విఫలమవ్వని ఆయన యొక్క వాగ్దాన వాక్కులు

విఫలమవ్వని ఆయన యొక్క వాగ్దాన వాక్కులు

1కాబట్టి మనము అందరము రోగుల కొరకు ప్రార్థించు దృక్పథమును కలిగియుందుము. మరియు వచ్చే గురువారము ఇచ్చట ప్రారంభమయ్యే వ్యాపారస్తుల యొక్క సభలను గూర్చి కూడా మనము ప్రార్థించుదాము. ఆ కూడికలలో కొంతమంది గొప్ప బోధకులు మాట్లాడబోవుచున్నారు. [టేపులో ఖాళీయున్నది.]

టుసాన్ , నేను ఇప్పుడు టుసాన్ లో నివసిస్తున్నాను. ఇది నాకు రెండవ సంవత్సరము. "నేను అక్కడ యెరూషలేములో నివసిస్తున్నాను" అని ఎల్లప్పుడు నేను చెప్పుచుంటాను.

అది యెరూషలేము అని నేను ఆ పోలీసు అధికారిని (గత రాత్రి వారు నాకు జరినామా వేసారు) నమ్మించలేకపోయాను. నేను నా కారు నడుపుకుంటూ ఆ రహదారి మీద ప్రయాణిస్తూ అపాచీ కూడలివద్దకు చేరుకున్నాను. నా కారు ముందు లైట్లు చెడిపోయి వెలుగక పోవుటవలన తక్కువ కాంతిని వెదజల్లే లైట్లు వేసుకొని వెళ్ళుచుండగా అవి కూడా చెడిపోయినవి. నేను దానిని మరమ్మత్తు చేపించుటకు పెట్రోల్ బంకుకు వెళ్ళుటకు ప్రయత్నించుచుండగా, మరి యొకటి కూడా ఆరిపోయినది. అలా జరిగిన తరువాత నేను వెనుకకు తిరిగి చూచినప్పుడు, రోడ్డు మీద పోలీసు ఎర్రలైటు వేసి నాకు ఎదురుగా వచ్చి అతడు నన్ను ఆపాడు. "నేను నిన్ను ఎందుకు ఆపానో తెలుసా?" అని నన్ను అడిగాడు.

నేను చెప్పాను, "తెలుసు, నా కారు యొక్క ఒక లైటు వెలుగుట లేదు." అతడు చెప్పాడు, "అది నిజమే. అలా చేయుట చట్ట వ్యతిరేకమని నీకు తెలుసా?"

నేను చెప్పాను,"అవునయ్యా, కాని నేను దానిని బాగుచేయు స్థలమునకు చేరలేకపోయాను. నాకు ఆ స్థలము కనబడలేదు. నేను దానికొరకు వెదకుచున్నాను."

"మీరు ఎక్కడ నుండి వస్తున్నారు" అని అతడు ప్రశ్నించాడు.

నేను చెప్పాను, "యెరూషలేము."

"ఎక్కడ నుండి? ఎక్కడ నుండి?" అని అతడు అడిగాడు.

"యెరూషలేము" అని నేను చెప్పాను. "నేను…"

అతడు నా లైసెన్స్ చూసి "నీవు సేవకుడివా?" అని అడిగాడు.

"అవునయ్యా" అని చెప్పాను. "నేను యెరూషలేము నుండి వస్తున్నాను" అతడు అడిగాడు, "అది ఎక్కడ ఉన్నది. సముద్రమునకు ఆవల ఉన్నదా?"

"లేదు, అయ్యా, అది అక్కడున్న కొండ మీద ఉన్నది. దానిని మీరు టుసాన్ అని పిలుస్తారు, నేను అక్కడ క్రింద యెరికోకు వెళ్ళాను. అచ్చటయున్న ఆ లోయలో పరిచర్య చేయుటకు వెళ్ళాను" అని నేను చెప్పాను.

అది అద్భుతము, అతడు జరినామా విధించు చలానా నాకు ఇవ్వలేదు. అది అద్భుతము కాదా? కాని అతడు నన్ను కొంచెము త్వరపెట్టాడు, "త్వరగా వెళ్ళి దానిని సరి చేయించుకొనుము, లేకపోతే…" [టేపు మీద ఖాళీ ఉన్నది.]

 

2ప్రభువైన యేసు, ఈ ఆరాధనకు మమ్ములను మీకు సమర్పించుకొనుచున్నాము. ప్రభువా, నీవు నాకు చెప్పిన సంగతులన్నిటిని మరియు ఈ ప్రజల ఎదుట మీరు జరిగించిన కార్యములన్నింటిని నేను జ్ఞాపకము చేసుకొనుచున్నాను; వాటన్నిటినిబట్టి నీకు స్తుతి మరియు మహిమ చెల్లించుచున్నాము. గత ఆకురాలు కాలములో ఐదువందల మైళ్ళ దూరమున ఇచ్చటవున్న ఉత్తరమువైపు నుండి ఇక్కడకు వస్తుండగా, నీవు ఆ పర్వతమును నాకు చూపించినప్పుడు, "ఆ సమయము వచ్చువరకు, నీవు వెనకకు వెళ్ళి రోగుల కొరకు ప్రార్ధించుము" అని చెప్పిన మాట జ్ఞాపకము చేసుకొనుచున్నాను. ప్రభువా, ఇక్కడ నేనున్నాను. ఇక్కడున్న ప్రజలకు కాదు, నేను వారికి ప్రార్థన చేయుటలేదు గాని, నేను నీకే ప్రార్ధిస్తున్నాను. ఎందుకనగా ఇచ్చట నేను ఈ రాత్రి నీ పరిచర్యలో ఉన్నాను, మీరు నాకు ఏ విధంగా ఆజ్ఞాపించారో అదే విధముగా చేయుచున్నాను. తండ్రీ, నాకు సహాయము చేయండి, యేసుక్రీస్తు నామమున నేను ప్రార్ధిస్తున్నాను.

ఇప్పుడు మనము పరిశుద్ద గ్రంధము తెరచి మత్తయి సువార్త చదువుదాము. మత్తయి సువార్త 24వ అధ్యాయము, 32వ వచనము నుండి 85వ వచనము వరకు చదువుదాము.

అంజూరపు చెట్టును చూచి ఒక ఉపమానము నేర్చుకొనుడి; అంజూరపు కొమ్మ లేతదై చిగిరించునప్పుడు వసంతకాలము యింక సమీపముగా ఉన్నదని మీకు తెలియును.

ఆ ప్రకారమే మీరీ సంగతులన్నియు జరుగుట చూచునప్పుడు ఆయన సమీపముననే, ద్వారము దగ్గరనే యున్నాడని తెలిసికొనుడి.

ఇవన్నియు జరుగువరకు ఈ తరము గతింపదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను.

ఆకాశమును భూమియు గతించునుగాని నా మాటలు ఏమాత్రము గతించవు.

3దీనిలోనుండి నేను ఒక చిన్న అంశమును తీయగోరుచున్నాను: విఫలమవ్వని ఆయన వాగ్దాన వాక్కులు. విఫలమవ్వని ఆయన వాగ్దాన వాక్కులపైనే మన విశ్వాసము ఆధారపడియున్నది. అన్ని కాలములయందు మానవులు దేవుని వాగ్దానములయందు విశ్వాసముంచిరి.

ఇప్పుడు, ఒకవేళ నీ జీవితములో ఎప్పుడైనను స్వస్థతా ఆరాధనకు వచ్చియున్నట్లైతే, నీకు సాధ్యమైనంతవరకు సంపూర్ణముగా నీవు నీ ఏకాగ్రతను నిలుపవలయునని, దానిని ఇప్పుడు నీవు చేయాలని నేను కోరుచున్నాను. దేవుడు మహిమపర్చబడుట మనము చూడాలని ఆశిస్తున్నాము.

దేవుని యొక్క ప్రతి మాట, ఆయన చేసిన ప్రతి వాగ్దానము సత్యమని నేను నిజముగా నమ్ముచున్నాను.

అది ఎవరైనాగాని దానిని అంగీకరించిన వారందరికి అది చెందును. మరియు కొంతమంది దానిని అంగీకరించాలని ప్రయత్నిస్తున్నారు, కాని చేయలేకపోవుచున్నారు. దానిని అంగీకరించగల వారు కొద్దిమంది ఉన్నారు. సగము ప్రయత్నము కూడా చేయకుండానే దానిని కొద్దిమంది పొందుకుంటారు. ఇప్పుడు "స్వస్థత అందరికి" అని మనము సువార్త బోధించవలసియున్నది. అయినప్పటికి అది అలాగు కాదు అని మనము ఎరిగియున్నాము. ఒకవేళ అందరూ దానిని స్వీకరించగలిగితే అది అందరిది, కాని మనకు తెలుసు, అందరూ దానిని పొందుకోలేరు. నాకు తెలిసినంత వరకు నేను ఎంత యధార్ధముగా ఉండగలనో అంత యదార్ధముగా మీ యెదుట ఉందగోరుచున్నాను.

 

4"రక్షణ అందరిది" అని అంటూ మనము రక్షణ గూర్చి కూడా అదే విధముగా బోధించవలసియున్నది, కాని అందరూ దానిని పోందుకోలేరని మనకు తెలుసు. మానవులందరూ ఈ సంగతులన్నింటిని చూడలేరు, యేసు, "మీ కన్నులు చూచుచున్నవి గనుక అవి ధన్యమైనవి, మీరు గ్రహించగలుగుచున్నారు, వీటిని గ్రహించలేనివారు అనేకులు" అని చెప్పెను.

ఏ జనులైతే దైవీక స్వస్థత నమ్మెదరో వారికే అది చెందును. కాని నీ అంతరంగములో నమ్మునట్లుగా ఏదో ఒకదానిని కలిగివుంటేనే నీవు దానిని నమ్మగలవు.

కపెర్నహెూము మరియు ఇతర పట్టణములో ఆయన అనేక అద్భుత కార్యములు చేసినను వారు మారుమనస్సు పొందకపోవుట వలన ఆయన ఆ పట్టణములు గుండా వెళ్ళుచున్నప్పుడు, "ఇచ్చట జరిగిన అద్భుత కార్యములు సొదొమ మరియు గొమెర్రాలో జరిగినయెడల, అవి నేటివరకు నిలిచియుండేవి" అని యేసు చెప్పెను.

మరియు నేను చెప్పుచున్నాను: ఒకవేళ ఇక్కడ ఫోనిక్స్ లో జరిగిన బలమైన అద్భుత కార్యములు, సొదొమలో జరిగినట్లైతే, అది ఇప్పటి వరకు నిలిచియుండేది. అది ఉప్పు… మృత సముద్రము అడుగుకు చేరేది కాదు.

 

5ఇప్పుడు, మీరు ఒక్క నిమిషము ఆగి, దేవుని వాక్యము యొక్క భావమేమిటో యోచించుటకు ప్రయత్నించి, రోగులైన మీరందరూ, మానవులందరూ దానిని గ్రహించి, గట్టిగా పట్టుకొనవలసియున్నది.

వాక్యము వినుటవలన, వాగ్దానపు వాక్యము వినుట వలన విశ్వాసము కలుగును. నీకు ఒక వాగ్దానము లేనట్లైయితే, అప్పుడు నీవు నీ స్వంత విశ్వాసముతో తెగించి ముందుకు సాగిపోయెదవు. కాని, నీవు దేవుని వాగ్దానమును గైకొనినయెడల, అది నీకు దేవుడిచ్చిన వాగ్దానమై యుండును.

ఆయన వస్త్రపు చెంగును ముట్టిన ఆ స్త్రీకి అలాంటి వాగ్దానము లేదు. కాని వాగ్దానము లేకుండానే, ఆమె తన విశ్వాసముతో స్వస్థతను పొందుకొనగలిగినది.

ఇప్పుడు, వాగ్దానము లేకుండానే ఆమె పొందుకున్నదానిని బట్టి, వాగ్దానమనేది లేకుండానే ఆమె దానిని చేయగలిగిందంటే, ఆమె విశ్వాసము ద్వారా తన స్వస్థతను పొందగలిగినచో, వాగ్దానమనే విశ్వాసము ద్వారా దేవుడు దానిని ప్రత్యక్షపరచి మరియు మన ముందు దానిని రుజువుపరచి, వాక్యము ద్వారా ఆయన దానిని మనకు అనుగ్రహించి, ఆ వాక్యము మనయొద్దకు వచ్చి ఆయన దానిని రుజువుపరుచుచూ వుంటే మరి మనము ఎంతగా మన స్వస్థతను పోందుకోవలసియున్నాము.

 

6నేను ఇప్పుడే ప్రతిష్టించిన ఈ చిన్న పిల్లలను చూడండి. వైద్యశాస్త్ర జ్ఞానమునకు అందని దేవుని యొక్క అద్భుత కార్యమును వారిద్దరికి దేవుడు చేసెను, గ్రహించారా? మన మధ్య జరిగిన కార్యములను గూర్చి ఒక్కసారి యోచించండి!

దేవుడు పక్షపాతా? ఖచ్చితముగా కాదు. ఒకవేళ ఆయన ఒకరిని స్వస్థపరచినచో ఆయన మరొకరిని కూడా స్వస్థపరచును. నీకు తగిన విశ్వాసమును నీవు కలిగి వుండుటయే నీకు కావలసియున్నది. నీవు కలిగియుండు ఆ విశ్వాసమనే దానిని నీవు ఎరిగి యుండవలెను, అదేదో నీవు ఊహించేది కాదు లేక మరొకరి దగ్గర అరవు తెచ్చుకునేది కాదు. ఏదోఒకటి నీకు జరిగియుండవలెను. దానిని నీవు ఎరుగగలవు. ఈ కాలములన్నింటిలో ప్రజలు దీనిమీదనే ఆనుకొనియుండిరి.

కొద్ది నిమిషములు ఈ లేఖన భాగమును నేను తీసుకొనుటకు కారణమేమనగా, "భూమి మరియు ఆకాశములు గతించును గాని, నా మాటలు ఎన్నడూ గతించవు," అని ఆయన చెప్పాడు. మరియు ఆయన ఇక్కడ ఒక వాగ్దానము చేస్తున్నాడు, ఆ తరమువారు… "ఈ సంగతులన్నియు నెరవేరువరకు ఈ తరము గతించదు."

 

7ఇప్పుడు ఒకవేళ ఒక అవిశ్వాసి ఇచ్చట కూర్చొనియుండినట్లయితే, ఈ మాటలు ఒక అవిశ్వాసి గ్రహించుటకు చాలా అభ్యంతరముగా ఉండును. యేసు, తాను మాట్లాడుచున్న తరము గూర్చి దీనిని సూచించుచూ చెప్పుచున్నాడని వారు తలంచెదరు. ఇప్పుడు దానిని సూటిగా అన్వేషించుట కొరకు, మనము వాక్యభాగము వద్దకు వెళ్దాము…

వారు ఆయనకు మూడు ప్రశ్నలు వేశారు. మీరు 24వ అధ్యాయములో గమనించినట్లైతే, 24వ అధ్యాయము ప్రారంభములో, మనము ఈ వాక్యములు చదువుదాము.

యేసు దేవాలయము నుండి బయలుదేరి వెళ్ళుచుండగా ఆయన శిష్యులు ఆ దేవాలయపు కట్టడములు ఆయనకు చూపింపవచ్చిరి.

అందుకాయన - మీరు ఇవన్నియు చూచుచున్నారు గదా; రాతి మీద రాయి యొకటియైనను ఇక్కడ నిలిచి యుండకుండ పడద్రోయబడునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో అనెను.

ఆయన ఇంకా పట్టణములో దేవాలయమువద్ద వున్నప్పుడు జరిగిన సంగతి, ఇప్పుడు దాని విషయమేమిటి?

ఆయన పర్వతము మీద కుర్చునియుండగా…

ఆయన దేవాలయమును విడిచి, ఆ కొండ శిఖరము మీదకు వెళ్ళాడు, ఒలీవల కొండ.

ఒలీవల కొండమీద కూర్చొనియున్నప్పుడు, శిష్యులాయన యొద్దకు ఏకాంతముగా వచ్చి, ఇవి ఎప్పుడు జరుగును? … నీ రాకడకును, ఈ యుగసమాప్తికిని సూచనలేవి, మాతో చెప్పుమనగా?

 

8వారు ఆయనను మూడు ప్రశ్నలు వేశారు, వారాయనను అడిగిన విధముగానే వారికి ఆయన జవాబిచ్చాడు. మూడు ప్రశ్నలు, చూడండి, మొదటిది, "ఒక రాయి మీద మరొక రాయి నిలువబడని కాలము ఎప్పుడు వచ్చును?" మరియు, "నీ రాకడకు సూచన ఏది?" మరియు, "ఈ యుగ సమాప్తికి సూచన ఏది?" మూడు ప్రశ్నలు. ఆయన మూడు ప్రశ్నలకు జవాబిచ్చాడు.

"మీరు పారిపోవుట చలికాలమందైనను విశ్రాంతి దినమందైనను సంభవింపకుండవలెనని ప్రార్థించుడి" అని ఆయన చెప్పిన మాటను, ఆ మొదటి ప్రశ్నను, అది భవిష్యత్తులో జరుగబోవు సంభవముగా, ఈ లోకము అంతమున ప్రభువు రాకడకు వచ్చునని ఈనాటి గొప్ప విద్యార్థులు అన్వయిస్తున్నారు.

అది క్రీస్తు శకము 70లో సంభవించినది, గొప్ప రోమా సైనికులు, లేక గొప్ప సైన్యము, యేసు వారితో చెప్పినట్లుగా, రోమా సైన్యాధక్షుడు టైటస్ మరియు అతని సైన్యము దాని గోడలు కూల్చివేశారు. "యెరుషలేము దండ్లతో ముట్టడి వేయబడినప్పుడు, పొలములో ఉండువాడు పట్టణములోనికి రాకూడదు." ఇప్పుడు అది ఏ మంచి కార్యమును చేసినది…

 

9కొద్దిమంది దానిని తమ సిద్దాంతమునకు ఆధారముగా ఉపయోగించుటకు ప్రయత్నిస్తున్నారు, ఆయన రాకడవరకు ప్రజలు ఇంకా విశ్రాంతి దినములను ఆచరిస్తారు, సబ్బాతు ఘడియలను పాటించెదరు. ఒకవేళ ఆ రాకడ విశ్వవ్యాప్తము అయినట్లైతే నీవు విశ్రాంతి దినమును ఆచరించలేవు. ఎందుకనగా, ఒకవైపు అది విశ్రాంతి దినము, మరియొక వైపు విశ్రాంతి దినమును దాటిపోయిన దినముగా అది యుండును. చూశారా, కావున అది ఆ విధముగా కాదు. సబ్బాతు అనే విశ్రాంతి దినమును ఆచరించుట అరణ్యములోని జనులకే చెందును గాని, సార్వత్రిక సంఘమునకు కాదు, గ్రహించారా. ఈ భిన్నమైన కార్యములన్నింటికి కారణమేమనగా, పరిశుద్ధాత్మ లేకుండానే లేఖన వాక్యములను తీసుకొని, వారికి తగిన విధముగా వాటిని విభాగించి వారేమైయున్నారనే దానిని వారు చూపించుచున్నారు.

అయితే ఇక్కడ యేసు మాట్లాడుచున్నదేమనగా, నా దీనమైన అభిప్రాయము ఏదనగా, ఆయన చెప్పాడు, "ఈ తరము"మరొక మాటలో "అంజూరపు చెట్టు చిగురించుట చూసిన తరము" చూడండి. ఆయన ఇక్కడ చెప్పాడు,"అంజూరపు చెట్లు చిగురించి, అది లేతగా ఉన్నప్పుడు, వసంతకాలము యింక సమీపముగా ఉన్నదని మీకు తెలియును. ఆ ప్రకారమే మీరీ సంగతులన్నియు జరుగుట చూచునప్పుడు ఆయన సమీపముననే, ద్వారము దగ్గరనే యున్నాడని తెలుసుకొనుడి. ఈ మూడు ప్రశ్నలు నెరవేరుట మీరు చూచినప్పుడు, కాలము సమీపముగా ఉన్నదని మీరు తెలుసుకుందురు. ఆ తరము అంజూరపు చెట్టు చిగురించుటను చూచెదరు," మరియు అంజూరపు చెట్టు ఎల్లప్పుడు "ఇశ్రాయేలు"కు సాదృశ్యముగా యున్నది. "ఇశ్రాయేలు తిరిగి తన స్వదేశమునకు చేరుకొని అది ఒక దేశముగా మారినప్పుడు, ఈ సంగతులు అన్నియు నెరవేరువరకు ఆ తరము గతించదు."

మరియు ఈ రాత్రి, లేఖనములలో దీనిని క్రైస్తవ స్నేహితులు గొప్ప సందేహాస్పదముగా చూచుచున్నారు. ప్రజలు దానిని సందేహించుచున్నారు. ఇక్కడ ఆయన చెప్పిన సమస్తము నెరవేరుటను ఇప్పుడు జీవించుచున్న మనము చూచుచున్నాము. ఇక తరువాత జరగవలసిన కార్యమేమనగా ఆయన రాకడ మాత్రమే.

10ఇశ్రాయేలీలు ఇప్పుడు తన స్వంత దేశములో ఉన్నది. ఇప్పుడు ఆమె స్వతంత్ర దేశమునందు యున్నది. స్వంత ద్రవ్యము, స్వంత జెండా కలిగియున్నది. ఐక్యరాజ్యసమితిలో సభ్యత్వము కలిగియున్నది. ఇప్పుడు ఆమె ఒక దేశము, ఇరవై-అయిదు-వందల సంవత్సరముల తర్వాత మొదటిసారిగా ఆమె దేశముగా మారినది. యేసు దానిని వాగ్దానము చేసెను, "ఈ తరము" పరిశుద్ధ గ్రంధములో ఒక తరమునకు నలభై సంవత్సరములు పరిగిణింపబడుచున్నది. ఇశ్రాయేలు ఒక దేశముగా మారిన సమయము నుండి నలభై సంవత్సరములలో, ఈ మధ్య కాలములో ఏదో ఒక సమయములో ఆయన వస్తాడు. మరియు ఒకవేళ అది సత్యమైతే, అప్పుడు అది రాకడను తీసుకొని వచ్చును.

మంచిది, మరొక సంగతేమనగా, ప్రతీ రెండువేల సంవత్సరములకు, భూమి యందు ఏదో ఒక కార్యము సంభవించినది. రాజకీయములు మరియు సమస్తము విఫలమయ్యాయి. దేవుడు పరలోకము నుండి సహాయము పంపవలసియున్నది. మరియు మొదటి రెండు వేల సంవత్సరములకు ఈ లోకము జలములతో నాశనము చేయబడినది; రెండవసారి రెండువేల సంవత్సరములకు క్రీస్తు వచ్చెను; మరియు ఇది 1964వ సంవత్సరము, మనము దానికి పదిహేడు సంవత్సరముల తక్కువగా ఉన్నామని వారు చెప్పుచున్నారు.

11మీరు గమనించారా, అది సమీపముగా ఉన్నది. తర్వాత కార్యమేమనగా, ప్రభువు రాకడ కొరకు కనిపెట్టుకొనియుండుట. మిగిలిన అన్ని సూచనలు దానితోనే మిళితమైయున్నవి. అందునుబట్టియే ఈ రాత్రి, ప్రజలు వాగ్దానము చేయబడిన వాక్యము మీద ఖచ్చితముగా నిలబడునట్లు చేయుటకు నేను ప్రయత్నించుచున్నాను. కేవలము వాక్యము ఏమి చెప్పినదో, ఖచ్చితముగా దానితోనే నిలబడండి.

క్రీస్తువద్దకు నేను వచ్చినప్పుడు, నేను నిలబడుటకు ఒక పునాది అవసరమై యున్నదని నేను ఎరిగియున్నాను. నేను మిషనరీ బాప్టిస్టు సంఘములో అభిషేకించబడినను మిషనరి బాప్టిస్టు సంఘము యొక్క సిద్దాంతములను చూచినప్పుడు అవి వాక్యమునకు ఎంతో వ్యతిరేకముగా ఉన్నట్లు నేను కనుగొన్నాను. పిదప నా నిరీక్షణకు ఆధారముగా మిషనరీ బాప్టిస్టు యొక్క సిద్ధాంతములను ఏకీభవించ లేకపోవుటచేత, ఇక అచ్చట నేను ఉండలేక పోయాను. అటుతరువాత నేను నా తల్లియొక్క సంఘమునకు వెల్దామని అనుకొన్నాను, ఆమె మెధడిస్టు, నేను అక్కడికి వెళ్ళాలని తలంచాను. అచ్చట కూడా వాక్యమునకు వ్యతిరేకమైన కార్యములు ఉండుటను నేను మరలా కనుగొన్నాను. కావున, యేసు ఒకవేళ మెధడిస్టువారి కొరకు వచ్చినట్లైతే, ఆయన ఖచ్చితముగా బాప్టిస్టువారిని విడిచిపెడతాడని నాకు తెలుసు. ఒక వేళ ఆయన బాప్టిస్టువారికొరకు వచ్చినట్లైతే, ఆయన మెధడిస్టువారిని విడిచిపెడతాడు. కాని ఆ రెండు గుంపులలోను చక్కటి ప్రజలను నేను చూశాను. ఒకవేళ ఆయన ఒక సంఘము కొరకు వచ్చినట్లైతే, ఏ సంఘము కొరకు వస్తాడు, తొమ్మిదివందల కంటే ఎక్కువ సంఘశాఖలు ఉన్నాయి. ఆయన వాటికొరకు రావడము లేదు. సంఘ మునుబట్టి ఆయన ప్రజలకు తీర్పు తీర్చడు.

 

12యేసుక్రీస్తు ద్వారా ఆయన ప్రజలను తీర్పుతీర్చబోవుచున్నాడు. మరియు యేసుక్రీస్తు వాక్యమైయున్నాడు. పరిశుద్ధ యోహాను సువార్త 1వ అధ్యాయములో "ఆదియందు వాక్యముండెను" అని చెప్పాడు. దేవుడు. ఆదియందు అది వాక్యముగా ఉండక ముందు అది ఒక ఆలోచనగా యుండెను. మరియు "ఆదియందు వాక్యముండెను. వాక్యము దేవునియొద్ద ఉండెను, వాక్యము దేవుడైయుండెను." అది అంతయూ దేవుడే.

దేవుడు తన వాక్యములో తెలియపరచిన విధముగా, జగత్తు పునాది వేయకముందే, సంఘము తనయెదుట నిష్కళంకముగా, ముడతలేనిదిగా నిలువబెట్టాలని నిర్ణయించాడు. ఇప్పుడు గడియారములో సమయము ముందుకు సాగుచున్నది. ముడత మరియు కళంకము లేని మహిమకరమైన సంఘము ఉండబోయే సయమము రాబోవుచున్నది. ఈ రాత్రి ఇక్కడున్న మనమందరము ఆ సంఘములో సభ్యులమని నేను నమ్ముచున్నాను. మరియు ఆ సంఘములో ప్రవేశించుటకు ఒక్క మార్గమే ఉన్నది, ఏ సంఘశాఖ ద్వారా కాదు గాని, నీవు నూతనముగే జన్మించుట ద్వారానే దానిలో ప్రవేశించగలవు.

మరియు నీవు, "మంచిది, దానిని నేను నమ్ముచున్నాను" అని చెప్పగలవు.

నీవు విశ్వసించినట్లయితే, ఈ పరిశుద్ధ గ్రంధములో ఉన్న ప్రతీ వాక్యమునకు నీవు "ఆమేన్" అని చెప్పెదవు; ఎందుకనగా, అది క్రీస్తు మరియు నీవు క్రీస్తులో ఒక భాగముమైయున్నావు. మరియు పరిశుద్ధాత్మ ఈ సత్యమును బయలుపరుచుచున్నాడు. ప్రతీ కాలమునందు నెరవేర్చవలసిన దానియొక్క వాక్యభాగము నిర్ణయించబడియున్నది.

 

13దేవుడు ఎల్లప్పుడూ ఒక ప్రవక్తను పంపును. వాక్యము ప్రవక్తవద్దకు వచ్చును. వ్రాయబడిన వాక్యము, హృదయాలోచనలను వివేచించేది. నీవు ఎల్లప్పుడూ దానిని గ్రహించితివా? ప్రవక్త తాను ఒక ప్రవక్తని అతడు ఎరుగును, ఎందుకనగా దేవుని వాక్యము హృదయాలోచనలను వివేచించును, జరుగుబోయే కార్యములను ముందే చెప్పును, భావిష్యత్కార్యములను చెప్పువాడు మరియు ముందే సంభవించబోవు వాటిని చెప్పువాడు. మీరు ఎప్పుడైనా పాత హీబ్రు నిఘంటును తీసి దీర్ఘదర్శి అనే పదమునకు అర్ధమేమైయున్నదో చూశారా? అతడే వ్రాయబడిన వాక్యము యొక్క దైవీక ప్రత్యక్షతను కలిగియుండువాడు. అతడు జరుగుబోయే సంగతులను ముందుగానే చూసి, ముందుగానే చెప్పును. అతడు చెప్పిన ఆ కార్యములు నెరవేరును, ఆ విధముగానే అతడు ఒక దీర్ఘదర్శిగా ఋజువుపరచబడును.

ఈ మాదిరి లేఖనములలో ఎక్కడ ఉన్నది? ఖచ్చితముగా ఉన్నది. "మీలో ఎవరైనా ప్రవక్తగాని, దీర్ఘదర్శిగాని ఉన్నట్లయితే, దర్శనము ద్వారా నేను అతడితో మాట్లాడి, ప్రభువైన నేను అతనికి నన్ను బయలు పరుచుకొనెదను. అవి నెరవేరిన యెడల, అవి నా వలన కలిగినవి. కానీ అవి నెరవేరనియెడల, అతని మాట ఆలకించ వద్దు;" అతనికి భయపడ వద్దు, దానిని నిర్లక్ష్యం చేయండి. దేవుని వాక్యము ఎల్లప్పుడూ సత్యమైయున్నది! కావున, అతడు మాట్లాడే మాటలను వారేవిధముగా కనుగొనేదరనగా, అతడు సరియైన ప్రత్యక్షతను కలిగియున్నడా లేదా —వ్రాయబడిన దైవీక వాక్యమునుబట్టియే కనుగొనెదరు — ఎందుకనగా, ప్రభువు యొక్క వాక్యము అతనియొద్దకు వచ్చును. కావున మనము అక్కడ నిలిచియుండవలెను. మనలను, మన విశ్వాసమును దేవుని వాక్యము మీద ఉంచవలెను.

 

14"సహోదరుడా బ్రెన్హా౦, అది పాత నిబంధనలోని ప్రవక్తలకు చెందినవి" అని నీవు చెప్పవచ్చును.

దేవుడు, పరిశుద్ధ గ్రంథములో, హెబ్రి 1వ అధ్యాయములో ఈ విధముగా చెప్పాడు, "పూర్వకాలమందు నానా సమయములో నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాటలాడిన దేవుడు, ఈ దినములయందు తన కుమారుడై, యేసుక్రీస్తు ద్వారా మాటలాడెను." చూశారా, అది యేసుక్రీస్తు మరియు యేసుక్రీస్తు వాక్యమైయున్నాడు. ఆయన తన వాక్యమును యేసుక్రీస్తు ద్వారా ప్రత్యక్షపరచును. వాక్యము తనంతటతానే ప్రత్యక్తపరచుకొనును, అది వాక్యమును జీవింపచేయును. అక్కడే ప్రజలు ఆయనను గుర్తించుటలో విఫలమయ్యారు.

ఆ విధముగానే, ఆ బావి దగ్గర ఆ స్త్రీ, ఆయనను గుర్తించినది. ఎలా ఆమె త్వరగా ఆయనను గుర్తించినది? ఆమెను గూర్చి ఆయన చెప్పిన వెంటనే, "అయ్యా, నీవు ప్రవక్తవని గ్రహించాను. మెస్సీయా వస్తాడని మేము ఎరుగుదుము. ఆయన వచ్చినప్పుడు ఈ సంగతులన్నిటిని ఆయన మాకు బయలుపరచును" అని చెప్పెను.

నీతో మాటాలాడుచున్న నేనే ఆయనను" అని ఆయన చెప్పాడు.

మొదటే ఆ క్రియ జరిగినప్పుడు, ఆమె ఆయనను ఏ విధముగా తృణీకరించగలదు? ఆయన ఆ ప్రవక్తయైయున్నాడని మొదటే ఆ క్రియ రుజువుపరచినది. కొన్ని వందల సంవత్సరములుగా వారు ప్రవక్తలను కలిగిలేరు. ఈ మనుష్యుడు ప్రవక్తగా వుండవలెను. తనను తాను రుజువుపరచుకొనుట ద్వారా తాను చెప్పినట్లుగానే ఆయన వాగ్దానము చేయబడిన ఆ ప్రవక్తాగానే యున్నాడు. ఆ స్త్రీ పట్టణములోనికి పరుగెత్తి వెళ్ళి, "నేను చేసినవన్నీ నాతో చెప్పిన ఈయనను వచ్చి చూడుడి, ఈయన మెస్సీయా కాడా? ఆయనే మెస్సీయా" అని చెప్పుటలో ఏ ఆశ్చర్యము లేదు.

దేవుడు ప్రతీకాలమునకు వాక్యములో కొంతభాగమును కేటాయించి వుంచును, అది రుజువుపరచబడుతుంది, ఎందుకనగా అది అలా జరుగునని దేవుడు వాగ్దానము చేశాడు. మరియు అది ఎల్లప్పుడు సత్యముగానే యుండును.

15నోవహు దినములలో నోవహును గ్రహించుటకు మరియు అర్ధము చేసుకొనుటకు ఆ ప్రజలకు కష్టమైనది. దేవుడు మాట్లాడుట అతడు విన్నాడు. అది దేవుని వాక్యమని అతనికి తెలుసు, ఎందుకనగా అతడు దేవునియొక్క ప్రవక్త. "గొప్ప జలప్రళయము రాబోవుచున్నదని" ప్రకటించుటకు దేవుడు అతడిని పంపెను. విమర్శల మధ్య అతడు పెద్ద ఓడను నిర్మించెను. ప్రజలు ఎంతగా విమర్శించినను, నోవాహు దానిని ఎంతమాత్రము లక్ష్యపెట్టలేదు. అతడు ఆ దినమునకు వెలుగైయున్నాడు. అతడు ఆ కాలమునకు ప్రత్యక్షపరచబడిన దేవుని వాక్యమైయున్నాడు; ఎందుకనగా దేవుడు ఆ ప్రజలను నాశనము చేసెను.

మోషే, తత్వశాస్త్రమునందు గొప్ప నిపుణుడు, గొప్ప వ్యక్తి, ప్రవక్తగా జన్మించినవాడు; అతడికి అంత గొప్ప జ్ఞానము ఉన్నప్పటికీ, దేవుని గూర్చి అతనికున్న విషయ పరిజ్ఞానముచేత అతడు ఇశ్రాయేలు సంతానమును విడిపించలేకపోయాడు.

మీరు గ్రహించారా, ప్రవక్త జ్ఞానము ద్వారా కార్యము జరిగించలేడు. అతడు దేవుని ప్రేరేపణ ద్వారా, ప్రేరేపణ ద్వారానే ముందుకు సాగవలసియున్నది.

ప్రభువు వాక్యము అతడికి అరణ్యములో మండుచున్న పొదలో ప్రత్యక్షమైనప్పుడు, దేవుడు అబ్రాహాముతో పలికిన మాటలను అతనికి బయలుపరిచాడు. ఆయన ఏమి చేస్తున్నాడు? ఆ కాలమునకు వ్రాయబడిన వాక్యమును అతనికి చూపించిన తరువాత అతడిని ఆ పరిచర్యకు పిలిచాడు. కాని అతడు భయపడ్డాడు. ఒకప్పుడు, సైన్యముతో వారిని విడిపించుటకు ప్రయత్నించాడు; కాని ఇప్పుడు తన చేతిలో కర్రతో వారిని విమోచించుటకు బయలుదేరి వారిని విమోచించెను.

లోక సంబంధమైన మనస్సు దానిని గ్రహించలేని రీతిలో దేవుడు ఆ కార్యమును మర్మయుక్తముగా జరిగించాడు. వారు దానిని ఎన్నడూ గ్రహించలేరనే దానిని మీరు ఎప్పుడైనా గమనించారా?

 

16బాప్తిస్మమిచ్చు యోహాను, నీటిలో నిలబడియున్నప్పుడు, అతడు ఒక ప్రవక్త. ప్రవక్తలకు మరియు దేవుని కుమారునికి మధ్య అతడు ముందుగా వచ్చే దూతగా ఉన్నాడు. యోహాను నీటిలోనికి వెళ్ళి నిలబడి, ఈ విధముగా ప్రకటించెను, ప్రజలతో ఈ మాట చెప్పుటకు అతడు భయపడలేదు, "మీ మధ్య ఒకరు నిలబడి యున్నారు!" ఒక్కసారి అతడు ఎంత నిశ్చయత కలిగియున్నాడో ఆలోచించి చూడండి. "ఇప్పుడే మీమధ్య ఒకరు నిలబడి యున్నారు, మీరు ఆయనను ఎరుగరు. నేను ఆయన చెప్పులు మోయుటకు కూడా యోగ్యడను కాను. ఆయన మీకు అగ్నితోను మరియు పరిశుద్ధాత్మతోను బాప్తిస్మమిచ్చును."

అప్పుడు ఆయన ప్రజల మధ్య ఉన్నాడు. ఆయన తన తరములో రావలసియున్నదని యోహాను ఎరిగియున్నాడు, ఎందుకనగా అతడు తన స్థానమును లేఖనములలో చూసియున్నాడు, ఆయన మీద దేవుని ఆత్మను చూశాడు. "మార్గమును సిద్ధపరచుటకు నీకు ముందుగా నా దూతను పంపుచున్నాను." మెస్సీయా యొక్క రాకడ సమీపముగా ఉన్నదని అతడు ఎరిగియున్నాడు.

ప్రవక్త నీటిలో నిలువబడి ప్రవచిస్తున్నప్పుడు, వాక్యము అతడి దగ్గరకు వచ్చినది. యేసు వాక్యమైయున్నాడు! ఆ రీతిగా ప్రవక్త ఆయనను ఎరిగి యున్నాడు, ఎందుకనగా అది వాక్యమైయున్నది, సూచనతో అది అతడికి అనుగ్రహించబడియున్నది. "నేను ఆయనను ఎరుగుదును; అరణ్యములో ఆయన దానిని నాకు చెప్పాడు, "వెళ్ళు, నీటిలో బాప్తిస్మము ఇమ్ము" ఎవరిమీదకు ఆత్మ దిగివచ్చి నిలిచి యుండుట చూస్తావో, ఆయనే పరిశుద్ధాత్మతోను, అగ్నితోను బాప్తిస్మమిచ్చును." వాక్యము వచ్చినప్పుడు, వాక్యముతోపాటు సూచన కూడా నీటిలోనికి వచ్చినది.

 

17ఆయన వచ్చినప్పుడు, తానే వాక్యమైయున్నాడని యేసు ఎరిగియున్నాడు. దానినిగూర్చి ఆయన సానుకూలముగా స్పందించాడు. ఎందుకనగా ఆయన కేవలము పండ్రెండు సంవత్సరముల వయస్సులో చిన్న బాలుడిగా ఉన్నప్పుడే (గత రాత్రి నేను మాట్లాడిన విధముగా) ఆయన దేవాలయములో యాజకులతో తర్కించుటను మనము కనుగొన్నాము. అయన స్వంత తల్లి ఆయన దగ్గరకు వచ్చినప్పుడు. ఆమె తప్పుగా పలికినది, అప్పుడు వాక్యము ఆ తప్పిదమును సరి చేసినది.

దేవుని వాక్యము ఎల్లప్పుడూ తప్పులను సరిచేయును. ఒకవేళ ఈ రోజున ప్రజలు దానిని గమనించగలిగినట్లయితే, వాక్యము తప్పులను సరిచేయును. సమస్తము తప్పుగా మారినది. అయితే దేవుని వాక్యమే సత్యము. ఆయన చెప్పెను, "భూమ్యాకాశములు గతించును గాని, నా మాటలేమాత్రమును గతించవు."

ఈ కాలమునకు ప్రవచింపబడిన వాక్యము, ఈ దినముయొక్క తప్పులను సరిచేయును. మీకు అర్థమయ్యిందా? వాక్యము తనంతట అదే తప్పులను సరి చేయును. ఈ రోజు ప్రజలు, "ఓ, మనము దీనిలో చేరుదాము, ఆ సంఘ సంస్థకు వెళ్లాము, ఈ కార్యములన్నింటిని చేద్దాము" అని చెప్పెదరు. అది తప్పు, వాక్యము మరలా తిరిగి వచ్చి ఆ గడియతోను, ఆ గడియ యొక్క కాలముతోను తనకుతానుగా రుజువుపరుచుకొనుచూ, ఆ తప్పులను సరిచేయును. ఆ సంగతులు సత్యమని మనము ఎరిగి యున్నాము.

18ప్రభువు చిత్తమైతే, పది నిమిషములు నేను నా స్వంత సాక్ష్యమును చెప్పెదను. చిన్న వ్యక్తిగత సాక్ష్యము. నాది పొరపాటు కానట్లైతే, నేను నమ్ముచున్నాను, సహో జాన్ షర్రిట్… అతడు ఈ రాత్రి ఈ ఆలయములో ఉన్నాడో లేదో నాకు తెలియదు. నేను అతడిని చూడలేదు. అతడు ప్రశస్త సహోదరుడు, నాకు చాలా వ్యక్తిగత స్నేహితుడు. నా పరిచర్య ప్రారంభములో అతడు నాతో ఉండినవాడు.

పదహారు సంవత్సరముల క్రితము నేను ఫోనిక్సుకు వచ్చినప్పుడు ఇక్కడ ఎంత మంది ఉన్నారు? మీ చేతులు చూపండి. వారిని చూడండి, మూడోవంతు ఉన్నారు. మీలో ఎంతమందికి అది గుర్తున్నది. రోగుల కొరకు ప్రార్ధి౦చునప్పుడు, నేను నా చేతులు చాపేవాడిని, ప్రజలు వారి చేతులు నా మీద వేసేవారు, అప్పుడు నేనేమి చెబుతానో దానిని వారు కలిగి యుండేవారు. అది ఎంత మందికి జ్ఞాపకము ఉన్నది?

19మీలో ఎంతమందికి అది జ్ఞాపకము ఉన్నది? ఆ అగ్నిస్థంభములోని ప్రభువు దూత నన్ను అక్కడ కలుసుకున్నప్పుడు, ఆయన నాతో "నేను యధార్థముగా ఉన్నట్లయితే, నేను హృదయ రహస్యములను తెలుసుకుంటానని" చెప్పిన సంగతి - ఎంత మందికి జ్ఞాపకమున్నది?

ఆయన వాగ్దానము చేసిన కార్యము కొనసాగుతుందని, ఎంతమందికి జ్ఞాపక మున్నది? కొద్దికాలము క్రితము, దర్శనములో మూడు ఈడ్పులను గూర్చి ఆయన వాగ్దానము చేశాడు. "సహజాతీతమైన కార్యములను పెంతుకోస్తు శిశువులకు నీవు భోదించలేవు" అని చెప్పాడు. నేను మూడవ ఈడ్పులోనికి వచ్చినప్పుడు, ఆయన చెప్పాడు, "ఇప్పుడు దీనిని గూర్చి ఎవరికి చెప్పవద్దు. నీవు ముందున్న దానిని వివరించుటకు ప్రయత్నించావు. దీనిని గూర్చి ఎవరికి చెప్పవద్దు. ఇది గొప్పది, ఇదే ఆఖరి ఈడ్పు" అని ముందే చెప్పిన సంగతి ఎందరికి గుర్తున్నది?

చూడండి, ఆయన ఎన్నడూ విఫలము కాడు. ఒకటి, రెండు, మూడు, చెప్పబడిన రీతిగానే అవి సంభవించాయి.

20ఆ కాలములోనే, ఫోనిక్సనందు గుండెలో కేన్సరువలన మరణిస్తున్న శ్రీమతి. వాల్తాఫ్ ప్రార్ధనా వరుసలో వచ్చుచుండగానే మరణించి పిదప ఆమె సజీవరాలుగా స్వస్థపరచబడెను. ఆమె సాధారణముగా కూడికలకు హాజరవుతాది. బహుశా, ఆమె ఇప్పుడిక్కడ యుండవచ్చును. శ్రీమతి. హట్టీ వాల్తాఫ్ తరువాత ఆమెకు చికిత్స చేసిన వైద్యుడు దానిని గూర్చి సాక్ష్యమిచ్చాడు, ఆ ఛాయా చిత్రములు, కాదు… ఎక్స్-రే చూపించాడు. ఆ స్త్రీలో కేన్సరు ఎక్కడున్నదో ఆ ఎక్స్-రే యందు చూపించాడు. ఆమె ఈ రోజు సజీవురాలు, అది పదహారు సంవత్సరముల క్రితము జరిగినది. ఇప్పుడు అది నాకు ఖచ్చితముగా తెలుసు… అవును, శ్రీమతి. వాల్తాఫ్ అక్కడున్నారు, అవును. [ఈ మార్చి నెలకు అది జరిగి పదిహేడు సంవత్సరములు అని ఎవరో చెప్పుచున్నారు]. ఈ మార్చి నెలకు పదిహేడు సంవత్సరములు, గుండెలో కేన్సరువలన మరణించిన ఒక స్త్రీ, మరలా బ్రతికినది. ఎందుకనగా, అది "ప్రభువు ఈలాగు సెలవిచ్చుచున్నాడు"గా ఉన్నది. ఇప్పుడు వారి కాలములను గమనించండి.

21నేను కాలిఫోర్నియాకు వెళ్ళాను, అప్పుడు సహో జాన్ షర్రిట్ నాతో ఉన్నాడని నేను నమ్ముచున్నాను. ఈ రోజు, ఇక్కడకు వస్తున్నప్పుడు, నేను దానిని గూర్చి ఆలోచించాను. అతడు అక్కడున్నాడని నాకు నిశ్చయముగా తెలుసు. నా భార్య, నేను… నా రిబ్కా ఆమె ఇప్పుడు యువతి, ఈ సంవత్సరము పట్టభద్రురాలు అవుచున్నది, అప్పుడు ఆమె బాలిక. ఆమెను నా చేతులలో పట్టుకున్నాను. మేము కాటలినా వరకు వెళ్ళాము. కూడిక అయిన తర్వాత కాటలినా వెళ్ళుచున్నాము, మేము పడవలో వెళ్ళుచున్నాము. మేము సముద్రము మీద ఉన్నాము. మేము వెళ్ళే ముందు, రాత్రి లేక రెండు రాత్రుల ముందు.

పాల్ మెల్మియన్, మీలో చాలామందికి అతడు తెలుసు. పాల్ మెల్మియన్ నేను నమ్ముచున్నాను, అతడు… ఏమిటి? ["మడెరా" అని ఒక సహోదరుడు చెప్పాడు]. ఎక్కడ? ["మడెరా"] మడెరా, కాలిఫోర్నియా, అతడి తల్లి, తండ్రి, వారిద్దరూ కూటములలో స్వస్థత పొందారు. వారిని దర్శించుటకు నేను విమానములో వెళ్ళాను, మరియు వారు స్వస్థతపొందారు.

22పౌలు యొక్క భార్య అప్పుడే ఒక బిడ్డను ప్రసవించినది. వారు మంచి ప్రజలు, ఆర్మేనియన్లు, అతని భార్య అనారోగ్యముగా ఉన్నది, ఆమెను తీసుకురావాలని ఫోన్ చేశారు. "సరే మంచిది, తీసుకురండి" అని నేను చెప్పాను. కాబట్టి ఆమెను వారు తీసుకువచ్చారు. ఆ రాత్రి… ఆమె, మరియు నా భార్య మరియు నేను, మరియు సహో షర్రిట్ నాకు ఖచ్చితముగా గుర్తులేదు.

సహో షర్రిట్ ఇక్కడున్నాడా? ఒకవేళ అతడున్నట్లయితే. అది నిజమేనా, సహో షర్రిట్, ఆ రాత్రి అక్కడ నీవు ఉన్నావా? అది నిజమే. అక్కడ సాక్షిగా ఉన్నాడు. నేను సహో జాన్ కొరకు చూస్తున్నాను, అతడున్నాడో లేదో చూడండి.

ఆమె తన చేతిని నా మీద పెట్టినది, వెంటనే అది కనిపించినది. "చూడండి, ఆమె యొక్క ప్రాణమును తీసే దుష్టజీవము" ఆమెలో ఉన్నది. మరి నేను చెప్పాను, "నీకు ప్రసవము తర్వాత వచ్చే కాళ్ళవాపు ఉన్నది." మంచిది, అప్పటికీ ఆమెకు ఆ వ్యాధి లక్షణములు లేవు. కాని కొన్ని దినముల తర్వాత ఆమెకు కాళ్ళవాపుకు వైద్యము చేశారు.

"సహో బ్రెన్హాం, అది అద్భుతము" అని ఆమె చెప్పినది.

ఇప్పుడు నేను కొన్ని అభ్యంతరముగా కనబడే విషయములను చెప్పాలి. అదేమైనప్పటికి నేను సత్యము చెప్పాలి. నా తండ్రి త్రాగుబోతు అని చెప్పుటకు నేను ఎప్పుడూ అసహ్యించుకుంటాను. అది చెప్పుట నాకు అసహ్యము, కాని అది సత్యము. ఒకవేళ ఏదైనా తప్పు ఉన్నట్లయితే, మనము పైకి వెళ్ళకముందే, ఇక్కడే దానిని సరిచేసుకుందాము. మంచి విషయములను చెప్పుట నాకు ఇష్టము, కాని చెడు విషయములను కూడా చెప్పాలి.

23నా భార్య ఆ గదిలో ఉన్నది, ఆమెతో పాటు నల్లటి జట్టున్న ఒక స్త్రీ ఉన్నది. శ్రీమతి మెలిక్కి, "అది వింతగా ఉన్నది, అది ఏ విధముగా నీ చేతి మీద క్రియ చేయుచున్నది, అది ప్రతివారి చేతి మీద అలాగే క్రియ చేస్తుందా?" అని ఆమె అడినది.

"లేదమ్మా" అని నేను చెప్పాను.

"మీరు దానిని వివరించగలరా?" అని అడిగినది.

"వివరించలేను" అని నేను చెప్పాను.

లేదు, నీవు దేవునిని గూర్చి ఏమియు వివరించలేవు. నీవు దేవుని కార్యములను వివరించలేవు, నీవు దేవుడిని వివరించలేవు. దేవుడు వివరణకు అతీతుడు. ఒకవేళ ఆ విధముగా వివరించగలిగితే, మనము విశ్వాసము ద్వారా ఆయనను నమ్మవలసిన అవసరము లేదు.

నేను చెప్పాను, "దేవుని కార్యములు అగోచరమైనవి. అది దేవుని కార్యము, నేను దానిని వివరించలేను" అని నేను చెప్పాను.

మరియు ఆమె చెప్పినది, "మంచిది, అది ఖచ్చితముగా అద్భుతము."

మరియు, "మంచిది, నా చేతిని ఆమె మీద పెడతాను, చూడండి, ఆమెలో ఏ మార్పు కలుగుట లేదు" అని నేను చెప్పాను.

"నా భార్యకు ఎలా౦టి సమస్య లేదు." హనీ, నీ చెయ్యి పెట్టుము. ఆమె చెయ్యి నన్ను తాకిన వెంటనే, నా స్వంత భార్యతో — "నీ ఎడమ అండాశములో కణిత ఉన్నది" అని నేను చెప్పాను.

సహో పర్రిట్ ఆ రాత్రి ఆ గదిలో ఉన్నాడు, గుర్తున్నదా?

24మంచిది, రెండు సంవత్సరముల తర్వాత, చిన్న శారా జన్మించినది, నాలుగు సంవత్సరముల తరువాత బెక్కీ జన్మించినది. "ఆమెకు సాధారణ కాన్పులు జరుగలేదు, శస్త్రచికిత్సలు చేయవలసివచ్చినది. ఆమె కుటుంబములో ఆ ఆనవాయితీ ఉన్నది. మీరు ఆమె ఉదరము తెరచినప్పుడు, ఆమె ఎడమ అండాశయమును చూడండి, దానిలో ఏమైనా కణితి లేక తిత్తి ఉన్నదేమో చూడండి" అని నేను వైద్యుడుతో చెప్పాను.

అతడు చెప్పాడు, "సహో బ్రెన్హాం, మంచిది, నేను చూస్తాను." కాని దాని తర్వాత… అతడు తిరిగి వచ్చిన తరువాత, "సహో బ్రెన్హాం, నాకు ఏమి కనబడలేదు" అని చెప్పాడు.

"సరే, మంచిది" అని చెప్పాను.

నాలుగు సంవత్సరముల తర్వాత నా చిన్న జోసఫ్ రంగము మీదకు వచ్చాడు. మరలా నేను ఆమె చేయి పట్టుకొని చూచాను, అది ఇంకా అక్కడే ఉన్నది. నేను చెప్పాను, "డాక్టర్, మరలా ఎడమ అండాశమును చూడండి, మీరు చూస్తారా?"

"అలాగే, సహో బ్రెన్హాం" అని అతడు చెప్పాడు. అతడు దానిని చూశాడు… "లేదు, అక్కడ ఏమియు లేదు" అని చెప్పాడు.

నేను ఆమె చేతిని పట్టుకొని, "కాని అది అక్కడున్నది. అది అక్కడున్నది. ఇది, దానిని రుజువపరుస్తుంది" అని చెప్పాను. అతడు దానిని కనుగొనలేకపోయాడు.

మంచిది, చాలా సంవత్సరములు గతించిపోయాయి.

25గత సంవత్సరము, మాకు వివాహమయ్యి ఇరవై-రెండు సంవత్సరములు. ప్రతి హనీమూన్ కు నేను వేటకు వెళ్తాను. నేను ఎప్పుడూ ఆ పర్వతము పైనున్న చిన్న స్థలమునకు వెళ్తాను. నేను అక్కడ చిన్న ప్రార్ధన చేస్తాను, మంచి భార్యను ఇచ్చినందుకు దేవనికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను. నా భార్య నాకు ఎంతో ప్రియమైనది, కాబట్టి ప్రతి సంవత్సరము నేను అదే విధముగా చేస్తాను.

ప్రభువు ఆజ్ఞనుబట్టి మేము అరిజోనాకు వచ్చినప్పుడు, నా దగ్గర ఆ చిన్న చిత్రము ఉన్నది. దీనిని వార్తా పత్రకలలో మీరు చూశారు, వార్తా పత్రికలలో దానిని ఎలా ప్రచురించారో, ఈ మధ్యాహ్నం ఒక వ్యక్తికి చూపించాను. నేను ఈ ప్రసంగ వేదిక మీద నిలువబడి, ఇక్కడున్న ప్రతి వ్యక్తికి చెప్పాను, "ప్రభువు ఈలాగు సెలవిచ్చుచున్నాడు, ఒక కార్యము జరుగబోవుచున్నది. టుసాన్ కు ఉత్తరము వైపుగా ఏడుగురు దేవదూతల నక్షత్ర రాశి నన్ను సంధించుటను నేను చూశాను." అది మీకు జ్ఞాపకమున్నదా? కొన్ని సంవత్సరముల క్రితము నేను దానిని చెప్పినప్పుడు ఉన్నవారు ఇక్కడ ఎంతమంది ఉన్నారు? మంచిది. అది ఖచ్చితముగా ఆ విధంగానే ఎలా జరిగినదో దానిని మీరెరుగుదురు.

26వార్తా పత్రికలు కూడా ఆ చిత్రమును ప్రచురించాయి, "ఇరవై-ఏడు మైళ్ళ ఎత్తులో; ముప్పై మైళ్ళ ఎత్తులో, ఇరవై-ఏడు మైళ్ళ వెడల్పున మర్మయుక్తమైన ఒక వెలుగు ప్రత్యక్షమైనది." తేమ ఎనిమిది లేక తొమ్మిది మైళ్ళ ఎత్తువరకే వెళ్ళగలదని మీకు తెలుసు. అది ఏమిటో వారు దానిని కనిపెట్టలేక పోయారు. నేను దానిని గూర్చి ఒక్క మాట కూడా చెప్పలేదు. దానిని అలాగే విడిచిపెట్టాను; ఎందుకనగా, దానిని గూర్చి చెప్పుటవలన కలిగే మేలు నాకు తెలియదు.

ఫోటో తీయబడిన ఆ వెలుగును మరియు ప్రభువు యొక్క దూతను గూర్చి వారు నమ్మని విధముగానే దీనిని కూడా వారు నమ్మటలేదు.

సరే ఇప్పుడు, మేము ఇక్కడికి వచ్చిన తర్వాత నేను ఖాళీ లేకుండా కూడికలలో ప్రసంగించుచూ, ప్రభువుకు నా శాయశక్తులా పరిచర్య చేస్తున్నాను. కాని నేను చేయవలసినంత చేయలేదని నాకు తెలుసు; నేను అనేక పొరపాట్లు చేశానని నాకు తెలుసు.

కాబట్టి నా పిల్లలకు, తల్లిగా మరియు తండ్రిగా నా భార్యే చూచుకోవలసి వచ్చినది. నేను ఇంటికి దూరముగా ఉండుటవలన ఆమే తల్లిగా, తండ్రిగా రెండు బాధ్యతలు నెరవేర్చవలసి వచ్చినది. మరియు ఆమె నిర్ణయము. తమ పిల్లలను గూర్చిన నిర్ణయములలో తండ్రి మరియు తల్లి అంగీకారమునకు రావలసియున్నది. కాని నేను ఇంటిలో లేను, నేను ప్రభువు సేవలో ఉన్నాను. మరియు నా భార్యకు ఇప్పుడు నలభై-నాలుగు సంవత్సరములు, నాకంటే పది సంవత్సరములు చిన్నది. కూటములను ముగించి చాలా అలసటతో నేను ఇంటికి వెళ్తాను. బహుశా మేము ఇక్కడకు వచ్చిన రెండు సంవత్సరముల తర్వాత అని నేను తలస్తున్నాను, నేను సభలకు వెళ్ళి వచ్చాను. నేను నిజముగా బాగా అలసిపోయాను.

27మరియు నా చిన్న కుమారుడు జోసఫ్, కొంచెం తుంటరి బాలుడు, అతడు పాఠశాలలో అటు ఇటు తిరుగుచుండేవాడు. ఒక రోజు నేను ఇంటికి వచ్చిన తరువాత అతడు ఏదో చెప్పాడు, తన తల్లిని అగౌరవముగా మాట్లాడినాడు. తరువాత నా దగ్గరకు పరుగెత్తికొని వచ్చాడు. ఇప్పుడు అతడికి తెలుసు, తన తల్లి కొడుతుందని. కాబట్టి ఆమె నాతో అన్నది, " బిల్లీ, వాడిని కొట్టు."

ఆ బాలుడు నా చుట్టూ చేతులు వేసి చెప్పాడు, "నాన్నా నన్ను క్షమించు." ఏ విధముగా చెబితే నేను మెత్తపడతానో వాడికి తెలుసు.

కాబట్టి, "ఓ" నేనన్నాను, "హనీ, దానిని మర్చిపో, నేను కొట్టలేను."

నేను మరియు నా భార్య, నా ఎదుట ఈ పరిశుద్ధ గ్రంథము పెట్టుకొని చెప్పుచున్నాను, మా జీవితములో మేము ఒక్క మాట కూడా అనుకోలేదు. కాని ఒకే ఒక్కసారి, తన జీతమునందు, ఆ ఉద్రేక సమయములో నా ముఖము ఎదుటనే ఆ తలుపును ఆమె గట్టిగా దభాలున వేసినది. మరి "అలా అయితే వాడిని నీవే కొద్దిసేపు చూచుకో," అని అంటూ ఆమె గట్టిగా తలుపును వేసి, లోపలికి వెళ్ళిపోయినది.

"పాపము దీనురాలు! ఆమె ఎంతో ప్రయాసపడుచున్నది, వీటన్నిటిని ఆమె ఒంటరిగా భరించవలసివస్తున్నది" అని నేననుకొన్నాను.

నేను బయటకు నడిచి వెళ్తూ "జోసఫ్, రా" అని చెప్పాను. అతడిని పట్టుకొని నేను నిన్ను కొట్టాలి, నీకు ఆ సంగతి తెలుసు. కాని నీవు పశ్చాతాప్తము పడుటను బట్టి నేను నిన్ను కొట్టలేదు. అర్ధమైనదా? కాని గుర్తుంచుకో, ఏదో ఒక రోజు, నా సహనం నశిస్తుంది. మరియు నీ పశ్చాతాప్తము చక్కని ఫలములను ఫలించాలి, అది నిజమైనదని నాకు నీవు నిరూపించాలి, గ్రహించావా. నీవు గనుక నన్ను ప్రేమిస్తున్నట్లయితే, నీవు నా మాటలను గుర్తుంచుకొంటావు" అని చెప్పాను.

 

28తరువాత నేను బయటకు వెళ్తూ, "నా కారు ముందు అద్దము మీద ఉన్న దుమ్మును కడిగి శుభ్రము చేస్తాను" అని చెప్పాను. నేను ఆ అద్దమును కడుగుటకు ప్రారంభించాను.

నేను కడుగుచుండగా, ఒక స్వరము, "వెళ్ళుము, మరియు II దినవృత్తాంతములు, 22వ అధ్యాయము చదువమని ఆమెకు చెప్పుము" అని చెప్పినది.

నేననుకొన్నాను, "నేను… నేను దానిని గూర్చి ఎలా భావించానో నాకు తెలియదు. బహుశా, అది నా ఊహ కావచ్చును" అని తలంచాను. కారు కడుగుట కొనసాగించాను.

మరలా స్వరము బిగ్గరగా, "వెళ్ళు, ఆమెకు చెప్పు!" అని వినిపించుచూ నన్ను భయపెట్టినది.

నేను లోపలికి వెళ్ళి మరియు దానిని చదివాను. అది ఏమిటో మీకు తెలుసా? కూషు దేశపు స్త్రీని వివాహము చేసుకున్నందుకు మిర్యాము, మోషేను ఎగతాళి చేస్తుంది. అప్పుడు దేవుడు చెప్పాడు, "నీవు ఆ పని చేయుటకంటే, నీ తండ్రి నీ ముఖము మీద ఉమ్మివేయుట మంచిది," గ్రహించారా. ఆయన వారిని పిలిచి, "వెళ్ళు, మిర్యామును తీసుకు రమ్ము, ఆమెకు కుష్ఠువ్యాధి వచ్చినది" అని చెప్పాడు. "వెళ్ళు, మిర్యామున పిలువము." మరియు మోషే… అగ్నిస్థంభము గుడారములోనికి దిగి వచ్చినది. మోషే అక్కడ నిలబడియున్నాడు, మరియు దేవుడు వారితో మాట్లాడినాడు. "మీలో ప్రవక్తయుండిన యెడల ప్రభువునగు నేను దర్శనమిచ్చి అతడు నన్ను తెలిసికొనునట్లు కలలో అతనితో మాటలాడుదును." ఆయన చెప్పెను, "అయితే నా సేవకుడైన మోషే, అతని వంటివాడు దేశములో ఎవ్వరూ లేరు." ఆయన చెప్పెను, "అతడు దేవునికి భయపడలేదా?" మిర్యాము ప్రవక్తిని అయినప్పటికిని, ఆమె కుష్ఠుముతో మొత్తబడినది. మరియు మోషే ఆమె కొరకు విజ్ఞాపనము చేశాడు మరియు ఆమె బ్రతికినది.

29అప్పుడు, అది నన్ను భయపెట్టినది. నేను మర్చిపోయాను. నేను దానిని గమనించలేదు, కాని ఆయన గమనించాడు. దానిని గమనించినవాడు ఆయనే. ఆమె నా భార్య, ఆమె కొరకు ఏ సమయమందైన నా ప్రాణమునైనా ఇచ్చుటకు నేను సిద్ధమే. కాని దేవుడు దానిని గమనించాడు. ఇది సత్యము, నా ఎదుట పరిశుద్ధ గ్రంథమున్నది.

నేను లోపలికి వెళ్ళాను. ఆమె గదిలోనికి వెళ్ళి, తలుపు మూసుకొని, మరియు కుట్టు మిషను మీద కుట్టుకొనుచున్నది. నేను తలుపును తట్టి, "ప్రియమైనదానా, నీతో ఒక్క నిమిషము మాట్లాడాలి" అని చెప్పాను.

"ఏమి కావాలి?" అని ఆమె అడిగినది.

నేను చెప్పాను, "హనీ, త్వరగా తలుపు తెరువు. ప్రభువు వద్దనుండి నాకు ఒక వాక్యము వచ్చినది." అది ఒక విధముగా ఆమెను కలవరపరచినది, కావున ఆమె తలుపు తీసినది.

మేము లోపలికి వెళ్ళాము. "ప్రియమైనదానా, నేను నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నానో నీకు తెలుసు, నేను దానిని గూర్చి నేనేమి అనుకోలేదు" అని నేను చెప్పాను.

"బిల్లీ, నేను… చాలా కలవరముగా ఉన్నాను" అని ఆమె చెప్పినది.

నేను చెప్పాను, "నాకు తెలుసు. అయితే ఆయన దానిని ఇష్టపడలేదు. దానిని ఆయన ఇష్టపడలేదు. అక్కడ ఇంటిముందున్న ఆ ఖర్జూర వృక్షము క్రింద, లోపలికి వెళ్ళి ఈ లేఖనము నీకు చదివి వినిపించమని చెప్పాడు" నేను దానిని చదివాను.

30కొద్ది రోజులలోనే ఆమెకు ఎడమ వైపున నొప్పి వచ్చినది. మేము ఇంటికి వెళ్ళవలసి యున్నది. పరిస్థితి మరింతగా దిగజారుతుంది. నేను ఆమె కొరకు ప్రార్ధించాను. పరిస్థితి మరింతగా క్షీణిస్తుంది.

లూయిస్ విల్ లోని ప్రత్యేక వైద్యనిపుణుడైన డాక్టర్ షాన్ దగ్గరకు ఆమెను తీసుకు వెళ్ళాను. అతడు ఆమెను పరీక్షించి, " శ్రీమతి. బ్రెన్హా౦, నేను సహో. బ్రెన్హా౦ను కలవాలని ఆయనకు చెప్పండి" అని చెప్పాడు.

ఆమె అడిగినది, "డాక్టర్, మీకు ఏమైనా కనబడినదా?"

"నేను ఆయనతోనే మాట్లాడుతాను" అని డాక్టర్ చెప్పాడు.

కాబట్టి మిడా నన్ను పిలిపించినది, నేను వెళ్ళగా అతడు, సహో. బ్రెన్హా౦ ఆమె ఎడమ అండాశయములో ఆక్రోటు కాయ పరిమాణంలో ఒక కణితి ఉన్నది" అని చెప్పాడు.

నేను ఆమెను తీసుకొని ఇంటికి వెళ్ళాను. "నీకు జ్ఞాపకమున్నదా?" అని నేను ఆమెను అడిగాను.

"నాది పొరపాటు కానట్లయితే, సహో. షర్రిట్ ఉన్నప్పుడు కాలిఫోర్నియాలో పదహారు సంవత్సరముల క్రితము దానిని గూర్చి చెప్పావు" అని ఆమె చెప్పినది.

నేను చెప్పాను, "అది నిజమే. ఇప్పుడు అది కనబడుచున్నది."

"బిల్లీ, నేను ఆ ఉదయము చేసిన దానినిబట్టి అది జరిగినదని నీవు తలస్తున్నావా?" అని ఆమె అడిగినది.

నేను చెప్పాను, "హనీ, నాకు అది తెలియదు. నేను దానిని చెప్పలేను." మేము ఒకరి చుట్టూ ఒకరు చేతులు వేసుకొని ప్రభువు ఎదుట కన్నీరు కార్చాము. నేను గదిలోనికి వెళ్ళి, నా హృదయపూర్వకముగా ఆమెను గూర్చి ప్రార్ధించాను.

డా. షాన్ కి ఫోన్ చేసి, నేను అడిగాను, "డాక్టర్, మేము ఏమి చేయాలి?"

అతడు చెప్పాడు, "దానిని తీసివేయాలి."

"సరే, దానిని అలాగే ఉండనిద్దాము" అని నేను చెప్పాను,

అతడు చెప్పాడు, "సహో. బ్రెన్హా౦, ఆమెను స్త్రీ-వైద్యనిపుణుడి వద్దకు పంపిస్తే మంచిది. అతడు నాకు మంచి స్నేహితుడు. అతడు కూడా క్రైస్తవుడే."

"డాక్టర్, మీ సంగతి ఏమిటి?" అని నేను అడిగాను, అతడు ఆ భారమును తన చేతుల నుండి తీసివేసుకొనుచున్నాడు, గమనించారా.

"నేను మిమ్మలను అక్కడికి పంపిస్తాను" అని చెప్పాడు. అతడు నన్ను ప్రేమించాడు, ప్రభువు కొరకు నేను చేస్తున్న పరిచర్యను అతడు గౌరవించాడు. అతడు దీనిని గూర్చి మరొక వైద్యునికి చెప్పాడు.

31నేను ఆమెను అక్కడికి తీసుకు వెళ్ళాను. వారు ఆమెను పరీక్షించిన తర్వాత దానిని గూర్చి ఒక రేఖా చిత్రమును గీశారు; అది ఎంత పరిమాణములో ఉన్నదో చిత్రించారు. "ఆమెను మరలా ముప్పై రోజుల తర్వాత తీసుకు రండి" అని చెప్పారు.

ముప్పై రోజుల తర్వాత ఆమెను మరలా తీసుకు వెళ్ళాను, చాలా త్వరగా అది ఆక్రోటు కాయ పరిమాణము నుండి నిమ్మకాయ పరిమాణమంత పెరిగినది. ఇన్ని సంవత్సరములుగా అది అలాగే ఉన్నది.

తరువాత ప్రభువు నాతో మాట్లాడెను, నన్ను మరలా తిరిగి వెనక్కి పంపించెను, నేను మరలా ఇక్కడకు వచ్చాను.

మరొకసారి సెలవులలో ఆమెను తీసుకొని వెళ్ళినప్పుడు, వారు ఎక్స్-రే తీశారు, అది ఆరెంజ్ కాయ పరిమాణములోనికి పెరిగినది. "సహో బ్రెన్హాం, నిశ్చయముగా సర్వశక్తిగల దేవునియందు నీకు గల విశ్వాసమును నేను ప్రశంసిస్తున్నాను. నేను కూడా క్రైస్తవుడనే, నీవు స్వస్థతా వరముగల దైవజనుడవని డా. షాన్ నాతో చెప్పెను" అని అతడు చెప్పాడు.

"అతడు నన్ను సరిగ్గా అర్ధము చెసుకొనలేదు. స్వస్థపరచువాడను నేను కాదు; నేను కేవలము దేవునిని నమ్ముచున్నాను. ఈ విషయమందు పరిస్థితిని మేము అర్ధము చేసుకొన్నాము" అని నేను చెప్పాను.

అతడు చెప్పాడు, "సహో. బ్రెన్హాం, చక్కని భార్యను కలిగియున్నావు."

"అది నాకెంతో బాగుగా తెలియును!" అని నేను చెప్పాను.

"అది మెత్తబడినట్లయితే, ప్రాణాంతకమవుతుంది, అప్పుడు ఇక నీ భార్యను నీవు కోల్పోవుదువు" అని అతడు చెప్పాడు.

"డాక్టర్, నేను దానిని గ్రహించాను" అని చెప్పాను.

"దానిని శస్త్ర చికిత్స చేసి, బయటకు తీసివేయుటకు నీవు వ్యతిరేకమా" అని ప్రశ్నించాడు.

"లేదయ్యా. కాని, మాకు ఒక కారణము ఉన్నది. ఇంకా కొంచెం కాలము దానిని అలాగే ఉండనీయండి. అలా కుదరదా?" అని నేను అడిగాను.

32అతడన్నాడు, "మంచిది, నీవు టుసాన్ లో నివసిస్తున్నావని విన్నాను." ఆ వైద్యనిపుణుడు నాతో అన్నాడు, "టుసాన్ లో నేను కొంతకాలము నివసించాను, కాని అక్కడ వాతావరణము నాకు కొంచెం వేడిగా అన్పించినది. అక్కడ నాకు ఒక స్నేహితుడు ఉన్నాడు. మిస్సిస్సిప్పి పశ్చిమములో అతడు నివసిస్తున్నాడు. అతడు ఉత్తమమైన వ్యక్తి, నేను ఎక్స్-రే లు మరియు సమస్తమును అక్కడికి పంపిస్తాను." కాబట్టి అతడు వాటిని టుసాన్ కు పంపించాడు.

మేము ఇక్కడికి వచ్చిన ముప్పది దినములకు తర్వాత, ఆ వైద్యుడిని కలుసుకున్నాము. అతడు దానిని పరిశీలించి, "అది దబ్బకాయ పరిమాణములో పెరిగినది, చాలా పెద్దదిగా ఉన్నది. దానిని ఖచ్చితముగా తీసివేయాలి" అని అతడు చెప్పాడు.

మంచిది, నేను వెళ్ళవలసియున్నది. నేను ఉత్తరము వైపు సెలవులకు వెళ్ళాను. వచ్చిన తర్వాత, న్యూయార్క్ లో మోరిస్ ఆడిటోరియంలో ఉజ్జీవ కూడికలు జరిపించుటకు, న్యూయార్క్ వెళ్ళాను. తిరిగి వచ్చేటప్పుడు, లూసియానాలోని సహో. జాక్ మూర్ వద్ద ఆగాను.

33ఆ రాత్రి నా భార్యకు ఫోన్ చేశాను, ఆమె అన్నది, "హనీ, రేపు ఉదయము మరలా పరీక్ష నిమిత్తము నేను వైద్యుని వద్దకు వెళ్ళాలి." ఆమె మరలా చెప్పినది, "బిల్లి ఈ వారము నా ఎడమకాలు కదుపలేక పోవుచున్నాను, అది నా దుస్తులు పైగా ఉబ్బియన్నది. మరియు అది చాలా నొప్పిగా ఉన్నది. నేను నా చెయ్యి కూడా పెట్టలేకపోవుచున్నాను. ఈ వారము అంతా ఒక్క కాలుతోనే కొంచెం, కొంచెం జరిపి నడుస్తున్నాను" అని ఆమె చెప్పినది.

మరియు నేను చెప్పాను, "హనీ, వైద్యుడు దానిని తీసివేయాలన్నాడు.

ఒకవేళ అతడు శస్త్రచికిత్స చేసినట్లయితే, అది క్రిస్మస్ సమయములో వస్తుంది; మనము తిరిగి ఇంటికి రాలేము."

ఆమె చెప్పినది, "నాకు అది తెలుసు, సరే, ఇప్పుడు మనము ఏమి చేయాలి?"

నేను చెప్పాను, "క్రిస్మస్ వరకు వేచియుండుటకు వీలవుతుందేమో అతనిని అడుగు. క్రిస్మస్ అయిన వెంటనే మనము శస్త్రచికిత్స చేసి దానిని తీసివేద్దాము, ఎందుకనగా నీవు ఆసుపత్రికి వెళ్ళకముందు మరలా ఇంటికి రావాలని నేను కోరుచున్నాను."

"నేను రేపు మూడు గంటలకు వెళ్ళుచున్నాను. నీవు శ్రివ్ పోర్ట్ లో మొదటి ఆరాధన ముగించిన తర్వాత నాకు ఫోను చేయుము" అని ఆ విధముగా ఆమె చెప్పినది. అది మన కాలమానముకు, అచ్చటకు మధ్య తేడా ఉండును.

"సరే, మంచిది" అని చెప్పాను.

34అక్కడ ఒక స్నేహితురాలు వున్నాది, చాలా మంచి క్రైస్తవరాలు. వారు ఆదివారము ఇక్కడకు వచ్చారు, ఈ రాత్రి ఇక్కడ ఉన్నారో లేదో నాకు తెలియదు. శ్రీ నార్మన్, శ్రీమతి నార్మన్. వారిద్దరూ ఇక్కడకు వస్తారు. శ్రీ నార్మన్, శ్రీమతి. నార్మన్ మీరు ఇక్కడున్నారా? వారిప్పుడు ఇక్కడ ఉన్నారో లేదో నాకు తెలియదు. టుసాన్ నుండి వచ్చిన సహో నార్మన్ మరియు సహోదరి నార్మన్. ఆమె ప్రతిరోజు రావడము వారికి వీలుపడదనుకొనుచున్నాను. బహుశా, ఆమె రేపు రాత్రికి ఇక్కడకు రావచ్చును. సహోదరి నార్మన్ యొక్క సహోదరుడు ఇక్కడ ఉన్నాడా? అతడు వచ్చాడనుకొనుచున్నాను. అతడు ఇక్కడ ఉన్నాడా? నార్మన్ కుటుంబ సభ్యులు ఎవరైనా ఇక్కడ ఉన్నారా? ఓ, వారు వెనుక ఉన్నారు. సరే మంచిది. ఆమె నా భార్యను తీసుకు వెళ్ళినది.

నా గృహమును నేను ఉదయము వదిలి వచ్చాను, మా యింటిముందు గదిలో ముప్పై-మూడు సంవత్సరముల వయస్సులోయుండు యేసుక్రీస్తు యొక్క శిరస్సు పటమును తగిలించి యుండును. దానిని హాఫ్మేన్ అనే పేరుగల అతడు చిత్రంచెను. కావున మేము మా గృహమును వదిలి వచ్చేటప్పుడు, మా పిల్లలతో మేము ఆ చిత్రపటము ముందు నిలబడి ప్రార్ధించుట మా అలవాటు. మేమందరము అచ్చటకు వెళ్ళి, చుట్టూ నిలబడి ప్రార్థించెదము, ప్రతీ ఒక్కొక్కరు నా కొరకు ప్రార్థించెదరు. నా భార్య నా కొరకు ప్రార్ధించేది, తరువాత నేను ఆమె కొరకు ప్రార్థన చేస్తాను. తరువాతే విదేశములకైనా, ఎక్కడికైనా నేను వెళ్ళేవాడను. ఆయన పరిచర్య నిమిత్తము మమ్ములను మేము ప్రభువుకు సమర్పించుకొనేవారము.

35నా యవ్వన ప్రాయములోనే నేను ఒక భార్యను కోల్పోయానని మీకు తెలుసు, బిల్లీ తల్లిని. నేను ఇంటి దగ్గర రెండు లేక మూడు రోజులు ఉన్నాను. పిల్లలందరూ వెళ్ళిపోయారు. నేను ఒంటరిగా ఉన్నాను. ఆ పాత సంగతులన్నియూ జ్ఞాపకమునకు వచ్చాయి.

ఆ ఉదయమున, నేను పెందలకడనే లేచాను. బిల్లీ మరియు లాయిస్ నా కొరకు ఎదురుచూస్తున్నారు. అచ్చటయున్న ఎత్తుపీటను లాగి, దానిపై సోఫావలె మెత్తగా వుండును. కాబట్టి నా రెండు చేతులను దానిపై పెట్టి మోకరించాను. మోకరించి, తల ఎత్తి ప్రార్ధించాను. "ఓ, నేను వారిని ఎలా తప్పిపోయాను, ప్రభువా, నేను ఇప్పుడు శ్రివ్ పోర్ట్ కు ప్రయాణమవుచున్నాను. ప్రభువా, నాకు అక్కడ సహాయము చేయమని ప్రార్ధిస్తున్నాను. నన్ను ఆశీర్వదించండి, ప్రభువా, నీ రాజ్యము నిమిత్తము నాకు ఆత్మలు అనుగ్రహించండి. మీరు ఆశించు విధముగా నన్ను ఉపయోగించుకొనుము. నేను నీ హస్తములలో ఉన్నాను. ఈ ఎడారి ఆవల, విశ్వాసము కలిగిన నా భార్య అక్కడ కనిపెట్టుకొని యున్నది. ఆమె శస్త్రచికిత్సకు సిద్ధపడుచు అక్కడికి వెళ్ళుచున్నది. ప్రభువా, క్రిస్మస్ వరకు ఆగమని ఆ వెద్యుడిని అడుగమని నేను ఆమెకు రాత్రి చెప్పాను. నేనేమైనా తప్పు చేశానా? అది ప్రాణాంతకముగా మారుతుందా? కొంచెము ఆగమని ఆమెను అడుగుటనుబట్టి నేను తప్పు చేసినట్లయితే, ఈ మధ్యకాలములో అది ప్రాణాంతకముగా మారుతుంది. నేను ఆమెను పోగొట్టుకుంటాను. దానినిబట్టి నన్ను ఇక ఎన్నడూ క్షమించుకోలేనని" నేనన్నాను.

36మరియు నేను అన్నాను, "ప్రభువా, అది జరిగిన రెండు సంవత్సరముల నుండి ఈ రెండు సంవత్సరములుగా నేను నీకు మొర్రపెట్టుచున్నాను. అవును, పదహారు సంవత్సరములు, ప్రభువా, నా భార్యగా యధార్ధముగా ఉండుటలో ఆమె ఎన్నడూ తప్పిపోలేదు. నేను పరిచర్యకు వెళ్ళుటకు సిద్ధపడుచుండగా, ఆమె ఎన్నడూ ఒక్క ఫిర్యాదు కూడా చేయలేదు, ఒక్కసారి కూడా అభ్యంతరము చెప్పలేదు. ఆమె ఎల్లప్పుడూ నా దుస్తులు ఉతికి, నా చొక్కాలు ఇస్త్రీ చేసి నాకు కావలసినవన్నియూ ఆమె సిద్ధము చేసేది. నేను ఇంటికి వచ్చినప్పుడు, చాలా అలసటతో వచ్చేవాడిని, నా వలన… సాధారణముగా స్త్రీ తన భర్త తన దగ్గరగా ఉండాలని కోరుతుంది. నేను వచ్చిన తర్వాత కూడా ప్రజలు గుంపులుగా వచ్చేవారు, నేను ఏమి చేయాలేని పరిస్థితి. నేను వేటాడుటకు లేదా చేపలు పట్టుటకు వెళ్ళేవాడిని. ఆమె ఎన్నడైనా ఫిర్యాదు చేసినదా? ఒక్కసారి కూడా చేయలేదు. నేను వెళ్ళుటకు నా దుస్తులను సిద్దము చేసేది. అదంతా నిజము. నలభై-నాలుగు సంవత్సరముల వయస్సులో హిమములాంటి తెల్లటి జట్టుతో దీనురాలిగా నాకు, ప్రజలకు మధ్యన నిలువబడినది. దేవా, ఆ ఉదయము తాను ఆ విధముగా చేయాలని చేయలేదు. తండ్రీ, నిజముగా ఆమె ఉద్దేశ్యము అది కాదు, ఆమె క్రియలు, ఆమె దానిని కావాలని చేయలేదని చూపిస్తున్నాయి. ఆమె నరాల బలహీనతతో, ఒత్తిడిలో ఉన్నది."

37కాబట్టి నాకు సహాయము చేయండి, ఉడుతలు సృష్టించబడిన అద్భుతము నుండి, ఆ తర్వాత కెంటకీలో జరిగిన సంభవము, రైట్ పిల్లలకు అచ్చట జరిగిన అద్భుత సంభవము, తర్వాత ఆ పర్వతము మీద తుఫానుతో మాట్లాడిన అద్భుత సంభవము, వాటన్నిటిని గూర్చి చెప్పుటకు ఈ రాత్రి నాకు సమయము చాలదు. అవి జరిగిన విధముగానే ఈసారి కూడా నిశ్చయముగా ఏదైనా సంభవించునట్లుగా చేయుము. సరిగ్గా ఆ సమయమందే - ఆ వెలుగు అక్కడికి వచ్చి, అక్కడ వ్రేలాడుచూ అది నాతో, "నీవు లేచి నిలువబడుము" అని చెప్పినది. నేను నిలువబడ్డాను, "నీవు ఏమి పలికినా, నీవు పలుకు రీతిగానే అది జరుగుతుంది" అని ఆయన చెప్పెను.

"వైద్యుడు చేయి దానిని తాకక ముందే, దేవుని హస్తము ఆ కణితిని కరిగించి వేస్తుంది" అని నేను పలికాను.

శ్రీమతి. నార్మన్ రేపు రాత్రికి ఇక్కడకు వస్తుంది. నేను ఆమెకు ఫోన్ చేయలేదు. అది నిజము. బిల్లీ, లాయిస్ నా కొరకు కనిపెట్టుచున్నారు. మేము శ్రివ్ పోర్ట్ కు వెళ్ళాము. మేము అక్కడికి చేరుకొన్న తరువాత ఆమెకు ఫోన్ చేయుటకు ఫోన్ వద్దకు వెళ్ళాము.

38ఆమె వైద్యుడి దగ్గరకు వెళ్ళినది. సహోదరి. నార్మన్ ఆమెకు సహాయము చేయుటకు ఆ గదిలో ఉన్నది, ఆపరేషన్ బల్లవద్దకు తీసుకొని వెళ్ళుటకు నర్సు ఆమెకు గౌను వేసినది. వారు ఆ యంత్రములన్నియూ సిద్ధము చేశారు. ఎక్స్-రేలు, రేఖా చిత్రములు సమస్తము సిద్ధముగా ఉన్నాయి. వైద్యుడు, "శ్రీమతి. బ్రెన్హాం, నీకు ఎలా అన్పిస్తున్నది?" అని నా భార్యను అడిగెను. అతడు చెప్పాడు…

ఆ వైద్యుడు, ఈ వైద్యునికి వ్రాసిన ఉత్తరములో ఏమి వ్రాశాడో చూచుటకు, ఆ ఉత్తరమును తెరిచాడు. "శ్రీమతి. బ్రెన్హాం చాలా మంచి స్త్రీ, ఆమె భర్త చాలా మంచి వ్యక్తి అతడు విశ్వాసము ద్వారా స్వస్థపరచువాడు, కాని నీవు శస్త్రచికిత్సకు చేయుటకు ఆయన వ్యతిరేకించుట లేదు. డాక్టర్, ఆ కణితిని ఒక్కసారే పూర్తిగా తొలగించాలి, లేకపోతే శ్రీమతి. బ్రెన్హాం మరణిస్తుంది" ఆ విధముగా వ్రాయబడి యుండుట అతడు చదివాడు.

ఆ వైద్యుడు వచ్చి, ఆమె ప్రక్క భాగమును తాకుటకు ఆమెపై కప్పియున్న వస్త్రమును పైకి తీసెను. చల్లగా స్పర్శించుచూ ఏదో ఆమె మీదుగా వెళ్ళినది. ఆ కణితి అదృశ్యమైనది, అక్కడ కణితిలేదు. మరియు ఆ వైద్యుడు… ఆమె అక్కడ పడుకొని యున్నది. అతడు ఆమెను తాకి, "శ్రీమతి. బ్రెనాం, ఆ కణితి ఎడమ వైపున కదా ఉన్నది?" అని అడిగాడు.

ఆమె, "అవునయ్యా, అక్కడే ఉన్నది" అని జవాబిచ్చినది.

కాబట్టి అతడు ఆమెను మరలా ఎక్స్-రే యంత్రము క్రిందకు తీసుకు వెళ్ళాడు, అతడు ఆ రేఖా చిత్రములు పరిశీలించి చూశాడు; మరలా పరిశోధించుచూ పరిక్షలన్నింటిని చేశాడు. "శ్రీమతి. బ్రెన్హాం, నేను దానిని వివరించలేను, కాని అక్కడ కణితి ఎంత మాత్రము లేదు. ఆ కణితి పోయినది" అని అతడు చెప్పాడు.

 

39నేనిచ్చట నిలబడియున్నట్లుగానే, అది సత్యము. అది సత్యమని సర్వశక్తుడైన దేవుడు ఎరిగియున్నాడు. అది నేను పలికిన విధముగానే జరిగినది. ఆ వైద్యుడి చేయి దానిని తాకకుండానే, "ఆ వైద్యుడి చేయి ఎంతో దూరములో లేదు, కాని ఆ సమయమందే చల్లగా ఏదో స్పర్శించుచూ ఆమె మీదుగా వెళ్ళినది" అని ఆమె చెప్పినది, ఆమె చాలా బాధపడుచున్నది, శ్రీమతి. నార్మన్ మరియు తదితరులు ఆమెకు సహాయము చేయవలసివచ్చేది. (అక్కడ వెనుక వైపున ఉన్నవారు దానిని గూర్చి చెప్పగలరు). ఆ బల్ల మీద ఆమెను ఎక్కించుటకు సహాయము చేశారు. ఆ కణితిని సూచిస్తున్న ఎక్స్-రేలు, రేఖా చిత్రములు సమస్తము అక్కడున్నాయి. కాని ఇప్పుడు దానికి సంబంధించిన సూచన ఒక్కటి కూడా లేదు. అప్పటి నుండి ఆమెలో కణితికి సంబంధించిన సూచనలు ఒక్కటి కూడా కన్పించలేదు. క్రిస్మస్ కు రెండు వారముల ముందుగా అది జరిగినది.

దేవుడు తన వాక్యముయెడల ఇంకనూ యదార్ధముగా ఉన్నాడు! "భూమి మరియు ఆకాశములు రెండూ గతించును, కాని నా మాటలు ఏ మాత్రమును గతించవు." ఆ ఉడుతలు సృష్టించగలిగిన దేవుడు, ఆ కణితి తీసివేయగలిగిన దేవుడు, ఈ రాత్రి కూడా ఆయన అదే దేవుడిగా ఉన్నాడు. ఎందుకనగా యేసుక్రీస్తు, నిన్న, నేడు, మరియు నిరంతరము ఒక్కటే రీతిగా ఉన్నాడు. మీరు దానిని నమ్ముచున్నారా?

ఈ పరలోకపు తండ్రియే నాకు సాక్షిగా యున్నాడు, పరిశుద్ధ గ్రంథము నా హృదయము మీద ఉండగా, దీనిని ఏ విధముగా చెప్పాలో నాకు తెలిసిన దానికన్నా అది అక్షరాలా ప్రతీమాట సత్యమని ఆయన ఎరిగియున్నాడు. స్నేహితుల్లారా! ఏదైనా అబద్దము చెప్పిన, దాని వలన నాకు ప్రయోజనమేమి యున్నది? దీనిని మీకు నేను చెప్పుటకు కారణమేమనగా, దీని ద్వారా మిమ్మల్ని ప్రోత్సహించుచూ, మీరు ఆయనను నమ్మునట్లుగా చేయుటకే.

40ఇప్పుడు, ఆ గొప్ప వరము! మిగిలిన వరములను గూర్చి నేను వివరించుటకు ప్రయత్నించాను. మరి అవి ఎలా జరిగాయో చెప్పాను. కాని ఇది వివరించలేను. కేవలము కనిపెట్టుకొని వుండండి. ఇప్పుడది పరిపూర్ణముగా క్రియ చేయుట లేదు గాని, ఆలోచనా సంఘముల సమైఖ్యత ద్వారా కలిగే శ్రమలు వచ్చేవరకు కనిపెట్టుకొని వుండండి, అప్పుడది క్రియ చేయుటకు ఆరంభించును. అందువలననే నేను రోగుల కొరకు ప్రార్థన చేయుటకు తిరిగి ఇప్పుడు మీ మధ్యకు వచ్చాను. నాకు తెలిసినంత వరకు నా జీవితకాలమందు ఆయన నాకు చెప్పిన వాటిల్లో ఇంకా జరుగవలసినది ఒక్కటే ఉన్నది. అది ఇంకా నెరవేరలేదని నాకు తెలుసు, ఒక విధమైన గుడారమువంటి దానిలోనికి నేను వెళ్ళి రోగుల కొరకు ప్రార్ధించవలెను, నాకు తెలిసినంత వరకు అది ఇంకా జరుగలేదు. నాకు తెలిసిన కార్యము అది ఒక్కటే.

ఈ రాత్రి ఇక్కడ నిలబడియుంటానని పరలోకపు తండ్రి ఎరిగియున్నాడు. ఆయన తాను చెప్పిన మాటలను చెప్పుమని నాకు చెప్పినప్పుడు, వాటిని నేను చెప్పనియెడల ఆయన ఇప్పుడే ఈ వేదిక మీద నన్ను చంపగలడు. అవునయ్యా, ఆయన నిశ్చయముగా దానిని చేయగలడు, నేను దానిని ఎరిగియున్నాను. అందుకొరకు నేనెంతగానో భయపడుచున్నాను. నేడు అనేక కధలు వ్యాప్తిలో ఉన్నవని నాకు తెలుసు, నేను వాటికి బాధ్యుడను కాను. కేవలము, నేను చెప్పిన వాటికి మాత్రమే నేను బాధ్యుడను. నేను ఏమి చెప్పానో, వాటికి మాత్రమే నేను జవాబు చెప్పాలి. అది సత్యము. అది సత్యమని పరలోకపు తండ్రి ఎరిగి యున్నాడు.

41యేసుక్రీస్తు దేవుని కుమారుడని, ఆయన నీ పాపముల కొరకు మరణించాడని నీ అతిక్రమముల నిమిత్తము గాయపరచబడ్డాడని, ఆయన దెబ్బలవలన నీవు స్వస్ధపడ్డావని నీవు నమ్ముచున్నవా? మీరు దానిని విశ్వసిస్తున్నారా? ఈ రోజు సమస్తము నల్లగా, చీకటిగా, పేలవముగా కన్పిస్తున్నది. అదెలావున్నప్పటికి యేసు అదేరీతిగా నిలిచి యున్నాడు. మీరు దానిని నమ్మటలేదా? ఆయన ఈ రాత్రి ఇక్కడ ఉన్నాడు.

ఇంకా జరుగవలసిన ఆ ఒక్క కార్యము తప్ప, ప్రభువు నామములో నేను చెప్పినది ఏదైనా జరుగలేదని ఎవరైనా నిలువబడి చెప్పగలరా? ఎన్నో వందల పర్యాయములు ఆయన చెప్పినది ఎన్నడూ తప్పిపోలేదని మీరు చూచితిరి. అదెన్నడూ తప్పిపోదు. నేను మీకు ఏమి చెప్పుటకు ప్రయత్నించుచున్నాను, ఆ కార్యములను చేయుటకు మానవునికి పూర్తిగా అసాధ్యము. అది ప్రజల మధ్య ఉన్న యేసుక్రీస్తు యొక్క క్రియలు, అది మన మధ్యనున్న క్రీస్తే.

ఈ రోజు సంఘ శాఖలు "ఇక్కడికి రండి, అక్కడికి వెళ్ళండి" అని చెప్పినప్పుడు, అది పాతకాలపు పోకడ లేక మరేదో; సరే, అది మంచిదే; అది అక్కడ ఆ విధముగానే ఉండవలసి యున్నది, అవన్నియు ఒకే పోకడను అనుసరించునవియే.

అయితే, నా వరకు, ఆయన ఈ రాత్రి సజీవుడుగానే యున్నాడు. ఆయన పూర్వము చేసినరీతిగానే తన ప్రతీ వాక్యము ఏ విధముగా వాస్తవమైనదిగా యుండెనో, ఇప్పుడు కూడా అది అదే రీతిలో, అదే శక్తివంతమైనదిగా మరియు బలమైనదిగా యున్నది.

మనము ప్రార్థన చేద్దాము.

 

42ప్రభువా, మీరు చెప్పారు, "భూమ్యాకాశములు గతించునుగాని, నా మాటలు ఏమాత్రము గతించవు" మీరు హృదయాలోచనలను వివేచించుటవలన దేవా, నీవు ఎవరివో నీ శిష్యులు గ్రహించగలిగిరి. పరిశుద్ధ గ్రంథము హెబ్రీ 4లో ఈ విధముగా చెప్పుచున్నది, "ఎందుకనగా, దేవుని వాక్యము సజీవమై బలముగలదై రెండంచులుగల యెటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉండి, హృదయము యొక్క తలంపులను, ఆలోచనలను శోధించుచున్నది." ప్రవక్తలలో ఉన్న దేవుని వాక్యము అదే కార్యము చేసినది, జ్ఞానులందరిలో అదే కార్యము చేసినది. ప్రభువైన యేసుక్రీస్తులో అదే కార్యము నెరవేర్చినది. తండ్రీ దేవా, ఈ రాత్రి నీవు రోగులను స్వస్థపరచుటకు ఆసక్తిని కలిగియున్నావని రోగులు గ్రహించునట్లుగా, నీ వాక్యమును మాట్లాడండి, వారిని స్వస్థపరచండి, తండ్రీ, వారు దానిని నమ్మునట్లుగా వారికి విశ్వాసము అనుగ్రహించండి. యేసు నామములో ప్రార్ధిస్తున్నాము. ఆమేన్.

43ఇప్పుడు, పియానో వాయించు వ్యక్తి నెమ్మదిగా, "కేవలము నమ్మము" అనే పాటను వాయించుడి. చాలా నెమ్మదిగా, భయభక్తితో నెమ్మదిగా వాయించండి.

బిల్లీ, నేను అడుగుట మరచిపోయాను, నీవు ఏ సంఖ్యలు పంచిపెట్టావు? ఏ (A), ఒకటి నుండి వంద వరకు. మనము లేచి నిలబడదాము.

ఏ, ఒకటి నుండి ఐదు వరకు లేచి నిలబడండి. మీరు నిలువబడలేక పోయినట్లయితే మీ చేయి పైకి ఎత్తండి. సంఖ్యలు ఒకటి నుండి ఐదు వరకు, ఒకటి, రెండు, మూడు, నాలుగు. అక్కడ నుండి వస్తున్న వ్యక్తి అనుకొను చున్నాను. ఏ. ఒకటి, రెండు, మూడు, నాలుగు, ఐదు, మరియు వారు వస్తుండగా ఐదు, ఆరు, ఏడు, ఎనిమిది, తొమ్మిది, పది, మీరు నిలబడగలిగితే నిలబడండి. ఆరు, ఏడు, ఎనిమిది, తొమ్మిది, పది, మీరు లేచి నిలువబడ్డారా, ప్రార్ధనా కార్డులు ఆరు, ఏడు, ఎనిమిది, తొమ్మిది, పది. ఒకటి, రెండు, మూడు, నాలుగు, ఐదు, ఆరు, ఏడు, ఎనిమిది, తొమ్మిది, పది. సరే మంచిది. పదకొండు, పండ్రెండు, పదమూడు, పధ్నాలుగు, పదిహేను. ఇక్కడకు రండి, ఇక్కడికి రండి. సరే. సరే మంచిది. పదహారు, పదిహేడు, పద్దెనిమిది, పంతొమ్మిది, ఇరవై

ఇప్పుడు, ఆ బాలుడు ప్రార్ధనా కార్డులు ఇస్తాడు. వాటన్నిటిని కలిపివేసి, తర్వాత వాటిని ఇస్తాడు. ఆ సంఖ్యలు ఎక్కడున్నాయో మాకు ఏ మాత్రము తెలియదు. అతడు కార్డులన్నిటిని కలుపుట మీరే చూడవచ్చును. మీరు ఏ కార్డు కోరితే అది మీకు ఇవ్వబడును, ఆ విధముగా ఆ కార్డుల సంఖ్యనుబట్టి మీరు పిలువబడతారు.

ఖచ్చితముగా మీకు కార్డు ఉండవలసిన అవసరము లేదు. నీవు ఎక్కడున్నా ఫర్వాలేదు. మీరు కేవలము నమ్మండి. మీరు చాలా కూడికలలో పాల్గొనియుండుట వలన, మీకు తెలుసు. ఆ కార్యములన్నిటి గూర్చి మీరు ఎరుగుదురు. సరే.

నేను ఎక్కడ విడిచిపెట్టాను, ఇరవై? [ఎవరో "ఇరవై" అని చెప్పారు.] ఇరవై, ఇరవై-ఒకటి, ఇరవై-రెండు, ఇరవై-మూడు, ఇరవై-నాలుగు, ఇరవై-ఐదు. సరే మంచిది.

44మీలో రోగులుగా ఉండి ప్రార్ధనా కార్డులు లేని వారు మీ చేతులు చూపండి. సరే మంచిది. ఇంకా ఈ భవనములో ఎక్కడ ఉన్నా ఇప్పుడు కేవలము నమ్మండి.

ఇప్పుడు మనము ఏమి చెప్పుటకు ప్రయత్నిస్తున్నాము, మనము దేనికి ప్రాతినిధ్యము వహించుటకు ప్రయత్నించుచున్నాము. యేసుక్రీస్తుకు ప్రాతినిధ్యము వహిస్తున్నాము. దానిని ఎంతమంది అర్ధము చేసుకున్నారు? ఆయన మనలను ఈ భూమి మీద దర్శించినప్పుడు, యేసు అనే శరీరములో దేవుడు తనను తాను ప్రత్యక్షపరచుకున్నాడు, ఆయన మానవునిగాయున్న దేవుడు అని ఎందరు ఎరిగియున్నారు? కేవలము ప్రవక్త మాత్రమే కాదు; ఆయన దేవుడు. మరియు ప్రవక్తలు వారికి ఇవ్వబడిన వాక్యభాగమును వారు కలిగి యున్నారు, వాక్యములో వారియొక్క భాగమును, వారే కాలమందు యున్నారో ఆ కాలమునకు వారికి అనుగ్రహించబడిన వాక్యములో ఒక భాగమును మాత్రమే వారు కలిగియున్నారు. కాని ఆయన సంపూర్ణ వాక్యమై యున్నాడు! మీలో ఎందరు దానిని ఎరుగుదురు? ఆయనే ఆ వాక్యమై యున్నాడు. ఇప్పుడు ఈ రోజుకు కేటాయించబడిన వాక్యభాగము ఉన్నది. అది నిజమేనా? ఆ కేటాయించిన వాక్య భాగము మరలా ఆయనే. కావున, అది ఆయనను నిన్న నేడు ఒక్కటే రీతిగా చేస్తుంది.

45మనము ఎంతమందిని పిలిచాము? ఇరవై-ఐదు. సరే, అక్కడితో ఆపుదాము. ఒకవేళ సమయము ఉంటే ఇంకా ముందుకు వెళ్ళుదము. నాకు సుమారుగా ఇరవై నిమిషములున్నవి. ఇప్పుడు గుర్తుంచుకొనిడి, ప్రార్ధనా కార్డులు కలిగినవారు వాటిని పట్టుకొని ఉండండి. ప్రార్ధనా కార్డులతో మీరు మాతో నిలిచియుండగలిగితే, ఇక్కడకు వచ్చిన వారందరికొరకు నేను ప్రార్ధన చేస్తాను. ఒకవేళ రాత్రి, పగలు చేయవలసి వచ్చినా, నేను చేస్తాను. ప్రభువు సహాయముతో నిశ్చయముగా నేను వారికి ప్రార్థన చేస్తాను.

ఇప్పుడు మీ ఏకాగ్రతను ఇటువైపు నిలపండి. ఇప్పుడు అక్కడ కూర్చుండియున్న వారిలో ఎంతమంది మీరు ఆయనను తాకుటకు చాలినంత విశ్వాసము కలిగియున్నామని నమ్ముచున్నారు? అది చాలా మంచిది. సరే. స్నేహితులారా, మనము దానిని వ్యర్ధముగా పోనియ్యవద్దు.

46ఇప్పుడు ఇక్కడ ఒక స్త్రీ చక్రాల కుర్చీలో కూర్చొనియున్నది. మరియు అక్కడ ఒక పురుషుడు చక్రాల కూర్చొనియున్నాడు. వారు అనారోగ్యముతో ఉండుట నేను చూడకలుగుచున్నాను. బహుశా వారు రోగులు కాకపోవచ్చు కాని వారు ఏదైనా బాధలతో ఉండి యుండవచ్చును. సహోదరీ, సహోదరుడా, నిరుత్సాహపడవద్దు. మీకు తెలుసు, ఒకవేళ నాకు సాధ్యమైతే, మిమ్ములను నేను స్వస్థపరచగలిగితే, నేను వచ్చి మిమ్ములను స్వస్థపరుస్తానని మీకు తెలుసు, కాదా? నేను ఖచ్చితముగా చేస్తాను. ఒకవేళ చేయలేకపోతే, ఇక్కడ నిలబడవలసిన అవసరము నాకు లేదు. నా హృదయమున క్రోధమును కలిగియుండి, మిమ్ములను ఆ చక్రాల కుర్చీల నుండి లేపకలిగిన శక్తిని నేను కలిగియుండి నేను మిమ్ములను లేపనట్లయితే, నేను క్రూరుడైన వ్యక్తినవుతాను.

"మంచిది, దేవుని వరముతో, నీవు ఏ విధముగానైనా చేయవచ్చును" అని మీరు అనవచ్చు, ఒక్క నిమిషము ఆగండి. అలా చెయ్యలేము. లేఖనములలో ఆ విధముగా వున్నట్లుగా ఎచ్చటా మీరు కనుగొనలేరు.

కుంటివారు, అంగహీనులు, గ్రుడ్డివారు, ఊచ చేతులు కలిగిన వారు వేల మంది పడియున్న స్థలములో యేసు నడచి వెళ్ళాడు. ఆయన వారిని తాకలేదు. నేల మీద దీనస్థితిలో పడియున్న లేక అలాంటి ఏదో ఒకదానితో బాధపడుచున్న ఒక వ్యక్తి దగ్గరకు వెళ్ళాడు. అతడు అక్కడ ముప్పై-ఐదు సంవత్సరములుగా, మానసికముగా దెబ్బతిన్న స్థితిలో పడియున్నాడు. అతడు నడువగలడు. ముప్పై-ఎనిమిది సంవత్సరములు అని నేను నమ్ముచున్నాను. చూడండి, అక్కడ యున్నట్లుగా మీలో కొందరు.

 

47బహుశా, అక్కడ కూర్చొనియున్నది నా భార్య అయితే లేక నా తల్లి, నా భార్య, నా కుమార్తె (చూశారా), లేక నా తమ్ముడు, నా తండ్రి అక్కడ కూర్చొనియంటే? నేను చేయకలిగినది ఏదైనా ఉంటే, నేను ఖచ్చితముగా చేస్తాను, చూశారా.

కాని మీకు తెలుసు, గుండె జబ్బులు, కేన్సరు వ్యాధితో బాధపడుచున్న వారికంటే చూచుటకు చాలా ఆరోగ్యముతో వున్నట్లుగా కనిపించినను మరణమునకు చాలా సమీపముగా ఉన్నవారు కూడా బహుశా ఇక్కడ కూర్చొని యుండవచ్చును. కేన్సరు రోగిని లేక కుంటి వారిని స్వస్థపరచుట దేవునికి కష్టమా? ఏ కష్టము లేదు. ఆయనకు కావలసినది ఒక్కటే, "నీవు విశ్వసించినచో!"

నా మట్టుకైతే, అది నాయంతట నేను చేసేదికాదని నేను చూపించగలను. నేను చేయగలిగితే, దానిని వెంటనే చేస్తాను. ఒకవేళ నేను చేయగలిగితే, నేనిలా చెప్తాను, "ఈ స్త్రీ, పురుషులను నేను వేదిక మీదకు రప్పిస్తాను. నేను ఎంత గొప్ప క్రీస్తు సేవకుడనో మీకు నిరూపిస్తాను" అని అంటూ అందరికీ నన్ను చూపించుకునేలా ఒక గొప్ప ప్రదర్శనను చేసి చూపిస్తాను. నేను ఆ రోగి గురించి కొన్ని మాటలు చెప్పి, "ఇప్పుడు పైకిలేచి నడుస్తూ వెళ్ళుము" అని చెప్తాను. నేను అలా చేయటానికి నేను ఇష్టపడతాను. అప్పుడు ఈ జనసమూహమంతయూ కేకలువేస్తూ "దేవునికి స్తోత్రం. సహో. బ్రెన్హాం చాలా గొప్ప వ్యక్తి, గొప్ప దైవజనుడు" అని చెప్తారు. గ్రహించారా? అది అలాగు చేయకూడదు. అలాగు చేసినయెడల అది తప్పు, చూచారా.

కాని ఇప్పుడు ఈ రాత్రి యేసు వారిద్దరిని కూడా స్వస్థపరచగలడు.

48అయితే, చూడండి, ఒక వ్యక్తికి కొంచెం అనారోగ్యము కలుగగానే వారు వెంటనే కృంగిపోతారు, (వారు ఆ విధముగా క్రుంగిపోవలసిన అవసరము లేదు). క్రుంగిపోతూ వారు ఈ విధముగా భావించుట ప్రారంభిస్తారు. నేను చనిపోవుచున్నాను, నేను ఇక బాగుపడలేను." ఆ విధముగా తలంచవద్దు, ఆ విధముగా అలోచించవద్దు. చూశారా, మీరు దానిని నమ్మండి. ఒక వేళ నేను… కాని ఇప్పుడు మీ హృదయము నుండి మీ సందేహమునంతటిని బయటకు పారద్రోలి, నీవు స్వస్థతను పొందుకొనుటకు నిన్ను అభ్యంతరపరచేవాటిని నీ తలంపులలోకి రానీయవద్దు.

[టేపులో ఖాళీ ఉన్నది.] పుట్టినప్పటినుండి, వంకరగావున్న కాళ్ళు వెంటనే చక్కగా, తిన్నగా మారి, అక్కడ నుండి నడిచి వెళ్ళెను. వైద్యులు మరియు మాయో సోదరుల యొక్క ప్రకటనలను చూశారా? కొద్దికాలము క్రిందటే అది రీడర్స్ డైజెస్ట్ అనే వార్తాపత్రికలో, డానీ మోర్టన్ యొక్క అద్భుతము అనే శీర్షికతో ప్రచురించారు. కాలిఫోర్నియాలోని, అసెంబ్లీస్-ఆఫ్-గాడ్ సంఘములో ఆ బిడ్డ కాళ్ళు ఎంతో వంకరగా ఉండెను, చివరికి జాన్ హాప్కిన్స్, మాయో సోదరులు కూడా, "అతడు బాగయ్యే అవకాశము భూమి మీద లేదు," అని చెప్పారు. కాని "ప్రభువు, ప్రభువు ఈలాగు సెలవిచ్చుచున్నాడు" అయి ఉన్నాడు. అది భిన్నమైనది, చూచారా.

నిరీక్షణ లేకుండా, వెళ్ళవద్దు.

49ఇప్పుడు, కొద్ది నిమిషములు, మనము కొద్ది నిమిషములు ప్రార్ధించుదాము. ఇంకా పన్నెండు నిమిషములు ఉన్నాయి, మనము ప్రార్ధనా వరుసను ప్రారంభించుదాము. నేను వారందరికి ప్రార్ధించిన తర్వాత, ఇంకా సమయమున్నట్లయితే… తొమ్మిదిన్నరకు పంపివేస్తానని నేను వాగ్దానము చేశాను. మీరు దీనిని గమనించండి, సరే. ఈ రాత్రికి ప్రార్ధించలేని వారికి, రేపు రాత్రి మనము ప్రార్ధించుదాము.

ఇప్పుడు అందరూ ప్రార్ధించండి. ప్రార్ధనా కార్డులు లేనివారు, అక్కడ నిలబడిన వారందరూ లేక ప్రార్ధనా కార్డులు ఉన్నా మీరు ఎక్కడున్నా ప్రార్ధించండి. చూశారా, గతకాలములో యేసు ఏమి చేశాడో, ఖచ్చితముగా అదే విధముగా మీ విశ్వాసము కూడా క్రియ చేస్తుంది. నీవు ఆయన వస్త్రమును ముట్టవచ్చును. ఇప్పుడు అందరూ భయభక్తులతో ఉండండి, అటూ, ఇటూ తిరుగవద్దు. కొద్ది సమయము గౌరవ ప్రతిపత్తులతో ఉండండి.

 

50అయ్యా, రండి. మనము ఒకరికి ఒకరము క్రొత్తవారము, ఒకవేళ నేను మీకు సహాయము చేయగలిగితే, నేను సహాయము చేస్తాను. ఆ సంగతి మీరు ఎరుగుదురు. ఆ విధముగా చేయుటకు నేను ఎంతో సంతోషిస్తాను, కాని నేను చేయలేను. నిజముగా చెప్పాలంటే, మరొకరి నిమిత్తము ప్రార్ధన చేయించుకొనుటకు నీవు ఇక్కడకు వచ్చియున్నావు. [ఆ వ్యక్తి "అవునయ్యా" అని చెప్పెను], దేవుడు అతడిని స్వస్థపరచగలడని నీవు విశ్వసిస్తున్నావా? ["అవునయ్యా"], వారు ఈ సమయములో ఇక్కడలేరు. ["లేరయ్యా"], వారు ఇక్కడకు దూరములో ఉన్నారు. ["అవునయ్యా"], అది కేన్సరు వ్యాధి. ["అవునయ్యా"]. అది నిజమేనా? ["అవునయ్యా"]. వారు స్వస్థపడతారని నీవు విశ్వసిస్తున్నావా? ["అవునయ్యా నేను విశ్వసిస్తున్నాను"] నీవు వెళ్ళుము. నీవు విశ్వసించిన ప్రకారము జరుగును. నీవు చేయవలసినది అంతా అదియే. అది అద్భుతము కాదా? దేవుడు నిన్ను దీవించును గాక.

ఎలా ఉన్నారు? మనము ఒకరికి యొకరము ఏ పరిచయములేని వారము. ఒక వ్యక్తి ఇక్కడకు నడచి వచ్చాడు. నీవు నాకు తెలియదు, నేను ఎన్నడూ నిన్ను చూడలేదు. కాని నీవు ఇక్కడ నిలబడియున్నావు… ఇది ప్రశస్తమైన పరిశుద్ధ గ్రంథము, ఇది వాగ్దానములు కలిగియున్నది. అది, అది దేవునియొక్క వాక్యము ['అది నిజము" అని ఆ వ్యక్తి చెప్పెను.] పరిశుద్ధ గ్రంథము చెప్పుచున్నది, "దేవుని వాక్యము హృదయాలోచనలను, తలంపులను వివేచించును. ప్రవచనమును నెరవేర్చుట ద్వారా దేవుని వాక్యము సత్యము అని ఋజువుపరచబడుతుంది." ["ఆమేన్"]. ఆయన చెప్పిన రీతిగా, "వెలుగు కలుగునుగాక అని పలుకగా, వెలుగు కలిగెను" ["అది సత్యము"], నేను ఈ మాటలు ఎందుకు చెప్పుచున్నానంటే, మన ప్రభువు ఆ బావియొద్ద స్త్రీతోను, సీమోనుతో మరియు మొదలగు వారితో మాట్లాడిన విధముగా నేను నీతో మాట్లాడుచున్నాను.

నీకు ఒక సమస్య ఉన్నది. నీకు ఆపరేషన్ జరిగినది, అది మరలా పగిలి పోయినది. ["అది నిజమే" అని ఆ వ్యక్తి చెప్పాడు.] నా ఉద్దేశ్యము ఏమిటో నీకు తెలుసు, దానిని ఇక్కడ ఎందుకు చెప్పలేదో నీకు తెలుసు. ["అవునయ్యా అది నిజము"]. అది ఎందుకో నీకు తెలుసు, అది నిజమేనా? ["అది నిజము"] అది నిజము. దానిని నేను ఇక్కడ చెప్పలేను, కాని నీకు తెలుసు. "ఆయన ఒకవేళ దానిని గూర్చి చెప్తాడా, లేదా" అని నీవు ఆలోచిస్తున్నప్పుడు, దానిని నేను గ్రహించాను. ["అది నిజము"]. లేదు. నేను దానిని చెప్పను. నేను దానిని ఇక్కడ చెప్పలేను. కాని ఇప్పుడు అది బాగవుతుంది. ["యేసు, వందనములు"] వెళ్ళు, విశ్వసించుము. దేవునియందు విశ్వాసముంచుము.

51అమ్మా, ఎలా ఉన్నారు? దేవుని కుమారుడైన, యేసుక్రీస్తును నీవు విశ్వసిస్తున్నావా? నేను ఆయన సేవకుడనని నీవు విశ్వసిస్తున్నావా? ["నేను నిశ్చయముగా నమ్ముచున్నాను" అని ఆ స్త్రీ చెప్పినది.] నేను దానిని అభినందిస్తున్నాను. నేను ఏ విధముగానైనా సహాయము చేయకలిగితే, ఖచ్చితముగా నేను నీకు సహాయము చేస్తాను. ఒకే ఒక విధముగా నేను, నీకు సహాయము చేయగలను, నేను ఏది చూస్తానో దానిని బట్టియే సహాయము చేయగలను. నేను కేవలము. నేను ఏది చూస్తానో, దానినే చెప్తాను. ఒకవేళ నేను చూడలేకపోతే.. దానిని చూసేవరకు నేనేమియు చెప్పలేను, ఎందుకనగా అది ఆయనయొద్ద నుండి రావలసియున్నది. అది దైవికమైనది. అది దేవునివద్ద నుండి వచ్చు దేవునియొక్క దైవిక వరము.

నీ సమస్య నీ కంటిలో ఉన్నది. నీ కంటిలో ఏదో పెరుగుచున్నది, చూడలేక పోవుచున్నావు, అది నీ ఎడమ కంటిలో [అది నిజము" అని ఆ స్త్రీ చెప్పెను]. ఇప్పుడు నీవు దీనిని ఎరుగునట్లు, అక్కడ బయట ఉన్నవారు దానిని చెప్పకలుగునట్లు. ఆమెకు మరొక సమస్య కూడా ఉన్నది. ఆమె ఎడమ రొమ్ములో సమస్య ఉన్నది ["అది నిజము"]. అది నిజమే కదా?["అది నిజము"]. ఇప్పుడు నీకు తెలుసు. ఒకవేళ అది నీకు గలిబిలిగా ఉన్నట్లయితే, నన్ను దానిని గూర్చి చెప్పనీయండి. నీవు ఇక్కడి వ్యక్తివి కాదు. నీవు ఇక్కడకు దూరముగా నివసిస్తున్నావు. నీవు లూసియానా నుండి వచ్చావు ["అది నిజము"] దేవుని విశ్వసించుము, నీవు దానినుండి స్వస్థత పొందుతావు. నీవు వెళ్ళుము. ఆమేన్. నీ హృదయమంతటితో విశ్వసించుము. దేవునియందు విశ్వాసముంచుము. సందేహించవద్దు. కేవలము నమ్ముము.

మీరు ఏలాగు ఉన్నారు? నీవు చాలా ఒత్తిడిలో ఉన్నావు.

52గోధుమ-వర్ణపు సూటు ధరించి, తెల్లని జుట్టు కలిగి అక్కడ కూర్చొని నా వైపు చూస్తున్న ఆ వ్యక్తి గొప్ప మానసిక ఒత్తిడితో ఉన్నాడు. అయ్యా, నీవు ఒత్తిడితో బాధపడుచున్నావా? ఇప్పుడు అది నిన్ను విడిచి పోయినది. ఇక అది పోయినది. దేవునికి స్తోత్రము.

అతడు దేనిని తాకాడు? నన్ను కాదు.

ఆ కార్యము అతని వెనుక కూర్చొనియున్న వ్యక్తికి కూడా కొంత ధైర్యమును ఇచ్చినది. నీవు విశ్వాసించాలని కోరలేదు. నీకు క్షయవ్యాధి ఉన్నది. ఇప్పుడు యేసును నిన్ను స్వస్థపరచువానిగా అంగీకరిస్తావా? సరే మంచిది. నీవు స్వస్థపడగలవు. ఆమేన్. నీ హృదయమంతటితో దానిని విశ్వసించుము. ఆమేన్. నీవు ఆ విధముగా దానిని చేయుము. ఓ, అది ఎంత అద్భుతము!

నీ హృదయమంతటితో, నమ్ముచున్నావా? పురుషులవైపు వస్తున్న ఆ వ్యక్తి!

అక్కడ అతడి వెనుక కూర్చొన్న వ్యక్తి ఇదంతా ఏమిటా అని ఆలోచిస్తున్నాడు. నీకు కీళ్ళ వాతము ఉన్నది. దేవుడు దానిని బాగుచేస్తాడని నీవు నమ్ముచున్నావా? నమ్ముచున్నావా? అయితే నీవు స్వస్థతపొందుకుంటావు. ఓ, మై!

అమ్మా… పురుషుల వరుస ప్రక్కన, ఆ వ్యక్తి ప్రక్కన ఉన్న నీవు, ఆ వ్యక్తివలె నీవు కూడా స్వస్థతను పొందుకొని ఈ రాత్రి వెళ్ళుము. అద్భుతము. దేవునికి వందనములు!

53ఇచ్చట ఇంకొక వ్యక్తి ఆ వైపున కూర్చొనియున్న వ్యక్తి అతడు రెండు వరిబీజము (హెర్నియా)లతో బాధపడుచున్నాడు. దేవుడు ఆ హెర్నియాను స్వస్థపరుస్తాడని నీవు విశ్వసిస్తున్నావా? ఆమేన్. నీవు దానిని పొందుకొనవచ్చును.

అతని వెనక రెండవ వరుసలోని వ్యక్తి, అతడికి కూడా వరిబీజము (హెర్నియా) ఉన్నది. అయ్యా, మీరు దానిని నమ్ముచున్నారా? నీవు కేవలము నమ్మినట్లయితే, నీవు స్వస్థతను పొందుకొనవచ్చును. ఆమేన్ హల్లేలూయ!

నీవు దేవుని విశ్వసిస్తున్నావా? కేవలము నమ్ముము. సందేహించవద్దు. దేవునికి దూరమనేది లేదు. మీరు దానిని నమ్ముచున్నారా?

ఇక్కడ ఒక వ్యక్తి ఇక్కడకు ఎదురుగా కూర్చొనియున్నాడు. అతడు వైపుగా నా వ్రేలిని చాపాను. అతడు కళ్ళజోడు ధరించి యున్నాడు, తెల్లజట్టు. అతడు మధుమేహముతో బాధపడుచున్నాడు. ఒకవేళ అతడు తన హృదయమంతటితో విశ్వసించకలిగితే, దేవుడు అతడిని స్వస్థపరచును. అక్కడ అతడి భార్య, అతని ప్రక్కనే కూర్చొనియున్నది. అవును. ఆమె మీద నీ చేతిని పెట్టుము, ఆమె పెద్ద ప్రేగులో సమస్య ఉన్నది. నీ చేతిని ఆమె మీద పెట్టుము, మరియు నీ హృదయమంతటితో విశ్వసించుము, మీరిద్దరూ స్వస్థత పొందెదరు.

మీరు విశ్వసిస్తున్నారా?

54నీ సమస్య రక్తము గడ్డకట్టుట, అది నీ ఎడమ చేతిలో ఉన్నది. ["అది నిజము" అని ఆ స్త్రీ చెప్పినది.] నీవు కేన్సరు కలిగియున్నావు ["అది నిజము"], ఆపరేషన్ జరిగినది ["అవును."] వారు నీకు కొన్ని మందులు ఇస్తున్నారు ["అవును."] ఆ మందుల వలన నీకు ఆ రక్తము గడ్డకట్టినది, దాని పరిస్థితి చాలా తీవ్రముగా ఉన్నది. దేవుడు నిన్ను స్వస్థపరచునని నీవు విశ్వసిస్తున్నావా? ["నమ్మచున్నాను."] అయితే, నీ నమ్మిక చొప్పున నీకు కలుగును గాక! ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఆమె స్వస్థత పొందును గాక.

బలముగా, ఆరోగ్యవంతమైన స్త్రీవలె ఆమె కన్పించుచున్నది. నీవు యేసుక్రీస్తును విశ్వసిస్తున్నావా, ఆయన దేవుని కుమారుడని, ఆయన సజీవుడని నమ్ముచున్నావా? [ఆ స్త్రీ "నేను నమ్ముచున్నాను" అని చెప్పెను.] ఈ రాత్రి ఆయన ఇక్కడ ఉన్నాడని నీవు నమ్ముచున్నావా?["అవును, నమ్ముచున్నాను"]. ఒకవేళ నీకు సంబంధించిన విషయము నేను ఏదైనా చెప్పినట్లయితే, నీ హృదయమంతటితో ఆయనను విశ్వసిస్తావా? ["అవును."] నీవు శస్త్రచికిత్సకు వచ్చావు అవునూ అది స్త్రీల వ్యాధి ["అవును."] అది స్త్రీ వ్యాధి ["అవును."] కాబట్టి నీకు శస్త్రచికిత్స చేయవలసి యున్నది ["అవును."] నీతోపాటు ఒక వ్యక్తి ఉన్నారు. ఆ వ్యక్తికి కూడా శస్త్రచికిత్స అవసరము ["అవును"], అది నిజము. ["అవును."] అది ఖచ్చితముగా నిజము. నీవు మరొక వ్యక్తి కొరకు ప్రార్ధిస్తున్నావు, నీ భర్త కొరకు ["అవును"]. అతడు రక్షణలేని వ్యక్తి ["అవునయ్యా"] అతడిక్కడ లేడు. నీ హృదయమంతటితో విశ్వసించుము, అతడు రక్షణ పొందుతాడు, నీకు శస్త్రచికిత్స చేయవలసిన అవసరములేదు. ["ఓ"], వెళ్ళు, విశ్వసించుము. నీ హృదయమంతటితో, ఆమేన్. ఆమేన్.

దేవునియందు విశ్వాసముంచుము!

55నీవు నడుస్తున్న విధానము నేను చూడగలుగుచున్నాను. దేవుడు మాత్రమే కెన్సర్ను స్వస్థపరచగలడు. కాని దానిని ఏ విధముగా చేయాలో దేవునికి తెలుసు. నిన్ను ఆయన స్వస్థపరుస్తాడని విశ్వసిస్తున్నావా, [ఆ స్త్రీ "అవును, అవును" అని చెప్పెను]. అయితే, నా ప్రియ సహోదరీ, నీవు స్వస్థత పొందుకొనునట్లుగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో నీమీద చేతులుంచుచున్నాను. ఆమేన్. వెళ్ళు, సందేహించక, నీ హృదయమంతటితో విశ్వసించుచూ వెళ్ళుము.

రమ్ము సహోదరి. నీకు ఉబ్బసవ్యాధి, స్త్రీ సమస్యయున్నది. నిన్ను దేవుడు స్వస్థపరుస్తాడని నీవు విశ్వసిస్తున్నావా? ["నమ్ముచున్నాను" అని ఆ స్త్రీ చెప్పెను], దేవుని మహిమార్థమై, యేసుక్రీస్తు నామములో స్వస్థపడుము. ఆమేన్. సరే, మంచిది.

మధుమేహము. దేవుడు నిన్ను బాగుచేస్తాడని నీవు నమ్ముచున్నావా, నిన్ను స్వస్థపరుస్తాడని? ["అవును. దానిని నేను నమ్ముచున్నాను" అని ఆ స్త్రీ చెప్పినది], వెళ్ళు, ప్రభువైన యేసుక్రీస్తు నామములో స్వస్థతపొందుము. నీవు విశ్వసించినట్లైతే, దానిమీద నీ చేతులు ఆ విధముగా ఉంచు, అది జరుగుతుంది.

అవునయ్యా, వెన్ను సమస్య ఉదర సమస్య. నీవు దేవుడు నిన్ను స్వస్థపరుస్తాడని? {"అవునయ్యా" అని ఆ వ్యక్తి చెప్పాడు.] అయితే, వెళ్ళు దేవుని మహిమార్థమై, యేసుక్రీస్తు నామములో స్వస్థతపొందుము.

అందరూ విశ్వసిస్తున్నారా?

 

56అయ్యా, ఎలా ఉన్నారు? నీకు గ్రంధులలో సమస్య ఉన్నది, దాని వలన గుండెజబ్బు వచ్చినది. దేవుడు నీ గుండెను బాగుచేసి, నిన్ను సంపూర్ణముగా స్వస్థపరుస్తాడని నమ్మచున్నావా? ["ఆమేన్" అని ఆ వ్యక్తి చెప్పాడు.] వెళ్ళు ప్రథమైన యేసుక్రీస్తు నామములో స్వస్థతను పొందుకొనుము.

నేను మీకు ఒకటి చూపించగోరుచున్నాను. నేను ఈ చేతి గడియారమును తీసివేస్తున్నాను. దేవుడు నీ ఊపిరితిత్తులను స్వస్థపరచి నిన్ను పూర్తి ఆరోగ్యవంతురాలిగా చేస్తాడని నీవు నమ్ముచున్నావా? ["అవును" అని ఆ స్త్రీ చెప్పినది.] సరే, మంచిది. ఆయన నిశ్చయముగా చేయగలడు. అది ఎలా జరిగినదో గ్రహించావా? సరే మంచిది. వెళ్ళుము, యేసుక్రీస్తు నామములో స్వస్థత పొందుము.

ఇప్పుడు నేను నీ చేతిని పట్టుకొననిమ్ము. నీవు నా చేతిని చూడాలనుకొనుచున్నాను, అది అందరి చేతివలెనే యున్నది. అవునా? ఇప్పుడు నా చేతిని దానిమీద పెట్టుచున్నాను, ఇప్పుడది మారినది, అది వాచినది. దానిమీద చిన్న బుడిపెలు కదులు చున్నాయి. నీ ఉదరమునకు పుండ్లు పడ్డాయి. దేవుడు దానిని బాగుచేసాడని నీవు నమ్ముచున్నావా? ఇప్పుడే నీ స్వస్థతను నీవు అంగీకరించెదవా? [ఆ వ్యకి "నేను నమ్ముచున్నాను" అని చెప్పెను.]

ప్రభువగు దేవా, యేసుక్రీస్తు నామములో ఈ వ్యక్తిని స్వస్థపరచండి. ఇది సత్యమని చూచి గ్రహించునట్లుగా, ప్రభువా, ఈ క్షణమందే అతని నుండి దానిని తీసివేయండి. పరిశుద్ద గ్రంధములో వ్రాయబడియున్నది. "విశ్వసించినవారు, నా నామములో దయ్యములను వెళ్ళగొట్టుదురు." ప్రభువా, నేను నమ్ముచున్నాను. యేసుక్రీస్తు నామములో ఈ దయ్యము నా సహోదరుని నుండి వెడలిపోవును గాక. ఆమేన్.

మరలా నీ చేతిని చూడనిమ్ము అది, అంతకుముందు కన్పించినట్లుగా లేదు. అవునా? [ఆ వ్యక్తి "లేదు, అదలా కన్పించుటలేదు" అని చెప్పెను.] నీవు స్వస్థపడ్డావు. బాగుపడి వెళ్ళుము.

57ఉబ్బస వ్యాధి, దేవుడు ఈ వ్యాధిని బాగుచేస్తాడని నీవు నమ్ముచున్నావా? [ఆ వ్యక్తి"ఆమేన్" అని చెప్పాడు.] వెళ్ళు, చక్కగా శ్వాస పీల్చుకొనుము, ప్రభువైన యేసుక్రీస్తు నామములో స్వస్థతపొందుము. బాగుపడి వెళ్ళుము. ఆమేన్. విశ్వాసమును కలిగి యుండుము.

దేవుడు, వెన్నునొప్పిని తగ్గించి, ఆ వ్యక్తిని సంపూర్ణముగా బాగుపరచును. నీవు దానిని నమ్ముచున్నావా? [ఆ వ్యక్తి "ఆమేన్" చెప్పెను.] సరే, మంచిది. నీవు వెళ్ళుము. నీవు వెళ్ళుచుండగా "ప్రభువైన యేసూ, వందనములు నేను స్వస్థత పొందాను" అని చెప్పుచూ వెళ్ళుము. ["హల్లేలూయ!"] సందేహించవద్దు; నీ హృదయమంతటితో విశ్వసించుము. ఆమేన్.

నీవు ఆ కుర్చీలో కూర్చొనియుండగా ఒకవేళ నేను నీవు స్వస్థపడ్డావు అని చెప్పినచో, నీవు దానిని విశ్వసిస్తావా? ["అవును" అని ఆ వ్యక్తి చెప్పాడు.] సరే, మంచిది. సంతోషిస్తూ వెళ్ళుము. నీ మార్గమున "ప్రభువైన యేసూ, వందనములు" అని చెప్పుచూ వెళ్ళుము. నీవు ఏదైతే అడిగావో దానిని పొందుకుంటావు. మంచిది.

 

58అయ్యా, రండి. మీరు విశ్వసించుచున్నారా? ["నేను నమ్ముచున్నాను" అని ఆ వ్యక్తి చెప్పాడు.] నీకు దానిని చూపించాలనుకొనుచున్నాను, అది నీ చేతిలో కన్పిస్తుంది. నాతో చెప్పుము. నా చేతివైపు ఇక్కడ చూడుము. దానిలో ఏదైనా తేడా ఉన్నదా! ఇక్కడ చూశారా? ["ఏమియు లేదు"]. ఇప్పుడు దానిలో మార్పువస్తుంది. అది ఉబ్బును, అచ్చట చిన్న తెల్లని బుడిపెలు వస్తాయి ["అవును"], నీవు రాత్రికి భోజనము చేసి మరలా ఆనందముగా ఉండగోరుచున్నావా? ["అవును"], నీవు ఉంటావని విశ్వసిస్తున్నావా? ["అవును"]. నీవు చూసిన ఈ కార్యములు దైవ కార్యములు అని నీవు నమ్ముచున్నావా? ["అవును, ఖచ్చితముగా నమ్ముచున్నాను"]. ఇప్పుడు మరలా నీ చేయి వెనుక చూడుము. మరలా నా చేతిని చూడుము, ఇప్పుడు అదిలేదు. కావున వెళ్ళి భోజనము చేయుము. సహోదరుడా, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచినది.

మనమందరమూ, "ప్రభువుకు స్తోత్రము" అని చెప్పెదము. ఆయన నిన్న నేడు ఒక్కటేరీతిగా ఉన్నాడు. మనము రోగులమీద చేతులుంచినప్పుడు వారు స్వస్థపడతారని మీరు నమ్ముచున్నారా? ["ఆమేన్!"] నిశ్చయముగా మీరు నమ్ముచున్నారు!

సహోదరి, నీవు దానిని విశ్వసించుచున్నావా? ["అవునయ్యా,"] యేసుక్రీస్తు నామములో, దేవుని మహిమార్దమై స్వస్థపడి వెళ్ళుము. ఆమేన్.

59ఓ, ప్రభువగు దేవా, భూమ్యాకాశముల సృష్టికర్తా, ఈ రాత్రి ఈ భవనములో జరుగుచున్న కార్యములన్నింటిని బట్టి నీవు ఇక్కడ ఉన్నావని మేమేరిగి యున్నాము. నీ మహిమ నిమిత్తము నా సహోదరిని దేవుని శక్తి స్వస్థపరచును గాక. ఆమేన్.

ఇప్పుడు రండి, విశ్వసించండి. నీ హృదయమంతటితో నీవు నమ్ముచున్నావా? ["అవును."] అయితే నీవు ఎన్నడూ కృంగిపోయి ఉండవలసిన అవసరము లేదు. దేవుని మహిమ నిమిత్తము ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఆమె స్వస్థత పొందుకొని వెళ్ళెను. ఆమేన్. ఇప్పుడు, సందేహించకుండా, నీ హృదయమంతటితో విశ్వసించుచూ వెళ్ళుము.

గుండె కడుపు, రెండూ, కడుపులోని సమస్య వలన గుండె సమస్య తలెత్తినది. ప్రభువైన యేసూ, నా సహోదరుని స్వస్థపరచండి. యేసుక్రీస్తు నామములో ప్రార్ధిస్తున్నాను. ఆమేన్.

మనము చాలా కాలము క్రింద ప్రార్ధించేవారిమి, దానిని ఈ విధముగానే మనము చేస్తూవుండెడివారమని మీరెరుగుదురు.

60నిజముగా నీవు దేనిని గూర్చియు కలవరపడవలసిన అవసరము లేదు. అవునా? కొంచెము కూడా అవసరము లేదు. కాని నీవు అలాగే ఉన్నావు. అది నిజము. అక్కడున్న వారందరూ, వారిలో ప్రతి ఒక్కరూ, అదే స్థితిలో ఉన్నారు. వారు అలాగే యున్నారు. నేను దానిని నీకు చూపిస్తాను.

అక్కడున్నవారిలో ఎందరు కలవరముతో ఉన్నారు? మీ చేతులు పైకెత్తండి మీ చేతులు పైకెత్తండి.

నీవు ఆ గుంపును ఏమని పిలుస్తావు? చూచావా, నీవు కలవరపడకూడదు. కాని దేవుడు స్వస్థపరచువాడని నేను నీకు చూపిస్తాను, ఎందుకనగా నీవు స్వస్థత పొందబోవుచున్నావని నాకు తెలుసు, గ్రహించావా. నిజముగా అది ఇప్పటికే పోయినది. అది నిజము. ఆమేన్. ఇప్పుడే ఆ నీడ ఆమె మీదనుండి తొలగిపోయినది. "ప్రభువా, వందనములు" అని చెప్పుచూ సంతోషించుచూ వెళ్ళుము.

నీవు మరలా చక్కగా శ్వాసను పీల్చుకోవాలని ఆశించుటలేదా? అవును, అది అద్భుతముగా ఉండదా? ఆయన చేయగలడని నీవు నమ్ముచున్నావా? అయితే నీ మార్గమున వెళ్ళుము. చక్కగా శ్వాస పీల్చుకొనుము. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ కార్యము జరుగును గాక. ఆమేన్.

 

61నీకు తెలుసు, ఇప్పుడు నీకు సహాయము కావాలి, లేనట్లయితే మరణిస్తావు. నీకు సహాయము దొరకనట్లయితే, అది నిన్ను చంపివేస్తుంది. నీకు సహాయము చేయుటకు ఇక్కడ దేవుడు ఉన్నాడు. నీవు దానిని విశ్వసించుచున్నావా? అది దురాత్మ వలన కలిగినదని నేను నీకు చూపిస్తాను. నీ చేతిని నన్నుపట్టుకొననిమ్ము. నీకు అది తెలుసు. అది కేన్సర్ నీకు కేన్సర్ ఉన్నదని నీకు తెలుసు, అవునా? [ఆ వ్యక్తి "అవును" అని చెప్పాడు] నాతో పాటు, నీ హృదయమంతటితో విశ్వసిస్తావా?

దేవుడు స్వస్థపరచనట్లయితే, ఈ వ్యక్తి మరణిస్తాడు. అది కేన్సర్.

ఓ దేవా, వాక్యము చెప్పుచున్నది, "నా నామములో వారు దయ్యములను వెళ్ళగొట్టుదురు." ప్రభువైన యేసూ, నీవు ఇతరుల విషయములో ఆ కార్యము చేసినట్లైతే, ఇక్కడున్న ఈ వ్యక్తి జీవితములో కూడా ఆ కార్యము చేయండి. సర్వశక్తుడైన దేవుని శక్తి ఈ వ్యక్తి మీదకు వచ్చును గాక, మరియు దేవుని మహిమార్థమై ఈ వ్యక్తి ప్రాణమును కాపాడుము. యేసుక్రీస్తు నామములో. ఆమేన్.

నీవు వెళ్ళుము, దానిని గూర్చి మర్చిపొమ్మ, "ప్రభువా వందనములు" అని చెప్పుము. దేవుని మహిమార్ధమై స్వస్థత పొందుకొని వెళ్ళుము.

62నీవు ఒక కణితి కలిగియున్నావు, దానివలన శస్త్రచికిత్స చేయవలసియున్నది (అది నిజము). అయితే నా భార్యలోని కణితిని తీసివేసిన దేవుడు, నీలో నుండి కూడా ఆ కణితిని తీసివేయగలడు. నీవు దానిని నమ్ముచున్నావా? నేను కొద్దిసేపటి క్రితము చెప్పిన ఆ సాక్ష్యము నిజమని నీవు నమ్ముచున్నావా? ఇక్కడ నా హస్తము పరిశుద్ధ గ్రంథము మీద ఉన్నది. అది సత్యము. ఇప్పుడు ఇక్కడ పరిశుద్దాత్మ ఉన్నాడని నీకు తెలుసు. నీవు ఎవరివో నాకు తెలియదు, నేను నిన్ను ఎన్నడూ చూడలేదు. ఒకవేళ నీ సమస్య ఏమిటో నేను చెప్ప కలిగినచో, ఇచ్చట ఉన్నదేదో ఒకటి నీ సమస్యను గూర్చినాతో చెప్పుచున్నది, అదే నా భార్యలో నుండి ఆ కణితిని తీసివేసినది, చూశావా. నేను నీ మీద చేతులుంచి ప్రార్ధించినట్లయితే, ఆ కణితి నిన్ను విడిచిపోతుందని నీవు నమ్ముచున్నావా? నీ హృదయమంతటితో దానిని నమ్ముచున్నావా? సరే, మంచిది. ఇక్కడకు రమ్ము.

ఇప్పుడు నీవు నాతో కూడా విశ్వసించినట్లయితే.

ప్రభువైన యేసూ, ఈ స్త్రీ మీద నీ కృపా కనికరములను కుమ్మరించండి. దేవుని యొక్క వాక్యపు వెలుగులో ఆమె మీద నా చేతులుంచుచుండగా, ఆ కణితి తొలగిపోవును గాక! దేవుని మహిమార్థమై ఈ స్త్రీ జీవించును గాక, యేసుక్రీస్తు నామములో. ఆమేన్.

"ప్రభువా, కృతజ్ఞతలు" అని చెప్పుచూ, విశ్వసించుచూ వెళ్ళుము. దేవుడు నిన్ను దీవించును గాక!

ఇప్పుడు మనము ఎంత… మనము మూడు నిమిషములు ఎక్కువగా తీసుకొన్నాము. నేను మూడు నిమిషములు ఎక్కువ తీసుకొన్నాను. కార్ల్, రేపు సరిగ్గా సమయానికి ముగిస్తాను.

63ఇప్పుడు ఎంతమంది ప్రభువును ప్రేమిస్తున్నారు? ఈ ప్రజలు స్వస్థపడ్డారని ఎంతమంది విశ్వసించుచున్నారు? ప్రభువు చితమైతే, రేపు రాత్రికి నేను దానిని వేరేవిధముగా చేస్తాను, అది ఏ విధముగా పని చేస్తుందో, అదే విధముగా జరుగుచున్నదో, మీకు వివరించుటకు ప్రయత్నిస్తాను. ఇప్పుడు మీలో ప్రతి ఒక్కరిని ప్రభువు దీవించును గాక.

పరిశుద్దాత్మచేత తాము పాపులమని ఒప్పించబడినవారు ఇక్కడ ఎవరైనా ఉన్నారా? యేసుక్రీస్తును తమ సహాయముగా సేవించకోరిన వారు, యేసును తమ రక్షకుడిగా అంగీకరించగోరినవారు, ఇక్కడ ఎవరైనా ఉన్నారా? మీరు లేచుటకు ఇష్టపడినట్లయితే, మేము మీతో కలిసి ప్రార్థన చేస్తాము. ఆ విధముగా చేయుటకు మేము ఎంతో సంతోషిస్తాము. ఈ ఆహ్వానము అందరికి, మేము ఈ కూడికను స్వస్థత కొరకు, దైవిక స్వస్థత కొరకు ఏర్పరచినాము, కాని ఇది కేవలము స్వస్థత కొరకు మాత్రమే కాదు. మేము రోగుల కొరకు ప్రార్థన చేస్తాము. మరియు… పాప రోగముతో బాధపడుచున్న ప్రజలకు ప్రార్థన చేస్తాము. అదే మా మొదటి ప్రాధాన్యత మీరు రావలసినదిగా మేము కోరుచున్నాము. ఒక్క నిమిషము మీరు ఇక్కడకు వచ్చి, మాతో పాటు నిలువబడండి. మీతో కలిసి ప్రార్ధించుటకు మేమెంతో సంతోషిస్తున్నాము. మీకు ఏ విధముగా సహాయము చేయుటకైనను మేము ఇష్టపడుచున్నాము. మీరు అలా చేస్తారా? ఈ భవనములో ఎవరైనా పాపి ఉన్నారా, లేచి నిలువబడి, "నేను వచ్చి, యేసుక్రీస్తును నా రక్షకుడిగా అంగీకరిస్తున్నాను. ఈ రాత్రి నేను రక్షణ పొందాలని కోరుచున్నాను" అని చెప్పేవారు ఎవరైనా ఉన్నారా?

 

64దేవుడు నిన్ను దీవించును గాక. ఇక్కడకు ఒక వ్యక్తి వచ్చాడు. దేవుడు నిన్ను దీవించును గాక, ఇంకా ఎవరైనా ఉన్నారా? ఇంకా ఎవరైనా ఉన్నారా? అదే విధముగా ప్రజలు వచ్చుటను నేను ఇష్టపడ్డాను. ఇక్కడకు రమ్ము "నేను తప్పు చేశాను. నన్ను సరిచేసుకోవాలని ఆశిస్తున్నాను" అని ధైర్యముగా చెప్పుము.

నా సహోదరి, నా సహోదరుడా, ఇక్కడున్న ఐదు లేక ఆరు వందలమంది లేక ఇక్కడున్నవారు ఎంతమందైనా (నాకు తెలియదు), కాని ఇక్కడ నిలబడియున్న ఈ ప్రజలకు ఇది సత్యమని తెలుసు. ఆ ప్రవచనములయందు దేనిని నేను తప్పుగా చెప్పుటకు దేవుడు ఎన్నడూ అనుమతించలేదు. "అది సత్యము" అని ఎంతమంది చెబుతారు? సాక్ష్యముగా మీ చేతులు పైకెత్తండి. చూశారా, ఎల్లప్పుడూ ఆ ప్రవచనము సత్యమే.

నీవు సామాన్య విశ్వాసము కలిగి, దానిని నమ్మినట్లయితే, ఆయన నిన్ను రక్షించును. ఆయన హృదయ రహస్యములను ఎరుగును. ఈ సమయములో, ఈ భవనములో ఉన్నవారందరూ, రణగొణ ధ్వనులతో ఉన్నప్పుడు, ఈ పిలుపును ఎందుకు ఇచ్చాను? ఎందుకనగా, "పిలుపునివ్వు" అని ఏదో నాతో మాట్లాడినది. బహుశా, అది ఈ మనుష్యుని జీవితములో చివరి అవకాశమో ఏమో, అది నాకు ఎలా తెలియును? ఇంకా ఇక్కడ ఎక్కువమంది ఉండియుండ వచ్చును. ఒకవేళ ఎవరైనా ఉన్నట్లయితే, మేము తలలు వంచి ప్రార్ధిస్తుండగా ఇక్కడకు వస్తారా?

అయ్యా, రండి. దేవుడు నిన్ను దీవించును గాక! అది మంచిది.

ప్రభువా, అతడిని స్వస్థపరచండి, అతడిని సంపూర్తిగా బాగుచేయండి. అతడి విషయములో ఈ కార్యములు జరిగించండి.

ఇంకా ఎవరైనా వస్తున్నారా? ముగ్గురు. "ముగ్గురు నోట సాక్ష్యమునుబట్టి అది స్థిరపరచబడును.

 

65సహోదరులారా, మీరు ఇక్కడ నిలబడియుండగా, మీరు అత్యంత గొప్ప కార్యము చేయుచున్నారు. రోగులు స్వస్థత పొందుటకు ఏమైనా చేస్తారు. కాని ఒక వ్యక్తి అతడు పాపమనే రోగముతో ఉన్నాడని గ్రహించినప్పుడు, అది అన్నింటి కంటే ఘోరమైన రోగము.

ఈ రాత్రి ఈ ప్రజలు ఇక్కడకు వచ్చియున్నారు. మనము ఇక్కడ నిలబడి యుండగా కొంతమంది కేన్సర్ నుండి స్వస్టపడ్డారని మనమెరుగుదుము. అది నిజము. ఆ నీడలు వెళ్ళిపోవుట నేను చూచాను. నేను మతమౌఢ్యడను కాదు. అది సత్యమని నేను ఎరుగుదును. అనేక ప్రజలు స్వస్థత పొందుకున్నారు. బహుశా, కొందరి విషయములో వారు స్వస్థత పొందుకొని చాలా కాలము జీవించిన తర్వాత, మరలా వారు వ్యాధిగ్రస్తులు కావచ్చును. బహుశా, వారికి ఉబ్బస వ్యాధి రావచ్చును, ఏదో ఒకటి వారినుండి జీవమును తీసివేయ వచ్చును. మరణము అది చేస్తుంది.

ఇప్పుడు, నీవు ఏమి చేస్తున్నావు, నీవు నిత్యజీవమును అంగీకరించబోవుచున్నావు. యేసు ఏమి చెప్పాడో చూడుము, "నా మాటలు వినువాడు", "వినుట" అనగా "అర్ధము చేసుకొనుట," చూశారా. "నా మాటలు వినువాడు, నన్ను పంపినవానియందు విశ్వాసముంచువాడు, నిత్యజీవము కలిగియున్నాడు; అతడు తీర్పులోనికి రాక, మరణమునుండి నిత్యజీవము లోనికి దాటియున్నాడు." నీవు ఎన్నడూ చేయనటువంటి శ్రేష్టమైన కార్యమును చేయుచున్నావు.

 

66మేము ప్రార్ధించుచుండగా, ఈ గొప్ప కార్యమునకు జ్ఞాపకార్దముగా సంఘమంతయూ లేచి నిలువబడవలెనని కోరుచున్నాను. దైవ సేవకులు ఇక్కడకు వచ్చి ఈ ప్రజల మీద తమ చేతులు పెట్టవలెనని కోరుచున్నాను. నాతో కలసి ఈ విధముగా చేసినచో దానినిబట్టి సంతోషిస్తాను. ఇక్కడకు రండి, వీరిమీద మీ హస్తములు పెట్టండి. అందరూ భయ భక్తులతో ఉండండి.

పరలోకపు తండ్రీ, దైవిక స్వస్థత జరుగుచున్న ఈ ఘడియలో, భావోద్రేకముతో కాదు గాని, పరిశుద్ధాత్మ యొక్క నాయకత్వముతో నీదైవిక సన్నిధిలోనికి వచ్చి యున్నాము. రెండువేల సంవత్సరముల క్రితము యేసు జరిగించిన అదే కార్యములను ఈ రోజు జరుగుట వారు చూచినప్పుడు అప్పటి వారు ప్రవర్తించినట్లుగానే, ఇప్పుడు వీరు కూడా స్పందించారు. వాక్యము చెప్పుచున్నది, "ఆయన చేసిన కార్యములను చూసినప్పుడు, అనేకులు ఆయనయందు విశ్వాసముంచిరి." ఆయన చేసిన కార్యముల నిమిత్తము ఈ రాత్రి అనేకులు ఆయనను విశ్వసించారు.

ఇక్కడ మూడు ప్రశస్తమైన ఆత్మలు, ముగ్గురు వ్యక్తులు నిలబడియున్నారు. ప్రభువా, సాధారణముగా స్త్రీలు వస్తారు. కాని ఈ రాత్రి పురుషులు వచ్చారు. వారు నేరుగా వచ్చారు. పరలోకపు తండ్రీ, వారు తమ తప్పిదములను ఒప్పుకొనుచుండగా, వారి ఒప్పుదలను అంగీకరించమని ప్రార్ధిస్తున్నాము. వారు నిత్యజీవమును కోరుకొనుచుండగా యేసుక్రీస్తు ద్వారా అత్యధికముగా అనుగ్రహించండి. ప్రతినల్లటి పాపపు మరకలను తీసివేయండి. ప్రభువా, నా ప్రార్థన ఆలకించండి. నేను, వారిని నీ హస్తములకు అప్పగించుచున్నాను. "నాయొద్దకు వచ్చువానిని నేను ఎంత మాత్రము త్రోసివేయను" అని చెప్పిన వాక్యపు అధికారముతో ఈ కార్యము చేయుచున్నాను. ప్రభువా, వారు నీయొద్దకు వచ్చి యున్నారు. నీవు వారిని త్రోసివేయవని నీ వాక్యము చెప్పుచున్నది, అట్లైతే ప్రభువా, నీవు వారిని ఖచ్చితముగా స్వీకరించవలసియున్నది. నీవు వారిని క్షమిస్తావనే విశ్వాసముతో వారు నీయొద్దకు వచ్చియున్నారు. ఈ రాత్రి నుండి వారు పాపము నుండి తమ్మునుతాము దూరపరచుకొని తమ ముందు రాబోవు జీవితకాలమంతయు వారు నిన్ను సేవించెదరు.

 

67పరలోకపు తండ్రి, వారి మీద, మీరు పరిశుద్దాత్మను కుమ్మరించండి, మీ దైవిక శక్తితో వారిని నింపండి. వారు కేవలము క్రైస్తవులుగా మారుట మాత్రమే గాక, పరిశుద్దాత్మ శక్తితో సంపూర్ణముగా నింపబడి, ఈ వర్తమానమును ఇతరులకు చేర్చు పరిచర్యలో గొప్ప పనిముట్లుగా వాడబడుదురు గాక!

ప్రభువైన యేసు, నీ వాక్య ప్రకారము ఇప్పుడు వారిని నీ హస్తములకు అప్పగించుచున్నాను. వారు "క్షమించబడుదురు" అని నీవు వాగ్దానము చేసితివి. "అంత్యదినమున నేను వానిని లేపుదును" అని మీరు చెప్పారు. మీ వాక్యములు సత్యమని మేమెరిగియున్నాము. ఇప్పుడే మేము వాటిని గూర్చి మాట్లాడితిమి. అది ఎన్నడూ విఫలము కాదు. ఆ వాక్యము ఈ రాత్రి ఈ మనుష్యులను దర్శించినది మరియు వారు ఆ వాక్యమును వెంబడించుటకు వచ్చియున్నారు. ఈ కూటములో వారిని నీవు క్షమించావని నేను ఎరుగుదును, ఎందుకనగా నీ వాక్యము తప్పిపోదని నేను ఎరిగియున్నాను. యేసు నామములో ప్రార్ధిస్తున్నాను.

ఇప్పుడు మన తలలు వంచియుండగా.

 

68ఈ రాత్రి ఇక్కడ నిలబడియున్న, నా సహోదరులారా, మీరు చేయగలిగిన ఒకే కార్యమును మీరు చేశారు. నీవు తప్పు చేశావని ఒప్పుకొనినప్పుడు, నీవు ఏదో తప్పు చేశావని నీ పాపమును గూర్చి నీవు ఒప్పుకొన్నావు. క్షమాపణ పొందుటకు ఒక్కటే మార్గము ఉన్నది. అది సిలువ ద్వారానే. నీవు తప్పు చేశావని ఒప్పుకొని, ఆయన సత్యమైనవాడని ఒప్పుకొని, నీది తప్పు అని ఒప్పకొనినప్పుడు, ఆయనను మీ రక్షకుడిగా అంగీకరించుటకు, ఈ రాత్రి ఈ ప్రజలందరి యెదుట ధైర్యముగా వచ్చితిరి, మరియు ఆయన పాపులకొరకు మరణించెను. అందునిమిత్తమే ఆయన వచ్చాడు, పాపులకొరకు మరణించుటకే ఆయన భూమిమీదకు వచ్చాడు. మిమ్ములను ఒక్కకార్యమే అడుగుచున్నాను, ఆయన నీ కొరకు ఎందుకు మరణించాడో దానిని స్వేచ్చగా అంగీకరించుము. మీరు దానిని చేస్తారా? ఆయనను మీ స్వరక్షకుడిగా అంగీకరిస్తారా? మీ పాపములను మీ వెనుక పడవేసి, ఇప్పుడే ఆయనను మీ స్వంత రక్షకుడిగా అంగీకరించండి. మీరు అలా చేయుటకు ఇష్టపడితే, నేను అంగీకరిస్తున్నానని మీ కుడి హస్తములను ఆయన వైపుకు చాపండి. దేవుడు మిమ్మును దీవించును గాక!

దాని భావమేమనగా, ఇక అది సంపూర్తియైనది. నేను దేవుని సేవకుడినని మీరు విశ్వసించినట్లయితే, అది ఆయన వాక్యము ప్రకారము, "మీ పాపములు మీ వెనుకకు పోయినవి, అవి పోయాయి. అవి మరపు అనే సముద్రములో పార వేయబడినవి, ఆయన మరలా వాటినెన్నడూ జ్ఞాపకము చేసుకొనడు. ఈ రాత్రి మీరు ఆయనలో నూతన సృష్టిగా అయ్యారు."

69ఇక్కడున్న సహోదరులు వచ్చి, మీ మీద తమ చేతులుంచుతారు. ఇక్కడకు దగ్గరగా నిలబడియున్న సేవకులలో కొంతమంది ఇక్కడకు వచ్చి, వీరిమీద చేతులుంచండి. వారు పరిశుద్దాత్మను పొందుకొనునట్లుగా, మనము వారిని ఆశీర్వదించుదాము. దగ్గరకు రండి.

పరలోకపు తండ్రీ, ఈ మంచి సహోదరులను నింపండి. నా సహోదరుడిని, పరిశుద్దాత్మ బాప్తిస్మముతో నింపండి. ప్రభువా, ఈ రాత్రి, ఈ నా సహోదరుని పరిశుద్దాత్మతో నింపండి. నీ సేవకులమైన మేము వారిని మీ హస్తములకు అప్పగించుచుండగా, యేసుక్రీస్తు నామములో దీనిని అనుగ్రహించండి. ఆమేన్.

 

70ఇప్పుడు మీరు చేతులు పైకెత్తవచ్చును. ఈ మనుష్యులు క్రీస్తును తమ రక్షకుడిగా అంగీకరించారు. గత పాపములు క్షమించబడ్డాయి. అది దేవుని వాక్యము. అది సత్యమని ఎందరు ఎరుగుదురు?

స్నేహితుల్లారా, ఇప్పుడు మీరు ప్రజల వైపుకు తిరగండి. కాబట్టి, "మనుష్యులయెదుట మీరు నన్ను గూర్చి సిగ్గుపడినట్లైతే, మిమ్మును గూర్చి నేను తండ్రియెదుట సిగ్గుపడతాను. మనుష్యులయెదుట ఎవడైతే నన్ను ఒప్పుకొనునో, నా తండ్రియెదుట పరిశుద్ధ దేవదూతల యెదుటను నేను అతడిని ఒప్పుకొందును" అని ఆయన చెప్పెను. మీరు యేసుక్రీస్తును మీ రక్షకుడిగా ఒప్పుకొన్నారు, ఇప్పుడు ఆయనను మీ రక్షకుడిగా అంగీకరించారు. మీ చేతులు పైకెత్తండీ, ఇక్కడున్న సహోదరులారా, మీ చేతులు పైకెత్తండి, ఇప్పుడు వేదికవద్దకు వచ్చిన మీరు ప్రజలు చూచునట్లు మీ చేతులు పైకెత్తండి. "మనుష్యులయెదుట ఎవడు నన్ను ఒప్పకొనునో, నా తండ్రియెదుట, దూతలు యెదుట నేను వానిని ఒప్పకొందును."

ఇప్పుడు మనము తలలు వంచియుండగా, వీడ్కోలు తీసుకుందాము.

మీలో ప్రతిఒక్కరూ, ఇక్కడకు రాగలిగిన ప్రతిఒక్కరూ, ఇక్కడున్న ఈ సహోదరుల యొద్దకు వచ్చి కరచాలనము చేయండి. ఇక్కడున్న సంఘ కాపరులారా, వారిని మీ సంఘమునకు ఆహ్వానించండి. పరిశుద్దాత్మను పొందుకొనుటకు, ఇక్కడ నుండి మీరు వారితో వెళ్ళండి.

దేవుడు మిమ్ములను దీవించును. దేవుడు మిమ్ములను స్వస్థపరచును. దేవుడు మీకు కృపను, అభివృద్ధిని అనుగ్రహించాలని నేను యధార్దముగా ప్రార్ధిస్తున్నాను. మనము కొద్ది నిమిషములు తలలు వంచియుండగా, సహో. రోజ్ వచ్చి ముగింపు ప్రార్ధన చేస్తాడని నమ్ముచున్నాను. సరే మంచిది, సహో. రోజ్.

Search Messages

0 / 0 matches
Enter characters above to process real-time text query scopes...