మూడు రకముల విశ్వాసులు
1[బాషలు మరియు అర్ధము చెప్పుట జనులలో నుండి ఇవ్వబడుచున్నది [టేపుపై ఖాలీ] "…..ఈ రోజు రాత్రి నీతో నా ఆత్మతో మాట్లాడుచున్నాను. నేను మరలా వచ్చియున్నాను నశించిన దానిని తిరిగి రక్షించుటకు, నా పిల్లలారా, నేను నశించిన వారిని తిరిగి సమకూర్చుటకు వచ్చియున్నాను. ఎందుకనగా, నా పిల్లలారా, నేను నా నిత్య సన్నినిధిని పంపుచున్నాను, నా ఆదరణ కలిగించు పరిశుద్ధాత్మను నింపుటకు: నా శక్తితో, ప్రేమతో, నా విశ్వాసముతో నన్ను వెతుకువారికి. ఎవరైతే సంరక్షింపబడిన వారు, నా పిల్లలారా, వెళ్ళుట కష్టము అయినప్పుడు. వారే నిజమైనవారు, నా పిల్లలారా, నేను తీసుకువచ్చుచున్నాను, నేను వచ్చునప్పుడు నా బహుమానమును తెచ్చుదును. ఎందుకనగా నా బహుమానము నా చేతిలోయున్నది. నేను మిమ్ములను చూచుచున్నాన్ను, నా పిల్లలారా [టేపుపై స్పష్టతలేని మాటలు] నన్ను వెతుకువారికి. విశ్వాసముతో ఈ వర్తమానము మోయుటకు మరియు వినువారికి దీనిని చేర్చుటకు శక్తివంతముగా నేను నా ఆత్మను, నా శక్తిని ప్రత్యక్షపరచాను. ఎందుకనగా నా పిల్లలారా, నాకు కొద్దిమందే ఉన్నారు, ఇంకా, బయటున్నారు; ఇంకా కొద్దిమంది నా హృదయముయొక్క ద్వారమును తట్టుచున్నారు. నా పిల్లలారా, ఇంకా నేను ద్వారమును పూర్తిగా మూయలేదు, ఎందుకనగా ఇంకా నేను కొద్ది కృపను కలిగియున్నాను. నా పిల్లలకు లోనికి వచ్చుటకు ఇంకా కొద్ది సమయము ఉన్నది.
కావునా నా పిల్లలారా, మీ దృష్టిని పైన నిలుపుము. ప్రలాపించుడి, ఊరకయుండకుడి, ఎందుకనగా నేను నా ప్రవక్తలకు ప్రభువగు వాక్యము, 'ప్రలాపించుడి మరియు ఊరకయుండకుడి.' ఎందుకనగా, నా పిల్లలారా, వారు ఎలా వినగలరు [టేపుపై స్పష్టతలేని మాటలు] వారు బోధించియున్నారు. మరియు నేను ఎలా [టేపుపై స్పష్టతలేని మాటలు] వారు బోధించుదురు కేవలము వినుటకు మీరు కోరిక చూపకపోయినయెడల.
ఎందుకనగా, నా పిల్లలారా, నేను మిమ్ము వెళ్ళుటకు ప్రేరేపించను, కానీ మీరు ప్రేమతో వెళ్ళవలెను. మీరు వెళ్ళవలెను. నా పిల్లలారా, ఎందుకనగా మీరు వెళ్ళుటకు కోరిక కలిగి యున్నారు. మీరు వెళ్ళవలెను, నా పిల్లలారా, ఎందుకనగా మీరు నాయందు విశ్వాసము౦చి యున్నారు. మీరు వెళ్ళవలెను, నా పిల్లలారా, ఎందుకనగా మీరు నా ప్రేమను మీ హృదయములో కలిగియున్నారు, నా పిల్లలు రాజ్యములోనికి వచ్చుట చూచుటకు మరియు మీరు మండే కోరికను కలిగియున్నారు.
నా పిల్లలారా, మీ దృష్టిని పైన నిలుపుము, సంతోషించుడి, ఎందుకనగా, "మీ విమోచన దగ్గరగా యున్నది, ఆత్మ చెప్పుచున్నది.''
మన శిరములు వంచుదము. తలలతో పాటు హృదయములను కూడా వంచుదము. ఎంత మంది ప్రార్థనలో జ్ఞాపకము చేసికోవలెనని కోరుచున్నారు? చేతులెత్తి "ప్రభువా, నన్ను జ్ఞాపకము చేసికొనుము. ఓ, ప్రభువా" అని చెప్పండి. ఇక్కడ చాలా విన్నపములు, చేతిగుడ్డలు బల్లమీద ఉంచిరి.
2ప్రియ పరమతండ్రీ, ఈ కప్పు క్రింద సాయంకాల సమయమందు మరోసారి మేము కూడుకొనియున్నాము. ఎన్నోసార్లు ఇక్కడ నీవు కలిసికొని మా పట్ల నీకున్న ప్రేను వ్యక్తము చేసితివి. మా కొరకు నీవు చేసిన దానిని బట్టి మేము మా ప్రేమ మరియు కృతజ్ఞతలను దీనమగు రీతిగా వ్యక్తము చేయ ప్రయత్నించుచున్నాము. ప్రభువా, అక్కరలో నున్న జనులముగా ఈ రాత్రి మరల మేము వచ్చియున్నాము. ఎప్పుడూ నీవు మాకు అవసరమే. భూమి మీద మేమున్నంతకాలము అదే మా మొర. ఎందుకనగా గొప్ప పోరాటములో మేమున్నాము. యుద్ధము ముమ్మరమగుచున్నది. గర్జించు సింహము వలె అపవాది లేచునని నీవు ముందే చెప్పితివి. వాడు జనుల మధ్య సంచరించుట చూచు చున్నాము. సమయము కొంచమేనని ఎరిగి ప్రతిచోట వాడు గర్జించు సింహము వలె ఎవరిని మ్రింగుదునాయని తిరుగుచున్నాడు. తన పిల్లలపట్ల శ్రద్ధవహించు తండ్రి మాకున్నాడు. ఈ రాత్రి ఈ మనవులతో నీయొద్దకే మేము వచ్చుచున్నాము ప్రభువా. వాటిని నీవు అనుగ్రహించమని ప్రార్ధి౦చుచున్నాము.
తండ్రీ, ఇక్కడ కొన్ని చేతిరుమాళ్ళు పడియున్నవనగా దేశములో వ్యాధిగ్రస్తులు ఎచ్చటో యున్నారనియు, వారు నిన్ను ఆహ్వానించుచున్నారనియు, నీవు వారికి అవసరమై యున్నావనియు, వారు నీయందు విశ్వాసముగలవారై వారు తమ విశ్వాసమును సాధకము చేయుచూ ఈ చేతిరుమాళ్ళు పంపియున్నారు. వారందరూ స్వస్థత పొందునట్లు కృప చూపుము.
HEB 4:12•
1PET 5:8
3ప్రభువా, కొద్ది క్షణముల క్రితం ఆ గదిలో నీయొక్క గొప్ప శక్తిని మేము చూచాము. పోగొట్టుకొనిన జ్ఞాపక శక్తిని ఆ బాలునికి తిరిగి ఇచ్చియున్నావు. నీయొక్క గొప్ప శక్తి ప్రతిసారి రోగములను వెళ్ళగొట్టుటను, హృదయ రహస్యములను బయలుపర్చుటను, జనులను క్రమపరచుచున్నది మేము చూచుచున్నాము. ప్రభువైన దేవా, మీకు వందనములు. ఎందుకనగా అది మానవునికి అందదు. అది ఏ హేతువు చేత అయినదో, దానిని క్రియ చేసినది ఏదై యున్నదో, అదెట్లు యున్నదో, నీవెట్లు దానిని బయలుపరచగలుగుచున్నావో మాలో ఎవరైనా గాని దానిని ఎరుగుటనేది అసాధ్యము. హృదయాలోచనలను, రహస్యములను వెల్లడిచేయునని మేమెరుగుదుము. దీనిని బట్టి మేము నీకు వందనములు చెల్లించుచున్నాము.
ప్రభువా, ఇప్పుడు జనులు తలలు వంచి ఈ సంగతుల గూర్చి ఆలోచించుచున్నారని, పరిశుద్దాత్మ వారితో మాట్లాడుచున్నదని నమ్ముచున్నాను. వారు ప్రతియొక్క మనవికి జవాబును దయచేయుము. ప్రభువా, రక్షించబడుటకు అర్హులగు వారిని నేటి రాత్రియందు రక్షించుము. నశించుపోవుచున్నవారు లోపలికి ప్రవేశించి రక్షింపబడుదురు
తడి బట్టలు ఎన్నో అక్కడ గుట్టగా పడియుండుట నాకు కనబడుచున్నది. దీనిని బట్టి వందనములు చెల్లించుచున్నాను. వారిలో అనేకులకు సమాధులు తెరువబడి, పాపమను ప్రాచీన పురుషుడు పాతిపెట్టబడియుండుట చేత మేము అందును బట్టి వందనములు చెల్లించుచున్నాము. ప్రభువు మిమ్ము దీవించును. జవాబు కొరకు కనిపెట్టుచున్న మీ హృదయ విన్నపములను ఆయన అనుగ్రహించును.
4సహో. వీలర్ యొక్క చిన్నబిడ్డ గూర్చి బిల్లీ చెప్పెను. ఇప్పుడు బాగున్నారా? నేను తప్పుగా అర్ధము చేసికొంటినా? ప్రతిష్ఠ చేయవలెనని తెచ్చిరా? మీరు తెచ్చినందుకు చాలా సంతోషము. పెద్దలు ముందుకు వచ్చి ఈ ప్రతిష్ఠ కార్యక్రమములో తమ చేతులను పిల్లలపై వేయవలెనని కోరుచున్నాము. క్లుప్తముగా చేయ ప్రయత్నించెదము. ఈ చిన్నవారిని ప్రభువైన యేసు నొద్దకు తీసికొని రావలెనని కోరుచున్నాము. దేవుడు వారికిచ్చిన చిన్న ముత్యములను తీసికొని వచ్చుచున్నారు. వారికొరకు ఎన్నడూ మేము మార్గము తెరవ ప్రయత్నించుచున్నాము. ఎందుకనగా రేపేమి జరుగునో మనకు తెలియదు. "నేడు చేయవలసిన దానిని రేపటికి వాయిదా వేయవద్దు." అని నా తల్లి చెప్పు చుండెడిది. అది సత్యము, ఎందుకనగా రేపేమి జరుగునో మనకు తెలియదు. కాని రేపు ఎవరి చేతిలో యున్నదో మనకు తెలియును. అది ముఖ్య విషయము. రేపు ఎవరి చేతిలో యున్నదో మనకు తెలియును.
5సహో. వీలర్, సహోదరుడా ప్రభువగు దేవుడు నిన్ను ఆశీర్వదించును గాక వీలర్ సహోదరి. మిమ్మల్ని కలుసుకున్నందుకు నిశ్చయముగా సంతోషముగా యున్నది. నేను. మిమ్మల్ని కలుసుకున్నది ఇదే మన మొదటి పరిచయముగా యున్నదని నేను అనుకుంటున్నాను. అంతే, నాకు ఇది ఎంతో భాగ్యముగా తలంచుచున్నాను. ఈ పాప మీ పాపేనా? ఈ పాప పేరేమిటి? (కార్లినా రిబ్కా అని వీలర్ సహోదరి చెప్పుచున్నది - సంపా.) చాలా బాగుంది, ఎంత అందమైన చిన్న పాప, ఈ పాప ఉండవలసినంత చక్కనిదిగా యున్నది. ఇప్పుడు, చిన్న కార్లినా రిబ్కా వీలర్. ఈ సంఘపు పెద్దల ( Deacons)లో వీలర్ సహోదరుడు ఒకడుగా యున్నాడు. మరియు వారివురి కలయికను దేవుడు ఈ చిన్న పాప మూలముగా ఆశీర్వదించాడు. మీకింకా ఇంకో ఇద్దరు అమ్మాయిలు గలరని నేను అనుకుంటున్నాను, అవును కదా? (ఇంకా "ముగ్గురు" అని వీలర్ సహోదరుడు చెప్పుచున్నాడు — సంపా.) ఇంకా ముగురు అమ్మాయిలు వారెంతో చక్కటి బాలికలని నేను అర్ధము చేసుకోగలుచున్నాను. కాబట్టి దేవుడు ఆ ముగ్గురివలె ఈ చిన్న రిబ్కాను కూడా చేయునని నేను ప్రార్ధి౦చితిని. చూచారా? అప్పుడది మీకందరికీ సంతృప్తిని ఇచ్చును కదా! అలాగే కదూ! అది నిజము; ఎందుకనగా వారెంతో మధురమైన పిల్లలుగా యున్నారు. ఈ పాప నా చేతుల్లోకి వచ్చునో లేదో నాకు తెలియదు గాని ఈ పాప అటు అనుమతించిన యెడల మేము ఈ బిడ్డపై మా చేతులుంచి ప్రార్ధి౦చెదము. రిబ్కా! ఇప్పుడు నీవు నా యొద్దకు వచ్చుటకు నీకు ఇష్టమేనా? నేను నిన్ను ఎత్తుకోవాలని నీవు ఆశపడుచున్నావా? ఇది ఎంతో బాగున్నది. ఎంతటి సుందరమైన నవ్వు ఇది. ఇప్పుడు మనము మన తలలను వంచెదము.
6కృప గల పరలోకపు తండ్రీ, ఈ దినమున రాత్రియందు ఇచ్చట ఈ పెద్ద (డీకన్స్) ఎదుట నిలబడిన మేము, నిజముగానే ఇతడు ఒక చక్కటి పెద్దగా, కార్య నిర్వాహకుడుగా యున్నాడు; ఎందుకనగా ఒక సంఘపు పెద్ద నిందారహితుడుగాను, ఏకపత్ని పురుషుడు గాను, తన కుటుంబమును బాగుగా ఏలువాడు గాను యుండవలెను. ఎందుకనగా తన యింటి వారిని ఏలనేరకపోయిన యెడల అతడు దేవుని సంఘమును ఏలాగు పాలించును? ఈ సహోదరుడు ఈ అర్హతలన్నియు కలిగియున్నందులకు మేము నీకు కృతజ్ఞతలు చెల్లించుచున్నాము. ఇతడితో మేము దేవుని ఆత్మ కదలాడుటను చూచుచున్నాము. ఇతడు ఇప్పుడు తన కుమార్తెను ప్రతిష్ఠించుటకై తీసుకొని వచ్చెను. ఈ బిడ్డను పెంచే బాధ్యతను నీవు వారికి అప్పగించితివి. ఈ బిడ్డ తన సహోదరిలవలె యుండుననే వారి యొక్క కోరికను బట్టి దేవా, మొమంతటి కృతజ్ఞతను కల్గియున్నాము. వారి యొక్క కోరిక ప్రకారమే యుండునట్లుగా తండ్రీ దీనిని వారికి అనుగ్రహించుము. ఈ బిడ్డ పెద్దదై ఎదిగిన తర్వాత నీకు మంచి సేవచేయు స్త్రీగా యుండును గాక మరియు ఇప్పుడు, తన జీవితములో నీకు సేవచేయుటకై ఈ బిడ్డను యేసు క్రీస్తు నామమున మేము నీకు సమర్పించుచున్నాము. ఈ బిడ్డ ఆరోగ్యవంతురాలిగాను, బలము గలదిగాను యుండి దీర్గాయుస్షును అనుగ్రహించి సాధ్యమైతే యేసు రాకడ వచ్చువరుకు జీవించును గాక. మరియు పిదప ఈ బిడ్డ క్రీస్తుయెుక్క జ్ఞానమందు ఎదుగునట్లుగా చేయుదునని తండ్రి, మేము నమ్ముచున్నాము. తన జీవితములో నీకొక సేవ చేయుటకై ఆమె యొక్క జీవితమును మేము మీకు సమర్పించుచున్నాము. ఆమేన్.
రిబ్కా దేవుడు నిన్ను ఆశీర్వదించును గాక వీలర్ సహోదరుడా మరియు సహోదరి వీలర్ దేవుడు మిమ్మల్ని దీవించును గాక ప్రభువు మీతో యుండును గాక!
JOB 1:21•
1TIM 3:12
7నీవేలాగు యున్నావు? ఇప్పుడిచ్చటకు ఇంకొక చిన్న బాలిక నవ్వుతూ యుండె ముఖముతో వచ్చుచున్నది. ఆమె పేరేమిటి? ("రొండారెన్నీ కొట్స్ "అని తల్లి చెప్పుచున్నది - సంపా) రొండారెన్నీ కోట్స్ అదే కదా పేరు? జెస్సీ కోట్స్ అనే వారికి మీరు "బంధువులగుదురా? జెస్సీ కోట్స్. నేను అలాగుండునేమో అనుకొన్నాను. ఈ నగర మందున్న కొంతమంది కోట్సను నేనెరుగుదును. వాళ్ళు నాకెంతో కాలముగా తెలుసు, వాళ్ళు నా మంచి స్నేహితులు - ఎంతో కాలముగా స్నేహితులుగా యున్నారు. రొండా, రొండారెన్నీ, రొండా, నీవు నాయొద్దకు వచ్చెదవా? నేను నిన్ను ప్రభువగు యేసుకు ప్రతిష్ఠించి మరలా వెంటనే నీ తల్లికి నిన్ను అప్పగించెదను. ఈ బిడ్డ ఎంత మధురముగా యున్నదో కదా! ఇప్పుడు మనము మన తలలు వంచేదము.
పరలోకపు తండ్రీ, ఈ రాత్రియందు నీ పెద్దయు మరియు నేను కలిసి నిలబడి యుండగా, సువార్తయందు ఏకీభవిస్తు మరియు సమ్మతించుచు, ఈ తల్లి తన చిన్న బాలికయగు రోలడాను ప్రతిష్ఠించుటకు నీయొద్దకు తీసుకువచ్చినది. ఈ బిడ్డను పెంచే భాద్యతను నీవు ఈమెకు అనుగ్రహించితివి, కాబట్టి ఈమె చేయగలిగిన శ్రేష్టమైన మొదటి కార్యమేదనగా ఈ బిడ్డను నీ యొద్దకు తీసుకొని వచ్చుటయేయగును. పూర్వకాలమందుయోబు పలికినట్లుగా ప్రభువు ఈ ఈవులను అనుగ్రహించుచున్నాడు. దేవా, ఈ బిడ్డను నీవు తీసుకొను వరుకు ఈమెను నీ కాపుదలయందు యుంచవలెనని మేము ప్రార్ధి౦చుచున్నాము. ఈమె ఒక మంచి క్రైస్తవ జీవితమును జీవించి ఇతరులకు మంచి సాదృశ్యముగా పెరిగి పెద్దదవుటకు కృపను అనుగ్రహించుము. దేవా, ఆమె గృహమును ఆశీర్వదించండి, యధార్ధ హృదయములతో పూర్తిగా నీకు సేవచేయుటకై నీ కొరకై యుండుటకు ప్రతిష్ఠించుకొందురు గాక తన జీవితములో నీకొక సేవ చేయుటకై, దేవా, ఈ చిన్న రొండారెన్నీ కోట్స్ని మేము యేసు క్రీస్తు నామమున నీకు ప్రతిష్ఠించుచున్నాము. ఆమేన్. ఎంతో మధురముగా యున్నది! సహోదరీ దేవుడు నిన్ను దీవించును గాక!
8నీవు ఎలా వున్నావు? ("రాబర్ట్ పాల్ షమ్మెల్ అని సహోదరి చెప్పుచున్నది - సంపా) రాబర్ట్ పాల్ పేన్? ("షమ్నైల్ - సంపా) పమ్మెమ౦చిది. నీవు ఇంకా ఒక చిన్న బాలుడుగానే యున్నావు. దీనిని గురించి అంతగా సందడి చేయవని నేననుకొంటున్నాను. ఆ విధంగా నన్ను చూచి నవ్వొదు. నీవు నవ్వాలనుకుంటే ఇదిగో ఇచ్చట చూడుము. రాబర్ట్ పాల్, ఎంతటి చక్కని పేరుగా ప్రభువా, ఈ యవ్వన బాలిక మా యొద్దకు వచ్చియున్నది, ఈమె ఒక చిన్న బాలికగా యున్నది. ఈమె తన చిన్నబిడ్డయగు బాలుడిని ఓ దేవా, జీవితమంతా నీకు సేవచేయుటకై సమర్పించుచున్నది. ఇది వారి కలియక యొక్క ఫలముగాను మరియు ఫలితముగాను యున్నది. మీ పెద్దయు మరియు నేను కలిసి మా చేతులను ఈ బిడ్డపై యుంచి ఇతడియొక్క జీవితము నీకు ప్రతిష్ఠముగా యుండవలెనని నేను ప్రార్ధి౦చుచున్నాను. దీనిని అనుగ్రహించుము దేవా! రేపటి దినము అనేది ఒకటి యుండిన యెడల ఇతడి తల్లిదండ్రులు ఆలకించుచున్న ఈ వర్తమానమును ఇతడు మోసుకొని వెళ్ళును గాక వీరి యొక్క గృహమును ఆశీర్వదించుము, ఈ బిడ్డ ఎదగవలసిన జ్ఞానముతో ఎదిగి, నీకు ప్రియమైన శిష్యునిగా ఉండును గాక! అని నేను ప్రార్ధి౦చుచున్నాను. మేము ఇతడిని నీయొద్ద యేసు క్రీస్తు నామమున సమర్పించుచున్నాము. ఆమేన్ బాగుంది, అతడు - అతడొక మంచి బాలుడు. అవునండీ, అంతే. దీనికంటే మధురమైన దానిని అడుగలేము కదా! కదూ! ఈ చిన్న బాలుని తప్ప ఈ లోకమున వేరేదియు మధురముగా ఉండలేదు. అది నిజము. నవ్వుతూ యుండెడి ముఖము ఎంతో మధురముగా యున్నది. (సంఘము "ఆమేన్" అని చెప్పుచున్నారు — సంపా.)
పిల్లలను ఎత్తుకొను నా పనిని చూచి నా భార్య ఒకసారి అసూయపడినది. ఆమె వారిని ఎత్తుకొనగోరును. నాకు ఇష్టమే గాని వారిని పడవేయుదుననే భయపడుదును. వారు చక్కగా అందంగా కనబడుదురు. వారు మనకంటె చాలా గట్టివారు.
9నాకు ముప్పది అయిదు నిమిషములు మాత్రమే సమయమున్నది. నేను త్వరపడవలెను. చూద్దాం. ఎవరిలోను తప్పులు పట్టుటకు గాని ఎవరినీ తీర్పు చేయుటకు గాని నేను భావించను. కాని నేను నిజముగా కష్టపడి దీనిని ముగించవలెను. ఎందుకనగా ప్రసంగము ఆయన తరువాత వీధులలోనికి వెళ్ళినప్పుడు మనకు - ఇంతకుముందున్నంత చురుకుదనము యుండదు అది మీరెరుగుదురు. ఎన్నో మైళ్ళ దూరం ఎత్తు పల్లముల రహదారులలో కొన్నిసార్లు ప్రయాణించుట వలనను మరియు రెండు లేదా మూడు ఆరాధనలు ఒకే దినమున యుండుట వలనను, ఎందుకనగా… బోధించుట నాకు కష్టమనిపించదు. దినమంతా ఇక్కడ నిలబడినా నాకేమీ బాధ కలుగదు, దర్శనములు కలుగుటయే అందుకు ముఖ్య కారణము. నేను. కాని ఈ దర్శనములు మరియు ప్రజలతో సంభాషించరాని ఈ సంభాషణలే నన్ను ఇబ్బందిపరచుచున్నవి. కాని అవియే వారికి అవసరమై యున్నవి. తప్పక కలిసికోవలెను. వారందుకే ఇచ్చటకు వచ్చియున్నారు, చూచారా? కేవలము మీద చేతులు వేయుట ద్వారా ఏమీ జరుగదు. దాని వేరు ఎక్కడున్నదో, కనుగొనవలెను, అది ఎందువలన వచ్చినది, అది ఏమి చేసినది మరియు దానిలో నుండి ఏ విధముగా దానిని వెలుపలికి తీసుకొని వచ్చుటకు ఏమి చేయవలెను. అందుకు కారణమేమిటో కనుగొనవలెను, వారందుకే ఇచ్చటికి వచ్చి యున్నారు.
10ఇప్పుడు, రేపటికి మరుసటి దినము రాత్రియందు కూటములు ప్రారంభమగును. లేదా, కాదు, నన్ను మన్నించవలెనని మిమ్మల్ని కోరుచున్నాను, కూటములు బుధవారము రాత్రి లూసియానాలోని శ్రివ్ పోర్ట్ నందు ప్రారంభమగును. ఆ చుట్టుప్రక్కల మీకెవరైనా స్నేహితులున్నయెడల రమ్మని చెప్పండి. లైఫ్ టెబర్నికల్లో అవి జరుగును. ఆచ్చటే ఈ కూటములు జరుగునని నేను భావిస్తున్నాను, అది కాని లభించనియెడల ఆడిటోరియంలో జరుగును, అచ్చట అనేకమంది కూర్చొనుటకు స్థలముండును. ఆ పైన అంతస్తులో ఒక పెద్ద స్థలము కలదు, దాని క్రింద అంతస్తులో కూడా స్థలము కలదు, కాబట్టి ఎంతమంది అచ్చట కూర్చొనుటకు స్థలము కలదో నేనెరుగను. ఒకవేళ అప్పటికే చాలకపోయిన యెడల. దానికి ఎదురుగా వున్న ఇంకొక ఆడిటోరియమందు ఏర్పాటు చేసెదరు. అందులో కూడా ఎన్ని కుర్చీలు గలవో నాకు తెలియదు. అచ్చట నేను కూటములు జరిపించాను గాని జ్ఞాపకము లేదు. ఇది వార్షిక సభ.
మరియు కేవలము మేము. మూడు సంవత్సరముల క్రితము నేను అక్కడున్నాను, ప్రభుని పేరట ఒక ఉజ్జీవము మేము ప్రారంభించాము, అప్పటి నుండి అది ముగియలేదు. నిరంతరము కొనసాగుచున్నది. ప్రతిరోజు కొనసాగుచునేచున్నది. ప్రజలు వచ్చుచున్నారు, రక్షింపబడుచున్నారు, బాప్తిస్మము పొందుచున్నారు, ప్రభునితో నడచుచున్నారు, సేవకులు కూడా వచ్చుచున్నారు. అది ఆ విధంగా జరిగినంతకాలము నేను వారిని సంధించుచూ, కొద్ది మాటలు చెప్పి ముందుకు నడిపించుచుండవలెను.
MATT 26:28•
HEB 9:22
11అది బుధవారము ప్రారంభమై ఆదివారము ముగియును. క్రైస్తవ వ్యాపారుల అల్పాహారము ఏ హోటలులో నిర్ణయించిరో నేను మరచిపోయాను. వారు మీకు ఎప్పుడు రావలెనో చెప్పెదరు. అది వ్యాపారస్తుల అల్పాహార కూటము.
గతసారి గొప్పగా జరిగినది. (ఇక్కడున్న వ్యాపారస్తులు ఎరుగుదురు) పట్టణములోని ఒక రబ్బీని రక్షించెను. ఓ! ఏమి జరిగినదో అంతా నేనెరుగను. ప్రభునిలో గొప్ప సమయము గడిపాను. కాబట్టి మేము. ఆ రక్తము గురించే యూదులకు తెలియును, అది రక్తమని వారెరుగుదురు. "రక్త ప్రోక్షణ లేకుండా, క్షమాపణయే ఉండదు" మీరు గమనించారా!
ఇప్పుడు తిన్నగా వాక్యములోనికి వెళ్ళుదము. నా మాట నిలబెట్టుకొనుటకు శాయశక్తులా ప్రయత్నించెదను.
12ప్రభుని చిత్తమయితే, క్రిస్మసు తరువాత ఆదివారము మీరు సెలవులో ఉందురు. మీరు సెలవులో ఉన్నయెడల ఇచ్చటికి రండి. క్రిస్మసు తర్వాత ఆదివారము ఉదయాన ఇక్కడ ఆరాధన జరుపవలెనని తలంచుచున్నాము. ఏ తేదీ! 29వ తేదీ. క్రిస్మసు తరువాత ఆదివారము.
ఏమైనా జరిగితే మేము రాలేము. మేమిచ్చట యుండలేము. ఎందుకనగా భవిష్యత్తు మనకు తెలియదు. ఏమైనా సంభవించిన యెడల, ఏమో, పట్టణము వెలుపల జీవించుచున్న మిమ్మల్నే మొమ్ఫిస్లో నుండి వచ్చిన మీకే చెప్పుచున్నాను.
"నీవెంత గొప్పవాడవు!" అను పాటను సహో, అన్గ్రెన్ పాడవలెనని కోరుచున్నాను. ఈ రాత్రి ఆయన ఇచ్చటే యున్నాడా? నాకు చేయవలసినవి చాలా యుండును. అన్నింటినీ చేయలేను. దేవుడు మిమ్మును దీవించును, జనులగు మిమ్మల్ని దీవించును.
JOB 14:13
13ఇప్పుడు వాక్య భాగమును చదువుదము. నా మాటలు తప్పిపోవును గాని ఆయన మాటలు తప్పవు. ఆయన మాట వినుటకు మీరు వచ్చినందుకు దేవుడు మిమ్మును దీవించును. "వినుటవలన విశ్వాసము వచ్చును. దేవుని వాక్యము వినవలెను," అవునా? ఇప్పుడు నేను ఆలోచించుచున్నట్లుగా. పరి. యోహాను 6వ అధ్యాయము 60వ వచనము నుండి 71 వరకు చదువుదము - యోహాను 6:60.
ఇప్పుడు నేను అనుకున్నాను. కొద్దిసేపటి క్రితం సూర్యాస్తమయమును నేను కిటికిలో నుండి చూచు ప్రకృతికి ఒక ధర్మమున్నది. చలికాలము వచ్చునప్పుడు, ప్రకృతి దానంతట అదే దాని ధర్మము ప్రకారముగా వృక్షములోని రసమంతయు వేరు క్రింది భాగమునకు దిగిపోయి అది పూడ్చి పెట్టబడుచున్నది. యోబు ఇట్లనెను, "ఓ! నీ ఉగ్రత దాటిపోవు వరకు నన్ను సమాధిలో దాచెదవు. రహస్య స్తలములో ఉంచుదువు." మరిచ్చట సంగతి అదే. "నీవు నన్ను దాచినయెడల" గమనించారా?
అతడు ప్రకృతిని గమనించాడు, ఆ వృక్షములోని జీవము దాని క్రింది భాగమునకు వెళ్ళుటను అతడు గమనించాడు, సహోదరుడు వే, "ఉగ్రత దాటిపోవు వరుకు అచ్చటే దాగియుండి, పిదప ఒక కాలమును నాకు నిర్ణయించి పిదప నన్ను పిలువుము." గమనించారా? ప్రకృతికి ఒక ధర్మమున్నది. దానిని అది మీరదు. అది ప్రకృతి నియమము. ఆత్మ నియమము ఒకటున్నది. దానిని కూడా ఎవరూ మీరలేరు అని నేను ఒక దంపతులయొద్ద ఈ మధ్యాహ్నాము చెప్పాను.
ROM 10:17
14నీవు దేనినీ సంపూర్తిగా నశింపచేయలేవు. మానవ జాతి దానిని నాశనము చేయలేరు. వారు దానిని చీల్చివేయవచ్చును కాని దానిని వారు నాశనము చేయలేరు, "ఒక కాగితము ముక్కను తీసుకొని దానిని కాల్చి వేసిన ఏమగును? అది దానిని సంపూర్తిగా నాశనము చేసినది కాదా" అని ఎవరో ఒకరు అడిగిరి. అగ్ని పేడ వలన అందులోని రసాయనములు చెల్లాచెదురగును. ఆదిలో ఉన్నట్టే అది వాయువుగా మారును. నీవు నాశనము చేయలేవు. ప్రపంచము ఇంకా నిలచియున్నచో ఆ కాగితములో ఉన్న వాయువులు, రసాయనములు మరల ఒక కాగితమగును. అది నిజము. నీవు సంపూర్తిగా నాశనము చేయలేవు. ఖచ్చితముగా,
దేవా ప్రతిదానికి ఒక పునరుత్థానము యున్నయెడల నాశనము. నీతిమంతులకు ఒక పునరుత్థానమున్నది. మనము తిరిగి రావలసి యున్నాము. అచ్చట యున్నదంతా అదియే. దానిని చేయుట తప్ప వేరేమియు అచ్చట లేదు. నీవు కాల్చివేసినా, ముంచివేసినా మరేమి చేసినా గాని దానిని వారు నాశనము చేయలేరు.
దేవుడు మాటను పలికి లోకమును సృష్టించినప్పుడు, మీలోని ప్రతి భాగము ఇచ్చటయే యున్నదని మీరు గుర్తించుకొనుడి. ఆయన మీ శరీరమును అప్పుడు ఈ భూమియందే యుంచెను. దేవుడు తప్ప మరెవరును దానిని తీసివేయలేరు. అంతా తిరిగి ఆయన చేతిలోనికి వెళ్ళవలసియున్నది. చూచారా? ఆయనే సృష్టికర్త వాగ్దానమును చేసినవాడు ఆయనే. కాబట్టి నిత్యజీవమున్నదని నిశ్చయముగా మనమెరుగుదుము. ఇప్పుడు మనలో చావులేని నిత్యజీవమున్నదను నిశ్చయతను హృదయమందు కలిగియున్నాము.
JOHN 6:60-71
15మంచిది, పరి. యోహాను 6వ అధ్యాయము 60 వచనమునుండి ఆరంభించుదమ.
ఆయన శిష్యులలో అనేకులు ఈ మాట విని - ఇది కఠినమైన మాట, ఇది ఎవడు వినగలడని చెప్పుకొనిరి.
యేసు తన శిష్యులు దీనిని గూర్చి సణుగుకొనుచున్నారని తనకు తానే ఎరిగి వారితో ఇట్లనెను, దీనివలన మీరు అభ్యంతరపడుచున్నారా?
అలాగైతే మనుష్య కుమారుడు మునుపున్న చోటునకు ఎక్కుట మీరు చూచిన యెడల ఏమందురు?
ఆత్మయే జీవింపచేయుచున్నది. శరీరము కేవలము నిష్ ప్రయోజనము. నేను మీతో చెప్పియున్న మాటలు ఆత్మయు జీవమునై యున్నవి గాని.
మీలో విశ్వసించని వారు కొందరున్నారని వారితో చెప్పెను. విశ్వసించని వారెవరో, తన్ను అప్పగింపబోవువాడెవడో మొదటినుండి యేసునకు తెలియును.
మరియు ఆయన - తండ్రిచేత వానికి కృప అనుగ్రహింపబడుకుంటే ఎవడును నాయొద్దకు రాలేడని ఈ హేతువును బట్టి మీతో చెప్పితిననెను.
అప్పటినుండి ఆయన శిష్యులలో అనేకులు వెనుక తీసి మరి ఎన్నడును ఆయనను వెంబడించలేదు.
కాబట్టి యేసు - మీరు కూడా వెళ్ళిపోవలెనని యున్నారా? అని పన్నె౦డు మందిని అడుగగా,
సీమోను పేతురు - ప్రభువా, యెవని యొద్దకు వెళ్ళుదుము? నీవే నిత్యజీవపు మాటలు గలవాడవు.
నీవే దేవుని పరిశుద్దుడవని మేము విశ్వసించి ఎరిగియున్నామని ఆయనతో చెప్పెను.
అందుకు యేసు - నేను మిమ్మును పంన్నె౦డుగురిని ఏర్పరచుకొనలేదా? మీలో ఒకడు సాతాను అని వారితో చెప్పెను.
సీమోసు ఇస్కరియోతు కుమారుడైనా యూదా పండ్రెండుమందిలో ఒకడైయుండి ఆయన నప్పగింపబోవుచుండెను గనుక వాని గూర్చియే ఆయన ఈ మాట చెప్పెను.
16ఈ రాత్రి నేను మూడు రకముల విశ్వాసులు అను అంశము మీద మాట్లాడుదును (అరగంటలో ముగించ యత్నించెదను) "మూడు రకముల విశ్వాసులు" అను అంశము నేను మాట్లాడగోరుచున్నాను. నేను తరచుగా ఈ ప్రకటన చేశాను అనుకుంట, "మంచిది, మధ్యాహ్నము దీని మీద ఒక్కసారి ప్రసంగించవలెనని అనుకున్నాను." ఆలాగే నేను తలంచితిని.
మొదటిది విశ్వాసులు, వేషధారులు, అవిశ్వాసులు. ఇది చాలా క్రొత్త అంశము. ఈ రాత్రి ఇచ్చట మనము కూర్చొనియుండుట ఎంత వాస్తవమో ఆ విధముగానే అటువంటి గుంపు ఎల్లప్పుడు వచ్చి చేరును. ఎచ్చటెచ్చట జనులు కూడుదురో అంతా ఇటువంటి గుంపును కలిగియుండును. ఇప్పుడు కూడా వారు యుండుటను మనము చూచుచున్నాము. ప్రభువు రాకడ వచ్చు వరుకు అటువంటి గుంపును ఎల్లప్పుడూ మనము కలిగియుందుము. ఈ మూడు రకముల గుంపును గూర్చి నేను మాట్లాడుచుండగా మనల్ని మనము విమర్శించుకొని ఈ మూడు గుంపులలో మనము ఏ గుంపులో యున్నామనే దానిని గూర్చి పరిశీలించి చూచుకొనెదము.
ఈ రాత్రి మన కొరకే బోధించుచున్నాను. ఈ మూడు గుంపులు మనలోనే యున్నవి. ఇప్పుడు గుర్తించుకొనండి, ఒకవేళ. ఈ సంఘములో ఈ రాత్రి యందు కిక్కిరిసియున్న గోడలు చుట్టు, వరండాలోనుయున్న ఈ జనులుతో నేను మాట్లాడుచున్నాను, కాని ప్రపంచంలోనున్న వారందరికి కూడా నేను చెప్పుచున్నాను. చూచారా? టేపు పరిచర్య ద్వారా ప్రపంచములోని వారందరు ఇది విందురు.
ACTS 4:13•
ROM 10:17
17ఇప్పుడు మూడు రకముల విశ్వాసులను గూర్చి మాట్లాడగోరుచున్నాను. నా అంశము విశ్వాసులు. అనగా నిజమగు విశ్వాసి. వేషధారి మరియు అవిశ్వాసి, చూచారా.
మనము మాట్లాడుకొను మొదటి గుంపు విశ్వాసి. అతడు ముందుండవలసిన వాడని నేను తలంచుచున్నాను. ఎందుకనగా, నిజముగా నమ్మువాడు అతడే. శిష్యులు ఇక్కడ విశ్వాసులుగా యున్నారు. ఈ చదువబడిన వాక్య భాగమును మాదిరిగా మనము తీసికొనుచున్నాము.
మొదటగా అసలైన - నిజ విశ్వాసులను చూద్దాం. "దేవుని వాక్యము వినుట వలన విశ్వాసము వచ్చును." క్రీస్తే దేవుని యొక్క వాక్యమైయున్నాడు. విశ్వాసులు (గమనించారా.)
ఇప్పుడు, ఈ విశ్వాసి చెప్పిన గొప్ప మాటను మీరు గమనించితిరా? ఇప్పుడు ఒక విశ్వాసి అనువాడు లోక సంబంధమైన తెలివితేటలు గలవానిగా ఉండునట్లు ఉండనక్కర్లేదు. ఇంతటి విద్యను కలిగిన విద్యావంతుడుగా నీవు ఉండాలని చెప్పే ప్రజల మాటలకనుగుణముగా అతడు ఉండనక్కర్లేదు. ఈ మాటను పలికిన వ్యక్తి విద్యలేని పామరుడని బైబిలు చెప్పుచున్నది - పేతురు. అతడు తెలివిగలవానిగా పరిగణించబడడు.
ISA 35:8
18యెషయా 35లో ఇటున్నది, "ఒక రాజ మార్గమున్నది. అది పరిశుద్ధ మార్గమని పిలువబడును. అపవిత్రులు దానిలోనికి ప్రవేశించలేరు."
ఈ మధ్యాహ్నము నేను మన పెద్దలలోని ఒకరితో ఆ క్రొత్తగా కట్టిన వంతెన గూర్చి మాట్లాడుచున్నాను, "నేడు నీటి మీద ఎన్నో వంతెనలు నిర్మించబడియున్నవి. కాని అచ్చట భూమి నుండి మహిమలోనికి వెళ్ళు ఒక గొప్ప వంతెన గలదు. అది రాజమార్గమై యున్నదని" నేను చెప్పితిని. అది రాజమార్గము, అపవిత్రులు దానిలోనికి ప్రవేశించలేరు. అని చెప్పాను. అది సత్యము. మన ప్రభువగు క్రీస్తు ద్వారా కట్టబడిన త్రోవ అది, భూమి నుండి మరో దేశమునకు దారివేయబడినది, అపవిత్రులు దానిలో ప్రవేశించలేరు.
DEUT 18:15,18•
JOHN 6:68
19విద్యలేని పేతురు అచ్చట నిలబడియుండి, వారి మధ్య దేవుడు ఒక ప్రవక్తను లేవుదునని వాగ్గానము చేయబడిన వాక్యము ఆ దినమున నెరవేరుటను అతడు చూచు చుండెను. పేతురు దానిని నమ్ముటకు కష్టతరమాయెను. ఎందుకనగా వాగ్దానము చేయబడిన ఆ వాక్యమునకు పోలికగా అనేక అనుకరణలు వచ్చినవి. కాని నిజమైన దానిని చూచి, ఆ కాలపు వాక్యము బయలుపడుట చూచి, ఆయన మాటలు విని ఆయనెవరో గుర్తించెను. పూర్తిగా నమ్మెను.
"ప్రభువా, మేమెవరి యొద్దకు వెళ్ళుదుము?" అని అతడే పలికెను. ఆ వచ్చిన సమూహమును విశ్వాసులుగా, వేషధారులుగా, అవిశ్వాసులుగా ఆయన విభాగించుచుండెను. ఆ ఒక్క జనసమూహములోనే మూడు రకముల వారు నిలబడియున్నారు. ఈ అధ్యాయములోనే విశ్వాసులను, అవిశ్వాసులను వేషధారులను కనుగొందము. యేసు చెప్పిన మాటలను బట్టి ఆ సమూహము విడిపోయెను. అది తప్పక జరుగవలసి యున్నది.
ఆయన రోగులను స్వస్థపరచినంత కాలము గొప్పవాడుగా పిలువబడెను. కాని బోధ మరియు ప్రవచనము చెప్పే సరికి గోధుమల నుండి పొట్టు వేరయ్యెను. చూచారా? పొట్టు గోధుమ గింజను చుట్టుకొనియుండును. అది గింజ కాదు. అది పనికి రాదు. అందులో ఏమి లేదు - దానిలో జీవములేదు. అది పొట్టులో యున్నది, అది గోధుమతో ఉండలేదు. అది గోధుమతో వారసురాలు కాదు. గోధుమ గింజను గూర్చి మనము మాట్లాడుకొనుచున్నాము.
MATT 16:13-18•
JOHN 6:67,68
20ఆయనే మెస్సీయా అని పేతురు నమ్మెను. మిగిలినవారందరూ ఏమి చెప్పినా అతడు చలించలేదు, యాజకుడు చెప్పినది నమ్మలేదు, సంఘము చెప్పిన దానిని సీమోను పేతురు లెక్కచేయలేదు. తనకు తాను నమ్మెను.
"నేనెవరినని జనులు చెప్పుకొనుచున్నారు?' అని ఒకసారి యేసు అతనిని అడిగెను.
"కొందరు నీవు ప్రవక్తవనియు, మరికొందరు నీవు మోషే లేక ఏలియావనియు చెప్పుకొనుచున్నారు" అనెను.
"అయితే నీవేమి తలంచుచున్నావు?" అనడిగెను.
"నీవు క్రీస్తువు. సజీవుడైన దేవుని కుమారుడవు." అనెను.
"సీమోనూ! (యోనా కుమారుడు) నీవు ధన్యుడవు. రక్త-మాంసములు దీనిని నీకు బయలుపర్చలేదు. ఒక గ్రంథము లేదా సిద్దాంతము, లేదా ఒక శాఖ పట్టిక నుండి దీనిని నీవు నేర్చుకొనలేదు. పరలోకమందున్ననా తండ్రి దీనిని నీకు బయలుపరచెను." నిజమగు విశ్వాసి… వాక్యము యొక్క ఆత్మీయ ప్రత్యక్షతను పొందెను. చూచారా.
"నీవు పేతురువు. నేనెవరైయున్నానో అన్న నీ ప్రత్యక్షతా బండమీద నేను నా సంఘమును కట్టుదును. పాతాళ లోక ద్వారములు దీనియెదుట నిలువజాలవు." చూసారా?
"మేమెవరియొద్దకు వెళ్ళుదము?" అని సీమోను చెప్పినదానిలో ఆశ్చర్యము లేదు.
"మీరును పోవలెనని కోరుచున్నారా"? అని యేసు ప్రశ్నించెను.
అందుకు వారు ఇట్లనిరి, "ప్రభువా, మేము ఎవరి యొద్దకు వెళ్ళుదుము? నీవు మాత్రమే నిత్యజీవపు మాటలుగలవాడవు." ఆయన యొద్ద జీవపు మాటలుండుట మాత్రమే కాదు గాని, ఆయనే ఆ జీవవాక్యము. దీనిని సీమోను చక్కగా గుర్తించెను. దీనిని గుర్తించుట వలన అతనికి నిరీక్షణ కలిగెను. ఆయనే సజీవ వాక్యమని అతనికి బయలుపరచబడెను.
21అతడు అసలైన విశ్వాసి. ఎవరి వలనో ఒప్పించబడుట కాదు, లేదా ఏదో జరుగుట కాదు గాని పరిశుద్దాత్మ దానిని అతనికి బయలుపరచెను. వాక్యమును తేటగా అతనికి బయలుపరచెను. దేవుని ఆత్మ వచ్చి ఆ కాలపు వాక్యమును బయలుపరచెను.
లూథరను గూర్చి ఎరిగిన వ్యక్తి లూథరును నమ్మకుండా ఎట్లు౦డగలడు? లూథరు ఒక సంస్కర్త, మానవాత్మ పెళ్ళి సంస్కరణను తెచ్చెను. వెస్లీ కూడా అంతే దానిని వారు నమ్మవలసియుండిరి. అది సంఘకాల వర్తమానము. అది అక్షరాలా జరుగవలసి యున్నది. దానిని నీవు నమ్మవలెను.
REV 3:20•
REV 10:6
22మనము లవొదికయ కాలములో యున్నాము. లవొదికయ కాలములో సంఘము బయటకు త్రోసివేసినట్టు మనము చూచియున్నాము. లోనికి రావలెనని ఆయన తలుపు తట్టుచున్నాడు. ఇది జరుగుట మనము చూచినప్పుడు ఏ కాలములో మనము జీవించుచున్నామో తెలియును.
మనము ప్రపంచ చరిత్ర ముగింపులో యున్నాము. పుస్తకము ఇప్పుడు ముగింపయినది. చివరి మాట ఏదో ఒక రోజున వ్రాయబడును. ఆమె సమాప్తమగును. పిదప కాలము అనునది ఇక ఉండదు.
అచ్చట ఒక గొప్ప నాటక ప్రదర్శనము జరుగబోవుచున్నది. దూతలు ఆకాశము నుండి చూచుచున్నారు. ఆ నాటకము ఏమిటనేది మీరెరుగుదురా? నటులు సిద్ధముగా యున్నారు. వారు నటించుటను మీరు చూచెదరు.
చెడ్డవాడు నటించుటను మీరు చూడవచ్చు. నాటకములోని విలన్ రంగము మీదికి వచ్చి తన మోసమును మరియు యుక్తితో నటించును.
GEN 6:14•
JOHN 6:69
23అంతేకాదు, సంఘము ఎత్తబడుటకై తనను తాను సిద్ధపరచుకొనుటను కూడా మీరు చూడవచ్చును. అది ఒక గొప్ప సన్నివేశము.
పరిశుద్ధ గ్రంథములో ముందుగానే చెప్పిన విధముగా దేవునియొక్క సన్నిధిలో ఆ గొప్ప నాటకము రూపుదాల్చుటను మరియు అది సంభవించుటను మీరు చూడవచ్చును. ఎంత గొప్ప సమయములో జీవించుచున్నాము! అతి మహిమకరమగు కాలము! అన్ని కాలములలోని ఈ సమయము కొరకు ఎదురుచూచిరి. పూర్వకాలపు ప్రవక్తలు ఈ ఘడియను చూడగోరిరి గాని ఆ భాగ్యము వారికి దొరకలేదు.
ఇప్పుడు, అచ్చట ఒక విశ్వాసి యుండెను. అతడు చూచిన దానిని బట్టి అతడు దానిని విశ్వసించెను. "నీవు క్రీస్తువని, మెస్సీయావని, ఈనాటి దేవుని వాక్యమని మేము పూర్తిగా నమ్మియున్నాము." చూడండి. ఒక నిజ విశ్వాసి ఆలాగుండును.
మరో వ్యక్తి గూర్చి ఆలోచించు ముందు మరి కొద్దిమంది విశ్వాసులను త్వరగా చూద్దాం. ప్రవక్తయగు నోవహును చూద్దాం. ఆ దినములలో అతడు ఒక వ్యవసాయదారుడై యుండును. అపహాసకులు, మత బోధకులు అతనిని హేళన చేసిరి. సంఘము దిగజారిపోయినది. దేవుడు నోవహుతో మాట్లాడి ఒక ఓడను నిర్మించమని చెప్పెను. దానిగూర్చి నోవహు ఎన్నడూ దేవునితో వాదించలేదు. అది దేవుని మాట అని అతడు నమ్మిన వెంటనే అందుకు అవసరమగు సామాను సిద్ధపరచెను.
ROM 10:17
24అతడు ఒక నిజ విశ్వాసి.
దానిగూర్చి ఏమీ వాదించవద్దు. నీవు పూర్తిగా ఒప్పించబడినచో చాలును. ఏదైనాగాని, ఏ విశ్వాసమైనా గాని, ఏ మార్గమైనా గాని ఈ విధమునే ఉండవలెను. వినుట వలన విశ్వాసము వచ్చును. నీవు ఇక్కడ నిలబడియుంటే చాలు. వైద్యుడు నీ గూర్చి ఏమి చెప్పినా లెక్కచేయవద్దు. మానవుడు తన పరికరముల ద్వారా, మరియు తన జ్ఞానమును బట్టి వ్యాధియొక్క లక్షణములను గుర్తించి, అతడు నీకు మరణమే తప్ప వేరే మార్గము లేదు అని నీతో చెప్పుటయే అతడెరుగును కాని నీకు ప్రార్థన చేసిరి. భవిష్యత్తులో నీవు ఆరోగ్యకరమగు స్త్రీగా, పురుషునిగా ఉన్నట్లు చూడవలెను. అదే చాలును. అందులోనికి నీవు బహు నిశ్చయముగా నడిచి వెళ్ళెదవు. ఎందుకనగా నీవు నమ్మితివి. దేవుడు చెప్పెను. అది జరుగునని నీవెరుగుదువు.
1KGS 8:30•
DAN 6:7•
AMOS 3:7
25కాన్సరు వచ్చిన ఆ స్త్రీని చూడండి. (చూచారా?) అది జరుగునని ఆమె నిస్సందేహముగా నమ్మినది. కాన్సరు చనిపోయినది. అది నీ నుండి విడిపోయి దానినుండి నీవు విడుదల పొందితివి గమనించితివా? అది వాస్తవము. దానిని నీవు నమ్మితివి.
కొద్దిసేపటి క్రితం ఒక బాలుని ఆ తండ్రి తీసికొని వచ్చెను. ఇక్కడే ఎక్కడో అతడున్నాడు. ఆ బాలుడు పడిపోయి జ్ఞాపకపు శక్తి కోల్పోయెను. ఏదీ అతనికి గుర్తుండదు. ప్రార్ధన చేసిన కొద్ది నిమిషముల తరువాత నేను అతని పేరు అడిగాను. అతడు తన వయస్సు కూడా చెప్పెను. మామూలు బాలుని వలె యున్నాడు. చూచారా? వారు నమ్మిరి. దేవుడు చెప్పినది తప్పక జరిగి తీరును. నోవహు దేవునిని నమ్మెను. నోవహు ఒక విశ్వాసిగా ఎంచబడెను. బబులోనులో సంఘము దాస్యములో ఉన్నప్పుడు దానియేలు దేవునిని నమ్మెను. ఎవరేమనినా వారు మాత్రము ప్రార్ధి౦చుట మానలేదు. ఆ ప్రతిమకు వారు మొక్కలేదు. దానియేలు దాని వైపు దృష్టి సారించలేదు. అతడు ప్రవక్త దేవుని గూర్చి వినినవాడు. వాక్కు. అతని యొద్దకు వచ్చెను. మందిరము ప్రతిష్ఠించబడినప్పుడు ఈలాగు చెప్పబడెను, "ఒక వ్యక్తి ఏ దేశములో ఉండియైనను శ్రమపడుచున్నయెడల ఈ పరిశుద్ధ స్థలము వైపు తిరిగి ప్రార్ధి౦చిన యెడల ఆకాశములో నుండి అతని మనవిని విందును." దానియేలు దేవునిని నమ్మెను. అతడు నిజ విశ్వాసి. సింహములు కూడా అతనిని తినలేకపోయెను. చూచారా? అతడు ఒక విశ్వాసి. అతనిలో నిజము, సత్యము ఉండెను. అతడు ఒక విశ్వాసి.
దావీదు మరియొక విశ్వాసి. ఒక చిన్న బాలుడు.
26ఆధునిక సంఘముతో అతడు చేతులు కలపలేదు. దానియేలు నోవహు కూడా ఆలాగే ఉండెను. దేవుడు చెప్పినదే సత్యము అని నమ్మిరి. ఆధునిక ప్రపంచము ఏమి చెప్పినా, దేవుడు చెప్పినదే సత్యమని వారు నమ్మిరి. వారు నిజమగు విశ్వాసులు.
పేతురు మరియు అపోస్తలులు ఆ విధంగానే చేసిరి. ఆయనే నిత్యజీవపు మాటలుగలవాడని వారు నమ్మిరి. నేడును అదే నమ్ముచున్నాను. దానికి వ్యతిరేకముగా నున్న ప్రతిదియు తప్ప. అది మరణమే. ఇది మాత్రమే జీవ వాక్యము. క్రీస్తే ఆ వాక్యము.
1SAM 17:34,35•
PS 42:1
27దావీదు ఎర్రని వాడు. అతని సోదరులు అతనిని చిన్నగా చూచిరి. ఒక శిరస్తాణము మోయలేనివాడు. చాలా చిన్నగా, సన్నగా ఉండెను గనుక యుద్ధమునకు ఎన్నిక కాలేదు. కాని ఒక విశ్వాసిగా అతడు వచ్చెను. అతని తండ్రి కొన్ని డజనుల గొర్రెలను కాయుమని అతనికి ఇచ్చెను. ఎడారిలో వాటిని కాయుచుండగా (సింహములు, ఎలుగుబంట్లు, తోడేళ్ళు మొదలగునవి) ఆ ప్రదేశములో అవి యుండును. అతడు తన తండ్రి ఇచ్చిన వడిసెలతో వాటిని కాయుచుండెను. దావీదు నీడగల పచ్చని భైళ్ళను చూచి గొర్రెలను ఆ ఎండ నుండి అచ్చటికి తోలుచుండెను. చల్లని నీరు ఎట్లు౦డునో అతనికి తెలియును. "దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడునట్లు, దేవా, నా ప్రాణము మీ కొరకు తృష్ణగొనుచున్నది." చూచారా? అతడు ఎలుగెత్తి ప్రార్ధి౦చెను.
ఒక రోజున అత్యవసర పరిస్థితి ఏర్పడెను. ఒక సింహము ఒక గొర్రెను కరచుకొని పోవుచుండెను. దేవుడు నన్ను సింహము కంటె గొప్పవానిగా చేసెనని తలంచి వడిసెల తీసి ఆ చిన్న రాయితో సింహమును కొట్టెను. పెద్ద జూలు, మెడ కల్గిన ఆఫ్రికను సింహాలను చూచారా? అవి పాలస్తీనాలోను, ఆసియాలోను ఉండినవి. పెద్ద 300 మాగ్నమ్ తుపాకీతో కూడా దానిని కూల్చలేరు. కాని ఒక రాయితో ఇతడు నేలకూల్చెను. అది లేచి తన మీద పడుచుండగా గడ్డము పటుకొని చీల్చివేసెను.
ఈ కారణము చేతనే ఇంత ధైర్యముగా మాట్లాడెను. అతనికి ఒక అనుభవమున్నది. దేవుడు చెప్పిన మాటను అతడు పరీక్షికు పెట్టెను.
28గొల్యాతును గూర్చి అతడు భయపడలేదు. ఎందుకనగా అతడు సున్నతి లేనివాడు. విశ్వాసి కాడు. గొల్యాతు వచ్చిన వాని దేవుని నామములో దూషించగోరెను. దావీదు కంటె గొల్యాతు ఎన్నోరెట్లు పెద్దవాడు. అతనికి పధ్నాలుగు అంగుళముల పొడవైన వ్రేళ్ళున్నవి. అంత గొప్ప యోధుడు. అతడు ధరించిన కోటు బహుశా మూడు వందల పౌనులకంటె ఎక్కువ బరువు ఉండియుండును. (చూచారా?) అతడు ధరించిన శిరస్తాణము బహుశా అంగుళమున్నర మందము ఉండియుండును. గొప్ప రాక్షసుని వంటివాడు. ఇరవై అడుగుల పొడవైన నేతగాని దోనెవంటి ఈటెను పట్టుకొని అతడు నడచుచుండెను. అటువంటి వ్యక్తి తన మీదికి వచ్చిన ఒక డజనుమందిని తేలికగా ఎత్తిపారవేయగలడు.
1SAM 17:9,26
29పోటీ ఎట్లున్నది? వాడచ్చట నిలబడి తనను గూర్చి గొప్పలు చెప్పుకొనుచుండెను.. సవాలు విసరబడియున్నది…
మీరు చూడండి, వాడు చెప్పెను, "మనము రక్తము పారనీయ వద్దు." "ఒక్కరు వచ్చి నాతో పోరాడి గెలిచినయడల మా అందరము మీకు దాసులమగుదుము. నేను గెలిచినయడల మీ యందరు నాకు దాసులవుదురు." అనెను.
గమనించండి, మీ బలముకంటె మించిన బలమును సాతాను నీపై ప్రయోగించగలడనే దానిని అతడు గ్రహించినప్పుడా సాతాను తనను గురించి గొప్పలు చెప్పుకొనును. ఇప్పుడు సాతాను వ్యత్యాసమైన వ్యక్తిని సంధించెను. భుజములు వంగిపోయిన చిన్నపాటి మనిషిగా అతడు కనిపించుచున్నాడు.
"జీవము గల దేవుని సైన్యము అచ్చట నిలబడియుండగా, ఈ సున్నతి లేని ఫిలిష్తియుడు జీవము గల దేవుని సైన్యమును తిరస్కరించుటకు ఏ పాటి వాడు"? అని అనెను.
దీనిని విని అతడు ఆశ్చర్యము పొందెను. ఎందువలన? అతడు ఒక విశ్వాసి. తక్కిన వారందరూ వేషధారులు. ఇతడు నిజ విశ్వాసి.
"మీరు భయపడుచున్నచో నేను వెళ్ళి పోరాడుదును" అనెను.
అంత చిన్నవాడు ఎంత సవాలు విసిరెను! అతడు ఒక విశ్వాసి. దేవుడు చేయనైయున్న దానిని అతడెరుగును.
1SAM 17:42-45•
PROV 18:10
30సున్నతి లేని ఫిలిష్తియుడు తన దేవుని పేరట దూషించసాగెను. "నేను కుక్కనా?" అనడిగెను. చెప్పెను, "ఈ చిన్నవాడిని నా ఈటె చివరతో ఎత్తి ఆ చెట్టు మీదకు పారవేయుదును. ఆకాశపక్షులు తినునట్లు చేసెదను." అనెను. ఓ! ఎంత భయంకరమగు మనిషి!
దావీదు ఇట్లనెను, "నీవు ఈటె, కత్తి మరియు శిరస్త్రాణముతో నా మీదికి వచ్చుచున్నావు. ఫిలిష్తియుల తరపున నీవు నా మీదికి వచ్చుచున్నావు. కాని నేను ఇశ్రాయేలీయుల దేవుడగు యెహోవా నామములో నీ మీదికి వచ్చుచున్నాను."
అది విశ్వాసి మాట. అది అతని రక్షణ. అది అతని కేడెము. అది అతని పరిరక్షణ. ఆమేన్! సంఘము యొక్క కవచము అదే. ఏ విశ్వాసికైనా అదే కవచము. ఏమి జరుగుచున్నా లోకము ఏమి చెప్పుచున్నా నీ కవచము ఇశ్రాయేలీయుల దేవుడగు యొహూవాయే. "యేసు క్రీస్తు నామము బలమైన దుర్గము. నీతిమంతులు అందులోనికి పరుగెత్తి సురక్షితముగా ఉందురు." "యేసు క్రీస్తే - మన దుర్గము."
చూడండి, ఏమి జరగినదో మనమెరుగుదుము. దావీదు, గొల్యాతు శిరస్తాణముతో తల ముఖమును కప్పుకొని యుండుట చేత దావీదు దెబ్బ కొట్టుటకు ఒక చిన్న స్థలము తప్ప నొసటయందు వేరే ఏమియు అతడికి కనిపించలేదు. కాబట్టి అతడు కొట్టవలెననిన ఆ శిరస్త్రాణములోనున్న నొసటయందున్న చిన్న రంధ్రము యున్న ఒకే ఒక స్థలము మాత్రమే. వేరే ఏదియు లేదు. ఆ రాక్షసుని యొద్దకు దావీదు దగ్గరగా వెళ్ళుటకు ముందే దేవుడు చంపవలసిన ఆ స్థలము యొద్దకు గురి చూచి రాయిని తిన్నగా పోనిచ్చి ఆ రాక్షసుడిని చంపెను. గమనించితిరా? దేవుడే దానిని చేసెను. అతడొక విశ్వాసియని మనము గుర్తించవలెను.
GEN 12:1•
GEN 17:4•
ROM 4:20
31అబ్రహాము మరియొక విశ్వాసి. అతడు కల్దీయుల ఊర్ అను పట్టణపు వాడు. శారీరకముగా అసాధ్యమని అనుకునే కార్యమును, అది సాధ్యమేనని పూర్తిగా నమ్మి ఆ కార్యమును చెయ్యుటకై అతడు పిలువబడెను. కాని దేవుడిచ్చిన వాగ్దానమును గూర్చి అతడు అవిశ్వాసమును బట్టి సందేహించలేదు, (రోమీయులకు వ్రాసిన 4వ అధ్యాయములో చెప్పినట్టుగా) కాని బలము పొంది దేవుని స్తుతించుచుండెను.
అబ్రహామునకు డెబ్బది అయిదు సంవత్సరములు. అతని భార్యకు అరవై అయిదు సంవత్సరములు. యువతీ యువకులుగా ఉన్నప్పటి నుండి వారు కలిసి జీవించుచుండిరి, అయినా వారికి పిల్లలు పుట్టలేదు. "అవిశ్వాసుల నుండి నిన్ను నీవు వేరు చేసుకో" అని దేవుడు అబ్రహాముతో చెప్పెను. దేవుడెల్లప్పుడూ వేరుపరచి పిలచును. "అవిశ్వాసుల నుండి వేరై నాతో నడువుడి, నేను అనేక జనములకు ఒక తండ్రిగా నిన్ను చేసెదను. ఇంతకు ముందే దీనిని చేసితిని." దానిని అబ్రహాము నమ్మెను. అనేక జనములకు తండ్రిగా నిన్ను చేసెదను. ముందే అది చేసితిని."
ROM 4:22
32అబ్రహాము దానిని నమ్మెను. ఒక విశ్వాసిగా అతడుండెను.
"ప్రభువా నీవెట్లు చేయుదువు?" అని ఎన్నడూ అతడు అడగలేదు. దేవుడే చెప్పెను కాబట్టి దానిని ఆయనే చేయును, అంతటితో ఆ కార్యము ముగిసిపోయెను.
మొదటి నెల గడిచెను గాని శారాలో ఏ మార్పు రాలేదు . ఆమె రుతుక్రమము ఎప్పుడో ఆగిపోయెను. "ఏమైనా మార్పున్నదా?"
"ఏ మార్పూ లేదు."
కాని అబ్రహాము ఇంకా దానిని నమ్మెను. ఇరవై అయిదేండ్లు గడిచినా గాని వాళ్ళలో ఏ మార్పు లేదు. అయినా అబ్రహాము ఇంకా నమ్ముతూనే యుండెను. అతడు ఒక విశ్వాసి. అతడొక వేషధారి కాదు, అతడొక విశ్వాసియై యుండెను. యుక్త వయస్సు ప్రారంభములో అబ్రహాము ఎంత బలముగా ఉండెనో ఇరవై అయిదు సంవత్సరముల తరువాత కూడా అంతే బలముగా ఉండెను. "అతడు దేవునిని నమ్మెను. అది అతనికి నీతిగా ఎంచబడెను," ఎందుకనగా ఆయన… అదియే నిజయమైన విశ్వాసి.
ROM 4:20,21
33ఇప్పుడు, కొంచెం సేపైన తరువాత, మీరు ఏ తరగతిలో ఉన్నారో మీకు నేను చూపించి మరియు కనుగోనునట్లు చేయుదును.
ఇప్పుడు, అబ్రహాము ఏమి చేసెను? దేవుని వాగ్దానముల విషయములో సందేహించలేదు, అసాధ్యములను నమ్మెను. డెబ్బది అయిదేండ్ల ముసలివాడు. అరువది అయిదేండ్ల ముసలి స్త్రీ వైద్యుని యొద్దకు వెళ్ళితే ఏమనును? "మేము బిడ్డను కనబోవుచున్నాము గనుక ఈ వైద్యశాలలో ఏర్పాటు చేయవలెనని కోరుచున్నాము." అనిరనుకోండి. ఇరవై అయిదు సంవత్సరాల తరువాత వెళ్ళి, "ఇంకా మీరు ఆస్పత్రిని మా కొరకే తెరిచే యు౦చారా"? అని వారనరు. అది నీవు వింతగా ప్రవర్తించునట్లు చేయును. ఈ లోకమునకు నీవు తీసుకొనే తీర్మానాలు వింతగా అనిపించును. అయినా గాని ఒక విశ్వాసిగా అది చూచుటకు ఎంత వింతగా యున్నను అతడికి లెక్కలేదు.
పరిశుద్ధ గ్రంథము ఈ విధముగా చెప్పుచున్నది. "దేవుడు చెప్పిన దానిని తప్పక నెరవేర్చ సమర్డుడని అతడు పూర్తిగా ఒప్పించబడెను." ఈ మధ్యాహ్నము ప్రతివిశ్వాసి ఆ విధంగానే యుండవలెను. దేవుడు తాను చేయుదునని చెప్పిన ప్రతి మాటను ఆయన చేసితీరును. సంఘ శాఖలు ఏమి చెప్పినా నాకక్కర్లేదు. "అద్భుతాలు జరుగు దినములు అయిపోయినవి. ఇది మానసిక వివేచన, ఇది సోదె చెప్పుట అని చెప్పినా అది నాకనవసరము." ఇది. వారు చెప్పేది నాకక్కరలేదు. దీనిని ఇంకా నేను నమ్ముచున్నాను. తుపాకీని గురిపెట్టి యుంచెదను, గురిని కొట్టెదను. మరియు ఒక విశ్వాసి ఏమి లేకుండానే దేవుని వాక్యముతో నిలిచియుండిన యెడల దానికి అదే దానిని నెరవేర్చునని నేను నమ్ముచున్నాను. అది దేవుడు వాగ్దానమును చేసిన ఏ మాట యైనను, అది మరలా దానిని చేయును. ఈ కాలములో మనమెప్పుడైతే అది ఇచ్చట యున్నదని మనము చూచుచున్నామో. అది ఇచ్చట యుండునని చెప్పెను; ఈ కార్యములు జరుగుననియు చెప్పబడెను. మరల అదే జరుగును. దీనిని బట్టి నేనెంతో సంతోషించుచున్నాను. ఈ కాలములో మనము ఉందుమని చెప్పెను. ఈ సంగతులు జరుగునని చెప్పెను.
34ఆ హేతువు చేతనే, జీవగ్రంథమందు ఎన్నుకోబడిన వధువును పిలుచునప్పుడు, పరలోకము నుండి ఒక శబ్దము వచ్చి వధువు గొప్ప పరిశుద్దాత్మ అభిషేకముతో నింపి, ఎత్తబడు కృపలో భూమి మీదనుండి ఆమెను కొనిపోవునని నేను నమ్ముచున్నాను. దేవుడు దీనిని వాగ్దానము చేసెను.
విజ్ఞానము, వ్యోమగాములు ఎన్నో కోట్ల మైళ్ళు దూరం అంతరిక్షంలో పయనించి వెళ్ళి పరిశీలించి చూచి అచ్చట పరలోకమనేది అసలు లేనే లేదు అని గట్టిగా చెప్పినా దానిని గురించి నాకనవసరము. అచ్చట ఒక పరలోకమున్నది, అక్షరాల అచ్చట యేసు క్రీస్తు శరీర రూపములో వచ్చి తన కొరకు తన సంఘమును తీసుకొనిపోవును. అది ఎంత పాత కథగా కనిపించినా గాని అది ఇంకా కూడా సత్యమే. దేవుడాలాగు చెప్పెను. దానిని — దానినే విశ్వాసులు నమ్ముదురు.
PS 103:3•
MAL 3:6•
JOHN 1:1,14•
COL 2:9
35నీ వ్యాధులన్నియూ స్వస్థపరచు ప్రభువును నేనే. నేను దేవుడను మరియు మారని వాడను" అని దేవుడు చెప్పెను. ఆమేన్! దేవుడు వాక్యమై యున్నాడు. దేవుడు మారని యెడల వాక్యమెట్లు మారును? గమనించారా? నేను దేవుడను. మార్పులేనివాడను." అని లేఖనము చెప్పుచున్నది. స్వయముగా ఆయనే దేవుడే దానిని చెప్పెను. ఆయన మార్పులేనివానిగా యున్నయెడల అప్పుడు ఆయన వాక్యముగా యుండవలెను. "అదియందు వాక్యముండెను. వాక్యము దేవుని యొద్ద ఉండెను. వాక్యము దేవుడై యుండెను." [మారని వాక్యము]… ఆ వాక్యము శరీరధారియై మనమధ్య నివసించెను." ఆమేన్! అవునండీ!
మోషే, యొహజ్కేలు, యిర్మియా, యెషయా, ఏలియా మొదలగువారి శరీరములను దేవుడు లేపెను. ఆయన వాక్యము తాత్కలికముగా వచ్చెను. కాని సంపూర్ణ వాక్యము యేసు క్రీస్తు అను నరుని యందు ప్రత్యక్షమాయెను. శరీరరీత్యా దేవత్వము యొక్క సర్వ సంపూర్ణత ఆయనయందు నివసించెను. ఆయన శరీరధారి అయ్యెను, ఆ ప్రతి మాటను నేను నమ్ముచున్నాను.
యోబు, మరియొక విశ్వాసి.
JOB 4:7,8•
HEB 12:6-8•
REV 3:19
36కొన్ని సమయములలో విశ్వాసులుకు పరీక్ష పెట్టును. కొన్ని సమయములలో కాదు, ప్రతీసారి! "దేవుని యొద్దకు వచ్చు కుమారుడు శోధించబడి, పిల్లలవంటి శిక్షణను పొందును." శోధనలు, ధూళితో నిండిన మార్గములు, మండే సూర్యుడు వంటి శ్రమలు ఇవన్నీ మీకు వచ్చునని మీరు జ్ఞాపకముంచుకోండి. అయినా గాని విధేయతను చూపే మీ హృదయ స్సందనలనే ఆ పదార్ధమును కలిగియున్న ఆమె ఇంకా కూడా మలచబడుటకై సిద్దముగానే యుండును. దేవుని యొక్క పిల్లలు ఆయన వాక్యము మీదనే సరిగ్గా కట్టబడుదురు, అందుకొరకై వారు సజీవ సాదృశ్యముగా యుందురు, మరియు దేవుని వాక్యము వారి ద్వారా జీవించును. గమనించారా? నీవు ఎచ్చట నిలబడియుందువో అని పరీక్షించుటకై శోధనలు వచ్చి నిన్ను కదలించి అట్టడుగు భాగమునకు త్రోసివేయును. దేవుని యొద్దకు వచ్చు ప్రతి కుమారుడు శోధించబడును. పరీక్షించబడును.
యోబు శోధనలు, శ్రమలు పొందెను. అతని పిల్లలు తీసికొనబడిరి. సమస్తమూ పోగొట్టుకొనెను. అతని సంఘ సభ్యులు వచ్చి అతనిని రహస్య-పాపియని నిందించిరి, అంతా అతనికి విరోధముగా మాట్లాడిరి. అయినా అతడేమీ వినలేదు. దేవుని దృష్టిలో తాను నీతిమంతుడనే ఎరిగియుండెను. సాతాను తనను శోధించుటకు అచ్చట ఏమియు లేదని అతడు ఎరిగియుండెను. ఇది అపవాది వలన కలిగినదని అతనికి తెలియను. ఈ వ్యాధి దేవుని వలననే తనకు కలిగినదని యోబును నమ్మించినట్లు సాతాను అన్ని విధాల ప్రయత్నించి నమ్మించినయెడల సాతాను యోబును తుడిచివేయును. కాని యోబు శిక్షకు గురియ్యెను. దేవుని వలన ఇది కలుగలేదు అను ప్రత్యక్షతను యోబు ఒక్కసారిగా పొందెను. ఈ శోధనల వలన తాను మేలు పొందుదునని తలంచెను. దానిని దేవుడు కాదు సాతాను చేయుచున్నాడు.
JOB 19:25-27•
MATT 6:21•
LUKE 12:34
37నేడును అదే జరుగుచున్నది. ఈ శోధనలన్నీ దేవుడు నీకు విధించిన శిక్ష అని సాతాను నీతో చెప్పుటకు ప్రయత్నిస్తూనే యున్నాడు. అది అట్లే యున్నది కదా! కాదండీ; సాతాను దానిని చేయుచున్నది, నిన్ను శోధించుటకై దేవుడు దానికి అనుమతినిచ్చి నీవు ఈ భూలోక సంబంధమగు కార్యముల యందు నీవు కట్టబడియున్నావా లేదా నీ హృదయము పరలోకమందున్న నిధితో కట్టబడియున్నదా అని పరీక్షించుటకై దేవుడు ఇవన్నీ చేయుచున్నాడు. అది వాస్తవము. నీ ధనమొక్కడుండునో అచ్చటే నీ హృదయముండును.
యోబు శోధించబడియు ఇట్లనెను, "నా విమోచకుడు సజీవుడని నేనెరుగుదును. అంత్య దినమున ఆయన భూమి మీద నిలచును. నా శరీరమును తినివేయవచ్చును. అయినా అది మరల ఏర్పడును. "మరొకరు కాదు. నేనే నా కన్నులతో దీనిని చూచెదను" అని యోబు చెప్పెను. మీరు గమనించితిరా? చర్మపు క్రింద యుండు పురుగులు ఎప్పుడో అతడిలో యున్నవి. నీ చర్మము క్రింద యుండు పురుగులు నీలో కూడా యున్నవి. గాలి చొరబడుటకు అవకాశము లేని చర్మముతో కప్పబడియున్నావు. లేదా ఎట్లైతే ఏమి ఎప్పుడో నీ చర్మము క్రింద పురుగులును నీవు కలిగియున్నావు. అవి నీలో యున్నవి. మరియు ఏ సమయములలో నైనను వాటిపని అవి చెయుటకై పిలుపుల కొరకు అవి సిద్ధముగా యున్నవి.
గుర్తుంచుకోండి హేరోదు, రాజును జ్ఞాపకము చేసుకోండి. అతడి శరీరమున పుండ్లు ఏర్పడి అతడి శరీరములోనున్న పురుగులే అతడిని తినివేసెను. అందుకొరకు అవి సిద్ధముగా యున్నవి.
"చర్మములోని పురుగుల ద్వారా నా శరీరము నాశనమైపోయిన తర్వాత కూడా నేను నా శరీరముతో దేవుని చూచెదను." ఆమేన్! పురుగులు ఈ శరీరమును తినివేసినను దీనిని పూర్తిగా నాశనము చేయలేవు. ఎందుకనగా అది మరలా తిరిగి వచ్చును. "నా మట్టుకు నేనే చూచెదను. మరి ఎవరును కాదు నేనే కన్నులార ఆయనను చూచెదను." ఎందుకని అతడా విధముగా చెప్పెను? అతడు ఒక విశ్వాసి. శ్రమలలోను, శోధనలలోను అతడు ఒక నిజ విశ్వాసిగా యుండెను.
GEN 37:7
38యోసేపు మరొక విశ్వాసి. అతడేమై యున్నను అతడు ప్రవక్త, దేవుడే అతనిని ఒక ప్రవక్తగా చేసెను. తన సోదరులకు నేనుగా అతడు ఉండగోరలేదు, కాని వేరుగా కనబడెను. దేవుడా విధంగా అతనిని చేసెను. ఎవరూ అతని స్థానము తీసుకోనలేరు.
నీ స్థానము ఎంత స్వల్పమైనను గాని అది అనవసరము. నీ స్థానమును ఎవరు తీసికొనలేరు. "నేను కేవలము ఒక గృహిణిని" అని నీవనవచ్చును. దేవుడు తన అధీనములో నీ స్థానమును యుంచుకొనెను. క్రీస్తు యొక్క శరీరము అటువంటి ఒక క్రమములో అమర్చబడియున్నందువలన నీ స్థానమును మరెవరూ తీసికోలేరు.
బిల్లీగ్రాహం స్థానమును తీసుకొనుటకు నేను ఏ విధముగా యిష్టపడగలను, (ఆ విధముగానే మన సేవకులలోని ఎవరి స్థానమునైనా గాని), మనము దానిని చేయకూడదు, కాని గుర్తుంచుకోండి, ఆలాగే బిల్లీ మన స్థానమును తీసికొనలేడు, గమనించారా, మనందరికి ఒక స్థానమున్నది. మనలో కొందరు సువార్తికులు, కొందరు ప్రవక్తలు, కొందరు బోధకులు, కొందరు సంఘ కాపరులు, కొందరు గృహిణులు, కొందరు వెుకానిక్కులు కొందరు వ్యవసాయదారులుగా ఉన్నారు. ఏ పని అయినా గాని దేవుడే నిన్ను ఆ స్థానములో యుంచెను. గమనించితిరా?
యోసేపు ఒక ప్రవక్త. అతడేమి చేయలేకపోయాడు. ఎందుకనగా అతడు కలలకు భావము చెప్పుచుండెను. ఎందుకనగా అతడు దర్శనములను చూచెను. అతడెంత ఖచ్చితముగా చెప్పెనో చూడండి. తన సోదరులతో సహవాసము చేయుటకు అది భంగము కలిగించెను. అతడు సత్యమునే చెప్పాడు, ఎందుకనగా ఆ కలలను అతడు నమ్మెను. అతడికి కల్గిన స్వప్నము ప్రకారము ఆ పనలు వలె వారందరూ అతడి ముందు సాగిలపడుదురని దానిని అతడు నమ్మెను. అది సంభవించుటకై సమయము ఆసన్నమైనది. ఎందుకనగా దానిని అతడు నమ్మెను. అతడు ఒక నిజ విశ్వాసియై యుండెను. ఏ విధముగా.
MATT 12:26•
LUKE 11:18•
JOHN 1:47,48
39నాకింకా ఐదు నిమిషాల సమయమున్నది. మరియు పది పేజీలు చెప్పుటకు యున్నవి.
ఇప్పుడు గమనించండి. వాక్యమును యిచ్చట వ్రాసియుంచుకున్నాను. గమనించండి. ఆ స్త్రీ… నతానియేలు ఒక విశ్వాసి. నిజమేనా? జరిగిన దానిని అతడు ఎప్పుడైతే చూచెనో, అది అతడిలో క్రియ చేయనారంభించెను. ఫిలిప్పు అతనిని పిలచుకొని రాగా యేసు అతడెవరో చెప్పెను. అతడు "కపటము లేని ఇశ్రాయేలీయుడు" అని చెప్పెను. అంతకు ముందు రోజు ఒక చెట్టు క్రింద ప్రార్ధి౦చుచుండెననియు చెప్పెను. అతడు ఒక విశ్వాసి.
అక్కడ నిలబడిన వారిలో చాలామంది "ఇది దయ్యపుటాత్మ దయ్యమే దైవిక స్వస్థత చేయును." అని చెప్పెను. ఆ ముసలి దయ్యము నేడును ఇంకా చావలేదు. దయ్యమే ఈ దైవిక స్వస్థతను చేయుచున్నదని వీరు నమ్ముచున్నారు.
"సాతాను సాతానును వెళ్ళగొట్టినట్లైతే దాని రాజ్యము నిలువనేరదు." అని యేసు చెప్పెను. చూచారా? కాబట్టి సాతాను సాతానును వెళ్ళగొట్టజాలదు.
MATT 4:3•
MATT 26:53,67,68•
MARK 14:65•
LUKE 4:3•
JOHN 1:49
40నతానియేలు ఒక విశ్వాసి. వాక్యము శరీరధారియగుటను చూచెను. అతడు విశ్సాసిగా బయలుపర్చబడెను. "నీవు క్రీస్తువు. ఇశ్రాయేలుకు రాజువు." అని అతడు నమ్మి చెప్పెను.
బావినొద్దనున్న స్త్రీయు దానిని ఎంతో చక్కగా గమనించినది, దానిని ఆమె నమ్మినది. ఆమె ఒక విశ్వాసి. ఎప్పుడైతే గ్రుడ్డి బర్తలోమయి… ఒక స్త్రీ వచ్చుచున్నప్పుడు.ప్రతి ఒక్కరు కేకలు వేయుచు, వెల్తూ యున్నారు. కొంతమంది "అచ్చట తెరవ బడిన… నీవు చనిపోయిన వానిని లేపితివని నేను విన్నాను. అచ్చట ఒక సమాధి తోట నిండా వారు యున్నారు. వచ్చి వారిని లేపుము. నీవు చేసే దానిని మమ్ము చూడనిమ్ము" అని చెప్పుచూ హేళన చేసిరి. గమనించితిరా; ఆ దయ్యమే నేడు ఇట్లనుచున్నది. "నీవు దేవుని కుమారునివైతే రాళ్ళను రొట్టెలుగా మార్చుము." కొందరు ఆయన కళ్ళకు గంతకట్టి తల మీద కొట్టుచూ, కర్రను ఒకరి నుండి ఒకరు మార్చుకొనుచూ, "నిన్నెవరు కొట్టిరో చెప్పినయెడల మేము నమ్మదుమనిరి." ఆ సైనికులు ఆయనను అపహసించిరి, (చూచారా?) కాని మరువవద్దు. దేవుడు ఎప్పుడూ రంగము మీదనే యుండును. చూచారా? ఆయన ఎల్లప్పుడూ అక్కడే సిద్ధముగా నుండును.
యేసు ఇట్లనెను, "నేను నా తండ్రికి చెప్పిన యెడల, ఆయన వెంటనే పండ్రెండు వ్యూహముల దేవదూతలను పంపును." ఒక దేవదూత ఎంత పనిచేయునో ఎరుగుదురా? ఆయన ఆజ్ఞాపించినచో పండ్రెండు వ్యూహముల సైన్యము పంపబడును. కాని ఆయన చేయవలసిన పని ఒకటున్నది. దానిని ఆయన సహించవలెను. ఆ పనిని ఆయన చేయ వలెను. యేసు ఇట్లనెను, "నేను నా తండ్రికి చెప్పినయెడల, ఆయన వెంటనే పండ్రెండు వ్యూహముల దేవదూతలను పంపును." ఒక్క దేవదూత ఎంత పనిచేయునో ఎరుగుదురా? ఆయన ఆజ్ఞాపించినచో పండ్రెండు వ్యూహముల సైన్యము పంపబడెను. కాని ఆయన చేయవలసిన పని ఒకటున్నది. దానిని ఆయన సహించవలెను. ఆ పనిని ఆయన చేయ వలెను.
41నీవును చేయవలసిన పనియున్నది. దేవుడు నీ కొరకు ఒక పనిచేయవలసి యున్నాడు. నీకు గుండెపోటు లేదా శ్రమలు ఉండవచ్చును. నీవు నిరుత్సాహపడవచ్చును. కాని వాటిని పంపవద్దని ప్రార్ధి౦చగలమా? "ప్రభువా, వాటిగుండా నడిపించుము. అది ఏమైనా గాని దానిని నేను తప్పించుకొనకుండా చేయుము. అవి నా కొరకు నిర్ణయించబడిన యెడల వాటిగుండా వెళ్ళుటకు కృపనిమ్ము అంతే చాలును." గుడ్డి బర్తలోమయిని గమనించండి. "ఈయన గలిలయ ప్రవక్త దావీదు కుమారుడు. దానిని మేము నమ్ముచున్నాము." అని అతడు దానిని ఎరిగియున్నాడు. కొందరు విశ్వాసులు తప్పక ఆలాగని అతనికి చెప్పియందురు. "ఆయన దావీదు కుమారుడని విశ్వాసులమగు మాకు తెలియును."
MATT 9:21,22•
MARK 5:28,34•
MARK 10:47,52
42ఆయనే వాక్యమని అతనికి తెలిసిపోయెను.
ఆయనే వాక్యమైతే తప్పక హృదయాలోచనలను గ్రహించగలడని అతడు ఎరిగియుండి ఇట్లు కేకవేసెను, "దావీదు కుమారుడా! కరుణించుము." అవిశ్వాసులు మరేదో విధంగా కేకలు వేయుచుండిరి గాని ఈ గ్రుడ్డి బర్తలోమయి ఆగలేదు. "ఓ! యేసూ, దావీదు కుమారుడా! నన్ను కరుణించుము." అని కేకలు వేసెను.
ఒకవేళ అతని కేకలు ఆయనకు వినబడక పోయివుండవచ్చు. కాని అతడు కేకలు వేయుచున్నాడని ఆయన ఎరిగియుండెను. మరియు ఆయన ఆగి వెనుక తిరిగి చూచెను. అతడు ఒక విశ్వాసి. "నీ విశ్వాసము నిన్ను రక్షించినది" అనెను. ఆమేన్!
రక్తస్రావపు రోగితో ఆయన ఆలాగే చేసెను. ఆమె తన హృదయములో ఇట్లనుకొన్నది, "ఆయన వస్త్రపు చెంగును నేను తాకిన యెడల బాగవుదును." "నీ విశ్వాసము నిన్ను రక్షించెను." చూచారా? ఆమె ఒక విశ్వాసి.
అక్కడ కూర్చొనియున్న విల్లియం డాచ్ను ఒకనాడు అదే రక్షించెను. పూర్తిగా గుండె పాడైపోయి, గుండెపోటు వచ్చినది. అతడికి ప్రోస్టేటు గ్రంధి యందు క్యాన్సరు వచ్చినది. తొంభై ఏండ్ల వృద్దుడు. "నీ విశ్వాసమే నిన్ను రక్షించెను." ఎందువలన? అతడు ఒక విశ్వాసి.
43రెవ. టామ్ కిడ్ ఇక్కడున్నాడు. తొంబది ఏండ్లకు దరిదాపులో ఉన్నాడు. అతనికి డెబ్బది తొమ్మిదేండ్లు వచ్చినప్పుడు ప్రోస్టేటు గ్రంథియందు క్యాన్సరు వచ్చి అతడిని ఆస్పత్రికి తీసుకొని వెళ్ళిరి, "అతడు బ్రతుకుటకు ఏ అవకాశము లేదు" అని వైద్యులు చెప్పిరి. ఒక ఉదయకాలము మేము వెళ్ళాము. ఆ వృద్దుడు దుప్పటి కప్పుకొని దాదాపు చావు-బ్రతుకల మద్య ఉండెను. వైద్యుడు అతడు బ్రదుకడని చెప్పెను. ఆయన సభ్యులలోని ఒకామె అక్కడ కూర్చొనియుండెను. అతడు మానసిక స్థిమితము పోయినట్లుండి ఇట్లనెను, "నీవు హిమమంత తెల్లగా నున్నావు." దేవుని శక్తి ఆ గదిని తాకెను. ఈ రాత్రి అతడు సజీవునిగా ఉన్నాడు. అది నాలుగు సంవత్సరాల క్రితం జరిగినది. ఎనుబది సంవత్సరాల వృద్దునిగా ఈ రాత్రి ఇక్కడ కూర్చొని యున్నాడు. క్యాన్సరు లేదు. పూర్తి ఆరోగ్యములో యున్నాడు. వేషధారి కాడు. విశ్వాసి. అదే విశ్వాసమనునది, నమ్ముము. అతడు ఆయన వాక్యమును తీసుకొని దేవుని నమ్మెను.
JOHN 11:22-27,31,34
44గుడ్డి బర్తలోమయి వలె ఇతడును నమ్మేను. గ్రుడ్డివాడైనా గాని యేసు క్రీస్తు దృష్టిని ఆకర్షించెను. తాను కోరినది పొందగోరెను. ఆయన వస్త్రపు చెంగును తాకినచో, ఆమెకు ఏది అవసరమో దానిని పోందుకోగలనని ఆమె ఎరిగియుండి — ఆమె దేనిని పొందుకోవాలో దానిని ఆమె పొందుకొనెను. నేను అతడికి ప్రార్ధి౦చినయెడల తానేమి పోందుకోవాలనుకుంటున్నాడో దానిని తాను పొందగలనని టామ్ ఎరిగియుండి దానియందు విశ్వాసమును అతడు కలిగియుండెను.
మార్త చెప్పినది అదే, "ప్రభువా, ఇప్పుడయినను, నీవు దేవుని ఏమి అడిగినను నీ కొరకు దానిని దేవుడు చేయును. నా సోదరుడు నాలుగు దినముల క్రితం చనిపోయి సమాధిలో యున్నాడు. నీవు దేవుని అడిగినచో అది జరుగును."
"నీ సోదరుడు మరల బ్రదుకును." అని ఆయన చెప్పెను.
"అవును ప్రభువా, అంత్యదినమందు పునరుత్థానుడగును. అతడు మంచివాడు." అన్నదామె.
"కాని పునరుత్థానమును జీవమును నేనే," అని చెప్పెను.
"అవును ప్రభువా, అది కూడా నేను నమ్ముచున్నాను."
"మీరతనిని ఎక్కడ పాతిపెట్టిరి?" అది అంతే. అది అయిపోయినది, అవునండి.
ఆ అవిశ్వాసుల తరములో దక్షిణ దేశపు రాణి వచ్చి దేవుడు చేసిన దానిని నమ్మెను. ఆమె ఆ తరముతో పాటుగా అంత్య దినములలో లేచి వారిమీద నేరారోపణ చేయును. ఎందుకనగా ఆమె సోలోమోను జ్ఞానము గూర్చి విని భూ దిగంతముల నుండి వచ్చెను.
EXOD 3:14
45మోషే ఒక విశ్వాసి. తన తెలివితో ప్రయత్నించెను. తన పధకములన్నింటినీ వేసెను. కాని పనిచేయలేకపోయెను. ఇశ్రాయేలును వెలుపటకు తీసుకొని రావటానికి ప్రయత్నించెను. అందుకొరకే తాను పిలువబడితినని అతడు ఎరిగియుండెను. ఏవేవో లెక్కలు ప్రయత్నించెను. సైనికపరంగా ప్రయత్నించెను. విద్యా సంబంధముగా ప్రయత్నించెను. అన్ని విధాలా అతడు ప్రయత్నించెను. కాని ఫలితము లేకపోయెను. తరువాత అతడు దేవుని మార్గము అనుసరించెను. ఏమి జరిగినది? ఒకనాడు పొదలో ఆరని అగ్నిని చూచెను. అక్కడనుండి వాక్కు వినబడెను. "నేను ఉన్నవాడను" అని చెప్పెను. [ఉంటిని లేదా ఉందును, అనలేదు]. "నేను ఉన్నవాడను" మరియు ఆయన నేడు కూడా "ఉన్నవాడుగానే ఉన్నాడు." ఆయనే వాక్యము. నిత్య వాక్యము.
మోషే సందేహించలేదు. ఇబ్బందులన్ని అతడికి విరోధమాయెను… సమస్త ప్రకృతి అతనికి విరోధమాయెను. అంతా అతనికి విరోధమాయెను. సమస్తము అతడికి వ్యతిరేకమాయెను. అయినా గాని అతడి చేతిలో యున్న ఒక వంకర కట్టెతో అతడు వెళ్ళి సమస్త దేశమును బయటకు తీసుకొని వచ్చెను. ఇశ్రాయేలును వాగ్దాన దేశమునకు తీసికొని వచ్చెను. ఐగుప్తును ఎర్ర సముద్రములో ముంచెను. ఎందువలన? అతడు దేవుని నమ్మెను… అతడు విశ్వాసి. మనము ఉండవచ్చు… ఇప్పుడు నేను అరగంట సేపు విశ్వాసులను ఉంచాను.ఇంకా రెండు రకముల వారున్నారు. వారంత ముఖ్యమైన వారు కారు. త్వరగా చెప్పెదను.
46రెండవదిగా అవిశ్వాసి వచ్చును. అవిశ్వాసిని గూర్చి మాట్లాడుకొందము. అవిశ్వాసి ఏమిచేయును? విశ్వాసి వాక్యమును (దేనిని?) అంగీకరించునని మనము చూచాము. ప్రతి జాతి, ప్రతి తరము నోవహు నుండి అందరూ, ఆ మార్గమున వచ్చిన వారందరూ ఆలాగే వాక్యము అంగీకరించెదరు. ఈ విధముగా వాక్యమును అంగీకరించిన వారందరి గుణాలక్షణములను గురించి ఆరు నెలల పాటు ఉజ్జివ కూటములుగా చెప్పుకుంటూ వెళ్ళవచ్చును. వారు నమ్మిరి. నమ్మిన వానిని గురించి ఆరు నెలల పాటు మనము చెప్పుకొనవచ్చును. విశ్వాసి ప్రశ్నించడు. ఎవరు ఏమి చెప్పినా, అదిటు కనిపించినా, అదెంత అసాధ్యముగా ఉన్నాగాని విశ్వాసి దానిని నమ్మును. దేనిని నమ్మును? వాక్యమును. ఆచారమును కాదు. వాక్యమునే నమ్మును. సంఘశాఖను కాదు, వాక్యమునే నమ్మును. ఎవరో ఏదో చెప్పిన దానిని కాదు గాని వాక్యము ఏమి చెప్పుచున్నదో దానినే నమ్మును. ఇప్పుడు, గుర్తించుకోండి. అతడే విశ్వాసి. విశ్వాసి ప్రశ్నించడు. "అదెట్లు జరుగును?" అని విశ్వాసి అడుగడు. "అదెట్లు జరుగుతాదో నాకు తెలిస్తే బాగుండును!" అని అడిగేవాడే అవిశ్వాసియగును. అది ఏమైనా గాని," అది వాక్యమైతే అది వాక్యముగానే యుండును! అది నిజము, అతడే విశ్వాసియగును.
LUKE 10:1,18•
JOHN 6:62
47ఇప్పుడు అవిశ్వాసిని చూద్దాం. ఇప్పుడు మనము చూచే అవిశ్వాసులను గురించి చెప్పుకుందాము. వారి వీపులను నిమురుతూ ఉన్నంతసేపు వారు చేసినవన్నియు బాగుగానే యుంటూ మరియు వారిని శిష్యులుగా పిలువబడటాన్ని మనము కనుగొంటిమి. ఆ విధముగా సమస్తము సవ్యముగా పోతూ యున్నప్పుడు వారందరూ బాగుగానే యుండిరి. రోగులను స్వస్థపర్చుచు మరియు అనేక కార్యములను చేయుటను వారు చూచి ఆయన ప్రవక్తని ఎరిగి అయనను ప్రవక్తగా వారు నమ్మిరి. ఆయనేమి చేసెను? వీరు ఏదైతే నమ్మిరో దానికి విరుద్ధముగా ఈయన సత్యము చెప్పి వారు నమ్మిన దానిని గురించి గద్దించినప్పుడు, వారా వాక్యమును అంగీకరించ లేదు. అద్భుతములు వారికి చాలును. వారును బయటకు వెళ్ళి దయ్యములను వెళ్ళగొట్టిరి. వాక్యము బోధించిరి. అయినా వారు అవిశ్వాసులే. ఇద్దరిద్దరిగా ఆయన డెబ్బది మందిని పంపినట్లు మత్తయి 10లో యున్నది. యేసు కూడా వారు దయ్యములను వెళ్ళగొట్టుట చూచి సంతోషించెను. ఇట్లనెను, "సాతాను మెరుపువలె ఆకాశమునుండి పడుట చూచితిని." వారు దయ్యములను వెళ్ళగొట్టిరి. యూదా వారితోనే యుండెను. ఆయనే జీవము, కాని యేసు తానే పునరుత్థానమునని చెప్పగా నమ్మలేదు. "మీరు మనుష్య కుమారుడు తాను దిగి వచ్చిన పరలోకమునకు ఆరోహణమగుట చూసి ఏమి చెబుతారు."
JOHN 6:63
48"ఈయన పరలోకమునుండి దిగి వచ్చెనని చెప్పుకొనుచున్నాడు. ఇది మరీ విపరీతము! దీనిని మనము నమ్మలేము అనిరి."
అందుకాయన ఇట్లనెను, "మీరు మాట్లాడుచున్న శరీరమువలన ప్రయోజనము లేదు. ఆత్మయే జీవింపచేయును."
మీరు అక్కడే ఉన్నారు. ఆత్మయే వాక్యమును జీవింపచేయును. అది ఒక ఆత్మ సిద్దాంతము కాదు. ఆ ఆత్మ పరిశుద్దాత్మయే వాక్యమును నీకు పునరుజ్జివి౦పచేయును, అది నీలో జీవముగా మారును, దానినే నీవు చేయవలెను. దానిని నీవు గమనించితివా. విశ్వాసము ద్వారా దానిని నీవు చూతువు. దానిని నీవు ఎరుగుదువు. ఎందుకనగా వాక్యము ఆ విధంగా చెప్పుచున్నది. ఆత్మ నీలో వాక్యము పునరుజ్జివి౦పచేయును. నీవా విధముగానే యుండవలెను.
ఇప్పుడు ఆయన చెప్పెను, "ఏది. మనము దీనిని చెప్పిన వెంటనే అవిశ్వాసులను మనము కనుగొనెదము. నీవు ఎప్పుడైతే దానిని గురించి చెప్చెదవో దానిని వారు అంగీకరించకుండా, నీ కళ్ళ ఎదుటే వారు బయటకు వెళ్ళిపోతారు. "నేను దానిని నమ్మను" అని చెప్పెదరు. ఓ, అటువంటి ఒక విధానము నేడు యున్న ఈ లోకములో ఎంతో లోతుగా దిగబడిపోయినది. ఏదైన ఒక దానిని గురించి చెప్పినయెడల.
49వారందరూ సమూహముగా చెరుకున్నారు.
నేను చాలా కూటములలో దానిని గమనించాను. వారు ఒక పెద్ద గుంపుగా చేరి నిలబడి, వారు అలాగా అక్కడ కూర్చొని చూస్తూ ఉందురు, మరి "యేసు క్రీస్తు మెస్సీయాగా గుర్తించబడి కనుగొనబడెను, ఎందుకనగా ఆయన ఒక ప్రవకై యుండెను," అని నీవు చెప్పినప్పుడు అది వెళ్ళిపోతుంది. ఎవరో… మరియు వారు వెళ్ళిపోతారు. అది ఏమిటి? - అవిశ్వాసులు!
"నీవే దానిని కలుగచేసి చెప్పుచున్నావు" అని నీవు చెప్పవచ్చును. నేను ఏదో కల్పించి చెప్పుట లేదు. బైబిలు ఏమి చెప్పుచున్నదో దానిని ఖచ్చితముగా చెప్పుచున్నాను. వారు అవిశ్వాసులు, వారు బయటకు నడచి వెళ్ళిపోయారు. శిష్యులయినా గాని నమ్మలేదు, కాని అది దేనికి విరుద్దము…
"ఇట్టి మాటను ఎవడు వినగలడు?" అని వారు చెప్పనారంభించిరి, చూచారా. వారు పరిసయ్యులు మరియు సద్దూకయ్యలతో కలసిపోయి వారితో వెళ్ళిపోయిరి. కాబట్టి, గమనించండి, సహజాతీతమైనది ప్రత్యక్షమైనప్పుడు అది మూడు రకముల వారిని తయారు చేయును. ఐగుప్తులో అది ఆ విధముగానే చేసినది. అది అవిశ్వాసిని, మరియు వేషధారిని ఉత్పత్తి చేయును. అది మూడు తరగతులను ఎప్పుడూ ఉత్పత్తి చేయును. అది ఏ విధముగా అని ఇచ్చట వ్రాసికొనియున్న దానినంతటిని మీకు వివరించాలంటే ఈ రాత్రంతయు పట్టును. ప్రతీచోటా ఆ ముగ్గురిని నీవు కనుగొనెదవు. ఎల్లప్పుడూ అది ఆ విధముగా యుండుటను నీవు కనుగొనెదవు.
HEB 4:14
50ఈ డెబ్బది మంది ఆయన చెప్పినది నమ్మలేదు గనుక వెళ్ళిపోయిరి. ఆయన చెప్పినది వారి ఆలోచనకు సమ్మతము కాలేదు. నీ ఆలోనల ప్రకారము నీవు సాగిపోకూడదు. ఆయన ఏమి చెప్పెనో దానినే వెంబడించవలెను. నీ స్వకీయ ఆలోచనలను నీవు త్రోసివేయవలెను. ఆయన ఏమి చెప్పాడో దానినే నీవు చెప్పవలెను. అదియే నిజమైన ఒప్పుదల. ఒప్పుకోవటము అనగా "ఏదో ఒక దానిని చెప్పటము"
ఒక సంగతి జరుగునని నేను నమ్మినయెడల అది జరిగినదని నేను ఒప్పుకొందును. అదే నిజమైన ఒప్పుదల. ఆయన మన ఒప్పుదలకు ప్రధాన యాజకుడు. దేవుడు చెప్పినదే చెప్పవలెను. దేవుని వాక్యమును నీవు తిరిగి చెప్పుచున్నావు.
PS 22:1,17•
PS 34:20•
ISA 9:6•
JOHN 6:66•
JOHN 10:33•
JOHN 19:36
51ఇప్పుడు గమనించండి, డెబ్బది మంది వెళ్ళిపోయిరి. వారేమి చేసిరి? వారు సమ్మతించలేదు. అందుకే వెళ్ళిపోయిరి. వారి జ్ఞానము, వారి సంఘ సహకారము అంత బలముగా ఉండెను. ఆయన తాను దేవుడని చెప్పిన దానిని వారు సహించలేకపోయిరి. ఎందుకనగా వారి ముందు నిలబడియున్న శరీరధారిగా ఉన్న యేసు క్రీస్తును అక్రమ సంబంధము ద్వారా జన్మించినవాడని కొంతమంది జనులు నమ్ముచుండగా ఆయన తనను దేవుడిగా చెప్పుకొనుటకు ఆయనకు అర్హత లేదని, ఆయన ఒక సామాన్యమైన మానవుడేనని వారు తలంచిరి.
"నీవు మంచి పనిచేయుచున్నందుకు నిన్ను రాళ్ళు పెట్టి కొట్టుట లేదు గాని, నీవు దేవుడనని చెప్పుకొనుచున్నందుకే రాళ్ళతో కొట్టుచున్నాము," అనిరి. ఆయన దేవుడని వాక్యమే చెప్పెను! "ఆయన ఆలోచన కర్త సమాధానాధిపతి, బలవంతుడగు దేవుడు, నిత్యుడు తండ్రి" అని పేరు. వారు ఆ లేఖనములనే చదువుచుండిరి. (22వ కీర్తన) "నా దేవా, నా దేవా, నన్నేల చేయి విడిచితివి? నా ఎముకలన్నియు విరవబడియున్నవి. ఒక్కటియు విరుగనిది లేదు." అను కీర్తనను ఆలయములో వారు పదే-పదే వల్లించుచుండిరి. ఎనిమిది వందల సంవత్సరములకు ముందు దావీదు ద్వారా పలుకబడిన ఆ బల్యర్పణ వారి ముందే నిలబడియుండినా వారు చూడలేని గ్రుడ్డివారైయిరి.
52నేడు కూడా అదే కార్యములు సంభవించుచున్నవి. ఈ కాలమును గురించి ముందే దేవుడు తాను ఏమి చేయబోవుచున్నానని చెప్పెనో దానిని సరిగ్గా చేయుచున్నాడు. కాని వారు దానిని కూడా చూడలేని గ్రుడ్డివారైరి. వారే అవిశ్వాసులగుదురు. "ఓ, అటువంటి ఒక కార్యమును అసలు నా జీవితములో ఎన్నడూ విననే లేదు. దానిని నేను నమ్మలేను." అని వారు చెప్పుచూ దూరంగా వెళ్ళిపోవుదురు. అది ఆ విధముగానే యుండునని బైబిలు చెప్పుచున్నందువలన దానిని వారు వినినను దానివలన వారికి ఏ ప్రయోజనము యుండదు.
వారు దానిని గురించి అసలు విని కూడా యుండరు. అయినా గాని అది ఆ విధముగానే యుంటూ అది మారనిదిగా యుండును. గమనించారా? అదే నిజము. వారే అవిశ్వాసులు. హవ్వవలె వారు అవిశ్వాసులుగా యుండిరి. ఆమె భక్తి గలది కాని నిజమైన వాక్యమును నమ్మలేదు. తన కొరకు ఒక మతము తయారుచేసికొన్నది. ఆమె కొన్ని అంజూరపు ఆకులు కూర్చుకొన్నది, చూచారా. కాని ప్రయోజనము లేదు. మతము అనగా ఒక ముసుగు.
53కయీను కూడా అదే చేసెను. వాస్తవమైనదేదో దానిని కయీను నమ్మలేకపోయెను. "దేవుడు పరిశుద్దుడు;పవిత్రుడు, మరియు దేవుడు సౌందర్యవంతుడు; కాబట్టి నేను ఆయనకు అందమైన ఒక బలిపీఠమును కట్టి, దానిని అందమైన పుష్పములతో అలంకరించి నా భక్తిని చాటుకొనుటకు సాష్ట౦గపడుదును, దేవుని ఆరాధించుదును. ఎందుకనగా నా తల్లిదండ్రులు ఏదేను తోటలో కొన్ని ఫలములను తినిరి. ఆ విధముగా నేను పుట్టాను. నేను అందమగు బలిపీఠము నిర్మించుదును. దేవుడు నా గొప్ప ఆలయమును పడద్రోయడు. దేవునిని ఆకర్షించునంత అందమైన దానిని నేను తయారుచేయుదును," అనుకొనెను. సాతాను అనే వాడు అందము అనే దానియందు నివసించును. అది అక్షరాలా వాక్య సత్యము.
కొన్నిసార్లు అందమైన యువతిని సాతాను తన ఎరగా వాడుకొనును. అటువంటి ఒక స్త్రీని సాతాను తన అధీనములో తీసుకొన్నయెడల, దేశములోని మధుపానశాలలు మనుష్యులను నరకమునకు పంపించుటకంటే ఎంతోమంది మనుష్యులను ఒక అందమైన స్త్రీ ద్వారా సాతాను నరకమునకు పంపించుచున్నాడు. అది నిజము, గమనించితిరా! ఒక అందమగు పురుషుడు కూడా అంతే, అనేకమంది స్త్రీలను సాతాను వైపునకు త్రిప్పి నరకమునకు పంపును. అవునండి.
GEN 4:7•
ISA 14:13
54సాతాను అందములో నివసించుననే దానిని గమనించండి. ఆదియందు వాడేమి చేయ ప్రయత్నించెను? మిఖాయేలు కంటె అందమగు రాజ్యమును తయారుచేయగోరెను. ఉత్తర దిశగా మూడులో రెండు వంతుల దేవదూతలను తన వైపు త్రిప్పుకొనెను. అటు పిదప ఎవరియొక్క కుమారుడు అటువంటి స్వభావమును తనలో కలిగి యుండెను? ఖచ్చితముగా సాతానుయొక్క కుమారుడే అటువంటి స్వభావమును కలిగి యుండెను.
ఇప్పుడు, కయీను బలిపీఠమును కట్టిన పిదప దానిముందు మోకరించి ఆరాధించెను. హేబెలు చేసినదంతయూ అతడు చేసెను. కాని హేబెలు కయీను చేయు కార్యము తప్పని ఎరిగియుండెను. లైంగిక క్రియ వలన ఏర్పడిన రక్త సంబంధమైన కార్యమే తాము జన్మించుటకు కారణమనే దానిని అతడు ఎరిగినవాడై ఒక చిన్న గొర్రెపిల్లను తీసుకొని పదునైన రాయితో దాని గొంతును కోసి దానిని ఒక బండ మీద బలిగా అచ్చట సమర్పించెను.
చూడండి, కయీనుతో దేవుడు ఇట్లనెను, "నీ సోదరునివలె నీవెందుకు ఆరాధించవు? అంతా బాగున్నది కాని రక్తము చిందించలేదు. నీవు ఆ విధముగా చేసిన యెడల అది నీకు బాగుండును కదా." కాని అతడు దానిని గురించి తన జ్ఞానమునందు ఎంతో ఎరిగియుండెను. అందుచేత గమనించండి, నిరూపించబడిన మూల వాక్యమును అతడు నిరాకరించెను. ఆ విధముగానే ప్రవర్తించుచున్న నేడు జీవించేవారు కూడా అతడి కుమారులే కదా! చూచారా.
GEN 4:7•
HEB 11:4
55ఇప్పుడు చుడండి, హెబ్రీ 4వ అధ్యాయము లేదా 11వ అధ్యాయములో బైబిలు ఈలాగు చెప్పుచున్నది. అతడు నీతిమంతుడని దేవుడు అతని బలిని బట్టి సాక్ష్యమిచ్చెను. దేవుడు తన అర్పణను బయలుపరచెను. దేవుడు దానిని అంగీకరించునట్లు రుజువు చేసెను; అది ఆయన మాట, అది ఆయన పధకము. "నీవును ఆలాగే చేసి జీవించుము," అని కయీనుకు చెప్పెను. అతడు తన ఉద్దేశ్యమును మార్చుకొనునని నీవు తలంచుదువా? మార్చుకొనడు. కయీను అవిశ్వాసి. అతడు నమ్మక వెళ్ళిపోయెను. కయీను అదే చేసెను, నిమ్రోదు కూడా అదే చేసెను - వారు అవిశ్వాసులు. ఆయన నమ్మలేదు.
బెల్తేషాజరు, అదే విషయము; లేక…
1SAM 4:21•
DAN 3:1,5•
DAN 5:2,5,8
56నెబుకదెజ్నరు ఆలాగే చేసెను. దానియేలు దేవుని ద్వారా గొప్ప కార్యములు చేయుటను చూచెను. దానియేలును దేవుడే అని ఎంచెను. అయినను అతడు ఒక ప్రతిమ చేయించి అందరూ దానిని మ్రోక్కవలెనని కోరెను. అన్య రాజ్యము ఒక పరిశుద్ధ మానవుని యొక్క విగ్రహమును ఆరాధించవలెనని బలవంతముగా ప్రారంభించుటను గమనించండి.
చుడండి, అన్య రాజ్యము సమాప్తమయ్యే ముందు ఒక పరిశుద్ధ మానవుని యొక్క విగ్రహమును ఆరాధించుటకు అదే విధముగా బలవంతముగా క్రియ చేయుచున్నదో గమనించండి. అన్య రాజ్యము గోడ మీద తెలియని భాషలో ఒక చేవ్రాత వ్రాయబడెను. ప్రవక్త తప్ప మరెవరు చదువలేకపోయిరి. నేడును ఒక గోడ మీద ఒక చేవ్రాత కనబడుచున్నది. (ఇది సత్యము) ఈకబోదు — అనగా దేవుని మహిమ వెడలిపోయినదని అర్థము. మరియు గోడ మీద ఒక చేవ్రాత కనబడుచున్నది మరి అది కేవలము దేవుని ఆత్మ మూలముగా జన్మించినవాడు దానిని చదువును, దేవుని ఆత్మములముగా జన్మించినవారు.
ముసలి బెల్తేషాజరు వెళ్ళి యెహోవా పాత్రలలో మద్యమును పోసికొని త్రాగెను. ఎందువలన? అతడు ఒక అవిశ్వాసి. తాను విశ్వాసి అనుకొనెను, కాని అవిశ్వాసి. చూడండి, అది అంతే. అతడు వాక్యముకు అవిధేయత చూపెను.
DAN 4:8
57అహాబు ఒక అవిశ్వాసి, విశ్వాసివలె నటించెను గాని విశ్వాసి కాడు. అతడు విశ్వాసుల మధ్య ఉండెను, కాని అవిశ్వాసి. అతడు ఏమి చేసెను? విగ్రహారాధికురాలిని పెండ్లి చేసికొని ఇశ్రాయేలు దేశములోనికి విగ్రహారాధనను తెచ్చెను… విగ్రహారాధన ఇశ్రాయేలులోనికి. అతడు ఒక అవిశ్వాసి; మనకది తెలియును.
దేవుని వాక్యమంతా నిజమని వారు నమ్మరు. ఒక వేషధారి… చుడండి, ఇప్పుడు గుర్తుంచుకొనండి, అతడు ఒక వేషధారి. మరియు ఆలాగు ప్రవర్తించును… అతడు నమ్ముదును అని చెప్పును, కానీ దానిని నిరాకరించును. "అందులో చాలా వరకు మంచిదే" గాని అంతమాత్రము సరికాదని చెప్పును. అదియే అతడిని ఒక అవిశ్వాసిగా చేయుచున్నది. నీవు అచ్చట చెప్పియున్న ప్రతీదానిని, ప్రతి చిన్న అక్షరము మరియు పొల్లును నమ్మవలెను. అది సత్యమై యుండవలెను. ఒకవేళ అది సత్యము కనియెడల - ఒకవేళ నీవు చెప్పినచొ, "నేను దానిని నమ్మను," మంచిది, అయినచో నీవు అవిశ్వాసివి.
2TIM 3:4,5
58ఒక సేవకుడు నాతో ఒకసారి ఇట్లనెను, "మిస్టర్. బ్రెన్హాం, నీవెందరిని బాగుచేశావని చెప్పినా, నేను మాత్రము నమ్మను."
"నిశ్చయంగా నీవు నమ్మజాలవు. నీవు అవిశ్వాసివి; అది నీకొరకు కాదు. అది కేవలము విశ్వాసులకు మాత్రమే." అన్నాను. నీవది నమ్మవలసియున్నావు, చూచారా? దానిని వారు నమ్మరు. కావున అది నీవు ఒక వ్యక్తిలో చూసినట్లయితే… మంచిది పౌలు మాట్లాడేనా (ప్రవక్తల ద్వార) వారు గర్వాంధులు, అహంకారులు, దేవుని కంటె సుఖానుభవమును ఎక్కువగా ప్రేమించువారు, పైకి భక్తిగలవారివలె ఉండియు దాని శక్తిని ఆశ్రయించనివారు. అట్టి వారికి విముఖడవై యుండుము.
చూడండి. వారు పూర్తి వాక్యమును నమ్మరు. కాని ఎంతో భక్తిగా కనిపించెదరు. నిజ వాక్యము బయలుపరచబడినా గాని వారు నమ్మని అవిశ్వాసులు. నోవహు మొదలుకొని, మోషే ఇంకా ఆ యా ప్రవక్తలందరి గూర్చి నేను మాట్లాడాను. ప్రతి కాలములోను దేవుడు వారికి వాక్యమును బయలుపరచెను. దేవుడు సహజాతీతముగా మాట్లాడి తన వాక్యమును రుజువుపరచినది, అయినా కానీ ఆ ప్రజలు నమ్మకుండా వెళ్ళిపోయిరి.
JOHN 6:60,62,63
59ఆ శిష్యులు ఇక్కడ నిలబడియుండిరి. వారితో యున్న (డెబ్బది మంది) మరియు యేసు చేసిన కార్యములు చూచుచుండిరి. వాక్యమును తెలిసికొనిరి. ఇది జరుగవలసిన కాలము ఇదేనని ఆయన వారికి చెప్పుచుండెను. ఆయన అప్పుడు ఎప్పుడైతే ఒక విషయము చెప్పెనో (మనుష్య కుమారుడు)… మరి నీవేమందువు వారికి రొట్టె విరచుట గూర్చి ప్రారంభించి మరెన్నో సంగతులను చెప్పెను, గొప్ప ఆత్మీయ సంగతులను చెప్పుటకు ముందుకు సాగెను.
"ఓ! ఇది కఠినమైన మాట!" అని వారనిరి.
ఆయన చెప్పెను, "మనుష్య కుమారుడు తాను దిగి వచ్చిన పరలోకమునకు ఎక్కిపోవుట మీరు చూచినప్పుడు ఏమందురు? చెప్పెను, "జీవింపచేయునది శరీరమా? లేక ఆత్మయా?" అని వారిని అడిగెను, చూచారా. వారు వెళ్ళిపోయిరి.
"వారు చెప్పెను, ఓ! అది నేను నమ్మలేను," చూచారా. వాక్యమును కాలదన్ని వెళ్ళిపోయిరి. జరుగనై యున్నదానిని చూచుటకు వారు ఆగలేదు. వారే అవిశ్వాసులు.
MARK 16:17•
HEB 13:8
60అప్పుడు వారు ఏమి చేయుదురు?
వారు నామకార్ధ విశ్వాసులని వారిని గూర్చి మనము కనుగొంటిమి. వారు మత ముసుగును ధరించుటచే గుర్తించబడినా వారు, చూచుటలో విఫలమయిరి, ఎందుకనగా అది వారి నమ్మకమునకు వ్యతిరేకముగా నుండెను. నీవు నమ్మునది లెక్కకు రాదు. నీ విధేయత, నీ మతభక్తి లెక్కకు రాదు. యధార్థత లెక్కలోనికి రాదు. ఎంతో యధార్ధముగా నున్నవారిని నేను చూచాను. అన్యులు తమ పిల్లలను కాల్చివేయుట, మొసళ్ళకు పారవేయుట నేను చూచాను. క్రైస్తవులు ఆలాగు చేయజాలరు, చూచారా? యధార్ధముగా నమ్ముచున్నారు, కాని అది యధార్థ తప్పు.
"మంచిది, ఈ సంఘము ఎంతోకాలముగా యున్నది." అని జనులు చెప్పుదురు.
"అది దేవుని యొక్క వాక్యమునకు విరోధముగా యున్నచో మీరు యధార్ధముగా తప్పు.
మంచిది, ఇప్పుడు చుడండి, "నేను అలంటి విషయములను నమ్మను…"
మంచిది, బైబిలు అటువంటి సంగతులను చెప్పుచున్నది.
"మనము ఇటువంటి కార్యములను చెయ్యవలెనని నేను నమ్ముట లేదు."
నీవు ఏమనుకున్నా నేను లెక్క చేయను, నీవు చేయనక్కరలేదు; దేవుడు చెప్పెను తప్పక జరుగును. "ఈ సూచక క్రియలు వారిని వెంబడి౦చును…" ఎంతవరకు? ప్రపంచమంతటికీ. ఎవరికి? సర్వసృష్టికి, చూచారా. అది జరుగును. "జరుగుతాయా? అవి జరిగే తీరుతాయి" సాయంకాల సమయము వెలుగు ప్రకాశించుచున్నది, ఈ కాలపు కడవరి ఘడియ యొక్క దేవుని ప్రసన్నతను మనము సంతోషముగా అనుభవించుచుండగా, రహస్యములు బయలుపరచబడుచూ ఇది సత్యమని వాక్యము గుర్తించబడి మరియు నిరూపించబడుచున్నది. ప్రవచనము నెరవేరుచూ వాక్యానుసారముగాను, విజ్ఞాన శాస్త్రము ప్రకారము గాను నిరూపించబడి యేసు క్రీస్తు నిన్న, నేడు, నిరంతరము ఏకరీతిగా యున్నాడని రుజువుపరచుచున్న సమయము; ఇదంతా చూచియు వెళ్ళిపోయిన వ్యక్తిని ఏమనవలెను? అతడు అవిశ్వాసి. అతడి పరిస్థితి నిరీక్షణకు అవతల యుండును. అతడు సాతాను శక్తిచేత మోద్దుబారెను, కావున అతడికి ఇక ఏ నిరీక్షణ లేదు. అతడి పరిస్థితి నిరీక్షణకు అవతల యుండును.
61ఇప్పుడు, ఏమిటి? అవిశ్వాసి; ఇప్పుడు మూడవ రకము వారిగూర్చి మాట్లాడుకొందము. వేషధారి. ఇప్పుడు గుర్తుంచుకొనండి, ఈ మూడు రకముల వారు అచ్చటే నిలబడియున్నారు. ఇప్పుడు, వారు అక్షరాలా వారి తండ్రియగు యూదావలె చేయుచున్నారు. పేతురు ఇంకా మిగిలిన అపోస్తులందరూ - విశ్వాసులు. డెబ్భయి మంది అవిశ్వాసులుగా నుండిరి. యూదా ఒక వేషధారి. వారేమి చేయుదురు? ఈ వేషధారి విశ్వాసియగు యూదా ఇస్కరియోతు చివరి వరుకు కూడా యుండెను. వారేమి చేయుదురు?
ఇటువంటి వారు తప్పు దొరకు వరకు కనిపెట్టి చూచుదురు. వారు ఒక పొరపాటును కనుగొన వెదకుదురు. అదెట్లు చేసెనో చూచెదరు. అది మాయాజాలమో, ఎత్తుగడో అని చూచెదరు. అమ్ముడు పోవుటకు వారు కనిపెట్టెదరు. అందుకే వారు చూచెదరు. అవిశ్వాసి ఆలాగు వేచియుండడు. అతడు దానిని ఖండించి వెంటనే వెళ్ళిపోవును. విశ్వాసి ఎవరేమన్నా వాక్యమును నమ్మును. మూడు రకముల వారు.
GAL 5:7•
1JN 2:19
62ఆ పాత అవిశ్వాసి వాక్యము చెప్పబడినప్పుడు తనకు నచ్చనిచో వెంటనే వెళ్ళిపోవును - ఆయన దానిని ఇష్టపడడు. సోదరుడా, వాడు వెంటనే తన రంగును చూపించును; వాడు అవిశ్వాసి.
పౌలు ఇట్లనెను, "వారు మనలో నుండి బయలు వెళ్ళిరి గాని ఆదిలో నుండి వారు మనలో యున్న వారు కారు. వారు మనతో ప్రారంభించిరి, ఓ, మీరు బాగుగా పరిగిడితిరి, ఏది మిమ్మల్ని అభ్యంతరపరచినది?" దానిని గమనించితిరా? వారు బయలు వెళ్ళిరి, ఎందుకనగా వారు మన సంబంధులు కారు. వాక్యము పరిపూర్ణముగా వారికి బయలుపరచబడుచుండగా వారు చూచియు దానికి ఏదో మాయాజాలము కారణమై యుండునని తలంచి దానిని నేర్చుకొనుటకు వెదకిరి. కాని నిజ విశ్వాసి ఏమియు ప్రశ్నించడు. అది వాక్యములో వ్రాయబడెను గనుక వారది నమ్ముదురు, నమ్మి ముందుకుపోవుదురు. ఎప్పుడూ అది వ్రాయబడియుండును. అది వ్రాయబడనియెడల దానికి నీవు దూరముగా యుండుము. ఏమి జరిగినా నమ్మవద్దు. అది వ్రాయబడవలసియున్నది. చూచారా? వారు వ్రాయబడిన వాక్యమును చూచి నమ్మిరి. నేను నేటి ఉదయమున చెప్పిన ప్రకారము విశ్వాసులు, కాలమును, దాని ఘడియను, వాక్యమును మరియు దేవుడు తన వాక్యమందు సంచరించుచుండుటను కనుగొని దానిలో నడుచుచున్నారు.
63ఈ ఉదయాన నేను చెప్పినవిధంగా.
పిలాతు ఆ రాత్రి ఎంతో బాధాకరమగు మనస్సాక్తితో నేల మీద అటు ఇటు నడిచి యుండును. తన్నుతాను శుద్ధిచేసికొనగోరెను. మరియు ఆయన చెప్పెను, "మై…" సందేహము లేదు అతడు రాత్రంతా అరచుచు చెప్పుచుండెను, "రాత్రంతా నేను నా చేతులుకడుగుకొన్నాను గాని నాకేమి అర్థమగుట లేదు," చూచారా. "అవి శుభ్రము కాలేదు." ఆయనను ఎన్నడూ నేను ఆయనను కలిసికొనలేదు; నా చేతులపై రక్తమున్నది." ఓ మై, చుడండి. ఆ విషయంలో ఎన్నడూ దోషిగా ఉండవద్దు, చూచారా. అది నీ చేతులపై ఉన్నది; నీవు దానిని తప్పించుకొనుటకు ఒకే ఒక మార్గమున్నది. దానిని అంగీకరించుము. దానిలో భాగముగా ఉండుము. అందుకొరకే అది చిందించబడియున్నది
64ఇప్పుడు వేషధారి పరిశుద్దునివలె నటించుచుండును. కాని తన హృదయమందు ఏమి చేయుదునా? అది ఎదురుచూచును. దేశమంతా ఆ రకమగు వేషధారులతో నిండి యున్నది. అతడే యూదా, అంటిపెట్టుకొని యుండెను. ఆ గుంపులో భాగస్తునిగా ఉండెను. అతడే కోశాధికారి. చూచారా? అతడు అంటిపెట్టుకొని యుండెను. అతడు ఎల్లప్పుడు డబ్బు కొరకే తన చేయి చాపుచుండెను. అతనివేట ఎప్పుడూ డబ్బు కొరకే అని మీరు గ్రహించవలెను. అతడు వేషధారి. విశ్వాసివలె నటించెను గాని హృదయములో ఉన్నది వేరు.
JOHN 6:70•
JOHN 14:9
65మీరు గుర్తుంచుకొనండి, అతడు యేసును మోసము చేయలేడు.
డెబ్బదిమంది వెళ్ళిపోయిన తరువాత విశ్వాసులు నిలబడియుండిరి. ఆయన విశ్వాసుల వైపు తిరిగి ఇట్లనెను, "ఇంకా మీలో ఒకటున్నది. మీ పండ్రెండు మందిని నేను ఏర్పరచుకొన్నాను గాని మీలో ఒకడు అపవాది" యేసు ఆది నుండియు అది ఎరిగి యుండెను. ఎందుకనగా ఆయనే వాక్యము. హృదయ రహస్యము ఆయనెరుగును. అదెంత కఠినము! ఒక్క నిమిషమాగి దానిగూర్చి లోతుగా ఆలోచించుము. ఆయనకది ఎంత కష్టమనిపించెనో ఆలోచించండి. "సోదరుడా," అని పిలచుచూ చుట్టూ తిరుగుచుండెను. కాని అతడు మోసగాడని ఆయనకు ప్రారంభము నుండియు తెలియును. ముప్పది వెండి నాణేములకు ఆయనను అమ్ముటకు ప్రయత్నించుచుండెను. తన రొమ్ము మీద ఆనుకొని, తన స్నేహితునిగా యున్నవాడు ఆలాగు చేయునని ఆయనకు తెలిసి ఎంత వేదన పడియుండును! (ఆయన యూదాను స్నేహితుడా! అని పిలచెను) "స్నేహితుడా, ఇంతకాలము నేను నీతో యున్నాను గదా?" అతని హృదయమును అతడు ఎరిగియుండి ఇక చెప్పలేకపోయెను. తనను అప్పగించువాడెవడో ఆయనకు మొదటి నుండియు తెలియును.
66అచ్చట ఆ వేషధారి సమయము కొరకు వేచియుండెను. అతడు ఆ పాట పాడుచూ, "ఓ, నేను దీనిని నమ్ముచున్నాను, నేను దీనిని నమ్ముచున్నాను మరియు నేను దీనిని నమ్ముచున్నాను, అతడు తన పొడవైన చెవులను ఇంకా పెద్దవి చేసుకొంటూ, అయినా గాని, ఓ, అది — ఇది అని పలాని వారు పలుసార్లు చెప్పుటను నేను విని యున్నాను, నీవెరుగుదువా." ఓ, గమనించితిరా, నిజ విశ్వాసి వాక్యమును తప్ప మరిదేనిని వినడు. వాక్యమునే అతడు చూచును. తప్పులు పట్టుకొనుటకు చూడడు. మాయ చేయుటకు చూడడు. అతడు దేవునిని నమ్మును, ముందుకు స్థిరంగా సాగిపోవును. చూచారా? అతడే విశ్వాసి.
అవిశ్వాసి ఒక్క నిమిషములో ఉబ్బిపోవును, వర్తమానమును వినుటకు పది నిమిషములు కూడా కూర్చోలేడు, లేచి వెళ్ళిపోవును. అది తన ఆచారమునకు విరోధమను కొనును. దానితో అతడికి ఏ సంబంధమును కలిగియుండనందువలన, అతడు లేచి వెళ్ళిపోవును.
67మోసగాడు యూదా దానిని పట్టుకొని వ్రేలాడుచున్నట్లుగా వేషధారి అచ్చటే కూర్చొనియుండును. ఆ బుద్ధిలేనివాడు, దాని చుట్టూ వేలాడుచున్న యూదా గురించి చెప్పుటకు అటువంటి మాటనే నేను చెప్పవలెను.
కొన్నిసార్లు ఈ వేషధారులు ప్రజలలో చాలా గొప్ప పేరు సంపాదించెదరు. (నిజము) చూచారా? కొందరు బలవంతులు గాను, ఇంకొందరు విద్యావంతులు గాను, ఇంకొందరు డాక్టరు డిగ్రీ సంపాదించి సంపాదించు వారుగా ఉందురు. అందులో చాలా గొప్పవారు, సాతానుయొక్క కుమారులు ఆ విధముగానే తెలివైనవారుగా యుందురు. సాతాను అక్కడికి వచ్చి ప్రతి మాటను ఎట్లు సమ్మతించెనో చూడండి. కాని అతడు హవ్వలోని బలహీనత ఏదని కనుగొని పట్టుకొనుటకు కాచుకొనియుండి, అటు తరువాత అతడు తన శక్తిని ప్రయోగించి ఆమెను మోసగించి ఆమెను దోషిగా నిలబెట్టెను. అది — అదియే సాతాను. సాతాను ఆ కాలములో యూదా రూపములో ఉండెను. ఆ మొదటి కాలమందు సాతానుయొక్క రూపమదియై యుండెను. అతడు ఎవరు? బలహీనమైన స్థలమెచ్చట యున్నదని కనుగొనే వరుకు, అంత వరుకు దానికొరకే అతడు ఆ వాక్యమును అంగీకరించునట్లు కనబడును. యూదా కూడా అక్షరాలా అదే చేయుచుండెను. అతడు కూటమునకు అందరివలె వచ్చుచుండెను. ఆ చిన్న పొరపాటు కనుగొను వరకు వెదకుచుండెను. "ఓ, అదిగో అది అక్కడ కనబడినది! అదిగో పొరపాటు" అని అతడు అనును. గమనించారా? "ఓ, అది ఆ విధముగానే సంభవించును!" చూచారా? అది ఖచ్చితముగా ఆలాగే యుండును.
68ఒక రాత్రి వేదిక పైకి వచ్చిన ఆ మనిషి మీకు గుర్తు౦డియుండును. మానసిక వివేచన వలన కార్డులను చదువుచున్నానని అతడు తలంచెను. సంపూర్ణ సువార్తను నమ్మని సంఘమునకు అతడు చెందియుండెను. అతడు వేదిక మీదికి వచ్చెను. నేను అలసిపోయాను. నన్ను తీసికొనిపోవుటకు వారు ప్రయత్నించిరి. అది ఒ౦టారియోలోని విన్డర్స్ లొ జరిగెను నేను అమెరికా నుండి వచ్చాను. అది విండర్స్లోని పెద్ద ఆడిటోరియం. ఆ వ్యక్తి సూటు ధరించుకొని ఎర్రని టైకట్టుకొని చాలా తెలివైనవానిగా కనిపించెను. అతడు నేనున్న వేదికపైకి వచ్చెను. నేనిట్లు చెప్పాను, "నేను అలసిపోయాను. నీ చేయి ఇవ్వు. నేను చాలా దర్శనములు చూచాను. నీ చేయి అందించు." అన్నాను. ఆ వ్యక్తి నా మీద తన చేయివేసెను గాని దానిని నేను గమనించలేదు. "నీలో ఏ తప్పు లేదు. వెళ్ళు." అని అతనితో చెప్పాను.
"ఓ! అక్కడ కూడా యున్నదా?" అనడిగాడు.
"నీవు పరిపూర్ణ ఆరోగ్యంగా యున్నావు. ఒక్క సూచన కూడా నీలో లేదు." అన్నాను.
"నా ప్రార్ధన కార్డు చూడు." అన్నాడు.
"ప్రార్ధన కార్డు మీద ఏది వ్రాసినా నాకు లెక్కలేదు" అని అన్నాను. "నీ ప్రార్ధనా కార్డుతో నాకు సంబంధము లేదు." అని చెప్పాను. ఆలోచించకుండా చూచారా, నేను అలసి-సొలసిపోయాను. కాని దేవుని కృపను బట్టి మీరు అక్కడుండి నన్ను జ్ఞాపకము చేసికొనిరి. ఆయన నన్ను పంపిన యెడల ఆయనే నా గూర్చి శ్రద్ధ వహించును. అది నా పని కాదు. ఆయనదే. ఆయన దానిని పంపెను. నేను కేవలము సత్యము మీద నిలబడవలసియున్నాను.
EXOD 7:10-12
69మోషే తన కర్రను విసరగా అది సర్పమాయెను, మాంత్రికులును ఆలాగే చేసిరి. మోషే ఏమి చేయగలడు? దేవుని కృప కొరకు నిలబడియుండెను. అంతే! అతడు ఆజ్ఞలను వెంబడించెను. ఏమయినదో మీకు తెలియును గదా?
"నా ప్రార్ధన కార్డు చూడు." అని ఈ వ్యక్తి చెప్పెను.
"నీకు చాలా విశ్వాసము ఉండియుండవచ్చును. నీవు ఎన్నో కార్యములు చేసియుండ వచ్చును." అన్నాను.
అతడు అసలు నా మాట వినుట లేదు. తన కోటు గుండీలు విప్పి గుండెను బయటపెట్టెను.
ఆయన జనులతో చెప్పెను, "అక్కడే మీరు ఉన్నారు."
మరియు నేను అనుకున్నాను, "ఇక్కడ ఏమి జరుగుతుంది?"
"చూడండి?" అని అతడు జనులతో చెప్పెను. అతడు చుట్టూ చూచెను. "ఈ గమ్మత్తు చూడండి." (అతడే యూదా, ఒక మత బోధకుడు. ఒక శాఖయొక్క బోధకుడు.) చెప్పెను, "ఇప్పుడు నాకు ఎంతో విశ్వాసమున్నది. ఈయన చాలా బలహీనుడైనందున మానసిక వివేచన చేయలేకపోవుచున్నాడు. ఇక అది ఆయనకు రాదు." మరితరువత, ఆయన చెప్పెను, "నా విశ్వాసము గొప్పది కాదు." చెప్పెను, "నేను ప్రార్థన కార్డు పెట్టినా గాని అతడు దానిని గమనించలేకపోయెను." "ఇదీ గమ్మత్తు," అని చెప్పెను.
"ఏమి జరుగుతుంది?" అని నేననుకొన్నాను. అంతట దేవుని కృప నా మీదికి వచ్చెను. నేనిట్లు చెప్పాను, "దేవుని మోసము చేయుటకు సాతాను నీ హృదయమును ఎందుకు ఎన్నుకొనెను? "నీవు చర్చ్ ఆఫ్ క్రెస్ట్…" నేను ఇలా చెప్పడం ప్రారంభించాను. "నీవు చర్చ్ ఆఫ్ క్రెస్ట్ సంఘమునకు చెందిన ఒక బోధకుడివిగా యున్నావు. నీవు అమెరికాలోని క్రీస్తు సంఘమునకు చెందియున్నావు. నీ భార్య అక్కడ కూర్చొనియున్నది. గత రాత్రి నీవు ఒక బల్ల యొుద్ద కూర్చొనియున్నావు. దాని మీద ఏదో పెద్ద పచ్చని వస్తువున్నది. దీనిని నీవు మానసిక వివేచన అని ఎంచి ఈ రాత్రి వచ్చావు."
"అది అక్షరాలా సత్యము. దేవుడు నన్ను కరుణించు గాక!" అని అతడు నిలబడి చెప్పెను.
"నీవు ఆ కార్డు మీద టి.బి మరియు క్యాన్సరు అని వ్రాసుకొచ్చావు. ఇప్పుడు నీవు వాటిని పొందుదువు" అని చెప్పాను.
అతడు నా కాలు ప్యాంటు పటుకొని బ్రతిమలాడెను. "నేను తెలియకుండా…"
"వెళ్ళిపో, నేనేమీ చేయలేను అన్నాను. అది నీకు దేవునికి మధ్య యున్నది. నీ శిక్షను నీవే నీ కార్డు మీద వ్రాసుకొంటివి." అని చెప్పాను. ఆ వ్యాధులు అతడికి వచ్చెను. అదే అతడికి శిక్షయాయెను.
70వేషధారులు మోసము చేయుదురు. దేవునిలోను, ఆయన వాక్యములోను తప్పును పట్టుకొన చూతురు. వారే యూదాలు. యూదా ఎట్లు వచ్చెనో మీరు చూచారా? గమనించారా? అతడే విధముగా బయటపడ్డాడు? వేషధారులకు ఆలాగే జరుగును. వారు బాగా విద్యనభ్యసించినవారు. వాక్యమునకు వారి ఆచారమునకు మధ్య వారు నిలబడి కొన్నిసార్లు వారు నిర్ణయము తీసికొనవలసియుందురు. ఈ వేషధారులు తమ పూర్వీకుడగు యూదా వలె వారు వారి సంఘశాఖకు అమ్ముడుబోయిరి. యూదా తాను వాక్యములోని ఒక భాగముగా యున్నానని చెప్పుకున్నను.
అతడు వాక్యమగు యేసును తన సంఘ శాఖకు చూపించి కొన్నిసార్లు క్రీస్తు దాసులమని చెప్పుకొనినవారు దేవుని వాక్యము సంపూర్తిగా బయలుపరచబడుట చూచియు, ఆ ఘడియ యొక్క వర్తమానమును గుర్తించియు తమ పేరు కొరకు యూదా యేసును పరిసయ్యులకు, సద్దూకయ్యులకు అప్పగించినట్లే వీరును తమ శాఖకు అమ్మివేయుదురు. ఆ ఆత్మ చనిపోలేదు. అది విశ్వాసుల మధ్య అవిశ్వాసుల మధ్య వేషధారుల మధ్య యున్నది. గమనించండి, అది ఖచ్చితముగా ఆత్మయై యున్నది, కేవలము యేసును ముప్పది వెండి నాణములకు అమ్మివేసెను, పొట్టకూటి కోసము మరియు యేసును వారమునకు ఒక వంద డాలర్లు ఇచ్చెదమన్నచో నేడును ఆయనను అమ్మివేయువారు చాలామంది యున్నారు. వారి మధ్య నిలబడియున్న దేవునిని, తమ జీవమును, పూర్తి వాక్యమును తిరస్కరించుచున్నారు.
ACTS 2:38
71"ఓ అద్భుతాలు జరుగు దినములు అయిపోయినవి. అప్పటివలె దేవుడు ఇప్పుడు చేయనవసరము లేదు. ఓ! నేను దేవుని కుమారుడగు యేసు క్రీస్తును నమ్ముచున్నాను. దేవుని తల్లియగు మరియా, నీవు ధన్యురాలవు. స్త్రీలలో నీవు ధన్యురాలవు." అని వారు చెప్పెదరు. వారు ఏవేవో నమ్మెదరు.
అందులో కొందరు ఇట్లందురు, "అపోస్తలుల విశ్వాసమును నేను నమ్ముదును. భూమ్యాకాశములు సృజించిన తండ్రియగు దేవునిని నేను నమ్ముదును. పరిశుద్ధ రోమను కాథలిక్కు సంఘమును నేను నమ్ముదును."
అటువంటి ఆచారము ఒక్క అపొస్తలునికైనా ఎన్నడయినా ఉండెనేమో చెప్పండి. అపోస్తలుల యొక్క ఒకే ఒక బోధ అపొ.కా 2:38లో యున్నది. "ప్రతివాడును మారుమనస్సు పొంది యేసు క్రీస్తు నామములో పాపక్షమాపణ నిమిత్తము బాప్తిస్మము పొందవలెను. అప్పుడు మీరు పరిశుద్దాత్మ అను వరము పొందుదురు." ఏదైనా వారి సిద్దాంతమున్నచో అది ఇదే. వారికి మరే బోధ లేదు. అది వాక్యమే. అది సత్యము. అది ఎల్లప్పుడూ ఒకే విధంగా యున్నది.
పాపపు వ్యాధికి మందు అదే. "మీరు పరిశుద్దాత్మ అను వరము పొందుదురు. మారుమనస్సు పొంది క్షమాపణ నిమిత్తము బాప్తిస్మము పొందుడి. అప్పుడు మీరు పరిశుద్దాత్మ అను వరము పొందుదురు."
ACTS 2:38
72కాని వారు యూదావలె అమ్మచూపుచున్నారు. వారు వేషధారులు. అందులో కొందరు ఎంతో తలాంతు కలిగినవారున్నారు. ఈ వేషధారిని చూడండి. అతడు చాలా తెలివైనవాడు. ఇతడు త్వరగా ఉప్పొంగి క్రిందికి పైకి ఎగురుచుండును. ఏది చెప్పినా వినడు. నీవతనివైపు చూడవద్దు. మొదట నుండియు అతడు అవిశ్వాసి. కాని ఈ వేషధారిని నీవు గమనించిన యెడల ఇతడు యూదావలె వారిని అంటిపెట్టుకొనే యుండును (చూచారా), అతడే యూదా.
నేను పేరు చెప్పకూడదు గాని మీకు వారినిగూర్చి తెలియును. ఏదైతే నేమి నేను వారి పేరు ప్రస్తావించెదను. అట్లైతే దానిని నీవెరుగుదువు. ఎల్విస్ల్వి ప్రేస్లీ, రెడ్ ఫోలే, ఎర్నీ ఫోర్డు, పాట్ బూన్ మొదలగువారు. రెడ్ ఫోలే క్రీస్తు సంఘములో ఒక పెద్ద ఎర్రెస్ ఫోర్డు ఒక మెథడిస్ట్. వారందరూ తలాంతులు గలవారే. తెలివైనవారని టెలివిజన్ లో చూచి జనులు చెప్పుచున్నారు. "వారు భక్తిగలవారు కారా? వారు పాటలు పాడిరి." అయినా ఏమీ లాభము లేదు. లోకమును మోసగించిరి. వారందువలన ఏమి సంపాదించిరి? యూదా ముప్పది వెండి నాణములు సంపాదించెను. ఎల్విస్ ఎన్నో కాడిలాక్ కార్లు సంపాదించెను. రికార్డుల మీద 120… లేక 150 మిలియన్ల డాలర్లు సంపాదించెను. పాట్ బూన్ వారందరూ ఆలాగే సంపాదించిరి. వారే సంఘానికి చెందియున్నా నాకక్కర్లేదు. అది పూర్తిగా వేషధారణ. వారు సరిగ్గా లేరని వారి జీవితము నిరూపించును.
MARK 16:15,17•
2TIM 3:5
73గొప్ప తలాంతులు కలిగిన వారు సంస్థలను నడుపుచున్నారు. లోకజ్ఞానము వారికున్నది. వారు సువార్త ప్రకటించుచున్నామని చెప్పుకొందురు. తెలివైనవారు, మేధావులు. ఆ విధంగా శిక్షణ పొందినవాడు బోధకుడు కాదు గాని వక్త, నేడు మన సమస్తము ఇదే. మనకు వక్తలున్నారు.
"వెళ్ళి ఇది చేయుటకు శిక్షణ జరుపుడి" అని యేసు ఎన్నడూ చెప్పలేదు. "వెళ్ళి సువార్తను ప్రకటించుడి. బోధించువారివలన ఈ సూచక క్రియలు కనబడును." అని ఆయన చెప్పెను, చూచారా? వక్తలుగా ఉండుట కాదు. ప్రధాన దేవదూత సన్నిధిలో యున్నట్లుగా వారి ప్రసంగము వలన అనుభూతి కలుగును. "పైకి భక్తి కలిగియుండుట." చూచారా? అది వక్త మాటయే గాని పరిశుద్దాత్మ పని కాదు.
అ ఆ లు కూడా రాని ఒక చిన్న మనిషి వాక్యమందు విశ్వాసముంచి శక్తితో వచ్చినప్పడు పరిశుద్దాత్మ గొప్ప క్రియలను చేయును. ఈ గొప్పవారు దానిని గురించి ఏమియు ఎరుగనివారై దానిని త్రోసివేయుదురు. గమనించారా? అవును, అయ్యా. ఆ విధముగానే చేయుదురు.
74గొప్ప జనులు! అవునండీ.
వారు గొప్ప సంస్థలను కలిగియున్నవారు. వీరు లోకము యొక్క జ్ఞానమును కలిగినవారై, జయము పొందుతూ, లోకసంబంధముగా వర్ధిల్లుదురు. ఆ దీన నిస్సహాయురాలైన స్త్రీ, హవ్వకు సాతాను చేసినట్లుగానే ఆ సాతాను ఆమె యొద్దకు వచ్చి ఆమెకు యున్న జ్ఞానముకంటె ఇంకా మెరుగైన జ్ఞానమును తాను పొందుకోవచ్చనే యుక్తిగల మాటలతో అతడు తన ఆలోచనను ఆమెకు అమ్ముటకు ప్రయత్నించెను. ఆమె అందుకొరకే ఎదురుచూచుచున్నది. ఆమె వాక్యముతో నిలిచి యుండుటకు బదులుగా, ఆమె గొప్ప జ్ఞానమును సంపాదించుకోవలననే అతడి ఆలోచనను ఆమెకు యుక్తిగా ఆమ్మివేసి తద్వారా అతడి యొక్క ఉత్పత్తిని (సంతానమును) ఆమె తీసుకొచ్చినది. వారింకా నేడును అదే చేయుచున్నారు. "ఈ లోక జ్ఞానము దేవునికి వెర్రితనము." అవునండి.
ఓ మై. పరిసయ్యులు అమ్మిన విధంగానే వీరును అమ్ముచున్నారు. లేదు, అయ్యా! ఓ, గమనించండి, పరిసయ్యులు కూడా వారికున్న జ్ఞానముతో వారెరిగిన దానిని బట్టి వారివలె వీరును ఆ విధముగానే చేయుచున్నారు. కాని, వారు అదే చేయుచున్నారు. దేవుని వాక్యమంతటిని వారు తిరస్కరించుచున్నారు. వారికది బయలుపరచబడెను, అది నిరూపించబడెను. అది ఒక మాయ అని వారింకా తలంచుచున్నారు, మరేదో వెదకుటకు ప్రయత్నించుచున్నారు. వారింకా మనస్సులో స్థిరపడలేదు. వారది నమ్మలేదు. వారికి నీవెంత చెప్పినా మరల వెనక్కు వచ్పుదురు. వారిలో నీవది నాటలేవు. వారిని గమనించు. వారికి కావలసినది ఒక తప్పును పట్టుకొనుటయే.
75నాకేమైనా పొరపాటులున్న యెడల అవి కేవలము దేవుని కృప వల్లనే బహిర్గతము కాలేదు, చూచారా? అది దేవుని కృప, ఎందుకనగా దేవుని వాక్యములో తప్పులు౦డవు ఇది తిన్నని సువార్త.
దేవుని వాక్యమునకు సరిపోనిది నేను ఎన్నడైనా బోదించుట మీరు చూచినయెడల వచ్చి నాతో చెప్పమని మిమ్మును ఎల్లప్పుడూ కోరుచుందును. మీరు తప్పులు వెదకినా దొరకవు ఎందుకనగా అ౦దులో పొరపాటులు౦డవు
ఇప్పుడు గుర్తు౦చుకొనండి, యూదా ఒక తప్పుపట్టుకొన్నానని తలంచెను. చాలాసార్లు వారాలాగే తలంచుదురు గాని అది కనుగోలేరు. వారే వేషధారులు, వంచకులు. హవ్వవలె వారును తొంబది అయిదు శాతము వాక్యము మీదే నిలిచియుందురు. తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది శాతము దాని మీద నిలబడినా ఒకశాతము తప్పిపోయిరి. అందువల్లనే దు:ఖము, మరణము వచ్చెను. అ౦దుకే సంస్థలను, శాఖలను ఖండించుచున్నాము. ఎందుకనగా వారు పూర్తిగా దేవుని వాక్యము అంగీకరించరు. వారు వేషధారులు. ఎల్లప్పుడూ ఆలాగే యుందురు, బయలుపరచబడిన వాక్యమును నిరాకరించుదురు. వారు ప్రతి తరములోను ఉందురు. వారు చాలా భక్తిగా యుందురనియు మనము కనుగొందుము. నేను ముగించెదను. ఎందుకనగా ఇంకో అరగంట తీసికొన్నాను.
MARK 13:22
76ఈ చివరి దినముల గూర్చియు, ఈ రకమగు జనులను గూర్చియు యేసు మనలను హెచ్చరించెను. వారు అసలు మాదిరిగానే యుందురు, ఏర్పరచబడిన వారిని మోసము చేయుదురు. ఏమిటది? యూదాలు. వారు కేకలు వేసి, చప్పట్లు కొట్టి దయ్యములను వెళ్ళగొట్టితిమనియు చెప్పెదరు. వెనుదిరిగి వాక్యమును తిరస్కరించెదరు. వారికి పై భక్తియున్నది. యూదా ఎక్కడ నుండి వచ్చెనో చూడండి. యూదా ఆత్మ పెంతెకోస్తులోనికి కూడా సువార్త ద్వారా ప్రవేశించినది. కాని యేసు క్రీస్తు నామమున బాప్తిస్మము తీసుకొనవలెను, మరియు అంతేకాకుండా పరిశుద్దాత్మతో కూడా బాప్తిస్మమును పొందుకొనుట వంటి కార్యములను చేయు సమయము వచ్చినప్పుడు అతడు వాటిని అంగీకరించుటకు బదులుగా తిరస్కరించి వెళ్ళిపోయెను. అతడు తన రంగు చూపించెను. ఆ శాఖలలో ఆ ఆత్మ ఇంకా జీవించుచున్నది. సత్యము నొద్దకు వచ్చెదరు కాని అంగీకరించక వెనుదిరుగుదురు. యేసు రాకడను గూర్చి యోహాను చాటించినట్లు వారి మీదనున్న ఆత్మ వారి గమ్యమును చాటించుచున్నది.
"వారు బహు దగ్గరగా ఉందురు అని యేసు చెప్పెను," అని నీవందువు.
MATT 24:24•
MARK 13:22•
LUKE 10:20•
REV 20:12
77"ఏర్పరచబడినవారి" పేరు జగత్తు పునాది వేయబడక మునుపే ఆ గ్రంథమందుండెను. వారు జీవ వాక్యము నంతటినీ నమ్ముదురు. వారే ఏర్పరచబడినవారు.
ఇప్పుడు వీరిని గమనించండి. దీనిని నేను గౌరవము, మర్యాద, దైవ ప్రేమతో చెప్పుచున్నాను. నాకు లేనియెడల, నాకు కూడా వేదిక పిలుపు అవసరమే. వారు ఏర్పరచబడినవారిని కూడా మోసము చేయుదురని యేసు చెప్పినది గమనించండి. వారు మెథడిష్టులు కారు, బాప్టిష్టులు కారు. వారి ప్రారంభమే అవిశ్వాసులు. పెంతెకోస్తు సంస్థవారు వాక్యము హద్దులు గీసికొనిరి, వారికొరకు వారొక గీతను గీసుకొని వారి శాఖను నిర్మించుకొనిరి, వాక్యమును బయటకు త్రోసివేసిరి. వారు ఏర్పరచబడిన వారినే మోసము చేయుదురు. వారు చాలా దగ్గరిపోలికతో యుందురు. "వారు కేకలు వేయుదురు, చప్పట్లు కొట్టుదురు, పైకి క్రిందికి ఎగురుదురు, స్వస్థతా కూటములను ఏర్పరచుదురు. యూదా ఇంకా తదితరులు ఆలాగే చేసిరి. వారు వెళ్ళి సంతోషముతో తిరిగి వచ్చిరి. వారి పేరు కూడా గొర్రెపిల్ల జీవ గ్రంథములో వ్రాయబడియుండెను. కాని గుర్తు౦చుకొనండి. పెండ్లికుమార్తె ఆ గుంపులోనికి రాదు. ఆమె రాకడలో ఎత్తబడును.
తీర్పు సిద్ధముగా యున్నది, "గ్రంథములు విప్పబడును. (దుర్మార్గులని) జీవ గ్రంథమను మరియొక గ్రంథము విప్పబడెను." తీర్పు తీర్చుటకు పెండ్లికుమార్తె అచ్చటుండును. చూచారా? చూచారా? జీవ గ్రంథమను మరియొక గ్రంథము తెరువ బడెను. గొర్రెలు, మేకలు చేరొక ప్రక్కన నిలబడును. పూర్వమున చనిపోయిన వారికి అవకాశమే దొరకలేదు. వేరుచేయుట అక్కడ జరుగును.
MATT 24:24•
MARK 13:22
78గమనించండి. "ఏర్పరచబడిన వారిని మోసము చేసెదరు." ఆ గుంపును కనిపెట్టి చూడండి. వారు విడువక వెంబడించెదరు. "అవును. సోదరుడా! హల్లెలూయా! దేవునికి మహిమ? అందురు. ఏ సంఘములోనే వారెందు కొరకు పనిచేయుచున్నారో నీవు కనిపెట్టుము. జనులను ఆకర్షించి డబ్బు కొరకు వారి రక్తమును పిండెదరు. నాకది తెలియదని మీరనుకొనుచున్నారా? నాకు తెలియదని వారనుకొనుచున్నారు. కాని నాకది తెలియును. ఎవడు మోసము చేయునో ఆది నుండియు యేసు ఎరుగును. చూచారా? చూచారా? కాని ఆయన ఏమి చేసెను? సమయము వచ్చు వరకు ఆయన కనిపెట్టును. మనము కూడా తప్పకుండా అది చేయవలెను. ఆ సమయము వచ్చు వరకు మనము కనిపెట్టుకొని యుండవలెను. నీయంతట నీవు ముందుకు సాగిపోవచ్చు. ఆ నిమిషము వరకు వేచియుండుము.
పైకి భక్తి కలిగియుందురు. వెంట వచ్చుదురు. అది మోసపరుచు గుంపు. ఆ మోసగానిని గమనించుము. విశ్వాసి కాదు. అవిశ్వాసి కాదు గాని వేషధారి! ఓ! వారేమి చేయుచున్నారు. వారు కలుపు విత్తనములను చల్లుచున్నారు, తప్పు కనుగొనుటకు వచ్చుచున్నారు, జనుల యొుద్దనుండి డబ్బును గుంజుచున్నారు. (చూచారా?) ఈ గొప్ప సంస్థలలో వాటిని పోగుచేయుచున్నారు. మీరందుకు పూర్తి వ్యతిరేకులని వారికి తెలియదు. చూచారా, వారు దానిని ఎరుగుదురు. నీవేమీ చేసినా వారు వినిపించుకొనరు. నీవు వచ్చు ముందుగానే వారు వారి జనులను హెచ్చరించుదురు. "అతని మాట వినవద్దు" అందురు.
79ఓహియోలో ఒక వ్యక్తి వేదిక యొద్దకు, (సహో, కిడ్ అప్పుడే స్వస్థత పొందెను) "సహో. బ్రనహోం నిస్సందేహముగా ఒక ప్రవక్త. ఆయన మీద నుండి అభిషేకము తొలగిపోయిన తరువాత చెప్పే మాటలను వినవద్దు. ఎందుకనగా అది తప్పు" అని చెప్పెను.
నేను గదిలో కూర్చొనియుండగా ప్రభువు దానిని నాకు బయలుపరచెనని అతనికి తెలియదు. నేనతని యొద్దకు వచ్చి "ఇతడెందుకీలాగు పలుకుచున్నాడు?" అనడిగాను. (మీలో చాలామంది అక్కడున్నారు). చూడండి. నేను ప్రవక్తనని ఎన్నడూ చెప్పుకొనలేదు. అతడే నేను ప్రవక్తనని చెప్పెను. ప్రవక్త వాక్య ప్రవక్త "దీర్ఘదర్శి" అని పాత నిబంధనలో కలదు. ఇప్పుడు ఆంగ్ల భాషలో "ప్రవక్త" అను పదమునకు అర్థమేమనగా బోధకుడు అని అర్థము. పాత నిబంధనలో ప్రవక్త అనగా "వాక్యమునకు దైవిక అర్ధము చెప్పి ముందే చూచిన వాక్యమును రుజువు చేయును. అది ఏమిటి…
80ఒక వ్యక్తి, ఒక వ్యక్తిని ప్రవక్తని చెప్పి, ఆ ప్రవక్త బోధించునది తప్పని ఆ వ్యక్తి చెప్పిన యెడల ఆ విధముగా చెప్పిన ఆ వ్యక్తి యొక్క భావమేమిటి? అది డబ్బు సమకూర్చుకునే పధకము కొరకే అతడలాగు చెప్పెనా? అదేమిటి? రంగము మీద ఇవన్నియూ కనబడు ఘడియ సమీపించినది. కాని ఆ విధమగు వారు (వేషధారులు) నిన్ను "సోదరుడా" అని పిలచి వీపు నిమురుదురు, యూదా వలె ఉందురు. కాని, ఆయనకు ఆదినుండియు దానిని గురించి తెలియును. నేడును తెలియునని గుర్తుంచుకొనండి.
దీనిని టేపు ద్వారా మీరు విందురు. మీరు ఏదో ఒక రకమునకు చెందియుందురు. ముగించుకొనబోవుచున్నాము. ఖచ్చితముగా అది నిజము. మనము ముగించబోవుచున్నాము.
ఇక్కడున్న ప్రతి వ్యక్తి, ఈ టేపును విను ప్రతి వ్యక్తి గమనించవలెను. ఒక దినమున నేను ఈ లోకమును విడిచిపెట్టవలసి యుందును, కాని ఈ టేపులు ఇంకా సజీవముగా ఉండును. అది నిజము. చూచారా? మీరు ఇందులో ఒక తరగతికి చెందియుందురు. తప్పక ఒక గుంపులో యుందువు. ఇది ఖచ్చితము. దానిని నీవు తప్పించుకోలేవు. ఈ తరగతులలో నీవు ఏదో ఒక దానికి చెందియుందువు.
81ఇప్పుడు విషయమేమిటి? నీవు నమ్ముచున్న ఈ పరిశుద్ధ గ్రంథములోని గుణ లక్షణములతో నిన్ను నీవు గుర్తించుకో, నేను నేటి రాత్రియందు దీనిని నిరూపించినట్లుగా ఎచ్చట నీవు వాక్యమును నమ్ముచున్నావో అది ఎప్పుడు ఒక నిరూపించబడిన వాక్యముగా యున్నదో దానితో నిన్ను నీవు గుర్తించుకో. నిరూపించబడిన వాక్యము ఎప్పుడూ, ఎల్లప్పుడూ అందరూ నమ్ముదానికి అది విరుద్ధముగా యుండును. నోవహు కాలములో నీవు జీవించియుండిన యెడల నీవు ఏ పక్షమున యుండెడి వాడవు? సంఘము పక్షమునా? లేక ప్రవక్తయగు నోవహు పక్షమునా? మోషె దినములలో నీవు జీవించియుండిన యెడల, దేవుని ద్వారా బయలుపరచబడి రుజువుకాబడిన మోషె యొక్క వర్తమానమును నీవు నమ్మి ఆ వర్తమానము పక్షమున ఉండియుందువా? నీవు కోరహు, దాతానుల పక్షమున ఉన్నచో ఎట్లు౦డును? వారిట్లనిరి, "నీవొక్కడివే పరిశుద్దుడువా? నీవు చేయుచున్న కార్యములు మేమందరము చేయగలము." చూచారా? నీవు ఈ రాత్రి అందులో ఏదో ఒక పక్షమున ఉండవలసియున్నావు.
NUM 16:3
82నీవు దానియేలు పక్షమున ఉందువా? లేదా విందు ఇచ్చిన నెబుకద్నెజరు పక్షమున ఉందువా? నీవు వెలుపట ఉండి యుందువా? లేక ఆ గొప్ప విందులో ఉండి యుందువా?
ఒంటరిగా నిలబడి, మతిలేనివానిగా పిలువబడిన ఏలియా పక్షమున నీవు ఉండి యందువా? అతడు కొండమీద నిలబడెను, అతని బట్టతల సూర్యుని కాంతికి మెరయుచుండెను. అతని చేతిలో ఒక కొంకి కఱ్ఱ ఉండెను. కాకులు అతనికి ఆహారమంది౦చుచు౦డిరి పిచ్చివాడనిరి. లేదా ఆధునాతన వస్త్రములు ధరించిన స్త్రీలకు నాయకురాలైన యొజెబెలు మరియు యాజకుల గుంపుతో నీవు నిలబడియుండెడి వాడవా? ఏలియా అక్కడ నిలబడి శాయశక్తులా వారిని గద్దించెను. నీ భార్య విషయములో నీవేమి చేసెడివాడవు? కాస్థ ఆలోచించు. ఈ రాత్రి నిన్ను నీవు చూచుకొనుము.
LUKE 2:46,47
83అధికారపత్రములు లేనివానితో నీవు యేసు దినములో ఉండియుందువా? ఆయనకు ఏ శాఖల సంబంధము లేదు. వారిట్లనిరి, "నీవు ఏ స్కూలు నుండి వచ్చావు. ఇక్కడి మా రికార్డులలో నీ పేరు లేదు. ఇంత జ్ఞానము నీకెట్లు వచ్చెను? మేము ఈ సంగతులు నీకు బోదించలేదు కదా? ఎక్కడ నేర్చుకొంటివి. నీవు ఏ స్కూలులో చదివావు? నీవు మెథడిస్టువా, ప్రెస్బిటేరియనువా, బాప్టిస్టువా?" ఆయన దేనికి చెందిన వాడు కాదు. అది వాస్తవము. ఆయన వాక్యము. అది పూర్తిగా నిజము. ఆధునిక విశ్వాసము గల పరిసయ్యుల పక్షమున నీవు ఉండెడివాడివి? లేక దీనత్వము గల యాజకుని పక్షమున ఉండియుందువా? నైసీయా సభ యొద్ద పుట్టి సంస్థ పక్షమున ఉండియుందువా? లేక లూథరు పక్షమున ఆనాటినుండి యుందువా? ఆ తరువాత లూథరును సంస్థగా మార్చిరి. నీవే గుంపులో ఉండియుందువు? ఈ ఘడియకు వర్తమానముగా యివ్వబడిన బయలుపరచబడి, నిరూపించబడిన వాక్యము పక్షమున ఉందువా? లేక సంఘము తరుపున నిలబడెదవా? ఈ రాత్రి నిన్ను నీవు చూచుకొనుము.
MARK 11:17•
JOHN 6:62•
JOHN 8:46•
JOHN 10:20
84యేసును, ఆయన మర్మయుక్తమగు సంగతులను చూచిన అపోస్తలుల పక్షమున ఉండియుందువా? ఆయన బోధకుల మీద విరుచుకుపడి, "మీరు పాముల గుంపు" అనెను. వారు యధార్థపరులు, ముసలి బోధకులు. వాక్యమును చదివిరి. "మీరు దొంగల గుంపు, చచ్చిన సమాధులు, సున్నము కొట్టిన గోడలు, సర్ప సంతానము." ఆలాగు వారిని చీల్చి గద్దించిన ఆ కఠినుని పక్షమున మీరుండియుందురా? "నాలో పాపమున్నదని ఎవరు చెప్పగలరు? తండ్రి చెప్పినదే నేను చేయుచున్నాను."
వారిట్లనిరి, "వీని మాట వినవద్దు. వీనికి దురాత్మ పట్టినది. ఇతడు పిచ్చివాడు. దయ్యము పట్టినవాడు." "జ్యోతిష్యము చెప్పు ఆత్మ ఈతనికున్నది. అసలు వీని సంగతి తెలియునా? పెండ్లికి ముందే వీని తల్లి వీనిని గర్భము ధరించినది." "ఏ స్కూలులో చదివెను. వ్యాకరణ పాఠశాలకు కూడా ఇతడు వెళ్ళిన దాఖలాలు లేవు." ఆయన పన్నెండు ఏండ్ల వయస్సులో ఉన్నప్పుడు దేవుని వాక్యముతో ఆ యాజకులను ఓడించి ఆశ్చర్యపరచెను. "ఏ స్కూలు నుండి ఇతడు వచ్చెను?" పైనున్న స్కూలు నుండి, "మనుష్య కుమారుడు పైకి ఆరోహణమగుట మీరు చూచెదరు. ఆయన అక్కడి నుండియే వచ్చెను." చూచారా? అదే ఆయన స్కూలు.
MATT 21:13,27•
LUKE 19:46
85సమయము వచ్చినప్పుడు అపోస్తలులవలె మీరు ఆయనతో నిలబడుదురా? లేక మీరా డెబ్బదిమంది వలె "ఈలాగు బోధించినట్లైతే మేము మా సంఘమునకు వెళ్ళిపోదుము. నీవెవరవు? నీవు మావంటి మానవునివి. నీకే మేము భుజించాము. నీవేదో గొప్ప చెప్పబోతున్నావు. నిన్ను మేము కనిపెట్టి చూచాము. నీ బలహీనతలు తెలియును. నీవు ఏడ్చుట చూచాను. నీవు దీనిని, దానిని మరియు ఇంకా అనేక కార్యములు చేయుటను మేము చూచాము. నీవు మాతో కూడా అరణ్యములోనికి వెళ్ళుట మాకు తెలియును. నీవు కేవలము మనిషివి. పరలోకమునుండి దిగి వచ్చితినని చెప్పుకొనుచున్నావెందుకు? అది మరీ విపరీతముగా యున్నది" అని పలికి యుందురా? మీరు వారితో కలిసి వెళ్ళిపోయి యుందురు. మీరు ఆ డెబ్బది మందితో కలిసి వెళ్ళిపోయి యుందురా? లేక అపోస్తలులవలె క్రీస్తుతో కూడా నిలబడియుండెడి వారా?
86పరిశుద్ధ మార్టిన్ యేసు క్రీస్తు నామములో బాప్తిస్మమును సంఘములో అమలు చేయ ప్రయత్నించెను. అద్భుతములు, సూచక క్రియలు ఇంకా జరుగునని చెప్పి ప్రయత్నించెను. కాథలిక్కు చర్చి ఆయనను ఖండించి అసలు గుర్తించనేలేదు. అతడిని వెలుపలికి త్రోసి వేసినది. కాథలిక్కు సిద్దాంతములతో నీవు నిలబడుదువా? లేక పరిశుద్ధ మార్టిన్తో నిలచి యుందువా? అతడు మృతుల విగ్రహములను ఆరాధించుటకు తిరస్కరించెను.
చేర్చిన ఆచారములను అతడు త్రోసివేసెను. "వాక్యమే సత్యము" అని చెప్పెను. దేవుడు గొప్ప సూచక క్రియలను, అద్భుత కార్యములను అతని ద్వారా బయలుపరచెను. జరుగబోవునని ముందే చెప్పెను. అతడు దేవుని ఆత్మయందు నడిచి దానిని రుజవు చేసెను. ఒక్క యాజకుడు కూడా ఏమీ చేయలేకపోయెను. నీవు పరిశుద్ధ మార్టిన్ పక్షము వహించుదువా? లేక కాథలిక్కు సిద్దాంత పక్షమున ఉందువా?
87ఇప్పుడు, నీ ఎదుట దేవుని వాక్యమున్నది, సంఘ ఆచారమున్నది. నీవు సంఘ ఆచారములను వెంబడించెదవా"? లేక వాక్యమును అనుసరించెదవా? అన్ని కాలములలోను ఇప్పుడున్నట్లే యున్నది. ప్రజల మధ్య ఒక ప్రసిద్ధ నమ్మక ముండును, అది నిజ వాక్యమునకు కొద్దిగా భిన్నముగా యుండును. పూర్తిగా వారు వాక్యమును త్రోసివేయరని మీరు గుర్తుంచుకొనవలెను. క్రీస్తు విరోధి వాక్యమును త్రోసి వేయడు. దానిని నమ్ముచున్నానని చెప్పును. కాని వ్రాయబడియున్న దానినంతటినీ వాడంగీకరించడు. చూచారా?
88సాతాను హవ్వతో మాట్లాడెను. హవ్వ దానినంతటినీ నమ్మినా గాని అతడు ఆమెకు చెప్పిన విషయము కొంచెము మాత్రమే. వారు దానినంతటినీ నమ్మినాగాని అది కొంచెము మాత్రమే అది బాప్తిస్మమును గురించిన విషయమయినా లేదా మరే విషయమైనా గాని ఉండవచ్చును. నీవు దానిని చేయవలెను, ప్రతిదీ పాటించవలెను, ఇచ్చట యున్న ప్రకారముగానే నీవు దానిని చేయవలెను. కాని వాక్యము ఏమి చెప్పుచున్నదో దానిని అట్టే చేయవలెను. కాని వాక్యము ఏమి చెప్పుచున్నదో దానిని అట్టే చేయుటకు మొదట నీవు దానిని క్రియల ద్వారా చేయవలెను.
చేసిన వాక్యము నుండి కొంచెము మాత్రము నమ్మునట్లుగా చేయుటకై సాతానుడు హవ్వయొద్ద మొదటగా క్రియ చేయుటకు అది అతడు చేసిన తంత్రము. మరియు, ఈ మూడు తరగతుల ప్రజలను ఎప్పుడూ వేరుచేయును, వాక్యమే వీరిని వేరుచేసెను. ప్రతి యుగములోను ఆలాగే జరుగుచున్నది. ప్రతీ యుగములలో ఎప్పుడూ దాని విధానము అట్టే యుండును. దేవుడు ఒక కార్యమును రంగము మీద చేసినప్పుడు దానిని స్పష్టముగా గుర్తింపచేయును. అది ఆయన వాక్యమైయున్నది. విశ్వాసులమని చెప్పుకొనువారు చాలామంది యున్నారు. కాని వెనుదిరగని వారే విశ్వాసులు, వారు వాక్యమును నమ్ముదురు. నీవు వాక్యములో నిలచియున్నంత కాలమే వారు నిన్ను నమ్ముదురు. దీనిని దేవుడు ఎంతగా నిరూపించినను కూడా వారు నమ్మినదానికి విరుద్ధముగా ఒక చిన్న పొరపాటు వచ్చినప్పుడు "మంచిది, నేను - నేను - నాకు దాని గురించి తెలియదు," అని చెప్పెదరు. వారే అవిశ్వాసులు.
యూదావలె కూడా వుంటూ, అవకాశము దొరికినప్పుడు, "విషయము అదే" అని అతడివలె ఎవరైనా ఒకరి వీపు వెనుక పొడుస్తు" ఇప్పుడన్నా లేదా ఏదో ఒక దినమున అది ఆ విధముగానే జరుగుతాదని నేనెరుగుదును, ఆ సంగతి ఇదే" అని చెప్పుచున్నావా? అటువంటివాడు వేషధారియగును. ప్రతీదీ, ప్రతీ చిన్న కార్యమును మనము పరిశుద్ధ గ్రంథములో చూడగలము.
1THS 5:21
89కెంటకీలో పెరిగిన ఒక చిన్న బాలుడుండెను. అతడు ఎన్నడునూ అద్దమును చూడలేదు, కొండలలో పెరిగెను. ఒక చెట్టుకు చిన్న అద్దపు ముక్కను అంటించినా అతడెన్నడూ చూచుకోలేదు. అతడు ఒకసారి లూయస్విల్లోని తన సోదరి ఇంటికి వచ్చెను. ఆమె చక్కని గృహములో జీవించుచున్నది, పాత పద్ధతిలో నిర్మించబడిన ఇల్లు. అతడు పడక గదిలోనికి వెళ్ళినప్పుడు పెద్ద నిలువుటద్దము కనబడెను. ఇటు అటు పరిగెత్తుచూ ఆటలాడుచుండగా ఆ గదిలోని అద్దమును చూచి ఆగి పోయెను. ఆ అద్దములో కనబడుచున్న చిన్న జానీ మరో జానీని చూచెను. అతడు తలగోక్కొనెను, ఆ అద్దములోని జానీకూడా తలగోక్కొనెను. అతడు నవ్వెను, ఆ అద్దములోని చిన్న జానీ కూడా నవ్వెను. అతడు క్రిందికి పైకి ఎగిరెను, అద్దములోని చిన్న జానీ కూడా క్రిందికి పైకి ఎగిరెను. అతడు నిజమైన అద్దము నొద్దకు నడిచి వెళ్ళెను. ఆ బాలునితో ఆడుకొందునని తలంచెను. అతడు మరింత దగ్గరగా వెళ్ళగా అద్దము తగిలెను. "అమ్మా అది నేనే" అని అరచెను.
తల్లిదండ్రులు దీనిని గమనించుచుండిరి. నిన్ను నీవు గమనించితివా? ఆ మూడు రకములలో నీవు ఒకడివి. ఇందులోనికి నీవు చూడుము. నీవెవరివి? నీవు ఏ చిన్న జానీని అనుకరించుచున్నావు? అందులో నీవెవరవు? వారిలో నీవు ఒకడివి, మొదటి విషయమందే "అది తప్పు" అని చెప్పుచూ తన వీపును చూపించే ఒకడు అచ్చట యున్నాడు. చూడండి? నిన్ను నీవు వాక్యముతో పోల్చి చూచుకొనుము. నీవు సరిగ్గా నున్నావో లేదో పరీక్షించుకొనుము. వాక్యము ద్వారానే రుజువు కావలెను. ఆ విధముగా చేయమని యేసు చెప్పెను. "మేలైన దానిని పట్టుకొనుము." ఆయన అదే చెప్పెను.
90ఇప్పుడు, దేవుని వాక్యపుటద్దములోనికి చూడుము. గత కాలముల యందు నీవు ఈ మూడు గుంపులలో ఏ గుంపుకు చెందియున్నావో గుర్తించుకొనుము. ఆలోచించుము. నోవహు దినములలో లేక మోషే దినములలో లేక యేసు దినములలో నీవు జీవించియుండిన యెడల లేదా ఎవరో ఒక కాలమునందు, అది ఏ కాలమైనా గాని, నీవు ఏ పక్షమున నీవు గుర్తించుకొనెదవో ఒక్కసారి ఆలోచించి చూచుకో. దానిని గురించి నేటి రాత్రియందు రుజువగును
అటు తర్వాత, నీ స్థానము. ఇప్పుడు, కొద్దిగా ఆలోచించు. ఇప్పుడు ఇది చాలా లోతైనది. దీనిని పై పైనే చూడవద్దు; నీవు ఇప్పుడెట్లున్నావో చూచినచో అప్పుడెట్లుండి యుందువో అర్థమగును. నీకు నీవే తీర్పు చేసికొనుము. నీవేమైయున్నావో రుజువగును.
JOHN 6:62
91గౌరవనీయులారా, సేవకుల్లారా యేసు చెప్పిన మాట నమ్ముటకు కఠినముగా ఉన్నదని వారన్నప్పుడు నీవు ఏ పక్షమున ఉండియుండెదవు? ఆయన వాక్యమనే దానిని పరిపూర్ణముగా ఆయన నిరూపించబడిన తరువాత గమనించండి, ఆయన నోటి ద్వారా చెప్పిన ఆ మాట "మనుష్య కుమారుడు తాను వచ్చిన పరలోకమునకు తిరిగి ఎక్కి పోవుటను గూర్చి మీరేమందురు?" ఎన్నడూ అటువంటి మాటను వినియుండలేనందు వలన, వారు ఏమిటి? ఏమిటి? అని ప్రశ్నించసాగిరి.
"ఆయన ఎక్కడ పుట్టెనో నాకు తెలియును. ఆయన తండ్రి నాకు తెలియును, ఆయన తల్లి నాకు తెలియును. ఈయన పరలోకము నుండి దిగి వచ్చితిననియు తిరిగి పరలోకమునకు ఎక్కిపోవుదుననియు చెప్పుట వింతగా నున్నది." అని నీవనుచున్నావా? నీకది కొంత విపరీతముగా నుండును. అవునా? నీవది గ్రహించుట కష్టముగా నుండును. నేడును ఆలాగే యున్నది. అయితే దేవుని వాక్యపుటద్దములోనికి చూచి నీవు ఎక్కడ నిలబడియున్నావో కనుగొనుము. మానవులను మోసము చేయువాడా, దానిని నీవు ఎన్నటికీ చేయవద్దు.
92నీవు ఈ తరగతులలో ఏదో ఒకదానికి చెందియుందువు. నీవు ఇప్పుడున్న స్థితిని బట్టియు, నీ మనస్సును బట్టియు, ఇచ్చట కూర్చొనియుండి కనులకు కనబడుచున్న జనులారా, ఈ టేపును వినుచున్న కంటికి కనబడని జనులారా, ఈ టేపును వినిన తర్వాతా మీ మనస్థితి ఏ గుంపునకు చెందినవారో మిమ్మల్ని గురించి ఇది నిరూపించును. నీవు ఎచ్చటవున్నావో నిన్ను గురించి ఇది తెలుపును. నీవు వాక్యమును విశ్వసించే ఒక విశ్వాసివైతే దానితోనే నిలచియుండుము. నీకు యిష్టము లేకపోయి వెలుపలికి వెళ్ళిపోయినా లేదా ఈ టేపును ఆపుచేసినా, నీవు ఏమి చేయదువో దాని గురించి ఇది చెప్పును. గమనించితివా, ఈ టేపును వినుటకు నీవు ఇష్టపడవు, "దానిని వినుటకు ఇష్టము లేదని" నీవు చెప్పుచు ఈ టేపును ఆపు చేసెదవు. అతడు, అతడే అవిశ్వాసియగును. గమనించుము. నీవు ఈ టేపును ఆపుచేయకుండా "ఇది సత్యమా లేదా అసత్యమా" అనే దానిని గురించి పరిశోధించి చూడుము. చూచావా? లేదా
దీనిచుట్టూ తిరుగుచూ దీనితోనే వుంటూ ఏదో ఒక తప్పును కనిపెట్టవలెనని నీవు ప్రయత్నించినయెడల, అప్పుడు నీవు ఏ తరగతికి చెందిన వాడవో నీవెరుగుదువు. అది నీవెవరివని నీతో చెప్పును. దానిని నమ్మి దానిమీద నిలబడి, దానికి లోబడునట్లు దేవుడు సహాయము చేయును గాక వాక్యమునకు లోబడుము. ఆయనే వాక్యము. నీవది నమ్ముచున్నావా? ప్రార్ధి౦చుదుము.
93ప్రియ పరమతండ్రీ, కొన్నిసార్లు ఇది చెప్పుట చాలా కష్టము. దేశములోను, ప్రపంచములోను వేలాదిమంది ఈ టేపు ద్వారా దీనిని విందురు. ప్రియ ప్రభువా, ఇది సత్యము. ఇది నిజము. ప్రభువా, మొదట నా హృదయమును పవిత్రపరచుమని ప్రార్ధి౦చుచున్నాను. ఓ ప్రభువా, నన్ను పరిశోధించుము. పరీక్షించుము ప్రభువా, నా పై దృష్టించుము. నేను బలహీనుడను. నేను అలసిపోయాను. నేను సొమ్మసిల్లాను. నా గొంత తడియారినది. నా పెదవులు ఎండిపోయినవి. నా శరీరము క్షీణించి ముసలిదగుచున్నది. ప్రభువా, ఇంకెన్నోసార్లు ఈ విధంగా నేను చెప్పలేకపొవచ్చును. మరెన్నో సూర్యోదయములు నేను చూడకపోవచ్చును. తండ్రీ, ఇప్పుడు నన్ను పరీక్షించుము. నాకు తెలియకుండా ఏదైనా పొరపాటు నేను చేయుచున్నచో ప్రభువా, నాకు దానిని బయలుపరచుము. నాకు చూపించుము. నేను సరిదిద్దుకొనుటకు సిద్ధముగా యున్నాము.
దేవుని వాక్యమను అద్దములో నన్ను చూచుకొనుచున్నాను. నేనెక్కడ నిలబడి యున్నాను? నా రూపము యేసు క్రీస్తును ప్రతిబింబించుచున్నదా? అద్దములో ఆయననే నేను చూచుచున్నానా? నేను పాత నిబంధనలోని లేదా క్రొత్త నిబంధనలోని ఒక విశ్వాసినెవరినైనా చూచుచున్నానా? నేను వేషధారిని చూచుచున్నానా? వాక్యమును వినుటకు నిలబడకుండా శాఖయొక్క ఆచారమును వెంబడించుచున్న అవిశ్వాసిగా నేను ఉన్నానా?
చిన్న తప్పు పట్టుకొనుటకు నేను కనిపెట్టి చూచుచున్నానా?
MAL 3:6•
JOHN 6:63•
2TIM 3:5
94ప్రభువా, ఆలాగున్నయెడల నన్ను శుద్ధిచేయుము. నా హృదయము పవిత్రముగా, శుద్ధిగా నుండనిమ్ము నా జీవితమును సరిచేసికొన గోరుచున్నాను. సగంచేసి ఊరుకొనుట కాదు. నిజంగా చేయగోరుచున్నాను. తండ్రి సరియైన దానితో నేను అతుకబడియుండ వలెను. అంతేకాకుండా నేను స్త్రీ, పురుషులను తప్పుగా నడిపించకుండునట్లు చేయుము. అలాగయితే నేను ప్రేమించుచున్న ఈ జనులు పొరపాటులో పడుదురు.
ఈ రాత్రిలో నేను శాఖా సంఘమయినా లేదా సంఘముల సమాఖ్య అయినా సరియైనది అని చెప్పినయెడల నా తప్పును క్షమించుము. ప్రభువైన దేవా, ఎక్కువ మంది చేయునది సరియని నేననలేను. ప్రభువా! నేను ఒక క్రైస్తవునిగా నుండుటకు, నా తప్పులను క్షమించి ఈ ప్రజలు ఎచ్చట యున్నచో చక్కగా యుందురో అచ్చటకు వారిని నడిపించుటకు ప్రభువగు దేవా, నీవు నాకు సహాయము చేయుము. నన్ను శుద్ధిచేయుము.
నన్ను చూడుము. పైకి భక్తి పరులుగా కనిపిస్తూ వేషధారుల యొక్క వేషమును ధరించుకునే వారిని నేను చూచినప్పుడు నేను దానిని వారికి చెప్పినను, వారి, "నుంచి, అది ఎటువంటి బేధమును కలిగించదు. దానిని ఇప్పుడు దేవుడు దానిని ఎదురు చూచుట లేదు." అని చెప్పుతూ దానిని గురించి అసలు పట్టించుకోకుండా వెళ్ళిపోవుచున్నారు.
95ప్రభువా, నీవు మారని యేసుగా వున్నావని నేను నమ్ముచున్నాను. నీవు ఎప్పుడూ ఉండే అదే దేవుడుగా యున్నావు. నీవు మారని దేవునివి. ఈ బైబిలు నీ మాట అని నేను నమ్ముచున్నాను. నీవు, నీ వాక్యము ఒక్కటే అని నేను నమ్ముచున్నాను. వాక్యమును జీవింపచేయు పరిశుద్దాత్మను మాకు దయచేయుమని ప్రార్ధి౦చు చున్నాను. పునర్జీవింపజేయు శక్తిని మాకు అనుగ్రహించుము. ఏదో ఒక దినమున మా యొక్క జీవితమును ముగించబడి, మేము పునరుజ్జీవించబడి పరలోకమునకు, ఈ భూమికి పునాది వేయబడక ముందే నీ యొక్క ఆలోచనలలోయున్న ఆ ఉన్నత స్థలమునకు మేము ఎక్కి వెళ్ళెదము. దేవా! దానిని మాకు అనుగ్రహించుము. తండ్రీ, మా పాపములను క్షమించుము.
వాక్యమును నమ్ము నిజ విశ్వాసుల గుంపులో చేరని స్త్రీలైనను లేదా పురుషులైనను ఇంకా యున్నచో వారి హృదయమును నీవు శుద్ధిచేయుము. వారు నశించుట నాకు కనబడరాదు, దానిని అర్థము చేసికొనుట మాకు సహాయము చేయుము. ఒక తప్పు మరో తప్పుకు దారి తీయును. మేము సరిచేసికొనుటయే మార్గము. మా ప్రభువగు క్రీస్తు ద్వారా దీనిని అనుగ్రహించుము.
ISA 64:4•
1COR 2:9
96మన తలలతో పాటు మన హృదయములను వ౦చుదము. కొద్ది నిమిషములు ఆగండి. చిన్న బాలునిగానున్నప్పుడు నేను ఎక్కడో యున్నాను. అటువంటి ఒక దర్శనమును నేను చూడకుండా యుండిన యెడల నేను చెప్పేది తప్పై యుండును. ఆ దర్శనములో నేను చూచిన ఆ దృశ్యము చాలా వాస్తవమైనదిగా యున్నది. నాకు తెలియదు. నేను ఎక్కడో యున్నాను. ఆశీర్వదించబడినవారున్న స్థలమును చూచాను. నశించుచున్న స్థలము చూచాను. "ఓ దేవా, ఏ వ్యక్తిని ఇచ్చటకు రానియ్యకుము!" అని నరకమును చూచి అరిచాను. దాని భయంకరత్వమును ఏ నాలుక వివరించలేదు. మీకు నేను చెప్పలేను. మండుచున్న నరకము, అగ్ని గంధకములు అందున్నవని నీవు నమ్మినఎడల, నశించిపోయిన వారి స్థితియొక్క భయంకరత్వమును గూర్చియు, దాని వెనుకయున్న ఎంతో ఘోరమైన వేదనను దానితో పోల్చినప్పుడు నరకము అనేది ఏదో ఒక చల్లని పచ్చిక బయలు వంటి స్థలము కాదు ఆ స్థలమును గూర్చి, ఆ దుఃఖము గూర్చి చెప్పలేను.
ఆ సంగతులను గూర్చి చెప్పుటకు నేను ప్రయత్నించినను ఆ సంగతులు మానవ మనస్సుకు అందనివి. ఆశీర్వదించబడిన వారుండు స్థలమును నేను వివరించలేను. ఎంత ప్రశాంతము! చావు లేదు, ముసలితనము లేదు, వ్యాధి లేదు, నిత్య యవ్వనము, నిత్య ఆరోగ్యము, మరణమనేది లేదు. ఆశీర్వదించబడిన యవ్వనము, పాపము లేదు. దానిని ఏ విధంగాను వివరించలేను.
పరి. పాలు కూడా ఇట్లనెను. "కంటికి కనబడదు, చెవికి వినబడదు, హృదయమునకు గోచరము కాదు." దానిని మీరు అర్థము చేసికొనలేరు, దానిని వివరించు మార్గము లేదు, "దేవుని ప్రేమించు వారికి దేవుడు దాచియుంచినది అదే."
PROV 28:13
97ఇది నిశ్చయముగా సత్యము. ఇక్కడున్నవారు, బయట వినుచున్నవారు తప్పక ఇందులో ఒక తరగతికి చెందియుందురు. మీరు నిజమైన విశ్వాసులైనచో వాక్యము చేత పరీక్షించుకొనుడి. వాక్యము ఒక రకము గాను, సంఘము మరో రకము గాను చెప్పుచున్న యెడల మీరెటు వైపు ఉందురు? దేవుని వాక్యపుటద్దములో చూడండి. మీరే గుంపులో నిలబడియున్నారో చూచుకొనండి. మీరు విశ్వాసుల గుంపులో లేనియెడల ఈ రాత్రి ఇక్కడున్నవారు, బయట వినుచున్నవారు మీ కొరకు ప్రార్ధి౦చుచున్నాను. మీరును ఆ విశ్వాసుల గుంపులోనికి రావలెను. దేవుని ద్వారా దానిని నీవు గుర్తించుము, మీ తలలు, హృదయములు వంచి, కండ్లు మూసికొని దేవుని ముందు భయభక్తులతో ప్రార్ధి౦చుదువా? కొన్నిసార్లు జనులు కొద్దిగా భయపడుదురు. నీవు చేతులను ఎత్తి ప్రార్ధి౦చుటకై మీ ప్రక్కనయున్నవారి నిమిత్తము భయపడుచుందురు. కాని వారు నిలబడి "నేను తప్పు చేశాను" అని చెప్పగోరుచున్నారు.
"పాపమును దాచిపెట్టువాడు వర్ధిల్లడు గాని దానిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును." చూచారా? పాపమనగా ఏమిటి? - "అవిశ్వాసము." ఎందులో అవిశ్వాసము? — వాక్యములో
98ఇప్పుడు, మీరా తరగతికి చెందనియెడల మీరు బైబిలులో ఉన్న సంగతులను చూడండి. మీ తెవివితో చూడవద్దు. బైబిలులో చెప్పినది మీకు అర్ధము కాలేదు. కాని అర్ధము చేసికో వలెననియున్నాము. ఇట్లు చెప్పుము, "దేవా, నాకు గ్రహింపును ఇమ్ము నీకు లోబడెదను." మీరు చేతులెత్తి "నిన్ను ప్రార్థనలో జ్ఞాపకము చేసికొనుము'"అని చెప్పండి. దేవుడు మిమ్ము దీవించును. దేవుడు నిన్ను దీవించును. అది మంచిది. చూచారా?
నిజంగా దీని గూర్చి ఆలోచించండి. "నాకు తెలియనిది బైబిలులో ఏమి ఉన్నది? నేను విశ్వాసుల గుంపులో లేనేమోనని భయపడుచున్నాను. నేను ఆ డెబ్బది మందివలె యున్నాను. దేవుడు ఈ కార్యములు ఎట్లు చేయునో అర్థము చేసికొనుట నాకు కష్టముగా యున్నది. యేసు మారనివాడెట్లగును? నాకు అర్థమగుట లేదు. గ్రహించవలెనని కోరుచున్నాను. దానిని నేను నమ్మగోరుచున్నాను. దేవా నాకు అవిశ్వాసము లేకుండా సహాయము చేయుము. దానిలో నేనొక భాగముగా ఉండగోరుచున్నాను. వాక్యములో పాలిభాగస్తునిగా ఉండగోరుచున్నాను. అది నాలో ఉండవలెనని కోరుచున్నాను."
JOHN 5:24
99"మీరు నా యందును, నా యందు మీ మాటలును నిలిచియుండిన యెడల మీకేది ఇష్టమో అడుగుడి." - యోహాను 15. అది సత్యమని మనకు తెలియును. "మీరు నా యందు నిలచియుండుడి. లోపల మరియు వెలుపల కాదు, కాని "మీరు నా యందు నిలచియుండినయెడల," అయన వాక్యమైయున్నాడు. "ఆ మాటలు మీలోను నిలచి యుండినయెడల అప్పుడు మీరడిగిన ప్రతిదియు మీకనుగ్రహించబడును." మీకు దొరకును.
"నా మాటలు చేర్చుకొని నన్ను పంపినవానియందు విశ్వాసముంచువాడు మరణములో నుండి జీవము లోనికి దాటియున్నాడు." కాని మొదట నీవు వాక్యమును చేర్చుకొనగలవా? పూర్తి వాక్యమును, పూర్తి క్రీస్తును, వాక్యమును నీవు చేర్చుకొనగలవా? క్రీస్తే అభిషేకించబడిన వాక్యము. ఆయనే అభిషిక్త వాక్యము. క్రీస్తు అనగా "అభిషిక్తుడు." ఆ దినమునకు అభిషేకించబడిన వాక్యము రక్షకునిగా, విమోచకునిగా ప్రత్యక్షమాయెను. ఆయన ఎప్పుడైతే వచ్చెనో, ఆ అభిషిక్తుడైన వ్యక్తి యొక్క ఆ స్థానమును ఆయన తీసుకొనెను.
ZECH 14:7•
MAL 4:6•
JOHN 15:7
100ఈ చివరి దినములలో సాయంకాలపు వెలుగును ప్రకాశింపచేయుచున్నది ఈ పరిశుద్దాత్మయే. సంఘ శాఖల ద్వారా క్షీణించిపోయిన విశ్వాసము మరలా పునరుద్దింప చేయుచు, సంఘ శాఖలను ఖండించుచూ, పరిశుద్ధ గ్రంథముయొక్క మూల విశ్వాసమునకు, ఆది విశ్వాసమునకు, నిజ పరిశుద్ధ గ్రంథము యొద్దకు, అందులోని ప్రతీ వాక్యమును నమ్ముటకు, ఏదియు చేర్చకుండా అది ఏమి చేయుచున్నదో దానిని అట్లే చెప్పే ఆ నిజ విశ్వాసమునకు ఆయన మరల తీసుకొని వెళ్ళును. అది ఏమి చెప్పుచున్నదో దానిని ఆ విధముగానే నమ్ముటకు నీవు ఆశించుచున్నావా! మీరెన్నడూ చేతులెత్తలేదు. ఇప్పుడు చేతులెత్తి "దేవా, నన్ను జ్ఞాపకము చేసికొనుము" అని చెప్పండి.
ఆమెను దేవుడు దీవించును. యువకుడిని దేవుడు దీవించును. దేవుడు నిన్ను దీవించును. మంచిది. దేవుడీ చిన్నవానిని దీవించును. నా సోదరీ, దేవుడు నిన్ను దీవించును. నా కుడివైపునున్న సోదరిని దేవుడు దీవించును. వెనుకనున్నవారిని దీవించును. అక్కడున్న యువకుడిని, ఆ సోదరిని దేవుడు దీవించును. ఇటువైపునున్న నిన్ను దేవుడు దీవించును. ప్రభువు నిన్ను దీవించును. వెనుకనున్నవారిని దేవుడు దీవించును.
"ప్రభువా, నన్ను జ్ఞాపకము చేసికొనుము."
మీరు చేతిని నావైపు కాదు ఆయన వైపు ఎత్తియున్నారని జ్ఞాపకము చేసికొనండి.
నా వెనుకనున్న నిన్ను దేవుడు దీవించును. నీ చేతిని ఆయన చూచుచున్నాడు. నేను మరచినా ఆయన చూచును. నీ హృదయమును ఆయనెరుగును. నీ స్పందనను ఆయన ఎరుగును. నీ గురిని ఆయనెరుగును. నీ ఉద్దేశ్యమును ఆయనెరుగును.
సోదరుడా, దేవుడు నిన్ను దీవించును.
101"నేను వాక్యమంతా నమ్మగోరుచున్నాను." అని ఎవరో చెప్పుచున్నారు. దేవుడు నిన్ను దీవించును. దేవుడు నిన్ను దీవించును. "ప్రభువా, నాకు సహాయము చేయుము." ప్రభువు నీ చేతులను చూచుచున్నాడు. అవును. "నాకర్థము గాని సంగతులు ఉండును. నేను అవిశ్వాసిగా ఉండగోరుట లేదు. వాటిని నేను అర్ధము చేసికొనలేకపోయినా గాని నమ్మగోరుచున్నాను. "ప్రభువైన దేవా, నేను నమ్మగోరుచున్నాను. నాకు అపనమ్మకము లేకుండా సహాయము చేయుము'"అని చెప్పండి. దేవుడు మీకు తోడుగా ఉండును. దేవుడు మిమ్మును దీవించును. ఎన్నో చేతులు పైకి లేచియున్నవి. ఇంకా ఎత్తుచున్నారు.
"బ్రెన్హాం సోదరుడా, ఇది సహాయము చేయనా?" అని మీరడుగుదురు. నిజమగు ఉద్దేశ్యముతో నీ చేతిని పైకి ఎత్తి ఒక్కసారి చూడుము. నీకే అర్థమగును. నీ జీవితములో ఏదో జరిగినట్లు నీవే సాక్ష్యమిచ్చెదవు. ఏదో నిన్ను అక్కడ కూర్చో వద్దనుచున్నది. అయినా నీవు వచ్చావు. ఇదెట్టు జరుగునో అని ఆశ్చర్యపడితిని. "నేను యూదావలె ఉండకుండా ప్రభువు సహాయము చేయు గాక తప్పులు పట్టుకొనుటకు నేను వర్తమానమును వెంబడించకుండా దేవుడు నిషేధించు గాక ఓ! దేవా, నీ వాక్యము తోనే నిలచి యుండనిమ్ము లేనియెడల నేను అవిశ్వాసినగుదును, నేను విశ్వాసివలె ఉండగోరుచున్నాను. ఈ ఘడియ యొక్క దేవుని వాక్యమును నేను చూచాను. అందులో దేవునిని నేను చూచాను. ప్రభువా, ఆ వాక్యములో భాగస్తునిగా నన్ను చేయుము. దేవుని వాక్యములో భాగమై యుండగోరుచున్నాను." ప్రభువు నిన్ను దీవించును.
102ప్రార్ధి౦చుదము. ప్రతివారు మీకొరకు ప్రార్ధి౦చుకొనండి. నేను మీ కొరకు ప్రార్ధి౦చెదను. ఒక దినమున ఇక్కడ మనము కూడుకొనము. మనలో కొందరు తీసికోబడుదురు. మనందరము రాలేము. మనలో చాలామంది వృద్దులున్నారు. యువకులును మరణించవచ్చు. ఏ వయస్సులోని వారయినా చనిపోవచ్చును. మనము వేరవ్వవలసి యున్నాము. ఈ విషయమును నిర్ణయించుకోవలయును. తొందరగా నీవు అక్కడికి రాలేవు. మంచి మనస్సు యుండగానే రావలెను.
"చనిపోవు ముందు నేనది చేయుదును" అని అనవద్దు. నీ మతి సరిగ్గా యుండకపోవచ్చును. నీవు ఇంటికి చేరక ముందే ప్రమాదములో మరణించవచ్చు. గుండెపోటుతో నీవు చనిపోవచ్చును. ఏమి జరుగునో మనకు తెలియదు. దేవుడే ఎరుగును. బయట జనులు ఆ కిటికీల యొద్ద చేతులెత్తుట నేను గమనించుచున్నాను. చూచారా? అవును, దేవుడు దివించునుగాక.
JOHN 1:1
103నేను సరిచేయబడాలి, నేను సరిచేయబడాలి, ఇప్పుడే మనము సరిచేయబడవలెను.
నీ హృదయాంతరంగములో నుండి యధార్థముగా చెప్పుము. "ప్రభువైన యేసూ, ఏమయినా గాని, ఎవరేమన్నా గాని, నా జీవితములో నీ వాక్యమునకే ముందు చోటిచ్చెదను. నా జీవితములో దానిని కోరుచున్నాను. నీవే వాక్యమైయున్నావు. బైబిలు ఆ విధంగా చెప్పెను. బైబిలు దేవుని వాక్యమని నేను నమ్ముచున్నాను. అందులోనికి ఎక్కించిన ఆచారములు, బోధలు వలన వేషధారుల గుంపు తయారయినదని నేనెరుగదును. ప్రభువా, అట్టిదాని నుండి నన్ను శుద్ధిచేయుము, పూర్తిగా నీవానినగుదును, నీ వైపు నా చేతులెత్తి యున్నాను, నీవైపు నా హృదయము ఎత్తియున్నాను, నా స్వరము, నా ప్రార్ధన వినుము. దేవా, నన్ను కరుణించుము."'ప్రభువా, నా చేతులు పైకెత్తియున్నాను. ఓ ప్రభువా, సమస్త అవిశ్వాసము నుండి నన్ను శుద్ధిచేయుము.
MATT 24:22•
MARK 13:20
104మరణము చూడకుండా దేవునితో నడిచిన హనోకువలె నన్ను శక్తితో నింపకపోయినా ఒక మధ్యాహ్నము ఆయనతో నడిచి గృహమునకు ఆయనతో వెళ్ళునట్లు చేయును. దేవా, అది జరుగునని నమ్ముచున్నాను. చివరి దినములలో ఎత్తబడుట యుండునని నేనెరుగుదును. పని కుదించబడును. తండ్రీ, ముప్పది ఆరు సంవత్సరముల తరువాత పని ఇక ఉండదని నా కేలెండరు బట్టి చెప్పుచున్నాను. నీవు ఆ కాలములోగా రావలసియున్నావు. లేనియెడల ఏ శరీరియు రక్షించబడడు. ప్రపంచ సంఘటనలను పరిశోధించువారు కూడా మేము ఎన్నోసంవత్సరాలు ముందుకు పోయినట్లు చెప్పుచున్నారు. వారును కేలెండరు బట్టి చెప్పుచున్నారు. బహుశా ఇంకా పదిహేను లేదా ఇరవై సంవత్సరములే మిగిలియుండవచ్చును. తండ్రీ, నాకు తెలియదు. కాని కేలెండరు బట్టి చూచినచో ఆ దరిదాపుకు వచ్చియున్నామని తెలియును
JOHN 6:63•
1COR 10:7•
1COR 11:3•
1COR 12:12,27
105ప్రభువా, ఇక ఏ నిరీక్షణ మిగిలిలేదు. ఆ బాంబులను ఒకరిపై ఒకరు విసరుకొన్న యెడల ఇక యుద్ధరంగమే ఉండదు. ప్రభువా, వారు ఒకరినొకరు నాశనము చేసికొందురు. అవి ఎదురుచూచుచున్నవి. భూమ్యాకాశములు అగ్నితో లయమగునని బైబిలు చెప్పుచున్నది. దేవా, ఆ ఘడియ సమీపించుట నేను చూచుచున్నాను.
అధ్యక్షుని హత్యను గూర్చి నేను ఆలోచించుచున్నాను. ఆ హంతకుని నేర విచారణ చేయక ముందే మరొకడు వానిని కాల్చవేయుననిపించుచున్నది. ఓ! దేవా, వారిద్దరూ సమాన దోషులే. వారది చేయు హక్కు కలిగిలేరు. మా స్వదేశములోనే దుర్మార్గత పెరిగియున్నది. క్రైస్తవ దేశముగా ఉండవలసినది, ప్రభువా, క్రైస్తవులముగా ఎంత ఘోర మాదిరిని చూపుచున్నాము. ప్రభువా, మా పాపములను క్షమించుము. అధ్యక్షుని హత్యను గూర్చి నేను ఆలోచించుచున్నాను. ఆ హంతకుని నేర విచారణ చేయక ముందే మరొకడు వానిని కాల్చివేయుననిపించుచున్నది. ఓ! దేవా, వారిద్దరూ సమాన దోషులే. వారది చేయు హక్కు కలిగిలేరు. మా స్వదేశములోనే దుర్మార్గత పెరిగియున్నది. క్రైస్తవ దేశముగా ఉండవలసినది, ప్రభువా, క్రైస్తవులముగా ఎంత ఘోర మాదిరిని చూపుచున్నాము. ప్రభువా, మా పాపములను క్షమించుము. ఓ దేవా ముఖ్యంగా క్రీస్తు యొక్క మర్మయుక్త శరీరములోనికి బాప్తిస్మము పొందిన నీ సంఘమునకు సహాయము చేయుము. "ఆత్మయే జీవింపచేయును." నీవిట్లు చెప్పితివి, "మనుష్య కుమారుడు పైకెత్తబడినట్లుగా, ఆయన శరీరమును పైకెత్త బడును. ఆయనే శిరస్సు. సంఘము ఆయన శరీరము." ఓ దేవా, శరీరమును శిరస్సు నడిపించును. వాక్యము యొక్క అధిపత్యము క్రీస్తు శరీరమును నడిపించును గాక! ప్రభువా, ఆ శరీరములో నేనొక భాగమై యుందును గాక!
PS 139:23,24•
JOHN 17:17•
2PET 3:10
106చేతులెత్తిన వారికొరకు, వచ్చిన వారందరి కొరకు, టేపు వినుచున్న వారికొరకు ప్రార్ధి౦చుచున్నాను. ప్రభువైన దేవా, వారిని అంగీకరించుమని యదార్థముగా ప్రార్ధి౦చు చున్నాను. వారి హృదయములను చూడుము. వారేమైయున్నారో నీకు తెలియును. కాని నీ దాసునిగా ప్రజల పక్షమున విజ్ఞాపన చేయుచున్నాను. ప్రభువా, వారిని నేను ప్రేమించుచున్నాను దీనిని నీవే చేయమని నాకు ఆజ్ఞాపించితివి గనుకనే నేను వారిని ప్రేమించి ఇది చేయుచున్నాను. తండ్రీ, నాకు సాధ్యమైనంత శక్తితో దీనిని చేయుచున్నాను. నా చిన్న తప్పులను క్షమించుము. నాకు బలము అనుగ్రహించుము. జనులకు మరింత తేటగా బయలుపరచుదును.
ఈ రాత్రి ఆలయములో మాతో ఉండుము. ఆలయములో చేతులను ఎత్తిన వీరిని ప్రభువా చూడుము. ఓ ప్రభువా, నన్ను పరిశోధించి తెలిసికొనుము. నాలో ఏదయినా పొరపాటున్నచో తండ్రీ శుద్ధిచేయుము. -ఈ సంఘమును శుద్ధిచేయుము. ప్రభువా, మా అందరినీ పవిత్రపరుచుము. వాక్యము మా మధ్య శరీరధారియై నేటి ప్రపంచమునకు వెల్లడియగునట్లు చేయుము. తండ్రీ, ఇది అనుగ్రహించుము. నన్ను ఈ జనులను, ఈ అంశమును నీకు అప్పగించుకొనుచున్నాము. యేసు క్రీస్తు నామము పేరట మా ఆత్మలకు రక్షణ వాగ్ధనమును ఇమ్ము దయచేయుము. దేవుని శక్తి మా పైకి వచ్చి మమ్ములను అభిషేకించును గాక సంఘకాపరి మొదలుకొని కావలివాని వరకు నీ అభిషేకము నొందుదురు గాక ఇక్కడున్న ప్రతి వ్యక్తి అభిషేకించబడును గాక పరిశుద్దాత్మవచ్చి మా హృదయములను ఆవరించి దేవుని యొక్క ప్రతి వాగ్ధనమును నెరవేర్చును గాక! నీ వాక్యమే సత్యమని నిరూపించును గాక! యేసు నామములో ప్రార్ధి౦చుచున్నాను.
MATT 10:38•
LUKE 14:27
107మనము తలలు వంచియుండగా ఆర్గానిస్ట్ వచ్చి "నా రక్షకుని పిలుపు వినుచున్నాను. ఆయన నడిపించు చోటకే వెళ్ళేదను. ఆయనను వెంబడించెదను. " అను పాటను వాయించవలెనని కోరుచున్నాను.
నా రక్షకుడు పిలచుచున్నాడు
(ఆయనెవరు? వాక్యము)
నా రక్షకుని పిలుపు నేను వినుచున్నాను.
నా రక్షకుని పిలుపు నేను వినుచున్నాను.
(నీ ఆచారములు త్రోసివేయుము)
నీ శిలువ నెత్తుకొని వెంబడించుము.
"తన సిలువ నెత్తుకొని వాక్యమగు ఆయనను వెంబడించనివాడు ఆయనకు శిష్యునిగా నుండ యోగ్యుడు కాడు."
ఆయన నన్ను నడిపించు చోటకే వెళ్ళెదను. (తిరిగి బైబిలు
యొద్దకు ఆయన నడిపించును) ఆయను నన్ను నడిపించు చోటకే నేను వెళ్ళెదను.
ఆయన నన్ను నడిపించు చోటకే నేను వెళ్ళెదను.
(ఆయన నామములో బాప్తిస్మమునకు నడిపించినా,
నా అవమానము తొలగించుటకు
వేదిక యొద్దకు నడిపించినా గాని వెళ్ళెదను)
తీరులో కూడా వెళ్ళెదను.
అది ఇప్పుడే, నీవే పక్షమున ఉన్నావు? దేవుని అద్దమగు బైబిలులో నీవెట్లు కనబడుచున్నావు? వాక్యము ద్వారా తీర్పు తీర్చబడుదువు?
నేను వెళ్ళెదను.
"ఎంత వెల చెల్లించినా గాని వాక్యముతో నేను వెళ్ళెదను. దేవుని తీర్పుగుండా నేను వెళ్ళుచున్నాను. నన్ను అవిశ్వాసినిగా చేయకుము. వాక్యము నమ్మువిశ్వాసిగా చేయుము.
ఆయనతో మార్గమంతా నడుచుదును,
ఆయన నన్ను నడిపించు చోటకి వెళ్ళేదను…
ఇప్పుడు అయిపోయినది. జాగ్రత్తగా వినండి.
ఆయన నన్ను నడిపించు చోటకి వెళ్ళేదను
ఆయన నన్ను నడిపించు చోటకి వెళ్ళెదను.