క్రీస్తు అనబడిన యేసును నేనేమి చేతును?

క్రీస్తు అనబడిన యేసును నేనేమి చేతును?

1వైల్ సోదరుడా, వందనములు. స్నేహితులకు శుభోదయము. నేను ఎప్పుడూ ఆలస్యమే. ముప్పది మంది నాతో ముచ్చటించ వచ్చిరి. అయితే ఇద్దరి ముగ్గురితో మాత్రమే మాట్లాడగలిగాను. అందరినీ నేను కలిసికోలేకపోయాను. నెలల తరబడి ఆ జాబితాలో మనుష్యులు వేచి చూచుచున్నారు. ప్రభువు ఇక్కడ కొన్ని గొప్ప కార్యములు చేయుచున్నాడు. ఓ, ఆయన మన దేవుడు, కదా?

2ఈ దేశమునకు జరిగిన విషాద సంఘటన ఈ ఉదయము తప్పక మీరు వినియుందురని తలంచుచున్నాను. మన దేశాధ్యక్షుడు శ్రీ. కెనెడీ హత్య గావించబడెను. రాజకీయంగాను, మత సంబంధముగాను నేను ఆయనతో సమ్మతించకపోవచ్చును… కాని ఆ విధముగా ఆయన చంపబడ తగడు. ఆ చిన్న బిడ్డలకు తండ్రి లేడు. శ్రీమతి. కెనెడీ విధవరాలయినది. ఆమె విధానములను తప్పక నేను అంగీకరించకపోయినా, ఆమె ఒక తల్లి. భర్తను కోల్పోయినది. ఆమె ఒడిలోనే ఆయన పడిపోయెను. తన స్వంత భర్త రక్తము ఆమె ఒడిలో కారినది. అది మహా విషాదము.

దేశమును ఆమె తన విధానముల ద్వారా కొన్నిసార్లు నడిపించినది. అది నిజమే. నేను బోధించిన ఈ వర్తమానములలో ఏ ఒక్కదానిని శ్రీమతి. కెనెడీ వినలేదని మీరు గుర్తుంచుకొనండి. ఆమె ఒక ప్రసంగము వినినా మారి యుండును. మనలోని కొందరు సోదరీలు వినియును దానితో ఏకీభవించుట లేదు, చూచారా. ఆమె కాతలిక్కుగా పెరిగెను. ఆమెకు అదే తెలియును. అది ఒక క్రమము. దానికి నేను ఏమి అనను. కాతలిక్కు జనులు నాకు విరోధులు కారు. కాతలిక్కు క్రమము కూడా ప్రెస్బిటేరియను, మెతడిస్టు, పెంతెకోస్తు లేదా ఇతర శాఖల క్రమము వంటిదే. ప్రజలు మంచివారే, గాని క్రమము తప్పు.

శ్రీ. కెనెడి దేశాధ్యక్షునిగా మంచి పని చేసెను. ఆతని భార్య గూర్చి నా హృదయము ఘోషించుచున్నది. నిజంగా నాకు దుఃఖము కలిగినది. మన దేశములో ఇటువంటి కృత్యము జరిగినదని వినుట ఎంత ఘోరము.

3ఒక వ్యక్తితో నీవు ఏకీభవించని యెడల నీ మట్టుకు నీవు నిలబడి జీవించు. కాని కొన్ని కారణముల బట్టి ఒక మనిషిని చంపుట తప్పు. ఆ చిన్న పిల్లలకు ఏమి తెలియును? ఒక చిన్న పిల్లవాడు ఒకసారి ఇట్లనుట నేను విన్నాను, "నా తండ్రి చనిపోయెను. ఇక నాతో ఆడే వారెవరు?" చూచారా. ఒక రోజున నా స్థితి ఆలాగే యుండునని ఎప్పుడూ అనుకొనుచుందును. ఆ విధంగా దాదాపుగా జరిగిన సంగతి మీరెరుగుదురు. దూరము నుండి నన్ను తుపాకీతో గురి చూచి కొట్టబోయినప్పుడు నన్ను రక్షించుటకు జనులు గుమికూడుట కొన్నిసార్లు విదేశములలో జరిగినది.

ఒక వ్యక్తి ఆ వెల చెల్లించెను. మన దేశాధ్యక్షులు నలుగురిలో ఒకరు ఆ విధంగా హత్య చేయబడుట పరిపాటి అయినది. నలుగురిలో ఒకరు అది చాలా చెడ్డ సంగతి. అమెరికాలో అట్టి వారున్నారని చెప్పుటకు సిగ్గుపడుచున్నాను.

అతని రాజకీయములతో నేను సమ్మతించను. అతడు చేయ ప్రయత్నించిన ఉద్దేశ్యములతో నేను సమ్మతించను. కాని ఆయన ఒక మనిషి. ఆతని మత క్రమము నాకు విరుద్ధము. అయితే ఆయనా విధంగా పెంచబడెను, లేక నేను తప్పుగా ఆయన గూర్చి వినియుండవచ్చును.

4అమెరికా జనులు శ్రీ. కెనెడీని అధ్యక్షునిగా ఎన్నుకొనిరి. మనది ప్రజాస్వామ్యము. నేను శ్రీ. కెనెడీకి వోటు వేయలేదు. నేను శ్రీ. నిక్సన్ కు ఓటు వేశాను, ఎందుకనగా ఆయనను వ్యక్తిగతంగా నేను ఎరుగుదును. అతనిని నేను ఇష్టపడి వ్యక్తిగతంగా ఓటు వేశాను. కాని నా సహ పౌరులగు ఈ దేశ ప్రజలు (అమెరికనులు) శ్రీ. కెనెడీని ఎన్నుకొనిరి. అయితే వారు చేసిన సంగతి వారికి దేవునికి మధ్య ఉన్నది.

5పిల్లలున్న ఆ తల్లి గూర్చి అనగా శ్రీమతి. కెనెడీ గూర్చి నేను ఆలోచించుచున్నాను. ఆమె కొరకు మనము ఒక్క క్షణము నిలబడి ప్రార్థించుదము.

ప్రభువైన యేసూ, మేము మానవులము. ఒకరి పట్ల ఒకరు చింత కలిగియున్నాము. మా దేశాధ్యక్షుని ఆ విధంగా కాల్చి రక్తపు మడుగులో కుప్ప కూల్చినందుకు దుఃఖించుచున్నాము. మా దేశము ఇంత ఘోర స్థితికి వచ్చినందుకు విచారించుచున్నాము. మా దేశములో అట్టి వారున్నారు; కొంత కాలం క్రితం ఒక వర్ణ సోదరుని కూడా ఆలాగే కాల్చి చంపిరి. మానవులను ఈలాగు హత్య చేయువారున్నారు. రంగు భేదము వలన అసూయతో వారీ ఘాతుక పనికి పూనుకొనిరి.

ప్రభువా, మా మధ్య ఆలాంటి జనులున్నందుకు చింతించుచున్నాము. మా బలహీనతయే ఇందుకు కారణము. అధ్యక్షుని భార్యయగు శ్రీమతి. కెనెడీ కొరకు మేము ప్రార్థించుచున్నాము. ఆ చిన్న పిల్లలు పడియున్న తమ తండ్రిని చూచి ఎంతగా విలపించుదురు! కొద్ది రోజుల ముందు ఆయన తమతో నవ్వుతూ, ఆడెను. ఇపుడు వారికి తండ్రి లేడు. తన స్వంత భర్త యొక్క రక్తము ఆమె బట్టలకు అంటినది. ఆమె ఒడిలో ఆ రక్తము కారినది. ఆమె పిల్లలును కలిగియున్నది.

6ప్రభువా, ఆమె తప్పులో నున్నదని మేము తలంచుచుండవచ్చును. ఆమె తన వస్త్రధారణ ద్వారా అమెరికా దేశవాసులందరినీ మార్చినది. వారికది ఇష్టము. అయినా ఈ ఉదయము ఆమె కొరకు ప్రార్థించుచున్నాము. నీవు ఆమెకు సహాయము చేయుము. ఈ గాఢ సంతాప సమయములో సత్యమగు యేసుక్రీస్తును ఆమె కనుగొనును గాక! ప్రభువా, శ్రమ ఘడియలో శాంతిని, ఆదరణను ఇవ్వగలవాడవు నీవే, దానిని దయచేయుము.

ప్రకాశించు వెలుగుగా మేమందరము ఉండకలుగునట్లు ప్రభువా, మాకు సహాయము చేయుము. మా ప్రభావము ద్వారా ఏ సమయములో ఎవరు మారెదరో మాకు తెలియదు. క్రీస్తు వచ్చు వరకు ఆయన వెలుగును మేము వెదజల్లునట్లు సహాయము చేయుము. సమస్త న్యాయము ఎరిగిన ఆ గొప్ప గొర్రెల కాపరి ప్రతి పాపమును పరిహరించును. మమ్మును మేము నీ చేతులకు అప్పగించు కొనుచున్నాము. నీ ప్రేమ, కృప మా మీద ఉంచుము. యేసు నామములో అడుగుచున్నాము. ఆమేన్.

7అవును, ఎవరునూ ఆ విధంగా చనిపోవనవసరము లేదు. శ్రీ. లింకన్ ఆ విధంగా చనిపోవనవసరము లేదు. శ్రీ. మెక్కిన్లీ ఆ విధంగా చనిపోనవసరము లేదు. వ్యూలాంగ్ ఆ విధంగా చనిపోనవసరము లేదు; ఎవరూ అలాగు చంపబడకూడదు. హత్యలు నాకు గిట్టవు. అది చెడ్డది. అందుకొరకు మన పిల్లలు పెంచబడుట లేదు. మన పతాకము అందుకొరకు లేపబడలేదు. మనము అందుకొరకు అమెరికా పౌరులము కాలేదు. మన దేశము పాపములో ఇరుక్కొని, చుట్టుకొన్నది. ఈ పనులన్నియూ పాపపు ఫలితములే.

8ఆదివారపు బడి వలె నేను నడిపించగోరుచున్నాను. సంఘమునకు కొన్ని సంగతులు చెప్పవలెను. మొదటగా ఆదివారములలో ఉదయములందు ఎక్కువసేపు మిమ్మునుంచుచున్నందుకు క్షమాపణ అడుగుచున్నాను. దీనికి కారణము మీరు నా జనులు గనుక నాకు తెలిసిన బోధను మాకందించాలి. ఇతర చోట్ల ఈ సంగతులు నేను చెప్పను. సువార్త యొక్క మూల సత్యముల మీద మీరు నిలబడవలెను. ఇది చాలా బలమగు బోధ. ఇతర చోట్ల నేను చెప్పను. ఇక్కడ నా వర్తమానము ముగించుటకు రెండు మూడు గంటలు పట్టును. కొన్నిసార్లు 12:30 లేక 1:00 వరకు మిమ్మునుంచుచున్నాను. అది చాలా తక్కువ సమయము. కొన్నిసార్లు దాదాపు రాత్రంతా ఉంచాను. చాలాసార్లు 8:00 గంటలకు ప్రారంభించి, మరుసటి ఉదయము 2:00 లేదా 3:00 గంటలకు ఇంటికి వెళ్ళాము. ఈ కూటములలో అలాగే జరుగును.

9ముందే మీకు నేను బోధించు వర్తమానమును గూర్చి, అందుకు తీసికొను సమయము గూర్చి చెప్పితే బాగుండును. చెప్పకుండా అంతసేపుంచుట వలన మీరు ఇబ్బందికి గురయ్యేదరు. ఏడు బూరల గూర్చి చెప్పవలెను. ఆరవ ముద్రతో దానికి సంబంధమున్నది. ఆరవ ముద్ర విప్పబడినప్పుడు ఏడు బూరలు ఒక్కసారే మ్రోగెను. చూచారా? ఆయన రాకకు ముందు… లేక నేను వెళ్ళిపోక ముందు లేక ఏది ఏమైనా దీనిని నేను సంఘమునకు చెప్పువలసియున్నాను.

అయితే దీనిని చెప్పుముందు మీకు తెలియపరచుదుము. ఈ ఉదయాన హాలులన్నీ నిండిపోయినవి. గోడల చుట్టూ జనులు పోగయిరి. సాధ్యమైతే స్థలము చూపెదము. మూడు వేల మంది కూర్చొను చోటు ఒకటి చూచాము. అది ఒక స్కూలు ఆడిటోరియం. మన దగ్గరలోనే యున్నది. ఏడు బూరల గూర్చి అక్కడే బోధించుట జరుగును. చాలా స్థలము దొరకును, కావున జనులను ఆహ్వానించుదము.

10న్యూయార్కులో అద్భుతముగా కూటములు జరిగినవి. అక్కడి మారిస్ ఆడిటోరియంలో జరిగినవి. ప్రతి రాత్రి జనులను సర్దవలసివచ్చెను. అంతగా జనులు వచ్చిరి. ప్రజలు నిలబడి క్రిక్కిరిసియున్నచో ఆగ్నిమాపకదళము వారు ఆ స్థలములో కూటము జరుపనియ్యరు గనుక కొందరిని పంపివేయవలసి వచ్చెను. జనులు వీధులలో నిలబడిరి. కొంత సేపు కొందరు నిలబడి, ఎక్కువసేపు నిలబడిన వారిని కూర్చోనిచ్చిరి, చూచారా. ఒక్క మనిషి కొరకు కూడా వారు ఎదురుచూచిరి. కొందరయితే తమ చోట్లు ఇచ్చి ఇంటికి కూడా వెళ్ళిపోయిరి. అంతగా వారు పంచుకొనిరి. వారు చక్కని జనులు. లోకము (క్రైస్తవ సంఘము) దేవుని కొరకు ఆకలిగొనుచున్నది అని నేను నమ్ముచున్నాను.

11ఆ చివరి ఏడు బూరలను గూర్చి మనమంతా నేర్చుకొను అవకాశము దేవుడు ఇచ్చునని నమ్ముతున్నాను. (సోదరుడా, వందనములు) మీరు ఆ సంగతులు తెలిసికొనునట్లుగా నేను నడిపించబడవలెను.

అక్కడ పనివారల అల్పాహార విందు ఏర్పాటు చేసిరి. ఏబది నుండి వంద మంది వరకు ఆ చోటికి వచ్చిరి. ఆ ఉదయము 1700 టిక్కెట్లు అమ్ముడయినవి. మిగిలిన వారందరు నిలబడిరి. ఆ చోటు నిండిపోయినది. వసారాలు, గోడలు, మెట్లు అన్నీ నిండిపోయినవి. జనులు నిలబడియుండిరి. వర్తమానము వినుటకు పేరు పొందిన సేవకులు, కొందరు మతాధికారులు వచ్చిరి. వారికది కొంత సహాయపడును. నేను తలంచిన దానికంటే ఎక్కువగానే వారికి అది సహాయపడియుండును.

12ఈ రాత్రి ప్రభుని చిత్తమయితే, క్రీస్తుతో నీ పరిస్థితి ఎట్లున్నదను అంశము మిద ప్రసంగించెదను. క్లుప్తముగా ఉండును. 7:30కు వేదిక మీద నుండగోరుచున్నాను. మామూలుగా మీరు 7:30కు ప్రారంభించేదరా? 7:00 గంటలకయితే, నేను 7:30 కు వేదిక మీద ఉందును. ప్రభుని చిత్తమయితే, 8:30కు ముగించెదను. వీలయినంత త్వరగా ముగించుట నేర్చుకొనగోరుచున్నాను.

13బహుశా కొందరు క్రొత్తవారు నవ్వుచుందురు, ఎందుకనగా నేను త్వరగా ముగించినా జనులను విడిచి వెళ్ళలేను. జనులు మన కొరకు కూడి వచ్చినప్పుడు త్వరగా తెంపుకొని పోలేమని నా తల్లి ఒక సామెత చెప్పెడిది. నెమ్మదిగా కదులుదుము. నేను వర్తమానమును నెమ్మదిగా చెప్పెదను, ఎందుకనగా ఆది దేవుని చెరకు గడ. ఎంత నమిలినా ఇంకా తీపిగా నుండును. అంతేగాని మరో ఉద్దేశ్యము లేదు. మనము నిలబడి ఆ పాట పాడే వారము:

బంధించు ముడి దీవెనకరము.

క్రైసవ ప్రేమలో మన హృదయములు ఏకమవును.

ఒకే మనస్సు గల వారి సహవాసము

పైనున్న దానికి సమానము. (చూచారా?)

మనము విడిపోవునప్పుడు,

అంతరంగ బాధ కలుగును;

అయినా వృదయములో ఇంకా కలిసే యుందుము,

మరల కలిసికొందుమను నిరీక్షణ యున్నది.

ఎల్లప్పుడూ అదే మన గురి. ఎందరో ముసలి పరిశుద్ధులు మనలను విడిచి వెళ్ళిరి, కాని హృదయాలలో ఇంకా కలిసే ఉన్నాము. ఒక ఉదయాన వారిని దర్శనంలో చూచాను. ఆ స్త్రీ పురుషులు యవ్వనములో తిరిగి కనబడిరి. వారు ఈ భూమి మీద నున్నట్లే యున్నారు. మన రాక కొరకు వారు ఎదురుచూచుచున్నారు. ఒక దినమున దేవుని చిత్తమయితే, వారిని కలిసికొందుము.

14ఆరాధనలు మరువకండి, పాటలు 7:00 గంటలకు ఆరంభమగును. 7:30కు కాదు. వచ్చేవారము లూసియానాలోని శ్రీవ్-పోర్టులో ఉందును. వారు ఒక ఆడిటోరియమును తీసికొందురు. గత రాత్రి సహోదరుడు మూర్ నాతో మాట్లాడెను. అది వార్షిక సభ గనుక చాలామంది వత్తురని ఆశించుచున్నారు.

15వాక్యము చదువు ముందుగా చిన్న సాక్ష్యమును ఇవ్వగోరుచున్నాను. ఒకరి కొరకు ఒకరు ప్రార్థించినప్పుడు ఆ ప్రభావమెట్లుండునో చెప్పెదను వినండి. సహోదరుడు రాడ్ని కాక్స్ భార్య మార్గీ కాక్స్ ను నేను చూచాను. గత వారము ఇది జరిగినది. ఆలయంలో వివేచన కొనసాగుతున్నది. ప్రజలు మాట్లాడుతున్నారు. ఆమె ఇక్కడే కూర్చొన్నది. అక్కడే మధుమేహ వ్యాధిగల మరో స్త్రీ కూర్చొన్నది. దర్శనంలో మార్గీ నిలబడియుండుట చూచాను, కాని వెలుగు ఆ మరో స్త్రీ మీద ఉన్నది.

నేను గమనించాను. మార్గీని పిలచినచో అందరికీ తెలియును, ఎందుకనగా ఆమె భర్త ఒక ప్రాణ స్నేహితుడు. కలిసి జీవించాము, కలిసి నిద్రించాము, కలిసి వేటాడాము. కాని మార్గీకి ఇది తెలియదు. కాని నేను షికాగో నుండి వచ్చిన మరో స్త్రీని నేను పిలచాను.

16వారు మధుమేహ పరీక్ష చేయుట చూచాను. ఆమెకు ఆ వ్యాధియున్నది. ఆ ముందు రోజు ఆమె వైద్యశాలకు వెళ్ళెను. నేను ఆమెకు ఇవన్నీ చెప్పాను. మార్గీ సోదరిని రమ్మని పిలిచాను. ఆమె వ్రేళ్ళు స్పర్శను పోగొట్టుకొని ఎంతగా బాధపడుచున్నదో చెప్పాను. ఆమె దివారాత్రులు పనిచేయును. ఆ దీన సోదరి తన భర్తకు సాయపడి ఇల్లును కట్టుటలో దోహదపడుచున్నది. ఆమె చిన్న సోదరి నెల్లి మరియు చార్లీ (రాడ్నీ సోదరుడు) అతని భార్య మొదలగు వారందరూ ఒకే ఫ్యాక్టరీలో కలిసి పనిచేయుచున్నారు. వారు కలిసికట్టుగా నిందను భరించుచున్నారు. వారు జుట్టు పెంచుకొనుచున్నారు, మేకప్ చేసికొనరు; క్రైస్తవులుగా జీవించుచున్నారు. మెచ్చు కోవలసిన వారిని నేను మెచ్చుకొందును. ఆ ఇద్దరు యువతుల పట్ల నా హృదయంలో ఎంత అనురాగమున్నది.

ఆమె చేయి పట్టుకొని ప్రార్థించాను. ఆమె వెళ్ళిపోయినది. మధుమేహ వ్యాధి చిహ్నములే ఆమెలో కనబడలేదు. పూర్తిగా పోయినది. పిలువబడిన మరో స్త్రీ ఇక్కడ కూర్చొనియున్నది. ఆ సోదరి పేరు బ్రూస్. ఈ ఉదయము ఆమె నాకు కనబడలేదు. ఆమె గూర్చి ఎంతో ప్రార్థించవలెను. ఆమెకు ప్రార్థన కార్డు లేదు. ప్రార్థన వరుసలో లేదు.

జనులలో నుండి పరిశుద్ధాత్మ పిలచెను.

17ఒకప్పుడు కాన్సరు నుండి ఈ బ్రూస్ స్వస్థత పొందెను. ఆమె ఎప్పుడూ ఇతరుల పట్ల భారము కలిగి ప్రార్థించుచుండును. లూయస్ విల్ నుండి ఒక స్త్రీ మరణావస్థలో వచ్చినది. ఆమెకు గొంతు కాన్సరు. ఆమె ప్రార్థించుచుండగా పరిశుద్ధాత్మ ఆమె యొద్దకు వెళ్ళెను. ఆమె ఎవరో, ఆమె వ్యాధి ఏమిటో తెలియచేసెను. కాన్సరు గూర్చి చెప్పెను. ఆమె బాగవునని చెప్పెను. ఆ స్త్రీ ఇంటికి వెళ్లెను. ఆ తరువాత రెండు రోజులకు ఆమె చావ సిద్ధమైనది. గొంతు బాగా వాచినది. దగ్గు వచ్చెను. ఆ కాన్సరు ఎగిరిపోయెను. ఆమె సంపూర్ణ ఆరోగ్యములో యున్నది, చూచారా.

18కాన్సరు అను వైద్య పదమునకు "పీత" అని అర్థము. అనగా దానికి చాలా కాళ్ళున్నవి. సముద్రపు పీత నీ రక్తమును పీల్చును. ఆమె గొంతులోని కాన్సరు కూడా ఆలాగే యున్నది. నేను ఆ వాపును గూర్చి చెప్పుట లేదు గాని ఆ వాపుకు కారణమైన దాని గూర్చి చెప్పుచున్నాను. ఆ వాపులోనే జీవమున్నది, చూచారా. "నా నామమున వారు దయ్యములను వెళ్ళగొట్టుదురు." దయ్యము అనగా "యాతన పెట్టునది." శరీరమును ఈ దయ్యము యాతన పెట్టును.

మరియు అప్పుడు జీవము ఆ వాపులో నుండి వెళ్ళిపోయినది, అవును, మరియు ఆ వాపు ఉబ్బుట ప్రారంభమైనది.

MARK 16:17

 

19వీధిలో పరుగెత్తుచున్న కుక్కను కొద్దిరోజులు ఎండలో ఉంచండి. అది రెండింతలు పెద్దదగును. ఆ స్త్రీ కూడా అలాగే యున్నది. దానిని గూర్చి చాలాసార్లు మీకు వివరించాను: నీవెప్పుడు పూర్తిగా దిగజారెదవో, అప్పుడే నీవు బాగుపడుదువు. ఆ వాపు ఆమెను బాగా దిగజార్చినది. దానిలో నుండి జీవము పోవలెను. ఆమె దగ్గినది. [సహోదరుడు బ్రెన్హాం దగ్గెను.] వెంటనే ఆమెలో నుండి అది బయటకు వచ్చెను. అది చచ్చిన శరీరము. (దానిలో జీవము లేదు, కాన్సరు పోయినది) బయటకు వచ్చినది, చూచారా, వెళ్ళిపోయినది.

HEB 13:8

 

20దయ్యము బయటకు పోవుట కాదు గాని, ఆ శరీరము ఊడిపోయినది. ఆ దయ్యము అందులో నివసించెను. ఆ స్త్రీ విశ్వాసమే దానికి కారణము. యేసుక్రీస్తు నిన్న, నేడు, నిరంతరము ఏకరీతిగా యున్నాడని ఎరుగును. అదే కాన్సరును చంపెను. దాని జీవము ఊడిపోయెను. ఆమె తిరిగి వైద్యుని యొద్దకు వెళ్ళగా ఇట్లు అతడు చెప్పెను, "ఏమి జరుగలేదు. అంతా మొదటి వలె యున్నది." అవును. ఆ వాపు ఉన్నది గాని, అందులో జీవము లేదు, చూచారా.

21[సహోదరుడు నెవిల్ సహోదరుడు బ్రెన్హాంతో మాట్లాడెను.] ఇండియానాలోని స్ట్రింగ్ విల్ నుండి వచ్చిన శ్రీమతి. బేకర్ యొక్క కాన్సరు ప్రార్థన వలన పోయినది. ఆ ఫోటో చూడండి. ఆ శరీరములో దయ్యము జీవించినది. ఆ శరీరము చిన్నదే కావచ్చు, పెద్దవే కావచ్చు, ఎర్రగా ఉండవచ్చు, నల్లగా ఉండవచ్చు. ఈ శరీరములో దయ్యమైనా ఉండాలి లేదా క్రీస్తయినా ఉండాలి. ఆ జీవము పోయినా నీ శరీరము ఇంకా భూమి మీదే యుండును. కాని దాని జీవము అందులో లేదు. దానిని శరీరము నుండి వేరు చేసి పంపేశాము. కాని హృదయము లేదా గుండె రక్తమును శుభ్రము చేయును. క్రిముల వలన జ్వరము వచ్చును. గుండె రక్తమును శుద్ధి చేయును. డాచ్ సోదరీ ఇది నిజమేనా? అది సరియే. (ఆమె ముందు కూర్చున్న నర్సుకు తెలియును) క్రిముల వలన జ్వరము వచ్చును. అంటువ్యాధి.

22మీ విశ్వాసమే పని చేయును; మీ భావనలు కాదు. నా చేయి కాదు. అందువలన ఏమి కాదు. విశ్వాసము ద్వారా సంపూర్తిగా స్వస్థత పొందిన ఒక మనిషిని మన ఎదుటే ఇప్పుడు చూచుచున్నాము. మీరును అడుగు వెంబడి అడుగు వేసి ఆ వ్యక్తి వలెనె నడచుకొనుడి, చూచారా. అందువలన క్రియ జరుగును. మీ విశ్వాసమే గాని మీ భావనలు కాదు. దేవునికి మనము వందనములు, స్తుతి చెల్లించవలెను.

23మనము ఆలోచించవలసిన ఒక అంశము ఇచ్చటున్నది. ప్రభుని చిత్తానుసారము కొద్ది సమయము నేను దాని మీద బోధించెదను. ఈ ఉదయము మీలో కొందరు వెళ్ళిపోవలసియున్నారనుకొందును. ప్రభుని చిత్తమయితే, తిరిగి సాయంకాలము ఇచ్చటకు వచ్చెదను. క్రిస్మస్ వారము నా కుటుంబము ఇచ్చటకు వచ్చును. ప్రభుని చిత్తమయితే క్రిస్మసు తరువాత ఆదివారము ఈ ఆలయములో నా క్రిస్మస్ వర్తమానమును అందించెదను. "వీధిలోని ఒక అనాధ," అను అంశము మీద దేవుని చిత్తమయితే బోధించెదను. ఇప్పుడు మన అంశమునకు వెళ్ళు ముందుగా తలలు వంచి ప్రార్థించుదము.

ACTS 20:7,9,10

 

24ప్రభువైన యేసూ, ఈ సమయములో నీవు మా యొద్దనే యున్నావు.

మా చిన్న సంఘములో చోటు లేక చాలామంది నిలబడియుండుట నీవెరుగుదువు. సుఖముగా కూర్చొనవలెనని ఇచ్చటకు మేము రాలేదు. శరీర సుఖము అక్కరలేదు. ఎవరికో కనబడవలెనని ఇచ్చటకు రాలేదు. నీ సన్నిధి ఆశించి ఇచ్చటకు మేము వచ్చి యున్నాము. నీవిక్కడున్నావని మాకు తెలియును. దిద్దుబాటు కొరకు ఇచ్చటకు మేము వచ్చియున్నాము. దేవుని ఇంటిలో యున్నామని మేమెరుగుదుము. ఇక్కడుండుట మాకెంతో బాగున్నది. ఎంత అసౌకర్యముగా నున్నాగానీ, నిలబడవలసి వచ్చినా, క్రిక్కిరిసియున్నాగాని దేవుడిచ్చటున్నాడని మేము ఎరిగి ఇచ్చటకు వచ్చాము.

పౌలు ఆ రాత్రి ఎంతో దీర్ఘ ప్రసంగము చేసినప్పుడు, అతడు కూడా అలాగే తప్పక తలంచి యుండును. సూర్యాస్తమయము నుండి సూర్యోదయము వరకు బహుశా ప్రసంగించి యుండును. పైన కూర్చొనిన యువకుడు పడిపోయెను. అతని పని అయిపోయినదని జనులు తలంచిరి. పౌలు అతనిని తన శరీరము మీద వేసికొనెను. ఆ వర్తమానికుని మిద నున్న దేవుని ఆత్మ అతని శరీరములోనికి తిరిగి వచ్చినది. ఆ యువకుడు బ్రదికెను.

పౌలు చెప్పేదానిని ఆసక్తితో అతడు వినగోరెను. దేవా, ఈ ఉదయమున పరిశుద్ధాత్మ మాతో చెప్పేది వినవలెనని మేమును ఆసక్తిని కలిగియున్నాము. మా ప్రతి ఒక్కరికి జీవాహారమును విరచి పంచుము. వచ్చినప్పుడు ఉన్న వ్యక్తి వలె వెళ్ళకుండా మాకు దీవెన ఇమ్ము. క్రైస్తవులు నీకు మరింత చేరువవుదురు గాక! పాపులు మారుదురు గాక! రోగులు బాగవుదురు గాక! దేవుని రాజ్యము మా దగ్గరకు వచ్చుగాక! మా లోనికి వచ్చు గాక! మాటలు ఇవ్వవలెనని ఆత్మ మీద ఆనుకొనియున్నాము. దీనిని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము. ఆమేన్.

MATT 27:11-26

 

25వాక్యము చదువుదము. దేవుని వాక్యము ఎల్లప్పుడూ మంచిదే. నిలబడియున్న వారిపట్ల మీ ప్రతి ఒక్కరు దయ చూపండి. కొందరు తమ చోట్లు నిలబడిన వారికిచ్చి వారు నిలబడుట నాకు కనబడుచున్నది. అది చాలా మంచిది. ఎక్కువ చోటున్నచో మనకు బాగుండెడిది, కాని ఈసారికి ఇంతే.

మత్తయి 27 త్రిప్పండి. 11 వ వచనము నుండి చదువుదము. ఈ అంశము మీద మాట్లాడుదును:

యేసు అధిపతి ఎదుట నిలచెను. అప్పుడు ఆధిపతి - యూదుల రాజవు నీవేనా? అని ఆయన నడుగగా, యేసు అతని చూచి - నీవన్నట్టే అనెను.

ప్రధాన యాజకులును, పెద్దలును ఆయన మీద నేరము మోపినప్పుడు ఆయన ప్రత్యుత్తరమేమియు ఇయ్యలేదు.

కాబట్టి పిలాతు - నీ మీద వీరెన్ని నేరములు మోపుచున్నారో నీవు వినలేదా? అని ఆయనను అడిగెను.

అయితే ఆయన ఒక మాటకైనను అతనికి ఉత్తరమియ్యలేదు. గనుక అధిపతి మిక్కిలి ఆశ్చర్యపడెను.

జనులు కోరుకొనిన ఒక ఖైదీని పండుగలో విడుదల చేయుట అధిపతికి వాడుక.

ఆ కాలమందు బరబ్బ అను ప్రసిద్ధుడైన ఒక ఖైదీ చెరసాలలో ఉండెను.

కాబట్టి జనులు కూడి వచ్చినప్పుడు పిలాతు - నేనెవనిని విడుదల చేయవలెనని మీరు కోరుచున్నారు? బరబ్బనా లేక క్రీస్తనబడిన యేసునా? అని వారిని అడిగెను.

ఏలయనగా వారు అసూయ చేత ఆయనను అప్పగించిరని అతడు ఎరిగి యుండెను.

అతడు న్యాయ పీఠము మీద కూర్చుండియున్నప్పుడు, అతని భార్య - నీవు ఆ నీతిమంతుని జోలికి పోవద్దు. ఈ ప్రొద్దు ఆయనను గూర్చి నేను కలలో మిక్కిలి బాధపడితినని అతని యొద్దకు వర్తమానము పంపెను.

ప్రధానయాజకులును పెద్దలును బరబ్బను విడిపించుమని అడుగుటకును, యేసును సంహరించుటకును జన సమూహములను ప్రేరేపించిరి.

అధిపతి - ఈ ఇద్దరిలో నేనెవరిని విడుదల చేయవలెనని మీరు కోరుచున్నారని వారినడుగగా వారు - బరబ్బనే అనిరి.

అందుకు పిలాతు - అలాగైతే క్రీస్తునబడిన యేసును ఏమిచేతునని వారినడుగగా - సిలువ వేయుమని అందరును చెప్పిరి.

అధిపతి - ఎందుకు? ఇతడు ఏ దుష్కార్యము చేసెనని అడుగగా, వారు సిలువ వేయుమని మరి ఎక్కువగా కేకలు వేసిరి.

పిలాతు - అల్లరి ఎక్కువగుచున్నదే గాని తన వలన ప్రయోజనమేమియు లేదని గ్రహించి నీళ్ళు తీసికొని, జన సమూహము ఎదుట చేతులు కడుగుకొని ఈ నీతిమంతుని రక్తమును గూర్చి నేను నిరపరాధిని, మీరే చూచుకొనుడని చెప్పెను.

అందుకు ప్రజలందరు - వాని రక్తము మా మీదను, మా పిల్లల మీదను ఉండుగాకనిరి.

అప్పుడతడు వారు కోరినట్టు బరబ్బను వారికి విడుదల చేసి, యేసును కొరడాలతో కొట్టించి సిలువవేయనప్పగించెను.

26ఎంత విషాద దృశ్యము! నా అంశము చెప్పెదను. టేపు చేయు వారికి

పేరు కావలెను. దాని పేరు ఇది: "క్రీస్తనబడిన యేసును నేనేమి చేతును?" నా అంశమునకు, మీ చేతులలోని యేసు అనియు పేరు పెట్టెదను. యేసు మీ చేతులలో నుండగా, మీరేమి చేసెదరు?

27మన రంగము ఈ ఉదయమున తీర్పు హాలు నుండి ప్రారంభమగును. గవర్నరగు పిలాతును తీర్పు ఇమ్మని పిలచిరి. అది వేకువ సమయము. అప్పుడే తెల్లవారినది. అతని నిద్రకు ఆటంకమేర్పడినది. ఈయన కేసును తీర్చమని అడిగిరి.

మన ప్రభువును, రక్షకుడును అగు యేసుక్రీస్తు యొక్క సిలువ మరణ సమయమది. వారాయనలో ఏమియూ కనుగొనలేకపోయిరి. ఆయన వారికి జవాబు చెప్పెను. ఆయనేమి చేయలేదు. ఆ విధముగా ఉండవలసిన ఘడియ అది. ఆ విధముగా జరుగుటకు దాని వెనుక ఏదీ లేకుండా పోలేదు. జరుగు ప్రతిదానికి ఒక కారణమున్నది. మానవులలో నున్న ఆత్మ ప్రేరణయే దానికి కారణము. దానికి ఒక కారణముండెను. ఆయన కంటే ఈ భూమి మీద జీవించిన వారిలో గొప్ప వారెవరూ లేరు. ఆయనకు ఈ విధంగా జరిగినది. అది ఆ విధంగా జరుగవలసిన ఘడియ. ఆలాగది ఉండవలెను. దానిని ఎవరూ తప్పించలేరు. అది అట్టి సమయము. ఆయన ఏ విధముగా వచ్చునని దేవుని వాక్యములో ముందుగా చెప్పబడెనో, అక్షరాలా ఆయన ఆ విధంగానే వచ్చెను. ఆయన ఏమి చేయునని వాక్యములో చెప్పబడెనో ఆ పనినే చేసెను. సరిగ్గా అలాగే ఆయన జీవించెను. ఆ సమయపు విత్తనమును దేవుడు బయలుపరచి తెలియచేసెను.

28బైబిలు ఆదికాండము నుండి ప్రారంభమై ప్రకటనతో అంతమగును. మిరిది గ్రహించవలెనని కోరుచున్నాను. ప్రతి తరములోను ఒక ప్రత్యేక కార్యము జరుగునని బైబిలు చెప్పుచున్నది. దానియేలు నెబుకద్నెజరు యొక్క కల భావమును చెప్పెను. అన్య రాజ్యములు లేచును, పోవును. ఆ దర్శనములో చూచినట్లే అన్య రాజ్యములు, జాతులు ప్రపంచమును ఏలినవి.

29నెబుకద్నెజరు గతించెను (బంగారపు శిరస్సు) తరువాత మాదీయ పారశీకులు వచ్చిరి. వారి స్వభావము ప్రవక్త చెప్పిన ప్రకారమే యుండెను. బంగారు శిరస్సు అగు నెబుకద్నెజరు ప్రధముడగు గొప్ప రాజు. మాదీయ పారసీకులు వెండిగా ఫోల్చబడిరి. తొడలు ఇత్తడివి. పై నుండి క్రిందికి వచ్చిన కొలది లోహము గట్టిదిగా నుండెను. (బంగారము మెత్తనిది) చివరగా ఇనుము వచ్చెను. అది అన్నింటికన్న గట్టిది. ఆ ప్రవక్త ఏ విధముగా ఉండునని చెప్పెనో, అదే స్వభావములో ఆ రాజ్యములుండెను. ఆయనేమి చేయుచున్నాడు? దేశములు గమనించవలెనని ఆయన విత్తనము చల్లుచున్నాడు? ప్రతి కాలములోను ఆయా రాజ్యములు వాక్యములో చెప్పినట్లే యుండినవి.

DEUT 18:15

 

30ఆ తరువాత రంగము మీదికి మెస్సీయా వచ్చెను. ఆయన రంగము మీదికి వచ్చి ప్రవక్తలు ఆయన గూర్చి చెప్పిన ప్రవచనములను ఆయన నెరవేర్చెను. "ఆయన నా వంటి ప్రవక్తగా ఉండును," అని మోషే చెప్పెను. మనకు సమయమున్నచో ఆ అద్భుతమగు మాదిరిని చూపించెదను. ఐగుప్తులో ఇశ్రాయేలీయులు దాసులగా నుండిరి. మోషే ఒక వింత బాలునిగా జన్మించెను. అతనిని ఎట్లు దాచి పెంచిరో మనకు తెలియును. చివరకు అతడు ఒక నాయకుడయ్యెను. పర్వతములోనికి వెళ్ళెను. ధర్మశాస్త్రము తీసికొని వచ్చెను. నాయకుడే కాక యాజకుడు, రాజు, పరిపాలకుడు. క్రీస్తులో ఇవన్నియూ అక్షరాలా నెరవేరేను. "మీ ప్రభువగు దేవుడు నా వంటి యొక ప్రవక్తను మీలో పుట్టించును," అని మోషే చెప్పెను, చూచారా.

MATT 5:27,28

 

31క్రీస్తు జన్మించినప్పుడు ఇశ్రాయేలీయులు మరల చెరలో నుండిరి. రోమా సామ్రాజ్య దాస్యములో నుండిరి. ఆయన ఒక వింత బాలునిగా పుట్టెను. ఆలాగే పెరిగెను. ఆయన కొండలలోనికి వెళ్ళెను. ఈలాగు చెప్పెను, "దొంగతనము చేయవద్దు, వ్యభిచారము చేయవద్దు అని పూర్వము మీతో చెప్పబడినది విన్నారు కదా? కాని ఒక స్త్రీని మోహపు చూపుతో చూచువాడు అప్పుడే ఆమెతో వ్యభిచరించి యున్నాడని నేను మీతో చెప్పుచున్నాను." ఒక ధర్మశాస్త్రమిచ్చువాడు (చూచారా), ఒక రాజు, ఒక యాజకుడు, ఒక ప్రవక్త. ఖచ్చితంగా మోషే వలె ఉన్నాడు. కాబట్టి ఇవన్నియూ నెరవేరవలెను. మెస్సీయా జీవితములో ఇవి జరుగవలెను. చక్కగా ప్రత్యక్షమైనవి…

ఇదే నేను చివరగా బోధించు పెద్ద పాఠము కావచ్చు. జాగ్రత్తగా వినవలెనని కోరుచున్నాను.

32ఈ ప్రత్యేక తరము కొరకు వాక్యము చెప్పబడినప్పుడు, ఆ వాక్యమును నెరవేర్చుటకు రంగము మీదికి ఎవరో ఒకరు రావలెను, ఎందుకనగా దేవుడు దానిని పలికెను. యేసు అన్ని అర్హతలున్నవాడు. మెస్సీయాగా ప్రత్యక్షపరచబడెను. చివరి దినము కొరకు కూడా వాక్యములున్నవి. అవి కూడా జీవమును పొందవలెను.

MATT 12:31,32•

MARK 3:28•

LUKE 12:10•

HEB 4:12

 

33మన ప్రభుని దినములలో పిలాతు యొక్క తీర్పు హాలులోనికి రాక ముందే సంఘము ఆయనను విసర్జించెను. వాక్యమును గూర్చి సత్యము చెప్పుచూ, ప్రవచించ ప్రారంభించిన ఆయన పరిచర్య తొలినాట నుండియే వారాయనను తిరస్కరించిరి. మానవునిగా నుండిన ఆయన జనుల హృదయములలోని సంగతులు ఎట్లు చేసెనో వారికర్థము కాలేదు. వాక్యమే దేవుడని వారెరుగరు. "వాక్యము ఆలోచనలను, హృదయ రహస్యములను వెలికి తెచ్చునది," అని బైబిలు చెప్పెను.

వారాయనను ఒక దురాత్మగా పిలచిరి. "అందుకు నేను మిమ్మును క్షమించెదను, కాని పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు దానికి విరోధముగా ఒక్కమాట మీరు మాట్లాడినా క్షమాపణ ఉండదు," అని ఆయన చెప్పెను. ఆయన ప్రవచించిన వన్నియూ నేడు జరుగవలసియున్నవి. కాని అవి జరిగినప్పుడు మానవులు తలంచిన దానికి భిన్నముగా కనబడును. ఏర్పరచబడిన వారు మాత్రమే దానిని చూడగలరు. దానిని ఏర్పాటు చేసికొనిన వారు మాత్రమే చూచుట ఎప్పుడూ జరుగుచున్నది, ఎందుకనగా దానిని చూచుటకు ఏర్పరచబడిన వారే ముందుగా అభిషేకించబడిరి.

కాబట్టి అది మరో రీతిగా యుండదు.

ISA 6:9,10•

MATT 13:14,15•

JOHN 6:37,44•

ACTS 28:25,26

 

34"తండ్రి మొదట ఆకర్షించితేనే గాని ఎవడును నా యొద్దకు రాలేడు. తండ్రి నాకనుగ్రహించిన వారందరూ నా యొద్దకు వచ్చెదరు," అని యేసు చెప్పెను, చూచారా. కాబట్టి మరో దారిలేదు. "కన్నులుండియు మీరు చూడరు; చెవులుండియు వినరు; యెషయా మీ గూర్చి సరిగానే ప్రవచించెను," అని ఆయన చెప్పెను. యెషయా ప్రవచనము దానిని బయలుపరచినది. దేవుని మాట బయలుపరచబడునని మీరు మరచిపోవద్దు. (ఇక్కడున్న వారు, టేపు వినువారు) అది నెరవేరునట్లు దేవుడు చేయును.

క్రీస్తు రాకను ముందుగా ప్రకటించుటకు బాప్తిస్మమిచ్చు యోహాను నిర్ణయించబడెను. ఆ వాక్యము నెరవేరుటకు ముందుగా ఒక వ్యక్తి పుట్టవలసి యుండెను.

LUKE 4:21

 

35అభిషిక్తుడగు మెస్సీయాగా యేసు వచ్చెను. ఆయన గూర్చి వాక్యములో చెప్పబడినదంతయూ ఆయన చేసెను. అయినాగాని యూదులు ఇంకా దేనికొరకో ఎదురుచూచుచుండిరి. ఇనుప దండము చేబట్టి ఒక రాజు వచ్చెను. (చాలా మందు భవిష్యత్తులో) ఆయన ప్రతి వాక్యమును నెరవేర్చెను. ఒకనాడు కపెర్నహూములో ఆయన వాక్యము చదివెను. ఆయన వాక్యములో సగ భాగము చదివి, ఆపెను. మీరు గ్రహించారా? "నేడు ఈ లేఖనము నెరవేరియున్నది" అని చెప్పెను.

LUKE 4:18,19,21

 

36మిగిలిన భాగమును ఆయన ఎందుకు చదువలేదు? ఎందుకనగా అది ఆయన మరో రాకకు చెందినది. వారు దానిని గూర్చి తెలిసికోనవసరము లేదు. ఆయనున్న కాలములో వాక్యము నెరవేరెను. "నేడు మీ ఎదుట ఈ వాక్యము నెరవేరియున్నది," అని చెప్పెను. పాత వత్సరము ప్రకటించుటకును, నలిగిన హృదయము గల వారిని బలపరచుటకును, రోగులను బాగుచేయుటకును వచ్చెను. తక్కిన భాగము అన్యులకు తీర్పు చేయుటను గూర్చినది. మొదటగా అన్యులు ఆయనను నిరాకరించవలెను.

ISA 61:1,2

 

37నేడు మన అంశము సిలువ మరణమును గూర్చినది. యేసు వారి చేతులలో యున్నాడు. దేవుని వాక్యము పూర్తిగా బయలుపరచబడును. ఎన్నోసార్లు రుజువు చేయబడెను. దేవుని వాక్యమునకు ఆయనే జవాబు అని చెప్పబడెను. దేవుడు దానిని ముందే బయలుపరచెను. దానిని వారు ఆధ్యయనము చేయవలెను. కాని చూడండి, వారు మరెవరి మాటనో తీసికొనిరి; ఏదో ఒక గుంపు వారి మాట తీసికొనిరి.

సత్యము పట్ల వారెంతో అంధులుగా నున్నారు. సత్యము వారి ఎదుటకు వచ్చినా వారు చూడలేకపోయిరి. కాని చూడండి, దేవుడు న్యాయవంతుడు. దానిని ఆయన వ్రాయించెను. నేడు జరుగనైయున్న దానిని ఆయన ఈ గ్రంధములో వ్రాయించెను. గనుక అది నెరవేరెను. కాని దానిని చూచుటకు ముందుగా నిర్ణయించబడని వారు ఎన్నడూ దానిని చూడరు. వారికిది చాలా తికమకగా ఉండును.

MATT 3:10,11•

LUKE 3:9,16•

JOHN 1:26,27•

JOHN 3:30

 

38అప్పుడు కూడా అలాగే యుండెను. ఆయనను వారెన్నడూ గుర్తించలేదు.

గురుతును బట్టి ఆ కాలపు వర్తమానికుడు ఆయనే. దానినెవరూ కాదనలేరు. ఆయన ప్రవక్త దాని గూర్చి చెప్పెను, "నేను తగ్గవలెను, ఆయన హెచ్చవలెను. ఆయన చెప్పుల వారు విప్పుటకైనను నేను యోగ్యుడను కాను. ఆయన మీ మధ్యనే నిలబడియున్నాడు," అని యోహాను చెప్పెను. "ఆయన వచ్చును. గొడ్డలి చెట్టు వేరున ఉంచబడియున్నది. మంచి ఫలములు ఫలించని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడును. ఆది ఇక ఇక్కడ ఉండదు."

MATT 16:20,21•

MATT 20:18,19•

MARK 10:33,34•

LUKE 18:31-33

 

39ఆయన చెప్పినట్లే ఆ సంగతులు జరిగెనని మనమెరుగుదుము. వారి హృదయాలోచనలను ఆయన ఎరిగెను. ఆయన ఒక ప్రవక్త. ఆయన ప్రవచించిన ప్రతిదియు అక్షరాలా అలాగే జరిగెను. "నేను యెరూషలేముకు వెళ్ళుచున్నాను. పాపుల చేతికి అప్పగించబడుదును." వారాయనను ఎంతో హింసించిరి. ఆయనను సిలువ వేసిరి. మూడవ దినమున ఆయన తిరిగి లేచెను. "దీనిని ఎవరితోను చెప్పవద్దు," అని ఆయన పలికెను. అది నెరవేరు వరకు వారికి అది తెలియకుండునట్లు అది వారి కన్నులకు మరుగాయెను. అవసరమగు ఘడియ వచ్చువరకు అది మనకు తెలియచేయబడకుండా అనేకసార్లు జరుగును. నేడు మనము చూచుచున్న సంగతుల విషయములో ఆయన మనకు గ్రడ్డితనము కలుగచేసెను. నేడు మనము జీవించుచున్న ఈ దినములోనే అది బయలుపరచబడవలసిన అవసరమున్నది.

40చూచారా, మన తండ్రులు ఈ సంగతులు ఎరుగరు. వారు ఎరుగరని బైబిలు చెప్పుచున్నది. అది వారికి మరుగు చేయబడెను. చివరి దినములలో దేవుని కుమారులకు అది బయలుపరచబడును. భూమి మీద ఆయన మహిమ, గొప్పతనము వెల్లడియగునట్లు అది బయలుపరచబడును.

DAN 11:32

 

41"తమ దేవుని ఎరుగువారు గొప్ప కార్యములు చేయుదురు" అని దానియేలు ఈ చివరి దినముల గూర్చి చెప్పెను. నేడు మనము జీవించుచున్న ఈ దినమునకు సరిపోవు ఎన్నో వచనములున్నవి. భూమి మీద ఈ చెడు, మోసకరమగు దినములుండునని చెప్పబడెను. అక్షరాలా అట్టి రోజులే ఇవి. వారాయనను చూచునట్లు అవకాశమియ్యబడెను, కాని వారి మెస్సీయానే వారు నిరాకరించిరి. నేడును అలాగే జరుగుచున్నది. మనకు అవకాశమియ్యబడెను, ఎందుకనగా మొదట అవకాశమియ్యకుండా దేవుడు తీర్పు తీర్చలేడు. అప్పుడే ఆయన న్యాయవంతుడగును. ఒక వ్యక్తి అతి వేగముగా రోడ్డు మీద వెళ్ళుచున్నచో నీవు ఆపెదవు. "ఆ రోడ్డు మీద గొయ్యి ఉన్నది. ఆ వేగంలో వెళ్ళినచో నీవు చచ్చెదవు," అని చెప్పెదవు.

"నాకు తెలియును, నీవు ఏమి చెప్పనక్కర్లేదు," అని అతడన్నచో ఆ రక్తాపరాధము నీ మీద ఉండదు, ఎందుకనగా నీవు చాలా హెచ్చరించావు. దేవుడు కూడా తన వాక్యముతో అలాగే హెచ్చరించును. రానున్న తీర్పు గూర్చి ముందుగానే ఆయన హెచ్చరించును. ఆ కాలమునకు సంబంధించి బైబిలులో చెప్పబడిన గురుతులు, సూచనలను ఆయన చూపును. ఆయన చూపినా జనులు లెక్క చేయరు. ఒక వ్యక్తి నరకమునకు పోవుట తేలిక కాదు. ఒక వ్యక్తి నరకమునకు ఎంతో పోరాడి వెళ్ళును. నీవు మొదటగా ఆడిన అబద్ధము తప్పు అని నీవెరుగుదువు. నీవు త్రాగు సిగరెట్టు తప్పు అని నీవెరుగుదువు. నీవు చేసిన మొదటి తప్పును నీవెరుగుదువు. అది తప్పు అని నీ మనస్సాక్షి నీకు చెప్పెను, కాని నీవు ఆ ఎర్ర దీపమును లెక్క చేయక దాటిపోవుచున్నావు గనుక గుద్దుకొనుచున్నావు. నీకు నిర్లక్ష్యమున్నది. నీవేదో పెద్దవాడిగా తలంచుకొందువు. నీవు నరకమునకు అలాగు పోరాడి వెళ్ళుచున్నావు. నరకమునకు వెళ్ళుట తేలిక కాదు.

నీవు సత్యమును నిరాకరించితివి.

42నీవు ప్రమాదమునకు గురికాకముందు ఆ ఎర్ర దీపమును దాటిపోయావు. హెచ్చరికలను విస్మరించావు. మనుష్యులు నేడు తమ స్వంత దారిలో పోవుచున్నారు. అందరి కంటే ఎక్కువ తెలియుననుకొని ఎవరి మాట వినుట లేదు. రానున్న తీర్పును గూర్చిన హెచ్చరికలను, గురుతులను దాటి పోవుచున్నాడు. వారే క్రీస్తును విసర్జించిన వారు.

JOHN 5:39•

JOHN 8:46•

JOHN 10:37

 

43గమనించండి! క్రీస్తుకు బదులుగా వారు ఇంకేదో అంగీకరించిరి. ఆనాటి సంఘము యొక్క గ్రుడ్డితనము గూర్చి ఆలోచించండి. అందరికీ తెలిసిన హంతకుడు బరబ్బాను వారు కోరుకొనిరి. వాడు హంతకునిగా రుజువు కాబడి శిక్షకై వేచియున్నాడు, వాడు హంతకుడు, దుర్మార్గుడు. యేసు వారిని ఈలాగు సవాలు చేసెను, "నాలో పాపమున్నదని ఎవరు నిరూపించగలరు? (అవిశ్వాసమే పాపము.) తండ్రి క్రియలు నేను చేయని యెడల నన్ను నమ్మకుడి. లేఖనమే నా గూర్చి సాక్ష్యమిచ్చుచున్నది. లేఖనములను పరిశోధించుడి, ఎందుకనగా వానిలో నిత్యజీవము కలదని మీరు తలంచుచున్నారు. ఈ కాలములో నన్ను గూర్చి అవి సాక్ష్యమిచ్చుచున్నవి."

JOHN 10:33

 

44కాని వారీలాగని, "ఆయన తన్ను తాను దేవునిగా చెప్పుకొనుచున్నాడు." ఆయనే దేవుడు. లేఖనమును ఆయన నెరవేర్పుచున్నాడు. ఆయన తన్ను గూర్చి ఎన్నడూ గొప్ప చెప్పుకోలేదు. ఆయన దేవుడే. వాక్యము నెరవేర్చబడ వలసియున్న ఘడియ అదే. వారది చూడలేకపోయిరి, ఎందుకనగా అది వారి శాఖల అభిప్రాయమునకు వ్యతిరేకముగా నుండెను. క్రీస్తును గూర్చి వారు వేరుగా తలంచిరి. వారు గ్రుడ్డివారయిరి.

45అంతే గాకుండా వారీయనను వదిలించుకోగోరిరి. వారొక హంతకుని అంగీకరించిరి. వారికి, వారి సమాజమునకు అది ఒక మచ్చ. క్రీస్తును త్రోసివేసి ఒక హంతకుని కోరుకొనిరి. ఎవరైనా గాని ఒక తప్పును అంగీకరించాడంటే, దానికి ముందు ఒప్పును విసర్జించాడన్నమాట. నీవు తప్పును అంగీకరించవలెనన్న ఒప్పును ముందు త్రోసివేయవలెను. నీవు నీ అంతరాత్మ స్వరమును విస్మరించి అబద్ధమాడెదవు. నీ తల్లిదండ్రులు చెప్పిన దానిని విస్మరించి నీవు ఒక పొరపాటు చేయుదువు. ప్రకృతియే నీకు బోధించును. దానిని చేయరాదని అది నీకు నేర్పును. కాబట్టి నీవు సత్యమును త్రోసివేసి అబద్ధమును అంగీకరించెదవు. ఒక అబద్దమును నీవు అంగీకరించు ముందు సత్యమును త్రోసివేయవలసియున్నావు.

JOHN 1:1,14•

JOHN 14:6•

1TIM 3:16

 

46వీరును అలాగే చేసిరి. వారు సత్యమును త్రోసివేసిరి. ఆయనే సత్యము. "నేనే మార్గమును, సత్యమును, జీవమునై యున్నాను. ఆదియందు వాక్యముండెను. వాక్యము దేవుని యొద్ద ఉండెను. వాక్యము దేవుడై యుండెను. ఆ వాక్యమే శరీరధారియై మన మధ్య నివసించెను." I తిమోతీ 3:16. " నిరాక్షేపముగా దైవభక్తిని గూర్చిన మర్మము గొప్పదై యున్నది. అదేమనగా దేవుడు సశరీరునిగా ప్రత్యక్ష మాయెను." దేవుడు! యెహోవా! ఇది ఆశ్చర్యము!

అంతరిక్షములో సౌర కుటుంబమును ఏర్పరచిన దేవుడు ఈ ప్రపంచము కంటే వేలాది రెట్లు పెద్దవైన నక్షత్రములను సృజించిన దేవుడు, ఎంత మహోన్నతుడే ఆలోచించండి. అందులోని ఒక నక్షత్రము గంటకు 10,000 మైళ్ళ వేగముతో భూమి వైపు రానారంభించిన యెడల ఇక్కడికి చేరుటకు వంద మిలియను సంవత్సరములు పట్టును. అంత సుదూరములో నున్నవి. ఇక్కడి నుండి చూచినచో అది చిన్న నక్షత్రములుగా ప్రక్క ప్రక్కనే కనబడును. వాటి నుండి మనమెంత దూరముగా నున్నామో అంతకన్న ఎక్కువ దూరముగా అవి ఒకదానికొకటి యున్నది. అయినా అందులో ఏ ఒక్కటి స్థానము తప్పుట లేదు. దేవుని యొక్క గంభీరత్వమును, గొప్పతనమును ఎవరు చెప్పగలరు? ప్రతి ఒక్కటి మరొక దానిని నిలిపియుంచును. అందుకే అవి అలాగు స్థానములలో ఉన్నవి. అవి స్థానము తప్పినచో మొత్తం క్రమమే పతనమగును.

ఏదేనులో అదే జరిగినది. దేవుని యొక్క ఆజ్ఞలను హవ్వ మీరినది. మొత్తం మానవజాతి పతనమాయెను. అది నేటి సమస్య. సంస్థలు, శాఖలలో మనము మునిగిపోరాదు. లోకమును నిలిపియుంచు గొప్ప గెలాక్సీల వలె, దేవుని కుమారులు, కుమార్తెల వలె మనముండవలెను.

47గొప్ప శాస్త్రజ్ఞుడగు ఐన్ స్టయిన్ చెప్పిన మాటలను గతవారం న్యూయార్క్ లో విన్నాను. అతడు ప్రపంచ మేధావి. అతని మాటలు విన్నాను. ఆ తరువాత ప్రసిద్ధ మానసిక శాస్త్రవేత్తయగు నార్మన్ విన్సెంట్ పీలే మాటలు విన్నాను. ప్రజలు ఎట్లు నడచెదరో, ప్రవర్తించెదరో అతడు తన శాస్త్ర కోణములో చెప్పెను. నక్షత్రముల నుండి వేరుగా నున్న గెలాక్సీల గూరి ఐన్ స్టయిన్ చెప్పెను. వెలుగును గూర్చి అతడు చెప్పెను. వెలుగు ఒక సెకనుకు 186,000 మైళ్ళు ప్రయాణించును. అయిదు నిమిషాలలో అది ఎన్ని మిలియనుల, బిలియనుల మైళ్ళు వెళ్ళునో ఆలోచించండి. ఆ గెలాక్సీని చేరుటకు 120 మిలియనుల వెలుగు సంవత్సరములు పట్టును. వెళ్ళుటకు 120 మిలియనుల వెలుగు సంవత్సరములు, తిరిగి వచుటకు మరల అంతకాలము పట్టును.

అక్కడికి వెళ్ళుటకు నీకు మూడు వందల మిలియను సంవత్సరములు పట్టును. ఒక్కసారి వెళ్ళుటకు అంతకాలము పట్టును. కాని ఈ భూమి మీద నీ వయస్సు ఏబయి సంవత్సరములకే అయిపోవుచున్నది. నీవు నిత్యత్వములోనికి వెళ్ళిపోయెదవు. దానికి అంతము లేదు.

48దానినంతటినీ మాట చేత కలుగచేసిన దేవుని గూర్చి ఆలోచించుము. ఆయన మనలను విమోచించుటకు శరీరధారిగా ఈ లోకమునకు దిగి వచ్చెను. తన సన్నిధితో మనలను గౌరవించుచున్నాడు. చివరి దినములలో ఆయన ఈ భూమి మీద నిలచును. ఈ పాపులకు వాక్యమును రుజువు చేయును, ఎందుకనగా ఆయన మాట తప్పడు. ఆమేన్. ఆ గొప్పవాని యొక్క సార్వభౌమత్వము మరియు న్యాయము చూడండి, ఆయన వీటన్నింటినీ తన చేతితో పట్టుకొనియున్నాడు.

49మొదటగా వాక్యమును సంఘము త్రోసివేయవలసియున్నది. వారాయనను బయల్జెబూబు, దురాత్మ అని పిలచిరి. దానిని బట్టి తీర్పు దినమున మానవ జాతి మొత్తము శిక్షకు గురియగును. రోమియుడగు పిలాతు యేసును పరిశోధించ వచ్చెను. ఆ గవర్నరు ఎదుట ఆయన నిలబడెను. మొదట సంఘమాయనను త్రోసివేసెను. ఆయన వర్తమానము నమ్మలేదు, ఎందుకనగా వారికి వాక్యము తెలియదు.

AMOS 3:7•

JOHN 5:46

 

50యేసు వారితో చెప్పెను, "మీరు మోషేను ఎరిగియున్నచో నన్ను నా మాటను నమ్మియుందురు, ఎందుకనగా అతడు నా గూర్చి పలికెను." చూచారా. అది ప్రవక్తమాట. ప్రభుని వాక్కు ప్రవక్త యొద్దకు వచ్చును. అది ఆ ఘడియ మాట. దానిని గుర్తించవలెను. మీరు మోషేను ఎరుగుదుమని అతడు మా మార్గదర్శి" అని చెప్పుచున్నారు గాని అతని మాట మీకు తెలియదు. ఇంకో రీతిగా ఆయన ఇట్లనెను, "నేనే వాక్యమును. మోషే చెప్పిన వాక్యమునకు నేనే గుర్తింపును. మీరు నన్ను ఖండించుచున్నారు." ఆచారముల వలన, సంఘమాయనను త్రోసివేసెను.

51ఇప్పుడాయన పిలాతు ఎదుట నిలబడియున్నాడు. ఆయన ఆ కాలపు వర్తమానికునిగా రుజువు చేసికొనెను. వారు చూచి నమ్ముటకు అవకాశమియ్యబడెను గాని వారు త్రోసివేసిరి. ఎందుకు వారు త్రోసివేసిరి? దానిని చాలామంది నమ్మగోరిరి, కాని వారి ఆచారములు, ప్రజలు కాదు, కాని వారి ఆచారములు నమ్మనియ్యలేదు.

JOHN 3:2

 

52చూడండి, నికోదేము రాత్రి వేళలో వచ్చి, "బోధకుడా, నీవు దేవుని యొద్ద నుండి దిగి వచ్చిన వాడివని మేమెరుగుదుము. నీవు దేవుని నుండి దిగి వచ్చితివి. దేవుడు తోడైయుండని యెడల ఎవడును ఈ కార్యములు చేయజాలడు." మేము అని అతడు ఎవరిని గూర్చి చెప్పెను? సంఘము, పరిసయ్యులు, ఆ నాటి నాయకులు! "మేమెరుగుదుము. నీవే ఆ వ్యక్తివని మాకు పూర్తి నమ్మకము ఏర్పడినది." అయితే వారెందుకు తప్పిపోయిరి? వారి శాఖ వల్లనే. (మీరు దీనిని లోతుగా నాటనీయుడి, నేను అదే చేయప్రయత్నము చేయుచున్నాను, చూచారా.) వారప్పటికే ఒక శాఖలో పాతుకొని పోయిరి. ఆయనే మెస్సీయా అని వారు చూచినా అందులో నుండి కదలలేకపోయిరి. వారికి సంబంధమున్న ఆ సంస్థ వారిని పోనియ్యలేదు. మీకు అర్థమైనదా? ఈ కనబడుచున్న జనులో ఎందరికి ఇది అర్థమైనది? చేతులెత్తండి. మంచిది!

53దానిని వారు నమ్మిరి, మరియు తెలిసికొనిరి.

నేడును అలాగే యున్నారని చెప్పుచున్నాను. నేడు ఇక్కడుండవలసినది ఇప్పుడే ఇక్కడ యున్నది. దానిని మనము చూచుచున్నాము, కాని వారు శాఖ బయటకు వదలుట లేదు. వారంతగా ఆ క్రమములో పాతుకుపోయిరి. చూడండి, వ్యక్తులు కాదు గాని, ఆ క్రమమే తప్పు. హత్య చేయబడిన దేశాధ్యక్షుని గూర్చి నేను ఇప్పుడే చెప్పాను; నాకు తెలిసినంత వరకు ఆయన వ్యక్తిగతంగా ఏమి చెడు చేయలేదు. కాని ఆయనున్న క్రమము తప్పు. జనులు మంచివారే.

యూదులు కాదు గాని వారి క్రమమే తప్పు. వారి శాఖయే ఆయనను ఖండించేను, ఎందుకనగా వారి శాఖను ఆయన సహించలేకపోయెను. మీలి అర్దమైనదా? ఇప్పుడును అదే జరుగుచున్నది. వారు ఈ సమాజ హంతుకుని ఎన్నుకొసిరి. బరబ్బాను కోరుకొనిరి. ఇప్పుడీ పని ప్రభుత్వము మీద పడినది. ప్రభుత్వము శిక్షను ప్రకటించవలెను. జీవమును తీసివేయుటకు ప్రభుత్వ ప్రకటన చేయవలెను. వారు రోమా పాలన క్రింద నుండిరి కనుక వారేమి చేయలేరు. వారి సంఘము ఎంత చెప్పినా గాని వారికి ప్రాణము తీయు హక్కు లేదు. రోమా వారి అనుమతి ముందుగా పొందవలెను. కాబట్టి ఈ పనిలో ప్రభుత్వము జోక్యము చేసినెను. నేడు ఈ దృశ్యము మనకు కనబడుట లేదా? ఖచ్చితంగా అలాగే యున్నది!

54సంఘము ఆయనను త్రోసివేసెను. ప్రభుత్వము జోక్యము చేసికొన్నది. దేశము తలదూర్చు సమయమాసన్నమైనది. అది సమీపములోనే యున్నది. దేశమంతా ఆయనను త్రోసివేసెను. దేవుని ఉగ్రత వారి మీదికి దిగినది. సంఘము కూడా ఆయనను త్రోసివేసెను. సంఘము మీదికి ఉగ్రత వచ్చును. దేశమాయనను తిరస్కరించెను. అందరి మీదికి ఊగ్రత వచ్చును. నేడు లోకమాయనను విసర్జించెను. సర్వలోకము మీదికి ఉగ్రత వచ్చును. దేశములన్నియూ తప్పక శిక్ష నొందును.

55గొప్ప రోమా సైన్యాధిపతియగు తీతు ఆధ్వర్యములో ఇది జరిగెనని మనమెరుగుదుము. అతడు యెరూషలేమును ముట్టడించెను. వారు చివరకు ఒకరి పిల్లలను ఒకరు తినిరి. చెట్ల బెరడు, గడ్డి తినిరి. తీతు తన రధములతో వచ్చి ఆ పట్టణపు గోడలను, వీధులను శిధిలము చేసెను. అగ్నితో దహించెను. అందరినీ చంపెను. కాని ఇది జరుగు ముందు న్యాయవంతుడగు దేవుడు ఎంతో హెచ్చరించెను. ఆయన శాసనములు ఆయన న్యాయమును వెల్లడి చేయును. శాసనము లేకుండా శిక్షపడదు.

(ఈ పట్టణములో ఒక శాసనము వచ్చినదనుకోండి), "ఎర్ర దీపమును వెలిగించిన వారికి శిక్ష" అని వచ్చినది. దానికి శిక్ష లేని యెడల శాసనమును ఎవరూ పాటించరు. ఎర్ర దీపములు వెలిగించుచునే యుందురు. కాబట్టి జరిమానా ఉండవలెను. దేవుని ధర్మశాస్త్రమును, ఆయన కార్యక్రమమును మారుట వలన మరణమే శిక్ష. మరణము శిక్షగా చెల్లించవలెను.

56ఈ ప్రపంచములో ఉన్నవారమంతా ఈ ఉదయమున అదే రకమగు నేర విచారణలో నిలబడియున్నాము. ఒక నేర విచారణ! శాఖలన్నియూ వాక్యమును నిరాకరించినవి. ఇది చాలా కఠినమైన మాట అని నాకు తెలియును. వినుచున్న సేవకులు, అనగా ఇక్కడున్న వారు, టేపు వినుచున్నవారు దీనిని అర్థము చేసికొనుటకు ప్రయత్నించండి. దీనిని నేను తేటపరచుగోరుచున్నాను. కాని ఈ విషయమును మీకు తెలియచేయుటకే ఇది చెప్పుచున్నాను. నేడు నిలబడియున్న మనము మరో పిలాతు యొక్క తీర్పు హాలులో నిలబడియున్నాము.

"నేను అక్కడ నిలబడియున్నచో యేసుక్రీస్తు పక్షముగా మాట్లాడి యుండెడివాడను," అని నీవనవచ్చును. ఇప్పుడు నీవు దాని గూర్చి ఏమి చెప్పుచున్నావు? ఆ విషయము చూద్దాం. సంఘము ఎంతగా ఆయనను త్రోసివేసినా నేను మాత్రము ఆయన పక్షముగా నిలచియుందును. నీకును ఆ ఆవకాశమున్నది. వారాయనను త్రోసివేసిరి.

57నేడాయనను నేర విచారణ చేయుచున్నారు. ఒక ప్రపంచ సంస్థ రూపొందుచున్నది. అది ప్రపంచ సంఘ సమితి. వారేమి చేసిరి? సంఘములన్నియూ ఒకటిగా ఇందులో కలిసిపోవలెనని వారు ఓటు వేసిరి. ప్రపంచ సంఘసమితి ఏర్పాటు చేసిరి. ఎవరైనా దీనికి చెందని యెడల బోధించ వీలు లేదు. రోగులకు కూడా నీవు ప్రార్థించ వీలులేదు. నీ సంఘమును వారెందుకైనా ఉపయోగించగలరు. వారు దానిని ఆయుధాగారముగానో, లేదా మరి దేనిగానో వాడుకోగలరు. నీకేమి దాని మీద అధికారముండదు. నీవు ఆ ప్రపంచ సంఘ సమితికి చెందియుండాలి. అది ఒక క్రమము. అది ఈ అమెరికాలోనే రూపుదిద్దుకొనుచున్నది. అక్షరాలా వాక్యము నెరవేరుచున్నది. 1933లో ప్రభువు నాకు చెప్పినది నెరవేరుచున్నది, చూచారా. ఈ ఉదయమున మనము ఆ కాలములో నిలచియున్నాము. వాక్యమగు యేసుక్రీస్తు పై నేర విచారణ చేయుచున్నారు. నేడు దానిని సిలువ వేయుచున్నారు. ఆయన మన చేతులలో యున్నాడు. ఆయన ప్రపంచపు చేతులలో యున్నాడు. వాక్యమును ప్రపంచమంతా గుర్తించియున్నారు, చూచారా. ఆయనను నిలబెట్టి నేర విచారణ చేయుచున్నారు. శాఖలన్నియూ ఆయనను త్రోసివేసినవి. సంఘముల సమితిలో ఆయనకు నేరవిచారణ జరుగుచున్నది. మరల వారాయనను తిరస్కరించి అప్పటి వారి వలెనే మరొకరిని ఎన్నుకొనిరి.

JOHN 1:1•

JOHN 8:46

 

58చూడండి, ప్రకృతి చరిత్ర పునరావృతమగుచుండును, ఎందుకనగా ప్రకృతి చక్రము మారదు. చెట్లు ఇంకా పెరుగుచున్నవి; కాయగూరలు పండుచున్నవి; పూలు వికసించుచున్నవి. లోకములో ప్రకృతి కొనసాగుతున్నది. సృష్టిలోని ప్రతిది, ఫలమిచ్చుచున్నది. తనకు ముందున్న దానిని మరల చూపించుచున్నది.

నేడు మనము మరల అదే చోటులో నిలబడియున్నాము. వాక్యమే యేసు. (యోహాను మొదటి అధ్యాయము) దానిని మనమంతా నమ్ముదుము. ఆయనే వాక్యము. (అర్థము చేసికొనండి) వాక్యమగు ఆయన మరల లోక క్రమమునకు విరోధముగా యున్నాడు. ఆయన అద్భుతములను బట్టి వారాయనను త్రోసివేయలేదు. "నాలో దోషమును ఎవరు చూపగలరు?" అనడిగెను.

ఆయన రోగులను స్వస్థపరచెను. అంతకన్న ఎక్కువ కీడు ఆయన చేయలేదే?

ISA 9:6•

AMOS 3:7•

JOHN 10:33

 

59"ఈ సంగతులను బట్టి మేమాయనను ఖండించుట లేదు. ఆయన మానవునిగా ఉండి దేవుడని చెప్పుకొనుచున్నాడు. అందుకు ఖండించుచున్నాము," అనిరి. ఆయన దేవునిగా యుండునని వారి స్వంత లేఖనమే చెప్పుచున్నది. అరవై-ఆరు గొప్ప అధ్యాయములు వ్రాసిన యెషయా ప్రవక్త తన గ్రంధములో సృష్టిని గూర్చి, మధ్యలో బాప్తిస్మమిచ్చు యోహాను రాక గూర్చి, చివరలో వెయ్యేండ్ల పాలన గూర్చి వ్రాసెను. బైబిలులోని అరవై-ఆరు గ్రంధముల వలెనే యెషయాలోని అరవై-ఆరు అధ్యాయములున్నవి. చాలా అద్భుతము. ఈ యెషయా 9:6లో ఇట్లున్నది, "మనకు ఒక శిశువు పుట్టెను. ఒక కుమారుడు అనుగ్రహించబడెను. ఆయన పేరు ఆలోచన కర్త, సమాధానాధిపతి, బలవంతుడగు దేవుడు, నిత్యుడగు తండ్రి, అద్భుతమగు దేవుడు."

ఆ గ్రుడి ఆచారములు లేదా క్రమములు ఆయనను దేవునిగా చూడలేకపోయెను. ఆయన దేవునిగా యుండునని వారి స్వంత ప్రవక్త చెప్పెను. (వారికి వాక్కు వచ్చెను) ఆ గుడ్డి క్రమములు! కాబట్టి వారు వాక్యమును త్రోసివేసిరి. బదులుగా దొంగయగు బరబ్బాను కోరుకొనిరి.

ZECH 14:7•

LUKE 17:28,30

 

60ఈ దినమునకు చెందిన వాక్యము తేటగా వెల్లడియగుచున్నది. అది వాస్తవ రూపము పొందినది. అదే సత్యమని చూపించబడినది. అంత్యదినములలో ఎట్లుండునో యేసు చెప్పెను, "సొదొమ దినములలో ఉండినట్లుగానే మనుష్యకుమారుని రాకడ దినములోను ఉండును." వాక్యమైయున్న ఆ దేవుడే అంత్యదినములలో జరుగు దానిని చెప్పెను. సాయంకాల సమయములో దీపములు వెలుగును. మలాకీ 4లోని సంగతులు జరుగును, అవి రుజువైనవి.

61నిర్ణయ కాలము వచ్చినది. సంఘములు దానిని త్రోసివేసినవి.

సంఘములు దేనిని కోరుచున్నవి? వాక్యమును హత్య చేయువారిని, ఒక క్రమమును ప్రవేశ పెట్టువారిని. ఆ క్రమము వాక్యమునకు వేరయినదయినచో వాక్యమును చంపినట్లే. నిజముగా బయలుపరచబడుచున్న దేవుని వాక్యమునకు బదులుగా వారు ఒక శాఖ ఆచారమును కోరుచున్నారు. దేవుడు తన జనుల మధ్య ఉన్నట్లు నిరూపణ అగుచున్నది. సైన్సు ద్వారా, బొమ్మల ద్వారా, వెలుగు ద్వారా, ప్రభుని దూత ద్వారా, అగ్నిస్తంభము ద్వారా అది రుజువగుచున్నది. యేసుక్రీస్తు శరీరములో ఈ భూమి మీద జీవించిన ఆయనే చివరి దినములలో తన ప్రజల మధ్య జీవించుచున్నాడు. దాని యొక్క చిత్రములను సైన్సు తీసినది. సంఘము దాని క్రియలను చూచెను. టేపుల ద్వారాను, వ్యక్తిగత సేవ ద్వారాను ప్రపంచమంతా ఇది గుర్తించబడినది. అయినాగాని వారు ఆ సంఘ సమాఖ్య పద్ధతినే కోరుకొనుచున్నారు. సత్యమును త్రోసివేసియున్నారు. ఒక హంతకుని వారు కోరుకొనుచున్నారు. వాడు వారి నోరు మూయును. వారిని అమ్మివేయును. సంఘ సమాఖ్య అదియే చేయును. అది మృగము యొక్క ముద్ర. అది క్రీస్తు విరోధి.

62అది ఆచారమని వారు తలంచుచున్నారు. వారి ఆచారములు దేవుని నుండి వచ్చినవని తలంచెదరు, చూచారా. కాని అది దేవుని వాక్యము ఎదుట నిలువదు. దానిని దేవుడు నిజమని నిరూపించడు. యేసు వాక్యముతో నిలచియుండును, సంఘ సమాఖ్యతో కాదు. ఆయన దేవుడని ఆ వాక్యమే నిరూపించును. ఇంకా అది అలాగు నిరూపించుచున్నది, ఎందుకనగా అదే జీవము ఇక్కడున్నది. ఆ వెనుక జరిగించిన క్రియలనే ఇప్పుడును మన మధ్య అది జరిగించుచున్నది.

కావున, వారేమి చేసిరి? ఏర్పరచబడిన వారిని సిలువ వేయు ఒక క్రమమును వారెప్పుడో ఎన్నుకొనిరి. స్వేచ్చా అంతర్జాతీయ సిలువ మరణము సమిపమునే యున్నది.

REV 13:14

 

63వాక్యమునకు అది నెరవేర్పు. వాక్య ప్రకారమే అది జరుగుచున్నది. వారు మృగము యొక్క ప్రతిమను రూపొందించిరి. ప్రపంచ శాఖలన్నింటినీ ఒక ప్రొటస్టెంటు మృగపు ప్రతిమలో ఏకము చేసిరి. ఇది ప్రకటన 13:8 ప్రకారమే యున్నది. "వారు మృగము యొక్క ప్రతిమను చేసిరి." ఆ మృగము రోమ్. అది మనందరకు తెలియును. బైబిలు రోమ్ అని చెప్పుచున్నది. రష్యా కాదు. జనులు తప్పు అభిప్రాయము కలిగియున్నారు. రోమ్ నుండి అది వచ్చునని ముందే చెప్పబడెను. మరేదీ కాదు.

DAN 2:41-43

 

64మరల దానియేలు చూడండి. మట్టి ఇనుము కలిసిన పాదములున్నవి. మోకాళ్ళ నుండి దిగువ వరకు ఇనుమున్నది. రష్యా అసలు దీనిని గూర్చి ఎరుగదు. అది రోమ్. ఆ ఎర్ర మృగము రోమ్. అది ఎల్లపుడు రోమ్. ఆ ఇమము రోమ్ తప్ప మరేది కాదు. ఆ మృగము రోమ్!

REV 13:3,11,12,14•

REV 17:15

 

65రోమ్ కు ఒక మత విధానమున్నది. దాని తలకు చావు దెబ్బ తగిలినది. మరల తేరుకొన్నది; అన్యుల రోమా, పోపుల రోమ్ అయినది. ఇప్పుడు వారు ఒక మృగపు ప్రతిమను తయారుచేయుచున్నారు. అది ప్రకటన 13. ఈ దేశము సంఖ్య పదమూడని మీరెరుగుదురా? గణతరీత్యా అది అలాగుండట ఆశ్చర్యము. వాక్య ప్రకారమే జరుగుచున్నది. ఈ దేశమును ప్రకటన 13లో కనుగొనగలరు.

ఆ జలము జనులకు సాదృశ్యము. అందులో నుండి ఈ మృగము పైకి వచ్చెనని బైబిలు చెప్పెను. కాని ఈ చిన్నమృగము జనులు లేని చోటులో నుండి వచ్చెను. అది ఒక గొర్రెపిల్ల. మత స్వాతంత్ర్యమున్నది, కాని ఆ తరువాత మృగము వలె మాట్లాడెను. దానికి ముందున్న మృగము చేసినట్లే సమస్తమును చేసెను. అధికారమును పొందెను. ఖచ్చితంగా! ఈ విధముగా అది జరుగువలసియున్నది.

66నేడు ఇక్కడ ఒక పద్ధతి రూపొందుచున్నది. అందరూ లూధరనులు కావలెనను ప్రయత్నము చేసిరి; అది జరుగలేదు. అందరినీ బాప్టిస్టులుగా చేయవలెనను ప్రయత్నము జరిగినది; అది జరుగలేదు. అందరినీ మెతడిస్టుగా, లేదా పెంతెకోస్తుగా మార్చవలెనని ప్రయత్నించిరి గాని జరుగలేదు. (కాలము ఎక్కువ లేదు) వారొక సమితిని రూపొందించిరి. అది మృగపు ప్రతిమ, ఒక శిరస్సు, వాక్యమును మరల త్వరలోనే సిలువవేయనై యున్నారు. వారదే చేసిరి. ఏమిటది? వాక్యమును సిలువ వేయుట. దీనిని నేరవిచారణ చేయుచున్నారు మరియు త్వరలో నిర్ణయమగును.

REV 17:3,5

 

67వాక్యమునకు శాఖకు మధ్య ఉన్న భేదమును గమనించాలి. ఈ పద్ధతి ఏమిటి? రోమ్ కు ఇది శాఖ. అలాగు జరుగునని బైబిలు చెప్పెనా? అవును! ప్రకటన 17. ఒక స్త్రీ యొక్క మత క్రమము నుండి రోమ్ లేచుట జరిగెను. సంఘము ఎల్లప్పుడూ స్త్రీగా చూపించబడెను. ఎందుకనగా క్రీస్తు వధువు స్త్రీయే. హవ్వ పడిపోయెను. ఆమె విడిపించబడవలెను. సంఘమే విడిపించబడిన ఆ స్త్రీ.

REV 17:3,5,9

 

68ఈ స్త్రీ ఏడు తలలతో మృగము మీద కూర్చొన్నది. ఏడు కొండలు గూర్చి మనకు తెలియును. అలాగు జరుగునని బైబిలు చెప్పెను. ఇందులో పొరపాటు లేదు, తప్పుకు అవకాశము లేదు. ఆమె వేశ్యలకు తల్లి అని మనము గమనించెదము, చూచారా. తల్లి, కూతురు మరల స్నేహముగా ఏకమైనవి. శుభ్రముగా జీవించగోరి ఒకసారి కుమార్తె తల్లి నుండి పారిపోయినది; ఎందుకనగా ఆమె తల్లి అంతగా దిగ జారినది. కుమార్తె తల్లిని విడువవలసి వచ్చెను. అయితే ఆమె ఇప్పుడు కొద్దిగా ఎదిగినందున అనేక చెడ్డ క్రియలు చేసెను. ఆమె తన తల్లిని చూచినది. ఒక సంస్థను స్థాపించుచున్నది గనుక మంచిగా నుండునని తలంచినది, చూచారా. నిజము!

MATT 24:22,24•

REV 17:8

 

69ప్రకటన 17లో చెప్పబడిన దానిని ప్రొటస్టెంటు వారు నెరవేర్చిరి. శాఖలను కలిపిరి. "గొర్రెపిల్ల జీవగ్రంధములో పేర్లు వ్రాయబడని వారందరూ దానికి చెందెదరు." ఇది లేదా అది. నీవు మృగమునకు లేదా మృగపు ప్రతిమకు చెందియుండాలి. బైబిలు మాట అది. యేసు దీనిని గూర్చి చెప్పెను. కమ్యూనిజము కాదు. మత్తయి 24 అధ్యాయము 21 నుండి 26 వచనములు చూడండి. ఈ పద్ధతిలో నున్న ఆత్మ అసలయిన దాని వలె కనబడి, సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని మోసము చేయును. జగత్తు పునాది వేయబడక ముందే ఈ ఏర్పరచుకొనిన వారి పేర్లు గొర్రెపిల్ల జీవగ్రంధములో వ్రాయబడినవి. వారి నిమిత్తము ఆ పని తక్కువ చేయబడని యెడల ఈ భూమి మీద ఏ శరీరియు తప్పించుకోజాలడు.

70ఇది '64 కదా? కేలెండరు ప్రకారము పది హేడు సంవత్సరములు తీసివేయవలెనని వారు చెప్పుచున్నారు. 1964 నుండి 21 శతాబ్దమునకు ఇంకా ముప్పది ఆరు సంవత్సరములున్నవి. ప్రతి రెండు వేల సంవత్సరమునకు ఒక ప్రపంచ క్రమమునకు ముగింపు వచ్చుచున్నది. మత క్రమము ముగియును. అన్ని క్రమములకు అంతమే. దేవుడు అడుగిడును. మొదటి రెండు వేల సంవత్సరముల తరువాత నోవహు దినములలో అలాగు ఆయన చేసెను. రెండవ రెండువేల సంవత్సరాంతమున జరిగిన దానిని ఈ ఉదయము మనము ఒక అంశముగా తీసికొన్నాము. ఆయన మరల తన వాక్కును పంపెను. నోవహు కాలములో ప్రవక్తయగు నోవహు ద్వారా ఆయన తన వాక్కు పంపెను. కాని జనులు తమ క్రమము కొరకు వాక్యమును త్రోసివేసిరి. యేసు కాలములో ఆయన మరల తన వాక్కును పంపెను. వాక్యము సంపూర్ణముగా ప్రత్యక్షమాయెను. జనులు దానిని తిరస్కరించిరి.

ఇది 1964. ఇంకా ముప్పది-ఆరేండ్లకు రెండువేల సంవత్సరములు ముగియును. వాక్యము బయటకు తేబడుచున్నది గాని శాఖలు దానిని త్రోసివేయుచున్నవి.

2TIM 3:5

 

71ఎంత సమీపములో మనమున్నాము. మనము అనుకొన్న దాని కంటే త్వరగా జరుగును! చూచారా? ఏ క్షణములోనయినా అది జరుగును. ఈ పాటికే అది జరిగియుండును. గత ఆదివారము ఇక్కడున్న వారితో దానిని గూర్చి చెప్పాను. ఆ గ్రంధములో చివరి పేరు వ్రాయబడియుండును. అది జరిగిన తరువాత ఇంకెవరూ లోనికి రాలేరు. లోకము ఎప్పటి వలెనే ముందుకు పోవును, కాని సంఘమునకు ముద్ర పడును. ఇంకా ముందుకు వెళ్ళుచుండగా దీనిని గమనించండి.

పేర్లు వ్రాయబడిన వారిని వాడు మోసము చేయలేడు.

72అది ఏమిటి? అది ఒక క్రమము. దాని గూర్చి ఆలోచించండి. ఆ శాఖకు లేదా ఆ క్రమమునకు మీరు చెందితే ఏమగును? వాక్యము నుండి నీవు దూరమై ఒక హంతక క్రమమునకు చెందెదవు. పైకి భక్తి కలిగి యుండియు దాని శక్తిని త్రోసివేయుదురు. అది మృగపు ముద్ర. నిజము!

REV 13:4,14

 

73చూడండి, మృగము చేసిన దానిని ఆ ప్రతిమ కూడా చేయును. ఆ మృగము చాలా గొప్పది. నైసీయా యొద్ద గొప్ప విశ్వ సంఖమును రూపొందించెను. ఆ ఒక్క క్రమము యొద్దకు ప్రపంచమంతా వచ్చునట్లు చేసెను. వారితో ఎవరునూ యుద్ధము చేయజాలరని తలంచినట్లుగా బైబిలులో వ్రాయబడెను. వారు మృగపు ప్రతిమను తయారుచేసిరి. ప్రొటస్టెంటు వారినందరినీ సంఘ సమాఖ్య లోనికి తెచ్చిరి. ఒక సంస్థ రూపొందించిరి. ఆ సంస్థకు చెందనియెడల అసలు నీవు క్రైస్తవునివే కాదందరు.

EPH 4:30

 

74మృగము ముద్రకు మరియు దేవుని ముద్రకు మధ్య ఉన్న తేడా అదే! దేవుడు తన వాక్యము ద్వారా ముద్ర వేయును. వాక్యమును నీవు నమ్ముచున్నావా? "అది నిజమా? బ్రెన్హాం సోదరుడా? " అని నీవు అడుగుదువు. అవునని చెప్పుచున్నాను.

విశ్రాంతి దినమును ఆచరించుట గూర్చి సెవెంతెడే వారు చెప్పు దానిని నేనెరుగుదును. మీ పట్ల అసభ్యంగా మాట్లాడను గాని అది పూర్తిగా వాక్య విరోధము. ఎఫెసీ 4:30లో ఇట్లున్నది, "దేవుని పరిశుద్ధాత్మను మీరు దుఃఖపరచకుడి, ఎందుకనగా విమోచనా దినము వరకు మీరు దానితో ముద్రించబడియున్నారు," చూచారా.

EPH 4:30

 

75ఇప్పుడు, వాక్యమే పరిశుద్ధాత్మ. దేవుళ్ళు ముగ్గురు కారు. మూడు యుగములలో, మూడు పనులను ఒకే దేవుడు చేసెను. తండ్రియగు దేవుడు ధర్మశాస్త్రమును ఇచ్చెను. ఆయనే కుమారునిగా వచ్చి కృప ఇచ్చెను. ఆయనే పరిశుద్ధాత్మ. ఒకే దేవుడు. వాక్యమే తండ్రియగు దేవుడు. వాక్యమే కుమారుడగు దేవుడు. వాక్యమే పరిశుద్ధాత్మ. చూడండి, అవి మూడు కార్యాలయములు. పరిశుద్ధాత్మ నిన్ను ముద్రించును; వాక్యముతో మీరు ముద్రించబడితిరి.

ఇప్పుడు, నీవు చెప్పవచ్చు, "మంచిది, నేను ముద్రింప…"

76మంచిది, దానికదే గుర్తించబడును, చూచారా. నీవు ముద్రించబడిన యెడల రుజువు కనబడును. ఒక క్రమమునకు చెందియుండవు. వాక్యముతోను, పద్దతితోను ఒకేసారి ముద్రించబడలేవు,. ఎందుకనగా అవి పరస్పర విరోధములు. అలాగు సాధ్యము కాదు.

కారులో యున్న గొప్ప యంత్రమును చూడండి. దానిలో పిస్టను, వాల్స్, కార్బొరేటరు మొదలగునవి యున్నవి. అవి యంత్రములు.

77నాకు జ్ఞాపకమునకు వచ్చిన ఒక సంగతి సంఘమునకు చెప్పెదను.

మనము అంతమునకు బహు సమీపములో యున్నాము. ఒక సంగతి చెప్పెదను, చూచారా. యంత్రములను గూర్చి చాలా మంది వివరించ ప్రయత్నించెదరు; అయినా దానిని గూర్చి ఎరుగరు. మొదట దాని గూర్చి నీవు ఎరిగి యుండవలెను. "ఓడ ఎట్లు తేలిపోవునో నీకు చెప్పెదను నోవహూ," అని ఎవరైనా అన్నారనుకొందాం. నీకు యంత్రమును గూర్చి తెలియదు. నీవు దానిని కదిలించు శక్తిని గూర్చి తెలిసికొనగోరుచున్నావు.

ఒకరు ఇశ్రాయేలులోనికి వచ్చి ఇట్లు చెప్పారనుకొందము, మోషే, నీ మాట ద్వారా జంతువులను ఎట్లు సృజించావో నాకు చెప్పుము. నేను అర్థము చేసికోవలెను."

అతడు ఇట్లనును, "అది నా వాక్యము కాదు, అది దేవుని వాక్యము. దానిని చేయమని ఆయన చెప్పెను," చూచారా.

78"భూమి మీదికి ఈగలు వచ్చునట్లు ఎట్లు చేసితివో నాకు వివరించుము, అన్ని ఈగలు ఎట్లు వచ్చెను?" చూచారా. మోషే తనకు తానుగా దానిని గూర్చి వివరించలేడు. తూర్పు గాలి వచ్చి ఎర్ర సముద్రములో ఒక చోట రంధ్రము చేసి దానిని ఆరిన నేలగా ఎట్లు చేసెనో చెప్పమంటే, చెప్పలేడు. యాంత్రికంగా దానిని వివరించజాలడు. మోషే ఏ పద్ధతినీ వాడలేదు. ఏ అణువును నీవు వదిలితివో శాస్త్రీయ పరిశోధన చేసి చెప్పమన్నచో, అతడు చెప్పలేడు.

చూచారా, దానిని గూర్చి ఆయనకు తెలియదు. ఆ యాంత్రిక పరిశోధన అతడు ఎరుగడు. ఆ శక్తిని మాత్రమే అతడు ఎరుగును. నేను జీవించుచున్న విధానమే నాకు తెలియదు. నీ ఆహారము ఎట్లు రక్తముగా మారుతున్నదో నీవెరుగవు. నీ గుండె గూర్చి నీకు తెలియదు. నీ ఆహారము ద్వారా బలము ఎట్లు సంగ్రహించబడుచున్నదో, నీ ప్రేవులు ఎట్లు పనిచేయుచున్నవో, ప్రాణము ఎట్లు వచ్చుచున్నదో నీవు వివరించలేవు. నేను దానిని వివరించలేను, కాని అది జరుగుచున్నది. నేను చెప్పలేను. ఆ యంత్రముల గూర్చి నాకు తెలియదు గాని, ఆ శక్తిని నేను ఎరుగుదును.

NUM 16:21,30,31

 

79మోషే ఆ యంత్రములను గూర్చి ఎరిగియుండవచ్చును, కాని వాటిని గూర్చి అతడు తప్ప మరెవరును గ్రహించజాలరు. ఆ క్రియలను వారు చూచి సంతృప్తి చెందిరి. ఈనాడు జనులు ఆ విధంగా ఎందుకు సంతృప్తి చెందుట లేదు? చూచారా? అందరూ మోషేలు కాలేరు. ఒక్కడే మోషే. అది దేవుని వలన కలిగినదని వారెరిగియుండిరి. అది దేవుని వలన కలిగినదని వారు చూచిరి. వారు ముందుకు దానిని వెంబడించిరి. చివరకు ప్రశ్నించసాగిరి. అదే పనిని చేయుటకు వారు మరొకరిని లేపగోరిరి. కోరహు, దాతానులు వారు కొన్ని శరీర సంబంధమగు అనుకరణలను తీసకొనివచ్చిరి. చివరకు దేవుడీలాగనెను, "నిన్ను నీవు ప్రత్యేకించుకొనుము. ఆ సంస్థ యొక్క క్రమములోనికి వెళ్ళకుము. దానినుండి అడుగు బయటకు వేయుము. నేను వారిని మ్రింగి వేసెదను." ఆయన నేలను తెరచి వారిని మ్రింగి వేసెను, చూడండి.

80యంత్రముల గూర్చి నీకు తెలియనక్కరలేదు. ఆ కదిలిచు శక్తిని తెలిసికొనుము, అదే సత్యము. ఈ దినమున ఏమి జరుగునని బైబిలు వాగ్దానము చేసెనో, ఆ గురిని అది తాకుచున్నదో లేదో చూడుము. తిరిగి వాక్యము నొద్దకు అది తెచ్చును.

AMOS 3:3

 

81ఆ పెద్ద యంత్రము ఇప్పుడు అమర్చబడి కదులుటకు సిద్ధముగా యున్నది. అది ముందే అక్కడున్నది. సంస్థ యొక్క యాంత్రిక పద్ధతి వారికి ముందే యున్నది. దాని వలన భూమి మీదికి శాంతి వచ్చునని వారనుచున్నారు. ఐక్యరాజ్యసమితి వంటిది ఏర్పరచుకొనిరి. దేశములన్నీ ఏకమయినవి. ఇది ఏకము చేయు కాలము. ఈ మధ్యనే దాని మీద నేను ప్రసంగించాను. దేని కొరకు వారు ఏకమగుచున్నారు? ప్రపంచ శాంతి కొరకు! నానాజాతి సమితిలో వారది చేసిరి. ఎప్పుడూ వారలాగు చేయుచునే యున్నారు గాని ఫలితము శూన్యము. ప్రతి దేశపు సిద్ధాంత గాలితో కొట్టుకొనిపోవుచున్న ఒక పెద్ద గాలి బుడగవంటిది ఈ నానాజాతి సమితి. ఎప్పుడో అది పేలిపోవును. పనిచేయదు; సంఘ సమితి కూడా అంతే. అది మానవ సంస్థ. వారి విధానము దేవుని వాక్యమునకు విరోధము. అది పనిచేయదు.

"సమ్మతింపకుండా ఇద్దరు కూడి నడతురా?" నడవరు. క్రైస్తవ సంఘములు…

82పెంతెకోస్తు, అసెంబ్లీస్-ఆఫ్-గాడ్, సంపూర్ణ సువార్త సంమము, ఇంకా ఆయా గొప్ప పెంతెకోస్తు శాఖలు తమ సువార్త బోధను, తమ నియమములను ఎందుకు వారికి తాకట్టు పెట్టుచున్నారు? వారు ఆ సంస్థలలో నుండియే బయటకు వచ్చిరి. వాటిని ఖండించుటకు పెంచబడిరి. బైబిలు సూత్రములను, దైవిక స్వస్థతను, దేవుని శక్తిని, యేసు క్రీస్తును అంగీకరించని మనుష్యులతో నడచుటకు వారు తమ సువార్త బోధనే విడిచి పెట్టుచున్నారు. సమ్మతింపకుండా ఇద్దరు కూడి నడతురా?

83ఆ ఘడియకు మనము వచ్చియున్నాము. ఇదే అమర్చబడిన పెద్ద యంత్రము. వారికి యంత్రములున్నవి. కాని వారు సాతాను శక్తితో దానిని పని చేయించుచూ మృగపు ముద్రను బలవంతముగా రుద్దుతున్నారు. అలాగు చేసినప్పుడే యంత్రములు పనిచేయును. వారికి ఎప్పుడో ఆ యంత్రములున్నవి.

84మరో సంగతి చెప్పెదను. ఇది ఏకము చేయు కాలము - సంఘములు ఏకమగుట, దేశములు ఏకమగుట మీరు చూచుచున్నారు. దేవుడు, ఆయన వధువు కూడా ఏకమగుచున్న కాలమిది. దీనిని నేను గౌరవ, మర్యాదలతో చెప్పుచున్నాను. క్రీస్తు వధువు పిలువబడినదని నేను నమ్ముచున్నాను. దేవుని రాజ్యములో ఆమె ముద్రించబడినదని నమ్ముచున్నాను. యంత్రములు అచ్చటున్నవని నేను నమ్ముచున్నాను. భూమి మీద నుండి మహిమలోనికి ఆమెను ఎత్తికొనిపోవు శక్తి కొరకు ఆమె ఎదురు చూచుచున్నది. నా నిండు హృదయముతో దానిని నమ్ముచున్నాను. దానిని ఆయనెట్లు చేయునో మనమెరుగము, కాని ఆయన చేయును. ఆయనే ఆ శక్తి. మనము ఆ యంత్రములోని భాగములము. (ఆయన శరీరములో సభ్యులము) ఆయన రూపములోనికి వచ్చుచున్నాము. ఆయన తన క్రియలలో, తన ప్రేమ కానుకలలో మనతో ఏకమగుచున్నాడు. పెండ్లి విందునకు ముందు ఆయన వాటిని మనకిచ్చును. దానికొరకు మనము ఎదురుచూచి కనిపెట్టుచున్నాము.

85పరిశుద్ధాత్మతో నింపబడినప్పుడు ఈ సంఘములోనికి శక్తి వచ్చును. మనము కొద్ది పరిమాణములో పనిచేసియున్నాము. శరీరముతో ఏకమవుటకు తలరాయి వచ్చుచున్నది. ఆ శిరస్సు మరియు శరీరము ఏకమయినప్పుడు పరిశుద్ధాత్మ శక్తి ఆమెను పైకి లేపును. వందల సంవత్సరముల క్రితము క్రీస్తునందు మృతులైన వారు కూడా తిరిగి లేచెదరు. ఆయన పరిశుద్ధ సౌందర్యమును ధరించుకొని మేఘముల మిద ఎగిరిపోయెదరు, పరిశుద్ధాత్మయే ఆ శక్తి.

86ప్రపంచ సంఘ సమితి అను ఈ పెద్ద యంత్రము ఒక దినమున పని చేయును. వారి రాజ్య శక్తి అందులోనికి వచ్చును. అప్పటి వరకు నీవు ఆలస్యము చేయవద్దు. అదిప్పుడే పనిచేయుచున్నది. నీకిష్టమున్నా, లేకపోయినా అందులో నీవు చేరవలెను, చూచావా.

నీ మీద ఇప్పటికే ఆ ఆత్మ యున్నట్లు గమనించావా? తూర్పు, పడమర, ఉత్తరము, దక్షిణముల నుండి ఆత్మీయ గాలులు వీచుచున్నవి. జనులు అందులో నుండి బయటకు వచ్చుచున్నారు. జనులు దానిని చూచుచున్నారు. ఆ కారణము చేతనే ఈ పద్ధతికి నేను ఇంత వ్యతిరేకముగా యున్నాను. నాకు చీకటి గనబడుచున్నది. స్త్రీలు తమ ముఖములకు పూసికొనుచున్న దానిని గూర్చి గత ఆదివారము చెప్పాను. ఒకటి రానున్నదని నాకు తెలియును.

ఎందుకు నేను ఎల్లప్పుడూ దానికి విరోధిని? నాకు తెలియదు; ఇప్పుడు నాకది తెలియును. సంస్థగా మారిన మతము పట్ల నాకీ విరోధమెందుకు? ఇప్పుడు నాకు కనబడుచున్నది. అది మృగపు ముద్ర. గత కొద్ది వారముల నుండియే దీనిని నేను చెప్పుచున్నాను, చూచారా. వాక్యము నిజంగా వారికి బయలుపరచబడినా గాని సంఘ రాజకీయములు చూడండి. ఒక స్థిరమగు ముగింపునకు రావలెను.

MARK 3:22•

LUKE 11:15•

JOHN 5:39

 

87సంఘము త్రోసివేసిన తరువాత యూదులేమి చేసిరి? (సంఘము వాక్యమును త్రోసివేసెను). వారికది అక్కరలేదు. అదొక దురాత్మ అనిరి. వారి హృదయాలోచనలను అది తెలిసికొనెను? వారి తలంపు చెడ్డది. ఆయనెవరో ఆయన చేసిన కార్యములే సాక్ష్యమిచ్చెను. అయినా గాని వారికి వాక్యము వద్దు. తరువాత ఒక ప్రభుత్వము వచ్చెను. ఇది సంఘ ప్రభుత్వము, ఎందుకనగా దేశమంతా ఇందులో ఇరుక్కొనెను. ఒక మత రాజ్యమును అన్య రాజ్యము ఏలినది. అది ఒక లోక మతము. గ్రుడ్డివాడు కూడా దానిని చూడగలడు. దీనిని చూచినప్పుడు గ్రుడ్డివాడు ఏమనును? అతడు తన గ్రుడ్డితనము నుండి బయటకు వచ్చును.

MATT 12:24•

MATT 27:22•

REV 13:14

 

88క్రీస్తనబడిన యేసును మనమేమి చేయుదుము? వారికి నిశ్చయంగా ఆయన వద్దు. కాబట్టి వారు ఆయనను సిలువవేసిరి. ఇక ఆయన ఉండరాదని నిశ్చయించిరి. మత బలముతో దానిని చేసిరి. అటువంటి పరిచర్య ఎక్కడ జరిగినా గాని మూసివేయుటకు సిద్ధముగా నున్నారు. సంఘ అధ్యక్షుని నుండి అనుమతి పొందితేనే దానిని నీవు చేయగలవు, చూచావా. మృగపు ప్రతిమ. ఓ, మన మీ కాలములో యున్నాము. నిజంగా అందులోనికి మనము వచ్చియున్నాము.

తరువాత సిలువ వేయుదురు.

REV 13:14•

REV 17:5

 

89వారితో చేరని వారిని బోధించనీయరు. చూచారా? వాగ్దాన వాక్యమును నూతనముగా సిలువచేయుట అనగా అదే. "ఇక ఏ మాత్రము స్వస్థత కూటములు వద్దు." లేదయ్యా. నీవది చేయలేవు. నీవు సంఘ సమాఖ్య నుండి రావలెను, లేనిచో ఏదీ చేయరాదు.

శాఖా సంబంధమగు మతమునకు నేను ఎందుకు విరోధినో ఇప్పుడు మీరు తెలిసికొనిరి, ఎందుకనగా అది మృగపు ముద్ర. దానికి శిరస్సు రోమ్. నిజము. అది ఈ కూమార్తెలనందరినీ కలుపుచున్నది. అదే ప్రతిమ. దాని తల్లియు ఆ విధంగానే చేయుచున్నది. రోమ్ మొదట ఎక్కడ సంస్థగా మారినది? లోకములో మొదట్టి సంస్థాగత మతము ఏమిటి? రోమను కాతలిక్కు దానినెవరయినా కాదనగలరా? రోమ్ లోని నైసియాలో మొదటి సంస్థ రూపొందినది. వారు ముందుగా చేసిన సంస్థ అదియే.

90తన మరణము తరువాత లూధర్ ఏమి చేసెను? రోమ్ లోని నైసీయాలో చేసినట్లే చేసెను. వెస్లీ తరువాత వారేమి చేసిరి? ఉజ్జీవములన్నీ అయిన తరువాత వారేమి చేసిరి? వారి వలెనే చేసిరి. వేశ్యకు కుమార్తెలను తయారు చేసిరి.

REV 17:5

 

91ఇక్కడ ఒక చిన్న వాక్యము వ్రాసి యుంచాను. దానిని చెప్పకుండా ఉండెదను. నేడును ఆ సంఘ సంస్థలు ఆ విధముగానే యున్నవి. వారికి దాని శక్తి కావలెను. ఆ శక్తి పొందినప్పుడు వారు తమ ప్రభావమును కనుపరచెదరు.

కాతలిక్కు సంఘము, ప్రొటస్టెంటు సంఘము స్నేహితులగుదురు, గత ముప్పది సంవత్సరముల నుండి వారు ఏకమగుటకు ప్రయత్నించుచున్నారు. ఇప్పుడు వారు చేయుచున్న దానిని మీరు చక్కగా చూడగలరు. ప్రొటస్టెంటు వారెన్నడూ కాతలిక్కులు కారు గాని సోదర భావముతో ఏకమై మృగము ముద్ర వేసికొందురు.

GEN 3:3,5

 

92తల్లియగు హవ్వ సర్వలోకమును శారీరక మరణమును ఆ విధంగానే తీసికొని వచ్చినది. (వినండి). తల్లియగు హవ్వ శారీరక మరణము ద్వారా సర్వమానవ జాతిని కలుషితము చేసినది. ఏలాగు? వాక్యమును త్రోసివేసి వాక్యము వలె ఉన్న దానిని అంగీకరించుట వలన, శారీరక మరణమును తెచ్చినది. నిజవాక్యమును విడిచి పెట్టినది. నిజవాక్యమును కొద్దిగా నమ్మలేదు. దేవుని యొక్క వాక్యమును పూర్తిగా నమ్మనందునే ఈ గుండెపోటు, మరణము, భూమి మీద సమస్యను సంభవించేను. హవ్వ దీనికి కారణము. మృత్యువునకు తల్లి. మనమెక్కడికి వచ్చుచున్నాము మరణమునకు తల్లి యొద్దకు. ఆమె వాక్యము నమ్మలేదు. దేవుడు ఈలాగు చెప్పెను గదా? అన్నదామె.

అందుకు సాతాను, "అది నిజమే" అన్నది.

"దేవుడు చెప్పెను."

"అది నిజము."

"దేవుడు మాట్లాడెను."

"అది సత్యము."

"అవును, ఒక విధంగా అది నిజమే. కాని చూడు, పూర్తిగా అది సత్యము కాదు. నీ కన్నులు తెరవబడును."

దేవుడు చెప్పినదే స్థిరము. అది వాక్యము! వాక్యమును కొద్దిగా మార్చుట జరిగినది. తిరిగి ఆ ప్రకారమే ఈ అంతమందు జరుగును.

MATT 24:24

 

93చూడండి, తల్లిదండ్రుల కలయిక వలన కుమార్తె పుట్టినది. ఇక్కడ ఒక ఆశ్చర్యకరమగు సంగతి చూడండి. తల్లియగు హవ్వ, మరియు సాతాను దేవుని వాక్యమును నమ్మనందున శారీరక మరణము కలిగినది. వారు ఏకమై మరణమును తెచ్చిరి. సాతాను మరియు హవ్వల కలయిక వలన మరణము పుట్టెను.

హవ్వకు వాక్యమియ్యబడెను. ఆ వాక్యమునకు సాతాను విరోధి. చూడండి! అందులో నూటికి తొంభై-తొమ్మిది పాళ్ళు నమ్మిరి. సాతాను నిజమేనని ఒప్పుకొనెను. చాలా దగ్గరగా యున్నది. "సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సహితము చివరి దినములలో మోసపుచ్చును." అది ఎల్లప్పుడూ ఆ ప్రకారమే చేయుచున్నది. దేవుని యొక్క సంపూర్ణ వాక్యములో అవిశ్వాసమును చేర్చుచున్నది. మాకు తెలిసినదా? అందువలన మరణము వచ్చెను. వాక్యముతో అవిశ్వాసమును చేరెను. చాలా కొద్దిగానే అది ఉన్నది. నూటికి-ఒక్క-పాలు మాత్రమే నమ్మలేదు. కాని అది చాలును.

LUKE 17:28•

HEB 13:8

 

94గమనించండి, దేవుని కుమార్తె, సంఘము, వధువు, కూడా దేవుని యొక్క ఉత్పత్తియై యున్నది. దేవుడు, ఆయన వాక్యము కలియుట వలన ఆమె పుట్టెను. శరీరమందు పరిశుద్ధాత్మ ఏకమైనది. అప్పుడు దేవుని కుమారుడు జన్మించెను. దేవుని నీతి యొక్క ఉత్పత్తి. చివరి దినములు సొదొమ దినములవలె యుండునని చెప్పుబడెను. వధువు దేవుని వాక్యముచే శరీరమందు ఏకమగును. పరిశుద్ధాత్మ వారిని ముద్రించును, అవిశ్వాసము పారద్రోలును.

95బోతోవెన్ యొక్క జీవము నీలో యున్నచో, నీవును బోతోవెన్ వలె జీవించెదవు. హిట్లర్ యొక్క జీవము నీలో యున్నచో, హిట్లర్ వలె జీవించెదవు. క్రీస్తు జీవము నీలో యున్నచో, క్రీస్తు వలె నీవు జీవించెదవు. క్రీస్తు క్రియలు నీవు చేయుదువు. క్రీస్తు నేడు జీవించియున్నచో, ఈనాడు ఆయన ఏమి చేయునని వాక్యము చెప్పెనో, దానినే ఆయన చేసి యుండును. ఆయన నిన్న, నేడు, నిరంతరము, ఏకరీతిగా యున్నాడని వాక్యము చెప్పుచున్నది. ఈ గుడ్డి మత ప్రపంచము వారు జీవించుచున్న కాలమును ఎందుకు చూడలేకపోవుచున్నారు?

96వాక్యము లోనికి సాతాను మాటను చేర్చినందున ఈ మరణమునకు హవ్వ కారకురాలయినది. రోమ్లోని నైసీయా యొద్ద నున్న సంఘమునకును అదే జరిగినది. వాక్యమునకు బదులుగా ఆచారము తీసికొన్నది. మెతడిస్టు, బాప్టిస్టు, ప్రెస్బిటేరియను మొదలగు వారును అలాగే చేయుచున్నారు. ప్రతి యుగములోను వారు వెలుగును త్రోసివేయుచున్నారు. అందువల్లనే వెస్లీ లేచుటతోనే లూధరన్ చచ్చినది. అది మరో కాలము. వాక్యము వచ్చినప్పుడు దానిని వారు అంగీకరించవలెను, లేనియెడల మరణించెదరు. ఆ కారణము చేతనే ఇప్పుడు పెంతెకోస్తు వారు చనిపోవుచున్నారు. ఇది వాక్య ప్రత్యక్షత వచ్చిన పక్షిరాజు కాలము. తిరిగి వాక్యము నొద్దకు రావలసిన కాలము. తండ్రుల విశ్వాసమును తిరిగి పిల్లలకు ఇయ్యవలసిన కాలము. వారు ఏకమై వాక్యమును త్రోసివేసినందున ఆత్మీయ మరణము ప్రాప్తించెను.

GEN 2:24•

MAL 4:6•

MATT 19:5•

MARK 10:8

 

97దేవుని శరీరమగు వధువు దేవునితో ఏకమైనది. యేసుక్రీస్తు శరీరములో ఆత్మ పని చేసిన ప్రకారమే సంఘములో ఆయనాత్మ పనిచేయుచున్నది, ఎందుకనగా అది ఆయన శరీరములో ఒక భాగమైయున్నది. ఇద్దరు కారు, ఒక్కటే. భార్యా భర్తలు ఇద్దరు కారు గాని ఒక్కరే. క్రీస్తు ఆయన శరీరము ఒక్కటే. క్రీస్తులో నున్న ఆత్మయే ఆయన వధువులోనూ ఉన్నది. వారిరువురిని వాక్యము ఏకము చేయుచున్నది. దేవుడు అక్కడే ప్రత్యక్షమై జీవించుచున్నాడు.

ACTS 4:12•

REV 3:1

 

98[టేపు మీద ఖాళీ యున్నది.]

"అద్భుతాలు జరుగు దినములు అయిపోయినవి. అటువంటివేమి లేవు," అనుచున్నారు. "యేసుక్రీస్తు నామములో బాప్తిస్మమును నేను నమ్మను," అనుచున్నారు.

కాని నీవు పొందవలెనని బైబిలు చెప్పుచున్నది. ఎవరూ దీనిని కాదనలేరు. అది సత్యము. బాప్తిస్మము వలన పెద్ద మార్పు లేదని నీవనవచ్చు. అయితే ఎందుకు వ్రాయబడినది? పౌలుకు ఎందువలన మార్పు కలిగినది? తక్కిన వారందరూ ఎందుకు మారిరి? నీవు బాప్తిస్మము పొందవలెను.

"నీకు జీవించుచున్నావన్న పేరు మాత్రమున్నది గాని నీవు మృతుడవే," అని బైబిలు చెప్పెను. ఆకాశము క్రింద మరే నామము లేదు. నీవెందుకు అందులో బోధించుచున్నావు? ఎందుకు ప్రార్థించుచున్నావు. అన్నీ ఆ నామములోనే నీవు చేయుదువు గాని బాప్తిస్మము మాత్రము ఆ నామములో పొందవు.

ఒక రోజు ఈ సంగతిని ఒకాయనతో చెప్పాను.

అందుకతడు "అది పెద్ద అక్కర కాదు," అన్నాడు.

99"ఒక వ్యక్తి నీ యొద్దకు వచ్చి, తాను షారోను పూవు నామములో,

లోయలోని పద్మము నామములో, ఉదయ నక్షత్రము నామములో బాప్తిస్మము పొందితినని చెప్పినయెడల నీవు దానిని అంగీకరించెదవా?" అనడిగాను.

"అంగీకరించను," అన్నాడు.

"నీవతనికి తిరిగి బాప్తిస్మమిచ్చెదవా?" అనడిగాను.

"అవును," అన్నాడు.

"ఏలాగిచ్చెదవు?" అనడిగాను.

"తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్ముని యొక్కయు నామములో," అని చెప్పెను.

"అయితే నీవు కూడా ఆ షారోను పూవు, లోయలోని పద్మము, వేకువ చుక్కలను వానిలో బాప్తిస్మమిచ్చిన వ్యక్తి వలె ఉన్నావు, ఎందుకనగా అవి బిరుదులు; తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ అనునవి బిరుదులు," చూచారా.

"కాని నామములో బాప్తిస్మము పొందమని యేసు చెప్పెను."

ఆయన చెప్పిన దాని భావము ఇదే. ఆ మాటలను తిరిగి చెప్పమని ఆయన భావము కాదు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలనునవి బిరుదులు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ యొక్క నామము, చూచారా. పేతురు ఏమని చెప్పెను? మిగిలిన వారందరూ ఏమి చెప్పిరి? తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ యొక్క నామము ప్రభువైన యేసుక్రీస్తు. 30,000 మంది స్థానికులకు అతడు తిరిగి బాప్తిస్మ మియ్యవలసి వచ్చెను, చూచారా. అయితే అది నిజము.

పౌలు చెప్పెను, "పరలోకము నుండి ఒక దూత…"

ACTS 19:4,5

 

100యేసుక్రీస్తు నామములో బాప్తిస్మము పొందని వారు తిరిగి బాప్తిస్మము పొందినప్పుడే పరిశుద్ధాత్మను పొందెదరని పౌలు చెప్పెను. (అపొ.కా. 19:5), వారు దేవుని గట్టిగా స్తుతించుచున్నాగాని వారు తిరిగి యేసుక్రీస్తు నామములో బాప్తిస్మము పొందవలసి వచ్చెను. అప్పటికి వారు యోహాను బాప్తిస్మమును పొందిరి. గలతీ 1:8లో అతడిట్లు చెప్పెను, "నేను బోధించిన సువార్తను గాక వేరొక సువార్తను పరలోకము నుండి ఒక దూత దిగి వచ్చి ప్రకటించినా శాపగ్రస్తుడగును." కాబట్టి మనము వాక్యముతోనే నిలచియుండవలెను; ప్రతి మాటను పట్టుకొనవలెను, చూచారా.

GAL 1:18

 

101ఇందులో ఎట్టి సడలింపులు లేవు; నీ మనస్సులో ఏవైనా సందేహములున్నచో ఇప్పుడే సరిచేసికొనుము. ఆలస్యమగు వరకు వేచి చూడకుము. హృదయము వాత పెట్టబడు మనసాక్షిని పొందవద్దు. అలాగయితే ఇక నీవు దానిని చూడలేవు. నీవు గ్రుడ్డివానివగుదువు. ఆయన తన వాక్యమును బయలుపరచునట్లుగా ఇశ్రాయేలీయులకు గుడ్డితనము కలుగచేసెను. అన్యులకును ఆయన అదే చేయుచున్నాడు. అపుడు వారు నడిచినట్లే ఇపుడు వీరు నడచుచున్నారు.

102హవ్వ తిరస్కరించి తన హక్కులను పోగొట్టుకొన్నది. దేవుని ద్వారా వాక్యము బయలుపరచబడుటను ఆమె చూచినది. దానిని ఆమె తిరస్కరించి హక్కులను కోల్పోయినది. రోమ్ లోని నైసీయా యొద్ద కూడా వారాలాగే చేసిరి. సంఘ సమితిలో కూడా ఇప్పుడు అదే వారు చేయుచున్నారు. సోదరులారా, ఆదికాండము నుండి ప్రకటన వరకు వారాలాగే చేసిరి. ఇశ్రాయేలు అలాగే చేసినది. పిలాతు అదే చేసెను. హవ్వ మొదలుకొని అందరూ ఆ ప్రకారమే ఈనాటి వరకు చేయుచున్నారు. బయలుపరచబడిన వాక్యమును వారు త్రోసివేసి, దానికి బదులుగా ఒక ఆచారమును వెంబడించుచున్నారు. దానివలన ఆత్మీయ మరణము వచ్చెను. మృతులకును ఇంకా వాక్యము బోధించబడుచున్నది. వెయ్యేండ్ల పాలన వరకు బోధించబడదు. ఇప్పుడే సిద్ధపడుము.

2PET 3:3,4

 

103కయీను కుమారులు వాక్యమును నమ్మరు. ప్రవక్తయగు నోవహు వర్తమానమును చూచి కయీను కుమారులు అపహసించిరి. మీరది గమనించారా? దేవుని వాక్యము తరువాత తీర్పు వచ్చెను. కాలము సమాప్తమైనదని గురుతులు చూచిరి. దానిని కయీను కుమారులు హేళన చేసిరి. ఇప్పుడును వారు అదే చేయుచున్నారు. యేసు దినములలోను వారదే చేసిరి. అన్ని కాలములలోను వారాలాగే చేసిరి. దానిని వారు హేళన చేయుచున్నారు. "అంత్యదినములలో అపహాసకులు లేచెదరు," అని ఆయన చెప్పెను. మా పితరుల నాటి నుండి ఈలాగే కాలమున్నదని చెప్పి నవ్వుదురు.

మత పద్ధతి ద్వారా అపవాది పిల్లలు కూడా అదే చేయుచున్నారు. యేసుక్రీస్తు కాలములో వాక్యము ప్రత్యక్షమాయెను. చూచారా? యూదుల మతాచారము గొప్పది. యూదులు ఎంతగానో ఎరిగి యుండవలసినది, కాని వారి మతాచారము వలన దేవుని వాక్యమును తిరస్కరించిరి. (నమ్మితిమని చెప్పుకొనిరి) ఒక్క మాటను నమ్మకపోయినా శిక్ష తప్పదు. వారదే చేసిరి.

104నేడు వీరు అలాగే చేయుచున్నారు. మతాచారమను పెద్ద యంత్రములో వారు ఇరుక్కుపోయిరి. అంత్యకాల వాగ్దానములను త్రోసివేసిరి. అంత్యకాల వర్తమానమును, అంత్యకాల సూచనను, దేవుడు చెప్పిన ప్రతిమాటను వారు త్రోసివేసిరి. ఇవి టేపు మీద ఎక్కుచున్నవి. వారు నన్ను కాల్చి చంపినా, మరేమి చేసినా, వర్తమానము మాత్రము ఆగదు. అది ఎప్పటి మాదిరిగా సాగిపోవును. చూచారా? అది బయలు వెళ్ళినది. టేపు చేయబడినది. ఇది అంత్యకాలపు వాక్కు పూర్తిగా బయలుపరచబడి రుజువుకాబడినది; సూచక క్రియలు, అద్భుతములు, యాంత్రిక శక్తి, సైన్సు, సంఘము, ద్వారా ఇదే ఆ ఘడియ అని దేవుడు రుజువు చేయుచున్నాడు; వాక్యము, సూచనలు, అద్భుత క్రియలు దీనిని నిరూపించుచున్నవి.

MATT 6:10•

MATT 26:39,42•

MARK 14:36•

LUKE 11:2•

LUKE 22:42

 

105మా మధ్య ఈ ఘడియ సూచనలు, అద్భుతములు వెల్లడికాబడినవి. దేవుని వర్తమానము రుజువైనది. యేసుక్రీస్తు చనిపోక సజీవునిగా ఉన్నాడను వర్తమానము ఇదే. మలాకీ 4 మరియు, చివరి దినముల గూర్చి యేసు చెప్పిన ఇతర లేఖనములు చక్కగా నెరవేరుచున్నవి. సైన్సు ద్వారా పూర్తిగా రుజువుకాబడినవి. ప్రపంచ పత్రికలు ఆ వెలుగు మరియు దేవుని దూతలు దిగి వచ్చుటను గూర్చిన చిత్రములను ప్రచురించిరి. ప్రపంచమంతటా ఇది రుజువైనది. (వారికి దాని గూర్చి తెలియదు)

ఇక సిలువ మరణము మనము ఎదుర్కోనై యున్నాము. అప్పుడు యేసు ఇట్లనెను, "నేనేమందును? ఈ ఘడియ నుండి తండ్రి, నన్ను తప్పించుము. నీ చిత్తమే జరుగు గాక!" పరలోకమందు జరిగినట్లే ఇక్కడను జరుగవలెనని కోరెను.

సంఘము మనస్ఫూర్తిగా అదే చెప్పుచున్నది: "నేను ఎవరితోను చేరను. పరలోకమందున్నట్లే ఇక్కడను నీ చిత్తము జరుగును గాక!"

106ఆ కాలమునకు వాగ్దానము చేయబడిన వాక్య ప్రత్యక్షతను వారు చూచియు త్రోసివేసిరి. నేడును వారదే చేయుచున్నారు. ఇప్పుడు నేను ముగింపునకు వచ్చుచున్నాను. అప్పుడు ఆయన వాక్యముతో తన్ను తేటగా గుర్తింపచేసికొనెను. వాక్యమును వెంబడించాలా లేదా ఆచారమును వెంబడించాలా అని వారు ఆలోచించిరి; నేడును అదే స్థితి వచ్చియున్నది. వాక్యమును లేదా ఆచారమును ఎన్నుకొనవలెను. వారు ఆచారమునే ఎన్నుకొనిరి. ఇప్పుడు, అది ఏమి చేయును? (ముగింపులో) ఆయన లోకపు చేతులలో యున్నాడు. నిజము!

MATT 27:22

 

107నా అంశమును ఇప్పుడే ప్రారంభించాను. చాలా చుట్టూ తిరిగాను. (నేను ఛలోక్తి విసిరాను) చూడండి! అదంతా నా అంశమునకు వెనుకటి గాధ. దానిని మనము చూడవలెను. ఇప్పుడు అది ఎలాగు కనబడునో మనము చూచెదము. పరీక్షించి కనుగొందుము.

యేసు ప్రజల చేతులలో యున్నాడు. ఆయన సంఘము చేతిలో యున్నాడు. అభిషిక్తుడగు వాక్యముగా నున్న యేసును మీరేమి చేయుదురు? "క్రీస్తు" అనగా "అభిషిక్తుడు" అని అర్థము. యేసును మీరేమి చేయుదురు? పిలాతు అదే ప్రశ్న అడిగెను. క్రీస్తనబడిన యేసును నేనేమి చేయుదును? ఈ తరువాత నేను తీసికోవలసిన నిర్ణయమేమిటి? లోకము ఏమనుచున్నది? సంఘము ఏమనుచున్నది? "సిలువ వేయుము! వాక్యము మాకు అక్కరలేదు," అనుచున్నారు.

108ఒక సంగతి మిమ్మును అడిగెదను. ఆస్వాల్డ్ చేతులలో ఉన్న రక్తమును గూర్చి ఈ ఉదయము మీరూహించగలరా? దేశాధ్యక్షుని చంపిన వాడతడే. చేసినది అతడేనని రుజువయినప్పుడు అతనికెట్టి శిక్షపడునో ఊహించండి. అతనికెవరైనా దయ చూపుదురా? అమెరికా దేశాధ్యక్షుని రక్తము అతని చేతులలో యున్నది. "నేను చేయాలని చేయలేదు," అని అతడు వాదించినా, ఏమి క్షమాపణ దొరకదు. అతడు నశించును. ఎందువలన? దేశాధ్యక్షుని రక్తాపరాధము అతని చేతుల్లో యున్నది.

అతని మనోభావములను నిరూపించగలరా? మీ చేతులలో దానిని ఉంచుకోగోరుదురా? యేసుక్రీస్తు రక్తము మాట ఏమిటి? క్షమించబడుదుమని మీరనుకొనుచున్నారు. పూర్తిగా ఇది బయలుపరచబడినది గనుక నీవెట్లు తప్పించుకొందువు? ఆయన రక్తము నీ చేతులలో యున్నది. అపరాధము! పాపము చేసిన నీవు ఎక్కడికి పోగలవు? ఈ ఉదయకాల కూటము తరువాత నీవెచ్చటికి వెళ్ళగలవు?

MATT 27:22

 

109నాకు చెడుగా జీవించవలెనని లేదని నీవనవచ్చును. ఆస్వాల్డు కూడా అదే చెప్పును. సుప్రీం కోర్టులో అతనికి న్యాయము చెప్పెదరు. దేశములో అదే అత్యున్నతమైనది. దేశమంతా ఆ ఉన్నత న్యాయస్థానము విధించిన దానికి కట్టుబడి యుండును. అతడు నేరము చేసెను. దానికి వెల చెల్లించవలెను. అతని అభిప్రాయములను, ఉద్దేశ్యములను ఎవరూ పరిగణనలోనికి తీసికోనరు. ఏమయినా గాని దానికి అతడు వెల చెల్లించవలెను.

మన సుప్రీం కోర్టు ఇచ్చు న్యాయమే అంత ఖచ్చితముగా ఉన్నచో, దేవుని తీర్పు మరెట్లుండును? నీ చేతులలో యేసుక్రీస్తు రక్తమున్నది. అభిషేకించబడిన వాక్యమగు యేసును నేనేమి చేతును? దానిని గూర్చి మీరు విన్నారు. అది సత్యమని మీకు తెలిసినది. అది పూర్తిగా బయలుపరచబడినది.

110ఒక హంతకుని కోరిరా? వాక్యమును, అమాయకుడగు క్రీస్తును హత్య చేసిన శాఖను మీరు కోరుకొందురా? మీరు సిలువ వేయుదురా? బరబ్బను కోరుకొనుటకు తెగించుదురా? బరబ్బను కావలెనని కోరుదురా? ఎంత ధైర్యముగా ఆ పని చేయగలరు? వాక్యమును హత్య చేసిన బరబ్బను కావలెనని కోరుదురా? వాక్యమే జీవము. అది మీ చేతులలోనే యున్నది.

ప్రెసిడెంటు కెన్నెడీ హత్య గూర్చి నేను విన్నప్పుడు, ఈ వర్తమానము నా హృదయము లోనికి వచ్చినది. అతడేమి చేయును? ఇప్పుడు ఇక తప్పించుకొనలేడు. ఈ పాటికి అతడు గ్రహించియుండవచ్చును గాని అంతా అయిపోయినది.

111నీవు కూడా ఏదో ఒక సమయములో గ్రహించవలసియుందువు. నీవు టేపు వినుచుండవచ్చును. పాపము చేసిన నీవు నీ చేతులలో రక్తమున్నదన్న సంగతిని గ్రహించియుందువు. అది దేవుని కుమారుని రక్తము. ఆయనను హత్య చేసిన నేరము నీ మీద ఉన్నది. నీ పావము ఆయనను హతమార్చినది. ఆయన వాక్యమును నీవు నమ్మకపోవుటయే దానికి కారణము. ఆయన గుర్తింపును నీవు చూచుటలో విఫలమైనావు. పరిశుద్ధాత్మను దుఃఖపరచితివి. దేవుని తీర్పులో నిలబడుట తప్పు మరేమి ఉన్నది? నీకు జరుగనైయున్నది నీకు తెలిసియున్నది. జాన్ కెన్నెడీ యొక్క రక్తము ఆస్వాల్డు చేతులలో యున్నది, కాని దేవుని యెదుట నీవు యేసుక్రీస్తు యొక్క రక్తము చేతులలో ఉంచుకొని నిలబడుట మరెంత ఘోరము?

MATT 27:22•

HEB 13:8

 

112"క్రీస్తనబడిన యేసును నేనేమి చేయుదును?" అని పిలాతు చెప్పెను. అతని చేతులలో ఆయన ఉండెను. యేసుక్రీస్తు యొక్క రక్తము మరల ఈ సమాజము చేతులలో యున్నది. ఈ దేశపు చేతులలో యున్నది. ఈ ప్రపంచము యొక్క చేతులలో యున్నది. ఈ టేపులు, ఈ క్రియలు దానిని రుజువు చేయుచున్నవి. నిన్న, నేడు, నిరంతరముగా ఉన్న ఈ యేసును మనమేమి చేతుము?

ఆయన పక్షముగా యుండుటకు నీవు సిద్ధముగా యున్నావా? ఆ పిలాతు చేసిన మూడు క్రియలే నీకును నేడు నిలచియున్నవి. పిలాతు ఆ మూడింటిని చేయ ప్రయత్నించెను గానీ తప్పిపోయెను. నీవు కూడను ఈ మూడింటిని చేయ ప్రయత్నించవచ్చును, కాని పని చేయదు. పిలాతు ఆయనను తన చేతులలో నుండి తీసివేయగోరెను. కాని ఒక్కసారి నీ చేతులలో ఆయన ఉన్నచో ఆయన రక్తాపరాధము నీ మీదనే యుండును. పిలాతు మూడు విధములుగా ప్రయత్నించెను గాని విఫలుడాయెను.

HEB 13:8

 

113ఆయన మన చేతులలో ఉన్నాడన్న వాస్తవమును మనము కాదనలేము. ఆయనను ఆయన వాక్యములో మనము చూచాము. ఆయన తన్ను తాను బయలుపరచుకొనెను. ఆయన నిన్న, నేడు, నిరంతరము ఏకరీతిగా యున్నాడని మనకు తెలియును. అవునా? నేను ఈ ఉదయము ఇక్కడున్న జనులతో మాత్రమే మాట్లాడుట లేదు గాని, ఈ టేపు ద్వారా ప్రపంచములోని మిలియనుల మందితో మాట్లాడుతున్నాను. ఇక్కడ ఆరు లేక ఏడువందల మంది ఉన్నారు. మీరెక్కడ ఉండి వినుచున్నాగాని ఆయన మీ చేతులలో యున్నాడు. అది సత్యమని మీరెరుగుదురు, లేనియెడల మీరు గ్రుడ్డివారే. వాక్యమును గాని వాక్యములో ఉన్న దేవునిని గాని మీరు చూడలేరు. ఆయన మీ చేతులలోనే యున్నాడు. మీరాయనను ఏమి చేయనై యున్నారు?

ROM 10:17

 

114పిలాతు ఆయనను వదిలించుకోగోరెను, కానీ మనము వాస్తవములను ఎదుర్కొనవలెను. పిలాతు ఆ ప్రకారమే ఎదుర్కొనెను. అతడు వినెను, తెలిసికొనెను. నీవును విన్నాను. ఇప్పుడు మీరు వినుచున్నారు. యేసు తన కొరకు ఏదో ఒక అద్భుతము లేదా గమ్మత్తు చేయవలేనని అతడు కోరెను. దేవుడు తను ఏది చేయుమనునో దానినే అతడు చేయవలసియున్నాడు.

మీరు విన్నారు! వినుట ద్వారా విశ్వాసము వచ్చును. విశ్వాసము కలిగి యుండియు నీవు ఆయనను నీ చేతులలో నుండి తీసివేసికోవలెనని తలంచుచున్నావు. కాని వాస్తవములను ఎదుర్కొనక తప్పదు. ఆయన పూర్తిగా గుర్తించబడెను. ఆయన రక్తము మీ చేతులలో యున్నది!

115ఒక వ్యక్తి రక్తము నీ చేతులలో యున్నప్పుడు నీవు దాని గూర్చి ఆలోచించవలసియున్నావు. ఒక విమానమును చూడుము. విమాన చోదకుడు అన్ని సాధనములను పూర్తిగా పరీక్షించి విమానము నడుపును. ఎందువలన? అతని చేతులలో వారందరి రక్తము ఉన్నది. పరీక్షించవలసిన ప్రతి పనిముట్టును పరీక్షించును. విమానము ఎగిరే ముందు ఇంజనును వేడెక్కించి చూచును. నేల నుండి పైకెగురుటకు ఆ గాలి చక్రము తగినట్లున్నదో లేదో చూచును. విమానమునంతటినీ ఒక్కసారి అతడు కదిపిచూచును. కొంచెము ఆలస్యమైనా మంచిదే గాని అంతా పరీక్షించవలెనని ఆ కూర్చొన్న వారును కోరుకుందురు.

116సంఘము మరెంతగా పరీక్షించుకోవలసియున్నది. మనము ఆయన రాక కొరకు ఎదురు చూచుచున్నాము. పైకెగురుటకు మనము సిద్ధపడుచున్నాము. ఎవరో చెప్పినది కాదు గాని, వాక్యమును మనము వినవలెను. దానితో మనము పరీక్షించుకొనవలెను. క్రీస్తుతో నీవు వ్యక్తిగత అనుభవము కలిగియుండునట్లుగా తెలిసికొనవలెను. మరల పరీక్షించుము, మరల పరీక్షించుము. ఎందుకు? ఒకాయన రక్తము నీ చేతులలో యున్నది. పరీక్షించుకొనుట మంచిది.

117ఆపరేషను చేయుముందు వైద్యుడేమి చేయును? ఈ ఉదయము ఇద్దరు వైద్యులు ఇక్కడ కూర్చొనియున్నారు. ఆపరేషను చేయు ముందు ఒక డాక్టరు ఏమి చేయును? ఎక్సురే తీయును. రక్తమును, గుండెను అతడు పరీక్షించును. మత్తు ఇచ్చు ముందు నీకు జలుబున్నదేమో పరీక్షించును. ప్రతి పరికరమును పరీక్షించి దానిలోని సూక్ష్మజీవులు చచ్చిపోవునట్లు బాగా మరిగించును. చేయవలసినదంతయూ చేయును. మరల మరల అతడు పరీక్షించును. ఎందుకు? అతని రక్తము ఇతని చేతిలో యున్నది. అంతా బాగున్నదని అతడు నిశ్చయించుకొనవలెను.

118నీ సంగతి ఏమిటి? పాపివైన నీ మాట ఏమిటి? ఒకాయన రక్తమును నీ చేతులలో ఉంచుకొని నీవేమి తలంచుచున్నావు? విమాన పైలట్ వలె బాధ్యతతో పరీక్షించుము. వైద్యుని వలె జాగ్రత్తగా పరీక్షించుము. ఒక మనుష్యుని రక్తము నీ చేతిలో యున్నప్పుడు నీవేమి చేయుదువు? ఒక న్యాయాధిపతి తన తీర్పును ప్రకటించు ముందుగా ఎన్నో పేజీలలోని దానిని మరల మరల చదువును. శిక్ష వేయు ముందు ప్రతి చిన్న దానిని చదువును, ఎందుకనగా అతని రక్తము న్యాయాధిపతి చేతిలో యుండును. దానిని అతడు తన మిద లేకుండా చూచుకొనును, గమనించారా.

MATT 27:22

 

119మన సంగతి ఎట్లున్నది? ఆయన నిన్న, నేడు, నిరంతరము ఏకరీతిగా యున్నాడని పూర్తిగా మనకు బయలుపరచబడియున్నది. ఆయన ఇక్కడున్నాడు. ఆయన మన చేతులలో యున్నాడు. ఆయన మా చేతులలో యున్నాడు! ఆయనను మీరేమి చేయబోవుచున్నారు? క్రీస్తనబడిన యేసును నేనేమి చేయబోవుచున్నాను? "ఆయనేమి చేయును? ఆయనను నీవెట్లు తెలిసికొందువు?" నేడు మనము జీవించుచున్న ఈ దినపు వాగ్దానమును చూడండి. ఎంతో వాక్యభాగము నెరవేరవలెను. ఇవి చివరి దినపు ఘడియలు. జరుగవలసియున్న చాలా సంగతులు మన ముందున్నవి. అభిషిక్తుడగు క్రీస్తు, అభిషేకించబడిన వాక్యము ఇక్కడున్నారు. వాటిని మీరేమి చేసెదరు? శాఖకు దానిని మీరు అమ్మివేయుదురా?

MATT 27:24•

LUKE 23:4,14•

JOHN 18:38•

JOHN 19:4,6•

HEB 13:8

 

120పిలాతు ఏమి చేసెను? పిలాతు తన చేతులను కడుగుకొన ప్రయత్నించెను. "ఆయన మంచివాడే" అని చెప్పెను.

పిలాతును చాలామంది మంచివాడందురు. కాడు! అతని చేతులలో యేసు ఉండెను. అతడు వర్తమానము వినెను, వాక్యమును చూచెను; అతని చేతులలో ఆయన ఉండెను. అలాగే నీ చేతులలోను ఆయన ఉన్నాడు. ఇది నిజము.

"ఆయన మంచివాడే, ఆయనలో ఏ తప్పిదము లేదు," అని చెప్పి వదిలించుకో ప్రయత్నించెను.

121"ఓ, వాక్యములో ఏమి తప్పులేదు. అది మంచిదే. బైబిలు సరియే, కాని మేము సంఘమును నమ్ముదుము. మా శాఖ దానితో ఏకీభవించదు," అని నేడు చాలామంది జవాబిచ్చుచున్నారు, చూచారా. ఒక రకమగు జనులు తమ చేతులలో నుండి ఆయనను కడిగివేసికొనుటకు ప్రయత్నించుచున్నారు. వాక్యములో తప్పు లేదు. అపోస్తలులు మంచివారే; కాని మనము వేరే దినములలో జీవించుచున్నాము. కాబట్టి మనము అపొస్తలులు చేసినట్లుగా చేయనక్కరలేదు. వారి వలె నేను బాప్తిస్మము పొందనవసరము లేదు. నేను మరో దినమున జీవించుచున్నాను. పరిశుద్ధాత్మ ఆనాటి వారికే ఇయ్యబడెను," అని చెప్పుచున్నారు.

MATT 27:19,24

 

122హెబ్రీ 13:8 చూడండి, తప్పించుకోలేరు! ఆయన పూర్తిగా బయలుపరచబడెను. ఆయన నిన్న, నేడు, నిరంతరము ఏకరీతిగా యున్నాడు. మీరు తప్పించుకొనలేరు. ఆయనను మరో కాలమునకు మీరు త్రోసివేయలేరు. నీ ఆలోచనలను హెబ్రీ 13:8 ఖండించుచున్నది. ఆయన నీ చేతులలో యున్నాడు. పిలాతు చేతులలో ఉన్నట్లే యేసు నీ చేతులలో యున్నాడు.

"నాకు తెలియదు," అని నీవు చెప్పవచ్చు. అయితే నీవు ఏమి వినుచున్నావు?

పిలాతు ఒక అన్యుడు. అతని భార్య ఒక అన్యురాలు. కాని దేవుడు న్యాయము తీర్చుటకు ఆమెను అక్కడికి పంపెను. "ఈ నీతిమంతుని జోలికి పోవద్దు. రాత్రి నేను ఆయన గూర్చి కలగంటిని. ఆయనను ఏమి చేయవద్దు," అనెను. (గతించిన రాత్రిలో ఆమెకు కల వచ్చెను).

"అలాగయితే నేను నా చేతులలో నుండి ఆయనను తీసివేసికొందును," అని చెప్పెను. కాని దానిని అతడు చేయలేకపోయెను. నీవు సత్యమును వినినప్పుడు అంగీకరించవలెను లేదా త్రోసివేయవలెను. మరో దారి లేదు. ప్రభుని హెచ్చరిక!

HEB 13:8

 

123"ఆ రక్తము మా మీద ఉండును గాక; ఏలయనగా మేము మా యాజకులను, శాఖను నమ్ముచున్నాము గాని ఆయనను నమ్ముట లేదు," అని యూదులు కేకలు వేసిరి. నేటి జనులలోను అట్టి వారున్నారు. కాని అందరూ దేవుని గూర్చి బాధ్యత వహించవలెను. ఏమైనా గాని ఆ పని మీదే. నీవు అన్యునివైనా, అవిశ్వాసివైనా, మెతడిస్టువైనా, బాప్టిస్టువైనా, ప్రెస్పిటేరియనువైనా, నులివెచ్చగా నున్నా, చల్లగా ఉన్నా, వెచ్చగా ఉన్నా, మరెట్లున్నాగాని, నీకు ఇష్టమున్నా లేకపోయినా ఈ వాస్తవములను ఎదుర్కొనవలెను. నీ చేతులలో అది యున్నది. అది ఖచ్చితముగా!

MATT 27:24,25

 

124దీనిని తప్పించుకొనుటకు పిలాతు వలె ఇతర పధకములను వేసిన వారును ఉన్నారు. మరో కైసరు మీదికి నెట్టుచున్నారు, చూచారా. పిలాతు

ఇట్లనెను, "ఒక్క నిమిషము ఆగండి. ఆయన నీతిమంతుడు. నేను ఆయన జోలికి పోను. నేను వినిన దానిని నమ్ముచున్నాను. నేను ఎన్నడూ ఆయన అద్భుతము చేయుట చూడలేదు. అందుకు చాలామంది సాక్షులున్నారు. ఆయన నీతిమంతుడని నేను నమ్ముచున్నాను. ఆయన సత్పురుషుడు. నాకుగా నేను ఆయన జోలికి వెళ్ళను. [చూచారా]. నా చేతులలో నుండి ఆయనను కడిగి వేసికొందును; కొన్ని నీళ్ళు తెండి. మీరే దీనికి బాధ్యులు." అవును, కాని దేవుడు కూడా సాక్ష్యమిచ్చుచున్నాడు.

అతని చేతులతో ఆయన ఉండెను;

MATT 27:22

 

125ఆ విధరగానే ఆయన నీ చేతులలో యున్నాడు. నా మాటను గ్రహించండి. మీరే కాదు; ఈ టేపును వినుచున్న వారును గ్రహించవలెను. క్రీస్తనబడిన ఈ యేసును మీరేమి చేయుదురు? క్రీస్తు అనగా అభిషేకించబడిన వాక్యము, చూచారా. దానిని మీరేమి చేయబోవుచున్నారు? ఇది ఈ ఘడియ వర్తమానము. ఇదే ఆ రోజు. బైబిలు ద్వారా దేవుని ద్వారా చాలా రుజువైనది. దానిని నీవేమి చేయబోవుచున్నావు? దీనిని నీవెట్లు తప్పించుకొందువు? ఆయన నీ చేతులలో యున్నాడు. మా కంటి ఆస్వాల్డు నేరము చిన్నదిగా ఎంచవచ్చును.

126యాజకులు, రబ్బిలు, బోధకులు, పరిశుద్ధులు, యూదులు అందరూ తమ చేతులలో ఆయననుంచుకొనియున్నారు. ఆయన వాక్యము, దేవుని సంగతి గూర్చి వారానాడు ఆలోచించక తప్పిపోయిరి. ఏర్పరచబడిన వారే చూచిరి. నమ్మిన వారే దానిని చూచిరి.

అందరూ వీటిని గూర్చి ఆలోచించవలెను. ప్రతి యుగములోను, ప్రతి కాలములోను అలాగే యున్నది. ఆదామవ్వల కాలము నుండి, నోవహు కాలము నుండి, దానియేలు కాలము నుండి మరియు బెత్తెషాజరు… మరియు నెబుకద్నెజరు; క్రీస్తుకాలము వరకు అలాగే జరిగియున్నది. మనము జీవించుచున్న ఘడియలోను అలాగే జరుగుచున్నది; వాక్యము గూర్చి నీవేమి తలంచుచున్నావు. వారి విశ్వాసము కాదు, వారి శాఖ కాదు, వారి సిద్ధాంతము కాదు గాని వాక్యము గూర్చి ఆలోచించండి, వాటికి విరోధముగా ఉన్నది. అంతే. ఇప్పుడది మీ చేతులలో యున్నది;

MATT 27:24

 

127ఆయనను మరొకరికి అప్పగించి తన చేతులు కడుగుకొనవలెనని ప్రయత్నించిన పిలాతు వంటి వారే ఇప్పుడు చాలామంది ఉన్నారు. పిలాతు ఏమనుకొన్నాడో తెలియునా? నీటితో చేతులు కడుగుకొని ఆయనను వదిలించుకొనవలెనని ప్రయత్నించెను. ఆయనను ఏమి చేయవలెనో తెలియక తన ప్రధాన కార్యాలయము యొద్దకు, బిషప్పు యొద్దకు ఆయనను పంపెను. నేడును వీరు అలాగే చేయుచున్నారు, చూచారా. వారాయనను కైసరు నొద్దకు పంపిరి. అంత మాత్రమున పిలాతు చేతులు ఖాళీ అవలేదు. అది తిరిగి అతని మీదికే వచ్చెను. వ్యక్తిగత బాధ్యత నీ మీద యున్నది.

REV 4:7

 

128"నా శాఖ అంగీకరించినట్లయితే నేనును అంగీకరించెదను," అని నీవనవచ్చును. నీ శాఖ ప్రపంచ సంఘ సమితిలో యున్నది. దానిని వారెట్లు చేర్చుకొందురు? తిరిగి అది నీ మీదికే వచ్చును. నీ శాఖ చేప్పేది కాదు. నీవేమి చెప్పెదవు? దానిని వారు నిరాకరించిరి. దానిని నీవేమి చేయుదువు? అదీ అసలు ప్రశ్న. నీ చేతులలో నుండి ఆయనను తీసివేసికొనలేవు. ఆయన ఎంతో ప్రత్యక్షత ఇచ్చుచున్నాడు. ఆయన పూర్తిగా గుర్తించబడెను. ఈ ఘడియ యొక్క వాక్యము మరియు వాగ్దానము ఆయనే. లూధర్ ఘడియ యొక్క వాగ్దానము కాదు. అది సంస్కరణ కర్తల కాలము. ఏడు ముద్రలలో మిరది విన్నారు.

సంస్కరణ కర్తల కాలము అయిపోయిన తరువాత సంస్థ తయారు అయినది. (నరుని ముఖము కలిగిన మృగము). కాని ఇది పక్షిరాజు ముఖము (నేటి సవాలును అది విసరుచున్నది).

129అది దేవుని ప్రేరేపణ కలిగిన వాక్యము కాదని ఎవరందురు? దీనిని గూర్చి ఆయన ముందే చెప్పెను. అరిజోనాలోనికి అది పంపబడెను. దానిని సైన్సు రుజువు చేసినది. ఈ గ్రంధము ముందే విప్పబడినది. క్రీస్తు రాకతో ఏడవ ముద్ర గుర్తించబడునని ఎదురుచూచుట జరుగుచున్నది.

130ఆయన మీ చేతులలో యున్నాడు. ఆయనను మీరు ఏదో చేయవలసి యున్నారు. ఆయనను త్రోసివేయవద్దు. "బ్రెన్హాం సోదరుడా, మా శాఖ దానిని అంగీకరించిన యెడల నేనును అంగీకరించెదను," అని నీవందువు. కాని చూడండి, నా తల్లి ఈ సంమమునకు చెందెను. ఆమె తన కాలములో జీవించినది; అది నీది కాదు. ఇది నీ కాలము. ఆమె అందులో నుండి బయటకు వచ్చినది. నీ సంగతి ఏమిటి?

చూడండి! నీవిట్లు అనవచ్చు, "నా తల్లి పెంతెకోస్తు. ఆమె పెంతెకోస్తు నుండి బయటకు వచ్చు వరకు నేను వేచియుందును." కాని నీ గూర్చి నీవు ఆలోచించుము. నీ సంగతి ఏమిటి? చాలా మంది విద్యాధికులు అలాగే యున్నారు. నా మాటలు కఠినముగా యుండవచ్చును గాని ఉద్దేశ్యపూర్వకముగా అనుట లేదు. మారుమనస్సుతో వేదిక నొద్ద మోకరించుము. దైవప్రేమతో దీనిని నేను చెప్పుచున్నాను.

GEN 3:12,13•

LUKE 23:34•

JOHN 8:44

 

131యేసు ఆ పరిసయ్యులను చూచి ఇట్లనెను, "మీరు మీ తండ్రియగు అపవాది సంబంధులు. వాని క్రియలే మీరు చేయుచున్నారు." అయినా గాని ఆయన సిలువ మీద ఉండి వారి కొరకు దయతో మాట్లాడెను. వారాయనను సిలువ వేసిరి. వారిని చూచి ఆయన కోపపడలేదు. "సర్పసంతానమా," అని ఆయన వారిని పిలచెను. ఆయన వారిని చూచి సిలువ మీద నుండి ప్రార్థించెను, చూచారా.

ఆయన ఇష్టపూర్వకంగా అలాగు మాట్లాడలేదు; అది కాదు. కాని వారి తప్పును వారు తెలిసికొనునట్లు చేసెను. నేడు నేనును అలాగే చెప్పుచున్నాను. ఎవరి మీదికే త్రోసివేయుట కాదు. ఆదామవ్వలు చేసినట్లుగానే ఒకరి మీదికి ఒకరు త్రోసుకొనుచున్నారు. "నీవిచ్చిన స్త్రీయే కారణము," అని ఆదామనెను. అతనికి క్షమాపణ లేదు, చూచారా. "సర్పము నన్ను మోసము చేసినది. సర్పమే నాతో లైంగిక సంబంధము కలిగియున్నది," అని హవ్వ చెప్పెను. అది వారిని ఏ మాత్రము కాపాడలేదు. వారు నేరుగా అదేరీతిగా తీర్పులోనికి వెళ్ళరు. అవునండి!

132మంచిది, ఒకరి మీదికి నీవు త్రోసివేయజాలవు; "నా శాఖ నమ్మిన యెడల నేనును నమ్ముదును" అని నీవు చెప్పరాదు. దానితో చేయునది ఏదియు లేదు. యూదులు కూడా అలాగే చేసిరి, నీవు కూడా అదే చేయుచున్నావు.

చక్కని సంస్కృతి కలిగిన మనుష్యులు చాలామంది యున్నారు. జాగ్రత్తగా వినండి. నేడు మనము నాగరికత అని పిలచుచున్నాము, సాతాను హవ్వకు ఆ నాగరికతనే ఇచ్చినది. ఒక చిన్న జ్ఞానము ఇచ్చెను. మీ కన్నులు తెరువబడలేదు గనుక దానినంతటినీ మీరు అర్థము చేసికొనలేరని చెప్పెను. ఆ వాక్యమును దేవుడు ప్రత్యక్షపరచుట ఆమె చూచెను. ఆ వాక్యముతో ఆమె నిలచియున్నంత వరకు ఆమెకు నిత్యజీవమున్నది. దానిని మీరిన దినమున ఆమె చనిపోవునని దేవుడామెతో చెప్పెను. దానిని మీరగానే ఆమె చనిపోయెను. అది నిజము!

MAL 4:3,6

 

133ఇక్కడ మనకు బయలుపరచబడిన దేవుని వాక్యమున్నది. ఆత్మ ద్వారా అది బయలుపరచబడి రుజువు చేయబడియున్నది. ఆయన మనలను చేర్చుకొని పరిశుద్ధాత్మ బాప్తిస్మము ఇచ్చుచున్నాడు. యేసుక్రీస్తు నామము లోనికి మనము బాప్తిస్మము పొందియున్నాము. సువార్త మారలేదు, సూచక క్రియలు మారలేదు, అద్భుతములు మారలేదు, సేవ మారలేదు; అదే అగ్నిస్తంభము మన ఎదుట ప్రత్యక్షమై సూచక క్రియలను, అద్భుతకార్యములను చేయుచున్నది. కాబట్టి నెపము చెప్పజాలరు. చివరి దినములలో జరుగునని బైబిలు చెప్పినదే ఇప్పుడు జరుగుచున్నది. మలాకీ 4ను చూడండి. పిల్లల హృదయములను తండ్రుల విశ్వాసము వైపు త్రిప్పును. ఆ తరువాత దుర్మార్గుల ధూళి మీద నీతిమంతులు నడచిపోయెదరు. ప్రపంచమంతా దహించబడును.

అణుబాంబులు ఎదురుచూచుచున్నవి. అధ్యక్షుడు హతమాయెనని తెలిసిన వెంటనే జర్మనీ ఏమి చేసెనో చూడండి. వారు తమ సైన్యమును త్వరగా సిద్ధపరచిరి. రష్యాపై బాంబుల దాడిని త్రిప్పుటకు వారు త్వరపడిరి. కెన్నెడీ వారికి హామి ఇచ్చెను, వారది చేసిన ఆ ఘడియలో వారిని భూమి మీద నుండి తుడిచివేయుదునని చెప్పెను. వారది చేయాలని అనుకున్నారు, కాని ఆ ఘడియ ఇంకా రాలేదు, చూచారా.

MATT 27:11•

MARK 15:2•

LUKE 23:3,4,14•

JOHN 18:37,38•

JOHN 19:4,6

 

134తెలివైన విద్యగల బోధకులు, సువార్తికులు మనకున్నారు. ఎవరి మిదికో త్రోసివేయుచున్నారు, చూచారా. ఎందువలన? పిలాతు ఎందుకిట్లు చెప్పలేదు? "ఒక్క నిమిషము ఆగండి. నా భార్య వచ్చినది, ఆయన గూర్చి చాలా సాక్ష్యములు నేను విన్నాను. నిత్యజీవము పొందుటకు నాకు ఆసక్తి కలుగుచున్నది. ఏమి చేయవలెను? నీవు మెస్సీయావా? యూదులకు రాజువా?"

"నీవన్నట్లే" అని ఆయన పలికెను.

లేక, "నీవు నిజముగా యూదుల రాజువా?" అనడిగెను.

యోహాను 18:37

"అందుకే నేను జన్మించితిని" అనెను.

"ఈయనలో ఏ తప్పిదము నాకు కనబడలేదు. నా చేతులు కడుగుకొనుచున్నాను," అని అతడు చెప్పెను.

ఆయన జవాబిచ్చినా, అతడు దానిని గ్రహించలేకపోయెను. ఎందువలన? అతని కీర్తి తగ్గిపోవును, కాబట్టి ఇంకొకరిని పంపి ఈ విషయమును తప్పించుకొనగోరెను.

ఇప్పుడును అదే జరుగుచున్నది; మరల అదే ప్రశ్న వచ్చుచున్నది. వాక్యమును మీరేమి చేయుదురు? ఏమి చేయవలసియున్నారు? బిషప్పునో, ఇంకా పెద్దవానినో అడుగుము. నీ బాప్తిస్మపు విధానము మార్చునేమో అడుగుము. వారు నీకు నిశ్చయముగా మార్చవద్దని జవాబు ఇచ్చెదరు. నీవు అలాగు లోబడనియెడల నిన్ను వెలివేయుదురు, చూచారా.

135జనులు ప్రతిష్టకు పోవుచున్నారు. ఈ శాఖా సమితులు వాక్యము కొరకు నిలువవు. పిలాతు, కైసరు మీదికి త్రోసినట్లే త్రోయుచున్నారు. కైసరు మరల పిలాతు చేతిలో ఉంచెను. కాబట్టి వారు తమ శాఖ నాయకుల మీదికి త్రోసివేయవలెనని తలంచిరి గాని లాభము లేకపోయెను. ఈ ఎత్తుగడ పారలేదు. పిలాతునకు పనిచేయనట్లే నీకును అది పనిచేయదు. ఎవరికీ పనిచేయదు.

ఇప్పుడు, రెండవదిగా, నీవు చేయగల విషయము…

MATT 27:22,24

 

136మూడవదిగా, నీవాయనను తిరస్కరించాలి లేదా అంగీకరించాలి. నీ చేతులను కడుగుకోలేవు! మరెవరి మీదికో లేక మరో వ్యవస్థ మీదికి ఆయనను త్రోసివేయలేవు. నీవే సమస్యను ఎదుర్కొనవలెను. కాబట్టి నీవేమి చేయగలవు? పిలాతు లేచి ఇట్లనెను, "నాకు నీళ్ళు ఇవ్వండి, నా చేతులు కడుగుకొందును." కాని అతడు తీర్పును చెప్పవలసియున్నాడు; నెపము దొరకలేదు. కాబట్టి కైసరు చేతులలో ఆయనను పెట్ట ప్రయత్నించెను, కాని అది తిరిగి అతని మీదికే వచ్చెను. వ్యక్తిగతముగా నీకును అలాగే జరుగును.

నీవేమి చేయబోవుచున్నావు? తల్లి లేదా తండ్రి, లేదా పాస్టరు, లేదా బ్రెన్హాం సోదరుడు చేసినది కాదు. నీ చేతులలోనే అది ఉన్నది. క్రీస్తనబడిన యేసును నీవేమి చేయగోరుచున్నావు? ఆయన రక్తము నీ చేతులలో యున్నది. అది దేవుని రక్తము. నీవేమి చేయుదువు? సిలువ మరణ అపరాధము నీ పైయుండును, చూచారా.

నీవు ఆయనను సిలువ వేయగలవు. నీ సిద్ధాంతమును నమ్ముదువు. దీనిని మరొకరి మీదికి త్రోసివేయ ప్రయత్నించెదవు. ఈ సంఖము చెప్పే విషయములు నాకు వద్దని అందువు. నీ చేతులలోనే ఆయన ఉన్నాడు. కాబట్టి నీవు మరచిపోయి తిరుగలేవు. నీ పాస్టరు అలాగు నీకు నేర్పెనని నీవనవచ్చు, కాని తిరిగి అది నీ మీదికే వచ్చును; అది నీకే. నీకే అది తెలియును! ఇప్పుడు, నీవాయనను చేర్చుకొనవచ్చు లేదా తిరస్కరించవచ్చు, అది నీ ఇష్టము. గమనించండి. ఏదో ఒకటి నీవు చేయవలెను.

MATT 16:3•

LUKE 12:56

 

137చూడండి! యేసు పరిసయ్యులను గుడ్డివారని పిలచెను. నేడును ఆయన అలాగే పిలచును. (గుడ్డి పరిసయ్యులు), "గుడ్డివారగు మత బోధకులారా, కమ్యూనిజం గూర్చి మీరు వివేచించగలరు. మిమ్మును నాశనము చేయుటకే దేవుడు దానిని లేపెనని మీరెరుగుదురా? (వాక్యము తెలియదు, చూచారా.) ప్రపంచమును కమ్యూనిజం మ్రింగి వేయునని మీరు వివేచించగలరు. దానిని మీరు చూడకలుగుచున్నారు."

మన అంశములన్నీ కమ్యూనిజం మిదే యున్నవి; కాని కమ్యూనిజం వెళ్ళిపోవును. నేను నిశ్చయంగా దానికి వ్యతిరేకినే. కానీ క్రీస్తును, ఆయన వాక్యమును త్రోసివేయు వారికి మరెక్కువ విరోధిని. నీవు బోధకునివో లేదా మరెవరివో కావచ్చును. ఏమైనా గాని కమ్యూనిజం కంటే క్రీస్తుకు నీవు ఎక్కువ రుణపడియున్నావు. నీవాయనను ఎరుగవు. నీవు ఆయనను తెలిసికోవలసియున్నావు.

కమ్యూనిజపు కాలమును నీవు వివేచించుచున్నావు, కాని నీవు జీవించుచున్న దినపు సూచనను గ్రహించలేకున్నావు.

MATT 16:3•

LUKE 12:56

 

138"వేషధారులారా, బయటకు వెళ్ళి ఆకాశము వైపు చూచి, సూర్యుడు ఎర్రగా ఉన్నాడు గనుక రేపు వర్షము పడును అనియు, ఆకాశము నిర్మలముగా యున్నచో రేపు చక్కగా వాతావరణముండుననియు మీరు చెప్పెదరు. ఆకాశపు సూచనలను, వాతావరణమును మీరు వివేచించెదరు. కాని కాలమును, సూచనలను మీరు ఎరుగరు," అని పరిసయ్యులను గద్దించెను. ఆయన మెస్సీయా; వారు త్రోసివేసిరి. మనమెల్లప్పుడూ కమ్యూనిజం గూర్చి చెప్పుకొనుచున్నాము; కాని కాల సూచనను ఎరుగము. దానిని మనము గమనించుట లేదు. అవిశ్వాసము వలన బైబిలులో చెప్పబడిన కాలపు గురుతులను మనము గమనించుట లేదు. మీరు చూచారా? నేను త్వరగా ముగించవలెను, ఆలస్యమగుచున్నది, చూచారా.

139వారి తండ్రుల వలెనే వీరు చేయుచున్నాడు. నేడును ఆ మాదిరిగానే జరుగుచున్నది.

ఇప్పుడు, తీర్మానమునకు రావలసిన ఘడియ ఇది. అది తేలుకొనవలెను; ఏదో రీతిగా దానిని నిర్ణయించుకోవలెను, చూచారా. వాక్యమును మరల సిలువ వేయుచున్నారు; లేక మీరేమి చేయుదురు? వాక్యమును సిలువ వేయుట దగ్గరలోనే జరుగును. శాఖ నిమిత్తము బయలుపరచబడిన వాక్యమును సిలువవేయుచున్నారు. పిలాతు వలె మరెవరి మీదకో త్రోసివేయగోరుచున్నారు. క్రీస్తనబడిన అభిషేకపు వాక్యమును వ్యక్తిగతముగా నీవేమి చేయుదువు? నోవహు దినములలో ఈ క్రీస్తే వాక్యమును అభిషేకించేను. జ్ఞానమునిచ్చు వృక్ష ఫలము తినగోరి హవ్వ జీవవృక్ష ఫలమును నిరాకరించెను. ఆమె మరణమును స్వీకరించినది. నోవహు కాలములోను అలాగే జరిగినది. ప్రవక్తల కాలములోను అదే జరిగెను. క్రీస్తు దినములలోను అదే జరిగెను. నేడును అదే జరుగుచున్నది. ప్రతి వారు తమ తమ కాలమును గూర్చి చెప్పెదరు. క్రియ జరుగుట చూచియు వారు తమ శాఖల యొక్క, లోకము యొక్క జ్ఞానముతో వాదించుచున్నారు. క్రీస్తు యొక్క అభిషేక వాక్యము వారు గ్రహించరు. వ్యక్తిగా నీవేమి చేయుదువు?

140పిలాతు తన చేతులలో నుండి ఆయనను తీసివేసికోలేకపోయెను. నేను ముగించెదను; ఒక్క క్షణము మౌనంగా ఉండండి. పిలాతు తన చేతులు కడుగుకోలేకపోయెను. నీవును ఈ ఏ పధకముల ద్వారాను తప్పించుకోలేవు. పిలాతునకేమి జరిగెనో నీవెరుగుదువా? అతడు పిచ్చివాడాయెను. సిలువ మరణము గూర్చి విని అతని మనస్సు చలించెను. దానిని విని, ఆ గల్లంతు చూచి చివరకు పిచ్చివాడాయెను.

స్విట్జర్లాండులో ఒక గాధ ప్రచారములో యున్నది. నేను అక్కడికి మిషనెరీగా వెళ్ళాను. మంచి శుక్రవారము నాడు వేలాదిమంది అక్కడి ఒక చోటికి వచ్చెదరు. పిలాతు ఆత్మహత్య చేసికొనిన ఒక నీటి మడుగును ప్రపంచ నలుమూలల నుండి వచ్చిన జనులు చూచెదరు. చివరగా అతడు ఈ నీటి కొలనులో మునిగి చనిపోయెను. ప్రతి మంచి శుక్రవారమున 3:00 గంటలకు ఆ నీరు నీలము రంగములోనికి మారునని వారు చెప్పిరి. పిలాతు శరీరమున్న చోటు అది మరుగుచుండును. ఆయనను అతడు తిరస్కరించెను. ఇంకా ఆ రక్తము అతని చేతులలో యున్నది. ఆయనను నీవు కడిగివేసికోలేవు. ఆయనను కడిగివేయు నీరుగాని, సబ్బుగాని ఎక్కడా లేదు. ఆయన నీ చేతులలో యున్నాడు. ఆయనతో నీవేమి చేయుదువు?

నీవు చేయకలిగినది ఒక్కటే యున్నది. నీవాయనను నీ చేతులలో నుండి కడిగివేసికోలేకపోయిన యెడల మరొకరి మీదికి ఆయనను త్రోయుదువు. కాని ఆయనను ఎవరి మీదికే త్రోసివేయగల మార్గము ఈ ప్రపంచములో లేదు. నీ హృదయములో ఆయనను స్వీకరించుట ఒక్కటే నీకున్నది. ఆ విధముగా ఆయనను నీవు వదిలించుకోగలవు. నీ చేతులలో నుండి ఆయనను తీసివేయుము. నీ హృదయములో ఆయనను పెట్టుము. నీ చేతులలోనే ఉంచుకొన్నయెడల తీర్పుకు గురి అయ్యెదవు. నీవు చేయకలిగినది అది మాత్రమే.

పిలాతు అంతము బహు ఘోరముగా నుండెను.

LUKE 23:30•

REV 6:16,17

 

141ఆయనను చేతులలోనే యుంచుకొను వారిని గూర్చి వాక్యమిట్లు చెప్పుచున్నది (నేను దానిని చదువబోవుచున్నాను), "వారు బండలకు, పర్వతములకు మొర పెట్టెదరు. వారు ప్రార్థించిరి గాని అప్పటికి సమయము గతించెను. సింహాసనము మీద ఉన్న వానికి మమ్ము మరుగుచేయుడి. గొర్రెపిల్ల ఉగ్రత నుండి తప్పించుడి. గొప్ప తీర్పు దినము వచ్చుచున్నది. ఎవరు దాని ఎదుట నిలువగలరు?"

ఆస్వాల్డు ఏమి చేయునని మీరు తలంచుచున్నారు? సుప్రీం కోర్టులో నుండి బయటకు వచ్చును. న్యాయాధిపతులు అక్కడ కూర్చొనియుందురు. అందరూ కోపపు నేత్రములతో చూచుచుందురు. ఏమి జరుగునో అతడెరుగును. అది గాస్ చాంబర్ లేదా ఉరి త్రాడో కావచ్చును. దానిని అతడు ఎదుర్కొనవలెను.

ROM 12:19•

HEB 10:26,27,30

 

142నీవాయనను విసర్జించి ఆయన రక్తాపరాధమును నీ మీద ఉంచుకొనియున్నావు. నీ ముందు నరకమున్నది. నిత్య నాశనమున్నది. బండలకు, కొండలకు వారు మొర పెట్టెదరు. వారి ప్రార్థన చాలా ఆలస్యము కాబడినది. హెబ్రీ 10, మనము సత్యమును గూర్చిన అనుభవజ్ఞానము పొందిన తరువాత [నీవు దానిని పొందుకోనవసరము లేదు, కేవలము దానిని గురించి ఎరుగుట. నీవు దానిని కలిగియుండనవసరము లేదు, నీవు కేవలము… లేదు, లేదు! చూచారా? సత్యమును స్వీకరించిన తరువాత అని చెప్పలేదు]. సత్యమును గూర్చిన అనుభవజ్ఞానము పొందిన తరువాత బుద్ధిపూర్వకముగా పాపము చేసినయెడల [అవిశ్వాసమే పాపము] పాపములకు బలి ఇకను ఉండదు గాని న్యాయపు తీర్పునకు భయముతో ఎదురుచూచుటయు, విరోధులను దహింపబోవు తీక్షణమైన ఉగ్రతయు ఇకను ఉండును. నీవు దానిని గూర్చి ఎరుగుదువు, పగతీర్చుట నా పని, నేనే ప్రతి ఫలమిత్తునని ప్రభువు చెప్పుచున్నాడు.

HEB 10:26

 

143సత్యము మనకు తెలిసిన తరువాత కూడా దానిని మనము నమ్మనియెడల కృప ఇక ఉండదు. దయచూపబడదు. ఈ టేపును వినుచున్న సంఘ కాపరీ, నీ మాట ఏమిటి? ఈ టేపును వినుచున్న సంఘ సభ్యుడా, నీ సంగతి ఏమిటి? ఇష్టపూర్వకంగా నీవు నమ్మనియెడల ఏమి చేయుదువు? నీ చేతులలో నుండి కడిగివేసికోగలవా? ప్రధాన నాయకత్వము మీదికి దీనిని నీవు త్రోసివేయలేవా? అది తిరిగి నీ మీదికే వచ్చును. దానిని గూర్చి మీరు విన్నారు. మీ మాట ఏమిటి? ఆ దినమున మారెట్లు నిలబడగలరు? ఆయన నీ చేతులలో గాని లేదా హృదయములో గాని ఉండి తీరును. ఏదో ఒకటి చేయవలెను. దేవా, మాకు సహాయము చేయుము!

PHIL 2:5

 

144ఒక హత్యను చేసిన వ్యక్తి హృదయము ఎట్లుండునో మీరూహించగలరా? అతడేమి చేసెను. తాను గ్రహించునంతలోనే ఆ పని జరిగిపోయినదని చెప్పును. చూడండి, అతనికి అవకాశమున్నది. అతడు ఒక స్వేచ్ఛా అమెరికనుగా జన్మించెను. అతడు ఒక అమెరికా పౌరుడు. కాని రష్యా వాడగుటకు తన జన్మ హక్కును అమ్మివేసికొనగోరెను, కాని అది తన మీదికే తిరిగి వచ్చెను. అతడు ఒక రష్యను యువతిని పెండ్లి చేసికొనెను. అతడు క్యూబా కమ్యూనిస్టు పార్టీ యొక్క స్వేచ్ఛాయుత ఆలోచనాపరుడు. "నాకు నేను ఆలోచించుకొందును," అని చెప్పే వ్యక్తి. నీకు ఏ ఆలోచనా రాకుండా యుండదు. క్రీస్తనబడిన యేసును నేను ఏమి చేతును? నీవు స్వేచ్ఛగా ఆలోచించ తగదు. స్వేచ్ఛా ఆలోచనా విధానమే లేదు. క్రీస్తులో యున్న మనసు మీలోను కలిగియుండుడి.

మనము ప్రార్థించుదము.

MATT 27:22•

PHIL 4:8•

HEB 13:8

 

145వీటిని గూర్చి ఆలోచించండి. ఈ ఉదయము మన మధ్య టేపు యున్నది. దీనిని వినుచున్న వారందరితోను చెప్పుచున్నాను. మీరు దేవునితో సరిచేసికొనని యెడల, దేవుని ఆత్మ మూలముగా జన్మించని యెడల "నేను ఒప్పుకొనుచున్నాను," అని చెప్పుము. నీవు ఒప్పుకొన్నానని అనవచ్చుగాని, దేవుడు దానిని అంగీకరించేనా?

పిలాతు కూడా ఇట్లే చేసెను, "నీశ్చయంగా నేను ఒప్పుకొన్నాను. ఈ నీతిమంతుని నేనేమి చేయుదును?" అలాగు నీవాయనను నీ చేతులలో నుండి కడిగివేసికొనలేవు. నీవాయనను ఏమి చేయుదువు? నీవు తిరిగి జన్మించని క్రైస్తవునివైనచో, పరిశుద్ధాత్మ నీలో జీవించకున్నచో ఇప్పుడే ఒక నిర్ణయము తీసికొనుము. నీ జీవితము అంతవరకు సమృద్ధి కాదు. నీ చేతులను ఎన్నడూ నీవు కడుగుకొనలేవు. యేసుక్రీస్తు నిన్న, నేడు, నిరంతరము ఏకరీతిగా యున్నాడను వర్తమానమును నీ హృదయములో చేర్చుకొనుము.

146ఈ ఉదయము ఇక్కడ కనబడుచున్న సమూహములో ఇంకా సరి చేసికొనని వారున్నచో చేతులు ఎత్తండి. వేదిక పిలుపును ఇచ్చుటకు మనకు చోటు లేదు. కాని ఇట్లు చెప్పండి, "బ్రెన్హాం సోదరుడా, నా కొరకు ప్రార్థించుము. దేవా, సహాయము చేయుము." దేవుడు నిన్ను దీవించును. నీ చేయి నాకు కనబడుచున్నది. నేను అపరాధిని అని గ్రహించి దేవుని యెదుట ఒప్పుకొనుచున్నానని చెప్పుము. నా చేతులలో నుండి ఆయనను తీసివేసి నా హృదయములోనికి తెచ్చుకొనుచున్నాను, అని చెప్పుము. నీ చేతిని ఎత్తి "బ్రెన్హాం సోదరుడా, నా కొరకు ప్రార్థించుము," అని చెప్పుము. ప్రభువు నిన్ను దీవించును. ఇక్కడ నలుబది లేదా ఏబది చేతులు పైకెత్తబడుట నేను చూచుచున్నాము.

నేడే పిలచుచున్నాడు!

నేడే పిలచుచున్నాడు!

(దాని గూర్చి ఆలోచించు — ఆయన పిలచుచున్నాడు.)

యేసు పిలచుచున్నాడు…

ఆయన నీతో మాట్లాడుచున్నాడు.

147నీ పాపము వలన నీ హృదయము చెడిపోయినది. నీవా పిలుపును వినలేకపోవుచున్నావా? చిన్న బాలునిగా లేదా బాలికగా ఉన్నప్పుడు దానిని నీవు విన్నావు; దేవునికి లోబడవలెనని ఆశించావు, కాని నీవు దానిని అర్పివేసావు; నీ హృదయము గట్టి పడిపోయినది. ఇక నీవు వినలేని స్థితికి వచ్చావు. ఈ ఉదయాన ఆస్వాల్డు వలె నీవు నిలబడియున్నావా? నేను ప్రార్థించబోవుచున్నాను. మరెవరైనా ఉన్నారా? ఎన్నడూ చేతిని ఎత్తని వారెవరైనా ఈ భవనములో యున్నచో, "బ్రెన్హాం సోదరుడా, నీ చివరి మాటలు విని నాకు ఎత్తవలెననిపించుచున్నది," అని చెప్పండి.

బయట ఉన్నవారు, వసారాలో ఉన్నవారు, కిటికీల ప్రక్కలలో నున్న వారు, ఇంకెక్కడున్న వారైనా సరే ఎత్త వచ్చును.

148ఆ యువతిని దేవుడు దీవించును. ఆమెను దేవుడు దీవించును. ఇంకెవరున్నారు? ఆమెను దేవుడు దీవించును. ఇక్కడున్న ఈయనను దేవుడు దీవించును. అక్కడున్న చిన్న బాలికను దేవుడు దీవించును. అవును! ప్రభువు నిన్ను దీవించును. "యేసు పిలచుచున్నాడు," అను పాటను నెమ్మదిగా పాడుచుండగా వెనుక నున్న మారును ఆలోచించండి. ఈ విధంగా చెప్పండి, "ప్రభువా, పాపినైన నాకు, వేషధారినైన నాకు దయ చూపుము. ప్రభువా, నేను ఒక సంఘ సభ్యుడిని మాత్రమే. నేను నిన్ను కోరుచున్నాను. నీవు నాకు కావలెను. నాకు సహాయము చేయుము. నీ సేవ చేసెదను. ఇప్పుడే నీకు వాగ్దానము చేయుచున్నాను. నీవు కావలెనని నా చేతిని ఎత్తియున్నాను. నిన్ను చేర్చుకొనునట్లు నా హృదయమును నీవు లేపుము. నిన్ను నా హృదయములోనికి చేర్చుకొందును."

ఈ వచనము మరల పాడుచుండగా మీరాలాగు చేయుదురా?

నేడే పిలచుచున్నాడు!

నేడే పిలచుచున్నాడు!

149(నీ స్వంత రీతిలో ఇపుడు ప్రార్థించుము.)

యేసు పిలచుచున్నాడు… (ఆయనే పిలచుచున్నాడు.

అందుకే నీవు చేతిని ఎత్తావు.)

నెమ్మదిగా నేడు ఆయన పిలచుచున్నాడు.

యేసు పిలచుచున్నాడు. ఆయన స్వరము వినుము -

నేడే వినుము…

ఇప్పుడే వినుము, "ప్రభువా, నేను దోషిని. నా చేతులలో నీ రక్తమున్నది. నేను పాపిని. ఇక అలాగు జీవించగోరుట లేదు. నేడు కడిగివేసికొనజాలను. చాలా సంవత్సరాలు ప్రయత్నించాను. పిలాతు వలె నేను నిన్ను మరొకరికి అప్పగించగోరుట లేదు. ఇప్పుడే నా హృదయములోనికి రమ్ము. ప్రభువా, నిన్ను చేర్చుకొనుచున్నాను. అక్కడ ఒక స్వరూపము నిలబడియున్నట్లుగా నీవు నా ముందు నీవు నిలబడియుండుట నాకు కనిపించుచున్నది. విశ్వాసము ద్వారా నీలోనికి నడిచి వచ్చుచున్నాను. నీవు నన్ను క్షమించెదవని ఎరుగుదును. ఇప్పటి నుండి నీవు నా హృదయములో ఉండెదవు.

… (అందరూ ప్రార్థించండి)

యేసు పిలచుచున్నాడు.

ఆయన మృదువుగా పిలచుచున్నాడు.

150పరమతండ్రీ, చిన్న వర్తమానము అయిపోయినది. ఈ దినమున ఇచ్చట దేవుని దూతలు కూడియున్నవి. యేసు ఇంకా జీవించియున్నాడని గొప్ప పరిశుద్ధాత్మ ప్రత్యక్షత ఇచ్చుచున్నది. ఆయనే నిత్యజీవపు ఊట. సమాధి ఆయనను నిలిపియుంచలేకపోయెను. పాతాళము ఆయనను నిలిపియుంచలేకపోయెను. పాతాళము నుండి, సమాధి నుండి ఆయన లేచి పైకి వెళ్ళెను. నేడు ఆయన మన మధ్య నిలబడియున్నాడు. ప్రభువా, చాలామంది నీ ప్రజలను శాఖలు మరియు సిద్ధాంతములు బంధించియున్నవి. పాపము వారిని బంధించెను. వారు స్వతంత్రులు కాగోరుచున్నారు. వారు పిలాతువలె నిలబడియున్నారు. మరెవరి మీదికో ఆయనను త్రోసివేయుట కాదు గాని, వారు నీ వైపు చేతులెత్తియున్నారు. "ప్రభువైన యేసూ, నా హృదయము లోనికి రమ్ము. మరెన్నడూ నిన్ను నేను త్రోసివేయను. నేనది చేయలేను. నీవింకా నా చేతులలోనే యున్నావు. నేను ఎంత కడుగుకొన్నా నీవు నా యొద్ద నుంచి పోవుట లేదు. ఇపుడు నిన్ను చేర్చుకొనుచున్నాను. నా జీవితములో నిన్ను కోరుచున్నాను. నా జీవితము లోనికి నిన్ను చేర్చుకొనుచున్నాను. ప్రభువా, నా పాపము క్షమించి, నీ రాజ్యములోనికి నన్ను చేర్చుకొనుము. తండ్రి, నీవు నన్ను చేర్చుకొంటివను విశ్వాసమును నాకు దయచేయుము." యేసు క్రీస్తు నామము ద్వారా ప్రార్థించుచున్నాను.

MATT 10:32•

JOHN 5:24

 

151మీరు తలలు వంచి యుండుడి. "దేవా, విశ్వాసము ద్వారా నేను యధార్థముగా నుండుటకు సహాయము చేయుము. నీ యొద్దకు వచ్చు వానిని నీవెంతమాత్రమును త్రోసివేయవని వాగ్దానము చేసియున్నావు. నీవు నిత్యజీవమిచ్చి అంత్యదినమున లేపెదవు. మనుష్యుల యెదుట నిన్ను ఒప్పుకొనువానిని తండ్రి యెదుటను, పరిశుద్ధ దూతల యెదుటను నీవు ఒప్పుకొందువు. పరి. యోహాను 5:24ను నిజముగా వినవలెను. నీ వాక్యమును గ్రహించి చేర్చుకోవలెను. "నీ వాక్యము విని నీవు పంపిన వానియందు విశ్వాసముంచువాడే నిత్యజీవము గలవాడు. వాడు తీర్పులోనికి రాడు."

ఆస్వాల్డు వలె నీవు తీర్పులోనికి రావు. నీవు మరణము నుండి జీవము లోనికి దాటుదువు. ఉచిత క్షమాపణ నీకు దొరకును.

"ప్రభువా, ఏలాగో, ఎందుకో నాకు తెలియదు గాని ఇది జరిగినదని నేను నమ్ముచున్నాను. నా హృదయములో విశ్వసించుచున్నాను. నా అవిశ్వాసము పోయినది. నీవు చెప్పు ప్రతి మాటకు నేను స్వేచ్చగా "ఆమేన్" చెప్పెదను. ఇప్పుడే దానిని అంగీకరించుచున్నాను. నేను నమ్మియున్నాను."

LUKE 12:8•

JOHN 6:37,40,44

 

152తలలు వంచియుంచండి. మీరు నమ్మి కొద్ది క్షణముల క్రితం చేతులు ఎత్తి యున్నారు. విశ్వాసము ద్వారా క్రీస్తు మీ ఎదుట నిలబడియుండుటను మీరు చూచుచున్నారు. ఇప్పుడు మీరు విశ్వాసము ద్వారా నడచుచున్నారు. మా పాపములు క్షమించబడియున్నవని నమ్ముడి. నేడు మీరు క్రైస్తవ బాప్తిస్మమునకు సిద్ధముగా ఉన్నారు. క్రీస్తులో నడచుటకు మీరు సిద్ధపడియున్నారు. ఒక సాక్ష్యముగా మీరు మీ చేతులెత్తి "పూర్ణహృదయముతో నేను విశ్వసించుచున్నాను," అని చెప్పుము. దేవుడు నిన్ను దీవించును. "నేను ఇప్పుడే దానిని అంగీకరించుచున్నాను. నేను ఇప్పుడే అంగీకరించుచున్నాను; నేను ఏమి చేయలేను," అని చెప్పుము. దేవుడు నిన్ను దీవించును. అందరూ నాకు కనబడుచున్నారు. "నేను ఇప్పుడే అంగీకరించుచున్నాను!"

MATT 28:19

 

153మీరు మంచివారు కారు. ఎన్నడూ మంచిగా ఉండలేరు. యేసు మంచి వారి కొరకు చనిపోలేదు. "అయితే నేనేమి చేయవలెను? బ్రెన్హాం సోదరుడా" అని నీవు అడుగవచ్చును. ఆయన నీ కొరకు చేసిన దానిని అంగీకరించుము. దానిని నమ్ముము. నీరు సిద్ధముగా యున్నది. బాప్తిస్మము ఇవ్వబడును. మీరింతక ముందు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ అను బిరుదులలో బాప్తిస్మము పొందియుండవచ్చును. దీనిని నేను మర్యాద మరియు గౌరవముతో చెప్పుచున్నాను. అలాగు మీరు బాప్తిస్మము పొందితే, నా దృష్టిలో పొందనట్లే లెక్క, ఎందుకనగా ఆయన చెప్పినది మీరు అనుసరించలేదు.

"తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మమియ్యుడి," అని ఆయన చెప్పెను. మీరు బిరుదులు పొందుట కాదు. బిరుదులు లేదా పేర్లు పిలువమని ఆయన ఎన్నడూ చెప్పలేదు. బైబిలులో ఎన్నడూ అలాగు చెప్పలేదు. ఆ విధంగా ఎన్నడూ, ఎవరూ, బాప్తిస్మము పొందలేదు. బాప్తిస్మమును యేసు ఇట్లు పొందమని చెప్పెను, "తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు నామములో అనగా యేసుక్రీస్తు - నామములో పొందమని చెప్పెను."

154తాళపుచెవులు కలిగిన పేతురు ఆ ప్రకారమే చెప్పెను; రోమను కాతలిక్కు చర్చి నైసియా సభ వద్ద పుట్టు వరకు సంఘము, అపోస్తలులును నామమునే ఉపయోగించిరి. నామమునకు బదులుగా బిరుదులను వాడిరి. నీవు రోమాను సంఘ సిద్ధాంతములో నయినా లేదా యేసుక్రీస్తు నామములో నయినా బాప్తిస్మము పొందియుందువు; ఎదో ఒకటి. అది నీ చేతుల్లో ఉన్నది, నీ చేతులను కడుగుకోలేవు. అది ఉన్నది. ఇప్పుడే నీవు అంగీకరించియున్నావు. ఆ ప్రసిద్ధ పాత పాటను ఆర్గను మరియు పియానో వాయించువారు వినిపించవలెనని కోరుచున్నాను:

నా విశ్వాసము నీ వైపు చూస్తున్నది.

కల్వరి గొర్రెపిల్లా!

దైవ రక్షకా!

నా ప్రార్థనాలకించుము,

నా దోషమంతా పరిహరించుము.

నేటి నుండి,

పూర్తిగా నీ వానిగా చేయుము.

ఎవరూ లేచి వెళ్ళవద్దు. మర్యాదగా లేచి నిలబడుము. ఆయన వైపు చేతులను ఎత్తుదము:

నా విశ్వాసము నీ వైపు చూస్తున్నది,

(ఆయన వాక్యము.)

కల్వరి గొర్రెపిల్లా!

దైవ రక్షకా!

నా ప్రార్థనాలకించుము,

నా దోషమంతా పరిహరించుము.

ఓ, నేటి నుండి

పూర్తిగా నీ వానిగా చేయుము.

(పూర్తిగా, సంపూర్ణముగా నా జీవితము సమర్పించుచున్నాను.)

155కొద్ది నిమిషములలో నీరు సిద్ధమగును. ఇప్పుడు మీరు బాప్తిస్మము తీసికోలేని యెడల తిరిగి ఈ రాత్రికి ఇచ్చెదము. మధ్యాహ్నమంతా దానిని గూర్చి ఆలోచించండి. మీ చేతులలో యున్నది! వదిలించుకొనండి. యేసుక్రీస్తు రక్తములో మీరు కడుగుకొనుట ఒక్కటే మార్గము, చూచారా. మనము తలలు వంచియుండగా దీనిని గుర్తుచేసికొనండి. ఆయన వైపు చూడండి.

జీవితము చీకటి మార్గములో…

నిర్ణయము మా హృదయములలోనే యున్నది. ఆయన పై నేర విచారణ చేయుచున్నారు. వాక్యమును సిలువ వేయనై యున్నారు. క్రీస్తు నేర విచారణలో యున్నారు. క్రీస్తనబడిన యేసును మీరేమి చేయుదురు?

నీవే నా మార్గదర్శిగా ఉండుము;

చీకటిని వెలుగుగా మార్పుము,

దుఃఖము, కన్నీరు తుడిచివేయుము,

నీ ప్రక్కనుండి నన్నెన్నడూ పోనీయకుము.

ఇప్పుడు, మన హృదయములు వంచుదము.

156స్నేహితులారా, లోతుగా ఆలోచించండి. గ్రంధము లోనికి వచ్చు చివరి పేరు మీదే కావచ్చును. మనము అంత్యకాలములో ఉన్నాము. ఇప్పుడు లోతుగా ఆలోచించండి. ఆయనను త్రోసివేసిన వారెవరైనా యున్నారా? గుర్తుంచుకొనండి, మరల ఎన్నడూ ఈ అవకాశము రాదు. పిలాతుకు మరో అవకాశము రాలేదు. రక్షించబడవలెనని శాయశక్తులా అతడు ప్రయత్నించెను, కాని అతడు చేయలేకపోయెను. అది అతని చేతిలో యుండెను. క్రీస్తు అనబడు ఈనాటి అభిషేక వాక్యమును నీవేమి చేయుదువు?

Search Messages

0 / 0 matches
Enter characters above to process real-time text query scopes...