మేము ఆయన నక్షత్రము చూచి ఆయనను ఆరాధింప వచ్చితిమి
1ధన్యుడగు మన ప్రభువైన యేసు గూర్చి మీతో మాట్లాడు ఈ అవకాశము నిమిత్తమును, కూడి వచ్చిన ఈ చక్కని క్రైస్తవ జనుల మధ్యనుండుట, ఈ సాయంకాలము మహా భాగ్యముగా ఎంచుచున్నాను. ఇక్కడ మనందరము ఆయనను గౌరవించుటకే యున్నాము. ఆయనను గౌరవించవలెను.
సహోదరులు టోనీ, మరియు విలియమ్స్ నుండుట బాగున్నది. టుసాన్ మరియు ఫీనిక్సులకు వారిచ్చట అధ్యక్షులుగా ఉన్నారు. గత శనివారము ఉదయము అక్కడ ఆరాధన జరిగినది. అక్కడున్న రమాడా ఇన్న్ లో నిశ్చయంగా గొప్ప సమయము అనుభవించాము. ఈ నెల పంతొమ్మిది నుండి మరల అక్కడ ప్రారంభమగు కూటములలోను గొప్ప సమయము గడుపగలమని ఆశించుచున్నాము. పొడిగించబడిన ఆరాధనకు వెళ్ళుట నాకు భాగ్యముగా ఎంచుచున్నాను. పంతొమ్మిది నుండి ప్రారంభమై నాలుగు రాత్రులు పాటు జరుగునని నమ్ముచున్నాను. బిజినెస్ మెన్స్ ఇంటర్నేషనల్ కన్వెన్షను ఇరవై రెండు, ఇరవై మూడులలో ఆరంభమగునని నమ్ముచున్నాము. ఇరవై రెండు వరకు అక్కడ నేనుందును. వారి కూటములలో ఒకటి, రెండు రాత్రులు గడుపుదును. దేశములోని వివిధ ప్రాంతములలో ఉన్న క్రైస్తవులతో పాటు కూడి, వారితో పాటుగా, క్రీస్తు పట్ల నాకు గల ప్రేమ, భావములు వ్యక్తము చేయు ఈ అవకాశము చాలా గొప్పది. గొప్ప సహవాసమును కలిసి మేము పంచుకొందుము. మీరిచ్చిన ఈ చక్కని భోజనమును అనుభవించుటకు ఇక్కడికి రాలేకపోయినందుకు చింతించుచున్నాను…
EXOD 20:16•
DEUT 5:20•
COL 3:9
2ఇంటర్వ్యూల నిమిత్తము, రోగులకు ప్రార్ధి౦చు నిమిత్తము, మార్గములో కొందరికి సహాయము చేయ ప్రయత్నించుటకు నేను బయటకు వెళ్ళాను. మనము ఒక జబ్బుపడిన, పాత ప్రపంచములో జీవించుచున్నాము, ఎంతో వ్యాధి, బాధ యున్నది. కాని దీనంతటి మధ్య ఒకాయన వైపు మనము చూడగలుగుట ఆశ్చర్యము కాదా? దీనికంటె అవతలకు, ఈ సంగతులకు పైగాను మనము చూచుచున్నాము.
ఒక నిజమగు క్రిస్మస్ లేని యెడల ఎట్లు౦డెడిది? ఒక నిజమగు క్రిస్మస్ ఉండి యుండని యెడల, సంగతులు ఈ రాత్రి యుండినటుగా ఉండియుండెడివి కావు. క్రిస్మస్ లేని యెడల రక్షణ ఉండెడిది కాదు. ఇప్పుడు మరల మనము క్రిస్మస్ను ఎదుర్కొనుచున్నాము. మనము దాని యొక్క వాస్తవ భావమును మార్చివేయుట చాలా విచారకరము. అది యేసు జననము. క్రిస్మస్లోని క్రీస్తు స్థానమును శాంతాక్లాస్ ఆక్రమించెను. ఒక పొగ గొట్టము నుండి క్రిస్ క్రింగిల్ తన వీపు మీద బొమ్మలు మోసికొనివచ్చి ఒక్క రాత్రిలో సర్వ ప్రపంచమును దర్శించుట ఒక కట్టు గాధ. దాని గూర్చి మీరేమి తలంచుచున్నారో నాకు తెలియదు. మీరు మీ పిల్లలకు అది చెప్పగోరినయెడల సరియే, కాని వాక్యము నాకు ఈలాగు నేర్పినది, "నీవు అబద్ధమాడరాదు." మరియు "యేసే శాంతాక్షస్ కదా"? అని ఒక దినమున వారు అడుగుదురు, ఎప్పుడైతే వారు శాంతాక్లాస్ లేడు అని కనుగోనునప్పుడు. కాబట్టి నాకు నేను అది ఉత్తమామము అని అనుకుంటాను. అది మీ ఆలోచన కాకపోవచ్చును. మీరు మీ బిడ్డలనెట్లు పెంచవలెనో చెప్పుట లేదు, కాని వారికి మీరు ఈ అబద్ధము నేర్పినట్లు గ్రహించిన యెడల ఒక దినమున వారు మరొక అబద్ధమును కూడా చెప్పెదరు, కాబట్టి వారికి సత్యము, సూటి వాస్తవము చెప్పండి. అప్పుడు వారు మీ భావమును గ్రహించెదరు. బయటి వారు క్రిస్మస్ను ఎంత వికృతపరచినా గాని, అది మనలను క్రిస్మస్ ఎలాగుండాలో అలాగ చేయకుండా ఇబ్బంది పెట్టలేదు. చూచారా?
MAL 4:2
3చీకటిలోనే వెలుగు చక్కగా ప్రకాశించునని నేను తలంచుచున్నాను. ఎంత ఎక్కువ చీకటి అయితే, అంత ఎక్కువ ప్రకాశమానముగా నుండును. కొన్నిసార్లు అది చిన్న వెలుగే కావచ్చు, ఎక్కువ వెలుగున్నా గాని గమనించరు. కాని చీకటి ఎక్కువగుచున్న కొలది, ఆ చిన్న వెలుగే మరింత బలముగా ప్రకాశించును. వెలుగు యొక్క సన్నిధిలో ఏ మాత్రమూ చీకటి ప్రకాశించజాలదని మరువకండి. వెలుగు, చీకటికన్నా ఎంతో ఎక్కువ శక్తిగలది. అది దాని సాన్నిధ్యములో నిలబడలేదు. సూర్యుడు ప్రకాశించనారంభించినప్పుడు చీకటి నిలబడజాలదు, దాని సాన్నిధ్యములో అది నిలువజాలదు. సూర్యుడు, దాని వెలుగు ఎంతో గొప్పది గనుక అది చీకటిని అణచి వేయును. ఇక అది కనబడదు.
ఈ చీకటి ప్రపంచము, ఒక దినమున, పూర్తిగా వెలుగుగా మార్చబడును. నీతి సూర్యుడగు యేసు క్రీస్తు మరల వచ్చినప్పుడు ఇక మనకు చీకటి యుండదు. ఆ సమయము వరకే మనము చీకటిని చూతుము. చంద్రుని కాంతి చూతుము.
4సూర్యచంద్రులు భార్యభర్తలు అని చెప్పవచ్చును. సూర్యుడు మరుగైన వేళ, చంద్రుడు సూర్యకాంతిని ప్రతిబింబింపచేసి, భూమికి తక్కువ కాంతిని ఇచ్చును. అందువలన మనము సూర్యోదయము వరకు ఆ వెలుగులో అటు ఇటు సంచరించగలుగుచున్నాము. అంతట సూర్యచంద్రులు ఒక్కటిగా యగును. సూర్యకాంతి, వెన్నెల ఒక్కటే.
ప్రభువైన యేసు క్రీస్తుయొక్క సంఘము కూడా ఆలాగే ఉండవలసియున్నది. శరీర సంబంధముగా ఆయన భూమి మీద లేనప్పుడు ఆయన యొక్క వెలుగును అది ప్రతిఫలింప చేయవలెను. ఈ చీకటి ఘడియలలో సంఘమే యేసుక్రీస్తు యొక్క ప్రతిబింబం. వీధుల్లో శాంతాక్షస్ ఇంకా హడావిడి కనబడుచున్నది. అయితే మనము "ఇది యేసుక్రీస్తు జననము, సెంట్ నికోలస్ దర్శనము కాదు," అని గొంతెత్తి చెప్పవలెను. మనము చాలా భయంకరమగు చీకటి సమయములో జీవించుచున్నాము. నిజంగా మన వెలుగు అప్పుడే ప్రకాశించవలెను.
MATT 2:1-7•
ROM 10:17
5ఇప్పుడు, దేవుని వాక్యమును చదువు ముందుగా దానిని మనము ఘనపరచవలెను. ఆయన వాక్యమును ఏలాగు ఘనపరచుదుము? దానిని చదువుట ద్వారాను, దానిని నమ్ముట ద్వారాను గౌరవించగలము. దానిని మనము చదువవలెను, "వినుట వలన విశ్వాసము వచ్చును." దానిని చదువుట ద్వారా మనము గౌరవించినఎడల, మనము చదివిన దానిని నమ్ముట ద్వారా ఆయనను గౌరవించుదుము.
కాబట్టి ఇప్పుడు, మొదటి గౌరవము ఇచ్చుట కొరకు, ఆయన వాక్యమును చదువుచుండగా లేచి నిలబడుదుము. నేను ఒక లేఖన భాగము చదివెదను. ఆయన వాక్యము చదువుచుండగా, గౌరవము కొరకు మనము లేచి నిలబడుదుము. ఈ రాత్రి కొన్ని క్షణములు మాట్లాడుట కొరకు దానిని నేను చదువగోరుచున్నాను. అది పరి. మత్తయిలోని క్రిస్మస్ గాధ. పరి. మత్తయి 2వ అధ్యాయము నుండి చదువుదుము.
రాజైన హేరోదు దినముల యందు యూదయ దేశపు బెల్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి,
యూదుల రాజుగా పుట్టిన వాడెక్కడ? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూచి, ఆయనను పూజింప వచ్చితిమనిరి.
హేరోదు రాజు ఈ సంగతి విన్నప్పుడు అతడును, అతనితో కూడా యెరూషలేము వారందరును కలవరపడిరి.
కాబట్టి రాజు ప్రధాన యాజకులను, ప్రజలలో నుండు శాస్తులను అందరిని సమకూర్చి - క్రీస్తు ఎక్కడ పుట్టునని వారినడిగెను.
అందుకు వారు - యూదయ బెల్లెహేములోనే, ఏలయనగా, యూదాయ దేశపు బెత్తే హేమా, నీవు యూదా ప్రధానులలో, ఎంత మాత్రమును అల్పమైనదానపు కావు. ఇశ్రాయేలను నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చును అని ప్రవక్త ద్వారా వ్రాయబడియున్నదనిరి.
అంతట హేరోదు ఆ జ్ఞానులను రహస్యముగా పిలిపించి ఆ నక్షత్రము కనబడిన కాలము వారిచేత పరిష్కారముగా తెలిసికొనెను.
6ఈ వాక్యమునకు కర్తయగు దేవునితో మాట్లాడుచుండగా, మనమిప్పుడు ఒక్క క్షణము మన శిరములను వ౦చుదము.
సర్వశక్తుడవగు దేవా, పరిశుద్దాత్మ ద్వారా ఈ చివరి దినములలో మా హృదయములందుంచబడిన క్రీస్తు ప్రేమను బట్టి మా హృదయా౦తరంగముల నుండి ఈ రాత్రి నీకు వందనములు చెల్లించుచున్నాము. మేము కూడికొని నిన్ను ఆరాధించు ఈ భాగ్యమును బట్టి వందనములు చెల్లించుచున్నాము. ఒక దినమున నీవు నీ సంఘము కొరకు వచ్చుచున్నావన్న శుభప్రదమగు నిరీక్షణ మాకు గలదు. ఈ యుగమునకు వెలుగును చూపించువారముగా మేము ఉన్నందులకు వందనములు చెల్లించుచున్నాము. ఇప్పుడు మేము జీవించుచున్న ఈ యుగమునకు వాగ్దానము చేయబడిన వాక్యము బయలుపరచబడుటకు సిద్ధముగా యున్నది. ఆదియందు నీవు నీ వాక్యమును కేటాయించి యున్నావు అని మాకు తెలియును. ప్రతి యుగము యొక్క అంతమును ఆదినుండియే నీవెరుగుదువు. నీవు ఆ యుగమునకు నీ వాక్యమును కేటాయించి యున్నావు. అయితే అదెట్లు జరిగియున్నదో మాకు తెలియదు, కాని ఆ యుగములలో ప్రతి దానిలోను ఒక ప్రత్యేక అభిషేకము ఆ వాక్యమును నెరవేర్చుచున్నట్లు నీ వాక్యములో మేము చూచుచున్నాము. ఇప్పుడు మేము జీవించుచున్న ఈ దినములకును ఒక కేటాయించబడిన వాక్యమున్నది. ఈ యుగమునకు ఒక వాగ్దానమున్నది. ఈ భూమి మీద ఇప్పుడు పరిశుద్ధాత్మయున్నదని మేము నమ్ముచున్నాము, హృదయములను కనుగొన ప్రయత్నించుచున్నది. ఈ దినము మరియు ఈ ఘడియ కొరకు ప్రవచింపబడిన వాక్యమును బయలుపరచుట ద్వారా దానిని నెరవేర్పులోనికి తీసికొని వచ్చుచున్నది.
7పందొమ్మిది వందల సంవత్సరముల వెనుకకు మేము చూడగా, ఏదెను తోటలోనే ఒక రక్షకుని గూర్చిన వాగ్దానము ప్రవచనాత్మకంగా చెప్పబడుట కనుగొనుచున్నాము. ఆయన వచ్చి ప్రవచించబడిన ప్రతి వాక్యమును నెరవేర్చెను. ఆయన జీవితము దేవుని వాక్యమును బయలుపరచెను, ఎందుకనగా ఆయనే వాక్యము. దేవునియొక్క సర్వపరిపూర్ణత ఆయనలో నివసించెను. ప్రవక్తలందరూ చెప్పిన దానికి జవాబు, నెరవేర్పు ఆయనే. ఈ రాత్రి మరల ఆయన జన్మదిన ఉత్సవమును జరుపుకొనుటకు సమీపించుచున్నాము.
ప్రభువా, మా దేశము సహితము ఎవరో అల్లిన కట్టుకథలో ఒక విధమగు పురాణము వంటి దానిలో పూర్తిగా మిళితమైపోయెను. కాని ప్రభువా, నిజ విశ్వాసికి అది తప్పుయని తెలియును, మరియు అది కేవలము శత్రువు యొక్క పని. నిజమగు, సజీవుడగు దేవుని నుండి ప్రజల యొక్క మనస్సులను మరల్చుటకే.
COL 1:19
8దేవా, మేము క్రిస్మస్ గాధలోనికి వచ్చుచుండగా ఈ రాత్రి ఆయన సన్నిధి మాతో నుండునట్లు ప్రార్ధి౦చుచున్నాము. ఇంకా ఆయనను తమ స్వరక్షకునిగా అంగీకరించని వ్యాపారి లేదా స్త్రీలు ఇక్కడ ఉన్నట్లయితే, ప్రభువైన యేసూ, ఈ రాత్రి వారి హృదయమే ఒక పశుల తొట్టిగాను, ఊయల గాను మారును గాక, దేవునియొక్క మెస్సీయా అగు యేసు ఆనాడు తృణీకరించబడి విసర్జించబడినవాడాయెను. ఉదయ నక్షత్రము వారిమీద ప్రకాశించుచుండగా ఈ రాత్రి వారు బయటకు వెళ్ళుదురు గాక. ఈయన వెలుగు ద్వారానే ఒక దినమున వారు యోర్దానును దాటుదురుగాక. తండ్రీ, అది అనుగ్రహించుము, దీనిని ఆయన మహిమార్థమై ఆయన నామములో అడుగుచున్నాము. ఆమేన్. (మీరు కూర్చొనవచ్చును.)
9మామూలుగా నేను ఎక్కువ సేపు మాట్లాడుచుందును; ఈ రాత్రి నేను బోధించుటకు ప్రయత్నించుట లేదు, ఎందుకనగా నా గొంతు బొంగురుపోయినది. కాని ఈ క్రిస్మస్ గాధను గూర్చి చిన్న నాటిక ఇచ్చెదను. దీనిని చాలాసార్లు మీరు వినియున్నారని నిస్సందేహముగా నేను చెప్పగలను, ఈ వాక్యమును మీరు చదివియందురు, ఇది రేడియోలలో వచ్చుచుండును, మీ టెలివిజనులలోనికి వచ్చును. మీ సంఘములు, మీ చక్కని దీన సంఘకాపరులు, వ్యాపారులు మొదలగు వారు ఈ క్రిస్మస్ గాధను చెప్పగా వినియుందురు, బహుశా వారు చెప్పియు౦దురు.
ఫోనిక్సులో జరిగిన వ్యాపారస్తుల కూడికలో గత శనివారము చెప్పిన దానికి కొద్ది భిన్నంగా దీనిని నేను సమీపించగోరుచున్నాను. యేసు బెత్లెహేములో ఎందుకు జన్మించెనో చెప్పాను. చూడండి. మరి ఆయన ఏ స్థలములోనూ జన్మించలేడు. (చూడండి?), ఎందుకనగా ఆయన పేరు, ఆయన ఎవరై యుండునో చెప్పబడినది. బెత్లెహేము అనగా దేవుని యొక్క రొట్టెల గృహము అని లేఖనములో మనము కనుగొందము. ఆయనే దేవుని యొక్క జీవాహారము, తిరిగి జన్మించిన క్రైస్తవులమగు మనందరము బెత్లెహేములోనే జన్మించియున్నాము. క్రీస్తే దేవుని యొక్క బెత్లెహేము, నిత్యజీవమే ఆయన యొక్క రొట్టెల గృహము.
MATT 2:2
10ఇప్పుడు, ఈ రాత్రి దానిని మనము వేరే రీతిలో సమీపించుదము. ప్రభుని చిత్తమయితే ఈ రాత్రి నేను తీసికొను అంశము ఇది: "మేమాయన నక్షత్రము చూచి ఆయనను ఆరాధింప వచ్చితిమి."
ఇక్కడ జ్ఞానులున్నారు. సాంప్రదాయమును బట్టి వీరు ముగ్గురు అని మనకు చెప్పబడి ఉన్నది, మరియు ఒక అవగాహనా ఇక్కడ ఉన్నది, ఇంకా మనకు అది సత్యము అని తెలియదు. బైబిలు మనకు ముగ్గురు అని చెప్పుట లేదు, వారు వచ్చిన ఇండియా దేశములో సేవచేయు భాగ్యము నాకు దొరికినది. వారు ముగ్గురు గానే ప్రయాణము చేయుదురు, ఇంకా దానిని మనము చూడగలము. నేను ఇండియాలో ఉండి ఎంతోకాలము కాలేదు. వారు తలపాగాలు ధరించి వీధుల్లో కూర్చొని ఒకరికొకరు తలలు ఆనించుకొని పగటి సమయములో పైకి చూచుచుందురు. ఏదో పగటి కల కనుచున్నట్లుందురు, వారెన్నడూ క్రింద సరిగ్గా కూర్చొనరు, వారు తమ మోకాళ్ళ మీద కూర్చొందురు. వారు ముగ్గురేసి చొప్పున ప్రయాణము చేయుచుందురు గనుకనే అక్కడ ముగ్గురున్నారని తలంచుచున్నాము.
"తూర్పున మేమూయన నక్షత్రము చూచి ఆయనను ఆరాధింప వచ్చితిమి," అని వారనిరి. మరొక మాటలో ఈలాగు చెప్పవచ్చును. "ఈ కాలమునకు సంబంధించిన ఆయన సూచనను మేము చూచాము," వారు ఆ కాలములో జీవించుచున్నారు. అది ఆలాగు ప్రవచింపబడినది.
MAL 3:6•
JOHN 12:48
11చూడండి. దేవుని వాక్యము నిత్యమైనదని నేను నమ్ముచున్నాను. "ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవునియొద్ద ఉండెను, వాక్యము దేవుడై యుండెను. ఆ వాక్యము శరీరధారియొ మనమధ్య నివసించెను." కాబట్టి వాక్యమొన్నడూ మారదు, అది నిత్యమైనది. అది దేవుడే స్వయముగా పరిశుద్ధ గ్రంథము లోపల అచ్చు రూపములో యున్నారు. బైబిలు దేవుని వాక్యము.
ఆయన సంఘమునకు ఒక ప్రామాణిక ద్వారా తీర్పు తీర్చును. మనము నిర్ణయించిన ఏదో ఒక ప్రమాణమును బట్టి ఆయన తీర్చు తీర్చడు, ఎందుకనగా మన వ్యవస్థలన్నియూ మానవ నిర్మితములు, మరియు అది తీర్పు తీర్చబడవలసినది. మీరు దానిని అంగీకరించక ఇట్లనవచ్చును. "లేదు, బ్రన్హం సోదరుడా, ఆ విషయములో నీది తప్పు. మేము మాది నమ్ముచున్నాము." మరొకడు "మాది మంచిది" అనును, అయితే ఏది ఒప్పు? తొమ్మిది వందలకు పైగా వేర్వేరు సిద్దాంతములున్నవి, తొమ్మిది వందలకు పైగానున్న వేర్వేరు పద్ధతులను బట్టి దేవుడు తీర్పు తీర్చజాలడు.
కాని అక్కడ ఒక్కటే యుండును. "యేసు క్రీస్తు ద్వారా లోకమునకు తీర్పు తీర్చును," అని చెప్పెను. క్రీస్తే వాక్యము. కాబట్టి మనము దేవుని వాక్యము ద్వారా తీర్పు తీర్చును
MATT 2:2,9,11,16•
JOHN 1:1,14
12మొదట ఒక సూచన చూపించకుండా దేవుడెన్నడూ ఏదియూ చేయడు. దేవుడు మొదట తన యొక్క సూచన చూపించకుండా ఏదియూ చేయడు. ఆయన దోషి కాజాలడు.
ఈ జ్ఞానులు ఈలాగు చెప్పిరి, "మేము తూర్పున ఆయన నక్షత్రము చూచితిమి." దానిని వారు చూచినప్పుడు తూర్పున ఉండిరి, అది బబులోను, యెరూషలేమునకు తూర్చు. ఆ తరువాత రెండు సంవత్సరములకు వారు పశ్చిమానికి పచ్చి, "ఆయనను ఆరాధింప వచ్చితిమని" చెప్పిరి.
క్రైస్తవ సాంప్రదాయ ప్రకారము జ్ఞానులు పశుల తొట్టిలోయున్న శిశువును చూచుటకు వచ్చినట్లు భావించుచున్నాము. అది తప్పు. వాక్యము దానికి వ్యతిరేకముగా యున్నది. వారు ఒక పసిబిడ్డ యొద్దకు గాక, ఎదిగిన శిశువు యొద్దకు వచ్చినట్లు లేఖనము చెప్పుచున్నది. హేరోదు రెండేండ్లు మొదలుకొని తక్కువ వయస్సు గల వారినందరినీ చంపెను. చూడండి. వారు అక్కడికి వచ్చుటకు ఒంటె ద్వారా ప్రయాణము చేయవలసియుండిరి. వారు టైగ్రిస్ నది దాటి ప్రయాణము చేయుటకు రెండు సంవత్సరములు పట్టెను. "మేమాయన నక్షత్రమును చూచితిమి." వారప్పుడు తూర్పున యుండినప్పుడు మరియు "పడమరకు వారాయనను ఆరాధింప వచ్చిరి."
13ఇప్పుడు గమనించండి, క్రిస్మసు ఇప్పుడు మారిపోయినది. నిజమగు క్రిస్మసు గూర్చి మనము వివాదపడుచున్నాము, ఎందుకనగా దానిని మనమెరుగము. మీరు అధ్యయనము చేసినత్లైతే, మనము రోమను కాథలిక్కు సంఘము యొక్క అభిప్రాయమును లెక్కలోనికి తీసికొనుచున్నాము. వాస్తవానికి, డిసెంబరు ఇరవై అయిదో తేదీన క్రీస్తు జన్మించియుండకపోవచ్చునని లేఖనముల ప్రకారము భావించవచ్చును, ఎందుకనగా ఆ సమయములో యూదయ నందు ముప్పది అడుగుల మంచు ఉండును. (చూచారా?) కావున వారు. గొర్రెల కాపరులు కొండలలో ఉండలేరు, అది ప్రకృతికి విరుద్ధము. ఆయన ప్రకృతి వలెనె వచ్చెను.
ఎందుకనగా, దేవుడు ఒక చట్టమును కలిగియున్నాడు, ఆ చట్టములు మారజాలవు. సూర్యుడు అస్తమించును, "అది ఇక ఉదయించదు" అని నీవు చెప్పలేవు. సూర్యుడు ఉదయించును. ఎండాకాలము, శీతాకాలము మొదలగునవి దేవుడు చట్ట ప్రకారము నిర్ణయించెను. వాటిని ఆయన క్రమములో యుంచాడు. మరియు ప్రతిదియూ పరిపూర్ణముగా పనిచేయుచున్నది.
14కాని ఇప్పుడు, బహుశా ఆయన ఏప్రిల్ లేదా మే లో జన్మించియుండవచ్చును. ఆయన ఒక గొర్రెపిల్ల, ఆయన గొర్రెపిల్లగా యుండునని అన్నియూ రుజవు చేసినవి. ఆ కారణము చేతనే ఆయన పశుల తొట్టిలో జన్మించెను, ఒక కొట్టములో జన్మించెను, ఇంటిలో జన్మించలేదు; ఎందుకనగా గొర్రెలు దొడ్డికి వెలుపట జీవించును, ఇంటిలో కాకుండా గడ్డి మొదలగు వానిలో జీవించును. సిలువ మరణమునకు కొనిపోబడినప్పుడు, ఆయన ముందుండి నడిపించబడెను, మీరు గుర్తు౦చుకొనండి, గొర్రెలు నడిపించబడును. మీరు ఇక్కడయున్న వధశాలకు వెళ్ళునప్పుడు; వారు గొర్రెను ముందుండి నడిపించుటకు గాను, మేక లేక మరిదేనినైనను కలిగియుందురు. అది తనంతట తాను వెళ్ళదు, దానిని తోడ్కొని వెళ్ళవలెను, అన్ని విధముల గాను ఆయన ఆలాగే యుండును. కాబట్టి ఆయన స్వాభావికంగా గొర్రెలు జన్మించు సమయములోనే జన్మించవలెను. అది ఏప్రిలు నెల, చూడండి. అది ఆయన జన్మించిన కాలమగును.
15కాని క్రైస్తవ్యమును రోమనిజము లోనికి తీసికొని వచ్చినప్పుడు నికాయా యొద్ద దానిని మిశ్రతము చేసిరి. వారు సూర్య దేవుని కలిగియుండిరి, జూపిటర్, రోమ్ యొక్క సూర్య దేవత, దానియొక్క జన్మ దినము డిసెంబరు ఇరవై అయిదు. ఎందుకనగా, రోమను సర్కస్ ఇరవై ఒకటిన ప్రారంభమయి ఇరవై అయిదు వరకు ఉండును. అప్పుడే సూర్యదేవత యొక్క జన్మదినోత్సవము జరుగును, కనుక రోమనుల అన్యత్వము క్రైస్తవ్యము లోనికి మలచి "దానిని మనము సూర్యదేవుని జన్మదినమును (Son-of-God's birthday)గా చేసికొ౦దుము, అప్పుడు మనమందరమూ దానిని అంగీకరించువచ్చును," అని చెప్పుకొనిరి. చూడండి. ఎల్లప్పుడు సత్యముతో రాజీ యగుటవల్లనే ఇవి పుట్టుకొచ్చుచున్నవి.
16కాబట్టి ఈనాడు వారు దానంతటినీ ఇందులోనికి చొప్పించిరి, మన సెలవు దినములు కలుషితమైపోయినవి. మన ఈస్టరు, క్రీస్తుయొక్క పునరుద్దానముగా ఇక లేదు, అది ఒక రకమగు ఈస్టరు చెవుల పిల్లి అయినది, లేక క్రొత్త టోపీగాను లేదా ఒక చిన్న రంగు బాతుగాను అయిపోయినది. క్రీస్తు పునరుద్దానమునకు ప్రాధాన్యత లేదు, యేసు క్రీస్తు జననమునకు శాంతాక్లాస్ సంబంధము లేదు, కాని అది లోకము! వ్యాపార ప్రపంచము ప్రతి దానిని ఈ విధముగా మలచినది, ఇందులో ఆశ్చర్యము లేదు, దానిని దేవుడు దహించుట న్యాయమే. ఆయనది చేయనైయున్నాడు, దానిని చేయుదునని దేవుడు వాగ్దానము చేసెను. చివరకు అది ఇట్టి గందరగోళములో పడినది… ఇక ఏ ఆశయూ లేదు, అది గతించినది.
మరియు ఇప్పుడు, కాని ఈ అంధకార ఘడియలో మనము జీవించుచున్నాము, క్రైస్తవులు ఇంకనూ ఆ వెలుగును చేతపట్టుకొని పోవలెను, అదియే క్రిస్మసు సత్యము, అదియే దేవుని కుమారుడగు యేసు క్రీస్తుయొక్క జననము. కారు మేఘములు కమ్మి చిమ్మచీకటి చోటు చేసికొన్న వేళ వెలుగు ప్రకాశించును, దానినే అది సూచించుచున్నది. అంధకార కాలములోను వెలుగు ఉండగలదని అది నిరూపించుచున్నది.
17ఈ రాత్రి నేను అదియే మాట్లాడుచున్నాను, అది కొద్దిగా అసాధారణముగా కనిపించవచ్చును, ముఖ్యంగా నేనిక్కడ వ్రాసిన నోట్సులు మరియు వాక్యములు ఆలాగే యుండును, వాటిని నేను ప్రస్తావించెదను, వీలయినన్ని లేఖనములను ఎత్తిచూపుదును. ఇప్పుడది కొద్దిగా అసాధారణముగా ఉండును, కాని మీరు ఎల్లప్పుడూ దీనిని మనస్సులో యుంచుకొనవలెనని కోరుచున్నాను. దేవుడు అసాధారణమగువాడు, దేవుడు అసాధారణమగు కార్యములను చేయును. నేడు అదే మన సమస్య. మనము వాడుక క్రియలలో ఎంతగానో పాతుకుపోయినందున ఏదయినా అసాధారణమైనది జరిగినప్పుడు దానిని మనము గమనించలేకపోవుచున్నాము. దేవుడు అసాధారణమగు వాటిని చేయును. బైబిలు చదివిన ఏ వ్యక్తి అయినా గాని, దేవుడెల్లప్పుడూ అసాధరణమైన వాటినే చేయునని ఎరుగుదురు.
మరియు గుర్తు౦చుకొనండి, ఇదంతయూ దేవుడు ముందుగానే ఏర్పాటు చేసెను, ఈ కుమారుని యొక్క పుట్టకముందు ఏర్పాటే. అదెట్లు, ఎప్పుడు, జరుగవలెనో అంతయూ దేవుడు తనంతట తానే ముందే నిర్ణయించెను.
JER 31:15•
MATT 2:18•
LUKE 8:11
18మీరు గమనించారా, ఈ హేరోదు రాజు ఒక హంతకుడు, ఈ సమయములోనే అందరు చిన్నపిల్లలను చంపెను, ప్రవక్త ద్వారా దేవుని యొక్క మాట నెరవేరునట్లు ఈలాగు జరిగెను. "రామాలో అంగలార్పు వినబడెను, రాహేలు తన పిల్లల విషయమై ఏడ్చి ఓదార్సు పొందనొల్లకపోయెను." చూడండి. అంతకు ఎన్నో వందల సంవత్సరముల ముందు ప్రవక్త ద్వారా పలుకబడిన ప్రవచనము నెరవేర్చుటకు ఆ హంతకుడగు రాజు ఉండవలసియున్నాడు. దేవుడు తన ప్రవక్త ద్వారా ఒక మాట పలికినప్పుడు అది దేవుని వాక్యమే అయిన యెడల అది నెరవేరవలసియున్నది. అదెంత కాలము పట్టినా గాని అది మాత్రము నెరవేరును, ఎందుకనగా అది ఒక విత్తనము. విత్తువాడు విత్తిన విత్తనమే ఈ వాక్యమని యేసు చెప్పెను, కాబట్టి అది దాని నిర్ణయ కాలములో తప్పక ఫలించును. ఆ పిల్లలను చంపుటకు ఆ సమయములో హంతకుడగు ఆ రాజు ఉండవలసియుండెను.
EXOD 9:16•
LUKE 2:1•
ROM 9:17
19మరో సంగతి మనము గమనించవలసి యున్నాము, అదే సమయములో, ప్రజల మీద పన్నులు విధించవలసియున్నది. ఆ కారణము చేత యోసేపు, అతని భార్య (ప్రధానము చేయబడిన భార్యయగు మరియ) బెత్లెహేములోనికి బలవంతముగా రావలసి వచ్చెను.
పన్నులు ఏలాగు చేయవలెనో దేవునికి తెలియును. ఆయన శత్రువు యొక్క పనులు కూడా తనను స్తుతించునట్లు చేయును. సమయమును సరిగ్గా దిద్దుటకు మనము "ఇది చేయవలెను, అది చేయవలెను" అని కొన్నిసార్లు తలంచుదుము. దేవుని యొక్క గడియారము పరిపూర్ణముగా కొట్టుచున్నది, మరియు యేసు సకాలములోనే ఇక్కడ ఉండును. ఆయన ఒక్క సెకెను కూడా వెనుక పడడు. దానిని చేయుదునని దేవుడు చెప్పినట్లుగానే ఖచ్చితముగా ప్రతిదియు జరుగును. దానిని మనము చేసినా, చేయకపోయినా, అది ఇక్కడ ఆలాగే యుండును, ఎందుకనగా దేవుడు దానిని చెప్పెను గనుక ఆలాగు అది జరుగును.
LUKE 2:1,3
20ఈ పన్నులు చెల్లించుటకు తమ జన్మస్థలము విడిచి దూరంగా ఉన్నవారందరూ తిరిగి తమ తమ స్వస్థలములకు రావలెనని హేరోదు ప్రజలకు చెప్పుట మనము కనుగొందుము. దీనిని అతడు తాను ఏదో గొప్ప కార్యము చేయుచున్నానని అతడు తలంచెను, ఆయన ఇది చేసినప్పుడు; యెహోవాతో కలిసి పొందికగా పనిచేయుచున్నానని అతడు ఎరుగకనే చేసెను. ప్రభువు పేరిట ఎందరు యాజకులు హేరోదును తిట్టి యుందురో గదా! బహుశా ఎందరో రహస్యముగా లేచి ఇట్లనియుందురు, "ఓ! ఈ రోమీయుడు! వీడిని పట్టుకొని పలాని-పలాని విధంగా చేయుదము!" కాని ఇది దేవుని యొక్క ప్రణాళిక ప్రకారమే చేయుచున్నానని అతనికి తెలియదు.
ఈనాడు కొన్నిసార్లు మనము కమ్యూనిజము మొదలగువానిని శపించుచున్నాము. అయితే అది రావలసియున్నదని తలంచుచున్నాను. మీరు సత్యమును ఎరిగినచో, అది అక్షరాల దేవుని హస్తము ప్రకారమే ఆయన చేయుదునని చెప్పిన రీతిగానే జరుగుచున్నదని గ్రహించగలరు. బబులోనును భూమి మీద నుండి తుడిచిపెట్టుటకు గాను ఆయన దేనినో లేపవలసియున్నాడు. ఆయన తన చేతులలో ఉన్న సాధనమును వాడుకొనును. మీరు లేఖనము చదవండి, తాను చేయుదునని దేవుడు చెప్పినది అక్కడ వ్రాయబడియున్నది.
ఆనాటి సేవకులు ఆ వాక్యమును చదివి అధ్యయనము చేసియుండినయెడల అది జరుగవలసియున్నట్లుగా తెలిసికొనెడి వారే.
21ఆ గొప్ప పన్ను విధింపును గమనించుదము, రాజు తన రాజ్యాధికారముతో శాసనము లేక చట్టమును జారీచేసెను, ఏమయినా గాని ప్రజలందరూ తమ స్వస్థలములకు తిరిగి రావలెననెను. అది ఒక భయంకర సంగతిగా కనబడును, ఆ స్త్రీ అంత దీన స్థితిలో యుండెను, శిశువును మోయుచుండెను. చాలా దూరము ప్రయాణము చేయవలసి యుండెను. నేడు, ఆమెను అంబులెన్సులో తీసికొని రావలెనని తలంచుచుందుము, ఆమె ఆలాగే రావలెను. మీరెప్పుడయినా పాలస్తీనా వెళ్ళి చూడండి, ఆమె కరకుగా నున్న నల్లరాళ్ళ గుట్టలు దాటుచూ ఒక కంచరి గాడిద మీద ప్రయాణము చేసినది. అది ఎంత కష్టమైనా, ఎంత క్రూరమైనా రాజు ఆజ్ఞ గనుక తప్పదు. ప్రతివారు ఆలాగు రావలెను. వృదులైనా, యువకులైనా, సిద్ధపడినా, సిద్ధపడకపోయినా తప్పకుండా రావలసియుండిరి.
LUKE 2:1,3
22కొన్నిసార్లు మన భారములను గూర్చి మనము ఆలోచించుదుము. లోకములో ఎవరికీ లేని భారములు మనకే ఏర్పడినట్లు కొన్నిసార్లు మనము భావించుచుందుము. అవన్నియూ నీ మేలు కొరకేనని నీవెరుగుదువా? అవన్నియూ నిన్ను మలచుటకు, రూపించుటకే. ఎడారి వెనుక ఎండలో, మండే సూర్యునిలో, శ్రమలు, శోధనలు, హింసలలో ప్రవక్తలు మరియు దైవజనులు మలచబడిరి. ఈనాడు మనమెదుర్కొనుచున్న ఈ సంగతులు ఆ ముందున్న క్రైస్తవులు ఎదుర్కొననివి కావు, ఇతర క్రైస్తవులు కూడా ఈలాటి అంధకార ఘడియలో నిలబడవలసి వచ్చెను. తమ సాక్ష్యము నిమిత్తము సింహములచే కూడా తినబడిరి.
23"మంచిది, నేను పలాని-పలాని సంఘమునకు చెందియున్నానని, నీకు తెలియదా" అని మనము కొంత గర్వముతో చెప్పుకొందుము. ఇప్పుడు మనము కొంచెం ఖ్యాతి, లేక మరి దేనికోసమైనను ఆలోచించుదము.
యేసు క్రీస్తు నిమిత్తమైన నీ సాక్ష్యమును గూర్చి భయపడవద్దు. నీ వెలుగును ప్రకాశింపచేయుము! నీ నమ్మకములకు అనుకూలముగా నిలబడుము, "ఆయన దేవుని కుమారుడు. ఇది క్రిస్ క్రింగిల్ రాత్రి సందర్శనము కాదు గాని, యేసు క్రీస్తుయొక్క జన్మ దినోత్సవమును మనము జరుపుకొనుచున్నాము." చూచారా? ఇప్పుడు మనము జరిగిన సంగతులను కనుగొనుచున్నాము.
24సంఘములో (ఇంపైన) ధ్వని ఇచ్చుట కొరకు ఆలయము నొద్ద వారు ఒక ప్రఖ్యాతి చెందిన గంటను బిగించుట మీరెప్పుడైనా చూచారా? అది ఒక నిశ్చితమైన ధ్వనిని ఇవ్వవలసియున్నది. చూడండి. మీరు గంటల సముదాయమును మ్రోగించునప్పుడు, అది చేయు ప్రతిధ్వని వేరువేరుగా నుండును. ఇత్తడి, ఇనుము, ఇంకా కొన్ని ఇతర ఖనిజములను తగిన పరిమాణములో వారు తీసికొని ఈ గంటను తయారుచేయుదురు. పూర్తిగా ఇత్తడియినచో అది సరిగ్గా ధ్వనించదు. సరైన రీతిగా ధ్వని ఇవ్వవలెనన్నచో అందులోనికి అన్ని రకముల లోహములను కూర్చి తయారుచేయవలెను. ఆ గంట సరిగ్గా ధ్వని ఇచ్చుటకు ఏ యే లోహములను ఎంతెంత కూర్చవలెనో ఆ తయారుచేయు వానికి తెలియును.
25దేవుడే మన యొక్క గొప్ప నిర్మాణకుడు. ఆయనే ఆ గొప్ప కుమ్మరి వాని కొలిమి, వీటన్నింటిని ఆయన మన మీద పెట్టవలసియున్నాడు. శోధనలు, హింసలు, ఇవ్వన్నియూ మనలను మలచి మన సాక్ష్యము ఒక ప్రత్యేక సమయములో సరిగ్గా మ్రోగునట్లుగా చేయును. ఒక ప్రత్యేక దినమున ఒక ప్రత్యేక గంట మ్రోగునట్లుగా ఆయన చేయును.
మనము వేరుగా నిర్మాణమైనాము. మనందరము వేరుగా తయారుచేయబడియున్నాము. మనము వ్యత్యాసముగా చూచుచున్నాము, కాని మనందరము ఒకే విషయమును చూచుచున్నాము. అతడే యేసు క్రీస్తు, ఆయన వైపు చూద్దాం, ఆయన ఈ వాక్యమునకు భిన్నంగా కనబడిన యెడల, నీవాయన వైపు చూచుట లేదు. ఎందుకనగా ఆయనే వాక్యము, నీవు ఒక మత విశ్వాసమును గాని లేదా ఒక ప్రత్యేక శాఖను గాని చూస్తూ "నేను దానికి చెందియున్నాను, అది చాలును" అనుకొన్నచో నీవు వాక్యము వైపు చూడక మరెటు వైపో చూచుచున్నావు. వాక్యము వైపు చూడుము! దేవుని వాక్య ప్రత్యక్షతయగు క్రీస్తు వైపునకు మనము చూచుచున్నాము. ఆయనే దేవుని వాక్యము యొక్క ప్రత్యక్షత.
26ఇప్పుడు, ఈ దీన జంటకు సంభవించిన ఈ గొప్ప సంగతులన్నియూ వింతగా కనిపించును, అవి వారికిని వింతగా తోచియుండును కానీ, అవన్నియూ మేలు కొరకే సమకూడి జరుగును
ఇప్పుడు, యోసేపు యొక్క కల గూర్చి ఒక్క క్షణము మాట్లాడగోరుచున్నాను. దానికి సంబంధించిన వచనములు ఇక్కడ వ్రాసియుంచాను. అన్ని సమయములలోను, అన్ని యుగములలోను దేవుడు తన జనులతో మాట్లాడి తన్ను తాను కలల ద్వారా బయలుపరచుకొనెను.
ఇప్పుడు, కలలు నిశ్చయములు కావు. ప్రతి కలయు దేవుని నుండి రాదు. ఇప్పుడు, కలలు చాలామంది జనులకు వచ్చును, వారికి నానా విధములగు కలలు వచ్చును. నీవు మంచి విందు తిని రాత్రి పడకకు వెళ్ళినచో, నీకు ఏ కల అయినా రావచ్చును. నీకు జ్వరము వచ్చినప్పుడు ఎన్నో పీడకలలు రావచ్చును, అవి దేవుని నుండి వచ్చినవి కావు. అయితే, దేవుడు కలల ద్వారా కూడా జనులతో మాట్లాడును.
NUM 12:6
27యాకోబు కుమారుడగు యోసేపు ఒక ప్రవక్త అని మనకు తెలియును. ప్రవక్త కలలను అర్థము చేసికొనును. కలకు భావము చెప్పిన యెడల అది దర్శనము, ప్రవచనము.
రాజకు నెబుకద్నెజరుతోను, దానియేలుతోను, ఇంకా ఆ వెనుక మరెందరో జనులతో దేవుడు కలల ద్వారాను, ఆత్మీయ స్వప్నముల ద్వారాను మాట్లాడినట్లు మనకు తెలియును. వాటిని నేను నమ్ముచున్నాను. ఇప్పుడు అవి మనకున్నవి. వందల కొలది మందికి వచ్చిన కలలకు సరయిన భావము చెప్పుట నేను కళ్ళారా చూచాను. అది అక్షరాలా ఆలాగే జరిగెను.
28కాని కల ఒక విధమగు కల్పన కూడా కావచ్చును. ఇప్పుడు, ఒకసారి ఒక పరీక్ష ద్వారా కలల గూర్చి ప్రశ్నించబడ్డాను, కలను మన అంతరాత్మ చూచును. ఒక వ్యక్తికి మొదటి ఆత్మ యుండును, అందులో అయిదు జ్ఞానేంద్రియములున్నవి, వాటి ద్వారా చూచుట, రుచి చూచుట, స్పర్శ, వాసన, వినుట చేయకలుగుచున్నాము. నీవు నిద్రపోవుచున్నప్పుడు ఈ పంచేంద్రియములు పనిచేయవు, అప్పుడు నీవు అంతరాత్మలో యుందువు, అది నిన్ను ఎక్కడో దూరంగా ఉంచును. అప్పుడు నీవు కలకందువు, కాని నీవు లేచి మెళకువను పొందినప్పుడు, ఒక వ్యక్తి కూడా అక్కడ ఉండడు. నీ జీవితములో కొంతసేపు కలకన్నావని నిస్సందేహముగా తెలిసికొందువు, దానిని నీవు జ్ఞాపకముంచుకొందువు. నీలో ఎక్కడో ఉన్న ఒక భాగము నీవు మరల మేల్కొని యధాస్థితిలోనికి వచ్చినప్పుడు దానిని ఇంకా జ్ఞాపకముంచుకొందువు, అది కొన్ని సంవత్సరముల గతమేదైనా నీకు గుర్తుండును. నేను బాలునిగా ఉన్నప్పుడు కనిన కలలు ఇంకా నాకు గుర్తున్నవి, నాలో ఉన్న ఒక భాగము ఎక్కడో బంధించబడినది. చూడండి. అవియే కలలు. (చూడండి?) నీవు నీ మామూలు స్థితికి దూరంగా ఉందువు. నీవు మరల మేల్కోన్నప్పుడు, నీవు నీ కలను చెప్పగలవు.
GEN 40:12,18•
GEN 41:12,15•
NUM 12:6
29కలలకు భావము చెప్పగల వ్యక్తి ఉండవచ్చును. బైబిల్లో ఇట్లున్నది, "మీ మధ్య ఆత్మ సంబంధియగు వాడు గాని, ప్రవక్త గాని యున్నయెడల నేను అతనికి కలల ద్వారా బయలుపరచుకొందును. దర్శనములు ద్వారా మాట్లాడుదును."
యాకోబు కుమారుడగు యోసేపు, అట్టి రకమగు మనిషియే. వారు కలలు కనినప్పుడు, అతడు భావము చెప్పెను, అతడు కలలకు భావము చెప్పగలవాడు, దర్శనములను చూచెను. అదంతయూ ఆత్మయొక్క కార్యము.
ROM 11:29
30ఇప్పుడు మీరు చూచినట్లైతే, ఇక్కడ ఒక మనిషి దీర్ఘదర్శిగా లేక దర్శనములు చూచుటకు దేవునిచే ఎన్నుకోబడి ఆలాగే జన్మించును.
గమనించండి, ఇక్కడ మీ అంతరాత్మ యున్నది, స్వాభావికమైనది, మరియు మీ మొదటి ఆత్మ ఇక్కడున్నది. నీవు నీ అయిదు జ్ఞానేంద్రియములను దాటిపోయి నిద్రపోవలెను, అప్పుడు అంతరాత్మలోనికి వెళ్ళెదవు, మరల అందులోనికి వచ్చెదవు అదియే స్వప్నము.
కాని ప్రవక్తకు, రెండు ఆత్మలు కలిసి పనిచేయుచుండును, కాని నీవు ఈ అయిదు పంచేంద్రియములను దాటిపోవు. వాటిలోనే యుండియూ జరుగుచున్నదానిని సూటిగా చూచెదవు. చూడండి. జ్ఞానేంద్రియములు పనిచేయుచుండును, నీవు ఎక్కడున్నావో, ఏమి చేయుచున్నావో, ఏమి మాట్లాడుచున్నావో ఎరిగియే యుందువు. అది ఒక ముందుగా నిర్ణయించబడిన వరము, "వరములు మరియు పిలుపులు మారుమనస్సు లేకుండా వచ్చును." చూడండి. దానిని దేవుడు చేయును. నీవు నిద్రకు వెళ్ళవు, నీవు రెండు కన్నులు తెరచియే చూచెదవు, నీవు దేనిని చూచుచున్నావో సూటిగా ఎరిగియుందువు. చూచారా? దర్శనము దేవుని మూలముగా కలుగును.
31నేడు మనము నిద్రపోవుచున్నాము. ఈనాడు ప్రపంచము యొక్క సమస్య అదియే, అది నిద్రించుచున్నది. చాలామంది ప్రజలు నిద్రపోవుటకు ఇష్టపడెదరు, కాని నేను చెప్పునదేమనగా, పరలోకములో పడకలు లేవు. పరలోకమునకు వెళ్ళినప్పుడు మనము నిద్రించము, ఎందుకనగా అక్కడ రాత్రి లేదు. అక్కడ చీకటి ఉండదు, కాబట్టి పరలోకమునకు వెళ్ళినప్పుడు నీవు నిద్రపోవు, ఎందుకనగా అక్కడ పడకలు లేవు.
కాని గమనించండి, మనము మార్పు పొందినయెడల దేవుడు మనలోని ఏ భాగమునయినా గాని వాడుకొనగలడు. మనకున్న సమస్తమును దేవుని హస్తములలోనికి పూర్తిగా సమర్పించినప్పుడు ఆయన సేవకు ఇచ్చినప్పుడు, ఆయన మనలను కలలలో వాడుకొనగలడు, మాటలో ఆయన మనలను వాడుకొనగలడు, అన్ని జ్ఞానేంద్రియములను ఆయనుపయోగించుకోగలడు. అది మీరు నమ్ముచున్నారా? చూడండి. మనము సమస్తమూ దేవునికి సమర్పించినప్పుడు ఆయన దానిని వాడుకొనగలడు. మన అంతరంగము పూర్తిగా మారినప్పుడు, ఈనాటి క్రైస్తవులు అర్థవంతమగు ఆత్మీయ కలలను కనగలరు, ముందు జరుగు సంగతులు చెప్పగలరు. అది సత్యము అని మనకు తెలియును.
32ఒక ఆత్మీయ కలకు సరిగ్గా అర్ధము చెప్పినప్పుడు, అది దర్శనము యగును. దర్శనమనగా ఏమిటి? భవిష్యత్తు సంఘటనలను ముందుగా చెప్పుటయే దర్శనము; ఒక క్రియ జరుగక ముందే చెప్పును. ఒక వ్యక్తి ప్రవక్తగా నున్నయెడల (పాత నిబంధనలో) అతడు చెప్పినది జరిగినప్పుడే అతడు సత్యవంతుడో, అబద్ధికుడో బయట పడెడిది. వారికి తెలిసిపోవును; అతడు చెప్పినది నిరంతరము నెరవేరుచుండవలెను. ఇప్పుడు, ఆ వ్యక్తి చేతులు వేసి, కుదిపి ఒకనికి ఏ వరమును ఇవ్వలేడు, కాని అతడు వరముతోనే జన్మించును, అతని జన్మ అతని పుట్టుక ముందే ఆ వరమును కలిగియుండును.
NUM 12:5•
ISA 40:3•
JER 1:5•
ROM 11:29
33యెషయా ప్రవక్తను చూడండి, యోహాను పుట్టుటకు ఇంకా ఏడు వందల పన్నెండు సంవత్సరములకు ము౦దే అతని గూర్చి ప్రవచించి ఇట్లు పలికెను, "అరణ్యంలో కేకవేయు ఒకని శబ్దము."
యిర్మియాను చూడండి, అతడు తల్లి గర్భములో పడకముందే చెప్పెను, "నిన్ను ఎరుగుదును, నిన్ను పవిత్రపరచియున్నాను. జనములకు ఒక ప్రవక్తగా అభిషేకించియున్నాను." చూచారా? "వరములు పిలుపులకు మారుమనస్సుతో నిమిత్తము లేదు.
దానితో పనిచేయుటకు అక్కడ ఏదయినా ఉన్నప్పుడు మాత్రమే అది పనిచేయగలదు. నీకు పనిచేయుటకు కుడి చేయి కావలెను గనుక నీకు కుడిచేయి ఉన్నది, దానిని దేవుని రాజ్యము కొరకు పనిచేయనిమ్ము. నీకు చూచుటకు కన్నులున్నవి గనుక సరైన వాటినే చూడుము; పెదవులు, మాట్లాడు స్వరము ఉన్నది గనుక సరయిన వాటినే మాట్లాడుము. ఏమయినా గాని, సరైయిన వాటినే చేయుము. నీకున్న వాటిని సమస్తము దేవుని కొరకు, ఆయన మహిమ కొరకు మార్చుము.
DEUT 22:23•
MATT 3:3
34జరుగకముందే ఆ భవిష్యత్తు సంఘటనలను గూర్చి అది చెప్పునని కనుగొన్నాము. అది వింతగా కనబడును, సర్వశక్తుడగు దేవుడు ముందే వానిని చెప్పెను. ఆ శిశువు యొక్క సంక్షేమము గూర్చి చర్య తీసికొనెను, ఏమి చేయవలెనో ఒక కల ద్వారా చెప్పబడెను. ఇప్పుడు, దేవుడు ఈ రెండవ విధానము ద్వారా తన స్వంత కుమారునికి ఏమి చేయవలెనో యోసేపునకు కల ద్వారా బయలుపరచెను, ఆయనాలాగు చేసెనని బైబిలు చెప్పుచున్నది. అవునయ్యా! యోసేపు మంచివాడు, అతడు దావీదు కుమారుడు, మరియను ప్రధానము చేసికొనెను.
ఇంకా ముందుకు వెళ్ళు ముందుగా దీనిని నేను దాటిపోవుచున్నాను. తూర్పు దేశాలలో "ప్రధానము" పెండ్లికి సమానము. వారికి ప్రధానము అయిన వెంటనే పెండ్లి యగును. వారి మధ్య ఒక పవిత్ర ప్రమాణము జరుగును, ద్వీతీయోపదేశ కాండము 22:23 చదవండి. ఈ స్త్రీ పురుషులు పెండ్లికి అంగీకరించిరి. (అయినా వారు నెలల తరబడి ప్రమాణములను చేసికొనకనే యుండకపోవచ్చును), వారు ఆ ప్రమాణమును ఉల్లంఘించినచో వ్యభిచారము చేసినవారగుదురు. అది నిజము. ప్రధానము చేయబడినప్పుడు వారు పెండ్లి చేసికొనినవారగుదురు. ఇంకా వారు భార్యా భర్తలుగా కలిసి జీవించుటకు చట్టము హక్కులను ఇవ్వలేదు, కాని దేవుని యెదుట వారు ఒకరికొకరు వాగ్దానము చేసికొనిరి. వారియొక్క మాటలు పరలోక రాజ్యమందు ముద్రించబడినవి, దానిని అతిక్రమించుట వ్యభిచారము చేసినట్టే యగును. యోసేపునకు మరియ "ప్రధానము" చేయబడెను. సేవక సోదరులారా, దానిని సరిగ్గా మీరు అధ్యయనము చేసినయెడల మీకు వివాహము - విడాకుల గూర్చి తేటగా అర్థమగును. ఈనాడు అది జనుల మధ్య చాలా కఠిన సమస్యగా నున్నది. ఇప్పుడు యోసేపును గమనించండి, ఆమె భర్త అతడు నీతిమంతుడు, ఇది అతిక్రమించరాదని తలంచెను.
MATT 1:18-20•
LUKE 1:26,27
35ఆమె అతనికి తప్పక చెప్పియుండును. ఈమె యువతి, అందమగు కన్యక, నా దృష్టికి మనందరము పెద్దవారిమే ఇచ్చటున్నామని తోచుచున్నది. ఆమె తల్లి కాబోవుచున్నది. ఆమెతో వెళ్ళుచున్న యోసేపు దీనిని గమనించుచుండెను, అందులో సందేహము లేదు, ఆమె ప్రధానము చేసికొనిన తరువాతనే ఇది జరుగుట చూచెను, తల్లి కానున్నదని ఎరిగెను, బైబిలు ఆలాగు చెప్పెను. ఆమె తన నిర్దోషత్వమును గూర్చి చెప్పుకొని యుండును. ఆ చక్కని స్త్రీ, యోసేపుతో ఈలాగు చెప్సియుండును, "నా ప్రియ స్నేహితుడగు యోసేపూ నా ప్రియ భర్తా, ఈ విషయంలో నేను నిరపరాధిని." ఆ ప్రధాన దూతయగు గాబ్రియేలు తనను దర్శించుట గూర్చియు, ఏమి జరుగనైయున్నదో, ఎట్టి సూచనలు కనబడునో తనకు చెప్పుట గూర్చియు వివరించియుండును.
LUKE 1:11,13,26,27,39
36దూత యొక్క వర్తమానము ద్వారా ఆమె తన స్వస్థలమగు నజరేతు పట్టణము నుండి యూదయ కొండ ప్రాంతమునకు తరలి వెళ్ళెను; నజరేతు, చాల చిన్న పట్టణము.
అక్కడికి ఆమె వెళ్ళగా ఆమె బంధువు ఎలీసబెతు కూడా తల్లి కాబోవుచున్నట్లు చూచెను. (అప్పటికే ఆరు నెలల గర్భవతి) ఆమెను గొడ్రాలని పిలచేవారు.
ఆమె భర్తయగు జెకర్యా దేవాలయములో యాజకుడు. ఒక దినమున అతడు ధూపము వేయుచుండగా యెహూవా దూతయగు గాబ్రియేలు దర్శించెను; ఇప్పుడు, అనేక సంవత్సరముల నుండి అతడు దైవసంబంధమగు దానిని దేనినీ చూడలేదు, అసలు కొన్ని వందల సంవత్సరముల నుండియే అట్టిది లేదు. కాని ఇక్కడ, బలిపీఠమునకు కుడివైపున దేవదూత నిలబడియుండి అతని భార్య గర్భవతియై కుమారుని కనుననియు అతనికి "యోహాను" అని పేరు పెట్టుదువనియు చెప్పెను. ఆ కథ మనందరకు తెలియును.
ఆ తరువాత ఆరునెలలకు గాబ్రియేలు దూత, నజరేతులో మరియను దర్శించి తన బంధువురాలగు ఎలీసబెతును గూర్చిన సంగతి చెప్పెను. మరియు తన హృదయమందు ఈ రహస్యమును దాచుకొని, ఏమి జరుగనైయున్నదో ఎరిగి, ఆ కొండలలో జీవించుచున్న ఎలీసబెతును దర్శించుటకు వెళ్ళెను.
37ఎలీసబెతు దాగుకొనెను, ఎందుకనగా తన స్థితిని ప్రజలకు కనుపరచ ఆమెకు మనస్సు లేదు, ఆమె ఆరు నెలలు దాగుకొనెను. ఇప్పుడు, వాక్యమును నేను అర్ధము చేసికొనిన దానిని బట్టి ఆమె ఆ బిడ్డ బ్రదుకదని తొందర చెందెనేమో అనుకొనుచున్నాను. మూడు లేదా నాలుగు నెలల కాలములో కడుపులో కదలవలెను, కాని ఇప్పటికి ఆరు నెలలయినా గాని శిశువు కదలుట లేదు. ఎలీసబెతు మరియు మరియలు ఒకరినొకరు కలిసికొనినప్పుడు ఒకరినొకరు కౌగలించుకొనిరని నిస్సందేహముగా చెప్పవచ్చు, ఒకరినొకరు చూచుకొనుటకు ఎంతో సంతోషించిరి. వారేమి అనుకొనిరో ఊహించుదము, "ఓ! నీవు చాలా అందముగా కనబడుచున్నావు" అని ఎలీసబెతు మరియతో అనియుండును.
"నీవు కూడా తల్లివి కాబోవుచున్నావని నాకు తెలియునని నీవెరుగుదువా?" అన్నది మరియ.
"అవును, అదే నన్ను కలవరపరచుచున్నది. ఆరు నెలలయినా గాని శిశువు కదలుట లేదు."
"ఓ, కాని ఒక సంగతి నీకు చెప్పవలెను. ఇక నేను దాచుకొనియుంచలేను!"
MATT 1:21•
LUKE 1:35
38నీకు తెలుసా, నీవు దేవునితో సంబంధము ఏర్పాటు చేసికొనినప్పుడు అదే జరుగును, నీవు నెమ్మదిగా యుండలేవు. నీకు నిజమైన మార్పు జరిగినయెడల దాని గూర్చి చెప్పకుండా ఉండలేవు. నీవు ఎక్కడున్నాగాని దానిని వ్యక్తపరచుదువు.
నేనామె చెప్పినది వినగలుతున్నాను, "నీకు తెలియునా? నేనును ఒక శిశువును కనబోవుచున్నాను," అన్నది.
"ఓ!" అలాగయితే "నీవు యోసేపు చివరగా పెండ్లిచేసికొనినప్పుడు నన్నెందుకు ఆహ్వానించలేదు? నీవు ప్రధానము చేయబడినావని ఎరుగుదును గాని, మరి పెండ్లికి ఎందుకు మమ్ము ఆహ్వానించలేదు?" అన్నది ఎలీసబెతు.
"ఓ! ఇంకా మాకు పెండ్లి కాలేదు."
"నీవు గర్భవతినని చెప్పావు గదా"?
"అవును!"
"మరియా, "నాకిది సరిగ్గా అర్థమగుట లేదు."
"నీకు తెలియునా? గాబ్రియేలను యెహోవా దూత నాకు ప్రత్యక్షమైనది. నీవు ప్రసవించనై యున్నావని నాకు తెలియచేసినది. నాకు ఆ దూతయే చెప్పెను, పరిశుద్ధాత్మ నన్ను కమ్ముకొననున్నదని చెప్పెను; నా వలన దేవుని కుమారుడు జన్మించుననియు, ఆయనకు "యేసు" అను పేరు పెట్టుదువనియు చెప్పెను. ఆయన జనులను వారి పాపముల నుండి విడిపించును."
LUKE 1:43,44
39మానవ పెదవుల ద్వారా పలుకబడిన అద్భుతమగు నామము మొదటిసారిగా అదియే; అతని తల్లి గర్భములో మృతతుల్యుని వలెయున్న యోహాను గర్భములో నుండి గంతులు వేసెను. మరణించినాడనుకొన్న యోహాను పరిశుద్ధాత్మను పొందెను. తల్లి గర్భములో చనిపోయినట్టున్న శిశువు యేసుక్రీస్తు నామము వినగానే శక్తితో నిండుకొనగా ఆయనాత్మ వలన జన్మించి, ఆయన దాసునిగా చెప్పుకొనుచున్న ఆయన సంఘమునకు మరెంత జరుగును? ఎలీసబెతు ఎంతో ఆశ్చర్యము చెంది మరియ వైపు చూచి ఇట్లనెను, "నా ప్రభువు యొక్క తల్లి ఈమెయే. ఈ శుభవార్తనా చెవులలో పడగానే నా గర్భములోని శిశువు సంతోషముతో గంతులు వేసెను." యోహాను తన తల్లి గర్భములోనే పరిశుద్ధాత్మ పూర్ణుడై జన్మించెను. యేసు క్రీస్తు నామము వల్లనే పొందెను! ఇతడు ఎట్టి వాడగునో!
దీనిని యోసేపునకు చెప్పియుండునని నిస్సందేహముగా గ్రహించగలము.
DEUT 22:23-25
40ఇప్పుడు చూడండి, యోసేపు నీతిమంతుడు, ఒక విధముగా ఆశ్చర్యపడెను, ఇప్పుడు నాకు తెలియును, "ఆమె వ్యభిచారము చేసినట్లు కనగొనబడినచో, ఆమెకు సంభవించబోవు మొదటి కార్యము ఏమనగా ఆమె రాళ్ళతో కొట్టి చంపబడియుండును."
ఆ విధంగా వారు జీవించలేరు. "ప్రధానము చేయబడిన కన్య పట్టణములో ఎవరైనా పురుషునిచో చెరుపబడినయెడల, ఆమె కేకలు పెట్టనిచో వారిద్దరినీ రాళ్ళు పెట్టి కొట్టి చంపవలెను. అయితే ఆమె బయట పొలములో యుండి, కేకలు వేసినా ఎవరూ విననియెడల ఆ పురుషుని రాళ్ళు పెట్టి కొట్టి చంపవలెను గాని, స్త్రీని బ్రదుకనియ్యవలెను." దానికి శిక్షను గూర్చి ద్వితీయోపదేశకాండము 22 అధ్యాయములో కొంతసేపటి క్రితము చదవమని చెప్పాను.
41ఇప్పుడు ఇందులో గమనించండి, ఆమె పెండ్లి కాకుండానే తల్లి కాబోతున్నది. అయితే, మరియ తన అవహేళన, అక్షేపణలను తప్పించుకొనుటకు యోసేపును ఒక కవచముగా వాడుకొనుచున్నట్లుగా కనిపించెను, చూడండి, యోసేపు ఆమెకు కేడెముగా ఉండెను; ఏలాగయినా గాని ఆమెను పెండ్లి చేసికొనవలెను, కుటుంబ సంబంధముగా భర్తగా నుండుటకు కాదు గాని, ఆమెను దాయుటకే ఇక వివాహము చేసికొనవలెను.
అతడు ఆమెను నమ్మగోరుచున్నాడు, నిజంగా అది నేను నమ్ముచున్నాను. ఆమెను అతడు నమ్మగోరెను, కాని ఆమె గాధ అసాధారణముగా యున్నది. ఆ విశ్వాసికి అది నమ్ముట కష్టముగా నున్నది.
42నన్ను క్షమించండి పురుషులారా! ఈనాడును ఆలాగే యున్నది! నేడు భూమి మీద పరిశుద్ధాత్మ శక్తి యొక్క గాధ ఆలాగే యున్నది. సంఘములో దేవుని శక్తినిగూర్చి సంస్థలకు, శాఖా మనస్సునకు గోచరించుట లేదు; అది మహాద్భుతముగా ఉండి, వారు నమ్మకలుగుటకు సందేహించుచున్నారు. కాని అది సత్యము! ఈ విధముగానే అది యుండునని బైబిలు చెప్పెను. ఆలాగే ఇక్కడున్నది. ఏదో మత విశ్వాసములో చిక్కుకొనిన అనేకులు నిజంగా దానిని నమ్మవలెనని కోరుచున్నారు గాని అది అసాధారణముగా నుండుట వలన నమ్మలేకపోవుచున్నారు. ఏమి చేయవలెనో అతనికి (పరిశుద్ధాత్మ శక్తికి) తెలియలేదు. యోసేపు వలె అయోమయ స్థితిలో యుండెను.
MATT 1:19,20
43బైబిలు చెప్పుచున్నది, "అతడు ఈ కార్యములన్నింటిని గూర్చి ఆలోచించు చున్నప్పుడు," చూడండి, అతడు మంచివాడు, తన స్వంత పేరు చెడ్డగుట అతనికి ఇష్టము లేదు; ఆ విధంగా ఉన్న స్త్రీని తాను పెండ్లిచేసికొనలేడు గాని ఏమి చేయును? ఆమె మరొకని వలన గర్భవతి అయ్యెనని తలంచెను. ఈ విషయము గూర్చి తీవ్రముగా ఆలోచించుచుండెను. "ఆమె చాలా అమాయకురాలు. పద్మమంత పవిత్రమైనది. ఆమె జీవితము నాకు తెలియును గనుక నేనామెను నమ్మగోరుచున్నాను. నాకేమి చేయవలెనో తెలియుట లేదు" అనుకొనెను.
"ఈ సంగతులు గూర్చి ఆలోచించుచూ, ఆమెను రహస్యముగా విడనాడ ఉద్దేశించెను." "దీని గూర్చి నేను ఏమీ పెద్ద అలజడి చేయను," అనుకొనెను. ఇప్పుడు, గుర్తు౦చుకొనండి, ఇంకా అతడు ఎట్టి ప్రమాణము చేయలేదు, కాని ప్రధానము చేసికొనెను. కాని ఆమెను రహస్యముగా విడనాడగోరెను. ఇక ఆమెను విడనాడుటయే తనకు తోచినంత వరకు సరైన పనియని అతడు తలంచెను. చూడండి, అతడు ఒక సాధారణమైన మానవుడు మరియు మంచి వ్యక్తి.
సోదరీ, సోదరుడా, నేను మీకు ఇది చెప్పనివ్వ౦డి. నీవు నీతిమంతునివైనచో, నీ హృదయమందు యధార్ధముగా ఉన్నచో, దేవుడు నీకు అసలు సంగతిని బయలుపరచుటకు బద్దుడై యున్నాడు.
MATT 1:20
44ఆమె భర్తయగు యోసేపు నీతిమంతుడు, సంగతులను ఆలోచించెను. అది అసాధారణము, దానిని అతడు అర్ధము చేసికొనజాలడు. "ఈ సంగతులు ఎట్లు జరుగును"? కాని అతడు కూర్చొని ప్రార్ధి౦చి లేఖనములను అధ్యయనము చేసెనని నిస్సందేహముగా చెప్పగలము. "ఈ సంగతులేలాగు సాధ్యము?" అతడు దీనిని అధ్యయనము చేయుచుండగా యెహోవా యొక్క దూత కలలో అతనికి ప్రత్యక్షమాయెను. అతడు ప్రవక్త కాడు. ఆ రోజులలో ప్రవక్త భూమి మీద లేడు, యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు అని చెప్పకలిగిన వారెవరునూ లేరు, కాబట్టి ప్రభువు రెండవ మార్గమును ఎన్నుకొనెను. ఆ కారణము చేతనే దేవుడు ఒక కల ద్వారా తన స్వకుమారుని పరిరక్షించెను; ఆయనను ఐగుప్తులో యుంచి మరల బయటకు తీసికొని వచ్చి జ్ఞానులకు దొరకకుండా దాచెను. జ్ఞానులు మరో దారిని వెళ్ళిరి. ఆనాడు భూమిమీద ఏ ప్రవక్తలేడు గనుక, దేవుడు రెండవ పద్దతిని ఎన్నుకొనెను. అదియే కల, అయితే ప్రవక్తగా జన్మించక పోయినా గాని మంచి మనుష్యులున్నారు. దేవుడు నిద్రలో వారిని దర్శించి తన్నుతాను బయలుపరచుకొనెను.
దేవునికి నీవు లోబడినట్లయితే, దేవుడు తన్నుతాను నీకు అనేక విధములుగా బయలుపరచుకొనగలడు. చూచారా? నీవు ఒక ప్రవక్తవు కాకపోవచ్చు, ఒక ఉపదేశకునివి కాకపోవచ్చు, నీవు ఆదివారపు బడి ఉపాధ్యాయునివి కాకపోవచ్చు, నీవు బోధకునివి కాకపోవచ్చు, అయితే దేవుడు తన్నుతాను నీకు బయలుపరచుకొనుటకు మార్గములున్నవి. చూడండి. కల ద్వారా గాని, మరో రీతిగా గాని జరుగును, యోసేపు వలె నిన్ను నీవు లోబరుచుకొనుము.
MATT 1:20
45"ఓ! గొప్ప యోహూవా! దేవా, నేను దావీదు వంశావళి నుండి వచ్చియున్నాను. నేను నీతిమంతుడను. నీవు చెప్పినది సత్యమని నేను నమ్ముచున్నాను. నేను ఈ నా ప్రియురాలను, ప్రధానము చేసికొన్నాను. నేనామెను విడనాడగోరుచున్నాను, ఆమె చేసినదని భావించి పాపము చేశాను. ఆమెను నేను భార్యగా ఎరుగను గాని ఆమె తల్లి కాబోవుచున్నది గనుక, ఆలాగు తలంచాను. ప్రభువా, ఏమిటది"? అని అతడు నిస్సందేహముగా ప్రశ్నించియుండును.
చూడండి అతడు ప్రవక్త కాడు. కాబట్టి ఆయన ఆలాగున మాట్లాడలేడు. అతనిని నిద్రపోనిచ్చెను. కలలో యోహూవా దూతను అతని యొద్దకు పంపెను. ఆమేన్. ప్రభువు దూత స్వప్నమందు అతనిని తాకి చెప్పినది: "దావీదు కుమారుడవగు యోసేపూ! నీ భార్యయగు మరియను చేర్చుకొనుటకు భయపడవద్దు. ఆమె పరిశుద్దాత్మ వలన గర్భము ధరించినది. మానవుని వలన కాదు. పరిశుద్దాత్మ కార్యమిది. ఆమె చెప్పినది సత్యము. ఈ అసాధారణ గాధ యోసేపు, సంభవించిన ఈ సంఘటన నిన్ను కలవరపరచినది. అది పరిశుద్ధాత్మ వలన కలిగినది."
MATT 1:20
46ఓ, ఆ దేవుడు ఈ రాత్రికిని సజీవుడై యున్నాడు! మీరింకనూ అంతరాత్మను కలిగియున్నారు. క్రైస్తవులారా, మీరు చూచుచున్నది అసాధారణముగా కనిపించిననూ, అది వాక్యమునకు ఖచ్చితంగా సరిపోవును. దేవుడు అసామాన్య సంగతులను అనేక రీతులుగా బయలుపరచును.
ఆయన యోసేపుతో ఈలాగు చెప్పెను, "దావీదు కుమారుడా, నీ భార్యయగు మరియను చేర్చుకొనుటకు భయపడవద్దు." గుర్తుంచుకొనండి, అప్పటికే ఆమె అతని భార్య. "నీ భార్యయగు మరియను చేర్చుకొనుము, ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భము ధరించినది."
మరియు దేవుడు తన దూతను పంపి, దానిని బయలుపరచినప్పుడు, ఆయన యొక్క ప్రత్యక్షత కల ద్వారా యోసేపు యొద్దకు వచ్చెను; అతనికి అది తెలిసిపోయెను, అందులో ఏ మర్మమును లేదు. దూత అతని యొద్దకు కలలో వచ్చెను. తన కలలో అతడు దేవదూతను చూచెను.
MATT 1:20
47ఇప్పుడు, ప్రవక్త లేక దీర్ఘదర్శి నిద్రపోకుండానే దేవదూత నిలబడియుండుటను చూడగలడు. అయితే ఇతడు నిద్రపోయి దేవదూతను చూచెను.
దేవదూత ఇట్లనెను, "యోసేపూ! ఇది చిక్కు ప్రశ్న కాదు, దీనిని ఎవరూ నీకు వివరించనవసరము లేదు. దానిని గూర్చి నీకు నేను చెప్పబోవుచున్నాను. దీనిని వాస్తవముగా నేను నీకు చూపించబోవుచున్నాను. ఎందుకనగా నీకు ఆ వాస్తవమును ఎవరూ వివరించజాలరు. మరియను నీ భార్యగా చేర్చుకొనుటకు భయపడవద్దు, ఆమె పరిశుద్దాత్మ వలన గర్భము ధరించినది."
యోసేపు నిద్రనుండి మేల్కొనినప్పుడు, ఓ, అతని హృదయము క్రొత్త విశ్వాసముతో నిండిపోయెను. అతడు నమ్మాలనుకున్నను, నమ్మడానికి భయపడినది, అసాధారణమైన, అతనిని కలవరపరచిన మర్మము ఒక కల ద్వారా అతనికి తెలియపరచెను. అసాధారణమైనది నమ్మవలెనన్న ధైర్యము కలిగియుండెను. ఇప్పుడు, అతని జీవితము లోనికి క్రొత్త విశ్వాసము పుట్టుకొచ్చెను. ఓ, మై! అతడు దేవునియందు విశ్వాసము కలిగియుండెను. తన భార్యయందు ప్రేమ కలిగియుండెను. ఇక ఏ ప్రశ్న లేదు, దాని గూర్చి సమస్యే లేదు. అది యెహోవా దూత అని అతనికి తెలియును. తన మనస్సులో యున్న ప్రశ్నకు దేవుడు ఖచ్చితమైన జవాబు ఇచ్చెను, కాబట్టి ప్రశ్నలన్నియూ పోయెను.
HEB 13:8
48దేవుడు నీ మనస్సులోనున్న ప్రశ్నకు జవాబు ఇవ్వగోరినప్పుడు, ఏలాగయిననూ ఇచ్చును, ఇక ఏ సందేహము ఉండదు. దాని గూర్చి ఎట్టి సందేహము ఉండదు. అది ఓక ప్రత్యక్షత.
ఇక్కడ వాక్యములో నీవు చదివి ఈలాగందువు, "అది అపోస్తలులకు మాత్రమేనని నేను నమ్ముచున్నాను. యేసు దీనిని గతించిన దినములలో చేసెను."
"ఆయన నిన్న, నేడు, నిరంతరము ఏకరీతిగా యున్నాడు, మారని యేసు" అని బైబిలు చెప్పుచున్నది. నీకు అది ప్రశ్నగా కనిపించుచున్నయెడల, దానిగూర్చి నీవు ఆలోచించుచున్నయెడల, దానిని నీవు జరుగుట చూచియు ఆశ్చర్యపడుచున్నయెడల, నీవు యధార్థముగా యున్నచో యెహోవా దూత దానిని నీకు బయలుపరచును. అప్పుడది నీకు ప్రశ్నగా యుండదు, అది సత్యముగా మారును. ఓ! అప్పుడు నీవు ఈలాగు కేకలు వేసి చెప్పగలవు, "ఓ! నేను చాలా కృతజ్ఞడను!"
HEB 13:8
49అప్పటి వరకు అది యోసేపునకు ఒక మర్మము, కాని అది బయలుపరచ బడినప్పుడు ఎంతగా ఆనందించి యుండునో గదా! మరియు ఇది సంభవించినప్పుడు, అతడు ఆనందముగానున్నందున సంతోషించెను. అతడు వెంటనే ఆమెను పెండ్లిచేసికొనుట మనము చూతుము. ఓ! అతనికి ఇక ఎట్టి ప్రశ్నలు లేవు, మరియను తన భార్యగా చేర్చుకొనెను. శిశువు జన్మించు వరకు ఆమెను భార్యగా ఎరుగక యుండెను, దాని గూర్చి ఆనందించెను! మరియకు రక్షణగా నుండుటకు అతడు సంతోషించెను. ఆమె నిమిత్తము నిందను ఆనందముగా భరించెను.
యేసు క్రీస్తు నిన్న, నేడు, నిరంతరము ఏకరీతిగా యున్నాడని ఒకనికి ప్రత్యక్ష్యపరచబడినప్పుడు ఏ మత విశ్వాసము అతనిని వెనుకకు మళ్ళించజాలవు. ఒక రక్షణ కవచముగా నుండుటకు నీవు సంతోషించెదవు, పరిరక్షించుటకు ఆనందించెదవు, వారేమన్నా గాని లెక్కచేయవు.
ఆ బయట నున్నవారు వినునంత గట్టిగా నేను మాట్లాడుచున్నాను. వారిని కూడా విననీయండి, వారు విని తీరవలెను. గమనించుడి. అవునయ్యా.
LUKE 24:49
50నీవు కేడెముగా నుండుటకు సంతోషించెదవు. నీవు కాళ్ళు తుడుచుకొనే పట్టాగా ఉండుటకు ఇష్టపడెదవు, ఏమయినా లెక్కచేయవు; అది ప్రభువు ద్వారా నీకు బయలుపరచబడెను. ప్రభువు తన వాక్యము ద్వారా దానిని బయలుపరచెను, అది సత్యము; అది నీకు స్థిరపరచబడినది, మరల జీవించుటకు దానిని మీకు ద్రువీకరించాడు. మీరు చెప్పవచ్చు, " అది అక్కడ ఉన్నది! మై ఏది కూడా…"
ఒక వ్యక్తి దేవునితో ముఖాముఖి అనుభవము పొందువరకు అసలు బోధించు హక్కు కూడా లేదు. అది నిజము. పరిశుద్దాత్మ బాప్తిస్మము పొందకుండా, ఏ వ్యక్తికి వేదిక ఎక్కు అర్హత లేదు. యేసు తన శిష్యులకు ఇట్లు ఆజ్ఞాపించెను, "ఇక బోధించవద్దు, పై నుండి శక్తి పొందు వరకు యెరూషలేములో కనిపెట్ట౦డి." పరిశుద్ధాత్మ వచ్చి ఏమి చేసెనో గమనించండి. పరిశుద్ధాత్మయే దేవుడు.
ISA 7:14•
ISA 9:6,7•
MATT 1:18,20,23
51పరిశుద్ధాత్మ యేసుక్రీస్తుకు తండ్రి. మత్తయి 2వ అధ్యాయము 20 వచనము ఇట్లు చెప్పుచున్నది, "ఆయన తల్లియగు మరియ యోసేపునకు ప్రధానము చేయబడెను. ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భము ధరించెను." "పరిశుద్ధాత్మయే యేసుక్రీస్తునకు తండ్రి."
పరిశుద్ధాత్మ వచ్చి వాక్యమును బయలుపరచినప్పుడు, అది అక్షరాలా దానిని జీవింపచేయును, అది నీకు ప్రత్యక్షత యగును, దానిని నీవు చూచెదవు. అది విప్పబడినదిగా నీకుండును. అది ఆ ఘడియకు వాగ్దానము.
యోసేపు దానిని చూచెను, యెషయా ప్రవచనము నెరవేరెను. యెషయా 9, "ఏలయనగా మనకు ఒక కుమారుడు అనుగ్రహించబడెను, ఒక శిశువు జన్మించెను. ఆశ్చర్యకరుడు, ఆలోచన కర్త, సమాధానాధిపతి, శక్తిమంతుడగు దేవుడు, నిత్యుడగు తండ్రి, అని ఆయన పిలువబడును. ఆయన రాజ్యమునకు అంతము లేదు." అది ఎవరై యుందురో ఆయనకు తెలియును, ఎందుకనగా యెహోవా దూత ఇదంతయూ చెప్పెను, దానిని అతడు చూచెను. "ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భము ధరించెను." "కన్యక గర్భవతియై ఒక కుమారుని కనును." ఇప్పుడు, అది ఒక గొప్ప మర్మము. సర్వలోకమునకు దేవుడిచ్చిన ఒక మహోన్నత గురుతు, ఆయన తన కుమారుడనుటకు ఒక మహోన్నత సూచన ఇచ్చెను.
GAL 4:19
52ఇప్పుడు గమనించండి, ఇంకా ముందుకు వెళ్ళుచూ, ఎక్కువ సేపు ఉంచకుండా యుండుటకు ప్రయత్నించెదను. ఇక్కడున్న చిన్నపిల్లలు అర్ధముచేసికొనలేరు, కావున పెద్దలకు చెప్పుటకు ఇక్కడ నాకొక విషయమున్నది.
మరియ గర్భములో యేసు రూపొందినప్పుడే, హింస ఆరంభమయ్యెను. అది నిజము. అది సత్యము. ఆమె హింస అప్పుడే ప్రారంభమాయెను.
మీకును అదే జరుగును, గలతీ 1 లేదా గలతీ 4:19; ఇట్లు చెప్పుచున్నది, క్రీస్తు మీలో రూపము ధరించినప్పుడు, (మహిమ నిరీక్షణ) క్రీస్తు మీలో రూపొందుచున్నాడు, మీరు చనిపోవుచుండగా క్రీస్తు జీవించుచున్నాడు. ఖచ్చితముగా, మీలో క్రీస్తు రూపొందునప్పుడు, ఎటు చూచినా హింస, ఎటు చూచినా శ్రమ, దయ్యము చెలరేగుట, కచ్చితముగా, ఎప్పుడైతే క్రీస్తు మీలో రూపము ధరించినప్పుడు.
COL 2:9
53ఎప్పుడైతే క్రీస్తు నిండు శిశువుగా మరియలో మారినప్పుడు, రాజాజ్ఞ వెంటనే వచ్చినది, "మీ అందరు ప్రజలు!" కేవలము ఆమె… ప్రసవము ద్వారా బయటకు వచ్చుటకు నిండు శిశువుగా సిద్ధమైనప్పుడు, అప్పుడే గొప్ప హింస ఆరంభమవును.
ఇప్పుడు, గర్భములో శిశువు చాలాకాలము రూపుదిద్దుకొనుట జరిగెను. ఇవి చివరి దినములు, దేవత్వము యొక్క సర్వ పరిపూర్ణత, క్రీస్తుయెుక్క సంపూర్ణత, తన జనుల మధ్య ప్రత్యక్ష పరచబడనైయున్నది. ఆయనాలాగు చెప్పెను, తన వాక్యములో ఆయన వాగ్దానము చేసెను. ఆ సంపూర్ణత ఏర్పడు సమయములో… మీరు చూడండి, అసాధారణ సంగతులు జరుగునని ఆయన వాగ్దానము చేసెను. ఆ కారణము చేతనే మన యొక్క గొప్ప సామాజిక వ్యక్తులు, తదితరులు దానిని అర్థము చేసికోలేకపోవుచున్నారు, వారికది వెర్రితనముగా యున్నది. ఇప్పుడు గమనించండి, వారు ఒక సంఘముల సమితిని రూపొందించుచున్నారు. సంఘము తన కాళ్ళ మీద నిలబడుటకు ఆరంభించు సమయములోనే అ సహజాతీతమైనది పనిచేయ సాగును, మరిప్పుడు వారందరు ఒక గుంపుగా కూడి వెళ్ళి, దీనిని వారు ఆపుటకు ప్రయత్నించుచున్నారు. సరిగ్గా అప్పటి వలెనె జరుగుచున్నది.
2SAM 23:14•
1CH 11:16•
MATT 1:21
54ఫీనిక్సులో, గత శనివారము నేను చెప్పాను, ఫిలిస్తీయులు బెత్లె హేమును చుట్టుముట్టిరి, సంఘ సమాఖ్య ద్వారా తప్ప వారు వచ్చుటకు మార్గము లేదు. ఓ! వారు తమ కొరకు ఒక చెడిపోయిన ఊటను తీసికొనిరి; బెత్లెహేము యొక్క తాజా జలమును కాదనిరి, ఎంతమాత్రము కాదు. ఇప్పుడు మనము గమనించుదము.
క్రీస్తు రూపుదిద్దుకొనినప్పుడు, రాజు ఆజ్ఞ ఇచ్చెను. వారిని ఒక్క నిమిషము పరిశీలించుదము, మనము ముగించు ముందు కొద్దిగా వారిని చూద్దాం.
"మరియా, ప్రియులారా! వాడు క్రూరుడగు రాజు," అని యోసేపు చెప్పుట నేను వినగలను.
కాని ఆమె ఇట్లనెను, "విను, నా ప్రియుడా! ఆయన పేరు "యేసు" అని పిలువబడునని పరిశుద్ధాత్మ నాతో చెప్పుట గుర్తుంచుకొనుము, మరియు ఆయన ప్రజలను వారి పాపముల నుండి విడిపించును. ప్రియుడవైన యోసేపూ! ఏమి జరిగినా పరవాలేదు, రాజు ఏమి చెప్పినా మనకు భయము లేదు, నేను చిన్న గాడిద మీద ఎక్కి ఆ రాళ్ళ పర్వతముల మీద ఎన్ని మైళ్ళయినా ప్రయాణించగలను. మనకు ప్రయాణములో ఏ చిన్న అవసరమొచ్చినా దారిలో మనకు సహాయపడుటకు చాలామంది యున్నారు, మన కుటుంబము ఒక్కటే ప్రయాణము చేయుటలేదు గదా? మనవలెనె బాధపడుచున్నవారు చాలామంది ఉన్నారు, మార్గములో చాలామంది యుందురు, తక్కినవారివలెనె మనమును కొండల మీద ప్రయాణము చేసి బెత్లెహేమునకు పోవుదుము." వారు నజరేతు నుండి కొండల ద్వారా ప్రయాణము చేసి వచ్చిరి.
55"మనమిప్పుడు ఒక చిన్న గాడిదను కనుగొనవలెను, మరియు ఆ రోజున మనము ఎండు గడ్డి మరియు యవలు కాస్త ఎక్కువగా దానికి మేపుదము, ఎందుకనగా దానికి చాలా బరువున్నది." కాబట్టి అతడు ఆ చిన్న గాడిద మీద ఆమెను కూర్చోబెట్టి, ఒక నీటితిత్తిని, మరియు చిన్న రొట్టెల సంచిని తగిలించెను; చేతిలో కర్రపట్టుకొని చిన్న గాడిదను సిద్ధపరచెను.
వారు ఆ చిన్న దారిన రా సాగిరి, ఆ గాడిద బరువుతో తూలుచూ పడసాగెను. ఓ, అదెవరిని మోసికొని వచ్చుచున్నదో చూడండి! దాని యొక్క బరువు చూడండి, క్రీస్తును ఆయన జన్మ స్థలమునకు అది తీసికొనివచ్చుచున్నది. ప్రసవపు నొప్పి కలిగి ఆమె ఆ చిన్న గాడిద తాడును పట్టుకొని కూర్చున్నది, మరియు మార్గాంతము ఆమె అతనితో మాట్లాడుతునే యుండెను.
ఆ రోజంతయూ వారు పయనించుచునే యుండిరి. అక్కడక్కడ ఆగి విశ్రాంతి తీసికొనుచుండిరి. "ప్రియా, నీవు బాగా అలసిపోయావా"?
"లేదు లెండి, నేను బాగానే యున్నాను. మీరు కొంతసేపు కూర్చొందురా?"
"వద్దు, ప్రియా, నీవే కూర్చొనుము."
ఆమెను కొద్దిసేపు గాడిద మీద నుండి క్రిందికి దింపి విశ్రాంతి తీసికోనిచ్చెను. ఆమెకు కొద్దిగా నీళ్ళు త్రాగించెను, మరియు చిన్న అప్పమును ఇచ్చెను. తరువాత మరల గాడిదపైకి ఎక్కించెను.
56చివరకు, చీకటి పడసాగినది. తక్కిన దారిలో ప్రయాణీకులు వీరికంటె ఎంతో త్వరగా పోసాగిరి, ఎందరో వారిని దాటిపోవుచుండిరి. మరియు తక్కినవారి గుర్రములు, బండ్లు దాటిపోవుటచే రేగిన ధూళిని ఆమె పీల్చుకొనవలసి వచ్చెను. ఎందుకనగా, ఆమె బహు నెమ్మదిగా ప్రయాణము చేయవలసి వచ్చెను, ఆమె స్థితి అటువంటిది. ఆ స్థితిలోయున్న ఆమెను ఆలాగు చేయుట ఎంత క్రూరమగు కార్యము! కాని నా చిన్న నాటకములో ఇప్పుడు వారు కొండ పై భాగమునకు ఎక్కుట ఊహించుచున్నాను. ఒక లోయలో బెత్లెహేమున్నది, బెత్లెహేమునకు పడమర దిశగా చిన్న కాలి త్రోవ యున్నది.
ఇప్పుడు, చీకటి పడుచున్నదని నా చిన్న నాటకములో ఊహించుచున్నాను. యోసేపు తన చేతి కర్రతో దారిని ముందు వెదకుచున్నాడు, ఎంత సత్వరమార్గము దొరికితే అంత మంచిదని అతడు తలంచుచూ వెళ్ళుచున్నాడు. సమయమును సద్వినియోగము చేసికొనుటకు ఆ ధూళిలో నుండి తన చిన్న భార్యను తీసికొని గాడిదను దగ్గర త్రోవ గుండా నడిపించుకొని వెళ్ళుచున్నాడు. నక్షత్రములు బయటకు వచ్చుట ప్రారంభమాయెను.
57కొంతసేపటికి, అతడు కొండ మీదికి వచ్చెను. వారిరువురు జన్మించిన ఆ బెత్లెహేము పట్టణమును, ఆ దీపములను తొంగి చూచిరి. ఆ చోట చాలామంది గుమిగూడిరి, బయట కొందరు, పొలముల్లో కొందరు పరుండియుండిరి. బహుశా యోసేపు మనస్సులో మొదటిసారిగా ఈ ప్రశ్న వచ్చియుండును. "ఈ రాత్రికే ఈమె బిడ్డను కనవచ్చును, ఒకవేళ చోటు దొరకనియెడల ఏమి చేయుదును? దినమంతయూ ఆమె నొప్పులు పడుచున్నది. కావున, ఇప్పుడే, ఈ రాత్రికే ఆమె ప్రసవించితే ఏలాగు?"
58అక్కడ నిలబడి అతడు ఆ లోయను చూచెను, ఆలోచనలో యున్నాడు, అతని కండ్లు త్రోవ ప్రక్కలకు వెళ్ళినవి, అతనికి ఒక వింత దృశ్యము కనబడినది. మీకు తెలియునా? సహజాతీతమగు కార్యములు అటువంటి కష్టకాలములోనే జరుగును. అతడు చూడగా ఒక నక్షత్రము కనబడెను. అంత పెద్ద నక్షత్రమును మునుపెన్నడూ చూచిన గుర్తు అతనికి లేదు. అది ఎంతో క్రిందగా కనబడుచున్నది. బెత్లెహేము మీదనే ప్రేలాడుచున్నది, మరియను విశ్రాంతి కొరకు ఒక బండ మీద కూర్చోబెట్టి అతడు మరల పైకి చూచెను. ఆమె వైపు తిరిగి అడిగాడు, దానియొక్క ప్రతిబింబమును ఆమె యొక్క అందమగు నల్లని కళ్ళలో కూడా చూచుచున్నాడు. ఆమె కూర్చొని నవ్వుచూ, "అది వింత గదా?" అన్నది.
"యోసేపూ! దానిని నేను సూర్యాస్తమయ సమయము నుండి గమనించుచునే యున్నాను, ఆ నక్షత్రమును నేను పరీక్షించుచున్నాను. ఈ రాత్రి నాకు ఏదో వింతగా కనబడుచున్నది, ఏదో జరుగనైయున్నది," అన్నది మరియ. అవును, నీకు ఆ వింత అనుభూతి కలుగును, అదెల్లప్పుడు ఆలాగే యుండును.
ఆమె, మరియు యోసేపు ఆ నక్షత్రమును పరీక్షించుచుండిరి, ఆ చిన్న గాడిద ఒగర్చుచూ విశ్రాంతి తీసికొనుచున్నది. వారు నక్షత్రమును కనిపెట్టి చూచుచుండిరి. అది చాలా వింతగా యున్నది. తక్కిన ఇతర నక్షత్రముల వలె అది లేదు, అది నిర్విరామముగా కదలుచున్నట్లు కనిపించెను, ఏదో జరుగుట కొరకు అది కనిపెట్టుచున్నట్లు తోచుచున్నది. ఇప్పుడు, ఒక నిమిషము ఈ బండ మీద కూర్చొనియున్న దంపతులను మనము విడిచి పెట్టెదము.
59ఇప్పుడు, మన మనస్సులలో వందలాది మైళ్ళు ప్రయాణము చేసి తూర్పున ఇండియాలో నున్న జ్ఞానులను చూద్దాం. సూర్యుడస్తమించి చీకటి పడినది, నక్షత్రములు బయటకు వచ్చినవి, వారు అలవాటు ప్రకారము పరిశీలించు గోపురము వంటి దాని మీదికి ఎక్కిరి. వారు అధ్యయనము చేయుటకు అక్కడికి ఎక్కిరి, వారు నక్షత్రములను బట్టి కాలమును పసికట్టుదురు, వారు సంఘటనలను అధ్యయనము చేయుదురు. అధికారముల పతనము గూర్చి రాజ్యముల నాశనము గూర్చి వారు అధ్యయనము చేయుదురు. వారు వానిని గూర్చి ఆలోచించి మాట్లాడుకొందురు, వారికి ఆ ప్రతి నక్షత్రము తెలియును. మనకు బైబిలు తెలిసినట్లుగా వారికవి తెలియును. వాటి చలనము, దాని భావము వారెరుగుదురు.
60దేవుడు భూమి మీద జరిగించబోవు ముందు తన కార్యములను ఆకాశములందు కనపరచునని మీరు ఎల్లప్పుడూ మరువవద్దు. సేవకులకు అది తెలియును.
అక్కడ వారు నక్షత్రములను గమనించుచుండిరి, ఎందుకనగా వాటి చలనమును వారెరుగుదురు. అది ఏమిటో వారు వెంటనే లేఖనములలో వెదకి కనుగొందురు, "లేఖనములా"? అని మీరు ప్రశ్నించవచ్చును. అవును, లేఖనములే. వారు జ్ఞానులు. కాని వారు మహమ్మదీయులు, వారా ప్రాచీన మాదీయ పారసీకుల నుండి వచ్చిన వారు. మహమ్మదీయులు అక్కడ నుండియే వచ్చిరి. మనందరకు అది తెలియును.
DAN 2:34,35,45
61వినండి, అక్కడ వారికొక యజమాని ఉన్నాడు. మీరు దానియేలు 2:43 చదవండి. వారు బబులోనులో ఉన్నప్పుడు, ప్రవక్తయగు దానియేలు వారికి యజమాని. అది నిజము. దానియేలు వారికి మూల ప్రవక్త, అతడు వారికి దేవునియొక్క సంగతులన్నియూ నేర్పెను, ఎందుకనగా అతడు వారిపై యజమాని. "ఒక దినమున ఒక పర్వతము నుండి ఒక రాయి కోయబడును అని వారితో అతడు చెప్పెను, అది చేతి సహాయముతో కాదు, అది అన్య రాజ్యములన్నింటిని తుత్తునియలు చేసి, భూమి మీద వృద్ధిపొందును." అని చెప్పెను, అది మీరు జ్ఞాపకముంచుకొనండి.
62ఈ జ్ఞానులు అవిశ్వాసులు కారు, లేదయ్యా! వారు విశ్వాసులు. వారు నిజమగు ఒకే దేవునిని నమ్మిరి. అది సత్యమని మనకు తెలియును, బైబిలు ఆలాగున చెప్పెను. దానిని మీరు చదువగోరినయెడల, అపో.కా. 10:35ను చదవండి. "దేవుడు ఏ జనాంగము పట్లను పక్షపాతి కాదు గాని, తనకు భయపడి నీతిగా ప్రవర్తించు వారినందరినీ ఆయన ఘనపరచును." కాని వారు పూర్తిగా సత్య మార్గములో లేరు, అయితే మనము నమ్మిన దేవునినే నమ్ముచున్నారు. మహమ్మదీయులు మనము నమ్మిన దేవునినే నమ్ముదురు.
63మహమ్మదీయ పూజారి చాలాసార్లు, ఈలాగు గట్టిగా చెప్పుట నేను విన్నాను, "నిజమగు, సజీవుడగు దేవుడు ఒక్కడే, మహమ్మదు ఆయనకు ప్రవక్త" మనమును నిజమగు, సజీవుడగు దేవుడు ఒక్కడేనని నమ్ముచున్నాము. ఆయన యేసు క్రీస్తు, చూచారా? "దేవునికి కుమారుడు ఉండడు." అని వారందురు. ఆత్మయైయుండవలెనని చెప్పెదరు. (మీరు చూడండి), "నిజమగు, సజీవుడగు దేవుడు ఒక్కడే, మహమ్మదు ఆయనకు ప్రవక్త," అందురు. వారు ఇంకనూ ఆ ఒకే సత్య దేవుని నమ్ముచున్నారు. ఇష్మాయేలు సంతతి.
64ఈ మహమ్మదీయులు దీనిని అధ్యయనము చేసియున్నారు, వారినే జ్ఞానులని పిలిచిరి, వారు ఆ నక్షత్రములను గమనించిరి. వారు రాత్రులందు అగ్నిని అంటించెదరు, అది పవిత్రాగ్ని రాత్రియందు ఈ అగ్ని మండుచుండగా, ఆ మంటల ద్వారా వారు తమ దేవుని ఆరాధించెదరు, వారు దానిని గమనించి ఆరాధించెదరు. సూర్యుడస్తమించిన వెంటనే, వారు ఇక్కడికి ఎక్కి ఈ విషయములు అధ్యయనము చేయుదురు. మనము కూటములకు వచ్చి ప్రతి వాక్యమును అధ్యయనము చేయు రీతిగానే, వారు నక్షత్రము యొక్క ప్రతి కదలికను ఎరుగుదురు.
65ఒక రాత్రి అక్కడ వారు అధ్యయనము చేయుచుండిరి. మరియు వారికి ముందెన్నడూ కనిపించని ఒక వింత నక్షత్రము ప్రత్యక్షమయినది. వారు ఆశ్చర్య చకితులయిరి. ఇది ఎందుగూర్చి వచ్చెనో వారికి అర్ధము కాలేదు, వారు ఆశ్చర్యపడుట వింత కాదు. వారు రాత్రంతయూ దానిని కనిపెట్టి చూచిరని నేను తలంచుదును, దానిగూర్చి వారికేమి చేయవలెనో తెలియలేదు. అది ఒక వింతగా యున్నది, ఆ గొప్ప నక్షత్ర రాశిలో వారు ఒక నక్షత్రము యుండుట గమనించిరి. అది ఒక వింత పరిణామము, వారు అటువంటిది ముందెన్నడూ చూడలేదు, కాబట్టి వారు వెంటనే దీనిని గూర్చి లేఖనములను వెదకి తెలిసి కొనుటకు మొదలుపెట్టిరి. అయితే వారు తమ స్వంత వ్రాతలలో దానిని గూర్చి కనుగొనలేరు, కాని వారు దానియేలు వ్రాతల యొద్దకు వెళ్ళి చూచిరి, "ఒక రాయి రానున్నట్లును, యాకోబు నక్షత్రము ఉదయించనైయున్నట్లును వారు చదివిరి." ఏదో జరుగనైయున్నదని వారికి తెలియును, వారందరూ ప్రార్ధి౦చియుందురు, దానిని కలిసి చర్చించియుందురు, ఆ తరువాత నిద్రపోయిరి; ఆ రాత్రి వారికి ఈ భూమి మీద రాజులకు రాజు జన్మించబోవుచున్నట్లు కల వచ్చియుండును.
66ఈ మధ్యనే వార్తాపత్రికలో జ్ఞానుల గూర్చి వ్రాయబడినది, మూడు నక్షత్రములు ఏకరాశిగా వచ్చి, ఒకే నక్షత్రము వలె కనబడినప్పుడు, భూమి మీదకు మెస్సీయా వచ్చునని తెలిసిపోయెను. వారు యూదులనియు, ఖగోళ శాస్త్రము అధ్యయనము చేయుటకు వారచ్చటికి వెళ్ళిరనియు, ఆ పత్రికలో వ్రాసిరి. కాబట్టి వారు దానిని చూచి యేసు ఎక్కడో జన్మించియుండెనని వారు తెలిసికొనిరి. అదెక్కడో వారెరుగరు, అయితే వారు ఎక్కడికి వెళ్ళవలెనో, ఎటు వెళ్ళవలెనో పధకములు వేయుచుండిరి. అందరూ వెళ్ళగోరిరి, కాని కొద్దిసేపటి క్రితం నేను చెప్పినట్లుగా ముగ్గురు చొప్పున వెళ్ళెదరు. వారు తిరిగి వచ్చి, అది సత్యమేనని సాక్ష్యము చెప్పెదరు. వారేమి చేసిరి? వారు తమ సంపదను బహుమతులను మూట కట్టుకొని ఆయనకు ఇచ్చుటకు బయలు వెళ్ళిరి.
67సోదరీ, సోదరుడా, ఎంత ఆశ్చర్యము! మనమెల్లప్పుడూ ఎంత పొందగలమా అని ఆలోచించుచుందుము, కాని మనము వెళ్ళి క్రీస్తుకు ఇవ్వవలసియున్నాము. చూచారా? మనమెంత తెలివిగలవారముగా ఉండగలమో అని చూచుట కాదు, ఇతరులను తలదన్నుటకు ప్రయత్నించుట కాదు, అయితే ఎంత వరకు ఆయనకు మనలను సమర్పించు కొన్నామో చూచుకోవలెను.
"దేవుడు నాకు కల ఇచ్చినా గాని దానిని నేను నమ్మను," అని కొందరు చెప్పుట విన్నాను.
"దైవిక స్వస్థతలో నాకు నమ్మకము లేదు." ఒకనాడు, ఒకనికి దానిని నేను చూపించాను. కాని అతడిట్లనెను, "ఎంతమంది వైద్యులు సంతకాలు చేసినా, మీరెంతమంది ఎన్ని చెప్పినా, నేను దానిని నమ్మను గాక నమ్మను."
"నిశ్చయంగా నీవు నమ్మవు. అది నీకు కాదు," అన్నాను నేను.
దైవిక స్వస్థత అవిశ్వాసుల కొరకు పంపబడలేదు. అది విశ్వాసులకు పంపబడెను. క్రీస్తు విశ్వాసుల కొరకే. నమ్మువారికే పరిశుద్ధాత్మ, అవిశ్వాసులకు కాదు. వారి కొరకు అది ఉద్దేశించబడలేదు. అది వారికి అడ్డుబండగా నుండును, ఎల్లప్పుడూ ఆలాగే యుండును. అది అవిశ్వాసులకు కాదు. అది నమ్మినవారికే! అది అంతే.
68ఇప్పుడు, వీరు విశ్వాసులని మనము ఇప్పుడు గ్రహించవలెను, వారది కనుగొనగోరిరి. వారు తాము కలిగియున్న సమస్తమును మూటకట్టి, బయలుదేరిరి. ఇది నిజంగా ఏమిటో కనుగొందమని వారు అనుకొనిరి. ఇప్పుడు, వారికి దూర ప్రయాణమున్నది, కనుక వారు తమ సంపదంతటిని కూర్చుకొనిరి, బంగారము, సాంబ్రాణి, బోళము ఇంకా తమనొద్దనున్న సమస్తము పోగుచేసి, ఈ రాజును కనగొనుటకు బయలుదేరిరి. వారు తమ కానుకలతో ప్రయాణమును ప్రారంభించిరి.
మరియు గమనించండి, ఈ రాజును కనుగొనుటకు వారు పరలోకములో దేవుడిచ్చిన గురుతు ద్వారా బయలుదేరిరి, మానవ సిద్దాంతము కాదు. వారు దానిని వాక్యములో చూచిరి, అది అక్కడుండవలెనని ఎరిగియుండి, ఆ పరలోక సూచనను వెంబడించిరి.
69వారికున్న శ్రద్ధ మానవులకుండిన ఎంత మేలు! వారికుండిన అవగాహన మనకుండిన ఎంత మేలు! దేవుడు మనకు ఏదయినా ఇచ్చిన యెడల, అది లేఖనానుసారమైనదైతే, దానిని పట్టుకొని యుండుము!
"పరిశుద్ధాత్మ బాప్తిస్మము అనునది లేదు," అని జనులు చెప్పును. పరిశుద్ధాత్మ బాప్తిస్మము ఉన్నది! పెంతెకోస్తు దినమున ఏలాగు జరిగినదో, నేడును ఖచ్చితంగా ఆలాగే జరుగును, దైవిక స్వస్థత, దేవుని యొక్క శక్తియై యున్నది. "అది తీసివేయబడినది" అని ఎవరునూ దానిని బైబిలు ద్వారా వివరించజాలరు. దేవుడు దానిని సంఘమునకు ఇచ్చినట్లు నేను చూపించగలను. ఆయన దానిని తీసివేసినట్లుగా పరిశుద్ధ గ్రంథములో ఎక్కడైనా మీరు చూపించగలరా? అక్కడ లేదు!
ACTS 26:27•
HEB 13:8
70"ఆయన నిన్న, నేడు, నిరంతరము ఏకరీతిగా యున్నాడు." పేతురు పెంతెకోస్తు దినమున ఈలాగు చెప్పెను, "ప్రతివాడును మారుమనస్సు పొంది పాపక్షమాపణ నిమిత్తము యేసుక్రీస్తు నామములో బాప్తీస్మము పొందుడి. అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరము పొందుదురు. ఈ వాగ్దానము మీకును, మీ పిల్లలకును, దూరస్తులందరికిని, మన ప్రభువగు దేవుడు ఎందరిని పిలచెనో వారందరికిని చెందును." పిలువబడిన వారందరికి! అదే పరిశుద్ధాత్మ, యధార్థమగు హృదయమునకు ఈ రాత్రి కూడా ఆలాగే యున్నది. నీకు దేవుని నమ్ముట మరీ అసాధారణముగా యున్నదా?
పౌలు అగ్రిప్పను ఈలాగు అడిగెను, "ఓ! అగ్రిప్ప, ప్రవక్తలు చెప్పిన దానిని నీవు తిరస్కరించుదువా?''
JOHN 15:7•
ACTS 2:38,39•
HEB 13:8
71యేసు చెప్పిన దానిని నీవు తిరస్కరించెదవా? బైబిలు చెప్పిన దానిని నీవు నిరాకరించెదవా? (అభిషేకించబడిన వాక్యము, క్రీస్తే) వాక్యము నీలో నివసించుచున్న యెడల, నీవు వాక్యముతో అభిషేకించబడిన వాడవగుదువు. "మీరు నా యందును, మీ యందు నా వాక్యమును నిలచియుండిన యెడల, మీకేది ఇష్టమో అడుగుడి. అది మీకు అనుగ్రహించబడును." అది క్రీస్తు నీలో యుండుట, వారు జీవించిన ఈ యుగమునకు వాక్యమును అభిషేకించుట, వారు ఏ యుగమున నివసించినప్పటికి . దేవుడు తన వాక్యమును యుగములకు విభజించి ఇచ్చెను. ఆ సమయము వచ్చిన ప్రతిసారి సంఘములన్నియు ఏకమైపోయినవి. అప్పుడు దేవుడు ఎవరినో పంపి ఆయన వాక్యము ఏమి చేయునని చెప్పెనో అదే చేయునట్లుగా క్రియ చేసెను. ఖచ్చితంగా! ఈ దినమునకు ఒక వాక్యము ప్రవచించబడియున్నది, దేవుడు ఎవరి కొరకో కనిపెట్టి చూచుచున్నాడు; యేసుక్రీస్తు నిన్న, నేడు, నిరంతరము ఏకరీతిగా యున్నాడని నిరూపించుటకు వారిని పరిశుద్ధాత్మతో అభిషేకించును, ప్రకాశించు వెలుగుగా చేయును, అవిశ్వాసి యొక్క నేత్రములను గ్రుడ్డిగా చేయుటకు. దానిని వారు దైవదూషణ పాలు చేయుదురు, అది వారి మీదికి తీర్పును తెచ్చును; ఏలయనగా దేవుని శాసనము న్యాయవంతమైనది, తీర్పు ఆయన న్యాయము వలన మాత్రమే రాగలదు. ఆయన అప్పుడు లోకమునకు న్యాయము తీర్చును, సొదొమ వారిని పంపినట్లుగా దానిని ఆయన అగ్నిజ్వాలలోనికి పంపును. ఇప్పుడు, గమనించండి.
72వారు యాత్రలో దేవుడిచ్చిన సూచనను వెంబడించిరి, వారు గమనించిరి, వారెవరి మాటను వెంబడించలేదు. ఏ బిషప్పును లేదా మరెవరిని వారు వెళ్ళి సంప్రదించలేదు. దేవుడు వారికి ఒక సూచన ఇచ్చెను, వారు ఇక్కడ దానిని చూచిరి. అది సత్యము. దానిని వారు అంగీకరించిరి. అది వారికి త్రోవ చూపెను. లేఖనము ముందుగా చెప్పినది అదియే. ఇది వచ్చుచున్నదని వారెరిగిరి, మరియు దానిని వారు వెంబడించిరి. అది ఏమిటి? వారు వీడ్కోలు చెప్పి వెళ్ళుచూ ఇట్లనిరని నేను చెప్పగలను, "సోదరులారా, ఒక దినమున మేము తిరిగి వచ్చెదము. సోదరులారా, మీకు వర్తమానము తెచ్చెదము, ఏలయనగా అది సత్యము అని మేమెరుగుదుము." దానిని వారు వెంబడించిరి, కొండలు దాటిరి, టైగ్రిస్ నది దాటిరి, మైదానములు దాటిరి. దివారాత్రులు, నెలల తరబడి నక్షత్రమును గమనించుచూ వెళ్ళిరి.
MATT 2:2
73బహుశా వారు పగటి సమయమందు విశ్రాంతి తీసికొనిరి, నిద్రపోయిరి, ఒకరితో ఒకరు ఈలాగు ముచ్చటించుకొనిరి. "ఓ! అక్కడికి మనము చేరినప్పుడు, తప్పక అద్భుతముగా ఉండును; ఈ పరలోక వెలుగు, మనము చూచుచున్న ఈ ప్రకాశము సహజాతీతమైనది!"
ఆమేన్! నేను నా వశములో లేననుకొనుచున్నారా? నేను కాదు. గమనించండి, మనము చూచుచున్న ఈ పరలోక కాంతి, ఈ వెలుగును గమనించండి.
ఇప్పుడు గుర్తు౦చుకొనండి, దానిని మరెవరూ చూడలేదు, ఎన్నో పరిశోధనశాలలను, ఎందరెందరో జ్ఞానులను అది దాటిపోయినది, కాని అది వారి కొరకు పంపబడెను, వారు చూచెదరని బైబిలు చెప్పెను, గనుక వారు చూచిరని నేను నమ్ముచున్నాను. దానిని ఇంకెవరూ చూడలేదు.
MATT 3:16•
MARK 1:10•
LUKE 3:22•
JOHN 1:32•
ACTS 26:12-14
74పౌలు చూచిన వెలుగును మరెవరూ చూడలేదు. దమస్కునకు పోవు మార్గములో అది అతనిని తాకినది, కాని అది పౌలుకు మాత్రమే కనబడెను.
యోహాను తప్ప మరెవరును పావురము వలె పరిశుద్ధాత్మ పరలోకము నుండి దిగుటను చూడలేదు. దానిని అతడు చూచి, సాక్ష్యమిచ్చెను. అతడు మాత్రమే చూచెను, తక్కినవారు చూడలేద, దానికొరకు అతడు ఎదురుచూచుచుండెను గనుక అతనికి కనబడెను.
జ్ఞానులు దానికొరకు ఎదురు చూచుచుండిరి!
దానికొరకు నీవు ఎదురు చూచినప్పుడు, నిజముగు క్రిస్మసు కానుకను స్వీకరించుటకు నీవు సిద్ధమైనప్పుడు, దానిని పొందెదవు. పరిశుద్ధాత్మయే నిజమగు క్రిస్మను కానుక, దానికొరకు నీవు చూచినయెడల దానిని పొందెదవు. యేసుక్రీస్తును గూర్చి సాక్ష్యమిచ్చుచూ, పరలోకము నుండి, దేవుని యొద్ద నుండి పంపబడిన వెలుగు.
వారు ఎవరి మాటను తీసికొనలేదు. పగటి పూట విరామమెరుగరు. "ఓ! నేను ఇక వేచియుండలేను, ఎంత దూరము మనము వెళ్ళుదుమో తెలియదు. బహుశా మనము యెరూషలేమునకు లేదా పవిత్ర భూమికి, పాలస్తీనాకు వెళ్ళుదము, ఎందుకనగా ఆయన అక్కడ జన్మించునని ప్రవచనము చెప్పుచున్నది, కాబట్టి నేడో లేదో రేపో దానిని కనుగొందము. రాత్రి వచ్చును మరియు చీకటి దిగును.
AMOS 3:3•
ACTS 9:3,4
75గుర్తు౦చుకొనండి, వెలుగు చీకటిలో మాత్రమే ప్రకాశించును. అది గుర్తించబడు మార్గము అదొక్కటే. దేవుని వాక్యము నుండి మనలను దూరము చేయునది మానవ కల్పిత విశ్వాసములే, అదే మనకు చీకటి కాలము, నేడు ఆలాగే యున్నది. ఈ శాఖలన్నియూ వాక్యమును విడిచిపెట్టి అన్ని రకముల సిద్దాంతములలోను మునిగిపోయినవి. వారు అంధులై పోయి సంఘ సమితిలోనికి వెళ్ళుచున్నారు, అవిశ్వాసులతో విజోడు అగుచున్నారు. బైబిలు ఇటు చెప్పెను, "సమ్మతింపకుండా ఇద్దరు కూడి నడచుదురా?" మన సంఘములు అంత దుస్థితిలోనికి వెళ్ళుచున్నవి! నిశ్చయంగా, వారు గ్రుడ్డివారే. కాని అట్టి చీకటి ఘడియలోనే వెలుగు ఉదయించును, అప్పుడే దీపములు ప్రకాశించును.
దానిని వారు గమనించిరి. రాత్రి వచ్చినప్పుడు, వారు ఆనందముతో ఇట్లనిరి, "ముందుకు పదండి, పశ్చిమ దిశగా ఇంకా ముందుకు సాగండి, ఆ పరిపూర్ణ వెలుగు నొద్దకు నడచుదము." వారు నదులను దాటిపోయిరి, ఇసుక గుట్టలు దాటిపోయిరి, వారు వెళ్ళుచుండగా, సత్యమును కనుగొనుటకే వారు కోరుకొనిరి.
76చూడండి, బెత్లెహేము సరిగ్గా యూదయకు తిన్నగా నున్నది లేదా వారు నిలబడిన చోటికి యెరూషలేము, బెత్లెహేము సమానాంతరముగా యున్నవి. గమనించండి. దానిని మీరు గమనించగలిగినయెడల, ఎంత గొప్ప చిహ్నము! ఇక్కడ బెత్లెహేమున్నది, అక్కడ యెరూషలేమున్నది. బయలుదేరి వచ్చుచున్న జ్ఞానులు, బెత్లెహేమునకు వచ్చుటకు ముందుగా, యెరూషలేమునకు రావలెను. మీరది గ్రహించారా? ఆ గొప్ప, పెద్ద, గర్వపు శాఖా ప్రధాన కార్యాలయము, యెరూషలేము మాత్రమే, (అవునండీ!) శాఖలన్నియూ అక్కడే కలిసికొనును. ఆ గొప్ప ఆలోచన అక్కడే కూడుకొనును. కాబట్టి వీరు ఈ పట్టణమునకు వచ్చి "ఇదే! అని తలంచిరి. ఈ గొప్ప మర్మముగానున్న వెలుగును ఇక్కడి వారు తమకు వివరించగలరనుకొనిరి. ప్రధాన యాజకులందరూ అచ్చటే యుండిరి. దైవత్వ విద్యలో పరిశోధకులు, పెద్ద పెద్ద పట్టాలు, పిహెచ్.డి., ఎల్ఎల్.డి., గలవారందరూ అక్కడే యుండిరి. దానిని గూర్చి వారికంతా తెలియునని అనుకొనిరి. ఓ! సోదరుడా! యెరూషలేము కనిపించుచున్నది! ఇక్కడ మనకు అంతా తెలియును." వారు వీధులలోనికి అడుగిడిరి.
"మీరెక్కడికి వెళ్ళుచున్నారు?"
"మాకు గొప్ప వర్తమానము దొరికినది."
"ఏమిటది?"
MATT 2:2•
MATT 16:3•
LUKE 12:56
77"యూదుల రాజుగా పుట్టిన వాడెక్కడ?" ఈ మర్మయుక్తమగు వెలుగు సంగతి ఏమిటి? ఎవరు, ఆయనెక్కడ?" ఈ ధనికులు, చక్కని ఒంటెల మీద ఎక్కి, బంగారము, సాంబ్రాణి పట్టుకొని ప్రతి వీధికి, ప్రతి సందుకు వెళ్ళి "ఆయనెక్కడ? ఆయనెక్కడ? ఆయనెక్కడ?" అని ప్రశ్నించిరి. కాని వారికి జవాబు రాలేదని తెలిసినది.
ఈనాటి గొప్ప కేక ఇదే, "కమ్యూనిజము మమ్మును ప్రిమింగుచున్నది." ఓ! ప్రతి రేడియో ప్రసారము ఎల్లప్పుడు కమ్యూనిజమునే ఎత్తి చూపుచున్నది. మీరు కమ్యూనిజమును వివేచించగలరు, కాని కాల సూచనను మీరు వివేచించజాలరు.
"మీరు ఆకాశ సూచనలను తెలిసికొనగలరు; కాని కాలపు గురుతులను మీరు వివేచించజాలరు," అని యేసు చెప్పెను.
ఎప్పుడూ "కమ్యూనిజము, కమ్యూనిజము! అనియే చెప్పుదురు. దానితో పాటుగా వచ్చుచున్న మరియొక దానిని మీరు కనుగొనుట మంచిది.
REV 3:20
78మనము ఏ సమయములో జీవించుచున్నాము? అది జరుగు ముందుగా దేవుడు ఏ చివరి సూచనను చూపించును? ఆయన చెప్పిన సంగతులేమిటి? ఇశ్రాయేలు తన దేశమును చేరినది, అంజూరపు చెట్లు తిరిగి చిగురించినది. ప్రతిదియూ చూడండి దాని దాని వరుసలోనికి వచ్చియున్నది. సంఘము లవొదికయ స్థితికి వచ్చెను, యేసు బయట ఉన్నాడు, తన స్వంత సంఘములోనే నిరాశ్రయుడాయెను; దావీదు తన స్వజనుల నుండి పారిపోయి బెత్లెహేము పైన నిరాశ్రయునిగా నున్నట్లే ఉన్నాడు. ఒక నిరాశ్రయుడు! చివరి దినములలో క్రీస్తు తన స్వజనుల మధ్యనే నిరాశ్రయునిగా యుండునని బైబిలు చెప్పెను. ప్రకటన 3వ అధ్యాయము, మనము లవొదికయ కాలములో జీవించుచున్నాము, "క్రీస్తు బయట ఉండి లోపలకు రావలెనని తలుపు తట్టుచున్నాడు." తన స్వజనుల మధ్యనే నిరాశ్రయుడు.
2SAM 23:15,16•
1CH 11:17,18•
MAL 4:6
79ఆ యోధులు తమ ఖడ్గములను చేత పట్టుకొనిరి, మరియు దావీదు మంచి నీరు కావలెనని కోరెను, అతనికి నీరు తెచ్చుటకు వారు పదిహేను మైళ్ళ దూరము వెళ్ళిరి. ఎందరినో చేధించి త్రోవ చేసికొని వెళ్ళిరి. దావీదు దానిని ఒక బలిగా, పానార్పణముగా నేల మీద పారబోసెను.
అవును, ఈనాటి యోధులు! యేసు ఒక మంచి, పాత పెంతెకోస్తు తాజా జలమును త్రాగుటకు కోరుచున్నాడు. ఈ శాఖా సంబంధమగు, చెడిపోయిన జలము ఆయనకు జబ్బు కలుగచేయుచున్నది. దేవుని వాక్యము తీసికొనుము, దానిని లాగి ఈ మత విశ్వాస క్రియల నుండి తెంపివేయుము, అప్పుడు ఆయనకు తాజా జలము తీసికొనివచ్చు స్థలమును కనుగొందము; ఆయనకు ఒక తాజా జలమును తీసికొనిరాగలము. ఒక నిజమగు, సత్యారాధన, ఒక నిజమగు హృదయము నుండి వచ్చును, అక్కడే ఆయన తన దానిని కుమ్మరించగలడు. ఈ దినమున తన వాక్కును జీవింపచేయగలడు, ఆయన దానిని పొందును. "తండ్రుల యొక్క విశ్వాసము వైపునకు పిల్లలను త్రిప్పదును," అని ఆయన చెప్పెను. అది వచ్చునని మలాకీ 4లో చెప్పెను. మీరు బాధపడవద్దు, అది తప్పక ఇచ్చటికి వచ్చును. దానిని చేయుదునని దేవుడు చెప్పెను గనుక చేయును. గడియారము కొట్టుకొనుచూ ముందుకు పోవుచున్నది. అవునండీ! కాని ఈనాడు మనము ఆ గొప్ప, ఈనాడు మనము చుచు….
80కమ్యూనిజము ఎందుకు వచ్చుచున్నది? ప్రపంచము ఎందుకు మ్రి౦గివేయబడుచున్నది? రష్యా మొత్తము ఎందుకు కమ్యూనిజం అయిపోయినది? అయితే ఇంకా తొంబది తొమ్మిది శాతము మంది క్రైస్తవులున్నాగాని ఒక్క శాతముగా నున్న రష్యా దాదాపుగా తూర్పు ఐరోపా అంతటినీ, తక్కిన ప్రపంచమును ఆధీనములో యుంచుకొనుచున్నది. కమ్యూనిజం. ఎందువలన? ఆలాగు జరుగుటకు ఏమిటి కారణము? ఆలాగు జరుగునని బైబిలు చెప్పెను; ఆయన దగ్గర జవాబు యున్నది.
కాని ఇప్పుడు మనము దీనికోసము, దానికోసము తగువులాడుకొనుచున్నాము. దేవుడు మనము గమనించవలెనని పంపిన దానినే, అసలు మనము గమనించుట లేదు.
వారు తమ దుస్తుల మీద ఎటువంటి గుండీలు ధరించిరో చూచుచున్నాము, రాబోయే సభకు ప్రసంగీకులెవరు అనియు, ఇంకా ప్రధాన అతిధి ఎవరు వంటి అంశములను గూర్చి వెదకుచున్నాము.
MATT 2:2
81ఇక్కడ జ్ఞానులు తమ పరలోక కాంతి దిగి వచ్చుటను చూచుచున్నారు. "నేను యెరూషలేములోనికి వెళ్ళినప్పుడు, ఈ పరలోక కాంతి, మర్మయుక్తమగు వెలుగు ఏమిటో నాకు చెప్పెదరు, అది మా మీద ఉండి మమ్ము నడిపించుచున్నది.'"వారు వీధిలో వెళ్ళుచూ, "యూదులకు రాజుగా పుట్టిన ఆయనెక్కడ"? తూర్పున మేమాయన నక్షత్రము చూచి ఆయనను పూజింప వచ్చితిమి. ఆయన కొరకు మేము సాంబ్రాణి, బంగారము, సమస్తము తెచ్చితిమి. ఆయనెక్కడ? ఆయనెక్కడ?" అని అడిగిరి.
"ఎవరు? ఏమిటి"? అని వారడిగిరి. నేడును ఆలాగే యున్నది. "ఓ, అటువంటిది ఈనాడు ఎక్కడ జరుగుట లేదే?" అని వారనుచున్నారు.
"ఓ! సూర్యాస్తమయమున ఒక మర్మయుక్తమగు వెలుగును మేము చుచాము."
"దానిని నేనెన్నడూ చూడలేదే."
"గోపురము మీదునున్న వానిని పిలువుము."
"నీవు ఏదయినా ఒక మర్మయుక్తమగు వెలుగును చూచావా?"
"నీవు ఏమి చెప్పావు?"
"ఒక మర్మయుక్తమగు వెలుగును చూచావా…"
"లేదు! నీతో ఏమి సంగతి?" చుడండి, వారి దగ్గర సమాధానము లేదు.
82నేడును వారికి అది కనబడదు! ఈ సంగతులు ఏమిటో వారిరుగరు. దానిని వారు తెలిసికొనియుండవలెను, ఆ గొప్ప సంఘాధిపతులు ఈ సంగతుల గూర్చి ఎరిగి యుండవలసినది. కాని దేవుడెల్లప్పుడు అల్పసంఖ్యతోనే పనిచేయును, అది వారిమీదనుండి దాటిపోవుచున్నది, దానిని వారు చూడరు. అయినా గాని ఆలాగు ఆయన తన వాక్యము నెరవేర్చుచున్నాడు. అది అంతే. ఈ గొప్ప విషయములలో మనకు మనము ముంచుకొని యున్నాము, మనము కదలలేము. (ఏ ఘడియలో మేము జీవించుచున్నామో మేము చూచుటకు, దేవా, వారి విషయముల నుండి మమ్మును స్వతంత్రులముగా చేయుము.) దేవుడు మరల ఒక కల ద్వారా పనిచేయవలసి వచ్చినచో ఆయన దానిని నీకే బయలుపరచగలడు. నిశ్చయంగా, ఆయన దానిని బయలుపరచగలడు. మనము చివరి దినములలో జీవించుచున్నాము. ఇప్పుడు వినండి! ఓ!
83ఆ మర్మమగు వెలుగును గూర్చిన జవాబు వారి యొద్ద లేదు. వారి ప్రధాన కార్యాలయములందును అది లేదు. నేడును అది వారియొద్ద లేదు. కావున వారేమి చేసిరి? వారు దేవుని వాక్యము కొరకు అడిగిరి. అది మంచి ఉద్దేశ్యము. "మనకు దేవుని వాక్యమును పిలచిరి, ఆ జ్ఞానులు ఈనాటి ఎందరో కంటె మంచి తెలివైనవారు." దేవుని వాక్య ప్రకారమే ఆ జ్ఞానులు చూచిరి. ఆమేన్! ఆ పట్టణము కాదు. ఆ స్థలమూ కాదు. ఆయన యూదయ బెత్లెహేములో జన్మించవలసియున్నాడు. ఆమేన్. అది అన్నింటిలోను చివరిది, మరియు అన్నిటికంటే వినయముగల పట్టణము, చాలా చిన్న స్థలము, గొప్పది కాదు. జ్ఞానులు వెంటనే చూచిరి. దేవుని వాక్యము దానిని బయలుపరచెను, వారు గందరగోళము నుండి బయటపడిరి, మనమును ఆలాగు చేసిన ఎంత మేలు! కలలో హెచ్చరించబడిరి, వారు గందరగోళము నుండి బయటపడిరి. కాబట్టి దానిని వారు విడిచిపెట్టిరి. హల్లెలూయా! దానిని వారు విడిచిపెట్టిరి.
84వారు గందరగోళములో నుండి బయట పడిన పిదప, ఆ సహజాతీతమైనది మరల కనబడెను. అది అక్కడ ఉన్నది. వారు ఆ సంగతుల నుండి బయటకు వచ్చిరి. అక్కడున్న గందరగోళము, వివాదము, ప్రధాన కార్యాలయము, ప్రధాన యాజకుడు, దైవశాస్త్ర పండితులు, పరిశోధన పట్టాలు, ఆ గొప్ప గొప్ప టోపీలు పెట్టుకొన్నవారు వీరికి ఇప్పుడు దూరమయిరి. వారు ఆ నక్షత్రమును చూడలేకపోయిరి. వారి నడక, వారి టోపీలు, పెద్ద పేరు వారిని గ్రుడ్డివారినిగా చేసెను.
వారిలో చాలా మంది ఇట్లనిరి, "అటువంటిది ఏదీ లేదు. నాలుగు వందల సంవత్సరాల నుండి అట్టిది ఏదీ వినబడ లేదే? ఈ పిచ్చి వారి మాటలు వినవద్దు? వారిని తిరిగి వారు చెందిన ఆ ఇండియా దేశమునకు, పంపేయండి."
MATT 2:6•
LUKE 9:62•
LUKE 14:26,27•
JOHN 1:1•
HEB 13:8•
2PET 1:20
85"మంచిది, ఏమిటి? దేవుని వాక్యము, దాని మాట ఏమిటి? "బెత్లెహేము యూదయ ఏ మాత్రము అల్పమైనది కాదు. దీనిలో నుండి ఒకాయన వచ్చును. ఓ! మనము తప్పు చోటులో యున్నాము. వీరితో ఎవరితోనూ మనము చేరరాదు," అని వారనుకొనిరి.
వారు తమ ఒంటెలను త్రిప్పి వెళ్ళిపోయిరి. దేవుడు వారిని దీవించును. వారక్కడ నుండి వెళ్ళిపోయిరి. అక్కడ నుండి వారు వెళ్ళిపోయిన వెంటనే మరల ఆ వెలుగు కనబడెను. ఆ సహజాతీతమైనది వారి మధ్య సంచరించనారంభమాయెను. ఓ, మై! అప్పుడు వారు సహజాతీతమైన దానిని వెంబడించసాగిరి, జ్ఞానులు వారి వశమునుండి తప్పుకొనిరి. వారు ఆలాగు బయటకు వచ్చిన తరువాత ఆకాశము నుండి సహజాతీతమైన వెలుగు మరల ప్రత్యక్షమాయెను.
ఈ సంగతులను నమ్మని అవిశ్వాసుల గుంపుతో కట్టబడిన౦త కాలము, నీవు గబ్బిలము వలె గ్రుడ్డివానిగా ఉందువు. నీవు సమస్తము నుండి వేరగుము; అది తల్లి, తండ్రి, సోదరుడు, శాఖ లేదా మరేదయినా కావచ్చును. "తన స్వంతవారిని విడిచి నన్ను వెంబడించనివాడు నా వాడుగా పిలువబడుటకు అయోగ్యుడు. నాగటి మీద చెయ్యి వేసి, వెనుకకు తిరిగి చూచువాడు దున్నుటకు యోగ్యుడు కాడు." సోదరీ, సోదరుడా! ఈ రాత్రి ఒక నిజమగు, క్రైస్తవ వెలుగు ప్రకాశించుచున్నది. ఆయన యేసుక్రీస్తు నిన్న, నేడు, నిరంతరము ఏకరీతిగ యున్నాడు. సమస్తము నుండి వేరగుము! ఆయనే వాక్యము. ఆయన ఎల్లప్పుడూ వాక్యమే. దేవుని వాక్యము పరిపూర్ణముగా సత్యము. దానికి ఎట్టి స్వంత అనువాదము అక్కర్లేదు.
"దాని భావము ఇది," అని నీవందువు.
MAL 3:6•
MATT 2:10•
MATT 24:35•
MARK 13:31•
LUKE 21:33•
JOHN 1:1•
2PET 1:20
86అది ఏమి చెప్పుచున్నదో అదియే దాని భావము. "దానికి ఎట్టి స్వంత భావము చెప్పరాదు," అని బైబిలు చెప్పెను. అది నలుపు అని చెప్పినచో అది నలుపే. కాదు అది తెలుపు అని చెప్పినచో తెలుపే. దానికి తిరుగు లేదు. అది ఖచ్చితము. దేవుని ఆత్మ మూలముగా పుట్టిన ప్రతివాడు ఏమయినా గాని దాని నుండి వేరు కాడు. అతడు ఆ వాక్యమునకు కట్టబడియుండును, ఎందుకనగా అది క్రీస్తు. క్రీస్తే వాక్యము. తన వాక్యము గూర్చి క్రీస్తు అబద్ధమాడజాలడు. ఆయనే వాక్యము.
"ఆయన ఆలాగు చెప్పెనని నాకు తెలియును, కాని" అని నీవందువు.
దానికి ఇక "కాని" అని గాని మరేదియూ చేర్చకూడదు. ఆయన చెప్పినదే సరి. అవును. దానిని ఆయన మార్చలేడు. ఆయన చేయలేడు. ఆయన మారనివాడు. "భూమ్యాకాశములు గతించును, గాని నా మాటలేమాత్రమును గతించవు," అని ఆయన చెప్పెను. అది దాని కాలములో అక్కడికి వచ్చును, దానిని ప్రకాశింపచేయుటకు ఎవరో అక్కడ యుందురు. అది నిజము.
ఈ కుమారుడు అక్కడుండునను మాటను దేవుడు పలికెను, మరియు దానిని ప్రకాశింప చేయుటకు ఆయన అక్కడుండెను. అక్కడ ఆ పరలోక దర్శకుడుండెను; దానిని వారు గమనించుచుండిరి, మరియు తిన్నగా దాని యొద్దకు వచ్చిరి. వారు ఆ పాత విశ్వాస పాఠమును విడిచిపెట్టి మరల సహజాతీతమైన దాని కొరకు ప్రారంభించిరి. వారు వెళ్ళిరి. "వారెంతగా సంతోషించిరి! వారు ఆ వెలుగు వచ్చుట మరల చూచి అమితానందముతో నిండుకొనిరి," అని బైబిలు చెప్పెను.
87"ఓ! సోదరీ, సోదరుడా, నీవు నేను, మనందరము, క్రైస్తవ ఆచారము విడిచిపెట్టి, (చూడండి?) ఈ లోక డాంబికము విడిచిపెట్టి, ఒకరికొకరు బహుమతులిచ్చుట విడిచిపెట్టి, మన గర్వమును కాళ్ళ క్రింద తొక్కి, "ప్రభువైన యేసు, పరిపూర్ణ వెలుగు నొద్దకు నన్ను నడుపుము," అని చెప్పిన ఎంత మేలు! సహజాతీతమైనది జరుగుట గమనించండి. పరిశుద్ధాత్మ మహోన్నత రీతిలో వచ్చును, చూడండి.
88వారు సహజాతీతమగు దానిని వెంబడించి ముందుకు సాగిపోయిరి. వారు దేనిని విడిచిపెట్టిరి? ఆ దినమునకు చెందిన పరలోక సూచనను వారు వెంబడించిరి, ఇప్పుడు గురుంచుకొనండి, అది పరలోక, దైవానుగ్రహ సూచన. అది నిజమని మీరందరూ నమ్ముచున్నారా? అది పరలోకపు దైవానుగ్రహ సూచన. శరీరధారియొన వాక్యమును కనుగొను వరకు వారు ఆ సూచనను వెంబడించిరి. ఆయనే శరీరధారియైన వాక్యమని మీరు నమ్ముచున్నారా? ఆ దినమునకు వాగ్దానము చేయబడిన పరలోకపు గురుతు వారిని శరీరధారియైన వాక్యము నొద్దకు నడిపించెను. చూచారా?
సోదరుడా, సోదరీ, ఈ రాత్రి ఆయన అదే చేయును. పరలోకపు ఈ గొప్ప సూచన మనము కలిగియున్నాము. మనమధ్య పరిశుద్ధాత్మ జీవించుచున్నది, దానిని వెంబడించుము. నీ హృదయములో ఒకటి సంచారము చేయుచున్నది, "దానిని నేను పొందవలసియున్నానని నాకు తెలియును. సంఘములో చేరుట కంటె ఎక్కువైనది నేను చేయవలెనని నాకు తెలియును."
"నాకు మంచి వ్యాపారమున్నది, అది ఫలించుచున్నదని నాకు తెలియును." సోదరుడా, ఈ రోజులలోనే ఒక రోజున ఉదయము నాలుగు గంటలకు గుండెపోటు నిన్ను తీసికొనిపోయినచో, నీ వ్యాపారమును నీవు విడిచిపెట్టవలెనని ఎరుగుదువా? దాని తరువాత నీవెక్కడికి వెళ్ళుదువు?
89[టేపు మీద ఖాళీ యున్నది] …. నీ స్వంత శరీరములోనే అది బయలు పరచబడియున్నది, నీవు పరిశుద్దాత్మ ద్వారా జన్మించిన వ్యక్తివి. దానిని కలిగియుండుటకు నీకు ఇష్టము లేదా? అంతకన్నా గొప్ప క్రిస్మస్ ఎవరైనా కలిగియుందురా? అది నిత్యజీవపు కానుక. "దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వానిని అనుగ్రహించెను, ఆయన యందు విశ్వాసముంచు వాడు నశింపక నిత్యజీవము పొందును."
"తూర్పున మేమాయన నక్షత్రము చూచి ఆయనను పూజింప వచ్చితిమి."
GEN 6:5-7•
MATT 2:2
90సూర్యునితో పాటుగా నారిగకత ప్రయాణము చేయుచూ తూర్పునుండి పశ్చిమానికి వచ్చుచున్నది. ఇప్పుడు మనము పశ్చిమ తీరమున యున్నాము, తూర్పు, పశ్చిమములు కలిసికొనినవి, ఇక ముందుకు మనము వెళ్ళలేము. అతి ప్రాచీన నాగరికత గలది చైనా, ప్రపంచమునకు అవతలి వైపు నున్నది. గురుంచుకొనండి. అది పోయినది…
పాపము కూడా నాగరికతతో పయనించుచున్నది. దీనిని చెప్పుట కష్టమని నాకు తెలియును. కాని, సోదరీ, సోదరుడా, మానవ హృదయములోని ఆలోచనలు, తలంపులు గమనించు. పరిశుద్దాత్మచేత అభిషేకించబడిన మనిషి నిలబడి మానవ హృదయములోని రహస్యములను చూడగలడు, మీరు అది నెరవేరుట చూచియున్నారు. ఒక వ్యక్తి నుండి రెండు లేదా మూడు మాటలు విను, నీకు తెలియును, వారి యొద్ద నుండి దోషాలు ఎగురుటను మీరు చూచెదరు; చూడండి? వారి అట్టి అభిషేకము వెంటపెట్టుకొని తురుగుదురు. మానవుని యొక్క ప్రతి తలంపు చెడ్డది. నోవహు దినములలో యుండినట్లే యున్నది, మానవుని చేసినందుకు దేవుడు సంతాపపడెను. "భూమి మీద లేకుండా మానవుని తుడిచి వేయుదును," అని ఆయన చెప్పెను. మరల తిరిగి మనము ఆ కాలమునకు వచ్చియున్నాము.
గమనించండి.
91కాని ఆయనకు ఒక చిన్న సంఘమున్నది, దానిని ఆయన తీసికొనగోరుచున్నాడు. భూమిలో పరుండి నిద్రించుచున్నవారు వేలాదిమంది ఆయనకున్నారు; మొదటి జాము, రెండవ జాము, మూడు, నాలుగు, అయిదు, ఆరు. ఇది ఏడవ జాము. గుర్తు౦చుకొనండి. ఆయన ఏడవ జాములోనే వచ్చును. ఆ జాములో బుద్ధిగల కన్యకలను ఆయన కనుగొనెను, బుద్ధిలేని కన్యకల దివిటీలలో నూనె లేక యుండిరి. నూనె పరిశుద్ధాత్మకు సూచన. ఈ రాత్రి నీ యొక్క దివిటీలో అది లేనియెడల, నా సహోదరి, సహోదరుడా, నీవెందుకు తిసుకోనకూడదు, దేవుని యొక్క గొప్ప క్రిస్మసు కానుక.
MATT 25:2,3
92మీకు తెలుసా, ఈనాడు మనకు గొప్ప, పెద్ద చుట్టబడిన కానుకలున్నవి, ఎంతో ఆర్బాటముగా వాటిని చుట్టి, అందుకు మూడు డాలర్లు తీసికొనుచున్నారు. అది నీవు గొప్ప బహుమతి అని చాలాసార్లు తలంచుచుందువు. మరియు ఒక స్త్రీ వేరొక రోజు కొట్టులో నిలబడి యున్నది, వారిద్దరూ మాట్లాడుకొనుచున్నారు, నిలబడి తమ తండ్రికి ఏ కానుక ఇవ్వవలెనని ఆలోచించుట విన్నాను. "నీవు నాన్నకు ఏమి కొందువు?" అని ఒక సోదరి మరొక సోదరిని అడిగెను.
"ఒక పేక ముక్కల పెట్టె మరియు సిగరెట్ల కట్ట తీసికొందును," అన్నది.
"నేను విస్కీ తీసికొన్నాను, దానిని బహుమతిగా చుట్టుటకు ఇచ్చెదను," అని మరొక సోదరి అన్నది. చూడండి. పైనున్న మెరుగు లోపట ఉన్నదానిని వెల్లడి చేయుట లేదు. చూచారా?
కాని ఈ రాత్రి దేవుని యొక్క ఒక క్రిస్మసు కానుక యున్నది. దానిని ఆయన ఒక పశుల తొట్టిలో చుట్టెను. పైకి ఏమీ బాగుగా లేదు, కాని, ఓ, ఆ లోపట నిత్యజీవమున్నది. పరిశుద్ధాత్మ ఈ రాత్రి నీ యొక్క జీవితమును తాకి నిత్యజీవమునకు నడిపించుటకు అనుమతించవా?
కొన్ని క్షణములు మనము తలలు వంచుదము.
93ఈ ప్రశాంత సమయములో, క్రిస్మసు సందేశము అని నేను పిలుచు ముక్కలుగా నున్న చిన్న వర్తమానమును అందించాను. మీరు నిజంగా అది సత్యమని నమ్ముచూ, నిత్యజీవము ఎన్నడూ పొందనియెడల, ఆ గొప్ప పరిశుద్ధాత్మ నిన్ను ఆ వెలుగు నొద్దకు నడిపించునట్లు సమ్మతించుము. ఇప్పుడే, నీ హృదయమందు ఈలాగు చెప్పుము, "ప్రభువైన యేసూ, ఆ వెలుగును నేను కనుగొనగోరుచున్నాను, ఎవరేమి చెప్పినా గాని అది నాకు కావలెను. ఆ వెలుగును నేను కనుగొనగోరుచున్నాను." మీరు మీ తలలు వంచియుండగానే ఆలాగు చెప్పండి, మీ చేతులెత్తి ఇట్లడుగుడి, "బ్రన్హం సోదరుడా, నా కొరకు ప్రార్ధి౦చుము. ఆ వెలుగును నిజంగా నేను కనుగొనగోరుచున్నాను. "సహోదరి, నిన్ను దేవుడు దీవించును, దేవుడు నిన్ను దీవించును, ఆమెను దేవుడు దీవించును, ఆయనను దేవుడు దీవించును. మరొకరు చేతిని ఎత్తి ఈలాగు చెప్పండి, "దేవుని యొక్క క్రిస్మసు కానుక నాకు కావలెను." అయ్యా! దేవుడు నిన్ను దీవించును. ఆమెను దేవుడు దీవించును. "నాకు దేవుని క్రిస్మసు కానుక కావలెను," అని మరొకరు చెప్పుచున్నారు. ప్రభువా, దానిని నాకు పంపుము, ఏమయినా గాని నేను లెక్కచేయను. అది పశుల పాకలో వచ్చినా, పశుల తొట్టిలో వచ్చినా, ప్రపంచమునకు అది ఎంత వికారముగా కనబడినా, లోకమునకు నేను ఎంత అసహ్యముగా కనబడినా లెక్క చేయను. మీకు తెలియును గదా, దేవుని యొక్క గొప్ప కానుకలు ఎల్లప్పుడూ మానవులను వింతగా ప్రవర్తించునట్లుగా చేయును.
94మోషేను చూడండి, ఒక గొప్ప వేదాంత పండితుడు, కాని ఒక దినమున ఎడారి వెనుక వైపున అతడు ఒక వెలుగును కలిసికొనెను. అతడు తన చెప్పులు విప్పెను. ఎనుబది ఏండ్ల వయస్సులో నుండెను, మీసములు అతని ఎద మీదకు వ్రేలాడుచుండెను. తన భార్యను, తన బిడ్డను ఒక గాడిద మీద ఎక్కించి, ఐగుప్తునకు వచ్చెను. ఒక్క రోజులో దేశమును జయించగల సైన్యము అతనికి ఉండినా, ఓడిపోయిన వ్యక్తి; ఇప్పుడు మరల వంకర కర్రతో ఐగుప్తును జయించుటకు వెళ్ళుచున్నాడు. ఎందువలన? అతడు ఆ వెలుగును, సహజాతీతమగు వెలుగును కనుగొనెను.
EXOD 3:1,2,5•
EXOD 4:20
95ఈ రాత్రి ఆ సహజాతీతమగునది నీ హృదయమును త్రిప్పుచున్నది, అదియే, ఈ దినపు వెలుగు. యేసు క్రీస్తునొద్దకు అది నిన్ను నడిపించనీయము, ఆయన మాత్రమే జీవమియ్యగలడు. ఇంకా చేతులు ఎత్తనివారు ఎవరైనా యున్నచో ఈలాగు చెప్పండి, "బ్రన్హం సోదరుడా ప్రార్ధనలో నన్ను జ్ఞాపకము చేసికొనుము." దేవుడు నిన్ను దీవించును. ఇంకెవరైనా యున్నారా? దీవించును. ఇంకెవరైనా యున్నారా? దేవుడు నిన్ను దీవించును. యౌవనుడా, దేవుడు నిన్ను దీవించును. మరెవరున్నారు? యువకుడా, దేవుడు నిన్ను దీవించును. ఇంకెవరున్నారు?
"నేను వెంబడించుటకు ఇష్టపడుచున్నాను. క్రీస్తు అను ఉదయ నక్షత్రమును నేను వెంబడించగోరుచున్నాను. నేను వెంబడించి నేడే యేసును కనుగొందును. ఈ క్రిస్మసు ఆచారమంతటి నుండియూ నేను వేరయ్యెదను, ఎందుకనగా ఒక దినమున ఆరని అగ్నితో అది కాల్చబడును." దానితో సమ్మతించు వారందరును కాల్చబడుదురు. ప్రపంచము మరియు లోకము శిక్షించబడి నాశనమగును. లోకమును ప్రేమించు జనులు లోకముతో కూడా నశించెదరు. లోకము యొక్క ప్రేమ ఇంకా నీలో యుండవచ్చును. ఈ రాత్రి నిన్నునీవు యేసు క్రీస్తుకు, ఆయన వాక్యమునకు అమ్మివేసికొనుటకు చేతిని ఎత్తుము. ఎత్తని వారికి మరల ఇది ఒక అవకాశము. దేవుడు నిన్ను దీవించును. నిన్ను దీవించును. నేను అదే చెప్పగలను. ఆమెను దేవుడు దీవించును.
96మీకు తెలియదు, ఒక్క నిమిషములో ఎవరయినా చేతిని ఎత్తవచ్చు. "బ్రన్హం సోదరుడా, అది ఏమి వ్యత్యాసము చూపించును?" అని చెప్పవచ్చును. జీవము మరియు మరణముల మధ్య తేడాను తెచ్చును.
ఆ చెయ్యి ఆలాగు పైకి లేచినప్పుడు అందులో నిజంగా ఎంతో అర్ధమున్నది. ఏమిటది? నేను ఆ వెలుగు గూర్చి మాట్లాడుచున్నాను. "నేను తప్పు చేశాను, నాలో లోక మున్నది, ఇంక నాకు అది వద్దు. నా చేతులు ఎత్తైదను," అని అదియే చెప్పును. అది ఒక సాక్ష్యము.
ఎత్తబడిన చెయ్యి భావమేమిటో మీకు గుర్తున్నదా? పరలోకము క్రింద ప్రతి భాషలోను ఎత్తబడిన చేతికి లొంగుట, అని అర్థము. అది ఒక లొ౦గుబాటు గురుతు. లొంగిపోవుటకు అది ఒక అంతర్జాతీయ సూచన. ప్రపంచములోని ఏ సైన్యమునకయినా అదే గుర్తు.
ఈ రాత్రి ఎందరు ఈ విధంగా చెప్పి, తమ చేతులు ఎత్తెదరు? "నేను సమస్తము సమర్పించుచున్నాను, ప్రభువా, నేను లొంగుచున్నాను. నాపని అయిపోయినది. నేను లొంగుచున్నాను." దేవుడు నిన్ను దీవించును. దేవుడు నిన్ను దీవించును. అది నిజము. అది మంచిది. ఓ, మై.
మనము ప్రార్ధి౦చుచుండగా, పియానో వాయించు వ్యక్తి రావలెనని కోరుచున్నాను.
ACTS 2:41
97పరమ తండ్రీ, ఈలాగు చెప్పబడినది అని నేను గ్రహించాను, "నమ్మినవారందరూ బాప్తీస్మము పొందిరి." ప్రభువా, అది ఎంతో అవసరము. వారు నిన్ను నమ్మిన యెడల, ఏదో ఒకటి జరుగును. వారు నీ వారు. ఈ చిన్న దేవుని యొక్క వాక్య ఆరాధనకు వారు జయ సూచకములుగా నున్నారు; ఈ రాత్రి ఇక్కడ చేరిన చక్కని జనుల మధ్య యేసు క్రీస్తు నన్నిధి ఉన్నది, చిన్న విందు ఉన్నది. కాని ఈ రాత్రి నీవు ఇక్కడున్నావని మాకు తెలియును, మా కళ్ళతో దానిని మేము చూడలేకపోవచ్చును, కాని మా స్పర్శ ద్వారా దానిని అనుభవించుచున్నాము. మా హృదయములో, అంతరాత్మలో ఆ భావనను తాకుచున్నాము. మా ఆత్మ మాతో ఈలాగు మాట్లాడి, చెప్పెను, "మేము యేసుక్రీస్తు సన్నిధిలో యున్నాము. దేవుని నుండి మానవునికి ఇవ్వబడిన అతి గొప్పది, నిజంగా మొదట ఇవ్వబడిన క్రిస్మస్ కానుక ఇదే."
మనము ఎన్నో కానుకలు పొందియుండవచ్చును, కాని ఇంకా చాలా మంది దానిని పొందియుండలేదు. దేవా, ఈ రాత్రి చేతులెత్తిన వారికొరకు ప్రార్ధి౦చుచున్నాము, ఈ సర్వపూర్ణుడవగు నీవు వారికి కావలెను. తండ్రీ, ఆలాగు వారు ఆనుకొనియున్నారు.
ఆ విధంగానే చాలామంది రబ్బీలు, ఆనాటి గొప్ప బోధకులు ఆనుకొనియుండిరి, కాని వారు బయటకు అడుగు వేయుటకు భయపడిరి. ఆ ఘడియకు చెందిన వెలుగు, వెల్లడయిన వాక్యము, వర్తమానమును నమ్మి అంగీకరించి పూర్తిగా సమర్పించుకొనుటకు వారు వెనుకాడిరి. దానిని చేసిన వారు చాలా మంది యున్నారు.
ZECH 14:7
98ప్రభువా, ఈ రాత్రి ఇక్కడ చాలామంది యున్నారు, ఈ చిన్న గుంపులో ఇరవై లేదా ముప్పది మూడు మంది యున్నారు. నేను ఎక్కువగా చెప్పినా, తక్కువగా చెప్పినా క్షమించండి. కాని, ప్రభువగు దేవా, అంతకు ఎక్కువ లేదా తక్కువ మంది చేతులు పైకెత్తి యున్నారు, వారు లొంగిపోవుటకు సిద్ధమయిరి. దేవా, వారికి యేసును ఇమ్ము, వారి జీవితములకు పరిశుద్ధాత్మనిమ్ము. ఇది వారి జీవితములలో అతి గొప్ప ఘడియగా నుండును గాక! యోసేపు వలె వారు తమ హృదయములలో ఈ సంగతులు గూర్చి ఆలోచించుచూ, ఈ రాత్రి ఇంటికి వెళ్ళుదురు గాక. "నా చేతిని ఎందుకు నేను ఎత్తాను? ఆ విధముగా నన్ను చేసినది ఏది? ఆ విధముగా నేను ఏలాగు చేయగలిగాను? ఎన్నో సంవత్సరముల నుండి నేను క్రైస్తవునిగా చలామణీ అయిపోయాను, కాని నన్ను చెయ్యి ఎత్తమని ఏదో ప్రేరేపించినది." సంఘ సభ్యులు, సేవకులు కూడా, ప్రభువా, తమ చేతులు ఎత్తియున్నారు. ప్రభువా, వారికి ఈ దీవెనను దయచేయుమని నీకు ప్రార్ధి౦చుచున్నాను. దయచేయుము.
ప్రభువు దూత వచ్చి ఇట్లు పలుకు గాక, "భయపడకుము, ఈ దినపు వెలుగు ఇదే. ఈ ఘడియ వెలుగు ఇదే. సాయంకాలపు దీపములు ప్రకాశించుచున్నవి. మరియు సూర్యాస్తమయమునకు ముందు, సాయంకాలమున వెలుతురుండునని ప్రవక్త చెప్పెను." ప్రభువా, కాలపు అస్తమయమును మేము చూచుచున్నాము, త్వరలోనే అది నిత్యత్వము లోనికి మళ్ళును. ప్రభువా, ఈ రాత్రి వారు ప్రతిఒక్కరు యేసును కనుగొనునట్లు కృప చూపుము. యేసు నామమున దీనిని నేను అడుగుచున్నాను. ఆమేన్.
ROM 3:4
99మనము లేచి నిలబడునపుడు, ఈ విధముగా మనము లోంగిపోయినట్లు చేతులెత్తి చూపించుదము.
ఒక సంగతి మిమ్మును అడుగగోరుచున్నాను. కొద్దిసేపటి క్రితం చేతులెత్తిన మీ కొరకు నేను ప్రార్ధి౦చాను. నాకు చేతనయినది అదియే, మీకొరకు నేను నమ్మనైయున్నాను. నేను అడిగినది నాకు ఆయన ఇచ్చునని నమ్ముచున్నాను, ఎందుకనగా ఆయన ఆలాగు వాగ్దానము చేసెను. ఆయన అబద్దమాడజాలడు. అది జరుగకుండా చేయునది అవిశ్వాసము మాత్రమే. మీ కొరకు నేను నమ్ముచున్నాను, నిజంగా మీరు నమ్మండి. దేవుడు మీకు పరిశుద్ధాత్మను ఇయ్యనై యున్నాడు, దానిని ఆయన మీకు ఇచ్చును, ఎందుకనగా మీరు పరిశుద్ధాత్మను అడిగియున్నారు, మీరు లొంగిపోదలిచారు.
మీరు ఆ విధముగా చేసిరి గనుక, మీరేమి చేయవలెనో నేను చెప్పెదను. పరిశుద్ధాత్మ బాప్తీస్మమును నమ్ము ఒక మంచి సంఘమును మీరు కనుగొనుడని కోరుచున్నాను. అక్కడికి వెళ్ళుడి. మీరు ఇప్పుడు అట్టి సంఘములోనే యున్నచో, మీ సంఘకాపరి యొద్దకు వెళ్ళి ఈలాగు చెప్పండి, "ఒక చిన్న కూటములో, ఆ రాత్రి నేను నా చేతిని ఎత్తాను." అదెక్కడో కూడా మీరు చెప్పనవసరము లేదు. "నా చేతులెత్తాను, నా కొరకు మీరు ప్రార్ధి౦చండి, నేను పరిశుద్దాత్మ బాప్తీస్మము కోరుకొనుచున్నాను. నాకది కావలెను! దానిని తప్పక నేను పొందవలెను, జీవించుటకు అది తప్పక నాకు కావలెను. నేను వెలుగును చూచాను." ఓ! దేవుడు దానిని నీకిచ్చును. ఇప్పుడే ఆలాగు నీవు చేయుదువా?
100ఇప్పుడు అందరూ ఇచ్చట యుండగా, ఈ పాట మనము పాడుకోనైయున్నాము; "నేను లొంగుదును, పూర్తిగా లొంగుదును. క్రీస్తుకు, నా రక్షకునికి అంతయూ లొంగుదును. " మనందరము చేతులెత్తి, కండ్లు మూసికొని పాడుదము.
ప్రూర్తిగా నేను లొంగుదును,
ప్రూర్తిగా నేను లొంగుదును,
నా ధన్య రక్షకా, ప్రూర్తిగా నీకే వ్రూర్తిగా లొంగుదును.
ప్రూర్తిగా నేను లొంగుదును,
వూర్తిగా నేను లొంగుదును,
నా ధన్య రక్షకా, ప్రూర్తిగా నీకే వ్రూర్తిగా లొంగుదును.
ప్రూర్తిగా లొంగుదును.
అర్థవంతముగా పాడుచున్నారా? "ఆమేన్" చెప్పండి. ఇప్పుడు మీరు నిజంగా ఒకటి చేయవలెనని కోరుచున్నాను. మీ ప్రక్కన నిలబడియున్న వారి చేయి పట్టుకొనుడి. "బ్రన్హం సోదరుడా, నిజంగా నేను భావించుచున్నాను. నా కొరకు ప్రార్ధి౦చుము." మనందరము కలిసి ఇప్పుడే దానిని చేయుదము. [సహో, బ్రన్హం వేదిక మీద ఎవరితోనో మాట్లాడుచున్నారు, "సోదరుడా, అర్థవంతముగా పాడుచున్నాను. నా కొరకు ప్రార్ధి౦చుము. దేవుడు నిన్ను దీవించును. నన్ను దీవించును."] అది మంచిది. చక్కనిది! ఓ! మీకది చక్కగా లేదా? నాకది భావయుక్తమే.
101ఇప్పుడు, నిజంగా మన హృదయమంతటితో అర్థవంతముగా పాడినచో, మనము మన స్వచిత్తము, మన స్వ మార్గములు, మనకున్న సమస్తము, క్రీస్తుకు సమర్పించుదుము. మరల మనము చేతులెత్తి పాడుదము.
ప్రూర్తిగా నేను లొంగుదును,
ప్రూర్తిగా నేను లొంగుదును,
నా ధన్య రక్షకా వూర్తిగా నీకే,
ఇప్పుడు, మనము తలలు వంచి పాడుదము. ఇప్పుడు, మీ మనస్సు ఆయన మీద ఉంచండి.
నేను…………
అత్యానంద క్రిస్మసు మీకుండవలెనని కోరుచున్నాను. తూర్పున పుట్టిన తన నక్షత్రమును దేవుడు మీకు పంపును గాక. పందొమ్మిది వందల సంవత్సరముల క్రితం పుట్టిన ఆ నక్షత్రము శరీరధారియగు వాక్యము నొద్దకు నడుపును గాక.
ప్రూర్తిగా నేను లొంగుదును,
ప్రూర్తిగా నేను లొంగుదును, (దేవుని వైపు చేతులెత్తి),
నా ధన్య రక్షకా, ప్రూర్తిగా నీకే
నేను,………………
టోనీ, దేవుడు నిన్ను దీవించును గాక.