పునరుత్థానమును జీవమును నేనే
1I థెస్స 4:13-18: సహోదరులారా, నిరీక్షణలేని యితరులవలె మీరు దుఃఖపడకుండు నిమిత్తము, నిద్రించుచున్న వారిని గూర్చి మీకు తెలియకుండుట మాకిష్టములేదు.
యేసు మృతి పొంది తిరిగి లేచెనని మనము నమ్మినయెడల, అదే ప్రకారము యేసునందు నిద్రించినవారిని దేవుడాయనతో కూడ వెంటబెట్టుకొని వచ్చును.
మేము ప్రభువు మాటను బట్టి మీతో చెప్పునదేమనగా, ప్రభువు రాకడవరకు సజీవులమై నిలిచియుండు మనము నిద్రించినవారికంటే ముందుగా ఆయన సన్నిధి చేరము.
ఆర్బాటముతోను, ప్రధానదూత శబ్దముతోను, దేవుని బూరతోను పరలోకము నుండి ప్రభువు దిగివచ్చును, క్రీస్తునుందుండి మృతులైన వారు మొదట లేతురు.
ఆ మీదట సజీవులమై నిలిచి యుండు మనము వారితో కూడ ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశమండలమునకు మేఘముల మీద కొనిపోబడుదుము. కాగా మనము సదాకాలము ప్రభువుతో కూడా ఉందుము. కాబట్టి మీరు ఈ మాటలచేత ఒకనినొకడు ఆదించుకొనుడి.
JOB 14:1-22
2థెస్సలోనికయలకు వ్రాసిన మొదటి పత్రిక నాలుగవ అధ్యాయము చదివియున్నాను. ఇప్పుడు యోబు గ్రంధమును నుండి 14వ అధ్యాయము చదువుచున్నాను.
స్త్రీ కనిన నరుడు కొద్ది దినములవాడై మిక్కిలి బాధనొందును.
పువ్వు వికసించునట్లు వాడు పెరిగి వాడిపోవును నీడ కనబడకపోవునట్లు వాడు నిలువక పారిపోవును.
అట్టివానిమీద నీవు కనుదృష్టి యుంచియున్నావు తీర్పు నొందుటకై నన్ను నీ యెదుటికి రప్పించియున్నావు.
పాపసహితునిలో నుండి పాపరహితుడు పుట్టగలిగిన ఎంత మేలు? ఆలాగున ఎవడును పుట్టనేరడు.
నరుల ఆయుష్కాలము పరిమితి కలది, వారి నెలల సంఖ్య నీకు తెలిసేయున్నది. మించజాలని వయఃపరిమాణము నీవు వారికి నియమించియున్నావు.
కూలివారివలె తమకు నియమింపబడిన పనిని వారు ముగించువరకు వారు విశ్రమము నొందునట్లు వారివైపు చూడకయుండుము.
వృక్షము నరకబడినయెడల అది తిరిగి చిగుర్చుననియు దానికి లేత కొమ్మలు వేయుననియు నమ్మకము కలదు.
దాని వేరు భూమిలో పాతదై పోయినను దాని అడుగుమొద్దు మంటిలో చీకపోయినను;
వీటి వాసనమాత్రముచేత అది చిగుర్చును లేత మొక్కవలె అది కొమ్మలు వేయును.
అయితే నరులు మరణమై కదలలేక పడియుందురు, నరులు ప్రాణము విడిచి తరువాత వారేమై పోవుదురు?
తటాక జలములు ఎట్లు ఇంకిపోవునో, నది నీరు ఎట్లు ఎండి హరించిపోవునో ఆలాగుననే నరులు పండుకొని తిరిగి లేవరు.
ఆకాశము గతించిపోవువరకు వారు మేలుకొనరు. ఎవరును వారిని నిద్ర లేపజాలరు.
నీవు పాతాళములో నన్ను దాచినయెడల ఎంతో మేలు, నీ కోపము చల్లారువరకు నన్ను చాటున నుంచిన యెడల ఎంతో మేలు, నాకు ఇంతకాలమని నీవు నియమించి తరువాత నన్ను జ్ఞాపకము చేసికొనవలెనని నేనెంతో కోరుచున్నాను.
మరణమైన తరువాత నరులు బ్రతుకుదురా? ఆలాగుండినయెడల నాకు విడుదల కలుగువరకు నా యుద్ద దినములన్నియు నేను కనిపెట్టియుందును.
ఆలాగుండినయెడల నీవు పిలచెదవు నేను నీకు ప్రత్యుత్తరమిచ్చెదను. నీ హస్తకృత్యము ఎడల నీకు ఇష్టము కలుగును.
అయితే ఇప్పుడు నీవు నా అడుగుజాడలను లెక్క పెట్టుచున్నావు, నా పాపము సహింపలేకయున్నావు.
నా అతిక్రమము సంచిలో ముద్రింపబడియున్నది, నేను చేసిన దోషమును భద్రముగా ఉంచియున్నావు.
పర్వతమైనను పడిపోయి నాశనమగును కొండయైనను దాని స్థానము తప్పును.
జలము రాళ్లను అరగదీయును దాని ప్రవాహములు భూమియొక్క ధూళిని కొట్టుకొనిపోవును నీవైతే నరుల ఆశను భంగపరచుచున్నావు.
నీవు వారిని ఎల్లప్పుడు గెలుచుచున్నావు గనుక వారు గతించిపోవుదురు. నీవు వారికి ముఖవికారము కలుగజేసి వారిని వెళ్లగొట్టుచున్నావు.
వారి కుమారులు ఒకవేళ ఘనత వహించినను అది వారికి తెలియకపోవును. వారు ఒకవేళ అణిగిపోయినను అట్టి గతి వారికి పట్టెనని వారు గ్రహింపకయుందురు.
తమ ముట్టుకు తామే శరీరమునందు నొప్పి నొందుదురు తమమట్టుకు తామే ప్రాణమునందు దుఃఖపడుదురు.
3ఈ మధ్యాహ్నమున మనము ఒకదానిని కలిగియున్నాము. అది ఎప్పుడు, ఎక్కడ ఆహ్వానింపబడదు. దానిని ఎదుర్కొనుటకు మనమెంత సిద్ధపడినను, నిశ్చయముగా ప్రతి గృహములోనికి ఆహ్వానింపకపోయినా వచ్చే అతిధిగా అది వున్నది. అది బహుకఠినమైనది (జాలి లేనిది). నేనే ఒక మృత్యువునైనట్లయితే, యవ్వన క్రైస్తవుడును, మనందరికి సుపరిచితుడగు మన సహోదరుడు గార్నెట్ ఇప్పుడు శవమై మనముందు పెట్టబడియున్న ఈ గృహమునకు వచ్చేందుకు ఇష్టపడను.
మరీ నేడు, ధీరత్వం గల క్రైస్తవుడు అగు ఈ యవ్వనస్తుని యొక్క అంత్యక్రియల కొరకు మనము ఇచ్చట కూడివచ్చియున్నాము. మనము చేసేవాటిని అతడు గ్రహించకపోయినను, ఈ భూమి పై అతనికి మనము చేసే చివరి కార్యములివే. అయితే ఇదివరకే దీనిని ఎదుర్కోన్న వారిని గురించి, ఇక ముందు ఎదుర్కొనబోయే వారిని గురించి మనం తలంచుచున్నాము. మనలో ప్రతి ఒక్కరు దీనికి బాధితులమే. ప్రతి ఒక్కరం దీనిని ఎదుర్కొనవలసిందే. చిన్నా, పెద్దా తేడా లేదు, ఇప్పుడైన కావొచ్చు, లేక మరెప్పుడైనా కావొచ్చు, మనలో ప్రతి ఒక్కరు దీనిని ఎదుర్కొనవలసినదే.
4గార్నెట్ గురించి నేను ఎరిగినంతవరకు నేను ఏమి చెప్పినను, అతడు ఎలాంటి వాడిగాయున్నాడో అను అభిప్రాయాన్ని అదెంత మాత్రము మార్చలేదు. అతని గురించి నేను చెప్పుదానికంటే కూడా మీ మధ్య అతడు జీవించిన జీవితము మరియు సాక్ష్యము మరెంతో బిగ్గరగా మాట్లాడగలదు.
నేను.. తన తల్లి ద్వారా వ్యక్తిగతంగా అతడు నాకు పరిచయం. నా సంఘములో జరిగిన ఒక రాత్రీకాల కూటము అనంతరం అతని తల్లి నా యొద్దకు వచ్చి పోలియో వ్యాధి చేత మరణశయ్యపై ఉన్న తన కుమారుని గురించి చెప్పినది. అతడు ఇక బ్రతకడని వారు చెప్పియున్నారని నేను అనుకొన్నాను. అటువంటి పిలుపులును మనము అనేకం కలిగియున్నాము. మనకు అవి వాడుకే. శరీరమందు లోహపు శ్వాసవయవమును అమర్చిన ఈ యవ్వనస్తుని దర్శించుటకు నేను వెళ్ళినప్పుడు, మొదటిసారిగా నేనతన్ని చూచినప్పుడే, తనలో ఏదో ఒక ప్రత్యేకత వున్నట్టుగా నేను గ్రహించాను. నేనతన్ని ప్రేమించితిని. ఇక అప్పటి నుండి ఇదిగో నేనిప్పుడు అతన్ని చూస్తున్న ఈ క్షణం వరకు మరి అలాగే నిత్యము ప్రేమించుచూనేయుందును.
అతడొక ధైర్యశాలియగు కుర్రాడు. సాధారణ బాలుని కంటే, యవ్వన ప్రాయం దాటు ఏ ఒక్క కుర్రవాని కంటే కూడా ఎంతో ఎక్కువ ప్రత్యేకత గలవానిగా కనబడతాడు. సంగతులను ఎంతో తేటగా గ్రహించుగలుగుతాడు.
తాను బ్రతుకుట కొరకు నేను ప్రార్థించాను.
5ఎట్టకేలకు, తనకు అమర్చిన ఆ లోహపు శ్వాసవయమును అతని నుండి తొలగించి ఇంటికి తీసికొని వచ్చి, తగినంత శ్వాస తీసుకొనునట్లుగా అతనిని ఒక కరుకైన పరుపు మీద పరుండజేసారు.
గార్నెట్ ను చూచుటకు వచ్చితిని. అతడొక పరిపక్వము చెందిన అద్భుతమగు చక్కని క్రైస్తవుడును, ఏ తల్లిదండ్రులైనా సరే గర్వించదగిన బాలుడునైయున్నాడు.
అన్నిటికి మించి, ఈ భూమిపై మనయాత్ర. దాని ఉద్దేశ్యము, విడిచి వెళ్ళుటకు సిద్ధపడివుండవలెను. నిస్సందేహముగా గార్నెట్ ఈ సిద్ధపాటును కలిగియున్నాడు, ధీరత్వము గల ఈ యవ్వనస్తుడు క్రీస్తు యొక్క ఆత్మతోను మరియు జీవముతోను నిండినవానిగా వుండెను. అది అతనిలో నుండి ప్రసరించెను.
6ఆరిజోనా రాష్ట్రం, టుసాన్ లో నేను వుంటున్నాను. కొద్దికాలం క్రితం ఒక యవ్వన బాలుడు ఎంతో అనారోగ్యం పాలయ్యాడు. దూరములోనున్న అతడు ఫోన్ చేయుట ద్వారా తన విశ్వాసమును కనబరిచేవాడు. మరి నేను ఇల్లు చేరుకొన్నాక, ఫోన్లో ఆ బాలుని కొరకు ప్రార్ధించాను, తన యొద్దకు దైవ కృప వచ్చియుండగా, స్వస్థత నొందియుండెను. మాటిమాటికి, పొరపాటువున్న ప్రతిసారి ఫోన్ చేస్తూవుండేవాడు. టెలిఫోన్ మాధ్యమం ద్వారా మేమిరువురం కలసి ప్రార్ధించేవారము. మన పరలోకపు తండ్రి అతన్ని విడిచిపెడతాడని నేను అసలు అనుకోవట్లేదు, గాని తాను దేనినైతే కలిగియుండెనో, దానిని అతడు పొందుకొనియున్నాడని నా నమ్మకం.
7క్రితంసారి స్నేహితులను కలుసుకొనుటకు నేనిక్కడికి వచ్చాను. ఒక రోజు గార్నెట్ బ్రతికి వున్నప్పుడు ఒకసారి, మేము అనుకోకుండా ప్రియమైన తన చిన్ని గృహములోనికి వచ్చాము. తన జనులతో అతడు వుంటున్నాడు. మేము అక్కడ ఏదైతే చూచామో, అది ప్రతి క్రైస్తవ సేవకుడు చూడదగిన నిజమైన మాదిరియైయున్నది. కరుకైన ఆ పరుపు మీద, భుజాల క్రింద రెండు చంకల కర్రల ఆధారముతో అతడు కూర్చొన్నాడు. మేము ఇంటిలోనికి వచ్చినప్పుడు, ఎల్లప్పుడు మమ్మును ఆహ్వానించుటకు అక్కడ గార్నెటు వుండెను. తన ముందు బైబిల్ వుండేది. తనకు పరిచారము చేసే ఆ చిన్న బాలిక అతనితో కూడా కలిసి కూర్చొనగా, అక్కడి వారిద్దరు బైబిల్ అధ్యయనం చేసేవారు.
నేనతనిని చూచినప్పుడు, నా హృదయం కరిగిపోయింది.
8నేనతనిని అడిగాను, ఒక ప్రశ్న వేశాను "గార్నెట్, బహుశా ఇలాంటిది ఒకటి నీకు సంభవించకపోయినటైతే నీ పరిస్థితి ఎలావుండేదో?" నేను ఇంకా అన్నాను, "నీవు… ఈ రాత్రికి నన్ను ఇక్కడికి పిలిచి, గార్నెట్ పీయాక్ (Garnett Peake) అనే పేరు గల ఒక యవ్వసస్తుడు ఆ యొక్క రహదారి మీద కారు ప్రమాదంలో మరణించియుండెను. ఆ బాలుడు బాగా తాగి మత్తుడై వుండెను, మరి అతని ఆత్మ దేవున్ని కలుసుకొనుటకు వెళ్ళెను అని చెప్పు దృశ్యం కన్నా, ఇదిగో ఇప్పుడున్న దృశ్యమును అనగా ఈలాగే పడి ఉండుటము నీకు మేలు కాదా? తప్పతాగి చనిపోవుట కంటే, రోగియై సజీవముగా, అనగా వ్యాధిశయ్యిపై వుండి దేవుని కలిగియుండుటను నీవు కోరుకోవా?"
అతడు చెప్పాడు, "అవును, ఇప్పుడు ఎలాగైతే ఇది వుందో దానిని అలాగే వుండనిమ్ము. యేసు మార్గమైయున్నడని నేనిప్పుడు ఆయనను తేటగా ఎరిగియున్నాను, అది జీవితము కంటే మిన్నయైనది, నా జీవితకాలమంతయు నేను ఈ స్థితిలో వుండటమే నాకు మేలు." అతడన్నాడు "బ్రదర్ బ్రెన్హాం, నేను చాలా మెరుగయ్యాను అని నీకు చూపగోరుచున్నాను."
అంటూ తన చేతులను ఆడించుటను, మరింకా అది ఇది చేయగలిగెను. తాను పూర్తిగా బాగుపడి నడవగలిగే సమయం కొరకు అతడెంతో ఆశతో ఎదురుచూచెను.
నేను వయస్సు పైబడినవాడిని. జీవితంలో ఎన్నో చూచాను. గార్నెట్ అంతటి ధీరత్వం గల ఆత్మ కలిగిన బాలున్ని నేనింతవరకు చూడలేదని నేననుకొంటున్నాను. గొప్ప నిరీక్షణ గలవాడు.
9కొద్ది రాత్రుల క్రితం అతని గురించి నాకు చెప్పారు… అతనికి ప్రేగులకు సంబంధించిన వ్యాధి సోకినదని తెలియజేసారు. తాను తనువు చాలించబోవుచున్నానని తాను గ్రహించి, నాకు ఫోన్ చేసాడు. అయితే ఆ సమయమందు నేను న్యూయార్క్ నందు బహిరంగ కూటములలో వున్నానని అతనికి తెలియదు. కూటము అనంతరం టెలిగ్రాంను లేక ఒక సమాచారమును నాకు అందజేస్తారు. దానిని తీసికొన్న వెంటనే ఫోన్ దగ్గరకు పరుగెత్తుకొనిపోయి ఫోన్ చేసాను. అతనికి అతనికి పరిచర్య చేసే ప్రియ సహోదరుడు "బ్రదర్ బ్రెన్హాం, ఆరు గంటలకే యేసుని కలుసుకొనుటకు గార్నెట్ వెళ్ళిపోయెను," అని చెప్పాడు.
JOB 14:14
10మన నుండి అతడు వెళ్ళిపోయాడు. అది మనందరికి తెలుసు. నిజానికి జీవితమనే దానికి ముగింపు ఇదేనా? అనే సంగతి నాకెంతో ఆశ్చర్యం కలిగించుచున్నది. ఈ బాలుడు మన నుండి నిష్క్రమించియున్నాడిని మనందరికి తెలుసు, అతని ప్రాణం పోయినది. కానీ తరువాత ఏమిటి అనే దాన్ని గూర్చి అలోచిద్దాం. తిరిగి మనము మరలా అతనిని చూడగలమా అని చెప్పేది ఏదైనా వుందా? గార్నెట్ ను చూడటము మరిదే కడసారా?
రాబోయే కొద్ది నిముషాలలో దీని గురించే నేను మాట్లాడగోరుచున్నాను. మరలా మనమతనిని చూడగలము అనే నిశ్చయత మీకు వున్నదా? బైబిల్ నందు అతిపురాతన పుస్తకమైన యోబు గ్రంధములో యోబు దీనినే ప్రశ్నించియున్నాడు. అతడు అడిగాడు, "నరులు ప్రాణము విడిచిన తరువాత వారేమైపోవుదురు." (ఇంగ్లీషు బైబిల్ నందు ఇలా వుంది. "ఒకడు చనిపోతే తిరిగి బ్రతుకగలడా?" - అనువాదకుడు). అది వాస్తవమైనదని చెప్పుటకు ఏదైనా ఆధారం వున్నదా? పునరుత్థానము వున్నదని చెప్పుటకు భౌతికమైన రుజువులేమైన వున్నాయా? అవును, ఉన్నాయనే నేననుకొంటున్నాను.
మనము గమనించినట్లైతే సృష్టికర్తను మనం స్మరించుచున్నాము. మనలను చేసినవాడు లేకుండా మనమిక్కడ వుండలేమని మనం గుర్తించాం. మనంతట మనము ఇక్కడ ఉండలేదు, అలాగే నా చేతి గడియారమనేది ఇంత అందముగా అలంకరింపబడి చక్కగా సమయం పెట్టబడివున్నదంటే, దానిని తయారు చేయుటకు అవసరమైన అద్భుతమైన మేధస్సు దాని వెనుక వున్నది. గడియారమును తయారు చేసిన మానవుని గొప్పతనాన్ని కొద్దిగ ఆలోచించుము. తయారు చేసినవాడు లేకుండా అడక్కడ వుండుట ఎంత అసాధ్యమో, సృష్టించినవాడు లేకుండా మనమిక్కడ వుండటము అనేది కూడా అంతే అసాధ్యము.
JOB 14:7,10,12•
1COR 11:32
11నేనొక మిషనరీని గనుక ప్రపంచమంతా ప్రయానించాను, ఏడు పర్యాయములు ప్రపంచమంతటిని చుట్టివచ్చాను, ప్రపంచమందున్న వివిధ మతములను, వారిలో ప్రతి ఒక్కరి తత్వజ్ఞానాన్ని లేక పాండిత్యమును, మరియు వారి ఆలోచన ధోరణిని చూసాను, (వారిలో అనేకులు అవతరించుటను (Reincarnation) నమ్ముదురు, మరింకా ఏదేదో). కాని క్రైస్తవ్యము మాత్రమే సత్యమును కలిగియున్న మతము, ఎందుకనగా ఈ సర్వసృష్టియు క్రైస్తవ్యమును గూర్చే మాట్లాడుచున్నది.
యోబు అన్నాడు, "ఒక చెట్టు చనిపోతే, తిరిగి అది బ్రతుకును అనే నమ్మకం కలదు. అలాగే ఒక పుష్పము వాడిపోయి రాలిపోతే, అది మరలా తిరిగి వచ్చును అనే నమ్మకం కలదు. నరులు ప్రాణము విడిచిన తరువాత వారేమైపోవుదురు?" అని యోబు అడుగుచుండెను. యోబు ఒక మనిషి, ప్రఖ్యాతిగల వ్యక్తి, తన యొక్క దినానికి తానొక తత్వవేత్త మరియు ఒక విశ్వాసి, ఎంతో జ్ఞానము గలవాడు. సాతాను అతన్ని పరీక్షించి మరియు శోధించగోరెను. మరి అటువలె క్రైస్తవులందరు మరియు విశ్వాసులు పరీక్షింపబడుదురు. "దేవుని యొద్దకు వచ్చే ప్రతి దేవుని కుమారుడు పరీక్షింపబడాలి మరియు శిక్షించబడాలి."
JOB 14:10-12
12ఈ సృష్టి యావత్తు సృష్టికర్త ద్వారానే ఉనికిలోకి వచ్చియున్నదని యోబు ఎరిగియుండెను, అంతే కాదు ఈ సృష్టిలోని ప్రతి వృక్షమునకు మరియు ప్రతి ఒక్క దానికిని పునురుత్థానము అనేది వున్నదని గమనించియుండెను. అందుకే అతడు ఇలా అన్నాడు, "నరులు మరణించి కదలలేక పడియున్నారు, నరులు ప్రాణము విడిచిన తరువాత వారెక్కడ? వారికి ఏమి జరుగును?"
అప్పుడు అతడు దర్శనమందు నీతిమంతుని రాకను చూసియుండెను, తానొక పాపియని అతడు గ్రహించెను. ఆ కారణము చేతనే మరణించిన పిదప మనిషి తిరిగి లేవలేకపోవుచున్నాడని గ్రహించెను, అందువలన తన కోసం మాట్లాడుటకు ఏమీ లేకపోయెను. పుష్పములలో ఏమియు లేదని అతడు ఎరిగియుండెను. అవి ఒక ఉద్దేశ్వము కొరకే ఇక్కడికి వచ్చియున్నవి, అవి దేవుని ఉద్దేశ్యమును నెరవేర్చుచుండెను గనుకనే అవి మరణించి (రాలిపోయి)నను మరలా తిరిగి అవి వచ్చుచున్నవి.
JOB 19:25-27
13కాని మానవుడు పాపము చేసినందున, అతడు తన సృష్టికర్త సముఖమునందు నిలుచుటకు అవకాశమే లేకపోయెను. ఆ కారణము చేతనే తన కోసం నీతిమంతుని రాకను చూచుటకు అతడు దేవుని చేత అనుమతించబడెను. ఆ నీతిమంతుడు ఒకేసారి (ఏక కాలములో) తన చేతులను పాపియైన మానవుని మీదను, పరిశుద్దుడగు దేవుని మీదను ఉంచగలిగెను, వారధిగా మార్గమేర్పరచెను. ఆ నీతిమంతుడు ఎవరో కాదు గాని దేవుని కుమారుడే.
ఆత్మ ప్రవక్త మీద వున్నప్పుడు అతడు ఈలాగున కేక వేసెను, "నా విమోచకుడు సజీవుడనియు, తరువాత ఆయన భూమి మీద నిలుచుననియు నేనరుగుదును, ఈలాగు నా చర్మము చీకిపోయినను తరువాత శరీరముతో నేను దేవుని చూచెదను: … నా మట్టుకు నేనే చూచెదను. మరి ఎవరును కాదు, నేనే కన్నులారా ఆయనను చూచెదను."
14క్రైస్తవ్యమంతయు పునరుత్థానము మీదనే ఆధారపడివున్నది. అదే మనకున్న నిరీక్షణ. సరే, అది ఎందుకో దానిని మనము చూద్దాం. సృష్టికర్త దానిని అట్టి విధమగు క్రమములో వుంచెను, బైబిల్ అనేది లేకున్నను, అయినను క్రైస్తవ్యము అనేది వాస్తవమైనది అని మనము ఎరిగియుండేవారము.
మరిప్పుడు, పునరుత్థానము అనగా వేరొక దానితో భర్తీ చేయడం కాదు. క్రిందికి దిగిపోయిన దానిని (పడిపోయిన దానిని), పైకి అనగా మరలా దానియొక్క స్థానములోనికి దానిని తిరిగి తీసికొని రావటాన్నే పునరుత్థానము అందురు. ఎత్తున (టేబుల్ మీద) వున్న బైబిల్ ని క్రిందకు పడవేసి, తర్వాత వేరొక బైబిల్ ని దాని స్థానములో ఉంచినట్లయితే, దానిని వేరొక దానితో భర్తీ చేయడం అంటారు. అయితే పునరుత్థానమనగా ఏ బైబిల్ అయితే మనం క్రిందికి పడివేశామో, మరి దానినే తిరిగి దాని స్థానములోకి తెచ్చి పెట్టడం. పునరుత్థానము అనగా, తిరిగి దాని స్థానములోకి చేర్చుట లేక పెట్టుట. (యధా స్థితిలోనికి తెచ్చుట).
15గొప్ప సృష్టికర్తయగు దేవుడు తాను సృజించిన ఈ సృష్టి అంతటిలో తన్నుతాను కనబరచుకొన్నాడు. పుష్పములు, వృక్షములు, మిగతా సృష్టి అంతా ఏలాగున అయనలో భాగమైవుండెనో, అలాగునే మనము కూడా ఆయనలో భాగమైయున్నాము. అవును, ఆయన సృష్టిలో మనం కూడా భాగమైయున్నాము.
ఇప్పుడు, దేవుడు విభిన్నమైన దేవుడు (God is God of Variety) సృష్టి అంతటిని ఒకే విధముగా ఉండునట్లు ఆయన చేయలేదు. ఆయన అన్నింటిని పర్వతములుగా వుండునట్లు సృజించలేదు. కొన్నిటిని ఎడారులుగాను, కొన్నిటిని పచ్చికలు గాను, మరికొన్నిటిని పచ్చని పొలాలుగాను ఆయన సృజించియుండెను. మరియు అలాగే ఆయన కొన్నిటిని పచ్చని పుష్పములుగాను, తెల్లవిగాను, నీలిరంగుగాను, గులాబి రంగు మరియు వివిధ రంగుల పుష్పములుగాను చేసెను. కొందరిని పొడవరి మనుష్యులుగాను, మరికొందరిని పొట్టివారిగాను, నల్లజుట్టు, గోధమరంగు జుట్టు, ఎర్ర జుట్టు గల మనుష్యులుగా వుండునట్లు ఆయన మనందరిని సృజించియున్నాడు. ఆయన విభిన్న దేవుడు. అయితే ఆయన సృజించిన ప్రతిదానికి ఒక ఉద్దేశ్యముంది. ప్రతిదానిని ఆయన తన ఉద్దేశ్యమును జరిగించుటకే సృజించియున్నాడు. ఆయన ఉద్దేశ్యమును జరిగించే ప్రతిదానికి పునరుత్థానము ఉన్నది.
COL 3:24,25
16ఇప్పుడు, అది ఆలోచించుటకు లేక ఒక్కసారిగా దానిని గ్రహించడానికి కఠినముగా ఉండవచ్చు. కాని దాని గురించి ఆలోచించుదాము, అందుకొరకే ఈ మధ్యానము దానిని మన ముందుకు తీసుకొని వచ్చాము.
ఇప్పుడు, ఇక్కడ కొన్ని పుష్పములున్నవి. వాటిని ఇక్కడ ఏ ఉద్దేశ్యము కొరకు పెట్టారో సరిగ్గా దానినే అవి వ్యక్తపరుచున్నవి, ఈ మధ్యాహ్నపు వేళ నిద్రించిన మన యవ్వన సహోదరుడు పెట్టబడియున్న ఈ గదిలో విచార వదనంలో వున్న మనలను ఉల్లాసపర్చుటకే ఈ పుష్పములను ఇక్కడ వుంచెను.
కెంటకీ స్త్రీలగు మీరు… నా మట్టుకు నేను కూడా ఒక కెంటకీ వాడినే. మీ గృహముల చుట్టు పుష్పముల కోసం మొక్కలను నాటుట నేను గమనించాను. వేసవికాలములో అవి చక్కగా పరిమళించి మీ ఇంటికి ఎంతో చక్కని శోభను తెచ్చును. తరువాత సంవత్సరము యొక్క అంతమునందు, ఒక్కసారిగా అతిశీతలము (భయకరంగా కురిచే మంచు) వచ్చినప్పుడు, అవి వడబడిపోతాయి. అప్పుడవి బహుశా పుష్పదళం వేసే దశలో వుండవచ్చు, లేక అప్పుడే లేత పుష్పములగా పైకి వచ్చే దశలోనైన ఉండవచ్చు, లేక మరే దశలోనైనా అవి ఉండవచ్చును, అతిశీతలం వాటిని తాకిన వెంటనే వాటి సొగసు, జీవము అంతరించిపోవును. అదియే మరణము. మరణమునకు వ్యక్తి, సామర్థ్యము, వయస్సు అను వాటితో పనిలేదు. అది కేవలం కబలించివేస్తుంది. అది తాకిన చోట అంతా ఎండి పోవుటమే, అంతరించిపోవటమే. లేత వయస్సులో వున్న పుష్పము నుండి రేకులు రాలిపోవటమును, ఆ తదుపరి ఆ పుష్పము నుండి నల్లని విత్తనములు రాలిపోవుటమును మనము గమనించవచ్చును.
చూడడానికి అది ఒక పరిపక్వతలేనిదిగా కనబడవచ్చును, కాని దేవున్ని కనుగొనుటకు అదొక్కటే మార్గము. సామాన్యమైన వాటిలో ఆయనను కనుగొనుట, కలగూర గంపకాదు. మనము చూడగలిగితే, దేవుడు చాలా సామాన్యతలో దానిని వుంచును.
17ఇప్పుడు, దేవుడు పుష్పముల విషయంలో ఒక అంత్యక్రియ క్రమమును కలిగియుండెను. చూడడానికి ఇదొక వింతగా ఉండొచ్చు. చిన్న విత్తనము భూమిలో పడును. మరప్పుడు ఆకాశము నుండి కన్నీటి చుక్కల వలె వర్షం రాలును, అది భూమిలో పూడుకుపోయే వరకు ఆ వర్షం పడును. చలికాలం వచ్చినప్పుడు రేకులు రాలిపోవును. కాడ తొలగిపోవును. భూమిలో కుదురు (దుంప), అలాగే వేర్లు ఎండిపోవును, అది పాతది. విత్తనము, అతిశీతలము (భయంకరమైన మంచు) పెరిగినప్పుడు, అది విత్తనమును కూడా గడ్డకట్టునటుగ్గా చేయును. విత్తనము పగలగొట్టబడి, గుజ్జు బయటకు వచ్చును. మనమిప్పుడు ఫిబ్రవరి, మార్చికి దగ్గర్లో వున్నాం. అప్పుడు ఏ విధమైన రేకులు గాని, కాడగాని, విత్తనం కాని, గుజ్జు (పిప్పి) గాని మరి ఏదియు అక్కడ వుండదు.
18ఇంత జరిగినప్పటికి పుష్పము అనేదానికి అది అంతము అని అందుమా? ఎంత మాత్రము కాదు. ఆ విత్తనములో ఏదో ఒక మూలన ఒక చిన్న జీవకణము వుంటుంది. మట్టిగొట్టుకున్న ఆ విత్తనమును నీ చేతిలోనికి తీసికొని, పరిశోధనాశాలకు పంపి, క్రిందా - మీద పడి శాస్త్రజ్ఞులు దానిని పరిశోధించినప్పటికి, ఆ విత్తనములో జీవము అనేది ఏ మూలన వుందో అనే సంగతి వారు ఎంత మాత్రము చెప్పలేరు. దేవుడే దానిని దాచియుంచాడు.
అయితే సౌరశక్తి భూమి పై పడినప్పుడు, భూమిని సూర్యుడు తాకినప్పుడు, దానిలో వున్న జీవమును నీవెంత మాత్రం దాచివుంచలేవు. అది బయటకు తన్నుకొని పైకి వచ్చును. నీ పెరటి మధ్యలో పచ్చని గడ్డి మీద కాంక్రీటు బాటను నీవు వేసినట్లయితే, తరువాత వేసవికాలం వచ్చేసరికి ఆ కాంక్రీటు దారికి ఇరుప్రక్కల పచ్చని గడ్డి మొలిచియుండటాన్ని నీవు గమనించగలవు. ఎందుకని? ఆ కాంక్రీటు క్రింద జీవము (విత్తనము) పడియున్నది. వసంతకాలము వచ్చినప్పుడు, దాని మీద రాతి కాంక్రీటు వున్నా సరే, అది ఎంత మాత్రము అక్కడ దాగి యుండలేదు. ఆ జీవము మొక్కగా బయటపడుతుంది. మరప్పుడు ఆ కాంక్రీటుకి ఇరుప్రక్కల చక్కని పచ్చదనం ఏపుగా పెరుగుటను చూడగలవు.
జీవమును ఏ మాత్రం నీవు దాచి వుంచలేవు. అది తప్పక పైకి రావలసివుంది, ఎందుకనగా దానికి పైగా ఉండుటకు దేవుడు సూర్యున్ని పెట్టియున్నాడు. వృక్ష శాస్త్రము యొక్క జీవమును సూర్యుడు తన ఆధీనములో వుంచుకొనెను.
2COR 6:18
19మంచిది, వృక్షశాస్త్ర జీవము అంతటి మీద ఆయన సూర్యున్ని ఎలాగైతే పెట్టియున్నాడో, అలాగే నిత్యజీవము నొందుటకు ఆయన తన కుమారున్ని (Son) నియమించియుండెను. కాబట్టి దేవుని ఉద్దేశ్యమును జరిగించిన పుష్పములకే పునరుత్థానము ఉన్నట్లైతే, ఇక మానవుని విషయములో ఆయన మరెంతో ఎక్కువగా మార్గమును కలిగియుండెను.
మానవునికి మార్గమున్నదని మీరెరుగుదురా! పుష్పములు తిరిగి వచ్చునట్టుగానే మానవుడు కూడా దేవుని కుమారుని రాకడయందు నిశ్చయముగా తిరిగి లేచును. సూర్యుడు వృక్షములకు జీవమును ఇచ్చును, ఎందుకనగా అవి సూర్యుని యొక్క ఆధీనములో వున్నవి. వాటి యందున్న జీవమును నీవు దాచియుంచలేవు. అది తప్పక పైకి రావలసివుంది. మరి అలాగే మానవుని యొక్క జీవమును తన ఆధీనములో వుంచుకొనిన దేవుని కుమారుడు (Son of God) వున్నాడు. ఆయన యొక్క ఆధీనములో మాత్రమే నిత్యజీవము అనేది వున్నది. దేవుని కుమారులుగా, కుమార్తెలుగా మనము దేవుని ఉద్దేశ్యమును జరిగించినట్లయితే, దేవుని కుమారుడు వచ్చు సమయాన ఇక ఎంత మాత్రం దాగి యుండలేము. సృష్టి అంతయు దానినే బోధించుచున్నది.
20ఇక్కడ కెంటకీలో వున్న మనము సంవత్సరమునకు అంతములో వున్నాము, ఇక్కడ అందమైన చెట్లు చిగురించి పచ్చగా వున్నాయి. అయితే అతిశీతలము వచ్చుటకు ముందే అనగా అగష్టు మొదటి వారంలోనే ఆకులు రాలిపోవటాన్ని నీవు గమనించితివా? ఎందుచేత అది అలా జరుగుతుంది? ఆకులు ఎందుకు రాలిపోతాయి? ఎందుకనగా ఆకులోవున్న జీవము దానిని విడిచి వెళ్ళిపోవును. ఆకులో వున్న జీవము ఎక్కడికి వెళ్తుంది? సరాసరి చెట్టు యొక్క వేరులోనికి. ఆకును విడిచి, భూమిలోకి అది వెళ్ళునట్లు ఏదో ఒక జ్ఞానము దానికి నేర్పినది. ఒకవేళ అది అలా వెళ్ళకపోతే అతిశీతలం (Frost) దానిని చంపివేస్తుంది. అతిశీతలం తగ్గేవరకు అది భూమిలోకి వెళ్ళి, మరి అక్కడే, అది దాగివుండును. తరువాత వసంత కాలమునకు అది తిరిగి పైకి వచ్చి మరొక క్రొత్త ఆకును ఉత్పత్తి చేయును.
ఇప్పుడు, దీనంతటిని జరిగించుటకు కొంత జ్ఞానము అక్కడ అవసరం. చెట్టుకైతే మరి అటువంటి జ్ఞానం లేదు. ఇది కేవలం వృక్షశాస్త్ర జీవము యొక్క వరుస విధానము మాత్రమే. అక్కడ ఒక గొప్ప జ్ఞానము, మంచు తీవ్రత దానిని తాకుటకు ముందే, చెట్టులో వున్న జీవముతో చెప్పును, "వేరులోనికి వెళ్ళి, అక్కడే దాగియుండుము!" సూర్యుడు, కనబడకుండా పోయినప్పుడు, సూర్యుడు అగుపించడని, శీతాకాలం వచ్చుచున్నదని ఆ ఆకునకు ఎలా తెలియును? దానిని చెప్పుటకు అక్కడ ఒక జ్ఞానమున్నది. అది దేవుడే.
21ఎంత చక్కని మాదిరిగా అది వున్నది. మనమిక్కడ ఏం చూడగలం? పుష్పములలో దేనినైతే చూడవచ్చునో, సరిగా దానినే మనం అందు చూడగలం: జీవించుట, మరణించుట, సమాధి చేయబడుట, పునరుత్థానము. సరిగ్గా ఈ మధ్యాహ్నపు వేళ ఎలాగైతే ఎరుపు, పచ్చ మరియు రకరకాల పువ్వులును అందంగా ఇక్కడ పరిచియుంచారో, మరి అలాగే దేవుడు కూడా భూమి యొక్క ఉపరితలము మీద ఆకులను గోదుమవన్నెలోకి తెచ్చి, పువ్వులను తెంచి అందముగా పూలగుత్తిలా పరుచును.
దేవుడు గ్రహింపునకు అందనివాడు కాదు. కొన్నిసార్లు జనులు ఆయనను క్లిష్టమైనవానిగా చూపుటకు ప్రయత్నము చేయుదురు. కాని దేవుడు సామాన్యతలో కనబరచుకొంటాడు. ఆయనను మనం గొప్పవాటిలో చూడాలనుకొంటాం, కనుగొనాలనుకొంటాం. కాని ఆయన సామాన్యతలో, ఆ విధానంలోనే తన్ను తాను వ్యక్తపరచుకొంటాడు. సామాన్యతే అయనను గొప్పగా చూపును.
JOB 14:13•
JOB 19:25,26
22ఇప్పుడు గమనించండి, ఇందులో, ఈ చెట్టులో వున్న జీవము తన యొక్క ఉద్దేశ్యమును జరిగించును, సమాధిలోకి వెళ్ళెను, వసంతకాలం వచ్చేటంత వరకు అక్కడే వుండును. ఇప్పుడు ఒక జ్ఞానము దానిని తిరిగి పైకి తీసికొని రావలసివుంది, ఆపిల్ ఫలములతో అది తిరిగి పైకి రావలసివుంది, ప్రతి చెట్టు తన తన ఫలమును, ఆకులను, మరింకా మిగతా వాటిని పైకి తీసికొని వచ్చును.
ఇప్పుడు యోబు ఇక్కడ అంటున్నాడు, "ఓ, నీవు నాకొక కాలమును నియమించియున్నావు. నీ కోపము చల్లారు వరకు సమాధిలో నన్ను దాచివుంచావు." చూశారా లేఖనము ఏమి చెప్పుచున్నది? కోపము చల్లారు వరకు మనము దాచబడియున్నాము, తరువాత పైకి తిరిగి లేపబడెదము.
23"నా విమోచకుడు సజీవుడనియు, అంత్యదినమందు ఆయన భూమి మీద నిలుచుననియు నేనెరుగుదును. పురుగులు నా దేహమును తినివేసినను, నేనింకా నా దేహముతోనే దేవుని చూచెదను."
ఒక దినాన మానవునికి పునరుత్థానము కలుగుటను అతడు చూచియున్నాడు. నీతిమంతుడును మరియు దేవుని కుమారుడునగువాడు వచ్చి పాపుల కొరకు మరణించినప్పుడు, ఇక పాపము అనేది అంతమవుతుంది. పరిశుద్దమగు దేవునికి, పాపియగు మానవునికి మధ్య వారధిగా దారి చేసే ఏ మనష్యుడును ఆ యోబు కాలమందు లేకుండెను. అలాగే మరిప్పుడు కూడా ఏ మనిషియు లేడు. అయితే యోబు ఇక్కడ ఆయన యొక్క రాకడకు ముందు, నాలుగు వేల సంవత్సరములకు ముందే ఆయన యొక్క మరణమును, సమాధి చేయబడుటను, పునరుత్థానమును, పునరుత్థానము వలన కలిగే నీతిని, విశ్వాసికి నిశ్చయముగా కలిగే పునరుత్థానమును చూచియుండెను. ఈ సంగతులన్నియు వాస్తవములైయున్నవని తెలుసుకొనుట ఎంతో ఆదరణయైయున్నది. ఇదొక కల్పన కథ కాదు.
24ఇక్కడ చూడండి. సూర్యుని చూడండి. సూర్యుడు ఉదయమున ఉదయించును. అప్పుడే పుట్టినట్టుగా వుండును. దేవుడే దానిని పంపెను. అది దేవుని ఉద్దేశ్యమును చేయుచుండెను. ప్రొద్దున తొమ్మిది గంటలకు అది పాఠశాలకు వెళ్ళును. అప్పుడది యవ్వన ప్రాయముగా వుండును. మధ్యాహ్నం పండ్రెండు గంటలకు, పూర్తిగా పరిపక్వము చెందినదానిగా వుండును. పండ్రెండు తరువాత, యాభైకి పైబడినట్టుగా, సగం ప్రాయం అయిపోయినట్టుగా క్రిందికి దిగిపోనారంభించును, బలహీనపడుచూ, క్రమంగా ముసలి వాడైనట్టుగా వుండును. ఈ మధ్యాహ్నపు వేళ బలముగా వుండి మరటు తరువాత బలహీనబడుచూ వుండును. కేవలం కార్యములను మనము చేయునట్టుగానే అది వున్నది. మనం కూడా బలముగా చేయనారంభించుదుము. మరియు… మనము పూర్తిగా పరిపక్వమైప్పుడు, ఎంతో బలముగా నుందుము. వయస్సు వచ్చేసరికి మనం చేయగలిగినంత శ్రేష్టముగా కార్యములను చేస్తాము. తరువాత బలహీనపడటం ఆరంభమవుచూ, ఇక ఆ తరువాత క్రిందికి దిగిపోతూవుంటాము.
తరువాత సూర్యుడు కొంతసేపటి తరువాత పశ్చమాన వెలుతురుగాను, అందమైన వెలుగుగాను కనబడును. అది దేవుని ఉద్దేశ్యమును చేయుచుండెను. అది అస్తమించును (Dies - మరణించును). భూమి చల్లబడి, రాత్రులు చల్లగా వుండును. సూర్యుడు అస్తమించిన పిదప అగుపించడు, అంతమాత్రానా సూర్యుడు అంతమైయాడని అనగలమా? అంతమాత్రానా సూర్యున్ని చూడటం ఇక అదే ఆఖరిసారి అగునా? లేదండి. మరుసటి ఉదయాన సూర్యుడు మరలా పైకి వచ్చును, పునరుత్థారనమందు తిరిగి లేచును. ప్రతిదినము జీవించుట, మరణించుట, పాతిపెట్టబడుట, పునరుత్థారనము అనే వాటిని సూర్యునియందు దేవుడు కనబరచుచున్నాడు.
JOHN 3:3
25నీవు చూచు ప్రతీది కూడా దీన్నే చెప్పుచున్నది: "జీవించుట, మరణించుట, పాతి పెట్టబడుట, పునరుత్థారనము," అనేవి కేవలం దేవుని ఉద్దేశ్యమును చేసినప్పుడు మాత్రమే జరుగును.
ఇప్పుడు, ఒక కాలము వున్నది, అప్పుడు ఈ పుష్పము ఇక ఎన్నటికి చనిపోదు, తిరిగి వచ్చుట అనేది దీనికి వుండదు. ఈ విషయాన్ని మీరు గమనించగోరుచున్నాను. ఈ మధ్యాహ్నము ఒక వేళ గార్నెట్ నాతో మాట్లాడినట్లయితే దీనినే అతడు చెప్పుటకు ఇష్టపడును, కారణం అతడు దేవుని సముఖమందున్నాడు. ఒకవేళ ఆ విత్తనము…
ఈ మధ్యాహ్నపు వేళ ఇక్కడున్న మీలో అనేకులు వ్యవసాయదారులను, లేక ఈ చుట్టు ప్రక్కల నివసిస్తూ వ్యవసాయ క్షేత్రాలను, ప్రకృతిని చూచు వారునైయున్నారు. విత్తనమును విత్తినప్పుడు, చూపుకు అదెంత అందంగా అగపడినా, అది చిగురించకపోయినట్లయితే లేదా అంకురించకపోతే, అది ఎంత మాత్రము బ్రతుకనేరదు. అది భూమిలోనికి వెళ్ళి, అక్కడ నశించిపోవును. ఇక దాని అంతము అదియే. అది మొలుచుటకు అవకాశమే లేదు. తిరిగి బ్రతుకుటకు అక్కడేమి మిగిలివుండదు. ఆ విత్తనము తన జతయైన పుప్పొడితో కలువాల్సివుంది. అప్పుడే అది మొలకెత్తును, లేకపోతే అది ఎన్నటికి తిరిగి లేవలేదు.
పునరుత్థానము మనకును కూడా వున్నదనే నిశ్చయతను అది మరొకసారి గుర్తుచేయుచున్నది. యేసు మనతో చెప్పెను, "ఒకడు క్రొత్తగా జన్మించితేనే కాని అతడు దేవుని రాజ్యము చూడలేడు." ఒక ఎన్నికను చేసుకొనుటకే మనమిక్కడికి వచ్చియున్నాము.
26మరిప్పుడు అందమైన ఆ పుష్పము - అది ఎంత చక్కగా కనబడినా, ఎంత నాజూకుగా వున్న, ఎంత గుండ్రంగా వున్నా అది లెక్కలోకి రాదు. ఒక సంకరం చేయబడిన మొక్కజొన్న వలె, మనం ఒక సంకరం చేయబడిన మొక్క జొన్నను నాటితే, అది మొలవదు. అదెంతో చక్కగా కనబడినను, అందులో జీవము లేదు. అందున్న జీవము చెరిపివేయబడియున్నది. దేవుని నుండి వచ్చే ఏ జీవమును చెడిపినా, అది తిరిగి బ్రతుకలేదు. మనము ఖచ్చితముగా తిరిగి జన్మించవలెను. ఆ విత్తనము అంకురించిన వెంటనే, అందున్న జీవము తిరిగి లేచును. అది లేవకుండా దానిని ఆపునదేదియు లేదు. అది లేవవలసి వుంది, ఎందుకనగా దానికి అంకురార్పణ జరిగియున్నది. వృక్షశాస్త్ర జీవము అందున్నది.
ఇప్పుడు, ఒక విశ్వాసి తనలో క్రీస్తు యొక్క జీవమును కలిగివుండెను. మన యొక్క నీతి కొరకు, మనిషి యొక్క శరీరమునకు పునురుత్థానము వుందని రుజువుపర్చుట కొరకు అయనే మొదటిగా పునురుత్థానుడాయెను. తద్వారా ఆ పునురుత్థానమందు మనము కూడా తిరిగి జీవించెదము, ఎందుకనగా మనం అంకురించాము (Germitized - చిగురించాము), మరో మాటలో చెప్పాలంటే పరిశుద్ధాత్మ ద్వారా తిరిగి జన్మించాము.
27ప్రకృతిలో మనం చూడగలిగిన ప్రతీది కూడా…
ఇక్కడ నిలబడి, మీకు చెప్పుట కొరకు అనేక విషయాలను పేపర్ మీద వ్రాసికొనివచ్చాను. అయితే ఇప్పటి వరకు చెప్పిన సంగతులు మీకు సరిపోతాయి. మరణించుట, పాతిపెట్టబడుట, పునరుత్థానము అను వాటి రుజువును ఎక్కడైన సరే నీవు చూడకుండా వుండలేవని తెలిపితిని. నీవెక్కడికి వెళ్ళినా, దేనిని నీవు చూచినా, మరణించుట, పాతి పెట్టుట, పునరుత్థానము అను వాటిని నీవు దాటివేయుటం కష్టం.
మరియు మరొకసారి, దేవుని ఉద్దేశ్యమును చేసినప్పుడు మాత్రమే పునరుత్థానము కలుగునని మనం తెలిసికొన్నాం. దేవుని ఉద్దేశ్యము అది నెరవేర్చనియెడల, అదెంత అందముగా కనిపించినా, అదెంత చక్కగా కనిపించినా, చిగురించు ఏ విత్తనము కన్నా ఎంతో శ్రేష్టముగా అగుపడినా, అది మాత్రం ఎన్నడు పునరుత్థానము చెందలేదు.
కావున నా స్నేహితులారా, మృత్యువు మన సహోదరునికి చేసినదేమిటో తెలిసికొనుటకు మనం ఈ మధ్యాహ్నము ఇక్కడ వున్నాము.
మనం అంకురించాలి. మనము ఏదో ఒక సంఘానికి చెందిన వారమైయుండొచ్చును. చక్కని వారముగా ఉండవచ్చు. పొరుగు వారి పట్ల మంచి గుణము గల వారైయుండవచ్చును. ఒక మంచి తండ్రిగానో, తల్లిగానో, కుమారునిగానో, కుమార్తెగానో వుండి వుండవచ్చును. అయితే మనము దేవుని ఆత్మతో కలసి అంకురించక (చిగురింపక) పోయినట్లయితే, పునరుత్థానము నందు ఎన్నటికిని లేవలేము. అది ముగించబడినది.
28ఈ సంగతులను గూర్చి ఇది మాట్లాడుచున్నది. దినదినము ప్రకృతి దీనిని చెప్పుచున్నది. మరి సూర్యుడు ఉదయించుచూ, అస్తమించుచుండెను. అదే రీతిగా చంద్రుడు మరియు నక్షత్రములు వచ్చుచున్నవి. సృష్టి అంతయు ఒకే ఒకదాని యందు పరిభ్రమించుచున్నది: మరణించుట, పాతి పెట్టబడుట, పునరుత్థానము. మన దైనందిన జీవితంలో ప్రతీది కూడా మరిణించుట, పాతి పెట్టబడుట, పునరుత్థానము అను వాటినే సాక్ష్యమిచ్చుచున్నది. చాలా సార్లు మనం దీన్ని పెద్దగా మనస్కరించము. అయితే మరిప్పుడు అలావుండకూడదు. మనం గమనించకుండా వుండేందుకు అది పెట్టబడలేదు, సృష్టి అంతయు ఆ విధమగు క్రమములో పెట్టబడియున్నది. అది నిత్యజీవము కొరకేనని మనం తెలిసికోవాలి. అంకురించని దేవుని ఉద్దేశ్యమును చేయని విత్తనము ఎన్నటికి మొలకెత్తలేదని చెప్పగలం. మరలాగే మనమెంత మంచివారమైనప్పటికిని, మనమే సంఘంలో సభ్యత్వమును కలిగియున్నప్పటికి, ఎంత ధైర్యము గల పొరుగువారమైనప్పటికి, చక్కని వారమైనప్పటికి, విద్యావంతులమైనప్పటికి, నాజూకైన వారమైనప్పటికి, అంకురించక మరియు దేవుని ఉద్దేశ్యమును నెరవేర్చకపోతే మనకు కూడా పునరుత్థానమనేది వుండదు.
గడిచిన దానిని విజ్ఞానము (సైన్సు) చెప్పగలదేమో గాని జీవమును మాత్రం అది ఇవ్వజాలదు.
29జీవమనేది కేవలం దేవునికే చెందియున్నది, మరియు కేవలము ఆయన మాత్రమే జీవ ప్రధాత. గనుక మనము తప్పక ఆ స్థలమునకు రావలసినదే, దేవుని వాక్యములో చిగురించవలసినదే, లేనియెడల ఎన్నటికి తిరిగి లేవలేము. మనము దేవుని వాక్యముతో లేక దేవుని జీవముతో మనము అంకురించకపోతే, ఇక ఈ జీవితాన్ని ముగించునప్పుడు, అంతటిని కలుపుకొని, మన జీవితము పూర్తిగా నశించిపోవును.
PS 23:4
30ఇప్పుడు, ఈ చిన్ని శీతల దేహము ఇక్కడ పడివున్నది… దేవుని యొక్క గొప్ప సృష్టి క్రమములో ఇతడొక భాగము కాడని మనలో ఏ ఒక్కరును చెప్పలేము. అతను దేవుని సృష్టిలో భాగమైయున్నాడు. అతడు ఒక మనిషి, దేవుని చేత సృజింపబడినవాడు. ఇప్పుడు ఇక్కడ నిద్రించుచున్నాడు. ఇప్పుడు విషయమేమిటంటే, తన జీవతములో దేవుని చిత్తము తాను చేసినట్లయితే, గార్నెట్ కి నిశ్చయముగా పునురుత్థానము కలుగుతుంది. పునరుత్థానము నొందుటకు దేవుని ఉద్దేశ్యమును నెరవేర్చుట తప్ప మరొకటి లేనేలేదు. గార్నెట్ కు ఇది ముగింపు కాదు. మంచిది, మనం జీవించిన జీవితమును బట్టి దీనిని మనము పొందుకోవటం జరుగును. మనము చీకటిలో నుండి లోపలికి, అదే మార్గము గుండా ప్రవేశించాము. మరియు మనలో ప్రతి ఒక్కరము, ఇలా కాకపోతే మరోలాగున చీకటి గుండా వెళ్ళుచున్నాము, గాడాంధకారపు లోయల గుండా వెళ్ళుచున్నాము. అయితే మనమిక్కడ ఎందుకు పాతి పెట్టబడితిమి, అక్కడ…
MATT 6:24
31యేసు చెప్పెను, "నీవు ఒకేసారి దేవున్ని మరియు లోకాన్ని సేవించలేవు." ఈ రెంటిని ఏకకాలమందు సేవించలేవు." నిర్ణయము మనదే. దేవుని చేత, ఆయన పరిశుద్ధాత్మ చేత మనము అంకురించగలిగితే, నిత్యజీవమును కలిగియండగలము. అలా కాకపోయినట్లయితే, మనము నశిస్తాము, అదంతే. ఇక తీర్పు కొరకు ఎదురు చూపే మిగులును, దానిని మనం చేయనందువలన శిక్షను పొందుతాము. దానిని తృణీకరించినందున శిక్షవచ్చును.
నాకు తెలసినంత వరకు ఈ బాలుడు దేవుని వాక్యమును బట్టి, పరిశుద్ధాత్మ సాక్ష్యమిచ్చుటను బట్టి అట్టి స్థితికి చేరుకొన్నందుకు నేనెంతో సంతోషిస్తున్నాము. దేవుని ఆత్మ యందు అతడు తిరిగి జన్మించియుండెను. అతడొక మార్పు నొందిన వ్యక్తి. దేవుని ఆత్మ ఈ చిన్నవాని పై వుండెను. ఇతడొక విధేయుడైన క్రైస్తవుడు. దేవుని ఉద్దేశ్యమును అతడు నెరవేర్చాడు.
బహుశా అది కొద్ది కాలమే అయివుండవచ్చును.
32దేవుడు కొన్నిసార్లు కొద్దికాల పరిచర్య కోసం ఒక వ్యక్తికి ఏళ్ళ తరుబడి తర్పీదునిస్తాడు. కేవలం ఆరు మాసాల పరిచర్య కోసం బాప్తీస్మమిచ్చు యోహానును అరణ్యములో ముప్పై ఏళ్ళు వుంచెను. అలాగే మూడేళ్ళ సేవ కొరకు, సిలువ మారణము కొరకు యేసుక్రీస్తు ముప్పది ఏండ్లు వచ్చు వరకు వేచివుండెను. దేవుడు మనుష్యులకు తర్పీదునిచ్చుచూ, రంగము మీదికి వారిని తీసికొని వస్తాడు. అది ఆయన ఉద్దేశ్యమైయున్నది. మనిషి కాలమందున్నాడు; దేవుడు నిత్యత్వమందున్నాడు.
ఒక ఉద్దేశ్యము కొరకు దేవుడు ఈ చిన్న బాలున్ని ఈ భూమి మీదికి తీసికొనివచ్చాడని నేను నమ్ముచున్నాను. తన, తన వ్యాధి సమయములయందు లేక మరలాటి కార్యాలు ఒక ఉద్దేశ్యము కొరకే వచ్చినవని, మృత్యువు అతన్ని కబలించియున్నదని మీరు గమనించగలరు. ఈ బాలున్ని దేవుడు ఎంతో చక్కని, పరిపూర్ణమైన ఆరోగ్యవంతునిగా చేసివుండగలడు. కాని అతని ప్రాణాన్ని తీసికొనుటకు బదులుగా దేవుడిప్పుడు అతనికేమి చేసాడు? ఇక ఎన్నటికి మరణించని చోటికి దేవుడతనిని తీసికొనియున్నాడు. అతని ప్రాణమును తీసింది పోలియో కాదు. మనం అనుకొనుచునట్టుగా పోలియో చేత అతడు మరణించలేదు. మరే ఇతర రోగములు అతన్ని చంపలేదు, దానిలో నుండి అతడు విడుదల పొందుట కొరకు మనమంతా ప్రార్ధించాం, అతడును మరియు నేను, మరలాగే క్యాంప్-బెల్స్-విల్ చుట్టు ప్రక్కల నున్న మిగతా క్రైస్తవులందరును అతని కొరకు ప్రార్ధించితిమి. అయితే రోగము, ఎటువంటి రోగము అతన్ని చంపలేదు. చూశారా, వెడలిపోవుటకు ఇది గార్నెట్ సమయం. తప్పక వెళ్ళవలసివుంది. ఆయన చిత్తమును నెరవేర్చుట కొరకే తాను బ్రతికాడు. అతడు క్రీస్తు నొద్దకి వచ్చి అంకురించాడు.
ఈ సమయానికి ముందే అతడు చనిపోయినట్లైతే ఏమైయుండేదో? పోలియోనే అతనిని దేవుని యొద్దకు నడిపించెను. ఒకవేళ అదే రాకపోయినట్లయితే, తన మనస్సునందున్న దాని బట్టి తానొక పొగాకు వేలం వేయువాడై వుండేవాడేమో. అయితే అతని పట్ల దేవుని యొక్క ఉద్దేశ్యము అదెంత మాత్రము కాదు. అది మనందరికి తెలుసు. అతడొక క్రైస్తవునిగా ఉండుటమే అతని పట్ల దేవుని ఉద్దేశ్యమైయున్నది.
33ఇప్పటి నుండి బహుశా డెబ్బై ఏళ్ళ గడచిన తర్వాత, ఈ లోకం అప్పటి వరకు నిలిచివున్నట్లైతే, కొందరు "గార్నెట్, అతడొక గొప్ప పొగాకు వేలం పాటగాడు," అని అందురేమో. అతని యొక్క సమాధి కార్యక్రమమందు దైవసేవకులు సహితం, "ఇతడొక గొప్ప వేలం పాటగాడు," అని సంభోదించివుండేవారేమో. కాని నేడు మనం ఎలా చెప్పగలుగుచున్నాం? "అతడు ఒక క్రైస్తవుడు." ఒక పొగాకు వేలం వేయువానిగా, జీవకణం లేనివాడై, ఆ తరానికి ఒక జ్ఞప్తిగానో, లేక కొద్దిమందిలో ఒకటిగానో మిగిపోయేవాడేమో. కాని ఇప్పుడయితే అతడు అమర్త్యుల మధ్య వున్నాడు. పునరుత్థానమందు అతడు రావలసివుండెను. దానిని ఏదియు ఆపజాలదు. అతడు దేవుని ఉద్దేశ్యమును నెరవేర్చినందున అతడు తిరిగి లేవవలసివున్నది.
దేవుని పరిశుద్ధాత్మ ద్వారా బాలుడగు తనయందు వుంచబడిన నిత్యజీవము ద్వారా అతడు అంకురార్పణ చెందెను. కాబట్టి అతడు చెప్పేవాడు, "ఒకవేళ నాకు తెలిస్తే…" చివరిసారి నేనతనితో మాట్లాడినప్పుడు, అతడన్నాడు, "నాకు తెలిసినట్లయితే… మంచిగా వుండి, ఇతర బాలురవలే బలముగా వుండి, రోడ్ల వెంబడి విచ్చలవిడిగా తిరగుచూ, నేనిప్పుడు దేన్నైతే ఎరిగియున్నానో దానిని గుర్తించనివానిగా వుండి వుండేవాడినేమో." మరి ఇంకా అన్నాడు, "పదివేల జీవితములు ఆలాగున వున్ననూ దీనిని నేను మార్చుకొనియుండేవాడిని కానేమో."
పద్దెనిమిదేళ్ళ ఒక కుర్రాడు, చక్కని అందగాడు, అపవాదికి ఎల్లవేళల గురిగా వుండి వుంటాడు.
34అయితే దేవుడు అతన్ని ఆ స్థితిలోకి నెట్టివేసి, తన ఉద్దేశ్యమును జరిగించునట్లుగా అతన్ని చేసెను. అతని సహనమును, పొరుగువారగు మీ మధ్య అతని యొక్క సాక్షమును చూడండి. అతడెలాంటివాడో, అతని యొక్క చిన్ని జీవితము మీలో అనేక మందితో ఏ విధముగా మాట్లాడియున్నదో, తీర్పు దినాన, అది లేకుండా, అతని జీవితం మీకు విరోధముగా సాక్ష్యమిచ్చును. దేవుడు ఏదైతే అతనిలో కోరుకొన్నాడో, దానికి అతడు చక్కని మాదిరిగా వుండెను. దేవుని ఉద్దేశ్యమును అతడు నెరవేర్చాడు.
35ఇప్పుడు, అతడు దేవుని ఉద్దేశ్యమును నెరవేర్చినవాడైనట్లయితే, సర్వసృష్టి అంకురార్పణ చెందినట్లు, అతడును అంకురార్పణ చెందియున్నట్లయితే, తప్పక అతడు తిరిగి లేచును అను వాగ్దానమును బట్టి, గార్నెట్ పునరుత్థానమందు మనము తిరిగి చూచుదుము అనుటలో ఇక ఎంత మాత్రము సందేహములేదు. ఒకవేళ అతడు తిరిగి లేవడని చెబితే పూర్తిగా అది వెర్రితనమే అవుతుంది.
గార్నెట్ తిరిగి లేవకపోతే, ఉదయించుటకు అస్తమించుటకు తిరిగి లేచుటకు సూర్యుడు అనే వాడు కూడా ఇక ఎన్నడు ఉండనట్టే. గార్నెట్ తిరిగి లేవకపోతే విరబూయుటకు, వాడిపోవుటకు పుష్పములనేవి ఇక ఎన్నడు వుండనట్టే. ఇవి దేవుని ఉద్దేశ్యమును నెరవేర్చినవి. ఇవి దేవుని ఉద్దేశ్యమును జరిగించినవి. జీవముచేత ఇవి అంకురార్పణ గావించబడినవి గనుకనే తిరిగి లేవగలుగుచున్నవి.
మంచిది, పునరుత్థానమును గూర్చి ఇంత తేటగా తెలిసికొన్న తరువాత కూడా పునరుత్థానము నొందుటకు మనమేమి చేయాలో తెలిసికొన్న తర్వాత కూడా 'పునరుత్థానము లేదు' అని అనటం, లేదా దానిని అంగీకరించకపోవటం ఎంతో భయంకరమును మరియు తెలివి తక్కువ తనమే అవుతుంది.
36గార్నెట్ తిరిగి బ్రతుకుతాడు. ఇప్పుడతడు సజీవుడే. అయితే అది మరొక లోకంలో. పుష్పములు ఎంత నిశ్చయముగా తిరిగి కనిపించునో, గార్నెట్ కూడా అంతే నిశ్చయముగా తిరిగి బ్రతుకును. సూర్య చంద్ర నక్షత్రము ఏలాగు తిరిగి లేచుచున్నవో, అలాగునే అతడు కూడా తిరిగిలే చును. అతడు పునరుత్థానము నొందును.
ఇప్పుడు చూడండి, అవి కేవలం క్షయమగు జీవితమునకు, మరొక కాలానికి సాక్ష్యమిచ్చుట కొరకే తిరిగి లేచుచున్నవి. అయితే అతడు తిరిగిలేచునప్పుడు, అది కాలమునకు అంతమగును. సాక్ష్యము అనేది ఇక ఎంత మాత్రము అవసరం లేదు. అతడు నిత్యజీవమును కలిగివున్నాడు; నిత్యజీవము అనగా నిరంతరము జీవించడం. అది ఖచ్చితముగా దానితో అంకురించబడాలి. అప్పుడే శాశ్వతమైన జీవము కొరకు తిరిగి లేవడము జరుగుతుంది. అతడు నిత్యజీవముతో అంకురించబడ్డాడు. గనుక అతడు తిరిగి లేచినప్పుడే మరణమనేది ఇక వుండనే వుండదు. సదాకాలము అతడు జీవించును.
37నా జీవితంలో ఇప్పటికి నేను వేలకొలదిగా భూస్థాపిత కార్యక్రమము (సమాధి కార్యక్రమము)లలో ప్రపంచమంతట భోదించాను. నేను భోదించిన అనేక భూస్థాపిత కార్యక్రమాలలో, గార్నెట్ యందు నాకున్న నమ్మకం, గార్నెట్ గురించి నాకు తెలిసిన విషయాలు నేను ఎలా అయితే చెప్పుచున్నానో, అలాగే నేను భోదించిన అనేక భూస్థాపన కార్యక్రమాలలో మరి అలాంటి వాటినే చెప్పుటకు నేను ఇష్టపడుదును. నాకు తెలిసినంత వరకు, దేవుడు అతనియందు కోరుకున్న ప్రతి దానిని అతడు జరిగించియున్నందున తప్పకుండా దేవుడు అతనిని లేపునని నేనెరుగుదును. పరిశుద్ధాత్మ యొక్క పుష్పములు అతని జీవితంలో పరిమళించుట కనబడెను. దేవుడు అతనియందు నివసించెను. ఆ పిల్లవాడు మార్పునొందినవానిగా వుండెను. అందులో ఏ సందేహము లేదు. అతడు జీవించిన జీవితమే దానికి నిదర్శనం. అతడు మార్పునొందినవాడు.
ఇప్పుడు, పునరుత్థానము లేదు, గార్నెట్ కి ఇదే ముగింపు, ఈ మధ్యాహ్నపువేళ అతని ముఖమును కప్పుటకు ముందు చూచే చూపే ఇక ఆఖరి చూపు, అని మనము అన్నట్లయితే, అతని గూర్చి ఏమి మాట్లాడును? బహుశా ఎవరో ఒకరు ఇలా, "ఓ, దాని గూర్చి నాకేమి తెలియదు. నాకు తెలియదు. అది జరుగుటను నేనెన్నడు చూడనేలేదు," అని అన్నట్లైతే. నిశ్చయముగా. కాలము యొక్క అంతము ఇంకను రాలేదు. అయితే నీవు అది చెప్పినప్పుడు, నీవు చేయవలసిన మొదటి కార్యమేదనగా…
JOHN 1:1•
1THS 4:15-17
38దేవుని వాక్యము గార్నెట్ కొరకు సాక్ష్యమిచ్చుచున్నది. దేవుని వాక్యము సెలవిచ్చుచున్నది, "ప్రభువు రాకడ వరకు సజీవులమై నిలచియుండు మనము, నిద్రించిన వారికంటే ముందుగా ఆయన సన్నిధి చేరము. దేవుని బూర మ్రోగును, క్రీస్తునందు మృతులు మొదట లేతురు. ఆ మీదట సజీవులమై నిలిచియుండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశమండలమునకు మేఘముల మీద కొనిపోబడుదుము." "నాయందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును." లేఖనములు. "పునరుత్థానమును జీవమును నేనే," అని దేవుడు చెప్పెను, చూచారా.
దేవుని వాక్యమునకు భిన్నంగా నీవు సాక్ష్యమియ్యజాలవు. వాక్యమే ఈ బాలుని కొరకు సాక్ష్యమిచ్చుచున్నది. దేవుని యొక్క సొంత వాక్యమే ఆ బాలుని గూర్చి సాక్ష్యమిచ్చుచుంటే, అంతకంటే మరి ఎక్కవగా మనకు ఇంకా ఏం కావాలి? మనకు తన వాక్యమే తానై యున్నాడు. వాక్యమే దేవుడు. స్వయంగా దేవుడే గార్నెట్ తిరిగి లేచునని సాక్ష్యమిచ్చుచున్నాడు. గార్నెట్ తిరిగి లేచును. సకల సృష్టి: … "సూర్యుడు ఇక రాడు, దేవుడు తప్పు చేసాడు. సూర్యున్ని, మనమిక సూర్యున్ని చూడలేము," అనే మాటలు నీవు అన్నావంటే. చూచారా, కేవలం అదొక వెర్రితనము తప్ప మరేమిటి?
39అతడు తిరిగి లేచునని సూర్యుడు అంటున్నాడు. అతడు తిరిగి లేచునని పుష్పములు చెప్పుచున్నవి. అతడు తిరిగి లేచునని వాక్యము చెప్పుచున్నది. సృష్టిలోని ప్రతీది, సకల సృష్టి అతడు తిరిగి లేచును అని చెప్పుచున్నది. భూమి, నీవు చూచు ప్రతీది కూడా అతడు తిరిగి లేచునని పలుకుచున్నది. దేవుని వాక్యము సహితము, మరియు నీ స్వంత… నా హృదయంలోను, అలాగే ఇక్కడున్న మిగతా క్రైస్తవులలో వున్న పరిశుద్ధాత్మ ద్వారా కొట్టుకొనుచున్న విశ్వాసము కూడా అతడు తిరిగి లేచును అనే చెప్పుచున్నది. అతడు తిరిగి లేవడు అని నీవు చెప్పినట్లయితే — నీవు నీ విశ్వాసమును, దేవుని వాక్యమును, సకల సృష్టిని, మరియు సమస్తమును మీరి వెళ్ళుచున్నావు.
గార్నెట్ కు ఇది ముగింపు కాదు గాని కేవలం భూమి మీద అతని జీవితం పట్ల దేవుని యొక్క ఉద్దేశ్యమునకు మాత్రమే ఇది ముగింపుగా వున్నది. కాని అతడు తిరిగి లేస్తాడు. చూశారా, అతడు తిరిగి లేచును అని సమస్తము ఘోషించుచున్నది. కావున మనకెందుకు ఇక విచారము, చింత?
40ఆ యౌవనస్తుడు అలా పడివుండటం మనకెవ్వరికి ఇష్టం లేదు, దానిని మనం కోరుకోవట్లేదు, కాని ఇదే అతని యొక్క జీవితానికి ప్రధాన ఘట్టం. అయితే, నీకు తెలుసా, దేవుడు… ఉద్యానవనంలోకి నీవు పుష్పములను కోయుటకు వెళ్ళినప్పుడు, వాడబడినవాటినో లేక సొగసు లేని వాటినో తీసికొనుటకు ఇష్టపడవు. కొన్నిసార్లయితే, మొగ్గలను తీసికొంటావు, ఎందుకనగా నీవు తయారు చేసే పూలగుత్తికి అవి కూడా అవసరమైవుంటాయి. గనుక మొగ్గ కూడా తన ఉద్దేశ్యమును నెరవేర్చును. దేవుడు కూడా బహుశా, ఈ ఒక 'మొగ్గ'ను కోరుకొనివుండెను. అందుకోసమే ఆయన ఇక్కడ నుండి దానిని తీసికొని మహిమలో తన బలిపీఠము కొరకు దానిని వుంచుకొనెను. నిశ్చయముగా, ప్రతీది కూడా అతడు తిరిగి లేచును అని సాక్ష్యమిచ్చుచున్నవి.
అతడు తిరిగి లేచునని మన విశ్వాసం కూడా చెప్పుచున్నది. అతడు తిరిగి లేచునని వాక్యము చెప్పుచున్నది. అతడు తిరిగి లేచును అని చంద్రుడు చెప్పుచుండెను. అతడు తిరిగి లేచునని నక్షత్రములు చెప్పుచున్నవి. అతడు తిరిగి లేచునని సూర్యుడు, పుష్పములు, సమస్తము చెప్పుచున్నవి. గార్నెట్ ఒక క్రైస్తవుడని అతనితో పరిచయమున్నవారందరికి తెలియును. ఆ బాలుని యొక్క దేహమందు మార్పు ఒకటి జరిగినదని తెలుసుకొని, దానిని చూచుటకు నీవిచ్చటికి వచ్చియున్నావు. అయితే జీవము చేత అతడు అంకురించాడు.
41దేవుడు జరిగించుచున్నవి, మరియు జరిగించబోవుచున్న వాటి యొక్క మాదిరిని, ఈ మధ్యాహ్నం బ్రతికివున్న మనము చూడాలన్నదే నా ప్రార్థన అయివున్నది. ఒకవేళ మనకది లేనట్లైతే… ఈ నిత్యజీవపు బీజమనేది లేనట్లైతే, ఇప్పుడతడు ఏ మార్గము గుండా అయితే వెళ్ళియున్నాడో, సరిగ్గా మనందరం కూడా అదే మార్గములో వెళ్ళవలసియున్నదని తెలిసికొన్నాము గనుక దానియందు ఇప్పుడే మనము అంకురించెదము గాక. మన హృదయములలోనికి క్రీస్తుని చేర్చుకొందుము గాక, తిరిగి జన్మించెదము గాక! మరిప్పుడు సహోదరుడా, సహోదరి మనమంతా దీన్ని ఎదుర్కోవలసినదే, నీవెవరివైనా సరే, నీవెంత గొప్ప వ్యాపారం చేస్తున్నా సరే, నీవొక వృద్దుడగావున్న లేక యవ్వనస్తుడుగా వున్న, తప్పకుండా నీవు దీనిని ఎదుర్కొవలసినదే. తప్పకుండా దీనిని నీవు కల్సుకోవలసినదే. మొదటగా క్రీస్తు ద్వారా అంకురము చెందకుండా నీకు నిత్యజీవము కలదని తలంచవద్దు.
42అప్పుడు విజయమందు మరణము మ్రింగివేయబడెను.
గార్నెట్ తిరిగి లేచును. సకల సృష్టి… ఇప్పుడు ఇరుగు పొరుగు వారును, ప్రతి ఒక్కరును ఆ బాలున్ని ఎరుగుదురు. అతడొక క్రైస్తవుడని అతనితో వ్యక్తిగతంగా పరిచయమున్న వారందరికి తెలుసును. ఇప్పుడు, దేవుని వాక్యము, సకల సృష్టి అతడు తిరిగి లేచునని చెప్పుచుండెను. అతని తల్లి, అతని తండ్రి, అతని బంధువులు, ఇంకా మీరెవరైనప్పటికి మీరిప్పుడు అతనిని చూచుచున్నారు గదా, ఒక సువార్త భోదకునిగా, అతని సహోదరునిగా, దేవుని వాక్యమునందును సృష్టిలో వున్న ప్రతి దాని యందును…
దీనిని నేనెందుకు చెప్పాలనుకొన్నానంటే, బహూశా మీలో ఎవరైనా చర్చితో ఎక్కువ పరిచయం లేనివారు, ఈ సంగతులు గూర్చి ఎక్కువగా తెలియనివారు వుండొచ్చును. గనుక ఈ రీతిగానైన మీరు వీటిని తెలిసికొందురని ఈ అంశాన్ని తీసికొన్నాను. ప్రకృతిలో జరుగు సంగతులను చూచుటను బట్టి ఎంతో సుళువుగా నీవు గ్రహించగలుగుదువని వీటిని చెప్పుచున్నాను. దేవుని షరతులన్నిటిని గార్నెట్ చేసి ముగించాడు. అతడు దేవుని ఉద్దేశ్యమును నెరవేర్చాడు. అతడు చనిపోలేదు; నిరంతరం అతడు సజీవునిగా వుండి, మన రాక కోసమే ఎదురు చూచుచున్నాడు.
ఇప్పుడు, తల్లిదండ్రులను, సహోదరులును, మరియు ఏ రకమైన బంధువులగు మీ అందరికి అతడు తెలుసును. మీరతనిని ప్రేమించారు. అతనిని ప్రేమించకుండా మీరందరు గార్నెట్ ను చూచుటకు ఇక్కడికి రాలేరు కూడా, చూశారా. అతడు బ్రతికియున్నప్పుడు మీరతనితో వున్నారు. మరిప్పుడు ఈ జీవితము ముగిసిన పిమ్మట ఏం జరుగును? పునరుత్థానములో మనము కూడా అతనిని కలుసుకొనునట్లు సిద్ధపడెదము. పునరుత్థానమందు మనమతనిని కలుసుకొనునట్లు, మన జీవితములను అందుకు తగినట్టుగా మలుచుకొందుము.
JOB 14:14,15
43"మృతినొందిన తరువాత మనిషి తిరిగి జీవించగలడా?" అనేది మన యొక్క అంశము. నాలో మార్పు జరిగే వరకు నా జీవిత దినములన్నియు నేను కని పెట్టుకొందును. "నీవు నన్ను పిలువగా నేను ఉత్తర మిచ్చెదను." దేవుని బూర మ్రోగును, క్రీస్తునందు మృతులు మొదట లేతురు. ఆ మీదట అప్పటి వరకు నిలిచి, సజీవముగా మనము యున్నట్లైతే ఆకాశమండలము మీద ప్రభువును కలుసుకొనుటకు వారితో కూడా కొనిపోబడెదము. మరియు సదాకాలము ప్రభువుతో కూడా యుండెదము. ఇది ఒక నిరూపించబడవలసిన చోటు, పరీక్షింపబడవలసిన కాలం.
దేవుడు పెట్టిన షరతులన్నింటిని గార్నెట్ నెరవేర్చాడు. మరినేడు, గార్నెట్ చనిపోలేదు, గాని ఈ లోకములో వున్న దానంతటి కంటే కూడా మరెక్కువుగా తాను ఎవరినైతే ప్రేమించియున్నాడో, వారితో కూడా కలిసి నిద్రించుచున్నాడు. తాము ప్రేమించిన దాని కంటే ఎక్కువగా… తన తల్లిదండ్రులను ఎంత ఎక్కవగా ప్రేమించగలిగాడో, మరి అంత ఎక్కువగా తనను పరామర్శించటానికి వచ్చిన వారందరిని అలాగునే ప్రేమించాడు, అతడు ప్రేమించాడు. అయితే అందరికంటే మిన్నగా అతడు యేసుక్రీస్తును ప్రేమించాడు. ఆయనతో ఉండుటకై అతడు వెళ్ళిపోయాడు. అల్పముగా మాత్రం అతని ప్రేమ పొందిన మీరు, మరియు మనందరం, ఆ గొప్ప పునరుత్థానమందు అతనిని కలుసుకొనుటకు ఆయుత్తమవుదము గాక?
కొద్ది క్షణములు మనము తలలు వంచుదాం.
1THS 4:16,17
44తలలు వంచియుండగా… గార్నెట్ గురించి ఎక్కువ చెప్పాలని నేను ప్రయత్నించలేదు. అతడొక క్రైస్తవుడు. అతడెలాంటివాడో అతడు జీవించిన జీవితమే చెబుతుంది. అయితే అతనికి ప్రియమైనవారలారా! తప్పక అతడు తిరిగిలేస్తాడు అని మాత్రం చెప్పుటకు ప్రయత్నంచాను. ఇదే అతని యొక్క అంతము కాదు అని మీకు రుజువులు సహితం చూపించాను. అతడు తిరిగి లేచునని దేవుని కుమారుని రక్తము చేత అక్కడ నిశ్చయముగా వ్రాయబడెను. ఇప్పుడు ఇటువంటి సమాధుల తోటలోనికి, ఇటువంటి ఒక చోటుకి మనము కూడా ఒక రోజున తీసికొనిరాబడినప్పుడు, వెళ్ళిపోవుటకు తగిన సిద్దపాటును మనము కూడా కలిగియున్నట్లుగా మన ప్రియులు జ్ఞప్తికి తెచ్చుకొనునట్లు మరిప్పుడు మన హృదయములను సిద్ధపరచుకొందుము. ఈ యావనస్తుని యొక్క తల్లిదండ్రులు, ప్రియమైనవారు కలిగియుందురు, గొప్పదానిని…
45మీకు తెలుసా, మీరెంతగా భాదపడుచున్నారో నేనెరుగుదును. నేనొక బిడ్డను, చిన్న బాలికను ఇచ్చివేసితిని. మీ హృదయములు ఎంతో రోదించుచున్నవని నాకు తెలుసు. చూడండి, ఒకవేళ గార్నెట్ రక్షింపబడనట్లైతే అది మీకు ఎంతో భయంకరముగా వుండును. కానీ మీ బాలుడు క్రీస్తుతో కూడా వున్నాడని తెలిసికోవటం మీకు ఎంతో ఆనందంగా వుండును. ఏదో ఒక రోజు అతడు వెళ్లిపోవలసినదే. తన జీవితపు ముగింపు వరకు అతడు నమ్మకముగా వుండెను, గనుక నేడు అతడు దేవుని యొద్ద వుండెను. అతని తల్లిదండ్రులకు తోడబుట్టిన వారి సంతానము యొక్క బంధువులగు మీరు, అతడేమైయున్నాడో ఒకసారి ఆలోచించండి. ఒకవేళ అతడు దేవున్ని యెరుగక, మరొక మార్గాన జీవితాన్ని చాలించినట్లైతే అప్పుడెలావుండేది? కావున చింతించవలసిన పనిలేదు. గార్నెట్ యేసుతో కూడా వుండెను. ఆయనతో వుండుటకు మనం కూడా సిద్దిపాటు కలిగివుందాం.
46కృపగల దేవా, నిత్యుడగు గొప్ప యెహోవా, జలముల పై అల్లాడుచూ, "వెలుగు కలుగును గాక," అని పలికితివి. నీ యొక్క మాట చేత లోకమును ఉనికిలోనికి తెచ్చితివి. మరిప్పుడు అదే మాట చేత మేము తిరిగి లేచెదమని వాగ్దానము చేసితివి. తండ్రి, ఈ మధ్యాహ్నపు వేళ, మమ్మును మీకు అర్పింపగోరుచున్నాము. బ్రతికియున్నప్పుడు ఈ వనస్తునితో నేను సహవసించిగా మా ఇద్దరి మధ్య శాశ్వతమైన ప్రేమ ఏర్పడినది.
శరీరంలో ఎన్నో బాధలను పడుచూ కరువైన మంచం మీద జీవన్మరణ పోరాటాల మధ్య వుండికూడా దేవున్ని స్తుతియించుచు జీవితాన్ని గడిపిన ధీరత్వముగల ఈ చిన్న యోధున్ని నేనెన్నడు మరువలేను. తన యొక్క ఓర్పు నాకు కూడా మాదిరే, తాను ఎన్నడు సణగలేదు, దేవుని చిత్తమే సిద్ధించును గాక, అని పలికేవాడు. నీవే అతనిని మా మధ్యకు రప్పించియున్నావు, మరిప్పుడు నీవే అతనిని మా నుండి తీసికొనిపోయావు, ప్రభువగు దేవా, ఈ మధ్యాహ్నపు వేళ మాలో ప్రతి ఒక్కరు… బహూశా దీనిని నేను మీతో చెప్పాలని గార్నెట్ ఆశించియున్నాడేమో, మనమింకా సిద్దపడనట్లైతే, మరి ఇప్పుడే సిద్ధపడుదుము గాక, దీనిని నేను నొక్కి చెప్పుచుండగా, తండ్రి, అతడు పొందుకొనిన అదే ఆత్మ చేత మమ్మును కూడా నింపి, క్రీస్తునందున్న జీవము చేత మమ్మును అంకురిపంచేయుము
GEN 1:2,3•
LUKE 8:11
47ఈ ప్రియమైన తల్లిని, తండ్రిని, తల్లిదండ్రులను, ప్రియులందరిని దీవించుము. వారు ఎవరైనప్పటికిని, తండ్రి, పరిశుద్ధమైన నీ సన్నిధిని వారికి అనుగ్రహించుము.
ఈ చిన్న జీవితము (గార్నెట్ జీవించిన జీవితము - అనువాదము) దేని కోసం జీవించెనో, దాన్ని గూర్చి వారిప్పుడు తలంచే సమయముగా ఈ సమయముండును గాక. ఇది వారికి మాదిరికరమైన సాక్ష్యముగా వున్నది. బాల్యంలో అతనితో కలసి పెరిగిన కొందరు యవ్వనస్తులు ఇక్కడ కూర్చొనియున్నారు, అదివరకు అతడెలాగు వున్నాడో, మరటు తరువాత ఏలాగు వున్నాడో చూడండి. తండ్రీ, అతని జీవితము వారికి ఒక పాఠముగా ఉండనిమ్ము. ప్రభువా, మరణము, దుఃఖము, గుండెపోటులు ఎన్నడూ వుండని ఆవలి గట్టున తన బాల్య స్నేహితున్ని కలుసుకొనుటకు తగిన సిద్దపాటును వారు కూడా కలిగివుండునట్లు దానిని దయచేయుము.
జీవితము యొక్క అసలైన సమయములో వున్న పెద్దవారమగు మనము, మృతతుల్యమైన జీవితములో నుండి సజీవమైన జీవితములోకి మార్పు నొందిన ఈ యవనస్తుడు ఇప్పుడు ఇక్కడ పడివుండుటను చూచుచున్నాము. ఇప్పటి వరకు ఎంతో సామాన్యమైన రీతిలో ప్రకృతిలోని సంగతులను మాదిరులుగా ఎత్తి చూపి, వాక్యములో వాటి స్థానమును వాగ్దానముగా వున్నట్టు ఈ మధ్యాహ్నపు వేళ చూచాము. అయితే ప్రభువా, వాటి యొక్క గ్రహింపును మాకు దయచేయుము.
"దేవుని వాక్యము ఒక విత్తనమై వున్నది," అని నీవు సెలవిచ్చితివి. ప్రతి జాతి విత్తనము తన జాతినే తప్పక తీసికొని రావలసివుంది. ఈ జనులను ఓదార్చమని, దీవించమని ప్రార్థించుచున్నాను. ఈ చిన్న బాలుడు వారికి ఒక పాఠముగా వున్నాడని వారు తెలిసికొందురు గాక. అతడు తన ప్రసంగమును ప్రసంగించెను; గ్రంధము ముగించబడెను. కాని మనము అతనిని తిరిగి మరలా చూచెదము, ప్రభువా, క్రీస్తు సౌందర్యములో మమ్మును నిలువజేయుము, ఎందుకనగా అక్కడ మాకు నిత్యజీవము వుంది. మరి అప్పటి వరకు మమ్మును నీ చిత్తములో నిలుచునట్లుగా కాపాడుము, యేసు నామములో ప్రార్థించుచున్నాము. ఆమేన్.