెళ్ళలేకపోయెను, ఎందుకనగా "నేను తిరిగి లేచెదను" అని అతడు పలికెను; అతడు లేచెను. అది అతను చేసెను.
97వినండి, దీనిని చెప్పుకొను సమయమున్నచో బాగుండును. కాని నేను ఒక ప్రశ్న అడుగగోరుచున్నాను, "క్రీస్తు నీలోయున్నాడు" అను దానిగూర్చి ఆ మరుసటి రోజున నేను విశేషముగా ఎత్తి చెప్పాను. ఇప్పుడు, నీ అనుభూతుల మీద ఆనుకోవద్దు, "నేను కొద్దిగా వణికినట్లు అనిపించినది. భాషలతో మాట్లాడాను. ఆత్మలో నాట్యమాడాను." ఇప్పుడు దానికి ఏమీ వ్యతిరేకిని కాను, అది మంచిదే, కాని చూడండి, వాటిమీద ఆనుకోవద్దు, చూచారా. దీనిని నీవు నీ జీవితములో కలిగియుండవలెను. నీవు ఇది ఏకము కావలెను, చూచారా. అప్పుడు ఇది దానంతట అదే బయలుపడును, చూచారా.
98ఇప్పుడు షేక్సిపియర్ ఆత్మ నీలో జీవించియున్నచో, ఈ రాత్రి నీ పూర్ణహృదయముతో నీవేమి చేయుదువో నీవెరుగుదువా? నీవేమి చెప్పుదువు? నీవు పెక్సిపియర్ యొక్క క్రియలు చేయుదువు. నీవు పద్యములను తయారు చేయుదువు, మరియు వాయించెదవు, మరియు మొదలగు కార్యములు చేసేవాడివి, ఎందుకనగా షెక్సిపియర్ అటువంటి ఒక కళాకారుడు, ఒక గొప్ప రచయిత, ఒక కావ్యాల రచయిత. ఇప్పుడు, నీలో షేక్స్పియర్ నివసించినయెడల, షేక్స్పియర్ క్రియలను నీవు చేసెదవు. అది నిజమేనా?
బీదోవెన్ మీలో జీవించిన ఎట్లుండును? బీదోవెన్ మీలో జీవించిన ఏమగును? నీవేమి చేయుదువు? నీవేమి చేయుదువో నీవెరుగుదువా? బీదోవెన్ వలె పాటలు వ్రాసెదవు. గొప్ప స్వరకర్త అతడు. బీదోవెన్ వలె నీవు పాటలు వ్రాసెదవు, ఎందుకనగా బీదోవెన్ జీవము నీలోయున్నది. నీవు బీదోవెన్ తిరిగి అవతారముగా యుందువు. బీదోవెన్ నీలో జీవించినయెడల, బీదోవెన్ క్రియలను నీవు చేసెదవు, ఎందుకనగా బీదోవెన్ నీలో జీవించెను. అది నిజమేనా?
LUKE 1:70•
JOHN 14:12•
HEB 1:1•
1JN 4:4
99కాని నీలో నున్నవాడు క్రీస్తు! క్రీస్తు నీలోయున్నయెడల, క్రీస్తు కార్యములను నీవు చేయుదువు. క్రీస్తు నీలో జీవించినట్లయితే. యోహాను 14:12లో ఆయన ఇలాగు చెప్పెను, "నాయందు విశ్వాసముంచువాడు, నేను చేయు క్రియలు అతను చేయును." నీవు క్రీస్తులో ఉన్నట్లయితే… లేక క్రీస్తు నీలో జీవించినట్లయితే. అప్పుడు క్రీస్తు వాక్యమైయున్నాడు. అది నిజమేనా? మరియు వాక్యము ఆయన ప్రవక్తల యొద్దకు వచ్చును, చూచారా. క్రీస్తు నీలో జీవించినయెడల, క్రీస్తు కార్యములు నీ ద్వారా వెల్లడగును. క్రీస్తు జీవము నీ ద్వారా జీవించును. ఆయన చేసిన క్రియలు, ఆయన జీవించిన జీవితము, మరియు సమస్తము అది నీలో జీవించును. షేక్స్పియర్, బీదోవెన్ మొదలగువారు ఎవరు జీవించినా, నీలో అలాగే జరుగును.
ఆయన యొక్క జీవము ఒకవేళ; అయితే నీవింకా నీ స్వజీవితమే జీవించుచున్నయెడల, అప్పుడు నీ స్వక్రియలే చేయుదువు, చూచారా. కాని క్రీస్తు జీవితము మీరు జీవించుచున్నట్లయితే, క్రీస్తు మీలో యుంటే, "మీలో నున్నవాడు లోకములో ఉన్నవానికంటె గొప్పవాడు." దేవుని వాగ్దానము గూర్చి నీకు సందేహములు, అనుమానములు ఉన్నయెడల క్రీస్తు నీలో లేడని అర్థము. గమనించారా, నీవు వేషధారివగుదువు. కాని జీవమున్నట్లయితే, క్రీస్తు నీలో జీవించియున్నయెడల, ఆయన వాక్యమును, ఆయన వాగ్దానమును నీవు గుర్తించెదవు. మరియు ఆయన వాగ్ధానమును ఆయన నెరవేర్చును, చూచారా. ఆయన నెరవేర్చును.
2CH 20:20•
MATT 21:21,22•
JOHN 1:1•
JOHN 5:17-19
100"మీరు ప్రార్ధన చేయునప్పుడు, అడుగు వాటినెల్లను పొందియున్నామని నమ్ముడి, మరియు అవి మీకు అనుగ్రహించబడును. ఈ కొండను ఎత్తబడమని చెప్పి హృదయములో సందేహించనియెడల, నీవు చెప్పినది జరుగునని నమ్మినయెడల, ఆ ప్రకారమే జరుగును. తండ్రి పని చేయుచున్నాడు, నేనును పని చేయుచున్నాను. నేను నిశ్చయముగా మీతో చెప్పునది ఏమనగా, కుమారుడు తనకుతాను ఏమియూ చేయడు. తండ్రి పని చేయుచున్న దానిని కుమారుడు చూచి ఆలాగు చేయును," చూచారా. ఏమి చేయవలెనో తండ్రి అతనికి చెప్పును గనుక అతడు విఫలము కాడు. "జరుగును గాక" అనగానే, జరుగును! ఆ క్రీస్తే మీలో జీవించుచున్నాడు. ఆయన మనలో జీవించుచున్నాడు. కాబట్టి ఆయన క్రియలు మనము చేయదము, ఎందుకనగా క్రీస్తే వాక్యము. వాక్య వాగ్ధానము మీకు స్వస్థతను ఇచ్చును. దానిని మీరు నమ్ముచున్నారా? నిశ్చయంగా!
MATT 28:20•
HEB 13:8
101ఆయన ఇట్లు చెప్పెను, "మిమ్మును అనాధలుగా విడువను," కొద్దిసేపటి క్రితం ఆలాగు ప్రార్ధించాను. మత్తయి 24 లేక మత్తయి 28:20, చూచారా. "నేను మీలోనికి వచ్చుదును. మీలో యందును, నేను" (క్రీస్తు అను వ్యక్తి పరిశుద్దాత్మ రూపములో యున్నాడు.) "వచ్చి మీలో నివాసము చేయుదును. ఇక మీరు మీ సొత్తు కారు. నేను మీలో యందును. లోకములో నున్నవానికంటె మీలో యున్నవాడు గొప్పవాడు," చూచారా. హెబ్రీ 13:8 చెప్పుచున్నది, "ఆయన నిన్న, నేడు, నిరంతరము ఏకరీతిగా యున్నాడు."
JOHN 14:18•
1JN 4:4
102నోవహులో ఉన్నవాడు తీర్పుగా వచ్చిన నీటి కంటె గొప్పవాడు. మరియు మీలో నున్నవాడు అగ్ని తీర్పులకంటె గొప్పవాడు, చూచారా. మీలో నున్నవాడు గొప్పవాడు, ఎందుకనగా ఆయన తీర్పును వెల చెల్లించి నీ కొరకు ఆ తీర్పును జయించెను, చూచారా, అందుగూర్చి ఏ భయము లేదు. చూడండి. మీరు అచ్చటున్నారు. అవును. అవిశ్వాసులను నాశనము చేసిన ఆ తీర్పు జలములకంటె నోవహులో నున్నవాడు గొప్పవాడు, ఎందుకనగా నోవహు నమ్మెను. అతనితో మాట్లాడినవాడు లోకములో నున్నవానికంటె గొప్పవాడు. ఆయనను విశ్వసించెను. సమస్త తీర్పును నోవహు తప్పించుకొనెను, ఎందుకనగా దేవుని యొక్క వాక్యము దానికంటె గొప్పది. అతను తీర్పుకు అందనంత పైకి కొనిపోబడెను. గొప్పవాడు!" అను అంశము గూర్చి ఎంతసేపయినా మాట్లాడుకోగలము, చూచారా.
GEN 9:15•
1SAM 17:4-7,34,44-46,51
103తన గొర్రెలను దొంగలించిన ఎలుగుబంటికంటె దావీదులో యున్నవాడు గొప్పవాడు. తన గొర్రెలలోని ఒకదానిని దొంగలించిన సింహము కంటె దావీదులో నున్నవాడు గొప్పవాడు. శత్రువగు గొల్యాతుకంటె దావీదులో నున్నవాడు గొప్పవాడు. పన్నెండు లేదా పధ్నాలుగు అడుగుల పొడవుగల గొప్ప ఫిలిస్తీయుడు నిలబడియుండెను. అతని వ్రేళ్ళు పధ్నాలుగు అంగుళముల పొడవున్నవి. అతని ఈటె నేతగాని దోనె వలె యున్నది. రెండు లేదా మూడు అంగుళముల మందము గల ఇత్తడితో సమస్తము కప్పుకొనియుండెను. కాని అతనికంటె దావీదులో నున్నవాడు గొప్పవాడు. అతడు శక్తిగల కండరములుగలవాడు, అతడు మహా యోధుడు. అతడు తన ఈటె కొనతో దావీదును ఎత్తి మరియు అతనిని పైన వ్రేలాడదీసి, పక్షులు తినునట్లుగా చేయగలనని చెప్పెను.
దావీదు ఇట్లనెను, "ఒక ఫిలిష్తియుడుగా, ఫిలిష్తియ నామములో నీవు నన్ను ఎదుర్కొనుటకు వచ్చుచున్నావు. ఫిలిష్తియ దేవుని పేరట నీవు నన్ను శపించుచున్నావు. నీ బలము గూర్చి గొప్ప చెప్పుకొనుచున్నావు. నీవు కవచము మరియు ఈటెతో నన్ను ఎదుర్కొనుచున్నావు. కాని నిన్ను దేవుడగు ప్రభువు నామములో నేను ఎదుర్కొనుచున్నాను. మరియు ఈ రోజు నేను నీ భుజముల మీద నుండి నీ తలను తీసివేయుదును." అతను ఆ ప్రకారమే చేసెను, ఎందుకనగా దావీదులో ఆ ధైర్యమును ప్రేరేపించినవాడు గొప్పవాడు.
1COR 15:55•
1JN 4:4
104చక్రాల కుర్చీకంటె నీలో నున్నవాడు గొప్పవాడు. ఆ మంచముకంటె నీలో నున్నవాడు గొప్పవాడు. కాన్సరుకంటె నీలో నున్నవాడు గొప్పవాడు. ఆ వ్యాధికంటె నీలో నున్నవాడు గొప్పవాడు. అపవాది నీ మీద ఉంచిన ఏదైన దానికంటె ఆయన గొప్పవాడు. "లోకములో ఉన్నవానికంటె నీలో నున్నవాడు గొప్పవాడు." ఆయన గొప్పవాడు! అవును!
దావీదులోనున్న దేవుడు గొప్పవాడు. దావీదులో దేవుడున్నాడు. ఆయన మనలో యున్నాడు. ఆయనే క్రీస్తు. ఆయన మనకొరకు ప్రతి శత్రువును జయించెను. ఆయన ఈ భూమిమీద నుండినప్పుడు పాపమును, వ్యాధిని, మరణమును, పాతాళమును, సమాధిని జయించెను. మరియు ఇప్పుడాయన ఒక జయశీలునిగా మనలో జీవించుచున్నాడు! ఆయన వ్యాధిని, పాతాళమును, మరణమును, సమాధిని జయించి, మరియు ఆ కార్యములన్నిటి నుండి మనలను విమోచించుటకు మనయొద్దకు వచ్చెను. నీ మీద ఈ భారముల నుంచిన వానికంటె నీలో నున్నవాడు గొప్పవాడు. అవును! "లోకములో నున్నవానికంటె మీలో నున్నవాడు గొప్పవాడు."
1JN 4:4
105ఈ అద్భుతములు ఆ ప్రకారమే జరుగెను. ఆనాడు గాలి ఆలాగే ఆగినది. ఒక మానవుడు ఆలాగు చేయగలడా? లేదయ్యా, అది అసాధ్యము. అలలు ఎగురుచూ ఉండగా నేను ఏడ్చుచున్నప్పుడు మరియు… అక్కడ ఉన్నవారిలో ఇక్కడ ఎందరున్నారు? మిమ్ముల్ని మేము చూచునట్లుగా మీ చేతులెత్తండి. మీ చేతులు పైకి ఎత్తండి, ఆ సమయంలో కొలరెడోలో మీరందరూ యున్నారు. సరే. అప్పుడు సహో, ఫ్రెడ్ ఒక్కడే ఉన్నాడనుకొనుచున్నాను. సహో, ఎవన్స్ లేడా? ఆ సమయంలో సహో, ఎవన్స్ అచ్చటున్నాడు. అవును. మంచిది. అవును.
గమనించండి. అది సత్యము కాదా? ఆ విధంగా అది జరగలేదా? వాన ఆగెను. మరియు గాలి వీచుట మానెను. అది ఏమిటి? నా మాటయా? కాదు! ఎందుకనగా ఆయన నన్ను అలాగు చేయమని చెప్పెను. సమస్త ప్రకృతికంటెను మనలో నున్నవాడు గొప్పవాడు. సముద్రము మీద అలలను, గాలులను గద్దించి వాటి స్థలములకు పంపినవాడు ఆ దేవుడే కాడా? సూర్యునికి చీకటిని, సూర్యునికి కాంతిని కలుగజేయువాడు ఆయన కాడా? "లోకములో నున్నవానికంటె మీలో నున్నవాడు గొప్పవాడు." చూచారా? మంచిది.
JOHN 14:12•
HEB 13:8
106అందువల్లనే ఈ నిజ అద్బుతములు జరుగగలవు, ఎందుకనగా అది దేవుని యొక్క వాగ్దానము. "నేను చేయు క్రియలు మీరును చేయుదురు." యోహాను 14:12. గాలిని, అలలను నిమ్మళపరచిన క్రీస్తే వాటియొక్క సృష్టికర్త, అప్పటి వలెనె ఇప్పుడును ఆయన సృష్టికర్తగాయున్నాడు. ఆయన నిన్న, నేడు, నిరంతరము ఏకరీతిగాయున్నాడు. ఆయన రోగులను బాగుచేసెను. మరియు పాపమును నాశనము చేసెను. మరియు నీ కొరకు దానినంతటిని ఆయన మార్చెను. దానిద్వారా ఆయన నీతో నివాసము చేయుటకు వచ్చెను. ఆయన వీటినన్నిటిని జయించి మనలో నివాసము చేయవచ్చెను. ఇంతకు ముందే ఆయన వాటినన్నిటిని మనకొరకు జయించి, తాను మారని దేవుడనని నిరూపించెను. పంతొమ్మిది వందల సంవత్సరముల తరువాత ఆయన ఇదివరకు చేసినట్లుగానే ఇప్పుడిక్కడ అదే కార్యమును మనమధ్యలో చేయుచున్నాడు. అది మరణమును, పాతాళమును, వ్యాధిని, సమాధిని జయించెను.
ROM 8:37•
HEB 4:12•
HEB 13:8
107ఈ క్రీస్తు ఈ "ఆయన." ఆయన మీలో యున్నాడు; ఆయన క్రీస్తు. యోహాను ఇట్లు చెప్పెను, "మీలో నున్నవాడు లోకములో ఉన్నవానికంటె గొప్పవాడు." ఆయన క్రీస్తు! సర్వ ప్రపంచముకంటె ఆయన గొప్పవాడు, ఎందుకనగా ఆయన ప్రపంచమును జయించెను. వాటన్నిటికంటే ఆయన గొప్పవాడు, ఎందుకనగా ఆయన మనకొరకే వాటినన్నింటిని జయించెను. "మనలను ప్రేమించి మనకొరకు తన్ను సమర్పించుకొనిన ఆయనను బట్టి మనము అత్యధిక జయశీలురము." ఆయన నిన్న, నేడు, నిరంతరము ఏకరీతిగా యున్నట్లు రుజువు చేయుటకు మనలోనికి వచ్చి తన క్రియలను వెల్లడిచేయును. ఆయన ఈ భూమిమీద నుండగా, ఆయన ప్రజల మధ్య నిలబడినప్పుడు, ఆయన తన్ను మెస్సీయగా రుజువు చేసికొనెను. ఆయన వారి జనుల హృదయములలోని ఆలోచనలను వివేచింపగలిగెను. మరియు బైబిల్ చెప్పెను, మోషే చెప్పెను, "ఆయన ప్రవక్తగా యుండునని." అది నిజమేనా? ఆయన హృదయ రహస్యములను యెరిగియుండెను. ఆ జనులెవరో ఆయనకు తెలియును. వారి సమస్య ఏమిటో ఆయనకు తెలియును. ఆయనది చేయుట మనము చూచామా? తరచుగా చూచుచున్నాము.
DEUT 18:15•
1JN 4:4
108చనిపోయిన వారు లేచుట మనమెరుగుదుము, చనిపోయిన స్థితినుండి లేచుట. అందులో కొందరు చనిపోయి రోజున్నర అయినది. ఉదయము చనిపోయిన వారిని రాత్రికి తీసికొని వచ్చిరి. మంచిది, ఒక ఉదయమున చనిపోయిరి మరియు ఆ రాత్రి వారు దానిని తిరిగి తీసుకొని వచ్చిరి మరియు రాత్రంతా ప్రయాణించి మరుసటి రోజు మధ్యాహ్నమునకు లేదా మధ్యాహ్నము తరువాత ఆ గుడారము యొద్దకు తీసికొని రాబడిరి. చనిపోయి కొయ్యబారిన చిన్న బాలుడు తల్లి చేతులలో పడియున్న వానిని తీసికొని వచ్చెను. ప్రభువగు దేవుడు జీవవాక్యము పలుకగానే, వేడిని పొంది, ఆ బాలుడు ఏడ్వసాగెను. తిరిగి ఆ తల్లి చేతులలోకి ఇచ్చివేయుట జరిగినది.
అది జరుగుట శ్రీమతి. స్టాడ్కవ్ అచ్చట నిలువబడి చూచెను. అందువల్లనే ఆమె తన బిడ్డకొరకు ప్రార్థించుటకు జర్మనీ రమ్మని కోరినది. కాని ప్రభువు ఇట్లనెను, "అది నా హస్తము. దానిని త్రోసివేయవద్దు." చూడండి, మీకు బాగా తెలుసు. మోషేతో ఆయనీలాగు చెప్పెను, "ఆ బండతో మాట్లాడుము"; దానిని కొట్టవద్దు. మాట్లాడవలెనే గాని కొట్టకూడదు అని దాని అర్ధము. గమనించారా, ఆయన చెప్పిన దానికి నీవు లోబడవలెను. "ఎవడూ తనంత తాను ఏమీ చేయలేడు." మొదట దానిని దేవునియొద్ద వినవలెను.
109ఆయన జీవించియున్నాడని దేవుని వాక్యము వాగ్ధానము చేయుచున్నది. మరియు ఆయన జీవించుచున్నాడు గనుక మీరును జీవించెదరు. "నేను చేయు క్రియలు మీరును చేయుదురు, అంతకంటె గొప్పవియూ చేయుదురు, ఎందుకనగా నేను తండ్రియొద్దకు ఎక్కిపోవుచున్నాను" అని ఆయన వాగ్ధానము చేసెను. ఆయన సమస్త కార్యములను జయించెను. ఆయనే దానిని ఆపినది… ఆ ఉడుతులను చేసినవాడు ఆయనే. అది రెండుసార్లు ఆలాగు జరిగెను. చార్లీ, ఒకసారి మీ స్థలములో జరిగినది. ఇక్కడ ఒకసారి జరిగినది. అప్పుడు సహో, ఫ్రెడ్ మరియు సహో, బాంక్స్ మాతో యున్నారు.
జర్మనీలో అది జరిగినది. పదిహేనుమంది మంత్రగాళ్ళు నా ఇరువైపుల నిలబడియుండిరి. చెప్పెను… ఎందుకనగా బిల్లీ మరియు సహో, ఆర్గన్ బ్రయిట్ వారిని నా యొద్దకు అనుమతించలేదు. వారు "మంచిది, మేము ఆ గుడారమును ఎగురగొట్టుదుమని పలికిరి." వారు మంత్రములు పలుకుచూ అక్కడ కూర్చొనిరి. తమ దేవతకు, అపవాదికి ప్రార్ధించిరి మరియు ఇక్కడ వాడు ఒక తుఫానును తీసికొనివచ్చెను. అక్కడ దాదాపు ముప్పది లేదా నలుబది వేలమంది జర్మనులు కూడియుండిరి. మరియు ఆ గుడారము క్రిందికి పైకి ఆ విధముగా ఎగిరినది. వారు కత్తెరతో ఒక పక్షి వెంట్రుకను చెక్కి దానిని తిరిగి ఆ విధముగా గురిపెట్టిరి. వారు కూర్చొని అన్ని రకములైన మంత్రములను పలుకుచూ నామీద ప్రయోగించిరి. మరియు వారు మూడు పవిత్ర మాటలు పలుకుచూ, వారు ఈలాగన్నారు, "తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మడు, "వు-ఉ-ఉ-ఉ! తండ్రి, కుమారుడు, పరిశుద్దాత్మడు; ఆహహహహ."
GEN 1:1
110ఆ విధముగా వెళ్ళుచున్నారు మరియు నిజంగానే తుఫాను వచ్చినది. నిశ్చయంగా, "వాడు ఆకాశ శక్తుల అధికారి." సాతానుడు. వారు తుఫానును రప్పించిరి. ఆ గొప్ప, పెద్ద గుడారము ఊగిసలాడినది. ఒక పట్టణమును కప్పునంత పెద్ద గుడారమది. అది కాన్వాసుతో కట్టబడినది. గాలి దాని క్రిందకు దూరి ఆ విధముగా పైకి లేపినది. మరియు ఆ గాలి, మెరపులు దానిని చెదరగొట్టినా నేను బోధ ఆపకుండా ప్రసంగించాను.
మరియు, ఓ, కేవలము వారు పెద్ద మంత్రము వల్లించిరి. ఆ విధముగా ముందుకు కొనసాగించుచూ, ఏవో పవిత్ర మాటలు పలుకుచూ, "మూడు పెద్ద పరిశుద్ధ మాటలు వారు పలికిరి. అవి: తండ్రి, కుమారుడు, పరిశుద్దాత్మ," ఇరువైపుల వారాలాగు చేసిరి. అప్పుడు వాడు సాష్టాంగపడుట, దయ్యముల చేత చుట్టబడియుండుట నేను చూచాను, కాని బంధించలేదు.
"దీనిని అనువాదము చేయవద్దు" అని సహో, లోస్టర్ తో చెప్పాను.
"ఆర్గన్ బ్రయిట్ సోదరుడా! కేవలము ప్రార్థించు" అన్నాను.
"భూమాక్యాశముల సృష్టికర్తవగు ప్రభువగు దేవా, నీవే నన్ను ఇచ్చటికి పంపితివి. యేసుక్రీస్తు నామము పేరట నేను ఈ జర్మను భూమిమీద కాలు మోపాను. నన్ను పంపితివి. గనుకనే ఆ మేఘమునకు నాపై అధికారము లేదు. దానికి అధికారము లేదు, ఎందుకనగా నేను అభిషేకించబడి ఈ జనుల రక్షణ కొరకు ఇక్కడకు పంపబడితిని. ఇక్కడనుండి పొమ్ముని యేసు నామములో నీకు ఆజ్ఞాపించుచున్నాను," అని నేను అన్నాను.
EPH 2:2•
1JN 4:4
111ఉరుములు "పెళ పెళమని" వెళ్ళిపోయెను. - వెళ్ళెను "గర్ర్ర్ర్ర్ర్" అనగా గుడారము మీదనే గుండ్రముగా తిరిగి, తిరిగి పేలిపోయి వెళ్ళెను మరియు సూర్యుడు బయటకు వచ్చి ప్రకాశించెను.
పది నిమిషములలో దాదాపు పదివేలమంది వేదిక చుట్టూ చేరి దేవుని శక్తిని చూచుటకై కృప కొరకు మొర్రపెట్టిరి. ప్రార్ధించిరి. ఎందువలన? "లోకములో ఉన్నవాని కంటె మీలో యున్నవాడు గొప్పవాడు." చూచారా?
"మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవానికంటె గొప్పవాడు. ఓ సోదరీ, సోదరుడా, మనము ఈ శ్రమలను చూచి బాధపడనక్కరలేదు, దేవుడు గొప్పవాడై యున్నాడు. మరియు ఆయన నీలో యున్నాడు. అది నీవు నమ్ముచున్నావా?
HEB 13:8
112నేను ఇప్పుడు గడువు సమయం దాటాను. 9:00 గంటలు దాటి పదిహేను నిమిషములయినది. మరియు ఈ ప్రజలు చాలా దూరము కారు నడుపుకొని వెళ్ళవలెనని నాకు తెలియును.
ఒక్క నిమిషము మన తలలు వంచుదము:
ఓ తండ్రియగు దేవా, నీవు కొలరెడో గూర్చి ఎరుగుదువు. ఆ సంగతులు నిజమని నీకు తెలియును. ఈ ప్రజలు గుర్తెరుగునట్లు నీ మహిమ కొరకే వీటిని చెప్పుచున్నాను. పరిశుద్దాత్మ యొక్క క్రియలను మరియు చిత్రముల యొక్క శాస్త్రీయ రుజువును ఈ జనులు తెలిసికొందురు గాక! ప్రభువా, జనులకు తెలిపితినని నీవెరుగుదువు. ఎప్పుడూ ఆలాగే నేను చేయుచున్నాను, ఎందుకనగా అది నీవు వాగ్ధానము చేసితివి మరియు నీవు ఇక్కడ యున్నావు, నిన్నునీవు ఒక వ్యక్తి ద్వారా ధృవపరచుకొనుటకు ఒక వ్యక్తి కొరకు వెదుకుచున్నావు. ఆ వ్యక్తి ద్వారా నీవు సజీవుడవని ఇతరులను చూచుటకును, నీవు నిన్న, నేడు, నిరంతరము ఏకరీతిగా యున్నావని రుజువుపరుచుటకు ప్రయత్నించుచున్నావు. ప్రభువా, మాపట్ల దయచూపి, మా ఆలోచనలను నీవే నడిపించమని నేను నీకు ప్రార్థించుచున్నాను.
రోగులు, మరియు శ్రమపడుచున్నవారు ఇచ్చట కూర్చొనియున్నారు. నీవు సహాయము అందించనియెడల బహుశా కొందరు చనిపోవచ్చును. చాలామంది జీవిత చివరి దశలో యుండవచ్చును. ఇక వైద్యులు ఏమీ చేయలేరు. నీవే దేవుడవు, నీవు నిన్న, నేడు, నిరంతరము ఏకరీతిగా యున్నావు. మరియు నీ సన్నిధి ఇచ్చటున్నది.
MATT 16:18•
JOHN 1:48,50•
JOHN 4:19•
JOHN 14:12
113ప్రభువా, ఈ మూడవ ఈడ్పు గూర్చి మాకు తెలియదు. దానిని మేము ప్రస్తావించినట్లుగా, అది ఏమిటో నాకు తెలియదు. ఒక్క సంగతి మాకు తెలియును. అదేమనగా, మొదటి ఈడ్పు పరిపూర్ణమైనది. రెండవ ఈడ్పు కృప, ఎందుకనగా దాని సంఖ్య అయిదు. దేవా, నేను ఈ రాత్రి ప్రార్ధించుచున్నాను, నిన్నునీవు మాకు బయలుపరచుకొనుమని, అదేమనగా, ఈ కార్యములు తరువాత, చెప్పెదము, "ఆయన నీలో నున్నవాడు!" మరియు "నేను చేయు క్రియలు మీరును చేయుదురు" అని నీవు చెప్పియున్నావు. తండ్రి చూపించిన దానినే నీవు చేసియున్నట్లు చెప్పితివి.
నీవేమి చేసితివో మేము చూచాము. అపోస్తలుడగు పేతురు ఎవరో నీవు చెప్పితివి. అతని తండ్రి పేరు చెప్పితివి. నతానియేలు యొక్క పనిని గూర్చి చెప్పితివి. అక్కడితడు ఎట్లు వచ్చెనో, అంతకు ముందు ఏమి చేసెనో చెప్పితివి. బావినొద్దనున్న స్త్రీ యొక్క పాపమును బయటపెట్టితివి. మరియు ఆమె ఏమైయున్నదో, ఈ ఆరుగురితో వ్యభిచారములో జీవించుచున్నదని; అయిదుగురు ఆమెకు ఇదివరకు యుండిరని మరియు ఆమె ఇప్పుడు జీవించుచున్నవాడు ఆమె భర్త కాదని చెప్పితివి. నీవు ఇంకను అదే దేవుడవు.
నీవు చెప్పావు…
HEB 4:15•
HEB 7:3,25
114అక్కడ నిలబడియున్న గ్రుడ్డి బర్తలొమయి స్థితిని నీవు చూచితివి. అతని హృదయ చూపు సరిగానేయున్నది. యేసుక్రీస్తు కుమారత్వములో యెహోవా ప్రత్యక్షమాయెనని అతడు చూడకలిగెను. అతడు మొరపెట్టెను. "దావీదు కుమారుడా! నాపై కృప చూపుము" అని అరచెను. ఆ కేక నిన్ను ఆపినది. మరియు నీవు వెనుదిరిగి అతనిని బాగుచేసితివి. ఓ తండ్రీ, అతని విశ్వాసము అతనిని రక్షించెనని నీవు పలికితివి.
ఆ రక్తస్రావపు రోగముగల చిన్న స్త్రీ, ఎన్నో సంవత్సరముల నుండి అది ఆగుట లేదు. ఆమె తన డబ్బునంతటినీ వైద్యుల కొరకు ఖర్చుచేసినది. మరియు ఎవరూ ఆమెకు సహాయము చేయలేకపోయిరి. నీ కూటమునకు ఆమె వచ్చినది. అక్కడ గలిలయ వానితో నీవు మాట్లాడుచుంటివి. నీవు యాయీరు ఇంటికి వెళ్ళే త్రోవలో యున్నావు. "ఆయన వస్త్రమును నేను తాకినయెడల నేను నమ్ముచున్నాను నేను బాగవుదును" అని ఈ చిన్న స్త్రీ దాని వెనుక ఎటువంటి లేఖనము లేకుండానే తన హృదయములో అనుకొన్నది. నీ వస్త్రపు చెంగును ముట్టగానే ఆమె కోరిక నెరవేరినది. నీవు ఆమెతో చెప్పితివి, అదేమనగా ఆమె విశ్వాసమే ఇది చేసినదని. ఆమె యొక్క కోరికలను వివరించితివి మరియు ఆమె బాగుపడెను.
నిన్న ప్రధాన యాజకుడవని, ఉన్నత స్థలమందు కూర్చొని మధ్యవర్తిత్వము చేయుటకు ఎల్లప్పుడు సజీవుడవని నీ వాక్యములో మాకు చెప్పబడెను. మరియు ఈ సమయమములో కూడ నీవు ప్రధాన యాజకుడవు గనుక మా బలహీనతలలో మిమ్మును త్రాకగలము. ప్రభువగు దేవా, ఇక్కడయున్న ప్రతి వ్యక్తి ఈ రాత్రి గొప్ప ప్రధాన యూజకుడవైన నిన్ను తాకుటకు మరియు బాగవుటకు అవకాశమును అనుగ్రహించుము. దేవుని మహిమ కొరకు యేసు నామములో దీనిని నేను అడుగుచున్నాను. ఆమేన్.
115ఇప్పుడు, నేను వద్దని… ప్రార్ధన కార్డులున్నవా? బిల్లీకి చెప్పాను వద్దని. ఎవరి యొద్దనైనా ప్రార్థన కార్డులున్నవా? మంచిది, అది నిజము, నేను ఇవ్వవద్దని అతనితో చెప్పాను. కొద్దిగా ఎక్కువ సమయమగునని నేను అనుకున్నాను, నేను… ఓ, నేను చాలా మాట్లాడాను, చూచారా. "నేను 8:30కు ముగించుటకు ప్రయత్నించెదనని" నేను చెప్పినప్పుడు మీరు నవ్విరి, నాకది తెలియును. కాని నేను మిమ్మును ప్రేమించుచున్నాను, చూచారా.
నేనేమి చేయుటకు ప్రయత్నించుచున్నాను, స్నేహితుడా, నేనెల్లప్పుడు దీనిని చేయుటకు ప్రయత్నించితిని. "సహో, బ్రెన్హాం ఇది చేసెను" అని ఎన్నడూ ఎవ్వరూ చెప్పవద్దు. సహో, బ్రెన్హాం ఏమియూ చేయలేడు, చూచారా. యేసుక్రీస్తు చేసెను. నాలో నున్నవాడు మీలో నున్నాడు. నీవు కేవలము నమ్మవలసియున్నది. అది నిజమేనా? చూచారా? మీ వ్యాధికంటె మీలో నున్నవాడు గొప్పవాడు.
116నన్ను ఎరుగని చాలామంది రోగులు ఇచ్చటయున్నారు. కాని ప్రధాన యాజకుని తాకు విశ్వాసము కలిగియుండి. "నేను నమ్ముచున్నాను!" అని చేయి ఎత్తి చెప్పండి. మంచిది. ఓ, చాలా చేతులు లేచియున్నవి. సరే. నేను తెలిసినవారు మరియు అవసరత ఏమిటో నాకు ఏమియూ తెలియదని తెలిసినవారు మరియు దేవుడు నిన్ను తాకవలెనని కోరుచున్నవారు ఇక్కడ ఎంతమంది యున్నారు? మీ చెయ్యి పైకెత్తెండి. మంచిది.
నాకు తెలిసినవారు ఒక్కరు కూడా ఇక్కడ లేరు. ఈ ప్రస్తుత సమయములో వారి వ్యాధిగూర్చి నాకు యధార్థముగా తెలియదు, కాని ఇక్కడ కూర్చొన్న బాలుడు నాకు తెలియును. ఇతని కొరకు నేను చాలాసార్లు ప్రార్ధించాను. ఇతని పేరు నాకు గుర్తువచ్చుట లేదు, కాని ఇతడు కెంటాకీ నుండి వచ్చాడు. నాకు ఉత్తరములు వ్రాయుచుండును. ఉడ్ దంపతులకు వ్యక్తిగత స్నేహితుడు. అక్కడకు వచ్చుచుండును. చాలా కాలము నుండి కూటములకు వచ్చుచున్నాడు. నాకు ఇతడు మాత్రమే తెలియును.
నాకు తెలిసినంతవరకు సహో, డాచ్ బాగున్నాడు, లేనియెడల ఇక్కడ కూర్చొనడు. మొన్న చాలా జబ్బుగా యుండెను, కాని ప్రభువు అతనిని బాగుచేసెను.
ఈ వ్యక్తిని నేనెరుగను. ఈ చంక కర్రలు ఎవరివో నాకు తెలియదు. బహుశ ఆ కుర్చీలోయున్న వ్యక్తివి కావచ్చును. నాకు తెలియదు. మీలో చాలామందిని నేనెరుగుదును, కాని ఈ సమయములో మీకేమి కావలెనో నాకు తెలియదని పరలోకమందున్న దేవునికి తెలియును. నాకు అసలు ఆలోచనే లేదు.
ఈ గుడారములో ఇక్కడ ఇది ఒక రకమైన కష్టముగా యున్నది. ఎందుకనగా, చూడండి, చాలామందిని నేనెరుగుదును.
HEB 7:3
117అసలు విషయము ఇప్పుడిక్కడ యున్నది. మీరు ఒక స్థలమునకు వచ్చినప్పుడు కొన్నిసార్లు ఇప్పుడిక్కడ వచ్చి మరియు నేను చెప్పుచుందును, "మంచిది, అందరికీ ప్రార్థన కార్డులు ఇచ్చి వరుసగా వేదక మీదికి రమ్మని చెప్పుచుందుము." ఎవరో వెళ్ళిపోవును… ఇప్పుడు నీవు చేయలేవు. స్నేహితులారా, ఇప్పుడు నా హృదయము తెరచి ఒక సంగతి మీకు చెప్పెదను. నీవు దానిని దాచిపెట్టలేవు. మీరు తలంచుచున్నది నేనెరుగుదును. అది నిజము. మీరు ఆలోచించేది నాకు తెలియును, చూచారా.
"సోదరుడా, నేను నమ్ముచున్నాను" అని కొన్నిసార్లు మీరందురు. ఎందుకు సరే, కొంతవరకు మీరు నమ్ముదురు, చూచారా. చూచారా? నాకు తెలియును. ఇప్పుడిక్కడే, అభిషేకము నామీదికి వచ్చుచున్నది, మీరు గమనించారా. ఆ నాడి కొట్టుకొనుచున్నట్లు నాకు అనిపించుచున్నది. చూచారా, వివిధ స్థలముల నుండి అనిపించుచున్నది, చూచారా. కాని ఇప్పుడు అవిశ్వాసమునకు చోటియ్యవద్దు. వర్తమానమంతా నమ్మవలెను. దానిని నమ్మండి. అది బైబిలులో వ్రాసియుండనియెడల దానిని మీరు నమ్మవద్దు. కాని అది బైబిలులో ఉన్నయెడల మనలో జీవించుచున్న పరిశుద్దాత్మ దానిని నెరవేర్చ బాధ్యత వహించును. దానిని మనము నమ్మవలెను. అది నిజమేనా? అది కష్టమని నేనెరుగుదును, చూడండి. ఏదీ సుళువుగా రాదు.
MARK 14:36•
LUKE 22:42
118ఇది మీకు వచ్చునట్లుగా ఆయన శ్రమపడి మృతి పొందుట ఆయనకు కష్టము. కల్వరి యొద్దకు ఆయన కష్టపడి వెళ్ళెను. ఆయన ఉండుటకు ఇష్టపడెను, "నా ఇష్టము కాదు. నీ చిత్తమే సిద్ధించు గాక" అని ఆయన అంతగా కేకవేసెను, చూచారా. చూచారా? చనిపోవుట ఆయన ఇష్టము కాదు. ఆయన ఒక యువకుడు మరియు ఆయనకు సోదరులున్నారు. మిమ్మును నేను ప్రేమించుచున్నట్లుగానే ఆయన వారిని ప్రేమించెను. ఆయన జీవించలేకపోయెను, మరియు వారు జీవించిరి, కాబట్టి మనము జీవించునట్లుగా ఆయన చనిపోయెను. అది సులభము కాదు. ఆయనది చేయవలసి వచ్చెను. ఆయన ముందు ఎట్టి మరణము కాచుకొనియున్నదో చూడండి! "తండ్రి, ఆ ఘడియ వచ్చినది. నాయొద్ద నుండి ఈ గిన్నెను తొలగించమని ప్రార్ధించవచ్చునా? లేదు!" కాని దానిని ఆయన తనంతట తాను చేయగోరలేదు. దేవుని చిత్తమే నెరవేరవలెనని కోరెను.
MATT 26:39
119ఇప్పుడు చూడండి, మీరు దానిని నమ్మినట్లయితే! ఇప్పుడు ఏమీ సందేహించవద్దు. కేవలము నమ్ముము. కేవలము సంపూర్ణముగా నమ్ముము. సందేహించవద్దు. నీవు దానిని నమ్ముము.
ప్రార్ధన వరుసలోనికి జనులను రమ్ముని ఇట్లందును. "సరే, ఈ వ్యక్తిని నేనెరుగను అని నీకు తెలియును."
"అది నిజమే బ్రెన్హాం సోదరుడా."
ఆ బయట ఎవరో ఇట్లనుట నీవు విందువు. "వారు ప్రార్ధన కార్డులో వ్రాసిన దానిని ఆయన చదువుచున్నాడు! మానసిక వివేచన!" ఆలాగనుట సహజము.
అప్పుడు నేనిట్ల౦దును, "సరే, ఈ ఆదివారము ప్రార్ధన కార్డులు ఇవ్వవద్దు. ప్రతి ఒక్కరు ఇక్కడుండాలని నేను కోరుచున్నాను, ఇక్కడకు ముందెన్నడూ రాని క్రొత్తవారిని లేచి నిలబడమందును," చూచారా. మరియు ఇప్పుడు పరిశుద్దాత్మ చుట్టూ తిరిగి, మరియు వారందరిలో ఉన్నదానినంతటిని విమోచించును, చూచారా. ఇది నిజమేనా? దానిని ఇరువైపుల మీరు చూచారు.
"ఓ, అందులో ఏదో పొరపాటున్నది!" అందురు. చూచారా? చూచారా, మరో మార్గము లేదు. సాతాను నిన్ను స్వాధీనపరచుకొన్నప్పుడు వాడు దేనినయినా నిన్ను నమ్మునట్లు చేయును. ప్రతి తప్పును వాడు నీకు చూపించును. మరియు నాలో అనేకమైన తప్పులుయున్నవి, వాడు వాటిని నీకు చూపించగలడు. కాని నీవు వాటివైపు చూడవద్దు! నీవు వాటివైపు చూడవద్దు. నేను ఒక మానవుడను, చూచారా. కాని గుర్తుంచుకొనండి, ఈ దేవుని వాక్యము సత్యము. మరియు దీనిని బట్టి నేను జీవించ ప్రయత్నించుచున్నాను.
HEB 13:8
120నేను ఇక్కడ నుండి వెళ్ళి, పాప కార్యములు చేసినయెడల అది సరియైనది కాదు, పాపము చేయుట. మరియు మత్తు పానీయములు త్రాగుట, లేక పొగ త్రాగుట, లేక మంచి కార్యములను కాని వాటిని చేయుట. మీరు వచ్చి నన్ను పిలువండి, ఎందుకనగా అది అలాగవ్వడము లేదు. అప్పుడు నేను లోకమునే విడిచిపెట్టుదును. అది జరుకగముందే నేను వెళ్ళిపోగోరుచున్నాను, చూచారా. ఆలాగు నేను చేయగోరుట లేదు.
కాని సరయినది చేయుచూ, సరిగా జీవించ ప్రయత్నించుచున్నంత కాలము, చూడండి, మరియు క్రైస్తవునివలె జీవించ ప్రయత్నించుచున్నాను. మరియు అప్పుడు దేవుడు తన వాక్యమును తీసుకొనును గాక, మరియు నేను దాని పక్షమున నిలబడితినని నన్ను గూర్చి వినును గాక. చాలామంది స్నేహితులను, లోక పేరును నేను పోగొట్టు కోవలసివచ్చినా సరే, అనేక మందిచే ద్వేషింపబడినను, శాఖలు బయటకు గెంటి వేసినను, అలాంటి కార్యములు జరిగిననూ, అయినా గాని నేను ఈ వాక్యము పట్ల యధార్థముగా జీవించగోరుచున్నాను. ఇది దేవుని మాట. మరియు నేను దేవుని ప్రేమించుచున్నాను. కాబట్టి ఇది దేవుని వాక్కు. "ఆయన నిన్న, నేడు, నిరంతరము ఏకరీతిగా యున్నాడని, మీతో చెప్పుచున్నాను. ఇప్పుడాయన మనలో యున్నాడు."
మరియు ఒక వేళ…
121షేక్స్పియర్ యొక్క జీవము నాలోయున్నయెడల, నాలో జీవించుచున్నయెడల, షేక్స్పియర్ నాలో జీవించినయెడల నేను షేక్స్పియర్ యొక్క క్రియలను చేయనా? బీదోవెన్ నాలోయున్నయెడల, నేను బిదోవెన్ క్రియలను చేయనా? జాన్ డిల్లింజర్ యొక్క ఆత్మనాలో జీవించినయెడల నేను జాన్ డిల్లింజర్ను అవ్వనా? బీద్వెన్ నాలో యున్నయెడల నేను బీదోవెన్ను అవ్వనా? చూచారా? కాస్ట్రో నాలో యున్న యెడల నేను కాస్ట్రోనవ్వనా? చూచారా? యేసుక్రీస్తు నాలోయున్నయెడల ఆయన క్రియలు నేను చేయుదును, ఎందుకనగా అది ఆయనే. ఆలాగు మరలా జరుగునని ఆయన చెప్పలేదా? చూచారా?
MATT 13:58•
HEB 13:8
122ఆయన నిన్న, నేడు, నిరంతరము ఏకరీతిగా యున్నట్లయితే, ఇప్పుడు ఆయన ఇక్కడ నిలబడియున్నట్లయితే ఆయనేమి చేయును? "తండ్రి చూపించినదే నేను చేయుదును" అని ఆయన చెప్పును. అది నిజమేనా? సరే, నిన్న ఆయన ఆ విధంగానే యుండెను. ఇప్పుడు ఆయన ఏకరీతిగా యున్నాడా? మరి వ్యాధి సంగతి ఏమిటి? వెల ముందే నీ కొరకు చెల్లించబడినది. మీ ప్రతి ఒక్కరు ఎప్పుడో మీ వ్యాధుల నుండి స్వస్థత పొందియున్నారు. అది నిజమేనా? మీ ప్రతిఒక్కరిని ఆయన క్షమించెను, కాని దానిని మీరు అంగీకరించవలసియున్నారు. మీ ప్రతి ఒక్కరు స్వస్థతను పొందిరి, కాని దానిని మీరు అంగీకరించవలసియున్నారు.
ఇప్పుడు నిన్న, నేడు, నిరంతరము ఆయన ఏకరీతిగా యున్నాడని రుజువు అగును. ఆయన ఇక్కడ నిలబడియున్నా గాని మీ అవిశ్వాసమును బట్టి ఆయన స్వస్థపరచలేకపోవును. మీరు దానిని విశ్వసించవలెను. ఇప్పుడే మీరిది నమ్మవలెను. ఇప్పుడు కూడ ఆలాగే యుండవలసియున్నది, గమనించారా. "ఎందుకనగా ఆయన తాను జీవించిన దినములలో కూడా ప్రజల అవిశ్వాసము బట్టి అనేక అద్భుత కార్యములు చేయలేకపోయెను." అది నిజమేనా? అవిశ్వాసమును బట్టియే ఎన్నో గొప్ప కార్యములు ఆయన ఈ రోజునూ చేయలేకపోవుచున్నాడు.
JOHN 5:19
123ఇప్పుడు, ముందుగా దానిని ఎవరు చెప్పగలరు? దేవుడు. దీనిని చెప్పిన వారెవరు? దేవుడు దానిని చేసిన వారెవరు? దేవుడు. ఎలుగుబంటి, లేడి, దున్న, మొదలగునవి అన్ని కార్యములను ఎక్కడున్నవో ఎవరు చెప్పిరి? ఇవన్నీ ఏలాగు జరిగినవి? ఎవరు వీటిని చెప్పిరి? ఇవన్నీ ఏలాగు జరిగినవి? ఎవరు వీటిని చెప్పిరి? మనలోనున్న క్రీస్తే, మన ద్వారా స్వయముగా ప్రవచించుచున్నాడు. తాను నిన్న, నేడు, నిరంతరము ఏకరీతిగా యున్నట్లు బయలుపరచుకొనుచున్నాడు. గాలులను ఎవరు ఆపిరి? ఉడుతలను ఎవరు సృజించిరి? అబ్రహామునకు ఒక పొట్టేలును సృష్టించిన వాడే. ఆయనను "యెహోవా యీరే" అని అతను పిలిచెను. ఆ బహు విమోచన నామములు ఇంకా ఆయనకు వర్తించును. ఆయన ఇంకా యెహోవా యీరేగా ఉన్నాడు. "యెహోవాయే తనకొరకు బలిని చూచుకొనును."
GEN 22:8,13•
HEB 13:8
124ఇప్పుడు మీరు ప్రతిఒక్కరు యదార్ధముగా ఉండవలెనని నేను కోరుచున్నాను. మీరు మీ పూర్ణహృదయముతో నిజముగా నమ్మినట్లయితే, గడియారము అయిదు నిమిషములు తిరుగక ముందే మన మధ్య ఒక్క బలహీన వ్యక్తి కూడా ఉండడు. ఇక్కడ ఏ వ్యక్తి కూడ ఉండడు, కాని అందరూ బాగయి లేచి నిలబడుదురు. సరే, కేవలము, నీవు దానిని నమ్మినట్లయితే. మీరు నమ్మగలరా?
ఇప్పుడు, మనము తలలు వంచియుండగా ఆయను మనయొద్దకు వచ్చి తన్నుతాను బయలుపరచుకొనుట ఇప్పుడు మనము చూద్దాం.
ప్రభువైన యేసు, ఇప్పుడు నీవు నాకు సహాయము చేయుము. ప్రభువా, నాకు తెలిసిన రీతిగా నేను నీకు లోబడెదను. నా పాపములు, దోషములు క్షమించుము. యేసు నామములో దీనిని ప్రార్థించుచున్నాను. ఆమేన్.
1JN 4:4
125ఈ వైపునున్నవారిని ఇప్పుడు మనము చూద్దాం. నమ్మండి విశ్వాసముంచండి, సందేహించవద్దు! నన్ను ఎరుగనివారున్నారు. దర్శనము ఎచ్చటకు వెళ్ళునో నాకు తెలియదు. దానికొరకు నేను చూడవలెను. అది చేసినట్లయితే అది నిజమో కాదో మీకు తెలియును. సందేహించక కేవలము నమ్మండి. దానిని ఆయన చేసినయెడల మీరు నమ్ముదురు, చూచారా, ఈ రోజు దానిని చేసినట్లయితే మీరు నమ్మెదరా? చూచారా? కేవలము మీ స్వస్థతను అంగీకరించండి, చూడండి. ఈలాగు చెప్పండి, "ప్రభువా, ఇప్పుడు నేను యేసుక్రీస్తును తాకుచున్నాను. నేను నమ్ముచున్నాను." పరలోక దేవుడది దయచేయును గాక!
"మీలోనున్న క్రీస్తు లోకములో ఉన్నవానికంటె గొప్పవాడు." ఇప్పుడు కూటములలో ఆయనను మనము తాకగలము. ఆయన తిరిగి తన్ను ప్రతిబింబించుకొనును. ఆ స్త్రీ క్రీస్తు ద్వారా దేవునిని తాకి, తన అక్కర తీర్చుకొనుట ద్వారా తిరిగి తన్ను ప్రతిబింబించుకొనెను.
1JN 4:4
126ఇప్పుడిక్కడ మూలవైపు నేను చూచుచున్నాను. పురుషునివలె కనబడుచున్నాడు. చాలా జబ్బుగా యున్నాడు. కాదు, అది అలా కాదు. ఒక స్త్రీ ఒక పురుషుని కొరకు ప్రార్ధించుచున్నది. అతడు ఇక్కడ లేడు. కాని ఈమె ఒక అది ఆమె యొక్క తండ్రి మరియు అతను కాన్సరుతో చనిపోవుచున్నాడు. మరియు చాలా జబ్ళుగా యున్నాడు. ఆ వ్యక్తి ఇచ్చట లేడు. అతను మరో చోట ఉన్నాడు. అతను ఈ దేశమునకు చెందినవాడు కాదు. అతడు జార్జియాలో యున్నాడు. కేవలము ప్రార్ధించండి. ఇప్పుడు మీ పూర్ణహృదయముతో నమ్ముచున్నారా? కేవలము ప్రార్ధిస్తూ ఉండండి. ప్రార్థించుచున్న స్త్రీ పేరు శ్రీమతి జోర్డన్. ఆమె జార్జియా నుండి కాక నార్త్-కరొలినా నుండి వచ్చినది. ఇది నిజమైనచో నీవు నీ పాదముల పైన లేచి నిలబడుము. నిజము, అదంతా సత్యమా. దానిగూర్చి నీవు ప్రార్ధించుచున్నావా? మంచిది. సరే, నీలో నున్నవాడు లోకములో ఉన్నవానికంటె గొప్పవాడు" అని నమ్ముచున్నావా? నీవు నమ్ముచున్నావా ఆయన…
127చూడండి, ఇక్కడ ఇంకో సంగతి యున్నది. నీ ప్రారంభ రోజులలో గొప్ప శిక్షణ పొందితివి లేక అలాంటిది ఏదో నీవు ఏదో సిద్దాంతముతో కలిసిపోయినట్లు కనబడుచున్నది. నీ తండ్రి లేక ఎవరైనా నీ బంధువులు సేవకులా? నీ భర్త సువార్త బోధించుచూ, నీ ప్రక్కన ఒకరు నిలబడుట నాకు కనబడుచున్నది. మరియు నీవు చర్చిలో యున్నావు. అతనికి నీతో సంబంధమున్నది. మంచిది, నీవక్కడే యున్నావు.
ఇప్పుడు, ఈమె నాకు తెలియదు కాని దేవునికి తెలియును. నీ జేబులో ఒక చిన్న చేతిరుమాలు లేదా మరేదో యున్నదా? మంచిది, నీవు కూర్చొని ఆ చేతిరుమాలు మీద చేయిపెట్టి సందేహించక, ప్రార్థించుము. నీ తండ్రిని చంపుచున్న వానికంటె నీలోనున్నవాడు గొప్పవాడు. నీ పూర్ణహృదయముతో నమ్ముము. నీ నమ్మిక ప్రకారమే జరుగును.
128ఇప్పుడు నేను ఒక సంగతిని నిన్ను అడుగగోరుచున్నాను. ఆ స్త్రీ నాకు తెలియదు. నాకు తెలిసినంతవరకు ఆమెను చూచుట ఇదే మొదటిసారి. ఆమె నిరాశా స్థితిలో కూర్చొని ప్రార్థించుచున్నది. వెనుదిరిగి రక్తస్రావము గూర్చి ఆ స్త్రీతో చెప్పిన దేవుడే ఇచ్చటయున్నాడు. మీలో నున్నవాడు లోకమును జయించియున్నాడని చూపించుచున్నాడు. నీవు నమ్ముదువా? సందేహించక, విశ్వాసముంచుము.
129కాన్సరు గూర్చి మాట్లాడుచుండగా, మరలా నేను ఆ నల్లని ఛాయను చూస్తున్నాను. ఇక్కడ కూర్చొనియున్నది ఒకస్త్రి. ఆమెకు గొంతు కాన్సరు యున్నది మరియు ఆమె చాలా దుస్థితిలో యున్నది. ఆమెకు ప్రార్ధించిరి. తన స్వస్థతను అంగీకరించుటకు శ్రీమతి. బర్టన్ ప్రయత్నించుచున్నది. నమ్ముము! ఆమె నాకు తెలియదు. కాని నీవు నీ పూర్ణహృదయముతో నమ్మినట్లయితే. నీవేమి చేయుటకు ప్రయత్నించుచున్నావు అనునది నేను దీనిని వివరించెదను వినుము. నీవు దానివలన స్వరమును కోల్పోయావు. స్వరము తిరిగి రావలెనని నీవు ప్రార్ధించ ప్రయత్నించుచున్నావు. అది నిజమేనా? నీ చేతిని ఈలాగు ఊపుము. ఇప్పుడు ఆమె నాకు ఒక అపరిచితురాలు. నాకామె తెలియదు. ఆమెను చూచారా? చూడండి. అది నిజము. అవును, ఆమె అక్కడున్నది. చూడండి? నీలో నున్నవాడు గొప్పవాడు. విశ్వాసము ఆయనను అంటుకోగలదు. అది నీ గొంతు కంటె గొప్పది. నీ పూర్ణహృదయముతో నమ్ముదువా?
MATT 25:35,40•
1JN 4:4
130లార్సన్ సోదరీ, నిన్ను నేనెరుగుదును. ఆమె నా భూస్వామి. లార్సన్ సోదరీ, నీవు వైద్యుని యొద్దకు ఆపరేషను కొరకు వెళ్ళితివి. అది నిజము. అది నిజమేనా? లార్సన్ సోదరీ, లోకములో ఉన్నవానికంటె నీలో నున్నవాడు గొప్పవాడు. "నేను పరదేశిగా యుంటిని. మీరు నన్ను చేర్చుకొనిరి" అని యేసు చెప్పెను, చూచారా. "మిక్కిలి అల్పులగు ఈ నా చిన్నవారిలో ఒకరికి మీరు చేసినయెడల నాకు చేసినట్లే." ఓ, పరమ తండ్రి! కృప చూపుము!
మీరేమి తలంచుచున్నారు? నీవు కూడా ఆపరేషనుకు వెళ్ళితివి. నీవు నాకు తెలియవు. అది నిజమేనా? నీవిచ్చట నుండి రాలేదు. నీవు నన్నెరుగుదువు గాని నీవు నాకు తెలియవు. కాని దేవుడు నిన్నెరుగును. దానిని నీవు నమ్ముచున్నావా? నీవు ఆపరేషనుకు వెళ్ళితివి. నీవిచ్చట వ్యక్తివి కావు. నీవు బెడ్ ఫోర్డ్ లేదా స్ప్రింగ్ విల్ నుండి వచ్చావు. స్ప్రింగి విల్ నుండి వచ్చావు. శ్రీమతి బర్టన్… కాదు, కాదు, నన్ను క్షమించండి, నా ఉద్దేశ్యము అది కాదు… నీ పేరు శ్రీమతి. పార్కర్, అవునా? నిన్ను చంప ప్రయత్నించుచున్నవానికంటె నీలో యున్నవాడు గొప్పవాడు. అది నిజమేనా? నీవు నీ పూర్ణహృదయముతో నమ్ముచున్నావా? నీవు నమ్మినట్లయితే నీకు ఆపరేషను అక్కర్లేదు.
1JN 4:4
131సోదరీ, దీనంతటిని గూర్చి నీవేమనుకొనుచున్నావు? నిన్ను నేనెరుగను. నీవు నాకు క్రొత్త వ్యక్తివి. నేనాయన ప్రవక్తననని నీవు నమ్ముచున్నావా? నీవు నమ్ముచున్నావా. మీకు వందనములు. దానిని దేవుడు ఘనపరచును. మీరు శ్రీమతి వైట్. నీవు టెక్సాస్లోని ఫోర్డు వర్త్ నుండి వచ్చితివి. నీకు ఒక కండరముల వ్యాధియున్నది. నరముల బలహీనతయున్నది. నీవు చాలా జబ్బుగా యున్నది. వైద్యశాస్త్ర ప్రకారము ఇక నీకు ఏ ఆశయు మిగులలేదు. నీ భర్త ఒక ఆత్మీయ అవసరత కొరకు ప్రార్థించుచున్నాడు. నీకు ఒక కుమారుడున్నాడు. అతనికి గుండెపోటు, వీపు నొప్పియున్నది. నీకు ఒక చిన్న బాలుడున్నాడు. అతనికి గల నోటి మాంద్యము గూర్చి నీవు ప్రార్థించుచున్నావు. అది నిజమయితే నీ చేతిని ఎత్తుము. "లోకములో ఉన్నవానికంటె నీలో ఉన్నవాడు గొప్పవాడు." దానిని నీవు నమ్ముదువా? నీ పూర్ణ హృదయముతో నమ్ముదువా? దానినంతటితో నమ్ముదువా?
ఇప్పుడు, మన తలలు వంచుదము.
132ఇప్పుడాయన ఈ భవనము గుండా వెళ్ళియున్నాడు. ఆయన దేవుడని నీకు రుజువైనది. "లోకములో ఉన్నవానికంటె నీలో ఉన్నవాడు గొప్పవాడు. "ఆయన ప్రభువగు దేవుడు. నీలోనున్న ఆయనకే ముందు స్థానము ఇమ్ము. నీవు నీ పూర్ణహృదయముతో ఇప్పుడు నమ్ముము. "నా శరీరములోయున్న వ్యాధి పోయినది" అని చెప్పుము," చూచారా. "ఇక నాకు ఏ బాధ లేదు. ఇక నాకు ఏ జబ్బు లేదు. నా శరీరములో యున్నవాని కంటె నాలో యున్నవాడు గొప్పవాడు. నా మాంసములో యున్నవానికంటె నా హృదయములో ఉన్నవాడు గొప్పవాడు. కాబట్టి నా హృదయములో యున్నవాడు భూమ్యాకాశములను సృజించెను. సాతాను ద్వారా నా శరీరము చెడిపోయినది. మరియు నేను పరిశుద్దాత్మకు ఒక ఆలయమైయున్నాను. కాబట్టి సాతానా, నా శరీరమును విడిచిపొమ్మని ఆజ్ఞాపించుచున్నాను. యేసుక్రీస్తు నామములో నీవు నాలో నుండి బయటకు రమ్ము," చూచారా. అది నమ్ముచున్నారా?
ఇప్పుడు, మనమందరము మన స్వంత పద్ధతిలో ప్రార్ధన చేసికొందము. నేను మీ కొరకు ప్రార్థించెదను:
JOHN 1:1•
1JN 4:4
133సర్వశక్తుడవగు దేవా, భూమ్యాకాశముల సృస్టికర్తా జీవాధిపతీ, హృదయ రహస్యములను వెలికి తెచ్చువాడా, "దేవుని వాక్యము రెండంచుల ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగలదియై మనస్సులోని ఆలోచనలను వెలికి తెచ్చునని" నీవు చెప్పి యున్నావు.
అందుకొరకే వాక్యము శరీరము ధరించినప్పుడు, వారు దేనిగూర్చి ఆలోచించుచున్నారో అది ఎరిగినది. ఆయన వారి ఆలోచనలను గ్రహించెను. ఆయనే వాక్యము, వాక్యమునకు వారి హృదయ రహస్యములు తెలియును. మరియు అది వాక్యము ఇంకనూ వాక్యముగానే యున్నది. రెండువేల సంవత్సరముల తరువాత ఈ రాత్రి అది మనలో తనకుతానుగా ప్రత్యక్షమగుట చూచియున్నాము, ఎందుకనగా దానిని ఆయన కాగితము మీద వ్రాసెను. మరియు అదిక్కడ ధృవపరచబడుచున్నది. అది నిజమని చూపుచున్నది.
ఇక్కడ కొన్ని చేతిరుమాళ్ళు ఉంచబడియున్నవి. రోగులు ప్రతిచోట యున్నారు. గొప్ప పరిశుద్దాత్మ ఇక్కడయుండి ఈ సంగతులను చూపించుచున్నది. ఎన్నడూ తప్పిపోదు. "అది సరియే"; ఒక్కసారి కూడా అది విఫలము కాదు, ఎందుకనగా అది దేవుడే తన సన్నిధితో ఆయన ఈ చేతిరుమాళ్ళను అభిషేకించును గాక. దానిని త్రాకు ప్రతి రోగి బాగవును గాక. రెండు వేల సంవత్సరముల తరువాత కూడా ఆయన సజీవునిగా యన్న దేవుడు. పాపుల హృదయములలో దానిని స్థిరపరచుచున్నాడు. కృప మరియు విశ్వాసము ద్వారా వారు విమోచించబడుచున్నారు. మర్త్య పెదవుల ద్వారా ఆయన తన స్వంత మాటలు పలుకుచున్నాడు. అవి జరుగుట చూడండి. అక్షరాలా ఆయన వాగ్ధానము చేసినట్లుగానే జరుగుచున్నది.
ACTS 3:6•
HEB 4:12•
HEB 13:8
134ప్రభువగు దేవా, మా పట్ల కృప చూపమని నేను అడుగుచున్నాను. ఇక్కడ కూర్చొనియున్న ప్రతి స్త్రీ, ప్రతి పురుషుడు ఎలాంటి విధములైన రుగ్మతలు, బాధల నుండి విడిపింపబడుదురు గాక! జనులకు మధ్యవర్తిగా మోషే నిలబడియున్నట్లుగా, ఈ రాత్రి నా హృదయమును నీ ముందుంచుచున్నాను, ప్రభువా! నీవు నాకిచ్చిన నీయందలి విశ్వాసమంతటితోను వారికొరకు నేను ప్రార్థించుచున్నాను. శృంగారమను దేవాలయ గుమ్మము నొద్ద పేతురు ఇట్లు పలికెను: "నాకున్నవే నీకిచ్చుచున్నాను. నజరేయుడగు యేసుక్రీస్తు నామములో లేచి నడువుము." ఆ కుంటివాడు కొద్ది క్షణముల వరకు బలహీనుడుగా ఉండేను. వారతనిని పట్టుకొనగా అతని చీలమండలు బలము పొందినవి. అతడు దేవుని స్తుతించుచూ, పొగడుచూ, గంతులు వేయుచూ దేవుని మందిరములో ప్రవేశించెను.
నీవు - నిన్న, నేడు, నిరంతరము ఏకరీతిగా యున్నావు. మరియు ఆయన అపోస్తలులు ఇట్లనిరి, "మావద్ద ఉన్నవే నీకిచ్చుదుము." అది విశ్వాసము. నేనీలాగు చెప్పుచున్నాను, నా యొద్ద ఉన్నవే, ఈ జనులకు నేను ఇచ్చుచున్నాను! నజరేయుడగు యేసుక్రీస్తు నామములో మీ వ్యాధులను గద్దించుచున్నాను, ఎందుకనగా మీలో యున్నవాడు మీ ప్రాణమును తీయుటకు ప్రయత్నించుచున్న అపవాదికంటె గొప్పవాడు. మీరు దేవుని యొక్క పిల్లలు మీరు విమోచించబడిరి. ఈ జనులను వదలి పొమ్మని సాతానుకు ఆజ్ఞాపించుచున్నాను.
ఆనాడు తుఫానును వెనుకకు పోచేసిన దేవుడు. గాలులను, అలలను ఆపిన దేవుడు ఈ జనుల యొక్క ప్రతి రోగమును తీసివేయును గాక! ఈ ఘడియలో క్రీస్తు యొక్క శక్తి వారి జీవితములలో ప్రత్యక్షమగు గాక. ప్రతి పాపి మారుమనస్సు పొందు గాక! నీకు దగ్గరగా లేని ప్రతి వ్యక్తి ఈ ఘడియలో నీతో సరిచేసికొను గాక! యేసుక్రీస్తు నామములో ఆలాగు అవును గాక!
135నేను మీ సంఘ కాపరిగా, మీ సోదరునిగా, నాకున్న విశ్వాసముతో దానిని మీ పైని ఉంచమని దేవుని అడిగాను. నాకు ఎటువంటి విశ్వాసమైతే యున్నదో, నాతో పాటు దానిని మీరు ఇప్పుడు నమ్మినట్లయితే, నేను ఈ ఘడియలో మీకు ఇచ్చుచున్నాను. దేవుని కుమారుడగు యేసుక్రీస్తు నామములో మీ వ్యాధిని, బాధను గద్దించుచున్నాను. "నీవు పోవలసియున్నావు," అని దానితో చెప్పండి, ఎందుకనగా మీకు మీ విశ్వాసము మరియు నా విశ్వాసముయున్నది. యేసుక్రీస్తు శక్తి ఇచ్చటున్నది. ఆయన సన్నిధి ఇచ్చటున్నది. అదిక్కడున్నట్లు బయలుపరచబడి రుజువైనది. ఈ సమయములో అది మిమ్ము బాగుచేయును.
ఈ మంచము మీద పరుండియున్న ఈమె దానిని నమ్ముచున్నదా? నీ కండరములు ఏలాగున్నాగాని నీవు ప్రయత్నించినచో నడువగలవు. యేసుక్రీస్తు నామములో లేచి నిలబడుము. ఆమె పైకి లేచుటకు సహాయము చేయండి. ఆమె నడుచుచున్నది. మీరు నమ్ముదురా? మీరు నమ్మినట్లయితే మిగిలినవారందరూ లేచి నిలబడండి. దానిని నమ్మండి! ఆమె చీలమండలు బలమును పొందినవి.
ఇప్పుడు, మనము చేతులెత్తి ఆయనను సుత్తించుదము.
గొప్ప యెహోవా దేవా యేసుక్రీస్తు నామములో మమ్ములను మేము స్వస్థత కొరకై నీకు అప్పగించుకొనుచున్నాము. ఆమేన్.