సాక్ష్యము
11, డాన్ సోదరుడా, వందనములు. ఇది ఒక రకమగు ఆకస్మిక ఆశ్చర్యము. ["ఒక చక్కనిది" అని ఎవరో చెప్పిరి.] ఆవును. అది… దానినీ చెప్పిన వారికి వందనములు. మీకు చాలా వందనములు.
ఆ పాటలను నేను ఆనందించాను. వానిని నేను వినగోరుదును! మంచి గానమును నేను ప్రేమించుదునని మీరెరుగుదురు. ఇక్కడకు నేను వచ్చినప్పుడు సమృద్ధిగా నేను అది వినుచున్నాను. మామూలుగా నేను… స్వస్థతా కూటము లేదా మరేదో ఆరాధనకు నేను వచ్చునప్పుడు నాకు నేను ఒంటరిగా ఉండుట జరుగును. బాలురు ఈ టేపులను తీయుదురు. అప్పుడు నేను ఇంటిలోనో, లేదా ఆఫీసులో పనిచేయుచున్నప్పుడో కూర్చొని ఆ టేపులను విందును, మరలా మరలా తిరిగి విందును. అప్పుడు చెప్పిన ప్రతి దానిని నేను విందును.
2సువార్తలో, పాత మిత్రుడగు సహూదరుడు గెర్ హెల్టర్ను ఇక్కడ ఈ ఉదయాన చూచుటకు సంతోషించుచున్నాను. రోగులకు ప్రార్థించు ఈ పనిలో ఎన్నో సంవత్సరముల నుండి ఆయన ఉన్నాడు. బహుశా నాకు రోగులకు ప్రార్థించవలెనని తెలియక ముందు నుండే అనుకొనుచున్నాను. ఆలాగే ఇతర వ్యక్తిగత స్నేహితులును ఉన్నారు. జేఫర్సన్-విల్ లోని ఆలయము నుండి వచ్చిన గొప్ప పరివారమును ఇక్కడ గతరాత్రి నేను చూచాను. మనము అందుకు చాలా సంతోషించుచున్నాము.
సహూదరుడు యంగ్ బ్రవున్ ను నేను కలిసికోన్నాను, "అతని పేరు 'యంగ్' అని సహూదరుడు జాక్ చెప్పినది సరిగ్గా అతనికి తగునని," నేను అన్నాను. అతడు నాకు చెప్పినప్పుడు అరవై ఏండ్ల వయస్సు గలవాడు. నేను నమ్మలేకపోయాను. ఇక్కడ శ్రివ్-పోర్టులో మొదటిసారి చూచినప్పటికీ ఇప్పటికీ ఏమి మారలేదు. అది నిజము. ఆలాగేయున్నాడు.
3మంచిది, దేవుడు మనకు ఉపకారి. ఈ ఉదయాన పాటలు, ఆ విధానము నా కిష్టము, దాని భావము లోతైనది; అది వాస్తవమైనది, అర్థవంతమైనది. దానిలోనిది మీరు త్రాగగలరు. అక్కడ వారు కీర్తనలు 23 గూర్చి పాడుచున్నప్పుడు, నేను విని గట్టిగా మొర్ర పెట్టకుండా ఉండలేకపోయాను. ఆ తరువాత ఈ చక్కని పాట వచ్చెను. అక్కడున్న ముగ్గురు పాడిరి. దానిని ఆలోచించుట …
దానిలో ఏదో యున్నది. నీ అంతరంగములో దానిని నీవు అనుభవించెదవు. నీ ఉద్రేకములు తారాస్థాయికి లేచును. దేవుని రాజ్యము సమీపమందున్నదని ఎరుగుదువు. మనము మాట్లాడుకొనుచున్న, ఆశ్చర్యపడుచున్న ఈ సంగతులన్నియు ఇప్పుడు జరుగనైయున్నవి. ఆ సమయము రాకముందే మనలో కొందరము నిద్రించవచ్చును, కాని ఇది మన పునరుత్థానమును ఆపదు, ఎందుకనగా అది మనకు మార్పు పొందిన వారికంటే ముందుగా వచ్చు భాగ్యమును ఇచ్చును.
1THS 4:16,17
4"దేవుని బూర మ్రోగును. క్రీస్తునందు మృతులు ప్రధమమున లేతురు. ఆ మీదట సజీవులమై నిలచియున్న మనము మారుదుము." పునరుత్థాన క్రమమును మీరు గుర్తించారా? "వారితో పాటుగా పైకెత్త బడుదుము." ఆయనను కలిసికొనకముందే మనము ఒకరినొకరము కలిసికొందము "మధ్యాకాశములో ప్రభువును ఎదుర్కొనుటకు మనమందరమును కొనిపోబడుదుము."
చూడుడి, ఆయన దేవుడు, ఆయన ఆరాధింపబడగోరును, ఆరాధింపబడగోరుట ఆయన యొక్క స్వభావము, ఎందుకనగా ఆయన దేవుడు. అక్కడ మనమున్నామో లేదో ఆయన ఎరుగును. మరియొకరు అక్కడ ఉన్నారో లేదో నీ కనుసన్నలలో నుండి బయటకు చూచును, కాని అది స్వేచ్ఛా ఆరాధన యొక్క పూర్తి విధానము కాదు. అక్కడ మనము నిలబడినప్పుడు మొదటగా మనము ఒకరినొకరము కలిసికొన్నామని ఎరుగుదుము, ఒకరి నొకరము అభినందించుకొందుము. దానంతటికీ కారణమగు ఆయన ప్రక్కన అప్పుడు నిలబడుదుము. విమోచనా గీతము పొడుదుము! సహూదరుడు జాక్ చాలా సార్లు ఈలాగు చెప్పుట జరిగినది, "మనము దేనిగూర్చి మాట్లాడుకొనుచున్నామో ఎరుగక దేవదూతలు తలలు వంచి భూమి చుట్టూ ఉందురు." చూడండి, ఎందుకనగా అవి ఎన్నడూ విడిపింపబడలేదు కాని మనము విడిపింపబడవలసి యున్నాము. ఆయనను రాజులకు రాజుగా, ప్రభువుల ప్రభువుగా కిరీటము ధరింప చేయుదుము.
5ఏమి చెప్పవలెనో నాకు తెలియదు. ఏది చెప్పవలెనని నేను అనుకొనలేదు; ఏదో ఇక్కడికి వచ్చారు, సాక్ష్య సమయమనుకొంటాను. ఒక సాక్ష్యము ఇవ్యవలెను. కనుక ఈ రాత్రి ప్రభుని చిత్తమయితే… ఆరాధనల యొక్క చిన్న కార్యక్రమము చూచాను, ఈస్టరు మీద ఈ రాత్రి నేను ప్రసంగించవలెననుకొంటాను. క్షమించండి, ఈ రాత్రి కృతజ్ఞతలు చెల్లించు వర్తమానము, ప్రభుని చిత్తమయితే, తక్కిన వారమంతయూ రోగుల కొరకు ప్రార్థించుటకే మనము తీసికొందము, ఈ వచ్చుచున్న ప్రత్యక్షతతో దాదాపు మూడు సంవత్సరాల క్రితము ఒకసారి శ్రివ్-పోర్టులో జరిగిన ఒక గొప్ప కూటమునకు జ్ఞాపకార్థముగా ఈ సంతోష కృతజ్ఞత చెల్లించు చిన్న ఆరాధన అయిన పిదప మీరు బయట కూడుకొనవలెనని కోరుచున్నాము. ఆ కూటములో ఇక్కడ ప్రభువు బలముగా ఆశీర్వదించెను! అది ప్రభువు కొనసాగించునని నేను నమ్ముచున్నాను. పైనున్న దేవుని గొప్ప నమోదు కేంద్రములోని గ్రంధమందు క్రీస్తును రక్షకునిగా అంగీకరించి, ఆయన ఆత్మతో నింపబడు చివరి పేరు వచ్చువరకు ఇక్కడ అత్మలు రక్షించబడును గాక.
MAL 3:10
6ఇప్పుడు మనము ఒక్క క్షణము తలలు వంచుదము. ఇక్కడ ఒక వాక్యమును నేను ఆలోచించుచున్నాను.
ప్రభువైన యేసూ, ఈ ఉదయాన మేము అత్యంత కృతజ్ఞత కలిగిన జనులముగా ఉన్నాము, కాని దానిని వ్యక్తపరచుటకు మేము పరిమితిని కలిగియున్నాము. మేము కోరుదానిని బయట పెట్టుటకు మా హృదయములు చోటు ఇచ్చినచో, మేము ఎట్లు ప్రవర్తించుదుమో మాకే తెలియదు. "మా మీద దేవుడు కుమ్మరించు దీవేనను పట్టుకొనుటకు చాలినంత స్థలము లేదు," అని నీవు చెప్పిన మాటలో ఆశ్చర్యములేదు, దీనికి మేము కృతజ్ఞులము. నీ గౌరవార్ధము ప్రభువా, మేము తలలు వంచి మా కృతజ్ఞతార్పణలను స్వీకరించమని ప్రార్థించుచున్నాను. మేము కృతజ్ఞత చూపించవలసినవి ఎన్నో ఉన్నవి, వాటిని మేము వివరించజాలము, కాని మేము కేవలము "దేవునికి వందనములు" అని చెప్పుదుము.
7అన్నింటి కన్న ఎక్కువగా మా విడుదల కొరకు ఒక మార్గముగా దేవుడు తన కుమారుని ఈ లోకమునకు గొప్ప కానుకగా ఇచ్చినందుకు మేము వందనములు చెల్లించుచున్నాము. దాని కొరకు మేమెంతో కృతజ్ఞులము, దానిని మేము హత్తుకొనుచున్నాము…
ప్రభువా, నేను దేనికొరకు జీవించానో చిన్నప్పటి నుండి నేను ఎరుగుదును, ఇతడు నేను వృద్దుడనగుచుండగా సూర్యుడు అస్తమించునని ఎరుగుదును. ఎంతోకొలము లేదు, నేను త్వరలోనే పిలువబడుదును, దేని కొరకు జీవించానో అది అనుభవించుటకు వెళ్ళుదును. ఆ విధంగానే ఈ ఉదయాన ఆ సమయమును చూచుట కొరకు అనేకమంది అదే రాజ్య సహపౌరులు ఎదురుచూచుచున్నారని ఎరుగుదును, అందుకొరకే మేము ఈ ప్రయాణమును స్వీకరించి ఆయనను సేవించి నిత్యజీవము కొరకు త్వరలో సమీపించుచున్న ఆ గొప్ప ఘడియకు ముందు మా సహమానవులను నడిపించుటకు ప్రయత్నించుచున్నాము. మేము ఆలోచించ కలిగిన దానికన్న అది సమీపముగా ఉన్నదని మాలో మేము ఏదో అనుభూతి కలిగియున్నాము.
ఇప్పుడు మమ్మును దీవించమని ప్రార్థించుచున్నాము. ఈ ఉదయమున నీవనుగ్రహించుచున్న దీవెనలతో ఆశీర్వదించ కొనసాగించుము. ఇప్పుడు మేము నీ వాక్యములో ఒక భాగము లేదా ఒకటి రెండు వచనములు చదువనైయుండగా, ఆ గొప్ప పరిశుద్ధాత్మ ఆ వచనములను తీసికొని ఆయన మహిమ కొరకు సాక్ష్యమును స్వీకరించుమని ప్రార్ధించుచున్నాము, యేసు నామమున ప్రార్థించుచున్నాము. ఆమేన్.
2COR 9:14,15
8II కొరింథీయులకు 9:14, 15 వచనములలో అది ఉన్నదని నమ్ముచున్నాను.
… మాయెడల దేవుడు కనుపరచిన అత్యధికమైన కృపను చూచి, వారు మీ నిమిత్తమై ప్రార్థన చేయుచూ, మిమ్ములను చూడవలెనని ఎక్కువ కోరిక గలవారైయున్నారు.
చెప్ప శక్యము కాని ఆయన వరమును గూర్చి దేవునికి స్తోత్రము.
పౌలు, ఇక్కడ మీలో నున్న దేవుని కృపను గూర్చి మాట్లాడుచున్నాడు. చెప్ప శక్యము కాని వరమయిన పరిశుద్ధాత్మ జనుల మధ్య నివాసము చేయుచున్నది. వారు తాము కలిగియున్న దానిని బట్టి దేవునికి వందనములు చెల్లించుచున్నారు. దేవుని యొక్క చెప్ప శక్యము గాని వరము అగు పరిశుద్ధాత్మ వారి మీదికి వచ్చియున్నది, ఎంతో ఐశ్వర్యము, మరియు పవిత్రమైనది.
2COR 9:14,15
9ఇప్పుడు, నా మనస్సులో సరిగ్గా ఏదీలేదు, కాబట్టి గత కొద్ది దినములలో క్రీస్తుతో నా యొక్క అనుభవమును ఒక చిన్న సాక్ష్యముగా ఇవ్వ గోరుటకు ఆలోచించుచున్నాను. అది ఎంతో మహిమ గలది!
నా జీవితమంతా మీకు తెలిసినదే. మీలో అనేకులు నేను చెప్పగా విన్నారు. ఇక్కడ కూర్చొని ఉన్న కొందరు ఆలయ ప్రజల కొరకు దీనిని నేను చెప్పెదను… మూడు దేశముల నుండి వచ్చిన జనులతో నా ఆలయము తయారయినది. ఉదయకాలమున మెక్సికో, కెనడా, అమెరికా వారికి ప్రసంగించెదము … ఒక రోజున ఇక్కడ ఒక చిన్న ఆదివారపు బడి ఆరాధనకు ఇరవై-ఎనిమిది వివిధ రాష్ట్రముల నుండి జనులు వచ్చిరి. చూడండి. ఇరవై-ఎనిమిది దేశముల ప్రతినిధులు, దీనిని నేను దేవుని మహిమ కొరకు చెప్పగోరుచున్నాను. ప్రయాణములో అనుకొందును… మేము త్రోసివేయబడినవారముగా, సంఘ ప్రపంచముతో విసర్జించబడి, ఈనాడు సంఘములుగా పిలువబడుచున్న వారితో తిరస్కరించబడిన మేము ప్రార్థన, విజ్ఞాపనల ద్వారా ఈ ఆలయము ప్రపంచములో నేనెరిగిన ఏ స్థలము కంటెను దేవుని కృపకు ప్రధాన కార్యాలయముగా బలముగా ఎదిగియున్నది. అక్కడ ప్రభువు చేయుచున్న కార్యములను మరెక్కడా నేను చూడలేదు, ఆయన అక్కడ చేయుచున్నది ఏలాగు చెప్పవలెనో చేత కాదు, కేవలము దీనత్వము, జనులు ప్రతి చోట నుండియూ వచ్చుచున్నారు. ఆ చిన్న కేంద్రము కొరకు మనము కృతజ్ఞులము. కృపను అనుభవించుటకు, కృపను ఇతరులకు విస్తరింప చేయుటకు దేశము చుట్టూ వున్న ప్రజలు కొందరు కూడుకొనుచున్నారు.
10నా జీవితమంతయూ పశ్చిమానికి వెళ్ళవలెనని నాకు కోరిక యుండినది. ఆ గాధలు మీలో చాలా మంది చదివారు. టేపులు విన్నారు.
టేపు పరిచర్య ప్రపంచ వ్యాప్తమైనది. ప్రతిచోట ఉన్నది, వర్తమానమును అన్యదేశములలోనికి, తర్జుమా కాబడవలసిన ప్రదేశములలోనికి వెదజల్లుటకు దేవుడు ఆ విధానమును కలిగియున్నాడనుకొనుచున్నాను. జర్మనీ, తదితర చోట్ల సంఘములలోను, వందల కొలది జనుల మధ్యను టేపులు వాడుతున్నారు. ఆ చిన్న వస్తువులను తమ చెవులలో పెట్టుకొని, వాటిని ఒక టేపు మీదికి ఎక్కించుచున్నారు, ఇక్కడ నేను మాట్లాడుచున్నట్లుగానే, అక్కడ సేవకుడు నిలబడి అదే రీతిగా కదలికలు చేయును. ఇతర భాషలలోనికీ, వందలాది జనులకు దానిని అందించుచున్నారు. వందలాది మంది రక్షించబడి, స్వస్థత పొందుచున్నారు. ప్రపంచమంతట టేపుల ద్వారా ఈలాగు జరుగుచున్నది. అంతా ఇంగ్లీషులోనే యున్నది, కాని ప్రపంచములోని ఆదిమ తెగల భాషలతో సహా అనేక భాషలలోనికి అనువదించబడెను. ఉత్తరముల ద్వారా తిరిగి వారి నుండి ఈ సంగతి వినుచున్నాము.
11దేవుని మహిమ కొరకు ఒక వ్యక్తిగత సాక్ష్యముగా ఉండుటకు దీనిని నేను చెప్పుచున్నాను, ప్రభుని చిత్తమయితే రానున్న రాత్రులందు నేను చెప్పగోరు దానిని మీరు దీనిని బట్టి అర్థము చేసికొందురు. మీరు అర్థము చేసికొందురు. ప్రపంచము రాజకీయంగా, సాంఘికంగా, ఆర్థికంగా తునాతునకలయి పోవుచున్న పరిస్థితికి వచ్చియున్నదని నేను గత రాత్రి చేప్ప ప్రయత్నించినట్లుగానే.
"ఆర్థిక శాస్త్రమా? ఎక్కువ ద్రవ్యమా!" అని మీరడుగవచ్చు.
అవును, కాని అది ఎక్కడ నుండి వచ్చుచున్నది? ఇప్పటి నుండి నలుబది సంవత్సరములు చెల్లించవలసిన వడ్డీకి మనము అప్పు చేసియున్నాము. విచ్ఛిన్న పరిస్థితి. దేశము దివాలా తీసెను; ఈ దేశమే కాదు, కాని అన్ని దేశములు. తిరిగి దానిని సంపాదించు మార్గము ఏదీ లేదు. ఈ దేశమును దేనిలోనికో పడవేయుటకు సరిగ్గా వల పెట్టబడెను. ఆ విషయంలో మీరందరూ జ్ఞానులే. సరే! ప్రపంచ సంపదను ఎవరు కల్గియున్నారు? ఎవరు దానిని పట్టుకొనియున్నారు? [ఎవరో, "రోమ్" అని చెప్పిరి.] నిశ్చయంగా! రోమ్ దానిని పట్టుకొని యున్నది. ఈ విస్కీ మొదలగు వాటిని ఉత్పత్తి చేయుటకు, ఈ పెద్ద వ్యాపారులకు బదులుగా మనసు చొరబడవలసి వచ్చినప్పుడు ధ్వంసమగుదుము… డబ్బును సంపాదించవలె నన్నచో మనము ద్రవ్యమునయనా మార్చవలెను, లేదా అప్పు చేయవలెను. ఆ విధంగా చేసినప్పుడు వాక్యము చెప్పినట్లుగా ఖచ్చితంగా జన్మహక్కును అమ్మివేసినట్లే.
12ప్రభుని చిత్తమయితే, రంగము మీదికి తెర వచ్చుట ఏదో సమయమున జరుగుట కొరకు ఎదురు చూచుచున్నాను. ఆ స్థలమునకు రాగోరుదును. ఇప్పుడు తొందరగానే అది వచ్చునని నమ్ముచున్నాను.. త్వరలోనే నేను ప్రపంచవ్యాప్తముగా వెళ్ళుదును. ఇప్పుడు నాకు ప్రపంచవ్యాప్త కూటములు వచ్చుచున్నవి. దాదాపు ఆరు వారముల పాటు కూర్చొనేందుకు ఒక స్థలములోనికి వెళ్ళగోరుచున్నాను, సంగతులన్నింటినీ ముందు వెనుక వాక్యము ద్వారా చూడవలెను. చూచారా.
మనము జీవించుచున్న ఘడియను చూచుట ఎంతో ఆశ్చర్యకరము! అది నన్ను భయపెట్టుచున్నది. అది నన్ను భీతిల్లచేయుటకు కారణము… నా హృదయములో ఆనంద గంటలు మ్రోగుచున్నవి. ప్రభువు యొక్క రాకడ ఎంతో సమీపముగా ఉన్నదని ఎరుగుదుము. కాని నేను అనేక మంది మనము ఎదుర్కోనున్న ఘడియకు సిద్ధపడలేదని భయపడుచున్నాను. అది విషాద భాగము.
13ఆ సమయాన అక్కడ ఉడుతలు కనబడుట గూర్చిన గాధ ఎందరు విన్నారు? చాలా మంది విన్నారు అని తలంచుదును. ఓ! అవును, అన్ని చోట్లనూ, ఒక రోజున అట్టిదే మరొకటి జరిగెను. నేను… కొండల మీద నుండి దిగివచ్చుచుండగా జరిగిన గాధ మీరు విన్నారు. ఒకనాడు కొండలపైన ప్రభువు ఆ సంగతులను వ్రాసెను. నా జీవితము…
నేను ప్రసంగీకుడ్ని కాను. ఎవరికైనా అది తెలియును. నేను బోధకుని కాదు. కాని అది ఒక ఆత్మీయ రూపములో తయారయినది. సంగతులు గమనించుట, కదలుచున్న వాటిని చూచుట, రాబోవు సంగతులను గూర్చి ముందుగా హెచ్చరించుట జరిగినది. నేను ఆ విధంగా తయారయ్యాను. మీరు ఏ విధంగా యాధృచ్ఛికంగా ఉన్న స్థితికి వచ్చారో, నేను అలాగే వచ్చాను. ఆ విషయంలో నా కృషి ఏమీ లేదు, కాని దేవుడు మనందరను కొన్ని ప్రత్యేక పనులు చేయుటకు శరీరములో అమర్చియున్నాడు. నేను ప్రతి చిన్న కదలికను ప్రతి కార్యమును, ప్రతి ఉద్దేశ్యమును గమనించుదును, ఎందుకనగా ప్రతిదియు ఆత్మ ద్వారా పరిపాలించబడును.
14ఒక ఉద్దేశము కొరకు ఈ సంఘము ఇక్కడ ఉంచబడినది. ఈ సంఘము వెనుక ఒక ఆత్మ ఉన్నది. నిశ్చయంగా! మా ఇంటి వెనుక, ప్రతి భవనము వెనుక ఒక ఆత్మ ఉన్నది, ప్రతి దాని వెనుక ఒక ఆత్మ, ఉద్దేశ్యము, గురి ఉన్నది. ఒక మానవ పద్దతిని లేదా మరేదో గొప్పగా హెచ్చించుటకు ఈ సంఘము ఇక్కడకు వచ్చినచో దాని ఉద్దేశము సరికాదు; కాని దేవుని రాజ్యము కోరకు దేనినో సాధించ ప్రయత్నించుటకు అది ఇక్కడ ఉంచబడినదో దాని ఉద్దేశ్యము, గురి రెండూ సరియే. ఆ విధంగా ఉద్దేశ్యము త్రిప్పబడినచో అది మంచిది.
15ఇప్పుడు నేను ఆలోచించుచున్నాను. సేవారంభము నుండియు, సేవ యొక్క మొదటి రెండు, మూడు దశల నుండియూ ఆలోచించుచున్నాను. నేను మొదట శ్రివ్-పోర్టునకు వచ్చినప్పుడు ప్రభువు… మీకు చెప్పాను, నా చేతిని ఎత్తినట్లుగా మీరు మీ చేతులెత్త వచ్చును. అప్పుడు ఇరువురమూ అదే సూచించువారమగుదుము. పరిశుద్ధాత్మ ఒక్కసారి కూడా తప్పిపోలేదు, కాని మీలో ఏ పొరపాటు యున్నచో ఖచ్చితంగా చెప్పెను. దానిని అప్పుడు నేను చెప్పాను, "నీవు హృదయ రహస్యములను ఎరుగు దినము వచ్చును," అని ఆయన ఆనాడు చెప్పెను. అది ఉండునని వాక్యము చెప్పినది తెలియకుండానే. అది నేనెరుగను. కాని వాక్యము ఆలాగు చెప్పెను, "దేవుని వాక్యము హృదయ ఆలోచనలను, ఉద్దేశ్యములను వివేచించును," హెబ్రీయులకు 4 అధ్యాయము.
16ఇప్పుడు, ఆ వాక్యమును మీరు చూడండి, ఎన్నడూ ఆ వాక్యమును మీరు విడిచి పెట్టరాదు. వ్రాయబడిన రీతీగా మీరు ఖచ్చితంగో వాక్యముతో నిలిచియుండవలెను. దానిని ఎట్టి స్వంత అనువాదము చేయకూడదు. అది వ్రాయబడిన ప్రకారముగానే చెప్పండి. అది దేవుని వాక్యము. అది దేవుడు. దేవుడు, ఆయన వాక్యము ఒక్కటే.
గతరాత్రి నేను చెప్పినట్లుగా, ప్రతి యుగమునకు ఒక వాక్యభాగము ఉంచబడియున్నది. ఆ కాలమునకు చెందిన వాక్యము యొక్క భాగమును అమలు చేయుటకు ఒక అభిషేకము వచ్చును. ఈనాడు మనమెక్కడున్నామో మీరు చూడండి. ఏది చేయవలసి యున్నామో మీరు చదువుడి, అప్పుడు నునము ఎంత వరకు వచ్చామో తెలియును. ఒక్కటే ఇక మిగిలియుండుట నాకు కనబడుచున్నది. అది ప్రభువైన యేసు రాకడ. ఏ సమయములోనయినా సంఘము ఎత్తబడవచ్చును, మనము మధ్యాకాశములో ఆయనను కలిసికోనైయున్నాము. ఆయన దానిని చేయుదునని వాగ్దానము చేసిన రీతిగా ఈ దినమున ఈ సంగతులు జరుగనైయున్నవి.
17అది జరిగి ఇప్పటికి అయిదు సంవత్సరములయినది. ప్రతి దశయు దాని దాని కాలములో జరిగినది. ఆయన దర్శనములను ఇచ్చును. మీలో అనేకులు టేపు విన్నారు. మరొక దశ రానున్నదని మీరెరుగుదురు. ఆయన ఎంతో ఖచ్చితముగా మామూలుగా దానిని జరిగించెను. ఇప్పుడిచ్చట కూర్చొనియున్న ఒకాయనను నేను చూస్తున్నాను, నా జీవితంలో అంత ఖచ్చితముగా జరుగుట ఏది నేను చూడలేదు. అది జరుగుచుండినప్పుడు అక్కడ ఆయన ఉండి చూచెను. ప్రభువగు దేవుడు ఏమి జరుగునని చెప్పెనో దాని ఫోటోలు సహితము తీయబడెను. మేము అక్కడికే వెళ్ళాము. ఆయన చెప్పినట్లుగానే అది అక్కడుండెను.
18మార్చి 17, లైఫ్ పత్రిక మార్చి సంచికలో ముప్పది మైళ్ళ ఎత్తులో, ఇరవై-ఏడు మైళ్ళ పరిధిలో ఆకాశములలో వెలుగు వృత్తమును మీరు చూశారు. సుమారు తొమ్మిది మైళ్ళ ఎత్తున మాత్రమే తేమ ఉండును. అది ఏమిటో కూడా వారు చెప్పలేకపోయిరి.
దాని క్రింద నిలబడిన ఒకాయన ఇప్పుడిచ్చట కూర్చొని యున్నాడు. దేవుని యొద్ద నుండి ఏడు దేవదూతలు దిగి వచ్చి దృశ్యరూపములో అక్కడ నిలబడి అంత్యకాలమును గూర్చి, ప్రకటన గ్రంధము నందలి ఈ ప్రత్యక్షతలు, ఏడు ముద్రలు గూర్చి చెప్పినప్పుడు ఆయన నా ప్రక్కనే నిలబడియున్నాడు, "ఇంటికి తిరిగి వెళ్ళుము, ఒక దాని వెంట ఒకటి వర్తమానము తెచ్చును" అని చెప్పెను. అది నిజము. అది పైకి ఎక్కిపోయి, పైకి వెళ్ళుచూ తెల్లగా మార సాగినది; ఒక పేలుడు ఆ పర్వతములను దద్దరిల్ల చేసెను. బక్కెటు పరిమాణములో ఉన్న బండలు ఆ విధంగా పర్వతము నుండి పడిపోయినవి.
19చుట్టూ ఏదియూ లేదు. ఒక శబ్ద విచ్ఛిన్నము చేయునదో, విమానమో లేక మరేదో అక్కడ ఉన్నదేమోనని చూచుటకు వారు పరీక్షించిరని, వార్తాపత్రికి కూడా వ్రాసెను. అక్కడ ఏదియూ లేదు. పైన ఏ విమానము లేదు. ఏదీలేదు. అంతే కాక విమాన ధ్వంసకము అది చేయజాలదు.
అది జరుగుటకు ఆరునెలల ముందే ఆ విధముగా జరుగునని చెప్పబడెను. అది అక్కడ జరిగెను. టుసాన్ మరియు ఆయా ప్రదేశములలో నేడు సెన్సు పరిశోధించుచున్నది. ఇక్కడ జరిగిన దానిని మీరు గ్రహించలేకపోవుచున్నారు. మీరు పత్రిక సంపాదించి చూచినచో, ఆ ఏడు దూతలు పైకి పోవుచున్నప్పటి రెక్కల ఆకారము కనబడును. స్నేహితులారా, ఈ సంగతులు సరియని మేమేరుగుదుము. సంఘము లోతయిన యధార్దతతో ఉండవలసిన సమయము ఏదయినా ఉన్నచో, అది ఇప్పుడే. ఇప్పుడే!
20కాని అదే నాలో ఒకటి కలుగజేసెను. ఏమిటి పొరపొటా అని ఇప్పటికి అయిదు సంవత్సరాల నుండి నేను ఆశ్చర్యపడుచున్నాను. దేనితోనో నేను నలుగగొట్టబడినట్లుగా నా హృదయములో నేను అనుభూతి చెందాను, కాని అది ఏమిటో నేను చెప్పలేకపోయాను. ఈ గొప్ప నలుగుడు మొదలగు సమయములలో నేను దేశమంతటా పర్యటించాను.
ప్రభుత్వము నన్ను విచారణ చేయమని శాసనము జారీ చేసేను, ఎందుకనగా మేము కూటములు జరిపించునప్పుడు "విలియం బ్రెన్హాం," అని చెప్పి ఎవరో చెక్కు వ్రాసిరి. నేను దానిపై సంతకము చేసి తిరిగి ఇచ్చేశాను. అప్పుడు ఎన్నో కూటములు జరిగినవి. వాటంతటికి చెల్లించుటకు అది వెళ్ళినదని వారు చూచారు. అయిననూ ఆ చెక్కును నేను సంతకము చేశాను. చెక్కును నాదిగా గుర్తింపచేశాను. "ప్రభుత్వానికి మూడు వందల వేల డాలర్లు బాకీ యున్నానని," వారు అన్నారు. వారు నన్ను విడిచి పెట్టి పోనీయలేదు. దీని నంతటినీ విచారించు వరకూ ఎంతో కాలము నేను ఇక్కడే ఉండవలసి వచ్చెను. నేను కాదు. అంతా… "అవును. అది కూటములకు వెళ్ళినది, కాని ప్రజలు నీకు చెక్కు వ్రాసిరి. దానిని నీవు స్వీకరించి, నీతో గుర్తింపచేసికొంటివి. దానికి పన్నులు నీవు బాకి యున్నావు. నీవు ఒక సెకెండు, నీ చేతితో దాని పట్టుకొన్నాగాని అది నీదే అగును, ఎందుకనగా నీవది స్వీకరించావు," అని చెప్పిరి.
21దానిని నేను ఎరుగను. ఈ యంత్రముల యొక్క సూత్రములు మొదలగునవి నాకు తెలియవు. దాని మీద సంతకమునకు బదులుగా నేను స్టాంపును అంటించవలసి యుంటిని. నేను సంతకము చేశాను గనుక అది నాదని అర్థము వచ్చెను. దానిని వారు నిధిలోనికి చేర్చి ఆ విధముగా ఖర్చు చేసిరి. వారమునకు వంద డాలర్ల జీతమును నేను నా సంఘము నుండి పుచ్చుకొన్నాను, అది నిజమని ఎరిగిన ట్రస్టీలు అక్కడ కూర్చొనియున్నారు. దానినుండి నాకు వచ్చిన దంతయూ అదే, అది కూటములలోనికి మళ్ళించబడును.
22గత నాలుగు లేదా అయిదు సంవత్సరముల నుండి నలిగిపోతున్నట్లుగా నాకు అనిపించుచున్నది. ఈ మధ్యనే వేటాడేందుకు కెనడాకు చిన్న ప్రయాణము చేశాను, నేను అక్కడికి వెళ్ళినప్పుడు ఒక ఇండియనుల తెగ మొత్తమును ప్రభువగు యేసు నొద్దకు నడిపించుటకు, ప్రభువు నాకు సహాయము చేసెను. కాలువలు నీటితో నిండియున్నప్పుడు నేను అక్కడికి వెళ్ళి, ఆ తెగవారికందరికి ప్రభువైన యేసు నామములో బాప్తిస్మము ఇయ్యవలెను; గుండెపోటుతో చనిపోవుచున్న ఒక ఇండియను స్త్రీ స్వస్థత పొందెను, ఎక్కడో అడవులలో గంటల కొలది గుర్రపు వీపు మీద ప్రయాణము చేయవలసి వచ్చెను, యాజకుడు రాలేకపోయెను. అది జరిగినప్పుడు అక్కడున్న వారిలో కొందరు ఇప్పుడిచ్చట కూర్చోని యున్నారు.
23అప్పుడు తిరిగి వచ్చుచూ కొందరు సేవకులయిన నా స్నేహితులను దర్శించుటకు కొలరడోలో ఆగవలసివచ్చెను. కొలరడోలో నేను ఒక మార్గదర్శిగా ఉంటిని, వారిని ఒక వేట పర్యటనలో నడిపించాను. దీనిని ఎరిగిన ముగ్గురు నలుగురు, లేదా అయిదుగురు ఇప్పుడిచ్చట కూర్చొనియున్నారు. ఈ సంవత్సరము కొలరడోలో భయంకర ఎండగా నుండెను. దేశమంతా ఆలాగే యున్నది గదా! మంటలు చాలా భీకరముగా ఉండినందున వారు, వేటకాలమును కొంత ఆలస్యము చేసిరి.
కాని మేము అప్పుడచ్చట ఉండగా, ఒక మంచు తుఫాను రానున్నదని హెచ్చరిక వచ్చెను. ఆ సమయములో పర్వతములలో ఉండుట ప్రమాదము, ఎందుకనగా కొన్నిసార్లు నీ ముందున్న చేతిని నీవు చూడలేవు, గంటల తరబడి ఇట్లుండును. కొద్ది గంటలలో ముప్పది అడుగుల మంచు పోగవుట ఒకసారి జరిగినది. నీ పైనే అది పడును, నీవు నశించెదవు. మేము బయటకు వెళ్ళవలెనని ఆ ఉదయాన బయలుదేరుచుండగా, నా సోదరులకు, "ఇప్పుడు మంచు తుఫాను…" అని చెప్పాను.
24వందమందికి పైగా జనులు మా వెనుక ఉండిరి. జీపులు, ట్రక్కులు, ప్రతిది బయటకు వచ్చుచున్నవి, ఎందుకనగా ఏమి జరుగనైయున్నదో వారెరుగుదురు. ఎవరూ వెనుక విడిచి పెట్టబడలేదు, కాని పశువుల కాపరి మాత్రమే అక్కడుండెను.
మా ఇరువురము, మా ట్రక్కు మాత్రమే అక్కడున్నాము. నేను సోదరులను అడిగాను. "మేము ఉందుము" అని వారినిరి. "సరే, మంచిది. ఇప్పుడు సిద్దముగా ఉండండి," అని చెప్పాను. మేము బయటకు వెళ్ళి ఒక మేతడిస్టు సేవకుని కలిశాము. నేను వెళ్ళి కొద్దిగా రొట్టె మొదలగు పదార్థములు తెచ్చాను. రానుపోను ముప్పది మైళ్ళ దూరము. మేము వెనక్కు వచ్చినప్పుడు సహూదరుడు జాన్, ఇతరులు ఇక్కడ కూర్చొనియుండిరి. వారు దానిని విని దూరంగా వెళ్ళిపోయిరి. వారు సరైన సమయాన వెళ్ళిరి. మంచు తుఫాను తాకినది. కాని మేము ఉండుటకు నిశ్చయించుకొన్నాము, నేను టుసాన్ కు ఒక కూటము నిమిత్తము వెళ్ళుచున్నాను. నేను నా భార్యను పిలిచి, నేను సమయానికి రాలేకపోయినచో నాకు బదులుగా మరెవరినయినా మాట్లాడనీయమని చెప్పాను.
25మరుసటి ఉదయము మేము రాసాగాము. "వర్షము పడుట వినుట మీకిది మొదటిసారి, ఆ మకాము యొద్దకు వీలయినంత త్వరగా వెళ్ళిపొండి, ఎందుకనగా పది, పదిహేను నిమిషములలో ఇక మీరు దారిని కనుగోలేరు," అని చెప్పాను. నిజంగా మేఘావృతమై యున్నది. ఆలాగు నేను జనులను బయటకు పంపించి పర్వత అంచునకు వెళ్ళి నడచుచూ, జింకలను క్రిందికి తరుముచున్నాను.
దానికి కొన్ని రోజుల ముందు టుసాన్ లో నేను నా రైఫిల్ ను పేల్చాను. అక్కడికి తిరిగి వస్తూ, కుడి ప్రక్కకు విసిరాను. ఎన్నో సంవత్సరాల నుండి నేను ఎదురుచూస్తున్న పెద్ద జింకను కాల్చాను. బాగా పైకి, అది తగిలినందున అక్కడే అది చనిపోయినది. దానిని నేను కనుగోలేకపోయాను, వాతావరణము బాగా లేదు.
26"నేను పరుగెత్తి వెళ్ళి చూస్తాను," అనుకొన్నాను. పర్వతము పైకి నేను ఎక్కినప్పుడు వర్షమారంభమగుట నేను గమనించాను. నాణెమంత పెద్ద మంచు చినుకులు పడుచున్నవి. అంతా మంచు పేర్కొనినది, గాలులు ఊపివేస్తున్నవి, అందరూ తమ టెంట్ వైపు పరుగిడుతున్నారని నాకు తెలియును. సరే, నేను కొద్ది క్షణములు వేచి చూచాను. "ఈ తుఫానులో ఈ సమయాన ఈ జింకను కనుగొనలేను," అని తలంచాను.
ఆ విధంగా మేము ముందుకు వెళ్ళాము, కొండ దిగనారంభించాము, నాకు ముందు పది అడుగుల వరకూ చూడకలుగుచున్నాను. సుమారు… ఆ స్థలమునకు నాలుగు మైళ్ళు ఇంకా ఎక్కువ దూరంలో ఉన్నాను. తెలిసి, కొండ దిగుచున్నాను, ఆ ప్రాంతమును బాగుగా ఎరుగుదును, ఎందుకనగా చాలా సంవత్సరాలు నేను అక్కడ పశువులను మేపాను. కొండ నుండి దిగుచూ ఈలాగు ఉన్న ఒక తిరుగుడు యొద్ద నుండి షుమారు అర్థమైలు నేను ఉన్న శ్రేణి నుండి జరిగిపోయాను. అక్కడ…
27ఆ భయంకర భారమును నేను అనుభవించుచున్నాను. "నేను ఏడ్చాను. ప్రార్థించాను. ఒప్పుకొన్నాను నేనేమి చేయగలను? నేను చేసినది ఏమిటి?" నిజంగా కీడు చేసినప్పుడు పడినంత బాధ; ఎవరినయినా బాధించినప్పుడు నీవు పడిన బాధ. నీవు సరిచేసికొనవలెనని నీవు ఎరిగి యుందువు. దేనిగూర్చి నేను దోషిగా బాధపడుచున్నాను? నాకు తెలియదు, "ప్రభువా నీవు నాకు బయలుపరచినచో, దానిని నేను సరిచేసికొందును. కాని నిలబడి బోధించుట తప్ప నేను చేసినది ఏమిటి? చేయుటకు నాకు తెలిసినదంతా నేను చేశాను. నీ మాటల ప్రకారము తేటగా, శుభ్రంగా నేను జీవించ ప్రయత్నించాను. కాని నేను చేసినదేమిటి?" సంవత్సరాల తరబడి ఇంకనూ ఆ భారము నాలో నుండి పోలేదు. దానిని గూర్చి ఆ ఉదయాన కొండ దిగి వస్తూ ఆలోచించాను.
28ముందు రోజు నా వివాహ దినము, దానికి ఇరవై సంవత్సరాల క్రితం నేను నా భార్య పెండ్లి చేసికొన్నాము. ఆ సందర్భములో ఎన్నడూ నేను ఇంటి యొద్ద లేను, ఎప్పుడూ నేను కొండలోని చిన్న స్థలమునకు వెళ్ళుచుండెడివాడను. మేము వివాహము చేసికొనిన మొదటి సంవత్సరము హానీమూన్ నకు వెళ్ళుటకు చాలినంత ద్రవ్యము లేదు. చిన్న పర్యటన చేయలేకపోయాము. వేటాడుటకు వెళ్ళుచూ నా భార్యను కూడా హానీమూన్ కొరకు వెంటబెట్టుకొని వెళ్ళాను. రెండూ ఒకేసారి పొందినట్లుగా అయినది.
నాకు గుర్తున్నది, ఆమె ఒక చిన్న మనిషి, నేనామెను ఎత్తుకొని ఆ దూలములు మొదలగునవి దాటించాను. ఒక చిన్న స్థలము యొద్దకు మేము వచ్చాము. ఆమె ఫోటో తీశాను, అదెల్లప్పుడూ ఒక విధమగు అందంగా కనిపించేది. దాని గూర్చి నేను ఆలోచించాను. ఆమె నల్లని జుట్టు ఎంత అందంగా ఉండేది! ఇప్పుడు నెరసిన జుట్టు, ఆమెకు ఏండ్లు గడిచిపోయాయి.
"నేను పైకి వెళ్ళేదను, కాని అది చాలా కష్టము," అనుకొన్నాను. అప్పుడు మంచు చాలా దట్టంగా ఉన్నది.
నేను లోనికి రావలేనని ఎరుగుదును, ఎందుకనగా వారు వార్తా ప్రసారము చేసిరి. తీవ్రమగు మంచు తుఫాను మార్గమందున్నది. దేశమంతా వారు ప్రకటించారు. టామ్ సింప్సన్ ఈ ఉదయాన ఇక్కడ కూర్చొనియున్నాడో లేదో నాకు తెలియదు. కెనడా నుండి వస్తూండగా, రేడియోలో అతడు ఆ ప్రాంతము గుండా వెళ్ళవద్దని చెప్పుట వినెను. "అటువైపుగా వెళ్ళవద్దు, మరో మార్గాన వెళ్ళండి, ఎందుకనగా ఒక భయంకర మంచు తుఫాను ముంచుకొస్తున్నది," అని అందరూ చెప్పారు.
29నేను కొండ నుండి దిగ నారంభించాను. దాని గూర్చి అలోచించుచున్నాను. సుమారు ఉదయము పది గంటలవుతుంది. అకస్మాత్తుగా, నా స్వరమును మీరు వినకలిగినంత స్పష్టముగా, స్వరము ఇట్లు పలికినది, "ఆగి, తిరిగి వెనుకకు వెళ్ళుము."
అవిశ్వాసులగు వారి మధ్య నేను దీనిని చెప్పజాలను, దీనిని నీవు విశ్వాసులకు మాత్రమే చెప్పవలెను, ఎందుకనగా అవిశ్వాసులు దానిని ఎన్నడునూ అర్థము చేసికోలరు. ఆత్మీయ సంగతులు అర్థము చేసికొనుటకు ఆత్మీయ మనస్సు నీకు అవసరము. వాక్యము ఆత్మసంబంధమైనది, అది ఆత్మీయముగానే అనువదించబడినది. అది దేవుని మాట. నేను ఆగిపోయి ఇట్లు తలంచాను, "ఈ విధంగా తుఫాను చేలరేగుచున్న సమయములో మరల అరమైలు వెనుకకు వెళ్ళినచో…"
30డేవిడ్ ఉడ్ నాకు ఒక శాండ్విచ్ ను తయారు చేసెను, అది అక్కడ ఉన్నది! ఒకసారి అతని తండ్రికి నేను చేసిన ఇచ్చిన దానికి సమానంగా అతడు చేయుచున్నాడని నేను తలంచాను. కొన్ని ఉల్లిపాయలు, తేనే, రొట్టె తప్ప మరేమియూ మా వద్దలేవు. నేను వాటినన్నింటిని కలిపి ఉంచాను. మాకు ఒక అప్పము తయారు చేసికొన్నాము. అతడు తన భాగమును తినుటకు కష్టపడెను. దానితో కూడా అతడు నాకు సమానుడగుటకు ప్రయత్నించాడనుకొంటాను. కనుక అతడు… పర్వతము పైకి ఎక్కుచుండగా వర్షము ఎంతో హెచ్చుగా పడుచుండెను. అది దానిని తడిపినది. "దానిని తిని వేచియుందును," అని నేననుకొన్నాను.
అక్కడ నిలబడియుండగా ఇట్లనుకొన్నాను, "అది ఏమియూ కాదు. నేను కేవలము ఊహించాను. బహుశా ఒక గాలి ఆ విధంగా వీచుచూ చెట్లను నులిపివేయుచున్నది." నేను నడువ ప్రారంభించాను. నేను నడువలేకపోయాను, "నేను వెనుకకు వెళ్ళగలనని నమ్ముచున్నాను," అనుకొన్నాను.
దానిని మరల విన్నాను, "నీవు వచ్చిన చోటుకు మరల వెళ్ళు!" అది ఆలా చెప్పెను. నేను కొండ పైకి ఎక్కుచూ ఆగాను, బహుశా నేను వచ్చిన స్థలమునకు వెళ్ళుటకు భయపడుచున్నాను, ఎందుకనగా గాలి అంత భీకరముగా ఉన్నది.
కొన్నిసార్లు దేవుడు బహు అపాయకరముగాను, ఒక పద్దతిలో లేనట్లుగా కనిపించు కార్యములను చేయునట్లు మనలను ప్రేరేపించును. మోషే ఆ కర్రతో ఐగుప్తును స్వాధీనపరచుకొనుట ఎంత వింత? ప్రతిదియూ ఆలాగే మనము కనుగొందుము. అసాధ్యములను దేవుడు అడుగును, చూడండి, ఎందుకనగా ఆయన అసాధ్యములను చేయును. చేయుచున్నది తాను కానని ఆ మనుష్యుడు ఎరుగును; దానిని చేయుచున్నది దేవుడు.
31గాలికి ఊగుచూ ఉన్న చెట్ల మధ్య నుండి దారి చూచుకొంటూ తిరిగి మరల ఆ కొండ పైకి వెళ్ళాను. నేను కూర్చొని నా తుపాకీని తీసి, నా షర్టు క్రింద దూరముగా కారు అద్దమును దాచి పెట్టి ఒక్క క్షణము కూర్చొన్నాను. అట్టి సమయములో ఎలుగుబంట్లు పరుగిడుచుండును. "ఇక్కడ కూర్చోని నేనేమి చేయుచున్నాను?" అని తలంచాను.
కాని దేవుడు మర్మముగానున్న విధానములలో పని చేయును, ఆయన అద్భుతములను జరిగించును. అవి కనుగొనుటకు అందవు. శరీర సంబంధమైన మనస్సుకు గోచరించవు, అవి ఎన్నడూ దానిని చూడనైనా చూడలేవు. తిరిగి వెళ్ళి, నేను కూర్చుండగా, దేవుని గూర్చి ఆలోచన కలిగినది. "ఎందుకు నేను వెనుకకు వచ్చాను అని ఆశ్చర్యపోయాను." "కొండ దిగువకు వెళ్ళవలసిన సమయమిది, తుఫాను అంతకంతకు ఉధృతమగుచున్నది. ముందు ఏమీ కనబడుట లేదు." ఇప్పుడు…
32దీనిని మీరు నమ్మవలసిన పనిలేదు, కాని ఇది సత్యము. ఒక స్వరము నాతో మాట్లాడి ఇట్లు పలికెను, "నేను దేవుడైన యెహోవాను. భూమ్యాకాశములను నేను సృజించాను. ప్రకృతి నాకు లోబడును."
అంతట నేను కొద్దిసేపు కూర్చొని, నా టోపీ తీసి వేశాను. ఆ స్వరము ఎక్కడో వినబడుచున్నది, దానిని నేను చూడలేను, నేను వినగలను మాత్రమే, ఎక్కడో ఆ చెట్లలో నుండి అది వస్తూన్నది అని నేను ఆలోచించాను. మామూలుగా వెలుగును నీవు చూచెదవు. నీకు తెలిసిందంతా అదే, మామూలుగా ఆలాగే జరుగును, కాని నేను అంతా వెదికాను గాని వెలుగు కనబడలేదు. "ఓ దేవుడా, నా సృష్టికర్తా, నీవు ఎక్కడున్నావు?" అనడిగాను. చుట్టూ చూచాను, అయన స్వరము ఇక నాకు వినబడలేదు. కొద్ది నిమిషములు నేను ఎదురుచూచాను.
ఆయన ఇట్లనెను, "నీవు చెప్పినప్పుడు ఉడుతలను ఉనికిలోనికి రప్పించిన దేవుడైన యెహోవాను నేనే. దాని గూర్చి మీరందరూ ఎరుగుదురు. నా ఎదుట ఈ బైబిలు పట్టుకొని ఈ కృతజ్ఞత అర్పించు ఉదయాన నేను అసత్యము చెప్పినచో, ఈ వేదిక మీదనే దేవుడు నన్ను మరణమగునట్లు మొత్తును గాక. చూడండి, అది నిజము అబ్రహామునకు పొట్టేలును సమకూర్చి ఇచ్చిన దేవుడు, ఇంకా సృష్టికర్తయైన దేవునిగానే యున్నాడు, సమకుర్చచగలడు. ఆయన ఇంకనూ యెహోవా-యీరే. దేవుడే చూచుకొనును!
GEN 22:4,13•
MATT 21:21•
MARK 11:23
33అబ్రహాము ఆ పొట్టేలును ఎక్కడ నుండి పొందెను? చూడండి, మానవ నాగరికత నుండి మూడు రోజులు ప్రయాణించి, ఆ పర్వతము పైకి చేరెను, అక్కడ నీరు గాని మరేదో గాని లేదు. అతనికి పొట్టేలు అవసరమాయేను. పొదలో కొమ్ములు చిక్కుబడి నిలబడిన పొట్టేలు కనబడెను. అబ్రహాము చుట్టూ తిరిగి బలిపీఠమునకు రాయి ఏరుకొనెను; కాని దేవుడు ఇంకనూ యెహోవా-యీరే గానే యుండెను. ప్రభువే చూచుకొనును.
తాను ఏది వాగ్దానము చేసినా దానిని చేయగల సమర్ధుడు! ఆ మాట మత్తయిలో ఉందనుకొంటాను, మార్కు 11:22, "ఈ పర్వతముతో మీరు చెప్పినచో" దానిని ఎన్నడూ నేను అర్థము చేసికోజాలను దాని గూర్చిన గాధ మీరెరుగుదురు.
కావున నాకు సహాయము చేయండి, అది సత్యము. "ఆ ఉడుతలను ఏర్పాటు చేసినవాడను నేనే," అని ఆయన చెప్పెను. మరల నేను విన్నాను. ఆయన ఏమి చెప్పునో అని చూడసాగాను. ఏదీ ఆగలేదు. గాలి హోరుమని వీచుచున్నది. నాకు నేనే కరచుకొన్నాను, ఎందుకనగా…
34ఒక సంగతి చెప్పనీయండి. నిజమైన ఆత్మీయ మనస్సు పిచ్చితనమునకు ఒక అడుగు ముందే ఉండును, అది మీరెరుగుదురా? శాస్త్రీయ పరిశోధన దానిని మీకు చెప్పును. ఇక్కడ మీరు నెమ్మదిగా మొద్దుగా ఉన్నారు; తరువాత మీరు ఇంకొద్దిగా ఆత్మ సంబంధులగుదురు, అప్పుడు మీరు ఈలాగుందురు; అప్పుడు మీరు మొద్దు గొడ్డలివలె ఉందురు; తరువాత మీరు వాడియగు కత్తివలె ఉందురు. ఇప్పుడు మీరు ఎటువైపు పడుదురో ఎరుగుదురు. ఒక వ్యక్తి తన్ను తాను హెచ్చించుకొనినచో నిశ్చయంగా తప్పు మార్గములో పడును. అక్కడ నుండి దేవుడు అతనిని లేపినచో, సగటు వ్యక్తి కన్న ఎంతో హెచ్చుగా ఉండును. దర్శనములు, క్రియలు అక్కడ నుండి ఉద్భవించును. అక్కడే దేవుని రాజ్యముండును. కవులు, ప్రవక్తలు మొదలగు వారందరూ పిచ్చివారిగా పరిగణించబడిరి.
JOHN 10:20
35యేసును కూడా, "పిచ్చివాడు" అని పిలిచిరి. "నీవు పిచ్చివాడివి. దయ్యము పట్టినవాడవు," అని పిలిచారు. పిచ్చి అనగా ఉన్మాదము, యుగములలో జన్మించిన కవులు, ప్రవక్తలను చూడండి, ఆలాగే పరిగణించబడిరి, ఆ స్థితికి నీవు వచ్చినచో అలాగే పరిగణించబడెదవు, నీ పని అయినట్లే. నీయంతట నీవు ఆ స్థితికి రాలేవు. ఆ అంచునకు నిన్ను తీసికొని వచ్చుటకు మహిమలో నుండి హస్తము నిన్ను పట్టుకోవలెను. మంచి చెడు సంగతుల మధ్య నిన్ను వివేచింప చేయును. ఆ అంచులపై నుండి నిలబడి నీవు బ్యూలా దేశమును చూచెదవు.
అంతట అదే ఘడియలో మరల అదే సమయములో కూర్చొనియుండగా అది మాట్లాడేను.. "ఆ రాత్రి ఆ దోనెలో కూర్చొని గాలులను అలలను అణచిన వాడను నేనే. లేచి నిలబడి, ఈ తుఫానును గద్దించుము, నీవు చెప్పినట్లుగానే అది లోబడును." సేవలో మూడవ దశ వచ్చుట అదే. సంవత్సరాల తరబడి అది ఆలాగు వచ్చుచున్నది. ఏదో బాధించుచున్నట్లుగా కనబడేను, "ఓ, వద్దు…" అనుకొన్నాను. అది ఖచ్చితంగా ఆయన చేసినదే. ఇది మరల ఆయనే, ఖచ్చితంగా ఆయన ఆత్మయే మరల మాట్లాడినది, అలాగే ఖచ్చితముగా.
36కాని శరీర సంబంధమగు అనుకరణలు ఒకదాని తరువాత ఒకటి నాకు వచ్చెను. దాని గూర్చి ఆలోచించుట కూడా నాకు భయము కలిగించుచున్నది. ఎందుకనగా అది బహు ఖచ్చితముగా జరుగును. ఎల్లప్పుడూ మిశ్రిత జన సమూహములే యుండును. దానిని శరీర సంబంధమగు అనుకరణలు వెంబడించును. ఆయన దినములలో ఆలాగు జరిగెను. మోషే దినములలో అది జరిగెను. ప్రతి రోజూ అదే జరుగును. పరిశుద్ధాత్మ పని చేయుచున్న ఈ దినమున అది జరుగును. కాని ఒక వ్యక్తి ఆత్మసంబంధిగా నిలబడినచో, శారీరక అనుకరణ అసలైనదానిని హెచ్చింపజేయును, అది దేవుని యొక్క నిజ ప్రణాళిక.
37ఆ సమయము అక్కడ నిలబడి పైకి చేతులెత్తి ఇట్లన్నాను, "ప్రభువైన దేవా, ప్రకృతి యొక్క గొప్ప సృష్టికర్తా, ఆ మాట్లాడుచున్నది నీవేనని నమ్ముతున్నాను, తప్పు ఏమిటో ఒక్కసారి కూడా నీవు నాకు చూపించలేదు. జరుగునది తప్ప మరేమియూ ఎన్నడూ నీవు నన్ను చెప్పనీయలేదు."
"చెలరేగిన ఈ తుఫానుకు ఇట్లు నేను చెప్పుచున్నాను, నీ చోటునకు వెళ్ళిపొమ్ము. వెనక్కు మళ్ళుము. ఇక్కడి నుండి పొమ్ము. వచ్చే నాలుగు రోజులు ఈ మనుష్యులు వేటాడువరకు నేను సహాయపడునట్లుగా సూర్యుడు ప్రకాశింపవలెనని ఆజ్ఞాపించుచున్నాను. ఈ కొండలలో నుండి పొమ్ము," అన్నాను.
ఈ ఉదయమున నా ఏకైక న్యాయాధిపతి ప్రభువైన దేవుడు మాత్రమే వర్షము పడుతుండగా చెట్లు ఊగిపోతున్నవి. ఒక్క క్షణములో ఏ మాత్రము అది కనిపించలేదు. నేను చూచాను, గాలి మరియొక వైపు నుండి వచ్చుచుండెను. పర్వతము పైన అది వీచుచున్నది. మేఘములు పైకి పోయినవి. కొద్ది నిమిషముల వ్యవధిలో సూర్యుడు బయటకు వచ్చెను. పైనుండి ఎంతో ప్రకాశమానముగా క్రిందికి సూర్యుని కాంతి దిగెను.
38జర్మనీలో జరిగిన రీతిగానే అది జరిగేను. జర్మనీలోని గాధ మీకు జ్ఞాపకముండును. మాంత్రికులు ఒక ప్రక్కన పదిహేను మంది కత్తెర తీసికొని ఈకెను కోసి ఇటు వెనుక వైపునకు గురి చూపారు. తమ మంత్రములు వల్లించుచూ అక్కడ నిలబడిరి. ముప్పదివేల మంది కూర్చున్న ఆ తెరను ఎగర గొట్టుదుమని చెప్పిరి. సహూదరుడు ఆర్గన్ బ్రయిటు అక్కడ నిలబడియుండెను. ఇక్కడ తుఫాను వచ్చెను. ఒక మేఘము పైకి వచ్చెను. సహూదరుడు లోస్టర్ ప్రక్కగా నేను నిలబడ్డాను. మీలో చాలా మంది ఆయనను ఎరుగుదురు. అమెరికాలో జన్మించిన జర్మను అతడు. అక్కడ అతడు నాకు అనువాదకుడు. అక్కడే అతడు నిలబడి యుండెను. "దీనిని అనువాదము చేయవద్దు" అని చెప్పాను. "ప్రభువైన దేవా, నీవు నాకు దర్శనమిచ్చి జర్మనీకి పంపించావు. ఈ మాంత్రికులు తుఫానును తీసికొని వచ్చారు. నీవు సృష్టికి దేవుడవు, నీవు దేవుడువని తెలియనిమ్ము!" అని చెప్పాను. నేను ఇంగ్లీషులో చెప్పుచున్న దానిని అర్థము చేసికొనువారు ఒక డజను మంది కంటే ఎవరునూ లేరు.
అప్పుడే ఈ విధంగా తెర ఎగురసాగెను, దాని క్రింద ముప్పదివేలమంది ఉన్నారు. అది క్రిందికి పైకి ఎగురుచుండెను. క్రిందికి పడసాగెను. మేఘములు, ఉరుములు గర్జించినవి. అయిదు నిమిషములలోపు సూర్యుడు ప్రకాశించుట జరిగినది. అప్పుడు దాదాపు పదిహేను వేలమంది జర్మనులు ప్రభువైన యేసుక్రీస్తు యొద్దకు వచ్చిరి. ఆయన ఇంకా దేవుడే, ఆయన ఎప్పటివలెనే దేవుడుగానే యుండెను.
39సరే, నేను అక్కడ కొండమీద నిలబడితిని. షుమారు నాలుగు రోజుల తరువాత వచ్చాను. ఇది సత్యమని ఎవరికయినా తెలియును. ఆ ఘడియ నుండి నాలుగు దినముల వరకు ఆకాశములో ఒక్క మేఘము కూడా లేదు.
మేము కొండ పైనుండి దిగి బయటకు వచ్చి పెట్రోలు కొనుచూ, "మేము చాలా పొడిగా ఉన్నాము," అని చెప్పాను.
"అవును, చాలా పొడిగా ఉన్నది. ఆ రోజున వస్తూ తుఫాను కోసం చూచాము. మాకు తెలియదు, కాని అది ఆగిపోయెను," అని చెప్పాడు, చూచారా.
కొలారెడోకు అవతల వైపుకు నేను వెళ్ళాను, కొంత ఇంధనము కొనుటకు ఆగాను. ఆ వెనుక ఉన్న నా కుమారుడు బిల్లీపాల్, నేను కలిసి ఉన్నాము. "ఇక్కడ కూడా ఆగిందో లేదో చూద్దాం పద," అన్నాను.
నేను లోపలికి కారు నడిపాను. "శుభోదయం," అన్నాను. అక్కడున్న వ్యక్తితో సంభాషించసాగాము.
అతడు కూడా, "శుభోదయం" ఇని చెప్పెను.
"నిశ్చయంగా, ఒక సుందరమగు దినము" అన్నాను.
"అవును, పాత సూర్యుడు బయటకు వచ్చుచున్నాడు. మరల వేడిగా ఉన్నది. నిశ్చయంగా ఈ ఎండాకాలము మనలను కాల్చివేసినది" అని అన్నాడు.
"అవును. ఆలాగు దేశమంతా యున్నది" అన్నాను.
"అవును. ఆలాగే అర్థమగుచున్నది," అన్నాడు.
"మీ తుఫానుల సమయము దరిదాపు వచ్చింది గదా?" అన్నాను.
"ఏమి జరిగిందో తెలియునా? వార్తాపత్రికలు, రేడియో మొదలగునవన్నీ తుఫాను రానున్నదని ముందు రోజున చెప్పినవి. మేఘములు కమ్మినవి. తుఫాను ప్రారంభమాయెను. దానికి ఏమి జరిగినదో మేమెరుగము గాని, అకస్మాత్తుగా అది అంతా వెళ్ళిపోయెను," అని చెప్పాడు.
40ఆయన ఎప్పటివలెనే ఉండిన దేవుడుగానే ఇంకనూ ఉన్నాడు, దానిని పలుకమని మొదట దేవుడు అతనికీ చెప్పకుండా ఆ సంగతులను ఒక మనిషి ఎట్లు పలుకగలడు? చూడండీ, ఏదో అభిప్రాయము బట్టి కాదు; నీవు చేప్పుదానిని నీవు ఎరుగుదువు. అది అప్పుడు చేసెదవు. కాని నిలిచియుండు, "ఓ, అదే మార్గము!" అని చెప్ప ప్రయత్నంచవద్దు, చాలామంది జనులు దేవుని వరములను తెలిసికొనుటకు నిరీక్షించవలెను. అప్పుడది దేవుడని ఎరుగుదురు. చూడండి, స్వరము వచ్చువరకు నిరీక్షించుము. దానిని నీవు విందువు. దానిని తెలిసికొందువు. దానిని చూడు. అప్పుడు నీవు, "అది యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు," అని చెప్పగలవు. అది గాని "యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు," కానియెడల అది నీ అభిప్రాయము, అది ఇతరులు ఆలోచించు విధానము. "నా కొరకు ఇది పలుకు, నా కొరకు ఇది చేయుము," అని ప్రజలు ప్రజలతో విన్నవించుకొందురు. నీవు దేవునితో యధార్థముగా ఉండినచో, మొదట దేవుడు నీకు చెప్పకుండా దానిని ఎట్లు నీవు చేయగలవు? జాక్ మూర్ నాకు ఏమియూ చెప్పకుండా "జాక్ మూర్ ఈలాగు సెలవిచ్చుచున్నాడు," అని నేనెట్లు చెప్పగలను? చూచారా? అది మొదటగా, దేవుని యొద్ద నుండి రావలెను, అభిప్రాయము కాదు. అది దేవుడే అయియుండాలి. అప్పుడు అది జరుగును, ఎందుకనగా అది "యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు."
41అందరూ దానిని కలిగియుండరు. లేదయ్యా. అది అలా కాదు. అదేన్నడూ ఆ విధముగా ఉండబోదు. దేవుడు వ్యక్తులతో వ్యవహరించును. నోవహు దినములలో ఆయన ఆలాగు చేసేసు. యెహోషువా దినములలో ఆయన ఆలాగు చేసెను. మోషే దినములలో ఆయనాలాగు చేసెను. ఎల్లప్పుడూ ఆయన ఆలాగే చేసెను. ఆయన ఎన్నడు ఒక విధానము తయారు చేయలేదు. వ్యక్తితోనే ఆయన జరిగించేను, ఎందుకనగా ఏ ఇద్దరు వ్యక్తులూ ఒకే సమయములో ఒక్కలాగుండరు. చూడండి, ఆయన అంతకన్నా ఎక్కువ ఎన్నడూ చేయలేదు. కాని అందరు మోషేలు కాలేరు. దానిని మీరు అర్దము చేసికోజాలరు. వారు కేవలము అనుసరించిరి. ఒక వ్యక్తి దేవునిచే ఆభిషేకించబడినచో, పరిశుద్ధాత్మ నిన్ను బైబిలును, పరిశుద్ధాత్మను వెంబడించుటకు నడిపించును, ఎందుకనగా ఈ సంగతులను జరిగిచువాడు ఆయనే. యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ రూపములో జనుల మధ్య క్రియచేయున్నాడు.
42అక్కడ నిలబడి నేను వెనుక క్రిందకు నడువనారంభించాను. అక్కడ నేను నిలిచాను, నేను ఏడ్చాను. ఒక్క క్షణములో ఏమి జరిగినదో అక్కడ చూచినప్పుడు, అది తప్ప మరేదీ నాకు చేతకాలేదు.
అక్కడ సహూదరులున్నారు, వారిలో ఎందరు ఇక్కడున్నారు? ఫ్రెడ్ సొద్మన్ తదితరులు ఇక్కడున్నారు. వారు అక్కడ ఉండిరి. కాదు, ఫ్రెడ్ నాతో మరోచోట ఉన్నాడు. అక్కడున్న వారిలో ఎవరయినా ఇక్కడున్నారా? సహూదరుడు బాంక్స్ ఉడ్ మొదలగు వారిక్కడ ఉన్నారా? అక్కడున్న వారిలో బిల్లీ పౌల్ కాకుండా ఎవరైనా ఉన్నారా? ఈ బాలురు అప్పుడే వెళ్ళిపోయారు. అవును. సహోదరుడు ఉడ్, సహోదరుడు టేలర్ ఇంకా ఇతర సోదరుల పేర్లు నేను మరచిపోయాను. నలుగురు లేదా అయిదుగురు అక్కడ ఉండిరి. ఇక్కడున్న సహోదరుడు మార్టిన్ అంతకుముందు రోజునే తుఫాను రాక విని వెళ్ళిపోయేను. మీరందరు ఆ తుఫాను రాక ఎరుగుదురు. రేడియో ప్రసారము చేసెను. అది వచ్చుచున్నదని వారు చెప్పారు. ["దానిని మేము చూచాము," అని ఒక సోదరుడు చెప్పెను.] ఇప్పుడు చెప్పండి? మీరు దానిని చూచారు. మీరు దానిని ఎదుర్కొనిరి.
43అయితే ఇప్పుడు గమనించండి. ఇక్కడ నిలబడి నేను ఆలోచించాను. "మంచిది. నేను కొండ క్రిందికి వెళ్ళేదను."
సంపూర్ణ సువార్త వ్యాపారస్థులతో బయటకు వెళుతూ, నాలుగు సంవత్సరాల క్రితం దేవునితో ఈలాగు ప్రమాణము చేశాను, "ఇతరుల కొరకు నేను అదే అత్యవసరమయితేనే గాని వేటాడను." నేను అది చేయలేను.
అవును. అది సహూదరుడు జాక్ పామర్, ఇక్కడున్నాడా? సహోదరుడు జాక్, జార్జియా నుండి వచ్చాడు. మామూలుగా ఇక్కడకు వచ్చుచుండును. అతడు అక్కడ నిలబడియున్నాడు. ముందు రాత్రి ఇట్లు పలికారు, "సహూదరుడా బ్రెన్హాం, నాకు ఒక జింక కొట్టి పెట్టు."
44మై, నేను వణకిపోయాను, ఎందుకనగానగా నేను ప్రమాణము చేశానని ఎరుగుదును. అది నేను చేయను. నాలుగైదేండ్ల క్రితమే అన్నాను, ఎందుకనగా ఆ సంవత్సరము కేవలను ప్రధానమైన దుప్పి వంటి జంతువులనే పందొమ్మిదింటిని చంపాను. కూర్చొని తమ పని గూర్చి ముచ్చటించుకోనే వ్యాపారస్థుల కోసమే చంపాను. నేను బయటకు వెళ్ళి వారికి బదులు వేటాడాను, అది ఒక విధమైన హత్యా నేరముగా నాకు తోచినది, అయితే అది నేను చేయను. అవి ఉన్న స్థలమునకు వారిని తీసికొని వెళ్ళుదును గాని వానిని నేను చంపను, కనుక అది చేయనని దేవునికి వాగ్దానము చేశాను.
అప్పుడు నేను స్థలము విడిచి పెట్టి వెనుకకు బయలుదేరి, కొండ దిగుచున్నాను. ఒక స్వరము నాతో ఇట్లు పలికెను, "నాతో ఎందుకు నడువకూడదు?"
"ప్రభువగు దేవా, అది నీవే, దేవుని హస్తము మాత్రమే ఆ మేఘములను విడుగొట్టి నీవిక్కడ చేసినది చేయకలుగును," అని చెప్పాను. వేడిగా సూర్యుడు వెలుగుచుండెను. బయట నా షర్టు ఎండిపోయెను. దాని నుండి ఆవిరి వచ్చుచుండెను…."గొప్ప దేవాలయమా, కన్య అరణ్యమా, నీ వెరుగుదువు, ప్రభువా, అయితే ఈ మార్గమున నేను నడువగలనని ఎరుగుదును. నీవు ప్రత్యేక సూచన ఇవ్వనిచో ఆలాగు చేతును. నేను అక్కడికి వెళ్ళి, నా భార్యకు జ్ఞాపకార్థముగా కొద్ది నిమిషములు నిలబడగోరాను. మా మొదటిది, ఒకే ఒక హానీమూన్. అది మాత్రమే ఎన్నటికీ మాకు కలిగిన అవకాశము, ఆమెను వేట ప్రయాణములో తీసికొని వెళ్ళాను. ఈ సంవత్సరము మరల నేను ఇచ్చట ఉన్నాను. ఈ సోదరులతో వేటాడుచున్నాను. ఆమె టుసాన్ లో ఉండి పనులన్నీ చక్కపెట్టుచున్నది.
45నేను ఇక్కడికి వెళ్ళుటకు నడక ప్రారంభించాను. నేను ఆలోచనలో ఉన్నాను. ఇప్పుడిది ఇలా వింతగా వినబడును. నేను తొందర పడవలెను, ఎందుకనగా మీ ఆరాధన పది నిమిషములలో ప్రారంభమగునని నాకు తెలియును. కనుక నేను అక్కడికి నడువసాగాను, మరియు ఆలోచిస్తూనే యున్నాను, "ఓ, ఎ్కడికయినా వెళ్ళుదమని ఆమె ఎప్పుడూ ఒక్క మాట కూడా నాతో ఎందుకు చెప్పదు?" ఎంత ఆశ్చర్యము! ఈ ఉదయమున ఏమి జరిగినదో కొద్ది నిమిషములలో నేను మీకు చెప్పగోరుచున్నాను. నేను…
ప్రతి మనిషి దీనిని ఆలోచించవలసియున్నాడు. నా భార్య వంటి స్త్రీ ఈ ప్రపంచములో మరెవరూ లేరని నేను తలంచుచున్నాను. ఆమె ఎంతో అద్భుత వ్యక్తి. పవిత్రురాలు, ఇంటి యొద్ద ఉండును. ఆమె ఎల్లప్పుడూ నా బట్టలు సిద్ధము చేయును. నేను పర్యటనలకు బయటకు పోవుదును. తిరిగి వచ్చి ఆమెను కొద్దిగా ఏడిపించుదును. "నేను నీ భర్తను. నీవు వా భార్యవేనా?" అని సరదాగా అంటూ పిల్లలను ముద్దు పెట్టుకొందును? మోకరించి ప్రార్థింతుము; నా దుస్తులు ధరించి మనస్సును ప్రశాంతముగా ఉంచుట కొరకు జనులకు దూరంగా పోయి చేపలవేట గాని జంతువులవేట గాని ప్రారంభించును. ఆమె నుండి దూరమవుదును. ఆమె ఒంటరిగా తానే అన్నీ భరించవలెను.
46అప్పుడు నేను ఆలోచించుదును, "సరే, నేను ఇంటికి వెళ్ళినచో బాగుండును… ఎల్లప్పుడూ నాకు తెలిసినది దేవుడు ఆయన వాక్యము మాత్రమే నిరంతరము దాని మీదనే నేను మాట్లాడుచున్నాను." అక్కడికి నేను వెళ్ళుచూ ఉండగా, ఒక ఆలోచన కలిగినది, "ఆమె నిన్ను బహుశా వెళ్ళనిచ్చును, ఎందుకనగా అది జనులు దూరముగా నుండుటకు దోహదపడును. నీవు దూరముగా ఉన్నప్పుడు ఆమె మరింత ప్రశాంతముగా ఉండును," అని చెప్పెను. నేను ఆలోచనను వెంబడించనారంభించాను. నేను వెళ్ళాను, "ఊఁ" అని నేను అనుకొంటుండగా, నా ముఖము మీద మీసములు చూచాను. వారము రోజుల పాటు పెరిగినంతగా ఉండి అవి సగము కూడా నేరవనట్లుగా కనబడినవి. ఇట్లనుకొన్నాను, "బిల్, నీవు కేవలము… ఎక్కడికి నీవు వెళ్ళుచున్నావో నీకు తెలియునా? నీవు ఇప్పుడు బయటకు పోవుచున్నావు, చూడు, నీవు ముసలివాడివగుచున్నావు. ఇప్పటికే నీవు ఏబది ఏండ్లు దాటిపోయావు." కనుక నేను దానిని ఆలోచించుచున్నాను. నా భుజము మీద రైఫిల్ ను వ్రేలాడదీసికొని ఆ విధంగా వెళ్ళుచున్నాను.
47అకస్మాత్తుగా, ఏదో జరిగినది. ఎన్ని విధములా నేను మరల బాలునిగా కనిపించాను. మానసికంగా ఏమి జరిగినదో లేదా ఏమాయెనో నేనెరుగను. ఆమె ముందు నేను నిలబడి చూచాను. నేనామెను పెండ్లి చేసికొన్నప్పుడు ఉన్న రీతిగానే, ఆమె నా ముందు నిలబడినది. నా తుపాకీని క్రింద ఉంచాను. నా కళ్ళు నులిపాను. ఆమె వైపు నేను చూడగా, ఆమె ఈ విధంగా చేతులు ముడుచుకొని నా వైపు చూస్తున్నది. నేను నా తలను క్రిందికి దించాను.
ఎందుకనగా మా వివాహ సంవత్సర జ్ఞాపకార్థముగా నేను అక్కడికి ఎక్కి వెళ్ళుచున్నాను. ఆ చెట్ల ప్రక్కన నిలబడియున్నాను, చిన్న చెట్ల తోపు అక్కడున్నది. అడిరాండెక్లోకి వెళ్ళినప్పుడు ఆ ఉత్తర అరణ్యాల్లో ఉన్న ఆప్స్ చెట్ల లాంటివి అక్కడుండెను. నేను ఎప్పుడూ అక్కడికి వెళ్ళేవాడీని, ప్రతి అక్టోబరు ఇరవై-మూడున అక్కడికి వెళ్ళుదును
48ఆమె అక్కడున్నది. నేను రైఫిల్ క్రింద పెట్టి కూర్చున్నాను, అటు చూచాను. ఒక్క నిమిషము ఆగాను. నా తలను వంచాను. వెనుకకు చూచాను. ఆమె ఇంకా ఆలాగే చేతులు బయట పెట్టి నిలబడియున్నది, "నేను నా మతిని పోగొట్టుకోలేదే?" అనుకొని మరల చూచాను. "ఎందుకిలా ఉన్నది?" అని ఆలోచించాను. ఇక్కడ నేను ఒక యువకునిగా ఉన్నాను. నేను నా చేతులు చూచుకొన్నాను… "ప్రభువా, నీ వర్తమానమును, ఈ లోకములోనికి తీసికొనివచ్చు నా బాధ్యతకు నాందీగానే ఇది ఏదో నిశ్చయముగా జరుగుచున్నది," అనుకొన్నాను. నేను మరల చూచాను. అప్పుడు అది తొలగిపోయెను.
నేను నా తుపాకీని పట్టుకొన్నాను. నా భుజము మీద ఉంచాను. "నేను వచ్చి ఈ విధంగా వేటాడుట మొదలగునవి ఆమె హృదయమును బ్రద్దలు చేయుచున్నదని నీవు తెలియపరచుటకు ఇది జరిగించావేమో," అనుకొన్నాను.
49కాని నేను నడవ సాగుచూ మరల నా టోపీని తీసివేశాను. "దేవా, నీవు ఇక్కడున్నావని నాకు తెలియును. నీవు ఇక్కడున్నావని అనుకొనుటలో నాకు ఎట్టి సందేహము లేదు. నేను నిన్ను నీ మాటను ప్రతిదానిని నమ్ముచున్నాను. నీవే, నీవే నా వెనుక ఆ సూర్యుని ప్రకాశింప చేసియున్నాను. ఈ కార్యములను చేసినది నీవే. నీవు సృష్టికర్తవు. నేను స్వీకరించుటకు భయపడునట్లుగా కనిపించనున్నాను. నేను ఏదయినా పొరపాటు చేయుదునని భయపడుచున్నాను. నిన్ను ఒక పని చేయమని అడుగుచున్నాను. నా హృదయము నుండి భారమును ఎత్తివేయుము. ఇక ఒప్పుకొనమని నన్ను ప్రయత్నింపనవసరము లేదు, ఎందుకనగా అయిదు సంవత్సరములు నిరంతరము నీకు మొర్ర పెట్టాను. నేనేమి చేశాను? అది ఏమిటో నాకు చెప్పుము."
50అప్పుడు నేను చిన్న కొండ మీద నడచుచున్నాను. ఈ సంవత్సరములో ప్రభువు, మాకిచ్చిన జయకరమగు పెండ్లి కొరకును, పరస్పర ప్రేమ కొరకును, మా బిడ్డల కొరకును, నా భార్య నిమిత్తమును ఆయనను స్తుతించుటకు కొద్ది నిమిషముల పాటు నిలబడనైయున్న చోటునకు చాలా సమీపములో యున్నాను. నేను ఆలాగు ప్రతి అక్టోబరు ఇరవై-మూడున చేయుదును. అక్కడ ఒక చిన్న అస్ప్ చెట్టు ఆకారములో పది అంగుళముల మందములో పెరిగియున్నది. ఆ కొండ పైకి నేను నడచుచుండగా ఎంతో బలహీనమయ్యాను, ఆ చెట్టునకు ఆ విధంగా నేను అనుకొనియున్నాను.
ఆకులను ఏదో సవ్వడి చేయుట ఒక్క నిమిషము పాటు నేను విన్నాను. అక్కడికి నేను వెళ్ళిన సమయాన ఆకులు ఎండిపోయి యున్నవి. దాదాపు మూడు లేక నాలుగు వందల గజముల దూరముండును. నేను చూచాను. నా కండ్ల నుండి నీరు కారుచూ నెరసిన గడ్డము మీద నుండి క్రింద నేల మీద పడుచున్నది. "ఓ, దేవా, నేనెంతగా విఫలమయ్యాను!" అనుకొన్నాను. ఆ స్థితిలో నేను నిలచియున్నాను, "నీవు ఆమె పట్ల కృప చూపుదువని నమ్ముచున్నాను. నేను కృపను ఆర్థించు యోగ్యతను కలిగి లేను, నేను ముసలివాడనగుచున్నాను. ఏదో దినమున నేను వెళ్ళిపోవలసి యున్నాను ప్రభువా," అని చెప్పాను.
51ప్రజలు దీనిని పిచ్చి అనుకొందురని నాకు తెలియును, కాని ఆ స్థలములలో దేవుని నేను కనుగొందును, అదే నాకు వాస్తవమైనది… అది ఇక్కడున్నంత వాస్తవముగానే యున్నది, ఇంకా ఎక్కువ వాస్తవమేనని తేటగా చెప్పుచున్నాను, ఎందుకనగా చూడండి, మీరందరూ అందులో భాగము. నేను ఒంటరిగా ఆయనతో నిలబడి, ఆయనతో తప్ప మరెవరితోను మాట్లాడనట్లుగా కనిపించినది.
నేను అక్కడ నిలబడియుండగా, కుంచే బ్రద్దలయినట్లుగా వినబడినది. ఒక విధంగా నా తలను పైకి ఎత్తాను; ఒక ఎర్రని షర్ట్ ధరించాను, నా టోపీ చుట్టూ ఎర్రని పట్టీ ధరించాను. ఒక ఎర్రని చేతి రుమాలును ఆ పాశ్చాత్య టోపీకి చుట్టి ఉంచాను. నేను చూడగా, రెండు మూడు జింకలు నా ప్రక్కనే నిలబడియున్నవి. అప్పుడే అవి నడచి వచ్చినవి; నేను ఆ ఎర్రనివి ధరించి ఉన్నాను. అక్కడుండిన ఆ వేటగాళ్ళందరూ, నలుబది సార్లు తుపాకీలు పేల్చారు అని నేననుకొంటాను; ఎందుకు, నిశ్చయంగా, అవి ఇప్పుడు చెదరిపోయి యుండును. కాని ఆలాగు కాలేదు. అవి అక్కడ నిలబడి నావైపు చూచెను.
52చక్కని మాంసము, రెండు బాగా ఎదిగిన జింకలు మరియు ఒక పెద్ద లేడి. ఏదో నాతో ఇట్లనెను, "అక్కడ సహూదరుడు ఇవాన్స్ కొరకు ఒకటి సహోదరుడు వేల్స్ కొరకు ఒకటి, ఆ మెతడిస్టు బోధకుని కొరకు ఒకటి, ప్రభువైన దేవుడు ఇప్పుడు నీకు ఇచ్చుచున్నది సరిగ్గా అక్కడున్నది. అవి పారిపోలేవు. వాటికి పోవు మార్గము లేదు. నా భుజము మీద రైఫిల్ వ్రేలాడుచున్నది. అవి తిరుగక ముందే, అవి కనీసము కదలక ముందే నేను ఆ మూడింటినీ చంపగలను. అవి నా చేతిలోనే యున్నవి. నేను ఈలాగు అనుకొన్నాను, "ఆ మూడింటినీ కొండమీద నుండి దొర్లించుట చాల సులభము. ఆ తరువాత బయటకు తీసికొని వెళ్ళవచ్చును. అది చాలా తేలిక. అక్కడ మూడు ఉన్నవి. వాటిని తీసికొని కొండలను విడిచిపెట్టి గృహమునకు పోవచ్చును." నేను అక్కడ వాటివైపు చూచాను. దాదాపు పదిహేను, ఇరవై గజములలో ఎంతో నెమ్మదిగా అవి నా వైపు చూస్తూ నిలబడియున్నవి. సరే, నేను నిశ్శబ్దముగా నిలబడియున్నాను.
53మీరు జింకలను వేటాడుదురో లేదో నాకు తెలియదు, కాని అవి వింతయిన జంతువులు… అని నిశ్చయత లేనివి. అవి ఈ విధముగా కాళ్ళు సిద్దము చేసికొని పోవును… [సహోదరుడు బ్రెన్హాం తన కాళ్ళను ఆ విధముగా ఉంచుకొని వాటిని అనుకరించుచున్నారు.]
ఆంతట అవి నన్ను గమనించెను. "అదిగో అక్కడున్నది. ఒక్కటే సంగతి, నా రైఫిల్ ను తీసి మరియు చంపగలను," అని అనుకున్నాను.
అది చేయనని నేను దేవునికి వాగ్దానము చేసినదానిని అప్పుడు నేను జ్ఞాపకము చేసికొన్నాను. అది నాకు గుర్తున్నది. "లేదు, నేను అది చేయజాలను. అది మంచిది కాదు. దానిని చేయనని నేను దేవునికి వాగ్దానము చేశాను," అని తలంచాను. నీవు ఒక వాగ్దానము చేసినప్పుడు దానికి నీవు కట్టుబడి యుండవలెను. దేవుడు ఆలాగుననే ఆశించును. నేను అక్కడ ఈలాగు తలంచాను. "అవి ఖచ్చితంగా నా చేతుల్లోనే యున్నవి, అయినను దానిని చేయనని నేను ఆయనకు వాగ్దానము చేశాను."
54ఇట్లు చెప్పాను, "ఓ తల్లీ, నీ పిల్లలను తీసికొని అరణ్యములోనికి వెళ్ళిపో. నీకునీవు హాయిగా ఉండు. నీవు నా చేతులలో ఉన్నావు, కాని నిన్ను నేను చంపబోవుట లేదు." అవి మరికొద్దిగా సమీపంగా వచ్చాయి. ఓ, జింకలు ఆలాగు చేయుట వాడుక కాదు. మీకు తెలియునా, అవి నా వైపు చూచి తలను త్రిప్పుకొన్నవి. నేను అక్కడ నిలబడియున్నాను. నేను ఎర్రని దుస్తులు ధరించుకొని అక్కడ నిలబడియున్నాను. నా చేతిలో రైఫీల్ ఉన్నది. నా చేతితో మేత అందించకలిగినంత దగ్గరగా అవి నడిచివచ్చాయి. అవి ఆ చుట్టూ కొద్ది క్షణముల పాటు ముక్కుతో పసిగట్టుచూ వెనుకకు తిరిగి నడిచాయి. అవి ఆగి మరల వెనుకకు వచ్చెను.
ఏదో నాతో ఇట్లు చెప్పసాగెను, "అది నీ చేతులలోనే యున్నవి. అవి నీ హస్తములలో యున్నవి. ప్రభువు వాటిని నీ చేతులలో పెట్టెను."
కాని నేనిట్లు చెప్పాను, "నేను వాగ్దానము చేశాను, అది చేయనని నేను ప్రమాణము చేశాను."
55అప్పుడు నేనిట్లు తలంచాను, "మీకు తెలియును, ఒకసారి దావీదు రాజగు సౌలు ఉన్న స్థలమునకు నడిపించబడెను. యోవాబు ఇట్లు పలికెను, "యెహోవా నీ చేతికి అతనిని అప్పగించియున్నాడు." కాని అతడిట్లు చెప్పెను, "ఆయన అభిషేకించిన వానిని ముట్టకుండా దేవుడు నన్ను నిరోధించును గాక," చూచారా. చూడండి, మీరు ఒక వాగ్దానము చేసినప్పుడు, దానిని తప్పకుండా గమనించవలసి యున్నారు.
అంతట నేనిట్లు పలికాను, "దానిని చేయనని నేను దేవునికి వాగ్దానము చేశాను, కనుక అది చేయను."
"తల్లీ, నీ పిల్లలను తీసికొని అడవులలోనికి వెళ్ళిపో. నిన్ను నేను బాధించను. నీవు నా చేతులలో ఉన్నావు. నీవు తప్పించుకొని వెళ్ళజాలవు. కాని నిన్ను నేను బాధించను. అడవులలోనికి వెళ్ళిపో," అని చెప్పాను. అవి మరల నా యొద్దకే తిరిగి వచ్చాయి. నేను అక్కడే నిలబడియున్నాను. "ఏమిటిది? ఒక వింత సంగతి" అని అనుకొన్నాను.
1SAM 24:4,6•
JOB 14:13
56నేను ప్రకృతి మనిషిని. నేను దేవునిని ప్రకృతిలో గమనించుదును, సూర్యాస్తమయము, సూర్యోదయము; అది మరణము, జీవము, సమాధి; ప్రతీది మరణించుచూ, తిరిగి పునరుత్థానము పొందుచున్నది. చెట్లువలెనే, సమాధిలో దాగి యుండుటను గూర్చి యోబు చెప్పెను, "ఆయన నన్ను రహస్య స్థలములో దాచేను." చూడండి, రసము చెట్లలో నుండి వేర్లు యొక్క సమాధిలోనికి పోవుచున్నది. వసంత కాలములో మరల వచ్చను, అది పునరుత్థానము. ప్రతీదియు జీవము మరియు పునరుత్థానములను గూర్చి మాట్లాడుచున్నది.
HEB 13:5
57వాటిని గమనించుచూ అక్కడ నేను నిలబడి యున్నాను. అవి మరింత దగ్గరకు వచ్చాయి. అంతట అవి వెనుతిరిగి అడవిలోనికి నడిచి వెళ్ళాయి. నేను మూగవానివలె ఆలాగు అక్కడ నిలబడిపోయాను.
అవి దూరంగా వెళ్ళిపోయిన తరువాత ఆ స్వరము మరల మాట్లడెను, నా వెనుక సూర్యుడు ప్రకాశించుచున్నాడు, "నీవు నీ ప్రమాణమును జ్ఞాపకము చేసికొన్నావు కదా?" అని పలికెను.
"అవును ప్రభువా, నేను నా ప్రమాణమును జ్ఞాపకము చేసికొన్నాను. అది నీవేనని నేనెరుగుదును. ప్రభువా, నిన్ను నేను చూడలేను గాని ఇక్కడ ఎక్కడో నీవు ఉన్నావు. నిన్ను నేను చూచుటలేదు, కాని నీ స్వరమును నేను విన్నాను. నీవు ఇక్కడే ఉన్నావని నాకు తెలియును," అని పలికాను.
"నీవు నీ వాగ్దానమును నిలబెట్టుకొన్నావు. నీవు నీ ప్రమాణమును జ్ఞాపకము చేసికోన్నావు. నేను కూడా నాది గుర్తుచేసికొందును. ఎన్నడూ నిన్ను నేను విడువను, ఎడబాయను," అని పలికెను.
ఓ, మై, అప్పటి నుండి ఎన్నడూ మరల ఆలాగు నేను అనుభవించలేదు! కొండ పైనుండి వచ్చేశాను, మధ్యాహ్నమంతయు దర్శనము వెంబడి దర్శనము కలిగినది. నేను క్రిందికి దిగి వచ్చాను. అప్పటినుండియూ అంతా వేరుగా ఉన్నట్లుగా కనిపించుచున్నది. ఒక భారము పోయినది.
58నాకు మొదటగా సువార్త పరిచర్య వచ్చినప్పుడు వ్యక్తుల చేతులు తాకిడిని అనుభవించాను, అది ఏమిటి, వాటిలో జీవముండెను, అదెట్లు జరిగెనో మనకు తెలియును.
కాలిఫోర్నియాలో ఒక రాత్రి మల్కీ కుటుంబముతో నేను కూర్చొనియున్నాను. సహోదరుడు మూర్, సహోదరుడు బ్రౌన్, మల్కీ కుటుంబమునకు అది గుర్తుండును. అక్కడ ఒక స్త్రీ, పుట్టుకతో యుండిన కాలు యొక్క వైకల్యము నుండి స్వస్థత పొందనైయున్నది. నేను ఆమె చేతిలోనే ఆమెకు చూపించి ఇట్లన్నాను, "అది అక్కడున్నది, దాని యొక్క అలికిడిని నీవు వినుచున్నావు. చూచారా?" "నీకు కాలుకు సంబంధించిన వ్యాధి రానైయున్నది. ఇప్పటికే అది నీలో పనిచేయుచున్నది," అని చెప్పాను. అలాగే ఆమెకు జరిగి, ప్రాణము పోయినంత పని అయినది.
59సహూదరుడు మల్కీ నాతో ఇట్లనెను, "సహోదరుడా బ్రెన్హాం, అది నీ వెట్లు చేయుచున్నావు?"
"నాకు తెలియదు. అదెట్లో నేను చెప్పలేను. అది దేవుడే," అని పలికాను.
కనుక నేను నా చేతిని ఆ విధంగా పట్టుకొని యుంచాను. "ఇక్కడ నా భార్య ఉన్నది, అమెకు ఏ పొరపాటు జరుగలేదు. నా మీద చేతిని వేయుము," అని పలికాను. ఆమె ఆలాగు చేసెను. స్త్రీ గ్రంధి నుండి ఒక కణితి యొక్క అలజడి కనబడినది. "ప్రియురాలా, నీ స్త్రీ గ్రంధులలో ఒక కణితి యున్నది," అని చెప్పాను.
"నాకేట్టి చిహ్నములు కనబడుటలేదు," అని అన్నది.
"ప్రియురాలా, ఇది నా చేతి మీద ఇక్కడున్నది. నీ చేతిని పైకెత్తుము" అని చెప్పాను. ఆమె పైకిలేపి మరల క్రిందికి దింపెను. "అది చూచావా?"
సరే, మేము ఇంటికి వచ్చిన తరువాత మాకు గల ఒక మంచి వైద్యుడయిన స్నేహితుని సంప్రదించాము. నేను ఆయన కలిసి బడికి వెళ్ళాము, ఆమెకు వైద్య పరీక్ష జరిపించాము. "ఏమో నాకు కనబడుట లేదు బిల్లీ! ఆమె బాగున్నదీ. ఎట్టి కణితి నాకు కనబడుట లేదు," అని పలికాడు.
"సామ్, నీ మాటకు నేను సందేహించను, చూడు, నీవు ఆమెకు వైద్య పరీక్ష జరిపావు, కాని ఆమెకు కణితియున్నది," అని పలికాను.
60మూడు లేక నాలుగు సంవత్సరములపాటు నేను వైద్య తనిఖీ చేసికొనినప్పుడు, విదేశములకు వెళ్ళినప్పుడు ఆమె నాతో కూడా వైద్య పరీక్షకు వచ్చినది. ఎన్నడూ అది కనిపించలేదు.
దాదాపు రెండు సంవత్సరాల క్రితం ఒక రోజున నేను వచ్చాను, ఇప్పుడు నేను పూర్తి సత్యము చెప్పవలెను. చూడండి, దేనిని కూడా దాటవేయ కూడదు అంతా సత్యమునే మీరు చెప్పవలెను. నా భార్య పట్ల నాకున్న ప్రేమను నేను వ్యక్తపరచుట మీరెరుగుదురు. కాని ఆ సంగతులను ఇంకా మనము గమనించవలెను. నేను మీకు సత్యము చెప్పుచున్నాను. ఇప్పుడిచ్చట నాకు సాక్షిగానున్న పరలోకపు తండ్రి అది నిజము అని ఎరుగును. ఓ, ఇంటియొద్ద ఏలాగున్నదనగా అదీ, ఇదీ ప్రతీదీ జరిగిపోతున్నది! ఈ సమయములో ఆమె రుతుక్రమములో మార్పు జరిగిపోతున్నది.
గత రెండు సంవత్సరములు, దాదాపు రెండు ఏండ్ల క్రితం మేము వైద్య పరీక్ష చేయించు కొన్నప్పుడు ఎడమ అండముపైన ఒక కణితిని కనుగొనెను. అది ఒక చిన్న కాయంత పరిమాణములో ఎదిగినది, "సహూదరుడా బ్రెన్హాం, దానిని మరల నన్ను పరీక్ష చేయనీ! మూడు నెలల పాటు అది ఎదిగినచో, అది బయటకు రావలసియుండును," అని చెప్పెను. సరే, మనము…
61దానికి ముందు నేను ఒక సంగతి మీకు చెప్పవలెను. దానిని నేను మరచి పోయాను. ఒకరోజు ఇంటిలో నుండి ఏదో చేయుటకు బయటకు వచ్చుచూ, తిరిగి వెళ్ళాను. ఆమె నాతో ఇట్లనెను, "బిల్, నీవు నాతో పట్టణములోనికి వచ్చెదవా?"
"ఇప్పుడు వెంటనే రాలేను," అని చెప్పాను.
"బెకీ గూర్చి చేయవలసిన ఆ ప్రత్యేకమైన దానిగూర్చి ఏమి చేయుదము?" అని ఆమె అడిగెను.
"హాని, ఏమీ చేయవలెనో నాకు తెలియదు," అని నేను చెప్పాను.
NUM 12:1,14
62అప్పుడు ఏదో వచ్చుచున్నది, ఆమె ఎంతో నరముల ఉద్రిక్తతలో ఉండెను, ఆమె నిలబడలేకపోతున్నది. రాత్రంతయూ ఇంటిలో జనము ఉండిరి. అంతకు ముందు రాత్రి వలెనే ఉదయము ఒంటి గంటకు కూడా ఇంటిలో ప్రజలు గుమిగూడిరి. కిటికీలు, గుమ్మముల చుట్టూ ఉండిరి… అప్పుడామే నిజంగా ఉద్రిక్తతలో యుండెను. ఆమె నాతో ఏదో చెప్పరానిది గలిబిలిగా చెప్పినది, చూచారా. ఇట్లు పలికినది, "బిల్, నీవు ఎప్పుడు బయటకు పోయెదవు. నేను ఈ పిల్లలను గూర్చి శ్రద్ధ వహించాలి. నీవు ఎప్పుడూ ఇక్కడుండవు. మనము కలిసి తీర్మానములు చేయుట లేదు. ఎప్పుడు నీవు బయటకు పోదువు," అని చెప్పి ఆమె ఏడ్చుచూ లోనికి పోయి తలుపు మూసికొనెను.
అప్పుడే నేను ఇట్లు పలికాను, "ఓ, దీనురాలా, నేను ఉండవలసి యున్నాను…" అని చెప్ప నారంభించాను.
"II దినవృత్తాంతములు 22 చదువమని నాకు చెప్పబడెను. ఒక ఇతియోపియా స్త్రీని పెండ్లి చేసికొన్నందుకు మిరియాము మోషేను గద్దించుట అది; ఇది చేయుట కంటే ఆమె ముఖము మీద ఆమె తండ్రి ఉమ్మివేయుట మేలు అనినది.
63నేను మరల లోనికి వెళ్ళాను. "నీవు తప్పు మాట పలికావు," అని ఆమెకు ప్రేమగా చెప్పాను. ఆమె ఏడ్చుచున్నది. "నీవు తప్పు మాట పలికావు. దేవుడు దానికి నీవు వెల చెల్లించవలెనని కోరును. నీవది చేసి యుండవలసినది కాదు. నేను చిందరవందరయి పోయాను. నీవది పలికి యుండవలసినది కాదు," అని అన్నాను.
ఆమె ఇట్లన్నది, "సరే బిల్, నేను అంతగా బాధకు గురి అయ్యాను." నేను వెనుకకు తిరిగి నడిచిపోయాను, ఎందుకనగా ఆమె నేను చేప్పునది విను స్థితిలో లేదని నేను ఎరుగుదును, కనుక నేను వెనుకకు వెళ్ళిపోయాను.
దాని తరువాత ఒక నెలకు తరువాత పరీక్ష జరిగినది, అప్పుడు కణితి కనబడెను.
గత సంవత్సరము, అది మరల ఇక్కడ వచ్చెను. ఆమె దానిని మరల ప్రయత్నించినప్పుడు, అది ఒక నారింజ కాయంత పరిమాణములో ఉండెను. వైద్యుడిట్లు చెప్పెను, "ఇంక ఆమెను ఆలాగు విడిచి పెట్టవద్దు. మీరు తప్పక శస్త్రచికిత్స చేసికొనవలెను. అది చాలా త్వరగా పెరిగిపోయే ప్రమాద భరితమగు కణితి. అది అంతా ప్రాకిపోయినట్లయినచో, అది ప్రక్కలకు అంటి పెట్టుకొని పోవును. అప్పుడు నీవు ఏమి చేయుదువు?"
"డాక్టరు గారూ! మాకు దేవుని యందు విశ్వాసమున్నది," అని చెప్పాను.
నేను సంఘమునకు గాని మరెవరికిని చేప్పలేదు, అలాగు కానిచ్చుదును. మేము ప్రార్థన చేయనారంభించాము. "ప్రభువైన దేవా, దయచేసి మాకు సహాయము చేయుము. నీవు సహాయము చేయుదువని ప్రార్థించున్నాను," అని చెప్పాను. ఆ విధంగా ప్రార్థించాను. ఆ కణితి అంతకంతకూ ఎదుగుచునే యున్నది.
64మేము టుసాన్ కు వెళ్ళుటకు బయలుదేరినప్పుడు ఇంటి యొద్దనున్న మా వైద్యుడు అక్కడున్న తన స్నేహితుడగు వైద్యునికి కబురు పంపెను "వెంటనే శ్రీమతి బ్రెన్హాం యొక్క కణితిని నీవు తీసివేయవలెను, లేనిచో అది ప్రమాద భరితమగును. ఇప్పటికే సంవత్సరము నుండి ఆ కణితి చిన్నకాయ పరిమాణము నుండి ఒక పెద్ద దబ్బ పండంత పరిమాణమునకు ఎదిగిపోయేను." అది అంతగా ఎదిగిపోయెను. అది ఆమె ప్రక్క ఆలాగు తోసికొని వచ్చెను. ఒక రోజు….
ఆమె వెళ్ళుట వాయిదా వేసెను. మేము ప్రార్థించాము. మేము మొర్ర పెట్టాము, మేము ప్రార్థించాము. అంతా చేశాము. ఏది జరుగలేదు. చివరకు వెళ్ళి చూద్దామని చెప్పి ఆమెను బయలుదేరెను. నిన్ననే, అవును. నిన్న ఆమె చివరగా వైద్యుని యొద్దకు వెళ్ళెను. "అది చేయుట నాకు ఇష్టములేదు గాని, బహుశా చూడవలసి యున్నాము. అది చాలా పెద్దది ఆయిపోవుచున్నది గనుక దానిని బయటకు తీసివేయవలెను, మన విశ్వాసము చాలలేదు" అని ఆమెతో చెప్పాను.
65కనుక మొన్న నేను వచ్చు ముందుగా తెలిసియే ఆమె ఇట్లు చెప్పెను, "ఆ రాత్రి సహూదరుడు జాక్ ఆరాధన నీవు జరిగించు వరకు నన్ను ఆమె పిలువలేదు, నీ వెట్టి విధమగు కూటము కలిగియున్నావో, ఆ శ్రివ్-పోర్టులో జనులెట్లున్నారో చెప్పుము. అప్పుడు వైద్యుడు చెప్పినది తెలియజేతును."
"సరే మంచిది," అని చెప్పాను. ఫోను పెట్టేశాను.
నిన్న, మొన్న, ఇంటిలో నుండి వచ్చుటకు ముందుగా లోనికి వెళ్ళాను… ఎప్పుడూ మేము వెళ్ళుముందు పిల్లలము, మేమంతా కలిసి గదిలో మోకరించి ప్రార్థించుదుము. ప్రభువునకు మేము ఇట్లు, చెప్పాము… విదేశములకు మేము వెళ్ళునప్పుడు… "ప్రభువైన యేసూ, నా కుటుంబము గూర్చి శ్రద్ద వహించుము," అని చెప్పెదను. మేము మరల కలిసికొనునట్లుగాను, దేవుడు నాకు సహాయము చేయునట్లుగాను వారు నా కొరకు ప్రార్థించుదురు, అప్పుడు పిల్లలందరూ ఏడ్వనారంభించుదురు, అదెట్లుండునో మీకు తెలియును.
66పెసిడెంటు కెన్నెడీ కాల్చిచంపబడుట గూర్చి మాట్లాడుకొనుచున్నారు? చీకటిలో సహితము, మూడు-నాలుగు వందల గజముల దూరము నుండి తేలికగా అనేకసార్లు నన్ను కాల్చిచంపు సందర్భముల నుండి రక్షింపబడవలసి వచ్చెను. ఆ రాత్రిలో కూడా పగలు చూడకలిగినంత తేటగా చూడకలిగిన సాధనము అమర్చబడి యుండును. నేను కాతలిక్కు దేశములలో సంచరించుచుండగా, మెక్సికో మొదలగు చోట్ల తీవ్రవాదులు పొంచి యుండి, "ఈ రాత్రికి నిన్ను చంపుదుము," అని వర్తమానము, మొదలగునవి పంపుట జరిగెను. లోనికి మరియు బయటకు వచ్చుట, నా కొరకు చూచిరి. బహుశా ఏదో ఒకప్పుడు అది నాకు జరుగవచ్చును. అది సరియే. ఆ సమయము వచ్చినప్పుడు నన్ను కాపాడునది మరి యొకటి యున్నది, చూచారా.
67అప్పుడు నేను మరల వెళ్ళిపో నారంభించినప్పుడు, ఒక దినమున నాకునేనే మోకరించి ప్రార్థించాను. మొన్న గదిలో నేను మోకరించాను, చుట్టూ చూశాను, రెండు రోజులు ఒంటరిగా నేను అచ్చట ఉన్నాను. ఇంటి యొద్ద ఎవరూ లేరు. ఇట్లు ప్రార్థించాను, "పరమ తండ్రీ, ఇప్పుడు నా పట్ల కృప చూపుమని ప్రార్థించుచున్నాను. సహాయము చేయుము, నీ రాజ్యము నిమిత్తము సాధ్యమైనంత సహాయము చేయుటకు శ్రివ్-పోర్టుకు వెళ్ళుచున్నాను. ఈ విధంగా ఎన్నిసార్లు నేను నా భార్య ఈ గదిలో, ఇక్కడ మోకరించామో నీవెరుగుదువు! మేము ప్రార్థించుచున్నాము. ఈ రోజున నేను ఆమె లేక ఏకాంతముగా యున్నాను." "రేపు ఆమె వెళ్ళును, బహుశా నేను నా కూటములు అప్పటికి ముగించలేను. నిన్ను తీసివేయుమని అడిగిన ఈ గొప్ప కణితి నిమిత్తము ఆమె బహుశా వైద్యశాలకు వెళ్ళును, అది దినదినము ఎదిగిపోవుచున్నది. ఇక ఇప్పుడు తప్పక తీసివేయవలసిన అగత్యము ఏర్పడినది. నిన్ను నేను వేడుకొన్నాను," అని అన్నాను.
68"ప్రభువా, ఆమె ఒకవేళ పొరపాటు చేప్పియుండును. ఆది జరిగినప్పుడు నేను చిందరవందరయ్యాను. ప్రభువా, నీ కూటములకు వెళ్ళుట విషయములో ఆమె ఎన్నడూ ఒక్కసారి కూడా ఏమీ చెప్పలేదు. ఆమె ఎల్లప్పుడూ నా బట్టలు శుభ్రపరచి సిద్ధపరచును. నా చేయి పట్టుకొని ఏడ్చి ప్రార్థించి, ప్రభుని కొరకు నేను ఏదయినా సహాయపడినచో ఎంత బాగుండును అని చెప్పియుండెడిది. ప్రభువా, ఇప్పుడామె స్థితి చూడుము. ఆలాగు చేయవద్దు. ప్రభువా, దయచేసి చేయవద్దు. దేవా, ఆమెకు సహాయము చేయుము, అమె పట్ల కృప చూపుమని ప్రార్థించుచున్నాను. ప్రభువా, ఆమె శస్త్రచికిత్సకు గురి అయినచో ఆమెకు సహాయపడుము. ఇప్పుడు నేను ఆమెను పోగొట్టుకొనినచో నేను ఏమీ చేయుదునో నాకు తెలియుటలేదు. నేను ముసలివాడను. ఆ చిన్న బిడ్డలను పెంచవలెను. నేనేమి చేయుదును? ప్రభువా, ఆమెకు దయచూపుము. నేనామెను ఎట్లు ప్రేమించానో నీవెరుగుదువు, నీ వామెకు సహాయము చేయుమని నేను ప్రార్థించున్నాను," అని పలికాను.
69నేను ప్రార్థించుచుండగా, ఏదో ఈలాగు పలుకుట విన్నాను, "లేచి నిలబడుము." నేను ఇంకా ప్రార్థించుట కొనసాగించుచునేయున్నాను, ఎందుకనగా అది నా ఊహ మాత్రమే కాబోలు అని అనుకొన్నాను. నేను ప్రార్థించుచుండగా, ఏదో ఇట్లు చెప్పెను, "నీవు లేచి నిలబడుము." అప్పుడు నేను ప్రార్థించుట మానివేశాను, మరియు పైకి చూచాను. క్రీస్తు చిత్రము….
నేనెన్నడూ సాల్మన్ యొక్క చిత్రమును లెక్క చేయలేదు. ముప్పది-మూడు సంవత్సరముల ప్రాయములో నున్న శిరస్సు యొక్క హాఫ్మన్ పఠము నాకు ఇష్టము అని మీరెరుగుదురు, దానియొక్క పెద్ద పఠము నా యొద్ద ఉన్నది, ఎందుకనగా ఆయనను ఆ సమయమందు దర్శనములో చూచినప్పుడు ఆలాగే కనబడెను. అది అక్కడే ఉన్నది. నేను ప్రార్థించునప్పుడు నా వైపు చూచినట్లుగా ఉండునట్లుగా దానిని వ్రేలాడదీసి యుంచాను.
నేను అక్కడ చూచాను, ఆ పఠము వైపు దృష్టించాను. చుట్టూ కలియ చూచాను, "నీవు లేచినిలబడు," అని చెప్పినది ఏమిటి? "సరే, లేచి నిలబడుదును అనుకొని, లేచాను."
70ఆ రాత్రి కొండ పైన మాట్లాడిన అదే స్వరము, ఎల్లప్పుడూ వచ్చే ఆయనే. "ప్రభువగు దేవా, నీ సేవకునితో మాట్లాడుచున్నది నీవేనా?" అనడిగాను.
"మాట మాత్రము పలుకుము, ఇక ఏ మాత్రము ఆ కణితి ఉండదు," అని చెప్పెను.
నాకు నేను సరిగా ఉండుటకు అక్కడ కొద్దిగా నిలబడ్డాను. ఆమెకున్నదానిని ఇక్కడున్న వారిలో చాలామంది, ఆలయములోని జనులు ఎరుగుదురు. అప్పుడు నేను ఇట్లు చెప్పాను, "ప్రభువైన యేసుక్రీస్తు నామములో కణితి పోవును గాక!" అది ఆమెను ఎంతగానో బాధించుచున్నది. దానితో ఆమె మూడు నాలుగు దినములో పడక మీద ఉన్నది. "వారెన్నడూ దాని జాడను తిరిగి కనుగొనలేకపోవుదురు గాక. గాలులు, తుఫానులు, సముద్రములు మొదలగు వానిని గద్దించిన, ప్రభువైన దేవుడగు నా సృష్టికర్త, ఆయనే భూమ్యాకాశములను సృష్టించిన వాడు. నేనాయనను ప్రేమించుదును, నమ్ముదును. ఈ సంగతులు జరుగనైయున్న కాలము సమీపించుచున్నదని నేను ఎరుగుదును. ఒక ఉడుతను నీవు సృష్టించి ఉనికిలోనికి తీసికొని వచ్చిన దేవుడు, ఉనికిలో లేకుండా శత్రువును తీసివేయగలడు, అపవాది ఆయనను తుఫానులో పడవేసినప్పుడు… గాలులు దేవుని యొక్క సృష్టి. జలములు దేవుని యొక్క సృష్టి. కాని అపవాది అందులో చొరబడెను, అది సముద్రములో ఆలాటి అల్లకల్లోలమును తీసికొని వచ్చెను, కాని నీవు దానిని నిమ్మళ పరచగలవు. దానిని నిమ్మళపరచగల నీవు, నా భార్యలో నుండి ఆ కణితిని తీసివేయగలవు. ఇది ఇప్పుడే జరిగినది, అని చెప్పుచున్నాను. ఇక మీదట ఏ మాత్రము అది ఉండకపోవును గాక. అది సమాప్తము అయినది."
HEB 13:8
71నేను నిశ్చయతతో అక్కడికి వెళ్ళాను. నా కుమారునికి, కోడలుకు చెప్పాను. మేము వచ్చాము, గతరాత్రి చాలా, త్వరగా పరుగిడి కూటమునకు ఇక్కడికి వచ్చాను. తిరిగి వెళ్ళి ఆమెను పిలిచాను. ఆమె ఇంకా దాని గూర్చి ఏదియు ఎరుగదు. ఆమెకు నేను చెప్పలేదు.
ఆమె పిలచినప్పుడు పూర్తి సంతోషంగా ఉన్నది. ఇట్లు చెప్పినది, "బిల్లీ, ఒక సంగతి నీకు చెప్పవలసియున్నాను. ఎక్కడా కూడా ఆ కణితి ఉన్న జాడయే లేదు. అది కనబడలేదని వైద్యుడు చెప్పెను. నేను ఎంతో సంతోషంగా ఉన్నాను! శ్రీమతి నార్మన్, మరియు కొందరు సోదరులు, ఇక్కడ ఇద్దరు ముగ్గురు నా గదిలో ఉన్నారు. నేను అర్థము చేసికొనలేకపోవుచున్నానని వైద్యుడు చెప్పెను, ఒకనెల క్రితం దబ్బ పండంత పరిమాణములో కణితి ఉండెను, శ్రీమతి బ్రెన్హాం, నీకు విశ్రాంతి అవసరము. కణతి యొక్క ఏ సూచన లేదు అని వైద్యుడు చెప్పెను." అదెక్కడుండెనో ఆమె వైద్యుడు ఎరుగును…
72అది మన ప్రభువగు దేవుడే! కృతజ్ఞత చెల్లించవలసిన దినమా? ఓ, యేసు క్రీస్తు వరమును బట్టి దేవునికి వందనములు. నిన్న, నేడు, నిరంతరము ఏకరీతిగా ఉన్న ఆ అత్యున్నత బహుమానము. అది నిజము.
పైనున్న ఆకాశములను బట్టి గాని లేదా మరి దేనిబట్టి గాని ప్రమాణము చేయుటలో నాకు నమ్మకము లేదు. కాని నా హృదయమందు బైబిలున్నది, నేను దేవుని ప్రేమించుచున్నాను. చెప్పిన ప్రతిమాట సత్యము అని ఆయన ఎరుగుదును. కృతజ్ఞత చెల్లించవలసిన దినము! రేపు, లేదా వచ్చే కొద్ది రోజుల్లో ఏదో ఒక దినమున దానిని నేను జరపాలంటే ఈ కూటము సహితము విడిచి వెళ్ళవలసియుండును. క్రిస్మసు సమయములోనయినా నేను తిరిగి వచ్చుచునని నా ప్రజలకు నేను వాగ్దానము ఇవ్వజాలను. క్రిస్మసునకు పిల్లలను తిరిగి గృహమునకు తెచ్చుటకై నా బిడ్డల నిమిత్తము ఇంటియొద్ద ఉండవలెను. ఒక పెద్ద దబ్బ పండు పరిమాణములో ఉండిన నా భార్య కణితికి శస్త్ర చికిత్స చేయించవలెనన్న సంగతి కూడా ఎరిగి నా హృదయము వికలమవుచున్నది. అది ఆలాగు జరిగెను.
73"నీవు పలికినది జరుగునని," దేవుని మాటయే చెప్పెను.
"ఆ కణితి పోయినది. ఇకమీదట ఎన్నడూ అది వారికి దొరకదు," అన్నాను.
ఈనాడు అది పోయినది. ఆరిజోనాలోని టుసాన్లో ఉండిన శ్రేష్టమగు వైద్యులు, ఉత్తమ శస్త్ర చికిత్సకులు ఎరుగుదురు. కొద్దిరోజుల క్రితము అంత గొప్ప కణితి ఉండెను. వైద్యులు దాని యొక్క ఏ జాడను కనుగొనలేకపోయిరి. ఏ వైద్యుడయితే ముందు చూచెనో, అదే వైద్యుడు ఈ విధముగా ఉచిత నివేదిక వ్రాసి ఇచ్చెను. "శ్రీమతి. బ్రెన్హాం మునకు కణితి ఉన్నట్లు ఎక్కడా జాడలేదు."
ఓ, దేవునికి కృతజ్ఞత చెల్లించవలెను! నాకు ఇది కృతజ్ఞత అర్పించవలసిన రోజు. అంతకన్న ఎక్కువగా, అక్కడ నేను వివాహము చేసికొనిన ఆ చిన్న ముఖమును గూర్చి దేవునికి మహిమ. మరణము యొక్క ముసలి చిహ్నములు ఒక రోజున అదృశ్యమగునని నాకు తెలియును. అక్కడ మనము యవ్వనత్వ పోలికలో ఉందుము. ఎన్నడూ వృద్దులము అవము, యేసుక్రీస్తు ద్వారా దేవుని వరమగు పరిశుద్ధాత్మను ఇప్పుడు మనము పొందియున్నాము. ఈ స్థిరతను అదే మనకు ఇచ్చును.
HEB 13:8
74స్నేహితులారా, నేడు దానిపైపు చూడండి. మీరు కృతజ్ఞత చూపు జనులగూర్చి మాట్లాడుచుందురు, లోకములో ఉన్న ప్రతి కృతజ్ఞత కలిగిన వారందరిలోను మనము ఉన్నతమైన వారిగా ఉండవలసియున్నాము. స్వస్థత ప్రక్కకు పెట్టి, జరుగుచున్న ఈ సంగతులు అటు ఉంచి, మరి ఏది మనకు గొప్పది జరిగినది? అదే దేవుడు, అదే స్వభావము, అదే అగ్నిస్తంభము, అదే దేవుని దూత, అదే నిన్న, నేడు, నిరంతరము ఏకరీతిగా ఉన్న యేసు. అదే శక్తి ద్వారా అవే కార్యములను చేయుచున్నాడన్న సంపూర్ణ నిశ్చయంత మనకున్నది. ఆత్మ నిలకడగా, నిశ్చయంతగా ఉండుటకు ఎట్టి లంగరు! పరలోకమందలి ప్రభువైన దేవుడు మీ ప్రతి ఒక్కరిని ఐశ్వర్యముగా దీవించును గాక. తలలు వంచుదము.
75ప్రభువా, నేనెంతో కృతజ్ఞుడను ప్రభువా. నాకు ఏమి చెప్పవలెనో తెలియదు, దానిని నేను వివరించజాలను. కొద్ది సేపటి క్రిందట ఆ గీతము పాడబడినప్పుడు, ఆ జనులు ఆ పాటను పాడినప్పుడు నా హృదయము ఆనందముతో గంతులేసినది. ఈ సాక్ష్యము నా హృదయములోనికి వచ్చినది. ఈ సంగతులు సత్యమని ఇప్పుడు పరలోక తండ్రి, నీవు ఎరుగుదువు. సరైనది తప్ప మరొకటి చెప్పవలసిన హేతువు ప్రభువా, నాకు లేదు. అది సత్యమని నా హృదయాంతరంగము నుండి నీవు ఎరుగుదువు. నా చిన్న సహచారిణి జీవితము రక్షించబడినందులకు కృతజ్ఞతలలో, క్రీస్తునందు బంధించబడిన నా సోదరీ, సోదరులు నాతో పాటు సంతోషించుచున్నారు. ఇక్కడున్న క్రైస్తవ సోదర సోదరీలు ఆలాగున్నట్లుగా నా హృదయము చూచును గాక ! [టేపు మీద ఖాళీ యున్నది.] … భూమి దేవుని స్తుతించు గాక. ప్రకృతి దేవుని స్తుతించు గాక! మనకు కలిగిన ఈ గొప్ప సమయమును బట్టి ఊపిరి ఉన్న ప్రతిది దేవుని స్తుతించి, కృతజ్ఞతలు చెల్లించును గాక.
EXOD 15:26•
HEB 13:8
76ప్రియ పరమ తండ్రి, అక్కడ నేను చక్రాల కుర్చీలో కూర్చొనియున్న ఒక చిన్న బాలుని చూచుచున్నాను. రోగులు అవసరతలు గలవారు ఇంకా కొందరు ఇక్కడున్నారు. మా ఆత్మలకు ఎట్లు నీవు రక్షకుడవో, ఆలాగే నీవు మా వ్యాధులను, బాధలను స్వస్థపరచగలవాడవు. ఇంకనూ నీవు… ఈ సాక్ష్యములు ఒకటి లేక రెండు మాత్రమే. కొన్ని వేలలో నీవు జరిగించుటను నీ దీన సేవకుడు చూచియున్నాడు. అందులో ఎట్టి దోషము లేదు. ఇంకనూ? నీవు యెహోవా-యీరేగా ఉవ్నావని మేము ఎరుగుదుము. స్వస్థత కొరకు బలిని ఇప్పటికే నీవు ఏర్పాటు చేసియున్నావు. నా భార్య ప్రక్కనుండి కణితిని నీవు తొలగించిన దేవుడవు నీవే, నీవు టుసాన్లో ఉండినట్లుగానే ఇక్కడ శ్రివ్-పోర్టులోను అదే దేవునిగా ఉన్నావు. ఆ సమయమున నేను ఆమెకు రెండువేల మైళ్ళ దూరములో ఉన్నాను. స్వస్థతా శక్తితో ఈనాడు ఆలయమును నీ పరిశుద్ద సన్నిధానముతో నింపుము. ఇక్కడున్న ప్రతి రోగిని స్వస్థపరచుము. దేశమంతటనూ ఈ కృతజ్ఞతార్పణల ఆశీర్వచనము నిరంతరము మారుమ్రోగును గాక! ప్రభువా, నిన్న, నేడు, నిరంతరము నీవు ఏకరీతిగా యున్నావు, నిత్యుడవగు దేవా, దానిని అనుగ్రహించుము.
1SAM 12:3•
PS 103:3
77ఇక్కడ కూర్చొని యుండిన మీరు, ఇప్పుడు ఒకరి మీద ఒకరు చేతులుంచుకొని ప్రార్ధించుడి. దేవుని యొక్క సన్నిధిలో విశ్వాస ఐక్యత ద్వారా మిమ్ములను మీరు కలుపుకొని మీ ప్రతీ ఒక్కరికి భాగ్యమున్నదని జ్ఞాపకము చేసికొనుడి. నేను మీకు సత్యము చెప్పుచున్నానో లేదో దేవుడే న్యాయము తీర్చును. నేను ఎన్నడైనా మీకు జరుగునని చెప్పినది విఫలమయినదా?
సౌలును రాజుగా చేయుదుమని ఒకసారి జనులు సమూయేలుతో చెప్పినప్పుడు, ఈలాగు పలికెను, "యెహోవా యొక్క నామము పేరట నేను ఎన్నడైనా చెప్పినది జరుగక మానెనా? మీ ద్రవ్యమును గాని, మీ ఆహారమును గాని నేను ఎన్నడైనా అడిగితినా?" "లేదు, సమూయేలు, కాని మాకు రాజు కావలెను. మాకు భూసంబంధమైన రాజు కావలెను." దేవుడే. వారి రాజు అని సమూయేలు ఎరుగును.
78జనులారా, ఈ ఉదయమున మీతో చెప్పుచున్నాము. మీకు జ్ఞాపకము చేయుచున్నాను. ఈ ఉదయమున మనము చదువుకొనిన దేవుని యొక్క వరము ఒక్కసారి అయినా విఫలమగుట చూచారా? లేదండీ! అది యేసుక్రీస్తు, అది తప్పిపోదు. సైన్సు దానిని రుజువు చేసెను. సంఘము అది ఎరుగును. ఆయన ఇప్పుడు ఇక్కడే యున్నాడు. ఈ నిమిషములో ఇక్కడ ఉన్నాడు. ఆయన ఇక్కడ ఉన్నాడు. మీ విశ్వాసము కొదువగాయున్నచో, ఆ వాక్యమును పట్టుకొని మిమ్మును మీరు దానితో అభిషేకించుకొనుడి, మరయు ఆయన మిమ్మును స్వస్థపరచును.
మీరు ఒకరి మీద ఒకరు చేతులుంచుకొని, మీ పూర్ణ హృదయముతో దేవునికి మొర్ర పెట్టి ఈలాగు చెప్పండి, "ప్రభువైన దేవా, భూమ్యాకాశముల సృష్టికర్తా, తుఫానును నీవు ఆపగలవు. రెండు వేల సంవత్సరముల క్రితము అది నీవు చేశావు. ఇప్పుడును నీవు మరలా అదే చేయగలవు. నా వ్యాధిని ఆపుచేయుము. నన్ను బాగుచేయుము. సర్వశక్తుడవగు దేవా, నీ పట్ల నా హృదయము కృతజ్ఞతతో నిండియున్నది." ఆమేన్.