వెళ్ళు, యేసును మేల్కొలుపుము

వెళ్ళు, యేసును మేల్కొలుపుము

1ప్రభువా, నేను నమ్ముచున్నాను,

సమస్తమూ సాధ్యమే, ప్రభువా, నేను నమ్ముచున్నాను.

ప్రార్థన కొరకు ఒక్క క్షణము లేచి నిలబడుదము. ఇప్పుడు మనము తలలు వంచుచుండగా, ఇక్కడ చేరినవారు, క్రింది భాగములో ఉన్నవారు… పైన బాల్కనీలో ఉన్నవారు, ఎవరు ఎక్కడున్నా గాని ఈ రాత్రి ఒక ప్రత్యేక విన్నపమును దేవునికి తెలియజేయవలెనని దైవ సన్నిధిలో కోరుచున్నచో, ఇప్పుడు ఆయన వైపునకు చేతులు ఎత్తండి. మీ యోచనను ఇప్పుడు ఆపి, మీ యెదుటనే క్రీస్తు నిలబడియున్నాడని నమ్మండి.

2పరమ తండ్రి, "అది విశ్వ వ్యాప్తముగా విధేయతకు సూచనగా ఉన్నది," అని సోదరుడు చెప్పినట్లుగా ఇక్కడ మేము మా హస్తములెత్తి నిలబడియున్నాము. నేల నుండి వచ్చిన మట్టి ముద్దలముగా మమ్ము మేము నీకు సమర్పించుకొనుచున్నాము. దేవా, వారిని ఈ రాత్రి నీ ఆత్మ, జీవములతో నింపి నీ కొరకే మహిమ తెచ్చుకొనమని ప్రార్థించుచున్నాము. మా ద్వారా ఈ రాత్రి మాట్లాడుము. నీ ఘనత కొరకు మా ద్వారా పని చేయుము. ప్రభువా, మా విన్నపమునకు జవాబునిమ్ము. వారందరిని నీవెరుగుదువు. మా వస్తముల, ఉద్దేశ్యముల, లక్ష్యముల వెనుక ఏమి ఉన్నదో నీవెరుగుదువు, మేము కోరునది ఎరుగుదువు…. దానిని మేము పొందినచో ఏమి చేయుదుమో నీవెరుగుదువు. నీ ఘనత కొరకు మేము అడుగుచున్న దానిని పొందునట్లుగా మా హృదయుములు, తలంపులు, మనస్సులను శుద్ధీకరించుము. దేవుని మహిమ కొరకు, యేసు నామములో దానిని అడుగుచున్నాము. ఆమేన్. మీరు కూర్చోండి.

3ఈ రాత్రి తిరిగి దేవుని గృహములోనికి వచ్చుట మేలుకరము, నాకు ఆగిపోవలెనని అనిపించినది. న్యూ-యార్కు యొద్ద నుండి తీవ్రమగు జలుబుతో సాతాను నన్ను మొత్తుటకు ప్రయత్నించుచున్నది. దానిని నా యొద్దకు తీసుకు వచ్చినప్పుడు తిరిగి దానికే నేను ప్రతిసారి అంటించుచున్నాను. అది నాకు అంటించుచుండగా తిరిగి నేను దానికి అంటించుచున్నాము, చూచారా. దాని మీద ఒక విధముగా పోట్లాడుకొనుచున్నాము. కొంతసేపు తరువాత ప్రభువు అడుగిడి నా పక్షము వహించునని నాకు తెలియును. కనుక ….

ఈ రాత్రి మా ప్రతి మనవులను ప్రభువు అనుగ్రహించవలెనని నేను ప్రార్థించు చున్నాను. ఈ రాత్రి స్వస్ధతా కూటము కొరకు మేము కేటాయించాము. దేశములోని పలు ప్రాంతముల నుండి మీరు వచ్చియున్నారను కొంటాను. వారు… నేను కూటమును ఏర్పరచుదునని ప్రకటించినప్పుడు, మొదటి ఆలోచన దైవిక స్వస్థత, చూచారా.

4కాని దైవిక స్వస్థత కంటే పరిచర్య మిన్నయైనది, చూచారా. ఈ రాత్రి నాకు తెలిసిన మిక్కిలి జబ్పుగల శరీరము, యేసుక్రీస్తు శరీరముగా పిలవబడుచున్న ఆ దేహమే. దానికి ఆత్మీయ స్వస్ధత కావలెను. దానిని చేయగల మందు నాకు తెలిసినంత వరకు ఒకే ఒక్కటున్నది. ఇది దేవుని వాక్యము. ఆ జబ్బు శరీరమును సువార్త యొక్క విటమినుల శక్తి మరియు బలములతో నింపగోరుచున్నాము. అందుకే నేను వాక్యము ద్వారా సంఘమును బలపరచుటకు ఇప్పుడు ఎక్కువ సమయము ఉపయోగించ ప్రయత్నించుచున్నాను.

ఒక పాండిత్యము గల సేవకునిగా, బోధకునిగా స్థానము తీసికొనుటకు నేను చాలినవాడను కానని నాకు తెలియును. కాని దీనిని నేను నమ్ముచున్నాను. పాండిత్యము గల సేవను నేను అగౌరవించుట లేదు. అది నాకుండినచో బాగుండునని కోరుచున్నాను. దీనిని చెప్పుటను బట్టి నేను నా ఆజ్ఞానమును బలపరుచుటకు ప్రయత్నించుట లేదు. కాని ఇప్పుడు మనకు కావలసినది మేధాశక్తి కాదు గాని, వాక్యమును సమకూర్చి దానిని ఆత్యుత్తమంగా ఆమర్చ కలుగుట ఎట్లో ఎరుగవలెను. అది దేవుని వలననే వచ్చును. మనకు దేవుడు అవసరము, చూచారా. చూచారా? చక్కగా రూపొందించిన పలుకుల ద్వారా ఎన్నడూ అది రాదు. అది ఒక సమర్పిత హృదయము ద్వారా వచ్చును. ఆ హృదయము దేవునికి అంకితమై, దేవుని చిత్తమును జరిగించవలెను. నీవు చిత్తమును చేయుటకు ముందుగా, ఆ చిత్తమును ఎరిగి యుండవలెను. నీవిక్కడ ఎందుకొరకు వచ్చి కూర్చున్నావో కనుగొనుము. అది కేవలము…

5సంఘము ఒక ఉద్దేశ్యము కొరకు ఉన్నది అని నేను ఎల్లప్పుడూ తలంచుచుంటిని. యేసు ఒక ఉద్దేశ్యము కొరకు భూమి మీదకు వచ్చెను. ఆయన ఒక ఉద్దేశ్యము కొరకు చనిపోయెను. ఆయన ఒక పని నిమిత్తము వచ్చెను, ఆ పని ఏమనగా, మడత, మచ్చ లేకుండా ఒక సంఘమును తన కొరకు కొనునట్లుగా దేవుని ఆజ్ఞను నెరవేర్చుటయే.

ఆ సంఘము ముందు నిర్ణయించబడినది. ఆ గ్రంథములో సర్వదా ఉంచబడు ప్రతి పేరును విడిపించుటకు యేసు వచ్చెను. చివరి పేరు విమోచించబడినప్పుడు గ్రంథము మూయబడును. ఎవరునూ నశించిపోకూడదని ఆయన ఉద్దేశ్యము కాదు, కాని తన ముందు జ్ఞానము వలన ఎవరు నశించెదరో ఆయనకు తెలియనిచ్చెను. కాబట్టి ఆయన ముందుగా నిర్ణయించగలడు. అప్పుడు వారి పేర్లు గ్రంథములో ఉంచబడును. దేవుని యొక్క మర్మయుతమగు శక్తుల ద్వారా - అది క్రియ జరిగించబడుచుండగా ఆ విమోచనా గ్రంథము మూయబడి, ఏడు ముద్రలతో ముద్రించబడును. ఒక దినమున విమోచన గ్రంథము ముగియబడినప్పుడు గొర్రెపిల్ల దానిని స్వీకరించును. దానిలో నుండి ఆఖరి పేరు పిలువబడినప్పుడు ఆయన విమోచించిన దానిని పిలచుటకు గొర్రెపిల్ల ముందుకు వచ్చును. అదే ఆయన సంఘము. ఆ సమయము బహు సమీపముగా ఉన్నదని నేను నమ్ముచున్నాను.

6దీనిని చేయుటలో నేను బహు కష్ట సమయములను ఎదుర్కొన్నాను. నా రికార్డును సరిగా ఉంచుటకు ప్రయత్నించుచున్నాను. అనేకసార్లు చాలా స్థలములలో నాకు తెలియకుండానే నేను వచ్చుచున్నట్లుగా ప్రకటనలు చేశారు. అది ఒక తప్పు ప్రకటన. సాతాను తాను చేయ కలిగినదంతా నాకు చేయ ప్రయత్నించుచున్నది. ఒక రోజున ఒకరు వచ్చి, "మనము ఫలాని చోట ఉండబోవుచున్నామన్న మాట నిజమేనా?" అని అడిగి తెలిసికోగోరెను, చూచారా.

ఈ మధ్యనే న్యూ-యార్కులో అసలు నాకు ఏమి తెలియకుండానే ప్రకటన చేశారు. ఆ సమయములో నేను అచ్చట ఉందును గనుక అది సరియేనని క్రిస్టియన్ బిజినెస్మన్ ఒకాయనకు చెప్పెను. వారి కన్వెన్షను అక్టోబరు నెలలో జరుగును. ఆ వ్యక్తికి నేను నవంబరు మొదటి వారములో న్యూ-యార్కులో ఉందుననియు, ఆ సమయమున వారి కూటము జరిగినచో మాట్లాడుదుననియు చెప్పాను. "ఆయితే అప్పుడు అది జరుగును," అని అతడు చెప్పెను. కాని అతడు అది అక్టోబరు అని చెప్పెను. చూచారా, ఒక చిన్న సంగతి. న్యూ-యార్కులో ఉండిన ఆయన మమ్మును అడిగి సంప్రదించకుండానే అక్కడ నేనుందునని రాష్ట్రమంతా ప్రకటన చేసెను.

7ఇక్కడి టెన్నిస్సీ లోని మెంఫిస్ లో కొద్ది వారముల క్రితము ఒక సర్క్యులర్ ఉత్తరమును నా సంతకముతో ప్రకటించిరి. అది ఫొటో స్టాట్ ప్రతి, ముప్పది దినములు నేను ఉపవాసముందును" అని ఈ వ్యక్తితో చెప్పినట్లుగా యున్నది. నా జీవితములో మూడు రోజుల కంటే ఎక్కువ ఉపవాసము ఎన్నడూ చేయలేదు. ఆ వ్యక్తి పేరును నా జీవితములో ఎన్నడూ వినలేదు. నేను అతనితో పాటుగా ఉపవాసము చేయుదుననియు, కొన్ని ప్రత్యేక దినములలో అచ్చట ఉందుననియు, గనుక మెంఫిస్ లో నున్న నా స్నేహితులందరూ ఆ ప్రత్యేక కూటమునకు రావలసినదనియు చెప్పెను. ఆ స్థలమును ఎన్నడూ నేను వినలేదు. ఆ వ్యక్తిని ఎన్నడూ నేను ఎరుగను. అసలు దాని గూర్చి నాకేమి తెలియదు. అది ఒక అబద్ధ, దొంగ సంతకము. ఆ సంతకము కూడా నేను చేయలేదు. ఎవరైననూ నా సంతకమును తిరిగి అనుకరణ చేయవచ్చును అని నేను అనుకోలేదు, ఎందుకనగా నేను సంతకము చేసిన తరువాత నా సంతకమును నేనే ఎరుగను. కనుక అది చాలా చెడ్డ సంగతి, అలాగు ఏలాగు చేయగలరో నాకు అర్థము కాదు.

ROM 8:28

 

8ఇక్కడే కొద్ది కాలము క్రిందట ఒక బ్యాంకుకు వెళ్ళాను. లెక్కలను సరిగా ఆ విధంగా చూపవలెనన్నచో మనము ప్రతి దానిని లెక్కించవలెను. నీవు తిరిగి పొందు పత్రములలో అత్యుత్తమమైనది రద్దు చేయబడిన చెక్కు. మేము పెండ్లి అయినప్పటి నుండి అలాగు చేయుచున్నాము. అప్పుడు బ్యాంకు అధికారి ఇట్లనెను. "ఆ సంతకమును ఎవరూ దొంగగా అనుకరించలేరను కొనుచున్నాను మిస్టర్ బ్రెన్హాం."

"మంచిది, అన్నీ మేలు కొరకే జరుగును అని చెప్పుట మీరెరుగుదురు కదా?" అన్నాను.

కనుక ఆ సంగతులు కష్టతరముగా నుండును. నీవు అబద్ధమాడుచున్నట్లుగా ప్రజలు తలంచునట్లు చేయును. అక్కడ ఉందునన్న సంగతి బొత్తిగా నాకు తెలియదు. ఎట్టి ప్రచురణలు చేయవద్దు. ప్రభువు నన్ను పిలిచిన చోటకు వెళ్ళి, సేవ చేయుటకు ప్రయత్నించుచున్నాను. దేవునికి తప్ప ఏ విషయములోను ఎవరికి నేను బాధ్యుడను కాను, కేవలము ఆయనతోనే నిలచియుందును.

ROM 10:17

 

9మీద చేతులుంచవలెను అన్న అభిప్రాయమును ఈ అమెరికా ప్రజలలో నుండి, సంఘములో నుండి తీసివేయుటయే నా ఉద్దేశ్యము, చూచారా. నేను… అలాగు చేయునప్పుడు నీవు ఏదోగా కనబడెదవు. "ఫలాని సోదరుడు వచ్చి నా మీద చేతులుంచెను," అని చెప్పుకొందురు. నీ మీద యేసు తన వస్త్రములను ఉంచనిమ్ము, చూచారా, నీ విశ్వాసము ఎదిగి ఆయనను అంటుకొనును. ఇప్పటికి పదహారు సంవత్సరముల నుండి దానిని నేను కలిగియున్నాను. దానితో పూర్తిగా నేను విఫలమయ్యాను, చూచారా, వారు … మరో విధంగా నమ్మగోరువారు చాలామంది ఉన్నారు. కనుక వారిపై చేతులుంచుట వలన జనులను ఏ విధముగా నైనను తృప్తిపరచుదుము.

కాని నా ఉద్దేశ్యము ఏమనగా, సన్నిధిని చూచి, యేసుక్రీస్తు ఇచటున్నాడని ఎరిగినచో అంతకన్న అవసరమైనది ఏమిటి? జనులందరూ ఒకేసారి ప్రార్థించుచుందురు గదా? చూచారా? వాక్యము తెలియబడినప్పుడు ప్రభువు యొక్క శక్తి దిగును. "వినుట వలన విశ్వాసము కలుగును. వినునది దేవుని వాక్యమైయుండ వలెను." వాక్యము బోధించబడినప్పుడు అది సత్యము. దేవుడు తన సన్నిధిని రుజువు చేయును, అది అక్కడే క్రియ చేయును.

10అప్పుడు, రేపు ఉదయము… క్షమించండి, ఈ రాత్రి ఒక క్లుప్త ఆంశము నాకున్నది, ఎందుకనగా రోగుల కొరకు మనము ప్రార్థించనైయున్నాము.. రేపు ఉదయము ఆదివారపుబడి పాఠమును కలిగియుందునని తలంచుచున్నాను. అది నిజమేనా? అదంతయూ ఇక్కడున్న ఆడిటోరియంలో జరుగును. ప్రభుని చిత్తమయితే…. ఆయన అనుమతించినచో నాకు ఇష్టమగు ఒక అంశమున్నది. దానిని ఆ విధంగానే నేను చెప్పవలెను, చూచారా. మీరు మీ స్వంత ఆదివారపుబడిని కలిగియుండనిచో మాత్రమే. మీకు మీ స్వంత ఆదివారపుబడి యున్నచో, మీ పాఠశాలకు వెళ్ళండి. దానిని వినగోరినచో టేపులు దొరకును. కనుక నా హృదయములో మీతో మాట్లాడగోరునది ఒకటున్నది. బహుశ అది మీకు బాగుగా సహాయపడగలదు. గ్రహింపునీయ గలదు. నేను సువార్తను ఏలాగు బోధించవలెనని ప్రయత్నించానో, అలాగు దానిని బోధించుచున్నాను. దానిని నమ్ముచున్నాను. చూచారా, దేవుడు చేసిన దానికి అదే కారణము. సువార్త యొక్క మర్మములు ప్రపంచ పునాది నుండియు దాచబడియున్నది, కాని ఈ చివరి దినములలో ప్రత్యక్షపరచబడ వలసియున్నవి. కనుక ప్రభుని చిత్తమయితే దాని మీద నేను మాట్లాడగోరుచున్నాను.

రేపు రాత్రికి ముగింపు ఆరాధన, మీకు సాధ్యమైనచో మీరు రావలెనని మా కోరిక.

11అప్పుడు ఇక్కడి నుండి యుమాకు, యుమా నుండి ఫీనిక్సుకు మరల వెనుకకు వెళ్ళుదుము. ఇక్కడి నుండి వెళ్ళిన తరువాత సెలవు సమయమున, క్రిస్మసు సెలవులకు నా స్నేహితులు కొందరితో కలిసి చిన్న వేట పర్యటనకు వెళ్ళెదను. నా భార్య తన జనులను దర్శించనై యున్నది. అప్పుడు అక్కడి నుండి మేము కాలిఫోర్నియో గుండా పశ్చిమానికి లేదా దక్షిణాది రాష్ట్రములకు లూసియానా, టెక్సాస్, ఫ్లోరిడాల మీదుగా పర్యటన చేసెదము. అక్కడి నుండి ప్రభుని చిత్తమయితే, దీర్ఘ కార్యక్రమముతో విదేశములకు వెళ్ళెదము. మీ ప్రార్థనలు బహుగా కోరుచున్నాను.

12ఆయన యొక్క స్వస్థతా శక్తి యొక్క సన్నిధిని, లేదా సమస్తమును మనము అనుభవించుచున్నట్లయితే చాలా మంచిది, కాని దానితో పాటుగా అంత కన్న గొప్పది బయలు వెళ్ళుచున్నది. చూచారా, దానితో మరి ఎక్కువైనది వెళ్ళుచున్నది. నీవు ఒక దానిని పొందుటకు వెళ్ళినప్పుడు జనులను అది ప్రశ్నించునట్లు చేయును. ప్రతి వారు దైవిక స్వస్థతను నమ్ముదురు. దైవిక స్వస్థత కొరకు వారు దాసోహమగుదురు. "దేవునికి స్తోత్రము," అని చెప్పి కేకలు వేసి గొప్ప సమయమును అనుభవించుదురు. అది కేవలము గాలమునకు ఎర మాత్రమే, చూచారా, అది ఎర. గాలము చేపలను పట్టుకొనును. వాక్యమే గాలము. యేసు రోగులు ప్రార్థించినంతకాలము గొప్ప కీర్తిగల వానిగా ప్రసిద్ధి పొందెను.

13ఇప్పుడు, మనము యేసులము కాము, కాని మనందరి ద్వారా పని చేయుచున్నది ఆయనే. ఆయన కేవలము ఒక మనిషిలో లేడు. ఆయన ప్రతి విశ్వాసిలోను ఉన్నాడు. మనము అలాగే జీవములోనికి విశ్వసించి యున్నాము, చూచారా, దేవుడు నన్ను ఎంతగా అభిషేకించినప్పటికిని ఇక్కడి ఈ వేదిక మీద, నిన్నును అక్కడ అదే మాదిరిగా ఆయన అభిషేకించనిచో ఏదీ జరుగదు. మన ఇరువురము కలియవలసియున్నది. మనము ఇరువురమూ విశ్వాసులముగా ఉండవలసియున్నది.

ఆయన తన గొప్ప శక్తిని చూపించుటకు పిలువబడవలసినది ఏదయినా లేనిచో ఏమి కాదు. ఏదో ఒకటి జరుగనీయుడి. సరికానిది చేయగోరుటకు ప్రయత్నించువానిని ఆయన బయటకు పిలచును. చూచారా, కాని మీరు దానిని గమనించవలెను. కొన్నిసార్లు ఆయన జనులకు వారు వినుటకు ఇష్టపడని సంగతులను చెప్పును. దానిని నేను చెప్పగోరను, కాని ఆయన మాట్లాడుచున్నపుడు మనము కేవలము వినవలెను. అప్పుడు - మారుమనస్సు, ఇప్పుడు ఈ సంగతుల గూర్చి ఆలోచించి ప్రార్థించండి.

MATT 12:24•

MARK 3:22•

LUKE 11:15

 

14ఇపుడు గుర్తుంచుకొనండి, నేను ఆయన సేవను మాదిరిగా చూపించాను, చూచారా. మొదటగా, గలిలయ ప్రవక్తగా అందరూ ఆయననూ ప్రవక్త అని విశ్వసించారు. కాని ఆయన రోగులను బాగుచేయుటకు ప్రవక్త, ఆయన పరిసయ్యులను, సద్దూకయ్యులను, వారి ఆచారములను ఖండించుచూ వెళ్ళినప్పుడు ఆయనను "పిచ్చివాడు" అనిరి. ఆయనను "వెర్రివాడు" అని వారనిరి. వారికి ఆయనతో ఏమి సంబంధము లేదన్నట్లుగా ఉండిరి. చివరకు అది ఆయనను సిలువ మరణము వరకూ తీసికొని పోయెను.

ఎల్లప్పుడూ అదే రీతిగా జరుగుచున్నది. బైబిలు అంతటిలోనూ అలాగే జరిగెను. అది దేవుని కార్యమయినచో ఇప్పుడును అలాగే జరుగవలసి యున్నది. అది అలాగే పరి సమాప్తమునకు రావలసియున్నది. ఒక కాలము, కాని వర్తమానమును మీరెన్నడూ సిలువ వేయజాలరు. అది దేవుని యొద్ద నుండి వచిన వర్తమానమైనచో, అలాగే యుండును. ఆయన కేవలము వర్తమానమునకు ఊతనిచ్చువాడు.

MATT 10:25

 

15దానిని గూర్చి కొన్ని నిమిషములు మనము మాట్లాడియున్నాము. గమనించండి. ఇప్పుడు సరిగ్గా ఎనిమిది అయినది. మీరు విశ్రాంతి తీసికొని ఆదివారపుబడికి వచ్చునట్లుగా తొమ్మిదిన్నరకు సంఘమును పంపివేయుటకు ప్రయత్నించగోరుచున్నాను. రేపు గొప్ప దినము. దీనితో ఈ రోజునకు రెండు ఆరాధనలయినవి. నేను యువకునిగా ఉన్నప్పుడు… మీరు మీ పూర్ణ హృదయముతో బోధించినచో రెండు ఆరాధనలు ఏ సేవకునికయిననూ కష్టమే. నీవు ఒక చిన్న జ్ఞానపు ముచ్చటను దినమంతటిలో ముప్పుది, నలుబది నిమిషములు మాత్రమే అందించగలవు. దాని వలన నీకెట్టి తొందర కలుగదు. కాని నీవు నీ హృదయమంతటినీ అక్కడ ఉంచి, జనుల ఎదుట దేవుని ఆత్మను ఎత్తి పట్టుకొన్నప్పుడు పరిస్థితి వేరుగా నుండును.

ఇప్పుడు ప్రార్థించుదము.

16పరమ తండ్రి, ఇప్పుడు మేము సంభాషణ నుండి నీ వాక్యములోనికి, కదులుచుండగా నీ దీవెనలు మరియు కృప మాపై ఉండనిమ్ము. సంఘము, మరియు చేరిన మేమందరము మా పునరుత్థాన ప్రభువగు యేసుక్రీస్తు సన్నిధానమును చూచి, అనుభవించి, ఎరుగునట్లుగా ఈ రాత్రి మరల మా మధ్య వాక్యమును శరీరధారిగా చేయుము. ఎందుకనగా మేము ఆయనను ప్రేమించుచున్నాము. ఆయన సమక్షమే మాకు జీవము. షెకీనా మహిమలో ఈ రాత్రి మేము విశ్రమించి, ఆయన సన్నిధిలో అది షెకీనా మహిమయే అని మేము ఈ రాత్రి గుర్తించెదము గాక! ఇప్పుడు మా కొరకు వాక్యమును ఆయన విరచునట్లుగా యేసు నామములో దానిని ఆడుగుచున్నాము. ఆమేన్.

MARK 4:35-41

 

17ఇప్పుడు మీరు బైబిలులో చూడగోరినచో పరిశుద్ధ మార్కు 4 ఆధ్యాయము తీయండి. ఈ రాత్రి నేను నా అంశమును "వెళ్ళి, యేసును మేల్కొలుపుము," అని పిలువనైయున్నాను. ఈ రాత్రి నా అంశము, యేసును రంగము మీదికి పిలచుట. "వెళ్ళి, ఆయనను మేల్కొలుపుము, రంగము మీదికి ఆయనను పిలువుడి! పరిశుద్ధ మార్కు 4 అధ్యాయము 35 వచనారంభము నుండి లేఖనము చదువుదము.

ఆ దినమే సాయంకాలమైనప్పుడు ఆయన - అద్దరికి పోవుదమని వారితో చెప్పగా.

వారు జనులను పంపివేసి, ఆయనను ఉన్న పాటున చిన్న దోనెలో తీసికొనిపోయిరి. ఆయన వెంబడి మరికొన్ని దోనెలు వచ్చెను.

"ఆయనను ఉన్నపాటున తీసికొని పోయిరి" అనునది ఒక ఆశర్యకరమగు అంశము అగును కదా? ఆయనను నీకు కనుపరచుకొనిన రీతిగా తీసికొని పొమ్ము, చూచారా, దోనెతో తీసికొని పొమ్ము.

అప్పుడు పెద్ద తుఫాను రేగి ఆయన ఉన్న దోనె మీద అలలు కొట్టినందున దోనె నిండిపోయెను.

ఆయన దోనె అమరమున తలగడ మీద తలవాలు కొని నిద్రించుచుండెను. వారాయనను లేపి - బోధకుడా, మేము నశించిపోవుచున్నాము. నీకు చింత లేదా? అని ఆయనతో అనిరి.

అందుకాయన లేచి గాలిని గద్దించి, నిశ్శబ్దమై ఊరకుండుమని సముద్రముతో చెప్పగా, గాలి అణగి మిక్కిలి నిమ్మళమాయెను.

అప్పుడాయన - మీరెందుకు భయపడుచున్నారు? మీరింకను నమ్మిక లేక యున్నారా? అని వారితో చెప్పెను.

వారు మిక్కిలి భయపడి - ఈయన ఎవరో, గాలియు, సముద్రమును, ఈయనకు లోబడుచున్నవని ఒకరితో ఒకడు చెప్పుకొనిరి.

"ఆయన ఏకరీతిగా ఉన్నాడు" అని లేఖనము చెప్పుచున్నది! గాలియు, అలలును ఆయనకు లోబడెను.

18ఆయన ఆ రోజు కొద్దిగా అలసిపోయి యుండును. ఆయనెక్కడున్నాడో, ఏమి చేయుచున్నాడో ప్రతిసారి మనము చూడ యత్నించుదుము. ఈ రాత్రి మన ప్రభుని దృశ్యమును కనుగొని చూద్దాం.

నేనాయనను వెంబడించ ఇష్టపడుచున్నాను, మీరు కోరరా? నేను ఆయనను వెంబడించి ఆయన కార్యములను గమనించ ఇష్టపడుదును. ఒక రోజున మనము ఆయనతో కూడా ఉండి ఆయనను వెంబడించెదము. మనము ఆయనతో ఉందుము, వ్యక్తిగతముగా ఉందుము, ఇప్పుడు మనము చూచుచున్న రీతిగానే చూతుము - ఆయనతో సదాకాలము ఉందుము. ఓ, ఆయన వైపు చూచినచో నాకెంతో మేలుకరము. కేవలము ఆయనను చూచినచో నాకది చాలును.

MARK 4:41•

HEB 13:8

 

19ఇప్పుడు మనము ఆ రంగమును తీసికొని ఆయన ఎచ్చటున్నాడో, ఏమి చేయుచున్నాడో కనుగొందము. శ్రమ వచ్చెను, ఆయన ఆ బాధ నుండి విడిపించి, వారెందుకు చేయజాలక పోయిరో వారికి చెప్పెను. ఆయన సముద్రము మీది దోనెలో వెనుక ఉండెను. ఆయన ఒక శ్రమభరిత దినమును గడిపెను. ఆయన శరీరము అలసి, సొమ్మసిల్లినదనుటలో సందేహము లేదు. అలసటతో బలహీనముగా ఉండెను. ప్రభావము ఆయనలో నుండి వెడలిపోయేను, ఎందుకనగా ఆయన బోధించుచూ - తానెవరై యుండెనో ఆ గొప్ప సూచనను చూపించుచూ, జనులకు సాక్ష్యమిచ్చుచూ ప్రజలను స్వస్థపరచుచుండెను.

జనసమూహములో కొందరు సంతోషించిరి, కొందరు తూలనాడిరి. యేసును జనులు అలాగు చేయుట మీరు ఊహించగలరా? వారు అంతకంటే ఎక్కువ ఎరిగినట్లుగా కనిపించినది. "మంచిది" నీవు…

MATT 28:20•

JOHN 14:17,19

 

20ఈనాడును వారు అలాగే, అదే రీతిగా చేయుచున్నారు. చూచారా, ఈ రోజున ఆయన వచ్చినచో, ఆ రోజున జనులు ఆయనకు చేసినట్లుగానే చేయుదురు. ఈనాటి ప్రజలు ఆయనను "తూలనాడి" అప్పటి వలెనే, "పిచ్చివాడు" అని పిలచెదరు. చూచారా, అది ఇప్పటి వలెనే యుండును. దానిని వారు చేసెదరు. వారాయనను అర్థము చేసికొనరు. దేవుని యొక్క నిజ కదలికను లోకము ఎన్నడూ అర్థము చేసికొనదు. అదెన్నడూ దానిని గ్రహించదు, ఎందుకనగా అది లోకము.

"ఇక మీదట లోకము నన్ను చూడదు." "కాని మీరు నన్ను చూతురు, ఎందుకనగా నేను మీతోను, మీలోను యుగ సమాప్తి పర్యంతము సదా కాలము ఉందును," అని ఆయన చెప్పెను. ఆయన చెప్పిన ఆ ఒక్క మాటను జనులు చూడ కలిగినచో, అక్కడే, ఈ రాత్రి మనమెచ్చటున్నామో గుర్తించగలరు.

21దృష్టిలోపము గలవానిని, ఎన్నడూ చూడ జాలని వానిని నీవు ఊహించగలవా? గ్రుడ్డివారు అన్నింటిని తన్నుకొని పడుదురు. నీవు నీ ఆహారమును శక్తి నుండి, లేదా మరో మూలము నుండి పొందవలసి యుండును. కాని నీవు దేనినో గ్రుద్దుకొందువు, నీవు ఒక తాకిడి శక్తిని కలిగియుందువు గాని, దృష్టి యుండదు. అప్పుడు అకస్మాత్తుగా ఎవరైన కండ్లు తెరచినప్పుడు పూర్తిగా వేరుగా నున్న ప్రపంచమును చూచును. వారు ఎన్నడూ దేనిని చూడలేదు.

"ఇప్పుడు, నీ మీద ఎండ వేడిమి పడుచున్నచో, అది సూర్యుని వలన," అని చెప్పెదవు.

"సూర్యుడనగా ఏమిటి?"

"అది ఒక వెలుగు."

"వెలుగనగా ఏమిటి?" చూచారా, అతడెన్నడూ ఆ భావములో జీవించడు. అది ఏమిటో అతనికి తెలియదు.

"నీవు గ్రుద్దుకొన్నది ఫలాని ఫలాని వస్తువు."

"సరే, అది ఏమిటి?" చూచారా, అతడెన్నడూ ఆ కోణములో జీవించలేదు. దానిని ఎరుగుట అతనికి చాలా వింతగా ఉండును.

22ఇప్పుడు, దేవుడు మనలను బ్రదుక నిచ్చినందున, శారీరకంగా మనము అయిదు జ్ఞానములలో ఉన్నాము. కాని మరియొక జ్ఞానేంద్రియ మున్నది. దాని లోనికి మనము మేల్కొని వెళ్ళవలెను. అది దర్శన జ్ఞానము. మనము చేయుచున్న ఈ కార్యములను గూర్చి మనకు అనుభూతిని సమకూర్చునది అదియే. దాని గూర్చి ఎవరికయినా చెప్ప ప్రయత్నించండి. తన జీవితములో ఎన్నడూ చూడని గ్రుడ్డివానికి చెప్పినట్లుగానే యుండును. దానిని అతడు గ్రహించజాలడు, ఎందుకనగా అతనికి ఆ జ్ఞానేంద్రియముతో సంబంధము లేదు. సువార్త విషయములో కూడా అలాగే యున్నది. వారు దానిని అర్థము చేసికొనరు. దానిని వారు చూచుట కష్టముగా నుండును, ఎందుకనగా వారెన్నడూ అందులో జీవించలేదు. దాని గూర్చి వారికేమి తెలియదు. దానిని వారు తాకెదరు. దాని యొక్క ప్రతిచర్యను వారు కలిగియుందురు. కాని వారు దానిని వాస్తవముగా ఎరుగుట మనకు తెలియదు. అదెక్కడి నుండి వచ్చెనో, అక్కడికి ఈ తెరను దాటి చూచినచో, చూచి వచ్చి జనులకు దాని గూర్చి అనగా దానిని తాకగలము గాని, చూడజాలము అని జనులకు చెప్పినచో మనుష్యులకది కష్టముగా నుండును. కాని "మనందరము ముఖాముఖిగా దానిని చూచు వరకు," నీకు సాధ్యమైనంత వరకు చెప్పవలెను.

23ఇప్పుడు ఇక్కడ యేసు అలసిపోయి, సొమ్మసిల్లి యుండెనని నేనూహించి చూడ కలుగుచున్నాను. దేవునికి మొర్రపెట్టు ఒక అత్మ గెదరలో ఉండెననియు, రేపు తాను పెద్ద పనిని చేయవలసియున్నాననియు ఆయన ఎరుగును. ఒక్క ఆత్మను కలిసికొనుటకు అలసి, నీరసముతో ఉండిననూ కల్లోల సాగరమును యేసు దాటుట మీరు ఊహించుకొనండి? అయిననూ ఆయన అలాగే చేయును. ఆయన చేయు విధానము అదే.

నావ దాటుచున్నది. ఈ అవకాశమును తీసికొని ఆయన చిన్న విశ్రాంతిని పొందగోరెను. తదుపరి మేల్కొనును. శిష్యులు తమ దైనందిన పనులకు, దోనే తెడ్లు వేయుటకు వెళ్ళిరి. ఆ దినపు ఉజ్జీవము అయిపోయేను.

ఈనాటి మాదిరిగానే కొంత ఉన్నదని నమ్ముచున్నాను. అదే సంగతి అని నమ్ముదును.

ఈ సమయమందు ఆయన చిన్న విశ్రాంతి పొందెను, బహుశా కూటముల మధ్య కావచ్చును. శిష్యులు తమ పాత విధులకు హాజరయిరి.

JOHN 3:29,30

 

24ఇప్పుడు వారిపై కొద్దిగా దృష్టి మరల్చుదము. ఆ దినమున జరిగిన సంగతులను చూచి వారు ముచ్చటించుకొనుచూ ఆనందించుచున్నారని నేను నమ్ముచున్నాను. అక్కడ గొప్ప కార్యములు సంభవించినవి. కుష్ఠ రోగులు స్వస్థత పొందిరి. వారికది గొప్ప సమయము. సంఘములో వారు తమ పనిలో కొనసాగిపోవుచుండగా, లేక వారు… సంఘమనగా ఒక కట్టడము కాదు; ప్రజలే సంఘము. జరిగిన వాటిని చూచి వారు ఆనందించుచుండిరి. ఆయన చెప్పుకొనుచున్నట్లుగా ఆయన యొక్క మెస్సీయా అధికారమును గూర్చి వారు చర్చించుకొనుచుండ వచ్చును. ఆయన వాక్యముగా ప్రకటించుకొనెను. ఆ ఘడియకు వర్తమానముగా, వాక్యముగా ఆయన చెప్పుకొనెను.

వాక్యముగా అక్కడ ముందుండిన ప్రవక్త ఆయనను పరిచయము చేసెను. "నా సమయము సమాప్తమైనది. నా భాగమును నేను నెరవేర్చాను. నేను నెరవేర్చవలసిన వాక్యమును నెరవేర్చాను. ఇక్కడి నుండి ఆయన తక్కిన వాక్యమంతటిని ఆయన బయలుపరచనై యున్నాడు. నా సమయము అయిపోయినది," అని చెప్పెను. యేసు రంగము మీదికి వచ్చినప్పుడు, యోహాను రంగము మీద నుండి నిష్క్రమించవలసి యుండెను.

మెస్సీయా ఏమి చేయనైయుండెనో, ఏ క్రియలు జరిగించనై యుండెనో - సరిగ్గా ఆ క్రియలను, కార్యములను, ఆయన రంగము మీదికి వచ్చినప్పుడు చేసెను. అలాగే చేయుచూ ఆయన వచ్చెను. వారి సంభాషణలో అది కూడా చోటు చేసికొని యుండ వచ్చును.

MATT 1:23•

JOHN 10:37

 

25వారిలో కొందరికి సాక్ష్యము ఉండియుండ వచ్చును. వారిలో ఒకరు ఇట్లు చెప్పియుండవచ్చును. మీరెరుగుదురా, మెస్సీయా ఎట్లుండబోవుచున్నాడో లేఖనము చదువు వరకు నాకు అంతగా గ్రహింపు కలుగనే లేదు. ఆయన ప్రవక్తగా ఉండును. అప్పుడు నాకు మరో సంగతి అర్థమయినది. అది ఆయన రొట్టెను విరచి ఆ జనులకు పోషించినప్పుడు జరిగెను. దేవుడు తప్ప ఎవరు సృష్టించగలరు? కనుక ఆయన మెస్సీయాయే అయి యుండును. అందుకు వారును, "దేవుడు తప్పు మరెవరూ సృజించలేరు. దేవుడొక్కడే సృష్టికర్త, ఆయన అయిదు చిన్న రొట్టెలను, రెండు చిన్న చేపలను తీసికొని, అయిదు వేల మందికి ఆహారము పెట్టెను. మిగిలిపోయిన ముక్కలను ఏడు గంపల నిండా ఎత్తిరి. ఆకాశముల నుండి ఆహారమును కురిపించిన ఆ యెహోవా తప్ప మరెవరునూ అలాగు చేయజాలరు. దానిని ఆయనే ఒక్కడే చేయగలడు. ఇదిగో ఇక్కడ ఆయన మన మధ్య ఉన రూపములో వడ్రంగివానిగా, ఒక సామాన్య మనిషిగా తెలియ చేయబడెను. పరమందు జీవించిన యెహోవా ఇక్కడకు వచ్చెను. అప్పుడాయనను ఎవరునూ చూడలేక పోయిరి. అదృశ్యుడగు దేవుడు మన మధ్య దృశ్యునిగా చేయబడినందున మనము ఆయనను చూడగలుగుచున్నాము. యెహోవా చేసిన కార్యములనే ఆయన చేయుచున్నాడు," అనిరి.

ఆయన వారితో ఇట్లనెను, "నేను నా తండ్రి కార్యములు చేయనియెడల నన్ను నమ్మకుడి. మెస్సీయా యెహోవాగా ఉండవలసి యున్నాడు. ఇమ్మానుయేలు - 'దేవుడు మనకు తోడు.' ఇమ్మానుయేలు క్రియలు నేను చేయనియెడల, ఇమ్మానుయేలు వలె నేను ప్రవర్తించని యెడల, నా క్రియలు ఇమ్మానుయేలు వలె లేనియెడల - నేను ఇమ్మానుయేలును కాను. మీరు నన్ను నమ్మలేనియెడల నేను చేయు క్రియలు గమనించండి. అవి నేను ఎవరినో సాక్ష్యమిచ్చుచున్నవి." చూచారా.

26వారు మాట్లాడుకొనుచుండగా అది వారి చర్చ అయి యుండ వచ్చును. ఆ తరువాత వచ్చిన అంశము ఇదియై యుండును… మీలో చాలా మంది సాక్ష్యమిచ్చి యుండగలరు. అక్కడ అంద్రెయ యున్నాడు. అతడు సాక్ష్యమిచ్చి యుండును.

యేసు చెప్పిన దానిని పేతురు చెప్పియుండ వచ్చును. "ఆయన నన్ను పేరు పెట్టి పిలచెను. దేవుడు తప్ప ఎవరు నా పేరు ఎరుగ గలరు? నా పేరు ఏమై యుండెనో, ఆయన చెప్పకలిగెను. నేనెవరినై యున్నానో ఆయన నాకు చెప్పెను. ఆయన నా తండ్రి పేరును చెప్పెను. ఆయన నన్ను ఎన్నడూ చూడలేదు. ఆయన మెస్సీయా అయియుండును. మేము గమనించాము."

DEUT 18:18,22•

JER 28:9•

AMOS 3:7•

JOHN 7:46

 

27దాని పట్ల ప్రజల యొక్క ధృక్పధమును వారు చర్చించి యుండ వచ్చును. అది వారి తరువాత చర్చ అయి యుండును. యేసు వెనుకకు వెళ్ళి, ఆ సమయమంతా నిద్రించుచూ విశ్రాంతి తీసికొనుచుండెను. ఇప్పుడు ఆ దృశ్యమును విశ్లేషించి వారిని గమనించుదము. ప్రజల యొక్క ధృక్పధము. వారిలో కొందరు ఇట్లు చెప్పియుందురు…

సరే, వారిలో కొందరు నమ్మిరి, వారిలో కొందరు ఇట్లని యుందురు, "ఈయన వలె ఏ మనుష్యుడును ఇంతకు ముందు మాట్లాడలేదు. ఆయన చెప్పుచున్న దానిని దేవుడు బలపరచుచున్నాడు. ఈయనను దేవుడు బలపరచి, ఆయన చెప్పినది నెరవేరుచున్నప్పుడు, దేవుడు ఆయనతో ఉన్నాడని మనము మన లేఖనమును బట్టి ఎరుగుదుము. ఆయనకు భయపడుడని దేవుడు మనకు చెప్పెను, ఎందుకనగా ఆయన ఆయనతో ఉన్నాడు. ఆయన మాట దేవుని మాట, కనుక ఆయనకు భయపడుడి." వారనరి ఆ కారణము చేతనే గాలియు, అలలును ఆయనకు లోబడుట చూచిన పిదప వారు ఎంతో భయపడిరి. అది దేవుడే అని వారు ఎరిగినందున వణకిరి, అది అలాగే యుండ వలెను. దేవుడు ఆయన మాటను ఘనపరచెను. ఆయన చెప్పినది జరిగెను, కనుక ఆయన మెస్సీయా అయి యుండెనని తెలిసికొనిరి.

28ధృక్పధమును గూర్చి వారు చర్చించుకొనుచుండగా వారిట్లు అనిరి, "వారిలో కొందరు నమ్మిరి, కొందరు నమ్మలేదు."

దానిని ఎల్లప్పుడూ మనము సంఘముల మధ్య ప్రతి సమాజములోను కనుగొందుము. మనము మూడు తరగతుల జనులను కనుగొందుము. వాస్తవానికి దాని మీద ఇక్కడ కొద్ది కాలము క్రిందట బోధించాను. న్యూ-యార్కు పట్టణములో లేక ఎక్కడో మూడు తరగతుల జనుల మీద బోధించాను. అనగా విశ్వాసులు, అవిశ్వాసులు, మరియు నటించు-విశ్వాసులు. దీని తరువాత ఒకటి రెండు అధ్యాయములలో ఆయన స్వంతవారే అక్కడికి వచ్చుటను మనము కనుగొందము. వారేమై యున్నారో అక్షరాలా రుజువు కాబడెను. ఇక్కడ ఒక్క క్షణము పాటు విశ్వాసులు, అవిశ్వాసులు గూర్చి ఆలోచించుదము.

వాక్యమునకు ముందుగా నిర్ణయించబడిన వారు. అభిషేకించబడిన వారే విశ్వాసులు, దానిని వారు చూచిన నిమిషమందే సంతృప్తి చెందెదరు. వారిలో నుండి జీవము ఉబుకును. దానిని వారు అంగీకరించెదరు. వారే శిష్యులు. దాని గూర్చిన ప్రశ్న వారి మనస్సులలో ఏదీ లేనే లేదు. వారు వెంటనే వెంబడించిరి. శిష్యులే విశ్వాసులు. వారు నమ్మిరి.

29ఎక్కువ సమయము ఒక నిజ అవిశ్వాసి తాను నమ్ముచున్నట్లుగానే నటించును. ఆ డెబ్బది మంది వలెనె అవిశ్వాసి యుండును. ఆయన సేవలో పేరుప్రఖ్యాతలు ఉన్నంత కాలము వారు వెంబడించిరి. ఆయన మృతులను లేపుచూ, కుష్ట రోగులను శుద్ధి చేయుచూ, అప్పుడే జరిగిన సంగతులన్నియూ ముందుగా చెప్పుచున్నప్పుడు అక్కడ నిలబడుటకు వారు సంతోషించిరి. కాని ఒకనాడు ఆయన వారి విశ్వాసమునకు భిన్నమయిన దానిని చెప్పెను. తాము నమ్ముచున్న దానికి ఆటంకము కలుగజేయు ఒక విషయమును ఆయన చెప్పిన వెంటనే, ఆ డెబ్బది మంది, "ఇది కఠినమైన మాట అనిరి. 'ఆయన ఎక్కడి నుండి దిగి వచ్చెనో, ఆ పరలోకమునకు మనుష్యకుమారుడు దిగి వెళ్ళిపోవుట మీరు చూచినచో ఏమందురు?' అనడిగెను. ఈయనతో మనము నిద్రపోయాము. ఈయన మనతో భుజించెను, ఈయన మనము ఒకే చోట ముఖము, చేతులు కడుగుకొన్నాము. నా వలె నిద్రించి, నా వలె భుజించి, నా వలె ఒడుదుడుకులకు లోనైన ఈయన పరలోకము నుండి దిగి వచ్చానని చెప్పుచున్నాడా? అది చాలా ఘోరమైన మాట," చూచారా. వారు ఏమి చేశారు? వారు కూటము అయ్యే వరకు కూర్చొనలేకపోయిరి. వారు లేచి బయటకు పోయిరి. చూచారా, వెక్కసమయినది. వారు అవిశ్వాసులు, చూచారా. వారు దానిని తట్టుకోలేకపోయిరి. లేదండి. వారు విడిచిపోయి, మరెన్నడును ఆయనను వెంబడించలేదు.

MATT 24:24•

MARK 13:22•

JOHN 6:60,62,66

 

30అక్కడ విశ్వాసులున్నారు… వారిని దాని నుండి ఏదీ వేరు చేయజాలకపోయెను.

అక్కడ అవిశ్వాసులుండిరి, తాము నమ్మిన దానితో సమ్మతించనిది ఏదయినా చెప్పిన వెంటనే జారిపోయిరి. గుర్తుంచుకొనండి, అవిశ్వాసి నిజమగు విశ్వాసికి బహు దగ్గర పోలిక కలిగియుండి - సాధ్యమైనచో, ఏర్పరచబడిన వారిని సహితము మోసము చేయునని బైబిలు మనకు బోధించుచున్నది. చూచారా, అది అవిశ్వాసము. వారికి నచ్చనిది ఏదయినా చెప్పిన వెంటనే వెళ్ళిపోయెదరు. చూచారా, అది అవిశ్వాసము. ఖచ్చితంగా అది చూపించును.

JOHN 6:62,66

 

31ఆ విత్తనమును తీసికొని వచ్చుటకు ఆ జీవపు వెలుగు ప్రకాశించుచున్ననూ, ఒక రాతి మీద అది ఏమి చేయగలదు? అది ఏమి చేయజాలదు. చచ్చిన పదార్థము మీద అదేమి చేయగలదు? అది చచ్చిన పదార్థము కొరకు పంపబడలేదు. జీవముతో మొలక పొందు విత్తనము కొరకే సూర్యుడు ప్రకాశించును. మనము జీవించుచున్న ఈ ఘడియలోని ఈ బైబిలు, ఆయన వాక్యము నిత్యజీవమును పట్టుకొను వారి మీదనే ప్రకాశించును. దానిని చూచుటకు ముందుగా నిర్ణయించబడిన వారి మీద ప్రకాశించును. తక్కిన వారి మీద అది ఏ మాత్రము మేలు చేయదు. సూర్యుని ద్వారా లేదా వెలుగు ద్వారా బయటకు వచ్చు జీవము అక్కడ లేదు.

వారు వెనుకకు తిరిగి ఆయనతో ఇక మీదట నడువలేదని మనము కనుగొందుము. సీమోను పేతురు గొప్ప సంగతిని చెప్పెను. ఆ డెబ్బది మంది వెళ్ళిపోయిన తరువాత యేసు వారికి కొంత బలమగు బోధను ఇచ్చెను. ఆయన స్వస్థపరచు దినములు గతించనైయున్నవి. ఆయన లెక్క చేయలేదు, మరి ఎక్కువ స్వస్థతలు ఆయన చేయగోర లేదు. ఇంకా మంచిదగు సంగతి గూర్చి ఆయన వారికి చెప్ప గోరెను. దానిని వారికి ఆయన చెప్పనారంభించెను. ఆయన అసలు ఎవరై యున్నాడో బయలుపరచెను. "ఆయన ఎక్కడి నుండి వచ్చెనో, ఆ పరలోకమునకు మనుష్యకుమారుడు ఎక్కి వెళ్ళుట చూచినప్పుడు మీరేమి అందురు?"

"ఇక్కడ నీ జన్మ రికార్డు యున్నది. నీవు యోసేపు మరియలకు నజరేతులో జన్మించావు. నీవు పరలోకము నుండి దిగి వచ్చానని చెప్పుకొనుచున్నావా? సరే… నీవు పిచ్చివానివని నేను నమ్ముచున్నాను, చూచారా. అయితే మేము అటువంటి మనుష్యుని వెంబడించగోరుట లేదు." కనుక వారు వెళ్ళి పోయిరి. వారు విడిచి పోయిరి. వారే అవిశ్వాసులు.

32కాని ఇప్పుడు గమనించండి, అక్కడ విశ్వాసులున్నారు. ఏమి జరిగినా, ఏది సంభవించినా, అదెంత కఠినముగా ఉన్ననూ, ఎంత మర్మయుక్తముగా ఉన్నాగాని, ఏమయినా గాని వారు లెక్క చేయక విశ్వసించారు. ప్రార్థించబడుట కొరకు వచ్చిన స్త్రీ, పురుషులు అలాగే యుండవలెను. దానిని వారు నమ్ముదురు. వారి మనసులను మారునది ఏదియూ ఉండదు. వారు అసలయిన విశ్వాసులు. అదెంత కఠినముగా కనిపించిననూ, ఇదేమిటి, ఇది జరుగదు అన్ననూ దానితో వారు సంబంధము లేనట్లుగా ఉండి, నమ్ముదురు.

ఆయన శిష్యులతో వారు నమ్మని ఎన్నో సంగతులు, లేక వారు చూడనివి ఎన్నో చెప్పియుండును. కాని ఏమయినా గాని వారు అవి నమ్మిరి. దానితోనే వారు కొనసాగిరి, ఎందుకనగా ఆ మెస్సీయా యేసే అని లేఖనము పూర్తిగా గుర్తించుటను వారు నిశ్చయముగా ఎరిగిరి.

HEB 13:8

 

33యేసుక్రీస్తు నిన్న, నేడు, నిరంతరము ఏకరీతిగా యున్నాడను ఈ చివరి దినములలోని పరిశుద్ధాత్మ యొక్క ఈ గొప్ప దైవ కదలికను లేఖనము ఈనాడు పూర్తిగా గుర్తించుచున్నదని నేను నమ్ముచున్నాను. దానిని క్షుణ్ణముగా వాక్యము గుర్తించుచున్నదని నేను నమ్ముచున్నాను. దానిని గూర్చి ఎవరు ఏమనుకున్నా నాకు లెక్క లేదు. అది సత్యము అని మనము నమ్ముదుము, ఎందుకనగా అది పూర్తిగా గుర్తింపబడినది.

"బ్రెన్హాం సోదరుడా, నీవు దానిని గ్రహించగలవని నాకు తెలియును," అని నీవనవచ్చు. అది నాకు అర్థము కాదు. దానిని కేవలము నమ్ముచున్నాను. ఈ సంగతులు నేను గ్రహించజాలను. నేను ప్రయత్నమూ చేయుట లేదు. దేవునిని నీవు అర్థము చేసికొనజాలవు. విశ్వాసము ద్వారా ఆయనను అంగీకరించవలసి యున్నావు. విశ్వాసమనగా నీవు నమ్మునది. దానిని నీవు వివరించజాలవు. అక్కడే మీరున్నారు. అందులో సత్యమున్నది.

34ఎల్లప్పుడూ చుట్టూ వ్రేలాడు మరొక గుంపున్నది, అది నటించు-విశ్వసుల గుంపు. విశ్వాసి వలె నటించువాడు, వేషధారిగా పరిగణించబడును.

ఇప్పుడు నటించు-విశ్వాసిని తీసికొందము. అది యూదా. అతడు నటించు-విశ్వాసి. నటించు-విశ్వాసి కాచుకొని యుండి, దాని మీద ఏదయినా సంపాదించు ఒక మార్గమును కనుగొనుటకు ప్రయత్నించును. వారు ఎంతో కాలము అంటి పెట్టికొనియుండి, ఒక చిన్న తప్పును కూడా పట్టుకొనలేక పోయినచో, బయటకు వెళ్ళి ఎక్కడో దానిని బయట పెట్టుదురు. "మేము నీవు ఎట్టి ఎత్తుగడలు వేయుచున్నవో కనుగొనగోరుచున్నాము. నీ చెవుల వెనుక ఏ కుందేలు కాలుతో రుద్దు కన్నావో చూడగోరుచున్నాము. ఏమి ఎత్తుగడ?" వారు దానిని అనుకరించగోరుదురు. లేదా మరేదో చేయగోరుదురు. వారే నటించు-విశ్వాసులులు. అదే యూదా సంబంధము.

35అది విశ్వాసులు, అవిశ్వాసులు, నటించు-విశ్వాసులను గూర్చిన సంగతి. ప్రపంచములో ప్రతిచోటా ఆ ముగ్గురు ఇలా నిలిచియే యున్నారు. ఎల్లప్పుడూ వారు ఉన్నారు. ఎల్లప్పుడు ఉందురు. దాని గూర్చి ఈ రాత్రి ఆలోచించుము. ఈ టేపు విను వారు యోచించండి. కూర్చున్న వారిలో ఆ మూడు వర్గములుండును. ఏ కూడికలో అయిననూ ఆ మూడు రకముల జనులుందురు.

ఒకరైతే, ఏది వచ్చినా, ఏది పోయినా ఏమి భేదము లేకుండా ఇంకనూ దానిని నమ్ముదురు. వారు పూర్తిగా ఒప్పింపబడినవారు.

ఇతరులు దానిలోని ఎంతో భాగమును నమ్ముదురు గాని, తక్కినది నమ్ముటకు ఇష్టపడరు. వారు అవిశ్వాసులు.

తమకు ఏదయినా దొరుకు వరకు అంటిపెట్టుకొని వ్రేలాడుచుండువారు నటించు-విశ్వాసులు. వారు, "హూఁ, అది సంగతి. హూఁ, నేను అక్కడేదో ఉందనుకొన్నాను గాని, నీవు అంతేనా?" అందురు.

కాని ఒక నిజ విశ్వాసిని ఏదియూ కదల్చజాలదు. ఏదియూ అతనిని కదల్చజాలదు.

36యేసు అక్కడ నిలబడియుండగా ఆయన ముఖము మీద ఉమ్మివేసిరి. ఆయన ముఖము రక్తమయమాయెను. ఆయన తల పై ముండ్ల కిరీటము ఉంచిరి. హేళన చేయు జనాంగము, ఇంకా ఎన్నెన్నో అక్కడ జరిగినవి. అవిశ్వాసి లేదా నటించు-విశ్వసి దాని గూర్చి ఏమీ ఆలోచించును? ఆయనను అమ్మివేసిరి. నిన్ను అమ్మివేయువాడు నటించు-విశ్వసి అని నీవు గ్రహించెదవు. నీ సేవను పతనము గావించువాడు ఆ నటించు-విశ్వసి మాత్రమే.

ROM 8:38,39

 

37కాని నిజ విశ్వాసి ఏది ఏమైననూ, అతడు పూర్తిగా సంతృప్తి చెందెను. వారు పూర్తిగా ఒప్పించబడిరి, ఎందుకనగా వారిలో ఉన్న జీవము అప్పటికే క్రీస్తుగా మారినది. అది క్రీస్తే, అది ఇక నీవు కాదు, కాని క్రీస్తు నీలో జీవించుచున్నాడు. "ఏదియూ కదప జాలదు." పౌలు చేప్పెను, "ఇప్పుడున్నది గాని, రాబోవునది గాని, మరణము, అపాయము, వస్త్రహీనత, మరేదయిననూ, క్రీస్తు యేసునందున్న దేవుని ప్రేమ నుండి మనలను ఎడబాపునా?" లేదు. వీరు, వారు, ఇతరులు, దైవ శాస్త్రంలో డాక్టరేటు పొందిన వారు దానిని వివరించి అది మరొక దినమునకు చెందినది అని చెప్పినా గాని, అది మిమ్మును వేరుచేయజాలదు. నీవు అక్కడే నిలచియుందువు. అది క్రీస్తు నీలో ఉండుటయే. ఇక మీదట నీవు నీ స్వంతము కావు. అది నీవు, నీవు మరియు దేవుడు మాత్రమే.

MATT 10:25•

MATT 12:24•

MARK 3:22•

LUKE 11:15•

JOHN 7:46

 

38అవిశ్వాసి ఒక చిన్న తప్పు దొరకగానే బయటకు వెళ్ళిపోవును, ఎందుకనగా ఏలాగయినా వెళ్ళిపోవలెనని కనిపెట్టుచుండును.

నటించు-విశ్వసి ఇంకొంత కాలము అనగా, విమర్శకు తనకు ఏదయినా దొరకు వరకు నిలచియుండును.

కాబట్టి ఆ ముగ్గరూ ఒక దగ్గర ఉన్నారు. అప్పుడు ఆ రకమయిన వారు ఆ ముగ్గురు. ఇప్పుడును ఆ రకము వారు ఉన్నారు. యేసు తానే, లేదా దేవుడు ఆ ధవళ సింహాసనపు తీర్పు నొద్ద వేరుచేయు వరకు ఆ రకముల వారు ఉందురు.

"ఈయన వలె ఎవరునూ ఎన్నడూ మాట్లాడలేదు. ఆయన చెప్పినది నెరవేరుచున్నది" అని కొందరు అనిరి.

ఇతరులు, అవిశ్వాసులు, "ఇతడు బయల్జెబూబు, తానెవరో ఆయనకే తెలియుట లేదు. ఇతడు మతిపోయినవాడు," అన్నారు.

MATT 10:25•

MATT 12:24•

MARK 3:22•

LUKE 11:15

 

39సాతాను చేయుటకు ప్రయత్నించునది మరో గొప్ప సంగతి యున్నది. మారెరుగుదురా వర్తమానికుని, నిజముగా పరిశుద్ధాత్మను పొందిన జనులను, "వారు మతి తప్పిన వారు" అని జనులు పిలచునట్లుగా ప్రయత్నించును.

ఒక చిన్న సర్కులర్ ఉత్తరము నాకు దొరికినది. ఆ ఉత్తరము మీద ఆ రోజున "పాపం, బ్రెన్హాం సోదరుడు! ఆయన ఏలియా అని మేము నమ్మాము. మీరెరుగుదురా? ఆయనకు మతి పోయినది. ఏలియా దుప్పటి ఎలీషా పైన పడినది. అనగా నా భార్య, రెండంతల ఆత్మతో వెళ్ళుటకు ఆమె సేవ స్వీకరించును," అని వ్రాశారు. ఒక స్త్రీ? ఏలియా మతి తప్పి పోయాడా లేక మరణము లేకుండా రథములో పరలోకమునకు తీసికొని కొనిపోబడెనా? చూచారా? కాని మీరు అది కలిగియుందురు, మీరు చూడండి, మనము దానితోనే పోరాడువలసియున్నాము.

అందులో కొందరు చెప్పిరి, అవిశ్వాసి చెప్పెను, "ఇతడు బయల్జెబూబు."

40దానిని యోహాను చెప్పియుండును, "ఇదంతా చేయుచున్న ఈయన గూర్చిరి కాస్త ఆలోచించండి." ఇప్పుడది తిరిగి మరల విశ్వాసుల యొద్దకు వచ్చెను. చెప్పెను, "మనము ఆలోచించుచున్న దానిని, మాట్లాడుతున్న దానిని ఆయా ప్రజలు వ్యక్తము చేయుచున్న దానిని అంతటిని చేసిన ఆయనను గూర్చి ఆలోచించుడి! మనందరము విశ్వాసులము, దానిని మనము నమ్ముచున్నాము. అవునండి! అది నిజంగా గుర్తించబడినదని మనము ఎరిగి, సంతృప్తి చెందియున్నాము. అక్కడ ఆయన ఒక మర్త్య మానవునిగా పరుండి యుండెను. ఆ ఓడ అడుగున పరుండెను. ఆ చెక్క ఇంటిలో ఒక తలగడ మీద పరుండి యుండినట్లుగా పరుండెను. ఆయనను నిద్రించుచున్న వానిగా అక్కడ ఉంచెదము. కాని దాని గూర్చి ఆలోచించండి! సృష్టికి దేవుడయినవాడే ఈ జలముల గుండా మనతో నడచుచున్నాడు." ఓ, మై! ఆమేన్.

41ఆ జలములు భీకరముగా నున్నవి. ఒక తుఫాను వచ్చెను, యెరూషలేము చుట్టు ప్రక్కల మీరున్నచో నేటికిని దానిని కనుగొందురు. జాక్, నీకు గుర్తున్నదనుకొంటాను. అక్కడున్న పగలులో నుండి ఇంకనూ తుఫానులు లేచుట జరుగుచున్నది. సముద్రమును తాకి అప్పటి వలెనే జాలరులను ముంచివేయుచున్నది. తుఫాను వచ్చుట కూడా నీవు చూడలేవు; అకస్మాత్తుగా అక్కడ లేచెను.

"ఇప్పుడు ఆలోచించుదము, మనందరము, మన జీవితములన్నియూ, ఇక్కడున్న ప్రమాదకరమగు నీటిని దాటుటకు భయపడుచున్నాము. కాని మరువద్దు, సృష్టికర్త అని మనకు తెలిసిన ఆయనే ఆ దోనెలో మనతో కూడా యున్నాడు. నాకు ఎంతో బాగా ఉన్నది! బాలులారా, మీకు అలాగు లేదా? వారు "ఆమేన్" చెప్పెదరు. అవును. అక్కడ ఆయన దోనెలో ఉండెను!"

42నేడు మనము జీవించుచున్న దినమును ఎరుగుట ఎంతో మంచిది. వారు ఆ గుర్తింపును చూచి సంతృప్తి చెందిరి. ఎవరు ఏమన్నా ఖాతరు చేయలేదు. వారి చర్చ విశ్వాసులు, నటించు-విశ్వాసులు మొదలగు వారిని గూర్చినది. కాని వారి మట్టుకు వారు నమ్మిరి. వారు తమతో ఆయనను కలిగియున్నారని ఎరుగుదురు. తక్కిన జనులందరూ ఏమన్నాగాని వారికి లెక్క లేదు. వారు ఆయనను తమతో కలిగియున్నందులకు సంతోషించిరి.

నేను కూడాను. మీరు లేరా? తక్కిన లోకము ఏమన్నా లెక్క లేదు. ఆయన దోనెలోనే, జీవిత కల్లోల సాగరములో నాతోనే ప్రయాణించుచున్నాడని ఎరిగినందులకు సంతోషించుచున్నాను. ఆమేన్. ఆమేన్. జీవిత గంభీర సాగరములలో, సకల భయంకర జలములలో ఆయన పయనించుచున్నాడు. ఏ సమయములో నీవు కాల్చబడెదవో, చనిపోదువో, మరేది సంభవించునో ఎరుగవు. కాని ఆ సృష్టికర్త…

43ఏమయినా గాని నీవేమై యున్నావు? నీవు ఒక చిన్న లూసియానా మట్టి ముద్దవు. దానిలో కొంత జీవమున్నది. అంతే. పెద్ద స్థలమగు టెక్సాస్ నుండి నీవు వచ్చినా గాని నీవు చిన్న తేమ కలిగిన టెక్సాస్ మట్టి ముద్దవే. నీవు అంతే. ఖచ్చితంగా తిరిగి నీవు అదే అయ్యేదవు.

జీవము దానిలో లేనిచో, ఆ మట్టి ఎట్లు నడువగలదు, ఊపిరి పీల్చగలదు, తినగలదు? ఆలోచించండి, అది సృష్టింపబడవలసి యుండవలెను! దానిని సృష్టించిన ఆ సృష్టికర్తయే ఆ మట్టి దోనెలో పయనించుచుండెను. ఆమేన్. ఒక కోరిక లేకుండా ఆయన నన్ను ఉన్న రీతిగా సృష్టించెను; ఆయన వాగ్దాన వాక్యము ద్వారా నా కోరికను బట్టి మరెంతగా ఆయన నన్ను లేవనెత్తునో గదా!

గంభీర జీవిత ప్రవాహము మీద ప్రయాణించుచూ,

మనము ఆయన వలెనే జీవించవలసియున్నాము,

మన ద్వారా ఆయనాత్మను పని చేయనీయుడి,

ఎడబాటుతో, ఓడ బ్రద్దలయిన సోదరుని కొరకు

చూచుటలో, తిరిగి మరల ధైర్యము వచ్చును.

ఆలోచించండి, నిశ్చయంగా ఆయన మనతో యున్నాడు. ఈ భీకర జలముల గుండా పయనించుచున్నప్పుడు ఎంతటి భద్రతా అనుభూతి! ఉజ్జీవము తరువాత ఆ ఫలితముల మీద విందు ఆరగించుచున్న ఇప్పటి ఈ ప్రస్తుతకాలము వలెనే దాదాపుగా అది ఉండియుండును.

44లూసియానాలోని, శ్రివ్-పోర్టుకు నేను చేసిన మొదటి ప్రయాణము నాకు గుర్తున్నది. ఎన్నడూ నేను జాక్ మూర్ గూర్చి వినలేదు. ఇక్కడున్న సహోదరుడు మూర్ గూర్చి నాకు చెప్పినది సహోదరుడు రిచర్డ్ రీడ్ గాని లేక సహోదరుడు కిడ్సన్ గాని ఆయి యుండునని నమ్ముచున్నాను. వారిలో ఒక సోదరుడు. ఎవరో ఇప్పుడు నేను మరచిపోయాను. సహోదరుడు జాక్ తో నాకు పరిచయమాయెను. నేను ఇక్కడికి వచ్చాను. చక్కని ఆయన వృద్ధ తల్లి ఇక్కడే ఎక్కడో కూర్చొని యుండెడిది. ఆమెకు కడుపు వ్యాధియుండెను. ఆమె కొరకు ప్రార్థించాము. ఆమె చిన్న పిల్లల ఆహారము తినుచుండెను. అప్పటి నుండి ఆమె మామూలు ఆహారము తినుచుండెను. ఎంత గొప్ప జీవము ఎట్లు లేచెనో చూడండి. అది నాంది అయినది. దాని వెంబడించుచూ బిల్లీ గ్రాహం, ఓరల్ రాబర్ట్సలు, టామీ ఆసబార్న్, మొదలగు గొప్ప వ్యక్తులు యోధులు ఆ మిణుకు మిణుకుమనుచున్న చిన్న ఉజ్జీవము నుండి వచ్చి గొప్ప కార్యములు చేసిరి.

45ఆ దినమున అచ్చట, దాదాపు ముప్పది-మూడు సంవత్సరాల క్రితము లేదా ముప్పుది-నాలుగు ఆ ఓహాయో నది ఒడ్డున వంతెన యొద్ద నిలబడియుంటిని. గట్టుల మీద సుమారు అయిదు వేల మంది లేదా అంతకన్న ఎక్కువ మంది నిలబడి యుండిరి. నేను దాదాపు ఇరవై, ఇరవై-మూడు, ఇరవై-రెండు, లేదా ఇరవై-మూడు సంవత్సరముల వయస్సులో ఉన్నాను. నా మొదటి ఉజ్జీవము. ఆ మధ్యాహ్నమున అయిదు వందల మందికి నేను బాప్తిస్మమిచ్చుచున్నాను. పెద్దలు నన్ను నీటిలోనికి నడిపించిరి. సుమారు పదిహేడవ వ్యక్తికి నేను బాప్తిస్మమిచ్చుచుండగా, ఒక స్వరము, "పైకి చూడు" అని నాతో చెప్పెను. పైకి చూచుటకు నేను తిరిగాను. బిల్లి తల్లి, అనగా ఇంకా మేము వివాహము కూడా చేసికోలేదు, కలిసి వెళ్ళు చున్నాము. అగ్నిస్తంభము వచ్చి, ఆ జూన్ 15న రెండు గంటలకు ప్రకాశమానమగు నీల మేఘములను చుట్టుముట్టెను. ఆ విధంగా మేఘముల నుండి దిగి వచ్చుచుండెను. ఒక స్వరము గర్జించగా, ఆ స్థలమంతా వినబడెను. ఇట్లు చెప్పెను, "క్రీస్తు యొక్క మొదటి రాకను ముందుగా చాటించుటకు బాప్తిస్మమిచ్చు యోహాను పంపబడినట్లుగా, క్రీస్తు యొక్క రెండవ రాకను గూర్చి చాటించుటకు నీకు వర్తమానమున్నది." ఛాయాగ్రాహకులు ఆ పటమును తీయుచుండిరి.

46కేవలము ఒక వ్యాకరణ పాఠశాల విద్యతో దానిని మేమెట్లు నమ్మగలము? కాని నేను దానిని నమ్మాను. ఆ మధ్యాన్నము నేను చాలా అలసిపోయియుండగా, బాప్తిస్మమిచ్చుట ముగించిన తరువాత వారు నన్ను నీటిలో నుండి బయటకు తీసికొనిరావలసి వచ్చెను. ఆ నది యొక్క ప్రవాహ వేగమునకు ఇక తట్టుకొని నిలబడుట నాకు ఎంతో కష్టమాయెను.

అది వెళ్ళెను, క్రిందికి వచ్చెను. దాని యొక్క పటమును వారు తీసిరి. అది అసోసియేటెడ్ ప్రెస్ యొద్ద ఉన్నది. దాదాపు ప్రపంచ వ్యాప్తి చెందెను. కెనడా లోనికి వెళ్ళెను. అసోసియేటెడ్ ప్రెస్ నుండి వచ్చిన ప్రతి ఒకటి ఇంకా సహోదరుడు అవైల్ యొద్ద ఉన్నదనుకొనుచున్నాను. "ఇండియానా జెఫర్సన్ విల్ లో గల స్ప్రింగ్ వీధి దిగువన ఒక స్థానిక బాప్టిస్టు సేవకుడు బాప్తిస్మమిచ్చుచుండగా, ఒక మర్మయుక్తమగు వెలుగు పైన వ్రేలాడినది." లూయిస్ విల్ హెరాల్డ్ దానిని ప్రచురించెను. పటములు వేసెను. అసోసియేటెడ్ ప్రెస్ యొద్ద నుండి ప్రాకి పోయెను.

అది చాలా సంవత్సరముల క్రితం జరిగెను. అదెట్లు సాధ్యము? కాని అది అలాగు జరిగెను. దేవుడు అలాగు చెప్పెను. అది నిజమగును. మనము సజీవ దేవుని కలిగియున్నామని ఎరుగుట ఎంత మహిమకరమగు సంగతి! అక్కడ నుండి ఉజ్జీవ జ్వాలలు ప్రపంచము చుట్టూ వ్యాపించెను. ఇప్పుడు గొప్ప స్వస్థత సభలు, గొప్పు మర్మయుక్తమగు సంగతులు జరిగిపోయినవి.

47నేను మొదట మీ మధ్యకు వచ్చినప్పుడు ఒక సంబంధము కొరకు మీ చేతిని అలాగు పట్టుకొనవలెనని నేను చెప్పాను. అప్పుడు నేను ఏమి చెప్పనైయున్నానో దానిని గూర్చి ఆలోచించేవాడిని కాను. మీరు దాని ఫలితములను చూడగలిగారు. అది ఇంకా జరుగును, ఆ విధంగానే దానిని చూడుడి.

అప్పుడాయన నాతో ఇట్లు చెప్పెను, "నీవు యథార్థముగా ఉండినచో, వారి హృదయ రహస్యములను నీవు తెలిసికొందువు." మీరందరూ, మీ ప్రజలలో చాలామంది దానిని గుర్తుంచుకొని యుందురు. సరిగ్గా అదే విధంగా అది నెరవేరెను. దాని తరువాత కొద్ది సంవత్సరములకు కెనడా రెజీనాలోని, క్వీన్ సిటీలో ఉన్నాను. డాక్టర్ ఎర్న్ బాక్సటర్ తదితరులతో వేదిక మీద ఉన్నాను. ఒక వ్యక్తి వేదిక మీదికి వచ్చుచుండెను. మొదటి సంగతి ఏమనగా, అసలు నాకు నేను ఏదో చెప్పుచున్నట్లే తెలియలేదు. అతని పేరు పిలిచాను. అతని సంగతి ఏమిటో చెప్పాను. అది అలాగే జరిగెను. అప్పటి నుండి అది కొనసాగెను.

ఇప్పుడు ఇది మరియొక దశకు చేరినది. అది నేనెన్నడూ చెప్పజాలను, కాని దానికి అదే మాట్లాడుకొనును.

48కాని మరువ వద్దు, గొప్ప సేవలో అది ఒక ఉజ్జీవ అగ్నిని తయారు చేసెను. అది ప్రపంచమంతా వెళ్ళెను. ఇప్పుడు గత కొద్ది సంవత్సరములలో ఆ ఉజ్జీవము, చరిత్రలో ఏ ఇతర ఉజ్జీవము నిలువనంత దీర్ఘకాలము నిలచినది. ఏ సమయములోనైనా గాని, ఏ ఉజ్జీవము కూడా మూడు సంవత్సరములకు పైగా నిలచియున్నట్లు ఏ చరిత్రకారుడు చెప్పజాలడు. కాని ఇది పదిహేను లేక అంతకన్న ఎక్కువ సంవత్సరములకు పైగా నిలచియున్నది, సూటియగు నిరంతర ఉజ్జీవము.

కాని ఇప్పుడు ఉజ్జీవము అయిపోయినది. కేవలము… అంతట కడవరివాన వచ్చును. దాని చిన్న తోక ఇప్పుడు ఇంగ్లాండును ఊడ్చుచున్నది. అది కేవలము ముగింపునకు ముందు వచ్చు ఆఖరి దెబ్బ. సంఘము మరల లవొదకయలోనే స్థిరపడినది. ఆ కాలమును తయారు చేసెను. అది అలాగే ఉండవలసి యుండెను. సరిగ్గా అది అట్లే యుండవలెను. ఈ రాత్రి మనము ఆ ఉజ్జీవమువలన మిగిలిన ముక్కలను ఏరుకొని విందు చేసికొనుచున్నాము.

GEN 2:2,3•

EXOD 20:11

 

49ఆ దినపు ఉజ్జీవము నుండి వచ్చుచున్న శిష్యుల పరిస్థితి అలాగే యున్నది. మరుసటి రోజు కొరకు ఎదురు చూస్తున్నారు. యేసు ఆ సమయమున విశ్రాంతి తీసికొనుచుండెను. ఏడవ దినమున ఆయన విశ్రమించినట్లుగా ఆయన ఉజ్జీవము నుండి విశ్రాంతి పొందుచుండ వచ్చును. భూమిని ఆరు దినములలో చేసిన తరువాత, "ఆయన ఏడవ దినమున విశ్రమించెను," అని బైబిలు చెప్పెను. బహుశా ఆయన అదే చేయుచుండ వచ్చును. ఆయన విశ్రాంతి పొందుచుండెను.

అప్పుడు అకస్మాత్తుగా శ్రమ వచ్చెను, ఓ, సంఘము కొద్దిగా విశ్రాంతి పొందుటకు ఆరంభించినచో, అప్పుడు శ్రమ వచ్చును. దోనె అల్లాడ సాగెను. దోనెను నీరు నింపెను. ఇక బ్రదుకుదుమన్న ఆశ గతించినట్లు కనబడెను. వారు ఆయన ఎన్నో కార్యములు చేయుట చూచినను, శ్రమ వచ్చినప్పుడు…

ఇక్కడ ఇప్పుడు నేను కొద్ది నిమిషములలో ముగించుదును, ఎందుకనగా మనము ప్రార్థన వరుసను ప్రారంభించనై యున్నాము.

మనము ఆ సంగతులన్నీ చూశాము. ప్రజల యొక్క అనుకూల ప్రతి కూలతలను చూశాము. ఇప్పుడు నెమ్మదిగా ఉండు స్థానమునకు వచ్చాము. ఆయన చేసిన దాని గూర్చి, వాటిని గూర్చి మాట్లాడుకొనుచున్నాము. ఆయన ఏమి చేయనైయున్నాడో దాని గూర్చి చూస్తున్నాము. అది కేవలము మానవ నైజము. మానవ మాత్రులు ఎల్లప్పుడూ దేవుడేమి చేసెనో చెప్పెదరు. నమ్ము దానిని చేయగలడని చెప్పెదరు, కాని ఆయన చేయుచున్న దానిని మరచిపోవుదురు.

EXOD 31:17

 

50వారును అదే చేసిరి. అక్కడ ఆయన రోగులను బాగుచేయుటను, మృతులను లేపుటను, సంగతులను ముందే ఎరుగుటను, ప్రజల హృదయములలోని రహస్యములను చెప్పుటను వారు చూచారు. మరియొక ఉజ్జీవమునకు వెళ్ళు దారిలో ఉన్నామని వారు నమ్మిరి. కాని శ్రమ రాగానే అదంతయూ వారు మరచిపోయిరి.

మనము అలాగే చేయుదుము. ఈ రాత్రి మనము అక్కడే కూర్చొని యున్నాము, అదే స్థలములో కూర్చున్నాము. అయిననూ ఆయన దోనెలో ఉన్నాడని తెలిసికొన్నచో చాలును. ఆ దోనెలో పరుండి యున్నప్పుడు ఆయన ఎంత గొప్పగా ఉండెనో ఇప్పుడునూ అంతే గొప్పవాడుగా ఆయన ఉన్నాడు. అంతరిక్షములో ఆయన నిలబడి ప్రపంచమును సృష్టించినప్పుడు ఆయన ఎంత గొప్పవానిగా ఉండెనో, ఇప్పుడునూ అంతే గొప్పవానిగా ఆయన ఉన్నాడు. ఎర్ర సముద్రము నొద్ద మోషేతో ఎంత గొప్పవానిగా ఆయన ఉండెనో, అంతే గొప్పవానిగా ఆయనున్నాడు. లాజరు సమాధి యొద్ద ఆయన ఎంత గొప్ప వానిగా ఉండెనో, అంతే గొప్పవానిగా ఇప్పుడున్నాడు. కుష్టరోగిని శుద్ధి చేసి, గ్రుడ్డివానికి దృష్టిని ఇచ్చినప్పుడు, ఆయన ఎంత గొప్ప వానిగా నుండెనో, ఇప్పుడునూ అంతే గొప్పవానిగా ఉన్నాడు. వేల్స్ ఉజ్జీవములో గొప్పగా నున్న రీతిగానే ఇప్పుడునూ ఉన్నాడు. అన్ని సమయములలో ఆయన ఎట్లు గొప్పగానున్నాడో, ఇప్పుడును అంతే గొప్పగా ఉన్నాడు. ఆయన ఇక్కడ దోనెలో ఉన్నాడు!

ఆపద వచ్చెను. మనము ఆయా స్థలములకు వెళ్ళెదము, సంఘములో గలిబిలి అగుదుము. చిందర వందరగుదుము. అది ఒక సంఘమును నాశనము చేయునని నీవెరుగుదువా? కలిసి యుండు!

బంధించు ముడి ఆశీర్వదించబడినది

క్రైస్తవ ప్రేమలో మన హృదయములు;

ఒకే మనస్సు గల సహవాసము

పైనున్న దానికి మాదిరిగానున్నది.

(విడదీయరాని దేవుని యందలి ప్రేమ

విశ్వాసము మరియు పరస్పరమైనది!)

51కాని ఇప్పుడు మనము నీటి సరఫరా తగ్గుట చూచుచున్నాము. నేను జీవించుచున్న ప్రదేశమగు టుసాన్ లో బయటనున్న ప్రతిదానికి ఒకటి అంటించబడియున్నది. అది ఎంతో ఎండిపోయి యున్నది గనుక ప్రతిదానికి ఒకటి అంటించిరి. ఆ ప్రాంతములో లేనివి ఈ ప్రాంతములో పెరిగినచో చక్కని నునుపైన ఆకులు వచ్చును. ఆకు చుట్టుకుపోయి గట్టిగా, పదునుగా ఒక అంటింపు వలె కనబడినది. ఏ సాధనము దాని వలె తయారు కాబడదు. ఎగిరే కాక్టస్ వలె ఏ సాధనము దేనిని తయారు చేయజాలదు, ఎందుకనగా దాని మీద చిన్న నూగున్నది, చివరి వరకును ఒక కొక్కెము వంటిది గలదు. ఏ సాధనము తయారు చేయజాలని రీతిలో ప్రకృతి దానిని మడిచినది. అది నీ మీదికి ఎగురును. దానిని నీవు వశపరచుకోనవసరము లేదు; అది నిన్ను పట్టుకొనును.

పాపముతో కూడా అలాగే యున్నది. అందులోనికి నీవు వెళ్ళవలసిన అవసరము లేదు; అది నీ మీదికి వచ్చును. అది నీ మీదికి ఎగురును. దాని జోలికి పోవద్దు. అవిశ్వాసము నుండి దూరము కమ్ము! కాని మనము ఆ కాలములో జీవించుచున్నాము.

వారు ఆయన ఎన్నో గొప్ప కార్యములు చేయుట చూచారు. వారు దాని గూర్చి మాట్లాడగలరు. కాని ఆపద సమయము వచ్చినప్పుడు, అదంతా మరచిపోయిరి.

52ఆయన చేసిన కార్యములను మనము చూచాము. వాటిని గూర్చి ఆలోచించండి. ఆయన వాక్యముతో గుర్తింపు పొందిన తప్పిపోని రుజువులు గలవు. చివరి దినములలో ఇక్కడున్న గొప్ప పరిశుద్ధాత్మ ఈ ఘడియకు వర్తమానికుడని ఎరుగుదుము. మనకు రుజువు చేయుచున్నవాడు ఆయనే. తాను చేయుదునని వాగ్దానము చేసిన ప్రతి వాగ్దానమును ఆయన చేయుచున్నాడు. ఆయన తాను చేయుదునని చెప్పిన ప్రకారము - ప్రతి గురుతు, ప్రతి పని, ప్రతి మాట నెరవేర్చుచున్నాడు.

అయిననూ ఇంకా దానిని చిన్న చూపు చూస్తున్నారు. ఉన్నత స్థాయిలో నున్న గొప్పవారు దానిని అంగీకరించినచో నేను దాని నుండి దూరంగా పోదును. వారి ద్వారా అంగీకరించబడినట్లయితే అది దేవుని వలన కలిగినది కాదు. కాదండీ! ఖచ్చితంగా కాదు. అది అంగీకరించబడినచో, అదెన్నడూ దేవుని వలన కలిగినది కాదు. కాని అది ఈ విధముగా ఉండుటను బట్టి దానిని నేను నమ్ముచున్నాను, చూచారా. అది అక్కడికే వచ్చును. అక్కడికే అది వాగ్దానము చేయబడెను.

53ఇప్పుడు మనము ప్రతిదియు సరిగ్గా వరుసలో ఉండుట చూస్తున్నాము. చివరి దినములలో ఉన్నామని ఎరుగుదుము. ఏమి జరిగినది? ఆపద వచ్చెను.

ఆయన చేయునదంతయూ చూశాము! ఆయన మన గృహములను ఎట్లు సరిచేసెనో గదా! తల్లిదండ్రులను ఆయన మరల ఎట్లు ఐక్యపరిచెను! మీరు అది చూచారు. భార్య, భర్తలు తిరిగి ఒకటయిరి. ఆయన మీ రోగులను బాగుచేసెను. కాన్సరులతో అక్కడ పడియున్నారు, సీసాలు, జగ్గులు, పెనములతో వారిని తీసికొని వచ్చారు. వైద్యులు సాక్ష్యమిచ్చి నివేదికల మీద సంతకాలు చేశారు. వాటిని పెట్టి నిండా ఊంచాను. గుట్టలు పడి యున్నవి. చనిపోయి కొన్ని గంటలు గడిచిన పిదప తిరిగి లేచిన సందర్భములు అయిదు సాక్ష్యాధారములతో ఉన్నవి. మంచిది… నాకు తెలిసిన దీర్ఘ వ్యవధి ఒక ఉదయము తొమ్మిది గంటల నుండి ఆ రాత్రి పదకొండు గంటల వరకును, చూచారా.

54కాదు, క్షమించండి. ఒక చిన్న బిడ్డను తల్లి రాత్రంతా చేతులలో మోసికొని వచ్చెను. ఒక మధ్యాహ్నము ఆ బిడ్డ చనిపోగా, రాత్రంతా ఆమె చేతులలో ఉంచుకొని, కాలిఫోర్నియాలో జరిగిన కూటమునకు వచ్చెను. ఆ మధ్యాహ్నము నేను మాట్లాడుచున్నాను. అంతకు ముందు మధ్యాహ్నము చనిపోయిన ఆ బిడ్డను రాత్రంతా కారు నడుపుకొని తీసికొని వచ్చెను. ఆమె వచ్చుటకు స్థలము లేదు. చల్లబడి పోయిన ఆ చిన్న రూపమును ఆమె నా చేతులలో ఉంచినది. అంతకు ముందు రోజు ఆ బిడ్డ చనిపోయెను. నిలబడి ఆ చిన్న బిడ్డను పట్టుకొని ప్రార్థించాను. ఆ చిన్న శరిరమునకు వెచ్చ పుట్టెను. తిరిగి చూచెను, తిరిగి తల్లికి అందించాను. అది సత్యము.

55ఆ కార్యములు చూశాము. పూర్తిగా వాటిని పరీక్షించాము. నిశ్చయంగా గుర్తించబడినవి, అయితే ఆపద వచ్చినప్పుడు ఎందుకు భయపడవలెను?

వారు చూచుచున్నది… జరిగిన దానికి ఎంతో సాక్ష్యమును వారు ఎరుగుదురు. వారితో ఎవరున్నారో మరిచారు. అప్పుడు వారు మరచిపోయిరి, ఎందుకనగా శ్రమ వచ్చినది.

ఇప్పటివలెనే, మనకు పరిష్కారము దొరకని శ్రమలు కలుగుచున్నవి.

వారు తెడ్లు బలంగా నడిపారు. గాలి బహు తీవ్రముగా నున్నది. అది వారిని ఎగుర గొట్టెను. వారు తెడ్లు ప్రయత్నించారు. అలలు చాలా గొప్పగా నున్నందున తెడ్లు విరిగిపోయినవి. వారి చిన్న దోనె అదుపు తప్పెను. వారు బహుశా, లంగరు వేయ ప్రయత్నించి యుందురు. అయినను అది అదుపు తప్పి ఇష్టానుసారంగా పోతున్నది. గుద్దుకుంటూ పెళ పెళమంటూ పోతున్నది.

అల మీద దోనెను స్వారీ చేయించవలెను. దోనె నడుపు మీలో కొందరికి అట్టి గాలిని ఎదురుగా ఎదుర్కొన జాలరని ఎరుగుదురు. అలలోనికి పోవుదురు. అటువంటప్పుడు మీ దోనె అడుగుకు వెళ్ళి పోవును, కనుక మీరు ఈ దోనెను నడిపించవలసి యుందురు. అలతో పాటుగా వెళ్ళవలెను. అలలు దొర్లుచుండగా దానితో పాటు మీ దోనె ఒడుదుడుకులకు లోనగును. మీరు… అలాగు చేయనిచో, మీ దోనె నిండా నీరు నిండిపోవును.

56సరే, అంతా అయిపోయిన తదుపరి, ఇక దానిని ఆపజాలక, దానిని వారు కొట్టుకొని పోనిచ్చిరి. అలాగు వదలగానే దోనె నీటితో నిండిపోయెను. ఆశలన్నీ అడుగంటినట్లుగానే కనిపించెను, అప్పుడు వారు తొందర పడి భయపడిరి. ఎట్టి సమయమది! విడుదల దొరకని శ్రమ అది. అప్పుడు భయము ప్రవేశించెను, ఎందుకనగా ఇక వారు బయటపడలేరని తెలిసికొనిరి.

మనమును మరొక ఆపదలో కొట్టబడితిమి. మనలను ఆపద మొత్తినది… మన దేశము బయటపడజాలని జాతీయ ఆపదలతో చుట్టబడినది. మన దేశములోని పైరవీలు చూడండి. మన దేశాధ్యక్షుని కాల్చి చంపి, వెళ్ళి మరో బాలుని కాల్చారు. నా దృష్టిలో అది దేశాధ్యక్షుని చంపినంత నేరమే. పాశవిక హత్య. అలాగు వాడిని పోనిచ్చినచో వారింకా అలాగే చేయుచు పోవుదురు. బహుశా వాడు అలాగే తప్పించుకొనునేమో. వారేమి చేయుచున్నారో చూడండి. సర్వ ప్రపంచమూ! ప్రతి ప్రాంతములో మనము ఒక అబ్రహాము లింకనును ఉంచినచో, వారు ఇంకనూ అలాగే చేయుదురు. చూచారా, ఆ ఆపదల నుండి విముక్తి లేదు. పాపము, విశ్వాసము, దుష్టత్వము మనలో కరడు కట్టుకొని పోయి మన చుట్టూ పెరిగిపోయి, మొత్తం దేశమంతటినీ చుట్టుముట్టునది.

57మనకు సంఘ శ్రమలు, వివాదములు, తొందరలు, ఎక్కువై పోయినవి. వాటి నుండి తప్పించుకోలేమనిపించుచున్నది. వారేమి చేయ ప్రయత్నించుచున్నారో చూశాము. సంఘముల సమితి కొరకు వారంతా ఏకమవుచున్నారు. దాని నుండి మనకు విడుదల లేదు.

మనము వాక్యమును పరిచయము చేయుటకు ప్రయత్నించాము. పునరుత్థానమును క్రీస్తు తానే తిరిగి చూపించుటకు ప్రయత్నించెను. రెండు వేల సంవత్సరముల నుండి ఆయన ఏకరీతిగా యున్నాడు. వారు దానికి వీపు పెట్టి వెళ్ళిపోయారు. వారు అవిశ్వాసులు. నటించు-విశ్వాసులులు ఇంకా దానిలో తప్పులు పట్టుకొనుటకు అంటి పెట్టుకొని యున్నారు. ఎంత వరకు ఉండగలరో అంత వరకు ఉండుటకు ప్రయత్నించుచున్నారు. కాని ఏమిటిది? అదే సంగతి తిరిగి మరల పునరావృతమగుచున్నది.

JOHN 1:1•

2COR 3:2

 

58వాక్యము వారు తెలిసికొన వలసి యుండిరి. అన్నింటికీ విడుదల ఏమిటి? దేవుడే! పరిశుద్ధ యోహాను 1లో "ఆయనే వాక్యము" అని చెప్పెను. దీనిలో నుండి మనలను వెలుపలకు తెచ్చుటకు ఇంకా మనకు వాక్యమున్నది. మనకు ఏ సంఘముల సమితి అక్కర లేదు. వాక్యములోనికి మిశ్రితమగుచున్న ఈ సిద్ధాంతములు, మొదలగునవన్ని అక్కరలేదు. ఇక్కడ మనకు బైబిలున్నది. దీనిని ఎట్లు నడిపించవలెనో మనకు చెప్పుచున్నది. తిరిగి బైబిలు యొద్దకు, తిరిగి వర్తమానము యొద్దకు! అదే క్రీస్తు మన మధ్యలో ఉండుట, బైబిలు, సజీవ బైబిలు."మీరు వ్రాయబడిన పత్రికలు," సజీవ బైబిళ్ళు, దేవుని వాక్యము మీలో అలాగు జీవించుచున్నది! అదే మనకు అవసరము.

59రష్యాలో కమ్యూనిజం లేచుటకు అదే కారణమయినది. కమ్యూనిస్టులు పెద్ద గొప్ప పార్టీ ఏమి కాదు. నూటికి ఒక్క శాతము మాత్రమే ఇప్పుడు రష్యాలో కమ్యూనిస్టులు. తొంబది తొమ్మిది శాతము ఇంకా స్వేచ్ఛా వాదులుగానే యున్నారు, కాని వారు పాలించుచున్నారు. పరిపాలన వారిది. అసలు మొదట ఎందుకు లేచినది? సంఘము చెడిపోయినందు వల్లనే. అదే కారణము. వారు ప్రజల యొద్ద నుండి ద్రవ్యమంతటిని సంఘము కొరకు తీసికొనిరి. వారు మాత్రము అదే జీవితము జీవించారు. ఇతర లాడ్జిలకన్నా సంఘము వేరుగా లేదు. ప్రజలు అసహ్యించుకొని ఏవగించుకొనిరి. అలాగు కమ్యూనిజము జన్మించినది.

ఇక్కడ లోకత్వము కూడా అలాగే పుట్టినది. అందుకే మనము సంఘముల సమితిని కలిగియున్నాము. అందుకే మనము ఈ సమాఖ్యలోనికి, చేయుచున్న పనులలోనికి వెళ్ళిపోవుచున్నాము. కారణము వారు వాక్యమును నిరాకరించుటయే. సంఘ కాపరికి చెల్లించుటకు వారు సంఘములో విందు ఏర్పాటు ఎందుకు చేయవలెను? వారు దైవ పద్ధతిలో దశమ భాగములను చెల్లించుట మానిరి. నిశ్చయంగా! వారెందుకు ఒక సిద్ధాంతమును పట్టుకొన్నారు? వారికి బైబిలు అక్కరలేదు గనుక. వారెందుకు ఒక తప్పును స్వీకరించారు? ఎందుకనగా వారికి సత్యము అక్కర లేదు గనుక.

60ఒక వ్యక్తి ఇంటి దిగువన కూర్చొని కండ్లు మూసికొని, "సూర్యుడు ప్రకాశించుట లేదు" అని చెప్పినచో, వాడికి ఏ నిరీక్షణ లేదు. కాని వాడు చూచుటకు ఇష్టపడినచో సూర్యుడు ప్రకాశించుట చూచును. దానిలో నుండి బయటకు వచ్చినచో దాని దీవెనలను అనుభవించును. వాడు రానిచో దానికి నీవేమి చేయలేవు. ఆ మనిషి పిచ్చివాడయిపోయెనని నీవు చెప్పగలవు.

దేవుని వాక్యమునకు బదులుగా, దానికి విరోధముగా నున్న ఒక మత విశ్వాసమును ఒకడు స్వీకరించినచో, అతడు ఏదో ఆత్మీయ తప్పులో ఉన్నాడు.

సిలువ వేయు దినమున వాక్యమునకు బదులుగా బందిపోటు దొంగయగు బరబ్బాను వారు కోరిరి. నేడు వారు మన మధ్య గుర్తింపు పొందిన వాక్యమును స్వీకరించుటకు బదులుగా, వాక్యమును హతము చేయు సమాఖ్యను తీసికొనుచున్నారు. అదే మాదిరి. మనము ఆ ఆపదలో చిక్కుబడితిమి.

61ఇప్పుడు ఆయన శిష్యులు కొంత సేపు ఆపదలో చిక్కుకొని, వైద్యులు విడిపించజాలని భౌతిక ఆపదల వంటి వానితో ఆయన శిష్యులు చిక్కుకొనిరి. "నీకు కాన్సరున్నది. అది ముదిరి పోయినది," అని చెప్పవచ్చును. క్షయవ్యాధి నీకు ముదిరిపోయి యుండవచ్చును, లేదా మరేదో వ్యాధి యుండ వచ్చును. మనమును వారి వలెనె దోనెలో ఎవరున్నారో మరచిపోయాము.

అక్కడ ఒక తుఫాను వచ్చెను. దేవుడు గాలిని సృజించెను. దేవుడు వాయువును సృష్టించెను. దేవుడు జలమును సృజించెను. అదంతయూ ఆయన సృష్టి. ఆయన దానిని తయారు చేసెను. కాని మీరు చూడండి. దానిలోనికి దూరి దానిని చిందర వందర చేసినది అపవాది, ఆదిలో ఆ విధముగా తయారు చేసిన సృష్టికర్త ఆయనే అయినచో, అక్కడే పరుండి యుండిన సృష్టికర్త దానిని ఆపగలడని శిష్యులు ఎరుగరా? ఆమేన్!

3JN 1:2

 

62దేవుడు నిన్ను ఆరోగ్యముగా ఉండుటకు తయారు చేసెను. అపవాది చొరబడెను, గాలివలెనె వాడు ఆయనకు లోబడవలెనని నీకు తెలియదా? ఆయన నీ శరీరమును తయారు చేసెను. ఆయన నిన్ను ఒక మానవునిగా చేసెను. ఆయన నీకు కండ్లను, ఆరోగ్యమును ఇచ్చెను. "అన్నింటికంటే ఎక్కువగా నీవు ఆరోగ్యమందు వర్ధిల్లవలెనని కోరుచున్నాను." అక్కడికి చొరబడినది అపవాది. నిజము. ఆయన ఇతర ఉజ్జీవముల నుండి విశ్రాంతి పొందుచున్నాడు గాని ఆయనను పిలచినచో వచ్చుటకు సిద్ధముగా నున్నాడు.

అది జరగనైయున్నదని ఆయన ఎరుగునని వారు తెలిసికొని యుండ వలసినది. ఆయన అన్ని సంగతులను ఎరుగును. అది జరుగునని ఆయన ఎరుగును. అది కేవలము వారి విశ్వాసమునకు ఒక పరీక్ష మాత్రమే అని రుజువు చేయుటయే. ఆయన నిద్రించుచున్నాడన్న మాటను కూడా నేను సందేహించుచున్నాను. ఆయన ఆ వెనుకన పరుండియున్నాడు, ఏమి జరుగుచున్నదో ఆయన ఎరుగును. అవును. వారు ఏమి చేయుదురో, ఆయన కనిపెట్టి చూచుచున్నాడు.

HEB 13:8

 

63వారు ఆ బయట ఏలాగు సాక్ష్యమిచ్చిరో వినండి, "ఓ, దేవునికి మహిమ. ఆయన మెస్సీయాయే అని మేము తృప్తి చెందాము. ఓ, మహిమ, హల్లెలూయా, అది మాకు తెలియును! అది సత్యము."

"నేను వీరిని చూచెదను. సరే, సాతానా, ఇప్పుడు వాటిని వదలుము," అనెను.

బయటకు చూచిరి. ఓ, ఇక ఏ ఆశయూ లేదు. ఓ, మేము నశించనై యున్నాము. అబ్బాయిలూ! ఏమి చేయగలము?" వారు ఎవరిని గూర్చి మాట్లాడుకొనిరో, ఆ సృష్టికర్త అక్కడే వారితోనే పరుండి యుండెను. హల్లెలూయా!

మనకు పరిశుద్ధాత్మను ఇచ్చిన ఆ దేవుడే, పెంతెకొస్తు దినమున దిగిన ఆ పరిశుద్ధాత్మయే, ఈ రాత్రి ఇక్కడ మనతో ఉన్నది. ఆమేన్. మృతులను లేపిన దేవుడు, రోగులను బాగుచేసినవాడు, నిన్న, నేడు, నిరంతరము ఏకరీతిగా ఉన్నవాడు ఇక్కడ మనతో ఉన్నానని రుజువు చేయుచున్నాడు.

JOHN 5:39•

JOHN 10:37•

JOHN 11:25•

ROM 8:28•

HEB 4:12

 

64బహుశా నీవు ఏమి చేయుదువోనని చూచుటకు ఈ ఉపద్రవమును, పిలుపును రప్పించి యుండవచ్చును. నీ విశ్వాసమును రుజువు చేయుటకు ఆయన చేయు విధానము అదియే. నీవేమి చేయుదువో చూచును. పారిపోయేదవా? "ఆయనను ప్రేమించువారందరికి మేలు కొరకే సమస్తము సమకూడి జరుగుచున్నవి," అని బైబిలు చెప్పుట లేదా?

తాను ఎవరై యుండెనో ఆయన పూర్తిగా రుజువు చేసెను. ఆయన ఎవరైయున్నాడో క్షుణముగా నేడు రుజువు చేసెను. ఆయన అప్పటి వలెనే ఇప్పుడును రుజువు చేసెను. ఆయన ఇంకనూ మెస్సియాయే. ఇంకనూ అదే రీతిగా యున్నాడు. ఇంకనూ, ఆయన వాక్యమే. హృదయ ఆలోచనలను, ఉద్దేశ్యములను వివేచించువాడు. ఆయన ఎప్పుడు చేసినట్లుగానే ఇంకనూ వివేచించుచున్నాడు. ఆయన ఎప్పుటి వలెనే ఇంకనూ బాగుచేయును. ఆయన ఎప్పుటి వలెనే ఇంకనూ సృష్టి చేయును. ఆయన ఇంకనూ మృతులను లేపును. ''పునరుత్థానమును జీవమును నేనే," ఆయన ఎప్పటి రీతిగానే యున్నాడు. ఆయన దానిని మన మధ్యనే, మన దోనెలోనే రుజువు చేయుచున్నాడు.

అప్పుడు శ్రమ వచ్చెను, "ఆశలన్నీ పోయినవి." అవును, అప్పుడు శిష్యులవలెనె లేదా? అది నిజము.

వాక్యము, గురుతులు ద్వారా ఆయన తానెవరై యుండెనో రుజువు చేసెను. ఆయన ఎవరై యుండెనో అన్న సంగతి పూర్తిగా బయలుపడినది. "నా గూర్చి వ్రాయబడిన కార్యములు నేను చేయనిచో నన్ను నమ్మకండి. కాని నా గూర్చి వ్రాయబడిన కార్యములు చేయుచున్నచో, అప్పుడు దాని గూర్చి చెప్పినది నిజమని నమ్ముడి. ఈనాడు మనమూ అలాగే యున్నాము. "లేఖములను పరిశోధించుడి, అవి నన్ను గూర్చి సాక్ష్యమిచ్చును," అని ఆయన చెప్పెను.

65సర్వసృష్టికిని, జరుగబోవు వానికి సహితము ఆయనే దేవుడు అని వారు ఎరిగి యుండవలసినది. గాలిని, భూమిని, నీటిని ఉండునట్లుగా ఆయన సృజించెను. ఆ సృష్టికర్త అక్కడ పరుండి యుండెను. దాని అంతటి పైన తనకు అధికారమున్నదని ఆయన చూపించెను. వారు దానిని నమ్మిరి, కాని ఆయన దోనెలో ఉన్నాడన్న సంగతిని మరచిపోయిరి. ఎందుకనగా ఆయన అన్ని వేళలా వారి వీపు నిమురుచూ అక్కడ ఉండలేదు. "అబ్బాయిలూ, ఇప్పుడు ముందుకు వెళ్ళండి. ఇక్కడ అది జరుగనై యున్నది. అలాగు జరిగినచో నేను మీ ప్రక్కనే నిలచియున్నానని మరచిపోవద్దు. అబ్బాయిలూ, ఇదిగో అది వస్తున్నది. పదండి చూద్దాం. ఇక కొద్ది నిమిషములలో జరుగును." ఓ, కాదు. అలాగు ఆయన చేయలేదు. మనము ఆయనను నమ్ముదుమో లేదో అని ఆయన తన యొద్దకు వచ్చు ప్రతి కుమారుని, కుమార్తెని పరీక్షించును. అవునండీ. దానిని ఆయన సృజించెను. అవి ఆయనకు లోబడవా?

ఆయన మన శరీరములను కూడా సృజించెనని మనము జ్ఞాపకము చేసికొందము. అవి ఆయనకు లోబడవా? ఈ చిన్న…

66మిమ్ములను నేను ఒక చిన్న టెక్సాస్ మరియు లూసియానా మట్టి ముద్దలని పిలిచాను. అవును, మీరు ఆ మట్టి అయియున్నారు. మీరు ఆ నేల నుండియే లేపబడి తిరిగి తిరిగి అక్కడికే చేరిపోవుదురు. మీలో పదహారు ప్రాథమిక పదార్థములున్నవి. కొంచెము తేమ, కొంచెము పెట్రోలు, కొంచెము పొటాష, కొంచెము సున్నము, కొంచెము సూర్య వెలుగు ఉన్నవి. వాటన్నింటిని మిశ్రితం చేసి మీరు మలచబడిరి, అక్కడికే మీరు వెళ్ళెదరు. లూసియానా మట్టి మీరు. కాని మిమ్ములను ఒకటి ఈలాగు చేసెను. ఈ విధముగా మిమ్మును తయారు చేసిన ఆయనే మిమ్మును వేరేగా చేయుటకు మీతో నివసించుటకు రానైయున్నాడు. ఓ, దానిని మనము ఎంతగా చూడవలసి యున్నాము! గుర్తుంచుకొనండి. ఈ చిన్న మట్టి ముద్ద తిరిగి… జీవము కలిగి నడచుచున్న ఈ మట్టి ముద్ద, జీవము పోయినప్పుడు తిరిగి మరల ధూళిగా మారును.

JOHN 6:40,44,54

 

67అయితే ఆయన తన వాక్యములో ఏమి చెప్పెను? "అంత్యదినమున నేను దానిని లేపెదను." ఆమేన్! "నేను దానిని లేపెదను." అది ఆయన వాగ్దానము. శరీరము నశించిన తరువాత, ధూళి అంతరించిన తదుపరి సహితము అది భూమి యొక్క వాయువులలోనికి పోవును. అయినను నేను ఒక రాత్రి చెప్పినట్లుగా, "దేనిని నీవు నశింపచేయజాలవు, మానవుడు నశింపచేయజాలడు." నిర్మూలన అనునది లేదు. మనిషి దేనిని నిర్మూలించజాలడు. దేవుడు మాత్రమే అది చేయును. ఒక చెంచా బూడిదను సహితము ఆయన చేయగలడు, "అంత్యదినమున నేను దానిని లేపెదను," అని ఆయన చెప్పెను. ఆ ధూళి ఆయన ఆజ్ఞకు లోబడవలెను, ఎందుకనగా దానిని ఆయన తయారు చేసెను. గాలి, అలలు ఆయనకు లోబడినట్లుగానే ధూళియు ఆయనకు లోబడెను. ఆమేన్.

మేల్కొనండి! ఆయన మనతో యున్నాడు. సమస్తమూ ఆయనకు లోబడును.

MARK 4:38,40

 

68శిష్యులు తాము మార్గాంతమునకు వచ్చియున్నామని గ్రహించినప్పుడు, తమతో సృష్టికర్త యున్నాడన్న జ్ఞానోదయము వారిలో కొందరికి కలిగినది. అలాగు జరిగియుండును. అందుకే వారు వెళ్ళి ఆయనను మేల్కొలిపిరి, ఏలయనగా అన్నివేళలా ఆయన వారితో యున్నాడు.

ఆయన లేఖనపూర్వక వాక్యము ప్రత్యక్షపరచబడుటను వారు చూచిరి. యేసును పిలచుట కష్టము కాదు. "ఓ, యజమానుడా, లెమ్ము, లెమ్ము! ఓ, యజమానుడా, లెమ్ము, లెమ్ము," అని చెప్పనవసరము లేదు. లేదు, లేదు.

"బోధకుడా!" అని మాత్రమే వారని.

"ఇక్కడే ఉన్నాను," అనెను.

"మేము నశించిపోవుచున్నాము నీకు చింతలేదా?"

"ఓ, మీ విశ్వాసమెక్కడ? అల్ప విశ్వాసులారా?" అని ఆయన చెప్పెను.

అంతే, ఆయన మనతో ఉన్నాడని మరిచిపోయాము. యేసును రంగము మీదికి వచ్చి పని చేయమని పిలిచారు. ఈనాడు జనులు పలుకుచున్నారు, "అది ఆయనే అని నేను ఖచ్చితంగా ఎరిగియుంటే, నాకు ఆ నిశ్చయత కలిగియుంటే చాలును!"

69వారెట్లు నిశ్చయత కలిగియుండగలరు, దాని గూర్చి శిష్యులు ఎట్లు నిశ్చయత కలిగియుందురు! ఇప్పుడు వినండి. ఆయన విద్య కలిగిన వ్యక్తి అయినందువలన కాదు. మనమెరిగింత వరకు ఆయన విద్యగలవాడు కాడు. ఆయన దేవుని జ్ఞాగము మాత్రమే కలిగియుండెను. కాని ఈ లోకపు విద్య, నేను… ఆయన ఎన్నడైనా బడికి వెళ్ళెనేమో నన్న ఆధారము ఎక్కడా మనకు లేదు. లేక ఆయన గొప్ప యాజకుడా, లేదు. గొప్ప పేరుగల వ్యక్తి కాదు. కాదు. అట్టి దాని గూర్చిన ఆధారము ఎక్కడా మనకు లేదు. కేవలము ఒక సామాన్య వ్యక్తి. కాని వారెట్లు ఎరుగుదురు? ఇప్పుడు జాగ్రత్తగా వినండి. దీనిని తప్పిపోవద్దు. "నీవు నిశ్చయంగా క్రీస్తువని" ఆ తక్కిన వారు ఎట్లు నిశ్చయత కలిగియుండిరి? ఏలాగు వారికి కలిగెను? ఎందుకనగా వారు వాగ్దాన వాక్యము బయలుపరచబడుటను చూచిరి. మరో మాటలో చెప్పువలెనన్నచో, అది ప్రత్యక్షపరచబడెను, తెలియచేయబడెను. సజీవ వాగ్దాన వాక్యము జీవింప చేయబడినది. ఆ శరీరము గుండా కార్యరూపము ధరించినది. ఆయనలో దేవుడున్నాడని వారు తెలిసికొనిరి.

JOHN 3:2•

JOHN 6:69•

ACTS 2:22

 

70పేతురు చెప్పెను, "యూదయ వారలారా, ఇశ్రాయేలీయులారా, మీ మధ్యనున్న నజరేయుడగు యేసు, దేవునిచే ఆయన ద్వారా జరిగించబడిన కార్యముల ద్వారా దైవ గుర్తింపు పొందినవాడు."

నికోదేము అను ఆ గొప్ప పండితుడు రాత్రియందు వచ్చి, "బోధకుడా, నీవు దేవుని యొద్ద నుండి వచ్చినవాడవని ఎరుగుదుము. దేవుడు తోడైయుంటేనే గాని ఎవడును ఇట్టి కార్యములు చేయజాలడు. అది మేము ఎరుగుదుము," అనెను. కాని అతడు ఎందుకు దానిని అంగీకరించలేదు? ఎందుకు? చూచారా, అది వారి ఆచారమునకు వ్యతిరేకము, చూచారా. కాదు.

అవును, ఆ దినమునకు ముందే చెప్పబడిన దేవుని వాక్యమును జీవింప చేసినందువలననే ఆయన ఎవరో వారు తెలిసికొనిరి. మీకు అర్థమైనదా? ఎందరికది తేటతెల్లముగా అర్థమయినది? మీ చేతిని ఎత్తండి. చూచారా, ఆనాటి వాగ్దాన వాక్యమును ఆయన జీవింపజేసెను. ఆయన మెస్సీయాయే అని వారు ఖచ్చితముగా ఎరిగియుండిరి.

HEB 4:12•

HEB 13:8

 

71అదే ఆ స్త్రీ చెప్పెను, "ఇప్పుడు ఇటు చూడండి, మనకు నాలుగు వందల సంవత్సరముల నుండి ప్రవక్త లేడు. రంగము మీద తరువాత ప్రత్యక్షము కావలసిన ప్రవక్త మెస్సీయా. నాకు అయిదుగురు భర్తలున్నారనియు, నేను చేసిన సంగతులన్నియూ చెప్పిన ఒకాయన ఇచ్చట నిలబడియున్నాడు. దానికి మీరందరూ సాక్షులు. ఇప్పుడు ఆయన ఆ పట్టణ బావి యొద్ద కూర్చొనియున్నాడు. నాకు అయిదుగురు భర్తలుండిరని ఆయన చెప్పెను. మెస్సీయా చేయు సూచన అదే కాదా? ఆయన వాక్యము, హృదయములో నున్న ఆలోచనలను వివేచించువాడు. అది ఆయనే కాదా?" ఆ కారణమును బట్టియే ప్రజలు ఎరిగిరి. ఆయనే మెస్సీయా అని ఖచ్చితంగా చెప్పిరి.

ఆ విధముగానే మనమును ఆయన మెస్సీయా అని ఎరిగితిమి, ఎందుకనగా ఆయన నిన్న, నేడు, నిరంతరము ఏకరీతిగా ఉండి, చివరి దినములలో తిరిగి దీనిని చేయుదునని వాగ్దానము చేయుటను గూర్చి బైబిలు చెప్పెను.

"సరే, వారాయనను సిలువ వేసిరి." అవును, కాని ఆయన తిరిగి లేచెను.

JOHN 4:25,29

 

72మెక్సికోలో జరిగిన ఒక సందర్భము గూర్చి మాట్లాడుతున్నాను, సహోదరుడు మూర్ తో ఆ చిన్న బాలిక తిరిగి లేచినది. అది జరిగిన కొద్ది దినముల తర్వాత సంఘము ద్వారా వార్తాపత్రిక విలేకరులు నన్ను ప్రశ్నలు వేశారు. వారు నాతో అన్నారు…

ఇక్కడ ఎవరయినా కాతలిక్కు వ్యక్తి కూర్చుని ఉన్నచో, వారిని ఉద్దేశించి ఇది చెప్పుట లేదని గుర్తించండి. నా జనులు కూడా కాతలిక్కులు. కాని చూడండి, వారు చక్కని జనులు. వారు మనవంటివారే, వారిలో చాలామంది దేవుని కొరకు ఆకలి, దప్పులు గలవారు.

REV 17:5

 

73ఈ విలేకరి ఇట్లనెను, "అది గుర్తించదగు సంగతి, మా పరిశుద్ధులు అది చేయగలరని నీవు తలంచుచున్నావా?"

"వారు జీవించుచున్నచో,'' అని నేనన్నాను.

"వారు చనిపోతేనేగాని పరిశుద్ధులు కాలేరు గదా?'' అని అనెను.

పేతురు చనిపోక ముందు పరిశుద్ధుడయ్యెనా, లేక చనిపోయిన తరువాతా? అని అడిగాను, చూచారా? పౌలు చనిపోయిన తరువాత పరిశుద్ధుడాయెనా లేక చనిపోకముందా? అతడు అదే చేసెను. చూచారా."

"నీవు కాతలిక్కువు కాదు గదా? నీ అభిప్రాయము …?" అని వారనిరి.

"కాదండి, నేను ప్రొటస్టెంటును," అన్నాను.

"నీవు ఎదురించవు…." అని అన్నాడు.

"నేను జనులను ఎదురించను గాని సంఘ బోధను చూచారా," అన్నాను.

"అయితే సంఘమును గూర్చిన అభిప్రాయమేమిటి?'' అనడిగారు. "మీరు నన్ను అది అడిగినందుకు చింతించుచున్నాను," అని చెప్పాను.

"పరవాలేదు, మిమ్మును అడిగాము కాబట్టి చెప్పండి," అన్నారు.

"నాకు తెలిసినంత వరకు అంతకన్న గొప్ప భూతవాదము లేదు,'' అన్నాను.

"భూతవాదమా?" అన్నాడు.

"అవునండీ," అన్నాను.

"తల్లి సంఘమును భూతవాదము అని నీవెట్లు అనగలవు?" అన్నాడు

"తల్లి ఎమిటి?" అన్నాను.

"తల్లి సంఘము," అన్నాడు.

నేనన్నాను, "అయ్యా, తల్లి రోమా సంఘము, అవును. సంఘ సంస్థ, దానికది తల్లి, ప్రకటన 17 అది అదేనని చెప్పుచున్నది. స్త్రీ వేశ్యలకు తల్లి, కాని "సంఘము రోమ్ లో ప్రారంభము కాలేదు. అది యెరూషలేములో ఆరంభమాయెను," చూచారా.

"దేవుడు తన సంఘములో ఉన్నాడు," అని అతడు చెప్పెను.

"దేవుడు ఆయన వాక్యమే అయియున్నాడు," అని నేను చెప్పాను.

74అందుకు అతడిట్లు అన్నాడు, "నీకు తెలిసిన ఉన్నత భూతవాదము అదే అని చెప్పావు గదా? అది నీవేలాగు చెప్పగలవు?"

"మృతులతో మధ్యవ్యక్తిత్వము జరుపు ఏదయినా గాని భూతవాదమే. అక్కడున్న వీధిలో నడిచిపోవుచున్న స్త్రీలందరూ రాళ్ళు మొదలగునవి పెరికి, పశ్చాత్తాపము జరిగించుచూ, ప్రేమికులచే చంపబడిన ఒక స్త్రీకి వారు మొక్కుతున్నారు! ఆమెను ఒక పరిశుద్ధురాలుగా చేశారు, ఎందుకనగా ఆమె సంఘము ద్వారా అంగీకరించబడెను. అదే భూతవాదము," అన్నాను.

"మీరు యేసుకు ప్రార్థించుదురు, మరియు ఆయన చనిపోయెను," అన్నాడు.

"అయ్యా! అయితే ఆయన తిరిగి లేచెను," అన్నాను. అది సత్యము. ఓ, సంగతులు ఎట్లున్నవో చూచారా! ఆయన తిరిగి లేచెను. మీ భావములకు బాధకలిగించుట లేదనుకొంటాను," అని పలికాను.

"లేదు, ఏ బాధయూ లేదు," అన్నారు.

"సరే, మంచిది," అని అన్నాను. చూచారా.

HEB 13:8

 

75ఏమిటి? ఆవును. ఓ, మై! దోనెలో ఎవరున్నారో మనము మరచిపోయాము, చూచారా. "ఆయన అలాగు లేదు," అని వారు చెప్పుచున్నారు గదా. మనము ఆయన నిన్న, నేడు, నిరంతరము ఏకరీతిగా యున్నాడని ఎట్లు ఎరుగుదుము? ఆయన పరిచర్య దానిని తిరిగి వారి ఒడిలోనికే విసిరివేయును. ఆయన నిన్న, నేడు, నిరంతరము ఏకరీతిగా యున్నాడు. పిలాతు ఆయన రక్తము విషయములో ఎంత దోషియో నీవును అంతే దోషివి. అది నీ చేతిలలో యున్నది. దానిని నీవు కడిగివేయలేవు. దాని గూర్చి ఎన్నడైనా ఆలోచించావా?

దేశాధక్ష్యుని రక్తమును నీవు నీ చేతులలో ఉంచుకొనుటకు ఎట్లు ఇష్టపడుదువు? నీవేమి చేయుదువు? నీ యొద్దకు ఏమి వచ్చుచున్నదో నీవెరుగుదువు. సరే, యేసు యొక్క రక్తమును నీ చేతులలో ఉంచుకొనుట స్వల్ప విషయము. అది నిజము.

76ప్రెసిడెంటును చంపిన వ్యక్తి… బహుశా అస్వాల్డు అది చేయలేదనుకొందము. ఎవరో చేసిరో వారెన్నడూ ఎరుగరు. కాని అతడు చేయక పోయినా, తన చేతులలో ప్రెసిడెంటు రక్తమును కలిగియున్న వ్యక్తి ఈ రాత్రి జీవించియున్నచో ఏమనుకొనును? వారతనిని పట్టుకొని ఈ దేశ ఉన్నత న్యాయస్థానమగు సుప్రీం కోర్టునకు అతనిని తరలించినచో, అతడేమి చేయును? అతని వైపు చూచుచున్న కోపపు చూపులను చూడండి. అతడు దయకొరకు అర్థించవచ్చునని మీకు తెలియును, "నేను అలాగు చేయవలెనని చేయలేదు. నేను చెప్పుచున్నాను, నేను మంచి వ్యక్తిని. నేను అలాగు చేయవలెనని చేయలేదు." అక్కడ దయకు తావు లేదు. ఆ విధంగా సుప్రీం కోర్టును చూచుట చాలా చెడ్డ సంగతి.

యేసుక్రీస్తు రక్తమును నీవు కలిగియుండి, నూతనముగా ఆయనను సిలువ వేసిన దోషముతో, దేవుని యొక్క నేత్రముల వైపు చూచుట ఎట్లుండును? దాని సంగతి ఏమిటి?

77విమానములో పైకి వెళ్ళు ముందు ఒక విమాన చోదకుని నీవు ఎన్నడైనా గమనించావా? అతడు… తనకు సాధ్యమైన ప్రతి సాధనమును తనిఖీ చేయును. అతడు ఆ విమానమును బయట పెట్టి ప్రతి దానిని పరీక్షించును. అక్కడ నిలబడి అది పైకి ఎగురునో లేదో అని అన్నీ కదిలించి చూచును. ఎందుకు? అతడు బహు జాగ్రత్తగా ఉండును. సరిగ్గా పరీక్షించనిచో, అతని చేతులు రక్తపరాధమునకు గురియగును.

ఆపరేషను చేయు వైద్యుని చూడండి. ప్రతి పనిముట్టును ఎట్లు పరీక్షించునో చూడండి. ఎక్స్-రే తీయును. ప్రతిదీ చేయును. ఎందుకు? ఆ మనిషి తన చేతులలో ఉన్నాడు. అతడు చనిపోయినచో, రక్తాపరాధము అతనిదే. ఆ రక్తము తన చేతులలో లేకుండా నిశ్చయించుకొనుటకు ప్రతిదీ పరీక్షించును. అది నిజము. ఏ రక్తము యొక్క దోషము తన చేతులతో ఉండవలెనని అతడు కోరడు. మానవ రక్తము మానవ హస్తములలో ఉండుట అవాంఛనీయము.

MATT 27:24

 

78అయితే నీ చేతుల మీద నున్న యేసుక్రీస్తు రక్తముతో నీవేమి చేయనైయున్నావు? ఇప్పుడు నీవు దానిని విసిరివేయజాలవు, "అది నేను నమ్మను," అనలేవు. బైబిలు నిన్ను ఖండించును. ఆయన నిన్న, నేడు, నిరంతరము ఏకరీతిగా యున్నాడని చెప్పుచున్నాడు. ఇక్కడ ఆయన క్రియ చేయుచున్నాడు. ఏమైనా గాని ఆ రక్తమున చేతులలో యున్నది. నీవు దానిని కడిగి వేయలేవు.

పిలాతు అది ప్రయత్నించెను. అతని చేతుల నుండి దానిని కడిగివేసికొనుటకు సరిపడనంత నీరు లేకపోయెను. దానిని అతడు తన సంస్థ మీదికి నెట్ట ప్రయత్నించెను, పైవారికి, ప్రెస్బిటరునకు, వారిట్లు చెప్పిరి, "నీవు నన్ను చేయనిచ్చితివి," కాని అది వెనక్కు ప్రేలినది.

అది తిరిగి నీ మీదికే వచ్చును, చూచారా. దానిని నీ చేతుల మీద నుండి తీసివేయలేవు. దానిని అంగీకరించుట తప్ప లోకములో మరొక దారి లేదు. నీ చేతులలో నుండి దానిని తీసివేసికొనుటకు ఒకే ఒక మార్గము నీ హృదయములోనికి దానిని తీసికొనుటయే. అది ఒక్కటే చేయుటకు మార్గము. ఈ రోజున యేసుక్రీస్తు ఆనాడు ఇక్కడి భూమి మీద ఉన్నప్పుడు ప్రత్యక్షపరచిన రీతిగానే తన్ను తాను బయలుపరచుకొనుట సరిగ్గా మనము చూచుచున్నాము. అది చేయుటకు వాగ్దానము చేసెను. ఈయన మెస్సీయా అని మనకు నిశ్చయంగా తెలియును. ఇప్పుడది మీ చేతులలో, మీ ఒడిలో యున్నది. క్రీస్తు అనబడిన యేసును మీరేమి చేతురు?

HEB 13:8

 

79యేసు చెప్పెను, "నేను ఎన్నడూ మిమ్మును విడువను. యుగాంతము వరకు నేను సదాకాలము మీతో ఉందును." ఆయన ఆ విధముగానే అక్కడ ఉండి తీరును. మరల ఆయన చేప్పెను, "నేను ఎన్నడు మిమ్మును విడువను ఎడబాయను. ఇక కొంతకాలమైన తరువాత లోకము నన్ను ఇక చూడదు. అయినను మీరు చూతురు, ఏలయనగా యుగ సమాప్తి పర్యంతము నేను మీతోను, మిలోను ఉందును."

"దాని గూర్చి నేనెట్లు నిశ్చయత కలిగియుందును? ఓ, బ్రెన్హాం సోదరుడా, నేను కేవలము నిశ్చయత కలిగియుండినచో చాలును," అనవచ్చు.

పరిశుద్ధ యోహాను 14:12 లో ఆయన చెప్పెను, "నా యందు విశ్వాసముంచువాడు నేను చేయు క్రియలును చేయును."

దానిని నీకు రుజువు చేయుటకు తెర మీద ఉండి పిలువబడవలెనని ఎదురు చూచుచున్నాడు. అది నిజము. కనుక వెళ్ళి, మన జీవితములలోనికి యేసును మేల్కొలుపుదుము. ఆయన ఇక్కడ సజీవముగా ఉండి, ఎంతో కాలము కాలేదు. ఒకసారి ఆయన నిన్ను బాగుచేసెను. ఆయన నీకు అది మరియు ఇది చేసెను. అప్పుడు ఆయన నీకు సజీవునిగా ఉండెను. ఆయన ఈ రాత్రి సజీవుడు. ఆయనను రంగము మీదికి పిలువుము.

MATT 4:4,7,10•

MATT 28:20•

LUKE 4:4,8•

JOHN 14:12,17,18•

HEB 13:5

 

80నేను చెప్పినట్లుగా షేక్స్పియర్ నాలో ఉండినచో నేను షేక్స్పియర్ క్రియలు చేయుదును. క్రీస్తు నీలో యున్నచో - ఆయన వలెనె నీవును దేవుని వాక్యమును నమ్ముదువు. అపవాది వచ్చిన ప్రతిసారి ఆయన జయించెను. "వ్రాయబడి యున్నది!" అంతే, దాని మీదనే నిలబడి యుండెను. ఆయన దానిని నమ్మెనని సాతాను ఎరిగియుండెను గనుక ఆయన నుండి వెడలిపోయెను.

ఆయన వాక్యమును స్థిరపరచుటకు ఆయనను పిలువుము. ఓ, హెబ్రీ 13:8 నిజము చేయును. అప్పుడు అనుమానములు, భయములు గాలి ఆగిపోయినట్లే ఆగిపోవును. ఆ పాత గాలులు నీ మనస్సు గుండా వీచుచున్నవి, "బహుశా నేను పొందలేనేమో. అది నాకు కాకపోవచ్చును. ఆయన ఇది చేయక పోవచ్చును." వద్దు. దానికి మరేది బహుశ అనునది లేదు. దానిని ఆయన వాగ్దానము చేసెను. అది దానిలో నుండి బహుశ అను మాటలను వేయును.

"ఆయన ఇక్కడున్నాడని నాకు తెలిసియుండినచో…" ఆయన భూమి మీద ఉండినప్పుడు ఏ వాగ్దానము చేసెనో, అదే విధానముల ద్వారా, అదే రీతిగా ఈ రాత్రి తన్నుతాను ఆయన గుర్తింపచేసుకొనుచున్నాడు. శిశ్యులు ఆయనను నమ్మవలసి వచ్చిన పద్ధతి అదే.

MATT 10:25•

MATT 12:24,31,32•

MARK 3:22,30•

MARK 16:17,18•

LUKE 11:15•

LUKE 17:29,30•

JOHN 14:12•

JOHN 15:7•

HEB 13:8

 

81"ఆయన పిచ్చివాడు," అనునది ప్రసిద్ధమగు విశ్వాసము. ఎవరికయిననూ అది తెలియును. "ఆయన పిచ్చివాడు. ఒక విధమగు అదృష్టములు చెప్పువాడు. ఒక దురాత్మ, మనస్సులను చదువగలిగిన ఒక బయల్జెబూబు, అదృష్టము చెప్పునట్టి ఒక దురాత్మ," అనిరి.

యేసు వారితో అనెను, "అది పరిశుద్ధాత్మను దైవ దూషణ చేయుట."

"నా యందు విశ్వాసముంచువాడు నేను చేయు క్రియలు చేయును. నా యందు మీరును, మీ యందు నా మాటలు నిలచి యుండినయెడల మీకేది ఇష్టమో అడుగుడి. అది మీకు అనుగ్రహించబడను," అని వ్రాయబడియున్నది. చూచారా. "సొదొమ దినములలో ఎట్లుండెనో, మనుష్యకుమారుని రాకడ యందును అలాగే యుండును," అని వ్రాయబడినది. ఈ వాగ్దానములన్నియూ ఆయన ఇచ్చుచున్నాడు! హెబ్రీ 13:8, "యేసుక్రీస్తు నిన్న, నేడు, నిరంతరము ఏకరీతిగా యున్నాడు." ఆ వాగ్దానములన్నియూ వ్రాయబడినవి. "నమ్మినవారి వలన ఈ సూచక క్రియలు కనబడును. వారు రోగులపై చేతులుంచినప్పుడు బాగవుదురు," అని వ్రాయబడియున్నది. ఇప్పుడది జరుగనీయుడి. ఆమేన్.

82యేసును మేల్కొలిపి, రంగము మీదికి ఆయనను పిలవండి! అది చేయుటకు నీవు భయపడుతున్నావా? దేవుని సవాలును తీసికొనుటకు నీవు భయపడుతున్నావా?

ప్రార్థించుదము, ఒక్క క్షణము మన శిరములు వంచుదము. ఇప్పటి నుండి కొద్ది నిమిషముల పాటు అందరూ వీలయినంత మర్యాదగా ఉండండి. కదలవద్దు. బహు నిశ్శబ్దముగా కూర్చొనండి. వీలయితే … ఏదయినా పాటను ఆర్గను మీద నెమ్మదిగా వాయించుడి.

ప్రభువైను యేసూ, మా హృదయముల లోనికి దిగిరమ్ము. మా బలహీనతలు మాకు తెలియపరచుము.

"ఓ, ప్రభువా, నన్ను మలచుము." ఇప్పుడు ప్రార్థించండి. "ప్రభువైన యేసూ, నేను అవసరతలో ఉన్నాను. ప్రభువా, నన్ను మలచుము. తయారు చేయుము. ఇప్పుడు నేను ఒక చిన్న మట్టి ముద్దను. నీ చిత్తమును బట్టి, నేను లోబడుచుండగా, ఓ, కనిపెట్టుచున్నాను. ఇంకా లోబడుచున్నాను. ప్రభువా, నీ స్వమార్గము చేపట్టుము! నీ స్వత విధానమే కానిమ్ము! "ఎక్కడున్నప్పటి వారయిననూ, భవనములేని వారు, చుట్టూనున్న వారు, ఇప్పుడు లోతుగా ప్రార్థనలో ఉండుడి. మీరు ప్రార్థించవలెనని కోరుచున్నాను.

…. నేను మట్టిని

నన్ను మలచుము, తయారు చేయుము.

నీ చిత్తమును బట్టి నేను కనిపెట్టియున్నాను,

లోబడి నెమ్మదిగా యున్నాను.

83ఇది చాలా నెమ్మది సమయము. ప్రార్థించుచూ ఈలాగు చెప్పండి, "ప్రభువైన యేసూ, ఇప్పుడు నన్ను ఒక విశ్వాసిగా తయారు చేయుము. సమస్త అవిశ్వాసమును బయటకు నెట్టుము."

నేను ప్రార్థన వరుసను పిలచు ముందుగా కొద్దిగా మీరు ప్రార్థించవలెనని కోరుచున్నాను. ప్రతి బల్ల యొద్దకు వెళ్ళి, కార్డు కోరిన ప్రతి వారికి చాలా ఎక్కువ ప్రార్థన కార్డులు ఇచ్చినట్లుగా నా కుమారుడు చెప్పెను. మీ కొరకు నేను ప్రార్థించనై యున్నాను. ఇంతకు ముందున్న రీతిగానే, పాత పద్ధతిలోనే వరుసను ఏర్పరుచుదుము. ఇక్కడకు వచ్చి ప్రార్థింతుము. రోగుల పై వస్త్రములుంచెదము. మీరు నమ్మవలెనని కోరుచున్నాను.

ఆయనను గుర్తించగలవని నీవు అనుకొనుచున్నావా? ఈ రాత్రి ఆయన దోనెలోనే యున్నాడని గ్రహించావా? ఆయన ఈ చిన్న దోనెలో యున్నాడు. ఈ చిన్న ఓడలో యున్నాడు. ఈ చిన్న విశ్వాసుల శరీరము. జీవిత గంభీర ప్రవాహములో పయనించుచూ, ఈ రాత్రి ఆయన మనలో కూడా వచ్చుచున్నాడని మీరు నమ్ముతున్నారా? మీరు దానిని పూర్ణ హృదయముతో నమ్ముచున్నచో, మీ చేతులు ఎత్తి "దానిని నేను నమ్ముతున్నాను, అది నేను నమ్ముచున్నాను, దానిని నేను అంగీకరించుచున్నాను," అని చెప్పండి.

84తండ్రి, వారి చేతులను, దానితో పాటు నా చేతిని మీరు చూచియున్నారు. నేను కూడా నిన్ను నమ్ముచున్నాను. తండ్రి, ఇప్పుడు మేము కనిపెట్టియున్నాము. ప్రభువైన యేసూ, రమ్ము. ఒక రాత్రి శిష్యులు తొందరపడినప్పుడు, వారు ఒకాయనతో మాట్లాడుచుండిరి. అది ఎవరో వారెరుగరు. ఆ ప్రాంతములో సంచరించుచున్న ఒక పరదేశి అనుకొనిరి. కాని ఒక రాత్రి వారు తలుపులు మూసినప్పుడు, ఆయన లోనికి వచ్చెను. ఆయన తన సిలువ మరణము, పునరుత్థానములకు ముందు చేసినట్లుగానే ఒక కార్యము చేసెను. అది ఆయనే అని వారు తెలిసికొనిరి. ప్రభువా, ఈ రాత్రి తిరిగి రమ్ము, మా కొరకు అది చేయుము. మేము కనిపెట్టుచుండగా, నీవు చేయవా? అది నీవు చేయుచుండగా మేము చూచితిమని ఎరుగుదుము. జనుల హృదయములలో నుండి భయమునంతటినీ, నీవు తీసివేయుము.

ఈ రాత్రి ఎవరి మీద చేతులుంచబడినవో వారందరూ యేసు నామములో స్వస్థత పొందెదరు గాక! ఒక్క బలహీన వ్యక్తియు ఉండకుండును గాక! ప్రతి వ్యాధిగ్రస్తుడు, మరణ శయ్యపై నున్నవాడు, గుండె వ్యాధి గల వ్యక్తి, స్త్రీ వ్యాధి, కాన్సరు, క్షయ, రక్త కాన్సరు మరేదయినా గాని ప్రభువా, ఈ రాత్రి స్వస్థత పొందుదురు గాక!

MATT 9:37,38•

LUKE 10:2•

JAS 4:2,3

 

85వారు ఈ వరుసను దాటుచుండగా, వారిపై మేము మా చేతులుంచుచుండగా, ఇది కేవలము ఒక మానవుని ద్వారా జరుగుచున్నది గాక. దేవుడు మనిషి ఒక్కటే అయియున్నారని గుర్తించుదురు గాక! దేవుడు మానవునిలోనికి వచ్చెను. మానవునికి వేరుగా ఉండి దేవుడు ఏమియూ చేయడు. ఆయన అదే చేయును. మానవుని ద్వారానే ఆయన కార్యములు చేయును. మానవుని తన భాగస్వామిగా ఆయన చేసెను.

యేసు నిలబడి పండిన పంటను చూస్తూ, ఇట్లనెను, "కోత విస్తారముగా యున్నది గాని పనివారు కొద్ది మందియే. కోత యజమానుని ప్రార్థించుడి." కోత యజమానుడు ఆయనే. మరో మాటలో, "చేయుటకు సరి అయినదని నాకు తెలిసినది చేయుమని నన్ను అడుగిడి," అని భావము.

కాని ఆయన తన్ను శిష్యులతో ముడి వేసికొనెను. వారే అడుగవలసిన వారు. మీరు అడుగనందున పొందలేదు. మీరు నమ్మలేదు గనుక అడుగలేదు," అని ఆయననెను. కాని, తండ్రి, మేము నమ్ముచున్నాము. తిరిగి ఈ రాత్రి నీ కృప మాతో ఉండునట్లుగా అడుగుచున్నాము. యేసు నామమున. ఆమేన్.

86మీరు ప్రతి ఒక్కరు మీ ప్రార్థన కార్డులతో వరుసలో నిలువబడవలెనని కోరుచున్నాము. ఎక్కడో నాకు తెలియదు… వారు బహుశా, పై భాగాన, క్రింది భాగాన ఉండి యుందురు. రోగుల కొరకు ప్రార్థించుటకు ఇక్కడ దాదాపు అరగంట సేపు ఉందుము. ఇప్పుడు తొమ్మిది లేదా కొద్దిగా ఎక్కువ అయినది. మనము దానిని చేయగలమని, కొనసాగించుదుమని తలంచుచున్నాను.

ఇప్పుడు చూడండి. ఇప్పుడు ఎవరూ వెళ్ళిపోవద్దు. ఇప్పుడు అందరూ బహు నిశ్శబ్దముగా కూర్చోండి. మీరు స్వస్థతా కూటము కోరుచున్నారు, అందుకొరకే మనము ఎదురు చూస్తున్నాము. మీరు స్వస్థతా కూటము కొరకు ఎదురు చూచుచున్నారా? మంచిది. ఇప్పుడు అది ఇక్కడున్నది. స్వస్థపరచువాడు అగు యేసుక్రీస్తు ఇక్కడే యున్నాడు. ఆయన ఇచటున్నాడు.

ISA 53:5•

1PET 2:24

 

87ఇపుడు గుర్తుంచుకొనండి, ఆయన ఈ స్థలములో ఒక చోట ఉన్నచో… ఆయన దాసులలో ఒకరు, కాలిన్స్ సోదరీ సోదరులు నా ఆలయము నుండి వచ్చిరి. అక్కడ కూర్చొన్నారు. నాకేదో ఇచ్చుటకా? ఆయన నేను ధరించిన ఈ సూటును ఇక్కడ ధరించి యుండి, ఇప్పుడు ఇక్కడ నేను నిలబడి యుండినట్లుగా, నిలబడి యుండినచో ఎట్లుండును? "ప్రభువా, నీవు నన్ను బాగుచేయుదువా?" అని నీవు అడిగినచో, నీ అవిశ్వాసమును బట్టి ఆయన చేయ జాలదని నీకు తెలియునా? అది నిజమని ఎందరికి తెలియును? నీవు ఇప్పుడు నమ్ముచున్న రీతిగానే నమ్మవలసి యుందువు. అది నిజము. ఇప్పుడు చేయుచున్న విధంగానే ఆయనను నమ్మవలసి యుందువు.

గుర్తుంచుకొనండి, ఇప్పటికే ఆయన చేసిన దానిని తిరిగి మరల చేయజాలడు. చూచారా, ఇప్పుడు ఆయన దానిని పూర్తిగా తనకు అందకుండా పెట్టి యున్నాడు. దానిని ఆయన నీకు అందుబాటులో ఉంచియున్నాడు. ఆయన తాను చేయకలిగినదంతయూ చేసెను. సేవకులారా, అది నిజమేనా? చూచారా, దానిని గూర్చి ఆయన చేయకలిగినది మరేది లేదు. అది ఆయనకు అందుబాటులో లేదు. అది నీ అందుబాటులో యున్నది. "ఏలయనగా ఆయన మన అతిక్రమముల నిమిత్తము గాయపరచబడెను, ఆయన పొందిన దెబ్బల వలన మనము స్వస్థత పొందితిమి," చూచారా. చూచారా, అది ఆయనకు అందుబాటులో లేదు. అది ఉన్నది గాని దానిని ఆయన నీకు అందునట్లుగా తెచ్చెను. ఇప్పుడది నీకు అందుబాటులో యున్నది. అది నీ కొరకు అక్కడ పెట్టబడియున్నది. అది ఎచ్చటున్నదో నీకు చూపించగలడు.

88"సరే, ఇది ఎల్లప్పుడూ నాకు చిక్కు ప్రశ్నగా యున్నది. ఆయన ఉన్నట్లయితే, నిజంగా ఆయన ఇంకా జీవించియే యున్నాడా?" అని నీవడుగ వచ్చును.

నిశ్చయంగా, ఆయన జీవించియున్నాడు. ఎల్లవేళలా నీవు గ్రుద్దుకొనుచున్నది ఏమిటి? నీవు తప్పు చేసినప్పుడు నిన్ను ఖండించునది ఏది? నిన్ను నమ్మునట్లుగా చేయునది ఏది? ఆయనే. నీవు నీ కండ్లు తెరచి ఆయనను చూడ కలుగు సామర్థ్యము కలిగియుండక పోవచ్చును, ఎందుకనగా ఆయన ఆత్మ రూపములో ఉన్నాడు, అదృశ్య దేవుడు. కాని ఆయన ఒక దృశ్య జనాంగము మధ్య జీవించుచున్నాడు. ఆ జనులలో తన వాగ్దాన వాక్యము ద్వారా తన్ను తాను కనుబరచుకొనుచున్నాడు. ఇప్పుడు నీవు దానిని అర్థము చేసికొన్నావా?

ఇక్కడ ప్రార్థన వరుసను మనము పిలచు ముందుగా, దేవుడు దీనిని చేయునని నమ్ముచున్నాను.

89లైఫ్ టాబర్నికల్, నేను నిన్ను ప్రేమించుచున్నాను. మాకది తెలియును. నేను మీకు సోదరునిగా యున్నాను. ఏమైనా గాని అలాగే యుండుటకు ప్రయత్నించాను. నేను ఎన్నో విఫల కార్యములు చేశాను, కాని అలాగు చేయుటకు ప్రయత్నించాను.

వినండి. ఈ రాత్రి మీ యంతట మీరే రండి. ఆలస్యము కాకముందే మేల్కొనండి. చూచారా, తొందరగా లేపండి. ఆయన ఇక్కడ మనతో ఉన్నాడు. ఇప్పుడు మీ ప్రతి ఒక్కరు…..

నా పూర్ణ హృదయముతో ఈ భవనములో యున్న నాకు తెలిసిన జనులను పిలచుటకు ప్రయత్నించగోరుచున్నాను. మిమ్ములను దాటిపోయినచో ఏమి తలంచవద్దు. మీ మీద ఈ వెలుగున్నచో, నేను దాటి పోవుదును. అది మిమ్మును దాటి పోయితినని చూపించును..

90ఇది సహోదరుడు జులియస్ స్టాడ్స్కలివ్, ఆయన భార్య, కుటుంబము అని బహు ఖచ్చితముగా ఎరుగుదును. వారు ఇక్కడి ముందు సీటులో కూర్చొనియున్నారు అవును. ఆ విషయము నిశ్చయము.

తరువాత నేను చూచు వ్యక్తి, నాకు తెలియును. ఒక్క క్షణము. కొద్ది క్షణముల క్రితము నేను ఒక వ్యక్తిని చూచాను. నేను గుర్తించానని అనుకొన్నాను. అది సహోదరుడు ఇవాన్స్, కాని ఇప్పుడాయన ఎక్కడున్నాడో కనిపించుట లేదు. సహోదరుడు వెల్స్ ఇవాన్స్. అవును. అవును, క్షమించండి. అవును.

అతని ప్రక్కనే ఫ్రీటింజర్ కూర్చొని యున్నాడు. అనగా అతని కుటుంబము ఇక్కడే కూర్చొని యున్నారు. ఇవాన్స్ కుటుంబము. ఫ్రీటింజర్ కుటుంబము కలిసి కూర్చొన్నారు.

ఇక్కడ డచ్ సోదర సోదరీలు కూర్చొనియున్నారు. వారు నాకు తెలియును.

ఇక్కడున్న చిన్న బాలికలలో ఒకరిని నేను ఎరుగుదును. చిన్న జాన్, ఆమె సహోదరి ఇవాన్స్, సహోదరి ఇవాన్స్ యొక్క కుమార్తె.

91ఫ్రెడ్ సాత్మన్ "ఆమేన్" చెప్పుట నేను విన్నాను. అతని వలె ఎవరును దానిని చెప్పజాలరు. అతడు ఇక్కడే ఎక్కడో ఉన్నాడు. అతడెక్కడున్నాడో ఇంకా నాకు కనబడలేదు. ఎక్కడో ఆ వెనుకన ఉన్నాడు. ఫ్రెడ్, నీవు ఎక్కడ? ఓ, అవును. ఆ వెనుక.

నీ ప్రక్కన సహోదరుడు ఉడ్ కూర్చొని యున్నాడా? అవును. సహోదరుడు ఉడ్. మంచిది.

సరే. ఇక్కడ టేపు చేయు బాలుడు కూర్చొని యున్నాడు. జిమ్ మెగారి.

అక్కడ సహోదరుడు బ్లయర్ కూర్చొని యున్నాడు.

మంచిది, నాకు తెలిసిన వారందరూ వారే నాకు కనబడిరి. మిమ్ములను నేను చూచియుందును. మీలో కొందరి ముఖములు చూచినట్లుగా గుర్తుకు వచ్చుచున్నవి గాని వారెవరో నేనెరుగను. ఇప్పుడు పరిశుద్ధాత్మ అది ఎరుగును.

92కాని నాకు తెలిసిన మిమ్మును ఎరుగుదునని మీకు తెలియును. మీరు ప్రార్థించండి. మీ కొరకు ఏమియూ ప్రార్థించుకోవద్దు. ఆయనను అంటుకొనుటకు ప్రయత్నించ వద్దు. నా కొరకు ప్రార్థించండి. కేవలము నా కోసము ప్రార్థించండి. మీరు ఎరిగిన, నేను సేవించుచున్న దేవుడు కూర్చున్న వారిలో ఎవరికైననూ కృప చూపించునట్లుగా, ఇప్పుడు మీరు ప్రార్థించండి. ఆయన తన్నుతాను మెస్సీయాగా గుర్తించుకొనునేమో ఆయనను అడుగుదము.

అవును, నేను నమ్ముచున్నాను… ఖచ్చితంగా నేనెరుగను, కాని సహోదరి మూర్ ను నేను చూచుచున్నానని అనుకొనుచున్నాను. ఆమె సోదరి మూర్ కాదా? ఆమె అనుకొనుచున్నాను… ఆమెయే. ఆమె కొంత బరువు తగ్గినది. ఆ కారణము వల్లనే మొదట నేను గుర్తించలేకపోయాను, కాని అక్కడ ఆమె కూర్చొనియున్నప్పుడు ఆమెను గుర్తుపట్టానని అనుకొన్నాను.

JOHN 15:7•

HEB 4:12

 

93ఇప్పుడు కేవలము ప్రార్థించండి, బహు మర్యాదగా ఉండండి. ఇది చూడండి… లేక మీకు ఏ కోరికయున్నదో అది చూడండి, మరియు కేవలము ప్రార్థించండి.

ఇప్పుడు వినండి, ఒక విషయము మిమ్మును అడుగగోరుచున్నాను. స్త్రీ ఆయన వస్త్రమును అంటుకొనుటకు బదులుగా, ఈ రాత్రి, ఈ లేఖనభాగమును నన్ను తీసికోనీయండి. నేను ఏమి బోధించుచున్నానో, ఆ వాక్యమును తిరిగి నెమరు వేసికొందము. బైబిలు ఈలాగు చెప్పెను, "దేవుని వాక్యము ఎటువంటి రెండంచుల ఖడ్గము కంటెను వాడిగలదియై, శక్తిగలదియై యున్నది." అది హెబ్రీ 4. "అది హృదయము, మనస్సులలో గల ఆలోచనలు, ఉద్దేశ్యములను వివేచించును." అది నిజమా? "నా యందు మీరును, మీ యందు నా మాటలను నిలిచియుండిన యెడల." వాక్యము వాగ్దానము, వాక్యమే హృదయాలోచనలను, అభిప్రాయములను వివేచించును. అది నిజమా? ఇప్పుడు ప్రార్థించుదము. అది మరింత స్పష్టముగా ఎట్లుండగలదు?

ఇప్పుడు ప్రార్థించండి, బహు మర్యాదగా ఉండి ప్రార్థించండి. మిమ్మును ఎరుగను. నాకు తెలిసిన మీరు నాకు తెలియని వారినెవరినో ప్రభువు ముట్టుకొనునట్లుగాను, వారు తాకబడునట్లుగాను ప్రార్థించండి.

94ఇప్పుడు, తొందరగా, అది లేచుటను చూచుచున్నాను. నా ఎడమ వైపునకు, ఆ గోడకు ఎదురుగా, పూర్తిగా నా ఎడమ వైపునకు, ఒకాయన ప్రార్థించుచూ కూర్చున్నాడు. నేనతనిని ఎరుగను. ఆ వెలుగు అతని మీద వ్రేలాడుచున్నది. ఆ వ్యక్తి ఊపిరితిత్తుల బాధ గురించి ప్రార్థించుచున్నాడు. ఆ ఊపిరితిత్తులకు రెండు ఆపరేషనులు కూడ జరిగెను. అతడు మధ్య-వయస్కుడు. కండ్లద్దాలు పెట్టుకొని యున్నాడు. నెరసిన జుట్టు, అతడు… అయ్యా! మీరు నమ్ముచున్నారా? నేను ఎవరిని గూర్చి మాట్లాడుతున్నానో, ఆ వ్యక్తి శ్రీ. బుఫర్డ్ అది మీ పేరు. మీరిప్పుడు నమ్ముచున్నారా? మీరది నమ్మినచో యేసుక్రీస్తు మిమ్మును పూర్తిగా బాగుచేయును.

నా జీవితంలో ఎన్నడూ ఆ మనిషిని చూడలేదు. ఇప్పుడు అతనిని చూడగోరు వారు చూడవచ్చును. ఆ వ్యక్తి ఎవరో లేచి నిలబడండి. అక్కడే నిలబడండి, మీరు నా జీవితంలో ఎన్నడూ నేను ఆయనను చూడలేదు. ఇప్పుడు ఏమిటది? ఆగండి. "నీవది వివరించగలవా బ్రెన్హాం సోదరుడా?'' నేను వివరించ జాలను. ఎవరు దానిని వివరించగలరు? నేను చేయలేను. నావల్ల కాదు.

HEB 4:12

 

95ఇక్కడ బాగా వెనుకన ఒకామె కూర్చొనియున్నది. ఆమె ప్రార్థించుట నేను చూచుచున్నాను. ఒకాయన తిరుగుట నేను చూస్తున్నాను. ఒక విధంగా గాలి లోనికి చేతులు విసిరెను. అతడు తడబడుచున్నాడు. ఆ వ్యక్తి ఆమె భర్త. అతడు మద్యపానము త్రాగును, త్రాగుబోతు. అతని విడుదల కొరకు ఆమె ప్రార్థించుచున్నది. ఆమె పేరు శ్రీమతి మోర్గన్. నీ చేతిని ఎత్తుము. అది నిజము. ఆమెకు నేను కొత్త వ్యక్తిని, కాని అది సత్యము.

ఇప్పుడే పిలువబడిన ఆమెను నిలబడమని కోరుచున్నాను. ఆ స్త్రీని నేనెరుగును. ఆ వెనుక ఉండి ఆమె దేనిని తాకెనో అడుగండి. వాక్యమేమిటి? "హృదయ ఆలోచనలను, అభిప్రాయములను వివేచించును."

మీరందరూ ఆనందంగా, సంతోషించుచూ కూర్చో వచ్చును. మీరు కూర్చోనగోరినచో కూర్చొనండి. ఖచ్చితంగా కూర్చోనక్కర లేదు. మీ పిలును బట్టి అనుకూలముగా సర్దుకొనండి. ఆనందముగా ఉండి సంతోషించుడి, ఎందుకనగా దేవుడు మీ పట్ల ఎంతో మేలు చేయుచున్నాడు.

96ఇక్కడే నా ముందు ఒకామె యున్నది. ఆమె బాగా జబ్బుగా యున్నది. బహుశా ఆమె తాననుకొనుచున్న దానికంటి జబ్బుగా ఉన్నది. ఆమె ఒక రకమగు రక్తస్రావముతో బాధపడుచున్నది. అది కాన్సరుగా మారినది. శ్రీమతి మోర్గన్… కాదు. క్షమించండి. ఆమె శ్రీమతి ఆండర్సన్. నీవు నీ పూర్ణ హృదయముతో నమ్మినచో యేసుక్రీస్తు నిన్ను బాగు చేయును. అమ్మా, అది నీవు నమ్ముచున్నావా?

అది నిజమైనచో లేచి నిలబడుము. ఆమెను నేను ఎరుగను. ఆమె సరిగ్గా ఆ స్త్రీతో వరుసలో నిలబడియున్నది. అదింకా అక్కడ వ్రేలాడుటను నేను చూచుచున్నాను. అదియే కారణము. ఒక రాత్రి… సోదరీ, నీ కిష్టమైనచో నీవు కూర్చో వచ్చును. నమ్ముము. నీవు బాగుపడెదవు.

97ఇక్కడ శ్రీ. ఉడ్ ఉన్నాడు. ఒక రోజు వేట కొరకు ఆయనతో కలిసి నేను వెళ్ళుచున్నాను. కెంటకీలో, ఒక స్థలములో, నేను నిలబడి యుండగా - క్రైస్తవురాలు కాని అతని వదిన వచ్చి గొంతులో కాన్సరున్నట్లుగా అనుమానించుచున్నట్లు చెప్పెను. ఆ ఉదయాన నేను ఒక దర్శనము చూచాను. గడి దుస్తులు ధరించిన ఒకామెను నేను అందులో చూచాను. ఆమె ఎర్రని కోటు ధరించెను. ఆమె మరొక గది లోనికి వెళ్ళి, ఎర్రని కోటు తీసి గడి దుస్తులు ధరించెను. (ఆమె ఎందుకొచ్చెనో తెలియదు) "ఇక్కడి రమ్ము," అన్నాను. అంతే. అది ఏమిటో పరిశుద్ధాత్మ చెప్పెను. అది స్థిరము. ఆమె వైద్యుని కడకు వెళ్ళనవసరము లేకుండెను. అది పూర్తిగా పోయెను.

దాని తరువాత కొద్ది నిమిషములకు ఒక మనిషి ఎందుకు వచ్చెనో తెలియలేదు. గుండె వ్యాధితో చనిపోవుచున్నట్లు తెలిసినది. "నీకు సహచరులున్నారా?" అనడిగాడు.

ఆమె ఇట్లన్నది, "సహోదరుడా బ్రెన్హాం, ఆ బయట బాంక్స్ తో ఉన్నాడు."

"దేవునికి వందనములు," అని చెప్పెను. నేను అక్కడికి వెళ్ళాను. కుర్చీలో ఆనుకొని గుండెపోటుతో చనిపోవుచున్న వానిని ప్రభువు స్వస్థపరచెను. అప్పటి నుండి దాని వలన అసలు ఏ బాధ లేదని రెండు మూడు రోజుల తరువాత అతడు చెప్పెను.

98ఆయన వదిన వచ్చెను, కాదు ఆయన కోడలు. ఒక యువతి. శ్రీమతి కాక్స్. దానికి కొద్ది రోజుల ముందుగా ఆలయము నొద్ద ఒకామె స్వస్థత పొందెను. ఆమె చక్కెర వ్యాధితో వచ్చెను. ఆ బాలిక లేపబడుట నేను దర్శనములో చూచాను. నేనామెను పిలువలేదు, ఎందుకనగా ఆమె ఆలయమునకు వచ్చును. దాని తరువాత రెండు మూడు రోజులకు ఆమెకు వైద్య పరీక్ష కొరకు తీసికొని వెళ్ళిరి. ఆమెకు భయంకరమగు చక్కెర వ్యాధి యున్నది. ఆమె తిరిగి వచ్చుచుండగా, మరల రక్త పరీక్ష చేశారు. అప్పుడామె పని మానవలసి వచ్చెను. ఆమె చేతులు, అవయవములు తిమ్మిరెక్కినవి… "మార్గీ, వైద్యుడు నిన్ను పరీక్ష చేసిన సమయములో నీ విశ్వాసము నిన్ను బాగుచేసెను," అని చెప్పాను. వారు ఆమెను వైద్య పరీక్షకు మరల అదే వైద్యశాలకు కొనిపోయిరి. అది పోయినది. [టేపు పై ఖాళీ యున్నది.] …ఎందుకనగా ఆయన దేవుడు, ఆయన తప్పిపోడు. మీరది నమ్ముదురా?

99ఇక్కడ కూర్చొనియున్న ఒక వ్యక్తిని నేను చూస్తున్నాను. ఇప్పుడు నా వైపు చూచుచున్నాడు. అతనికి జీవితములో చిన్న బాధ ఉన్నది. అతనికి గవద బిళ్ళలు… అతని హృదయములో ఏదో కలిగి యున్నాడు. అతడు నా వైపే చూచుచున్నాడు. అతనికి అందరూ మగ పిల్లలే. ఇప్పుడు ఒక బాలికను కోరుకొనుచున్నాడు. మీరెరుగుదురా, ఆ వ్యక్తి కూడా బోధకుడే. శ్రీ. బర్డ్, రెవరెండ్ శ్రీ. బర్డ్, అయ్యా! మీ చేతిని ఎత్తండి. అది నిజము కాదా! అయ్యా! దేవుడు మీ విన్నపమును ఆలకించును. అవును.

చూచారా ఎంత సులభమో! దేవుడు సామాన్యతలోనే నివాసము చేయును. మీరది నమ్ముదురా? సామాన్యతలోనే పని చేయును. ఆయన ఆశ్చర్య కార్యములను జరిగించును.

MARK 9:23•

HEB 4:12

 

100అమ్మా, నీవు నీ వాసన చూచు స్థితిని పోగొట్టుకొన్నావు గదా? అక్కడ కూర్చొని ఎంతో యధార్థముగా నావైపు చూస్తున్నది. నేను పిలువవలెనని నీవు ప్రార్థించుచున్నావు. నీకు నీ విన్నపమున్నది. నీవు ఒక సేవకుని భార్యవు. అది నిజము. నీవు నీ వాసన చూచు శక్తిని పోగొట్టుకొన్నావు. నీ హృదయములో గొప్ప భారమున్నది. నీవు నీ ఇద్దరు కుమారుల కొరకు ప్రార్థించుచున్నావు. అది సత్యము. నీ పేరు సోదరి లెగ్. నా జీవితంలో ఎన్నడూ ఆమెను నేను చూడలేదు.

"నమ్ముట నీవలననైతే నీకు సమస్తమూ సాధ్యమే." అది నిజమేనా? "నీవు నమ్మినచో సమస్తమూ, సాధ్యమే." ఆయన సన్నిధి ఇప్పుడు ఇక్కడున్నదని నీవు నమ్ముచున్నావా? ఆయన హృదయ ఆలోచనలను, ఉద్దేశ్యములను వివేచించువాడు, కాదా? ఆయనకు తెలియును.

ఆ జనులను అడుగుము. ఎవరైన సందేహములో ఉన్నారేమో పరీక్షించుము. వారిని అడగండి. నా జీవితంలో ఎన్నడూ నేను ఆ జనులను చూడలేదు. అవునండి!

HEB 13:8

 

101నీలో నుండి దేవుడు ఆ కంతిని తీసివేయునని నీవు నమ్ముదువా? ఆమె బాగవుట నీవు చూచావు గదా, ఆయన నీ కంతిని కూడా బాగుచేసి నిన్ను స్వస్థపరచునని నమ్ముచున్నావా? నమ్ముదువా? నీ ప్రక్కనున్న ఆమెకు కూడా శరీరములో వాపు యున్నది. మీ ఇద్దరినీ దేవుడు బాగు చేయగలడని తలంచుచున్నారా? నమ్ముదురా? మంచిది, మీరు నమ్మినచో ఆయన చేయగలడు.

అయ్యా, మీరు ఇక్కడ కూర్చొని నా వైపు చూస్తున్నారు. గ్రంధికి సంబంధించిన బాధ నుండి దేవుడు మిమ్మును బాగుచేయునని నమ్ముచున్నారా? నల్లని టై ధరించి వెనుక కూర్చోన్న మీరు ఆ గ్రంధికి చెందిన వ్యాధి నుండి దేవుడు బాగు చేయగలడని నమ్ముచున్నారా? నీ వ్యాధి అదే. అది నిజమైనచో, నీ చేతిని ఎత్తుము. అది నిజము. మంచిది, చూచారా.

మీరు నమ్ముదురా? ఆయన ఓడలో యున్నాడు. ఆయనే ఇక్కడే యున్నాడు. అది ఏమి చేయునని చెప్పుబడెనో, అదే ఆయన వాక్యము చేయుచున్నది. హృదయ రహస్యములను తీసికొని తెలియపరచుచున్నది. "యేసుక్రీస్తు నిన్న, నేడు, నిరంతరము ఏకరీతిగా యున్నాడు."

102ప్రభువైన యేసూ, ఇక్కడ పడియున్న చేతి రుమాళ్ళు కొరకు ప్రార్థించుచున్నాను. రోగులకు, బాధపడుతున్న వారికి సంబంధించినవి. ప్రభువా, వారిక్కడ నిలబడి యుండిన తరువాత దేవుని యొక్క సృజనాత్మక స్వరము మానవ మాత్రుల ద్వారా మాట్లాడుచున్నది. విశ్వాసము ఒకరి నుండి మరియొకరికి ప్రసారమగుచుండగా, ఈ చేతిరుమాళ్ళు దీవించబడను గాక! దానిని మీద వేసికొను జనులు దీవించబడి స్వస్థత పొందెదరు గాక!

ఇప్పుడు తండ్రీ, నీ ఆత్మ ఇచటుండగా, ఇప్పుడు శిష్యులు, నిన్ను వెంబడించు వారు, నీవు ఆ దోనెలో ఉన్నావని చూచిరి. భయపడవలసిన అవసరము లేదు. ఏదియూ హాని చేయజాలదు, ఎందుకనగా నీవు ఇచటున్నావు! నీవు సృష్టికర్తవు. అలాగు జరుగనిమ్ము ప్రభువా, ఇప్పుడు వారు ఈ ప్రార్థన వరుస లోనికి నడచుచుండగా, వారి విశ్వాసము విఫలము కానీయకుము. యేసుక్రీస్తు నామము పేరట వారు స్వస్థత పొందెదరు గాక! ఆమేన్.

103ఆయన ఉన్నాడని మనకు నిశ్చయత ఎట్లు కలుగును? మీరు నిశ్చయత కలిగి యున్నారా? మేము ఒప్పించబడితిమి. యేసుక్రీస్తు నిన్న, నేడు, నిరంతరము ఏకరీతిగా యున్నాడని మేము పూర్తిగా ఒప్పించబడితిమి. మీరు కూడానా? నేను ఒప్పింపబడితిని. ఆ సంగతులు నాకు తెలియవని నేను ఎరుగుదును.

సరే, ఇటు చూడండి. ఒక సంగతి మీకు చెప్పగోరుచున్నాను. ఇక్కడ జరిగినవి కేవలము అల్ప సంగతులు. వెళ్ళిపోయిన వారు, ఇంటి యొద్ద నున్నవారు, నాతో కూటములకు తదితర స్థలములకు వచ్చు వారి మాట ఏమిటి? నాతో కూటములకు వచ్చుచూ, జరిగిన సంగతులు ఎరిగిన సోదరీ, సోదరులందరూ చేతు లెత్తండి. ఇవి కేవలము చిన్న సంఘటనలు. నేను వివిధ స్థలముల గూర్చి చెప్పినప్పుడు ఇక్కడేమి జరుగునో చెప్పినప్పుడు, "ఇక్కడ ఒకాయనను కలిసికోనై యున్నాము. మీరు నన్ను అతనికి దూరపరచవలెనని ప్రయత్నించుచున్నారు. అది చేయవద్దు, ఎందుకనగా నేను వెళ్ళవలసియున్నాను. ఆయన భార్య ఫలాని, ఫలాని. ఆమె బాగుపడబోవుచున్నది. ఇది నేను అతనికి చెప్పనైయున్నాను." ఈ వీధిని దాటుచున్న ఈ బాలుడు ఒక ప్రత్యేకమైనది అడుగబోవుచున్నాడు. నేనతనికి ఒక ప్రత్యేకమైనది చెప్పెదను. అతడు ఇది, అది చేయును." అది నిరంతరము, ఎల్లవేళలా అలాగే ఉంటున్నది. అది యేసుక్రీస్తు, మానవమాత్రుడు కాడు. అది క్రీస్తే. నేను మానవుడిని, కాని ఆయన క్రీస్తు.

HEB 13:8

 

104"వరము అనగా ఏమిటి బ్రెన్హాం సోదరుడా?" దానిని నేను వివరించజాలను. నాకు తెలిసినదంతా ఒక్కటే. అదేమనగా విలియం బ్రెన్హాంను మార్గములో నుండి తప్పుకోనీయండి. అంతే. ఆయన మట్టిని తీసికొని దాని ద్వారా పని చేయును.

దానిని నమ్ముము, నీవు నమ్మెదవా. ష్రీవ్ పోర్టు? నీ పూర్ణహృదయముతో దానిని నమ్ముము, సందేహించకుము, ఇక్కడి నుండి నీవు దాటిపోవుచున్నప్పుడు నీవు నీ స్వస్థతను పొందుదువు.

దర్శనములు నిన్ను బాగుచేయవు. ఆయన వాక్యము సత్యము అని మాత్రమే దర్శనములు గుర్తింపునిచ్చును. మీరు ఎప్పుడో స్వస్థత పొందారు. ఆయన ఇక్కడున్నాడనియు, ఆయన ఇంకనూ సజీవ వాక్యముగానే ఉన్నాడనియు మాత్రమే దర్శనములు రుజువు చేయును. కాని స్వస్థతకు సంబంధించినంత వరకు అదేమియు చేయజాలదు. ఆయన ఇక్కడున్నాడని మాత్రమే అది నీకు తెలియచేయును. ఆయన ఎప్పుడో నిన్ను బాగుచేసెను — ఆయన రక్తము ఆయన నిన్ను స్వస్థపరిచినందు వల్లనే ఇక్కడున్నాడు. నీ కొరకు ఆయన జీవము ఇవ్వబడెను. ఆయన రక్తము చిందించబడెను. మన ద్వారా పని చేయుటకు ఆయన ఇక్కడున్నాడని రుజువు చేయుటకు ఆయన ఇక్కడ పరిశుద్ధాత్మ రూపములో యున్నాడు. కాని నీ స్వస్థత నీ విశ్వాసముతో ముడివేయబడెను. నీవు నమ్మినచో అది అలాగు జరుగును. ఆమేన్.

105ఇక్కడున్న వరుసలోని ఈ ప్రక్కవారికి ఎందరికి కార్డులున్నవి? ఈ ప్రక్కనున్న వరుసలో నుండి బయటకు రమ్మని కోరుచున్నాను. వారు వచ్చిన వెంటనే, ఇక్కడున్న ఈ వరుస వారు ఆ ప్రక్కకు వచ్చెదరు. ఇక్కడున్న ఈ వరుస వారు చుట్టూ వెళ్ళి, వెనుక నుండి వెంబడించుదురు. ఇక్కడున్న వీరు ప్రార్థనలో చుట్టూ వచ్చెదరు.

సహోదరుడు జాక్ మూర్ ఎక్కడ? నాకు సహాయము చేయటకు సేవకులను పిలచుట మంచిదేనా?

ప్రభువు యొక్క వర్తమానమందు విశ్వాసముగల ఏ సేవకుడయిననూ, బైబిలు ఈ విషయములను నేర్పించేనని నమ్మువారు, ఈ రాత్రి యేసుక్రీస్తు మనతో ఉన్నారని పూర్తిగా ఒప్పించబడిన వారు, ఇక్కడకు రాగోరుచున్నచో, వచ్చి రోగుల మీద చేతులుంచుటకు సహాయపడండి. మీరు విశ్వాసము నుండి వెనక్కు లాగునది ఏదైనా మీ జీవితములో యున్నచో రావద్దు, చూచారా, ఈ వ్యక్తిపై మీరు మీ చేతులుంచినప్పుడు అతడు బాగవునని మీరు నమ్మవలసియున్నారు. మీరు కేవలము మీ విశ్వాసమును వారి విశ్వాసముతో జోడించుచున్నారు. నా భావము గ్రహించారా? వారిని సంప్రదించుట ద్వారా, వారి మీద మీ చేతులుంచుట ద్వారా, వారి విశ్వాసముతో మీ విశ్వాసమును జత చేయు చేయుచున్నారు. దాని గూర్చి ఎంత చిన్న సందేహమున్నా, దానిని మీరు చేయవద్దు.

106చూడండి, ప్రార్థన వరుసలోనికి వచ్చు ప్రతి వారును, ఈ రాత్రి నేను బాగుపడను అను ఎట్టి చిన్న సందేహమున్ననూ లోనికి రావద్దు. అది మిమ్ములను మరింత దిగజార్చును, చూచారా, మీరు మరింత దిగజారెదరు, చూచారా, కనుక ప్రార్థన వరుసలోనికి రావద్దు. రేపటి వరకు వేచి యుండండి. రేపు ఏదో సమయములో గాని లేదా మీరు విశ్వాసము పొందుకొను మరో సమయములో గాని చేయండి. అది చేయవద్దు, ఎందుకనగా ఇది నమ్ముటకు విశ్వాసముగల వారికి మాత్రమే.

మనము రోగులకు ప్రార్థించుచుండగా, సేవక సోదరులను ఇక్కడికి వచ్చి నాతో నిలడవలెనని ఇప్పుడు కోరుచున్నాను. వేదిక మీదనున్నవారు ఇప్పుడు ఈ ముందుకు దిగి రండి. ఇక్కడున్న బల్లల వరుసకు ముందుకు దిగి రండి, ఎందుకనగా చక్రాల కురీలలోను ఇంకా ఆయా వ్యాధులతో బాధపడుతున్న వారిని ఈ బల్లల మీదికి తేవలెనని కోరుచున్నాము. నేను వారికి ప్రార్థించుట కొరకు క్రిందికి దిగి వచ్చెదను. తిన్నగా ఇక్కడికి రండి. పూర్ణహృదయముతో విశ్వసించు సేవకులు ఎవరయినా గాని వెనుకనున్నచో, రండి.

ఇప్పుడు మీరు యధార్థ హృదయముతో అది జరుగనైయున్నదని నిజంగా నమ్మవలెను, చూచారా. మీరు దానిని నమ్మినచో, అప్పుడు వారు నమ్ముదురు, మీరు వారి మీద చేతులుంచునప్పుడు ఒక్కటి జరుగనై యున్నది. మీరిద్దరు నమ్మినచో, అది జరుగును. నా భావము చూచారా?

107మంచిది, ఇక్కడి వరుసలోనికి రండి సోదరులారా. ఇప్పుడు ఈ మార్గము గుండా రెండు వరుసలు ఏర్పాటు చేయండి. సేవ చేయు ప్రతి సోదరుడును, ఇంకొద్దిగా ఇటు ప్రక్కకు రావలెనని కోరుచున్నాను. అప్పుడు ఆ వరుస లేని వారు వెనుకకు వెళ్ళగలరు, ఎందుకనగా ఇక్కడున్న కొందరు తిరిగి ఈ వెనుక నుండి మధ్యలోనికి వెళ్ళవలసియున్నారు. నా సోదరులారా, దయచేసి మీరు ఇక్కడ నుండి కొద్దిగా వెనుకకు జరుగండి. మంచిది.

"నేను నమ్ముదును," అని చెప్పి తమ స్థానము తీసికొని నిలబడి, విమర్శకుల ఎదుట నిలబడుటకు ఇష్టపడిన ఇటువంటి జనుల కొరకు ప్రభువుకు వందనములు చెల్లించవలసి యున్నాము. ఆమేన్. అట్టి విధమగు మనుష్యులను బట్టి నేనెంతో వందనములు చెల్లించుచున్నాను. వారితో నా భుజములు కలుపుటకు, వారితో నా హృదయము కలుపుటకు, ఎంతో సంతోషించుచున్నాను. నా ఉద్రేకమును, విశ్వాసమును వారితో కలుపుటకు ఆనందించుచున్నాను. జీవాహారము మరియు దేవుని వాక్యము చుట్టూ చేరిన మనమంతా సోదరులము. యేసుక్రీస్తుతో కూడా రాజ్యములో సహవారసులము. మీరు నిలబడి వాక్యమును… అది ఒక వరము. అది కేవలము వరము. చివరి దినమున సూచనను చూపించుటకు గురుతు. అది చేయవలసినది సరిగ్గా అదే. నా వలె, లేక ఓరల్ రాబర్ట్స్ వలె, లేదా టామి హిక్స్ వలె, లేక టామీ ఆస్బోర్న్ మొదలగు వారి వలె రోగుల మీద చేతులుంచు హక్కును వీరును కలిగియున్నారు. అదే దేవుని ద్వారా వారు అదే అధికారమును కలిగియున్నారు, ఎందుకనగా వారును అదే దేవుని యొక్క దాసులైయున్నారు.

108మీరు… సహోదరుడు ప్రయిస్ లేదా మరెవరైనా గాని లేక సహోదరుడు మూర్ గానీ రావలెనని నేను కోరుచున్నాను. మీరు వచ్చి ప్రార్థించుటలో సహాయపడండి, లేక అక్కడే నిలచి యుండి.. మంచిది, మీరు మైకు క్రిందికి తెచ్చుచున్నారు. సరే. ఇప్పుడు నేను సహోదరుడు ప్రయిస్ ఆహ్వానించనై యున్నాను. ఇక్కడికి మనము వచ్చినప్పుడు…

ఇప్పుడు చూడండి, ఇది దానిని సరిచేయనీయండి. ఇది అదే. ఆయనను కదిలించవలసిన పనిలేదు. మీరలాగు చేయనవసరము లేదు. "ప్రభువగు దేవా, దానిని నేను నమ్ముతున్నాను," అని చెప్పండి. చూచారా, ఇప్పుడాయన మేల్కొనియున్నాడు. ఆయన తన్నుతాను రుజువు చేసికొనుట అయిపోయినది. మా మధ్య ఆయన వేచియున్నాడు. నేనాయనను తాకుచున్నాను. ఆయన ఇక్కడున్నాడని నాకు తెలియను, ఎందుకనగా ఆయన రుజువును నేను చూచుచున్నాను. ఆయన పని చేయుచున్న తీరును బట్టియే. కేవలము ఆలోచించండి. సృష్టికర్త తానే, వాక్యమగు ఆయనే, ప్రత్యక్షపరచబడి ఈ రాత్రి మన మధ్య రుజువు కాబడెను. నా వాక్యమును మీరు తీసికొన్నచో ఈ భవనమంతయూ ఆ రీతిగా అది కదలుచున్నది. అది ఇక్కడ నిలబడి కేక వేయుచునే యుండగలదు. కాని ఎనిమిది లేదా పది లేక అంతకన్న ఎక్కువమంది జనులు వరుసలోనికి తేబడియున్నారు. ఆయన సన్నిధి ఇక్కడున్నదని గుర్తించుటకు అది చాలును.

109ఇప్పుడు ప్రయిస్ సోదరుడా, నీ కిష్టమైనచో, జనులు బహు నెమ్మదిగా, "ఆ గొప్ప వైద్యుడు ఇప్పుడు చేరువనే యున్నాడు, సానుభూతి చూపు యేసు," అను పాటను పాడునట్లు చూడుము. నీవు బాగవునట్లుగా ఆయన చనిపోయినచో, నిశ్చయంగా, స్త్రీ వ్యాధిపట్ల ఆయన సానుభూతి చూపును. నీవు వ్యాధితో నున్నావు గనుక ఆయన నీకు సానుభూతి చూపును. నీవు వరుసలోనికి వచ్చుచుండగా, దైవజనుడు నీ మీద చేతులుంచనై యున్నాడు. నేను ఇక్కడ నిలబడి ఈ దైవ జనులతో కూడా నా స్థానమును తీసికొందును. వెనుక నుండి రండి ….

ఇప్పుడు, చూడండి, దీనిని మరిచిపోవద్దు. ఇప్పుడు గట్టిగా ఆలోచించండి. మీరు వరుసలో నుండి పోవుచుండగా, ఈ విధముగా మీ విశ్వాసమును స్థిరపరచుకొనుడి, "ఆ వరుస చివరకు నేను వచ్చుసరికి అదంతా పోవును. నేను ఆ వరుస క్రిందికి వెళ్ళనైయున్నాను. ఇక్కడ నేను వ్యాధితో నిలబడి యున్నాను. ఇక్కడ నేను తొందరతో నిలబడియున్నాను. ఇక్కడ నేను భయముతో నిలబడియున్నాను. ఏమి జరుగనై యున్నదో ఎరుగని అయోమయ స్థితిలో నేను నిలబడియున్నాను. వైద్యుడు ఈలాగు చెప్పెను, మరియు వారు ఈలాగు చెప్పిరి… కాని అక్కడికి నేను వెళ్ళినప్పుడు నేను బాగనైనాను అననుకొని ప్రభువునకు గాలిలో చేతులు పైకెత్తి వందనములు చెల్లించెదను." ఏమి జరుగునో చూడండి. ఇప్పుడు నేను…

HEB 13:8

 

110చాలా సార్లు, ప్రజలను మనము పరీక్షించి గమనించుచున్నప్పుడు వారు, చాలా ఎరిగియున్నారు; ముఖ్యంగా రోగులు. వారు నిన్ను గమనించుదురు. నేత్రమే ఆత్మకు ద్వారము. అందువల్లనే యేసు వారిని బయటకు పంపించెను. ఒక్కొక్కరిని ప్రత్యేకముగా తీసికొని సమయము వెచ్చించి ప్రార్థించినప్పుడు, బాగయినంతమంది ఈ విధంగా బాగవరు. కాని ఎందరు ప్రార్థించబడుటకు కోరిక కలిగియున్నారో చూడండి. ఆ విధంగా వారిని మీరు తీసికొనలేరు. కాని ఇప్పుడు ఈ విధంగా మీ విశ్వాసము దానిని పట్టుకొనవలెను.

"దానినెట్లు వివరించవలెనో నాకు తెలియదు," అని చెప్పవద్దు. ఎవరూ ఎరుగరు.

కాని దానిని మనము నమ్ముచున్నాము, ఎందుకనగా వాక్యము అలాగు చెప్పెను. బయలుపరచబడిన యేసు ఇక్కడ మనతో యున్నాడు. రంగము మీదికి ఆయనను పిలువుడి. ఆయనను పిలిచినప్పుడు ఆయన ఏమి చేసెను? "నేను నిన్న, నేడు, నిరంతరము ఏకరీతిగా ఉన్నాను," అని మనకు చూపించెను. ఆమేన్. నమ్మిక మాత్రముంచుము. నీ పూర్ణహృదయముతో దానిని నమ్ముము. మేము… ఇప్పుడు తలలు వంచుదము.

ACTS 9:40,41

 

111సహోదరుడు ప్రయిస్ లేదా ఇక్కడున్న వారిలో ఒకరు… సహోదరుడు ప్రయిస్ వరుసలను నడిపించును. ప్రతి ఒక్కరూ వెళ్ళండి, తిరిగి మరల మీ స్థలములో కూర్చోనండి. "మహా వైద్యుడు" అను పాట పాడుదము.

మనము ప్రార్థించుదము. ఇప్పుడు మనందరము ప్రార్థించవలెనని కోరుచున్నాను, ఎందుకనగా… ఇప్పుడు ప్రార్థించుదము, గుర్తుంచుకొనండి, పేతురు దొర్కా ఇంటికి పిలువబడినప్పుడు, ఒక మూలన ప్రార్థించెను, లేచి వెళ్ళి దొర్కా మీద తన చేతిని ఉంచెను. "దొర్కా, లెమ్మనెను."

112పరమ తండ్రి, మేమును అలాగే ప్రార్థించుచున్నాము. నీవు ఇక్కడ ఉన్నావు. నిన్ను నీవు తెలియపరచుకొన్నావు, నీవు మా ప్రభుడవు, రక్షకుడవు. నీవు మమ్మును అనేకసార్లు స్వస్థపరిచావు. ఇక్కడున్న ఈ ఘడియలో ఆ క్రింది స్థలము నుండి, ఇంకా ఆయా చోట్ల నుండియు వందలాది మంది స్వస్థత పొందుటకు వచ్చుచున్నారు. వారు ఈ ప్రార్థన వరుసలోనికి వచ్చుదురు. ఇక్కడ నీ దాసులమగు మేమందరము నీవు వాగ్దానము చేసిన దానిని చేయనైయున్నావని నమ్ముచున్నాము. ఈ వరుసలో నుండి వచ్చుచుండగా ఈ స్త్రీ, పురుషులు, బాల బాలికల మీద మేము ఇక్కడ చేతులుంచబోవుచున్నాము. ప్రభువా, వారిలో ప్రతి ఒక్కరు విశ్వసించెదరు గాక.

"మహా వైద్యుడు" అను ఈ మాధుర్యమగు పాత పాటను మనము పాడుకొననైయున్నాము. ప్రభువా, అది నీవే, ఇప్పుడు మనము యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు అను ప్రాతిపదిక మీద బయలు వెళ్ళనైయున్నాము. నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు కనబడునని మా విశ్వాసము మాకు చెప్పుచున్నది. మా స్వంత హృదయములలో ప్రసరణ జరుగుచున్నది. మనము విశ్వాసులము. ఒక మహా సైన్యముగా మేము నిలబడి, సాతాను యొక్క సవాలును ఎదుర్కొననై యున్నాము. యేసుక్రీస్తు నామమున మనము ఎదుర్కొనుచున్నాము.

113మంచిది, సహోదరుడా ప్రయిస్. ఇప్పుడు ప్రతి వారు తలలు వంచుకొని, ప్రార్థించండి. మీలో కొందరు "మహా వైద్యుడు" అను పాట పాడుచున్నారు. ప్రార్థన వరుస జరుగుచున్నది. సహోదరుడు ప్రయిస్ పాటను నడిపించుచూ, వచ్చుచున్న జనులకు మార్గము చూపించుచున్నాడు. ప్రభువు ఇప్పుడు మిమ్మును దీవించును. [సహోదరుడు బ్రెన్హాం, సేవకులు రోగుల కొరకు ప్రార్థించుచున్నారు. సహోదరుడు ప్రయిస్ మరియు సంఘము "మహా వైద్యుడు" అను పాట పాడుతున్నారు.]

JOHN 13:12

 

114యేసు ఒకసారి చెప్పెను, "నేను మీకు చేసినది తెలిసికొనుడి." చూచారా?

ఎందరు ఇప్పుడు నమ్ముచున్నారు? చేతులు పైకెత్తి యున్నవారు, ఆ వరుస వారు ఇటు వచ్చుచున్నారు. యేసు ఏమి చేయుదునని చెప్పెనో సరిగ్గా అదే. నీవది నమ్ముచున్నావా? ఆయన వాక్యము తప్పిపోదు. నీవు ఇది చెప్పితివి గనుక అది నమ్మితివని నీవు సాక్ష్యము చెప్పెతివి కాబట్టి దీనిని నేను నా పూర్ణహృదయముతో నమ్మి చెప్పుచున్నాను. "సర్వశక్తుడగు దేవుడు నిన్ను బాగుచేయును," చూచారా. ఎందుకనగా అది లేఖనమని నేనెరుగుదును. అది సత్యము. ఈ వరుసగుండా వచ్చు ప్రతి వ్యక్తి పూర్తిగా బాగవునని నేను నమ్ముచున్నాను.

ఇప్పుడు దానితో మీరేమి చేయుదురు? దాని గూర్చి సందేహించవద్దు. మీ గురుతును మీ ఎదుటనే పట్టుకొని యుండుడి. మీ గురుతు ఏమిటి? మీ హృదయములో నున్న పరిశుద్ధాత్మయే. మీరు ఆ వరుస గుండా దాటి వచ్చారు. అది జరుగవలసియున్నది. దానికి మరో మార్గము లేదు… ఇంతకు ముందు ఎంత మందిని దీనిని దాటి వెళ్ళినను లెక్కలేదు. ఇది మాత్రమే. ఇదే ఘడియ. ఇదే సమయము. అది అయిపోయినది. అది స్థిరపరచబడినది. నీవు ఎప్పుడైనా జబ్బుగా నున్న సంగతిని, ఎన్నడయినా బాధపడిన సంగతిని, లేదా మరేదియూ గుర్తుచేసికోవద్దు. దేవుడు దానిని నీ కొరకు తీసివేయును. అది నీవు నమ్మెదవా? ఆమేన్. నా పూర్ణ హృదయముతో నేను నమ్ముచున్నాను.

115ఇప్పుడు మనము ప్రతి ఒక్కరము ఈ విధముగా పైకి లేచి నిలబడుదుము. ఈ రోజు నేను చదివిన కరపత్రికలో సోదరుడు చెప్పినట్లుగా, చేతిని ఎత్తుట లొంగిపోయాననుటకు ఒక విశ్వవ్యాప్త సూచన. నేను అన్నియూ లోబరిచాను. దానిని పాడుదము.

నేను సమర్పింతును,

నా సమస్తమూ సమర్పింతును,

అంతా నీకే నా క్రీస్తూ, నా రక్షకుడా,

నా సమస్తమూ సమర్పింతును

"యేసు, నేను… నా చిత్తము, నా సందేహములు, నా విశ్వాసము, నా హృదయము, నా శరీరము, నా వ్యాధి, నా జీవితము సమస్తమూ సమర్పించుచున్నాను."

నేను సదా ప్రేమించి ఆయనను విశ్వసించుదును,

ఆయన సన్నిధిలో అనుదినము.

మీరు మీ చేతులు ఎత్తుచుండగా, ఇప్పుడు మీ హృదయమంతటితో చెప్పండి, "నా విశ్వాసమును సమర్పించుచున్నాను ప్రభువా, నా సమస్తమును సమర్పించాను. నేను స్వస్థత పొందాను."

… సమర్పింతును,

నా సమస్తము సమర్పింతును,

అంతయూ నీకే, నా ధన్య రక్షకుడా,

నా సమస్తమూ సమర్పింతును.

116ఆయన ఆశ్చర్యకరుడు కాదా? ఇప్పుడు, ఆలోచించండి. దానిని భావముతో చెప్పుచున్నాము, సమస్తమూ సమర్పించబడినది. "ఇక నేను ఏ మాత్రము నా స్వంత ఆలోచన కాదు. నేను ఆలోచించు విధముగా ఇక ఆలోచించను. ప్రభువా, నీవు ఆలోచించు విధముగా నేను ఆలోచించనై యున్నాను. నేను స్వస్థపడితినని నీవు వాగ్దానము చేశావు. అది నేను ఆలోచించెదను. నా ఆలోచనను నీకు వశపరచుచున్నాను. ఇక మీదట ఏ మాత్రము నేను నా వ్యాధి గూర్చి ఆలోచించను. నాకున్న వ్యాధిని గూర్చి నేను ఆలోచించను. నేను దేనిని గూర్చియూ ఆలోచించను గాని నీవు చెప్పిన దానిని గూర్చి ఆలోచించెదను."

ఇప్పుడు నీ ఎదుట నీవలె, అనగా కొద్ది నిమిషముల క్రితం నీవుండినట్లుగా ఉండిన ఒక వ్యక్తి నిలబడి యున్నాడు. ఇక్కడ నీవు వ్యాధితో యున్నావు, కాని అక్కడ ఒక మంచి వ్యక్తి నిలబడియున్నాడు. దానికవతలకు ఆ మంచి వ్యక్తిని యేసుక్రీస్తు పిలచుచున్నాడు. ఇప్పుడు నీవు కేవలము విశ్వాసముతో నీ కండ్లు మూసికొని, ఆ మంచి శరీరములోనికి తిన్నగా నడిచి వెళ్ళుము, చూచారా, ఆగకుండా నడిచిపోవుడి, ఆగకుండా సాగిపోవుడి. "నేను సమస్తమూ నీ వశము చేశాను." ప్రభువు నిన్ను దీవించును. "నేను…."

Search Messages

0 / 0 matches
Enter characters above to process real-time text query scopes...