వెలుగును ప్రసరింపచేయగల ఒకాయన ఉన్నాడు

వెలుగును ప్రసరింపచేయగల ఒకాయన ఉన్నాడు

1ఇప్పుడు తలలు వంచుదము. మా పరమ తండ్రీ, నీ మంచి తనము మరియు కృప కొరకు ఈ ఉదయకాలమున నీకు వందనములు చెల్లించుచున్నాము. ఇక్కడ మరల మేము కూడుకొను భాగ్యము అనుగ్రహించియున్నావు — నిత్యత్వమునకు ఈవలి వైపున — ప్రియుడగు ప్రభువైన యేసుక్రీస్తును ఆరాధించు భాగ్యము అనుగ్రహించియున్నావు. మమ్మును పాపపు జీవితము నుండి విడిపించి, ఆయన నీతి ద్వారా ఈ గొప్ప వారసత్వమును పొందునట్లుగా ఆయన భూమి మీదకు వచ్చినందుకు వందనములు చెల్లించుచున్నాను. ఈ ఉదయ కాలమున మేము ఆయన రాయబారులముగా ఇక్కడ ఉన్నాము, కనిపెట్టియున్న జనులకు జీవాహారమును విరచుటకు ఇక్కడికి వచ్చాము. ప్రతి మాటను పరిశుద్ధాత్మ ఆవేశపరచును గాక! మాకు అవసరమయిన రీతిగా దానిని జనుల యొక్క హృదయములలో పడవేయును గాక! దీనిని యేసు నామములో అడుగుచున్నాము. ఆమేన్. మీరు కూర్చొనవచ్చును.

2మీతో పాటు ఇక్కడ నిలబడుట గొప్ప భాగ్యమని ఈ ఉదయకాలమున నేను నిశ్చయముగా తలంచుచున్నాను. ప్రజలను మరింత సుఖముగా నుంచుటకు ఇక ఏ మాత్రము స్థలము లేనందుకు చింతించుచున్నాను. మన ఆలయము అంత పెద్దది కాదు. టుసాన్‌లోని మా ఇంటి యొద్ద నుండి వచ్చి సెలవులు ఇక్కడ గడుపుచున్నందుకు సంతోషించుచున్నాము. వాతావరణము కొద్దిగా కరుకుగా యున్నది, కాని ఇక్కడ మేము ఉండి ఈ కూటమును జరుపుటకు సంతోషించుచున్నాము

ఈ రాత్రి స్వస్థత కూటము లేదా రోగులకు ప్రార్థించుట యుండునని ప్రకటించగోరుచున్నాను. ఇప్పుడే బిల్లీకి నేను చెప్పాను. "మీరేమి చేయుదురని," అతడు నన్ను అడిగెను

"ఈ రాత్రి సుమారు 6:30 గంటలకు కొన్ని కార్డులు ఇమ్మని," నేను చెప్పాను. చూడండి. జనులు క్రిక్కిరిసి యున్నారు. కార్డు ద్వారా నంబరు పిలిచి ఒకరి తరువాత ఒకరిని పిలచుట వలనజనులు గుమిగూడుట ఉండదు. వారిని ఒకరి తరువాత ఒకరిని పిలచుదము. వారు వరుసలో నుండి వచ్చుచుండగా ప్రార్థన చేయుదము.

3మీరు రోగులుగా ఉన్నా లేదా మీ ప్రియులు రోగులుగాఉన్నా గాని 6:30 లేదా 7:00 గంటలకు రండి. ప్రార్థన కార్డును తీసికొనండి. మీరు వచ్చునప్పుడు అతడు గుమ్మములో నిలబడివాటిని ఇచ్చును.

బహుశా నేను మరలా చాలా కాలము వరకు ఇక్కడికి తిరిగి రానని తలంచుచున్నాను. ఎందుకనగా చాలా తీరిక లేని కార్యక్రమమున్నది. వసంత కాలము చివరి వరకు అమెరికాలోనే యుందును. ఈ ఎండా కాలము తరువాత కొద్దిగా ఆలస్యముగా తిరిగి వచ్చెదను. ప్రభుని చిత్తమయితే ఎయిర్ కండిషను గల స్థలము ఇక్కడ దొరికినచో తీసికొందము. నేను బిల్లీని అడుగగోరుచున్నాను; ఏడు బూరల మీద నేను మాట్లాడగోరుచున్నాను, ప్రభుని చిత్తమయితే ఏడు బూరలు గూర్చి ఇక్కడి కూటములో చెప్పెదను… ఏడు సంఘ కాలములు, ఏడు ముద్రలు అయినవి, ఇప్పుడు ఏడు బూరలు. జూన్‌లో అయితే సెలవులుండును, కనుక అందరును వచ్చుటకు వీలగును.

4ఈ ఉదయమున సహో. షెపర్డ్‌ను ఆస్పత్రి నుండి వచ్చుట చూచి చాలా సంతోషించుచున్నాను. నేనాయనను చూచుటకు ఒక దినమున వెళ్ళాను, షెపర్డ్ సోదరిని నిన్న నేను మీకు కాల్ చేయలేకపోయాను. మీరు నాకు పంపిన ఆ కల చాలా బాగున్నది. క్రీస్తు మేఘములలో తెల్లని గుర్రము మీద ఉండుట మీరు చూచారు, అయినా గాని బంధించబడి యుండెను. చూచారా? అది అదశ్యము కాక ముందు దానిని చూచుటకు మీ కుటుంబమంతయూ పోగయిరి. దాని భావము ఏమనగా, ఈ చివరి దినములలో ఆయన కదలికను మీరు గతించక ముందే కుటుంబసమేతంగా చూతురు అనియే. అది ఆత్మ సంబంధమైనది. మీ కుటుంబముకు అది చాలా మంచి ఆశీర్వచనము. ఆ కుటుంబము మహాశ్రమను దాటి ఇప్పుడున్న స్థితికి వచ్చియున్నారు.

5మరియు ఇప్పుడు, ఈ ఉదయమున మనకు ఒక విషాద సంగతి కూడా యున్నది. ఇక్కడికి నేను వచ్చినప్పటి నుండియూ మన ప్రశస్త స్నేహితులగు కోట్సు కుటుంబము ఈ ఆలయమునకు వచ్చుచున్నారు, వారిని మనమంతా ప్రేమించుదుము. వారు తూర్పు నుండి వచ్చిరి. అనగా షికాగో చుట్టు ప్రక్కల నుండి, సోదరి బిల్లీ హబీబ్, సోదరి ఆర్మ్‌స్ట్రాంగ్ మొదలగు వారు. వారుముందు నజరేన్ వారు, వారు ప్రభువు నొద్దకు వచ్చిరి. వారు మనకు ప్రశస్తమగు స్నేహితులు. కోట్సు దంపతుల వారి తల్లిదండ్రులు పశ్చిమము నుండి వచ్చుచూ యున్నారు. ఒకరు దారిలో జారిపోయి రోడ్డు మీద పడినందున, కోట్సు వెంటనే చనిపోయినది. టుసాన్‌లో నన్ను వారు పిలువనంపినప్పుడు, ఆమె నా కొరకు సిద్ధపరచిన తీయని పదార్థములు నా ముందు బల్లమీద ఉన్నవి. అప్పుడు నేనెట్లు అనుభూతి చెందానో మీకు తెలియదు. ఈ ఉదయమున ప్రభువుకు వందనములు చెల్లించుచున్నాను. ఆమెకు ఇక శ్రమ లేదు. ఆమె ముసలిదగుచున్నది. ఇక ఆమె బాధపడనక్కరలేదు. ఆమె దేవునితో యుండుటకు గృహమునకు వెళ్ళినది.

JOB 14:13

 

6ఆ బయట నున్న గదిలో నేను ఆమె యొక్క ఇద్దరు కుమార్తెలతో మాట్లాడితిని. ఇక్కడ ఈ ఉదయమున సహో. కోట్సు విరిగిన కొన్ని ఎముకలు కలిగియున్నాడు. ఆస్పత్రిలో అతడుండగా నేను పిలిచాను. మిస్సోరిలోని ఆస్పత్రిలో అతనిని చేర్చిరి. అతని ప్రక్కటెముకలు విరిగినవి, కాని నిజంగా అతడు ధైర్యశాలి, నిజక్రైస్తవుడు. తన చిన్న రాణి చనిపోలేదని అతడెరుగును. ఆమె క్రీస్తుతో కూడా సదా కాలము జీవించుచున్నది, మరియు ఒక ఐక్యమగు కాలము వచ్చును.

యోబు ఒకసారి ఇట్లనెను, "నీ ఉగ్రత నా మీద నుండి దాటిపోవు వరకు నీవు నన్ను సమాధిలో దాచి యుంచి రహస్య స్థలములో మరుగు చేసితివి."

JOB 14:13

 

7దేవుడు ప్రకృతిలో కూడా అదే చేయునని మీరు గమనించారా? ఈ చెట్లలో ఉన్న రసము శీతాకాలము వచ్చు ముందు ఆకులలో నుండి అడుగునకు పోవును. భూమి మీద ఉగ్రత కుమ్మరించబడక ముందే ఆలాగు జరుగును. చూడండి, ఒక కాలములో భూమి మీద శీతా కాలము లేదు. వెయ్యేండ్ల పాలనలో ఇక ఏ శీతా కాలములు ఉండవు. మీరు చూచారా? కాబట్టి అదియే భూమి మీద ఉగ్రత. ఆ ఉగ్రత కుమ్మరించబడక ముందే దేవుడు తన కృపను బట్టి రసమును నేలలో నున్న చెట్ల వేరులలోనికి పంపును. శీతాకాలము అను ఉగ్రత దాటిపోవు వరకు అక్కడే యుంచును. దానిని మరల వసంత కాలములో పైకి తీసికొని వచ్చును. "ఓ! నీ ఉగ్రత దాటిపోవు వరకు నీవు నన్ను సమాధిలో దాచి యుంచెదవు, రహస్య స్థలములో మరుగు చేసెదవు." మన సోదరి పట్ల ఆయన చేసినది అదియే. క్రైస్తవులందరికీ ఆయన అదే చేయును.

PS 23:4

 

8కోట్సు సోదరుడా, దేవుడు నిన్ను దీవించును. సంకట సమయములో దేవుని ముద్ర మన కొరకు నిలిచియున్న దానిని ఎరుగుట బట్టి నేనెంతో సంతోషించుచున్నాను. అతడు ఏ విధ వేదన భరించుచున్నాడో నాకు తెలియును, ఎందుకనగా కొన్ని సంవత్సరముల క్రితము నేనును ఆలాంటి దానినే ఎదుర్కొన్నాను. ఈ గొప్ప నదిని ఒకరి తరువాత ఒకరము దాటి పోవలసియున్నాము. ఒక దినమున నేను దాటు సమయము వచ్చును. ఒక దినమున మీరు దాటు సమయము వచ్చును. కాని దావీదు చెప్పినట్లుగా, "నీవు నాకు తోడైయుందువు గనుక, ఏ అపాయమునకు నేను భయపడను. నీ దుడ్డు కర్రయు నీ దండము నన్ను ఆదరించును," అని చెప్పెదను.

మన కోట్సు సోదరి సంస్మరణార్థము మనమంతా ఒక్క క్షణము లేచి నిలబడవలెనని కోరుచున్నాను. మన ప్రశస్త సోదరి ప్రభువుతో నుండ వెళ్ళినది. మన తలలు వంచుదము. కొద్ది రోజుల క్రితం ఈ ఆలయములో నడిచిన ఒకామెను జ్ఞాపకము చేసికొందము. మన మధ్యనే యుండి, మనతో కరచాలనము చేసినది. చక్కని క్రైస్తవురాలు. ఇప్పుడామె ప్రభువున్న స్థలములో యున్నది. కొద్ది కాలము క్రితమే ఆమెను నేను చూచాను. ఇప్పుడామె మరల ఒక యువతియై రానున్న తన కుటుంబము కొరకు ఎదురు చూచుచున్నది.

9మా పరమ తండ్రీ, మా కోట్సు సోదరి జ్ఞాపకముల బట్టి నీకు వందనములు చెల్లించుచున్నాను. ఆమె ఎంతో ప్రియమగు సోదరి. మనకు నిర్ణయించబడిన జీవిత కాలము మనము జీవించి, ఆ నదిని తప్పక దాటవలసి యున్నాము. ఆ కాలము వచ్చును, ఆమె శ్రమపడనక్కర లేదు గనుక నీకు వందనములు చెల్లించుచున్నాను. ఆమె బాధపడునట్లుగా చేయునది ఏదియూ లేదనియూ, ఆమె తిన్నగా దేవుని హస్తములలోనికి వెళ్ళినదనియు నేను నమ్ముచున్నాను.

ప్రభువా, ఈ ఉదయ కాలమున ఆమె భర్త, పిల్లలు ఇచ్చటున్నారు. వారి విధిని నిర్వహించుచున్నారు. ధైర్యముతో కూడిన విశ్వాసమును బట్టి నీకెంతగానో వందనములు చెల్లించుచున్నాను. మన తండ్రుల యొక్క విశ్వాసము ఇంకా జీవించియున్నది, చెరసాల, అగ్ని, ఖడ్గము దానిని ఆర్పలేక పోయినవి, వీటన్నిటి కొరకు నీకు వందనములు చెల్లించుచున్నాము.

ప్రభువా, ఆమె ప్రశస్త ఆత్మకు విశ్రాంతిని ఇమ్ము. ఆమె మా సోదరి. ఆమె లేనందున విచారము, కన్నీరు మా హృదయములలో పడుచున్నది, కాని ఆ కన్నీరు నుండియే ఆనందము పుట్టును. మరెన్నడూ చావు లేని అమర్త్య జీవితమును ఆమె జీవించుచున్నదని నీ వాక్య నిశ్చయతను బట్టి మేమెరుగుదుము. ఇప్పుడామె ఉన్నచోట ఇక ఏ ప్రమాదము లేదు. ఆమె తరువాత వచ్చు వారిని కలిసికొనుట కొరకే ఆమె ఎదురుచూచుచున్నది.

సహో. కోట్సును, ఆమె కుటుంబములో నున్న బాలికలను వారి ప్రియులను, ఆమెను ప్రేమించుచున్న వారందరిని ప్రభువా దీవించుము. తండ్రీ, ఒక దినమున ఆ గొప్ప స్థలములో కలిసికొందుమని నమ్ముచున్నాము. అక్కడ వ్యాధి లేదు, దుఃఖము లేదు, మరణము లేదు. ఆ సమయము వరకు మమ్ములనందరినీ ఆరోగ్యముతో నుంచుము. నిన్ను సేవించుచూ, ఆ దినము కొరకు ఎదురు చూచుచున్నాము. దీనిని యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాము. ఆమేన్.

ఆయన వాక్యమును ఇక్కడి ఈ ఆలయములో మనకు బయలు పరచుచున్న ఆ గొప్ప పరిశుద్ధాత్మ ఆమె గొప్ప ఆత్మను మనము కలిసికొను వరకు నెమ్మదిలో యుంచును గాక!

10ఇప్పుడు, ఈ ఉదయమున ఇక్కడ వేడిగాయున్నది, ఎందుకనగా మన శరీరములలో ఎక్కువ వేడి యుండును.

ఇప్పుడు, ఒక ప్రకటన చేయబోవుచున్నాను. కొన్నిసార్లు ఇక్కడి మన ఉదయకాలపు ఆరాధనలు చాలా దీర్ఘముగా యుండును, అయితే అంతసేపు ఉంచుట సరికాదు, ఎందుకనగా… గంట, గంటన్నర, కొన్నిసార్లు రెండు గంటలు ఉండును. అయితే నేను ఏమి చేయుచున్నాను. వాటిని టేపు చేయుచున్నాను, చూచారా? ఈ ప్రపంచమంతయూ వెళ్ళును. టేపు చేయుటకే ఇక్కడికి నేను వచ్చియున్నాను. అందుకే ఈ ఉదయము ఇంత సేపున్నాము. ఆ గదిలో తయారగుచున్నవి. చూడండి. అవి ప్రపంచములో ప్రతి చోటకు వెళ్ళును.

11ప్రభుని చిత్తమయితే ఇది అయిన వెంటనే రేపు ఉదయము ఆరిజోనాకు తిరిగి వెళ్ళుదును, ఎందుకనగా ఒక కూటమున్నది. అప్పుడు దక్షిణాదికి వెళ్ళిపోవుదును. జార్జియా, మిస్సిసిపి, టెక్సాస్, ఆలబామాల నుండి ప్లారిడాకు వచ్చుదుము.

నేను ఇక్కడి నుండి ఫీనిక్సుకు, ఆ తరువాత కాలిఫోర్నియాకు, తిరిగి డల్లాస్‌కు వచ్చుదును. వీలయితే సాన్ ఆంటోనియోలో ఆగుదును. ఆలాగున ఆలబామా మరియు ప్లారిడా వెళ్ళుదును. కాబట్టి ప్రభుని చిత్తమయితే అక్కడున్న మీ అందరిని నేను చూచుదును.

12మీరు మా కొరకు ప్రార్థించుడి. ఈ వచ్చే ఎండా కాలము కొన్ని దినముల పాటు ఇక్కడ కూటములు పెట్టవలెనని ప్రభువు మా హృదయములో భారముంచెను.

నాకు కొన్ని కూటములు ముందే నిర్ణయించబడినవి. న్యూయార్కు లోనున్న మీకు ఆ దర్శనములో స్కాండినేవియా దేశపు కూటముల గూర్చి చెప్పబడినది తెలియును. మీకది గుర్తున్నదా? నేను న్యూయార్కులో నుండగా, ఆ దర్శనము వచ్చినది. ఒక కారణమును బట్టి ప్రతి ఆ ముందుగా నిర్ణయము చేయబడిన కూటము రద్దగును. ఇక్కడున్న మీలో చాలా మందికి నేను న్యూయార్కులో నుండగా ఆ సంగతి చెప్పినట్లు గుర్తున్నది. సరిగ్గా ఆలాగే జరిగినది, ఎందుకనగా వారందరూ ఒకే దినమున ఆ భవనము కావలెననిరి. అందువలన జరుగలేదు. కాబట్టి జూన్‌లో కొంత ఖాళీ యుండును. ప్రభుని చిత్తమయితే ఇక్కడికి మరల వచ్చి ఆ బూరల గూర్చి త్వరలోనే చెప్పవలెననుకొనుచున్నాను, చూచారా. కాబట్టి ప్రతిదియు సరిగానే సమకూడి జరుగుచున్నదని మనమెరుగుదుము. కాబట్టి ఆలాగు నా హృదయములో ఉన్నది. ఆయన మనలను చేయగోరునది అదియే కావచ్చును

13ఇప్పుడు, ఆ బయట హాలులోను ఇంకా ఇతర చోట్ల మీరు ఒకరికొకరు సీట్లు మార్చుకొనుట నాకు కనబడుచున్నది. మనకు కూర్చొను స్థలమున్నచో బాగుండుననుకొనుచున్నాను. ఆ బూరల గూర్చి చెప్పుకొనుటకు హైస్కూలు జిమ్నాజియంను తీసికొందము. అది ఏబది-అయిదు వందల మంది కూర్చొనుటకు సరిపోవుననుకొనుచున్నాను. అప్పుడు అందరూ కూర్చొనుటకు అవకాశము కలుగును. మేము బోధించుచుండగా నెమ్మదిగా విందురు. బూరల గూర్చి చెప్పు కొనుట చాలా మంచిది.

చూడండి, ఏడు బూరలును, క్రీస్తు యొక్క రాకడను ఏడవ ముద్ర విప్పు ముందుగా ఆరవ ముద్రలో ఊదబడినవి.

14ఈ రాత్రి ఒక అతి ప్రాముఖ్యమగు వర్తమానము నాకున్నది. స్వస్థతా కూటము ముందుగా నేను దానిని మాట్లాడగోరుచున్నాను. మీరు ఇక్కడ ఉండి పోగోరినచో మంచిదే. వీలయితే కొద్దిగా ముందు ప్రారంభించుటకు ప్రయత్నించుదము, ఎందుకనగా ప్రార్థన వరుస యుండును. నేను మరీ ఎక్కువసేపు ప్రసంగించను, కాని సంఘమునకు కొంతసేపు నేను చెప్పవలసినది యున్నది. ఈ కాలములో జరుగుచున్న సంగతుల గూర్చి చెప్పవలెను. మనము ఎచ్చట నిలబడి యున్నామో నాకు తెలిసినంతవరకు వాక్యమును బట్టి చెప్పగోరుచున్నాను.

మీరు కూడా నాతో పాటు ఈ ఉదయమున వాక్యము తీసి చూడండి. యెషయా గ్రంథము 42వ అధ్యాయము నుండి తీసి చదువగోరుచున్నాను.

15సహో. డాచ్ ఈ ఉదయము మనతో కూడా కూర్చొనుట బట్టి మనము చాలా సంతోషించుచున్నాము. ష్రీవ్‌పోర్టులో అతడు జీవించడు అని వారనుకొనిరి, అతనికి నిశ్చయముగా విశ్వాసమున్నది. అవునండీ! అతడు దానిని దాటిపోయి యున్నాడు; ప్రభువాయనను దీవించెను, చూడండి. డాచ్ సోదరునికి తొంబది-ఒక్క సంవత్సరములు. గుండె పూర్తిగా చెడినది. ఇంకా గుండె పోటు వచ్చినది. ఇక అతడు బ్రతుకు మార్గము ఏదియూ కనబడుట లేదని అతని వైద్యుడే చెప్పెను. సహో. డాచ్ బ్రతికియున్నాడు. ఆ వైద్యుడు చనిపోయెను. చూడండి. సహో. డాచ్ ఇక్కడ కూర్చొనెను.

గుండె పోటు, గుండె వ్యాధితో నున్న వ్యక్తి తొంబది-ఒక్క సంవత్సరముల వాడై కూర్చొనియున్నాడు. నేను అక్కడికి వెళ్ళినప్పుడు అతడు వీధిలో గుండా వచ్చుట నాకు కనబడినది. ఆయనను ఆలయములో నేను చూచాను. నేను వెళ్ళి ఒక ఆక్సిజను గుడారము క్రింద ఈలాగు చెప్పాను, ప్రభువు నామము పేరట మరల నిన్ను ఆలయములో చూచి వీధిలో నీతో కరచాలనము చేయుదును, ఆ మరుసటి ఆరాధనకే అతడు ఇక్కడ యున్నాడు. ఈ ఆలయములో కూర్చొని యున్నాడు. మేము లూయిస్‌విల్‌కు వెళ్ళి బ్లూబోయర్ యొద్ద భోజనము చేశాము. నేను కారు దిగి వీధిలో నడవసాగాను. సహో. డాచ్ నడచి వచ్చుట నాకు కనబడెను. అంతా పరిపూర్ణముగా జరిగినది. ప్రభువు ఎట్లు ఆయనను దీవించెనో చూడండి.

ISA 42:1-7

 

16ఇప్పుడు, ఈ రాత్రి స్వస్థత గూర్చి, ఇంకా ఆయా సంగతుల గూర్చి మాట్లాడుదుము. ఈ రాత్రి మీకు చెప్పుటకు కొన్ని అసాధారణమగు నిజ సంగతులున్నవి.

వారు తయారు చేయచున్నారు. యెషయా 42వ అధ్యాయము 1 నుండి 7వ వచనములు మరియు మత్తయి 4వ అధ్యాయము 15, 16వ వచనములు చదువుదము.

యెషయా 42వ అధ్యాయము నుండి చదువనై యున్నాము.

ఇదిగో నేను ఆదుకొను నా సేవకుడు. నేను ఏర్పరచుకొనిన వాడు నా ప్రాణమునకు ప్రియుడు. అతని యందు నా ఆత్మను ఉంచియున్నాను. అతడు అన్యజనులకు న్యాయము కనుపరచును.

అతడు కేకలు వేయడు, అరవడు, తన కంఠ స్వరము వీధిలో వినబడనియ్యడు.

నలిగిన రెల్లును అతడు విరువడు. మకమకలాడుచున్న జనుపనార వత్తిని ఆర్పడు. అతడు సత్యము ననుసరించి న్యాయము కనుపరచును. భూలోకమున న్యాయము స్థాపించువరకు అతడు మందగిలడు.

నలుగుడు పడడు. ద్వీపములు అతని బోధ కొరకు కనిపెట్టును.

ఆకాశములను సృజించి, వాటిని విశాలపరచి, భూమిని అందులో పుట్టిన సమస్తమును పరచి దానిమీద నున్న జనులకు ప్రాణమగు దానిలో నడచు వారికి జీవాత్మను ఇచ్చుచున్న దేవుడైన యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు.

గుడ్డివారి కన్నులు తెరచుటకును, బంధింపబడిన వారిని చెరసాలలో నుండి వెలుపలకు తెచ్చుటకును చీకటిలో నివసించు వారిని బంధీగృహములో నుండి వెలుపలికి తెచ్చుటకును.

యెహోవానగు నేనే నీతి విషయములో నిన్ను పిలిచి నీ చేయి పట్టుకొనియున్నాను. నిన్ను కాపాడి ప్రజల కొరకు నిబంధనగాను, అన్యజనులకు వెలుగుగాను నిన్ను నియమించి యున్నాను.

MATT 4:12-17

 

17ఇప్పుడు, మత్తయి సువార్త 4వ అధ్యాయము చదువగోరుచున్నాను. యెషయా ద్వారా ఇవ్వబడిన ప్రవచనమునకు ఇదినెరవేర్పు. మత్తయి 4వ అధ్యాయము 12వ వచనము నుండి ప్రారంభించి చదువుదము. సాధ్యమైతే మనము 15వ వచనము బదలు, 12వ వచనము నుండి ప్రారంభించి చదువుదము.

యోహాను చెరపట్టబడెనని యేసు విని గలిలియకు తిరిగి వెళ్ళి;

…నజరేతు విడిచి జెబూలూను, నఫ్తాలి అను దేశముల ప్రాంతములలో సముద్ర తీరమందలి కపెర్నహూముకు వచ్చి కాపురముండెను.

— జెబూలూను దేశమును, నఫ్తాలి దేశమును యొర్థాను కావల నున్న సముద్ర తీరమున అన్యజనులు నివసించు గలిలియయు చీకటిలో కూర్చుండి యున్న ప్రజలును గొప్ప వెలుగు చూచిరి.

మరణ ప్రదేశములోను మరణచ్ఛాయలోను కూర్చొన్నవారికి వెలుగు ఉదయించెను, అని ప్రవక్తయైన యెషయా ద్వారా పలుకబడినది నెరవేరునట్లు ఈలాగు జరిగెను.

అప్పటినుండి యేసు — పరలోకరాజ్యము సమీపించియున్నది గనుక మరుమనస్సు పొందుడని చెప్పుచు ప్రకటింప మొదలు పెట్టెను.

MATT 4:12-17

 

18చదువబడిన ఆయన వాక్యమునకు ప్రభువు తన దీవెనలు దయచేయును గాక.

ఎవరో మాట్లాడుచూ చెప్పిన మాటనే నేను ఒక అంశముగా తీసికొన గోరుచున్నాను. "వెలుగును ప్రసరింప చేయగల ఒకాయన ఉన్నాడు."

ఇప్పుడు మనము వెలుగు అను అంశము మీద మాట్లాడుకొనుచున్నాము. ఇంతకు ముందు మనము టుసాన్ లేదా ఫీనిక్సులలో యేసు ఎందుకు బెత్లేహేముకు వచ్చెనో అని మూడు అంశముల ప్రకారము మాట్లాడుకొన్నాము. ఇది ఆ వరుసలోనే యుండును. అయనే బేత్లేహేము. బేత్ (B-e-t-h) అనగా "ఇల్లు;" ఏల్, ( e-l) అనగా "దేవుడు;" హేము (e-h-a-m) అనగా "రొట్టె." "దేవుని రొట్టెల ఇల్లు." క్రీస్తు నందు పుట్టిన ప్రతి క్రైస్తవుడు దేవుని రొట్టెల ఇల్లు అగు బేత్లేహేములోనే పుట్టియున్నాడు.

1SAM 22:8•

2SAM 23:8,14

 

19దావీదును ఒక మాదిరిగా చూపితిని, అతడు తన స్వజనుల నుండి వెళ్ళగొట్టబడి యున్నాడు, ఒక పరదేశి, మరియు అతడు వెలివేయబడెను. బేత్లేహేము ముట్టడి వేయబడినది, మరియు ఫిలిష్తీయులు బెత్లేహేము చుట్టూ దండెత్తిరి. దావీదు ఒక నిరాశ్రయుడు, నేటి క్రీస్తు యొక్క సంఘమునకు మాదిరిగా యున్నాడు — క్రీస్తుకు మాదిరి. చూడండి, క్రీస్తు ఈనాడు తన స్వంత సంఘమునకు పరదేశిగా యున్నాడు, తిరస్కరించబడిన వానిగానున్నాడు. దావీదును తిరస్కరించిరి, అయినా అతడు రాజుగా అభిషేకము పొందెను… ప్రవక్త అతనిని అభిషేకించెను.

ఈ సమయములో అతడు తన స్వజనులచే తిరస్కరించబడెను, అతడు చాలామంది యోధులగు అన్య జనులను ఏరుకొనెను. అందులో ఒకడు ఖడ్గముచే ఒక్క రోజులోనే ఎనిమిది వందల మందిని చంపెను, మరొకడు ఒక మంచు పడుచున్న దినమున గోతిలోనికి దూకి సింహమును చంపెను. వారు చిక్కుడు కాయలు పోగుచేసికొనుచుండిరి, వారందరూ పారిపోయిరి, అతడు నిలబడి తన చేయి అలసిపోవు వరకు వారిని చంపుచునే యుండెను. వారు గొల్యాతు యొక్క బలము గల సోదరులను కూడా చంపిరి. యోధులు దావీదును హత్తుకొని యుండిరి, ఎందుకనగా అతడు అధికారములోనికి వచ్చుచున్నాడని వారికి తెలియును. అందుకే వారికెవరు ఏమి చెప్పినా లెక్క చేయలేదు. దావీదు మీద దేవుని యొక్క అభిషేకమున్నది, మరియు దానిని వారెరుగుదురు. వారు అన్యులు. వారందరూ తిరస్కరించినా గాని, అతడు అధికారములోనికి వచ్చుచున్నాడని వారు తెలిసికొనిరి.

REV 3:20

 

20క్రీస్తు కూడా నేడు తృణీకరించబడినవాడుగా నున్నాడు, ఒక పరదేశి? మీరు అందుకు అభ్యంతరము చెప్పవచ్చును. బైబిలు ప్రకారము చూడండి… ఏడు సంఘ కాలములలోని లవొదికయ సంఘమును చూడండి. క్రీస్తు తన సంఘమునకు వెలపట నిలచియున్నాడు, తృణీకరించబడెను, మరల లోనికి రావలెనని ప్రయత్నించుచున్నాడు, చూచారా. ఆయన తన స్వసంఘమునకే పరదేశి అయ్యెను. ఆలాగు ఆయన అగుటకు కారణము ఆయన వాక్యముగా నుండుటయే, మరియు వారు వాక్యమునకు చోటియ్యరు — బదులుగా వారి స్వంత సిద్ధాంతములున్నవి.

ఆ గొప్ప ఆపదలో వారు దావీదు చుట్టూ ఆ అన్యులే యోధులుగా నిలబడిరి.

21బెత్లేహేము ఎట్లు రూపొందినదో మీరు గమనించారా? ఆ అంశము మనది కాదు. బెత్లేహేమును కనుగొనిన వాడు, వేశ్యయగు రాహాబు యొక్క అతని కుమారుడు. అది ఒక గోధుమల కేంద్రము, మరియు అక్కడ చాలా చక్కని నీరున్నది. అతడు ఆ చిన్న పట్టణమును కనుగొనెను. అది అన్నింటి కన్న చిన్న పట్టణము, ఎందుకనగా ప్రవక్త ఈలాగు చెప్పెను, "యూదయ బెత్లేహేమా, నీవు ఎంత మాత్రము అల్పమైనదానవు కావు… ఎందుకనగా నా జనులను ఏలువాడు నీలో నుండి వచ్చును." ఆ చిన్న పట్టణములో నుండియే వచ్చును.

దావీదును వారు ఎన్నుకొనిరి, అతని సోదరులు చాలా చక్కని వారు, ప్రవక్తయగు సమూయేలు వారిని అభిషేకించ వెళ్ళెను, వారందరూ అచ్చట నిలబడి యుండిరి, మహాయోధులు. వారు రాజుల వలె కనబడిరి, కాని అందరూ తృణీకరించిన దావీదును ఆయన ఎన్నుకొని తైలముతో అభిషేకించెను. తిరస్కరించబడిన పట్టణమునే క్రీస్తు ఎన్నుకొనెను (చూచారా), తిరస్కరించబడిన దానిని.

2SAM 23:14,15•

MATT 1:5

 

22అన్యురాలైన రూతు వలన బోయజుకు ఓబేదు, అతడి నుండి యెష్షయి, యెష్షయి నుండి దావీదు వచ్చెను అని మనము కనుగొన్నాము. ఆ కొండ ప్రక్కనున్న ఒక చిన్న పశులపాక రాజాధి రాజగు యేసుక్రీస్తును, దావీదునకు ఆత్మీయ కుమారుడగు వానిని తీసికొని వచ్చెను.

దావీదు ఈ పట్టణములో జన్మించెను, అతడు ఈ చిన్న స్థలమునకు రావలసి వచ్చెను. దానిని బెత్లేహేము అని పిలచిరి, అనగా "దేవుని రొట్టెల ఇల్లు" అని అర్థము. ఆయనే ఆ దేవుని యొక్క రొట్టెల ఇల్లు.

దావీదు ఆ దినమున ఆ కొండ మీద పడియుండి క్రిందికి చూచెను, ఎండ వలన దాహము గొని యుండును, ఫిలిష్తీయులు చుట్టుముట్టుట కనబడెను. ఇట్లు తలంచెను, "ఓ! ఆ బావి నుండి మరియొకసారి నేను నీరు త్రాగిన యెడల ఎంత బాగుండును!" తనను ప్రేమించుచున్న వారికి అతడి యొక్క కనీస ఆలోచనే ఒక ఆజ్ఞ.

RUTH 4:17•

MATT 5:18

 

23నేడును ఆలాగే యున్నది, యేసు యొక్క కనీస ఆలోచన — ఆయన యొక్క మాట ఏమిటి — ఆయనను ప్రేమించుచున్న అన్యులమగు మనకు అది ఒక ఆజ్ఞ. ఆయన ఎంత తృణీకరించ బడినా గాని అధికారములోనికి వచ్చుచున్నాడని మనకు తెలియును. భూమ్యాకాశములు గతించును గాని ఆయనమాట మాత్రము ఎప్పుడు పరిపాలన చేయును. ఆయన అధికారములోనికి వచ్చుచున్నాడని మనకు తెలియును, ఎందుకనగా అది జరుగకుండా ఏదియూ అడ్డగించజాలదు. ఇది క్రీస్తును గూర్చిన ప్రత్యక్షత, వాక్యము ఏమి చెప్పినదో ఆ ప్రకారమే జరుగును, ఎందుకనగా ఆయనే వాక్యము. ఆయన యొక్క ఆజ్ఞ ఎంత చిన్నదయినా గాని పరవాలేదు… తిరిగి బాప్తిస్మము పొందుటయినా, మరేదయినా దానిని మనము చేయుదుము. అది ఆయన యొక్క ఆజ్ఞ.

2SAM 23:8

 

24దావీదు యొక్క అల్పమగు ఆలోచన వారికి ఒక ఆజ్ఞగా యుండెను, ఈనాటి అన్యసంఘమునకు మాదిరి, వారు యోధులు, చూచారా. దావీదు పక్షమున నిలబడిన వారు అన్యులు, కాని యోధులు. వారికి భయము లేదు. భయమనగా ఏమిటో వారెరుగరు.

ఒకడు ఖడ్గము తీసికొని ఎనిమిది వందల మందిని చంపెను. ఎట్టివాడు! ఒక ఐగుప్తు వీరుడు పొడవైన ఈటెతో పరుగెత్తికొని వచ్చెను; అతని చేతిలో ఒక కర్ర మాత్రమే యున్నది. ఆ కర్రతో అతడు అతని చేతిలోని ఈటెను పడగొట్టి, ఆ ఈటెతోనే వానిని చంపెను, చూచారా.

అందులోని ఒక యోధుడు పధ్నాలుగు అంగుళముల వ్రేళ్ళు కలిగి యుండెను. నీ వ్రేలు నీ చేయి ముడిచినంత పొడుగు మాత్రమే ఉండును; దానిని తెరచినచో ఇరవై ఎనిమిది అంగుళముల పొడవు గల చేయిగా నుండును. వాని మీద పడి వెంటనే వానిని చంపెను, చూచారా. ఎందువలన? ఒక పరాక్రమశాలిగా ఆ అన్యుడుండెను, అభిషేకము పొందినవాడు అధికారములోనికి వచ్చుచున్నట్లు ఎరిగి యుండిరి.

2SAM 23:15-17•

1COR 10:4

 

25మీరు గమనించారా? చివరకు దావీదు అధికారమునకు వచ్చినప్పుడు వారిని పట్టణముల మీద అధికారులనుగా నియమించెను. యేసు కూడా అదే వాగ్ధానము చేయలేదా? అలాగే అప్పుడు అధికారులనుగా చేయును.

దావీదు దాహముగొని నీళ్ళు త్రాగగోరెను. బహుశా అతని యొద్ద నిలువ నీరుండెను. కాని అతడు బెత్లేహేములోని తాజా జలము గూర్చి ఆలోచించెను, "దేవుని రొట్టెల ఇల్లు." వారు ఖడ్గము దూసి పదిహేను మైళ్ళలో నున్న ఫిలిష్తీయులను హతము చేసి, ఆ బావిలో నుండి నీళ్ళు తెచ్చిరి. దావీదు అడుగలేదు గాని వారు తెలిసికొనిరి. ఇద్దరు పోరాడుచుండగా, మరొకడు నీళ్ళను తీసికొని వచ్చి దావీదునకు ఇచ్చెను. ఆ పరాక్రమమును గూర్చి తలంచండి!

భక్తిగల దావీదు ఇట్లనెను, "తమ ప్రాణములను ఒడ్డి ఈ స్నేహితులు తెచ్చిన నీళ్ళను నేను త్రాగను." అతడు పానార్పణముగా ఆ నీళ్ళను నేల మీద ప్రభువునకు పారబోసెను: "ప్రభువునకు ఇయ్యుడి. దానికి ఆయనే యోగ్యుడు" గాని నేను కాదు.

క్రీస్తునకు మాదిరి అది. ఆయన తనలోనే నిత్య జీవము కలిగియున్నాడు, కొట్టబడిన బండ, మన కొరకు పాపప్రాయశ్చిత్త బలిగా, ఈ వాక్యము జీవించునట్లు, ఆయన తన జీవమును నేల మీద ఒలికించెను.

26ఓ! అన్యులు! నేను చెప్పినట్లుగా నాతో కూడా ఎవరు ఖడ్గమును దూయుదురు? ఈ ఉదయము ఆయనకు తాజా జలము కావలెను. ఈ పాతగిలిన సంఘ సిద్ధాంతములు, మనము ఆటలాడుకొనుచున్న ఈ సంగతులు ఆయనకు వద్దు. ఆయన వాక్యములోని ప్రతి మాటను నమ్ము అసలయిన విశ్వాసము గలవారు ఆయనకు కావలెను. మనము బావి యొద్దకు వెళ్ళి సేదదీర్చుకొనుటకు నీరు తెచ్చుదము. మత విశ్వాసము, శాఖ మీద కట్టబడిన ఆరాధన కాదు గాని, ఒక అసలయిన ఆత్మీయారాధన, క్రీస్తు మన మధ్య తాను జీవించవలసిన రీతిగా జీవించు అవకాశమును ఇయ్యవలెను. మత విశ్వాసులు మొదలగునవి కావు, ఆయనను ఆ రీతిగా కలిగి యుందము.

GEN 37:5

 

27ఇప్పుడు, యోసేపు దినములలో దేవుడు ఒక కల ద్వారా జనులతో మాట్లాడిన విధమును గమనించండి. కల రెండవ విధానమని మీరు గమనించండి; దేవుడు ఆ విధముగా పనిచేయును. కొందరికి కలలు వచ్చును గాని వాటికి ఎట్టి అర్థముండదు. మితిమీరి తినుట వలన నీకు పీడకల రావచ్చును. కల రెండవ విధానము, చూచారా. మంచిది, దేవుడు తన స్వంత కుమారుని రెండవ విధానము ద్వారా ఎందుకు కాపాడెను? ఆయన యోసేపునకు కనబడెను. తన స్వంత బిడ్డ యొక్క సంక్షేమమును ఆయన రెండవ విధానము ద్వారా కనుపరచెను. దాని గూర్చి మీరెన్నడైనా ఆలోచించారా? ఎందుకనగా దేశమందు ప్రవక్త లేడు. ఆయన కలల ద్వారా పనిచేయవలసి వచ్చెను. భావము చెప్పబడవలసినది కల కాదు. ప్రభుని దూత ఇట్లు చెప్పెను, "యోసేపూ, నీ భార్యయగు మరియను చేర్చుకొనుటకు భయపడవద్దు. ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భము ధరించినది."

MATT 1:20

 

28ఆలాగు జరుగుట ఒక అసాధరణము. యోసేపు నీతిమంతుడు; దేవుడు అసాధరణమగువాడు. అసాధరణమగు వాటిని అర్థము చేసికొనుట కష్టము. అందువల్లనే ఈనాడు సత్యమును అర్థము చేసికొనుట కష్టముగా నున్నది; అది అంత అసామాన్యముగా నున్నది. పురుషుని ఎరుగకుండా ఒక స్త్రీ గర్భము ధరించుట ఒక అసామాన్యము. కాని నీవు యధార్థముగా నున్నచో, దేవుడు ఒక కలలో నీకు కనబడును. నీకు కలిగిన ప్రతిది అనగా నీ మనస్సు, నీ ఈల, నీ పాట, నీ సాక్ష్యము, ప్రతిది పూర్తిగా దేవునికి సమర్పించబడవలెను. నీవు దేవునిని అనుమతించినచో, ఆయన దానిని వాడుకోగలడు.

29తప్పించుకొనుట అను అంశము మీద, మానవుడు ఎట్లు తప్పించుకొనునో సహోదరుడు నెవిల్ ఒకరాత్రి బోధించెను. అది గమనించదగినది, ఈ ఉదయమున పరిశుద్ధాత్మ నన్ను వెలుగు అను అంశము మీదకు నడిపించెను, తొట్టిలో క్రీస్తు జీవితమును గూర్చి చెప్పిన వెంటనే ఇదియున్నది. మన అంశములో తిరిగి దానిని చూతుము. దానిని అతడు ఎరుగడు; నాకు అది తెలియదు; ఇక్కడ మరల అదే జరుగుచున్నది, చూచారా. ఆయన వెంటనే సేవలోనికి ప్రవేశించుచున్నాడు. ఈ రాత్రి దానికి సరిపడు ఒకదానితో ప్రభుని చిత్తమయితే మాట్లాడుకొందము.

GEN 1:3

 

30ఇప్పుడు, మరణ ప్రాంతములలో కూర్చొనియున్న అన్యులు గొప్ప వెలుగు చూచిరి, వారి మధ్య గొప్ప వెలుగు ఉదయించెను. జెబూలూను,నఫ్తాలి, గలిలయ చుట్టూ నున్న అన్యుల గొప్ప వెలుగును చూచిరి.

బైబిలులో వెలుగును మొదటి సారిగా ఆదికాండము 1:3లో కనుగొందము. దేవుని యొక్క పలుకబడిన వాక్యము వెలుగును చేసెను. "వెలుగు కలుగును గాక," అని దేవుడు పలుకగా — ఆదికాండము 1:3లో — వెలుగు కలిగెను.

ఇప్పుడు గుర్తుంచుకొనండి, దేవుని యొక్క పలుకబడిన మాట ద్వారా వెలుగు వచ్చెను. ఆయన వెలుగును గూర్చి పలికినమాటకు అది ప్రత్యక్షత. వెలుగు అనునది లేనప్పుడు, "వెలుగుకలుగును గాక" అని దేవుడు పలుకగా, వెలుగు కలిగెను. అది ఒక రుజువు; వెలుగు ఆయనచే పలుకబడిన మాటకు ప్రత్యక్షత. నేడును ఆలాగే యున్నది: ఆయన యొక్క పలుకబడిన మాటకు అది ఒక ప్రత్యక్షత.

GEN 1:1

 

31ఆయన మాట బయలు పరచబడుట లేదా ఇతర మాటలు తెలియచేయబడుట, నిరూపించబడుట మీరు చూడండి. ఆయన పలికిన మాట యొక్క వెలుగు, వెలుగు లేకుండా ఏదియూ జీవించజాలదు. సూర్యుని వెలుగు వల్లనే ఈ భూమి మీదనున్న వృక్ష జీవము మొదలుకొని సమస్తమును జీవించుచున్నది. దేవుని కుమారుడు లేనిచో నిత్యజీవము లేదు, చూచారా. ఆయనే వెలుగు.

భూమి నిరాకారముగా నుండెనని మనము కనగొందుము.

నేడు పాఠశాలల్లో ప్రపంచము చాలా మిలియనుల సంవత్సరముల నాటిదని చెప్పి వాదించుచూ, బైబిలును నిందించుటకు ప్రయత్నించుచున్నారు, అది తప్పు అనుచున్నారు; వారు ఎన్నడూ బైబిలు చదువలేదు; అంతే. ఎందుకనగా ప్రపంచము ఎంత పురాతనమైనదో బైబిలు మనకు చెప్పుట లేదు; "ఆదియందు దేవుడు భూమ్యాకాశములను సృజించెను," అని బైబిలు చెప్పెను. ఎప్పుడో, ఏలాగో, అది మనమెరుగము, ఆ మాట అంతటితో సమాప్తమాయెను.

GEN 1:1-5

 

32"ఆదియందు దేవుడు భూమ్యాకాశములు సృజించెను." అది వందల మిలియనులు లేక బిలియనులు లేదా మరెంతయినా కావచ్చును. ఏలాగు చేసెనో అది ఆయనకే తెలియును. అది నా పని కాదు, కాని భూమి నిరాకారముగాను, శూన్యముగాను ఉండెను. భూమి మీద జలముండెను, దేవుడు జలముల మీద సంచరించి, "వెలుగు కలుగును గాక"! అనెను.

సూర్యుడు ఇంకా తదితరములగునవి అప్పటికే ఉన్నవని నేను నమ్ముచున్నాను. చంద్రుడు గూర్చి ఆదికాండము 3లో ఉన్నదని నమ్ముచున్నాను. కాని ఇక్కడున్నది ప్రపంచము అని నేను నమ్ముచున్నాను… దానిని మనము ఉపయోగించుకోనై యున్నాము; కాబట్టి అది కదిలి వచ్చినది; భూమి యందంతట మంచు, పొగ మంచు కప్పి యుండుట వలన చీకటి ఏర్పడినది. అప్పుడు దేవుడు "వెలుగు కలుగును గాక!" అని పలుకగా, చీకటి పోయి ఒక నిర్మల ఆకాశము కనబడెను.

GEN 1:1-5

 

33దేవుడు కార్యములను చేయు విధానము ఆలాగేనని నేను నమ్ముచున్నాను. బైబిలులో ఆ తరువాత 4వ వచనము ఇట్లు చెప్పుచున్నది, "ఆయన చీకటి నుండి వెలుగును వేరుపరచెను. వెలుగును ఆయన పగలనియు, చీకటిని రాత్రి అనియు," ఆయన పిలచెను. దేవుని వాక్కు ఎల్లప్పుడూ చీకటి నుండి వెలుగును వేరు చేయును (చూచారా), చీకటి నుండి వెలుగును వేరుపరచునది వాక్యమే.

దేవుడు ఎప్పుడూ అదే చేయును. ఆయన దేనినయినా గాని వాడుకొనుటకు సిద్ధమగు నప్పుడు, చీకటి నుండి వెలుగును వేరుపరచవలసి యుండును. నక్షత్రమును ఉపయోగించు ముందును ఆలాగే ఆయన చేసెను. ఒక గుంపు జనులను ఆయన వాడుకొను ముందు కూడా వారిని చీకటిలో నుండి వేరుచేయును. ఒక వ్యక్తిని వాడుకొను ముందు, ఆయన ఆ వ్యక్తిని చీకటిలో నుండి వేరు చేయును, చూచారా.

వెలుగు దేవుని ద్వారా వచ్చును. గుర్తుంచుకొనండి, ఆయన పలికిన మాట ద్వారా వెలుగు వచ్చెను. "వెలుగు కలుగును గాక!" అని దేవుని యొక్క వాక్యము పలికెను. అప్పుడు వెలుగు లేదు. ఆయన చీకటి నుండి వెలుగును వేరు చేయుటకు వెలుగును పంపెను.

ఈ ఆజ్ఞ వాక్యమే ఆకాశమును నిర్మలము చేసెను, అప్పుడు సూర్యుడు ప్రకాశించకలిగెను. ఈనాడు ఆయన వాక్యము సమస్త అవిశ్వాస వాతావరణములను పారద్రోల కలుగుచున్నది.

34ఈ ఉదయమున ఈ వేదిక యొద్దకు వచ్చు ముందు ఇంటర్వ్యూలో పదకొండు మందితో మాట్లాడాను.

ఒక రోజున నా చిన్నస్నేహితుడగు జిమ్ పూల్, అతని చిన్న బాలుని తీసికొని వచ్చెను, వారతనికి గుండెపోటు వచ్చినదని తలంచి ఆస్పత్రికి తరలించిరి. ఆ చిన్నవానికి ఆయాసము అని తెలిసినది. అతని చిన్నగుండె ఆయాసముతో, ఊపిరి సలపక ఎగురుచున్నది. ఊపిరి అంద నందున అతడు కేకలు వేయుచుండెను. ఆ చిన్నవాడు చనిపోవుచున్నట్లే కనిపించెను. నేను వైద్యశాలకు వెళ్ళవలెనని నిశ్చయించుకొన్నాను; అంతలోనే వారతనిని ఇక్కడికి తీసికొని వచ్చిరి. మరియు అతని చిన్న చేతిని పట్టుకొని ఇట్లన్నాను, "ఈ పిల్లవానికి పొంగు చల్లినప్పుడు ఏమయినది? జ్వరము, పొంగు అతనిని మొత్తినది. మీరు ఇతడిని గమనించండి; రెండు రోజులలో అతనిని మరల నేను చూడగోరుచున్నాను. అతడు పూర్తిగా పొంగుకు గురియగును." అతడు పూర్తిగా పొంగునకు గురి ఆయెను. మీరు చూచారా, చూచారా?

35ఇప్పుడు, దేవుడు వెలుగును చీకటిలో నుండి వేరుపరచును. ఆయన జీవమును మరణమును వేరు చేయును. దానిని ఆయన తన మాట ద్వారానే చేయును. దీనిని జరిగించునది ఎల్లప్పుడూ ఆయన మాటయే.

ఇప్పుడు, భూమి మీద అప్పటికే విత్తనముండెను. దేవుడు విత్తనమును నాటెనని నేను నమ్ముచున్నాను. దాని యొద్దకు సూర్యుడు చేరగానే అది ఎదుగసాగెను. అందువలననే ఇవన్నియూ చేయుటకు దినములు మాత్రమే పట్టెను, ఎందుకనగా అప్పటికే భూమి లోపల విత్తనముండెను, అయితే దానికి కావలసినదంతయూ వెలుగే.

నేడును దేవుడు ఆలాగేయున్నాడు. వాక్యము అను ఆయన బీజము ముందే ఇక్కడున్నది. దాని మీద వెలుగు పడుట మాత్రమే అవసరమైయున్నది; ఆయనే వెలుగు, ఏలయనగా ఆయన వాక్యమై యున్నాడు. వాక్యము మరియు వెలుగు ఒక్కటియే. ఆ వాక్యపు వెలుగే జీవము. బీజములోనే ఆ జీవముయున్నది, ఆ జీవము ముందుకు వచ్చును. ఆ జీవము గింజలో నుండి బయటకు ఉబికి వచ్చును. ఆలాగే వాక్యము నందున్న క్రీస్తు ముందుకు వచ్చి, వాక్యము చేయవలసియున్న దానిని చేయును; గోధుమ గింజ మొదలగు వానిలోనున్న జీవము వలెనే, ఇదియు బయటకు వచ్చును. ఎందుకనగా ఆ జీవము దానిలో యున్నది.

జీవము అంతయు…

GEN 1:3,4

 

36కాబట్టి జీవము దేవుని వాక్యము వలన మాత్రమే బయలుపరచబడును. దేవుని వాక్యప్రత్యక్షత వలన మాత్రమే జీవము వచ్చును. అది ఈ పుస్తకమువంటి దానిలో యున్నంత కాలము, ప్రశ్నార్థకముగానే యుండును; కాని అది బయలుపరచబడినప్పుడు అందులో నుండి వచ్చు దానిని చూడగలము, చెప్పబడినది బయటకు వచ్చును; అదియే వాక్యము మీది వెలుగు, చూచారా. వాక్యము చెప్పినది నెరవేరును. అది వెలుగులో నున్న జీవము, వెలుగు జీవమును తీసికొని వచ్చును.

వెలుగు వలన జీవము వచ్చును. ఇక్కడ ఒక గోధుమ గింజను నాటండి, దానికి వెలుగు తాకకుండా మూసివేయండి; అది ఎన్నడునూ మొలకెత్తదు, ఎందుకనగా వెలుగు లేదు. కాని దానిని వెలుగు తాకిన వెంటనే ఆ విత్తనము మొలకెత్తును, జీవము బయటకు వచ్చును. వాక్యము కూడా ఆలాగే యున్నది. చూడండి, వాక్యమే దేవుడై యున్నాడు, దానిని జీవము తాకిన వెంటనే, అనగా వెలుగు తాకిన వెంటనే వాక్యము సజీవమగును. ప్రతి యుగము కూడా ఆలాగే యుండినది.

ఓ! ఈ గొప్ప సంగతులను ఎంతగానో మనము ప్రశంసించుచున్నాము, పలుకబడిన వాక్యపు వెలుగులో వాక్యమెట్లు బయలుపరచబడినదో చూచాము, చూడండి. దేవుడు "వెలుగు కలుగును గాక!" అని పలికెను.

37ఆయన పలికినప్పుడు వెలుగుకలుగని యెడల ఎట్లుండును? అది నిజమో కాదో మనకు అప్పుడు తెలియదు. ఆయన చెప్పినది నిజమో కాదో తెలియదు, ఆయన దేవుడో కాడో తెలియదు. ఆయన "కలుగును గాక" అనెను గాని కలుగలేదు, చూడండి. దేవుడు పలుకగా అది జరిగినట్లు మనము చూచుచున్నాము, అప్పుడు వెలుగు ప్రకాశించెను, అది వాక్య సత్యము, చూచారా. అక్కడ వెలుగు మరియు జీవము ఉన్నవి.

సమస్త ప్రకతి వెలుగు ఆయన పలుకబడిన మాట ద్వారా కలిగెను. సూర్యుడు ఆయన పలికిన మాటయే. పగటి కొరకు ఆయన పెద్ద జ్యోతిని కలుగు గాకని చెప్పెను, చూచారా. సమస్త స్వాభావిక వెలుగు కూడా ఆయన పలికిన మాట ద్వారానే వచ్చెను. దేవుడు పలికిన ఆ వెలుగు పడకుండా ఒక్క పువ్వూ కూడా పుష్పించదు. సూర్యుడు దేవుని పలుకబడిన మాటయై యున్నాడు. "వెలుగు కలుగును గాక!" అని ఆయన పలికెను, చూచారా. అది దేవుడు పలికిన జీవము, మరియు దానిని జనులు ఇది, అది, మరేదో అని ఎంత చెప్పప్రయత్నించినా గాని, అది మాత్రము మారదు. నీవు సూర్యుని కలిగి యుండవలసియున్నావు. కాబట్టి స్వాభావిక జీవము, దేవుని యొక్క పలుకబడిన మాట వలన మాత్రమే వచ్చును.

38నిత్యజీవము, ఆత్మీయ జీవము దేవుని యొక్క పలుకబడిన మాట వలన మాత్రమే రాగలదు. ఈసారి కుమారుడే ఆ జీవము. ఆయనలో వెలుగున్నది, ఆయనలో ఏ చీకటియు లేదు; మరియు దేవుడు పలికిన వెలుగు ఆయనే (అది సరియే నా?), దేవుని పలుకబడినవాక్యము; "ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై యుండెను." అది నిత్యమూ దేవుడే, చూచారా. వాక్యమును దేవుని వెలుగు తాకగానే అది జీవించును. ఆయన పలుకగా వెలుగు ప్రకాశించెను, వెలుగు ప్రకాశించనీయుడి. వెలుగు వలన ప్రతివాక్యము దాని కాలములో తగిన స్థానములోనికి వచ్చును. ఆమేన్!

కాదు! మీరు చూడండి, గింజలు ఎంతో కాలము ఆ చలిలో క్రిందపడి యుండును, దానిని తరువాత వెలుగు తాకగా అది జీవించును, చూచారా. సూర్యుడు లేకుండా అది జీవించజాలదు. దేవుడు ప్రతి యుగమునకు, ప్రతి దినమునకు వాగ్ధానము చేసెను. దాని మీద తిన్నగా వెలుగు పడినప్పుడు, అది పలుకబడినట్లుగానే నెరవేరును; ఎందుకనగా ఆయనే వెలుగు మరియు జీవము.

JOHN 1:1•

REV 1:1

 

39బైబిలు ద్వారా మాత్రమే దేవుని మాట వచ్చును. దేవుని యొక్క బైబిలు దేవుని కుమారుని యొక్క ముద్రణా రూపము, ఎందుకనగా అది యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షత అని బైబిలు చెప్పెను. అది దేవుడు తన్నుతాను క్రీస్తు ద్వారా బయలుపరచుకొనుటయే, మరియు క్రీస్తు వాక్యమై యున్నాడు. ఆ వాక్యము మీద దేవుని వెలుగు ప్రసరించినప్పుడు అది బయలుపడును. దేవుడు ఇంకా నిత్యజీవమును కలిగి యున్నాడని దీని వలన రుజువగును. స్వాభావిక వెలుగువలన జీవము కలుగును. వెలుగు వలన మాత్రమే జీవము రాగలదు, వాక్యము శరీరధారి అయ్యెను. వాక్యమగు యేసుక్రీస్తు మన మధ్య శరీరధారి అయినప్పుడే బైబిలులోని వాగ్థానములన్నియూ ప్రత్యక్షపరచబడినవి. దేవుడు ఎల్లప్పుడూ మానవుల ద్వారా పని చేయును. మానవులు దేవునికి ఆధీనులు.

ఇప్పుడు, మీకు కొద్దిగా వేడిగా నున్నదనిపించినప్పుడు ఇక్కడ కిటికీలు తీయుదురు. లేదా ఆ కుంపటిని తగ్గించుదురు, లేదా మీకు తెలిసినది చేయుదురు. చాలా మందికి వేడిగా నున్నదని నాకు తెలియును, ఇక్కడ నిలబడియున్న నాకును వేడిగా నున్నది. అయితే చలికి బదులుగ వేడిగా నున్నందుకు సంతోషించుచున్నాను, ఎందుకనగా నాకు వేడి ఇష్టము. వేడి వలన జీవము కలుగును — జీవము.

40గమనించండి! వాక్యము శరీరధారియైనప్పుడు, ప్రత్యక్షత కలిగినది. వాక్యమును సరియగు స్థానములో, సరియగు నేలలో యుంచినప్పుడు దాని ఫలమును అది ఇచ్చును. సరియగు హృదయములోనికి వాక్యమును తెచ్చినప్పుడు, అది బయటపడును. అది వెలుగును తెచ్చును. దాని మీద అది పడును. మంచిది.

స్వాభావికమైనది గాని, ఆత్మసంబంధమైనది గాని, ఏదియూ దేవుని వెలుగు లేకుండా జీవించజాలదు. వెలుగు ద్వారా మాత్రమే జీవము వచ్చును. స్వాభావికమైనది గాని, ఆత్మసంబంధమైనది గాని ఏదియూ దేవుని వెలుగు లేకుండా జీవించజాలదు. దానిని గూర్చి ఆలోచించుము. మంచిది. కాని ఆయన వెలుగును పంపి (చూచారా), ఇవన్నియూ జరిగించగా దానిని మనము తిరస్కరించుచున్నాము. ఇప్పుడు, మన యొద్దకు పంపబడిన వెలుగును త్రోసివేయుటయే అన్నింటికన్న విషాదమైన సంగతి.

41ఈనాడు కొందరు ఈలాగు చెప్పుట మీరు వినుచున్నారనుకొందము. "సూర్యుడు లేడు, నేను దానిని నమ్మను," అతడు గదిలోనికి వెళ్ళి తలుపులన్నీ మూసికొని చీకటిలో కూర్చొని. "సూర్యుడు గాని, సూర్యుని వెలుగు గాని అసలు లేనే లేదు," అనుచున్నాడనుకొనండి. ఆ వ్యక్తి మానసిక రుగ్మతలో యున్నాడని మీరు వెంటనే తెలిసికొందురు, చూచారా. అతడు చీకటి గదిలోనికి వెళ్ళి, దేవుడిచ్చిన వెలుగును తిరస్కరించుటకు ఏదో కారణమున్నది. దాని యొక్క వేడి కిరణము అతనికి అక్కరలేదు. దాని యొక్క ఆరోగ్యమిచ్చు పదార్థము అక్కరలేదు. నడచుటకు దాని వెలుగు అతడు కోరుట లేదు. అతడు చీకటిలో కూర్చొని యుండును. అతడు స్వాభావికముగా మానసిక రుగ్మతలో యున్నట్లు దానినిబట్టి మనకు తెలియుచున్నది.

JOHN 15:4,7

 

42దీనిని నేను ప్రేమ మరియు మర్యాదతో చెప్పుచున్నాను. తన ముందు బైబిలు వెలుగు ప్రకాశించుచుండగా దానిని త్రోసివేసి, తన యొక్క శాఖల మత విశ్వాసము లోనికి పరుగిడి వెళ్ళుచున్న వ్యక్తి కూడా ఆత్మ సంబంధముగా పొరపాటులో యున్నాడు. అతని విషయములోను ఏదో పొరపాటున్నది. అతడు తన మత విశ్వాసము మరియు ఆచారములలోనికి వెళ్ళి తలుపును మూసికొని ఈలాగనుచున్నాడు,"అటువంటిది ఏదియూ లేదు. ఆశ్చర్య కార్యములు జరుగు రోజులు అయిపోయినవి. దైవిక స్వస్తత అనునది లేదు, ఇట్టివి అసలు ఏమీ లేవు, అది అపోస్తలులకు మాత్రమే." ఆ మనిషి ఆత్మ సంబంధముగా పిచ్చివాడు, చూచారా. అతనికి ఏదో అయినది. అతడు తెరలు క్రిందికి లాగి తన మీదికి వచ్చుచున్న పరిశుద్ధాత్మను నిరాకరించుచున్నాడు. "మీరు నా యందు నా మాటలు మీ యందు నిలచియుండిన యెడల [ఈ వాక్యం మీద వెలుగు ప్రకాశిస్తుంది] మీకేది ఇష్టమో అడుగుడి." చూడండి, చూచారా?

DEUT 8:3•

LUKE 4:4•

GAL 3:11

 

43దేవుడు మనము జీవించుట కొరకు తన వాక్యమును ఇచ్చెను, దానిని, దేవుని యొక్క వనరులను తిరస్కరించుటలో పొరపాటున్నది. "నీతిమంతులు విశ్వాస మూలముగా జీవించుదురు." "మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు గాని దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట, [మాటలోని భాగము కాదు] ప్రతి మాట వలనను జీవించును." ఒక వ్యక్తి దానిని తిరస్కరించుటను బట్టి అతడు ఏదో పొరపాటులో యున్నాడని మనకు తెలుయును. దేవునిని ప్రేమించుచున్నానని చెప్పుచూ, దేవునిని తిరస్కరించుటలో ఆ వ్యక్తి పొరపాటు చేయుచున్నాడు. ఆ వ్యక్తి పరిస్థితి బాగో లేదు. దానిని మనము నిస్సందేహముగా ఎరుగుదుము. దానిని అతడు విసర్జించి మరెక్కడికో పరుగెత్తు చున్నాడు. "దానిని గూర్చి నేనేమియూ తెలిసికోగోరుట లేదు. ఈ సంగతులు నాకేమియూ చెప్పవద్దు. దానిని నేను నమ్మను అనుచున్నాడు, నీవేమి చెప్పినా అతడు నమ్మడు."

MATT 4:4•

JOHN 10:25

 

44ఒక వ్యక్తికి నేను ఏదో చెప్పుచుండగా అతడు ఈలాగనెను, "నీవు ఏబయి మంది కాన్సరు గల వారిని తీసికొని వచ్చి, వారిని గూర్చి సాక్షమిచ్చుటకు ఏబది మంది వ్యైద్యులను తీసికొని వచ్చినా నేను నమ్మను, నా కళ్ళముందే నీవు చనిపోయినవారిని లేపినా నేను నమ్మను." చూడండి, ఆ వ్యక్తిలో ఏదో తప్పు ఉన్నది. అతడు సేవకునిగా (చూచారా) పిలువబడుచున్నాడు. ఆ సంస్థ దేవుని యొక్క శక్తిని గాని, దేవుని వాక్యమును గాని నమ్ముట లేదు గనుక ఈ వ్యక్తి ఆ మురికిగా, అసహ్యంగా, ధూళితోనున్న సంస్థ అను చీకటి కొట్టులోనికి పరుగిడి వెళ్ళుచూ, పరిశుద్ధాత్మ యొక్క ఆరోగ్యమిచ్చు కిరణములను, వేడిని నిరాకరించుచున్నాడు. యేసుక్రీస్తు నిన్న, నేడు, నిరంతరము ఏకరీతిగా యున్నాడు. అయితే ఆ వ్యక్తి సరయిన స్థితిలో లేడు, చూచారా. అతడు ఆ మురికి, చీకటి గదిలోనే నివసించగోరుచున్నాడు గాని, యేసుక్రీస్తు నిన్న, నేడు, నిరంతరము ఏకరీతిగా యున్నాడు అను బైబిలు యొక్క దేవుని వెలుగులో జీవించగోరుట లేదు. "నేను చేయు క్రియలు మీరును చేయుదురు. అంతకంటే గొప్పవియు మీరు చేయుదురు, ఎందుకనగా నేను తండ్రి యొద్దకు ఎక్కిపోవుచున్నాను." అయితే ఆ వ్యక్తిలో ఏదో తప్పు ఉన్నది. అందులో ఎట్టి సందేహము లేదు, ఎదో తప్పు ఉన్నది.

GEN 1:3•

JOHN 14:12•

HEB 13:8

 

45ప్రపంచమంతటిలోను ఉన్న జనులు దీనిని వినుచున్నారు, మీరు ఎక్కడున్నాగాని, దేవుని ప్రేమించుచున్నామని చెప్పుచూ, దేవుని వాక్యమును తిరస్కరించుచున్నట్లయినచో మీరు ఏదో పొరపాటులో యున్నారు. మీ అనుభవము తప్పు. సంఘము ఈ పరిస్థితికి వచ్చుటలో ఎట్టి ఆశ్చర్యము లేదు. మీరు వాక్యమును చేర్చుకొని, దాని వెలుగులో నడుచుట లేదు గనుక దేవుని వాగ్ధానములు నెరవేరుట లేదు. ఆయన వెలుగైయున్న ప్రకారము మనము కూడా ఆయన వెలుగులో నడచుదము. అప్పుడు దేవుని కుమారుడగు "యేసుక్రీస్తు యొక్క రక్తము మనలను సమస్త పాపము నుండి పవిత్రపరచును" అని బైబిలు చెప్పెను. అవిశ్వాసమే పాపము.

ఈ ఘడియ యొక్క దేవుని వెలుగులో మనము నడిచిన యెడల, దేవుడు ఈ ఘడియ యొక్క వాక్యమును తీసికొని దానిని బయలుపరచి ఆదికాండము 1:3లో చేసినట్లే చేయును. "వెలుగు కలుగును గాక!" అని ఆయన పలికెను. వెలుగు కలిగెను, ఆయన మాట బయలు వెళ్ళగా, దాని వెనుకనే వెలుగు వచ్చెను. అది పొగమంచును తరిమి వేసెను. ఒక మూలకు చీకటిపోయెను, మరియు మరో వైపు వెలుగు ప్రకాశించెను.

నేడును దేవుడు ఆలాగే చేయును. ఈ ఘడియ కొరకు ఆయన తన వాక్కును పంపును, పరిశుద్ధాత్మ వచ్చును మరియు ఆ వాక్యమును జీవింపచేయును. చీకటి వారి యొక్క విశ్వాసముల లోనికి, శాఖలలోనికి వెళ్ళును, కాని వెలుగు ప్రకాశించును; ఎందుకనగా బయలుపరచబడినది ఆ దేవుని వాక్యము. ఆయన వాక్యము సత్యము. ఇప్పుడు, అది కల్పితమైనది కాదు గానీ, ఖచ్చితంగా లేఖన పూర్వకమైనది. మంచిది.

NUM 24:17•

1JN 1:7

 

46ఆనాటి జ్ఞానులు దేవుడిచ్చిన దానిని వెంబడించిరి, వారు దేవుని వాక్యమును వెలుగు నొద్దకు వెంబడించిరి, ఎందుకనగా జీవమును తెచ్చినది వాక్యమే.

"వారెట్లు వెంబడించిరి?" అని నీవు ప్రశ్నించవచ్చును. వారు జ్ఞానులని మనము గ్రహించాము. సంఖ్యాకాండము 24:17లో బిలాము కూడా ఒక రకమగు జ్ఞానియే. అతడు నిజంగా ఒక ప్రవక్త. అతడు ప్రవచించి యాకోబు నుండి ఒక నక్షత్రము పుట్టుననెను. యాకోబు నుండి ఒక నక్షత్రము పుట్టునను దేవుని వాక్యమును ఈ జ్ఞానులు చూచి, వారు ఈ దేవుడిచ్చిన చిన్న నిత్యవెలుగు ఆధారమును వెంబడించిరి. ఈనాడును జ్ఞానులు ఆలాగే తమ కండ్లను ఆచారములచే గ్రుడ్డిగా చేసికొనక, దేవుని చే పలుకబడిన వాక్యమును వెంబడించెదరు. ఈ ఘడియలో దేవుని శక్తి నిండుగా వికసించు వరకు వారు చూచెదరు, చూచారా. దానిని వారు చూచెదరు, మరియు అది ఇక్కడ ఈ వాక్యములో యున్నదని వారెరుగుదురు. దానిని దేవుడు ఈ దినము కొరకు వాగ్థానము చేసెను.

47ఆ జ్ఞానులకు ఎన్నో పరిశోధన శాలలు, లేక మరేవో ఈలాగు చెప్పి యుండును, "ఎందుకు, మీకు మతి చెడినది!" వారు రెండు సంవత్సరములు ప్రయాణము చేసిరి. వారు ఎన్నో రాజ్యములను దాటిపోయిరి. "మీరెక్కడికి వెళ్ళుచున్నారు?" అని వారిని అడిగిరి.

"ఓ! మేము తూర్పున ఆయన నక్షత్రము చూచి ఆరాధించవచ్చితిమి." వారు శాఖల ప్రధాన కార్యాలయమగు యెరూషలేములో నిలిచిరి, కాని వారికి జవాబు దొరకలేదు. వారు వీధులలో అటు ఇటు తిరుగుచు ఈలాగు అడుగుచుండిరి. "యూదులకు రాజుగా పుట్టిన వాడెక్కడ?" కాని వారికి అది తెలియదు. కావున వారు వాక్యములో కనుగొనగోరిరి. నిత్యత్వపు వెలుగు నొద్దకు ఆ నక్షత్రము తమను నడిపించుచున్నదని వారు ఎరిగి, దానిని వెంబడించిరి. ఆ పరిపూర్ణ వెలుగు నొద్దకు మమ్మును నడిపించుము. ఆ వెలుగు నొద్దకు వాక్యమే నిన్ను నడిపించును. ఆ వాక్యమును బయలుపరచునదియు ఆ వెలుగే. ఆమేన్!

గమనించండి, వారు జ్ఞానులు.

48ఈనాటి జ్ఞానులు ఆలాగు లేరు. ఈ లోక జ్ఞానము దేవునికి వెర్రితనము. మీ శాస్త్రజ్ఞులు లేదా మీ మహా మేధావులు ఒక అణువును చీల్చుట ఏలాగో చెప్పు చున్నారు. అది జీవమును ఈయజాలదు. దేవుని యొక్క పలుకబడిన వాక్యము తప్ప మరేదియూ జీవమును ఈయజాలదు. ఆయన పలుకబడిన వాక్యము ద్వారానే జీవము వచ్చును.

ఒక అణువును చీల్చుట ఎట్లో తెలిసి కొనుట మంచిదే, కాని వారెన్నడూ కనుగొనరను కొనుచున్నాను. వారు దానిని కనుగొనవలసి యున్నారు, ఈ భూమిని క్రొత్త భూమిగా చేయుటకు, ఆ లావాను తీసికొని వచ్చుటకు, భూమిలో పెద్ద రంధ్రములు ఏర్పడుటకు ఈ ప్రేలుడు జరుగవలసి యున్నది. దుష్టుల ధూళి మీద నీతిమంతులు నడిచిపోవుదురు, అప్పుడు పాపము మరువబడును. ప్రతిదియు వినూత్నపరచబడును. మానవుడు తన స్వంత జ్ఞానము ద్వారా ఇప్పుడు భూమి మీద జీవించుచున్నాడు. జీవవక్షమునకు బదులుగా మంచి చెడ్డల తెలివినిచ్చు వక్షమును ఎన్నుకొనుట వలన దేవుడు నివసించుటకు తనకిచ్చిన భూమిని నాశనం చేయును. కాని జీవవృక్ష ఫలమును స్వీకరించిన వారు ఈ భూమి మీద ఇంకా ఉన్నారు. వారు వ్యాధి మరియు మరణము లేని క్రొత్త ఆకాశము మరియు క్రొత్త భూమి మీదికి వచ్చెదరు. వెలుగు! వెలుగు! ప్రభువా; మాకు వెలుగును పంపుము.

MATT 2:1,5

 

49గొర్రెల కాపరులను నిత్య వెలుగు నొద్దకు నడిపించుటకు కొండ మీద వెలుగును చూపించిన వారు దేవుని యొక్క దూతలు. చూడండి, అది వెలుగు ద్వారా మాత్రమే వచ్చును. జీవము వెలుగు ద్వారా కలుగును. గొర్రెల కాపరులు తెలిసికొనగోరిరి. మీకు తెలుసా, ఒక రాజు పుట్టినప్పుడు వారు పాడుదురు, ఒక రాజు జన్మించినప్పుడు ఎంతో ఆనందముండును. ఆయన ఎంతో రహస్యముగా జన్మించెను. ఒక పశులశాలలో పుట్టెను, ఆ తొట్టెలో గుర్రములు, పశువులు మేత తినును. అయినా గాని ఆయన రాజే. దేవదూతలు దిగి వచ్చి వెలుగులో గొర్రెల కాపరులకు పాటలు పాడినవి. దేవుని వాక్యమును చూపించిన వెలుగుగా ఆ దేవదూతలున్నారు. వారు దేవుని వాక్యమును కలిగియుండినందునే ఈలాగు చెప్పిరి, "ఈనాడు దావీదు పట్టణము లేదా బెత్లేహేము నందు క్రీస్తు అను రక్షకుడు పుట్టి యున్నాడు." దేవదూతలు వాక్యమును కలిగి యుండెను. నడిపించు వెలుగు వాక్యము ద్వారా వచ్చెను. వారు దేవదూతల వాక్యమును వెంబడించి నిత్యవెలుగు నొద్దకు వచ్చిరి. వారికి చెప్పబడిన రీతిగా పొత్తి గుడ్డలతో చుట్టబడిన యొక శిశువును వారు కనుగొనిరి. మీరు చూడండి, వెలుగు ద్వారానే జీవము వచ్చును.

ISA 7:14•

MATT 1:23•

LUKE 2:7,12

 

50గమనించండి, ఆయన వెలుగుగా చేయబడిన వాక్యముగా యున్నాడు. ఆయనే వెలుగాయెను. ఆ తరములో వారికి ఆయనే వాక్య వెలుగుగా నున్నాడు, ఎందుకనగా ఆనాటి ప్రవక్తలు ఆయనను గూర్చి చెప్పిరి. ఆయన ఇప్పుడు రంగము మీదికి వచ్చెను. దేవుని యొక్క పలుకబడిన వాక్యమునకు తానే బయలుపరచబడిన వెలుగునని ఆయన వచ్చి చూపించెను, చూచారా. ప్రవక్తలందరూ పలికినదంతయూ ఆయనలో నెరవేరును, చూడండి. ఆనాటి ప్రవక్తలు వాక్యమును కలిగియుండిరి — దేవుడు "వెలుగు కలుగునని" పలుకగా వెలుగు కలిగిన రీతిగానే, ప్రవక్తలు "కన్యక గర్భవతి అయి కుమారుని కనునని" ప్రవచించిరి. ఆయనకు ఇమ్మానుయేలు అను పేరు పెట్టుదురనియు, దానికి దేవుడు మనకు తోడు అని అర్థమనియు" వారు చెప్పిరి. దానిని వారు పలికిరి. వాక్యము బయలు వెళ్ళెను. ఆయనే ఆ వెలుగు. ఆయన ఎవరు? నెరవేర్పు! ఆ వాక్యమునకు ఆయనే నెరవేర్పు. ఆ వాక్యమునకు ఆయనే ప్రత్యక్షత.

కావున నేడును ఆలాగే యున్నది. దేవుని యొక్క వాక్యము ఆ ఘడియలో నెరవేరును. అదియే వెలుగు. అదియే దేవుడు తన్నుతాను బయలుపరచుకొనుట. ఆయనే లోకమునకు వెలుగై యున్నాడు.

GEN 1:3•

PS 16:10•

ISA 9:6•

MATT 28:6•

MARK 16:6•

LUKE 24:6•

ACTS 2:27•

ACTS 13:35

 

51ప్రవక్తలు పరిశుద్ధాత్మ ద్వారా ప్రేరేపించబడి ఇట్లనిరి, "మనకు ఒక కుమారుడు అను గ్రహించబడెను — ఒక శిశువు ఇయ్యబడెను; ఆయనకు ఆలోచన కర్త, సమాధానాధిపతి, సర్వశక్తి గల దేవుడు, నిత్యుడగు తండ్రి" అని పేరు పెట్టబడెను. ఆలాగే జరిగినది. ఆయనెవరు? అయన వాక్యమును నెరవేర్చిన వెలుగు (ఆమెన్!), వాక్యమును నెరవేర్చిన వెలుగైయున్నాడు.

మత్తయి 28వ అధ్యాయములో ఈలాగు కనుగొందుము, యేసు మృతిపొంది, తిరిగి లేచెను. ఆయన దావీదు ద్వారా పలుకబడిన వాక్యముగా కూడా యుండెను, "నేను ఆయన ఆత్మను పాతాళములో విడిచిపెట్టను; నా పరిశుద్ధుని కుళ్ళు పట్టనియ్యను." మరణము చీకటిలో ఉండెను, కాని ఆయన మరణపు ముద్రలను చీల్చికొని వచ్చెను. బయటకు నడిచి వచ్చెను. ఆయనే వెలుగు, మృతులు మరల బ్రదుకుదురను సంగతిని బయలుపరచిన వాక్యము. ఆయనే!

52పెంతెకోస్తు దినమున పరిశుద్ధాత్మ వచ్చి వెలుగును చూపించెను. యెషయా 28వ అధ్యాయములో చెప్పినది అదియే. "సూత్రము వెంబడి సూత్రము; ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, ఇక్కడ కొంచెము, అక్కడ కొంచెము; మేలయిన దానిని పట్టుకొని యుండవలెను; నత్తి పెదవుల ద్వారా అన్యభాషలతో ఈ జనులతో మాట్లాడెదను; మరియు విశ్రాంతి ఇదే — నేను మీకు ఇచ్చే సబ్బాతు ఇదే." వారు ఇదంతయూ వినరు, తమకు కాదు అని తలలూపుచూ పోయెదరు. పెంతెకోస్తు దినమున ఆ జనుల మీదికి పరిశుద్ధాత్మదిగెను, ఆ స్త్రీ పురుషులు త్రాగిన వారి వలె ప్రవర్తించిరి, పరిశుద్ధాత్మ శక్తి క్రింద వణకిరి. వీరు "త్రాగిరి, క్రొత్త మద్యముతో నిండిరి," అని వారనుచూ తలలూపి పోసాగిరి. అది నిరాక్షేపముగా వెలుగే, ప్రవచించబడిన వాక్యము బయలుపరచబడినది.

GEN 1:3•

ISA 28:10,13•

JOEL 2:28•

ACTS 2:15,17,18

 

53ప్రతి యుగములోను ఆలాగే యున్నది. వాక్యము బయలుపరచబడుచున్నది, ఆ కాలము నాటి వెలుగు సజీవమగు చున్నది — ఆదికాండము 1లో దేవుడు "వెలుగు కలుగును గాక," అని పలుకగా వెలుగు కలిగినట్లుగానే ఇదియున్నది. కుమారుడు కలుగును గాక అని దేవుడు పలుకగా ఒక కుమారుడు కలిగెను.

యోవేలు 2:28లో దేవుడిట్లు చెప్పెను, "అంత్యదినములలో మనుష్యులందరి మీద నా ఆత్మను కుమ్మరించెదను. మీ కుమారులు కుమార్తెలు ప్రవచించెదరు. నా దాసుల మీద, దాసురాండ్రమీద నా ఆత్మను నేను కుమ్మరించెదను. మీ యవనస్థులు దర్శనములు చూచెదరు; మీ వృద్ధులు కలలు కందురు!" పరిశుద్ధాత్మ దిగి వచ్చినప్పుడు ఆయన వాగ్ధానము చేసినవన్నియూ జరిగెను. వాక్యము మీద వెలుగు పడినది. వాక్యము శరీరధారియైనప్పుడు అది వెలుగాయెను. ఆయనే వెలుగు. మనము వెంబడించవలసిన వెలుగు ఆయనే. ఆయన ఒక్కడే వెలుగు. దేవదూతలు వెలుగును కనుగొని, ఆయనను వెంబడించునట్లు చేసెను.

JOHN 10:35

 

54ప్రతి యుగమునకు ఆయన వెలుగు లేదా వాక్యము నిర్ణయించబడినది. వాక్యము చొచ్చుకొని వెళ్ళి, దాని వెలుగును చూపించునట్లుగా దేవుడు ప్రతిసారి ఒకరిని పంపుచుండును. ప్రతి యుగములోను ఆలాగే జరుగుచున్నది, ఆలాగే జరుగును.

ప్రవక్తల యొక్క పరిశుద్ధ, దైవిక శక్తి యంతటికి ఆయనే నెరవేర్పు అని నేను చెప్పుచున్నాను. వారు చిన్న దేవుళ్ళు. "ప్రభుని యొక్క వాక్యము ఎవరి యొద్దకు వచ్చునో, వారే దైవములని యేసు చెప్పెను. దేవుని యొక్క వాక్కు ఎవరి యొద్దకు వచ్చునో వారే దైవములని మీ ధర్మశాస్త్రము, మీ పితరులు చెప్పిరి. ఆ దేవునికి నేను కుమారుడనని చెప్పుకొనుచుండగా నన్నెందుకు ఖండించుచున్నారు?" అని అడిగెను. చూచారా? ప్రవక్తల ద్వారా ఆ వాక్యము పలికించినది ఆయనే. ఆ పలుకబడిన వాక్యమునకు ఆయనయే ప్రత్యక్షత. ప్రవక్తను ఒక దైవముగా పిలిచెను, ఎందుకనగా అతడు మరియొక ప్రవక్త వచనమునకు ప్రత్యక్షత. ఆయనే ఆలాగు అయి యుండగా ఆయనను మీరేలాగు ఖండించుదురు? ఆయన దేవుని యొక్క కుమారుడు. దేవునికు మారునిగా ఆయన పిలువబడును.

ఆయనే మెస్సీయాగా లోకమునకు రానుండెనని ఎప్పుడో వాగ్ధానము చేయబడెను, లోకము ఎదురుచూచుచుండెను. మెస్సీయా వాగ్ధానము బయలు పరచబడుటగా ఆయన ఉండెను.

JOHN 5:39•

JOHN 7:8,9•

JOHN 8:12•

JOHN 9:5

 

55ఆయన అక్కడ నిలబడి యుండగా చూడండి. "నా తండ్రి క్రియలు నేను చేయని యెడల నన్ను నమ్మకుడి. [చూచారా?] కాని నన్ను నమ్మనియెడల, నా క్రియలను నమ్ముడి. నా గూర్చి అవి సాక్షమిచ్చుచున్నవి. నేనెవరినో అవి చెప్పుచున్నవి," అని ఆయన పలికెను. చూడండి, వారు ఒక అంధకార, గ్రుడ్డి ఘడియలో జీవించుచున్నారు, వారు దానిని చూడలేకపోయిరి. వారు అర్థము చేసికొనలేకపోయిరి, ఆయన ఎవరో అనుకొనిరి. "ఈ బెత్లేహేములో పుట్టిన ఇతడు దేవుని కుమారుడెట్లు కాగలడు?" కాని ఆయన ఆలాగే వచ్చునని వాక్యము చెప్పిన దానిని వారు తెలిసికొనలేకపోయిరి.

"ఇతని తండ్రి వడ్లవాడు యోసేపు కాడా? ఇతని తల్లి మనకు తెలియును. మనందరము ఇతడు అక్రమముగా పుట్టెనని" తలంచుచున్నాము, చూచారా. కాని దేవుని వాక్యము చెప్పినది వారెరుగరు.

"లేఖనములను పరిశోధించుడి, అందులో నిత్యజీవము కలదని మీరు తలంచుచున్నారు. నేనెవరినై యున్నానో అవియే నాకు సాక్ష్యమిచ్చుచున్నవి," అని ఆయన చెప్పెను. ఈ పరిశుద్ధ లేఖనములు. ఆయనెవరు? దేవుని వెలుగు. "నేను లోకమును వెలుగై యున్నాను," అని ఆయన చెప్పుటలో ఆశ్చర్యము లేదు.

"నేను మాత్రమే వెలుగును," అని ఆయన చెప్పలేదు గాని "మీరును వెలుగై యున్నారు," అని చెప్పెను. దానిని గూర్చి మీలో నున్న వాక్యము సాక్షమిచ్చుచున్నది గనుక మీరు లోకమునకు వెలుగై యున్నారు.

గమనించండి, ప్రతి కాలములోని వెలుగు ఎల్లప్పుడూ ఒకే విధముగా ప్రత్యక్షపరచబడినది.

JOHN 3:2

 

56మన సమయము గడిచిపోక ముందు ఒక ప్రశ్న అడుగుదును. అయితే దానిని వారెందుకు త్రోసివేసిరి? వారు చదువుచున్న ఆ బైబిలు వారికండ్ల ముందే ప్రత్యక్షమయినా గాని, వారెందుకు చూడలేదు. దీనిని లోతుగా ఆలోచించండి.

ఇక్కడున్న నాలుగు లేదా అయిదు వందల మందితో మాత్రమే నేను మాట్లాడుట లేదు గాని, వేలాదిమందితో నేను మాట్లాడుచున్నానని మరువ వద్దు.

ఒక్క నిమిషము ఆగండి. మీ రికార్డరు ఆపి ప్రశ్న వేసికొనండి. భక్తిగలవాడగు యోసేపు ఎందుకు ప్రశ్నించెను? చూచారా? అతడు ఎన్నడూ లేఖనములను పరిశోధించలేదు. యాజకులు ఎందుకు ప్రశ్నించిరి? వారికి తెలియును గాని ఎరుగకుండిరి. నికోదేము మాటలలో అది అర్థమగును. "బోధకుడా, నీవు దేవుని యొద్ద నుండి వచ్చినవాడవని యెరుగుదుము. దేవుడు తోడైయుంటేనే గాని ఎవడును నీవు చేయు కార్యములు చేయజాలడు. అది మేమెరుగుదుము." కాని ఏమి లాభము? వారి ఆచారములు వారిని అది అంగీకరించకుండా దూరము చేసినవి.

57వారు మెస్సీయాను విసర్జించిరా? వారెందుకు వెలుగును విసర్జించిరి? నెరవేరుచున్నదని వారు ఆ వాక్యమును బట్టి గ్రహించిరి. నెరవేరబోవునని వారు ఎరిగియుండియు, దేవుని వాక్య నెరవేర్పును చూపుటకై వాక్యము ప్రత్యక్షమైనప్పుడు వారు తిరస్కరించారు. దీనిని నేటి దినములతో పోల్చండి, చూచారా. ఈ సంగతులు జరుగునని వాక్యములో వ్రాయబడెను. ఆ బోధకులు ఎందుకు తిరస్కరించిరి? వారు మరియొక వెలుగు నీడలో జీవించుచుండిరి. అది అంతే. వారు నీడలో జీవించుచుండిరి. నేడును వారు అదే చేయుచున్నారు. వారు మరియొక కండ్లు చెదరునట్లు ధగధగమని మెరిసే వెలుగు ఛాయలో జీవించుటయే దానికి కారణము, చూచారా. వారు మోషే చెప్పిన దానిని బట్టి జీవించుచున్నామనిరి. జరిగిపోయిన మరొక కాలపు ఛాయలో వారు జీవించుచుండిరి. ఆ కారణము చేతనే యేసుక్రీస్తు అదే రీతిగా యున్నాడను వర్తమానమును తిరస్కరించుచున్నారు, ఎందుకనగా జనులు మరో కాలపు నీడలో జీవించుచున్నారు. ఆ కారణము చేతనే వారు విసర్జించుచున్నారు.

ఇప్పుడు మనము గమనించుదము.

58అది ఒక తప్పు వెలుగు అని వెబ్‌స్టర్ చెప్పినది, అది దారిలోని ఎండమావి వంటిది. కార్లు నడుపుకొని వెళ్ళుచున్న మీకు దారిలో సూర్యుని కాంతి ప్రతిబింబించుట వలన దారిలో అంతా నీటితో నిండియున్నట్లు కనిపించును. అదియే ఎండమావి, కాని అక్కడికి మీరు చేరుకొన్నప్పుడు ఏదియూ యుండదు, అది నిజ కాంతి యొక్క ప్రతిబింబము — ఎండమావి. ఈనాడు అపవాది అదియే చేయుచున్నది. ప్రజలకు ఒక ఎండమావిని, సంఘ సమితిని చూపించుచున్నది. ఒక శాఖల గుంపు అది. వారు అబద్ధికులుగా మారిరి. అయితే దాని వెనుక ఒక నిజ వెలుగు ప్రకాశించుచున్నది. ఒక అసలు వెలుగు ఉన్నది గనుకనే ఇది యున్నది. ఆ నిజ వెలుగు ప్రకాశించని యెడల ఎండమావి యుండదు. ఒక నిజ వెలుగు ప్రకాశించుచున్నది, వారు మరో కాలపు వెలుగులో జీవించుచున్నారు, అది ఎప్పుడో వచ్చి వెళ్ళిపోయినది.

ఇప్పుడు, ఈ ఎండమావి నిజము కాదు. అది సూర్యుని వెలుగే.

GEN 1:3

 

59వారు ఆ విధముగానే యుండిరి. నిజ వెలుగును గాక, మోసపు వెలుగును వెంబడించిరి.

ఆయనే నిజ వెలుగు అని నిరూపించబడెను. ఆయనే వెలుగు. ఆయనే వెలుగని వారెందుకు తెలిసికొనిరి? ఆయన వెలుగని నీవేలాగు తెలిసి కొందువు? వాగ్ధానము చేయబడిన వాక్యము ఆయన ద్వారా ప్రత్యక్షమాయెను, కాబట్టి ఆయన ఆ పలుకబడిన వాక్యము యొక్క వెలుగు. ఆమేన్! ఓ, అది నన్ను దాదాపు పెంతెకోస్తు-బాప్టిస్టుగా చేయుచున్నది. కేకలు వేయునట్లు చేయుచున్నది.

గమనించండి, దాని గూర్చి ఆలోచించండి, ఒక నీడ చూడండి. ఒక మోసపు నీడలో జీవించుట. కాని ఒక నిజ వాక్యము జీవించుచున్నది. అదియే వెలుగు అని దేవుడు పలికెను. ఆదియందు దేవుడు "వెలుగు కలుగు గాక," అని పలుకగా, మరేదో ఏర్పడిన యెడల ఏమగును? అది ఒక ఎండమావి. దేవుడు పలికినది అది కాదు. ఆలాగు కాజాలదు. వెలుగు కలుగును గాక అని దేవుడు పలుకగా పొగమంచు వచ్చినచో ఎట్లుండును? అది వెలుగు కాదు. చూడండి? అది వెలుగు కాదు. కాని వెలుగు వచ్చుటకు కారణము, ఆయన మాట వెల్లడియగుటయే. ఈ కాలములో ఈ సంగతులు జరుగనని దేవుడు చెప్పెను, అవి జరుగుట చూచుచున్నారు. ఏమిటది? అది దేవుని వాక్యము మీది వెలుగు. వాక్యము వెలుగుగా మారి, దానికది బయలు పడుచున్నది.

JOHN 5:45,46

 

60"మేము ఎవరిమని తలంచుచున్నావు?" "ఎందుకు," "నీవు పిచ్చివానివని మేమెరుగుదుము. ఎందుకు, నీవు సమరయునివి; నీ బుద్ధి సరిగాలేదు. నీవు పాపములో జన్మించితివని మాకు తెలియును. నీవెక్కడ నుండి వచ్చితివో మాకు తెలియదు. మా గుంపులలో నీ గుర్తింపు ఎక్కడా లేదు. నీవు పిచ్చివానివి. నీకు దయ్యము పట్టినది. నీకు మతి పోయినది," అని వారనిరి. కాని ఆయన అసలయిన, నిజమయిన దేవుని వెలుగుగా ప్రకాశించుచున్నాడు, మోసపు నీడ వారి నేత్రములను మూసివేసినది.

"మోషేను మాకు నాయకునిగా కలిగియున్నాము."

"మీరు మోషేను విశ్వసించిన యెడల, నన్నును విశ్వసించెదరు," అని ఆయన పలికెను. మీరు యేసును నమ్మి బైబిలును ఎరిగిన యెడల, నేడు మనము ఏ ఘడియలో జీవించుచున్నామో ఎరుగుదుము.

"మేము క్రైస్తవులము," అని వారనుచున్నారు. మీరు క్రైస్తవులయిన యెడల, ఈ దినమున దేవుని క్రియలు ఏలాగుండునో ఎరిగి యుందురు, చూడండి. చూచారా? దానిని మీరు ఎరిగి యుందురు.

యేసు ఇట్లనెను, "ప్రవక్తలందరు నన్ను గూర్చి పలికిరి. మీరు ప్రవక్తలను ఎరిగి యుండినయెడల నన్నును ఎరిగి యుందురు. నా క్రియలు సాక్షమిచ్చుచున్నవి, ఎందుకనగా వారు చెప్పినది నేను చేయుచున్నాను. ఎవరు నన్ను ఇప్పుడు అవిశ్వాసమును బట్టి ఖండించగలరు?"

MATT 15:14•

LUKE 6:39

 

61అయినా వారు చూడలేకపోయిరి. ఎందువలన? వారి కండ్లు మరొక ప్రకాశత వలన గ్రుడ్డి వాయెను. నిజవాక్యమునకు బదులుగా వారు అబద్ధ వెలుగును చూచిరి.

ఇప్పుడు దానిని గూర్చి ఆలోచించండి! దాని గూర్చి ఆలోచించండి. వారు ఆ వాక్యమును నమ్మినామని చెప్పుకొనిరి. కాని వారి ఆచారములు వారి నేత్రములను నిజ వాక్యము నుండి త్రిప్పివేసినవి, అందువలన వారు అసలయిన దానిని చూడలేకపోయిరి. నేడును ఆలాగే యున్నది. ప్రతి కాలములోను ఆ విధముగానే యున్నది, చూడండి. నిజవెలుగు ప్రకాశించు చున్నది, కాని వారు ఆచారబద్ధులైనందున, నిజవాక్యమును చూడలేకపోయిరి. వారు ఒక నీడను చూచి గ్రుడ్డివారయిరి, అది నిన్ను గ్రుడ్డి వానినిగా చేయగలదు.

"అంధులగు మీరు అంధులకు దారి చూపించుచున్నారు" అని యేసు చెప్పెను. ఆయ నెవరో వారు చూచియుండవలెను, కాని వారు ఆ వెలుగులో నుండి నందున చూడలేకపోయిరి.

JOHN 7:9

 

62ఇప్పుడు, మోసపు నీడ, ఒక ఎండమావి, నిజవెలుగును మరచున్నట్లు చేయును. దాని వలెనే అది కనిపించును, కాని అది కాదు.

వారు భేదమును ఒక విధముగా మాత్రమే చెప్పగలరు. యేసు తన కార్యముల ద్వారా తానెవరో నిరూపించుకొనెను. తాను వెలుగునని రుజువుచేసికొనెను. వారు తాము వెలుగులో నున్నట్లుగా తలంచిరి. కాని ఇప్పుడు, మీరు ఆగి, ఒక నిమిషము ఆలోచించండి, ఎవరు అప్పుడు వెలుగులో నున్నారు?

అటువంటి తప్పు వారు ఆనాడు తెలిసి ఉండి చేసిరి, ఆ సంఘస౦స్థులు ఆలాగు చేసిరి, సోదరులారా, మనము ఆగి ఏది వెలుగో ఆలోచించవలసిన సమయము ఇది కాదా? అటు వంటి తప్పు, మనము తెలిసి ఉండియు చేయరాదు. కాని మీరు చేయుచున్నారు. ఎప్పుడో మీరు దానిని చేసిరి, కాని అది మీరెరుగరు. అప్పటి వలెనే యున్నది.

ఇప్పుడు, ఒక నిమిషము ఆగి నేటి కొరకు వాక్యమేమి చెప్పుచున్నదో కనుగొనుడి.

63"ఆయన ఏమి చేయునని వాక్యము చెప్పెనో, దానిని ఆయన అక్షరాలా నెరవేర్చుచున్నాడు," అని వారు ఆగి ఆలోచించిన ఎంత బాగుండెడిది! నేను మిమ్మును సవాలు చేయుచున్నట్లు, ఆయన వారిని సవాలు చేసెను. వాక్యములో చూడుడి, అని నేను మిమ్మును సవాలు చేయుచున్నారు. లేఖనములను పరిశోధించుడి; ఇదే ఆ ఘడియ కాదేమో చూడుడి; లేఖనములను పరిశోధించుడి; వాటి యందునిత్య జీవము కలదని మీరు తలంచుచున్నారు; మరియు అవి నన్ను గూర్చి సాక్షమిచ్చుచున్నవి. నేటి ఈ పనిని గూర్చి సాక్షమిచ్చునవి అవియే. ఆ కార్యమే తనకది సాక్షమిచ్చుకొనును. అది జరిగి యున్నది. ఆలాగు జరుగునని వాక్యము చెప్పెను, కనుక ఇదే ఆ ఘడియ యొక్క వెలుగు. దేవుని వాక్యము ఆలాగు చెప్పెను.

PROV 26:11•

JOHN 5:39•

2PET 2:22

 

64మీ ఆచారములు, క్రియలు బైబిలు చెప్పినట్లే సరిగ్గా యున్నవి, వారు తలలూపి వెళ్ళిపోయిరి. బైబిలు చెప్పినట్లుగా బల్లలన్నియూ వాంతులతో నిండి యున్నవి. దానిని వారు నమ్మరు; వారు తలలుజాడించిరి. పెద్దలారా, ఇది మీరు గ్రహించుడి; మరియు సోదరులారా, ఇది గ్రహించుడి. దేవుడు మీ ఎదుట బయలుపరచుచున్న దానినే మీరు నిరాకరించుచున్నారు, వారి వలెనే మీరును చేయుచున్నారు, మీరు కక్కిన ఆచారముల వైపు మళ్ళుచున్నారు.

"కుక్క తన వాంతికి తిరిగినట్లు…" మొదటిసారి అందువలన దానికి జబ్బు చేసినది గనుక రెండవసారి జబ్బు చేయును. కాతలిక్కు సంఘము సంస్థగా మారి, అసలు సంఘమునకు జబ్బు కలుగచేసినది. లూథరను, మెతడిస్టు, బాప్టిస్టు, ప్రెస్బిటేరియను,పెంతెకోస్తు మొదలగు వారందరూ అంతే. కుక్క తన వాంతికి తిరిగినట్లును, కడుగబడిన పంది మరల గోతిలోనికి దొర్లినట్లును ఇది యున్నది, చూచారా. ప్రభుని చిత్తమయితే కొద్ది నిమిషములలో అది చూచెదము.

65నిజవెలుగు అనుకొని ఎండమావిని వెంబడించుట అదియే. తానే వెలుగును అని ఆయన నిరూపించెను, ఆయనను అల్పునిగా ఎంచిరి (ఓ, మై!), మిలియనుల మంది ఆయనకు విరోధముగా నుండిరి. ఆయన ఇక్కడ యున్నట్లు ఈ భూమి మీద నూటికి తొంబది మంది కూడా ఎరుగరు. యూదులు అసలు ఏ ఒక్కరు ఎరుగరని నాకు తోచుచున్నది. ఆయన ఇక్కడున్నట్లు ఆయన స్వంత దేశము వారికి తెలియదు. ఆయనను ఎరిగిన వారేమో ఆయన అబద్ధికుడని తలంచిరి, ఎందుకనగా వారి శాఖలు ఆయనను గూర్చి ఆలాగే చెప్పినవి, చూచారా. కాని ఆయనే నిజ వెలుగు, ఆది కాలము నుండి పలుకబడినది ఆయన గూర్చియే, మరియు లేఖనములను పరిశోధించుడి అని చెప్పెను. ఆ కాలములో ఆయన జీవించుటను గూర్చి చూడమని చెప్పెను. ఆ కాలమునకు వాగ్ధానము చేయబడిన క్రియలను ఆయన నెరవేర్చెను. ఆమేన్!

సోదరుడా, ఇది తీవ్రమగు సంగతి! మనము అద్భుతమగు కాలములో జీవించుచున్నాము. ఆయన సరియైన వాడని నిరూపించుకొనెను.

66తాము ఆరాధించుచున్నామని చెప్పుకొనుచున్న నిజవెలుగు ఆయనే. వారు ఆ వెలుగును ఆరాధించుచున్నామని చెప్పుకొనిరి. నేడును ఆలాగే యున్నది. దానిని వారు ఆరాధించుచున్నట్లు చెప్పిరి. పెంతెకోస్తు వారు ఆలాగే చెప్పుకొనుచున్నారు, కాని వారు దానిని చూడలేని గ్రుడ్డివారుగా నున్నారు. ఎందువలన? వారు సంస్థగా మారిరి. అసలు వెలుగు చూడలేరు. ఒక ఆచారమును వారు నెలకొల్పిరి. "మేము వెళ్ళి ఇది చేయుదుము, అది చేయుదుము అని వారందురు." ప్రభుని చిత్తమయితే అది ఎందుకు జరిగెనో అను సంగతిని చెప్పుకొందము.

MATT 15:9•

MARK 7:7

 

67గమనించండి, ఆయన క్రియలే సజీవ వాక్యము. లోక ఆరంభము నుండి వాగ్ధానము చేయబడిన నిజ వెలుగు ఆయనే అని చూపుటకై ఆయనే సజీవవాక్యమాయేను. ఆయనే ఆ వెలుగు. ఆ కాలమునకు వాగ్ధానము చేయడిన వాక్యము మీద ఆయన యొక్క వెలుగు, ఏమి చేయునని వాక్యము చెప్పెనో అదే ఆయన చేసెను, కాని వారు దానిని చూడలేనంతగా మరల్చబడిరి, చూచారా. కాని ఆయనే ఆ కాలపు వెలుగు.

తాము ఆరాధించుచున్నామని చెప్పుకొనుచున్న వెలుగు ఆయనే. సృష్టిని చేసిన దేవునినే తాము ఆరాధించుచున్నామని చెప్పుకొనిరి. కాని వారు ఒక ఎండమావిని ఆరాధించుచున్నారు, "మీరు నన్ను వ్యర్థముగా ఆరాధించుచున్నారు, వాక్యమునకు బదులుగా మనుష్యుల ఆచారములను బోధించుచున్నారు," అని యేసు చెప్పెను. ఆయన వాక్యము, మరియు ఆయన ప్రత్యక్షపరచబడిన వాక్యము. దానిని వారు ఎరిగి యుండవలసినది.

68ఆయన బయలుపరచబడిన వాక్యమని ఆ వినిన వారందరు ఎరిగియుండవలెను.

"ఓ, మాకు వాక్యమున్నది" అని చెప్పుచున్నారు. ఎవరయినా గాని బైబిలు తీసికోవచ్చును, కాని వాక్య ప్రత్యక్షతను పొందరు.

"మేము విశ్వసించుచున్నాము." అని చెప్పెదరు. అవునండి! వారు వాక్యమంతా నమ్మిరి, సాతాను కూడా నమ్మెను. ఆ పరిసయ్యులు మాత్రము నమ్మలేదని ఎవరనగలరు? కాని ఆ ఘడియ కియ్యబడిన వాక్యమును వారు నమ్మలేదు. వారు మరొక వెలుగులో ఆరాధించుచుండిరి. నేడును వారు అదే చేయుచున్నారు. మీరు లూథరు ఆచారములను, వెస్లీ ఆచారములను గైకొనుచున్నారు, పెంతెకోస్తు ఆచారము అనుసరించుచున్నారు, కాని ఆ ఘడియ మాట ఏమిటి? పరిసయ్యులు తమ ఆచారము గైకొనుచున్నారు, కాని వారి ఆచారముల వెనుక దేవుని యొక్క నిజవాక్యము ప్రకాశమానముగా వచ్చుచున్నది. అది చూడకుండా వారు అంధులయిరి. దానిని వారు చూడజాలరు, ఎందుకనగా వారు మరో దాని కొరకు ఎదురు చూచుచున్నారు. నేడును ఆలాగే యున్నది. దేవుడు దానిని వారిలో నాటనిచ్చును గాక! దానిని వారు నమ్మునట్లుగా అది వారి గృహములకు వెళ్ళును గాక! అది మీరు తలంచిన దాని కంటె వేగముగా జరుగవచ్చును.

69నా కుమారుడు, బిల్లీ పాల్, తన నిద్రలో మాట్లాడుచుండును, కాని అతనికి తరచుగా కలలు రావు. ఒక రాత్రి అతనిని కల కలవరపరచినది. తాను ఒక సంఘములో నున్నట్లు కలలో చూచెను. నేను ఇంకా రాలేదు. నేను వచ్చుచుండగా నా కండ్లలో నుండి అగ్ని వచ్చుచుండెను. నేను ఇట్లు పలికాను," సమయము వచ్చినది; అది సమాప్తమైనది!" అందరూ కేకలు వేయసాగిరి. "నా పిల్లలు సంగతి ఏమిటి?" అని వారు అరచుచుండిరి.

నా భార్య ఇట్లనెను, "బల్ల యొద్ద శారాను ప్రార్థించమని నేను అడుగలేను."

"నేను లాయిస్ మరియు పిల్ల యొద్దకు వెళ్ళవలెను," అని అతడనెను.

నేనిట్లు పలికాను, "లాయిస్ ఇప్పుడు రాజాలదు, పిల్ల చాలా చిన్నది గనుక ఎరుగదు. బిల్లీ, ఆ ఘడియ వచ్చినది; మనము తప్పక వెళ్ళవలెను." ఇప్పుడు అర్థరాత్రి అయినది, తెల్లవారక ముందే యేసు ఇక్కడుండును. ఆలాగు కాని యెడల, నేను క్రీస్తు యొక్క అబద్ధ సాక్షిని.

ఎవరో లేచి ఇట్లనిరి, "ఆ ఘడియ గాని, నిమిషము గాని ఎవరూ ఎరుగరు."

నేను ఎన్నడూ ఘడియ గాని నిమిషము గాని చెప్పలేదు; ఇప్పుడు మరియు పగటికి మధ్య అని మాత్రమే చెప్పాను. బిల్లీ, "మనం వెళ్ళిపోదము," అన్నాను. "మనము సమయములో ఉన్నాము గనుక వెళ్ళిపోదము," అన్నాను. మేము కారు ఎక్కి వెళ్ళసాగాము. మేము కొండ ఎక్క నారంభించాము. అప్పుడు ఆకాశము నుండి వెలుగు వచ్చుట ఆరంభమయినట్లు, భూమి మీద చీకటిగా ఉన్నట్లుంది. నేను రోడ్డు ప్రక్కకు వెళ్ళి, నా చేతులతో కండ్లు మూసికొన్నాను. ఇంకా నా కండ్ల నుండి అగ్నివచ్చుచున్నది. నేనిట్లు అన్నట్లు అతడు చెప్పెను, "ప్రభువా, దీనిని నేను నీ ఆజ్ఞ చొప్పున చేశాను. ఈ విధముగా చేయమని నీవు చెప్పినందునే మేము చేశాము. నీవు చెప్పిన ప్రకారమే ఈ కార్యములన్నియూ మేము చేశాము." నేను ఒక పెద్ద నల్లరాతి కొండ వైపు కదిలాను. చేతులు లేని ఒక వెలుగు ఆ కొండలో నుండి వందలాది టన్నుల బరువు గల ఒక రాతిని తీసికొని వచ్చినది. నేనిట్లు పలికాను, "మీరు చూడవద్దు; తలలు త్రిప్పుకొనుడి. కొద్ది నిమిషములలో అంతా ముగియును." చెప్పెను, "ఆ రాయి ఆ చోటికి వచ్చుచుండగా, ఒక గొప్ప పరిశుద్ధ శబ్దము అంతటా వినబడెను."

DAN 2:34,45

 

70అది మనము తలంచిన దాని కంటే ముందే జరుగవచ్చును. చూడండి, అది పూర్తిగా వాక్యానుసారము. చేతి సహాయము లేకుండా ఒక రాయి కొండలో నుండి తీయబడినది. ఈ దినములలోనే ఒక దినమున అది ఆలాగు జరుగును, అప్పుడు మీరు కేకలు వేయుదురు. నేనిట్లు అతనికి చెప్పాను, "ఇప్పటికే మీకు ఆ సమయము వచ్చినది. దేవుడు ప్రతిసారి మిమ్మును ఎడతెగక హెచ్చరించుచునే యున్నాడు. నా స్వంత పిల్లలు కానీయండి, మరెవరయినా కానీయండి, ఆ సమయము వచ్చినది. ఆయన నాకు చెప్పమని చెప్పినదే నేను చెప్పెదను, అది ఇక్కడ యుండును, మరియు అది యుండెను." అంతట అకస్మాత్తుగా ఒక రాయి చేతి సహాయము లేకుండా కొండలో నుండి తీయబడినది. ఎన్నో సంవత్సరముల క్రితం దానియేలు దానిని చూచెనని మనకు తెలియును. దానిని గూర్చి బిల్లీ ఏమీ ఎరుగడు, కాని ఆ కల ప్రభువు యొద్ద నుండి అతనికి పంపబడినది.

వారు ఏ దేవునిని ఎగతాళి చేయుచున్నారో, ఆయననే ఆరాధించుచున్నట్లు చెప్పుకొనుచుండిరి. నేడును మరల అదే జరుగుచున్నది. దానికి కారణము వారు మరొక వెలుగులో జీవించుటయే. గొప్ప వెలుగు ప్రకాశించుచున్నది. మంచిది.

LUKE 17:29

 

71నేడు మనము ఎంత చీకటిలో నున్నామో చూడండి. నేడు ఏమీ జరుగుచున్నదో చూడండి. హత్యలు, మానభంగములు, పోరాటములు చూడండి. బిల్లీ గ్రాహం తన చివరి కూటములో ఇట్లు చెప్పెను, ఇక పది సంవత్సరములకు కాలిఫోర్నియోలోని ప్రతి వ్యక్తి తన్నుతాను రక్షించుకొనుటకు ఒక తుపాకీని మోసికొని పోవలసియుండును. చట్టము వలన ఏమి కాదు. జనులు మతిలేని వారయిరి. తుపాకీని ప్రేల్చుట, హత్యలు, మానభంగములు విచ్చలవిడి అయినవి. అది వీధులలోనే జరుగుచున్నది. మనము సొదొమ దినములలో జీవించుచున్నాము, చూచారా. ప్రకాశించుచున్న వెలుగును వారు చూచిన ఎంత మేలు! వారు ఈ ఘడియలో ఏమీ జరుగవలసి యున్నదో వాక్యములో చూచి తెలిసికొనవలెను. ఏమీ జరుగునో వారు అప్పుడు ఎరుగుదురు.

వారు ఆ వెలుగును ఆరాధించుచున్నామని చెప్పుకొనుచున్నారు. ఆనాడు వారును ఆలాగే చెప్పుకొనిరి, కాని వారు నిజవెలుగునకు బదులుగా మోసకరమైన నీడను వెంబడించుచుండిరి, చూచారా. ఆయనే ఆ వెలుగు.

72ఆచారముల, విశ్వాసములు వారి స్థితిని అంధత్వములోనికి లాగినవి. వాగ్ధానము చేయబడిన నిజవాక్యమును వారు తృణీకరించిరి. లోకమునకు వెలుగై యున్న యేసు ద్వారా దేవుని వాక్యము బయలుపరచబడినది. ఆయన కాలములో అది సజీవమాయెను. ఆయన డెబ్బది వారముల మధ్యలో తీసికోబడును (అది నిజము), అది ఆయన యొక్క మూడున్నర సంవత్సరముల ప్రవచనము. రాజగు మెస్సీయా వచ్చి ప్రవచించును. మూడున్నర సంవత్సరముల తదుపరి ఆయన సజీవుల మధ్యనుండి తీసికొనబడిన ఒక పరిహారమును చేయును. అది ఖచ్చితము. ఆయన మూడున్నర సంవత్సరములు ప్రవచించెను.

దావీదు తన కీర్తనలో ఇట్లనెను," నా దేవా, నా దేవా, నన్నేల విడిచితివి? [22వ కీర్తన] నా ఎముకలన్నియు, వారు నన్ను నిదానించి చూచుచున్నారు. వారు నన్ను చూచి తలలూపుచున్నారు; వారు నన్ను దాటిపోవుచున్నారు." ఎనిమిదివందల ఏబది సంవత్సరములకు ముందే దావీదు ఆ పాటను ఆత్మలో పాడెను, అది ప్రవచనముగా ఎంచబడెను. ఆయన చేతులలో గాయములతో సిలువ మీద వ్రేలాడుచుండగా, వారు ఆలయములో అదే బలిని గూర్చి పాటలు పాడుచుండిరి. వారు "నా చేతులలో పాదములలో పొడిచిరి," చూచారా. అక్కడ చూడండి? ఎందువలన? వారు మరొక వెలుగులో జీవించుచుండిరి; వారు అసలు వెలుగు చూడలేదు.

JOHN 1:12•

JOHN 7:9

 

73మతి సరిగా యున్న వ్యక్తి ఆలాగు చేయగలడా? పిచ్చివాడు మాత్రమే చీకటి గదిలోనికి పరుగిడి వెళ్ళి, తలుపులు మూసికొని "వెలుగున్నదంటే నేను అంగీకరించను," అని పలుకును. అది పిచ్చితనము. బైబిలు వాగ్ధానము చేసినది, ఇప్పుడిచ్చట బయలుపరచబడి యున్నది, దానిని చూడకుండా ఆ మతవిశ్వాసములలో జీవించి, అసలు దానిని తిరస్కరించుట ఆత్మీయంగా వెనుక అడుగువేయుటయే. అది ఆత్మీయ భ్రష్టత్వము. నిజమే.

ఇప్పుడాయన ఇచ్చటున్నాడు. ఆయన లోకమునకు వెలుగు. ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చెను; వారాయనను ఎరుగకపోయిరి. ఆయన లోకములోనికి వచ్చెను. లోకము ఆయన వలననే కలిగెను, కానీ లోకము ఆయనను ఎరుగలేదు, చూచారా. కాని ఎందరు ఆయనను నమ్మిరో, వారందరికి ఆయన దేవుని కుమారులగుటకు అధికారమిచ్చెను.

74గుర్తుంచుకొనండి, నిన్నటి వెలుగు బట్టి మనము జీవించజాలము. నిన్నటి వెలుగు గతించినది. అది ఇక లేదు, నిన్నటి వెలుగు ఒక జ్ఞాపకము మాత్రమే. నిన్నటి సూర్య కాంతి ఒక జ్ఞాపకం మరియు అది ఒక చరిత్ర మాత్రమే. నిన్నటి వెలుగులో మనము జీవించజాలము. సూర్యుడు ఒక్కడే అయినా, ప్రతిదినము నూతన వెలుగు వచ్చి, కోత కొరకు పంటను పరిపక్వ పరచుచున్నది, చూచారా.

ఈనాడు సూర్యుడుదయించుచున్నాడు, మరింత బలముకలుగును. దినదినము మరింత బలము పొందును, చివరకు గోధుమ సంపూర్ణ జీవము పొందును. కొద్ది కొద్దిగా బలము పొంది, చివరకు జీవము పైకి వచ్చును. మార్చి, ఏప్రిల్, మే, జూన్, జూలై చివరకు కోత కాలము వచ్చును. మీరు చూచారా? అదే సూర్యుడు జనవరి, డిసెంబరులో కూడా ఉదయించును. ఆ మంచు కరిగి నీరుగా మారునట్లు చేయునది, కాని ఆ గోధుమ గింజ జూన్ వేడిలో తట్టుకొని ఉండజాలదు, ఎందుకనగా దాని వేడి హెచ్చగును. సూర్యకాంతి తట్టుకొనుటకు ఆ గింజ పరిపక్వత చెందవలెను.

నేడును ఆలాగే యున్నది. ఆది కాలములో పితరులు చల్లిన విత్తనము ఎదుగలేదు లూథర్, వెస్లీ మొదలగు వారు సూర్యుని గ్రహించలేదు. సూర్యుడు దానిని చంపును. అది ఎదుగుటకు ఇష్టపడలేదు, చూచారా. అది ఎదిగినది కాని గిడసబారి పండలేదు, అందులో జీవము లేదు. సూర్యుని యొక్క దినదిన కాంతి వలన ఆ గింజ దినదినము వేడిని పొంది పరిపక్వమవ్వవలెను.

75ఇప్పుడు, ఒక్క నిమిషము ఆలోచించుదము. సంఘ కాలములను గమనించుదము. ఏడు సంఘ కాలములున్నవి. ఆ సంఘ కాలములలో, ప్రతి కాలము వారు ఏమి చేయుదురని ఆయన చెప్పెనో గమనించండి. ఆ గింజ పక్వత చెంది చివరకు ఈ ఘడియకు ఏమగునని చెప్పెను? నేడు మనము ఆ చివరి ఘడియలో జీవించుచున్నాము. సంఘములు ఆలాగే చేయవలసి యుండును.

లూథరు ఒక గింజను విత్తెను, లూథరే ఒక విత్తనము. దానిని అతడు చల్లెను. మంచిది. వెస్లీ కూడా అంతే, మరియు పెంతెకోస్తు కూడా అంతే. బాప్టిస్టు, నజరీను వారు అంతే. అయితే, ఇప్పుడు మీరు చూడండి, లూథరు వెళ్ళి మొదటి శాఖయగు కాతలిక్కులో జీవించలేడు. లేదండి. అతనికి మరొక వెలుగున్నది. దేవుడు ఒకదానిని పరిపక్వపరచుచున్నాడు.

లూథరను ఉజ్జీవము నుండి ఒక చిన్న గుంపు వచ్చెను. తదుపరి వెస్లీ ఉజ్జీవము వచ్చెను. వారు వెళ్ళి లూథరను వారి వలె జీవించలేరు, చూచారా. ఆ తరువాత పెంతెకోస్తు వారు వచ్చిరి.పెంతెకోస్తు వారును సంస్థగా మారి ఆలాగే చేసిరి, పొట్టు మిగిలినది. గమనించండి.

76కాని ఆ గింజ ఇంకా ముందుకు సాగిపోవుచున్నది.

ఇప్పుడు మనము మరో కాలములో ఉన్నాము. వారెందుకు దానిని పొందలేదు? ఆ పరిపక్వ మగుచున్న గింజను వారెందుకు చూడలేదు? నేటి కొరకు ఈయబడిన వాగ్ధాన వచనము ఇక్కడున్నది. దానిని వారెందుకు చూడరు? ఎందుకనగా వారు లూథరు వెలుగులో, వెస్లీ వెలుగులో, బాప్టిస్టు వెలుగులో,పెంతెకోస్తు వెలుగులో జీవించుచున్నారు. వారు మరియొక వెలుగులో జీవించుచున్నారు. ఆ కారణము చేతనే వారు దేవుడు వాగ్ధానము చేసి బయలుపరచిన పూర్తి వాక్య వెలుగును పొందలేకపోవుచున్నారు. ఏడు ముద్రలలో మర్మములన్నియూ విప్పబడినవి, ఆ మర్మములు ఎందుకు ఆలాగున్నవో వచ్చి చెప్పెను. అయినా గాని వారు ఎప్పటి వలెనె దానిని కాదని వెళ్ళిపోవుచున్నారు. వారికి క్షమాపణ ఉండదు.

దేవుడు దానిని ఆత్మ ద్వారాను, ప్రత్యక్షల ద్వారాను జరిగించెను. ఆయన సైన్సు ద్వారా సంపూర్ణముగా దానిని రుజువు చేసెను. అది సత్యము అని బయలుపరచెను. అయినా గాని ఇంకా వారు ఆ పెంతెకోస్తు వెలుగులో జీవించగోరుచున్నారు: "నేను అసెంబ్లీసుకు చెందినవాడను"; "నేను ఏకత్వవాదిని"; "నేను దేవుని సంఘము వాడను"; "నేను ఇది," అనుచున్నారు, చూచారా. నలుబది లేదా ఏబది సంవత్సరాల క్రితపు వెలుగులో వారు జీవించ గోరుచున్నారు. లూథరను వెలుగులో, వెస్లీ వెలుగులో, బాప్టిస్టు వెలుగులో, ప్రెస్బిటేరియను వెలుగులో, నాజరీను వెలుగులో, మరేదో యుగపు వెలుగులో వారు జీవించగోరుచున్నారు. గతించిన సంఘ కాలములో జీవించగోరుచున్నారు. వారు సంస్థగా మారి నిజముగా ప్రకాశించుచున్న వెలుగును నిరాకరించుచున్నారు.

77మీరు ఒక ఎండమావిలో జీవించుచున్నారు.

నేను దీనిని వినయముగా చెప్పుచున్నాను (చూడండి), మిమ్మును గాయపరచవలెనని కాదు, కాని మిమ్మును మేల్కొలుపుటకు చెప్పుచున్నాను. మీరు ఒక ఎండమావిలో జీవించుచున్నారు. యేసు ఇట్లనెను, "మీరు గ్రుడ్డివారై యుండి గ్రుడ్డి వారికి త్రోవచూపుచున్నారు." అందులో నుండి బయటకు రమ్మని ఆయన వారితో చెప్పెను. "గ్రుడ్డివాడు గ్రుడ్డివానికి త్రోవ చూపిన యెడల ఇద్దరును గుంటలో పడుదురు." వారి జోలికి పోవద్దు. నేను ఆ ఘడియకు వచ్చి యున్నాను, పడిపోవుచున్నచో నేను సహాయముచేయలేను. నేను చేయకలిగినదంతయూ చేశాను. ప్రభువా, నీ ఆజ్ఞ ప్రకారమే ఇదంతయూ నేను చేశాను. నీవే సాక్షివి. 1933లో నీవు ఆ వెలుగును నది యొద్ద ప్రకాశింపచేసియున్నావు; ఈ వెలుగు ఈ ఆలయములోనికి వచ్చి యున్నది. ఇన్ని సంవత్సరములు అది మీకు సాక్షమిచ్చియున్నది. చెప్పిన ప్రతిదియు నెరవేరినది. వారింకా ఆలాగే కొనసాగుచున్నారు. గ్రుడ్డివారు గ్రుడ్డివారికి దారి చూపించుకొననిమ్ము. నేను ఆ ఘడియ కొరకు ఎదురు చూచెదను. ఈ దినములలో ఒక దినమున ఆయన వచ్చును.

78గమనించండి, లూథరు వెలుగులో జీవించుచున్నారు, వెస్లీ వెలుగులో జీవించుచున్నారు, ఆ వెనుకటి వెలుగులో జీవించుచున్నారు, అందువల్లనే వారు నిజ వెలుగును చూడలేకపోవుచున్నారు. వారు కొద్ది నిమిషముల ఆగి, బైబిలు పట్టుకొని చదివినచో, ఈ ఘడియకు వాగ్ధానము చేయబడిన వెలుగును చూడగలరు.

ఈ విషయములు కొన్ని ఒక నిమిషము చూద్దాం. మలాకీ 4 ప్రకారము ఈ సంగతులు జరుగునని ఆయన వాగ్ధానము చేసెను. ఆలాగు జరుగునని ఆయన లేఖనములన్నిటి ద్వారా వాగ్ధానము చేసెను, చూచారా.

ఇశ్రాయేలును కూడా గమనించండి, మనకు మాదిరి (చూడండి!), యాత్రలో వారు మన్నా తినుచుండిరి, అది వారి జీవ-వెలుగు, వారికి బలము జీవము ఇచ్చెను. నిజమేనా? నిన్న పడిన మన్నా ఇశ్రాయేలీయులు తినరు. అది చెడిపోవును; అది క్రుళ్ళిపోవును. అది వారికి కీడు చేయును; దానిని తినిన చనిపోదురు. నిన్న వారిని జీవముతో ఉంచిన మన్నా నేడు వారిని చంపును. అది పురుగులు పట్టి క్రుళ్ళిపోవును అని బైబిలు చెప్పెను. వారు ప్రతి దినము క్రొత్త మన్నా తినవలెను. ఆమేన్! అది ఏమిటి? జనులు లూథరు, వెస్లీ మొదలగు వారి మన్నాను తిని జీవించగోరుచున్నారు. ఆ చెడిపోయిన మన్నా మిమ్మును ఆత్మీయముగా చంపును, చూచారా. అది నిన్ను చంపుచున్నది. నీ ఆచారము ద్వారా చచ్చెదవు.

79నిన్నటి లూథరు, మన్నా మెతడిస్టులకు పనికి రాదు. మెతడిస్టు మన్నా పెంతెకోస్తు వారికి పనికి రాదు. పెంతెకోస్తు మన్నా నేడు పనికిరాదు. నా భావము గ్రహించారా? ప్రతి రోజు అది తాజాగా రావలెను. సంఘ కాలములలోను ఆలాగే జరుగవలసియున్నది. లూథరు యొక్క మన్నా నీతికరణము. వెస్లీ యొక్క వర్తమానము శుద్ధీకరణ యొక్క ప్రత్యక్షత. పెంతెకోస్తు అనగా వరముల పునరుద్దరణ, కాని ఇది చివరి దినమున మూలరాయిని, వధువు వృక్షమును పరిచయము చేయుచున్నది. అది అన్నింటికి వేరుగా నున్నది. కాని అది పరిపక్వమగుచున్న వారికి మారని వెలుగే, జూలైలో పంటను కోత కొరకు సూర్యుని వెలుగు తీసికొని వచ్చుచున్నట్లే యున్నది. నేడు ఆలాగే ప్రకాశించుచున్నది. నా భావము గ్రహించారా? కాని నేడున్న వెలుగు జూలై నాటికి పనికి రాదు. అది బలమైనది; గోధుమ మరింత పండును. అది దానిని స్వీకరించుటకు సిద్ధమగును. ఆమేన్! నిశ్చయముగా అది అలాగే యున్నది. ఇప్పుడు అది పనికి రాదు. అప్పటికి అది ఉపయోగపడును. ఆ కాలము ఇప్పుడు వచ్చియున్నది.

దేవుని సష్టికి విరోధంగా నీవు వెళ్ళజాలవు. ఆయనకు ఒక సూత్రమున్నది. దానికి విరుద్ధమైనది నీ మొక్కను చంపివేయును. దేవుడు పలికిన సూత్రముల ద్వారానే నీవు వెళ్ళవలసి యున్నావు. ఆయన వాక్యమే ఆయన సూత్రము. ఏ సూత్రమయినా గాని పలుకబడిన వాక్యమే. వాక్కు అనగా ప్రత్యక్షపరచబడిన ఆలోచన, చూచారా.

ఇప్పుడు, అది మనకు తెలియును; అది సత్యము. దర్శనమనగా ఏమిటి? ఒక సంఘటనను దేవుని వాక్యము ముందుగా చెప్పును. ప్రవక్తలు దర్శనము కలిగి యుండిరి, యేసు కలిగి యుండెను, పౌలు కలిగి యుండెను, ఈ దినమున ఏమి జరుగునో వారందరూ ముందే చెప్పిరి. జనులు దానిని గుర్తించలేకపోవుచున్నారు, నా భావము గ్రహించారా?

ఇప్పుడు, నిన్నటి మన్నా…

80ఇటు చూడండి! సూర్యుడు తూర్పు నుండి పడమరకు పయనించుట మీరు చూడండి. దానిని గమనించారా? సంఘ కాలములు కూడా ఆలాగే చేసినవి. సూర్యుడు తూర్పున ఆరంభమాయెను. నాగరికత సూర్యునితో పాటు పయనించును, వారిని జీవింపచేయు దేవునిచే పలుకబడిన వెలుగు అది. వారు వచ్చి సూర్యుని చూచి అది వెళ్ళు చోటికి వెంబడించిరి.

నీ పుట్టుకతోనే నీ జీవము కూడా సూర్యునిలాగే యున్నది. నీ జీవితము సూర్యోదయము, సూర్యాస్తమయమువలె యున్నది.

మనిషి ఎల్లప్పుడూ పశ్చిమానికి పయనించును. తూర్పు దేశములలో అతి ప్రాచీన నాగరికత చైనాది. అది పశ్చిమానికి పయనించి వచ్చుట గమనించండి. అది పశ్చిమానికి ఆలాగే కొనసాగును.

81సంఘ కాలములు కూడా అదే రీతిగా దేవుని కుమారుని ద్వారా పయనించుచున్నవి.

చూడండి! ఆది సంఘము తూర్పున ప్రారంభమాయెను; అది అక్కడ నుండి సముద్రము దాటి జర్మనీ లోనికి వెళ్ళినది. అది మూడు ఈడ్పులు పొందినది. చూడండి, ఆసియా నుండి పాలస్తీనాకు, అక్కడ నుండి సముద్రము దాటి జర్మనీకి వెళ్ళినది. అక్కడ లూథరు వచ్చెను. అది లూథరు నుండి ఇంగ్లీషు ఛానలు దాటి వెస్లీ యొద్దకు వెళ్ళినది. వెస్లీ నుండి అమెరికాలోని పశ్చిమ తీరమునకు వెళ్ళినది. అది మరల తూర్పునకే వెళ్ళును. ఇది సాయంకాలము!

సంఘ కాలములను చూడండి. ఆది కాలములో పౌలు నుండి ఐరేనియసుకు అది వచ్చింది. అలాగే ఫ్రాన్సు వరకు వచ్చినది. అక్కడ నుండి జర్మనీ, ఇంగ్లండు, ఇంకా పశ్చిమానికి వెళ్ళుచునే యున్నది. ఇంక దూరము మనము వెళ్ళజాలము. ఇది చివరి యుగము! ఈ చివరి యుగము గూర్చి బైబిలు ఏమి చెప్పెను? భౌగోళికంగా మీరు చూచినా గాని తెలియును. మొదట వాక్యము చూడండి. మొదటి సాక్షి వాక్యమే. చారిత్రకంగా కూడా చూడండి. ఏలాగు చూచినా మనము అంత్యమందు, చివరి యుగములో యున్నాము.

82అది ఇంకా ముందుకు బలంగా ఎదిగి వెళ్ళుటను చూడండి. ఆలాగే చిన్న సంఘము కూడా యున్నది. నీతికరణము, శుద్ధీకరణము, పరిశుద్ధాత్మ బాప్తిస్మము, చివరకు తలరాయి యొద్దకు వచ్చి రూపము పొందినది. దీని తరువాత ఇక సంస్థలుండవు. ఇక ఏవీ ఉండవు, చూచారా. ఉండలేవు. చూచారా, మనము పశ్చిమాన ఉన్నాము.

అన్ని మాదిరిలు మీకు చూపించగోరుచున్నాను. ఆ మూడు గంతులు, మూడు ఈడ్పులు చూడండి. మనము ఎందువలన చివరికాలములో ఉన్నామో ఈ రాత్రి చూద్దాం.

కుమారునివలెనే సూర్యుడును పయనించుచున్నాడు; సూర్యుడివలెనే కుమారుడు పయనించుచున్నాడు (S-o-n like s-u-n.) సంఘము కూడా ఏడు సంఘ కాలములలో ఆలాగే యున్నది. నాగరికతలు పశ్చిమానికి పయనించినవి. సంఘము కూడా పశ్చిమదిశకే వెళ్ళుచున్నది. ఇప్పుడున్న దానికంటె ఇంకా ముందుకు మనము వెళ్ళినచో, మరల తూర్పుకే వచ్చుదుము. మీరు పశ్చిమ తీరము దాటినచో మరల చైనా, జపాను మొదలగు దేశములకే తిరిగి వెళ్ళెదరు. ఏడు వేల మైళ్ళు అడ్డంగా వెళ్ళినచో మరల తూర్పునకే వచ్చెదవు. తూర్పు, పశ్చిమములు కలిసికొనినవి. మనము అంత్యదినమున ఉన్నాము. ఇక ఏమియూ విడిచిపెట్టబడలేదు.

83నేడును, ఆ వెనుక జరిగినదే మరల జరుగుచున్నది. పశ్చిమాన కలిసికొనినదే, తూర్పున కలిసికొనుచున్నది. జనులు మరియొక వెలుగులో జీవించుచున్నారు. వచ్చిన వెలుగును వారు నిరాకరించి విసర్జించియున్నారు. వారిప్పుడు వెలుగునకు బదులుగా నీడను పొందియున్నారు. "ఓ! అన్యుల దేశములగు జెబూలూను, నఫ్తాలి, గలిలయ మొదలగు వానిలో గొప్ప వెలుగుండెను."

ఇది ఏడవ సంఘ కాలము. గుర్తుంచుకొనండి, పశ్చిమమున ఉన్న సూర్యుడే తూర్పున ఉన్నాడని గ్రహించండి. అన్ని యుగములలోనే ఒకే ఆత్మయున్నది, మారని సూర్యుడు ఉన్నట్లే యున్నది, రుతువులలో పండుచున్నట్లే యున్నది. ఇప్పుడున్న సూర్యుడే ఆకురాలు కాలములోను, పంటకాలములోను యుండును. ఆ సూర్యుడే ఆకురాలు కాలములోను, పంట కాలములోను యుండును. ఆ సూర్యుడే గింజను పండచేయును, చూడండి. కాని ఇది అధికమగు సూర్యరశ్మి. ఈ చివరియుగములోను వారికి కలిగినది కాక అదనంగా మనము కలిగి యుండవలెను. కాని వీరు మరుగుజ్జువారి వలె జీవించగోరుచున్నారు. చీకటితో నిండిన శాఖా గదిలోనికి వెళ్ళుచున్నారు. విశ్వాస సూత్రములు వల్లించి తమ్మును గ్రుడ్డివారుగా చేసికొనుచున్నారు. "నేను దానిని చూడను, అది బుద్ధిహీనత అనుచున్నారు." వారు నమ్ముచున్నామని చెప్పుచున్న బైబిలును పరిశుద్ధాత్మ బయలుపరచి, చివరి దినములకు వెలుగును తీసికొని వచ్చుచున్నది.

MAL 4:6•

MATT 15:14•

LUKE 6:39

 

84మలాకీలో చెప్పినది గమనించండి. "తండ్రుల విశ్వాసము పిల్లలకు; పిల్లల విశ్వాసము తండ్రులకు ఇచ్చెను." ఆ గత కాలములో లేచిన ఆత్మయే ఇక్కడ మరల లేచుచున్నది, జరిగినదే మరలా జరుగుచున్నది. ఎందువలన? పశ్చిమములు కలిసికొనినవి. మన కండ్ల యెదుటనే జరిగినది, అయినా వారు అది చూడరు. ఎందువలన? యేసు చెప్పిన దానిలో ఆశ్చర్యము లేదు. "గ్రుడ్డివాడు గ్రుడ్డివానికి త్రోవచూపించిన యెడల ఇద్దరును గుంటలో పడుదురు."

ఇతర యుగముల వెలుగు ఈ యుగపు వెలుగును ప్రతిబింబింప చేసినది, చూచారా. జూలై లేక ఆగస్టు నెలలో యుండు సూర్యుని ఈ సూర్యుడు వెల్లడి చేయుచున్నాడు. కోత కాలము. మార్టిన్‌లూథర్, వెస్లీ, సాంకీ, ఫిన్నీ, నాక్సు, కాల్విన్, మూడీ మొదలగు గొప్ప వారందరు ఆ వెనుక ఆ వెలుగును కలిగి యుండిరి. బాపిస్టు సంఘము యొక్క జాన్ స్మిత్, క్రీస్తు శిష్యులుగా పిలువబడుచున్న అలెగ్జాండరుకాంప్ బెల్, క్రైస్తవ సంఘము, ఇంకా ఏవేవో పేర్లు గల సంఘములున్నవి. ఆ వెనుక నుండిన వారందరును ఈ అంతమందుండు ఈ వెలుగునే ప్రతిబింబింప చేసిరి.

85ఆ సంస్థాపకుల పిల్లలు వారి వెంట వచ్చి ఏమి చేసిరి? దానితో నిలిచియుండక, దాని నుండి తెంపివేసుకుని, జీవము లేని పొట్టును తయారు చేసికొనిరి. [ఒక ప్రక్క అంతమై మరో వైపు అసంపూర్తిగా ఆరంభమయినది - సంపా॥] సువార్త వెలుగు ద్వారా పండిన పంటను దేవుడు పరిశుద్ధులకు ఆహారముగా ఇచ్చెను. నేడు ఆయన ఇక్కడున్నాడు. పరిశుద్ధులు రొట్టెను తిందురు.

ఆలోచించండి. నిన్నటి పొట్టును (చూడండి), మీరు నాటకూడదు; అది కుళ్ళిపోయినది. అందులో ఉండలేదు. లేదండి! అది ఏ మంచి చేయదు; అది ఎదుగదు. దానిలో జీవము లేదు. వాక్యమే జీవము. అది నిజము. పై పొట్టు రాలిపోవును, పాతవి వాటికవే పడిపోవును, అలంటివి అన్నియు. దానికి జీవముతో సంబంధము లేదు. కాని వెలుగు దానిని బయలుపరచును. ఓ మై! అవునండి.

86ఓ! మై… నిన్నటిది…

దానిని ఎంతగానో మనము చూడవలసి యున్నాము! "నిన్నటి కుళ్ళును తినవద్దు." దానిలో పురుగులున్నవి. కుళ్ళును తినవద్దు. దానిలో పురుగులున్నవి. కుళ్ళిపోయిన దానిలో పురుగు ఏలాగుండునో మీకు తెలియును, చూచారా. అదిప్పుడు నాకు వద్దు. మీకు నచ్చితే, అది తినండి. కాని నాకు వద్దు.

"నిన్న అది బాగున్నది కదా?" అని మీరు తలంచవచ్చును. ముందు తప్పగా నున్నదే చివరకు గింజగా మారును. నిన్నటి గోధుమలే నేటి పిండి. కాని అది పరిపక్వత చెందుటకు నిరాకరించిన యెడల అది రాలిపోవును, చూచారా. కాని అది జీవము పొందు పరిణామములో వెళ్ళుచున్నచో, అది ఒక దినమునకు గింజగా తయారగును. లేని యెడల ఎక్కడికి వచ్చును?ఆమేన్! గ్రహించారా?

87ఒక సారి ఇంగ్లాండు దేశపు రాణి, పెద్ద పేపరు కంపెనీకి వెళ్ళినది. ఆమె పేపరు మిల్లులను చూడగోరినది. కాబట్టి వారు పేపరు మిల్లులు చూపించుచున్నారు. ఆ తదుపరి ఆమె ఒక పెద్ద మురికి గుడ్డల గుట్ట యొద్దకు వచ్చినది. "ఇదెక్కడ నుండి వచ్చినది? ఇది ఏమిటి?" అని ఆమె అడిగినది.

ఆ కంపెనీ యజమాని ఇట్లనెను, "ఈ మురికి దానిలో నుండియే ఆ కాగితము తయారగును."

"అందులో నుండి పేపరు వచ్చునా?" అని ఆశ్చర్యపడెను.

"అవును!" ఆమె అది నమ్మలేకపోయినది. ఆమె వెళ్ళిపోయిన తదుపరి, ఆమె మురికి గుడ్డలు అని పిలిచిన, ఆ మురికిగా నున్న చెత్తను తీసికొని వెళ్ళి శుద్ధి చేయు యంత్రములో వేయగా అందులో నుండి చక్కని, అందమగు కాగితము వచ్చెను. ఆమెను ప్రతిబింబించే ఆకృతితో కాగితమును తయారు చేసిరి. ఆమెకు వాటిని పంపిరి.

88ఇప్పుడు, నిన్నటి కుళ్ళు, లూథరు వర్తమానము, వెస్లీ వర్తమానము, పెంతెకోస్తు వర్తమానము దేవుని పరిశుద్ధాత్మ యంత్రము గుండాను, వాక్యప్రత్యక్షత ద్వారాను వెళ్ళినప్పుడు మాత్రమే అది రాజగు యేసుక్రీస్తు ప్రత్యక్షతను ప్రతిబింబించగలదు. ఆమేన్! కాని దానిని నీవు ఆలాగే విడిచిపెట్టినచో, మురికి బట్టలవలెనే యుండును, చూచారా. అది ఒకదానిలో పోయబడి రూపుదిద్దుకొనవలెను.

వెస్లీ దానిలో లూథరు మలచబడవలెను, పెంతెకోస్తు దానిలో వెస్లీ మలచబడవలెను, క్రీస్తులో పెంతెకోస్తు మలచబడవలెను. అది ఒక విధానముగుండా వెళ్ళును. ఆలాగే సువార్త కూడా ఒక పద్ధతిలో వెళ్ళును. ఇది ఆ విధానము. లూథరు యొక్క నీతీకరణ కాలమును మనము నమ్ముచున్నాము. వెస్లీ యొక్క శుద్ధీకరణమును మనము నమ్ముచున్నాము. పెంతెకోస్తు వారి వరముల పునరుద్ధరణను మనము నిశ్చయంగా నమ్ముచున్నాము, కాని వాటన్నింటినీ మలచినచో ఏమి తయారగును? "నిన్న, నేడు, నిరంతరము ఏకరీతిగా నున్న యేసు." మహిమ! మీరు యేసుతో బయటకు రండి.

89ఒక లోహ కర్మాగారంలో ఒకడు గంటను తయారు చేయుచున్నాడు, దానిలో అతడు ఒక ప్రత్యేక ధ్వనిని ఉంచవలసి యున్నాడు. అతడు దానిని కొలిమిలో ఉంచి దాని మీద ఇనుమును, ఇత్తడిని, ఉక్కును, రాగిని తగిన పాళ్ళలో పోయును. ఎందుకు? సరయిన ధ్వని ఇచ్చుటకు ఎంత పోయవలెనో అతడెరుగును. తన వధువు ద్వారా యేసు చేసినది అదియే. లూథరును, వెస్లీని, ప్రెస్బిటేరియనును, పెంతెకోస్తును ఎన్ని పాళ్ళలో కలుపవలెనో ఆయనెరుగును. అప్పుడు బయటకు ఏమి వచ్చును? ఆయన స్వంత ప్రతిబింబము. ఎందువలన? పిరమిడ్ వర్తమానము వలెనే. అది తలరాయి కొరకు చిన్న మందగా ప్రోగవుచున్నది. యేసు యొక్క పరిచర్య ఈ భూమి మీద ఆలాగే యుండవలెను, లేనిచో ఆయన అక్కడికి రాజాలడు. పాదముల నుండి శిరము వరకు ఏలాగున్నవో, ఆలాగే అంగములుండును. శిరము పాదము కాదు, పాదము శిరము కాదు. పాదములు ఎచ్చటికి వెళ్ళవలెనో శిరము తెలియచేయును. గ్రహించారా? ఘడియ యొక్క వెలుగు చక్కగా కనబడుచున్నది.

ఆయన బాప్తిస్మమిచ్చు యోహానుతో చెప్పినట్లుగా వెస్లీ కూడా గొప్ప వెలుగే. నిశ్చయంగా అతడు తన ఘడియకు గొప్ప వెలుగే.

90అవునండి! నిన్నటి మురికి గుడ్డలను ఆలాగే యుంచినచో, అవి ఎన్నడును ఆలాగే యుండును. అది ఒక వస్త్రముగా తన పనిని నెరవేర్చినది, కాని ఇప్పుడు అది కాగితముగా మారినది. లూథరు ఆధ్వర్యములో నీతికరణము తన పనిని జరిగించినది. ఆ తరవాత వెస్లీ ద్వారా శుద్ధీకరణము వచ్చినది. పరిశుద్ధాత్మ బాప్తిస్మము వచ్చువరకు శుద్ధీకరణము తన పనిని నెరవేర్చినది. ఒక్క దేవుడు సంఘములోనికి, సంఘమును క్రీస్తు లోనికి మలచు సమయము వచ్చువరకు పరిశుద్ధాత్మ బాప్తిస్మము తన పనిని నెరవేర్చినది. అది యేసుక్రీస్తును భూమి మీద ప్రతిబింబించునట్లు చేసినది. ఆయన బైబిలులో అదే వాగ్ధానము చేసెను. దానిని నమ్మకపోవచ్చును. నేను మిమ్మును నమ్మునట్లుగా చేయజాలను. నేను వాక్యమునకు మాత్రమే బాధ్యుడను, చూచారా. అది నిజము.

JOHN 14:12

 

91ఇప్పుడు అది చూచారా? మీరు దానిని చూచారా? ఒక వ్యక్తి వెల్చ్ ఉజ్జీవమును చూచుటకు వేల్సు వెళ్ళెను. చాలా మంది అమెరికా నుండి వెళ్ళిరి. వారు వెల్చ్‌ ఉజ్జీవము జరుగుచున్న భవనమును కనుగొనగోరిరి. వేల్సు దేశములో వెల్చ్ జనుల మధ్య పెల్లుబికిన ఉజ్జీవము మీకు చాలా మందికి తెలియును. పెద్ద పెద్ద సంఘకాపరులు, గొప్పవారు (doctors of divinity) చాలామంది అమెరికా నుండి వెళ్ళియుండిరి. వారు వెళ్ళి ఆ జరుగుచున్న గొప్ప దానిని తెలిసికొనగోరిరి. వారు వీధిలో వెళ్ళుచుండగా, ఒక మూలన కర్ర పట్టుకొని, "ఈల ఊదుచూ ఒక పోలీసు కనబడెను. అతడు ఒక పాటను ఈలగా పాడుచుండెను." అతనిని వీరు ప్రశ్నించుటకు వెళ్ళిరి. వారు అతనిని "వెల్చ్ ఉజ్జీవ మెక్కడ?" అనడిగిరి.

అతడు తన టోపిని తీసి, అయ్యలారా, వెల్చ్ ఉజ్జీవము ఇక్కడున్నది, అని తన హృదయమును చూపించెను. ఓ! అవును. అతడే వెల్చ్‌ ఉజ్జీవము. ఓ! దేవా, మేము యేసుక్రీస్తు ప్రతిబింబములమని గుర్తించిన ఎంత బాగుండును! ఆయన వాక్యము ప్రత్యక్షమాయెను. మీరు ఆయన వాక్యమునకు ప్రతిబింబములు, చూచారా.

"వెల్చ్ ఉజ్జీవము ఎక్కడ? ఏ భవనములో?"

"నా హృదయములో అని అతడు చెప్పెను." అతడే వెల్చ్ ఉజ్జీవము. నిజము.

ఈనాడు సంఘము భూమి మీద కార్యరూపములో నున్న యేసుక్రీస్తుగా ఉండవలసి యున్నది. "నేను జీవించుచున్నాను గనుక మీరును జీవించెదరు. నా జీవము మీలో ఉండును. నేను చేయు క్రియలు మీరును చేయుదురు," చూచారా. సంఘము ఆ స్థానమునకు రావలసి యున్నది. అది ఆలాగుండునని ఆయన వాగ్థానము చేసెను. ఆలాగగును. అక్కడికి వచ్చును. కావున మీరు చూడండి, అది జరుగును. మనము ఆలాగు ఉండవలసి యున్నాము.

ఆయన వెలుగై యున్నాడు.

EXOD 3:4

 

92ఆలాగే తన దినమున నోవహు వెలుగుగా నుండెను. దేవుని వాక్యమును ఆచరించు వెలుగుగా అతడు ఉన్నాడు. "నేను సృజించిన నరులను నేను భూమి మీద నుండకుండా తుడిచి వేసెదను. ఒక ఓడ నిర్మించుము, మరియు దానిలోనికి వచ్చిన వారందరూ రక్షించబడుదురు."

నోవహు ఇట్లు చెప్పెను," ఒకే ఒక మార్గమున్నది. అది ఓడ."

"ముసలివాడు వెర్రిపట్టిన పిచ్చివాడు," అన్నారు వారు. ఆయన ప్రత్యక్షపరచబడిన వాక్యము. నిశ్చయంగా, ఆ ఘడియకు నోవహు వెలుగే. తన కాలములో, వెలుగును అతడు తీసికొని వచ్చెను.

మోషే తన ఘడియకు వెలుగు. "నేను నిశ్చయముగా మిమ్మును దర్శించెదను," అని దేవుడు అబ్రహాముతో చెప్పెను. నేను వచ్చి మిమ్మును బలమగు హస్తముతో విడిపించెను. ఐగుప్తులో నా బలమును మీకు చూపించెదను. మోషే దేవునిని మండుచున్న పొదలో కలిసికొనెను. "నేను" ఉన్నవాడను అని దేవుడు అతనితో చెప్పెను. మోషే అక్కడికి వెళ్ళెను. ఆయనే వెలుగు. ఆమేన్! నేలమీద ధూళిని తీసి ఊది, "భూమి మీదకు పేలు వచ్చును గాక," అని చెప్పిన, ఆలాగే జరిగెను. అతడు దేవుని వాక్యమును కలిగి యుండెను. ఏమి జరిగినది? ధూళి ఎగురసాగినది. పేలు ఎక్కడ చూచినా కనబడెను. హల్లెలూయా! ఎందువలన? దేవుని వాక్య వెలుగునకు అతడు ప్రత్యక్షత. "నేను ఐగుప్తును తెగుళ్ళతో నింపెదను." అతడు ప్రవక్త. అతడు చెప్పినది, నెరవేరును. ఆ దినమునకు అతడు వెలుగు. అతడు దేవుని యొక్క వెలుగు.

MARK 14:58

 

93ఫరో, అతనితో నున్నవారు, ఆ యాజకులు ఏవేవో కలిగి యుండవచ్చును. కాని మోషే మాత్రమే వెలుగు. ఎందువలన? అతడు బయలుపరచబడిన దేవుని వెలుగును చూపించుచుండెను. నేను "బలమగు హస్తముతో వారిని బయటకు విడిపించెదను. నేను మహిమ తెచ్చు కొందును అని దేవుడు వాగ్ధానము చేసెను." ఆయన అదే చేయుచుండెను. ఆ కారణముచేతనే మోషే తాను సృష్టించగలనని నిరూపించెను. తాను కావలెనని సృష్టించలేదు, కాని దేవుడు చెప్పినట్లుగానే చేసెను. "జనులతో ఈలాగు చెప్పమని దేవుడు సెలవిచ్చెను. దేవుడు నన్ను పిడికిడి నిండా ధూళి తీసికొని దానిని పైకి విసిరి, ఈలాగు పలుకమనెను. అక్కడ ఏమీ లేదు గాని చెప్పినది వచ్చును." ఆమేన్! ఓ! మీరు నిద్రపోవుట లేదని తలంచుచున్నాను. ఓ! ప్రత్యక్షత.

అతడిట్లు చెప్పెను, "నేను పంపబడితిని. ఆయన నిశ్చయముగా మనలను దర్శింతునని, బయటకు తీసుకు వస్తానని మన పితరులకు చెప్పెను. ఆ ఘడియ సమీపముగా ఉన్నదని నిరూపించుటకు నేను వచ్చియున్నాను. మీరు విడిచిపెట్టి సిద్ధపడండి. వెళ్ళిపోదము."

అందులో కొందరు లేదా దాతాను "ఇట్లు" అని యుండును, అంత తొందరలేదులే. దీని గూర్చి మరీ అంతగా మనం ఆలోచించనక్కర లేదు. నాలుగయిదు సార్లు విఫలమయినట్లు ఇప్పటికే చూచాము. అయినా ఎప్పటి వలే అది జరిగి యున్నది.

వారు బయటకు వచ్చి ఇట్లనిరి, "ఈ మోషే మనకు వద్దు, మననుండి దూరముగా వదిలించుకొందము; మన గుంపులో ఇతడిని ఉండనీయ వద్దు." అయినా గాని మోషే చలించలేదు, ఎందుకనగా అతడు వెలుగు. అతడు ఆ ఘడియకు వెలుగు. అతడు కలిగి యుండినది ఏమిటి? మోషే ద్వారా దేవుడు తన వాగ్థాన వాక్యమును బయలుపరచుచుండెను, మోషే వెలుగుగా ఉండెను.

1KGS 17:4

 

94ఏలియా వెలుగుగానున్నాడు, "వెళ్ళి కొండ మీద కూర్చొనుము;" కాకులకు నిన్ను పోషించమని ఆజ్ఞాపించియున్నాను. ఆమేన్!

అవునండి! అతడు తిరిగి "యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడుతో" వచ్చెను. నేను తిరిగి ఆజ్ఞాపించు వరకు మంచు కూడా కురియదని చెప్పెను. ఆమేన్! "సూర్యుడు ప్రకాశించ వచ్చును. మీరు మేఘముల నన్నింటిని ఒక చోటకు తీసికొని వచ్చి ఏదేదో చేయవచ్చును, కాని నేను మరల ప్రార్థించు వరకు మంచయినను కురియదు." అతడెవరు? వెలుగు. హల్లెలూయా! అతడు వెలుగు! వెలుగు. అతడు దేవుని ప్రత్యక్షతా వాక్కుగా నున్నాడు.

అతడు మతి చలించి, కొండ ఎక్కి కూర్చొనియున్నాడు అని వారనుకొనిరి. అతనిని పక్షులు పోషించుచుండగా వారు ఆకలితో చనిపోవుచుండిరి. వారు ఆచారములలో జీవించగోరిరి, ఏలియా వెలుగులో జీవించుచుండెను. అతడు కెరీతు వాగునొద్ద హాయిగా కూర్చొనెను. అతనికి కావలసినవన్నియూ సమకూడుచున్నవి. ఎవరో ఒకరు అతడిని గూర్చి శ్రద్ధ వహించుచుండిరి. వారతనిని పిచ్చివారనుకొనిరి, కాని అతడు వెలుగు.

GEN 1:3•

JOHN 1:23

 

95"హే! ఇక్కడ ఒక భక్తిపరుడుండే వాడు ఏమయ్యాడు? మొన్న ఎవరో వేటకు వెళ్ళితే ఆ కొండ మీద నిలబడి వారికి కనిపించాడట. ఈపాటికి ఆ ముసలివాడు ఎండిపోయి యుండును," అని వారనిరి. ఓ! కాదు. అతడే వెలుగు. అతడు ఆ వెలుగు. అతడు తన దినమునకు దేవుని వెలుగు.

యోహాను ఈ భూమి మీదికి వచ్చెను, అతడు అరణ్యములోనికి వెళ్ళెను, సెమినరీ నుండి కాదు గాని, దేవుని నుండి విద్యను నేర్చుకొనెను. అతడు మెస్సీయాను పరిచయము చేయ వలసియున్నాడు. అతడు వచ్చుచుండగా యేసు అతనిని చూచి, "ప్రకాశమానమగు" వెలుగు అని చెప్పెను. హల్లెలూయా! ఎందువలన? అతడు బయలుపరచబడిన వాక్యము యెషయా ఆలాగు పలికెను. నిజమే అది. అరణ్యములో ఒకని శబ్దము ఈలాగు వినబడెను, "ప్రభువుకు మార్గము సిద్ధపరచుడి. ఆయనకు మార్గము సరాళము చేయుడి. అరణ్యములో కేకవేయు ఒకని శబ్ధము" అతడే. ఎవరతడు? అరణ్యములో కేక వేయుచున్న ఒక స్వరము. ఎవరతడు? వాక్య వెలుగునకు ప్రత్యక్షత. ఆదికాండములో పలికిన దేవుడే ఇక్కడను పలికెను. ఇక్కడ కూడా జీవము వచ్చెను. "వెలుగు కలుగును గాక" అని ఆయన పలుకగా, సూర్యుడు ఉనికిలోనికి వచ్చెను. ఆయన అరణ్యములో కేకవేయు ఒక స్వరము ఉండవలెనని పలికెను. ఇక్కడ అతడు వచ్చుట చూతుము. ఆ ఘడియకు అతడు వెలుగు.

MATT 3:9,10•

LUKE 3:8,9•

REV 18:4

 

96బబులోను అరణ్యములో ఆ ఘడియ వెలుగు లేక కేక వేయునని ఆయన చివరి దినములలో చెప్పెను. "నా జనులారా, దాని పాపములలో పాలిభాగస్థులు కాకుండునట్లు దానిలో నుండి బయటకు రండి!అపవిత్రమైనది ముట్టకుడి; దానికి దూరమగుడి. రాబోవు ఉగ్రత నుండి పారిపోవుడి."

యోహాను కూడా అదే చెప్పెను: "చెట్టు వేరున గొడ్డలి ఉంచబడియున్నది." అతనికి చదువులేదు, ఒక బోధకుని వలె మాట్లాడలేదు. అతడు సర్పములు గూర్చి, కర్రలు గూర్చి, చెట్లు గూర్చి, గొడ్డళ్ళు మొదలగు అడవి పనిముట్లు గూర్చి మాట్లాడెను. నేడున్న ఈ గొప్ప పద్ధతులు అతనికి తెలియవు. అతనికి అతని స్వంత భాష యున్నది. "ఆమేన్" అని కూడా అతడు నిలబడి చెప్పలేదు. వంగి వంగి నమస్కారము చేయుట అతనికి తెలియదు. అతడు తిన్నగా అరణ్యములో నుండి వచ్చి ఇట్లనెను, "నేను పలాని వాడిని, నేను పలాని వాడిని, అని మీరు ఆలోచించుచున్నారు గదా? దేవుడు అబ్రహాముకు ఈ రాళ్ళ ద్వారా పిల్లలను పుట్టించగలడు."

GEN 1:3•

MATT 3:10•

MARK 1:7•

LUKE 3:9,16

 

97మీరు మెతడిస్టు, బాప్టిస్టు, ప్రెస్బిటేరియనులు గనుక దేవుని యొద్ద హక్కు కలిగియున్నామని తలంచుచున్నారు గదా? దేవుడు వీధిలోని పనికిరాని వారిని, వేశ్యలను లేవనెత్తి వారిని పరిశుద్ధులుగా మార్చగల సమర్థుడు. దానిని వినువారు ఉందురు, దానిని నమ్ము వారుందురు.

ఇంకా ఈలాగు అతడనెను, "చెట్టు మొదలున గొడ్డలి ఉంచబడియున్నది." నమ్మని ప్రతి చెట్టు నరకబడి, అగ్నిలో పడవేయబడును. అది అతని వర్తమానము. ఆ దినమునకు అతడు వెలుగు.

యేసు ఇట్లనెను, "అతడు ఒక ప్రకాశమానమగు వెలుగు. మీరు కొద్ది కాలము పాటు అందులో నడువగోరుదురు."

యోహాను తాను ప్రవక్తనని చెప్పెనా? "ఆయన మీ మధ్య నిలబడి యున్నాడు. ఆయన చెప్పులవారు విప్పుటకు నేను తగను. ఆయన రంగము మీదికి వచ్చిన వెంటనే నేను వెళ్ళిపోయెదను." ఓ! ఆయన వెలుగు. రెండు మూడు వెలుగులు గాని, నాలుగయిదు సంస్థలు గాని లేవు; ఒకే వెలుగు. మెతడిస్టు లేదు, బాప్టిస్టు లేదు, లూథరను లేదు, ప్రెస్బిటేరియను లేదు. క్రీస్తే వెలుగు, మరియు వెలుగే వాక్యము. బయలుపరచబడిన వాక్యమే ఆ ఘడియకు వెలుగు.

98"వెలుగు కలుగును గాకని పలుకగా, వెలుగు కలిగెను." అవున౦డి! వెలుగు కలుగునని పలుకగా, వెలుగు కలిగెను.

"ఈ దినమున వెలుగుండును గాకని ఆయన పలికెను, ఆలాగే వెలుగు కలిగెను." ఆయన వచ్చుచున్నాడు. దానిని నేను నమ్ముచున్నాను.

ఈ కాలము యొక్క వాగ్ధానములను చూడండి. ఓ! అన్నిటికన్న ప్రకాశమానమగు వెలుగు. సంఘ కాలములు చూడండి, అవి దానిని తిరస్కరించుట విషాదకరము. ప్రకటన 3లో దానిని ఇక్కడ వ్రాసియుంచాను, అప్పుడు నేను దేనిని ప్రస్తావించానో దానిని నేను ఎరుగుదును.

నేడు మనము జీవించుచున్న ఈ ఘడియ వాగ్ధానమును, తిరస్కరించబడిన వెలుగును చూడండి. వారేమి చేసిరి? దానిని వారు అప్పుడే నిరాకరించిరి. ఎందువలన? వారు ఒక మోసపు నీడలో జీవించుచున్నారు. నేడు వారు ఏమి చేయుచున్నారు. అదే చేయుచున్నారు. "మంచిది, నీవు క్రైస్తవునివా?"

"నేను లూథరనును."

"నేను బాప్టిస్టును."

"నేను ప్రెస్బిటేరియనును." అది దేవునికి అర్థరహితము. నిన్నునీవు పంది, కుక్క ఇంకా ఏదేదోగా పిలుచుకొన్నట్లుగానే యుండును, చూచారా. అంతకన్న గొప్ప కాదు. నీవు అవహేళన రప్పించుట కాదు, నీవు మూల సూత్రము అంగీకరించినచో సరియే, కాని నీవు క్రైస్తవునివా? అని అడుగుచున్నాను. నీలో క్రీస్తు ఉన్నాడా? క్రీస్తు నీలో యున్నచో, నీలో వాక్యముండును. నీలో వాక్యమున్న యెడల, వెలుగు ప్రకాశించుచున్నప్పుడు, దానిలో నుండి బయటకు రాలేవు, చూచారా. అదియే ప్రశ్న. ఇప్పుడు అదే జరుగుచున్నది.

వెలుగు, సాయంకాల వెలుగు ప్రకాశించుచున్నది; వధువు వృక్షము వికసించుచున్నది

JOEL 2:25

 

99ఓ! గుర్తుంచుకొనండి, వారు పాత చెట్టును కత్తిరించిరి. పసర పురుగులు, గొంగళి పురుగులు, ఒకదాని తరువాత ఒకటిగా దానిని తినినవి. మెతడిస్టులు విడిచి పెట్టిన దానిని, బాప్టిస్టులు తిన్నారు; బాప్టిస్టులు విడిచిన దానిని, పెంతెకోస్తు వారు తినిరి; ఆ చెట్టు మోడు అయినది. (యోవేలు) అది ఇక జీవించునను ఆశ లేదు. ఓ! ఆయన దానిని పదిలపరచెను. అది ఆయన వధువు కనుక ఆయన దానిని దాచెను. "నేను తిరిగి సమకూర్చుదునని," యెహోవా సెలవిచ్చుచున్నాడు. "అది ఏమిటి? లూథరు తినిన దానిని, వెస్లీ తినిన దానిని వారందరు తినిన దానిని అంతటిని నేను తిరిగి రప్పించెదను, ఎందుకనగా అది అంతయూ ఇంకా చెట్టువేరునే యున్నది," చూచారా. అది నేలలో పడి యున్నది. రసము వేరులో దాగినట్లే యున్నది. ఆ సోదరి నేలలో పరుండి యున్నది," అని నేను చెప్పాను. ఒక దినమున ప్రభుని బూర మ్రోగును. ఏర్పరచబడిన లూథరనులు, మెతడిస్టులు, బాప్టిస్టులు, సంస్థలతో నిమిత్తము లేదు.

100లూథర్ ఎన్నడూ సంస్థను కట్టలేదు. మూడీ దేనినీ స్థాపించలేదు. వారి తరువాత వచ్చిన వారే సంస్థగా దానిని మార్చిరి. జాన్ స్మిత్ దేనినీ స్థాపించలేదు. మిగిలిన వారెవరూ ఏ సంస్థనూ స్థాపించలేదు. అది ఘడియ యొక్క వెలుగు. లూథరు, వెస్లీ మొదలగు వారెవరూ సంస్థలకు కారకులు కారు. ఆ తరువాత వచ్చిన గుంపు సంస్థను తయారు చేసిరి.

పెంతెకోస్తు నాడు పరిశుద్ధాత్మ ఏ సంస్థను స్థాపించలేదు. పెంతెకోస్తు ఒక అనుభవమే గాని సంస్థ కాదు. అది ఎన్నడూ సంస్థను తయారు చేయలేదు, కాని తాము పెంతెకోస్తు అని చెప్పుకొన్న వారు దానిని తయారుచేసిరి. ఆ మొద్దు ఆవల చనిపోవుచున్నది. యేసుక్రీస్తు సంపూర్ణ స్వరూపములోనికి వారు వచ్చుటకు బదులుగా, వారు తమను తాము వేరు చేసికొనిరి. కాబట్టి వారితో ఆయనకు పొత్తు లేదు. వారికి ఆయనతో సంబంధము లేదు.

MATT 5:17,18•

JOHN 14:12•

HEB 13:8

 

101కాని ఈ వెలుగును మనము కనుగొనుచున్నాము. సంఘము క్రీస్తును మరల తిరస్కరించినది. ఎందువలన? ఆ మొదటి వారి కారణమే వీరును చూపించిరి. వారు మరియొక దినపు వెలుగులో జీవించసాగిరి. ఆయన నిన్న, నేడు, నిరంతరము ఏకరీతిగా యున్నాడు, హెబ్రీ 13:8. ఆయన ఆనాడు చేసినదే నేడును చేయుచున్నాడు. క్రీస్తుగా నున్న ఆ వాక్యము మారలేదు.

వినండి, వ్యక్తిగతముగా ఇది మీకు చెప్పుచున్నాడు. నాకు తెలియదు; నేను కొద్దిగా నిర్ణయించుకోలేకపోవుచున్నాను, టేపు ఆపుట మంచిదా కాదా అని (చూడండి), ఆ టేపు. నేను దానిని అలాగే ఉండనిచ్చెదను.

ఒక సంగతి మిమ్మును అడుగగోరుచున్నాను. దీనిని గమనించండి! ఆయన నిన్న, నేడు, నిరంతరము ఏకరీతిగాయున్నాడు. చూడండి, ఆయనే క్రియలే ఆయనను బయలుపరచుచున్నవి. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. యోహాను 14:12లో ఆయన ఇట్లు చెప్పెను, "నేను చేయు క్రియలు మీరును చేయుదురు. వీటి కన్న గొప్పవియు చేయుదురు, ఎందుకనగా నేను తండ్రి యొద్దకు వెళ్ళుచున్నాను." ఇప్పుడు, దానిని ఆయనే చెప్పెను. భూమ్యాకాశములు గతించును గాని, ఆ మాట ఎన్నడూ గతించదు. మనము చివరి యుగాంతమున ఉన్నాము. గొప్ప కార్యములు జరుగనై యున్నవి. చూచారా? ఇక్కడ మనమున్నాము.

102రోమను కాలెండరు సరియైనచో… ఇంకా మనకు ముప్పది-ఆరు సంవత్సరములు మిగిలి యున్నవి. ప్రతి రెండు వేల సంవత్సరాంతమున ప్రపంచ అంతము వచ్చును. మొదటి రెండు వేల సంవత్సరములలో నీటి ద్వారా అది నాశనమాయెను. రెండవ రెండు వేల సంవత్సరమున క్రీస్తు వచ్చెను. 1964 ఇప్పుడు వచ్చుచున్నది. ముప్పది-ఆరు సంవత్సరములు ఉన్నవి. ఐగుప్తు అంతరిక్ష క్యాలెండరు మనము పదిహేడు సంవత్సరములు వెనుకబడి యున్నామని చెప్పుచున్నది, అనగా, ఇంక మనకు పందొమ్మిది సంవత్సరములే మిగిలియున్నవి. ఏర్పరచబడిన వారి నిమిత్తము ఆ పని తక్కువ చేయబడును, లేనియెడల ఏ శరీరియు రక్షించబడడు, అని యేసు చెప్పెను. మనము ఎచ్చటున్నాము?

GEN 1:3•

MATT 14:17•

MARK 6:38•

LUKE 9:13•

JOHN 14:12

 

103"నేను చేయు క్రియలు మీరును చేయుదురు." అవే క్రియలు, ఇంకా గొప్పవియు చేయుదురు.

ఇప్పుడు గమనించండి! జాగ్రత్తగా వినండి! దీనిని అర్థము చేసికొనునట్లుగా దేవుడు మీ హృదయము మరియు మనస్సులను తెరువవలెనని ప్రార్థించుచున్నాను. దీనిని గూర్చి ఎక్కువగా చెప్పకుండానే గ్రహించగలరు. గమనించండి. ఆయన చేసిన గొప్ప కార్యములలో కొన్నింటిని చూద్దాం. కొద్ది నిమిషములు ఆగి చూద్దాం. ఆలోచించుదం. "వారికి ఆహారము పెట్టుడి," అని ఆయన ఒకసారి వారితో అనెను.

"మా యొద్ద ఏమియు లేదే," అనిరి వారు.

"మీ యొద్ద ఏది యున్నదో, అది నా కియ్యుడి," అని ఆయన పలికెను.

"అయిదు యవల రొట్టెలు, రెండు చేపలు మాత్రమే యున్నవి," అని వారనిరి.

"వాటిని నాకియ్యుడి" అని ఆయన చెప్పెను. ఆయన అయిదు యవల రొట్టెలను తీసికొని వాటిని విరవసాగెను. ఆయన వాటి ద్వారా అయిదు వేల మందిని పోషించెను. నిజమేనా? "మీ యొద్ద నున్న చేపలను నాకీయుడి" అని ఆయన పలికెను. ఆయన ఒక్క చేపతోనే దానిని ఆరంభించెను. అయిదువేల మందికి ఆహారము పెట్టెను. అది నిజమేనా? కాని ఈ చివరి దినమున ఆయన యొద్ద ఏమియూ లేదు. ఆయన "మాట చేత ప్రతిదియూ" సృజించెను. అంతకు ముందు అక్కడ ఏమియూ లేదు. అక్కడ ఉడుత లేదు, కాని "ఉండును గాక" అని ఆయననెను. ఓ! ఆయన మాట తప్పిపోనిది. అది నెరవేరబడవలసి యున్నది. ఆయన చెప్పినట్లే జరుగును.

మిమ్మును విభ్రాంతిపరచు సంగతులు నేను చెప్పగలను, చూచారా. ఆయన దానిని పలుకగానే అది కలిగెను. ఆయననే పలుకనీయుడి, చూడండి. ఖచ్చితంగా ఆలాగే జరుగును, చూచారా.

104మరల ఆ పశ్చిమము ఇక్కడికి తిరిగి వచ్చి తూర్పును కలిసినది. మోషే ధూళిని పట్టుకొని పేలుగా మార్చెను. భూమి మీద ఆలాగే జరిగినది, కాని ఈ చివరి దినమున ఆయన వాక్యమును తప్ప మరేమియూ తీసికొనడు. "ఆయన పలికినట్లే జరుగును," జరిగిన సంగతులు కొన్ని మీకు ఈ రాత్రి నేను చెప్పెదను. ఆయన ఇంకా దేవునిగానే యున్నాడని మీరు తెలిసికో గలరు. "నేను చేయు క్రియలు మీరును చేయుదురు, వీటి కంటె గొప్పవియు చేయుదురు. నేను చేపను తీసికొని చేపను చేశాను, కాని మీరు చేపను కూడా తీసికోనవసరము లేదు." ఆయన ఇంకనూ దేవుడే. ఆయన మారని దేవుని కుమారుడు. ఒక చేప నుండి చేపలను సృజించెను. నేడును ఆయన అదే దేవుని కుమారునిగా యున్నాడు. "నేను చేయు క్రియలు మీరును చేయుదురు; ఇంతకంటె గొప్పవియు చేయుదురు." అది హెచ్చింపబడును. "ఇంతకన్న గొప్పవియు చేయుదురు." గొప్పక్రియలను జనులు చూచుటకు నిరాకరించుచున్నారు. గొప్ప కార్యములు!

JOHN 14:12

 

105ఒక మోసపు వెలుగు! మీకు తెలుసా, నేను ఒక సంగతి గూర్చి ఆలోచించుచున్నాను. ఇంగ్లాండు గురించి నేను చాలా చెప్పాను, కాని ఒక అబద్ధ వెలుగు గూర్చి నేను ఆలోచించుచున్నాను. కొంత కాలము క్రిందట ఎన్నడూ జరుగని గొప్ప దొంగతనము ఇంగ్లాండులో జరిగినది. ఏడు మిలియను డాలర్లు దోపిడీ జరిగినది, ప్రపంచములో ఎన్నడూ అంత గొప్ప దొంగతనము జరుగలేదు. ఏడు మిలియను డాలర్ల దోపిడి. స్కాట్‌లాండు యార్డు వారు కూడా దానిని పసిగట్టలేకపోయిరి. వారు ఒక మోసపు వెలుగు ద్వారా దానిని చేయకలిగిరి. వారు రైలు పట్టాల మీద ఎర్రని దీపము చూపి ఆపు చేసిరి. ఆగిన రైలును దోచుకొనిరి. మంచి స్థలమును వారు ఎన్నుకొనిరి. దేశములో ఎన్నడూ జరుగని దోపిడి ఒక దొంగ వెలుగు మూలముగా జరిగినది. అది దేశములో అతి పెద్ద దొంగతనము. దానిని మోసపు వెలుగు ద్వారా చేసిరి.

HEB 13:8

 

106దేవుని సంఘము ఎన్నడూ ఎరుగని దొంగతనము శాఖ యొక్క మోసపు వెలుగు ద్వారా జరుగుచున్నది. పరిశుద్ధాత్మ శక్తిని ప్రజల నుండి అది దోచుకొనుచున్నది. సంఘము యొక్క జీవనాడినే అది దోచుకొనుచున్నది. వాక్యమును వారి నుండి అది దోచుకొనుచున్నది. వాక్యమునకు బదులుగా మత విశ్వాసమును వారు అంగీకరించుచున్నారు. ఓ! వారు తమకు వాక్యమున్నదని చెప్పుకొనుచున్నారు, కాని వాక్యము ఆ కాలము నాటిది కాదు; అది తన్నుతాను తెలియపరచుకొనినది. యేసు దినములలోని వారు కూడా, తమకు వాక్యమున్నట్లుగా చెప్పుకొనిరి, కాని వారు గొప్ప వెలుగును చూచి కూడా తిరస్కరించిరి. వారు దానిని చూచియు, తిరస్కరించిరి.

ఓ! అబద్ధ వెలుగు! అవును. అంతకన్న గొప్ప దొంగతనము సంఘములో ఎన్నడూ జరుగలేదు. సోదరుడా! చల్లని శాఖా విశ్వాసములు, బయలుపరచబడిన వాక్యము పరిపక్వము కాలేదు, గింజ, బైబిల్ చెప్పెను… దేవుని వాక్యము విత్తబడిన విత్తనమని యేసు చెప్పెను, చూచారా. చల్లని సిద్ధాంతములు వాక్యమును పరిపక్వపరచజాలవు. కాదు, కాదు! చల్లని వర్షపు జల్లులు గోధుమ గింజను పండిచజాలవు. వాస్తవముగా కాదు! సూర్యుని యొక్క వేడి కావలెను. దేవుని యొక్క పలుకబడిన వాక్యము మాత్రమే ఆలాగు చేయగలదు. యేసుక్రీస్తు నిన్నటి వలెనే, నేడును జీవించియున్నాడని విశ్వాసుల ద్వారా పలుకబడిన దేవుని వాక్యము నిరూపించుచున్నది. మత విశ్వాసములు మరియు శాఖలు ఎన్నడూ దానిని చేయజాలవు. అవి చల్లగాను, నిరుత్సాహముగాను ఉన్నవి, గింజ భూమిలో సరిగా యుండదు. ఆ పరిస్థితుల్లో అది పండదు.

107ఆ కారణము చేతనే నేడు మనము చేయునది ఆలాగున యున్నది. మన ప్రశస్త సోదరుడగు బిల్లీ గ్రాహం గొప్ప ఉజ్జీవ కర్త. దేవుడాతనిని వాడుకొనుచున్నాడని నేను తలంచుచున్నాను. కాని అతడు ఏమి చేయుచున్నాడో చూడండి, బాప్టిస్టులు మరియు ప్రెస్బిటేరియనులు మధ్యకు అతడు వెళ్ళుచున్నాడు. అతడు చేయునది ఏమిటి? సంఘములో చేరు గుంపును సంపాదించుచున్నాడు.

దక్షిణ బాప్టిస్టులు అక్కడ గుమికూడుటను చూడండి. వారికి చాలా శాఖలున్నవి… ఏ ఇతర ప్రొటస్టెంటు శాఖల కంటెను వారి శాఖ ఎంతగానో అభివద్ధి చెందుచున్నది. గత సంవత్సరము దాదాపు వారందరినీ కాతలిక్కులు తీసికొనిరి. దానిని మీరు పేపర్లో చూచారా? నిశ్చయంగా వారాలాగు చేసిరి. బాధపడవద్దు, అది వారందరినీ తీసుకొనబోవుచున్నది. బాప్టిస్టులు తదితరులు ఆలాగే కూడివత్తురు. వారందరూ తెలియకుండానే ఒక్కటగుచున్నారు. సంఘములు సమాఖ్య వారినందరినీ ఒక్కచోటకే చేర్చుచున్నది. మీరెందుకు శాఖలలో ఉండగోరుచున్నారు? దీనిని మీరు తిరస్కరించుచున్నంత కాలము మీరే మాత్రము వారికి తీసిపోరు. మీరు అదే శాఖా ముద్రను తగిలించుకొని యున్నారు. అది మృగపు ముద్ర. కాబట్టి మీలో పెద్ద మార్పు లేదు.

108వాడు ఆ ముద్రలోనే బయలుపడుచున్నాడు, దానిని మీరు అంగీకరించుచున్నారు. అది చివరకు వైట్ హవుస్, వాషింగ్‌టన్ డి.సి., సంఘముల సమాఖ్య వరకు నడిపించుచున్నది. మీరు దాని వెనుకనే వెళ్ళుచున్నారు. బైబిలు చెప్పినట్లుగానే సంఘకాపరులు దానిని స్వీకరించిరి. సమయము గతించుచున్నది.

ఇప్పుడు మనము ఎచ్చటున్నామో గమనించుదము. ఈ దినపు వాగ్ధానములు చూద్దాం — మరల వారు తిరస్కరించిరి. ఈ చివరి దినములలో సంఘములు శాఖలను తయారు చేసినవి.

అబద్ధపు వెలుగులో జీవించుచున్నందుననే అది పరిపక్వమగుట లేదు. ఆ కారణము చేతనే మీరు అద్భుతములు చూచుట లేదు.

MATT 5:34•

ACTS 2:38

 

109ఒక యాజకుడు నాతో మాట్లాడెను, "శ్రీ. బ్రన్హం, ఆ బాలికకు నీవెట్లు బాప్తిస్మమిచ్చెదవు?" అనడిగాడు. ఈ సంఘములో యుండి వెనుకకు జారి, ఒక కాతలిక్కు బాలుని పెండ్లాడినది. కాతలిక్కు సంఘములోనికి వెళ్ళినది. అతడామెను సంఘములోనికి తీసికొని రానై యున్నాడు.

"నేను క్రైస్తవ బాప్తిస్మము ఇచ్చెదను," అన్నాను.

"బిషప్పు తెలిసికోగోరుచున్నాడు," అని పలికాడు.

"సరే. మంచిది, అదిక్కడ ఉన్నది," అన్నాను.

"నేను ప్రమాణము చేయుదునేమో," అని తెలిసికొనగోరెను.

కాని "నేను ప్రమాణము చేయను," అని చెప్పాను. నా మాట నమ్మితే నమ్ముట, లేనిచో లేదు. "ప్రమాణము చేయను." "ఆకాశము తోడని చెప్పవద్దు; అది దేవుని సింహాసనము; భూమి ఆయన పాదపీఠము, అని బైబిలు చెప్పుచున్నది. మీ మాట అవునంటే, అవును; కాదంటే, కాదు." మీరు "నా మాట నమ్మవలెనని" వారికి చెప్పాను.

"క్రైస్తవ బాప్తిస్మమనగా ముంచుట అన్నావు గదా? మరి దాని అర్థము ఏమిటి?" అనడిగాడు.

"క్రైస్తవ బాప్తిస్మవిధానము అది ఒక్కటే. "నేనామెకు ఓహియో నదిలో బాప్తిస్మమిచ్చాను. యేసుక్రీస్తు నామములో ఆమెను నీటిలో ముంచి పైకి లేవనెత్తాను. ప్రభువైన యేసుక్రీస్తు నామములో బాప్తిస్మము ఒక్కటే నిజమైనది," అని నేను చెప్పాను.

"అవునండి!" అని అతడు చెప్పెను, మరియు ఇలాగు చెప్పసాగెను, "కాతలిక్కు సంఘము కూడా ఆలాగే బాప్తిస్మము ఇచ్చెడిది." "ఇది చాలా వింతగా యున్నదే?" అని అతడనెను.

"ఎప్పుడు?" అనడిగాను.

అతడు ఇంకా సంబాషించుచూ "మేమే అసలయిన కాతలిక్కులము," అని ఉత్తరమిచ్చెను.

110అందుకు ఆధారముగా చరిత్ర గ్రంథములున్నవి. "అది నిజమే." "మరి ఈనాడు ఎందుకు ఆలాగు చేయుట లేదు"? అనడిగాను.

"పాపములను క్షమించుటకు మాకు అధికారమున్నది." "మీరెవరి పాపములు క్షమింతురో, వారి పాపములు క్షమించబడుననియు, ఎవరి పాపములు నిలిచియుండనిత్తురో, అవి నిలచి యుండుననియు" యేసు తన శిష్యులతో చెప్పెను గదా? అన్నాడతడు.

"అవును, ఆయన చెప్పెను," అన్నాను.

"అది సంఘమునకు అధికారమిచ్చుట కాదా? సంఘమునకు శిరస్సు పేతురు," అని చెప్పెను.

పేతురు చెప్పినట్లు చేసినచో, సంఘము పాపములను క్షమించగలదు. వారు రక్షించబడుటకు ఏమి చేయవలెను అని అడిగినప్పుడు, "మీరందరూ మారుమనస్సు పొంది పాపక్షమాపణ నిమిత్తము యేసుక్రీస్తు నామములోబాప్తిస్మము పొందుడి," అని చెప్పాడు. "మీరును ఆ ప్రకారమే చేసినయెడల నేను మీతో వచ్చెదను," అని చెప్పాను.

"ఓ! నీవు బైబిలుతో వాదించ ప్రయత్నించుచున్నావు," అని పలికాడు.

"అది వాక్యము అన్నాను."

"దేవుడు తన సంఘములో ఉన్నాడు," అని చెప్పాడు.

"దేవుడు తన వాక్యములో యున్నాడు. ప్రతివాడు అబద్ధికుడే, ఆయన ఒక్కడే సత్యవంతుడు అన్నాను," చూడండి.

HEB 13:8

 

111అది తప్ప నీకు వేరే మార్గము లేదు (చూచారా), వారు చీకటి లోనికి నడిచిపోవుచున్నారు, ప్రొటస్టెంటువారు వేలకొలదిగా అందులో పడుచున్నారు. వారు మతవిశ్వాసములను వెంబడించుచున్నారు. వాక్యము దానిని రుజువు చేయుచున్నది. యేసుక్రీస్తు నిన్న, నేడు, నిరంతరము ఏకరీతిగా యున్నట్లుగా బయలుపరచుకొనుచున్నాడు. వారు ఆ మత విశ్వాసపు వెలుగు ద్వారా చీకటి లోనికి నడిచి పోవుచున్నారు. నోవహు కాలములోను ఆలాగే జరిగినది. అన్ని సమయములలోను ఆలాగే జరిగినది, నేడు కూడా ఆలాగే వారు చేయుచున్నారు. చీకటిలోనికి నడిచిపోవుచున్నారు. ఎందువలన? వారు వెలుగును త్రోసిపుచ్చిరి. శాఖల విశ్వాసములు వారిని గ్రుడ్డివారిని చేసెను.

ఓ! ఇప్పుడు మనము ఎంత చీకటి ఘడియలో జీవించుచున్నాము? క్రీస్తు యొక్క నిజమగు నిత్య వెలుగు వారు తిరస్కరించిరి.

112చల్లని శాఖలు ఎన్నడూ దేవుని వాక్యమునకు జీవము తేజాలవు. అది శాఖకు ఊపిరి పోయును. ఇప్పుడు వేషధారులగు క్రైస్తవులు ఎక్కువమంది యున్నారు. ఇటు చూడండి, రోమ్‌లోని నైసియావద్ద గాక ఆది పెంతెకోస్తు నొద్ద నుండినట్లుగా కాతలిక్కు చర్చి యున్నచో దానిని నేను వెంబడించుదునని ఆ మత గురువుకు చెప్పాను. సంఘము ఆ రోమ్‌లోని నైసియాలో ఎన్నడును ప్రారంభము కాలేదు. అది పెంతెకోస్తు నొద్ద ఆరంభమాయెను, చూచారా. యెరూషలేము నొద్ద సంఘము ప్రారంభమాయెను.

113"ఇక్కడ, నేను ఒప్పుకుంటాను ఈ ప్రజలు…

ఆ బానిసలు తదితరులు పరిశుద్ధాత్మను పొందిరి వారి శక్తిని, క్రియలను ఆ యజమానులు చూచిరి. మృతులను లేపుట, భాషలు మాట్లాడుట, దయ్యములను వెళ్ళగొట్టుట, ప్రవచించుట మొదలగునవి వారు చూచిరి. వారు గొర్రె చర్మములు చుట్టుకొని, ఆకులు తినెడి వారు, కాని నైసియా సభ యొద్ద గొప్పవారున్నారు. ఆ వాక్యము కొరకు నిలబడుటకు వారు రాలేదు. ఆ పదిహేను రోజులలో వారు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ అను సిద్ధాంతమును రూపొందించిరి. యేసుక్రీస్తు నామమునకు బదులుగా ఒక విశ్వాసమును తయారు చేసిరి, దానిలో నుండియే అన్నిప్రొటస్టెంటు సంఘములు పుట్టి, అవి కూడా అదే చేయుచున్నవి. ఇవ్వన్నియూ పరిశుద్ధాత్మను గూర్చిన తప్పు అభిప్రాయములే. ప్రభురాత్రి భోజనములో వారు మద్యము త్రాగసాగిరి. పరిశుద్ధాత్మకు బదులుగా పవిత్ర రొట్టె అను దానిని యాజకుడు ఇయ్యగా వీరు తినసాగిరి.

ACTS 2:1-3,13

 

114ఇప్పుడు, బైబిలు భావము అది కాదు: "పెంతెకోస్తు దినము వచ్చినప్పుడు యాజకుడు వచ్చి నోటిలో రొట్టెనుంచును. అది తప్పు. "అందరూ వచ్చి కరచాలనము చేయుదురు. బాప్టిస్టులు, మెతడిస్టులు ఎక్కడ నుండో ఒక ఉత్తరము తెచ్చెదరు, అందులో నీ పేరును ఉంచెదను."

వారందరూ ఒకే మనస్సుతో ఒక స్థలములో కూడి యున్నట్లు బైబిలు చెప్పెను. అకస్మాత్తుగా ఆకాశము నుండి బలమగు గాలి వీచెను. వారు కూడి యుండిన ఇల్లు దానితో నిండి యుండెను. వారందరూ పరిశుద్ధాత్మతో నిండుకొని, ఆత్మ వారికి వాక్ శక్తి దయచేసిన కొలది అన్యభాషలతో మాట్లాడసాగిరి. వారు మద్యముతో మత్తిల్లిన వారి వలె నుండి వీధుల్లోకి వెళ్ళిరి. మరియతో సహా వారందరూ పరిశుద్ధాత్మ పూర్ణులయిరి. జనులు వారిని చూచి నవ్విరి, "వీరు క్రొత్త మద్యమును త్రాగిరి" అనిరి. ఏమిటది? సిద్ధాంతము వారిని గ్రుడ్డివారిగా చేసెను.

ACTS 2:14,15

 

115పేతురు అను పేరుగల ఒక అనామక బోధకుడు లేచి ఇట్లనెను."యూదయవారలారా, యెరూషలేము వారలారా, మీరందరూ ఇది తెలిసికొనవలెను. వీరు మద్యముతో మత్తులు కాలేదు," కాని దీనిని గూర్చి వాక్యమేమి చెప్పుచున్నదో వినుడి. "ఇదే వెలుగు! ఇదే బయలుపరచ బడిన వాక్యము!" అమేన్! నేడును ఆలాగే జరుగుచున్నది. ఈ జనులు తమకు నచ్చదు అని వెళ్ళిపోవుచున్నారు. వారు గ్రుడ్డివారు. "గ్రుడ్డివాడు గ్రుడ్డివానికి త్రోవ చూపినచో, ఇద్దరూ గుంటలో పడుదురు." వారిని విడిచిపెట్టండి.

MARK 16:15-18•

JOHN 14:12

 

116ఓ! దేవుని వాక్యము బయలుపరచబడవలెనన్నచో, క్రీస్తు యొక్క నిత్యజీవము కావలెను. వాక్య రూపము దాల్చి… ఓ, మై!

దేవుని వాక్యమును పరిశుద్ధాత్మయే పనిచేయించును. "మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వసృష్టికి సువార్త ప్రకటించుడి," అని యేసు మార్కు 16 లో ఆజ్ఞాపించెను. "సర్వలోకము" ఇంకా అది నెరవేరలేదు. చూచారా. సర్వలోకమునకు వెళ్ళి "సర్వసష్టికి" ప్రకటించవలెను. "నమ్మి బాప్తిస్మము పొందిన వాడు రక్షించబడును. నమ్మని వారికి శిక్ష విధించబడును." నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు కనబడును. "నా నామమున వారు దయ్యములను వెళ్ళగొట్టుదురు, వారు క్రొత్త భాషలు మాట్లాడుదురు, వారు సర్పములను ఎత్తిపట్టుకొందురు. విషకరమైనది త్రాగుదురు, అయినా అది వారికి హానిచేయదు. వారు రోగులపై చేతులుంచగా బాగవుదురు. ఓ, మై!"

ఎంత దూరము? సర్వసృష్టికి! ఎంత మందికి? ఆయన తిరిగి వచ్చు వరకు సర్వలోకమునకు వెళ్ళవలెను. "నా యందు విశ్వాసముంచువాడు నేను చేయు క్రియలు చేయును. అంతకన్న గొప్పవియు చేయును," ఎందుకనగా నేను తండ్రి యొద్దకు వెళ్ళుచున్నాను.

MATT 24:24•

MARK 13:22

 

117ఓ, దాని నుండి ఏలాగు మనము దూరముగా వెళ్ళగలము.

మనము వారికంటె ఎక్కువ చీకటిలో ఉన్నాము. నేను మరికొన్ని వచనములు చెప్పి ముగించెదను. అప్పటికన్న ఎక్కువ చీకటిలో మనమున్నాము. ఇప్పుడు, నాకు కొన్ని వచనములు ఉన్నవి, వీలైనంత త్వరగా ముగించేదను. అప్పటికన్న ఎక్కువ చీకటిలో మనమున్నాము. నేను గంటన్నర సేపు మిమ్మును ఉంచాను. ఈ టేపు అయిపోవుచున్నది. చూడండి?

వారు మనకంటె ఎక్కువ చీకటిలో యున్నారు. నేనెందుకాలాగు పలికితిని? ఈ వెలుగులో నున్న సంఘములు బహుగా మోసపోవుచున్నవి. ఇది సత్యము వలెనె కనిపించుచున్నది. మత్తయి 24లో యేసు చెప్పెను. అంత్య దినములలో సాధ్యమైనచో ఏర్పరచబడిన వారు కూడా మోసపుచ్చబడుదురు. ఆ రెండు ఆత్మలు అంత సన్నిహితంగా యుండును. చివరి దినములలో ఒక ఎన్నుకోబడిన గుంపు సంఘముగా తయారగును. ఈ శాఖల సత్యములు అసలు దాని వలెనె కనిపించును. పెంతెకోస్తు వారిని, ఎన్నుకోబడిన వారిని సహితము అది మోసపుచ్చును.

118నీవు ఒక పెంతెకోస్తును తీసికొని మెతడిస్టు లేదా బాపిస్టు సిద్ధాంతముతో మోసపుచ్చలేవు. దానిని అతనికి నీవు చెప్పనే లేవు. అతనికి ఇంకా బాగుగా తెలియును. ఒక బాప్టిస్టును నీవు ఒక లూథరను సిద్ధాంతముతో మోసపుచ్చలేవు, చూచారా. ఈ వాక్యములో నున్న వర్తమానమును అంగీకరించిన వానిని పెంతెకోస్తు యొక్క తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ సిద్ధాంతముతో మోస పుచ్చలేవు. ఆ సంస్థలో నున్న సంగతులు, సిద్ధాంతములు నీవు వారికి చెప్పజాలవు. నిశ్చయంగా! వారిని ఎన్నడూ నీవు మోసము చేయలేవు, ఎందుకనగా ఏర్పరచబడిన వారు మోసపరచబడరు.

ఏమిటది? ఏమిటి? మోసపుచ్చుట. ఈ వెలుగులు ఏమి చేయుచున్నవి. వారి వెలుగును బట్టి వారిని వధశాలకు ఈ సంఘములు నడిపించుచున్నవి. చివరగా వధకు ఆమె మరియు రోమ్ ఏకమై పోవును. మృగము యొక్క రూపమును వారు రూపొందించుదురు. అదియే చివరి వధ. మీరిప్పుడు పొందిన ఈ వెలుగులుఏమి చేయుచున్నవో చూడండి. ప్రజలను నడిపించుచున్నది. అది ఒక మేక.

119గొర్రెను వధకు ఎల్లప్పుడూ ఒక మేక నడిపించుకొని వెళ్ళును. వధశాలలో మీరు దానిని చూతురు. ఆ మేక చివర వరకు గొర్రెను నడిపించుకొని వెళ్ళి, అది అవతలికి దూకి వేయును, చూచారా. అది దాని పని. ఎప్పుడూ ఆలాగే చేయును. గొర్రెపిల్లయగు యేసు వధకు నడిపించినది రోమను మేకలే. నిజము! అమాయకమగు గొర్రెలను నేడు వధశాలకు ఈ శాఖా మేకలు నడిపించుకొని వెళ్ళుచున్నవి. వారి పేర్లను పుస్తకములలో వ్రాసి వారిని అంత మొందించుచున్నారు. అది మృగము ముద్ర. ప్రభుని నామములో దీనిని చెప్పుచున్నాను. దానిని చాలా కాలము నిలిపియుంచాను; అది సత్యము. అక్షరాలా నిజము! మృగమనగా ఏమిటి? అది రోమా ఆధిపత్యమే. అది ప్రథమ సంస్థ. దాని యొక్క ముద్ర ఏమిటి? నిశ్చయంగా అదియే.

కాని ఈ ప్రస్తుత చీకటిలో కూడా దేవుని యొక్క వెలుగు ప్రకాశించుట మనము చూడ కలుగుచున్నాము. దానిని బట్టి ఎంతగానో మనము వందనములు చెల్లించవలెను.

జాగ్రత్తగా వినండి. మనము వెలుగు చూచుచున్నాము. ఈ దినమునకు వాగ్ధానము చేయబడిన ఆయన వాక్యము బయలుపడుచున్నది. ఈ ఘడియవెలుగు అదియే. ఓ! నేనెంతో సంతోషముగా యున్నాను. ఇందులో సందేహము లేదు.

120కొద్ది కాలము క్రితం ఒక బోధకుడు నాతో చెప్పినది ఇది. అతడు కారులో ఫ్లారిడా వెళ్ళెను. ఆ కారు చెడినది. దానిని అతడు బాగు చేయించలేకపోయెను. అతడు గేరేజికి వెళ్ళెను. ఒక మెకానిక్కు దాని క్రిందికి దూరెను. దానిని పరీక్షించెను, అయినా అది సరి కాలేదు. అతడు చాలా ప్రయత్నించెను గాని పని కాలేదు. మరేదో చేసెను గాని లాభము లేకపోయెను. జనరేటరు పెట్టెను, ప్లగ్గులు మార్చెను, పాయింట్సు మార్చెను; ఏదేదో చేసెను గాని, బాగు అవలేదు. చివరగా "ఒక చక్కని దుస్తులు ధరించిన వ్యక్తి వచ్చి, నా సలహా విందువా?" అని అడిగెను.

"అవును," అని మెకానిక్కు చెప్పెను. "దీనిని తీసికొని అటు కలిపి ప్రయత్నించుము," అని ఆ పెద్ద మనిషి చెప్పెను. ఆలాగే అతడు దానిని తీసికొని చేయగా అది కదిలినది.

ఆ మెకానిక్కు ఆయనవైపు తిరిగి "మీరెవరండి," అనడిగెను. అతడే ఆ కారును తయారు చేసిన జనరల్ మోటార్సు కంపెనీ ప్రధాన ఇంజనీరు. దానిని తయారు చేసినది ఆయనే.

DEUT 8:3•

MATT 4:4•

LUKE 4:4

 

121నేడు మనము మెతడిస్టు, బాప్టిస్టు, ప్రెస్బిటేరియను గూర్చి మాట్లాడుచున్నాము. ప్రధాన మెకానిక్కు ఇక్కడే యున్నాడు. ఆయన వాక్యమునకు రూపకల్పన చేసినవాడు. భూమ్యాకాశ ములను సృజించిన వాడు, ఆయన సంఘమును రూపొందించిన వాడు. రాకడలో ఎత్తబడుటకు ఏది అవసరమో మెతడిస్టు, బాప్టిస్టు చర్చి కంటే ఆయనకే ఎక్కువ తెలియును. ఆయనే రూపకర్త; ఆయనకే తెలియును. ఆయన తన పునరుత్థాన శక్తిని వస్త్రముగా ధరించియున్నాడు. హల్లెలూయా! ఆయన నేడు మనమధ్య తన పునరుత్థాన శక్తిలో వస్త్రము ధరించుకొని యున్నాడు. ఒక సంఘమును ఆయన ఎత్తబడు క్రమములో ఉంచగలడు. ఆయన దానిని రూపొందించెను. ఇక్కడ బైబిలులో భాగములను ఉంచెను. ఆమేన్! దాని ద్వారా కరెంటు ప్రవహించనీయండి. అదెట్లు పని చేయునో చూడండి. ఆయన వాగ్థాన వాక్యములో విశ్వాసమును నేడు ప్రవహించనీయండి. అదెట్లు పనిచేయునో మీరు చూడగలరు. ఎందువలన? ఆయనే దాని రూపకర్త. ఆయన తన వాక్యము ద్వారా తన సంఘమును రూపించెను. ఆలాగే దానిని ఆయన విలీనము చేసెను. మెతడిస్టు, బాప్టిస్టు, ప్రెస్బిటేరియను, పెంతెకోస్తు సంస్థ ద్వారా కాదు గాని తన వాక్యము ద్వారానే ఆయన ఏకము చేయును. "మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు గాని దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును."

MATT 24:35•

MARK 13:31•

MARK 16:17•

LUKE 21:33

 

122అవును. ఆ వెలుగుల నుండి బయటకు రండి.

ఇప్పుడు మనము చీకటి సమయములో జీవించుచున్నాము. ఇంక నాకు అయిదు నిమిషముల సమయమున్నది. ఈ చీకటి మధ్యలో నుండి చిన్న పెండ్లి కుమార్తెను బయటకు ఎవరు తీసికొని వచ్చెదరు? దానిని గూర్చి ఎవరెరుగుదురు? ఆయన ప్రధాన రూపకర్త. ఓ! అవును! ఇక్కడ మెతడిస్టులు ఒక వెలుగు చూపించుచున్నారు, బాప్టిస్టులు ఒకటి చూపించుచున్నారు, ప్రెస్బిటేరియనులు ఒకటి చూపించుచున్నారు, పెంతెకోస్తు వారు ఒకటి చూపించుచున్నారు. వారు తమ పేరును ఈ వెలుగులో ఉంచి యున్నారు. అవును. దానిలో ఏదయినా కనుగొనుటకు రండి. ఇక్కడికి వచ్చి చూడండి.

ఒక మత గురువును ఇట్లు ప్రశ్నించాను, "మీరందరూ అసలు సంఘము వారనుచున్నారు, కాని మీరు నైసియాలో ఈ మనుష్యులు స్థాపించిన సిద్ధాంతమును వెంబడించుచున్నారు. అందువల్లనే ఆదిలో వారికున్న శక్తి మీకు ఎందుకు లేదు? వారు చేసిన క్రియలు ఎందుకు చేయలేక పోతున్నారు? ఓ! ఇప్పుడు మేము చాలా మందిమి ఉన్నాము.

"మనము వేరే కాలములో జీవించుచున్నాము," అని అన్నాడు.

"కాని వాక్యము మారదు. నమ్మిన వారి వలన ఈ సూచన క్రియలు కనబడును అని ఆయన చెప్పెను. భూమ్యాకాశములు గతించును గాని ఆయన మాటలేమాత్రమును గతించవు," అని నేనన్నాను.

"నీవు బైబిలు గూర్చి మాట్లాడుచున్నావు," అని అతడనెను.

"అవును, వాక్యమే క్రీస్తు" అన్నాను. నిజమే. కావున మీరు అక్కడే ఉన్నారు, చూచారా.

123ఈ వెలుగులో మెతడిస్టులు, బాప్టిస్టులు, ప్రెస్బిటేరియనులు మొదలగు వారందరూ తమతమ వాటిని చూపించుచున్నారు. ప్రతి ఒక్కరు అంతకంతకు ఎదిగిపోవుచున్నారు. ఆ చిన్న పెండ్లి కుమార్తె ఎచ్చటున్నది? కొంత కాలము పాటు ఆమె పెంతెకోస్తు ఏకత్వములో వెళ్ళినది. "ఆమె తన పేరును అక్కడ పెట్టినది. వారేమి చేయుదురో వెళ్ళి కనుగొందుననుకొన్నది." వారిని తమలో చేరమని అడిగిరి. "మా సంఘములో చేరనిచో, నీవు పెండ్లి కుమార్తెవు కానే కాదు," అనిరి. అసెంబ్లీస్ లోనికి వెళ్ళినది, ఏమయిందో చూడండి. బాప్టిస్టుల యొద్దకు వెళ్ళి, అది కూడా చూచినది.

ఆమెకు ఏమి జరుగనై యున్నది? చూడండి? ఆమె వచ్చుచున్నది. మీరు బాధపడవద్దు. ఆమె అక్కడుండును.

124కొద్ది సంవత్సరముల క్రితం ఒకతను చెప్పినది గుర్తున్నది; అతడు న్యూ మెక్సికోలో యుండెను. కారల్స్ బార్డ్ కావెర్స్ దగ్గరగా నేను కూటము జరిపాను. దానిని గూర్చి మీరు విన్నారు. వారు ఒక పురుషుని, అతని భార్యను, కొందరు పిల్లలను ఈ ఎలివేటరు ఎక్కించిరి. వారు అగాధము లోనికి వెళ్ళిపోయిరి. వారక్కడికి వెళ్ళినప్పుడు అన్ని దీపములు ఆరిపోయినవి. అది కటిక చీకటిమయముగా మారినది. అక్కడ నిలబడిన ఒక చిన్నపిల్ల "ఓ!" అని కేకలు వేయసాగినది. ఆమె ప్రాణము పోయినంతగా ఆ చీకటిలో భయపడినది. ఆ చిన్న పిల్ల అటు ఇటు పరుగులెత్తుచూ, తన తల్లిదండ్రుల కొరకు కేకలు వేసినది. ఆమె దానిని సహించలేకపోయెను. అంత చీకటిని ఆమె ఎన్నడూ చూడలేదు.

125నేడును ఆలాగేయున్నది. నిజము! ఎచ్చటికి వెళ్ళవలెనో నీకు తెలియునంత చీకటిగా యున్నది. మీరు మెతడిస్టులు, బాప్టిస్టులు, ప్రెస్బిటేరియనులు ఎవరి దగ్గరకు వెళ్ళినా గాని అందరూ ఒకేలాగున్నారు, చూచారా. పురుగులు పట్టి కుళ్ళిపోయిన మన్నా తినుచున్నారు. అందులో మీకు క్రీస్తు కనబడడు. ఓ! మీరు స్వనీతిపరులను చూతురు. ఆ శాఖలలో చాలామంది చక్కని జనులున్నారు. నేను ఆ ప్రజలను కాదు గాని ఆ విధానమును వ్యతిరేకించు చున్నాను. కాని అక్కడ వారు తినుచున్నది అదే. దానిని గూర్చి వారికి చెప్పండి. తాజా మన్నా ఇచ్చట ఉన్నది!

126ఈ చిన్న బాలిక నిలబడి కేకలు వేయుచున్నది. ఆమె ఆ కేకలతో పిచ్చివానిగా మారునన్నంత భయము కలిగినది, పెండ్లి కుమార్తెయు ఆలాగే యున్నది. కాని ఆమె చిన్న సోదరుడు పిలచి ఇట్లనెను, "చిన్న సోదరీ! భయపడవద్దు (దీపములను వెలిగించగల ఒకాయన ఇచ్చటున్నాడు.)" దీపమును వెలిగించగల ఒకాయన ఇచ్చటేయున్నాడు. ఈ వాక్యమును ఆయన జీవింప చేయును." చిన్న సోదరీ! భయపడవద్దు, దీపమును వెలిగించగల ఒకాయన ఇచ్చటేయున్నాడు. ఆయన ఎప్పుడు వచ్చునో మనకు తెలియదు. దాని గూర్చి నాకు ఏమియూ తెలియదు, కాని ఆయన ఇచ్చటనే యున్నాడు. ఆయన దీపములను వెలిగించగలడు. దాని నుండి ఎట్లు బయటకు రాగలము? నాకు తెలియదు గాని, ఆయన ఇచ్చట యున్నాడు. దీపములను వెలిగించగలవాడు ఆయనే. అవును. ఆయనే; ఆయనే వెలుగు. ఆయన తన్ను తాను బయలుపరచుకొనును; ఆయన దీపములను ఆలాగే వెలిగించగలడు. నిశ్చయంగా! క్రీస్తు తన వెలుగును ప్రసరింపజేయును. అప్పుడు చీకటి పటాపంచలగును. ఆయన వేరు చేయును; "తన చిన్న వధువును బయటకు లాగును. "తన నామము నిమిత్తము అన్య జనులలో నుండి ఒక జనాంగమును తీసికొనును. వారు ఆయన పేరును కలిగియుందురు." ఆయన పేరేమిటి? మెతడిస్టు, బాప్టిస్టు, ప్రెస్బిటేరియను, లూథరను కాదు. యేసుక్రీస్తు! అది నిజము.

GEN 1:3•

JOHN 1:14•

JOHN 14:12

 

127ఆయనే వెలుగు, సత్యము. ఆయనలో ఏ చీకటియు లేదు. ఆయనలోనికి వచ్చినప్పుడు చీకటి చెల్లాచెదురగును. ఆయన వాక్యము. వాక్యమే వెలుగు. నిజము. ఆయన "వెలుగు కలుగు గాక" అని పలికెను. ఆ మాట వెలుగాయెను. ఆయన పలుకగా ప్రతి కాలపు వెలుగు వచ్చుచున్నది. దొంగవెలుగు కాదు. ఆయన బయలుపరచబడిన వాక్యము. చీకటి కాలములో ఆయనే సంపూర్ణ వెలుగు. అవును. ఈ మాయ వెలుగులు మాయమగును. అవును! ఆయన ఇక్కడున్నాడు. భయపడవద్దు! ఆయన వాగ్ధానపు వాక్యమను దీపమును వెలిగించుడి. జీవము కలుగును. "నా యందు విశ్వాసముంచువాడు నేను చేయు క్రియలు చేయును. ఆయనే వాక్యము." తండ్రి నన్ను పంపినట్లుగా, నేను మిమ్మును పంపుచున్నాను. ఆయనను పంపిన తండ్రి ఆయన లోనికి వచ్చెను. నిన్ను పంపిన యేసు నీలోనికి వచ్చును. అప్పుడు ఆయన చేసిన క్రియలు ఇప్పుడును ఆయన చేయును, ఎందువలన? వాక్యము మానవ శరీరధారియైనది. ఈ దినపు వెలుగులో తన్ను బయలుపరచుకొనుచున్నది. వెలుగులో జీవపు మార్గమును అది చూపించుచున్నది.

శాఖలు మరియు మత విశ్వాసములు వలన అంధులు కాని బుద్ధిమంతులు ఆ వెలుగులో నడచెదరు. ఓ, మై!

128దీపములను వెలిగించగల ఒకాయన ఇచ్చట ఉన్నాడు. ఆయన ఏమి చేయును? నేటి దినమునకు తన వాక్యమును ఆయన బయలుపరచును. దేవుని కుమారుడగు యేసు ఈ దినమునకు వాగ్థానము చేసిన వాక్యము ఇప్పుడు ఇక్కడ మనతోనే యున్నది. భయపడకుడి; వారు చేయుచున్న దాని వైపు చూడకుడి. మీరు చూచినచో, చీకటిలో నడచెదరు. జ్ఞానము కలిగి యుండుడి! "బుద్ధిగలవారు తమ దేవుని కొరకు చివరి దినములలో గొప్ప కార్యములు చేసెదరు," అని దానియేలు చెప్పెను. చూచారా? ఆయన వెలుగులో నున్న ప్రకారము వారును వెలుగులో నడచెదరు.

భయపడవద్దు; చీకటిగా కనబడవచ్చును. మనందరినీ వారు బలవంతము చేయుచున్నట్లు కనబడును. ఈ చిన్న సంఘములన్నియూ ఒక చోటకు రండి అను నినాదము ఇప్పుడు బయలు వెళ్ళుచున్నది. నీవు రావలెను. లేనిచో వారు నీ అంతు చూతురు. దానిని వారు చేయనై యున్నారు.

దానిని నేను సమయమున్నచో నొక్కి చెప్పెదను, చూచారా.

DAN 11:28

 

129ఇప్పుడు, మనము ముగించబోవుచున్నాము. మీరు వారిలో ఒకరిగా ఉండవలెను. వారిలో చేరనిచో ఏమియూ చేయలేరు, కొనలేరు. అమ్మలేరు. అది నిజము! మీకు రోగులకు ప్రార్థించు ధైర్యముండదు. మీరు సేవ చేయుచున్నట్లును, ఆత్మ సంబంధ కార్యములలో పాలు పొందుచున్నట్లును వారు గమనించిన యెడల మిమ్మును ఉరి శిక్షకు గురి చేసెదరు. నిజమే. మీరది ఎరుగుదురు. అది వారి పత్రములలో యున్నది. అవును! కాబట్టి దానిని మీరు చేయలేరు. మీరు వారికి చెంది యుండాలి. సోదరుడా, ఒక్క సంగతి నేను చెప్పెదను. ఇప్పుడు క్రీస్తును నీ హృదయములో పొందుము, ఎందుకనగా అది నిజంగా నీకు అవసరమగు కాలము వచ్చుచున్నది. అప్పుడు నీకు సమయముండదు. గుర్తుంచుకొనుము. ఆ ముద్ర పడితే ఇక లేనట్లే, కాబట్టి వారి మాటలు నమ్మవద్దు. ఆలాగు చేయవద్దు. ఇప్పుడే వాక్యము అను క్రీస్తులోనికి రమ్ము.

అవును! వాక్యము బయలుపడుచున్నది. ఈ ఘడియ యొక్క వెలుగు అదియే. ఆయన వెలుగని ఆలాగే మనము ఎరుగుదుము. ఆయన తన వెలుగును శరీరములో బయలుపరచు చున్నాడు. ఏలాగు మనకు తెలియును? ఆయన దేవుని యొక్క శరీరధారి, చూచారా. దేవుని వాక్యము తన్ను బయలుపరచుకొని చూపించుకొనుచున్నది.

"మెస్సీయా వచ్చినప్పుడు ఏమి చేయును?

JOHN 4:25,26,29

 

130బావినొద్ద నున్న స్త్రీ ఇట్లన్నది, మెస్సీయా వచ్చినప్పుడు ఇవి జరుగును. నీవు తప్పక వాక్యమై యున్న ప్రవక్తవే. మాకు ముందు జరుగు సంగతులు చెప్పుచున్నావు".

"నేనే ఆయనను," అని ఆయననెను. చూచారా? అది చాలు. వాగ్థానము చేయబడిన వాక్యము మీద వెలుగుదయించెను. అది ఒక వెలుగు.

ఆమె పట్టణములోనికి వెళ్ళి, "నేను చేసినవన్నియు నాతో చెప్పిన ఈయన మెస్సీయా కాడా? వచ్చిచూడుడి" అన్నది. అది అంతే, చూచారా. ఇతరులు ఏమన్నా గాని, ఆమె ఆయన మెస్సీయా అని గుర్తించినది.

గుర్తుంచుకొనండి, ప్రతి కాలములోను చీకటి సమయాన దేవుడు తన మాటను పంపి వెలుగును చీకటి నుండి వేరు చేసెను. కాతలిక్కు సంఘకాలములో లూథరు ద్వారా ఆయనా లాగు చేసెను. లూథరును ఒక ప్రకాశించు వెలుగుగా ఆయన పంపెను. లూథరు చీకటి నుండి సత్యమును వేరు చేసెను. లూథరనులు చెడిపోగా ఆయన జాన్ వెస్లీని పంపెను. ఆయన చీకటి నుండి వెలుగును వేరు చేసెను. వెస్లీ వారగు మెతడిస్టులు మెత్తబడిపోయినప్పుడు, బాప్టిస్టులు,ప్రెస్బిటేరియనులు చెడిపోయినప్పుడు, చీకటి నుండి వెలుగును వేరు చేయుటకు పెంతెకోస్తు వర్తమానమును పంపెను. పెంతెకోస్తు కూడా ఇతర సంస్థల వలెనె తిరిగి చీకటిలోనికి పోయినది. మత నమ్మకములను తయారు చేసికొనెను. ఇప్పుడు, ఈ వాక్యము బయలుపడు ఘడియ వచ్చినది. ఆయన వెలుగును పంపును, వాక్యము బయలుపడినది, ఆదియందున్నట్లే వాక్యముపంపబడెను, మరియు దానికది రుజువగును. వెలుగున్నది. ఆయన ఎల్లప్పుడు వేరు చేయును. ఆదియందు నిత్యజీవమువలెనే ఇది యున్నది.

HEB 13:8

 

131నా సమయము అయిదు నిమిషములు మించినది, కాని ఈ ఒక్క సంగతి చెప్పవలెను. ఒకాయన ఉన్నాడు; వారేమి చెప్పినా భయపడకుడి. నేనెక్కడికి పోవలెనో తెలియని సందర్భములో అది వచ్చుట చూచాను. ఆయన ఎల్లపుడూ సిద్ధమే. ఎన్నడూ తప్పిపోని ఆయన సన్నిధి మనకున్నది. ఆయన దీపము వెలిగించగలడు. అవును! నీవేమి చేయుదువోనని ఆయన కనిపెట్టి చూచుచున్నాడు. ఆయన తన కిష్టమొచ్చిన వేళ మీట నొక్క గలడు. అవును.

దీపములను వెలిగించగల ఒకాయన ఇచ్చటున్నాడు. మరణఛాయగల ప్రదేశములో కూర్చొని కొందరున్నారు. కొందరు కాన్సరుతో, కొందరు శాఖల మరణముతో, కొందరు మత సిద్ధాంతముల మరణముతో, కొందరు పారంపర్యాచార మరణముతో, వివిధ రకముల మరణములతో మొత్తబడిరి. వారందరూ గొప్ప వెలుగు చూచిరి. ఆదియందు, వెలుగు కమ్మని పలికిన ఆ దేవుడే ఇప్పుడును దీపములు వెలిగించనైయున్నాడు. ఆయన నిన్న, నేడు, నిరంతరము ఏకరీతిగాయున్నాడు. నేడు ఆయన ఇక్కడున్నాడు. భయపడకుడి; ఆయన దీపములను వెలిగించగలడు. హింస వచ్చినను భయపడకుడి; ఒక దీపమున్నది. ఆయన తన జనులను కొనిపోవును. ఆమె హింస గుండా రాదు. ఆమె ఎన్నడూ వెళ్ళదు. ఆలాగున ఆయన చెప్పుచున్నాడు. ఆమె ఎత్తబడును. "బ్రెన్‌హాం సోదరుడా, అంత చీకటిగా కనబడుచున్నది కదా. ఏలాగది జరుగును?" అనవచ్చు. అదెంత చీకటి అయినా గాని పరవాలేదు. నీ చేయి నీకు కనబడకపోవచ్చును, కాని గుర్తుంచుకో, దీపమును వెలిగించగల ఒకాయన ఇచ్చటున్నాడు. ఆయన సంఘమును పైకి కొనిపోగలడు.

మీరు చెప్పండి, "మంచిది, నేను …"

132షద్రకు, మేషెకు, అబెద్నెగోలు అగ్ని గుండములోనికి పోయిరి, కాని గాలిని విసర చేయగల ఒకాయన అచ్చటుండెను. అవును! పెంతెకోస్తు దినమున బలముగా గాలి వీచినది. ఆయన గాలిని విసరజేసి, అగ్నిని వెనక్కి పంపెను. అక్కడ ఒకాయన ఉండెను. ఆయనను వారు నాలుగవ మనిషి అనిరి. నేడు ఇక్కడ ఒకాయన ఉన్నాడు. ఆయన ఒక్కడే! హల్లెలూయా! దీపములను వెలిగించగల మీట ఆయన చేతిలో యున్నది.

మరణ ఛాయలలో కూర్చొని యున్నవారు గొప్ప వెలుగును చూచిరి. దానిని త్రోసివేయవద్దు. ఒక్క క్షణము మనము శిరములు వంచుచుండగా ప్రభుని నామము పేరట దానిని అంగీకరించుము.

మేము వెలుగులో నడతుము!

అందమగు వెలుగు కృపా హిమబిందువులు,

ప్రకాశించు చోట నుండి వచ్చినవి.

దివారాత్రులు మా చుట్టూ ప్రకాశించును.

యేసే లోకమునకు వెలుగు.

మేము వెలుగులో నడతుము!

అది అంత అందమగు వెలుగు!

కృపాహిమ బిందువులు,

ప్రకాశించుచోట నుండి వచ్చినవి.

దివారాత్రులు మా చుట్టూ ప్రకాశించును,

యేసే లోకమునకు వెలుగు, రండి,

పరిశుద్ధులారా వచ్చి ప్రకటించుడి.

యేసే లోకమునకు వెలుగు!

ఆకాశగంట మ్రోగును.

యేసే వెలుగు. (ఏమిటది? బయలుపరబడిన వాక్యమే

నేడు యేసు; ఆయన వాక్యమైయున్నాడు)

మేము వెలుగులో నడచుదుము.

అది అంత అందమగు వెలుగు!

కృపా హిమ బిందువులు ప్రకాశించుచోట నుండి వచ్చినవి.

ఓ! దివారాత్రులు మా చుట్టూ ప్రకాశించుము.

యేసే లోకమునకు వెలుగు.

ISA 9:6

 

133పరిశుద్ధాత్మ యొక్క నాయకత్వము క్రింద ఈ వెలుగులో ఎందరు నడచుటకు ఇక్కడ తలలు వంచి యున్నారు? నేటి వాక్యము బయలుపడినది. నేటి కొరకు దేవుడు వాగ్ధానము చేసిన వాక్యము బయలు పడుట చూచారా? ఆదియందు ఆయన ఆలాగే యున్నాడు గదా? ఆయన వాక్యము. కుమారుడు పుట్టెను; ఆయన వాక్యము; ఆయన మెస్సీయా; ఆయనే బయలు పరచబడిన వాక్యము. దేవుడు ఆదియందే అంతము గూర్చి పలికెను.

ఇప్పుడు, ఈ దినము కొరకు ఒక వాక్యమున్నది. గందరగోళము, చీకటి, మాయ వెలుగుల మధ్య ఆయన ఆ వాక్యమును బయలుపరచుచున్నాడు. అసలు దాని వలె వారిది కనబడుచున్నది గాని, అది రుజువు కాబడదు.

134యేసు ఇట్లనెను, "నేను దేవుని వ్రేలి ద్వారా దయ్యములను వెళ్ళగోట్టుచున్నాను. మీరు దేని వలన వెళ్ళగొట్టుచున్నారు?" వారు వాటిని వెళ్ళగొట్టలేదు, చూచారా. "కాని నేను దేవుని వ్రేలు వలన దయ్యములను వెళ్ళగొట్టుచున్నాను గనుక దేవుని రాజ్యము మీకు సమీపముగా వచ్చినది, చూడండి. ఓ! నెమ్మదిగా మనము చేతులు ఎత్తుచుండగా నిజముగా ఆలోచించుదము.

మేము ఈ వెలుగులో నడతుము!

ఇది అంత అందమైన వెలుగు!

అది కృపా హిమ బిందువులు

మెరయు చోట నుండి వచ్చినది.

(మీరు ఒప్పుకొని ఇప్పుడు దేవునిని నమ్మండి)

దివా రాత్రులు మన చుట్టూప్రకాశించుచున్నది.

యేసే లోకమునకు వెలుగు.

మేము ఈ వెలుగులో నడతుము!

అది అంత అందమగు వెలుగు!

అది కృపా హిమ బిందువులు

మెరయు చోట నుండి వచ్చినది.

దివారాత్రులు మన చుట్టూ ప్రకాశించుచున్నది.

యేసే లోకమునకు వెలుగు.

135వారు ఆ పాటను కొనసాగించెదరు. ప్రతి కాలము ఒకేలాగున్నది. నోవహు దినములలో వారు వెలుగును తిరస్కరించి ఏమి చేసిరి? దేవుని తీర్పులోనికి వెళ్ళిరి. మోషేలో మండుచున్న పొద వెలుగుండెను. అప్పుడు ఫరోకు ఏమి జరిగినది? మరణ సాగరములోనికి నడిచెను. వెలుగులో నడక ప్రారంభించి తరువాత తిరస్కరించిన దాతానుకు ఏమయినది? భూమి బ్రద్ధలయి అతనిని మ్రింగివేసినది. వెలుగులో నడచుటలో విఫలమైన వారందరికి ప్రతి కాలములోను ఏమి జరిగినది? అన్ని కాలములలోను ఆ వెలుగు యేసే. వారి దినములలో ఉండివాడు యేసే, ఏలయనగా ఆయనే వాక్యము. వాక్యమే వెలుగును తయారు చేయును. అదియే ఆ దినపు వెలుగు. దానిని గూర్చి నిజంగా ఆలోచించండి. యధార్థముగా అడగండి. మీరు వెలుగులో నడచుచున్నారా? దీనిని మరల పాడుదము.

[సహో. బ్రెన్‌హాం గానము చేయసాగిరి.]

అందమగు వెలుగు!

కృపా హిమబిందువులు

మెరయు చోట నుండి అది వచ్చును.

దివా రాత్రులు

మా చుట్టూ ప్రకాశించుము

ఓ! యేసే, లోకమునకు వెలుగు.

ఇప్పుడు మనము లేచి నిలబడుదము.

JOHN 3:1,2

 

136ఇక్కడున్న వారి హృదయములలోను, వినువారి హృదయములలోను ఈ సందేశము లోతుగా నాటుకొనునట్లు పరమ తండ్రిని ప్రార్థించుచున్నాను. వాక్యము అను విత్తనము మీద వెలుగు పడి ప్రతి ముందు నిర్ణయించబడిన బీజము ఫలించును గాక! ఈ వివిధ సంస్థలలో అవి నాటబడినవి. వారు రాత్రి వచ్చినా గాని నికోదేమువలె వెదకుదురు గాక! వెలుగు నొద్దకు రమ్ము! తండ్రీ, అది దయచేయుము.

చేతితో తీయబడని ఒక రాయి అక్కడికి వచ్చినది. అది ఈ అన్యరాజ్యములను తుత్తునియలు చేయును. ఆత్మసంబంధ రాజ్యములు. ప్రకృతి సంబంధ రాజ్యములు అన్నియూ నలుగును. ఆ రాయి మొత్త౦ భూమిని కప్పును. అది ఒక పరిశుద్ధపరచు ప్రక్రియ ఆ రాయి ఎవని మీద పడునో వారు తుత్తునియలగుదురు. అది ఒక బలమగు పునాది.

137ఓ క్రీస్తూ, నీ దాసునిగా నన్ను ఈ బండ మీదనే చనిపోనిమ్ము, ఈ బండ నీ వాక్యమే. ప్రభువగు దేవా, నన్ను దావీదు వలెను, ఆనాడు దావీదు పక్షమున నిలచిన యోధుల వలెను నిలబడ నిమ్ము. ఈ వాక్యమును శాఖల నిరాకరించుట నేను చూచుచున్నాను. నన్ను దీని పక్షమున నిలబడ నిమ్ము. అది ఇక్కడే ఎక్కడో పడి యున్నది. ఓ దేవా, మాకు బలము, ధైర్యము ఉండునట్లు దయ చూపుము, ఎందుకనగా చీకటి ఘడియ వచ్చుచున్నది. అయితే ఏ ఘడియలో నయినా గాని నీవు కోరినచో దీపములను వెలిగించగలవను సంగతి మేము మరువకుందుము గాక! తండ్రీ, నీవు దీపములు వెలిగించగలవు.

"మీరు లోకమునకు వెలుగై యున్నారు," అని నీవు చెప్పి యున్నావు. నీ సేవలో నున్న మా దీపములు ఇతరుల కొరకు ప్రకాశించునట్లు దయ చూపుమని ప్రార్థించుచున్నాము. మా జీవితములలో వారు సువార్త వెలుగును చూచెదరు గాక! దినదినము యేసుక్రీస్తు యొక్క జీవితమును వారి మీద ప్రతిఫలింప చేయుము. ఆయన భూమి మీద నిండు దీనునిగాను, మధురముగాను ఉండెను. ఆయన ద్వారా వాక్యము జీవించెను. ప్రభువా, అది అనుగ్రహించుము. మేము నీవైపు చూచుచున్నాము. నీ చేతిలో ఆ మీట ఉన్నది. ప్రపంచమును నీవు నీ చేతిలో పట్టుకొనియున్నావు. నీవు సమస్తమును నీ చేతిలో పట్టుకొని యున్నావు. నీ మాట చేత లోకమును పట్టుకొని యున్నావు. ఓ తండ్రీ, మమ్మును వాక్యమును స్వీకరింపజేయుము. ప్రభువా, అది ఈ చోట నున్న ప్రతి వారి హృదయవాంఛ అగును గాక.

దావీదు పాడినట్లుగా మేము ఈ పాటలు పాడుచున్నాము… అవి ప్రవచనములయినవి, వారు ప్రవచించిరి, నీవు ఆ ప్రవచనమును గుర్తించితివి. ప్రభువా, దానిని మేము పాడుచుండగా, అది మా హృదయములలో అన్వయించుకొనెదము గాక! మేము వెలుగులో నడతుము అని పాడుచున్నాము. ఆలాగు కృప చూపు ప్రభూ! ఇది ఒక అందమగు వెలుగు. ఇది వాక్యము. ఇది క్రీస్తు మా మధ్య జీవించుట. గతము కాదు గాని ప్రస్తుతము. ఆయన గతంలో ప్రతిబింబింపచేసినది ప్రస్తుతమున్నదే. ప్రజలు అర్థముచేసికొని ఈ అందమగు వెలుగులో నడచునట్లు కృప చూపుమని తండ్రీ మేము ప్రార్థించుచున్నాము. యేసు నామములో అడుగుచున్నాము.

138ఒక క్షణము మనందరము లేచి నిలబడి పాడుదము.

ఇక్కడ ప్రెస్బిటేరియను, మెతడిస్టు, కాతలిక్కు, అన్ని రకముల వారున్నారు. శాఖా సంబంధముగా చూచినచో ఇది మిశ్రిత గుంపు.

గుర్తుంచుకొనండి, ఈ వెలుగుల గూర్చి మాట్లాడినప్పుడు, ఎవరికీ వ్యతిరేకముగా నేను మాట్లాడలేదు, కాని అవి దొంగ వెలుగులని బైబిలు ద్వారా నిరూపించాను. కానిచో, క్రీస్తు తాను వాగ్ధానము చేసిన రీతిగానే క్రియ చేసి యుండును, చూచారా. దానిని వారు నిరాకరించుచున్నారు, చూడండి. అక్కడికి వెళ్ళగా నీకేమి కనబడును? సంఘములో చేరుట, ఒక క్రమము వల్లించుట. మార్గాంతమునకు వచ్చినప్పుడు అది ఎండమావి అని అర్థమగును. క్రీస్తే వాక్యము; ఆయన వెలుగు. మీరు జీవము పొందగల ఈ సమయములోనే జీవము పొందుడి.

మీరు ఒకదాని కొరకు జీవించుచున్నారు.

DEUT 8:3•

LUKE 4:4

 

139దేని కొరకు మీరు జీవించుచున్నారు? చనిపోవుట కొరకు. మీ ప్రతి ఒక్కరు దేనికొరకు పనిచేయుచున్నారు? తినుట కొరకు. ఎందుకు తినుచున్నారు? జీవించుట కొరకు. ఎందుకు జీవించుచున్నారు? చనిపోవుట కొరకు. కాబట్టి జీవము కొరకు ఎందుకని జీవించరు? వాక్యమును అంగీకరించుట మాత్రమే జీవమునకు మార్గము. "మానవుడు రొట్టె వలన మాత్రము కాదు గాని దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలనను జీవించును." ఇప్పుడు దేవుని నోట నుండి వచ్చు మాట పరిశుద్ధాత్మ వలన మనకు బయలుపరచబడి యున్నది. దాని వలన జీవించుడి, మీరు జీవి౦చెదరా?

MATT 4:4

 

140దీనిని మనల మనము పాడుచుండగా, మన స్థలములో లేచి నిలబడుదము. ప్రక్కనున్న వారి చేయి పట్టుకొని ఇట్లు చెప్పండి. "సోదరుడా, వెలుగులో నడచుదము." మనము "వెలుగులో నడచుదమను" పాట పాడుదము. పాడండి. దీనిని మనము ఒకరి చేతులు ఒకరము పట్టుకొని, సాధ్యమైనచో కండ్లు మూసికొని కలిసి పాడుదము.

మనము వెలుగులో నడచుదము

అంత అందమగు వెలుగు!

అది కృపా హిమ బిందువులు

మెరయు చోట నుండి వచ్చును.

దివా రాత్రులు మన చుట్టూ ప్రకాశించును.

లోకమునకు వెలుగై యున్న యేసు.

ఇప్పుడు మన చేతులు ఎత్తుదము!

మేము వెలుగులో నడతుము.

అది అందమగు వెలుగు!

అది కృపా హిమ బిందువులు

మెరయు చోట నుండి వచ్చును.

దివారాత్రులు మా చుట్టూ ప్రకాశించుము.

ఓ! యేసే లోకమునకు వెలుగు.

వెలుగు పరిశుద్ధులారా,

వచ్చి ప్రకటించుడి.

యేసే లోకమునకు వెలుగు.

అప్పుడు పరలోక గంటలు మ్రోగును.

యేసే లోకమునకు వెలుగు.

ఓ! ఇప్పుడు మనము పాడుదము.

మేము వెలుగులో నడతుము.

అది అందమగు వెలుగు!

కృపా హిమ బిందువులు మెరయుచున్న

చోట నుండి అది వచ్చును.

దివా రాత్రులు మా చుట్టూ ప్రకాశించుము.

యేసే లోకమునకు వెలుగు.

DEUT 8:3•

MATT 4:4•

LUKE 4:4

 

141ఇప్పుడు మన తలలు వంచియుండగా గుర్తుంచుకొందము. ఇశ్రాయేలువారు తమ ప్రయాణములో ప్రతి దినము నూతన మన్నా తినుచుండిరి. అగ్నిస్తంభపు వెలుగులో నడచుచుండిరి. ఆ అగ్నిస్తంభము క్రీస్తే. ఆలాగు బైబిలు చెప్పుచున్నది. నేడు ఆయన మనకు తోడై యున్నాడు. దానిని మనము కలిగియున్నాము. ఆయన మనతో యున్నాడని మనకు తెలియును. అదే అగ్నిస్తంభము. ఆయన భూమి మీద నున్నప్పుడు వాక్యమును నెరవేర్చుటకు ఏమి చేసెనో ఆలాగే మరల చేయుచున్నాడు.

ఇక్కడ నుండి మనము వెళ్ళుచుండగా, మన గృహములకు వెళ్ళుచు౦డగా ఆ పాటను మన హృదయములో ఉంచుకొందము. చక్రమువలెనే ఆ పాటనాలపించుము. మీరు మీ భోజనము తినుటకు ముందు తలలువంచి, మీ శరీరము కొరకు భూమి మీద ఆహారమును పండించుటకు వెలుగును పంపిన దేవునికి వందనములు చెల్లించుడి. ఆ తరువాత ఆయన వాక్యమును, ఆత్మీయ వెలుగును, మీ ఆత్మల కొరకు ఆహారముగా పంపినందుకు వందనములు చెల్లించుడి. "మనుష్యుడు రొట్టె వలన మాత్రమే కాదు గాని దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాటవలనను జీవించును."

మీ ఇంటిలోను, మీ ప్రజల మధ్య ఈ పాటను పాడుకొనుడి. ప్రార్థన కార్డులు మొదలగు వాని కొరకు సుమారు రాత్రి 6:30 గంటలకు తిరిగి ఇక్కడ మమ్మును కలిసికొనుడి. మిమ్మును అప్పుడు చూచెదను. మీ శిరములు వంచుడి. సంఘకాపరియగు సహోదరుడు నెవిల్‌ను ఇక్కడికి వచ్చి ప్రార్థనతో ముగించమని కోరుచున్నాను.

Search Messages

0 / 0 matches
Enter characters above to process real-time text query scopes...