సంఘ క్రమము
1సోదరులారా, సజీవ దేవుని యొక్క సంఘమును నిర్వహించుటెట్లో తెలిసికొను ఉద్దేశ్యముతో ఈ రాత్రి కూటమును ఏర్పాటు చేయుట జరిగినది. ఈ సంఘములో మనము భాగమైయున్నామని నమ్ముచున్నాము.
మొదటిగా చెప్పగోరుచున్న సంగతి వినండి. ప్రపంచమంతా నేను పర్యటించాను. ఇంత వరకు నాకు తెలిసిన దానిని బట్టి ఇది ఆత్మీయ స్థలములలో అతి గొప్ప దానిలో ఒకటిగా భావించుచున్నాను. నాకు తెలిసిన ఏ ఇతర స్థలములో కంటెను ఇక్కడ దేవుని యొక్క ఆత్మను ఎక్కువగా చూడగలము. ఇంతకు ముందు నేనెరిగిన రెండు స్థలములు నా మనస్సులో యుండెడివి, కాని ఇంత వరకు ఆ స్థలములను మనము చూడలేదనుకొంటాను. అందులో ఒకటి సంస్థలోనికి పోయినది. మరియొకటి పతనమయినది.
నిన్న నన్ను పిలచిరి ఈ సంఘములో మీకు సంబంధించిన విధులను గురించి మీరందరూ ఈ ప్రశ్నలు అడుగగోరుచున్నారని నాకు చెప్పిరి. ఈ రాత్రి అందుకొరకే ఇచ్చటికి వచ్చాను. సంఘమును క్రమములో యుంచుటకు, లేదా నేను తలంచుచున్న విషయములను మీతో పంచుకొనుటకు వచ్చియున్నాను ఈ సంఘము ముందుకు కొనసాగుటకు అదే అవసరమైయున్నది.
2సోదరులారా, ఇది ఆత్మ సంబంధమగు స్థలమని మీతో నేను చెప్పిన మాటను మీరు గ్రహించియున్నారని నిశ్చయముగా నేను చెప్పగలను. ప్రపంచములో ఇది అతి పెద్ద చోటని చెప్పుటలేదు. చాలా గొప్పగా పాటలు పాడే వారు, చాలా గొప్పగా అరిచేవారు, చాలా గొప్పగా చప్పుట్లు కొట్టేవారు, చాలా గొప్పగా భాషలు మాట్లాడే వారు, ఇంకా ఆయా కార్యములు చేయువారు ఇక్కడున్నారని చెప్పుట లేదు, కాని ఇక్కడి ఈ ఆలయమలో ఆత్మ పనిచేయుచున్న తీరును గూర్చి చెప్పుచున్నాను. ఇంతవరకూ నేను సహోదరుడు నెవిల్‌ను అభినందించి వందనములు చెప్పగోరుచున్నాను ఇక్కడ సోదరులు, ట్రస్టీలు, డీకన్లు, ఆదివారపుబడి పర్యవేక్షకులు, ఇంకా తదితరులందరూ ఎంతగానో సహాయపడుచూ దీనిని ఈ విధంగా ఉంచియున్నారు. సంఘము క్రమముగా నడువవలెనని నేను బాలునిగా యున్నప్పటి నుండి ఆకాంక్షించుచూ బహుగా ప్రార్థించుచుంటిని.
3సంఘమును ప్రతిష్టించి యున్నామని మీతో నేను చెప్పియున్నాను. కొంతసేపటి క్రితం అదే మీతో మాట్లాడుదునని చెప్పాను. దీని క్రమ పద్ధతిని గూర్చి మాట్లాడవలెనని కోరియున్నాను. దీనినెట్లు నడుపవలెనో గ్రహించవలెను. ఇక్కడ మనకు సంఘ కాపరులున్నారు. సహోదరుడు నెవిల్ మన మధ్యకు యువకునిగా వచ్చినప్పుడు, నేను సమీపించబోవు కార్యములను గూర్చి చూపుటకు ముందుగా, నెవిల్ సోదరుడు విశ్వాసములో బాగుగా కట్టబడుట మంచిదని నేను తలంచితిని. అతడు విశ్వాసములో బాగుగా కట్టబడెనని నేను గమనించినప్పుడు, బోధను అతడు అర్థము చేసికొనెను. క్రీస్తు సాక్షిగా నమ్మకమగు పాత్రను పోషించియున్నాడు. మనము సత్యమని నమ్ముచున్న దానిని పట్టుకొని యున్నాడు. ఆ ఘడియ ఇదేనని తలంచుచున్నాను. ఆయనను సమీపించుటకు ఇదే మంచి సమయము. సంఘ పెద్దలు తదితరులు ఇచ్చటున్నారు. ఆజ్ఞలను మీరు స్వీకరించుడి. వాటిని గుర్తుంచుకొనండి. నాకు తెలిసినంతవరకు అవియే అని దేవుని యెదుట చెప్పుచున్నాను. నేను మీకు ఏ విధముగా అయితే ఈ సంగతులను చెప్పుచున్నానో ఆ విధముగానే వాటిని అమలు చేయవలెనని కోరుచున్నాను, ఎందుకనగా ఇచ్చట ఎవరో ఒకరు నాయకునిగా ఉండువలసియున్నారు.
1COR 11:1
4అధికారమును గాని, అటువంటి మరి దేనినైనా గాని నేను హస్తగతం చేసికోవలెనని కోరుట లేదు, కాని చూడండి, ఒక దాని మీద ఇద్దరు నాయకులుగా ఉంటే అది నడచుట కష్టము. దేవుడు తన సంఘమునకు ఇద్దరు నాయకులను ఎన్నడూ ఉంచడు. ఎన్నడూ ఆయన అలాగు చేయలేదు. ఒకే శిరస్సు. ప్రతి తరములోను ఆయన ఆ విధముగానే వ్యవహరించెను. లేఖనములలో దానిని మనము చదివి యున్నాము. ఒకే ఒక వ్యక్తితో ఆయన ఎల్లపుడూ పని చేయును. ఎందుకనగా ఇద్దరు మనుష్యులున్నచో, రెండు అభిప్రాయములుండును. ఒక తుది సంపూర్ణత యొద్దకు అది రావలసియున్నది. నా సంపూర్ణత వాక్యమే, బైబిలు. ఈ సంఘము యొక్క కాపరిగా నా సంపూర్ణత వాక్యమైయున్నది, సోదరులైన మిమ్మును నేనెరుగుదును, మీరు నన్ను గమనించిన దానిని బట్టి మీ సంపూర్ణత ఏమిటో… లేఖనములో పౌలు చెప్పినట్లుగా, దేవునిని నేను వెంబడించినంత కాలము నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్న ప్రకారము మీరు నన్ను పోలినడచుకొనుడి.
5సోదరులారా, నేను ఈ వాక్యము నుండి తొలగిపోవుచున్నట్లు మీరు ఏ సమయములో గమనించినా గాని, వ్యక్తిగతముగా నా వద్దకు వచ్చి, నా తప్పును ఎత్తి చూపించవలెనని కోరుచున్నాను. మీరు ట్రస్టీలయినా, ద్వార పాలకులయినా, మరెవరయినా కావచ్చు. అది నాకు లెక్క కాదు. నా విషయంలో అది మీ బాధ్యత (క్రీస్తు నందు ఒక సోదరునిగా) నేను లేఖనములో తప్పుగా వెళ్ళునపుడు మీరు నాకు చెప్పవలెను. ఏదయినా ప్రశ్న తలెత్తినచో, అందరమూ కూర్చొని, సమిష్టిగా దానిని పరిష్కరించుదము.
ఈ రాత్రి అందుకే మీరిక్కడికి వచ్చి యున్నారు. అందుకే నన్ను పిలచి యున్నారని తలంచుచున్నాను, ఎందుకనగా ఇచ్చట ప్రశ్నలున్నవి. ఇక్కడ నేను చెప్పిన విషయముల గురించి మీ మనస్సులలో కొన్ని ప్రశ్నలు ఎదురయినవి. సోదరులారా, ఇప్పుడు గుర్తుంచుకొనండి. ఈ చీటీలు దేని మీద కూడా సంతకములు లేవు. వాటిని వ్రాసి పంపిరి. ఎవరు వ్రాసిరో తెలియదు, కాని ఇవి వారి మనస్సులోని ప్రశ్నలు. వాటికి నేను నాకు తెలిసిన అత్యుత్తమ రీతిలో జవాబు ఇయ్యుటకు ఇచ్చటికి వచ్చి యున్నాను.
6గుర్తుంచుకొనండి, నేను వాక్యములోనే నిలచి యుండవలెనని దేవుడు కోరుచున్నాడు. సంఘములో మీరు వాక్యమునే మోసికొని వెళ్ళవలెనని నేను కోరుచున్నాను, చూడండి, దీనిని ఆత్మీయముగా ఉంచండి, ఎందుకనగా గుర్తుంచుకొనండి, సాతాను యొక్క చీకటి రాజ్యపు శక్తులన్నియూ, నీవు ప్రభువులో ఎదుగ నారంభించినప్పటి నుండి నీ మీదికి రానారంభించించును. మీరు సైనికులుగా ఉండవలెను. క్రొత్తగా వచ్చినవారి వలె ఉండకూడదు. ఇప్పుడు మీరు అనుభవమున్న సైనికులు, పోరాడుటకు శిక్షణ పొందిరి. సాతాను మీ మధ్యకు వచ్చును, వీలయితే మీరు ఒకరితో ఒకరు వివాదపడునట్లు చేయును. వెంటనే వానిని తరిమి కొట్టండి. మీరు సోదరులు. అది శత్రువు. ఈ సాయంకాలపు వెలుగు సమయములో మనము ఒక ప్రమాణమును నెలకొల్పవలసియున్నాము. లోకము చీకటితో నిండిపోవుచున్నది. మొత్తం సంఘ రాజ్యమంతా సంఘముల సమితిలోనికి చేరిపోవుచున్నది. అతి త్వరలోనే వారు ఆలయ ద్వారము మీద మూసి వేయుడి అను బోర్డు వ్రాయనై యున్నారు. అపుడు మనము ఇతర చోట్ల కూడుకోవలసి యుండును, ఎందుకనగా మనము మృగము యొక్క ముద్రను వేసికొనుటకు నిరాకరించిన యెడల, వారు ఈ దినములలోనే ఏదో ఒక రోజున ఈ సంఘములను నిశ్చయముగా మూసివేయుదురు. మరణమువరకు దేవుని పట్ల నమ్మకముగా యుండుట మీదనే మనము ఆధారపడియున్నాము. అది చేయుటకే మనం ఉద్దేశించియున్నాము.
7ఈ సంగతుల గూర్చి ఏదయినా ప్రశ్న ఎప్పుడు తలెత్తినా గాని ఈ సంఘ సభ్యుల ఎదుట మీ కూడికలలో, లేక కూడికకు ముందు ఈ టేపును వినిపించవలెనని కోరుచున్నాను. ఈ టేపును వినిపించండి. ఈ మనుష్యులు విధి నిర్వహణలో దేవునికి జవాబు దారీలని ఇక్కడి సమూహము అర్థము చేసికొందురు గాక! ఈ నియమములను సంఘములో అమలుపరచి వెంబడించెదమని వారు ప్రమాణము చేసియున్నారు. వారితో మీరు విభేదించ వచ్చును. దీనిని నడుపవలెనని మిమ్మును కోరినపుడు, నేను మీతో అంగీకరించక పోవచ్చును. మనకు ఎక్కడో ఒక చోట ఇది సరి అని చెప్పగల ఆధారముండవలెను. నాకు తెలిసినంత వరకు పరిశుద్ధాత్మ క్రింద ఉండి దీనిని చెప్పుచున్నాను. ఆయనే నా తుది. ఈ ప్రశ్నల మీద ఈ మీకు అంతిమ జవాబుగా ఉండనీయుడి.
8ఇప్పుడు, మొదటి ప్రశ్న:
ప్రశ్న: ఆహారము మరియు వస్త్రములు సమకూర్చు విషయములో ఆర్థిక ప్రక్రియను సంఘము ఎట్లు నిర్వర్తించును?
సంఘము తన స్వంత వారికొరకు, అనగా ఈ సంఘ సభ్యుల కొరకు బాధ్యత వహించునని మనము గ్రహించవలెను. వారి అవసరముల కనుగుణంగా సహాయపడ వలసినంత వరకు మనము పూర్తి బాధ్యత వహించుదుము. మన స్వంత వారి పట్ల మన బాధ్యత యుండును. అనగా నిలకడగా, స్థిరముగా ఆలయమునకు వచ్చు సభ్యులు. వారిచ్చటకు వచ్చి, మనతో ఆరాధన చేయుచున్నారు. మన సోదరులు మరియు సోదరీలు వారే గనుక వారి పట్లమనము బాధ్యతను వహించ బద్ధులమై యున్నాము. ఈ కూడిక యొక్క సభ్యులుగా వారు నిరూపించుకొని యున్నారు.
ఆహారము లేకుండా, వస్త్రములు లేకుండా బాధపడుచున్న వారు మిలియనుల కొలదిగా యున్నారని మనమెరుగుదుము. సాధ్యమయితే వారందరికీ మన శాయశక్తులా సహాయపడ వలెనని కోరుదుము; కాని ఆర్థికంగా అది మన వలన కాదు. ప్రపంచమంతటికి మనం సహాయము చేయలేము, కాని మన స్వంత వారిపట్ల మనకు బాధ్యత యున్నది. మీకు మిగిలియున్న దానిని, ఈ సంఘ సభ్యులు కాని వారికి మీరు ఇవ్వగోరినచో దానిని డీకనుల బోర్డు వారి యొద్దకు తీసికొని వెళ్ళవలెను.
ACTS 6:3,4
9ఈ సమస్యను పరిష్కరించవలసినవారు డీకన్లు, అది బైబిలు పద్దతి. ఆహారము మరియు వస్త్రముల విషయములో వివాదము లేచినప్పుడు, అపోస్తలుల కార్యములలో వారు అపోస్తలులకు ఫిర్యాదు చేసిరి. అపుడు వారిట్లనిరి, వెళ్ళి మీలో యదార్థపరులుగాను, పరిశుద్ధాత్మ పూర్ణులుగాను ఎంచబడిన ఏడుగురు మనుష్యులను ఏర్పరచుకొనుడి. వారు ఈ విషయములను చూచెదరు, ఎందుకనగా మేము దేవుని వాక్యము కొరకును, ప్రార్థన కొరకును ఎడతెగక సమయము గడపవలసియున్నాము.
ఆహారము మొదలుకొని ఇతర విషయములను చూచుకోవలసిన బాధ్యత సంఘ కాపరిది కాదు, అది డీకన్ల యొక్క విధి. అది ట్రస్టీల పని కాదు, అది డీకన్ల పని. బైబిలులోనిది గుర్తుంచుకొనండి, వారు తమ స్వంతవారగు గ్రీకులకు యూదులకు ఇచ్చుచుండిరి. అక్కడే వివాదము పుట్టెను. ఒకరికంటె మరియొకరు తక్కువని ఫిర్యాదు చేసిరి, కాని ప్రజలు తమ సమస్తమును అమ్మి సంఘమునకు ఇచ్చిరి. దానిని వారి మధ్య సమానముగా పంచవలెనని కోరిరి. చిన్న వివాదము అక్కడ ఏర్పడెను. డీకన్లు మొదట వచ్చినది అప్పుడే. వారి విధులలో ఇది ఒకటి.
10మన స్వంత ప్రజల గూర్చి మనము శ్రద్దవహించవలసి యున్నామని నేను తలంచుచున్నాను. ఏ ఫిర్యాదయినా యున్నచో డీకన్ బోర్డు చైర్మన్‌కు అందించవలెను. ఆ తర్వాత డీకన్ బోర్డు వారు సమావేశమగుదురు. ఆ విషయములో చేయగల దానిని గూర్చి ఆలోచించుదురు. వస్త్రముల గూర్చి గాని, ఆహారము గూర్చి గాని, ఆర్థిక సహాయము గూర్చి గాని ఏదయినా వివాదమేర్పడినచో వారే నిర్ణయములు తీసికొందురు. ఆ విషయములో చేయవలసిన దానిని గూర్చి డీకన్లు నిర్ణయించెదరు. దానిని ఖజనాదారునికి అప్పగించెదరు దానికి కావలసిన ద్రవ్యమున్నదో, లేదో ఖజనాదారుడు చూచును వస్త్రములు కొనవలెనన్నా, మరేది చేయవలెనన్నా అతడే. డీకను బోర్డు వారు దీనిని గూర్చి సమావేశము కావలెను గాని, ట్రస్టీల యొద్దకు గాని, సంఘ కాపరి యొద్దకు గాని వెళ్ళరాదు. ఇది సంపూర్తిగా డీకన్ల విధి.
11ఇప్పుడు, రెండవ ప్రశ్న:
ప్రశ్న: ఆరాధనకు ముందున్న కూడికలోనే భాషలు మాట్లాడుట వాటికర్థము చెప్పుట జరుగవలెనని వేదిక మీదనుండి బహిరంగముగా చెప్పితే సరిపోవునా? ఈ పేపరు మీద ఉన్న రెండవ ప్రశ్న అది, చిన్న కార్డు మీద ఉన్నది.
చూడండి, ఇది ఇక్కడున్నసంఘ కాపరికి సంబంధించినది. ఎందుకనగా అతడు ఆత్మీయ పాత్ర వహించును, దానికతడు నాయకుడు. డీకన్లు సంఘములో రక్షకభటులవలె యున్నారు. క్రమమును అమలుపరచి, అన్ని విషయములలో జాగ్రత్త వహించెదరు. పేదలను పోషించుట మొదలగునవి చేయుదురు. ట్రస్టీలు ఆర్థిక వ్యవహారములు, ఆలయ నిర్మాణము గూర్చి శ్రద్దవహించెదరు. కాని సంఘ కాపరి ఆత్మ సంబంధమగు వ్యవహారమును చూచును. నెవిల్ సోదరుడా, ఇది నీకు చెందినది.
12కొంత కాలము క్రిందట సంఘములో క్రమము స్థాపించబడినది. భాషలతో మాట్లాడుటను, దానికి భావము చెప్పుటను నేను నమ్ముచున్నాను. సంఘములో దేవుడు నియమించిన చక్కని ఆత్మసంబంధ వరములవి. బైబిలు సమయము వలెనే నేడు మనము జీవించుచున్న కాలమునూ ఉన్నది. పౌలును గమనించండి, ఎఫెసు నొద్ద సంఘమును కనుగొనెను. అదే ఎఫెసు సంఘము, చాలా చక్కగా పాదుకొనిన సంఘము, మీరు దానిని గమనించారా? దానిని గూర్చి పౌలు స్వయంగా చెప్పినది మనం ఎరుగుదుము. అతడు కూడా అనేక భాషలతో మాట్లాడెను. భాషల వరము అతనికున్నదని మనం ఎరుగుదుము. ఆత్మీయంగా అతనికియ్యబడిన వారు మాట్లాడుటను చాలాసార్లు అతడెరుగును, ఎందుకనగా కొరింథీయులతో అతడెట్లు మాట్లాడెనో చూడండి. బైబిలును తీసి అది మీకు చూపించవలెనని యున్నది గాని సమయము చాలదు. చాలా రాత్రియగును, మనకెంతో సమయము లేదు, ఆలాగు చేసినచో మీరు బహిర౦గముగా చూచెదరు.
1COR 11:18-21
13ఆత్మీయ వరములను గూర్చియు, వాటిని క్రమములో ఉంచుటను గూర్చియు పౌలు ఎన్నడూ ఎఫెసీ సంఘము లేదా రోమను సంఘముతో గాని లేదా ఏ ఇతర సంఘములతో గాని మాట్లాడలేదు. కాని అతడు కొరింథీయులతో మాత్రము దానిని గూర్చి నిరంతరము చెప్పుచుండెను, ఎందుకనగా వారు దానిని ఎల్లప్పుడు పెద్ద సమస్యగా చేసిరి. పౌలు వారి మధ్యకు వచ్చినపుడు కొందరు భాషలు మాట్లాడుట, మరి కొందరు పాటలు పాడుట, ఇంకా ఇతర వరములు ఉండుట గూర్చి ఎంతగానో ప్రభువుకు వందనములు చెల్లించెను. మీరు కొరింథీ పత్రికలో మొదటి రెండు అధ్యాయములను గమనించండి. క్రీస్తు నందు వారెట్టి స్థానము కలిగి యున్నారో పౌలు చెప్పెను. వారు క్రీస్తు నందు స్థానమును కలిగియున్నారు.
అతడు వారికిది చెప్పిన తరువాత, అతడు వారిని తండ్రి తన పిల్లలను శిక్షించినట్లుగా శిక్షించవలసి వచ్చెను. మీ మధ్య పోరాటములున్నవని నేను విన్నాను. ప్రభుని బల్ల యొద్ద మీరు త్రాగుచున్నారని విన్నాను. వారు క్రైస్తవులు కారని అతడు చెప్పలేదు. సోదరులారా, మీరు కూడా ఆలాగు భావించవద్దు, కాని క్రైస్తవేతరులు చేయు పనులను చేయుచున్నారు. దేవుని యొక్క మందిరములో వారావిధంగా ప్రవర్తించుచున్నారు. అది మనం గమనించవలెను.
1COR 14:26-28
14ఆనాటి పౌలు చెప్పినట్లుగా దీనిని నేను చెప్పెదను, మీరు కూడి వచ్చునపుడు ఒకరు భాషలలో మాట్లాడుచుండగా, దానికి మరొకరు అర్థము చెప్పవలెను. అర్థము చెప్పువారు లేనియెడల మాట్లాడరాదు.
ఇక్కడి సంఘమును నేను గమనించాను. మీరు ఎదుగుట నేను చూచాను. మీ మధ్య ఎన్నో ఆత్మీయ వరములు పని చేయుట చూచాను. నిజముగా చెప్పుచున్నాను. సహోదరుడు నెవిల్ యొద్దకు ఒకని విషయములో ప్రభుని యొక్క వాక్కు తీసికొని నేను రావలసివచ్చెను. అతడు చేయుచున్న దానిని సరిదిద్దుటకు రావలసివచ్చెను.
పరిశుద్ధాత్మ నన్ను మంద మీద కాపరిగా నియమించెను. మీకు సత్యము చెప్పుట నా పని. సహోదరుడు నెవిల్‌కు ఎంతో నేను కృతజ్ఞుడను. అతడు సత్యమును కోరుతున్నాడు. ఆయన చెప్పిన దానికి మీతో నేను చెప్పుచున్నాను.
15మీ సంఘము ఎదుగుటను నేను గమనించాను. మొదట మన సంఘము ఎట్లుంటిమో మీరెరుగుదురు. ఆ విధంగానే ఇది యున్నది మరల ఆలాగే మనం ఉండవలెను.
ఒక శిశువు ముందు మాటలు రాకముందే మాట్లాడుటకు ప్రయత్నించును, చూచారా. చాలా అల్లరి, శబ్దము చేయును. ఆ సమయములో బోధకుని మించి గోల చేయును. దానిని మనము స్వాభావిక జీవితములో చూచుట మాత్రమే కాదు గాని, ఆత్మీయ జీవితములోను చూచెదము. అది చిన్న శిశువు. ఆ బిడ్డ మాట్లాడుటకు ప్రయత్నించుచున్నపుడు, నీవు బెత్తము తీసికొని కొట్టితే, సరిదిద్దుటకు ప్రయత్నించితే ఆ బిడ్డ జీవితమును నాశనము చేసినవాడివగుదువు, నీవతనిని గాయపరచెదవు. ఆ బిడ్డను కొంత కాలము ఆ ప్రకారమే ఎదుగనియ్యవలెను. అతడు సరిగా మాటలు పలుకు సమయం వచ్చును, అప్పుడతనికి నేర్పుము. అమ్మ మాట్లాడుచున్నపుడు, నాన్న మాట్లాడుచున్నపుడు మధ్యలో మాట్లాడకూడదని చెప్పెదవు, సరైన సమయములో అతనికి నీవు నేర్పవలెను. నన్ను మీరు అర్థము చేసికొన్నారా? మాట్లాడవలసిన సమయం అతనికి వచ్చినపుడు అతనిని మాట్లాడనీయండి.
16నేను మాట్లాడుచున్నపుడు మధ్యలో లేచి భాషలతో మాట్లాడుచు వర్తమానము ఇచ్చుచుందురు. ఇది బయట కూటములలో జరుగు సంగతి. ఆత్మను వారు ముక్కలు చేయుదురు. నా శరీరమునకు ఇంతకన్న ముల్లు మరొకటి లేదు. న్యూయార్కులోను, ఇతర స్థలములలోను కూటములకు ఈ మధ్యనే వెళ్ళి వచ్చాను. అక్కడి సేవకులు ఆలాగు చేయుటకు తావిచ్చుచున్నారు. చాలా సార్లు ఇది జరుగుచున్నది. ఎంతో గందరగోళము. చూడండి, దేవుడు ఆలోచనా సరళిలో పని చేయుచున్నప్పుడు మధ్యలో మాట్లాడితే, ఆయన ఉద్దేశ్యమును మనము భంగము చేసినట్లే. ఆయన తన పనిని పాడుచేసికొనడు. దేవుడు తన ఆలోచనా సరళిలో జనులతో వ్యవహరిస్తున్నప్పుడు, వేదిక పిలుపును ఇచ్చునపుడు ఎవరో లేచెదరు.
ఉదాహరణకు చూడండి, మనము బల్లయొద్ద కూర్చొనియున్నాము. ప్రభువు గురించి మనము మాట్లాడుకొనుచున్నాము. జూనియర్ బహు వేగంగా బల్లయొద్దకు పరుగెత్తికొని వచ్చి మనందరి దృష్టిని మళ్ళించి, ఈ విధంగా గట్టిగా కేకలు వేయుచున్నాడనుకొందము. అమ్మా, నానా, మేము ఒక పందెములో వారిని చిత్తుగా ఓడించాము. మేము వారిని ఫలాని విధంగా, ఫలాని విధంగా చేశాము. మనం ఎంతో పరిశుద్ధమగు అంశమును గూర్చి మాట్లాడుకొనుచుండగా మధ్యలో వచ్చి బేస్‌బాల్ ఆట గూర్చి కేకలు వేసినచో అతనిని ఏమందుము? క్రమము లేని వాడందుము. మనము మాట్లాడుకొనుచున్న వర్తమానమును ముక్కలు చేసెను. అతని సమయము వచ్చువరకు వేచియుండవలెను. అపుడతడు బేస్‌బాల్ ఆటలో ఏమి చేసెనో చెప్పవచ్చును.
17ఈనాడు వరముల విషయములో ఆలాగే జరుగుచున్నది. అందుకే దేవుడు, వరములున్న చాలా మందిని నమ్మలేక పోవుచున్నాడు. వాటినెట్లు అదుపులో ఉంచవలెనో వారికి తెలియుట లేదు. అది ఈనాటి సంగతి. మనం అంతకన్న ఏమి చేయలేకపోవుచున్నాము.
ఆత్మ సంబంధమైన వరములకు చాలా అనుకరణలను నేడు మనం చూచుచున్నాము. ఈ మన సంఘంలో ఆలాగు లేదని నమ్ముచున్నాను, అందును బట్టి వందనములు చెల్లించుచున్నాను. అది అనుకరణ అని నేను నమ్మనే నమ్మను. మనకు అసలయిన వరములున్నవని నేను నమ్ముచున్నాను, కాని ఆ వరములను ఎట్లు అదుపులో ఉంచవలెనో మనము తెలిసికొనవలెను.
1COR 14:32
18మీరు ఏదో మేలు చేయుటకు వెళ్ళుచున్నారు… మీరొక యజమాని యొద్ద పని చేయుచున్నారు. మీరు మొదట ఆ పనిలో చేరునపుడు పనిని గూర్చిన క్రమమును తెలిసికొందురు, అప్పుడు ఆ యజమాని మీ యందు నమ్మకముంచును, అతడు నిన్ను క్రమంగా పైపైకి హెచ్చించుచుండును.
దేవుడు మనకనుగ్రహించిన వరములనెట్లు ఉపయోగించవలెనో తెలిసికొను ఘడియ బ్రెన్హాం టాబెర్నికల్ కు వచ్చియున్నది. ఇప్పుడు మనం పొందిన దాని కంటె ఇంకా గొప్ప వానిని దేవుడు మనకు ఇవ్వగోరుచున్నాడు. కాని ఎంతసేపూ మనం ఇతరులతో చెప్పించుకొనే రకంగా జీవిస్తూ యుంటే ఆయన ఏమి చేయగలడు? గుర్తుంచుకొనండి, ప్రవక్తల ఆత్మలు ప్రవక్తల స్వాధీనములో యున్నవి అని లేఖనము చెప్పుచున్నది. ఒక స్త్రీని, లేదా పురుషుని నీవు సరి చేయవలెనను కొందువు, ఎందుకనగా ఆ వ్యక్తి క్రమము తప్పియున్నాడు. అతనికి నీవు లేఖన సత్యమును చెప్పెదవు, అనగా వారి మీద ఉన్న ఆత్మ దేవునికి చెందినది కాదని అర్థము. ఎందుకనగా బైబిలు చెప్పుచున్నది చూడండి, "ప్రవక్తల ఆత్మలు ప్రవక్తల స్వాధీనములో ఉన్నవి." ప్రవచించినా, ప్రసంగించినా, సాక్షమిచ్చినా, భాషలతో మాట్లాడినా, మరేదయినా సరే, ఎందుకనగా భాషలకర్థము చెప్పుటయే ప్రవచనము. కావున అది ప్రవక్తల స్వాధీనములో యున్నది, వాక్యమే ప్రవక్తయై యున్నది. ప్రసంగీకుడు వేదిక మీద ఉండగా, దానిని చేయవలెనని వారెంతగా ఆశపడినను, ఒక స్త్రీ లేదా పురుషుడు మధ్యలో గంతులేసి ఏదో చెప్పుట అక్రమము.
19బ్రెన్హాం ఆలయమునకు (బ్రెన్హాం టాబెర్నికల్) దీనిని చెప్పుచున్నాను. ఇక్కడ చాలా చక్కని వరము గల జనులు కొందరున్నా, ప్రతి వరము కూడా తమ స్వంత పరిచర్య కొరకే ఇవ్వబడును. అవి వరములు, బోధించుట ఒక వరము, స్వస్థత ఒక వరము, ఇంకా ఇతర వరములున్నవి, వాటివాటి పరిచర్యలున్నవి. ప్రతి వ్యక్తి తన సేవ ఏమిటో తెలిసికొనుటకు కనిపెట్టవలెను.
కావున బ్రెన్హాం ఆలయమును ఈ విధంగానే పనిచేయనీయుడి. ముఖ్యంగా ఈ దినములలో ఎంతో వేషధారణయున్నది (దానిని నేను చెప్పగోరలేదు), మనము వేషధారణను కోరుటలేదు. నీతిమంతుడు వేషధారణను కోరుకొనడు. నిజమైనది మనకు లేనియెడల లేనట్లుగానే ఉందము. నిజమగు దానిని పొందువరకు ఎదురు చూద్దాం. మీరు దానితో ఏకీభవించెదరని నమ్ముచున్నాను, ఎట్టి వేషధారణ మనకు వద్దు. సోదరులారా, ఏదో ఒక వేషధారణను మనం ప్రారంభించి దానితోనే ఈ లోకమును విడిచిపెట్టవద్దు. నిజమైన దానిని, అసలయిన దానిని మనం కలిగియుండగోరుచున్నాము. దానిని మనం పొందనిచో పొందువరకు కనిపెట్టుదము, అప్పుడు దాని గురించి మాట్లాడుదము, చూచారా.
ISA 28:11•
1COR 14:32•
1THS 5:21
20భాషలలో మాట్లాడువారు, ప్రవచించువారు, వర్తమానములిచ్చు వారు, దీనిని వినవలెనని కోరుచున్నాను. వారు నిజమైన వారని మీతో పాటు నేను నమ్ముచున్నాను. బైబిలు ఇట్లు చెప్పెను, "అన్నింటినీ పరీక్షించి, మేలైన దానిని చేపట్టుము. నత్తి పెదవుల ద్వారాను, అన్య భాషల ద్వారాను ఈ జనులతో నేను మాట్లాడుదును. వారు ప్రవేశించెదరని నేను చెప్పిన విశ్రాంతి ఇదే," అని యెషయా గ్రంథములో యున్నది.
ఆలయములో ఒక్కసారి ఒక్క వరము ద్వారా మాత్రమే పరిచర్య జరగవలెనని నేను దీనిని చెప్పుచున్నాను. నేను క్రమము గూర్చి చెప్పుచున్నాను. ఒకరు మాట్లాడుచున్నపుడు, ఇతరులు లేవరాదు. ప్రవక్తల ఆత్మలు ప్రవక్తల స్వాధీనములో యుండవలెను. మీరు గ్రహించారా? క్రీస్తు శరీరములో పరిచర్య యున్నవారికి చెప్పుచున్నాను. చెప్పినట్లుగా జరుగనీయుడి. క్రీస్తు యొక్క శరీరములో పరిచర్య కలిగియున్న వారు కనిపెట్టి చూడవలెను, ఎందుకనగా అది క్రీస్తు ద్వారా సంఘమునకియ్యబడిన పరిచర్య. కాని అందరూ ఒకేసారి పరిచర్య చేయలేరు, ఒక్కసారి ఒక్కరే చేయవలెను.
21బ్రెన్హాం ఆలయము ఈలాగే ఉండవలెను. భాషలతో మాట్లాడువారు, భాషలకర్థము చెప్పువారు, సంఘము కొరకు ప్రవచించువారు, కూటము ప్రారంభించక ముందే పెందలకడ రావలెను. నియమింపబడిన గదిలో వారు కూడుకొనవలెను, ప్రభువు యొక్క పరిచర్యలో ఎదురుచూడవలెను.
జన సమూహాములోనికి రాకముందు, సంఘ కాపరి చేయునట్లే ఇది యుండును. అతడు బైబిలు తీసికొని, తన గదిలో ప్రశాంత వాతావరణములో చదువును, ఆత్మపూర్ణుడై యుండును. జనుల ఎదుటికి వచ్చి, మాట్లాడు ముందుగా, అభిషేకము పొందవలెను. ఆలాగు లేనియెడల అతడు జనుల ఎదుటికి వచ్చి గలిబిలి చెందును. (ఆత్మ సంబంధమగు వరము గల ప్రతి వ్యక్తియు, స్త్రీయైనా, పురుషుడైనా, ప్రభువు ఎదుటికి రావలెను.) సంఘ కాపరికి ఒకే సేవ యున్నది, అతడు ప్రవక్త; ఇంగ్లీషులో ప్రసంగీకుడను మాటకు "ప్రవక్త" అని భావము, అనగా వాక్కును ముందుగా చెప్పువాడు.
22ఈ పరిచర్యలలో భాగము గలవారు గమనించవలెను. ఒకరు భాషలలో మాట్లాడుచుండగా మరియొకరు దానికి అర్థము చెప్పవలెను, వారి వంతు వచ్చు వరకు ఎదురుచూడవలెను. వారు ఎక్కడో రహస్య గదిలో యుండి, భాషలతో మాట్లాడి, బయటకు వచ్చి దానిని చెప్పుట కాదు; ఎందుకనగా భాషలతో మాట్లాడువానికి, అర్థము చెప్పువాడును ఉండవలెను, చూచారా. ఆ విధముగా ఉన్నపుడు మనం చక్కగా చేర్చుకొందుము. మన సంఘములో ఉన్న వరముల వలన మన సంఘము మేలు పొందవలెను. దేవుడు వారిని మన యొద్దకు పంపించెను. ఈ ఆత్మ సంబంధమగు వరముల వలన మన సంఘము మేలు పొందవలెనని కోరుదుము. కావున భాషలతో మాట్లాడువాడు, దానికి అర్థము చెప్పువాడు, ప్రవచించువాడు, సంఘము కలిసికొనుటకు ముందే కూడి రావలెను. వారు ఒక గదిలో కూడుకొనవలెను. ప్రభువు సంఘమునకిచ్చు పరిచర్య కొరకు ఎదురు చూడవలెను. దానిని అర్థము చేసికొన్నారా?
23ఒక సంగతిని పోలికగా చెప్పెదను వినండి. సహోదరుడు కాలిన్స్ భాషలతో మాట్లాడుచున్నాడు. సహోదరుడు హికర్సన్ దానికి అర్థము చెప్పుచున్నాడు, అనగా వారిరువురు కలిసి సంఘమునకు సేవ చేయుచున్నారు. అది సహోదరుడు నెవిల్ యొక్క పరిచర్య కాదు. అది సంఘమునకు మీరు చేయు పరిచర్య. దీనిని ఒక ఉదహరణగా మీకు చెప్పియున్నాను. సంఘ కాపరి తన భాగమును ఎంత ఆసక్తితో సంఘములో నిర్వహించునో, మీరును మీ మీ పరిచర్యల విషయములో సంఘములో అంతే ఆసక్తిని కలిగి యుండవలెను, ఎందుకనగా మీరాపని చేయుట అవసరము. కాని మీరు ఎక్కడో మీ రహస్యగదిలో దానిని చేయుట కాదు. మీరు మాట్లాడినా, అర్థము చెప్పినా, కలిసి సంఘము ఎదుటికి రావలెను. సంఘములోనికి కూడి వచ్చి మీరే స్వయంగా ఒక గదిలో కూర్చొనండి, ఎందుకనగా అది మీ స్వంత పరిచర్య. అది బహిరంగ పరిచర్య కాదు, సంఘమునకు సహాయము చేయుటకు అది ఇవ్వబడినది, చూచారా. సంఘమునకు అది సహాయపడును, ప్రధాన జనసమూహములో చేయవలసినది కాదు. నేను చెప్పిన విధంగానే దానిని చేయవలెను, చూచారా. సహోదరుడు కాలిన్స్ చెప్పిన దానికి సహోదరుడు హికర్సన్ భావము చెప్పును. ఇది ఉదాహరణ. మరొక సోదరుడు దానిని వ్రాయును. అదేమిటో తెలియును.
24ప్రభువు వచ్చుచున్నాడని మనందరము ఎరుగుదుము. అది మనకు తెలిసినదే. సహోదరుడు నెవిల్ ప్రతి రాత్రి లేచి, ఇదిగో ప్రభువు వచ్చుచున్నాడు, "ఇదిగో ప్రభువు వచ్చుచున్నాడు," అని చెప్పితే చూడండి. అది మంచిదే. కాని అతడు దానిని వేదిక మీద ఉండి చెప్పుచున్నాడు. (సంఘ కాపరి), ఎందుకనగా అందుకు అతనికి వాక్యమున్నది. అతడు సంఘమునకు ప్రవక్త అయినచో, అనగా సంఘ కాపరి అయినచో వాక్యమును అధ్యయనము చేసి ప్రభువు యొక్క రాకడ గూర్చి దేవుని వాక్యములో ఏమి ఉన్నదో చెప్పుము, దాని ద్వారా మీరు హెచ్చరికను పొందెదరు. భాషలు, భాషల భావము, (ప్రవచనము) మొదలగు వానితో అతనికి ఏ సంబంధము లేదనుకొందము, ఎందుకనగా వ్రాయబడిన వాక్యములో లేని పరిచర్యలవి. వాక్యములో వ్రాయబడిన వాటినే మీకు అందించును; కాని వాక్యములో వ్రాయబడని దానిని మీరు చెప్పుచున్నారు, ఉదాహరణకు ఇట్లు చెప్పెదరు, "సహోదరుడు వీలర్‌కు చెప్పుము, యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు: రేపు అతడు తన ఇసుక పుంత లోనికి వెళ్ళకూడదు, ఎందుకనగా ఒక లారీ తల క్రిందులగును," లేదా అటువంటి హెచ్చరిక నిచ్చెననుకొందము, అది జరుగవలసి యున్నది. నీవు దానిని పలుకగా, ఇతడు దానికి భావము చెప్పెను. నీ పరిచర్య అయిపోయిన తరువాత దానిని వ్రాసి, వేదిక మీద ఉంచుము. ఆ తరువాత సంఘము పాటపాడి ముగించిన తరువాత జనులు వేదిక యొద్దకు వచ్చి ఆ ప్రవచనమును చూచెదరు.
25ఈలాగు వారు కలిసికొనినపుడు జ్ఞానముగలవాడు మందు రావలెను. ఎందుకనగా చూడండి, ఒకరు భాషలతో మాట్లాడుచుండగా, మరియొకరు దానికి అర్థము చెప్పుచున్నారు, అయితే ఇద్దరు లేక ముగ్గురు సాక్షులు లేని యెడల దానిని అంగీకరించుట జరగదు. దానికి రెండు లేదా మూడు సాక్ష్యములుండవలెను. (చూచారా?) అపుడే అది ప్రభువు వాక్యమని నమ్మబడును. కొన్నిసార్లు ఈ చిన్న పరిచర్యలలో, ఏ పరిచర్య అయినా గాని దురాత్మలు ప్రవేశించును. అది మనకు వద్దు. ఈ పరిచర్యలను ముందే మనము విశదీకరించి చూడవలెను. దానిని బహిర్గతము చేయుటకు వెరవవద్దు. దేవుని పరీక్షకు అది తాళుకోవలెను.
సంఘ కాపరి ఆ విధముగానే యుండవలెను, వాక్యము విషయములో ఎవరయినా గాని అతనిని సవాలు చేసినచో దానిని ఎదుర్కొనుటకు అతడు ప్రయత్నించనవసరము లేదు, ఎందుకనగా అతడు మాట్లాడుచున్న దానిని గూర్చి అతనికి ఖచ్చితంగా తెలియును, చూచారా. ఇతర పరిచారకులును అదే విధంగా ఉండవలెను.
1COR 14:4,27
26భాషలతో మాట్లాడువాడు తనకుతాను క్షేమాభివద్ది కలుగజేసికొనుచున్నాడు. వారు మంచి సమయమును కలిగియున్నారని బైబిలు చెప్పుచున్నది. వారు భాషలతో మాట్లాడునపుడు చక్కగా అనుభూతి పొందెదరు. వారు నిశ్చయముగా భాషలలో మాట్లాడుదురు. అది ఆత్మ యొక్క కార్యము, కాని జన సమూహము మధ్యలో కూర్చొని వారు భాషలతో మాట్లాడుచుంటే వారికి క్షేమాభివద్ది కలదు గానీ, సంఘమునకు ప్రయోజనము లేదు. ఒక వ్యక్తి భాషలతో మాట్లాడుచూ తనకుతాను క్షేమాభివద్ది కలుగజేసికొనును, చూచారా.
లేఖనములో పౌలు చెప్పినట్లుగా భాషలతో మాట్లాడుట దేవుని యొక్క వరము, అది క్షేమాభివద్ది కొరకు ఇవ్వబడును, సంఘమునకు క్షేమాభివద్ది కలుగజేయును. కావున అది సంఘము కొరకు దేవుడు ప్రత్యక్షంగా ఇచ్చు వర్తమానమై యుండవలెను. బైబిలులో వ్రాయబడనిదై యుండవలెను, చూచారా.
27బ్రెన్హాం సోదరుడా, నేనెట్లు బాప్తిస్మము పొందవలెను? అని నీవడుగ వచ్చు. వెంటనే నీకు నేను చెప్పెదను, నీవు భాషలలో మాట్లాడనవసరము లేదు, ఆ విషయములో బైబిలు నందు ఏమి వ్రాయబడినదో తెలిసికొనుము, చూచారా. ఆ విషయములో ఎవరినీ నీవు ప్రశ్నలు అడగనవసరము లేదు. ఎవరో భాషలలో మాట్లాడి దానిని నీకు చెప్పనవసరం లేదు. చూడండి, అది ముందే వ్రాయబడియున్నది.
బ్రెన్హాం సోదరుడా, నేనేమి చేయవలెను? ఒక నిర్ణయము ఇక్కడ నాకు కావలసియున్నది. నేను ఈ సంఘములో ఉండవలెనా? లేక మరో సంఘమునకు వెళ్ళవలెనా? నేను ఇది చేయవలెనా? అది చేయవలెనా? అని నీవడుగవచ్చు. అది దేవుని యొద్ద నుండి రావలసియున్నది. చూడండి. దేవుడే దానిని గూర్చి చెప్పవలెను, అది మరియొక పరిచర్య మూలముగా రావలసియున్నది. "ఆర్మన్ నెవిల్ బ్రెన్హాం ఆలయమును విడిచిపెట్టి, షోర్ట్-వేన్ గాస్పల్ ఆలయమునకు వెళ్ళవలెనని వాక్యములో వ్రాసియుండదు." ఈ వాక్యములో అది లేదు గనుకనే ఈ వరములు ఇయ్యబడినవి.
28ఒక వ్యక్తి వచ్చి నిన్ను ఈలాగు ప్రశ్నించాడనుకో, నీకు దైవిక స్వస్థతయందు నమ్మకమున్నదా? దానిని మేము బోధించుచున్నాము. దానిని మేము నమ్ముచున్నాము. నూనె రాసి ప్రార్థించుటలో మాకు విశ్వాసమున్నది.
తాను మనజాలనని ఎవరయినా నీతో అనవచ్చును. అపుడు దేవుడు భాషల ద్వారాను, దాని భావము ద్వారాను, ప్రవచనము ద్వారాను, లేదా మరేదో మార్గము ద్వారాను ఆ వ్యక్తి జీవితములో మార్పును తీసికొని వచ్చును, అతడు చేసిన క్రియను బయటకు లాగును, దానిని గూర్చి అతనికి చెప్పును. ఆ పరిచర్య సంఘ కాపరికి చెందినది కాదు, అది ఇతర పరిచర్యలు చేయు వరముల యొక్క పని, కాని ఆ పనిని వారు జనుల మధ్యలో చేయరాదు, చూచారా.
29పౌలు ఒక్కసారి కూడా ఆ ఎఫెసీ సంఘమునకు దానిని గూర్చి చెప్పవలసిన అవసరము రాలేదు, వారు క్రమములో ఉండిరి, రోమను సంఘమునకు గాని, ఇంకా ఇతర సంఘములకు భాషలు మాట్లాడుటను పౌలు నమ్మెను. ఎఫెసు సంఘములో పౌలు గాని దానిని చెప్పనవసరము రాలేదు. కొరింథీ సంఘమునకు మాత్రమే చెప్పవలసి వచ్చెను. భాషలతో మాట్లాడెను. కొరింథీ సంఘములోను ఆలాగే చేసెను (చూచారా), కాని భాషలతో మాట్లాడుట, దానికి భావము చెప్పుట అనువాటి కంటె గొప్ప విషయములను ఎఫెసీయులకు అతడు చెప్పెను.
భాషలతో మాట్లాడుట ద్వారా లేదా ప్రవచనము ద్వారా ఎవరయినా ఒక సందేశమును ఇచ్చినప్పుడు దానిని వేదిక మీద ఉంచవలెను. ఆరాధన ప్రారంభము కాక ముందే సంఘ కాపరి దానిని చదివి వినిపించవలెను. అది మాట్లాడిన, మరియు అర్థము చెప్పిన జనుల ద్వారా వచ్చిన "యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు." దానికి వారే అర్థము చెప్పిరి. ఆ భావమునకు అనుగుణంగా అది ఖచ్చితంగా జరిగినపుడు మనము చేతులెత్తి దేవునికి వందనములు చెల్లించవలెను, ఎందుకనగా ఆయన తన ఆత్మను మన మధ్య ఉంచెను. అది నెరవేరని యెడల ఆ దురాత్మ అక్కడ నుండి వెడలిపోవువరకు ఏమియూ చేయరాదు. దేవుడు అబద్ధమాడడు, ఆయన ఎల్లపుడూ సత్యవంతుడు.
చూడండి. ఇప్పుడు మీరు పిల్లలు కారు గనుక పెద్దల వలె ప్రవర్తించుడి. ("గూ, గూ, గూ.") అర్థవంతముగా మీరిపుడు మాట్లాడవలెను.
1COR 14:23-27
30ఇప్పుడు సంఘము ఈ క్రమమునకు రావలెను. మీరు భాషలలో మాట్లాడుచుండగా, ఒక తెలియని వ్యక్తి అక్కడికి వచ్చెననుకొనండి, అతనికి నీవు ఒక అమానుష వ్యక్తి వలె కనిపించెదవు. నీవు దేని గూర్చి మాట్లాడుచున్నావో అతనికి తెలియదు, చూచారా. నిజంగా ఈ దినములలో ఆ విషయము గూర్చి చాలా గందర గోళమున్నది. అది ఒక ఆటంక బండగా నిలుచుచున్నది. కాని ఒకరు భాషలతో మాట్లాడినపుడు మరియొకరు దానికి భావముచెప్పి వర్తమానమును ఇవ్వవలెను. వేదిక మీద దానిని ఉంచి చదువవలెను, జరుగబోవు దానిని తెలిసికొందురు, అది జరుగనీయండి, అందరూ దానిని చూచెదరు. రేపు ఫలాని సమయమునకు, లేదా వచ్చే వారం ఫలాని సమయమునకు ఫలాని సంగతి జరుగబోవుచున్నది అని తెలియచేయండి. అప్పుడ చ్చట కూర్చొనియున్న అవిశ్వాసి దానిని విని ముందే జరుగ బోవుదానిని గూర్చి ఎరుగును. అపుడు మీ మధ్య ఎట్టి ఆత్మ యున్నదో వారు గ్రహించెదరు. అది దేవుని ఆత్మ. పౌలు అదే చెప్పెను, "ఒకరు ప్రవచించి రహస్య సంగతులను బయలుపరచినయెడల మొత్తం సమూహము వంగి పనిచేయును. అవిశ్వాసి దేవుడచ్చటున్నాడని గ్రహించును." చూచారా?
1COR 13:11
31ఇక మనము పిల్లలము కాము. "పిల్లవానిగా ఉన్నపుడు పిల్లవాని చేష్టలు చేసితినని," పౌలు చెప్పెను. పిల్లవానివలె మాట్లాడితినని పౌలు కొరింథీయులకు చెప్పెను. అతనికి పిల్లవాని మనస్సుండెను. కాని పెద్దవాడినయినపుడు, పిల్లవాని చేష్టలను విడిచితినని చెప్పెను.
ఇప్పుడు మీ అందరికి చెప్పుచున్నాను, చూడండి. కొన్ని సంవత్సరాల క్రితం మీరందరూ ఈ వరములను కలిగియుండిన పిల్లలు, అటు ఇటు ఆడిరి. ఇప్పుడు పాఠశాలలో చాలా కాలము గడిపిరి, పెద్దవారు అవలసిన సమయమిది, ఆటగా వీనిని వాడుకొనుట కాదు. ఈ వరములు పవిత్రమైనవి, అవి దేవునికి చెందినవి, వాటితో మీరు ఆడకూడదు. దేవుని కొరకు వాటిని వాడుదము. మీ పరిచర్య ఆ విధంగానే ఉండవలెను. బ్రెన్హాం ఆలయమును ఆ విధంగానే పని చేయించవలెను. ఈ విషయములో ఎప్పుడయినా గాని ప్రశ్న వచ్చినచో, ఈ టేపు సాక్షముగా నిలబడనీయండి. బ్రెన్హాం ఆలయములో ఈ విధంగానే జరుగవలెను.
ఒక క్రొత్తవాడు లోనికివచ్చెననుకొనుడి. ఎందుకనగా ఎల్లపుడూ మన మధ్యకు క్రొత్తవారు వచ్చుచుందురు. ఇది శాఖాభేదము లేని ఆలయము. మంచి శిక్షణ లేని జనులు కూడా ఇందులోనికి వచ్చెదరు. వారికి ఏమీ తెలియదు, వారి స్వంత సంఘ కాపరియే వర్తమాన మందిచుచూ మధ్యలో దానిని ఆపి, గంతులు వేయుచూ ఏవో భాషలు మాట్లాడుచూ, వేదిక పిలుపును బ్రద్దలు చేయుచున్నాడనుకొనండి. వానికంటె మీరే బాగుగా శిక్షణ పొందినవారు, చూచారా. అతడు లోబడని విధముగా ప్రవర్తించినపుడు, ఆ విధంగా మీరు చేయనియ్యరాదు. ఒక డీకన్ దీనిని అజమాయిషీ చేయవలెను, చూచారా.
32ఆరాధన ముగిసిన తరువాత ఎవరైనా ఒక వ్యక్తి లేచి ఒక వర్తమానమును అందించును. సంఘ కాపరి కోరినచో ఒక క్షణమాగి, ముందుకు కొనసాగవచ్చు, అది సంఘ కాపరి ఇష్టము. కాని ఆ వ్యక్తి భవనములో నుండి లేచి వెళ్ళిపోవక ముందే, డీకన్ వచ్చి వారిని ఒక ప్రక్కకు తీసికొని వెళ్ళి మాట్లాడవలెను. వారు ప్రశ్నించినచో, ఈ టేపును వినిపించండి. సంఘము యొక్క దీర్ఘదర్శి లేదా బిషప్పు చెప్పినది ఇదేనని తెలియచేయుడి. సంఘమునకు నాయకులుగా ఉన్నవారనిల గూర్చి బైబిలులో వ్రాయబడినది. ఇవే క్రమములు. సంఘము దానిని చేయవలెను. మీరు వచ్చి వర్తమానమియ్యవలెనని మా కోరిక. మీరు దేవుని యొద్ద నుండి వర్తమానమును పొందుకున్నప్పుడు, దానిని వేదికపైన ఉంచవలెను. మన సంఘ కాపరి దానిని చదివి జనులకు వినిపింప చేయును. అది జనులకు వర్తమానము, కాని అది లేఖనములను పదే పదే వల్లించుట కాకూడదు. అది ప్రజలకు ప్రత్యక్ష వర్తమానమై యుండవలెను. జరుగబోవు సంగతిని ఖచ్చితముగా తెలియచేయునదై యుండవలెను. వారు చేయవలసిన కార్యము గూర్చి చెప్పవలెను. అర్థమైనదా? మంచిది.
33ప్రశ్న: ఆ విధంగా డీకన్లు పదే పదే తిరిగి జనులకు గుర్తుచేయుట కంటే, శ్రేష్ఠమైన మరో విధానము సంఘమును క్రమములో పెట్టుటకు ఉన్నదా? అది మూడవ ప్రశ్న. లేదు, దానిని ఇపుడే వివరించాను.
డీకన్ లారా, మీరు దయతోను, స్నేహ పూర్వకముగాను సంఘమును క్రమములో ఉంచవలసిన బాధ్యతను కలిగియున్నారు. సంఘ క్రమమును ఎవరయినా మీరినా, త్రాగి ఎవరయినా సంఘము లోనికి వచ్చినా, మీరే సరిదిద్దవలెను.
అక్కడ ఒక రాత్రి ఒక సేవకుని వారు వేదిక మీదనే కాల్చివేసిరి. దానిని గూర్చి మీరు విన్నారు, వాడు త్రాగి డబుల్ బేరల్ తుపాకీ పట్టుకొని వచ్చెను. అతడు తన భార్య కొరకు కేకలు వేసెను, అతడు తన భార్య ఏదని అడుగుచూ సంఘ కాపరి యొద్దకు వెళ్ళుచుండెను. ఆ సంఘ కాపరి అతని భార్య అటు వైపు కూర్చొన్నదని చెప్పెను, కాని అతడామెను సంఘములోనే కాల్చి చంపవలెనని వెళ్ళుచుండెను. అపుడు సంఘ కాపరి అతనితో మాట్లాడుచుండెను, అపుడు ఆ తుపాకీ పట్టుకొనిన వ్యక్తి సంఘ కాపరిని, ఆ తరువాత తన భార్యను కాల్చి వేసి చివరగా ఆత్మహత్య చేసికొనెను.
ఆ వ్యక్తి తుపాకీ పట్టుకొని ఆలయములోనికి ప్రవేశించుచున్న సమయములో ద్వారము నొద్దనే డీకన్లు అడ్డగించి అతని తుపాకీని లాక్కొని యుండినచో సరిపోయెడిది, చూచారా. అది డీకన్ల యొక్క క్రమము. ఇప్పుడు, మీరు ఈ సంగతులు జరుగుట చూచుచున్నారు, రేపు ఇంకేదయినా జరుగవచ్చును. కాని గుర్తుంచుకొనండి, డీకన్లు దేవుని యొక్క మందిరములో రక్షక భటులు, ఎవరేమనుకొనినా పరవాలేదు. కొన్నిసార్లు పోలీసు తన స్నేహితుని పట్టుకొని అరెస్టు చేయుటకు వెనుకాడవచ్చును, కాని ఏమయినా గాని, తమ బాధ్యతను నిర్వహించుదునని అతడు ముందే ప్రమాణము చేసి ఆ పని లోనికి వచ్చెను. అది అతడు ఆ పట్టణములో నెరవేర్చవలసిన కర్తవ్యము, చూచారా.
34సంఘములో డీకన్ యొక్క విధి కూడా అంతే. మధ్యలో ఎవరయినా తటాలున లేచి, సంఘ కాపరిని అభ్యంతరపరచ నారంభించినచో, సంఘ కాపరి వర్తమాన మందించుచుండగా అట్టి మరే కార్యమైనా ఎవరయినా చేయుచున్నచో, డీకన్లు అతని యొద్దకు వెళ్ళవలెను. ఇద్దరు లేక ముగ్గురు వెళ్ళి, ఆ సోదురునితో మాట్లాడవలెను. చూచారా? సంఘములో నుండి అతనిని వెలుపలికి తీసుకువచ్చి, మాట్లాడవలెను. మధ్యలో ఆటంకపరచరాదని చెప్పవలెను. ఆరాధనను మధ్యలో ఏలాగు ఆటంకపరచినా సరే గొప్ప జరిమానా విధించవలెనని ధర్మశాస్త్రము చెప్పుచున్నది, చూచారా. కాని అనుభవము లేనివారు మీ మధ్యకు వచ్చెదరు, మత మౌఢ్యులు మీ మధ్యకు వచ్చెదరు, కేకలు వేయ నారంభించెదరు. వారిని డీకన్లు గాని అదుపులో పెట్టలేక పోయిన యెడల, ట్రస్టీ బోర్డు గాని, లేక సంఘములోని మరెవరయినా గాని వచ్చి సహాయము చేయవలెను, మీకది తెలియును.
35మరల ఇక్కడ ఈ ప్రశ్నకు అడిగెదను:
ప్రశ్న: డీకన్లు పదే పదే గుర్తుచేయుటకు బదులుగా సంఘమును క్రమములో యుంచు విధానము మరేదయినా ఉన్నదా?
ఇప్పుడు, అప్పుడప్పుడు… లేదా ఈ టేపును వినిపించండి, ఇదే సాక్ష్యముగా యుండును. పెద్దలు రక్షక భటులు, వారి మాటయే చట్టము మరియు శాసనము, చూచారా. సంఘము నుండియు, దేశ చట్టము నుండియు వారు అధికారమును పొందియున్నారు. వారు దేవుని మందిరమును సరయిన క్రమములో యుంచవలసియున్నారు. అటువంటి డీకన్ ను ఎవరయినా వ్యతిరేకించినచో, రెండు నుండి పది సంవత్సరముల జైలు శిక్షపడును. వారిని వెళ్ళమని చెప్పినపుడు వెళ్ళనియెడల అక్రమ ప్రవర్తన చూపినయెడల అతడు శిక్షార్హుడు, అన్ని రకముల జరిమానాను విధింపవచ్చును.
ఎవరయినా మధ్యలో లేచి క్రమము తప్పి ఎగురుచూ, భాషలతో మాట్లాడుట లేదా మరేదో చేయుచున్నాడనుకొనండి. వారు క్రొత్తవారయితే వేరే సంగతి, కాని వారు మన స్వంత సభ్యులే అయితే, మీరు ఆ తర్వాత రాత్రి ఈ టేపును వినిపించండి, డీకన్లు ఇది చేయవలెను. ఆరాధనను ఆరంభించక ముందు సంఘ క్రమమెట్లుండవలెనో వారికి తెలియచేయవలెను. అందరూ దానిని అర్థము చేసికొనవలెను. సంఘ కాపరి, పెద్దలు, అందరూ కలిసి పనిచేయవలెను.
36ప్రశ్న: బ్రెన్హాం సోదరుడా, ఆదివారపుబడి సంగతి ఏమిటి? బ్రెన్హాం సోదరుడా, ఆదివారపుబడిని బోధించు కార్యక్రమమునకు ముందే జరుపవలెనా?
అవును, మనం ఎల్లపుడూ ఆ విధంగానే చేయుచున్నాము. బోధించు కార్యక్రమమునకు ముందే ఆదివారపుబడి ఉండవలెను. అందువలన ఆదివారపుబడికి హాజరయిన చిన్న పిల్లలకు ఒక అవకాశముండును. చిన్న పిల్లలు దానిని అర్థము చేసికొనరు. వారు బోధించు సమయమంతా కూర్చొని ఆ తరువాత ఆదివారపుబడికి హాజరగుట బాగుండదు. చిన్న పిల్లలు అలసిపోవుదురు. మొదట ఆదివారపుబడి జరుగవలెను. నియమిత సమయముండవలెను, ఆ నియమిత సమయములోనే ఆదివారపుబడి జరుగవలెను. ఆదివారపుబడి పర్యవేక్షకులు దానిని గూర్చి జాగ్రత్త వహించవలెను. ఆదివారపుబడికి ఒక ప్రత్యేక సమయం ఉండవలెను, దానిని ఒక నియమిత కాలములోనే ముగించవలెను. అన్ని ఆదివారపు పాఠశాలల వారు దాని కొరకు ఒక నియమిత సమయమును కేటాయించుకోవలెను.
37ప్రశ్న: పెద్దల తరగతికి సంఘ కాపరి కాకుండా మరో వ్యక్తి ఉపాధ్యాయునిగా ఉండవలెనా?
అది సమ్మతిని బట్టి ఉండును. సంఘ కాపరి ఆదివారపుబడిని నడిపించగోరినచో మంచిదే. ఆ తరువాత వర్తమానము అందించును. ఆ విధంగా రెండు పనులు చేయగోరినచో అభిలాషణీయము. కాని అలాగతడు చేయనియెడల, మీ పెద్దల తరగతికి వేరొకరు ఉపాధ్యాయునిగా వచ్చి ఆదివారపుబడి నడుపవచ్చును (చూచారా) సంఘ కాపరి మనస్సులో అందుకు తగిన వ్యక్తి ఎవరైనా యున్నచో, ఓ అరగంట లేక ముప్పది-అయిదు, నలుబది నిమిషముల సమయము అతనికి ఇయ్యవచ్చును.
ఒక గంటను ఇక్కడ ఏర్పాటు చేయవలెను, అది సంఘ గంట కావచ్చును. ఆ గంట మ్రోగినపుడు, తరగతిని వదలవలెను. ఆ గంట మ్రోగినపుడు ప్రతిది దాని దాని క్రమములో జరుగునట్లు చూడవలెను.
అపుడు మీరు ఒకటి లేదా రెండు పాటలు పాడుటకు సమయము సరిపోవును, మరీ ఎక్కువ సమయము తీసికొనినచో జనులు అలసిపోవుదురు. గంట మ్రోగించండి, ఒక పాట పాడండి, అపుడు మీ తరగతులను మీ కార్యక్రమ ప్రకారము నడిపించండి. పది గంటలు లేదా పదింపావు, పదిన్నర అని సమయము చెప్పండి. ఆ సమయమున వెంటనే గంట మ్రోగించినచో, ఉపాధ్యాయులు తరగతిని ముగించెదరు. బయట జనులలోనికి వారు వచ్చెదరు. ఆదివారపుబడి నివేదికను ఇచ్చెదరు, అంతటితో ఆ విభాగము సమాప్తమగును. ఆ తదుపరి ప్రసంగ కార్యక్రమము కొరకు అందరూ, అనగా ఉండగోరు వారు ఉండవలెను. అది క్రమము.
38ప్రశ్న: [ఒకరు బ్రెన్హాం సోదరుని అడుగుచున్నారు ఎన్ని తరగతులుగా విడదీయవలెను?]
అవును, విడదీయవలెను. మూడు సంవత్సరముల బాలుడు పధ్నాలుగు సంవత్సరాల వారి తరగతిని అర్థము చేసికోలేడు. ఇంకా విపులంగా అది చెప్పెదను.
39ప్రశ్న: ఎన్ని తరగతులుండవలెను?
చిన్న పిల్లలకు వేరే తరగతి యుండవలెను. పద్నాలుగు సంవత్సరాల వారికి అది బాగుండదు, చూచారా. పిల్లల తరగతిని కొందరు తీసికొనవలెను. వారిని శ్రద్దగా చూడగల తల్లి వద్ద లేదా అట్టి వారు తీసికొనవలెను. చూచారా? మిగిలిన తరగతులను వాక్యము సమర్థవంతముగా చెప్పగలవారు తీసికోవలెను అని తలంచుచున్నాను, చూచారా. ఆలాగు తరగతులు విభజించ వలెను. కనీసము మూడు తరగతులుంటే బాగుండును.
మరీ చిన్న పిల్లలకు ఒక తరగతి యుండవలెను, దాదాపు అయిదు సంవత్సరముల పైబడి వయస్సు వారికి ఒక తరగతి యుండవలెను. ఇంకా చిన్న వారందరినీ వారి తల్లులే దగ్గరుంచుకొని, బోధించు సమయములో సాకుటకు వెళ్ళవచ్చును, అనగా వారు మారము చేసినపుడు అవసరమయితే తీసికొని వెళ్ళవచ్చును. అందుకొరకే ఆ పిల్లలను సాకు గది ఏర్పాటు చేయబడినది.
కాబట్టి అయిదు లేదా ఆరు సంవత్సరముల వయస్సున్న పిల్లల మొదలుకొని ఎనిమిది, తొమ్మిది, పది సంవత్సరముల వరకూ ఉన్న పిల్లల తరగతిని ఏర్పరచ వలెనని తలంచుచున్నాను. ఆ తర్వాత పది సంవత్సరముల వయస్సు నుండి పదిహేను సంవత్సరముల వయస్సున్న పిల్లలను - అనగా యుక్త వయస్కులను ఒక తరగతిగా ఏర్పరచవలెను. పదిహేనేండ్లు దాటిన వారిని పెద్ద వారిగా తరగతి ఏర్పరచవలెను. ఈ దినములలో ఆ వయసున్న వారికి ఉద్యోగము దొరకును. అది దాదాపుగా ఓటు హక్కున్న వయస్సు. వారు వాక్యము వినగలరు, వారు ప్రధాన ఆడిటోరియం లోనికి రావచ్చును.
40ప్రశ్న: అధ్యాపకులుగా ఎవరుండవలెను?
అది మీ ఇష్టము. మీ స్వంత ఉపాధ్యాయులను మీరు ఎన్నుకోవచ్చును. మీరే ఆ పని చేయవచ్చును, లేనిచో ఎవరినయినా తీసికొనిరండి. సంఘముతో సంప్రదించండి. ఎవరిని ప్రభువు నడిపించునో చూడండి. ఒక అర్హత గల టీచరుని నియమించండి. సోదరులారా, ఈ విషయములో చాలా జాగ్రత్తగా యుండవలెను. ఇది ఆషామాషీ కాదు, ఉపాధ్యాయుడు అందుకు సరిపోనిచో, ఆ ఉపాధ్యాయుని మార్చి వేయండి.
సమయము వచ్చినపుడు, దేవుని నడిపింపు నాకు కలిగినపుడు ఆర్మన్ నెవిల్ ఇక సంఘ కాపరిగాయుండుటకు ఇక్కడ తగడని తెలిసినపుడు దానిని నేను సంఘమునకు చెప్పెదను. ఇక్కడున్న డీకన్లు తమ అర్హతను కోల్పోవుటను నేను చూచినపుడు, ఆ విషయమును సంఘమునకు నేను తెలియచేతును. ఫలాని పెద్ద ఫలాని చేయకూడని పని చేసెను, గనుక అతడు డీకన్గా విధి నిర్వహించుటకు అర్హతను కోల్పోయెనని నేను చెప్పెదను. ఒకవేళ ఒక ట్రస్టీ ఆలాగున్నాగాని చెప్పవలెను. ఓటు చేసేది లేదా చేయకుండేది నేను కాను. సంఘమే ఆ పని చేయవలెను, కాని నేను నిశ్చయంగా ఆ విషయమును తెలియచేసెదను. చూడండి, అది ఆలాగు జరుగవలసియున్నది. దీర్ఘదర్శిగా నేనది చేయవలసియున్నాను, జరుగుచున్న దానిని నేను చూచి తగిన చర్య తీసికొవలెను. మనము పరలోకమునకు వెళ్ళుచున్నాము గాని, ఏదో ఒక ర్యాలీకి లేదా వినోదమునకు, బేస్‌బాల్ ఆడుటకు వెళ్ళుట కాదు. ఈ భూమి మీద అన్నింటి కంటె గొప్పది ఒకటున్నది, అది దేవుని యొక్క వాక్యము, దానిని దైవిక క్రమముతో మోసికొని వెళ్ళవలెను.
41ప్రశ్న: అధ్యాయపకులుగా ఎవరుండవలెను?
వారిని ఎన్నుకొను బాధ్యత మీదే. కాని పసి పిల్లలకు ఒక పెద్ద స్త్రీని నియమించుడని నా సలహా ఇచ్చుచున్నాను. వారే సహనముతో పని చేయగలరు. కాని యుక్త వయస్సు గలవారికి చాలా కఠినముగా వ్యవహరించు వారిని నియమించ వలెను. వారిని అటు ఇటు తిరుగ నీయకుండా క్రమములో ఉంచవలెను. వాక్యమును సరిగా చెప్పువారినే నియమించవలెను. పైపైన మీగులు సమర్థత యుండువారు కావలెను. ఈ సంఘము కాలక్షేపపు కబుర్లు చెప్పుకొని వెళ్ళిపోవుటకు నియమింపబడలేదు. చిన్న విహారయాత్రలు ఏర్పరచుకొనుటకు నిర్మింపబడలేదు. మీరు కలిసి సహవాసము ఆ విధంగా చేయుట మంచిదే. అయితే పిల్లలకు ఆ వినోదము అవసరము. కాని ఇక్కడ, ఈ స్థలములో దేవుని యొక్క వాక్యము కావలెను. మీరు కాలక్షేపపు కబుర్లుబయట కలిసికొన్నపుడు చెప్పుకొనండి, కాని ఈ దేవుని మందిరములో ఆలాగు ముచ్చట్లాడ రాదు. విందులుగాని, వినోదములు గాని ఇందులో జరుపరాదని మనము నమ్ముచున్నాము. మీకది బాగుగా తెలియును.
42ప్రశ్న: ఆదివారపుబడిని క్రమముగా ఉంచునట్లు పర్యవేక్షించు వారెవరు?
ఆదివారపుబడి సూపరింటెండెంటు. అది అతని యొక్క పని డీకనులతోను, ట్రస్టీలతోను, సంఘ కాపరితోను, మరెవరితోను అతనికి సంబంధముండవలసిన అవసరము లేదు. అతనికి స్వంత పని యున్నది. మీ ఆదివారపుబడి ఉపాధ్యాయుడెవరో నాకు తెలియదు, కాని ఆదివారపుబడి ఉపాధ్యాయుడు ప్రతి తరగతి దానిస్థానములో ఉండునట్లుగాను ప్రతి ఉపాధ్యాయుడూ హాజరయ్యాడో లేదో చూడవలెను. ఒకవేళ ఒక ఉపాధ్యాయుడు రానిచో, అతడికి బదులుగా వేరొకరిని ఏర్పాటు చేయవలెను.
ఆదివారపుబడి పాఠములు కొనసాగుచుండగా, ఆదివారపుబడి సూపరింటెండెంటు వెళ్ళి వారిచ్చు కానుకలను తీసికోవలెను (అవి ఆదివారపుబడి చందాలు), ఎంతమంది వచ్చిరో, ఆ తరగతులలో ఎన్ని బైబిలులున్నవో, మొదలగు విషయములను గూర్చిన నివేదిక తయారు చేయవలెను. బోధించు కార్యక్రమము ఆరంభమగుటకు ముందు, జన సమూహము ఎదుట నిలబడి ఆ ఆదివారపుబడి నివేదికను చదువవలెను. ఆదివారపుబడి ముగిసిన తరువాత దీనిని చేయవలెను. ఎంతమంది ఉపాధ్యాయులు వచ్చిరో, ఎందరు పిల్లలు హాజరయిరో, మొత్తం ఆదివారపుబడి సంఖ్య ఎంతో, ఎంత చందా వచ్చినదో మొదలగు సమాచారమును ఇయ్యవలెను. డీకన్లు, ట్రస్టీలు, సంఘ కాపరి, ఆ పనిని చేయరాదు. అందులో వారికేమీ సంబంధము లేదు, అది ఆదివారపుబడి సూపరింటెండెంటు బాధ్యత.
ఆదివారపుబడికి ప్రత్యేక అవసరతలు ఏమయినా ఉన్నచో, దానిని ట్రస్టీ బోర్డుకు అతడు నివేదించవలెను. దాని విషయములో ట్రస్టీలు ఒక కూటమును ఏర్పరచెదరు. ఆ ట్రస్టీలు, ట్రెజరర్ ద్వారా తగినంత ద్రవ్యమున్నదని తెలిసికొనినపుడు, ఆ వస్తువులను కొనెదరు. పుస్తకములుగాని, బైబిళ్ళు గాని అవసరమయితే కొనెదరు. మనిషికి ఒక బైబిలు కొనగోరినయెడల కొనవచ్చును, లేదా బహుమతులు ఇచ్చుటకు లేఖన సంబంధమగు పుస్తకములను వారు కొనవచ్చును. సంఘము ద్వారానే వారు వాటిని కొనవచ్చును. డీకన్లకు దానిని తెలియపరచవలెను, మరియు అది ఖజానాలోనిదని వారికి తెలియపరచవలెను.
ఆ విషయమును గూర్చిన అయిదు ప్రశ్నలకు జవాబు వచ్చినది.
43తరువాతది చూద్దాం.
ప్రశ్న: బ్రెన్హాం సోదరుడా, సంఘ క్రమమును గూర్చిన ప్రశ్న. క్రొత్త సంఘ ప్రతిష్ఠ సమయములో ఇవ్వబడిన ఆజ్ఞలను బట్టి మేము మాకర్థమైనట్లు నడచుకొనుటకు ప్రయత్నించియున్నాము. ఆలాగు చేసినందువలన కొందరికి కోపం వచ్చి, ఆలయం విడిచిపెట్టి వెళ్ళిపోయిరి. ఇతరులు, ముఖ్యంగా, పిల్లలు, మేము చెప్పిన దానిని దేనినీ అసలు వినుట లేదు. ఆ పిల్లల తల్లిదండ్రులకు ఆ సంగతిని తెలియచేసి యున్నాము. వారు ఏమి శ్రద్ధ వహించుటలేదు. మేము తప్పుగా అర్థం చేసికొన్నామా? లేక మేము తప్పు మార్గములో వెళ్ళుచున్నామా? వందనములు.
44దీనికి నేను జవాబు ఇచ్చెదను, విడగొట్టెదను.
ప్రశ్న: సంఘ క్రమము గూర్చిన ప్రశ్న ఇది, క్రొత్త సంఘపు ప్రతిష్ఠ సమయములో ఇవ్వబడిన శాసనములను మేము అర్థము చేసికొనిన రీతిగా అమలు చేయ ప్రయత్నించాము.
ఇప్పుడు, అది సరియే. మీరు మంచిదే చేయుచున్నారు. ఇది డీకన్ ఒకరు వ్రాసి యుందురు, ఎందుకనగా ఇది డీకన్ యొక్క పని.
45ఆ విధంగా మేము చేసినందున, జనులు తరచుగా మండిపడుచుండిరి.
వారు నా మీద కూడా మండిపడుచుందురు. ఎవరి మీదనయినా వారు కోపపడెదరు, చూచారా. ఆ విధంగా ప్రవర్తించువారిలో ఏదో తప్పున్నది. వారు దేవుని పట్ల సరిగా లేరు, ఎందుకనగా క్రీస్తు యొక్క ఆత్మ, క్రీస్తు యొక్క బోధకు, క్రీస్తు యొక్క ఇంటికి, క్రీస్తు యొక్క క్రమమునకు లోబడును, చూచారా. భక్తిగల డీకన్ పై కోపించు స్త్రీ అయినా, పురుషుడయినా, పిల్లలయినా, తండ్రి అయినా, సరిగా లేరని చెప్పుదును. మనము చెప్పుచున్నట్లుగా వారు శరీరములో ముల్లువలె సంఘమునకు ఉందురు. కట్టెల మోపు మధ్యలో కుందేలు అను సామెతవలె ఉందురు. మాట వినని వారు సరిగా లేరని గ్రహించవలెను.
వారు వెళ్ళిపోయినచో చేయవలసినది ఒకే ఒక పని యున్నది. వారిని వెళ్ళనీయండి, వారి కొరకు ప్రార్థన చేయండి, చూచారా. ఒకవేళ డీకన్లలో కొందరు ఒక రోజున వారి గృహములకు వెళ్ళవచ్చును. వారెందుకు వెళ్ళిపోయిరో, ఏమి తప్పు జరిగినదో తెలిసికొందురు. వారిని సమాధానపరచవచ్చేమో ప్రయత్నించండి. అది సాధ్యము కానియెడల మీతో కూడా ఇద్దరు ముగ్గురు సాక్షులను తీసికొని వెళ్ళండి, వారికపుడు అర్థమగును. అప్పటికి కూడా వారు గ్రహించనియెడల, వారు సంఘ సభ్యులైనచో సంఘమునకు వారి గూర్చి తెలియచేయండి.
1JN 2:19
46వారు సంఘ సభ్యులు కానియెడల, ఈ సమూహమునకు చెందని వారయినయెడల వారిని తీవ్రముగా మందలించవలెను. చూడండి, వారు ఇక్కడి క్రమమును పాటించవలెను, ఎందుకనగా ఇది సంఘము యొక్క శాసనము. ఇటు వంటి సంగతులు ఇక్కడ జరుగరాదు, వాటిని ఇచ్చట జరుగకుండా చూడవలెను. ఆ విషయంలో చేయవలసినది తప్పక చేయవలెను. ఈ టేపు ద్వారా నేను దీనిని వెళ్ళగ్రక్కుచున్నాను. ఈ మాట్లాడుచున్నది నేనని వారు వినవలెను, మీరు కారు. మీరు నన్ను ఈ ప్రశ్నలడిగారు, నేను దేవుని యొక్క వాక్యము నుండి శాయశక్తులా ప్రయత్నించి, నా జవాబులు ఇచ్చుచున్నాను.
ఆ జనులు కోపగించి, మా యొద్ద నుండి వెళ్ళిపోయిన యెడల, దాని విషయములో ఏమీ చేయమని వాక్యము చెప్పుచున్నది బ్రెన్హాం సోదరుడా?
వారు మనలోవారు కారు గనుక మనలో నుండి వెళ్ళిపోయియుండిరి. అంతే. "వారు సంఘమును విడిచి వెళ్ళిపోయిరి." మంచిది.
47ప్రశ్న: మేము చెప్పిన దానిని ఇతరులు, ముఖ్యంగా పిల్లలు వినుటలేదు.
పిల్లలు క్రమశిక్షణను నేర్చుకొనవలసియున్నారు. వారు దానిని ఇంటి యొద్దనే నేర్చుకొనవలెను. నా పిల్లలయినా సరే. వారిచ్చట క్రమంగా లేని యెడల మీరే మాత్రమూ మినహాయింపు ఇవ్వవద్దు; శారా, రిబ్కా, జోసెఫ్, బిల్లీ మరెవరయినా సరే, నాకు చెప్పండి, నేను చూచెదను. వారు సరిగా ప్రవర్తించని యెడల, మంచిగా ప్రవర్తించుట నేర్చుకొను వరకు సంఘమునకు దూరముగా ఉండవలెను. ఇది పందెపు స్థలము కాదు, ఇది దేవుని గృహము. ఇది ఆటాలాడు స్థలము కాదు, స్కేటింగు చేయు చోటు కాదు, నోట్సు వ్రాసికొనుచూ, నవ్వుకొను స్థలము కాదు. ఇది దేవుని మందిరము, భక్తిగా దీనిని కొనసాగించవలెను.
మీరిచ్చటకు ఆరాధనకు వచ్చుచున్నారు, దర్శించుటకు కాదు. ఇది పిక్‌నిక్ స్థలము కాదు, ఇది దర్శించుచోటు కాదు; ఇది పరిశుద్ధాత్మ యొక్క సందర్శనా స్థలము, ఆయన చెప్పుచున్న దానిని వినవలెను. ఒకరితో ఒకరు మాట్లాడుకొనుట కాదు. ఒకరితో ఒకరము సహవాసము చేయుటకు ఇక్కడికి మనము రాలేదు, క్రీస్తుతో సహవాసము చేయుటకు వచ్చి యున్నాము. ఇది ఆరాధనా గృహం. పిల్లలు తప్పక క్రమ శిక్షణను కలిగి యుండవలెను. తల్లిదండ్రుల మాట వినవలెను. దీనిని వారికి తెలియచేయుడి. డీకన్లు చెప్పిన దానికి పిల్లల తల్లిదండ్రులు లోబడితే సరి, లేనిచో వారిని కూడా సరి చేయవలెను.
48ప్రశ్న: తల్లిదండ్రులకు వారి పిల్లల గూర్చి తెలియచేసి యున్నాము. వారిని గూర్చి ఏమీ శ్రద్ధ వహించుట లేదు.
వారు ఈ సంఘ సభ్యులైనయెడల, నీతో కూడా ఇద్దరు లేదా ముగ్గురిని తీసికొని వెళ్ళి ఆ తండ్రిని ఒక రహస్య స్థలములోనికి పిలువవలెను. కార్యాలయములో ఒక చోటకు పిలువ వచ్చును. అదెవరయినా పరవాలేదు, నేను కావచ్చు, సహోదరుడు నెవిల్ కావచ్చు, బిల్లీ పాల్ కావచ్చు, అతని పిల్లవాడు కావచ్చు, సహోదరుడు కాలిన్స్ కావచ్చు, అతని పిల్లలలో ఒకరు కావచ్చు, మీలో మరెవరయినా కావచ్చు. మనము ఒకరినొకరము ప్రేమించుకొనుచున్నాము, కాని మనము దేవునికిని, ఆయన వాక్యమునకును బద్దులమైయున్నాము. ఆ వ్యక్తులు ఎవరయినా, ఎంత పెద్దవారయినా కావచ్చు, ఒకరితో ఒకరము యధార్థముగా ఉండవలెను. ఒకరి పట్ల ఒకరము యధార్థముగా లేనియెడల, దేవుడు మనతో ఎట్లు మాట్లాడగలడు? ఆయన పట్ల మనం ఎట్లు యధార్థముగా ఉండగలము? చూచారా?
ఇది ఒక క్రమము, దేవుని మందిరమును ఈలాగే మనము ఉంచవలెను. దీనినెట్లు అమలు పరచవలెనో, డీకన్లు ఎరిగి యుండవలెను, చూచారా. అందుకే వాటిని గ్రహించవలెనని, నేను మీకు ఈ సంగతులు చెప్పుచున్నాను, మీరు పిల్లల తల్లిదండ్రులకు చెప్పవలెను; వారు దీనికి లోబడనిచో, మీరు మరియొక డీకన్ ను తీసికొని వెళ్ళి చెప్పండి, లేదా ట్రస్టీలలో ఒకరిని, లేదా సంఘములోని మంచివారిని మీరు తీసికొని వెళ్ళండి. డీకనులు అందరూ కూడుకొనండి. ఈలాగు చెప్పండి, సహోదరుడు జోన్స్, సహోదరుడు హెండర్సన్, సహోదరుడు జాక్సన్ లేదా మరెవరయినా గాని, వారి పిల్లలు లోబడుట లేదు. వారి తల్లిదండ్రులకు రెండు, మూడు సార్లు చెప్పాము, అయినా వారేమీ పట్టించుకొనలేదు.
అపుడు సహోదరుడు జోన్స్‌ను లేదా ఆ సంబంధించిన వారిని పిలిచి చెప్పండి. జోన్స్ సోదరుడా, నిన్ను ఈ కూటమునకు పిలచుచున్నాము. మేము నిన్ను ప్రేమించుచున్నాము, నీవు మాలో భాగమైయున్నావు, నీవు మాలో ఒకనివి. ఈ టేపు వినుము, సహోదరుడు బ్రెన్హాం చెప్పిన దానిని వినుము. నీ పిల్లల ప్రవర్తన విషయములో మేము నీకు చెప్పి యున్నాము. నీవు వారిని సరి చేయలేనియెడల, వారిని ఆలయమునకు తీసికొని రావద్దు. దేవుని మందిరములో ఎట్లు ప్రవర్తించవలెనో, వారు తెలిసికొనువరకు, వారిని ఎవరి దగ్గరో ఉంచుము. చూచారా? ఇది ఒక క్రమము. దీనిని నెరవేర్చ వలెను. చూచారా?
49ఇప్పుడు మరో ప్రశ్నను చూద్దాం:
ప్రశ్న: మేము తప్పుగా అర్థము చేసికొన్నామా?
లేదండీ! మీరు తప్పుగా అర్థము చేసికోలేదు. అది సరియే. అది క్రమమని మరల నేను చెప్పుచున్నాను. నీవు ఫలాని చోటికి వెళ్ళుదువా? అని సైన్యములో అడుగరు. నీవు సైన్యములో యున్నచో, నీవు బలవంతముగా అయినా సరే ఆలాగు చేయవలెను, చూచారా. సువార్తను బోధించుటకు నేను బలవంతము చేయబడితిని. దీనిని గూర్చి నిర్లక్ష్యము గల నా ప్రజలు, మరొకరు, నా సోదరులు ఏమి చెప్పినా గాని దీనిని చేయుటకు నేను బలంతము చేయబడితిని. నేను ఇతరులను బాధ పెట్టవలసి వచ్చినా, కోయవలసి వచ్చినా తప్పదు.
ఆస్వాల్డ్ వలె మీరుండగోరరు గదా, చూచారా. ఒక వ్యక్తితో మీరు విభేదించినా, ఏకీభవించకపోయినా, కరచాలనము చేయుదురు గదా? మీలో అతని పట్ల ఇంకా ఆ భేదభావము కలిగియున్నయెడల మీలో ఏదో తప్పున్నది. (ఇరువైపుల చూడండి) ఆ విధముగా ఒకనిని నేను చూచినపుడు, క్రీస్తు ఆత్మ నాలో లేదు, నా ఆత్మసరియైనది కాదు, చూచారా.
"బ్రెన్హాం సోదరుడా, నీవు ఫలానిది, ఫలానిది బోధించుచున్నావు," అని నీవందువు.
"అవును సోదరుడా, ఆ విషయము తేల్చుకొందము. నీవు, నేను కూర్చొని మాట్లాడు కొందము. ఆ గది లోనికి వెళ్ళి, మనం చర్చించుకొందము అనవలెను. అతడు నన్ను ముక్కలుగా కోయవచ్చును. అతనికి నేను విషయములు చెప్పెదను, నా హృదయములో అతడు ఇంకనూ నా సహోదరుడని నేను అనుభూతి కలిగియుండకపోతే, అతనికి సహాయము చేయుటకు నేను ప్రయత్నించినప్పుడు, నేనెన్నడూ చేయలేను. అతడికి సహాయము చేసే అవకాశమే లేదు. అతడిని ప్రేమించనప్పుడు, సంధి కొరకు వెళ్ళుటలో ప్రయోజనమేమి? సోదరుడా, మొదట నేను నిన్ను ప్రేమించలేదు. ఇక్కడి నుండి మనము వెళ్ళకముందే నా హృదయం నుండి దానిని తీసివేస్తున్నాను, ఎందుకనగా నేను ప్రేమించనంతవరకూ, సహాయం చేయలేను," అని అతనితో చెప్పుము.
అది సరియే, అదే మంచి మార్గము. చూడండి. ఆలాగు కొనసాగించండి, మీరు ఖచ్చితంగా చేశారు, ఆ విధంగానే అది చేయవలెను. దానిని మీరు తప్పుగా అర్థము చేసికొనలేదు.
50ప్రశ్న: మేము తప్పు విధానములో వెళ్ళుచున్నామా?
కాదు, అది సరియైన మార్గము, దానినే కొనసాగించండి. క్రమమును పాటించండి! చిన్న పిల్లలు, తల్లులు ఎప్పుడూ యుందురు. వారు ఏడ్చుచుందురు. వారు మరీ ఎక్కువగా అల్లరి చేయుచూ, అక్కడ సంఘ కాపరికి ఆటంకము కలిగించుచున్నచో, గుర్తుంచుకొనండి, మీరే ఆయనకు రక్షక వలయము. సువార్త యందు మీరే ఆయనకు రక్షక భటులు, చూచారా. ప్రభువు యొక్క వర్తమానమును అది ఆటంకపరచుచున్నయెడల, డీకన్లగు మీరు ఏమి చేయవలెను? భాషలతో మాట్లాడుచున్నవానివలె బాధ్యతను నిర్వహించవలెను. బోధించుచున్నవాడు, వాక్య విషయములో విధిని నిర్వహించవలెను, ఈ విషయములలో కార్యమును నిర్వహించవలెను. మీలో ప్రతి ఒక్కరు ఒక్కొక్క పనికి బాధ్యత వహించవలెను, అందుకొరకే ఇచ్చటికి మనము వచ్చియున్నాము.
మరీ ఎక్కువ సేపు మనం ఉండవద్దు, కొద్ది నిమిషములలో నేను ఒకరిని కలిసికొనవలసియున్నానని ఎరుగుదును, వీలయినంత త్వరగా నేను ముగించెదను.
51ప్రశ్న: ఈ కార్డు మీద రెండు లేదా మూడు ప్రశ్నలున్నవి. బ్రెన్హాం సోదరుడా, జనుల కొరకు ఆలయములో కానుకలు సేకరించుటకు విధానము ఏమిటి? దీనిని ఎట్లు చేయవలెను?
సంఘ కాపరి కొరకు మాత్రమే ఆలయములో చందా సేకరించవలెను, గాని జనుల కొరకు ఆలయములో చందా సేకరించుట తగదని నా తలంపు. ఎవరయినా సహాయము కొరకు రావచ్చును, లేక ఈ సమూహములోని ఒక సభ్యుడు చాలా అవసరములో ఉండ వచ్చును, మన సోదరులలో ఒకరు చాలా బాధలో యుండవచ్చును. సరి, దానిని వేదిక మీద నుండి ప్రకటించవలెనని నేను తలంచుచున్నాను, సేవకుడే దానిని చేయనిమ్ము. దానిని చేయుట అతడి బాధ్యత; ఒక సహోదరుడు ఏదో అవసరతలో ఉన్నప్పుడు, దానిని సంఘమునకు తెలియపరచినయెడల, ఈ విధముగా చేయవలెను.
అవసరతలో ఉన్న ఆ వ్యక్తి కొరకు విరాళము స్వీకరించుట మీకు ఇష్టము లేనట్లైతే, బోర్డు వారు కూడుకోవలెను. ఇవ్వవలసిన మొత్తము వారికి అంగీకారమైతే, ఖజానా నుండి తీసి ఇయ్యవచ్చు. ఒకవేళ ఆ సమయములో ఖజానాలో డబ్బు కొరతగా యుండి, సహాయమును చేయలేనిస్థితి వచ్చినదను కొనండి. అపుడు బోర్డు వారు మాట్లాడుకొని, దానిని సంఘ కాపరికి చెప్పవలెను. అప్పుడు సంఘ కాపరి ఈలాగు ప్రకటించవలెను, "ఈ రాత్రి మన సోదరుడు జోన్స్‌కు పెద్ద ప్రమాదమయినది. అతని ఇల్లు కాలి పోయినది. సహోదరుడు జోన్స్ యొక్క ఇల్లు పునర్నిర్మించు కొనుటకుగాను క్రైస్తవులముగా మనము మన శక్తి కొలది సహాయపడుదము." చూడండి, ఆలాగు చేయవలెను. వేదిక మీది నుండి దీనిని చెప్పవలెను, చేయవలసిన విధానమదియే. వారు విరాళములు ఇచ్చెదరు, వాటిని సంఘ ఖజానాదారునికి ఇచ్చెదరు. ఆ విరాళములు సంఘ ఖజానాదారుడి ద్వారానే వారికి అందజేయవలెను. దానిని ఆ వ్యక్తికి ఏ విధముగా అందచేయుదురు. దానికి రశీదు తీసికోవలెను, అందుకు పన్ను మినహాయింపు ఉన్నదోలేదో నాకు తెలియదు; కాని ఉన్నదని తలంచుచున్నాను.
52ఒక క్రొత్త వ్యక్తి వచ్చెననుకొనండి. అతడు వచ్చి తన ప్రయాణములో టైరు పేలిపోయి ఆటంకము ఏర్పడినది గనుక క్రొత్త టైరు కొనుక్కొనుటకు సహాయము చేయమని అడుగును, అందుకు మీరంగీకరించరాదు. ఆ పని మీరు చేయనే రాదు. అది యోగ్యమైన కార్యముగా మీకు కనబడవచ్చును. బోర్డు వారు కూడికొని దానిని గూర్చి ఒక నిర్ణయము తీసికొని ఖజానా ధారుడు యొద్దనుండి డబ్బుతీసి అతనికి క్రొత్త టైరు కొనుక్కొనుటకు ఇయ్యవచ్చును. సంఘ ఖజానాలో డబ్బు తక్కువగా యున్నపుడు, ఆ విషయమై బోర్డు వారే నిర్ణయము తీసికొనవలెను. సంఘ కాపరికి ఈ విషయములో ఏమీ సంబంధము లేదు. డీకనులే దీనిని చూచుకొనవలెను. అందుకు సమ్మతించినపుడు సంఘ కాపరికి తెలియపరచవలెను. అపుడు సంఘ కాపరి కానుక స్వీకరించుటకు సిద్దపడును. కాని గమనించండి, అది సరయిన కారణమై యుండవలెను. ఒక క్రొత్త వ్యక్తికి ఆలాగు జరిగినపుడు, ఒక అత్యవసర పరిస్థితి వచ్చినపుడు, ఒకరికి సహాయము అవసరమని మీకు తోచినపుడు ఆలాగున చేయవలెను. (ఇది నా అభిప్రాయము), అది సరయిన కారణమై యుండవలెను.
53మీరు వచ్చి నా గృహములోని పుస్తకములను చూడండి. చాలా మంది వచ్చుచుందురు. "నేను రెవరెండు ఫలాని-ఫలాని, నాకు ప్రత్యేకమగు అవసరము వచ్చినది. నేను ఫలాని సంఘమునకు చెందినవాడను, ఈ దారిలో వచ్చుచుండగా కారు టైర్లు పేలిపోయినవి," అని చెప్పుదురు. నేను కూటము నుండి అప్పుడే వచ్చుట జరుగును కనుక నా యొద్ద కానుక యుండును. నా యొద్ద ఉన్నదానిని వారికి ఇచ్చెదను. రెండు టైర్లు ఎంతనో, అంత ఇచ్చుచుందును. నా పుస్తకమును చూడండి. లెక్క వ్రాసి యుంచాను. ఈ సంవత్సరములలో ఈలాగు నేను ఇచ్చినదంతా చూచినచో దాదాపుగా పది లేదా ఇరవైవేల డాలర్లు అగును. వారెవరో, ఎక్కడి వారో నాకేమీ తెలియదు. ఆ తరువాత మరియొకరు వచ్చి, ఆ వ్యక్తి మా యొద్దకు వచ్చి ఆలాగే చేసెనని చెప్పెదరు. ఇప్పుడు, సంఘము బాధ్యత వహించదు, ఇది వారి స్వంత బాధ్యత. ఇది నిజము. వారిది స్వంత బాధ్యతతో చేసియున్నారు.
54కాని ఒక యోగ్యమగు కారణమున్నయెడల, ట్రస్టీలు ఆలోచించవచ్చును. ఒక వ్యక్తి దారిలో ప్రయాణమై వచ్చుచుండగా, కారు ఫలాని ప్రమాదమునకు గురియైనది గనుక మనము సహాయము చేయుదమని చెప్పుకొనండి. ఇది సంఘము యొక్క బాధ్యత కాదు. ఆ వ్యక్తి మన సహవాసమునకు చెందిన వాడు కాకపోయినా గాని చెప్పండి. నిజమైన ఆపదలో యున్నయెడల సహాయము చేయవలెను.
మన స్వంత వారు కారు, మన సంఘమునకు చెందని వారే అయితే వెంటనే వారికి సహాయము చేయవచ్చును, కాని మన మధ్య ఉన్నవారికి మన సోదరులు విరాళమిచ్చెదరు.
అయితే బయటి వ్యక్తి వచ్చి ఆకలిగా ఉన్నదని చెప్పెననుకొనండి. అప్పుడు మీరు మీ జేబులో నుండి ద్రవ్యము తీసి ఇవ్వవచ్చును. అది మీ ఇష్టము, కాని సంఘము యొక్క ద్రవ్యము గూర్చి నేను మాట్లాడుచున్నాను. సంఘస్థులను ఇమ్మని చెప్పినపుడు చేయవలసినది అది.
55బహుశ ఒక సువార్తికుడు ఇక్కడికి వచ్చి బోధించెననుకొనండి, అతడు వచ్చునని మీకు ముందే తెలియును, మీరతనికి ఒక కానుకను ఇచ్చెదరు. అతనికి మీరు అతడు ఇష్టపడునది చేయుదురు.
కాని ఒక వ్యక్తి వచ్చి కారణము చెప్పి సహాయమును అర్థించెను. బోర్డు వారు దానిని విని అతనికి సహాయము చేయగోరి, సంఘ కాపరికి చెప్పెదరు. అపుడు సంఘ కాపరి ఇట్లు సభికులతో చెప్పును, "ఫలాని వ్యక్తి ఇచ్చటకు వచ్చి యున్నాడు. ఇతనిని మనము ఎరుగము, అయితే అతని పిల్లలు ఆకలిగా యున్నారని చెప్పుచున్నాడు. అతని గురించి అన్వేషించుటకు కూడా మనకు సమయము లేదు, కనుక ఇష్టపడిన వారు సహాయపడ వచ్చును," చూచారా.
56మన స్వంత వారెవరయినా వచ్చి కారణము చెప్పినచో, మన డీకన్ వెళ్ళి నిజా-నిజాలను తెలిసికొందురు, చూచారా. అది యోగ్యమైనదయినచో సహాయము చేయుడి. ఆ కారణము యోగ్యముగా లేనిచో సహాయము చేయనక్కర లేదు. కాని అపరిచిత వ్యక్తి వచ్చినపుడు, ట్రస్టీ వారు సంఘ కాపరికి తెలియచేతురు. అపుడు సంఘ కాపరి ఇట్లు చెప్పును, "ఈ వ్యక్తి తమకు తెలియడని ట్రస్టీబోర్డు వారు చెప్పిరి. కాని ఈ వ్యక్తి ఇక్కడ కూర్చొని యున్నాడు, తన పేరు జిమ్ జోన్స్ అని చెప్పి యున్నాడు. ఇతడిప్పుడు లేచి నిలబడును అందరూ చూడవచ్చును. ఈ జోన్స్, కూటము ముగిసిన తరువాత ఆ వెనుక ద్వారము యొద్ద నిలబడును.
మీరు హృదయములో సహాయము చేయవలెనని నిజముగా కోరుకొనుచున్నచో, ఇతనికి సహాయము చేయవచ్చును." ఇప్పుడది అర్థమయినదా?
సహోదరుడు కాలిన్స్ యొక్క ఇది వినబడలేదా? ఇతడు డీకన్లలో ఒకడు గనుక మరల చెప్పగోరుచున్నాను.
57మీ మధ్యకు ఒకడు వచ్చినపుడు ఒక అత్యవసర పరిస్థితి వచ్చి సహాయము కావలెనని అతడు అడిగినపుడు, సంఘము నుండి కానుక స్వీకరించవలెనని తలంచినపుడు, ట్రస్టీలు లేదా డీకన్లు కూడికొని ఆలోచించి ఒక నిర్ణయము తీసికొనవలెను. ఆ విషయము గూర్చి సంఘ కాపరికి తెలియపరచవలెను. అపుడు ఆ సంఘ కాపరి ఆ వ్యక్తి యొక్క పేరును చెప్పి, అతనిని గూర్చి అన్వేషించుటకు సమయము లేదు గనుక, అతడు ఒక అత్యవసరము యున్నట్లు చెప్పియున్నాడు గనుక, అతని పిల్లలు ఆకలితో యున్నారని చెప్పెను గనుక, అత్యవసర పరిస్థితిలో యున్న తన పిల్లలకు మందులు కొనవలెనని చెప్పెను గనుక మీర తనికి సహాయము చేయ వచ్చును. అత్యవసర పరిస్థితిలో సహాయము చేయవచ్చును. అతనిని అందరూ చూచునట్లు నిలబెట్టించుడి, అపుడు అతడెవరో జనులకు తెలియును. ఆరాధన అనంతరం ఆ వ్యక్తి వెనుకకు వెళ్ళి ద్వారం యొద్ద నిలబడును. బయటకు వెళ్ళిపోతూ జనులు అతనికి ఆర్థిక సహాయము చేయుదురు. ఇందులో బలవంతమేమియూ లేదు, ఎవరి ఇష్టానుసారంగా వారు సహాయము చేయవచ్చును; దీనిని సంఘములో ప్రకటించెదరు. మీరు ఆదేశించుట కాదు. దాని గూర్చి ప్రకటన మాత్రమే చేయుదురు. చూడండి, అది వచ్చిన పరదేశికి ఆతిధ్యము ఇచ్చుటయే, చూచారా. ఇప్పుడు అర్థము చేసికొన్నారా? మంచిది. ఆ ప్రశ్నకు ఈ జవాబు సరిపోవునని తలంచుచున్నాను.
58ప్రశ్న: టేపు సంగతి ఏమిటి? (ప్రశ్నార్థకమున్నది.) చాలామంది మీ ఆఫీసుకి వ్రాసి, విషయంలో మీరు తీసికొనుచున్న చర్యకు నిరాశ వ్యక్తపరచుచున్నారు. సంఘములో ఇతరులు అమ్ముచున్నారు. శ్రీ మగైర్ వాటికి రాయల్టీ చెల్లించవలెనని తలంచుచున్నాము.
మంచిది. టేపులను ఒప్పందము మీద అమ్ముచున్నారు. ఆ ఒప్పందము ఎప్పుడు ఖచ్చితముగా ముగియునో నాకు సరిగ్గా తెలియదు, కాని ట్రస్టీలకు తెలియును, ఇది ట్రస్టీలకు చెందు విషయము; డీకన్లది కాదు. ట్రస్టీల పని; సంఘ కాపరిది కాదు, ట్రస్టీలదే. నాకు అవగాహన అయిన దానిని బట్టి ట్రస్టీలు ఒప్పందములపై సంతకము చేయుదురు. ఇది తప్పు అయినచో ట్రస్టీలు దానిని సరి చేయుదురు. టేపు తయారు చేయుచున్న వారితో ఈ ట్రస్టీలకు ఒప్పందము ఉన్నది. విక్రయించుటకు స్వేచ్ఛ కలదు.
వాణిజ్య పరమగు హక్కులు ఇయ్యని యెడల ఎవరునూ ఈ టేపును తయారు చేయలేరు. ఆ వాణిజ్య ఒప్పందము కుదుర్చుకొన్న వ్యక్తి అనుమతి లేకుండా ఎవరూ వాటిని అమ్ముటకు వీలుండదు, ఎందుకనగా అది చట్టము, చూడండి. అది వాణిజ్య ఒప్పందమును కుదుర్చుకొనిన వ్యక్తి ఎవరికయినా టేపు తయారు చేసికొనుటకు అనుమతి ఇచ్చినచో, అది అతని ఇష్టము. అందరూ టేపు తయారు చేసికొనవచ్చని అతడు చెప్పినచో, అది అతని ఇష్టము. అందరూ టేపు అమ్మ వచ్చునని అతడు చెప్పినచో, అది అతని ఇష్టము. ఆ వాణిజ్య ఒప్పందము చేసికొనిన వ్యక్తి ఇష్టమది. తయారు చేసికోవచ్చని, అమ్ముకోవచ్చని చిన్న చీటి అతడు వ్రాసినచో బాగుండును. అప్పుడు చట్టరీత్యా సందేహములు తొలగును, ఆలాగు లేనియెడల కొందరు దీనిని దుర్వినియోగపరచి చాలా సమస్యలు కలుగ జేయుదురు, చూడండి, అది కాపీరైట్ వలెయున్నది. ఏమీ తేడా లేదు. అనుమతి లేకుండా నీవు దానిని వాడకొన రాదు. ఆలాగు చేసినవారికి జరిమానా విధింపబడును.
59కావున జనులు టేపు తయారు చేయుచున్నచో, బహుశా వారికి శ్రీ మగైర్ నుండి అనుమతి వచ్చియుండును. వారే మీద రాయల్టీ తీసికొందురు. దానిని గూర్చి నేనెరుగను, ఎందుకనగా ఆ సంగతులన్నీ తెలిసికొనుటకు ఇక్కడనేను ఎక్కువగా యుండుట లేదు. వారు ఎవరిని గూర్చి వ్రాసిరో నాకు తెలియదు. శ్రీ మగైర్ ఇంకా ఆ ఒప్పందము కలిగి యుండెనని తలంచుచున్నాను. నేను కాలిఫోర్నియాలో లేదా ఆరిజోనాలో యున్నాను. వారు ఇంకా కాలిఫోర్నియా నుండి టేపులను కొనుచున్నారని నాకు అర్థమయినది. శ్రీ. మగైర్ యొక్క మామగారగు సహోదరుడు సాద్‌మన్ ఈ సంఘములో మన సోదరుడు. ఆ వాణిజ్య ఒప్పందమును శ్రీ మగైర్ ఇంకా కలిగియున్నాడని నేను నమ్ముచున్నాను.
ఈ టేపులను తయారుచేయు విషయములో చాలా ఫిర్యాదులు వచ్చుచున్నవి. ఈ ఆలయమునకు చెందిన ఆర్థిక వ్యవహారముల విషయములలో ఏవయినా ఫిర్యాదులు వచ్చినచో, దానిని వివరించ వలసిన బాధ్యత ఈ ట్రస్టీలపై యున్నది, చూచారా. మిగిలిన ఫిర్యాదుల విషయములో వారికేమీ సంబంధము లేదు.
60చూచారా, ఈ పోస్టు కార్డు మీద ఇదియున్నది.
ప్రశ్న: వారు ఆఫీసుకు వ్రాసి, మిమ్మును నిందించుచున్నారు.
నిజంగానే, ఆ విషయంలో చాలా ఉత్తరములు వచ్చుచున్నవి. వారికి టేపులు ఎందుకు రావటము లేదో తెలిసి కొనగోరుచున్నారు. మీరు ఆ వాణిజ్య ఒప్పందముగలవారిని ఎరుగుదురు. వారితో నాకేమీ సంబంధము లేదు. సువార్త యొక్క వ్యాప్తి కొరకు ఎవరయినా టేపును వాడుకోవచ్చును. ఇది నా భావము. "ఆమేన్!"
కాని మొదట సహోదరుడు రాబర్సన్ తదితరులు వాటిని తయారు చేయసాగిరి. సహోదరుడు బీలర్, ఇంకా చాలామంది అందులో యుండిరి. సహోదరుడు మెర్సియర్ మరియు సహోదరుడు గోడ్ చాలా సంవత్సరముల పాటు తయారు చేసిరి. ఎవరు చేసినా గాని వారి మీద ఫిర్యాదులు వచ్చుచునే యున్నవి. చివరకు ఈ పెద్ద ఫిర్యాదు వచ్చినది, అదేమనగా, వారికి టేపు అందుట లేదు దేశములోని చాలా ప్రాంతముల వారు నాకు చెప్పుచున్నారు. మరల చేయుట గూర్చియు ఫిర్యాదులు వచ్చినవి. వారు ఒక నిమిషం ఒకటి, మరో నిమిషం ఇంకొకటి వినిపించుచున్నారు, అవి ఎవరికీ అర్థమగుట లేదు.
61డబ్బు పంపించుచున్న వారికి మంచి టేపులు పంపవలెను. మన సోదరులను, మన విశ్వాసులను చూడవలసియున్నాము. (వారు మన అతిధులు, సోదరులు) వారికి "నెంబర్ 1" టేపులను పంపించవలెను. ట్రస్టీలు దీనిని చూడవలెను, వారు తృప్తి చెందవలెను, వారికి సంతృప్తిగా లేనియెడల వెంటనే వారి డబ్బు వాపసు చేయవలెను.
ఎవరో నన్ను పిలచిరి, వారు నెలల తరుబడి నా కొరకు ఎదురుచూచుచున్నట్లు చెప్పిరి. దీనిని గూర్చి సహోదరుడు మగైర్ ఏమి చెప్పునో నాకు తెలియదు. ఈ విషయములో నాకేమీ తెలియదు, దానిని గురించి తెలిసికోవలసిన పని నాకు లేదు. ఆ పని వారిది మరియు ట్రస్టీలది. అందులోనికి నేను అడుగుపెట్టను, కాని ఆ చట్టము గురించి నేను చెప్పుటకు ప్రయత్నించుచున్నాను, చూచారా. దానిని గురించిన చట్టం ఏదనగా, వారు టేపు పంపించిన ఒకటి, రెండు, మూడు, నాలుగు లేదా ఐదు రోజుల తరువాత, వారు మెయిలులో దానిని గమనించనట్లయిన, తమ ఆర్డరును రద్దు చేయుదురు, చూచారా.
62ప్రతి ఆరు నెలలకు లేదా సంవత్సరమునకు ఒకసారి దీనిని నూతన పరచుకొనవలెను. ఈ ఒప్పందమును క్రొత్తదిగా చేసికొనవలెను. ఫలాని తేదీ వరకు అని నీవు వాణిజ్య ఒప్పందములో వ్రాసికొనవలెను. అప్పుడు నీవు నీ వద్దకు వచ్చుచున్న జనులకు దానిని గూర్చి చెప్పవలెను. అది అడుగుచున్న వారికి సహాయపడును, వారు ఈ టేపు ఒప్పందమును గూర్చి తెలిసికొని ఆ విధముగా వెంబడించెదరు.
ఈ విధులను కొనసాగించవలెను. చూచారా? సరిగా దానిని నిర్వహించవలెను, ఎందుకనగా ఫిర్యాదులు వచ్చుచున్నవి. లియోను మరియు జినీను వారు సంప్రదించుచున్నారు. సహోదరుడు మగైర్‌ను, ఇంకా చాలామందిని వారు అడుగుచున్నారు. మరెవరినో వారు అడుగుచున్నారు. వారి ఫిర్యాదును గమనించవలెను.
ఎన్నో టేపులు పేరుకొని పోవుచున్నవి. ఎన్నో పెట్టెల నిండా యున్నవి. డజనులు కొలది ఉత్తరములు వచ్చుచున్నవి. చూడండి, అవి తయారు చేయుచున్న వాని యొద్దకు వెళ్ళకుండా నా యొద్దకు వచ్చుచున్నవి. వారు నన్ను దుయ్యబట్టుచున్నారు. ప్రజలు డబ్బు చెల్లించిరి గనుక వారు అడిగిన దానిని పొందునట్లు క్రైస్తవునిగా నాకు బాధ్యత యున్నది. వారు పొందునట్లుగా ట్రస్టీలు చూడవలెనని కోరుచున్నారు. వారు ఎక్కువగా చెల్లించవలసివచ్చినా గాని, మంచి టేపును, మంచి యంత్రమును కొనండి. సరిగా తయారు చేయు వానిని మేము కోరుచున్నాము, అది మా ఆసక్తి, అవి సరిగా తయారు కావలెను. కొనువారు సంతృప్తి చెందవలెను, కొనువారు సంతప్తిపడవలెను. ఆలాగు టేపు తయారు చేయలేని యెడల, ఆప్పుచేయండి. మరొకరికి ఆ పని ఇచ్చెదము. వారు చెల్లించిన వెలకు తగినట్లుగా అవి ఉండవలెను. అది క్రైస్తవ్యము. అంత కన్నను చేయగలిగినదేమీ లేదు.
63వారిచ్చటకు సువార్తను వినుటకువచ్చుచుండగా నేను నాకు తెలిసిన శ్రేష్టమైన దానిని వారికిచ్చుటకు ప్రయత్నించుచుందును. (చూచారా?) అందరికీ అది అందునట్లు చూచుదును. అందువలనే ఈ రాత్రి ట్రస్టీలకు, డీకన్లకు, పాస్టర్లకు చెప్పుచున్నాను. అక్షరాలా దీనిని నెరవేర్చుడి. ఎందుకనగా దేవుని కనుగొనుటకు ప్రజలు వచ్చుచున్నారు. మనం ఈ విషయములను క్రమములో ఉంచవలెను.
ఆలాగే టేపు కూడా సరిగా పర్యవేక్షించవలెను. వారు ఎక్కువ చెల్లించవలసి వచ్చినా గాని మంచివి పెట్టండి. ఖరీదు ఎక్కువ పెట్టండి. ఆ వ్యక్తియే అవసరమయినంతా చెల్లించును.
రాయల్టీ విషయములోనాకేమీ ఆసక్తి లేదు, ఒక్క పెన్నీ కూడా వద్దు, ఈ ఆలయమునకు కూడా అందులో ఆసక్తి లేదు. రాయల్టీలను గూర్చి నాకసలు ఆలోచనయే లేదు. వారు అది చెల్లించినా గాని మీరు దానికి వేరే ఖాతాను ఇక్కడ తెరువవలెనని కోరుచున్నాను. శ్రీ మిల్లర్ ఇంకా తదితరులకు దాని చట్టమును గూర్చి నేను తెలియపరచియున్నాను. కొన్ని ప్రత్యేకమగు రాయల్టీలను మనము తీసికొందుము. దానినంతటినీ చూచుకొనవలసిన పని మీదే, ఆ విషయములో నాకేమీ సంబంధము లేదు. ఆ విషయములను మీరందరూ కలిసి తేల్చు కొనండి. ఆ విషయములన్నీ నేను చూచుకొన జాలను. అదెట్లుండవలెనో, ఏలాగు నిర్వహించవలెనో అది మాత్రమే నేను చెప్పుచున్నాను. మీరు అర్థము చేసికొనండి. అది ఉండవలసిన విధానము చెప్పుచున్నాను, ఆ విధంగా దానిని మనము నడిపించవలెను.
64ఇంకా మంచి యంత్రము కావలసినచో తీసికొనండి, మంచిగా తయారు చేయండి. నేను విదేశములకు వెళ్ళక ముందు ఏ ప్రసంగములను ప్రసంగించెదనో మీకు ముందే తెలియచేతును. మీకదంతా వాగ్ధానము చేసియున్నాను, టేపు మరల ఆదివారము రాత్రి చేయుదుము. నేను ఏ క్రొత్త ప్రసంగము చేసినా అది ఈ ఆలయములో నుండియే మొదట వచ్చునని చెప్పాను, ఎందుకనగా ఇచ్చట మంచి రికార్డింగు ఉన్నది. దానిని గుర్తుంచుకొన్నారా? నా వర్తమానములందించుటకు ఇచ్చటికి నేను వచ్చెదను, రికార్డు చేయువారికి దానిని తెలియపరచెదను. వారు నన్ను అడుగుదురు. అపుడు నేను, ఈ రాత్రి ఈ ప్రసంగము చేసెదనని చెప్పెదను. అపుడు వారు అన్నియూ సిద్దము, చేసికొందురు. కావలసిన వారికి సరఫరా చేసెదరు, మంచిగా టేపు తయారు చేయండి. ఈ ఆలయములో మంచి విధానమున్నది గనుక ఇక్కడే వాటిని చేయుదుము, చూచారా.
65ఈ గొప్ప సువార్త కూటములకు నేను వెళ్ళుచున్నాను. విదేశములలో నేను చేయబోవు ప్రసంగముల గూర్చి మీకు ముందు ఏమీ చెప్పలేదు. మొదటి ప్రసంగమును ఇక్కడే చేసెదనని నేను వాగ్ధానము చేయలేను. ఎందుకనగా విదేశములలో నేను ప్రసంగించిన వర్తమానములు, మీకు వినుటకు పాతబడినట్లు అనిపించును. మీకు కొంత ప్రత్యేకమైనది కావలెను. అక్కడ వర్తమానము ఉన్నది ఉన్నట్లుగా తీసుకురండి, వారు ఒక యంత్రమునో లేక మరొక దానినో ఉపయోగించవలెను. అప్పుడు టేపులు ఖచ్చితమైనవి తయారగును.
చక్కగా టేపు చేయండి, ప్రతిదానిని తిరిగి వేసి చూడండి. బాగుగా లేనిచో మొత్తం ఆపండి; దానితో ఏమీ పని లేదు. ప్రతివారు స్వంతగా టేపు చేసికొనవచ్చును, చూచారా. కాని దానిని సరిగా చేయండి, అప్పుడు ఈ ఫిర్యాదు ఆగిపోవును, ఎట్టి ఫిర్యాదులు రాకుండా చూడవలెను. ఏదయినా ఫిర్యాదు వచ్చినచో, ఆ విషయమై చర్య తీసికోవలెను. ఆ విషయమును సరిదిద్దవలెను.
వీలయినంత త్వరగా నేను పని చేయుదును. ఇంకా దాదాపు రెండు ప్రశ్నలున్నవని బిల్లీ చెప్పెను, లేదా మూడుండవచ్చు, అప్పుడు మనము ముగించెదము.
66ప్రశ్న: బ్రెన్హాం సోదరుడా, సంఘములో క్రమమును డీకన్ చూడవలెనా? లేక సహోదరుడు నెవిల్ ఏమి చేయవలెనో చెప్పు వరకు మేము ఎదురు చూడవలెనా?
అది సహోదరుడు నెవిల్ పని కాదు, అది మీ పని, చూచారా. ఏమీ బోధించవలెనో, ఏలాగు బోధించవలెనో మీరు నెవిల్‌కు చెప్పనవసరము లేదు. డీకన్లగు మీరు క్రమము గూర్చి బాధ్యత వహించవలెను. మీరది చేయవలసియున్నారు. ఆ విషయము మీరు చూడండి. అది సహోదరుడు నెవిల్ యొక్క పని కాదు, అది మీ పని, చూచారా.
ఇప్పుడు, వీధిలో ఒక పోలీసు ఉన్నాడు, అతడు ఒక వ్యక్తి కారు వెనుక తలుపు ఎత్తి ఏదో దొంగలించుటను చూచాడు. అప్పుడతడు మేయరును పిలచి ఇట్లు చెప్పవలెనా? అయ్యా! గౌరవనీయులగు మేయరు గారూ, నేను మీ కొరకు ఈ పోలీసు శాఖలో పనిచేయుచున్నాను. ఇక్కడ వీధిలో ఒకనిని నేను చూచాను. గత రాత్రి అతడు ఒక కారు టైర్లు ఎత్తికొనిపోయెను. ఆ విషయములో మీరేమందురోనని అడుగుచున్నాను. చూచారా, బుద్ధిగలవాడు ఆలాగు అడగడు. అవునా? ఏదయినా నేరము చూచినపుడు వెంటనే అరెస్టు చేయును.
ఈ ఆలయములో ఒక వ్యక్తి ఏదయినా తప్పు చేయుట మనము చూచినపుడు వారిని ఆపి మాట్లాడుదుము. గర్వముతో కాదు; కాని వారు విననపుడు, వారు వినగల విధానములో చెప్పవలెను, చూచారా. చూడండి, పిల్లలకు చెప్పినట్లు చెప్పవలెను. ప్రవర్తనకు సరిదిద్దుకోమనవలెను. డీకన్లారా, మీ పని చేయుడి. ముందు ఒక ఇద్దరు, వెనుక ఒక ఇద్దరు, అటు, ఇటు కొందరు ఉండుట మంచిది. ఇటువంటి స్థలములోనికి దుర్మార్గులు, అన్ని రకముల వారు వచ్చుచుందురు. కనిపెట్టి చూడండి, కాపలా కాయండి, మెళకువగా యుండండి, మీ విధి నిర్వహణను సక్రమంగా నిర్వహించండి. అక్కడే ఉండండి, అది మీ సీటు. ఒక గోడ ప్రక్కగా నిలబడి ఉండుడి, వచ్చుచున్న వారినందరినీ గమనించండి.
67డీకన్, దేవుని యొక్క మందిరమును కావలి కాయును. ఎవరయినా వచ్చి వారితో మాట్లడండి, వారిని అభినందించండి, వారితో కరచాలనము చేయండి. మీరు రక్షక భటులు. సామానులు భద్రపరచు గదిని మీరు చూపించవలెను, వారికి మీరు చోటు చూపించవలెను. పాటల పుస్తకమును గాని, మరేదయినా అవసరమయిన దానిని గాని మీరు వారికి చూపించవలెను. వచ్చిన వారిని ఆహ్వానించి సాదరముగా పలుకరించవలెను. వారు వచ్చినందుకు సంతోషముగా ఉన్నదని చెప్పవలెను, వారిని స్వేచ్ఛగా మెలగమని చెప్పవలెను, వారి కొరకు ప్రార్థించవలెను. వారికి చోటు చూపించి తీసికొని వెళ్ళవలెను. వారు ముందు కూర్చొనుటకు ఇష్టపడుదురో, లేక వెనుక కూర్చొనుటకు ఇష్టపడుదురో అడుగవలెను. అదే ఆతిధ్యము.
రక్షక భటుడు (లేదా డీకన్) సైన్యములో ఒక అధికారిగా యుండును. అతడు మర్యాదగా పని చేయును, కాని అతనికి ఒక అధికారమున్నది. చూచారా? సైనిక పోలీసు అనగా ఏమిటో మీకు తెలియును. అతడు తన హక్కులను అమలు పరచును. గురువువలె అతడు పని చేయును. చూచారా? అందులో మర్యాద ఇమిడి యుండును, కాని ఒక అధికారము కూడా అతనికియున్నది. చూడండి, అతని మాట మీరు వినవలెను. ఈ పోకిరీ వారు త్రాగి తూలుచుంటే, వారిని సరిగ్గా కూర్చోపెట్టును. ఆ విధముగానే డీకన్ ఆలయములో తన పనిని నిర్వహించును.
గుర్తుంచుకొనండి, డీకన్ ఒక పోలీసు వంటి వ్యక్తి. సంఘములో మరెవరి కార్య భారము కన్నా డీకన్ యొక్క కార్యభారమే మిన్నయైనది. డీకన్ యొక్క కార్య భారము కంటె కఠినమైనది మరేది లేదని భావించుచున్నాను. అది నిజము. అతనికి చాలా గొప్ప పని యున్నది. అతడు దైవజనుడు. సంఘ కాపరి ఎట్లు దైవజనుడో, డీకన్ ఆలాగే దైవజనుడై యున్నాడు. నిశ్చయంగా అంతే! అతడు దేవుని దాసుడు.
68ట్రస్టీలు దేవుని యొక్క ఆధ్వర్యములో తమ విధులు నిర్వర్తించుదురు. ఆర్థిక స్థితిగతులను పరీక్షించెదరు. ఆ విషయములో శ్రద్ద వహించెదరు, అందుకు సంబంధించిన వ్యవహారములను చూచెదరు, దానిని గురించి మీకు చెప్పియున్నాను. ఇక్కడ జరుగుచున్న టేపు, మరియు ఇతర విషయముల గూర్చి చెప్పాను, ఆలయ విస్తరణ మరియు మరమ్మత్తులు గురించి, అందుకు సంబంధించిన ఆర్థిక వ్యవహారముల గురించి చూచెదరు. వారు దానికే ట్రస్టీలు, ఆస్తులు, ఆర్థిక పరిస్థితులు వారి ఆధ్వర్యములో యుండును. ఆ విషయములలో డీకన్లకు ఏమి సంబంధము లేదు. అదే విధముగా పెద్దల పనితో ధర్మకర్త (ట్రస్టీ)లకు ఎటువంటి సంబంధములేదు.
ఏ విషయములోనయినా డీకన్లు కాని, ట్రస్టీల సహాయము కోరినయెడల, లేదా ట్రస్టీల సహాయమును డీకన్లు కోరిన యెడల, మంచిదే. అందరూ కలిసి పనిచేయవలెను. కాని వ్యక్తిగతముగా మీ బాధ్యతలు ఏమిటో నేను చెప్పాను, చూచారా. సరే.
69సహోదరుడు నెవిల్‌ను ఏమీ ఇప్పుడు అడుగవద్దు. సహోదరుడు నెవిల్ మిమ్మును ఏదయినా చేయమని అడిగినపుడు, ఆయన మీ సంఘ కాపరి గనుక మర్యాదతోను, ప్రేమతోను మాట గౌరవించుడి. ఆ వెనుక మూలన ఏదో జరుగుచున్నది. చూడుడని ఆయన గాని సహోదరుడు కాలిన్స్‌ను, సహోదరుడు హికర్సన్‌ను, సహోదరుడు టోనీని లేదా మరెవరయినా అడిగినప్పుడు లోబడండి, అటువంటి విధులను నిర్వహించవలెను. అతడు ఒక నిజమగు దైవజనుడు.
గుర్తుంచుకొనండి, మీరు బ్రెన్హాం ఆలయము కొరకు గాని, సహోదరుడు నెవిల్ కొరకు గాని లేదా నా కొరకు గాని పనిచేయుట లేదు, యేసుక్రీస్తు కొరకు పనిచేయుచున్నారు, చూచారా. ఆయన మీ విధేయతను గౌరవించును. సంఘ కాపరి లేదా మరొకరి విధేయతను ఆయన గౌరవించురీతిగానే మీ విధేయతను గౌరవించును. మీరు లోబడవలెనని ఆయన ఆశించుచున్నాడు. మనము మన విధేయతను చూపించవలెను.
70కొన్నిసార్లు అది కఠినముగా యుండును. కొన్నిసార్లు నా పని చాలా కష్టముగా తోచును. ఒక సేవకుడు అచ్చట కూర్చొని యున్నాడు, నా నిండు హృదయముతో అతనిని ప్రేమించుచున్నాను, నిజంగా అతనికి చెప్పవలసియున్నాను. ప్రేమను బట్టి నేను అతనికి సహాయము చేయుటకు నా చేయి అందించాను. మీరు గ్రహించారా? వారు నా యొద్దకు వచ్చి ఇట్లందురు, "బ్రెన్హాం సోదరుడా, నీవు చాలా అద్భుతమైన వ్యక్తివి. నీవు ఆ బాప్తిస్మము విషయములో కాస్త రాజీ పడితే చాలును, లేక ఆ సర్పసంతానము లేదా ఆ ఇతర బోధల విషయములో కొద్దిగా సర్దుబాటు చేసికొంటే చాలును."
"సోదరుడా, నిన్ను ప్రేమించుచున్నాను, కాని లేఖనము తీసి ఏది తప్పో, ఏది ఒప్పో చూద్దాం," అని అందును.
"ఓ! కాదు. బ్రెన్హాం సోదరుడా, నీది పూర్తిగా తప్పు అందురు." అంతా ఎగిరిపోవును.
నిజమే. "నాది తప్పు కావచ్చును. మీరు నిశ్చయంగా నాకు చెప్పవచ్చును. నా తప్పు ఎక్కడో చూపించండి, నేను వినుటకు ఇష్టపడుచున్నాను, చూచారా."
ఆ పిల్లవాడిని కూర్చొమను హక్కు నీకు లేదని నీవు అనవచ్చును. డీకన్ దేవుని యొక్క మందిరమునకు సంరక్షకుడు, చూచారా. అతడు దేవుని మందిరము గూర్చి శ్రద్ద వహించును. దానిని క్రమములో ఉంచును. లేఖనము అదియే చెప్పుచున్నది. డీకన్ చేయవలసినది మరేదయినా ఉన్నచో, నాకు వచ్చి చెప్పండి. మీరు కూడా ఒక విధిని నిర్వహించవలసియున్నారు. దానిని మీరు సరిగా నిర్వహించవలెను.
ఎవరినీ మీరు అడుగనవసరము లేదు, అది మీ బాధ్యత. సహోదరుడు నెవిల్ ఎవరినీ అడుగనవసరము లేదు. సంఘము అతనికి చెప్పనవసరము లేదు. అనగా ట్రస్టీలు వచ్చి ఆలయ మునకు పైకప్పు వేయమందురా, లేదా అని సహోదరుడు నెవిల్‌ను అడుగ నవసరము లేదు. సహోదరుడు నెవిల్‌కు దానితో ఏమీ సంబంధము లేదు. నాకేమీ సంబంధము లేదు, అది మీ పని. డీకన్లు మీకు చెప్పనసరము లేదు.
71సంఘ కాపరికి కూడా అదే విధానం. నీవు దేని మీద బోధించబోతున్నావు? నీవు దీనిని చేయుట నాకిష్టం లేదు అని చెప్పనక్కర్లేదు. అతడు దేవుని వశములో యున్నాడు. ఎవరూ అతనికి చెప్పనక్కరలేదు, చూడండి, అతడు వారి సంఘ కాపరి. సహోదరుడు నెవిల్, ప్రభువు తన కిచ్చిన వర్తమానమును మనకు అందించును. మనమందరమూ ఇందులో కలిసి యున్నాము. సహోదరుడు నెవిల్‌కు నేను ఏదయినా తప్పు చెప్పిన యెడల, అందుకు నన్ను దేవుడు లెక్క అడుగును. అది నిజము, చూచారా. కాబట్టి అన్నింటికీ దేవుడే యజమాని, చూచారా. మనము కేవలము ఆయన రాయబారులుగా పనిచేయుచున్నాము. ఈ ఆఫీసులోనే మీరు చూడండి.
72ప్రశ్న: (తరువాత ప్రశ్న. ఇంకొకటి చెప్పిన తరువాత ఆపుదము) మన సంఘములో భాషల వరమును ఎట్లు పని చేయించవలెనో దయచేసి చెప్పుము. దానిని మనము ఇప్పుడే చెప్పుకొని యున్నాము.
73ప్రశ్న: దీనిని దయతో చూచి చెప్పగలరా? [వాయిద్యములు అని బిల్లీ పాల్, సహోదరుడు బ్రెన్హాం గారితో చెప్పెను.] ఆర్గన్ మరియు పియానో కాకుండా ఎన్ని వాయిద్యములు మనకుండవచ్చును?
అది మీ బృందము మీద ఆధారపడియుండును, చూడండి. మీకేమున్నవో నాకు తెలియదు. ఇది నాకు అర్థము కాలేదు. ఆర్గన్ మరియు పియానో సంఘము యొక్క సొత్తు. పాటలను నడిపించు వ్యక్తి బూరలు మరియు ఊదెడు కొమ్ములు మొదలగునవి కొన్ని పాటలకు అవసరమగును ఆనుకొంటే వాటిని సంపాదించవచ్చును, ఈ వాయిద్యములను వాయించు మరెవరయినా ఆలయములోనికి రావచ్చును. వారు బృందముగా యుండవచ్చు, ఆ వాయిద్యములను కొనుటకు అవసరమగు ద్రవ్యమున్నదో లేదో, ట్రస్టీలు చూచుకొందురు. వారి ప్రశ్న అదేనని తలంచుచున్నాను.
వారికి స్వంత వాయిద్యములున్నచో మరీ మంచిది. వారికి స్వంత వాయిద్యములు లేనియెడల, వారు ఈ బృందములో సభ్యులుగా ఉండవచ్చు. ఎవరో ఒకరు అప్పుడప్పుడు వచ్చి వాటినుపయోగించి వెళ్ళిపోవుట కంటె ఒక బృందముగా వారుండుట మంచిది. ఈ రాత్రి ఇక్కడుండి, రేపు రాత్రి మరెక్కడో వాయించు వానికి సంఘము ఒక బూరను కొని ఇవ్వజాలదు. మధ్యలో అప్పుడప్పుడు వచ్చి వాయించి వెళ్ళిపోతే చాలదు. ఇక్కడే ఆ బృందము ఉండవలెను, దానికి ఒక నాయకుడుండవలెను, ఒక క్రమబద్దముగా ఉండవలెను. అప్పుడు సంఘము వాయిద్యములను కొనుటను గూర్చి వారితో మాట్లాడును.
74ప్రశ్న: సంఘ ప్రారంభములోను, ముగింపులోను ప్రజలను డీకన్ల అగు మీరు ఎట్లు నెమ్మదిగా ఉంచవలెనో దయచేసి వివరించుము. [ఈ ప్రశ్నను బిల్లీ పాల్ చదివి సహోదరుడు బ్రెన్హాం కు చెప్పెను.] ఓ, మంచిది. సోదరులారా, నా సలహా వినండి. గొప్ప సంగతి, కాని ఎక్కువ సమయముంటే బాగుండును. ఇది మనకు కావలసిన జవాబు.
కూటములకు ముందు మీరు ఈ టేపును వేసి వినిపించండి. జనులు దానిని అర్థము చేసికొందురు, దీనిని వినిపించండి. ఈ భాగము చాలు, ఇంకా ఎక్కువ వద్దు. ఇది వినబడువరకు దానిని చూడండి, ఎందుకనగా ఇది ప్రశ్న.
సంఘ డీకన్లు, సంఘమునకు పోలీసులని చెప్పాను, కాని సంఘము మామూలు సమావేశ స్థలము కాదు. సహవాసమునకు, స్నేహమునకు, వినోదములకు కూడుకొను స్థలము కాదు. సంఘమనగా దేవుని యొక్క సాన్నిధ్యము, మీరు ఒకరినొకరు కలిసికొనుటకు మీ గృహములున్నవి. మీరు నా యింటికి, నేను మీ ఇంటికి రావచ్చును. మనం ఒకరి గృహములకు మరొకరము వెళ్ళవచ్చును, కాని ఆలయములో సరదాగా ముచ్చటించుకొనుట మంచిది కాదు. సోదరులారా, మన మనస్సులలో నుండి దీనినంతటినీ తీసివేసికొనుటకు ఇచ్చటికి వచ్చుచున్నాము.
75చాలా సంవత్సరాల క్రితం ఎట్లుండెడిదో చూడండి. సోదరి గెర్టీ ఒక పియానిస్టు. అప్పుడు ఈ సంఘమునకు కాపరిని, ట్రస్టీని, డీకన్ ని అన్నీ నేనే. నేనే చేయవలసివచ్చెను. ఇప్పుడాలాగు చేయవలసిన అవసరము లేదు, ఎందుకనగా చేయుటకు మనుష్యులు ఉన్నారు. ద్వారము యొద్ద సహోదరుడు సెవర్ట్ తదితరులు నిలబడి ఆహ్వానించుచున్నారు. ఆ ద్వారము యొద్ద పుస్తకములు పేర్చి యుంచారు. వారు కుర్చీలో కూర్చొని లేక మరొక విధంగా యుందురు. ఎవరయినా వచ్చినప్పుడు వారికి చోటు చూపించెదరు, కోటు తగిలించుటకు సహాయము చేయుదురు, పాటల పుస్తకము ఇచ్చెదరు, ప్రార్థనలో యుండుడని చెప్పెదరు. అందరూ తమ తమ కుర్చీలలో కూర్చొని, ఆరాధన ఆరంభమగు వరకు నెమ్మదిగా ప్రార్థించెదరు, చూచారా. ప్రారంభ సమయములో సోదరి గెర్టీ వచ్చి పియానో వాయించి సంగీతము నారంభించును. జనులందరూ కూడి వచ్చెదరు.
చాలా చక్కని నిజమగు సంగీతముతో మన ఆర్గానిస్టు రావలెనని నేను సలహా ఇచ్చుచున్నాను. ఆమె రాలేనిచో దానిని రికార్డు చేసి వేయవలెను. చాలా చక్కని, మధురమగు పవిత్ర సంగీతము కావలెను. జనులు ముచ్చట్లాడి పరధ్యానంలో యున్నపుడు, డీకన్లలో ఒకరు మైక్రోఫోను యొద్దకు వచ్చి ష్-ష్-ష్ అనవలెను. ఈ ఆలయములోనికి ఆరాధనకు వచ్చియున్నామని చెప్పవలెను. ఇప్పుడు గోల చేయకుండా, సంగీతమును వినవలెనని చెప్పవలెను. మీ స్థానములలో కూర్చోండని, మర్యాదగా యుండుడని (చూచారా), బైబిలు చదువుడని లేదా ప్రార్థించుడని చెప్పవలెను. ఈ పరిశుద్ధాలయములో ప్రభువు నివసించుచున్నాడు. ప్రతి వారు ఎంతో మర్యాదగా ఉండి ఆరాధించవలెను. ఆరాధన ప్రారంభములో అటు ఇటు నడువరాదు, మాట్లాడరాదు. మీరు సమాజముగా కూడి ప్రభువుతో మాట్లాడవలెను, చూచారా. నిశ్శబ్ద ప్రార్థన ద్వారా గాని, బైబిలు చదువుట ద్వారా గాని ఆలాగు చేయవలెను.
76అక్కడున్న మార్బుల్ చర్చికి నేను వెళ్ళాను. నార్మన్ విన్సెంట్ పీలే గూర్చి మీరు విని యుందురు. గొప్ప మానసిక శాస్త్రవేత్త. అతడు ఒక ఉపదేశకుడు. అతని ఆలయమునకు నేను వెళ్ళాను, నా ఆలయం కూడా ఆలాగుంటే ఎంత బాగుండునో కదా అని తలంచాను. నీవు లోనికి రాకముందే ఆ డీకన్లు ఆ తలుపు యొద్ద నిలబడియుందురు. ఆదివారపుబడి పాఠమును వారు నీ చేతికి ఇచ్చెదరు. దానిని మూడుసార్లు పూర్తి చేయవలెను. నాలుగు లేక అయిదువందల మంది మాత్రమే అందులో పట్టుదురు. మీకు తెలుసు; న్యూయార్కు చాలా పెద్ద పట్టణము, ఈయన చాలా ప్రసిద్ది చెందిన వ్యక్తి. పది గంటలకు ఒక తరగతి, పదకొండు గంటలకు మరొకటి జరుగును. ఒకే పాఠము. ఒకే షీటును రెండుసార్లు ఇచ్చెదరు. ఆ తరగతులు అయిపోయిన అయిదు నిమిషములకు ఆరాధన జరుగును. వారందరూ బయటకు వచ్చు వరకు లోనికి ఎవరూ వెళ్ళలేరు, డీకన్లు మరో ద్వారమును తెరచెదరు, అపుడు ఆలయము నిండును. ఆ పాత-కాలపు సీట్లు మీకు తెలియును. నీవు తలుపు తీయగానే ఆ వరుసలు నీకు కనబడును. దాదాపు రెండు వందల సంవత్సరముల నుండి అది ఆలాగే నిలచి యున్నదని నేననుకొనుచున్నాను. అది పురాతన మార్బుల్ చర్చి.
77ఆ సంఘములో పిన్ పడినా శబ్దము వినబడును, అంత నిశ్శబ్దముగా యుందురు. ఆర్గన్ మీద మొదటి పల్లవి వినబడుటకు ముందుగా అరగంట సేపు అందరూ ప్రార్థనలో యుందురు. ఎంత అద్భుతమది! వారు మూడు నుండి అయిదు నిమిషములలోగా ఒక పల్లవి పాడుదురు. "ఎంత గొప్పవాడవు" లేదా అటువంటి పాట పాడెదరు. ఆ పాట వినబడగానే అందరూ ప్రార్థన ఆపి, దానిని విందురు. అది ఒక మార్పును ఇచ్చును. ప్రార్థన నుండి పాటలోనికి వచ్చుదురు. అపుడు సంగీత బృంద నాయకుడు గానమును నడిపించును. వారు అందరికీ వచ్చు పాటను మరియు బృందపు పాటను పాడుదురు. ఆదివారపుబడికి వారప్పుడు సిద్దమయ్యెదరు, చూచారా. అది అయిపోయిన తరువాత, దైవారాధన తప్ప మరేదియూ ఉండదు, అందుకొరకే మనము వచ్చియున్నాము.
78మన సంఘము కూడా ఆలాగుండిన మేలని తలంచుచున్నాను. దానిని మనము ఆచరణలో పెట్టనై యున్నామని చెప్పుచున్నాను, చూచారా. ఆలాగు మనం చేయుదము. ఎవరైనా ఏదైనా చేసినప్పుడు, అది మంచిపని, అయితే మనమును చేయుదము, చూచారా. ఏమయినా గాని ఒక మంచిపనిని మనము అనుకరించవలెను, చూచారా. ఉదయమైనా, రాత్రయినా జనులు నిలబడియున్నపుడు డీకన్లు వెళ్ళి పలుకరించి సీటు చూపించవలెను, ఆలయములో కొన్ని క్రమములను తప్పక పాటించవలెను.
వారాలాగు చేయుచున్నారో లేదో నాకు తెలియదు, ఎందుకనగా ఆరాధన ప్రారంభము కాక ముందెన్నడూ నేను రాలేదు, కావున నాకు తెలియదు.
జనులు వచ్చి ముచ్చట్లాడుకొనునప్పుడు ఎవరో ఒకడు లేచి ఒక్క క్షణము ష్-ష్-ష్ అని చెప్పవలెను, చూచారా. ఒక సోదరి అచ్చటికి వెళ్ళి, పాట వాయించుట మంచిది. మీలో ఎవరూ అట్టివారు లేనియెడల, రికార్డ్ చేసి దానిని పెట్టండి, ఆర్గన్ సంగీతమును వినిపించండి. "ఆలయములో ఒక క్రొత్త క్రమమున్నదని చెప్పండి. జనులు ఇచ్చటికి ముచ్చట్లాడుటకు రారాదు, కేవలము ఆరాధన కొరకు రావలెను, చూచారా. ఆ కొద్ది నిమిషముల తరువాత ఆరాధన ప్రారంభమగును. అంత వరకూ మీ బైబిలు చదువుట గాని, తలవంచి నెమ్మదిగా ప్రార్థించుట గాని చేయవలెను." కొన్నిసార్లు ఈలాగు చేసినయెడల వారందరూ దానిని నేర్చుకొందురు, చూచారా. చూచారా?
79ఎవరయినా మాట్లాడుట మీరు వినునపుడు దగ్గరకు వెళ్ళండి… ఆలాగు మాట్లాడుచున్న వారిని కొన్నిసార్లు చేసినపుడు మరెవరూ ఆ తరువాత మాట్లాడరు. డీకన్లు వెళ్ళి చెప్పవలెను, ఆరాధన సమయములో అందరూ ఆరాధించవలెనని వారికి మీరు చెప్పవలెను. చూచారా? దేవుని మందిరములో మాట్లాడకూడదు, ఇది ఆరాధనా మందిరము. అర్థము చేసికొనండని చెప్పవలెను.
ప్రశ్న: ఆలయములో డీకన్లు ఎట్లు పని చేయవలెనో చెప్పుము. అదే ఇది.
80ఇప్పుడు చివరి దానిని చూడండి.
ప్రశ్న: బ్రెన్హాం సోదరుడా, ఆరాధన ప్రారంభమగు సమయములో మేము పిర్యాదులను వివరించ వచ్చునా? చాలా చిన్న అక్షరములలో వ్రాసిరి. (చూద్దాం) మాకు పాటలు, సాక్ష్యములు, ప్రార్థనలు, ప్రార్థన విన్నపములు, ప్రత్యేక పాటలు ఉండును. పదకొండు గంటల వరకు వర్తమానము లోనికి వెళ్ళరు. వాక్యమునకు ఎక్కువ సమయముండదు. కొందరు విసుగు చెంది వాక్యము చెప్పక ముందే లేచి పోవుచుందురు. దయచేసి ఎన్ని పాటలు పాడవలెనో, వర్తమానము ఎప్పుడు ఆరంభించవలెనో వివరించుము. కొన్నిసార్లు ప్రార్థన విన్నపములు ఉండును, సాక్ష్యపు కూటముండును, ఆ సమయములో ఇవన్నీ పెట్టుట సబబుగా కనిపించుటలేదు.
81దానిని నేను అర్థము చేసుకున్నానని తలంచుచున్నాను. బిల్లీ ఇక్కడ నాకు సహాయము చేసెను. నేను టేపుపై ఈ మాటను చెప్పుట బహుశా వారు ఏదైనా కూడికలో లేక ఆరాధనలోనో వినియుందురు, చాలా చక్కగా వ్రాసిరి, నేను చదువలేక పోయాను. కాని నాకర్థమైన దాని ప్రకారము, ఆరాధనకు ముందు ఎన్ని పాటలు పాడవలెను, ఏ సమయములో వర్తమానము ప్రారంభించవలెను అని అడిగిరి.
మొదటగా, ఒకటి నేనిచ్చట ఒప్పు కోవలసియున్నాను. నేను తప్పు చేసినపుడు, తప్పు అని ఒప్పుకొందును, చూచారా. అటువంటి దానికి నేను నాయకునిగా ఉన్నానని ఇక్కడ ఒప్పుకొనుచున్నాను, ఎందుకనగా నేను చాలాసేపు మిమ్మును ఉంచుచున్నాను. సంఘ మునకు అది అలవాటు అయినది, కాని ఆలాగుండరాదు. (చూచారా). గుర్తుంచుకొనండి, మీ అందరకీ చెప్పుచున్నాను, ప్రభుని చిత్తమయితే ఆదివారం రాత్రి నుండి నా కూటమును ముప్పది లేదా నలుబది నిమిషములకు మించనియ్యను. ఒక వారం ఎక్కువ ఉండవలసి వచ్చినా గాని ఆలాగే చేయుదును.
82ఎందుకనగా దీనిని నేను తెలిసికొన్నాను, వర్తమానమును శక్తితో ఇచ్చెదము; కాని మరీ దీర్ఘమైనచో జనులు అలసిపోయి దానిని గ్రహించలేరు. నాకిది ముందు నుండి తెలియును, చూచారా. సరిగ్గా సమయమును పాటించిన వారే జయశీలురగు ప్రసంగీకులు. యేసు కొద్ది మాటలే చెప్పెను. ఆయన వర్తమానములను గమనించండి,పెంతెకొస్తు దినమున పేతురు ప్రసంగమును చూడండి, బహుశా పదిహేను నిమిషములుండి యుండును, కాని అది మూడు వేల ఆత్మలను దేవుని రాజ్యములోనికి పంపించెను. చూడండి, సూటిగా అది తాకి యున్నది, చూచారా.
నేను దోషిని. ఎందుకనగా, ఈలాగు చేశాను, నాకు తెలియక కాదు గాని, మనము టేపులు తయారు చేయుచున్నాము. (చూచారా), ఈ టేపులను గృహములలో గంటల కొలదిగా విందురు. ఈలాగు ఎందుకు చేశానో ఆ కారణములను ఈ వచ్చే ఆదివారము మీరు విందురు, దానిని చెప్పవచ్చును. ఈ ఘడియ యొక్క వర్తమానమును అందించవలెనను భారము నా మీద ఎంతో యున్నది, దానిని చెప్పవలెను. ఇప్పుడు వర్తమానము వెళ్ళి యున్నది. ఇక నుండి కూటములలో వర్తమానమును ముప్పది నిమిషములకు మించనియ్యను. ఈ సంవత్సర ప్రారంభము నుండి ఆలాగు చేయుదును. నేనెక్కడికి వెళ్ళినా గాని, అరగంట లేదా మరీ ఎక్కువయితే నలుబది నిమిషములకు మించి చెప్పను. వర్తమానమును సూటిగా అందించి వేదిక పిలుపును ఇచ్చుదును. మరీ ఎక్కువ సమయము తీసికొనను. ప్రార్థన వరుసను ఏర్పరచెదను, ఎందుకనగా జనులను అలసటకు గురి చేయరాదు. నాకు ఆ సంగతి తెలియును.
83కాని ఇక్కడ చూడండి. కొన్నిసార్లు నేను రెండు లేదా మూడు గంటలు ఇక్కడ బోధించాను, కాని ఈ సంవత్సరమంతా చూచాను. కనీసం డజను మంది కూడా మధ్యలో ఎన్నడూ లేచి వెళ్ళిపోలేదు. చూచారా? అది నిజము. ఎందుకనగా ఈ టేపులను తయారు చేయుచున్నాము, అవి ప్రపంచమంతటనూ ఉన్న జనుల యొద్దకు వెళ్ళును. వారు గంటల కొలది కూర్చొని వాటిని విందురు, సేవకులు విందురు; జర్మనీ, స్విట్జర్లాండు, ఆఫ్రికా, ఆసియా, ఇంకా చాలా చోట్లకు ఇవి వెళ్ళును; వారందరూ దీనిని విందురు.
చూడండి, సంఘము మట్టుకే అయితే పరవాలేదు. రెండు గంటల టేపు తయారు చేయవలెనన్న రెండు గంటల వర్తమానమును అందించవలెను. ఆలాగు టేపు తయారు చేయనియెడల వర్తమానమును కుదించ వచ్చును. కొన్నిసార్లు తేలికగా అది నిండును, కొన్నిసార్లు చాలా సమయము పట్టును. దానికి మధ్యస్థముగా ఉన్నపుడు మనము సంతోషించుదము.
MATT 6:6
84పొడుగయిన సాక్ష్యపు కూటము వలన చాలాసార్లు మన కూటములను నాశనము చేయుదము. ఆ విషయంలో నేను అపరాధినని నాకు తెలియును. మనకు వీధి కూటములుండేవి, ఒక ముసలి సోదరుని ప్రార్థించమని కోరినపుడు, అతడు ఆ పట్టణ మేయరు కొరకు, ఆ రాష్ట్ర గవర్నరు కొరకు, యూనియను ప్రెసిడెంటు కొరకు, చుట్టూ ఉన్న సంఘకాపరుల కొరకు, ఆసుపత్రిలో యున్న సోదరి జోన్స్ కొరకు, ఇంకా సభ్యులొక్కక్కరి కొరు ప్రార్థించేవాడు. జనులు ఆ వీధిలో నడిచి పోతుండే వారు. ఆ నిలబడిన వారు అలసిపోయేవారు.
ఇప్పుడు ప్రధానమగు సంగతి చూడండి. మీ ప్రధానమగు దీర్ఘప్రార్థన రహస్యముగా ఉండవలెను. నీ రహస్య గదిలోనికి వెళ్ళి తలుపు మూసికొనుము. అక్కడ నీవు దివారాత్రులు, గంటల కొలదిగా ప్రార్థించుకోవచ్చును, కాని ప్రజలు చూచుచున్న స్థలములో మీ ప్రార్థన చిన్నగాను, త్వరగాను చేయవలెను. మీ ఎక్కువ సమయమును వాక్యము కొరకే వినియోగించవలెను. అదే ప్రధానము! నీకు వీలయినంత గట్టిగా ఆ వాక్యమును చెప్పుము, వాక్యమును జనుల యొద్దకు తీసుకోని రమ్ము.
85ఇక్కడ నా సలహా వినుడి. దీనిని గుర్తుంచుకొనండి, దీనిని నేను కొనసాగించినందుకు, తప్పును ఒప్పుకొనుచున్నాను. ఆ విషయములో నేను దోషిని. కాని దానిని ఎందుకా విధంగా కొనసాగించానో చెప్పాను, విదేశములకు ఆ రెండు గంటల వర్తమానపు టేపులను పంపవలసియున్నాను. కాని సంఘము ఆ మాదిరిని అనుసరించరాదు, (ఈ టాబెర్నికల్ లోని వర్తమానము) టేపులు (రెండు గంటలు), ఆ యా స్థలములకు వెళ్ళవలెను.
ఇప్పుడు, ఒక ఉదాహరణ మీకు ఇచ్చెదను. ఒక సలహాగా అది గ్రహించెదరా? ఆలయపు తలుపులు ఒక ప్రత్యేక సమయములో తెరువబడవలెను, జనులు లోనికి వచ్చెదరు, పాటలు పాడుదురు. అందరూ ఆరాధనకే రావలెను గాని సందర్శన కొరకు కాదు. ఆ తరువాత కూడా వారిని ముచ్చట్లాడనీయరాదు, ముగించి పంపివేయవలెను. మీరు మాట్లాడుకొనుట బయట జరుగ వలెను. కాని ఇది పరిశుద్ద స్థలము, దీనిని పవిత్రముగా ఉంచవలెను. ప్రభువు యొక్క ఆత్మ ఇక్కడ మాట్లాడునప్పుడు, దానిని ప్రభువు ఆత్మగానే మనము స్వీకరించవలెను, చూచారా. అది సంచారము చేయుచుండును, లేనియెడల అది నిశ్చయంగా పడిపోవునని నేను గట్టిగా చెప్పుచున్నాను. దానిని మనము రానిచ్చుదము, అది మన విధి, అందుకోసమే ఈ రాత్రి ఇచ్చటున్నాను. ఇతర క్రమములతో పాటుగా దీనిని కూడా మనము గుర్తుంచుకొని పాటించుదము.
86ఇప్పుడు చూడండి, వారికి టేపు చేయుచున్నట్లుగా తెలియచేయండి. మనము సాధారణంగా చెప్పుచుందుము, ఒకవేళ సహోదరుడు నెవిల్ వర్తమానమందించనై యున్నచో, లేదా చేయుచున్నచో ఆ విషయమును వారికి తెలియచేయండి. వచ్చే ఆదివారం రాత్రికి రెండు గంటల వర్తమానమును, లేదా [మూడు గంటల వర్తమానమును టేపు చేయదుమని] ముందే ప్రకటించండి. అపుడు జనులు తెలిసికొందురు. వారు వచ్చిన తరువాత కూడా చెప్పవలెను. ఈ రాత్రికి ఒక వర్తమానమును టేపు చేయుదురు, దానికి రెండు గంటలు పట్టునని చెప్పండి. అది టేపు చేయబడి బయటకు పంపబడవలెను. నాకు నడిపింపు ఉన్నప్పుడే ఆలాగు చేయుదును. అందుకు ఎన్ని గంటలు పట్టునో వారికి చెప్పవలెను.
నేను సాధారణంగా బయట కూటములకు వెళ్ళినపుడు ఏమి చేయుదునో వినండి. వ్యాపారుల కూటములకు, ప్రార్థన వరుసలను ఏర్పరచు కూటములకు వెళ్ళుమందును. స్వస్థతా కూటమునకు ముందుగా నేను వేదిక మీద నిలబడి మూడు గంటల వర్తమానమును ఇచ్చినచో, ఏ విధంగా ఉండునో చూడండి. ఆ మరుసటి రాత్రికి ముందు వచ్చిన వారిలో సగం మంది కూడా రాలేరు, చూచారా. అది వారి వలన కాదు, వారు పనులకు వెళ్ళవలసి యుందురు.
87సాధారణముగా నా సలహా ఇది. గత రాత్రి సహోదరుడు నెవిల్ బోధించినపుడు నేను చూచాను, అది గొప్ప ఉజ్జీవ వర్తమానము. దానినినేను వ్రాసికొని జేబులో ఉంచుకొన్నాను. నా స్వంత వర్తమానములలో దానిని వాడుదును. అది మంచిది. "తప్పించుకొను మార్గము అని పేరు పెట్టెను," చూడండి. అది ఆశ్చర్యకరమగు వర్తమానము. ఎంత త్వరగా దానినతడు ముగించెనో చూచారా? దాదాపు ముప్పది-అయిదు నిమిషములు తీసికొనెను. దానిని ముగించెను, చూచారా, చాలా చక్కగా యున్నది. సహోదరుడు నెవిల్ యొక్క వర్తమానములు సాధారణంగా ఆలాగే యుండును. ఎక్కువ దీర్ఘముగా ఉండవు. చూచారా, అసలు అంశమును చెప్పకుండా చుట్టూ ఏవేవో అల్లుట ద్వారా నీ వర్తమానమును నీవు చంపుచుందువు, గమనించారా.
ఇప్పుడు… ఈ విషయమును గమనించండి. దీనిని నేను ట్రస్టీలను, డీకన్లను, సంఘ కాపరులను అవమానపరచవలెనని చెప్పుట లేదు, మీకే ఇది చెప్పుచున్నాను: సత్యమును మీరు చూడండి, మీరందరూ మంచి స్వభావము గల జనులు. మీలో ప్రతి ఒక్కరూ ఆలాంటివారే. ఆలాగుండని యెడల నేను ఫలాని-ఫలాని వారు తప్ప అందరూ మంచి స్వభావము గలవారేనని చెప్పియుందును. మనందరము అతని కొరకు ప్రార్థన చేసియుందుము. కాని మీకు మంచి స్వభావమున్నది, మీకు దీర్ఘ శాంతమున్నది, దీనత్వమున్నది, నెమ్మది యున్నది. అది మంచిదే గాని, దానితో ఇతరులను ఆడ్డుకొనవద్దు.
MATT 15:14•
MATT 17:27•
MATT 21:13•
MATT 22:21•
MARK 11:17•
MARK 12:17•
LUKE 20:25
88యేసు కూడా మంచి స్వభావముగలవాడే, కాని సమయము వచ్చినపుడు ఈలాగు పలికెను, "నా తండ్రి ఇల్లు ప్రార్థనా మందిరమనబడునని వ్రాయబడియున్నది, దానిని మీరు దొంగల గుహగా చేసి యున్నారు," చూచారా. ఎపుడు మాట్లాడవలెనో, ఎపుడు మాట్లాడరాదో ఆయనకు తెలియును. మనము కూడా ఆలాగే చేయవలెను, చూచారా. యేసు వంటి వారెవరూ లేరు, ఆయన దేవుడు. సంఘములో డీకన్ గూర్చి చెప్పుకొన్నాము, దానిని ఆయన నిర్వహించెను. ఆయన ఒక కొరడాను తీసికొనెను. ఆయన బహు నెమ్మదిగా వారిని బయటకు తరుమలేదు. వారిని దేవుని మందిరములో నుండి కొట్టి, తరిమెను. ఆయన ఒక డీకన్గా విధిని నిర్వహించెను (చూచారా), డీకన్ లారా, అది మీకు ఒక మాదిరి. నా తండ్రి ఇల్లు ప్రార్థనా మందిరమనబడునని వ్రాయబడియున్నది అని చెప్పెను. గుర్తుంచుకొనండి, యేసు ఒక డీకన్ గా అక్కడుండెను. మీకది తెలియును, డీకన్ యొక్క పాత్రను యేసు నిర్వహించెను.
సంఘ కాపరిగా ఆయన పాత్రను నిర్వహించవలసి వచ్చినపుడు ఏమి చెప్పెను? గ్రుడ్డి పరిసయ్యులారా! మీరు గ్రుడ్డి నాయకులు! చూడండి. ఆయనప్పుడు సంఘ కాపరి విధిని నిర్వర్తించెను.
జరుగబోవుదానిని ఆయన వారికి చెప్పి, ప్రవక్త పనిని నిర్వహించెను, చూచారా.
పన్ను చెల్లించవలెనని వారాయనను ఖచ్చితంగా అడిగిరి, అప్పుడాయన ట్రస్టీ యొక్క పాత్రను నిర్వహించెను, "పేతురూ, నీవు వెళ్ళి నదిలో గాలము వేయుము, నీకు ముందుగా దొరికిన చేప నోటిని తెరచి చూడుము, అందులో ఒక నాణెముండును, దానిని పన్నుగా చెల్లించుము." కైసరుది కైసరుకి చెల్లించుడి, దేవునిది దేవునికి చెల్లించుడి, అని ఆయన చెప్పెను.
LUKE 19:46
89ఆయన ప్రవక్తగాను, సంఘ కాపరిగాను, ట్రస్టీగాను, డీకన్ గాను ఉండెను. నిశ్చయంగా! ఆయన చేసిన దానిని మీరు చూడండి. ఈ బ్రెన్హాం టాబెర్నికల్లో ఆ ఉదాహరణనే పాటించండి. ప్రతి పనిలోను, ప్రతిస్థలములోను, సమస్తములోను ఆయనను మహిమపరచే ఆలయముగా ఇది ఉండవలెను, ఎవరూ వెనుకాడకూడదు. మంచితనము, మాధుర్యము, దయ, సూటిగా చెప్పగల మనస్సు అందరిలో యుండవలెను. ప్రతివారు తమ విధిని నిర్వహించవలెను, చూచారా. అదియే విధానము, ఆ విధముగానే ఆయన కోరుకొనెను. ఆయన ఎన్నడూ సందేహించలేదు. ఏదయినా చెప్పవలసిన సమయము వచ్చినప్పుడు, ఆయన నిస్సంకోచముగా దానిని చెప్పెను. దయ చూపవలసిన సమయము వచ్చినప్పుడు, ఆయన దయ చూపించెను. ఆయన దయ, జాలి, అవగాహన గలవాడు, కాని తప్పును ఖండించునప్పుడు కాఠిన్యము చూపెను, ప్రతిది పొల్లు పోకుండా ఆయన చేసెను. మీ మాదిరి కొరకే ఆయన దానిని చేసెను. పరిశుద్ధాత్మ ఇప్పుడే దానిని నాకిచ్చెను. ఆయనను ఒక డీకన్ గా నేనెన్నడూ ఆలోచించలేదు, కాని ఆయన ముందే ఒక డీకన్ గా ఉండెను, చూచారా. ఆయన పెద్దవలె పని చేసెను.
90ఇప్పుడు వినండి. మీ ఆరాధన ఏడున్నరకు ప్రారంభ మగుననుకొనండి. మీ ఆలయమును అరగంట ముందే, అనగా ఏడుగంటలకు తెరవండి… ఆర్గానిస్టుకి చెల్లించుచున్నారా? ఆమెకు మీరందరూ చెల్లించుచున్నారా? పియానిస్టుకి చెల్లించుచున్నారా? ఆమె స్వచ్ఛందముగా పనిచేయుచున్నది. ఆమెను మర్యాదతో అడుగుడి. ఆమె ఒకవేళ డబ్బు అందుకై చెల్లించమన్నా గాని కొంత చెల్లించండి. ఆరాధనకు అరగంట ముందే ఆమె రావలెనని చెప్పండి. ఒకవేళ ఆమె కారణముల వలన రాలేనని చెప్పినయెడల, చక్కని సంగీతమును పెట్టండి. చూచారా? డీకన్ లలో ఒకరు గాని, ట్రస్టీగాని, జానిటర్ గాని ఎవరో ఒకరు దానిని పెట్టవచ్చును. జనులు వచ్చుచుండగా దానిని వినిపించండి, చూచారా. ఎందుకనగా ఇక్కడ డీకన్లు లేనియెడల అక్కడ ఎవరో ఒకరు పెట్టవచ్చును, ఒక అరగంటసేపు వినిపించండి.
కాని ఖచ్చితంగా ఏడున్నరకు ఆలయం పైనున్న గంటను మ్రోగించండి, చూచారా. మీ గంట ఇంకా అక్కడే ఉన్నదా? అయితే మంచిది. మీ గంటను ఏడున్నరకు మ్రోగించుడి, దాని అర్థమేమనగా ఆలయములో అటు ఇటు తిరుగుట గాని, జోనెసెస్‌తో కరచాలనము చేయుట గాని ఆపవలెనని అర్థము. అప్పుడు పాటలు నడిపించువాని పని ప్రారంభమగును. పాటలు నడిపించు వారు లేనియెడల, ఎవరో ఒకరిని ఆరాధనకు సమయమైనదని గంట వినబడగానే పాటలు పాడుటకు డీకన్లు పిలువవలెను. మీ పాటల పుస్తకములో ఫలాని పాట తీయండని సంఖ్య చెప్పవలెను, చూచారా. ఏడున్నరకు అంతా అక్షరాలా జరుగవలెను.
91ఆ తరువాత అందరూ కలిసి పాడే పాటను తీయవలయును, ఆలాగే రెండవ సామూహిక పాటను కూడా పాడవచ్చును. ప్రార్థనను నడిపించుటకు ముందే పిలువడి. (వీలయితే) సంఘ కాపరి అక్కడ ఉండనవసరము లేదు. పాటలు నడిపించు వ్యక్తి దానిని చేయవచ్చును. అది సహోదరుడు కాప్స్ అనుకొంటాను. చూడండి, ఏమీ చేయవలెనో అతనికి తెలియును. అతడు మరొకరిని పిలువవచ్చును లేదా అతడే ప్రార్థనను కూడా నడిపించవచ్చును. ప్రార్థనకు జనులందరూ నిలబడుట మంచిది. అపుడెవరైనా ప్రార్థనలో నడిపించవలెను.
ప్రతివారును దేవుని మందిరమునకు వచ్చి ప్రార్థించవలెనని మేము నమ్ముచున్నాను, అది ప్రార్థనా స్థలము. కాని మీరా పరిశుద్ద స్థలములో ఉన్నప్పుడు, సమయమును పాటించవలెను, చూచారా. మీరు వారందరినీ వేదిక యొద్దకు పిలచినప్పుడు, ప్రతిఒక్కరూ పదిహేను లేదా ఇరవై నిమిషాల సేపు ప్రార్థించితే, మీ సమయము అయిపోవును.
MATT 6:4-7
92మీరు ఇంటి యొద్ద ప్రార్థన చేసికొనండి. యేసు చెప్పెను, మీరు "ప్రార్థించునపుడు వేషధారుల వలె ప్రార్థించవద్దు. అది, ఇది, మరేదో చెప్పుచూ దీర్ఘ ప్రార్థనలు వారు చేయుదురు వారాలాగు మనుష్యులకు కనబడవలెనని తలంచుదురు." చూచారా. "మీరు ప్రార్థించునపుడు రహస్యముగా మీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసికొని ప్రార్థించండి. రహస్యమందు చూచుచున్న మీ పరలోకపు తండ్రి మీకు బహిరంగముగా ప్రతి ఫలమిచ్చును." ఆ విధంగా రహస్య ప్రార్థన ఉండవలెను, ఆలాగే చేయవలెనని ఆయన చెప్పెను.
ఒకవేళ ఒక పాట అయిన అనంతరము పాటలు నడిపించు నాయకుడు ఎవరినయినా ప్రార్థన చేయుటకు పిలచినపుడు వారు క్లుప్తముగా ప్రార్థన చేయవలెను. లేచి నిలబడి గవర్నరులందరి కొరకూ ప్రార్థన చేయవద్దు, ఏవరికైనా ప్రార్థనావసరతలున్నచో తెలియ చేయండి. వాటిని వ్రాసి పంపించండి. ఈ రాత్రి ప్రార్థనలో ఫలాని సోదరి ఆస్పత్రిలో యున్నది గనుక ఆమె స్వస్థత కొరకు ప్రార్థించమనవి, అని వ్రాసి పంపండి. వారిని మీరు మీ ప్రార్థనలో జ్ఞాపకము చేసికొనవలెను. అందరూ లేచి నిలబడి, సహోదరుడు జోన్స్‌ను పిలచి ప్రార్థనను నడిపించమనండి, చూచారా. ఆ విన్నపములను వేదిక మీద ఉంచండి, ఆ అలవాటును నేర్పించండి. ఎవరయినా ప్రార్థనా విన్నపమును తెచ్చినచో, వేదిక మీద ఉంచమని చెప్పండి. ఎవరి యొద్ద ప్రార్థన విన్నపములున్నచో చెప్పమని అడగవద్దు. అపుడు అందరూ లేచి గోల సష్టించెదరు. ఎవరో ఒకరు ముందు లేచి దేవునికి స్తోత్రం అని ఏదో చెప్ప నారంభించెదరు. కొన్నిసార్లు వారు అరగంటయినా గాని కూర్చోరు, చూచారా.
ఈ సంఘము విషయములో మాత్రమే మేము బాధ్యులము, ఇతర వాటిని గూర్చి కాదు; ఇది మా బాధ్యత. దేవునికి లెక్క చెప్పవలెను. ఈ బాధ్యతలు దేవుడు మీకప్పగించినవి, చూచారా. అందుకు మీరు జవాబు చెప్పుకొనవలెను. నా బాధ్యత గూర్చి నేను దేవునికి లెక్క చెప్పుకోవలెను. ఈ రాత్రి నేనిచ్చట నిలబడి చెప్పవలసియున్న బాధ్యతను కలిగియున్నాను గనుక దానిని నెరవేర్చుచున్నాను, చూచారా.
93ఎవరినయినా ప్రార్థనలో నడుపమని చెప్పండి. వారు ఆ విధంగా ప్రార్థన చేసి కూర్చొందురు. అది బాగుండును.
దీనిని నేను చెప్పగూడదు, ఎవరయినా ఒక ప్రత్యేకమగు పాట పాడగోరినచో సంఘములో ప్రకటించండి. ఎవరయినా ప్రత్యేక పాటను పాడగోరినచో ఆరాధన ప్రారంభము కాక ముందే పాటల నాయకుని కలిసికొనండని ప్రకటన చేయుడి. ఎవరయినా సరే రాత్రికి పాడే అవకాశమిమ్మని అడిగితే ఏ రాత్రి ఆలాగు వీలగునో వారికి చెప్పండి. ఆ కార్యక్రమములో వారి పేరు చేర్చండి. కార్యక్రమ పేపరులో వ్రాయండి.
94పాటలను సహోదరుడు కాప్స్ లేదా మరొకరు నడిపించెదరు. వారెవరయినా కావచ్చును, అయితే పాటలను నడిపించు వ్యక్తి లేచి నిలబడి ప్రసంగము చేయరాదు. వారు నిలబడి పాటలు నడిపించవలెను, అదే వారి పని.
ప్రసంగించవలసిన పని సంఘ కాపరిది, పాటలు నడిపించడు. అతడు పాటలు నడిపించనవసరము లేదు. బృంద నాయకుడు పాటలను నడిపించును. సమయము వచ్చినప్పుడు అతడు కార్యాలయములో నుండి, లేదా ఏదో మూల నుండి పరిశుద్ధాత్మ యొక్క తాజా అభిషేకముతో వచ్చి బోధించవలసిన బాధ్యతను కలిగియున్నాడు. పాటల సమయములో అతడు వేదిక మీదకు రావలసిన అవసరము కూడా లేదు. అతడు కార్యాలయమునకు వెనుక లేక ఆరాధనా స్థలమునకు వెనుక ఏదో స్థలములో యుండి, సమయము వచ్చునపుడు వేదిక పైన కనబడును. (చూచారా), ఒక ప్రత్యేకమగు పాటను ఎవరయినా ఒంటరిగా కాని, జంటగా గాని పాడునపుడు వినవలెనంటే రావచ్చును. అది మీ మూడవ పాటగా ఉండవలెను, చూచారా.
రెండు సామూహిక పాటలు, ప్రార్థన, కానుక ఉండును. (మీరు స్వీకరించగోరితే). ప్రతివారు వారి వారి విధులను నిర్వహించవలెను. చివరి పాట పాడుచుండగా ద్వారపాలకులు ఉన్నట్లయితే సాయంకాలపు కానుక కొరకు ముందుకు రావలెను, చూచారా. వారా పాట పాడుట ముగించగానే, ఆ ద్వార పాలకులు ఇచ్చట నిలబడెదరు. ఆ తరువాత వారు ప్రార్థన చేయుదురు, కానుకల ప్రార్థన. ఆ సమయములో ఫలాని వారిని, ఫలాని వారిని గుర్తుచేసికొందమని చెప్పండి. వారి పేర్లు చదువ వచ్చును. అందరూ లేచి నిలబడితే ఒక సోదరుడు ప్రార్థనలో నడిపించును. అంతటితో ఆ భాగము ముగియును.
95వారు ఈ రెండవ పాట పాడుచుండగా మీరు కానుకలు స్వీకరించదలంచినచో స్వీకరించండి. మీ మొదటి పాట అయిన పిదప సాయంకాల కానుకను తీసికొనుడి. ఆ తరువాత రెండవ పాట పాడి ముగించండి. మీరు చివరి పాట పాడుచుండగా, సంఘ కాపరిని పిలువుడి. చివరి పాట పాడగానే ఆర్గను మ్రోగించినపుడు మీ సంఘ కాపరి బయటకు వచ్చును, చూడండి, అంతా క్రమము గాను, నిశ్శబ్దముగాను జరుగవలెను. చెప్ప వలసినది ఏదియూ ఉండరాదు. ప్రతి డీకన్ తన విధిని నిర్వహించవలెను. సంఘ కాపరి అచ్చట నిలచియుండును.
అతడు బయటకు వచ్చి జనులను అభినందించును. తన గ్రంథమును తీసి, ఈ రాత్రికి బైబిలు నుండి ఫలాని అధ్యాయము నుండి చదువుదమని చెప్పును. బైబిలు చదువుదమని అతడు చెప్పినపుడు చదువుదము దేవుని యొక్క వాక్యమును గౌరవించుటకై మనము బైబిలు నుండి వాక్యము చదువుచుండగా, లేచి నిలబడుదము, అని కొన్నిసార్లు చెప్పుట మంచిది. ఈ రాత్రికి నేను కీర్తనల గ్రంథము నుండి చదువుచున్నానని చెప్పును. ఏది చదువగోరునో దానిని చెప్పును, లేదా మరెవరినో చదువమని చెప్పవచ్చును. ఆ దగ్గర్లో యున్న సహచరున్నో, పాటల నాయకుడినో, మరెవరినో చదువమనవచ్చును, కాని వీలయినంత వరకు సంఘ కాపరి చదువుటయే మంచిది. ఆలాగు చదివిన తరువాత నీ అంశమును తీసికొనుము, చూచారా. ఇదంతా చేయుటకు అరగంట సమయము పట్టును, అప్పటికి ఎనిమిది గంటలగును.
96ఎనిమిది మొదలుకొని పావు-తక్కువ-తొమ్మిది వరకు అనగా ముప్పయి నుండి నలుబది-అయిదు నిమిషముల వ్యవధి వరకూ పరిశుద్ధాత్మ నిన్ను నడిపించిన ప్రకారము వాక్యమును విత్తుము (చూచారా), అభిషేకము క్రిందయుండి ఆయన చేయమని చెప్పిన ప్రకారము చేయుము.
ఆ తరువాత వేదిక పిలుపును ఇమ్ము. "ఈ సంఘములో క్రీస్తును తమ స్వరక్షకునిగా అంగీకరించగోరువారెవరైనా యున్నారా? ఇప్పుడు మీరు నిలబడి, ఈ వేదిక యొద్దకు రావలెనని ఆహ్వానించుచున్నాము," చూచారా.
ఎవరూ నిలబడనిచో ఇట్లు చెప్పుము, "బాప్తిస్మము కొరకు ఎవరయినా యున్నారా? ముందే మారుమనస్సు పొంది, పాపక్షమాపణ నిమిత్తము నీటి బాప్తిస్మము పొందగోరు వారు రాగోరినచో ఇప్పుడు మీకు అవకాశము ఇచ్చుచున్నాము. ఆర్గను ఇంకా పలుకుచుండగానే మీరు రావచ్చును," చూచారా.
ఎవరూరాని యెడల ఈలాగు చెప్పుడి, "పరిశుద్ధాత్మ బాప్తిస్మమును ఎన్నడూ పొందని వారు ఈ రాత్రి పొందవలెనని కోరినయెడల రావచ్చు. మీ కొరకు మేము ప్రార్థించెదము." బహుశా కొందరు రావచ్చును, అపుడు ఇద్దరు లేక ముగ్గురు వారి మీదచేతులు వేయవలెను, వారి కొరకు ప్రార్థించండి. ఆ వెనుక ఉన్న గదిలోనికి పంపండి, వారితో ఎవరినయినా పంపండి. పరిశుద్ధాత్మను ఎట్లు పొందవలెనో వారికి ఉపదేశించండి. జనులందరూ వారికి దూరంగా ఉందురు.
97ఎవరైనా క్రీస్తును అంగీకరించగోరి, వేదిక యొద్దకు వచ్చినచో వారిని ప్రార్థించనీయండి. వారు ప్రార్థించుచుండగా, మీరును ఇప్పుడు ప్రార్థించుదము రండని చెప్పండి. విశ్వసించుచున్నారా? అని అడగండి.
జనులకు ఆలస్యము కాకుండా వారిని వెంటనే గదిలోనికి పంపండి. వారితో కూడా మీరు వెళ్ళండి, లేదా వారితో కూడా ఎవరినయినా పంపండి. జనులను వెళ్ళిపోనీయండి. వారిని మీరు ఎక్కడా నిలిపి యుంచలేరు, చూచారా.
కొద్ది నిమిషములు ఆగండి. ఎవరూ రాని యెడల ఈలాగున చెప్పండి, ఈ రాత్రి వ్యాధిని గూర్చి ప్రార్థన చేయించుకోవలెనని, నూనె రాసి ప్రార్థించబవలెనని ఎవరయినా వచ్చారా? రోగులకు ఇక్కడ ప్రార్థనచేయబడునని చెప్పండి.
"నెవిల్ సోదరుడా, వ్యక్తిగతంగా నిన్ను కలిసి కొనగోరుచున్నాను," అని ఎవరయినా అడిగితే, ఆఫీసుకు రమ్మని చెప్పవలెను. ఆ విషయమై డీకన్లను కలిసి సంప్రదించండి. వారు మీ గూర్చి మాట్లాడుదురు. సోదరునితో ఏదయినా మీరు చెప్పవలెనని కోరవచ్చును. డీకన్లలో ఒకరు మిమ్మును కార్యాలయమునకు తీసికొని వచ్చుదురు. కూటానంతరము వెంటనే మిమ్మును కలిసికొందును.
98ముగించుట కొరకు లేచి నిలబడుదమని మీరు చెప్పవలెను. మొత్తం కార్యక్రమమునకు మీకు ఒక గంట నలుబది-అయిదు నిమిషముల కన్న ఎక్కువ సమయము పట్టదు. చూచారా. ఒక గంటన్నరలో మీ ఆరాధన ముగియును. మీరు సూటిగా దానిని చెప్పవలెను, అపుడు అందరూ సంతృప్తి చెంది గృహములకు వెళ్ళుదురు, చూచారా. ఆ విధంగా జరుగునట్లు చూడండి.
ఈ వేదిక మీదను, ప్రపంచమంతటా నున్న వేదికల మీదను నేను ముప్పది-మూడు సంవత్సరముల నుండి మాట్లాడుచున్నాను. నిశ్చయంగా, ఈ కొద్ది సమయములో మీరు ఏదో ఒక దానిని నేర్చుకొని యుందురు, చూచారా. ఆలాగు మీరు లేనియెడల, రాకుండుట మంచిది. మీరు పరిశుద్దులతో వ్యవహరించుచున్నయెడల రాత్రంతా మీరుండవచ్చును, అది మీ ఇష్టము. చూడండి, వారితో మీరు మాట్లాడుట లేదు గాని వీరిని పట్టుకొనుటకు ప్రయత్నించుచున్నారు. మీరు పట్టుకొనినవారిక్కడ ఉన్నారు. మీరు వారి పొలములో పని చేయవలసి యున్నారు, చూచారా. వారినిచ్చటికి తీసికొని రండి, వాక్యము వారికి అందును, అపుడు మరే పిర్యాదు ఉండదు. మీరు ఏదయినా గైనొనవలసినది యున్నదో, వారిని ఆఫీసులోనికి తీసికొని వెళ్ళండి గాని, జనులను నిలిపి యుంచవద్దు.
99జనులు లేచి నిలచి, "మంచి సాక్ష కూటమును ఏర్పరచుదము, రండని పలుకుదురు." ఈ విషయములో నేను విమర్శించుట కాదు, సత్యమును చెప్పుచున్నాను, చూచారా. సత్యమును చెప్పవలెనని నేను భావించుచున్నాను, చూచారా. నేను కొన్నిసార్లు ఈ సాక్ష కూటములు మేలు కన్న కీడును చేయుటను చూచాను. నిజంగానే జరుగుచున్నది.
ఉజ్జీవ కూటము జరుగుచున్నపుడు ఒక వ్యక్తి లేచి తీవ్ర ఉద్రేకముతో సాక్ష్యము నిచ్చును. మీరు ఉజ్జీవ కూటమును ఏర్పాటు చేసి కొందరిని రక్షణలోనికి నడిపించవలెనని కోరుదురు, వాక్యమును చెప్పెదరు, దైవాశీర్వచనమును వారి మీదికి రప్పించగోరుదురు, వారి ఆత్మ భారమును దించగోరుదురు, కాని అటువంటి సమయములో ఒకరు మధ్యలో లేచి ప్రభువు నాకు చేసిన వన్నీ చెప్పుదునంటే ఎట్లుండునో ఆలోచించండి. గత వారం ఆయన నన్ను రక్షించెను గనుక నా హృదయము దేవుని కొరకు మండుచున్నదని చెప్పనారంభించును. అంతటితో దేవునికి వందనములు చెల్లించి ఆమేన్ అనినచో బాగుండును. ఆలాగయితే మంచిదే.
100కాని మీరు మరొకరిని పిలచి ఒక్క చిన్న సాక్ష్యమియ్యుడని కోరుచుందురు. ఆ తర్వాత ఎవరని అడుగుదురు. అటువంటి కూటము కొరకు ఒక రాత్రిని ప్రత్యేకముగా మీరు ఎన్నుకొనండి. ప్రార్థన కూటమునకు బదులుగా వచ్చే బుధవారం రాత్రికి సాక్ష్యపు కూటము జరుగునని ప్రకటన చేయుడి. అందరూ రావలెనని కోరుచున్నామని చెప్పండి. అది సాక్ష్యపు కూటమని చెప్పండి. వారు సాక్ష్యములను ఇయ్యుటకు వచ్చెదరు. వాక్యము చదవండి. ప్రార్థన చేయండి. ఇది సాక్ష కూటపు రాత్రి అని ముందే ప్రకటించినట్లు చెప్పండి, అపుడు జనులు గంట లేక నలుబది అయిదు నిమిషములు లేక ముప్పది నిమిషముల పాటు సాక్ష్యమిచ్చుదురు. వారి అనుకూల సమయానుసారంగా ముందుకు సాగించండి. నా భావమును గమనించారా? అదిమీ సహవాసులకు ఉపయోగపడును. ఆ విధంగా మీరు చేసిన యెడల అందరికీ అది ఉపయోగపడును.
101ఆలస్యమగుచున్నది… సోదరులారా, ఇది నా ఆలోచన. మీ హృదయములో ఉన్నదానిని నేను చూచాను. మీరడిగిన ప్రశ్నలకు ఇవే నా ఉత్తమ జవాబులు. ఇక నుండి మీరు తెలిసికొనుడి. మీ మనస్సులో ఏదయినా గాని వినండి. డీకన్, ట్రస్టీ, లేదా ఎవరైనా, జనులు టేపు వినగోరనిచో వారికి కూడా దానిని వినిపించండి. ఇది నా ఉత్తమ జవాబు. ఈ ఎనిమిదవ పెన్ స్ట్రీట్‌లో యున్న బ్రెన్హాం ఆలయమునకు ఇది దేవుని చిత్తము. పరిశుద్ధాత్మ నాయకత్వము క్రింద, సమస్త దయ మరియు ప్రేమతో ఈ ఆజ్ఞను కొనసాగించవలెనని సోదరులను కోరుచున్నాను. మీరు క్రైస్తవులని మీ దయను ఇతరులకు చూపించండి. క్రైస్తవులనగా ఎటుబడితే అటు త్రోయబడుటకు వీలయిన పసి పిల్లల వంటి వారు కారు. "ప్రేమతో నిండిన వారని అర్థము, జనసమూహము పట్ల దేవుని ప్రేమ ఎంత నిండుగాయున్నదో అంతే నిండు ప్రేమను వీరు చూపవలెను." నా భావము గ్రహించారా?
102మరేదయిన ప్రశ్న యున్నదా? టేపు అయిపోవుచున్నది. అక్కడ నా కొరకు కొందరు ఎదురు చూచుచున్నారు. ఎన్ని గంటలకు ఆయనచ్చట ఉండవలసియున్నాడు? [ఇప్పుడే అని బిల్లీపాల్ చెప్పెను.] ఇప్పుడే. ఒక్కడే వచ్చునా? [నేను తీసికొనివచ్చుదునని బిల్లీపాల్ చెప్పెను,] మంచిది. సరే.
మరేదీ చెప్పవలసినదిలేనియెడల మనము ముగించెదము. కాలిన్స్ సోదరుడా? [టేపు అపుచేసినచో బాగుండును అని కాలిన్స్ సోదరుడు చెప్పెను.] మంచిది. [టేపులో ఖాళీ యున్నది.]
103సోదరులారా, మీరు ఈ రాత్రి మాతో యున్నందుకు సంతోషించుచున్నాము. సహోదరుడు నెవిల్, డీకన్లు, ట్రస్టీలు, ఆదివారపుబడి సూపరింటెండెంటు తదితరులున్నారు. దేవుని యొక్క రాజ్యము కొరకు ఈ ఆజ్ఞలను మీరు కొనసాగించుటకు ప్రభువు సహాయము చేయునని నమ్ముచున్నాను. దీనిని నేను చెప్పుటకు కారణమున్నది, మీరు పిల్లలుగా లేరు, పెద్దలుగా ఎదిగియున్నారు. పిల్లలుగా ఉన్నపుడు మీరు పిల్లల వలె మాట్లాడితిరి, పిల్లల వలె మీరు అర్థము చేసికొంటిరి, కాని ఇప్పుడు మీరు పెద్దలు, కావున దేవుని మందిరములో పెద్దలవలె మనము ప్రవర్తించుదము. మనలను క్రమపరచుకొందము, మన పనులను గౌరవించుదము, ప్రతి వారి పనిని గౌరవించుదము. దేవుడు మనకిచ్చిన ప్రతి వరమును క్రమములో ఉంచి మన వరములు మరియు క్రియలతో దేవునిని ఘనపరచుదము.
మనము ప్రార్థించుదం:
104పరలోకపు తండ్రీ, ఈ కూడికను బట్టి ఈ రాత్రి నీకు వందనములు చెల్లించుచున్నాము. ప్రభువు యొక్క కార్యమును నిర్వహించుటకు కొందరికి కొన్ని పనులు అప్పగింపబడినవి, జెఫర్‌సన్ విల్‌లోని ఈ ఆలయములో వారు నిర్వహించచున్నారు. దేవా, నీ హస్తమును వారిపై ఉంచుము. వారికి సహాయము చేసి వారిని ఆశీర్వదించుము. దేవుని యొక్క రాజ్య ప్రగతి కొరకే ఇది ఉద్దేశించబడినదని ఈ జన సమూహము అర్థము చేసికొనునట్లు చేయుము. అవగాహన గల మనుష్యులముగా మేముండ వలెను. దేవుని యొక్క ఆత్మను ఎరుగ వలెను. ఏమీ చేయవలెనో తెలిసికొనవలెను. తండ్రీ, దానిని దయచేయుము. ఇప్పుడు నీ ఆశీర్వచనములతో మమ్మును పంపించుము. పరిశుద్ధాత్మ మమ్మును కాచి, నడిపించి, భద్రపరచును గాక! మా విధి నిర్వహణలో ఎప్పుడూ మేము నమ్మకస్థులముగా ఉందుము గాక! యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము. ఆమేన్.