అవిశ్వాసములో నుండి పూర్తిగా వేరవుటకు దేవుని వాక్యము పిలుచుచున్నది

అవిశ్వాసములో నుండి పూర్తిగా వేరవుటకు దేవుని వాక్యము పిలుచుచున్నది

1…ఇక్కడ కొన్ని లేఖనములు వ్రాసియుంచాను. దానిని ఒక అంశముగా పిలుచుదును (దానిని అంశముగా పిలువవలెనో, లేదో నాకు తెలియదు; కానీ కేవలము ఒక అంశము కొరకు), నేను ఈ ఆలోచనను తీసికొనగోరచున్నాను: "అవిశ్వాసములో నుండి పూర్తిగా వేరవుటకు దేవుని వాక్యము పిలుచుచున్నది."

GEN 13:5-15

 

2ఇప్పుడు బైబిల్లోని ఆదికాండము గ్రంధము 13వ అధ్యాయము నుండి చదవగోరుచున్నాను. 5వ వచనారంభము నుండి చదువుము. వాక్యము చదువుట నాకెంతో ఇష్టము, ఎందుకనగా నేను మానవుడిని గనుక నేను చెప్పినది విఫలము కావచ్చును — అయితే ఈ వాక్యము చదివినప్పుడు ఆయన చెప్పిన మాట విఫలము కాదు. దాని నుండి మంచిది ఒకటి వచ్చునని నాకు తెలియును. వాక్యము తప్ప మరేమియు చదువరాదు. 13వ అధ్యాయము 5వ వచనము నుండి చదువుట ప్రారంభించుదుము.

అబ్రాముతో కూడా వెళ్ళిన లోతుకును గొర్రెలు, గొడ్లు, గుడారములు ఉండెను.

వారు కలిసి నివసించుటకు ఆ ప్రదేశము చాలకపోయెను; ఎందుకనగా వారి ఆస్తి వారు కలిసి నివసించలేనంత విస్తారమైయుండెను.

అప్పుడు అబ్రము పశువుల కాపరులకును లోతు పశువుల కాపరులకును కలహము పుట్టెను. ఆ కాలమందు కనానీయులు, పెరిజ్జీయులు ఆ దేశములో కాపురముండిరి.

కాబట్టి అబ్రాము - మనము బంధువులము గనుక నాకును నీకును నా పశువుల కాపరులకును నీ పశువుల కాపరులకును కలహముండకూడదు.

ఈ దేశమంతయు నీ యెదుట నున్నది గదా, దయచేసి నన్ను విడిచి వేరుగా నుండుము. నీవు ఎడమతట్టునకు వెళ్ళిన యెడల నేను కుడితట్టుకును, నీకు కుడితట్టునకు వెళ్ళిన యెడల నేను ఎడమ తట్టునకు వెళ్ళుదునని లోతుతో చెప్పగా.

లోతు తన కన్నులెత్తి యోర్దాను ప్రాంతమంతటిని చూచెను. యెహోవా సొదొమగొమొర్రా అను పట్టణములను నాశనము చేయకమునుపు సోయారుకు వచ్చువరకు అదంతయు యెహోవా తోటవలెను, ఐగుప్తు దేశమువలెను, నీళ్ళు పారు దేశమైయుండెను.

కాబట్టి లోతు తనకు యోర్దాను ప్రాంతమంతటిని ఏర్పరచుకొని తూర్పుగా ప్రయాణము చేసెను. అట్లు వారు ఒకరినొకరు వేరైపోయిరి.

అబ్రాము కాననులో నివసించెను. లోతు ఆ మైదానమందున్న పట్టణముల ప్రదేశములో కాపురముండి సొదొమ దగ్గర తన గుడారము వేసికొనెను.

సొదొమ మనుష్యులు దుష్టులును యెహోవా దృష్టికి బహుగా పాపులునైయుండిరి.

లోతు అబ్రామును విడిచిపోయిన తరువాత యెహోవా - ఇదిగో నీ కన్నులెత్తి నీవు ఉన్నచోట నుండి ఉత్తరపుతట్టు దక్షిణపుతట్టు తూర్పుతట్టు పడమరతట్టును చూడుము.

ఎందుకనగా నీవు చూచుచున్న ఈ దేశమంతటిని నీకును నీ సంతానమునకు సదాకాలము ఇచ్చెదను.

GEN 1:3,4

 

3ఇప్పుడు, ఆలోచన ఏమనగా, దేవుని వాక్యము పూర్తిగా వేరవుటకు పిలుచుచున్నది. వాక్యమును చదివి, వాక్యమును చూచుట ద్వారానే దీనిని మనము తెలిసికొనియున్నాము. వాక్యమే దానిని బయలుపరచినది.

ఇప్పుడు, ఆదిలో (ఆదికాండము 1:3) దానిని మనము కనుగొందుము. భూమిని చీకటి కమ్మియుండెను, దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను, "వెలుగు కలుగును గాక" అని పలుకగా, వెలుగు కలిగెను. దేవుడు ఆ వెలుగు మంచిదైనట్టుగా చూచెను; దేవుడు వెలుగును చీకటిని వేరుపరచెను. కాబట్టి దేవుని వాక్యము ఆదినుండి వెలుగును చీకటి నుండి వేరుచేయుచున్నది. ఈ రోజు వరకు అంతే.

LUKE 2:48,49

 

4గతరాత్రి యేసును గూర్చి నేను చెప్పాను, ఆయనకు పండ్రెండేండ్ల వయస్సు వచ్చినప్పు చేసిన కార్యము చెప్పాను. ఆయన తల్లి పొరబడినది (ప్రజల ద్వారా దేవుని తల్లిగా పిలువబడినది), మరియు "నేనును, నీ తండ్రియు కన్నీటితో నిన్ను వెదకుచున్నాము" అని ఆ స్త్రీ ఎట్లు చెప్పినదో చూడండి. వాక్యమైయున్న ఆయన వెంటనే ఇట్లనెను, "నేను నా తండ్రి పనిమీద ఉండవలెనని మీకు తెలియదా?" చూడండి, ఆమె ఆయనను యోసేపు కుమారునిగా ప్రకటింపచూస్తున్నది, కానీ ఆయన యోసేపు కుమారుడు కాదు. ఒకవేళ ఆయన యోసేపు కుమారుడయినచో, అతనితోనే ఉండియుండును; కానీ ఆయన తండ్రితోను, ఆయన పని మీదను ఉండెను. కాబట్టి వాక్యము ఎల్లప్పుడూ సరిదిద్దును మరియు ఎల్లప్పుడూ సరిగానేయుండును. వాక్యము ఎల్లప్పుడూ ప్రతి తప్పును సరిదిద్దును.

GEN 1:3,4

 

5దేవుడు భూమిని వాడుకోనైయుండెను. అది పూర్తి చీకటిలో యుండెను. దేవుని ఆత్మ ఈలాగున పలికెను, "వెలుగు కలుగును గాక," మరియు ఆయన చీకటిలో నుండి వెలుగును వేరుచేసెను. ఆయన అప్పటి నుండి ఆలాగే చీకటి నుండి వెలుగును వేరుచేయుచునే యున్నాడు.

దేవుని వాక్యము ఆదిలో నీటిని భూమిని కూడా వేరుచేసెను. దేవుడు పలుకగా, నీరు భూమి నుండి వేరాయెను. దానికి ఆయనకు ఒక కారణమున్నది. మాట పలుకుటకు ఒక ఉద్దేశ్యము లేకుండా దేవుడెన్నడునూ మాటను పలుకడు. ఆయన నీవంటివాడు నావంటివాడు కాదు. ముఖ్యంగా, నావలె అనేక బుద్దిహీనపు మాటలు పలుకువాడు కాదు. దేవుడు ప్రతిమాటను ఒక అర్ధముతో పలుకును. ఒక దానిని సాధించుటకు ఆయన ప్రయత్నించును. ఆయన తన మాట ద్వారా దానిని సాధించును. అదేమి చేయవలెనని ఆయన చెప్పునో, దానినే సరిగ్గా అది చేయును.

6ఇప్పుడు, "వెలుగు కలుగును గాక," అని దేవుడు చెప్పినచో, అక్కడ వెలుగనేది కలుగనియెడల అది దేవుడు చెప్పినది కానట్టే, చూచారా. దేవుడు ఏదయినా చెప్పినయెడల, తాను చెప్పిన దానిపక్షము ఆయన వహించును. మరియు ఎప్పుడైతే దేవుని వాక్యము రుజువుచేయబడినదో, వాక్యము రుజువుచేయబడినది, అదే వెలుగు. ఇప్పుడు, వాక్యము దానంతట అదే వెలుగు కానేరదు, అది రుజువుచేయబడినప్పుడే వెలుగు అగును. "వెలుగు కలుగును గాక" అని దేవుడు చెప్పినప్పుడు, అక్కడ వెలుగు కలగనిచో, అది దేవుని వాక్యము కానేరదు; అయితే వెలుగు భూమి మీదికి ఉద్భవించినప్పుడు, వాక్యము రుజువుచేయబడుట చూడగలము, మరియు అదియే వెలుగైయుండెను.

7ఇప్పుడు, ఈ రోజు, దేవుడొక వాగ్దానము చేసినయెడల, ఆ వాగ్దానము రుజువుచేయబడినప్పుడు, అప్పుడు అది వెలుగుగా ఉండును; అదే ఆ దినము యొక్క వెలుగు, వాక్యము రుజువుచేయబడినప్పుడు — ఆ గడియ యొక్క వాక్యము రుజువుచేయబడినది.

ఆ తరువాత వృక్షములు పెరిగే ఒక భూమిని దేవుడు తయారు చేయబోవుచుండెను. ఆయన భూమి మీద జనులను సృజించెను. ఆ తరువాత ఆయన మాట పలికి సముద్రము నుండి జలములను వేరుపరచెను. ఆ తరువాత ఆదికాండములోనే ఆయన మరణము నుండి జీవమును వేరుపరచెను.

మనము దేవుని వాక్యమును నమ్మినయెడల, అది మనకు జీవవాక్యము అగును; కానీ మనము దేవుని వాక్యమును ప్రశ్నించినయెడల, అది మరణమగును. ఏలయనగా దేవుడు మాట్లాడెను; దానినెవరు కాదనగలరు? చూచారా? మనము దేవుని వాక్యమును ప్రశ్నించినయెడల, అది మరణమగును — హవ్వ వలె అగుదుము.

8ఇప్పుడు, హవ్వ దేవుని వాక్యములోని ఒక చిన్న భాగమును ప్రశ్నించెను. అందువలన ఏమాయెను? మనకున్న బాధలన్నింటికి అదే కారణమయ్యెను. ఆమె వాక్యము వెనుక నిలిచియుండినయెడల, వాక్యము వెనుక దాగియుండినయెడల, దానిని విశ్వసించియుండిన యెడల దేవునియొక్క పూర్తి కవచమును కలిగియున్నయెడల ఇపుడున్న రీతిగా ఎన్నడును జరిగియుండెడిది కాదు. ఈ విధముగా యుండేది కాదు. అయితే, మీరు చూడండి, అక్కడ మరణము వచ్చెను.

అప్పుడు దేవుడొక పరిహారమును కలిగియుండెను. మనయెడల కనికరపడి, వారి మరణమునకు ప్రత్యామ్నాయమరణముగా ఆయనొక మరణమును అంగీకరించెను.

ఏదెను తోటలో ఆయన మరణము నుండి జీవమును కూడా వేరుచేసెను. ఆయన తన వాక్యము ద్వారా దానిని చేసెను. నేడును ఆయన అదే కార్యమును చేయుచున్నాడు. మనము కటిక చీకటిలో యున్నప్పుడు, భూమిమీద చీకటి కమ్ముట గూర్చి నేను గత ఆదివారమున మాట్లాడాను. చీకటి భూమిని కమ్ముట, కటిక చీకటి జనులను ఆవరించుట గూర్చి నేను మాట్లాడాను. అయితే వీటన్నింటి మధ్యలో నుండి ఆయన ఇంకను తన జీవపు వాక్యమును నమ్మువారు నిమిత్తం మాట్లాడుతూనేయుండెను.

మరిప్పుడు మనము కనుగొనగలిగితే …

9ఒక పూర్తి వేర్పాటు యున్నదని యేసు ఎప్పుడు చెప్పుచూనేయుండెను. మానవజాతికి చివరగా నిర్దేశించబడిన ఒక సంగతిని, అనగా గొప్ప కడవరి దినము రాకమునుపు, మనమంతా దేవుని సన్నిధిలోనికి ఎక్కి వెళ్ళినప్పుడు, అక్కడ ఒక చివరి వేరుపరుచుట జరుగునని మనము కనుగోగలము. మేకలలో నుండి గొర్రెలను ఆయన వేరుచేయును.

దేవుడు ఎల్లవేళల వేరుచేయుచు, వేరుచేయుచు ఉన్నాడు. ఈ రాత్రి కూడా ఆయన చేయుచున్నది అదే. ఆయన ఎల్లప్పుడూ అదే చేయును. ప్రతి కూటములోను దానిని మీరు చూడగలరు. విశ్వాసమును అవిశ్వాసము నుండి ఆయన వేరుచేయును. ఆయన మాట్లాడును. ఆయనను నమ్మి, ఆయనయందు విశ్వాసము కలిగియున్నవారికి ఆయన తన్నుతాను ప్రకటించుకొనును.

NUM 6:2,5

 

10ఇప్పుడు, సంఖ్యాకాండము 6వ అధ్యాయములో ఒక నాజీరు పిలుపును మనము కనుగొందుము. నాజిరు పిలుపు అనగా, తమ్మును తాము లోకము నుండి పూర్తిగా వేరుచేసికొని, వాక్యము వైపునకు తిరుగుట అని అర్థము. అదే నాజీరు పిలుపు — వేరగుట.

సంసోను యెహోవాకు నాజీరు చేయబడినవాడని మనము కనుగొందుము. ఒక గురుతు ద్వారా అతడు వేరుచేయబడెను. అతడు ఏడు జడలతో పొడవైన జుట్టును పెంచుకొనుటయే ఈ గురుతు. అది ఒక వేర్పాటుకు గురుతు. అతడు ఒక పని కొరకు పిలువబడెను.

11దీని మీద నేను ప్రారంభించగోరుట లేదు, ఎందుకనగా కొద్ది నిమిషములు మాత్రమే నేను మాట్లాడుదును అని చెప్పియున్నాను. ఈనాడు బైబిలు ఏలాగు ఉండవలెనని చెప్పెనో అలాగు మన సోదరీలు పొడవైన జుట్టు కలిగియుండుటను మనము చూచుచున్నాము. తాము ప్రభువును వెంబడించగోరుచున్నామని చెప్పుటకు అదొక నాజీరు గురుతు. అది బాగా వినిపించుచున్నదని నాకు తెలియును. దానిని మీ ఇంటికి కొనిపోవలెనని కోరుచున్నాను (చూచారా?), ఎందుకనగా అది అదే అయియున్నది. దేవుడు తమకు చెప్పిన ఒక దానిని చేయుటకు ఒకరు ప్రయత్నించుచున్నట్లుగా కనిపించుచున్నది. దానిని గైకొనవలెనని వారు నిశ్చయించుకొనిరి. వెల ఎంతయినా గాని అక్కర లేదు. దాని గూర్చి బయట లోకము ఏదేదో చెప్పును. ఎందరో అపహాసకులు, హేళన చేయువారు, విమర్శకులు లేచి ఏదేదో పలుకుదురు. పూర్తిగా లోక-సంగతుల నుండి తేరి, దేవుని సంగతుల కొరకు జీవించు వ్యక్తికి వారివలన ఎట్టి తొందర కలుగదు. వారు వాక్యమునకు విధేయులగుదురు. లోక విషయముల నుండి తమ్మును తాము వేరుచేసికొందురు, ఎందుకనగా వాక్యము వారిని వేరుచేయును.

వారు వివుర్శను ఎదుర్కొందురని నాకు తెలియును. ఒకవేళ వారు విమర్శించనొందకపోతే వారిలో ఎక్కడో పొరపాటున్నదన్న మాట. లోకము ఎల్లప్పుడూ తన స్వంత వారిని ఎరుగును. కాని నేను చెప్పినది గుర్తుంచుకొనండి, దేవుని వాక్యము వలన కలుగు విమర్శ అనేది ఆయన కృప యొక్క బాధలయందు ఎదుగుటైయున్నది. ఒక క్రైస్తవునిగా ఉండుటకు నిన్నునీవు వేరుచేసికొన్నావని అది చూపించును. ఆలాగు ప్రవర్తించుటకు, ఆలాగు జీవించుటకు, దేవుని ప్రతీ ఆజ్ఞకు నీవు విదేయుడవుచున్నానని అది చూపించును. అది ఒక నాజీరు పత్రము, వేరగుటకు, లోక-సంగతుల నుండి వేరుచేయు పిలుపు దేవుని నుండి వచ్చుట.

12దేవుని ఆత్మ మూలముగా పుట్టిన ప్రతి స్త్రీ మరియు పురుషుడు, ప్రతి బాలుడు మరియు బాలిక ఈ రాత్రి ప్రభువునకు నాజీరు చేయబడినవారేనని నేను నమ్ముచున్నాను; ఎందుకనగా వారు ఈ సంగతుల నుండి వేరుపరచుకొనిరి. తమ్మును తాము లోక విచారముల నుండి వేరుపరచుకొనిరి. లోకము ఏమన్నా గానీ వారు వినక వేరయిరి.

గొప్ప పాఠశాలలున్న ఈ పట్టణములో మీరు జీవించుచున్నారు. మన దేశము ఉన్నత విద్య కొరకు పిలుచుట మనము చూచుచున్నాము (అది మంచిదే, దానికి విరోధముగా ఏమి పలుకుట లేదు), కానీ ఆ విద్య నీకు రక్షణను ఇవ్వజాలదు. ఒక శాస్త్రవేత్త గోధుమ గింజను చీల్చి, అందులో ఎన్నెన్ని రసాయనలున్నవో నీకు చెప్పవచ్చును, కానీ అక్కడున్న జీవమును మాత్రము అతడు కనుగొనజాలడు. విద్య నీకు లెక్కలను నేర్పించవచ్చును, అది నీకు చరిత్ర బోధించవచ్చును, ఇంకేదేదో నేర్పవచ్చును; కాని అది నీకు వెలుగును తీసికొని రాజాలదు. నీ విద్య దానిని చేయజాలదు. నీకు వెలుగును తెచ్చుటకు దేవునికి ఒకే ఒక మార్గమున్నది: అదెప్పుడనగా నిన్ను లోకపు సంగతుల నుండి వేరుపరచుకొనుటకు సిద్దపాటు చేసికొన్నప్పుడే. లోక విచారములన్నింటిని విడిచి పెట్టి దేవుని వాగ్దాన వాక్యమును మాత్రమే హత్తుకొనవలెను.

13పౌలు ప్రభువునకు నాజీరు చేయబడినవాడు. అతడు సజీవ దేవుని వాక్యము తట్టు త్రిప్పబడుటకు తనయొక్క సనాతన సంఘము నుండి వేరుచేయబడెను. అహరోను ప్రభువునకు నాజీరు చేయబడినవాడు. జన్మరాళ్ళను మోయుటకు మరియు ప్రధానయాజకునిగా ఉండుటకు అతడు తన సహోదరుల మధ్య నుండి వేరుచేయబడెను. అది పూర్తిగా వేరగుట. ఇకెంత మాత్రం మునము లోకములోనికి తిరిగి వెళ్ళుట లేదు, లేక లోకముతో తనకి ఏ పనిలేదు, కానీ దేవున్ని మాత్రమే హత్తుకొని యుండెదము.

లోకపు విచారములలో నుండి మరియు లోకసంబంధమైన కార్యాల నుండి వేరుచేయబడిన ఒక సంఘము కొరకు, ఒక స్త్రీ కొరకు, ఒక వధువు కొరకు యేసు వచ్చుచున్నాడు. నేడు మనం జీవించుచున్న ఈ ఆధునాతన మోజులలో నుండి ఆమె ప్రత్యేకించబడినది (వేరుచేయబడినది). ఆమె సంఘాల యొక్క ఆచారములలో నుండి, విచారములలో నుండి వేరుచేయబడినది. ఆమె కేవలం దేవునికి మాత్రమే ప్రత్యేకించబడెను. దేవుడు వాక్యమైయున్నాడు. భార్య మరియు భర్త ఒక్కటైయున్న రీతిగా వధువు మరియు వాక్యము ఒక్కటైయుండెను, ఎందుకనగా వాక్యము వధువు ద్వారా జీవించుచున్నది. అది అలాగే యున్నది. అదియే ఆమె యొక్క గుర్తింపు.

HEB 4:12

 

14నేను పి.హెచ్.డి., గానీ ఎల్.ఎల్.డి., గానీ చదివినచో, నేను ఏ స్కూలులో లేదా ఏ నంస్థలో దానిని చదివానో - ఆ స్కూలు ఆ యోగ్యతా పత్రమును గుర్తించును. వాటిని మీకు చూపించెదను. ఒక విశ్వాసి కలిగియుండిన యోగ్యతా పత్రము ఒకే ఒకటున్నది. అది దేవుని యొక్క వాక్యము అతనిలో జీవించుటయే. ఆ వ్యక్తిలో యేసుక్రీస్తు జీవించుచున్నట్లు ప్రకటించుటయే. అదియే ప్రభువునకు ప్రత్యేకించబడి నాజీరు చేయబడుట. వాక్యము నిమిత్తము వేరగుట. బైబిలు ఇట్లు చెప్పెను, "దేవుని వాక్యము రెండంచుల ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగలదియై, ఎముకలలోని మూలుగను విభజించునంత మట్టుకు దూరుచూ, హృదయములోని ఆలోచనలను పరిశోధించుచున్నది." ఆ కారణము చేతనే యేసు ప్రజలను చూచి వారేమి ఆలోచించుచున్నారో కనుగొనగలిగెను; ఆయనే వాక్యము.

MARK 16:17•

JOHN 14:12

 

15ఈ లోకములో మొదటిగా పుట్టిన — లేదండీ దేవునిచే సృజింపబడిన — మొదటి ఆదాము తన భార్య మాట విని వాక్యము నుండి వేరైపోయెను. అతడు ఇష్టపడినచో వాక్యముతో నిలిచియుండెడివాడే, కానీ అతడు భార్యతో ఉండుట కొరకు తన్నుతాను వాక్యము నుండి వేరుపరచుకొనెను. ఈనాడు సామాన్య లోకసంబంధియగు సంఘ సభ్యుడు సరిగ్గా అదే చేయుచున్నాడు; నిజమగు సజీవ వాక్యము నుండి తమ్మును తాము వేరుపరచుకొని, తమ సంఘమును పట్టుకొనుచున్నారు. దేవుడు శిక్షించునా లేక శిక్షించకపోవునా అని హవ్వ వాక్యమును ప్రశ్నించినది. సాతాను ప్రశ్నించినది; హవ్వ దానిని నమ్మినది.

ఈనాడు సంఘము కూడా వాక్యము గూర్చి ఈలాగు ప్రశ్నించుచున్నది, "ఆయన ఏకరీతిగా యున్నాడా? ఆయన ఇంకా తన సంఘములో జీవించియుండి, ఆయన భూమి మీదనుండినప్పుడు జరిగించిన అద్భుతములను, ఆశ్చర్య కార్యములను మరలా జరిగించునా?" నిశ్చయముగా, ఆయన యోహాను 14:12లో వాగ్దానము చేసెను గదా? "నా యందు విశ్వాసముంచువాడు నేను చేయు క్రియలు చేయును. అంతకంటే గొప్పవియు చేయును, ఎందుకనగా నేను తండ్రియొద్దకు ఎక్కిపోవుచున్నాను. నమ్మినవారి వలన ఈ సూచక క్రియలు కనబడును," అవి వారిని వెంబడించును.

ఈనాడు ప్రజల యొక్క ప్రశ్న ఏదనగా: "అది ఆయన నిజంగా అలాంటి భావముతో చెప్పెనా?" అనునదియే. "నిజంగా ఆయన అర్ధము అదేనా?" అని సంఘము చెప్పుచున్న దానితో నీవు ఆదాము స్థితిలోనికి నిన్నునీవు తెచ్చుకొనుచున్నావు. ఈ లోకము యొక్క స్త్రీ యగు సంఘముతో నీవు చేరుచున్నావు. లోకము నుండి వేరై వాక్యమునకు లోబడు ప్రతి విశ్వాసికి దేవుడు వాగ్దానము చేసిన ఆశీర్వచనములను పొందకుండా నిన్నునీవు వేరుచేసుకొనుచున్నావు. ఇప్పుడు, అది సత్యము.

ACTS 5:29

 

16కొన్ని ప్రత్యేక కార్యములు సంభవించుటకు కేటాయించబడిన యుగములో జీవించు భాగ్యము మనకు దొరికినది. మనం చూచిన దేవుని వాక్యము ప్రతి యుగమును దాటి వచ్చినది. కేటాయించబడిన వాక్యమును చూచినప్పుడు కొన్నిసార్లు మానవుడు ఇదెట్లు జరుగునా అని ఆశ్చర్యపడును. ప్రొఫెసర్లకు వారి స్వంత అభిప్రాయమున్నది. కానీ ఆ యుగములలో దేవుడెల్లప్పుడూ తన ప్రవక్తను పంపెను. యెహోవా వాక్కు ప్రవక్త యొద్దకు వచ్చును. ఆ తరమునకు వాక్యమును బయలుపరచును. ప్రవక్తలెప్పుడు నాజీరు చేయబడినవారే. దేవుని వాక్యమునకు లోబడు నిమిత్తం వారు సమస్తము నుండి వేరయిరి.

పేతురు యోహానులు చెప్పినది మీకు గుర్తున్నదా: "దేవుని మాట వినుటకంటె మీ మాట వినుట దేవుని దృష్టికి న్యాయమా?" పెంతెకోస్తు అనుభవమును గూర్చి వారిని ప్రశ్నించినప్పుడు, వారు ఆలాగు పలికిరి.

JOHN 5:39,46•

HEB 7:23,26

 

17ఇప్పుడు, మొదటి మనిషి తన్నుతాను వేరుచేసికొనెను — మొదటి ఆదాము — వాక్యము నుండి వేరై, తన భార్యతో నుండగోరెను. దేవుడు తన మాటను నిలబెట్టుకొనునా లేదా అని ప్రశ్నించెను. ఈనాటి నులివెచ్చని, లోకసంబంధ మనస్సుగల విశ్వానికి ఎంత చక్కని మాదిరి! తమ ఆచారము ఏమి చెప్పుచున్నదో, దాన్నే హత్తుకొని యుండగోరుచున్నాడు. వాక్యము చెప్పు దానిని స్వీకరించుటకు బదులు దానిని చేయుచున్నాడు — నిజమైన మాదిరి. తన భార్య కొరకు అతడు వేరాయెను. లోకసంబంధియగు విశ్వాసి వాక్యము నుండి వేరై సంఘమునకు లోబడుచున్నాడు. అయితే కడపటి ఆదాము ఒక స్త్రీ గర్భములో రూపింపబడి, లోకమునకు వచ్చెను. ఆయన దేవుని వాక్యమునకు నాజీరు కాబడినవాడు. ఆయన లోకము నుండి వేరై, వాక్యము వైపు తిరిగెను.

హెబ్రీ 7వ అధ్యాయము 26వ వచనము మనకు చెప్పునదేమనగా, ఆ యాజకులు నిత్యము చనిపోవుచుండిరి, కానీ ఈ యేసు పరిశుద్దుడైయుండి, పాపుల కొరకు ప్రత్యేకించబడెను.

ISA 7:14•

ISA 9:6

 

18పాపమనగా "అవిశ్వాసము." ఆయనలో ఎట్టి అవిశ్వాసము కనుగొనబడలేదు. ఆయన ఈ భూమి మీద ఉన్నప్పుడు, "నాలో పాపమున్నదని ఎవడు నిరూపించగలడు?" అని అనెను. పాపమనగా "అవిశ్వాసము." "ఈ యుగమునకు వాగ్దానము చేయబడిన దానిని నేను జరిగించనియెడల, ఈ యుగమునకు ప్రవచించబడినది నేను నెరవేర్చనియెడల, మెస్సీయా ఏమి చేయునని చెప్పబడెనో అది నేను చేయనియెడల, నన్ను నమ్మకుడి." "లేఖనములను పరిశోధించుడి, ఎందుకనగా అందులో నిత్యజీవము కలదని మీరు తలంచుచున్నారు, కానీ అవే నన్ను గూర్చి సాక్ష్యమిచ్చుచున్నవి" అని చెప్పెను (ఆయనెవరో అని చెప్పును). ఎందుకనగా ఏదెనుయొద్ద మొదలుకొని ఒక రక్షకుడు వచ్చునని ప్రవచించబడెను.

ఆయన ఒక కన్యకకు జన్మించుననియు, ఆయనకు "ఇమ్మానుయేలు" అని పేరు పెట్టబడుననియు ప్రవక్త పలికెను. ఆయన "ఆలోచనకర్త, సమాధానాధిపతి, బలవంతుడగు దేవుడు." అయితే ఆయన తన్నుతాను దేవునిగా చేసికొనుచున్నాడని వారాయన మిద నేరము మోపిరి. ఆయన దేవుడై యుండెను. ఆయన "సమాధానాధిపతి, బలవంతుడగు దేవుడు, నిత్యుడగు తండ్రి" గా ఉండెను. ఆత్మీయముగా మాట్లాడునట్లయితే, ఆయన తప్ప మరియొక తండ్రి లేడు. ఆయనే తండ్రి. మనందరికీ ఆయనే తండ్రి. విశ్వాసులందరికి, ఆయన వాక్యమును నమ్మువారందరికి ఆయనే తండ్రి. ఆయన సంఘము నుండి, దాని ఆచారముల నుండి, తన తల్లి నుండి, లోకము నుండి పూర్తిగా వేరయ్యెను, తండ్రికి ఇష్టమైనది మాత్రమే చేసెను.

JOHN 1:1,14•

HEB 13:8

 

19ఆయన ఆదామునకు భిన్నమైనవాడు. ఎంతమంది ఆయనను ప్రశ్నించినా ఆయన ఖాతరు చేయక, ఎల్లప్పుడూ వాక్యమును మొదట స్థానములో యుంచెను. ఆయనకు వాక్యమే ముందు. వాక్యము సరియని ఆయన రుజువు చేసెను. సాతాను ఆయన యొద్దకు వచ్చి సున్నము వేయగోరినప్పుడు, ఆయన ఈలాగు చెప్పెను, "ఈలాగున వ్రాయబడియున్నది." "అవును, మరియు ఈలాగు కూడా వ్రాయబడియున్నది," అని ఆయన చెప్పెను. వాక్యముతో ఆయన సాతానును ఎదిరించెను, ఎందుకనగా ఆయన అదే అయి యుండెను: ఆయనే వాక్యమైయుండెను.

బైబిల్ లోని I యోహాను 1వ అధ్యాయంలో ఇట్లున్నది, "ఆదియందు వాక్యముండెను. వాక్యము దేవునియొద్ద ఉండెను. వాక్యము దేవుడై యుండెను. ఆ వాక్యమే శరీరధారియై మన మధ్య నివసించెను."

ఆయన నిన్న, నేడు, నిరంతరము ఏకరీతిగా యున్నాడు.

20దేవుని యొక్క పలుకబడిన వాక్యముతో అదెల్లప్పుడూ సంబంధము కలిగియుండెను. ఆ దినమునకు అది దేవుని యొక్క వాగ్దానము. అది వచ్చునప్పుడు అదెంతో అసాధారణముగా ఉండుటనుబట్టి ప్రజలు దానిని అసలు గ్రహించనే గ్రహించరు; ఎందుకనగా వారు తమ స్వంత ఉద్దేశ్యములు, అభిప్రాయములలో అంతగా మిళితమైపోయిరి. ఏది సత్యమో గ్రహించుట మనకు చాలా కష్టము.

మరియ గర్భవతియై యున్నప్పుడు యోసేపునకు జరిగిన దాన్ని గూర్చి ఎక్కువగా నేను ఆలోచించుదును. ఆమె తల్లి కాబోవుచుండెను; యోసేపు ఆమెను ప్రేమించెను, అతడు నమ్మగోరెను. అతడు నీతిమంతుడు, మంచివాడు. మరియు తనకు చెప్పుచున్న గాధను నమ్మగోరెను, అయినా ఒక ప్రశ్న మిగిలియుండెను, "ఇపుడు, ఈమె ఒక మంచి స్త్రీ…"

గాబ్రియేలు తనను దర్శించుట గూర్చి మరియు అతనికి నిస్సందేహముగా వివరించియుండెను. అతడు నీతిమంతుడు, దావీదు యొక్క వంశములో నుండెను. అయినా గాని ఆమె అతనిని తన తప్పు కప్పుకొనుటకు వాడుకొన ప్రయత్నము చేయుచున్నదేమోనన్నట్లుగా కనిపించెను. తన నిందను తీసివేసికొనుటకు ఈలాగు చేయ ప్రయత్నించుచున్నదేమోననుకొనెను. ఎందుకనగా ఆమె అతనికి ప్రధానము చేయబడినది గనుక ఈ పరిస్థితిలో నుండట వ్యభిచారమునకు సమానమే. కాబట్టి రాళ్ళతో కొట్టబడి చంపబడవలెను. (ద్వితీయోపదేశకాండము మనకు ఆలాగు చెప్పెను) కనుక అతనిని ఆమె ఒక రక్షణగా వాడకొనుచున్నట్లుగా కనిపించెను.

ISA 7:14•

MATT 1:19

 

21అతడు మంచి మనిషి, నీతిమంతుడు, బైబిలు కూడా అతడు నీతిమంతుడని చెప్పెను. కానీ ఈమె సంగతి చాలా అసాధారణముగా యున్నది. అతనికది అర్ధము కాలేదు. ఆమె యొక్క చక్కని ముఖములోనికి అతడు చూచుచుండెను. యధార్ధత, నిజత్వము ఆమె చెప్పిన గాధలో ఉట్టిపడుచుండెను. ఏమి సందేహము లేదు, అతడు తన ఇంటికి, లేదా వడ్రంగి పనిచేయు చోటునకు వెళ్ళుచూ, "ఆమె నాతో పొరపాటు చెప్పదు గాని ఇది మాత్రం ఏదో అసాధారణముగా యున్నాదే," అని తలంచుచుండెను. అతడు లేఖనములను వెదికి యుండినచో, బాగుండును. "ఒక కన్యక గర్భవతి యగును!" చూడండి, అది అతనికి ఎంతో అసాధారణము, ఎందుకనగా అది అతని ఆలోచనా పరిదికి అందుదు; కానీ ఆమె వాక్యములోనే చక్కగా యున్నది.

సోదరులారా, నేడును ఆలాగే యున్నది. యేసుక్రీస్తు యొక్క పునరుత్దాన శక్తి, ఈ గడియకు చెందిన ఆయన వాగ్దాన వాక్యము ఎంతో అసామాన్యముగా యున్నది. మంచి వారును దాని విషయమై తొట్రిల్లుచున్నారు. అది మరి అసాధారణము! మృతులు లేపబడిరి, గ్రుడ్డివారు చూచుచున్నారు, చెవిటి వారు వినుచున్నారు, పరిశుద్దాత్మ ఆలోచనలను వివేచించుచున్నది, రాబోవు సంగతులను ముందే చెప్పుట జరుగుచున్నది; చెప్పినది ఏ ఒక్కటియూ నెరవేరకుండా పోలేదు. ఓ, వాటిని వారు గ్రహింపలేకున్నారు. అదెంతో అసాధారణము. అందుకే వారు, "అది మనస్సులను చదువుట, దురాత్మ" అని అనిరి. ఆనాడు వారు చేసినట్లుగానే యున్నది. దేవుని వాక్యము యొక్క అసామాన్యత!

MATT 10:38

 

22అయితే ఈ లోకములో జన్మించిన ఒక వ్యక్తి, అనగా విశ్వాసి, వాక్యమునకు విరుద్ధముగా నున్న ప్రతిదాని నుండియూ తన్నుతాను వేరుచేసికొన్నప్పుడు అతడు నాజీరు కాబడిన వాడగును - సంపూర్తి వేర్పాటు. యేసు చెప్పెను, "ఒకనిని అతని భార్య నుండి వేరుచేయుటకు, ఒక కుటుంబమును చీల్చుటకు నేను వచ్చాను. తన సిలువను ఎత్తికొని నన్ను వెంబడించనివాడు నా వాడుగా పిలువబడుటకు యోగ్యుడు కాడు." ఒక వేరగుట - సమస్తము నుండి వేరగుట, అది ఏదైనా: సంఘము నుండి, ఒక సమాజము నుండి, ఒక విశ్వాసము నుండి, లేదా కుటుంబము నుండి, లేదా పూర్తి దేవుని వాక్యమును నమ్మకుండా చేయునట్లు, మరియు నీకును వాక్యమునకు మధ్య నిలచిన ప్రతిదాని నుండియూ వేరుకావలెను. ఈ ఘడియకు చెందిన ప్రతి వాగ్దానమును నీ ఆత్మ, "ఆమేన్" అని చెప్పి స్థిరపరచనిచో, ఎక్కడో ఏదో పొరపాటున్నది; నీకు ఒక వేర్పాటు అవసరము.

JOHN 5:19

 

23కాబట్టి యేసు శరీరధారియైన వాక్యము, ఆయన పాపుల నుండి — అవిశ్వాసుల నుండి — పూర్తిగా వేరుచేసికొనెను, అప్పుడే వాక్యము ఆయన గుండా సంపూర్తిగా ప్రవహించెను, ఆయన ద్వారా బయలు వెళ్ళెను, "తండ్రి చేయుట మొదట చూస్తేనే గాని నేనేదియూ చేయను" అని ఆయన పలికెను.

వారు ఆయనను కొన్ని సంగతులను గూర్చి అడిగి, ప్రశ్నించుచుండిరి. అపుడాయన ఈలాగు చెప్పెను, "తండ్రి ఏమి చేయుట చూచునో, అది తప్ప కుమారుడు తనంతట తాను ఏదియూ చేయజాలడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను." గమనించండి; ఆయన చెప్పిన ప్రతిదియు పరిపూర్ణమైనది. ఆయన దాని గూర్చి అడుగవలసిన పనిలేదు, ఆలోచించవలసిన పనిలేదు; అది పరిపూర్ణము. సత్యము ఎల్లప్పుడూ సత్యమును మరియు అబద్దము నుండి వేరుచేయును.

LUKE 2:49•

ROM 3:4

 

24నేను మరల మరల ఆ వెనుకటి సంగతిని ప్రస్తావించెదను; ఆయన తల్లి ఇట్లు చెప్పెను, "నీతండ్రియు, నేనును…" ఆ యాజకుల ఎదుట అప్పటికే ఆమె కన్యకకు జన్మించిన కుమారుడని సాక్ష్యమిచ్చినది. కాని ఆమె యొక్క దుఃఖ క్షణములలో…

పండ్రెండు సంవత్సరముల బాలుడు అంత గొప్ప జ్ఞానముతో యాజకులను, మునులను, విద్యాధికులను ఎట్లు వాదనతో ఎదిరించగలిగెను? అతడు కనీసము బడికి వెళ్ళిన ఆధారము కూడా మనకు లేదే? ఆమె అతనితో యోసేపు నీ తండ్రి అని చెప్పెను. వెంటనే ఆ దేవుని వాక్యము, ఆయన వేరయ్యెను. ఆయన వాక్యమైయుండెను, మరియు వాక్యము తప్పును సరిదిద్దును: "నేను నా తండ్రి పని మీద యుండవలెనని మీకు తెలియదా?" అది కేవలము పండ్రెండు సంవత్సరముల బాలుడు పలికిన మాట కాదు. అది దేవుని వాక్యము. తప్పును సరిదిద్దుటకు, ఆదియందు చీకటి నుండి వెలుగును వేరుచేసినట్లుగా చేయుటకు, సత్యమును అబద్దమును వేరుపరచుటకు, మరణమును జీవమును వేరుచేయుటకు ఆయన యొక్క చిన్న బాల్యనోటి ద్వారా దేవుని వాక్యము మాట్లాడెను. అదొక వేరగుట.

ఏదేమైనా వాక్యము ఎల్లప్పుడు సంపూర్ణ మరియు పూర్తి వేర్పాటును కోరును. యేసు ఈలాగు చెప్పెను, "ప్రతివాని మాట అబద్దము నా మాట సత్యము." యుగములన్నింటిలోను ఇదే సంగతి జరిగినది. అది ఒక వేర్పాటు. ఆయన ఎల్లప్పుడూ తన జనులను అవిశ్వాసము నుండి వేరుచేయును. ఆదియందు ఆయన అదే చేసెను. ఈనాడును ఆయన అదే చేయును. ప్రవక్తల్లో ప్రతి ఒక్కరు అవిశ్వాసము నుండి వేరయిరి. అది వారు చేయుటకు కారణము, ప్రభువు వాక్యము వారి యొద్దకు వచ్చుటయే.

25పాత నిబంధనలో "ప్రవక్త" అను పదమునకు అర్ధము ఏమిటో, బహుశా ఒక ఆదివారము లేదా గతరాత్రి ఇక్కడో మరెక్కడో చెప్పాననుకొనుచున్నాను. దాని అర్ధము, "ఒక దైవిక వ్యక్తి, జరుగునైయున్న భవిష్యత్తు సంఘటనలను గూర్చి చెప్పువాడు." అవి చెప్పబడినట్లు ఎట్టి వైఫల్యము లేకుండా సరిగ్గా జరిగినప్పుడు," అతని మాట వినుడి, అతనికి భయపడుడి, ఎందుకనగా నేనతనితో యున్నాను." అతడు వ్రాయబడిన వాక్యము యొక్క దైవీక భావమును చెప్పును. అవే అతని గుర్తింపు యొక్క యోగ్యతా పత్రములు. అతడు దేవుని యొక్క ప్రవక్త అనియు, వాక్యము అతని యొద్దకు వచ్చెననియు అదే గుర్తింపు. అది నిజము.

JOHN 8:46

 

26ఇప్పుడు, వేర్పాటు. అది యెషయాను సంఘలోకము నుండి వేరుచేసినది. అది మోషేను సంఘలోకము నుండి అది వేరుచేసినది. అన్ని యుగములలోను ఉండిన ప్రవక్తలందరిని సంఘలోకము నుండి అది వేరుచేసెను, ఎందుకనగా వారు… అది యేసును తన సోదరులతో నుండి వేరుచేసెను. అది అపోస్తలులను ఆనాటి వారి సంఘము నుండి, పరిసయ్యులు, సద్దూకయ్యులు, గొప్పవారు, పరిశుద్దులు, మంచివారు, చక్కని వారు, దీనులు, యేసు సాధకము చేసిన దానికంటే ఎక్కువగా ఆత్మ ఫలములను కలిగినవారి నుండి వేరుచేసెను. అయితే ఆయన యోగ్యతా పత్రము లేమిటి? వాక్యము ఆయనతో నుండుటయే. ఆ దినమునకు వాగ్దానము చేయబడిన వాక్యము ఆయన ద్వారా జీవించెను. "నాలో పాపము గలదని మీలో ఎవడు నిరూపించగలడు? నేను ముందుగా జరుగునని చెప్పినది జరుగలేదని ఎవరు చెప్పగలరు?" అని ఆయన ప్రశ్నించెను. దానిని బట్టి ఆయన, తాను ప్రభువునకు నాజీరుగా నుండుటకు వేరుకాబడినవాడనని చూపించెను. ఆయన శరీరములోనున్న ప్రభువు.

GEN 12:1•

GEN 18:10,12,13,15

 

27అబ్రాహాము కూడా లోకము నుండి వేరయిన వ్యక్తి. దేవుడు అబ్రాహామును డెబ్బది-అయిదేండ్ల వయస్సులో పిలిచెను. "నీ స్వజనము నుండియు, సమస్త అవిశ్వాసము నుండియు వేరుకాబడి, ఇంతకు ముందెన్నడూ నీవు నడవని ప్రపంచములోనికి రమ్ము. నీవు ఇంతకు ముందెన్నడూ ఎరుగని జనుల మధ్య నడువుము. బయటకు రమ్ము. నీవు నమ్ముచున్న దానికి విరోధభావము చూపుచున్న ప్రతివారిలో నుండి నిన్నునీవు వేరుచేసికొనుము. ప్రభువునకు నీవు నాజీరుగా ఉందువు," ఎందుకనగా అతడు ఒక కుమారుని యొక్క వాగ్దానమును కలిగియుండెను. అతడు తన తండ్రి నుండి, తల్లి నుండి, బంధువుల నుండి వేరుకావలసియుండెను. అతనిని ఏది వేరుచేసెను? అతడు మంచివాడయినందున కాదు గానీ, తనకు దేవుడిచ్చిన వాగ్దానమును దేవుడు నెరవేర్చుటకు సమర్ధుడు అని నమ్మినందు వల్లనే.

ఆ తరువాత పాతిక సంవత్సరములు గతించెను గాని ఏ బిడ్డ కలుగ లేదు. శారాకు తొంబది సంవత్సరములు, అతనికి నూరు సంవత్సరములు. యెహోవా దూత అతనిని దర్శించెను. చివరి దినములలో అది మరల జరుగునని యేసు ప్రస్తావించెను. దేవుడు మానవ రూపములో అతని యెదుట కూర్చొని మాట్లాడెను. దాదాపు వంద సంవత్సరముల వయస్సులో నుండిన శారా, ఆయన వెనుక నున్న గుడారములో యుండి నవ్వెను, ఎందుకనగా దూత ఈలాగు చెప్పెను, "వాగ్దానము చేసినట్లుగా, ఆ సమయమునకు వచ్చి నిన్ను దర్శించెదను."

ఆమె ఇట్లనెను, "నేను బలము ఉడిగినదాననైన తరువాత నాకు సుఖము కలుగునా? నా యజమానుడు వృద్దుడై యున్నాడు కదా?"

ఈ నరుడు శరీరధారీగానున్న దేవుడే. ఆయనిట్లనెను, "గుడారములో శారా ఎందుకు నవ్వినది?" ఆమె పరుగిడి వెళ్ళి, ఆలాగు అనలేదు, అని చెప్ప ప్రయత్నించెను. కాని ఆయన, "అవును, నీవు నవ్వితివి" అని అనెను. ఆమె నవ్వినది ఎందుకనగా, ఆయన చెప్పినది జరుగునని ఆమె నమ్మలేదు.

LUKE 17:28,30

 

28ఇప్పుడు గమనించండి, అది మరల వచ్చునని యేసు చెప్పెను. "సొదొమ దినములలో జరిగినట్లుగానే, మనుష్యకుమారుని ప్రత్యక్షమగు దినాలలో జరుగును." మరల దేవుని ఆత్మ మర్త్యుని మీదకు, మానవశరీరము మీదికి వచ్చును. ఆ నరుడు దూడ మాంసము తినెను, ఆవు పాలు త్రాగెను, మరియు మానవ శరీరములో యుండి వెన్న మరియు రొట్టె తినెను; అతడు ఎలోహిం అని అబ్రాహాము అనెను: దేవుడు శరీరమందు ప్రత్యక్షమాయెను. యేసు దానినే వాగ్దానము చేసెను. తన రాకడకు ముందుగా, దేవుడు మరల శరీరమందు ప్రత్యక్షమగునని వాగ్దానము చేసెను. అది పరిశుద్ధాత్మ తన్నుతాను ప్రత్యక్షపరచుకొనుటయే — దేవుడు ఒక్కడే — మరల వేరుచేయుచున్నాడు, మరల అబ్రాహాము నుండి లోతును వేరుచేయుచున్నాడు.

లోతు లోకమును కోరెను. దేవుడు అతని ప్రపంచమును విడగొట్టి అబ్రాహాము లోతులను వేరుచేసెను. లోతు శరీరసంబంధియగు విశ్వాసికి మాదిరి. ఈ విషయములు నిజమని అతడు తలంచలేదు. అతడు సొదొమలోనికి వెళ్ళెను. అతనికి అసలు నిజంగా నిలబడవలెనని లేదు (మనము చెప్పుకోనునట్లు) "నిజమును నిజమనియు, మరియు తప్పును తప్పు అనియు" పిలచుట జరుగలేదు. కనుక అతడు వెళ్ళెను.

29ఈ విశ్వాసులందరిని గూర్చి చెప్పుకొంటూ వెళితే చాలా గంటలు పట్టును. వీరందరూ నీ జేబులోని చిల్లరవలె దేవుని చేతిలో యున్నారు. నీవు కొంత చిల్లరను బయటకు లాగెదవు. అందులో పెన్నీలు, నికెళ్ళు, డైములు, క్వార్టర్లు, అర్ధడాలర్లు, డాలరు నాణెములు యుండును. దేవుని చేతిలో ప్రపంచము అలాగే యున్నది. కొందరు జనులు పెన్ని విలువను కలిగియున్నారు. వారిని దేవుడు పెన్ని విలువకే వాడుకోగలడు. వారు కొనకలిగినదంతయూ అంతకు సమానమైనదే. వారిని విసర్జించవద్దు. వారు నిజ సత్యమును విశ్వసించనిచో, వారిని త్రోసివేయవద్దు. వారిని బయటకు తన్ని, వీరు ఇందులో లేరని చెప్పవద్దు, ఎందుకనగా దేవుడు ఒక సమయమును పెన్నీలను వాడుకొనును.

లోతు ఒక పెన్నీ మాత్రమే; అబ్రాహాము ఒక వెండి డాలరు. కాబట్టి వంద లోతులను కలిపితే ఒక అబ్రాహాము అగును. లోకము యొక్క శరీర సంగతుల నుండి వేరై, యేసుక్రీస్తునందు జీవించుచున్న ఒక అసలయిన క్రైస్తవుని ముందు ఒక వందమంది శరీరసంబంధ విశ్వాసులు నిలువజాలరు. నిజ క్రైస్తవుని ద్వారా వాక్యము ప్రవహించును.

ఒక పెన్నీ విలువంత దానిని మాత్రమే అతడు తీసికోగలడు; అతనికున్నదంతయూ అదే. కాబట్టి "స్వస్థతలో నాకు నమ్మకము లేదు. ఈ సంగతులను నేను నమ్మను," అని ఈలాగు చెప్పే జనులు ఉన్నారు. అది కేవలము పెన్నీ అని మాత్రమే తెలిసికొనుడి. అతని జోలికి పోవద్దు, చూచారా. కేవలము ఒక పెన్నీ యోగ్యతే యున్నది, కనుక అతడు కొనకలిగినదంతయూ అదే. అతనిని ఆపవద్దు; అతనిని ఒంటరిగా ఉండనీయుడి. అతడు వెళ్ళగలిగిన దూరమంతయూ అదే.

యోసేపు తన సోదరుల నుండి వేరాయెను.

30నేను చెప్పినంత కఠినముగా ఉండవలెననునది నా ఉద్దేశ్యము కాదు, చూచారా. నా భావము ఇది, "నేను దీనికి చెందియున్నాను, మరియు మేము అది నమ్ముచున్నాము."

అది కేవలం ఒక పెన్నీ, ముందుకు వెళ్లండి. (చూచారా?), కేవలం ఒక పెన్నీ. "సరే, నా సోదరుడా, ప్రభువు నిన్ను దీవించును గాక!" అని చెప్పండి. చూడండి, అతడు రాగి నాణెము; అతడు వెండి నాణెముగా ఎన్నడూ ఉండజాలడు. కాబట్టి దానిని ఆలాగే పోనీయండి. దేవుడతనిని వాడుకోగలడు. ఓ, దానిని దేవుడు వాడుకొనుచున్నాడు. మద్యశాలలో అతడు ఒక మూలన నిలబడియుండుట మనము చూచుటకంటే, అతనిని ఒక సంఘములో చూడవలెనని నా ఆశ. మిరది కోరరా? నిశ్చయంగా. కాబట్టి వాని జోలికి పోవద్దు. ఏమయినా గాని దానిని దేవుడు వాడుకొనును, మరీ ఎక్కువగా కాకపోవచ్చును, కాని ఆయన వాడుకొనగలిగిన రీతిగా వాడుకొనును. వారాయనకు వాడుకొనుటకు ఎంత అవకాశమిచ్చుదురో, అంతగా ఆయన వాడుకొనును. దేనినయినా గాని ఆలాగు వివరించుట కఠిన విధానమని అనుకొనుచున్నాను. మంచిది, మీరు నా భావములో ఇమిడియున్న సత్యమును గ్రహించుదురని ఆశించుచున్నాను, దాని భావము, చూచారా.

JOHN 6:52,53•

JOHN 10:33

 

31అతడు వివేచనయందు గానీ, ఈ దినమునకు వాగ్దానము చేయబడిన దేవుని యొక్క శక్తులను గాని నమ్మజాలడు. ఆ పరిసయ్యులు కూడా దానిని చేయలేకపోయిరి. యేసు దేవుడుగానుండుటను వారు చూడలేకపోయిరి. ఓ, లేదు! "నీవు మానవునివై యుండి దేవునిగా చెప్పుకొనుచున్నావు."

ఆయన రొట్టె ముక్కలను, మొదలగువాటిని ఆశీర్వదించి, వారికి పంచిన తరవాత ఒక దినమున అక్కడ నిలబడి, ఇట్లనెను, "మనుష్యకుమారుని శరీరమును తిని, ఆయన రక్తమును త్రాగితేనే గానీ మీలో జీవముండదు."

నేను ఊహించుచున్నాను, ఆయన సమాజము ఆయనయొద్ద నుండి వెడలిపోయిరి. "ఈ మనిషి మనల్ని నరమాంస భక్షకులనుగా చేయగోరుచున్నాడు. ఎవరిదో మాంసము తినమనుచున్నాడు? ఓ, అది వెర్రితనము!"

వైద్యులు, చికిత్స చేయు వారు ఈలాగనిరి, "ఇతడు పిచ్చివాడు. అక్కడ ఉన్నది అంతయు అంతే. యాజకుడే సరయినవాడు. అతడు మతిపోయినవాడు. మనకు తినుటకు శరీరము ఇచ్చుచున్నాడు!"

ఆయన చెప్పినదంతయూ అదే, చూడండి. కానీ ఆత్మీయ మనస్సును వారు అర్ధము చేసికోలేకపోయిరి. వారు సరిగ్గా దాని అర్ధము ఎరుగలేకపోయిరి, ఆ శిష్యులు; అయితే ఏది ఏమైనా వారు నమ్మిరి, ఎందుకనగా అది ఎక్కడ నుండి వచ్చినది? వారు దేవుని కుమారునిగా ఎవరిని ఎరుగుదురో ఆయన యొద్దనుండియే అది వచ్చెను.

ఇక్కడున్నదంతయూ నేను అర్ధము చేసుకునే స్థితిలో లేకపోవచ్చును, కాని దానిని నేను నమ్ముచున్నాను. అది దేవుని వాక్యము. దానికి విరోధముగానున్న ప్రతిదాని నుండి నేను వేరుకాగోరుచున్నాను. ఆలాగు నిలబడుటకు నేను ప్రయత్నించాను.

JOHN 6:62

 

32మరో గుంపును గమనించండి: డెబ్బది మంది అని ఆయన పిలిచెను. ఒక రోజు ఆయన వారితో నిలబడి, వారితో మాట్లాడుచుండెను, "మనుష్యకుమారుడు ఎక్కడ నుండి దిగి వచ్చెనో, ఆ పరలోకమునకే తిరిగి ఎక్కిపోవును," అని చెప్పెను.

వారిట్లనిరి, "ఈ మనుష్యుడా? ఇతడు తాను జన్మించిన స్థలమునకు మనలను తీసికొని వెళ్ళియున్నాడు. ఇతని తల్లియగు మరియను మనమెరుగుదుము. ఎందుకు, ఇతని సోదరులను మనమెరుగుదుము. అంతా మనకు తెలియును. ఇప్పుడితడు, మనుష్యకుమారుడు ఎక్కడ నుండి వచ్చెనో, ఆ పరలోకమునకే తిరిగి ఎక్కిపోవునని చెప్పుచున్నాడే? అతడు బెత్లెహేము నుండి వచ్చెను. దానిని ఆయనెట్లు చేయగలడు?" చూడండి. ఆయన ఆ రీతిగా చెప్పెను, చూడండి. వారాయనతో ఆ మీదట నడువలేదు. వారు విడిచిపోయిరి; "ఆహా, ఈ మనిషి, అతడిలో ఎదో పొరపాటు ఉన్నది," అని అనిరి.

33అయితే ఆ శిష్యులు అక్కడే కూర్చొనియుండిరి, చూచారా. వారు నమ్మిరి. ఆ దినమునకు వాగ్ధానము చేయబడిన వాక్యము ఆయన ద్వారా రుజువుచేయబడి, ప్రత్యక్షపరచబడుట వారు చూచిరి. దేవుడు తప్ప మరెవరు సృష్టి చేయగలరు, ఆయన రొట్టెను విరిచి విస్తరించెను. ఆయన దేవుడు కుమారుడని వారెరుగుదురు. అది వారికి చిక్కు కథగా యున్నా గానీ, దానిని వారు అర్ధము చేసికొన్నా, చేసికోలేకపోయినా గాని, వారు ఆయనతో నడిచిరి; ఎందుకనగా వాక్యము రుజువుచేయబడినది, మరియు దానికి విరుద్ధముగానున్న ప్రతిదానినుండియు వారు వేరయిరి.

దేవా, అటువంటి విశ్వాసము మాకుండునట్లు సహాయము చేయుము! ఈ బైబిలు సత్యమని మేము నమ్ముచున్నాము. వాగ్దానములన్నియు నెరవేర్పులోనికి తేగల విశ్వాసము నాకు లేకపోవచ్చును, అయితే ఏది ఏమయినా నేను దానిని నమ్ముదును. మేము జీవించుచున్న గడియను నమ్ముచున్నాను.

34యోసేపు ఒక కారణము లేకుండానే తన సోదరుల నుండి వేరయ్యెను. వారి సంగతి ఇప్పుడు ఏమిటి? వేరగుటకు అతనికి ఇష్టము లేదు. వేరగుట అతని చిత్తము కాదు. కానీ వారతనిని తమలో నుండి వేరుచేసిరి, చూడండి. అతడు మెరయుచున్న డాలరు, వారి యొక్క పెన్నీ విలువ దానిని సహించలేకపోయెను. వారు పితరులని వారికి తెలియును. వారికి తెలియును యాకోబు వారియొక్క… లేక (నన్ను మన్నించండి) యాకోబు వారియొక్క తండ్రి, మరియు అది నిజమని వారికి తెలియును. యోసేపు దానికేమి చేయజాలడు. అతడు ఆత్మసంబంధి; అతడు దర్శనములను చూచెను; కలలను వివరించి అర్ధము చెప్పగలిగెను, మరియు అవి అక్షరాలా ఖచ్చితముగా నుండెను. అతడు చెప్పిన ప్రతిదియు సత్యమే. అతని యొక్క పితరులగు సోదరులు అసూయతో నిండి ఐగుప్తీయులకు అతనిని అమ్మివేసిరి. చూడండి, వారు తమ్మును తాము అతని నుండి వేరుచేసికొనిరి, ఎందుకనగా వారు పెన్నీలు వంటివారు. అతడయితే వేరే లక్షణము గలవానిగా యుండెను.

కావున ఈనాడు నిజవిశ్వాసియు ఆలాగే యున్నాడు. అతడు వేరే లక్షణము కలిగి యున్నాడు. వారు తమకుతామే వేరగుదురు. వారది అర్ధం చేసికొనరు. వెండిలో నుండి రాగి వేరగును.

35వారు అసూయతో నిండి అతనిని అమ్మివేసినట్లుగా ఇప్పుడు మనము కనుగొన్నాము. ఎందువలన? ఈనాడు కూడా వారు అదే చేయుచున్నారు. వారు కేవలము అసూయ వలననే అంతయూ చేయుచున్నారు. వారు విరగగొట్టబడుటకు ఇష్టపడరు, ఎందుకనగా వారిలో ఉన్న గుణము అతనిలోనున్న గుణమునకు సరిపడదు. దానిని బట్టి వారు అసూయతో నిండిరి. వారు పెన్నీలు, అతడు డాలరు అయియున్నాడు, చూచారా.

ఇప్పుడు, పెన్నీ వచ్చి, "ప్రభువు యొక్క నామమునకు స్తుతి కలుగును గాక. ఇక్కడ సోదరుడగు డాలరు యున్నాడు (చూచారా), అతడు చేయు మార్పును నేను చేయలేను గానీ చేయకలిగినది నేను చేసెదను," అని చెప్పెననుకోండి. అది… మనము కొనసాగుదుము. దేవుడు తన కార్యక్రమమును ముగించును.

1COR 14:8

 

36దేవుని వాక్యము యొక్క గొప్ప సమ్మేళనమోత మోగించుచున్నదని ఆదివారమున మీకు బోధించాను. మార్పులు మరియు కూడళ్ళు కేవలము దేవుడు మార్చు కాలములైయున్నవి. అవి సంగీత దర్శకునివలే యుండెను. యుగముల మార్పులను, కాలముల మార్పులను మనము చూచునప్పుడు ఇక్కడున్న పట్టికను చూడండి. ఇక్కడ మనము ఎక్కడ ఉండవలసియున్నామో కనుగొందుము. వారది చేయవలసియున్నారు. దానిని చేయకుండ దాటుటకు వారికి మార్గమే లేదు.

మరి, సంగీతము, సమ్మేళనమోత అర్దం కాని ఒక వ్యక్తికి అది ఎలా వుండును? అది కేవలం ఒక గోల చేయు గుంపుగా ఉండును. దానిని అతడు అర్ధము చేసికొనడు. కనీసము అతనికి దాని యందు శ్రద్ద కూడా యుండదు. అతని కోరిక ఈలాగుండును, "వారు ఆపివేసినచో బాగుండును, నేను ఇంటికి పోవచ్చును." అతనికి శ్రద్ద లేదు, ఎందుకనగా ఆ సంగీత సమ్మేళనం అతనికి తెలియదు. అది అతడెరుగడు. కానీ దానిని సమకూర్చినవానికి ఆది నుండి అంతము వరకు అది తెలియును, చూచారా. ఒకవేళ దర్శకుడు దానిని సమకూర్చినవాని ఆత్మలో లేనప్పుడు, దానినతడు సరిగా ప్రదర్శించలేడు; ఎందుకనగా అదంతయూ సంజ్ఞల ద్వారా జరిగెను. దానియొక్క సూచన బయలుపరచనియెడల, సంగీత బృందమువారు దానినెట్లు వాయించగలరు? ఆమేన్! అదీ సంగతి!

బూర అస్పష్టమగు ధ్వనిని ఇచ్చినయెడల, యుద్దమునకు లేక సంధికి ఏలాగు సిద్దపడవలెనో, ఎవరికి తెలియును? ఏమి జరుగుచున్నదో ఎట్లు తెలియును?

JOHN 4:16-19,25,26,29•

ROM 10:17

 

37వాక్యము వైపు చూచి మనమెక్కడ జీవించుచున్నామో గుర్తించుడి, అప్పుడు నీవు పెన్నీలు చూడగలవు, అవేమి చేయునో చూచెదవు. విని గమనించి, వాక్యమును ఎరిగి, ఈ సూచనలు జరుగునని గమనించుచున్నవారిని నీవు చూడగలవు. అక్కడే అది ఉన్నది. [బ్రదర్ బ్రెన్హాం చిటిక వేసెను.]

బావినొద్దనున్న దీన స్త్రీ వలె నుండును, "వెళ్ళి నీ భర్తను తీసికొనిరా!" అని ఆయననగా, "నాకు ఎవరూ లేరని" ఆమె అన్నది. "అది నిజమే. నీకు అయిదుగురు పెనిమిటులున్నారు."

"అయ్యా, నీవు ప్రవక్తవని గ్రహించుచున్నాను. వందల సంవత్సరముల నుండి మాకు ప్రవక్త లేడు. కాని మెస్సీయా వచ్చుచున్నాడని మాకు తెలియును, ఆయన ఒక ప్రవక్తగా నుండును. ఆయన అదే చేయును," ఆమె చెప్పెను.

"ఆయనను నేనే," అని ఆయన పలికెను.

ఓ, సంగీతసమ్మేళనంలో అన్నీ చక్కగా లయ కలిపి పాడినవి. దిగువస్థాయి నుండి పైస్థాయి వరకు సరిగ్గా సాగెను. ఆమె పట్టణములోనికి పరుగిడి వెళ్ళినది," వచ్చి, నేను చేసినవన్నియు నాతో చెప్పిన వానిని చూడుడి. మనం ఎదురుచూచుచున్న మెస్సియా ఈయన కాడా?" అన్నది. నిశ్చయంగా. చూడండి, సంగీతసమ్మేళనంలో యున్న పత్రసంగీతమేమిటో ఆమెకు అర్థమయినది. అది అవిశ్వాసము నుండి విశ్వాసమును వేరగుట. విశ్వాసము సంఘము ద్వారా రాదు. దేవుని వాక్యము వినుటవలన వచ్చును. అది ఏమైయున్నదో ఎరుగవలెను.

ఇప్పుడు, ఈ రోజు మనము అదే విషయము కనుగొనుచున్నాము.

NUM 16:3,21,32

 

38చాలామంది వరములు వైపు చూచుచున్నారు. (ఇప్పుడు ముగింపులో, మరో అయిదు నిమిషములు.) ప్రజలు వరముల వైపు చూచి ఈలాగు తలంచుదురు, "ఓ!, ఎంత గొప్పది!'' వారు ఆ వరములను అనుకరణ చేయగోరుదురు. దానిని నీవు చేయలేవు. ఒక పెన్నీని నీవు ఒక డాలరుగా చేయలేవు. దానిని డైమ్ గా చేయలేవు (చూచారా), దానిని ఒక నికెల్ గా చేయలేవు; అది ఒక పెన్నీ. నిన్నునీవు ఒక పెన్నీగా గుర్తించుకొన్నయెడల మరియు తక్కిన చిల్లరతో కోనసాగుము (చూచారా), దేవుడు నిన్ను వాడుకోగలడు. మనమంతా చేయ సమర్థులం కాకపోవచ్చును…

అట్టి వారెవరూ లేరు… దేవుడు ఐగుప్తు నుండి ఇశ్రాయేలును పిలిచినప్పుడు, వారందరూ మోషే చేసినది చేయు స్థితిలో లేరు, కాని దానిని వారు నమ్మిరి. అది నిజము. వారు మోషేను నమ్మిరి, ఎందుకగా అది ఆ గడియకు సూచన అని వారికి తెలియును. అతడు తన వాక్యము కలిగియున్నాడని దేవుడు రుజువు చేసెను. "ఫరోకు ఈటెలున్నవి" అని వారనిరి.

"కాని మోషేకి దేవుని వాక్యమున్నదని" ఆయన చెప్పెను. అంతే! ఫరో యొక్క శక్తి ఆ సైన్యములో యుండవచ్చును, కానీ మోషేకు దేవుని వాక్యముండెను; ఎందుకనగా అతడు దేవుని యొక్క ప్రవక్త. వాక్యము అతని యొద్దకు వచ్చెను. అది సత్యమని రుజువుచేయబడెను. ధూళిని విసరగా, ఈగలు సృజింపబడుట సజీవ దేవుని యొక్క పనియే. ఒక మనిషి అది చేయజాలడు. ఒక మానవునిగా అక్కడ అతడు నిలబడి, ఇట్లనెను, "రేపు ఈ సమయమునకు ఫలానా-ఫలానా జరుగును," అది జరగెను, చూడండి. మోషే దేవుని వాక్యమును కలిగియుండెనని వారికి తెలియును. ఫరోకు ఎన్ని ఈటెలు, దాగు చోట్లు ఉన్నా, లెక్కలేదు. ఎన్ని ఇటుకలు నిర్మించుకున్నా లెక్క లేదు. మోషే దేవుని వాక్యమును కలిగియుండెను. కనుక వారు అరణ్యములోనికి ప్రయాణమయిరి.

అక్కడ దాతాను అనే ఒకడు ఇట్లనెను, "మోషే తనమీదనే బరువంతా వేసికొనుచున్నాడు. మనందరము పరిశుద్ద ప్రజలమే గదా? కాబట్టి మోషే చేసిన దానిని మనందరమును చేయ సమర్ధులము."

"ప్రభువా, ఇతని మాట ఏమిటి?'' అని మోషే అడిగెను.

"నిన్నునీవు ప్రత్యేకించుకొనుము. వారిలో నుండి వేరగుము," అని ఆయన భూమిని తెరచెను. దాతాను మరియు అతని గుంపును భూమి నెరవిడిచి మ్రింగెను. చీకటిలో నుండి వెలుగును ఆయన వేరుచేసెను. ఆయన వాక్కును బయలుపరచి, అది చేసెను. నేడునూ ఆయన అదే దేవునిగా యున్నాడు.

39ముగింపులో. గతరాత్రి నేను మీకు చెప్పుచున్నాను: మొదటగా ఇక్కడికి నేను వచ్చినప్పటి సంగతి. ఇది వ్యక్తిగతమైనది కాదు. మిరాలాగు అనుకొనుచున్నయెడల, దయచేసి మీ హృదయముపై తెరను లాగండి. నమ్ముచున్నవారికి దీనిని నేను చెప్పుచున్నాను. "ఈ కాలములో ఖచ్చితంగా జరుగబోవు సంగతుల గూర్చి నేను చెప్పాను (దానికి మీరందరూ సాక్షులు, గత రాత్రి మీరు చూచార), వివేచన ద్వారా మిరది చూచారు; ఎలాగు అనుకరణ చేయువారు… అనుకరణ చేయుచూ, మరియు ఈలాంటివి ఎన్నో జరుగుచున్నవి, కాని చివరగా ఒక గొప్ప సంఘటన జరుగనైయున్నది. కొన్ని సంవత్సరములు నుండి అది జరుగునని మనము ఎదురుచూచుచున్నాము. అది మొదట ఎప్పుడు జరిగినదో మనందరకు తెలియును, మూడవసారి ఒక సృష్టి ఉనికిలోనికి వచ్చినది. తరువాత నాలుగవసారి జరిగినది. అయిదవసారి అది జరిగినదని గత రాత్రి మీకు చెప్పాను. సంఘముల యొక్క సమితి కొరకు అది ఎదురుచూచుచున్నది, అది ఐక్యమగునప్పుడు, మరియు ప్రొటస్టెంటులను ఏకము చేయును. శనివారం ఉదయమున నేను దాని మీదనే మాట్లాడగోరుచున్నాను, చూడండి. ఇప్పుడు, ఇది ఏకముగా కూడుట జరిగినప్పుడు, దేవుని ఆత్మ ఎల్లప్పుడూ వారికి విరోధముగా ఒక ద్వజమును లేపును.

దీనికి సాక్షిగానున్న ఒక వ్యక్తి ఈ రాత్రి ఇక్కడ కూర్చొనియున్నాడు.

40గత ఆకురాలు కాలములో, కొద్ది కాలము క్రితం నేను కొలరాడోలో యున్నాను. వేటాడుటకు నేనక్కడికి వెళ్ళాను. మామూలుగా నేను నా వివాహ దినమును అక్కడ గుర్తుచేసికొనుట పరిపాటి. నేను నా భార్యను వివాహం చేసికొనినప్పుడు, నా పని ద్వారా సంపాధించిన నికెలులను దాచియుంచాను. వాటిని ఒక పౌడరు డబ్బాలో పెట్టాను. హనీమూన్ కు మరియు వేట పర్యటనకు తీసికొని వెళ్ళుటకు చాలినంత డబ్బు లేదు, కనుక ఆ రెంటిని కలిపివేసాను; మరియు ఆమెను హనీమూన్ కు తీసికొని వెళ్ళుటకు వేట పర్యటన నిర్ణయించాను. అప్పటి నుండి నేను… సిగ్గుపడుతున్నాను, మా యొక్క ఏ వివాహపు రోజున కూడా నా భార్యతో ఇంటిలో నేనుండలేదు. నేను కొలరాడోలో యున్నాను.

41అక్కడ ఒక క్యాంప్ లో నాతోవున్న ఇద్దరు ముగ్గురు సేవకులను గతరాత్రి ఇక్కడ నేను చూచాను. నేను అలాస్కా నుండి వచ్చి వేటలో వారిని కలిసికొనవలెను. వారే మార్టిన్ బాలురు. వారు గతరాత్రి ఇక్కడున్నారు. ఇప్పుడు వారు ఆ వెనుక యున్నారు. మరో చిన్న వ్యక్తి యున్నాడు గాని అతని పేరు మరిచిపోయాను. కుమారుడా, నీవు కూడా అక్కడ ఉన్నావా? అది నిజము. మరియు బహుశా… సహోదరుడు పామర్ ఇక్కడ ఉన్నాడా? మేము పర్వతములపై యున్నాము, కొలరెడోలో నేను మార్గదర్శిగా యున్నాను. అక్కడ నేను కొన్ని సంవత్సరములు వేటాడాను.

మా పెండ్లిరోజు అక్టోబరు ఇరవై-మూడు. నా భార్యను నేను ఒక చిన్న చోటుకు తీసికొని వెళ్ళాను. అడిరోనాండిక్ పర్వతముల పైకి తీనికొని వెళ్ళాను. ఈ స్థలము దాని వలె కనిపించును, చిందర వందరగా నున్న గడ్డి మొదళ్ళు, చిన్న తుప్పలు అక్కడున్నవి. అది ఒక అడవిలోని భాగము. ఇరవై-మూడున నేను అక్కడికి నడిచి వెళ్ళాను. దినములో కొంత సమయము నడిచాను. కొన్నిసార్లు పగలంతా నా టోపి తీసివేసి, ఈ సంవత్సరములన్నియు నాకు సహాయము చేసిన నా మంచి, విధేయత గల భార్యను బట్టి వందనములు చెల్లించాను, నా పట్ల ఆమెకి దయ యున్నది, నేను సువార్త ప్రకటించుటకు వెళ్ళుచుండగా ఆమె ఆ పనులు చూచుకొన్నది.

42కొలరాడోలో ఈ సంవత్సరం బహు పొడిగానున్నది. దేశమంతా అలాగే యున్నది. మా ముందు రెండు వందలమంది లేక వందమంది ఉన్నట్లుగా ఒకసారి నాకు అనిపించినది, క్షమించండి, ఆ పైన క్యాంపులలో దాదాపు వందమంది మా కంటే ముందుగా వచ్చి యుండిరి. నాలుగు లేక అయిదు రోజులు నుండి వారు అక్కడ వేటాడుచున్నారు. సంవత్సరాల తరబడి వేటాడుచున్న ఒక జింకని నేను కొట్టాను. పొగమంచు క్రిందికి వచ్చుట వలన దానిని నేను చూడలేకపోయాను; అది నాకు దొరకలేదు. ఆ దినము దానిని నేను వేటాడుచున్నాను. మరుసటి రోజున రేడియోలో ఫోను వచ్చినది, "ఒక మంచు తుఫాను వచ్చుచున్నది. ఒక్క రాత్రిలోనే ఈ పర్వతములు ఇరవై అడుగుల మంచుతో కప్పబడును."

కాబట్టి నేను సోదరులను పిలిచి వారికి సంగతి చెప్పాను (మార్టిన్ బాలురు కూడా అచ్చటనే యున్నారు); నేనిట్లన్నాను, "సోదరులారా, మీరు చెప్పబడిన వార్త విన్నారు. కాబట్టి ఇప్పుడు మీరు ఇక్కడ నుండి తప్పించుకొని వెళ్లిపోవలెనన్నచో ఇంతకన్నా మంచి సమయము లేదు, లేనిచో సమయము మించిపోవును. మీరిక్కడ ఒక వారము ఉండిపోవలసి వచ్చును. నేను వెళ్లిపోవలెను, ఎందుకనగా వచ్చే సోమవారము నాకు ఒక కూటమున్నది, క్రైస్తవ వ్యాపారుల కూడిక… సంపూర్ణ సువార్త వ్యాపారుల కూటము టూసాన్ యొద్ద జరుగును. మీ ఇష్టప్రకారము నిర్ణయము తీసికొనండి. మీరు ఇక్కడే ఉండిపోదలిచినయెడల, నేను మీకు మార్గదర్శిగా నుందును. మితో నేను ఇక్కడ నిలిచియుందును."

వారిలో ప్రతిఒక్కరు, "మేమిక్కడే నిలిచియుందుము, మేము ఉందుము," అనిరి.

మార్టిన్ బాలురకు తక్కువ వేగపు ట్రక్కు లేదా ఎక్కువ వేగపు ట్రక్కు ఒకటున్నది. అక్కడే మాకు ఎక్కువ దుప్పులు కొన్ని ఉన్నవి. మేము వాటిని మార్టిన్ బాలురకు, తదితరులకు ఇచ్చాము, వారు బయటకు వెళ్ళిరి; ఎందుకనగా వారు అక్కడే ఉండుటకు నిశ్చయించుకొనిరి, అంతే. ఈ రాత్రి సాక్షిగా వారు ఇచ్చట కూర్చొనియున్నారు.

43మరుసటి రోజు సంగతి, వారు బయటకు వెళ్లిన ఆ రోజు మంచుపడలేదు. నేను నా భార్యను ఫోనులో పిలిచి, నీ వంటి చక్కని భార్య దొరికినందుకు వందనములు అని చెప్పగోరాను. అది మా పెళ్ళి రోజు. మరుసటి రోజు మేము అచ్చట నుండి వెళ్లిపోదుము. అప్పుడు మంచు కురియునని ముందే మాకు చెప్పబడెను. కనుక నేను లోనికి వెళ్ళాను, ఆమెకు ఫోను చేయలేకపోయాను. నేను తిరిగి వచ్చాను. పట్టణములో ప్రతి వారు సిద్దపడుచున్నారు. పెద్ద మంచు తుఫాను రానున్నది. కొలరాడోలో ఆ రాత్రి ఇరువై అడుగుల ఎత్తు మంచు పడునని వార్తా పత్రికలో వ్రాసిరి.

44ఈ రాత్రి బ్రదర్ టాం సింప్సన్ ఇక్కడే ఎక్కడో తప్పక కూర్చొని యుండును. అతడు కెనడాలో తన దారిన పయనించుచుండెను. వారు ప్రక్కదారిన వెళ్ళుచుండిరి. "కొలరాడోను తప్పించి ప్రయాణించండి, ఎందుకనగా అక్కడ గొప్ప మంచు తుఫాను!" అని హెచ్చరించబడెను. బ్రదర్ సింప్సన్, నీవిచటనే యున్నావా? ఎక్కడున్నావు. అవును, అదిగో అతడు ఆ వెనుక కూర్చొనియున్నాడు. "కొలరాడోను దాటుకొంటు వెళ్ళవద్దు. ఒక గొప్ప మంచు తుఫాను వస్తున్నది," అని వారు అతనికి చెప్పిరి.

కనుక నేను ఆ సోదరితో చెప్పాను… ఆమె మరొకని భార్య. ఆమె బ్రదర్ ఏవాన్స్ యొక్క భార్య. ఈ రాత్రి బ్రదర్ ఏవాన్స్ ఇచ్చట వున్నాడనుకొంటాను. ఒకవేళ వచ్చి యుండవచ్చును. ఇక్కడే ఉన్నావా బ్రదర్ ఎవాన్స్? ఇంకా ఇక్కడికి వచ్చాడనుకోను. కన్వెన్షనుకు ఎలాగయినా వచ్చును. అప్పుడు అతని భార్యకు ఫోన్ చేసి ఇలా చెప్పాను, "నా భార్యకు ఫోన్ చేసాను గాని ఆమె అందుబాటులోకి రాలేదు; బహుశా ఆమె స్టోరుకు వెళ్ళివుండవచ్చు. ఆదివారముకి కూడా ఒకవేళ నేను రానియెడల మరొక ప్రసంగీకుని సిద్దపరచుకొనమని ఆ కూటముల అధ్యక్షుడగు బ్రదర్ టోనీ స్టామికి కబురు పంపమని ఆమెతో (నా భార్య) చెప్పండి, ఎందుకనగా బహుశా ఇక్కడ నుండి నేను రాలేకపోవచ్చును. నేను వీరితో యున్నాను."

45అప్పుడు ఏమి జరిగినది? ఆ రాత్రి మంచు కురియలేదు. మరుసటి ఉదయాన మబ్బులు చాలా దిగవగా గర్జించ సాగాయి. "ఇదిగో సోదరులారా, నేను కొన్ని సంవత్సరములు ఇక్కడ పశువులను మేపాను మరియు గైడ్ గా ఉన్నాను. వాన చుక్క మొదట పడుటతోనే మీరు త్వరగా మీ క్యాంపునకు వెళ్ళిపోవలెను, ఎందుకనగా పదిహేను నిమిషములలో మీ చేతిని మీ ముందు మీరు చూడలేరు. హఠాత్తుగా రెండు మూడు రోజులు ఈ మంచు తుఫానుండును. అక్కడ అది 9,000 అడుగుల ఎత్తు. మీరు గాని ఆ తుఫానులో చిక్కుబడినచో, మీరు తప్పిపోవుదురు; ఈ పర్వతములలోనే మీరు చనిపోవుదురు. నేను ప్రతి ఒక్కరిని అక్కడే వుంచి, పైకి ఎక్కి వెళ్ళాను. నేను వచ్చు వరకు మీరు ఆగవద్దు. అది ప్రారంభమయిన వెంటనే త్వరపడి వెళ్ళిపోండి, ఎందుకనగా అది ఉదృతమైతే, మీరు మీ దారిని కనుగొనలేరు," అని చెప్పాను. నేను చెప్పినట్టే చేయుదుమని వారంతా అన్నారు.

46నేను పైకి ఎక్కి వెళ్ళాను. చిన్నచిన్న అడవి జంతువులు అంతటా గోల చేయుచున్నవి. వాతావరణము మారనున్నదని నాకు అర్దమైనది. అకస్మాతుగా ఒక పెద్ద ధ్వనితో గాలి వచ్చినది. మంచు పడనారంభించినది. "ప్రతి ఒక్కరు బహుశా తిరుగు ప్రయాణమగుచుందురు," అని అనుకొన్నాను. సరే, నేను అక్కడే నిలబడి చుట్టూ చూచాను. "నేను తిరిగి వెళ్ళక ముందు ఆ లేడిని కనుగొంటే బాగుండును, ఎందుకనగా మంచు దానిని కప్పివేయును. ఇక వసంతకాలము వరకు అది బయటపడదు. దానిని ఎంతో కష్టపడి వేటాడాను, ఈ చిన్న రైఫిల్ నాకు వచ్చినప్పటి నుండి అంత మంచి లేడిని వేటాడుట ఇదే మొదటిసారి, అని అనుకున్నాను. దానితో ఏబది-అయిదు వెటలు ఆడాను. అది కనబడకుండా పోవుట చాలా విచారముగా నున్నది" అని అనుకొన్నాను.

47ఒక్క క్షణములో పెద్ద మంచు బిందువులు, చాలా పెద్దవి ప్రతిచోటను పడుచున్నవి. గాలి వీచనారంభించినది, నేను ఏమి చూడలేకున్నాను, ఈ పర్వత కొన నుండి ఏలాగు బయటపడాలో నాకు అర్ధం కాకున్నది. నేను క్రిందకి వెళ్ళి ఏటి దారిని కనుగొని వెళ్ళినచో, చివరకు ఒక వంతెన దొరకును. అప్పుడు నేను నా గుడారము వేసిన చోటికి వెళ్ళగలను. బయట పడాలంటే అదొక్కటే మార్గము. "నేను అటు గాని ఇటు గాని ఒక్క అడుగు తప్పు వేసినచో ఇక ఎన్నడూ బ్రతికి బయటపడను. అక్కడే చనిపోయెదను," అనుకొన్నాను.

కనుక నేను కొండ దిగనారంభించాను. నేనున్న చోట నుండి దాదాపు మూడు నాలుగు వందల గజములు క్రిందికి దిగాను.

48ఇప్పుడు, ఇది మీకు వింతగా వినబడును, కాని నా ముందు బైబిలు యున్నది, దీనికి పరలోకపు తండ్రియే సాక్షి. నేను దరిదాపున పరుగిడుచున్నాను, మంచు తుఫానులో నుండి తప్పించుకొనే ప్రయత్నములో యున్నాను. అక్కడ గాలి చాలా బలంగా వీచుచున్నది. నేనున్న ఆ దట్టమగు పొదలలో నుండి దాదాపుగా ఇరవై అడుగుల మాత్రమే ముందు కనబడుచున్నది. అక్కడంతా దట్టమైన కలప యున్నది. గాలి వీచుచూ చెట్లను కుదుపుచున్నది. అప్పుడు ఒక స్వరము ఇట్లనెను, "ఆగుము! నీవెక్కడి నుండి వచ్చావో తిరిగి అక్కడికే వెళ్ళుము."

సరే, నేను ఆగిపోయాను. "అది బహుశా ఆ గాలి శబ్దము కాబోలు. దాని గూర్చి నేనసలు ఆలోచించనే లేదు గదా," అనుకొన్నాను. ఒక్క క్షణము ఆగాను. ఆ బాలురలో ఒకరు నాకు సాండ్-విచ్ తయారు చేశారు. దానిని బయటకు లాగి, చూచాను. అది నిజంగానే సాండ్-విచ్. ఒక ప్రక్క నాకు చెమటలు పట్టినవి. అదొక పెద్దరొట్టె, అందులో మాంసమున్నది. అదెలాగున్నా గాని నేను తిన్నాను, ఎందుకనగా నేను ఆకలితో ఉన్నాను. అక్కడ నేను నిలబడియున్నాను. చిన్న కాగితపు ముక్కను నేను కప్పి పెట్టాను, ఎందుకనగా ఏదయినా జంతువు ఏదైనా నాగరికతను చూచినచో పారిపోవును. కాబట్టి కొద్దిగా అక్కడ నేను నిలబడ్డాను. "సరే. ముందుకు వెళ్ళుదును" అని అనుకొన్నాను.

నేను నడక ప్రారంభించాను. నా స్వరమును మీరెంత స్పష్టముగా వినుచున్నారో, అంత స్పష్టముగా నాకు ఏదో చెప్పుట విన్నాను, "తిరిగి మరల నీవెక్కడ నుండి ప్రారంభించావో అక్కడికే వెళ్ళుము."

"ఒకవేళ అదే అయినట్లైతే అటువంటి మరణ ఉరిలోనికి వెళ్ళమని దేవుడు ఏలాగు చెప్పగలడు?

"ఆ ఉడుతలను గూర్చి చెప్పినది కూడా ఆయనే గదా?" అని అక్కడ ఒక నిమిషము నిలబడి తలంచాను. "గతరాత్రి నా భార్య గూర్చి చెప్పినది కూడా ఆయనే." ఒక స్వరము, ఒక మానవ స్వరము. నేను బాలునిగా నున్నప్పుడు, "ఎన్నడూ త్రాగవద్దు, పొగపీల్చవద్దు" అని చెప్పిన ఆ స్వరమే ఇది. చివరి దినములలో ఈ సంగతులు జరుగునని ఆ స్వరమే చెప్పెను. నా హృదయములో బైబిలు నుంచుకొని దైవసాక్షిగా చెప్పుచున్నాను. మీకు తప్పు చెప్పి నా ఆత్మను తెలిసి తెలిసి నేనెందుకు నరమునకు పంపుకొందును? అది నిజము. అది అసాధారణమే, అయితే అది సత్యము.

49"సరే, ఆ స్వరమునకు లోబడవలెనని నాకు తెలియును. ఆయన అక్కడికి నన్ను వెళ్ళమనుటకు ఒక కారణముండును. బహుశా నేను గతించుపోవు సమయము వచ్చినదేమో" అని అనుకొన్నాను. నేను వెనుదిరిగాను. అడవి గుండా దారి చేసికొని వెళ్ళుచున్నాను. దాదాపు మూడు, నాలుగు వందల గజముల పైకి, ఆ పర్వత శిఖరానికి మరల చేరుకొన్నాను. అది చాలా దట్టముగా నున్నందున ఏమియూ కనబడుట లేదు. గాలి బలంగా వీస్తున్నందున, చెట్టు ఒకదానితో ఒకటి తిరిగిపోతున్నవి. నా రైఫిల్ తీసికొన్నాను. (నా నెత్తిమీద ఎర్రని టోపి యున్నది. ఎర్రని షర్టు ధరించాను.) రైఫిల్ ను సిద్దపరచి పెట్టుకొన్నాను, ఎందుకనగా అట్టి సయమములో ఎలుగుబంట్లు, ఇంకా సింహము మొదలగు జంతువులు నా మీదికి రావచ్చును. కాబట్టి రైఫిల్ కు పొగ రాకుండ ఈ విధంగా నా వైపుకి గాక మరో వైపుకు తిప్పియుంచాను. దాని నుండి పొగమంచు రాకుండా తప్పించాను. మంచు వలన తడవకుండా చూచాను. ఒక చెట్టు క్రింద నేను కూర్చొన్నాను.

50అక్కడ కూర్చొని ఇట్లు తలంచాను, "ఇక్కడికి ఆయన నన్ను ఎందుకు ఎక్కిరమ్మని చెప్పెను? నా దారి ఇప్పుడు నేను కనుగో గలనా అని చాలా సందేహముగా యున్నది… భయంకరముగా మారుచున్నది." పది, పదిహేను అడుగుల దూరము చూచుటయే చాలా కష్టముగా నున్నది. కొన్నిసార్లు అయిదడుగుల దూరము కూడా కనబడుటలేదు. చాలా కరకుగా యున్నది. "సరే, వెనక్కి వెళ్ళమని ఆయన చెప్పెను. నాకు తెలిసిందంతయూ ఇక్కడ కూర్చొనుటయే," అనుకొన్నాను. అప్పటికి మంచు అడుగు లేక అడుగున్నర లేదా రెండు అడుగులు పడియున్నది. నేను అప్పటికి ఇరవై లేదా ముప్పది నిమిషాల నుండి అచ్చట యున్నాను. బలంగా గాలి వీస్తున్నది. చాలా భీకరపు గాలి. నేను ఒక్క క్షణము అక్కడ కూర్చొని యున్నాను.

"నేను పరలోక దేవుడను, భూమ్యాకాశములను సృజించినవాడను నేనే," అని ఒక స్వరము చెప్పుటను నేను విన్నాను.

నేను నా టోపీని తీసి, నెమ్మదిగా కూర్చొన్నాను. మరల ఆ స్వరాన్ని విన్నాను; "అది గాలి కాదు" అనుకొన్నాను. ఓ, గాలి వీస్తున్నది, గోల చేస్తున్నది.

51మరల దానిని నేను విన్నాను. "బలమగు సముద్రములో గాలులను నిమ్మళపరచిన వాడను నేనే. సృష్టికర్తను నేనే. నీ సమక్షములో నేను ఉడతలను సృష్టించాను. ఈ క్రియలన్ని నేనే చేశాను," అని చెప్పెను.

"అవును, ప్రభువా. నేను నిన్ను నమ్ముచున్నాను," అని

"లేచి నిలబడుము," అని చెప్పెను. నేను లేచి నిలబడితిని. "ఇప్పుడు తుఫానుతో మాట్లాడుము. ఏది చేయమని నీవు చెప్పెదవో దానిని అది చేయును" అని చెప్పెను.

ఇప్పుడు, అది నిజము. తీర్పులో మిమ్మును నేను కలిసికొన్నప్పుడు దీనికి నేను జవాబు చెప్పవలెను. "తుఫానా! నీ స్థలమునకు పొమ్ము. ఆగుము. సూర్యుడా, నీవు మామూలుగా నాలుగు రోజుల పాటు ప్రకాశించుము," అని చెప్పాను. నేను ఆ మాట పలికి ముగించిన వెంటనే నన్ను పడద్రోయుచున్న ఆ గాలి, తుఫాను ఆగిపోయెను. ఒకటి రెండు క్షణములలో నా మిద సూర్యుడు ప్రకాశించ నారంభించెను. నేను పర్వతముల క్రిందికి చూచాను. తూర్పు గాలి వీచుట నేను చూచితిని. పశ్చిమము నుండి గాలి వస్తున్నది. తూర్పు గాలి వస్తున్నది. తూర్పు గాలి ఇటువైపుగా వచ్చినది. మబ్బులు ఎంత విచిత్రంగా మాయమై పోయినవో నాకు తెలియలేదు.

52కొద్ది క్షణములు అక్కడ నేను నిలబడియున్నాను. నెరసిన నా గడ్డం మీదనుండి కన్నీరు కారుచున్నది. "దేవా, ఏమి చేయవలేనో నాకు తెలియదు" అన్నాను." "సోదరులందరూ గుడారములో ఆ వెనుక ఉన్నారనుకొన్నాను. సూర్యుడు అంతటా చక్కగా ప్రకాశించుచున్నాడు.

నేను పర్వతము క్రిందికి దిగి వెళ్ళనారంభించాను. మంచు మొత్తము కరిగిపోవుచున్నది. ఆది ఎండవేళ. నా షర్టు నుండి ఆవిరి వస్తున్నది. ఒకటి లేదా రెండు క్షణములలో ఎంత మార్పు! నేను పర్వతము క్రిందికి దిగి వచ్చుచున్నాను. ఈలాగు చేయుచుండగా, ఒక స్వరము నాకు ఇట్లు వినబడినది, "నీవెందుకు నాతో నడువకూడదు?"

"ప్రభువా, నీతో నడవటం నాకెన్నడూ దొరకని మహాభాగ్యము ఇది" అని చెప్పి వెనుదిరిగి ఆ పెద్ద లేడి జాడ వెంబడి నడవసాగెను. చక్కని అడవిలోనికి నడువ నారంభించాను. అప్పుడు నేనిట్లు తలంచాను, "మంచిది, నా భార్యయగు మెడాకు ఎల్లప్పుడూ ప్రణామము (అభినందన) అర్పించు ఆ చోటకు వెళ్ళుదును.'' కొంతసేపు, అనగా దాదాపు అరగంట, ముప్పావు గంట నేను నడవసాగాను. మంచు మొత్తం కరిగిపోయినది. నేనిట్లు ఆలోచించసాగాను, "ఆమె తాను వెళ్ళిపోవుట గూర్చి ఎన్నడునూ నాతో ఎందుకు చెప్పలేదు అని ఆశ్చర్యపడితిని. మేము పెండ్లి చేసికొనిన తరువాత మొదటిసారిగా ఆమెను అక్కడికి తీసికొని వెళ్ళి, ఆ దుంగల మీద కూర్చోబెట్టుట నాకు జ్ఞాపకము వచ్చినది. ఇప్పుడామె తల నెరసినది." "హు.." నేను వెళ్ళాను. నా ముఖము మీద తెల్లని గడ్డము. నలుపు, తెలుపు కలగలుపుగా యున్నది, "బిల్, నీవిక ఎంతో కాలము ఉండవు. ముసలివాడవు అయిపోయావు," అని అనుకున్నాను.

53నేను ముందుకు పోవుచునే యున్నాను, మరియు నేను పైకి చూచాను. అమె నా ఎదురుగా చేతులు చాపి, ఇంకా నల్లని జుట్టుతో నిలబడియున్నట్లు కనిపించినది. నేను నా తల క్రిందికి దించాను; చిన్న చెట్లున్న ఒక చోటికి నేను ఎక్కిపోవుచున్నాను. కొద్దిగా వంకరగా యున్నది. నేను ఆ కొమ్మన ఈలాగున చేరబడ్డాను. అక్కడ నేను ఏడ్చుచూ నిలబడ్డాను. అక్కడ ఏదో, "పట్, పట్, పట్" మని శబ్దము చేయుట విన్నాను. మరియు నేను క్రిందికి చూచాను; నా కండ్ల నుండి కారుచున్న నీరు గడ్డము మిదగా జారి ఆ ఎండిన ఆకుల మీద పడుచున్నది. అంతకు ముందు దాదాపు ముప్పది నిమిషములకు పూర్వము ఒక అంగుళము ఎత్తులో మంచు తుఫాను యుండెను.

54నేను పర్వతమును నాలుగు రోజుల తరువాత దిగి క్రిందికి వచ్చాను — ఒక్క మేఘము కూడా ఆ నాలుగు రోజుల తరువాత లేదు. నేను వచ్చి ఆ పెట్రోలు బంకు వ్యక్తితో ఇట్లన్నాను, "చాలా పొడిగా వున్నది గదా?"

"అవును," "నీకు తెలియునా, ఈ వింత? ఆ ముందు దినములలో ఒక తుఫాను వచ్చునని చెప్పబడినది; మరియు నీకు తెలుసా, అది హఠాత్తుగా ఆగిపోయినది" అని చెప్పెను.

అప్పుడు నేను న్యూ-మెక్సికో వరుసకు అరిజోనాకు వెళ్తూ వచ్చాను. నా కుమారుడగు బిల్లీతో ఇట్లన్నాను, "ఇటు వైపు అసలు ఎట్లున్నదో చూద్దాం."

అక్కడ నేను ఆగాను, అది ఒక ఆదివారపు ఉదయము, కొంత పెట్రోలు కొట్టించాను. "బాగా వేటాడిరా?" అని అతడు అడిగాడు.

"అవునండి," అన్నాను.

"అదృష్టము పండినదా?" అనడిగాడు.

"అవునండి, మాకు మంచి సమయము దొరికినది. చాలా పొడిగా ఉన్నట్లున్నది గదా?" అని బదులిచ్చాను.

"అవును, ఇక్కడ చెప్పలేనంత పొడిగా యున్నది. ఆ ముందు రోజున భయంకరమగు మంచు తుఫాను వచ్చునని విన్నాము. నీకు తెలియునా, నిజంగానే ఆ మంచు తుఫాను ఆరంభమయినది, కానీ ఎందుకో అకస్మాత్తుగా అది ఆగిపోయినది," అని చెప్పెను. ఓ, మై, ఓ, మై!

MARK 4:39

 

55ఈ చెట్టుకు ఆనుకోని నేను నిలబడ్డాను, (ముగింపులో), ఆ చెట్టు ప్రక్కన నిలబడియుండిగా, నా కండ్ల నుండి నీరు కారుచుండెను; "దేవా… అని అనుకొన్నాను. "నిమ్మళమగును గాక!" అని అలలతో చెప్పినప్పుడు గాలులు అలలు ఆయనకు లోబడినవి, అదే యేసు ఈనాడు మనతో ఈ అడవులలో యున్నాడు. ఆయన ఇంకా వాక్యముగానే యున్నాడు. వాక్యము. సమస్త సృష్టి ఆయన వాక్యమునకు లోబడివలసియున్నది, ఎందుకనగా ఆయన ప్రకృతికి సృష్టికర్త. అక్కడ నేను నిలబడియున్నాను మరియు నా బుగ్గల నుండి కన్నీరు జారుచున్నది.

ఇప్పటికి దాదాపు అయిదు సంవత్సరములు నుండి నేను సువార్త పొలములోనే తిరుగుచున్నాను. సంఘములకు వెళ్ళుట, నేను చేయ కలిగినది చేయుటలో మునిగియున్నాను. మీ అందరికి అది తెలియును. నా హృదయము భారముతో నిండియున్నది. అరిజోనాలో వుండుటకే నేనిచ్చటకు వచ్చాను. ఆయన నాకు చేయుటకు కొన్ని సంగతులు చెప్పెను. దానిని చేయుటకు వెళ్ళుదును. ఉజ్జీవము ముగిసినట్లుగా కనిపించుచున్నది. జరుగుచున్న దానిని బట్టి నేను ఆశ్చర్యపడుట లేదు. నా హృదయములో నేను పశ్చత్తాపపడుదును. "ప్రభువా, నేను ఏదైనా చేసినయెడల, నాకు చెప్పుము; దానిని నేను సరిచేసికొందును" అన్నాను. ఎల్లప్పుడూ భారము కలిగియున్నాను. అది భయంకరమైన అనుభూతి. నేను కోరిన జయము నాకు దొరకలేదు. ఎన్నో గొప్పసంగతులు ఆయన చేసెను, చూపించెను, వాటికి మీరందరు సాక్ష్యులు — ఇక్కడికి వచ్చి దానిని గూర్చి మీకు చెప్పాను, పత్రికలు దానిని గూర్చి వ్రాయుట చూచాను, వార్తాపత్రికలు మొదలుగునవి. జరిగిన, చూచిన ఆ గొప్ప సహజాతీత సంగతుల గూర్చి వ్రాసినవి.

56కాని నాహృదయము ఇంకా భారముగానే యున్నది. నేను పొదకు ఆనుకొన్నాను, ఇలా అనుకొన్నాను, "పరలోకపు ఆ గొప్ప దేవుడు (వేడి సూర్యుడు నా మీద ప్రకాశించుచున్నాడు, ఎక్కడా ఒక్క మబ్బు కూడా లేదు), కొద్దిక్షణాల క్రితం మానవులు చెప్పిన మాటకు పూర్తి విరుద్దము. ప్రకృతి దానిని చేసెను. ప్రభువా? ఇదెట్లు జరిగినది? యేసుక్రీస్తు నిన్న, నేడు, నిరంతరం ఏకరీతిగా యున్నాడు. నీవు నన్ను పలుకమన్నది కేవలము ఆయన మాటయే. తండ్రీ, నేనెంత కృతజ్ఞుడను!" అని తలంచాను.

ఏదో వెళ్ళిపోవుచున్న శబ్దం విన్నాను, "బూమ్, బూమ్" [బ్రదర్ బ్రెన్హాం వేదికను రెండుసార్లు వేదికపై తట్టి యున్నారు.], మరియు నేను చేసాను. నా ముందు రెండు… మూడు లేళ్ళు నిలబడియున్నావి. అవి నా వైపు చూచుచున్నవి. ఇప్పుడు, గతవారంలో వేటగాండ్రు అక్కడున్న వాటిలో చాలా లేళ్ళను చంపి యున్నారు. ఇక్కడ నేను ఎర్రని దుస్తులు వేసికొని యున్నాను. అవి ఆ దుస్తులు చూచి వెంటనే పారిపోవునని మీకు తెలియును [బ్రదర్ బ్రెన్హాం చిటిక వేసెను.] కానీ అవి అక్కడే నిలబడి నావైపు చూచుచున్నవి. మరియు "మేయుచున్న జింక," అంతకంటే మంచిది ఇక ఉండదు. అది ఒక పెద్ద జింక, దానికి రెండు ఎదిగిన పిల్లలున్నవి. "ఆ మూడు జింకలు అయితే మాకు బాగుండును" అనుకొన్నాను.

ఏదో నాతో ఇట్లన్నది "నీకు తెలియునా, ప్రభువు వాటిని చేతిలో పెట్టియున్నాడని."

57కానీ నేను సంపూర్ణ సువార్త వ్యాపారులతో యున్నప్పుడు, బ్రదర్ క్లేటన్తో వున్నప్పుడు సుమారు ఒక సంవత్సరం ముందు నేను ఆ పెద్ద సంచలనము కలిగించిన చేపను పట్టినప్పుడు, అతడు మాతో యుండెను. ఆ సంవత్సరము నేను పందొమ్మిది జింకలను నాయకులుగా నున్నవాటిని చంపాను.

కొన్నిసార్లు వ్యాపారులు — సోదరులారా, ఇది క్షమించండి — అందులో కొందరు వైద్యులు వుందురని మీకు తెలియును గదా, వారు నడవలేరు, మీకు తెలియును, చాలా లావుగా నుందురు. బల్లయొద్దనే కూర్చొండుట వారికి పరిపాటి, "బిల్లీ, నాకు రెండు సంవత్సరముల గల దానిని ఒక దానిని తెచ్చి పెట్టు."

"ఒక నీలపు ఆవు తెమ్ము."

"నాకు ఒక బక్ కావాలి."

"నిండు రాక్ నాకు తెచ్చి పెట్టు" అనుచుండెడి వారు.

అక్కడ నాకు మహదానందము కలిగెడిది. వేటాడి జింకలను, వీటిని తెచ్చుట ఎంతో ఆనందము. కాని అది చేయవద్దని ప్రభువు నాతో చెప్పెను, దానికి కొన్ని సంవత్సరములు ముందే కొలరాడోలో మంచు తుఫాను వచ్చినప్పుడు ఆయనకు నేను వాగ్దానము చేశాను. "ప్రభువా, నేను ఒక మనిషిని వేటకు నడిపించుదును గాని ఇక మీదట మనుష్యుల కొరకు నేను చంపను." అది అత్యవసర పరిస్థితి అయితేనే దానిని మేము చేయుదుము.

మనం వచ్చిన ముందు రాత్రి జరిగినది మీకు గుర్తున్నదా, బాలులారా? ఒక ముసలి దీన సోదరునకు ఒక్క జింక కూడా దొరకలేదు. (అతని పేరేమిటి? పామర్), మా యొద్దకు వచ్చెను, మరియు నా చేతిలో పది డాలర్ల దశమ-భాగము పెట్టెను. అతడిట్లనెను, "బ్రదర్ బ్రెన్హాం ఇది నా దశమ-భాగము; దీనిని సంఘములో వేయుము." "నాకొక జింక సంపాదించగలవా?" అనడిగెను.

1SAM 26:8,9,11

 

58ఓ, నేను… [టేపులోని భాగము తప్పిపోయినది.] … ఆ మూడు జింకలు అక్కడ నిలబడి యున్నవి. నా ఈ స్వంత రైఫిలు నా భుజములు మీద యున్నది. నేను నా భుజమును కాస్త అలాగు జార్చాను. "అవి నా యొద్ద నుండి పారిపోజాలవు. అవి ఇక్కడే యున్నవి," అనుకొన్నాను. నేను రైఫిలను బహు వేగముగా పేల్చగలను: "అవి వెనుదిరిగి ముందే ఆ మూడింటినీ నేను కాల్చగలను," చూచారా. నా యొద్ద రైఫిల్ యున్నది. "అవి అక్కడే యున్నవి…" అనుకొన్నాను. మెల్లగా రైఫిల్ తీశాను, ఆ వాగ్దానమును గూర్చి నేను ఆలోచించుట జరిగినది. "అది నేను చేయలేను; అది నేను చేయలేను." ఒక వ్యక్తి ఒకప్పుడు మరొకనితో చెప్పిన మాట గుర్తుకొచ్చినది, దేవుడు యోవాబును లేదా సౌలును నీ చేతికప్పగించియున్నాడు; యోవాబు దావీదుతో చెప్పెను.

దావీదు పలికెను, "దేవుడు దూరపరచును గాక, ఆయన అభిషేకించిన దానిని నేను తాకను," అని ఆలోచన వచ్చినది.

అది నా వాగ్దానము; అది నేను చేయను. "అవి ఈ కొండ పైన యున్నవి. వాటిని క్రిందికి నేను దొర్లించి తీసికొని రాగలను; వాటిని తేలికగా పట్టుకోగలం. మూడు చక్కని జింకలు అక్కడ నిలబడియున్నవి, అని అనుకొన్నాను; "లేదు, నేను దానిని చేయజాలను" అనుకొన్నాను.

59పూర్తిగా ఎదిగిన రెండు ఆడ, మగ జింక పిల్లలు, ఒక తల్లి జింక ఇటువైపుగా వచ్చుచున్నవి. అవి నడుచుచూ ఇటు అటు చూచుచున్నవి. బాగా బలిసిన పెద్ద జింకలు.

కొంత సేపు అక్కడ నేను నిలబడ్డాను, "నేను ఈలాగు ఎర్రని బట్టలు వేసికొనియుండగా జింకలు ఆలాగు నా ఎదురుగా నిలబడుట అసాధారణము, నేను వాటిని భయపెడుదును" అనుకొన్నాను. "మీరు నా చేతుల్లో యున్నారు. మీరు పారిపోలేరు, కాని మిమ్మును నేను బాధించను, వెళ్ళండి," అన్నాను. అవి ఒక దానివైపు ఒకటి చూచూకొనుచు, ఇంకా వచ్చుచునే యున్నవి. అవి నాకు చాలా దగ్గరకు వచ్చినవి, నా వైపు చూస్తున్నవి.

60సరే, నేను రైఫిల్ క్రింద పెట్టాను, "ఓ తల్లీ, నీ పిల్లలను తీసికొని అడవులలోనికి పొమ్ము. ఇక్కడ నేను దేవుని సన్నిధిలో నా మట్టుకు నేను అనుభవించుచున్నాను. ప్రజల కొరకు నేను వేటాడనని వాగ్దానము చేశాను. ఇప్పుడు నీవు నీ పిల్లలను తీసికొని అడవులలోనికి పొమ్ము. నాకు కూడా అడవులంటే ఇష్టము. వెళ్ళిపోండి" అని అన్నాను.

అది నా వైపు చూచినది. ఆ రెండూ చుట్టూ చూచినవి, మూడును కలియ చూచినవి. అంతట అవి వెనుదిరిగి నడిచిపోయినవి. అప్పుడు మరల తిరిగి వచ్చినవి. "మిమ్మును నేను భాధించబోవుట లేదు. అడవుల లోనికి వెళ్ళిపోండి. మీరు నా చేతులలో యున్నారు. మీరు తప్పించుకు పోలేరు. కాని నేను దేవుని చేతిలో యున్నాను, మరియు నేను కూడ తప్పించుకుపోలేను. ఆయన నన్ను కాపాడెను. ఆయనకు ఒక వాగ్దానము చేశాను; మిమ్మును నేను కాపాడుయున్నాను. వెళ్ళండి. మంచిగా కాలము అనుభవించండి. అడవులలో ఆనందించండి. నాకది ఇష్టము. మీరును పోండి," అని చెప్పాను.

HEB 13:5

 

61అవి మరి కొద్దిసేపు అక్కడే నిలిచియున్నవి. దాదాపుగా నా చేతిలో ఉన్న వాటిని తినుటకు దగ్గరగా వచ్చినవి; తిరిగి అవన్నీ నా వైపు చూచినవి, అలాగు చూచి వెళ్ళిపోయినవి, నిలబడి మరల వెనుకకు చూచినవి, తిన్నగా అడవులలోనికి నడక సాగించినవి. అక్కడే నేను నిలబడి యున్నాను. "జింక అలాగు ప్రవర్తించుట అసామాన్యము. ప్రభువగు యేసు, ఆయన యొక్క సన్నిధి ఇక్కడ ఉండుట వల్లనే ఇంత ఆశ్చర్యము జరిగినది కదా?" అనుకొన్నాను.

అప్పుడే ఒక స్వరము నాతో ఈలాగు మాట్లాడినది, "నీవు నీ వాగ్దానమును జ్ఞాపకము చేసికొంటివి కదా?"

అది ఆయనే అని నాకు తెలియును. "అవును, ప్రభువా" అన్నాను.

"ఆలాగే నేను నా వాగ్దానము గుర్తుచేసికొందును. నిన్ను ఎన్నడూ విడువను; ఎడబాయను," అని ఆయన చెప్పెను.

ఆ భారము తొలిగిపోయెను. క్రైస్తవ స్నేహితులారా, అప్పటి నుండి మరెన్నడు తిరిగి రాలేదు. ఇది గత అక్టోబరు మాట. నేను ఒక వేరయిన వ్యక్తిగా యున్నాను. దేవునికి మీరు చేసిన వాగ్దానములు నిలబెట్టుకొనండి. దేవునికి మిరేది చెప్పినా గాని దానిని నమ్మండి. ఆయన వాక్యమునకు విరోధముగా నున్న ప్రతిదాని నుండి మిమ్మును మీరు వేరుచేసికొనుడి. దేవుడు విని ప్రార్ధనకు జవాబును ఇచ్చును. ఒక్క క్షణము మనము తలలు వంచుదము.

ప్రభువు మాటను వినుటకు, సమస్త అవిశ్వాసము నుండి ఈ రాత్రి నిన్నునీవు వేరుచేసికొనుటకు ఇష్టపడుతున్నావా? అది నీవు చేసిన యెడల, "ఆయన నిన్న, నేడు, నిరంతరము ఏకరీతిగా యున్నాడని విశ్వాసించుము (తాను చేయుదునని ఆయన వాగ్దానము చేసిన ఈ సంగతులు ఆయన చేయుట మనము చూచుచున్నాము), మీ చేతులు ఎత్తి ఈలాగు చెప్పెదరా, "దేవా, నీకు ఈ రాత్రి ఒక వాగ్దానము చేయుచున్నాను. నీవు వాగ్దానము చేసిన సమస్తము నేను నమ్ముచున్నాను. ప్రతిమాట నేను నమ్ముచున్నాను, మరియు ఇక ఏ మాత్రము సందేహించను."

62మా పరమ తండ్రి, ఈ గాధ సత్యమని నీవెరుగుదువు. అది నాలుగవసారి. అయిదవసారి నా ప్రశస్త భార్యతో జరిగినది. గతవారము వైద్యుడు తన నివేదిక వ్రాయుచుండగా, అతని హస్తము ఆమెను తాకక ముందే, ఆ పెద్ద కణితి తొలగిపోయినది. అది చెప్పబడిన ప్రకారమే జరిగినది.

ఇప్పుడు తండ్రి, ఈ జనులకు నీవు సహాయము చేయుమని ప్రార్ధించుచున్నాను. నేను వృద్దుడనయిపోవుచున్నానని గ్రహించుచున్నాను. నేను త్వరగా వెళ్లిపోవలెనని నాకు తెలియును. ప్రభువా, నా సోదరులతో యధార్ధముగా, సత్యముగా నుండునట్లు సహాయము చేయమని ప్రార్ధించుచున్నాను. నీ జనులతో యదార్ధముగా, నిజముగా ఉండనిమ్ము. వారితో నేను యధార్ధంగా ఉండని యెడల నీతో నేను యధార్ధముగా ఉండునని నేను తలంచుట లేదు. ప్రభువా, నీ సాక్ష్యము పొందవలెనని నేను కోరుచున్నాను.

ఈ రాత్రి నీ వాక్యము నిండుగా మాలో జీవించనీయుము. మా అందరికి విశ్వాసము దయచేయుము. ఈ చిన్న వరము ఇమ్ము… వరము అనగా నీవు నీ చేతులలో పెట్టుకొని బయట దాని ద్వారా నీవు కోయునది అని కొన్నిసార్లు ప్రజలు తలంచుచుందురు. తండ్రి, వరము అనగా అది కాదు. పరిశుద్దాత్మ తాను చేయగోరునది చేయుటకు వీలుగా నీ మార్గమునకు అడ్డము రాకుండా నండుటయే ఒక వరమని వారు అర్ధము చేసికొందురు గాక.

JOHN 1:14•

HEB 4:12

 

63ప్రభువా, ఇప్పుడు మాకు మేము మార్గములో నుండి అడ్డము తొలగునట్టు కృప చూపుము. ఆ గొప్ప పరిశుద్దాత్మ వచ్చి, మాలో పనిచేయునట్లుగా చూడుము. ఈ రాత్రి మేము యేసుక్రీస్తు యొక్క వాగ్దానములను చూతుము గాక. ప్రభువా, ఈ రాత్రి ముఖ్యంగా నేను ప్రస్తావించిన వాగ్దానములను చూతురు గాక, దేవుడు అబ్రాహాము యొద్దకు వచ్చి, శరీరధారిగా కనబడి, హృదయ రహస్యములను తెలిసికొనెను. ఆయనే దేవుడు. ఆయన మా మధ్యకు శరీరధారిగా వచ్చి, నివసించి, హృదయ రహస్యములను ఎరిగెను. బైబిలు ఆలాగు చెప్పుచున్నది, "దేవుని వాక్యము హృదయాలోచనలను వివేచించును." ఆయన దేవుడని ఆ శిష్యులు అలాగే తెలిసికొనిరి.

ఇప్పుడు, తండ్రి, ఈ రాత్రి నీవు వచ్చి, మా దీన ఆలయములను నీకు ప్రతిష్టించుకొనుము. మేము నమ్మునట్లుగా చేయుము. ఈ రాత్రి మా మధ్య నీ ఆత్మ దానికది తెలియపరచుకొనును గాక. ఇంకా నీవు వాక్యముగానే యున్నావని నిరూపించును గాక. అప్పుడు మేము సమస్త అవిశ్వాసము నుండి వేరై, నిన్ను వెంబడించెదము. యేసు నామమున నీవు మాతో మాట్లాడుము. ఆమేన్. [సమాజములోని ఒకరు ప్రవచనము ద్వారా వర్తమానము ఇచ్చుచున్నారు.]

64పరలోకపు గొప్ప దేవా, మా పట్ల దయ చూపుము. ఓ, ప్రభువా, నీ ఆజ్ఞలకు లోబడుటకు మాకు సహాయము చేయుము. నీ ఘనత కొరకు వాడుకొనుము. ఈ ప్రోత్సాహకర మాటలకై నీకు వందనములు చెల్లించుచున్నాము. మా మధ్య పరిశుద్దాత్మ ఇప్పుడు సంచరించి, ఈ మాటలను స్థిరపరచనీయుము. యేసుక్రీస్తు నామమున. ఆమేన్.

దేవునియందు విశ్వాసముంచుడి. సందేహించవద్దు. దైర్యము కలిగి యుండుడి. ఆయన రాకడ యొక్క సమయము సమిపమగుచున్నది.

65ఇప్పుడు, ఈ రాత్రి ప్రార్ధన కార్డులను గుంపుల వారీగా ఇచ్చెదము. ఎంతమంది ప్రార్ధన కార్డులు కలిగియున్నారో చేతులెత్తండి. ప్రభువు నాకు వివేచన ఆ గుంపందరి గూర్చి ఇచ్చినచో అంతమందికి చెప్పుట నాకు కష్టమగును. కానీ ఒక్క క్షణము తీసికొని ఈ మాట చెప్పనీయండి. ఎంతమంది ఇక్కడ ప్రార్ధన కార్డులు లేక ఉండియు ప్రభువు మిమ్మును స్వస్థపరచునని ఎందరు నమ్మి, ప్రార్థించుచున్నారు?

ఇప్పుడు ప్రభువగు దేవుడు మీ ప్రతి ఒక్కరికి సహాయము చేయును గాక. నేను మీ సోదరుడను. యేసు మీ రక్షకుడు. దేవుడు మన తండ్రి. మనము జనులను. మనము ఈ లోక సంబంధులము కాదు. దేవుని వలన మనము జన్మించినప్పుడు, మనము పై సంబంధలము. రోగుల కొరకు ప్రార్థించుటకు మనము ప్రార్థన వరుసను ప్రారంభించు ముందుగా, ఒక్క మాట వినుడి. ఈ రాత్రి ఈ వేదిక పైన రోగుల కొరకు ప్రార్ధించుటకు ఒకాయన ఉన్నాడు. రోగులకు ప్రార్థించుటకు సేవకులున్నారు. కేవలము నేను మాత్రమే రోగుల కొరకు ప్రార్థన చేయుటకు తగుదునను అభిప్రాయము మిలో నుండి తీసివేయగోరుచున్నాను, చూచారా. ఆయన నన్ను వాడుకోనవసరము లేదు. ఆయన మిమ్మును లేక ఎవరినయినా గాని వాడుకోగలడు. అయితే సంగతి ఏమనగా, ఆయన చెప్పినది సత్యమని నమ్మవలసియున్నది.

JOHN 14:12•

HEB 4:12,15•

HEB 13:8•

JAS 5:15

 

66కాని ఇప్పుడు, నేను చెప్పినట్లుగా ఇది చెప్పబడిన దానికి ప్రత్యక్షతయైయున్నది. ఒక్క క్షణము మనము తలలు వంచుదుము.

ప్రార్థించుచున్న మీరు, వ్యాధిగ్రస్తులయి కూడా ప్రార్థన కార్డులు లేనివారు ప్రార్థియించుచూ ఈలాగు చెప్పండి, "ప్రభువైన యేసూ, విశ్వాస సహితమగు ప్రార్థన రోగిని స్వస్థర్చునని బైబిలు చెప్పినది నేనెరుగుదును. దేవుడట్టి వానిని లేపును. యేసుక్రీస్తు నిన్న, నేడు, ఏకరీతిగా యున్నాడని కూడా చెప్పబడెను." ఆయన ఏకరీతిగా యున్నచో, ఆయన ఆ రీతిగానే పనిచేయవలెను. దేవుని వాక్యము రెండంచుల గల ఎటువంటి ఖడ్గముకంటెను వాడి గలదియై, హృదయాలోచనలను పరిశోధించునని కూడా బైబిలు చెప్పుచున్నది.

యేసుక్రీస్తు వ్యక్తిత్వములో దేవుని కుమారునిగా వాక్యము శరీరధారియైనది దేవుడు తన కుమారుని ద్వారా సరిగ్గా అదే చేసెను. యోహాను 14లో యేసు చెప్పెను, "నేను చేయు క్రియలు మీరును చేయుదురు. ఇంతకన్న గొప్పవియు చేయుదురు, ఏలయనగా నేను తండ్రి యొద్దకు వెళ్ళుచున్నాను."

67హెబ్రీ గ్రంధములో బైబిలు ఈలాగు కూడా చెప్పెను, ఆయన ఇప్పుడు ప్రధానయాజకుడు. మనందరము అది నమ్ముచున్నామా? నిశ్చయంగా. "ఆయన మన బలహీనతలను తాకే ప్రధానయాజకుడు." ఇప్పుడు, ఆయన ఉన్నవాడు, నేను ఉన్నవాడను అనువాడు కాదు; ఆయన ఉన్నవాడు. ఏ మనిషి కాదు. ఇప్పుడు మన బలహీనతలతో ఆయనను అంటుకొన్నప్పుడు ఆయన స్వస్థత అనుగ్రహించగల ప్రధానయాజకుడు.

ఇప్పుడు, మీరు ఆలాగు తలంచి అడుగువేయు సిద్ధపడినచో, మీ అవిశ్వాసమునంతటినీ విడిచి పెట్టి, ఇట్లు చెప్పండి, "గొప్ప ప్రధానయాజకుడా! నిన్ను తాక నిమ్ము!"

ఇప్పుడు, ఆయన ప్రధానయాజకుడు అయిన యెడల - నిన్న, నేడు, నిరంతరము ఏకరీతిగా యుండినయెడల, అప్పటి వలెనే ఆయన పనిచేయును, ఎందుకనగా ఆయన ఏకరీతిగా యున్నాడు.

MATT 9:20,22•

MARK 5:27,30,34•

LUKE 8:44,45,48•

JOHN 14:10•

HEB 13:8

 

68ఆయన ఈ భూమి మీద నున్నప్పుడు ఒకసారి ఒక స్త్రీ ఆయనను తాకినది, ఆమె చేతి తాకిడిని ఆయన గమనించెను. వెనక్కి తిరిగి ఇట్లనెను, "నన్నెవరు తాకిరి?" వారందరూ దానిని కాదనిరి. కానీ ఆయన ఆలోచనలను వెలికి తీసెను, మరియు ఆ స్త్రీని కనుగొనెను, ఆమె జబ్బు ఏమిటో చెప్పెను, మరియు ఆమె విశ్వాసము ఆమెను స్వస్థపరచెను.

ఇప్పుడు, ఆయన నిన్న, నేడు, నిరంతరము ఏకరీతిగా యున్నాడు. బహుశా ఆ స్త్రీకి ప్రార్థన కార్డు లేకపోవచ్చును, కానీ ఆమెకు విశ్వాసమున్నది. అవసరమగునదంతయూ అదే. విశ్వాసము కలిగి యుండుము. ఆ మహా వైద్యుని అంటుకొనుము. దైవిక వరము ద్వారా, నేను దారిలో అడ్డము రాకుండా తప్పుకొన్నచో, పరిశుద్ధాత్మ తాను చెప్పగోరునది చెప్పును మరియు చేయగోరునది చేయును… ఇప్పుడు అది ఒక వరము, ఊహ కాదు. అది ఊహ అయినచో, పని చేయదు. అది వాస్తవమైనచో, పని చేయును. యేసు అదే చెప్పెను: "ఈ క్రియలు చేయునది నేను కాదు; నా యందు నివసించుచున్న నా తండ్రియే ఇవి చేయుయున్నాడు." కాబట్టి అది నేను కాదు. ఆయన దేవుని కుమారుడు; నేను కృప ద్వారా రక్షించబడిన పాపిని.

ACTS 3:4

 

69నమ్మిక మాత్రముంచుము. అణచవద్దు. నమ్మి ఈలాగు చెప్పుము, "ప్రభువైన యేసూ, నీ వస్త్రమును అంటుకోనిమ్ము." సామాన్యముగా ప్రార్థించుము. మానక ప్రార్థించుము. ప్రతివారు ఉన్న చోటనే యుండి ప్రార్థించండి మరియు నమ్ముడి. నిలకడగా ఉండుడి, తొదరపడవద్దు. అణచవద్దు. కేవలము నమ్ముము. ఇప్పుడు మీరందరూ నమ్ముచున్నారా? మీరు నమ్మగలరా? గతమును పూర్తిగా మరచిపోండి. దీనిని యేసు వాగ్దానము చేసెనని అనుకోండి. అది అసామాన్యమని నాకు తెలియును, కాని యేసు వాగ్దానము చేసెను. ఇప్పుడు, మీరు ఒక్క క్షణము మర్యాదగా ఉండండి, మనము ప్రార్థన వరుస ప్రారంభించుదుము. దీనిని ఆయన చేయును అని నేను చెప్పను. ఆయన చేయవచ్చును. దేవుని కృపను బట్టి నేను నా స్వంత ఆలోచన నుండి విడిపించబడియున్నానని తలంచుచున్నాను.

70మీరు మీ తల ఎత్తి, ఇటువైపు చూచి ప్రార్థనలో యుండండి. "నా వైపు చూడుము" అంతేగాని "మా వైపు కాదు" అని పేతురు యోహానులు చెప్పిరి. దాని భావమేమనగా, వారు చెప్పుచున్న దాని వైపు దృష్టిని నిలుపమని.

మీరు ఒక జనసమూహము. ఇక్కడ కూర్చొనియున్న మార్టిన్ బాలురు తప్ప, నాకు తెలిసిన వారు ఎవరూ పెద్దగా లేరనుకొంటాను. ఇక్కడ కూర్చొనియున్నది బ్రదర్ డాల్టన్ అని నేను అనుకొనుచున్నాను. అది అంత ఖచ్చితముగా నేను చెప్పలేను. నాకు తెలియని వారిని దాటిపోవుటకు ప్రయత్నించుదును.

ఈ దినము గూర్చి ముందే చెప్పబడిన లేఖనము, ఈనాటి వాగ్దానము మీరు చూడ కలుగునట్లుగా యేసుక్రీస్తు తన శక్తితో వచ్చును గాక. మలాకీ 4, ప్రకారము అది నెరవేరబడును. దానిని ఏదో చేయవలసియున్నది; దానిని దేవుడు వాగ్దానము చేసెను.

71ఇక్కడ ఒక స్త్రీ కూర్చొనియున్నది. రేపు ఆమె వైద్యశాలకు వెళ్ళు దారిలో యున్నది. ఆమె ఒక కారు ప్రమాదానికి గురైనది. ఆమె గాయపడి లోలోపల గాయములతోను, చేయి బాగా గాయము అగుటతోను బాధపడుచున్నది. నీకు ప్రార్ధనా కార్డు వున్నదా? నీకు లేదు. నీకు నేను పూర్తిగా కొత్త వ్యక్తిని గదా? నిన్ను నేనెరుగను, మనము ఒకరినొకరము ఎరగము. నేను బోధించుట విన్నావు; కానీ నీ గూర్చి నా కేమియు తెలియదని నీవెరుగుదువు. ఆ సంగతులన్నియూ నిజమేనా? అది నిజమే అయితే నీ చేతిని ఎత్తుము. దేవుడు నిన్ను దీవించును. మంచిదమ్మా, విశ్వాసముంచుము. నీవు ఊరకే పోనవసరము లేదు. నీ బాధ పోయినది. ఆ స్త్రీ ఏమి తాకినది?

ఆమె వెనుక ఒకాయన కూర్చొనియున్నాడు. ఆ వెలుగును మీరు చూడలేదా? ఆ వర్ణపు కాంతి కదలుట మీరు చూచారా? ఆమె వెనుక ఒకాయన కూర్చొనియున్నాడు. ఆయన ఒకదాని కొరకు ప్రార్థించుచచున్నాడు. అస్పత్రిలోనున్న తన సోదరుని గూర్చి ప్రార్థించుచున్నాడు. నీ సోదురుని దేవుడు స్వస్థపరచి, తిరిగి మతిస్థిమితమును ఇవ్వగలడనియు, అంతా సరిచేయగలడనియు నమ్ముచున్నావా? నీవది నమ్ముచున్నావా? నీకు నేను క్రొత్త వ్యక్తిని. అవునా? నమ్ముము. మంచిది, అతడు దేనిని తాకెను?

72ఆ వెనుక కూర్చొని ఇక్కడ ఒకామె యున్నది. ఆ వెలుగు చూడండి. దానిని మీరు చూడ కలుగుచున్నారా? ఇటు చూడుము. అందరూ చూడండి. ఇక్కడ సరిగ్గా చూడండి. రంగుల వలయము వంటిది కనబడుచున్నది. దాని క్రింద స్త్రీ ఉన్నది. ఆమె ఇక్కడ ఉన్నది; ఆమె ఎవరికోరకో ప్రార్దించుచున్నది. ఇద్దరు పిల్లల కోసము ప్రార్థించుచున్నది: మనుమడు, ముని మనమడు. ఆమె ఇక్కడి వ్యక్తి కాదు; ఆమె కాలిఫోర్నియో నుండి వచ్చినది. ప్రార్ధన విన్నపము కొరకు ఇక్కడికామె వచ్చినది. అలాగే ఆమెతో మరెవరో యున్నారు. ఆమె సోదరి. ఆమె ఎర్రని దుస్తులు ధరించి ఇక్కడే ఆ వెనుకన కూర్చొనియున్నది. ఆమెకు మూర్చ యున్నది. అది నిజము. ఆమె కాలిఫోర్నియో నుండి వచ్చినది. నీవు నీతో ఆమెను తీసికొనిచ్చితివి. నీ పేరు మేరీ. నీ పూర్ణహృదయముతో నమ్ముచున్నావా? ఇప్పుడు నీవు అడిగిన దానిని నీవు పొందగలవు.

ఇప్పుడు, నాకు తెలిసిన వ్యక్తియో కాదో మీరెవరయినా అడుగవచ్చును.

నీకు ప్రార్ధనా కార్డు ఉన్నదా? నీకు లేదా? అది నీకు అవసరము లేదు.

JOHN 1:42•

HEB 13:8

 

73ఇక్కడ - ఇక్కడ ఒకాయన ఆ వెనుక కూర్చొని యున్నాడు. నా వైపు చూస్తున్నాడు. ఆ వరుస లో కూర్చొనియున్నాడు. ఇతనికి మోకాళ్ళలో జబ్బున్నది. ఆ మోకాళ్ళను దేవుడు బాగు చేయునని అతడు నమ్మినయెడల, అతడు తాను ప్రార్థించుచున్న దానిని పొందవచ్చును. అది నీవు నమ్ముచున్నావా? మంచిది. నీ మోకాళ్ళ వ్యాధి పోయినది. నీకు ప్రార్థన కార్డు లేదు. నీకు అది అవసరము లేదు.

ఇప్పుడు, యేసుక్రీస్తు నిన్న, నేడు, నిరంతరము ఏకరీతిగా యున్నవాడు.

ఇక్కడ ఒక స్త్రీ కూర్చొనియున్నది, స్త్రీ సంబంధమగువ్యాధి యున్నది. మీరు నమ్ముదురా? (ఓ, మై, ఆమె దానిని పోగొట్టుకోనైయున్నది.) ఎర్రని కోటు ధరించినది. ఆమె పేరు మిస్ డెయిలీ. నీ నిండు హృదయముతో నమ్ముము. ప్రభువగు యేసుక్రీస్తు బాగు చేయును, మిస్ డెయిలీ.

ఆమె నాకు తెలియునేమో అడగండి. నా జీవితంలో ఎన్నడూ ఆమెను నేను చూడలేదు. పరలోకపు తండ్రికి అది తెలియును. "ఆమె పేరును ఎందుకు పిలిచావని" మీరు నన్నడగవచ్చును. "నీ పేరు సీమోను. నీవు యోనా కుమారుడవు" అని యేసు చెప్పెను. అది నిజమేనా? నిన్న, నేడు, నిరంతరము ఏకరీతిగా యున్నవాడు ఆయనే గదా? అది సత్యమని మీరు నమ్ముచున్నారా? ఇప్పుడు, యేసు ఏమి చెప్పెను? ఇది జరుగును.

74గుర్తుంచుకొనండి, ఏర్పరచుకోబడిన సంఘమునకు ఇవ్వబడిన చివరి సూచన అదే — అబ్రాహాము మరియు అతని గుంపు — వాగ్దాన కుమారుడు ప్రత్యక్షము కాకముందు ఇచ్చెను. అది నిజమేనా? దేవుడు అబ్రాహామునకు అతని ప్రయాణమంతటిలోను గురుతులను ఇచ్చెను. ఆయన సంఘమునకు కూడా అలాగే ఇచ్చెను. దానిని చేయుటకు పరలోకపు దూత వచ్చినప్పుడు ఆయన విశ్వాసము లేని అన్యులను నాశనము చేసెను. కనిపెట్టుచుండిన కుమారుడు, అనగా: ఇస్సాకు ప్రత్యక్షమాయెను.

ఈ పరిచర్య త్వరలోనే ముగియును, మరియు ఊహించబడిన కుమారుడగు ఆయనే ప్రత్యక్షమగును. లూధరన్ ద్వారా సంఘము నీతీకరణములో నుండి వచ్చినది. వెస్లీ వారి ద్వారా శుద్దీకరణములో నుండి వచ్చినది. పెంతుకోస్తు వారి ద్వారా పరిశుద్ధాత్మ బాప్తిస్మములోనికి వచ్చినది. ఇప్పుడు తలరాయి పరిచర్యకు సమాయత్తమగుచున్నది. అన్ని సమయములలోను చక్కని మాదిరిని ఎత్తిచూపుచున్నది. ప్రతికూల చాయ అనుకూల చాయగా మారుచున్నది. నమ్మినవారిని తీసికొని పోవుటకు, అనగా తన సంఘమును తీసికొనిపోవుటకు ఒక దినమున యేసు వచ్చును. అవిశ్వాసము నుండి మిమ్మును మీరు చేసికొనుడి. ఈ రాత్రి విశ్వాసముంచును. ఈలాగు మిరు చేయుదురా?

75ఈ సమయములో ప్రార్థన కార్డులున్నవారి దగ్గర నుండి ప్రారంభించుదుము. గత రాత్రి ఇరవై-అయిదు వరకు ప్రార్థించానని తలంచుచున్నాను. అవునా? ఒకటి నుండి ఇరవై-అయిదు వరకు అని తలంచుచున్నాను.

[సహోదరుడు బ్రెన్హాం ప్రార్ధనా వరుసను పిలచుచున్నారు.]

ఇప్పుడు, ప్రార్థన కార్డులు లేకుండానే ఇప్పుడు మనకు వివేచన వరుస యున్నది. ప్రార్థన కార్డులు మీద ఉన్నది చదివి నేను చెప్పుచున్నానని జనులు తలంచుచున్నారు. ఆ జనులకు ప్రార్థన కార్డు లేదు. వారు వచ్చి కూర్చోన్నారు. అంతే. అది కొనసాగును. అర్థగంట లేదా అంతకన్న ఎక్కువ సేపు (చూచారా), ఈ సంగతులు జరుగుట చూచిన వారు ఎందరున్నారు? కాని మీరు చూడండి. మనకు కొంత బలము అవసరము అయియున్నది. నాకు ఇంకా నలుబది కంటే ఎక్కువ కూటములు ముందున్నది. దక్షిణాదిన అవి ఏర్పాటు చేయవలెను. ఇప్పుడిచ్చటకు జరిగి రండి, మీ ప్రార్థన కార్డులతో ఈ ప్రక్కకు రండి. "ఎ" ప్రార్థన కార్డులున్న వారందరూ ఈ ప్రక్కకు రండి. "ఎ" కార్డుల వారు.

76తక్కివ వారందరము కేవలం నమ్ముము' అను పాట పాడుదము. పాడెదరా? అందరము కలిసి పాడుదుము.

కేవలము నమ్ముము, (అంతే, కేవలము దేనిని నమ్ముట?

ఆయన వాక్యమును) కేవలము నమ్ముము;

సమస్తము సాధ్యము, కేవలము నమ్ముము;

కేవలము నమ్ముము, కేవలము నమ్ముము,

సమస్తము సాధ్యము, కేవలము నమ్ముము.

ప్రభువా, నేను నమ్ముచున్నాను; ప్రభువా, నేను నమ్ముచున్నాను.

[సహోదరుడు బ్రెన్హాం ప్రార్ధనా వరుసలో ఉన్నవారికి సూచనలు ఇచ్చుచున్నారు.]

ISA 53:5

 

77ఈ జనులు స్వస్థత పొందవలెనని ఎందరు ఆసక్తితో యున్నారు? ఇప్పుడు చూడండి, స్వస్థత దేవునికి చెందినది. అది నిజమేనా? ఆయన నాకిచ్చిన దుస్తులు యేసు తానే ధరించుకొని ఈ రాత్రి ఇక్కడ నిలబడియుండిన యెడల ఎట్లుండును? "ప్రభువా, నీవు నన్ను బాగుచేయుదువా?" ఆయన, "ఎప్పుడో అది నేను చేశాను" అని చెప్పును. ఆయన మన అతిక్రముల కొరకు గాయపరచబడెను. ఆయన పొందిన దెబ్బలు వలన మనము స్వస్థత పొందితిమి. అవునా? చూడండి, ఆయన ఎప్పుడో అది చేసెను; అది భూతకాలము.

"ప్రభువా, నన్ను రక్షించుము," అని నీవందువు. ఆయన దానిని ఎప్పుడో చేసెను. నీవెంత అరచినా, ప్రార్థించినా, బల్లలు బాదినా, ఆయన నీ కొరకు చేసినది అంగీకరించి నమ్మువరకు రక్షణ లేదు. అది నిజమేనా?

అది ఆలాగే యున్నది. నేను జనులను బాగుపరచలేను. నేను ప్రజలను స్వస్థపరచజాలను. ఆయన నిన్న, నేడు, నిరంతరము ఏకరీతిగా యున్నచో ఏమి చేయును? అప్పుడేమి చేసెనో అదే ఇప్పుడు చేయును. ఎందుకనగా ఆయన ఈ దినమునకు ఆయనిచ్చిన వాగ్దానము అదే. ఆయన ఏమి వాగ్దానము చేసెనో ఎందరికి తెలియును? ఆయన దానిని వాగ్దానము చేసెను. అవునండి! లేఖనములన్నింటిలోను ఆయన దానిని వాగ్దానము చేసెను. మీరందరూ ఏడు సంఘకాలముల వర్తమానముల తదితర వర్తమానముల టేపులను తీసికొండి. ఆ సంగతుల లేఖనముల ద్వారా రుజువు కాబడుట చూడండి. అది నిజమని చెప్పబడినది.

MARK 5:30•

LUKE 8:46

 

78ఇప్పుడు, ఈ ప్రార్థన వరుసలో నిలబడియున్న వారిని వివేచన వరుసలోనికి రమ్మని చెప్పుచున్నాను… యేసు ఒక దర్శనమును చూచెను, "నాలో నుండి ప్రభావము నుండి తొలగిపోయినది" అని చెప్పెను. అది బలము. అవునా? దర్శనములు అనగా మీరు మరో లోకములో యుండుట. ఇప్పుడాయన ఇచ్చట యున్నాడు. మీరు ఆయననే తాకియున్నారు, చూచారా. ఆయన ఇక్కడ మనతో యున్నాడని ఇప్పుడే గుర్తించబడియున్నది.

ఇప్పుడు, మీరు ఈ వరుసలో నుండి వచ్చుచుండగా, నేను మీ మీద చేతులుంచి ప్రార్థించిన తరువాత మీరు మీ స్థలములలోనికి వెళ్ళి కూర్చొన్నప్పుడు, నేను చేతులుంచి ప్రార్థించిన వారందరూ, అనగా మీ ప్రతి ఒక్కరూ బాగుపడుదురని ఎందరు నమ్ముచున్నారు?

PS 107:20•

MATT 8:8•

MATT 9:18•

MARK 5:23•

LUKE 7:6,7

 

79ఇక్కడున్నది పరిశుద్ధాత్మ అని మీరు నమ్ముచున్నారా? అది అలాగే చేయుచూ కొనసాగుచుండును. ఆ వరుసను మీరు సమీపించలేనిచో, ఇంకొంత సేపు వేచియుండండి, మేమది చేయుదుము, చూచారా. పరిశుద్ధాత్మ ఇక్కడ అందుకే యున్నది. చూచారా, మీరెక్కువగా నమ్మండి. అది మీ ఆలోచన పై ఆధారపడియున్నది.

"వారి మీద చేతులుంచండి" అని చాలామందికి నేర్పించారు. "ఆయన తన మాట పంపి వారిని స్వస్థపరిచెను," అని బైబిలు చెప్పెను. ఇప్పుడు ఆయన చేసినది అదే. తన వాక్యమును దృడపరచెను. దానిని మీ యొద్దకు పంపెను. దానిని మీకు స్థిరపరచెను. అది వారిని స్వస్థపరిచెను. అన్యులు ఇట్లు అనిరి…. యూదుడిలాగనెను, "వచ్చి నా కుమార్తె పై చేతులుంచుము, ఆమె బ్రతుకును." రోమియుడిట్లు పలికెను, "నా ఇంటికి నీవు వచ్చుటకు నేను యోగ్యుడను కాను. మాట మాత్రము సెలవిమ్ము!" మీరు ఆ విశ్వాసమునకు రమ్మనియే నేను చెప్ప ప్రయత్నించుచున్నాను, మీరు చూచారా. మీరు ప్రార్థించబడగోరుచున్నచో, మీ మీద చేతులుంచబడవలెనని కోరుచున్నచో…

ఇప్పుడు, మేము జనులకు ప్రార్థించబోవుచుండగా, మీలో ప్రతి ఒక్కరు నాతో కలిసి సహకరించవలెనని ప్రార్థించుచున్నారు. మన శిరములు వంచుదము.

MARK 16:17,18

 

80ప్రభువగు యేసూ, ఇప్పుడు జనుల కొరకు ప్రార్థించియున్నాను. నీవు ఇక్కడ నిలబడియున్నావని వారెరుగుదురు. నీవు జనుల మధ్య యున్నావని వారెరుగుదురు. ఈ రాత్రి ఈ జనులు ఈ వేదిక దాటి వెళ్ళుచుండగా, వారు కేవలము నా యొద్దకు గాని లేదా ఇక్కడ కూర్చొనియున్న మరి ఇతర సేవకుల యొద్దకు గాని వచ్చినట్లు మాత్రమే కాకుండనట్లు చేయుము. సజీవుడగు దేవుని ఆలయము నొద్దకు వచ్చినట్లు వారు గ్రహించెదరు గాక! దేవుడు చెప్పిన వాగ్దానము యొద్దకు వారు వచ్చియున్నారు. "నమ్మువారివలన ఈ క్రియలు కనబడును. వారు రోగుల మీద చేతులుంచినప్పుడు, వారు బాగుపడెదరు." దానిని ఆయన వాగ్దానము చేసెను. నమ్మిన ప్రతివాడు రక్షించబడునని ఆయన వాగ్దానము చేసెను. ఆ నమ్ము ప్రతివానికి రక్షణ దొరుకును. స్వస్థతయందు నమ్మకమున్న ప్రతి వ్యక్తి స్వస్థత పొందును. తండ్రి, ఇప్పుడు మాకు అవిశ్వాసము లేకుండా సహాయము చేయుము.

నీవు ఇక్కడ యుండినట్లుగా లేఖనపూర్వకముగా మాకు చూపించి, ఈ రాత్రి నిన్నునీవు గుర్తింపచేసికొనియున్నావు. ఈ వేదిక మీదికి లేదా ఈ సమూహములోనికి వచ్చు ఈ ఆరాధన అయిపోవు సరికి ఎట్టి వ్యాధి లేక యుండును గాక! ఆ గొప్ప పరిశుద్ధాత్మ తన ప్రజల మధ్యకు వచ్చి, మా ప్రతి ఒక్కరిని అభిషేకించి, ప్రభువా, ఇక్కడ కూర్చొనియున్న సేవకులను, నీ దాసులను, వందలాది జనులను నీ కొరకు సన్నద్ధపరచు గాక!

తండ్రి, నీ దైవ సన్నిధిలో యుండగా, మా ప్రార్థనలు సమస్తము నీ యొద్దకు చేరును గాక. ఈ వేదికను దాటి వెళ్ళుచుండగా, వారు నమ్మినట్లయితే - ఈ రాత్రే వారి స్వస్థత రాత్రి అని ఈ జనులు అర్థము చేసికొందురు గాక.

JOHN 13:12

 

81ఇప్పుడు జనులు వచ్చుచుండగా ప్రతి ఒక్కరును ప్రార్థనలో సహకరించవలెనని కోరుచున్నాను. ప్రతి వారి మీద నేను స్వస్థత కొరకు చేతులుంచగోరుచున్నాను.

రండి, అయ్యా. ఈ నా సోదరుని కొరకు ప్రార్థించుచున్నాను. యేసుక్రీస్తు నామమున స్వస్థత పొందుము.

ఈ నా సోదరుని కొరకు ప్రార్థించుచున్నాను. యేసుక్రీస్తు నామమున స్వస్థత పొందుము.

ఈ నా సోదరి స్వస్థత కొరకు యేసుక్రీస్తు నామములో ప్రార్థించుచున్నాను. ఆమేన్.

ఈ నా సోదరి స్వస్థత కొరకు యేసుక్రీస్తు నామమున ప్రార్థించుచున్నాను.

నా సోదరి స్వస్థత కొరకు యేసు నామమున ప్రార్థించుచున్నాను.

నా సోదరి స్వస్థత కొరకు యేసు నామమున ప్రార్థించుచున్నాను.

నా సోదరుని స్వస్థత కొరకు యేసుక్రీస్తు నామమున ప్రార్థించుచున్నాను.

నా సోదరి స్వస్థత కొరకు యేసుక్రీస్తు నామమున ప్రార్థించుచున్నాను.

నా సోదరుని స్వస్థత కొరకు యేసుక్రీస్తు నామమున ప్రార్థించుచున్నాను. యేసు నామములో నా సోదరుని కొరకు నీవు బాగు చేయుదువాని ప్రార్థించుచున్నాను.

మా సోదరుని స్వస్థతకై అతని మీద యేసుక్రీస్తు నామమున చేతులుంచుచున్నాను.

ఈ సోదరుని మీద అతని స్వస్థత కొరకు యేసు నామములో నా చేతులుంచుచున్నాను.

ఈ సోదరుని మీద నా చేతులుంచి, యేసు నామములో అతని స్వస్థత కొరకు ప్రార్థించుచున్నాను. ఇప్పుడు నీ అభిషేకము ఇక్కడున్నది. అతడు నీ సన్నిధిలో యున్నాడు.

82నా సోదరిని స్వస్థతపరచుము తండ్రి, యేసుక్రీస్తు నామమున ప్రార్థించుచున్నాను. ["యేసూ, నీకు వందనములు" అని సోదరి చెప్పుచున్నది.]

[టేపు మిద ఖాళీ యున్నది.]… యేసుక్రీస్తు నామమున ఇతడు బాగుపడును గాక!

అలాగే ఇక్కడున్న ఈ నా సోదరుని మీద కూడా రమ్మని చేతిని ఉంచుచున్నాను. యేసు నామములో బాగవును గాక.

తండ్రియగు దేవా, యేసుక్రీస్తు నామమున ఈ నా సోదరి మీద చేతులుంచుచున్నాను. ప్రభువైన యేసు నామములో ఆమెను బాగుచేయుము. ఆమేన్.

మా తండ్రి, ఈ సోదరుని మీద నా చేతులుంచుచున్నాను. యేసు నామములో ఇతని స్వస్థత కొరకు అడుగుచున్నాను. ఆమేన్.

యేసుక్రీస్తు నామమున నా సోదరుని మీద చేతులుంచుచూ, దేవుని మహిమార్ధమై అతని స్వస్థత కొరకు ప్రార్థించుచున్నాను. ఆమేన్.

మా పరమ తండ్రీ, నా సోదరుని మీద చేతులుంచుచున్నాను. అతని స్వస్థత కొరకు అడుగుచున్నాను. అతని ప్రార్థనతో నా ప్రార్థనను కలుపుచున్నాను. ఈ రాత్రి నీవు సమకూర్చిన సంఘ ప్రార్థనను కూడా కలుపుచుచున్నాను. అతని మీద నేను పెట్టిన చేతులు దేవుని కుమారునియందు నాకున్న విశ్వాసమును గుర్తింపచేయుచున్నవి. అతని స్వస్థతకై కోరుచున్నాను. ఆమేన్.

ఇక్కడ ప్రార్థించబడుటకు కొందరు చక్రాల కుర్చీలలో వచ్చియున్నారు. [టేపు మిద ఖాళీ.]

యేసు ఒకసారి ఈలాగు చెప్పెను, "నేను మీకు చేసిన దానిని తెలిసికొనుడి." దేవుడు చేయమని ఆజ్ఞాపించినదే నేను చేశాను."

83ఇప్పుడు, మనందరము కలిసి ప్రార్థించుదము; మీ మనవులను దేవునిపై యుంచి, ప్రార్థన చేయండి; గుర్తుంచుకొనండి, ఇప్పుడు నమ్మండి, మాతో విశ్వాసించండి. మీలో రోగులయిన వారు, బహుశా ప్రార్థన కార్డులు కలిగి యుండకపోవచ్చును.. రేపు రాత్రి మరల ఆరున్నర లేక ఏడు గంటలకు ప్రార్థన కార్డులు ఇచ్చెదము — గనక రేపు రాత్రి ఆరున్నర, లేక ఏడు గంటలకు మరల ప్రార్థన వరుస ఉండును. ప్రార్థన వరుసను బట్టి ఈ రాత్రి మిమ్మును ఆలస్యంగా ఉంచినందులకు క్షమించండి. దేవుడు మిమ్ము దీవించును గాక. మరల తలలు వంచుదము.

JOHN 14:13,14•

JOHN 16:23

 

84తండ్రి, మేము ప్రార్థించుచుండగా, మాకు విరోధముగా ఎవరికి పాపము గలదో వారినందరినీ క్షమించుచున్నాను. మాలో నీవలె లేని వారెవరయినా ఉన్నచో ప్రభువా, మమ్ము క్షమించుము. "మేము మనుష్యులందరి చేత చదువబడు పత్రికలమైయున్నాము, ఆలాగు ఉండవలసియున్నాము, అని మాకు చెప్పబడినది. నీ ఆజ్ఞలకు మేము లోబడియుండగా, నీ సన్నిధి మాతో గుర్తించబడియుండుట మేము చూచుచున్నాము. తమ విశ్వాసము గూర్చి సాక్ష్యమిచ్చుచూ ప్రజలు వేదిక మీదకు నడిచి వచ్చుచున్నారు. తండ్రి, వారి మీద మేము చేతులుంచాము. మాలో ఏదో ఒక్కరే కాదు గాని అందరము కలిసి ప్రార్థనతో వారి మీద చేతులుంచి, వారి శరీరములను నీవు బాగు చేయుదువని విశ్వాసించాము.

ఈ భూమి మీద ఉన్నప్పుడు నీవు ఇట్లు చెప్పావు: "నా తండ్రి నామమున నన్ను ఏది అడిగినను అది అనుగ్రహించెదను." దేవుని కుమారుడా, ప్రభూవా, అది నీ వాగ్దానము. వాగ్దానము చేసినవాడు ఈ రాత్రి ఇక్కడ తన వాగ్దానమును నెరవేర్చుటకు తన్నుతాను గుర్తింపచేసికొనియున్నాడు. రోగుల పై చేతులుంచవలెనని నీ ఆజ్ఞ పాటించబడినది. ఇప్పుడది జరుగనిమ్ము. అది వ్రాయబడినది గనుక జరుగనిమ్ము. ఈ రాత్రి యేసుక్రీస్తు యొక్క సన్నిధి ఇక్కడికి వచ్చి మరియు ప్రతి ఒక్క వ్యక్తిని అవిశ్వసమును నుండి వేరుచేయును గాక, యేసుక్రీస్తు యొక్క సన్నిది, వాక్యము, మా హృదయాలోచనలను ఎరిగినదైయున్నది, ప్రతి హృదయములో ఈ రాత్రి ఆధిక్యతను తీసుకొను గాక.

MATT 28:20•

JOHN 14:19•

EPH 4:8

 

85మేము, సాతానును దాని యొక్క చీకటి శక్తులనన్నింటినీ, దాని అవిశ్వాసపు శక్తులన్నింటిని గద్దించుచున్నాము. సాతానా, నీకు విరోధముగా దేవుని యొక్క ఆత్మ ఒక ప్రమాణము లేపియున్నది. నీవు ఓడిపోయినవాడవు. యేసుక్రీస్తు కల్వరి యొద్ద నిన్ను ఓడించెను.

ఆయన మరణమును, పాతాళమును, సమాధిని జయించి, మూడవ దినమున ఆయన ఆరోహణమై, మనుష్యులకు ఈవులను అనుగ్రహించెను. ఈ రాత్రి ఆయన వ్యక్తిగా ఇచ్చటున్నాడు. "ఇంకా కొంత కాలమైన తరువాత ఈ లోకము నన్ను చూడదు, అయినను మీరు నన్ను చూతురు, ఏలయనగా నేను మీతోను, మిలోను - యుగ సమాప్తి పర్యంతము ఉందును," అని చెప్పెను. ఆయన వాక్యము నెరవేర్చుచూ ఆయన సన్నిధి ఈ రాత్రి యుండుట మనము చూచుచున్నాము. యేసుక్రీస్తు నామము పేరట, దేవుని మహిమార్థము ఇక్కడున్న ప్రతి రోగియు బాగుపడునని విశ్వాసముతో మేము నమ్ముచున్నాము. జనులందరు "ఆమేన్" చెప్పిరి. దేవుడు మిమ్ము దీవించును. సోదరునికి తిరిగి అప్పగించుచున్నాను!

Search Messages

0 / 0 matches
Enter characters above to process real-time text query scopes...