వీడని పట్టుదల
1వందనములు. మీకు వందనములు, సహోదరుడు యోసేపు. "ఇప్పుడు నేను నమ్ముచున్నాను."
ఇప్పుడు నేను నమ్మచున్నాను, ఇప్పుడు నేను నమ్మచున్నాను,
సమస్తమును సాధ్యమగును, ఇప్పుడు నేను నమ్మచున్నాను;
ఇప్పుడు నేను నమ్ముచున్నాను, ఇప్పుడు నేను నమ్మచున్నాను,
సమస్తమును సాధ్యమగును, ఇప్పుడు నేను నమ్మచున్నాను.
ఆయన సన్నిధిలో ఇప్పుడు మన హృదయుములను వంచెదము. మా పరలోకపు తండ్రీ, ఈ రాత్రి మరల మీకు మేము కృతజ్జలమై యున్నాము, ఏలయనగా మీరు దినమంతయు మాతో కూడా నుండి మరి మమ్ములను నడిపించితిరి. మరియు ఈ రాత్రి, మరల మేము ప్రియమైన ప్రభువైన యేసు నామమున మేము ఒక్కటిగా కూడియున్నాము. మరియు మేము మీ యొద్ద నుండి ఇచ్చట ఉన్నతమైన దానిని ఎదురు చూచుచున్నాము. ఈ కూటము యొక్క ముగింపునందు, మీరు వ్యాధిగ్రస్తులను, బాధపడుచున్న జనులందరిని స్వస్థపరచబోవు వంటి వాటితో ఈ రాత్రి సమయమున మీరు అనుగ్రహించబోవు ఆ ఉత్కంఠ సమయమునకై మేము ఇప్పుడు ఎదురు చూచుచున్నాము. ఈ రాత్రి మా మధ్యలో ఏ ఒక బలహీనమైన వ్యక్తిని విడువబడకుండా యుండును గాక! మరియు వారియొక్క విశ్వాసము పైకి ఎదగనిమ్ము, ప్రభువా, మరియు వారు వారియొక్క బాధలను ఇక మీదట చూడక, అయితే మరి వారి బాధలకు పరిష్కరించు లేదా వారిని బాధలను బాగుచేయు వంటి ఆ ఒకనిని చూడనిమ్ము. మరియు దేవా, మమ్ములను ఉత్సాహపరచు మా కొరకైన ఆ జీవపు రొట్టెను మీ వాక్యము నుండి మీరు మాకు విరిచి అనుగ్రహించమని మేము ప్రార్థించుచున్నాము. "ఏలయనగా విశ్వాసము వినుట వలన కలుగును మరియు దేవుని వాక్యమును వినుట వలన." మరియు మేము మిమ్ములను స్తుతించుచున్నాము, యేసు నామములో దీనిని మేము అడుగుచున్నాము. ఆమేన్.
2మీకు కూర్చొనవచ్చును. కావున ఈ రాత్రి మరల మీ మధ్య నుండుటకు ఆనందముగా నున్నది. కొద్ది నిమిషములకు మునుపు నేను అక్కడ ద్వారము నొద్ద దాటి వచ్చుచుంటిని, మరి అక్కడ గొప్ప జనసమూహము వీధులలో పైకి క్రిందికి నడచి వెళ్ళుచు అచ్చటనే తిరుగుచుండిరి. మరియు బస్ డ్రైవరు చెప్పెను… నన్ను మన్నించుడి, కారు డ్రైవరు అడిగెను, "ఆ జనులు సంఘమునకు రాలేదు కదూ, మరి వారు సంఘమునకు వచ్చితిరా?" నేను చెప్పాను, "అవునయ్యా, వారు లోనికి రాలేకున్నారు," అని నేను చెప్పాను. జనులు అనేకులు చెప్పెదరు, ప్రజలు సంఘమునకు పోవుటకు ఇష్టపడరు, చూశారా. అయితే, వారు… భూమిపై సువార్త ఇంకా గొప్ప ఆకర్షణ శక్తిగానే యున్నదని నేను నమ్ముచున్నాను, అదింకా సామాన్యమైనదిగానే యున్నధి.
3ఈ ఉదయ కాలమున వ్యాపారస్తుల సంపూర్ణ సువార్త యొక్క అల్పాహార సమయమందు ఒక గొప్ప సమయమును కలిగి యుంటిమి. ప్రభువు మమ్ములను ఆశీర్వదించెను. ఆయన మమ్ములను ఒక గంభీరమైన రీతిలో సంధించెను. పదిహేడు వందల టిక్కెట్లు వారు అమ్మియున్నారని వారు చెప్పిరి, వారు అమ్మితిరి, వారు అదే చెప్పారని నేను నమ్ముచున్నాను. అంతేకాకుండా మరో మూడు వందల మందిని లోపలికి అనుమతించిరి, అటు పిదప అంతకంటే ఎక్కువ వుందిని లోపలికి పంపించుటకు వారికి సాధ్యపడనందున, ద్వారము యొక్క తలుపులకు యిరు ప్రక్కల వారు అచ్చట నిలుచుకొనియుండిరి. మరియు మేము వేదిక నుండి పిలుపు నిచ్చినప్పుడు, నిత్యజీవమును పొందుకొనుటకు అనేకులు పైకి లేచిరి. ఆ విధముగా అనేకులను ప్రభువు మాకు అనుగ్రహించెను. కావున దానికొరకై మేము ఎంతో వందనములు చెల్లించుచున్నాము.
MARK 6:31
4మరియు నేను ఒక సహోదరునికి కృతజ్ఞతలు తెలుపవలయునని ఆశించుచున్నాను. అతడు లోపలికి ప్రవేశించలేకపోయెను, అలాగని నేను అనుకోవటం లేదు. మరియు అతను కొద్దిసేపటికి మునుపు బిల్లీ యొద్ద ఒక అట్ట పెట్టెలో .22 తుపాకీ గుండ్లు నా కొరకై ఇచ్చెను. మరి అచ్చట వాటిని నేను పొందుకొన్నాను. నిజముగానే, వాటి నిమిత్తమై నేను ఎంతో సంతోషించాను. మీరు ఒకవేళ వెలుపల గాని, లేదా లోపల గాని, ఎచ్చట యున్నా గాని, అందుకొరకు మీకు నేను ఎంతో కృతజ్ఞతలు తెలుపుచున్నాను. నేను నిశ్చయముగా…
గురిపెట్టి పేల్చటము కొన్ని సమయములయందు అది నాకు ఒక గొప్ప దీవెనగా యుండును. మరిప్పుడు, మీ యొక్క ఉద్రిక్తత నుండి ఏదో విధముగా మీరు బయటపడవలయును, కొన్ని సమయములయందు అటువంటి ఒక అవకాశము నాకు చేజిక్కినప్పుడు దానిని నేను ఆ విధముగానే చేయుదును. ఎందుచేత, ఆ విధముగా కొద్దిసేపు తుపాకీని పేల్చుట వలన, నాలోయున్న ఒత్తిడియనే ఆవిరిని వెలుపలికి విడిచి దానినుండి విడుదల పొందుటకై నేను దూరముగా పరుగెత్తి పోయెదను. యేసు చెప్పినాడని నేను నమ్ముచున్నాను, "మనము కొద్దిసేపు వేరుగా నుండుటకై అరణ్యమునకు వెళ్ళేదము."
5ఇప్పుడు, మేము మిమ్ములను ఎంతగానో ప్రేమించుచున్నాము! మరియు రేపు ఆదివారము మరియు ప్రతియొక్కరును ఆదివారమున సంఘమునకు వెళ్ళుటకు ఆశించెదరు. ఖచ్చితముగా మీరందరు ఎరిగియుందురు. ఎచ్చటోయున్న (దానిని రాతి సంఘమని (Rock Church) చెప్పుటకు నేను ప్రయత్నించుచున్నాను) ఆ రాతి సంఘమును, నేనెరుగుదును. ఆ సంఘమే ఈ కూటమును జరిపించుటకై ఏర్పాటు చేసిరి. ఇతరులు కూడా ఇచ్చటకు వచ్చి చూచుచున్నారని నేను ఊహించుచున్నాను. ఈ పట్టణమునకు చెందని క్రొత్తవారు ఈ కూటమునకై వచ్చియున్నారు, మరియు మీరు గనుక లేకున్న… ఇప్పుడు మీకు గనుక కర్తవ్యమున్న యెడల, మీరు అచ్చటికి వెళ్ళుడి. మీరు చేయవలసిన కార్యము అదియే. ఎల్లప్పుడును మీ కర్తవ్యస్థానములో నందు మీరు నిలిచియుండండి. అదియే మీ యొక్క - అదియే మీరు దేవునికి, మరియు మీ సంఘకాపరికి, తదితర మీ సంఘ సభ్యులకు మీరు చేయు కార్యమైయున్నది. కాని మీరు వెళ్ళుటకు ఏ స్థలము లేనియెడల ఖచ్చితముగా మిమ్మల్ని ఈ రాతి సంఘము ( Rock Church)నకు నేను నిశ్చయముగా ఆహ్వానించుచున్నాను, ఏలయనగా ఆరాధనలను గురించి వారు ప్రకటించియున్నారని నేను అనుకొనుచున్నాను.
ACTS 2:39
6మరియు ఈ కూటములలో రక్షింపబడినవారు, మేమెన్నటికి ఎరుగము. ఇప్పుడు, మేము సహజముగానే వేదిక పిలుపును యిచ్చెదము, మేము దానిని బలిపీఠపు పిలుపులని పిలిచెదము, చూశారా, మరియు అది సరియే. దానికి నేను వ్యతిరేకిని కాదు. అది మంచిది. అయితే నేను నమ్ముచున్నాను, మీరు గనుక లేఖనములను గుర్తించి చూచినయెడల, వారు బలిపీఠపు పిలుపనేది వారికి లేదు. "ఎందరైతే విశ్వాసించిరో మరి వారు సంఘములో చేర్చబడిరి." విశ్వాసులు!
మరియు మీరు వెళ్ళుటకు ఏ సంఘము లేని వారినైనను, మంచిది, ఈ చుట్టు ప్రక్కల ఇచ్చటయున్న ఏ మరికొందరినైనను సహోదరుడు విక్ మిమ్ములను తనయొక్క సంఘమునకు ఆహ్వానించుచున్నాడని నేను నిశ్చయముగానున్నాను. మీలో ఎవరైనను క్రైస్తవ బాప్తిస్మమును పొందనియెడల, వారిని సంప్రదించుడి. మరియు నిలిచిపోవద్దు. ముందుకు కొనసాగిపోతూనే యుండండి, కేవలము ముందుకు కొనసాగిపోతూనే యుండండి.
7మాకు తెలియనే తెలియదు, ఎంతమంది స్వస్థతనొందినారని కూడా మాకు అసలు తెలియనే తెలియదు. మరియు కాపరులైన సహోదరులారా, గుర్తుంచుకొనుడి, కూటములు ముగించిన పిదప, ఒకవేళ అనేక వారములకు తరువాత, ఒక దీనురాలైన స్త్రీ గాని, మరెవరైనా గాని మీయొద్దకు వచ్చి, ఈ విధముగా చెప్పియుండవచ్చు, "మీకు తెలియునా, నాకు స్త్రీలకుయున్న వ్యాధి యుండెను, అదిప్పుడు లేదు." ఎవరో ఒకరు, "నాకు మీరెరుగుదురు, అప్పటికప్పుడే, సిగరెట్లను ఇంకెప్పుడూ నేను ముట్టుకోకూడదనుకొంటిని, అక్కడిక్కడే అది నన్ను విడిచి వెళ్ళిపోయినది." చూచారా. వారు స్వస్థతను పొందితిరి. ఇంకా అనేకమంది కలరు, వారినందరినీ మీరు పిలువలేరు. గమనించారా, అది కేవలము ప్రతీ చోటా జరిగినది మరియు నా కింకను దాని పిదప కూటములు లేనందువలన, అయితే దాని పిదప జరిగిన ఫలితములు అవే అచ్చట ప్రభువు వారిని స్వస్థపరచెను మరి వారు అప్పుడు దానిని గుర్తించలేకపోయిరి, కాని వారు స్వస్థతను పొందుకొనిరి. మొదట జరిగిన విషయమును మీరెరుగుదురా, మరియు మీకు తెలియునా - మొదటి కార్యము, ఆ కూటములప్పుడు వారు లేచి వెళ్ళిపోయిరి మరి దానితో అది అంతా అయిపోయినది. అయితే వారు అప్పుడు దానిని గురించి గ్రహింపలేకపోయిరి, కాని అది ఇంచుమించు అది సమాప్తమైనది.
8చాలా కాలము క్రితము ఫిన్లాండ్లో సంభవించిన సంభవము నాకు గుర్తున్నది. ఇచ్చట ఫిన్లాండ్ జనులు యున్నారని నేను ఊహించుచున్నాను. అచ్చట మరణము నుండి ఒక బాలుడు మరల లేపబడెను. పుస్తకములో మీరు దానిని చదివే యుందురు. ఆ వార్త రష్యా యంతటా వ్యాపించెను, అయితే ఆ కార్యము సంభవించుటకు రెండు సంవత్సరములకు మునుపే నేను దానిని దేశమంతటను చెప్పియున్నాను.
ఆ చిన్న ఫిన్నిష్ బాలిక, అచ్చట ఆ హాలులో వెలుపల నిలబడియుండటం నాకు గుర్తున్నది, ఒక కాలు ఇంకొక కాలుకంటే ఆరు లేదా ఎనిమిది అంగుళాలు కురచగా యున్నది. ఆ కురచ కాలికి తగిన విధముగా ప్రత్యేకముగా చేయబడిన ఒక పెద్ద షూను ధరించుకొని యుండెను. ఆమె వ్రేలికి ఒక చిన్న కొక్కి కలిగియుండి మరి ఆమె మెడకు ఒక నాడాతో అది కలుపబడి యుండెను. మరియు ఆమె భుజముల చుట్టూ ఒక బెల్టు కలిగియుండి మరి ఈ విధముగా అడ్డముగా కట్టబడి ఆమె షూలోని వ్రేలి వరకు అది కలుపబడి యుండెను. ఆమె రెండు చంక కర్రలను కలిగియుండెను. మరియు మురికి దుస్తులతో నుండెను. మరియు ఆమె కదులు ప్రతి సమయమును ఆమె తన కాలును తన భుజములతో సహా పైకెత్తి ఆ నాడాతో, మరి ఆ విధముగా త్రోసుకొనుచు దానిని క్రిందకు యుంచి, మరటు పిదప ఆ చంక కర్రను క్రిందికి దించును. మరియు మనము…
వారు పిలుచు ఆ స్థలమందు మేముంటిమి (ఇప్పుడు ఫిన్నిష్ సహోదరుడు మరియు సహోదరి, నేను దానిని సరిగా ఉచ్చరింపలేను) మెషూహలి, మరియు అన్ని అక్షరములతో అది నుండును. మరియు వారు సుమారుగా ఇరువది వేల మందిని లోనికి రానిచ్చిరి లేక మరెందరో వారు విని బయటికి వెళ్ళిన పిదప నేను మరి ఇంకొక ఇరువది వేల మందికి ప్రసంగించులాగున చేసిరి.
9మరియు కుయోఫియోలో చనిపోయి మరల లేపబడిన ఆ చిన్న బాలుడు, ఒక కారు ఆ బాలుడిని ఢీకొనినందున అతడు చనిపోయెను. మరియు ఓ, మై! వారు వార్తలు మరియు మొదలగునవియే ప్రసారము చేయుదురు, కాని రాక్-అండ్-రోల్ వంటి నృత్య కార్యక్రమములను వారి ప్రచార సాధనముల ద్వారా ప్రసారము చేయరు. అందువలన ఈ సంభవము ఆ వార్తలయందు ప్రసారము చేసిరి. మరి వారు దూరముగా నుండు రష్యా నుండి ఇచ్చటికి వచ్చిరి.
మరియు, ఆ రాత్రి నేను చూచియున్నాను. మరి అది యుద్ధము జరిగిన వెంటనే సుమారుగా ఐదు సంవత్సరములు క్రితము అని నేను అనుకొనుచున్నాను. మరియు నేను ఆ చిన్న వరండాలోనికి వచ్చి మరి ఆ చిన్న హాలులోనికి వచ్చితిని. మరియు రష్యా సైనికులు మరియు ఫిన్నిష్ సైనికులు వారు ఒకరిపై ఒకరి చేతులుంచుకొని, ఒకొరినొకరు ప్రేమించుకొనుచు, ఒకరినొకరు అప్యాయముగా ఓదార్చుకోవటమును బట్టి అది యుద్దమునకు వీడ్కోలు చెప్పి సమాధానమును ఆహ్వానించుట అని అర్ధము. మరి ఆ విధముగా వారు సమాదానముతో నుండుటకు అది యేసుక్రీస్తు యొక్క ప్రేమ అవసరమైయున్నది.
10అయితే ఆ గొప్ప కమ్యూనిస్ట్ సైనికులు అక్కడ నిలుచుకొని యున్నారు! మేము ఫిన్నీస్ సైనికుల ఒక చిన్న గుంపును దాటి పోతిమి, వారు మరి గడ్డము కూడా తీయలేదు, మృదువైన ముఖముతో, పెద్ద బూట్లు ధరించుకొని వీధి గుండా నడచి వచ్చుచు జనులను గమనించుచుండిరి. వారు ఆ పట్టణపు భవనములకు ఇరు ప్రక్కల గుంపు కూడి యుండిరి. మరియు ఆ సైనికులు శ్రద్దగా నిలుచుకొని యుండగా మరి వారి చెంపలపై నుండి కన్నీరు కారుచుండెను. వారు చెప్పిరి, "మరణము నుండి జీవముతో లేపగల ఒక దేవునిని మనము స్వీకరించెదము." మనవలెనే వారు కూడా మానవులే.
క్రైస్తవత్వమును చాటించుచు క్రైస్తవులమని చెప్పుకొనుచు మరి అది ఏ విధమైన ఫలితములను చూపించకనున్న యెడల వారు, దానిని ప్రక్కకు నెట్టెదరు. వారు ఏదో ఒక నిజమైన వాస్తవమును కోరుచున్నారు. చూడుడి, ఆ కారణము వలననే కమ్యూనిజమ్ పైకి లేచి యున్నది, దిగజారిపోవుట సంఘము దాని స్థాయి నుండి క్రిందికి దిగజారిపోవుట వలననే. కమ్యూనిజమను గురించి సంఘము అపరాధిగా యున్నది, ఎందుకనగా అదియే దానిని ఆ విధముగా చేసినది. మరియు ఇప్పుడు ఆలోచించుడి, రష్యాలో ఒక శాతము (నూటికి ఒక్కడు) మాత్రమే కమ్యూనిస్టు, ఒక శాతము మాత్రమే. తొంబది-తొమ్మిది శాతము జనులు ఇంకా క్రైస్తవులుగానే యున్నారు. వారికి కావలసినది ఒక నిజమైన దహింపజేయు అగ్ని, ప్రభువు నెలవిచ్చుచున్నాడుతో గల ఒక ప్రవక్త. ఎందుకనగా చూశారా, అది కమ్యూనిస్టు బలమును సముద్రములోకి త్రోయును. మనకు కావలసినది ఏమనగా, వారు నిజమైన క్రైస్తవత్వమును కోరుచున్నారు.
మరియు ఈ రష్యా సైనికులు ఆ రాత్రి అచ్చట నిలుచుకొని యుండిరి, మరియు నేను ఆ చిన్న వరండా లోనికి వచ్చి మరి ఆ చిన్న హాలులోనికి వచ్చితిని. మరియు ఈ చిన్న బాలిక, నేను ఆమెను మరచిపోలేను, ఆమె చింపిరి తలతో మరియు మురికి చింపిరి దుస్తులతో నుండెను. మరి ఆమె స్త్రీల గది నుండి బయటికి వచ్చెను. మరియు నన్ను విసిగింపవద్దని వారు ఆమెతో చెప్పిరి.
11నేను బయటికి వెళ్ళి మరి చక్కెరతో చేసిన మిఠాయిని కొంటిని. నాకు పిల్లలు గలరు, చిన్న పిల్లలంటే నాకెంతో ఇష్టము. చిన్న పిల్లలను ప్రేమించలేని వారిలో ఏదో తప్పు యున్నదని నేను అనుకొనుచున్నాను. కావున ఈ చిన్న పిల్లలు నన్ను వరుసగా దారమువలె వెంబడించెదరు. నేను వారికి తీపి మిఠాయిని కొని యిచ్చెదను. వారు దాని నిమిత్తము డబ్బులను నాకు యిచ్చెదరు, కాని అలా తీసుకోవటము బాగోదు, అది ఎంత అయినదో అంతటిని నేనే చెల్లించెదను. నేనేమి కొంటానో నాకే తెలియదు, అయితే నేను వాటిని కొని వారికి యిచ్చెదను. మీరెరుగుదురా, నేను ఆ చుట్టు ప్రక్కల నడుచుకొంటూ వెళ్ళినయెడల, ఆ వీధులలో నున్న ఆ చిన్న పిల్లలు కూడా నన్ను ఆ తీపి మిఠాయిలను నా యొద్ద అడిగెదరు. ఆ విధముగా వారు ముందుకు కొనసాగుచు నన్ను మరచిపోయెదరు, నేను తలంచెదను, అది ఒక చిన్న వ్యాయముని.
మరటుపిమ్మట నేను ఆ రాత్రి వచ్చినప్పుడు, ఆ చిన్న బాలిక తానేదో తప్పు చేసినట్లు అనుకొని ఆమె తన చిన్న తల వంచుకొని యున్నదని నేనెరుగుదును. మరియు ఆమె తన చిన్న, నీలి కన్నులతో నేనేమి చెప్పెదనో యని చూచుచుండెను.
12మరియు నాకు ముందున్న ఇరువురు సైనికులు ద్వారము నొద్దకు వెళ్ళిరి. మరియు వారు "నమ్మిన చాలును" అను పాటను పాడుచుండిరి. మరి ఇంకో ఇద్దరు నాకు వెనుక నుండిరి. నేను "నిలుపు"మని, వారికి సైగ చేసాను.
ఆ బిడ్డ ఏమి చేయునోయని నేను చూడ తలంచితిని. ఆ బాలికకు సుమారుగా ఎనిమిది లేక పది సంవత్సరముల వయస్సు యుండ వచ్చునని నేను ఊహించుచున్నాను. ఆమె యుద్ధములో విడువబడిన ఒక చిన్న అనాధయని నేను పిదప తెలుసుకొన్నాను. రష్యా యుద్ధములో ఆమె తల్లి తండ్రులు చంపబడిరి. మరియు నేను ఆ చిన్న బాలికను చూసాను, మరి ఆమె ఈ చంక కర్రలను కలిగి వాటి ఆధారముతో నిలుచుకొని యుండెను. మరియు మీకు తెలియునా, ఆమె తానేదో తప్పు చేసినదని తలంచుకొనెను.
13మరి నేను ఆమె తట్టు చూశాను. "నీవు నన్ను చూడగోరుచున్నావా?" అని నేను అడిగాను. మరి ఆమెకు ఆంగ్ల భాష తెలియదు. మరి నేను అచ్చటికి రమ్మని ఆమెకు సైగ చేశాను. మరియు ఆమె తన తలను పైకెత్తి చిన్న బిడ్డవలె చూచెను. ఆమె తన కర్రలను బయటికి తీసి మరి తన చిన్న చేతులను ఆ విధముగా పైకెత్తెను. మరిచ్చట ఆమె నడచుచు వచ్చుచున్నది.
"ఆ బిడ్డ ఏమి చేయునో అని నేను ఊరకే చూస్తాను," అని నేను అనుకొన్నాను. మరి ఆ విధముగా నేనచ్చట నిలుచుకొని యున్నాను. ఆమె నాకు చాలా సమీపముగా నిలుచుకొని, నన్ను క్రిందికి పైకి చూచుచుండెను. నేను అనుకొన్నాను, "ఆమె ఏమి చేయునో" అని నేను చూస్తూ యున్నాను. ఆమె నా కోటును తన చేతులతో పట్టుకొని, దానిని చూస్తూ యుండి, నా కోటు యొక్క జోబిని ముద్దు పెట్టుకొనెను, మరియు పిదప తన చేతిని దించెను.
14"నా యొక్క చిన్న సహోదరి," యని నేను ఆమెతో చెప్పబోవుచున్నాను, మరి ఏ విధముగా మాటలాడవలయునో నాకు తెలియకుండెను. మరియు నేను ముందుకు చూశాను, మరి ఆమె సామాన్యమైన పిల్లలవలె వీధులలో పరిగెత్తుచూ ఆమె వెళ్ళటమును నేను చూశాను, మరియు నేనిప్పుడు చెప్పాను, నేను ఆమెతో మాటలాడలేను, నేను చెప్పాను, "ప్రియమైన బిడ్డ, యేసుక్రీస్తు నిన్ను స్వస్థపరచియున్నాడు."
మరియు ఆమె తన చిన్న గౌనును లాగుకొని ఫిన్నీయులు చేయునట్లుగా మరి చెప్పెను, "కిటోస్," (Kitos) అట్లనగా "మీకు వందనములు," అని అర్థము, చూడుడి, జోబిని ముద్దు పెట్టినందులకు. నేను అనుకొన్నాను, ఒకవేళ నేను లోకములో ఒక పెద్ద వేషధారిగా నుండి యుండ వచ్చును, దేవుడు ఆ చిన్న బిడ్డ యొక్క విశ్వాసమును ఆమోదించెను.
మరియు కావున ఆమె, నేను తలంచాను, "మంచిది, కొద్దిసేపైన పిదప ఆమె ఎట్లైనను కనుగొనును. చూడుడి, అది ఆ విధముగా నుండును, ఆమె స్వస్థత నొందును, ఎందుకనగా ఆమెకు సంభవించిన దానిని నేను దర్శనములో చూశాను." అది ఆ విధముగా నెరవేరవలయును! నేను ఏమి చెప్పియున్నానో అది కేవలము జరిగి తీరవలయును.
15కావున ఆ రాత్రి, ప్రభువు అనేకమైన కార్యములను చేసెను, మరియు నేను
వెళ్ళుటకు సిద్దముగా నుంటిని. మరియు నేను చెప్పాను, "మంచిది, మరి కొందరిని పిలువుడి."
మరియు నా సహోదరుడు చెప్పెను, "వద్దు," చెప్పెను, "నీవు…" మరియు సహోదరుడు బాక్స్టర్ చెప్పెను, "మీరు ఇప్పటికే అలసిపోయున్నారు, సహోదరుడా బ్రెన్హాం" అని చెప్పెను. "ఇప్పుడు, మీరు ఇప్పటికి చాలును, వదలి రమ్ము, ఏలయనగా మనము ఇంకొక చోటికి పోవలయును." మరియు చెప్పెను, "మీరు ఊరక…
నేను చెప్పాను, "మంచిది, ఇంకా నాలుగు లేక ఐదుగురు యున్నారని నేను అనుకొన్నాను, అయితే ఇక్కడ అనేకులు కలరు."
కావున ప్రార్ధనా వరుసలో తదుపరి వచ్చు వారు ఆ చిన్న బాలిక. కార్యములను ఏ విధముగా ఖచ్చితముగా చేయవలయునో ప్రభువు ఎరుగును. కావున నేను అడిగాను, "శ్రీమతి. ఐసక్సన్…" ఆమె ఒకవేళ ఇక్కడ యుండవచ్చును. ఆమె ఫిన్లాండులో నాకు తర్జుమా చేసినది. మరియు నేను చెప్పాను, "ఇప్పుడు, నేను చెప్పు మాటలను నీవు చెప్పుము." ఆమె చెప్పెను, "అది సరియే."
మరియు నేను చెప్పాను, "ప్రియమైన బిడ్డ, ప్రభువైన యేసు నిన్ను స్వస్థపరచియున్నాడు, నీవు చేసిన దానికి అచ్చట నీకు ప్రతిఫలమిచ్చియున్నాడు." నేను చెప్పాను, "నీవిప్పుడు వెళ్ళి, నీ కట్టు విడిపించుటకు ఆ మనుష్యులను పిలువుము. ఏమి సంభవించునని గమనించుము." మరియు ఆమె వేదిక ప్రక్కగా కుంటుకొని నడచుచుండెను. మరియు నేను తక్కిన ఇతరులతో దానిని గమనించుచుంటిని.
కొద్ది క్షణములలో, తలపైన ఆ విప్పబడిన బంధకములతో, షూలతో మామూలుగా నడచు వారివలె కాళ్ళు ఆడించుచు నడచుచు, క్రిందికి పైకి పరుగెత్తుచు, మెట్ల పైన పరుగిడుచు నుండెను. చూడుడి, విశ్వాసము, విశ్వాసము, ప్రేమ తన స్థానమును కనుగొనెను. అది సరియే.
16ఈ దినమున నాకు ఒక చిన్న అనుభవము కలిగెను, మరియు క్రైస్తవ సహవాసము అనగా ఏమిటని నేను చూపెదను. నేను గత సారి ఇచ్చట న్యూ-యార్కు లేక నేనిచ్చట సహో, హడ్సన్, నేను తలంచుచున్నాను, అచ్చట … ఆ ఒకటి, అది అక్కడ న్యూ-యార్కులో యని నేను తలంచుట లేదు. అది, నాకు తెలియదు అది న్యూ-యార్కు చుట్టు ప్రక్కల నున్నది. మరి అది నాకు న్యూ-యార్కు మాత్రమే, ఇచ్చటి టూసాన్ నుండి, ఆ విధముగా అగుపించుచున్నది.
కావున అప్పుడు నేను సహోదరి బ్రౌన్ మరియు సహాగోదరుడు బెర్గ్ తో ఇచ్చటికి వచ్చుచుండెడివాడిని. అనేకులు మీరు వారిని ఎరిగి యున్నారని నేను నిశ్చయముగా నున్నాను. మరియు ఆ ప్రియమైన పాత పరిశుద్దుని కనుగొనుటకు గత ఒకటి రెండు దినములుగా నేను ప్రయత్నించుచున్నాను. మరియు అచ్చట సంఘములో ఎవరూ లేరు మరి ఈ దినమున నేను ఫోనులో ఆమెతో మాటలాడితిని. నేను కాపలా కాయు వానితో మాట్లాడగలిగితిని. మరియు, మంచిది, నేను ఒక పదహారేండ్ల వయస్సు గల అమ్మాయితో మాట్లాడుచున్నట్లుగా నేను తలంచితిని. ఆమె స్వరములో అంత మృదువుగా నుండెను. నేను చెప్పాను, "సహోదరి బ్రౌన్, నెలలో ఒక ఆదివారమున, ఇది ఎవరని" నీవు నిజముగా ఊహించి యుండలేవు.
మరియు ఆమె చెప్పెను, "నీ హృదయము ఆశీర్వదింపబడును గాక, నేను నిజముగానే గ్రహించలేకపోయాను."
ఆమె ఎంతగా ఆనందించాలో అంతగా అనందించినది. "సహోదరుడు బ్రెన్హాం" అని నేను చెప్పాను, అది వినగానే ఆమె ఆనందముగా కేరింతలు పెట్టుటకు ప్రారంభించినది; అది అటువంటి ఒక మధురమైన పాత సంభవము.
మరియు ఆమె ఎనభై-మూడు సంవత్సరముల వయస్సు గలది, మరి వారమునకు రెండు మార్లు ప్రసంగించును. మరియు ఊరక ఆలోచించి చూడుడి, ఆమె నేను పుట్టక మునుపే వాక్య సేవలో ప్రవేశించినది. మరియు నేను వృద్దునిగా అవుచుండుట వలన నేను వదలుటకు సిద్ధముగా నున్నాను. ఇప్పుడు నేను నూతన ధైర్యమును తెచ్చుకొన్నాను.
17మరియు నేనిచ్చట సహోదరుడు విక్ తో యున్నానని ఆమెతో చెప్పాను. ఆమె సహోదరుడు విక్ ను గురించి ఆమె నాతో మంచి మాటలు చెప్పెను! నేను మీకు చెప్పుచున్నాను, అది… అదియే నిజమైన క్రైస్తవత్వము. ఇచ్చట న్యూ-యార్కులో రెండు పెద్ద సంఘములు గలవు, వారి మధ్య పోటీలు లేవు, మీరు చూడుడి, క్రీస్తులో నిజమైన సహోదర మరియు సహోదరులుగా యున్నారు. నేను మీకు చెప్పుచున్నాను, అది సంఘ కాపరికి ఎంతో పెద్ద విషయమని మీరెరుగుదురా, ప్రాచీన సంఘాలుగా స్థిరపడిన వాటిల్లో ఆ రెండు సంఘాలే ఇచ్చట యున్నవి. మరియు వారింకా సహోదర - సహోదరిలుగానే ఐక్యతగా యుండి, ఏకంకా కలిసి పనిచేయుచున్నారు. మరి ఆ విధముగానే మీరు కూడా దానిని చేయవలయును. అది చాలా బాగున్నది. ప్రభువు కొరకు అతడు చేయు గొప్ప సేవ నిమిత్తము, మరియు ఇతరుల కొరకు అతడికి గల గొప్ప మనోభావాల నిమిత్తము, వారిరువురు నిమిత్తము ఇది సహోదరుడు విక్ ని మెచ్చుకొను ఒక అభినందనగా యున్నదని నేను తలంచుచున్నాను. వారిరువురూ ఇంకా దీర్ఘకాలముగా జీవించునట్లుగా ప్రభువు కృప అనుగ్రహించును గాక!
మరియు సహోదరుడు విక్, మనము మంచి వృద్దులమగుచున్నామని నేను తలంచుచున్నాను, అయినా గాని మనమింకా చిన్న పిల్లలమే చూశారా, మనము చిన్న పిల్లలమే.
2KGS 2:12
18సహోదరుడు బోస్వర్త్ చనిపోవునప్పుడు అతడు ఎనభై-నాలుగు సంవత్సరముల వయస్సుగలవాడని నాకు గుర్తున్నది. అతనిని చూడాలనే ఆశతో నా పాత కారు యొక్క చక్రాలు కాలిపోయేంతటి వేగముగా అచ్చటికి వెళ్ళాను. తన చేతులను ఆ విధముగా పైకెత్తుచూ, బట్ట తలను కలిగిన అతడు పైకి లేవటమును నేను చూచాను. అతడు తన చేతులను నాపై వేసెను, "నా తండ్రి, నా తండ్రి, ఇశ్రాయేలు యొక్క రథములు మరియు గుర్రపు స్వారి చేయు వారు అచ్చట!" అని నేను కేకలేసితిని. మరియు నేను చెప్పాను, "సహోదరుడా బోస్వర్త్, నేను నిన్ను ఒకటి అడుగదలచి యున్నాను," నేను చెస్పాను, "నీవు అస్వస్థతగా నున్నావా?"
చెప్పెను, "లేదు."
నేను అడిగాను, "మంచిది, మరి విషయమేమిటి?"
అతను చెప్పెను, "నేను ఇంటికి వెళ్ళిపోవుచున్నాను." అవును, అతని హాస్యాస్తరణను మీరెరుగుదురు.
మరియు నేను అడిగాను, "మంచిది, సహోదరుడా బోస్వర్త్," నేను అడిగాను, "నేను ఒకటి నిన్ను అడగాలని ఆశించుచున్నాను. నీకు మంచి అనుభూతిని యిచ్చిన సమయమేది?" అతను చెప్పెను, "అది ఇప్పుడే."
మరియు నేను చెప్పాను, "నీవు ఇప్పుడు మరణించుచున్నావని తెలిసి యున్నప్పటికిని?"
అతను చెప్పెను, "నేను మరణించలేను." చెప్పెను, "నేను ఏడు సంవత్సరములకు మునుపే మరణించితిని," అని అతను చెప్పెను. మరియు అతను చెప్పెను, "నేను క్రీస్తులో ఒక నూతన సృష్టిని, మరియు అతను చెప్పెను, వెళ్ళుటకును మరియు ఏ నిమిషములోనైనా ఆయనతో నడుచుచూ ద్వారము లోపలికి వెళ్ళుటకై నేను ఎదురు చూచుచున్నాను."
19పౌలు రాడర్ నాకు జ్ఞాపకము వచ్చుచున్నాడు. ఎంతమందికి అతడు జ్ఞాపకమున్నాడు? అచ్చట పౌలు చనిపోయే సమయము అనేకులకు జ్ఞాపకము యుండి యుండును. మరియు వారు పిలిచిరి, వారు ఒక… మూడి బైబిలు పాఠశాలను కలిగియుండిరి, వారు పాటలు పాడుటకై ఒక చిన్న సంగీత బృందమును అతనికొరకై పంపిరి. మరియు వారు "నా దేవునికి సమీపముగా" అను పాటను పాడుచుండిరి, మీకు తెలియునా, వరియు అతను చెప్పెను, "వారు దుఃఖముతో ఆ పాటను పాడుచుండగా వారిని చూచి అతడు నవ్వుకొంటూ "చనిపోవుచున్నది ఎవరు, నేనా లేక మీరా?" అని వారిని అతడు అడిగిన దానిని మీరెరుగుదురా. "మీరు నవ్వుకొంటూ మంచి ఉత్సాహమైన సువార్త పాటలను నా కొరకు పాడుడి," అని అతడు వారితో చెప్పెను.
మరియు వారు పాడుటకు ప్రారంభించిరి, "నా రక్షకుడు చనిపోయిన చోటు ఆ సిలువ క్రింద, నా పాపములు కడుగబడుటకుగాను అచ్చట నేను విలాపించితిని!"
అతను చెప్పెను, "అది చక్కగా ధ్వనించుచు బాగున్నది." అడిగెను, "నా సహోదరుడైన లూకా ఎక్కడ?"
"సరి, తన సహోదరుడు చనిపోవుటను చూచి లూకా భరించలేకపోయెను, కావున అతను ప్రక్కన గదిలో నుండెను."
చెప్పెను, "వెళ్ళి లూకాను పిలుచుకొని రమ్ము."
మరి లూకా, పౌలు ఇద్దరు కలిసి జీవించిరి, కలిసి ప్రయాణము చేసిరి - నా కుమారుడు బిల్లీ పౌలు మరియు నేను ఏ విధముగా కలిసి ప్రయాణించుచున్నామో ఆ విధముగానే.
మరి లూకా లోనికి వచ్చెను, తన శక్తినంతటిని కూడదీసుకొని మరి పౌలు యొక్క చేతిని పట్టుకొనెను. పౌలు అతనికి దగ్గరగా వచ్చి మరి చెప్పెను, "లూకా మనము ఎంతో దూరము జీవిత యాత్రలో కలిసి ప్రయాణించియున్నాము, మనము అలాగే వున్నాము కదా, సహోదరుడా?"
"అవును" అని అతను చెప్పెను.
చెప్పెను, "అయితే దానిని గురించి ఆలోచించుడి! ఇప్పటి నుండి ఇంకొక ఐదు నిమిషములలో నేను యేసుక్రీస్తు యొక్క సముఖములో ఆయన నీతితో కప్పబడి నిలుచుకొని యుండెదను." ఓ, మై! అది…
నేను కూడా ఆ విధముగానే వెళ్ళవలెను. అదియే అది, ఆయన నీతియను వస్త్రములు ధరించుకొని! అతని యొక్క సహోదరుని చేతులను పట్టుకొని ఇంకొక ఐదు నిమిషములలో, "ఆయన నీతియను వస్త్రములు ధరించుకొని నేను యేసుక్రీస్తు యొక్క సముఖములో నిలుచుకొని యుండెదను." పౌలు తన సహోదరుని యొక్క చేతులను గట్టిగా నొక్కుచూ, మరి ఆయనను సంధించుటకు వెళ్ళిపోయెను. ఓ మై. అది ఎంతటి గొప్ప దినముగా యుండును. వారు ధీరులైన వీరులు!
20చూడుడి, నేను ఇక్కడ నిలుచుకొని మరి మీతో మాటలాడుచునుండగా, నా యొక్క సమయమంతయు అయిపోవుచున్నది. మరి అది ఆ విధముగానే గడిచిపోవునని దానిని మీరు ఊహించి చూడండి. తొమ్మిది గంటలు, అయినది, అయితే నేను ఈ రాత్రి త్వరపడవలెను. కొద్దిగా ఒక కొన్ని లేఖనములను కలిగియున్నాను.
నేను లేఖనములను వ్రాసియుంచుకొనియున్నాను. వాటిని ఎట్లు తీయవలయునో ఎరిగియున్నాను. కొన్ని సమయములలో ఒక… ఒక పేరును వ్రాసికొని, మీకు తెలియునా, నేను లోనికి రాక మునుపు మరి సహోదరుడు వైల్ ని అడిగెదను దాని అర్థము ఏమిటని. ఇచ్చట బైబిలు నుండి దానిని తీయగలను మరి దానిని ఎట్లు ఉచ్చరింపవలయునో అతను నాకు చెప్పును. మరి నాకు విద్యా జ్ఞానము లేదు.
MATT 8:8•
MATT 9:18•
MARK 5:23•
LUKE 7:6
21అయితే వ్యాధిగ్రస్తుల కొరకు ఈ రాత్రి ప్రార్ధింపవలయునని నేను వాగ్దానము చేసియున్నాను. మరిప్పుడు నా యొక్క ముఖ్య ఉద్దేశ్యము, నా యొక్క కూటములు, అనేక మార్లు నేను కలిగి యుండను; ఒకటి లేక రెండు మార్లు ప్రచార కూటములలో ఈ రాత్రివలె వివేచించక వ్యాధిగ్రస్తులపై చేతులను మాత్రమే యుంచాలని అనుకుంటున్నాను. అనేకులు దానిని నమ్ముచున్నారు. ఇప్పుడు అది బాగున్నది. అది లేఖనములు ప్రకారమున్నది, చూశారా. అయితే మీరు గుర్తుంచుకొనుడి, అది ఒక విధమైన యూదుల పారంపర్యాచారము. చూడుడి, యాయీరు చెప్పెను, "వచ్చి నీ చేతులను నా కుమార్తెపై నుంచుము, మరి ఆమె జీవించును."
అయితే ఆ రోమీయుడు చెప్పెను, "నా ఇంట నీవు వచ్చుటకు నేను పాత్రుడను కాను. మాట మాత్రము పలుకుము!" అతను ఏమి చెప్పినాడో గమనించుడి. చెప్పెను, "నేను అధికారము గలవానిని." అతను వందమందికి అధిపతి. "మరియు నేను ఈ మనుష్యుని పొమ్మని చెప్పిన, 'పోవును' మరి వెళ్ళును. మరితనిని రమ్మనిన 'వచ్చును.' అతను ఏమని సాక్ష్యమిచ్చుచున్నాడు? తనయొక్క సేవకుని స్వస్థపరచుటకు ఆ యేసు యొక్క మాట మాత్రము చాలును. సకల వ్యాధుల మీద ఆయనకు అధికారమున్నది. "నీవు మాట మాత్రము పలుకుము, నా యొక్క సేవకుడు బ్రతుకును."
ఆయన చుట్టూ తిరిగి మరి చెప్పెను, "ఇశ్రాయేలులో ఇటువంటి విశ్వాసమును నేను కనుగొనలేదు," చూశారా.
ఇప్పుడు అటువంటి స్థితికి జనులు వెళ్ళి దానిని విశ్వాసించునట్లుగా చేయవలెనని నేను ప్రయత్నించుచున్నాను.
22మీకు తెలియునా, అనేక జనులు చెప్పెదరు, "ఓ దేవునికి మహిమ, సహోదరుడు ఫలానా మరి ఫలానా నాపై చేతులు యుంచెను, హల్లెలూయా, నేను స్వస్థత నొందియున్నాను!" ఆ విధముగా చెప్పినప్పుడు, ఆ సహోదరుడు స్వస్థపరచుటకు దేనినో కలిగియున్నాడని అగుపించుచున్నది, చూశారా.
ఇప్పుడు మీరు గనుక యేసుక్రీస్తు యొక్క ప్రసన్నతను గుర్తించగలిగిన యెడల, చూడుడి, మరి… ఆయన యొక్క చేతులు దానిని గ్రహించును. మరియు ఆయనను అంగీకరించుడి, పిదప ఎవరును మీపై చేతులు యుంచనవసరము లేదు అయితే క్రీస్తు మాత్రము చాలు. గమనించితివా? మీరు ఆయనను తాకిరి. మరియు ఆయన చేతులు మిమ్ములను తాకినవి, గమనించండి, మరియు ఏ వ్యక్తి కూడా ఎప్పుడూ కూడా స్తుతులకు పాత్రుడు కాడు. ఆ స్తుతులన్నియూ చూడుడి. మరియు ఏ వ్యక్తియును ఎచ్చటను స్తోత్రార్హుడు కాడు. స్తోత్రమంతయును… ఏలయనగా, ఎట్లైనను అవన్నియూ జరిగే తీరును. ఆ మహిమను మనము గనుక తీసికొనినయెడల, మనము దేవుని నుండి దానిని దొంగిలించిన వారమగుదుము, ఏలయనగా దేవుడే స్వస్థతను కలుగజేయువాడు.
EXOD 15:26•
PS 103:3
23మరియు గుర్తుంచుకొనుడి, అచ్చట అటువంటి ఒక విషయమనేది లేదు, ఏ వ్యక్తియైనా గాని, వైద్యుడైనా గాని, లేదా సేవకుడైనా గాని, ఆ స్వస్థతను అనుగ్రహింపలేరు. "మీ వ్యాధులనన్నిటిని స్వస్థపరచు ప్రభువునైన దేవుడను నేనే," చూశారా, "సమస్తమును ఏ ఔషధమూ స్వస్థతనను గ్రహించలేదు. ఏ వైద్యుడూ ఔషధము స్వస్థతను అనుగ్రహించునని చెప్పలేడు. లేదు, లేదు. ఔషధము శుభ్రముగా నుంచును మరి దేవుడు స్వస్థపరచును. కణములను ఉత్పత్తి చేసి పెంచదు, ఒక ఎముకను బాగు చేయదు, చూశారా. మీరు ఒక అపెండిక్స్ ను కోయవచ్చును. అయితే అది ఎచ్చటి నుండి వచ్చినదో దానిని ఎవరు స్వస్థపరచగలరు, చూశారా? ఒకవేళ పల్లును పీకివేయవచ్చును, అయితే అది ఎచ్చటి నుండి వచ్చినదో ఆ చోటును ఎవరు స్వస్థపరచగలరు, చూశారా? దేవుడు స్వస్థపరచువాడు, ఆయన ఒక్కడే స్వస్థపరచువాడు. లేఖనములు అబద్దము చెప్పవు, అవి పరిపూర్ణముగా నున్నవి, కావున ఆయనే స్వస్థపరచువాడు.
24క్రిములను చంపు అనేక మందులు మనము కలిగియున్నాము, నేను వాటికొరకై చాలా కృతజ్ఞునిగా యున్నాను. దానికి వ్యతిరేకిని కాదు. వాటికొరకై ఎల్లప్పుడూ నేను ప్రార్ధించుచున్నాను. అయితే కొన్ని చోట్లు కలవు, ఆ విధమైన వాటికి ఎటువంటి మందులు మన యొద్ద లేవు. మరియు ఇంకొక విషయమేమిటంటే, కొన్ని సమయములలో, ఒక వ్యాధికి సహాయపడు మందు ఇంకొక దానిని చంపును, చూశారా.
అయితే ఒక టాక్సిన్ (జీవించు క్రిముల ద్వారా ఉత్పత్తి చేయబడు విషము) నాకు తెలియును, అది పరిపూర్ణమైన ఒక ఔషధము కాదు. అయితే బాగుచేయును, అదియే యేసుక్రీస్తు యొక్క రక్తము. ఆ రక్తములో విశ్వాసము ఉంచవలెను!
25ఇప్పుడు ఈ రాత్రి, ఓ, మనము, బిల్లీ… నేను అతనిని అడుగుటకు మరచిపోతిని. నేను లోనికి పరుగెత్తి వెళ్ళాను. అతను ప్రార్థనా అట్టలను ఇచ్చియున్నాడా, లేడా ? అతను గనుక ఇవ్వనియెడల, అతను ఇప్పుడు ఇచ్చులాగున నేను చేసెదను. మనము కొద్దిగా విశ్వాసమును గురించి మాటలాడుకొనెదము, మరలు పిదప ప్రార్ధనా వరుసలోనికి వెళ్ళి వ్యాధిగ్రస్తుల కొరకై ప్రార్థించెదము, వీలైనంతవరుకు అందరి మీద చేతులుంచి మనము ప్రార్ధించెదము. ఇప్పుడు, మీరు విశ్వాసమును కలిగి యుండుడి.
26మీ తలంపులను చెదరనివ్వకుండా నేను వాక్యము చదువుచుండగా, కొద్ది నిమిషములు, మీరు శ్రద్దగా గమనించవలెను అని నేను మిమ్ములను కోరుచున్నాను. మరిప్పుడు నేను పరిశుద్ధ మత్తయి సువార్త, 15వ వచనము… 15వ అధ్యాయము, 21వ వచనము నుండి చదువవలెనని ఆశించుచున్నాను. మరియు ఇది చదువుటకు పెద్ద వాక్య భాగము కాదు, ఇది ఒక స్వల్పమైన పాఠ్యంశమనే దానిని మీరు గమనించండి. కాని, ఇది కాదు… మరియు చదువుటకు తగిన లేఖనములు ఇవి కావు, మీరు చూడుడి, అది చిన్న పాఠ్యభాగము. అయితే మీకు తెలియునా, అది ఎంత పెద్ద వాక్యమనుట ముఖ్యము కాదు గాని దానిలోనున్న నాణ్యతే ముఖ్యము. ప్రరిమాణము కాదు గాని, నాణ్యతే ప్రాముఖ్యము! చూడుడి, అక్కడ సమస్త ప్రపంచమును రక్షించుటకు కావలసిన కొన్ని వాక్యములు కలవు. నిశ్చయముగా, చూడుడి, దానియొక్క కొలత కాదు అది, అదేమైయున్నదో అదే కావలసినది.
27నేను కొద్ది కాలమునకు మునుపు చెప్పుచుండిన విధముగా, ఒక చిన్న బాలుడు, ఈ రాష్ట్రములో అనుకొంటాను, ఆ బాలుడు ఒక పాత అటకపై ఒక ప్రాచీన తపాలా బిల్లను కనుగొనెను. మరియు ఆ బాలునికి ఒక స్టాంపు కలెక్టరును ఎరిగియుండుటవలన అతడు దానిని చూచి దాని యొక్క విలువను కనుగొనదలచెను. మరియు స్టాంప్ కలెక్టరు అడిగెను… ఆ చిన్న బాలునికి ఐస్ క్రీము తినవలయుననే వాంఛను కలిగియుండెను. మీకు తెలియునా, అతను చెప్పెను, "దానికొరకు నేను నీకు ఒక డాలరు నిచ్చెదను." మంచిది, దానికొరకు ఆ బాలుడు అప్పటికప్పుడే దానిని అమ్మివేసెను. సుమారు ఐదు వందలకు అతను అమ్మివేసెనని నేను అనుకొనుచున్నాను, మరియు గతసారి దానిని గురించి మేము విచారింపగా, అది ఎన్ని వందలకు విలువ చేస్తాదనే దానిని నేను మరచిపోయాను. మీరు చూడుడి, అది పాత తపాలా బిళ్ళయే అయి యుండవచ్చు, అది కేవలము కాగితమనేది కాదు, దాని విషయము, ఆ పాత కాగితపు ముక్కను తీయుటకు కూడా పనికి రాదనేది కాదు దాని సంగతి. అయితే ఆ కాగితము లోపల ఏమున్నదో అదియే ముఖ్యము.
MATT 15:21-28
28ఆ విధముగానే ఇచ్చట కూడా ఈ విషయమున్నది.ఇది ఉత్త కాగితమే, కాని దానిలో యున్న ఆ దేవుని వాక్యము వలననే, అదే దానిని ఎంతో శ్రేష్టమైనదిగా చేయుచున్నది, సరే, 21వ వచనము.
యేసు అక్కడి నుండి బయలుదేరి తూరు సీదోనుల ప్రాంతములకు వెళ్ళగా.
ఇదిగో ఆ ప్రాంతముల నుండి కనాను స్త్రీ యొకతె వచ్చి - ప్రభువా, దావీదు కుమారుడా నన్ను కరుణింపుము; నా కుమార్తె దయ్యము పట్టి, బహు బాధపడుచున్నదని కేకలు వేనెను.
అందుకాయన ఆమెతో ఒక్క మాట ఎడమైనను చెప్పలేదు. అప్పుడాయన శిష్యులు వచ్చి - ఈమె మన వెంబడి వచ్చి కేకలు వేయుచున్నది గనుక ఈమెను పంపి వేయమని ఆయనను వేడుకొనగా.
ఆయన ఇశ్రాయేలు ఇంటివారై నశించిన గొర్రెలయొద్దకే గాని మరి ఎవరి యొద్దకును నేను పంపబడలేదనెను.
అయినను ఆమె వచ్చి ఆయనకు మొక్కి, ప్రభువా, నాకు సహాయము చేయమని అడిగెను.
అందుకాయన పిల్లల రొట్టె తీసికొని కుక్క పిల్లలకు వేయుట యుక్తము కాదని చెప్పగా
ఆమె నిజమే ప్రభునా, కుక్క పిల్లలు కూడా తమ యజమానుల బల్లమీద నుండి పడు ముక్కలు తినును గదా అని చెప్పెను.
అందుకు యేసు - అమ్మా, నీ విశ్వాసము గొప్పది, నీవు కోరినట్టే నీకు అవును గాక అని ఆమెతో చెప్పెను. ఆ ఘడియలోనే ఆమె కుమార్తె స్వస్థత నొందెను.
29ఇప్పుడు కొద్ది క్షణములు, మరి దీనిపై నేను కట్టబోవుచుండగా, వీడని పట్టుదల, వ్రాసియుంచుకొనియున్న ఈ లేఖనములపై నేను ఒక పాఠ్యభాగమును తీయవలయునని యున్నాను. నేను "వీడని పట్టదల" యని పిలువ వలయునని యున్నాను, కేవలము ఒక్క మాట.
వీడని పట్టదల, మనమిప్పుడు ఈ మాటను ఎరిగియున్నాము, దాని అర్థము, 'విడువకుండా పట్టుదల,' మరియు మీరు చేయు కార్యములో విడువకుండా పట్టు వదలక చేయుట. ఒక కార్యమును చేయునప్పుడు ఆ గురిలో మీరు పట్టు విడువక యుండవలయును.
మరియు ఈ కాలమంతటా మానవుడు, వారు దేనిని పొందుటకు ప్రయత్నించుచున్నారో మరి దానిపై విశ్వాసమునుగలవారై వీడని పట్టుదలను వారు కలిగియుండవలయును, మీరు గనుక ఏదైనను సరైన కార్యమును చేయునప్పుడు మీరు ఆ విధముగా పట్టుదలగా నుండెదరు. ఏలయనగా మీరు ఎదుర్కొనబోవునది, మీరు ఒక శత్రువును ఎదుర్కొనబోవుచున్నారు.
MATT 9:28•
MATT 24:35•
JOHN 11:27
30ఈ రాత్రి ప్రార్థించుకొనబోవు జనులైన మీరు మీ యొక్క మహిమార్థమై, మీరు దానిని అర్ధము చేసుకోవాలని ఆశిస్తూ నేను దీనిని చెప్పుచున్నాను. మీరు గనుక ప్రార్ధనా వరుసలో వచ్చుటకు సిద్దముగా లేనియెడల, రావద్దు. ఏలయనగా, మీ వ్రాక్కు ప్రకారముగానే దేవుడు దీనిని తీసుకొనుబోవు సమయము ఇదే అనేదానిని మీరు గుర్తించుకొనవలయును, వరియు ఆయన వాక్యమందే ఆయనను మీరు అంగీకరించవలెను. మరియు ఎవరేమి చెప్పినను అక్కరలేదు లేక మీరు ఏ విధమైన అనుభూతి చెందుచున్నారో, లేక మీరు పొందిన అనుభూతితో దీనిని మీరు ఏమీ చేయలేరు. యేసు ఎన్నడూ ఆ విధముగా అడగలేదు, "దానిని స్పర్శించ గలిగితివా?" ఆయన అడిగెను. "దానిని మీరు నమ్ముచున్నారా?" చూడుడి, మీరు దానిని నమ్మవలయును. మరియు మీ యొక్క స్వస్థత ఇదివరకే మీకొరకై భద్రపరచబడియున్నది, యేసుక్రీస్తు మిమ్ములను కల్వరిలో స్వస్థపరచియున్నాడు. మరియు మీరు ఏ శోధనలలో యున్నాగాని, దానిని మీరు అంగీకరించే తీరవలయును. మరియు మీరు అంగీకరించుటకు మునుపు మీరు దానిని నమ్మవలయును, ఏలయనగా, విశ్వాసము లేక స్వస్థత మీ విశ్వాసముపై ఆధారపడి యున్నది; మరి విశ్వాసము వాక్యముపై ఆధారపడి యున్నది.
ఇప్పుడు, మీరు చెప్పలేరు, "నేను గనుక ఈ మైక్రోఫోనును తాకినయెడల, నేను స్వస్థత నొందెదను." అక్కడ, అచ్చట దానికి ఏ ఆధారము లేదు, చూడుడి. అది మీ యొక్క తలంపు.
అయితే అది ఎప్పుడైతే ప్రభువు నెలవిచ్చుచున్నాడుగా యుండునో అప్పుడు అది నిజమని మీరు తెలుసుకొనవచ్చును, ఏలయనగా, "ఆకాశమును భూమియు గతించిపోవును గాని, అయితే ఆయన వాక్యము ఎన్నడును మారదు." కావున అది సత్యమై యున్నది.
ఇప్పుడు మీరు వీడని పట్టుదలను కలిగియుండవలయును. "మంచిది, కొద్దిగా నీకు బాగోలేదు," అనేటువంటి మాటలను అపవాది ఎన్ని నీతో చెప్పుటకు ప్రయత్నించినా గాని వాటిల్లోని ఒక్క మాటను కూడా నీవు నమ్మవద్దు!
31ఇచ్చట కొద్ది కాలమునకు మునుపు, నేను అస్వస్థతలోనున్న ఒక పడుక యొద్దకు పిలువబడితిని, ఒక కూటము జరుపుచుండగా ఒక యవ్వన బాలుడు చనిపోవుచుండగా అతనియొద్దకు పిలువబడితిని. మరియు ఆ వృదుడైన తండ్రి, సుమారుగా పదిహేను సంవత్సరములకు మునుపు యుండవచ్చునని అనుకుంటున్నాను, అతను నా యొద్దకు వచ్చెను, అతను చెప్పెను, "మీరు నా కుమారుని యొద్దకు వచ్చెదరా, అతడుఒక భయంకరమైన వ్యాధి వలన మరణావస్థలో యున్నాడు?" అది ఒక గుండె జబ్బుగా యున్నది. అది ఒక రకమైన గుండె జబ్బుగా పరిగణింపబడుచున్నదని నేను నమ్ముచున్నాను. ఆ వ్యాధిని ఏమనుచున్నారో గాని ఇప్పుడు దానిని నేను మరచిపోయాను, కాని అది ఘోరమైన వ్యాధి.
మరి కావున నేను చెప్పాను, "అవును."
ఓ, నన్ను కరుణించమని మిమ్మల్ని వేడుకొనుచున్నాను, అది అతని యొక్క హృదయమునకు వెళ్ళినది, అయితే అది అతని శరీరములో నున్న పోలియో, అది పోలియో వ్యాధి. మరి మనకు సాల్క్ టీకాలు లేని రోజులు అవి. మరి ఆ బాలుడు ఘోర అపాయ స్థితిలో నుండెను. మరియు నేను అతని కొరకు ప్రార్థించుట కొరకు వెళ్ళినప్పుడు, వైద్యుడు నన్ను లోపలికి అనుమతింప లేదు. "నేను మిమ్ములను లోపలికి అనుమతించను" అని అతను చెప్పెను.
32మరియు నేను చెప్పాను, "మంచిది, నేను…" నేను నలుబది సంవత్సరముల వయస్సుగలవాడినని, "మంచిది, నేను నలుబది సంవత్సరములు గలవాడిని" అని నేను చెప్పాను. "ఈ వ్యక్తి యొక్క కుమారుని కొరకు నేను వెళ్ళి ప్రార్ధించుట శ్రేయస్కారమని నా విశ్వాసము నాతో చెప్పుచున్నది, ఎందుకనగా తన కుమారుని కొరకు నేను ప్రార్ధించవలెనని ఇతడు ఆశించుచున్నాడు" అని నేను చెప్పాను.
అతను చెప్పెను, "అయితే, చూడుము," అతను చెప్పెను, "నీవు వివాహమైనవాడివి. నీకు పిల్లలు యుందురు, ఆ పోలియో వ్యాధిని నీ కుమారునికి నీవు తీసికొని వెళ్ళేదవు."
మరియు నేను చెప్పాను, "సరే, నన్ను లోపలికి వెళ్ళనిమ్ము." ఆయన దానిని చేయుడు.
మరియు ఆ వైద్యుడు ఒక కాతోలిక్కుయని నేను గ్రహించాను. నేను చెప్పాను, "నేను మిమ్ములను ఒకటి అడుగవలెనని ఆశించుచున్నాను. నేను గనుక ఒక యాజకుడైన యెడల, మరి ఈ బాలుని యొక్క తండ్రి ఒక కాతలిక్కుయై, ఈ బాలుడు ఈ విధముగా మరణించబోవుచున్న చివరి ఘడియల యందు, ఆ అంతిమ ఆచారకర్మలు అతనికి చేయుటకై నీవు నన్ను అనుమతించెదవా."
అతను చెప్పెను, "అది వేరే. అది ఒక మత యాజకుని కార్యము."
నేను చెప్పాను, "ఒక కాతోలిక్కుకు వారి యాజకుడు ఎట్లో మరి నేను కూడా వారికి అదే విధముగా నున్నాను."
మరి చివరికి అతను చెప్పెను, '"మీరు గనుక ఈ కాగితముపై సంతకము చేసినయెడల."
నేను చెప్పాను, "నేను దేనినైనను సంతకము చేసెదను, చూశారా." మరి అతను నాకు కూ-క్లుక్స్ వంటి వస్త్రములను ధరింపజేసెను; మరి నేను అచ్చటికి లోపలికి వెళ్ళాను. నేను దానిని చెప్పవలసినంత భావముతో దానిని చెప్పలేకపోతున్నాను; నన్ను క్షమించండి, చూచారా; కాని ఎలాగైతేనేమి, అది తెల్లగా నా ముఖమునంతా కప్పివేసినది.
33మరియు నేను లోపలికి వెళ్ళాను, ఆ బాలుడు చాలా బాధతో శ్వాసను పీల్చుచుండెను. మరియు అతడు రెండు రోజులుగా స్పృహ లేకుండా పండుకొని యుండెను. గొప్ప విజ్ఞాన పరిశోధనల ద్వారా మందులను తయారు చేయుటకు దేవుడు మానవుడిని అనుమతించినను ఈ వ్యాధిగ్రస్తులకు వైద్యులు ఎందుచేతనో ఏమీ చేయలేకపోవుచున్నారనేది నాకు అర్ధము అగుట లేదు. అయితే అచ్చట గుండె ఎంత వేగముగా కొట్టుకొనుచున్నదో తెలుపే పరికరము అమర్చబడియుండెను. అతని గుండె చాలా దీనస్థితిలో కొట్టుకొనుచుండెను. అది ఎంతయని నేను మరచిపోయాను. నేనప్పుడే లోపలికి వెళ్ళాను. మరియు ఆ బాలుని తల్లి అక్కడ నిలుచుకొనియుండెను మరి నేను ఆమెతో మాటలాడితిని. కావున నేను మంచమునకు ఆవలి ప్రక్కకు వెళ్ళాను. మరి ఒక యవ్వన నర్స్ యున్నది, ఓ, చక్కని యవ్వన స్త్రీ, ఆమె, బహుశా ఇరువది సంవత్సరముల లోపే ఆమెకు వయస్సు ఉండవచ్చని నేను ఊహించుచున్నాను. ఒకవేళ ఇరవై-ఒకటి, ఇరవై-రెండు సంవత్సరములు వయస్సు ఉండవచ్చు, ఆమె ఆ వ్యాధిగ్రస్తుని శ్రద్దగా చూచుకొనుటకై నియమింపబడియుండెను.
MARK 16:17
34మరి నేను మంచమునకు ఆవలి ప్రక్కకు వెళ్ళి, మరి మోకాళ్ళుని, నేను కేవలము… చేతులను ఆ బాలునిపై యుంచి ఒక చిన్న సామాన్యమైన ప్రార్థనను చేసాను. నేను చెప్పాను, "ప్రభువైన యేసు, వారి కుమారుని కొరకై ప్రార్థించుటకు గాను ఈ తల్లి తండ్రులు నన్ను తీసికొని వచ్చియున్నారు మరి అతను చనిపోవుచున్నాడు. మరి దేవా, మీరు మాత్రమే అతనికి సహాయపడగలరు. మరియు మీరు చెప్పినదానిని నేనెరుగుదును, "నమ్మినవారివలన ఈ సూచక క్రియలు కనబడును; రోగుల మీద చేతులుంచినప్పుడు వారు స్వస్థత నొందుదురు." ఈ బాలుని యొక్క జీవితము కొరకై ప్రభువైన యేసు ఆ వాగ్దానమును మీ యొద్ద బ్రతిమాలి అడుగుచున్నాను.'' ఎటువంటి మార్పు రాలేదు. నేను చెప్పాను, "దేవా, మీకు నా వందనములు."
మరియు ఆ వృద్ద తండ్రి పైకి లేచి మరి చెప్పెను, "ప్రభువా, మీకు నేను చాలా కృతజ్ఞునిగా యున్నాను, నా యొక్క కుమారుని స్వస్థతపరచినందుకు చాలా కృతజ్ఞతలు." మరియు అతను తిరిగినప్పుడు ఆ బాలుని తల్లి అతని చేతులందు వ్రాలెను, మరి ఆమె చెప్పెను, "తండ్రీ, దానిని గురించి ఆలోచించుము, ఇప్పుడు అతను స్వస్థతనొందబోవుచున్నాడు." మరియు నేను నిలుచుకొని గమనించుచుంటిని, మరి వారు సంతోషముతో, ఆనందించుచు, కన్నీళ్ళు కార్చుచున్నారు. ఆ బాలుడి పరిస్థితి ఇంకా దిగిజారిపోవుచున్నది. వారు చెప్పిరి, "ఓ, ఇది అద్భుతము!"
35మరియు ఆ చిన్న నర్స్ చుట్టూ చూచెను, ఆమె నా వైపు చూచెను. ఆమె చెప్పెను, "మీరు వైద్యుల ఆజ్ఞలను తప్పుగా అపార్ధము చేసుకొన్నారని నేను అనుకొనుచున్నాను." ఆమె చెప్పెను, "మీరు తప్పుగా అర్ధము చేసికొని యున్నారని నేను అనుకొనుచున్నాను. ఆ బాలుడు చనిపోవుచున్నాడు."
"ఓ," ఆ వృద్దుడు చెప్పెను, "లేదు, ఆ బాలుడు చనిపోవుట లేదు. అతను జీవించనైయున్నాడు."
మరి కావున ఆమె చెప్పెను, "అయ్యా, గమనించుడి," చెప్పెను, "నేను ఎవరైనా అటువంటి విశ్వాసము కలిగియుండుటను మెచ్చుకొనుచున్నాను," అయితే, అడిగెను, "మీరు ఆ విధముగా నవ్వుకొనుచు, ఆనందముగా ఎట్లు యుండగలరు," చెప్పెను, "మరి ఆ బాలుని పరిస్థితిలో ఏ మార్పు లేదు." మరియు చెప్పెను, "ఆ బాలుడు మరణమునకు సమీపించుచున్నాడు" అని చెప్పెను, "అతను బ్రతుకడు. అసలు, అతడు ఇంతవరుకు ఏ విధముగా ప్రాణముతో యున్నాడో మాకే అర్ధమవ్వుట లేదు." మరియు ఈ విధముగా చెప్పినది, "ఇటువంటి వ్యాధిగ్రస్తులలో ఈ రీతిగా యుండుట అసలు ఎచ్చటా వినలేదు లేదా విజ్ఞాన శాస్త్రములోనే ఇంతటి హీన స్థితిలో గుండె కొట్టుకొనుచుండగా, ఏ వ్యక్తి కూడా బ్రతికినట్లుగా ఏ ఆధారము లేదు." అది ఒక రకమైన గుండె కొట్టుకొనేటప్పుడు దాని వేగమును తెలిపే పరికరము, అటువంటిది ఏదో అది, "అది ఎన్నటికి మరలా తిరిగి రాదు."
36మరియు ఆ వృద్దుని నేను ఎన్నటికి మరచిపోలేను. అతను ఒక తండ్రి కుమార్తెపై వేసినట్టు తన చేతులను ఆమె భుజములపై వేసి, అతను చెప్పెను, "నా ప్రియుమైన బిడ్డ చూడుము." అతను చెప్పెను, "మీరు చూచుచున్నది కార్డియోగ్రాము. దానిని చూచుటకే మీకు శిక్షణ ఇవ్వబడినది. మరియు మీకు తెలిసిన దంతయు ఆ కార్డియోగ్రాము. అయితే చెప్పెను, "నేను ఒక దైవిక వాగ్దానమును చూచుచున్నాను."
ఇప్పుడు ఆ బాలుడు స్వస్థతనొంది వివాహము చేసికొని, అతనికి ముగ్గురు బిడ్డలు గలరు. మీరు దేనిని చూచుచున్నారో దానిపై ఆధారపడియున్నది. ఆ ప్రార్థనకు పిదప మొదటి రెండు లేక మూడు దినములు వరకు అతని పరిస్థితి మెరుగుపడలేదు. అయితే కొద్ది దినములకు పిదప జరిగిన మొదటి కార్యము మీకు తెలియునా, అతను స్వస్థతనొంది తన గృహమునకు వెళ్ళిపోయెను. అతను ఇప్పుడు దక్షిణ ఆఫ్రికాలో ఒక మిషనెరి, ముగురు బిడ్డల తండ్రి.
37ఇప్పుడు, అది దేనిని చూపించుచున్నదనగా, మీరు వీడని పట్టుదలతో యుండవలయును. ఆ దీన పరిస్థితి యందు కూడా ఆ వృద్దుడిని ఏదీ కదిలించలేకపోయినది. ఆ విషయము అంతటితో సమాప్తమైనది.
ఆ స్త్రీ యేసు యొక్క వస్త్రమును తాకిని వెంటనే, ఆమె వ్యాధి ఏ విధముగా పోయినదో - మరి ఆ విధముగానే ఇది కూడా యున్నది. అది అంతే. ఆమె ఆయన యొద్దకు చేరు వరకు వీడని పట్టుదలతో యుండెను, అయితే దానితో ఆ కార్యము ముగిసినది.
మీరు కూడా ఆ విధముగానే యుండవలయును. మీరు కూడా వీడని పట్టుదలతో యుండవలయును. మరియు ఎవరైనను ఏదైనను కలిగియున్నను, దేనినైనను సాధింపవలయునన్నను, వీడని పట్టుదలతో యుండవలయును.
38జార్జ్ వాషింగ్టన్ వాలీ ఫోర్జ్ భూమియొద్ద వీడని పట్టుదలతో యుండెను. సమస్తము అతనికి విరోధముగా నుండెను, మరియు శత్రువు నదికి ఆవలి ప్రక్కన నుండెను. అయితే రాత్రంతయు ప్రార్థనలో గడిపిన పిదప, వారి పాదములకు బూట్లు లేవు. అమెరికను సైనికులు వారిలో మూడు శాతములో ఒక శాతము వారికి పాదములకు ధరించుకొనుటకు బూట్లు లేవు. మరి వారు మంచు గడ్డల మీద నుండి వాలీ ఫోర్జ్ భూమియొద్ద నదిని దాటిరి. మరియు అతని వస్త్రము గుండా మూడు తుపాకి బుల్లెట్ల దూసుకొని వెళ్ళినవి గాని అతడు దేవుని యొద్ద నుండి ఒక జవాబును పొందుకొని అచ్చట అతడు వెనుకంజ వేయనక్కర్లేదు, పిదప అతడిని ఏదీ కూడా అడ్డుకోలేదు. అతను దానిని దాటెను, ఏలయనగా అతను వీడని పట్టుదలతో యుండెను. దేవునియొద్ద నుండి అతను దానిని వినెను.
మరి మనము ఆ విధముగానే నుండవలయును. దేవుడు గనుక దేనినైనను చెప్పినయెడల, ఆ కార్యము దానితో అది సమాప్తమై పోవును.
39నోవహు దేవునియొద్ద నుండి వినిన తరువాత వీడని పట్టుదలతో యుండెను. ఒక ఓడను కట్టమని దేవుని యొక్క వాక్యము అతనికి ఆజ్ఞాపించుటను అతను వినగానే మరి అతను ఓడను కట్టుటకు ప్రారంభించెను. దాని నిమిత్తమై ఎవరెన్ని మాటలు మాటలాడినను, దానిని గురించి ఎవరేమి అనుకొన్నప్పటికిని, దేవుడు అతడికి చెప్పిన కార్యమందే నోవాహు తన దృష్టిని కేంద్రీకరించి ఆ పనిని పట్టుదలతో చేసి ముగించెను. "భలే, ఆ ముసలివాడి ఆ వాన కథ భలే వున్నదని," ఒకవేళ వారెవరైనా పరిహాసము చేసియుండవచ్చు. "ఆ ముసలివాడు పైన ఆ ఎండలో చాలాసేపు ఆలాగే పని చేయుచున్నాడు. అతడికి ఏదన్నా మతి చలించినదేమో" అని అనిరి. అయినా కూడా అతడు తన పనిని ఆపలేదు. ఆ మాటలను అసలు అతడు తన చెవిలో కూడా పడనియ్యలేదు. దేవుడు తనకు ఏదైతే చెప్పెనో దానికి మాత్రమే చెవియొగ్గెను. "వర్షము కురియబోవుచున్నది; ఒక ఓడను కట్టుము," మరి దానిని చేయుటలో అతను వీడని పట్టుదలను కలిగియుండెను.
40ఇప్పుడు మోషే వీడని పట్టుదలతో యుండెను; ముందు అతడు వెనుదిరిగి పారిపోయిన పిరికివానిగా యుండెను. అతడు మంచి విధ్యావంతునిగా యుండెను. మరియు అతను ఐగుప్తు వారికి కూడా జ్ఞానమును బోధింపగలడు. అతను చాలా మేధా సంపన్నుడైయుండెను, అయినప్పటికిని, తన కార్యములో ఓడిపోయెను. ఫరో అతనికి ఇచ్చిన విద్యను తనలో ఇముడ్చుకొనుటకు అతనికి నలుబది సంవత్సరములు పట్టెను; అయితే ఆ అరణ్యములో అతనిని ఉపయోగించుటకు ముందు ఆ ఐగుప్తు జ్ఞానమును అతనిలో నుండి తీసివేయుటకు దేవునికి నలుబది సంవత్సరములు పట్టెను. మరియు కొన్ని సమయములలో మీరు కూడా నింపబడుటకు ముందు మిమ్మల్ని మీరు ఖాళీ చేసుకొనవలెను, మీలో ఉన్నదంతా మీలో నుండి తీసివేయవలెను. మరిప్పుడు అతను ఓడిపోయెను. మరియు మోషే పరుగెత్తిపోయి ఈ చక్కటి కూషు దేశపు స్త్రీని వివాహము చేసికొనెను. మరి అప్పుడక్కడే స్థిరపడి గేర్షోము అను కుమారుని కలిగెను, మరియు తన మామయైన యిత్రో యొక్క మందకు సమస్తమునకు వారసుడగులాగున నుండెను. అతను తన జనుల యొక్క బాధను మరచిపోయి చాలా కాలమైనది.
41అయితే ఒక దినమున, అతను అరణ్యమునకు వెనుక ప్రక్కన గల ప్రసిద్ది గాంచిన ఆ ప్రాచీన మార్గమున వెళ్ళచుండగా, అతను మండుచున్న ఒక పొదను చూచెను. ఇప్పుడు, ఆ పొదను పరీక్షించుటకు అతడు ప్రయత్నించనే లేదు, "ఆ పొద మండుచున్నను ఆ ఆకులు కాలుట లేదు, దాదాపు గంటకు పైగా ఆ పొద ఉండుచున్నను ఆ ఆకులు మాత్రము ఎందుకు కాలుట లేదో కనుగొనుటకు దానిలోని కొన్ని ఆకులను త్రుంచికొని నేను పరిశోధనాశాలకు వెళ్ళి వాటిని పరీక్షించెదనని," అతడు చెప్పలేదు. మరియు అవి ఒక గంటగా మండుచున్నవి, అయితే ఆ పొద కాలలేదు. అతను గనుక ఆ విధముగా తలంచి యుండినట్లయిన యెడల అది అతనితో మాట్లాడియుండదు. అయితే అతను తన హృదయములో దీనిని చిత్రీకరించుకొని మరి మాట్లాడి కనుగొనెదను. మరి ఒక స్వరము చెప్పెను, "నీ పాదముల నుండి నీ చెప్పులు విడువుము, ఏలయనగా నీవు నిలిచియున్న స్థలము పరిశుద్ద ప్రదేశము."
EXOD 3:5
42మీరు గమనించవలయునని నేను మిమ్ములను కోరుచున్నాను. ఒక దినమున అతను పిరికివాడుగా పరుగెత్తెను, మరియు తదుపరి దినమున అతడు సమూలముగా మార్పులను చేయాలని ఆశించినవాడుగా యుండెను. అతడు ఐగుప్తును విడిచి వచ్చు సమయమందు ఆ జనులను విడిపించుటకై సమస్త సైన్యము తన వశమున యుండెను. ఇంకొక దినము అతను ఐగుప్తును విడిచినప్పుడు, జనులను విడిపించుటకు తన చేతులలో సమస్త సైన్యమును యున్నప్పుడు. మరియు, మీరు దేవుని యొక్క స్వరమును వినినప్పుడు, మీరు వింతగా వ్యవహరించులాగున అది చేయును, వింత కార్యములను చేయించును, వినోదమైన మరియు అసాధారణమైన కార్యములను చేయులాగున చేయుననేది మీరెరుగుదురా! ఇప్పుడు ఊరక తలంచి చూడుడి, అతనిప్పుడు ఎనభై సంవత్సరముల వయస్సుగలవాడు, తన నడుము వరకు గడ్డము వ్రేలాడుచూ యుండ వచ్చును, ఒకవేళ అతని బట్టతల తళతళమని మెరయుచూ యుండ వచ్చును, అతని మెడ చుట్టూ వెంట్రుకలు యుండి యుండ వచ్చును. మరిచ్చట అతను ఐగుప్తుకు వచ్చు దారిలో తన భార్య తన కుమారుడిని నడుమున ఎత్తుకొని ఒక చిన్న కంచరగాడిదపై కూర్చొని యుండగా మరియు అతను ఒక వంకరటింకర కర్ర తన చేతిలో నుంచుకొని, కన్నులు పైకెత్తి, దేవుని స్తోత్రించుచుండెను. ఎటువంటి ఒక వింతైన దృశ్యము!
"మోషే నీవు ఎచ్చటికి వెళ్ళుచున్నావు?"
"ఐగుప్తును జయించుటకు మేము వెళ్ళుచున్నాము."
ఒకే ఒక్క వ్యక్తి దండయాత్ర! మీరు అతనిని నిలుపలేరు. అతడు వీడని పటుదలతో నున్నాడు. ఎందుచేత? అతను దేవుని యొక్క స్వరమును వినియున్నాడు, వీడని పట్టుదలను కలిగియుండుటకు అతడికి అది చాలినంతగా యున్నది. మరియు వృద్దుడు, ఎనభై సంవత్సరములు వయస్సుగలవాడు, దేశమును జయించబోవుచున్నాడు, మరి అతడు దానిని చేసెను. అతను దేవుని యొక్క స్వరమును వినెను. అతను తన చేతి కర్రతో ఏ విధముగా దానిని జయించగలడు? బాగుగా శిక్షణ పొందిన సైన్యము, ఒక పది లక్షలమంది అక్కడ నిలుచుకొని యున్నారు, పది లక్షలకు పైగా, ఆ దినములలో వారు ప్రపంచమంతటిని జయించి యున్నారు; మరిచ్చట ఒక వృద్దుడు వెళ్ళుచున్నాడు, ఎనభై సంవత్సరముల వయస్సు గలవాడు, భార్య ఒక కంచరగాడిదపై కూర్చొని యున్నది, మరి అతని చేతిలో ఒక కర్రతో , పెద్ద దేశమును జయించుటకు బయలుదేరి వెళ్ళుచున్నాడు. జనులు అతనిని ఒక వెర్రివానిగా తలంచుకొని యుండ వచ్చును.
EXOD 7:10
43మీరు దేవుని యొక్క స్వరమును వినినప్పుడు, దేవుని యొక్క మాటను మీరు వినినప్పుడు, మీరు లోకమునకు ఒక వింతగా యుండెదరని మీరెరుగుదురా! అయితే మీరు గనుక స్వరమును వినినయెడల, మరి మీరేమి చేయుచున్నారో మీరు ఎరిగెదరు.
మరియు మోషేను ఏదియూ నిలుపజాలదు, అతడు తన మార్గమున వెళ్ళుచున్నాడు! అతడు వీడని పట్టుదలతో ముందుకు కొనసాగిపోవుచున్నాడు. ఫరోను ఎదురెదురుగా ఎదుర్కొనుటకై, అతడు ఫరోకి ఎదురుగా నిలబడి కట్టును క్రింద వేయగా అది సర్పమాయెను, మరియు ఫరో మాంత్రికులు వచ్చి వారు కూడా అదే కార్యమును చేసిరి, మరప్పుడు మోషే పిరికివానివలె పరిగెత్తి వెళ్ళిపోలేదు. అతను అచ్చట నిలుచుకొని యుండెను. దేవుడు అతనిని పంపి యున్నాడని అతను ఎరిగియుండెను. ఎంతమంది శారీరక సంబంధమైన అనుకరణలు అపవాది పురిగొల్పి లేపినను మోషే వాటిని మాత్రము లెక్కచెయ్యలేదు. అతను తనయొక్క కర్తవ్యములో నిలిచెను, ఏలయనగా అతను దేవుని యొక్క స్వరమును వినెను. అతను అచ్చటనే యుండెను మరియు సర్పములు ప్రాకులాడుటను గమనించుచుండెను మరి కొద్దిసేపైన పిదప మోషే యొక్క సర్పము వచ్చి తక్కినవాటిని మ్రింగివేసెను. ఆ సర్పము తినిన ఆ కర్రలకు ఏమైనది, అవెచ్చటికి పోయెను? దానిని కనుగొనుడి. అది సరి.
1SAM 17:26
44దావీదు దేవుని నమ్మిన పిదప, ప్రభువైన దేవుడు తనతో నుండుట చూచెను, ఆయన దావీదుతో యుండుట వలననే ఒక ఎలుగుబంటును తానొక్కడే చంపుటకు సహాయపడెను మరియు ఒక సింహమును చంపుటకు కూడా అది సహాయపడెను. మరటు పిదప అతనికి దేవుడు తనతో ఉన్నాడను ధైర్యము వచ్చెను. దేవుడు తనతో యున్నాడని అతను ఎరిగియుండెను, ఏలయనగా దేవుడు ఏదో కార్యము అతనికి చేసెను.
దేవుడు మీకు ఏదో చేసెను. ఆయన మిమ్ములను రక్షించెను, అచ్చటయున్న అద్భుతములన్నింటిలోనూ అదియే గొప్పది.
ఇప్పుడు వేరే దేనినో చేయునని ఆయన చెప్పెను. మరియు గొల్యాతు అను వాడు తన ప్రగల్భములు పలుకు సమయము వచ్చెను. దావీదు చెప్పెను, ఎట్లు? "ఈ సున్నతిలేని ఫిలిష్తియుడు నిలుచుకొని జీవించు దేవుని యొక్క సైన్యములను తిరస్కరించునని మీరు చెప్పుచున్నారా? మీకేమైనది?"
1SAM 17:33,34
45మంచిది, సౌలు వారందరికంటే ఎంతో బలముగలవాడు, అతని తల భుజములు తన సైన్యములోయున్న వారికంటె ఎత్తుగా నుండెను. మరి ఈ దావీదు ఒక పొట్టివాడు, ఒక చిన్న పిల్లవాడు, ఎర్రని వర్ణము కలవాడు, వంగిన భుజములు కలిగి ఒక బాలునివలె కనిపించుచు చిన్నగొర్రెల మందను మేపువాడుగా యున్నాడు. కావున సౌలు మరి చెప్పెను, "నీ ధైర్యమును నేను మెచ్చుకొనుచున్నాను, కుమారుడా, అయితే, గుర్తుంచుకొనుము, ఆ వ్యక్తి యవ్వన ప్రాయము నుండియే యుద్ద ప్రావీణ్యతను పొందిన యుద్దవీరుడు, కాని నీవు యవ్వనుడివైనా, దానిగురించి ఏమీ ఎరుగనివాడివి."
అప్పుడు దావీదు చెప్పెను, "అయితే నీ దాసుడు ఒకప్పుడు నీ సేవకుని గొర్రెలను కాచుకొనుచుండగా, ఒక ఎలుగుబంటు వచ్చి ఒక గొర్రె తీసికొని పోయెను. నేను దానిని వెంటాడి తరిమి కొట్టినప్పుడు ప్రభువు దానిని నా చేతుల కిచ్చెను." చెప్పెను, "ఒక సింహము వెళ్ళెను మరి దానిని నేను నా వడిసెలతో పడగొట్టితిని. మరియు ఆ సింహము పైకి లేచి నాపై గర్జించి - నా మీదికి రాగా, దాని గడ్డము పట్టుకొని నా కత్తితో దాని చంపితిని." మరియు చెప్పెను, "మరి ఈ విధముగా నాకు సహాయము చేసిన ప్రభువైన దేవుడు ఇంకెంత గొప్పగా ఆసున్నతిలేని ఫిలిష్తియుని నా చేతికి అప్పగించును!" ఆమేన్.
మరియు దేవుడు ఒక పాపపు జీవితము నుండి మీ యొక్క ఆత్మను రక్షించిన యెడల, ఆ కాన్సరును ఎంత సులభముగా స్వస్ధపరచును!
1SAM 17:38,39
46చిన్నవాడైన దావీదును గమనించుడి. సౌలు చెప్పెను, "నీ యొక్క ధైర్యమును నేను మెచ్చుకొనుచున్నాను, అయితే నీవు ఒక యుద్ధ నైపుణ్యము నెరిగిన యుద్ద వీరుడివి కాదు, అందువలన నీవు గనుక అతడితో యుద్ధము చేయ నాశించినయెడల నేను నీకు యుద్ద దుస్తులు ధరింపజేసెదను,'' కావున అతను తన కవచనమును తీసి దావీదుపై నుంచెను.
ఆ పి.హెచ్డి. మరియు డి.డి.డిలు అనే ఆ విద్యా పట్టములు ఆ చిన్న దావీదుపై వ్రేలాడుచుండగా, ఆ సౌలు యొక్క మత మార్గమునకు సంబంధించిన దుస్తులు ఒక దేవుని యొక్క మనిషికి అవి సరిపోవని దావీదు కనుగొనెను. కావున అతను చెప్పెను, "ఇటువంటి వాటితో నేనెన్నడూ నిరూపింపబడలేదు, వీటిని నా యొద్ద నుండి తీసివేయుము. ఏది సరియైన మార్గమని నేనెరుగుదునో, ఆ మార్గముననే నన్ను పోనిమ్ము." ఓ, మై! మరిచ్చట అతను వెళ్ళుచున్నాడు. మరి అతను వీడని పట్టుదలను కలిగియున్నాడు, గొల్యాతును ఎదుర్కొనబోవుచున్నానని మరియు అతను దానిని చేసెను. మరి అతను గొల్యాతును చంపెను.
47అతని యొక్క గొర్రెలను గురించి నేను తలంచుచున్నాను. అచ్చట దావీదు తన కర్తవ్యములో ఒక నమ్మకమైన వ్యక్తి, మరియు ఈ సింహము సులభముగా అతనిని చంపివేసి, లోపలికి వచ్చి తన తండ్రి యొక్క గొర్రెలలో ఒకదానిని తీసుకొనివెళ్ళిపోయి యుండెడిది. ఎందుకనగా దావీదు యొద్ద సింహముతో పోరాడుటకు నిజముగా ఏమియు లేదు, అయితే ఒక వడిసెను కలిగియుండెను.
ఎన్నిసార్లు నేను కిటీకీలకు డబ్బులను చెల్లించవలసి వచ్చెనని బాలురైన మీరెరుగుదురు. మరియు ఒక చిన్న చర్మము ముక్కతో ఒక వడిసెను మీరెరుగుదురు. ఈ చిన్న రాయిని దానితో చుట్టి విసిరినయెడల, మరియు మేము ఈ పాత సర్పముల వైద్యుల కంచెను పడగొట్టియున్నాము మరియు వాటిని ఈ వడిసెలతో పడగొట్టి యున్నాము. దావీదు దానిని మాత్రమే కలిగియుండెను; దానితో అతను ఒక కుందేలును కూడా చంపలేదు. అతడి చేతిలో ఏమున్నదని కాదు, దాని గొప్పతనము కాదు, కాని అతడు దృఢమైన ధైర్యమును కలిగియుండెనని ఆ దావీదు గురించి మనము కనుగొన్నాము. అది తన తండ్రి యొక్క గొర్రెయని అతడు ఎరిగియుండెను. ఈ గొర్రెలను మేపమని అతడు తన తండ్రి ద్వారా పంపబడెను. అందుచే వాటిని మేపే బాధ్యతను అతడు కలిగియున్నాడు. ఆ గొర్రెను రక్షించుటకు తన చేతిలో ఏమున్నదో దానిని అతడు తీసికొని బహు పట్టుదలతో ఆ సింహము నుండి తన గొర్రెను విడిపించునట్లుగా అతడు చేసెను.
48మీరెప్పుడైనా ఒక సింహమును చూశారా? అది ఏ విధముగా నుండును? మీరు వీటిని ఒక బోనులో బంధించి యుండుటను చూచి యుండెదరు; సరి, అవి పిల్లి పిల్లలవలె నుండును. అడవిలో అవి గర్జించునప్పుడు మీరు వినవలయును. ఇచ్చట బోనులో నున్నవి మరి బంధింపబడి యుండును; వాటిలో ఒకటి గర్జించుట మీరు వినుడి, అది చాలా భయంకరముగా నుండును. మీరు అడవిలో ఒక సింహము గర్జించుట వినవలయును దానిని వేటూడునప్పుడు, మరి మీరు తెలిసికొనెదరు అది మిమ్ములను కూడా వేటాడుచున్నదని. పిదప, ఓ, మై, అతను గొప్పవాడు! అతడు గర్జించునప్పుడు; కీటకాలు, కోతులు, పెద్ద కోతులు, మరియు నక్కలు, సమస్తమును నిలిచిపోవును. ఆ సింహము ఒక రాజు మరి అవి దానికి భయపడును, ఆ సింహము అరచినప్పుడు అవి నోరు మూసుకొనును.
అయితే ఇక్కడ దావీదు ఈ చిన్న వడిసెలతో ఆ గొర్రెను తిరిగి తీసికొని వచ్చుటకు వెళ్ళుచున్నాడు, మరి అతను దానిని తీసికొని వచ్చెను.
49ఓ, మై, కొన్ని నిమిషములకు దానిపై ఒక పాఠమును నేను తీసిన ఏలాగుండును. అవును, అయ్యా. మీరు కూడా దేవుని గొర్రె, వ్యాధి మిమ్ములను పట్టుకొనెను, నా యొద్ద పెద్దగా ఏమియూ లేదు, ఒక వడిసెల కూడా లేదు, అయితే నా యొద్ద వాక్యమున్నది. నేను మిమ్ములను మరల తీసికొని వచ్చుటకు ఈ రాత్రి మీ వెంట వచ్చుచున్నాను. నేను మిమ్ములను దేవుని యొక్క వాక్యముతో విడిపించుటకు వచ్చుచున్నాను. నాకు వైద్యమును గురించి కత్తులతో కోయుట మరి మొదలగు కార్యములు ఏమియూ తెలియదు, అయితే ఇది నేను నిరూపించియున్నాను. ఇది సరియని నేనెరిగియున్నాను, కావున గొర్రెయైన మీ వెంట నేను వచ్చుచున్నాను, మరల మిమ్ములను దేవుని ప్రేమయైన పచ్చిక గల చోట్ల మిమ్ములను మరల నడిపించుటకు. దేవా, ఈ చిన్న వడిసెలతో నాకు సహాయపడుము.
50దావీదు దానిని తన వ్రేళ్ళలో చుట్టియుంచుకొనెను మరియు అతనియొద్ద చేతిలో ఐదు రాళ్లుండేను. అదేమిటి? (F-a-i-t-h in J-e-s-u-s) యేసునందు విశ్వాసము. మరిచ్చట అతను వచ్చుచున్నాడు, మరియు అతను గొర్రెను మరల తీసికొని వచ్చుచున్నాడు.
ఇప్పుడు మనము ఈ రాత్రి ఆ విధముగానే చేయుచున్నాము, యేసు నందు విశ్వాసముంచుట మరియు వీడని పట్టుదలతో ఆయన యొక్క తాకని వాక్యముపై నిలబడబోవుచున్నాము. మరియు దేవుడు ఆయన యొక్క వాక్యమును కాపాడుకొనునని మనము నమ్ముచున్నాము. ఆయన గనుక అట్లు చేయనియెడల మనము నశించెదము. విశ్వాసికి దేవుని యొక్క ప్రతీ వాక్యమును "ఆమేన్"తో గుర్తింపబడియున్నది. అది సరియే. అవును, అతడు వీడని పట్టుదలను కలిగియున్నాడు.
JUDG 14:6
51మరియు సమ్సోను ఆ ఫిలిష్తియులను సంధించినప్పుడు దానిని గురించి మీరు ఎన్నడైనను తలంచియున్నారా? సమ్సోను, వారు అతనిని వెడల్పైన తలుపుల వంటి భుజములు గలవాడుగా ఎట్లు వారు చిత్రీకరించగలిగిరి? మంచిది, సరి, ఆ విధముగా అతనున్నయెడల ఒక సింహమును పట్టుకొని దానిని రెండుగా చీల్చివేయుటలో ఆశ్చర్యము లేదు. అయితే సమ్సోను ఒక… ఈ విధముగా నేను చెప్పుచున్నందులకు నన్ను క్షమించండి, అతడు చుట్టలు చుట్టలుగా చుట్టబడిన ఉంగరాలు వెంట్రుకలు గలవాడై ఒక మరుగుజ్జు వంటి పొట్టివాడుగా యుండగా, ఒక తల్లి చాటు బిడ్డ, అతని తల మీద ఏడు జడలు వ్రేలాడుచునుండెను. ఏమిటి, మరియు మీరు గురుంచుకొనుడి, దేవుని యొక్క ఆత్మ అతనిపైన వచ్చు వరకు అతను ఒక బలహీనుడుగా నుండెను, అప్పుడతడు ఆ సింహమును పట్టుకొని దానిని చీల్చివేసెను. అది నిజము. మొదట, మొదట అతనిపై దేవుని ఆత్మ వచ్చెను, పిదప అతను తానెక్కడ నిలుచుకొని యుండెనో ఎరిగియుండెను.
JUDG 16:3
52మరియు సంఘము గనుక అభిషేకింపబడినయెడల, నిజమైన విశ్వాసముతో అభిషేకింపబడిన యెడల, ఆ సింహము గర్జించినప్పుడు, సమ్సోను కదిలింపబడినాడని నేను ఊహించుచున్నాను. అయితే దేవుని ఆత్మ అతనిపైన దిగెను. అతను వీడని పట్టుదలను గలవానిగా యుండెను, చెప్పెను, "నేను నిన్ను సంధించుటకు సిద్దముగా నున్నాను," ఆ సింహమును పట్టుకొని దానిని లాగి మరియు దానిని ఒక ప్రక్కకు త్రోసి మరి దానిపై నడిచెను.
ఒక దినపు రాత్రి వారు అతనిని పట్టణము లోపల బంధించిరి. మరి అతను గాజా పట్టణపు తలుపులను ఊడబెరికి వాటిని తన భుజములపై వేసికొని మరి వాటితో కొండపైకి నడిచి వెళ్ళెను. మై, ఓ, మై, ఎటువంటి ఒక మనిషి మరుగుజ్జులాటి ఒక మనిషి. అయితే దానిలోనున్న విషయమేమనగా, దేవుని యొక్క ఆత్మ అతనిపై నుండెను. అతను దానితో నింపబడియుండెను. అదియే అతనిలో బేధమును కలుగ చేసినది.
JUDG 15:15
53అటు పిదప ఒక దినమున అతను వెయ్యిమంది ఫిలిష్తియుల ద్వారా చుట్టు ముట్టబడెను. మరతడు అచ్చట, అతనియొద్ద ఏమియు లేక నిలువబడి యుండెను, కావున అతడు గాడిద యొక్క దవడ యెముకను తీసికొనెను, బహుశా, ఆ గాడిద చనిపోయి నలుబది సంవత్సరములై యుండవచ్చును మరియు అది బాగుగా ఎండిన ఎముక, మరియు ఆ ఫిలిష్తియులు శిరస్త్రాణమును ధరించి, శరీరములకు కవచములు ధరించియుండిరి, మరి అవి ఇనుము లేక ఇత్తడితో చేయబడి ఆ శిరస్త్రాణము ఒక అంగుళము దళసరి కలిగియుండెను. మరి అతడు ఆ గాడిద యొక్క దవడ యెముకను తీసికొని మరి ఒక వెయ్యిమంది ఫిలిష్తియులను చంపెను.
మీరెప్పుడైనను తలంచారా? ఆ పాత ఎండిన దవడ యెముకను ఆ ఎడారిలో తీసికొని మరి ఆ శిరస్త్రాణములను చీల్చివేసెను, ఎట్లు? ఆ దవడ యెముక వెయ్యి తునకలుగా విరిగి పోయుండెడిది. అయితే అతనక్కడ నిలుచుకొని మరి వారియొక్క ఇనుప తల కవచములను చీల్చివేసి మరి వారి ఈటెలను విరగగొట్టి, మరి వారిని అచ్చటనే కొట్టి మరి వారిని వెయ్యిమందిని అచ్చటే చంపివేసెను. మిగిలిన వారు రాళ్ళలోనికి పరిగెత్తుకొని పారిపోయిరి.
అదేమిటి? అతను ఆఏడు జడలను కలిగియున్న వరకు అచ్చట నుండు వరకు అది దేవుని యొక్క ఒడంబడిక. ఆ ఒడంబడిక వాగ్దానమును అతను కలిగి యుండు వరకు ఏదియూ అతడిని ఇబ్బందిపరచ జాలదు.
JOHN 14:12,19•
JOHN 20:21
54ఆ విధముగానే పెంతెకొస్తు ఆశీర్వాదములైన దేవుని వాక్యమైన ఒడంబడిక మన హృదయములలో నున్నంతవరకు మనము దానిని స్మరించు వరకు జీవించు దేవుని యొక్క సంఘమును ఏ కార్యమును బాధించదు. "ఏలయనగా నేను చేయు క్రియలు మీరును చేతురు. నాలోనున్న జీవము మీలోను నుండును. నన్ను తండ్రి పంపిన విధముగానే నేను మిమ్ములను కూడా పంపించుచున్నాను." ఆయనను పంపిన తండ్రి, అతనిలోనికి వచ్చును. మనుష్యుని పంపు యేసు ఆ వ్యక్తిలోనికి వచ్చును. అది ఆ వ్యక్తి కాదు; అది యేసు. అది యేసు కాదు; అది దేవుడు. "తండ్రి నన్ను పంపినట్టు నేనును మిమ్ములను పంపుచున్నాను. ఇదిగో నేను ఎల్లప్పుడును మీతో కూడా యున్నాను, యుగసమాప్తి వరకు యున్నాను. మరియు నేను చేయు క్రియలు మీరును చేసెదరు. ఇంకొద్ది కాలమైన పిదప లోకము నన్ను చూడదు గాని మరి మీరు నన్ను చూతురు; విశ్వాసి నన్ను చూచును, ఏలయనగా నేను మీతో కూడా యుందును, మీలో నుండెదను యుగసమాప్తి వరకు నుండెదను," అని యేసుక్రీస్తు చెప్పెను. దేవుని అత్మ యొక్క ప్రసన్నత చుట్టనున్నదని నేను స్పర్శించువరకు ఏదో కార్యము సంభవింపనై యున్నది. మరియు దానిని నమ్ము జనులను నేను చూచుచున్నాను, అది దేవుని యొక్క స్తుతి స్తోత్రములను ప్రతిఫలించుచున్నది.
55మీరు చంద్రుని వైపుగా చూచు ప్రతీసారి, అది చంద్రుడు ప్రకాశించుట కాదు గాని, సూర్యుడు చంద్రునిపై ప్రకాశించుచున్నది. నేను గనుక "చంద్రుని, నిన్ను ప్రకాశింపచేయు కార్యమేది యని" అడిగిన యెడల, చంద్రుడు చెప్పును, "ప్రకాశించునది నేను కాదు. ఏదో నాపై ప్రకాశించుచున్నది. సూర్యుడు లేనప్పుడు నేను ఆ వెలుగును ప్రకాశింపజేయుచుండవలయును."
మరి సంఘము చంద్రునికి ఒక మాదిరిగా యున్నది. దేవుని కుమారుడు లేనప్పుడు మనము ఆ వెలుగును ప్రతిబింబింప జేయవలయును, ఏలయనగా మనము దేవుని కుమారులు మరియు కుమార్తెలుగా యున్నాము, కొంచెము వెలుగు, సూర్యుడు వెలుగును ప్రకాశింపజేయునట్లుగా మనము కూడా అదే రీతిగా వెలుగును ప్రతిబింబించవలయును. ఓ, అది జనులు కాదు గాని, జనులలోనున్న దేవుడు.
JOHN 14:14
56నేను అనేక సంవత్సరములుగా గేమ్ వార్డెన్ గా యుంటిని. నేను జంతువులను ప్రేమించెదను మరియు నేను వాటిని శ్రద్దతో చూచుకొనెదను. కావున నేను రక్షణ శాఖ అధికారిగా అనేక సంవత్సరములుంటిని. నేను ఒక పాత ఊటను దాటుకొని వెళ్ళుచుండెడి వాడిని. నేను నీళ్ళను రుచి చూచి త్రాగిన స్థలములన్నింటిలోను అదియే శ్రేష్టమైన ఊట. మరియు నేను ఎల్లప్పుడును దానిని ఇష్టపడెదను, ఎందుకనగా అది ఎంతో ఆనందముగా యుండును, ఎప్పుడూ అచ్చట నీళ్ళ ఊట నుండి పైకి లేచుచు నుండును, నీటి బుగ్గలు లేచుచు, లేచుచు నుండును. మరియు నేను తలంచితిని, "మై!" నేను పండుకొని నీరు త్రాగుచుండెడి వాడిని. ఒక దినము నేను తలంచితిని, "చిన్న నీటి ఊట, ఏది నిన్ను అంత ఆనందముగా చేయుచున్నది? ఒకవేళ కుందేలు నీయొద్ద నుండి నీరు త్రాగుట వలననా?"
ఒకవేళ ఆ నీటి ఊట మాటలాడగలిగిన యెడల, అతను చెప్పియుండును, "కాదు, నన్ను నీటి బుగ్గలు ఉప్పొంగునట్టు చేయునది అది కాదు."
మరియు నేను అడిగెదను, "అప్పుడప్పుడు జింకలు నీయొద్ద నీరు త్రాగుట వలననా."
"కాదు, అది నేను నీటి బుగ్గలు ఉప్పొంగునట్లుగా సంతోషింపజేయుట లేదు.'''
"సరి," నేను అడిగితిని, "చిన్న ఊట, నెలకు ఒకసారి నేను నీ యొద్దకు వచ్చి నీళ్ళు త్రాగుట వలన నీవు ఉప్పొంగుచూ ఆనందముగా యున్నావా."
చెప్పెను, "లేదు అది కాదు నన్ను ఆనందింప జేయునది." నేను అడిగాను, "సరే, నిన్ను ఎల్లప్పుడూ ఆనందముగా యుండునట్టు చేయునది ఏది?"
ఒకవేళ ఆ నీటి ఊట గనుక మాటలాడగలిగిన యెడల, అతను చెప్పును, "నాలో నీటి బుగ్గలు వచ్చుట నేను రప్పించుట కాదు, నాలోనున్న ఏదో కార్యము ఆ విధముగా నన్ను చేయుచున్నవి. నన్ను ఉప్పొంగునట్లు చేయుచున్నది. అది ఆనందముతో ఉప్పొంగునట్లు చేయుచున్నది."
మరి ఆ విధముగానే ఒక విశ్వాసికి పరిశుద్దాత్మ చేయుచున్నది. మీ వెనుక ఏదో కార్యము యున్నది. మీరు దానిని త్రోయలేరు, లేక దానిని చింపలేవు. అది మీ యెడల శ్రద్దను కలిగి యుండును. మీలో ఉప్పొంగులాగున చేయునది అదియే, ఏదో కార్యము మీలో యున్నది. యేసు బావియొద్ద ఆ స్త్రీతో చెప్పినట్లు, "నిత్యజీవమునకు బావిలోని నీరు ఉప్పొంగి పైకి వచ్చుచున్నవి, ఎల్లప్పుడూ ఊరే నీటి ఊట మీ ఆత్మ ద్వారా దేవుని యొక్క ఆనందమును ఎల్లవేళలా వెదజల్లుచున్నవి. మరియు అది తమ చుట్టూ యున్నట్టుగా సంఘము ఆ అనుభూతిని కలిగియున్నంత వరుకూ, ఎందుకని నీవు దేనికొరకు భయపడుచున్నావు, చూశారా?
57సమ్సోను భయపడలేదు. అతను వీడని ధృడమైన పట్టుదలను కలిగియున్నాడు. అతడియొద్ద ఉన్నదంతా కేవలము ఒక్క గాడిద యొక్క దవడ ఎముక మాత్రమే; అయినా గాని అతడు వీడని పట్టుదలను కలిగియున్నాడు, ఏలయనగా అతని తలపై జడలు ఇంకా వ్రేలాడుచుండుటను అతను ఎరిగియుండెను.
ఒకవేళ వైద్యుడు మీతో చెప్పియుండవచ్చును, "నీవు స్వస్థత నొందుటకు వేరే అవకాశమే లేదు. నీవు చనిపోవుచున్నావు. నీకు కాన్సరు వ్యాధి గలదు. అయితే నీవిచ్చట కూర్చొని మరియు యేసు క్రీస్తు యొక్క మహిమగల పునరుత్తానమనే అనుభూతిని అనుభవించుచున్న యెడల వైద్యులు ఏమి చెప్పినను దానితో నీకు సంబంధము లేదు. అది ఏదీ కూడా నిన్ను కదిలించ లేదు. గమనించండి, మీరు దృఢమైన వీడని పట్టుదలను కలిగియుండవలెను. అతను గనుక ఒక మంచి వైద్యుడైన యెడల అతను నిన్ను మెచ్చుకొనును, అతను చెప్పును, తాను కోరుకొనునది నీవు స్వస్థత పొందవలయు ననుటయే. నీవు దానిని చేయుటయే అతడు ఆశించును. మరి మీరు చేయవలయును, విశ్వాసమును కలిగియుండుటకు, మీరు వీడని పట్టుదలను కలిగియుండవలయును.
MATT 3:16•
MARK 1:10•
JOHN 1:29,32
58యోహాను తాను ఒక నిజమైన సూచనను చూచెదనని నిశ్చయతను కలిగి యుండెను. మెస్సియా ఎవరనే దానిని తాను గుర్తెరుగగలనని దేవుడు తనతో చెప్పియుండుట యోహాను ఎరిగియుండెను. దానియందు అతడు వీడని పట్టుదలను కలిగియుండెను!
మరియు ఎవరైనను చెప్పియుండ వచ్చును, "ఆయనయే ఈయనని నీవు అనుకొనుట లేదా?"
అతను చెప్పెను, "ఆయన వచ్చునప్పుడు నేను ఎరుగుదును." అతడు ఎంతో దృఢమైన నిశ్చయతను కలిగియుండెను. అతను చెప్పెను "లోకము యొక్క పాపములను తీసివేయు దేవుని యొక్క గొర్రెపిల్ల ఇదియే." అది ఆయనేనని అతడు ఎరిగియుండెను. దానిని గురించి అతను సాక్ష్యమిచ్చెను. "పరలోకము నుండి దేవుని ఆత్మ పావురమువలె క్రిందికి ఆయనపై దిగుటను నేను చూశాను, మరి అది దేవుని కుమారుడని నేను ఎరిగియున్నాను." వీడని పట్టుదల! ఓ, మనము అనేక వ్యక్తులను గురించి మాటలాడుకొనుచు పోవచ్చును.
ROM 10:17•
HEB 11:1
59ఈ చిన్న స్త్రీ, ఆమె ఒక గ్రీసు దేశస్తురాలు సురోఫెనికయ నుండి వచ్చినది, మరియు ఆమె ప్రభువైన యేసు యొక్క మహిమను గురించి మరియు ఘనతను గురించి వినియుండవచ్చును. "విశ్వాసము వినుట వలన కలుగును, దేవుని వాక్యము వినుట వలన కలుగును." ఆమె వినెను, మరియు ఆమె వినినప్పుడు…
మీకు తెలియునా, ఇతరులు చూడలేని మార్గములను విశ్వాసము చూచును. ఇప్పుడు మీకు గనుక విశ్వాసము లేనియెడల, సరి, దానిని మీకు చూపించుటకు ప్రయత్నము చేయనవసరము లేదు. ఏలయనగా, విశ్వాసము దానిని చూచును. "విశ్వాసమనునది నిరీక్షింపబడు వాటియొక్క నిజస్వరూపమును, అదృశ్యమైనవి యున్నవనుటకు రుజువునైయున్నది." గ్రుడ్డివారు చూడలేని దానిని విశ్వాసము చూచును. విశ్వాసము ఆరవ ఇంద్రియము. ఐదు ఇంద్రియములు అరవ ఇంద్రియముతో భిన్నాభిప్రాయము కలుగకుండు వరకు బాగుండును. అయితే ఆరవ ఇంద్రియము విశ్వాసమనే, "అది నిరీక్షింపబడు వాటియొక్క నిజస్వరూపమైయున్నది," ఏలయనగా, మీరు చూచుట, రుచి, స్పర్శ, వాసన లేక వినుట వీటిని మీరు చూడలేరు, అయితే అవి మీకు తెలియును. విశ్వాసము ఆ విధముగా మీకు చెప్పును. మరియు అది ఖచ్చితముగా నిజము, అది ఒక పదార్ధముగా మీయొద్దకు వచ్చును. అదేదో ఊహ కాదు. మీరు కలిగియున్న ఒక కార్యము.
జనులు వేదికపైకి వచ్చి మరిచెప్పుటను నేను చూచియున్నాను, "సహోదరుడా బ్రెన్హాం, నాకు విశ్వాసమంతయును యున్నది!"
"మంచిది, అట్లైన పైన ఇచ్చట నీవేమి చేయుచున్నావు?" చూశారా, చూశారా, చూశారా.
"నేను దానిని కలిగియుండలేదు." అయితే మీరు దానిని కలిగియున్న యెడల, ఏమైనను…
HEB 4:12
60మీరు జరుగునని ఎరిగియున్న కార్యములు మీయెడల సంభవించి యుండ వచ్చును. అయినప్పటికిని అది ఏ విధముగాయని మీకు తెలియకుండా యుండవచ్చును, అయినను అది జరుగును. అదియే విశ్వాసము. అదియే నిజమైన విశ్వాసము. అది సంభవింపబోవుచున్నదని మీరు ఎరిగి యున్నప్పుడు, అది జరిగియే తీరును. ఇప్పుడు విశ్వాసము ఇతరులు చూడలేని మార్గములను, అవకాశములను చూచును.
ఆయన వాక్యము ఒక ఖడ్గము. బైబిలు ఆ విధముగా చెప్పుచున్నది, హెబ్రియులు 4:12, అది ఒక ఖడ్గమని. అయితే ఆ ఖడ్గమును ఉపయోగించుటకు విశ్వాసమనే చేయి కావలయును. విశ్వాసము మాత్రమే దానిని చేయగలదు, ఖడ్గమును పట్టుకొనగలదు.
ROM 10:17
61ఈ చిన్న స్త్రీకి ఆటంకములు ఏర్పడినవి. ఇప్పుడు, ఆమెకు మూర్చ రోగము గల ఒక కుమార్తె యుండెను, మరి ఆమె పరిస్థితి చాలా ఘోరముగా నుండెను. మరియు యేసు మూర్చ రోగమును స్వస్థపరచినాడని ఆమె వినెను. ఇప్పుడు, "విశ్వాసము వినుట ద్వారా కలుగును," మరియు అది ఆమె యొక్క కుమార్తె, కావున ఆమె ఎట్లైనను యేసు యొద్దకు వెళ్లి మరి ఆయన మాటలను వినవలయునని నిర్ణయించుకొనెను. మరిప్పుడు ఆవెుకు ఎన్నో ఆటంకములు, అనేకములు, అనేకమైన ఆటంకములు ఏర్పడినవి, అయితే ఆమె విశ్వాసమునకు ఏ ఆటంకము కలుగలేదు.
ఈ రాత్రి, జనులకు ఆటంకములు ఏర్పడిన వారు ఇచ్చట యున్నారు. మీరు గనుక… మీ తలంపులలో అనేక ఆటంకములు గలవు. అయితే మీ విశ్వాసము, దాని మార్గములో ఆటంకము అడ్డగించదు. విశ్వాసమునకు అసలు ఆటంకము అంటే ఏమిటో ఎరుగనే ఎరుగదు.
62ఈ చిన్న స్త్రీకి సంభవించిన కొన్ని కార్యములను గురించి మనము తలంచి చూచెదము. వారు ఒకవేళ ఆమెకు చెప్పియుండవచ్చును, "నీవు ఒక గ్రీకు దేశస్తురాలవు." ఇంకొక మాటలో చెప్పవలయుననిన, "నీ సంఘ శాఖ అచ్చట జరుగు కూటమును ఏర్పరచలేదు. నీవు అచ్చటికి పోవుటకు నీకు ఏ అధికారమును లేదు." మంచిది, ఆ తలంపు గాని ఆమె మనస్సులో యుండినయెడల, చాలా సేపుగా ఆమె అచ్చట వేచియుండదు. ఆమె పాత్ర నిండియుండును మరి ఆమె వెళ్ళిపోయుండును. అయితే మనము కనుగొనియున్నాము, అది ఆమెను నిలుపలేదు. ఆమె గ్రీకు దేశస్తురాలో లేక లేదో, ఆమె విశ్వాసమును కలిగియుండెను. ఆమెకు కావలసినదంతయును విశ్వాసమే.
63ఇప్పుడు ఎవరో ఆమె యొద్దకు వచ్చి, మరియు చెప్పి యుండవచ్చును, "సరి, అద్భుతములు జరుగు దినములు ఎప్పుడో గతించిపోయినవి. అసలు అటువంటి విషయములనేవి ఏదీ లేదు. ఆ జనులంటావా, వారు ఒక మత మూర్ఖత్వపు గుంపు." అయినప్పటికిని ఆమె వీడని పట్టుదలను కలిగియుండి, ఎట్లైనను అచ్చటకు వెళ్ళవలెనని ఆమె నిర్ణయించుకొనెను.
ఇప్పుడు ఇంకొక దానిని గురించి ఆలోచించెదము. వారిలో కొందరు చెప్పి యుండవచ్చును, "సరి, నీకేమిటని తెలియునా, నీ భర్త పట్టణములో ప్రాముఖ్యుడు, మరి నీవు గనుక ఆ గుంపులో చేరినయెడల నీ భర్త నిన్ను నిజముగా వదిలివేయును." అయినప్పటికిని ఆమె వీడని పట్టుదలతో యుండెను. ఆమె విశ్వాసము కలిగి యుండెను, మరియు దానిని ఉపయోగించు అవసరము ఆమెకుండెను.
వారిలో కొందరు ఈ విధముగా చెప్పి యుండవచ్చును, "ఏల, నీవు గనుక వెళ్ళినయెడల లేక ఇంకేమైనా విందులు, వినోదాలకు వెళ్ళినయెడల జనులు నిన్ను చూచి నవ్వెదరు." అయినా ఆమె ఇంకా వీడని పట్టుదలను కలిగియుండెను.
మరటు పిదప ఆ పాత కార్యము ఆమె యొద్దకు వచ్చి యుండవచ్చును, "నీవు గనుక ఆ విధమైన గుంపుతో కలిసినయెడల సంఘ కాపరి నిన్ను సంఘము నుండి బహిష్కరించుదరని నీవెరుగుదువా?" అయితే అది ఆమెను నిలుపలేక పోయెను. ఆమె ఇంకా వీడని పట్టుదలను కలిగియుండెను. ఆమె ఏ విధముగానైనను వెళ్ళుటకు సిద్దపడును. ఎందుచేత? విశ్వాసమును ఆమె తాకినది. విశ్వాసము దానిని చేయబోవుచున్నది. ఇతరులు ఏమి తలంచినను నాకు అక్కర లేదు; విశ్వాసము దానిని చేయును.
64చిట్టచివరకు ఆమె తనకున్న అడ్డంకులన్నింటిని దాటుకొని యేసునొద్దకు వచ్చెను. ఇప్పుడు ఆమె యేసునొద్దకు వచ్చినప్పుడు ఆమె బాధలన్నియు సమసిపోయినట్టుగా కనిపించును; అయితే అవి ఆ విధముగా కాదు, అప్పుడే అవి ప్రారంభమాయెను.
అనేక జనులు చెప్పెదరు, "మంచిది, నేను గనుక యేసును ఎరిగియున్న యెడల…" అవును, మనము దానిని ప్రతి రాత్రి చూచుచున్నాము. చూడుడి, ఆయన మనతోనే ప్రతి రాత్రి వచ్చును, ఇచ్చట యున్నాడని ఆయన నిరూపించును, అయితే మనము మరల మరుసటి దినపు రాత్రి వచ్చెదము, మరల మన బాధలన్నియును నుండును, మీరు చూశారా. చూడుడి, అది నిజమేనా? ఇప్పుడది నిజమే.
65ఆమె యేసు నొద్దకు వచ్చెను. ఆమె బహుశా… ఆమెకు గనుక అటువంటి విశ్వాసము లేకున్నయెడల, ఆమె యేసును కనుగొనిన పిదప మొదట అధైర్యపడి, ఆమె నమ్మకము కోల్పోయి మరి తిరిగి వెళ్ళి పోయుండును. అయితే మీరు చూడుడి, విశ్వాసము ఆ విధముగా వెనుదిరిగి వెళ్ళదు. విశ్వాసము దానిని ఆ విధముగా వదలదు. విశ్వాసము దృఢమైన పట్టుదలను కలిగియుండును. అది గట్టిగా పట్టుకొనును. ఇప్పుడు గమనించుడి, ఆమె ఈ మనుష్యునిపై తన నమ్మకమంతటిని మరియు విశ్వాసమంతటిని యుంచెను. ఇప్పుడు ఆమె గనుక ఏదో పరిహసించులాగున లేక ఏదో చెప్పుచు, "నేను ప్రయత్నము చేయబోవుచున్నాను, ఆయన ఏమి చెప్పబోవుచున్నాడో నేను చూచెదను. ఆయన గనుక మా సంఘ శాఖలకు విరోధముగా ఏమైనను చెప్పినయెడల, మనము వదిలి పోయెదము. అదంతే." అయితే ఆమె ఏదో కార్యమును పొందుటకు వచ్చెను, మరియు ఆమె దానిని పొందువరకు అచ్చటనే యుండవలయునని నిర్ణయించుకొనెను. అక్కడే మీరున్నారు, అదియే ఆ వ్యక్తి దక్షిణ దేశపు రాణివలె, ఆ రోజు రాత్రి మనము దానిపై ప్రసంగించియున్నాము.
MATT 15:22
66ఆమె యేసు నొద్దకు వచ్చినప్పుడు గమనించుడి. ఆమె ఆహ్వానింపబడుటకు బదులుగా, నిరాకరింపబడెను. ఇప్పుడు మీరు … ఈ దినమున అటువంటి ఒక స్థాయికి వచ్చి మరి ఆ విధముగా వారియెడల ప్రవర్తించినయెడల మీరు దానిని గురించి ఏమి తలంచుచున్నారు? యేసు వెంటనే జవాబు చెప్పెను. ఆమె ఈ ఆటంకములన్నింటిని దాటి తదుపరి, మరి చివరికి … [టేపులో ఖాళీ స్థలము కలదు.] ఆమె చెప్పెను …
ఆమె ఆయన యొద్దకు వచ్చెను. మరియు ఆమె ఆయనను ఆరాధించుటకు ఆయన యొద్దకు పరుగెత్తికొని వచ్చి, మరి చెప్పెను, "దావీదు కుమారుడా, నాపై దయగలిగి యుండుము, నా కుమార్తె దయ్యముతో విసిగిపోయున్నది. మరియు నీవు ఒక గొప్ప స్వస్థత అనుగ్రహించువాడవని నేనెరిగియున్నాను, మరియు నాకు సహాయము చేయుమని నిన్ను అడుగుటకు వచ్చితిని." ఆయన ఆమెను చూచి చూడనట్లుగా దాటిపోయెను. ఆమె వైపు చూచి నడచి వెళ్లిపోవుచుండెను. ఓ మై! ఆమె మన నవీన పెంతెకొస్తు కంటే కొంచెము శ్రేష్టమైన స్థితిలో యున్నది; మై, వారు వారి ముక్కును త్రిప్పుకొని మరి వెనుకకు తిరిగి నడచి వెళ్ళిపోయి యుండెదరు, మరియు చెప్పి యుండెడి వారు, "దానిని నేను చేయనక్కరలేదు." అయితే ఆ స్త్రీ ఆ విధముగా చేయలేదు. ఆమె విశ్వాసమును కలిగియుండెను. ఆమె అచ్చటనే నిలిచియుండెను.
JOSH 1:3
67ఇప్పుడు ఆమె మరల అతని వెంట వెళ్ళెను, "ప్రభువా, నేను పొందుకొన వచ్చునా?" మరియు ఆమె ఎటువంటి ఆటంకముల ద్వారా వచ్చినదో తలంచుట లేదు. ఆమె ఎటువంటి ఆటంకముల ద్వారా వెళ్ళవలెనో, ఆమె ఏ విధమైన అడ్డంకులలో పోవలయునో దానిని గురించి కూడా ఆలోచింపలేదు. ఆమె ఆయన యొద్దకు వెళ్ళినట్లైతే, ఆయన దానిని చెప్పితే చాలునని ఆమె నమ్మినది. ఆ ఒకే ఒక్క కార్యమును మాత్రమే ఆమె ఎరిగియున్నది. ఆమె తెలిసికొనుటకు కోరుకొనునదంతయును, ఆయన ఆ విధముగా చెప్పినయెడల! అది ఇతరులపై క్రియ చేయుచున్నదనే దానిని ఆమె ఎరిగియున్నది. ఆమెపై ఎందుకు క్రియ చేయదు?
మీరు మార్గమున ప్రతి అంగుళము కొరకు పోరాడ వలయును. ఐగుప్తులో దేవుడు పాలస్తీనాను యూదుల కిచ్చెను, అయితే వారు మార్గమున ప్రతి దానికొరకు పోరాడవలసి యుండెను! దేవుడు యొహోషువాతో చెప్పెను, "మీరు అడుగుపెట్టు ప్రతి స్థలము మీది, నేను మీకిచ్చియున్నాను." పాద అడుగులు అనగా విజయము, స్వాధీనము, మీరు దేవుని రాజ్యమునకు ఎక్కువరకు, మీరు గనుక ఒక చిన్న కార్యమును దాటి పైకెక్కవలయునని ఆశించినయెడల, "మంచిది, నేను నరకమునకు వెళ్ళవలసిన అవసరము లేదని నేను నమ్ముచున్నాను, అయితే నేను సంఘములో చేరినయెడల చివరకు నేను రక్షింపబడెదనని నేను నమ్ముచున్నాను," ఆ విధముగా తలంచిన యెడల మీరింకా ఆ స్థితిని పొందలేదు. అయితే బైబిలులోనున్న ప్రతియొక్క వాగ్దానమును మీది, అయితే మీరు మీయొద్ద నుండి అపవాదిని వెళ్ళగొట్టుటకై మీరు రెండంచుల ఖడ్గముతో ప్రతి దయ్యమును పోరాడుచు మరి దానిని మీకై స్వాధీనపరచుకొనవలయును. వీడని పట్టుదలను కలిగియుండి దానిలోనికి ముందుకు సాగిపోండి.
MATT 15:26
68ఇప్పుడు ఆమె తిన్నగా దేవుని యొద్దకే వెళ్ళినది. మరి ఆయన ఆమెను ఎరుగునట్లు దాటి పోయెను. మరి ఆమె ఆయన వెంట కేకలేయుచు పరుగెత్తికొంటూ వెళ్ళుచున్నది. వీడని పట్టుదలను అమె కలిగియున్నది. "ప్రభువా, నాకు సహాయపడుము" ఆమె అడిగెను. ఆమె ఆయనను ఆరాధించెను, "నాకు సహాయ పడుము!" అని అడిగెను.
ఆ గద్దింపును వినుము. "నేను మీ జాతికొరకు పంపబడ లేదు." ఓ, మై!
అట్లైనయెడల అనేకులు వారిలో పైకి లేచి "సరి, ఆయన మనకొరకు పంపబడ లేదని నేనూహించుచున్నాను. ఈ ఉజ్జీవము మనకు కాదు. నేను వెళ్ళి పోయెదను" అని చెప్పియుందురు.
గమనించండి, ఆమె ఎంతటి విశ్వాసమును కలిగియున్నదో యేసు ఎరిగి యుండును చూశారా.
మరియు ఆయన ఇంకొక సంగతి చెప్పెను, "మీ జాతి ఒక కుక్కల గుంపు." వ్యూ! మై!
నవీన పెంతెకొస్తు వారితో ఆ విధముగా మాటలాడవద్దు. ఓ! మీరు దానిని చెప్పిన, వారు చెప్పెదరు, "సరి, నేను ఈ గుంపును వదిలి అసెంబ్లీస్ వారితో చేరిపోయెదను. మరి అసెంబ్లీస్ నాతో చెప్పెదరు, నేను ఇంకొకరి యొద్దకు వెళ్ళేదను, ఇంకొకరి యొద్దకు వెళ్ళేదను, ఇంకొకరి యొద్దకు వెళ్ళేదను, మీరు చూశారా."
అయితే ఆ స్త్రీ కాదు. ఆమె విశ్వాసము కలిగియుండెను.
చెప్పెను, "మీ … నేను మీ కొరకు పంపబడలేదు. నేను మీ జాతికి పంపబడలేదు మరియు అది మాత్రము కాదు, మరియు మీరు ఒక కుక్కల గుంపు. "పిల్లల రొట్టె తీసికొని కుక్క పిల్లలకు వేయుట యుక్తము కాదనెను." ఓ, మై!
MATT 15:27
69విశ్వాసమును అది ఆటంకపరచలేకపోయెను. ఇంకా విశ్వాసమును కలిగి యున్నది. అది ఎప్పటివలెనే తాజాగా నుండెను. విశ్వాసము దేనిని అంగీకరించును? అది సత్యమును అంగీకరించును. ఆమె చెప్పెను, "అది నిజమే, ప్రభువా." ఓ, మై! గమనించండి, మీరు ఎంత పెద్దవారని కాదు, మిమ్మల్ని మీరు ఎంతగా తగ్గించుకొనవలయునో అంతగా తగ్గించుకొనవలెను. విశ్వాసము మిమ్ములను తగ్గించుకొనునట్టుగా చేయును. గమనించుడి, ఆమె ఇంకా వీడని పట్టుదలతోనే యుండెను.
అయినప్పటికిని, ఆయన ఆమెను గమనించలేదు. ఆయన ఆమెను ఎరుగనట్టుండెను. మరి చివరకు ఆమె ఆయన వెళ్తున్న మార్గమందు ఆయన దగ్గరకు వచ్చెను. మరి ఆయన ఆమెను తప్పించుకొని వెళ్ళలేకపోయెను, మరటు పిమ్మట ఆయన ఆమెతో చెప్పెను, "నేను మీకొరకు పంపబడలేదు, మరి మీ… మీ జాతి కొరకు. మరి మీ జాతి ఒక కుక్కల గుంపు తప్పనిచ్చి మరేమియు కాదు. మరియు నేను పిల్లల రొట్టెను తీసికొని ఇవ్వలేను. పిల్లల రొట్టె తీసికొని, ఈ గుంపుకు ఇచ్చు స్వస్థత, కుక్కలైన మీకు ఇచ్చుట యుక్తము కాదు."
మరియు "అది నిజమే ప్రభువా" అని ఆమె చెప్పెను.
వాక్యమే సత్యమైనదని విశ్వాసము ఎల్లప్పుడూ అంగీకరించును. ఆమేన్. చూశారా? మీకు గనుక నిజమైన విశ్వాసమున్నయెడల, మరి మీరు తప్పు చేయుచున్నారని ఈ పరిశుద్ద గ్రంథము చెప్పినయెడల, మీ తప్పును మీరు అంగీకరించెదరు. మీరు, "ఇప్పుడు ఒక్క నిమిషమాగుము, నేను ఫలానాకు చెందినవాడను…" అని చెప్పరు. కాదు, కాదు, అది విశ్వాసము కాదు. వాక్యము దానిని చెప్పినయెడల, మీరు… చేయుచున్న దానిని సరియా లేక తప్పాని ఈ వాక్యము ద్వారానే తెలియపరచబడును. అది నిజము.
MARK 7:28
70ఇప్పుడు ఆమె చెప్పెను. లేదయ్యా, ఆమె ఏ మాత్రము దానిని నమ్మకుండా, అంతటితోనే ఆమె ఆగిపోకుండా, ఆమె ఇంకా వెళ్ళుచునే యున్నది. మరియు ఆమె చెప్పెను, "నిజమే ప్రభువా, మేము కుక్కలమే. అయినను నేను అడుగుచున్నాను, యజమానుని బల్ల మీదనుండి క్రింద పడిన రొట్టె ముక్కలను కొన్నిటిని నేను తీసుకొనవచ్చు గదా." ఆమె రొట్టె ముక్కల కొరకు వేటాడుచున్నది. దానిని గురించి ఆలోచించుకొనుడి.
నేడు, మనము రొట్టెనంతటినీ తీసికొనగోరెదను లేనియెడల మనము ఏమీ తీసుకొనలేము. గమనించారా! దానినంతటిని మనము పొందుకొనవలయును లేదా మనము దేనిని పొందుకోలేము.
ఆమె ఇంకనూ పట్టుదల విడువక యుండెను. ఆమె కార్యములో దిగెను. వెచ్చని పాది మొక్కలను పురుగులు తినకుండా నుండుటకై చిన్న బిడ్డలను బుజ్జగించు విధముగా చల్లెడి మందువంటి స్త్రీ కాదు ఆమె. లేదయ్యా. ఈ దినమున వారిని క్రైస్తవులని పిలుచుకొనుచు నుండు ఆధునిక కృత్రిమ పంట వంటిది కాదు ఆమె. దేవుని వాక్యము దానిని చెప్పినప్పుడు, మరి ఆమె దానిని నమ్మెను, అది నిరూపింపబడుటను ఆమె చూచెను, ఎవరేమి చెప్పినను ఆమె దానిని వెంబడించుటకు సిద్దముగా నుండెను. క్రీస్తు కూడా ఆమెను నిలుపలేడు. మరి విశ్వాసము ఆ విధముగా చేయును. ఓ, అది వాక్యము సత్యమని అంగీకరించును. ఆమె రొట్టె ముక్కలకై వేటాడుచున్నది.
JOSH 2:9
71గుర్తుంచుకొనుడి, ఆమె ఒక్క అద్భుతమును కూడా చూడలేదు. అద్భుతములను నమ్మని ఒక సంఘశాఖ నుండి ఆమె వచ్చెను. "అద్భుతములను మొదలగునవి లేవని" చెప్పు ఆ సంఘ శాఖల నుండి ఆమె నమ్ముచు వెలుపలికి రావలయును. ఆమె అన్యజాతికి చెందిన స్త్రీ. ఆమె తన జీవితములో ఎన్నడూ అద్భుతమును చూసియుండలేదు. అయినప్పటికిని, విశ్వాసమును గట్టిగా పట్టుకొని యున్నప్పుడు, అచ్చట దేవుడుండెను. ఆమె ఎన్నడును దానిని చూచి యుండలేదు, అయితే ఆమె దానిని గురించి వినియుండెను.
అద్భుతములున్నవని మీరు నమ్మనియెడల, పరిశుద్ద గ్రంథమును మరి ఈ దినమున పరిశుద్ద గ్రంథములోని వాగ్దానములను చదువుడి. విశ్వాసము దానిని పట్టుకొనెను.
ఆమె రాహాబను వేశ్యవలె నుండెను. వేగుల వారి ద్వారా ఆమె వినినప్పుడు, ఆమె యెహోషువాను చూడగోరలేదు, మరియు అతను ఏ విధముగా దుస్తులు ధరించియున్నాడు మరియు అతను ఎటువంటి ఒక యుద్ద వీరుడని చూడగోరలేదు. ఆమె చెప్పెను, "దేవుడు మీతో కూడా నున్నాడని నేను వినియున్నాను. దేవుడు ఏమి చేసి యున్నాడని నేను వినియున్నాను." మరియు ఆమె రక్షణను కోరెను, మరియు ఆమె దానిని పొందెను; సరి, ఏలయనగా ఆమె కూడా వీడని పట్టుదలను కలిగి యుండెను. ఆమె చెప్పెను, "నేను మిమ్ములను దాచెదను, నేను దేనినైనను చేసెదను. కాని ఒక్క విషయమేమనగా మీరు నాకు ప్రమాణము చేయవలయును, నేను ఈ సమయములో రక్షింపబడెదనని మీరు హామి ఇవ్వవలయును." ఓ, మై అదియే ఉద్దేశ్యము.
MATT 15:26•
MARK 7:27,29
72మరియు ఈ దీన స్త్రీ కూడ ఆ విధముగానే యున్నది. ఆమె ఆశించినది, ఆమె దానిని పొందబోవుచున్నానని ఎరిగియుండెను. దానిలో ఏ సందేహము లేదు. ఆమె దేనిని ఎక్కవలయుననినను, ఆమెకు పరవాలేదు ఎత్తైనను దానిన పొందవలయును. కావున యేసు ఆమెను వ్యర్ధముగా వెనక్కు పంపించలేకపోయెను, ఆయన చెప్పెను, "పిల్లల రొట్టె తీసికొని కుక్కపిల్లలకు వేయుట యుక్తము కాదు," మరి ఆ విధముగా చెప్పెను. అయినప్పటికిని ఆమె దానిని వెంబడించెను. ఏలాగైనను, ఏలయనగా ఆమె వీడని గట్టి పట్టుదలతో యున్నది. ఆమెకు అది అవసరమై యున్నది, ఎందుకనగా తన కుమార్తె మరణపాయములో యున్నది. ఇతరులు స్వస్థతను పొందుకొనగా, తన కుమార్తె మాత్రము ఎందుకు స్వస్థత పొందుకోకూడదు? మరియు ఆయన అదే సృష్టికర్తయైన దేవుడైయున్నాడు.
యేసు చెప్పెను, "ఈ మాట నిమిత్తము, దయ్యము నీ కుమార్తెను వదిలి పోయెను." ఓ, మై! దేవుని యొక్క వరమును ఆమె సరైన మార్గమున సమీపించెను.
73ఈ విధముగా చేసిన ఈ జనులు ఏమి చేయుదురో కనిపెట్టి చూద్దామని దేవుడు కొన్ని సందర్భములలో వేరే విధముగా కార్యములను చేయునని మీరెరుగుదురా? ఇప్పుడు అది మీ తలపైన పోయున్నది, దానిని మీరు చూడలేదు మరియు దానిని గమనించలేదు, కాని ఒక దానిని చేయుటకై నేనిప్పుడే ఏదో కార్యమును చేసితిని. మరియు అది నాకు ఎంతో ఉపయోగపడినది. మరియు అది క్రియ చేయుటను నేను గమనించితిని, చూడుడి, మీరు కార్యములను చెప్పెదరు, మీ యొక్క తీరును మార్చెదరు, మీ స్వరమును మీరు మార్చెదరు, కొన్ని సమయములలో మీ ప్రసంగమును మీరు మార్చెదరు; కొన్ని కార్యములను చూచుచు మరియు గమనించుచు, పిదప గమనించి చూడుడి, అది ఎట్లు క్రియ చేయునని. ఏలయనగా ప్రార్ధనా వరుస రాబోవుచున్నది, అది మీ మధ్య నుండకుండా యుండుట మంచిది, చూశారా. అది సంభవించుటను చూడుడి, పిదప మీరు మిమ్ములను మార్చుకొని మరి ఎచ్చటికైనను తిరిగి వెళ్ళుడి, చూశారా. దేవుడు అదే కార్యమును చేసియున్నాడు. ఆయనింకా దానిని చేయుచునే యున్నాడు, గమనించుము.
దేవునియొక్క వరమును సమీపించుటకు ఆమె సరైన మార్గమును ఎన్నుకొనెను. మరియు గుర్తుంచుకొనుడి, అన్యజనులలో దేవుడు చేసిన అద్భుత కార్యములో ఆ స్త్రీకి చేసినదే మొట్టమొదటిదై యున్నది. ఆమెయే మొదటి అన్యజాతి.
వాక్యము సత్యమని విశ్వాసము ఒప్పుకొనును. మరియు అది భయభక్తులు గలది, మరి అది విడువక పట్టుదలతో యుండును మరి అది అదియే.
JOHN 11:3
74మార్త యేసును సంధించుటకు వెళ్ళినప్పుడు. ఇప్పుడు ఎవరికైనను నిందించుటకు ఒక హక్కు కలిగియున్నయెడల అది మార్తకే వర్తించును, ఎందుకనగా మరణపాయమున, ఘోర స్థితియందున్న తన సహోదరుని కొరకు ప్రార్థించుటకై ఆమె యేసును పిలువ నంపెను, మరి యేసు… వారు సంఘమును వదిలి వేసిరి, వారున్న ప్రాచీన మృతిచెంది, చలనము లేని సంఘము నుండి బయటికీ వచ్చిరి మరి యేసును వెంబడించి, ఆయన అభిషేక్షింపబడిన మెస్సీయాయని నమ్మిరి. మరలు పిదప ఆయన సన్నిహితుడైన స్నేహితుడుగా లాజరుండెను, ఆయన వారితో నుండెను… మరియు వారు, వారి సంఘము నుండియు మరియు సమాజము నుండి బహిష్కరింపబడిరి. మరి ఎవరితో కూడా ఆయన యుండెనో మరి ఆ సన్నిహిత స్నేహితుడు వ్యాధితో నుండెను, మరణపు అంచున నుండెను, వైద్యుడు అతనికి ఏమియు చేయలేకపోయెను.
మరి ఆమె యేసుకు ఆ వార్తను తెలియజేసెను, మరి యేసు ఆమె యొక్క పిలుపును ఎరుగనట్లుండెను. ఆయన ఇంకొక పట్టణమునకు వెళ్ళి మరి అదే కార్యమును అచ్చట చేసెను. వారు మరల కబురు పంపిరి. మరి ఆయన దానిని ఎరుగనట్టుండి వెళ్ళిపోయెను.
LUKE 10:40
75మరటు పిదప లాజరు చనిపోయి మరి పాతిపెట్టబడి నాలుగు దినము లాయెను. అతని ముఖము అప్పటికే క్షీణించి పోయుండును. అది ఉష్ణ ప్రాంతము. నాకు చెప్పబడిన ప్రకారము మరియు మొదట ముక్కు రాలిపోవును, మరటు పిదప బహుశా అతని శరీరము క్షీణించిపోవును. ఏలయనగా, డెబ్బై-రెండు గంటలకు పిదప శరీరము కుళ్ళిపోవుటకు ప్రారంభించును మనము దానిని కనుగొనియున్నాము.
నేను ఒక మనుష్యుని కొన్ని రోజులలో సమాధి చేయవలెను. బుధవారము. మరియు అతడు గత బుధవారము చనిపోయెను, మరియు వారు అతనిని అక్కడ పెట్టి నేను వచ్చి అతని శవమును సమాధి కార్యక్రమము చేసి ప్రసంగించవలెనని వారు అశించుచున్నారు. వారు అతనిని ఇంకా ఎక్కువ సమయము ఉంచలేరు, ఏలయనగా అతని ముఖము ఇప్పటికే క్షీణించిపోయున్నది, చూశారా.
మరి లాజరుకు జరిగినది అదియే. అతను ఇదివరకే చనిపోయెను.
76మరియు అతను చనిపోయిన పిదప సమస్తమును ముగింపబడెను, అప్పుడు యేసు ఆ పట్టణములోనికి వచ్చుచున్నాడు. కావున వారికి తెలియును వారు విమర్శింపబడబోవుచున్నారని, ఏలయనగా వారు ఇదివరకే విమర్శింపబడిరి.
అయితే మార్త చాలా ఆలస్యము చేయుచుండెడిది, ఆ విధముగా కనిపించును; యేసు నిద్రించుటకు ఒక స్థలమును సిద్దపరచుట, ఆయన తినుటకు ఒక స్థలమును సిద్దపరచుట మరి మొదలగునవి ఆమె చేయును. ఒకసారి యేసుతో చెప్పెను, తనకు సహాయపడుటకు తన సహోదరిని పంపమని. అయితే ఆమె విశ్వాసము ఆమె హృదయాంతరంగములో తాకినది. మరియు నెమ్మదిగా కూర్చొని, ఏడ్చుకొనుచు దానిని గురించి ఏమియు చేయక మరి నమ్మకమును కోల్పోయెను. మార్త ఇంటి నుండి బయటికి వచ్చి మరి నగరములోనికి పరుగెత్తెను. నిస్సందేహముగా ఆమె కొందరిని వీధిలో సంధించి యుండవచ్చును, వారు ఒకవేళ అడిగియుండెదరు, "ఇప్పుడు ఈ లాజరు సంగతి ఇంతేనా? ఇచ్చట మీతో కూడా యున్నటువంటి ఆ దైవీక స్వస్థతదారుడు ఏమైపోయినాడు?" ఆమె వారిని దాటుకొని పోయెను.
MATT 6:10•
JOHN 11:21
77ఆయన ఎచ్చట యున్నాడో అచ్చటికి ఆమె వెళ్ళెను. ఆమె ఏ విధముగా నున్నదో గమనించుడి. ఆమె ఆయన యొద్దకు పరుగెత్తెను. ఆయనలో తప్పు కనిపెట్టుటకు ఆమెకు హక్కు కలదు, ఆయనతో చెప్పుటకు ఆమెకు హక్కు గలదు, ఈ విధముగా చెప్పుటకు, "ఇప్పుడు నేను పిలిచినప్పుడు ఎందుకొరకు రాలేదు?" ఒకవేళ అది గనుక ఈ దినపు ఒక పెంతెకొస్తు, లేక ఒక బాప్తిస్తు, లేక ఒక ప్రెస్బిటేరియన్ గా ఉండినట్లైనయెడల వారు వెంటనే సంఘమును మార్చివేసి యుందురు, చూశారా. నిశ్చయముగా. "మేము నిన్ను పిలిచినప్పుడు నీవు ఎందుకు రాలేదు? ఆమెకు హక్కు యున్నట్లుగా కనిపించుచున్నది. అయితే ఆమెకు హక్కు లేదు.
నేను గత రాత్రి చెప్పిన విధముగా, మీకు ఏ స్వకీయ తలంపు ఉండకూడదు. అది ఆయన తలంపుగానే యుండవలెను, గమనించండి, ఆయన ఏమి చేసినా. "నీ చిత్తము జరుగను గాక, ఈ విధముగా ప్రార్థించుము." ఆయన ఇంకొకరి ద్వారా వినియోగింపబడు బాలుడు కాదు. ఆయన దేవుడు. గమనించుడి, "నీ రాజ్యము వచ్చును గాక. నీ చిత్తము జరుగును గాక."
LUKE 11:2
78మరియు ఆమె ఆయన యొద్దకు వచ్చినప్పుడు, ఆమె ఆయనను సరైన మార్గమున సమీపించెను. క్రమపద్దతిలో ఆయన యొద్దకు వచ్చెను. ఆమె ఆయనకు ఆయన యొక్క సరైన బిరుదును ఇచ్చెను, "ప్రభువా!" ఆయనను నిందించలేదు, అయితే, "ప్రభువా, నీవు గనుక ఇచ్చట నుండి యుండిన యెడల, నా సహోదరుడు చనిపోయుండెడి వాడు కాడు." ఓ, మై! ఆయన తనయొక్క దీన, అలసిపోయిన శరీరమును కూడదీసుకొనుటను నేను చూచుచున్నాను. "నీవు గనుక ఇచ్చట ఉండియుండిన యెడల, నా సహోదరుడు చనిపోకయుండును. అయినను ఇప్పటికిని, దేవుని నీవు ఏమి అడిగినను, దేవుడు దానిని నీకిచ్చును." చూడుడి, ఆమె సృష్టికర్తయైన దేవుడు ఎంతటివాడనే దానిని ఆమె ఎరిగియుండెను. ఆయన అభిషేకింపబడిన మెస్సీయాయని ఆమె ఎరిగియుండెను. ఆమె ఆయన యొక్క అనుగ్రహము పొందుటకు సరైన మార్గమును ఎన్నుకొనెను, తన మోకాళ్ళపై, చెప్పెను, "ప్రభువా, నీవిక్కడ ఉండినయెడల నా సహోదరుడు చావకుండును. ఇప్పుడైనను నీవు దేవుని ఏమడిగినను, దేవుడు నీకనుగ్రహించును." ఓ, మనము గనుక ఆ విధముగా తలంచినయెడల! "ఇప్పుడైనను, ప్రభువా, నీవె దేవుని ఏమడిగినను, దేవుడు దాని నీకనుగ్రహించును."
JOHN 11:25,27,34,35
79ఆయన చెప్పెను, "నేనే పునరుత్తానమును, జీవమునైయున్నాను." ఏ మానవమాత్రుడు దానిని చెప్పనే చెప్పలేడు. "నేనే పునరుత్తానమును మరియు జీవమును. నాయందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రదుకును, బ్రదికి నాయందు విశ్వాసముంచు ప్రతివాడును ఎన్నటికిని చనిపోడు." దీనిని నమ్ముచున్నావా?
ఆమె చెప్పెను, "అవును ప్రభువా. లోకమునకు రావలసియున్న దేవుని కుమారుడవు నీవని నేను నమ్ముచున్నాను."
ఆయన అడిగెను, "అతనిని మీరెక్కడ సమాధి చేసితిరి?"
సమీప కాలమున నేను ఒక స్త్రీతో మాటలాడుచుంటిని, మరి ఆమె నాతో చెప్పెను, ఆమె చెప్పెను, "నేను మీరు మాటలాడుచుండగా వినుటకు ఇష్టపడుచున్నాను, సహోదరుడా బ్రెన్హాం, అయితే," చెప్పెను, "మీలో ఒక తప్పు యున్నది."
"మీకు కృతజ్ఞతలు," అని నేను చెప్పితిని. ఒకే ఒక తప్పు, "అదేమిటి?" అని నేను అడిగాను.
ఆమె చెప్పెను, "మీరు యేసును గురించి ఎంతో పొగుడుచూ ఆయనను దైవము చేయుచున్నావు." నేను చెప్పాను, "ఆయన నాలో కనుగొనగలిగినది అదొక్కటే."
"యేసు దైవత్వముతో నిండియున్నాడని మీరు ఆయనను గురించి అధికముగా డంబములు పలుకుచున్నారు, ఆయన దైవము కాదు," యని చెప్పెను.
నేను చెప్పాను, "ఓ, అవును, ఆయన దైవము."
ఆమె చెప్పెను, "సరి, మీరు ఆయనను దేవునిగా చేయుచున్నారు."
నేను చెప్పాను, "ఆయన దేవుడుగా యుండవలయును, లేనియెడల లోకములో ఇది వరకు ఎన్నడు లేని ఒక వేషధారిగా యుండవలయును," చూశారా. మరియు నేను చెప్పాను, "ఆయన దేవుడు."
ఆమె చెప్పెను, "ఆయన ఒక మనిషి అంతే. ఆయన దేవునిగా యుండలేడు."
నేను చెప్పాను, "ఆయన దేవుడు. ఆయన దేవుడుగాను మరియు మానవునిగాను ఏకమై యుండిరి.
మరియు ఆమె అడిగెను, "నీవు పరిశుద్ద గ్రంథమును నమ్ముచున్నావని నీవు చెప్పియున్నావు."
నేను చెస్పాను, "అవును, గౌరవనీయురాలైన స్త్రీ, నేను నమ్ముచున్నాను."
మరియు ఆమె చెప్పెను, "మీ యొక్క సొంత పరిశుద్ద గ్రంథమునే ఉపయోగించి ఆయన దైవత్వము లేనివాడని నేను గనుక దానిని నిరూపించినట్లైన యెడల, నీవు దానిని అంగీకరించెదవా?"
నేను చెప్పాను, "నిశ్చయముగా, పరిశుద్ద గ్రంథము ఆయన దైవము కాదని చెప్పినయెడల," అయితే, నేను చెప్పాను, "పరిశుద్ద గ్రంథములో అట్లున్నదని నేను నమ్ముట లేదు."
ఆమె చెప్పెను, "సరి. యోహాను 11వ అధ్యాయములో, పరిశుద్ద గ్రంథము చెప్పుచున్నది, "యేసు లాజరు యొక్క సమాధి యొద్దకు వెళ్ళినప్పుడు, పరిశుద్ద గ్రంథము చెప్పుచున్నది, "ఆయన దుఃఖించెను." మరియు చెప్పెను, "ఆయన గనుక దుఃఖించినయెడల, ఆయన దైవముగా యుండనేరడు, మరి దైవము ఏడ్వడు."
80నేను చెప్పాను, "సరి, స్త్రీ, అది సరైన మాటగా నిలువదు." నేను చెప్పాను, "నేను మీకు చెప్పదలచి యున్నాను." నేను చెప్పాను, "ఆహారము వేయక పస్తుతో చంపబడిన ఒక కోడి యొక్క నీడతో చేయబడిన పులుసు కన్నను పలుచగా యున్నది మీరు చెప్పునది," నేను చెప్పాను, "ఏలయనగా అది పరిశుద్ద గ్రంథముతో సరిగా లేదు." నేను చెప్పాను, "చూడుము, ఆయన సమాధియొద్దకు వెళ్ళెను, ఆయన సమాధికి మునుపు నిలుచుకొని మరి ఆయన చెప్పెను, తన శరీరమును కదిలించుకొని మరి చెప్పెను, "లాజరు బయటికి రమ్ము!"
ఆయన ఒకవేళ ఒక మానవునిగా ఏడ్చి యుండవచ్చును; అయితే ఆయన ఆ సమాధి నుండి ఆ మనుష్యుని బయటికి రమ్మని పిలిచినప్పుడు, ఆ శవము నాలుగు దినములుగా సమాధిలో యుండెను, మరియు లాజరు ఆత్మ నాలుగు దినములుగా ఎక్కడో ప్రయాణము చేయుచుండెను! నాకు తెలియదు - అది ఎక్కడ యున్నదని, మరి మీకు తెలియదు - అది ఎచ్చట యుండెనని. ఏది ఏమైనను ఆయన అతనిని మరల పిలిచెను. నాశనము తన యజమానుని ఎరుగును. ఆత్మ దాని సృష్టికర్తను ఎరుగును. మరియు ఒక మనుష్యుడు, చనిపోయి నాలుగు దినములకు పిదప మరల లేచి తన కాళ్ళపై నిలువబడెను. ఆ కార్యము చేసినప్పుడు ఆయన మానవునికన్నను గొప్పవాడు. అది దేవుడు!
MATT 14:19,21•
MARK 4:39•
LUKE 8:25•
JOHN 11:25,43
81మరియు ఆ కొండమీది నుండి ఆ రాత్రి ఆయన దిగి వచ్చునప్పుడు, ఆయన ఒక మానవునిగా యుండెను, మరియు ఆయన ఆకలిగొని యుండెను, ఏదైన తినుటకు దొరకునా యని ఒక అంజూరపు చెట్టు చుట్టూ చూచెను. ఆయన ఆకలి గొనినప్పుడు ఆయన ఒక మానవుడు. అయితే ఆయన ఐదు రొట్టెలను మరి రెండు చేపలను తీసికొని మరి ఐదు వేల మందికి పంచి ఇచ్చినప్పుడు, ఆయన ఒక మానవుని కన్నను గొప్పవాడు.
ఆ పడవలో వెనుక భాగమున ఆ రాత్రి ఆయన పండుకొని యున్నప్పుడు, అచ్చట సముద్రములోనున్న పదివేల దయ్యములు ఆయనను ముంచి చంపివేయ వలయునని అనుకొన్నప్పుడు, ఆయన అచ్చట ఒక మానవునిగా నుండెను. మరియు ఆ చిన్న పడవ ఆ తుఫానులో ఒక సీసా మూతవలె ఆ సముద్రములో అటు ఇటు క్రిందికి పైకి తేలుచునుండెను. ఆయన నిద్రించునప్పుడు, ఆయన ఒక మానవునిగా యుండెను. ఆయన అలసిపోయుండెను, శక్తి ఆయనను వదలి పోయుండెను. అయితే ఆయన తన పాదములను పడవపై నుంచినప్పుడు మరియు పైకి చూచి మరి "నిశ్శబ్దమై ఊరకుండుము," అని చెప్పినప్పుడు గాలియు మరియు అలలు ఆయనకు లోబడెను, అది ఒక మానవుని కంటే శ్రేష్ఠమైనదిగా యున్నది. మానవుడు దానిని చేయలేడు. అది క్రీస్తులోనున్న దేవుడు, ప్రపంచమును తనలో తాను సఖ్యపరచుకొనుచున్నాడు.
MARK 16:19•
LUKE 24:51•
EPH 4:8•
HEB 7:25•
HEB 13:8
82దయకొరకు కేకలు వేయుచు సిలువపై ఆయన మరణించినప్పుడు, ఆయన ఒక మానవుడు. అది నిజము. అయితే ఆ ఈస్టరు ఉదయమున సమాధిలో నుండి ఆ ముద్రను బ్రద్దలు చేసుకొని మరి ఉన్నతములకెక్కి, అవునయ్యా, మధ్యవర్తిత్వము చేయుటకై నిత్యముగా జీవించుచున్నప్పుడు ఆయన దేవుడు. ప్రాకుచు కొండపైకి ఎక్కు ప్రతి పురుషుడును మరియు స్త్రీయు దానిని నమ్ముచున్నారు. అవును అయ్యా.
ఆయన నిన్న, నేడు, నిరంతరము ఏకరీతిగా యున్నాడు! "నీవు దీనిని నమ్ముచున్నావా?" అవును అయ్యా. ఆయన అప్పుడెట్లు యుండెనో మరి అదే విధముగా ఇచ్చట మన మధ్య ఈ రాత్రి యున్నాడు. దీనిని నీవు నమ్ముచున్నావా? అప్పుడు ఆయన ఏ విధముగా యుండెనో, ఈ రాత్రి ఆయన అదే విధముగా స్వస్థపరచువానిగా యున్నాడు. దీనిని నీవు నమ్ముచున్నావా? నిశ్చయముగా. ఆయన తప్పుడు. వీడని పట్టుదలతో యుండుము. క్రీస్తులో మీ స్థానమును పట్టుకొనుము, మీ పశ్చాత్తాపము. క్రీస్తులో మీరు పశ్చాత్తాపము పడుటయందు నిలుకడగా యుండుడి.
ఆమె వీడని పట్టుదలతో యుండెను మరియు ఆమె తన సహోదరుని పునరుత్తానమును పొందెను.
2KGS 4:9,13-17•
MATT 25:40
83షూనేమీయురాలైన స్త్రీ ఏలీయా సముఖములో వీడని పట్టుదలతో యుండెను. ఏలీయా ఆ దారిన వచ్చి మరి ఆమెను ఆశీర్వదించి ఆమె ఒక కుమారుని కలుగునని చెప్పెను. ఆ కుమారుడు సుమారుగా పన్నెండు సంవత్సరముల వయస్సు గలవాడై యుండెను. బయట పొలములో నున్నప్పుడు అతనికి ఎండ దెబ్బ తగిలి యుండవచ్చును. ఈ స్త్రీ ఏలీయా యెడల బహు దయతో నుండెను. ఆమె షూనేము పట్టణము నుండి వచ్చిన ఒక షూనేమీయురాలైన స్త్రీ. మరియు ఆమె కనుగొనెను … ఆమె భర్త ఒక ధనికునిగా నున్నందు వలన, ఆమె చెప్పెను, "ఇచ్చటికి వచ్చి పోవు ఈ వ్యక్తి ఒక పరిశుద్దుడని నేను గ్రహించుచున్నాను." ఆమె చెప్పెను, "మనము అతనియెడల దయకలిగి ఏదైనను చేసెదము." చెప్పెను, "ఇచ్చట మన ఇంటి ప్రక్కన ఒక చిన్న గదిని అతనికొరకు కట్టెదము, అతను ఇచ్చటికి వచ్చినప్పుడు, అతని కొరకు ఒక మంచము మరియు అచ్చట ఒక నీటి కూజా నుంచెదము, కావున అతను విశ్రాంతి తీసికొనును."
మరి ఆమె భర్త చెప్పెను, "అది చాలా బాగున్నది."
"కావున, ఈ చిన్నవారికి మీరు చేయు ఏ కార్యమైనను అది మీరు నాకు చేయుచున్నారు," అని యేసు చెప్పెను.
కావున అతను తన పనివాడైన గేహజీతో చెప్పెను, "వెళ్ళి, ఆమెను అడుగుము, సైన్యాధిపతితో మాటలాడవలయునా లేక ఆమెకు నేనేమి చేయవలయును?"
ఆమె చెప్పెను, "నేను నా స్వజనులలో కాపురమున్నాననెను. నేను బాగున్నాను."
మరి గేహజీ చెప్పెను, "అయితే ఆమెకు సంతానము లేదు."
చెప్పెను, "వెళ్ళి ఆమెకు చెప్పుము." అచ్చట ఒక దర్శనము వచ్చెను. చెప్పెను, "మరుసటి యేట ఈ సమయమున ఆమె ఒక కుమారుని కలిగి యుండునని, వెళ్ళి, ఆమెతో చెప్పుము." మరి ఆమెకు ఆ విధముననే కలిగెను.
2KGS 4:19,22,24
84ఆ బాలుడు సుమారు పన్నెండు సంవత్సరముల వయస్సు గలవాడుగా నుండెను. అతని తండ్రి వృద్దుడుగా నుండెను. అతను ఒక దినమున పొలములో నుండగా ఒకవేళ ఎండదెబ్బ తగిలి యుండ వచ్చును. అది మధ్యాహ్న సమయము, "నా తల పోయెనే! నా తల పోయెనే!" అని అతడు కేకలేసెను. అతను ఆ బాలుని ఇంటికి పంపెను. అతడు తన తల్లి తొడమీద పండుకొనియుండి చనిపోయెను. ప్రవక్త ఏ మంచముపై పండుకొనెనో మరి ఆ మంచము మీద ఆమె ఆ బిడ్డను పండబెట్టెను, ఎంత చక్కగా కుదిరినది ఆ స్థలము మీరు గమనించి యున్నారా.
మరియు ఆమె పనివానితో చెప్పెను, "ఒక గాడిదకు గంత కట్టించి మరి నీవు నన్ను కర్మెలు పర్వతమునకు తీసికొని వెళ్ళుము. ఆ ప్రసంగికుడు యుండు గుహ యొక్కటి అక్కడెక్కడో యున్నది. నేను ఈ కుమారుని కనబోయెదనని నాకు ఒక దర్శనమును చూసి చెప్పు శక్తి అతనికి కలదు; మరియు అతను దేవునికి చాలా సన్నిహితముగా నుండినయెడల, అతను ఈ సమయమునకైన దేవుని వర్తమానికుడు. మరియు ఈ విధముగా ఎందులకు జరిగినదనియు, మరియు నేను అతని యొద్దకు వెళ్లినప్పుడు ఎందుకొరకు దేవుడు ఆ బిడ్డను తీసికొన్నాడని అతను నాకు చెప్పగలడని నేనెరిగి యున్నాను. నన్ను పైకి అచ్చటికి వెళ్ళనిమ్ము." ఆమె చెప్పెను, "ఎవరైనను నీకు ఎదురుపడినయెడల వానికి నమస్కరింపవద్దు. మరియు ఎచ్చటను నిలువవద్దు; ఆగకుండా వెళ్తూవుండు."
ఓ, దానిని నేను ఇష్టపడుచున్నాను! ఇప్పుడు అవసరమైన సమయము. జనులు చనిపోవుచున్నారు, మనము మన దారిలో అది ఇది చేయు చుండకూడదు. కదలిపోవలయును. మరి ఆమె వీడని పట్టుదలతో యుండెను.
2KGS 4:19,25-27
85మరియు ఏలీయా. మీకు తెలియునా, జరుగబోవు ప్రతి కార్యమును దేవుడు ఆయన యొక్క ప్రవక్తలకు ప్రతిసారి తెలుపడు. అతను పైకి చూచెను, ఆమె వచ్చుటను గమనించెను, అతను చెప్పెను, "ఇదిగో ఇచ్చట ఆ షూనేమీయురాలు వచ్చుచున్నది." మరియు చెప్పెను, "ఆమె అధిక వ్యాకులముగా ఉన్నది, అయితే దేవుడు నాకు దానిని మరుగుపరచెను." అతను చెప్పెను, "వెళ్ళి ఆమెను సంధించుము." మరియు ఆమె…
అతను అడిగెను, "నీవును నీ పెనిమిటియు నీ బిడ్డయు సుఖముగా నున్నారా?"
ఆ వర్తమానికుని యొద్దకు వెళ్ళుటకు ఆమె యొక్క వీడని పట్టుదలను నేను ఇష్టపడుచున్నాను. మరియు ఆమె చెప్పెను, "సుఖముగా నున్నాము." ఆమె భర్త తన చేతులు నలుపుకొనుచు, ఆ గదిలో అటు ఇటు తిరుగుచూ ఏడ్చుచున్నాడు, మరి ఆ బిడ్డ చనిపోయి మంచముపైన పండుకొనియున్నాడు, అయినను, "సమస్తమును బాగున్నది." ఆమేన్. ఏల? ఆమె తనయొక్క గమ్యస్థానమునకు వచ్చియున్నది. ఆమె తన గమ్యమును నెరవేర్చుకొన్నది. ఏల ఆ విధముగా సంభవించినదని అతను ఆమెకు చెప్పునని ఆ దైవజనుని యొద్దకు పోవుటకు ఆమె వీడని పట్టుదలతో యుండెను. మరటు పిమ్మట ఆమె అతని కాళ్లపై పడి మరి ఏమి సంభవించినదని చెప్పెను.
2KGS 4:29,30
86ఇప్పుడు అతడు వెళ్ళి తన దండమును తీసుకొని మరి తన సేవకునితో చెప్పెను, "దీనిని తీసికొనివెళ్ళి మరి ఆ బిడ్డపై దీనినుంచుము." ఇప్పుడు పౌలు దీనిని చూచియే మరి చేతి రుమాలును జనులపై నుంచెనని నేను అనుకొనుచున్నాను. చూడుడి, ఏలయనగా తాను ముట్టినదంతయును ఆశీర్వదింపబడినదని ఏలీయా ఎరిగి యుండెను, అయితే ఆమె దానిని నమ్ములాగున అతను చేయగలిగిన యెడల!
అయితే ఆ స్త్రీ యొక్క విశ్వాసము ఆ దండములోలేదు, అది ప్రవక్తపై నుండెను, చూశారా. మరియు ఆమె చెప్పెను, "యెహోవా జీవము తోడు నీ జీవము తోడు, చూడుడి, అతను నిత్యజీవమును కలిగియుండెదనని ఆమె సాక్ష్యమిచ్చెను. చెప్పెను, "మరి నీ జీవము తోడు నేను నిన్ను విడువను." ఓ, మై, దానితో నిలిచి యుండుము! దానిలో నున్నదదే.
2KGS 4:35
87మీరు కోరునది పొందుకొను మార్గము అదే. ఈ సురోఫెనికయు స్త్రీ వలె, దానితో నిలచియుండుము! అక్కడే నిలిచియుండుము. క్రీస్తుతో నిలిచియుండుము. ఈ రాత్రి గట్టిగా పట్టుకొని దానితో అచ్చటనే యుండుము. అచ్చట నుండి కదలవద్దు. రేపు ఎవరైనను చెప్పినయెడల, "అది ఊరక…" వారికి మీ చెవినీయవద్దు. మీరు విశ్వాసమును కలిగియున్నారు. మీరచ్చటనే యుండుడి.
చెప్పెను, "నేను నిన్ను వదలను."
మరి ఏలీయా చెప్పెను, "సరి, ఈమెను వదిలించుకొన వీలు కాదు, నేను ఆమెతోనే వెళ్ళుదును." కావున అతను తన నడుమును బిగించుకొని మరి వెళ్ళెను.
అతను గదిలోనికి వెళ్ళినప్పుడు మరి అతనిని గమనించుడి. అతనికి ఏమి చేయవలయునో తెలియలేదు. అతను ప్రార్ధించలేదు. అతను ముందుకు వెనుకకు నడచుచుండెను, మరియు నేలపై క్రిందికి పైకి నడచుచుండెను, దేవుని ఆత్మ అతనిపైకి వచ్చు వరకు ఆ విధముగా చేయుచుండెను. పిదప అతను ఆ బిడ్డపై తాను పండుకొనెను, మరిప్పుడు ఆ బిడ్డ యేడు సార్లు తుమ్మెను. మరి అతనికి ప్రాణము వచ్చెను.
88మార్త ఎరిగియుండెను, దేవుడు గనుక ఆ ప్రవక్తలో యుండి యున్నయెడల, నిశ్చయమగా ఆయన, ఆయన యొక్క కుమారునిలో నున్నాడు, చూశారా, మరి ఆ కారణము వలననే ఆమె వీడని పట్టుదలతో యుండెను.
మరప్పటి నుండి మనకు వేలకొలది సంవత్సరములుగా అనుభవము కలిగియుండి మరి దేవుడు ఆయన వాగ్దానమును నెరవేర్చునని ఎరిగియున్న యెడల, ఈ రాత్రి దేవుని యొక్క సముఖమును మనము చూచుటకు ఎంతగా వీడని పట్టుదలతో యుండవలయును, ఓ, మై, మరి నక్షత్రముల వలె మనము ఏ విధముగా ప్రకాశింపవలయును!
89సమీపకాలనున ఒక రాత్రి నాకు గుర్తున్నది, అచ్చట ఒక స్త్రీ యున్నది, మరియు ఆ స్త్రీ ప్రార్థించుటకు ఆశించుచున్నదని నేనెరుగను. ఆ రాత్రి నేను పోయి వ్యాధిగ్రస్తుల కొరకు ప్రార్థించలేదు. మరియు ఆ స్థలమంతయు జనులతో క్రిక్కిరిసి యుండెను! ఈ రాత్రి ఇచ్చట కూర్చొనియున్న ధర్మకర్తలు కొందరు అచ్చట నుండిరి. కాలిఫోర్నియా నుండి వచ్చిన ఒక స్త్రీకి ఒక యాభై పౌండ్లంత గడ్డ యుండెను. ఆమె వైద్యుని యొద్దకు వెళ్ళలేకపోయెను; మరటు పిమ్మట వారు ఆమె వైద్యుని యొద్దకు వెళ్ళునట్లుగా చేయగా, శస్త్రచికిత్స చేయుటకు కూడా వీలులేని విధముగా ఆ కణితి పెద్దదిగా నుండెను. మరియు ఆమె ఈ విధముగా ఆ పెద్ద గడ్డతో నుండెను. మరి వారు ఆమెను అచ్చటకి తీసికొనివచ్చిరి. వారు తీసికొనివచ్చిరి. వారు ఆమెను కారులో తీసుకొని రాలేకపోయిరి. వారు ఆమెను లోనికి తీసికొని వచ్చుటకు గాను, ఒక ట్రైలర్ (బండి)లో యుంచి తీసికొని వచ్చిరి. మరి వారు ఆమెను లోనికి తీసికొని వచ్చిరి. నేను దానిని ఎరుగకుంటిని మరి నేను ప్రసంగించుచుంటిని. మరియు ఆమె అడిగెను, "సరి, అతను…" నేను బలిపీఠపు పిలుపునిచ్చాను. "వ్యాధిగ్రస్తుల కొరకు అతను ప్రార్థించుట లేదా?" అని అడిగెను,
"లేదు" అని చెప్పెను.
ఆమె అడిగెను, "అతను ఏ ద్వారము గుండా బయటికి వెళ్ళును?" హు-హు. ఇప్పుడు దీనిని తలంచుడి, ఆమె విశ్వాసమును! మరి వారు ఆమెను తీసికొని వెనుక తలుపు నొద్దయుంచిరి, నేను సంఘ కాపరి గది ద్వారా బయటికి వచ్చి, నా కారు యొద్దకు వెళ్ళుచున్నాను.
90మరి ఆ స్త్రీ అచ్చట పండుకొని యుండెను, నా ప్యాంటును అడుగున పట్టుకొనెను, మరి ఆమె చెప్పెను, "సహోదరుడా బ్రెన్హాం," ఓ, మై, ఆమె ఆ విధముగా వెలుపల నా కొరకు కాచుకొని యుండెను. చెప్పెను, "నీవు గనుక నీ చేతులను నాపై యుంచినయెడల, దేవుడు నన్ను స్వస్థపరచును." మరి నేను దానిని చేసాను.
మరి ఆ సంభవమునకు మూడు నెలల పిదప నేను ఒక కూటములో యుంటిని. మరి స్త్రీలందరివలె ఆమె కూడా అచ్చట ఆరోగ్యముగా నిలుచుకొని యుండెను; మరియు ఆమె పై శస్త్రచికిత్స జరిగినదా లేదా యని చూచుటకు ఇతర స్త్రీలను గదిలోనికి రమ్మని ఆహ్వానించి వచ్చి పరీక్షించి చూడమనెను.
ఎందుచేత? ఆమె వీడని పట్టుదలతో యుండెను. ఆమె దేనికొరకైతే వచ్చినదో దానిని గైకొనవలయునని తీర్మానించుకొనెను. మరి ఆ విధముగానే నుండవలయును. అవును, అయ్యా. వారి విశ్వాసము వాక్యమును పట్టుకొని యుండెను.
91ఒకప్పుడు మీకాయాను తీసుకొని రావలెనని కబురు పంపించెను. అహాబుతో కలిసి యెహోషాపాతు యుద్దము చేయుటకు నిర్ణయించుకొనెను. అది ఒక విశ్వాసి అవిశ్వాసితో ఏకమైనట్టుగా కనిపించుచున్నది. మరియు అతను చెప్పెను, మనము యుద్దము చేయబోవుచున్నాము; వారి సొంత భూమిని స్వాధీనపరచుకొనుటకై వారు ఒక స్థలమునకు పోవుచున్నారు. మూలాధారముగా, అది వారికి చెందినది. చెప్పెను, "ఏల ఇశ్రాయేలీయులకు చెందిన ధాన్యములను సిరియనులు తినివేయుచున్నారు? యెహోషువా దానిని మనకిచ్చెను!" అది ఖచ్చితముగా సరియే. కావున వారు అచ్చట కూడుకొని ఒక పెద్ద సెమీనరీ నడిపిరి, పెద్ద పెద్ద ప్రసంగికులు అచ్చట కూడిరి; ఐదు, నాలుగు లేక ఐదు వందల మంది, చక్కని తర్ఫీదుని పొందిన హెబ్రియులుగా యున్నారు.
1KGS 22:5-8,11,12•
2CH 18:4,6,7,10,11
92మరి యెహోషాపాతు చెప్పెను, అతను ఒక నీతిమంతుడు, అతను అడిగెను, "మనము ప్రభువును విచారణ చేయుట మంచిది కదా?"
అతను చెప్పెను, "ఓ, మంచిది, ఆ విధముగా చేసెదము." అహాబు ఎటువంటి వ్యక్తో మీరెరుగుదురు, కావున అతను వెళ్ళెను. మరియు చెప్పెను, "నా యొద్ద జవాబున్నది, నేను నాలుగు వందల మంది ప్రవక్తలను కలిగియున్నాను. సరే, వారిని ఇచ్చటికి పిలుచుకొని రండి.''
కావున వారు వెళ్ళి వారిని పిలుచుకొని వచ్చిరి, వారిలో ఒకడు, సిద్కియా, అతనేయని నేను నమ్ముచున్నాను, అతను రెండు పెద్ద కొమ్ములు చేయించుకొని వచ్చి మరి చెప్పెను, "ప్రభువు నెలవిచ్చుచున్నాడు. యుద్దమునకు వెళ్ళుము, అది నీకు చెందినది. ప్రభువు సెలవిచ్చుచున్నాడు, సిరియనులను నీవు ఈ కొమ్ములతో దేశము నుండి పారద్రోలెదవు."
యెహూషాపాతు చుట్టూ చూచెను, మీకు తెలియునా, మరి అతను అడిగెను, "ఇంకా ఇచ్చట వేరే ఇంకొకరెవరైనా నీ యొద్ద గలరా?"
ఇంకొకడా? ఇచ్చట నుంచి విద్యాలయముల నుండి చక్కగా తర్ఫీదు నొందిన నాలుగు వందల మంది హెబ్రియ ప్రవక్తలు ఇచ్చటకు వచ్చియుండగా ఇంకొకరితో గల అవసరత నీకేమున్నది? మనయొద్ద నాలుగు వందల మంది యున్నారు! మొత్తం సెమినరీ వారు ఇచ్చట యున్నారు, వారందరూ ఏక మనస్సును కలిగియున్నారు, "ముందుకు సాగిపోండి, ప్రభువు మీతో యున్నాడు. ప్రభువు నెలవిచ్చుచున్నాడు."
యెహోషాపాతు అడిగెను "సరి, మీయొద్ద ఇంకొకడు యున్నాడా?"
అహాబు చెప్పెను, "ఓ, నేను విచారణ చేయుటకై ఇంకొకడు నాయొద్ద గలడు," చెప్పెను, అది ఇమల్లా కుమారుడైన మీకాయా, అయితే, చెప్పెను, "నేను అతనిని ద్వేషించుచున్నాను." ఓ, నిజముగా. అవును. చెప్పెను, "సరి, అతను ఈ సంఘ శాఖలతో ఏకీభవించడు! చెప్పెను, "మనము, నీవు… అతను ఒక వింతైన వ్యక్తి," అని వారు చెప్పిరి.
"ఓ," అతడు చెప్పెను, "రాజా, ఆ విధముగా అనవద్దు. వెళ్ళి అతడిని పిలుచుకొని రమ్మనండి."
1KGS 22:14,17,24•
2CH 18:13,16
93కావున, వారు అతనిని పిలుచుటకై ఒకనిని పంపిరి, చెప్పెను, "ఇప్పుడు, మీకాయా, నీవు ఆ సహవాసము నుండి వేరై, ప్రత్యేకముగా యున్నావు. ఇకమీదట ఆ నాలుగు వందల మంది ప్రవక్తలతో నీవు కలువ లేవు. అయితే ఇప్పుడు వారు చెప్పినట్లే చెప్పినయెడల, వారు వారితో నిన్ను చేర్చుకొన్నట్లుగా గుర్తింపుకై ఒక సహవాసపు అట్టను నీకు తిరిగి ఇచ్చెదరు. ఒక ప్రవక్తతో ఆ విధముగా మాటలాడుటను మీరు ఊహించగలరా?
మీకాయా చెప్పెను, "యెహోవా నాకు సెలవిచ్చునదేదో, ఆయన జీవము తోడు, నేను దానినే పలుకుదుననెను." ఇప్పుడు మీరు అక్కడే యున్నారు. ఆమేన్. అంతే.
"సరి, నీకు తెలియునా, వారు నీకు ఏమి చేయనైయున్నారోయని?
అది నాకనవసరము, ఆయన ఏమి చెప్పునో దానినే నేను చెప్చెదను." అతను తిరిగి అతని యొద్దకు వచ్చి చెప్పెను, "ఇప్పుడు ఈ రాత్రి నన్ను గడపనిమ్ము, మరి ప్రభువు ఏమి చెప్పునో నేను దానిని చూచెదను."
అతను మరుసటి దినమయిన ఉదయుమున తిరిగి వచ్చి మరి చెప్పెను, "యుద్దమునకు వెళ్ళు. అవును అయ్యా. వెళ్ళు. అయితే ఇశ్రాయేలీయులందరును కాపరిలేని గొర్రెలవలె చెదిరియుండుటను నేను చూచితిని."
1KGS 22:14,19,22,25•
2CH 18:18,21,23-25
94అప్పుడు ఈ సిద్కియా వచ్చి తన చేతినెత్తి మీకాయా చెంప మీద కొట్టెను, "ఆ అల్పుడైన పరిశుద్ద దొర్లువాడు," అతనిని కూర్చుండబెట్టి మరి అడిగెను, "దేవుని ఆత్మ నా యొద్ద నుండి ఏ వైపుగా పోయెను?"
అతను చెప్పెను, "నీవు చూచెదవు."
కావున అతను అడిగెను, "దానిని గురించి ఏమిటి?"
చెప్పెను, "గత రాత్రి నేను ఒక దర్శనమును చూసాను. యెహోవా సింహాసనాసీనుడై యుండగా నేను చూచితిని." మరియు చెప్పెను, "ఆయన మరి వారందరు ఆయన చుట్టు నుండిరి. వారు ఒక ఆలోచన సభను కలిగి యుండిరి, 'అహాబును వంచించుటకు మనయొద్ద నుండి ఎవరు వెళ్ళెదరు, ప్రవక్తయైన ఏలీయా ఏమి చెప్పియున్నాడో దానిని నెరవేర్చుటకు ఎవరు క్రిందికి వెళ్ళెదరు? దీనిని గురించి నేను ఏమి చేసెదను?'" మరియు చెప్పెను, "ఒక అబద్దమాడు ఆత్మ పైకి వచ్చి మరి చెప్పెను, నేను క్రిందికి వెళ్ళి ఆ ప్రవక్తలలో దిగెదను మరి వారు అబద్దమూడులాగున చేసెదను." మరి ప్రభువు చెప్పెను, "దానిని చేయగలవాడివి నీవే, ఏలయనగా వారు సెమీనరిలో శిక్షణ పొందితిరని నీవెరుగుదువా? చెప్పెను, 'వెళ్ళి మరి దానిని చేయుము. నీవు చేయగలిగినది అదియే.'" అతను క్రిందికి వెళ్ళి, మరి దానిని చేసెను!
ACTS 2:38
95ఇప్పుడు మీరు అడుగ వచ్చును, "అట్లైనయెడల, ఏది సరియని ఎవరికి తెలియును?" మీకాయా వాక్యముతో యుండెను!
దేవుడు శపించిన దానిని మీరెట్లు ఆశీర్వదించగలరు? మీరే విధముగానైన జీవించవచ్చునని మీరెట్లు జనులకు చెప్పగలుగుచున్నారు, ఏ పనులన్నా చేయవచ్చునని మీరెట్లు చెప్పగలుగుచున్నారు? ఆ విధముగా వుంటూ యేసుక్రీస్తుతో సహవాసమును కలిగి యుండవచ్చునని ఎట్లు చెప్పుచున్నారు? మీరు దానిని చేయలేరు. మీరు మరల జన్మించి మరి పరిశుద్దాత్మతో నింపబడవలయును. [టేపులో ఖాళీ స్థలము గలదు.] యేసుక్రీస్తు, మీ పాపక్షమాపణ నిమిత్తము, మరి మీరు పరిశుద్దాత్మ అను వరము పొందుదురు. ఈ వాగ్దానము మీకును, మీ పిల్లలకును దూరస్తులందరికిని, అనగా ప్రభువైన మన దేవుడు తనయొద్దకు పిలిచిన వారికందరికిని చెందును." అదియే ఔషధ నిర్ణయము. ఆ విధితో మీరు ఆటలాడవద్దు, దానిని ఆపకూడదు.
ACTS 2:39
96ఒక వైద్యుడు మీకు ఒక మందుల సూత్రమును వ్రాసి ఇచ్చును. మరి మీరు దానిని ఒక బూటకపు మందుల వానియొద్దకు తీసికొని వెళ్ళినయెడల మరి అతను దానిని సరిగా కలుపకపోయిన యెడల, మీ యొక్క రోగిని మీరు చంపివేయుదురు.
మరి ఈ దినమునున్న కార్యమదే, మీరు నిజమైన కార్యమునకు బదులుగా చేతుల కరచాలనము మరి మిగతా వాటిని చేయుచున్నారు. తిరిగి రమ్ము! దేవుడు పేతురు రక్షణకై ఒక నిత్య మందుల రసీదును వ్రాయుటకు అనుమతించెను. అది ఎన్నడును మారలేదు, మరియు అది ఎన్నటికిని మారదు. చేతులు కలుపుట, మరియు సంఘములో చేరుట, మరి ఆ విధమైన కార్యములు దాని స్థానమును తీసికొనలేవు. అక్కడ ఏ విధముగా వ్రాయబడియున్నదో మరి అట్లే వాక్యప్రకారము తిరిగి రావలయును. పరిశుద్ద గ్రంథము అంతట మరి వారు ఆ ఔషధ చీటినే వారు ఉపయోగించిరి. వారు దానిని నైసియా ఆలోచన సభ వరకు వాడుచు వచ్చిరి, మరి దానికి పిదప వారు ఔషధ చీటిని మార్చివేసిరి. ఆ కారణము వలననే మనకు ఈ దినమున అనేక జీవము లేని మృతతుల్యమైన సభ్యులున్నారు. నిజముగా. మీరు నిజమైన ఆ ఔషధ చీటిని పొందవలయును. పిదప తెలుసుకొనుడి, అది గనుక అప్పుడు గురిని కొట్టినయెడల, ఇప్పుడు కూడా గురిని కొట్టును, "ఇది మీకును మీ పిల్లలకును, దూరస్తులందరికిని, అనగా ప్రభువైన మన దేవుడు తన యొద్దకు పిలిచిన వారికందరికిని." దానితో కూడా దేనిని స్వీకరించవద్దు. దానితో కూడా దేనిని చేర్చవద్దు. మీరు గనుక దానితో కూడా దేనినైనను చేర్చినయెడల …
ACTS 2:38
97గుర్తుంచుకొనుడి, ఒక ఔషధ చీటి అక్కడున్న వ్యాధిని తీసివేయుటకు తగిన పరిహార ఔషధము, చంపుటకు తగిన రోగికి చాలినంత మందు. మరియు మీరు గనుక అధికముగా పరిహార ఔషధమును ఉపయోగించిన యెడల, లేక వేరే దేనినైనను దానిలో వేసినయెడల, అది క్రియ చేయదు, ఆ మందును బలహీనపరచి మరి అది రోగికి సహాయపడదు. మీరు గనుక దానిలో అధికముగా విషమును వేసిన యెడల, అది రోగిని చంపివేయును. అది సరిగ్గా యుండవలయును.
మరియు ఆయన నిత్య ఔషధ చీటిని వ్రాసెను, అది ప్రతి తరమునకు చెందును. చేతులు కలుపుట కాదు, సంఘములో చేరుట కాదు, మరి వేరే ఏ ఇతర విషయములందు ఏదీ లేదు. ఆయన చెప్పెను, "మారుమనస్సు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి. అప్పుడు మీరు పరిశుద్దాత్మ అను వరము పొందుదురు. ఈ వాగ్దానము మీకును, మీ పిల్లలకును చెందును."
వారు ఆ ఔషధ చీటిని తీసికొనిరి, మరి దేవుని యొక్క గొప్ప గల్లా పెట్టలో దానిని నెరవేర్చిరి. మరియు వారు దానిని చేసినప్పుడు, పెంతెకొస్తు దినమున వారు వ్యాధిగ్రస్తులను స్వస్థపరచిరి, చేయగలిగిన సమస్తమును వారు చేసిరి, ఏలయనగా అది దేవుడు, వారిలో క్రీస్తు యుండెను. సరే మంచిది.
98మీకాయా అది దేవుని యొక్క వాక్యమని ఎరిగియుండెను, ఏలయనగా అది పరిశుద్ద గ్రంథముతో ఖచ్చితముగా నున్నది, నిజమైన ప్రవక్త చెప్పెను. దేవుడు ఆ వ్యక్తిని అతని భార్యను శపించెను, ఏలయనగా వారియొక్క చెడుతనము వలన. మరి ఆయన దానిని శపించినప్పుడు, ఈ మనుష్యులు అచ్చటికి వచ్చి మరి ఎట్లు దానిని ఆశీర్వదించెదరు?
ఇదిగో ఇచ్చట వారియొక్క అభిప్రాయము వారి ఆలోచన యున్నది. ఆ భూమి వారికి చెందినది. అది వాస్తవముగా వారికివ్వబడినది. అయితే వారి పాపములు దానిని వారినుండి దూరపరచినవి. కావున వారు తలంచిరి, ఆ భూమి వారికి చెందినందువలన వారు చేయనలసిన కార్యమదేయని తలంచిరి. లేదయ్యా.
అది నిబంధనలపై యున్నది. పరిపూర్ణముగా. మీరు దైవిక స్వస్థతను పొందియుండవచ్చును, మీరు రక్షణను పొందవచ్చును, పరిశుద్దాత్మ బాప్తిస్మమును మీరు పొందవచ్చును, అయితే అది నిబంధనలపై ఆధారపడి యున్నది, మీరు దేవుని యొక్క నిబంధనలను సంధించవలయును. దానికి వెలుపల, ఆ దేవుని నిబంధనలు విశ్వాసులకు తప్పనిచ్చి మరెవ్వరికీ వర్తించవు.
99సమీప కాలమున ఒక వ్యక్తి నాతో చెప్పెను, అతను ఒక వాక్య పరిచారకుడు, అతను చెప్పెను, "మీరు చనిపోయినవారిని లేపినను, చనిపోయిన వారు లేపబడినట్లు వైద్యులు వివరించినను, నాకు లెక్కలేదు," చెప్పెను, "నేను వాటినన్నింటిని నమ్మను."
నేను చెప్పాను, "నిశ్చయముగా అట్లు కాదు, ఆ కార్యములు అవిశ్వాసులకు కాదు."
అది విశ్వాసులకు మాత్రమే. అవిశ్వాసులకు అది అనుగ్రహించలేదు. అది విశ్వాసులకు వూత్రమే పంపబడినది. అది విశ్వాసులకు మాత్రమే కాని మరి అవిశ్వాసులకు కాదు. నిశ్చయముగా, వారు అచ్చట ఒక తప్పుడు విషయమును అంగీకరించిరి.
100అయితే మీకాయా ఎరిగియున్నాడు. అతను తనయొక్క దర్శనమును చూచినప్పుడు, అది దేవుని యొక్క వాక్యముతో ఖచ్చితముగా సరిగానున్నదని చూచినప్పుడు, అది సరియని అతను ఎరిగియుండెను. మరియు అతను అది తన వీడని పట్టుదలతో యుండెను. అతను చెప్పెను, "నేను చెప్పిన ఈ కార్యములన్నియును సంభవించినప్పుడు మీరు వాటిని కనుగొన్నప్పుడు, పిదప అదేమిటని మీరు తెలిసికొనెదరు."
అదే విధముగా గ్రుడ్డివాడు, అతను వారియొక్క వేదాంత శాస్త్రముతో, వాగ్వాదము పెట్టుకొనలేదు; అయితే తన కండ్లు తెరువబడెనని అతను ఎరిగియుండెను, కావున అతను దానిని గురించి వీడని పట్టుదలతో యుండెను. ఫిలిప్పువలె, నతనయేలువలె, బావియొద్ద స్త్రీ వలె, వారు దేవుని పట్టుకొనిన పిదప వారు వీడని పట్టుదలతో నుండిరి.
101ఇప్పుడు ముగించబోవుచుండగా, ఒక నిమిషము మనము ప్రార్ధనా వరసను ప్రారంభింపబోవుచున్నాము, ఇప్పుడు ఏదో చెప్పవలయునని నాకు మనస్సులో తోచుచున్నది.
కొద్ది కాలము క్రితము నేను మెక్సీకోలో నుంటిని. దేవుడు నన్ను మెక్సికో పట్టణమునకు పంపెను, అక్కడ పెద్ద రింగు యుండెను. ఓ, జనులు అచ్చట వేలకొలది వేలకొలదిగా యుండిరి. మరి ఆ దినమునకు ముందు రాత్రి ఆ వేదికపై ఒక వృద్దుడైన గ్రుడ్డి మనుష్యుడు యుండెను, ఇప్పుడది ఘోరమైన దృశ్యములలో ఒకటి. అచ్చటు ఒక …
ఎందరికి సహోదరుడు ఎస్పినోజా తెలియును? చూడుడి, అతనిని తెలిసిన వారు అనేకులు యున్నారు. నిశ్చయముగా. సరిప్పుడు అతను నాకు తర్జుమా చేయును. మరి అతను దీనిని మీకు చెప్పగలడు. మరియు అచ్చట ఒక గ్రుడ్డి వ్యక్తి వేదికపైకి వచ్చెను, అతడు మెక్సికోకు చెందిన ఒక పేద వ్యక్తి.
102మరియు వారియొక్క ఆర్థిక పరిస్థితి చాలా పేదరికమైనదిగా నున్నది. ఉదాహరణకు, ఒక తాపీ పనివాడు ఒక దినమునకు చాలా పిసోస్ సంపాదించుకొనును, ఒకవేళ ఒక దినమునకు ఐదు పిసోస్ యుండ వచ్చును. నాకు అది ఏమిటని తెలియదు. మరియు అది పెడ్రో మరి దానిని అతను సంపాదించును… అతను ఒక తాపీ పనివాడు, కావున అతను ఒక దినమునకు ఐదు పిసోస్ సంపాదించును, అయితే ఒక జత బూట్లు కొనుటకు అతను ఐదు దినములు పనిచేయవలసియున్నది, అది వారియొక్క ఆర్థిక పరిస్థితి, మరట్లైనయెడల చిన్న పాన్కో గురించి, చికో గురించి ఏమిటి, వారు ఒక దినమునకు రెండు పిసోస్ మాత్రమే సంపాదించెదరు మరి ఐదు మంది పిల్లలను పోషింపవలయును? అయితే వారు ఆ కొద్ది సంపాదనలో ఒక పది లక్షల డాలర్ల బంగారు అల్టరులో ఒక మైనపు క్రొవ్వు వొత్తిని వెలిగించుటకు పొదుపు చేయవలయును, అది అతని పాపముల కొరకు, మీరు చూశారా. మరి వారు చనిపోయిన స్త్రీలయొద్ద పశ్చాత్తాపపడుటయు, మరియు వారి మోకాళ్ళపై ప్రాకుచూ వెళ్ళుటయు మొదలగు వాటని చూస్తుంటే అది నన్ను దహించి వేయుచున్నది.
103కావున ఒక దినమున ఈ వృద్దుడు కాళ్ళలో పాదరక్షలు లేకుండానే వేదిక పైకి వచ్చెను. అతని తల వెంట్రుకలు నెరసియుండెను. అతను దారములతో చుట్టూ కట్టియున్న ఒక పాత టోపీని ధరించియుండెను. అతను వేదికకు అడ్డముగా వచ్చుచుండెను. నేను ఆ వృద్దుని చూసాను. మరిచ్చట నేనేమో ఒక మంచి పాదరక్షలు (షూస్) మరియు మంచి దుస్తులతో నిలుచుకొని యున్నాను. అతను గ్రుడ్డివాడు. అతను ఈ విధముగా నడచుచుండెను. మరియు అతను దేనినో చెప్పుచుండెను. నేను స్పానిష్ భాషలో కొద్ది మాటలను కూడా పలుకలేను. అతను ఈ ప్రక్కగా వచ్చెను. మరి నేను అతనిని పట్టుకొన్నాను, నేను … ఎవరు నన్ను చూడలేరని నేను అనుకొన్నాను; నేను నా పాదములను ఈ విధముగా పెట్టాను, ఏలయనగా నా బూట్లు అతనికి సరిపోవునేమోయని చూచుటకు. నా పాదరక్షలు గనుక అతనికి సరిపోయినయెడల, నేను వాటిని విప్పి అతనికి వాటిని ఇవ్వాలని ఆశించాను. మరి అతని కాళ్ళు చాలా పెద్దవి. మరి కావున నేను ఒక విధమైన… నేను చెప్పాను, "నిన్ను ఆశీర్వదించును, తండ్రి."
104మరియు నేను నా భుజములను వైకెత్తి చూసాను, ఒకవేళ నా కోటు అతనికి సరిపోవునేమోయని. మరి అది కూడా సరిపోలేదు మరి పెద్దదిగా నుండెను. అతనికి లోపల చొక్కాయి లేదు ఒక పాత కోటు ధరించి యుండెను. మరియు నేను తలంచాను, "బీద వృద్దుడు, బహుశా జీవితములో ఒక్కసారి కూడా మంచి ఆహారము తినియుండడు కాబోలు." అతని ధరించిన ప్యాంటు చాలా పాతది, చినిగిపోయి, మరి అతనిపై ధూళితో యుండెను. వీటన్నిటితో పాటు మరి దయ్యము అతనిని గ్రుడ్డివానిగా చేసెను. మరి అచ్చట అతడు, అక్కడ నడచుచు ఏదో చెప్పుచున్నాడు. మరియు నేను తలంచుచుంటిని, "నా తండ్రి గనుక జీవించుచుండిన యెడల, నా తండ్రి ఆ వృద్దుని యంత వయస్సుగలవాడై యుండి యుండును." "ఓ దేవా!" యని తలంచితిని.
మరియు నేను నా చేతులను అతని చుట్టూ వేసితిని. అయ్యో, వారిట్లున్నారేయని మీరు ప్రజల కొరకు దయకలిగి యుండవలయును, మీరు గనుక ఆ విధముగా వారియెడల దయకలగకుండా నుండినయెడల ప్రార్ధింపనవసరము లేదు, మీకు జాలి లేదు. మరి నేను నా చేతులను అతని చుట్టూ వేశాను.
నేను చెప్పాను, "దీనిని చెప్పవద్దు, సహోదరుడా ఎస్పినోజా" వారు ప్రార్థనను తర్జుమా చేయలేదు.
కావున నేను చెప్పాను, "పరలోకపు తండ్రి , అతనిపై దయ కలిగి యుండుము." మరియు నేను చేతులను ఆ విధముగా అతనిపై వేసి యుంచాను.
అతను కేక లేసెను, "గ్లోరియా ఎ డైయస్!" అట్లనగా అర్ధము, "దేవునికి మహిమ." అతను ఆ విధముగా చుట్టూ చూసెను, మరి ఆ వృద్ధుడు నేను చూచునట్లుగా చక్కగా బాగుగా చూచెను. అక్కడ అతడు వేదికపై నడచుచు వెళ్ళిపోయెను.
105సరి, మరుసటి రాత్రి, వేదిక యొద్దనుండి తలుపుల వరకు జనులతో నిండి, మరి పాత శాలువాలతో, మరియు పాత చినిగిపోయిన గుడ్డలతో జనులు ప్రార్ధించుటకై వాటిని కుప్పలు కుప్పలుగా అచ్చట నుంచిరి. మరియు ఆ దినమున భయంకరముగా వర్షము కురియుట వలన వారు రాలేక … ఆ దినపు ఉదయమున సుమారుగా ఎనిమిది లేక తొమ్మిది గంటలకే వారు వచ్చి కాచుకొని యుండిరి; మరి నేను ఆ దినము రాత్రి ఎనిమిది లేక తొమ్మిది గంటల వరకు అచ్చటికి రాలేకపోతిని. కావున అచ్చట అనేక జనులుండిరి. మీరు ఇచ్చటయున్న విధముగా వారికి కూడా అచ్చట కూర్చొనుటకు సీట్లు లేవు. వారు ఒకరిపై ఒకరు ఆనుకొని యుండిరి. మరియు ఆ వర్షములో నిలబడుకొని యున్నారు, స్త్రీల యొక్క తల వెంట్రుకలు ముద్దగా తడిచిపోయినవి, జీవ వాక్యమును వినుటకై వారు అట్లే వేచియుండిరి.
106మరియు జనరల్ వాల్డియా నన్ను లోనికి తీసికొనిపోయెను. మీరతనిని ఎరిగియుందురని నేను ఊహించుచున్నాను, ఏలయనగా అతను క్రైస్తవ వ్యాపార పురుషుడు. మరియు ప్రభుత్వపు రక్షకదళములో చేర్చుకొనబడిన మొదటి ప్రొటెస్టెంట్. మెక్సీకోలోనున్న జనరల్ వాల్డివియా, మరి అప్పుడు నేను …
ఆ రాత్రి నేను లోనికి వెళ్ళాను, ఆ వేదిక స్థలమునకు వెనుక నుండి వారు నన్ను త్రాడు కట్టి క్రిందికి దించిరి, కారుకు వెనుక నుండి ఈ విధముగా నేను లోనికి వచ్చాను. మరియు నేను ఆ వలయము లోనికి దించబడినప్పుడు, నేను అచ్చటికి నడిచి వెళ్ళాను. మరియు నా కుమారుడైన బిల్లీ నా యొద్దకు వచ్చి చెప్పెను, "అక్కడ ఒకతను ప్రార్ధనా అట్టలను ఇచ్చుచున్నాడు." నేను అతనిని "మనానా" అని పిలిచెదను, అట్లనగా దాని అర్థము "రేపు," అతను చాలా నిదానముగా ఇచ్చును, మరియు అతను నా యొద్దకు రాడు. కావున అతను ప్రార్థనా అట్టలను ఇచ్చుచుండెను.
107మరి బిల్లీ చెప్పెను, "సరి," అతను చెప్పెను, "తండ్రి, ఒక చనిపోయిన శిశువును తన చేతులలో పట్టుకొని అచ్చట ఒక స్త్రీ నిలబడుకొని యున్నది." మరియు ఈ సంఘటనను మీరందరు వ్యాపార పురుషుల యొక్క స్వరమనే పత్రికలో చూచి యుండెదరు. మరియు అతను చెప్పెను, "ఆమె ఒక చనిపోయిన శిశువును కలిగి యుండెను." మరి చెప్పెను, "మనయొద్ద ప్రార్ధనా అట్టలు లేవు." మరియు చెప్పెను, "నా యొద్దనున్న మూడు వందల మంది ద్వారపాలకులు ఆమెను ఆపలేకపోవుచున్నారు."
మరియు ఆమె చిన్న స్త్రీ, యవ్వనస్తురాలు, చాలా చక్కని స్త్రీ మరియు ఆమె ఈ చిన్న చనిపోయిన శిశువును ఒక నీలి రంగు కంబళితో చుట్టి, ఆ మృత దేహము నిటారుగా నుండగా ఆమె దానిని తన చేతులలో నుంచుకొని, ఆ రోజు ఉదయము నుండి నిలుచుకొని యుండెను. ఆ బిడ్డ తొమ్మిది గంటలకు చనిపోయెను, మరి ఇది జరిగినది ఆ రాత్రి సుమారుగా పది గంటలు. కావున ఆమె ఈ చిన్న శిశువును తన చేతులలో పట్టుకొని యుండెను.
108మరియు నేను చెప్పాను - చెప్పాను, "సరి, ఆ ద్వారపాలకులతో చెప్పుడి ఆమెను దూరముగా నుంచమని. మీరు గనుక ఆమెను ప్రార్ధనా అట్టలు గల జనుల మధ్య ఉంచినయెడల, నేను చెప్పాను, ఆ విధముగా ఆమె చేసినయెడల … మరియు "ఆమెను ఆ ప్రక్కనుండి చుట్టుకొని రమ్మని చెప్పకూడదా?" అని నేను చెప్పాను.
చెప్పెను, "ఆమెకు మీరు ఏమీ చెప్పలేరు. ఏమి చెప్పినా కూడా ఆమె వినిపించుకోవటము లేదు."
మరియు నేను చెప్పాను, "సరి, ఆమెను ఆపుటకు తగిన ద్వారపాలకులు నిశ్చయముగా అక్కడ యున్నారు."
"మీరు దానిని చేయలేరు" అని చెప్పిరి.
నేను చెప్పాను, "సహోదరుడు మూర్." సహోదరుడు జాక్ మూర్ను ఎందరికి తెలియును? అతను ఒక … నేను చెప్పాను, "ఆమెకు మన మధ్య గల బేధము తెలియదు, నేనెవరనేది ఆమెకు తెలియదు. నేను చెప్పాను, "సహోదరుడా మూర్, నీవు అచ్చటికి వెళ్ళి ఆమె కొరకు ప్రార్థించుము."
"అలాగే" అని అతను చెప్పెను.
నేను చెప్పాను, "నీవు వెళ్ళి ఆ శిశువు కొరకు ప్రార్థించుము. మరి అది ఆమెను తృప్తిపరచును, మరి ఆమె ఇంటికి వెళ్ళును."
"అలాగే" అని అతను చెప్పెను.
109కావున నేను వెనుకకు తిరిగి యుంటిని. నేను "విశ్వాసమనునది నిరీక్షింపబడు వాటియొక్క నిజ స్వరూపము," మరియు యేసును గురించి మరియు యేసు ఈ భూమిపై నున్నప్పుడు దానిని గురించి వారికి ఏ విధముగా బోధించెనో చెప్పుచుంటిని. మరియు నేను మాటలాడుటకు ప్రారంభించుచుండగా, నాకు ముందుగా ఒక దర్శనము కనబడుటను నేను చూచితిని మరియు ఆ దర్శనములో నల్లని ముఖముతో ఒక శిశువు, మరి అతను నన్ను చూచి నవ్వుచున్నట్లుగా కనిపించెను. నేను మరల దానిని చూచితిని.
సహోదరుడు ఎస్పినోజా చెప్పెను, "సహోదరుడా బ్రెన్హాం, అదేమిటి?"
నేను చెప్పాను, దానిని గురించి పట్టించుకొనవద్దు, సహోదరుడా ఎస్పినోజా, ఒక్క క్షణము జనుల యొక్క ధ్యాస అటు ఇటు పోకుండా చూచుకొనుము."
మరియు నేను బయటికి వెళ్ళాను. నేను చెప్పాను, "సాహోదరుడు మూర్ ఒక్క నిమిషమాగుము." అతను ఆ స్త్రీ ఎచ్చట యున్నదో అచ్చటికి వెళ్ళేను. మరియు "ఆ చనిపోయిన బిడ్డను ఇచ్చటికి తీసకొని రమ్మని ఆమెతో చెప్పుము" అని నేను చెప్పాను.
మరి ఆమె వేదికపైకి వచ్చెను. ఆమె ఒక కాలితో మోకాళ్ళని తన చేతిలో ఒక జపమాలను పట్టుకొని యున్నది. ఆమె చెప్పెను, "పాడ్రే" దాని అర్ధము "తండ్రి," అని మీకు తెలియునా!
నేను చెప్పాను, "ఇప్పుడు లేచి నిలబడు. లేచి నిలువుము." ఆమె లేచి నిలబడినది. నేను అడిగాను, "బిడ్డ చనిపోయినదా?" ఆమె అర్ధము చేసికొనలేక పోయెను. కన్నీరు ఆమె యొక్క చిన్న చెక్కిళ్ళపై నుండి కారుచుండగా మరి ఆమె వెంట్రుకలు దారమువలె వ్రేలాడుచుండెను. ఇప్పుడిది సత్యము; అక్కడ నా యొక్క పరిశుద్ద గ్రంథము యున్నది. మరియు చూడుడి, నేను నా చేతులను ఆ చిన్న శిశువుపై నుంచి, మరి నేను అది ఆమెను తృప్తిపరచునని అనుకొన్నాను. ఆ బిడ్డయే దర్శనములో చూచిన బిడ్డయని నేను అనుకొనలేదు. నేను దానిని చెప్పలేకపోతిని.
110మరియు నేను చెప్పాను, "పరలోకపు తండ్రీ," నేను చెప్పాను, "నాకు ముందు ఒక చిన్న శిశువును గురించిన దర్శనము యున్నది మరి ఒక వేళ ఈ బిడ్డ - ఆ బిడ్డై యుండ వచ్చును. మరి నేను దర్శనములో చూచిన బిడ్డ గనుక ఈ బిడ్డైన యెడల, ఈ చిన్న స్త్రీ యొక్క విశ్వాసమును అంగీకరించి ఆమె శిశువుకు ప్రాణమును మరల ఇవ్వమని నేను ప్రార్థించుచున్నాను.
మరి వెంటనే అప్పుడు కెవ్వుమని ఒక కేక వేసి మరి అరచుటకు ప్రారంభించెను. మరియు ఆ చిన్న స్త్రీకి తాను ఏమి చేయవలయునో తెలియలేదు. కావున ఆమె … నేను సహోదరుడు ఎస్పినోజాతో "ఇప్పుడు దానిని నీవు చెప్పవద్దు. మరియు వేచి యుండుము, నీవు వెళ్ళి ఒక వైద్యుడు ఆ బిడ్డకు ప్రాణము వచ్చినట్టు వ్రాసి ఇవ్వనిమ్ము" అని చెప్పాను.
111మరియు కొంత కాలము క్రితము గత క్రైస్తవ వ్యాపార పురుషుల స్వరముయను పత్రికలో అది ప్రచురింపబడెను. చూడుడి, మీరు దేనినైనను వ్రాయుటకు ముందు, అది సరియను నిర్ధారణను మీరు కలిగియుండవలయును. వైద్యుడు ఆ సంభవమును వ్రాసియుంచెను, "ఆ బిడ్డ ఊపిరితిత్తుల వ్యాధివలన శ్వాస విడుచుట నిలిచిపోయి, ఆ దినపు ఉదయమున చనిపోయినట్టు వైద్యుడు వ్రాసి చేవ్రాలు వేసెను. ఆ కార్యము తన కార్యాలయమున తొమ్మిది గంటలకు సంభవించినట్టు వ్రాసెను. మరిది జరిగినది ఆ రాత్రి సుమారుగా పది గంటలు, అప్పుడు ఆ బిడ్డకు ప్రాణము తిరిగి వచ్చెను, ఏలయనగా ఈ చిన్న స్త్రీ వీడని పట్టుదలతో యుండెను.
దేవుడు ఒక గ్రుడ్డివానికి వాని కండ్లు తెరువగలిగిన యెడల, ఆయన తన బిడ్డకు కూడా ప్రాణము తిరిగి నివ్వగలడు. స్నేహితుడా, ఈ రాత్రి, ఆయన ఇంకా మారని దేవుడుగా యున్నాడు. మీరు దేనినైనను సాధింపవలయుననిన మీరు వీడని పట్టుదలతో యుండవలయును. ఒకవేళ ఆమె బిడ్డ చనిపోయినది గదా, మరి ఏమి చేయగలమని ఇతరులు ఏమి చెప్పినా కూడా దానిని ఏ మాత్రము లెక్కచేయకుండా తన నమ్మకమును ఎటు విడువలేకపోయినది? చూశారా? ఆ షూనేమీయురాలైన స్త్రీలో యున్న విశ్వాసము ఈ దినమున ఇంకా ప్రజలలో యున్నది. ఎప్పుడైనా ఒకసారి, దానిని వారు పొందెదరు. ఏదో ధరించుకొనుట కాదు, ఒకదానిని నమ్మునట్లుగా నటించుట కాదు, అయితే అది నిజమైనది, అది స్వచ్చమైనది. ఈ రాత్రి మనము కూడా దానిని చేయగలమని మీరు తలంచుచున్నారా?
112ఇప్పుడు మనము ప్రభువైన యేసు నామమున వ్యాధిగ్రస్తుల కొరకు ప్రార్ధించి వారిపై చేతులను నుంచబోవుచున్నావు. ఇప్పుడు ఇంకా ఇరువది లేక ముప్పది నిమిషములలో ప్రార్థనా వరుసను ఏర్పాటు చేయబోవుచున్నాము. ఇప్పుడు మనము వివేచనను నిలుపుట లేదు మీరు నిజముగా అర్థము చేసికొనుచున్నారా, ఏలయనగా అది ఎంతో అధికముగా యున్నట్లుండును. అయితే మనము వ్యాధిగ్రస్తుల కొరకు ప్రార్ధించి మరి వారిపైన చేతులును యుంచబోవుచున్నాము. మీరు ఈ రాత్రి సిద్దముగా యున్నారా? ఏదో యొకటి మీ హృదయములో నాటబడినదని మీరు అనుభూతి నొందుచున్నారా, అది ఆయన ప్రసన్నత?
ఈ వారము జరిగిన కూటములన్నిటిలోను మీలో ఎందరు పాల్గొన్నారు, మీ చేతులను మమ్మల్ని చూడనివ్వండి. మీలో అందరూ పాల్గొన్నారని నేను ఊహించుచున్నాను. అది మంచిది. ఇంతకు మునుపు ఏ ఒక్క కూటములోనైనను పాల్గొనని వారు ఇప్పుడిక్కడ యున్నయెడల మీ చేతులను పైకెత్తుడి. మంచిది, ఓ, సగము మంది. సరి, కొందరు లోపలికి ప్రవేశింపకలేకపోయారు. నేను వారికి చెప్పనిమ్ము … వారిలో కొందరు ప్రార్థనా అట్టలను కలిగియుండవచ్చును.
JOHN 5:9•
JOHN 14:12
113దైవిక స్వస్థతయనునది, దేవుడు ఇదివరకే చేసిన క్రియగా యున్నది. చూడుడి, ఏదో కార్యము. మనము నమ్ముచున్నాము, మరియు నా పూర్ణ హృదయముతో నేను నమ్ముచున్నాను, పరిశుద్ద గ్రంథములో హెబ్రియులు 13:8, "యేసుక్రీస్తు నిన్న, నేడు, యుగయుగములకు ఒక్కటే రీతిగా యున్నాడు," ఆయన మారనివాడుగా యున్నాడు. మరియు మనము గనుక క్రైస్తవులమైన యెడల క్రీస్తులోనున్న జీవవు మనలో కూడా యుండవలయును. మరియు ఆయన చెప్పెను, పరి. యోహాను 14:12, "నేను చేయు క్రియలు నాయందు విశ్వాసముంచు వాడును చేయును." పరి. యోహాను 5:19లో చెప్పెను, "తండ్రి యేది చేయుట కుమారుడు చూచునో, అదే కాని తనంతట తాను ఏదియు చేయునేరడు. అది నిజమేనా?
ఇప్పుడిక్కడ ఉదాహరణకు మీలోయున్న ప్రతి యొక్కరును నా మట్టుకు నాకు అన్యులే, నేను మిమ్ములను ఎరుగను. సరి, ఒక్క క్షణము అందరూ వినయ విధేయతలతో యుండవలయునని నేను కోరుచున్నాను. మరియు యేసుక్రీస్తు గనుక మన మధ్య మారని ఆయన శక్తితో ప్రత్యక్షము కానియెడల నేను ఒక అబద్దపు ప్రవక్తను, నేను చెప్పునది ఇక నుండి ఎవరూ వినవద్దు.
మీలో ప్రార్థనా అట్టను లేనివారు, ప్రార్ధనా వరుసలో నిలువనివారు, మీరు ఎక్కడ యున్నను, మీ చేతులను పైకెత్తుడి. మీరు ఈ తట్టుకు చూచి మరి మీ హృదయమంతటితో ప్రార్ధించి మరి నమ్ముడి. ఇది కష్టమే… దీనికి మనము సిద్ధపడి రాలేదు, అయితే మనము ఇచ్ఛట ఎక్కువ సమయము యుండలేము.
ఇప్పుడు, నేను యేసుక్రీస్తు నామమున ఇచ్చటయున్న ప్రతీ ఆత్మను నా ఆధీనమున తీసికొనుచున్నాను. ఇప్పుడు నిశ్శబ్దముగా నుండుడి మరియు మీరు గనుక నమ్మనియెడల, మీ తలలు వంచుకొని యుండుడి.
HEB 4:15•
HEB 13:8
114అయితే మీరు గనుక ఒక విశ్వాసియైన యెడల, పరిశుద్ద గ్రంథము చెప్పుచున్నది, "మన బలహీనతల యందు మన ప్రధాన యాజకుడు సహానుభవము కలవాడు." మరి ఆ స్త్రీ ఆయనను ముట్టినప్పుడు, ఆయన ఏ విధముగా వ్యవహరించెను? మరియు ఆయన అప్పుడు చుట్టూ తిరిగి ఆమె ఎవరని, ఆమెకు ఏమి లోపమని ఎరిగియుండెను. వారి హృదయాలోచనలను ఆయన గ్రహించెను. ఆయన నిన్న మరి ఎన్నటికిని మారనివాడని నీవు నమ్ముచున్నావా? మీకు గనుక అవసరమున్న యెడల, ఇప్పుడు మీరు ప్రార్థించుడి. మరియు ఏమిటి …
"సహోదరుడా బ్రెన్హాం, నీవు చెప్పుచున్నది ఏమిటి?"
నేను గనుక ఆయన సేవకుడనైన యెడల, ఇచ్చట నున్న ఆయన జీవమును నేను హక్కు గోరుచున్నాను, అట్లైనయెడల అదే క్రియలు వాటిని గురించి వ్యక్తపరచును. ఇప్పుడు, ఒక వ్యక్తి అటువంటి క్రియలను చేయలేడని మీరెరుగుదురు. అది అసాధ్యము. అయితే క్రీస్తు మారనివాడుగా యున్నాడు. మరియు మీరు దానిని నమ్మవలయునని నేను మిమ్ములను కోరుచున్నాను.
ఈ భవనములో ఎచ్చట యున్నను, దేవునియందు మీరు విశ్వాసముంచ వలయునని నేను మిమ్ములను కోరుచున్నాను మరియు నమ్ముడి, మీరు చెప్పుడి, "ప్రభువైన యేసు, ఆ మనుష్యునికి నన్ను గురించి తెలియదు. మరియు నేను దీనిని గురించి వినుచున్నావు, అయితే ఒకవేళ అది సత్యమై యుండవచ్చును. నాకు తెలియదు. అయితే అతను నన్ను ఎరుగడని నేనెరుగుదును. మరియు అతను గనుక నాకు చెప్పినయెడల నాకు తెలియును … ఇప్పుడు 'నీ స్వస్థతను నీవు ఇది వరకే పొందుకొని యున్నావు,' అని అతను చెప్పుచున్నాడు.'"
HEB 13:8
115ఇప్పుడు ఆయన నాకిచ్చిన నేను ధరించియున్న ఈ కోటును యేసు గనుక ధరించుకొని ఇచ్చట నిలుచుకొనియున్న యెడల, ఆయన మిమ్ములను స్వస్థపరచ లేడు. మీలోయున్న పరిశుద్ద గ్రంథము విద్యార్ధులారా, ఎందరికది తెలియును? లేదు, ఆయన ఇది వరకే దానిని ముగించివేసెను. చూశారా. చూశారా, ఆయన నిన్న, నేడు, మరియు యుగ యుగములకు మారక ఏకరీతిగా యున్నాడని ఆయన నిరూపించగలడు, మరి మేకుల వలన కలిగిన గాయపు మచ్చల వలన కాదు. ఆయన జీవము ద్వారా! ఎవరైనను, మేకుల గాయపు మచ్చలను మరియు పొడుగైన వెంట్రుకలను, మరియు ఒకవేళ ఒక పొడుగైన గడ్డమును కలిగియుండవచ్చును. ఆయన ఆ విధముగా దుస్తులు ధరించినట్లు కూడా మనకు తెలియదు. అది నిజమని మనము చెప్పలేము, చూశారా. అయితే ఎవరైనను దానిని చేయవచ్చును, అయితే ఆయన జీవమే విశిష్ఠమైనదిగా యున్నది, అదే అది, మీలోనున్న ఆయన జీవము.
ఇప్పుడు మీరు ప్రార్ధించి మరి చెప్పుడి, "ప్రభువైన యేసు, నేను నిన్ను తాకనిమ్ము" మరియు ఆయన నిన్న, నేడు, మరి ఎన్నటికిని మారనివాడని కనుగొననిమ్ము. ఆయన గనుక దానిని చేసినయెడల, నీవు నమ్మెదవా? మీకు తెలియునా, ఆయన దానిని ఆ విధముగానే చేసెను. అదియే ఆయన మెస్సీయాయని నిరూపించుచున్నది.
116ఇక్కడ కూర్చొనియున్న ఈ చిన్న స్త్రీ నావైపు చూచుచున్నది, తన ముఖముపై చేతులుంచుకొని మరియు ఆ విధముగా యున్నది. నీకు … నీకు ప్రార్థనా అట్ట లేదని నేను అనుకొనుచున్నాను. స్త్రీ నీవే, నీకు ప్రార్థనా అట్ట లేదు. లేదు. అది సరి, నేను దేవుని యొక్క సేవకుడని నీవు నమ్ముచున్నావా? అట్లైన ప్రభువైన యేసుక్రీస్తు… మనము ఒకరికొకరు పూర్తిగా అన్యులము, మనము వేరే జాతికి చెందినవారము, ఒకరికొకరికి సంబంధము లేదు. అయితే నేను గనుక నీతో మాటలాడిన యెడల.
నీకు ముందుగా కూర్చొనియున్నది, నా యొక్క మంచి స్నేహితుడు శ్రీ. డౌచ్, అతను ఒహియోకు చెందిన వ్యక్తి, తొంభై-ఒక్క సంవత్సరములో అతనికి గుండెపోటు కలిగినది. వైద్యులు అతనిని చేయి విడిచిరి మరి అతను జీవించుటకు ఏ ఆశ లేకుండెను. నేను అతనిని చూచుటకు వెళ్ళుచుంటిని. అతను ఒక చక్కని ప్రేమగల సహోదరుడు, అతను మరి అతని ప్రేమగల భార్య అక్కడ కూర్చొనియున్నారు. వారు నాకు మంచి స్నేహితులు. మరియు నేను అతని యొద్దకు బయలుదేరి వెళ్ళితిని. నేను ఒక పెట్రోలు బంకు నుండి బయటికి వచ్చుచుంటిని, అతను అచ్చటనీ నుండి ఇంకా రెండు లేక మూడు వందల మైళ్ళ దూరమున యున్నాడు. మరియు అతనిని చూచుటకు నేను వేగముగా వెళ్ళుచుంటిని, ఏలయనగా అతను … ఆమె నన్ను ఫోనులో పిలిచి మరి చెప్పెను, "బిల్ చనిపోవుచున్నాడు." గుండెపోటు తీవ్రముగా వచ్చుట వలన గుండె నిలిచిపోయెను, తొంభై-ఒక్క సంవత్సరము. మరియు పెట్రోలు బంకు నుండి బయటికి వచ్చి పోవుచుంటిని, బిల్ నాకు మందుగా వీధిలో నిలుచుకొని యుండుటను, నేను చూచితిని, "ప్రభువు సెలవిచ్చుచున్నాడుతో నేను వచ్చాను. అతను చనిపోవుట లేదు."
117ఇచ్చట అతనిప్పుడు కూర్చునియున్నాడు. అది జరిగి చాలా నెలలైంది. అతను ఎంతో విశ్వాసను గల వ్యక్తి. ఈ స్త్రీకి సమీపముగా అతను కూర్చొని యున్నాడు. ఆమె అతనికి నెనుకగా కూర్చొని యున్నది. అతను నమ్ముచున్నాడు. ఆమె కూడా నమ్ముచున్నది.
ఇప్పుడు, నాకు నిన్ను గురించి తెలియదు. అయితే యేసుక్రీస్తు… మన ప్రభువు బావియొద్ద ఆ స్త్రీతో మాటలాడినట్లు మనము ఇప్పుడు మాటలాడుకొనుచున్నావు. ఆయన గనుక నా యెుక్క బాధ ఏమిటనియు నీకు ఏమి కావలయుననియు లేక వేరేమైనను, నాకు చెప్పినయెడల అది నిజమో కాదోయని నీవు తెలిసికొనెదవు. నీవు అట్లు చేయుదువా? అది ఒక కుమారుని కొరకు మరి ఆ కుమారుని మతి చలించి అతని స్థితి బాగో లేదు. అది… అది గనుక సరైన యెడల, నీ చేతులను పైకెత్తుము, అది సరి. అది నిజము, నిజము. నీవు గనుక పరిపూర్ణముగా నమ్మి, మరి నీవు నీ ముఖమును తుడుచుకొన్న ఆ పైన కప్పుకొను రుమాలును ఎటువంటి సందేహమును లేకుండా అతనిపై నుంచినయెడల, ఆ అస్వస్థత అతనిని విడిచి పోవును. ఇప్పుడు అదే దేవుడు నీకు చెప్పగలడు… సందేహింప వద్దు. ఏమి సంభవించినదో నీవు చూచుట లేదా?
118చూడుడి; ఈ స్త్రీ వైపు చూడుడి, ఇచ్చట కూర్చొనియున్న ఒక నల్లజాతి స్త్రీ యొద్దకు వెళ్ళుచున్నది. నేను నీకు అన్యుడను. అయితే నీవు ఒక కార్యమును కోరుకొనుచున్నావు. మరి నేను ఇంకొక జాతికి చెందినవాడను, మన ప్రభువు మరియు బావి యొద్దనున్న స్త్రీ వలె, ఒకరు యూదుడు, మరి ఇంకొకరు సమరయురాలు. దేవుడు గనుక… నీవు ప్రార్థనా అట్టను కలిగియున్నావా? నీవు ప్రార్థనా అట్టను కలిగియుండలేదు. ఎర్రని చారలు గల దుస్తులు ధరించుకొని అచ్చటనున్న ఈ చిన్న స్త్రీని గురించి చెప్పుచున్నాను. అవును. అది నిజము. నేను నిన్ను ఎరుగను. మనము పూర్తిగా ఒకరికొకరము అన్యులము. అది నిజమేనా? మరిప్పుడు దేవుడు నీకున్న బాధ ఏమిటనే దానిని నాకు బయలుపరచిన యెడల మరియు అది సరియా కాదా యని నీవు తెలిసికొనినయెడల తెలిసికొనెదనా? నిష్కపటముగా నీకు ఏ లోపము లేదు, నీకు ఆకలితో యున్న హృదయము కలదు. నీవు పరిశుద్దాత్మ యొక్క బాప్తిస్మమును వెదకుచున్నావు. అది గనుక సరైన యెడల నీ చేతులను పైకెత్తుము. పిదప నీవు దానిని పొందెదవు, అది నిజము. నీవు నీ పూర్ణ హృదయముతో దానిని నమ్మినయెడల, నీవు పొందెదను. సందేహింపవద్దు. దేవుని యందు విశ్వాసముంచును. ఆమేన్. అవును. నీ పూర్ణ హృదయునుతో నీవు నమ్ముచున్నావా? నీలోనున్న సమస్తముతో దానిని నీవు నమ్మవలయునని నేను నిన్నుకోరుచున్నాను.
119ఇచ్చట ఒక స్త్రీ కూర్చొని యున్నది, నా వైపు చూచుచున్నది, ఇచ్చట ఆ ప్రక్కగా యున్నది. ఆమె గుండె బాధతో వేదనపడుచున్నది. దానిని ఆమె విడువక పట్టుకొనునని నేను నమ్ముచున్నాను. దేవా, ఎవరని నాకు చెప్పుము. ఆమె శ్రీమతి. ఫైట్స్గెరాల్డ్, నీ పూర్ణ హృదయముతో నీవు నమ్ముచున్నావా? నీవు నీ స్వస్థతను పొందవచ్చును. నీ చేతిని పైకెత్తుము. నేను నీకు అన్యుడను. అది నిజమేనా? నీ గుండె బాధ పోయినది. అది నీ పేరానా? అది వాస్తవము. నాకు నిన్ను గురించి తెలియదు, నా జీవితములో నిన్ను చూచియుండలేదు.
నీకు వెనుకగా యున్న స్త్రీ, ఆమెకిప్పుడు ఎంతో విశ్వాసము కలదు. ఆమె తన చేతిలో ఒక ప్రార్థనా అట్టను కలిగియున్నది, అయితే ఆమె బాధపడుచున్నది. మరియు అది పరిశుద్దాత్మగా యున్నందు వలన ఆ వెలుగు ఆమె పై ఇంకా వ్రేలాడుచున్నది. ఆమె బాధపడుచున్నది… ఆమెకు గొంతులో ఒక గడ్డ యున్నది. మరియు ఆమెకు కడుపులో అస్వస్థత యున్నది. అది నిజమేనా? నీ ప్రార్థనా అట్టను క్రింద యుంచుము, అది నీకు ఇంక అక్కర లేదు. దేవుని యందు విశ్వాసముంచుము. నమ్ముము.
నీ పూర్ణ హృదయముతో నీవు నమ్ముచున్నావా? చూశారా? విశ్వాసము కలిగియుండుము. సందేహింపవద్దు.
ఇచ్చట వెనుక ఒక వ్యక్తి యున్నాడు, అతనికి గడ్డ యున్నది.
120చూడుడి, ఆ దయ్యము, అప్పుడు దానిని అతడు వదిలివేయునని తలంచెను. ఇచ్చట కూర్చొనియున్న ఒక వ్యక్తికి గడ్డ యున్నది. ఆ గడ్డ వెనుక భాగమున యున్నది. నాకు ఆ వ్యక్తిని గురించి తెలియదు. నేను అతనిని చూచి యుండలేదు. అతను నాకు పూర్తిగా అన్యుడు. అయితే ఆ దయ్యము అచ్చటి నుండి బయటికి పోయి, ఆ నల్లటి నీడ మరటు పిదప అది ఈ మార్గము గుండా పరుగెత్తికొని పోయి దీనిలోనికి పోయెను, దయ కొరకు. అచ్చట వారు గుంపుగా కూడుకొని యుండుటకు ప్రయత్నించుచున్నారు. సాతాను తలంచుకొనుచున్నాడు, అతను దానిని వదిలి వేయునని, చూడుడి, నేను దానిని తప్పిపోయెదనని, అయితే ప్రభువు నాకు దానిని చూపించెను.
ఇచ్చట కూర్చొనియున్న ఆ వ్యక్తి అతనికి వెనుక భాగమున గడ్డ యున్నది, మరి అతని పేరు శ్రీ. కార్సన్, అది గనుక సరైన యెడల, నీవు లేచి నిలువబడుము, మరియు యేసుక్రీస్తు నామమున స్వస్థత నొందుము.
మీరు నమ్ముచున్నారా? విశ్వాసము కలిగియుండుము. నీవు గనుక …
HEB 13:8
121ఇచ్చట ఒక స్త్రీ కూర్చొని యున్నది. ఆమెకు మూత్రపిండముల ద్వారా బాధ యున్నది. ఆమెకు ఎన్నో ఇబ్బందులు గలవు. ఆమె పేరు శ్రీమతి. బైర్డ్, అది నిజము. అది నీ పేరేనా స్త్రీ? నేను నీకు అన్యుడను మరియు నీకు గల బాధ అదియే కదూ? అట్లైనయెడల, నీవు లేచి నిలువబడి మరి యేసుక్రీస్తు నామములో నీ స్వస్థతను అంగీకరించుము.
వెళ్ళి ఆ జనులను అడుగుము. యేసుక్రీస్తు నిన్న, నేడు, మరి ఎన్నటికిని మారడు. ఆయన ఇచ్చట యున్నాడని, ఆయన ప్రసన్నతను నీవు స్పర్మించగలుగుచున్నావా?
నా కుమారుడు నాతో చెప్పుచున్నాడు, "వెళ్ళకుండా వుంటే మంచిది." చూశారా, రేపు నాకు మరియు ఆ పిదప నాకు కూటములు కలవు, ఒకదాని వెనుక ఒక కూటము, చూశారా.
ఇచ్చటనున్న ఏ పురుషుడైనను లేక స్త్రీయైనను నమ్మవలయునని నేను సవాలు చేయుచున్నాను. దేవునికి మునుపు మీ జీవితమును మీరు కప్పిపెట్టలేరు. మన ప్రభువు చేసినది ఖచ్చితముగా అదియే. చివరి దినములలో ఆయన వాగ్దానము చేసినది అదియే. సొదొమ కాలిపోవుటకు మునుపు జరిగినది ఖచ్చితముగా అదియే. సంఘమునకు రానైయున్న ఆఖరి సూచన ఖచ్చితముగా అదియే, మరి మనము చివరి కాలములో యున్నాము. దానిని మీరు నవ్ముచున్నారా?
122నీ ప్రార్థనా అట్ట సంఖ్య ఎంత? [ఎవరో సహోదరుడు బ్రెన్హాంతో మాటలాడు చున్నారు.] అది సరియే, ఇప్పుడు చేయవలసిన సరైన కార్యమేమిటని నేను మీకు చెప్పెదను, జనులను విభజించి మరి పిలిచెదము. అనేక ప్రార్థనా అట్టలు కలవని అతను చెప్పుచున్నాడు. ఇప్పుడు దేవుడిక్కడ యున్నాడని మీరు గ్రహించండి.
ఇప్పుడు ఎవరైనా వాక్య సేవకులున్నారా? ఇది సరియేనా సహోదరుడా విక్? ఇచ్చట ఎవరైన వాక్య సేవకులున్నారా, సహోదరులారా? ఇప్పుడు నేను ఈ జనులపై నా చేతులను ఉంచుచున్నాను, జనులు వెళ్ళి మరి "సహోదరుడు బ్రెన్హాం దీనిని చేసెను," అని చెప్పుట నాకిష్టము లేదు. చూశారా. నేను కూడా మీవంటి ఒక సహోదరుడినే. నేను వ్యాధిగ్రస్తులకు ప్రార్ధించు విధముగానే మీ యొక్క సంఘ కాపరికి కూడా అట్టి అధికారము కలదు.
అతనికి ఈ వరము లేకుండా యుండ వచ్చును; కాదు, అతనికి లేదు, చూశారా. ప్రపంచములో ఒకే ఒకనికి వారిలో, ఒకే సమయమున. పరిశుద్ద గ్రంథము మరి ఖచ్చితముగా దానిని చెప్పుచున్నది, చూశారా. అది నిజము. మరి, అది, ఇప్పుడు గమనించుడి.
MARK 16:17
123అయితే మీ సంఘ కాపరి గనుక ఒక విశ్వాసియైనయెడల, వ్యాధిగ్రస్తులకు ప్రార్ధించుటకు అతను దేవుని ద్వారా నిర్ణయింపబడియున్నాడు. మరియు మేము ప్రార్ధించుచుండగా, మీలో వాక్య పరిచారకులైన సహోదరులు ఇచ్చటకి వచ్చి మరి నాతో నిలువబడవలయునని నేను మిమ్ములను కోరుచున్నాను. దేవుని ఆత్మతో నింపబడిన వాక్య సేవకులు, వ్యాధిగ్రస్తుల కొరకు ప్రార్థించుటలో నమ్మకముగలవారు, సహోదరుడు విక్ మరియు సహోదరుడు బోజ్లతో, ఇచ్చటకి రావలసిన డాక్టరు లీ వైల్ మరి వారిలో కొందరు ఎక్కడ యున్నారు, కావున … పరిశుద్ద గ్రంథము చెప్పుచున్నది, "ఈ సూచనలు… "
సహోదరులారా, మనము ఇచ్చట నిలిపి వేసెదము. ఇచ్చట ఎట్లుండును? ఇచ్చటికి రమ్ము. అవును.
''నమ్మినవారివలన ఈ సూచక క్రియలు కనబడును. రోగుల మీద చేతులుంచినప్పుడు వారు స్వస్థత నొందుదురు." దానిని మీరు నమ్ముచున్నారా ? క్రీస్తు యొక్క సన్నిధిలో మనము యున్నామని మీరు నమ్ముతున్నారా? ఆమేన్.
మీరు దీనిని చూడవలయునని నేను ఆశించుచున్నాను. నేను మాటలాడిన విధముగా పలికినది దానికి ఒక ఉద్దేశ్యము కలదు, చూడుడి, లేక ఉద్దేశ్యము సరిగా క్రియ చేయబడినది. మీరు గనుక దానిని నమ్మినయెడల గొప్ప కార్యములు జరుగబోవుచున్నవి.
124ఇప్పుడు సహోదరులారా, మీరేమి చేయవలయునో నేను మీకు చెప్చెదను. మీరు ఇరు ప్రక్కల నిలబడియుండునట్లుగా విభజించుకొనుడి, జనులు వచ్చుటకు వీలుగా దారి నివ్వుడి. నేను మీతో కూడా క్రిందికి వచ్చుచున్నాను.
ఇచ్చటకి వచ్చి పాటలు నడుపుటకై ఎవరైనను రావలయునని నేను కోరుచున్నాను. నేను క్రిందికి వెళ్ళి మరి జనుల కొరకు ప్రార్థించవలెనని ఆశించుచున్నాను. ఎవరైనను వచ్చి ఇచ్చట నిలుచుకొని మరి ప్రార్థించుకొనగోరువారిని నడిపించిన బాగుండును. పాటలు పాడు వారికి మీకు వందనములు. మీ మంచితనమునకు, ఆ విధముగా వచ్చి మాకు గదిని ఇచ్చిన మీకు. అది సరి.
125ఈ విధముగా వాక్య సేవకులు వరుసగా నిలువుడి, మంచిది. ముఖములు చూచలాగున ఎదురెదురుగా, చూశారా, ఈ విధముగా మరి నేను ఆ సహోదరుడు నిలుచుకొని యున్నట్లుగా, బిల్లీ మరియు నేను ఇచ్చట నిలుచుకొనియున్న విధముగా, ఒకరితో ఒకరు.
ఇప్పుడు ఈ ప్రక్క ఎందరు ప్రార్ధనా అట్టలను కలిగియున్నారు? మీ చేతులను మేము చూడనిమ్ము. అక్కడ అనేకులు యున్నారు. వారినందరిని ఈ ప్రక్కకు వచ్చునట్లుగా చేసిన బాగుండును, మరియు ఈ ప్రక్క, ఈ దారిన వచ్చినయెడల బాగుండును. ఇప్పుడు మీరు వచ్చుటకు మునుపు … అట్టలను కలిగియున్న వరుసలోని మొదటి భాగములో నున్నవారు, ఇచ్చట వరుసగా నిలుచుకొనిన, మనము వ్యాధిగ్రస్తుల కొరకు ప్రార్ధించెదము, మరియు వారిపై చేతులనుంచెదము.
MARK 16:17•
JAS 5:15
126మరియు ఇచ్చట ఈ రాత్రి మంచి ఆరోగ్యముతోనున్న ఎందరు ఈ వ్యాయధిగ్రస్తులు స్వస్థతనొంద వలయునని కోరుచున్నారాయని ఆశ్చర్యపడుచున్నాను. మీ చేతులను పైకెత్తుడి. నిశ్చయముగా మీరు. ఇప్పుడు గుర్తుంచుకొనుడి, మీరు నాతో ప్రార్ధించెదరా? మీరు నాతో ప్రార్ధించుడి. ఇప్పుడు మీరు మీ సంఘ కాపరులతో ప్రార్ధించుడి.
ఇప్పుడు ఇచ్చట వరుసలో నిలుచుకొనియున్న వ్యాధిగ్రస్తుల కొరకు. గుర్తుంచుకొనుడి, మీరు ఈ వరుసలో వచ్చునప్పుడు, మరి ఈ వాక్య సేవకులు మరియు నేను మిమ్ములను తాకునప్పుడు, గుర్తుంచుకొనుడి, అది మీరు బాప్తిస్మము పొందునప్పటివలె యుండును. మీరు వచ్చియున్నారు, మరి విశ్వాసము గల వాక్య సేవకులుగా మీపై చేతులుంచినప్పుడు, దేవుడు దానిని వాగ్దానము చేసియున్నాడు, "విశ్వాస సహితమైన ప్రార్ధన రోగిని స్వస్థపరచును. మరియు నమ్మినవారివలన ఈ సూచక క్రియలు కనబడును." ఈ వాక్య సేవను వారు నమ్ముచున్నారని వారు సాక్ష్యమిచ్చులాగున, ఈ వ్యక్తులు ఇచ్చటికి వచ్చిరి. మరియు మనతో నుండునట్లుగా వారు సహచరులుగా వచ్చిరి. మనమందరమును ఏక మనస్సుతో యున్నాము. మనము ఒకే సమయమున ఒకే చోటు యున్నాము. ఇప్పుడు స్వస్థతా సమయముగా యున్నది. అయితే మీరు గనుక దానిని నమ్మనియెడల, రావద్దు, 'ఏలయనగా అది మీకు ఏ మంచియు చేయదు. చూశారా, దానిని మీరు నమ్మవలయును. ఇప్పుడు మీరు నమ్ముచున్నారా?
127ఇప్పుడు కొద్ది క్షణములు మనము మన తలలు వంచెదము. మరియు మనమిప్పుడు మెల్లగా పాడబోవుచున్నాము. ప్రతియొక్కరు మీ తలలు వంచుకొనుడి. "ప్రభువా, నేను నవ్ముచున్నాను," నమ్ముచున్నాను, ఇప్పుడు అందరూ ఏక మనస్సుతో, ఇప్పుడు మనము ప్రార్ధించెదము, చూశారా.
యేసు కొండ మీది నుండి దిగి వచ్చునట్లుగా మనము ఊహించుకొనెదము. ఏ యేసు? పరిశుద్దాత్మ రూపముననున్న అదే యేసు. మీరు నిజముగా నమ్ముచున్నారా లేదా యనియు, మీ హృదయుములోనున్న దానిని ఎరిగియున్న అదే యేసు. మిమ్ములను గురించి సమసమును ఎరిగియున్న అదే యేసు, ప్రతి రాత్రియు మీకు చెప్పుచున్న ఆయన. అది ఆయనే. అది నేను కాదు అని మీకు తెలియును.
మరిప్పుడు ఆయన యొక్క ప్రసన్నతకు పిదప … ఇప్పుడు, చిన్న సురోఫెనికయ స్త్రీ, గురుంచుకొనుడి, ఆమె యేసు యొక్క సన్నిధికి వచ్చిన పిదప కూడా ఇంకా బాధపడుచునే యున్నది. మీకు బాధ యుండును. ఈ వరుస ద్వారా మీరు వచ్చినప్పుడు, మీలో ప్రతి యొక్కరు స్వస్థత నొందెదరని మీరు నమ్మవలయునని నేను మిమ్ములను కోరుచున్నాను. మీరు నమ్మనియెడల లోనికి రావద్దు. ఇంకొకరి స్థానమును మీరు తీసికొనవద్దు. మీరు స్వస్థతనొందెదరను విశ్వాసమును పొందువరకు అచ్చటనే యుండుడి, మరటు పిదప దేవుడు దానిని మీకు అనుగ్రహించును.
128ఇప్పుడు నాకు కుడి ప్రక్కగానున్న వారు ఈ ప్రక్కగా వచ్చి నిలువబడుడి, తక్కినవారు నవ్మిన చాలును అను పాటను పాడెదము. ప్రార్ధనా అట్టను కలిగియున్న మీరు, కుడి ప్రక్కగా ఈ ప్రక్కగా వచ్చు వారియొద్ద నుండి ప్రార్థనా అట్టలను తీసికొనుటకు అచ్చట కొందరు బాలురు నిలుచుకొని యున్నారు. మీరు వెళ్ళగలిగిన యెడల కుడి ప్రక్కగా వెళ్ళుడి, ఏలయనగా అది వారిని తికమకపరచును, ఈ ప్రక్కగా వెళ్ళిన. మీరు వెనుక ప్రక్కగా వెళ్ళలేరు. మీరు ఈ ప్రక్కగా రావలయును, చూచారా; ఒక ప్రక్కగా రావలయును, చుట్టి తిరిగి రావలయును. అచ్చట నున్న సహోదరులు కొద్దిగా వెనుకకు వెళ్ళినయెడల మరి వారు ఈ ప్రక్కగా వచ్చుటకు వీలుగా నుండును. అది కొద్దిగా తడబడులాగున యుండును, ఏలయనగా అటువంటి ఒక గుంపు జనులు యున్నారు. అయితే ఇప్పుడు నా కుమారుడు బిల్లీ పౌలును గమనించుడి, మరియు అచ్చటనున్న ద్వారాపాలకులను గమనించుడి; దానిని ఏ విధముగా చేయవలయునని మీకు చెప్పెదరు, అప్పుడు తడబడరు, గందరగోళముండదు. పిదప మీరు చూడుడి, మీరు ఈ ప్రక్కగా ప్రార్ధనా వరుసలో వచ్చినయెడల, మీరు మీ స్థలము యొద్దకు వెళ్ళగలరు. మరటు పిదప మేము ఈ ప్రక్కనున్న వారిని రమ్మనిన యెడల వారు ఆ మార్గము ద్వారా వచ్చెదరు, చూశారా.
129ఇప్పుడు మనము ఎదురెదురుగా వరుసలో నిలిచెదము, ఈ ప్రక్కనుండి ఆ ప్రక్కగా, మరి వారి కొరకు ప్రార్ధించెదము. అది మంచిది.
ఇప్పుడు అచ్చట నున్న సహోదరులు కొద్దిగా క్రిందికి జరిగినయెడల, ఈ సహోదరులు ఇచ్చటికి వచ్చి మరి మేమందరమును వ్యాధిగ్రస్తులపై చేతులుంచుటకు వీలుగా నుండును. అది చాలా బాగుండును.
ఇప్పుడు మీలోనున్న ప్రతి యొక్క సహోదరులారా వినుడి. మీరేమి చేయుచున్నారని మీలోనున్న సహోదరులకు తెలియునా, చూశారా, దేవుడు మీలో పెట్టిన స్థానమును మీరు ఎరిగియున్నారా? ఇప్పుడు ఇది మీ విశ్వాసమును సవాలు చేయుచున్నది. మీరు గుర్తుంచుకొనుడి, మీరు తాకు ప్రతి వ్యక్తియు స్వస్థత నొందునని మీరు నమ్మవలయును. దానిని వారు చేయవలయును. దేవుడు ఆ విధముగా చెప్పెను. నేను కూడా మీతో కలిసి వారిని ముట్టబోవుచున్నాను మరియు వారు స్వస్థత నొందెదరని నేను నమ్ముచున్నాను. దానిని మీరు నమ్ముచున్నారా? మనలో మనము ప్రార్ధించుకొనెదము, తక్కిన వారు వరుసలోకి వెళ్ళి నిలుచుకొనుడి, మన యొక్క విశ్వాస స్థితి నిమిత్తము మనము ప్రార్థించుకొనబోవుచున్నాము.
MARK 16:17
130పరలోకపు తండ్రీ, ఇచ్చట అనేక వ్యాధిగ్రస్తులు యున్నారు. మరియు వారిలో కొందరు, పెద్దలు వారిపై చేతులుంచవలయునని ఇంకా నమ్ముచున్నారు. అది సరియే, తండ్రి. అది మీరు మాకు బోధించి యున్నారని మేము ఎరిగియున్నాము. మీరు చెప్పియున్నారు, "నమ్మినవారివలన ఈ సూచక క్రియలు కనబడును; రోగుల మీద చేతులుంచినప్పుడు వారు స్వస్థత నొందుదురు." మీరు దానిని వాగ్దానము చేసిరి, మరియు జనులు వారి వాగ్దానమును నమ్ముచున్నారు. మీ యొక్క సన్నిధి ఇచ్చట యున్నది. ప్రభువా, ఎవరూ దానిని సందేహింపలేరు. మరియు ఇచ్చట మీరు నిర్ణయించిన వాక్య సేవకులు నిలుచుకొని యున్నారు, పరిశుద్దాత్మ ద్వారా నిర్ణయింపబడిన వారు, వ్యాధిగ్రస్తులకు ప్రార్థించుటకై నిర్ణయింపబడిన వారు.
ఇప్పుడు, ప్రభువైన దేవా, ఈ రాత్రి మేము తాకే ప్రతియొక్కరు స్వస్థత నొందనిమ్ము, ఇప్పుడు వీరి కొరకు విశ్వాసముతో కూడిన ప్రార్థన మేము ప్రార్ధించుచున్నాము. మేము వారిపై చేతులుంచుచుండగా, వారు స్వస్థత నొందెదరని మేము నమ్ముచున్నాము. ఆమేన్. మా స్థితిని విశ్వాసించులాగున చేయుము ప్రభువా, మా పాపములను మరియు మా అక్రమములను తీసివేయుము. ప్రభువైన యేసుక్రీస్తు రక్తము ద్వారా మమ్ములను కడిగి పరిశుద్దపరచుము, మేము… మా చేతులు పరిశుద్దమైనవి కావు. మీ యొక్క పరిశుద్దత ద్వారానే మేము దీనిని చేయుటకు అనుమతింపబడి యున్నాము. స్వస్థపరచబడుటకుగాను ఇచ్చటయున్న ఈ జనులకు సహాయపడుటకుగాను ఈ సహోదరుల గుంపుతో నన్ను నేను సమర్పించుకొనుచుండగా - దానిని అనుగ్రహించుము, ప్రభువా.
మరిప్పుడు ప్రార్ధనా వరుసలో వచ్చు ప్రతివారికొరకు నేను ప్రార్థించుచున్నాను. ఓ, దేవా, నీటి బాప్తిస్మమునకు వచ్చునట్లుగా వారు వచ్చుచుండగా, వారు ప్రభువు యొక్క బల్ల యొద్దకు వచ్చుచున్నారు, వారు కల్వరి సిలువను దాటి ఆవలి ప్రక్కకు వచ్చుచున్నారు. వారు ఇచ్చట దాటిపోవుచుండగా, ఈ సహోదరుల మధ్య నిలుచుకొనియున్న అదృశ్యమైన క్రీస్తు ఇప్పుడిచ్చట నిలుచుకొని మరి వారి విశ్వాసమునకు తగిన ప్రతిఫలమును ఇచ్చునని వారు గుర్తించెదరు గాక. మరియు వారినందరిని ఇప్పుడు యేసుక్రీస్తు నామమున మీకు అర్పించుచున్నాను, తండ్రి.
131ఇప్పుడు మీలో ప్రతియొక్కరు మీ తలలు వంచుకొనవలయునని నేను కోరుచున్నాను. మీకు ఇవ్వబడిన హెచ్చరికలను మీరు జాగ్రత్తగా ఇప్పుడు వినుడి. మీరు గనుక విననియెడల, మీరు ఊరక వచ్చియున్నారు, చూశారా. ఇప్పుడు గుర్తుంచుకొనుడి, దేవుడు గనుక మీ యొక్క స్థితిని తెలిసికొనుటకు నన్ను అనుమతించినయెడల, మరి మీరు దీనిని నమ్మిన, చూశారా, మీరు ఇప్పుడు నా మాటను గైకొనుడి, మీరు దానిని నమ్మవలయును, ఆ కార్యమంతే. అది గనుక చేయనియెడల, అది మిమ్ములను అధ్వానముగా చేయును. చూడుడి, సమస్తమును చక్కబరచును! మీ జీవితములో పాపమున్నయెడల, వరుస నుండి వచ్చి మరి దానిని ఒప్పుకొనుడి. మరియు మీరు ప్రార్థించు వరకు వరుసలోనికి రావద్దు. మరియు మీ జీవితమును దేవుని మహిమకు తప్పనిచ్చి మరి ఏ ఇతర కార్యమునకై వినియోగించ బోవుచున్నయెడల, వరుసలోనికి రావలదు. చూశారా. మీరు గనుక క్రీస్తుకు అర్పించుకొనిన, పూర్తిగా సమర్పించుకొనినయెడల, ఇది యేసు క్రిస్తని సమ్మతించిన యెడల, ఈ గొప్ప పరిశుద్దాత్మ ఇచ్చట యున్నది; మరియు ఈ వరుస ద్వారా మీరు దాటిపోవునప్పుడు, మీరు మీ స్వస్థతను పొందెదరు, మీరు ఏ విధముగా అనుభూతి చెందినను లేక ఏమైనను పరవాలేదు, జయము కలుగువరకు మీరు దేవుని యొక్క వాగ్దానములను విడువక - పట్టుకొని యుండవలెను, మనము మాటలాడుకొనిన స్త్రీ వలెనే. శ్రోతలారా, మీరు ఆ విధముగా అనుభూతి చెందుచున్నారా? మీరు గనుగ ఆ విధముగా యైన యెడల, మీ చేతిని పైకెత్తుడి, మరియు చెప్పుడి, "నేను దానిని అంగీకరించుచున్నాను." ఈ రాత్రి ఎవరైనను వ్యాధితో బయటికి వెళ్ళుటకు నేను ఎటువంటి కారణమును చూడలేకున్నాను.
132ఇప్పుడు వరుసలో లేనివారు ప్రార్థించవలయునని నేను కోరుచున్నాను. సహోదరుడు యోసేపు ఇచ్చటికి వచ్చి నిలుచుకొని మరి పాటలు పాడి నడిపించునని నేను ఊహించుచున్నాను, మరియు నేను ఇచ్చట క్రిందికి వెళ్ళి మరి ఈ జనులు ఈ ప్రక్క వచ్చుచుండగా మరి వారిపై నా చేతులుంచి నేను కూడా ప్రార్ధించగలను.
ఇప్పుడు గమనించుడి, స్నేహితులారా, రేపు రాత్రికి ఆరాధన కలదు. ఏమి జరుగనైయున్నదో మనము ఎరుగము, ఎవరైనను స్వస్థత నొందెదరు మరియు కేకలేయుదురు మరియు దేవుని స్తుతించెదరు, మరి మొదలగునవి జరుగును. ఇంకొద్ది సేపటికి మనము ఆరాధనను ముగింపబోవుట లేదు, అయితే దయచేసి ఇచ్చటనే యుండి మరి మాతో ప్రార్థించుడి. ఇప్పుడు మాకు మీరు అవసరమై యున్నారు. జనుల యొక్క మనస్సులో ఎటువంటి సందేహమను శత్రువు యుంచకుండా ప్రార్థించుడి. అచ్చట నిలుచుకొని యున్నది మీ తల్లి, మీ సహోదరి, మీ భార్య, మీ భర్త, మీ బిడ్డయైన ఎట్లుండును? మీరు ఎవరైనను భయభక్తులు కలిగి ప్రార్ధింపవలయునని కోరెదను. గుర్తుంచుకొనుడి, అది ఎవరిదో యొకరి తల్లి, ఎవరో సహోదరి, సహోదరుడు, ఎవరిదో ఒక బిడ్డ మరి మనము దీనిని గురించి భయభక్తులతో నమ్మకముతో యుండవలయును.
మరియు మనము ప్రార్థించుచుండగా, ఓ పురుషులారా, నేను మిమ్ములను కోరుచున్నాను, మీరు ఈ వ్యాధిగ్రస్తులులపై చేతులుంచగా - దేవుడు ఆ వ్యక్తిని స్వస్థపరచునని మీ పూర్ణ హృదయములో నమ్ముడి, ఏలయనగా వారు దానిని నమ్ముచున్నారు.
133మరియు ఇప్పుడు, ఇప్పటికిని రేపటి రాత్రికిని, ఏల, రేపు రాత్రి నేను వేదిక యొద్దకు వచ్చు లోపల మూడు లేక నాలుగు వందల సాక్ష్యములు ఇచ్చట యుండబోవుచున్నవి, ఏమిటవి, "నేను చంక కర్రలతో యుంటిని. నేను ఇప్పుడు వాటిని లేకుండా యున్నాను. నా కాళ్ళ బాగైనవి. నేను వ్యాధిగ్రస్తునిగా యున్నాను, నేనిప్పుడు స్వస్థత నొందియున్నాను." రానున్న ఇరువది-నాలుగు గంటలలో దయ్యములు ఈ స్థలమును విడిచి పోబోవుచున్నవి, ఏలయనగా జనులపై ఆశీర్వాదములు పలుకబడియున్నవి.
ఇప్పుడు, వారు వరుసలో దాటిపోవుచుండగా మనలో ప్రతియొక్కరును మన తలలు వంచుకొని ప్రార్థించెదము. సహోదరుడా, వ్యాధిగ్రస్తులపై మీ చేతులను మాత్రము ఉంచిన చాలు. అది మంచిది.
[సహోదరుడు బ్రెన్హాం వాక్య సేవకులుతో క్రిందికి వెళ్ళి మరి వ్యాధిగ్రస్తుల కొరకు ప్రార్థించుచున్నారు. టేపులో ఖాళీ స్థలము కలదు.]
134ఇప్పుడు మీరు చక్కని అనుభూతి చెందుచున్నారా? మీలో ఎందరు స్వస్థత నొందినారని నమ్ముచున్నారు? ఇచ్చట ప్రార్ధనా వరుసలోకి దాటిపోవుచుండగా, ఒక్కొక్క సమయము తదుపరి ఒక్కొక్క సమయము వారు వేదికను విడిచివెళ్ళుటకు మునుపే వారు స్వస్థత నొందెదరని నేను నమ్ముచున్నాను. ఓ, నేను దానిని నమ్ముచున్నాను. దానిని మీ కొరకై నేను అంగీకరించుచున్నాను. మీరు స్వస్థత నొందెదరని నా విశ్వాసముతో మీతో కూడా చేర్చబడియున్నది. సహోదరులారా, దానిని మీరు నమ్ముచున్నారా? ఓ, మై, అది అద్భుతముగా నున్నది కదూ!
మనము ఆరాధనను ముగించుటకు మునుపు ఇప్పుడు ఆయనను స్తుతించి పాడెదము. మరటు పిదప మనము మన చేతులను పైకెత్తి మరి వాటిని అట్లే యుంచెదము. మరియు గుర్తుంచుకొనుడి, మనము సిలువ ద్వారా వెళ్ళుచున్నాము, మరి అచ్చటే మనము వెలుగును పొందితిమి.
సిలువలో… మొదట వెలుగును చూశాను,
మరియు నా హృదయపు భారము దొర్లి పోయినది,
ఓ, అచ్చటనే నా విశ్వాసము ద్వారా నేను నా చూపును పొందితిని,
మరిప్పుడు నేను దినమంతయు ఆనందముగా యున్నాను!
ఏ సిలువలోనైతే, సిలువలో నేను మొదట వెలుగును చూచినప్పుడు,
మరి నా హృదయపు భారము దొర్లి పోయినది,
మరియు అచ్చటనే విశ్వాసము ద్వారా నేను చూపును పొందితిని,
మురియు … . .