చిన్నాభిన్నమై పడిపోవుచున్న ప్రపంచము

చిన్నాభిన్నమై పడిపోవుచున్న ప్రపంచము

1నమ్మిన చాలును,

సమస్త కార్యములును సాధ్యములగును, నమ్మిన మాత్రము చాలును;

నమ్మిన చాలును, నమ్మిన చాలును,

సమస్త కార్యములు సాధ్యములగును, నమ్మిన మాత్రము చాలును.

మేము మరల ఈ రాత్రి సమయమున, ఇచ్చట ఒక్కటిగా కూడికొని మేము మహోన్నతుడవైన మిమ్మల్ని ఆరాధించుటకు ఈ రాత్రి సమయమున మమ్మల్ని జీవముతో నుంచినందులకు మేమె౦తో కృతజ్ఞతలను మీకు చెల్లించుచున్నాము. మరియు పరలోకపు ఉన్నత స్థలములలో సహోదర, సహోదరీలుగాను, దేవుని రాజ్యము యొక్క వారసులుగాను, పరిశుద్దాత్మ మాపై వచ్చుటకు, నిరీక్షిస్తూ, మా జీవిత కార్యక్రమములలో మేమేమి చేయవలెననే దానిని ఆయన మాకు ప్రత్యక్ష్యపరచుననే ఉద్దేశముతో మేము ఒక్కటిగా కూడికొనియున్నాము. ఆయన యొక్క చిత్తానుసారముగా నడువవలెనని మేము కోరుకొనుచున్నాము.

మరియు మీరు సమస్తమును మాలో నుండి తీసివేసి మమ్ములను పరిశుభ్ర పరచి, ప్రభువా, మమ్ములను నూతన సృష్టిగా మార్చి మరి మేము మీకు సేవ చేయుటకు పాత్రులుగా చేయవలయునని మిమ్ములను కోరుచున్నాము, ప్రభువా. ఈ కార్యము మాకు అసాధ్యమైనదని మేము ఎరిగియున్నాము తండ్రీ, మా స్వయముగా మేము చేసిన అది చిరుత పులి తన మచ్చలను శుద్దపరచుకొనవలయునని తన నాలుకతో ఆ మచ్చలను నాకిన యెడల ఆ మచ్చలు మరి ఎక్కువగా ప్రకాశముగా అగుపించులాగుండును. అయితే, "ఇమ్మానుయేలు రక్తనాళముల నుండి తీయబడిన రక్తముతో నింపబడిన ఊట కలదు. అదియే చిరుత పులి యొక్క మచ్చలను శుద్ధపరచగలదు. పరలోకపు తండ్రి, మేమందరమును దానిలో మునిగి మా యొక్క సందేహములను వాటిలో వదిలివేసి దేవుని యొక్క ప్రేమను గురించిన సందేహములను కూడ దానిలో వదిలి మరియు ఈ సమయమునకైన వాగ్దానమును గురించిన సందేహమును కూడ వదిలివేయవలయునని మిమ్మును ప్రార్థించుచున్నాము. దీనిని మేము యేసు నామమున అడుగుచున్నాము. ఆమేన్.

2మనము కూర్చుండుచుండగా దీనిని మనము పాడెదము. "నమ్మిన చాలును," అని పాడుటకు బదులుగా, మనము మన చేతులను వైకెత్తి మరి "ఇప్పుడు నేను నమ్ముచున్నాను" అని పాడెదము. ప్రతి యొక్కరు కూడా ఇప్పుడు.

ఇప్పుడు నేను నమ్ముచున్నాము, ఇప్పుడు నేను నమ్ముచున్నాను,

సమస్త కారములు సాధ్యమగును, ఇప్పుడు నేను నమ్ముచున్నాను;

ఇప్పుడు నేను నమ్ముచున్నాను, ఇప్పుడు నేను నమ్మచున్నాను,

సమస్త కారములు సాధ్యమగును, ఇప్పుడు నేను నమ్ముచున్నాను.

మీరు కూర్చొనుచుండగా, దేవుడు మిమ్ములను ఆశీర్వదించును గాక. ఓ, ఇది చాలా పొందికగా ధ్వనించుచున్నది. దేవునిని అడిగిన పిదప, ఆయనతో చెప్పండి; ఆయనను అడిగిన పిదప, "ఇప్పుడు నేను నమ్ముచున్నాను."

3ఇది నాకు నిజముగానే ఒక కఠినమైన దినముగా నున్నది. నేను చేయవలసిన అనేక కార్యములున్నవి, మరియు డెబ్బది-ఐదు సంభాషణ సమావేశములు కాచుకొనియున్నవి, మరి అంతమందిని కలిసి మాటలాడలేము, అది అంతే. అది పూర్తిగా అసాధ్యమైన కార్యముగా నున్నది. మరియు నేను ఈ పట్టణము నుండి విమానములో ప్రయాణించులాగున నాకు నాలుగు పిలుపులు వచ్చినవి, వాటిలో ఒకటి బ్యూమాంటన్, టెక్సాస్; మరి ఇంకొకటి హోస్టన్; మరియు ఇంకొకటి కేంప్ బెల్స్ విల్, కెంటకీ; మరియు ఇంకొకటి లిటిల్ రాక్, అర్కాన్సాన్, అస్వస్థతగానున్న అత్యవసర పిలుపులు. మరియు బయలుదేరుటకు మునుపు, ఆదివారము ఆరాధన ముగించిన వెంటనే - పశ్చిమ తీరమున ఒక భూ స్థాపన ఆరాధనలో ప్రసంగించుటకు కలుసుకొనుటకు విమానములో రావలయునని ఒక పిలుపు వచ్చెను. మరి అన్నిటిలో కలుసుకొనుటకు వీలుపడదు. మరిక్కడకు వచ్చినప్పుడు వారు తెలుసుకొన గోరుచున్నారు, మరిక్కడకు ఇట్లున్న యెడల; ఇంటి యొద్ద ఎట్లు౦డును, కార్యాలయములో ఎట్లు౦డును, మీరు చూశారా? మరియు వారందరును చాలా మంచివారు. వారిలో అనేకులు క్రైస్తవులు. మరియు వారు… అయితే మనము ఒకే సమయములో అన్నిచోట్లను ఉండుటకు వీలుపడదు, కావున మీరు అక్కడ నుండునప్పుడు మీకు వీలైనది చేయవలయును. అది మిమ్ములను బలహీనులుగా చేయును. అయితే మీకు తెలియునా ఎక్కడికో కొనిపోవుటకు అది కొన్ని సమయులలో బలహీనులను తీసికొనును, మరియు వారు దానిలో బంది౦పబడుదరు.

JOHN 10:20

 

4ప్రేరేపణలోనున్న జనులందరును ఎల్లప్పుడును మతిలేని వారిని నరముల బలహీనతలోనున్న వారుగా ఎంచబడియుండుటను మీరు ఎరిగియున్నారా? అది సరియే. ఏ ఒక్క ప్రవక్త కూడ ఒక పిచ్చివానిగా ఎంచబడకుండా నున్నాడా, చూడుడి. యేసును కూడ, వారు ఆయనను చెప్పిరి, "నీవు పిచ్చివాడవు," అనగా వెర్రివాడని అర్థము, చూశారా. మరియు పౌలు చెప్పెను, "'వెర్రి' యని ఏది పిలువబడునో మరి ఆ వెర్రితనముతోనే నేను దేవునిని ఆరాధించెదను." చూశారా, భిన్నముగా నుండులాగున అగుపడుట, "వెర్రితనము."

ACTS 24:14

 

5మరి మీరు గనుక కవులను గమనించిన యెడల, వారు ప్రేరేపణలో, సాధారణ జనులు చూడలేని ఎత్తైన స్థలములకు వారు పోయెదరు. అమెరికాకు జానపద గేయాలను అందించిన స్టీఫన్ ఫోస్టర్ గురించి నేను తలంచుచున్నాను. ఇప్పుడు అతను వాటిని తన తలంపులలో కలిగియుండెను, అయితే అతని హృదయములో కాదు. మరియు నేను నా యొక్క పాత కెంటకీ గృహమునకు అవతలి ప్రక్కనున్న నది యొద్ద నివసించుచుంటిని. మీకు తెలియునా, అతను ఆ ప్రఖ్యాతి గాంచిన గ్రామీణ పాటలను వ్రాసిన పిదప మరి ఆ ప్రేరణకు అతడు తట్టుకొలేక వెళ్ళి మద్యమును త్రాగెడివాడు. ఒక రోజు అతను తన పని వానిని పిలిచి మరి ఒక కత్తిని తీసికొని మరి దానితో ఆత్మహత్య చేసికొనెను. చూడుడి, మీరు …

మీరు బాగుగా పైన నున్నప్పుడు సమస్తమును చాలా బాగుండును, మరి నీ స్థితి దిగజారిపోయినప్పుడు క్రిందకు ఒరిగిపోయెదవు. అది మీరు అటువంటి అటు ఇటు కాని స్థితిలో నున్నప్పుడు, మీరు దానిలో నుండి పైకి వచ్చినప్పుడు. రాత్రులలో నాతో కూడ నుండు నా మేనేజరును మరి ఇతరులను మీరు అడుగవలయును, ఆ వివేచన వరములు పనిచేయుటను గురించి. ఓ, మై, మీకు తెలియదు, అవన్నియును ఒక దర్శనములా లేక ఏమి జరుగుచున్నదని. చూచారా, మీరు చూచు ప్రతియొక్కటి, అది నిజముగా దర్శనమా లేక అదేమిటో మీకు తెలియదు. మీరు కేవలము… మరి దానిని చేయునది మీరే, చూశారా. ఆ వివేచించుటను బయటకు లాగునది మీరే.

6ఈ రోజు దానిని సంఘ కాపరికి నేను వివరించుచుంటిని. అదెట్లు౦డుననగా ఒక చిన్న బాలుడు ఒక గోడలోని రంధ్రము ద్వారా ఒక సర్కస్ చూచులాగుండును. అతను తన చేతులు ద్వారా ఆ రంధ్రమును పట్టుకొని మరి దాని ద్వారా చూచి మరి జిరాఫి లా౦టి లేక ఒక ఒంటె వలె వాటిని చూచి మరి తిరిగి పడిపోవును. మరియు "నీవు ఏమి చూచావు?" అని అడుగగా? మంచిది, అతడు చూచుటకు మరలా పైకి వెళ్ళుట, దాదాపు అతడి ప్రాణము పోవునంతగా అవును. అయితే కొద్దిసేపైన పిదప ఎవరైనను వచ్చి మరతని లేపి వైకెత్తి మరి "ఇక్కడ ఈ విధముగా పోవుచున్నవి, ఇక్కడ దండలు మొదలిడుచున్నవి, మరియు గొప్పగా నున్న కార్యములు ఇటు పోవుచున్నవి, మరది ఇటు పోవుచున్నవని" అని చెప్పి, అతనిని వైకెత్తి కూర్చొని పెట్టుకొనుడి. ఎందుకు, అది అతనిని ఇబ్బందిపరచదు.

MATT 9:20•

MARK 5:25-27,30•

LUKE 8:43-45

 

7మరి ఆ విధముగానే దేవుడు క్రీస్తులో నున్నాడు. రక్త స్రావము వ్యాధిగల స్త్రీ, ఆమె బహిష్ట సమయములోనున్నప్పుడు ఆయన యొక్క వస్త్రమును ఆమె తాకెను. మరి వైద్యులు ఆమెకు ఆ జబ్బును బాగుచేయలేకపోయిరి. రక్త స్రావమును నిలుపలేక పోయిరి. మరి ఆమె, ఆయన యొక్క వస్త్రమును తాకెను. మరి ఆయన తిరిగి మరి చెప్పెను, "నన్ను ముట్టినది ఎవరు? ప్రభావము నాలో నుండి వెడలి పోయెను." చూడుడి, దేవుని యొక్క వరమును ఆ స్త్రీ ఉపయోగించుకొనుచున్నది. ఆయనలో నుండి ఆమె దేవునిని బయటకు లాగెను. స్త్రీ ఆ కార్యమును చేసెను. దేవుని యొక్క వరమును ఉపయోగించు ఆధిక్యమును ఆమె పొందెను.

JOHN 5:19•

JOHN 11:11,12,15,41,42

 

8అయితే లాజరు చనిపోయినప్పుడు, ఆయన చెప్పెను, తండ్రి అతనికి చూపించు వరకు ఆయన ఏ కార్యమును చేయలేదు. మరియు ఆయన దూరముగా పోయినప్పుడు లాజరు కొరకు ఆయన వచ్చి ప్రార్థించులాగున వారు ఆయనకు వార్తను పంపిరి. ఆయన వెళ్ళలేదు; ఆయన ఇంకొక స్థలమునకు వెళ్ళెను. మరల ఆయనను రమ్మని వారు వార్తను పంపిరి. మరియు ఆయన వెళ్లలేదు; ఆయన అక్కడికి వెళ్ళక, ఇంకొక చోటికి వెళ్ళెను. మరి చివరకు ఆయన తన శిష్యులతో చెప్పెను, "లాజరు నిద్రించుచున్నాడు."

సరి, వారు చెప్పుకొనిరి, "అతను బాగున్నాడని."

పిదప ఆయన వారి స్వయ భాషలో వారితో మాటలాడెను, "అతను చనిపోయున్నాడు. మీ నిమిత్తము నేను అక్కడ లేనందులకు నేను సంతోషించుచున్నాను." చూశారా, ఆ కార్యము ఎప్పుడు సంభవించునని తండ్రి ఆయనతో చెప్పియుండెను, ఏలయనగా తండ్రి అతనికి చూపించితేనేగాని ఆయన తన స్వయముగా ఏమియును చేయడు; మరియు అది ఎంత కాలమునకు సంభవించును, మరియు ఏమి సంభవించును, మరియు ఆయన ఎప్పుడు పోవలయును. వినుడి. "అయితే నేను వెళ్ళి అతనిని లేపెదను," చూశారా.

మరియు ఆయన లాజరు యొక్క సమాధియొద్దకు వెళ్ళినప్పుడు, ఆయన ప్రార్థించెను. ఆయన చెప్పెను, "తండ్రి, మీరు ఇది వరకే వినియున్నందులకు మీకు స్తోత్రములు; అయితే ఇక్కడ నిలబడియున్న వారి కొరకై నేను దీనిని చెప్పుచున్నాను." ఆయనకు తెలియును ఏమి చేయవలయునని, మరియు ఆయన లాజరును సమాధి నుండి లేవమని పిలిచెను. అక్కడ ఆయన నుండి ప్రభావము వెడలి పోయెనని చెప్పబడియుండలేదు. అది దేవుడు ఆయన యొక్క వరమును ఉపయోగించుచున్నాడు, మరియు ఇంకొక కార్యము, స్త్రీ దేవుని యొక్క వరమును ఉపయోగించుచున్నది.

9ఇప్పుడు, మీరు ఒక దర్శనమును ఉత్పత్తి చేయలేరు. అది దేవుని యొద్ద నుండి రావలసినదిగా యున్నది.

కావున దానిని చేయునది విశ్వాసము మాత్రమే. దేవుడు గుర్తించు ఒకే కార్యము విశ్వాసము, జీవించు మనలో విశ్వాసమనునది ఆయన యొక్క వాగ్దానము చేయబడిన వాక్యము, మరి మీయ౦తట మీరు దానిని చేయగలరు. దానిని చేయునది మీ విశ్వాసమే. అయితే ఒక దర్శనము వచ్చినప్పుడు కొన్ని సమయములలో, దేవుడు ఎచ్చటికో పోవలయునని చెప్పినప్పుడు, ఏల అది కొన్ని గంటలు నిలిచియుండును, మరి అది నన్ను ఇబ్బందిపరచదు. అయితే, ఈ విధమైనవి వచ్చినప్పుడు అది భాధించును, అప్పుడు మీరు వెనుకకు వచ్చి మరి మీరు ఎక్కడ నున్నారని ఆశ్చర్యపడెదరు.

10నేను విలియమ్ కౌపర్ ను గురించి ఆలోచించితిని. "రక్తములో నిండియున్న ఊట కలదని" వ్రాసినది అది అతని పేరని నేను నమ్ముచున్నాను. లండను నగరములో అతని సమాధి యొద్ద నేను ఈ మధ్యనే నిలుచుకొని యుంటిని. నేను కొద్దిగా విలాపించితిని, ఏలయనగా అతని కొరకు నేను పరితపించితిని. అతను ఒక కవి. మరియు అతను ప్రేరేపింపబడియుండగా మరి అతను పాటలు వ్రాసెను… సరి, అతను దానినుండి బయటికి వచ్చినప్పుడు… అతను ఒక డ్రైవరును తీసికొని ఆత్మహత్య చేసికొనుటకు ఒక నదిని వెదకుటకు ప్రయత్నించెను, మరి మంచు పొగవలెనుండుట వలన వారు నదిని కనుగొనలేక పోయిరి. చూడుడి, అతను తప్పిపోయెను, ప్రేరేపణ నుండి అతను బయటికి వచ్చెను, మరల భూమికి వచ్చెను.

వీటన్నిటి యొక్క అర్థము ఏమిటి స్నేహితుడా? నిజముగా నదికి ఆవలి ప్రక్క ఒక దేశము కలదు, దానిని పైకెక్కి చూడవలయును. కావున మనము ఎరిగియున్నాము, ఒకానొక రోజు మనము ఆ యొక్క దేశమునకు పోబోవుచున్నాము. అదియే మన యొక్క గొప్ప నిరీక్షణ.

11ఇప్పుడు ఈ రాత్రి, నా కుమారునితో ప్రార్థనా అట్టలను ఇయ్యవలదని చెప్పియున్నాను. అయితే ప్రతి రాత్రియను విశ్వాసము గల వారిని శ్రోతలలో నుండి పిలిచి మరి స్వస్థతను అనుగ్రహించుచున్నాడు. ఇప్పుడు ఆయన మాటలాడునప్పుడు, ఆయన ఏమి చెప్పుచున్నాడో చాలా జాగ్రత్తగా వినుడి.

అయితే రేపు రాత్రి మనము కూటముల యొక్క క్రమమును మార్చెదము. మరియు వ్యాధిగ్రస్తులైన వారు ఎందరు ప్రార్ధింపబడవలయునని కోరుచున్నారు? సరి, నేను బిల్లీని కొద్దిగా ముందుగానే పంపించెదను, మీకు సరైన యెడల మన ప్రియమైన కాపరితో పంపించెదను, మరి మేము ప్రార్థనా అట్టను కోరువారందరికి ఇచ్చెదము, మరి అటు పిదప జనులను పైకి పిలిచెదము మరియు వారి కొరకు ప్రార్థించెదము.

నేను అందరిని ఆ యొక్క వివేచన క్రమములో ఉంచలేను. నేను… వారు నన్ను బయటికి తీసికొని వచ్చెదరు, మరియు మీరు నా కొరకు ప్రార్థంచుచుండెదరు. మరి ఆలోచించుడి, ఒక స్త్రీ ఆయన వస్త్రమును ముట్టిన యెడల…

12మరియు ఆయన దైవీక దేవుని కుమారుడు మరియు ఒక స్త్రీ ఆయన వస్త్రమును ముట్టి మరి అది ఆయనను బలహీనునిగా చేసిన యెడల, ఆయన కృప ద్వారా రక్షింపబడిన పాపియైన నాకు అది ఏమి చేయును? ఆయన గనుక ఈ విధముగా చెప్పకుండిన యెడల మీకు ఆ విధముగా జరుగక యుండదు, "నేను చేయు క్రియలు నా యందు విశ్వాసముంచు వాడును చేయును; వాటి కంటె మరి గొప్పవియు మీరు చేయుదురు." ఏలయనగా, చూడుడి, ఆయన చెప్పియున్నాడు, కింగ్ జేమ్స్ బైబిల్ లో అవి "గొప్పవి," అని వ్రాయబడియున్నది, అయితే సరైన పదము "అధికమైన" మీరు గనుక దానిని చూచిన యెడల "అధికమైన" ఏలయనగా దాని కంటెను గొప్ప కార్యములు ఎవరును చేయలేరు; ఆయన చనిపోయిన వారిని లేపెను, మరియు సృష్టిని నిలిపెను. ఆయన సమస్తమును చేసెను. కావున ఒకే కార్యము, సంఘము… దేవునిలో నున్న సమస్తమును అక్కడ ఒక మనుష్యునిలో నుండెను, అయితే ఇశ్రాయేలును నడిపించిన ఆ పెద్ద అగ్ని స్తంభము శరీరధారియై మనమధ్య నివసించెను.

JOHN 14:12

 

13ఆయన సిలువ వేయబడినప్పుడు, మరల లేచి మరి దేవుని యొద్దకు ఆరోహణుడాయెను; పెంతెకోస్తు దినమున ఈ యొక్క అగ్నిస్తంభము రూపములో ఆయన తిరిగి వచ్చి, మరియు ఆయన తనకు తానే వేరుపరచుకొని, అగ్ని నాలుకలు వారిలో ప్రతియొక్కక్కరి పైనను వ్రాలెను. దేవుడు ఆయన యొక్క సంఘములో విభజింపబడెను, ఏలయనగా అది ఆయన భార్యగా నున్నది. మరియు ఒక భర్తయును మరియు భార్యయు ఒక్కటిగా నున్నారు. మరియు దేవుడు మరియు సంఘమును ఒక్కరే, ఒక్కటిగా నున్నారు. దేవుడు మీలో నున్నాడు! మునుపు దేవుడు మనకు పైగా నుండెను, దేవుడు మనతో కూడా నుండెను, ఇప్పుడు దేవుడు మనలోపల నున్నాడు, అన్నివేళలను అదే దేవుడు; మూడు ప్రత్యక్ష్యతలు, మూడు స్వభావములు, లేక కార్యాలయములు, లేక మీరు దానిని ఎట్లు పిలిచెదరో. తండ్రి, కుమారుడు మరియు పరిశుద్దాత్మ ఎల్లవేళలను అదే దేవుడు, చూశారా.

EXOD 19:12,13•

JOHN 14:20•

ACTS 2:3•

1TIM 3:16•

HEB 12:20•

1JN 1:1

 

14మరియు దేవుడు మనపైన నుండెను, తాకను వీలుకాదు. ఆయన దిగిన కొండను తాకుటకు కూడ వారు పరిశుభ్రముగా నుండవలయును, ఏలయనగా పాపమునకు పరిహారము అప్పటికి చెల్లింపబడి యుండలేదు.

అయితే దేవుడు వచ్చి మనమధ్య శరీరధారియాయెను. "మన చేతులతో మనము ఆయనను తాకియున్నాము," అతను చెప్పెను, "దేవుడు!" I తిమోతి 3:16, "నిరాక్షేపముగా దైవభక్తిని గూర్చిన మర్మము గొప్పదైయున్నది, ఆయన శరీరుడుగా ప్రత్యక్షుడయ్యెను. ఆత్మ విషయమున నీతిపరుడని తీర్పునొందెను, దేవ దూతలకు కనబడెను, రక్షకుడని జనములలో ప్రకటింపబడెను, లోకమందు నమ్మబడెను, ఆరోహణుడై తేజోమయుడయ్యెను," చూశారా. చూడుడి, దేవుడు మనతో కూడా నుండెను.

దేవుడు మనకు పైగా నుండెను, దేవుడు మనతో కూడ నుండెను, ఇప్పుడు దేవుడు మనలో నున్నాడు. దేవునిలోనున్న సమస్తమును ఆయన క్రీస్తులో క్రుమ్మరించెను; క్రీస్తులోనున్న సమస్తమును ఆయన సంఘములో క్రుమ్మరించెను. "ఆ దినమున నేను నా తండ్రిలో, తండ్రి నాలో; నేను మీలో, మరి మీరు నాలో ఉన్నామని మీరు తెలిసికొనెదరు." కావున సమస్త సమయములందు అది దేవుడైయున్నాడు, మీరు చూశారా, అదే క్రియలను ఆయన చేయుచున్నాడు. సంఘము అదే ఆత్మతో ఆయన యొక్క క్రియలను కొనసాగింపవలయునని నిర్ణయింపబడి యున్నది. అదే ఆత్మ లేకుండా మీరు అదే కార్యమును కొనసాగింపలేరు. అదే ఆత్మ కార్యమును కొనసాగించును.

15కావున ఇప్పుడు, నేను మీతో మాటలాడుటకు మీరు చాలా మంచి వారు, నాకు అధిక సమయమున్నది, ప్రతి రాత్రియును. మరియు నేను దానిని చేయుటకు ఇష్టపడుట లేదు.

అయితే నా యొక్క పూర్ణహృదయముతో మనము చివరి కాలములోనున్నాము అని నేను అనుకోనుచున్నాను. నేను దానిని ఊరక చెప్పుట లేదు, ఏలయనగా అది జనులలో వాడుకగా చెప్పు ఒక కార్యమైపోయినది. యధార్థమైన నా హృదయముతో మరియు నా హృదయపూర్వకముగా దానిని నేను నమ్ముచున్నాను. ఆ కారణము వలననే నేను పెద్ద కార్యములను కట్టుటకు ప్రయత్నించుట లేదు, పెద్ద కార్యములను చేయుటకు ప్రయత్నించుట లేదు, మరియు పెద్ద గోపురములను కట్టుటకు ప్రయత్నించుట లేదు. మరియు క్రీస్తు వచ్చుచున్నాడని నేను నమ్ముచున్నాను. సమస్తమును, ఇప్పుడే మనము దానిని చేసెదము, ఏలయనగా రేపు అను ఒక దినము మనకుండదు, చూడుడి. మనకు వీలైనయెడల, చేయగలిగిన సమస్తమును ఈ దినముననే చేసెదము.

16అందువలననే నేను అనుమతింపలేదు, లేక పెద్ద, గొప్ప కార్యములను నేను చేయుటకు పరిశుద్దాత్మ నన్ను కోరుచున్నదని నేను తలంచుట లేదు… ఇప్పుడు, ఆ విధమైన గొప్ప కార్యములు చేయు వారికి అది సరియే. వారిని నేను ఖండించుట లేదు. అది బాగున్నది. అయితే దేశమంతటను చూచునట్టుగా టెలివిజనులలో ప్రసారము చేయుటయు, ఆ విధముగా ప్రసారము చేయవలనిన అందుకొరకు వారు పైకమును చెల్లించవలెను. ఆ డబ్బు కోసము వారు ప్రజలను భిక్షమడుగుచున్నారు. ఆ విధముగానే దానిని వారు చేయుచున్నారు. రేడియో ప్రసారములు ఆ విధముగానే చేయుచున్నారు, అవన్నియు మంచిదే, అని చక్కగానే వున్నవి, అయితే అని నాకు కావు. నేను కేవలము… ఆ విధముగా చేయుచుండిన యెడల చనిపోవు వరకు వాటిని గురించి చింతించుచుండవలయును. మరి నేను ఆ విధముగా దానిని చేయలేను. నేను చేయలేను.

17నేను ఒకప్పుడు నా జీవితములో ఒకసారి కానుకలు తీసాను. దానిని గురించి మీరు వినియందురని అనుకొనుచున్నాను. నేను కానుకలు తీయుటకు ఆరంభించితిని. మేము అది చేయ వచ్చునా సరియా కాదాయని సందేహములో నుంటిమి, ఆ విధముగా తీయవలసిన పరిస్థితిలో నుంటిమి. నేను పనిచేయుచుండగా, నాకు కొన్ని అప్పులు ఉండెను. నేను నా సంపాదనంతటిని అప్పులు తీర్చుటకు గాను, వేసినను అప్పులు తీర్చలేక పోయాను. నేను ఆలయములో ఎన్నడును కానుకలను తీయలేదు. నేను ఒక పైసా కూడ కానుకలు తీయకుండా, పదునేడు సంవత్సరములు సంఘ కాపరిగా యుంటిని, మరియు నేను నా భార్యతో చెప్పియుంటిని, "మనము ఎట్లైనను అప్పులు తీర్చవలయును. నేను వెళ్ళి మరియు కానుకలు తీయదలచియున్నాను" అని నేను చెప్పితిని.

ఆమె చెప్పెను, "నేను నిన్ను గమనింపబోవుచున్నాను." ఆమె పోయి నెమ్మదిగా కూర్చుండెను.

మరియు ఆ రాత్రి, తర్వాత… వారు ప్రియమైన జనులు. వారి హృదయములను ఆశీర్వదించును. నేను చెప్పాను, "నేను దీనిని చెప్పుటకు అసహ్యసించుకొనుచున్నాను." నేను చెప్పాను, "సంఘముతో, నేను చాలా కాలముగా మీతో కూడ నున్నాను. నేను దేనికొరకు కూడ మిమ్ములను ఏమియు అడుగలేదు," నేను చెప్పాను, "అయితే నాకు చెల్లించవలసిన అప్పులు ఉన్నవి. నాకు సుమారుగా ఆరు డాలర్లు కావలయును." మరియు నేను చెప్పాను, "నా యొద్ద ఆ పైకము లేదు. ఇప్పుడు నా యొద్ద ఆ పైకము లేదు మరియు కాని, నేను వాటిని చెల్లించి తీరవలయును," మరియు నేను చెప్పాను, "శనివారము. మరియు నా యొద్ద చెల్లించుటకు పైకము లేదు." మరియు నేను చెప్పాను, "మీరందరు, మీలో ఎవరైనను మీ యొద్ద డబ్బున్న యెడల, మీరు గనుక నాకు సహాయపడిన యెడల నేను దానిని అభినందించెదను." మరియు ప్రతి యొక్కరును విలపించసాగిరి. అక్కడ ఒక వృద్దురాలు కూర్చొని యుండెను… మరియు సంఘపు సంఘపెద్దలలో ఒకరు లేచి మరి మనయొద్ద కానుకలను సేకరించుటకు ఒక పళ్ళెము కూడా లేదని చెప్పెను, మరియు నేను చెప్పాను, "నీవు నా యొక్క టోపీని తీసికొనుము." మరతను వెళ్ళి నా యొక్క టోపీని తీసికొనెను.

మరి నేను అక్కడ క్రింద చూశాను. మరియు ఒక చిన్న సహోదరి నా కొరకు ఎల్లప్పుడును ప్రార్థించుచుండెను. ఆమె పాతకాలపు దక్షిణ ప్రాంతపు తల్లి, ఆమెయొద్ద ఒక చిన్న… చిన్న పాకెట్ పుస్తకము యుండెను. దానిని తెరచి ఆమె మరియు ఓ, మై! దానిని నేను చూశాను. దేనికొరకు వాటిని నేను వినియోగించలేను. నేను చెప్పాను, "నేను ఊరికే తమాషాకు అడుగుచున్నాను. మీరేమి చెప్చెదరో అని చూద్దామని నేను అలా అడిగితిని. నిజము అడిగి తీసుకోవలెననే భావముతో నేను దానిని అడుగలేదు." దానిని నేను చేయలేను. నేను ఎప్పుడైనా కానుకలు తీయుటకు సమీపముగా వచ్చినది కేవలము అదే సమయము.

18నా ఇంటికి ఒక వృద్దుడు వచ్చుచుండెడివాడు. అతను, దావీదు గృహమునకు లేక దేనికో చెందినవాడు అని నేను అనుకొనుచున్నాను. అతనికి పొడుగాటి గడ్డమును మరియు వెంట్రుకలు ఉండెను. అతను ఒక పాత సైకిలును, బాగా పాడైపోయిన ఒక సైకిలును నాకు ఇచ్చెను. అయితే అది పాతదయి పోయెను. అది బహుశా దాని పనిని అది బాగుగానే చేసెను, కాని అది… కావున నేను పది-సెంటు అను కొట్టుకి వెళ్ళి మరియు రెండు డబ్బాల పెయింటును ఇరువది సెంటుకు కొని ఆ సైకిలుకు పెయింటు చేసి మరి దానిని ఆరు డాలర్లకు అమ్మివేసితిని. కావున నేను కానుకలు తీయనక్కర లేకుండెను, చూశారా. కావున అదియే నేను కానుకలు తీయవలయునని ఏర్పడిన సమీప పరిస్థితి.

మరి నాకు ఆ అప్పు తీర్చవలసిన బాధ్యత ఉండగా, మరియు దానిని తీర్చుటకు నాకు నా యొద్ద వందల కొలది డాలర్లు నేను కలిగి యుండవలసినదిగా యున్న యెడల, మరి పరిశుద్దాత్మ నన్ను ఎక్కడయో ఒక చిన్న సంఘమునకు పిలిచిన ఎట్లు౦డును? వారు దానిని నాకు ఇవ్వలేరు. అయితే మీరు చూడుడి, నాకు దేవుడు తప్పనిచ్చి మరేదియు అక్కర లేదు, చూశారా. నాకు అవసరము లేదు. కావున నన్ను ఆయన పిలిచిన యెడల ఎక్కడికైనను ఫరవాలేదు, అదెక్కడైనను ఫరవాలేదు, ఒక వేళ పదిమంది యున్నను లేక… మరియు నేను ఒకేసారి ఐదు లక్షల మందికి ఒకేసారి ప్రసంగించియున్నాను. కావున, మరి అటు వంటి క్లిష్ట పరిస్థితి వచ్చినప్పుడు ఎవరైనను… దేవుడు వారి హృదయములలో పెట్టును, మరియు వారు అప్పుడు వచ్చి మరి చెప్పుదరు, "మీకు తెలియునా, ప్రభువు మీరు ఎక్కడికో వెళ్లబోవుచున్నారని చెప్పెను, మరి దానికొరకైన ఖర్చులకు చెక్కు ఇదిగో." అదియే విశ్వాసము వలన వచ్చు కార్యము, మీరు చూశారా, మనకేమి కావలయునో ఆయన ఎరిగియున్నాడు, చూశారా. కావున మరి నేను ఆ విధముగా విశ్వాసముపై ఆధారపడి జీవింపవలయునని ఇష్టపడుచున్నాను.

MATT 8:20•

LUKE 9:58

 

19మరియు మీకు ఇంకొక కార్యము తెలియునా, మేము అనేక స్థలములకు వెళ్ళచుండెదము. మరియు నా కూటములకు వచ్చు జనులు నాలాగానే వారు కూడా చాలా పేదవారు, మరియు నేను - వారు ఏ విధముగా నుండెదరో ఆ విధముగా నుండవలయునని కోరుచున్నాను. ఒక వాక్య పరిచారకుడు అచ్చటికి, ఇచ్చటికి వెళ్ళుటకు మరియు ఏదో గొప్ప కార్యములను చేయుటయు, ఆ వాక్య పరిచారకునికి పెద్ద పెద్ద కార్యములు చేయుటయు వాటికై వేల కొలది డాలర్లు వెచ్చించుటయు మరి ఆ విధముగా ఖర్చు చేయుట సరిగా నున్నదా; మరి ఒక పేదరాలు సాధారణ వస్త్రములు ధరించుకొని మరి ఒక రోజుకు మూడు డాలర్లు పత్తి ఏరుట ద్వారా సంపాదించుచు, మరియు ధాన్యపు రొట్టెను, పంది మాంసమును తినుచు, వారి జీవితములను గడుపుచున్నారు. ఉ-ఊ, నేనది చూడలేను, మీరు చూచారా. క్రీస్తు భూమినంతటిని సొంతముగా కలిగియున్నప్పటికిని, ఆయన తల వాల్చుటకు ఒక స్థలమైనను లేకుండెను; "నక్కలకు బోరియలు౦డెను." మరియు ఆయన మనకు ఉదాహరణముగా నున్నాడు. ఆయన ఎట్లు౦డవలయునో, ఆయన ఆ విధముగా ను౦డేను.

ఇప్పుడు, దానిని నేను ఖండించుటకు ప్రయత్నించుట లేదు. నన్ను గురించి నేను చెప్పుటకు ప్రయత్నించుచున్నాను. కావున నేను ధనముతో పెద్ద కార్యములను ప్రారంభింప లేదు, మీకు తెలియును. ఎలాగైనను మరియు మీరు ఏ గొప్ప కార్యమును ప్రారంభింపలేరు. మరి గొప్ప కార్యమేదనగా, మరి దానిని మనము చూడబోవుచున్నాము, అది దేవుడైయున్నాడు. మరియు మన మందరము ఒకే పరిమితిలోనున్నామని నేను అనుకొనుచున్నాను, మరియు మనము ఆ విధముగానే నుండెదము. మనము దేవుని బిడ్డలము.

20ఇప్పుడు, నేను ఈ యొక్క పరిశుద్ద గ్రంథమును చదువుటకు ఇష్టపడుచున్నాను. మరియు నేను దానిని సరిగా చదువలేను మరియు కొన్ని సమయములలో పదములను నేను తప్పుగా ఉచ్చరించుచున్నాను, అయితే మీరు దానిని సహించుకొనుచున్నారు. నేను…

ఒకప్పుడు ఫోర్ట్ వేన్ అని అనుకొనుచున్నాను, నేను అక్కడ ప్రసంగించుచుంటిని. మరియు అక్కడ దేవుని యొక్క కూడికలు అను సంఘపువారు ఈ యొక్క వ్యాసమును వ్రాసిరి మరియు అప్పుడు "ఎవరికి ఎవరు?" (who's who) అను పత్రిక దానిని ప్రచురించెను; ఒక చిన్న బాలికకు జరిగిన సంభవమును అందులో ప్రచురించిరి. పది సంవత్సరములకు మునుపు మీరు దీనిని గురించి వినియుందురు. ఆ బాలిక యొక్క కండ్లకు వారు శస్త్రచికిత్స చేసిరి, మరప్పుడు ఆమెకు చూపు పోయెను. మరియు ఆమె నా యొద్దకు తీసికొనిరాబడెను, అప్పుడు పరిశుద్దాత్మ ఆమెను గురించి సమస్తమును నాకు చెప్పెను, మరక్కడే ఆమె స్వస్థత నొందెను; ఆమె పరిశుద్ద గ్రంథమును లేక దేనినైనను చదువగలదు. మరియు "ఎవరికి ఎవరు" అనే పత్రిక దానిని ప్రచురించెను. ఆ యొక్క పత్రిక "ఎవరికి ఎవరు" విజ్ఞాన శాస్త్రములో విశేషాలను ప్రచురించే పత్రిక మరియు ఇతర కార్యములను గురించి వ్రాయును. (ఆమెకు చూపు వచ్చిన కార్యమును అందులో ప్రచురించెను.)

21మరియు నాకు గుర్తున్నది, దానికి పిదప రెండు రాత్రులకు తరువాత పౌలు రాడర్ వ్రాసిన ఆ పాటను గమనించితిని. "నమ్మిన చాలును," మరియు నేను అతను వ్రాసిన పాటను గమనించుచుంటిని. అక్కడ ఒక చదువుకొన్న వ్యక్తి నా యొద్దకు వచ్చి మరి అడిగెను, "బ్రెన్హాం గారు, నేను మీతో మాటలాడవచ్చునా?"

నేను చెప్పాను, "సరి అయ్యా, మాటలాడవచ్చును."

మరియు అతను తన్ను తాను పరిచయము చేసికొని మరి అతను చెప్పెను, "నేను కొన్ని కార్యములలో మిమ్ములను సరిదిద్దవలయునని కోరుచున్నాను".

"మంచిది, అయ్యా" అని చెప్పాను.

"మీ యొక్క వ్యాకరణము" అని అతడు చెప్పెను.

నేను చెప్పాను, "అవునయ్యా, అది నాకు తెలియును." నేను చెప్పాను, "నేను ఏడవ తరగతి చదువు మాత్రమే కలిగియున్నాను." నేను చెప్పాను, "మేము పదిమంది బిడ్డలము. నా యొక్క తండ్రి వ్యాధిగ్రస్తుడు మరియు నేను పనిచేయవలసి యుండెను. నేను చిన్న బాలునిగా ఉన్నప్పుడే నేను పాఠశాలను వదలివేయవలసి యు౦డేను."

అతను చెప్పెను, "ఇప్పుడు ఏ విధమైన కారణములన్నియును చెప్పకూడదు."

మరియు నేను చెప్పాను, "అది, సరియే." నేను చెప్పాను, "అది కాదని నేను తలంచుచున్నాను. నేను ఎప్పుడైతే ప్రభువును సేవింపవలసి యున్నందున, దానిని గురించి నాకు సమయము లేదు."

అతను చెప్పెను, "సరి, మీ…" చెప్పెను, "అక్కడున్న జనులు!" "నీవు గత రాత్రి చెప్పిన దానిని నేను గమనించియున్నాను, నీవు చెప్పియున్నావు, "ఈ యొక్క పుల్పిట్ (ప్రసంగ వేదిక) పైకి వచ్చిన వారు క్రిందికి పొమ్మని చెప్పియున్నావు…"

మరి నేను చెప్పాను, "సరి, ఏమిటి? నాకు దాని వ్యాత్యాసము తెలియదు." నేను అడిగాను, "దానిలో ఏమి తప్పు ఉన్నది?"

చెప్పెను, "నీవు పుల్పిట్ ఉచ్చరించుటలో తప్పు చేసియున్నావు" అని అతను చెప్పెను.

"మీ సంఘము నీవు గనుక పుల్పిట్ ను సరిగా ఉచ్చరించియుండిన, వారు నిన్ను మెచ్చుకొని యుండెడి వారు."

సరి, అతను తప్పుగా అర్థము చేసికొనియున్నాడని నేను తలంచితిని. నేను చెప్పాను, "సహోదరుడా, నేను నీతో తర్కించుటను కోరుట లేదు. అయితే నేను దేవుని యొక్క వాక్యమును ప్రసంగించుచు మరి దానిలో జీవించుచుండగా ప్రజలు నేను పుల్పిట్ ఏ విధముగా ఉచ్చరించినను దానిని గురించి లెక్క చేయరు, వారు వాక్యమును గ్రహించెదరు." అదియే ముఖ్యమైన విషయము. ఆమేన్.

ఆ చిన్న వ్యక్తి చెప్పెను, "అయితే నీకు నీ బైబిలును గురించి తెలియదు."

నేను చెప్పాను, "అయితే నేను ఆ బైబిలు గ్రంథకర్తను బాగుగా ఎరిగి యున్నాను, మరి ఆయన నన్ను ఆశీర్వదించును." మరియు నేను తెలిసికొనగోరుచున్నాను, "ఆయనను ఎరుగుటయే జీవము," చూశారా.

22ఇప్పుడు, రేపు రాత్రి త్వరగా రండి. ఏలయనగా కొద్ది క్షణముల క్రితము నేను కారులో నుండి దిగుచున్నప్పుడు అనేక జనులు అసంతృప్తి నొందినవారై, కొందరు ఏడ్చుచుండిరి, ప్రార్థనా అట్టలను పొందలేక ఆ స్థలమును వదిలి పోయిరి. కావున మీరు మీ ప్రార్థనా అట్టలను పొందుటకుగాను, ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా రండి.

ఇప్పుడు మనము వాక్యమును చూచుటకు మునుపు గ్రంధకర్తతో ఒక నిమిషము మాట్లాడేదము.

NUM 19:3-5,9•

ISA 55:11•

EPH 5:26

 

23పరలోకపు తండ్రి, ఇది మీ యొక్క వాక్యమైయున్నది. "వాక్యమును నీటితో మేము శుద్ధి చేయబడియున్నామని," పరిశుద్ద గ్రంథమందు మేము చదివితిమి, వారు ఏ విధముగా పెయ్యను తీసుకొని, ఎర్రని వెయ్యను చంపి, సంఘమంతయు కలిసి పెయ్యను కాల్చెడివారు. మరటు పిమ్మట దాని బూడిద ప్రాకారములకు వెలుపట నుంచబడును, వేరుపరచు నీరుగా నుండునట్లు అచ్చట పెట్టబడును, ఆ కార్యమును చేయు చేతులు పరిశుభ్రముగా నుండవలయుననే దానిని మేము పాత నిబంధనలో మేమెరిగియున్నాము. మరియు దేవా, మమ్ములను మరణము నుండి మరియు జీవమునకును వేరుపరచు నీళ్ళను ఈ వాక్యము, మా యొక్క తలంపులను, మా హృదయములను పరిశుభ్రపరచమని, ప్రభువా, నేను మిమ్ములను ప్రార్థించి అడుగుచున్నాను. మరియు సరిగా లేని ఏ కార్యములైనను మీరు మాలో కనుగొనినయెడల, ప్రభువా ఈ రాత్రి ఈ యొక్క వేరుపరచు నీటితో దానిని కడిగి శుభ్రపరచుము, తండ్రి. మా పాపములను దూరముగా తీసివేయుము. మా స్వబుద్దినందు మేము చనిపోయి, క్రీస్తులో మేము జీవించులాగున, ప్రతీదినము మేము మీ ముందు నిలువ వలయునని కోరుచున్నాము. వాక్యమును చదువుచుండగా, దానిని మీరు ఆశీర్వదించుము. మరియు ఆ వాక్యము ఎందుకొరకు పంపబడియున్నదో, ఆ కార్యమును చేయకుండా అది నిష్పలముగా తిరిగి రాదని మీరు వాగ్ధానము చేసియున్నారు. మరియు దీనిని మీరు అనుగ్రహింపవలయునని యేసు నామమున అడుగుచున్నాము. ఆమేన్.

REV 6:12-17

 

24యేసుక్రీస్తు యొక్క ప్రకటన గ్రంథములో ఆరవ ముద్రలో కొంత భాగమును నేను చదువబోవుచున్నాను. ప్రకటన గ్రంథము 6వ అధ్యాయము 12వ వచనము నుండి చదివెదము. మరియు పిదప నేను హెబ్రియులు 12:25, కూడ చదువవలయునని యున్నాను, ఏలయనగా నేను కొన్ని లేఖనములు వ్రాసియుంచుకొని యున్నాను. మరియు కొన్ని కార్యములను ప్రభువు చిత్తమైతే, మాటలాడవలయునని నేను కోరుచున్నాను. మరిప్పుడు ప్రకటన 6:12.

ఆయన ఆరవ ముద్రను విప్పినప్పుడు, నేను చూడగా పెద్ద భూకంపము కలిగెను. సూర్యుడు కంబళివలె నలుపాయెను, చంద్ర బింబమంతయు రక్త వర్ణమాయెను.

వెద్ద గాలి చేత ఊగులాడు అంజూరపు చెట్టు నుండి అకాలపు కాయలు రాలినట్టు ఆకాశ నక్షత్రములు భూమిమీద రాలెను.

మరియు ఆకాశమండలము చుట్టబడిన గ్రంథమువలెనై తొలగిపోయెను. ప్రతి కొండయు ప్రతి ద్వీపమును వాటి వాటి స్థానములు తప్పెను.

భూరాజులును, ఘనులును, సహస్రాధిపతులును, ధనికులును, బలిష్టులును ప్రతి దాసుడును, ప్రతి స్వతంత్రుడును కొంత గుహలలోను బండల సందులలోను దాగుకొని -

సింహాసనాసీనుడైయున్న వాని యొక్కయు గొర్రెపిల్లయొక్కయు ఉగ్రత మహాదినము వచ్చెను; దానికి తాళజాలినవాడెవడు?

మీరు మా మీదపడి ఆయన సన్నిధికిని గొర్రెపిల్ల ఉగ్రతకును మమ్మును మరుగుచేయుడి అని పర్వతములతోను బండలతోను చెప్పుచున్నారు.

HEB 12:25-29

 

25ఇప్పుడు హెబ్రియులకు వ్రాసిన పత్రిక 12వ అధ్యాయము, 25వ వచనము మొదలుకొని.

మీకు బుద్ధి చెప్పుచున్న వానిని నిరాకరింపకుండునట్లు చూచుకొనుడి.

వారు భూమి మీదనుండి బుద్ధి చెప్పిన వానిని నిరాకరించినప్పుడు తప్పించుకొనక పోయినయెడల, పరలోకమునుండి బుద్ధి చెప్పుచున్న వానిని విసర్జించు మనము తప్పించుకొనక పోవుట మరి నిశ్చయముగదా.

అప్పుడాయన శబ్దము భూమిని చలింపచేనెను గాని యిప్పుడు నేనింకొకసారి భూమిని మాత్రమేకాక ఆకాశమును కూడ కంపింపచేతును అని మాట యిచ్చియున్నాడు.

ఇంకొకసారి అను మాట చలింపచేయబడనివి నిలుకడగా ఉండు నిమిత్తము అవి సృష్టింపబడినవన్నట్లు చలింపచేయబడినవి బొత్తిగా తీసివేయబడునని అర్థమిచ్చుచున్నది.

అందువలన మనము నిశ్చలమైన రాజ్యమును పొంది, దైవ కృప పొంది యు౦దము. ఆ కృప కలిగి వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేయుదము,

ఏలయనగా మన దేవుడు దహించు అగ్నియైయున్నాడు.

26ఇప్పుడు ఇదియే ఒక చిన్న పాఠ్యభాగము నేను దానిలో నుండి ఒక అంశమును తీసికొనివలయునని యున్నాను, దానికి నేను ఒక పేరు నివ్వవలయునని యున్నాను. మరియు మిమ్ములను అధిక సమయము నేను ఉంచదలచుకొనలేదు మరియు రేపు రాత్రి త్వరగా వచ్చి మరి ప్రార్థనా అట్టలను తీసికొనుటకు మరువకుడి, మరి ప్రార్థనా అట్టలను కలిగియున్న వారందరికి మేము ప్రార్ధింపబోవుచున్నాము. ఇప్పుడు మరి ఈ రాత్రికి నా యొక్క పాఠ్యాంశము "చిన్నాభిన్నమై పడిపోవుచున్న ప్రపంచము." ఇది ఒక వింతైన పాఠము.

27నేను క్రీస్తుకొరకైన ఉన్నత సేవకుడైన సహోదరుడైన విక్ తో ఈ దినము నడచు గొప్ప అవకాశమును గురించి విశేషాధిక్యతను గురించి నేను తలంచుచుంటిని; సహోదరుడు జోసెఫ్, నా అమూల్యమైన స్నేహితుడు, అతనిని గురించి కూడా. మాకు అది భోజన సమయుము ఇక్కడ మీకు అది మధ్యాహ్న భోజనము అనుకొనుచున్నాను. మరది విందు అయిన యెడల, ఈ రాత్రికి ఇది విందుగాను మరియు అది మధ్యాహ్న ఉదయ కాలము భోజనము మరట్లైనయెడల నా రాత్రి భోజనము ఎప్పుడు వచ్చును? చూశారా, నేను దేనినో వదిలి వేసినట్టు అనుకొనుచున్నాను. మరప్పుడు మేము భోజనము ముగించి మరియు వీధిలో వచ్చుచుండగా, వారు క్రిస్మస్ కొరకైన కార్యములను అక్కడ అలంకరించుటకు ప్రారంభించుచుండిరి. మనము క్రిస్మస్ సమయమును సమీపించుచున్నాము, మరియు ఒక నెల మాత్రమే యున్నది, అయితే క్రిస్మస్ కొరకైన వస్తువులతో అంగళ్ళన్నియును నిండియున్నవి.

28వారు ఏ విధముగా క్రిస్మస్ అనగా ఏమిటన్న అర్థము తెలిసికొనకుండా దానిని ఆచరించుచున్నారు! అది ఒక వ్యాపార కార్యముగా మారియున్నది. అన్ని సెలవు దినములను ఆ విధముగానే నున్నవి. తల్లుల దినము, తండ్రుల దినము మరియు ప్రతి దినమును తల్లుల దినము మరియు తండ్రుల దినముగా నుండవలయును. మరియు వారికి ఓ, ఈస్టరు. సాంతా క్లాన్ (క్రిస్మస్ తాత) క్రీస్తు పుట్టుక స్థానమును తీసికొనెను. ఒక కుందేలు, మరియు కోడి, ఒక చిన్న బాతు, పునరుత్దాన సమయమును తీసికొనియున్నది. మరియు పండగలని కోళ్ళు, మరి బాతులు మరి గ్రుడ్డు, వీటికి పునరుత్దానమునకు ఏమిటి సంబంధము? చూశారా? మరియు అది చాలా అసహ్యము మనము… మన పిల్లలకు మనము వాటిని ముందుంచుచున్నాము.

29ఈ రాత్రి ఇక్కడ ఒక చిన్న పిల్లవాడు యేసుక్రీస్తు కంటె కూడ అధికముగా రింగుల ద్వారా బంతులను కొట్టు ఆట గురించి చెప్పగలడు, నిశ్చయముగా, నిశ్చయముగా, ఏలయనగా అది ఒక గొప్ప వ్యాపార కార్యము. వ్యాపారులు ఒక కౌబాయ్ దుస్తులవలె లేక ఒక హిరో, మరియు లేక ఏదో ఒక చట్టవిరోధి లేక ఏదో మరి ఇంకొకరివలె కనిపించునట్లు దుస్తులను అమ్మెదరు, మరి అప్పుడు చిన్న బిడ్డలందరును దానిని గురించి తెలుసుకొని మరి పూర్తిగా ఆలాటి కార్యములు ధరించుటలో వారిని గురించిన చరిత్ర అంతయును తెలిసికొనెదరు. మరి ఆ విధముగా క్రీస్తు యొక్క కార్యక్రమములను మనము జనులకు తీసికొని వెళ్ళినయెడల ఎంత బాగుండును. మీరు సహజముగా దేనినైతే చదివెదరో, దానినే అనుసరించి ఆ ప్రకారముండుటకు ప్రయత్నించెదరు; చదువుచున్న మీరు.

30నాకు గుర్తున్నది, నాకు ఎల్లప్పుడును ఆ విధముగానే యుండును. నేను చిన్న పిల్లవానిగా నున్నప్పుడు నాకు గుర్తున్నది, సుమారుగా పండ్రెండు సంవత్సరముల వయస్సులో నున్నప్పుడు నేనొక లైబ్రరిలో జేన్ గ్రేస్ రచించిన పుస్తకము, "ద లోన్ రేంజర్," అనే దానిని చదివాను. దానిలో అడవులను గురించిన కార్యములను చదివి, చదివి అదే నా మనస్సులో నుండుటవలన నా తల్లి ఊడ్చు చీపురు కట్టపై గుర్రమువలె స్వారీ చేయుచు - ఆ చీపురుకట్ట విరిగిపోయేలా ఇల్లంతయు తిరుగుచు, దానిని విరిచేసాను. అటు పిదప ఎడ్గర్ రైన్ బర్రోన్ రచించిన పుస్తకము "టూర్జాన్ అండ్ ఏప్స్" చదివాను మరి దానిని చదివి నేను ఒక చెట్టుపై నిద్రించాను, ఏలయనగా నేను దానిని చదువుచుంటిని. అది నా యొక్క మనస్సులో నిలిచిపోయెను.

మరియు, ఓ, ఒక రోజు నేను నిజమైన ఒక కార్యమును, ఒక సత్యమును పట్టుకొన్నాను, ఒక కల్పనా కథ కాదు. మరప్పటి నుండి ఆయనవలె నా జీవితము ఉండవలయునని నేను కోరుచున్నాను. నేను పరిశుద్ద గ్రంథమును మరి యేసుక్రీస్తు యొక్క జీవితమును చదువుచున్నప్పుడు, నిజమైన ఒక దానిని దేనినో నేను కనుగొనియున్నాను.

31ఇప్పుడు మనము ఈ పండుగ సమయమును సమీపించుచుండగా, ఇది చాలా బాగుగా ఎరిగియున్న కార్యమైయున్నది. ఆయన యొక్క మొదటి రాకడలో రెండు వేల సంవత్సరములకు మునుపు ప్రపంచము ఎట్లు౦డెనో ఇప్పుడు కూడ ఆ విధముగానే నున్నది. ఆయన భూమిపైకి వచ్చినప్పుడు, భూమి తన కాలమును సంధించెను.

ప్రతిసారియను ప్రపంచము అటువంటి గందరగోళపు స్థితిలో నుండును మరి దానికి ఎవరును సహాయపడలేరు. మనకు ఈ విధముగా అనేక ముందు ఉదాహరణములు కలవు. మరి ప్రతిసారియు అది ఇటువంటి స్థితిని సంధించినప్పుడు మరి ఆ స్థితి ప్రజలను ప్రార్థించుటకు ప్రేరేపించెను. మరియు సమస్తమును తమ తమ కార్యములను చేసినవని వారు అనుకొనిరి, ఎట్లనగా మనయొక్క పద్ధతులు మరియు సమస్తమును చివరి వరకు క్రమముగా నెరవేరుచున్నవి. జల ప్రళయమునకు మునుపు అది ఆ విధముగానే యుండెను. రాజకీయములు మరియు ఇతర కార్యములు వాటి అంతిమ దశకు వచ్చియున్నవి, ఇక వాటికి విమోచన లేదు. మరియు నేను అనుకొనుచున్నాను, ఇవంతయు ఒక ఉద్దేశము కొరకు దేవుని ద్వారా చేయబడుచున్నవి, ఎందుకనగా వాటిని మరల తమ స్థానమునకు తీసికొని వచ్చుటకు. దానిని పునఃప్రారంభము చేయుటకు ఒక మార్గము కలదు. మరి అది దేవుని యొక్క చట్టముగా నున్నది, ఈ యొక్క కార్యములు అటువంటి స్థితికి వచ్చుచున్నవి.

32క్రీస్తు యొక్క మొదటి రాకడను నేను అనుకొనుచున్నాను, ప్రపంచము చిన్నాభిన్నమై పడిపోవుచున్నదని మనము చెప్పగలము. అది రాజకీయములలో చెడిపోయియున్న సమయము, మతములలో చెడిపోయియున్న సమయము. సమస్త కార్యములు, పద్దతులు క్రుళ్ళిపోయి, చెడిపోయియున్నవి. వారు అన్నిటితోను కలిసిపోయిరి, ఇతర కార్యములను లోనికి చేర్చిరి మరియు మనుష్యుల సిద్దాంతములను వారి మత మార్గములలో మరి ఆలాటి వాటితో చేర్చిరి, సమస్తమును క్రుళ్ళిపోయి చెడిపోయెను. మరియు ప్రపంచము చిన్నాభిన్నమై పడిపోయెను.

మరియు ప్రపంచము ఆ సమయములో మెస్సీయ కొరకై ప్రార్థించెను. రోమీయులు ఒక మెస్సీయ కొరకు ప్రార్థించుచుండెను, గ్రీకులు ఒక మెస్సీయను కోరిరి, యూదులు ఒక మెస్సీయను కోరిరి. మరియు దేవుడు వారికి ఒక మెస్సీయను ఇచ్చెను, అయితే వారు మెస్సియాను పంపిన విధముగా వారు దానిని కోరలేదు.

33మరియు మనమిప్పుడున్న ఇటువంటి గందరగోళ సమయములలో మనము క్రిస్మస్ ను సమీపించుచుండగా, మనము ప్రపంచమును అదే స్థితిలో నుండుట చూచుచున్నాము; అనీతితో చెడిపోయియున్నది, మరియు రాజకీయములు క్రుళ్లిపొయి చెడిపోయియున్నవి, మతమార్గములు భక్తి జీవితములు చెడిపోయియున్నవి, సంఘ శాఖలు వాటి మార్గములు చెడిపోయున్నవి మరి సమస్తమును క్రుళ్లిపోయున్నవా అని నేను ఆశ్చర్యపడుచున్నాను. మరియు మనమ౦దరమును ఇటువంటి స్థితి నుండి ఏదైనను మనలను వెలుపలకు లాగగలదా అని ఎదురు చూచుచున్నాము. మన మ౦దరమును ఒక మెస్సీయను ఎదురు చూచుచున్నాము.

దేవుడు గనుక ఒక మెస్సీయను పంపిన యెడల, గడచిన కాలములో వారు చేసిన విధముగానే మనము చేయుదమా అని నేను ఆశ్చర్యపడుచున్నాను. మనము ఆయనను ఎరుగము, ఆయన ఎవరుయని మనము ఎరుగము. ప్రపంచము ఆయనను గుర్తించునని నేను అనుకొనుట లేదు.

34మరి ఎందుకనేది గమనించుము. అదెందులకని, దాని కారణము ఇదో ఇది నా యొక్క తలంపు. రోమనులకు ఒక మెస్సీయ ఏ విధముగా నుండునని వారి యొక్క స్వయ తలంపులుండెను. మనలో ప్రతి యొక్కరమును మన యొక్క ఆలోచనలను కలిగియున్నాము; ప్రతి సంఘ శాఖయు దానియొక్క ఆలోచనలను కలిగియున్నది. పటములలో చిత్రీకరించి మరి గీసి మెస్సీయా ఏ విధముగా నుండునని, "మా యొక్క సంఘము దానిని గైకొనబోవుచున్నదని," మనము బోధింపబడి యున్నాము. సరి, యూదులును మరి పరిసయ్యలును ఆ విధముగా తలంచి యున్నారు, మరియు సద్దూకయ్యలను వారి ప్రకారము ఆ విధముగానే తలంచిరి. మీరు చూడుడి, అదే కార్యము. ఆత్మలు చనిపోవు; మనుష్యులలో అది చోటు చేసికొనును, చూశారా. అయితే దయ్యము తన యొక్క ఆత్మను తీసికొనదు, అతను మనుష్యుని మాత్రము తీసికొనును. మరియు దానిని గురించిన మంచి కార్యమేదనగా, దేవుడు ఆయన యొక్క ఆత్మను తీసికొనడు, చూచారా, అది అట్లే నిలిచియుండును; కేవలము మనుష్యుడు. క్రీస్తులో నుండిన అదే ఆత్మ, ఈ రోజు ఒక నిజమైన విశ్వాసిలోను నుండును.

35ఇప్పుడు గమనించుడి, రోమనులు ఆ దినమున ఒక మెస్సీయ కొరకును ఒక రాజకీయ నాయకుని కొరకును ఎదురుచూచుచుండిరి. రోమను దేశస్తుల యొక్క పెద్ద దేవుడైన బృహస్పతి నుండి, లేక అగ్ని రథముల నుండి ఎవరో క్రిందికి దిగి రావలయునని వారు కోరిరి, మరియు ఆ విధముగా క్రిందికి దిగి వచ్చిన వాని తలపై ఒక సూర్యుడును మరియు అతను తన రథములను ఆకాశమునకు మధ్య నడిపించి తోలుకొని వచ్చునని వారు ఎదురు చూచిరి. మరియు బృహస్పతి క్రిందికి దిగివచ్చి కొన్ని మాయలు చేసి, సైన్య రహస్యమును వారికి చెప్పి మరి ప్రపంచమునంతయును ఎలా వారి కాలిక్రింద వేసి అణగద్రొక్కవలయునని వారికి చెప్పబడవలయునని వారు కోరిరి. వారు చేయదలచుకొనినది అదే. వారు గ్రీకులను పడద్రోసి మరియు ప్రపంచమును పాలించవలయునని కోరిరి. వారు కోరుకొనిన విధముగా మెస్సియా వుండవలెనని వారు వాంఛించిరి.

సరి, గ్రీకు దేశస్తులు మెస్సీయ వచ్చి రోమనులను పడద్రోయునని మరి ఆ విధమైన పథకముతో మెస్సీయ వచ్చునని వారు కోరుకొనిరి. చూశారా, అటువంటి రకమైన మెస్సీయను.

36మరియు యూదులు ఒక సైన్యాధిపతి కొరకు, ఇనుప దండమును తన చేతిలో నుంచుకొని వచ్చుననియు, మరియు ఒక యూదా గోత్రపు సింహము వచ్చి మరి సమస్త దేశములు పరిపాలించునని వారు ఎదురు చూచిరి; మరియు రోమనులను ముంచివేసి మరి ఇశ్రాయేలీయులు కైవశపరచుకొనెదరని వారు అనుకొనిరి. అదియే కారణము. వాక్యము ఆయన ఏ విధముగా వచ్చునని చెప్పుబడియున్నదో - ఆ ప్రకారముగా ఆయన వచ్చెను, కాని వారు ఇంకొక విధముగా ఆయన వచ్చునని వారు ఎదురుచూచుచుండిరి.

ఆయన గనుక ఈ రోజు వచ్చిన యెడల అదే విధమైన కార్యము ఈ దినమున కూడ జరుగునని నేను ఆశ్చర్యపడుచున్నాను, దానిని గురించి మనము తలంచిన యెడల, ఆయన ఏ విధముగా నుండవలయును, మరియు ఆయన ఎట్లు అగుపించవలయును, ఏ విధముగా దుస్తులు ధరించుకొనవలయును, మరియు ఎట్లు ఆయన తల వెంట్రుకలు ఉండవలయును, మరి సమస్తమును వారు కోరినట్లుండవలయునని వారు అనుకొనిరి. మనము అనుకొనిన ప్రకారము ఆయన లేనియెడల మనము ఆయనను అంగీకరించలేము, మీరు చూడుడి; నా భావము, మనము, ఈ రోజు ఉన్న ప్రపంచము, చూశారా. అది సరి.

వారు, యూదులు మెస్సీయను నిరాకరించిరి, ఏలయనగా వారికి తగినట్లుగా వారు అనుకొనిన విధముగా ఆయన వారి అభిరుచులకు సరిపోలేదు. వారు అనుకొనిన విధముగా ఆయన లేడు.

JOHN 1:11•

ROM 11:25

 

37కొన్ని దినములకు మునుపు టూసాన్ లో నున్న ఒక మంచి టైలరు నా కొరకు ప్యాంట్లు కుట్టుచుండెను. మరియు అతను ఒక యూదుడు. మరియు అతను ఆంగ్లము సరిగా మాటలాడక మెల్లగా మాటలాడుచుండెను, మరియు నేను అడిగితిని, "నీవు యూదుడువా?"

అతను చెప్పెను, అవునయ్యా. మరియు అతను అడిగెను, "నీవు క్రైస్తవుడని నేను అనుకొనుచున్నాను?"

నేను చెప్పాను, "అవునయ్యా." కావున అతను నా యొక్క ప్యాంట్లు కుట్టుటలో నుండెను. మరియు నేను అనుకొంటిని అతనితో మాటలు పొడిగించవలయునని."

మరియు అతను చెప్పెను, "సరి," క్రైస్తవులైన మీ యెడల నాకు ఏ విధమైన విరోధము లేదు."

నేను చెప్పాను, "కృతజ్ఞతలు అయ్యా. నాకును మీపై విరోధము లేదు." మరియు అతను చెప్పెను… నేను చెప్పాను, "క్రీస్తును గురించి మీ అభిప్రాయము ఏమిటి?"

అతను చెప్పెను, "ఆయన చాలా త్వరగా వచ్చెను, మరియు వారు చెప్పియున్నారు ఆ కార్యమును చేయుటకు సరిపడ్డ వయస్సు ఆయనకు లేకపోయేననిరి.

మరి నేను చెప్పాను, "అవునయ్యా."

అతను చెప్పెను, "ఆయన యొక్క పనికి అతను చాలా చిన్నవాడు (దానిని చేయుటకు తగిన వయస్సు లేదు)" అని చెప్పెను. ఇప్పుడు, క్రీస్తు, "యేసు గనుక ఇప్పుడు ఈ రోజు వచ్చిన యెడల…" క్రీస్తు కాదు; దానిని వారు నమ్మరు. చెప్పెను, "యేసు గనుక ఈ రోజు వచ్చియుండిన, ఆయన యొక్క కార్యక్రమము సరిగా నుండి యుండవచ్చును" అని చెప్పెను." "అది ఏదో ఇంకొక కార్యము రాక్-ఫెల్లర్ మరియు గోల్డ్-వాటర్" వలె నుండెను అని చెప్పెను, "వారు ఒకరికొకరితో పోరాడుకొనుచు నుండిరి, మరియు ఒకే తెగలో నుండుచు వారట్లు౦డిరి. మరియు అతను చెప్పెను, "నీవు గమనించి చూడుము వారు దానిని ఆ విధముగా చేసియుండ కూడదు."

నేను చెప్పాను, "అది సరియని."

చెప్పెను, "యేసు వచ్చినప్పుడు, ఆయన తన తెగకు చెందిన జనులతో పోరాడుచు౦డెను."

నేను చెప్పాను, "ఓ కాదు. ఆయన తన సొంత వారికొరకు వచ్చెను మరియు ఆయనకు సొంతమైన వారు ఆయనను అంగీకరింపలేదు. అందులో నున్న కార్యము అదియే, నీవు చూడుము అని నేను అతనికి బదులిచ్చాను.

కావున నేను తిరిగి వచ్చువరకు అతడిని విశ్రాంతి తీసుకోనిచ్చెదను, మీరు చూచార, ఆ సమయమున కొద్దిగా ఆలస్యము అయినది. ఏలయనగా, నాకు గుర్తున్నది, దేవుడు నేను చూడగలుగులాగున అతని యొక్క కండ్లను మూసి వేసియున్నాడు, చూచారా, కావున నేను ఆ యూదుల జాతికి కృతజ్ఞుడనైయున్నాను. నిశ్చయముగా నేను కృతజ్ఞుడను. ఇశ్రాయేలూ మీరు గనుక ఇక్కడ కూర్చొనియున్న యెడల దిగులు పడవద్దు, మీ యొక్క సమయము చాలా సమీపముగా నున్నది.

38మనము అనేక మార్లు చెప్పెదము, "యేసు యూదుడని." కాదు, ఆయన యూదుడు కాదు. కాదు, ఆయన యూదుడు కాదు. ఆయన యూదుడు కాదు లేక అన్యజనుడు కాదు. ఆయన దేవుడు. చూచారా, రక్తములోని హిమగ్లోబిన్లో జీవాణువు యున్నది మరియు ఆ జీవాణువు దేవుని ద్వారా సృష్టింపబడియున్నది. దేవునికి మరియు మరియకు ఎటువ౦టి మానవ సంబంధము లేదు. ఆ జీవము సృష్టింపబడినప్పుడు, ఎటువంటి ఉద్రేకము కూడ లేదు. ఆయన రెండు బీజములను సృష్టించెను, అది సరియే, గ్రుడ్డు మరియు జీవాణువులను సృష్టించెను. మరియు ఆయన యూదుడు కాదు లేక అన్యజనుడు కాదు. ఆయన వాటి రెండింటికి మధ్యనున్నాడు. ఆయన దేవుడు. ఆయన గనుక యూదుని రక్తము కలిగియున్నవాడైతే, మనము తప్పిపోయున్నాము; అయన గనుక అన్యజనులు రక్తమైతే, మనము తప్పిపోయున్నాము. ఆయనలో నున్నది దేవుని యొక్క రక్తము, ఎటువంటి లైంగిక వాంఛ లేకుండా సృష్టింపబడినది. అందువలననే మన యొక్క విశ్వాసము దానిని చూచి మరియు అది సరియని స్థిరవిశ్వాసముతో నిలుచుకొని యున్నది. కావున ఆయన ఇరువురికొరకును మరణించి యున్నాడు.

ఆయన యూదుల యొక్క కోరిక ప్రకారము, వారు అనుకొన్న రీతిన రాలేదు, కనుక వారు ఆయనను ఖండించిరి. మరిప్పుడు మనము దానిని గురించి ఏమియును చెప్పలేము, ఏలయనగా అదే కార్యమును మనము చేయుచున్నాము.

MATT 15:6•

MARK 7:13•

LUKE 8:11

 

39దీనికి కారణము ఏమిటి? దానికి ఒక కారణను కలదని నేను నమ్ముచున్నాను. వారు వారియొక్క పారంపరాచార్యముల వలన దేవుని యొక్క వాక్యమును తీసివేసి దానికి ఎటువంటి ఫలితము నియ్యలేకపోయిరి. యేసు దానిని చెప్పియున్నాడు. ఆయన చెప్పెను, "మీరు మీ పారంపర్యాచారము నిమిత్తమై దేవుని వాక్యమును నిరర్ధకము చేయుచున్నారు." అది సరియే. అది నిరర్థకముగా నుండెను, ఏలయనగా వారు దానిలో వారియొక్క పారంపర్యాచారములను చేర్చి, వాటిని ఎత్తి చూపించుచుండిరి. మరియు ఎప్పుడైతే…

మీరు దానికి దేనిని చేర్చకూడదు. దానినుండి వేటిని తీసివేయకూడదు. అది ఆ విధముగానే యుండవలయును. దేవుడు దానిని ఆ విధముగానే భద్రపరచి యున్నాడు. దానిలోనికి మనము ఆచారములు మరియు సిద్దాంతములను మరియు ఇతర విషయాలు చేర్చకూడదు. దానికి ఏ యొక్క సహాయము అక్కర లేదు. అది, అది ఆయనే, అది వ్రాత రూపములో ఆయనై యున్నాడు.

మరియు వాక్యము ఒక విత్తనముగా నున్నది. మరియు సరైన భూమిలో విత్తనము ఎదుగును, మీరు ప్రతి ఉదయమును అది ఎదిగినదా లేదా అని చూడనక్కర లేదు. మీరు దానిని విత్తిన చాలును, దేవునికి దానిని అప్పగించి మరి దానిని ఆ విధముగానే వదిలి వేయుడి. మరి దానిని ఆ విధముగానే ఎదగనియ్యవలెను, ఆ విధముగానే భూమిలో వదిలి వేయవలెను. మరియు ఆ విత్తనము హృదయమును మీ భూమిలో అక్కడనే యుండవలయును, ప్రతి గంటయును విశ్వాసమను నీరును దానికి పోయవలయును, "ఒకవేళ దేవుడు ఆ విధముగా చెప్పినట్లయితే, అది నాకు సొంతమైయున్నది!" దానిని ఆ విధముగానే చేయవలయును.

JOB 38:4,7

 

40కావున ఈ దినములవలనే ప్రపంచమ౦తయును చిన్నాభిన్నమై పడిపోవుచున్నది, ప్రతి దేశమును, ప్రపంచమును తాకబోవు ఏదో కార్యము నుండి వారిని తప్పింపవలయునని, వారిని కాపాడవలయునని ఎదురు చూచుచున్నది. దేశములన్నియును ఏదో ఒక కార్యము కొరకు ఎదురు చూచుచున్నవి, మరియు ప్రతి దేశమును వారిని కాపాడు దేనికొరకో ఎదురు చూచుచున్నవి, అయితే వారి కొరకు దేవుడు పంపినది స్వీకరించుటకు వారికి నచ్చిన కర్యముగా కనపడలేదు. వారు ఒక వ్యక్తిని అడుగుచున్నారు, ఒక మెస్సీయాను, తక్కిన దేశములన్నిటిని అనగద్రోక్కుటకుగాను అడిగిరి, మరి దేవుడు వారికి ఒక శిశువును ఇచ్చెను. వారు ఒక సైన్యాధిపతి కొరకు అడిగిరి, మరి ఒక శిశువును పొందిరి! దేవునికి తెలియును వారికేమి కావలయునని. ఆయన వారిని కించపరచెను.

దేవుడు చేయు పద్దతి అదే, మనకు అన్నియును తెలియునని మనము అనుకొనిన యెడల, దేవుడు మన గర్వమును అణచును. ఆయన యోబుతో చెప్పినట్లు, "నీకు అధిక జ్ఞానము కలదు, భూమికి నేను పునాదులు వేసినప్పుడు, ఉదయ నక్షత్రములు ఏకముగా కూడి పాడినప్పుడు మరియు దేవదూతలందరును ఆనందించి జయధ్వనులు చేసినప్పుడు? యోబు, నీవెక్కడ నున్నావు?" ఏల, ఆ విధముగా దేవుడు చెప్పెను, అతని వివేకమునకు అది అర్థము కాదు, చూశారా. మరియు దేవుడు మనమేదో చాలా గొప్పవారమని తలంచుకొనిన యెడల, మనలను అణచును. మనము మనయొక్క సంఘ శాఖ చాలా గొప్పవాటిలో యొకటిది అని తలంచినయెడల, మరి దేవుడు ఎక్కడి నుండియో దేనినో లేపి మరి దానితో గొప్పయని చెప్పువాటిని అణచును. అది సరియే. ఆ విధముగానే ఆయన ఎల్లప్పుడును చేయును. అవును.

41చూడుడి, వారు ఒక సైన్యాధిపతి కొరకు అడిగిరి, మరి ఒక శిశువును పొందిరి. దేవునికి తెలియును వారికి కావలసినది ఏమిటని. అది సరియే. వారు ఒక సైన్యాధిపతి కొరకు అడిగిరి మరియు ఒక రక్షకుని పొందిరి. వారు రక్షింపబడి యున్నామని వారు అనుకొన్నప్పటికిని, కాని దేవుడు వారిని దర్శించినప్పుడు వారు రక్షింపబడలేదని తెలిసెను.

మరియు ఈ దినమున ప్రతియొక్కరును తలంచుకొనునది అదియే. ప్రపంచము తలంచుకొనుచున్నది ఏదో సంఘ శాఖలో వారు చేరుటవలన రక్షింపబడి యున్నారని, అయితే వారికి ఒక రక్షకుడు కావలసియున్నది, ఈ రోజును ఆ విధముగానే యున్నది. ఈ రోజు కూడా మరి అటువంటి ఒక దృశ్యముగా నున్నది, నాకు ప్రపంచమును గురించి తెలియదు.

ఈ క్రిస్మస్ నందు కూడా మరియు అదే కార్యమును మనము కనుగొనుచున్నాము, ప్రపంచము చిన్నాభిన్నమై పడిపోవుచున్నది. మీరు గనుక దీని యొద్దకు వెళ్ళిన యెడల అది పడిపోవుచున్నది. మీరు గనుక దీని యొద్దకు వెళ్ళిన యెడల అది పడిపోవుచున్నది. మరి అది ఆ విధముగానే నుండవలయును, కావున అప్పుడే మనము దీనియొద్దకు వచ్చెదము. చూడుడి, అది మన క్రిందనున్న అన్ని ఆధారములను తీసివేయుచున్నది, కావున మనము ఒకే ఒక మార్గము నొద్దకు వచ్చెదము, మరి అది నిత్యజీవమైయున్నది.

ఈ దినములలో కూడ ఆ దినములవలే వారిని కాపాడుటకు ఏకముగా నుంచుటకు ఏదో ఒక పథకము కావలసియున్నది. మరి ఆ దినములలో వలె ఇప్పుడు కూడా అది చిన్నాభిన్నమై పడిపోవుచున్నది. మరియు అప్పటి భక్తిగల ప్రపంచము దీనిని చేయుటకు ఒక వాగ్దానము చేయబడిన మెస్సీయా కొరకు ఎదురుచూచుచు౦డేను.

42మరియు దేవుడు తన వాగ్దానమును కాచుకొనును. ప్రతియొక కాలములోను ఆయన తన యొక్క వాగ్ధానమును తప్పిపోకుండా కాచుకొనుచున్నాడు. ప్రపంచము నోవహు కాలములో చిన్నాభిన్నమై పడిపోయినప్పుడు, దేవుడు వారికి ఒక గొప్ప ప్రవక్తను పంపించెను. అతనితో వారేమి చేసిరి? దానిని త్రోసివేసిరి. ఒక ప్రవక్త అనగా ఏమిటి? దేవుని యొక్క వాక్యముతో వచ్చునతనే ప్రవక్తగా యుండును. నోవహు కాలములో ఒక ప్రవక్త పంపబడెను, మోషే కాలములో సమస్తమును పడిపోవునప్పుడు, వారికి ఒక ప్రవక్త పంపబడెను, ఏలీయా కాలములో సమస్తమును చిన్నాభిన్నముగా పడిపోయినప్పుడు ఒక ప్రవక్త పంపబడెను. ప్రతియొక సారియు ప్రపంచము గందరగోళముగా నున్నప్పుడు, వారికి ఒక ప్రవక్త పంపబడెను. మరియు పిదప ఈ యొక్క మొదటి క్రిస్మస్ లో ఆయన వాక్యమును పూర్ణముగా పంపించెను, చూచారా, వాక్యము! ప్రవక్తలో వాక్యము ఒక భాగముగా మాత్రమే ఉండెను, ఆ కాలమునకైన వర్తమానమును అతను కలిగియుండెను, మరియు అతను దానిని ముగించి వెళ్లిపోయెను.

MATT 23:29-31•

1COR 1:20,21

 

43వారికి ఒక ప్రవక్తను యిచ్చినప్పటికిని, వారు ప్రతిసారియు ఆ ప్రవక్తలతో ఏమి చేసిరి? వారిని రాళ్ళతో కొట్టిరి (ఆ ప్రవక్తలు, వారియొక్క పద్దతులతో ఏకీభవించలేకపోయిరి) మరియు వారిని చంపిరి. యేసు చెప్పెను, "మీరు ప్రవక్తల సమాధులను శృంగారించుచున్నారు, మరియు మీ పితరులు వారిని సమాధులలో ఉంచిరి. వారి యొక్క సంతానమని మరి మీరు నిరూపించుచున్నారు." చూశారా, వారు దానిని చేయుచున్నారు. అది చాలా ఘోరమైన కార్యమైయున్నది. అయినను అదియే లోకము చేయుచున్నది. చూడుడి, అది ఎల్లప్పుడును ఆ విధముగానే నున్నది, దేవుడు ఆయన యొక్క వాక్యమును పంపించుచున్నాడు మరియు ఈ లోక జ్ఞానము వాక్యముతో తనను సరిచూచుకొనుచు పరీక్షించుకొనుచున్నది.

ప్రారంభములో ఆ విధముగానే నుండెను. పాపమును కార్యము ప్రారంభింపబడెను, ఏలయనగా హవ్వ… దేవుని యొక్క పద్దతి కన్నను సాతాను వక్రమార్గము ద్వారా వేరొక పద్దతిని ఉత్పత్తి చేసెను - వాడు ఈ లోక జ్ఞానమును ఉత్పత్తి చేసెను. మంచి-చెడ్డల తెలివినిచ్చు వృక్షమునుండి వారు భుజించిరి.

ఈ లోక జ్ఞానము ఎల్లప్పుడును మిమ్ములను దేవుని యొద్ద నుండి

దూరముగా కొనిపోవును. విశ్వాసము మిమ్ములను తిరిగి దేవుని యొద్దకు తీసికొని వచ్చును. మీరు మీ యొక్క గొప్ప జ్ఞానము ద్వారా దేవునిని ఎరుగలేరు. అది మ౦చిది కాదు. అది ఈ లోకమునకు సంబంధించినది. అది దేవునికి వెర్రితనము. "అయితే సువార్త ప్రకటనయను వెర్రితనము చేత నమ్మవారిని రక్షించుట దేవుని దయాపూర్వక సంకల్పమాయెను." కావున దేవుడు ఎల్లప్పుడును సాధారణమైన మరియు వెర్రి కార్యములను ఉపయోగించెను.

1COR 2:1,5•

PHIL 3:7,8,13

 

44ఆయన తన యొక్క శిష్యులను పిలిచినప్పుడు, ఆ సమయుములో గొప్పయని చెప్పుకొనదగిన కయపను మరియు గొప్ప యాజకులను, ఆరితేరిన వారిని ఎన్నుకొని యుండవచ్చును. వారు ఎంతో గొప్పైన డాక్టరు డిగ్రీలను మరియు సమస్తమును కలిగియుండిరి. అయితే ఆయన పామరులుగానున్నవారైన చేపలు పట్టు జాలరుల యొద్దకు వెళ్ళేను. వారు వారి పేరును కూడా వ్రాయలేని విధ్యాభ్యాసము లేనివారిగా యున్నను, ఆయన వారినే ఎన్నుకొనెను, ఏలయనగా ఆయన శూన్యముగా నున్న దానిని తీసికొని మరి దానిలో నుండి ఏదో కార్యమును చేయువాడై యున్నాడు.

మరియు గొప్ప పరిశుద్ధ పౌలు కూడా చెప్పెను, క్రీస్తును కనుగొనుటకు తాను తెలిసికొనినదంతయును అతను మరచిపోవలసియుండెను. అతను కొరింథీయుల సంఘమనకు చెప్పెను, "నేను మీ యొద్దకు వచ్చినప్పుడు వాక్చాతుర్యముతో గాని జ్ఞానాతిశయముతో గాని వచ్చిన వాడను కాను, ఏలయనగా నేను ఆ విధముగా వచ్చియుండినయెడల మీరు దానిపై మీ విశ్వాసమును పెట్టియుండెడివారు."

45మరియు గమనించి చూడుడి, ఈ దినమున, జనులకు చక్కటి విద్యాజ్ఞానము గలిగి, చక్కటి వ్యాకరణములతో ఉచ్చరించుచు ప్రసంగించగల కాపరులు కావలయును. మరియు ఆ విధమైన అర్హతలు కాపరులకు కావలసియున్నయెడల నేను ఏ ప్రసంగ వేదికపై నుండలేను, ఏలయనగా నాకు నామవాచకమునకు మరియు సర్వనామమునకు బేధము కూడా సరిగా తెలియదు. మరి నాకు తెలిసిన ఒకే కార్యము, ఏమనగా, ఆయనను నాకు తెలియును. మరియు నేను తెలిసికొనగోరునది అదే, ఏలయనగా ఆయనే నా యొక్క నామవాచకము మరియు సర్వనామము, ఆయనే నా యొక్క జీవము. ఇప్పుడు మనము తెలుసుకొనవలసిన కార్యము ఆయనే, అయితే మనయొక్క భక్తిమత పద్దతులు పరిశుద్దాత్మకు బదులుగా విద్యా ప్రణాళికలను గైకొనియున్నవి. వాటినే అవి చేసియున్నవి.

MATT 21:33-38•

MARK 12:1-7•

LUKE 20:9-14

 

46నోవహు దినములలో, మోషే దినములలో వారికి ప్రవక్తలు పంపబడినప్పుడు, మరి వారిని వారేమి చేసిరి? రాళ్లతో కొట్టిరి, చంపిరి, రంపములతో ముక్కలు ముక్కలుగా కోసిరి, వారిని కాల్చిరి, వారిని తొలగించుకొనవలయునని ఏమి చేయవలయునో - వాటినన్నిటిని చేసిరి.

యేసు ఒక మంచి చక్కని ఉపమానమును చెప్పెను, ఆయన చెప్పెను, "ఒక గొప్ప వ్యక్తి ద్రాక్ష తోట నాటించి మరియు కాపులకు దానిని గుత్తకిచ్చి దేశాంతరము పోయెను. మరియు అతను పండ్ల కాలను సమీపించినప్పుడు, పండ్లలో తన భాగము తీసికొనివచ్చుటకు ఆ కాపుల యొద్దకు తన దాసులనంపగా మరియు ఆ కాపులు ఆ దాసుని కొట్టి చంపిరి. అతను మరియొక దాసుని పంపగా, మరియు వారు అతనిని కూడా చంపిరి, మరి ఆ విధముగా పంపిన తక్కిన దాసులను చంపిరి." మరియు చెప్పెను, "చివరికి నా కుమారుని సన్మానించెదరనుకొని తన కుమారుని వారి యొద్దకు పంచెను. మరియు ఆ కాపులు కుమారుని చూచి ఇతడు వారసుడు, ఇతనిని చంపి ఇతని స్వాస్థ్యమును తీసికొందము రండని చెప్పుకొనుచు - ఆ కుమారుని చంపిరి." అతనే ఆయన పంపిన దేవుని కుమారుడు.

ప్రవక్తలను పంపించెను! ఆయన వాక్యమును పంపించెను; వాక్యము — దేవుడు! గుర్తుంచుకొనుడి, ప్రతీసారియు వినాశనమైపోవు సంతతిని మరియు ఈ ప్రపంచమును ఏకముగా చేయునది ఒకే ఒక కార్యమైనదిగా, అది దేవుని యొక్క వాక్యమైయున్నది!

HEB 11:3

 

47ఈ ప్రపంచము దేవుని యొక్క వాక్యము ద్వారా నిర్మింపబడెను. అది దేవుని యొక్క వాక్యము ద్వారా రూపమియ్యబడెను. ప్రపంచమును ఒక్కటిగా ఉంచగల ఒకే ఒక కార్యము దేవుని యొక్క వాక్యమై యున్నది, ఏలయనగా హెబ్రీయులు చెప్పుచున్నది, "దేవుని వాక్యము ద్వారా ప్రపంచము నిర్మించబడియున్నది." జనులు దేవుని వాక్యమును సందేహించుచున్నారు, మరియు మీరు కూర్చొనియున్న ఈ ధూళి దేవుని యొక్క వాక్యము ప్రత్యక్ష్యమగుటవలన కూడినది. మీరు కూర్చొనియున్న కుర్చీలు దేవుని యొక్క వాక్యము యొక్క ప్రత్యక్షతయే. దేవుడు దానిని పలికెను మరి అది నెరవేరవలసి యున్నది, ఏలయనగా అది దేవుని యొక్క వాక్యమై యున్నది.

ఇప్పుడు ఈ ప్రపంచమును ఒక్కటిగా ఉంచబోవునది, ఒక రాజకీయ పద్దతి కాదు, ఒక ఐక్యరాజ్య సమితి కాదు, ఈ సంస్థలలో ఏదియును కాదు. ప్రపంచమును ఏకముగా నుంచునది దేవుని యొక్క వాక్యము మాత్రమే. ఈ దినమున నేను మీకు సిఫారసుచేయు కార్యము ఏదనగా, ప్రపంచము ఇప్పుడు చిన్నాభిన్నముగా పడిపోకుండా ఉంచగల కార్యము, మరల దేవుని యొక్క వాక్యము నొద్దకు పోవుటయే. అదియే దేవుని యొక్క ప్రణాళిక, ఎల్లప్పుడును.

GEN 3:4

 

48ఏదెను తోటలో సాతానుడు హవ్వనొద్దకు వచ్చి చెప్పెను, "నీవు ఆ వృక్షము యొక్క ఫలమును తీసికొనవచ్చును."

మరియు ఆమె చెప్పెను, "అయితే ప్రభువు తినకూడదని చెప్పెను."

అతను చెప్పెను, "ఓ, నిశ్చయముగా నీవు చనిపోవు." చూడుడి, అతనికి తెలియును జనులు రక్షణార్ధమైన కోటలోనున్నంత వరకు!

మనము ఉండవలసిన రక్షణార్ధమైన కోట అదియే, వాక్యము. చూశారా, మనము వాక్యము ద్వారా చుట్టబడియున్నాము. వాక్యము మీలో నున్నది; దేవుడు మీలో నున్నాడు, మీ చుట్టునున్నాడు. మీరెక్కడికి పోయినను, అది వాక్యమై యున్నది, వాక్యము! ఆయనను ఎల్లప్పుడును మీ ముందు నుంచుకొనుడి. గుర్తుంచుకొనుడి, ప్రతిచోటును ఆయన ఉన్నాడను స్మృతితో నుండుడి. హవ్వ మరియు ఆదాము ఆ విధముగా నడచునంత వరకు మరణమే లేకుండెను. ఇప్పుడు పురుషుడైనను లేక స్త్రీయైనను ఆ విధముగా నడచినయెడల వారికి మరణమే లేదు, వారు నిత్యజీవమును కలిగియున్నారు. మరియు మీరు గనుక వాక్యము ద్వారా చుట్టబడి మరియు వాక్యమును కాచుకొనియున్నంత వరకు మీకు నిత్యజీవము కలదు.

MATT 24:24•

MARK 13:22

 

49ఇప్పుడు గమనించుడి, వాక్యముతో ఈ లోక జ్ఞానము పోటీకి వచ్చినప్పుడు హవ్వ ఆ అడ్డును త్రుంచివేసెను. మరియు సాతానుడు దానిని కనుగొనినప్పుడు, ఆ చోటు అతను మానవ జాతిని పడగొట్టెను, సరిగా ప్రతిసారియు ఆ చోటనే అతను పడగొట్టుచు వచ్చెను. అంత్యక్రీస్తు ఆత్మ కూడా ఆ విధముగానే నున్నది, ఈ కడపటి దినములలో అది వీలైతే ఏర్పరచబడిన వారిని సహితము మోసపుచ్చులాగున్నది, అతను మతము యొక్క రూపములో వచ్చుచున్నాడు. ఇప్పుడు కమ్యూనిస్టు పార్టీయని మరియు అటువంటి కార్యము ఏదియును లేదు, అది అందరిని వెర్రివారిని చేయలాగున్నది; చెప్పాలంటే వారు దేవునికి విరోధముగా నుండెను, అయితే అది అంత్యక్రీస్తు కాదు. అంత్యక్రీస్తు యనునది మతమునకు సంభంధించినది, అది నిజమైన దానికి చాలా సమీపముగా నున్నది, వీలైతే ఏర్పరచబడిన వారిని మోసపుచ్చులాగున్నది.

MATT 10:1

 

50ఇస్కరియోతు యూదాను చూడుడి, సంఘముతో కూడా నడిచెను మరియు క్రీస్తును ప్రకటించెను. తక్కిన వారు చేసినదంతయును - అతను కూడా చేసెను, బయటికి వెళ్లి మరియు దయ్యములను వెళ్ళగొట్టెను, మరియు తిరిగి వచ్చి వారితో కూడా చేరి ఆనందించెను. సరిగా మత్తయి 10న అధ్యాయము. అయితే పెంతెకోస్తు స్థలమునకు వచ్చినప్పుడు, నిత్యజీవమును పొందబోవు సమయము వచ్చినప్పుడు, అతను తనయొక్క నిజస్వరూపమును చూపించెను.

మరియు ఈ రోజు ఆ విధమైన స్థితికి వచ్చియున్నది. మీరు ఏ సంఘములోనైనను చేరుటకు దయ్యము మిమ్ములను అనుమతించుచున్నది. అయితే మీరు పరిశుద్దాత్మను పొందవలసిన సమయము వచ్చినప్పుడు, వాడు కేకలేసి చెప్పును, "అది పరిశుద్ద గుండ్రాళ్ళ గుంపు," లేక ఆ విధముగా ఏదో చెప్పును. వాడు దానితో ఏదైనా చేయుటకు ఏ విధమైన కార్యము లేదు. మరియు యూదాయ అతని పద్దతులును ఆ ఘడియ వరుకు దానిని వెంబడించుచుండిరి. ఏలయనగా అక్కడే యూదా ప్రపంచమును మోసపుచ్చును, ఆ చోటు వరకు, అయితే అక్కడ అతను నటించలేకపోయెను. అక్కడే ఎన్నుకొనబడిన వారున్నారు. ఇప్పుడు, అతను అంతవరకు చాలా సమీపముగా వచ్చెను, అయితే అతను తక్కినవారివలె రాలేకపోయెను. ఏలయనగా, అతను ఆ విధముగా కడపటి వరకు వచ్చియుండిన యెడల అతను మీకు సహోదరుడై యుండెడివాడు, కావున అతను దానిని చేయలేకపోయెను.

ఎవరో చెప్పిరి, "మీకు తెలియునా, దయ్యము నన్ను పట్టుకొనెను." కానే కాదు, వాడు ఆ విధముగా చేయడు.

JOHN 5:24•

EPH 1:13•

EPH 4:30•

COL 3:3

 

51మీరు వాడిని వెంబడించి వాని వెనుక పోయిరి. వాడిని లోనికి వచ్చి మరి మిమ్ములను పట్టుకొన లేదు. ఏలయనగా, "మీరు చనిపోయున్నారు, మరియు మీ యొక్క జీవితము దేవునిలో మరుగు చేయబడియున్నది, మరియు పరిశుద్దాత్మ ద్వారా ముద్రింపబడియున్నారు." అక్కడికి మీరున్న చోటికి వాడు రావలయుననిన ఉన్న ఒకే ఒక మార్గము - మీరు వచ్చిన విధముగానే వాడు కూడా రావలయును. కావున వాడు మిమ్ములను ఆహ్వానించిన వెంటనే, మీరు వానియొద్దకు వెళ్ళియున్నారు. అది అంతే, చూశారా. వాడు మీ వెనుక రాలేదు. వాడు మీ యొద్దకు రాలేడు, ఏలయనగా మీరు క్రీస్తునందున్నారు, మీరు మీకు చనిపోయున్నారు. ఆమేన్. నేను నాకుగా ఆమేన్ అని చెప్పుట లేదు, అయితే దాని అర్ధము "ఆ విధముగానే జరుగును గాక." మరియు అది సత్యమని నేను ఎరిగియున్నాను, దానిని అనుభవించియున్నాను మరియు అది సత్యము. మీరు క్రీస్తును అంగీకరించుట - అది మరణము నుండి జీవమునకు దాటుట అయి యున్నది. మంచది.

52ఇప్పుడు మనము కనుగొనియున్నాము, ఆ మతసంబంధమైన ప్రపంచము ఆ దినములలో చిన్నాభిన్నముగా పడిపోయెను మరియు ఆ విధముగానే ఎల్లప్పుడును జరుగుచుండెను. మరియు ఎందులకు? ఏలయనగా, రాబోవుచున్న ప్రవక్తలు మరియు రాబోవు మెస్సీయా వారు అనుకొన్న విధముగా వారియొక్క వేదపండితులు వారికి బోధించినరీతిగా వారు రాలేదు. వారు… అది వారు తలంచినట్లు లేదు.

మరియు ఈ దినమున కూడా ఆ విధముగానే నున్నది. మరియు అందువలననే ఈ రోజు మనము ఎదగకుండా నున్నాము, ఏలయనగా దేవుని యొక్క కదిలింపు, సంఘములలో దేవుని యొక్క కదిలింపు ఏ విధముగా నుండునని వారు అనుకొనియున్నారో మరి ఆ విధముగా అది లేదు. వారు చిత్రీకరించుకొని యున్నారు, "ఒక కాలములో ఫలానా - ఫలానా కార్యములు జరుగునని, మరియు నిజమైన ముఖ్య భాగమైనది వచ్చునప్పుడు, అప్పుడు వారు దానిని నిరాకరించుచున్నారు, చూచారా.

మరియు మీరు విద్యుచ్చక్తి జనక యంత్రమును (dynamo) నిరాకరించి మరి విద్యుచ్చక్తి వైర్లును ఉంచిన దానివలన ఏమి ప్రయోజనము కలదు? చూడుడి, దానిలో విద్యుచ్చక్తి లేదు, అది ఒక చచ్చిన వైర్లు. ఈ దినమున సంఘముల యొక్క స్థితి కూడా అట్లేయున్నది. మనము కూడ అన్ని వైర్లు కలిగియున్నాము మరి బల్బును నొక్కిన వెంటనే దానిలో జీవము లేదు. మనకు కావలసినది ఇప్పుడే దానితో జతపరచబడ వలయును. క్రీస్తుతో మన జీవితములను మన ఉద్రేకములను, మన తలంపులతో జీవించు కార్యములను సమస్తమును క్రీస్తుతో మనలను మనము చేర్చుకొనవలయును.

LUKE 2:49•

ROM 3:4•

PHIL 2:5

 

53మీరు చెప్పవచ్చును, "సరి, నేను మీకు చెప్పెదను, నేను నమ్ముచున్నాను నేను…" మీకు ఏమియును లేదు… మీకు ఎటువంటి తలంపు వచ్చుట లేదు. మరి అది సరియే. మీరు చెప్పవచ్చును, "నేను దీనిని తలంచుచున్నాను. మరియు నేను…" మీకు ఒక ఆలోచన కూడ లేదు. నాకు కూడా లేదు.

పరిశుద్ద గ్రంథము చెప్పుచున్నది, "క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగియుండుడి." మరియు ఆయన ఎల్లప్పుడును తండ్రి పని మీద నుండెను. కావున ఆ తలంపు మాత్రమే మీరు కలిగియుండవలయును, ఎవరో ఏమో చెప్పినారని కాదు, మరి దేవుడు దానిని గురించి ఏమి చెప్పెనోయని యుండ వలయును. అయితే దేవుడు ఏమి చెప్పెనో దాని కార్యము అంతే. ఆయన చెప్పెను, "ప్రతి మనుష్యుని మాటయు అబద్దము మరి నా మాటలు సత్యములని," చూశారా.

ఆ కార్యమే ప్రపంచమును తిరిగి చేర్చునది, అయితే వారు దానిని అంగీకరింపరు. ఇప్పుడు మనకు తెలియును వారు చేయరు, ఏలయనగా వారు దానిని ఎన్నడును చేసియుండలేదు. అది సరి. ఆ విధముగానున్న యెడల మనము ఆశ్చర్యపడుచున్నాము, ఈ దినమున దానికి జవాబు ఏమనగా, ఈ దినమున కేక ఏమిటనగా, మెస్సీయా వచ్చుటకు సహాయపడవలయునని అరచు కేక. మరియు నేను నమ్ముచున్నాను కొన్ని సమయములలో మనకు ఆ విధముగా కేకలేసినయెడల, దానిని ఆయన పంపించిన యెడల, అప్పుడు వారు చేసిన విధముగానే మనము కూడా చేసెదమాయని నేను ఆశ్చర్యపడుచున్నాను.

AMOS 5:21

 

54మన రాజకీయములన్నియును, మతసంబంధమైనవనియు మరియు సంయుక్త జీవితములలో మరి ఆ విధముగా సమస్తమును కలుషితమై యున్నది. భూమిపైనున్న ప్రతియొక్క మతసంబంధమైన మానవ కల్పిత పద్దతులు పలు విధములైన ఫ్యాషన్లతో కల్పింపబడి మనుష్యులకు అనువుగా పద్దతులు మార్చబడి మనయొక్క ఆరాధనను సమస్తమును కలుషితము చేయబడియున్నది. ప్రతియొక్కరును వారియొక్క స్వకీయమైన ఆలోచనలను కలిగియున్నారు. అవెట్లున్నవనగా దేవుడు బలమైన ప్రవక్తను పంపినప్పుడున్న దినములవలె నున్నవి, యెషయా చెప్పెను, "మీ యొక్క బలులు మరియు ఇతర కార్యములు నా యొక్క నాసికా రంధ్రములకు కంపుకొట్టుచున్నవి."

చూడుడి, దేవుడు ఇశ్రాయేలును మొదట ఒక బలిని అర్చింపమని వారికి చెప్పినప్పుడు అది ఒక గొప్ప కార్యముగా నుండెను. మీరు ఊహించుకొన వచ్చును, ఒక యూదుడు ఒక చిన్న గొర్రెపిల్లను, ఒక క్రొవ్విన చిన్న గొర్రెపిల్లను లేక ఒక ఎద్దును లేక దేనినైనను తీసికొని దారిలో పోవుచుండుటను. అది ఒక పస్కా బలి, మరియు అతను పోవుచుండగా, తన చేతులను దానిపై నుంచి - ఆ బలితో అతనిని జతపరచుచున్నది, అతను తన చేతులను ఆ బలిపై నుంచినప్పుడు, తనను తాను ఆ బలితో గుర్తించుకొనుచున్నాడు. యాజకుడు ఆ మృగమును, చిన్న గొర్రెపిల్ల, అది ఏమైనను - దానిని చంపుచున్నాడు. మరియు ఆ చిన్న గొర్రెపిల్ల చనిపోవునప్పుడు, అది కాళ్ళను తన్నుకొనుచు మరియు చావుకేక లేసి అరచుచు మరణించేటపుడు మరియు దాని రక్తము అతని చేతులపై చెదరును.

మరి చనిపోయేది తనకోసమేనని ఆ ఆరాధనను చేయునతడు తన మనస్ఫూర్తిగా దానిని ఎరిగియున్నాడు. అయితే ఇక్కడ గొర్రెపిల్ల అతని యొక్క స్థానమును తీసికొనుచున్నది. యెహోవా కోరునది అదియే, ఏలయనగా క్రీస్తునకు అది ఒక సాదృశ్యముగా నున్నది. అయితే ఒకప్పుడు భయభక్తులతో చేయు కార్యము కాలక్రమేణా ఒక కుటుంబ పారంపర్యముగా మారినది. వారు ఆ విధముగా గొర్రెపిల్లను అర్పించుచుండిరి, అయితే దానిని గురించి వారికి విధేయత లేకుండెను. దేవుడు చెప్పెను, "అవి నా యొక్క నాసికా రంధ్రములకు కంపుకొట్టుచున్నవి."

55మరియు ఈ రోజు! సంవత్సరములకు క్రితము జనులు ఎంతో నిష్కపటముగా ఆరాధించుటను మనము కనుగొనియున్నాము. మరియు ఈ దినమున అది ఒక గొప్ప హాలివుడ్ సినిమా వలె ఆకర్షణీయమైన కార్యములవలెనున్నది, అది ఒక తర్ఫీదు పొందిన వాయిద్యమువలె నున్నది; మరియు స్త్రీలు వేదికలపై, బిగుతైన దుస్తులు ధరించుకొని, శరీరవయములను కనబరచుకొనుచు మరియు వేదిక చుట్టును నటనమాడుచున్నారు; విధేయత లేదు, మరియు… కేవలము బహిరంగముగా అవమానపడులాగున, క్రైస్తవులమని చెప్పుకొనుచు - ఇటువంటి సిగ్గుమాలిన పనులు చేయుచున్నారు. మన యొక్క అర్పణలు, బలులు మరియు మన యొక్క బేధములు కూడ మరల ఆయన యొక్క ముక్కులకు ఒక రకమైన కంపు కొట్టుచున్నవాయని నేను ఆశ్చర్యపడుచున్నాను!

56అది అవమానకరముగా నున్నది, శత్రువు మన యొక్క అమెరికను స్త్రీల దుస్తులు తీసివేసి వారు వీధులలో అర్థనగ్నముతో తిరుగులాడుచున్నారు. ఎందులకు, అది అవమానకరము. ఈ రోజున చిన్న బాలురు మరియు చిన్న బాలికలు ఆ విధమైన అసభ్యమైన స్త్రీలను అనుసరించుటలో ఆశ్చర్యము లేదు! వారు ఎల్లప్పుడును నాలుగు లేక ఐదు మార్లు వివాహము చేసికొనిన హాలివుడ్ స్త్రీలను అనుసరించుటకు ప్రయత్నించుచున్నారు. మరియు ఆమె ఒక విధమైన అసభ్యమైన దుస్తులను వేసికొని బయటికి వచ్చుచున్నది మరియు దేశములో నున్న చిన్న అమ్మాయిలందరును దానినే అనుసరించుచున్నారు. ఎటువంటి దయనీయమైన స్థితి! అది చాలా అసహ్యముగా నున్నది. అవునయ్యా. అది చాలా అసహ్యము, మరియు అది సంఘములోనికి వచ్చియున్నది. ఒక తల్లిగా ఉండుటకుగాను దేవుడు స్త్రీకి ఇచ్చిన సుశీలత చెడగొట్టుకొన్నది.

మరియు అది దేశమనకు వెన్నెముకగా నున్నది. మీరు గనుక మాతృత్వమును విచ్చిన్నము చేసినయెడల మీరు అప్పుడు దేశమును విచ్చిన్నము చేయుచున్నారు. ఒక్కటిగా నుంచు ఒకే కార్యము నిజమైన స్వచ్చమైన తల్లి తండ్రులు పెంపకమైయున్నది.

57నేను వచ్చునప్పుడు కారును నడుపు వానితో మాటలాడుచుంటిని. అక్కడున్న తుంటరి పిల్లలను గురించి మేము మాటులాడుకొనుచుంటిమి. మరియు అతను చెప్పెను, "నేను అనుకొనుచున్నాను, వారు ఆ విధముగా నుండుటకు వారి తల్లిదండ్రులే కారణమై యున్నారు."

నేను "ఆమేన్" అని చెప్పాను. అయ్యా, నీవెవరవు అని నాకు తెలియదు, అయితే నీవు సరైన మార్గములో నున్నావు." మరియు నేను చెప్పాను, "అది సరియే." నేను చెప్పాను, "అది చాలా ఘోరముగా నున్నది, వారు గృహములలో నుండి పరిశుద్ద గ్రంథమును తీసివేసి మరి పేకాట ఆడు కార్డులను వారికి ఇచ్చుచున్నారు."

మరియు అది సంఘములో ఆరంభమైయున్నది. నేను కొన్ని క్షణములకు మునుపు ఎలివేటర్ దగ్గర నిలుచుకొని యుంటిని; మరియు అక్కడున్న ఒక స్త్రీ ఇంకొకరితో మాటలాడుచు చెప్పెను, "సరి, నీకు తెలియునా, అతను చెప్పెను, "ఇది చాలా అద్భుతమైన కార్యము, మన సంఘము ఒక కార్డు పార్టీని ఇచ్చియున్నది," మరియు అక్కడ ఆ సంఘములో ఒక కృతజ్ఞతగా టర్కీ కోడి విందును ఇచ్చుచున్నది, ఇది ఒక ప్రాటెస్టెంటు సంఘములో జరుగుచున్నది. ఓ, మై! జూదమాడుట, లాటరీలు, బంకో, డాన్స్ లు. ఓ, కాలము ఈ విధముగా నున్నది, సంఘమును సంతోషపరచుటకు జనులు ఆ విధమైన కార్యములు చేయవలసియున్నది!

తిరిగి-జన్మించిన సంఘమును, పరిశుద్దాత్మ నిత్యజీవముతో సంతోషపరచును.

58అయితే జనులకు అది అక్కర లేదు, ఏలయనగా వారు ఉల్లాస కార్యక్రమములలో మునిగియున్నారు. వారు పొందియున్నట్లుగా కార్యములు ఆ విధముగా అసహ్యముగా సంభవించుచున్నవి. చాలా కాలము క్రిందట ఎంతో కాలము క్రిందట స్త్రీల యొక్క సుశీలత మరియు వారి యొక్క చక్కటి దుస్తుల అలంకరణ యావత్తును హాలివుడ్ దేవత విగ్రహము ముందు తలవంచి దానికి తలవగ్గి యున్నది. అది సత్యము. ప్రపంచము మరి అటువంటి స్థితికి దిగజారియున్నది. అది చూచుటకు ప్రపంచమును జాలిపడులాగున్నది. దేశముల యొక్క వెన్నెముక విరిగిపోయున్నది. అసభ్యముగా నుండుట అనేక మార్లు ఇప్పటి తీరుగాను మరియు నవీనముగాను నున్నది; ప్రజలు దుస్తులు ధరించుకొని వీథులలో పోవుచున్నారు. పరిశుద్ద గ్రంథము ఏమి చెప్పుచున్నదని మీకు తెలియునా?

నేను మీకు చెప్పుచున్నాను, దానిని గురించి నేను ఒకసారి మాటలాడుచుంటిని మరియు ఒక ప్రసిద్ధి చెందిన వాక్యపరచారకుడు నాతో చెప్పెను, అతడు అడిగెను, "మీరు స్త్రీలను గురించి వారు ఇది చేయుచున్నారు - అది చేయుచున్నారని ఏల చెప్పుచున్నారు?" మరియు నేను అతనితో చెప్పాను, నేను… అతను చెప్పెను, "ఏ విధముగా వారు ప్రవక్తిణిలుగా నుండవలయునో, మరియు అటువంటి కార్యములను మీరు వారికి బోధింపవలయును."

నేను చెప్పాను, "ఎ,బి,సి కూడా నేర్చుకోనివారికీ, నేనేలాగు ఆల్జీబ్రాను బోధింపగలను, ఎల్లప్పుడును క్రిస్తుని నమ్ముడి, (Always Believe Christ) ఎ-బి-సి ( A - B - C). కావున మరి నేను చెప్పాను, "మీరు దానిని ఏలాగు చేయగలరు?"

59మరియు ఈ కార్యములన్నియును ఒక గొప్ప కలగలుపుగా ఉండి అవి సంఘములోనికి మొలకెత్తి యున్నవి. పెంతెకొస్తులైన మన మధ్యలోనికి జొరబడి యున్నవి, అది చాలా తప్పైన కార్యములుగా నున్నవి. ఓ, జనులారా, నిలువుడి! ఇప్పుడు, మీరు నన్ను ఒకవేళ మూడుడని పిలువవచ్చును, అయితే న్యాయతీర్పు దినమున మీరు నన్ను కరచాలనము చేసెదరు. మరియు నేను మిమ్ములను దైవీక ప్రేమతో ప్రేమించుచున్నాను. మరియు మీరు సరిగా క్రమముగా నుండవలయునని నేను మిమ్ములను కోరుచున్నాను, స్నేహితులారా. అటువంటి కార్యములలో సందేహముగా నుండుట వలన ఏమి లాభము?

ఒక స్త్రీ నాతో చెప్పెను, "సరి, మిస్టర్ బ్రెన్హాం వారికి తెలియదు, వారు … మరి అటువంటి దుస్తులనే వారు స్త్రీలకు తయారు చేయుచున్నారు."

నేను చెప్పాను, "వారు ఇంకను వస్త్రములను అమ్ముచున్నారు, మరియు కుట్టు మిషన్లను అమ్ముచున్నారు." మీరు, ఆ విధముగా చెప్పలేరు, మీరే బట్టలు కుట్టు మిషన్లలో కుట్టుకొనవచ్చును, చూశారా. అది సరియే.

MATT 5:28

 

60చూడుడి, మరి ఈ విధముగా నేను మీకు ఇంకొక కార్యమును చెప్పనిమ్ము. మీకు తెలియునా, మీరు ఆ విధముగా అసభ్యముగా దుస్తులు ధరించుకొనిన యెడల మరియు ఎవరైనను పాపియైన వ్యక్తి వీధిలో మిమ్ములను తప్పైన అభిప్రాయముతో చూచినయెడల, ఆ పాపితో మీరు వ్యభిచరించినందులకు గాను మీరు న్యాయతీర్పు దినమున బదులియ్యవలెను. మీరు మీ భర్తకు చాలా మంచి పవిత్రులుగా నుండవచ్చును, మీ యొక్క మగ స్నేహితునికి మీరు ఉండవలసిన౦త నమ్మకముగా మరియు పవిత్రముగా నుండవచ్చును, అయితే దేవుని దృష్టిలో మీరు వీధిలో పోవు వేశ్యగాయు౦దురు.

మీరు అడుగ వచ్చును, "అది సరియేనా? బ్రెన్హాం సహోదరుడా, దానిని వాక్యముతో నిరూపింపుము. అది వాక్యమైనయెడల దేనినైను అడుగుడి అని మీరు చెప్పియున్నారు." అవునయ్యా.

యేసు చెప్పెను, "ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడును ఆమెతో అదివరకే హృదయములో వ్యభిచరించియున్నాడు." మరియు మీరు గనుక ఆ విధముగా మిమ్ములను బయలుపరచుకొనిన యెడల, దానికి కారణము మీరే. అది ఖచ్చితముగా సరియే. మీరు మీ వరకు నిర్దోషులుగా నున్నప్పటికిని, ఆ విధముగా మిమ్ములను మీరు ఆ పాపియైన మనుష్యునికి మిమ్ములను చూపించుకొనియున్నారు. దానికై అతను బదులు చెప్పునప్పుడు, మీరు అపరాధులుగా ఎ౦చబడెదరు. ఓ, మీరు వస్త్రములను తీసి కప్పుకొనుడి, మరియు గౌరవింపదగిన స్త్రీలవలె వ్యవహరించుడి. అది సరియే.

MATT 7:16

 

61మరియు పురుషులారా, మీ యొక్క భార్యలను అటువంటి కార్యము చేయుటకు అనుమతించుచున్నారు, ఆ విధముగా దుస్తులు ధరించుకొనుటకును అనుమతించుచున్నారు, మీపై మీకు గౌరవము లేదా లేక ఆమెపై మీకు గౌరవము లేదా, లేక ఒకరిపై ఒకరికి గౌరవము లేదా? మై! మీ యొక్క భార్య కూర్చొని ఇంటిలో సిగరెట్టు కాల్చుచుండగా, మరి దానిని ఖండించక, మీరెమైయున్నారు? మరియు మిమ్ములను మీరు ఒక క్రైస్తవుడని పిలుచుకొనుచున్నారు? ఓ, దానిని నేను అర్ధము చేసికొనలేకున్నాను.

మీరు చెప్పవచ్చును, "సరి, ఒక నిమిషము ఆగుము, 'వారి ఫలముల వలన మీరు వారిని ఎరిగెదరు.'" దానిని గురించియే నేను మాటలాడుచున్నాను, చూశారా. అది సరియే, మీరు గనుక ప్రభువును మీ హృదయమంతటితో ప్రేమించినయెడల!

మీరు చెప్పవచ్చును, "సరి, సిగరెట్టును నేను కాల్చవలయును. అది నా యొక్క ఆనందము." మీ యొక్క ఆనందమా?

నా యొక్క ఆనందము ప్రభువులో కలదు. మీరు గనుక లోకమునకు చనిపోయినయెడల మీ యొక్క ఆనందము ప్రభువునందు కలదు. దేవుడు నా యొక్క సంతోషము. ఆయనే నా యొక్క సమాధానము. ఆయనే నా యొక్క బలి. ఆయన నా యొక్క దేవుడు. ఆయన నా యొక్క ప్రేమ. ఆయనే నా సమస్తము మరియు నాకు కావలసినదంతయును, మరి నేను క్రీస్తునందు పొందుచున్నాను. దప్పిగొనుచున్నాను! ఓ, మై!

HEB 11:10

 

62[ఒకరు అన్య భాషలో మాట్లాడుచున్నారు]. భయభక్తులతో నుండుడి. మీకు తెలియునా అటువంటి కార్యములపై మనము కాచుకొని యుండవలయును. మరి ఆత్మ పలుకుచున్నప్పుడు, ఒక వర్తమానమును ఇచ్చుచున్నప్పుడు, ఏదో ఒక ముఖ్యమైన కార్యము నెరవేరవలసినదిగా యున్నది, చూశారా. [ఒకరు దానిని వాఖ్యానించుచున్నారు]. ఆమేన్. ఆమేన్. మరియు జనులు చెప్పుచున్నారు, "ఆమేన్."

ఇప్పుడు గుర్తు౦చుకొనుడి, నేను గనుక సరైన వ్యాఖ్యానమును పొందియున్నయెడల, మనము జనులను హెచ్చరింపవలయును, చూశారా, ప్రభువు యొక్క రాకడ గురించి మరియు మనము వారిని హెచ్చరించెదము, హెచ్చరించునప్పుడు మరి దాని వెనుక సరైన జీవితము ఉండవలయును. ఏలయనగా మీరు ఎట్లైనను జీవించుచు మరియు వారితో మాటలాడలేరు మరియు వారికి చెప్పను లేరు. అతను జీవించుచున్నాడు మరి మీరును జీవించుచున్నారు, చూడుడి. మనము మనలను సరిచేసికొనెదము మరియు సిద్ధపడెదము, ఏలయనగా ఈ కార్యములను మనము తెలుసుకొని జరుగబోవుచున్న ఒక గొప్ప కార్యమునకు మనము సిద్ధముగా నుండవలయునని పరిశుద్దాత్మ మనలను కోరుచున్నదని నేను నమ్ముచున్నాను. అవును. అవునయ్యా.

ఈ సమయమున, ఇప్పుడు ప్రపంచము చిన్నాభిన్నమై పడిపోవుచున్నది. సమస్త పద్దతులును పడిపోవుచున్నవి. అదెందులకు? అది ఆ విధముగా నుండవలయును, చూశారా. అది, "దేవుడు దేనికి శిల్పియు, నిర్మాణకుడునై యున్నాడో ఆ పట్టణము కొరకై మనము ఎదురుచూచుచున్నాము," మరి ఏ భూమి-సంబంధమైన కార్యములన్నియును దానికి విడచిపెట్టబడవలయును.

PHIL 4:19

 

63ఇప్పుడు ఈ యాత్రలో మనకు కావలసిని అక్కరలన్నియును దేవుడు సమకూర్చునని మనకు వాగ్దానము చేసియున్నాడని మనము కనుకొనియున్నాము. అది సరియేనా? అయితే, గుర్తుంచుకొనుడి, ఆయన ఒక షరతుపై మాత్రమే వాటిని మనకు అనుగ్రహించుచున్నాడు. మొదట ఆయన షరతును మనము పూర్తి చేయవలయును. మనము గనుక ఆయన షరతును నెరవేర్చకున్నయెడల, ఆయన మన షరతులను నెరవేర్చడు. మనము సరైన కార్యములను మొదలు చేయవలయును, అడుగు నుండి దానిని కట్టుకొనుచు రావలయును. అది ఖచ్చితముగా సరియే. మనము పై నుండి ప్రారంభించి క్రిందికి రాలేము. మనము క్రింద నుండి ప్రారంభించి మరియు కట్టుకొనుచు రావలయును. క్రిందికి మరల పోవుడి. ఇప్పుడు ఆయన మనయొక్క షరతును నెరవేర్చును. ఆయన వాగ్ధానములన్నియును షరతులపై నున్నవి.

అయితే మనయొక్క పారంపర్యాచారముల వలన మనము దీనిని మార్చివేయుచున్నాము. దేవుని మరి ఏదో విధముగా మనము తయారు చేయుటకు ప్రయత్నించుచున్నాము. "ఈ విధముగా చేసిన బాగుండును, లేక అటు చేసిన ఇంకొద్దిగా బాగుండునని లేక దానిని జనులు ఈ విధముగా అనుకొనుచున్నారని మనము మన యొక్క పారంపరాచార్యములను వాక్యములో దూర్చుచున్నాము.

ఇప్పుడు నేను ఇక్కడున్న ఈ సంఘమునకు, ఈ గుంపు జనులకు మాత్రము మాట్లాడుట లేదు. ప్రపంచమంతటికిని నేను మాటలాడుచున్నాను. మేము ఏమి చెప్పుచున్నామో, మరి అవన్నియును టేపు చేయబడి ప్రపంచమంతటను పోవుచున్నవి.

64మనము కోరునవన్నియును అనుగ్రహింపబడవలయునని కోరుకొనుచున్నాము, అయితే ఆయన మన అవసరములను మనకు కావలసినవాటిని సమకూర్చును మనము మనము కోరునవన్నియును మనకు అనుగ్రహింపబడవలయునని కోరుచున్నాము, మరియు ఆయన మనకు కావలసిన అవసరములను మనకు అనుగ్రహించును. మనకు ఏమి కావలయునో ఆయనకు ఎరుగును. మరియు మనము నిశ్చయముగా ఎరిగియున్నాము, ఈ దినమున ప్రపంచము మన యొక్క సాంప్రదాయుముల ప్రకారము అది మనకు వచ్చిన దానిని అంగీకరించును. ఓ, బాప్టిస్తులు చెప్పుటకు ఇష్టపడుచున్నారు, "దానిని మేము ఎట్లు నమ్ముచున్నామో ఆ విధముగానున్నయెడల, మీరు చూడుడి మీరందరును తప్పే." మెథడిస్తులు చెప్పెదరు, "బాప్తిస్తులైన మీరు తప్పు, అది మేము నమ్ముచున్న ప్రకారము ఆ విధముగా నమ్ముచున్నాము." అయితే నేను ఊహించుచున్నాను, మనమందరమును తలంచు దానికన్నను వేరు విధముగా అది వచ్చును. అది సరియే. దానిని దేవుడు ఏ విధముగా నిర్ణయించియున్నాడో మరి ఆ విధముగానే అది వచ్చును, మరియు దానిని తీసివేసి అది ఆ విధముగా నుండునని మానవ తలంపు ప్రకారము అది ఉండదు. ఇప్పుడు మీరు…

65ఈ దినమున మనము ఆశ్చర్యపడుచున్నాము, ఏల, ఎందులకు ఏ విధముగా వరములు మరియు ఆ కార్యములు సంఘములో పనిచేయవలెనో ఆ విధముగా పనిచేయుట లేదు. సంఘములో వరములు ఎందులకై ఉంచబడినవనగా, పాపమును వేరుపరచి మరి తీసివేయుటకై, సంఘమును పరిశుభ్రముగా నుంచుటకై, అది సంఘమునకై ఇవ్వబడిన దేవుని యొక్క టాక్సిన్. మరియు అది సంఘమును శుభ్రపరచుటకై, సంఘములో నుండి సంఘమును చీల్చు మలిన-పురుగులను దేవుడు శుభ్రపరచు సాధనమైయున్నది. మరియు దేవుడు ఆయన వాక్యమును ఆయన సంఘముపై వెదజల్లును. సంఘమును ఒక మంచి వృక్షముగా పెరుగులాగున చేయుటకు మరియు ఆ వాక్యమును చెరచు పురుగులను దూరముగా నుంచును. మరియు దానిని చేయుటకు ఏమి కావలయునని దేవునికి తెలియును. సరి, మీరు చెప్పవచ్చును…

66అది ఎట్లున్నదనగా, ఒక చిన్న బిడ్డ మీరు గడ్డము, గీసుకొనుచుండగా మీ యొక్క బ్లేడు కొరకు ఏడ్చులాగున్నది. మరియు మీ యొక్క చిన్న బిడ్డ, "బ్లేడు నాకివ్వు డాడీ," అని కేకలేయుచున్నది! నాకు ఆ క్షవరపు కత్తి ఇయ్యుడి." మీ యొక్క చిన్న కొడుకు రెండు లేక మూడు సంవత్సరముల వయస్సుగలవాడు, అరచుచున్నాడు, మరి క్రిందికి పైకి నేలపై గంతులు వేయుచున్నాడు, "నాకు క్షవరపు కత్తి నియ్యుడి!" సరి, మీకు బాగుగా తెలియును, దానిని అతనికి ఇవ్వ కూడదని. సరి, మీరు ఆ బిడ్డకు ఆ బ్లేడును ఇవ్వరు. దానిని ఏ విధముగా ఉపయోగింపవలయునో, ఆ బిడ్డకు తెలియదు.

మరియు ఆ కారణము వలననే మనము ముందు కలిగియున్నట్లుగా ఎక్కువగా దైవీకవరములను కలిగియుండలేదు. సంఘ శాఖలో వారు ఆ వరములను ఒక పారంపర్యముగా కలిగియున్నారు. దానిని ఏ విధముగా ఉపయోగింపవలయునో, వారికి తెలియదు. దానితో ఏమి చేయవలయునని దేవునికి తెలియును. మీరు చెప్పవచ్చును…

ఆ చిన్న బాలునికి మీరు కవరపు బ్లేడును ఇచ్చుటకు నిరాకరించియుండ వచ్చును, అప్పుడు ఆ బాలుడు మీతో చెప్పవచ్చును, "తండ్రీ, దానిని మీరు ఉపయోగించుట నేను చూచియున్నాను." అయితే, చూడుడి, మీరు వయస్సులో ఎదిగియున్నారు, దానిని ఎట్లు ఉపయోగింపవలయునో మీకు తెలియును.

మరియు ఆ విధముగానే సంఘము తప్పటడుగులు వేయు చిన్న బిడ్డ నుండి పెరిగి పెద్దదై, మంచి సద్గుణములు కలిగిన దేవుని యొక్క కుమారులు మరియు కుమార్తెలుగా మారుచున్నారు, అప్పుడు కార్యములు వేరే విధముగా నుండును. అవునయ్యా. సంఘము దేవుని కుమారులు మరియు కుమార్తెలుగా ఈ సమయమున ఎదిగి ఆ విధముగా నడచుచుండవలయును. మనము బోధింపవలసినవారమై యుండగా మనమింకను బోధింపబడుచునేయున్నాము.

67నాకు గుర్తుకు తెచ్చుచున్నది. నా యొక్క నల్ల జాతి స్నేహితులు నా యొక్క సహోదర, సహోదరిలు నేను చెప్పు ఈ భావమునకు నన్ను మన్నించెదరు. అనేక సంవత్సరములకు మునుపు దక్షిణ ప్రాంతమున వారు మనుష్యులను అమ్మెడివారు, అక్కడ దక్షిణ ప్రాంతమున బానిసత్వము ఉండెడిది. మరియు వారు ఆ బీద జనులను తీసికొని వెళ్ళి, ఒక ఉపయోగించిన కారును వేలము వేయునట్లు వారిని వేలము వేసెడి వారు. అమ్మినట్లుగా మీ యొద్ద ఒక రసీదు ఉండును, మానవ జీవితము.

ఏ మానవుడు మరొక మనుష్యునిపైన అధికారము చెలాయించుట ఎన్నడును దేవుని యొక్క చిత్తము కాదు. మనుష్యుడు చేసెను… దేవుడు మానవుని చేసెను, మరి మానవుడు బానిసలను చేసెను. మనమందరమును ఒకే వృక్షము నుండి వచ్చియున్నాము. మనము పసుపు రంగు, నలుపు, గోధుమ వర్ణము, ఎరుపు, లేక మనమెట్లున్నను - ఒకరి రక్తమును ఇంకొకరికి మార్చవచ్చును. మనమందరమును ఆదాము యొక్క సంతతిగా నున్నాము. మనము నివసించు దేశము మనయొక్క రంగును మార్చియున్నది. మనము నివసించు దేశమును బట్టి మన రంగు ఉండును, (కావున రంగు నివసించు దేశము యొక్క వాతావరణ మరియు శీతోష్ణ స్థితి వలన మారును.) దానితో చేయునది ఏమి లేదు. యేసు పాపిని రక్షించుటకు చనిపోయెను, అది ఎవరైనను - ఏ రంగు కలిగియున్నను ఫరవాలేదు.

68మరియు మధ్యవర్తి వచ్చి ఆ జనులను కొనెదరు. మీరు ఒక కారును కొనునట్లు, వారు వచ్చి అనేకులు ఉపయోగించిన కారును వారు కొనెదరు; దానిని కొని వేరెక్కడైనను దానిని అమ్మెదరు. వారు తోటల యొద్ద జనులు పనులు చేయుచుండగా వారిని గమనించెదరు, వారిలో ఎవరు బాగుగా పనిచేయుచున్నారనుటను చూచెదరు. అదియును గాక, ఎవరు బలమైన స్త్రీలు మరియు పురుషులని చూచెదరు. మరి ఆ విధముగా బలముగానున్న ఆడ, మగవారిని అమ్మి వేసెదరు. కొనినవారు ఆ పెద్ద బలమైన పురుషులను మరి బారీగా బలముగా నుండు స్త్రీలతో సంయోగము జరిపించెదరు. మీరు ఆవులను లేక వేరేదైనను కలుపులాగున, ఒక పెద్ద బలమైన బానిసను పొందుటకు గాను ఆ విధముగా వారు చేసెదరు. నాకు ఆశ్చర్యమేయుచున్నది ఏమిటని… నరకము అటువంటి కార్యములతో నిండియుండును… ఆ విధమైన ఒక కార్యము! మరిక్కడ ఆ యొక్క చిన్న పాత తల్లి, తనయొక్క చంటి బిడ్డలతో, తన బలమైన భర్త వేలమునకు అమ్మివేయబడుచుండగా, ఏడ్చుచున్నది. అది ఘోరముగా నున్నది.

69అప్పుడు మొదటి సంగతి మీకు తెలియునా, ఒక కార్యము జరిగినది, ఈ యొక్క మధ్యవర్తి ఆ తోటయొద్దకు ఒక రోజు వచ్చి, మరి ఆ యొక్క బానిసను చూచుచుండెను. మరియు ఆ బ్రోకరు అడిగెను, "నీవు ఎందరు బానసలను కలిగియున్నావు?"

చెప్పెను, "ఓ, మేము సుమారుగా రెండు వందల మందిని అక్కడ కలిగియున్నాము."

మరియు కావున అతను వారిని గమనించెను, మరి ఆ జనులు చాలా దుఃఖముతో నుండిరి. వారు వారియొక్క గృహముల నుండియు మరియు వారిని ప్రేమించు కుటుంబ-సభ్యుల నుండి దూరముగా నుండిరి. ఆఫ్రికా నుండి వచ్చిన వారు ఆ ఆఫ్రికా దేశస్తులను బానిసలుగా కొని, వారిని ఇక్కడ దక్షిణ ప్రాంతపు వారికి అమ్మియున్నారు; మరియు ఆ బానిసలకు తెలియును, మరియు వారు వారి దేశమునకు ఇక ఎన్నడును పోలేరని. వారి గతి ఇక అంతే. వారు మరెన్నడును తిరిగి వారి దేశమునకు పోలేరని. మరి వారు చాలా దుఃఖముగానున్నారు. వారి యొద్దనుండి పనిలాగుట చాలా కష్టము, వారు పనిచేయరు. ఆ బానిసలు పని చేయుటకు వారిని కొట్టెదరు మరియు హింసించెదరు, ఏలయనగా వారికి తెలియును, వారి గృహములకు మరి ఇక వారెన్నడును తిరిగి పోలేరని. వారి తండ్రి అక్కడుండును, ఒక వేళ తల్లి ఇక్కడ మరియు తండ్రి అక్కడ నుండవచ్చును, మరియు ఒక వేళ పిల్లలు ఇక్కడ, మరి వారి తండ్రి ఎక్కడో యుండవచ్చును. ఓ, అది ఘోరమైన కార్యము.

70మరియు ఒక రోజు ఈ మధ్యవర్తి అచ్చటికి వచ్చెను మరి ఆ బానిసల గుంపును కొనుటకు చూచుచుండెను, మరి అక్కడ ఒక యౌవ్వన బానిస ఒకడుండెను, మరి వారు అతనిని కొట్టనక్కర లేకుండెను. మరియు అతడు రొమ్ము విరుచుకొని ధైర్యముగా నిలుచుకొని యుండెను; అతను అక్కడ తిరుగుచు పనిచేయుచు అక్కడే యుండెను. మరి మధ్యవర్తి అడిగెను, "ఆ బానిసను నేను కొనవలయునని యున్నాను."

యజమానుడు చెప్పెను, "అయితే అతనిని నేను అమ్మను."

"ఎందులకు?" అని అడిగెను

చెప్పెను, "నేను అతనిని ఉంచుకొనవలయును."

అతను చెప్పెను, "అతను మిగిలిన వారిపై అధికారిగా నుండి యుండ వచ్చును."

అతను బదులిచ్చెను, "కాదు, కాదు, అతను అధికారి కాదు.

"సరి," చెప్పెను, "నీవు ఒక వేళ అతనికి మంచి ఆహారమిచ్చుచుండవలయును."

చెప్పెను, "లేదు, వారందరు ఒకచోట బానిసలందరు భుజించు చోట కలసి తినెదరు."

అతను అడిగెను, "సరి, మిగిలిన ఇతర బానిసలకన్నను ఇతనిని వేరుపరచు కార్యము ఏమిటి?"

అతను చెప్పెను, "నేను ఒక రోజు అతనిని గురించిన కనుగొను వరకు నాకు కూడా ఆశ్చర్యమేసెను." "అతడు ఏ దేశమునుండి వచ్చెనో, ఆ మాతృ దేశమునకు అతడి తండ్రి ఒక తెగకు రాజుగా నుండెను. ఇచ్చటి నుండి ఆ దేశమునకు ఎంతో దూరమున ఇతడు వుంటున్నను అతడు ఒక రాకూమారుడు. కాబట్టి ఒక రాకూమారుని వలెనే అతడు నడుచుకొనుచున్నాడు" అని అతడు చెప్పెను.

71ఓ మనము కూడా రాజాధిరాజైన రాజు యొక్క కుమారులును మరియు కుమార్తెలుగానున్న యెడల మనము కూడ ఒక క్రైస్తవులవలె నడచుకొనెదము. అది సరియే. అవును, మనము ఇక్కడ అన్యులము, మనము యాత్రికులము మరియు మనము పరదేశియులమై యున్నాము." ఇది మన ప్రపంచము కాదు. రాబోవు ఒక రాజ్యమును మనము ఎదురు చూచుచున్నాము. ఇది మన యొక్క గృహము కాదు. మనము ప్రపంచము ద్వారా పరిహసింపబడవలయును; అదంటు, మరియు ఏదేదో అనుచు "పాత కాలపు మనిషినని" అందురు మనమెందుకు వాటిని లెక్క చెయ్యవలెను! ఒక సినిమా తారవలెనో లేక ఒక టెలివిజను తారవలెనో లేక వేరే ఇంకొకరివలెనో నీవు వారిని అనుసరించి నిన్ను నీవు వారితో పోల్చుకొనకూడదు. నీవు ఒక దేవుని కుమార్తెవైయున్నావు. నీవు ఒక దేవుని కుమారుడవై యున్నావు. మనము దేవునివలె నడుచుకొనవలయును. మనము దేవుని యొక్క సంతతియై, మనము రాజు యొక్క కుమారులము మరియు కుమార్తెలమై యున్నామని ఎరిగియున్నాము. మరియు మనము ఎటువంటి క్లిష్ట పరిస్థితులలోనున్నను మన యొక్క గుణాలక్షణములు ఆయన యొక్క ప్రసన్నమును ప్రతిఫలించును గాక.

ఒక గుడారములో వున్నను లేక గుడిసెలోవున్నను, దానిని నేనెందుకు లెక్క చేయవలెను?

వారు ఒక రాజ గృహమును అక్కడ నా కొరకు కట్టుచున్నారు!

మాణిక్యములతో మరియు వజ్రములతో, వెండి మరియు బంగారుతో,

ఆయన యొక్క భోషాణము నిండుకొని యున్నది, చెప్పశక్యము కాని ఐశ్వర్యములను ఆయన కలిగియున్నాడు.

మనము రాజు యొక్క బిడ్డలము! మన రక్షకుడైన యేసుతో నేను ఒక రాజు యొక్క బిడ్డను!

మన యొక్క తండ్రివలె మనము నడచుకొనెదము గాక. ఏదో ఒక రోజున మనము ఆయనతో నుండుటకు గృహమునకు పోయెదము. అవును. అవును.

72వారు ఒక మెస్సీయును కోరుకున్నారు, అయితే వారు వారి పరిస్థితులకు అనుగుణముగా నుండునట్లు ఆయనను కోరుచున్నారు. అవును, వారు ఒక రక్షకుని కోరియన్నారు, వారు కోరిరి మరియు ఇప్పుడు కూడా అదే మార్గములో కోరుచున్నారు, అదే కారణము కొరకు, ఏలయనగా పరిశుద్దాత్మ యొక్క స్థానమును సంఘ శాఖలు, తెగలు మరియు రాజకీయములు చోటు చేసికొనినవి. వాక్య పరిచారకులుగా, నుండుటకు బదులుగా… పరిశుద్దాత్మ వారిని నడిపించుటకు బదులుగా వారిలో అనేకులు మత సంబంధమైన రాజకీయముల ద్వారా నడిపింపబడుచున్నారు, చూశారా. ఏదో ఒక సంఘము వారికి అధిక కానుకలిచ్చినయెడల లేక వేరేమైనను యిచ్చిన యెడల, మరియు వారు దానికొరకై పేరుప్రఖ్యాతులకై మరియు లేక ఆ విధమైన ఘనమైన కార్యములకై పోవుచున్నారు. అయితే అది చాలా తప్పు. మనము పరిశుద్దాత్మ ద్వారా నడిపింపబడవలయును. దేవుడు నిజమైన నాయకుని సంఘమునకు పంపియున్నాడు, మరి అదే పరిశుద్దాత్మగా యున్నది.

73మన సంఘములోనున్న విధ్యా విధానములు మనలను దేవుని యొక్క సముఖము నుండి చాలా దూరమునకు తీసికొనిపోయిన్నవి. (ఇప్పుడు పెంతెకోస్తు వారిని గురించి మాటలాడుచున్నాను) మనము మన యొక్క బాలురను సెమినరీలలో ఉంచుచున్నాము మరియు ఆలాటి కార్యములలో, యంత్రముల ద్వారా పొదిగెడి కొళ్ళవలె వారున్నారు. అది సరియే. నేను ఎల్లప్పుడును ఒక యంత్రము ద్వారా పొదిగి బయటికి వచ్చు కోడిని చూచి చాలా చింతించెదను, అది సరిగా క్రమమైన పద్దతిలో పొదగ లేదు. అతను అరచును కేకలేయును మరియు కోడి పిల్ల తన తల్లియొద్దకు వెళ్ళుటకు దానికి తల్లి లేదు, ఏలయనగా యంత్రము నుండి బయటికి వచ్చియున్నది. మరి ఆ విధముగానే వారు ఈ దినమున ఒక విధమైన డాక్టరు డిగ్రీతో సెమినరిల నుండి బయటికి వచ్చు ప్రసంగికులను ఉత్పత్తి చేసి, సంఘమునకు పంపుచున్నారు. మరియు అనేక సమయములలో అది ఆఫ్రికాలో నుండు వెనుకబడిన ఒక తెగ జాతి వారికి ఐగుప్తు యొక్క యోధుని గురించి ఏ విధముగా తెలియదో మరి ఆ విధముగా ఈ సెమినరీల నుండి వచ్చిన ప్రసంగికులకు దేవుని గురించి తెలియదు.

74ఈ దినమున మనకు కావలసినది ఒక మంచి పాత-కాలపు పద్ధతితో, అరణ్యపు కూడికల వలె, నీలి-రంగు, పాపమును-చంపు భక్తిగల మతము, మరియు పరిశుద్దాత్మ యొక్క బాప్తిస్మము మరల సంఘములో మనకు కావలయును; ఒక శుద్ధిపరచు, తుపాకివలె సరిగా గురి చూచు, నీలి-రంగు ఆకాశమువలె తేటగా నుండు కార్యములు కావలయును. మనకు కావలసినది పూర్తిగా పరిశుభ్రపరచు, మరియు మరల మొదలిడు కార్యములు కావలయును. అది సత్యము.

సంఘమా, నాకు నేను మాత్రము ఒక్కనిగా లేను. గత రాత్రి చెప్పిన విధముగా, నేను ఒకవేళ వెర్రివానిగా నుండవచ్చును, అయితే నేను ఈ విధముగా ఒక మంచి అనుభూతితో నున్నాను. నేను ఇంకొక విధముగా ఎప్పుడును నుండినది లేదు, కావున నేను ఈ విధముగా మ౦చి అనుభూతితో నుండవలయునని ఇష్టపడుచున్నాను. అవునయ్యా. నేను నా మతి కోల్పోయాను; క్రీస్తు యొక్క మనస్సును కనుగొనుటకు నేను దానిని కోల్పోవలసి యున్నది, ప్రతియొక విశ్వాసియును, మరి క్రీస్తు యొక్క మనస్సును కనుగొనుటకు వారి యొక్క స్వబుద్ధిని కోల్పోవలయును.

75విద్యా విధానములు మనలను దూరముగా తీసికొనిపోయున్నవి. ఎక్కడైతే అరిజోనా విశ్వవిద్యాలయము కలదో, ఒక కళాశాల గల పట్టణములో నేను జీవించుచున్నాను. మరియు నేను దీనిని తలంచుకొనుచు చెప్పుచున్నాను, మీకు విజ్ఞానము ఏమి చేయును? వారు దేనినైనను ఒక దానిని తీసికొని మరి చెప్పెదరు, "ఇది చాలా వందల సంవత్సరములకు పైగా నున్నటువంటిది." మరి వారిప్పుడు కనుగొనియున్నారు - అది అన్ని సంవత్సరములకు క్రితము ఉన్నది కాదని. ఆరు వేల సంవత్సరములకు పైగా ప్రపంచముపై జీవమున్నట్లు విజ్ఞానము ఇంతవరకు నిరూపించ లేదు. వారు ఎముకలను తీసి మరియు దానిని పలు విధములుగా కొలతలు తీసి మరియు అది ఎట్లు౦డెనని చెప్పుచున్నారు. ఇప్పుడు వారు దానిని ఒప్పుకొనకున్నారు. ఆ రోజు రాత్రి ఒక పెద్ద పండితుడు ఆరిజోనాలో లేచి నిలుచుకొని మరి చెప్పెను, "వారు దానిని చెప్పరు, లేదు, అయితే ఆ ఎముక యొక్క వయస్సు కనిపెట్టునప్పుడు నీటిలోని క్లోరైడు మరియు ఇతర కార్యములు దానిని ఆ విధముగా మార్చినవని చెప్పుచు, దానివలన అది ఎక్కువ వయస్సును చూపించుచున్నది. కాల ప్రకారము వారు ఆ ఎముక వయస్సని చెప్పుట లేదు." ఆమేన్.

JOHN 1:14•

HEB 13:8

 

76దేవుని వాక్యము ఇంకను మారకయున్నది, నిన్న, నేడు మరియు నిరంతరము ఏకరీతిగా నున్నది. దానిని వారు కాదని చెప్పలేరు. అదియే ప్రపంచమును ఒక్కటిగా ఉంచగలుగుచున్నది; ఒక విద్యా విధానము కాదు. దేవుని వాక్యమునకు బదులుగా మీరు మరి దేనినైనను స్వీకరించిన యెడల, అది అంత్యక్రీస్తు యొక్క చర్యగా యుండును; అది ఖచ్చితముగా సరియే, క్రీస్తు యొక్క నియమములకు అది విరోధముగా నున్నది. క్రీస్తే వాక్యమైయున్నాడు. ఆ వాక్యము వైపుకు తిరుగవలెను. అవునయ్యా. ఆయనే వాక్యము మరియు వాక్యము శరీరధారియై మరియు మనమధ్య నివసించెను.

ఈ లోకపు విద్య, జ్ఞానము మరి మనకు జీవము నియ్యదు. విద్య ఎన్నటికిని ఇవ్వదు. విజ్ఞానము మనకు జీవమునివ్వదు. లోకము మనకు జీవము నివ్వదు. సంఘము మనకు జీవమునివ్వదు. వేదపాండిత్యము మనకు జీవమునివ్వదు. మనకు జీవమునిచ్చు ఒకే ఒక కార్యము, అది క్రీస్తై యున్నాడు. ఆయనే జీవముగా నున్నాడు, విస్తారమైన జీవముగా యున్నాడు!

77కొంత కాలమునకు మునుపు కెనడాలోనున్న ఒక నగరములో నేను పైకి క్రిందికి పోవు మెట్టు వలె నుండు సాధనములో (ఎలివేటర్) పైకి పోవుచుంటిని. మరియు అక్కడ వారు ఒక అమెరికనుల గుంపు వారియొక్క ఒక మీటింగు అనుకొనుచున్నాను. దానియొక్క పేరును నేను చెప్పలేను, ఏలయనగా ఆ యొక్క విడిదిలో వేరే ఇతరులు కూడ ఉండవచ్చును మరి పేరు చెప్పుట ద్వారా వారిని నొప్పించలేను. అయితే ఒక పెద్ద హోటలులో వారు ఎలివేటర్లో పైకి పోవుచుండిరి మరి అక్కడ నాకు మీటింగు కలదు. మరియు మీరు ఎలివేటర్ను ఉపయోగింప లేరు, ఏలయనగా విస్కీ సీసాలు మరియు ఆ కార్యములన్నియును వాటిద్వారా పోవుచుండెను. మరి నేను ఎలివేటర్ ను పర్యవేక్షించు అతనిని అడిగితిని, "ఇదంతయు ఏమిటని?" నేను అడిగాను.

అతను చెప్పెను, "ఈ రాత్రి అమెరికనులు మా హోటలుకు వచ్చి యున్నారు." ఓ, భలే ఉన్నది, వారు అనేకులు. మరి నేను క్రిందికి వెళ్ళాను.

78మేము ఆ చిన్న ఎలివేటర్ నుండి దిగి మరి అక్కడున్న హాలు వైపునకు పోవుచుండగా, అక్కడ ఇరువురు యౌవ్వన స్త్రీలు వారియొక్క లోపల ధరించే లోపటి వస్త్రములతో మాత్రము అచ్చట నిలుచుకొని యున్నారు. వారి చేతిలో ఒక విస్కీ సీసా కలదు, మరి వారు త్రాగుచుండిరి. మరి వారు అక్కడ దిగి పోవుచుండగా, మద్యపాన గది నుండి వచ్చిన పురుషులు త్రాగిన మత్తులో ఆ స్త్రీలను పట్టుకొని వారి వస్త్రములను పట్టుకొని లాగుచున్నారు. మరి అది చాలా ఘోర దృశ్యముగా నుండెను. మరియు వారు వచ్చుచుండిరి. వారు నన్ను దాటిపోవు వరకు నేను ఒక చిన్న హాలులో దాగుకొనియుంటిని. వారు ఆ చిన్న తలుపు ద్వారా పోవుచునుండిరి మరి వారు నా ముందుకే వచ్చి నిలబడియుండిరి. మరియు చూచుటకు చక్కగా ను౦డు ఆ స్త్రీలు అక్కడ వారి లోపలి దుస్తులతో అక్కడ నిలుచుకొని యుండిరి, వారిపైనున్న దుస్తులు ఆ లోపలి వస్త్రములు మాత్రమే ధరించికొనియున్నారు. ఆ మధుపాన సీసాను తీసికొని ఒకరిపై నొకరు వారు పోసికొనుచు నుండిరి. వారిలోని ఒక స్త్రీ తాను ధరించిన లోపలి వస్త్రములను ఎంత పై వరుకు లాగుకొనుటకు వీలైనదో అంతవరకు పైకిలాగుకొనుచు మరియు "ఓహో, ఇదియే జీవితము!" అని కేకలు వేయుచు, తన కాలిని పైకి ఎత్తి ఎగురుతు విదిలించుచు అరుచుచున్నది.

79దానిని చూచుచు నేను నిలువలేకపోయాను. నేను ఉన్నచోటి నుండి బయటికి వచ్చి మరి "సహోదరి, నన్ను మన్నించుడి. అది మరణము. అది మరణము" అని నేను చెప్పాను.

ఆమె చెప్పెను, "వచ్చి కొద్దిగా త్రాగుము."

మరియు నేను చెప్పాను, "ఒక్క నిమిషమాగుము." నేను చెప్పాను, "అది జీవితమని మీరు చెప్పియున్నారు. నేను చెప్పాను, "అది తారుమారైన జీవితము. మీరు ఎందులకు అటువంటి కార్యమును చేయుటకు ప్రయత్నించుచున్నారు?" వారిని గురించి కనుగొనుటకుగాను… నేను చెప్పాను, "నేను ఒక సువార్త సేవకుని, నేను కూడ ఒక అమెరికనును. నేను మిమ్ములను గురించి సిగ్గుపడుచున్నాను. మీరు ఇక్కడ ఈ విధముగా నుండుటకును మరియు మిమ్ములను మీరు అమెరికనులని పిలుచుకొనుటను బట్టి నేను సిగ్గుపడుచున్నాను." వారిలో ఒకామె ఆదివారపు పాఠశాల ఉపాధ్యాయురాలని నేను కనుగొన్నాను, మరియు ఆమె ఏడ్చుటకు ఆరంబించెను.

మొదటగా వారు పరిగెత్తుటకు ఆరంభించిరి, మరియు నేను వారిరువురిని చేతితో పట్టుకొన్నాను. వారు అధికముగా త్రాగియుండుట వలన వారు తప్పించుకొని పోలేకపోయిరి. నేను చెప్పాను, "ఆగండి మనము ఇక్కడ ప్రార్ధింపబోవుచున్నాము."

"మంచి మార్గమని అగుపించు మార్గమొకటి కలదు" అని చెప్పితిని.

PROV 14:12•

PROV 16:25

 

80సరి, మీరు చెప్పవచ్చును, "వారు ఏదో కొద్దిగా వినోదముగా ఆడుకొన్నారని." ఒక చిన్న వినోదము. ఏమి కాదు! ఆ కార్యములో ఏమి లేదు… మీరు ఎంతో ఆదివారపు ఉపాధ్యాయురాలైనను నేను లెక్క చేయును. మీ యొక్క హృదయములో అటువంటి కార్యమున్నయెడల, దేవుడు మరి ఆ విధమైన అసహ్యమైన స్థలములో నివసింపడు. సంఘమును ఈ చివరి నుండి ఆ చివరి వరకు శుద్ధిచేయుటకు మనకు కావలసిన దేమనగా, పాతకాలపు పరిశుద్ద ఉజ్జీవమైయున్నది. అవునయ్యా. మనము దానిని చేయుట లేదు. ఆ విధమైన అపరిశుద్దమైన కార్యములు అనుమతింపకూడదు. ఒక క్రైస్తవ దేశమునకు ఉదాహరణముగా ఇక్కడ అమెరికనులు ఒక చిన్న "శుద్దమైన వినోదము"ను కలిగియున్నారు. ఓ, మై! విద్యా విధానము, అది జీవము కాదు. అది మరణము.

PS 119:11

 

81ఒక వ్యక్తిని ఆ విధముగా చేయుటకు ఏది పురికొల్పుచున్నది? దానిని వారెందులకు చేయుచున్నారు? వారు చేయలాగున ప్రపంచము కూడ ఆ మార్గముననే ఎందులకు చేయుచున్నది? దీనిని వారు నిరాకరించుట వలననే. దేవుని కొరకు దప్పిగొను ఒక చిన్న స్థలము మానవుని హృదయములో కలదు. ఒక చిన్న స్థలము, ఒక మనుష్యుడు దప్పిగొనులాగున చేయబడుచున్నాడు. మీరు ఆ విధముగా నిర్మింపబడి యున్నారు. అదియే మిమ్ములను త్రాగులాగున చేయుచున్నది, ఈ కార్యములను అదే చేయుచున్నది, ఏలయనగా మీలో ఏదో ఒకటినున్నది అది సంతృప్తి కొరకు, దాహముతో వాంఛించుచున్నది. దేవుని యొక్క పరిశుద్ద పిలుపును మరియు ఆ పరిశుద్ద పిలుపుయను దాహమును దయ్యము ప్రత్యామ్నాయముగా ఇచ్చు కార్యము ద్వారా మానవుని యొక్క దప్పిక తీర్చాలనే దాని ప్రయత్నమును మానవుడు అవలంభింపవలదని, దేవుడు దానిని వద్దనుచున్నాడు. దానిని చేయుటకు మీకు హక్కు లేదు. అది దేవుడు మిమ్ములను పిలుచు పిలుపు. దప్పిక తీర్చుకునే ఆ కార్యము మరణమునకు ఒక హేతువైయున్నది. మరి మీరు గనుక ఆ స్థానమును నింపుటకు క్రీస్తును గనుక గైకొనకున్నయెడల, దానిలోనికి దయ్యము మరణమును కార్యమును దానికి బదులుగా యిచ్చును. అది సరియే. దానిని చేయుటకు మీకు అధికారము లేదు. దేవుని యొక్క పిలుపును అక్కడున్న పరిశుద్ధ పిలుపును ఒక మనుష్యుడైనను లేక స్త్రీ యైనను అణచి వేయుటకు ఎంతటి ధైర్యముండవలయును. మరి మీరు దేవుని యొక్క పిలుపును అంగీకరింపనందువలన, దయ్యము వేరొక దానితో ఆ యొక్క దాహమును మీలో తృప్తిపరచ చూచుచున్నది.

దానిని తృప్తిపరచునది ఇదియే. "దేవుని యొక్క వాక్యమును నేను నా హృదయమునందు పదిలపరచుకొని యున్నాను, ఆయనకు విరోధముగా నేను పాపము చేయలేను." అది సరియే. దేవుడు హృదయములోనున్నయెడల అది సమస్తమును సరిదిద్దును. అవునయ్యా.

2TIM 3:3-5•

HEB 13:8

 

82విజ్ఞాము మీకు జీవమునివ్వదు. విద్య మీకు జీవమునివ్వదు. సంఘ శాఖ మీకు జీవమునివ్వదు. పాఠశాలలు మీకు జీవమునివ్వవు. దేశము మీకు జీవమునివ్వదు. సంఘము మీకు జీవమునివ్వదు. దేవుడు మాత్రమే మీకు జీవము నిచ్చును. దానిని చేయగలిగినది ఆయన మాత్రమే.

ఇప్పుడు మనము సరిగా ప్రవక్త ఏమి చెప్పియున్నాడో అది ఈ దినమున నెరవేరుట చూచుచున్నాము. ప్రవక్తయైన పౌలు II తిమోతిలో, మనము కనుగొనియున్నాము, కాలము వచ్చుచున్నది, సంఘము ఏ విధముగా నుండుననగా, "ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు దేవునికంటె సుఖానుభవము నెక్కువగా ప్రేమించువారు, సమస్తమును నెరిగిన వారనుకొనుచు, అనురాగరహితులు, అతి ద్వేషులు, అపవాదకులు, అజితేంద్రియులు, క్రూరులు సజ్జన ద్వేషులు," గా ను౦డేదరు.

మీరు చెప్పవచ్చును, "అది కమ్యూనిస్టులని," కాదు, కాదు.

అది బాహాటముగా మేము క్రైస్తవులమని చెప్పుకొను క్రైస్తవులు. వినుడి, తదుపరి వచనమును చదువుడి. "పైకి భక్తి గలవారివలె ఉండియు, దాని శక్తిని ఆశ్రయించనివారునై యుందురు. అట్టివారికి విముఖుడవై యుండుము." యేసుక్రీస్తు నిన్న, నేడు, మరి నిరంతరము ఏకరీతిగా నున్నాడనుటను, పునరుత్తాన శక్తిని నిరాకరించువారి నుండి దూరముగా నుండుము. అదియే వాస్తవము. ఆయన నిన్న, నేడు, మరియు యుగయుగములకు మారనివాడై యున్నాడు.

GEN 1:26

 

83పెంతెకొస్తు దినమున పేతురు చెప్పెను, "ఈ యొక్క వాగ్దానము మీకును, మరియు మీ పిల్లలకును, దూరస్తులందరికిని, అనగా ప్రభువైన మన దేవుడు తన యొద్దకు పిలిచిన వారికందరికిని చెందునని చెప్పెను." దాని కొరకే పరిశుద్దాత్మ ఇవ్వబడెను. దేవుడు ఇంకను పిలుచువరకు, దేవుడు పిలుచు ప్రతి యొక్క ఆకలి హృదయమునకు పరిశుద్దాత్మ అకలి తీర్చును.

అయితే మనము వేరొక దానిని దానికి ప్రత్యామ్నాయముగా కలిగియున్నాము. సంఘములో చేరుట ద్వారా మనము దానిని తృప్తి పరచుచున్నాము. దానిని చేయుట ద్వారా ఆ ఆకలిని నీవు చంపుచున్నావు. నీవు దాని ద్వారా తృప్తి పొందలేవు. అది నిన్ను తృప్తిపరచ లేదు.

త్రుప్తిపరచు ఒకే ఒక కార్యమున్నది, అది ఏమనగా క్రీస్తు ఒక మనుష్యుని యొక్క హృదయములోకి వచ్చినప్పుడు మాత్రమే; ఏలయనగా ఆయన (మానవుడు) దేవుని యొక్క రూపములో చేయబడియున్నాడు, మరియు ఆయన (దేవుడు) దేవుని యొక్క స్వారూప్యములో చేయబడియున్నాడు. మరియు మీరు ఇది, అది లేక వేరేటోగా నుండుటకు ఆయన ఈ యొక్క యాత్రను ఇవ్వలేదు, అయితే దేవుని యొక్క కుమారుని గాను మరి కుమార్తె గాను నుండుటకు గాను ఈ యాత్రను యిచ్చియున్నాడు. మరేదియు తృప్తినివ్వదు. మన ప్రపంచమును ఒక్కటిగా నుంచు కార్యము అది ఒక్కటి మాత్రమే. మరియు మానవుడు చేసిన పధకములను తీసికొన వద్దు, అయితే దేవుని యొక్క ప్రణాళికను ఆయన వాక్యము ద్వారా దానిని నెరవేర్చు ఆయన మార్గమును గైకొనుము. అదియే దానిని ఏకముగా నుంచును.

దానిని ఏకముగా కలిపియుంచు శక్తి అదే,

క్రైస్తవ ప్రేమలో మన హృదయములు;

ఏక మనస్సు గల సహవాసము

పైన చెప్పిన విధముగా నుండును.

84అది సరియే. పరిశుద్ద గ్రంథమును మరియు ఒక చక్కటి ప్రాచీన కాలమను పరిశుద్ద పౌలు యొక్క ఉజ్జీవమును నేడు ప్రపంచమునకు కావలసియున్నది. మరల పరిశుద్దాత్మ అక్కడ దేవుని యొక్క ఆత్మ జనుల మధ్య పడినప్పుడు, మరి సూచనలు మరియు అద్భుత కార్యములు కమసాలివాని దాగలి నుండి వెడలు అగ్ని కణములవలె అగుపించును. అవును అయ్యా, అది మనకు అవసరమై యున్నది. దానిని ఒకటిగా నుంచుటకు మనము పైన చెప్పినటువంటి దానిని కలిగియుండవలయును.

అప్పుడు మనము దేవుడు మన యొక్క పారంపర్యములలో వచ్చి మనలను సంధింపవలయునని ఎదురు చూచుచున్నాము. ఓ! ప్రపంచము పడిపోకుండా నుంచుటకు, ఆయన మనయొక్క పద్దతుల ప్రకారముగా రావలయునని మనము ఆయనను కోరుచున్నాము.

MATT 3:7•

LUKE 3:7•

JOHN 8:44

 

85ఇప్పుడు ఖచ్చితముగా ఆ వెనుకటి వారు దానిని తలంచిరి, "ఇప్పుడు గనుక మెస్సీయ ఈ కాలములో వచ్చినయెడల, మనము ఒక చక్కని కయపయను ప్రధాన యాజకుని కలిగియున్నాము. మనము లావిన్స్కిని కలిగియున్నాము, ఈ యొక్క యూజకులందరును, చూడుడి, వారు చాలా చక్కని వారు. వారిని మనము చదివించి యున్నాము, వారిని చదివించి యున్నాము. వారేమి మట్లాడుచున్నారో వారికి తెలియును అని వారి యాజకులను గురించి ఆ జనులు అనుకొనిరి."

అయితే మరి ఆయన వచ్చినప్పుడు, వారి యొక్క తలంపులనన్నిటిని ఆయన దాటి మరి వచ్చెను. ఆయన వారియొక్క పద్దతులను తాకను కూడ తాకలేదు. అంత మాత్రము కాదు, ఆయన చెప్పెను, "మీరు మీ యొక్క తండ్రి, అపవాది బిడ్డలు, మరియు అతని క్రియలు మీరు చేయుదురు. మీరు గడ్డిలోనున్న సర్ప సంతానము," ఆయన చెప్పెను, "రానున్న ఉగ్రత నుండి మిమ్ములను తప్పించుకొనమని మీకు బుద్ధి చెప్పినవాడెవడు?" ఆ యొక్క గద్దింపులో దేవుని వాక్యము వచ్చుటను గమనించుడి. ఓ, అది వారియొక్క వేదాంత పాండిత్యపు రుచికి సరిగా లేదు. మరియు ఈ దినమున కూడ ఆ విధముగానే యున్నది. అది వారికి సరిపోదు.

MATT 10:25•

MATT 12:24,31•

MARK 3:22,29,30•

LUKE 11:15

 

86ఆయన అక్కడ నిలుచుకొని మరియు తాను మెస్సీయయని చూపించుకొనుటకు మరి ఒక ప్రవక్త యొక్క సూచనను చేయుచుండగా, వారేమి చెప్పిరి? "ఆయన బయెల్జెబూ అని చెప్పిరి. అది ఆయనపైనున్న అపవిత్రాత్మయని వారు చెప్పిరి."

యేసు చెప్పెను, "అది దేవ దూషణ. మరియు పరిశుద్దాత్మ వచ్చినప్పుడు మరి మీరు దానికి విరోధముగా మాటలాడిన యెడల, మరది ఈ లోకములోను లేక రానున్న లోకములోను మన్ని౦పబడదు."

అయితే ఈ దినముననున్న పద్దతులను చూశారా? అదే కార్యములు. మనము మనయొక్క సొంత పద్దతులను రూపొందించుకొని యున్నాము, ఆ కారణమువలననే మన పద్దతి ఈ లోకమును ఒక్కటిగా నుంచజాలదు. వారు ఒక అధ్యకుని లేక అబ్రాహాము లింకన్ను ఐక్యరాష్ట్రములలోనున్న ప్రతియొక్క రాష్ట్రములోను వారు ఎన్నుకొనవచ్చును, అయితే మనము తిరిగి దేవుని యొక్క వాక్యమునకు పోవువరకు, సత్యమును కలిగియున్న నల్లరంగు అట్టతో కూడిన పాత పద్దతి బైబిలు యొద్దకు పోతేనే గాని, ఈ లోకమును ఏదియును ఒక్కటిగా నుంచజాలదు. దేవునిని తెలుసుకొనవలయుననిన మనయొక్క ప్రపంచమును ఒక్కటిగా నుంచవలయుననిన ఒకే ఒక మార్గమున్నది, అది యేసుక్రీస్తు యొక్క నియమములకు తిరిగిపోవలయును, ఆయన యొక్క ఉపదేశములకు, సంఘము నడిపించు పరిశుద్దాత్మనొద్దకు తిరిగిపోవలయును.

2COR 6:17•

REV 18:4

 

87అందువలననే సత్యము ఈ అంత్యదినములలో తప్పుగా ప్రయోగింపబడుచున్నది, ఏలయనగా దేవుడు ఆయన యొక్క కార్యక్రమమును లోనికి తీసికొని వచ్చుటకు ప్రయత్నించగా, మరి జనులు వారి స్వయ కార్యములతో ఒక సంఘ శాఖగా, తెగగా స్థాపించుకొనిరి. వారు వారి చుట్టు ఒక కంచె కట్టుకొనిరి, కావున పరిశుద్దాత్మను వెలుపల నుంచుటకును మరియు పరిశుద్దాత్మను లోనికి రానియ్యకుండునట్లును వారు ఆ విధముగా కంచెను కట్టుకొనిరి. మనమిప్పుడున్న ఈ పరిస్థితుల నుండి దేవుడు మనలను రక్షింపవలయునని మనము కోరుకొనుచున్నాము. మరి ఆ విధముగానే నేను తలంచుచున్నాను…

పెంతెకోస్తు జనులైన మీరు, ఏ విధముగా ప్రారంభించి యున్నారు? మీరెప్పుడైనను అజూసా వీధి కార్యార్థమును చదివియున్నారా? ఆలోచన సభ కూడక మునుపు కార్యములను మీరు ఎప్పుడైనను చదివియున్నారా. ఆ యొక్క స్థాపింపబడిన సంఘ శాఖల నుండి వెలుపలికి వచ్చి మరి వేరుగా ఉన్నందువలన పెంతెకోస్తు జనులు గుర్తింపబడియున్నారు. వారు వెలుపలికి వచ్చియుండిరి. "వారి మధ్య నుండి బయటికి రమ్ము." వారు ఎల్లప్పుడును దానిని గురించి ప్రసంగించుచునే యుండిరి," దేవుడు చెప్పుచున్నాడు, వేరుపడుడి. మానవుని యొక్క పారంపర్యముల నుండి దూరముగా నుండుడి." మరి అతనేమి చేసెను? అతను తిరిగి దేనినుండి బయటికి వచ్చెనో, మరి దానిలోనికి తిరిగిపోయెను. ఇప్పుడు మీరు వేరుపడియున్నారు; ఒకరు దేవుని యొక్క సంఘము; మరొకరు, ఇది లేక అది అని చెప్పుకొనుచున్నారు. మీరు వేరుపడి, ఒకరిపై ఒకరు చెప్పుకొనుచున్నారు. ఆ విధముగా నుండకుడి!

88నేను వాక్య పరిచర్యకు మొదట వచ్చినప్పుడు సమస్తమును ఒకే గుంపుకు చెందిన పెంతెకోస్తుయని నేను అనుకొన్నాను, పెంతెకోస్తు వారంతయును ఒకే గుంపుయని తలంచితిని. పిదప నేను కనుగొన్నాను, వారు బాప్తిస్తులకంటె కూడ ఘోరముగా వేరుపడియున్నారు, చీలిపోయున్నారు. వారిరువురికి మధ్యలో నేను నిలిచి మరి, "మనము సహోదరులము, అంతే" అని చెప్పడమే నేను చేయగలిగినది. సరి. మీరు ఒకరితో ఒకరు పోట్లాడుకొను వరకు, సాతాను మీతో పోరాడనక్కర లేదు, మీ యొద్దకు అతను రానక్కర లేదు. అయితే ఆ కట్టును తెంపి మరియు మీ యొక్క గుడారములను విశాలపరచి ప్రతియొక్క సహోదరుని చేర్చుకొనుడి. అప్పుడు నేను మీకు చెప్పుచున్నాను, దేవుని యొక్క గొప్ప సైన్యము యేసుక్రీస్తు యొక్క శక్తిలో లేచి మరల బైబిలు నొద్దకు పోవును. మరియు మీరు ఒక సంఘమును గురించియు లేక ఎత్తుకొనబడు కృపను గురించియు మాటలాడుచున్నారు, మనము గనుక మన పారంపర్యములను వదిలివేసినయెడల మనయొక్క స్థాపన సంఘములను వాటి కార్యములను మరచిపోయినయెడల, మరి తిరిగి దేవుని వాక్యమును ఆధారముగల కార్యమునకు మరల వచ్చినయెడల అది నెరవేరి తీరును.

మనమిపుడున్న ఈ పరిస్థితిలో దేవుడు మనలను రక్షింపవలయునని మనము కోరుకొనుచున్నాము. ఆయన యొక్క నిబంధనను మనము నెరవేర్చవలయును. చూడుడి, మనము మనయొక్క నిబంధనలపై మనము కలువకూడదు, ఆలాగు చేయకూడదు; ఆయన యొక్క నిబంధ! ఆయన కోరిన… అదే కార్యముల నుండి దేవుడు మనలను కాపాడవలయునని మనము కోరుచున్నాము. ఆయన కోరిన కార్యము… అది కలుషితము చేయుబడినది. దేవుని అనుమతించుడి! వాక్యము నొద్దకు తిరిగిపోవుడి, మరియు ఒకరినొకరు ప్రేమించుకొనుడి. నాకు తెలిసిన కార్యము అది ఒక్కటే.

89దేవుడు మనకు ప్రవక్తలను పంపించుచున్నాడు, మరియు మనము వారిని చంపుచున్నాము, వారేమి చేయుదురని యేసు చెప్పెనో, సరిగా ఖచ్చితముగా దానిని మనము చేయుచున్నాము. అటు పిదప మనము కనుగొనియున్నాము, ఒక వంద సంవత్సరములు లేక రెండు వందల సంవత్సరములకు లేక ఏబది సంవత్సరములకు తరువాత దేవుడు మనకు ఒక ప్రవక్తనో లేక ఒక వర్తమానికుని పంపినప్పుడు, మీకు తెలియునా, మొదటి కార్యము, మనము అతనిని విమర్శించి మరియు చంపెదము. అటు పిదప కొంత కాలమైన పిదప అతను చనిపోయిన తరువాత, మీకు తెలియునా, సంఘము మేల్కొనును. వారేమి చేసెదరు? వారు చెప్పెదరు, "సరి, మనము ఒక సంఘ శాఖను దానిపై, అనగా, ఆ ప్రవక్త లేక వర్తమానికుడు చెప్పిన దానిపై కట్టెదము." మెతడిస్తులు, బాప్తిస్తులు మరియు మిగిలిన వారందరి విషయములో జరిగిన కార్యము అదియే, వారు ఒక సంఘ శాఖను స్థాపించిరి. మరియు దానిలోనున్న కార్యమేమనగా, అతను చనిపోయిన పిదప, మరియు అతని వర్తమానము ముగించిన పిదప, మనము ఇంకొక వర్తమానములో జీవించుచున్నాము. అప్పుడు మీరు ఆ ముగించి పోయిన అతని వర్తమానమును పట్టుకొని జీవించుచుండెదరు, అతని సమాధికి సున్నము కొట్టెదరు, ప్రతి సమయములోను అదిక్కడ ఆలాగుననే జరుగుచున్నది. మీరు ఘడియను మరచిపోయెదరు!

HEB 13:8

 

90ఒక మానవునివలె. మానవుడు సాధారణముగా దేవుడు చేసిన దానికి దేవుని స్తోత్రించును, మరియు ఆయన ఏమి చేయునైయున్నాడో దానికి స్తోత్రించును, అయితే ప్రస్తుత కాలమున ఏమి చేయుచున్నాడో దానిని వదిలివేయును, దానిని గమనింపడు. అది మానవుని యొక్క పద్ధతి. అతనెల్లప్పుడును దానిని చేసియున్నాడు. ఆయన ఏమి చేసియున్నాడో దానిని అతను తలంచును, ఆయనకు స్తోత్రములు చెల్లించును; ఆయన ఇక్కడ ఏదో చేయబోవునని అతను నమ్మును; అయితే ఇప్పుడే, ఇక్కడే ఎల్లప్పుడును ఆయన చేయుచునే యున్నాడని అతను మరచిపోవుచున్నాడు! దానిని అతను ఎల్లప్పుడును దాటివేయుచున్నాడు. ఆ విధముగా చేయుట దయ్యము యొక్క వ్యవహారమైయున్నది. అవునయ్యా.

మన యొక్క సంప్రదాయములు! అవునయ్యా. "మెస్సీయ," వారు చెప్పెదరు. "ఆయన ఇంకొక తరానికి, అలాంటిది ఎదో అని చెప్పెదరు. ఆయన అక్కడున్నాడు." ఆయన నిన్న, నేడు, మరి యుగయుగములకు ఏకరీతిగా యున్నాడు.

91ఆయన యొక్క మొదటి రాకడలో, యేసు రాకడలో సమస్త ప్రపంచమును రాజకీయములతో మరియు మత మార్గములతో చెడిపోయుండెను. అందరును ఒక మెస్సీయ కొరకు కేకలేసిరి. వారు అభిషేక్షింపబడిన ఒకనిని కోరిరి. ఇశ్రాయేలు దేనినో కోరెను, మరియు రోము దేనినో కోరెను, మరియు మిగిలిన వారును కోరిరి.

ఈ దినమున కూడ అదే కార్యముగా నున్నది. మనమందరమును, ప్రతి యొక్కరును ఒక రాజకీయుని కోరుచున్నాము. ఈ దినమున దేనినో మనము కోరుచున్నాము.

ఇప్పుడు, ఈ దినమున, రష్యా ఒక మెస్సీయను కోరుచున్నది. చంద్రుని యొద్దకు వేరొకరు పోవుటకంటే ముందుగా వారిని త్వరగా తీసుకొని వెళ్ళుటకు, రష్యా ఒక మెస్సీయను కోరుచున్నారు. రష్యా కోరునది అదియే. వారు అటువంటి ఒక మెస్సీయను కోరుచున్నారు, ఒక మేధావిని, ఒక విజ్ఞాన మేధావిని మరియు ఆ మేధావి ఆకాశమ౦డలమును ఏ విధముగా జయింపవలయునని తలంచి, అచ్చటికి వెళ్ళి మరియు అమెరికనులు అచ్చటికి వెళ్ళుటకు ముందు, రష్యనులు వెళ్లి అక్కడొక జెండాను నాటగల ఒక మెస్సీయను వారు కోరుచున్నారు. ఓ, వారు… వారు వారియొక్క మెస్సీయను కోరుచున్నారు. అటువంటి ఒకరు లేపబడవలయునని వారు వారి శక్తియంతటితో ప్రయత్నము చేయుచున్నారు. అది సరి.

92అమెరికా ఏమి చేసెను? అమెరికా, నీవేమి కోరుచున్నావు, నీవు బిగ్గరగా కేకలు వేయుచున్నావు. నీవేమి కోరుచున్నావు? నీవు ఒక విధ్యనభ్యసించియున్న మేధావిని కోరుకొనుచునే యున్నావు. నీవు ఒక రాజకీయ మేధావిని కోరుకొనుచునేయున్నావు. దానిని నీవు పొందియున్నావు. నీవు ఒక వక్రమైన ఓటు వేయు సాధనమును కనిపెట్టవలసి యుండినను, అయినప్పటికిని దానిని నీవు పొందియున్నావు. అది సరియే. ప్రపంచము కోరుచున్నది… దానిని అది కోరుచున్నది, ఇప్పుడు దానితో నీవేమి చేయబోవుచున్నావు? నీవెంత తెలివిమ౦తునివో నీవు చూపించు కొనవలయునని నీవు కోరుకొనుచున్నావు. నీవు వారిని టెలివిజన్లలో కూడా దానిని చూపించుచున్నావు, ఒకరికి మించి మరియొకరు చాలా తెలివిపరులను చూపించుచున్నావు మరి నీవు దాని వలలో పడిపోయున్నావు, చూశారా. నీవు దానిని పొందియున్నావు, ఇప్పుడు అతను నిన్ను ఎచ్చటికి నడిపింపబోవుచున్నాడు? రోము వైపునకే ఎప్పటివలె నడిపింపబోవుచున్నాడు. దానిని ఇప్పుడే నీవు చూచియున్నావు.

93సంఘస్తులారా, మీకు ఒక మేధావి కావలయును. మీరేమి కోరుచున్నారు? మీరు ఏమి కోరుచున్నారు, సంఘము దేనిని కోరుచున్నది? మీరు ఏమి కోరుకొనుచున్నారు. మీరు బిల్లీ గ్రహము కన్నను ఒక తెలివైన, విద్యాభ్యాసము గల, వేదాంతియైన పరిచర్యకుని కోరుచున్నారు. అతను మిమ్ములను తన జ్ఞానముతో వృద్ధిచేసి మిమ్ములనందరిని తిరిగి సంఘ శాఖలలో తీసికొనిపోవలయును, దానిని మీరు కోరుచున్నారు. ఆ విధముగా పొదిగి బయటికి వచ్చుటకు మీ యొద్ద సెమినరీలు కలవు. చూడుడి, అది సరియే. అది నిజము కాదని మీరు తలంచుకొనవచ్చును; అయితే, చూడుడి, మీ యొక్క మాటలకన్నను మీ యొక్క చేష్టలు ఎక్కువ శబ్దముగా పలుకును. మీరు ఒక మతమేధావిని కోరుకొనుచున్నారు, మిమ్ములను నడిపించు ఒకనిని, మీ యొక్క సంఘ శాఖను నడిపించు ఒకనిని, అందరికన్నను పైగా మిమ్ములను నడపు వానిని కోరుచున్నారు; బాప్తిస్తులను అణగద్రోక్కి, మెథడిస్తులను అణగద్రోక్కి, ఏకత్వము వారిని అణగద్రోక్కి, త్రిత్వమును అణగద్రోక్కి, సమస్తమును అణగద్రోక్కి, మరియు వాటిపై నడపించువానిని మీరు కోరుచున్నారు. మీరు ప్రపంచము క్రింద, పైన అతని కొరకు వెతకుటకు ప్రయత్నించుచున్నారు. ఆ విధమైన వానిని మీరు కోరుచున్నారు.

94అయితే మీకు కావలసినది ఏమిటని మీకు తెలియునా? మీకు ఒక రక్షకుడు కావలయును, అదియే ఖచ్చితముగా మీకు కావలసినదై యున్నది. మరియు మీకు కావలసినది అదియేయని దేవునికి తెలియును ఒక రక్షకుని, మరి దానిని ఆయన మీకు పంపించుచున్నాడు. అయితే వారు దానిని కోరుచున్నారా? లేదయ్యా. అది వారియొక్క ప్రసంగికుల రుచికి తగినట్లుగా లేదు. అది వారి యొక్క మార్గములకు అనువుగా పని చేయలేదు.

అయితే సమస్త ప్రపంచము వారియొక్క మేధావిని కోరుకొనుచున్నది. ఇప్పుడు రష్యా వారియొక్క మెస్సీయను పొందియున్న యెడల మనలను గురించి ఏమిటి?

మీకు తెలియునా జర్మనీ వారియొక్క మెస్సీయను కలిగెను, సమీప కాలమున అది పొందెను, మరియు మీలో బాలురగానున్న అనేకులు మొదటి ప్రపంచ యుద్ధములోనున్న వారికి అది చక్కగా జ్ఞాపకముండును. చూడుడి, దానిని వారు పొందియున్నారు. మీకు ఆ విధమైన మెస్సీయ అక్కరలేదు. అది తప్పుడు మార్గలో యుండెను. అది ఒక తప్పుడు విషయమైయుండెను. అది దేవుని వాక్యమునకు విరుద్దమైనది.

95ఊరక తలంచి చూడుడి, నెపోలియన్ ముప్పది-మూడు సంవత్సరముల వయస్సులో అతను ప్రపంచమును జయించెను మరియు ఓటమితో మరణించెను. అతను ఓటమితో మరణించెను. అతను మొదటగా లేచినప్పుడు మధ్యపానమునకు విరోధముగా నుండెను, మరియు గొప్ప విజయాలు అతడిని పైకి తీసుకొని వచ్చెను; మరి చివరగా అతను ఒక త్రాగుబోతుగా మరణించెను, ఏడు వేల వేశ్యలు అతని సైన్యమును వెంబండించెను. మరియు అతను ముప్పది-మూడవ సంవత్సరమున మరణించెను. మరియు అతను ప్రపంచమును జయించుటకు ప్రయత్నించెను, అయితే దానిని అతను తప్పైన మార్గమున చేసెను.

అయితే యేసుక్రీస్తు ముప్పది-మూడవ సంవత్సరమున ప్రపంచమును, మరణమును, నరకమును, సమాధిని జయించి మరి ఉన్నతములలోనికి ఎక్కి వెళ్ళెను. ఎందులకు? ఆయన ప్రత్యక్ష్యపరచబడిన దేవుని వాక్యమైయున్నాడు. అదియే మన మెస్సీయ! ఆమేన్. నిశ్చయముగా. వారు ఎల్లప్పుడును, మనము ఒక మెస్సీయను కోరుచున్నాము, అయితే మనము ఏ విధముగా కోరుచున్నామంటే….

ఇప్పుడు నేను వ్రాసికొనియుంచిన కొన్ని కార్యములను వదిలి వేయవలసియున్నది, మనకు ఎంతో ఆలస్యమగుచున్నది. మనము దానిలో కొంత భాగమును వదిలివేయ వలసియున్నది.

AMOS 3:7

 

96అయితే ప్రపంచము వారి యొక్క మెస్సీయను కోరుచున్నది. ప్రపంచము ఒక మెస్సీయను కోరుచున్నది. సంఘము ఒక మెస్సీయను కోరుచున్నది. మరి దేవుడు ఒక మెస్సీయను పంపినయెడల ఏనుగును? ఒకవేళ దేవుడు గనుక ఒక మెస్సీయను పంపినయెడల అతను ఎట్లు యుండును? అతను ఒక రాజకీయ మతసంబందిగా నుండడు. అతను మనము పిలుచు లాగున ఒక పెద్ద మేధావిగా నుండడు. ఓ, కాదు.

ఆయన ఏమైయు౦డును? ఆయన హెబ్రియలకు 13:8 వలె నుండును, ఆయన మునుపు ఎట్లు౦డెనో, ఆ విధముగానే నుండును. ఆయన ఎల్లప్పుడును అట్టే యుండును. ఆయన బయలుపడిన దేవుని వాక్యముగా నుండును. అది ఖచ్చితముగా సరియే. ఆయన దేవుని యొక్క వాక్యమై యుండెను; ఆయన దేవుని వాక్యమైయున్నాడు; ఆయన ఎల్లప్పుడును దేవుని వాక్యముగా నుండును. మరియు ఆయన యొక్క రాకడను గురించిన శబ్దము కూడా ప్రవక్తల నుండి వచ్చు వాక్యము ద్వారా అది ధ్వనించబడును. ఇక్కడ వాక్యము పరిపూర్ణముగా వచ్చియున్నది.

మరియు ఈ దినమున ఆయన మరల వచ్చినయెడల ఆయన ఒక దేవుని వాక్యమై యుండును, బయలుపడిన దేవుని వాక్యముగా నుండును, నిరూపింపబడిన దేవుని వాక్యముగా నుండును, దేవుడు మనమధ్య నివసించును. అదియే మెస్సీయ. దానిని ఆయన వాగ్దానము చేసియున్నాడు. ఆమేన్. ఆయన మరల ఆ అగ్ని స్తంభముగా నుండును. ఇశ్రాయేలీయులను నడిపించిన ఆదే మెస్సీయగా నుండును. ఆమేన్. ఆయన అదే యోహాను వలె… [టేపులో ఖాళీ స్థలము కలదు.] నిశ్చయముగా, వారు ఎల్లప్పుడు చేయునట్లుగానే వారు ఆయనను తిరస్కరించెదరు. నిశ్చయముగా. ఏలయనగా వారు ఒక గొప్ప దేశమును కట్టవలయునని కోరుచున్నారు.

JOHN 5:43

 

97మనము ఒక పెద్ద సంఘ శరీరమును కట్టవలెనని కోరుచున్నాము. ఒక గొప్ప సంఘ సమిష్టిని మనము కోరుచు దాని గురించి నేడు మనము ఆలోచించుచున్నాము. అది మంచిదే. దానిని మీరు పొందబోవుచున్నారు. మీరు ఒక ఐక్య సంఘమును కోరుచున్నారు. మీరు దానిని పొందబోవుచున్నారు. దానిని మీరు పొందబోవుచున్నారు. ఆ విధముగా కావలెనని ఎందుకు వారు కోరుచున్నారు? ఒకవేళ మెస్సీయ గనుక వచ్చినయెడల మరి ఆయన వారు కోరునట్టు దానిని అమర్చడు. దానికి ఆయన వ్యతిరేకిగా నుండును. నిశ్చయముగా, ఆయన దానికి వ్యతిరేకిగా నుండును. అయితే వారు దానిని దేనికి కోరుచున్నారు, మరియు ఆ విధముగా వచ్చుటకు కారణము ఏమిటి? వారు ఒక వ్యక్తి లేచి సమస్త కార్యములకు పైగా అధికారిగా నుండవలయునని కోరుచున్నారు. మీరు దానిని పొందబోవుచున్నారు, ఖచ్చితముగా సరియే. మీరు అతనిని గైకొనబోవుచున్నారు, ఏలయనగా అతను వచ్చుచున్నాడు. "ఇంకొకతను వచ్చుచున్నాడు, మరియు మీరు అతనిని అంగీకరింపబోవుచున్నారు," యేసు చెప్పెను, మరియు వారు అంగీకరించెదరు, వారు అతనిని అంగీకరించెదరు. దానిని వారేల చేయవలెనని చూచుచున్నారు? ప్రజలు వారియొక్క స్వయమార్గమున కార్యములను కోరుచున్నారు.

JOHN 8:44•

HEB 13:8

 

98మెస్సీయ వచ్చును, అతను వచ్చి మరియు మీ ఈకలను పీకి వేయును. ఒక ప్రసంగి - స్త్రీల మరియు పురుషుల తోలు వలచునని మాటలాడుకొనుచుంటిరి, ఆయన నిజముగానే మీ తోలును వలిచివేయును. ఆయన వచ్చినప్పుడు ఆయన దానిని చేసెను; ఆయన చెప్పెను, "మీరు సర్పసంతానము, గడ్డిలోనున్న సర్పములు, మీరు మీ తండ్రియైన అపవాది బిడ్డలు." ఒకవేళ మెస్సీయ గనుక ఈ కలుషితమైన కాలమున మరల వచ్చినయెడల, ఆయన మరల అదే కార్యమును చేయును. ఆదిలో ఆయన చేసిన విధముగానే, అదే విధమైన సూచనలతో మరియు అద్భుతములతో ఆయన, ఆయన యొక్క క్రియలను నిరూపించును. ఆయన గనుక మరల తిరిగి వచ్చినయెడల, నిశ్చయముగా దానిని చేయును. మనము గనుక ఆ మెస్సీయను పొందినయెడల ఆయన మొదటిసారి ఏ విధముగా నుండెనో మరియు ఆ విధముగానే ఇప్పుడును యుండును, ఏలయనగా అది వేరే విధముగా నుండదు. బైబిలు చెప్పుచున్నది, "ఆయన నిన్న, నేడు మరియు యుగయుగములకు ఏకరీతిగా నున్నాడు." ఆయన ఎల్లప్పుడును వాక్యముగా నున్నాడు.

1JN 2:15

 

99అయితే మనము కోరుకొనుచున్నదేమిటి? మనము అటువంటి ఒక మెస్సీయను కోరుట లేదు. లేదు, లేదు. మనము లోకములో ఏదో ఒక లోకకార్యమువలె నుండవలయునని కోరుకొనుచున్నాము. మరి జనులు చేయుటకు ప్రయత్నించునది ఏమనగా, వారు కోరుకున్న విధముగా వారు జీవించుటకు వారిని అనుమతించుచు, వారి యిష్టానుసారమైన కార్యములను చేయుటకు సమ్మతించుచు మరియు లోకములోనున్న లోకస్తులవలె ప్రవర్తించుటకు మరియు అట్లే లోక-కార్యములతో జీవించుచు ఇంకను వారు క్రైస్తవులమని చెప్పుకొనుటకు అనుమతించు ఒక మెస్సీయను వారు కోరుచున్నారు. సరి. మీరు దానిని చేయలేరు! "మీరు గనుక లోకమును లేక లోక-కార్యములను ప్రేమించినయెడల, దేవుని యొక్క ప్రేమ మీలో నుండదు," అని యేసు చెప్పియున్నాడు. అవునయ్యా. అయితే అటువంటి మెస్సీయను లోకము కోరుచున్నది. ఆ కారణము వలననే వారు దేవుని యొక్క మెస్సీయను అంగీకరింపకున్నారు. దానిని వారు చేయరు.

ఇది ఆయన యొక్క మెస్సీయ. ఖచ్చితముగా. ఆయన యొక్క వాక్యము ఆయన మెస్సీయగా యుండును. వాక్యము ఏ కార్యములనైతే చేయునని చెప్పుచున్నదో, మీలోనున్న మెస్సీయు ఆ కార్యములను చేయును. క్రీసు మీలోనున్నందువలన అది క్రీస్తును మీలో తిరిగి పునరుత్పత్తి చేయును. ఆయన మారనివానిగా నున్నందువలన, ఆయన జీవము మీలోనున్నయెడల, ఆయన ఏమి చేయునో దానినే మీరు చేసెదరు, దానిని ఎల్లప్పుడు చేయలాగున మీరు చేసెదరు, దానిని ఆయన చేసిన విధముగా, ఆయన చేసిన అదే కార్యములను మీరు కూడ చేసెదరు. దేవుడు పంపు మెస్సీయ అదే.

100వారు కోరుకొను దేనినైనను వారు చేయుటకు అనుమతించు మెస్సీయను, వారేమి చేసినను "ఓ, అది సరియే," అని చెప్పు మెస్సీయను లోకము కోరుకొనుచున్నది. ఓ, దేశమంతటనునున్న ఈ యొక్క స్త్రీలు! మీరు, మీరు దానిని కోరుకొనుచున్నారు. అవును, మీరు కోరిరి. మీరు మీ యొక్క ఫ్రెంచి వస్తాలంకరణను మరియు ఆ యొక్క పెద్ద కార్యములను కోరుచున్నారు. దానిని మీరు పొందియున్నారు. మీరు ఒక నవీన అహాబును మరియు యొజెబెలును కలిగియున్నారు, మరి అది సంఘమును నవీనముగా మార్చుచున్నది. అది సరియే. నేను రాజకీయములను మాట్లాడుట లేదు. నేను సత్యమును మాటలాడుచున్నాను. మీకు తెలియునా, ఈ యొక్క దేశము ఇశ్రాయేలువలె నున్నదని? ఇది అదే కార్యమును చేసియున్నది.

ఇశ్రాయేలు లోనికి వచ్చి మరియు దానిలోనున్న దానిని ఆక్రమించుకొన్న వారిని ఆ దేశము నుండి వెళ్ళగొట్టి మరియు దానిని చేజిక్కించుకొనిరి. దేవుడు దానిని వారికిచ్చెను. మరి వారేమి చేసిరి? వారు దేశమును ఆక్రమించుకొన్న వారిని వెళ్ళగొట్టి మరియు దానిని గైకొనిరి. మొదట వారికి దావీదు మరియు సొలోమోనులాటి గొప్ప రాజులను కలిగియుండిరి. మరియు కొద్ది కాలమైన పిదప ఒక యొజెబెలు అని పిలువబడు… లేక అహాబు అను మనుష్యుడు లేచెను, మరియు అతను యొజెబెలును వివాహము చేసికొనెను మరియు ఆమె ముఖమునకు రంగులు పూసుకొని మేకప్ చేసికొను స్త్రీలలో ఒకతే. మరియు అతను ఆమెను వివాహము చేసికొనినప్పుడు, ఆమె అతనిని నియంత్రి౦చెను. అతను ఏమి చేయవలయునని ఆమె చెప్పెను. అతను ఒకవేళ తలగా నుండియుండవచ్చును, అయితే ఆమె అతని గొంతుగా నుండి మరియు అతను ఏమి చేయవలయునో అమె చెప్పెను.

101మరియు ఈ దేశము అదే కార్యమును చేసియుండ లేదా! మనము ఇచ్చటికి వచ్చి మరియు ఇండియనులను వెళ్ళగొట్టియున్నాము. మనకు వాషింగ్టన్ మరియు ఒక లింకన్ ను కలిగియుంటిమి. అయితే ఈ దినమున మనము ఓటు వేసినందువలన మరి రాజకీయముల వలన మరియు కార్యముల వలన మనమేమి కలిగియున్నాము? మనము ఒక పద్దతిని అమర్చి మరియు దానినుండి ఒక దేశమును చేసియున్నాము, ప్రజల యొక్క కోరికగానున్నందు వలన దానిని మరల మునుపువలె తిరిగి తీసికొని వచ్చియున్నాము. సరి. ఇప్పుడు నేను డెమొక్రాట్ ను కాను లేక రిపబ్లికన్ ను కాను. నేను ఒక క్రైస్తవుని. సమస్తమును కలుషితమైపోయినది.

నేను నా యొక్క ఓటును యేసుక్రీస్తుకు వేశాను. ఆమేన్. "ఈ యొక్క బండపై నేను నిలచెదను, మరి ఇతర భూములన్నియును కృంగిపోవు ఇసుక వలె నున్నది." అవునయ్యా.

1COR 12:13

 

102స్నేహితులారా, మనకు ఒక పద్దతి వాగ్దానము చేయబడలేదు. యేసుకు ఒక పద్దతితో పని లేదు. మనము ఒక పద్దతితో వాగ్దానము చేయబడియుండ లేదు. (మనకు ఏమి వాగ్దానము చేయబడియున్నది?) మనకు ఒక రాజ్యము వాగ్దానము చేయబడియున్నది! దానిలోనికి మీరెట్లు ప్రవేశింపగలరు? "ఒకే ఆత్మ ద్వారా మనమందరమును ఈ రాజ్యములోనికి బాప్తిస్మము నొందియున్నాము." అది దేవుని యొక్క రాజ్యము, ఒక నిత్యమైన రాజ్యము, ఆ రాజ్యములో ఆయన నిత్యమైన వాక్యమును, నిత్యమైన రాజును యిచ్చుచు, నిత్యజీవమునకై ముందుగానే నిర్ణయించబడిన నిత్యమైన జనులు అచ్చట నుండెదరు. ఆయన, ఆయన రాజు. మనము దానిలోనికి బాప్తిస్మము నొందియున్నాము, పరలోకపు మహిమలో కూర్చొనియున్నాము.

LUKE 17:21•

HEB 12:26-28

 

103"మనము చనిపోయి యున్నాము, మన జీవితములు క్రీస్తు ద్వారా దేవునిలో మరుగు చేయబడి యున్నవి." మరియు అది మాత్రము కాదు, మనము ఆయనతో లేచియున్నాము. దేనిలో లేపబడియున్నారు, ఒక పద్దతిలోనా? ఒక సంఘ శాఖలోనా? సంస్థలోనా? మనము దేవుని యొక్క రాజ్యములోనికి పునరుద్దరింపబడి యున్నాము! "దేవుని యొక్క రాజ్యము మీలో నున్నది." ఏల? మానవ-నిర్మితములైన ఈ సమస్త క్రమములన్నియు పతనమైపోవలయును. "నేను ఇంకొక మారు భూమిని మాత్రము కాదు అయితే, ఆకాశమును కూడ కదిలించెదను. మరియు కదిలింపబడని కార్యములు నిత్యమైన నిలకడగా యుండు కార్యములుగా యుండును. మరియు మనము ఒక రాజ్యమును పొందియున్నాము, కదలింపబడని లేక నిలకడగా యుండు ఒక రాజ్యమును మనము పొందబోవుచున్నాము." అది దేవుని యొక్క రాజ్యము! ఏదో ఒక పద్దతి కాదు, ఒక రాజకీయ చక్రము కాదు, ఒక సంఘ శాఖ కాదు, అయితే ఒక రాజ్యము! ఆమేన్! మరియు దానియొక్క పౌరులు ఈ లోక కార్యములకు మరణించినవారై యున్నారు. మరియు దానియొక్క పౌరులు ఈ సంఘ శాఖల కార్యములకు మరణించినవారై యున్నారు. అది ఈ యొక్క రాజకీయ పద్దతులకు చనిపోయున్నది, మరియు అది రాజు యొక్క శక్తి ద్వారా పునరుద్ధరింపబడి, అది జీవించియున్నది.

EPH 1:3•

EPH 2:6•

COL 3:3•

HEB 12:28

 

104నిత్యవాక్యముతో నిత్యజీవమును అనుభవించుటకై మరిప్పుడు మనము ఒక రాజ్యములో నున్నాము, పరలోకపు ఉన్నత స్థలములలో కూర్చొని యున్నాము, నిత్యపరలోకమునకు ఆయనతో కూడా నిత్యముగా నుండుటకై పోవుచున్నాము. హల్లెలూయా! రాజు యొక్క సముఖములో జీవించుచు! ఓ, నేను ఆయనను ప్రేమించుచున్నాను. వ్యూ! వారిలో ఒకనిగా నుండుటకు నేను ఆనందించుచున్నాను. నేను క్రీస్తులో చనిపోవుటకు ఆనందించుచున్నాను, దేవుని యొక్క రాజ్యములో జీవించుటకు ఇష్టపడుచున్నాను. ఇది నా యొక్క గృహము కాదు; మనము ఒక రాజ్యమును వెతకుచున్నాము. రాజును మనము వెతకుచున్నాము. మనము ఇదివరకే రాజ్యములో నున్నాము. రాబోవు రాజు కొరకు మనము ఎదురు చూచుచున్నాము, మరియు రాజు ఆయన యొక్క రాజ్యమునకై త్వరగా వచ్చును.

"ఎనుకనగా మనము కదిలింపబడని ఒక రాజ్యమును పొందబోవుచున్నాము." మరియు ఈ ఇతరేతర కార్యములన్నియును పతనమైపోవుచున్నవి. అమెరికా పతనమైపోవుచున్నది. ఐరోపా పతనమైపోవుచున్నది. ఆసియా పతనమైపోవుచున్నది. సమస్త ప్రపంచమును పతనమైపోవుచున్నది. "అయితే మనము ఒక రాజ్యములో నున్నాము, ఒక నిత్య రాజ్యములో, అది నశింపదు." ఆమేన్, అక్కడ ప్రతి దినమును క్రిస్మస్, ఆమేన్, రాజు యొక్క సముఖములో జీవించుట. మహిమ! దానిని గురించి ఊహింపనక్కర లేదు. అది సత్యము, దేవుని సత్యము, దేవుని యొక్క సంపూర్ణ సత్యము. దీనికొరకు నేనెట్లు ఆయనను ప్రేమించెదను! ఆయన ఎంత మంచివానిగా నున్నాడు!

ISA 53:5•

1PET 2:24

 

105అక్కడ కూర్చొనియున్న నీవు, నా వైపు చూచుచున్నావు, నల్ల టోపీని వేసికొనియున్న చిన్న స్త్రీ నావైపు చూచుచున్నావు. నీవు ఒక రాజ్యములో నున్నావు (దానిని నీవు నమ్ముచున్నావా?) రాజు యొక్క సముఖములో నున్నావు. పేగులలో బాధగాయున్నందు వలన ఒక ఆపరేషన్ సమీపములో చేయించుకొన్నావు. అది సరియేనా? మరి అది నిన్ను ఇబ్బంది పెట్టుచున్నది, అది నిన్ను ఎల్లప్పుడు బాధించుచున్నది; దానిని గురించి మరచిపోవుము. ఇప్పుడు అది సరియగును. ఏల? రాజు యొక్క సముఖములో స్వస్థత కలదు, రాజ్యములో, "ఏలయనగా ఆయన యొక్క గాయములవలన మనము స్వస్థతనొందియున్నాము." ఆమేన్. ఆమేన్.

ఆ వృద్ధుడైన రంగు జాతి సహోదరుడు అక్కడ చివరగా కూర్చొనియున్నాడు, అతని యొక్క చేతులు పైకెత్తుకొని యున్నాడు, చుట్టును చూచుచున్నాడు, నన్ను కనుగొనుటకు ప్రయత్నించుచున్నాడు. నీవు నన్ను కనుగొనలేదు; అయితే నీవు ఆయనను కనుగొనియున్నావు. నీ ప్రక్కలో నుండు ఆ గ్రంథి పుండు నీవు గనుక నీ యొక్క పరిపూర్ణహృదయముతో నమ్మినయెడల, దేవుడు దానిని తీసివేయును. దానిని నీవు నమ్ముచున్నావా? అది సరి. దేవుడు నిన్ను ఆశీర్వదించును. ఆమేన్.

ఓ, ఆయన ఆశ్చర్యకరుడు, అద్భుతమైనవాడు కాడా!

HEB 4:12•

HEB 12:28

 

106మీరేల సందేహించుచున్నారు? సందేహింపకుడి. మీకు ఉబ్బస రోగము కలదు, మీకు గుండె వ్యాధి కలదు, మీకు కీళ్లనొప్పి కలదు, సమస్తమును కలదు. దేవుడు వరుస క్రమములో పిలువవలయునని మీరు కోరుచున్నారు. ఆయనతో మీతో మాటలాడిన చాలు, కార్యము అంతే. సందేహింపకుడి. అది సత్యమనుటను మరచిపోవద్దు. దేవుని నమ్ముడి, మరి మీరు కోరుకొను దానిని పొందెదరు. ఆమెన్.

ఉబ్బసపు వ్యాధితో ఇక్కడ కూర్చొనియున్న ఈ యొక్క వ్యక్తి నార్వేకు చెందినతను. దేవుడు ఆ యొక్క ఉబ్బస వ్యాధిని స్వస్థపరచి మరియు నిన్ను బాగుపరచునని నీవు నమ్ముచున్నావా? నీవు గనుక నమ్మిన యొడల దేవుడు నిన్ను బాగుచేయును. ఆమేన్. ఎందువలన? అది సరి. మీరు స్వస్థతను పొందవచ్చును అయ్యా. మీకు అంత విశ్వాసమున్నదని మీరు ఎరుగకున్నారు, మీకు తెలియునా? అయితే దేవుని యొక్క రాజ్యము వచ్చియున్నది, మరియు మనము మెస్సియతో కూర్చొనియున్నాము, దేవుని యొక్క మెస్సీయ.

"అది 'మెస్సీయ' అని మీరేల చెప్పుచున్నారు? అదేమిటి, సహోదరుడా "బ్రెన్హా౦?"

బైబిలు చెప్పుచున్నది, "దేవుని వాక్యము ఏ రాజ్యముకన్నను, రెండంచుల ఖడ్గముకన్నను మహా శక్తి కలది; అది మనస్సులోనున్న కార్యములను వివేచించును, హృదయ రహస్యములను వివేచించును. "అది దేవుని యొక్క రాజ్యము! హల్లెలూయా!

"కదిలింపబడని ఒక నిత్య రాజ్యమును మనము పొందియున్నాము." దానిని మీరు నమ్ముచున్నారా? ఆయన ఇక్కడున్నప్పుడే మీరు ఆయనను అంగీరించెదరా? అట్లైనయెడల మనము లేచి నిలువబడి, మన హృదయమంతటితో ఆయనను స్తోత్రించెదము.

1COR 12:13•

HEB 12:28

 

107ప్రభువైన యేసు, మిమ్ములను మేము స్తోత్రించుచున్నాము, ఓ, గొప్ప మహిమ గల రాజా! "కదలని నిత్యరాజ్యమును మేము పొందియున్నాము." ప్రభువా మీ యొక్క జనులు స్వస్థతనొంది, నిలుచుకొని మీ యొక్క గొప్ప నామమును పొగడి, హెచ్చుగా చెప్పుచున్నారు తండ్రి. దానిని అనుగ్రహించుము ప్రభువా, ప్రజలపై దయ గలిగి యుండుము. ఈ యొక్క రాజ్యమునకై మేము కృతజ్ఞలముగానున్నాము, "ఏలయనగా ఒకే ఆత్మ ద్వారా మేము ఈ కదిలింపబడని రాజ్యములోనికి బాప్తిస్మము పొందియున్నాము." మరిప్పుడు మనయొక్క రాజు మన మధ్యలో నున్నాడు, చివరి దినములకై ఆయన యొక్క వాక్యమును నిరూపించుచున్నాడు; అదే అగ్నిస్తంభము, అదే యేసుక్రీసు, అదే సూచనలతో. ఆయనలోనున్న అదే జీవితము సంఘములోను నున్నది. "మనము ఒక రాజ్యమును పొందియున్నాము."

108మీరు ఆయనను ప్రేమించుచున్నారా? ఆయన స్తోత్రములను మనము పాడెదము, "నేను ఆయనను ప్రేమించుచున్నాను, నేను ఆయనను ప్రేమించుచున్నాను, ఏలయనగా ఆయన నన్ను మొదలు ప్రేమించెను." మనమందరమును కలసి పాడెదము, సహోదరుడా దానిని మా కొరకు వాయించుము. ప్రతియొక్కరు ఒక్కటిగా, మనమాయనను స్తోత్రించుచుండగా, దానిని మనము పాడెదము, "నేను ఆయనను ప్రేమించుచున్నాను."

నేను ఆయనను ప్రేమించుచున్నాను,

నేను ఆయనను ప్రేమించుచున్నాను

ఏలయనగా ఆయన నన్ను మొదలు ప్రేమించెను;

మరియు నాయొక్క రక్షణను కొనెను

కల్వరి మ్రానుపై.

1COR 12:13

 

109ఓ మై. అది పరలోకమువలె అనిపించుట లేదా? ఓ, మై! ఏమిటని నేను చెప్పెదను, ఈ రాజ్యపు నివాసులతో మనము పరిచయము చేసికొనెదము గాక. మనము మరల పాడుచుండగా, మనము చుట్టు ప్రక్కల తిరిగి మన చుట్టనున్న వారితో కరచాలనము చేసెదము మరియు చెప్పెదము, "దేవుడు నిన్ను ఆశీర్వదించును, నా సహోదరుడా, సహోదరీ దానిని మనము పాడుచుండగా, అందరు ఏకముగా. మీరందరు ఒకరికొకరు కరచాలనము చేయుడి. ఏలయనగా, "ఒకే ఆత్మ ద్వారా మనమందరము ఒకే శరీరములో నున్నాము," మరియు రాజుతో కూర్చొనియున్నాము.

నేను ఆయనను ప్రేమించుచున్నాను,

నేను ఆయనను ప్రేమించుచున్నాను,

ఏలయనగా ఆయన నన్ను మొదలు ప్రేమించెను;

మరియు నా యొక్క రక్షణను కొనెను,

కల్వరి మ్రానుపై.

ఓ, ఆయన అద్భుతమైనవాడు కాడా? ఆమేన్. ఇప్పుడు మరల దానిని పాడెదము.

నేను ఆయనను ప్రేమించుచున్నాను,

నేను ఆయనను ప్రేమించుచున్నాను

ఏలయనగా ఆయన నన్ను మొదలు ప్రేమించెను;

మరియు నా యొక్క రక్షణను కొనెను

కల్వరి మ్రానుపై.

ఎందరు శుద్దీకరింపబడియున్నాముని అనుభూతి నొందుచున్నారు? మనము చూచెదము. ఓ, మై! వాక్యము మన యొక్క ఆత్మకు ఆహారముగా నున్నది. ఓ, మై! దానిని మరల మనము పాడెదము.

నేను… (దేవుడు నిన్ను ఆశీర్వదించును!), నేను ఆయనను ప్రేమించుచున్నాను.

Search Messages

0 / 0 matches
Enter characters above to process real-time text query scopes...