ప్రభావము

ప్రభావము

1కేవలం నమ్ముము, కేవలం నమ్ముము,

సమస్తమునూ సాధ్యమే, కేవలం నమ్ముము,

కేవలం నమ్ముము, కేవలం నమ్ముము,

సమస్తమునూ సాధ్యమే, కేవలం నమ్ముము.

మనము మన తలలు వంచుదము. మా పరలోకపు తండ్రి, ఈ పాట కొరకు మేము మీకు వందనాలు చెల్లిస్తున్నాము, కేవలం నమ్ముట మన యొక్క ప్రభువును చూస్తూ, ఆయన ఒక మూర్చ రోగము కలిగియున్న బాలుని యొద్దకు వచ్చి ఇలా చెప్పెను, "నీవు విశ్వసించినచో నేను చేయగలను, ఎందుకనగా నమ్మువారికి సమస్తమును సాధ్యమే." ప్రభువా, ఈ రాత్రి మా యొక్క అవిశ్వాసమునకు సహాయము చేయుమని, మా యొక్క ప్రార్ధన, మీ యొక్క సన్నిధి మాతో ఉంచినందులకు మేము ఎంతగానో మీకు వందనస్తులమైయున్నాము మరియు మిమ్ములను విశ్వసిస్తూ మరియు ప్రేమిస్తూ ఉన్న ప్రజలు కొరకు కూడా వందనములు. మరియు ఇప్పుడు తెలుసుకొనుటకు, మేము భవిష్యత్తులో ఉంటామని కాదు గాని, మేము ఇప్పుడే క్రీస్తు యేసుతో పరలోక స్థలములోనికి ఎత్తబడియున్నాము. మరియు ఈ రాత్రి మా యొక్క రాజుతో ప్రక్కనే కూర్చొని యున్నాము, ఆయనతో స్థానము ప్రకారముగా ఇదివరకే కూర్చొనియున్నాము. ఓ, ఆయనలో మేము కలిగియున్న ఈ యొక్క నమ్మకము కొరకు మేము మీకు ఎంతగానో వందనస్తులము, ఆయన యొక్క వాగ్దానాలు అవి ఎన్నడూ విఫలం కావని ఎరిగియున్నాము అనగా అవి ఎల్లప్పుడూ సత్యమైయున్నవి. ఈ రాత్రికాల వేళలో మీరు మమ్మును దర్శిస్తారని మేము ప్రార్థిస్తున్నాము. పరిశుద్ధాత్మ వాక్యమును తీసుకొని మరియు మా యొక్క అవసరతకు అనుగుణంగా మా హృదయములకు దానిని విభజించును గాక, మేము ఈ రాత్రి వేళ్లుచుండగా, మా యొక్క గృహములకు వెళ్ళుచుండగా, ఒక రాత్రి ఎమ్మాయి మార్గము గుండా వచ్చినవారు చెప్పిన రీతిగా అనగా, "ఆయన మార్గమంతటి గుండా మనతో మాట్లాడుతున్నప్పుడు మన హృదయములు మనలో మండలేదా?" అని చెప్పెదము. మేము దీనిని యేసు నామములో అడుగుచున్నాము. ఆమేన్.

2మీరు కూర్చొనండి. ఈ రాత్రికాల సమయంలో నేను మీ యొద్దకు మరల వచ్చుటకు ఎంతగానో సంతోషిస్తున్నాను, మీతో మాట్లాడుటకు, సహవాసము చేయుటకు, క్రీస్తుకు సంబంధించిన విషయముల చుట్టూ మాట్లాడుటకు సంతోషిస్తున్నాము. ఆయన వాక్యము చుట్టూ చేరి సహవాసము చేయుట తప్ప ఇచ్చట మనము కూడి ఉండుటలో మరి ఏ ఇతర ఉద్దేశ్యమును లేవు.

ప్రతీ రాత్రి మిమ్ములను ఎక్కువ సమయం ఉంచుచున్నందుకు క్షమించండి. ఎవరో నాతో చెప్పారు, "ఇచ్చట నుండి ప్రజలు, సంఘము నుండి ఎనిమిదన్నర లేక తొమ్మిదికి ఇంటికి వెళ్ళుచున్నారు." అయితే నేను దక్షిణ ప్రాంతపువాడను మరియు మెల్లగా మాట్లాడే వ్యక్తిని, మీకు తెలుసా. మరియు దానిని నేను చాలా వేగముగా ఆలోచించలేను. దానితో నా యొక్క సమయమును తీసుకొనే దానిని కలిగియున్నాము.

MATT 13:58

 

3అయితే దాని కొరకు అనగా మంచి మద్దతు కొరకు నేను నిశ్చయముగా వందనస్తుడును. దేవునిని విశ్వసిస్తున్న అచ్చటనున్న ప్రజలైన మీ నుండి నేను దానిని పొందుకొనియున్నాను. మీ యొక్క మంచి సహకారము దీనిని చాలా సులువుగా చేసినది, పరిశుద్ధాత్మ ప్రజలు మధ్య కదులుటకు కూడా అది ఎంతో సులువైనది. ఇలాంటివే ప్రతీ చోట నేను కనుగొనవలెనని ఆశిస్తున్నాను, నేను కనుగొంటాను, విశ్వసించు ప్రజలను మీరు కునుగొనవలసియున్నారు. దేవుడు ఏమి చేయుచున్నాడో కాదు, ఎంతటి వరానికి ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్నాడో కాదు, అయితే మీరు దానిని నమ్మవలసియున్నారు. చూచారా, ఎందుకనగా నీవు దానిని విశ్వసించనంత వరకు అది ప్రభావంలోనికి రాదు.

యేసు ఒకసారి వేరే ఇతర దేశములో నుండి తన స్వదేశమునకు వచ్చియున్నాడు, మరియు అప్పుడు వారు చెప్పారు, "నీవు ఫలాన స్థలములో ఫలాన-ఫలాన దానిని చేసినట్లుగ మేము విన్నాము," అయితే పిమ్మట ఆయన ఇచ్చట అనేకమైన గొప్ప కార్యాలు చేయలేకపోయాడు. ఇప్పుడు మనము ఆ మార్గములో చేయరాదు. అయితే దీనిని గూర్చి ఆ లేఖనం చెప్పుచున్నది, అనగా ఆయన చేయగలడు. "వారి యొక్క అవిశ్వాసము మూలముగా ఆయన అనేక గొప్ప కార్యాలు చేయలేకపోయాడు."

MARK 11:23•

MARK 14:36

 

4మరియు మీ యొక్క విశ్వాసమును బట్టి దేవుని యొక్క శక్తి పరిమితమై ఉంటుంది, చూచారా. అది కలిగియున్న కేవలం పరిమితి ఏమనగా, నీ యొక్క విశ్వాసమే. మరియు… దానిని నమ్మువారందరికి సమస్తమూ సాధ్యమే, చూచారా. పరలోకంలో మహా గొప్ప దేవుడున్నాడు మనము అతనిలో ప్రత్యక్ష వరుస వలే సందర్శనలో ఉన్నచో, సమస్తమును సాధ్యమే, చూచారా. అయితే మనము తప్పక ఆయనతో సంబంధము కలిగియుండాలి, ఎచ్చటికీ కదలిక లేకుండగా దేవునికి మరియు మనకు మధ్యన ఒక స్పష్టమైన కాలువవలే సంబంధం ఉండాలి. అప్పుడు ఆయన చెప్పెను, "నీవు కదిలిపో," అని ఈ పర్వతముతో చెప్పినచో మరియు మీ హృదయములో సందేహించక మీరు దేనినైతే చెప్పియున్నారో దానిని నమ్మినచో అది జరుగును." ఇప్పుడు, దానిని నీవు మోసగించలేవు. సాతానుడు ఎంతో సులువుగా దానిని బూటకముగా చేయలేడు, కావున నీవు దానిని మోసగించలేవు. అయితే నీవు దానిని వాస్తవముగా ఎరిగినప్పుడు, అది జరుగును, చూచారా, అది ఖచ్చితంగా అలా జరుగును.

కావున మనము ఇచ్చటనున్నాము మరియు ఆయనను ఆరాధించాము మరియు ఆయన ఎంతో ప్రియమైనవాడు మరియు పదివేల మంది కన్నా సుందరుడు. మరియు ఈ రాత్రి అనగా ఈ యొక్క ప్రియమైన సహవాసపు సమయంలో మీతో కలిసి ఇచ్చట కూర్చొనుటకు మేమెంతగానో సంతోషిస్తున్నాము.

MATT 11:25•

MATT 21:21•

MARK 9:23•

LUKE 10:21•

LUKE 18:27

 

5ఇప్పుడు, మీరు వాక్యమును చదువుటకు లేక ఆ భాగములు గుర్తించుటకు ఇష్టపడుచున్నారు, దైవిక స్వస్థత మీద ఈ రాత్రి బోధించవలెనని నేను భావించాను, ఈ రాత్రి కొంత మట్టుకు అంశమును మార్చవలెనని కూడా తలంచాను. దీనిని ఖచ్చితంగా మార్చవలెనని కాదు గాని, కేవలము దానిని కొనసాగించుట కొరకు. ఎందుకనగా, పరిశుద్ధ గ్రంథములో నుండి ఒక్క మాటను కూడా మీరు మార్చలేరు, ఎందుకనగా అది మిగతా వాక్యములతో ఒకదానికి ఒకటి సంధించుచున్నవి. లేఖనములన్నియు ఒకదానికొకటి కట్టుచున్నది. ఇది కేవలం ఒక దానివలె…

ఇది దైవదూషణ అనిపిస్తే నన్ను క్షమించండి, మరియు నేను ఎంత మాత్రమును దీనిని ఆ రీతిగా భావించుటలేదు. అయితే ఇది కేవలం ఒక క్రమరహిత చిత్ర ప్రహేళిక లాంటిదని, మీకు తెలుసా. మేము గత కాలములో ఆ ప్రాచీన కాలపు చిత్ర ప్రహేళికలను చూసి, అన్నింటినీ కత్తిరించి మరి తదుపరి కూర్చొని వాటిని ఎలా సరిగ్గా క్రమములోనికి అమర్చవలెనో చేసేవారము, మరియు ఆ తరువాత దాని ప్రక్కను దేనినో ఒక దానిని ఉంచేవారము, మేము కలసికట్టుగా క్రమములోనికి తీసుకొని రావలెనని ప్రయత్నించేవారము, ఎందుకనగా ఆ యొక్క చిత్ర ప్రహేళిక సరియైన అమరికలోనికి రావలెను గనుక, నీవు దానిని చేయనిచో దానిని ఎన్నడూ సంపూర్తిగా పొందుకొనలేవు.

మరియు ఇప్పుడు లేఖనము కూడా అదే రీతిగానున్నది. జ్ఞానులకు మరియు వివేకుల యొక్క కన్నులకు మరుగుపరుచుటకు ఇది కూడా అలాగే కొంత కత్తిరించబడినది; చూచారా, వారు పరిసయ్యుల వలే మరియు తెలివైన మేథావుల వలే ఉన్నారు. మరియు దీనిని గూర్చి యేసు, దేవునికి వందనాలు చెల్లించాడు, ఎందుకనగా దానిని దేవుడు వారి నేత్రముల నుండి మరుగు చేసి నేర్చుకొనుటకు ఇష్టపడే పసిబాలురకు బయలు పరుస్తాడు.

6ఇప్పుడు దానికి మీకు ఉదాహరణ కావలసినచో మీ యొక్క విధానమును ప్రక్కన పెట్టి దానితో లేఖనము ఎలా వెళ్ళుచున్నదో చూచినచో, యేసును ఇచ్చట ఉంచి మరియు ఆయనను గమనించుటకు మీరు వెళ్లండి, పిమ్మట పరిశుద్ధ గ్రంథములో దానిని ఉంచండి. సమస్త విషయమును నీవు సరిగ్గా కనుగొంటావు, ఎందుకనగా ఇదంతయూ యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షతయైయున్నది. పాత నిబంధన మరియు క్రొత్త నిబంధన రెండునూ యేసును గూర్చే మాట్లాడుచున్నవి, చూచారా, యేసుక్రీస్తు దేవుని కుమారుడు, ఎందుకనగా ఆయనే ఈ యొక్క విమోచనా గ్రంథమైయున్నాడు. ఆయన వాక్యమైయుండెను, మరియు ఆయన వాక్యమైయున్నాడు మరియు అది ఆయనకు మాత్రమే చెందియున్నది, మీరు చూచారా. కావున ఇదియే విమోచనా గ్రంథము యొక్క సమస్తమును, అదియే యేసుక్రీస్తు, దేవుని చేత సరిగ్గా అమర్చబడియున్నాడు అనగా విమోచనా వాగ్దానములతోనూ మరియు స్వస్థత మరియు మానవుని కొరకు సమస్తమునూ, చూచారా. మరియు ఆయన ఒక మానవునిగా వచ్చాడు, పిమ్మట మనలను విడిపించాడు, మరియు నీ కొరకు ప్రతీ వాగ్దానము ఆయనలోనున్నది, ఎందుకనగా ఆయనే విమోచకుడైయున్నాడు.

7మన యొక్క సందర్బమునకు సరిపడే దానిని పొందుకొనుటకు మనము ఈ రాత్రి పాత నిబంధనను త్రిప్పెదము అనగా, మనము ప్రవక్తయైన యెషయా గ్రంథము యొక్క 6వ అధ్యాయమును చదివెదము.

యెషయా యొక్క వ్రాతలను నేను ఇష్టపడతాను. ఆయన ఒక మహా ప్రవక్త, పరిశుద్ధ గ్రంథము యొక్క మొత్తము సారాంశాన్ని ఒక ఉపోద్ఘాతము వలే తన గ్రంథములో యెషయా వ్రాసినట్లు మీకు తెలియునా? ఆయన వ్రాశాడు. యెషయా సృష్టిని గూర్చి ప్రారంభించాడు. ఆయన గ్రంథము యొక్క మధ్యస్థములో బాప్తిస్తము ఇచ్చు యోహాను వస్తాడు మరియు చివరలో వెయ్యేండ్ల రాజ్యపరిపాలన గూర్చి కూడా వ్రాసాడు. కావున అతడు… పరిశుద్ధ గ్రంథము మొత్తములో 66 పుస్తకములున్నవి. అలాగే యెషయా గ్రంథం మొత్తములో 66 అధ్యాయములున్నవి, కావున ఇది రాబోవుచున్న సమస్త పరిశుద్ధ గ్రంథమునకు ముందస్తు ఛాయవలెనున్నది.

ISA 6:1-8•

2COR 3:2

 

8ఇప్పుడు మనము యెషయా 6వ అధ్యాయము నుండి చదివెదము.

"రాజైన ఉజ్జియా మృతినొందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనమందు ప్రభువు ఆసీనుడైయుండగా నేను చూచితిని; ఆయన చొక్కాయి అంచులు దేవాలయమును నిండుకొనెను.

ఆయనకు పైగా సెరాపులు నిలిచియుండిరి; ఒక్కొక్కరికి ఆరేసి రెక్కలుండెను. ప్రతివాడు రెండు రెక్కలతో తన ముఖమును, రెంటితో తన కాళ్లను కప్పుకొనుచు రెంటితో ఎగురుచుండెను.

వారు - సైన్యములకధిపతియగు యెహోవా, పరిశుద్దుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు; సర్వలోకము ఆయన మహిమతో నిండియున్నది అని గొప్ప స్వరముతో గానప్రతిగానములు చేయుచుండిరి.

వారి కంఠస్వరము వలన గడప కమ్ముల పునాదులు కదలుచు మందిరము ధూమము చేతనిండగా -

నేను - అయ్యో, నేను అపవిత్రమైన పెదవుల గలవాడను; అపవిత్రమైన పెదవులుగల జనుల మధ్యను నివసించువాడను; నేను నశించితిని; రాజును సైన్యములకధిపతియునగు యెహోవాను నేను కన్నులారా చూచితిననుకొంటిని.

అప్పుడు ఆ సెరాపులలో నొకడు తాను బలిపీఠము మీదనుండి కారుతో తీసిన నిప్పును చేతపట్టుకొని నా యొద్దకు ఎగిరి వచ్చి,

నా నోటికి దానిని తగిలించి - ఇది నీ పెదవులకు తగిలెను గనుక నీ పాపమునకు ప్రాయశ్చిత్తమాయెను, నీ దోషము తొలగిపోయెను అనెను. అప్పుడు - నేను ఎవని పంపెదను? మా నిమిత్తము ఎవడు పోవునని ప్రభువు సెలవియ్యగా వింటిని. అంతట నేను - చిత్తగించుము నేనున్నాను; నన్ను పంపుమనగా.

నేను ఒక అంశమును తీసుకొనవలెనని కోరుచున్నాను, దానిని మనము "ప్రభావము" అని పిలిచినచో, ఆ అంశమును నేను తీసుకొనెదను ప్రభావము అనే ఒక గొప్ప విషయం. "మనము మనుష్యులందరిచేత చదవబడే, వ్రాయబడిన పత్రికలము," అని లేఖనము ద్వారా చెప్పబడ్డాము.

9మరియు క్రైస్తవులుగా మనమంతా మనము ఏమి చేయుచున్నామో మరియు ఏమి చెప్పుచున్నామో అనే దానిని ఎల్లప్పుడూ గమనిస్తూ ఉండాలి, అనగా ప్రతీ ఒక్కరి ఎదుట మనము ఎంతో నిజాయితీగా ఉండాలి. మరియు నీవు నీ యొక్క సహచర వ్యక్తితో నిజాయితీగా ఉండ లేనిచో, నీవు దేవునితో కూడా నిజాయితీగా ఉండలేవు. కావున దేవునిని మనము ఎలా సేవిస్తున్నామో, ఒకరికొకరము అలా సేవించుకొనాలి. నేను మీతో ఎంత నిజాయితీగా ఉన్నానో, దేవునితో కూడా అలాగే నిజాయితీగా ఉండవలసియున్నాను. మరియు నాకు కూడా మీరును అలాగే ఉండవలసియున్నారు. మన యొక్క అన్ని వ్యవహారములలో కూడా మనమందరము ఒకరికొకరము నిజాయితీగా ఉండవలసియున్నది.

మరియు ఎవరో ఒకరు మనలను గమనిస్తూ ఉన్నారు, నీవు దానిని గూర్చి ఆలోచించలేకపోవచ్చు గాని ఏవో కళ్లు నిన్ను గమనిస్తున్నవి మరియు నీ యొక్క జీవితము ఇంకొకరి జీవితమును ప్రభావితం చేస్తుంది. బహుశా అది ఒక చిన్న బిడ్డ కావచ్చు మరియు ఆ యొక్క చిన్న బిడ్డ పెరిగి అతడు మరియొక ఫిన్నీ వలె లేక మూడీ వలె పెరగవచ్చు. మనకు తెలియదు. అయితే నీ యొక్క జీవితము ఇంకొకరిని ప్రభావితం చేస్తూ ఉంటుంది.

10మరియు మనము ఈ రాత్రి కూడుకొని యుండుట, దీని మీద కూడుకొని ఉండుట ఎంతో గొప్ప ప్రశాంతముగానున్నది, ఎందుకనగా ఈ యొక్క మధ్యాహ్న కాలములో దీనిని చదువుతూ, నేను దీనిని చదువుచున్నప్పుడు, దేవుడు ఎంత గొప్పవాడో నేను ఆలోచిస్తూ ఉన్నాను.

ఈ ఉదయకాల సమయములో నా కుమారుడు మరియు నేను ఆ యొక్క ఆవరణము చుట్టూ నడుస్తూ ఉండగా, అచ్చట చాలామంది ప్రజలున్నారు. మేము టైమ్స్-స్క్వేర్ చుట్టూ వెళ్లాము, ఎందుకనగా వారు దీనిని చింపి క్రింద పడేస్తామని చెప్పారు. ఆ పనులు ఇది వరకే ప్రారంభమయ్యాయి కూడా, కావున నేను దాని వైపుగా చూస్తున్నాను మరియు మేము కొన్ని చిత్రములు కూడా తీసుకున్నాము. మరియు ప్రజలు గుంపులుగా ఉన్నారు! నేను నా కుమారుడైన బిల్లీని అడిగాను, "వారంతా ఎచ్చటకు వెళ్ళుచున్నారు? ఏమిటి ఆ యొక్క ఆతురత? వారు ఇచ్చటనున్నారు, మనక్రింద నుండి పరుగెత్తుచున్నారు; మరియు ఇచ్చటకు పరుగెత్తుచున్నారు; మరియు మన పైన కూడా పరుగెత్తుచున్నారు. అంత ఆతురుతగా ప్రతీ ఒక్కరూ ఎచ్చటకు వెళ్ళుచున్నారు?"

11మరియు మేము నిలువబడియుంటుండగా మేము ఇలా అనుకున్నాము, "ప్రతీ వ్యక్తి యొక్క ఆలోచనలను దేవుడు ఎలా తెలుసుకొనగలడు? మరియు భూమి మీదనున్న కోట్ల మంది యొక్క తలంపులను మరియు నీవు ఎన్ని సార్లు కనురెప్ప కొట్టుకొంటావో దేవునికి ఎలా తెలియును?" అయితే ఆయన అనంతుడైయున్నాడు.

మరియు మీరు తెలుసుకొనవలెనని కోరినచో మరియు దానిని సంతృప్తి పరచబడవలెనని, అట్టిది మీ మనసులోనికి ఎప్పుడైనా వచ్చినచో, మీరు వెళ్లి పిమ్మట నక్షత్రములు వైపు చూడండి మరియు వాటన్నింటిని ఆయన ఎలా నియంత్రించుచున్నాడో మీరు ఆశ్చర్యపోతారు, పిమ్మట అది ఆయనకు ఎంత చిన్న పనో మీరు చూడగలరు. ఆ యొక్క నక్షత్రములను మీరు చూచినప్పుడు ఆ యొక్క గాజు ద్వారా మీరు నూటా-ఇరవై మిలియన్ల కాంతి సంవత్సరాలను చూడగలరు; కాంతి ఎంత వేగంగా ప్రయాణిస్తుందో మీకు తెలియునా, ఎందుకనగా న్యూ-యార్క్ నగరం చుట్టూ 9 వరుసలు మొత్తం తిరుగేళ్లినచో దానిని మైళ్లలో కూడా అధిగమించలేరు. మరియు దానికి ఆవలి వైపున ఇటువైపుగా ఎన్ని నక్షత్రములున్నావో, అవి కాలిఫోర్నియాలో గల పామర్ పర్వతములు వలె మరియు విల్సన్ పర్వతము వలే ఉన్నవి, ఇది దృశ్యముగా ఉంటుంది.

12ఆయన ఎంత ఘనుడో ఆలోచించండి మరియు ఆయన భూమిని ఎలా పట్టుకొనియున్నాడో ఆలోచించండి! ఈ యొక్క భూమి లేక ఆ నక్షత్రాలలో ఏదో ఒక నక్షత్రము దాని యొక్క స్థానము నుండి వేరొక చోటుకి కదిలినచో, అది కొన్ని మిలియన్ల మరియు బిలియన్ల దూరము ఉంటుంది, అది ఈ భూమిని కూడా ప్రభావితం చేస్తుంది. ఆ యొక్క సౌరకుటుంబం ఖచ్చితంగా దాని యొక్క స్థానంలోనే అది ఉండవలసి యున్నది. మరియు, చూచారా, దేవుడు చేసిన ప్రతీది కూడా అది దేవుడికి లోబడేటట్లుగా ఆయన చేశాడు. అయితే దేవుడు మనిషిని చేసినప్పుడు, ఆయన చేసిన దానికన్నా ఎక్కువగా తెలుసుకొనవలెనని మానవుడు కోరుకొనుచున్నాడు, మీరు చూచారా; ఇది మనము మాత్రమే స్థానములో లేకుండా ఉన్నాము. అవన్నియూ వాటి వాటి స్థానములోనున్నవి. మరియు అవి ఆ స్థానములో ఉండవలసియున్నవి, ఎందుకనగా ఒకదానికొకటి సమతుల్యం కోసం.

13ఉదాహరణకు చంద్రుడు దాని స్థానం నుండి అది కదలినచో, భూమి అంతయూ కొద్ది నిమిషములలోనే జలముతో నిండి పోతుంది. చూచారా, ఆ యొక్క చంద్రుడు, సముద్రమును నిరంతరం కనిపెట్టే ఒక కావలి కుక్కలా ఉన్నాడు. "అది అచ్చటి నుండి దాటి వెళ్లకుండా దాని యొక్క సరిహద్దులతో దానిని ఆయన బంధించియున్నాడు." మరియు చంద్రుడు భూమి యొద్ద నుండి వెనుకకు తిరిగినప్పుడు, ఇచ్చట అలలు వస్తూ ఉంటాయి. ఒకవేళ చంద్రుడు దీనిని వేరే వైపునుండి పట్టుకొననిచో అవి భూమిని కప్పివేయును, చూచారా. కావున చంద్రుడు ఆపు చేస్తున్నాడు, మరియు ప్రపంచం యొక్క అవతలి భాగం చుట్టూ చూచుటకు, అతడు తన వీపును తప్పుచున్నాడు, మరియు ఇచ్చటకు జలములు వాస్తవమైన వేగంతో వస్తునప్పుడు వెంటనే ఆయన మరలా ఇటు తిరుగుచున్నాడు. (అనగా ఆ జలములు భూమి యొక్క సగభాగమును ముంచివేయకుండా చంద్రుడు మరలా ఇటు తిరిగి నియంత్రించుచున్నాడని అని అర్ధం -తె-త-దా). అతడు (చంద్రుడు) యెహోవా యొక్క సేవకుడు, అప్పుడు సముద్రము ఆగిపోయి పిమ్మట దాని యొక్క స్థానమునకు మరలా వెనుకకు వెళ్లిపోతుంది, ఎందుకనగా యెహోవా యొక్క పరిపూర్ణ కదలికను అది చూస్తున్నది.

ఓ, మనము సంఘములో ఉన్నచో క్రీస్తు యొక్క శరీరంలో సభ్యులుగా మనమందరం ఉన్నచో మనము కూడా అలాగే ఐక్యముగా పనిచేయగలము, అప్పుడు పరిశుద్ధాత్మతో నింపబడిన సమస్తమును ఒకే వ్యూహముగా, ఒక మహా గొప్ప మరియు బలమైన జీవము గల దేవుని సంఘముగా మీరు చూడగలరు, ఇది అద్భుతము కాదా? శరీరంలోనున్న ప్రతీ సభ్యుడు దాని యొక్క స్థానమునకు ప్రతీ వారము ఇంకొకరికి సహాయము చేసినట్లుగా ప్రతీ సభ్యుడూ ఇంకొకరికి సహాయము చేసినట్లుగా ఉన్నచో- అది ఎంతో అద్భుతముగా ఉన్నట్లు ఉంటుంది. అదియే మనము చూడాలని కోరుకొనుచున్నాము. అయితే అది సరియైనచో దానిని ఏదో ఒక రోజున చూస్తాము.

2CH 26:1•

JOB 38:11

 

14ఇప్పుడు, ఈ యొక్క యవ్వనస్తుడు అనగా ఉజ్జియా ఒక రాజైయున్నాడు. అయితే అతడు రాజు కాకమునుపు… అతడు యెషయా ప్రవక్త యొక్క పరిపాలన కాలంలో రాజుగానున్నాడు. మరియు ఇతడు ఒక బాలుడైన కాపరి; ఇతడు బయట దృశ్యాలను ఎక్కువగా ఇష్టపడేవాడు, యెషయా కూడా ఒక యవ్వనస్తుడు మరియు ఒక యవ్వన ప్రవక్త. మరియు మీరు ఆ యొక్క కథను చదివినచో, అది II దినవృత్తాంతములు 26వ అధ్యాయములో మీకు చెప్తుంది. 16వ సంవత్సరములోనే, అనగా ఆయన యొక్క నిజాయితి గల తండ్రి మరణం పిదప ఆయన రాజు అయి ఉన్నాడు. వారు ఆయనను తీసుకొని మరియు అతనిని ఇశ్రాయేలుకు రాజుగా నియమించారు, కావున అతని 16వ యేటనే పరిపాలన చేయుట ఆరంభించాడు. మరియు ఆయన తల్లిదండ్రులు యొక్క ప్రభావాన్ని చూచాడు; అతని తల్లి ఒక భక్తి కలిగిన స్త్రీ, మరియు అతని తండ్రి అతని ముందు ఒక భక్తి కలిగిన వ్యక్తిగా వుండెను. మరియు దానిలో, ఆ యొక్క పిల్లవాడు, ఏది సరైనదో చేయగలిగేటట్లు, వారు అతనిని ప్రభావితం చేశారు.

15నేను మీకు చెప్పెదను. నేను అనుకుంటున్నాను, నేడు మన దేశము చుట్టూ, అట్టి బాల్య నేరములను మనము కలిగియున్నాము, అయితే వాస్తముగా అది గృహములోనే ప్రారంభం అయినదని నేను భావిస్తున్నాను. నేను అనుకొనుచున్నదేమనగా అలా జరుగుటకు తల్లిదండ్రులే ప్రారంభించుచున్నారు. మరియు ఒక చిన్న బిడ్డ ఒక మంచి స్థితిలో పెరిగినచో, ప్రాచీన స్థితిలో భక్తి కలిగిన గృహములో పెరిగినచో; అప్పుడు అంతా అయిపోయినదని నేను చెప్పను, ఖచ్చితంగా కాదు, అయితే అది ఖచ్చితంగా ఆ చిన్న బిడ్డకు సరైన ప్రభావాన్ని కలుగజేస్తుంది. నేననుకొనుచున్నదేమనగా, చాలా సార్లు, ఆ గృహాలే, ఆ పిల్లలను తప్పుగా పెంచుతున్నారు, వీధులలోను యధేచ్ఛగా విడిచిపెట్టేస్తున్నారు మరియు వారి యొక్క తల్లి మద్యపానశాలలో ఉంటుండగా, వారు, వారికొరకే జీవిస్తున్నారు, లేక… బిడ్డ కొరకు జాగ్రత్త వహించుటలేదు. మరియొక విషయమేదనగా వారు దానిని ప్రేమించుట లేదు మరియు దానిని తీసుకొనుటకు వారికి అనురాగమును చూపించుట లేదు. అది వారి యవ్వనం. ప్రేమించుటకు మరియు గౌరవించుటకు మరియు బైబిలు చదువుటకు, మీరు వారికి బోధించాలి.

16నేను సూసన్ వెస్లీని గూర్చి ఆలోచిస్తూంటాను. ఆమెకి 17 మంది పిల్లలున్నారని నేను అనుకొంటాను. అది నిజమని నేను నమ్ముచున్నాను. అయితే ప్రతీ దినమూ ప్రార్ధించుటకు ఆమె 2 గంటలు కన్నా ఎక్కు సమయం కలిగియుండేది. అయితే ఆమె యొక్క చివరి గుంపులో ఆమె యొక్క చిన్న అబ్బాయిలు కూడా చుట్టూ మోకరించేవారు. మరియు వారిలో నుండి జాన్-వెస్లీ మరియు చార్లెస్ లు బయటకు వచ్చారు, వీరు ప్రపంచం యొక్క స్థితిగతులనే మార్చేశారు, మరియు ఆ దినమున ప్రపంచాన్నే రక్షించారు. మరియు ఈ దినమున మనము కలిగియున్న రీతిగా ఆ దినము ఆమె బట్టలు ఉతుకు యంత్రముని కలిగిలేదు. మరియు బట్టలు ఆరబెట్టే యంత్రమును, మరియు గిన్నెలు కడిగే యంత్రమును ఆమె కలిగిలేదు, లేక ఒక పని మనిషి కూడా ఆమెకు లేదు. అవన్నియూ ఆమె తనకు తానుగానే చేసుకొనేది, అయినప్పటికి ఆమె కొంత ప్రత్యేక సమయాన్ని కలిగియుండేది, ఎందుకనగా ఆమె కొంత ప్రభావాన్ని ఆ పిల్లల పైన ఉంచేది. చివరికి వారు ప్రపంచ గమనాన్నే మార్చివేశారు. నేను అనుకొనుచున్నదేమనగా, ఆమె ఒక పాతకాలానికి చెందిన తల్లి, అది ఒక పాత-కాలపు తీరును కలిగిన గృహము, అచ్చట ప్రార్ధన మరియు పరిశుద్ధ గ్రంథ పఠనం ఉండేది.

17నేను నమ్ముచున్నదేమనగా, అబ్రాహాం లింకన్ ఆయన తన జీవితములో వయస్సు వచ్చేంతవరకు పరిశుద్ధ గ్రంథము తప్ప వేరే పుస్తకాన్ని కలిగిలేడు మరియు… బహుశ అది ఫాక్స్-హతసాక్షుల-గ్రంథము అని నేను అనుకుంటున్నాను… అది కాకపోవచ్చు లేదా అది వేరే పుస్తకం కావచ్చు. బహుశ అది యాత్రికుని ప్రయాణం అని నేను అనుకొనుచున్నాను. అది సరియే. మరియు ఒక బైబిలు గ్రంథము. అది ఏ రకమైన ప్రవర్తనను మలచినదో మీరు చూచారా?

నన్ను మీ గృహములోనికి రానివ్వండి మరియు మీ యొక్క గోడల మీద ఎట్టి రకమైన బొమ్మలున్నవో నేను గమనించగలను. నన్ను మీ యొక్క గృహములకు లేదా ఆఫీస్ కి అనుమతించండి మరియు మీరు ఎటువంటి రకమైన సంగీతము కలిగియున్నారో, నన్ను గమనించనీయండి, చూచారా. మీరేమి చదువుచున్నారో, మీరేమి చూచుచున్నారో దానిని బట్టి లోపల ఏమున్నదో ఖచ్చితంగా చెప్పగలను, చూచారా, ఎందుకనగా అది మిమ్ములను పోషించుచున్నది, చూచారా. మరియు, ఓ, మన యొక్క గృహమును ఎంతో ప్రేమగా మనము మార్చినచో అప్పుడు పిల్లలు బయటకు వెళ్ళే అవసరత ఉండదు. వారి కొరకు అనేక విషయాలను చేస్తూ, అనగా ఎచ్చటైతే వారు స్వాగతింపబడేటట్లుగా నాజూకుగా మరియు ఆదరణగా ఆ గృహము ఉంటుందో అచ్చట వారు దానిని పొందుకునేంత వరకు కష్టముగా అచ్చట వేచియుండలేరు. మరియు ఒక గృహము అట్టి మాదిరిగా ఉండవలసియున్నది.

18మరియు నేను అనుకొనుచున్నది ఏమనగా అట్టి రకమైన గృహములోనే ఉజ్జియా కూడా పెరిగియున్నాడని, ఎందుకనగా అతని యొక్క భక్తి కలిగిన తల్లితండ్రులు ప్రభావం మూలముగా మరియు అతడు రాజు అయిన వెంటనే, ప్రసిద్ధి గాంచిన అన్ని అభిప్రాయములను మరియు అన్ని రాజకీయ విభేదములను పెడచెవిన పెట్టి, పిమ్మట తన యొక్క మనస్సును ఒక్క దాని మీదే లగ్నముంచాడు. ఏది ఏమైనప్పటికి అతడు దేవునిని సేవించాడు! అట్టి మరికొంత మంది రాజకీయ నాయకులు మనకు అవసరం. దేవునిని సేవించుటకు అతడు నిశ్చయించుకున్నాడు, ఎందుకనగా ఆ రీతిగా ఆయన పెరిగాడు. మరియు అతని యొక్క తండ్రి, అతడు దేవునిని సేవించి మరియు జీవించులాగున అతనిని ప్రభావితం చేశాడు.

మరియు ఆయన యొక్క రాజ్యము మహా ఘనత వహించినది. ఇప్పటికీ నేను నమ్ముచున్నదేమనగా, సొలొమోను రాజ్యము తర్వాత గొప్ప రాజ్యము ఆయనదే. దేవుడు ఇతనిని ఎంతగా దీవించాడో!

మరియు ఇది (ఉజ్జియా జీవితం) ఈ యొక్క యవ్వన ప్రవక్త అయిన యెషయా మీద కూడా ప్రభావితం చేసింది, ఈ ప్రవక్త ఈ కాలంలో దేవాలయంలో లేక పొలములో ఉన్నాడు. మరియు ఆయన ఎలా కనిపించాడు మరియు సరియైన నిలకడను తీసుకొను వ్యక్తిని, సరియైన విషయమును చేయు వ్యక్తిని, సరియైన ఉద్దేశ్యము మరియు లక్ష్యాన్ని కలిగిన వ్యక్తిని దేవుడు ఎలా దీవిస్తాడో ఆయన చూచాడు. మరియు ఆయన సరియైనదే చేశాడు.

19అది వెల చెల్లించుట కాదు అని మీరు కొన్నిసార్లు అనుకోవచ్చు. అయితే ఇది ఖచ్చితముగా వెల చెల్లించుటయే. ఇది చెల్లించుట అయి ఉన్నది. నీవు ఒకేసారి తూర్పుకి మరియు పడమరకు ప్రయాణించలేవు. కుడికి మరియు ఎడమకి ఒకే సారి ప్రయాణించలేవు. నీవు వేరే మార్గం గుండా వెళ్ళుచున్నావని నీవు తలంచవచ్చు. అయితే నీవు వెళ్ళుటలేదు. కావున నీవు నీ యొక్క మనస్సును మరియు నేత్రములను మరియు జీవితంలో నీ యొక్క ఉద్దేశ్యాలను మరియు లక్ష్యాలను సరియైన విషయం పైన నీవు పెట్టినచో, నీవు మిగతా వాటి నుండి సరియైన విషయం యొద్దకు రావలసియున్నావు. నీవు విఫలం కాలేవు, చూచారా. అదియే సరియైన మార్గము. వేరే వైపునున్న దానిని చేయుటకు నీవు ఎంతగా శోధింపబడినను, దాని నుండి నీ తలను త్రిప్పివేయుము. పిమ్మట ఏది నిజమైనదో దానినే చేయుము. మరియు నీవు నిజము అని నీకు తెలియునుగదా; నీవు మంచిగా, మరికొంత మంచిగా భావిస్తున్నావు గదా. మరియు దీనికి సమస్తమును అది అచ్చట సరిపోయినది… నీవు సరిగ్గా బయటకు రావలసియున్నావు. నీవు పశ్చిమమునకు వెళ్ళుటకు ప్రారంభించావు, అయితే నీవు వెళ్లలేదు నీవు ఉత్తరమునకు వెళ్ళుటలేదు. నీవు వెళ్ళుచున్నావు… నీవు పశ్చిమమునకే వెళ్ళుచున్నావు… మరియు అదే విధముగా సత్యము మరియు అసత్యం అలాగునే ఉన్నవి.

20మరియు యెషయా దీనిని చూచాడు, మరియు దానిని చూచాడు, దేవుడు అతడిని దీవించుట చూచాడు మరియు అతడు ఎలా… సమస్త దేశములు చుట్టూ అతని యొక్క కీర్తి ప్రసిద్ధులు వ్యాపించినవి, ఐగుప్తు దేశములోకి కూడా వెళ్లినవి. మరియు ఆ దేశములో అతనితో యుద్ధము చేయుటకు ఎవరూ ఎందుకు ముందుకు రాలేదనగా, దేవుడు అతడితో ఉండుట వారు చూచారు. కావున వారు అతనికి సమాధానపు కానుకలు పంపించారు, గొర్రెల మందను మరియు అట్టి వస్తువులను మరియు అతనితో సమాధానపడుటకు వాటిని అతనికి ఇచ్చారు. మరియు అతడు ఒక మంచి వ్యక్తి.

మరియు నేను నమ్ముచున్నదేమనగా, ఒక జాతి గాని లేక ప్రజలు గాని లేక సంఘముగాని లేక వ్యక్తి గాని, విమర్శకులు నిన్ను ఎంతగా విమర్శించినప్పటికీ నీవు సరియైన విషయమునే చేయవలసియున్నావు. వారి యొక్క హృదయముతో నీ కొరకు, ఆ మార్గమంతయు వారు గౌరవాన్ని కలిగియుంటారు. మరియు అది సత్యముగా ఉంటుందని నేను కనుగొన్నాను, చూచారా. మరియు మీరు నిజాయితీగాను మరియు న్యాయముగాను ఉండండి ప్రజలు దానిని గౌరవిస్తారు. మరియు వారు తప్పుడు ప్రజలైనప్పటికి, దానిని గౌరవిస్తారు, మీరు చూచారా, ఎందుకనగా అది ఒక మానవ సంబంధమైనది. మనమందరము మానవులము మరియు తప్పు మరియు ఒప్పు ఉన్నవని మనమెరుగుదుము మరియు మనము దానిని తీసుకోనవలెను.

21మరియు ఉజ్జియా ఈ యొక్క ప్రామాణికతను కలిగియున్నాడు. నేను చెప్పినరీతిగా, ఇతడు యెషయా ప్రవక్తకు గొప్ప ప్రభావితముగానున్నాడు.

మరియు పిమ్మట ఇతర అనేకమంది ప్రజలు చేసినరీతిగానే ఉజ్జియా ఒక ప్రాణాంతకమైన తప్పు చేశాడు. అతడు అది చేసినప్పుడు, అది భద్రతగా భావించాడు, సమస్త విషయము అతని చేతిలో ఉన్నట్లుగా భావించాడు. అతడు తన ఆత్మలో హెచ్చించుకున్నాడు, అతడు గర్వంతో పైకి హెచ్చించుకున్నాడు. ఇప్పుడు మనందరికీ అది ఒక వాస్తవమైన ఉదాహరణగానున్నది.

అది ఒక సమస్యగా ఉంటుందని మీకు తెలియునా. నేను క్రైస్తవులతోను మరియు సేవకులతోను మాట్లాడుచున్నాను మరియు ఈ విషయాలతో నేనెంతో నిజీయితీగా ఉండాలనుకొనుచున్నాను. మరియు అచ్చటే అనేకమంది సేవకులు తప్పు చేస్తారు. సేవకులు వారు చేసే చర్యలను గురించే మనము చాలాసార్లు వినియున్నాము మరియు బహుశా వారు చేయకూడని విషయములు కూడా వారిలో కొంతమంది చేయవచ్చు. నేను అనుకొనుచున్నదేమనగా, కొన్నిసార్లు వారు మంచివారు, ప్రభువుచేత వాడబడే ఒక చిన్న రాజ్యాన్ని వారిచుట్టూ నిర్మించుకుంటారు లేక ఒక గొప్ప పలుకుబడిని, చాలామంది వారి సభలకు హాజరవుతారు. వారు జాగ్రత్త వహించనంత స్థితి వరకు మరియు వారు పైకి హెచ్చించుకొనే స్వభావము వరకు, ప్రజలు వారిని అభినందిస్తారు మరియు నిలువబెడతారు. మరియు మనము దానిని నిజముగా అలా చేయరాదు. మనము, గుర్తించుకొనండి, మనమందరము…

మన మధ్య పెద్దవారెవరునూ లేరు. మనమందరమూ కేవలం దేవుని పిల్లలము, మీరు చూచారా, దేవుడు మనలో ఒకరిని ఒకరీతిగా, ఇంకొకరిని మరొక రీతిగా చేసినచో ఎలా ఉండును? ఎందుకని, దేవుడు నన్ను ఒక వ్రేలితో మరియు ఒక కన్నుతో చేశాడు, మరియు కావున ఆ రీతిగా. మంచిది, మనము ఒకరికొకరము అభినందించుకొనవలసియున్నాము మరియు పిమ్మట ఒకరికొకరము గొప్పవారిగా భావించుకోరాదు. ఎందుకనగా మనమందరము కలసికట్టుగా ఒకే దేవునికి సంబంధించినవారము గనుక, చూచారా, మరియు మనమందరము ఒకే చెట్టు నుండి బయటకు వచ్చాము, చూచారా.

22మరియు ఇప్పుడు మనము దానిని కనుగొన్నాము, చాలా సార్లు, సేవకులు ఒక చిన్న భద్రతగా భావిస్తుంటారు మరియు వారు నాయకత్వం చేస్తూ ఉంటారు, మరియు నీవు తెలుసుకొనవలసిన మొట్టమొదటి విషయమేమనగా, వారు చేయకూడని విషయములు చేస్తారు. మరియు అది మనకు తెలుసు, చాలాసార్లు, నీతిమంతులు మరియు మంచి ప్రజలు కూడా అలా చేస్తారు. కాబట్టి వారు అనేకమైన సామాజిక సంబంధాలు కలిగి ఉంటారు. అనగా వారు పెద్ద విందులకు వెళ్తారు మరియు ఒక విషయం మీరు మొదటిగా తెలుసుకొనండి అదేమనగా, వారు ఏదో ఒకసారి కొద్దిపాటి పానీయము కావాలని కోరుకుంటారు. మరియు వారు లోకంలో పడతారు. మరియు నేను ఆలోచిస్తున్నదేమనగా, ఈ రోజు మన సంఘముతో ఉన్న సమస్య అదే. నేను అనుకొనుచున్నదేమనగా మనయొక్క పెంతుకోస్తు కదలికతో సమస్య అదే.

ఇప్పుడు దీనిని గూర్చి మొదట స్పష్టముగా నన్ను చెప్పనివ్వండి, చూచారా. నేను పెంతుకోస్తు సంఘమును గూర్చి చెప్పిన విషయాలు మీరు వినేయుంటారు. మరియు నేనొక పెంతుకోస్తును, చూచారా. అయితే, ఇచ్చట, ఈ యొక్క న్యూ-యార్క్ నగరంలో పెంతుకోస్తు ప్రజలు లేనిచో, ఈ వర్తమానమును బోధించుటకు నేను ఎచ్చటకి వెళ్లేదను? చూచారా? పెంతుకోస్తు ప్రజలను నేను అభినందిస్తాను. వారంతా నా సోదర సోదరీమణులు.

అయితే ఇంకా ఏమైనా నా సహోదరులతో తప్పిదము నేను చూచినచో, నా బిడ్డతో, నా భార్యతో లేక అది ఏమైనప్పటికీ, నిజము నిజమే. ఒక నిజమైన తల్లిదండ్రులు వారి యొక్క పిల్లలను సరిచేస్తారు.

23మరియు నేననుకొనుచున్నదేమనగా, మన సంఘముతో ఉన్న సమస్య ఏదనగా ఇతరుల వలె ఉండుటకు మనము ఎక్కువగా ప్రయత్నిస్తుంటాము, చూచారా. మనము ఎవరో ఒక వ్యక్తిలా నటించవలెనని ప్రయత్నిస్తాము, మీరు చూచారా, మరియు మనము వారి యొక్క అలవాట్లను తీసుకొని అనుసరించటానికి ప్రయత్నిస్తుంటాము. మరియు మీరు తెలుసుకొనవలసిన మొట్ట మొదటి విషయమేదనగా, ఇది ఒకప్పుడు…

నాకు అది సరిగ్గా గుర్తులేదు గానీ, పెంతుకోస్తు ప్రజలు వారి యొక్క ప్రారంభములో వారు సరిగ్గానే యున్నారు, ఈ యొక్క చివరి ఉజ్జీవములో వారు చాలా సంవత్సరాల క్రితం అజూసా వీధి నుంచి ప్రారంభమయ్యారు, అయితే దాని యొక్క చరిత్రను నేను తీసుకున్నాను. మరియు నేను చాలా పుస్తకములు చదివి మరియు అనేకమంది వృద్ధులతో మాట్లాడియున్నాను. ఇప్పుడే శ్రివ్-పోర్ట్, లూసియానాలో ఒక సభను ఏర్పాటు చేయుటకు, ఆయన అచ్చట ఉంటాడు, అతడు అజూసా వీధిలో గల మొట్టమొదటి వ్యక్తి మరియు పిమ్మట ఈ దేశంలో పెంతుకోస్తుకు అదియే ప్రారంభము, బహుశా 50 సంవత్సరాల క్రితం కావచ్చు, నేను అనుకొనుచున్నాను. మెక్-పర్సన్ దేవాలయము నొద్ద సునాద సంవత్సరమును బోధించాను, ఏంజలస్ దేవాలయమునొద్ద లోస్-ఏంజిల్స్ లో గల దేవాలయమునొద్ద కొన్ని సంవత్సరములు క్రితము - పెంతుకోస్తు యొక్క 50వ సంవత్సర స్మారక సునాద సంవత్సరమును గూర్చి నేను బోధించాను, ఇప్పుడు మీరు చూచారా.

24అయితే అప్పటి నుండి ఇప్పటికి, అనేకమైన చిన్న చిన్న

విషయాలు సంఘములోనికి మెల్లగా ప్రాకుకుంటూ వచ్చినవి, ఎందుకనగా సంఘము లోకముతో ప్రతి దినము భుజాలు తట్టుచూ వచ్చినది. ఇప్పుడు, మరియు ఇది మరలా తన వెనుకకు వస్తుందని నేననుకొనుట లేదు. మనయొక్క సోదరీలకు చూచారా మన యొక్క సోదరులకు అనేక పర్యాయములు, సంవత్సరములు క్రితము జరిగినది. అయితే అది తప్పైయున్నది (దానిని గూర్చి నేను గత రాత్రి చెప్పినరీతిగా) ఎందుకనగా మన సోదరీలు వారి జుట్టు కత్తిరించుకొనుట తప్పైయున్నది. అయితే ఇది ఏమిటి? ఇప్పుడు మనము దేశములో వివిధ రకాలైన స్థలాలకు వెళ్ళుచున్నాము మరియు మీకు తెలుసా మన పెంతుకోస్తు సహోదరీలను ఆ యొక్క వాటర్-హెడ్ జుట్టు కత్తిరింపుతో మనము చూస్తున్నాము, మరియు వారు అటువంటి పెద్ద జుట్టు కత్తిరింపులతో ఉన్నారు. మరియు దీనిని గూర్చి మీరు వారికి చెప్పగలరు. మరియు వారు మేకప్ వేసుకుంటారు. వారు పురుషుల వలె వస్త్రాలు ధరిస్తారు.

మరియు మీరు ఇలా చెప్పవచ్చు, "ఇప్పుడు, సహోదారుడా, బ్రెన్హాం గారు, మీరు స్త్రీలను గూర్చి చెప్పుచున్నారా."

25ఇప్పుడు ఒక్క నిమషమాగండి, పురుషులను గురించి కూడా నన్ను చెప్పనివ్వండి. తన భార్యను అలా చేయుటకు అనుమతించు సహోదరుడు, తన గృహము మీద ఒక మంచి పరిపాలకుడు కానే కాదు, చూచారా. చూచారా?

నీవు అలా చేయరాదు. అయితే ఇది ఏమిటి? మిగతా వారితో మనము మన యొక్క భుజాలు కలిపాము. ఒక చిన్న బలహీనుడు ఏదో ఒక సెమినరీ నుండో లేక పాఠశాల నుండో వచ్చి, దీనిని గూర్చి ఒక భిన్నమైన తలంపు కలిగివుంటాడు. అయితే ఒకే ఒక్క పరిపూర్ణ మాదిరి ఏదనగా పరిశుద్ధ గ్రంథము వద్దకు మనము తిరిగి వెళ్లటమే. పరిశుద్ధ గ్రంథము దానిని ఖండించుచున్నది, చూచారా. మరియు అది సరియైనది కాదు.

26మరియు పిమ్మట మనము మిగతా విషయములను కనుగొంటాము. చలన చిత్రములకు వెళ్ళుట ఆనాటి పరిశుద్ధులైన ప్రజల కొరకు అది తప్పుగా వుండేది. అయితే ఇప్పుడు వారు అన్నివేళలా వెళ్తున్నారు, చూచారా. మరియు పిమ్మట సాతానుడు నీ మీదికి వేగమైన ఒక దానిని లాగుతాడు, దూరదర్శిని (టి.వి)ని నీ గృహములో ప్రవేశపెడతాడు. మరియు, చూచారా, అచ్చట లోపల దానిని (టి.వి ని) స్థిరపరుస్తాడు. అయితే ఒకప్పుడు ఇవన్నియు తప్పుగా ఉండేవి.

మంచిది, అది ఏమిటి? చూచారా, ఇది ఇప్పుడు చాలా సర్వసాధారణమైపోయినది. నీవు తెలుసుకొనవలసిన మొట్టమొదటి విషయమేమనగా, అది నిన్ను పట్టుకొనినది. ఇది ఒక ద్రాక్షవళ్ళి నీ చుట్టూ పెరిగినట్లుగా ఉన్నది. ఇప్పుడు, ఆ ద్రాక్షవళ్ళిని నీ నుండి దూరముగా ఉంచినచో, చూచారా, మరియు నీవు యేసుతో చుట్టూ చుట్టబడి ఉండు, వాక్యము చుట్టూ చుట్టబడి ఉండు మరియు దానితో నిలిచియుండు, చూచారా, నీవు తిన్నగా పెరుగుతావు. అది ఒక వంకరైనది మరియు అది నిన్ను రహదారికి ఆవలివైపుగా లాగుకొనిపోతుంది. అయితే క్రీస్తు నిన్ను పైకి లాగుచున్నాడు. అది మాత్రం నిన్ను ప్రక్కదారులకు లాగుతుంది.

మరియు పిమ్మట నీవు ఒక స్త్రీని చూడు, ఒక సేవకుని భార్యలాంటిది లేక ఒక సేవకుడు ఏదో ఒక విషయమును చేయుట ప్రారంభిస్తాడు, ఆయన యొక్క సమస్త సంఘము ఇలా చెప్తుంటుంది. "మంచిది, మా యొక్క కాపరి దానిని చేశాడు, మా కాపరి యొక్క భార్య దీనిని చేసింది. మనమెందుకు దీనిని చేయకూడదు?" చూచారా, నీవు ఎవరినో ఒకరిని ప్రభావితం చేస్తుంటావు, మరియు సరైన రహదారి వైపుగా వారిని నీవు సరిగ్గా ప్రభావితం చేసేటట్లుగా నీవు నీశ్చయత కలిగివుండు. మరియు సరియైన విషయాలు వారు చేసేలాగున.

2CH 26:16-18

 

27ఇప్పుడు మనము కనుగొననది ఏమనగా, మీరు పైకి

హెచ్చించుకొనినప్పుడు, నీవు నీ యొక్క రహదారి మీదనున్నావు, చూచారా, నిన్ను నీవు పైకి హెచ్చించికొనినప్పుడు.

మరియు ఇప్పుడు మనము కనుగొనినది ఏమనగా ఈ యొక్క ఉజ్జియా, అతడు పైకి హెచ్చించుకొన్నాడు, ఎందుకనగా అతని చుట్టూ ఉన్న ప్రతీదానిని చూచి, అతడు భద్రతగా భావించాడు. అతడు తన రాజ్యాన్ని కలిగియున్నాడు, మరియు ఇది బాగా జాగ్రత్త వహించబడినది. మరియు దేవుడు అతనిని దీవించాడు. మరియు అతడు గొప్ప ద్రాక్షతోటలను కలిగియున్నాడు. మరియు పశువుల మందలను మరియు గొర్రెలను కలిగియున్నాడు. మరియు గనులు సమస్త సంపాదన కలిగియున్నాడు, మరియు అతడితో అన్ని దేశాల వారు శాంతి ఒప్పందాలు కుదుర్చుకున్నారు. కావున తాను కోరుకోను దేనినైనా చేయగలనని అతడు తలస్తూ, అతడు తనను తాను హెచ్చించుకున్నాడు మరియు గర్వము కలిగివున్నాడు.

అతడు (ఉజ్జియా) ఆయన యొక్క సేవకుని స్థానమును తీసుకొనేటంతగా తనను తాను హెచ్చించుకొన్నాడు. అతడు దేవాలయము లోనికి వెళ్లి, మరియు ధూపార్తిని తీసుకొని పిమ్మట బలిపీఠం వద్దకు వెళ్లాడు. మరియు అతడు దానిని చేసినప్పుడు ఆ యాజకుడు అతని వద్దకు వెళ్లి, అతడు దానిని చేయరాదని చెప్పెను. మరియు అతనిని సరిచేసినప్పుడు, తనను తాను తగ్గించుకొనుటకు బదులుగా, అతడు హెచ్చించుకొనుటకు ముందుగా, "అది నిజము, అది చేయుటకు నాకు హక్కులేదు," అని చెప్పుటకు బదులుగా మరియు అతడు ఆ ధూపార్తీని అచ్చట గల అహరోను యాజకునికి ఇచ్చివేయవలసి యున్నాడు. ఎందుకనగా, దానిని చేయుటకు అహరోను అభిషేకించబడి, ఆ సేవకొరకు ప్రతిష్టించబడ్డాడు.

28వీటితో ఇచ్చట నేను సంపూర్ణ సువార్త వ్యాపార ప్రజలతో కొంతవరకు ప్రయాణిస్తాను. వారిలో చాలామంది ఇప్పుడు, ఇచ్చట కూర్చొనియున్నారు. మరియు శనివారం ఉదయం అల్పాహారం తీసుకోను సమయంలో నేను వారితో మాట్లాడవలసియున్నాను. స్టాట్లలర్ హోటల్లోనని, నేను నమ్ముచున్నాను. ఆ యొక్క ఉదయకాల అల్పాహారం కోసం, వారు ఇదివరకే పదిహేడు వందల టిక్కెట్లను అమ్మియున్నారని చెప్పారు.

కావున ఎంతోకాలం క్రితం కాదు గానీ, నేను వారితో మాట్లాడియున్నాను. మరియు ఆ వ్యాపారులను ను వారు వేదికపైకి తీసుకు వస్తున్నారు., వారు వారి యొక్క ప్రసంగ అంశాలను తీసుకొని సువార్తను ప్రకటిస్తున్నారు. "అది తప్పు" అని నేను చెప్పాను. ఇది ఖచ్చితముగా తప్పు, దీనిని తిన్నగా చేయుటకు సేవకులమైన మనకు ఇది చాలా కష్టతరం. కావున ఈ వ్యాపారులను కూడా దానిని చేయుటకు అభిషేకించబడలేదు., అనగా మీరు మీ కొన్ని, చిన్న ఆలోచనలు మొదలగునవి తెస్తారు. "మీరు అది చేయరాదని," నేను చెప్పాను.

29ఇతరులకు సంబంధించిన స్థానమును తీసికొనుటకు నీవేన్నడూ ప్రయత్నించరాదు. దేవుడు నిన్నొక ప్రత్యేక వ్యక్తిగా చేశాడు, మరియు నీవు దానితోనే వుండు. నీవు ఏమైయున్నావో అలాగే ఉండు. ఇతరులను అనుకరించటానికి ప్రయత్నించవద్దు. దేవుడు ప్రపంచానికి పంపిస్తున్న వరములను అదియే ఎల్లప్పుడును నాశనం చేస్తున్నది. అనేకమైన భౌతిక అనుకరణలను మనము కనుగొనుచున్నాము. మరియు వేరొక వ్యక్తిని అనుకరించే వ్యక్తిని మనము కూడా అనుకరించడానికి ప్రయత్నిస్తూ ఉంటాము.

వారు స్త్రీ పరిచారకులు వద్ద చెప్పిన విధముగా, శ్రీమతి. మెక్-పర్సన్ జీవిస్తూ ఉండేకాలంలో ప్రతీ స్త్రీ బోధకురాలు కూడా ఆమె వలె రెక్కలు ధరించేవారు, లేక ఎన్నడూ లేనివిధముగా మరియు వారియొక్క పలుకబడిన వాక్వము పరిశుద్ధ గ్రంథమును అదేరీతిగా కలిగివున్నారు. మరియు ఆమె చేసే ప్రతీది, వారు కూడా చేసేవారు.

2COR 12:15-18

 

30మనము గమనించినదేమనగా, నేడు అనేకమంది బిల్లీగ్రాహంలను మనము కలిగియున్నాము! అయితే మీరు చూచారా, దేవుడు ఒక బిల్లీగ్రాహంను తప్ప అనేకమందిని చేయలేదు. అది అంతే.

మరియు బిల్లీగ్రాహం వలె, ఓరల్ రాబర్ట్స్ వలె కాక ఆ యొక్క ప్రసిద్ధిగాంచిన మనుష్యుల వలే నీవు కూడా ఎంతో ప్రాముఖ్యమైనవాడవు. నీవు నీ యొక్క స్థానంలో నుండి పోనంతవరకు నీవు ప్రాముఖ్యమైనవాడవే. మరియు అప్పుడు నీవు ఇంకెంత మాత్రమును మంచివాడవు కాదు. నీవు ఈ మనుషులకు ఆటంకంగా ఉంటావు. మరియు నీకు నీవుగానే అవరోధంగా ఉంటావు. మరియు దేవుని రాజ్యముకు కూడా అవరోధంగా ఉంటావు. కావున నీ స్థానంలోనే నీవు వుండు, చూచారా. దేవుడు నిన్ను చేసిన రీతిగానే వుండు, చూచారా, మరియు పిమ్మట నీవు సరిగ్గా ప్రయాణిస్తావు.

పౌలుగారి ప్రకారంగా ఇది ఏమీ కొత్తదేమీ కాదు, పౌలు కూడా అదే విషయాన్ని చెప్పెను, ఆయన చెప్పినదేమనగా, "చెయ్యి కన్నుతో నేను కన్ను కాదు అని చెప్పినచో లేక చెవి ముక్కుతో నేను ఇక ఎంత మాత్రమూ చెవిగా ఉండను, ఎందుకనగా నేను ముక్కును కాదు," లేక ఫలాన కాదు అని చెప్పినచో, నీవు దానిని చేయలేవు. చూచారా, ఇవన్నియూ కలసికట్టుగా సరిగ్గా అమరచ్చబడి మరియు ఒక గొప్ప సమూహముగా కదులుచున్నవి.

31మరియు మనము ఏ ఒక్కరిని కూడా అనుకరించుటకు ప్రయత్నించరాదు. నీవు ఏమైయున్నావో అలాగే వుండు, చూచారా, మరియు దేవుడు నిన్ను ఆ రీతిగా మలిచాడు. నిన్ను నీవెన్నడూ రూపించుకోలేదు. మరియు గుర్తించుకొనండి, సేవకులుముగా మనము బిల్లీగ్రాహం గారి యొక్క స్థానమును తీసుకొనుటకు ప్రయత్నించరాదు. చూడండి, మనలో ప్రతీ ఒక్కరము చేయుటకు ఏదో ఒకటివున్నది. ఇచ్చట గల సాధారణ, ఒక చిన్న వ్యక్తి కూడా ఈ భవన కాపలాదారుడుగా వుండవచ్చు, ఒక చిన్న స్త్రీ కూడా ఒక ఇంటి భార్యగా వుండవచ్చు, నేడు భూమిమీదనున్న ఒక మహా గొప్ప సేవకుడు కూడా నీ స్థానమును తీసుకొనలేడు. నీవు, నిన్ను తయారు చేయటంలో నీవు ఏమైయుండాలో అని దేవుడు ఒక ఉద్దేశ్యమును కలిగియున్నాడు. మరియు దేవుడు నిన్ను తయారుచేసిన రీతిగానే నీవు ఆయనను సేవించవలసియున్నావు, చూచారా. మరియు నేను అనుకొనుచున్నది ఏమనగా, మనము దానిని ఖచ్చితంగా చేసినచో ఆ చక్రములు చాలా సులువుగా నడుస్తాయి. అవును, అది జరుగుతుంది, అనగా మనము పైకి హెచ్చించుకొననిచో అప్పుడు మరియు దానికి బదులుగా మనము కనుగొనుచున్నాము…

MARK 16:15,17

 

32ఎవరో ఒకరు ఇంకొకరికి ఏదో చెప్పినచో లేఖన పూర్వకముగా అది సరైనది అని మనము చూచినప్పుడు, మనలను మనము తగ్గించుకొనుటకు ప్రయత్నించుటకు బదులుగా, "మంచిది, ఇప్పుడు నేను తప్పైయున్నాను. మీరు నన్ను క్షమించండి. మరియు నేను అలా చేయదలచుకోలేదు. అది నాకు తెలియదు. కావున దానిని నేను ఖచ్చితంగా విడిచిపెడతాను," అని చెప్పవలసియున్నాము. మంచిది, పిమ్మట దానిని చేయుటకు బదులుగా అనేకసార్లు ఉజ్జియా చేసినరీతిగా మనము చేస్తాము. అతనికి అలాగు చెప్పటానికి అతడేదో ఒక గొప్పవాడుగా భావించాడు, చూచారా, ఎందుకనగా అతడు ఒక రాజైయున్నాడు మరియు నేను చూచినదేమనగా చాలాసార్లు సేవకులు ఆ రీతిగా ఉంటారు. అనగా వాక్యం మరియు సత్యం ఏమైయున్నదో వారికి చెప్పినచో వారెంతో ప్రాముఖ్యమైన వారుగా భావిస్తారు.

"మంచిది, అద్భుతాలు జరుగుకాలము గతించిపోయినది!"

దేవుడు ఎక్కడ అద్భుతములను అభిషేకించాడో నేను మీకు చూపించగలను; ఆయన వాటిని ఆపివేశాడు అని మీరు నాకు చెప్పజాలరు, చూచారా. మరియు ఆయన వరములను అభిషేకించాడు. ఆయన ఎచ్చట వాటిని ఆపు చేసేశాడో మీరు నాకు ఎన్నడూ చెప్పలేరు. చూడండి, ఇది లేఖనములలో వున్నది. "మీరు సర్వలోకమునకు వెళ్లి, సర్వసృష్టికి నా సువార్తను ప్రకటించుడి." అది ఎంతకాలము? "సర్వలోకము, సర్వ సృష్టి వినేంతవరకు, ఎంతమంది వినవలెనో అంతమంది. దీనిని వినేంతవరకు, నమ్మినవారివలన ఈ సూచక క్రియలు కనబడును." చూడండి, మనము దీనికి వేరే ప్రత్యామ్నాయం ఇవ్వలేము. కావున ఆయన ఏమి చెప్పాడో ఖచ్చితంగా దానినే చేయండి మరియు అది అంతా సరిగ్గా ఉంటుంది మరియు ఇది మంచిగా ఉంటుంది. అయితే మనము మన స్వంత మార్గములను అనుసరించుటకు ప్రయత్నించుచున్నంత కాలము…

33అచ్చట ఇశ్రాయేలీయులు తమ యొక్క ఘోర తప్పిదము చేశారు. కృప వారికి అగ్నిస్తంభమును ఇచ్చినప్పుడు, దేవదూత, మరియు ఒక బలి మరియు వారిని విమోచించెను. వారికి ప్రవక్తను పంపించెను, వెంబడించుటకు వారికి అగ్నిస్తంభము పంపబడెను. వారిని మార్గంలో నడిపించుటకు పంపబడెను. మరియు వారు నిర్గమకాండము 19వ అధ్యాయమునకు వచ్చినప్పుడు, వారు ఎన్నడూ చేయని తప్పును - కృపకు బదులుగా ధర్మశాస్త్రాన్ని ఎంచుకున్నప్పుడు చేశారు, చూచారా. అయితే వారు, వారికి వారే చేయగలిగినది కోరుకొన్నారు.

మనము ఆ మార్గంలోనే వున్నాము. మనము మన యొక్క డాక్టరు డిగ్రీని కలిగివుండాలని కోరుకొంటాము. మరియు నీవు దానిని పొందుకొనలేనిచో, నీవు సంఘములోనికి వెళ్లలేవు. అంతే. కావున, మనము ఆ విషయాన్ని పరిశీలించి, అది దేవుని వచ్చినదా, కాదా కనుగొనవలెను.

34ఇప్పుడు మనము కనుగొనినదేమనగా, ఉజ్జియా తనను తాను హెచ్చించుకున్నాడు. మరియు ఎలాగైనప్పటికి దానిని అతడు చేయుటకు వెళ్ళుచున్నాడు. అతడు ఆ ధూపార్తిని బలవంతముగా లాగుకొని అర్పించాడు. అది లేఖనమునకు విరుద్దమైనది. దానిని అతడు చేయుట లేఖన విరుద్దం.

ఇంకొకర్ని అనుసరించుట నాకైనా లేక నీకైనా, ఇది లేఖన విరుద్దం. అది నిజం. కావున, నీవేమైయున్నావో అలాగే వుండు, మరియు ఒక మంచి వ్యక్తిగా వుండు మరియు నీ యొక్క ఉద్దేశ్యమును నెరవేర్చు, కావున అప్పుడు ఇతరులు కూడా నిన్ను చూచెదరు. నీవు ఒక గృహిణివైతే ఒక నిజమైన దానివిగా వుండు, చూచారా. మరియు నీవు ఒక డీకనువైతే, యధార్థంగా వుండు; లేక ఒక బోధకుడవైనచో, నీవేదైనప్పటికీ, అంతేగానీ, వేరొకని స్థానమును తీసుకొనుటకు ప్రయత్నించవద్దు.

మరియు ఆ విషయములో వాక్యము నిన్ను పిలిచినప్పుడు (సరిచేసినప్పుడు) నీవు… నీవు గద్దించబడియున్నావని భావించినచో, మారుమనస్సు పొందు. నీవు చేయవలసినది ఏమనగా, సరిదిద్దుకొనుము. అదియే నీవు చేయవలసిన విషయము.

2CH 26:19-21

 

35అయితే ఉజ్జియా దానిని చేయదలచుకోలేదు. అతడున్న మార్గములో దేవుడతనిని దీవించిన పిదప, మరియు ఆయన దానిని చేస్తానని, ఇంకా ఆయన భావించుకోలేదు. అతడు అనుకున్నదేమనగా, అతడు అలాగే ఇంకా ముందుకు వెళ్లాలని, ఎలాగైనా దానిని చేయాలని, ఎందుకనగా అతడెంతో భద్రతగా వున్నాడని తాను భావించాడు. అయితే అతడు అలా వుంటుండగా… ఆ యొక్క వ్యక్తుల పైన కూడా కోపపడే రీతిగా మారాడు, అనగా ఎవరైతే దేవుని వాక్యాన్ని అతనికి చెప్పారో వారి పైన కోపపడ్డాడు.

మరియు అతడు దానిని చేసినప్పుడు, అతడు చాలా తొందరపడ్డాడు. ఎలాగైనప్పటికీ, అతని యొక్క ముఖము మీద కుష్ఠువ్యాధి వచ్చినట్లుగా మనం చూస్తాము. మరియు అతడు చనిపోయినంత వరకు ఒక కుష్ఠు రోగిగా వున్నాడు. అతడు ఇంకెంతమాత్రమును దేవుని గృహానికి వెళ్లలేకపోయాడు. అతడొక కుష్ఠరోగిగా చనిపోయాడు. దేవుని యొక్క హస్తము. అతడు చూచిన తర్వాత, అనగా దేవుడు అతనికి ఎంత మంచివానిగా వుండెనో మరియు అతడు కలిగియున్న విషయాలను ఎలా చేసెనో; అయినప్పటికీ, ఆ మనుష్యుడు రోగము వలన ప్రత్యేక శిబిరములో ఉంచబడి కుష్ఠువానిగా చనిపోయెను.

ఇప్పుడు మనము దానిని చేయగలము. మనము చాలా విషయములు చేశాము. అయితే దేవుడు మన పైన తీర్పు కూడా తీర్చబోడు అని, మరియు మనము చాలా భద్రతగానున్నాము అని, అనుకుంటాము, చూడండి. చూచారా?

MATT 13:46

 

36గుర్తుంచుకొనండి, ఏ ఒక్కరినీ అనుకరించుటకు ప్రయత్నించవద్దు. నీవేమైయున్నావో అలాగేవుండు. దేవుడు నీన్నొక పెంతెకోస్తువానిగా చేసినచో, నీవు అలాగే నిజంగా వుండు. నీవు చూచావా, ఒకవేళ దేవుడు… దీనిని గూర్చి సిగ్గుపడవద్దు. మానవునిగా వుండుటకు నేను సిగ్గుపడుటలేదు. అమెరికావానిగా వుండుటకు నేను సిగ్గుపడుటలేదు. ఒక సేవకునిగా వుండుటకు నేను సిగ్గుపడుటలేదు. నేను ప్రకటించు సువార్తకు నేను సిగ్గుపడుటలేదు. ఎందుకనగా…

నేను నా మతి కోల్పోయానని, వారిలో చాలామంది అనుకొనుచున్నారని నాకు తెలుసు. కొన్ని సంవత్సరాల క్రితం చనిపోయిన నా మంచి తల్లి కూడా అలాగే భావించినది. నేను పరిశుద్ధాత్మను మొట్టమొదటగా పొందుకున్నప్పుడు, దీనిని గూర్చి తెలుసుకొనుటకు దేశములో ఏ ఒక్కరూ లేరు. మరియు నేను కేవలం 20 సంవత్సరముల ఒక చిన్న యౌవ్వన బాప్తిస్టు బోధకున్ని. అయితే నేను పరిశుద్ధాత్మను పొందుకొనినప్పుడు, మా అమ్మగారు ఇలా అన్నారు, "ఆ అబ్బాయి తన యొక్క మతి స్థిమితమును కోల్పోయాడు," చూచారా. అయితే మా అమ్మగారు నేను తప్పు అని తలంచినప్పటికీ, నేను ఆ యొక్క గొప్ప విలువైన ముత్యమును పొందుకున్నాను. అయితే అది ఆమెకు అలా కనిపించవచ్చు, అయితే నాకది వాస్తవమైనది. చూడండి, అది నిజము. ఇది ఏదో ఒక వాస్తవమైన విషయము, దానిని నేను దేవునిలో కనుగొన్నాను.

MARK 13:31•

REV 22:18

 

37ఎందుకనగా, ఒక బాలునిగా, ఇది దేవుని వాక్యమని నేనెల్లప్పుడు నమ్మేవాడను, మరియు ఇది ఎన్నడూ మారనిది. యేసు చెప్పెను, "ఆకాశము, భూమి గతించినా గాని, నా మాటలు మారనే మారవు; ఇవి గతించనే గతించవు." దీనికి నీవు ఏ విధమైన ప్రత్యామ్నాయాన్ని కూడా చేయజాలవు. ఇది వ్రాయబడిన విధంగానే, మనము దీనిని నమ్మవలసియున్నాము. దీనికి ఏదీ కలుపవద్దు. దీనినుండి ఏమియూ తీసివేయవద్దు. ప్రకటన గ్రంథములో ఏమి వ్రాయబడినదో మీకు తెలుసా, "ఈ గ్రంథములో నుండి ఎవరైనా ఒక వాక్యమును తీసివేసినా, కలిపినా (ఏమిటి?) అతని మీద శాపం ఉంటుంది." కావున అది వున్న మార్గములోనే దానితో వుండు. మరియు దానిని అలాగే నమ్ము, మరియు దానిని దేవుడు గౌరవిస్తాడు.

MATT 24:35

 

38ఇప్పుడు, అతడు తనను తాను హెచ్చించుకొనిన గర్వం మూలంగా, అతడు మొత్తబడ్డాడు. ఏదో వున్నదనే భావాన్ని కలిగివున్నాడు… అతడు మాత్రమే అలా వున్నాడు మరియు అతడు దేనికైతే కోరుకున్నాడో, దానిని చేయాలని చూశాడు మరియు అతనిని ఏ ఒక్కరూ ఆపలేకపోయారు.

మాకొక సహోదరుడున్నాడు, ఎంతోకాలం క్రితం కాదు గానీ, అతని కొరకు నేను చాలా చింతించుచున్నాను. ప్రతీ ఒక్కరూ ఆయనకు నిందించినట్లుగా కన్పించాడు. అతడు ఏదో తప్పు చేశాడని, ఆ సహోదరుని అందరూ నిందించారు, వార్తాపత్రిక కూడా ఆయనను నిందించింది. అయితే నేను ఆ వ్యక్తిని నిందించుట గూర్చి ఆలోచించాను? నేను నిజముగా అతని కొరకు తీసుకొన్నాను, ఎందుకనగా… నేను నిశ్చయముగా అతనితో ఏకీభవించలేదు. అయితే ఆ యొక్క వ్యాసమును వ్రాసి, ఆ పత్రికలో వుంచిన వ్యక్తులు మాత్రము, ఈ మనిషి చేసిన విషయాలకు భిన్నంగా వ్రాసియున్నాడు.

39మరియు ఒక రాత్రి మినియాపోలిస్ లో జరిగిన రాత్రికాల సభలో, ఆ పత్రిక రచయిత కూడా అచ్చటనున్నాడని వారు నాకు చెప్పారు. మరియు ఆ యొక్క అంశము ఒక క్రైస్తవ పత్రికలో వచ్చినది. అది ఒక క్రైస్తవ డైజెస్ట్ పత్రిక. కావున వారు, ఆ మనిషిని నాకు చూపించి, ఇలా చెప్పారు, "ఆ మనిషి అచ్చట కూర్చొన్నాడు." మరియు ఈ యొక్క సేవకుడు వ్రాసిన ఏదో ఒకదానిని, అతడు ఆ అంశమును వేశాడు. ఆ పుస్తకమును అతడు వ్రాయలేదు. అది నాకు తెలుసు. ఒక స్త్రీ ఆ పుస్తకమును వ్రాసినది, మరియు ఆ స్త్రీని కూడా నేనెరుగుదును. "బైటింగ్-అఫ్-డెవిల్స్," అను పుస్తకం.

కావున నేను చెప్పాను, "మంచిది, ఇప్పుడు, నేనొక విషయమును చెప్పెదను. ఇప్పుడు, నేను ఆ యొక్క సేవకునితో అంగీకరించకపోవచ్చు, అయితే నేను ఆలోచించినదేమనగా, ఈ అంశం యొక్క సంపాదకుడు, అతడు తన యొక్క రచనను పరిశీలించనిచో, ఈ మనిషి ఈ అంశం వ్రాశాడని సరిగ్గా చెప్పలేడు, మరియు అతడు దానిని చేయలేదని నాకు తెలుసు. చూడండి, పిమ్మట నేను ఈ సేవకుడు తప్పు అని చెప్పిన అనేకమైన విషయాలకు ఎంతో భయపడ్డాను. మరియు పిమ్మట నేను ఇలా చెప్పాను, "ఒక వ్యక్తిని రక్షించుటకు నేను చేయు ప్రయత్నం ద్వారా, నేను తప్పుగా అనిపించవచ్చు, అయితే ఒక వ్యక్తిని ఆటంకపరిచేకన్నా, ఒక వ్యక్తిని రక్షించుటకు ప్రయత్నించడమే గొప్పది." అవునండి.

ఆ యొక్క మనిషిని విమర్శించేకన్నా, లేక ఎవరో ఒకరు చెప్పినదానిని విని అతనిని చీల్చివేసేకన్నా, ఏ సమయములోనైనా నేను ఆ యొక్క మనిషి స్థానాన్ని తీసుకోగలను, వారు ఒక తప్పు చేసినప్పటికీ లేక ఏదో ఒక తప్పిదం చేసినప్పటికీ కూడా. కావున మనము దేనినైతే చేస్తున్నామో అది ఇతరులను ప్రభావితం చేస్తుంది గనుక మనము గమనిస్తుండాలి.

40పిమ్మట ఈ వ్యక్తి తనను తాను హెచ్చించుకున్న మీదట, కుష్ఠువ్యాధి ద్వారా మొత్తబడిన తర్వాత, ఇది ఆ యొక్క యౌవ్వన ప్రవక్తకు ఒక గొప్ప పాఠంగానున్నది. ఇది అతనికి ఒక గొప్ప పాఠంగా తెలుసుకున్నాడు, మరియు దేవుడు తన మనిషిని, ఆ స్థానానికి ఆదేశిస్తాడు, చూచారా. మనిషి తనకుతాను ఆదేశించుకొనజాలడు. దేవుడు తన మనిషిని ఆదేశించును. నీవేమైయున్నావో దేవుడు తయారుచేయును, చూచారా. దేవుడు తన మనిషిని ఆదేశించును, మరియు మరొకని స్థానమును అతడు తీసుకొనుటకు ఎంతమాత్రము ప్రయత్నించరాదు. మరియు ఇది యెషయాకు ఒక పాఠం, అనగా మాదిరి కొరకు అతడు తన నేత్రములను ఏ మనిషిపైన ఉంచుకోరాదని; అతడు తన కన్నులను దేవుని మీద మాత్రమే ఉంచుకొనవలసియున్నాడు.

ఇప్పుడు మనము కూడా అదే అయివున్నాము. ఏ మనిషైనా తప్పులు చేస్తాడు. అతడు తప్పు చేయుటకు గల కారణమేమనగా, అతడు మనిషి గనుక. దేవుని ధర్మశాస్త్రమును మనిషి అతిక్రమిస్తూవుంటాడు. మరియు అతడు అనేకమైన తప్పులు చేస్తుంటాడు, ఎందుకనగా సాతానుడు అతనిని శోధిస్తూ ఉంటాడు, మరియు అతడు ఒక మానవమాత్రుడు గనుక, మరియు దేవుడు ఎన్నడైననూ, మనిషి యొక్క చేతులను పైకెత్తినయెడల, అతడు పడిపోతూ ఉంటాడు. అంతే.

మరియు ప్రజలు ఇలా చెప్పడం నేను విన్నాను, "ఓ, సాతానుడు దానిని చేయలేడు…"

అవును, దేవుడు తన చేతులను పైకెత్తడానికి మీరు ఒకసారి అనుమతించండి, మరియు ఏమి జరుగునో గమనించండి. అది ఒక… నేను స్థిరంగా అర్దిస్తాను, "దేవా, అతనిని పంపించవద్దు. నాపైన కృప చూపండి. అతనిని నా వద్ద నుండి దూరంగా వుంచండి," మీరు చూడండి. నాకు దేవుని కృప కావాలి. మరియు అది మనందరికీ అవసరం.

41ఇప్పుడు మనము దానిని కనుగొన్నాము, యెషయా, అతడు చాలా బలంగా రాజు యొక్క చేతుల మీద ఆనుకొనియున్నాడు, మరియు ఇప్పుడు ఆ చేయి అతని నుండి తీసివేయబడినది; మరియు రాజు (ఉజ్జియా) మృతి చెందాడు, మరియు సిగ్గుచేటుగా కుష్ఠువ్యాధితో మృతి చెందాడు. ఇప్పుడు, ఈ మధ్యకాలము యెషయా, రాజు హెచ్చించబడినప్పుడు, మంచిది, పిమ్మట తన యొక్క యవ్వన కుమారుడు ఆ యొక్క స్థానమును తీసుకొనవలసియున్నాడు. మరియు మనము కనుగొనినదేమనగా, అప్పుడు ఆ ప్రజలు బహు భయంకరమైన అవినీతి స్థితిలోనికి వెళ్ళిపోయారు.

ఒక నిజమైన భక్తిగలిగిన నాయకుడు లేనప్పుడు ప్రజలు నీచమైనవారుగా మారిపోతారు. నేను అనుకొనుచున్నదేమనగా, నేడు మనతో, మన దేశముతో, మన సంఘాలతో, విషయాలతో అదియే సమస్య. మనకు దైవికమైన నాయకులు అవసరము, ఒక ఉదాహరణనగా ఉండువారు.

ISA 6:1•

HEB 12:2

 

42అయితే ఆయన (దేవుడు) యెషయా ఇచ్చట మనుష్యుల వైపు చూడరాదని తెలియచేశాడు. కావున యెషయా, ఒక దినాన, అతడు చుట్టూ ఆశ్చర్యపడుచుండగా, అతడు అలసిపోయి వుంటాడు. అతనికి గొప్ప బాధ్యతలు ఉన్నాయని యెరిగి, ప్రార్థించుటకు దేవాలయానికి వెళ్లాడు. మనందరమూ చేయుటకు అది ఒక మంచి విషయం. ప్రార్థించుటకు అతడు దేవాలయమునకు వెళ్లాడు.

మరియ మనము గమనించినది ఏమనగా, అతడు బలిపీఠం వద్ద ప్రార్థిస్తూ ఉండగా, అతడు ఒక ప్రవక్తగా వుండి, అకస్మాత్తుగా అతడు ఒక దర్శనం చూశాడు. మరియు అతడు దానిని చేసినప్పుడు, అతడు పైకి చూచెను మరియు అతడు దేవునిని చూచెను, ఆ రాజు అత్యున్నత సింహాసనం మీద ఆసినుడైయున్నాడు మరియు ఆయన యొక్క చొక్కాయి అంచులు ఆ స్థలమంతంటను ఆవరించినది, మీరు చూడండి. పిమ్మట అతడు ఒక వాస్తవమైన ఉదాహరణ చూచాడు. ఎవరిలోనైతే తన విశ్వాసాన్ని పెట్టగలడో, ఆ వ్యక్తిని చూశాడు. అనగా ఆయన ఎన్నడూ కుష్ఠువ్యాధితో మొత్తబడలేదు, ఆయన ఎన్నడూ విఫలం కాడు. మరో మటలో చెప్పాలంటే, ఆయన యెషయాతో ఇలా చెప్పుచున్నాడు, "చూచావా, నీవు నీ యొక్క నిరీక్షణను ఒక మనిషి మీద ఉంచుకున్నావు మరియు ఇది విఫలమైనది. ఉదాహరణకు ఈ యొక్క వ్యక్తిని చూడు మరియు అతడు విఫలమయ్యాడు. ఇప్పుడు ఇచ్చట పైకి చూడు, నా వైపు చూడు, నేను ఓటములేని దేవుడను."

మరియు నేను అనుకొనుచున్నది ఏమనగా నేడు మనము కూడా అదే చేయవలసియున్నాము, ఆయన సేవకులుగా మనము ఆయన వైపు చూడవలసియున్నాము. యేసే మన యొక్క ఉదాహరణయైయున్నాడు. మరియు మనము ఆయన వైపు చూడవలసియున్నాము. మరియు ఆయనే మన విశ్వాసమునకు కర్తయు మరియు దానిని కొనసాగించువాడును.

43ఇప్పుడు ఈ దర్శనములో మనము కనుగొనుచున్నది ఏమనగా సర్వోన్నత సింహాసనం మీద ఆసినుడైయున్న దేవుడు ఆ దర్శనంలో కనిపించాడు. పిమ్మట అతడు వేరొక విషయాన్ని గమనించాడు. గమనించండి, ఆయన చుట్టూ మరియు ఆయన దేవాలయం చుట్టూ పరలోక సంబంధమైన సెరాపులు ఉన్నవి.

మీరు ఆ యొక్క వాక్యమును పరిశీలించినచో, నేను అనుకొనుచున్నది ఏమనగా పరిశుద్ధ గ్రంథములో అది కేవలం ఒకటి లేక రెండుసార్లు ఉపయోగించబడినది మరియు అవి కెరూబులు కావు గాని అవి కెరూబుల తర్వాత స్థానములో ఉన్నటువంటివి. దేవదూతలాంటిది; అయినప్పటికీ అది దేవదూత కాదు మరియు అది దేవదూత గాని ఒక ప్రత్యేకమైన వ్యక్తి. వారు ఎవరనగా పరిశుద్ధ గ్రంథంలో బలులు అర్పించేవారు, మరియు వారు ఆ యొక్క బలులను తీసుకొనివచ్చి లోనికి నడిపిస్తారు… ఒక పాపి పరిశుద్ధునిగా ఉండుట కొరకు ఒక మార్గాన్ని తయారుచేస్తారు. మరియు ఈ యొక్క సెరాపులు అవసరమైన బలులను అర్పిస్తూ ఉంటారు, వారు అచ్చటకు వెళ్లి… అది వారి యొక్క విధి.

ISA 6:2,3

 

44మరియు యెషయా ఆ యొక్క దర్శనంలో ఉంటుండగానే వారు ఆ దేవాలయం గుండా ఎగురుతూ ఉన్నారు. మరియు ఆ సమస్త దేవాలయం ధూపముతో నిండుకొనినది మరియు వారు ఒకరికొకరు, "పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్దుడు సర్వశక్తి గల ప్రభువైన దేవుడు పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్దుడు!" అని చెప్పుచున్నవి. ఇంకోమాటలో చెప్పాలంటే, "విఫలంకాని ఒక వ్యక్తి వున్నాడు. అతడు మీ యొక్క మాదిరి. చూచుటకు అక్కడ ఒక రాజు ఉన్నాడు. అతడే సర్వశక్తి గల ప్రభువైన దేవుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడై యున్నాడు!"

మరియు మనము కనుగొన్నది ఏమనగా, ఇవి ఆరు రెక్కలతోనున్న జీవులు మరియు వాటికి ఆరు రెక్కలు కలిగి ఉండుటలో గల కారణాన్ని మనము ఇప్పుడు పరిశీలించబోవుచున్నాము. మనము కనుగొనినట్లుగా రెండు రెక్కలు వాటి ముఖము మీదనున్నవి, మరో రెండు రెక్కలు వాటి పాదముల మీదనున్నవి మరియు మిగతా రెండింటితో అవి ఎగురుతూనున్నవి.

45ఇప్పుడు గమనించండి, మొదటిగా, ఈ యొక్క జీవులు దేవుని యొక్క సముఖంలో పరిచర్య చేయుచున్నవి మరియు వాటి యొక్క వీధి ఏదనగా, "సర్వశక్తి గల ప్రభువైన దేవుడు పరిశుద్దుడు, పరిశుద్ధుడు, పరిశుద్దుడు!" అని కేకలు వేయటమే. మరియు అవి రాత్రింబవళ్లు ఆయన సన్నిధిలో అచ్చట బలులు ఉంటుండగా, "సర్వశక్తిగల దేవుడు పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్దుడు!" అని కేకలు వేయుచున్నవి.

మరియు ఇచ్చట మీరు ఒక విషయాన్ని గమనించవలెనని నేను కోరుచున్నాను, మరియు ఆలోచించండి. ఆ యొక్క సెరాపులు వాటి ముఖముపైన రెండు రెక్కలతో కప్పుకొనియున్నవి. అవి వాటి ముఖాలు మీద ఎందుకు ఉంచుకొనియున్నవి? ఎందుకనగా అవి దేవుని సన్నిధిలో నున్నవి. మరియు ఒక్కసారి ఆలోచించండి, పరిశుద్ద దూతలే ఆయన సన్నిధిలో వాటి ముఖాలను కప్పుకున్నప్పుడు మన గూర్చి ఏమిటి? వాటి ముఖాలు మీదనున్న ఆ యొక్క రెక్కలు గౌరవానికి సూచనగా వున్నవి.

అయితే నేడు, గౌరవము లేనట్లుగా మనము చూస్తున్నాము. గౌరవాన్ని కనుగొనడం ఎంతో కష్టంగా ఉంది. దేవుని కొరకు వారు గౌరవాన్ని కలిగిలేరు. వారు నిల్చొని, దేవుడు అమెరికాను దీవించును గాక అని బారు షాపులో పాటలు పాడుచున్నారు మరియు వారు చేయు మార్గం ఇదెంతో భయంకరమైనది.

46నేను ఒక స్థలములో ఈ దినము ఫలాహారము కొరకు అడుగుటకు వెళ్లాను. మరియు ఒక చిన్న స్త్రీ, ఆమెను గూర్చి ఏ విధమైన విషయాలు చెప్పుకొనుట లేదు గాని, నేను అనుకొనుచున్నదేమనగా, ఆమె చనిపోవుచున్నది. ఆమె కళ్ల క్రింద ఒక కొరుకుడు పుండు ఉన్నట్లుగా ఆమె కనిపిస్తున్నది, ఆమె చుట్టూ నీలపు ఛాయ ఉన్నది. మరియు కొద్దిపాటి వస్త్రములతో ఆమె పైకి పరిగెత్తుచున్నది. పిమ్మట ఆమె నన్ను ఇలా అడిగెను, "మీకు ఏమి కావాలీ?"

నేను అడిగాను, "మీరు నాకొక శాండ్విచ్ మరియు ఒక గ్లాసుతో మజ్జిగ ఇవ్వగలరా?"

మరియు ఆమె చెప్పినది, "బార్బోన్… అనేది ఉన్నది."

నేను చెప్పాను, "లేదండి మేడమ్, మీరు నన్ను బాగా అర్థము చేసుకోలేదు." నేను చెప్పాను, నేను "మజ్జిగ" అని చెప్పాను.

మరియు ఆమె అడిగెను, "ఓ," అడిగెను, "త్రాగడానికి మీకు ఏమీ అవసరం లేదా?"

నేను చెప్పాను, "నాకు మజ్జిగ కావాలి."

మరియు ఆమె చెప్పెను, "మంచిది, మీ అందరూ ఏమి కోరుకొనుటలేదో… రాత్రికి మేము ఫలాన, ఫలానిది ఇస్తాము."

నేను చెప్పాను, "నేను ఒక సేవకుడను."

ఆమె చెప్పినది, "మంచిది మా యొక్క.. కేథలిక్ బోధకులు ఇచ్చటకు వచ్చి త్రాగుతూ ఉంటారు."

నేను చెప్పాను, "అమ్మా, నేను ఒక కేథలిక్కు బోధకుని కాదు, నాకు ఒక గ్లాసు మజ్జిగ కావాలి." ఇది ఆ స్త్రీకి షాక్ కొట్టినట్లుగా అనిపించింది. ఇది ఏమిటో ఆమెకు తెలియలేదు, చూచారా.

ISA 6:2,3

 

47మరియు ప్రపంచము అట్టి స్థితిలోనికి వెళ్లిపోయినది. ఇప్పుడు ఒక బోధకుడు వచ్చి, బీరు త్రాగుతూ వుంటే, సంఘము కూడా త్రాగడానికి హక్కును కలిగివున్నది. అదియే మీ యొక్క మాదిరి, చూడండి. ఓ, మై, ఎట్టి అవినీతిలో మనము జీవిస్తున్నాము! మనకు గృహ శుభ్రత కావాలి, వేదిక వద్ద నుండి, మార్గమంతటిలో… అవును, అవునండి, మనము ఖచ్చితముగా చేయాలి. ప్రపంచం యొక్క అవినీతి ఎంతగా ఉన్నదో!

మరియు వీరు, ఏ విధమైన మర్యాద, గౌరవం కలిగిలేరు! నేటి ప్రజలు దేవునిని గౌరవించుటలేదు. ఆయన నామాన్ని వారు వ్యర్థంగా ఉపయోగిస్తున్నారు మరియు నీచ పరిహాసాలు చేస్తున్నారు. మరియు సేవకులు కూడా దానిని చేస్తుంటారు. మీరు ఒక హాస్యము వింటారు, అది సరియేనని నేనూహిస్తున్నాను. అయితే సేవకులు ఇతరులకు మాదిరిగా వుండాలి, నేను అనుకుంటున్నదేమనగా నీతి మరియు పరిశుద్దతను గూర్చి. మరియు బహుశా, మనము చేయుదానికన్నా ఎక్కువగా మనము చేయుటలేదు, మనము చేయుట లేదు, మనము కలిగివున్నటువంటి నిజాయితీని కలిగి మనము రావటం లేదు. మీరు కొనసాగుచుండగా, ఆలాగు వెళ్ళుచుండగా, ఆ యొక్క రవ్వంత నిజాయితీని కోల్పోవుచున్నారని మీకు తెలుసా. దాని గూర్చి ఏదో ఒకటున్నది.

48ప్రతీ ఘడియ కూడా దేవుడు నిన్ను గమనిస్తున్నాడని, నీవు గుర్తుంచుకోవాలి. నీవు నిద్రిస్తూ ఉండగా ఆయన నిన్ను గమనిస్తున్నాడు. అయితే అతడు ఇంకా అచ్చటున్నాడు. ఆయన అచ్చటనున్నాడని లేదా లేడని నీవు ఆలోచించకపోయినప్పటికీ, నీవు చేయు ప్రతీ దానిని ఆయన చూస్తున్నాడు. మరియు నీవు వేయు ప్రతీ కదలికను కూడా దీనిని గూర్చి ఆయనకు అంతా తెలుసు. అయితే దానిని మనము గుర్తెరగాలి.

నేను పెంతెకోస్తు వారి మధ్యకు మొట్టమొదటగా వచ్చినప్పుడు మేము ఒక చిన్న పాటను కలిగి ఉండేవారము, వారు ఇలా పాడేవారు.

రహదారి మార్గమంతయు

సత్యమైన ఆత్మల యొక్క స్థావరానికే,

ఒక కన్ను నిన్ను గమనిస్తున్నది;

నీవు వేయు ప్రతీ అడుగు

ఈ గొప్ప కన్ను మెళకువుగా వున్నది,

ఒక కన్ను నిన్ను గమనిస్తున్నది;

ఆ పాట మీకు గుర్తున్నదా? ఇప్పుడు అది నిజము.

1SAM 13:14•

PS 16:8•

PS 21:7•

ACTS 13:22

 

49దేవుని యొక్క సర్వాంతర్యామి తత్వము నీవు ఏమి చేయుచున్నావో ఎరుగును మరియు నీ యొక్క ఆలోచనలు కూడా వినును. ఒకసారి నేను ఒక దర్శనం చూస్తుండగా, నా ప్రక్కనే నిలబడియున్న జీవితో నేను మాట్లాడుచున్నాను మరియు ఆయన తిరిగి నాతో ఇలా చెప్పెను, "భూమి మీదనున్న నీ యొక్క స్వరము కన్నా, నీ యొక్క ఆలోచనలు పరలోకంలో అది బిగ్గరగా వినిపిస్తున్నవి." నీవు ఏమి ఆలోచిస్తున్నావో ఆయన ఎరుగును. నీవు ఇది చేస్తున్నావు మరియు నేను అది చేస్తున్నాను, అని బహుశా నీవు చెప్పవచ్చు. అయితే నీ యొక్క హృదయాంతరంగములో ఒక విభిన్నముగా ఆలోచిస్తూ ఉంటే నీవు అప్పుడు ఏదో తప్పు చేస్తున్నావు. నీవు ఏమైయున్నావో అలాగే ఉండు, చూచారా, హృదయము. హృదయము నిండివున్న దాన్నిబట్టి నోరు మాట్లాడును, చూచారా. మరియు ప్రజలు దేవుని సన్నిధిని గుర్తించలేకపోవుట మనము చూస్తున్నాము.

మీకు తెలుసా, వారు దేవుని యొక్క హృదయానుసారుడైన దావీదు వలె ఉండవలసియున్నారు. అతడు చెప్పెను, "ప్రభువు ఎల్లప్పుడు నా ముందే ఉన్నారు." అతడు ఎక్కడికి వెళ్లినప్పటికీ, దేవుడు తనముందే ఉన్నాడని దావీదు జ్ఞాపకము చేసుకునేవాడు. "ఆయన నా కుడి పార్శ్వమందున్నాడు గనుక నేను కదల్చబడను," ఎందుకనగా దేవుడు అతని కుడి పార్శ్వమందున్నాడు.

MATT 5:44,46,47•

LUKE 6:27•

ROM 5:8

 

50గౌరవము! ఒకరినొకరు మనము ఘనపరుచుకొనవలెను, ఒకరినొకరు గౌరవించుకొనవలెను మరియు మృతము కాని ప్రేమతో ఒకరినొకరు ప్రేమించుకొనవలెను. "మంచిది, నేను చేయలేను," అని నీవు చెప్పవచ్చు. మంచిది, ఇచ్చట ఎక్కువ కాలం ఉండండి మరియు పిమ్మట నీవు ఈ ప్రజలను కూడా ప్రేమిస్తావు. నిన్ను ప్రేమించని ప్రజలను కూడా ప్రేమిస్తావు. అదియే క్రైస్తవ్యానికి మంచి సూచన; మీరు చేయగలిగినప్పుడు, మిమ్ములను ఎవరు ప్రేమించుటలేదో మీ హృదయములో నుండి వారిని ప్రేమించండి, ప్రేమింపబడని వారిని ప్రేమించండి.

యేసు చెప్పినదేమనగా, "మిమ్మును ప్రేమించినవారినే మీరు ప్రేమించిన యెడల మీకు ఏమి ప్రయోజనము, మంచిది, అన్యజనులు కూడా ఆలాగు చేయుచున్నారు గదా." అయితే చూడండి, ఎవరైతే నీ యెడల దయగా లేరో వారి యెడల నీవు దయగా ఉండాలి. ఎవరైతే నీకు కీడు చేయుచున్నారో వారికి నీవు మేలు చేయాలి. ఎల్లప్పుడూ దానిని గుర్తించండి. దేవుడు నిన్ను గమనిస్తున్నాడనే దానిని నీ ముందు వుంచుకో. గుర్తించుకో, నీవు దేవునికి చెడ్డగా వున్నప్పుడు, ఆయన నీకు మంచిగా ఉన్నాడు గదా. "మీరు ఇంకా పాపులుగా ఉండగానే క్రీస్తు మీ కొరకు చనిపోయెను గదా."

51ఇప్పుడు మనము కనుగొన్నది ఏమనగా ఆ జీవులు తమ ముఖాల పైన, వాటి రెక్కలు ఎందుకు కప్పుకున్నాయనగా వారు దేవుని సముఖములో ఉన్నారు గనుక, గౌరవార్థం మరియు ఒక పరిశుద్ధ సెరాపు తన యొక్క ముఖమును ప్రత్యేకంగా కప్పుకున్నప్పుడు పాపమెరుగని, ఎన్నడూ పాపము చేయనివారు, పరిశుద్ధ దేవుని సన్నిధిలో వారి యొక్క ముఖాన్ని దేవుని యొక్క సన్నిధిలో కప్పుకొనినప్పుడు, ఆ దినమున ఒక వేషధారి ఎలా దేవుని సన్నిధిని సమీపిస్తాడు? వెనుకకు జారిపోయినవాడు ఆ దినాన ఏమి చేస్తాడు. ఆ దినమున భక్తిహీనులు ఏమి చేస్తారు, నీవు వచ్చినప్పుడు మరియు నీవు ఆయనను ఎదుర్కొనవలసియున్నావు.

ఒకే ఒక విషయము ఉన్నది. "అయితే నా ముఖమును కప్పుకొనుటకు నాకు ఆయన ఏ విధమైన రెక్కలు చేయలేదు," అని నీవు చెప్పవచ్చు. అయితే ఆయన తన యొక్క స్వంత కుమారుని యొక్క రక్తమును చిందించాడు. దానితో నీవు నీ యొక్క ముఖమును కప్పుకొనవచ్చును. అది నిజము. మానవ జాతి కొరకు కప్పుకొనుటకు ఆయన ఇచ్చే ఒకే ఒక ముసుగు అదే, అదియే యేసుక్రీస్తు యొక్క రక్తము, ఒకే ఒక ముసుగు అదే, అదియే యేసుక్రీస్తు యొక్క రక్తము.

ISA 6:2

 

52ఇప్పుడు, రెండవదిగా, వారు వారి యొక్క పాదములను కూడా రెక్కలతో కప్పుకొనుచున్నారు. దాని యొక్క అర్థం ఏమనగా వినయము. ఓ, ఈ దినము అనేకమంది ప్రజలు ఆ పదము యొక్క అర్థాన్ని కోల్పోయారు. ఆయన సన్నిధిలో వినయము (దీనత్వము). ఆయన సన్నిధిలో మనలను మనము తగ్గించుకుందాము.

పరిశుద్ధాత్మ గదిలోనికి రావటం నేను చూచాను మరియు బైబిలులో చెప్పబడిన విషయములనే ఖచ్చితంగా చేస్తుంది, అతడు చేయును, వివేచించును, మరియు ప్రజలు పైకి లేచి బయటకు వెళ్లిపోవడాన్ని నేను చూచాను. ప్రజలు కూర్చొని మరియు మాట్లాడుకొని మరియు నవ్వుకొని మరియు దీనిని గూర్చి వెళ్తుండగా పరిహాసం చేయటం నేను చూచాను.

53ఒకరాత్రి నాకు గుర్తున్నది. ఒక సేవకుడు, తన యొక్క 28 మంది సంఘముతో నా వద్దకు వచ్చాడు. మరియు కూర్చున్నాడు. అది జోనెస్బరోలో గల ఆర్కాన్సాస్ నగరం,

మరియు వారితో ఒక మూర్ఛరోగం గల బాలుడున్నాడు. అతడు మూర్చ రోగాన్ని కలిగివున్నాడు. మరియు అది ఒక దయ్యము. అది ఇదియే అయి ఉన్నది. వారు చేయలేరు, వైద్యులు అది ఏమిటో గుర్తించలేరు. ఇది ఒక దయ్యము. మరియు వారు ఒక రకమైన వస్త్రములో చుట్టూ చుట్టారు. అతడు ఈ యొక్క మూర్చను పొందుకున్నప్పుడల్లా వారు దానిని ఆ అబ్బాయి యొక్క నోటిలోనికి తోసేవారు, ఎందుకనగా అతడు తన నాలుకను కరచుకునేవాడు మరియు వారు ఆ అబ్బాయిని పైకి తీసుకువచ్చారు, మరియు అతడు ఈ యొక్క మూర్ఛ రోగమును వేదిక వద్ద కూడా కలిగివున్నాడు. వారు (మూర్ఛ రోగులు) అతిచిన్న విషయము రేపబడినప్పుడు కూడా వారు దానిలోనికి వెళ్తారు. కావున మనము అబ్బాయి కొరకు ప్రార్థిస్తుండగా, నేను చెప్పాను, "ప్రతీ ఒక్కరు గౌరవముగా మీ తలలను మీరు వంచెదరా?" మరియు నేను అతని కొరకు ప్రార్థించాను మరియు ఆ యొక్క ఆత్మ ఆ అబ్బాయిని సులువుగా విడిచి పెట్టదు.

మరియు నేను చుట్టూ చూచాను మరియు నేను ఒక చిన్న గుంపు ఒక స్థలములో కూర్చుండుట చూచాను. నేను చెప్పాను, "నీవు నీ యొక్క తలను వంచెదవా." నేను చెప్పాను, "నీవు తప్పక విధేయత చూపించాలి." నేను చెప్పాను, "ప్రజలు నిన్ను నమ్మవలెనని అనుకొన్నచో, అది ఒక కర్తవ్యం మరియు నీవు ప్రార్థించినప్పుడు నిజాయితీగా ఉండుము." నేను అడిగాను, "నీవు నీ యొక్క తలను వంచెదవా?" అప్పుడు ఆ వ్యక్తి నన్ను చూసి నవ్వాడు.

54మరియు నేను చుట్టూ తిరిగాను, అయితే ఇది ఈ అబ్బాయిని ఇంకా విడిచి పెట్టదు మరియు ఇచ్చట వేలకొలది ప్రజలున్నారు, ఈ రాత్రి ఇచ్చట ఉన్నవారికి ఐదురెట్లు ఎక్కువ, అచ్చట చాలాసార్లు కూర్చున్నారు. అవును, అచ్చట 28,000 మంది ప్రజలున్నట్లుగా వారు చెప్పారు. కావున అచ్చట… కావున అచ్చట వారంతావున్నారు…

మరియు పిమ్మట నేను చెప్పాను, నేను "నేను దానిని చేయనండి." మరియు అతడు ఒక ఒక సంస్థాగత సంఘానికి చెందినవాడు. ఇప్పుడే దైవిక స్వస్థత పై కేవలము నవ్వెను, అనగా దైవిక స్వస్థత పట్ల అట్టిది ఉన్నదని నమ్మటలేదు.

కావున నేను చుట్టూ చూశాను. ఆ యొక్క దీన అబ్బాయి తన యొక్క గొంతు పోయింది, మరియు ఆతని యొక్క తల్లి అరచుటకు ఆలాగు ఏడ్చుటకును ప్రయత్నిస్తున్నది. మరియు ఆ అబ్బాయి మ్రింగివేయుటకు ప్రయత్నిస్తున్నాడు మరియు ఆలాగు చేయుచున్నాడు.

నేను చెప్పాను, "పరలోకపు తండ్రి, ఈ యొక్క అమాయకుడైన అబ్బాయిని ఆ యొక్క నేరస్థు గుంపు కొరకు బాధపడనివ్వకండి, చూచారా." నేను చెప్పాను, "అది నీ యొక్క నీ యొక్క వాక్యము మరియు నేను నేను నిజాయితీగా ఉండి వారికి చెప్పాను. మరియు అనేకమంది మూర్చ రోగులు ఈ సభలో ఇచ్చటే స్వస్థపరచబడ్డారు." నేను అడిగాను, "ఈ యొక్క అమాయకపు అబ్బాయిని బాధపడనివ్వకండి. అతని యొక్క తల్లి మరియు తండ్రి ఇచ్చటకు తీసుకువచ్చారు. నేను నీ కృప కొరకు ప్రార్ధిస్తున్నాను."

55పిమ్మట నేను తిరిగాను, నేను చెప్పాను, "విశ్వాసము ద్వారా, సర్వశక్తిగల దేవుని ద్వారా నాకివ్వబడిన పరిచర్య ద్వారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ దయ్యము ఈ అబ్బాయిని ఇక బంధించి ఉంచజాలదు. నీవు స్వేచ్ఛను పొందుకొనియున్నావు, చూడండి. అవిధేయులు ఎవరైనా ఉంటే వారిని అవిధేయులగానే ఉండనిమ్ము, నీవైతే వారియొద్దకు వెళ్ళుటకు ఇప్పుడు స్వేచ్ఛను పొందుకొనియున్నావు, అయితే ఆ అబ్బాయి నుండి బయటకు రమ్ము."

మరియు నేను 28 మంది ప్రజలను చూచాను, వారంతా వారి కాపరితోనున్నారు, వారంతా మూర్ఛవ్యాధిని కలిగియున్నారు, వారు సరిగ్గా ఆ భవనము చుట్టూ మరియు దానిచుట్టూ, చుడుతూ చుడుతూ తిరుగుచున్నారు. నేనెరిగినంత వరకు వారు దానిని కలిగివున్నారు, చూచారా.

ఇప్పుడు, మీరు చూడండి, మీరు అగౌరముగా ఉండరాదు. మిమ్మల్ని మీరు తగ్గించుకొనవలసియున్నారు. ఎంతమంది మీలో ఈ సభలలో ఉన్నారు మరియు నా సభలలో అటువంటి విషయాలు జరుగుట ఎంతమంది చూచారు. అలా ఎందుకు, చూడండి. నిశ్చయముగా. అవునండీ.

56ఒకసారి నన్ను హిప్నటైజ్ చేయటానికి వారు ఒక మనిషిని నా వద్దకు తీసుకొనివచ్చారు. దానిని గూర్చి మీలో అనేకమందికి గుర్తున్నదని నేను తలస్తున్నాను. మరియు వారు అతనిని సైనికులను తీసుకొని వారిని కూడా వశీకరణచేసుకున్నారు మరియు వారిని కుక్కలవలె అరిచేటట్లు తయారు చేశారు. మరియు వారు నన్ను ఎగతాళి చేయవలెనని చూచారు. మరియు నేను ఆ యొక్క పెద్ద గదిలో ఉన్నాను పిమ్మట వారు ఆ మనిషిని తీసుకువచ్చారు, అయితే ప్రార్థనా వరుస ప్రారంభమైనప్పటికి ఎచ్చటో ఒక అపవిత్రాత్మ ఉన్నట్లుగా నేను భావించాను.

మీరు ఎల్లప్పుడూ వారిని పట్టుకొని సందేహించవచ్చు. వారు చేయుట లేదని వారనుకొంటారు, అయితే మీరు దానిని … అది ఒక భిన్నమైనది.

కావున పిమ్మట అది ఎక్కడున్నదో నేను చెప్పగలను, అయితే ఆ మనిషి ఎక్కడున్నాడో నేను చూడనేలేదు కొంత సమయమయ్యాక నేను దానిని కనుగొన్నాను మరియు అది ఏమిటో చూచాను. అతని పైన ఒక నల్లటి ఛాయ వ్రేలాడుచుండుట నేను గమనించాను మరియు నేను దానిని చెప్పాలనుకొనలేదు గాని ఆయన వైపు తిరిగి చెప్పాను, "దయ్యపు బిడ్డా," చూచారా, "దానిని చేయుటకు దయ్యము నీ మనసులో ఎందుకు ఉంచినది? ఎందుకనగా అతడు దానిని చేశాడు," ఏదో ఒకటి నాలో చెప్పుచున్నది, "వారు నిన్ను ఇచ్చటనుండి మోసుకొనిపోతారు." మరియు అతడు వెంటనే పక్షపాతిగా మారిపోయాడు, చూచారా.

అక్షరం వెంబడి అక్షరం, "ఆయన వద్దకు రా!"

నేను చెప్పాను, "నాకు తెలిసిన ఒకే ఒక విషయమేమనగా, మారుమనస్సు. చూచారా, నేను దానిని ఎన్నడూ చేయలేదు. అది దేవుని ముందు నీ యొక్క అగౌరవం," చూచారా. ఇప్పుడు దానిని మీరు చేయవద్దు. మనము…

ISA 6:2

 

57మేము అనేకసార్లు వచ్చాము మరియు ప్రజలు అనుకొనుచున్నదేమనగా, దేవుని ముందు ఈ యొక్క పరిశుద్దత అనేది ఒక విధమైన ఎగతాళి అనుకొనుచున్నారు, లేక ఏమి యెరుగని కొంతమంది గుంపు ప్రజలు లేక ఒక తెగవారు లేక కులము వారు లేక అట్టివారు. అయితే సహోదరుడా నన్ను నీకు నిశ్చయత ఇవ్వనివ్వు! చాలా పరిహాసము బహుశా అచ్చటనున్నది. లేదు అని నేను చెప్పలేను; దానిని నేను చెప్పజాలను. నేను కేవలం ఒక మనిషిని నేను తీర్పుతీర్చుటకు లేను, నేను కేవలం బోధించవలసియున్నాను. అయితే ఒక నిజమైన పరిశుద్ధాత్మ ఉన్నది. ఒక నిజమైన పరిశుద్ధాత్మ యొక్క అపొస్తలుల శక్తి ఉన్నది. మరియు విదేశాలలో, భూతవైద్యులు మరియు అట్టి విషయాలు పైకి వస్తాయి, ఆ దయ్యములు సవాలు చేస్తాయి. ఓ, మనము కేవలము… ఆ విషయములు మీకు చెప్పుటకు నేను నా ప్రసంగ అంశాన్ని కొద్ది సేపు ఆపుచేస్తాను. మరియు ఏమిటి? పరిశుద్ధాత్మ ఒక్కసారి కూడా దీనిని చేయుటలో విఫమైనట్టుగా నేను చూడలేదు. ఆయన ప్రతీసారి చేస్తాడు.

ఇప్పుడు గమనించండి, ఆ జీవులు వాటి యొక్క రెక్కలతో వినయానికి సూచనగా పాదములను కప్పుకొనుచున్నవి. మనమైతే మనలను మనము తలలు కూడా వంచము. మనమేదో గొప్పవారమని భావిస్తాము.

58ఎంతో కాలం క్రితము కాదు గాని నేను ఇచ్చట ఒక విషయాన్ని జ్ఞాపకము చేసుకొంటున్నాను, నేను ఒక చిన్న ప్రదర్శన శాలలో ఉన్నాను, మరియు అచ్చట వారు 150 పౌండ్ల గల ఒక మనిషిని గూర్చి విశ్లేషిస్తున్నారు, అనగా అతని యొక్క శరీరము యొక్క విలువను రసాయనాలలో కొలుస్తున్నారు. నేను నమ్ముచున్నదేమనగా, 150 పౌండ్ల బరువుగల మనిషి అతని యొక్క శరీర రసాయనాలన్నియూ కలిపితే 84 సెంట్ల విలువ మాత్రమే. అతడు కాల్షియం కలిగి వున్నాడు, మరియు ఒక చిన్న చాలినంత తెల్ల సున్నము, బహుశా ఒక కోళ్ల గూటికి చిలకరించగలిగేంత వరకు మరియు అటువంటిది. అది అంతా అంతే, అనగా ఆయనలో వున్నది బరువు చూస్తే 184 పౌండ్లు… లేక నా భావం 84 సెంట్లు అని అర్థము అనగా 150 పౌండ్ల బరువుగల దానికి.

అచ్చట ఇద్దరు యువకులు నిలువబడి, దానివైపు చూస్తున్నారు. మరియు నేను ఖచ్చితముగా వారి వెనుక నిలబడ్డాను, వారిలో ఒక వ్యక్తి చెప్పినరీతిగా, "మంచిది," చెప్పెను, "జాన్, మనము చాలా ఎక్కువ విలువైన వారము కాదు, దేనికన్ననూ మనము విలువైనవారమా?" మరియు అతడు జవాబిచ్చెను, "మనము కాదని నేను తలస్తున్నాను."

మరియు నేను చెప్పాను, "మంచిది, అబ్బాయిలూ, అది నిజము, చూడండి, మీరు రసాయనాలలో చాలా విలువైనవారు కాకపోవచ్చు. అయితే మీ లోపల ఒక ప్రాణము ఉన్నది. చూడండి, అది ఒక పది లక్షల ప్రపంచాల కన్నా విలువైనది, చూచారా." అది నిజము చూచారా.

59అయితే ఇంకా మనము జాగ్రత్త వహించవలసియున్నాము, మనము లోపల గర్వము కలిగియున్నాము 84 సెంట్లు - 500 డాలర్ల ఉన్ని కోటును దానికి తొడిగి మరియు మన యొక్క ముక్కును గాలిలో ఉంచి మరియు మనము ఏదో ఫలాన-ఫలాన చేస్తున్నామని భావిస్తున్నాము. నేను పరిహాసమాడుట లేదు. పరిహాసానికి ఇది నేను చెప్పుట లేదు. మనము ఏమైయున్నామో అది తెలుపుకొనుటకు దీనిని మీకు నేను చెప్పుచున్నాను. చూచారా, మనము…

మనము వినయాన్ని కలిగిలేము. అలా ఉండాలని కూడా మనము కోరుకొనుటలేదు. మరియు ప్రజలు కోరుకొనుటలేదు. సంఘములో నిజముగా, బాగా వస్త్రాలు ధరించిన ప్రజల వద్దకు మీరు కొన్నిసార్లు వెళ్లండి, వారు లోనికి వస్తారు; మరియు మీరు సరిగ్గా దుస్తులు ధరించనిచో, వారు మీ వైపు చూసి మాట్లాడుతారు, మీకు తెలుసా. క్రైస్తవులమని చెప్పుకొనుచూ వారు అలా చేయరాదు. నేను అనుకొనుచున్నదేమనగా, ఇది ఒక ఒప్పుకోలు గాని స్వాధీనము కాదు, ఎందుకనగా నేను నమ్ముచున్నదేమనగా దేవునితో ఒక నిజ ప్రాచీన అనుభవం అనేది టాక్సీడో కోటులా తయారు చేస్తుంది, చుట్టూ ఆయన యొక్క చేతులు ఉంచి విశాలమైన పొడుగాటి చేతులను కలిగివుంటుంది. మరియు "సహోదరుడా," దీనిని నేను నిజముగా నమ్ముచున్నానని చెప్పండి. ఇది నిజము. సిల్క్ లాంటి ఒక కలికో దుస్తులతో ఒక "సహోదరి," అని పిలుచును. అవునండి. ఎందుకనగా మీరు దుస్తులు కాదు, ఇది వ్యక్తి కాదు. ఇది క్రీస్తు, లోపల ఏదైతే వున్నదో మరియు దానికి మనము తగ్గించుకొనవలసియున్నాము.

EXOD 3:4,5•

HEB 11:26

 

60ఇప్పుడు మనము దానిని కనుగొన్నాము, అచ్చట దేవదూతలు లేక ఈ యొక్క సెరాపులు తమ పాదములను కప్పుకొనియున్నవి.

దేవుని సన్నిధిలో మోషే ఉన్నప్పుడు, ఆ యొక్క మండుచున్న పొదలో అగ్నిస్తంభము వద్ద అతనిని గమనించండి, ప్రభువు అచ్చట మాట్లాడియున్నాడు. మరియు ఆ యొక్క అగ్నిస్తంభమనగా క్రీస్తేనని ఏ ఒక్కరైనా తెలుసుకొనగలరు, అతడే నిబంధన దూత. "మోషే ఐగుప్తును విడిచిపెట్టాడు, ఐగుప్తు ధనము కంటే క్రీస్తు నిమిత్తము నింద గొప్ప భాగ్యమని యెంచుకొని." కావున, ఇది నిబంధన యొక్క దూత మరియు ఆ ప్రక్కన మండుచున్న అగ్నిపొదలో అతడు కనిపించినప్పుడు, మోషేతో "నీ చెప్పులు" విడువుము అని ఎందుకు చెప్పెను. నీ యొక్క పాదములు, చూచారా. "నీ యొక్క చెప్పులు విడువుము, ఎందుకనగా నీవు నిల్చున్న స్థలము పరిశుద్ధమైనది." మోషే తన చెప్పులను విడిచి పెట్టడం ద్వారా తనను తాను తగ్గించుకున్నాడు.

JOHN 6:35,48•

JOHN 8:52,57,58

 

61అదే అగ్నిస్తంభము దమస్కు మార్గమున పౌలుకు ఒక దినాన కనిపించినది.

గుర్తుంచుకొనండి, యేసు ఆయన భూమి మీద ఉన్నప్పుడు వారు ఒక దినాన చెప్పారు… యోహాను సువార్త 6వ అధ్యాయములో వారు ఆ బండలోనిది త్రాగి ఎంతో సంతోషించారు. మరియు ఆయన చెప్పెను, "ఆ బండలో నుండి వచ్చిన జలమును నేనే. పరలోకము నుండి దిగివచ్చిన జీవాహారమును నేనే, మీరు చూడండి."

వారు దానిని నమ్మలేకపోయారు. వారు చెప్పారు, "వారు, ఇచ్చట! నీవు దయ్యము పట్టినవాడవని మేమెరుగుదము మరియు నీవు పిచ్చివాడవు కదా." దాని అర్థము మతిస్థిమితము లేనివాడని అర్థము. "ఎందుకనగా, నీకు కనీసం ఏబది సంవత్సరములైనా లేవే, మరియు నీవు అబ్రాహామును చూచియున్నానని చెప్పుచున్నావేంటి?

ఆయన చెప్పెను, "అబ్రాహాముకు మునుపే నేనున్నాను. నేను ఉన్నవాడను."

JOHN 16:28•

ACTS 9:3,5

 

62ఇప్పుడు మనము దానిని చూస్తున్నాము, యేసు చెప్పెను, "నేను దేవుని యొద్ద నుండి వచ్చియున్నాను నేను దేవుని యొద్దకే వెళ్ళుచున్నాను." ఆ యొక్క అగ్నిస్తంభము శరీరధారిగా మారినప్పుడు దేవుడు పితృత్వము నుండి వచ్చియున్నాడు [టేపు మీద ఖాళీ ఉన్నదీ.] … కుమారత్వము మరియు ఆయన ఈ యొక్క లక్షణములోనికి వచ్చినప్పుడు మూడు గుణలక్షణాలు; తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. దేవుడు శరీరధారిగా మారినప్పుడు, ఆయన చెప్పెను, "నేను దేవుని యొద్ద నుండి వచ్చియున్నాను. మరియు నేను దేవుని యొద్దకే వెళ్ళుచున్నాను," మరియు ఆయన పైకి ఆరోహణమాయెను.

మరియు సౌలు తర్షిషు నుండి తన మార్గమైన దమస్కుకు పోవుచుండగా, అతడు ఒక వెలుగు ద్వారా మొత్తబడ్డాడు. మరియు అతనికి అలా జరిగినప్పుడు పైకి చూచాడు. మరియు ఆ యొక్క యూదుడు అది అగ్నిస్తంభము కానిచో, వేరేదానిని, "ప్రభువా" అని పిలువలేడు. అతడు అచ్చట వెలుగును చూచాడు మరియు "ప్రభువా, నీవెవరవు," అని అడిగాడు.

ఆయన చెప్పెను, "సౌలా, మునికోళ్లకు ఎదురు తన్నుట నీకు అసాధ్యము."

మరియు అతడు అడిగెను, "ప్రభువా నీవెవడవు?"

ఆయన చెప్పెను, "నేను యేసును." చూచారా, మరలా అదే అగ్నిస్తంభము.

63సౌలును చూడండి, ఆ ధూళిలో తనను తాను తగ్గించుకున్నాడు, చూచారా, దేవుని సన్నిధిలో. వినయం! అతడు పాదముల నుండి కొట్టబడి, బహుశా వెనుకనుండి పడిపోయియున్నాడు, పైకి చూస్తున్నాడు.

మరియు ఆ యొక్క అగ్నిస్తంభమే అచ్చట చుట్టూ కదిలియున్నది, అతడు చూచి గుర్తెరిగాడు. గమలియేలు క్రిందనున్న ఒక బోధకునిగా ఆ దినము యొక్క గొప్ప బోధకునిగా దేవుడు ఆయన యొక్క ప్రజలను అగ్నిస్తంభము యొక్క రూపములో నడిపించాడని అతనికి తెలుసు. మరియు ఆ యొక్క అగ్ని, అగ్నిస్తంభము, శరీరధారిగా మారి మన మధ్య నివసించెను. మరియు వారి పాపముల కొరకు సిలువ వేయబడెను. "మరియు నేను దేవుని యొద్దనుండి వచ్చాను; మరియు నేను దేవుని యొద్దకే వెళ్ళుచున్నాను," మరియు ఆయన ఇప్పుడు కూడా ఇచ్చటనున్నాడు. ఇంకనూ ఆయన ప్రభువైన యేసుక్రీస్తు నామములోనున్నాడు.

LUKE 1:41

 

64మరియు పిమ్మట దానిలో మనము కనగొనినదేమనగా, అటుపిమ్మట లేక దానికి ముందు, ప్రవక్తలందరిలోకెల్లా గొప్పవాడైన బాప్తిస్మమిచ్చు యోహాను వచ్చాడు; ఆయన రాబోవుచున్నాడని ప్రవక్తలందరు ప్రవచించారు; యోహానయితే, "ఇదిగో ఇతడే ఆయన అని ప్రపంచానికి ఆయనను పరిచయం చేశాడు." మరియు అతడు బాప్తిస్మమిచ్చుచుండగా, యోహాను అచ్చట నీటిలోనున్నాడు, పిమ్మట అతడు ఇలా చెప్పెను, "అనుదినబలి దేవాలయము నుండి నిలుపుచేయబడు సమయము రాబోవుచున్నది మరియు అప్పుడు ఒక మనిషి బలిగా అర్పింపబోవుచున్నాడు." మరియు మెస్సీయాను నిశ్చయముగా చూడగలనని యోహాను నిశ్చయించుకున్నాడు.

మీరు చూడండి, యోహాను పిలువబడినప్పుడు తన యొక్క తండ్రి ఒక యాజకుడు, అయితే సాధారణముగా ఆ రోజులలో ఒక అబ్బాయిని నియమించేవారు మరియు తండ్రి యొక్క వృత్తిని తూర్పు దేశములవారు ఇప్పటికీ కుమారునికిస్తున్నారు. మరియు సాధారణముగా అతడు కూడా యాజకుడే. అయితే యోహాను ఎన్నడూ ఒక పాఠశాలకు వెళ్లలేదు. ఎందుకనగా, తల్లి గర్భము నుండి పుట్టినది మొదలుకొని, యోహాను పరిశుద్ధాత్మపూర్ణుడై యున్నాడు.

LUKE 1:31,32,35,44•

JOHN 1:30

 

65ఎలీసబెతు గర్భము దాల్చినప్పుడు మరియు ఆ శిశువు ఆమె గర్బములో చనిపోయినప్పుడు, గాబ్రియేలు దేవదూత మరియను దర్శించినప్పుడు మరియతో (దూత చెప్పెను) నీ బంధువైన ఎలీసబెతు గర్బము దాల్చినది ఆమె ఒక యాజకుని మోయుచున్నది, మరియు కనబోవుచున్నది. పిమ్మట ఆమెను కలవటానికి మరియ వెళ్లినది. మరియు ఆమె (ఎలీసబెతు) తనకు తను దాగుకున్నది, ఎందుకనగా ఆరు మాసములు ఆ శిశువు కదలకపోయినప్పుడు ఆమె కలత చెందినది మరియు అది ఒక సాధారణ స్థితికన్నా తక్కువ. అయితే మరియ రావటం ఆమె చూచినది, ఆమెను కలుసుకొనుటకు పరుగెత్తికొనిపోయి మరియను కౌగిలించుకొనినది మరియు ఆమె చెప్పెను, మాట్లాడుట ప్రారంభించారు మరియు ఆమె చెప్పెను, "ఆమె తల్లి కాబోవుచున్నదని నాకు తెలుసు" మరియు ఆమె చెప్పెను, "అవును, మరియు నేను కూడా తల్లిని కాబోవుచున్నాను."

"ఓ, నీవు మరియు యోసేపు వివాహము చేసుకొనియున్నారని తలస్తున్నాను."

"లేదు, లేదు. మేమింకా వివాహము చేసుకొనలేదు."

"మరి నీవు తల్లివి కాబోవుచున్నావా?"

"అవును. పరిశుద్ధాత్మ నన్ను కమ్ముకొనినది, మరియ చెప్పినదేమనగా, నా నుండి ఒక పరిశుద్ధమైన వ్యక్తి పుట్టబోవుచున్నాడని నాలో దేవుని కుమారుడు పుట్టబోవుచున్నాడని మరియు ఆయనకు నేను యేసు అను పేరు పెట్టబోవుచున్నానని."

మరియు "యేసు" అనే మాట మానవ నోటి నుండి మొట్టమొదటిసారిగా బయటకు వచ్చిన తక్షణమే, తనలో ఎన్నడూ జీవములేని ఒక శిశువు, అప్పుడే తన తల్లి గర్భములో జీవాన్ని పొందుకొనెను మరియు సంతోషముతో గంతులు వేసెను. మరియు "యేసుక్రీస్తు యొక్క నామము ఒక మృతమైన శిశువుకు జీవమునిచ్చినచో, పరిశుద్ధాత్మలో నింపబడి యున్నామని చెప్పుకొనుచున్న ఒక తిరిగి-జన్మించిన సంఘమునకు అది ఏమి చేస్తుంది? చూచారా?

MAL 3:1

 

66ఇప్పుడు ఇతడు ఎటువంటి రకమైన బాలునిగా ఉంటాడు? రాబోవుచున్న మెస్సీయా గూర్చి అతడు ప్రకటించుచున్నాడు. మలాకీ 3 చెప్పుచున్నదేమనగా, అతడు అలా చేయునని. "ఇదిగో, నాకు ముందుగా నేను నా దూతను పంపుచున్నాను."

ఇప్పుడు, అతడు ఒక వేదాంత పాఠశాలకు వెళ్లినచో అచ్చట ఉన్న కొంతమంది సేవకులు ఇలా చెప్పిరి, "ఇప్పుడు యోహాను, నీవు మెస్సీయా రాకడను ప్రకటించవలసియున్నావు. ఇచ్చట అంకుల్ జోయి ఉన్నాడు, లేక ఫాథర్ జిమ్ ఉన్నాడు, లేక వారిలో కొంతమంది ఉన్నారు, మెస్సీయాగా ఉండుటకు వారికి అన్ని అర్హతలున్నట్లుగా నీకు తెలుసు కదా. అది అతడు, యోహాను." అది చూచారా, అతడు మనుషుల ద్వారా ప్రభావితమయ్యాడు.

అతడు అరణ్యములోనికి వెళ్లాడు, మరియు అతడు దేవునితో నివసించాడు. నాకు తెలిసిన గొప్ప వేదాంత పాఠశాల అదే, ఎందుకనగా అతనిని గూర్చి చెప్పుటకు కొంతమంది మనుషులకు అతనికి నిర్దేశించిన పని ఎంతో కీలకమైనది మరియు అతనిని పెద్ద సామాజిక సంబంధాలకు బయటకు లాగారు. అతడు ఒక పనిని కలిగి ఉన్నాడు, అతడు వేరొక దానికొరకు కత్తిరించవలసి యున్నాడు మరియు యోహాను తెలుసుకొనినదేమనగా, అతడు బోధించుటకు ప్రారంభించిన సమయములో మెస్సీయా అప్పటికే భూమి మీదనున్నాడని.

MATT 2:2•

LUKE 3:15,16•

JOHN 1:26,27

 

67అయితే జ్ఞానులు యెరిగినంతమట్టుకు బబులోను నుండి వారు చూచినప్పుడు మూడు నక్షత్రములు వరుసగా ఉండుట చూచారు, దాని అర్థమేమనగా మెస్సీయా ఇదివరకే భూమిమీదనున్నాడని. ఆ కారణమును బట్టియే వారు, "యూదుల రాజుగా పుట్టివాడు ఎక్కడున్నాడు?" అని కేకలువేసిరి మరియు సంఘము వద్ద దానికి సమాధానము లేదు. ఈ దినము కూడా వారివద్ద దీనికి సమాధానము లేదు. పరిశుద్ధ గ్రంథము దానిని కలిగియున్నది. దేవుని వాక్యము దానిని కలిగివున్నది. అది నిజము.

మనము కనుగొనినది ఏమనగా యోహాను, మెస్సీయాను పరిచయం చేయవలసియున్నాడు… మెస్సీయాను అతడు సూచన వలన మాత్రమే గుర్తించగలడు, ఆ రీతిగా అతడు మెస్సీయా అని తెలుసుకొనవలెను. దేవుడు ఎప్పటికిని తెలియపరుచుకునే ఒకే ఒక్క మార్గం అదియే. ఒక లేఖన పూర్వకమైన సూచన ద్వారా, మరియు అతడు గమనించాడు. అతడు అచ్చట నిలువబడియున్నాడు, అతడు చెప్పెను…

వారు చెప్పిరి, "నీవు మెస్సీయావా?"

అతడు చెప్పెను, "లేదు, ఆయన యొక్క చెప్పుల వారును విప్పుటకైనను నేను యోగ్యుడను కాను." అతడు చెప్పెను, "అయితే ఆయనే… మీ మధ్య ఒకాయన నిలువబడియున్నాడు."

JOEL 2:28•

MATT 3:11•

MARK 1:7,8•

LUKE 3:16•

JOHN 1:26,27,29,33,36•

ACTS 2:17

 

68ఓ, మై, నేను ఉద్రేకపడుచున్నానని అనుకోవద్దు! నేను ఎచ్చటనున్నానో నాకు తెలుసు. లేదు, అయితే దానిని గూర్చి నేను ఆలోచిస్తున్నప్పుడెల్లా అది నాకెంతో మంచిగా ఉంటుంది, "మీ మధ్య ఒక వ్యక్తి ఉన్నాడు." మరియు నేను ఈ రాత్రి చెప్పుచున్నాను. మీ మధ్య ఒక వ్యక్తి ఉన్నాడు. మహాగొప్ప పరిశుద్ధాత్మ ఈ చివరి దినాలలో కుమ్మరించబడబోవుచున్నది. ఆయన యొక్క సూచనను స్థిరముగా నేను చూస్తున్నాను మరియు ఆయన మెస్సీయా అని నేను యెరుగుదును, ఎందుకనగా అతడు ఇంకనూ మెస్సీయా యొక్క సూచన చేయుచున్నాడు.

మరియు ఆయన వారి మధ్య నిలువబడియున్నారు. అతడు చెప్పెను, మీ మధ్యలో ఒక వ్యక్తి ఉన్నారు. ఆయన చెప్పులు తాకుటకైనను యోగ్యుడను కాను. ఆయన మాత్రమే పరిశుద్ధాత్మతోను మరియు అగ్నితోను బాప్తిస్మము ఇస్తాడు.

మరియు ఒక దినము వారి మధ్యలో నుండి ఒక సాధారణ మనిషిగా బయటకు నడుచుకుంటూ వచ్చాడు. యోహాను పైకి చూచి ఇలా చెప్పెను, "ఇదిగో, లోకపాపములను మోసుకొనిపోవుచున్న దేవుని గొర్రెపిల్ల." మరియు ఆయన వచ్చినప్పుడు, అతడు చెప్పెను, "నేను ఆయనను ఎరుగుదును, ఎందుకనగా ఆయనను ఒక సూచన వెంబడిస్తున్నది." మరియు ఇచ్చట గమనించండి, అచ్చట భూమి మీద ఇద్దరు గొప్ప వ్యక్తులున్నారు, ఒకరికొకరు ఎదురెదురుగా నిలువబడియున్నాడు. యోహాను…

MATT 3:14,15

 

69డాక్టర్ రాయ్ డేవిస్ నాకు గుర్తున్నది, అతడు నన్ను మిషనరీ బాప్తిస్టు సంఘములో అభిషేకించాడు, అతడు చెప్పెను, "బిల్లీ, అచ్చట ఏమి జరిగినదో నీకు తెలుసా?".

"ఏమి జరిగినది," అని నేను అడిగాను.

"నేను నీ చేత బాప్తిస్మము పొందవలసినవాడనైయుండగా, మరియు నీవు నా దగ్గరకు వచ్చితివా?" అని యోహాను అడిగినప్పుడు. యోహాను యొక్క వినయాన్ని గమనించండి. అతడు చెప్పెను, "నేను నీ చేతను బాప్తిస్మము పొందవలసినవాడనైయుండగా నీవు నా వద్దకు ఎందుకు వచ్చితివి?" ఆ దినము యొక్క మనుష్యులు మెస్సీయా మరియు ఆయన యొక్క ప్రవక్త గొప్ప ప్రాముఖ్యమైన వ్యక్తులు, వారు పరిశుద్ధ గ్రంథము యొక్క గొప్ప వ్యక్తులు, అచ్చట వారు నిలువబడి ఒకరికొరు చూచుకొనుచున్నారు. యోహాను అతి వినయముగా చెప్పాడు, "నేను నీ చేతను బాప్తీస్మము పొందవలసిన వాడనైయుండగా, నీవు నా వద్దకు వచ్చితివా?"

యేసు చెప్పెను, "నీతి నిమిత్తం ఇలాగు చేయుట మనకు తగియున్నది." మరియు యోహాను అతనికి బాప్తిస్మము ఇచ్చాడు.

డాక్టర్ రాయ్ డేవిస్ ను నాకు గుర్తున్నది, బహుశా అతడు ఇచ్చట కూర్చొనియున్నాడు. అతడు డాక్టర్ రాయ్ డేవిస్ గారూ, దీనిని మీ మీదకు త్రోయుటలేదు గాని… అతడు చెప్పెను, "యోహాను, మొదట యేసు, యోహానుకు బాప్తిస్మము ఇచ్చాడు, ఎందుకనగా యోహాను అప్పటికి ఇంకా బాప్తిస్మము పొందలేదు గనుక." మరియు పిమ్మట చెప్పెను, "పిమ్మట యోహాను యేసుకు బాప్తిస్మము ఇచ్చాడు." అది నా వద్దకు సరిగ్గా ఎన్నడూ రాలేదు.

కావున ఒక రోజు పరిశుద్ధాత్మకు దగ్గరగా ఉంటుండగా అది ఏమిటో నేను దర్శనములో చూచాను.

అచ్చట యోహాను మరియు యేసు ఒకరికొకరు ఎదురెదురుగా నిలువబడియున్నారు. వాక్యము ఎవరి వద్దకు వస్తుందో ఆ ప్రవక్త. మరియు వాక్యము ప్రవక్త వద్దకు వస్తుంది. ఆమేన్. మరియు ఆయన చెప్పెను, "ఇలా చేయుట సరియైనదే." చెప్పెను, "కావున నీతి నిమిత్తం ఇలాగు చేయుట మనకు తగియున్నది." అతడు గొర్రెపిల్ల అని ప్రవక్తకు తెలుసు మరియు ఒక గొర్రెపిల్ల బలి అర్పించబడు ముందుగా అది కడుగబడవలసియున్నది. ఆమేన్. కావున అతడు దానిని చేశాడు, చూచారా? ప్రవక్త వాక్యమైయుండగా మరియు అది ఆయన యొద్దకే వచ్చినది.

[ఒక సహోదరి భాషలతో మాట్లాడుచున్నది, వేరొక సహోదరుడు దానికి అర్థము చెప్పుచున్నాడు.] ఆమేన్.

AMOS 3:7•

MATT 3:15

 

70యోహాను, ప్రవక్తయై యున్నాడు. వాక్యము ఆయన యొక్క ప్రవక్త వద్దకే వస్తుంది. మరియు వాక్యము ఖచ్చితంగా ప్రవక్త వద్దకు వస్తుంది. "ఇది మనకు తగియున్నది," దీని అర్థము 'బిహోవిత్' అనగా "నీతి నిమిత్తము ఇలా మనము చేయవలసియున్నది."

ఓ, నేను ఒక్క నిమిషం కొరకు ఆ అంశమును ఎలా విడిచిపెట్టుదును, నీతి నిమిత్తం ఇలా చేయుట మనకు తగియున్నది! ఆ ఇడియ సమీపించినది, మనము సమస్త నీతిని చేయవలసియున్నాము. ఏమి చేయవలెనో మనకు తెలుసు. చూచారా, మనము దానిని చేయాలి, అది నిజము. మన హృదయమంతటితో మనము నమ్మాలి.

71గమనించండి, పిమ్మట దేవుని సముఖములో, యోహాను తనను తాను తగ్గించుకొనుట మనము కనుగొందుము.

ప్రజలారా, సహోదరీ, సహోదరుడా, మరియు స్నేహితులారా, విషయమేమనగా, మీ యొక్క సామాన్యతలో కూడా మీరు గ్రహణశక్తి కలిగి వుండాలి, చూచారా. నీవెంత గొప్పవాడవో తలంచుకోకు. నీవెంత చిన్నవాడవో అనే విషయంలోనే గ్రహణశక్తిని కలిగివుండు. నీవు చిన్నవాడవు. మనమంతా ఆ మార్గములోనే యున్నాము. మనము లేకుండా కూడా దేవుడు చేయగలడు. అయితే ఆయన లేకుండా మనమేమియు చేయలేము, చూచారా. చూచారా? ఆయన లేకుండా మనమేమీ చేయలేము, అయితే మనము లేకుండా ఆయన చేయగలడు.

72దేవుడు ఒక వ్యక్తిని కనుగొనుటకు మాత్రమే ప్రయత్నిస్తున్నాడు ఆయన చేతులను పొందుకొనగలడు. ఆయన ఎల్లప్పుడూ దానిని చేయుటకు ప్రయత్నించాడు. పరిశుద్ధ గ్రంథమంతటిలో దానిని మీరు గమనించారా, ఆయన యెషయాను కనుగొనినప్పుడు, యిర్మియాను కనుగొనినప్పుడు. పిమ్మట ఆయన సమ్సోనును కనుగొన్నాడు. అయితే సమ్సోను తన బలము దేవునికి ఇచ్చాడు గాని, తన హృదయమును మాత్రము దెలీలాకు ఇచ్చెను. చూచారా, అతడు…

నీవు నీ యొక్క సమస్తమును దేవునికి ఇవ్వాలి, నీ యొక్క గౌరవములు, నీ యొక్క మర్యాదలు, నీవు ఏమైయున్నావో ఆ యొక్క సమస్తమును. నీవు ఏమి అయి ఉండకు, ఇప్పుడు నీవు ఎంత చిన్నవాడవో చూచుకో, మరియు అదే చేయవలెనని దేవుడు మన నుండి కోరుచున్నాడు మరియు అదే నిజమైన వినయము. ఆ రీతిగా సెరాపులు ఆయన సన్నిధిలోనున్నవి. మీరు చూడండి, గౌరవముతో వారి ముఖాలను వారు కప్పుకున్నారు; వారి యొక్క పాదములు వినయముతోనున్నవి.

73ఇప్పుడు, మూడవదిగా అవి ఎగురగలవు. ఎగరటానికి వాటికి మరో రెండు రెక్కలున్నవి.

దేవుడు ఆయన యొక్క ప్రవక్తను ఇచ్చట చూపిస్తున్నాడు, ఎటువంటి రకమైన సేవకుని ఆయన సిద్దపరిచాడు, గౌరవము మరియు దీనత్వము కార్యచరణలో ఉన్న సేవకుడు. అది చూడండి, అదియే నిజమైన దేవుని సేవకుడు మీరు ఆయన వైపు చూస్తున్నారు. ఆయన తన్ను తాను హెచ్చించుకొన్న హిజ్కియా వైపు చూస్తున్నాడు మరియు అతడు గర్వము ద్వారా పతనమైపోయాడు. అయితే ఒక సేవకుడు, ఆయన ముందు ఆయన యొక్క సేవకులు గౌరవముగా మరియు దీనత్వముగా ఉండవలసి యున్నారు. ఆయన సేవకులు ఆ రీతిగా వస్త్రములు ధరించాలి, గౌరవముగా, వినయముగా ధరించాలి మరియు ఎల్లప్పుడు తండ్రి పని మీదే ఉండాలి. అవునండీ. గౌరవము మరియు దీనత్వముగా పని చేయుట.

JOHN 4:28

 

74ఆ యొక్క చిన్న స్త్రీ వలె ఆ రాత్రి మనము బావి వద్ద స్త్రీని గూర్చి మాట్లాడిన రీతిగా, ఆమె ముందుగా నిర్ణయించబడిన ఒక చిన్న విత్తనము, అది ఆమె హృదయములోనున్నది. అయితే ఆ యొక్క వెలుగు అచ్చట ప్రసరింపబడినప్పుడు మరియు ఆయన మెస్సీయా అని ఆమె చూచినది. అలా చేయుటకు ఆమెకు ఎక్కువ సమయం పట్టలేదు. ఆమె తన చేతులలోనున్న కుండను కూడా మరచిపోయినది. ఆ రీతిగా ఆమె అతివేగముగా గ్రహించగలిగినది. వెంటనే ఆమె ప్రజలకు చెప్పవలసి యున్నది. ఎవరో ఒకరికి ఆమె చెప్పవలసియున్నది, ఎందుకనగా ఆమె మెస్సీయాను కనుగొనియున్నది. ఆమె నిశ్చయత కలిగియున్నది. ఆమె ఆ నగరంలోనికి వెళ్లి మరియు తక్షణమే ఆమె ప్రజలకు చెప్పు పనిలోనికి వెళ్ళినది.

LUKE 5:4,5

 

75పేతురు ఆ రాత్రంతా చేపలు వేటాడిన తర్వాత, ఉదయమున ఆ సముద్రపు ఒడ్డున కూర్చొనియున్నాడు. యేసు తన యొక్క పడవను అద్దెకు తీసుకున్నాక మరియు ఒడ్డు నుండి కొంతవరకు లోనికి తోసియున్నాడు, పిమ్మట ప్రజలకి బోధించియున్నాడు. మరియు పిమ్మట ఆయన సీమోనుకి చెప్పియున్నాడు, "లోతులోనికి లాగండి మరియు దానిని దించండి."

మంచిది, సీమోను చెప్పాడు, "నేను ఒక జాలరిని. చంద్రుడు మరియు సూచనలు సరిగ్గానున్నప్పుడు నేను ఎరుగుదును, చేపలు తిరిగే వేళ నాకు తెలుసు. నేను ఈ యొక్క సరస్సు వద్ద జన్మించాను. నేను రాత్రంతయూ వేటాడాను మరియు కనీసం ఒక చిన్న పరిగినీ కూడా పట్టుకోలేకపోయాను. ఒక చిన్న దానిని కూడా పట్టలేకపోయాను." చెప్పెను, "అచ్చట ఏ విధమైన చేపలు లేవు. అయితే నీ మాట చొప్పున వల విసురుతున్నాను." మీరు అచ్చట ఉండండి, "నేను వలను విసిరెదను." ఓ, మీరు బహుశ…

LUKE 5:4,5

 

76ఈ విషయములను మనము బయటకు చిత్రీకరించలేము. మరియు దేవుడు గతాన్ని చిత్రీకరిస్తున్నాడు. నీవు దానిని నమ్మవలసియున్నావు, చూడండి. విద్యద్వారా గాని లేక జ్ఞానం ద్వారా గాని దేవుడు మనకు తెలియపరచబడడు. ఆయన విశ్వాసం ద్వారా మాత్రమే తెలియపరచబడతాడు, మరియు కేవలము విశ్వాసం ద్వారానే.

"నీ మాట మీద నమ్మిక వుంచి, ఎందుకనగా అచ్చట చేపలు లేవని నాకు తెలుసు. అయితే నీ మాట చొప్పున, 'అచ్చట చేపలున్నవి గనుక వల వేయండి,' అని మీరు చెప్పినచో, నీవు చెప్పినచో, విశ్వాసం దీనిని అచ్చట ఉంచుతుంది. అది అంతే. నేను వలను వేసెదను."

77ప్రజలు ఇచ్చట రోగులుగా కూర్చొనినచో పిమ్మట దేవుని నుండి సహాయం కావలెను, "నేను ప్రతీ ప్రార్థనా వరుసలోను వస్తున్నాను, నేను సమస్తమును చేసియున్నాను. అయితే మీ మాట చొప్పున నేను వల వేయుచున్నాను. నేను ఇప్పుడే వస్తున్నాను మరియు నేను దానిని పొందుకొనబోవుచున్నాను. నేను ఆయన సన్నిధిలోనున్నానని నమ్ముచున్నాను. మరియు నేను…" మరియు వినయముతోను, నిజాయితీతోను మరియు గౌరవముతోను గుర్తించండి. వలను వేయండి. దానిని పట్టుకొనండి. దేవుడు అలా చెప్పెను, మరియు అది అలా జరుగును!

ISA 6:5•

LUKE 5:8,10

 

78మరియు మనము కనుగొందుము అతడు జాలరి కావున దోనె నిండుగా విస్తారమైన చేపలు పట్టుటకు త్వరగా ఆ పనిలోనికి వెళ్లెను, మరియు అతడు ఒక పేదవాడు, మరియు యేసు చెప్పెను, "ఇక నుండి నీవు మనుష్యులను పట్టుదువు." అది అతనికి ఎంతో సమయం పట్టలేదు. అతడు తనను తాను తగ్గించుకొని క్రీస్తు ముందు సాగిలపడ్డాడు, "ప్రభువా నా నుండి దూరముగా వెళ్లిపొమ్ము, నేను ఒక పాపిని," అని చెప్పాడు, నేను నీ యొక్క సన్నిధిలో నిలువలేను," అని చెప్పాడు.

అదే విషయము యెషయా కూడా చేశాడు. ఆయన చెప్పాడు, "నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, మరియు నేను అపవిత్రమైన ప్రజలు మధ్య జీవిస్తున్నాను." ఓ, ఎట్టి రకమైన పరిస్థితిలో అతడున్నాడు!

పేతురు కూడా అదే విషయం చెప్పాడు, మరియు అతడు తనను తాను తగ్గించుకున్నాడు. అతని ముఖము మీద పడి అతని నుండి దూరముగా పొమ్మని దేవునిని అర్ధించాడు. ఆయన చెప్పెను, "పేతురూ, భయపడవద్దు, ఇక నుండి నీవు మనుష్యులను పట్టెదవు." మరియు అతడు వెంటనే కార్యాచరణలోనికి వచ్చియున్నాడు.

JOHN 9:10,11,21,23,26

 

79ఒకసారి ఒక గ్రుడ్డివానిని యేసు స్వస్ధపరిచెను. ఆయనను గుర్తించుటకు ఆ గ్రుడ్డివానికి ఎక్కువ సమయం పట్టలేదు, అతడు క్రియా రూపంలోనికి వెళ్లాడు, ఆయన యొక్క కీర్తిని ప్రతీ చోట వ్యాప్తి చేశాడు. ఎవరో ఒకరు వచ్చి అడిగారు, "ఎందుకు, ఎవరు నిన్ను స్వస్థపరిచారు?" యాజకుడు చేశాడు. అతడిని ఎవరు స్వస్థపరిచారో అతడు చెప్పెను.

మొదట వారు అతని తల్లి మరియు తండ్రిని అడిగారు. మరియు ఆ తల్లి చెప్పినది… మంచిది, ఇప్పుడు వారు భయపడ్డారు, ఎందుకనగా ఎవరైనా యేసుని ఒప్పుకున్నచో వారిని సమాజ మందిరములలో నుండి వెలివేసేవారు. మరియు వారు ఆ విషయాన్ని మరల తమ బీద కుమారుని మీదకే త్రోసివేశారు. వారు చెప్పారు, "అతడు వయస్సు వచ్చినవాడు గనుక అతడినే అడగండి.

మరియు అతడు చెప్పెను, "నజరేయుడైన యేసు అను ఒకరు నన్ను స్వస్థపరచెను."

అతడు చెప్పాడు, "ఎందుకని, దేవునికి మహిమను చెల్లించాలి!" చెప్పాడు, "మాకు, నజరేయుడైన యేసు గూర్చి తెలియదు." చెప్పారు, "అతడు ఒక పాపి, ఆయనకు స్తుతులు ఇవ్వవద్దు; సమస్తమును దేవునికి ఇవ్వండి. మరియు ఇప్పుడు ఆయన ఎచ్చట నుండి వచ్చియున్నాడో మాకు తెలియదు."

JOHN 9:25,30

 

80మంచిది, ఈ గ్రుడ్డివాడు వారికి ఒక మంచి ప్రశ్న అడిగాడు. అతడు ఇలా చెప్పాడు, "ఇది బలమైన ఒక వింతైన కార్యము. నేడు మీరంతా ఆత్మసంబంధమైన నాయకులు మరియు ఈ మనుష్యుడు నా యొక్క గ్రుడ్డి నేత్రములను తెరిచియున్నాడు మరియు నేను గ్రుడ్డివాడిగా పుట్టితిని, అయితే ఆయన ఎక్కడ నుండి వచ్చాడో మీరు ఎరుగరా? చూడండి, ఇప్పుడు అది ఒక వింతైన విషయము.

నేను అదే విషయమును చెప్పవచ్చా? ఈ యొక్క అంత్యదినములలో తన సంఘం మీదకి వస్తానని వాగ్దానం చేసిన దేవుడు, మరియు వారి వద్ద సమాధానం లేదు. ఎవరైతే ఆయనను స్వీకరిస్తారో వారి వద్దే జవాబు ఉన్నది.

చెప్పాడు, "అతడు పాపియో, కాదో నేను దానిని చెప్పలేను. అయితే నేను ఎరిగిన ఒకే విషయము ఏమనగా, ఒకప్పుడు నేను గ్రుడ్డివాడను, అయితే ఇప్పుడు నేను చూచుచున్నాను."

ఒకప్పుడు నేను పాపిని; దేవుని కృప ద్వారా నేను రక్షించబడ్డాను. నాకు ఏదో జరిగినదని నాకు తెలుసు. ఏదో ఒకటి జరిగినది. మీరు దీనిని "పరిశుద్ద గుండ్రాయి" అని పిలువగలరు, లేక మీరు ఏమని పిలవాలనుకుంటే అలాగు పిలవండి, అయితే ఇది నన్ను రక్షించింది. సుమారు 30 సంవత్సరముల వయస్సులో మరియు ఇది అన్ని సమయములలోను మంచిగా ఉన్నది. కావున నేను దీనిని సంతోషిస్తున్నాను.

ఎవరో చెప్పిరి, "నీవు మతిభ్రమించినవాడుగా సున్నావు."

నేను చెప్పాను, "మంచిది, అయితే నన్ను ఒంటరిగా విడిచిపెట్టండి. నేను వేరొక మార్గంలో ఉండే కన్నా, ఈ మార్గంలోనే నాకు బాగుంది, కావున నేనున్న మార్గంలో నన్ను ఉండనివ్వండి. ఈ మార్గంలోనే నాకు మంచిగా ఉన్నది మరియు బాగా చేస్తున్నాను. నేను ఇంకా ఎక్కువ చేయగలను. అవునండీ.

అతడు వెంటనే కార్యాచరణలోనికి వెళ్లాడు. అవునండీ, అతడు ఆయన యొక్క కీర్తిప్రతిష్టలను ప్రతీచోటా వ్యాప్తిచేశాడు.

LUKE 24:49•

ACTS 1:4•

ACTS 2:4,13

 

81పెంతెకోస్తునొద్దనున్న ప్రజలు, దేవుని యొక్క వాగ్దానాన్ని వారు చూచిన వెంటనే! యేసు చెప్పెను, "ఇదిగో మీ మీదకు నేను వాగ్దానాన్ని పంపుతున్నాను," లేఖనమేమనగా, "నా తండ్రి యొక్క వాగ్దానాము మీ మీదకు వచ్చువరకు." మీరు వేచియుండండి. దానికై వేచియుండుడి. "పైనుండి శక్తి పొందువరకు మీరు యెరూషలేము పట్టణములోనే నిలచియుండండి."

మొదటి ప్రార్థనా వరుస కాదు, లేక వరుస గుండా మొదటిసారి రావటం కాదు గాని, అది నేరవేరువరకు అచ్చటే మీరు నిలచి ఉండండి, చూచారా. "పొందేవరకు," ఒక్క దినము కాదు, రెండు దినాలు కాదు, లేక పది సంవత్సరములు కాదు, "అది జరిగేంతవరకు." అంతవరకు వేచి ఉండండి!

మరియు వారు పరిశుద్ధాత్మతో నింపబడినప్పుడు, వారు వెనువెంటనే కార్యాచరణలోనికి వెళ్లిరి; వీధులలోనికి వెళ్లిరి మరియు అరచిరి మరియు నాట్యం చేసిరి. మరియు త్రాగిన ప్రజలు వలె అగుపడిరి, మరియు అన్యభాషలతో మాట్లాడిరి. అది ఎంత గొప్ప ఉజ్జీవము! వారు వెనువెంటనే కార్యాచరణలోనికి వెళ్లిరి; వారు తమను తాము తగ్గించుకున్న వెంటనే లోనికి వెళ్లి తలుపు మూసుకొనిరి, మరియు దేవుని వాక్యముపై వేచియున్నారు.

82ఓ, స్నేహితులారా, మనము ఏమి చూచాము! ఇప్పటికే ఆలస్యమగుచున్నదని నాకు తెలుసు మరియు మిమ్ములను ఎక్కువ సేపు ఉంచను. అయితే, చూడండి! గతించిన కొద్ది సంవత్సరాలలో మనము దేనినైతే చూచామో, అది మనలో ప్రతీ ఒక్కరు కార్యాచరణలో ఉంచవలసియున్నది. ఇది తప్పక మనలను కార్యాచరణలో ఉంచవలసియున్నది. ఏమిటి? మొదటిగా మనలను గౌరముగా ఉంచుతుంది. మరియు దీనముగా మరియు కార్య రూపములో, మరియు ప్రేమ మన హృదయాలలో మండుచున్నది. నశించిపోతున్న ప్రపంచం కొరకు మనం మంచిగా ప్రయత్నించాలి. మరియు దేవుని సూచనలు చూస్తూ… నాకు తెలిసినంత మట్టుకు, చిట్టచివరి వ్యక్తి వరకు పరలోకము నుండి అగ్ని పడే ముందుగానే సంఘము దానిని స్వీకరించబోవుచున్నది. వెనుక ఆ అరణ్యంలో కనిపించిన అదే అగ్నిస్తంభము, పరిశుద్ద పౌలును కొట్టి క్రింద పడేసిన అదే అగ్నిస్తంభము మరియు అదే అగ్నిస్తంభము యొక్క చిత్రము తీయబడినది. అది ఖచ్చితముగా అక్కడ చేసిన అదే విషయమును ఇక్కడ చేయుచున్నది, అదే మెస్సీయా.

మీరు గుమ్మడికాయ యొక్క తీగలోనున్న జీవాన్ని తీసి కర్బూజ తీగలో పెట్టినచో, అది గుమ్మడి కాయలే కాస్తుంది. మీరు ద్రాక్షా తీగ యొక్క జీవాన్ని తీసి, పీర్ చెట్టులో పెట్టినచో అది ద్రాక్ష పళ్ళనే ఫలిస్తుంది, ఎందుకనగా దాని యొక్క జీవమే దీనిలో ఉన్నది గనుక.

JOHN 14:2

 

83మరియు మనము దానిని చూచి తెలుసుకొన్నచో, సర్వ ప్రపంచ వ్యాప్తంగానున్న ప్రజలు దీనిని తెలుసుకుంటారు, విజ్ఞాన శాస్త్రము దానికి సాక్షము ఇచ్చినది. ప్రతీ చోటా ఆ చిత్రము తీయబడినది. ఇది సరిగ్గా ఇప్పుడు ఇచ్చట కూడా ఉన్నది. అది వాస్తవం, ఎంతో సత్యము. ఇది ఇచ్చట సరిగ్గా నున్నది! మరియు ఇది అదే రకమైన జీవమును ఫలించినచో, ఇది క్రీస్తు యేసు అనే వ్యక్తిలో ఉన్నప్పుడు అదే చేసినది, ఇది ఆయన యొక్క సంఘములో అదే విషయం చేయనిచో అప్పుడు ఇది తప్పు. అయితే ఇది అదే జీవమును ఫలించినచో అప్పుడు ఇది ఇశ్రాయేలీలను నడిపించిన అదే అగ్నిస్తంభమై యుంటుంది. ఇదియే మనలను వాగ్దాన దేశములోనికి నడిపిస్తుంది. "నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు," ఆయన మనకు ఇచ్చిన వాగ్దానము మరియు ఇది మనలను అచ్చటకు నడిపిస్తుంది. మరియు ఇది సంపూర్ణముగా నిరూపణ అయినట్లుగా మనము చూశాము, దేవుని వాక్యము ప్రత్యక్షపరచబడినది. కుంటివారు నడుచుచున్నారు, చెవిటి వారు వినుచున్నారు, గ్రుడ్డివారు చూచుచున్నారు, మృతులు లేపబడుచున్నారు; హృదయ తలంపులు దాగలేవు, అవి బయటకు చెప్పబడతాయి, ఆయన చేసిన అదే క్రియలు మరల. అది ఏమిటి, ఏదో మనిషి? ఇది మెస్సీయా! ఇది మెస్సీయా, దేవుడు, పరిశుద్ధాత్మ, అదే వ్యక్తి. అది అలా ఉండవలసి యున్నది…

84పెంతెకోస్తు సంఘము దీనిని విమర్శించుటకు బదులుగా అది ప్రతీ చోటా కార్యాచరణలోనికి వెళ్లవలసియున్నది, దీనత్వము మరియు ప్రేమతో నశించిపోవుచున్న మరియు చనిపోవుచున్న ప్రజలు కొరకు చూచుటకు ప్రయత్నించవలసియున్నారు. మనము దీనిని గౌరవిద్దాము. మనము ఆయనను గౌరవిద్దాము. మనలను మనము తగ్గించుకుందాము. మనము గౌరవము కలిగియుందాము. మరియు ఈ సెరాపులు ఉన్నట్లుగా గౌరవముతోను మరియు వినయముతోను కార్యాచరణలో ఉందాము. స్పష్టముగా నిరూపించబడినది, చివరి దినాలలో మనకు వాగ్దానం చేయబడినది. మరియు ఇది ఇచ్చటనున్నది! మనము దానిని చూచాము. యేసు అలా చెప్పెను, అది జరుగునని చెప్పెను. అది ఇచ్చటనున్నది, ఇది కాలిపోయే ముందుగా ఆయన రాకడ సూచన సమీపముగా నున్నదని ఆయన యొక్క రాకడ నిరూపించుచున్నది. ఇది ఎప్పుడైనా రావచ్చు. ఇప్పుడే సంఘం యొక్క ఎత్తబాటుకు ఏమీ అడ్డంకుగా ఉండుటకు నేను ఏమి చూచుటలేదు.

మంచిది, గురుతు… మృగము యొక్క ముద్ర వేరే ప్రక్కనవున్నది. జ్ఞాపకముంచుకొనుడి, చూశారా, విశ్వాసమును త్యజించుట (Apostosy) అనేది లోనికి సంఘముగా వచ్చినది. ఇప్పుడు వేచియుండండి, బహుశా నేను ఏదో ఒకటి చెప్పియుండవచ్చును. అదియే దీనిని నేను చూచే విధానము, చూడండి. గమనించండి.

MATT 25:10

 

85వాక్యము వెంబడి వాక్యము, ఇది, ఇదివరకే నెరవేర్చబడినది. ఇది మనలను కార్యాచరణలోనికి ఉంచవలసియున్నది. అది ఖచ్చితముగా నిజము. మనము, నశించిపోతున్న ప్రతీ ఆత్మను మనము చేయగలిగినంతగా దేవుని రాజ్యము కొరకు రక్షించవలసియున్నాము. ఎందుకనగా, ఈ దినాలలో ఏదో ఒక దినమున వారిని తీసుకురాబోవుచున్నాము మరియు ఇది ఏ మంచీ చేయదు. ఆ తలుపు మూయబడబోవుచున్నది, ఇంకా ఉండబోదు. ఓ, వారు బహుశా మానసికంగా పని చేసివుంటారు మరియు ఉద్రేకపడుట మరియు శబ్దాలు చేయుట మరియు, పైకి క్రిందికి ఎగురుట మరియు దీనిని ప్రకటించుకొనుట, మీకు తెలుసా. అయితే బుద్దిలేని కన్యక నూనె కొనటానికి వచ్చునప్పుడు, ఆమె దానిని పొందలేదు. మరియు ఈ చివరి దినాలలో చరిత్రలో మీరెన్నడైననూ ఒక కాలాన్ని చూచారా, అనగా ఆ యొక్క ప్రెస్బిటేరియన్లు, లూథరన్లు ప్రతీ ఒక్కరూ పెంతెకోస్తు వర్తమానమునకు వచ్చుటకు ప్రయత్నించారా? యేసు ఏమి చెప్పెను? "వారు కొనబోవుచుండగా పెండ్లి కుమార్తె లోనికి వెళ్ళినది," బుద్ది గల కన్యక లోనికి వెళ్లినది. వారు నూనెను పొందుకొనలేదు. వారు దానిని పొందుకొనలేదు. అంతే. అది లేఖనానుసారముగా ఉన్నది.

మరియు మీరు చూచారా, ఈ సూచనలు మరియు ఈ ఇతర విషయాలు ఇవన్నియూ ఆయన యొక్క రాకడ కొరకు సరిగ్గా క్రమములో కూర్చోండబెట్టబడుచున్నవి.

MATT 25:6•

REV 3:16,17

 

86ఏడవ జాములో, ఆయన వస్తాడు. కొంతమంది మొదటి జాములో నిద్రించిరి, రెండవ జాము, మూడవ జాము, నాలుగవ జాము, ఐదవ జాము. మరియు ఏడవ జాములో ఒక పిలుపు వస్తుంది, "ఇదిగో, పెండ్లి కుమారుడు వచ్చుచున్నాడు!" ఏడవ సంఘకాలము, అదియే జాము. ఆ కాలం దీనిని గమనించినది. మరియు ఇది లవొదికయ సంఘకాలము దీని యొక్క అంతములో. ఆమేన్. ఓ, ఇది… ప్రభువు యొక్క పరిశుద్దులారా, మీరెందుకు మేల్కొనరు, అంతము సమీపించుచుండగా మీరెందుకు నిద్రిస్తున్నారు?

అయితే గుర్తుంచుకొనండి, లవొదికయ సంఘకాలంలో నున్న సంఘము అనేది నులివెచ్చగానున్నది. ఆయన చెప్పెను, "ఎందుకనగా ధనవంతుడువని నీవు చెప్పుకొనుచున్నావు మరియు నీ వస్తు సంపాదనలో అభివృద్ధి చెందానని చెప్పుకొనుచున్నావు." మరియు ఆయన చెప్పెను, "నీవు దిగంబరివని, గ్రుడ్డివాడివని, దరిద్రుడవని, దిక్కుమాలినవాడువని ఎరుగకయున్నావు." చెప్పెను, "నేను నా నోట నుండి ఉమ్మివేయ నుద్దేశించుచున్నాను."

మరియు ఇచ్చట మనము సమస్త విషయములకు అంతములోనే యున్నాము. చరిత్ర యొక్క అంతములో వున్నాము. నాగరికత అంతములో వున్నాము. మీరు చూడగలరు. వీధులలో చూడండి.

87నేను కారు డ్రైవరుతో మాట్లాడుచున్నాను, నన్ను ఇచ్చటకు తీసుకొని వస్తున్న అతనితో అతడు చెప్పెను, "మంచిది, నేను చెప్పగలిగే ఒకే ఒక మార్గం ఏదనగా ఇచ్చట పిచ్చివానిగా తిరుగుచున్న ఒక మనిషిని నేను చూచినప్పుడు, అతడు ఒక క్రొత్తవాడని నేను ఎరుగుదును," చూచారా. ఇప్పుడు, అది మీ యొక్క ఒక కారు డ్రైవరు చెప్పినటువంటిది. ఆ విధముగా చెప్పెను.

ఇది కేవలం ఇచ్చట మాత్రమే కాదు గాని, ప్రతీ చోటను ఉన్నది. ప్రతీ దాని యొక్క అంతము; ఎంత క్రూరమైనది, మనిషి, అన్ని రకాలైన దుష్ట పనులు మరియు వారు చేయుచున్నారు. ఈ లోకము చెడిపోయినది. వీధులలోనికి చూడండి. దీని వైపు చూడండి, ఓ, మై, ప్రతీచోటను! అమెరికాలో మాత్రమే కాదు; ప్రతీ చోటను, ఎందుకు, ఇది ఒక ఆధునిక సొదొమ.

ఏదియూ విడిచి పెట్టబడదు గానీ కాల్చివేయబడును. మరియు అది అంతే, ఇది అంతయూ శభ్రపరచబడును. దేవుడు దీనిని చేయును. ఆయన యొక్క చట్టములకు అది అవసరమైయున్నది. అది ఆ విధముగా చేయవలసియున్నది. ఒక ధాన్యపు కాడ దాని యొక్క జీవమును బయటకు తీసుకు వచ్చినప్పుడు, అది నాశనం కావలసియున్నది. ఒక పుష్పం దాని జీవము బయటకు తీసుకువచ్చినప్పుడు, అది చనిపోవును. మరియు నాగరికత దాని యొక్క కాలము పరిపక్వత చెందినది. సంఘకాలము యొక్క జీవము బయటకు వచ్చినది. సంస్థల జీవము బయటకు పోయినది.

88ఇది ఐక్యపరుచు కాలము. ఐక్యరాజ్యమున్నది, ఐక్య సంఘమున్నది, మరియు ఐక్య శ్రమ ఉన్నది. ఇది దేనికి సూచన? క్రీస్తు మరియు తన యొక్క వధువు ఐక్యమగుచున్నది. ఇదియే అది. ఇవన్నియూ ఛాయలు మరియు మాదిరిలు. సమస్తమును ఐక్యము కావలసియున్నది, ఖచ్చితముగా ఇది సూచన. క్రీస్తు తన వధువుతో ఐక్యమగుటకు స్థిరపరుచుకొనుచున్నాడు. ఒక పెండ్లి విందు ఆకాశంలో జరుగబోవుచున్నది, కావున ఆయన యొక్క సూచనలను సమీపించుట ఇచ్చట మనము చూచినప్పుడు ఇది సంఘమును కార్యాచరణలోనికి త్రోయవలసియున్నది. ఓ, మై! ఈ విషయములన్ని మనకు సూచనలుగా ఉన్నవి, ప్రతీ చోటను. ఓ, మనము కార్యాచరణలోనికి వెళ్లవలసియున్నాము!

89మనము, ప్రాచీన ప్రవక్త యెషయా వలె, తనను తాను హెచ్చించుకునే వ్యక్తికి ఏమి జరిగెనో మనము చూచాము. ఈ యొక్క సంఘశాఖలు లేచి ఏమి చెప్పెనో మనము చూచాము. మరియు వారు చెప్పుచున్నారు, "మంచిది, ఎందుకనగా మీరు మాకు చెందినవారు కాదు, మీరు దీనిలో కూడా లేరు," వారికి ఏమి జరగుచున్నదో మనము చూచాము. వారు ఏమి కోల్పోయారు? వారు పాప సంబంధమైన కుష్ఠువ్యాధిలో మొత్తబడిన వారివలె ఉన్నారు. అవిశ్వాసముతో దేవుని వాక్యము మీద వారి యొక్క పట్టును కోల్పోయారు. వారిలో కొంతమంది ప్రజలు ప్రయత్నిస్తారు, వారు మార్చుకుంటారు, వాక్యములో వారి యొక్క పట్టును కోల్పోతారు, మరియు దానిని సిద్దాంతములు కొరకు మార్చుకుంటారు. వారు ఏమి పొందుకుంటారు? కుష్ఠువ్యాధి అనే గందరగోళము. అది నిజము.

90ప్రాచీన ఉజ్జియా వలె, అభిషేకించబడిన వారి యొక్క కార్యాలయమును తీసుకొనుటకు ప్రయత్నించుట ద్వారా మరియు దేనిని పొందుకొనలేకపోయాడు, అయితే ఒక డాక్టర్ పట్టా లేక ఏదో ఒకటి. దేవుడు డాక్టరు పట్టా కొరకు ఎదురు చూచుటలేదు; ఆయన దీన హృదయాలు కొరకు ఎదురుచూస్తున్నాడు మరియు ఆయనను నమ్మేవారి కొరకు కూడా. అయితే మనము మనుష్యులను తీసుకొని మరియు వారిని బిషప్పులు గానూ, ప్రతి విధమైన వారు గాను, కార్టినల్స్ గాను మరియు ఇంకా ఎక్కువగా వారిని విద్యావంతులుగా చేసిరి, అనగా ఒక దైవసంబంధమైన కార్యాలయమును భౌతికమైన విద్యతో నిర్వహించటానికి ప్రయత్నిస్తున్నారు. ఆ యొక్క కార్యాలయమును తీసుకొనుటకు మనకు పరిశుద్ధాత్మ బాప్తిస్మము కావలసియున్నది. పరిశుద్ధాత్మ మన యొక్క బోధకుడు. మన మధ్య తనను తాను తెలియపరుచుకున్న వ్యక్తి ఆయన ఒక్కడే, ఈ చివరి దీనాలలో ఈ ఘడియ యొక్క సూచన ఆయనే. మనమైతే హిజ్కియా వలె పైకి హెచ్చించుకొనుచున్నాము, వారి యొక్క స్థానములను తీసుకొనగలరని వారనుకొనుచున్నారు.

ISA 6:5•

2PET 1:18

 

91ఆ దర్శనం ప్రభావములు ప్రవక్త మీద ఎలా పడినవో చూడండి. ఇప్పుడు, ఆయన ఒక ప్రవక్తగానున్నాడు. దేవుని యొక్క వాక్యము వచ్చుటకు ఆయన ఒక పాత్రగానున్నాడు. అతడు ఎన్నిక చేయబడ్డాడు, ప్రవక్తగా జన్మించాడు. చివరిగా ఆయన జీవితాన్ని ఇచ్చాడు, రంపముతో తన యొక్క శరీరము ముక్కలుగా కోయబడినది. అయితే మనము కనుగొనినది ఏమనగా, ఈ యొక్క గొప్ప ప్రవక్త పరలోకము నుండి ఇతడు ఆ దర్శనము చూచినప్పుడు, ఒక క్రమాన్ని చూచాడు, దేవుడు ఆయన యొక్క మనుష్యుని ఎలా సిద్దపరుస్తాడు, ఎందుకు, ప్రవక్త, తాను పాపి అని ఒప్పుకొనుటకు ఇది కారణమైనది.

మరియు మనము చాలా పెద్ద వ్యక్తులుగా వుండాలని కోరుకుంటూ ఉంటాము. మరియు ఒక పెద్ద చుట్టూ మలచిన కాలర్ ను ధరించి, ఒక రకమైన దుస్తులను ధరిస్తూ ఉంటాము. మీకు తెలుసా, అది మనలను చాలా ఎక్కువ పరిశుద్దముగాను మరియు గౌరవముగాను ఉంచుతుంది, అని అంటాము. మనతో ఏ పరిశుద్దత లేదు. మనము పరిశుద్దులుగా ఉండలేము; పరిశుద్ధత అనేది దేవునిది, చూచారా. నిశ్చయముగా. ఇది ఒక పరిశుద్ద సంఘం కాదు, ఒక పరిశుద్ధ పర్వతము కాదు, ఇది ఒక పరిశుద్ధ దేవుడు. అది నిజము. పరిశుద్ధ ప్రజలు కాదు; ఒక పరిశుద్ద దేవుడు. ఇది దేవుడే ప్రజలలో ఉండుట. పేతురు రూపాంతరపు కొండను గూర్చి చెప్పాడు, "పరిశుద్ధ పర్వతము," అని దాని అర్ధం ఏమనగా, పరిశుద్ధ దేవుడు ఆ పర్వతం మీద ఉన్నాడు గనుక, ఇప్పుడు దాని వైపు చూడండి, చూచారా. అయితే అచ్చట పరిశుద్దుడైన దేవుడున్నాడు, దేవుని యొక్క సన్నిధియే దానిని పరిశుద్ధముగా చేసినది.

ఇది మన మధ్యలోనున్న దేవుని యొక్క సన్నిధి మరియు ఇది పరిశుద్దతను తీసుకువస్తుంది, నా యొక్క పరిశుద్ధతను కాదు, నీ యొక్క పరిశుద్ధతను కాదు, అయితే ఆయన యొక్క పరిశుద్ధత, ఆయన సన్నిధి పరిశుద్ధతను తెచ్చును. మనము ఒకరికొకరము తగ్గించుకొనవలసి యున్నాము, మనకు మనము గౌరవములో కప్పుకొనవలసియున్నాము. దీనత్వములో కప్పుకొనవలసియున్నాము. మరియు, "ప్రభువైన యేసూ, నీ యొక్క రాజ్యములోనికి నన్ను స్వీకరించుము," అని చెప్పవలసియున్నాము. ఆయన యొక్క పరిశుద్ధత, మనది కాదు. పరిశుద్ధాత్మ!

ISA 6:5-7•

ACTS 1:13,15•

ACTS 2:3

 

92ప్రవక్త దానిని ఒప్పుకున్నాడు, "నేను అపవిత్రమైన పెదవులు గలవాడను," అని చెప్పుటకు కారణమైనది. ఒక ప్రవక్త! దేవా, అట్టి మరియొక దర్శనం మాకు కావాలి! అతడు అచ్చట పైకి చూచినప్పుడు… దేవుని యొక్క శుభ్రపరిచే శక్తిని చూశాడు.

ఇప్పుడు దేవుడు ఎలా చేశాడు గమనించండి. ఆయన సెరాపులలో ఒకరిని పంపించి బలిపీఠము మీద నుండి ఒక నిప్పును పట్టకారుతో తీసుకొని మరియు దానిని అతని చేతులలో పెట్టెను, దానిని యెషయా యొక్క తల వెనుక నుండి వచ్చి ఆయన యొక్క పెదవులకు తగిలించెను మరియు చెప్పెను, "నీ యొక్క అతిక్రమములు క్షమించబడినవి."

పిమ్మట యెషయా వేరొక పాఠమును నేర్చుకున్నాడు. నేను బహుశా దీనిని లోపలికి విడిచి పెట్టవచ్చు. బహుశా సరియైనది. కాకపోవచ్చు, అయితే దీనిని నేను నమ్ముచున్నాను. దీనిని మీరు గమనించారా, దేవుడు తన ప్రవక్తలను అగ్ని ద్వారా శుద్ధిచేస్తాడు; వేదాంతము ద్వారా కాదు లేక కొన్ని రకాలైన గ్రంథముల ద్వారా కాదు. ఆయన తన యొక్క ప్రజలను అగ్ని ద్వారా శుద్ధిచేస్తాడు, పరిశుద్ధాత్మ మరియు అగ్ని ద్వారా సిద్ధాంతముల యొక్క ఎడబాటు ద్వారా కాదు, లేక పుస్తకముల ద్వారా కాదు, లేదా నీవేదో నేర్చుకొనుట ద్వారా కాదు, లేదా కొన్ని ప్రార్ధనల ద్వారా కాదు మరియు మొదలగు వాటి ద్వారా కాదు. ఆయన వారిని బలిపీఠము యొక్క అగ్ని ద్వారా శుద్దిచేస్తాడు. ఆ రీతిగా ఆయన ఇతనిని క్రమములో ఉంచాడు. అవునయ్యా. ఆ రీతిగా ఆయన ఆది నుండి తన యొక్క ప్రవక్తలను శుద్ధిచేసాడు. 120 మంది మేడ గదిలో ఉన్నప్పుడు కూడా, పరిశుద్ధాత్మ వారి మీదకు పడినది మరియు అగ్నివంటి నాలుకలు వారిమీద వ్రాలినవి. వారు శుభ్రపరచబడి మరియు సేవ చేయుటకు సిద్ధమయ్యారు. ఆ రీతిగా దేవుడు శుద్ధిచేస్తుంటాడు. బి.ఏ. చదువు లేక డిడి, పిహెచ్.డి చదివి నేర్చుకొనుట ద్వారా కాదు; అయితే పరలోకము నుండి పరిశుద్ద అగ్ని నుండి పొందుకొనుట ద్వారా, అది నీ యొక్క పెదవులలోనికి వెళ్ళి తగలడం ద్వారా నీలో నుండి భౌతికమైన దానిని తీసివేయును మరియు వ్యర్ధపు మాటలను కాల్చి దూరముగా పారవేయును, ఆ యొక్క ప్రపంచపు చెత్తనంతటినీ పిమ్మట అది ఆయన యొక్క సన్నిధిని మన లోపల ఉంచి ఆ వ్యక్తి ద్వారా నివాసం చేయును. పరిశుద్ధ అగ్ని అనేటటువంటి దానిద్వారా దేవుడు తన సంఘమును శుద్ధి చేయును. యెషయా దానిని నేర్చుకున్నాడు. మనము దానిని నేర్చుకొనవలసియున్నాము, అనగా దేవుడు జ్ఞానము ద్వారా శుద్ధిచేయడు. ఆయన అగ్ని ద్వారా శుద్ధిచేస్తాడు.

ISA 6:5

 

93మీరు చూచారా ఆయన ఎలా ఉన్నాడో, ఒక ప్రవక్త క్రమములో పెట్టబడ్డాడు, ఇప్పుడు ఆయన, ఇతని యొక్క పెదవులను శుద్ధిచేసాడు, తన అతిక్రమములను దూరంగా పారవేశాడు. పిమ్మట అతడు దానిని కలిగి, అతడు ఒప్పుకున్నాడు, తనను తాను తగ్గించుకున్నాడు, అతడు చెప్పెను, "నేను అపవిత్రమైన పెదవులు గలవాడను," అని దేవుని యొక్క సన్నిధిని చూసినప్పుడు అతడు ఒప్పుకున్నాడు.

మీరు నన్ను వెంబడిస్తున్నారా? ఇప్పుడు మనము సరిగ్గా ఏమి చేద్దాము? మనము దేవుని సన్నిధిలోనున్నాము. అది నిజము. మనము ఇప్పుడు కూర్చోనియున్నాము. మనము. దీనిని విశదీకరించలేము, అయితే మనము ఇప్పుడు దేవుని సన్నిధిలోనున్నాము, దేవునిని చూస్తున్నాము. ఆయన ఇచ్చటనున్నాడని మీరు నమ్ముచున్నారా? నిశ్చయముగా, ఆయన ఇక్కడ ఉన్నాడు. మనము తప్పక… [టేపు మీద ఖళీగానున్నది.]

JOHN 14:12•

HEB 13:8

 

94నేను మీ యొక్క సహోదరుడను. అయితే ఆయన చెప్పెను, "నేను చేయు క్రియలు మీరు చేయుదురు," అని ఆయన చెప్పెనా? మంచిది. ఆయన ఇచ్చట ఉన్నచో, ఆయన ఆత్మ ఇచ్చట ఉన్నదని అర్ధము. అదియే ఆయనను అలా చేస్తున్నది. పిమ్మట మనల్ని మనము లోబరుచుకొనినచో, మరియు మన యొక్క తలంపులను దూరముగా తీసుకొనివేసినచో, ఆ రీతిగా ఇది ఏ తలంపులన కలిగిలేదు, పిమ్మట దీని ద్వారా వేరొక స్వరము మాట్లాడగలదు. అదియే మార్గము. మనలను మనము బయటకు ఖాళీచేసుకొనినచో, అదియే రహస్యము. మీకు మీరు విడుదల పొందండి! అప్పుడు దేవుడు చేస్తాడు… మీ యొక్క స్వంత ఆలోచనలకు విడుదల పొందండి. మీ యొక్క స్వంత మార్గముకు విడుదల పొందండి, మరియు పిమ్మట దేవునిని కదిలించండి. ఆయన యేసుక్రీస్తుగా నిన్న, నేడు, నిరంతరము ఏకరీతిగా ఉన్నాడని మీరు నమ్ముతున్నారా? ఆయన్ని మీరు ఇప్పుడే నమ్మండి మరియు అవునో కాదో చూడండి.

95ఈ యొక్క చిన్న వ్యక్తి ఇచ్చట కూర్చొనియుండుట నేను గమనిస్తూవున్నాను, సరిగ్గా నాకు ముందుగా నీవు ప్రార్ధనా కార్డును కలిగిలేవు. నీవు దేనికొరకు ఇచ్చట కూర్చొనియున్నావో దేవుడు నాకు చెప్పిన యెడల, దీనిని నీవు నమ్మెదవా? ఇది ఒక ఆత్మ సంబంధమైన ఒక సమస్య, మీరందరూ చుట్టూ గుమిగూడారు మరియు ఏమి చేయవలెనో మీకు తెలియుట లేదు. అది నిజమైనచో, నీ చేతిని ఎత్తుము? మంచిది. అది జరిగినది. వాక్యమును తీసుకొనండి, నేనేమైతే చెప్పానో అదంతా ముగిసింది.

మీరు దానిని నమ్ముచున్నారా?

ఆ యొక్క నల్లజాతి స్త్రీ సరిగ్గా అచ్చట వెనుక కూర్చొనియున్నది, అతని వైపు చూస్తున్నది; ఆమెకు గుండె సమస్య ఉన్నది. దేవుడు నిన్ను బాగుచేస్తాడని నీవు నమ్ముచున్నావా? నిశ్చయముగా. నీవు నమ్ముచున్నావా? మంచిది, నీవు నీ యొక్క స్వస్థతను పొందుకొనగలవు.

ఆయన నిన్న మరియు… ఒకే రీతిగా ఉన్నాడని నమ్ముచున్నావా.

96ఆ మనిషి, తన చేతిని పైకెత్తి ఉంచిన ఆ తెలుపు మనిషి, నేను ఆయన యొక్క ప్రవక్తనని ఆయన యొక్క సేవకుడనని నీవు నమ్ముచున్నావా? నేను నిన్ను ఎరుగను. నీవు నాకొక క్రొత్త వ్యక్తివి. నీవు ప్రార్ధనా కార్డును లేక దేనినైనా కలిగియున్నావా? నీవు ఇచ్చట ఒక మనిషిగా కూర్చొనియున్నావు, అయ్యా అది నిజము. నీవు నీ గొంతులో ఒక కణితిని కలిగియున్నావు. అది నిజము. అది నిజమేనా? నేను ఆయన ప్రవక్తనని నమ్ముచున్నావా? నీ హృదయమంతటితో నన్ను నమ్ముచున్నావా? నీవు వేరొక దానిని కలిగియున్నావు, నీ హృదయములో భారాన్ని కలిగియున్నావు, ఇది ఒక చిన్న అమ్మాయిని గూర్చి నీ యొక్క మనుమరాలును గూర్చి ఆమె ఒక చెడ్డ చేతిని కలిగి ఉన్నది, అది నిజము, అది నిజమేనా? అచ్చట ఒక మంచి సంబంధమున్నది. ఒక్క నిమిషము. మీరు ఇచ్చట నుండి వచ్చిన వారు కాదు, మీరు కనెక్టికట్ నుండి వచ్చారు మరియు మీ యొక్క పేరు విల్సన్, మీ యొక్క మొట్టమొదటి పేరు ఆర్ట్ మీరు ఆర్ట్ విల్సన్, అది ఖచ్చితంగా సరే. ఇది నిజమేనా?

దీనిని నీవు నమ్ముచున్నావా? సరే!

వెనుక అచ్చట ఒక నల్లజాతి స్త్రీ కూర్చొనియున్నది, ఏదో ఒక పసుపుపచ్చ రంగు కోటు లాంటిది వేసుకొనియున్నది, అవును, లేత ఆకుపచ్చ. ఆమె ప్రార్థిస్తూ ఉన్నది. నీవు ప్రార్థనా కార్డును కలిగియున్నావా? నీవు ప్రార్ధనా కార్డుని కలిగి లేవా? నీవు కలిగిలేవు, నన్ను ఆయన సేవకునిగా నమ్ముచున్నావా? నేను సంపూర్ణముగా క్రొత్తవాడను మనము రెండు జాతుల ప్రజలము, నీవు ప్రార్ధించుచున్నాను. అది నీవే. అవును. దేవుడు నీ యొక్క సమస్యను నాకు చెప్పగలడనీ నీవు నమ్ముచున్నావా? నీవు ఒక కణితిని కలిగియున్నావు. అది నిజము. నీవు నీ యొక్క హృదయములో ఏదో ఒక దానిని కూడా కలిగియున్నావు. నీవు ప్రార్థిస్తూ ఉన్నావు. అది ఒక స్నేహితుడు, మూత్రపిండ సమస్యను కలిగియున్నాడు. అది నిజమైతే నీ చేతిని ఎత్తుము. మంచిది. ఇప్పుడు నీవు నీ యొక్క విన్నపాన్ని పొందవచ్చు.

ISA 6:8

 

97నేను నీ యొక్క విశ్వాసాన్ని సవాలు చేస్తున్నాను! ఇది ఏమిటి? ప్రవక్త తాను దేవుని సముఖములో ఉన్నాడని చూచినప్పుడు, అతడు తన్ను తాను తగ్గించుకొన్నాడు. చూడండి, మొదటిగా అతడు తనను తాను తగ్గించుకొన్నాడు పిమ్మట అగ్ని అతనిని శుద్ధిచేసింది. మరియు పిమ్మట అగ్ని అతనిని శుద్ధి చేశాక, పిమ్మట అతడు శుద్ధి చేయబడిన యెషయాగా ఉన్నాడు. "నా తరుపున ఎవరు పోవుదురు?" అని దేవుని స్వరమును అతను వినినప్పుడు అతడు కార్యములోనికి వెళ్లాడు, "నేనున్నాను నన్ను పంపుము." ఓ, మై!

ఆ కారు నిప్పు ప్రవక్తను ముట్టినప్పుడు,

ఎంత పరిశుద్ధముగా ఉండాలో అంత పరిశుద్ధముగా అతనిని చేసెను,

"మా కొరకు ఎవరు వెళ్ళుదురు?" అని దేవుని స్వరము అడిగినప్పుడు.

"నా ఏలినవాడా, నేనున్నాను నన్ను పంపుము," అని అతడు జవాబిచ్చెను.

ఆమేన్. పరిశుద్ధాత్మ అతనిని శుద్ధిచేసిన తర్వాత, అదియే శుద్ది అయిన యెషయా యొక్క జవాబు అయి ఉన్నది. అతనికి ఏ విధమైన సెమినరి అనుభవాలు లేవు, అతనికి ఏ విధమైన పుస్తక అనుభవాలు లేవు. అతడు దేవుని యొక్క అగ్ని ద్వారా మాత్రమే. శుభ్రపరచబడ్డాడు. మరియు కార్యచరణలోనికి పిలువబడ్డాడు. అది ఏమిటి? అతడు దేవునిని కార్యాచరణలో చూచినప్పుడు, అతడు కూడా కార్యాచరణలోనికి వెళ్లియున్నాడు.

98మనము దేవునిని కార్యాచరణలో చూస్తున్నాము. సంఘము కార్యాచరణలోనికి వెళ్ళుటకు ఇది సమయము. మరియు దేవుడు ఏమైయున్నాడో దానికి సంఘము ఉదాహరణలుగా ఉండవలసియున్నది. మీరు దానిని నమ్ముచున్నారా? మీలో ఎంతమంది ఈ యొక్క తప్పిదములను మరియు ప్రతీ దానిని ఇప్పుడు ఒప్పుకొనవలెనని కోరుచున్నారు, మరియు "దేవా, నన్ను శుద్ధి చేయు," అని చెప్పండి. (పియానో, యవ్వనుడా.)

ఆ యొక్క నిప్పు రవ్వ ప్రవక్తను తాకినప్పుడు!

మనమందరము లేచి నిలవబడదాము. ఇప్పుడు చాలా ఆలస్యమగుచున్నది గనుక నేను ఇచ్చట ఆపివేస్తాను. ఇప్పుడు మీ హృదయమంతటితో నమ్మండి.

మీ తలలు వంచవలెనని నేను కోరుచున్నాను. గుర్తించుకొనండి, అతడు దేవునిని చూసిన పిమ్మట! అది ఇప్పుడు మరలా ఉన్నది. ఆమేన్. ఇప్పుడు ఏదైనా జరుగవచ్చా. ఏదైనా జరుగవచ్చు.

ఆ కారు నిప్పు ప్రవక్తను ముట్టినప్పుడు,

ఎంత పరిశుద్దముగా ఉండాలో అంత పరిశుద్ధముగా అతనిని చేసెను;

"మా కొరకు ఎవరు వెళ్ళుదురు?" అని దేవుని స్వరము అడిగినప్పుడు.

"నా ఏలినవాడా, నేనున్నాను నన్ను పంపుము," అని అతడు జవాబిచ్చెను.

నా ప్రభువా, మాట్లాడండి (ఇప్పుడు మీ చేతులు ఎత్తండి) ఓ,

నా ప్రభువా, మాట్లాడండి.

మాట్లాడండి, పిమ్మట వెంటనే మీకు బదులిస్తాను;

నా ప్రభువా, మాట్లాడండి, నా ప్రభువా, మాట్లాడండి.

మాట్లాడండి, మరియు నేను మీకు జవాబు ఇస్తాను.

"ప్రభువా నన్ను పంపించండి."

ఓ, ఇప్పుడు లక్షకొలది మంది, పాపములోను మరియు సిగ్గుచేటుగాను చనిపోవుచున్నారు,

(మీ వీధులలో చూడండి)

ఓ, వారి యొక్క విచారమైన, చేదు ఏడుపును వినండి,

ఓ, సహోదరుడా, తొందరపడు, వారియొక్క విడుదల కొరకు త్వరపడు,

నా ప్రభువా, మాట్లాడుము, (నిజముగా ఇప్పుడు దీనికి అర్థమున్నది) మాట్లాడుము, నా ప్రభువా మాట్లడు,

మరియు నేను మీకు వెంటనే బదులిస్తాను,

నా ప్రభువా, మాట్లాడండి, మాట్లాడండి,

నా ప్రభువా, మాట్లాడండి, మరియు నేను జవాబిస్తాను, "ప్రభువా, నన్ను పంపించండి."

99మనము మన యొక్క చేతులను మన యొక్క హృదయాల పైన వుంచుకొందాం, మనము పాటను మనలోపల పాడుచుండగా, మీరు ఒప్పుకొనండి, "ప్రభువా, నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, నేను అపవిత్రమైన పెదవులు గల స్త్రీని," అని చెప్పండి. మనము నిజమైన ఒప్పుకోలు ఒప్పుకుందాం, మనము నిజమైన ఉజ్జీవాన్ని కలిగియుందాం. ముందు శుభ్రపరచబడండి. గమనించండి, ప్రవక్త మొట్టమొదటిగా శుద్ధిచేయబడాల్సివుంది. అగ్ని అతనిని తాకినది, ఏమ్మట అతడు కార్యాచరణలోవున్నాడు. "ప్రభువా, నా హృదయంలో ఉత్సాహమునివ్వండి. నాలో ఏదో ఉంచండి. నేనింకా పొందుకొనలేదు ప్రభువా. మీ యొక్క ప్రేమను మరియు అగ్నిని నాలో ఉంచండి, పిమ్మట నన్ను పంపండి." ఇప్పుడు మీరు మీ యొక్క ఒప్పుకోలు ఒప్పుకోండి, దేవునిని మీ హృదయ మంతటితో నమ్మండి.

ప్రభువా, మాట్లాడండి, ప్రభువా, మాట్లాడండి.

ఓ, ప్రభువా, మరియు నేను శీఘ్రంగా మీకు బదులిస్తాను,

నా ప్రభువా మాట్లాడండి, నా ప్రభువా, మాట్లాడండి,

మాట్లాడండి, మరియు నేను సమాధానమిస్తాను,

"ప్రభువా నన్ను పంపండి."

[సహోదరుడు బ్రెన్హాం గారు పాటను నెమ్మదిగా పాడుచున్నారు.]

అతడు ఎంత పరిశుద్దముగా ఉండాలో అంత పరిశుద్ధముగా తయారు చేసినది,

"మా నిమిత్తం ఎవడు పోవును?" అని దేవుని స్వరము అడిగినప్పుడు.

పిమ్మట ఆయన బదులిచ్చెను, "ఏలినవాడా, నేనున్నాను నన్ను పంపుమనెను."

100"మాట్లాడండి." ఇప్పుడు దేవునిని మీ హృదయంలో మాట్లాడనివ్వండి; నిజమైన దీనముగా, మధురముగా, ఆయన యొక్క సన్నిధిలో గౌరముగా. ప్రతీ పాపి, ప్రతీ పరిశుద్దుడు, మరియు ఇది అందరికీ సంబంధిచినది. ఇది నా కొరకు. ఇది అందరి కొరకు. ఇచ్చట ఆయన యొక్క సన్నిధి ఉన్నది. ఆయన ఇచ్చటనున్నాడు, ఆయన ఏమి చెప్పెనో అది చేస్తాడు. మనము పొందుకుంటామని ఆయన చెప్పిన ఆ సూచన, అది ఆయనే ఇచ్చటనున్నాడు. ఇప్పుడు ఆ సంగీతము ఇచ్చట తియ్యగా మ్రోగుచుండగా, మనము మన యొక్క తప్పులను ఒప్పుకుందాము. "ప్రభువా, ఏది ఏమైనా నేను ఏమియూ కాదు, నా హృదయముతో మాట్లాడండి. ప్రభువా, నన్ను మొట్టమొదటిగా శుభ్రపరచండి, పరిశుద్ధాత్మను పంపించి శుద్ధి చేయండి నేను మీ సన్నిధిలోనున్నానని నేను ఎరుగుదును. మీరు కదులుతున్నట్లుగా యోషయా ఏ రీతిగా చూచాడో, నేను కూడా మిమ్మును చూస్తున్నాను. ఇప్పుడు, ఆ స్థలము (ధూపముతో కాదు గాని) సంపూర్ణ వెలుగుతోను మరియు మహిమతోను నిండియున్నది."

ఓ ప్రభువైన దేవా, పరలోకమునకు మరియు భూమికి సృష్టికర్తా, ఇది మా యొక్క మనసులలో ఉంటుండగా, అనగా పైకి హెచ్చించుకున్న ప్రజలకు ఏమీ జరుగునో మేము చూశాము. వారంతా మాకు మాదిరిలైయున్నారు. రక్షింపబడుటకు ఎటువంటి వినయము మరియు ప్రార్ధన మేము చూశాము.

పరలోకపు తండ్రి, ఇప్పుడు ఈ యొక్క సభికుల కొరకు మరియు నా కొరకు కూడా ప్రార్థిస్తున్నాను. ప్రభువా, నీ కిష్టము కానిది నాలో ఏదైనా ఉంటే, దానిని నా నుండి తీసి వేయుము. నేను కోరుచున్నదేమనగా, మీరు నాలో నివసించాలని ప్రభువా, గొప్ప ఆధిక్యతలతో మీ యొక్క ఆత్మను నేను కోరుచున్నాను. నాలో మీరు పరిపూర్ణముగా నివసించాలని నేను కోరుచున్నాను, అనగా నేను ఇక ఎంత మాత్రమునూ నేను కాదు. మరియు నేను మీలో నడిచి మాట్లాడి నివసించదలచుకున్నాను. దీనిని ప్రసాదించండి, ప్రభువా. నేను ఇచ్చటనున్నాను. ప్రభువా, నన్ను శుద్ధిచేయండి. ఈ సంఘమును శుద్ధిచేయండి. మా అందరిని కలిసికట్టుగా శుద్ధిచేయండి. వ్యాధిని తీసివేయండి, పాపమును తీసివేయండి, అవిశ్వాసము తీసివేయండి, సందేహం తీసి వేయండి, దీనినంతటిని బయటకు తీసివేయండి. ఇప్పుడు బలిపీఠము నుండి కారుతో తీసిన నిప్పు రవ్వను పట్టుకొని పరిశుద్ధాత్మ వచ్చును గాక. పెంతెకోస్తు యొక్క నూతన జ్వాలను మరియు ఇచ్చటనున్న ప్రతీ హృదయాన్ని శుద్ధి చేయండి. ప్రభువా, మమ్ములను తీసుకొనండి. మేము నీ వారము. మేము నిన్ను విశ్వసిస్తున్నాము. తండ్రి, దీనిని అనుగ్రహించండి.

… . నా ప్రభువా, మాట్లాడండి.

మాట్లాడండి, మరియు నేను బదులిచ్చెదను, "ప్రభువా నన్ను పంపించండి."

101ఎంతమంది అయితే చేయవలెనని కోరుకొనుచున్నారో మరియు మీ జీవితములను క్రీస్తుకు సమర్పించుకొనండి, ఒక నూతనమైన వారిగా, సరిగ్గా ఇప్పుడే మరియు ఆయన యొక్క సన్నిధిలో మీరు సమర్పించుకొనుటకు కోరుకొనండి!

నేను దేనినైతే చూచానో దానిని పిలుచుటకు నేను ప్రారంభించినచో… ఇచ్చట ప్రతీ ఒక్కరూ వచ్చెదరు. సరిగ్గా ఇప్పుడే నేను నమ్ముచున్నాను. మీరు కూడా నమ్ముతున్నారని నాకు తెలుసు. నేను ఇచ్చట నిలువబడి మరియు ఇది ఇలా ప్రతీ చోటా జరగనిచో, నేను ఆయన సేవకునిగా నిలుబడలేనని మీకు తెలుసు, మీరు ఒక నూతన పెంతెకోస్తును సరిగ్గా ఇప్పుడే ప్రారంభించే స్థితిలోనున్నారు. స్నేహితులారా, ఇది నిశ్చయముగా వాస్తవమైయున్నది.

మిమ్మల్ని మీరు తగ్గించుకొనండి. మీ ముఖమును కప్పుకొనండి, పాదాలను కప్పుకొనండి, మరియు ఆయనకు దగ్గరగా చేరువవ్వండి. మీ తలలు వంచి మరియు మీ ఒప్పుకోలును ఒప్పుకొనండి. మరియు విశ్వసించండి. మీరు దానిని చేయవలెనని కోరుకొనుచున్నారా? మీరు కోరుకొనినచో మీరు మీ చేతులను పైకి ఎత్తండి. అనగా మేము "మాట్లాడుము, నా ప్రభువా," అనే పాటను పాడుచుండగా.

మాట్లాడుము, నా ప్రభువా (ఇప్పుడు ప్రార్థించండి) మాట్లాడుము ప్రభువా,

మాట్లాడండి, మరియు నేను మీకు శీఘ్రముగా బదులిచ్చెదను;

ఓ, మాట్లాడండి నా ప్రభువా, మాట్లాడండి నా ప్రభువా.

మాట్లాడండి మరియు నేను బదులిచ్చెదను, "ప్రభువా నన్ను పంపించండి."

Search Messages

0 / 0 matches
Enter characters above to process real-time text query scopes...