షాలోమ్
సహోదరుడా ఐసాక్ సన్, నీకు చాలా కృతఙ్ఞతలు. [క్యాన్సర్ గల ఒక వ్యక్తి గురించి సహోదరుడు ఐసాక్ సన్ మాట్లాడనారంభించాడు. టేపుపై ఖాళీ ఉన్నది—సంపా.]…ఐసాక్ సన్.
స్నేహితులారా, శుభోదయం, మీరు కూర్చొనవచ్చు. అవునండి. తిరిగి ఈ ఎడారి వెనుక ప్రాంతాన ఉండటం మంచిగానున్నది. మీకు తెలుసుకదా, మనము…పోయినసారి నేనిక్కడ ఉన్నప్పుడు, ఈ స్థలమునకు, “ఎడారి వెనుక భాగము” అని పేరు పెట్టానని నేను నమ్ముచున్నాను. సాధారణంగా మనము ప్రభువును ఆ—ఆ చోటనే కనుగొంటాము, లేదా ఒకసారి మోషే ఆ ఎడారి వెనుక గొర్రెలను కాయుచుండగా అక్కడే అది కనుగొనబడినది.
ఇక్కడున్న ఈ వ్యక్తిని, కొద్దిసేపటి క్రితం, నేను వచ్చుచుండగా, కారులోని వెనుక చూపుటద్దంలో నేను చూసాను. గడిచిన దినమున, అతడు ఆసుపత్రిలో ఉన్నాడని నేను విన్నాను. నేను అతనికొరకు ప్రార్ధించుచుంటిని, మరియు ఈ ఉదయం అతనిక్కడ కూర్చొనియున్నాడు. [“అతడు బాగానే ఉన్నాడు,” అని ఎవరో చెప్తున్నారు.—సంపా.] సరి, అది మంచిది. నేను చాలా ఆనందిస్తున్నాను. అతడు చాలా రక్తాన్ని కోల్పోయాడు. మరియు కావున, ఈ ఉదయం అతణ్ణి ఇక్కడ చూడటం, మాకు చాలా ఆనందంగా ఉంది.
పోయినసారి మనతోపాటు ఇక్కడుండి, క్యాన్సరుతో ఆసుపత్రిలో ఉన్న, ఈ సహోదరుని గూర్చి వినడానికి బాధగా ఉంది. దీనినుండి బయటకు ఒకే ఒక్క దారిని మనము కలిగియున్నామని మనకు తెలుసు, మరది మరణమనే దారియైయున్నది. మనమందరము ఆ దారిలో నడవవలసియున్నది, మనము అత్యంత నీతిమంతులమైనా గానీ, మనలో అత్యంత పరిశుద్ధులైనా గానీ, మనము ఒకరినొకరము మరొకరి సమాధి ప్రక్కన సమాధి చేస్తుంటాము. మరి అయిననూ యేసు ఇట్లు చెప్పెను, “నాయందు విశ్వాసముంచువాడు ఎన్నటికిని చనిపోడు.” అయితే అక్కడున్న ఆ “మరణం” అనేది, మనం అనుకునే మరణం కాదు.
2 లాజరు గురించి యేసు చెప్పినట్లే అది ఉన్నది, “అతడు నిద్రించుచున్నాడు,” అని ఆయన చెప్పెను.
మరియు వారు, “సరి, మేము…అతడు నిద్రించినయెడల బాగుపడునని” అన్నారు.
3 పిదప యేసు ఇట్లు చెప్పెను, “అతడు చనిపోయెను,” చూడండి, వారికి తెలిసిన భాషలో చెప్పవలసివచ్చెను. “మరియు నేనక్కడ ఉండలేదని మీ నిమిత్తము సంతోషించుచున్నాను, కానీ నేను వెళ్ళి అతణ్ణి మేల్కొల్పుదును,” అని ఆయన చెప్పెను. చూశారా?
4 మరియు లేఖనములో మనము కలిగియున్న ఈ అద్భుతమైన వాక్యమును ఆయన చెప్పినది అప్పుడేయైయున్నది, “నామాటలు విని, నా యందు విశ్వాసముంచువాడు, నిత్యజీవము గలవాడు; వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటియున్నాడు. పునరుత్థానము మరియు జీవమును నేనే. నాయందు విశ్వాసముంచువాడు, వాడు చనిపోయినను బ్రదుకును. మరియు బ్రతికి నాయందు విశ్వాసముంచు ప్రతివాడును ఎన్నటికిని చనిపోడు.” చూశారా? ఎన్నటికిని చనిపోడు! అటువంటిది లేదు…వాస్తవానికి ఒక క్రైస్తవునికి మరణమనేది లేదు. అతడు…
మరణం అంటే “నిత్యమైన యెడబాటు.”
5 మరియు మనమిప్పుడు ఉన్నట్టుగానే…ఇప్పుడు మనం ఈ భౌతిక దేహంలో ఉంటుండగానే మనము మరణించినట్లైతే, మనం ఒకరి నుండి ఒకరము వేరవుతాము. అయితే, వాస్తవానికి ఈ శరీరం మాత్రమే మనలను ఒకరినొకరకి గుర్తింపజేస్తుంది, ఎందుకనగా మనం ఐదు ఇంద్రియములలో బంధించబడియున్నాము: చూచుట, రుచి, స్పర్శ, వాసన, మరియు వినికిడి. మరియు మనం ఒకరినొకరము చూడగలిగి లేదా స్పర్శించ కలిగినంతవరకు, అప్పుడు, మనం ఇక్కడ ఉన్నామనే ఆధారాన్ని మనం కలిగియుంటాము. మీరు గ్రుడ్డివారైయుండి మరియు చూడలేకపోతే, మరియు—మరియు చూడలేకపోతే, అటువంటప్పుడు మీరు ఒకరినొకరు స్పర్శించగలరు, మరియు మనం…లేదా ఒకరినొకరు వినగలరు. మరియు ఈ భూసంబంధమైన ఇంద్రియములు ఒకరినొకరికి పరిచయం చేస్తాయి.
6 అయితే, వాస్తవానికి, స్పష్టంగా, మనమెన్నడూ ఒకరినొకరం చూచుకొనలేదు. అది మీకు తెలియునా? మనమెన్నడూ ఒకరినొకరం చూచుకొనలేదు. ఆ లోపల అది కలిగియున్నదానిని అనుకరిస్తూ, ఇక్కడున్న ఒక శరీరంలో నుండి ఏదో మాట్లాడుటను మీరు వింటారు. కావున పిదప, మనం ఒకరితో ఒకరం మాట్లాడినప్పుడు, మనం—మనం నిజంగా ఆ శరీరంతో మాట్లాడుటలేదు. ఆ లోపలున్న ఆత్మతో మాట్లాడుచున్నాము, అయితే ఆ లోపలున్న ఆ ఆత్మను గుర్తింపచేయునది ఈ శరీరమేయైయున్నది. మరియు కావున, మనం ఒకరితోనొకరము మాట్లాడినప్పుడు, మనము…అప్పటికప్పుడే మనం క్రైస్తవులమో కాదో అన్నది వెంటనే అర్ధం చేసుకొనగలము, ఎందుకనగా మనం మాట్లాడుతున్న దానిలో నుండి ఆత్మలో ఒక సహవాసాన్ని కలిగియుంటాము, మీరు చూడండి, అది ఒకరినొకరిని స్పర్శిస్తూ, మనం క్రైస్తవులమా కాదా అన్నది తేల్చివేస్తుంది. అందునుబట్టి మనం ఎన్నడూ ఒకరినొకరము చూచుకొనలేదు.
7 యేసు చెప్పెను. “ఎవడును ఎప్పుడైనను దేవుని చూడలేదు, అయితే తండ్రి రొమ్ముననున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరచెను.” చూశారా? ఇంకో మాటలో చెప్పాలంటే, దేవుడు గుర్తించబడినాడు. ఆ—ఆ దేవునియొక్క వ్యక్తిత్వము శరీరమందు అనగా ప్రభువైన యేసుక్రీస్తులో గుర్తించబడెను, కావున ఆయన దేవునియొక్క మూర్తిమంతమునైయున్నాడు. లేదా, దేవుడే తననుతాను ఒక రూపంలో, చూడండి, మానవ రూపంలో వ్యక్తపరచుకొనుచున్నాడు. దేవుడు తననుతాను మనకు వ్యక్తపరచుకున్నాడు, మరియు ఆయన దేవుడైయున్నాడు. మూడవ వ్యక్తియో లేదా రెండవ వ్యక్తో కాదు; ఆయన ఒక్కడైయున్న దేవుడైయున్నాడు. మనమాయనను అనుభూతిచెందగల్గునట్లు, ఆయన స్వయంగా దేవుడైయుండియు, తనను తాను గుర్తింపజేసుకొనుచున్నాడు.
8 మొదటి తిమోతి 3:16, “నిరాక్షేపముగా,” అంటే వివాదము లేకుండా, “దైవత్వమును గూర్చిన మర్మము గొప్పదైయున్నది, ఏలయనగా దేవుడు సశరీరుడు అయ్యాడు,” లేదా “శరీరమందు” ప్రత్యక్షపరచుకున్నాడు. అది అద్భుతంగా లేదా? దేవా! మరియు తాను చేసినట్లు ఆయన ఒక అగ్నిస్తంభము ద్వారా మరి ఆ రీతిగా కదలాడినప్పుడు, మనమెన్నడూ దేవుడిని అర్ధం చేసుకొనలేము. కానీ ఆయన మనలో ఒకనిగా మారినప్పుడు, చూడండి, ఆయన మనుష్యునిగా మారినప్పుడు మాత్రం మనమాయనను అర్ధం చేసుకున్నాము. అప్పుడు ఆయన మనతో మాట్లాడగలడు, మరియు మనమాయనను స్పర్శించగలము, ఆయనను పట్టుకోగలము, ఆయనను తాకగలము, మరియు ప్రతీది చేయగలము. మరియు, “మేము దేవుడిని తాకియున్నాము,” అని స్పష్టంగా లేఖనము చెప్పినట్లు, చూడండి, మా చేతులతో, ఆయనను మన చేతులతో ముట్టుకున్నాము.
9 దేవుడు మానవునిలో ఉండియున్నాడు. మరియు ఈనాడు ఆయన తననుతాను తన సంఘములో గుర్తింపజేసుకొనుచున్నాడు. ఆయన దేవుడిగానే నిలిచియుంటాడని, ఒక తిరిగి-జన్మించిన క్రైస్తవునిలో, దేవుడు తననుతాను గుర్తింపజేసుకుంటాడు. మరియు నీలోను, నాలోను దేవుడిని చూసినదాన్నిబట్టి మాత్రమే ఈ బయటి ప్రపంచపువారు దేవుడిని తెలుసుకుంటారు. వారు దేవుని తెలుసుకొనుటకుగల ఒకే ఒక మార్గమేదనగా, మనము వ్రాయబడిన పత్రికలముగా, లేఖనముయొక్క పత్రికలముగా ఉన్నప్పుడేయైయున్నది, మనము మనుష్యులందరిచేత చదవబడతాము. మరియు మనం జీవించే జీవితము మనలోపల ఉన్నదానిని ప్రతిబింబిస్తుంది. ఒక మనుష్యుడు తాను చేయు క్రియలచేత గుర్తించబడతాడు. కావున మన క్రియలు మంచివిగా, చూడండి, ఎల్లప్పుడూ మంచిగా ఉండవలసియున్నవి, ఎందుకనగా మనము మన ప్రభువైన యేసుక్రీస్తుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాము.
10 అది ఎటువంటి ఒక అద్భుతమైన విషయం కదా, ప్రత్యేకించి నాలాంటి ఒక—ఒక వృద్ధుడు ఇక్కడ నిలబడి, మరియు—మరియు గతంలో అయిపోయిన, గతించిపోవుచున్న ఈ జీవితం గూర్చి ఆలోచిస్తుండటం, మరియు—మరియు మనము నిత్యత్వమనే ఒక భవిష్యత్తును ఎదుర్కొనుచున్నాము. మరియు ఈ జీవితకాలము మట్టుకే నేను క్రీస్తునందు నిరీక్షించుచున్నయెడల, ఈ ఉదయం మనుష్యులందరికంటె నేను దౌర్భాగ్యుడనైయుందునని ఎరిగియున్నాను. అయితే మనము ఏ—ఏ స్థితికైతే రావలసియున్నదో దానికి ఈ జీవితం కేవలం ఒక—ఒక ఛాయవలెనున్నదని ఎరిగియున్నాము. ఇది ఒక ప్రతిభింబము మాత్రమే, ఎందుకనగా ఇది దేవుడు చేసిన ఆ పరిపూర్ణమైనదానివలె ఉండనేరదు. నశియించిపోయే దేనిని దేవుడు చేయడు. చూశారా? దేవుడు నిత్యుడైయున్నాడు. మరియు, కావున, మనమిప్పుడు జీవించే ఈ జీవితం, కేవలం మనకు ముందున్న దానిని ప్రతిబింబించుచున్నది. మరణించనటువంటి ఆ నిజమైన దానిని ప్రతిబింబించుచున్నది. నశించిపోని ఆ శరీరాన్ని ప్రతిబింబించుచున్నది. తీయబడని ఆ ప్రాణాన్ని ప్రతిబింబించుచున్నది. చూశారా? కాబట్టి మనము నిత్య జీవమును కలిగియున్నామని, అది చెప్పినప్పుడు, ఆ లేఖనము సత్యమేయైయున్నది, మనము నిత్య జీవమును కలిగియున్నాము. మనమెన్నడూ మరణించము. చూడండి, ఎందుకనగా మీరు…మీరు తిరిగి జన్మించినప్పుడు, మీరు దేవునిలో ఒక భాగం అవుతారు. చూడండి, మీరెన్నడూ నశించిపోకుండా ఎప్పటికి నిత్యులైయుంటున్నారు. మీరు ఆయనయొక్క కుమారుడు, గనుక మీరు దేవునిలో భాగమైయుంటారు.
11 ఇప్పుడు, నేను వేరొక పేరును తీసుకొని, మరియు నా పేరు వేరొక పేరని చెప్పవచ్చును. నాకు అత్యంత సమీపమైయున్న, హార్వే అను మా అమ్మ పేరును నేను తీసుకొనవచ్చును, లోకములో, మా అమ్మ పేరు హార్వే, గనుక నేను హార్వే అనే పేరును తీసుకొనవచ్చును. అయినా గాని నేనొక బ్రెన్హాం నని ఆ రక్తము ఋజువుచేస్తుంది. చూశారా? ఎందుకనగా నేను నా తండ్రిలో భాగమైయున్నాను. మరియు నేను రక్తమును నాలో కలిగియున్నంతవరకు, నేనింకా నా తండ్రిలో భాగమైయుంటాను. చూడండి, అది నిజము. మరియు నేను దేవుని ఆత్మ ద్వారా జన్మించినప్పుడు, నేను దేవునిలో ఒక భాగమైయున్నాను, అది అంతే; చూడండి, ఆయనే నా తండ్రియని నేను ఆయనతో గుర్తించబడతాను. అప్పుడు నా జీవితము ఆయనను ప్రతిబింబించవలసియున్నది; నా జీవితం నా భూసంబంధమైన తండ్రిని, తాను ఉన్నటువంటి రూపములో ప్రతిబింబించునట్లే అది ఉన్నది. నేను…ఎక్కువగా మా నాన్న లాగా కనిపిస్తానని వారు అంటారు, కావున ఆయనయొక్క రూపమే నా యందు ప్రతిబింబించబడుచున్నది. మరియు మీ—మీ తండ్రి, మీ తల్లిదండ్రులు మీయందు ప్రతిబింబించబడుచున్నారు. మరియు కావున, మనము తిరిగి జన్మించి మరియు—మరియు ఇక్కడ ఆయన రూపములో చేయబడినప్పుడు మన తండ్రియైన దేవుడు మనయందు ప్రతిబింబించుచున్నాడు.
12 ఇప్పుడు, నేను మాట్లాడటం మొదలుపెట్టాను కానీ, నేను దేని గూర్చి మీతో మాటలాడనైయున్నానో ఆ పాఠ్యాంశములోనికి నేనింకా వెళ్ళనేలేదు.
13 నేనెల్లప్పుడూ, దేనికంటెనూ ఇటువంటి ఒక కుటుంబ ప్రార్ధనను, గృహ కూడికను అభినందిస్తుంటాను, ప్రజలు అనుకున్న దానికంటే—దానికంటే ఎక్కువగానే నేనట్లు చేసానని నేను అనుకొనుచున్నాను, ఎందుకంటే సాధారణంగా ఇటువంటి ఒక గృహ కూడికలోనే మనము అత్యుత్తమ కూటములను మరియు చక్కని సహవాసపు సమయాలను కలిగియుంటాము. ఎక్కడైతే మనము కొద్దిమంది విశ్వాసులు మాత్రమే కూడుకొని ఆరాధిస్తామో, అక్కడే దేవుడికి అత్యంత సమీపముగా ఉన్నట్లు నేను అనుభూతి చెందాను.
14 ఇప్పుడు ఈ ఉదయమున, ఇక్కడ మనం ముప్పై, నలభై, ముప్పై, లేదా, అంతమంది కూర్చొనియున్నామని నేను అనుకొనుచున్నాను, పిల్లలను కూడా లెక్కిస్తే, ఎంత మందో నాకు తెలియదు. ఒక చిన్న గుంపుగా ఉన్న ఈ ప్రజలను చూసి, అంకెలను లెక్కించుట నాకు—రాదు—రాదు, ఎందుకంటే ఇచ్చట వేరే గదులు ఉన్నవి, మరి వాటిలో ఉన్న ప్రజలు నాకు కనబడుటలేదని మీరు చూస్తున్నారు కదా. అయితే, ఇప్పుడు మనము ఈ విధంగా కూడుకున్నప్పుడు బయట ఒక గొప్ప, పెద్ద జన సమూహములో మనం పొందలేనటువంటి సాన్నిహిత్యాన్ని మనమిక్కడ పొందుతామని నేను భావిస్తున్నాను. మనము, మనల్ని మనం వ్యక్తపరచుకొనగలము. అందునుబట్టియే, ఈ ఉదయం, ఇక్కడికి వచ్చుచుండగా, ఈ ఉదయం ఇక్కడున్న ఈ సంఘముతో, మరియు దానియొక్క ప్రియమైన కాపరితో మాట్లాడవచ్చునని నేను తలంచాను. నా స్నేహితులలో చాలా మందిని, స్ట్రైకర్స్ ను మరియు నేను—నేను కొంతకాలంగా చూడని వారందరినీ చూచుటకు నాకు చాలా ఆనందంగా ఉంది.
15 మరియు వచ్చే ఆదివారం మధ్యాహ్నం, ఆ ఆడిటోరియంలోని ఫినిక్స్ కూటములో మాటలాడుటకు నేను సిద్ధపరచుకున్న నా నూతన-సంవత్సర వర్తమానమును ఈ ఉదయము నేను మీతో మాటలాడుతాను. ఎందుకంటే, ఇక్కడైతే, బహుశా వారు టేపులను చేయుచున్నారని నేను తలంచాను. నేను…మరియు మీకు తెలుసు కదా, విశ్వాసము మరియు అవిశ్వాసము, మూఢ నమ్మకములు మరియు—మరియు అన్నియూ కలిసియున్నటువంటి ఆ ఫినిక్స్ లో కంటెను, బహుశా కేవలం, ఇక్కడున్న ఈ విశ్వాసుల గుంపు మధ్యలోనే, ఒక—ఒక శ్రేష్ఠమైన ఆలోచనను పరిశుద్ధాత్మ నాకు అనుగ్రహించవచ్చును. మరియు పిదప ఒక వేళ సహోదరులు, టేపులను బయటకు విడుదల చేయదలచినయెడల, అది—అప్పుడు దానిని ఆ ప్రకారం చేయుట మంచిది, ఎందుకనగా ఇక్కడినుండి మీరొక శ్రేష్టమైన టేపును పొందుకొనవచ్చును. మొదటిగా ధ్వనికి సంబంధించిన సంగతులను పరీక్షించమని నేను ఆ పిల్లలకు చెప్పాను. మరియు నేను ఈ ఉదయము లోపలికి వచ్చినప్పుడు, ఆ ధ్వనికి సంబంధించినవన్ని సరిగ్గానే ఉన్నాయని సహోదరుడు టెర్రీ నాతో చెప్పియున్నాడు. కావున, అది—అది మంచిది. కావున ఇప్పుడు మొదటిగా మనము, ఈ భక్తి పూర్వకమైన విషయమును సమీపించుటకు ముందు, మరియు నాకు తెలియును…
16 మీలో కొందరు మధ్యాహ్నం భోజనం కోసం ఉంటున్నారని, ఇక్కడ మైదానంలోనో, లేదా ఆ ఇంట్లోనో లేదా ఇక్కడెక్కడో, కలిసి ఆ విధంగా భోజనం చేయబోతున్నారని వారు చెప్పారని నేను నమ్ముచున్నాను. అది చాలా మంచిది. మీరందరూ కూడుకొనుటను చూసి నేను నిశ్చయంగా అభినందిస్తున్నాను.
17 మరియు ఈ ఉదయం నా వర్తమానము జీవముగల దేవుని సంఘమునకు ఉద్దేశించబడినది అని—అని నేను భావించుచున్నాను, చూడండి, మరియు ఈ ఉదయం ఇక్కడ కూర్చున్నవారు దానిలో భాగమైయున్నారని నేను నమ్ముచున్నాను. మరియు ఇప్పుడు ఆ ప్రధానమైన భాగమునకు మనం రావడానికి ముందు, ప్రార్ధన కొరకు ఒక్క క్షణం మన తలలు వంచుదాము.
18 మా పరలోకపు తండ్రీ, మేము నిన్ను మా తండ్రీ అని సంభోదించే భాగ్యమును కలిగియున్నందుకు, మేమెంతగానో కృతజ్ఞులమైయున్నాము, ఏలయనగా తండ్రీ అంటే మేము ఆ భూమ్యాకాశములను సృజించిన ఆ గొప్ప దేవుని మూలమున పుట్టినవారమని అర్ధము. మరియు ఈ భాగ్యమును కలిగియున్నందుకు మేమెంతగానో సంతోషించుచున్నాము, ఏలయనగా మా హృదయములలో, మేము నీ కుమారులము మరియు కుమార్తెలమని ఆలోచించగలుగుచున్నాము. మరియు నీవే మాకు తండ్రివని, నిన్ను నీవు మా మధ్యన నిక్కచ్చితంగా గుర్తింపజేసుకొనుచు, మా తలంపులను మార్చుచూ మరియు మా ఉద్దేశములను మరియు ఆశయాలను, మరియు లక్ష్యములను మరియు మాయొక్క ప్రతి దశను లోకముయొక్క సంగతులనుండి, నిన్ను ప్రేమించుటకు మరియు నిన్ను నమ్ముటకును, మరియు—మరియు నీ వాగ్దానములు సత్యమని తెలుసుకొనే వైపుకు మార్చుటను మేము చూచుటకు ఆనందిస్తున్నాము.
19 “ఎడారి వెనుక భాగం,” అని మేము పిలిచే ఈ స్థలములో ఈ ఉదయం మేమిక్కడ కూడుకొనియున్నాము, లేదా నేనిట్లు ఆలోచించుటను బట్టి, దానిని అట్లు పిలుస్తాను. నేను దానిని చెప్పుటకు కారణమేదనగా, ప్రభువా, ఏ ఆడంబరములేని వారిగా ఉండాలనే స్వభావం తప్ప, మరి దేనిని ఈ చిన్న గుంపుగా నున్న ప్రజలపై ప్రతిబింబించుటకు కాదు.
20 అయితే ఆ ఎడారి వెనుక భాగంలో ఉన్నది, నీ సేవకుడైన మోషే అని నేను ఆలోచించుటకు ప్రయత్నిస్తున్నాను, బహుశా కేవలం అతను మరియు అతని గొర్రెలు, బహుశా అతని భార్య సిప్పోరా, మరియు—మరియు—మరియు అతని కుమారుడైన గెర్షోము, అతనితో కూడా ఉండవచ్చును. నాకు…అది నాకు తెలియదు. అయితే ఒక పారిపోయిన పిరికివాడిగా ఉండుటనుండి, తనను పనికొరకు నియమించిన ఆ దేవునియొక్క సేవ నిమిత్తము ఆ ప్రవక్తను మార్చిన అనుభవాన్ని, వారు కలిగియున్నది అక్కడేయైయున్నది, ఆ ఎడారి వెనుక భాగామునేయై యున్నది. మనము ఎరిగియున్న ఆ—ఆ అగ్నిస్తంభము మొట్టమొదటిగా, మానవ జీవితంలో ప్రత్యక్షపరచబడినది అక్కడేయైయున్నది, ఆ వెనుక ఒక చిన్నఎడారి పొదలో ఆ మంట ఉండియున్నది, కానీ అది కాలిపోలేదు. అయితే—అయితే ఆ పొదలోనుండి దానంతటదే ప్రతిబింబించుకొనుచున్నది దేవునియొక్క మహిమయైయున్నది; దానిని సమీపించిన ఆ ప్రవక్తయైన మోషే తన చెప్పులను విప్పియున్నాడు, మరియు దేవుని జనాంగమైన ఒక దేశమును విడిపించవలెనని దేవునిచేత ఆజ్ఞాపించబడెను.
21 ప్రభువా, ఈ ఎడారి వెనకాల, అది మరలా అదే విధంగా ఈ దినమున జరుగును గాక తద్వారా మేము ఉన్నపనంగా మా చెప్పులను, మా టోపీలను, మా సమస్తమును, క్రీస్తు యొక్క సిల్వచెంత విడిచి, మరియు “ప్రభువా, నేనిచ్చట ఉన్నాను, నన్ను పంపుము.” అని చెప్పుదుము గాక.
22 ఇక్కడ, ఈ సంఘకాపరియైన, మా సహోదరుడు ఐసాక్ సన్ ని ఆశీర్వదించండి. అతనిని మరియు అతని భార్యను మరియు అతని పిల్లలను, నీవు ఆశీర్వదించవలసిందిగా మేము ప్రార్ధించుచున్నాము; సహోదరుడు స్ట్రైకర్ ను అతని భార్యను మరియు అతని పిల్లలను; మరియు ఈ ఉదయం ఇక్కడ హాజరైన వారందరిని ఆశీర్వదించండి.
23 మరియు ప్రభువా, మేమిక్కడ కూడుకున్నది; ఏదో గొప్ప మహిమ కొరకో, లేదా నాయకులుగా లేదా—లేదా ఏదో…ఒక గొప్ప విషయానికి అధికారిగా తెలియజేసుకొనుట కొరకు కాదు. మేము—మేము కేవలం దీనమైన విశ్వాసులుగా ఇక్కడ ఉన్నాము. మేము నిన్ను ప్రేమించుచు మరియు ఒకరినొకరము ప్రేమిస్తున్నాము గనుక మేమిక్కడ ఉండియున్నాము. మరియు మేము ఒకరినొకరము చూచుకొనుచుండగా మరియు మేము కలిసి కూడుకొనియుండగా, ఒక ఫలాన స్థలములో స్వయంగా ప్రతీ విశ్వాసి కూడుకొనుటవలెనే దేవుడిని ఎక్కువగా కలిగియున్నట్లు మేము కనుగొనుచున్నాము. మరియు యేసు ఇట్లు చెప్పెను, “మీరు నా నామమున దీనిని చేసినయెడల, అప్పుడు నేను మీ మధ్యన ఉంటాను.” మరియు నీవిచ్చట ఉన్నావని మేము ఎరిగియున్నాము.
24 ప్రభువా, మాతో మాట్లాడుము. మరియు నేనిక్కడ వ్రాసుకొనియుంచిన ఈ చిన్న నోట్సును, మరియు నేను చూపించుటకు పెట్టుకున్న లేఖనములు, ఒకవేళ ఈ ఉదయం నీవు మమ్మల్ని ఏమి ఆలోచింపజేయాలని అనుకున్నావో ఆ ఆలోచనకు వెలుపల ఉన్నయెడల, అప్పుడు ప్రభువా, మేము వాటిని విడిచిపెట్టి, మరియు నీవు మాకు చేయమని చెప్పినదానిని మేము చేస్తాము. ఇప్పుడు మమ్మల్ని ఆశీర్వదించండి, ఏలయనగా యేసుక్రీస్తు నామములో మేము దీనిని అడుగుచున్నాము. ఆమేన్.
25 ఇప్పుడు, వాక్యము చదువుటలో, అది ఏవిధంగా ఉండేదంటే నేను…నాకు ఇంత వయస్సు రాకముందు, నాకు మంచి జ్ఞాపకశక్తి ఉండేది. మరియు ఆ రోజుల్లో, నేను…యౌవన దినాల్లో నేనొక పెద్ద వర్తమానమును తీసుకునేవాణ్ణి కాదు, బహుశా ముప్పై నిమిషాలు లేదా అంత కొద్దిసేపు తీసుకుని, నేను నేరుగా ఒక్క తలంపును నాటేవాణ్ణి మరియు దాన్ని నా మనసులో ఉంచుకునేవాణ్ణి. కానీ ఇప్పుడైతే నేను…ఈ పెద్ద కూటములను పెట్టుటకుగల కారణమేదనగా, నేను టేపు చేయుచున్నాను. చూశారా? మరియు ఈ టేపు, అక్కడ ఆ పిల్లలు దాన్ని టేపు చేయుచున్నారు, అది ఒక ఫలాన సమయానికి, బహుశా ఇప్పుడు, ప్రార్ధనను ప్రారంభించినప్పుడు అది మొదలవుతుంది, మరియు అది వాస్తవంగా ప్రపంచములోని అనేక స్థలములకు వెళ్ళుచున్నది. కావున ఈ ఉదయము మనమిప్పుడు నా నూతన సంవత్సర…మనము నా నూతన-సంవత్సర వర్తమానమని పిలవబడే దాని మీద మాట్లాడుకోబోవుచున్నాము. నేను ప్రయత్నించాను, మూడు క్రిస్మస్ వర్తమానములను కలిగియున్నాను, మరియు ఇక్కడ ఆ ఎడారి వెనుకనున్న ప్రజలైన మీరు ఆ టేపులను పొందుకుంటారని నాకు తెలియును. మరియు నా—సంఘములోని నా చివరి వర్తమానము, లేదా నా చివరి వర్తమానమునకు ముందు చెప్పబడిన వర్తమానము వెలుగు అనే అంశము మీదయైయున్నది. మరియు ఆ టేపు గనుక మీ వద్ద లేనియెడల, మీరు దానిని ఆనందిస్తారని నేను ఖచ్చితంగా చెప్పగలను. దానిలోనున్న ఆ ప్రేరేపణను నేనెంతగానో ఆనందించాను, అది ప్రభువు నాకు ఇచ్చినదైయున్నది.
26 ఇప్పుడు ఈనాడు, మనము నూతన సంవత్సరమును ఎదుర్కొనుచుండగా, గతాన్ని గూర్చి నేను—నేను ఆలోచించగోరటంలేదు, కానీ నేను భవిష్యత్తువైపునకు చూడగోరుచున్నాను. చూశారా? పౌలు చెప్పినట్లే, “వెనుక ఉన్నవి మరచి, నేను గురి యొద్దకే పరుగెత్తుచున్నాను,” చూడండి, “ఉన్నతమైన పిలుపునకు.” మరియు ఒక కారు యొక్క అద్దంలో నుండి వెనుకకు చూచునట్లు, అని అది వ్యక్తపరచబడినది. మనము కారు యొక్క వెనుక చూపుటద్దంలో చూస్తున్నప్పుడు, మనం దాటిపోయిన వాటిని చూస్తాము. ఇప్పుడు మనం ఈ రోజు వర్తమానాన్ని ఒక వెనుక చూపుటద్దంలో నుండి చూస్తున్నట్లుగా ఉంచుటకు ప్రయత్నించడం లేదు. ప్రభువు చేసినటువంటి కార్యములు చెప్పుటకు చాలా సమయం పడుతుంది, చూడండి. మరియు మన ప్రభువు చేయుచున్నటువంటి ఆ గొప్ప కార్యములను మీరంతా ఎరిగియున్నారు, అవి నా జీవితంలో నేనెన్నడూ చూడనటువంటి మహత్తరమైన కార్యములైయున్నవి, ఆయన సరిగ్గా—సరిగ్గా గత కొద్ది నెలలుగా వాటిని జరిగించుచున్నాడు. మరియు, ఇప్పటివరకు జరిగినదానికి మేము కృతజ్ఞులమైయున్నాము, కానీ ఇప్పుడైతే మేము ముందుకు చూస్తున్నాము. మేము ఎక్కడికైతే వెళ్తున్నామో, ఆ 1964 లోనికి మేము చూస్తున్నాము.
27 మరియు ఇప్పుడిక్కడ మీరు చదవగోరినయెడల, లేదా—లేదా, నేను కొన్ని లేఖనములను చదువగోరుచున్నాను, ఎందుకనగా ఇదంతయూ దేవునియొక్క పరిశుద్ధ వాక్యముపైనే ఆధారపడియున్నది.
28 మరియు ఈ టేపుకొరకు, నాకు ఇంకా దాదాపు ఒక గంట పదిహేను నిమిషాలు మిగిలియున్నది. మరియు ప్రభువు చిత్తమైతే, మీరు భోజనం చేయగలుగునట్లు నేను సకాలంలో ముగించుటకు ప్రయత్నిస్తాను. ఈ రాత్రి ఆరు గంటలవరకు నాకు సమయమున్నదని చెప్పుచున్నందుకు నేను మీకు కృతజ్ఞతలు చెల్లించుచున్నాను. అది చాలా మంచిది.
29 ఇప్పుడు బైబిల్ గ్రంధములో రెండు చోట్లకు త్రిప్పెదము, ఆ పుస్తకములు రెండు దగ్గరగా ఉంటాయి. అది పాత నిబంధనలో ఉన్నది. యెషయా 62 మరియు కీర్తనలు 60, ఈ రెండు చోట్ల నుండి నేను పాఠ్య భాగమును చదవటానికి తీసుకుంటున్నాను. ఇప్పుడు మొదటిగా చదువుటకు మనం యెషయా 62 నకు త్రిప్పుదాము. మరియు ఇందులో, మన ప్రభువైన దేవునియొక్క గొప్ప శక్తుల గురించి, మరియు ఎంత—ఆయన ఎంత గొప్పవాడనియు మరియు మన దేవుడెంత శక్తిమంతుడనియు మనకు జ్ఞాపకం చేయబడుతుంది. నన్ను మన్నించండి, అది 62 కి బదులు యెషయా 60 యైయున్నది. యెషయా 60. అది సరియే, ఇప్పుడు మనము దీనిని చదువుదాము, యెషయా 60:1 మరియు 2.
లెమ్ము తెజరిల్లుము; నీకు వెలుగు వచ్చియున్నది, మరియు ప్రభువుయొక్క మహిమ నీ మీద ఉదయించెను.
ఏలయనగా, చూడుము,…భూమిని కటిక చీకటి కమ్ముచున్నది, మరియు కటికచీకటి జనములను కమ్ముచున్నది: అయితే ప్రభువు నీమీద ఉదయించుచున్నాడు, మరియు ఆయన మహిమ నీమీద కనబడుచున్నది.
30 “కటికచీకటి జనములను కమ్ముచున్నది.” అవశ్యముగా ఇది మనమిప్పుడు జీవించుచున్న ఈ దినమును గూర్చిన ఒక ప్రవచనమైయున్నది.
31 తర్వాత ఇప్పుడు మనం కీర్తనల వైపుకు త్రిప్పుదాము. నేనిక్కడ నా లేఖనములను ఎక్కడ వ్రాసియుంచానా అని బహుశా నేను కొంచెం గందరగోళములో ఉండవచ్చునని నేను నమ్ముచున్నాను, గత రాత్రి తొందరలో వాటిని వ్రాసేటప్పుడు, దీనిని వ్రాసాను. కీర్తనలు 62:1 నుండి 8.
నా ప్రాణము దేవుని నమ్ముకొని మౌనముగా ఉన్నది: ఆయనవలెనే నాకు రక్షణ కలుగును.
ఆయనే నా ఆశ్రయదుర్గము మరియు ఆయనే నా రక్షణకర్త; ఎత్తయిన నా కోట ఆయనే; నేను అంతగా కదిలింపబడను.
ఎన్నాళ్ళు మీరు ఒకనిపైబడుదురు? ఒక ఒరుగుచున్న—ఒరుగుచున్న గోడవలె…మరియు పడబోవు కంచెవలె: మీలో అందరూ హతము చేయబడుదురు.
అతని ఔన్నత్యమునుండి అతని పడద్రోయుటకే వారు అలోచించుదురు: అబద్ధమాడుట వారికి సంతోషము: వారియొక్క…వారు తమ నోటితో శుభవచనములు పలుకుతారు, కానీ అంతరంగములో దూషించుదురు. సెలా.
నా ప్రాణమా, దేవుని నమ్ముకొని మౌనముగా ఉండుము; ఆయన వలననే నాకు నిరీక్షణ కలుగుచున్నది.
ఆయనే నా ఆశ్రయదుర్గము మరియు నా రక్షణాధారము: నా ఎత్తయిన కోట ఆయనే; నేను కదలింపబడను.
నా రక్షణకు మరియు నా మహిమకు దేవుడే ఆధారము: నా బలమైన ఆశ్రయదుర్గము మరియు నా ఆశ్రయము దేవునియందే ఉన్నది.
ఎల్లప్పుడూ ఆయనయందు నమ్మికయుంచుడి; జనులారా, ఆయన సన్నిధిని మీ హృదయములు కుమ్మరించుడి: దేవుడే మనకు ఆశ్రయమైయున్నాడు. సెలా.
32 ఇప్పుడు ఈ కీర్తనలోని లేఖన భాగమును మీరు గమనించినట్లైతే, అది “దేవుడు నా బండ,” అని చెప్పుచున్నది. బైబిల్ గ్రంధములో ఒక బండ దేనిని సూచిస్తుందో మీకు తెలియునా? ఇక్కడ బైబిల్ గ్రంధములో ఒక బండ, “దేవునియొక్క ప్రత్యక్షతను” సూచించుచున్నది. చూడండి, “దేవుడు నా ప్రత్యక్షతయై యున్నాడు.” ఆయనయైయున్నాడు, చూడండి. వాక్యముయొక్క ప్రత్యక్షత ఆ బండయే.
33 ఎందుకనగా, పేతురు ఒక దినమున…యేసు ఇట్లు ప్రశ్నించెను, “మనుష్యకుమారుడెవడని జనులు చెప్పుకొనుచున్నారు?”
34 మరియు వారిలో ఒకరు ఇట్లు చెప్పిరి, “నీవు…నీవు మోషే అనియు, లేదా ఏలియా అనియు, యిర్మీయా అనియు, లేదా ప్రవక్తలలో ఒకడనియు వారిలో కొందరు చెప్పుకొనుచున్నారు.” అయితే ప్రశ్న అది కాదు.
“నేను ఎవడనని మీరు చెప్పుకొనుచున్నారు?”
35 అతడు, అనగా పేతురు, “నీవు సజీవుడగు దేవుని కుమారుడవైన క్రీస్తువు,” అని ఈ గొప్ప మాటలు పలికినాడు.
36 అందుకాయన ఇట్లన్నాడు, “సీమోను బర్ యోనా, నీవు ధన్యుడవు, రక్తమాంసములు నీకు బయలుపరచలేదు గానీ, పరలోకమందున్న నా తండ్రియే ఈ సంగతి నీకు బయలుపరచెను. మరియు ఈ బండపైన!” చూశారా?
37 మరియు దావీదు ఇక్కడ, “దేవుడు నా బండ” అని చెప్పుచున్నాడు. దేవుడు మనకు బయలుపరచబడినప్పుడు దేవుడు మనకు బండ అవుతాడు. చూడండి. ఒక బండ అంటే అది. దేవుడు మన బండయైయున్నాడు.
38 ఇప్పుడు, ఈ ఉదయానికి, నా పాఠ్యాంశము ఒక వింత పదమైయున్నది: అది షాలోమ్. హెబ్రీ భాషలో షాలోమ్ అంటే, “సమాధానము” అని అర్ధం. మరియు ఈ ఉదయమున నేను ఈ సంఘమునకు చెప్పుచున్నది అదేయైయున్నది, “షాలోమ్!” అనగా సమాధానము.
39 ఫిన్నిష్ భాషలో దానిని యుమాలన్ రాహ, అని అంటారు, దాని అర్ధం “దేవుని సమాధానం” మీపై యుండునుగాక. రాహ. దేవుడు, చూడండి, దేవునియొక్క సమాధానము, అనగా షాలోమ్.
40 1964 కొరకైన నా నూతన-సంవత్సర వర్తమానము, యేసుక్రీస్తులో ఎన్నుకొనబడిన సంఘముకొరకై యున్నది. లేదు—కేవలం సంఘపు గుంపులకు కాదండి; అయితే ఎన్నుకొనబడిన, ఆ యువతి, సంఘముయొక్క—ఆ యువతి, అనగా క్రీస్తుయొక్క వధువు, చూడండి, నేను తనతోనే మాటలాడుచున్నాను.
41 మనము చదివిన మన రెండు అంశాలలో, అనగా ఆ రెండు లేఖనములలో, ఒకదానికొకటి కొంచెం పరస్పర విభేదాన్ని కలిగియుండుటను మనము ఇక్కడ ఎదుర్కొంటున్నాము. యెషయాలో ఇట్లు చెప్పబడుచున్నది, “లెమ్ము మరియు తేజరిల్లుము, యెహోవా మహిమ నీమీద ఉదయించెను. వెలుగు ఇచ్చట ఉండియున్నది.” మరియు పిదప ఆ తరువాత వచనంలోనే, “ఈ ప్రజలను కటికచీకటి కమ్ముచున్నది,” అని ఆయన చెప్పుచున్నాడు. మరియు అటువంటప్పుడు, మనము ఒక వెలుగు మరియు చీకటియొక్క మిశ్రమంలో ఉండియున్నాము, మరియు పిదప సంఘమునకు నేను చెప్పనుద్దేశించినదేమో “షాలోమ్, సమాధానం,” కాబట్టి ఇదంతయూ ఏమిటని మనం కనుగొందాము, చూడండి. మనం వెలుగు మరియు చీకటి, ఈ రెంటితో ఈ నూతన సంవత్సరమును ఎదుర్కొనుచున్నాము. మనము…మునుపెన్నడూ లేనటువంటి ఒక అత్యంత చీకటి అగాధ సమయాలలో ప్రపంచం నిలబడియున్నది; మరి అయిననూ ఒకవైపు అది మునుపెన్నడూ ప్రకాశించని అత్యంత ధన్యకరమైన వెలుగులో నిలబడియున్నది. మరియు అక్కడ…
42 ఆ వ్యత్యాసము సరిగ్గా ఆదిలో భూమిని కటికచీకటి కమ్మినప్పుడున్నట్లే ఉండియున్నది. మరియు దేవుని ఆత్మ ఆ జలములపై అల్లాడుచూ, “వెలుగు కలుగును గాక,” అని పలికెను. మరియు దేవుడు చీకటి నుండి వెలుగును వేరుపరచెను. మరియు మరలా, దేవుడు చీకటి నుండి వెలుగును వేరుచేస్తున్న అదే ఘడియలో మనమిప్పుడు జీవిస్తున్నామని నేను నమ్ముచున్నాను, మరియు ఆ వెలుగు ప్రత్యక్షపరచబడునట్లు, ఆయన దానిని ప్రపంచముయొక్క అవతలి వైపుకు నెట్టుచున్నాడు. మరియు మనము…
43 పిదప, ఈ—ఈ సంఘమునకు, నేను వారికి “షాలోమ్” అని చెప్పుటకు గల కారణమేమిటనగా, అది దేవునియొక్క సమాధానమైయున్నది. మరి దానినే ఈ నూతన సంవత్సరము కొరకు, ఈ ఉదయం, మీవద్దకు తీసుకురావాలని నేను కోరుకుంటున్నాను, వెనుకకు చూచుట కాదు కానీ, మనము ఒక నూతన ఉదయం కొరకు ఎదురుచూచుచున్నాము. ఏదో గొప్ప విషయము మన ముందుండునంత వరకు మనము ఎదురుచూశాము, అయితే ఆ గొప్ప వెలుగు చొచ్చుకొని వచ్చుట కొరకు మనము ఎదురుచూసిన ఆ సంవత్సరములన్నియు సంతోషముగా ఉండియున్నవి. అయితే ఇప్పుడు ఆకాశము మరియు భూమి కలిసే చోటునుండి అది చొచ్చుకొని వచ్చుటను మనం చూడగలము, అది మర్త్యత మరియు అమర్త్యత మధ్యనుండి చొచ్చుకొని వచ్చుచున్నది. అది ఆకాశము మరియు భూమి మధ్యనుండి, భూ-సంబంధమైన వ్యాధి మరియు సతమతమగుచున్న ప్రపంచము నుండి, ఒక అమర్త్య జీవము, మరియు ఒక అమర్త్య శరీరము మరియు ఎన్నడూ గతించనటువంటి ఒక అమర్త్య భూమియొక్క ఒక ప్రకాశమానమైన దినములోనికి అది చొచ్చుకొని పోవుచున్నది. అది—అదియే సంఘమునకు “షాలోమ్,” అయి—యున్నది. ఇప్పుడు, విశ్వాసులకైతే అది వెలుగు వచ్చే సమయమైయున్నది, కానీ ప్రజలకు అది కటికచీకటియై యున్నది. నేను…
44 గతరాత్రి నేను మరియు నా భార్య మాట్లాడుకొనుచున్నాము, మరియు మేము—మనము జీవిస్తున్న ఘడియను గూర్చి మాట్లాడుచుంటిమి. ఇప్పుడు, నేను ఈ స్థలమును ఎన్నుకొనుటకు గల కారణమేదనగా, నేను కేవలం కూర్చొని మీతో మాటలాడవచ్చని నాకు అనిపించినది. చూడండి. చూశారా? నేను ఆలోచించగలిగే అత్యంత విషాదకరమైన సమయము, ప్రస్తుతం ప్రజలపై నున్న సమయమేయైయున్నది.
45 మత సిద్ధాంతాల విషయంలో మనుష్యులతో ఏకీభవించకుండునట్లు, నేను నిరంతరం నా సాయశక్తుల ప్రయత్నించాను; అయితే తర్వాత నేనతని చెయ్యి పట్టుకోని, ఆ విషయం ఎంత తీవ్రమైనప్పటికినీ, అతని చేతులను పట్టుకొని, మరియు “ఇది మన ఇద్దరి మధ్యనున్న శ్రేష్ఠమైన అవగాహనయొక్క వెలుగైయున్నది,” అని చెప్పి, ఇంకనూ ఆ వ్యక్తిని ప్రేమించనియెడల (కేవలం పెదవులతో కాదుగానీ, దానిని నా హృదయము నుండి చెప్పవలసియున్నది), అటువంటప్పుడు నేను—నేను బయటకు వెళ్ళి మరియు ప్రజలతో మాట్లాడుటకు ప్రయత్నించుటకు ఎంతమాత్రమూ అర్హుడను కాను. ఎందుకనగా, చూడండి, మనము దానిని చేయవలసియున్నది, మనము ఆ వ్యక్తిని ప్రేమించవలసియున్నది. చూశారా? మరియు నానా విధములైన తరగతులు, మరియు విభిన్నమైన సిద్ధాంతాలు మరియు వర్గాలు, మరియు మతాలు మరటువంటి వాటిలోని ప్రజల మధ్యకు వెళ్ళి, మరియు బైబిల్ గ్రంధమును ముందుంచుటకు ప్రయత్నించి, మరియు, “మనము—మనము మీ సిద్ధాంతము నుండియో లేదా మీ నైతిక పుస్తకము నుండియో కాదు గానీ, పరిశుద్ధ గ్రంధము నుండి మనము దీనిని చర్చించుకుందాము” అని చెప్పెదము. మరియు పిదప…బహుశా కొన్నిసార్లు మనుష్యులు తీవ్రమైన కోపానికి వచ్చెదరు; అయిననూ నేను ఆ వ్యక్తిని ఇష్టపడుటలేదన్న ఒక్క ఆలోచన నాకు వచ్చినయెడల, అప్పుడు—అప్పుడు క్రీస్తుయొక్క ఆత్మ నన్ను విడిచిపెట్టెనన్న ఒక్క విషయమును నేనెరుగుదును. నేనొకవేళ—ఒకవేళ నేను ఆ వ్యక్తిని ఇష్టపడుటలేదని నాకు అనిపించినయెడల, అప్పుడు నాలో ఏదో తప్పిదము ఉండియున్నది.
46 ఎందుకనగా క్రీస్తుయొక్క ఆత్మ, వారు…ఆ…అక్కడ—అక్కడ ఆయనను సిలువవేయునప్పుడు, ఆయన స్వంత జనులే ఆయనకు మేకులు కొడుతుండగా, మరియు—మరియు ఆయన సృష్టించిన తన సృష్టియే, ఆయనయొక్క మానవ శరీరంలో మేకులు దిగ్గొట్టిరి. మరి అయిననూ ప్రేమతోనిండిన హృదయముతో, “తండ్రీ, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుము,” అని ఆయన బిగ్గరగా కేకవేసెను. మీరు చూడండి.
47 మరియు నేను—నేను ఆ చోటుకి వచ్చియున్నాను. ప్రజలు ఏమి చేయుచున్నారో వారెరుగరని నేను నమ్ముచున్నాను. మానవులు దుష్టత్వానికి బద్ధులయ్యారన్నట్లు అగుపించునట్టి సమయమునకు అది వచ్చియున్నది, అది—అది ఒక విషాదకరమైన సంగతియైయున్నది. వారినట్లు నెట్టుచున్న ఒక—ఒక చీకటి నీడ సరిగ్గా ప్రజలపైనున్నట్లు అనిపించుచున్నది.
48 ఉదాహరణకు, ఈ ఒక్క విషయాన్ని తీసుకొండి. దేశమంతటా వెళ్ళుచూ మరియు మాట్లాడుచున్నాను, మరియు అది ఖచ్చితంగా సరియేనని చూపించుచూ, ఆయన చెప్పినది చెప్పినట్లు జరుగువాటినే ఆయన పలికిస్తూ, ప్రభువైన దేవుడు తన వాక్యమును నిరూపించుట ద్వారా గుర్తింపజేసుకొనుచున్నాడు, తాను ఎప్పుడూ చేస్తున్నట్లే ఉనికిలోనికి పలుకుచూ మొదలగువాటిని చేయుచున్నాడు. మరియు ప్రజలు కూర్చుని వాటిని చూసినా గానీ, సరిగ్గా వారున్న అదే స్థితిలో కొనసాగుచున్నారు. చూశారా?
49 చూడండి, ఏదో కించపరచాలని కాదు కానీ, మన సహోదరీలతో, వారు ధరించే ఆ దుస్తుల గురించి, మరియు జుట్టు కత్తిరించుకొనుట గురించి, మరియు అటువంటి చిన్న విషయముల గురించి నేను వారితో మాట్లాడినప్పటివలెనే అది ఉన్నది. మరియు పురుషులు, వారి సిద్ధాంతములలో వారెట్లు కొనసాగుతారో, మరియు—మరియు ఆ సిద్ధాంతములు మరియు ఆ కార్యములను అనుసరించియే వారు సేవ చేస్తారు. మరియు—మరియు వారు మంచి వారే. వారు చక్కని ప్రజలైయున్నారు. అయినప్పటికినీ, వారు—వారు—వారు దానిని అర్ధము చేసుకోలేనట్లు అనిపించుచున్నది, వారు అసలు దానిని గ్రహించలేనట్లు అగుపించుచున్నది. అంతెందుకు? ఆ తర్వాత సంవత్సరం నేను తిరిగి అక్కడికి వెళ్ళగా, ఎంతోకొంత మంచిగా ఉండటానికి బదులు, అది అద్వాన్నమైపోవుచున్నది. అది—అది కొనసాగుచూనే ఉండును. ఒకప్పుడు చాలా అందమైన పొడవాటి జుట్టు కలిగియున్న ఒక సహోదరి ఇచ్చట ఉండియున్నది, అయితే ఆమె దానిని కత్తిరించివేసినది. ఒకప్పుడు సరియైన దాని కొరకు నిలబడి మరియు దానికొరకు ముందుకు వెళ్ళిన ఒక వ్యక్తి ఇచ్చట ఉన్నాడు; అయితే అతడు తిరిగి మరలా…కుక్క తన వాంతికి తిరిగినట్టును, మరియు ఒక—ఒక కడుగబడిన పంది బురదలో దొర్లుటకు మళ్ళినట్టు అయినాడు. చూడండి, తిరిగి నేరుగా అందులోనికి వెళ్ళిపోవును. మన ప్రజలను ఏదో తాకినట్లు అనిపించుచున్నది, అది లోకమును కూడా తాకియున్నది, ఎట్లనగా వారు ఆ—ఆ గ్రహింపును కలిగియున్నట్లు అనిపించుటలేదు, ఏదో పొరపాటు ఉండియున్నది.
50 ఈనాడు పురుషులను మీరు గమనించినట్లే యున్నది, ఆ యధార్ధతను మీరు పురుషులలో కనుగొనలేరు. స్త్రీలలో కూడా మీరు దానిని కనుగొనలేరు. ఇప్పుడు నేను మాట్లాడబోవునది అది కాదు…నేను దీనిని ఆధారము చేసుకొనుటకు గల కారణమేదనగా, “షాలోమ్” లోనికి వెళ్ళుటకేయైయున్నది. చూశారా?
51 అయితే మనయొక్క దినములలోని స్త్రీలను మీరు గమనించండి, వారు ఒకప్పుడు కలిగియున్నట్టి ఆ స్త్రీ తత్వమును ఇప్పుడు కలిగియున్నట్లుగా లేరు. వారు సరిగ్గా వారు—వారు కోరుకుంటారు, కానీ ఏదో వారిని అట్లు చేయనివ్వడంలేదు. ఏదో భారంగా ఉన్నట్లు అనిపించుచున్నది. ఎట్లనగా, మీరు ఒక—ఒక స్త్రీతో ఒక ఫలానా-మరియు-ఫలానా కార్యమును చేయవద్దని చెప్పినయెడల, మరియు ఆ స్త్రీ దానిని చూసి మరియు దానిని నమ్ముతుంది, ఆమె దానిని నమ్మాలని కోరుకుంటుంది, కానీ ఏదో ఆమెను వేరొక వైపుకు లాగుతుంది. చూశారా? అది విచారకరము, నాకు—నాకు—నాకు ఆమె విషయమై బాధగా ఉన్నది. ఒక హాలీవుడ్ ఉచ్చులోను, మరియు టెలివిజనులోని ప్రకటనల్లో, రేడియోలో, వార్తాపత్రికలో, వీధుల్లో, ఆ—ఆ అంగడి దుకాణాల కిటికీలపై, ఆధునిక దుస్తులతో మరియు అటువంటి వాటితో, మరియు ఇతర స్త్రీలు ఆమెను కలిసే విధానములో ఆమె ఎంతగానో పట్టబడియున్నది. మరియు మన యౌవనస్థులు, మన వృద్ధులు, మన నడివయస్కులు; దాని నుండి వారస్సలు దూరమవ్వలేనటువంటిది ఏదో ఉన్నట్లు అనిపించుచున్నది.
52 పురుషుల మధ్యలోను ఏదో ఉన్నట్లు అనిపించుచున్నది. వారు ఒకప్పుడు కలిగియున్నటువంటి, ఒక పురుషత్వపు తాకిడిని పురుషులు కలిగిలేనట్లు అనిపించుచున్నది. ఆమె కలిగియుండేటటువంటి ఆ సున్నితమైన తాకిడిని స్త్రీలు కలిగిలేరు. ఈనాడు మీరు పురుషులను తీసుకున్నట్లయితే, వారు కలిగియుండునట్టి ఆ మోటుతనాన్ని పురుషులు కలిగిలేరు. అంతయూ ఒక విధమైనటువంటి…వారు మెత్తని ఊదారంగు బూట్లను ధరించగోరుచున్నారు, మరియు—మరియు వారు స్త్రీల వలె ప్రవర్తించగోరుచున్నారు. ఇప్పుడది వాస్తవమైయున్నది. అది అంతో ఇంతో, ఒక వంకరతనము వలె అనిపించుచున్నది. ఒక స్త్రీ తన జుట్టును కత్తిరించుకొని మరియు ఒక—ఒక పురుషునివలె ప్రవర్తించగోరుచున్నది. మరియు పురుషుడేమో ఒక స్త్రీ వలె ప్రవర్తించగోరచున్నాడు. చూశారా? మరి అయిననూ మీరు వారితో మాట్లాడగలరు, మరియు వారు మాటలాడుటకు చక్కని ప్రజలైయున్నారు, మంచివారు, స్నేహపూర్వకముగాను, కలివిడిగాను ఉండే ప్రజలైయున్నారు. అయితే ఈ పరిస్థితిని కలుగజేసినది ఏమిటి? అది ప్రజల మీద ఉన్నటువంటి ఆ కటిక చీకటియైయున్నది, అది—అది వారిని దానిలోనికి చొచ్చుకొని పోవునట్లు చేసినదైయున్నది.
53 యేసు భూమిమీదకు వచ్చినప్పటి దినాల్లో యూదులున్నట్లే అది ఉన్నది, దాని గూర్చి యెషయా ప్రవచించి ఇట్లు చెప్పెను, “వారు కన్నులుండియు చూడకుందురు, మరియు చెవులుండియు గ్రహింపకుందురు.” మరియు ఆ కారణముచేతనే వారి క్షమాపణ నిమిత్తం యేసు ప్రార్ధన చేసెను, ఎందుకనగా ఆ లేఖనమును నేరవేర్చుటకు అది ఆ విధంగా ఉండవలసియున్నది.
54 మరియు అది మరలా మనకు సంభవించుచున్నది. మనము జీవిస్తున్న ఈ దినమును గూర్చి బైబిలు గ్రంధము మాట్లాడుచూ, మరియు ఈ సంగతులు సంభవించునని చెప్పినది, “ప్రజలను కటిక చీకటి కమ్ముచున్నది.” మరియు ప్రజలు చేయాలనుకుంటారు, కానీ ఊరకే వారు దానిని చేయలేకపోవుటను, మనము చూచుచున్నాము.
55 ఒకసారి నీకొదేము ప్రభువు యెదుట ఈలాగున వ్యక్తపరచుకొనెను, “బోధకుడా, నీవు దేవునియొద్దనుండి వచ్చిన బోధకుడవని మేమెరుగుదుము, దేవుడతనికి తోడైయుంటేనే గానీ నీవు చేయుచున్న సూచకక్రియలను ఎవడును చేయడు.” అయితే మెస్సీయ వచ్చి అన్యులలోనుండి ఒక వధువును తీసుకొనిపోవునట్లు, అది యూదా జాతిపై ఉన్నటువంటి, ఆ చీకటి లేదా గ్రుడ్డితనమైయున్నది, కావున వారు ఆయనను తృణీకరించవలసియున్నది.
56 మరియు ఈనాడు సంఘములపై మరియు అటువంటి వాటిపై ఉన్నటువంటి కటిక చీకటి అదేయైయున్నది, ప్రకాశించుచున్న ఆ వెలుగును చూచుటలో తప్పిపోవునట్లు చేయుటకొరకైయున్నది. చూశారా? చూడండి, ఒక భారమైన ఒత్తిడి ఉన్నట్లు అనిపించుచున్నది. ఈనాడు కొందరు పేరుగాంచిన సువార్తికులను మనం తీసుకుందాము, వారు నిరంతరము ఒక ఉజ్జీవం కొరకు కేకలు వేయుచున్నారు, కానీ సరిగ్గా దానికి వ్యతిరేకంగా పనిచేయుచున్నారు; చూడండి గ్రహింపులేక, అర్ధం కాకయే వారట్లు చేయుచున్నారు.
57 మరియు నేను దీనిని ఈ—ఈ ఉద్దేశముతో చెప్పుటకు ప్రయత్నించుటలేదు, “ఇప్పుడు మేమైతే, దీనిని చూసియున్నాము, ‘దేవునికి మహిమ,’ మరియు వారు—వారైతే దానిలో లేరు.” “మంచిది, సహోదరుడా బ్రెన్హామ్, ప్రపంచంలోనున్న—ఉన్న సత్యమంతా…నీ ఒక్కడి దగ్గరే ఉన్నది,” అని ప్రజలు అనుకొనునట్లు చేయడానికి, నేను—నేను దీనిని చెప్పుటకు ప్రయత్నించుటలేదు. లేదండి, అది తప్పు. చూశారా?
58 కేవలం మనము నడుస్తున్న ఈ ఘడియ యొక్క వెలుగులో, మరియు ఈ వెలుగును వెదకుటకు ప్రయత్నించుచున్న ప్రజలయొక్క ప్రయోజనం నిమిత్తము, నేను దీనిని చెప్పుచున్నాను. నిజముగా, యేసు ఇట్లు చెప్పెను, “నన్ను పంపిన తండ్రి వానిని ఆకర్షించితేనే గానీ ఎవడును నా యొద్దకు రాలేడు.” ఏ మనుష్యుడును దానిని ఎన్నడును చూడలేడు. అది ముందుగా నిర్ణయించబడిన ఆ విత్తనం, మరి వారు మాత్రమే దానిని స్వీకరించుదురు. అయితే మనము మరలా అటువంటి చోటుకు వచ్చియున్నాము. “మీరు లోకమునకు వెలుగైయున్నారు,” అని బైబిలు గ్రంధము చెప్పియున్నది.
59 ప్రవక్త ఇట్లు చెప్పెను, “కటికచీకటి జనములను కమ్ముచున్నది,” ఈ సమయంలో లోకసంబంధమైన ప్రజలపై అది ఉన్నది. మరియు సరిగ్గా మనం కలిగియున్నది అదే, కటికచీకటి జనములను కమ్మియున్నది.
60 నేనెల్లప్పుడూ ప్రసంగించి మరియు నిలబడుటకు ప్రయత్నించినట్లే, దేవుడు, తన గొప్ప కృప ద్వారా, తన—తనయొక్క సంఘటనలను ఎల్లప్పుడు ఆకాశమునుండి చూపిస్తాడు, ఆయనయొక్క మహా గొప్ప సంఘటనలు, భూమి మీద జరుగుటకు ముందే, అవి ఆకాశములో జరుగుతాయి. ఆయన తననుతాను ప్రతిబింబింపజేసుకుంటాడు. ఇంకో మాటలో చెప్పాలంటే, తన పరిచర్య ఆరంభమయ్యే చోటుకు మెస్సీయ రాకముందే, ఆకాశము నుండి ఒక—ఒక నక్షత్రము వచ్చి ఆ జ్ఞానులను ఆయన ఉన్న ఆ—ఆ—ఆ చోటుకు నడిపించెను. దేవుడు ఆ—ఆ జ్ఞానులతో ఎట్లు వ్యవహరించాడోయని నా గత వర్తమానములో మీరు విన్నట్లుగా, మరియు—మరియు ఆ దినమున ఆయన—ఆయన వారిని ఒక కల ద్వారా మరలుకొల్పెను, మరియు ఆయన తన స్వంత కుమారుడి యొక్క సంక్షేమము గూర్చి శ్రద్ధ వహించునట్లు ఒక కల ద్వారా యోసేపుకు తెలిపెను. ఆయనకు కల వచ్చినందువలన, అక్కడొక…
61 కల అనేది మాధ్యమికంగా ఒక ప్రక్కకు ఉంచబడినటువంటిదై యున్నది, ఎందుకనగా ప్రజలు సరికానటువంటి కలలు కూడా కనుచుందురు. అయితే ఆ రోజుల్లో దేశంలో ప్రవక్త లేకుండెను, చూడండి, ప్రవక్త లేడు గనుక, తాను వాడుకొనుటకు ఏదైతే కలిగియున్నాడో, దానినే దేవుడు వాడుకొనవలసి వచ్చెను. మరియు అది ఆయనకు సమర్పించబడియున్నట్లైతే, మనము చేయు ప్రతీదానిని మరియు ప్రతీ సామర్ధ్యాన్ని దేవుడు ఉపయోగించుకొనగలడని మనకు—నేర్పించుచున్నాడు. అయితే మొదటిగా అది ఆయనకు సమర్పించబడవలసియున్నది. వాస్తవానికి మీ—మీ ధ్యానములు మీ కలలను ప్రతిబింబిస్తాయి, చూడండి, ఎందుకనగా అది మీ యొక్క అసంకల్పిత స్థితియైయుంటుంది. మీరు ఒక కలను గమనించినట్లైతే, అది మీరు ఆలోచిస్తునది ఏదైనా లేదా అటువంటిది ఏదైనా అయ్యుండుటను మీరు చూస్తారు. సాధారణంగా, మీరు చూడండి. మరియు మీ మనస్సును దేవునిపై ఉంచి, అప్పుడు చూడండి, అప్పుడది ఆయనకు చెందిన దేనినైనా ప్రతిబింబిస్తుంది. మరియు మీరు ఏమైయున్ననూ, అది ఆయనను ప్రతిబింబించనివ్వండి.
62 ఇప్పుడు, ఆ పైన ఆకాశంలో, మీరు గమనించారా…? ఆ లైఫ్ పత్రిక నుండి తీసిన ఆ—ఆ పటముపై ఆ వెలుగును నేను చూస్తున్నాను, ఇక్కడ ఈ ఇంటిలో నివసిస్తున్న ఈ సహోదరుడు త్రిభుజాకారంలో ఉన్న ఆ వెలుగును తన గోడ మీద పెట్టుకున్నాడు.
63 ఈ విషయం ఇందాకే నా మనస్సులో మెదిలినది. మీలో ఎవరి దగ్గరైనా లామ్సా బైబిల్ అనువాదం ఉండినట్లైతే, దాని కవరుమీద మీరు గమనించినట్లైతే, త్రికోణ, త్రిత్వపు వెలుగు ఉంటుంది, ఒక కాంతి వలయం వలెనున్న ఒక ముక్కోణపు వెలుగైయున్నది. మరియు నా స్నేహితుడైన డాక్టరు లామ్సా, అతడు నా వ్యక్తిగత స్నేహితుడు, అతడు బైబిల్ ను తర్జుమా చేయుచున్నప్పుడు, అది ఆయన ఉన్నటువంటి అసలైన త్రిత్వ విధానంలో దేవుని యొక్క ప్రాచీన హెబ్రీ గురుతైయున్నది; ముగ్గురు దేవుళ్ళు కాదు గానీ, ఒకే దేవునియొక్క మూడు వ్యక్తీకరణలైయున్నవి: తండ్రీ, కుమారుడు మరియు పరిశుద్ధాత్మ. ఆ వెలుగు ఒక త్రిభుజాకారంలో నున్న ఒక సంపూర్ణ వృత్తాకారపు వెలుగైయున్నది, దేవుడు మూడు కార్యాలయములలో నివసిస్తాడని దాని అర్ధమైయున్నది: ఒకే దేవునియొక్క పిత్రుత్వము, కుమారత్వము, మరియు పరిశుద్ధాత్మయొక్క కాలము, అవన్నియు ఒక్క దేవుడే.
64 అయితే ఆ ఏడు ముద్రలు ప్రత్యక్షపరచబడుటకు ముందు, టూసాన్ నందలి, ఫ్లాగ్-స్టాఫ్ వద్ద ఆకాశంలో ఆ గొప్ప మర్మయుక్తమైన వెలుగు అగుపించబడటానికి ముందు, మేము ఎచ్చట ఉన్నామో మీరు గమనించారా? సహోదరుడు ఫ్రెడ్, ఆ ఇద్దరు…ఆ ఉదయం ఆ ఇద్దరు వ్యక్తులు నాతో కూడా ఉండియున్నారు. అది మీదటికి జరుగునని, కొన్ని నెలల క్రితమే చెప్పబడినది. ఈ ఉదయం ఇక్కడ కూర్చునియున్న సహోదరుడు ఫ్రెడ్ సాత్మన్ మరియు సహోదరుడు జీన్ నార్మన్ ఇరువురూ, అది…ఆ గొప్ప ప్రేలుడు సంభవించినప్పుడు అచ్చట ఉండియున్నారు, మరియు ఈ సంగతులు జరుగునని ఎరుగకయుండిరి. మరియు ఈ ఏడు ముద్రలతో ముద్రించబడినటువంటి పూర్తి బైబిల్ గ్రంధము యొక్క ఏడు మర్మములు, వాటిని కలిగియున్నటువంటి, ఈ ఏడు ముద్రలకు సమయం ఆసన్నమైనదని చెప్పి, ఆయన నన్ను వెనుకకు పంపించాడు. మరియు ఆ దారిగుండా ఆ సంఘకాల వర్తమానికులు, దానిలోని కొంత భాగము మట్టుకు ఎట్లు తెరిచారు గదా. అయితే ఏడవ ఘడియలో, ఏడవ వర్తమానికుని సమయంలో, ఈ మర్మములన్నియు సమాప్తము చేయబడవలసియున్నవి. చూశారా? ఆ ఏడవ భూలోక వర్తమానికుడు, చూడండి, ఆయన అప్పుడు ఎవరి గురించైతే మాట్లాడుచున్నాడో ఆ దూత భూమి మీద ఉన్నాడు. ఒక దూత అనగా “వర్తమానికుడు.” మరియు పిదప, దాని తర్వాత, వేరొక దూత దిగివచ్చుటను ఆయన చూసియున్నాడు, ఇక్కడ వర్తమానమివ్వబడిన ఈ భూసంబంధమైన దూత కాదు కానీ, తనపై వర్షధనుస్సు కలిగియున్న, బలిష్ఠుడైన (వేరొక) దూత పరలోకమునుండి దిగివచ్చుటను అతడు చూసెను, మరియు అతడు తన పాదమును సముద్రము మీదను మరియు నేల మీదను మోపి, “సమయం ఇక లేదు” అని సజీవుడైనవానితోడు ఒట్టు పెట్టుకొనెను. చూశారా? అయితే వారికి బయలుపరచుటకు ఆయన ఆ ఏడు ముద్రలను తెరవడానికి ముందు, ఆయన అద్భుతంగా చూపించెను, ఆయన మొదటిగా దానిని ఆకాశంలో చూపించెను.
65 ఆ దినమున దక్షిణ అమెరికా మరియు మెక్సికో ప్రాంతములన్నిటి నుండి వారు ఫోటోలు తీసారు. ఇప్పుడది అక్కడ ఆ లైఫ్ పత్రికలో వ్రేలాడుచున్నది, అదింకనూ వారికి మర్మముగానే ఉన్నది. అయితే ఆయన భూమి మీద దానిని చేయుటకు ముందు దానిని ఆయన ఆకాశంలో ప్రకటించును. ఆయన ఎల్లప్పుడూ దానిని చేయును. ఆయన తన సూచనలను మొదటిగా ఆకాశమందు చూపించును.
66 మరియు ఆ రాశి చక్రములో కూడా అది అట్లే యున్నది. నేను తిరిగి ఆ రాశి చక్రమును బోధించబోవడం లేదు, అయితే కేవలం ఆకాశము దానిని వెల్లడి చేస్తుందని నేను మీకు చూపించుచున్నాను. ఆ రాశి చక్రములో, ఆ నక్షత్రముల సమూహంలో, ఆ—ఆ రాశి చక్రముయొక్క సమూహంలో ఆయన బైబిల్ గ్రంధమంతటిని వెల్లడి చేసియున్నాడని మనము కనుగొనగలము. ఆయన సరిగ్గా—సరిగ్గా ఆ రాశి చక్రమును, కన్యక పటముతోనే ప్రారంభించుటను మనము కనుగొంటాము, మరియు రాశి చక్రములోని చివరి పటము సింహ రాశి అనగా సింహమైయున్నది; యేసు మొదటిసారి భూమిమీదకు ఒక కన్యక ద్వారా వచ్చుననియు, ఆయన రెండవసారి యూదాగోత్రపు సింహముగా వచ్చుననియు అది చూపించుచున్నది. చూశారా? సరిగ్గా దానికి ముందు ఆయన మీనం రాశి గుండా వెళ్ళును. కర్కాటక రాశి, మనమిప్పుడు జీవిస్తున్నదైయున్నది. “మరియు ఆకాశమంతయు ఆయనను ప్రకటించుచున్నది,” అని బైబిలు గ్రంధము చెప్పుచున్నది.
67 ఇప్పుడు, కొన్ని నెలల క్రితం ఆలయంలో జరిగిన వరుస కూటములలో, ఏడు సంఘ కాలములను నేను బోధించాను. బహుశా, మీరంతా వాటిని వినియుంటారు. మరియు ఆ ఏడు సంఘకాలములను నేను ఆ నల్ల బోర్డుపైన గీయడం ముగించగానే, ఆ వెలుగు ఏ విధంగా లోపలికి వచ్చి మరియు ఏ విధంగా బయటకి వెళ్ళింది కదా. మరియు బహుశా, మీరు దానిని ఇక్కడే ఎక్కడో కలిగియున్నారని నేను అనుకొనుచున్నాను; అయితే ఎలాగైననూ, అది మన మధ్య ఉన్నదని మనము ఎరిగియున్నాము. మరియు వింతైన కార్యమేదనగా, చివరి రోజు ఆ చివరి సంఘకాలము గీయబడినప్పుడు, (మన మధ్యనున్న) ఈ గొప్ప అగ్నిస్తంభము వందలాది ప్రజల మధ్యకు దిగి వచ్చెను, మరియు దానికదే ఆలయంయొక్క వెనుక గోడ వద్దకు వెళ్ళెను. మరియు అక్కడ, ఈ వందలాది జనుల ముందు, ఆ సంఘకాలములను గీసెను, ఆ వెలుగు మరియు చీకటిని నింపుతూ, సరిగ్గా నేను ఆ బోర్డు మీద గీసినట్లే గీసెను. మర్మయుక్తముగా!
68 ఇప్పుడు, ఒక రోజు, మనమిప్పుడు కలిగియున్న సంఘము యొక్క చారిత్రాత్మక సంఘటనలో…బైబిల్ గ్రంధములో, చంద్రుడు “సంఘమును” సూచిస్తుంది మరియు సూర్యుడు “క్రీస్తును” సూచిస్తుంది. ఏలయనగా, ప్రకటన 12వ అధ్యాయములో, “సంఘమునకు” సాదృశ్యముగానున్న స్త్రీని మనం కనుగొంటాము, ఆమె తన పాదముల క్రింద చంద్రుడిని, మరియు తన శిరస్సున సూర్యుణ్ణి ధరించుకొని, తన కిరీటములో పండ్రెండు నక్షత్రములతో కనుగొనబడినది. ఆ—ఆ పురాతన సంప్రదాయకమైన యూదా ధర్మశాస్త్రము ఆమె పాదముల క్రింద ఉండియున్నది, దానిని ఆమె దాటుకొని ఆ సూర్యునియొక్క వెలుగులోనికి ప్రవేశించియున్నది. పన్నెండు నక్షత్రములు అనగా ఇప్పుడు పరిశుద్దాత్మ ద్వారా మనకు వర్తమానములు తీసుకొనివచ్చిన, ఆ “పన్నెండుగురు అపోస్తులులైయున్నారు.” ఇప్పుడు ఆకాశములోనున్న చంద్రుడు, సూర్యుడు లేనప్పుడు, ఆ సూర్యుని యొక్క వెలుగును ప్రతిబింబించుటకొరకేనని మనం కనుగొంటాము. అది మనకు—మనకు అటు ఇటు తిరగడానికి వెలుగునిస్తుంది. అయితే అది ఇంకనూ…అది ఎంతగా ప్రకాశించినాగానీ, అది కేవలం ప్రతిబింబిస్తుంది గనుక, అది పరిపూర్ణమైన వెలుగు కాదు. మరియు సూర్యుడు చంద్రుడిపై ప్రకాశిస్తాడు, మరియు సూర్యుడు లేనప్పుడు దాని వెలుగును చంద్రుడు ప్రతిబింబిస్తాడు. అయితే సూర్యుడు వచ్చినప్పుడు, ఇక అప్పుడు చంద్రుని అవసరం ఎంతమాత్రమూ ఉండదు.
69 మరియు ఈనాడు దేవుని కుమారుడు లేని సమయంలో సంఘము ఆయనయొక్క వెలుగును ప్రతిబింబించుచున్నది. సంఘము ఆ వెలుగు యొక్క ప్రతిబింబమైయున్నది. ఎందుకనగా ఆయన ఇట్లు చెప్పెను, “కొంతకాలమైన తర్వాత లోకము నన్ను మరి ఎన్నడునూ చూడదు. అయితే మీరు నన్ను చూతురు, ఏలయనగా నేను మీతోను, మీలోను యుగసమాప్తి వరకు సదాకాలము ఉన్నాను. నేను చేయు క్రియలను,” అనగా ఆయన ప్రత్యక్షపరచిన ఆ వెలుగులు. మరియు దేవునియొక్క వాక్యము ద్వారా కాకుండా ఎటువంటి వెలుగు లేదు. అక్కడ…
70 ఆ సూర్యుడు దేవుని యొక్క వాక్యమైయున్నాడు. ఆదిలో దేవుడు, “వెలుగు కలుగును గాక,” అని పలికెను. మరియు ఆ ప్రత్యక్షపరచబడిన దేవుని వాక్యము, అనగా దేవుని యొక్క వాక్యము ప్రత్యక్షపరచబడినప్పుడు, అప్పుడు వెలుగు కలిగెను. మొదటిగా, దేవుడు దానిని పలికెను. అది ప్రత్యక్షపరచబడనియెడల అప్పుడేమిటి? అప్పుడిక వెలుగు కలుగదు. కానీ ఆయన దానిని పలుకగా, మరి అప్పుడది ప్రత్యక్షపరచబడి, నిరూపించబడుతుంది, ఆయనయొక్క వాక్యము నిరూపించబడినప్పుడు, వెలుగు ఉనికిలోనికి వస్తుంది.
71 మరియు ఇప్పుడది జరుగు విధానం అది మాత్రమేయైయున్నది, అదేదనగా వాక్యము నిరూపించబడినప్పుడేయై యున్నది, దేవునియొక్క వ్రాయబడిన వాక్యము నిరూపించబడినప్పుడు, అది వెలుగును చూపిస్తుంది. అది, ఒక భాగము వెలిగించబడి, ప్రతి కాలమునకై ఉంచబడినది. దానిని మనం సంఘకాలములలో కనుగొంటాము, దానిని మనం ఆ పాత—ఆ పాత నిబంధన సంఘ కాలములలో కనుగొంటాము. ప్రయాణములోని ఒక—ఒక ఫలాన విషయం ప్రత్యక్షపరచబడే సమయము వచ్చిన ప్రతీసారి, భూమిమీదకు ఒక ప్రవక్త వచ్చియుండెను. మరియు ఆ వాక్యము ఆ ప్రవక్త వద్దకు వచ్చెను, మరియు ఆయన ఆ వాక్యమును జీవింపజేసెను. మరియు ఆ వాక్యము గుర్తించబడినప్పుడు, అది దేవుడిని ప్రతిబింబించెను. మరదే ఆ—ఆ కాలముయొక్క వెలుగైయున్నది. మరియు ఈనాడు వెలుగు వచ్చునది ఆ విధంగానేయై యున్నది.
72 ఇప్పుడు, ఏ సంఘశాఖ ప్రజలపట్లనైనా, నాకు ఎటువంటి వ్యతిరేకత లేదు. కానీ ఆ సిద్ధాంతములు తప్పైయున్నవి గనుక, వాటికి వ్యతిరేకంగా నేను ఆలోచించుటకు నాకు ఎంతో ఉన్నది. మరియు మొట్ట మొదటిసారిగా లేచిన సిద్ధాంతమేదనగా, అది—అది రోమన్ కథోలిక్ సంఘముయొక్క రోమన్ సిద్ధాంతమైయున్నది. రోమ్ లోని, నైసియా వద్ద, సంస్థగా మారిన రోమన్ కథోలిక్ సంఘమే, మొట్టమొదటి సంఘ సంస్థయైయున్నది. క్రీస్తు మరణానంతరం మూడు వందల ఇరువది-ఐదు, 325, సంవత్సరముల తర్వాత రోమన్ కథోలిక్ సంఘము స్థాపించబడినది అది ప్రజలను సమకూర్చుకొని మరియు దానికి విరోధముగానున్న దేనినైనా గానీ రూపుమాపినది. అక్కడే వారు వారియొక్క వింతైన సిద్ధాంతములను పొందుకొని మరియు వాక్యమునకు దూరముగా ఒక మత క్రమమును పాటించడం మొదలుపెట్టారు. మరియు ఇప్పుడు ఆ సంఘము, అప్పటినుండి, సరిగ్గా అంధకారమును ప్రతిబింబించినది, ఎందుకనగా ఆ కాలములో, “అంధకార యుగము” అని మనం పిలుచునట్టి దానిగుండా మనం వెళ్ళియున్నాము, అది దాదాపు ఒక వెయ్యి సంవత్సరములైయున్నది. చరిత్రకారులు మరియు బైబిల్ పండితులు మరియు మొదలగు వారందరు దానిని చీకటి కాలముగా ఎరిగియున్నారు, అది రోమన్ సంఘము ప్రతీదానిని నియంత్రించినప్పుడైయున్నది.
73 మరియు ఈ—ఈ రోమన్ సంఘము, “వేశ్యలకు తల్లియైయున్నది,” ప్రకటన 17లో, “ఆమె ఒక వేశ్య మరియు వేశ్యలకు తల్లి,” అని బైబిల్ గ్రంధము చెప్పుచున్నది. ఇప్పుడు, ఒక స్త్రీ యొక్క అపవిత్రమైన జీవితం, అది దుర్నీతియైయున్నది. ఈ రెండును ఒక్కటేయైయున్నవి, రెండూ ఒక్కటే. కావున—వేశ్యయైనచో, అది ఒక స్త్రీయై ఉండవలసియున్నది. కావున తద్వారా, మీరు గమనించండి అది, “వేశ్య” కాదు కానీ, “వేశ్యలకు” చూశారా? అది “ఆమె” ఒక “వేశ్య,” అని ఏకవచనంలో పిలువబడింది. పిదప ఆ రోమను వేశ్యయొక్క పిల్లలు అంటే ఈ సంఘాలు “వేశ్యలు,” గా పిలువబడెను. ఆమె వాటన్నింటికి తల్లియైయున్నది, సంఘసంస్థకు తల్లిగానున్నది.
74 మరియు అదొక వింతైన విషయము కదా, ఈనాడు మనం వీటన్నింటినీ దాటుకొని వచ్చాము, మరియు సంఘసంస్థకు వ్యతిరేకంగా ఈ వర్తమానము భూమిని చుట్టి వచ్చినది, ఎడాపెడా అది దానిని బ్రద్దలు చేసినది, 1933 నుండి ఇప్పటివరకు, పరిశుద్ధాత్మ ఆ దర్శనములను నాకు అనుగ్రహించి, మరియు అంత్య కాలమును చూపించినప్పుడు, ఏడు సంగతులు నేను చెప్పాను, మరియు ఇప్పటికే వాటిలో ఐదు సంపూర్ణముగా నేరవేరినవి; సరిగ్గా జర్మనీ మరియు—ఇటలీ మరియు ఆ యుద్దములు మరియు ఆ జాతీయ సంగతులవంటివి జరిగినవి (నాతో అరుదుగా ఆ విషయములు మాట్లాడుచుందురు). అయితే అవి ఏ విధంగా జరుగుతాయని ఆయన చెప్పాడో సరిగ్గా అట్లే అవి జరిగినవి. ముస్సోలినీ ఇథియోఫియా మీదకి ఎట్లు దండెత్తునో, మరియు అతని పాదముల వద్ద ఇథియోఫియా ఎట్లు పడిపోవునో, మరియు చివరకు అతడు తన స్వజనులచేత ఉమ్మివేయబడి ఎట్లు అవమానం పాలగునో; మరియు తాను కలిసి జీవించిన, ఆ వేశ్యతో పాటు వీధిలో ఎట్లు తలక్రిందులుగా వ్రేలాడ తీయబడెనో చెప్పబడెను. అమెరికా ఏ విధంగా జర్మనుతో యుద్దమునకు వెళ్తుందనియు, వారు ఆ కాంక్రీటు ప్రాకారమున్న ఒక గొప్ప లైను, అని పిలువబడే చోట ఎట్లు ఘోరంగా దెబ్బతింటారనియు చెప్పబడినది, దానిని సిగ్ ఫ్రీడ్ లైన్ అంటారని నేను నమ్ముచున్నాను. మరియు మ్యాజినో అని మరొకటి, ఫ్రెంచ్ వారిదైయున్నదని నేను నమ్ముచున్నాను. అది నిజమేనా? మరియు ఆ సిగ్ ఫ్రీడ్ లైను జర్మను లైనైయున్నది. మరియు అది కట్టబడుటకు పదకొండు సంవత్సరాల ముందే, దానిని చూచుటకు ప్రభువు నాకు అనుమతించెను. మరియు వారు దాదాపు సైన్యమునంతా ముంచివేసినా గానీ, ఆ చోట దెబ్బ తిన్నారని, అమెరికన్లు ఎంతమాత్రమూ ఒప్పుకొనరు. వారు అక్కడికి వెళ్ళినప్పుడు, జర్మనీవారు తమ కవాతులో ఆ యుద్దనావల మీదుగా తుపాకులను గురిపెట్టి, వారిని నేరుగా లోపలిదాక రానిచ్చి మరియు దాదాపుగా దానిని ముంచివేసిరి. మరియు ఆ లైను అంటే ఆ సిగ్ ఫ్రీడ్ లైను కట్టుటకు, కనీసం—కనీసం దాని పునాదియైనా, లేదా అటువంటిదేదైనా వేయబడుటకు పదకొండు సంవత్సరాలకు ముందే, నేను దాన్ని చూసాను. ఇంకా ఈ యంత్రములు మరియు వాహనములు లాంటి ఇతర విషయములన్నిటిని నేను చూసాను, మరియు—మరియు ఈ దేశమును ఒక స్త్రీ పరిపాలించునన్నంత వరకు, ప్రతీది ఆయన చెప్పినట్లే సరిగ్గా నెరవేరియున్నవి, బహుశా అది సంఘము కావచ్చును. మరియు ఆ మీదట అంతము వచ్చును.
75 ఇప్పుడు వీటన్నిటి మధ్య నేను ఎట్లు సంఘ సంస్థపై విరుచుకుపడ్డానో మనం కనుగొన్నాము, రోమ్ యొక్క పోపు తిరిగి యెరూషలేమునకు వెళ్ళుట కొరకు మొట్టమొదటిసారి రోమ్ ని విడిచివెళ్ళడం అనేది ఒక వింతైన విషయం కాదా? మరియు దీనిని చేయుటతో…ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన సంఘముగా యెరుషలేము పేరుగాంచినది.
76 రాజులను సంహరించి వచ్చుచుండగా మెల్కీసెదెకు అబ్రాహామును కలిసినప్పుడు, ఆయన యెరూషలేముకు రాజు, మరియు యాజకుడైయున్నాడు, ఆయన క్రీస్తే, ఆయన దేవుడైయున్నాడు; స్వయంగా క్రీస్తే, లేదా స్వయంగా దేవుడు తప్ప వేరెవ్వరునూ మెల్కీసెదెకైయ్యుండలేరు, చూడండి, స్వయంగా దేవుడే, ఎందుకంటే ఆయన తల్లీ మరియు తండ్రి లేకుండా ఉండెను. చూశారా? యేసు తల్లిదండ్రులిద్దరినీ కలిగియుండెను, చూడండి. అయితే ఈ మనుష్యుడు తండ్రిలేనివాడును, తల్లిలేనివాడును, జీవితకాలమునకు ఆదియైనను జీవమునకు అంతమైనను లేనివాడైయున్నాడు. మరియు ఆయన ఎవరైయున్నాడో, ఆయన ఇంకనూ జీవించుచున్నాడు. మరియు ఆ కాలములో, ఆయన షాలేము రాజైయున్నాడు, దానికి “సమాధానపు రాజు, షాలోం,” అని అర్ధమివ్వబడినది. యుద్దము ముగిసిన పిదప, అబ్రాహామును కలిసి అతనికి రొట్టె మరియు ద్రాక్షరసమును, ప్రభురాత్రి భోజనమును ఇచ్చినది, ఆ యెరూషలేము యొక్క రాజైయున్నాడు. ఎంతో సుందరమైనటువంటి ఆ సాదృశ్యమును అచ్చట హెబ్రీ 7వ అధ్యాయములో, దాన్ని మనం కనుగొంటాము. ఇప్పుడు, ఆ యుద్ధము ముగిసిన తర్వాత అతనికి రొట్టె మరియు ద్రాక్షారసమునిచ్చెను. ఆయన…
77 నూతన రాజ్యములోనికి మనము ప్రవేశించిన తర్వాత మనము మొట్టమొదట తీసుకునేది అదేయైయున్నది, దానిని అనగా ఆ రొట్టె మరియు ద్రాక్షారసమును మనము తండ్రి రాజ్యములో, ఆయనతో పాటు క్రొత్తదిగా తింటాము. “నా తండ్రి రాజ్యములో నేను మీతో కూడా దీనిని క్రొత్తదిగా తీసుకొనువరకు, ఇకను ఎన్నడు, నేను ఈ ద్రాక్షారసమును త్రాగను, లేదా ఈ రొట్టెను తినను.”
78 ఇప్పుడు, ఇప్పుడు ఆ షాలోము రాజు…ఆ పట్టణము నుండి వచ్చిన తర్వాత, అప్పుడు మత సిద్ధాంతము దానిని స్వాధీనం చేసుకొనుటను మనము కనుగొంటాము. మరియు అది నిరంతరము ఒక మత సిద్ధాంతముగానే ఉండియున్నది, అయితే అది ఆ పాత సంఘమును సూచిస్తుంది. మరియు క్రొత్త నిబంధనలో మనకు ఇది బోధించబడినది, దీన్ని పొందుకొనుటను తప్పిపోకండి, మనం ఈ భూమి మీదనున్న ఈ యెరూషలేము పట్టణమునకు చెందినవారము కాదు, అయితే మనం పైనున్న యెరూషలేమునకు చెందినవారమని మనం క్రొత్త నిబంధనలో నేర్చుకున్నాము. కావున ఆ చంద్రుడు, ఈ యెరూషలేమును సూచిస్తుంది కానీ పైనున్న నూతన యెరూషలేమును కాదు. కావున చంద్రుడు భూసంబంధమైన సంఘమును సూచిస్తుంది.
79 మరియు సరిగ్గా పోపు యెరూషలేమునకు ప్రయాణమై వెళ్ళుటకు ముందు, ఆయన ప్రయాణమవ్వడానికి కేవలం కొద్ది దినములకు ముందు, ఆకాశంలో చంద్రుడు పూర్తిగా నల్లబడటం అనేది ఆశ్చర్యముగా ఉంది కదా. అతను ఇక్కడికి కూడా వచ్చుచున్నాడని మీకు తెలుయును, చూడండి. ఇప్పుడు, అది ఎన్నడూ తెలియజేయబడలేదు చూడండి. అయితే అది దేనిని చూపిస్తుంది? అతడు యెరూషలేమునకు వచ్చిన ఆ మరుసటి రోజు, ఆ గ్రీకు సనాతన సంఘపువారిని కలిసియుండగా, అతడు సహవాసమును పొందుకొనుటకు దీనిని చేయుచున్నాడని అది చూపించుచున్నది. మరది దేనిని ప్రతిబింబిస్తుంది? సహవాసమును సూచిస్తుంది, ప్రొటెస్టెంట్లు మరియు కథోలిక్కులు ఇరువురు కలవడాన్ని వారు కోరుకుంటున్నారు, వారు దాన్ని చేయుచున్నారు మరియు దాన్ని పూర్తిగా చేస్తారు. మరియు దేవుడు తన కృప, కనికరముల ద్వారా చంద్రునిలో, ఒక పూర్తి అంధకారముతో, దీనిని మనకు సూచించాడు…
80 చంద్రునియొక్క ఫోటోలను తీసిన ఆ వార్తా పత్రికను మీరెవరైనా చూసారా? దానిని నేను ఇక్కడ కలిగియున్నాను. అది ఇంకనూ కాదు గనుక, ఆ ఏడవ కాలమును మినహాయించి, అది సరిగ్గా పరిశుద్దాత్మ ద్వారా నేను ఆ సంఘకాలములను గీసినట్లే అది ఒక పరిపూర్ణమైన పటము కాక మరేమిటి. ఆ ఆరు అచ్చట ఉండియున్నవి, ఆ ఏడవది ఇంకనూ పూర్తి కాలేదు. మొదటి సంఘకాలములో అది ఎట్లు ప్రకాశవంతంగా ఉన్నదో; ఆ రెండు, మూడు, నాలుగు, ఐదు మరియు ఆరవ కాలములో చీకటి పడుటను గూర్చి చంద్రునియొక్క ఆ ఆరు దశలు సరిగ్గా పరిశుద్ధాత్మ ఆ బోర్డుమీద వాటిని గీయుటకు నాకు అనుమతించినట్లేయున్నవి, మరియు పిదప రెండు సంవత్సరముల క్రితం, ఆలయంయొక్క గోడమీద స్వయంగా తనతో వాటిని గుర్తింపజేసెను. చంద్రుడు దానికదే ప్రతిబింబిస్తుంది, మరియు ఏడవ దూత కాలములో, ఆ ముద్రలు తెరవబడి, ప్రత్యక్షపరచబడుటను గూర్చి, ఆ వెలుగును వారు ఫోటో తీసి లైఫ్ పత్రికలో ప్రచురించినట్లే, సంఘకాలములను గూర్చిన ఈ పటమును కూడా సైన్సు మరలా పట్టుకొనును. ఆ ఏడవ వర్తమానికునియొక్క పరిచర్య దినములలోనే, దేవునియొక్క మర్మములు అనగా, కాలములన్నిటిలో నున్న మర్మములన్నీ బయలుపరచబడి, ప్రత్యక్షపరచబడవలసి యున్నది, అది ఆ సమయములోనే జరగవలసియున్నది, మరియు ఆయన దానిని చేసియున్నాడు! ఆయన మాటలు తప్పిపోవు. అది ఒక మర్మయుక్తమైన కార్యము కదా? వారు పట్టుకొనియున్న అదే విషయమును దేవుడు ఆకాశములో గీసియున్నాడు, అదే దేవుడు నన్ను ఆ నల్ల బోర్డు మీద గీయుటకు అనుమతించాడు, మరియు పిదప స్వయంగా ఆయనే బయలుపరచెను. మూడు సార్లు ఆయన దాన్ని పరిపూర్ణముగా గుర్తింపజేసియున్నాడు, మరియు సరిగ్గా పోపు యెరూషలేము వెళ్ళుటకు ముందే అది జరిగినది.
81 అదేదనగా, అది సంఘమైయున్నది, చంద్రుడు సంఘమైయుండెను, అనగా సంఘమును సూచిస్తుంది. మరియు సంఘము ఎదుటినుండి, అనగా చంద్రుడిని లోకముయొక్క నీడ దాటివెళ్తుంది. మరియు బైబిలు యొక్క వెలుగంతటినీ అంధకారము చేయుటకు, లౌకిక-వాదము యొక్క ఛాయ, ఈ లోకపు ఛాయ, ఈ లోకసంబంధమైన సంఘము యొక్క ఛాయ, అంతటనూ వ్యాపించినది. ఈ లోకము ప్రతిబింబపు కాంతి లోనికి వచ్చియున్నది. మీకు అర్ధమగుచున్నదా? లోకము చంద్రునియొక్క వెలుగును దాటుకొని వచ్చి సూర్యుణ్ణి కనబడకుండా చేసింది. మరియు భూమికి వెలుగునివ్వవలసిన చంద్రుని యొక్క కాంతి నల్లబడెను. మరియు సరిగ్గా మునుపు చేసినట్లే, అది జరగడానికి ముందే అది లోపలికి వచ్చి ఆత్మ ప్రేరేపణ ద్వారా ఆ పటములను గీసెను.
82 ఇప్పుడది, సహోదరి సింప్సన్, అది టూసాన్ పత్రిక అని నేను నమ్ముచున్నాను. సహోదరి సింప్సన్ కి అది తెలియునో లేదో నాకు తెలియదు…ఆమెకది అప్పుడు అర్ధము కాలేదు. “నేను మీ కొరకు ఆ పత్రిక నుండి కొన్ని పటములను, కొంత నోట్సును కత్తిరించాను,” అని చెప్పి, ఆమె దానిని నాకు అందించింది.
83 మరియు నేనేదో వింతగా ఆలోచించి, అక్కడ లోపలికి వెళ్ళి, మరియు దానిని తీసుకొని దానిని చూశాను, “ఇదిగో అది ఇచ్చట ఉంది, సరిగ్గా అదే, చూడండి, సరిగ్గా నేను దేనికొరకు వెదకుచున్నానో అదేయైయున్నది,” అని నేనన్నాను. మరియు అది ఆ పత్రికలో ఉండియున్నది.
84 దాని యొక్క ఒక ప్రతి మీకు కావాలనుకుంటే, అది ఏ పత్రికలో ఉన్నదో, సహోదరి సింప్సన్ మీకు చెప్పవచ్చును. [“అది డిశంబరు 28వ తేదీయైయున్నది.” అని సహోదరి సింప్సన్ చెప్పుచున్నది—సంపా] మరియు—మరియు ఏమన్నారు? [“అది డిశంబరు 28వ తేది, సాయంకాలపు ముద్రణయైయున్నది.”] డిశంబరు 28వ తేది యొక్క సాయంకాలపు ముద్రణయైయున్నది.
85 చూడండి, అది కలిగియున్న ఆ కాంతిని, లేదా అది కలిగియున్నటువంటి మార్గమును, ఆ సమయమును, దాని స్థానమును మరియు అది ప్రకాశించుటకు గల హక్కులను, నిరోధించడానికి అతడు యెరూషలేమునకు వెళ్ళడానికి ముందే, ఇప్పుడది మొత్తానికే అంతమగుచు, చివరి కాలమైయున్న ఈ ఏడవ సంఘకాలములో అది పూర్తిగా అంధకారములోనికి వెళ్ళుచున్నది. మనకు ప్రభువు ఎటువంటి ఒక గొప్ప విషయమును చెప్పుచున్నాడు గదా. ప్రతీ విషయములోను, అది ఎన్నడూ తప్పిపోలేదు, అయితే పరలోకపు దేవుడు దానిని ప్రకటించి మరియు దాని గురించి చెప్పి, అది జరుగునట్లు చూసెను, మరియు ఇక్కడ దానిని గుర్తింపజేసి మరియు అది సంపూర్ణ సత్యమని దానిని నిరూపించెను.
86 ఈ లవోదికయ సంఘకాలము అంధకారమాయెను. వాక్యమైయున్న యేసు, ఈ లవోదికయ సంఘకాలములో సంఘమునకు వెలుపల ఉండి, తలుపును తట్టుచూ, లోపలికి వచ్చుటకు ప్రయత్నించుచుండెను. అప్పుడు చీకటి, కటికచీకటి జనములను కమ్మియున్నది. బైబిలు గ్రంధము సత్యమేనా?
87 లేఖనముయొక్క పరిపూర్ణతయే, ఆయన గొప్ప నామమునకు మహిమకరమైయున్నది. పోపు సందర్శించుట, సంఘములు ఆయనయొక్క ప్రత్యక్షతను చీకటి పరచుటకు ఒక సూచనగా ఉన్నది…లోకమునకు ప్రత్యక్షపరచబడిన వెలుగు బైబిలు గ్రంధమేయైయున్నది. తాను లోకమునకు వెలుగైయున్నాడని యేసు చెప్పెను. ఆయన వాక్యమైయున్నాడని బైబిలు గ్రంధము చెప్పుచున్నది. మరియు ఆ ప్రత్యక్షపరచబడిన, లేదా నిరూపించబడిన, లేఖనమే వెలుగైయున్నది. ఇప్పుడది పట్టు బిగించినప్పుడు మీరు దానిని చేయుటకు అనుమతించబడరు. అయితే అది జరుగుటకు ముందే ప్రేరేపణ ద్వారా చెప్పబడినది; మరియు దానిని మనము ఛాయా రూపములో చూసియున్నాము; చంద్రుని ద్వారా ఒక ఛాయగా అది జరుగుటను చూపించుచున్నది, మరియు ఇక్కడ అది సంభవించుచున్నది.
88 ఆ చీకటి, ఆ కటికచీకటి ఘడియ మన మీదికి వచ్చియున్నది. ఇప్పుడు ప్రజలమీదనున్నది ఆ కటికచీకటియేయై యున్నది. వీటన్నింటియొక్క భావం ఏమైయున్నది? మనమెక్కడ నిలబడియున్నాము? మనము ఏ ఘడియలో ఉండియున్నాము? మనము రాకడకు ఎంత సమీపములో ఉన్నాము? సరి, “వారందరూ ఒక ఉజ్జీవమును కలిగియున్నప్పుడు,” అని మీరు చెప్పవచ్చును.
89 “చిన్నమందా భయపడకుడి, మీకు రాజ్యము అనుగ్రహించుటకు మీ తండ్రికి ఇష్టమైయున్నది.” అది సరియే.
90 దానియొక్క భావమేమిటి? దేవుడు చీకటినుండి వెలుగును వేరుచేయనారంభించెను, చూడండి, దానిని వెనుకకు నెట్టుచున్నాడు, ఒక నూతన దినముయొక్క సూర్యోదయమును చూపించుటకు, ఆదియందు చేసినట్లే చేయుచున్నాడు. సంఘ కాలములు కాంతి విహీనమగుచున్నవి. [సహోదరుడు బ్రెన్హామ్ తన గొంతును సవరించుకొనుచుండెను—సంపా.] (నన్ను మన్నించండి.) సంఘ కాలములు కాంతివిహీనమగుచున్నవి. దేవుడు చీకటిని ఒక చోటునకు నెట్టుచున్నాడు, సంఘ సంస్థలను, లోకమును కాంతివిహీనం చేయడానికి అట్లు చేయవలసియుండెను. లోకము ఆ విషయమును కమ్ముచున్నది, మరియు లోకత్వము సమస్తమును స్వాధీనం చేసుకున్నది. అటువంటప్పుడు దేవుడు చెప్పినది సరియే కదా? లోకసంబంధమైన కార్యముల చేత, లోకసంబంధమైన దుస్తుల చేత మరియు లోకసంబంధమైన నటన, మరియు లోకసంబంధమైన జీవనము చేత అదియే లోకమైయున్నది!
91 చిన్న పిల్లలారా, మీరు లోక సంబంధులు కారు. మీరు పరలోకమునకు చెందియున్నారు. ఇది మీ గృహము కాదు.
92 వృద్దులమైన మనము, వెనుకకు చూసి, మరలా యౌవనస్థులుగా మారుటకు, ఎందుకు ప్రయత్నించాలి? మనం దానిని చేయలేము. అయితే మనం వెనుకకు చూచుట లేదు గాని ముందుకు చూచుచున్నాము. ఇక్కడ జరుగుతున్న దానిని చూస్తూ, ఏమి జరగబోవుచున్నదను దానిని మనము తెలుసుకొనగోరుచున్నాము. మరియు మనం ఆ ఘడియ కొరకు ఎదురుచూస్తూ, దాని కొరకు పరుగిడుచున్నాము.
93 “పైకి భక్తిగల వారివలె ఉండియు దాని శక్తిని ఆశ్రయించని వారునై యుందురు,” అని రెండవ తిమోతి, 3వ అధ్యాయంలో చెప్పినట్లు, ఈనాడు చాలామంది మంచి, యదార్థవంతులైన ప్రజలు ఈ మత సిద్ధాంతములలో, ఈ సంఘములు మరియు సంఘ సంస్థలలో పట్టబడియున్నారు.
94 ఆ కటికచీకటి ఇశ్రాయేలునకు గ్రుడ్డితనము కలుగజేయుట, అన్యజనులకు వెలుగునిచ్చుట కొరకేయైయున్నది. ఇప్పుడు అన్యజనులయొక్క గ్రుడ్డితనము ఇశ్రాయేలునకు వెలుగునిచ్చుటయై యున్నది. అది సరిగ్గా పగలు మరియు రాత్రివలెయున్నది; ఒకవైపు చీకటి, మరొక వైపు వెలుగు ఉండియున్నది; మరియు పిదప ఆ వెలుగు మరొక వైపుకు వస్తుంది. కావున ఆ—ఆ చంద్రుడు ఆ విధంగా కదిలిపోవుచుండెను మరియు లోకపు అంధకారముయొక్క ప్రతిబింబము దాని కాంతిని మూసివేయుచున్నది, అది అన్య సంఘకాలం ముగించబడినదనుటకు మనకు ఒక సూచనగా ఉన్నది. సంఘము తనను తాను సిద్ధపరుచుకొనుచున్నది, ఒక సమయము కొరకు తనను తాను సిద్ధపరచుకొనుచున్నది, అది ఎత్తబడే సమయముకొరకై యున్నది. ఏలయనగా అన్యజనులను చీకటి కమ్ముచున్నది మరియు త్వరలో యూదులకు సూర్యోదయం కానున్నది. సూర్యుడు తూర్పు నుండి పశ్చిమమునకు ప్రయాణం చేసెను, మరియు మనము పశ్చిమ తీరాన ఉండియున్నాము. ఆ వెలుగు ఒకే ఒకటి చేయగలదు, అది తిరిగి మళ్ళీ ఆవలి వైపునున్న తూర్పునకు వెళ్ళును. మీరు అర్ధం చేసుకుంటున్నారా? అది ఎక్కడైతే తూర్పునున్న ఆ ఇశ్రాయేలువద్ద ప్రారంభమైనదో ఆ వెలుగు, తిరిగి మళ్ళీ అక్కడికి మాత్రమే వెళ్ళగలదు. దేవుడు కొంతకాలం వరకు వారికి గ్రుడ్డితనము కలుగజేసెను, అయితే ఇప్పుడు సమస్తమును కప్పివేసిన ఆ చీకటి, ఆ—అన్య ప్రపంచమును కమ్మియున్నది. యేసు ఈ విధంగా చెప్పెను. అన్యజనుల కాలము సంపూర్ణమగువరకు యెరుషలేము అన్యజనుల చేత త్రొక్కబడును. మరియు ఇప్పుడు అది సమాప్తమాయెను, కటికచీకటి జనములను కమ్ముచున్నది! అదంతయూ జరగకముందే ఆయన భూమి మీద దానిని చూపించినట్లే, దేవుడు దానిని ఆకాశములో కూడా ప్రతిబింబింపజేయుచున్నాడు. మనము దానిలో ఉండియున్నాము.
95 చక్కని ప్రజలు, యదార్ధవంతులు, మంచి ప్రజలు సైతం ఈ విషయములో పట్టబడియున్నారు. మరియ, యోసేపుల వలె, వారు చాలా యదార్ధవంతులైయున్నారు, చూడండి, ఆయన వారితో లేకున్ననూ, ఆయన వారితో ఉన్నాడని తలంచుకొనిరి. మీకు తెలుసుగదా, యేసు పన్నెండు యేండ్లవాడై ఉన్నప్పుడు మరియ మరియు యోసేపులు, వారు ఆ పండుగకు వెళ్ళినప్పుడు, ఆయన వారితో ఉన్నాడని వారు ఊహించుకొనిరి, అయితే ఆయన వారితో లేకుండెను. ఈనాడు మంచి ప్రజలు కూడా అట్లే తలంచుచున్నారు, ఈ సంఘముల సమైఖ్యలో సంస్థాగతమైన ఈ ప్రజలు, ఈ సంఘ సంస్థలలోనున్న ఈ ప్రజలు, వారు—వారు ఒక మంచి కార్యమును చేస్తున్నారని తలంచుచున్నారు. ఆయన వారితో లేకున్ననూ, ఆయన వారితో ఉన్నాడని వారు ఊహించుకొనుచున్నారు. చూడండి, చాలామంది ప్రజలు, వారు బోధకునితో కరచాలనము చేసి మరియు పుస్తకములో వారి పేరు నమోదు చేసుకున్నప్పుడు, ఆయన వారితో ఉన్నాడని తలంచుదురు, అయితే ఆయన వారితో లేకుండెను. చాలామంది ప్రజలు, వారు చిలకరించబడి, నిర్ధారించబడి, “తండ్రీ, కుమారా, పరిశుద్ధాత్మ,” నామములో బాప్తీస్మము తీసుకున్నప్పుడు, ఆయన వారితో ఉన్నాడని తలంచుచుండిరి. వారు మంచి ప్రజలేయైయున్నారు. మరియ మరియు యోసేపులు కూడా మంచివారేయైయున్నారు. కానీ సత్యమేమిటంటే, ఆయన వారితో లేకుండెను! దేనిని ఊహించుకొనవద్దు.
96 వెలుగు అనగా ఏమిటి? నిరూపించబడిన, దేవునియొక్క పలుకబడిన మాటయైయున్నది! దానికి వెలుపల వెలుగనేది లేదు. చూశారా? మీరు టార్చి లైట్లతో భూమిపై వెలుగును తీసుకురాలేరు. దానికి ఆ ప్రత్యక్షపరచబడిన దేవునియొక్క వాక్యము అనగా, ఆ కుమారుడు అవసరమైయుండెను.
97 వారు మంచి ప్రజలేయైయున్నారు. ఆయన వాక్యము యొక్క ఖచ్చితత్వము ఎంత పరిపూర్ణముగా ఉన్నదో గమనించండి. మరియ ఏమి చెప్పినదో మీరు గమనించారా? ఇప్పుడు ప్రియమైన కథోలిక్ ప్రజలారా, మీ పట్ల నాకు ఎటువంటి వ్యతిరేకత లేదు. మీకు విరోధముగా నాకు ఎటువంటిదియు లేదు. అయితే మీరు కలిగియున్నటువంటి ఆ మత సిద్ధాంతములకు నేను వ్యతిరేకిని. మరియు ప్రొటెస్టంటువారలారా, మీ విషయం కూడా అంతే. ఆ మత సిద్ధాంతములే!
98 “మరియ, దేవుని తల్లా?” ఆమె సొంత కుమారుడుగా నున్న, ఆ పన్నెండు యేండ్ల పిల్లవాడు, ఆమెను క్రమపరచవలసి యుండుటను కనుగొంటాము. యేసు, మరియను “తల్లి” అని పిలిచిన సందర్భము బైబిలు గ్రంధములో ఒక్కసారియైనా లేదు. ఆమె ఆయనయొక్క తల్లి కాదు. ఆమె దేవునికి ఎట్లు ఒక తల్లి కాగలదు? భూమి మీద ఆ గర్భము ద్వారా ప్రత్యక్షపరచబడుటకు, ఆమె కేవలం, ఆయన భూమి మీదకి వచ్చుటకు ఉపయోగించుకొనిన ఒక గర్భమైయుండెను. అంతకుమించి ఆమె విషయములో ఏమియులేదు, “తల్లీ” అని చెప్పిన లేఖనము ఒక్కటియు లేదు.
99 మరియ ఎంత పొరపాటు చేసిందో గమనించండి, కానీ ఆయన వాక్యము ఎంతో పరిపూర్ణమైనదైయున్నది. ఆమె ఆయనతో ఇట్లనెను…పన్నెండు సంవత్సరముల వయస్సులో ఆలయంలో ఆ వేద పండితులతో చర్చించుచుండగా, ఆమె ఆయనను కనుగొన్నది. పన్నెండేండ్ల-బాలుడిగా ఉండగనే, ఆయన వారిని విస్మయపరచెను; కనీసము బడికి కూడా వెళ్ళలేదు లేదా ఒకవేళ వెళ్ళాడనుకున్నా, దానిని గూర్చిన దాఖలాలు ఏమీలేవు. అయితే ఒక పన్నెండేండ్ల పిల్లవాడు తన జ్ఞానము చేత ఆలయములోనున్న ఆ—ఆ శాస్త్రులను ఆశ్చర్యచకితులను చేసెను. “ఇదిగో నీ తండ్రియు నేనునూ దుఃఖపడుచూ నిన్ను వెదుకుచున్నాము.” అని ఆమె అన్నది. “నీ తండ్రీ!” తనను తాను తల్లి అనుకొనుచు, “నీ తండ్రియైన యోసేపు మరియు నేను కన్నీళ్ళతో నిన్ను వెదకుచున్నాము,” అని అన్నది.
100 ఆయన ఆమెతో ఏమి చెప్పెను? “నేను నా తండ్రి పనుల మీద నుండవలెనని మీరెరుగరా?” ఆయన ఒకవేళ యోసేపుయొక్క పనులమీద ఉండినయెడల, ఆయన ఇండ్లు కట్టుచూ, లేదా ఒక వడ్రంగియొక్క దుకాణములో ఉండెడివాడు. అయితే ఆయన యోసేపుయొక్క కుమారుడు కాదు. ఈ సంఘశాఖలు మరియు సిద్ధాంతములు మరియు నేను వినుచున్న ఈ సంగతులను సరిచేయుచూ, “నేను నా తండ్రి పనుల మీద ఉండియున్నాను.” చూశారా? “నేను నా తండ్రి పనుల మీద ఉండియున్నాను.” యోసేపు తన తండ్రియని ఆయన ఎన్నడూ ఒప్పుకొనలేదు. అయితే మరియ అలాగన్నప్పుడు, ఆయన వెనుదిరిగి ఆమెను సరిచేసెను.
“ఇదిగో నీ తండ్రియూ నేనునూ నిన్ను వెదకుచున్నాము.” అని ఆమె చెప్పెను.
101 యోసేపు తన తండ్రి కాడని చూపిస్తూ, “నేను నా తండ్రి పనుల మీద ఉండియున్నాను,” అని ఆయన చెప్పెను. ఆయన మాటలు పరిపూర్ణమైయున్నవి, చూడండి.
102 అయితే మరియ మరియు తదితరులు, కేవలం అట్లు ఊహించుకొనుచుండిరి. సరి, అదేమిటో చూడండి, ఆమె విషయమునకు ఎంతో దూరమైపోయినది. ఆమె—ఆమె…ఈ యాజకులు మరియు తదితరుల ముందు ఆమె ఆ—ఆ—ఆ రకమైన స్త్రీ కాదని చూపించుకొనగోరినది. మరియు ఆమె, అట్లు చేయుట ద్వారా “నీవు పురుషుని ఎరుగకుండా, ఒక కుమారుని గర్భమున ధరించుదువు, కన్యకకు జన్మించిన కుమారుడిగా అతడు ఉండును,” అని దూత తన వద్దకు వచ్చి చెప్పెనని సాక్ష్యమిచ్చిన తరువాత ఆ సాక్ష్యపు పునాదినే ఆమె విచ్చిన్నం చేసినది. మరియు ఇక్కడ ఆ గొప్ప సన్హెద్రిను సభ యెదుట, “నీ తండ్రియగు యోసేపు, మరియు నేను నీ కొరకు వెదకుచున్నాము,” అని ఆమె చెప్పినది.
103 మరియు ఆ పన్నెండు సంవత్సరముల బాలుడు, “నేను నా తండ్రి పనుల మీద ఉండవలసియున్నది.” అని చెప్పెను. “ఈయన నా తండ్రి కాదు!” అని ఆమెను గద్దించెను.
104 చూడండి ఈనాటి సంఘము, సంఘ సమైఖ్యల ద్వారా మరియ—మరియు లోక సంబంధమైన విషయముల ద్వారా ఎంతో దూరమైపోయింది, ఇప్పుడామె అంధకారమైపోయినది. దేవుడు ఆమెను గద్దించుచున్నాడు!
105 యేసు ఎన్నడూ ఆమెను “అమ్మా” అని పిలవలేదు. ఒకనాడు తన కూటములలో, ఇటువంటి ఒక గృహ కూడికలో ఆమె ఆయనను కలుసుకొనుటకు వచ్చెను. అప్పుడు, “నీ తల్లియూ మరియు నీ సహోదరులునూ నిన్ను చూడగోరి ద్వారము వెలుపల నిలిచియున్నారు,” అని ఎవరో వచ్చి చెప్పిరి.
106 అందుకాయన, “నా తల్లి ఎవరు, నా సహోదరులెవరు? ఎవరు వారు?” అని చెప్పి, తన శిష్యులవైపు చూసి, ఇట్లనెను, “పరలోకమందున్న నా తండ్రి చిత్తము చొప్పున చేయువాడే, వారు మాత్రమే, నా తల్లియూ, నా సహోదరుడును, నా సహోదరి.”
107 మరియు ఆ సిలువవద్ద, ఆయన మరణించుచుండగా, ఆయన యౌవన శిష్యుడైన యోహానుతో, ఇట్లు చెప్పెను, “ఇదిగో నీ తల్లి.” “స్త్రీ, ఇదిగో నీ కుమారుడు.” “కుమారుడా, ఇదిగో నీ తల్లి.” చూడండి, ఆయన ఎన్నడూ చెప్పుకొనలేదు. ఆయన ఆమె కుమారుడు కాదు. ఆయన దేవుని కుమారుడైయున్నాడు. ఆమె కేవలం ఒక గర్భం మాత్రమైయున్నది.
108 ఈ ఉదయము ఇది ఒక ఇల్లు మాత్రమే, కానీ ఇది ఒక సంఘము కాదు. సంఘము మీలో ఉండియున్నది, అది క్రీస్తే. ఇక్కడ కూర్చునియున్న మర్త్యులైనవారి ఆత్మలు పరస్పరం పరలోక స్థలములలో కలుసుకొనియున్నవి. మరదే క్రీస్తైయుండెను, ఇల్లు కాదు. ఇల్లు మంచిదే, అది దానియొక్క పనిని నిర్వర్తించుచున్నది, అయితే అది ఒక కూడుకొనే స్థలముగా మాత్రమే ఉపయోగపడుతుంది. ఆయన తననుతాను ప్రజల మధ్యలో గుర్తింపజేసుకొనుటకు, భూమిమీదకు రావడానికి, మరియ కేవలం ఆయన ఉపయోగించుకొనిన ఒక గర్భము మాత్రమైయున్నది. “దేవునియొక్క తల్లి,” కాదండి. ఈ ఇల్లు దేవునియొక్క సంఘముగా ఎలాగు ఉన్నదో కేవలం అంతేయైయున్నది. అది కేవలం దాని కొరకు ఉపయోగించబడినది.
109 అవునండీ, ఇప్పుడు, చాలామంది స్నేహితులు, మంచి ప్రజలు, మరియ మరియు యోసేపు వలెనె ఆలోచించుదురు, అట్లు చేయడంలో—ఆయన తమతో ఉన్నాడని అనుకొందురు. అయితే అప్పుడు వారు చేసినట్లే, ఇప్పుడు వీరును చేయుచున్నారు, పొరబడుచున్నారు. వారు ఆయనతో లేరు కానీ, ఆయనతో ఉన్నామని అనుకున్నారు. అయితే ప్రజలు బాప్తీస్మము పొందినపుడు, వారిట్లు అనుకొనియుందురు, “ఓ, నేను—నేను ఆయనను స్వీకరించి మరియు బాప్తీస్మము తీసుకున్నప్పుడు నేనాయనను పొందుకున్నాను.” అది కాదండీ. పలుకబడిన మాట దానికదే ప్రతిబింబించనంత వరకు అది అంతే!
110 అయితే ఏర్పరచబడిన వారలారా, ఇప్పుడా వెలుగు సంగతి ఏమిటి? నేను చీకటి గూర్చి చాలాసేపు మాట్లాడుచుంటిని, మరియు నా సగం సమయము అయిపోయినది, పదకొండున్నర అయినది. ఇప్పుడు మరలా దానివైపు త్రిప్పెదము; కటికచీకటి జనములను కమ్ముచున్నది, మరిప్పుడు ఆ వెలుగు సంగతి ఏమిటి? కటికచీకటి జనములను కమ్ముచున్నది, అయితే అక్కడ వెలుగు ఉంటుంది అని ఆయన చెప్పెను, “లెమ్ము, మరియు తేజరిల్లుము, నీకు వెలుగు వచ్చియున్నది.” వెలుగు మరియు చీకటి అక్కడ ఏలాగు ఉండును, అది వేరు చేయబడవలసియున్నది. మరియు ఒకేఒకటి వాటిని వేరుచేస్తుంది, ప్రత్యక్షపరచబడిన వాక్యము దానిని వేరుచేసి, దానిని మరొక ప్రక్కకు నెట్టివేస్తుంది…ఇక్కడ భూమిమీద చీకటి కమ్మియున్నది, అయితే ప్రత్యక్షపరచబడిన దేవునివాక్యము, అనగా వాక్యము ద్వారా ఉనికిలోనికి పలుకబడిన ఆ సూర్యుడు దానికదే ప్రకాశించినప్పుడు, ఆ చీకటి మరొక ప్రక్కకు పరిగెత్తును. మరియు ఇప్పుడు జరుగుచున్నది అదేయైయున్నది, చీకటి దానికదే ఆ వెలుగునుండి వేరగుచున్నది. ఇప్పుడు ఈ చీకటి ఘడియలో ఏర్పరచబడిన సంఘమునకు…మనము దానిమీద కొన్ని గంటల తరబడి మాట్లాడుకొనవచ్చును, కానీ “కటికచీకటి జనములను కమ్ముచున్నది,” అని నేను చెప్పినప్పుడు, ఆ—ఆ లేఖనముయొక్క భావము ఏమైయున్నదో, మీకు అర్ధమగుటకు సరిపడునంత నేను చెప్పానని నేను తలంచుచున్నాను.
111 ఇప్పుడు సంఘమునకు నేను “షాలోమ్. దేవునియొక్క సమాధానము,” అని చెప్పుచున్నాను. సమాధానం! నిజమైన ప్రతీ హెబ్రీయుడు, మరొకరిని కలిసినప్పుడు, “షాలోమ్” అని చెప్పును. మరో మాటలో చెప్పాలంటే, “శుభోదయం! దేవుడు మీతోనుండును గాక! దేవుని సమాధానం మీతో వచ్చును గాక!” అని దాని భావమైయున్నది. “శుభోదయం! మీరెలా ఉన్నారు?” అని దాని అర్ధం. సంఘమా, అది ఒక నూతనోదయమైయున్నది. కటికచీకటి జనములను కమ్ముచున్నది, కానీ సంఘమునకైతే అది “శుభోదయం.” క్రీస్తు మనమధ్య ప్రత్యక్షమగుచున్నాడు. “షాలోమ్. సమాధానము.” హల్లెలూయా! “షాలోమ్.”
112 సరిగ్గా పగలు అవడానికి ముందు, చీకటి తొలగిపోవుటను మనము చూచినప్పుడు, ఆ సూర్యుణ్ణి పరిచయం చేయుటకు ఆ ఉదయ నక్షత్రము అక్కడ దూరాన వ్రేలాడుచున్నదని మనము ఎరిగియున్నాము. ఉదయ నక్షత్రము ప్రకాశించునది అప్పుడేయైయున్నది. అది—అది—అది మధ్యవర్తియై-యున్నది. పగలు అవ్వడానికి సరిగ్గా కొద్ది నిమిషముల ముందు అది ఎప్పుడూ చిమ్మచీకటిగా ఉంటుంది, అది అంధకారమౌతుంది, చంద్రుడు ప్రకాశించుటను కోల్పోతాడు. ఆ వెలుగు చీకటిని నెట్టివేయుచున్నది, గనుక పగటికి ముందు చిమ్మచీకటిగా ఉంటుంది. కానీ ఉదయ నక్షత్రము వచ్చి, మరియు, “శుభోదయం. షాలోమ్.” అని చెప్పును.
113 ఆయన వాక్యము గుర్తించబడుటను బట్టి, మనమధ్యనున్నది ఆయనేయైయున్నాడు. షాలోమ్. ఆ గొప్ప దినము ఉదయించనైయున్నది, ప్రకాశవంతముగా మరియు నిర్మలంగా, నిత్యత్వములోనికి అది ఉదయించినప్పుడు, ఆయన ప్రియులు ఆకాశముయొక్క ఆవల వారి గృహమునొద్ద కూడుకొనినప్పుడు, ఆ వరుస పిలువబడినప్పుడు, నేనక్కడ ఉంటాను. మన పేర్లు ఆయన గ్రంధములో ఉన్నవి గనుక, మనమక్కడ ఉండెదము. “షాలోమ్, శుభోదయం. మీకు సమాధానం కలుగును గాక.”
114 ఆ చీకటి దానికదే వెలుగునుండి వేరగుచున్నది. దేవుడే దానిని కలుగజేయుచున్నాడు, ఆ వెలుగు దానిని చేయుచున్నది. చూడండి, ఆ చీకటి ఒక్కచోట పోగవ్వవలసినంతగా, వెలుగు దానికదే నెట్టుకొనుచున్నది. దానిని అంగీకరించుటకు వారికి ఒక అవకాశముండెను అయితే వారు దానిని చేయరు, కావున దానికదే కుదించుకుపోయెను. మరియు సంఘములను సమకూర్చుతూ, సంఘముల సమైఖ్య ద్వారా, మరియు దానిని అన్యత్వపు చీకటితో ఐక్యపరచుట ద్వారా వారు దానిని చేయుచున్నారు. వారు ఒకరితోఒకరు ఎంతో ధృడమైన అసమ్మతిని కలిగియున్నారు, అయినప్పటికినీ ఆ ప్రజలమీదికి రాత్రి కమ్మునట్లు చేయడానికి వారు ఒకరితోఒకరు కలిసి వెళ్ళవలసియున్నది.
115 యెషయా 60:1 ఇట్లు చెప్పుచున్నది, “లెమ్ము మరియు తేజరిల్లుము, నీకు వెలుగు వచ్చియున్నది.”
116 లెమ్ము మరియు తేజరిల్లుము, వెలుగు వచ్చియున్నది. వాక్యమనే ఆ వెలుగు మరలా నిరూపించబడినది. వెలుగు మరలా దేవునియొక్క వాక్యమును నిరూపించినది, తద్వారా దేవుడు ఈ దినపు వెలుగు యొక్క వాగ్దానములో లేదా ఈ కాలమునకు ఇవ్వబడిన వాక్యములో, ప్రత్యక్షపరచుకొనుటను మీరు చూడగలరు, ఈ దినమునకు చేయబడిన ఈ వాగ్దానములను, ప్రవక్తల ద్వారా మరియు స్వయంగా యేసు ద్వారా చెప్పబడిన ఈ వాగ్దానములను చూడండి. ఈ దినమున! “దేవుడు, నానా సమయములలోను…” హెబ్రీ 1, “పూర్వకాలమందు నానా సమయములలోను నానా విధములుగాను, ప్రవక్తల ద్వారా వారి పితరులతో మాటలాడిన దేవుడు, ఈ దినముల అంతమందు తన కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా మాటలాడుచున్నాడు.” చూశారా?
117 ఐగుప్తు ధనము కంటె క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని, మోషే ఐగుప్తుని విడిచిపోయెను. అరణ్యములో వ్రేలాడినటువంటి ఆ గొప్ప వెలుగు ఏదైతే ఉన్నదో,
118 అదే వెలుగు సౌలును దమస్కు మార్గమున కలుసుకొనెను. ఒక గొప్ప వెలుగు అతనిముందు వ్రేలాడెను, అదే వెలుగు, అది అదే అగ్నిస్తంభమైయుండెను. సౌలు, ఒక హెబ్రీయుడైయుండి తాను కలిగియున్న స్థానమునుబట్టి, ఏ ఆత్మను గానీ లేదా మరి దేనినైన గానీ ఎన్నడూ ఆరాధించడు, లేదా “ప్రభువు” అని దానిని పిలువడు. అయితే అతడు, “ప్రభువా, నీవెవరవు?” అని అడిగెను.
119 “నేను యేసును,” అని ఆయన చెప్పెను. (యేసు ఇట్లు చెప్పెను, “నేను దేవునియొద్దనుండి వచ్చియున్నాను, తిరిగి నేను దేవునియొద్దకు వెళ్ళుదును.”)
120 అదే వెలుగు వచ్చియున్నది. దేనికొరకు? ప్రత్యక్షపరచుట కొరకు—ఈ దినమునకై ఆయన చేసిన వాగ్దానములను, ఈ దినమునకై ప్రత్యక్షపరచబడిన వెలుగును, ప్రజలకు తెలియజేయుట కొరకు వచ్చెను. చీకటి మరింత అంధకారమాయెను.
121 ఆయన వచ్చినప్పుడు, ఆయన ఆ దినమునకు వెలుగైయుండెను. ఒక మెస్సీయా రావలసియుండెను. మరియు ఆయన ఎట్లు వచ్చునని దేవుడు చెప్పెనో, సరిగ్గా అలాగే ఆయన వచ్చెను. మరియు ఆయన వచ్చినప్పుడు, ఆయన ఏమైయుండెను? ఆ దినపు వెలుగైయుండెను. మరియు అది ఆ చీకటిని ఆయనకు ఎంతో వ్యతిరేకంగా తీసుకువచ్చెను! అది నిజమేనా? ఆ వెలుగు కొనసాగునట్లు, అది ప్రకాశించుటకు గాను ఆయన తన ప్రాణమును ఇవ్వవలసివచ్చెను. ఆయనే ఆ దినపు వెలుగైయుండెను. అయితే ఎందువలన, ఎందువలన ఆయన ఆ దినపు వెలుగైయుండెను? ఆయన పలుకబడి, ప్రత్యక్షపరచబడి, నిరూపించబడిన వాక్యమైయున్నాడు. అంతకన్నా…
122 వెలుగనేది లేకుండా ఉన్న ఈ చీకటి, అంధకారపు భయంకరమైన గందరగోళ ప్రపంచము మీదుగా దేవుడిట్లు పలికెను, “వెలుగు కలుగును గాక” అని ఆయన అన్నాడు. మరియు ఆ వాక్యము ప్రత్యక్షపరచబడేవరకు వెలుగు కలుగలేదు, పిదప వెలుగు కలిగెను.
123 “ఒక రక్షకుడు, ఒక మెస్సీయ వచ్చును” అని ఆయన చెప్పెను. ఆ వాగ్దానమును నెరవేర్చుటకు ఆయన వచ్చేంతవరకు అది ఇంకను ప్రత్యక్షపరచబడలేదు. మరియు ఆయన ఆ వాగ్దానమును నిరూపించినప్పుడు, “లేఖనములను పరిశోధించుడి, వాటిలో నిత్యజీవము కలదని మీరు తలంచుదురు గదా; మరి అవియే నన్ను గూర్చి సాక్ష్యమిచ్చుచున్నవి,” అని ఆయన చెప్పెను.
124 “నీవెక్కడ నుండి వచ్చితివో మేమెరుగము, మేము మోషే శిష్యులము” అని వారు చెప్పిరి.
125 “మీరు మోషే శిష్యులైనయెడల మీరు నన్ను ఎరిగియుందురు, ఎందుకనగా మోషే నన్ను గూర్చి వ్రాసెను” అని ఆయన చెప్పెను. చూశారా? ఆయనే ఆ నేరవేర్పైయుండెను. ఆయన మోషే ద్వారా పలుకబడిన దేవుని వాక్యముయొక్క నిరూపణయైయుండెను.
126 మరియు మనము జీవించుచున్న ఈ దినమున, తన వాగ్దానములను నిరూపించి మరియు ఋజువుచేయుటకొరకు దేవుడు రంగం మీదికి వచ్చాడు. కావున అది ఈ ఘడియయొక్క వెలుగైయున్నది గనుక మనము లేచి మరియు తేజరిల్లగలము. మరలా ఈ దినమున ఆ వెలుగు మనపై ప్రకాశించుచున్నది, వాక్యము ప్రత్యక్షపరచబడుచున్నది. అది వెలుగైయున్నది.
127 ఈ ఉదయాన సరిగ్గా ఆ వెలుగు, అనగా ఆ సూర్యుని వెలుగు అక్కడ ప్రకాశిస్తునట్లే అది ఉన్నది. అది దేవునియొక్క పలుకబడిన మాటయైయున్నది, దానివలె వెలుగిచ్చునటువంటిది మరేదియు లేదు. దానిని ఏదియు చేయలేదు. కృత్రిమమైన వెలుగు ఏదైనా, బల్బులైనా మరేదైనాగాని కొంతసేపటిలోనే కాలిపోతుంది. కానీ అది ఎన్నడూ విఫలమవ్వదు, ఎందుకనగా అది ప్రత్యక్షపరచబడిన దేవునియొక్క పలుకబడిన మాటయైయున్నది.
128 చిన్న సంఘసంస్థయొక్క సిద్ధాంతములు ఒక బల్బును విఫలపరచి మరియు ఒక బల్బును పేలిపోవునట్లు చేసి మరియు ఆ ఫ్యూజును కొట్టివేసి మరియు ప్రతీది చేయును. అయితే దేవునియొక్క వాక్యము ఎన్నటికీ తప్పిపోదు! అది ఏమైయున్నదో అట్లే, ఎల్లప్పుడూ వాక్యముగానే నిలిచియుంటుంది.
129 నాకు ఇక్కడ కొంచెం ఎక్కువ సమయం పడుతుందేమో అని నేను భయపడుచున్నాను. లేదా, ఇలాగే కొనసాగించి మరియు ఈ వర్తమానాన్ని ముగించితే సరిపోతుంది కదా? సరియే.
130 లెమ్ము, మరియు తేజరిల్లుము, వెలుగు నీయొద్దకు వచ్చియున్నది. ఆ వాక్యము అనగా ఆ వెలుగు నిరూపించబడియున్నది.
131 ఒకే ఒక విధానం ఏమిటనగా, దేవుడు, యేసుక్రీస్తు పలుకబడిన దేవుని వాక్యముయొక్క ప్రత్యక్షతయైయుండి, ఆ ఘడియయొక్క వెలుగైయున్నట్లే,
132 బాప్తీస్మము ఇచ్చు యోహాను ఆ ఘడియ యొక్క వెలుగైయున్నాడు. యేసు వెలుగుగా ఉండుటకు ముందు అతను వెలుగుగా ఉండెను. ప్రవక్తయైన యెషయా ఇట్లు చెప్పెను, “ఆలకించుడి, అరణ్యములో ఒకడు ప్రకటించుచున్నాడు, ఎట్లనగా యెహోవాకు మార్గం సిద్ధపరుచుము, మరియు మా దేవుని రాజమార్గము సరాళము చేయుము.” అది దేవునియొక్క పలుకబడిన మాటయైయున్నది, అది అక్కడ పడియున్నది, అది ఇంకనూ జీవమును పొందుకొనలేదు. అది జరుగుటకు నాలుగు వందల సంవత్సరముల ముందు, చివరి ప్రవక్తయైన మలాకీ, అతడిట్లు చెప్పెను, “ఇదిగో, నాకు ముందుగా మార్గము సిద్ధపరచుటకై, నేను నా దూతను పంపుచున్నాను.” అంతట ఒక సంఘశాఖ గానీ, మత సిద్ధాంతము గానీ, ఎటువంటి గుర్తింపు గానీ లేకుండా అరణ్యములో నుండి ఒకడు వచ్చెను. కానీ అతని వెలుగే అతడిని గుర్తింపజేసెను. వాక్యము ఆయనను గుర్తింపజేసెను.
“నీవు మెస్సీయావా?” అని వారు అడిగిరి.
133 “నేను కాదు! అయితే నేను, ‘యోహోవాకు మార్గము సరాళము చేయుడి!’ అని అరణ్యములో ఎలుగెత్తి చెప్పు ఒక స్వరమైయున్నాను.” అని అతడు చెప్పెను.
134 యేసు ఇట్లు చెప్పెను, “మీరు అతని వెలుగులో నడిచియున్నారు.” అతడు కొంతకాలం వరకు మండుచు ప్రకాశించుచున్న వెలుగైయుండెను. ఎందువలన? ఆ మార్గము సిద్ధపరచబడువరకే గాని, తరువాత అతనియొక్క వెలుగు ఆరిపోయెను.
135 బాప్టిస్టువారలారా, మీరు ఆ వెలుగులో నడువలేరు, ఇదే ఈ ఘడియయొక్క వెలుగైయున్నది! వెలుగు వచ్చియున్నది. లెమ్ము, తేజరిల్లుము. వాక్యపు వెలుగు. వాక్యము అనగా ఆ ప్రత్యక్షపరచబడిన దేవునియొక్క వాక్యము (గుర్తించబడినప్పుడు) అది వెలుగైయున్నది.
136 మరిప్పుడు మనము ఎదుర్కొనుచున్న నూతన సంవత్సరముయొక్క సంగతేమిటి? ఈ చీకటి నుండి వెలుగునకు మధ్యలో దానిపై, అనగా వచ్చుచున్న ఆ వెలుగుయొక్క పరిచయాన్ని గూర్చి మనము చెప్పుకొనుటకు ఎంతో ఉంది, కానీ ఇప్పుడు మనము నేరుగా నూతన సంవత్సరములోనికి వెళ్ళగోరుచున్నాము. అది సరియే.
137 నూతన సంవత్సరము, నూతన సంవత్సరము, దాని సంగతేమిటి? నూతన నిరీక్షణను తీసుకొనివచ్చును. మనమొక సంవత్సరము దగ్గరపడినాము. నిన్నటి కంటే ఒక రోజు మనము దగ్గరపడినాము. పది గంటల నలభై ఐదు—నలభై ఐదు నిమిషములకు నేను ప్రారంభించినప్పటి కంటే మనం ఒక గంట దగ్గరపడినాము, ఇప్పుడు పదకొండు గంటల నలభై ఐదు నిమిషాలు అగుచున్నది. మనమొక గంట చేరువయ్యాము! మనము వెనుకకు చూడటం లేదు కానీ, మనము ముందుకు చూచుచున్నాము. చూశారా? ఓహ్! అవునండీ. క్రొత్త సంవత్సరము అంటే ఒక క్రొత్త పేజీని త్రిప్పుట కాదు. ఆహ్-హ. కాదండి.
138 ఒక ఉదయమున, ఒక వ్యక్తి గూర్చి; నేను విన్నదానివలె అది ఉంది. ఒక వ్యక్తి ఉదయమునే లేచి బయటకు వెళ్ళి, ఒక వార్తాపత్రికను తీసుకొని తిరిగివచ్చెను, మరియు కూర్చొని తన పాదములు దివానా బల్ల మీద పెట్టుకొని, తనయొక్క కళ్ళజోడు ధరించి, వార్తాపత్రికను చదువుట మొదలుపెట్టెను. అల్పాహారమును సిద్దపరుస్తున్న అతని భార్య, “జాన్, కొత్తగా ఏమైనా ఉన్నదా?” అని అన్నది.
139 “లేదు. అవే పాత సంగతులు, కాకపోతే క్రొత్త ప్రజలు,” అని అతను చెప్పెను. అవును. అది వాస్తవం. హత్యలు, మానభంగాలు మరియు ప్రతీది, వేరెవరో వాటిని చేసారు, చూడండి. అది నిజం.
140 ఒక క్రొత్త పేజీని త్రిప్పడం కాదు. వాక్యము వైపునకు తిరిగి, ఈ దినమునకై వాక్యము దేనిని వాగ్దానము చేసినదో చూచుటయైయున్నది, ఈ దినముయొక్క వెలుగు ఏమైయుండవలసినదో చూచుటయైయున్నది. మనము ఈ సంవత్సరం చేయవలసింది ఏమిటంటే, మత సిద్ధాంతములు మరియు అట్టి కార్యముల వైపుకు తిరిగి వెళ్ళుట కాదు గానీ, మన పాత సంఘ శాఖల వైపుకు తిరిగి వెళ్ళుట కాదు గానీ, వాక్యము వైపునకు తిరిగి, ఈనాడు ఏ విధమైన వెలుగు ప్రకాశించవలసియున్నదో చూడవలసియున్నది. ఓ, సంఘమా, వాక్యము వైపునకు తిరుగుము, తిరిగి వాక్యమువద్దకు రమ్ము, సరియైన మీట నొక్కుము, చూడండి, మానవ-కల్పితమైన కృత్రిమ విద్యుత్తు దీపాలను వెలిగించడం ఆపివేయండి. ఆయన వాక్యము వైపునకు తిరిగి మరియు ఈ దినముయొక్క వాగ్దానమును చూడండి. మరియు పిదప వాగ్దానము ఏమైయున్నదో చూసి, మరియు అది గుర్తించబడుట కొరకు కనిపెట్టండి. అది ఋజువు చేయబడినప్పుడు, అప్పుడు మీరు వెలుగులో ఉన్నారా, లేదా అన్నది మీకు తెలుస్తుంది. వాగ్దానము ఏమిటో చూడండి.
141 పేజీలను త్రిప్పడం లేదా క్యాలెండర్లను మార్చడం కాలమును మార్చదు. చాలామంది ప్రజలు ఇట్లంటారు, “సరి, పాత సంవత్సరం గతించినది, ఇప్పుడా పాత డిశంబరు క్యాలెండరును పారవేయండి మరియు వేరొకదానిని అనగా, క్రొత్త సంవత్సరముది పెట్టండి.” అది, వారికి నూతన సంవత్సరములు అంటే అంతేయైయున్నది.
142 నా మట్టుకైతే, ఈ దినమునకై ఏమి వాగ్దానము చేయబడినదో నేను చూడగోరుచున్నాను. ఈ ఘడియయొక్క వెలుగు ఏమైయున్నదో నేను తెలుసుకొనగోరుచున్నాను, తద్వారా దానిలో ఎట్లు నడువవలెనో నేను తెలుసుకొనగలుగుతాను. నేనెక్కడ జీవిస్తున్నాననియు, నేను ఏ కాలములో ఉన్నాననియు, మార్గములో నేనెంతవరకు వచ్చాననియు నేను తెలుసుకొనగోరుచున్నాను.
143 పౌలు చెప్పినట్లు, మరలా నేను నిలబడి చెప్పగలను, “వెనకున్నవి మరచి, ఇప్పుడు ఆ ఉన్నత పిలుపును బట్టి, నేను గురియొద్దకు పరిగెత్తుచున్నాను,” ఆ సంపూర్ణ గుర్తింపునకు, యేసు వచ్చినప్పుడు, కాలమంతా నిత్యత్వములోనికి కలిసిపోవునట్టి దానివైపుకు పరిగెత్తుచున్నాను.
144 దావీదు చేసినట్లు చేయండి, మీ భవిష్యత్తును ఆయన చేతిలో పెట్టండి. మరి దేనివైపుకు చూడకండి, అయితే మీ…దావీదు ఇక్కడ ఇట్లన్నాడు, అతడు—ఇట్లు చెప్పెను, “నా కాలగతులు ఆయన చేతిలోనున్నవి.” దానిని ఎక్కడైతే మనము చదివియున్నామో, ఆ 62వ కీర్తనను ఇక్కడ గమనించండి, “నా కాలగతులు ఆయన చేతిలోనున్నవి. ఆయనే నా బండ.” ఆయన ఏమైయున్నాడు? “ఆయన నాకు బయలుపరచబడినాడు. ఆయన బయలుపరచబడిన సత్యమైయున్నాడు. నా కాలగతులు ఆయన వశములోనున్నవి.” ఆమేన్. ఓహ్, మై! అది విషయమైయున్నది.
145 నా సమయము ఆయనకు చెందియున్నది. నేను ఆయనవాడను. ఆయన కాలమును పట్టుకొనియున్నాడు గనుక నేను ఆయన చేతిలో ఉండియున్నాను. భవిష్యత్తు ఏమైయున్నదో నేనెరుగను, కానీ భవిష్యత్తును ఆయన పట్టుకొనియున్నాడని నేనెరుగుదును. కావున, ఆ భవిష్యత్తును పట్టుకున్నవాడే నన్ను పట్టుకొనియున్నాడు. కావున ఈ నూతన సంవత్సరం కొరకు దీనిని, దానిని ఆ మరొక దానిని, క్రమపరచుటను గూర్చి నేనెందుకొరకు ఆలోచించాలి? నేను కేవలం నన్ను నేను ఆయన చేతులకు అప్పగించుకొని, దేవుడే ఆ భవిష్యత్తును పట్టుకొనియుండెనని ఎరిగియున్నవాడనై, దావీదు వలె నడిచిపోవుదును, “నా కాలగతులు ఆయన చేతిలోనున్నవి.” భవిష్యత్తు ఏమైయున్నదో దావీదు ఎరుగకుండెను, కానీ ఆ భవిష్యత్తు దేవుడి చేతుల్లో ఉన్నదని అతడు ఎరిగియున్నాడు. భవిష్యత్తు ఏమైయున్నదో నాకు తెలియదు, మనలో ఎవరికిని తెలియదు. అయితే ఆ భవిష్యత్తు ఆయన చేతుల్లో ఉన్నదని మనము ఎరిగియున్నాము.
146 సహనము. సహనము. మనలో కొందరు అలా అవుతారు, మనలో కొందరు చాలా తొందరపాటులో ఉంటారు. చాలామంది మంచివారు కూడా ఆ విధంగా చేసారని నేను అనుకుంటున్నాను. మీరు చాలా—చాలా తొందరపడుతుంటారు. మీరు దానిని చూడగోరుదురు, మీ అంతట మీరే దానిని చేయగోరుదురు.
147 మరియు సేవక సహోదరులారా, నేను ఎప్పటినుండి మాట్లాడుచున్నానో, ఈ టేపును వినుచున్న మీకు తెలియును. ఇక్కడున్న ఈ చిన్న సంఘముతో మాత్రమే కాక, ప్రపంచవ్యాప్తంగానున్న ప్రజలతో నేను మాట్లాడుచున్నాను.
148 చాలామంది పురుషులు అసహనంతో బయటకు వెళ్తారు, అయితే సమయం సమీపించియున్నదని నమ్ముచూ, ఏదోఒకటి చేయుటకు మీయంతట మీరు ప్రయత్నము చేస్తారు. ప్రభువుపై వేచియుండుడి. సహనం ఒక మంచి గుణలక్షణమైయున్నది. మీరు సహనాన్ని కలిగియుండగలిగితే, అదొక సద్గుణమైయున్నది. మీరు గనుక…“యెహోవా కొరకు ఎదురుచూచువారు నూతన బలము పొందుదురు.” యెహోవాను దాటిపోవుటకు ప్రయత్నించువారు కాదు, “ప్రభువా, నేను దీనిని చేయాలని నీవు కోరుచున్నావని నేనెరుగుదును, మరియు దేవునికి మహిమ నేను…” అని యెహోవాకు చెప్పుటకు ప్రయత్నించువారు కాదు. ఆలాగు చేయకండి. ప్రభువు కొరకు వేచియుండండి. “యెహోవా కొరకు ఎదురుచూచువారు నూతన బలము పొందుదురు,” అని బైబిల్ గ్రంధము చెప్పుచున్నది.
149 రాబోవు రక్షకుని గూర్చిన తన వాగ్దానమును నెరవేర్చుటకు దేవుడు కొన్ని వేల సంవత్సరములు తీసుకున్నాడు. అయితే, గుర్తుంచుకొనుడి, అది ఎప్పుడు జరుగునన్నది ఆయనకు అన్నివేళలా తెలియును. చాలామంది ప్రజలు లేచి మెస్సీయవలె ఉండుటకు ప్రయత్నము చేశారు. మెస్సీయాలను ఉత్పత్తిచేయుటకు అనేక సంఘాలు ప్రయత్నము చేసినవి. అయితే దేవుడు తన మెస్సీయ కొరకు ఒక సమయమును నిర్ణయించి పెట్టెను. ఆయన ఎటువంటి తొందరపాటులో లేడు. చూశారా?
150 మరియు ఈ కాల వ్యవధిలో, ఆయన మెస్సీయ గూర్చి అనేక సాదృశ్యములను చూపించెను. ఆయన ఆదాము మొదలుకొని మెస్సీయ వరకు దానిని చూపించెను, అనగా మొదటి ఆదాము నుండి కడపటి ఆదాము వరకు; వారిలో ఒకరు లోకమునుండి మరియు మరొకరు పరలోకమునుండి, ఒకరు భూసంబంధి మరియు మరొకరు పరలోక సంబంధియై యుండెను, ఒకరు పరలోకము నుండి వచ్చెను మరియు మరొకరు భూమిమీద నుండి వచ్చెను. అయితే ఒక మెస్సీయను వాగ్దానము చేసెను, మరి ఆయన దానిని నెరవేర్చుటకు కొన్ని వేల సంవత్సరములు తీసుకొనెను.
151 ఆయన ఏమైయుండెనో సరిగ్గా యోసేపులో చూపించెను. యోసేపు ఆయనను ప్రతిబింబించెను.
152 దావీదు ఆయనను ప్రతిబింబించెను. దావీదు ఒక త్రోసివేయబడిన రాజుగా ఉండినప్పుడు, కొండ శిఖరము పైకి ఎక్కి మరియు వెనుకకు తిరిగి ఒక త్రోసివేయబడిన రాజుగా, యెరూషలేమును చూసి ఏడ్చినప్పుడు, దావీదులో ఉన్నది యేసేయైయుండెను. ఎనిమిది వందల సంవత్సరముల తర్వాత, ఒక త్రోసివేయబడిన రాజుగా ఆ యెరూషలేము పై నిలబడి, “యెరూషలేమా, యెరూషలేమా, కోడి తన పిల్లలను రెక్కల క్రిందికి ఏలాగు చేర్చుకొనునో ఆలాగే నేనును నిన్ను ఎన్నో మార్లు చేర్చుకొనవలెననియుంటిని, కానీ మీరు ఒల్లకపోతిరి,” అని ఆయన అనెను.
153 యోసేపును చూడండి, తన సహోదరుల మధ్య జన్మించినాడు, ఆ మూల పితరులు; చివరివాడు కాదు (చివరివాని కంటే ముందువాడు; బెన్యామీను చివరివాడు,) అయితే చివరివాని కంటే ముందువాడు, చూడండి, సరిగ్గా అతనికంటే ముందువాడైయుండెను. అతడు తన సహోదరుల చేత ద్వేషించబడెను, తన తండ్రిచేత ప్రేమింపబడెను. అతనొక ఆత్మ సంబంధియైన వ్యక్తియైయుండెను గనుక అతడు ద్వేషించబడెను. అతడు కలలకు అర్ధం చెప్పగలడు, అవి అక్షరాల వాస్తవమైయుండును. అతడు దర్శనములను చూడగలడు, సంభవింపబోవు సంగతులను ముందుగానే చెప్పగలడు. మరియు వారతన్ని ద్వేషించిరి. అతడు ముప్పై వెండి నాణెములకు అమ్మివేయబడినాడు.
154 వారు యేసును ఎందుకు ద్వేషించిరి? వారాయనను బయెల్జెబూబు అని పిలిచిరి ఎందుకనగా ఆయన వాక్యమైయుండెను, మరియు ఆ వాక్యము హృదయములలోని తలంపులను వివేచించగలదు. వారాయనను ద్వేషించిరి. మరియు ముప్పది వెండి నాణెములకు వారాయనను అమ్మివేసిరి.
155 అతను ఒక గోతిలోనికి త్రోయబడెను, యోసేపు చనిపోయినవానిగా పరిగణించబడెను. ఆయన మరణమును గుర్తింపచేయుటకు, తాను ధరించిన అంగీ అనగా సిలువ మీదనుండి తీయబడిన యేసు యొక్క రక్తపు వస్త్రమువలెనె, ఈయనయొక్క రక్తపు అంగీ కూడా విడిచిపెట్టబడినది. అయితే దేవుడు యోసేపుకు ఏమి చేసెను? ఆయన అతనిని ఆ గోతినుండి బయటకు తీసుకొనివచ్చి, ఫరోయొక్క కుడిపార్శ్వమున కూర్చుండబెట్టెను. మరియు ఏ మనుష్యుడైనను ఫరోను చూడలేరు కానీ యోసేపును మాత్రమే చూచెదరు. మరియు యోసేపు రాజభవనమును విడిచి వెళ్ళునప్పుడు, బూరలు మ్రోగుతూ మరియు “యోసేపు వచ్చుచున్నాడు గనుక, ప్రతి మోకాలు వంగవలెను,” అని ఒక ప్రకటన బయలువెళ్ళును.
156 యేసు విషయము కూడా అంతేయైయున్నది. గోతినుండి అనగా ఆయన చనిపోయిన చోటినుండి తీయబడెను, మరియు తిరిగిలేచి మహోన్నతుని కుడిపార్శ్వమున కూర్చొనియుండెను. “తండ్రియొక్క అద్వితీయ కుమారుడు తప్ప, ఏ మనుష్యుడును, దేవుడిని ఎన్నడూ చూచియుండలేదు. మరియు ఆయన అక్కడినుండి బయలుదేరినప్పుడు, బూరలు మ్రోగును మరియు ప్రతీ మోకాలు వంగును మరియు ప్రతీ నాలుక ఒప్పుకొనును.” చూడండి, ఆయన ఫలింపజేయు రాజైయున్నాడు. అప్పుడు ఐగుప్తు ఏమి చేసెనో చూడండి, ఒక కరువు రాగా, అది ప్రపంచమంతటినీ కాపాడెను. కావున, ఆ ప్రకారమే మనుష్యకుమారుని రాకడలో ఉండును. మోకాలు, ప్రతీ మోకాలు వంగును మరియు ప్రతీ నాలుక ఆయనను ఒప్పుకొనును.
157 ఆయన పూర్తిగా సాదృశ్యములలో చూపించబడెను, అయితే ఖచ్చితముగా ఆయన ఎప్పుడు వచ్చునన్నది దేవుడు ఎరిగియున్నాడు. తాను సరిగ్గా ఎప్పుడు వచ్చునన్నది ఆయన ఎరిగియుండెను. అంతకుముందు వారెంతమందిని కలిగియున్నా లెక్కలేదు గానీ, ఆయన తన మెస్సీయను కలిగియున్నాడు. రాబోవుదానిని ఆయన వారికి సాదృశ్యములుగా చూపించెను.
158 ఏమి సంభవించనున్నదని, ఆయన ఆ ఏడు సంఘ కాలములను మనకు చూపించినట్లే అది ఉన్నది. ప్రపంచమునకు చూపించడానికి దానియొక్క ప్రత్యక్షతలో, ఆయన అక్కడ ఆ వెలుగును పెట్టినప్పుడు, ఏమి సంభవించునని ఆయన చూపించెనో సరిగ్గా అట్లే ఉన్నది. ఆ కాలముగుండా అక్కడున్న ఆ ఏడుగురు వర్తమానికులను బయలుపరచుటకు ఆయన ఆ ఏడు దూతలను పంపి, మరియు ఆ వదిలిపెట్టబడిన వాటిని చూపించి, ఒకొక్క రోజు, ఒకొక్క దూత వచ్చి మరియు లూధర్ వదిలిపెట్టినవాటిని, వెస్లీ వదిలిపెట్టినవాటిని మరియు పెంతెకోస్తు వదిలిపెట్టినవాటిని బయలుపరచుచునప్పుడు, అదంతయూ అక్కడ ప్రదర్శించబడినది. మరియు సరిగ్గా ఈ గొప్ప షాలోమ్ యొక్క ఛాయ మరియు మాదిరిలోనేయై యున్నది, యెహోవా, యావె. చూశారా? ఖచ్చితంగా. దానిని ఆకాశములోకి విసిరెను, మరియు అదిగో యాంత్రిక నేత్రము దాని పటమును తీయడం జరిగినది. చూశారా? ప్రభువునకు ధన్యవాదములు!
159 షాలోమ్! సమాధానము! అలసిపోకుడి, యేసు ఇచ్చట ఉన్నాడు. ఆయనయొక్క గొప్ప వెలుగు మనయొద్దకు వచ్చెను, మరియు దానికై, అనగా ఆయనయొక్క వాక్యమునకై, ఆ గొప్ప మర్మమునకై మనము కృతజ్ఞతలు చెల్లించుచున్నాము, అవునండి. అప్పుడు చేసినట్లే అదే కార్యమును చేయుచు, ఈనాడు తనను తాను ప్రత్యక్షపరచుకొనుచూ ఆయన ఇచ్చట ఉండియున్నాడు. సరిగ్గా అట్లే చేయుచూ, అదే కార్యమును చేయుచున్నాడు.
160 మనము కాలపు జీవులమైయున్నాము. ఆయన నిత్యుడైన దేవుడైయున్నాడు. మనము మనకుమనమే తొందరపడుతుంటాము, ఏదైనా భిన్నంగా చేయుటకు మనము ప్రయత్నిస్తుంటాము, “ఓహ్, దీనిని చేయవలసియున్నది.” గుర్తుంచుకొనండి, దాని గూర్చి ఆయనకు అంతా తెలియును. అది ఎలాగైనా జరుగుతుంది. ఆయననే దాన్ని చేయనివ్వండి. కేవలం మిమ్మల్ని మీరు ఆయనకు అప్పగించుకొనండి.
161 పైకి చూడండి, మరియు ప్రభువుయొక్క ఆనందముతో ప్రకాశించుడి, ఈ దినమును చూచుటకు మీ కన్నులు తెరవబడినందుకు, మీరు భాగ్యవంతులైన ప్రజలైయున్నారని తెలుసుకొనండి. భవిష్యత్తు విషయమై ఆయనయందు నమ్మికయుంచండి. గడిచిన దినములలో ఆయన తన వాక్యమును నిర్ధారించుటను మీరు చూసియున్నారు. గతంలో తన వాక్యమును నిర్ధారించి, మరియు ఈ ఇతర కార్యములన్నియు సరిగ్గా మనము జీవిస్తున్న ఈ ఘడియకు, ఈ ఏడవ దూత వర్తమానం వరకు ప్రతీది ఖచ్చితంగా జరుగునట్లు చేసి, భూమి మీదను, ఆకాశములోను వాటిని చూపించి మరియు ఎలాంటి త్రొట్టుబాటు కలుగకుండునట్లు దానిని మూడు విధములుగా తెలియజేయబడునట్లు చేసిన ఆయనే, గుర్తుంచుకొనండి, తాను మరలా వస్తాడని ఆయన వాగ్దానం చేసియున్నాడు. హల్లెలూయా! ఆ వాక్యము తప్పకుండా నిరూపించబడుతుంది. రెండు వేల సంవత్సరాల ఎదురుచూపుతో, దేవునియొక్క వాగ్దాన వాక్యము ఉన్నది, ఆయన సమయానికి వచ్చేస్తాడు! అలసిపోకుడి, ఆయన ఇచ్చట ఉంటాడు. ప్రతీ కాలములో ఆయన తన వాక్యమును నిరూపించినట్లే, ఆ సంఘకాలములు మరియు ఏడవ వర్తమానము ద్వారా మన ప్రభువు బయలుపరచబడుట మరియు మొదలుగునవి అదే విషయమును చూపించుచున్నవి. దేవుడు దానిని బయలుపరచి, దానిని ప్రత్యక్షపరచి మరియు దానిని నిరూపించియున్నాడు. మరియు ఈనాడు మన మధ్యలో, ఆయన ఇక్కడ మనతో తనను తాను చూపించుకొని, మరియు ఆయన వాక్యమును నిరూపించి మరియు నిర్దారించెను. ఆయన అలాగే చేయును!
162 ఒక వెయ్యేండ్ల పరిపాలన ఉండును. అక్కడ వృద్ధులు సదా యౌవనస్థులుగా ఉందురు. వ్యాధి గతించిపోవును మరియు మరణము ఇకనూ ఉండదు. వారు ఇండ్లు కట్టుకొని, వాటిలో కాపురముందురు. వారు ద్రాక్షా తోటలు నాటుకొని మరియు వాటి ఫలములను అనుభవింతురు. వారు నాటుకున్న వాటిని వేరొకరు అనుభవించరు (అతని కుమారుడు దానిని తీసుకొనును), అతని కుమారుడు తనయొద్దనే జీవించును. అతడు నాటిన దానిని వేరొకరు తినరు, చనిపోగా వేరొకరు దానిని తీసుకొనరు; కానీ అతనే అక్కడ జీవించును. ఆమేన్. తోడేలు మరియు గొర్రెపిల్ల కలిసి మేయును. మరియు సింహము ఎద్దువలె గడ్డి తినును, మరియు ఒక బాలుడు వాటిని తోలును. అక్కడ—అక్కడ నిర్దోషత్వముండును. అక్కడ—అక్కడ—హాని చేయునది ఏదియూ అక్కడ ఉండదు. మనమిప్పుడు ఏమైయున్నమో దానిని నుండి, దేవుని అమర్తుడైన కుమారునియొక్క ఆ మహిమకరమైన రూపములోకి మనము మార్పు చెందుతాము. సంవత్సరములు ఆయనను ఎన్నడూ తాకలేవు, వయస్సు ఆయనను ఏమియూ చేయలేదు, అతడు దేవుని యొక్క అమర్త్యుడైన కుమారుడు. కావున మనము—మనము అంత్యకాలములో ఉన్నామని మనము ఎరిగియున్నాము. మనము కూడలివద్ద ఉండియున్నాము. ఈ కార్యములన్నియు పరిపూర్ణముగా గుర్తించబడినాయి, ఆ ప్రకారమే అది మరలా గుర్తించబడుతుంది.
163 ఇప్పుడు, భవిష్యత్తు ఆయన చేతిలో ఉన్నది. ఆయన ఎప్పుడు వచ్చునన్నది నాకెట్లు తెలియును? ఆయన ఎప్పుడు వచ్చును? నాకు తెలియదు, కానీ ఆయన ఇచ్చట ఉంటాడు. అది నిజం. ఫలాన మరియు ఫలానావి ఆయన ఎప్పుడు చేయును? శాపము భూమిని ఎప్పుడు వదిలిపోవును? దేవుని ప్రేమయొక్క ఈ ధన్యకరమైన ప్రతిబింబాలైయున్న, ఈ చెట్లు మరియు పువ్వులు మరియు మొదలుగునవి అమర్త్యముగా ఎప్పుడు పెరుగును? నాకు తెలియదు, కానీ అవి పెరుగును. మనుష్యుల హృదయములయొక్క ప్రతిబింబములన్నియు జీవించవలెనన్న కోరికతో ఉండుటయు, మరియు వైద్యశాలలు, వైద్యులు మరియు శస్త్రచికిత్సలు, ఏడ్పులు మరియు దుఃఖము, ఇవన్నియు ఆగిపోయి, యేసుతో ఒక వెయ్యి షాలోమ్ సంవత్సరముల, ఒక మహిమకరమైన పరిపాలన ఎప్పుడు జరుగును? అది ఎప్పుడు జరుగును? నాకు తెలియదు. అది అక్కడ ఉండునని ఆయన చెప్పెను. ఆయన దానిని ఎట్లు చేయబోవుచున్నాడో నేనెరుగను, అయితే నీతిసూర్యుడు తన స్వస్థత రెక్కలతో ఉదయించినప్పుడు ఆయనయొక్క పలుకబడిన మాట నిరూపించబడుతుంది. మరియు ఆ స్వస్థత విషయమైతే, ఎవరికైనా ఒక వ్యాధి వచ్చి మరియు అది వారియొద్ద నుండి తీసివేయబడుతుందని, మీరు అనుకున్నట్లు ఒక భౌతిక సంబంధమైన స్వస్థత ఉండదు. ఆయన ఇప్పుడు సాదృశ్యముగా చేయుచున్నది అదేయైయున్నది. అయితే జీవప్రాణియంతయు మార్చబడును! ఈ మర్త్యమైనది అమర్త్యతను ధరించుకుంటుంది. ఈ వృద్దాప్యము యౌవనములోకి దూకుతుంది. ఆమేన్. సరి, అదెట్లుండును? నాకు తెలియదు, కానీ అది అక్కడుండును.
164 నేను వృద్దుడనగుచున్నాను. ఈ ఏప్రిల్ 6వ తారీకును చూచుటకు ప్రభువు నాకు అనుమతించినయెడల అప్పుడు నేను ఈ సంవత్సరము, యాభై-ఐదు ఏండ్ల వృద్దుడనగుదును. అయితే నేను…నేను మరలా ఒక బాలుడిగా అవడానికి వెనుకకు వెళ్ళగోరడంలేదు. నేను ఏ ఉద్దేశ్యం కొరకైతే వచ్చానో, ఆ గురియొద్దకే నేను పరిగెత్తగోరుచున్నాను. ఇప్పుడు దాదాపు ముప్పై సంవత్సరాలుగా నేను ఈ ప్రసంగ వేదిక వెనుక నిలబడ్డాను, ఒక ఇరవై సంవత్సరాలు, దాదాపు ఇరువది-ఒకటి, ఇరువది-రెండు సంవత్సరాల చిన్న పిల్లవాడిగా ఉన్నప్పటి నుండి, నేను ఈ వర్తమానమును ప్రకటించుటకు ప్రయత్నించాను. మరియు నా శక్తినంతయు దానికై ధారపోసాను. నా భుజములు వంగిపోయినను, మరియు నా జుట్టు తెల్లబడి రాలిపోవుచున్నను నేను తిరిగి దానివైపు చూడను, నేను మరలా వాటిని పొందెదను. “నీ తల వెంట్రుకలలో ఒకటైనను నశించిపోదు మరియు అంత్యదినములలో నేను మరలా వాటిని లేపెదను,” అని ఎక్కడైతే దేవునియొక్క నిరూపించబడిన వాక్యం చెబుతుందో, ఆవలినున్న అట్టి దినముకొరకు నేను ఎదురుచూచుచున్నాను. ఆయన దానిని ఎట్లు చేయబోవుచున్నాడు? నాకు తెలియదు. కానీ నేను నమ్ముదును…
165 ఈ నూతన సంవత్సరము, అది దేనిని పట్టుకొనియున్నదో నేనెరుగను, కానీ ఆయన దానిని పట్టుకున్నాడని నేనెరుగుదును. అదియే ఈ నూతన సంవత్సరమునకు నా నిరీక్షణయైయున్నది. ఆయన వచ్చుచున్నయెడల, ఆమేన్. ఆయన రానియెడల, నన్ను బ్రతకనిస్తే నేనింకను పని చేయుచూనే ఉందును. భవిష్యత్తు గూర్చి నేను కేవలం ఆయనయందే నమ్మిక యుంచెదను. అదేమైయున్నదో నేనెరుగను, దాని కొరకు నేను కేవలం ఆయనయందే నమ్మిక యుంచెదను. ఆయన తన వాక్యమును నిరూపించుటను మీరు చూసియున్నారు, గనుక అది నెరవేర్చబడనైయున్నదని మీరెరిగియున్నారు. ఆయన వాక్యము!
“బ్రెన్హామ్ సహోదరుడా, దానిని నీవెట్లు పొందెదవు?” అని మీరు అనవచ్చును.
166 మంచిది, ఒక నిమిషము సరిగ్గా ఇక్కడ మీకొక ఆలోచనను ఇవ్వనీయండి. ఒక స్వరసమ్మేళనము అనగా ఏమిటో మీకు తెలియునా? మీకు తెలియునని నేనెరుగుదును. అది ఒక సంగీతము, అది ఒక నాటిక. చూడండి, వారు దానిని ప్రదర్శించెదరు.
167 చిన్న పిల్లలైన మీరు, ఇప్పుడు మీరు దానిని అర్ధం చేసుకొనెదరు. మీకు జ్ఞాపకమున్నదా—పాఠశాలలో, మీరు దీనిని కలిగియుంటారని నేను నమ్ముచున్నాను…ఈ చిన్న రష్యన్ సింఫోనీ, కొన్నిసార్లు వారు—వారు డ్రమ్ములపై ప్రదర్శించుదురు; దానిని ఏమని పిలుస్తారో మీరెరుగుదురు, అది…అడవుల్లో ఉన్న ఆ—ఆ చిన్న వడ్రంగి పిట్టను గూర్చియేగదా, మరియు వారు అటుఇటు తిరుగుచు; ఆ డ్రమ్ములను మరియు వాటిని వాయించుచుందురు. మరియు వారు దానిని వాయించుచుండగా, ఆ స్వర సమ్మేళనము ద్వారా వాటన్నింటిని మీరు వింటారు. నేను దానియొక్క పేరు మర్చిపోయాను, “పీటర్ అండ్ ది వుల్ఫ్”. అది సరియే, “పీటర్ అండ్ ది వుల్ఫ్”. ఇప్పుడు, అది—అదొక రష్యన్ వారి స్వర సమ్మేళనమైయున్నది. చూడండి వారు—వారికి చిన్న—ఆ చిన్న పక్షులు, అక్కడ శబ్దం చేయుచు ఎగరవు గాని, వారే ఆ డ్రమ్ముల మీద వాయించెదరు [సహోదరుడు బ్రెన్హామ్ ఒక చెక్కపై తట్టుచున్నాడు—సంపా.], మరియు పిదప [సహోదరుడు బ్రెన్హామ్ దేనినో తట్టుచున్నాడు], మరియు ఆ డ్రమ్ముల మీద వాయించుచు మరియు ఆ శబ్దములను మరియు మొదలుగునవి చేయుదురు. అది వాయించబడుతుంది, అది ప్రదర్శించబడుతుంది. తద్వారా, సహోదరుడు బ్రెన్హామ్ దేనిని చెప్పుటకు ప్రయత్నించుచున్నాడో మీకు అర్ధమవుతుంది. చూశారా?
168 ఇప్పుడు పెద్దలైన మీకు చెప్పుచున్నాను, లేఖనము దేవుని యొక్క స్వరసమ్మేళనమైయున్నది. అవును. హల్లెలుయా! కేవలం ఆ స్వరకర్తకి మాత్రమే వాస్తవంగా దాని అర్ధమేమిటన్నది తెలియును మరియు వినుచున్నవారికి, అనగా ఆ నాటిక ఏమైయున్నదని తెలుసుకొనుటకు ఆసక్తి కలిగియున్నవారికి ఆయన దానిని బయలుపరచును. అయితే మీరు మొదటిగా ఒక స్వరసమ్మేళనము గూర్చి తెలుసుకొనవలసియున్నది, చూడండి. అది కేవలం మీరు ఏదో చూచునటువంటిది కాదు, అది ఆ—ఆ వాక్యము, సంగీతము యొక్క కూడలిలు మారుటయైయున్నది. అది విసిరివేస్తుంది; కొంత సమయము అది కాసేపటి వరకు ఈ ప్రక్కగా వెళ్తుంది, ఒక ఫలానా తాళం వేయబడుతుంది, క్రొద్దిసేపటి తర్వాత అది మొత్తం మారిపోతుంది. అదేమైయున్నది? దానిని అర్దముచేసుకోలేని లేదా దాని గూర్చి అసలేమీ తెలియనివారై, దానియందు ఆసక్తి లేనివారైన మీకు, అది కేవలం ఒక పెద్ద ధ్వనిగాను, ఒక గలిబిలిగాను ఉంటుంది. కానీ దాని గూర్చి తెలిసినవారికైతే, వారు దాని కొరకు కనిపెట్టుచున్నారు, అది వచ్చుచున్నదని వారు ఎరిగియున్నారు. హల్లెలూయా!
169 కావున దేవుని వాక్యపు స్వరసమ్మేళనం యొక్క ఈ స్వరసమ్మేళనపు సమయాలను మనము కలిగియుంటాము, తద్వారా ఆ నాటిక మొత్తం మారుతుంది. మీరు ఎవరైతే ఆసక్తి కలిగియున్నారో, ఆ మార్పు కొరకు వినండి. అది సమీపించుచున్నదని మీరెరుగుదురు. ఆ డ్రమ్ములు ఏ విధంగా మ్రోగుచున్నవో మీరు వినుచున్నారు, ఆమేన్, ఏదో సంభవించుటను కోరుచున్నారు. ఇది ఒక మార్పు అని మీరెరిగియున్నారు, చూడండి, అది కొన్ని నిమిషాలలో ఒక ప్రేలుడులోనికి బ్రద్దలవ్వబోవుచున్నది. చూశారా? మరియు మీరు దాని కొరకు కనిపెట్టుచున్నారు గనుక, ఆ డ్రమ్ములు ఏ తాళములో మ్రోగుచున్నవో మీరు చెప్పగలరు. ఓ దేవా! ఇప్పుడు ఆ డ్రమ్ములయొక్క ముగింపును మీరు వినగలిగినట్లయితే, “మరియు అంత్య దినములలో ఈలాగున సంభవించును!’’ అని పరలోక వాక్యపు సంగీతముయొక్క ప్రతిధ్వని దానికదే పాడుటను, మీరు వినగలిగితే బాగుండును. దేవుడు ప్రదర్శించుచున్న తన గొప్ప నాటికయొక్క స్వరసమ్మేళనము, కూడలివద్ద ఆయనయొక్క స్వరసమ్మేళనము, ఆయనను మార్చివేస్తుంది. ఆ స్వరకర్త మరియు ఆసక్తి కలిగియున్నవారు, ఆ మార్పు కొరకు వింటారు. మనకు ఈ విషయమంతా దాని కొరకేయైయున్నది, మనం వినుచున్నాము, మనం కనిపెట్టుచున్నాము. ఆయన ప్రత్యక్షమైన ప్రతీసారి ఏదో జరుగుతుంది, సమయం సమీపించడాన్ని మనం చూస్తున్నాము. ఇటీవల కాలంలో ఆ సంఘకాలములు గీయబడినప్పుడు కూడా మనం చూశాము, మనం వినియున్నాము. అది సరిగ్గా వాక్యముతో ఉండుటను, ఆ వాక్యముతో తాళము వేయబడుటను మనం చూసియున్నాము. కొద్దిసేపటి తర్వాత ఏమి జరిగినది? స్వయంగా ఆయనే వచ్చి, మరియు దానిని నిరూపించెను.
170 “ఏడవ దూత పలుకు దినములలో,” అని వాక్యము చెప్పుటను మనం వినియున్నాము. సంఘకాలములో, “ఏడవ దూత యొక్క వర్తమానము చివరి వర్తమానముగా ఉంటుంది.” అని ఆయన చెప్పెను. మరియు పిదప, ఓహ్, ఇచ్చట ప్రకటన 10 లో మనమిట్లు కనుగొంటాము, “ఏడవ దూత యొక్క వర్తమాన దినములలో, దేవుని మర్మములు సమాప్తమగును,” ఆ ఏడవ ముద్ర దాని స్థానమునకు తీసుకురాబడుతుంది. అది అచ్చట ఉండవలసియున్నది. పిదప ఒక్కసారిగా, అది జరుగుచున్నప్పుడు, ఒక దర్శనము తెరవబడి, ఇట్లు చెప్పబడినది, “టూసాన్ కు వెళ్ళుము, ఈ సమయమున ఒక గొప్ప శబ్ధము సంభవించును తద్వారా నీవు స్ధిరముగా గ్రహించుచు మరియు అది పంపబడినదని ఎరుగుదువు. అది దాదాపు భూమిని కుదిపివేయును.” దాని గూర్చి మీరందరు ఎరిగియున్నారు. అది జరుగుటకు కొన్ని నెలల ముందే, అది టేపులో రికార్డు చేయబడినది. పిదప అది సంభవించినది! తర్వాత ఆకాశంలో అది ప్రత్యక్షమైనది. “షాలోమ్!” అదేమైయున్నది? అది ఆ స్వరసమ్మేళనం యొక్క తాళమును మార్చుటయైయున్నది.
171 పిదప ఒకసారి ఆయన మూడవ ఈడ్పును గూర్చి, ఈ ఒక్క విధానము ద్వారా అది ఎట్లు వచ్చుననియు, పిదప హృదయమును తెలుసుకొనుట ద్వారా, మరియు తర్వాత ఆ పలుకబడిన మాట ద్వారా అది ఎట్లు వచ్చునని ఆయన చెప్పెను.
172 “నేను తండ్రి యొద్దకు వెళ్ళుచున్నాను గనుక, మీరు ఇంతకంటే గొప్ప కార్యములు చేయుదురు,” అని యేసు చెప్పెను. యోహాను 14, “నేను చేయు క్రియలు మీరును చేయుదురు; నేను తండ్రి యొద్దకు వెళ్ళుచున్నాను గనుక మీరు వాటికంటె మరి గొప్పవియు చేయుదురు.” సరిగ్గా కొద్దిసేపటి క్రితం చెప్పినట్లే మరియ ఆయనని యోసేపు కుమారునిగా గుర్తింపజేయుటకు ప్రయత్నించినప్పుడు, ఆయన ఆమెను సరిచేసేను. ఆయన మాటలు తప్పిపోజాలవు! ఆయనట్లు చెప్పెను, “ఆకాశమును భూమియు గతించును గాని, నా మాటలు ఏమాత్రమును గతింపవు.”
173 ఆ స్వరసమ్మేళనం యొక్క తాళము మారుటను, మారబోవుటను మనము వినుచున్నప్పుడు, అది ఒక కూడలి సమయమైయున్నది. ఆయన తాళము వేయడం మొదలుపెట్టగా—మనము గమనించియున్నాము. మరియు, “నేను చేయు క్రియలను మీరును చేయుదురు. మరి గొప్పవియు చేయుదురు.” అని మనము చూసియున్నాము. “మరి గొప్పవి,” ఆయన దానిని వాగ్దానము చేసియున్నాడు. అది ఎట్లుండునా అని మనము ఆశ్చర్యపోయాము.
174 అయితే మీరు గమనించారా ఆయన తన మొదటి అద్భుతమును చేసినప్పుడు, ఆయన నీటిని తీసుకొని మరియు దానిని ద్రాక్షారసముగ మార్చెను. అది సరియేనా? ఆయన నీటిని తీసుకొనెను, మరియు అది ఏదో ఒక రోజు ద్రాక్షారసముగా మారుటకు సామర్ధ్యతను కలిగియుండవచ్చును, అయితే అది మొదట నీరైయున్నది.
175 మరియు ఆయన ఐదువేలమందికి ఆహారము పెట్టినప్పుడు, ఆయన ఏమి చేసెను. ఆ నీటి లాగానే ఆయన దేనినో తీసుకొనెను, ఒక గుడ్డు నుండి పుట్టినదై మరియు ఒకానొక సమయములో ఈదినటువంటి ఒక చేపను ఆయన తీసుకొనెను, మరియు ఆయన దానిని విరిచెను, మరప్పుడు అసలైన సృష్టియైయున్న దాని మీదుగా మరొక చేప ఎదిగెను. ఒక విత్తనమైయుండి మరియు ఒకానొక సమయంలో గోధుమయైయున్నటువంటి ఆ రొట్టెను ఆయన తీసుకున్నాడు, మరియు ఆయన విరువగా ఆ రొట్టెనుండి, కేవలం ఆ సృష్టము అధికమయ్యెను.
176 అయితే ఆ అడవులలో, ఒక ఉడతను చేయుటకు అచ్చట ఏమియూ లేకుండెను. దానిని కలుగజేయుటకు ఏదియు లేకుండానే, “కలుగును గాక,” అని పలుకగా అవి కలిగెను. అదేమిటి? అదే యేసు క్రీస్తు! చూశారా? “నేను నా తండ్రియొద్దకు వెళ్ళుచున్నాను గనుక, మీరు ఇంతకంటే గొప్ప కార్యములు చేయుదురు.” సృష్టించబడిన దేనినైనా తీసుకొని, దానినుండి దేనినో బయటకు తీసి మరియు ఒక సృష్టిని అధికము చేయుట కాదుగాని, ఖచ్చితంగా సృష్టించుటయేయైయున్నది. ఆయన ఆ వెనుక నిలబడి మరియు “కలుగునుగాక,” అని పలికి మరియు కలుగజేసిన అదే యెహోవాయైయున్నాడని అది చూపించుచున్నది. ఆయన వాక్యము ప్రత్యక్షపరచబడియున్నది! ఆయన భూమి మీద శరీరధారియైనప్పుడు ఆయన తన అసలైన సృష్టిని తీసుకొని, దానిని విరిచి, మరియు దానిని విస్తరింపజేసెను. అయితే ఇప్పుడు ఈ అంత్య దినములలో, ఆయన మరలా మన మధ్యకు వచ్చినప్పుడు, క్రిందకు వచ్చిన అదే వెలుగు ఇట్లు చెప్పెను, “వెలుగు కలుగును గాక,” చూడండి, ఆయన కేవలం సృష్టిని ఉనికిలోనికి పలికెను. “నేను తండ్రియొద్దకు వెళ్ళుచున్నాను గనుక ఇంతకంటె మరిగొప్పవి మీరు చేయుదురు.” గుర్తుంచుకొనుడి, మనమిట్టి సమయములయందు ఉండియున్నాము.
177 “అది ఒక పనికిమాలిన గుంపు” అని వారందురు గనుక లోకము దానిని గ్రహించదు. వారు మెథడిస్టులు కారు గనుక మెథడిస్టులు దానిని అర్ధం చేసుకోలేరు. వారు బాప్టిస్టులు కారు గనుక బాప్టిస్టులు దానిని అర్ధం చేసుకోలేరు. అది క్యాథలిక్ కాదు గనుక క్యాథలిక్ వారు దానిని గ్రహించరు. అది పెంతెకోస్తు కాదు గనుక పెంతెకోస్తువారు దానిని గ్రహించరు.
178 అయితే యెహోవా కొరకు ఎదురు చూచువారు, ఎవరైతే ఎదురు చూచుచున్నారో వారు! దాటిపోయిన ఆ నక్షత్రమునుగూర్చి ఎరిగినట్టి ఏ ఒక్క మనుష్యుని చరిత్రను, ఏ పరిశోధనాశాల నుండైనా మనము కలిగిలేము. అయితే ఆ జ్ఞానులు కొన్ని వందల మైళ్ళదూరం, రెండు సంవత్సరాల వరకు దానిని వెంబడించారు, వారు దానిని గమనించి మరియు దానిని వెంబడించిరి. నా భావమును గ్రహించుచున్నారా? అది ఆ స్వరసమ్మేళనం వినేవారి కొరకైయున్నది.
179 గుర్తుంచుకోండి, ఆ సంగీత దర్శకుడు ఆరంభమునుండే అంతమును ఎరిగియున్నాడు. దాని గురించి ఆయనకు అంతా తెలియును, ఆ కారణముచేతనే ఆయన దానిని ఇచ్చట సరిగ్గా వ్రాసియుంచగలిగెను. ఇప్పుడు మీరు ఆయనతో ప్రారంభించవలెను, మీరు ప్రారంభించవలెను. మీరు గనుక ఒక స్వరసమ్మేళనం వినగోరినయెడల, ఆ స్వరసమ్మేళనంలోని సంగీతమువలెనే మీరు ఆయనతో ప్రారంభించుడి. మీరు వినండి, అదేమీ చెప్తుందో మీరు ఎరుగుదురు, ఆ స్వరసమ్మేళనం ఏమైయున్నదో అది అదేయైయుండబోతుంది, పిదప మీరు ఆ సంగీతమును వినడం మొదలుపెడతారు. మరియు అదేమైయున్నదో మీరెరుగుదురు, కావున, “ఇచ్చటనే ఫలాన—ఫలాన కార్యములు సంభవించును, ఇప్పుడది మారవలసియున్నది,” అని సరిగ్గా మీరెరుగుదురు. ఇప్పుడు, అదేమిటో అస్సలు తెలియకుండా ఊరకే లోపలికి వచ్చి మరియు కూర్చున్న వేరెవరికైనా గాని…అది కేవలం ఒక బుద్ధిహీనపు గుంపువలె, గలగలమనే గోల వలె అనిపిస్తుంది. అయితే అదేమిటో తెలిసినవారికి మాత్రం, అది ఆ సంగీతమును వాయించినట్లుగాను, ఆ నోట్సు ప్రకారంగా డ్రమ్ములు మ్రోగించినట్లుగాను, అది—అది బూరలతో ఊదబడినట్లుగాను, తంబుర మీద మీటబడినట్లుగాను, ఫిడేలుతో వాయించబడినట్లుగాను, అది—అది ఆ బేసు డ్రమ్ము మీద వాయించినట్లుగాను, బూరల చేత మ్రోగించబడినట్లుగాను అది ఉంటుంది. ఆ సమస్తమును కలిసి తాళములో ఉంటుంది, మరియు అది—ఆ నాటికను మీ కళ్ళు మూసుకొని మరియు మీరందులో జీవించగలుగునట్లు చేస్తుంది. హల్లెలూయా!
180 మనమిప్పుడు జీవించుచూ, మారుచున్నటువంటి ఈ గొప్ప స్వరసమ్మేళనంలో, ఆయన వాక్యము తాళము వేయబడుటను మీరు చూసినప్పుడు, మానవుడు భూసంబంధమైన దృష్టికి తన మర్త్యమైన నేత్రములను మూసువేసి మరియు యేసుక్రీస్తు యొక్క సన్నిధిలో జీవించగలడు. మీరు ఆ స్వరసమ్మేళనంలో ప్రారంభించవలసియున్నది. మీరు ఆ స్వరసమ్మేళనంలో ఉన్నయెడల మీరు చేయగలిగిన ఒకేఒక్క విషయమేదనగా, మీరు ప్రారంభించినప్పుడు మీరు ఆ తాళములోనికి వెళ్లనారంభించెదరు. మీరు దేవుని విషయములో కూడా చేయవలసింది అదే. మీరు దూరంగా నిలబడి మరియు దానిని చూచుట కాదుగాని మీరు ఆ తాళములోనికి ప్రవేశించండి! మీరు దానిలోనికి ఎట్లు ప్రవేశించుదురు? మీరు ఆ వాక్యములో భాగమైనప్పుడు, దానిలోనికి అనగా, ఆ వాక్యము యొక్క తాళములోనికి జన్మించెదరు.
181 నాట్యములోనికి మీరు వెళ్ళాలంటే మీరు ఆ నాట్యములో భాగమైయుండవలసియున్నది. మీరు ఆసక్తి కలిగియున్న దేనిలోకైనా, ఒక బంతి ఆటలోనికి మీరు వెళ్ళాలంటే, మీరు ఆ బంతి ఆటలో భాగమైయుండవలసియున్నది.
182 దేవుని యొక్క స్వరసమ్మేళనంను తెలుసుకొనుటకు, మీరు ఆయన వాక్యములో భాగమైయుండవలసియున్నది. ఆయన యొక్క స్వరసమ్మేళనం మ్రోగుచున్నప్పుడు, కాలముయొక్క తాళములో మీరు నడిచిపోవుచున్నారని మీరు గ్రహించెదరు. ఈ అంత్య దినములలో మీరు దానికొరకు వేచి చూస్తున్నారు, “నేను చేయు క్రియలు మీరును చేయుదురు; వాటికంటె గొప్పవియు చేయుదురు.” ఓ, మై! కాలముయొక్క గొప్ప మార్పు. మనము ఆ తాళములోనికి, వాక్యముయొక్క తాళములోనికి ప్రవేశించుదుము. మనము జీవించుచున్న ఈ ఘడియలో ఆయన యొక్క ఉద్దేశ్యమును కనుగొనండి. ఏ విధంగా…ఆయన దానిని ఎట్లు చేయుచున్నాడో, దానియొక్క తాళములోనికి ప్రవేశించండి. మీరు వాక్యములోనికి ప్రవేశించినయెడల, ఆయన దానిని ఆరంభములో ఎట్లు చేసెనో మీరు కనుగొనెదరు, అప్పుడు ఆయన దానిని అన్నివేళలా ఎట్లు చేయుచున్నాడో మీరు తెలుసుకొనెదరు.
183 మొదటిసరిగా ఆయన తన వర్తమానమును, ఎట్లు పంపెను? ఆయన ఏమి చేసెను? ఆయన మత సంస్థలతో వ్యవహరించడు. ఆయన ఎన్నడూ చేయలేదు, కావున ఇప్పుడునూ ఆయన అట్లు చేయడు. మరి అందుచేతనే, ఆ సంఘసమైఖ్యల యొక్క తాళమును మీరు వినుచున్నట్లైతే, మీరు చీకటిలో ఉన్నట్లైయున్నది. అయితే మీరు వాక్యముయొక్క తాళమును వినుచున్నట్లైతే!
184 వారు యేసును ఎందుకొరకు చంపారు? “నీవు, మనుష్యుడవైయుండి, నిన్ను నీవు దేవునిగా చేసుకొనుచున్నావు”.
185 మూడు రకాల విశ్వాసులు మీద నా వర్తమానమును మీరు కలిగియున్నారు. ఎట్లైతే ఒకడు అచ్చట నిల్చొనియుండి…అక్కడ వేషదారులు ఉండియున్నారు, వారు నమ్మినట్లే నటించుచూ కొంతకాలము వరకు వెంబడించిరి. మరియు ఒక దినమున యేసు వారితో ఇట్లనెను, “పరలోకము నుండి వచ్చిన మనుష్యకుమారుడే, తిరిగి పరలోకమునకు ఎక్కుటను మీరు చూచినయెడల మీరేమి తలంచుదురు? నేను పరలోకమునుండి వచ్చియున్నాను, తిరిగి పరలోకమునకు వెళ్ళుచున్నాను.”
186 అంతేకాదు, “ఇది కఠినమైన మాట” అని చెప్పుచూ అనేకులు ఆయనను విడిచిపోయిరి.
187 పిదప ఆయనతో నడుచుచున్న ఆ డెబ్బదిమంది వేషధారులు అక్కడకు వచ్చిరి, వారేదైనా కఠినమైన దానిని ఎదుర్కొన్నప్పుడు, అది ఫలాన అని వారు చూడలేకపోయిరి…వారికి ఆ స్వరసమ్మేళనం తెలియదు. ఈ బాలుడే ఆ యెహోవా అను ఆ వాగ్దానమును వారెరుగకయుండిరి, “ఆలోచనకర్త, సమాధానకర్తయగు అధిపతి, బలవంతుడైన దేవుడు అని అతనికి పేరు పెట్టబడును,” మరియు, “నేను ఎక్కడినుండి వచ్చానో ఆ పరలోకమునకు నేను ఆరోహణమైనప్పుడు!” అని ఆయన చెప్పినప్పుడు,
188 “సరి” వారిట్లన్నారు, “ఇది కఠినమైన మాట. దీనిని ఎవడు గ్రహించగలడు? నీవు కేవలం మానవుడవని మాకు తెలుసు. మేము నీతో కలిసి తింటాము, నీతో కలిసి పడుకుంటాము, నీతో పాటు అడవులలో ఉన్నాము, నీతో పాటు జలముల వద్ద ఉన్నాము. సరి, నీవు కేవలం ఒక మానవ మాత్రుడవైయుండి, మరియు మనుష్యకుమారుడు తానెక్కడినుండి వచ్చెనో తిరిగి అక్కడికి వెళ్ళును అని అనుచున్నావా? నీవేమి చెప్పుచున్నావు? ఇది ఒక కఠినమైన మాట!” చూడండి, వారు ఆ తాళమును ఎరుగకయున్నారు. ఆయన ఆ—ఆ ఘడియయొక్క నిరూపించబడిన వాక్యపు వెలుగైయున్నాడు గనుక, ఆయన శరీరధారియైన దేవుడని, ఆ దేవుని వాక్యపు స్వరసమ్మేళనం యొక్క తాళమును వారెరుగకపోయిరి. వారు దానిని గ్రహింపకయుండిరి. “ఇది కఠినమైన మాట. దీనిని గ్రహించగలవాడెవడు?” అని వారన్నారు. మరియు వారు మరలిపోయారు. వారు ఆ తాళమును ఎరుగకయున్నారు, చూడండి.
189 పిదప అతడొక తప్పిదమును కనుగొనువరకు వేచియున్న, ఆ వేషధారి లేదా అవిశ్వాసియైన యూదా అచ్చటుండుటను మనము మరలా గమనించెదము. పిదప ఆయన శిష్యులవైపు తిరిగెను, కేవలం పన్నెండుగురు, మరియు యూదా వారిలో ఒకడైయున్నాడు, “మీరు కూడా వెళ్ళిపోవలెననియున్నారా?” అని ఆయన అనెను.
190 అప్పుడు పేతురు ఇట్లనెను, “ప్రభువా, మేము ఎవనియొద్దకు వెళ్ళుదుము? నీవే ఆ స్వరకర్తవైయున్నావు.” ఆమేన్. “అది ఎట్లు జరుగుచున్నదో నీకే తెలియును. నీవే నిత్యజీవపు మాటలుగలవాడవు. మేము ఎటువైపు తిరుగగలము? ఒక పరిసయ్యునిగా ఉండుటకు, లేదా ఒక సద్దూకయ్యునిగా, లేదా ఒక హేరోదీయునిగా గాని ఉండుటకు మేము తిరిగి వెళ్ళలేము” లేదా ఇంకేవిధముగానైనా ఉండుటకు మేము వెళ్ళలేము. “నీవే నిత్యజీవపు మాటలుగలవాడవు. మేము వెళ్ళడానికి వేరే ఏ స్థలము మాకు లేదు. మేము, మాకు మేముగా ఈ గొప్ప సంగీత కచేరిలో చేరియున్నాము. మేమిచ్చట ఉండియున్నాము, మేము వినుచున్నాము, మరియు మేము తాళములో ఉండియున్నాము. నీవే దేవుని కుమారుడవని, శరీరధారియైన యెహోవాయని మేము నమ్ముచున్నాము. మేము దీని విషయమై నిశ్చయత కలిగియున్నాము! ఈ గొప్ప పరీక్షలు మరియు శ్రమలు మరియు ఇబ్బందులు, మరియు మొదలగు సంగతులేమిటో మాకు తెలియదు, మరియు నీవేమో, నీవు ‘అర్పించబడుటకు వెళ్ళుచున్నావని’ మరియు దీనినంతటిని, దానినంతటిని, ఇతర విషయములను, మరియు ‘మూడవ రోజున,’ అని ఈ విషయములన్నిటినీ చెప్పుచున్నావు. మేము దానిని గ్రహింపకయున్నాము. అయితే, మేము దేవునియొక్క స్వరసమ్మేళనం వినుచు లోపల ఉన్నాము, మేము దానిలో ఒక భాగమైయున్నాము. మరియు తర్వాత ఏమి జరుగునో చూచుటకు మేము వేచియున్నాము, మరియు మేము నిన్ను అత్యంత సమీపంగా వెంబడించుచున్నాము.” ఓ, మై! నేను దానినే చేయగోరుచున్నాను. వాగ్దానము.
191 ఆయనెట్లు ప్రారంభించెను? సరిగ్గా ఆరంభంలో ఆయన చేసినట్లే చేసెను. చూశారా? ఆయన ఎన్నడూ తనయొక్క వర్తమానమును ఒక మతసంస్థకు పంపలేదు. ఆయన ఎన్నడును తన గుంపుకు ఒక వర్తమానమును పంపలేదు, ఆయన ఒక మనిషిని పంపెను. నోవహు దినములలో, అది నోవహుయై యున్నాడు. మోషే దినములలో అది మోషేయై యున్నాడు.
192 ఒకసారి ఇతరులు ఇట్లు తలంచి, వారు ఇట్లన్నారు, “సరి, సమాజంలో నీవొక్కడివే పరిశుద్ధునివన్నట్లు చేసుకొనుచున్నావు,” దేవుడు దానిని చూసెను.
193 మోషే ప్రభువుయొద్దకు వెళ్ళి, “నేను దీనిని చేసియున్నాను. ఏమి—నేనేమి చేయవలెను?”
194 ఆయన ఇట్లు చెప్పెను, “వారినుండి నీవు వేరగుము. ఆ మిగతా విషయమును నేను చూసుకొందును. నేను నిన్ను పంపియున్నాను. అది నా బాధ్యతయైయున్నది.” మరియు ఆయన భూమిని తెరువగా, అది కోరహును మరియు ఆ గుంపంతటిని మింగివేసెను. ఎల్లప్పుడూ అంతే.
195 యోహాను మరియు యేసు ఒకే సమయంలో ఉండవలసినవారు కారు. యేసు…యోహాను పైకి చూసినప్పుడు అతడిట్లనెను, “ఇప్పుడు నేను తగ్గవలసియున్నది, ఆయన హెచ్చవలసియున్నది. ఆయనే నిర్ధారించబడిన ఆ వెలుగైయున్నాడు.” ఆ విధంగానే పరిపూర్ణమైన నిర్ధారణ వచ్చుటను అతడు కనుగొనువరకు ఈ వెలుగు కూడా అట్లే కొనసాగును. అది సరి. అది నిజము.
196 ఆయన ఆరంభమున ఉన్నట్లుగానే ఉన్నాడు. మీరు ఆరంభించేది, దేవుడేమైయున్నాడని మీరు నేర్చుకొనుటను ఆరంభించేది ఆ విధంగానేయైయున్నది. ఆయన ఇచ్చట భూమి మీద ఉన్నప్పుడు ఏమి చేసెను? ఆయన ఎటువంటి జీవితమును జీవించెను? ఆయన ఏకీభవించాడా, ఆయన రాజీపడేవాడా? ఆయన మతసంస్థలకు వెళ్ళాడా? ఆయన తననుతాను ఎట్లు గుర్తింపజేసుకొనెను? “లేఖనములను పరిశోధించుడి! మీరు…వాటియందు మీకు నిత్యజీవము కలదని తలంచుచున్నారు గదా, మరి అవే నన్ను గూర్చి సాక్ష్యమిచ్చుచున్నవి.” చూడండి, ఈ రోజైనా లేదా ఏ కాలమందైనా అది ఆ విధంగానే ఉండియున్నది. మీకు వెలుగు కావాలంటే, ఈ ఘడియయొక్క లేఖనము ఏమి చెప్పుచున్నదో చూడండి. అది సరియే.
197 అటువంటప్పుడు, మీరెక్కడ ప్రారంభించెదరు? ఇక్కడ ఒక పాపి ఉన్నట్లైతే, ఆయనతోపాటు మీరెక్కడైతే మీకు మీరుగా మరణించారని పరిగణించుదురో అక్కడ ఆ సిలువయొద్ద ప్రారంభించుడి. అప్పుడు మీరు ఆ—గొప్ప నాటికలోనికి ప్రవేశించియున్నారు. మీరు వినుచున్నారు, పిదప, దానిని మీ చేతితో పట్టుకొనియుండగా మీ కాగితమును మీరు గమనించుచున్నారు, ఆ—ఆ—ఆ స్వరసమ్మేళనం. ఈ సంగతులను చెప్పునటువంటి ఒక కాగితమును మీరు—మీ చేతిలో కలిగియున్నారు, అట్లు ప్రదర్శించబడునట్లు ఆ సంగీతములో ఆ మార్పులు ఎక్కడ ప్రారంభమవుతాయో అది మీకు చెప్తుంది, అప్పుడు ఆ ప్రదర్శన ఏమిటో మీరు చూచెదరు. దేవుని ఆత్మ ప్రజల మీద కుమ్మరించబడి మరియు ఒక ఫలానా విషయమును చేయడం మీరు చూసినప్పుడు, మీరు వెనుకకు చూసి మరియు అదెచ్చట ఉండియున్నదో చూచెదరు. అది అదేనేమో చూడండి, ఈ దినమునకు అది అదే విషయమో కాదో చూడండి. అంతెందుకు, యేసు వచ్చినప్పుడు, వారు ఆ స్వరసమ్మేళనం యొక్క కాగితమును వారి చేతిలో కలిగియున్నారు. నిశ్చయంగా, వారు కలిగియున్నారు.
198 నేను ఆ పదమును సరిగ్గా పలుకుచున్నానా? సింఫోనియా? సింపతియా? నేను సరిగ్గా పలుకుతున్నానని ఆశిస్తున్నాను. ఆహ-హ. అయితే అప్పుడు నేనట్లు దాని గురించి ఆలోచించడం జరిగినది. సింఫోనీ? [సంఘములో ఎవరో, “సింఫోనీ” అని చెప్పుచున్నారు—సంపా.] సింఫోనీ. అది సరియేనా? మంచిది.
199 ఇప్పుడు, వారి చేతిలో వారొక కాగితమును కలిగియున్నారు, అయితే వారేమి చేయుదురు? ఇదివరకే ప్రదర్శించబడిన ఒక భాగము వైపుకు…ఆ వెనుకటి తాళమువైపు చూచుటకు ప్రయత్నించుచుండిరి. ఈనాడు సంఘములు చేసేది అదేయైయున్నది. వారు వెనుకకు చూస్తారు, లూథరు ఏ భాగమును వాయించాడో చూస్తారు; ఆ లూథరన్లు దానిని చేస్తారు. ఆ సంగీతములోని మార్పును వారెరుగరు. దేవుడు ఈ సంగతులను చేయుచుండగా ఈ దినమున ఆయన ఏమి చేయుచున్నాడన్నది ఆ లూథరన్లు, ఎరుగరు. పెంతెకోస్తు వారు ఇట్లందురు, “ఓ, మేము దానిని కలిగియున్నాము.” యాభై సంవత్సరాల క్రితం ప్రదర్శించబడిన కాగితమును మీరు కలిగియున్నారు. చూశారా? నిశ్చయంగా. మనమైతే కేవలం ఈ వాక్యమును మన చేతులలో ఉంచుకొని, మరియు ఆ మార్పులు ఎప్పుడు సంభవించునో గమనించుదాము, అప్పుడు మనమేమి చేయుచున్నామో మనకు తెలియును.
200 ఇప్పుడు, ఆ సిలువ వద్ద ఆయనతో ప్రారంభించుడి: “మారుమనస్సు పొంది, పాపక్షమాపణ నిమిత్తము యేసుక్రీస్తు నామములో బాప్తీస్మము పొందుడి; మరియు మీరు ఆ సంగీతమును, ఆ ఆదేశమును మీరు పొందుకొనెదరు,” చూడండి, “ఆయన వాక్యము, ఆ వాక్యమును ప్రత్యక్షపరచునట్టి ఆ పరిశుద్ధాత్మను పొందుకొనెదరు.” పిదప ఆ వాక్యముయొక్క తాళముతో దాని గుండా వెంబడించండి. ఆ ఘడియకు ఆ సంగీతము ఏ తాళము వేసినప్పటికినీ దానితో తాళము వేయండి. చూశారా?
201 చాలామంది ప్రజలు, “ఎందుకు?” అని అడిగారు. వారు అడిగారు, కొన్నిసార్లు నన్ను వారు ఇట్లు అడిగెదరు, “ఎందుకు? ఈ సంగతులు ఎందుకు సంభవించాలి? ఏమిటి, ఎందుకు, నాకెందుకు ఇది జరిగినది? నేను ఎందుకు ప్రారంభించానో మరియు ఇది జరిగినది, మరియు నేను—నేనిచ్చట ఈ శ్రమను కలిగియున్నాను, మరియు ఇది నన్నిక్కడ నిరాశపరచినది, మరియు నేను దీనిని ఇక్కడ కోల్పోయాను?”
202 కొన్నిసార్లు “ఎందుకు?” అని నేను అడిగాను. కేవలం ఒక యౌవన సేవకుడిగా ఉండగానే, మొదట ఆరంభించినప్పుడు, ఎందుకని దేవుడు నా భార్యను నాయొద్ద నుండి తీసుకొనెను, నా కుమార్తెను నా వద్దనుండి, నేరుగా నా హృదయములో నుండి తీసుకొనెను? ఆయన దానిని ఎందుకు చేసెను? నాకు తెలియలేదు ఇప్పుడు తెలియును. నేను కేవలం నా చేతిని ఆయన చేతిలో ఉంచి మరియు నమ్ముచునుంటిని.
203 ఆయన ప్రతి కూడలిని ఎరిగియున్నాడు. ఆ తాళమును…ఆ తాళము ఎప్పుడు సంభవించవలెనో ఆయన ఎరిగియున్నాడు. మిమ్మల్ని మలచుటకు ఏమి అవసరమో ఆయన ఎరిగియున్నాడు, ఆయన ఎటువంటి పదార్ధమును వాడనైయున్నాడో ఆయన ఎరిగియున్నాడు. చూశారా? దేవుడు నీతిమంతులైన వ్యక్తులను సాధువులుగాను మరియు ప్రవక్తలుగాను మలచునది కొన్నిసార్లు ఆ ఎడారియొక్క ఆవలి భాగమునేయైయున్నది. చూశారా? చూశారా? మరక్కడే మనుష్యులు కొట్టబడేది. మనుష్యులు వాక్యములో కొట్టబడెదరు. వారు ఆ సిద్ధాంతమును మరియు ఆ చెత్తంతటినీ వారిలో కలిగియున్నప్పుడు, వారిని వాక్యమునొద్దకు రానీయుడి మరియు దేవుడు దానంతటినీ నేరుగా వారిలోనుండి కొట్టును, సరిగ్గా దీనిలోనికి అనగా ఆయన వాక్యముయొక్క ఆ గొప్ప స్వరసమ్మేళనం లోనికి మలుచును. చూశారా? మరప్పుడు ఆ వాక్యము ముందుకు సాగిపోవుటను వారు చూచెదరు.
204 దానియొక్క తాళము ఎప్పుడు మారవలసియున్నదో దేవుడు ఎరిగియున్నాడు. ఆ తాళమెట్లు కొనసాగునో ఆయన ఎరిగియున్నాడు, అదెట్లుండునో నాకు తెలియదు గానీ ఆయన ఎరిగియున్నాడు. అదెట్లు వేయబడునో ఆయనకు తెలుసుగానీ, నాకు తెలియదు. అయితే నేను దానినిక్కడ చూసి, మరియు, “సరి, అది వచ్చుచున్నది” అని నేను చెప్పుదును.
205 “నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, అయితే వాటన్నింటినుండి దేవుడు వానిని విడిపించును.” చూశారా? తన వాక్యమును అదే తాళములో ఉంచుతూ, ప్రతి కాలములోను, ఆయన వాక్యపు వాగ్దానముయొక్క తాళముతో చరిత్ర గుండా దేవుడు కదిలి వచ్చెను, ఆదికాండము నుండి ప్రకటన గ్రంధము వరకును దేవుడు చరిత్ర గుండా కదిలి వచ్చినది ఆ ప్రకారమేయైయున్నది, ఆయన తన వాక్యముతోనే చరిత్ర గుండా కదలివచ్చెను. అది వాస్తవము, ఎన్నుకొనబడినవారికి ఆయన తన వాక్యమును నిరూపించుచు, పరిశుద్ధాత్మ శక్తి యొక్క తాళముతోనే వచ్చెను. గుర్తుంచుకొనండి, ఆయన సంఘము వెలుపటివారిని ఎన్నడునూ తాకలేదు. అది కేవలం ఎన్నుకొనబడినవారేయైయున్నారు.
206 ఆ యాజకులవైపు చూడండి, “ఈ మనుష్యుడు బయెల్జెబూబు. అతడు సోదె చెప్పువాడు, అంతెందుకు, అతడు—అతడు—అతడు వారి మనస్సులను చదువుచున్నాడు.” అని అన్నారు.
207 “దేవుని వాక్యము రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటెను వాడియైనదై, హృదయములోని తలంపులను వివేచించును,” అని వారసలు ఎరుగకుండిరి. మరియు ఆయనే ఆ వాక్యమైయున్నాడు.
208 అయితే ఆ దినమున ఒక బక్కెట్టు నీళ్ళు తెచ్చుకోవడానికి ఆ బావినొద్ద నిలబడిన ఈ వేశ్య మాత్రం, “నీవొక ప్రవక్తవని నేను గ్రహించుచున్నాను. మెస్సీయా రానున్నాడని మేము ఎరిగియున్నాము. కొన్ని వందల సంవత్సరాలు మాకు ప్రవక్తలు లేరు, కానీ మెస్సీయా రానున్నాడని మేము ఎరిగియున్నాము. మరియు ఆయన వచ్చినప్పుడు, ఆయన అదేయై ఉండబోవుచున్నాడు.” అని ఆమె చెప్పినది.
209 “నేనే ఆయనను” అని ఆయన చెప్పెను. అంతే చాలును. ఎందువలన? ఆ తాళము మ్రోగినది! ఆమె ఆ మార్పు కొరకు అనగా, ఒక సంఘ సంస్థ నుండి ఒక నిర్ధారించబడిన మెస్సీయా కోసం ఆమె ఎదురుచూచుచున్నది. మరియు, “ప్రభువైన దేవుడు నావంటి ఒక ప్రవక్తను మీలోనుండి లేపును” అని మోషే చేత పలకబడిన ఆ మెస్సీయా, ఇచ్చట నిలబడియుండెను. ఆయన అచ్చట ఉండియున్నాడు. ఆ తాళము మారిపోయినది, నిర్దారించబడిన ఆ విత్తనము దానిని గుర్తించినది.
210 మరియు నిర్ధారించబడిన, ఆ విత్తనము మీద దేవునియొక్క నిజమైన వాక్యము పడినప్పుడు, మరియు వాక్యముయొక్క నిరూపణను వారు చూసినప్పుడు, వారు దానిని గుర్తించెదరు. వారు వాక్యము వైపు చూచుచున్నారు, వారు ఆ కూడలిని ఎరిగియున్నారు, వారు కాలమును ఎరిగియున్నారు, వారు ఆ మార్పును ఎరిగియున్నారు, ఆ ఘడియలో ఉండవలసిన తాళమును వారెరిగియున్నారు. హల్లెలూయా! వారికి ఆ తాళము తెలిసియున్నది, వారికి ఆ సమయం తెలిసియున్నది, అది ఎట్లు ఉండవలసియున్నదో వారెరిగియున్నారు. చూడండి, ఎన్నుకొనబడినవారు మాత్రమే దానిని ఎరిగియున్నారు.
211 ఫిలిప్పు దానిని చూసినప్పుడు, అతడిక ఎంతమాత్రము నిలువలేకపోయెను, అది మెస్సీయానే అని అతడు ఎరిగియుండెను. కావున అతడు తనతో కలిసి బైబిలు అధ్యాయనం చేసే ఒక వ్యక్తియొద్దకు వెళ్ళెను. “నతానియేలు,” అతడిట్లనెను “వచ్చి, ఆ మనుష్యుని చూడుము. మేము ఏమి కనుగొన్నామో వచ్చి చూడుము, మేము నజరేయుడైన యేసును కనుగొన్నాము. నజరేయుడైన యేసుని మేము కనుగొన్నాము, తాను వస్తాడని మోషే చెప్పిన ఆ ప్రవక్త ఆయనేయైయున్నాడు. మేము ఆయనను కనుగొన్నాము. మేమాయనను కనుగొన్నాము.”
212 “అదెట్లు సాధ్యము? నేను కేవలం…ఆయన ఎచ్చట ఉన్నాడు?” అని అతడనెను. చూడండి, అతడు…చూడండి, అతడు ఆ తాళమును సరిగ్గా ఎరుగకుండెను. వారు అధ్యాయనం చేయుచున్నారు. అయితే తాను అక్కడికి వచ్చినప్పుడు, ఆయన అతనికి చెప్పెను, అతడిని ఆ వాక్యమునకు పరిచయం చేసెను.
213 మరియు అతను అక్కడికి వచ్చినప్పుడు, యేసు ఇట్లనెను, “ఇదిగో ఇతడు ఇశ్రాయేలీయుడు,” వెంటనే ఆ తాళము వేయబడటం ఆరంభమయ్యెను, ఆ వేదిక మీద లేదా ఆ నేలపైన, ఆ దినమున అచ్చట ఆ గొప్ప నాటిక ప్రదర్శించబడుచుండెను. బహుశా యేసు ఒక బండపై నిలబడి, ఆ ప్రజలతో మాట్లాడుచుండెను. మరియు ఫిలిప్పు, నతానియేలును వెంట బెట్టుకొని వచ్చినప్పుడు, ఆయన అతనిని చూచి, “ఇతడు నిజముగా ఇశ్రాయేలీయుడు, ఇతని యందు ఏ కపటము లేదు,” అని చెప్పెను.
“రబ్బీ, అసలు నన్ను నీవెప్పుడు ఎరిగియున్నావు?” అని అతడన్నాడు.
214 “ఫిలిప్పు నిన్ను పిలువక ముందే, నీవా అంజూరపు చెట్టు క్రిందనున్నప్పుడే, నేను నిన్ను చూసియున్నాను,” అని ఆయన చెప్పెను. ఓ, మై!
215 అతడు దానిలో భాగమైయున్నాడు! “నీవు దేవుని కుమారుడవు! నీవు ఇశ్రాయేలు రాజువు!” అని అతడన్నాడు. లోకముయొక్క ఆ—ఆ తాళములు ఏమైనప్పటికినీ లెక్కలేదు, మరియు—ఆ సంఘ సంస్థల యొక్క వారి సంబరాలన్నియు, అవి దేవునియొక్క స్వరసమ్మేళనం కావు. ఆమేన్. అతడిట్లన్నాడు, “నీవు ఇశ్రాయేలు రాజువు! నీవు అదేయైయున్నావు! నేను దానిని చూచుచున్నాను. నేను దానిని ఎరిగియున్నాను.” ఎందువలన? అతడు ఎన్నుకొనబడియున్నాడు. ఆ ఏర్పరచబడిన విత్తనము దానిని ఎరుగును అది, ఎల్లప్పుడూ ప్రతీకాలములో, వారు దానిని ఎరిగియున్నారు.
216 మీరిట్లు అనవచ్చు, “కానీ, బ్రెన్హామ్ సహోదరుడా, మా అమ్మ మరియు నాన్న విషయం ఏమిటి, నా జనుల విషయమేమిటి, నా సంఘశాఖ విషయమేమిటి, ఏమిటి—వారేమి చేయుదురు? వారు నన్ను బయటికి వెళ్ళగొట్టుదురు. అది…” నీవు ముందు చూడలేనియెడల, పైకి చూడుము. ఎలాగుననూ నీవు ముందుకు చూడ ప్రయత్నించకు, నీ చేయి ఆయన చేతిలో ఉంచుము. ఆయనే నిన్ను నడిపించనీయుము, ముందుకు చూడకు కానీ, పైకి చూడుము. నీవంటావు, “ఎందుకు—అంతెందుకు, నా పొడవైన జుట్టు గూర్చి, మరియు నేను పొట్టి దుస్తులు తీసివేయుట గూర్చి, మరియు నేను సంఘమును విడిచిపెట్టుట గూర్చి ఇతరులు నన్ను ఎగతాళి చేయుదురు.” హా! ఆయన నామము నిమిత్తము శ్రమపడుటయనునది, ఆయనయొక్క కృపలో ఎదుగుదల నొప్పులైయున్నవి. అవునండీ. ఆయన వాక్యము నిమిత్తము శ్రమపడుట, చూడండి, అది ఆయన కృపలో ఎదుగుదలకు నొప్పులైయున్నవి. అవునయ్యా! కేవలం గుర్తుంచుకొనండి, మీకు ఇవ్వబడినది దేవునియొక్క కృపయైయున్నది. ఓ, మై!
217 తనకు ఇబ్బంది కలిగించే, శరీర బలహీనతను తాను కలిగియున్నాడని పౌలు చెప్పినట్లే అది ఉన్నది, హల్లెలూయా. అతనికి…అపవాది—దెబ్బ మీద దెబ్బ వేయుచు, అతడిని నలగగొట్టుచునుండెను. మరియు దానిని తనయొద్ద నుండి తీసివేయమని, అతడు ముమ్మారు ప్రభువును వేడుకొనెను, “ఇది నాకు వద్దు ప్రభువా, దీనిని నా నుండి తీసివేయుము!” అని చెప్పెను.
218 మరియు పిదప ఒక రాత్రి ప్రభువు అతనితో మాట్లాడెను, సౌలా, లేదా, “పౌలు, నా కృప నీకు చాలును” అని చెప్పెను.
219 “అట్లైనచో నా బలహీనతలయందే నేను సంతోషించెదను. దానియందు నేను సంతోషించెదను. నీవు స్వస్థపరచువాడవని నేనెరుగుదును. నీవు రోగులను స్వస్థపరచుటను, మృతులను లేపుటను, దయ్యములను వెళ్ళగొట్టుటను, మరియు గ్రుడ్డివారి కన్నులు తెరచుటను నేను చూసియున్నాను. కానీ నేను నిన్ను వేడుకుంటే, నీ కృప నాకు చాలునని నీవు నాతో చెప్పియున్నావు, అటువంటప్పుడు నన్ను భాదించే ఈ అపవాది, అది—అది నీ కృపలో ఎదుగుదల నొప్పులైయున్నవి. కాబట్టి నేను నా బలహీనతలయందే సంతోషించెదను. ఎందువలన? నాకు కలిగిన ప్రత్యక్షత వలన నేను అత్యధికంగా హెచ్చిపోకుండు నిమిత్తము అది ఉంచబడినది,” అని అతడనెను. చూశారా?
220 చూడండి, అతడు—ఇతర శిష్యులు కలిగిలేని దేనినో అతడు కలిగియున్నాడు, అతడు ఆయనను మరణము, సమాధి, పునరుత్థానము మరియు ఆరోహణమైన తరువాత చూసెను. అతడు ఆయనను చూసెను. వారిలో కొందరిట్లన్నారు, “సరి, నేనాయనతో నడిచాను.” ఆ వీధిలో అందరు అట్లే చేసిరి. అయితే ఆయన చనిపోయి, పాతిపెట్టబడి, తిరిగిలేచి, మరియు ఆరోహణమై, ఒక అగ్నిస్తంభము రూపంలో తిరిగివచ్చిన తర్వాత, ఆయన పౌలుతో మాట్లాడెను. ఆ మిగతా వారెవరు కలిగియున్న దాని కన్నా ఇది గొప్పదైయున్నది. ఆమేన్.
221 “నేను హెచ్చించుకొని మరియు గొప్ప సెమినరీలు మరియు అటువంటివాటిని, మరియు గొప్ప ఇతరమైనవాటిని నిర్మించకుండునట్లు, నేను—ఈ ప్రత్యక్షతవలన అత్యధికంగా హెచ్చింపకుండునట్లు, నన్ను నలగగొట్టుటకు సాతానుయొక్క దూతకు దేవుడు అనుమతించెను” అని అతడనెను. అతడింకా ఇట్లన్నాడు, “నేనెప్పుడు బలహీనుడనో, అప్పుడే నేను బలవంతుడను.” ఆమేన్. ఆమేన్. కృపయొక్క ఎదుగుదల నొప్పులు! ఆమేన్. గంటా నలభై ఐదు నిమిషములు గడిచినది గానీ, మనము చాలాసేపు దాని మీద మాట్లాడుకొనగలము; మరియు—మరియు మనము ఆయన కృపయొక్క నొప్పులను భరించుచున్నాము.
222 ఓహ్, ఆయన ఆ క్లిష్టమైన పరిస్థితులను అనుమతించవచ్చును. ఆయన సేవకొరకు మనలను సంపూర్ణులుగా చేయునట్లు, మనలను పరీక్షించుటకై ఈ క్లిష్ట పరిస్థితులను ఆయన అనుమతించవచ్చును. ఇక్కడున్న సంఘమా, మరియు టేపును వినుచున్నవారలారా, ఆయన ఇప్పుడే దానిని అనుమతించవచ్చును. మన ఈ కూటమునకు కూడా క్లిష్ట పరిస్థితి కలుగునట్లు ఆయన అనుమతించవచ్చును.
223 ఆయన దానియేలుకు చేసినట్లేయైయున్నది. ఆయన ఒక దినమున దానియేలుకు ఒక చిన్న క్లిష్ట పరిస్థితిని కలుగజేసెను. అతడు బబులోనులో ఒక గొప్ప వ్యక్తియని మీకు తెలియును. ఆయన రాజును అతనికి వ్యతిరేకముగా మార్చి మరియు అతనిని సింహపు బోనులో పడవేయునట్లు చేసెను. అది కేవలం ఆయనను పరిపూర్ణునిగా చేసెను. నిశ్చయంగా చేసెను!
224 మండుచున్న అగ్నిగుండములోనికి హెబ్రీ పిల్లలు వెళ్ళునట్లు అనుమతించెను. వారాయన వాక్యము కొరకు నిలబడుటకు తీర్మానించుకొనిరి!
225 ఆయన వంకర మాటలను అనుమతించవచ్చు, పొడవైన జుట్టును కలిగియున్నందుకు మిమ్మల్ని చూసి వారిని నవ్వనీయండి, మీరు ఒక పరిశుద్ధ—గుండ్రాయిగా లేదా ఇంకా అట్లు ఎందుకు మారారని చెప్పినందుకు మిమ్మల్ని చూసి వారిని నవ్వనీయండి. అది బహుశా, వారు బహుశా మిమ్మల్ని నవ్వుల పాలు చేసెదరు…దానిని బట్టి వారు మిమ్మల్ని చూసి నవ్వవచ్చును, అది, అది, అది మంచిదే. అది ఒక క్లిష్టమైన పరిస్థితైయున్నది, అది ఒక చిన్న కూడలియైయున్నది. అది దేనినో ఋజువు చేయుటకైయున్నది.
226 చూడండి, ఆ క్లిష్టమైన పరిస్థితి వాక్యముపై నిలబడియున్న ఆ హెబ్రీ పిల్లలకు చేసిన ఒకే ఒక్క విషయమేదనగా, అది కేవలం వారి కాళ్ళకి మరియు వారి చేతులకు ఉన్న కట్ల నుండి వారిని విడిపించెను.
227 మరియు కొన్నిసార్లు లోకముయొక్క బంధకాలను మన నుండి బ్రద్దలు చేయడానికి కఠినమైన శ్రమలు అవసరమైయుండును. మీకు తెలియునా, కొన్నిసార్లు లోకము నుండి మిమ్మల్ని బయటకు తీయడానికి దేవుడు ఒక చిన్న శ్రమను అనుమతించి, మనమేమి చేయుదుమా అని చూచును. లేదా ఇంకో మాటలో చెప్పాలంటే, మీకొక చిన్న శ్రమను అనుమతించి ఆ మతసంస్థ నుండి, మరియు “మెథడిస్టువారు మాత్రమే, బాప్టిస్టువారు లేదా పెంతెకోస్తువారు లేదా వారు—ఆ గుంపువారు మాత్రమే దానిని కలిగియున్నారు. దానిని మా సంఘం నమ్మినట్లు నమ్మకపోతే, మీరసలు దానిని నమ్మనట్లే,” అనే ఆ ఆలోచన నుండి మిమ్మల్ని బయటకు వెళ్ళగొడతాడు. కొన్నిసార్లు ఆయన ఒక చిన్న శ్రమ కలుగుటకు అనుమతిస్తాడు. బహుశా ఒక వ్యాధిగ్రస్తురాలైన బిడ్డను మీరు కలిగియుండవచ్చును. సరిగ్గా మరణము సమయములో ఏదో సంభవించవచ్చును. బహుశా మీయొద్ద నుండి ఎవరైనా తీసివేయబడుట లేదా అటువంటిదేదో జరగవచ్చును. అది ఏమి చేయుటకైయున్నది? మిమ్మల్ని బయటకు విడిపించి, మీ కళ్ళు తెరిచి మీకు దేనినో చూపించుటకేయైయున్నది. కొన్నిసార్లు బహుశా నీవు విమర్శించడానికి వచ్చియుండవచ్చును. బహుశా ఈ టేపును నీవు కేవలం విమర్శించడానికే వినుచుండవచ్చును. మిమ్మల్ని బంధించియుంచిన ఈ లోకపు కట్ల నుండి మిమ్మల్ని విడిపించడానికే బహుశా దేవుడట్లు చేయుచుండవచ్చును.
228 నదిలో మునుగుచున్న ఒక వ్యక్తివలె అది ఉన్నది, ఆ మనిషిలో నుండి మీరు నీళ్ళు బయటకు తీయగలుగుటకు ముందు మీరు ఆ వ్యక్తిని ఆ నదిలో నుండి బయటకు తీయవలసియున్నది. అది వాస్తవం. మొదటగా మీరు అతనిని ఆ నదిలో నుండి బయటకు తీయవలసియున్నది, పిదప అతనిలో నుండి నీళ్ళను బయటకు తీయగలరు. కొన్నిసార్లు దేవుడు ఆ విధంగానే చేయవలసియుంటుంది. దానిని చేయుటకు ఆయన కూడలిలను, క్లిష్ట పరిస్థితులను అనుమతిస్తాడు. ఆయనయొక్క వాగ్దానములపై, వాక్యముపై నిలిచియుండుడి, ఏలయనగా అవి ఎన్నటికి తప్పిపోవు. భవిష్యత్తు అనేది, ఆయన చేతిలో ఉన్నది. వారు చేసినట్లే నిలబడండి, అసలు—అస్సలు వదిలేయకండి.
229 అబ్రహాము, తన క్లిష్ట పరిస్థితులలో, ఎచ్చటనుండైతే అతడిని పొందుకున్నాడో, అట్టి మృతులనుండి తన కుమారుడిని దేవుడు లేపగలడని ఎరిగియున్నాడు. అబ్రహాము తనయొక్క క్లిష్ట పరిస్థితికి వచ్చియుండెను. మరియు అతడు దేవుని నమ్మి మరియు దేవునియొక్క అద్భుతములన్నియు చూసిన తర్వాత, ఇరవై ఐదు సంవత్సరములు ఒక పిల్లవాని కొరకు, ఒక వాగ్దాన కుమారుని కొరకు అతడు వేచియుండెను, మరియు పిదప అతడు దేని కొరకైతే వేచియుండెనో, దానినే వెళ్ళి, బలిగా అర్పించమని దేవుడతనితో చెప్పెను. మై, ఓ, మై, ఎటువంటి సమయము! అయితే అబ్రహాము సందేహపడెనా? రోమా పత్రిక 4వ అధ్యాయం చదవండి, “అతడు రూఢీగా విశ్వసించెను” అని చెప్పబడినది. ఆమేన్. దేవుడు దేనిని వాగ్దానం చేసెనో, దానిని చేయుటకు దేవుడు సమర్ధవంతుడని అతడు రూఢీగా విశ్వసించెను. ఆమేన్. ఆయన ఆ క్లిష్టపరిస్థితిని అనుమతించెను. చూడండి, ఆయన మృతులను లేపగలడని అబ్రహాము ద్వారా మనకు చూపించుచుండెను.
230 “మృతులలో నుండి ఒకనిని పొందుకున్నట్లు నేను అతనిని పొందెదను,” అని అబ్రహాము అనెను. శారాయొక్క గర్భము మృతమైనది, శారా గర్భము మృతతుల్యమైనది; మరియు అతను, అతని శరీరము మృతతుల్యమైనది, అతడు ఒక వృద్ధుడు. బిడ్డకు ఆహారమిచ్చుటకు ఆమెకు పాల నరములు కూడా లేకుండెను. మరియు వారు…సరి, అచ్చట ఏమియూ లేకుండెను. మరియు అతడు స్వయంగా మృతతుల్యుడుగా ఉండెను, మరియు ఆమె గొడ్రాలైయుండెను. చూశారా? అసలక్కడ మార్గమే లేకుండెను. మరియు మృతులలో నుండి ఒకనిని పొందినట్లు ఆయన అతడిని పొందుకొనెను, అతడిట్లు చెప్పెను, “దేవుడు దానిని చేయగలిగినయెడల, దేవుడు ఇతణ్ణి మృతులలో నుండి కూడా లేపగలడు. ఎట్లనగా అదే దేవుడు బిడ్డ పుడతాడని నాకు చెప్పగా నేను నిలబడితిని మరియు అది జరిగినది, మరి ఆయనే మృతులలో నుండి అతణ్ణి లేపగలడు.” ఏలయనగా ఆయనను ప్రేమించువారికి మేలు కలుగుటకు ఆయన సమస్తమును సమకూడి జరిగించును. ఆమేన్.
231 అంత్య దినములలో ఈ సంగతులు జరుగునని దేవుడు వాగ్దానము చేయగా అది జరుగుటను మనము చూశాము! ఆయన ఒక కుమారుని వాగ్దానము చేస్తే, మరి ఆ కుమారుడు వచ్చెను; లేఖనము ద్వారా మనం చూస్తున్న ఈ కార్యములన్నింటిని ఆయన వాగ్దానం చేసినయెడల మరది నేరవేరగా, దానియొక్క తాళములోనికి మనము ప్రవేశించుదుము. అంత్య దినములలో ఈ సంగతులు జరుగునని ఆయన వాగ్దానము చేసెను, మరియు మనము దానిని చూచుచున్నాము. ఆయన యేసును పంపుదునని వాగ్దానం చేసెను. హల్లెలూయా! ఒక వెయ్యేండ్ల పాలన ఉండును! ఒక నూతన దినము ఉండును. సూర్యుడు ఇకనూ అస్తమించనటువంటి ఒక దినము ఉండబోవుచున్నది, ఏలయనగా…మనకిక దానితో ఎంతమాత్రము అవసరముండదు, ఎందుకనగా మనము వెళ్ళుచున్నటువంటి ఆ పట్టణమునకు గొర్రెపిల్లయే వెలుగైయున్నది. ఆమేన్.
232 ఒక నూతన దినము ఉదయించుచున్నది, ఇప్పుడు దానిని నా మీదంతటను నేను అనుభూతి చెందుతున్నాను. ఒక నూతన దినముయొక్క వెలుగు! అక్కడ రాత్రి లేదు, చీకటి, ఛాయలు లేవు, మబ్బులు లేవు, మసక, చీకటి మబ్బులు లేవు—లేవు, అర్ధరాత్రులు లేవు, సమాధులు లేవు, కొండ ప్రాంతములలో పువ్వులు లేవు, సమాధి కార్యక్రమములు లేవు, వైద్యులు లేరు, శవపేటికయు లేదు, అది అటువంటి ఒక దినపు వెలుగైయున్నది. ఆమేన్. నేను—నా అంతరాత్మ మీదుగా ఆయనయొక్క ఆ—ఆ కాంతి కిరణములు ప్రకాశించుటను నేను అనుభూతి చెందుచున్నాను. నూతన దినము! పాతది తొలగిపోవుచున్నది.
233 నా శరీరముగుండా ఈ మర్త్యమైన రక్తము ప్రవహించుటను నేను అనుభూతి చెందుతున్నట్లే, దాని వెనుకనే “లెమ్ము, తెజరిల్లుము,” అని పరిశుద్ధాత్మ యొక్క ఉప్పెన వచ్చుటను నేను అనుభూతి చెందుచున్నాను.
234 ఏదో ఇట్లు చెప్పెను, “బిల్లీ బ్రెన్హామ్, నీవు వృద్ధుడవగుచున్నావు, నీవు బలహీనుడవగుచున్నావు, నీ భుజములు వంగిపోవుచున్నవి, నీ తలవెంట్రుకలు తెల్లబడుచున్నవి, మరియు రాలిపోవుచున్నవి.” అది నిజము. మరియు భూమిని చీకటి మరియు కటిక చీకటి కమ్మియున్నది!
235 “కానీ లెమ్ము, మరియు తెజరిల్లుము!” ఆయనలో నన్ను నూతన సృష్టిగా చేసినటువంటి యేసుక్రీస్తు యొక్క మహిమకరమగు సువార్త వెలుగు యొక్క ఆ ఉప్పెన అచ్చట పడుటను నేను అనుభూతి చెందుచున్నాను. నేను ఆ దినము కొరకు అనగా, ఆ నూతన దినము కొరకు చూచుచున్నాను, ఆమేన్. భవిష్యత్తు ఏమిటో నేనెరుగను. అది ఏమి పట్టుకొనియున్నదో, 1964, నా కొరకు ఏమీ పట్టుకొనియున్నదో లేదా ఇంకేమో నాకు తెలియదు, కానీ నిత్యుడైయుండి, నిత్యత్వమును పట్టుకొనియున్న ఆయన చేతిని నేను పట్టుకొనియున్నాను. ఆమేన్.
236 దేవుడు అతనిని మరలా లేపగలడని అబ్రహాము ఎరిగియున్నాడు, కావున అతడు ఆయనను నమ్మెను.
237 కావున, ఈ నూతన సంవత్సరము కొరకు, ఇతర కాలములలో వారు (ఏర్పరచబడినవారు) చేసినట్లే, ఆయన వాక్యముతోను మరియు అది వాగ్దానము చేసిన దానితోను నిలబడుటకు నిశ్చయించుకొనుడి. ఈ అంత్య దినములలో మీ పైన ప్రకాశించుచున్న ఆయన పరిశుద్ధాత్మ యొక్క ప్రత్యక్షతయైయున్న, యేసుక్రీస్తు యొక్క ఆ వెలుగును మీరు చూసియున్నారనే అనుభూతిని మీరు కలిగియున్నట్లయితే, మరి గుర్తుంచుకొనండి, గుర్తుంచుకొనండి, ఆయన చేసిన దానితో నిలబడండి, మీరు ఏర్పరచబడినవారిలో ఒకరైయున్నారు; మరియు అతను అనగా, ఇతర కాలములో ఏర్పరచబడినవారిలో, అబ్రహాము వలెనే, అతడు దానిని చూసినప్పుడు, అది శాస్త్రీయ ఋజువంతటికీ వ్యతిరేకముగా ఉండెను. నోవహు దానిని చూసెను, మరది శాస్త్రీయ ఋజువంతటికీ వ్యతిరేకముగా ఉండెను. మోషే దానిని చూసెను, మరది శాస్త్రీయ ఋజువంతటికీ వ్యతిరేకముగా ఉండెను. గడిచిపోయిన ఈ తెలివైన యుగములలో; దానిని చూసిన ఏర్పరచబడినవారు మాత్రం, స్థిరముగా నిలబడిరి! ఆమేన్.
238 మరియు భవిష్యత్తు కొరకు, మనము వాగ్దానముపై స్థిరంగా నిలబడుదాము. దేవుడే దానిని చేసెను, గనుక దానిని చూసుకొనుట దేవుని వంతైయున్నది. నేను కేవలం ఆ తాళమును వెంబడించుచున్నాను. అది కాలమును తట్టి, “ఇది భూమి మీద విలియం బ్రెన్హామ్ యొక్క ముగింపైయున్నది,” అని చెప్పినట్లయితే, అప్పుడు నేను ఆ తాళముతో వెళ్ళుదును. పిదప మరలా నేను ఆ తాళముతో లేచెదను. హల్లెలూయా! దానిని లోపలికి తట్టువాడు, దానిని బయటకు తట్టును, మరలా దానిని లోపలికి తట్టును. అది దేవుని యొక్క తాళమైయున్నది, “అంత్యదినములలో నేను వాని లేపుదును. నాయందు విశ్వాసముంచువాడు నిత్యజీవము గలవాడు. నా మాట విని నన్ను పంపినవానియందు విశ్వాసముంచువాడు, నిత్యజీవము గలవాడు; మరియు వాడు ఎన్నడూ తీర్పులోనికి రాక, మరణములో నుండి జీవములోనికి దాటియున్నాడు.” నేను ఆ వాక్యము యొక్క తాళమును వెంబడించుదును. ఆమేన్. నా హృదయముయొక్క తాళమును కాదండి; ఆ వాక్యముయొక్క తాళమును! అదేమైయున్నాగానీ నా హృదయం వాక్యముతో తాళము వేయబడనట్లైతే, అప్పుడు నా హృదయము తప్పైయున్నది. ఆమేన్. ఎట్లనగా, ఆయనే ఆ వాక్యమైయున్నాడు! ఆమేన్. దేవుని వాక్యమైయున్న బైబిల్ గ్రంధము దానిని మనకు చెప్పుచున్నది.
239 కాసేపటి క్రితం ఒక కార్యక్రమము వచ్చుచుండగా, బిల్లీ మరియు నేను వినుచుంటిమి. మరియు అది ఈ బైబిలు…ఆ—ఆ ఘడియ ప్రవచనమని పిలవబడుతుంది, ఆ ఘడియయొక్క…దానిని ఏమని పిలుస్తారు? ఏదో ప్రవచనము గూర్చి ఉంటుంది. వాయిస్ ఆఫ్ ప్రాఫసి. నిజంగా, అది సెవెంత్-డే అడ్వెంటిస్టులైయున్నారు. వారికి నాలుగు లేదా ఐదు భిన్నమైన పేర్లు కలవు. వారు ప్రారంభించినప్పుడు మిలేరైట్స్ అనే పేరు కలిగియున్నారు.
240 నేను యేసుక్రీస్తునని చెప్పుకొనుచున్నాననియు, ఆ—ఆ పరిశుద్దుడగు తండ్రి, ఆ అగ్నిస్తంభము నాపై ఉన్నదనియు, మరియు నేను యేసుక్రీస్తునని చెప్పుకొనుచున్నానని అచ్చట ఒక కూటములో చెప్పినది వారేయైయున్నారు. వారి చిన్న కూటములో నా స్నేహితుడొకడు అచ్చట నిలబడియుండటం జరిగినది, అతడు పైకి లేచి మరియు ఇట్లన్నాడు, “మీరు దానిని ఋజువు చేయవలసియున్నది, ఎందుకనగా నేను సరిగ్గా ఆయనను ఇక్కడికి పిలుస్తాను. ఆయన ఒక్కసారైనా దానిని ఒప్పుకుంటాడా అని మీరు చూడవలెనని నేను కోరుచున్నాను,” చూడండి, మరి ఆ విధంగా జరిగినది. అతడు భూమి మీదనున్న భిన్నమైన సిద్ధాంతములు మరియు అట్టి సంగతుల గూర్చి మాట్లాడుచుండెను.
241 వారికి తెలియును. ఒకసారి ఈ సబ్బాతు ప్రశ్న మీద వారితో నాకు ముడిపడినది. వారు గతించిపోయిన ఆ పాత దినమును పాటిస్తున్నారు. పరిశుద్ధాత్మయే మన సబ్బాతు, పరిశుద్ధ గ్రంధము ఆ విధంగా చెప్పెను, “ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు సబ్బాతు కలుగజేతును.” ఒక “దినము” కాదు. పౌలు ఇట్లు చెప్పెను, “దినములను ఆచరించుచున్న వారలారా, మిమ్మును గూర్చి నేను భయపడుచున్నాను.” చూడండి, అది నిజము. అవునండీ. “ఒక విశ్రాంతి అనేది నిలిచియున్నది,” హెబ్రీ పత్రిక 4, “దేవుని ప్రజలకు విశ్రాంతి-నిలిచియున్నది. ఏలయనగా దేవుడు తన కార్యములను ముగించి విశ్రమించిన ప్రకారము, ఆయనయొక్క విశ్రాంతిలో ప్రవేశించిన మనము కూడా, మన కార్యములను ముగించియున్నాము.”
242 అయితే కాసేపటి క్రితం వారియొక్క ప్రసంగికుడు, అది మంచి కార్యక్రమమే, వారికి వ్యతిరేకముగా నాకేమియూ లేదు. వారికి సహాయము చేయుట కొరకు నేను చేయగలిగిన దేనినైనా చేయుదును. వారట్లన్నందుకు నేను నిరభ్యంతరంగా క్షమించెదను, ఎందుకనగా వాస్తవం కాని దానిని వారు చెప్పియున్నారు. అయితే అది సరియే. వారి సిద్ధాంతము సరిగ్గా యెహోవా సాక్షులు మరియు క్రిస్టియన్ సైన్స్ మరియు ఈ ఇతర సిద్ధాంతముల వలెనె ఉన్నది, మీరు చూడండి, అదే విషయం. అయితే గమనించండి, వారు కేవలం ఇతర సంఘ సంస్థల వలెనె ఉన్నారు, తక్కిన వారికంటె వీరిది తప్పేమి కాదని నేననుకొనుచున్నాను. వాక్యమెల్లప్పుడు వాస్తవమైయున్నది, చూడండి, అది సత్యమని దానికది ఋజువు చేసుకుంటుంది. గమనించండి.
243 ఆ వ్యక్తి, తాను మాట్లాడుచూ ఇట్లు చెప్పెను, “మనము ఈ సంవత్సరపు-పుస్తకమును కలిగియున్నాము.” ఈ రచయత, ఓ, అతని పేరు ఏమిటి, దానియొక్క ప్రసంగికుడు? ఖచ్చితంగా అతని పేరేమిటో నేనిప్పుడు మర్చిపోయాను. అతడు ఇటీవల కాలంలో సీయటిల్ లోని వరల్డ్స్ ఫెయిర్ వద్ద క్రైస్తవ వ్యాపారవేత్తల తరపున మాట్లాడెను. మరియు అతడు—అతడు, “ఈ మనుష్యుడు ఈ పుస్తకమును వ్రాసియున్నాడు, ఈ సంవత్సరంలో అదొక అసాధారణమైన పుస్తకమైయున్నది,” అని ఆ వ్యాఖ్యాత చెప్పెను. నేను దానిని అంగీకరించను.
244 ఈ సంవత్సరము కొరకైన పుస్తకము బైబిల్ గ్రంధమైయున్నది! అది లోకమునకు వెలుగైయున్నది. అది స్వయంగా దేవుడే. మన బుక్-ఆఫ్-ది-ఇయర్ అనగా ఈ సంవత్సరముయొక్క పుస్తకము బైబిల్ గ్రంధమైయున్నది. ఈ 1964 కొరకు, మన పుస్తకము బైబిల్ గ్రంధమేయైయున్నది. మరియు ఆ రానున్న మిగతా సంవత్సరములన్నింటిలో, మన పుస్తకం బైబిల్ గ్రంధమేయైయున్నది. గడిచిన సంవత్సరములన్నింటిలోను, అది గడిచిన సంవత్సరములకు పుస్తకమైయున్నది, రానున్న సంవత్సరములయొక్క పుస్తకమైయున్నది, మరియు అది నిత్యత్వపు పుస్తకమైయున్నది. అది దేవుడేయని అది బయలుపరచుచున్నది. అవును. అది దేవుడిని బయలుపరుచును. రానున్న ప్రతీ సంవత్సరమునకు, అది ఆ సంవత్సరపు-పుస్తకమైయున్నది. ఎప్పుడైనా—బైబిల్ గ్రంధము దేనినైనా చెప్పుటను మీరు విన్నప్పుడల్లా, దానియొక్క వాగ్దానము నిరూపించబడుతుంది. ఏదో ఒక దినమున ఒక నిత్యుడైనవాడు వస్తాడు. యేసు వచ్చునటువంటి ఒక దినము కలదని బైబిల్ గ్రంధము చెప్పుటను మీరు విన్నప్పుడు, మనకు ఈ వాగ్దానమునిచ్చినది, బైబిల్ గ్రంధమేయైయున్నది. మరియు ఇప్పుడు నేను ఈ రోజు చెప్పినట్లుగా…
245 నేను ముగించవలసియున్నది, ఎందుకనగా నేను—నేను దాదాపు రెండు గంటలపాటు ఇచ్చట ఉండియున్నాను, సరిగ్గా దాని వైపు చూడండి.
246 చూడండి, రాబోవు ఈ—ఈ సంగతుల గురించి బైబిల్ గ్రంధము మనకు చెప్పినయెడల, అది మనం దాటి వచ్చిన—ఈ ఘడియలన్నిటి గూర్చియూ చెప్పును, నోవహు దినములను గూర్చి ముందుగానే చెప్పబడినది, ఈ ఇతరుల దినములన్నింటి గూర్చి లేఖనం ముందుగానే చెప్పినది, మార్టిన్ లూథర్ యొక్క దినముల గూర్చి ముందుగానే చెప్పబడినది, వెస్లీ దినముల గూర్చి పెంతెకోస్తు దినముల గూర్చి, మనం జీవిస్తున్న ఈ ఘడియ గూర్చి ముందుగానే చెప్పబడినది, అది చెప్పినట్టుగానే ప్రతీది సరిగ్గా అట్లే జరిగెను, మరప్పుడు…అదేమైయున్నది? అది దేవుని చేత నిర్దారించబడిన, దేవునియొక్క పలుకబడిన మాటయైయున్నది, మరది దానిని ఆ ఘడియయొక్క వెలుగుగా చేయుచున్నది. చూడండి. సూర్యునివలెనె అది ఉన్నది. వాక్యము ఎప్పుడైతే, నిరూపించబడుతుందో అప్పుడు స్వయంగా ఆ వాక్యమే అది చెందియున్న కాలమునకు వెలుగవుతుంది. చూడండి. అది నిరూపించబడినప్పుడు, అది ఆ ఘడియయొక్క వెలుగవుతుంది.
247 యోహాను వెలుగైయుండెను, అతడు—అతడు ఏలియా మరియు ఇతరులు కలిగియున్న దానికంటే అతడు ఎక్కువ వెలుగైయ్యుండెను. ఏలియా. అతడు ఏలియాయొక్క వెలుగు కాదుగానీ, అతడు మరొక రూపంలో ఉన్న ఏలియాయైయుండి, ఒక-నిర్ధారించబడిన వెలుగైయున్నాడు. చూడండి, అతడైయ్యుండెను. మరియు యేసు వచ్చినప్పుడు, ఆయన ఇట్లు చెప్పెను, “అతడు కొంతకాలం మట్టుకు మండుచూ ప్రకాశించుచున్న వెలుగైయుండెను. మీరాయన వెలుగులో నడుచుటకు ఇష్టపడితిరి.” చూశారా?
248 మరియు యోహాను ఇట్లనెను, “ఇప్పుడు నేను తగ్గవలసియున్నది. ఇప్పుడు నేను వెళ్ళవలసియున్నది, నా వెలుగు ప్రకాశించడం ముగిసినది. నేను వెళ్ళవలెను. ఆయన హెచ్చవలసియున్నది. ఆయనే వెలుగైయున్నాడు.”
249 ఆయనిట్లు చెప్పెను, “నేను లోకమునకు వెలుగైయున్నాను.” ఆమేన్. అది నిజము. “ఆయన నిన్నా, నేడు మరియు నిరంతరం ఒకటే రీతిగా ఉన్నాడు.” మరియు ఆయన ఇంకనూ లోకమునకు వెలుగైయున్నాడు. మరియు ఆయన ఏమైయున్నాడు? “ఆదియందు వాక్యముండెను మరియు ఆ వాక్యము దేవునియొద్ద నుండెను.” ఎందువలన ఆయన లోకమునకు వెలుగైయున్నాడు? ఆయన వచ్చి, తాను మెస్సీయానని చెప్పుకొని, మరియు మెస్సీయా ఏమి చేయునని బైబిల్ గ్రంధము చెప్పెనో, ఆయన ఆ ప్రకారము చేయనియెడల, అప్పుడాయన లోకమునకు వెలుగుకాదు. చూడండి, దానిని లోకమునకు వెలుగుగా చేయునది ఆ-నిరూపించబడిన వాక్యమేయైయున్నది.
250 మరియు మనమిప్పుడు జీవించుచున్న ఈ ఘడియలో, ఈ ఘడియయొక్క నిర్దారించబడిన వాక్యం! పెంతెకోస్తువారలారా, మీరు, “అది భాషలతో మాట్లాడుటయైయున్నది”, మరియు అటువంటిది అని చెప్తారు. అది పెంతెకోస్తు దినమైయున్నది, అప్పుడది ఆ ఘడియయొక్క వెలుగైయున్నది. చూడండి, ఇది వేరొక దినము. ఈనాడు ఈ ఘడియయొక్క వెలుగు ఆయనేయైయున్నాడు.
251 క్రీస్తుని వెలుపల ఉంచి, ఆ ఏడవ సంఘకాలము, పూర్తిగా కమ్మివేయబడినది. చంద్రుడు దానిని తెలియజేయుచున్నాడు, భూమి మీదకు చీకటి అంతయూ వ్యాపించుచున్నది. ఇప్పుడు వెలుగు లోపలికి చొచ్చుకొని వచ్చుచున్నది, జరగబోవుదానిని చూపించుటను మొదలుపెట్టినది. ఆ విషయము నశింపజేయబడును, మరియు వెలుగు లోపలికి వచ్చి దానిని నాశనము చేయును. మరియు పరిశుద్ధులు భూమిని స్వతంత్రించుకొందురు, సాత్వికులు భూమిని స్వతంత్రించుకొందురు. భూమి, చంద్రుడు…చీకటి తొలగించబడును. రాత్రియొక్క చీకటి, వారి మరణపు సిద్ధాంతములు, మరియు దేవునియొక్క వాక్యమునకు వెలుపల, వారు చెప్పుచున్న వంకర సంగతులు అనే ఆ చీకటి గతించిపోవును. మరియు ఆ వెలుగు దినముపై ప్రకాశించును.
252 మరియు గుర్తుంచుకొనండి, ఎప్పుడైతే బైబిల్ గ్రంధమంతయు…ముగింపులో వినండి. ఎప్పుడైతే ఈ బైబిల్ గ్రంధమంతయు స్థిరముగా నిరూపించబడుతుందో, అప్పుడు ఒక నిత్యమైన షాలోమ్, నిత్యమైన సమాధానముండును. చూశారా?
253 ఆయన వచ్చెను మరియు ఆయనే, “భూమి మీద శాంతియు, మనుష్యులకు సమాధానము,” అయ్యున్నాడని చెప్పెను, కానీ లోకము దానిని స్వీకరించలేదు. చూశారా? చూశారా? ఆయన వద్దకు సమాధానం కొరకు వచ్చు వారందరికి ఆయన సమాధానమైయున్నాడు. చూశారా? భూమి మీద శాంతియు, మనుష్యులకు సమాధానం కలుగును, ఆ నూతన సంవత్సర ఆరంభంలో ఆయనే సమాధానమైయున్నాడు, దేవునియొక్క నూతన దినము. దేనికొరకు? ఆయనే ఆ దినముయొక్క ఒక-నిరూపించబడిన వెలుగైయున్నాడు. చూశారా?
254 నిరూపించబడవలసిన వాక్యము ఇంకా ఎంతో ఉన్నది. ఆయన ఇంకా చాలా వాక్యమును నిరూపించవలసియున్నది. మరియు చివరి వాక్యము నిరూపించబడవలసినప్పుడు, లేదా నిరూపించబడినప్పుడు, అప్పుడు విజయమందు మరణము మ్రింగివేయబడును, మరియు క్రీస్తునందు మృతులు లేతురు, వెయ్యేండ్ల పాలన ఆరంభమగును, మరియు అదొక గొప్ప సమాధానముగా ఉండును, షాలోమ్. సహోదరీ, సహోదరుడా ఆ దినము కొరకు అనగా ఆ ఒక్క గొప్ప షాలోమ్ కొరకు మనము జీవించెదము.
255 గుర్తుంచుకొనండి, బైబిల్ గ్రంధము సమస్త జ్ఞానముయొక్క ఊటయైయున్నది, మరియు భవిష్యత్తుయొక్క నిరీక్షణనంతటిని కలిగియున్నది. సంఘమునకు, షాలోమ్! మనం ప్రార్ధించుకుందాం.
256 ఇప్పుడున్న ఈ చిన్న గుంపువారలారా, నేను—నేను రెండుగంటల పాటు ఈ చిన్న నూతన సంవత్సర వర్తమానంపై—పై మాట్లాడాను. మీరు చాలా ఓపికతో ఉండియున్నారు. మీరు మరియు దేవునియొక్క వాక్యము ఏకమైనప్పుడు, ఆ గుర్తించబడిన దేవునియొక్క వాక్యము పలికినటువంటి ఆ సమాధానము లేనటువంటివారు ఈ ఉదయము లేదా—లేదా ఈ మధ్యాహ్నము ఎవరైనా ఇచ్చట ఉన్నారా? బైబిల్ ఒక విషయమును చెప్పినప్పుడు, “లేదు, అది నిజమని నేను అసలు నమ్మలేను,” అని మీరు చెప్పినట్లైతే, అప్పుడు మీరు షాలోమ్ ను కలిగిలేరు. మీరు దేవునితో సమాధానం కలిగిలేరు, ఎందుకనగా ఆయన వాక్యము ఒక విషయమును చెప్పెను మరియు మీరు దానితో విభేదించియున్నారు.
257 మరియు వాక్యము, “షాలోమ్, సమాధానము,” అని చెప్పినప్పుడు మరియు మీరు ఆ సమాధానమును కలిగియున్నయెడల, దేవుడు చెప్పుచున్న ప్రతీ మాటకు మీరు “ఆమేన్” అని చెప్పుదురు, మరియు దానిని మీరు నమ్ముదురు. మరియు అది నిరూపించబడుటను మీరు చూసినప్పుడు, “ఆమేన్, అది వాక్యమైయున్నది!” అని మీరు చెప్పుదురు. లోకము దానిని చీకటిమయం చేయుటకు ప్రతిబింబించబడుచున్న ఆ వెలుగు యొక్క నీడలో తిరుగుచున్నది, అయితే ఒక సిద్ధాంతము, ఒక వెలుగు, అనగా ఒక తప్పుడు వెలుగు, ఏదో సిద్దాంతము, “లేదు, అది—అది వేరే దేనికొరకోయని నేను—నేను అనుకొనుచున్నాను. దాని భావం సరిగ్గా అది కాదు,” అని చెప్పినట్లైతే మరి ఇంకనూ వాక్యము దానినే చెప్పుచుండినయెడల, మీరు ఆ ఛాయను వెంబడించుచున్నారా, లేకా మీరు ఆ వెలుగుతో ప్రత్యక్షమగుచున్నారా?
258 ఇచ్చట మరియు ఆ టేపులో, దానిని వినుచున్న ఎవరైనాగాని, ఒక క్షణము దానిని ఆలోచించండి. మరియు ఇక్కడ ఎవరైనా, ఆ వెలుగును కలిగిలేనివారు ఇక్కడ ఒకరైనా ఉన్నయెడల, ఈ రోజే ఆ వెలుగులో నడుచుటకు మీరు సిద్ధముగానున్నారని తెలియజేయబడునట్లు మీ చెయ్యి పైకెత్తుదురా? మరియు ఈ టేపు వెళ్ళుచున్న ప్రాంతంలో దానిని కలిగిలేకుండా, ఒక్కరైనా ఉన్నయెడల, మీరు మీ చెయ్యిని దేవుని తట్టు ఎత్తుదురా…మనం ప్రార్ధించుచుండగా ఒక క్షణము మీ టేపు రికార్డింగును ఆపివేయండి, మీ మోకాళ్ళపై ఉండి, మరియు ఇట్లు చెప్పండి, “ప్రభువైన దేవా, నేను సందేహించాను, నేను—నేను దీనిని చేశాను. ‘సరి, ఈ సంగతులు జరుగవని సంఘము చెప్పినది గనుక, ఇది జరగదు’ అని నేను తలంచాను. మరియు, కానీ అది బైబిల్ లో వాగ్దానము చేయబడుటను నేను చూశాను, మరియు ఇంకా అనేక సంగతులను నేను చూశాను. స్వయంగా ఆకాశము దానిని వెల్లడి చేసెను. మరియు చెప్పబడిన ఈ సంగతులు సరిగ్గా అట్లే జరుగుచున్నవి. మరియు పరలోకమందున్న దేవుడు అదే విషయమును వెల్లడి చేయుచున్నాడు. కావున ఇప్పుడు నేను దానిని పొందకొనగోరుచున్నాను. దేవుని వాక్యమును నాలోనికి రానిమ్ము. మరియు నన్ను ఆ తాళములోనికి, సంఘము లేదా ఆ ప్రసంగీకుడు చెప్పుచున్న దానిని వినే తాళములోనికి కాదుగానీ; వాక్యముయొక్క తాళములోనికి నన్ను ప్రవేశింపనియ్యుము, మరియు అది ఏమి చెప్పుచున్నదో చూడనిమ్ము. మరియు, దేవునియొక్క ఈ గొప్ప స్వరసమ్మేళనంలో, ఆయన చిత్తమే నా జీవితంలో తాళము వేయబడునట్టి విషయాన్ని అది నాకు తీసుకొనిరానిమ్ము.”
259 మా పరలోకపు తండ్రీ, ప్రతీచోట పైకెత్తబడిన ప్రతీ చెయ్యిని మేమిప్పుడు నీ వద్దకు తీసుకువచ్చుచున్నాము. మరియు ఇప్పుడు వారు దేవునియొక్క కుమారులుగా మరియు కుమార్తెలుగా మలచబడునట్లు, దేవునియొక్క పరిశుద్ధాత్మ, వాక్యము మరియు దాని సత్యముయొక్క తాళమును వారియొద్దకు తెచ్చునుగాక, మరియు భూమి మీద దేవునియొక్క వెలుగును ప్రతిబింబించువారిగా వారుందురు గాక. యేసు జీవించిన విధానములో స్త్రీలు మరియు పురుషులు జీవించునట్లు, వారు దేవునియొక్క ప్రత్యక్షపరచబడిన వాక్యముగా ఉందురు గాక, మరియు—ఆయన చేసినట్లే దేవునియొక్క ప్రతీ వాక్యమును నమ్మి దానివలన జీవించుదురు గాక, ఏలయనగా, ఆయన ఇట్లు చెప్పెను, “మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదుగానీ దేవుని నోటనుండి వచ్చు ప్రతీ మాట వలననూ జీవించును.” కేవలం కొన్ని మాటలే కాదు, వాక్యములో కొంతభాగం కాదు, కానీ “దేవుని నోట నుండి వచ్చు ప్రతీ మాట వలన.”
260 మోషే కాలముయొక్క వాక్యము, యేసు దినములలో పనిచేయలేదు. ఆ పని…అపోస్తలుల దినములలోని ఆ వాక్యము ఈ దినమున పనిచేయదు. అది ఈ దినమునకు వాగ్దానము చేయబడిన వాక్యమైయుండవలసియున్నది. అంత్యదినములో ఏమి జరుగునని, వారు స్వయంగా పరిశుద్ధాత్మ వలన దానిని పలికిరి, సంఘములు ఎట్లు మూర్ఖులుగాను, గర్వాంధులుగాను మారుదురనియు, మహావేశ్య ఎట్లు లేచుననియు మరియు ఆ వేశ్యలు సరిగ్గా ఆమెతో ఉందురనియు, మరియు…వారెట్లు భూమిని చీకటి పరచెదరనియు చెప్పబడినది. మరియు చివరి సంఘకాలమైయున్న, లవొదికయలో, యేసు పూర్తిగా సంఘము నుండి తొలగించబడును.
261 ఓ ప్రభువా, ఆయనతో, ఆ వాక్యముతో నన్నుండనిమ్ము. మరియు ఈ నూతన సంవత్సరంలో మేము ఒక నిశ్చయతతో ప్రారంభించుచుండగా, మా అందరి ద్వారా ఆయనయొక్క వెలుగును ప్రత్యక్షపరచబడనిమ్ము. ఈ నూతన సంవత్సరము దేనిని పట్టుకొనునో తెలియదు కానీ, ఆది నుండి అంతము వరకు ఆ స్వరసమ్మేళనము నంతటిని ఎరిగియున్న, ఆయనను అనగా ఆ వాక్యమును మేము పట్టుకొనియున్నాము. ఆయనకు ప్రతీ కదలిక మరియు ప్రతీ కూడలి తెలియును. మరియు, ప్రభువా, మేము మా కన్నులను ఆయనపై, ఆ వాక్యముపై నిలిపియుంచి, మరియు కేవలం ఆయనను గమనించుచున్నాము. పిదప ఈ సంగతులు ప్రత్యక్షమగుటను మేము చూచినప్పుడు, మేము సరిగ్గా ఆ వాక్యముయొక్క తాళములోనే ఉన్నామని మేము ఎరిగియున్నాము. దానిని అనుగ్రహించండి. ప్రభువా ఇక్కడ, ఆ…తప్పిపోయిన ప్రతీ ఆత్మను, మరియు ఈ టేపును వినే ప్రతిఒక్కరిని రక్షించండి. నీ రాజ్యము నిమిత్తము, యేసుక్రీస్తు నామములో మేము వారిని నీకు అప్పగించుచున్నాము. ఆమేన్.
262 ఇప్పుడు ఒక…ఈ ఉదయం మీ అందరితో ఉండుట సంతోషముగా ఉంది. కావున, సరిగ్గా ప్రారంభించినప్పటి నుండి, పది గంటల నలభై ఐదు నిమిషముల నుండి పన్నెండు గంటల నలభై ఐదు నిమిషాల వరకు, సరిగ్గా రెండు గంటల పాటు నేను మాట్లాడాను. మేడాతో, “నేను ఒంటిగంటా-ముప్ఫై నిమిషములకల్లా తిరిగి వస్తాను” అని నేను చెప్పాను. ఇప్పుడు, వేగముయొక్క చట్టములను దాటిపోవుట యందు మనము నమ్మికయుంచము. అట్లు చేయాలని, మనము తలంచము, మీరు చూడండి, దానిని చేయాలనుకోము. ఇప్పుడు మేము మీకు కృతజ్ఞతలు చెల్లించుచున్నాము. ఇప్పుడు నేను చెప్పగోరునది…
263 ఆ టేపు బయటకు వెళ్తుంది గనుక టెర్రీ తన టేపును ఆపివేశాడు. మీరు ఇంకనూ టేపు కొనసాగించుచున్నారని నేను అనుకొనుచున్నాను, అది సరియే, చూడండి, ఎందుకనగా నేను సంఘముతో మాట్లాడబోవుచున్నాను.
264 నిశ్చయంగా ఇక్కడున్న మీ అందరినీ నేను అభినందించుచున్నాను. ఎడారి వెనుక భాగము అని నేను పిలుచునట్టి ఈ స్థలమునకు రావడం, ఎడారిగుండా ఇక్కడకు వచ్చి, మరియు, చుట్టూ చూసి సరిగ్గా ఈ నది ప్రక్కన ఇక్కడ చెట్ల క్రింద ఈ చిన్న గుంపును చూడటం, ఇది నాకొక విశ్రాంతి చోటువలె ఉన్నదని నేను ఎన్నోసార్లు తలంచాను. మరియు ఇప్పుడు మనము ఈ నదికి తూర్పువైపున ఉన్నాము. మరియు నేను—నేను—దేవుడు మిమ్మును, ప్రతీ ఒక్కరినీ దీవించునని నేను నమ్ముచున్నాను. దేవుడు, షాలోమ్ మీతో నుండునుగాక. అది ఆయనయొక్క సమాధానము.
265 మరియు నిజంగా మిమ్మల్ని ఈ విధంగా ఉంచినందుకు నన్ను మన్నించండి, అయితే ఇప్పుడు కేవలం దీనిని టేపు చేయుటకైయున్నది. ప్రభువు చిత్తమైతే ఆదివారం మధ్యాహ్నమున, ఫినిక్సు వద్ద—వద్ద నేను మాట్లాడబోవునది ఇదేయైయున్నది. పిదప, సోమవారమున, నేను చిన్న చిన్న కూడికలు మరియు అటువంటివాటికి వెళ్ళుదును. ప్రభువు చిత్తమైతే…నేను—నేను కేవలం ఈ ప్రక్క నుండి ఆ ప్రక్కకు కత్తిరించి మరియు చీల్చివేయాలని, ఈ సంవత్సరము నా హృదయములో నేను నిశ్చయించుకున్నాను. చూశారా?
266 మరియు అది గుర్తింపు అని మనందరికీ తెలియును. ఆ మూడవ ఈడ్పు ఏమైయున్నదో మనము ఎరిగియున్నాము. మనమందరము, దానిని మనమంతా గ్రహించియున్నాము. ఇప్పుడు, మీరు కలిగియున్నారు, ఆ టేపును మీరందరు కలిగియున్నారు. చూశారా? మరియు ఆ గొప్ప హింస ఘడియవచ్చు వరకు, ఇది కొద్దిసేపు ఊరకయుండునని నేను అనుకొనుచున్నాను. అది వచ్చినప్పుడు అది మాట్లాడును. సరిగ్గా ఆ ఐదు సూచనల వలెనె తప్పిపోకుండా, పరిపూర్ణముగా అది ప్రత్యక్షపరచబడును. మరియు ఇప్పుడు, అది ఏమి చేసెనో చూచుటకు కేవలం వేచియుండు అని నేను తలంచుచున్నాను, చూడండి. ఇప్పుడు, నేను దానినే పూర్తిగా కనుగొనుటకు, తిరిగి వెళ్ళుచున్నాను.
267 ప్రతీ రాత్రి త్వరగా ముగించునట్లు, నేను చిన్న కూటములను కలిగియుండుటకు ప్రయత్నించబోవుచున్నాను. కేవలం ఒక ముప్పది నిమిషములు తీసుకొని, మరియు దైవిక స్వస్థత లేదా అటువంటిదానిపై మాట్లాడుదును. మరియు మరలా ఒక టేపు రికార్డింగు చేయుటకు నేను సిద్ధపడినప్పుడల్లా, నేను ఈ ఎడారి వెనుకకైనా, లేదా ఆలయమునకైనా లేదా ఎక్కడైతే మనవరకే ఉండి, నేను కోరినది చెప్పగలిగియుండి, మీరు టేపు చేయగలిగే చోటుకు పరుగెత్తుకొని వచ్చెదను. అయితే, చూడండి, యేసు…
268 గుర్తుంచుకొనండి. చూశారా? నేను గమనించవలసియున్నది. ఆ ప్రజలు పూర్తిగా అహంకారముతో నడుచుకుంటు వెళ్ళిపోవుటను నేను చూసినప్పుడు, ఈ ఉదయం నేను దానిని వ్యక్తపరచుటకు ప్రయత్నించానని నేను అనుకొనుచున్నాను. అది వారిపైనున్న కటిక చీకటియైయున్నది. దానికి వారేమి చేయలేరు. వారు విననందుకు నేను వారిని క్షమించుదును, చూడండి. మరియు దేవుడు చేసిన కార్యములను చూసియుండి, మరి ఇంకను వారు దానిని చేయరు. “దేవా, వారిని క్షమించుము,” అని ఇంకా నేను ప్రార్ధించుదును. మరియు నా హృదయపూర్వకంగా నేను దానిని చెప్పుచున్నాను. నా యజమాని చెప్పాడు కదా అని ఊరకే దానిని చెప్పుటలేదు, కానీ వాస్తవంగా నేను చేయుదానిని మొదటిగా నా హృదయంలో అనుభూతి చెందగోరుచున్నాను.
269 నన్ను నేను ప్రజలనుండి వేరు చేసుకోను. దానిని నేను చేయగోరడంలేదు. చూశారా? ఎందుకనగా నేను—నేను…“రక్షణ” అను వర్తమానమును నేను వారికొరకు కలిగియున్నాను. నేను వారి మధ్యలోకి వెళ్ళవలసియున్నది. చూశారా? ఇప్పుడు, త్రిత్వవాదులతో, మెథడిస్టులతో, బాప్టిస్టులతో, పెంతెకోస్తువారితో, సెవెంత్-డే అడ్వెంటిస్టులతో, మరియు ఇంకా ప్రతీవారితో నేను బయటకు వెళ్ళుదును. ఎందుకనగా, నావల్ల అయిన యెడల; ఆ తప్పిపోయిన దానిని రక్షించుటకు, దానిని లోపలికి తీసుకువచ్చి, వారికి వెలుగును చూపించుటకు నేను వెదకుచున్నాను. మరియు ప్రభువు మీతోనుండును గాక.
270 మా—మా మొట్టమొదటి చిన్న గుంపు కూడికలను నేను ఇక్కడే కలిగియున్నాను. వాటిని మీరు కలిగియున్నారో లేదో, ఇక్కడున్న మీ కాలక్రమ పట్టికను నేనెరుగను. మీలో కొందరు…నేను దీనిని ఇక్కడ వదిలిపెడతాను. మరియు ప్రభువు చిత్తమైతే మనం ఎక్కడ కలుసుకోబోవుచున్నామన్నది, సంఘకాపరి దానిని మీకొరకు చదువుతాడు. మరది ప్రభువు చిత్తమైతేనే. వాటి విషయమై నాకు ఎలాంటి నడిపింపు లేదు, నేను చేయగలిగినది చేయుటకు ప్రయత్నించుచు, ఊరకే బయటకు వెళ్ళుచున్నాను. మరియు ఆ కూటములకు రావడానికి ఇష్టపడే మీ ప్రియులెవరైనా అక్కడ ఉన్నట్లయితే, మీరు వారికొక ఉత్తరము వ్రాసి మరియు ఆ కూటములలో ఒకదానికి హాజరుకమ్మని వారితో చెప్పండి.
271 దేవుడు మిమ్మును దీవించును. సహోదరుడు స్త్రైకర్ మరియు సహోదరి స్త్రైకర్, మరియు ఇక్కడున్న ఈ మిగతా ప్రజలందరిని చూడటం బాగుంది. ఇప్పుడు, వారిలో కొందరు, కనీసం మీ పేర్లు కూడా నాకు తెలియదు. అయితే, మీరు నా సహోదరులు మరియు సహోదరీలు అని పరిశుద్ధాత్మ యొక్క సాక్ష్యమునుబట్టి నేను—నేను మిమ్మల్ని ఎరిగియున్నాను. మరియు—మరియు మీ పట్ల నాకు ప్రేమ మరియు గౌరవము ఉన్నది. మరియు ఇక్కడ మీతో నుండుట నాకు ఒక గొప్ప ఆనందమైయున్నది.
272 మరియు ఇక్కడ మీరెట్లు—మీ విందును ఏర్పాటుచేసారన్నది నాకు తెలియును, ఒక చిన్న సహవాసపు విందును మీరు కలిగియుండబోవుచున్నారు. కేవలం నేను మీతో ఇక్కడ ఉండుట సాధ్యమైతే బాగుండునని కోరుచున్నాను. మరియు—మరియు అది మంచిదని నేను ఎరిగియున్నాను. నాకు—ఈ ప్రాంతంలోనే ఉత్తమమైన వంటగాళ్ళను మీరు కలిగియున్నారని నాకు తెలుసు. అది వాస్తవమని నాకు తెలుసు. కానీ నేనైతే వెళ్ళేటప్పుడు, బహుశా ఒక హ్యాంబర్గర్ తో విందు చేసుకోవలసియుంటుంది. అయితే, ఏమైనప్పటికినీ, నేను చేయవలసిన నియామకాలను నేను కలిగియున్నాను. నా సమయం, కొంచెం ఇక్కడ మరియు కొంచెం అక్కడ, నియమించబడియున్నది. మీరందరు అర్ధం చేసుకుంటారని, నేను నిశ్చయతను కలిగియున్నాను. నేనిక్కడ ఉండకూడదని కోరుకొనుటవలన కాదు. దేవుడు దానిని ఎరిగియున్నాడు. నేనిక్కడికి వచ్చేవాణ్ణి కాదు…చూశారా?
273 ఎవరో ఇట్లన్నారు, “నీవు ఒక పదివేల మందికి భోదించగలిగియుండి, మరి అదే విషయమును అక్కడికి వెళ్ళి ముప్పై మందికి భోదించుదువా?” నిశ్చయముగా. ఎంత మంది అనేది, ఏ తేడాను కలిగించదు. అది ఎక్కడ స్వీకరించబడుతుందో నేను చూడగోరుచున్నాను.
274 “మీ ముత్యములను పందులయెదుట వేయకుడి. వేసినయెడల అవి యొకవేళ వాటిని కాళ్ళతో త్రొక్కి మీ మీద పడి మిమ్మును చీల్చి వేయును.” చూశారా? కాబట్టి మీరు మీ ముత్యములను అక్కడ వేయకండి.
275 మరియు నేను ఇక్కడ చెప్పుచున్నది, పందుల ముందు ముత్యములు వేయుట కాదని, నాకు అనిపించుచున్నది. అది, పిల్లలకు, వారికి చెందిన రత్నములను చూపించుటయని నేను అనుకొనుచున్నాను. చూశారా? చూశారా? కొన్నిసార్లు ఆ రత్నములు ఎక్కడ కనుగొనబడతాయి? దుమ్ము ధూళిలోనేయైయున్నది.
276 ఎప్పుడైనా ఒక లిల్లీని, అది ఎక్కడనుండి వచ్చునో మీరు గమనించారా? నేరుగా ఒక చెరువులోని బురదగుంట యొక్క లోతులనుండి అది వచ్చును. మరియు, దానంతటది ఆ వెలుగునొద్దకు వచ్చుటకు, అది రాత్రింబవళ్ళు కష్టపడుతుంది. అయితే ఒక్కసారి అది ఆ వెలుగులోనికి వచ్చినప్పుడు మాత్రం, అది వికసిస్తుంది, మరియు ఎక్కడా లేనటువంటి ఒక అందమైన పుష్పముగా ఉంటుంది. ఒక లిల్లీ పువ్వు విషయము ఆ విధంగా ఉన్నది. భూమి యొక్క చెత్త మరియు మురికి నుండి అది పైకి వచ్చును.
277 దేశములోని ఈ గోల్డ్ స్టేట్ నందు చుట్టబడియున్న, ఆ రత్నములు కనుగొనబడునది అచ్చటేయైయున్నది. మీరు బంగారమును ఎక్కడ కనుగొంటారు? క్రింద మురికిలోనే. కెంపులను మరియు రత్నములను మీరు ఎక్కడ కనుగొంటారు? చెత్తలో మరియు బురదలోనే. అది ఖచ్చితంగా వాస్తవమైయున్నది. మనమందరము వచ్చినది అక్కడనుండే, ఈ లోకముయొక్క బురద మరియు చెత్త నుండి వచ్చియున్నాము. అయితే ఇక్కడున్న ఈ…
278 నేనొక ఖనిజ పరిశోధకుడను. ఒక ఖనిజ పరిశోధకుడు ఏమి చేస్తాడు? అతడు బంగారము కొరకు వెదకుతాడు. పిదప, అతడు కనుగొన్నప్పుడు, అతడు దానిని ప్రకాశింపజేస్తాడు. మరియు అతడు దానిని కొడతాడు, మరియు దానిని కరిగిస్తాడు, మరియు అతడు దానిని సిద్ధపరుస్తాడు.
279 ఇది ఒక బంగారపు గనియైయున్నది. చూశారా? నేను దీని గుండా, ఎల్లప్పుడూ, అందమైన రత్నముల కొరకు వెదకుచున్నాను. చూశారా? ఇక్కడ, మురికిలో ఎక్కడో వారిని కనుగొని, వారిని మెరుగుగా చేసి, మరియు ఇట్లు చెప్పుదును, “ప్రభువా, ఇదిగో వారిచ్చటున్నారు. ఇక్కడ ఒక సోదరుడున్నాడు. ఇదిగో తిరిగి జన్మించిన ఒక క్రైస్తవుడు ఇక్కడున్నాడు. ఇక్కడ ఒక చక్కని, యవనస్తురాలున్నది. ఇదిగో ఒక మధ్య-వయస్కురాలు, ఒక వృద్దురాలు, మై, ఒక యవనస్తురాలు, ఇక్కడున్నారు” అది ఎవరైనా కానీ. “ఇదిగో ప్రభువా, వారిక్కడున్నారు. వారు నీ రత్నములైయున్నారు. ప్రభువా, వారిని నీ కిరీటములో పెట్టుకొనుము. వారు ఎన్నటెన్నటికీ ఆ విధంగా ప్రకాశించుదురు.”
నేను మిమ్ములను చూచువరకు, షాలోమ్. దేవుని సమాధానం మీతోనుండును గాక!
280 మంచిది, సంఘకాపరి, ఇక్కడకు రండి. మంచిది. ఇప్పుడు దేవుడు మిమ్మల్ని దీవించును గాక. మరియు నేను మీ అందరిని కొద్దిసేపటి తర్వాత చూస్తాను.
64-0112 — షాలోమ్
Rev. William Marrion Branham