ప్రభువా, కేవలం మరొక్కసారి
1ఇప్పుడు మన తలలు వంచెదము. ప్రభువు యొక్క వాక్యము చుట్టూ, మన తలలు వంచి మరియు మన హృదయములు వంచియుండగా, ఇక్కడ మనము కలిగియున్న జూబిలీ, ఈ గొప్ప కూటము యొక్క ముగింపులో, దేవుని యొద్ద దేనికొరకో ఈ రాత్రి మన హృదయములు పొంగిపోవుచున్నందుకు నేను సంతోషించుచున్నాను. అది అలాగైనచో, మన చేతులను ఆయన తట్టు ఎత్తుకొని ఇట్లు చెప్పెదము, "ప్రభువా, ఇదిగో ఇదే నా విన్నపము. మీకు తెలియును," అని చెప్పెదము.
మా పరలోకపు తండ్రీ, ఇప్పుడు మా చేతుల వైపు చూడుము. ఆ ఎత్తబడిన చేతుల యొక్క భావమేమనగా, మా యొక్క సమస్తమును మీకు స్వాధీనపరచు కొనుచున్నాము. మా అవసరత ఏమిటో మీరెరుగుదురు, మరియు తండ్రి మా అవసరతలన్నియు మీరు తీర్చెదరని మేము ప్రార్ధించుచున్నాము. కొన్నిసార్లు మా యొక్క అవసరతలకన్నా మా కోర్కెలు అధికముగా నుండును. అయితే తండ్రీ, మా అవసరతలనే మీరు తీర్చండి, ఏలయనగా వాటిని మేము విశ్వాసముతో అడగగలము. మీరు దానిని చేయుదురని మీరు వాగ్దానము చేసితిరి. దీనిని నేను, యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాను. ఆమేన్. (ఇప్పుడు మీరు కూర్చొనండి.)
2సహోదరుడు మూర్ తో, మరియు సహోదరి మూర్, సహోదరుడు బ్రౌన్ కి మరియు సహోదరి బ్రౌన్ కి, సహోదరుడు లైల్ కు, సహోదరుడు బౌట్లియర్ కు మరియు ఇక్కడి సంఘము యొక్క చక్కని ప్రజలందరికీ, ధర్మకర్తలకు, డీకన్ లకు, వారెవరైయున్నప్పటికిని, నేను ఇక్కడ కలిగియున్న చక్కని సమయమును బట్టి మరియు ఈ అవకాశమును బట్టి నేను నిశ్చయంగా కృతజ్ఞుడనైయున్నాను. ఈ ప్రజలు మరియు ఈ గొప్ప పునాదికర్తలు, ఇక్కడికి సంవత్సరముల తరబడిగా వచ్చువారైయుండి, చిరిగిన బూట్లతో మరియు నిస్వార్ధమైన సమర్పణ జీవితము కలిగి ఈ ఆరాధన స్థలము ఇక్కడికి (ఈ స్థాయికి) తెచ్చుటకు గొప్ప ప్రయత్నము చేసిరి. శ్రివ్-పోర్ట్ వారు, ఈ జాక్ మూర్ వంటి మనుష్యునకు మరియు ఇక్కడున్న ఇటువంటి జనులకు ఎంతగానో రునపడియున్నారని నేను తలంచుచున్నాను. ఒక అలసిపోనటువంటి మరియు నిస్వార్థమైనటువంటి ప్రయత్నమువలన వారు దేవుని యొక్క వెలుగు మరియు దేవుని యొక్క జీవము, యాత్రికులైన స్త్రీ, పురుషులకు ప్రసరింపబడి, లోనికి వచ్చి మరియు కూటములలో సంతోషించునట్లుగా ఇటువంటి ఒక స్థలమును స్థాపించుటకు వారు ప్రయత్నము చేసిరి. ఆయన దానితో ముగించునట్లుగా, ప్రభువైన యేసు యొక్క రాకడవరకు ఇది నిలిచియుండును గాక.
3పరిచర్య పట్ల, వర్తమానముల పట్ల మీ యొక్క చక్కని ప్రతిస్పందనను బట్టి, నేను సంఘము యొక్క జనులవలన ఎంతగానో ఆనందించియుంటిని. మరియు దేవుడు మన కొరకు చేసిన గొప్ప కార్యములు, అవి కేవలం పరిమితిలేనివైయున్నవి. మరియు ఆవలిగట్టును మనము దాటునంతవరకు అదేమైయున్నదో మనమెరుగలేము, ఎందుకనగా మీదటికి మనముందున్న దినములలో జీవము వచ్చునట్లుగా విత్తనము నాటబడియుండెను. మరియు అనేకులు స్వస్థత పొందియున్నారు, బహుశ ఈ క్షణములో దానిగూర్చి ఏమియు ఎరుగము, అయితే కొంతసేపైన పిదప అది వెళ్ళిపోయెనని మీరు కనుగొనెదరు. మరియు మనము ఎంతగానో కనుగొనెదము, అది కేవలం మీరు జరుగుచున్నది ఏదో దానిని చూచుట కాదు; దాని ప్రతిఫలమే మీరెన్నటికి ఏమి జరుగనైయున్నదో, ఏమి జరుగునో దానిని తెలుసుకొనలేరు. మరియు కార్యము జరిగిపోయెననియు మరియు బాగైపోవుదుమనియు సరిపడా విశ్వాసము కలిగియున్నయెడల, ఈ కూటము ముగిసి వెళ్ళుచుండగా అక్కడ ఏ వ్యక్తియూ బలహీనుడిగా వుండడని నేను నమ్ముచున్నాను.
ఎవరైతే పరిశుద్ధాత్మ బాప్తిస్మము కొరకు మరియు అనేక కార్యముల కొరకు, క్రీస్తువైపు తమ చేతులెత్తియున్నారో వారు, మరియు ఎవరైతే దేవుడు తమతో క్రియ చేయవలెనని, కృపా కార్యముల కొరకై ఆశ కలిగియున్నారో వారు, వారిలో ప్రతి ఒక్కరూ పరిశుద్ధాత్మతో నింపబడెదరని నేను నమ్మికమాత్రముంచియున్నాను. "గురుతు" అను అంశముపై నా వర్తమానమును మరచిపోకండి. మీరు దానితో నిలిచియుండవలెను. గుర్తుంచుకొనండి, గురుతును ప్రదర్శించుడి.
4మరియు మనము త్వరగా ఆరిజోనా, మరియు యూమా మరియు ఫీనిక్స కు వెళ్ళవలెను. మరియు దక్షిణముగా ఇక్కడికి తరిగి వచ్చెదము. ఆ ప్రయాణము గూర్చి అదంతయూ ఏమైయున్నదో, దానిని నేను ఎరుగను. మరలా లూసియనా దిగువన, లూసియానాలో ఎక్కడైననూ మరియు డల్లాస్ లో ఫిబ్రవరి నెలలో ఉండెదమని మరియు అక్కడ జార్జియా గుండా ఆ దిగువునకు మరియు పిదప ఫ్లోరిడాకు వెళ్ళెదము. మరియు తరువాత మేము అక్కడి నుండి, జూన్ నెలవరకు యూరఫ్ లో ఉండునట్లు అచ్చటికి వెళ్ళవలసినవారమైయున్నాము. మరియు పిదప జూలై తర్వాత ఆగష్టు మధ్యలో మేము ఇక్కడికి తిరిగి వచ్చెదము. మరియు పిదప, భూమి యొక్క దిగువగా దక్షిణ అమెరికాకు… దక్షిణ అమెరికాకు కాదు, దక్షిణ ఆఫ్రికాకు తిరిగి వెళ్ళెదము. మరియు ప్రభువు చిత్తమైతే 1964, సెప్టెంబరు, రెండవ తారీఖున, ఎక్కడైతే ఒకసారి ముప్పైవేలమంది ప్రభువు చెంతకు వచ్చుటను మేము చూచితిమో, అక్కడ దక్షిణ ఆఫ్రికాయందలి, డర్బన్ లో మేము ప్రారంభించెదము. ఇక్కడ కూర్చునియున్న సహోదరుడు జూలియస్ స్టడీస్లీవ్, ఆ సమయములో ఆ కూటములో నుండెను. అది వాస్తవమేనని నేను తలంచుచున్నాను.
5మరియు "ప్రవక్త దక్షిణ ఆఫ్రికాను దర్శించుట," అను పుస్తకమును వ్రాసిన సహోదరుడు జూలియస్ పరిచయము చేయబడినాడని నేను అనుకొనుచున్నాను, ఎటువంటి సందేహము లేదు, సహోదరి స్టడీస్లీవ్ ఇక్కడే ఎచ్చటనో ఉండి యున్నది. కేవలం ఆమె స్థలమును నేను చూపించలేకపోవుచున్నాను… అవును, ఇప్పుడు నేను చేయుదును, మరియు పిల్లలు. నేను గుర్తుంచుకొన్నాను, కొన్ని సంవత్సరముల క్రితం మినియాపోలిస్, వారు చిన్నపిల్లలైయున్నారు; ఇప్పుడు నేను వారికొరకు పైకి చూడవలెను, వారు పెద్ద అబ్బాయి మరియు అమ్మాయి అయి వున్నారు.
సహోదరి స్టడీస్లీవ్, ఇటీవల కాలంలో, అది నిజంగా నా హృదయము తరుక్కు పోవునట్లు చేసెను, ఒక చిన్న తల్లి, ఆమె తన బిడ్డను పోగొట్టుకొనెను. మరియు ప్రభువు… అట్లు తీసికొనుట సరియేనని చూచెను. మరియు ఆమె నన్ను పిలిచినది, మరియు ఆమె… వారు నన్ను జర్మనీకి విమానంపై వెళ్ళవలసినదిగా కోరిరి. మరియు ఆ వైద్యుడు ఎంతో దయగలిగి, బిడ్డ అట్లే ఉంచబడునట్లు అనుమతించెను. బొద్దుగా, చక్కగా నుండు ఆ చిన్న పాప అకస్మాత్తుగా చనిపోయెను. మరియు సహోదరి స్టడీస్లీవ్ అప్పటికే తన తల్లిని పోగొట్టుకొని ఎంతగానో హృదయము బ్రద్దలైనదై యుండెను. ఈ చిన్న బిడ్డలు నిశ్చయంగా అత్యున్నతమైనదానిని పొందుకొనెను. మరియు, జర్మనీ నుండి, చాలా దూరము నుండి, మరియు నన్ను రమ్మని ఫోను ద్వారా ఆమె కోరెను. మరియు నేను చెప్పాను, "సహోదరి స్టడీస్లీవ్… "
6ప్రభువైన యేసు, అంత్యదినములలో తన పనికొరకు నన్ను పంపెనని ఆమె నమ్ముచుండెనని తన విశ్వాసమును ఆమె ఒప్పుకొనెను. మరియు ఎవ్వరు ఇవ్వనటువంటి ఒక నమ్మకమైన సాక్ష్యమైయుండెను, మరియు ఆమె దానిని తన హృదయమంతటితో భావించెను. చనిపోయినవారిని తిరిగి లేపునటువంటి కార్యములు ప్రభువైన దేవుడు చేసియుండుటను, ఆమె చూచియుండెను. అయితే మీరు చూడండి, మీరు నిజముగా…. ఎట్లు, నేను దానిని నాకు నేనుగా చేసినయెడల, దానిని నేను చేసినట్లైతే జర్మనీలో మరియు ప్రతీచోటా దేవునికి ఎటువంటి మహిమ వచ్చియుండెడిది. కాని, మొదటి కార్యమేదనగా, మనము దేనికొరకు వెళ్ళుచున్నామో తెలుసుకునేవరకు మనము వెళ్ళకూడదు.
కావున నేను బయటకు వెళ్ళి మరియు ప్రార్ధించితిని, మరియు రాత్రంతయు ఆమె ఫోను వద్దనే సమయమును గడిపెనని నేను తలంచితిని. మరియు మరుసటి దినమున నేను వచ్చితిని, అచ్చట ఏమియూ లేదు. మరలా నా భార్య మేడా వచ్చి ఇట్లు చెప్పినది, "సహోదరి స్టడీస్లీవ్ రెండు సార్లు ఫోన్ చేసినది. ప్రభువు యొద్ద నుండి ఇకనైనా ఏదైనా జవాబు వచ్చినదా?"
నేను చెప్పాను, "ఏమియు రాలేదు." మరియు నేను చెప్పాను, "సరే…"
నేను వెలుపలికి వెళ్ళి, మరలా ప్రార్ధించితిని. ఆ రాత్రి నేను అడవిలో ఉంటిని. పిదప, ఆ చిన్న బిడ్డ పట్ల జాగ్రత్త వహించియుండవలసినది. మరియు నేను సరిగ్గా లోపలికి వచ్చుచుండగా, ఒక దర్శనము తాకెను, ప్రభువైన యేసు నా యెదుట నిలిచియుండెను. మరియు దానిని తృణీకరించకుము. అది ప్రభువు యొక్క హస్తమైయున్నది," అని చెప్పు ఆయన స్వరమును నేను వింటిని. అంతట దేవుడే ఏదో కారణము చేత, ఆమె బిడ్డను మహిమలోనికి తీసుకొని వెళ్ళెనని నేను తెలిసికొంటిని, మరియు దానికి విరోధముగా నేను ఏదైనా చెప్పుట నిశ్చయంగా ప్రభువు యొక్క చిత్తమును వ్యతిరేకించుటయే అయి యున్నది.
మరియు తరువాత, ''మంచిది, అది ఒక గొప్ప నిరాశగా నుండును. అయితే నేను చేసిన ఒక కార్యమేదనగా, ప్రభువును నేను మనస్సులో ఉంచుకుంటిని. ఆయన నాతో చెప్పినదే నేను చేసితిని," అని నేను తలంచితిని.
7ఇటీవల కాలములో ఇక్కడ, ఒక సేవకుని యొద్ద నుండి నాకు ఒక ఉత్తరము వచ్చియుండెను, మరియు అతను ఇతర సేవకుల ద్వారా చేయబడిన కొన్ని మాటలు ప్రకటనలుగా వ్రాసెను. అతను చెప్పెను, "ఒకరు…" మరియు బహుశ అతను ఒక జర్మను లూథరన్ అయియుండును. నేను ఖచ్చితంగా చెప్పలేను. అయితే అతను ఇట్లు చెప్పెను, "సహోదరుడా బ్రెన్హాం గురించి నేను మెచ్చుకొను ఒక కార్యమేదనగా, ఉద్రిక్తతంతయూ కొనసాగుచుండగా, అతడు దేవుని యొద్ద నుండి స్పష్టమైన నిర్ణయము పొందువరకు అతడు స్థిరముగా నిలిచెను, తరువాత అతడు ఏమి చేయుచున్నాడో అతడెరిగియుండెను."
మరియు అటువంటి కార్యములు మీరు చేయుటకు అదే విధానమైయున్నది, అదేదనగా మొదటగా ప్రభువు యొద్ద నుండి వినుటయైయున్నది, ఆయన చెప్పినప్పుడు వినుట. ఈ రాత్రి స్మశానవాటికకు వెళ్ళి మరియు ప్రెసిడెంటు కెన్నెడీని లేపవలెనని ఆయన నాతో చెప్పినయెడల, అది జరుగుటను గమనించవలసినదిగా నేను ప్రపంచమంతటిని రమ్మని ఆహ్వానించెదను, ఎట్లనగా నేను "ప్రభువు ఈలాగు సెలవిచ్చుచున్నాడు," అను దానిని కలిగియుండెదను, చూశారా. ఇప్పుడు, అయితే, "ప్రభువు ఈలాగు సెలవిచ్చుచున్నాడు," అని చెప్పనంతవరకు నేనెట్లు "ప్రభువు ఈలాగు సెలవిచ్చుచున్నాడు," అని చెప్పెదను? చూశారా, చూశారా?
8అనేకసార్లు, ప్రజలు ఉద్రిక్తులై మరియు ప్రభావితులై మరియు అటువంటి కార్యములతో ఏదైతే తమ మనస్సుకు మంచిది అని తలంచుదురో అట్లు పోయెదరు. అది ఎల్లప్పుడూ సరి కాదు. ఆయన మీతో చెప్పువరకు వేచియుండుడి. మరియు మీరు దానిని తెలిసికొందురు, తరువాత మీరు వాస్తవమైనది పొందుకొనెదరు. దానిగూర్చి మీరు ఊహించుకోవలసిన అవసరము లేదు. ఆయన చేయునని మీతో చెప్పెను, అది "ప్రభువు ఈలాగు సెలవిచ్చుచున్నాడు," అయియున్నది. పిదప ఆయన మీతో చెప్పెను గనుక ఆయన ఏమి చెప్పెనో, దానిని మీరు చెప్పగలరు. అంతవరకు, మీరు వెళ్ళి, మీరు చేయగలిగినది చేయగలరు, మీకు మీరుగా చేయగలిగినది చేసెదరు, అయితే దేవుడు అట్లు చెప్పనంతవరకు మీరు నిశ్చయత కలిగియుండలేరు. అప్పుడు మీరు నిస్సందేహముగా నుందురు.
9"అయ్యలారా, ఇది ఏ సమయము?" అను టేపులో, మీలో అనేకులు టేపును కలిగియుండిరి, చూడండి. నేను అధ్యాయములుగా మాటలాడగలను మరియు ప్రతీచోట, మరియు ఇట్లు చెప్పితిని, "అది 'ప్రభువు ఈలాగు సెలవిచ్చుచున్నాడు' అయి యున్నది. నేను ఏడుగురు దూతలను కలిపెదను. మరియు ప్రపంచమంతటా అది తెలియబడును, చూడండి. మరియు ఆయన నాతో చెప్పెను గనుక ఏదో జరుగనైయుండెను." అక్కడే అది వున్నదీ, చూడండి, కేవలం మూడు నెలల తర్వాత, చూశారా. మరియు ఈ తక్కిన కార్యములన్నియూ, మీరు… ప్రభువు దానిని చెప్పినప్పుడు, అది జరుగవలసియున్నది.
ఆ కారణము చేతనే ఆయన యొక్క వాక్యము సంపూర్ణమైనదని నేనెరుగుదును. ప్రజలు దానినిగూర్చి ఏమి తలంచినను ఫరవాలేదు, అది దేవుని యొక్క వాక్యమైయున్నది. అది నిజము, అది "ప్రభువు ఈలాగు సెలవిచ్చుచున్నాడు" అయియున్నది. చూడండి, అది, మరియు అది వాస్తవమని మనమెరుగుదుము.
JOHN 5:24•
JOHN 12:32
10యేసు వచ్చుచున్నాడు. ఎప్పుడు? నాకు తెలియదు. ఏ రూపములో, ఆయనెట్లు వచ్చును? నాకొక ఆలోచన ఉన్నది, కాని నేనెరుగను. అది ఇక్కడ ఈ విధముగా వ్రాయబడియున్నది, ఆయన చెప్పెను, "నేను, తీసుకొనిపోబడినప్పుడు," ఆయన మనుష్యులందరిని ఆయన యొద్దకు చేర్చుకొని మరియు ఆయన మరలా వచ్చును. ఆయన వచ్చునని నాకు తెలియును. ఓ, అది ఖచ్చితమైయున్నది. మరియు అది ఎప్పుడైనను ఏమి ఫరవాలేదు, చూశారా. అది ఈ రాత్రియైనచో, లేక అది వచ్చే సంవత్సరమైనను లేక అది ఇప్పటి నుండి వెయ్యి సంవత్సరములైనను, ఆయన వచ్చిన వెంటనే నేను నిత్యజీవము పొందుకొందును. ఇక నేను ఎలాంటి వృద్ధుడనైయుండను, ఆయన వచ్చినప్పుడు నేను అచ్చట ఉండెదను. అంతే. అది… నాకైతే, ఎప్పుడు, ఎట్లు, ఏ విధంగా ఆయన వచ్చును అనునది ఎటువంటి వ్యత్యాసం కలిగించదు, వచ్చిన వెంటనే నేనచ్చట ఉండెదను!
మరియు నేనచ్చట ఉందునని ఆయన నాకు వాగ్దానము చేసెను, మరియు ఆయన ముందుగానే నాకు నిత్యజీవము నిచ్చెను, ఏలయనగా ఆయన ఇట్లు చెప్పెను, "నా మాటలు అంగీకరించి మరియు నన్ను పంపినవానియందు విశ్వాసముంచువాడు నిత్యజీవముగలవాడు; మరియు వాడు తీర్పులోనికి రాడు, అయితే మరణమును దాటి జీవములోనికి ప్రవేశించును." అది నాకు చాలును. సరిగ్గా అదే, నాకు సంపూర్ణతయైయున్నది. అదే నా సంపూర్ణత, ఆయన దానిని వాగ్దానము చేసెను. ఇది తప్పిపోవుటకు ఇక ఎటువంటి మార్గమూ లేదు. మరియు దేవుడు తప్పిపోవుట అనునది అసాధ్యము. దేవుడు చేయలేని ఒకే ఒక కార్యము ఏదనగా తప్పిపోవుట. ఆయన విఫలమవ్వడు. అందునుబట్టి మీరు సంతోషముగా లేరా? ఓ,మై!
11సంవత్సరములు గడిచిపోవుటను నేను చూచుచుండినప్పుడు, మరియు రోజుకు రెండు లేదా మూడు కూటములు జరుగుటను, మరి అది కొద్దిగా నాకు అలసట కలిగించుటను నేను చూచినప్పుడు, అది నాకు ఎటువంటి ఇబ్బందిని కలిగించుట లేదు. అయితే పిదప నేను, ఇట్లు తలంచెదను, "మంచిది, అది ఎటువంటి వ్యత్యాసమును కలిగించును?"
నేను మిమ్ములను ఒకటి అడుగగోరుచున్నాను. మనము స్థానిక విశ్వాసులమైయున్నాము, కావున నేను అడుగగోరుచున్నాను. ఈ రాత్రి మీరు ఎనభై సంవత్సరములు గలవారైననూ లేదా పదిహేను సంవత్సరములుగలవారైనను తేడా ఏమిటి? మీరు ఈ సమయమునకు ఎనభై సంవత్సరములుగలవారైయుండి, రేపు రాత్రి వరకు జీవించినయెడల, మీరు ఎందరో పదహారు సంవత్సరములు వయస్సు గల పిల్లలను దాటి జీవించినవారగుదురు. మీరు ఎన్నడైనా దానిగూర్చి ఆలోచించితిరా? మీరు నిశ్చయంగా ఆలోచించెదరు. మీరు ఇక్కడ దేవుని సేవించవలెనన్న ఉద్దేశ్యము కొరకైయున్నారు. కావున వయస్సు అనునది మీకు ఎటువంటి వ్యత్యాసమును కలిగించును? కేవలం దేవుని సేవించుడి.
12దేవుడు నా యొద్దకు వచ్చి మరియు ఇట్లు చెప్పినయెడల, "నేను నిన్ను భూమిమీదికి పంపగోరుచున్నాను," మరియు నేనచ్చట ఉండినయెడల మరియు ఆయన, "భూమి మీదికి వెళ్ళుము, నేను నీకు వంద సంవత్సరముల జ్ఞానమును ఇవ్వబోవుచున్నాను, అయితే నేను నీ సంవత్సరములను నిర్ణయించగోరుచున్నాను, ఎన్నో సంవత్సరములు నీవు తీసుకొనగోరుచున్నావు, మొదటి పాతిక సంవత్సరములా (25 సం.), రెండవ పాతిక సంవత్సరములా, ( 50 సం.), మూడవ పాతిక సంవత్సరములా, (75 సం.), లేక ఆఖరి పాతిక సంవత్సరములా? ( 100 సం.) అని చెప్పినయెడల ఏమగును?
నేనేమి చెప్పుదును? మంచిది, ఓ, ఇక్కడ నేనొక ఫుట్ బాల్ ఆటగాడిగానో లేక ఒక క్రీడాకారునిగానో, లేక ఏదైనా ఆటగానిగా నా సమయమును వెచ్చించవలసినచో, మొదటి పాతిక సంవత్సరములు తీసుకొనుటయే నాకు మంచిది. ఒక వడ్రంగివానీగానో, లేక ఆ విధంగా మరేదైనా వ్యక్తిగా నేనిక్కడ జీవించవలసివస్తే, సరి, ఆ రెండవ పాతిక సంవత్సరములు (50 సం.) తీసుకొనుటే నాకు మంచిది. అయితే దేవుని సేవించుటకు నేను సంవత్సరములను తీసుకోగోరినయెడల, నేను ఆఖరి పాతిక సంవత్సరములను, డెబ్బై-అయిదు నుండి వంద సంవత్సరములను తీసుకొనెదను, ఏలయనగా అంతటి జ్ఞానమును నేను కూడగట్టుకొనుటవలన దానిగూర్చి నాకు ఎక్కువగా తెలియును, చూశారా. నేను నా రెండు కాళ్ళపై నిలబడి, మరియు చుట్టూ నడవగలిగినంతవరకూ నేను ఎంత వయస్సుగలవాడననునది ఎటువంటి వ్యత్యాసమును కలిగించును? నేను ఇక్కడ ప్రభువును సేవించుటకే ఉన్నాను, మరియు అది అంతే. ఆమేన్. అది నాకు చాలును. ఆయనే దానిని వాగ్దానము చేసెను.
13ఇప్పుడు, మీ యొక్క స్నేహభావమును బట్టి మీలో ప్రతిఒక్కరికి నేను కృతజ్ఞతలు తెలియజేయగోరుచున్నాను. మరియు ప్రభువు చిత్తమైతే, మరలా భూమి మీద వేరెక్కడైనా కలుసుకొనెదమని నమ్ముచున్నాను; ఇక ఇక్కడ కానియెడల, ఆవలిగట్టున కలుసుకొనెదము. మరియు ప్రభువు దీవించును. మరియు ఈ చేతిరుమాళ్ళకై నేను ప్రార్ధించగోరుచున్నాను. మనము వర్తమానములోనికి వెళ్ళినవెంటనే, ఏమి జరుగునో ఖచ్చితముగా మనకెవరికి తెలియదు. ప్రభువు ప్రజలలో పిలుపును మనకిచ్చియుండెనని నేను నమ్ముచున్నాను, ప్రజలను బయటకి పిలచి, ప్రభువు వారిని స్వస్థపరచునట్లు ఐదు లేక ఆరు, ఐదు రాత్రులలో రెండు రాత్రులు…. మూడు, మూడు రాత్రులవరకు కేటాయించుటకు ప్రయత్నించితిమి. మరియు మనము ఒక రాత్రినే కలిగియుంటిమి, గతరాత్రి, ప్రార్ధన కోరిన ప్రతి వ్యక్తిని ప్రార్ధన వరుసలోనికి తీసుకొని వచ్చితిమి మరియు వారికొరకు ప్రార్ధించితిమి. మరియు మనము నాలుగు లేక ఐదు రాత్రుల క్రితం ఇక్కడికి వచ్చినప్పటికంటెను ఇప్పుడు, మనము చక్కని ఆత్మీయ స్థితిలోను మరియు చక్కని భౌతిక స్థితిలోను ఉండుటకు నేను ఎట్లు చేయవలెనని ఎరిగియుంటినో, అట్లు ప్రతిదీ చేయుటలో ఎక్కడనూ నేను విఫలమవ్వలేదని నేను నిరీక్షించియుంటిని. నేను విఫలమైనచో, దేవా నన్ను క్షమించుము, మరియు మీరూనూ నన్ను క్షమించుడి.
14ఇప్పుడు ముగింపు వర్తమానముకై, మరియు నేను వీలయినంత త్వరగా ముగించుటకు ప్రయత్నించెదను, ఏలయనగా నేను ఎక్కవసేపు ప్రసంగించెదను. మరియు నేను సంవత్సరము యొక్క ప్రారంభ దినము నుండి అట్లు ప్రయత్నించెదనని నా సంఘముతో చెప్పియుంటిని మరియు ఆ రీతిగా నా పరిచర్య ప్రారంభము నుండి, గత ముప్పై-ఐదేళ్ళుగా వర్తమానమును రెండు గంటల నుండి, ముప్పై నిమిషములకు కుదించుటకు ప్రయత్నము చేసితిని. అయితే నేను నిదానముగా మాట్లాడెదను, ఒకే ఒక కార్యమేదనగా, నేను చెప్పగోరినదానిని ముప్పై నిమిషములలోగా చెప్పలేను. నేను దక్షిణవాసుడనని మీకు తెలియును, మరియు కావున నేను దానిగూర్చి వేగముగా ఆలోచించలేను. నేను కేవలం వేచిచూడవలెను. నా మాటలకొరకై నేను ఆయనపై వేచియుండవలెను. కావున, అయితే నేను ఆయనపై వేచియుండునంతవరకు, మరి కేవలం మీరు నాతో సహనం కలిగియుండుడి.
JOHN 7:37•
EPH 2:6
15ఇప్పుడు, కొంత లేఖనమును చదివెదము, కావున ఇది తప్పిపోనిదని మనమెరుగుదుము. మరియు మనయొక్క స్నేహపూరితమైన కూడుకొనుట మరియు మాటలాడుకొనుట తరువాత, ఆరాధనలో ఈ యొక్క నిజమైన పవిత్రమైన భాగమును సమీపించుటకు ముందు, జీవాహారమును తీసుకువచ్చుటకు ముందు, మనము మరలా ప్రార్ధించుకొనెదము.
ప్రభువైన యేసు, ఇప్పుడు మేము నీకు ఎంతగానో కృతజ్ఞులమైయున్నాము, ఈ గొప్ప పగలు మరియు రాత్రులు కూటములకుగాను, వాక్యముతోను మరియు ఈ ప్రజలతోను కలిగియున్న సహవాసమునకుగాను నీకు కృతజ్ఞతలు చెల్లించుటకై మేమందరము నీవైపు తిరుగుచున్నాము. ప్రభువా, మేము కృతజ్ఞులమైయున్నాము. మా ఆత్మలు పైకెత్తబడియున్నవి. మరియు పరలోక స్థలములలో మీతో కూర్చుండుటకు సామర్ధ్యముకలవారగుటను బట్టి మేము మీకు ఎంతగానో వందనములు చెల్లించుచున్నాము, మరియు ఇప్పుడు, తండ్రి, ఈ గొప్ప మరియు చివరి రాత్రి ప్రేమ విందులో, నీవు మా మధ్య నిలిచియుందువు గాక, మరలా ఈ రాత్రి, "దాహము గొన్నవారలారా, నా యొద్దకు రండి," అని బిగ్గరగా పిలిచెదరు గాక. ప్రభువా, దానిని అనుగ్రహించండి. మీరు అనుగ్రహించెదరని మేమెరుగుదుము, ఏలయనగా మీరు దానిని చేయుదురు. మీరు కార్యములు చేయు విధానము అదేయైయున్నది, మరియు దానిని మీరు ఎన్నటికినీ మార్చివేయరు. మరియు దేవా, మా కొరకై మీరు జీవాహారమును విరిచెదరని నేను ప్రార్ధించుచున్నాను. వాక్యమును హృదయములలోనికి మేము స్వీకరించుటవలన అది మాకందరికి ఆశీర్వాదముల ఊటను తెరచును గాక. చదువునటువంటి వాక్యమును దీవించండి, మరియు సంఘము కొరకై జీవాహారమును నేను విరచుటకు ప్రయత్నించుచుండగా, నాకు సహాయము చేయండి, ఎట్టి అవసరతవున్ననూ, యేసుక్రీస్తు నామములో ఆమేన్.
JUDG 16:27,28
16న్యాయాధిపతుల గ్రంథము వైపు తిరిగెదము, ఇశ్రాయేలు యెక్క న్యాయాధిపతులు మరియు నేను వాక్యభాగమును చదువుటకై న్యాయాధిపతులు 16వ అధ్యాయము వైపు త్రిప్పవలెనని కోరుచున్నాను. న్యాయాధిపతులు 16వ అధ్యాయము, 27 మరియు 28వ వచనములను నేను చదువగోరుచున్నాను.
ఆ గుడి స్త్రీ పురుషులతో నిండియుండెను, ఫిలిష్తియుల సర్దారులందరు అక్కడ నుండిరి, వారు సమ్సోనును ఎగతాళీ చేయగా గుడి కప్పుమీద స్త్రీ పురుషులు రమారమి మూడు వేలమంది చూచుచుండిరి.
అప్పుడు సమ్సోను — యెహోవా ప్రభువా, దయచేసి నన్ను జ్ఞాపకము చేసికొనుము, దేవా దయచేసి యీసారి మాత్రమే నన్ను బలపరచుము, నా రెండు కన్నుల నిమిత్తము ఫిలిష్తియులను ఒక్కమారే దండించి పగతీర్చుకొననిమ్మని యెహోవాకు మొర్రపెట్టెను.
17ఎటువంటి విచారకరమైన దృశ్యము! మరియు ఈ చిన్న అధ్యయనము, దీనినుండి "ప్రభువా, కేవలం మరొక్కసారి," అని పిలుచు పాఠమును నేను తీసికొనగోరుచున్నాను. కేవలం మరొక్కసారి!
అది ఒక ఎండవేళయైయుండవచ్చును. వారు ఒక గొప్ప ఉత్సవమును కలిగియుండిరి. మరియు దానిగూర్చి నేను తలంచిన ప్రతీసారి అది నాకు చెడు అనుభూతిని కలిగించును, ఏలయనగా ఆ మతపరమైన ఉత్సవముల నైజము అటువంటిది. మీకు తెలియును, ఒక ఉత్సవము అది సరియే, అయితే అది ఉత్సవము యొక్క నైజమును బట్టియైయున్నది. మరియు ఈ ఉత్సవము, నిశ్చయంగా దానిగూర్చి చెప్పుటకైనను నాకు ఇష్టములేని ఉత్సవాలలో ఇది ఒకటైయున్నది. అది ఫిలిష్తియ దేశములో అయియున్నది. మరియు వారు ఉత్సవమును జరుపుకొనుచున్నారు, దానిగూర్చి చెప్పుటకు నాకు చెడు అనుభూతిని కలిగించుచున్నది, దేవుని సేవకులపై విజయోత్సవం. దేవుని యొక్క అవిధేయ సేవకుడు ప్రభువు నామముపై నిందను తీసికొనివచ్చెను, మరియు ఓటమిపాలయెను, మరియు ఈ ఫిలిష్తియులు వారి చేప దేవుడు, యెహోవా యొక్క సేవకునిపై విజయము పొందెనని, విజయోత్సవమును జరుపుకొనుచుండిరి.
కూటమును ముగించుటకు అది ఒక అంశముగా లేదా! అయితే నేను ఇక్కడ అయిదు లేదా ఆరు వందల అంశములను చూచుచుండగా నేను నడిపించబడినట్లు అనుభూతి చెందితిని. నా కన్నులు ఈ అంశముపైపడినవి, మరియు "ఈ రాత్రి కొంతసేపు దానిగూర్చి మాత్రమే నేను మాటలాడెదనని నేను నమ్ముచున్నాను,'' అని నేను తలంచితిని. మరియు మనము ఇక్కడ దానిగూర్చి కొంత తెలుసుకొనవలెనని పరిశుద్ధాత్మ దానినే కోరుచుండును.
18అది ఎండవేళ, అని నేను నమ్ముచున్నాను మరియు ఈ గొప్ప చేప దేవుని చుట్టూ అగ్నిలో బలులు దహించబడుచున్నవి మరియు అక్కడ మూడువేలమంది ఫిలిష్తియులు ఆ భవనములోనికి వచ్చుచున్న జంటలవైపు క్రిందికి చూచుచుండిరి. అది (ఆ భవనము) ఒక పుట్టగొడుగు ఆకారములో అమర్చబడియున్నది, వారట్లు దానిని అమర్చిరి. ఒక గొడుగు లేదా, నేను చెప్పవలెననిన అది ఒక పుట్టగొడుగు ఆకారములో ఆ విధానములో ఉన్నది, ఈ విధముగా త్రిప్పబడి, రెండు పెద్ద గోడలతో, లేదా రెండు స్తంభములపై ఆ భవనము ఆధారపడియున్నది, అది బహుశ, ఈ ఆకారములో అమర్చబడియున్నది, అందునుబట్టి ఈ గొప్ప భవనములోనున్న ప్రజలు క్రిందనున్న ముఖ్య అంతస్తులో (ప్రదేశములో) జరుగుచున్న వినోదమును చూడగలరు.
19మరియు బాగా మెరుగుపెట్టబడిన యుద్ధ వీరులు ఆ కూటమునకు హాజరైతిరి మరియు వారి అందమైన ఆభరణములు ధరించిన స్త్రీలు ఆ కూటమునొద్దనుండిరి. మరియు సరిగ్గా అప్పుడే ముఖ్యమైన సంఘటన జరగనున్నది గనుక వారందరు ఆకస్మాత్తుగా ఆగిపోయి, ముందుకు వంగిరి. కొన్నిసార్లు మనము కలిగియుండెదము, మనము ఏమని పిలిచెదమనిన, ప్రాధమిక చర్య. మరియు పిదప పరిచయము, ముఖ్యమైన సంఘటనకు ముందు పరిచయ భాగము. మరియు వారు బహుగా వినోదభరితులైయుండిరి, వారు కొన్నిసార్లు చేసినట్లుగా, బలిఅర్పణ మరియు చంపుట మరియు అటువంటిది. అయితే ఇప్పుడు ముఖ్యమైన సంఘటన జరుగనున్నది, మరియు గొప్ప ఉత్సవమును జరుపుకొను ఈ గుంపు అంతా, ఫిలిష్తియుల భూభాగములోని ఆయా ప్రాంతములవారైయుండిరి. వారంతా లేచిరి, ఏలయనగా వారు భాగ్యవంతులైరి. వారు పుట్టగొడుగువంటి ఆకారముగల ఆ గొప్ప భవనములో కూర్చునియుండిరి. మరియు పేదవారు మరియు అటువంటివారు బహుశ క్రింద నేలపై కూర్చొనెదరు. అయితే వారు ఎక్కడైతే చక్కగా కనబడునో అక్కడ కూర్చుని మరియు వినోదమును చూచుచుండిరి. అది ఒక ఉత్సవపు పెట్టెవలెనున్నది. మూడు వేలమంది! మత్తుపానీయముల చేత ఆ గాలి కంపుకొట్టుచున్నది, దినమంతా త్రాగుడువలన ఆనందభరితులై, త్రాగుచూ మరియు అధికంగా వదురుచూ మరియు అట్లు చేయుచునుండిరి, త్రాగుబోతుల విందువలే, అట్లున్నది. మరియు వారంతా లేచి నిలబడిరి, మరియు ముందుకు వంగిరి. వారు సరిగ్గా చూడగోరిరి. వారు ఈ అవకాశమును వదిలిపెట్టదలుచుకోలేదు, ఏలయనగా అది ఒక ముఖ్యమైన సన్నివేశమైయున్నది.
20వారేమి చూసిరి? ఆ చేప దేవుడైన దాగోను ఉత్సవములో ఆ మధ్యలో నుండి ఒక గ్రుడ్డివానిని ఒక చిన్నపిల్లవాడు నడిపించుచుండెను. తూలుతూ నడచుచున్న, అంధుడైన ఈ ధృడ శరీరుడను, గ్రుడ్డివాడిని స్తంభమునొద్దకు ఆ పిల్లవాడు నడిపించెను మరియు కాలక్షేప కార్యక్రమము కొరకు అతనిని స్తంభము ప్రక్కకు నిలువ బెట్టెను.
కావున అతనే సమ్సోను, ఒక ప్రసిద్ధిచెందిన దైవసేవకుడైయుండెను, ఇప్పుడైతే అణిచివేయబడి, గ్రుడ్డివాడై, బలహీనుడై, అక్కడ నిలబడియుండెను, ఒక అవమానకరమైన కార్యమైయుండెను. అది ఒక అవినీతిమయమైన, అట్టడుగున పడిన తరమునకు ఒక మాదిరివలెనున్నది. అది దేవునితో పట్టును కోల్పోయిన ఒక సంఘమునకు అది మాదిరిగానున్నది, ఏలయనగా ఇక్కడ సమ్సోను దానినే సూచించుచున్నాడు. అణచివేయబడి, బ్రద్దలైనవాడై ఒక భయంకరమైన స్థితిలో అతనక్కడ కూర్చునియున్నాడు లేదా నిలబడియున్నాడు. కావున అతనట్లు నిలబడియుండుటను మీరు ఊహించగలరా, ఈ గొప్పవ్యక్తి, ఒకప్పుడు, తాను ఏమి చేయగలిగియుండెను; మరియు ఇక్కడ అణిచివేయబడి అటువంటి స్థితిలో అతడిక్కడ నిలబడియుండెను, నేను చెప్పినట్లుగా, బ్రద్దలైనవాడై, ఈ రాత్రి నేను ప్రకటింపగోరినట్లు ఒక గురుతుగా ఉండెను. ఈ గురుతు సరిగ్గా మనమిప్పుడు జీవించుచున్న ఘడియను, ఇప్పటి సంఘము యొక్క స్థితిని సూచించుచున్నది; బ్రద్దలై, దేవుని యొక్క వాక్యమునుండి వేరై, దానియొక్క స్థానము నుండి అణచివేయబడుటయైయున్నది. మరియు ఈ రోజు ప్రశ్న ఒకటి వచ్చుచున్నది. గోడమీద చేవ్రాత ఉన్నది మరియు దానిని ఎవరు చదవగలరు? దానిగూర్చి వారికేమియూ తెలియదు.
JUDG 16:26
21ఆ ఫిలిష్తియుల మనస్సులను తీసుకొని మరియు పరిశీలించెదము. ఈ మనుష్యుని యొక్క సమ్సోను అను పేరు ఒకప్పుడు దేశమంతటిని గడగడలాడించెను, కేవలం "సమ్సోను" అని చెప్పితే చాలు, ఎందుకనగా దేవుడు అతనితో ఉండెను, మరియు ఆయన పేరుకే దేశములు భయపడుచుండెను.
యేసుక్రీస్తు యొక్క నామము కూడా ఆ మాదిరిగానే వాడబడెను. అయితే, ఇప్పుడు దానిని శాపవచనముగా, హాస్యముగా వాడుచుండిరి. దానికి వారెటువంటి గౌరవమును ఇచ్చుటలేదని కనిపించుచున్నది. ఆ నామము క్షయమైన భాషలలో పెట్టబడిన నామములన్నింటి కంటెను పై నామమైయున్నది. పరలోకములోనున్న ప్రతీ నామముకంటెను, భూమిపైనున్న ప్రతినామముకంటెను ఆ నామము అత్యున్నతమైన నామమైయున్నది. మరియు పరలోకములోను మరియు భూలోకములోను ఉన్న కుటుంబమంతటికి ఆ నామము పెట్టబడియున్నది. అయిననూ మనుష్యులు దానిని శాపవచనముగా వాడుతున్నారు. సంఘసభ్యులు దానిని హాస్యముగా తీసుకొనెదరు, మరియు అనేక మతనాయకులు వారియొక్క ఆచారములతో దానిని దూషించుచున్నారు. ఆ కారణము చేతనే మనము కమ్యూనిజం యొక్క విశ్వాసములోను, రోమనిజం మరియు ప్రొటెస్టంటిజం మరియు ఈ దినమున భూమిపై లేచుచున్న కార్యములతోను మనము అణిచివేయబడియున్నాము. మరి ఆ కారణము చేతనే మనము అణిచివేయబడితిమి. మనము ఈ సమాధానములను తెలుసుకొనవలసినవారమైయున్నాము. ఈ దినమునకై దానిని దేవుడు తన పుస్తకములో ఉంచెను, అయితే మనము వేరే కార్యమువైపు వెళ్ళితిమి, దానిగూర్చి మరచిపోతిమి.
22అక్కడ నిలిచియున్న అనేకమంది ఫిలిష్తియులలో, వారిలో గొప్ప యుద్ధవీరులు ఉండిరి, ఎటువంటి సందేహము లేదు …. "తదుపరి సన్నివేశం సమ్సోనుదే" అని ఎవరో ప్రకటించిరి. ఆ యోధులలో అనేకులు, చక్కని ఆభరణములు ధరించి మరియు రంగులు పులుముకొన్న స్త్రీలు, మెట్లవరుస ప్రక్కన, ఆసరా కొరకు ఏర్పాటు చేయబడిన చువ్వల నుండి చూచిరి మరియు సమ్సోను ఒక భిన్నమైన విధంగా నిలబడుటను గుర్తుంచుకొనిరి, ఒకసారి దేవుని ఆత్మ అతనిపైయుండినప్పుడు వెయ్యిమంది, ఫిలిష్తియులు అతనిచుట్టూ ఉండగా అతను తన చేతిలో గాడిద దవడ ఎముకతో నిలబడియుండెను. మరియు వారు ఆశ్రయము కొరకై ఎక్కడో ఒక బండ దగ్గరకు పరుగెత్తిరి.
ఎడారిలో పడియున్న గాడిద యొక్క దవడ ఎముకను ఒక వ్యక్తి తీసుకొన్నప్పుడు, ఒక రాతిమీద లేదో దేనినైనా ఆ ఎముకతో ఒక దెబ్బ కొట్టినట్లైతే, అది దానిని ముక్కలుగా పగలగొట్టునని ఎవరికైనా తెలియును. మరియు ఆ శిరస్త్రాణములు, వాటిలో కొన్ని ఒక అంగుళము, నుండి అంగుళమున్నర వరకు మందము కలిగి ఇత్తడివైయుండెను. మరియు ఈ మనుష్యుడు ఒక సైనికుడు కాదు, మరియు ఈటెతో అతడు తర్పీదు పొందిన వ్యక్తి కాదు. మరి ఫిలిష్తియులైతే ఈటెలు మరియు ఇతరమైనవి వారిని తాకకుండా వారిని కాపాడునట్లు లోహముతో చేయబడి కిటికీకి జాలిని అల్లినట్లుగా లోహముతో అల్లబడిన రక్షణ కవచమును ధరించిరి; మరియు శిరస్త్రాణములతోను మరియు డాలులతోను మరియు ఈటెలతోను వచ్చిరి. మరియు వారు సమ్సోనను ఈ వ్యక్తిని చుట్టుముట్టిరి మరియు "గొప్ప సైన్య సమూహము, ఈ వ్యక్తిని పట్టుకొనుటకు సామర్ధ్యము కలిగియుండెను," అని తలంచితిరి.
JUDG 15:14-16•
JUDG 16:3
23మరియు అతను తన చేతిలో ఏమియూ కలిగియుండలేదు. మరియు అతడు ఒక పాత ఎండిన గాడిద దవడ ఎముకను కనుగొనెను, మరియు అతడు కుడికీ, ఎడమకి కొట్టుట ప్రారంభించెను, ఆ వెయ్యిమంది ఫిలిష్తియులను చంపువరకు అట్లు చేసెను. ఎందువలన? "ప్రభువు యొక్క ఆత్మ అతనిమీద ఉండెను," అని పరిశుద్ధ గ్రంథము చెప్పెను.
అయితే ఇక్కడ అతను దానికి భిన్నముగా నిలబడియుండెను. అతడు తన రహస్యమును చెప్పెను. మరియు వారు అతనిని స్పష్టముగా గుర్తించగలరు.
దెలీలా అతనిని మోహింపజేసి గాజా పట్టణములోనికి తీసుకు వెళ్ళిన ఆ రాత్రి జరిగినదానిని గుర్తుంచుకోగల మరియొక గుంపువారు అక్కడ ఉండియుండవచ్చును. మరియు వారు ఇనుప కడ్డీలుగలిగి దాదాపు వంద కిలోలు లేదా అంతకన్నా ఎక్కువ బరువుగల ఆ పట్టణపు ఇత్తడి ద్వారములను మూసివేసిరి. మరియు కనీసం ఈ దినమువరకైనా మనము కలిగిలేనటువంటి గడియలలో భద్రముగా తాళము వేసికొనిరి. మరియు వారిట్లు చెప్పిరి, "సమ్సోను, ఫిలిష్తియులు నీ మీద పడుతున్నారు." మరియు అతడు త్రాళ్ళను తెంచుకొని నడచి వచ్చుచుండగా ద్వారము చుట్టూ నిలబడియున్న అనేకమంది సైనికులు మౌనులైరి. మరియు వారు, రాత్రివేళ దీపము వేయగానే బొద్దింకలవలే చెదిరిపోయి. ప్రభువు యొక్క ఆత్మ అతని మీద నుండెను, అక్కడకి సమీపించి, ఒక ద్వారమును పెల్లకించి మరియు ఇంకొకదానిని కుదిపి మరియు వాటిని తన భుజములపై పెట్టుకొని కొండమీదికి నడిచి వెళ్ళెను మరియు కూర్చొనెను. దానిని వారు గుర్తుంచుకొనగలిగిరి. "ఎటువంటి యోధుడు," ఆ గొప్ప విజయోత్సవములో అతనిని చూచిన ఆ కార్యమును వారిలో అనేకులు గుర్తుంచుకోగలరు, "అయితే ఇప్పుడు అతనివైపు చూడండి!"
24అది సంఘము యొక్క దృశ్యమైయున్నది. నేను సంఘమును గూర్చి పరిశుద్ధ గ్రంథములో చదవగలను, అది మొదటిసారిగా పరిశుద్ధాత్మతో నింపబడినప్పుడు, గొప్ప సూచనలు మరియు అద్భుతములు వారి కూటములను అనుసరించెను. కొన్ని సంవత్సరముల క్రితం, నలభై లేదా యాభై సంవత్సరముల క్రితం సంఘము అదే శక్తితో నింపబడుటను, మనము గుర్తుంచుకోగలము. అయితే ఈ దినమున దానివైపు చూడండి, ఆమె (సంఘము) వస్త్రములు ఒలిచివేయబడి నిలబడియున్నది. ఏదో ఆమెను ఒలిచివేసినది, అదే కార్యము సమ్సోనును ఒలిచివేసినది, అంతయూ అతనిని తీసుకొనిన ఒక స్త్రీ మాటలు వినుటవలన జరిగినది. మరి సంఘమును ఏది ఒలిచివేసినది, సంస్థాగతమైన స్త్రీ స్థానము, ఆ పాత యెజెబెలు మాటలు వినుటవలన జరిగినది. సమ్సోనును సరిగ్గా ఎవరినైతే జయించుటకు లేపబడెనో, వారే అతనిని జయించిరి. మరియు పెంతెకోస్తు సంఘము ఈ రాత్రి అదే బాటలో నిలబడియ్నుది. సరిగ్గా సంస్థాగతమైన పద్దతిని జయించుటకు ఆమె లేపబడెను, అయితే ఆమె తిరిగి అందులో చేరి మరలా ఒక సంస్థగా మారినది, మరియు ఆమె శక్తి వెళ్ళిపోయినది. నిజము. ప్రభువు యొక్క శక్తి ఆమెను వదిలిపోయినది.
మనము దానిని తెలిసికొనవలసినవారమైయున్నాము. ప్రతీసారి, చరిత్రలో సంఘము సంస్థగా మారినవెంటనే, సరిగ్గా అప్పుడే దేవుడు దానిని విడిచిపెట్టెను. అది పడిపోయి మరి ఎన్నటికి లేవకుండెను. మరియు పెంతెకోస్తు, సంఘశాఖ నుండి బయటికి వచ్చిన ఒక కార్యముగా నున్నది, కాని, అదేయైయున్నది, పరిశుద్ధాత్మకు బదులుగా మనము మానవ-కల్పిత నాయకత్వమును స్వీకరించాము.
25మరియు సమ్సోను చేసినది ఖచ్చితముగా అదేయైయున్నది. అతను అక్కడ నిలబడియున్నప్పుడు ఆ మనుష్యుని యొక్క మనస్సులో ఏమి మెదిలెనో, దానిగూర్చి ఆలోచించుడి. దేవుడు అతనికిచ్చియున్న గొప్ప విజయోత్సముల గూర్చియు, దేవుడు అతని ద్వారా మరియు అతని కొరకు చేసిన గొప్ప కార్యములను గూర్చియు; మరియు అతను దేవునితో నున్నప్పుడు, ఆయన ప్రజలతో నుండినప్పుడు అతను కలిగియున్న దేవుని యొక్క ఆనందము మరియు సమాధానమును గూర్చియు బహుశ అతను ఆలోచించెను. సమ్సోను ఆయనను ఎట్లు విఫలపరచెను! ఇప్పుడు, ఏ దేశమునైతే నాశనము చేయుటకు సమ్సోను లేపబడెనో వారే అతనిని బంధించిరి.
మరియు ఏ కార్యమునైతే చేయుటకు పెంతెకోస్తును లేపెనో అదే వారిని బంధించివేసినది, సహవాసము కోల్పోయిరి, శక్తిని కోల్పోయిరి, పనికిరాని విషయములలో శ్రద్ధచూపుచూ, ఎక్కువగా లోలోపల మధనపడుచూ, నులివెచ్చని సంఘసభ్యులైరి. ఉన్నతమైన విషయములు, మహోన్నతమైన, ప్రతీదియూ, అయితే వారు రక్షణ శృంగనాదము చేయునది కలిగియున్నయెడల లేదా ఎక్కడో ఆ మూలలో ఆ చిన్న పాత డోలు వాయిద్యము, లేక పాత గిటార్ కలిగియుండినయెడల మంచిది. మిలియన్ల డాలరు ఖరీదు చేయు మందిరములు కలిగియుండుటకంటే, ఆ విధముగా నుండుటకు నేను ఇష్టపడుచున్నాను.
2PET 2:22•
REV 17:5
26అయితే అతడు అచ్చట నిలబడియుండెను. అతను ఓడిపోయెను. ఏ దేశమునైతే నాశనము చేయుటకు దేవుడు అతనిని లేపెనో, ఇప్పుడు దానికే అతడు ఒక బంధీగా వున్నాడు.
వారిని వినోదపరచుటకు అతనితో తమాషాలు చేయుచుండిరి. మరియు ఈ దినమున కూడా అదేయైయున్నది, వారిని వినోదపరచుటకు ఒక చిన్న చిట్కావంటిది చేయుచున్నారు.
వాగ్దానము చేయబడిన దేవుని వాక్యము నుండి తీసుకొనిపోబడుటకు అతనిని ఒక స్త్రీ మోహింపజేయునట్లు చేసిరి. ప్రకటన 17లో చెప్పబడిన "వేశ్యలకు తల్లి" యైన యెజెబెలు అను స్త్రీ చేత, వారు విడిచి బయటకు వచ్చిన అదే వాంతిలోనికి కొనిపోబడులాగున అదే కార్యమును సంఘము చేసినది. పరిశుద్ధ గ్రంథములో చెప్పబడినట్లుగా, "ఒక పంది తిరిగి బురదలోనికి దొర్లినట్లు, మరియు ఒక కుక్క తన వా౦తికి మరలినట్లు."
మరియు ఒక పంది, పందిగా ఉన్నంతవరకూ, అతను, అతని స్వభావము ఒక పంది గనుక, అతను తిరిగి నేరుగా బురదలోనికి వెళ్ళును. మరియు, దానిని బురద గుంటలోనికి వెళ్ళకుండా మీరు చేయగల ఒకే ఒక విధానమేదనగా దాని స్వభావము మార్చుట ద్వారా అయియున్నది.
27ఈ దినమున సంఘములో కూడా మీరు మార్పును తెచ్చుటకు అదొక్కటే విధానమైయున్నది, అది స్వభావమును మార్చుట ద్వారాయైయున్నది. మరియు ఏదో ఒక సార్వత్రిక సంఘ పద్ధతివలన బోధకులు అంతటా నడిపించబడుటకు బదులు, వారిని తిరిగి మరలా ఆ దేవునికి భయపడు ఆత్మయొద్దకు నడిపించుటకు, అది వాక్యము ద్వారా పరిశుద్ధాత్మ చేయవలసిన పనైయున్నది. అది నిజము. కుక్క వాంతి చేసినయెడల, మరి అది మొదటిసారి దాని కడుపులో జబ్బు కలుగచేసినయెడల, అది మరలా దానికి జబ్బు కలగజేయదా? మరియు అటువంటి ఒక గందరగోళము నుండి దేవుడు మనలను బయటకి పిలిచినయెడల, ఏలయనగా… మంచిది, అది మరలా అదే కార్యమును చేయదా? అప్పుడు మనము తిరిగి నేరుగా దానిలోనికి వెళ్ళెదము, అదే కార్యము. అది ఎన్నటికీ చేయకూడనిదైయున్నది.
2PET 2:22
28ఈ యెజెబెలు పద్ధతినిబట్టి సంఘ సమైఖ్యలోనికి వారు తమకు తాముగా చేరుచూ, ఇప్పుడు దేవుని వాక్యమునకు ఆత్మీయమైన గ్రుడ్డివారిగా వారున్నారని నేను చెప్పుచున్నాను. మన గొప్ప సువార్తిక బోధ ఏదనగా, ఒక సంస్థగా ఉండుటయను దానిని వదిలిపెట్టుటయైయున్నది. ఏలయనగా ఈ సంఘ సమైఖ్యలో లేని సంఘములన్నియూ, దానిగూర్చిన వార్త నా యొద్దనున్నది, కనీసం శ్రమల సమయములోనైనా నీ సంఘము ఈ సంఘముల సమైఖ్యలో లేనియెడల, వారు నీ సంఘమును సామాగ్రి పెట్టు స్థలముగానో లేక వారు కోరిన మరి దేనికైననూ వారు వాడుకొనగలరు. మరియు ఏ వ్యక్తియైనా ఈ సంఘముల యొక్క సమైఖ్యకు అనుబంధము లేకుండా ఎవరికైనా ప్రార్ధించుచుండగా పట్టుబడినయెడల, సంయుక్త వ్యవస్థను వ్యతిరేకించిన కారణముతో అతనిని చంపెదరు. అది నిజము. వాషింగ్టన్ నుండి వచ్చిన ఆ పత్రములు నా యొద్ద నున్నవి. మీరు దానిలోనికి వెళ్ళునట్లు వారు మిమ్ములను బలవంతము చేసెదరు. ఆ కారణముచేతనే నేను ఈ సంస్థాగతమైన పద్ధతికి వ్యతిరేకినైయున్నాను. అది అదియే. అది మృగము యొక్క ముద్ర అయినందున దాని విషయమును నేను నిశ్చలముగా వుంచవలసియున్నది, కాని అది సత్యమని ఇప్పుడు నీవు తెలిసికొనుటకు సమయము గతించిపోయినది. ఓ, చూశారా. అది. అది ఖచ్చితముగా అదియే.
REV 3:19
29ఇప్పుడు, అది ఏమి చేసియున్నది? అది పేరు తప్ప మరేమిలేని, శక్తిని కోల్పోయిన సంఘమును తీసుకు వచ్చినది, అది ఖచ్చితముగా క్రీస్తును తృణీకరించి మరియు వెలుపలనుంచిన ప్రకటన 3లోని లవొదకయ సంఘమును చూపించుచున్నది. ఖచ్చితముగా. ఎందువలన? అది ఖచ్చితముగా దానియొక్క తల్లి చేసినట్లే చేసియున్నది, తిరిగి సంస్థాగతమై పోయినది. పెంతెకోస్తు, సంస్థలో నుండి జన్మించినది, దానినుండి జన్మించినది; మరియు ఏదో పాఠశాల నుండి కొందరు పిల్లలను వారు కలిగిన వెంటనే మేడ గదులకు బదులు సెమినెరీలు మరియు అటువంటి కార్యములను వారు కలిగి యుండిరి. మరియు ఇప్పుడు ఒక వ్యక్తి విదేశీ మిషినరీగా అనుమతించబడుటకు ముందు అతడు మానసిక పరీక్షగుండా వెళ్ళవలెను. మొట్టమొదటి సంఘము పరీక్షించబడవలసిన పనిలేదు, ఎటువంటి మానసిక పరీక్ష లేదు, అయితే వారు యేసుక్రీస్తు యొక్క రక్తపు పరీక్ష ద్వారా వెళ్ళవలసివచ్చినది, ఇటువంటి తేడా కలిగించినదేమిటీ.
JOHN 15:7
30గమనించండి, సమ్సోను తన రహస్యమును దెలీలాకు చెప్పెను. ఆమె ఆఖరిగా అతనిని ప్రేమించెను మరియు జోకొట్టెను. మరియు అతడు చక్కనివాడని అతనితో చెప్పెను, ఆమె అతనిని ఎట్లు ప్రేమించెనో చెప్పెను, రహస్యము ఎక్కడనున్నదో తెలుసుకొనేవరకు అట్లు చెప్పెను, తర్వాత ఆమె ఆ రహస్యమును కత్తిరించెను.
మరియు అప్పుడే మొలకెత్తిన ప్రొటస్టెంటు సంఘమునకు ఆ పాత తల్లియైన యెజెబెలు చేసినది. ఖచ్చితముగా అదేయై యున్నది. మరియు పోరు కలిగియున్నారని చెప్పిన కొన్ని సిద్ధాంతముల విషయములలో వారు ఇప్పుడు రాజీపడుచున్నారు, కావున ప్రపంచమంతటా వారు ఐక్యతను కలిగియుండెదరు. మరియు మొట్టమొదటిగా నైసియావద్ద సంఘము తన జుట్టు పాయను క్షారము చేయించుకొన్నది, మరియు ఆమె ఇక్కడ ఉండుటనుబట్టి ఆమె మరలా వారిని కత్తిరించబోవుచున్నది. అదే ఆమె రహస్యము, అది వాక్యమైయున్నది. "నాయందు మీరును, మీయందు నా మాటలును నిలిచియున్నయెడల, మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకనుగ్రహించబడును." చూశారా, అక్కడే వారు వారియొక్క రహస్యమును కోల్పోయిరి. ఇప్పుడు వారివైపు చూడండి, సరిగ్గా సమ్సోనువలె, ఓడిపోయియున్నారు. సేవకులు, జన్మించుటకు బదులు…
2TIM 3:3,4
31డేవిడ్ డుప్లెసిస్ ఒకసారి చెప్పినట్లు, "దేవునికి పెంతెకోస్తు మనవళ్ళు లేరు."
అయితే ఆ విధానములో మీరు చెప్పెదరు, "నా తల్లి పెంతెకోస్తురాలు. ఆమె ఒక అనుభవమును కలిగియున్నది. ఆమె ఇది చేసినది. నా తండ్రి ఫలాన - ఫలానా చేసియున్నాడు. దానివలన నీకెటువంటి ప్రయోజనము కలుగదు. నీవునూ అదే కార్యమును కలిగియుండవలెను.
ఇప్పుడు మన సేవకులను పొదుగునటువంటి సెమినరీలు మనకున్నవి, మరియు ప్రతీసారి గొప్పవాటిని మనము కట్టుచున్నాము. మరియు మనస్తత్వ శాస్త్రము యొక్క విద్యార్థులను మనము కలిగియున్నాము, అయితే నేను మానసిక శాస్త్రమును (Psychology) లెక్క చేయను. నేను కేవలం యేసుక్రీస్తును తెలుసుకొనగోరుచున్నాను, అంతే నేను తెలుసుకొనగోరినదంతా ఆయనగూర్చేయైయున్నది. ఇప్పుడు దానిని మనము కలిగియున్నామని మనము కనుగొన్నాము. అది నిశ్చయముగా II తిమోతీ 3లోని ప్రవచనమును నెరవేర్చవలసియున్నది, ఎక్కడైతే, నులివెచ్చని, మీకు తెలియును, "మూర్ఖులు, గర్వాంధులు, దేవునికంటే సుఖానుభవము నెక్కువగా ప్రేమించువారు, మరియు అతిద్వేషులు, అజితేంద్రియులు మరియు మంచిని ద్వేషించువారు."
32అది మనకు ఏమి చేసెను? అది మన పెంతెకోస్తు స్త్రీలను దాదాపు ఒక హాలీవుడ్ ప్రదర్శకులుగా మార్చివేసినది. అది నిజము. సినిమాలకు, సినిమా ప్రదర్శనలకు వెళ్ళుట తప్పైయున్నది. అయితే ఇప్పుడు, మీకు తెలియును దయ్యము వారిని దాని యొద్దకు తరిమినది, వాడు దానిని (టి.వి) నేరుగా వారి గృహములోనికే తెచ్చియున్నాడు, చూశారా. అది వాస్తవం. దానిని చేయుట తప్పైయున్నది. మన సహోదరీలు తమ జుట్టు కత్తిరించుకొనుట లేదా పొట్టిదుస్తులు ధరించుట తప్పైయున్నది. అయితే, పెంతెకోస్తు, వారి సంస్థ యొక్క ఆలోచన ప్రకారం ఇప్పుడు అది తప్పు కాదని అనుకొనుచున్నది. అయితే దేవుని వాక్యప్రకారము అది ఇంకనూ తప్పే అయియున్నది! అయితే, మీరు చూడండి, వారు వారియొక్క శక్తి కత్తిరించి వేయబడినది, చూశారా. మరియు వారు చెప్పెదరు, "మంచిది, మా సంఘములు నమ్మును…" మీ సంఘములు ఏమి నమ్మునో నేను లెక్క చేయను. అది దేవుడేమి చెప్పెనో అదేయైయున్నది! ఆ కారణము చేతనే, ఈ దినమున, జవాబు లేకుండా, అమె నిలబడియున్నది.
33అది ఖచ్చితముగా సమ్సోను నిలబడినట్లే ఉన్నది. సమ్సోను అదే రీతిగానున్నాడు. అతను అక్కడ నిలబడుటను బట్టి తన పొరపాట్లను అతను తలంచుకొనుచుండ వచ్చును. ఒక వ్యక్తి అక్కడ నిలబడియుండి మరియు సున్నితముగా ఆలోచించునని నేను తలంచుట లేదు. అయితే ఇప్పుడిక్కడ అతను ఉండెననీ ఎరిగియుండి ఏమి తలంచును, అతను కేవలం ఒక ఆటంకముగా మారెను. గొప్ప మనుష్యుడు అక్కడ నిలబడియుండుట, ఓ అది ఎటువంటి పరిస్థితియైయున్నది! ఆ మనుష్యునిలో నున్నదంతయూ నేను మాటలాడునదేదనగా కండలు, ప్రతీది అక్కడ వున్నది. అతనింకనూ అతని కండలను కలిగియున్నాడు. అతడింకనూ అతని గొప్ప కండలను అతని జబ్బలను కలిగియున్నాడు. అతను గొప్ప పిడికిళ్ళు కలిగియున్నాడు. అతడింకనూ బహుశ, అతడు మునుపు ఉన్నట్లుగానే గంభీరముగా నుండెను. ఖచ్చితముగా పెంతెకోస్తు సంఘము ఇంతకుముందెన్నడూ లేనంత పెద్దగా ఉన్నది, అయితే దేవుడేడి? అది అంతే. అవును. అతను అక్కడ నిలబడి తన తప్పిదములు జ్ఞాపకము చేసుకొనుచుండగా, అసలు మొదటగా దానికి కారణమును అతడు జ్ఞాపకము చేసికొనెను. మొదటిగా అట్లు జరుగుటకు కారణమేదనగా, అది ఖచ్చితముగా అతని యొక్క భౌతికమైన కన్నులు ఊడదీయుట వలన కాదు, అయితే అది, అతని ఆత్మీయదృష్టి తొలగిపోయెను, తద్వారా దెలీలా అతనిని లాలించుటకు కారణమాయెను.
JUDG 16:28
34మరియు ఈ దినమున సంఘమును ఆటంకపరచునది అదేయైయున్నది, అదేదనగా దేవుని వాక్యము యొక్క ఆత్మీయ దృష్టి, ఒక కుప్ప ఆచారములకై మారకము చేయబడినది. దయ్యము కలిగియున్న కన్ను అదేయైయున్నది. పాడు చేయగల మొదటి కార్యమేదనగా, నీ కన్నులను ఊడబీకును, "అది ఒక పరిశుద్ధ గుండ్రాళ్ళ గుంపు" అని చెప్పును. "అది ఇదైయున్నది, అదైయున్నది లేదా మరొకటైయున్నది, లేదా ఒక దయ్యపు కదలికయని, లేదా అది మనస్సును చదువుటయని, లేదా ఆ రీతిగా, అది ఏదో అయియున్నది," అని చెప్పును. అతడు నీ కన్నులను పొడిచినయెడల, నీవు చీకటిలో వుందువు.
మరియు గమనించండి, అతని ప్రార్ధనలో సమ్సోను యొక్క మొదటి విజ్ఞప్తి ఏదనగా, "ప్రభువా, నా రెండు కన్నుల నిమిత్తము నేను పగతీర్చుకొనునట్లు!" అక్కడే అతనికి సమస్య వచ్చినదని అతడు ఎరిగియుండెను. గమనించండి, అతని జుట్టు పాయలు ఎదుగుచుండిను, అయితే అతను గ్రుడ్డివాడిగా నుండెను. అతని మిగిలిన దినములన్నియూ అతడు తడువులాడుచూనుండవలెను. అతను గ్రుడ్డివాడై యుండెను,
మనము ఎన్నడూ కలిగిలేనటువంటి గొప్ప యాంత్రిక శక్తివంటిది కలిగియుండవచ్చును, మరియు చాలామంది సభ్యులను కలిగియుండవచ్చును; అయితే నీ యెదుటే జరుగుచున్నదానిని చూడలేనటువంటి గ్రుడ్డివానిగా నీవున్నప్పుడు దానివలన నీకేమి ప్రయోజనము? సరిగ్గా ఇక్కడే ఏమి జరుగుచుండెను, ప్రతీదినము ప్రజల మధ్య, పరిశుద్ధాత్మ తననుతాను బయలుపరచుకొనుచుండెను. మరియు ప్రజలు దానిని చూచుట లేదు. అది గ్రుడ్డితనమైయున్నది, ఆత్మీయ గ్రుడ్డితనము!
MARK 8:18
35వారు నిలబడి యేసు అద్భుతములను మరియు అటువంటివి చేయుటను గమనించిరి, మరియు తనను తాను మెస్సీయగా ప్రకటించుకొనుటను గమనించిరి, మరియు దానిని వారు చూడకయుంటిరి. వారికి కన్నులున్నవి, కాని వారు చూడలేరు," అని ఆయన చెప్పెను. వారు గ్రుడ్డివారైయున్నారు.
మరియు సమ్సోను గ్రుడ్డివాడైయుండెను. అయితే సంఘము ఇంతవరకూ గుర్తించనటువంటిది, సమ్సోను గుర్తించినదేదో ఇక్కడ వున్నది, మరలా వెనుకకు వచ్చుటకు సాధ్యపడునని అతడు ఎరిగియుండెను.
సంఘము దానిని మాత్రము ఎరిగియున్నయెడల, సాధ్యపడునని, అయితే ఈ రోజు ప్రజలు ఇంకనూ ఆ దర్శనమును పట్టుకొనేలా లేరు. ఒక సాధ్యపడే మార్గమున్నదని దానిని గుర్తించునట్లు వారు లేరు. అది ఆ విధంగా రాదు. నీవు కొద్దిగా కేకవేయవచ్చును, కొద్దిగా నీ చేతులను తట్టవచ్చును, లేదా ఇంకా కొద్దిగా నాట్యమాడవచ్చును, అది అట్లు కానే కాదు. కాదు. అది తిరిగి వాక్యమునొద్దకు వచ్చుటయైయున్నది; మరలా వెనుకకు వచ్చి మరియు వాక్యములోనికి వెళ్ళుటకు సాధ్యపడు మార్గమున్నది. అక్కడ మీరు దానిని దాటివేసితిరి. గమనించండి, వారు సహనముతో కూర్చొనెదరు. ఓ, నిశ్చయంగా చప్పట్లు కొట్టెదరు? అవునండి. అయితే, మీరు చూడండి, అదంతయూ లంగరు లేనటువంటి ఓడ ప్రయాణమైయున్నది.
36అన్యులైనవారు చప్పట్లు కొట్టుటను, నాట్యమాడుటను, భాషలలో మాట్లాడుటను మరియు ఆ కార్యములన్నియు చేయుటను మరియు దానికి అనువాదము చెప్పుటను నేను చూచియున్నాను. అయితే వారు ఆఫ్రికాలోని అన్యులైయున్నారు. నిశ్చయంగా, వారు ఒక పెన్సిలును క్రింద, పడవేయుటను నేను చూచియుంటిని మరియు ఆ మంత్రగత్తె అచ్చట నిలబడి ఆ పెన్సిలును నిలబడునట్లు చేసెను. మరియు ఆ స్థలములో పైకి, క్రిందికి పరుగెత్తునట్లు చేసెను మరియు వెనుదిరిగి ఏఏ, "క్షారము మరియు జుట్టుకత్తెర, రెండిటివలె," అది ఆడుచుండెను. మరి ఏదో ఒక అన్యభాషలో వ్రాసెను మరియు అక్కడ నిలిచియున్నవారిలో ఒకరు అర్ధము చెప్పుటను నేను చూచితిని. ఓ, మై!
మీరు దానిపై ఆధారపడలేరు. అనేకులు భాషలలో మాట్లాడెదరు. మరియు వారు యేసుక్రీస్తు యొక్క ప్రాధమిక సత్యములను నిరాకరించెదరు. నేను నా పరిశుద్ద గ్రంథమును తీసికొని, ఒక వ్యక్తి ముందుంచితిని; అతనక్కడ నిలబడి భాషలలో మాటలాడుచుండెను. మరియు సహోదరుడా, ఇదే ఖచ్చితమైనది," అని నేను చెప్పితిని.
''నేను కనీసం దానిని చూచుటకైనను ఇష్టపడను. దేవునికే మహిమ! యేసు ఏమి చెప్పెనో నాకు తెలియును, ఇక మిగతావాటిని నేను లెక్క చేయను. హల్లెలూయా! దేవునికి మహిమ," ఆ విధముగా. ఎందువలన, సత్యమునకు తన వీపు త్రిప్పిన ఒక వ్యక్తి, సత్యమును చూడకుండునట్లు ఆ విధముగా ఒక ముసుగును కలిగియుండును, అది వేషధారణ మరియు అది అవధులు లేనంత వేషధారణయైయున్నది. ఏలయనగా, సత్యమును ఒప్పుకొనుటవలన అతడు తన సహవాసపు కార్డును వదులుకొనవలసి వచ్చును. అది సమ్సోను స్థితికంటెను దయనీయమైనది. గమనించండి. అయితే వారు దానిని గ్రహించలేకపోయిరి. వారు నిశ్చలముగా కూర్చుండిరి.
37ఇప్పుడు, ఓ, నిశ్చయముగా మనము గొప్ప హార్థిక సమావేశములను, సభలను కలిగియుంటిమి, మనము వాటిని లోకపరమైన ఉజ్జీవములు, మరియు అటువంటివి అని పిలచెదము, మరి అంతయు తళుకుబెళుకులే, నిశ్చయంగా, గొప్ప విషయములు, మరియు గొప్ప ప్రకటనలతో ఉండును. "ఈ కాలపు వర్తమానముతోవున్న వ్యక్తి మరియు ఫలానా మరియు ఫలానా." మనకు అలాటివన్నియు వున్నవి, అయితే దేవుడెక్కడ? మరి అటువంటి కార్యము కొరకే మనము ఎదురుచూచుచున్నాము, దేవుడెక్కడ? ఒక గొప్ప విద్యను ప్రదర్శించువాడు, చాలినంత విద్యావంతుడైయుండి… అతడు చెప్పినది. సగంమంది ప్రజలు అర్ధము చేసుకోలేని పదములతో అతడు బోధించును, మరియు అయిననూ అతనికి గౌరవప్రదమైన డిగ్రీయున్నది, మరియు ఒక డిగ్రీ, మరియొక డిగ్రీ, మరియొక డిగ్రీ తద్వారా పరిశుద్ధ గ్రంథము యొక్క వ్యాఖ్యానమును సమకూర్పు చేసి పదములన్నియు కలిపి, మరియు నిటారుగా నిలువబడి, "ఆమేన్" అని స్పష్టముగా పలికి, సైనికునివలె తిరిగి, వేదికపైనుండి అతడు దిగి వెళ్ళును. అయితే దేవుడెక్కడ? ఒకప్పుడు సమ్సోను అదే స్థలములో తనకుతానుగా నిలబడెను. మరియు దేవుని యొక్క శక్తిని ఎరిగియుండెను, అయితే ఇప్పుడు ఆ భాగ్యములన్నింటిని అతడు క్షౌరము చేయించుకొనెను. అతను అంతకు ముందుకన్నా గొప్పగా అచ్చట నుండేను, అయితే దేవుని అక్కడ లేకుండెను.
38ఈ దినమున మనకు అటువంటివి చాలా వున్నవి. అటువంటివి మనము కలిగి యు౦డుట చాలా చెడు అయివున్నది, అయితే దానిని మనము కలిగియున్నాము. అయితే మనము గమనించితిమి. అయితే అది దేవుని ఆత్మను తిరిగి తీసికొనిరాలేదు. ఇప్పుడు దానిలోని కార్యమేదనగా, దానిని తిరిగి పొందుకొనుటకు దాని వెలను చెల్లించుటకు ప్రజలు ఇష్టపడుటలేదు. దేవుడెల్లప్పుడూ, ఆయన ఎప్పుడున్నట్లుగానే ఒకే రీతిగా ఉండునని నేను నమ్ముచున్నాను. అయితే దానిలోని కార్యమేదనగా ప్రజలు లోకములో ఎంతగానో చుట్టుకొనిపోయిరి, మరియు లోకము వారిలోనున్నది, తద్వారా వారిని దరిద్రులుగా చేయుటకు సరిపడు మతమును వారు కలిగియుండిరి. నిజముగా దేవుని తట్టు తిరిగి మరియు మీ హృదయమంతటిని ఆయనకిచ్చుట లేదు కాని, "అవును, నేను సంఘమునకు వెళతాను. నిశ్చయంగా, మంచిగా పాటలు పాడుటను నేను ఆనందిస్తాను మరియు చప్పట్లు కొట్టెదను. అవును, నేను దానిని ప్రేమించుచున్నాను, చూడండి."
2COR 7:10
39అయితే మీరు నమ్మెదమని చెప్పుదానిని ఆచరణలో పెట్టి మరియు తప్పును ఒప్పుకొను సమయము వచ్చేసరికి, వారు దానిని నిరాకరించుదురు. అక్కడటువంటిది. ఉండదు, వారు దానిని కలిగిలేరు. మంచిది, అది నిజమైన నేరమైయున్నది. మనకు కావలసినది అదేయైయున్నది. మనము ఎప్పుడో దానిని అనుభవించాము, ఎంతోకాలం క్రితం, మరియు దానిని మారకం చేసియున్నాము. ప్రార్ధన, మరియు ఒప్పుకోలు మరియు పశ్చాత్తాపము, వీటిని ఉద్రేకము, కరచాలనము లేదా ఒక కుదుపు లేదా పైకి క్రిందికి ఎగరడమునకు మనము మార్చియున్నాము. ఆ కారణము చేతనే స్థిరముగా పట్టుకొనుటయనునది లేదు, ఏలయనగా మీరు దైవచిత్తానుసారమైన దుఃఖముతో దేవుని యొక్క వాక్య పునాది యొద్దకు వచ్చి మరియు పశ్చాత్తాపపడుటకు సిద్ధముగా నుండి దేనినైనా సరే, సరిచేసికొని మరియు ఏది సరియైనదో దానిని చేయుచు, సరియైన జీవితము జీవించుటకు సిద్ధపడనంతవరకు, అసలు అక్కడ పట్టుకొనుటకు వారికేమియు ఉండదు. ప్రజలు ఏమి చెప్పినా లేక మరేదైననూ నేను లెక్కచేయను. మీరు కేవలం యేసుక్రీస్తు కొరకు మరియు ఆయన ఏమి చేప్పెనో దానికొరకు జీవించుడి, పిదప తిరిగి వచ్చుటకు ఆ విధముగానే మీరొక సంఘమును తీసుకొనుడి, అది వచ్చుటకు సాధ్యపడే మార్గమున్నది. అయితే వారు దానిని చేయుటకు ఇష్టపడరు.
40సమ్సోను సరిగ్గా ప్రార్ధించెను, "ప్రభువా, ఈ ఫిలిష్తియులతో పాటు నన్నూ చావనిమ్ము." ఓ, మై! చూడండి దానికతడు ఎంత వెలచెల్లించవలసి వచ్చెను? దేవుడు తన ప్రార్ధనకు జవాబిచ్చినచో ఏమగును? "నన్ను చావనిమ్ము" ఓ! నేను దానిని ఇష్టపడుదును.
ప్యాట్రిక్ హెన్రీయేనా ఇట్లు చెప్పినది, "నాకు స్వేచ్ఛనిమ్ము లేదా మరణము నిమ్ము?" అది వాస్తవము.
అది సరియే, అది అదేయైయున్నది. స్వేచ్ఛ లేదా మరణము! అది తిరిగి దేవుని యొద్దకు, లేదా మరణము. మనము ఏది చేయబోవుచున్నాము? మనము దేనిని అనుకరించుచున్నాము? మనము దేనితో ఆటలాడుచున్నాము, క్రైస్తవత్వముతోనా? పరిశుద్ధాత్మ, పెంతెకోస్తు దినమునందు కుమ్మరింపబడిన అదే పరిశుద్ధాత్మయైనచో, అది యింకను అప్పుడు చేసినట్లుగానే అదే కార్యములను చేయును. అదే శక్తి, అదే ఆత్మ అదే విధముగా అది పనిచేయును, మనకు సంఘముల సమైఖ్య అవసరము లేదు. మనకు తిరిగి క్రియా రూపములో పరిశుద్ధ గ్రంథము అవసరమైయున్నది. ఖచ్చితంగా అంతే.
JUDG 16:30
41సమ్సోను సరిగ్గా ప్రార్ధించెనని ఇప్పుడు మనము కనుగొన్నాము, "ప్రభువా, శత్రువుతో పాటు నన్ను చావనిమ్ము," తనను ఆ స్థితిలోనికి తీసుకు వెళ్ళిన శత్రువుతో చనిపోవుట. ఈ రాత్రి ప్రజలు ప్రార్ధించగోరినది ఏమైనా కలదా! మరియు మనము చూశాము, దీనిని చేసిన కార్యమేదనగా, పరిశుద్ధ గ్రంథము నుండి దూరమై ఒక మత సిద్ధాంతము నొద్దకు వెళ్ళితిరి. అటువంటప్పుడు ఆ కార్యముతో చనిపొమ్ము, దానినుండి తొలగిపొమ్ము! దానికై చావుము. సమ్సోను తిరిగి మరలా దేవుని యొక్క శక్తిని పొందుకొనుటకు వెల చెల్లించగోరెను. దానికొరకై వెల చెల్లించవలసియున్నది, అయితే, ఈ దినమున ప్రజలు దానిని చేయగోరుట లేదు.
ఓ, మనము ఉజ్జీవము గూర్చి వినుచున్నాము, నిశ్చయంగా అవును, మనము ఒక సంస్థ యొక్క ఉజ్జీవమును కలిగియున్నాము, ఎక్కువమంది సభ్యులను కలిగియుండుట మరియు అటువంటి కార్యములు. అయితే నైతిక ప్రవర్తనలవైపు చూడండి, అవి స్థిరముగా కుళ్ళిపోవుచున్నవి. అవి ప్రతిసారి దేవుని యొద్ద నుండి ముందుకు దూరముగా, ఎంత ముందుకు వెళ్ళుచున్నవో చూడండి, వాక్యమును వదిలి బయటకు వెళ్ళుచున్నవి. మరియు ఇప్పుడు వారు లోపలికి వెళ్ళి మరియు సంఘముల సమైఖ్యలోనికి వచ్చినప్పుడు, అంతెందుకు వారు సంఘపు వాక్యము కలిగియున్న పెద్ద హంతకుడిని వారు అంగీకరించిరి. దేవుడు వారికి వదిలిపెట్టిన వాక్యమును దానంతటిని వారు దాటివేసిరి. ఆ పరిశుద్ధ గ్రంథమును మీరు బోధించలేరు; మీరు వారియొక్క మత సిద్ధాంతమును బోధించవలసివచ్చును. అక్కడే అది వున్నది.
EXOD 4:8,12•
2TIM 3:8
42సమ్సోను ఒక కార్యమును ఎరిగియుండెను, మరియు సంఘము ఈనాడు గుర్తించినట్లైతే నేను సంతోషించెదను. అతని యొక్క పడిపోయిన స్థితి ఆ ఘడియ యొక్క సవాలును ఎదుర్కొనలేదని అతడు ఎరిగియుండెను. మరియు సంఘము యొక్క పడిపోయిన స్థితి ఈ ఘడియ యొక్క సవాలును ఎదుర్కొనలేదని నేను ఎరుగుదును. మరియు అది ఇంకా దరిద్రముగా మారుతున్నది. "యన్నే, యంబ్రే అనువారు మోషేను ఎదిరించినట్టు వీరును చెడిన మనస్సు కలిగి విశ్వాస విషయములో భ్రష్టులై సత్యమును ఎదిరింతురు" అని పరిశుద్ధ గ్రంథము చెప్పెను. వారు ఇంచుమించు దానిని, ఖచ్చితముగా అనుకరించెదరు.
దేవుని యొద్ద నుండి తన ఆజ్ఞను పొందుకొని తన చేతిలో ఒక కర్రతో మోషే క్రిందికి వెళ్ళెను. మరియు దేవుడిట్లు చెప్పెను, "వారి ఎదుట ఈ సూచనను చేయుము. మరియు దానిని వారు విననియెడల, వారి ఎదుట ఈ సూచనను చేయుము. మరియు వారు దానిని విననియెడల అప్పుడు నేను నీతో ఉందును, మిగతా కార్యమును నేను చూసుకొందును."
మంచిది, మోషే తన మొదటి సూచనతో క్రిందికి వెళ్ళెను. మరియు, ఆయన తన మొదటి సూచనను జరిగించిన వెంటనే ప్రతిచోటా అనుకరణకర్తలు అదే కార్యమును చేయుచుండిరి. అయితే మోషే ఎన్నడూ దాని విషయమై ఆందోళన చెందలేదు. అంత్యదినములలో అటువంటివి తిరిగి జరుగుటను మనము కలిగియుండెదము, గుర్తుంచుకొనండి, చూశారా.
43మరియు ఇప్పుడు మన పడిపోయిన స్థితి ఈ ఘడియ యొక్క సవాలును ఎదుర్కొనలేదు. అయిననూ గొప్ప శరీర పరిమాణము మాత్రము ఇక్కడ వున్నది. ఇంతకుముందెన్నడూ లేనంతగా ప్రపంచములో ఈ దినమున పెంతెకోస్తువారున్నారు, అది మనకు తెలియును, ఎక్కువగా పెంతెకోస్తు విశ్వాసులున్నారు. అది నిజము.
మీకు తెలియును, కథోలిక్ పత్రిక "ది-సండే-విజిటర్," ఆదివారపు పత్రిక దానిని "ద-సండే-విజిటర్," అని పిలిచెదరు, రెండు సంవత్సరముల క్రితం అని నేను నమ్ముచున్నాను, అందులో వారు ఈ విధమైన ప్రకటనను చేసిరి. "ప్రపంచములో అతి వేగముగా ఎదిగే సంఘము పెంతెకోస్తువారు," అని అతను చెప్పెను. "గత సంవత్సరము, కథోలిక్ సంఘపువారు కథోలిజంలోనికి ఒక మిలియన్ మందిని మార్చినట్లు నమోదైనది," అని చెప్పెను. అయితే చెప్పెను… కథోలిజం అంతేయైయున్నది. అయితే "పెంతెకోస్తు సంఘము వారు మాత్రమే ఒక మిలియన్, ఐదు వందల వేలమందిని మార్చినట్లు రికార్డు నమోదైనది," అని చెప్పెను.
ఇప్పుడు గొప్ప శరీర పరిమాణము మాత్రము అక్కడ వున్నది, అయితే మనము కొద్దిమందిగా ఉన్నప్పుడు మనము కలిగియున్న శక్తిని ఇప్పుడు కలిగిలేము. సమ్సోను యొక్క గొప్ప ధృడ శరీరము అక్కడ నిలబడియుండెను, అయితే ప్రభువు యొక్క శక్తి ఏది? అవును, సంస్థాగతమైన పద్ధతి ప్రభువు యొక్క వాక్యమును నిరూపించజాలదు. అది నిజము. ఇప్పుడు గమనించండి.
44వారు సమీపముననున్న వీధిలో నివసించుచున్న సేక్రెడ్ హార్ట్ అను సంఘమునకు బోధకునితో నేను మాటలాడుచుంటిని.
ఈ నూతన వివాదము వెలువడిన దాదాపు ఒక నెల క్రితము, ఈ లూథరను బోధకుడు తన సేక్రెడ్ హార్ట్ సంఘమునందు తన స్థానములో తన వేదికపై బోధించుటకు ఒక క్యాథలిక్కు బోధకుని ఆహ్వానించెను. మరీయు ఆ క్యాథలిక్ బోధకుడు తన ఆరాధనా కార్యక్రమమును నడిపించుటకు ఈ లూథరను బోధకుని ఆహ్వానించెను. వార్తాపత్రికలో "వేదిక మార్పిడి," అని పెద్ద అంశము ప్రచురించబడెను. అవును. నిశ్చయంగా, ఓ, మై, ఎవరైననూ దానిని చూచినయెడల మరియు మీరు దానిని గ్రహించలేనియెడల, సరి, మీరు లేఖన ప్రకారము గ్రుడ్డివారైయున్నారు. అవును.
45నేను ఈ యాజకునితో మాటలాడితిని. మరియు ఆయన నాతో చెప్పెను, "సేవకుడైన బ్రెన్హాం నేను నీతో మాటలాడగోరుచున్నాను," అని అతను చెప్పెను.
"సరే," అని నేను చెప్పాను.
మరియు "మేరీ ఎలిజబెత్ ఫ్రేజియర్ అను నామమును బట్టి ఈ ఫ్రేజియర్ అమ్మాయికి నీవు బాప్తీస్మమిచ్చితివా?" అని ఆయన అడిగెను.
"అవునండీ, నేను అట్లు చేశాను," అని నేను చెప్పాను.
"దానిగూర్చి నీ సంతకముతో కూడిన ప్రకటనను బిషప్పు కోరుచున్నాడు," అని అతను చెప్పెను.
"ఆమె కథోలిక్ గా మారెనని, నేను గ్రహించితిని," అని నేను చెప్పాను.
మరియు ఆయన ఇట్లు చెప్పెను, "అవునండి, ఆమె తిరిగి తన తల్లి సంఘము నొద్దకు వచ్చినది," అని చెప్పెను.
మరియు నేను చెప్పాను, "అవునండీ, ఆమె తల్లి దాని గూర్చి నాతో చెప్పుచున్నది" అని నేను చెప్పాను.
"అవును, ఆమె తల్లి దానిని సరిగా తీసికొనలేదు," అని అతడు చెప్పెను.
నేను ఇట్లు చెప్పాను, "అవును, తనతోపాటు సమాధులలోనికైనా ఆమెతో నడచుటకు సిద్ధమేనని ఆమె యొక్క తల్లి నాతో చెప్పెను."
మరియు "సరిగ్గా, ఆమె దానినే చేయుచున్నది," అని నేను చెప్పాను.
మరియు కావున అతనెట్లు చెప్పెను, "ఈ వ్రాత రూపమైన ప్రకటనపై నీవు సంతకము చేయవలసినదిగా నేను కోరుచున్నాను," అని అతను చెప్పెను. "నీవు ఆమెకు బాప్తీస్మమిచ్చితివా? నీవు ఏ విధంగా ఆమెకు బాప్తీస్మమిచ్చితివి?" అని అడిగెను.
"క్రైస్తవ బాప్తిస్మములో బాప్తీస్మమిచ్చితిని," అని నేను చెప్పాను.
మరియు, "అయ్యా, నా భావమేమనగా, ఎట్లు బాప్తీస్మమిచ్చితివి? ఆమె పై నీళ్ళు చిలకరించావా, నీళ్ళు పోసితిరా, లేదా ఆమెను నీటిలో ముంచావా?" అని అతను అడిగెను.
"క్రైస్తవ బాప్తీస్మమనగా ముంచుట," అని నేను చెప్పాను.
JOHN 20:23•
ACTS 2:38
46"అహ్-అహ్" చెప్పెను, "మంచిది." "అలాగైతే ఇప్పుడు నీవు ఆమెను తండ్రియొక్కయు, కుమారునియొక్కయు, పరిశుద్ధాత్మయొక్కయు నామములో ముంచితివా?" అని అడిగెను.
"అవునండి, ఆ నామమే యేసుక్రీస్తు నామము, అదే తండ్రియొక్కయు, కుమారునియొక్కయు, పరిశుద్ధాత్మయొక్కయు నామమైయున్నది. మరి ఆ విధముగానే నేను ఆమెకు బాప్తీస్మమిచ్చితిని," అని నేను చెప్పాను.
మరియు, "నీవు ఆమెకు తండ్రియొక్కయు, కుమారునియొక్కయు, పరిశుద్ధాత్మయొక్కయు నామములో బాప్తీస్మమిచ్చితివా?" అని ఆయన అడిగెను.
"అవునండి. ఇప్పుడు నేను ఆ పదములను వల్లించలేదు. అయితే తండ్రియొక్కయు, కుమారునియొక్కయు, పరిశుద్ధాత్మయొక్కయు నామమైన యేసుక్రీస్తు నామములో నేను ఆమెకు బాప్తీస్మమిచ్చితిని," అని నేను చెప్పాను.
"అవునండీ, అలాగా," అని ఆయన అనెను, మరియు దానిని అట్లు వుంచి, "నీకు తెలియునా, ప్రారంభ కథోలిక్ సంఘము ఆ రీతిగానే బాప్తీస్మమిచ్చుచుండెను," అని ఆయన చెప్పెను.
"ఓ, అది నిజమా?" అని నేను చెప్పాను.
"అవును, ఆ విధముగానే," అని ఆయన చెప్పెను.
"ఏమి జరిగినది? "వారు చక్కగానే చేసిరి," అని నేను చెప్పాను.
మరియు ఆయన చెప్పెను, "మంచిది," ఆయన చెప్పెను, "నీవు చూడుము, నీవు ఒక పరిశుద్ధ గ్రంథమును నమ్ముదువా.
దేవుడు తన సంఘములో ఉన్నాడు," అని ఆయన చెప్పెను.
''అయ్యా, దేవుడు తన వాక్యములో ఉన్నాడు, తన వాక్యములో," అని నేను చెప్పాను. "పేతురు మొట్టమొదటి పోప్ అని నీవు చెప్పుదువా," అని నేను అడిగాను.
"అవును ఆయనే అయియున్నాడు," అని ఆయన చెప్పెను.
"మంచిది, పిదప కథోలిక్ సంఘము వారియొక్క ఆరాధనలన్నియూ ఎటువంటి మార్పులేకుండా లాటిన్ భాషలో, మరియు ఆ విధముగా చెప్పుచున్నచో; అప్పుడు అపోస్తుల కార్యములు 2:38 లో మొదటి పోప్ చెప్పినది ఏమిటి." "మీరు మారుమనస్సు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామములో బాప్తిస్మము పొందుడి," అని నేను చెప్పాను. ఆయన చెప్పెను, మీరు గనుక…. నేను చెప్పాను, "ఈ ఒప్పుకోలుపై, మరియు ఆ రీతిగా," అని నేను చెప్పాను.
"మంచిది, మీరు ఎవరి పాపములు క్షమింతురో అవి వారికి క్షమింపబడును, ఎవరి పాపములు మీరు నిలిచియుండనిత్తురో అవి నిలిచియుండును," అని యేసు తన శిష్యులతో చెప్పలేదా?" అని ఆయన చెప్పెను.
''ఆయన చెప్పాడు," అని నేను అన్నాను.
"అటువంటప్పుడు అందులో తప్పేమున్నది? నీ పరిశుద్ధ గ్రంథమే దానిని గూర్చి చెప్పుచున్నది కదా," అని ఆయన చెప్పెను.
ACTS 2:37,38
47''వారు ఏ విధముగా పాపములు క్షమించారో నీవునూ అదే విధంగా పాపములు క్షమించగలిగినచో నేను నీతో ఉండేదను. ఎందుకనగా తాళపుచెవులు కలిగియున్న పేతురును వారిట్లు అడిగిరి, "రక్షింపబడుటకు మేమేమీ చేయవలెను?" అందుకు ఆయన ఇట్లు చెప్పెను, "పశ్చాత్తాపమునొంది ప్రతిఒక్కరూ పాపక్షమాపణకై యేసుక్రీస్తు నామములో బాప్తిస్మము పొందుడి." ఇప్పుడు నీవు ఆ రీతిగా చేయుము అప్పుడు నేను నీతో వచ్చెదను," అని నేను చెప్పాను. ఆమేన్. అది వాక్యమైయున్నది. దానిని చేయుటకు అది దేవుని యొక్క విధానమైయున్నది. దానిపై వారు బలహీనులైతిరి. అది….
"మంచిది, మంచిది, నేనసలు నీతో వాదనచేయుటకు వచ్చియుండలేదు," అని ఆయన చెప్పెను.
"వాదన చేసేది ఎవరు?" అని నేను అడిగాను. "నేనసలు వాదించుట లేదు. నీవు నన్ను ఒక ప్రశ్న అడిగితివి, మరియు నేను నాకు తెలిసిన సరైన విధానములో జవాబిచ్చితిని" అని నేను చెప్పాను.
"నేను మిమ్మును ఒకటి అడగాలనుకొనుచున్నాను," అని నేను చెప్పాను. నేను ఇట్లు చెప్పాను, "దేవుడు తన సంఘముతో ఉన్నాడని మీరు చెప్పారు, మరియు ఇప్పుడు మీ ఉపయోగార్ధమై చెప్పుచున్నాను, మొట్టమొదటి క్రైస్తవులు, పేతురు, యాకోబు, యోహాను, మార్కు, లూకా మరియు వారందరిని క్యాథలిక్ వారు అని మీరు పిలువదలచినయెడల, మంచిది." "అటువంటప్పుడు ఈ అపోస్తలులు వ్రాసిన పరిశుద్ధ గ్రంథము యొక్క క్రమమును అనుసరించి నడచుటకు బదులు ఈ రోజున మీరు కలిగియున్న బిషప్పు యొక్క అధికారములు (డయోసేసులు) అప్పటికన్నా గొప్పవైయుండి, మరీ ఎక్కువ జ్ఞానమును మీరు కలిగియున్నారా? మరియు ఏ విధంగా జాగ్రత్త తీసుకొనవలెనో మీకు తెలియునా…?" అని నేను అడిగాను.
"అవునండి. అది ఖచ్చితముగా సరియే."
''వారు యేసుక్రీస్తు యొక్క ఆజ్ఞలను అనుసరించినప్పుడు, వారు మృతులను లేపిరి, దయ్యములను వెళ్ళగొట్టిరి, వారు నానావిధములైన సూచనలను మరియు అద్భుతములను జరిగించిరి మరి ఈ దినమున మీరు ఎందువలన వాటిని చేయలేకపోవుచున్నారు? ఇప్పుడు పొరపాటు ఏమిటి?" అని నేను అడిగితిని.
లూథరన్ కాలములో లేదా వెస్లీ కాలములో లేదా వేరే ఏ కాలములోనైనా సంఘము చక్కగానున్నయెడల, అప్పుడు అది తిరిగి అచ్చటనున్నది, వారు అప్పుడు చేసిన క్రియలను వారెందుకు చేయలేకపోవుచున్నారు? నిశ్చయంగా. తిరిగి వాక్యమునొద్దకైయున్నది!
AMOS 3:7
48సమ్సోను, శక్తి అంతయూ కోల్పోయి అక్కడ నిలబడియుండెను. అయితే, మీకు తెలియునా, సమ్సోను అక్కడ నిలబడియుండి ఇదంతయూ ఆలోచించుకొనుచుండగా, ఫిలిష్తియులు గమనించనటువంటిది ఏదో అక్కడ వున్నది. (నేను త్వరపడ గోరుచున్నాను).
పెంతెకోస్తు ప్రపంచమును తిరిగి ఎక్కడో ఒక మూలకు తీసుకు వెళ్ళి వారు కూడా ఆ విధంగా కొద్దిసేపు ఆలోచించునట్లు చేయవలెనని నేను కోరుచున్నాను. కొద్దిగా సరైన కారణముల గూర్చి ఆలోచించుట. వారియొక్క గొప్ప దృఢమైన సంస్థతో మేమెక్కడనున్నాము? ప్రతిఒక్కరూ, ఒకరికి ఒకరు విరోధముగానున్నారు. ఏకత్వం వారు ద్విత్వం వారికి విరోధముగా, ద్విత్వం వారు త్రిత్వం వారికి విరోధముగా, మరి ఆ విధముగా, అందరూ కేవలం ఆ విధంగా అది వున్నది. అది ఆ విధంగా ఉండకూడదు. అసలు ఆ రీతిగా ఉండవలసినది కాదు. మనము తిరిగి వచ్చి, మరియు కలిసికట్టుగా వచ్చి "ప్రభువు ఈలాగు సెలవిచ్చుచున్నాడు," అను పునాదిపై దానిని స్థిరపరచవలసియున్నది.
సంఘములోని ప్రవక్తల విషయం ఏమిటి? ప్రభువు యొక్క వాక్యము ప్రవక్తలనొద్దకు వచ్చును. మరియు ఒక ప్రవక్త తాను ప్రవక్తనని చాటించుకొని మరియు పరిశుద్ధ గ్రంథమునందలి సత్యమును నిరాకరించినయెడల, వాక్యప్రకారముగా అతడు ఒక ప్రవక్త కాదు. ఇప్పుడు, మనలను క్రమములో ఉంచుటకై మనము ఈ వరములను కలిగియుండవలసి యున్నది. అయితే అక్కడ, ఏదో ఒక విధంగా మనము దానంతటీనుండి తొలగిపోయాము. మరియు వారు అక్కడ ఒక మూలన నిలబడియున్నారు.
49ఇక్కడ సమ్సోను నిలబడియుండెను, మూలన నిలబడియుండి, జరిగినదంతటినీ ఆలోచించుచుండెను. మరియు ఈ ఫిలిష్తియులు వారి స్త్రీలను కౌగలించుకొని, బాగా మత్తులై, త్రేన్పుచూ, అక్కడ నిలబడియుండి యెహోవా యొక్క సేవకునిపై విజయమును ఉత్సవముగా జరుపుకొనుచుండిరి. ఓ మై! యెహోవా ప్రణాళికపై విజయము! దానిగూర్చి ఆలోచించుటకు అది మీలోనుండి ఏదో పారినట్లు అనిపించుట లేదా. అవును, అక్కడ చేప దేవునితో నిలబడుట. దాగోను చేప దేవుడైయుండెను. మరియు వారు బలిని దహించుచుండిరి. మానవ జీవితములు తీసికొనబడును, ఒక చిన్నబిడ్డ బలికొరకు చనిపోవలెను, ఆ బలికొరకు దాని హృదయములో నుండి ఖడ్గమును దూసెదరు. మరియు వారు యెహోవాపై ఈ విజయమును గొప్ప ఉత్సవముగా జరుపుకొంటూ అక్కడ యున్నారు.
మరియు ఈ రాత్రి సంఘము, ఫిలిష్తియుల గుంపువలెనేయుండి, కొంతకాలమైన పిదప, దానికి సంబంధించని ప్రతి సంఘమును బయటకి త్రోసివేయునటువంటి ఒక సంఘముల సమైఖ్యను కలిగియుండవలెనన్న దురాలోచనను కలిగియున్నారు. సమ్సోను, నీ వెంట్రుకలను మరెన్నడూ కత్తిరించుకొనకుము! సరిగ్గా ఆ వాక్యముతోనే నిలబడుము. ఏది జరిగిననూ నేను లెక్కచేయను, నీవు సరిగ్గా అక్కడే వాక్యముతో నిలబడుము. దానితో మీరు మిశ్రమము కాకుండుడి.
JUDG 16:26,30
50సమ్సోను ఆలోచించుట మొదలు పెట్టెను, "ఒక అవకాశమున్నదా అని ఆశ్చర్యపోవుచున్నాను?" ఇప్పుడు అతను ఇట్లు చెప్పెను, "నా వెంట్రుకలు ఎదిగినవని నాకు తెలియును, అయితే నేను గ్రుడ్డివాడిని. మరొక ఉజ్జీవమునకు అవకాశము కలుగునేమో. ఒక అవకాశము ఉన్నది."
ఆయన ఆ చిన్నపిల్లవానితో ఇట్లు చెప్పెను, "ఈ భవనమంతయూ ఈ స్తంభములపై స్థిరముగా, బిగించబడియున్నయెడల, నా హస్తములు ఆ స్తంభముపై ఉంచుము?"
"సరే."
"మరియు రాజులందరు మరియు ఉత్సవము జరుపుకొనువారందరూ పైన ఉన్నారని నీవు చెప్పుదువా?"
"అవును."
"నేను అలసిపోయాను. మీరు అనేకమైన తమాషా కార్యములు నేను చేయునట్లు, నాతో చేయించినారు! నీవు నా చేతులను ఆ స్తంభముపై ఉంచుదువా?
మరియు అతను ఆయన చేతులను స్తంభముపై ఉంచెను, మరియు వాటి మధ్యలో నిలబడెను, బహుశ ఈ విధముగా అయియుండును. మరియు ఆ స్తంభముల కెదురుగా తన చేతులనుంచి అతను అక్కడ నిలబడియుండెను. ఫిలిష్తియులు, ఉత్సవము జరుపుకొంటూ గొప్ప సమయమును కలిగియుండిరి, వారు అతనిని గమనించుటకు మరచిరి. ఓ,మై!
అయితే అతను ఆలోచించుట మొదలుపెట్టెను, "దేవుడు ఇంకనూ దేవుడే. ఆయన దేవుడైయున్నాడని నాకు తెలియును. నేనాయనను పరీక్షకు గురిచేసితిని. నేను ఆయనను పరీక్షించితిని. ఆయన ఇంకనూ దేవుడిగానే ఉన్నాడని నాకు తెలియును. తప్పిదస్తుడను నేనే అయియున్నాను, పాపము చేసినవాడను నేనే అయియున్నాను. ఆ గ్రుడ్డికన్నుల నుండి గడ్డము మీదుగా కన్నీళ్ళు కారుటను వారు గమనించలేదు. "ప్రభువా, నేను తప్పు చేసితిని. ఈ ఫిలిష్తియులతో కూడా నన్ను చావనిమ్ము," అనుచు, అతని పెదవులు కదులుటను వారు గమనించలేదు.
JUDG 16:28,30
51అతను తన స్వంత జీవమును కోరుకొనుటకంటే ఎక్కువగా, దేవుని వాక్యము ఆ యెజెబెలు ముందు ప్రత్యక్షపరచబడుటనే అతడు కోరుకొనెను. ఓ, అటువంటి ఆశ మరలా సంఘమునకు వచ్చినయెడల! అవును. అతడు ఒక క్రొత్త క్రమము కొరకు, క్రొత్త సంస్థ కొరకు ప్రార్ధించుటలేదు, అయితే దేవుని యొక్క వాక్యము మరలా తెలియపరచబడుట కొరకు; అతను ఒకప్పుడు కలిగియున్న వాగ్దానము మరలా అతని యొద్దకు వచ్చుటకు అతడు ప్రార్ధించెను. అతని ప్రార్ధనకు జవాబు వచ్చినయెడల ఏమి జరుగునో అతనికి బాగా తెలిసియుండెను, అయిననూ అతడు సిద్దపడి మరియు దృఢసంకల్పముతో నుండెను. ఓ, సంఘము ఆ విధముగా పొందుకొనినయెడల ఎలాగుండును! అంతట అతడు బిగ్గరగా కేకవేసెను!
అతడు చిన్నగా ప్రార్ధించుచుండెను, "ప్రభువా, అది సాధ్యమగును. అది సాధ్యమగును. నేనిచ్చట నిలబడియున్నాను, నా గొప్ప శరీరాకారము ఇంకనూ ఉన్నది. నేనిచ్చట ఉన్నాను. నా వెంట్రుకలు ఎదిగినవి, అయితే వారినెట్లు కొట్టవలెనో నేనెంతమాత్రము చూడలేను, ఏలయనగా నా కన్నులు గ్రుడ్డివైపోయినవి. నేనెచ్చటికి వెళ్ళుచున్నానో నేను చూడలేను. అయినను ప్రభువా, నీ శక్తిని కనబరచుటకు నీవు అది మరలా జరుగునట్లు అనుమతించినయెడల, అది సాధ్యమగును."
"మరొక్కసారి, ప్రభువా, కేవలం మరొక్కసారి!" అని అతడు బిగ్గరగా ఏడ్చెను.
ఓ, "మరొక్కసారి ప్రభువా, నీ శక్తిని మేము చూడనిమ్ము!" అని సంఘము మొర్ర పెట్టినయెడల చాలును.
"మరొక్కసారి మరియు అతను అట్లు కేకవేసి మరియు దేవుని అడుగగా, అతని కండలు ఉబ్బుటను నేను చూడగలుగుచున్నాను. అతని శరీరములోనున్న ప్రతి కణము గట్టిపడుటకు ఆరంభించెను. అప్పుడు పరిశుద్ధాత్మ అతని పైకి వచ్చుచుండెను. అతనిపైనున్న పరిశుద్ధాత్మ యొక్క శక్తివలన అతను మరలా తన చేతులను చాచగా,
భవనము క్రిందికి పడిపోయెను." "మరణకాలమున అతడు చంపినవారి లెక్క జీవితకాలమందు అతడు చంపినవారి లెక్కకంటే ఎక్కువాయెను," అని పరిశుద్ద గ్రంథము చెప్పుచున్నది. అప్పుడతను దేవుడు తనకిచ్చిన ఆజ్ఞను నెరవేర్చెను. "మరొక్కసారి!"
అది ఎల్లప్పుడూ ఆ రీతిగానే ఉండెను, దేవుని యొక్క శక్తి వచ్చినప్పుడు సిద్ధాంతముల యొక్క నిర్మాణములన్నియూ కూలిపోవును. చివరి దశలో సమ్సోను తన శత్రువుపై గొప్ప విజయము కలిగియుండెను.
52ఇప్పుడు ముగింపులో నన్ను ఈ కార్యమును చెప్పనివ్వండి. పెంతెకోస్తూ, ఈ గొప్ప సంస్థల యొక్క స్తంభము యొద్ద మనము నిలబడెదమా, హాలివుడ్ మరియు క్రీస్తులోని దేవుని ప్రేమ నుండి మనలను వేరుచేయు ఈ సమస్తమైన ఇతర కార్యముల యొక్క స్తంభము యొద్ద మనము నిలబడెదమా, మరియు మనము అక్కడ నిలబడి మరియు పశ్చాత్తాపపడి, మరలా "ప్రభువా, మమ్మల్ని మరొక్కసారి పెంతెకోస్తుగా చేయుము! మరొక్కసారి, ప్రభువా, మరొక్కసారి మమ్మల్ని పెంతెకోస్తువలె చేయుము! ప్రభువా, మరొక్కసారి నీ శక్తిని మాలో కనబరచుము! కేవలం మరొక్కసారి?" అని బిగ్గరగా మొర్రపెట్టెదము.
వినండి, మీ శత్రువు మిమ్మల్ని నాశనము చేయుటకు ముందే మీరు మీ శత్రువును నాశనము చేయండి. ఆయన దానిని చేయును. తిరిగి ఆ పాతకాలపు కూటములు మరియు అలాంటి కార్యములను తెచ్చును. మరియు, ఓ, మీరు చేయకూడనటువంటి చిన్నచిన్న కార్యములోనికి మిమ్మల్ని లాలించు దెలీలాను ఒంటరిగా వదిలివేయండి, లోకమును ఒంటరిగా వదలివేయండి. మరియు చిన్న కార్యములు, సంఘములోనికి సమస్యలు వచ్చును, మరియు సరిచేసుకొనుటకు మీరు నిలువరు, ఎందుకనగా మీరు సరిచేసికొనదలంచరు; మీరు మరియొక సంఘమునకు వెళ్ళగలరు, మరియు అలాంటి కార్యములు జరుగును. ఆదిమ దినాల్లో, ఒక వ్యక్తి దేవుని వాక్యముతో సరితూగనియెడల, అతను చనిపోగా వారు అతనిని మోసుకుపోయెడివారు.
"మమ్మల్ని తిరిగి పెంతెకోస్తు యొద్దకు తీసికొని రమ్ము!" ఏదో హాలీవుడ్ ప్రదర్శన వైపు కాదు, కాని దేవునివైపు తిరిగిన సంపూర్ణ హృదయమే మాకు అవసరమైయున్నది. "మరొక్కసారి, ఓ ప్రభువా, మరొక్కసారి!"
53అది జరుగుటను నేను చూడగలిగినయెడల, నా బలహీనపడుచున్న కళ్ళు మరియొకసారి సంఘము దానియొక్క భేదములను మరచిపోవుటను చూడగలిగినయెడల ఎంత బాగుండును! "దానితో మాకెటువంటి సంబంధము లేదు, మేము మా జన్మహక్కులను పోగొట్టుకొనము!" అని సంఘ శాఖలు తెగతెంపులు చేసుకొని మరియు దానిని ఆ సంఘ సమైఖ్య ఒడిలో విసిరివేయుటను నేను చూచినయెడల ఎంత బాగుండును! త్రిత్వవాదులు మరియు ఏకత్వవాదులు, మరియు వారందరూ కలిసి, "సహోదరులారా ఆయనను మనము ఎచ్చట వదిలివేసితిమో అచ్చటకు తిరిగి వెళ్ళెదము. మనము ఎక్కడైతే ఒకరితో ఒకరము నీటి బాప్తిస్మముపై గందరగోళములో పడితిమో, వెనుతిరిగి దానికొరకై బైబిలు మార్గమును మనము అనుసరించెదము," మరియు "మరొక్కసారి, ప్రభువా, మరొక్కసారి," అని మొర్ర పెట్టుదుము అని చెప్పుటను నేను చూచినయెడల ఎంత బాగుండును. మరియు వేదికపైనున్న ఈ వ్యక్తులలో చాలామందికి, ఒక కుందేలుకు మంచులో వేసుకొను చెప్పుల గూర్చి తెలియనట్లుగానే దేవునిగూర్చి వారెరుగరు, మరియు ఈ స్త్రీలు వారి శరీరము బయటపడునంత బిగుతుగా దుస్తులు ధరించి, వేదిక పైకి ఎక్కుచూ, దిగుచూ, వారి చేతులతో చప్పట్లు కొట్టుచూ మరియు ఆ విధముగా ఎగురుచూ, ఒక ప్రదర్శన గుంపు లేక మరొకదానివలె వున్నారు.
54"దేవా, మమ్మల్ని తిరిగి పరిశుద్ధాత్మయొద్దకు, శక్తియొద్దకు మరియు వాక్యము యొక్క బయలుపాటునొద్దకు తీసుకొనిరమ్ము! మరొక్కసారి, ప్రభువా, మరొక్కసారి!" మీరు దానిని నమ్ముచున్నారా? "ప్రభువైన దేవా, మరొక్కసారి, మరొక్కసారి యేసుక్రీస్తు యొక్క ప్రసన్నత సంఘములో నడచుటను, నన్ను చూడనిమ్ము, ఆయన శక్తి మరియు ఆయన వాగ్దానము మా ముందు బయలుపరచబడుటను చూడనిమ్ము. మరొక్కసారి, ప్రభువా, మరొక్కసారి, ప్రభువా, మరొక్కసారి! దేవా, కనికరించుము, మాకు సహాయము చేయుము!"
ఈ ఇతర కార్యములు మనకు ఏమి తీసికొనివచ్చునో మీరు చూశారా? అది చంపివేయును… అది సహవాసములో నుండియు, సంఘములో నుండియు, ప్రజలలో నుండియు క్రీస్తు యొక్క స్వభావమును తరిమివేయును. ఈ వాక్యము నుండియు మరియు మనలో ఒకరియెడల ఒకరికివున్న ప్రేమనుండియు మనలను ఏదియూ వేరుచేయలేనంతగా మనము అల్లుకుపోవలెను.
55యేసుక్రీస్తు ఇచ్చటనున్నాడు. ఆయనే మన తండ్రి. ఆయనే మనకు తల్లి. నన్ను స్వస్థపరచువాడు ఆయనే. ఆయనే నా రాజు. ఆయనే నా దేవుడు. ఆయనే నా జీవము. ఆయనే నాకు ఆనందము. ఆయనే నాకు సమాధానము. అక్కడ ఉన్నదంతయూ నాకు ఆయనే. నాకు సమస్తములో సమస్తము ఆయనే. ఇప్పుడు ఆయన ఇక్కడ ఉన్నాడు.
ఆయన సంఘమును మరలా ఆ స్థానమునకు తీసుకురావలెనని కోరుచున్నాడు. మనము, "మరొక్కసారి, ప్రభువా," అని మొర్రపెట్టి మరియు మన గ్రుడ్డికన్నులగుండా పశ్చాత్తాపముతో కన్నీళ్ళు కర్చుదుమా అని ఆశ్చర్యపోవుచున్నాను? నేను వాస్తవముగా ఈ సంఘముతోనే మాటలాడుటలేదు. ఇది టేపు చేయబడినది, మీరు చూడండి, ఇక్కడ ఇది ప్రపంచమంతటికీ వెళ్ళును. మన ప్రజలు దానియొద్దకు మరలా తిరిగి వచ్చెదరు గాక, మనకిది వరకు ఉండినట్లుగా మనము కూడుకొనునట్లుగా అది ఆ స్థానమునకు తిరిగి రానిమ్ము.
HEB 13:8
56కేవలం గత పది లేదా పదిహేను సంవత్సరాలు తీసుకొనండి, అప్పటినుండి అది ఎంతగా దిగజారిపోయెనో గమనించండి, అది ఎంతగా క్రిందికి, క్రిందికి, క్రిందికి పడిపోయెనో చూడండి. దైవిక స్వస్థత గురించి మాటలాడుటకు, ఒక వ్యక్తి అది ఎంతో సిగ్గుగా, అవమానముగా భావించుచున్నాడు, దాని పై ఎంతగానో ని౦ద తీసికొని రాబడినది; దానిపై అటువంటి నింద వచ్చినప్పుడు పరిశుద్ధాత్మ గూర్చి మాటలాడుడి. అది వాస్తవము. అది దేవుని పొరపాటు కాదు. అది, దేవుని వాక్యము యొక్క సూత్రములను విడిచి, దానికి ప్రత్యామ్నాయముగా దేనినో తీసికొని, సంస్థ తనను లాలించి మరియు క్షారము చేయునట్లుగా చేసిన సమ్సోను యొక్క పొరపాటైయున్నది.
నా సహోదరుడా, సహోదరీ, దేవుని యొక్క గొప్ప తీర్పునకు ఇవతల నేనిక మిమ్మల్ని ఎన్నటికీ చూడకపోవచ్చును, అయితే "యేసుక్రీస్తు నిన్నా, నేడు, నిరంతరము ఒక్కటే రీతిగా ఉన్నాడు," అని నేను మీతో చెప్పుచున్నాను. ఆయన వాక్యము నాకు జీవమైయున్నది. ఆయన ఇప్పుడు ఇచ్చటనున్నాడు. దానిని మీరు నమ్ముచున్నారా? ఆయన ఇక్కడ ఉన్నాడని నాకు తెలియును.
ISA 55:8•
PHIL 4:8
57మరియు ఆయన ఇక్కడ నున్నాడని తెలిసికొనుటకు మీరు చేయవలసిన ఒకే ఒక కార్యమేదనగా, మీ విధానము నుండి మీకు మీరుగా తొలగిపోవుడి. మీరు మీ విధానములో ఉన్నంతవరకూ దేవుడు మీ కొరకు ఏమియూ చేయలేడు. మీరు మీ స్వంత ఆలోచనలు ఆలోచించినప్పుడు ఇక దేవుని ఆలోచనలకు అవకాశముండదు. అయితే నీవు నీ ఆలోచనలు ఆలోచించుట ఆపివేసి, ఆయన యొక్క ఆలోచనలు ఆలోచించినయెడల బాగుండును! "నా తలంపులు మీ తలంపులవంటివి కావు," అని ఆయన చెప్పెను. "ఏవి ఖ్యాతిగలవో, ఏవి యోగ్యమైనవో వాటిమీద ధ్యానముంచుకొనుడి." దానిగూర్చి ఏదో సంఘము ఏమి చెప్పునో అని కాదు, అయితే దానిగూర్చి దేవుడు ఏమి చెప్పెనో అనునది!
ఇక్కడ మంచములో వణుకుచూ పడియున్న ఈ చిన్న స్త్రీవలెయున్నది. ఆమె యేసుక్రీస్తుపై తనకున్న విశ్వాసమును సరిచేసుకోనంత వరకూ, ఆ స్త్రీ తన జీవితమంతయూ ఆ విధముగానే పడియుండును. మరియు ఏది వచ్చిననూ లేదా పోయిననూ లెక్కలేదు, అది గనుక ఆమెకు బయలుపరచబడినయెడల, ఆమె స్వస్థత పొందకుండా ఏదియూ ఆపలేదు. అది నిజము. అయితే నీవు పొందినయెడల… అది నీవు దేనిని తలంచుచున్నావో దానిపై ఆధారపడియున్నది.
58నీవు గనుక కేవలం నమ్మి మరియు విశ్వాసమును కలిగియున్నయెడల, దేవుడు నీ కొరకు దేనినైనా చేయగలడు. మరియు ఈ రాత్రి నీ కొరకు ఆయన చేయగల అతి గొప్ప కార్యమేదనగా, నీ ఆత్మను తన సన్నిధిలోనికి తీసుకొని వెళ్ళుటయే. ఇచ్చటనున్న ప్రతి వ్యక్తిని సరిగ్గా ఆ చోటికి తీసికొని వెళ్ళుట…
పరిశుద్ధాత్ముడు ఇచ్చటనున్న ప్రతిఒక్కరిని తన స్వాధీనములో వుంచుకొనినయెడల ఏమి జరుగునో ఆలోచించుడి? ఈ రాత్రి ఏమి సంభవించునో ఆలోచించుడి. రేపు రాత్రి ఇదే సమయమునకు శ్రివ్-పోర్టులో ఏమి జరుగునో ఆలోచించుడి. ప్రతి చోటను ఈ విధముగా ప్రధాన శీర్షికలతో ప్రచురించెదరు. "ఒక గుంపు ప్రజలు వెర్రిగా ప్రవర్తించుచున్నారు. వారు వ్యాధిగ్రస్తులను స్వస్థపరచుచూ మరియు చనిపోయినవారిని తిరిగి లేపుచున్నారు, వారు అమెరికాలోని శ్రివ్-పోర్టు, లూసియానా స్థలములలో అనేక కార్యములు చేయుచున్నారు." పరిశుద్ధాత్ముడు సంపూర్ణముగా తన స్వాధీనము చేసికొనినయెడల, వారు ఏమి చేయుచున్నారో వాటిని వారు టెలివిజనులో చూపెదరు.
JOHN 16:24
59ఆయన ఎందుకు చేయడు? ఆయన చేయగోరుచున్నాడు. ఆయన చేయుటకు ఇష్టపడుచున్నాడు. ఆయన ఎదురుచూచుచున్నాడు. "మంచిది, నేను ఆయనను ఎన్నో విషయములు అడిగితిని, ఆయనను మరి ఎక్కువగా అడుగుటకు నాకిష్టము లేదు," అని నీవు చెప్పుదువు. మీ సంతోషము పరిపూర్ణమగునట్లు విస్తారముగా అడుగుము!
పసిఫిక్ మహా సముద్రం మధ్యలోనున్న ఒక అర అంగుళం చేప, "నేను నీటిని పొదుపుగా త్రాగెదను, లేనియెడల ఒకానొక దినమున నీరు ఎండిపోవును," అని తలంచుటను మీరు ఊహించగలరా? ఐగుప్తు ధాన్యపు కొట్టములలోని ఒక చిన్న ఎలుక, "నేను ఒక రోజునకు ఒక గింజ చొప్పున తినెదను, ఏలయనగా రాబోవు కోతకాలము వరకు ధాన్యము అయిపోవునేమో!" అని తలంచుటను మీరు ఊహించగలరా? ఓ, మై! ఇప్పుడు దానిని వంద బిలియన్లతో భాగించండి. మరియు నీ యెడల దేవుని కృప, దయ, మరియు శక్తిని ఖాళీచేయుట అంతే సులభము. దానిని నీవు కేవలం నమ్మినచో, నీ అంతట నీవు సరిగా… మంచిది, నన్ను క్షమించండి నేను… అది, నీవు ఆయనను ఖాళీచేయలేవు.
JOHN 7:37•
EPH 3:20
60నిత్యజీవపు ఊటయైన ఆయన తన పరిశుద్ధ గ్రంథములోని ఏ దైవిక వాగ్దానమునైనను దానిని నమ్మువారికెవరికైననూ ప్రత్యక్షపరచుటకు ఈ రాత్రి ఇచ్చటనున్నాడు. ఆమేన్. అవునండి. నీవు చేయవలసిన ఒకే ఒక కార్యమేదనగా, త్రాగుటయేయై యున్నది. ఊటయొద్దకు రమ్ము మరియు త్రాగుము. నీవు తృప్తి చెందునంతవరకు త్రాగుము. నీవు ఆయనను ఖాళీచేయలేవు. లేదండి. ఆయన ఖచ్చితముగా ఇంకిపోనివాడైయున్నాడు. మరియు నీవు కేవలం త్రాగుము మరియు త్రాగుము మరియు త్రాగుము. నీ స్వస్థతను నీవు త్రాగవచ్చును. నీ రక్షణను నీవు త్రాగవచ్చును. కేవలం వచ్చి మరియు త్రాగుము. "దప్పిగొన్నవారిని వచ్చి త్రాగనిమ్ము." ఆమేన్. నేను ఆయన ఇచ్చట ఉన్నాడని నేనెరుగుదును, మరియు ఆయన చేయుటకు మీరు అనుమతించినయెడల ఆయన అత్యధికముగాను, సమృద్ధిగాను చేయునని నేనెరుగుదును.
61నేను ఇప్పుడే ఏదో జరుగుటను చూచితిని. మరియు నేను దర్శనములను గూర్చి, అటువంటి ఒక కూడికను మొదలుపెట్ట తలంచుట లేదు. కాని, నేను వేరే కార్యమును గూర్చి మాటలాడుచున్నాను. చూడండి, నేను మీరు భౌతికమైన స్వస్థత కొరకు వచ్చుటను గూర్చి చెప్పుట లేదు, కాని వచ్చుటను గూర్చి…. అంతట వారు చేయుటకు బయలువెళ్ళిన వెంటనే, ఇప్పుడు అది కేవలం…. చూడండి, అంతట నేను విశ్రాంతి తీసికొనుటకు వెళ్ళిన వెంటనే, వెళ్ళుటకు, మొట్టమొదటిగా ఏమి జరుగునో మీకు తెలియునా, జనులు పట్టబడిరి, ఆ అనుభవము వచ్చుటను నీవు ఎరుగుదువు.
ఇక్కడ నేను మీకు చెప్పగలను. తన మేనళ్ళునితో ఆ వెనుక తట్టున కూర్చున్న ఆ వ్యక్తి, తుంటిలో బాధతోనున్నాడు. అతడు నమ్మినయెడల, దేవుడు అతనిని స్వస్థపరచి మరియు అతనిని బాగుచేయగలడు. ఆయన అతని స్వస్థపరచి మరియు అతనిని బాగుచేయునని నీవు నమ్ముచున్నావా? నీవు నమ్మినయెడల, దేవుడు దానిని చేయగలడు, చూశారా. ఖచ్చితముగా సత్యము. ఆమేన్.
62ఇచ్చట ఒక వ్యక్తి కూర్చొని, నావైపే చూచుచున్నాడు. అతడు తన కుటుంబము కొరకు ప్రార్ధించుచున్నాడు. అతడు నిజముగా ఈ స్థలమునకు చెందినవాడు కాదు. అతడు దక్షిణ కరోలినా ప్రాంతమునకు చెందినవాడు. శ్రీ. డిక్సన్. అయితే అతడు కేవలం తన పూర్ణ హృదయముతో విశ్వసించినయెడల, దేవుడు ఆ దీవెనను అతనికి దయచేయును. దానిని మీరు నమ్ముచున్నారా? నేను అతనికి పూర్తిగా అపరిచతుడను. నా జీవితములో నేనతనిని ఎన్నడూ చూడలేదు. ఆమేన్. నేనతనిని నా జీవితములో ఎన్నడూ చూచియుండలేదు.
అయితే నా భావమును మీరు గ్రహించుచున్నారా? అది ఏమిటి? "సహోదరుడా బ్రెన్హాం అది ఏలాగు జరుగును?" సహోదరుడు బ్రెన్హాం మార్గము నుండి ప్రక్కకు జరిగినప్పుడు! అవునండి. నేను మార్గము నుండి తొలగినప్పుడు, అప్పుడు యేసుక్రీస్తు లోనికి వచ్చును.
చెప్పవలెననిన, అతనియొద్ద నుండి అగ్నిచే పట్టబడిన మరొక వ్యక్తి, మరియు అతను కూడా దక్షిణ కరోలినా నుండియే వచ్చెను. అది నిజము. అది అతనిపైన వ్రేలాడుటను నేను చూచుచున్నాను. అది ఖచ్చితముగా సత్యము. అతడు మద్యపానము చేయు మరొక సహోదరుని కొరకు ప్రార్ధించుచున్నాడు. అది ఖచ్చితముగా సత్యము. జాగ్రత్తగా వినండి. నీవు సహోదరుడు హోమ్స్. నీవు నమ్ముచున్నావా. నీ పేరు అదేనా. దేవుడు చేయగలడు… దేవుడు నీకు దానిని అనుగ్రహించును.
నా భావమును నీవు గ్రహించుచున్నావా? "మరొక్కసారి, ప్రభువా, మరొక్కసారి!"
ACTS 2:2
63మనందరము లేచి నిలబడెదము, ప్రతి ఒక్కరము. మొర్ర పెట్టండి, పెంతెకోస్తు వారలారా, మీ చేతులెత్తండి, "మరొక్కసారి, ప్రభువా! మరొక్కసారి ప్రభువా, మరొక్కసారి!" హల్లెలూయా! ఏమి చేయవలెనో నేనెరుగను, కాని అది ఇచ్చటనున్నది. మనందరము ఏకమనస్సుతో ''మరొక్కసారి ప్రభువా!" అని కేకవేయుదము. "మరొక్కసారి ప్రభువా! మరొక్కసారి ప్రభువా! మరొక్కసారి ప్రభువా, నీ యొక్క శక్తిని పంపుము, నీ ఆశీర్వాదములు పంపుము, గొప్ప సుడిగాలివలె పరిశుద్ధాత్మను మాపైకి పంపుము, మరియు ఇచ్చటనున్న ప్రతియొక్క ఆత్మను నూతనముగా నింపుము." దేవునికి మహిమ! నీ హృదయమంతటితో దానిని నమ్ముము. "మరొక్కసారి, ప్రభువా, మరొక్కసారి!" హల్లెలూయా!
64ఆత్మతో నింపబడుడి! పరిశుద్ధాత్మ నీలో కుమ్మరించబడినచో, నీ పేరును నీవు మరచిపోవునంతవరకు, నీ సందేహములన్నింటినీ నీవు మరచునంతవరకు నీవు నింపబడవలెను; నీ సందేహములను నీవు మరచునంతగా నీవు ఆత్మతో నింపబడవలెను, అప్పుడు నీవు దేవునితో ఎచ్చటనో ఉండగలవు. అప్పుడు "మరొక్కసారి," అను కేక యధార్థముగా పైకి వెళ్ళును, మరియు తరువాత మరొకటి. హల్లెలూయ! ఆత్మను త్రాగిన వీరు పరిశుద్ధాత్మతో నింపబడినవారైయున్నారు; దేవుని నీతి మరియు పరిశుద్ధత మరియు శక్తి మిమ్మును ఎంతగా నింపుననగా, మీరు ఎవరో మీకు తెలియకుండును. చెప్పాలంటే, మీరు వట్టివారైయున్నారు. గుర్తుంచుకొనండి, దేవుడు మీలోనికి రావలెనని కోరుచున్నాడు. "మరొక్కసారి, ప్రభువా మరొక్కసారి! మరొక్కసారి ప్రభువా, మరొక్కసారి!"
65ఓ, పెంతెకోస్తువారలారా, పెంతెకోస్తువారలారా, మీ జీవము కొరకు పరుగెత్తుడి! ఇంకా కొద్ది సమయమే వున్నది. మీరు ఊహించినదానికంటే ముందే అది జరగవచ్చును. నేను ఈ వేదికపైనుండి ఇక ఎన్నటికినీ మరొక మాట చెప్పకపోయిననూ, గుర్తుంచుకొనండి, మీ జీవము కొరకు పరుగెత్తుడి! మీరు ఆలోచించుటకు ముందే జరగవచ్చును. "దానిని మరలా చెప్పుము," మీ జీవము కొరకు పరుగెత్తుము! అని నా పైనున్న పరిశుద్ధాత్మ చెప్పుటను నేను అనుభూతి చెందుచున్నాను. మీరు ఆలోచించుటకు ముందే జరుగును.
మరొక్కసారి, ప్రభువా, మరొక్కసారి లైఫ్-టేబర్నకల్ లో నున్న ప్రతీ ఒక్కరిని నీ నిత్యజీవముతో నింపుము. ప్రభువైన యేసు, దేవుని యొక్క మహిమ ఈ సహవాసముపై పడనీయుము. హల్లెలూయా! హల్లెలూయా! నేను దేవుని నమ్ముచున్నాను. మరొక్కసారి, ప్రభువా, మరొక్కసారి మనుష్యుడు తానెవరో మరచిపోవునట్లు చేయండి. మనష్యుడు తన అవిశ్వాసమును మరచిపోవునట్లు చేయండి, తద్వారా మేము, "మరొక్కసారి, ప్రభువా, మరొక్కసారి!" అని మొర్ర పెట్టెదము.
మీరాయనను ప్రేమించుచున్నారా?
HEB 4:12
66ఓ దేవా, పరలోకపు తండ్రి, ప్రభువా, మా ప్రాణములో ఉజ్జీవము దయ చేయుము. దీపములు పొగరాజుటను మేము చూచుచున్నాము. బలిపీఠముపైనున్న ఆత్మ ఆరిపోవుచున్నది. ఓ, ప్రభువైన దేవా, పాపశపితమైన ఈ దేశము వైపు చూడండి, అయితే ప్రభువా, నీ ప్రజలను మరువకండి. ప్రభువా, నీ కొరకు ఈ వనరులను నిర్మించుటకు ఇక్కడున్న ప్రజలు సంవత్సరాలుగా కృషి చేసిరి. ప్రభువా, ఆత్మల-రక్షణకు, ఒక ఉజ్జీవమునకు కేంద్రముగా నుండుటకై ఈ లైఫ్-టేబర్నకల్ నిర్మించబడినది. ఓ దేవా, మరొక్కసారి నీ పరిశుద్ధాత్మను దానిలోనికి కుమ్మరించండి. ప్రతి వ్యక్తిని పురిగొల్పండి, ప్రతి భేదాభిప్రాయములను తీసివేయండి. ప్రభువా, యేసుక్రీస్తు ప్రసన్నతతో పాటు, దేవుని యొక్క పరిశుద్ధ అగ్నియను వర్షమును క్రిందికి పంపుము మరియు మా ఆత్మలను వెలిగించుము. ప్రజలు అవిశ్వాసములోనికి వంగిపోకుండునట్లు చేయండి, నీవిక్కడ మాతోనున్నావని వారు చూచునట్లు చేయండి; మరియు నీవు వాక్యమైయున్నావు, మరియు హృదయాలోచనలను వివేచించువాడవైయున్నావు, పరిశుద్ధ గ్రంథము దానిని మరల, మరలా మాకు నిరూపించెను. ప్రభువైన దేవా, దేవుని ఆత్మ మా మధ్యలో నున్నదను మేల్కొల్పును మా జ్ఞానేంద్రియములకు కలుగును గాక. తండ్రి, దానిని అనుగ్రహించండి. నాతోపాటు, దానిని నేను నీకు అప్పగించుచున్నాను. ఆమేన్.
67సహోదరుడా, సహోదరీ, సంఘము ఎత్తబడుటకు ముందు దేవుడు దేనిని వాగ్దానము చేసెనో, నా పరిశుద్ధ గ్రంథములో నేనెరుగను. నేనెరుగను. నీవు మృగము యొక్క ముద్ర వచ్చుటను గూర్చి ఆలోచించుచున్నావు, వారు దానిని కలిగియున్నారు, నేను దానిని చెప్పితిని, చూశారా. ఇక మిగిలియున్న కార్యమేదనగా సంఘము యొక్క ఎత్తబడుటయైయున్నది. నాకు తెలిసినంతవరకు అది ఏ లేఖనమునూ తప్పిపోకుండా అది ఏ సమయములోనైనా జరగవచ్చును. అది సత్యమని దేవుడెరుగును. అవునండి. సమయము ఆసన్నమైనది. అది మనము ఊహించినదానికంటే ముందుగా వుండును.
మనము కేవలం మన కళ్ళు మూసుకొని మరియు "నేనాయనను ప్రేమించుచున్నాను," అను పాట పాడెదము. బహుశ మనము ఆరాధించి మరియు ఆయనను స్తుతించినయెడల ఆయన దేనినైనా చేయును. ఈ గుడారములో గొప్ప ఉజ్జీవము కలుగుటను చూచునట్లు ఈ వారమంతయూ నేను ప్రార్ధించితిని. నేను ఇక్కడికి వచ్చుటకు ముందు నేను ప్రార్ధించితిని. దీనికొరకు ప్రార్ధించే ప్రజలు నాకున్నారు. ఓ, దీనికొరకై అక్కడ ప్రార్ధన జరుగుచున్నది. నేను నా హృదయమంతటితో నమ్ముటకు ప్రయత్నించుచున్నాను. మనమిప్పుడే, త్వరగా లేచెదము. దానిని మనమిప్పుడు మన కన్నులు మూసుకొని మరియు దేవునివైపు మన చేతులెత్తి పాడుచుండగా, మనము కేవలం ఆయనను ఆరాధించెదము మరియు ఆయనను స్తుతించెదము.
నేనాయనను ప్రేమించుచున్నాను,
నేనాయనను ప్రేమించుచున్నాను,
ఎందుకనగా ఆయనే మొదటగా నన్ను ప్రేమించెను.
మరియు నా రక్షణను కొనెను,
కల్వరి వృక్షముపై.
68ఇప్పుడు తర్వాతి వచనమును పాడుచుండగా, మీ ప్రక్కనున్న మీ క్రైస్తవ సహోదరునితో కరచాలనము చేసి, ఇట్లు చెప్పుడి, "ప్రభువు నిన్ను దీవించును." ఇప్పుడు మనము పాడుచుండగా, అట్లు చేయుడి.
నేనాయనను ప్రేమించుచున్నాను, నేనా …
(మీరు ఒకరినొకరు ప్రేమించినయెడల
దేవుని ప్రేమించకుండా ఉండలేరు.)
ఏలయనగా ఆయనే మొదటగా ప్రేమించెను
మరియు నా రక్షణను కొనెను
కల్వరి వృక్షముపై.
ఇప్పుడు మనము, "హల్లెలూయా!" అని చెప్పెదము. దానిని మరలా చెప్పండి, "హల్లెలూయా!" మరలా "హల్లెలూయా!" మన దేవుని స్తుతించండి!
నేనాయనను ప్రేమించుచున్నాను
ఎందుకనగా….