ఈ కాలము యొక్క సూచన

ఈ కాలము యొక్క సూచన

1[మొదటి పేర తప్పిపోయెను]

ఒక క్షణము ప్రార్ధన కొరకై మన శిరములు వంచెదము. మా కృప గల పరలోకపు తండ్రీ, మేము ఈ రాత్రి ఇక్కడికి, న్యూయార్క్ నగరమునకు వచ్చి నీ నామమున, నీ జనులకు పరిచర్యచేయు భాగ్యము కలిగియున్నందుకు నిజముగా సంతోషించుచున్నాము. రోగులు నిత్యము స్వస్థతనొందియుందురు గనుక భవిష్యత్తులో ఇక రోగుల కొరకు పార్థనయనునది ఉండని చోట మేము వారిని కలుసుకొనెదమని ఎరిగియుండుట వలన మేము ఎంతగానో సంతోషించుచున్నాము. ఇక నశించువారి కొరకు సంపూర్ణ రాత్రి ప్రార్థనయనునది ఉండదు, ఎందుకనగా అప్పుడు వారంతా రక్షింపబడియుండెదరు.

మరియు యేసు ప్రత్యక్షమయ్యే ఆ దినము కొరకు మేము ఎదురుచూచుచున్నాము. ఆ ఘడియ సమీపించుటను, మరియు సూచనలు మరియు అద్భుతములు ఆ సమయము వైపు చూపించుటను చూచుచున్నవారమైయుండగా, ప్రభువా, అది మమ్ములను ఒక్క క్షణము మా గురించి మేము ఆలోచించునట్లు చేయుచున్నది; మరియు ఇప్పుడు మేము ఆ ప్రశ్నను అడుగుచున్నాము, ప్రభువా, నన్ను పరిశోధించి మరియు నన్ను పరీక్షించుము. "మరియు తండ్రీ, మాయందు దోషమేదైనా ఉన్నయెడల, దానిని తీసివేయుము. ఏ ఘడియలో నీవు మమ్ములను పిలుచుదువో మరియు పైకి రమ్మని ఆజ్ఞాపించుదువో, మాకు తెలియదు గనుక వేము శుద్ధ హృదయముతో మరియు పవిత్ర హస్తములతో నిన్ను సేవింపగోరుచున్నాము. మేము నిన్ను కలుసుకొనుటకు వచ్చెదము.

అయితే ప్రభువా, నిన్ను తమ రక్షకునిగా, తమ పాపములకు క్షమాపణగా ఎరుగనివారు ఎవరైనా ఈ రాత్రి ఇచ్చట ఉండినయెడల, వారు దేవుని యొక్క ఆత్మమూలముగా జన్మించనియెడల, ఈ రాత్రే వారు ఆ నిర్ణయమును తీసుకొనెదరు గాక, మరియు దేవా, ఆయన యొక్క మంచితనముతో వారిని నింపండి. తండ్రీ, ఇచ్చట ఉన్న ప్రతీ రోగిని, వ్యాధిగ్రసులను స్వస్థపరచండి. కూటము ముగించబడినప్పుడు ఈ భవనములో ఏ ఒక్క బలహీనుడైననూ, లేదా ఏ ఒక్క పాపియైననూ, ఉండకుండునట్లు చేయండి. దేవుని యొక్క ఘనత మరియు మహిమ కొరకై ఇది జరుగుటను మేము చూచెదము గాక. ఆయన యొక్క ప్రియ బిడ్డయైన యేసుక్రీస్తు యొక్క నామములో దీనిని అడుగుచున్నాము. ఆమేన్.

GEN 1:1•

GEN 11:24•

GEN 17:5•

GEN 18:3

 

2కూర్చొనండి. స్వయం సమృద్ధియైనవాడు మరియు మన ప్రియ రక్షకుడును అయిన, ఆయన యొక్క నామములో ఈ రాత్రి పరిచర్య చేయుటకై మరలా ఇచ్చట ఉండుట గొప్ప భాగ్యము.

గత రాత్రి మనము ప్రభువు యొక్క దూత విషయమై ఆ దూత అబ్రహముతో మాటలాడుటకై నిలిచియుండెనని చెప్పుకొంటిమి; ఆయితే దూతయైయున్న ఈ మనుష్యుడు, అతడు మానవ రూపములో ఉన్న దేవుడైయుండెను, ఏలయనగా అబ్రాహాము అతనిని "ప్రభువా" అని పిలిచెను. బైబిలు చదువరియైన ఎవరికైనను ప్ర-భు-వు (L-O-R-D) అను పదము దేవుడు "ఆదియందు భూమ్యాకాశములు సృజించెను" అను దానినుండి వచ్చినదని తెలియును, ఎలోహిం అని దాని అర్ధము, అనగా స్వయం సమృద్దియగువాడు, సర్వశక్తిమంతుడు అని అర్థమిచ్చును. మరియు దేవుడు అచ్చట అబ్రాహామునకు, ఒక మానవ రూపములో తననుతాను బయలుపరచుకొనెను. వారు చూచుటకు కేవలం దుమ్ముకొట్టుకుపోయిన బాటసారివలెనె అగపడిరి. ఆయన ఎచ్చటి నుండి వచ్చెననునది చెప్పనేలేదు. అయితే గమనించండి, ఆయన అబ్రాహాముతో మాటలాడునప్పుడు, "నేను దీనిని చేయుదును. దీనిని నీకు వాగ్దానము చేయుచున్నాను" అని చెప్పెను, చూశారా. మరియు, తనను కొద్దిరోజుల క్రితమే అబ్రాము నుండి మార్చిన, "తండ్రి" అను నామముతో అని అతనిని పిలిచెను. ఆయితే ఇప్పుడు ఆతను అబ్రాహాము అయి యుండెను. మరియు శారాయిని, శారా అని పిలిచెను, "ఒక రాణి." మరియు దేవుడు అబ్రాహాము ఎదుటి నుండి అదృశ్యుడయ్యెను. మరియు సొదొమ వైపునకు వెళ్ళిరి, మరియు అది వారియొక్క ముగింపు సూచనయైయుండెను. ఆకాశము నుండి అగ్ని కుమ్మరించబడెను మరియు సొదొమ గొమొర్రాలను మరియు ఆ పట్టణములను, ఆ ప్రాంతమంతటిని దహించివేసెను.

GEN 9:12,15•

MATT 24:37,38•

LUKE 17:26,27•

1PET 3:20

 

3అన్యప్రపంచము ఏమి చేయుననుటకు ఒక సాదృశ్యముగా చూపించెను. అది నాశనమగును, అది అగ్నిచేత దహించివేయబడును. అయన మనకు ఒక సూచన ఇచ్చుట ద్వారా ప్రపంచమును ఇక ఎన్నటికి నీటి ద్వారా నాశనము చేయనని, దేవుడు వాగ్దానము చేసియున్నాడు. దేవుడు ఒక సూచన లేకుండా, దేనినైనను చేయడు. మరియు ఆయన మనకు ఒక నిబంధనగా వర్ష ధనుస్సును సూచనగా ఇచ్చెను. అయన ఇక ఎన్నడూ ప్రపంచమును నీటితో నాశనము చేయడు. మరియు, ఇప్పుడు, అయితే ఈసారి అది అగ్ని ద్వారా జరుగును.

మరియు యేసు ఆ కాలములను ప్రస్తావించగా, ఆయన చెప్పెను, "నోవహు దినములలో జరిగినట్లు, ఓడ సిద్ధపరచబడినప్పుడు, నీటి ద్వారా కేవలం ఎనిమిది మంది మాత్రమే రక్షింపబడిరి, ఆ ప్రకారమే మనుష్యకుమారుని రాకడలో జరుగును? అక్కడున్న అల్పసంఖ్యను చూడండి, "ఆ ప్రకారమే జరుగును, నీటి ద్వారా ఎనిమిది మంది రక్షింపబడిరి." మరియు ఆయన ఆ దినములలో వారి నడత గురించి చెప్పసాగెను, "తినుచు, త్రాగుచు, పెండ్లాడుచు మరియు పెండ్లికియ్యబడుచుండిరి." మరియు ఒకవేళ…

GEN 6:2,4•

GEN 7:4,10•

MATT 24:38,39•

LUKE 24:38,39

 

4కొద్దికాలం క్రితం నేను దానిని చదువుచు మరియు దానిపై మాటలాడుచూ, దానిగూర్చి ప్రసంగము చేయుచుంటిని. నేను, మరియు మీరు చదివిన అదే ఆదికాండమును యేసు చదివెనన్న విషయమును గమనించితిని. కావున ఆ దినమున వారు ఏమి చేసారోయని కనుగొనుటకు నేను ఆదికాండము 6లోనికి వెళ్ళితిని, మరియు మనము, "దేవుని కుమారులు నరుల కుమార్తెలతో పోయిరి," అని కనుగొనెదము. నేను అచ్చట దానిగూర్చి వారియొక్క అనువాదమును చూచితిని, కుమార్తెలు కాదు కాని వారికొరకు స్త్రీలను తీసుకొనిరి. అది అచ్చం రెనో, నెవెడా వలెనున్నది; కేవలం వివాహము, పరిత్యాగము, హాలీవుడ్, మరియు ఆ రీతిగా నున్నది. మరియు పిదప, "వీరు ఆ పాతకాలపు పేరుగాంచినవారు" అని చెప్పబడినది.

పిదప ఇంగ్లాండ్ దేశములో ఆ పేరుగాంచిన వ్యక్తుల యొక్క అపకీర్తిని గూర్చియు మరియు ఆ వ్యభిచారిణుల గూర్చియు మరియు మన గవర్నర్ల గూర్చియు మీరు లైఫ్ పత్రికలో చూసియున్నారు. మరియు ఓ, మై, మనము ఎటువంటి గందరగోళంలో ఉండియున్నాము, సరిగా యేసు జరుగునని చెప్పిన మాదిరిగానే యున్నది, చూడండి. "తినుచు, త్రాగుచు, పెండ్లాడుచు, పెండ్లికియ్యబడుచునుండిరి, మరియు నోవహు ఓడలోనికి వెళ్ళు దినమువరకు దానిని ఎరుగకయుండిరి."

మరియు పిదప ద్వారము మూసివేయబడెను. ఇక అక్కడ ఎటువంటి అవకాశము లేకుండెను. అదియే అతని ఆఖరి ప్రసంగమైయుండెను. రక్షింపబడుటకు అసాధ్యము అను వారికి బోధించుటయే ప్రతీ గొప్ప పరిచర్య యొక్క ఆఖరి ప్రసంగము. నోవహు యొక్క ఆఖరి ప్రసంగము రక్షింపబడుటకు అసాధ్యము అనువారికే. చూడండి, అతను లోపలికి ప్రవేశించెను మరియు అతని వెనుక ద్వారము మూసివేయబడెను, మరియు వర్షము పడుటకు ఏడు దినముల ముందే అతను లోపలయుండెను. చూడండి, మొదటిగా అతను వర్తమానమును బోధించుట, ఓడను కట్టుట, మరియు ఆటు పిదప ఏడు దినముల లోపల మూసివేయబడుట అయి యున్నది.

"ఆ మూఢభక్తిగల వృద్ధుడు. చూడండి, అతను ఆక్కడ లోపలే యండి, తానే స్వయంగా తలుపును మూసుకొనియున్నాడు," అని ఆ ప్రజలు అనిరి. అయితే దానిని దేవుడే మూసివేసెను. సొదొమలో అదే కార్యమైయుండెను.

5మన ప్రభువైన యేసును చూడండి. ఆయన భూమి మీదకు వచ్చినప్పుడు, ఆయన గలలీయులోని ఒక యవ్వన ప్రవక్తగానుండెను. ఆయన సమాజ మందిరములకు వెళ్ళియుండెను, ప్రతీయొక్కరు ఆయనను ప్రేమించిరి. ఆయన రోగులను స్వస్థపరచెను. అది అయన పరిచర్యలోని మొదటి భాగమైయుండెను, మొదటి దశ. రెండవ దశ, ప్రవచించుట - ఆయన తన దినములోని పరిసయ్యులను మరియు సద్దూకయ్యలను గద్దించుట మొదలుపెట్టెను, వారేమైయున్నారనియు మరియు వారెట్లు గ్రుడ్డివారైయుండి దానిని చూడలేకపోయిరనియు మరియు ఆయన ఏమైయుండెనని మరియు వారికి ఏమి సంభవించుననియు మొదలగునవి చెప్పెనని మీకు తెలియును. దీనిని బట్టియే ఆయనపై నేరస్థాపన చేయబడెను. మరియు వీటిని బట్టియే ఆయన సిలువ వేయబడియుండెను, కాని వారు వర్తమానమును ఆపలేకపోయిరి. మరియు పరిశుద్ధ గ్రంధము ఈలాగు చెప్పెను, "ఆయన పాతాళమునకు వెళ్ళెను, మరియు ఒకప్పుడు అవిధేయులైనవారికి, అనగా చెరలోని ఆత్మలకు బోధించెను." మరియు అక్కడ ఆయన యొక్క ఆఖరి వర్తమానము నశించువారికైయుండెను.

MATT 13:47•

MARK 16:15•

JOHN 6:44,47

 

6ఇప్పుడు, నోవహు దినములలో వారు చేసినట్లే ఒకానొక ఈ దినాల్లో జనులు బోధించుచూనే యుందురు, వారు ఆ రీతిగానే పోవుచునుందురు, అయితే నశించు ప్రపంచమునకు ఇదివరకే ద్వారములు మూయబడియుండెనని తలంచుటయే భయంకరముగానున్నది. అది ఎప్పుడు సంభవించునో మనకు తెలియదు. కావున నీవు క్రైస్తవుడవు కానియెడల ఈ రాత్రి దానిగూర్చి బాగా ఆలోచన చేయుము. దాని విషయమై తీవ్రముగా ఆలోచించుము.

ఇప్పుడు, చేయుటకు మనకు తెలిసిన ఒకే ఒక కార్యమేదనగా, మన ప్రభువు మనకు విడిచిపెట్టిన ఆదేశాలను అనుసరించుట, "సర్వసృష్టికి సువార్త ప్రకటించుడి." ఎవరు రక్షించబడిరో మరియు ఎవరు రక్షింపబడలేదో ఆయనకు తెలియును. "మరియు తండ్రి ఒకనిని ఆకర్షించితేనే గాని యెవడును ఆయనయొద్దకు రాలేడు; తండ్రి ఆయనకు అనుగ్రహించినవారే వచ్చెదరు" అని మనకు తెలియును, చూడండి. కావున ఇతను క్రైస్తవుడనియూ మరియు అతడు క్రైస్తవుడు కాదనియు మనము చెప్పలేము, ఏలయనగా ఆయన ఇట్లు చెప్పెను, "పరలోక రాజ్యము, ఒకడు నానావిధములైన చేపలను పట్టుటకు సముద్రములో వేసిన వలను పోలియున్నది." అతడు వలను లాగినప్పుడు అందులో నానా విధములైనవి ఉండెను. అందులో సాలెపురుగులు, నల్లులు, స్కావెంజర్ చేపలు, మరియు మంచి చేపలు ఉండియుండును. మరియు, అయితే మీరు చూడండి, ఆ నీటి పురుగులు మరియు ఇతరమైనవి చివరకు మరలా ప్రాకుతూ నీటిలోనికి పోవును, అయితే మంచి చేపలు యజమానుని కొరకు ఉంచబడును. ఇప్పుడు అవి ఏవో మనము ఎరుగము. మనము కేవలం వలను వేయుదుము.

REV 17:8

 

7అయితే గుర్తుంచుకొనుడి, వల దానిపై పడినప్పుడు నీటి పురుగు, నీటి పురుగే. దానిని పట్టుకున్నది కూటము యొక్క ప్రభావము. పాము, ఇంకనూ పామే; కేవలం సువార్త అను వల దానిని లోపలికి లాగియున్నది. మరియు స్కావెంజర్ చేప, స్కావెంజర్ చేపయే; తాబేలు, తాబేలే; గాజు రొయ్య, గాజు రొయ్యే, చూడండి. అయితే మంచి చేప ప్రారంభము నుండి మంచి చేప అయి యున్నది. కావున ఏది సరియైనదో ఆయనకు తెలియును, ఎందుకనగా జగత్తు పునాది వేయబడకముందే గొర్రెపిల్ల వధించబడినప్పుడు, ఆయన అచ్చట వారి పేర్లను తన గ్రంధములో కలిగియున్నాడు.

8మనము మన వంతు ప్రయత్నము చేయుటకే మనమిక్కడ ఉండి యున్నాము. ఇప్పుడు, సహోదరుడు విక్ ఆ మూలన ఉండియున్నాడు, అనేక సంవత్సరములుగా వలను వేయుచున్నాడు. ఇతర సేవకులు కూడా వేరే వైపులు, వలను వేయుచునుండిరి. సహోదరులారా, నేను కూడా మీతో పాటు నావలను అల్లుటకు వచ్చియున్నాను, తద్వారా చెరువులలో జాలరులవలె మనము కూడా ఒక పెద్ద వలను వేసి మరియు లాగుచునుండెదము. ఒకానొక దినమున ఆ నది నుండి చివరి చేప తీసుకొనబడును. అప్పుడు చేపల వేట ముగియును. ఈ ఘడియ సమీపించుకొలది, మనము మన హృదయములన్నిటితో దేవుని వెదుకుదుము, ప్రార్ధించుచూ మరియు యదార్ధముగానుండెదము.

ఇప్పుడు ఈ రాత్రి మనము రోగుల కొరకు ప్రార్ధించబోవుచున్నాము. వాటిని మనము పంచిపెట్టాము. నేను నమ్ముచున్నాను బిల్లీ… నేను మాటలాడలేదు… అతను ప్రార్ధనా కార్డులను పంచిపెట్టాడా? అవునండీ. మంచిది. ఉత్తమము. అది మంచిది. అది సరియే.

9మనము ఈ రాత్రికి, ఒక ప్రార్ధనా కూటము కలిగియుండుటకై గత రాత్రి నుండే సన్నద్దమగుచున్నాము. మరియు పిదప కేవలం ప్రసంగించుటకు బహుశా ఒకటి లేదా రెండు రాత్రులు తీసుకొనవలెనని నేను తలంచాను, మరియు పరిశుద్దాత్మను ఎంతమంది పొందుకొనలేదాయని మనము చూచెదము. మరియు అదే ముఖ్యమైన కార్యము, చూడండి. మీరు గనుక - మీరు స్వస్థపరచబడినయెడల, నిశ్చయంగా దేవుడు మిమ్మును స్వస్థపరచును. ఆయన ఇదివరకే దానిని చేసియున్నాడు. మీరు కేవలం దానిని నమ్మవలసియున్నది. అయితే మీరు గనుక, ఒకవేళ మీరు ఇంకా ఎక్కువ కాలం జీవించినయెడల, మీరు మరలా జబ్బున పడవచ్చును. అయితే మీరు రక్షించబడినప్పుడు, అది భిన్నముగా నుండును, దానిని చూడండి, చూశారా?

మరియు ఇప్పుడు ఈ ఒక్క విషయమును మేము చెప్పబోవుచున్నాము ఎందుకనగా కొన్నిసార్లు కొత్తవారు వచ్చెదరు, బహుశా కూటములో ఉండి యుండవచ్చును, ఎన్నడూ స్వస్థతా కూటమును చూడకపోవచ్చును. మరియు చాలా సార్లు వారు, "ఒక దైవిక స్వస్థకుడు," అను పదమును మీకు తగిలించుటకు ప్రయత్నించుదురు. అయితే ఎవ్వరునూ లేరు… దైవిక స్వస్థతకుడు ఒకే ఒకడున్నాడు. అది దేవుడు మాత్రమే. మరియు స్పష్టముగా చెప్పాలంటే, ఒకే ఒకాయన స్వస్ధపరచును, ఆయన దేవుడేయైయున్నాడు.

10ఇప్పుడు, వైద్యులు తాము స్వస్థపరచువారమని ప్రస్తావించుకొనరు. వారు స్వస్థపరచువారు కారు, వారు ఆ హక్కును కలిగిలేరు. నేను వెలుపలికి వెళ్ళి మరియు నా చేయి విరుగగొట్టుకొని మరియు నేను వచ్చి "డాక్టర్ గారు, వెంటనే నా చేతిని స్వస్థపరచండి, నేను-నేను నా పనిని ముగించుకొనవలసియున్నది అని చెప్పినచో ఏమగును? నీకు మానసిక స్వస్థత అవసరము," అని అతడు అనును, మంచిది, అది, అది వాస్తవమైయుండును. చూశారా? ఇప్పుడు ఆ వైద్యుడు నా చేతికి కట్టుకట్టగలడు, కాని స్వస్థపరచునది దేవుడే. నేను నా చేయిని నరుక్కొనినయెడల, నేను చెప్పుదును, "డాక్టర్ గారు, నేను నా చేయిని గాయపరచుకున్నాను, వెంటనే దానిని నా కొరకు స్వస్థపరచండి." ఆయన దానిని చేయలేడు. ఆయన చేయగల ఒకే ఒక కార్యమేదనగా దానిని శుభ్రముగా కడుగును; అది పెద్దదైనచో దానికి కుట్లు వేయగలడు, అయితే దేవుడే దానిని స్వస్థపరచవలెను.

చూడండి, ప్రకృతి సహజంగా, జీవమే ఆ కణములను వృద్ధి చేయవలెను. జీవమే దానిని జతచేయవలయును. శరీరమే కాల్షియమును మొదలగువాటిని ఉత్పత్తి చేయవలెను, మరియు అది స్వయంగా జీవమును కలిగియుండును. కేవలం కాల్షియం స్వస్థపరచదు. స్వస్థపరచునది జీవమే. చూడండి. స్వస్థపరిచే ఔషధమేదియూ లేదు. దేవుడు స్వస్థపరచగా, ఔషధము కేవలం శుభ్రపరుచును. చూశారా? స్వస్థపరచగల ఏ ఔషధమూ లేదు.

11నా చేయి నరకబడి మరియు నేను ఇక్కడ మృతుడనై పడిపోయినయెడల, చూడండి. మీరు గనుక నన్ను వైద్యుని యొద్దకు తీసుకొనిపోయి, మరియు ఇట్లు చెప్పండి, ఈ మనుష్యుని నీవు స్వస్థపరచగలవా?

అతడు ఇట్లనును, "అతడు చనిపోయాడు కదా."

అది సరియే, అప్పుడు మీరు చెప్పండి, "మనము దానికి కుట్లువేయుదుము. మరియు మీ వద్ద ఆ చేయిని స్వస్థపరచు ఏదో ఒక ఔషధము ఉండియుండును, మీ వద్ద లేదా?"

"లేదు, మా వద్ద లేదు."

పిదప మీరు నాకు కుట్లు వేసినయెడల, మరియు ఒక వందసంవత్సరముల వరకు సహజంగా కనబడునట్లు వారు ఒక భద్రపరచు ద్రవ్యమును నాకిచ్చినయెడల, మరియు ప్రతీదినము నాకు పెన్సిలిన్ ని ఇచ్చి, మరియు ఆ గాయమైనచోట మందు రాసినను, నిశ్చయంగా అది స్వస్థపరచబడదు. ఎందువలన? ఎందుకనగా దానిలోనుండి జీవము వెడలిపోయెను.

మంచిది, అలాగైనచో స్వస్థపరచునది ఏది, ఔషధమా లేక జీవమా? ఇప్పుడు జీవమనగా ఏమిటో మీరు చెప్పండి, మరియు దేవుడు అనగా ఎవరో నేను చెప్పెదను చూశారా? దేవుడు జీవమైయున్నాడు. చూశారా? మీరు…

12గత రాత్రి మనము చెప్పుకున్నాము, "మనకు యాంత్రికమైనవి ఉన్నవి కాని చలనశీలమైనవి లేవు." ఇప్పుడు, నా శరీరము యాంత్రికమైనది, కాని ఆత్మ అను చలనశీలమైనది లేకుండా నా శరీరము నడిపించబడదు, చూశారా? మరియు ఆత్మయే నా శరీరమును నడిపించును, దానిని నియంత్రణలోనికి తెచ్చును.

దానిలో పెట్రోలు లేకుండా, మండే శక్తి లేకుండా ఒక మోటారు వాహనము వలె అది ఉన్నది, చూడండి యాంత్రిక శక్తి ఎంత చక్కగా ఉన్ననూ లేక లేదు, లేదా నా భావమేదనగా యాంత్రికమైనది అమర్చబడి, సిలెండర్లు పెట్టబడి, మరియు ఆ ప్లగ్గులు మరియు ఇంకా అవన్నియూ బిగించబడినను, దానికి కరెంట్ కూడా అవసరమైయున్నది. మీరు వాటన్నింటిని కలిగియుండవలసియున్నది.

ఆ ప్రకారమే దేవుడుచేయుచున్నాడు. దేవునితో సంబంధముగల ఒక విశ్వాసి అవసరమైయున్నాడు, అప్పుడే ఏదైనా జరుగును.

ISA 53:5

 

13కావున దైవికస్వస్థత కూడా రక్షణవలెనున్నది మీ ఆత్మకు రక్షణ సువార్తను ప్రకటించు ఏ వ్యక్తియైనా తాను ఒక దైవిక రక్షకునిగా పిలిపించుకొనగోరడు, అయితే దైవిక స్వస్థతను బోధించు ఏ వ్యక్తియైనా ఒక దైవిక స్వస్ధికుడు అనునది ఎంతో ఇతనూ అంతేయైయున్నాడు. ఎందుకనగా, ఆ వ్యక్తి తాను ఒక మనిషిని రక్షించగలనని చెప్పుకొనలేడు, ఏలయనగా యేసు ఇదివరకే దానిని చేసియుండెను, చూశారా. అది సరియే. అయితే, తన ప్రసంగమువలన, అతడు రక్షకుడైయున్న క్రీస్తు వైపుకు వారిని చూపించును.

దైవిక స్వస్థత వారిని కల్వరి యొక్క ముగించబడిన పని వైపుకు చూపించును, "మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది," చూశారా. చూశారా? దైవిక స్వస్థత అనునది దానిని మీ పైన ఉంచునట్లు, అది ఎవరో ఒక వ్యక్తి కలిగియుండునట్టిది కాదు. అది ఒక ముగించబడిన కార్యముపై మీరు కలిగియున్న విశ్వాసము.

14ఆయన నాకిచ్చిన ఈ సూటును ధరించి, ఈ రాత్రి యేసు ఇక్కడ నిలబడియున్ననూ, ఆయన మిమ్మును స్వస్థపరచలేడు, ఆయన కేవలం… ఆయన బహుశా… ఆయన యేసే అని మీరు ఎరిగియుండగలరేమో, అయిననూ ఆయన మిమ్మును స్వస్థపరచలేడు, ఎందుకనగా ఆయన ఇదివరకే దానిని చేసియున్నాడు. చూడండి, మీరు దానిని నమ్మవలసియున్నది. ఇప్పుడు ఆయన ఇట్లు చెప్పునేమో, "నా బిడ్డా, నేను పొందిన దెబ్బలవలన నీవు స్వస్థత పొందియున్నావని నీకు తెలియదా?" చూడండి, ఆయన ఇదివరకే దానిని చేసియున్నాడు. అది ఇదివరకే ముగించబడిన కార్యము. అది ఒక భూతకాలము. కేవలం దానిని మనము ఇప్పుడు నమ్ముచున్నాము. మరియు, నాకైతే వాక్యమున్నచో చాలును. మీరు ఎవరితోనైనా ఏదైనా చెప్పినప్పుడు, వారు దానిని నమ్మకూడదని అనుకున్నయెడల, మంచిది, అది - దానిని స్థిరపరుచును, వారిని వెళ్ళనీయుడి మరియు దానిని నమ్మకుండ ఉండనిమ్ము. అయితే అది దేవుడు కాదు, చూచారా.

ISA 53:5•

1PET 2:24

 

15అది నేను తరుచుగా వినే ఒక సేవకుడు మరియు అతని యొక్క భార్య పాడే పాటవలెనున్నది, "మర్త్యులు ఒకరినొకరు క్షమించుకున్నట్లు కాదు. యేసు క్షమించును మరియు మరచిపోవును," చూశారా. మనము దానిని మరచిపోలేము, చూడండి, అయితే ఆయన చేయగలడు. ఆయన దేవుడు. ఆయన దానిని మరచిపోగలడు; అది ఎన్నడూ జ్ఞాపకములోనికి రాదు. దానిని మరపు అను సముద్రములో వేసి, మరియు దానిని కనీసం జ్ఞాపకమునకు చేసికొనడు. ఆయన దేవుడైయున్నాడు. ఆయన దానిని పూర్తిగా తన జ్ఞాపకము నుండి తీసివేయగలడు. అయితే మనము దానిని చేయలేము, చూడండి. ఆయన చేయగలడు.

ఇప్పుడు ఆయన దీనిని మీ కొరకు చేసియున్నాడని మీరు ఆయనను నమ్మినప్పుడు, ఆయన - "మన అతిక్రమ క్రియలను బట్టి ఆయన గాయపరచబడెను, మరియు ఆయన పొందిన దెబ్బల వలన మనకు స్వస్థత కలిగినది," భూతకాలము. ఇప్పుడు మీరు చేయవలసిన ఒకే ఒక కార్యమేదనగా దానిని నమ్ముటయే. ఇప్పుడు వాక్యము దానిని బోధించుచున్నది. వాక్యము దానిని బోధించుటలేదని ఎవ్వరూ చెప్పజాలరు. మరియు దానిని అది బోధించును, ఇప్పుడు, మరియు ప్రతిచోట ప్రజలు స్వస్థపడుట అను రుజువును ఎంతగానో మనము చూచుచున్నాము. అయితే దైవిక స్వస్థత అనునది ఉన్నది.

1COR 12:8-10•

EPH 4:11

 

16ఇప్పుడు మీరైనా లేదా నేనైనా, సర్వాధికారియైన దేవునివలె మనము మన మాటను నాటినయెడల, మంచిది, ప్రజలు దానిని నమ్మగోరనియెడల, వారు నమ్మనక్కర్లేదు; తుదకు, రోగియైయున్నది వారు. కాని దేవుడు కాదు.

ఆయన సంఘములో కొందరిని, అపోస్తలులుగాను, ప్రవక్తలగాను, ఉపదేశకులగాను, కాపరులుగాను, మరియు సువార్తకులుగాను నియమించెను, చూడండి, శరీరము యొక్క క్షేమాభివృద్ధి కొరకే వాటన్నింటిని అనుగ్రహించెను. మరియు ఈ శరీరములో, ప్రతీ స్థానిక శరీరములో, ఆయన తొమ్మిది ఆత్మ వరములను అనుగ్రహించెను, ఆ వరములు వివిధ రకములైయున్నవి; జ్ఞానము, వివేకము, అన్యభాషలు మాటలాడుట, స్వస్థపరచు వరము, భాషలకు అనువాదము చెప్పు వరము, మరియు మొదలుగునవి; తొమ్మిది ఆత్మ వరములు, అన్నియూ సంఘము పట్ల ఆయనకున్న ప్రేమను చూపించుటకే, చూడండి, గొప్ప పరిశుద్దాత్మ స్వయంగా తానే సంఘము యొక్క ఉపాధ్యాయుడై యుండి, మీరు క్రమంగా నిలుచుటను ఆయన కోరుచున్నాడు. ఉపాధ్యాయుడిగా ఉండుటకు, పరిశుద్దాత్మకు బదులుగా మనము ఒక బిషప్పును తీసుకొనుట, ఎంతో విచారకరము, చూడండి. కాని సంఘము ఎదుగునట్లు, దానిని దేవుని యొక్క భద్రతలోనికి తీసుకు వచ్చునట్లు దేవుడు సంఘమునకు ఇచ్చిన ఉపాధ్యాయుడు పరిశుద్ధాత్మ అయి యున్నాడు. కావున పరిశుద్దాత్మ ఉచితముగానే ఈ వరములను సంఘములో అమర్చెను, మరియు మీరు ఉద్రేకపడకుండా ఉండినయెడల, మరియు మీకు తోచిన విధంగా మీరు తీసుకొనుటకు ప్రయత్నించనియెడల, అవి సంపూర్ణముగా పనిచేయును.

17అక్కడే ప్రజలు పొరపాట్లు చేయుచున్నారు. బాగా ప్రభావితులైనవారై మరియు పరిశుద్దాత్మ చేత కొద్దిగా నడిపించబడినవారైన ప్రజల మధ్యన నేను దానిని కనుగొన్నాను. అది, అద్భుతంగా, ఉత్తేజపరచినట్లుగానే ఉండును. అయితే అక్కడ ఎవరైనా మీ యొద్దకు వచ్చి, మరియు ఇట్లు చెప్పెదరు, "ప్రభువు ఫలానా మరియు ఫలానా చెప్పెనా?" చూడండి, మీరు వారికి జవాబు ఇవ్వనక్కర్లేదు. దేవుడు దానిని చెప్పునంతవరకు మీరు దానిని చెప్పకండి, అప్పుడు మీరు 'ప్రభువు ఈలాగు సెలవిచ్చుచున్నాడు' అను దానిని కలిగియుండెదరు. అప్పుడు అది జరగకుండా దానిని ఆపుచేయునది ఏదియూ లేదు. అది జరిగి తీరవలసినదే.

కొన్ని లక్షల సంధర్భాలలో 'ప్రభువు ఈలాగు సెలవిచ్చుచున్నాడని' కూటములలో పరిశుద్దాత్మ మాటలాడినప్పుడు, అది ఖచ్చితముగా, అట్లే జరుగుటను మీరు ఎన్నడూ విననియెడల, ఈ రాత్రి ఎవరైనా నాపై ఆరోపణ చేయవచ్చును. చూడండి, అది ఖచ్చితంగా సరియై యుండవలసినదే.

MATT 12:38-42

 

18ఈ రాత్రి ఒక దర్శనములో పరిశుద్ధాత్మ వచ్చి మరియు నాతో, "నీవు ప్రెసిడెంట్ సమాధి యొద్దకు వెళ్ళవలెనని నేను కోరుచున్నాను, రేపు నేను జార్జి వాషింగ్టన్ ను లేపెదను," అని చెప్పినయెడల, నేను దానిని చేయుటను చూడవలసినదిగా నేను ప్రపంచమును ఆహ్వానించెదను. అది జరగవలసినదే, చూడండి, ఏలయనగా దానిని చెప్పినది పరిశుద్దాత్మ అయి యున్నాడు. అదే దానిని సత్యముగా చేయును.

అయితే ఆయన దానిని చెప్పనంతవరకు, మీరు వేచియుండవలెను, మీరు చూడండి, చూశారా. మీరు రక్షించబడిరనియు మరియు మీరు ఆయన యొక్క మంచితనముతో నింపబడిరనియు మీరు ఎరుగుదురు. మరియు ఆయన మీలోనున్నయెడల, ఆయన యొక్క జీవము మీలో ఎట్లు పని చేయునో మీరు ఎరుగుదురు. కావున కేవలం తృప్తి కలిగియుండుడి. ఒకే ఒక కార్యమేదనగా, ఆయన నిశ్చయంగా దానిని చేయును, చూడండి. మీరు ఎచ్చటనున్నది ఆయనకి తెలియును.

మరియు నేను తలంచాను, దానిని ప్రేమతో చేయుటవలన మరియు, ఒకరితో ఒకరు సహవాసము చేయుటవలన, మనము ఈ మిశ్రమములను, మత శాఖలను మరియు అవరోధములన్నింటిని మరచిపోవుదుము, మరియు దేవుని యొక్క గొప్ప సైన్యము విజయము వైపుకు సాగిపోవును.

19ఈ రాత్రి నేను ఒక చిన్న లేఖన భాగమును చదవబోవుచున్నాను, మరియు మీలో చాలామంది, బహుశా నాతో పాటు చదవగోరవచ్చును. మీరు కోరినయెడల, ఎందుకు, మీరు నిశ్చయంగా చదవవచ్చును. మరియు నేను చదువుచుండగా, నాతోపాటు మీరు చదువగోరినయెడల, మనము మత్తయి సువార్త 12వ అధ్యాయమునకు త్రిప్పగోరుచున్నాము. మత్తయి సువార్త 12వ అధ్యాయము 38వ వచనములో.

మరియు ఇప్పుడు నేను ప్రకటించగోరునదియై నేను మాట్లడగోరు పార్యాంశము ఏమైయున్నదనగా? "ఈ కాలము యొక్క సూచన." ఇది బాగుగా తెలిసిన ఒక చిన్న పాఠ్యాంశము మరియు నేను కేవలం దీనిని ప్రసంగించెదను, ఎందుకనగా నేను ప్రార్ధించుచునుంటిని. మరియు నేను ఒక కఠినంగా ప్రసంగించుట నుండి మరలా ఆ వరుసయొద్దకు తిరిగి రావడాన్ని నేను ఇష్టపడుటలేదు. ఏలయనగా, పరిశుద్దాత్మ యొక్క వరములు, అవి ఒక ఫలానా మార్గము గుండా పనిచేయనని ఎవరికైనా తెలియును. "అదే ఆత్మ ద్వారా స్వస్థత వరములు ఉన్నవి; అదే ఆత్మ ద్వారా భాషలు మాటలాడు వరములు కలవు," కేవలం మరియొక మార్గము, మరియు స్వయంగా మీరు ఒక దానినుండి మరియొక దానిలోనికి లాగుదురు. కావున ఇప్పుడు మనము చదివెదము. మీరు గనుక…

అప్పుడు శాస్త్రులలోను పరిసయ్యులలోను కొందరు - బోధకుడా, నీవలన ఒక సూచక క్రియ చూడగోరుచున్నామని ఆయనతో చెప్పగా,

ఆయన ఇట్లనెను, వ్యభిచారులైన చెడ్డ తరమవారు సూచక క్రియను అడుగుచున్నారు. ప్రవక్తయైన యోనాను గూర్చిన సూచక క్రియయే గాని మరి ఏ సూచక క్రియయైనను వారికి అనుగ్రహింపబడదు.

యోనా మూడు రాత్రింబగళ్ళు తిమింగళము కడుపులో ఏలాగుండెనో అలాగు మనుష్యకుమారుడు మూడు రాత్రింబగళ్ళు భూగర్భములో ఉండును.

నీనెవె వారు యోనా ప్రకటన విని మారుమనస్సు పొందిరి గనుక విమర్శ సమయమున నీనెవెవారు ఈ తరమువారితో నిలువబడి వారి మీద నేరస్థాపన చేతురు. ఇదిగో యోనాకంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు.

విమర్శ సమయమున దక్షిణదేశపు రాణి ఈ తరము వారితో నిలువబడి వారి మీద నేరస్థాపన చేయును; ఆమె సొలోమోను జానము వినుటకు భూమ్యాంతముల నుండి వచ్చెను; ఇదిగో సొలోమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు.

20మనము ఇప్పుడు చదివిన లేఖనములో, సరిగ్గా యూదులు దేనిని నమ్ముదురో - ఆ ధోరణిలోనే మన ప్రభువు ఉండుటను మనము ఇక్కడ కనుగొనెదము. యూదులు సూచనలను నమ్ముదురు. మరియు ఆ పండితులు మరియు వారు ఆయన వలన ఒక సూచక క్రియను చూడగోరవలెనని ఆయనతో చర్చించుచుండిరి. వారు ఎంత గ్రుడ్డివారో ఇప్పుడు మీరు చూడండి? ఆయన ఏమైయున్నాడనియు ఆయనే మెస్పీయాయనియు ఆయన ఇదివరకే తన సూచనను చూపించెను.

గత సాయంకాలము మనము దాని గూర్చి విన్నాము. ఎంతమంది గత సాయంకాలము ఇక్కడ ఉన్నారు? మనము చూచెదము. అది మంచిది. అది సరియే.

DEUT 18:15,18,19•

MATT 12:32

 

21మనము గడిచిన సాయంకాలము దాని గూర్చి ఆలోచించాము, మరియు ఆయన చూపించవలసిన మెస్సీయా సూచనయు, ప్రవక్త లేచునని మోషే చెప్పినది ఆయన గూర్చియేననియు, జనులకు నిరూపించియున్నాము. "ప్రభువైన మీ దేవుడు నా వంటి ఒక ప్రవక్తను లేపును, మరియు ఈ ప్రవక్తను నమ్మనివారు ప్రజలలో నుండి కొట్టివేయబడుదురు." మరియు ఆయన వచ్చి ప్రవక్త యొక్క సూచనను చేసినప్పుడు, సరి, వారిలో అనేకులు ఆయన ఒక బయాల్జెబూబు — ఏదో ఒక దురాత్మయనియు చెప్పగోరిరి.

మరియు ఆయన వారితో చెప్పెను, ఇట్లనెను, "ఇప్పుడు, దీని విషయమై మీకు క్షమాపణ కలుగును. అయితే పరిశుద్దాత్మ వచ్చినప్పుడు, మరియు అదే కార్యమును చేసినపుడు మీరు దానికి వ్యతిరేకముగా మాటలాడినయెడల, ఈ యుగమందైననూ, రాబోవు యుగమందైననూ మీకు క్షమాపణ కలుగదు."

MATT 12:32

 

22ఇప్పుడు ఈ సంగతులను మనము ఏదో తేలికగా సమీపించగోరుట లేదు, మనము దీనియొద్దకు యదార్ధముగా వచ్చి మరియు చూడవలసియున్నది. యేసు ఆ ప్రకటన చేశాడు, అదేదనగా, ఆయన చేసిన అదే పనిని చేయుటకు పరిశుద్దాత్మ వచ్చినప్పుడు, దానికి వ్యతిరేకముగా ఒక మాటయైనా మాటలాడినచో, ఈ యుగమందైననూ రాబోవుయుగమందైననూ ఎన్నడూ క్షమాపణ కలుగదు.

ఇప్పుడు, గుర్తుంచుకొనండి, పెంతెకోస్తు వచ్చువరకు పరిశుద్దాత్మ అనుగ్రహించబడియుండలేదు, మరియు యూదులు ఇదివరకే యేసుక్రీస్తు చేత సాక్ష్యము పొందియున్నారు. సమరయులు కూడా యేసుక్రీస్తు చేత సాక్ష్యము కలిగియున్నారు. కావున ఒక నీతిమంతుడైన దేవుడు ఒక నీతిమంతులైన ప్రజలను శిక్షించడు, దేవుడు వారిని శిక్షించునట్లు అనీతిమంతులైన ప్రజలు ఉండవలసియున్నది. సరి, పిదప అంత్యదినములలో ఈ పరిశుద్దాత్మ వచ్చి మరియు ఆయన అప్పుడు చేసినట్లే అవే సూచనలను చూపించవలసియున్నది, ఏలయనగా దేవుడు తన మార్గమును సవరించుకొనడు.

MATT 3:6

 

23దేవుడు ఎన్నడూ ఒక విషయమును ఈ విధంగా, మరియు ఇంకొకటి, మరోక విధముగా చేయడు. చూచారా, ఆయన మొదటి నిర్ణయము పరిపూర్ణమైయుండును, ఏలయనగా ఆయన దేవుడైయున్నాడు. చూశారా, ఆయన యొక్క వాక్యము సవరించబడదు. ఆయన మనము కలిగియున్న మానవ చరిత్రలోని ఈ ఆరువేల సంవత్సరములలో ఆయన ఏదో అధికంగా నేర్చుకొనలేదు. ఆయన మొదట్లో ఉన్న దానికంటే అధికంగా ఎన్నడూ నేర్చుకొనియుండలేదు, ఎందుకనగా ఆయన యొక్క ఆరంభమే అనంతుడైయుండెను, చూశారా. మరియు ఆయన యొక్క వాక్యమును ఎన్నడూ మార్చడు.

ఆయన మానవుని రక్షించుటకు ఒక నిర్దోషమైనదాని యొక్క రక్తమును ఎన్నుకొనెను. మనము వారికి విద్య నేర్ప ప్రయత్నించాము, మనము వారిని సంస్థగా చేయుటకు ప్రయత్నించాము, మనము లోకములో ఉన్న ప్రతీదానిని ప్రయత్నించాము, మరియు సాంఘిక జీవనము, మరియు ప్రతీది విఫలమయ్యెను, మరియు తిరిగి రక్తము క్రిందకు వచ్చువరకు విఫలమవుతూనే యుండెదము. సహవాసము కలిగియుండు స్థలము కేవలము అది మాత్రమే.

MATT 3:6

 

24దేవుడు ఎన్నటికి మారడు. దేవుడేదైనా చెప్పినప్పుడు, అది ఎప్పటికి నిలిచియుండవలసియున్నది. దేవుడు గనుక… ఒక మనుష్యుడు దేవుని యొద్దకు వచ్చినయెడల, మరియు అతనిని అతని యొక్క విశ్వాసమూలంగా దేవుడు స్వస్థపరచినయెడల, తర్వాత వచ్చు మనుష్యునికి కూడా దేవుడు ఆ విధంగానే చేయవలసియున్నది, లేనియెడల ఆ మొదటి వ్యక్తిని స్వస్థపరచినప్పుడు ఆయన తప్పు చేసినవాడగును. ఆయన ఒక మనుష్యుని రక్తము క్రింద రక్షించినయెడల, మరియు అది మాత్రమే, మరియు రక్తము తనకు అన్వయించుకొనని వేరొకరిని కేవలం విద్య ద్వారా లేదా ఏదో వేదాంతి అగుట వలన లేక ఏదో ఒకటి అయినందున లోపలికి వచ్చుటకు అనుమతించినయెడల, ఆ మొదటి మనుష్యుని విషయంలో రక్తమును కోరినందుకు ఆయన తప్పు చేసినవాడగును. చూడండి, ఆయన ఎప్పుడూ ఒకే రీతిగా ఉండవలసియున్నది. ఆయన ఉద్దేశ్యము ఎప్పుడూ ఒక్కటే అయి యున్నది. ఆయన కార్యములు ఎప్పుడూ ఒకే రీతిగా ఉండియున్నవి.

25దేవుడు ఏ కాలమందైననూ ఏ సంస్థతోనూ వ్యవహరించియుండలేదు. చరిత్రలో దానిని కనుగొనండి. ఆయన ఎప్పుడూ ఒక గుంపుతో కాక, ఎప్పుడూ ఒక వ్యక్తితోనే ఆయన వ్యవహరించెను; ఒక్క వ్యక్తి. గొప్ప వ్యక్తులు లేచినప్పుడు, దేవుడు వారిని రంగము మీదకు పంపును, మరియు వారు వెళ్ళిపోయిన తర్వాత వారి వెనుక ఒక సంస్ధ తయారగుట మనము చరిత్రలో కనుగొనెదము. ప్రజలు సంస్థగా మారిన తర్వాత, ఆ సంస్థ మృతమగుట తప్ప, మరియు అది ఉన్న విధముగా ఎన్నడూ ఆత్మీయ మండలములోనికి తిరిగి రాలేదు. నేను కేవలం ఇరువది సంవత్సరముల బైబిల్ చరిత్రను అధ్యాయనం చేసితిని, కావున వారు మరల లేచిరి అనునదియే లేకుండెను.

ACTS 1:26•

ACTS 9:16

 

26నేటికిని దేవుడు వ్యవహరించును. ఆయన రేపు ఏమి చేయనైయుండెనో అది ఆయనకే చెందును, మరియు ఆయన మనతో ఎల్లప్పుడూ వ్యక్తిగతంగానే వ్యవహరించువాడైయుండెను, చూడండి, ఎందుకనగా గుంపులుగానున్న వ్యక్తులు, చాలా ఎక్కువ అభిప్రాయములు కలిగియుండెదరు.

చూడండి, అపోస్తలులు సైతం, యూదా పడిపోవుటవలన వారు ఇంకొకరిని ఎన్నుకొన ప్రయత్నము చేసిన పిదప, వారు చీట్లు వేయగా అది మత్తీయి పేరు వచ్చినది. రాజ్యము యొక్క తాళముచెవులు కలిగివారు చేయగలిగిన ఉత్తమమైనది అదే అయి యుండెను. మరియు అతను ఏదైనా చేసెనని తెలుపు ఒక్క లేఖనమైనా వ్రాయబడియుండలేదు. అయితే దేవుడు సహనము లేని ఒక పౌలును ఎన్నుకొనెను, అయితే ఒక దినమున ఆయనను వెనుక పడద్రోసి మరియు ఒకసారి అతనిని ఆలోచింపజేసెను. మరియు ఆయన ఇట్లు చెప్పెను, "నా కొరకు అతడు ఎటువంటి గొప్ప శ్రమలను భరించవలెనో నేను అతనికి చూపించెదను," చూశారా. చూడండి, సంఘము మత్తీయను ఎన్నుకొనెను, అయితే దేవుడు పౌలును ఎన్నుకొనెను. చూడండి, అదే వ్యత్యాసము. దేవుడు ఎప్పుడూ తన ఎన్నికను, తన ఏర్పాటును కలిగియుండెను. దేవుడు దానిని ముందస్తు జ్ఞానము వలన ఎన్నిక చేయును.

NUM 12:6•

DEUT 18:15•

AMOS 3:7

 

27దేవుడెల్లప్పుడూ సూచనలు మరియు అద్భుతముల ద్వారా ప్రజలతో వ్యవహరించునని ఇప్పుడు మనము కనుగొనెదము. ఆయన అంత్యదినముల యొక్క సూచనలను వాగ్దానము చేసెను. దేవుడు తన పద్దతిని మార్చుకొనజాలడు. ఆయన ఎల్లప్పుడూ ప్రజలతో తన ప్రవక్తల ద్వారానే మాటలాడును. యుగములన్నిటిలో, అనేక సమయములున్నవి; అయితే దేవుడు ఎల్లప్పుడూ ప్రతీఒక్కరితో మాటలాడుటకు ఎక్కడో ఒక చోట ప్రభువు యొక్క వాక్యము వచ్చునట్లు ఒక ప్రవక్తను కలిగియుండెను, మరియు ఆ ఒక్కడే, చూడండి, ఆ ప్రవక్త ద్వారా, చూశారా.

DEUT 18:20-22

 

28వారు వెళ్ళి మరియు ఈ ప్రవక్త ఎక్కడ ఉన్నడాయని కనుగొనెదరు. ఒక దీర్ఘదర్శి అనగా - ఒక దీర్ఘదర్శియనిన "భవిష్యత్తును చెప్పు లేదా ముందుగా చెప్పుట," అతను జరగనైయున్న సంగతులు ముందుగా చూచునట్టి ఒక దీర్ఘదర్శి అయి యుండెను. మరియు పరుశుద్ధ గ్రంధము ఇట్లు చెప్పుచున్నది, "అది గనుక నెరవేరనియెడల, అప్పుడు అతను చెప్పునది మీరు వినకుడి? అది ప్రతీసారి నెరవేరవలసియున్నది. దేవుడు తప్పిపోజాలడు, చూడండి. "మరియు అది నెరవేరనియెడల," అప్పుడు ఆయన చెప్పెను, "ఆయన ఆ వ్యక్తితో లేకుంకుండెను," కావున దీనిని ఆధారం చేసికొని, ఆయన కలిగియున్న పాతనిబంధన దీర్ఘదర్శులలో ప్రభువు యొక్క వాక్యము ఫలానా దీర్ఘదర్శితో ఉండియున్నదని ప్రజలు తెలుసుకొనెదరు.

JOHN 16:13•

HEB 13:8

 

29ఇప్పుడు పరిశుద్ధాత్మ ఆ విధానాన్ని మార్చలేదు. యేసు చెప్పెను, "పరిశుద్దాత్మ మీ మీదకి వచ్చినప్పుడు, నేను మీకు బోధించిన, నేను మీతో చెప్పిన, ఈ సంగతులను మీకు చూపించును, మరియు ఆయన జరగబోవు సంగతులను మీకు చూపించును." చూడండి, ఆయన ఎన్నడూ తన విధానమును మార్చలేదు; అది ఎప్పుడూ ఒకేరీతిగా యున్నది, తద్వారా ఆయనపై మనము నమ్మికయుంచగలము.

అయితే, మీరు చూడండి, మన మానవ బుద్ధి మనలను వివిధమైన కార్యములలోనికి చుట్టబడునట్లు చేయును, మరియు మనుష్యులు గుంపులు కలిసికట్టుగా సమకూడి మరియు దీనిపై మరియు దానిపై ఓటు వేయుదురు. అక్కడే మనలను క్రమము తప్పునట్లు చేయునది కలదు, చూడండి, మరియు "మంచిది, ఇది వేరొక దినము కొరకైయున్నది" అని అనెదరు. కాదు, ఆయన నిన్న, నేడు, మరియు నిరంతరము ఒకటేరీతిగా ఉన్నాడు. మరియు వాక్యమంతయూ, దానిలోనిదంతయూ ప్రేరేపింవబడినదైయుండెను.

DEUT 18:15•

MATT 12:38•

MATT 16:3•

LUKE 12:56

 

30ఇప్పుడు ప్రభువు లేపునట్టి ఒక అభిషేకించబడిన ప్రవక్తగా మెస్సీయ ఉండునని మోషే ముందుగా చెప్పిన ప్రకారం, యేసు ఖచ్చితముగా తనను వెంబడించు సూచన ద్వారానే వచ్చియుండెను, మరియు ఆయనే ఆ ప్రవక్తయైయున్నాడని ఆయన స్పష్టంగా చూపించెను. మరియు ఇప్పుడు ఈ పరిసయ్యులు ఆయన యొద్దకు వచ్చిరి, మరియు "బోధకుడా నీ యొద్ద నుండి మేము ఒక సూచనను చూడగోరుచున్నాము" అనిరి.

ఆయన అనెను, ఒకచోట ఆయన ఇట్లు చెప్పెను, మీరు దానిని చదువగోరినయెడల, పరిశుద్ధ మత్తయ సువార్త 16వ అధ్యాయం మరియు 3వ వచనం, 1 నుండి 3 వరకు, వారు మరలా ఒక సూచనకొరకై ఆయనను అడిగిరి. మరియు ఆయన చెప్పెను, "గ్రుడ్డివారైన పరిసయ్యులారా, వేషధారులారా, మీరు బయటకు వెళ్ళి మరియు సూర్యాస్తమయమును చూచెదరు," మరియు ఇట్లనెను, " రేపు తేటగా ఉండునని మీరు చెప్పుదురు. ఆకాశం మబ్బుగాను, మరియు ఎర్రగాను ఉండినయెడల, గాలివాన వచ్చునని మీరు చెప్పుదురు" ఇంకా ఇట్లనెను, "వేషధారులారా, మీరు ఆకాశ వైఖరిని వివేచింపనెరుగుదురు; కాని కాలముల సూచనలను, వివేచింపలేరు." వారు దానిని తెలుసుకొనవలసియుండెను.

MATT 24:22•

MARK 13:20

 

31ఇప్పుడు, ఈ అంత్యదినములలో వచ్చుచున్న పరిశుద్దాత్మ ఖచ్చితముగా సంఘములో క్రీస్తు యొక్క జీవమును పోలియుండవలసినయెడల, చూడండి, మరియు ఏ ప్రపంచము దాని విషయమై ఎగతాళి చేయునో లేదా దానికి వ్యతిరేకముగా ఒక్క మాటయైననూ మాట్లాడునో, అది దేవుని వాక్యము యొక్క అధికారము చేత నాశనమగును. కావున లోకము ఏమి చేసెనో మీరు చూడండి, కావున ఆకాశము నుండి దేవుడు వర్షమును కుమ్మరించెను అనునది ఇప్పుడు సరిగ్గా ఖచ్చితమైన క్రమములోనే యున్నది. మన దేశము, మన పట్టణములు, మన ప్రపంచము, తీర్పు కొరకై పరిపక్వము చెందియున్నవి.

మరియు ఇక ఎంతో సమయము లేదని నేను నిశ్చయముగా చెప్పుచున్నాను. ఏర్పరచబడినవారి నిమిత్తము ఆ దినములు తక్కువ చేయబడవలసియుండెను, లేనియెడల ఏ శరీరియు తప్పించుకొనడు, అని ఆయన చెప్పెను.

DEUT 22:5•

1COR 11:5

 

32రోజు రోజుకి, సంవత్సరం సంవత్సరానికి అది ఇంకనూ నీచముగా అగుటను గూర్చి మీరు ఆలోచించండి. హోలీనెస్ ప్రజలారా, పెంతుకోస్తు ప్రజలారా, సంఘములలోనికి, కుళ్ళు, గందరగోళము ఎట్లు ప్రవేశించెనో మీరు చూడండి.

మన స్త్రీల వైపు చూడండి. వారు జట్టు కత్తిరించుకొనుట ఒకప్పుడు వారికి హేయమైయుండెను, "అది తప్పు," అని పరిశుద్ధ గ్రంధము చెప్పుచున్నది. అయిననూ, వారు దానినే చేయుదురు. దానిని చేయకూడదని పరిశుద్ధ గ్రంధము వారికి చెప్పియుండెను. మరియు పురుషుల వస్త్రముల వలె కనిపించు ఈ వస్త్రములను ధరించుట; "అది దేవునికి హేయమైనది," అని పరిశుద్ధ గ్రంధము చెప్పుచున్నది.

"ఓ, అది చేయునది మెథడిస్ట్ లు," అది పెంతుకోస్తువారు అని మీరందరు చూడండి, అది వారు అందరూ అయియున్నారు.

అది ఎందువలన? మీరు పరిశుద్ద గ్రంధమును చదువుటలో శ్రద్ధ చూపించుటకంటెనూ, మీ టెలివిజన్ కార్యక్రమములనే మీరు అధికముగా ఇష్టపడుచున్నారు. చూడండి, మీరు దేవుని యొక్క వాక్యమునకు బదులుగా, ఆ ప్రజలనే మీరు మాదిరిగా తీసుకొనుచున్నారు, చూశారా. ఇప్పుడు, ఇక తీర్పే జరగవలసియున్నది, మరియు అది క్రమేనా నీచమగుచు మరియు దారుణమగుచున్నది.

LUKE 17:28-30•

HEB 4:12

 

33ఇప్పుడు, అక్కడ ఒక సూచన ఉండునని యేసు వారితో చెప్పెను. ఆయన అంత్యదినము యొక్క సూచనలను గూర్చి చెప్పియుండెను. మరియు గతరాత్రి, "అంత్యదినమున దేవుని యొక్క ఆత్మ మానవ శరీరములో బయలుపరుచుకొనుననియు, అది హృదయములలోని, మనస్సులలోని ఆలోచనను వివేచింపగలదైయుండెననియు, సొదొమ దినములలో ఉన్నట్లే మనుష్యకుమారుని యొక్క రాకడలో ఉండుననియు," ఆయన మనతో చెప్పియున్నాడు.

ఇప్పుడు, దేవుని యొక్క వాక్యము దానిని చేయునని పరిశుద్ధ గ్రంధము చెప్పుచున్నది, హెబ్రీ 4లో, "దేవుని వాక్యము సజీవమై బలముగలదై రెండంచులుగల యెటువంటి ఖడ్గముకంటెను వాడిగా ఉండి, ప్రాణాత్మలను, కిళ్ళను, మూలుగును విభజించునంతమట్టుకు దూరుచు, హృదయము యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది."

JOHN 1:1,14,47,48•

JOHN 4:18•

ACTS 15:14

 

34ఆ కారణము చేతనే, యేసు వాక్యమైయున్నాడు. "ఆదియందు," పరిశుద్ధ యోహాను సువార్త 1లో "ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను మరియు వాక్యము దేవుడైయుండెను. మరియు ఆ వాక్యము శరీరధారియై మనమధ్య నివసించెను." ఆ కారణముచేతనే ఆయన వారిని చూచి మరియు వారి ఆలోచనలను తెలుసుకొనగలిగెను.

ఆ కారణము చేతనే ఆయన బావినొద్ద ఉన్న స్త్రీతో, "నీకు అయిదుగురు పెనిమిటులు కలరు" అని చెప్పగలిగెను, చూడండి.

ఆ కారణము చేతనే ఆయన ఫిలిప్పుతో చెప్పగలిగెను, అతడు నతానియేలును తీసుకువచ్చినప్పుడు; "ఇదిగో ఇతడు ఇశ్రాయేలియుడు, ఇతనియందు ఏ కపటమును లేదు," అని ఆయన నతానియేలును చెప్పెను.

అతడిట్లనెను "బోధకుడా నన్ను నీవు ఏలాగు ఎరుగుదువు?"

"ఫిలిప్పు నిన్ను పిలువక మునుపే, ఆ అంజూరపు చెట్టు క్రింద ఉన్నప్పుడే, నేను నిన్ను చూచితిని," అని అనెను.

తలంపులను వివేచించువాడు, ఓ, లేఖనములో అనేక చోట్ల తననుతాను గుర్తింపజేసుకొనుచుండెను! అది అన్యజనులకు కాదండి. ఆయన ఒక్కసారైనా అన్యజనులకు తననుతాను ఆ ప్రకారముగా బయలుపరచుకొనలేదు. ఒకసారైనా చేయలేదు. అది ఈ దినము, చూశారా. అన్యజనులు ధ్యానించుటకు మరియు వేదాంతమునకు రెండువేల సంవత్సరములు కలిగియుండిరి; ఆయన అన్యజనులలో నుండి తన నామము కొరకు జనమును తీసికొనెను; అయితే దహించబడుటకు ముందు సొదొమలో ఉన్న ప్రకారముగా ఇదియు జరుగుటకు ఇప్పుడు సమయము వచ్చియున్నది.

MATT 12:38•

MATT 27:40•

MARK 14:65•

LUKE 22:64•

JOHN 5:19•

JOHN 12:50

 

35తన యొక్క గుర్తింపబడిన, నిరూపించబడిన సూచనతో, ప్రజలకు ఒక లేఖనానుసారమైన సూచనతో యేసు ఇచ్చట ఉండెను, మరి అయిననూ ఆ యూదులు ఇట్లనిరి, "నీ నుండి మేము ఒక సూచనను చూడగోరుచున్నాము."

అవిశ్వాసులైన ప్రజలు ఆ విధంగా మీతో చెప్పుటను మీరెన్నడైనా చూశారా, "ఒకవేళ వీధిలో ఫలానా-ఫలాన గురించి నాకు తెలుసు, అతను వారిని స్వస్థపరచినయెడల!" చూడండి, అది అది… అది అపవాదేనని మీరు చూడగలరు, అదే విషయము.

వారు ఇట్లు అనిరి అని మీకు తెలియును, "నీవు దేవుని కుమారుడవైనచో, సిలువ మీద నుండి దిగి రమ్ము." వారు ఆయన తలపై ఒక వస్త్రమును వేసి, ఇట్లనిరి, "వీడు ఒక 'ప్రవక్తనని' చెప్పుకొనుచున్నాడు." వారు ఆయన ముఖముపై వస్త్రమును కప్పి ఒక కర్రతో ఆయన తలపై కొట్టిరి, వారు కర్రను ఇంకొకరికి ఇచ్చి, "ఇప్పుడు నిన్ను కొట్టినవాడెవడో ప్రవచింపుము, మేము నిన్ను నమ్ముదుము" అని అనిరి.

అయితే, మీరు చూడండి, దేవుడు ఎవరికోసమో ఒక హాస్యగాడిగా మారడు. యేసు చెప్పెను, "తండ్రి ఏమి చూపించునో, నేను దానినే చేయుదును," చూశారా. మరియు అది వాస్తవము.

MATT 16:1

 

36మరియు దేవుని యొక్క ఒక నిజమైన సేవకుడు అట్లుండును, ఎల్లప్పుడూ తన యజమానునికి విధేయుడైయుండును, చూశారా. దేనినో ప్రదర్శించుటకు లేదా ఎవరినో ఉప్పొంగిచుటకు ఏదైనా చెప్పుట కాదు, కాని నిజాయితీగా మరియు తనను పంపినవానికి నమ్మకముగా నుండుట. క్రీస్తు యొక్క నిజమైన సేవకుడు ఆలాగుండును.

అందమైన రిబ్కాను ఇస్సాకునకు వధువుగా తెచ్చుటకు, అబ్రాహాము నొద్ద నుండి ప్రతినిధిగా వచ్చుచున్న ఎలీయాజరు వలెనైయున్నది; చూడండి, విధేయుడిగా, ఒక మాదిరికరమైన సేవకుడిగా నుండెను, చూడండి, అతడు కేవలం తన యొక్క యజమానుని పని మీదనే ఉండెను. ఈనాడు పరిశుద్దాత్మకు అది ఎటువంటి ఒక సాదృశ్యమైయున్నది, అదే కార్యమైయున్నది, చూడండి, సాయంకాలవేళలో వెలుతురు ఆరిపోవునప్పుడు ఒక వధువున తెచ్చుట అయి యున్నది.

PS 91:11,12•

MATT 12:38,39•

LUKE 4:3,9-11

 

37ఇప్పుడు వారు ఒక సూచనను చూడగోరుచున్నారు. ఆయన లేఖనానుసారమైన సూచనతో పూర్తిగా గుర్తించబడినప్పటికి, అయిననూ వారు బైబిల్ యొక్క సూచనను నమ్మగోరలేదు. వారు ఆయనను ఒక హాస్యగానిగా చేయగోరిరి. మీరు చూచుటలేదా? అది, "నీవు దేవుని కుమారుడవైతే ఈ రాళ్ళ రొట్టెలగునట్లు ఆజ్ఞాపించు. నీవు దేవుని కుమారుడవైతే క్రిందకి దుముకుము, ఎందుకనగా ఆయన నిన్ను గూర్చి తన దూతలకాజ్ఞాపించును; నీ పాదమెప్పుడైననూ రాతికి తగులకుండ వారు నిన్ను చేతులలో ఎత్తుకొందురు" అని చెప్పిన అదే రకమైన ఆత్మ. అయితే ఆయన తన పాదమును రాతికి తగలనియ్యుడు, చూశారా. నిశ్చయంగా ఆయన దీనిని సిలువపై ఉంచినప్పుడు, ఇంకా అక్కడ మొదలుగునవి చెప్పెను; ఇప్పుడు ఇక్కడున్న ఈ పరిసయ్యులలో అదే ఆత్మ ఉండియున్నది, "మేము ఒక సూచనను చూడగోరుచున్నాము," అనుచుండిరి.

ఒక వ్యభిచారులైన చెడ్డతరమువారు ఒక సూచక క్రియను అడుగుచున్నారు," అని ఆయన అనెను. గమనించండి.

MAL 3:6•

MATT 4:3,6

 

38మరియు ఆయన, దేవుడు అన్ని కాలములలో తన ప్రజల కొరకై సూచనలను కలిగియుండెను. మరియు ఏదైనా చేయుటకు ముందు, దేవుడు ఒక సూచనను పంపును, ఎల్లప్పుడూ ఆయన మొదటిగా ఒక సూచనను పంపును మరియు ఆయన అదే కార్యమును చేయునని ఆయన వాగ్దానము చేసియున్నాడు, ఎందుకనగా ఆయన మారనివాడు, కావున అంత్యకాలము మరియు అంత్యకాలము యొక్క సూచనలు ప్రత్యక్షమగుటను మనము చూచునప్పుడు, సొదొమ దహించబడుటకు ముందు వాగ్దానము చేయబడిన చివరి సూచనను కూడా చూచుచున్నాము.

మనము ఆనందమును కలిగియున్నాము. మరియు ఆకాశ నక్షత్రములు కదిలింపబడుటను కలిగియున్నాము, మనము యుద్ధములను మరియు యుద్ధములను గూర్చిన సమాచారములను కలిగియున్నాము. వివిధ స్థలములలో భూకంపములు కలిగియున్నాము మరియు సంఘమునకు ఆత్మ యొక్క వరములు తిరిగి వచ్చుటతో పాటు అవన్నియూ మనము కలిగియున్నాము. మనము ఈ అన్ని విధములైన ప్రత్యక్ష్యతలను, గొప్ప స్వస్థతా కూటములను మరియు కార్యములను చూపించుటను కలిగియున్నాము. అవన్నియునూ సూచనలైయున్నవి.

అయితే చివరి సూచన, అన్యులు దహించబడుటకు ముందు సూచనై యున్నది, దేవుడు మానవ గుడారములో బయలుపరచబడుట. అది వాస్తవము మరియు అది ఆయన తిరిగి వచ్చునప్పుడు జరుగునని యేసు చెప్పెను. మనము ఇప్పుడు జాగ్రత్తగా ఉండి మరియు ఎంతో యదార్ధముగా దేవునితో సరిచేసుకొనవలసినవారమైయున్నాము, ఇప్పుడు మీరు సరియైన వారిగా ఉన్నారను నిశ్చయతను కలిగియుండుడి.

MARK 16:17

 

39అవి వారికి, యూదులెల్లప్పుడు వేదాంతము మరియు ఉపన్యాసములకు బదులు వారు ఎల్లప్పుడూ వారియొక్క సూచనలపై ఆధారపడవలసియుందురు, దానిగూర్చి మీకు తెలియును. వారు సూచనపై ఆధారపడవలసియుండెను, ఏలయనగా నిజమైన అసలైన విశ్వాసి ఎల్లప్పుడూ దేవుడు ఒక శక్తిమంతుడైన దేవుడని నమ్మును.

మరియు దేవుడెక్కడ ఉండునో, అక్కడ సూచనలు జరగవలసియుండెను. అది ప్రతిబింబించును. మరియు ఇది కూడా అంతే, దేవుడు ఎచ్చటుండునో అక్కడ సూచనలు మరియు అద్భుతములు ఉండును. యేసు ఇట్లు చెప్పెను, "నమ్మినవారిని ఈ సూచక క్రియలు వెంబడించును," ప్రపంచవ్యాప్తముగా పరిచర్యను చూడండి. "ఈ సూచక క్రియలు వారిని వెంబడించును," ఎల్లప్పుడూ సూచనలేయైయున్నవి. ఆయన ఆదిలో చేసినట్లు, దేవుడెల్లప్పుడూ సూచనలను ఇచ్చును, మరియు చివరకు ప్రతి తరమునకు వాటిని ఇచ్చెను.

GEN 6:17•

GEN 7:4

 

40ఆయన నోవహు కాలములో దానిని చేసియున్నాడు. నోవహు ఆ తరమునకు ఒక సూచన అయి యున్నాడు. అతడు లోకము దృష్టికి, శాస్త్రవేత్తలకు ఒక వెర్రివానివలెనున్నాడు, ఎందువలన, అతని యొక్క వర్తమానము వారియొక్క శాస్త్రీయ అవగాహనతో ఏకీభవించునది కాదు. అతడు చెప్పెను, "ఆకాశము నుండి వర్షము వచ్చును మరియు భూమి మీదకి జలప్రళయము వచ్చును."

వారు చంద్రుని మీదకి వారియొక్క రాడార్ సహాయముతో లేదా దేనితోనైనా ఎక్కుపెట్టి చూడగల సమర్ధులైయుండవచ్చును. వారు చెప్పిరి, "అక్కడ నీరే లేదు. అక్కడ నీరు లేదని నేను శాస్త్రీయముగా రుజువు చేయగలను," అని బహుశా శాస్త్రవేత్తలు అట్లు చెప్పియుండవచ్చును.

అయితే నోవహు ఇట్లనెను, "దేవుడు సమర్ధుడు. అక్కడ నీరు లేనియెడల ఆయన సృష్టికర్తయైయున్నాడు గనుక, ఆయన అక్కడ నీరును ఉంచగలడు. మరియు దానిని ఎట్లు చేయవలెనో ఆయనకు తెలియును." అయితే అతడు ఒక సూచన అయి యున్నాడు. అది తేలుటకు అచ్చట నీరు లేకున్ననూ, అతడు ఏమైనప్పటికి అతడు దానిని నిర్మించెను. ఆ ప్రజలకు అతడు ఒక సూచన అయి యున్నాడు.

సరి, వారు ఈ గొప్ప అద్భుతములు, మరియు మొదలగునవి చూసినప్పుడు, ఐగుప్తులో మోషే ఒక సూచన అయి యున్నాడు. సొలోమోను క్రిందివరకు.

MATT 10:25•

MATT 11:18•

MATT 12:24•

LUKE 7:33•

JOHN 7:20•

JOHN 8:48

 

41పిదప ఇచ్చట వారు యేసుని అడిగిరని మనము కనుగొన్నాము. ఆయన వారికిచ్చిన ఆ సూచన, వారియొక్క లేఖనప్రకారమైన నిజమగు ప్రవక్త సూచన అయి యున్నది.

ఇప్పుడు లేఖన ప్రకారము కానటువంటి ఎన్నో సూచనలు కలవు. మనము లేఖనానుసారమైన సూచనలు కలిగియుండవలసియున్నది. అది పరిశుద్ధ గ్రంధము నుండి, 'యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు,' అని రావలసియున్నది, చూడండి, అప్పుడే అది నిజమైనదని మనకు తెలియును. మంచిది, దానిలో పాటు ఇంకా చాలా సంగతులు కలవు. మరియు దేవుడు తాను కోరినది ఏదైనా చేయగలడు. ఆయన దేవుడైయున్నాడు. అయితే ఆయన తన మాటను నిలబెట్టుకొనునని నాకు తెలియును, కావున నేను దానిని ఆయన యొక్క వాక్యములో చూడగోరుదును, అది వాక్యమైయున్నది గనుక అప్పుడది సత్యమని నేను ఎరుగుదును.

ఇప్పుడు ఈ సమయములో, యేసు తనయొక్క లేఖనానుసారమైన సూచనను చూపించుచున్నాడని మనము కనుగొన్నాము, మరి అయిననూ వారు ఆ యొక్క లేఖనానుసారమైన సూచనను… ఎందుకనగా అది ఒక లేఖనానుసారమైన సూచనయని వారు నమ్మగోరలేదు, వారు ప్రజలకు జవాబు ఇవ్వవలసిన వారైయున్నారు, కావున వారు ఇట్లనిరి, "అది ఆయన యొక్క మనస్సు, ఆయన దయ్యము పట్టినవాడు." మరియు ఆయన ఇట్లు పిలువబడినాడు, ఆయనను వారు ఇట్లు పిలిచిరి, "బయల్జెబూబు." మరియు అందునుబట్టి ఆయన వారిని గద్దించుచుండెను. ఆయన మరలా వచ్చినప్పుడు ఎట్లుండును?

MATT 12:40

 

42గమనించండి, ఆయన యోనా గూర్చి ప్రస్తావించెను. "యోనా దినములో ఉండినట్లు, యోనాను ఉద్దేశించి, "ఆ ప్రకారమే మనుష్యకుమారుని రాకడలో జరుగును."

ఇప్పుడు చాలామంది ప్రజలు యోనాను ఖండించెదరు. నేను యోనాను ఖండించను. వారు ఇట్లు చెప్పుట మీకు తెలియును, "మంచిది, ఆయన ఒక యోనా." అలా వ్యక్తపరచుటను మీరు వినియందురు. అయితే క్రైస్తవులైన మీరు అట్లు చేయకూడదు. మీరు దేవుని సేవకులను ఖండించకూడదు. యోనా ఒక ప్రవక్త అయి యున్నాడు. అతడు దేవుడి చిత్తము నుండి తొలగిపోలేదు. అతడు ఖచ్చితముగా సరిగానే చేసెను. అతడు ఒక సూచన కొరకై దానిని చేయవలసియుండెను, సంభవించు ప్రతీది ఏదో ఊరికే సంభవించదు, కాని అది ఒక సూచనకై సంభవించును.

GEN 21:12•

LUKE 11:30

 

43ఒకసారి, ఒక ప్రవక్త ఒక వేశ్యను వివాహము చేసికొనవలసివచ్చెను, ఆమెతో పిల్లలను కనెను. ఒకరు మూడు వందల నలుబది దినములు ఒక ప్రక్కకే పడుకొనియుండెను. తరువాత ఇంకొక ప్రక్కకు తిరిగెను. ఒకరు తన వస్త్రములను ఊడదీసుకొనెను. మరియు ప్రతీది సూచనలుగా ఉండుటకై చేసియుండిరి, చూడండి. మరియు యోనా ఒక సూచనగా ఉండుటకై దీనిని చేసియుండెను.

గుర్తుంచుకొనండి, శారా తన దాసిని ఇచ్చినప్పుడు, అబ్రాహాము తన స్వంత చిత్తమునకు వ్యతిరేకముగా హాగరును పెండ్లాడవలసివచ్చెను, కాని ఆయన దానిని తిరస్కరించెను. అయితే దేవుడు అతనికి ప్రత్యక్షమై, చెప్పెను, "శారా మాట వినుము, ఎందుకనగా యజమానురాలు దాసితో వారసత్వము పొందనేరదు." ఆమె ఆ పిల్లవాడిని వెళ్ళగొట్టవలసియుండెను. అది ఏమైయున్నది? ఒక సూచన. అవన్నియూ సూచనలే. దేవుడు సూచనల కొరకై కార్యములను చేయును.

GEN 16:1,2•

EZEK 4:4-6

 

44మరియు యోనా ఒక సూచన అయి యుండెను. ఇప్పుడు మీరు గమనించినయెడల, ఇక్కడ యేసు దానిని ప్రస్తావించెను, " వ్యభిచారులైన చెడ్డతరమువారు ఒక సూచన అడుగుచున్నారు, మరియు వారు దానిని పొందెదరు. యోనా మూడు రాత్రింబగళ్ళు తిమింగళము కడుపులో ఏలాగుండెనో అలాగు మనుష్యకుమారుడు మూడు రాత్రింబగళ్ళు భూగర్భములో ఉండును." అట్లైనచో యోనా దేనికి సూచనగా ఉండెను? అతడు పునరుత్దానమునకు ఒక సూచనగా ఉండెను. అది సరియే.

MATT 12:39,40

 

45ఇప్పుడు, వంకరచేయబడిన తరమేదైనా ఉందన్నచో, అది మనము జీవించుచున్న తరమే. దానిని మనము ఎరిగియున్నాము. మానసికంగా, భౌతికంగా, లైంగికముగా, ప్రతీది అన్ని విధాలుగా అది వంకరచేయబడినది. మనము ఎన్నడూ కలిగిలేనటువంటి, అవిశ్వాసులైన ఒక దుష్టతరము ఇదేనని నేను ఊహించుచున్నాను. వారు మతాచారా పద్ధతిగల అవిశ్వాసులైయున్నారు, మరియు దానితో వ్యవహరించుట చాలా కఠినమైన విషయము.

నేను ఒక మిషనరీనైయున్నాను. ఎక్కడైతే వారు నాస్తికులను తీసుకువచ్చిరో అటువంటి రంగములపై నేను నిలబడియుంటిని, వారికి కనీసం కుడిచేయి ఏదో మరియు ఎడమ చేయి ఏదో కూడా తెలియకుండుట చూచితిని. వారికి తెలియదు. మంచిది, అతను తన యొక్క పరిస్థితిని బట్టి వచ్చును. అతడు ఎన్నడూ దేవుని గూర్చి వినియుండలేదు. ఇప్పుడతడు దేనినో చూడగోరుచున్నాడు. మరియు మీరు సత్యమైనదానిని అతనికి రుజువు చేసిన వెంటనే, అతడు దానిని అంగీకరించును.

46అయితే విద్యావంతులైన నాస్తికులు; చూడండి, అది సత్యము. చూడండి, విద్యావంతుడైన నాస్తికుడు, దాని విషయమై అతడు తన స్వంత అభిప్రాయమును తీసుకొనగోరును, చూడండి, అతడికి దానిగూర్చి ఎంతో తెలియును. అతడు దేవుని యొక్క వాక్యమును చూచుటకై న్యాయమైన విశ్వాసమునకు తననుతాను తగ్గించుకొనడు.

ఆ దినమున ఆ పరిసయ్యులు ఆ రీతిగానేయుండిరి, వారు కేవలం వాక్యము వైపుకు చూడలేకపోయిరి. అక్కడే అది ఉండెను, కాని వారు దానిని చూడగోరలేదు. మరియు వారు వాస్తవముగా గ్రుడ్డివారని తెలుసుకొనుట అనునది ఒక దయనీయమైన సంగతి. దేవుడు దానిని ఒక సూచన కొరకై జరిగించెను.

47అట్లైనచో ఇప్పుడు ఈ దినమున చూడండి, మనము జీవించుచున్న ఈ దుష్టతరము చూచు సూచన ఎట్టిదనగా, అది పునరుత్దానము యొక్క సూచన అయి యున్నది. ఆయన ఉండబోవుచున్నది అని చెప్పలేదు… "ఒక వ్యభిచారులైన చెడ్డతరమువారు సూచనను వెదుకుచున్నారు, మరియు వారు యోనాను గూర్చిన సూచనను పొందెదరు; పునరుత్దానము." మరియు మనము జీవిస్తున్న వ్యభిచారులైన, చెడిపోయిన వంకరచేయబడిన ఈ తరము, ప్రపంచ వ్యాప్తముగా! న్యూయార్క్ నగరమే దానినంతటిని కలిగియున్నదని మీరు తలంచకుడి. వారిని మీరు కలిగియుండరు; వారు ప్రపంచమంతటా ఉండెదరు. అమెరికా మాత్రమే అటువంటి వారిని కలిగియున్నదని తలంచకుడి; చూడండి, పునరుత్థానము యొక్క సూచనను పొందుకొనువారు వారే అయి యున్నారు.

48ఈ దినములన్నిటిలో, బౌద్దులు, సిక్కులు, జైనులు, ఓ, ప్రతివిధమైన మతము, ప్రపంచమంతటా ఉన్న వేలకొలది రూపములు, వాటిలోని ప్రతీ ఒక్కటి, వాటియొక్క స్థాపకుల సమాధుల యొద్దకు మిమ్మును తీసుకొనిపోవును, అయితే క్రైస్తవ్యమునకు మాత్రమే ఒక ఖాళీ సమాధి ఉన్నది, చూశారా.

అంతమాత్రమే కాదండి, "ఆ ప్రజలు ఆయిన మా హృదయములో జీవించును," అని అనగలరని మీరు చెప్పలేరు. వారు తిరిగి మిమ్ములను ఆయన యొక్క వాక్యము నొద్దకు తీసుకువచ్చెదరు. నిశ్చయముగా వారు అట్లు చేయుదురు. వారు తిరిగి మిమ్ములను ఆయన వాక్యము నొద్దకు తీసుకువచ్చెదరు. అవునండీ. మీరు ఒక అన్యమతస్థుడికి మనస్తత్వ శాస్త్రమును ఉత్పత్తి చేయలేరు, చూడండి, ఎందుకనగా అతని హృదయములో కూడా అతని దేవుడు నివసించును.

మహమ్మదీయులు వీధిలో పడియుండి మరియు చెక్క ముక్కలను తీసుకొని వారి చేతివ్రేళ్ళగుండా దానిని గుచ్చుకొని, దాని స్పర్శ తెలియకుండనంతగా ఆవేశపూరితులై, "ఆలీ, ఆలీ," అని అనుటను నేను చూచితిని.

49నేను స్విట్జర్ల్యాండ్ లోని జురిచ్ లో ఒక వ్యక్తిని చూశాను, అతడు ఒక ఖడ్గమును తీసికొని తన ఊపిరితిత్తులపై ఈ విధంగా పెట్టుకొని, మరియు దానిలోనికి గుచ్చుకొనెను. మరియు వేదిక మీదకు ఒక వైద్యుడు వచ్చి మరియు ఒక వైపు నుండి నీరు పోయగా, అది మరొక వైపుకు జారును, దానిని బయటికు లాగగా మరియు అక్కడ రక్తమే లేకుండెను, చూశారా. ఒక బల్లెమును తీసుకొని మరియు వారి గడ్డముగుండా అది వారి ముక్కు నుండి బయటకు వచ్చువరకు దానిని గుచ్చుకొందురు.

ఇప్పుడు, అటువంటి ఒక మనిషితో దేవుడి గురించి మాట్లాడటానికి మీరు వెళ్ళునప్పుడు, మీరు ఏమి మాట్లాడనైయున్నారో దాని గూర్చి మీరు తెలుసుకోవలసినవారైయుండుట మంచిది. మీరు బాగుగా తెలుసుకొనవలెను, కేవలం మనస్తత్వ శాస్త్రము పనిచేయదు. దానిని అతడు మీకు వెంటనే తెలియజేయును. మీరు ఏమి మాటలాడుచున్నారో అది మీరు ఎరిగియుండవలసియున్నది.

50అయితే గుర్తుంచుకొనండి, కర్మెలు పర్వతము మీద ఏలియాతో నున్న అదే దేవుడు, ఈ దినము కూడా ఇంకనూ అదే దేవుడైయున్నాడు. మరియు, అక్షరాల వందల వేల కొలది ప్రజల ఎదుట ఆయన దానిని చేయుటను నేను చూసియున్నాను; చూడండి, మంత్రగాళ్ళ గీతలు గీసి, అక్కడ నిలబడి మరియు మిమ్మును సవాలు చేయుటను చూడండి మరియు పరిశుద్దాత్మ ఏమి చేయునో గమనించండి. మీరు పుస్తకములు చదివియన్నారు మరియు మీకు తెలియును; మరియు దేవుడు చేసిన దానిని తెలుపుటకు సంతకములతో కూడిన ప్రకటనలు కలవు. ఆయన ఇంకనూ దేవుడైయున్నాడు. ఆయన తన వాక్యమునకు బద్దుడైయున్నాడు. ఇప్పుడు, మీ కోరికలకు ఆయన బద్దుడైలేడు. ఆయన తన స్వంత వాక్యమునకు బదుడైయున్నాడు, చూశారా. ఇప్పుడు ఈ నాస్తికులు, వారు చేయు విధానమును మనము కనుగొన్నాము.

JOHN 14:12,19•

HEB 13:8

 

51ఆయన మరణించలేదు అను ఆయన యొక్క పునరుత్దానపు సూచనను ఇప్పుడు ఈ అంత్యదినములలో వ్యభిచారులైన చెడ్డతరము వారికి ఆయన చూపించునని ఆయన వాగ్దానము చేసియున్నాడు. ఆయన సజీవుడు, ఆయన ప్రతీ మాటను నిలబెట్టుకొనును, ఆయన నేరుగా మీలోనుండి దానిని జీవింపచేయును. "కొంతకాలమైన తరువాత లోకము నన్ను చూడదు." యేసు చెప్పెను, "అయినను మీరు నన్ను చూచెదరు," చూడండి, విశ్వాసితో మాటలాడుచున్నాడు, "ఎందుకనగా నేను," నేను అనునది వ్యక్తిగత సర్వనాము, "నేను మీతోను, మీలోను - యుగసమాప్తి వరకు సదాకాలము తోడైయున్నాను." మరియు నేను చేయు క్రియలు, యోహాను సువార్త 14:12, "నా యందు విశ్వాసముంచువాడు, నేను చేయు క్రియలను చేయును." అవే క్రియలు! "యేసుక్రీస్తు నిన్న, నేడు, మరియు నిరంతరం ఒక్కటే రీతిగా ఉన్నాడు," హెబ్రీ 13:8.

ISA 59:19

 

52ఇప్పుడు పరిశుద్ధ గ్రంధములో, మొదటిదైయున్న ఎఫెసీ సంఘ కాలము తర్వాత సంఘ కాలముల యొక్క లెక్క ప్రకారము సంఘము వచ్చియున్నది. మరియు ప్రభువు చిత్తమైనయెడల, నేను ఇక్కడ నుండి వెళ్ళేలోపు, నేను "అవరోహణ లెక్కించుట," అను చిన్న అంశమును బోధించగోరుచున్నాను, మరియు మనము ఎట్లు వచ్చామనియు, మనము ఎట్లు ముందుకు పోవుచున్నామనియు చూచెదము.ఇప్పుడు ఎఫెసీ సంఘ కాలమును మరియు ఆ సంఘ కాలములను, అది వెయ్యి సంవత్సరముల చీకటి గల, చీకటి కాలములోనికి వెళ్ళునంతవరకు గమనించండి. మరియు పిదప లూథర్, మొదటి సంఘ సంస్కర్తయైయున్నాడు, అతడు నీతికరణతో బయటిక వచ్చియున్నాడు; ఇక్కడ వెస్లీ శుద్దీకరణతో వచ్చియున్నాడు; పెంతెకోస్తువారు పరిశుద్ధాత్మ బాప్తిస్మముతో వచ్చియున్నారు. సంఘము రాను రాను తక్కువ సంఖ్యయగుచు, గొప్ప శక్తిగలదైపోవుచుండెను. "శత్రువు వరదవలె వచ్చినప్పుడు, దేవుని యొక్క ఆత్మ దానికి విరోధముగా ఒక ధ్వజమునెత్తును."

53మరియు ఇప్పుడు మనము పెంతెకోస్తకాలము దాటియున్నాము. ఇప్పుడు పిరమిడ్లో ఉన్నట్టుగా వచ్చుచున్నాము, ఇప్పుడు పిరమిడ్ సిద్ధాంతముల గూర్చి కాదండి, అయితే పిరమిడ్ వలె అని నా భావమై. సంఘములో, అనగా నిజమగు దేవుని సంఘములో ఒక పరిచర్య ఉండవలసియున్నది, తలరాయి అమర్చబడుటకు వచ్చినప్పుడు, అది క్రీస్తు లేదా క్రీస్తు యొక్క పరిచర్య మరియు క్రీస్తు సరిగ్గా, సంపూర్ణముగా ఒకటియగునంతగా ఇమిడిపోవలసియున్నది. పిదప అది దేవుని ఇంటినంతటినీ మహిమలోనికి తీసుకు వెళ్ళుటకు విమోచించబడినవారిని తిరిగి వెనుకకు తీసుకొనివచ్చును; మెథడిస్టు, బాప్టిస్టు మరియు ప్రెస్బిటెరియను, గొప్ప సంఘ సంస్కరణ కాలములు గుండా, బయటకు వచ్చి మరియు శ్రమలలో దేవుని రాజ్యము నిమిత్తము తమ ప్రాణములను అర్పించినవారైయున్నారు. అయితే ఆ రాయి వచ్చుచున్నది. అవునండీ. అది నిశ్చయముగా వచ్చును. దేవుడు దానిని పంపించును. అది కట్టడమంతటినీ దానిపై ఒకటిగా అమర్చును, చూశారా. పరిశుద్దాత్మ యొక్క సంపూర్ణతలో, క్రీస్తు వద్ద ప్రారంభమై ఇప్పటి క్రీస్తు యొక్క పూర్తి పరిచర్య వరకు, సన్నబడుచున్న పరిచర్యను మనము చూచుచుండగా, ఇప్పుడు ఈ సూచనలను మనము చూచుచున్నాము. మనము కనుగొన్నాము. దానిని మనము కనుగొన్నాము.

అదే పరిశుద్ధాత్మ లూథర్ ఆధ్వర్యంలో నీతికరణ; పిదప వెస్లీ అధ్వర్యంలో శుద్దీకరణ; వర్తమానములు; పిదప పరిశుద్ధాత్మ బాప్తిస్మము, మూడు అగుచున్నవి. మూడు, కృప యొక్క మూడు మెట్లు కాదండి, అయితే మూడు దశలు అని నేను దానిని పిలుచుదును.

54ఈ రీతిగా ఉండుటను గమనించండి. ఒక బిడ్డ జన్మించినప్పుడు, ఆ జన్మను కొనసాగించునవి మూడు కలవు; సహజ జన్మలో మొదటి కార్యమేదనగా… పెద్దలైన మీరు ఇప్పుడు జాగ్రత్తగా వినండి; యవ్వనస్తులైన పిల్లలు దానిని అస్సలు అర్థం చేసుకోజాలరు. అయితే, మనము చూద్దాం, ప్రకృతి సంబంధమైన జన్మలో మొదటిగా నీరు, పిదప రక్తము, ఆ తర్వాత జీవము, చూశారా.

ఇప్పుడు నూతన జన్మ కలుగుటకును అదే కార్యము; నీరు, రక్తము, ఆత్మ. ఆయన శరీరము నుండి వచ్చిన మూలకములే ఆయన శరీరమును తయారుచేయును, చూశారా. ఆయన వధువును తయారు చేయుటకు తీసుకొనబడినది, ఆయన శరీరము నుండి వచ్చిన పదార్ధమే. ఏలయనగా, ఆదాము తన శరీరము నుండి తీయబడిన వధువునే కలిగియుండెను. క్రీస్తు కూడా తనయొక్క శరీరము నుండి తీయబడిన వధువునే కలిగియుండును. మరియు క్రీస్తు మరణించినప్పుడు, ఆయన శరీరము నుండి అక్కడ మూడు మూలకములు వచ్చెను; నీరు, రక్తము, ఆత్మ. విశ్వసించుట ద్వారా నీతికరణ, నీరు; రక్తము ద్వారా శుద్దీకరణ; పరిశుద్దాత్మ యొక్క బాప్తిస్మము.

ఇప్పుడు ఈ చివరి గొప్ప మెట్టు పరిపూర్ణతలోనికి రావలసియున్నది, తద్వారా పరిశుద్దాత్మ ఎంతో సంపూర్ణముగా సంఘములో జీవించవలసియున్నది, అది శిరస్సును మరియు శరీరమును ఒకటిగా జతచేయునదైయున్నది, చూశారా. చూశారా? అదియే శరీరము, ఆయనే ఆ శరీరమునకు శిరస్సై యున్నాడు. ఈ చివరి దినములలో అది జరుగుటను ఆయన వాగ్దానము చేసియున్నాడని ఇప్పుడు మనము కనుగొన్నాము. దానిని మనము కనుగొన్నాము.

55ఇప్పుడు, యోనా విషయం. "సరి, అతను ఒక అవిశ్వాసి" అని చాలామంది యోనా గూర్చి చెప్పుదురని నేను చెప్పియున్నాను. లేదు, అతను అవిశ్వాసి కాదండి.

అతడు నీనెవెకు వెళ్ళవలసినవాడైయుండెను, అది ఖచ్చితముగా సరియే, ఎందుకనగా అది పాపముతో నిండియున్న ఒక గొప్ప పట్టణమైయుండెను, మరియు బహుశా అయిదు లక్షలమంది ప్రజలు అందులో ఉండియుందురు, మరియు వారు చాలా ఎంతగానో చెడిపోయిన వారైయున్నారు. అది వర్తకము బాగా జరిగే ఒక గొప్ప పట్టణమైయుండెను. వారియొక్క ప్రధాన వృత్తి, చేపలు పట్టుటయైయున్నదని నేను గ్రహించియున్నాను, మరి వారు అదే అయి యున్నారు. అతను అక్కడికి పంపబడినాడు, అయితే అతను తప్పుడు ఓడ ఎక్కి మరియు తర్షిషునకు వెళ్ళియుండెను.

అతను అట్లు చేయకుండవలసియున్నదని ఇప్పుడు చాలా మంది చెప్పుటకు ప్రయత్నించెదరు. అదంతయూ దేవుని యొక్క ప్రణాళిక అని నేను నమ్ముదును. నేను ఒక చిన్న కథను చదువుచుంటిని, ఒక విధంగా యోనాను నీతిమంతుడిగా తీర్చుటకు, నేను చెప్పదలచినదానిలోనికి వెళ్ళుటకు, ఈ సందర్భములో దానిని చెప్పుటవలన అది ఒక సాక్షాధారముగా ఉండును.

JON 1:6,12,17

 

56ఇప్పుడు, యోనా, అతడు వేరొక ఓడను ఎక్కినప్పుడు, మొదటి విషయము మీకు తెలియునా, అతడు తప్పుడు మార్గములో వెళ్ళుచున్నాడు మరియు వారు సమస్యలో చిక్కుకొనియున్నారు. గాలులు వీచుట మొదలయ్యెను, అలలు ఘోషించుచుండెను, మరియు ప్రతిఒక్కరూ ఓడ మునిగిపోబోవుచున్నదని తలంచిరి. కావున యోనా గాఢ నిద్రలో ఉండగా వారు చెప్పిరి, "ఓయీ నిద్రబోతా, లేచి నీ దేవుని ప్రార్ధించుము!"

మరియు తాను తప్పిదస్తుడనని యోనా ఒప్పుకొనెను. "ఇప్పుడు మీరు నా కాళ్ళ మరియు చేతులు కట్టివేసి, నన్ను ఎత్తి సముద్రములో పడవేయుడి, అప్పుడు తుఫాను నిమ్మళించును." మరియు వారు దానిని చేసిరి.

మరియు దేవుడు ఒక పెద్ద చేపను సిద్ధపరచియున్నాడు.

JON 1:17

 

57ఇప్పుడు, లూయిన్ విల్లోని కెంటకీనందు ఇటీవలె ఒక శాస్త్రవేత్త చెప్పుటను నేను వింటిని, దానికి ఎదురుగానున్న జఫర్సన్ విల్ నందు నేను నివసించుచుంటిని, వారు ఒక ప్లాట్కారు పై తిమింగలము ఆకారమును పెట్టిరి మరియు శాస్త్రవేత్తయైన ఈ వ్యక్తి ఉపన్యసించుచుండెను, మరియు దానికి ఎన్ని దంతాలు ఉన్నాయని చెప్పుచుండెను, మరియు ఓ, నాకు తెలియదండి. కావున చివరికి అతడు చెప్పెను, "బైబిల్ కథ మీకు తెలియును కదా?" "వాస్తవము కానిది" అనెను, అతడు చెప్పెను, "బైబిల్ ఒక…"

అది నాకు చాలా విపరీతము అనిపించినది, కావున నేను కొద్దిగా దగ్గరకి వెళ్ళాను. "అతడు ఏమి చెప్పబోవుచున్నాడో నేను చూచెదను," అని నేను అనుకొన్నాను.

అతను చెప్పెను, "అది ఒక బైబిల్ కధ, యోనాను తిమింగలము మింగినదాని గూర్చినదైయుండెను," ఇట్లు చెప్పెను, "జనులు చూడవలసినదిగా నేను కోరుచున్నాను. మీరు కనీసం ఒక బేస్ బాల్ నైనా దాని గొంతులోనికి విసరలేనప్పుడు, ఒక మనిషి దాని గొంతులో ఎలా పట్టగలడు?" కావున "అది "తప్పు" అని అతను చెప్పెను.

ఆ నాస్తికుడు అటువంటి విషయములు ఆ విధంగా మాట్లాడుతుంటే నేను అక్కడ ఊరికే నిలబడలేకపోయాను. నేను అన్నాను, "క్షమించండి, అయ్యా! మీరు బైబిల్ ఎన్నడైనా చదివారా?"

"నిశ్చయంగా," అని అతనన్నాడు.

"మంచిది, మరి అటువంటి మాటను మీరు ఎలా అనగలిగారు? అది ఒక తిమింగలము అని దేవుడు చెప్పలేదు. అది ఒక చేప అని దేవుడు చెప్పెను" అని నేను అన్నాను.

సరి, అది ఒక తిమింగలమై యుండును" అని అతనన్నాడు.

"అట్లైనచో, అది ఒక తిమింగలమే కానిమ్ము. అది ఒక ప్రత్యేకముగా తయారు చేయబడియుండెను. ఎట్లనగా దేవుడు అతని కొరకు ఒక చేపను తయారు చేసెను" అని నేనన్నాను. అది ఒక ప్రత్యేకమైన చేప. ఈ బాక్స్ కారును మొత్తం మింగగలిగిన దానిని ఆయన తయారు చేయగలడు. ఆయన దేవుడైయున్నాడు. చూడండి, కావున అది సత్యము, మేము, దానిని మేము నమ్మగోరుటలేదు, ఆ కార్యములు లేదా బైబిల్ కథలు అని నీవనుచున్నావు. అయితే దేవుడు యోనా కొరకు ఈ చేపను తయారుచేసియున్నాడు. అది ఒక ప్రత్యేకమైన చేప, కావున అది యోనాను మ్రింగివేసినది.

58మరియు ఇప్పుడు అతను తిమింగలము కడుపులో ఉన్నాడు. మరియు అతని చేతులు మరియు కాళ్ళు వెనుకకు కట్టివేయబడియుండెను. ఇప్పుడు ఆ మనిషి ఎటువంటి స్థితిలో ఉన్నాడోయని మీరు ఊహించగలరు. మరియు, ఏదైతే ఏంటి, ఒక తిమింగలమైననూ, లేదా ఏ ఇతర చేపవంటిదైననూ, అది ఆహారమును కనుగొనువరకు నీళ్ళలో తిరుగులాడును, మరియు పిదప అది క్రిందకు సముద్రము యొక్క అడుగునకు పోవును.

ఇప్పుడు మీరు మీ యొక్క చిన్ని బంగారు వర్ణ చేపలకు అహారము వేసి మరియు వాటిని గమనించండి. అవి వాటి చిన్న కడుపును నింపుకొని మరియు నీళ్ళ యొక్క అడుగునకు వెళ్ళిపోవును, మరియు వాటి చిన్న రెక్కలను బయటకు చాచుకొనును. మరియు అక్కడే అవి విశ్రమించును, చూడండి, ఏలయనగా అది దానియొక్క ఆహారమును కనుగొనెను.

మంచిది, ఈ చేప ప్రవక్తను కనుగొన్నప్పుడు, మరియు ఆయనను మ్రింగివేసెను. సరి, అప్పుడు బహుశా అది సముద్రము యొక్క అడుగునకు వెళ్ళియుండవచ్చును. ఇప్పుడు, అది అట్లు చేసెనని నాకు తెలియదు, కాని అది అట్లు చేసియుండవచ్చునేమో అని నేను అనుచున్నాను. మరియు ఇప్పుడు ఈ వ్యక్తి అచ్చటున్నాడు.

2CH 6:34-39•

JON 2:4,8

 

59ఇప్పుడు మనము ఎల్లప్పుడూ, అది చాలా తప్పయినప్పటికిని, మనము ఎల్లప్పుడూ తలంచుటకు మరియు చూపించుటకు ప్రయత్నించెదము లేదా అపవాది మనకు మన రోగ లక్షణములను చూపించును. "సరి, మీరు చూడండి, నీవు నిన్నటికంటే నేడు ఏమి బాగోలేవు. మరియు మీరు చూడండి, నీవు బాగవ్వలేదు." పరిస్థితుల వైపు చూడకండి. ఎవరికైనా వ్యాధి లక్షణములు ఉన్నవనుకొనినయెడల, అది యోనాయే అయి యుండును, చూశారా. అతడు ఎటువైపు చూసిననూ ఆ తిమింగలము యొక్క కడుపే. అయితే అతడేమి చెప్పెనో మీకు తెలియునా? "అక్కడ వ్యర్థమైనదంతయూ పడియుండెను." "నేను దీనివైపు చూచెదను" అని అతడు చెప్పనేలేదు. అతడిట్లు చెప్పెను, "నీ పరిశుద్ధాలయము తట్టు నేను మరల చూచెదను."

ఎట్లనగా సొలోమోను ఆ ఆలయమును ప్రతిష్టించి మరియు ప్రార్ధించినప్పుడు, ఇట్లు చెప్పెనని అతనికి తెలియును, "నీ ప్రజలు ఎక్కడైనా అపదలోనున్నప్పుడు, మరియు ఈ పరిశుద్ధ స్థలమువైపు చూచి మరియు ప్రార్ధించినయెడల, అప్పుడు నీవు ఆకాశము నుండి వారి ప్రార్థన విన్నపములను విందువు." అతనికి సొలోమోను యొక్క ప్రార్ధనపై నమ్మకముండెను, ఒక మానవుడు, నీవలె - నా వలె ఒక మానవమాత్రుడు, ఆ తరువాత అతను పడిపోయియుండెను. స్త్రీలు అతనిని దేవుని యొద్ద నుండి దూరము చేసిరి, మరి అయిననూ, దేవుడు అతని ప్రార్థనను వినియుండెను, మరియు అటువంటి పరిస్థితిలో కూడా ఇతడు విశ్వాసము కలిగియుండెను.

HEB 1:3•

HEB 8:1

 

60మరియు మనము ఒక మనుష్యుని చేత కట్టబడిన ఒక ఆలయము వైపు చూడనవసరము లేకుండా తన స్వంత రక్తముతో విజ్ఞాపన చేయుటకు ఆసీనుడైయున్న దేవుని కుమారునివైపు, అనగా నేరుగా పరలోకమువైపు చూచు మనము మరి ఎంత అధికమైన విశ్వాసమును కలిగియుండవలసియున్నది!

మరియు మనలో ఏ ఒక్కరూ ఆ రకమైన పరిస్థితిని కలిగిలేరు. దేవుని సన్నిధిలో ప్రజలు స్వస్థత నొందుటను మనము చూచియున్నాము. మనము ఎన్నడూ వ్యాధి లక్షణాలవైపు చూడకూడదు; అవన్నియూ వ్యర్థముగా పడియుండునట్టివైయుండెను. దేవుని వైపు చూడండి, వాగ్దానము చేసినది ఆయనే.

JON 1:17•

HEB 7:25

 

61ఇప్పుడు మనము కనుగొన్నదేమనగా ఏది జరిగిననూ, దేవుడెట్లు ఆ ప్రవక్తకి ఆక్సిజన్ ను అందజేసెనో నాకు తెలియదు. అయితే పరిశుద్ధ గ్రంధము ప్రకారము అతడు మూడు రాత్రింబగళ్ళు నివసించెను. మరియు తర్లీషు ఎంత దూరమో, మరియు అది నీనెవెకు ఎంత దూరమో, వారు సముద్రమునకు ఎంత దూరములో నున్నారో నాకు తెలియదు; అయితే లేఖన ప్రకారము యోనా మూడు రాత్రింబగళ్ళు సజీవముగా నుండెను. ఆయన అతనిని పిలిచెను.

"ఓ, అది అసాధ్యము," అని అంటారు.

చనిపోయి నాలుగు రోజులైన పిదప లాజరును పిలిచిన విషయము ఏమిటి? చూశారా? మరియు మనము కూడా చనిపోయి పదివేల సంవత్సరములయినా కాని ఒక దినమున ఆయన మనలను పిలుచును. అది ఎటువంటి వ్యత్యాసమును కలిగించదు, చూడండి, అది ఒకే విధంగా ఉండును. చూడండి, ఆయన దేవుడైయున్నాడు.

62ఇప్పుడు మనము అతనిని కనుగొనెదము, మరియు ఇక్కడ అతను నీవెవకు వచ్చుచున్నాడు. వాహనములో సవారివలె నీటిలో ఆ తిమింగలం అతనిని తీసికొనివచ్చుచున్నది. సముద్రపు అడుగున ఒక వాహనములో ప్రయాణమువలె నీనెవెకు వచ్చుచుండెను, మరియు బహుశా మధ్యాహ్నం అయియుండును.

సరి, ఇప్పుడు, ఆ ప్రజలు జాలరులైయున్నారు. మరియు వారు వారియొక్క వలలను లాగుచునుండిరి, వారు వర్తక సంబంధమైన జాలరులైయున్నారు. మరియు వారు అన్యజనులైయున్నారు. వారు విగ్రహారాధకులైయున్నారు. మరియు వారి దేవుళ్ళలో ఒకరు…

ఇక్కడ అమెరికాలోనున్న ఇండియనుల వలె, వారికి బూడిదరంగు గల ఎలుగుబంటి ఒక దేవుడు, వేగాస్ అనునది వారు క్రైస్తవ్యములోనికి రాకముందు అన్యులైన ఇండియనుల చేత ఆరాధించబడే దేవుడైయుండెను. వారికి ఒక దేవుడుండెను, శక్తిగల దేవుడు.

JON 3:4•

ROM 8:28

 

63మరియు, నీనెవెనందు, నేను చెప్పితిని కదా తిమింగలము సముద్రపు దేవుడైయుండెను, ఏలయనగా అది సముద్రమునకు యజమానుడై యుండెను. అది దేనినైనా మ్రింగగలదు. మరియు దాదాపు మధ్యాహ్నవేళలో, సముద్రము నుండి, ఇదిగో వారి దేవుడు బయటకు వచ్చుచుండెను; అది నోరు తెరువగానే, ప్రవక్త నడుచుకుంటూ ఒడ్డు మీదకి వచ్చెను. వారు నమ్ముటలో ఆశ్చర్యమేమియులేదు, చూశారా. నిశ్చయంగా వారు నమ్మిరి, ఎందుకనగా వర్తమానము ఇచ్చుచున్న ఆ ప్రవక్త వారియొక్క దేవుని నోటిలో నుండి బయటకు వచ్చెను, "పశ్చాత్తాపపడుడి, లేనియెడల ఈ పట్టణము నాశనమగును," చూశారా.

కావున అతను దేవుని యొక్క చిత్తమునకు వెలుపల లేడు. ఆయన సరిగ్గా, "దేవుని ప్రేమించువారికి, మరియు ఆయన సంకల్పము చొప్పున పిలువబడినవారికి దేవుడు సమస్తమును వారి మేలుకొరకు సమకూడి జరిగించును" అను దాని ప్రకారమే చేసెను. అది నిజము యేసు అతని గూర్చి ప్రస్తావించెను.

మనము ప్రార్ధన వరుస కొరకు ముగించుటకు ముందు మరొక్క విషయము ఆయన సొలోమోను గూర్చి కూడా ప్రస్తావించెను.

64ఇప్పుడు, దేవుడు భూమి మీదకు ఒక బహుమానమును పంపినప్పుడు, మరియు ప్రజలు దానిని గౌరవించినయెడల, అది ఎల్లప్పుడూ ఆ ప్రజలకు ఒక సువర్ణయుగమై యుండును. కాని వారు దానిని త్రోసివేసినయెడల, అది ఎల్లప్పుడూ ఆ ప్రజలకు అగాధమవలెనుండును. ఆయన ప్రతీ కాలములో అట్లు చేయును. కేవలం గమనించండి. వారు యేసును త్రోసివేసినప్పుడు, మరియు వారు ప్రవక్తలను త్రోసివేసినప్పుడు ఏమయ్యెనో గమనించండి.

అయితే సొలోమోను కాలములో, వారందరూ నమ్మియుండిరి. సొలోమోను ఒక వివేచన వరమును కలిగియుండెను. దేవుడు దానిని సొలోమోనుకు ఇచ్చియుండెను. మరియు ప్రజలందరూ దానిని ఏక మనస్సుతో విశ్వసించిరి. అది హెబ్రీయులకు ఆ కాలములో దాదాపు ఒక వెయ్యేండ్ల పాలన వంటిదని వారు చెప్పుకొనిరి. అది ఒక సువర్ణ యుగము, సాలొమోను కాలము. యుద్ధములు లేదా అటువంటివి ఏమియు లేవు; అతను దానికి అభివృద్ధి కలుగజేసెను. వారు ఆలయములను మరియు ఈ గొప్ప కార్యములన్నిటిని సొలోమోను కాలములో నిర్మించిరి, ఏలయనగా అతను ఒక సాదృశ్యముగా ఉండియున్నాడు, దావీదు కుమారుడు, మీరు చూడండి, శారీరకమైన దావీదు కుమారుడు. ఇప్పుడు, ఈ కాలములో వారు ఆలయమును మరియు ప్రతీది నిర్మించిన కాలములో, ప్రతీఒక్కరూ దేవుడు వారికి ఇచ్చిన ఆ బహుమానమును గౌరవించిరి, మరియు ఇంకా అతనిని వారికి రాజుగా చేసియుండెను. మరియు కీర్తి అంతటా విస్తరించెను.

ROM 2:11

 

65అమెరికన్లగు మీతో నేను చెప్పుచున్నాను, దేవుడు మనకు పంపిన

వ్యోమగామీల గురించి మరియు అణుబాంబులు మరియు మొదలగువాటి గురించి మనము విచారపడవలసిన అవసరంలేదు. సరి, మన భద్రత క్రీస్తే అయి యున్నాడు, చూశారా. ఆయనే మన భద్రత అయి యున్నాడు.

అయితే దానిలోని సమస్య ఏదనగా, ఆయన మనకు వరములను పంపును మరియు సరిగ్గా వారు చేసినట్లే మనము కూడా దానిని ఎగతాళి చేయుటకు ఎటువంటి పక్షపాతము లేదన్నట్లున్నది. ఇప్పుడు అవి చేసిన వాటిని బట్టి ఈ న్యూయార్క్, ఈ అమెరికా, ఈ ప్రపంచము వీటిమీదకి తీర్పు రాకుండా దేవుడు వీటిని పోనిచ్చినయెడల, ఆయన న్యాయమంతుడైన దేవుడు గనుక, సొదొమ మరియు గొమొర్రాలను లేపి వాటిని దహించినందుకు క్షమాపణ చెప్ప బద్దుడైయున్నాడు, ఏలయనగా సరిగ్గా మనము ఇప్పుడు చేయుచున్న అదే కార్యమును బట్టి ఆయన వాటిని దహించివేసియున్నాడు, చూశారా. చూశారా? కావున అది ఈ రీతిగా ఉండునని ఆయన వాగ్దానము చేసియున్నాడు.

66ఇప్పుడు మనమిప్పుడు కనుగొనెదము, అదేదనగా సొలోమోను దినములలో, మీరు ఊహించగలరా, ప్రతీ ఒక్కరూ దేవుడు గురించి మాటలాడుచుండిరి, "ఓ, సొలోమోను యొక్క గొప్ప వివేచనా శక్తి," అది వివేచింపగల వరము మరియు ప్రతి ఒక్కరూ దాని గూర్చి గొప్పగా చెప్పుకొనుచుండిరి. "ఓ, లేదు, కాదు!" అని చెప్పునట్టి ఎటువంటి గందరగోళము లేకుండెను. వారందరూ దానిని విశ్వసించియుండిరి. మరియు ఆ కీర్తి ప్రతీ దేశమునకు వ్యాపించెను. మరియు దేశములు ఇశ్రాయేలునకు భయపడెను, అయితే వారికి మెరుగైన సైన్యము ఉన్నదని కాదు కాని, దేవుడు వారి మధ్య ఉన్నందున భయపడిరి. భయమును తీసుకువచ్చునది, దేవుడే. దేవుడు వారి మధ్యనున్నాడు.

ఓ, క్రైస్తవ దేశమని చెప్పుకొను మనకు అది ఎట్లుండవలసియున్నది! ఈనాడు మనమంతా క్రమము తప్పునట్లు సంఘ శాఖలు మరియు మొదలగునవి మనలను ఇటువంటి వంకర స్థితిలోనికి త్రిప్పుట ఎంతో బాధాకరమైన విషయము, మరియు ఏ వ్యక్తికైనా దేనిని నమ్మవలెనో తెలుసుకొనుటకు కష్టమైయుండెను.

67మరియు, గమనించండి, పిదప సొలోమోను యొక్క కీర్తి షేబా దేశము వరకు వ్యాపించెను. రాణి దాని గూర్చి వినియుండెను. ఆమె ఒక అన్యురాలైయుండెను. మరియు అప్పట్లో వారు కలిగియున్న ఒకే మార్గము ఏదనగా… ఈనాడు మనము కలిగియున్నట్లు టెలివిజన్లు లేదా పత్రికలు మరియు అటువంటివి వారికి లేకుండెను వారు వర్తమానములను పంపుటకు ఒకే ఒక్క మార్గము ఏదనగా, నోట నుండి చెవికి చెప్పుటయే. మరియు ప్రయాణికుల వాహనం వచ్చిన ప్రతీసారి, ఆ రాణి బయటికు వెళ్ళి మరియు ఇట్లు అడిగెననుటలో ఎటువంటి సందేహము లేకుండెను, "మీరు వచ్చునప్పుడు పాలస్తీనా గుండా వచ్చితిరా?"

"అవును."

"అటైనచో, వారు ఏమి చెప్పిరి?"

"ఓ మీరు దానిని చూచినచో బాగుండును! దానివంటిది మరేదియు లేదు! అక్కడ ఆ ప్రజలు ఒక ఉజ్జీవమును కలిగియున్నారు. అది ఒక దేశవ్యాప్తమైన వ్యవహారము. ఓ, వారు ఒక అద్భుతమైన ఉజ్జీవమును కలిగియున్నారు. మరియు వారి దేవుడు, వారి రాజును అభిషేకించియున్నాడు, మరియు అతను ఒక వివేచన వరమును కలిగియున్నాడు. మరియు మీరు అటువంటి దానిని ఎన్నడూ చూచియుండరు. ఆ జ్ఞానమును మించినదేదియూ లేకుండెను. అతడు దేనినైనా చెప్పగలడు. అది మనుష్యుని జ్ఞానమును మించినదైయుండెను. అది దేవుని యొద్ద నుండి ఇవ్వబడిన వివేచనయైయుండెను." మరియు వారందరూ, ఎందుకు… వారు వినియున్నారు.

ROM 10:17

 

68మీకు తెలియును, "వినుటవలన విశ్వాసము కలుగును, అది దేవుని యొక్క వాక్యము వినుటవలన కలుగును." మేము మెథడిస్టులము, బాప్టిస్టులము, లేదా పెంతెకోస్తులము అని వినుట కాదు; కాని దేవుని యొక్క వాక్యము వినుటవలన, చూడండి. "వినుట వలన విశ్వాసము కలుగును."

మరియు వారు చెప్పుటను ఆమె వినినప్పుడు, ఆకలి ప్రారంభమయ్యెను. మంచిది, ఇప్పుడు, ఇదంతయూ ఆమె వినినప్పుడు, ఆమె దాని గూర్చి ఏదైనా చెప్పుటకు ముందు, ఆమె తన అభిప్రాయమును తెలియజేయుటకు ముందు, ఆమె స్వయంగా వెళ్ళి చూడవలెనని నిర్ణయించుకొనెను. ఓ, మనము కూడా అట్లు చేసినయెడల బాగుండును కదా? చూశారా? వారి దేవుడైన యెహోవా యొక్క స్వభావమును చూపుటకు అనేక గ్రంధపు చుట్టలను, పరిశుద్ధ గ్రంధమును, ప్రవక్తలు ఏమి ప్రవచించిరాయని తెలుపు సంగతులను ఆమె కలిగియున్నదనుటలో ఎటువంటి సందేహము లేదు.

69ఇప్పుడు ఈ రాణి అక్కడికి వెళ్ళటకు ముందు ఆమె అనేక పరిస్థితులను ఎదుర్కొనవలసివచ్చెను. మొదటి కార్యమేదనగా, అన్యురాలగుటవలన ఆమె ముందుగా ఆనుమతి కొరకు తన యాజకుని యొద్దకు వెళ్ళవలసియుండెను, ఎందుకనగా ఆమె ఒక రాణి మరియు సంఘము యొక్క సభ్యురాలు. కావున ఆమె యాజకుని వద్దకు వెళ్ళి మరియు ఇట్లు చెప్పుటను నేను ఊహించగలను. "అయ్యా, దేవుడు తన జ్ఞానమును కుమ్మరించిన ఈ సొలోమోను అను గొప్ప వ్యక్తి యొద్ద కొంత జ్ఞానమును సంపాదించుకొనుటకు నేను ఇశ్రాయేలునకు వెళ్ళనా?

అతడిట్లు చెప్పుటను నేను వినగలను, "బిడ్డా, నేను నీ వద్దనుండి ఇటువంటిది ఎన్నడూ తలంచలేదు. ఆ ఉజ్జీవముతో మన సంఘ శాఖ ఏకీభవించుటలేదు." అయితే ఈనాడు అది ఎట్లుండునో మీకు తెలియును. సహజంగా అంత ఘనమైనదాని నుండి అది ఎంత ఎగతాళి చేయబడువరకు తీసుకురాబడుచున్నదోయని మీ ముందుంచుచున్నాను. అయితే ఇప్పుడు ఈనాడు అట్లు చెప్పునది అదే ఆత్మ. చూడండి, అదే ఆత్మ అదే విధమైన దానిని తీసుకువచ్చును. "నీవు అట్లు చేయకూడదు, మీరు చూడండి. ఎందుకనగా, తుదకు ఆ ప్రజలు మూఢభక్తిగలవారు. వారు అన్ని విధములైన సూచనలను మరియు కార్యములను నమ్ముదురు. అయితే, సరి, మీరు చూడండి, వారు ఒక మూఢభక్తిగల గుంపు అని ప్రతిఒక్కరికి తెలియును. సముద్రము ఎండిపోయెననియు, మరియు వారు కలిగియున్న ఈ అన్ని రకములైనవి, వాటిలో ఏదియూ వాస్తవము కాదు. చూడండి, అది కేవలం ఒక కథ లేదా వారు పాడుకున్న పాట లేదా మరేదోయైయుండెను. మరియు దానికి ఎలాంటి ఆధారము లేదు," అనెను.

70అయితే, మీకు తెలియును, నిజమగు విశ్వాసము ఒక హృదయాన్ని తాకినప్పుడు, వారు ఆకలిగొనెదరు. వారు చూడగోరుదురు.

తెరను దాటుకొని కాలమునకు ఆవలివైపు ఎట్లుండునాయని చూచుటకు జీవించు వ్యక్తి ఒకరైనా లేరు. "నేను ఎక్కడి నుండి వచ్చాను? నేను ఎవరిని? పుస్తకములలోకెల్లా గొప్పగా ఎన్నిక చేయబడినవాటిలో, నీవు ఎవరివి, నీవు ఎచ్చటినుండి వచ్చావు, మరియు నీవు ఎచ్చటికి పోవుచున్నావు, అని బయలుపరచు ఒకే ఒక పుస్తకము ఉన్నది. అది అంతే. మరియు అది మనలను తెరను దాటి దానిని చూచుటకు కూడా అనుమతించును.

71ఇప్పుడు, ఇది జరుగుటను వారు చూచినప్పుడు, ఆమె దీనిగూర్చి వినియున్న తరువాత ఆమె ఇట్లనెను, "ఏది ఏమైననూ నేను వెళ్ళెదను." కావున బిషప్పు ఏమన్నా లెక్క లేదు, లేదా ఏదేమైనా, ఎలాగైననూ ఆమె వెళ్లబోవుచున్నది, ఆమె నిశ్చయించుకున్నది, ఎందుకనగా ఆమె ఏదైనా వాస్తవమైనదాన్ని చూడగోరినది, ఏదైనా.

మంచిది, పిదప యాజకుడు ఆమెతో ఇట్లు చెప్పియుండును, చెప్పెను. "ఇప్పుడు చూడు, బిడ్డా, నీవు ఒక రాణియైయున్నావు. నీవు అటువంటి ప్రజలతో సహవాసము చేయకూడదు."

దానిని లక్ష్యపెట్టకుండా, "నేను కూడా మరణించవలసిన మానవమాత్రురాలినే," అని అనెను.

"మంచిది, ఇప్పుడు, ఒకవేళ అటువంటిది ఏమైనా జరగాలంటే, అది ఇచ్చట మన సంఘములోనే జరుగవలెను." అవును, ఆ ఆత్మ ఇంకనూ చనిపోలేదు, చూడండి. "అవును, అది మన ద్వారానే రావలసియున్నది, లేనిచో అది వాస్తవము కాదు."

మంచిది, ఆమె ఇట్లు చెప్పియుండును, "నేను చిన్ననాటినుండి ఇచ్చట సమర్పించుకొనియున్నాను. నేను ఈ విగ్రహములను మరియు ప్రతిమలను మొదలగువాటన్నిటిని చూసియున్నాను, మరియు అవి దేవుళ్ళని వాటి గూర్చి మీరు చెప్పియున్నారు. మా అమ్మమ్మ, మరియు మామ్మ, మరియు మా అమ్మకి అమ్మ ఇక్కడకి చెందినవారే. మరియు వారిలో ఏ ఒక్కరూ జీవము యొక్క ఏ సూచనయైనా మరిదేనినైనా చూపించియుండలేదు. అదియే జీవము అని వారు చెప్పుదురు."

HEB 13:8

 

72రాణి కలిగియున్నటువంటి అభిప్రాయమునే కలిగియున్న మరి కొంతమంది ప్రజలు సరిగ్గా ఇచ్చట న్యూయార్క్ లోను మరియు ప్రపంచమంతటా ఉండియుండవచ్చును.

"నేను స్వయంగా దానిని చూడగోరుచున్నాను. మరియు నేను ఆ విగ్రహములను చూడను. నేను మీరు చదువుచున్న అన్ని రకములైన పుస్తకములను, ప్రార్థనా పుస్తకములను మరియు మొదలగువాటిని వినియున్నాను, అయితే అదంతా ఏమిటి? వాటిలో జీవమున్నట్టు దేనినైనా నేను చూచియుండలేదు. అదంతయూ మృతమైనది, ఏదో వేదాంతము లేదా మరేదో. నా హృదయం మాత్రము దానిని చూచుటకు ఆకలిగొనుచున్నది. ఒక దేవుడనేవాడు ఎక్కడున్నాడు? ఆయన ఎక్కడున్నాడు?"

ఓ, లోకము దానికొరకు ఆకలిగొనును గాక! ఆయన ఎక్కడున్నాడు? ఆయన దేవుడైయున్నయెడల, ఆయన ఇంకనూ దేవుడైయుండవలసియున్నది. ఆయన అట్లు కానియెడల, ఆయన మరణించినట్లే, చూశారా. "ఆయన నిన్న, నేడు, మరియు నిరంతరం ఒక్కటే రీతిగా ఉన్నాడు" అని పరిశుద్ధ గ్రంధము చెప్పుచున్నది.

1KGS 10:2•

2CH 9:1

 

73ఇప్పుడు గమనించండి, ఇప్పుడామె హృదయం ఆకలిగొననారంభించెను, కావున ఆమెకు మంచి ఆలోచన వచ్చియుండెను. ఆమె చెప్పెను, "నేను కొంత డబ్బును, మరియు కొంత సాంబ్రాణిని, మరియు బోళమును తీసికొని వెళ్ళబోవుచున్నాను. మరియు ఆ విషయము వాస్తవమైనయెడల, నేను దానికి సహకరించెదను. అది వాస్తవము కానియెడల, నేను దానిని వదిలిపెట్టుదును."

ఆమె నిశ్చయంగా పెంతెకోస్తువారికి బోధించగలదు! మిమ్మల్ని పరిశుద్ధ గుండ్రాళ్ళు అని పిలచు ఒక దానిని సహకరించుచున్నారు, చూశారా, మీరు ఇంకను దానిని సహకరించుచున్నారు, చూచారా. ఓ, మై! మరియు జ్ఞానము అను వరము సంఘములో ఉండవలెనని చెప్పుదురు. ఇప్పుడు గమనించండి. చెప్పవలెననిన అది సంఘ కాపరులకైయున్నది. ఇప్పుడు గమనించండి.

పిదప ఆమె ఈ విధంగా చెప్పినది, "నేను నాతో కూడా నా బహుమానములను తీసుకొని వెళ్ళుదును. మరియు అది సత్యము కానియెడల, నేను నా బహుమానములను తిరిగి వెనుకను తెచ్చెదను." అది మంచిది. ఇప్పుడా స్త్రీ వెళ్ళుటకు సిద్ధపడినది. ఆమె తనతోపాటు కొంతమంది నపుంసకులను, ఈ ధనమంతటిని, మరియు తన పనికత్తెలను తీసుకొనినది.

MATT 12:41,42

 

74ఇది నిజమా కాదాయని కనుగొనుటకు, ఆమె ప్రయాణము చేయవలసిన దూరమును గూర్చి ఇప్పుడు ఆలోచించండి, చూశారా. పాలస్తీనా నుండి షేబా వరకు మీ పటములో కొలవండి. అది ఖచ్చితంగా తొంభై రోజులు. ఒక ఒంటెపై మూడు నెలలు పట్టును. ఆమెకు కష్టములు ఎదురయ్యెను. మనము చేయునట్లు ఆమె ఒక ఎయిర్ కండీషన్ క్యాడిలాక్ కారులో ప్రయాణించియుండలేదు. అయితే, ఆమె ఆ కాలంలో ప్రపంచంలో నాగరికతకు చాలా దూరముగానున్న ప్రాంతములగుండా ఆమె సొలోమోను యొక్క జ్ఞానమును వినుటకు వచ్చెను.

మరియు ప్రజలు ఆ ప్రక్క వీధిలోనే నివసించెదరు మరియు గొప్పదైన దానిగూర్చి వినుటకు రాకుందురు. "అంత్యదినములలో ఆమె లేచి మరియు ఈ తరమునకు తీర్పు తీర్చును" అని యేసు చెప్పుటలో ఆశ్చర్యమేమియు లేదు.

ఆమెకు దారిలో ఇబ్బందులు ఎదురయ్యెను. గుర్తుంచుకొనండి, చురుకుగా స్వారీ చేయు ఇష్మాయేలు కుమారులు అచ్చట ఎడారిలో దారికట్టి దోచుకొను దొంగలైయున్నారు. ఆ ఇష్మాయేలీయుల పెద్ద ముఠాకు ఆ రాణిపైబడి మరియు ఆ అరడజను నపుంసకులను చంపి, మరియు వారి ధనమంతటినీ దోచుకొనిపోవుట ఎంత సులభమో కదా.

75అయితే ఏదో విధంగా, దేవుని కొరకు ఆ హృదయము తపించినప్పుడు ఇబ్బందులు పెద్ద లెక్కగా అనిపించవు. నిన్ను ఎవరు ఏమన్నా కాని, నీ ఆలోచన విధానమును నీవు కలిగియుందువు, వారికి తోచినట్లు నిన్ను ఏదన్నా అనగలరు, వారు కోరిన విధంగా నిన్ను ఏమైనా పిలువగలరు, నీ మార్గములో ప్రతీ అడ్డంకుని ఉంచుటకు వారు ప్రయత్నించెదరు; అయితే దేవుని కొరకు నీవు ఆకలిగొన్నప్పుడు, దానిని నీవు ఎక్కడో ఒక చోట కనుగొనెదవు. అంతే, చూడండి. ఏదియూ నిన్ను ఆపజాలదు. భర్త నిన్ను ఆపలేడు. భార్య నిన్ను ఆపలేదు. సంఘము నిన్ను ఆపలేదు. సంఘ కాపరి నిన్ను ఆపలేడు. నిజముగా ఒక పరిశుద్దుడు, దానిని చూడగోరినయెడల, అతనిని తన దేవుని యొద్దనుండి దూరము చేయునది ఏదియూ లేదు. లేదండి.

ఆమె కనీసం దాని గూర్చి ఆలోచించనేలేదు.

NUM 12:6

 

76మీరు కూడా, ఈయన ఏమి చెప్పబోవుచున్నాడనియు, మరియు అమ్మ ఏమి చెప్పబోవుచున్నదనియు, మరియు నాన్న ఏమి చెప్పబోవుచున్నాడనియు లేదా భర్త ఏమి చెప్పబోవుచున్నాడనియు ఆలోచించరు. యేసుక్రీస్తు వాస్తవమైయున్నాడని మీరు కనుగొనుటకు వచ్చినప్పుడు, మరియు ఆయన సజీవుడని మీరు వినియున్నప్పుడు, జగత్తుపునాది వేయబడకముందే ఎన్నుకొనబడిన ఆ విత్తనము, ఆ ఆకలి మీరు కలిగియున్నప్పుడు, మిమ్మును ఏదియూ ఆపజాలదు. వెలుగు దానిని తాకినప్పుడు, అది వెంటనే జీవమును పొందుకొనును.

అన్యురాలైయుండి, అన్యమతస్తురాలై యున్నప్పటికిని ఈ స్త్రీ అటువంటి విత్తనమే.

ఇప్పుడు, ఇప్పుడు గుర్తుంచుకొనండి, ఆ సహారా ఎడారి ఎంతో ఎండగా ఉండుటను బట్టి బహుశా ఆమె రాత్రులు ప్రయాణము చేయవలసియుండెనేమో మరియు ఆమె రాత్రులు ప్రయాణము చేసియుండెను. బహుశా గ్రంధపు చుట్టలను చదువుచుండెను. "ఇప్పుడు దేవడేమైయుండెనని ఆ ప్రవక్త ఇక్కడ చెప్పెనో, దానిని మనము కనుగొనెదము. నేను హృదయ రహస్యములను బయలు పరచెదను. మరియు మీలో ఒక ఆత్మసంబంధియైననూ లేదా ఒక ప్రవక్తయైననూ ఉన్నయెడల, ప్రభువగు నేను అతనికి నన్ను తెలియజేసుకొందును, దర్శనములలో అతనితో మాటలాడెదను. మరియు అతను చెప్పునది నెరవేరును, అతను చెప్పినది వినుడి. నేను అచ్చటికి వెళ్ళినప్పుడు దానిని కనుగొనెదను. ఆ దేవుడు అదే అయి యున్నాడు. నేను దానిని కనుగొనెదను."

77ఇప్పుడు గమనించండి, కొద్దిసేపటి తర్వాత చివరకు అక్కడ జరుగుచున్న ఆ ఉజ్జీవమునొద్దకు ఆమె చేరుకొనెను. అది ఒక ఉజ్జీవమైయుండెను. కావున, ఆమె అచ్చటికి చేరుకున్నది. ఇప్పుడు ఆమె, కేవలం "నేను లోనికి వెళ్ళి మరియు కొద్ది నిమిషములు కూర్చుండెదను. మరియు నా సిద్ధాంతంతో ఏకీభవించని ఒక్క మాటయైనా ఆయన చెప్పుటను నేను వినినయెడల, నేను లేచి వెళ్ళిపోవుదును!" అని చెప్పుటకు వచ్చియుండలేదు. లేదండి, అటువంటి వారిమీద నేరస్థాపన చేయుటకు ఆమె న్యాయతీర్పు వద్ద ఉండబోవుచుండటను చూడండి. ఆమె పరిపూర్ణంగా ఒప్పుకునేంతవరకు అచ్చట ఉండుటకై ఆమె వచ్చియున్నది.

మనము అట్లు చేయగలిగినయెడల, కేవలం భక్తిగౌరవంలో మౌనంగా కూర్చొని మరియు ఇప్పుడు చెప్పండి, "ఇది ఏదో వాస్తవముగా ఉన్నట్లు కనపడుచున్నది. నాకు తెలియదు. నేను దానిని విమర్శించబోవుటలేదు. నేను ఊరక మౌనముగా కూర్చొని మరియు నేను గమనించెదను. మరియు పిదప నేను దానిని లేఖనముతో పోల్చుదును మరియు అది వాస్తవమా కాదాయని చూచెదను." మీరు స్వయంగా దానికి రుణపడియున్నారు.

78ఇప్పుడు, ఆమె భూమ్యంతముల నుండి వచ్చియుండెను. ఆమె బహుశా ఆలయము యొక్క ఆవరణములోనికి వెళ్ళియుండును, మరియు, ఇంతేకాకుండా ఆమె తన డేరాలను అమర్చుకొనెను. మరియు బహుశా… ఇప్పుడు నేను చిన్న పిల్లల కొరకు దీనిని ఒక నాటికలాగా చెప్పబోవుచున్నాను.

బహుశా ఆ ఉదయం, ఆలయము తెరిచినప్పుడు, బూర మ్రోగెను, యాజకులు బూరలను ఊదిరి, వాయిద్యములు వాయించిరి, మరియు అటువంటివి చేసిరి. మరియు పిల్లలందరూ లోపల కూడుకొనుటను ఆరంభించిరి, మరియు బహుశా ఆమెకు కూర్చుండుటకు చాలా వెనుకకు చోటు దొరికియుండును. మంచిది, సొలోమోను కాపరిగారు బయటకు వచ్చినప్పుడు ఆమె గమనించుచుండెను. వారాయనను పరిచయం చేసిరి మరియు ఆయన ప్రజలతో మాటలాడెను మరియు లేఖనములను చదివెను, మరియు వారు ప్రార్ధన చేసిరి. మరియు పిదప మొదటి వ్యాజ్యము వచ్చియుండెను. ఇప్పుడు, "ఇది ఎంతటి వివేచన అయి యున్నదో నేను చూచెదను" అని ఆమె అనుకొనెను.

1KGS 10:3,6-8•

2CH 9:6,7

 

79మరియు ఆమె ఆ వివేచనను చూసినప్పుడు, ఆ తరువాత కూటమునకు ఆమె తన కూర్చుండుచోటును ముందరికి జరుపుకొనెనని నేను అనుకొన్నాను. బహుశా ఆమె… మరియు ఆ, ఇది అగౌరవముగా తోచినయెడల, నన్ను మన్నించండి. బహుశా ఆ ఒక్క సాయంత్రవేళ ఆమె ప్రార్థనా కార్డును పిలువకపోయియుండవచ్చును, చూడండి, ఆమె కొద్దిసేపు వేచియుండవలసివచ్చెను. ఇప్పుడు నేను ప్రజలకు ఏదో ఒక కార్యమును తెలుపుటకు ప్రయత్నించుచున్నాను, మీరు అర్ధం చేసుకొనండి, చూడండి. మరియు బహుషా అది కాకపోవును, అయినప్పటికినీ, ఆమె వాజ్యము వెంబడి వ్యాజ్యమును గమనించుచుండెను, మరియు చివరిగా ఆమె ఒప్పుకొనెను.

అయితే అది ఆమెకు జరుగునంతవరకు వేచియుండుడి. ఆమె కోరినది ఆదే. మరియు పరిశుద్ధ గ్రంధము దానిని చెప్పియుండెను, "ఆమె సొలొమోను వద్దకు తీసుకురాబడినప్పుడు, అచ్చట సొలోమోను ఆమెకు తెలియజేయనటువంటి ఏ ప్రశ్నయూ ఆమె మనసులో మిగిలియుండలేదు." దేవుడు ఆమెకు బయలుపరచెను, ఆమెకు తన జీవితములో అవసరమైనవన్నింటినీ దేవుడు సొలోమోనుకు బయలుపరచెను. మరియు అతడు దీనిని చేసినప్పుడు, అటు పిమ్మట అది ఆమెకు కూడా జరిగెను. మరియు ఆమె నిలబడి మరియు ఆమె ఇట్లనెను, "నేను వినినదంతయూ నిజమే, మరియు దానిని మించియున్నవి." ఆమె ఇంకా ఇట్లనెను, "అనుదినము ఇక్కడ కూర్చొనియుండి మరియు ఆ గొప్ప సూచనయు, ఆ గొప్ప వరమును పనిచేయుటను చూచు వ్యక్తి ధన్యుడైయుండెను." ఆమె దేవుని అంగీకరించెను. ఆమె వాస్తవమైనదానిని చూసియుండెను. ఆమె హృదయం పురిగొల్పబడియుండెను. ఒక మృతమైన సిద్దాంతమును కాదు కాని, ఒక ప్రతిమ వంటిదానిని కాదు కాని ఆమె ఒక వాస్తవమైన దానిని కనుగొనెను. అది ఒక జీవముగల దేవుడైయుండెను.

LUKE 11:31•

2COR 5:19

 

80ఇప్పుడు, యేసు దానిని చెప్పుటలో ఎలాంటి ఆశ్చర్యము లేదు, "తీర్పు దినమున షేబా దేశపు రాణి ఈ తరమువారితో నిలబడి మరియు వారిపై నేరస్థాపన చేయును; ఎందుకనగా సొలోమోను జ్ఞానమును వినుటకు ఆమె భ్యూమ్యాంతముల నుండి వచ్చియుండెను, మరియు, ఇదిగో సొలోమోను కంటె గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు." మరియు ప్రభువైన యేసు దినములలోనూ, ఇమ్మానుయేలు అనగా దేవుడు శరీరధారి అయ్యెను, "దేవుడు క్రీస్తునందుండి, లోకమును తనతో సమాధానపరచుకొనుచుండెను." ఆయన జీవముగల వాక్యమైయున్నాడు. మరియు ఆ దినముల్లో ఆయన కలిగియున్న అటువంటి పరిచర్యను విమర్శించిన వారితోనూ, ఆయన వారిని క్షమించెదనని చెప్పెను, వారితో అనెను, "పరిశుద్దాత్మ వచ్చినప్పుడు…"

అక్కడ వారు కలిగియున్న దానికంటెను రెండు వేల సంవత్సరముల అధిక బైబిలు శిక్షణను మీరు కలిగియున్నారు, రెండు వేల సంవత్సరాలుగా పరిశద్దాత్మ భూమి మీద సంచరించుచునుండెను. ఇప్పుడు, ఆ తరమువారి మీద ఆమె నేరస్థాపన చేయునట్లైతే, ఈ తరము వారిని ఆమె ఏమి చేయును? సొలోమోనుకంటె గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు! ఆ చిన్న స్త్రీ వాస్తవమైనదానిని చూసియుండెను.

MATT 12:32,42

 

81నేను ఈ చిన్న విషయమును ఇదివరకే చెప్పియున్నాను, అయితే సరిగ్గా ఇప్పుడు నేను ప్రార్ధనా వరుసను పిలుచుటకు ముందు దానిని చెప్పుట ఉపయోగకరమని నేను నమ్ముచున్నాను. నేను వేటాడుటను ఇష్టపడుదును. అది కేవలం నాకు రెండవ ప్రకృతిలాంటిది. నేను దానిని ప్రేమించుదును. నా మార్పు ఎన్నడూ దానిని నా నుండి దూరపరచలేదు, ఎందుకనగా నేను అడవికి వెళ్ళుటను ఇష్టపడుదును. ఇక్కడ ఉత్తరాన నేను వేటాడుచుండేవాడిని, మరియు సంవత్సరముల క్రితం నేను ఇక్కడ ఆడిరోండెక్లో వేటాడుచుండేవాడిని, మరియు నేను అచ్చటికి వెళ్ళి మరియు ఆ కొండలపైకి పోయెదను, సూర్యోదయం మరియు సూర్యాస్తమయములను గమనించుచు, వారముల కొద్ది అచ్చట ఉండేవాడిని, మరియు ప్రకృతి ద్వారా దేవుడు మాటలాడుటను వినుచుండేవాడిని అక్కడే ఆయన…

నా మొదటి బైబిలు ప్రకృతి అయి యున్నది. ఎట్లు ఒక చిన్న విత్తనము చిట్లించుకొని బయటకు వచ్చి, దాని బెండు తొలగిపోయి మరియు మీరు చూడగలిగిన ప్రతి సూచనయు తొలిగిపోయినా గాని మరుసటి వసంతకాలమున అది మరలా బ్రతుకుటను చూచెదము, చూశారా. దేవుడు దానికి ఒక మార్గమును ఏర్పాటు చేసియున్నాడు. "ఆ విత్తనము మరలా జీవించుటకు ఆయన మార్గమును ఏర్పాటు చేసినయెడల," నేను అన్నాను, "నేను మరల జీవించుటకు ఏదో ఒక మార్గము ఉన్నది." అది నిజము. కావున అది నా మొదటి బైబిల్ అయి యుండెను.

82నేను ఇక్కడ ఒక అమెరికా పౌరుడితో కలిసి వేటాడుచుండేవాడిని, అతడు ఒక మంచి వేటగాడైయున్నాడు, కాని అతను హృదయమందు చాలా కఠినుడైయుండెను. మరియు అతను ఒక… అతడు ఒక మంచివాడని నేను అనుకొన్నాను. కలిసి వేటాడుటకు అతను మంచివాడే మరియు అతనితో కలిసి వేటాడుట మీకు ఎలాంటి ఇబ్బందిని కలిగించదు, అతను తన పరిధిని ఎరిగియున్నాడు. మరియు మేము వేటాడితిమి, అయితే అతను నిజముగా తన హృదయమందు ఎంతో కఠినుడైయుండెను. మరియు నేను అనేక సార్లు అతనితో చెప్పియున్నాను, "నీవెందువలన అంత కఠినుడవైయున్నావు?" అని నేను అన్నాను.

మరియు అతను, అతనిని ఎగతాళి చేయుటకో లేదా మరిదేనికో కాదు, కాని చూడటానికి అతని కండ్లు బల్లి కండ్లవలె ఉండును. మరియు అతను నా వైపు చూచి, "ఓ వెళ్ళవయ్యా, బోధకుడా! బిల్లీ, పక్కకు వెళ్ళవయ్యా! నీవు ఒక బోధకుడవై యుండి ఎన్నడూ ఒక వేటగాడివి కాలేవు" అని చెప్పేవాడు. "నీకు తెలియును, నీవు చాలా సున్నితమైన మనస్సు గలవాడవు" అని అనేవాడు. మరియు నన్ను బాధపెట్టుటకు అతను జింక యొక్క పిల్లలను చంపేవాడు.

83ఆ చిన్న పిల్లలను, వాటిని చంపుటను నేను ఇష్టపడను. అందుకే అతను అన్నాడు… ఒక జింకపిల్లను చంపవచ్చని చట్టము చెప్పినయెడల అది సరియే, అది సరియే, అయితే కేవలం తమాషా కొరకు వాటిని చంపవద్దు. అబ్రాహాము ఒక దూడను చంపెను, మరియు దేవుడు దానిని తినెను. అది సరియే, చూడండి, కావున జంతువు యొక్క పరిమాణము కాదు. అయితే కేవలము సరదా కొరకు దానిని చంపినయెడల; నా దృష్టిలో అది హత్యతో సమానము. ఆ చిన్న జింకపిల్ల బ్రతకవలెనని నేను తలంచుదును. అది నీకవసరమైనచో, ఫరవాలేదు, చట్టము చెప్పినయెడల దానిని తీసుకోండి, ఫరవాలేదు, అది సరియే. మీకు తెలుసు, నేను ఏడు సంవత్సరములు ఒక సంరక్షణ అధికారిగా పనిచేశాను. అది ఎప్పుడనగా, నేను బాప్టిస్టు సంఘములో పరిచర్య చేయునప్పుడు.

కావున పిదప ఈ వ్యక్తి, అతడు దాని విషయములో చాలా క్రూరుడైయుండెను, ఒక సంవత్సరము నేను అచ్చటికి వెళ్ళాను, మరియు అతను తనకొరకు ఒక చిన్న ఈలను తయారు చేసుకున్నాడు.

1SAM 12:3,4

 

84ఇప్పుడు నేను దానిని బాప్టిస్టు ప్రజలపై వేయడంలేదు, చూడండి. లేదు, చూడండి, నా భావం అది కాదు. నేను… నేను సేవను వదిలిపెట్టియుండలేదు. నేను పనిచేయదలంచాను కావున పనిచేసితిని. నేను ఈ సువార్త పనికి వెళ్ళనంత వరకు నేను ఎల్లప్పుడూ పనిచేశాను, మరియు అయిననూ నేను నా జీవితంలో ఎన్నడూ కానుకలు తీసికొనలేదు, చూడండి. అది వాస్తవము, చూశారా. అయితే నేను ఎన్నడూ ఏ వ్యక్తిని ఒక్క పైసా కూడా అడిగియుండలేదు. సమూయేలు వలె నిలబడి మాట్లాడే సమయమునకు త్వరలో నా జీవితం రావలెనని కోరుకొనుచున్నాను, అతను ఇట్లు చెప్పెను, "ప్రభువు పేరిట నేను మీతో చెప్పినది ఏదైనా నెరవేరకుండెనా? నేను మీ యొద్ద డబ్బునైనా, మీ సొమ్మునైనా తీసుకుంటినా?" చూడండి, అది వాస్తవము. "నీవు దేనినైననూ తీసికొనలేదు," అని వారు అనిరి. ఏదేమైనా కాని వారు రాజు కావలెనని కోరుకొనిరి, కావున తుదకు అదే వారు దారి తప్పుటకు కారణమైయుండవచ్చును, కావున సాధారణముగా అదే జరుగును.

85అయితే ఈ వ్యక్తి, నేను అతనిని ఇష్టపడితిని మరియు నేను ఒక శీతాకాలమున అచ్చటికి వెళ్ళియుంటిని, మరియు అతడు ఊదుటకు ఒక చిన్న ఈలను తయారుచేసుకొనెను, అది సరిగ్గా చిన్న జింకపిల్ల తన తల్లికొరకు అరచునట్లుగా ఉండెను. కావున ఇప్పుడతను చెప్పెను, "హే, బిల్లీ నేను నీకు ఒకదానిని చూపించగోరుచున్నాను." మరియు అతను ఊదుటకు ఈ చిన్న ఈలను అతడు కలిగియుండెను.

"నీవు అలాగు చేయకూడదు" అని నేను అన్నాను.

మరియు "ఓ, అక్కడే నీవున్నావు. నీవు ఎన్నడూ దానిని ఆధిగమించలేవు, అధిగమించగలవా?" అని అతనన్నాడు.

మరియు నేను, "లేదు, ఆయ్యా. ఆలాగని కాదు" అని అన్నాను.

కావున మేము వేటకు వెళ్ళియున్నాము, మరియు అప్పటికే అది వేట కాలమునకు ముగింపు సమయము. నేను రావలసియున్నది… మరియు ఇక్కడి వేటగాళ్ళు అయిన మీరందరు అక్కడి తెల్లతోక జింకలను ఎరిగియుందురు, కావున అవి భయపడినప్పుడు, వాటికి హుడినీ సైతం తప్పించుకోగల కళాకారుడేమీ కాదు. మరియు కావున అవి కాల్చబడ్డాయి. మరియు అక్కడ నేలపై చిన్న చిన్న మంచు కుప్పలు ఉండియున్నవి, చిన్న… దక్షిణాన మనము చిన్న దోనెలు అని పిలుచుకుందుము. నాలుగు లేదా ఐదు అంగుళములు మంచుతో, జాడ వెంబడించునంతగా చక్కగా ఉన్నది. మరియు మేము ఒక పూటంతా నడిచియుంటిమి, మరియు నేను ఇట్లు తలంచాను…

86వేడి చాక్లెట్ తో నిండిన ఒక చిన్న థెర్మాస్ సీసాను, అది మీకు శక్తినిచ్చును, మరియు ఒక సాండ్వీచ్ రొట్టెను మేము తీసుకు వెళ్ళాము. సాధారణముగా మేము వాటిని క్రింద అమర్చుకొనెదము. మరియు మేము ఆ కొండపైకి వెళ్ళిన తర్వాత, పిదప అతను ఒక వైపునకు మరియు నేను మరొక వైపునకు వెళ్ళేవారము, వచ్చిన పిదప అతడు ఆ రాత్రికి శిబిరము వేసుకొనేవాడు. కావున నేను అనుకొన్నాను… అప్పుడు దాదాపు పదకొండు గంటలయ్యింది, మరియు ఆ మంచు ఒడ్డునకు, ఒక చిన్న స్థలములో, ఈ గదికి రెండింతలున్న చోట అతను కూర్చుండెనని నేను తలంచాను. మరియు అతనక్కడ కూర్చున్నాడు. మేము మా మధ్యాహ్నం భోజనం చేయుదుమనుకొని, నా భోజనాన్ని బయటకు తీయుచుంటిని.

మరియు అతడు ఈ చిన్న ఈలను బయటకు తీసి, మరియు ఆ చిన్న ఈలను ఊదబోవుచుండెను. మరియు వేటకాలము కొనసాగుచునప్పుడు జింకలు చాలా భయపడుచుండును, అవి బ్రతుకుట కొరకు దట్టమైన పొదల చాటున అవి నివసించును. మరియు అతను ఈ చిన్న ఈలను ఊదెను. మరియు అతను అట్లు చేసినవెంటనే, ఆ దారిగుండా ఒక పెద్ద తల్లి జింక అచ్చట ఎదురుగా నిలబడెను. ఇప్పుడు 'డో' అనగా అది తల్లి జింక, మరి అది నిలబడియున్నది. మరియు నేను దానివైపు చూశాను. మరియు అక్కడ పెద్ద చెవులతో మరియు పెద్ద కండ్లతో అది అందముగా ఉన్నది, మరియు అది దాని బిడ్డ కొరకు చూచుచున్నది.

మరియు అతను నావైపు ఒక విధంగా చూసియున్నాడు. "నీవు అది

చేయకూడదు, బెర్ట్, నిశ్చయంగా నీవు అట్లు చేయకూడదు" అని నేను అనుకొన్నాను. కావున అతను తూటాను తుపాకీలోకి నెట్టివేసెను. మరియు అతను ప్రేల్చి చంపగలడు.

87మరియు నేను అతన్ని చూశాను, అతను మరలా దానిని ఊదెను. మరియు పగలు పదకొండు గంటల సమయములో ఆ తల్లి జింక నేరుగా బయటకు నడుచుకుంటూ వచ్చియున్నది. ఇప్పుడు, అది ఒక అసాధారణమైన విషయము. ప్రాముఖ్యంగా వేటాడే కాలములో పగటివేళ ఏమైయున్నప్పటికీ అవి అలాగు చేయవు. అది నడుచుకుంటూ అక్కడికి వచ్చియున్నది. ఎందుకొరకు? అది ఒక తల్లి గనుక దానిది తల్లి స్వభావమైయున్నది. తన హృదయపూర్వకంగా అది ఒక తల్లి, మరియు దాని బిడ్డ ప్రమాదములో ఉన్నది. మరియు అది ఈ తల్లి కొరకు అరుచుచున్నది, మరియు ఇది తన బిడ్డ కోసం చూచుచున్నది.

"నిశ్చయంగా నీవు తన బిడ్డ కొరకు చూచుచున్న ఆ తల్లి జింకను చంపేంత క్రూరుడవు కావు!" అని నేను అనుకొన్నాను. మరియు అతడు బల్లి కళ్ళు వేసుకొని, ఆ విధంగా నా వైపు చూసియుండెను. మరియు అతను ఆ తుపాకీని తీసుకొని మరియు తిన్నగా గురిపెట్టుకొనియుండెను. "ఓ, మై, నిశ్చయంగా అతడు దానిని చేయడు" అని నేను అనుకున్నాను. మరియు ఆ ధైర్యముగల తల్లి అచ్చటికి నడుచుకుంటూ వచ్చి, అచ్చట నిలబడెను!

88మరియు ఎప్పుడైతే బుల్లెట్టును గొట్టములోనికి బిగించుటకు ఆ బోల్టు తుపాకీలోనికి వెళ్ళినప్పుడు; బోల్టు వెళ్ళిన వెంటనే ఆ బోల్టు శబ్దమును ఆ జింక వినియున్నది, మరియు అది ప్రక్కకు తిరిగి మరియు అది వేటగాడిని చూసియున్నది. అతను దానిని కాల్చుటకు ఈ విధంగా తుపాకీని పైకెత్తినాడు, మరియు మై, అది నేరుగా దానియొక్క నమ్మకమైన హృదయమునకు గురి పెట్టబడినది! "ఆ పెద్ద 30.06, 180 గ్రెయిన్ బుల్లెట్, దాని గుండెను దానినుండి చీల్చివేయును" అని నేను తలంచాను. నేను ఇట్లు అనుకొన్నాను, "నీవు దానిని ఎలాగు చేయగలవు? ఒక తల్లి ఎదురుచూచుచుండగా… మరియు దాని బిడ్డవలె ఈలవేయుచు దానిని మోసము చేయుచున్నావు. మరియు దానిని బయటకు రప్పించి మరియు అప్పుడు దానిని కాల్చివేయుట, మరియు ఆ విధంగా ఒక నమ్మకమైన హృదయము అల్లాడుచుండగా, నీవెట్లు దానిని చేయగలవు? ఏమిటి, నీవు అంత కఠినంగా ఎట్లుండగలవు?" మరియు అతను దానివైపు గురిపెట్టుటను నేను చూశాను. మరియు ఆ జింక, సాధారణంగా పరిగెత్తుటకు బదులు, అక్కడే నిలుచునియుండెను. దానికి చనిపోవుదునన్న భయము లేకుండెను. దాని బిడ్డ ఆపదలో ఉన్నది.

ఇప్పుడు, చూడండి, అది వేషధారణ చేయుటలేదు. అది నటించుటలేదు. అక్కడ మరణం పొంచియున్నది, చూశారా. అయితే అది నిస్సహాయ స్థితిలో ఉండియున్నది, అది ఒక తల్లి. అది దాని స్వభావము, ఒక తల్లి; మరియు అది దాని యొక్క బిడ్డ కొరకై ఎదురు చూచుచున్నది. అది అరుచుచున్నది గనుక అది దాని బిడ్డ కొరకు ఎదురుచూచుచున్నది.

ISA 49:15,16

 

89అటువంటి సన్నివేశమును నేనెంతమాత్రము చూడలేకపోయాను. కావున నేను నా తలను తిప్పుకున్నాను. నేను ప్రార్ధించటం మొదలుపెట్టాను. నేను అన్నాను, "ప్రభువైన యేసు, అతడిని అట్లు చేయనీయకుము, అతడు అట్లు చేయుటకు అనుమతించకుము. అతడు దానిని ఎట్లు చేయగలడు? ఆ దీనమైన తల్లి అచ్చట నిలబడియుండెను మరియు అతడు దాని గుండెను పేల్చబోవుచున్నాడు." సరి, నేను వేచియున్నాను, మరియు ఆ తుపాకీ ఇక ప్రేలలేదు.

మరియు నేను చూచుటకై వెనుకకు తిరిగాను, మరియు తుపాకీ గొట్టం ఈ విధంగా పోవుచున్నది. అతడు దానిని ఎంతమాత్రం స్థిరంగా పట్టుకోలేకపోయెను. మరియు అతడు వెనుకకు తిరిగి, నా వైపు చూసెను, మరియు అతని చెంపల గుండా ఆ వాలిపోవు కండ్ల నుండి కన్నీళ్ళు కారుచుండెను. అతడు తుపాకీని పట్టుకొని మరియు దానిని నేలమీదికి విసిరికొట్టెను. మరియు ఆ మంచు కుప్ప మీద నా కాలు పట్టుకొని అతడిట్లు అన్నాడు, "బిల్లీ, నేనింతవరకు చేసింది చాలును. నేనింతవరకు చేసింది చాలును. నీవు మాట్లాడునట్టి ఆ యేసు నొద్దకు నన్ను నడిపించుము."

ఏమి జరిగినది? అతడు ఏదో వాస్తవమైనదానిని చూసియున్నాడు. అతడొక కల్పితము కాని దానిని చూసియుండెను, ఓ, మనము ఆ తల్లి జింకంత క్రైస్తవులమైనచో చాలును, చూశారా.

అయిననూ యేసు చెప్పెను, "తల్లి తన చంటిబిడ్డను మరచునా? అవును, ఆమె మరచును. కాని నేను నిన్ను మరువను. మీ పేర్లను నా అరచేతుల మీద చెక్కియున్నాను."

ఒక క్షణము మన శిరములు వంచెదము.

90మనము త్వరపడుచుండగా ఈ సమయములో, "దేవా ఆ జింక ఎంతటి ఒక మంచి తల్లియో, నన్ను ఆంతటి ఒక మంచి క్రైస్తవుడిగా, ఒక నిర్భయుడిగా ఉండునట్లు నన్ను చేయమని నేను ఇప్పుడు ప్రార్ధించుచున్నాను. నేను… ఆ తల్లి జింక తన బిడ్డను ఏ విధంగా ప్రేమించినదో, నేను కూడా ఆ విధంగా నిన్ను ప్రేమించగోరుచున్నాను" అని దైవిక ప్రసన్నతలోనున్న మీలో ఎంతమంది చెప్పుదురు? మీ చేయి పైకెత్తుడి, చెప్పుడి… దేవుడు మిమ్మును దీవించును, దేవుడు మిమ్మును దీవించును. అటువంటి ప్రేమను కలిగియుండుడి.

91మా పరలోకపు తండ్రీ, ఇక్కడ కూర్చున్న వారిలో, అటువంటి అనుభవమును పొందుకొనుటకు అనేకులు, అవును, వందలమంది తమ చేయి పైకెత్తిరి. ఆ జింక ఆ సాహసమును, ఆ మాతృత్వమును ప్రదర్శించుటకు కారణమేమనగా, అది ఒక తల్లియైయుండుటను బట్టియే. దానిది తల్లి స్వభావమైయుండెను. ఓ దేవా, మమ్మల్ని క్రైస్తవులనుగా చేయుము, క్రైస్తవ స్వభావమును దయచేయుము, ప్రభువా. ఏదో ఒక కల్పితమైనది, "నేను దీనికి లేదా దానికి చెందియున్నాను" అని చెప్పునది కాదు, కాని హృదయపూర్వకమైన క్రైస్తవులుగా మమ్ములను చేయుము. ప్రభువా, మా హృదయములో వాక్యమును మరియు ప్రేమను నాటుము, తద్వారా ఆ దినమున మాతృత్వము విషయములో ఆ తల్లి జింక చేసినట్లు మేమునూ క్రైస్తవ్యమును మరియు దైవిక ప్రేమను లోకమునకు ప్రదర్శింపగలిగెదము. దీనిని అనుగ్రహించుము తండ్రీ, తమ చేయి పైకెత్తిన ప్రతి ఒక్కరి కొరకు నేను ప్రార్ధించుచున్నాను. ఆ అనుభవము వారికి వచ్చును గాక.

PS 23:4•

HEB 13:8•

REV 1:18

 

92బహుశా ఇక్కడున్న కొందరికి కేవలం సంఘములో చేరుట తప్ప మరేమియూ తెలియకపోవచ్చును. వారు వాస్తవమైనదేదియూ చూచియుండలేదు. అయితే సాలొమోనుకంటే గొప్పవాడైన యేసే స్వయంగా ఇక్కడున్నాడు. ఆయన నిన్నా, నేడు, మరియు నిరంతరము ఒకటే రీతిగా ఉన్నాడు. ఈ రాత్రి ప్రార్ధనా వరుసలో వేచియున్న జనులు, దేవుని యొక్క ప్రేమను మరియు దేవుని యొక్క సత్యమును, ఆయన వాక్యమే సత్యమనియు, ఆయన మరణించియుండలేదని ప్రదర్శించబడుటను చూచెదరు గాక, ఆయన ఎప్పటికీ సజీవుడైయున్నాడు. మరియు దీనిని చూచుటలో, వారు వారియొక్క జీవితములను పూర్తిగా నీకు సమర్పించుకొని మరియు నీ పిల్లలుగా మారుదురు గాక; మరియు వారిని మరణము వరకు తీసుకువెళ్ళినా ఎటువంటి భయము లేకుండా వారి హృదయములలో ప్రేమను కలిగియుందురు గాక.

దావీదు చెప్పినట్లు, "గాఢాంధకార లోయలో నేను సంచరించిననూ, ఏ అపాయమునకు భయపడను." ఆ తల్లి జింక అడవిలో నుండి నడుచుకుంటూ బయటకు వచ్చి, నేరుగా మరణము యొక్క ఛాయలోనికి వచ్చినట్లే యున్నది. మరియు దావీదు చెప్పెను, "నేను గాఢాంధకార లోయలలో సంచరించెదను. నేను ఏ అపాయమునకు భయపడను, నీవు నాకు తోడైయున్నావు." దేవా, మేమందరమూ అట్లుండగోరుచున్నాము. ప్రభువా, దీనిని అనుగ్రహించండి. దీనిని యేసు నామములో అడుగుచున్నాను. ఆమేన్.

93ప్రభువు మిమ్మును ఆశీర్వదించును. చాలాసేపు మిమ్మల్ని ఉంచినందుకు నన్ను మన్నించండి. నేను మాటలాడుటను ఆపుట నాకు కష్టమేమో అనిపించినది. అయితే ఇప్పుడు రోగుల కొరకు ప్రార్ధించబోవుచున్నాము. కొద్ది నిమిషముల కొరకై మీరు ఉన్నచోటనే కూర్చునియుండుడి. ఈ రాత్రి ప్రార్ధనా వరస కొనసాగించెదనని నేను వాగ్దానము చేసియున్నాను. నేను దానిని చేయగోరుచున్నాను. దీనిని ఇంతకన్నా త్వరగా ముగించదలచామని నాకు తెలియును, అయితే నాకు తెలియును. మనము… మరియు అయ్యా, సంరక్షణాధికారి, మీ దయను బట్టి లైట్లను ఆపుచేయకుండా ఉంచినందుకు నేను నిశ్చయంగా మిమ్మును అభినందించుచున్నాను. దేవుని యొక్క వెలుగు మీకు లేనియెడల ఇప్పుడది మీ జీవితములో ప్రకాశించును గాక, అది మిమ్మును ఒక దినమున మహిమలోనికి తీసుకువెళ్ళను.

94ఇప్పుడు బిల్లీ ఎక్కడ? నీవు ఏ కార్డుల ఇచ్చియున్నావు? 'ఎ' లో ఒకటి నుండి వందవరకు, అది సరియే. మనము త్వరపడుచుండగా, వారు తీసుకొనెదరు. సాధారణముగా మనము వాటిని కలిపెదము, మరియు ఆ అబ్బాయి ప్రార్ధనా కార్డులను ఇచ్చేటప్పుడు, ఆయన మీ ఎదురుగానే వాటిని కలిపివేయును మరియు మీరు కోరినట్లు అతను మీకు ఒక ప్రార్ధనా కార్డును ఇచ్చును. కావున ఆ కార్డులన్నియూ కలపబడును, మరియు మేము ఎచ్చట నుండి పిలిచెదమో మాకు అస్సలు తెలియదు. ఇక్కడున్న చాలామంది మునుపటి కూటములకు హాజరైనవారైయున్నారు. అందును బట్టియే ఆ అబ్బాయి ప్రార్ధనా కార్డును అమ్మలేడు, ఒకసారి అట్లు చేయుచున్న అబ్బాయిని మేము పట్టుకున్నాము. మనమట్ల చేయకూడదు. అతనికి కూడా అమ్మకూడదని తెలియదు.

అతను చెప్పును, "మంచిది, నీవు ఈ కార్డుని ఇచ్చావు, నేను ఆ వరుసలోనికి వెళ్ళుదునా? అతనికి తెలియదు. మొదటిగా, అవ్వన్నియూ కలపబడినవి, మరియు అతను కేవలం మీకొక కార్డును ఇచ్చును. మరియు అప్పుడు అతనికి తెలియదు, మరియు మేము ఇక్కడికి వచ్చువరకు నాకునూ తెలియదు. సాధారణముగా నేను ఈ వరుసలో కొన్ని లెక్కించెదను, మరియు ఇంతమందికని వాటిని విభాగించెదను, మరియు ఏదో విధముగా దాని జవాబును పొందెదము, లేదా ఎక్కడినుండైనా మొదలుపెట్టెదము.

95అయితే ఈ రాత్రి మనము ఆవిధంగా చేయకుండా, ఒకటవ సంఖ్య నుండి ప్రారంభించెదము, ఎందుకనగా మనకు ఆలస్యమైనది, మరియు ప్రార్ధనా కార్డు… ఇప్పుడు నేను మీ అంకెను పిలువబోవుచుండగా, ఒక్కసారి లేచి నిలబడెదము. మీరు లేవలేని యెడల, మిమ్మును ఇక్కడికి తీసుకొని వచ్చుటకు ఎవరైనా మీకు సహాయపడెదరు.

ఇప్పుడు మీరు వ్యాధిగ్రస్తులైయుండియు, ఇక్కడున్న మీలో ఎంతమంది ప్రార్ధనా కార్డును పొందలేదు? కేవలం ప్రార్ధించండి. ప్రభువు మిమ్మును దీవించును గాక. అది మంచిది.

96ఇప్పుడు ప్రార్ధనా కార్డు నంబరు ఒకటి. అది ఎవరి వద్ద ఉన్నది? సరిగ్గా అక్కడ అమ్మా నీవు నేరుగా ఇచ్చటకు వచ్చెదవా? రెండవ సంఖ్య ప్రార్ధనా కార్డు 'ఎ' ఎవరి వద్ద ఉన్నది. సంఖ్యా… అది 'ఎ' నా? 'ఎ', రెండవ సంఖ్య ఎవరివద్ద రెండవ సంఖ్య ఉన్నది. ఇక్కడున్న ఆమె వద్ద, అమ్మా, నీవిచ్చటకు వచ్చెదవా? మూడవ సంఖ్య. నేరుగా ఇచ్చటకు రమ్ము. నాలుగు. అయ్యా, నేరుగా ఇచ్చటకు రమ్ము. అయిదు, ప్రార్ధనా కార్డు అయిదు ఎవరి వద్ద ఉన్నది, మీ చేయి ఎత్తగలరా? ఆ స్త్రీ వద్ద ఉన్నది. ఆరు. ఇది మిమ్మును ఒక పోటిపడే స్థలములో ఉండకుండునట్లు చేయునని మీకు తెలియును, ఎక్కడా… ఇది సంఘ. ఆరు, ఏడు. అది సరియే, సంఖ్య ఎనిమిది. అది సరియే, కేవలం మీ స్థానమును తీసుకొనుడి, ఎనిమిది [టేపుపై ఖాళీ ఉన్నది.] ఎనిమిది, తొమ్మిది, పదకొండు.

ఇప్పుడు నేను పదకొండ సంఖ్య గలవారిని చూడలేదు. అది ఎవరో చెవిటివారైయుండవచ్చును. మీరు మీ ప్రక్కవారి సంఖ్యను చూచెదరా? పదకొండు, అమ్మా, నీది పదకొండవ సంఖ్యనా? నీ చేయి ఎత్తైదవా? ఓ, ఆమె చెవిటిది, నేను చూచుచున్నాను. ఆమె పిలువబడినప్పుడు, మీరు ఆమె కార్డును చూడగలరు, చూడండి. అది సరియే, పదకొండు. నీవు పదకొండు నంబరు కలిగియున్నావా, పండ్రెండు. ప్రార్ధనా కార్డు పండెండు, ఇక్కడున్న స్త్రీ పదమూడు, ప్రార్ధనా కార్డు నెంబరు పదమూడు. పదమూడేన పదమూడు, పదమూడేనా? [ఒక సహోదరుడు, సహో! బ్రెన్హాంతో మాటలాడుచుండెను.] అది సరియే, అక్కడున్న ఆ స్త్రీని గమనించండి, చూడండి. నీలం రంగు టోపిని కలిగియున్న ఆ స్త్రీ, నీది పదమూ… పంన్నెండేనా, మరియు నీవు పదమూడవ నంబరును కలిగియున్నావు, నీది పదమూడేనా? నన్ను మన్నించండి. పద్నాలుగు. అది సరియే. పదిహేను, చూడండి మనము వరుసలు ఇరుకుగా చేయుచున్నాము గనుక ఇప్పటికి ఇన్ని నంబర్లు సరిపోవునని నేను నమ్ముచున్నాను.

HEB 13:8

 

97ఇప్పుడు మిగతావారు, ప్రార్ధనా కార్డు లేనివారు. ఇక్కడకి మొదటిసారిగా ఉండుట మాకు సంతోషముగానున్నది. ఇదివరకు జరిగిన కూటములలో మీరున్నారా? కూటములో మీరున్నయెడల, మీ చేయిపైకెత్తండి. అది సరియే.

ఇప్పుడు, మేము స్వస్థతనిచ్చేవాళ్ళము అని చెప్పుకొనువారము కాదని అందరికీ తెలియును. మేము జనులను స్వస్థపరచలేము. దానిని యేసు ఇదివరకే చేసియున్నాడు. అయితే ఆయన నిన్నా, నేడు, మరియు నిరంతరం ఒక్కటేరీతిగా ఉన్నాడనే మేము చెప్పుచున్నాము. మరియు ఆయన మన మధ్యలో ఉన్నాడని, అనగా యేసు ఇక్కడ ఉన్నాడని గుర్తించినచో చాలును! ఆయన ఇచ్చట నిలబడినయెడల, మరియు మీరాయనను మీ కళ్ళతో చూసినయెడల, అది మీకు విశ్వాసమునిచ్చునా? నిశ్చయంగా, అయితే, మీరు చూడండి, ఆయన అట్లు చేయడు. ఆయన వచ్చాడంటే, ఇక అప్పుడు సమయం అయిపోయినట్టే; అప్పుడు ఆయన మన కొరకు వచ్చును. అయితే పరిశుద్దాత్మయను వ్యక్తి…

ఇప్పుడు, తమ చేతులలో మేకుల గాయములతో మరియు తలపై ముండ్లతో ఎవరైనా మన మధ్యకు రావచ్చు. అది కేవలం అనుకరణ మాత్రమే. అతను అనుకరించువాడైయుండును. దానిని ఎవరైనా చేయగలరు. అయితే అందులోనూ, అది గనుక క్రీస్తు యొక్క జీవితమును ఉత్పత్తి చేయనియెడల, అది క్రీసు కాకుండును, చూశారా. లేదండి, ఇవ్పుడది క్రీసు యొక్క జీవమైయుండవలసియున్నది.

MARK 9:23,24•

HEB 4:15

 

98మరియు బైబిల్ చెప్పెను, "ఆయన మన బలహీనతలయందు మనతో సహానుభవము కలిగిన ప్రధానయాజకుడైయుండెను." ఇప్పుడు ప్రార్ధనా కార్డులు లేనివారైన ప్రజలు, ఇప్పుడు కేవలము ఒక విషయాన్ని తీసుకుందాము, మరియు ఇప్పుడు మనము ప్రార్దించుచుండగా, మీరు కేవలము, "ఓ, గొప్ప ప్రధానయజకుడైన, యేసుక్రీస్తు, నా ప్రభువా, మరియు నా రక్షకుడా!" అని చెప్పండి. మీ జేవితములో ఏదైనా పాపమున్నయెడల, దానిని ఒప్పుకొనుడి, దానిని తొలగించుకొనుడి.

మరియు ప్రార్ధనా వరుసలో ఉన్న మీరు, అదేరీతిగా చేయుడి, ఎందుకనగా అది నేరుగా ఇచ్చట చెప్పబడునని బాగా నిశ్చయత కలిగియుండుడి, చూశారా. మీలో ఏదైనా తప్పిదము ఉన్నయెడల, అది ఇక్కడ వేదిక మీద బహిరంగంగా చెప్పబడకూడదని మీరు కోరినయెడల, పార్ధనా వరుసనుండి ప్రక్కకు తొలగుడి. ఎందుకనగా ఎంతమందికి అది తెలియును? అవునండీ, అది ఇక్కడ బహిరంగంగా చెప్పబడుతుంది. కావున దానిని రక్తము క్రిందికి తీసుకు రండి, చూడండి, కావున, మరియు కేవలం ఇట్లు చెప్పుడి, "నా పాపము విషయమై నన్ను క్షమించుము, మరియు నేను నిన్ను నమ్మునట్లు నాకు సహాయము చేయుము. మరియు ప్రభువా నేను రోగినైయున్నాను, మరియు నీ మహిమార్ధమై నేను స్వస్థపడగోరుచున్నాను." "చూడండి, కేవలం స్వస్థత నిమిత్తం దేవుడు మిమ్మును స్వస్థపరచడు, చూశారా. లేదండి. ఆయన దానిని దేవుని యొక్క మహిమార్థమై చేయును. మరియు మనము మనయొక్క పాపములను మరియు మన అవిశ్వాసమును ఒప్పుకొనవలసియున్నాము.

మరియు మూర్చరోగియైన పిల్లవాడిని తీసుకు వచ్చిన తండ్రివైపు చూడుడి, శిష్యులు వానిని బాగుచేయలేకపోయిరి. యేసు ఇట్లు చెప్పెను, "నీవు నమ్మినయెడల, నేను స్వస్థపరుచుదును."

అతడిట్లనెను, "ప్రభువా, నేను నమ్ముదును! నాలో అపనమ్మకముండకుండా సహాయము చేయుము," చూశారా. అతను అవసరతలో ఉన్నాడు గనుక బిగ్గరగా కేకవేసెను.

HEB 13:8

 

99ఇప్పుడు అక్కడున్న మీరు, దేవునికి ప్రార్ధన చేయుచూ మరియు చెప్పుడి, "దేవా, బ్రెన్హాం సహోదరుడికి నేను ఎవరో తెలియదు. అతడు నన్ను ఎరగడు. అయితే నీవు ఎరుగుదువని నాకు తెలియును, కావున నన్ను నీ వస్త్రమును తాకనిమ్ము, నీవు ప్రధానయాడకుడవు గనుక నన్ను నీ వస్త్రమును తాకనిమ్ము మరియు అట్లైనచో భూమిపైన మీ వస్త్రమును తాకిన స్త్రీతో మీరు చెప్పినట్లే, సహోదరుడు బ్రెన్హాం ద్వారా మాటలాడి చెప్పుము. నీవు మా బలహీనతలయందు మాతో సహానుభవము గల ప్రధానయాజకుడవైయుండి - నిన్నా, నేడు, మరియు నిరంతరము ఒకటేరీతిగా ఉన్నాడు గనుక, ఆయన అదే రీతిగా ప్రవర్తించవలసియున్నది."

ఆ దినమున ఆ స్త్రీ ఆయనను తాకి, మరియు వెళ్ళి కూర్చుండినప్పుడు ఎంతమంది విశ్వసించియుందురని, మీకనిపించుచున్నది? అక్కడున్న ప్రజలను అది ప్రభావితం చేసియున్నదని మీరు తలంచుచున్నారా? చూడండి, బహుశా అది చేసియుండవచ్చును. మంచిది, అది చేసియుండును. ఎందువలన, ఈ దినపు అన్యజనులమైన మనము, యేసుకు అంతే వందనస్తులమైయున్నాము. మనము ఎంతగానో కృతజ్ఞులమై యుండవలసియున్నది, చూశారా.

MATT 9:22•

MARK 5:30•

LUKE 8:45,46,48•

HEB 4:15

 

100మరియు ఈ స్త్రీ ఆయనను తాకియున్నది, ఆమె వెళ్ళి మరియు కూర్చుండియున్నది. యేసు చెప్పెను, "ఒక్క క్షణము. నన్ను ముట్టినదెవరు? నన్ను మట్టినదెవరు?"

పేతురు ఆయనతో ఇట్లనెను, "ప్రభువా," ఇంకోమాటలో చెప్పాలంటే, "నీవు అట్లు చెప్పుట పిచ్చితనము కాదా. ఎందుకనగా, నిన్ను ఒక ప్రవక్తగా ప్రజలు భావించుచున్నారు. ప్రతి ఒక్కరు నిన్ను ముట్టుకొనుచుండగా, 'ఎవరో నన్ను మట్టిరి,' అని నీవేల చెప్పుచున్నావు?"

ఆయన చెప్పెను, "అవును, కాకపోతే ఇది ఒక భిన్నమైన స్పర్శ, చూశారా. చూడండి, నాలో నుండి ప్రభావము, శక్తియు బయలు వెళ్ళెను."

మరియు ఆయన చుట్టూ చూచి ఆ స్త్రీని కనుగొనెను, ఆమెకు రక్తస్రావ రోగమున్నదని ఆమెతో చెప్పెను. మరియు ఆయన, "నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచెను అని చెప్పెను గనుక అది నిలిచిపోయెనని ఆమె తన స్వంత దేహములో అనుభూతి చెందెను," చూశారా.

ఇప్పుడు ఆయన అదే ప్రధానయాజకుడైయుండెను. మరియు ఇప్పుడు మీరాయనను త్రాకితే చాలును!

101ఇప్పుడు, నన్ను తాకుటవలన ప్రయోజనమేమియు ఉండదు. నేను మీ భర్త, సహోదరుడు, మీ తండ్రివలె నేను యున్నాను, చూడండి. పాస్టర్లలో ఒకరిని ముట్టుట కూడా అట్లేయుండును, చూశారా. అయితే ఆయనను తాకుడి, ఆయనను మాత్రమే. నేను మిమ్మును ఎరుగను. నాకు మీ గురించి ఏమియూ తెలియదు. నేను మిమ్ములను స్వస్థపరచలేను. నేను చేయగలిగినయెడల, నేను నిశ్చయంగా దానిని చేసెదను; అయితే నేను చేయలేను. ఆయన ఇదివరకే చేసియున్నదానిని నేను చేయలేను.

ఇప్పుడు ఆయన ఇచ్చట నిలబడినయెడల, ఆయన కేవలం మీ మధ్యనున్నాడు అని మీకు తెలియజేసుకొనును. కేవలం దానిగూర్చి ఆలోచన చేయుడి. ఇప్పుడు మనము ఒకదాని కొరకు కనిపెట్టుకొనియున్నామని మనందరికీ తెలియును. దానిని మనము అనుభూతిచెందగలము.

ఇప్పుడు, ఒక సరియైనది మరియు తప్పైనది కలదు. "మంచిది, ఇదే!సరియైన దారి" అని చెప్పుటకు నిర్దేశించే అనేక విధములైన మార్గములు కలవు. అయితే ఎక్కడో సరియైన మార్గము ఉండియుండవలసియున్నది.

MATT 18:20

 

102మరియు తీర్పునందు మిమ్ములను తీర్పు తీర్చు అదే దేవుడు సరిగ్గా ఇచ్చటికి వచ్చి మీ మధ్యలో మీతో ఇచ్చట నిలబడియుండుటను తలంచుచుండగా! "నా నామమున ఇద్దరు లేదా ముగ్గురు కూడియుండిన చోట నేనుండియున్నాను. చూడండి, నేను ఒకప్పుడు చేసిన క్రియలు," ఆయన మరలా దానిని చేయును. ఆయన దానిని చేయుదునని వాగ్దానము చేసియున్నాడు. "యెరూషలేము, యూదయా, న్యూయార్క్ పట్టణము, చూడండి, ప్రపంచమంతా మీరు నాకు సాక్షులైయున్నారు."

మరియు మీరు నిశ్శబ్దముగా యండి, మరియు మీరు ప్రార్ధన చేయుడి. మీ హృదయమంతటితో నమ్మికయుంచుడి. సందేహపడకుడి, కేవలం మీలో ఉన్నదానంతటితో విశ్వాసముంచుడి, (ప్రాణము, ఆత్మ, మరియు శరీరముతో విశ్వసించుడి) మరియు దేవుడు దానిని మీకు అనుగ్రహించును.

ఇప్పుడు ఒక్క క్షణం మన శిరములు వంచెదము.

MATT 9:38•

LUKE 10:2•

ACTS 1:8

 

103వాస్తవమని రుజువు చేయనంతవరకు ఈ రాత్రి ఇక్కడ నిలబడియుండి నేను చెప్పినదంతయూ లెక్కలోనికి రాదు. మేము ఎంతో వినియున్నాము మరియు జనులు ఎంతో వినియున్నారు. ఇప్పుడు తండ్రి, నీయొద్ద నుండి వచ్చు ఒక్క మాట, దానంతటినీ వాస్తవము చేయును. మరియు మేము దాని కొరకు చూచుచున్నాము.

ఇప్పుడు, నీవు మానవ పెదవుల ద్వారా మాత్రమే మాటలాడెదవని మేము ఎరిగియున్నాము. నీవు మానవున్ని నీకు ప్రతినిధిగా చేసుకొనియున్నావు. ఒక దినమున నీవు నిలుచుని, పంటవైపు చూసి మరియు చెప్పావు, "అది పరిపక్వమైనది," "తన కోతకు పనివారిని పంపమని కోత యజమానుని వేడుకొనుడి," అని చెప్పితివి, మరియు ప్రభువా నీవే కోత యజమానుడవైయున్నావు. నీవు మరియు మానవుడు ఒక్కటిగా, నీవు దానికి వేరుగా ఏమియు చేయవన్నంతగా నీవు నీ ప్రణాళికను ముడివేసియున్నావు.

దేవా, ఇప్పుడు నేను ప్రార్ధించుచున్నాను. మరియు నీవు నన్ను మాత్రమే అభిషేకించి మరియు నమ్మునట్లుగా ఈ జనులను అభిషేకించనియెడల, అది ఏ మంచియు చేయదు. మేము సహోదరులుగా మరియు సహోదరీలుగా కలిసి ఒకటిగా ఉండవలసియున్నది. దేవా, నిత్యత్వమునకు ఈవలవైపు మరలా, మరలా మేము సొలోమోను కంటే గొప్పవాడైన, మహిమకరమైన యేసును చూచునట్లు మమ్మల్ని ఏకముగా అభిషేకించెదవని నేను ప్రార్ధించుచున్నాను. ఆమేన్.

104ఇప్పుడు మీరు ఎంతో వినయముగా ఉండుటను కోరుచున్నాను. [పియానిస్ట్ కేవలం నమ్ముము అను పాటను వాయించుటకు మొదలుపెట్టెను.]

ఒక దినమున, నేను మరణించినయెడల, వారు నన్ను సమాధిలో పెట్టునప్పుడు, వారు దానిని వాయించెదరని మీకు తెలియును. నేను పోయానని మీరు వినినప్పుడు, నేను మరణించానని మీరు నమ్మకుడి. నేను కాదు. అయితే మీరు రేడియోలో లేదా ఎక్కడైనా దానిని వినినయెడల, పత్రికలో దానిని చదివినయెడల, ఎక్కడైనా నిలువబడి, కేవలం ఆ పాటను పాడుడి (పాడుతారు కదా?) మరియు కేవలం గుర్తుంచుకొనుడి అంతే, "కేవలం నమ్ముము."

105ఇప్పుడు, జనులలో, ఆ వరుసలో నాకు తెలిసిన వ్యక్తి ఒకరైనా లేరు. ఆ వరుసలో ప్రతీఒక్కరూ నాకు అపరిచితులైనయెడల, అప్పుడు మీ గురించియైనా మీ సమస్య గురించియైనా నాకేమియూ తెలియదని మీరెరుగుదురు. మీరు కేవలం మీ చేతులు పైకెత్తి దానిని చెప్పుడి. ఇప్పుడు బహుశా మీరు వ్యాధిగ్రస్తులైయుండవచ్చును; బహుశా వారు కాకపోవచ్చును. నాకు తెలియదు. బహుశా ఆర్థిక ఇబ్బందులైనా, కుటుంబ సమస్యలైనా అయి యైయుండవచ్చును. నాకు తెలియదు.

అయితే ఇప్పుడు ఆ స్త్రీ కొద్దిగా దగ్గరకు వచ్చినయెడల, చూడండి. వందనములు, అది సరియే. ఇప్పుడు నాకంటే చాలా తక్కువ వయసులో ఉన్న స్త్రీ ఇచ్చట ఉన్నది. బహుశా మేము మైళ్ళ దూరంలో సంవత్సరాల వ్యత్యాసంలో జన్మించియున్నాము. ఇది మేము మొదటిసారి కలుసుకొనుట. ఇప్పుడు ఒక కారణము బట్టి ఆమె ఇచ్చట ఉన్నది. నాకు తెలియదు. ఆమె, రోగముతో ఉండియుండవచ్చును. ఆమె సమస్య ఏమిటో నాకు తెలియదు. ఆమె సమస్య ఏదైయున్నప్పటికినీ, అది దేవునికి తెలియును. మరియు ఆయన బయలుపరచినయెడల, అప్పుడు అది నిజమా, కాదా అని ఆమెకు తెలియును.

MARK 16:18

 

106ఇప్పుడా స్త్రీ ఇట్లు చెప్పినయెడల, "సహోదరుడా బ్రెన్హాం, నేను భయంకరమైన వ్యాధితో ఉన్నాను. నా ఉదరములో నేను ఎంతో బాధపడుచున్నాను. నాకు మూర్చ వ్యాధి లేదా అటువంటిదేదో ఉన్నది." ఆమె చూచుటకు ఆరోగ్యకరమైన వ్యక్తిలా అగపడుచున్నది, కావున మీరు ఎల్లప్పుడూ దానినిబట్టి గ్రహించలేరు.

మరియు ఆమె అట్లు చెప్పినయెడల, నేను ఇట్లు చెప్పుదును. "మంచిది, రోగులపై చేతులుంచుడి, అని పరిశుద్ధ గ్రంధం చెప్పుచున్నది." సహోదరుడు రాబర్ట్స్, సహెదరుడు హెలెన్ మరియు అనేక వ్యక్తులు ఆమె కొరకు ప్రార్ధించు విధానం అదే. అది వారియొక్క పరిచర్య. వారు వారిపై చేతులుంచి, "సాతానా, యేసు నామములో ఆమెను వదిలిపొమ్ము. సాతానా నేను నిన్ను గద్దించుచున్నాను" అని చెప్పుదురు. లేదా "ఇప్పుడు నీవు వెళ్ళుము, నీవు స్వస్థపరచబడినావు," అని అటువంటిదేదో చెప్పుదురు. ఆమె దానిని నమ్మవలసియున్నది. చూడండి, అది బాగుగానేయుండును.

107మంచిది, ఇప్పుడు ఒకవేళ ఆమెలో ఎక్కడైనా పాపము దాగియున్నయెడల అప్పుడు పరిస్థితి ఏమిటి? మీరు ఆమెపై కొన్ని లీటర్ల నూనె పోయగలరు, అనేకసార్లు ఆమెను అభిషేకించగలరు, పైకి క్రిందికి దుమికి మరియు కేకలు పెట్టగలరు; ఆ దయ్యము ఇంకనూ అచ్చటే ఉండును. ఒప్పుకొనబడని పాపము. మీరు వాడిని కదల్చలేరు, లేదండి.

అయితే ఇప్పుడు, పరిశుద్దాత్మ వచ్చి మరియు జరిగినదేదైనా ఆమెతో చెప్పినయెడల, అది నిజమా, కాదా అని ఆమెకు తెలియును, మరియు అప్పుడు ఏమి జరగబోవుచున్నదో ఆమెకు చెప్చును. "ఏమి జరిగినోయనునది? వాస్తవమైనయెడల, ఏమి జరగబోవుచున్నదో కూడా వాస్తవమైయుండును." అది నిజము కాదా? ఇప్పుడది ఆయన వాగ్ధానము చేసినట్లు ఈ అంత్యదినములలో తన వధువును తెచ్చుటకు ప్రయత్నించుచున్న మన ప్రభువు యొక్క మంచితము, మీరు చూడండి. ఆయన అటువంటి కార్యమును చేసినయెడల ఎంతమంది మీ హృదయమంతటితో ఆయనను నమ్మెదరు? మీ విశ్వసనీయతను బట్టి దేవుడు మిమ్మును దీవించును. ఇప్పుడు ఇది ఒక… మీరు చదవగోరినయెడల, నేను మిమ్మల్ని అడుగుచున్నాను, నేను లేఖనములో లేనిది చెప్పినట్టు మీరు కనుగొనినయెడల, అటువంటిది నాతో చెప్పండి, చూశారా. నాకు ఉత్తరము వ్రాయండి, లేదా సంఘ కాపరులలో ఎవరికైనా చెప్పండి. మరియు నేను ఎక్కడ తప్పైయున్నానో నాతో చెప్పండి. నేను తప్పిదమైన దానివైపు ఉండగోరుటలేదు. నిజమైనదానివైపు నేను ఉండగోరుచున్నాను, మరియు అది వాక్యప్రకారముగా ఉండవలసియున్నది.

MATT 10:25•

MATT 12:24•

MARK 3:22•

LUKE 11:15•

HEB 13:8

 

108ఇప్పుడు, కేవలం ఒక చిన్న విషయమును తీసుకొనెదము, ఖచ్చితంగా మరలా యోహాను సువార్త 4వ అధ్యాయమును తీసుకొందాము. మన ప్రభువు మరియు సమరయ స్త్రీ వలె ఇక్కడ కూడా ఒక పురుషుడు మరియు ఒక స్త్రీ మొదటి సారిగా కలుసుకొనుచున్నారు. వారు మొదటిసారిగా కలుసుకొనిరి, మరియు యేసు ఆమెతో ఆమె సమస్య ఏమిటో కనుగొనువరకు ఆమెతో కొద్దిసేపు మాట్లాడెను. ఆమె సమస్య ఏదనగా, ఆమె ఒక అనైతికమైన స్త్రీ. మరియు ఆయన ఆమె సమస్య ఏమిటో ఆమెతో చెప్పెను, మరియు వెంటనే ఆయన ఒక ప్రవక్తయైయుండునని ఆమె గుర్తించినది. "అయ్యా, నీవు ఒక ప్రవక్తవని నేను గ్రహించుచున్నాను" అని ఆమె చెప్పెను. "మెస్సయ్యా వచ్చునని మాకు తెలియును. ఆయన వచ్చినప్పుడు, ఆయన చేయునది ఇదే," అని అనెను.

"నేనే ఆయనను," అని యేసు చెప్పెను, చూశారా.

ఇప్పుడు, ఆయన నిన్న తన ప్రజలకు తనను గుర్తింపజేసుకున్న విధానము అదైనయెడల ఆయన, ఈ దినమునకునూ అదే రీతిగా ఉన్నచో, ఆయన అదే విధముగా తననుతాను గుర్తింపజేసుకొనవలసియున్నది. ఇప్పుడు, పరిశుద్దాత్మ దానిని ఆమెతో చెప్పినయెడల, అప్పుడు అది ఒక ఆత్మీయ సాధనము నుండి మాత్రమే రావలసియున్నదని ఆమెకు తెలియును. అది ఒక ప్రకృతి సంబంధమైనదాని నుండి రాదు. ఒక ఆత్మీయ సాధనమైయున్నది! ఇప్పుడామె పరిసయ్యులవలె, ''అది బయెల్జేబూబు," అని చెప్పవచ్చును, అప్పుడది ఆమెకే వదిలిపెట్టబడును. "అది క్రీస్తు" అని ఆమె చెప్పినయెడల, అప్పుడది మరల ఆమెకు మరియు క్రీస్తుకు మధ్య ఉండును, చూడండి, అది ఏమైనప్పటికి.

JOHN 4:19,25,26

 

109ఇప్పుడు నిజంగా భక్తిగౌరవముతో ఉండుడి. నేను ఒక క్షణం ఆ అభిషేకం కొరకు వేచియున్నాను. నేను దాని కొరకే నిలిచియున్నాను, చూడండి. ఎందుకనగా అది అసలు రాకపోవచ్చును కూడా, అది రానియెడల అప్పుడు మన తలలు వంచి, ప్రార్ధించి మరియు జనులను పంపివేయుదుము, మరియు రేపు రాత్రి తిరిగి వచ్చి ఆయనను అడిగెదము. ఒక వేళ ఆయన… ఆయన ఇంతవరకు నన్ను ఎన్నడూ విఫలమవనివ్వలేదు. ఇప్పుడు, వందల వేలమంది ఎదుట ఒక్కసారైనా ఆయన నన్ను విఫలమవనివ్వలేదు. మరియు ఇప్పుడు కూడా అట్లు కానివ్వడు. అట్లు కానివ్వడని నాకు తెలియును. అట్లు కానివ్వడని నేనెరుగుదును. ఆయన ఎంతమాత్రము అట్లు కానివ్వడని నేనెరుగుదును.

కావున, చూడండి, ముగించు సమయమైపోయినదని నా మనసులో ఉన్నది, మీరు నిరుత్సాహంతో ఉండినయెడల పరిశుద్దాత్మ మీ ద్వారా క్రియ చేయకుండును; మీరు స్థిరంగా ఉండవలెను. ఇప్పుడు ఈ రాత్రికి మీకు అదనపు ఖర్చయినచో దానిని నేను చెల్లించెదను, చూడండి. అదంతే. సాతానా, నీవు మమ్మును ఆ విధంగా మోసగించలేవు.

JOHN 4:4

 

110యేసుక్రీస్తు నామమున, అధికారముతో నేను ఇక్కడున్న ప్రతీ ఆత్మను గద్దించుచున్నాను. ఇప్పుడే…

నేను ఆ స్త్రీతో మాటలాడెదను. ఇప్పుడు పరిశుద్ధాత్మ గనుక, సహోదరీ, కేవలం…

యేసు ఆమె ఆత్మను సంధించుటకు, చూడండి, తప్పిదము ఏమైయున్నదని చూచుటకు ఒక క్షణం ఆ స్త్రీతో మాటలాడెను. ఆయన చేసినది అదేయని నేను నమ్ముచున్నాను. తండ్రి ఆయనను అచ్చటికి పంపెను మరియు ఆయన సమరయుగుండా వెళ్ళవలసియుండెను. అయితే ఆయన అచ్చటికి వచ్చినప్పుడు, ఆయనకి తెలిసినది అదే, ఆయన అచ్చటకు వెళ్ళియుండెను. అంతలో ఆ స్త్రీ వచ్చెను, అది ఆ సమయమేనని ఆయన ఎరిగియుండెను.

111ఇప్పుడు తండ్రి నన్ను ఇచ్చటికి పంపియన్నాడు. ఇచ్చట న్యూయార్క్ లో నేను ఉండియున్నాను; మరియు ఈ రాత్రి వేదికపై మొదటి వ్యక్తిగా నీవిచ్చటనున్నావు. నేనెరుగను, కాని ఆయన దానిని నాకు బయలుపరచును. ఆయన చేసినయెడల, అది నిన్ను హృదయపూర్వకంగా ఆయనను నమ్మునట్లు చేయునా? నీవు అంగీకరించెదవా? అది వాస్తవమో, కాదో నీవు తెలుసుకొనెదవు, చూడుము. నిన్ను ఎరిగియున్నవాడినా, నీకు అపరిచితుడనా అనునది కాదు; కాని, నీ సమస్య గురించి, నీవేమి… నీకు అనేక సమస్యలుండియున్నవి. అయితే నీవు ప్రార్థనను కోరుచున్న నీ ముఖ్యమైన సమస్య ఏదనగా, అది నీ గొంతులో ఉన్నది. నీకు గొంతు సమస్య ఉన్నది. అది నిజమేనా? నీ చేయి పైకెత్తుము. దానిని మీరు నమ్ముచున్నారా? ఒక్క క్షణము. ఇప్పుడు, అది బాగవును.

మీరు చెప్పుదురు, "సహోదరుడా బ్రెన్హాం, నీవు దానిని ఊహించియుండవచ్చును." లేదండి. కానే కాదు. "దానిని ఆయన ఊహించి చెప్పాడు," అనునది ప్రజల నుండి ఎల్లప్పుడూ వచ్చుటను నేను గ్రహించాను.

112ఇప్పుడు ఒక క్షణము, ఆమెతో మాత్రమే మాటలాడుదము. ఏదో జరుగుచున్నదని మీరు బాగా ఎరిగియున్నారు, చూడండి.

ఇప్పుడు జనులలో ఎంతమంది ప్రభువు యొక్క దూత పఠమును, ఆ వెలుగును చూసియున్నారు? అది వాషింగ్టన్, డి.సిలో వ్రేలాడుచున్నది. చూడండి, అది ఇప్పుడు సరిగ్గా ఆమె ప్రక్కనే వ్రేలాడుచున్నది. మీరు దానిని చూడలేరా? అట్లు అగుపించును… సరే, మంచిది, ఇప్పుడు అభిషేకము ఇచ్చటనున్నది. నేను దానిని చూడగలుగుచున్నాను, చూడండి. అది సరిగ్గా ఆమెపైయున్నది.

అవునండి, అది ఇచ్చటనున్నది. ఆమె, అవును, ఆమె సమస్య ఆమె గొంతులో ఉన్నది. ఆమె విచారపడినది. మరియు, సరి, ఆమెకు గొంతులో కణితి ఉన్నది. అది ఖచ్చితముగా వాస్తవము. అంతమాత్రమే కాదు, నిన్ను బాధపెట్టే థైరాయిడ్ సమస్య కూడా నీవు కలిగియున్నావు. అది నిజమేనా?చూశారా? అది సరియే. యేసుక్రీస్తే ఇచ్చట నిలబడియుండి నిన్ను మరియు దానంతటిని గూర్చి ఎరిగియున్నాడని ఇప్పుడు నీవు నమ్ముచున్నావా? నిన్ను స్వస్థపరచువాడు ఆయనేయని నీవు అంగీకరించుచున్నావా? [ఆ సహోదరి, "అవును" అని చెప్పుచున్నది.] ప్రభువు నామములో వెళ్ళి, క్షేమంగా ఉండుము.

కేవలం చూడండి. ఆయన సమస్తమును ఎరిగియున్నాడు.

113ఎలా ఉన్నావు, యవ్వనస్తురాలా? ఇప్పుడు నీవు కొద్దిగా విస్మయమొందియున్నావు, నీవు చూడుము, ఏలయనగా ఆ స్త్రీ వచ్చిన వెంటనే, ఆ వెలుగు ఆమె పైకి వచ్చియున్నది, చూశారా. మరియు ఆమెకు తెలిసే యున్నది. ఇప్పుడు చూడండి. ఆ స్త్రీని నేనెరుగను. నాకు ఆమె గూర్చి ఏమియు తెలియదు. అయితే ఆమె కేవలం ఒక యవ్వనస్తురాలిగా అచ్చట నిలబడియున్నది. మరియు ఇప్పుడు దేవునియొద్ద నీవు కోరినదేదో పరిశుద్దాత్మ నాకు బయలుపరిచినయెడల చాలును! నీవు ఒక క్రైస్తవురాలివి, చూడుము. మరియు నీవు కానిచో ఇప్పుడు, ఆయన దానిని నాకు తెలియజేయును, చూడుము. అయితే నీవు ఒక క్రైస్తవురాలివి, ఒక నిజమైన క్రైస్తవురాలివని నా భావము. మరియు ఆయన వద్ద నీ కోరికలు ఏమిటన్నవి ఆయన నాకు బయలుపరిచినయెడల, నేనాయన ప్రవక్తనని లేదా సేవకుడినని నీవు నమ్ముదువా? నేను దీనిని చెప్పవలసియున్నది, చూడుము ఆ సమయము వచ్చును, చూడుము. నీవు నమ్ముదువా? నేను నీకు ఒక అపరిచితుడనని నీకు తెలియును.

ఇప్పుడు, నీవు నిజముగా ఇచ్చట నీ కొరకు ఉండియుండ లేదు, నేను ఒక స్త్రీని, ఒక వృద్ధురాలిని చూచుచున్నాను, నిజము, ఆమె నీ తల్లి. [ఆ సహోదరి "అవును!" అని చెప్పుచున్నది.] ఓ, మరియు ఆమె ఇచ్చటలేదు. మరియు ఆమె విషయమై నీవు ఎంతగానో కృంగియున్నావు. ఆమె కూడా క్యాన్సర్ తో బాధపడుచున్నది మరియు నీవు ఆమె పరిస్థితిని బట్టి ఆశ్చర్యపోవుచున్నావు. యవ్వనస్తురాలా, అది చేయునది పరిశుద్దాత్మయేనని నీవు నమ్ముచున్నావా? ఇప్పుడు నీ పర్సులో నుండి చేతిరుమాలు తీసుకొని ఇంటికి వెళ్ళుము. నీవు నీ తల్లిని చూసినప్పుడు, లేదా దానిని ఆమెకి పంపుము, మరియు ఆమెపై పెట్టుము లేదా ఈ రాత్రి ప్రార్ధనకి ఒక స్మారకముగా ఆ చేతిరుమాలు ఆమెకి పంపుము, మరియు నీ హృదయములో సందేహింపకుము. అయితే నమ్ముము యేసు… అవును, మరియు చీకటి ఆమెను విడిచిపెట్టును, మరియు ఆమె… నీవు బాగవుదువు. ఇప్పుడు వెళ్ళుము, మరియు ప్రభువు నిన్ను దీవించును. నా సహోదరి, దేవుడు నిన్ను దీవించును.

మీ హృదయమంతటితో మీరు విశ్వసించెదరా? ఇప్పుడు, ఎంతమాత్రమూ సందేహించకుడి, కేవలం విశ్వాసముంచుడి.

HEB 4:15•

HEB 13:8

 

114ఇప్పుడు ఒక క్షణము, నన్ను మన్నించండి. ఏదో జరిగినది. ఇక్కడ ఇంకెవరో ప్రత్యక్షమయ్యారు. ఇక్కడ ఇంత క్రితమే ప్రార్థన చేయించుకున్న స్త్రీ ఎవరు, ఆమె ఇచ్చట ఎక్కడున్నది? ఓ, అవును, అది నిజము. ఒక్క క్షణము. లేదండి. కేవలం ఒక్క క్షణం, పరిశుద్దాత్మ… అక్కడ ఇంకెవరో వచ్చియున్నారు. చూడండి, అది ఒక వెలుగైయున్నది, మరియు అది…

అవును, ఇక్కడ ఈ నల్లజాతి స్త్రీ కూర్చునియున్నది. అవును, నీవక్కడ కూర్చుని స్వస్థత కొరకు ప్రార్థించుచున్నావు. ఇప్పుడు, నీవు నాకు ఒక అపరిచితురాలివి. నేను నిన్ను ఎరుగను. అయితే యేసుక్రీస్తు నిన్నా, నేడు, మరియు నిరంతరము ఒక్కటే రీతిగా ఉన్నాడని నీవు నమ్ముచున్నావా? అధిక రక్తపోటు నుండి నీవు విడుదల పొందుతావనియు మరియు నీవు బాగవ్వబోవుచున్నావనియు నమ్ముచున్నావా? దాని కొరకే నీవు ప్రార్ధించుచున్నావు, చూశారా. దేనిని తాకినది? ఆమె నన్ను తాకలేదు, ఆమె నాకు చాలా దూరంలో ఉన్నది. మన బలహీనతల యందు మనతో సహానుభవము కలిగిన ప్రధానయాజకుడిని ఆమె తాకినది.

కేవలం నమ్ముము. ఇప్పుడు, చూడండి, నీవు ఇచ్చటికి రానక్కర్లేదు. నీవచ్చటే ఉండుము. కేవలం నమ్ముము, అది మాత్రమే నీవు చేయవలెనని నేను చెప్పుచున్నాను. కేవలం నమ్ముము.

115ఇచ్చట ఒక స్త్రీ అక్కడ వెనకాల కూర్చొని ఇటువైపు చూచుచూ ప్రార్ధించుచున్నది. ఆమె తనకొరకు ప్రార్ధించుటలేదు. ఆమె తన ప్రియమగువారి కొరకు ప్రార్ధించుచున్నది. ఎందుకనగా ఈ… ఇంతకుముందే ఒకరు తన ప్రియమగువారి కొరకు, తన తల్లికొరకు ఒక స్త్రీ ప్రార్ధించియున్నది. కాని ఈ స్త్రీ తన తండ్రి కొరకు ప్రార్ధించుచున్నది. మరియు ఆమె తండ్రి, నాకు ఒక సముద్రము కనబడుచున్నది, అతను విదేశీ లేదా అటువంటిదానినుండియైయున్నాడు. నార్వే, నార్విగేన్ అది ఖచ్చితముగా సరియే. యవ్వనస్తురాలా ప్రభువైన యేసునందు విశ్వాసముంచుము మరియు నీ తండ్రి స్వస్థతపొందుతాడు.

ఇప్పుడు ఆమె దేనిని తాకినది? ఆమె నన్ను ఎరుగునెమో ఆమెను అడుగుడి.

నీవు ప్రార్ధించునది దాని కొరకేనా? అది వాస్తవమైనయెడల, నీ చేయి ఆడించుము. అది నిజము. మనము అపరిచితులము. అది నిజమేనా? అది నిజము, అది సరియే. నీవు కేవలం నమ్మినట్లయితే నీ మనవి అనుగ్రహించబడును.

నాకు ఇరవై గజాల దూరంలోనున్న ఆమె దేనిని తాకినది? నన్ను కాదు, చూడండి, ఆమె ప్రధానయాజకుని తాకినది. నేను ఆమెను ఎరుగను. అయితే ఆమె ఈ రాత్రి మనతోనున్న ప్రధానయాజకుడైన ప్రభువైన యేసును, ముట్టినది.

నీవు ఒక అపరిచితురాలివి. రోగి ఇతడేనా, ఇతనేనా ఆ వ్యక్తి?

116చూడండి, అది నన్ను నడిపించు విధానములో నేను నేను వెంబడించవలసియున్నది, చూడండి. ఆ స్త్రీ వలే, చూడండి. ఆయన ఆమెను వెతికి పట్టుకొనెను. ఆమె ఆయన ద్వారా దేవుని ముట్టినది. మంచిది, అక్కడున్న ఆ ప్రజలు, వారునూ అదే చేయుచున్నారు, వారు దేవుని తాకుచున్నారు. చూడండి, అది కేవలం… అది వ్యవహరించుచున్న ప్రకారము నేను మరలవలసియున్నది.

ఇప్పుడు, మనము ఒకరికొకరము అపరిచితులము. నేను నిన్ను ఎరుగను. నా జీవితంలో ఎన్నడూ నేను నిన్ను చూచియుండలేదు. మనము అపరిచితులము. కావున మనము అపరిచితులమని ప్రజలు చూచెదరు, మనము ఒకరినొకరము ఎరుగము. ఇప్పుడు నీకు తెలిసినదైయుండి మరి నాకు దానిగూర్చి ఏమియు తెలియనిదేదైనా సంగతిని ప్రభువైన యేసు నాకు బయలుపరచినయెడల, అప్పుడది సహజాతీతమైన శక్తి ద్వారా రావలసియున్నది. నీవు చూడుము, దైవీక స్వస్థత, నీవు స్వస్థత కోరినయెడల… నీవు కోరినది అదేనో, కాదో నాకు తెలియదు, చూడుము. కొన్నిసార్లు అది ఎవరి గూర్చోయైయుండును, కుటుంబ సమస్యలు, ఆర్ధిక సమస్యలు, మరియు మొదలుగునవి. అయితే ఆయన వాటన్నింటినీ అనుగ్రహించును. నీకవసరమైనదేదో ఆయనకు తెలిసియున్నయెడల, ఆయన దానిని నాకు బయలుపరచగలడు, చూడండి. మరియు ఆయన దానిని చేసినయెడల, అప్పుడది ఆయనేయని నీవెరుగుదువు, చూడండి, అది ఆయనే అయి యుండవలసినదని నీకు తెలియును.

అది మీ అందరినీ నమ్మునట్లు చేయునా? మంచిది, విశ్వసించుడి.

ఇప్పుడు, ఆమె ఒక మంచి వ్యక్తివలె కనిపించుచున్నది, చూశారా. ఇప్పుడు మనము ఒక్క నిమిషము మాటలాడెదము.

117ఇప్పుడు అది వెడలిపోయెను, అది జనులలోనికి వెళ్ళియుండెను. ఎవరో… కేవలం భక్తిమర్యాదతో ఉండుడి, చూడండి. అది విశ్వాసము యొక్క గొప్ప ఈడ్పు. అది కుడివైపుకు మళ్లేను… నీవు దానిని అనుభూతి చెందుచున్నావు, ప్రభావమును! నేను పది గంటలు బోధించినదానికన్నా, ఒక గంటన్నర ప్రసంగము మరియు ఒక్క దర్శనము నన్ను చాలా నీరసము గురిచేయును. శక్తి, ప్రభావమనగా "శక్తి."

చూడండి, అట్లు చేయునది మీరే, అది నేను కాదు. నేను కాదు. దానిని చేయునది మీరే, దేవునియందు మీరు కలిగియున్న విశ్వాసమే దానిని చేయుచున్నది. అది నేను కాదు. నేను కాదు. నేను కేవలం ఇచ్చట ప్రాతినిధ్యం వహించుచున్నాను. ఇక్కడున్న దీనిలాగా, ఇది ఒక మూగది, ఈ స్పీకరు, దీనిలో మాటలాడుచున్న ఒక సజీవ స్వరము లేనిచో, ఇది మూగది; అది దానంతట అది మాటలాడదు. నేను కూడా మాటలాడలేను. అది ఆయనే, సజీవుడైన క్రీస్తు, సజీవుడైనవాడు, ఆయనే మాట్లాడును మరియు నీవెవరవనియు మరియు నీవేమి చేశావనియు ఆయనకే తెలియును.

118ఆ స్త్రీతో మరలా మాటలాడదెము. నీ జీవితములో దేనినైనా ప్రభువైన యేసు నాకు బయలుపరచినయెడల నీవు… బహుశా నీవు ఆయనను ఏమి కోరుచున్నావో దానినైనా, ఎందుకనగా ఒక విశ్వాసివైయుండి, నీవు ఆయనను ఏదో అడుగుచున్నావు. మరియు దానిని ఆయన నాకు బయలుపరచినయెడల, నీవు దానిని పొందుకొనెదవని నీవు నమ్ముదువా? [సహోదరి "అవును", అని చెప్పుచున్నది.] నీవు దానిని నమ్ముదువా? ఇప్పుడు, నీ సమస్య ఉదరములో ఉన్నది. ["అవును"] నీ ఉదరము శుష్కించియున్నదని వైద్య పరీక్ష తెలుపుచున్నది. ["అవును"] అది నిజము. నీ కడుపులో కణితి ఉన్నదని వారు కనుగొన్నారు. ["అవును"] అది నిజమేనా? ["అవును"] నీవు నమ్ముదువా? ["అవును"] నీవెవరివన్నది దేవుడు నాకు చెప్పగలడని నీవు నమ్ముదువా? ["అవును"] శ్రీమతి. విల్లార్డ్, ఇప్పుడు నీవు ఇంటికి వెళ్ళుము మరియు నమ్ముము.

119మీరు, మీ హృదయమంతటితో నమ్ముదురా? ఇప్పుడు ఆ స్త్రీని అడగండి. మేమెన్నడూ మా జీవితంలో ఒకరినొకరము చూసుకొనియుండలేదు. అయితే అది పరిశుద్దాత్మ అయి యున్నాడు, ఆయన ఇచ్చట ఉన్నాడు. ఇప్పుడు నిజమగు భక్తి గౌరవంతో ఉండుడి. ఇప్పుడు మీకు సరిపడు సమయమున్నచో నాతో చెప్పండి, చూడండి, ఎక్కడ [స్పష్టతలేని మాటలు].

ఇప్పుడు, అయ్యా, మీరు బావున్నారా? ఇప్పుడు మనం ఒకరికొకరం అపరిచితులవు. మరియు ఏదో ఒక దినమున మనము దేవుని కలవవలసియున్నదని నీవు గ్రహించియున్నావు. మరియు నీవు నాకు, నేను నీకు అపరిచితులమైయుండగా, ప్రభువైన యేసు నీ సమస్యలు నాకు బయలుపరచినయెడల, అది ఆయనేయని నీవు నమ్ముదువా? మరియు నేను ఒక మానవుడినైయుండి, దానిని ఎరుగనని నీకు తెలియును. అయితే అది ఆయన మాత్రమే చేయును. అది నిజమేనా?

నేను దీనిని చెప్పుటకు ఇష్టపడుటలేదు. ఈ పిల్లవాడు నీడచేత కప్పబడియున్నాడు, చూడండి, అతనిని చీకటి ఆవరించియున్నది. మరియు అది చెప్పుటకు ఒక విచారించదగిన కార్యమైయున్నది. నీకు క్యాన్సర్ ఉన్నది. అది వాస్తవము. మరియు ఒక ఎక్స్-రే చూపించుట ద్వారా నీ కడుపులో క్యాన్సర్ అని తెలియపరచబడినది, మరియు అది జీర్ణకోశముపై ఉండియున్నది అది. అది నిజమేనా? అక్కడే అని నేను పటములో, ఎక్స్-రేలో చూచుచున్నాను. అది జీర్ణకోశముపై యున్నది. ఇప్పుడు దాని భావమేదనగా నీవు త్వరలో వెళ్ళవలసియున్నది; లేనియెడల, దేవుడే నీకు సహాయము చేయవలెను. సహోదరుడా దానిని నీవు అంగీకరించుదువా? యేసు… యేసుక్రీస్తు ముందు క్యాన్సర్, ఒక తలనొప్పికంటె పెద్దదేమీ కాదు. దానిని నీవు నమ్ముదువా? ఇప్పుడు, ఏదో కార్యము ఇప్పుడే నీలో జరిగినది. నీకు ఒక నిజమైన మంచి అనుభూతి కలిగెను, చూడుము. ఇప్పుడు నీవారీతిగా నమ్ముచూ ఉండినచో చాలును! ఆ ఛాయ నిన్ను విడిచిపెట్టినది, చూచావా. నీ విశ్వాసము నిన్ను కాపాడినది. ఇప్పుడు నమ్మికతో వెళ్ళుము, మరియు దేవుడు నిన్ను బాగుచేయును గాక.

120దేవుడు కీళ్ళనొప్పులను స్వస్థపరచగలడు. దానిని నీవు నమ్ముట లేదా? మంచిది, ఇప్పుడు నడుచుకుంటూ, "ప్రభువైన యేసు, నీకు వందనములు" అని చెప్పుము.

"నీవు నమ్మినచో చాలును! నమ్మువానికి సమస్తము సాధ్యము." అది సరియే.

నేను "కీళ్ళనొప్పులు" అని చెప్పినప్పుడు నీకు ఆశ్చర్యమైనది. నీవు కూడా కలిగియున్నది అదే, అది నిన్ను బిగుసుకుపోవునట్లు చేయుటవలన ఉదయము లేచుట నీకు చాలా కష్టమగును. నీవు నమ్మినట్లైతే ఇప్పుడది వదిలిపోవును, దానిని నమ్ముచూ తిరిగి వెళ్ళుము, ప్రభువు నిన్ను దీవించును. కేవలం నమ్ముము.

అక్కడ ఉబ్బసంతో బాధపడుతున్నాడు, నీవు చూడుము. దేవుడు దానిని స్వస్థపరచగలడని నీవు నమ్ముచున్నావా? ఆయనను స్వీకరించుము, వెళ్ళుము మరియు యేసుక్రీస్తు నిన్ను బాగుచేయును, మరియు నీ హృదయమంతటితో నమ్మిక కలిగియుండుము.

వెళ్ళి, నీ భోజనమును చేయగోరుచున్నావా దానిని ఆనందించుము కడుపునొప్పి పోవును, మరియు వెళ్ళి బాగుగా ఉండుము? వెళ్ళి దానిని నమ్ముము. నీవు నమ్మితే చాలును!

121దేవుడు వెన్నునొప్పిని స్వస్థపరచగలడు, దేనినైనా బాగుచేయును. దానిని నీవు నమ్ముదువా? ఆయన నీ నొప్పిని కూడా స్వస్థపరచునని నీవు నమ్ముదువా? ఆనందంతో "ప్రభువా, నీకు వందనములు" అని చెప్పుచూ నీ దారిన వెళ్ళుము.

నేను ఆయన ప్రవక్తనని లేదా ఆయన సేవకుడనని నీవు నమ్ముదువా? దేవుడు గుండెజబ్బును స్వస్థపరచగలడని నమ్ముచున్నావా? అలాగైతే నమ్మికతో వెళ్ళుము.

ఒక కార్యమేదనగా నీకు స్త్రీవ్యాధి ఉన్నది, మరియు కీళ్ళనొప్పులున్నవి. అది నిజమేనా? ఆయన దైవిక స్వస్థతనిచ్చువాడని నీవు నమ్ముచున్నావా? నిన్ను స్వస్థపరచువాడని ఆయనను ఆంగీకరించుము. ఆనందముతో, "ప్రభువా నీకు కృతజ్ఞతలు" అని చెప్పుచూ వెళ్ళుము.

చాలా కాలంగా నిన్ను బాధిస్తున్న స్త్రీ వ్యాధిని నీవు కలిగియున్నావు. నీవు గుండె జబ్బును కూడా కలిగియున్నావు. మరణావస్థలో నీవున్నావు. నీవు గుండెదడను కలిగియున్నావు. నీ హృదయమంతటితో నమ్ముము మరియు అది నిన్ను ఇక ఎంతమాత్రము ఇబ్బంది పెట్టదు. వెళ్ళుము మరియు దానిని నమ్ముము.

122రక్తహీనత ఆవస్థ కలిగియున్నావు. దేవుడు నీ రక్తహీనతను స్వస్థపరచి మరలా ఆ స్థితిని కుదురుపరచగలడని మరియు దానిని బాగుచేయునని నీవు నమ్ముచున్నావా? దానిని నీవు నమ్ముచున్నావా? మంచిది, నమ్మికతో వెళ్ళుము, ఆ మధుమేహ వ్యాధి కూడా నిన్ను ఇక ఎంతమాత్రము ఇబ్బంది పెట్టదు. నీవు నీ హృదయమంతటితో నమ్ముము!

అక్కడ కూర్చున్న నీవు, ఆయన నిన్ను స్వస్థపరచాడని నమ్ముచున్నావా? నీ హృదయపూర్వకముగా దానిని నమ్ముదువా? నిన్ను పూర్తిగా, సంపూర్ణముగా బాగుచేయనది దేవుడేయని నమ్ముదువా? దేవుడు నిన్ను దీవించును. నీ దారిన వెళ్ళుము మరియు ఆనందించుము. ఆమేన్.

మరలా ఆ వెన్ను నొప్పి ఇక ఎన్నడూ నిన్ను బాధపరచదు. అది నీకు బాగైనావు అను మంచి అనుభూతినిచ్చును, అవునా? అది సరియే, ఆనందముతో వెళ్ళుము, "ప్రభువా నీకు కృతజ్నతలు" అని చెప్పుము, మరియు నీ హృదయపూర్వకముగా నమ్ముము.

రక్తము, నీ రక్తమునందు, మధుమేహ వ్యాధి కలదు. మధుమేహమును దేవుడు స్వస్థపరచునది నీవు నమ్ముచున్నావా? ఒక రక్తమార్పిడి కొరకు కల్వరి యొద్దకు వెళ్ళుదుము, ఆయన దానిని నీలో నుండి తీసివేయును.

నీవు ఛాతి నొప్పిని కలిగియున్నావు. అవును కదా? కొద్ది నిమిషముల క్రితం నేను నిన్ను పిలువబోయాను. కొద్ది నిమిషముల క్రితమే నీవు నావైపు చూచుచున్నావు మరియు నేను వెనుకకు తిరిగి నీవైపు చూశాను, మరియు నేను నీవైపు చూచుటను గమనించి నీవు తల క్రిందకు దించుకున్నావు. ఒక వింతైన అనుభూతి నీకు కలిగినది, ఛాతి నొప్పి నిన్ను విడిచిపెట్టినది, అది వెళ్ళిపోయినది. నీ ఛాతిని ఆటంకపరచినది నరముల ఉద్రిక్తతయైయున్నది. నీవు నమ్ముము.

HEB 13:8

 

123ఆ చివరి కుర్చీపై కూర్చుని, కీళ్ళ నొప్పులతో బాధపడుతున్న నీవు ఏమి తలంచుచున్నావు, నీవు నమ్ముచున్నావా? లేచి నిలబడుము, యేసుక్రీస్తు నిన్ను బాగుచేయును.

దేవుని నమ్మవలసినదిగా నేను మీతో సవాలు చేయుచున్నాను, యేసుక్రీస్తు నిన్నా, నేడు, మరియు నిరంతరం ఒక్కటే రీతిగా ఉన్నాడు! దానిని మీరు విశ్వసించుదురా? మంచిది. మీ హృదయపూర్వకముగా దానిని నమ్మినయెడల, మీరు ఒకరిపై ఒకరు చేతులుంచుడి. ఆయన తప్పిపోజాలడు. ప్రియ ప్రభువైన యేసు, ఆయన దేవుడైయున్నాడు, ఆయన పునరుత్దాన శక్తి, ఆయన యొక్క రుజువు. అందరూ ఒకరిపై ఒకరు చేతులుంచుడి.

124పరలోకపు తండ్రీ, శత్రువు పారిపోవుచున్నాడు. శత్రువు ఓడిపోయినాడు. యేసుక్రీస్తు జీవించుచున్నాడు మరియు ఏలుచున్నాడు. ఓ దేవా, కనికరముతో ఈ ప్రజలకు స్వస్థతను అనుగ్రహించుము.

సాతానా, నీవు యుద్దములో ఓడిపోయినావు! ఈ రాత్రి ఈ ఆడిటోరియమునందు యేసుక్రీస్తు విజయం పొందియున్నాడు. అపవాదీ నీవు బయటపడినావు, నీవు కేవలం ఒక మోసగాడివైయున్నావు; కల్వరి యొక్క ప్రేమలో యేసుక్రీస్తు నామమున ఈ ప్రజలను విడిచి బయటికి రమ్మనియు మరియు వారిని వదిలిపెట్టుమనియు నీకు ఆజ్నాపించుచున్నాను!

Search Messages

0 / 0 matches
Enter characters above to process real-time text query scopes...