యేసు వైపు చూచుచు

యేసు వైపు చూచుచు

1(సంఘమంతా నమ్మిక మాత్రముంచుము అను పాటను పాడుచున్నారు.) దేవుని యొక్క బైబిల్‌ గ్రంథం నుండి…నా మాటలు విఫలమయినట్లయితే, ఆయన మాటలు మరి ఎన్నడూ గతించవు. ఇది ఎరిగి యున్నాను. అందును బట్టి యెషయా పుస్తకములో నుండి లేఖనమును చదువగోరుచున్నాను. నేను వ్రాసిన కొన్నిలేఖనములు ఇక్కడ ఉన్నవి, ఎంత త్వరగా సాధ్యమగునో అంత త్వరగా నేను కొన్ని వ్యాఖ్యానాలు పేర్కొనుటకు ఇష్టపడుచున్నాను. మరియు ఆ తరువాత ఈ రాత్రి రోగులకొరకై మరల ప్రార్ధన చేయుదము, (యెషయా 45 మనము తీయుచుండగా), నేను ఈ అవకాశమును తీసుకొనగోరుచున్నాను. ఈ కూటములో సహకరించిన దైవసేవకులందరికి కృతజ్ఞతలు చెల్లించుటకు ఈ అవకాశమును తీసుకుంటున్నాను.

2సహోదరుడు షోర్స్‌ నాకు ఎంతో ప్రియమైన స్నేహితుడు, అతడు అసెంబ్లీస్ ఆఫ్‌ గాడ్‌ వారికి, ఇక్కడ ఈ నగరంలో ప్రాతినిధ్యం వహించుచున్నాడు, సహోదరుడు ఔట్లా మరొక నా ప్రశస్త స్నేహితుడు, యేసునామం సంఘం నుండి వచ్చినారు, సహోదరుడు పుల్లర్‌, స్వతంత్రుడు మరొక నా ప్రశస్త స్నేహితుడు,

ఈ ముగ్గురు మాత్రమే కాదు గాని, వారు మూడు పెద్ద గుంపులకు ప్రాతినిధ్యం వహించుచున్నారు. మరియు మరి కొందరు సేవకులు ఇంతకు మునుపు సేవా కార్యక్రమంలో నేను పరిచర్య చేసినవారు వారందరు సహకరించి కలసి వచ్చినారు, మరియు ఆ ప్రజలు బయటికి వచ్చారు, నా సహోదరులారా మీలో అనేక మంది రోగములతోను అక్కరలతోను ఉన్నారు, ఈ సమయంలో వారికి సహాయం అవసరం అని నేను నిజంగా నమ్ముచున్నాను. ఏలాగు చేయాలో అది నిశ్చయముగా తెలుసుకోవడానికి నేను ఎంతో ప్రయత్నించాను. నేను ఏమి చెప్పబడెనో ఏమి చేయబడినదో అది పరిశుద్దాత్మ నిర్దారించునని నేను నిశ్చయత కలిగియున్నాను.

ISA 45:22,23

 

3కాబట్టి మరియు మనం ఇపుడు బైబిల్‌ గ్రంధం చూచుచుండగా మన ప్రభువు మిమ్ములను దీవించును గాక యెషయ నలభై -ఐదుతో ఆరంభము లేక ఇరవై-రెండవ వచనం ఆరంభము.

భూదిగంత నివాసులారా నా వైపు చూఛి రక్షణపొందుడి, దేవుడను నేనే మరి ఏ దేవుడును లేడు

నీతి గల నా నోటి మాట బయలుదేరి యున్నది, అది వ్యర్దము కానేరదు..నా యెదుట ప్రతీ మోకాలు వంగుననియు ప్రతీ నాలుక నా తోడని ప్రమాణము చేయుననియు నేను నా పేరట ప్రమాణము చేసి యున్నాను.

అది ఎంతో ఎక్కువ లేఖనము చదువుట కాదని నాకు తెలుసు, అయితే అది సరిపోతుంది, ఎందుకనగా అది నిత్యజీవముతో కూడియున్నది.. అది దేవుని యొక్క వాక్యము. దీనిని నేను ఇపుడు ఒక పాఠముగా పిలిచినట్లయితే, సుమారు ఇరవై లేక ముప్పై నిముషములు నేను ఇలా చెప్పుటకు ఇష్టపడుదును, "యేసు వైవు చూచుచు" అని నేను చెప్పాలనుకొంటున్నాను.

ISA 45:22

 

4"భూదిగంత నివాసులారా నావైపు చూడుడి." సంవత్సరముల తరబడి అది ఒక పిలుపై యున్నది. కొద్దిగా దాన్ని ఒక విధంగా త్రిప్పాలనుకొంటున్నాను, భూదిగంతముల యందలి ప్రతీ లోక పద్దతి నుండి ప్రత్యేకించి నా వైపు చూడుడి, ఎందుకనగా ప్రపంచ పద్దతులు దాని అంతమునకు వచ్చినప్పుడు దానియొక్క అంతానికి వచ్చినప్పుడు, ఎల్లప్పుడూ తనకు తాను ఎంతో నిజముగా తెలియపరచుకొంటాడు, "భూదిగంత నివాసులారా నావైపు చూచి" అని చెప్పాలనుకొంటున్నాను. లేఖనము చెప్పుచున్నది, "చివరలో, భూమి యొక్క దిగంతములు" అంతములు అనునది బహువచనములో ఉన్నది, "భూమి యెక్క అంతములు,"

"నా వైపు చూచి, నావైపు చూడుడి అను మాటను" అనేక సంవత్సరముల నుండి మేమిది విని యున్నాము అని చాలా మంది చెబుతారు మంచిదే అది సత్యమే.

అయితే ఆ విషయం… ప్రశ్న ఏదనగా "నీవు చూస్తున్నప్పుడు నీవు ఏమి చూస్తున్నావు? "నా వైపు చూచి" అను మాట ఎంతో కాలం నుండి అది ప్రశ్నగా అడగబడెను.

ISA 45:22•

JOHN 1:1•

HEB 13:8

 

5నా వైపు "చూడు" అని ఇక్కడ ప్రజలు చెబుతారు, అసలు చూడు అను మాటను మీరు నిర్వచిస్తే దాని యొక్క అర్దం "శ్రద్ద వహించు", "పైకి చూడు" లేక "ఈ వైపుకి చూడు" మరియు "కాచుకొనియుండు" అని అర్దము. ఇక్కడ దేవుడు చెబుతున్నాడు, "నా వైపు చూడుము నేను దేవుడను మరి యొక దేవుడు ఎవ్వరు లేరు,"

ఇప్పుడు మనం జీవించుచున్న సమయంలో, నేను ఆశ్చర్యపోతున్నాను మనం దేనివైపు చూడగలిగి ఉన్నామో అది దేవుని కంటే ఎక్కువ స్థిరమైనదా? దేవుడు వాక్యమై వున్నాడు కనుక నీ యొక్క జవాబు కొరకు ఈనాడు తప్పనిసరిగా దేవుని వాక్యం వైపు చూడవలసి యున్నది. ఈ రోజునకు బైబిల్‌ గ్రంధమే జవాబై యున్నది, మిగతా దినాలలో అది అదియై వుండవలెను. ఎందుకనగా అది క్రీస్తు అయి ఉండి నిన్న నేడు యుగయుగములు ఒక్కటే రీతిగా యున్నాడు.

బైబిల్‌ గ్రంధంలో జవాబు ఉన్నది. బైబిల్‌ గ్రంధమే యేసు క్రీస్తు యొక్క ప్రత్యక్షత అయి ఉన్నది, అది భూమికి పునాది వేయబడినప్పటి నుండి బయలుపరచబడినది, ప్రవక్తల రూపంలో ఆయన బయలుపరచబడెను, రాజుల రూపంలో ఆయన బయలు పరచబడెను, న్యాయాధిపతుల రూపంలో ఆయన బయలుపరచబడెను, ఎందుకనగా అది ఆయనే ఐయు౦డెను, రాజు, ప్రవక్త, న్యాయాధిపతి మరియు దేవుడు.

ఇప్పుడు ఆయన చెప్పాడు, "నా వైవు చూచి"

ISA 45:22

 

6" నేను అది చేసియున్నాను." అని చెబుతావు.

నీవు ఏవిధంగా చూస్తావో అది దానిమీద ఆధారపడి ఉంది, నీవు ఏది చూస్తావో అది నిన్ను నిర్ణయిస్తుంది, ఆయనపై, దేనికై, ఎక్కడకై చూస్తావో అది నిర్ణయం చేస్తుంది, దేనివైపు నీవు చూస్తున్నావు! ఏ ఉద్దేశ్యం కొరకు నీవు ఆయన వైపు చూచుచున్నావు? నీవు దేనికొరకు ఎదురు చూచుచున్నావో దానిపై మాత్రమే అది అధారడి ఉండును, దానినే నీవు కనుగొనగలవు.

సహజముగా, ప్రజలు కూటములకు వెళతారు, మత సంభంధమైన కూటాలకు వెళతారు, కొందరైతే కొంతమంది గుంపు ప్రజలను చూచివారిలో కూర్చొనుట కొరకై వెళతారు…నేను చెప్పుటకు అసహ్యపడు చున్నాను, అయితే అది నిజము, కొందరు ఆలయానికి వెళతారు ఎందుకంటే వారు చెబుతారు, బట్టలు చూపించుకొనుటకు వెళతారు… ఎందుకంటే వారు చెబుతారు, "ఇది నగరంలో పెద్ద ఆలయం కాబట్టి లేక దానికి గొప్ప పేరు ఉన్నది గనుక ఒక తరగతి ప్రజలు ఈ ఆలయానికి వెళతారు కనుక అని చెబుతారు." అలాగైతే ఇది ఎంతో తప్పవుతుంది. అవునా, ఆలయం ఎందుకు స్థాపించబడినదో దాని సరియైన విషయం కొరకు నీవు చూచుటలేదు. దేవుడు చెప్పాడు… "నావైపు చూడు"

చాలామంది ఆరాధనలకు వెళతారు. కేవలం కనుపరచుకొనుట కొరకై వెళతారు…కొన్ని పర్యాయాలు ప్రజలు కూటాలకు వెళతారు, ఇది చెప్పుటకు ఎంతో తప్పు అవుతుంది…చాలాసేపు దానిమీద మతాచారం చేస్తాం… అయితే వారు వెళ్ళకముందే మనస్సులో ముందుగానే నిర్ణయించుకొని వారు ఆలయానికి వెళతారు…ఒక విషయం చెప్పినట్లయితే లేక వారి యొక్క ఆలోచనలకు ఒకటి వ్యతిరేకమైనట్లయితే, వారు అప్పుడే లేచి నిలబడి బయటకు వెళ్ళిపోతారు… కేవలం వారు అలాగే నిలబడలేరు, ఎందుచేతననగా అది ఎలా ఉండాలో వారు ఒక సొంత తలంపును కలిగి ఉంటారు.

MATT 3:9•

LUKE 3:8•

ROM 4:18,20,21

 

7ఆ హేతువుచేతనే యేసు భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన అర్థం చేసికొనబడలేదు…ఆ దినమున వారికున్న పారంపర్యాచారాలకు బదులుగా దేవుని యొక్క వాక్యమును వారు చూచినట్లయితే ఆయన దేవునియొక్క కుమారుడని వారు ఎరిగియుందురు…ఎందుకనగా ఆయన యొక్క సంపూర్ణ రాకడను గూర్చి వాక్యము యొక్క నిండు ప్రత్యక్షతతో ఆయన వచ్చును అను దాని గూర్చి బైబిల్‌ గ్రంధం విశదముగా తెలియపరచెను.

ప్రతీ తరము కూడా ఆ కాలమునకు విభజింపబడిన నిండు ప్రత్యక్షత వలన ఆయనను బయలుపరచెను. ఈ యొక్క తరము తప్పక యేసు క్రీస్తును బయలుపరచును, ఆయన వాక్యమునందు వాగ్ధానము చేయబడిన ఆయనను గూర్చిన ప్రత్యక్షత అది, ఈ తరమునకు తప్పక బయలు పరచబడవలెను, సంఘము దాన్ని స్వీకరించకపోతే, మరొకరు లేచి దాన్ని చేయుదురు. కారణం, యోహాను చెప్పాడు "దేవుడు ఈ రాళ్ళ వలన అబ్రహాముకు పిల్లలు పుట్టించును" అని అబ్రహాము మాకు తండ్రి అని మీలో మీరు అనుకోవద్దు. ధేవుడు ఈ రాళ్ళ వలన అబ్రహామునకు పిల్లలు పుట్టించగలడు.

GAL 3:7,29

 

8దేవుడు ఏది చెబుతాడో ఆయన చేయునని ఏది వాగ్జానం చేస్తాడో దానిని నెరవేర్చుటకు ఆయన నిండుగా సమర్దుడు. మన తండ్రియైన అబ్రహాము దాన్ని గ్రహించాడు… నిరీక్షణకు ఆధారం లేనప్పుడు అతడు నిరీక్షించాడు. అవిశ్వాసము వలన అతడు దేవుని వాగ్ధానమును సందేహించలేదు, అయితే బలము పొంది దేవుని స్తుతించెను, ఎందుకనగా దేవుడే అతనికి వాగ్ధానము చేసాడు.

ఆయన ఈ దినానికి మనకు వాగ్ధానము చేసెను, ఆయన మనకు వాగ్ధానము చేసెను, అబ్రహామునకు బయలుపరచబడినది ఎంత నిశ్చయమో, అంతగా అది అంత నిశ్చయముగా ఉన్నది. ఎందుచేతననగా మనము అబ్రహాము యొక్క పిల్లలము, క్రీస్తులో మనము చనిపోయిన వారమై మనము అబ్రహాము సంతానము ప్రకారముగా ఆయనతో మనము వాగ్ధానమునకు వారసులము.

ACTS 26:19

 

9అనేక మంది వివిధ తలంపులతో వస్తారు, వారు వారి యొక్క సొంత అభిప్రాయములతో వచ్చి, సంపూర్ణ సువార్త కూటాలలో కూర్చొంటారు లేక మరొక కూటానికి వస్తారు…వారు అంగీకరించని ఒకటి చెప్పేవరకు కొద్ది క్షణాలు వేచియుండి, ఆ తరువాత లేచి వెళ్ళిపోతారు, వారు ఇంకెక్కువగా వినుటకు నిలబడరు, వారు వెళ్ళిపోయారు. అక్కడ ఉన్న దానిని చూచుటకు మరియు దానిలో సత్యం ఏమని చూచుటకు వారు నిలబడరు.

ఇప్పడు మనము చెబుతాము… అది ఆత్మయా? అది ఎక్కడ నుండి వచ్చినది అని మనము చెబుతాము, అది ఎల్లప్పుడు ఉన్నది ..అది ఆదికాండము నుండి వచ్చినది, చాలాసార్లు అది లేఖనాలలో ఉన్నది. పౌలు ఒకసారి మాట్లాడుతున్నప్పుడు లేక కొంతమంది గుంపుతో మాట్లాడుతున్నప్పుడు అతడు ధర్మశాస్త్రం పైన నిలబడినంత వరకు ఎంతో జాగ్రత్తగా, అతని మాటలు అంగీకరించారు, అయితే పరలోక దర్శనాన్ని గూర్చి అతడు మాట్లాడుట మొదలు పెట్టగా చాలా త్వరగా అది సమాజాన్ని మార్చివేసింది, వారు లేచి నిలబడి అరుపులు అరిచారు. ఆ మనుష్యుడు ఏమి చెబుతున్నాడో వారు వినినట్లయితే, వాక్యము ద్వారా, అతడు దేవుని సత్యము బయలు పరచుచున్నాడు.

ACTS 26:19

 

10కొద్ది కాలము క్రితము, ఒక గొప్ప పట్టణంలో, ఈ అమెరికా సంయుక్త రాష్ట్రంలో, ఒక ఉజ్జీవ కూటమునకు ఆహ్వానించబడ్డాను. కేవలం కొద్దిమందే తిరిగి వెళ్ళారు.. బహుశా ఉజ్జీవ కూటము అంతటలోను ఈ రాత్రి ఈ భవనంలో ఉన్నవారి కంటే ఎక్కువ మంది లేరు, అయితే ఈ ఉదయ వేళ అల్పాహర విందు — ఉచిత అల్పాహరము ఇద్దాము అని అనుకొన్నాను..నా యొక్క ప్రేమకానుక తీసుకొని, అక్కడ పట్టణంలో కొందరు సాధారణమైన విశ్వాసులకు ఉచిత అల్పాహరము ఏర్పాటు చేయుట కొరకై రండి, నేను మీతో మాట్లాడి నేను ఇక్కడ ఉండు ఉద్దేశ్యము వారితో చెబుతాను, నగరానికి సహకరించి, రోగులకు సహాయం చేసి ప్రతీ సంఘానికి సహాయం చేయుదును అని వారితో చెప్పాను.

మంచిది, ఆ ఉదయం అక్కడ సేవా కార్యక్రమంలో "డాక్టర్‌ లీవై" నా యొక్క పరిచయవేత్త— అల్బహారము అయిన తరువాత అతను నన్ను సభకు పరిచయం చేసాడు, నేను ఈ అంశాన్ని తీసుకున్నాను, "పరలోక దర్శనానికి నేను అవిధేయుడను కాను, అనునది"… ఒక్క క్షణములోనే ఒక దైవ సేవకుడు తన గడియారాన్ని చూచుకొని, మరియొకరి వద్దకు వచ్చి, తల ఊపి, లేచి బయటకు వెళ్ళి పోయాడు. నేను 6 లేక 8 మాటలు చెప్పక ముందే ఆ సేవకుల గుంపులో నిండుగా మూడవ వంతు బయటకు వెళ్ళిపోయారు. పరలోక దర్శనానికి అతడు అవిధేయుడు కాలేదు, ఎందుకనగా దేవుడు ఈ పని నిమిత్తమే దేవుడు అతనిని పిలిచాడు అని పౌలు ఏమి చెప్పినది అది ఐదు నిముషాలు నేను మాట్లాడకముందు నేను ఎక్కడ నా తలంపులు కేంద్రికరించానో అక్కడ వారది చేసారు, అక్కడ మూడు వంతుల వారు వెళ్ళిపోయారు. యేసుక్రీస్తు నామమున వచ్చిన ఒక మనిషికి చేయుటకు అది కైస్తవ మర్యాదకాదు.

ISA 45:22•

MATT 23:29

 

11ఇది నేను గౌరవ మర్యాదలతో చెబుతున్నాను, ఆ ఉధయం ఆ దైవ సేవకుల సమావేశం కంటే ఆఫ్రికాలో మంత్రగాళ్ళ వైద్యుల వద్ద నేను మంచి గౌరవాన్ని, మంచి సహవాసాన్ని పొందుకున్నాను. వారు దేవుని యొక్క వాక్యానికి ఎక్కువ శ్రద్ధ వహించారు, ప్రశ్నలు అడిగారు, నిత్యజీవం యొక్క నిరీక్షణ, నా లోపల ఏ నిరీక్షణ నాటబడి యున్నదో దానిని నేను వారికి ఇవ్వగలిగాను.

ఈ దైవ సేవకులకు అందుకై ఎటువంటి సమయంకూడలేదు, ఎంతో త్వరగా నీవు ఒకటి చెప్పిన వెంటనే వారు వెళ్ళిపోతారు. కనుక మార్గం అలా ఉ౦టుంది వారి మనస్సుల్లో వారు తీర్మానించు కొంటారు, ఎంతోసేపు ఉంటారు, అది మాత్రమే వారు ఎరగాలనుకొంటారు, వారు తెలుసుకున్న ఏ చిన్న దానికి ఒక దానికి ఏ వాక్యము ఏకీభవించక పోయిన అక్కడ నుండి అదంతా వారు వినరు, వేచి ఉ౦డరు.

ఆ కారణముచేతనే యేసుక్రీస్తును ఆయన మొదటి రాకడయందు వారు నమ్మలేకపోయారు, ఆకారణము చేతనే రెండవ దానిలో వారు ఆయనను పోగొట్టుకొంటారు. ప్రతీ యొక్క సారి కూడ వారు ఆయనను పోగొట్టుకున్నారు, ఎప్పుడు వారు అలాగే చేస్తారు, ఆయన మోషేకు తనకు తాను బయలుపరచు కున్నాడు, నోవాహుకు బయలు పరచుకున్నాడు, ఏలియాలో బయలుపరచుకున్నాడు, ప్రవక్తలందరిలో ఆయనను బయలు పరచుకున్నాడు, ప్రతీసారి వారు పోగొట్టుకున్నారు. యేసు చెప్పి యున్నాడు, మీ పితరులు సమాధులలో పెట్టిన ప్రవక్తల, సమాధులను అవి ఇప్పుడు అలంకరించబడుటలేదా? అది నిజం అది ఎల్లప్పుడు నిజమే…

అది ఈ రోజు కూడ నిజమే. వీటన్నిటి మథ్యలో చూడుము, చూడు, అని మనకు ఆజ్ఞ ఇవ్వబడినది , "భూదిగంత నివాసులారా ఆయన వైపు చూడు"

PHIL 3:10

 

12కొన్ని కొన్ని సార్లు వారు లోపలకు వస్తారు, నీవు ఎటువంటి బట్టలు ధరించి యున్నావో దానిని బట్టి ఒకరు నిన్ను తీర్పు తీరుస్తారు, నీవు సేవకుని బట్టలు తదితరమైనవి ధరించి యుండకపోయిన యెడల అలాంటప్పుడు అది అయిపోయిందే. నీతో వారికేమి పని లేదు, కొన్ని సార్లు నీవు ఎటువంటి విద్యను కలిగి ఉన్నావో నీవు నీ మాటలు సరిగా పలుకుతున్నావో లేదో నీవు సరిగా నిలబడ్డావో, ఏ విధంగా నామవాచకము, సర్వనామము ఏ విధంగా వాడుచున్నావో చూడటానికి వస్తారు. నిజంగా నామ వాచకం ఏదో సర్వనామమేదో నాకు తెలియదు, నేను మీకు చెప్పలేను, నాకు అది బయలు పడుతుంది , కాని నాకు తెలియదు, నామ వాచకం, సర్వనామం యొక్క వ్యత్యాసం నేను చెప్పలేను, నేను, బడిలో ఉన్నప్పుడు చేసాను, అయితే అది ఎంతో కాలము కిందట నేనది మర్చిపోయాను.

నాకైతే ఒకటి తెలుసు, ఆయన పునరుద్దాన బలము నందు యేసు క్రీస్తును తెలియపరచడానికి అది నాకు తెలుసు, విశేషణములు, సర్వనామములు నాకు తెలియదు, ఇలాంటి కూటాళ్లో ఇందుకే మనమంతా ఇక్కడకు వస్తున్నాము. ఆయనను గూర్చి తెలుసుకోవటానికి నామవాచకములు సర్వ నామములు అవసరంలేదు, అయితే ఆయనను యేసుక్రీస్తును ఆయన పునరుత్దాన శక్తి తెలుసు కొనటానికి అయి ఉన్నది.

13ఇప్పుడు, కొందరు ప్రజలు వారు యేసుని చూచినప్పుడు… ఆయనను చూస్తారు, ఆయనను గ్రహిస్తారు… చూస్తారు, ఆయనవైపు చూస్తారు.., అటు తరువాత వారాయనను చూస్తారు, వారు ఆయనలో సంఘ సంస్థాపకమును మాత్రమే చూస్తారు లేక వ్యవన్థాపకుని లేక సంఘము యొక్క మూఢ సిద్దాంతాన్ని చూస్తారు. యేసును చూచుటకు చాలా మంది అదే విధానంలో చూస్తున్నారు. కేవలం ఆయన ఆ పాత సిద్ధాంతానికి ఒక కొత్త మత విశ్వాసమును చేర్చుట అయిఉండెను. ఇప్పుడు చాలామంది ప్రజలు ఆయనను అలాగే చూస్తున్నారు. కొందరాయనను శాంతాక్స్లాజ్‌ పురాణ గాధగా చూస్తారు, లేక కొందరాయనను చరిత్ర గాధగా అనేక సంవత్సరాల క్రితము దేవుడు చేసిన ఒక చరిత్రగా ఆయనను చూస్తారు, మరికొందరు ఇంకా ఆయనను పశువుల పాకలో ఉన్న ఒక శిశువుగా చూస్తారు.

అయితే, నీవు ఆయన వైపు చూచినప్పుడు నీవు ఏమి చూస్తున్నావు అనునదే ఆ ప్రశ్న? త్రిత్వములో రెండవ వ్యక్తిగా చూస్తున్నావా లేదా ఒక త్రిత్యముగా చూస్తున్నావా? ఒక దానిలో ముగ్గురిగా చూస్తున్నావా? ఆ వాక్యము ద్వారా నీవు ఆయన వైపు చూడగలవు, నీవు ఆవిధముగా మాత్రమే ఆయనను చూడగలవు, అది నీవు ఎరిగి ఉండుటం అది ఆ పద్దతియే, ఎందుకనగా ఆయన వాక్యమైయున్నాడు, ఆయననే అది బయలు పరచును, నీవు దేని కొరకు చూస్తున్నావో దానిపై ఆధారపడి ఉండును. వాగ్వాదము చేయుటకు, నీవు ఆయన వైపు చూచినట్లయితే, అలాగైతే నీవు పొరపాటుగా చూస్తున్నావు, ఆయన వాదము పెట్టుకొనడు, అది ఆయన వాగ్వాదము చేయుటకు కొరకు కాదు. జ్ఞాపకముంచుకో, ఆయన వాక్యము గుండా ఆయన వైపు చూచినప్పుడు.. నీవు ఆయనను చూస్తావు…, నీవు ఆయనను గుర్తిస్తావు.

సత్యమునకై నీ కన్నులు తెరువబడు వరకు నీవు ఆయనను చూడలేవు. ఇద్దరు మనుష్యులు ఒకే లేఖనమును చూడగలరు మరియు వ్యతిరేకించుదురు. అందులో ఒకరు సరియైన దానిలో ఉంటారు, మరియు మరియొకడు తప్పులో ఉంటాడు..

2KGS 6:15,17

 

14కొన్నిసార్లు మనచుట్టూ కొన్ని సంగతులు జరుగుతాయి, అర్ధము కానివి జరుగును, కొందరు వారు విషయాలను చూస్తున్నారని చెబుతున్నారు, కొందరు దాన్ని గూర్చి ఏమి చూడలేదని అంటారు.

అక్కడ దిగువన ఉన్న దాతాను యొద్ద, ఆ దినమున సిరియా సైన్యముచేత ఎలీషా ముట్టడివేయబడినప్పుడు చూడు అతని నమ్మకమైన దాసుడు గేహజి అతనితో నివాసమున్నవాడు, అతనికై కనిపెట్టుకున్న వాడు, అతనికి ఆహారము వండువాడు, అతని బట్టలు శుభ్రముగా ఉంచేవాడు, అతని చేతుల మీద నీళ్ళు పోసిన వాడు, రాత్రి పగలు అతనితో సరిగా యుండువాడు, అతడు భోదిస్తున్న మరియు ఉపదేశాన్ని వినువాడు అతడు. ఆ ఉదయం అతడు మేల్కొన్నప్పుడు అతడు బయట చూసాడు, సిరియా సైన్యము చుట్టూరా ఉండుట అతడు చూసాడు, అతడన్నాడు, "అయ్యో నాయనా, సిరియా సైన్యమంతా… మన శత్రువుల వైపు చూడు."

మీరు చూడండి, ఏలియా, అతడు పైకి లేచి మరియు చూసాడు, గెహజి చూడని ఒకటి అతడు చూసాడు, కాబట్టి అతడు ప్రార్ధించాడు. "దేవా ఈ యౌవ్వనుని కన్నులు తెరువుము." అతని కన్నులు బాగుగా తెరువబడి యున్నవి. అయితే అతడు చెప్పాడు. "అతడు చూచునట్లు అతని కన్నులు తెరువుము," అని … అతని కన్నులు ఆత్మీయంగా తెరువబడిన తరువాత ఆ పర్వతమంతా అగ్ని రధాలతోను, దూతలతోను ప్రవక్త చుట్టూ ఉన్నారు, చూసారా, అతని కన్నులు తెరువబడిన తరువాత అదంతయు వ్యత్యాసముగా ఉన్నది.

HEB 13:8

 

15ప్రజలు అక్షరార్థముగా వాక్యమును చూస్తారు. అయితే ఆ విధముగా నీవు చూడవలసి ఉంటున్నది, అయితే అక్షరార్ధముగాను ఆత్మీయముగాను అది తెలియజేస్తుంది. ఆత్మ వాక్యమును వాగ్ధానమునకై జీవింపజేయును. మరోమాటలో చెప్పాలంటే అది విత్తనమై ఉండును. ఆత్మ దానికి జీవమును ఇచ్చును, అది మాటలోను, ప్రవర్తనలోను, విశేషముగా ఉండును. అది దానిని ఇచ్చును. అది భూమిలో పాతి పెట్టబడిన విత్తనానికి వర్షం ఇచ్చినట్లుగా అది మాటలోను, ప్రవర్తనలోను విశేషముగా ఉండును. అది దానిని ఇచ్చును, అది పగులగొట్టును, జీవమునకై అది పగులగొట్టబడును, కాలానికి వాగ్ధానము చేయబడిన వాక్యముగా యేసును నీవు చూచినప్పుడు అప్పుడు నీ కది బయలు పరచబడును. నీవు ఆయనను చూచినట్లయితే ఆయన నిన్న నేడు, యుగ యుగములు ఒక్కటే రీతిగా ఉన్న వానిగా అదే క్రీస్తును నీవు చూస్తావు.

AMOS 3:7

 

16ఆదికాండము నుండి మార్గమంతటిలో ప్రతీయొక్క తరానికి దేవునియొక్క వాక్య భాగము మార్గమంతటిలో పంచి ఇవ్వబడినది, దేవుడు ఎల్లప్పుడూ ఒకరిని పంపించును. సహజముగా మత సంబంధమైన గురువులు దానిని ఎంతో మిశ్రితం చేసారు, పారంపర్యాచారాలు మొదలగు వాటితో చేసారు. యేసు యొక్క రాకడ వచ్చుచుండగా నేరుగా దేవుడు ఒక ప్రవక్తను పంపును. "ప్రవక్త యొద్దకు ప్రభువు వాక్యము వచ్చును." అతడు దానిని బయలు పరచును, మరణించుట కొరకై రాళ్ళు విసురుతారు లేక బయటకు నెట్తారు తరువాత అది గతించిన తరువాత అతనికి సమాధి కడతారు, మరల అతడు గొప్పవాడని చెబుతారు. వెనుక అతడు ఏమై ఉన్నాడో ఆ నీడలో వారు జీవిస్తారు. ఈ దినాన వెళుతున్న వాక్యమును తిరస్కరిస్తారు.

అది మనిషివలె ఉండును. దేవుడు ఎంతగొప్పవాడై యున్నాడో ఆయన ఏమేమి చేసి యున్నాడో ఆయన ఎటువంటి సంగతులు చేయనై ఉన్నాడో వాటిని గూర్చి మాట్లాడుచూ ఉంటాడు, ఇప్పుడు ఆయన చేయుచున్నవి చూడకుండా అవి మాట్లాడుచూ ఉంటాడు. అవునా? అతడు ఆయనను చరిత్రలో చూస్తాడు, ప్రవచనంలో చూస్తాడు, అయితే అప్పుడు చేసినవే ఇప్పుడు ఆయన చేస్తున్నాడని మరిచి పోతాడు అది మనుష్యులలో ఉన్నటువంటి విషయము…

LUKE 24:13,29

 

17ఒకసారి మనము శిష్యులను గమనించాము, అది మొట్ట మొదటి ఈస్టర్‌ ఉదయం ఎంతటి ఉదయవేళ అది …యేసు మృతులలో నుండి లేచి పువ్వుల మధ్య నడుస్తున్నాడు. ఇద్దరు మిత్రులు కయప మరియు అతని స్నేహితులలో ఒకరు వారు దు:ఖముఖులై మార్గమున నడుచుకొంటు వెళ్ళిపోతున్నారు. మరియు ఒక మనుష్యుడు పొదలో గుండా వచ్చి రోజంతా వారితో మాట్లాడాడు. క్రీస్తును గూర్చి వారితో మాట్లాడాడు, ఆ సాయంకాలం వారు ఆయనతో మాట్లాడారు, ఆయన వారిని దాటి వెళ్ళుచున్నట్లుగా నటించాడు, అయితే ఆయనను లోపలికి రమ్మని వారు అడిగారు, ఆయన ఆ విధముగానే వెళ్ళాడు. ఆయన ఆలాగు చేసినప్పుడు ఆయన సిలువకు మరియు పునరుత్థానమునకు ముందుగా ఆయన చేసిన విధముగా అక్కడ ఆయన ఒకటి చేసి యున్నాడు. ఆయన సిలువ వేయబడక ముందు ఆయన ఏవిధముగా చేసియున్నాడో ఆయన ఆలాగు చేసియున్నప్పుడు వారు ఆయనను చూడగలిగారు, ఆయనే అని వారు గుర్తించగలిగారు. దినమంతా వారితో ఆయన ఉన్నప్పటికి ఆయన ఎవ్వరనేది వారు గుర్తు పట్టలేదు.

DEUT 18:15•

JOHN 5:39,45•

JOHN 7:19,20•

JOHN 9:28

 

18ఈ రోజు ఆ విధముగానే ఉంటున్నది, ఆయనను మంచి మనిషి, గొప్ప మనిషి, అని క్రీస్తుతో నడుస్తారు, ఆయన వాక్యమును చదువుతారు, అయినను బైబిల్‌లో కొన్ని విషయాలను నెరవేర్చు గడియ ఇదేనని గుర్తించరు. మనము జీవిస్తున్న ఈ సమయం ఈ సంగతులు తప్పక నెరవేరవలసి యుండుటకు సమయం ఆసన్నమైనది అని వ్రాయబడినది. అలాగే అది నెరవేరవలసి యున్నది. ఎందుకనగా అది దేవుడు వాగ్ధానము చేసినది అవును, వాక్యమును చూచుటకు మన కన్నులు తప్పక తెరువబడాలి. మరియు నీవు వాక్యమును చూచెదవు.

మెస్సియా వచ్చునని …వచ్చు విధము ఖచ్చితముగా గీయబడిన వాక్యము పరిసయ్యులు కలిగి ఉన్నారు. వారు అది సరి అని వారు నమ్మి యుండిరి. ఇక్కడ ఆయన జన్మించి వారి మధ్యనే నడిచాడు. "మీరు లేఖనములను పరిశోధించుడి వాటి యందు నిత్యజీవమున్నదని మీరు తలంచుచున్నారు, అవి నన్ను గూర్చి సాక్ష్యమిచ్చుచున్నవని ఆయన వారితో చెప్పినప్పుడు వారాయనకు శిక్ష విధించారు. "లేఖనాలను పరిశోధించుడి." వారు అన్నారు,

"మేము మోషే శిష్యులము"

ఆయన చెప్పాడు, మీరు మోషే శిష్యులు అయినట్లయితే , మీరు నన్ను ఎరుగుదురు. ఏలయనగా మోషే నన్ను గూర్చి వ్రాసెను, అతడాలాగు చేసెను…

మోషే చెప్పాడు, "ప్రభువైన దేవుడు నావంటి ఒక ప్రవక్తను మీకొరకు పుట్టించును."

ఒక ధర్మశాస్త్రమిచ్చువాడు మొదలైనవి, ఒక ప్రవక్త మరియు అతని మాటలు జనులు వినవలెను."

చూశారా, వారు మోషే వ్రాతలు ఎరిగి యుంటే, వారు నన్నెరిగి యుందురు, మోషే వ్రాతలు వారెరిగి ఉన్నారని వారనుకున్నారు, అయితే మీరు చూడండి వారు అది ఎరుగలేదు. చూడండి, ఆ యొక్క నిజ బుజువునకు వారు అంధులై పోయారు. కాబట్టి అలాంటివి ఆయనను గూర్చి కొద్ది విషయాలు, వారు ఏమి చేసారు? దూసుకొని పోయి ఈలాగు చెప్పారు. ఈ మనుష్యునికి దయ్యం పట్టినది, మాకు బోధించుటకై వచ్చాడు ఆయన ఏ పాఠశాలనుండి వచ్చాడు? ఆయనను గూర్చిన వివరణ ఏమీ లేదు, ఎవరి సహవాసపు కార్డును ఆయన పట్టుకొని ఉన్నాడు? ఆశ్చర్యముగా లేదా ? లేక ఆ విధమైన ఒక ప్రశ్న ఉన్నది.

ISA 45:5,7,22•

ISA 46:9

 

19అయితే ఆయన ఆ ఘడియకు వెలుగై ఉన్నాడని, యేసు క్రీస్తు అను వ్యక్తి ద్వారా నేరుగా అక్కడే బుజువు పరచబడిన వాగ్ధాన వాక్యము యొక్క సాక్ష్యాత్తు దేవుడినే వారు చూచి యున్ననూ అయితే వారు గ్రహించుటకు విఫలం అయ్యారు. వారు చూచుటకు విఫలం అయ్యారు. ప్రజలు నడవటానికి ఆయన వెలుగైయున్నాడు.

మరియు, దేవుని యొక్క వాక్యము మాత్రమే వెలుగును ఉత్పత్తి చేయును. కేవలం దేవుని యొక్క వాక్యము మాత్రమే వెలుగును ఉత్పత్తి చేయును. దేవుని వాక్యము సూర్యకాంతిని ఉత్పత్తి చేయును. దేవుని వాక్యము భూమిని ఉత్పత్తిచేయును. దేవుని వాక్యము గాలిని ఉతృత్తి చేయును, ప్రతీది కూడ దేవుని యొక్క వాక్యము ద్వారా మాత్రమే ప్రత్యక్షమైనది, ప్రతీది కూడ దాని యొక్క వాస్తవికత అవుతుంది. ఆయన ఇక్కడ ఉన్నప్పుడు, ఆయన చెప్పాడు, నేను దేవుడను, నేను తప్ప వేరొకరు లేరు, కొందరు చూసారు, చూచిన వారిని కొందరిని తీసుకొందాం.

2CH 26:16,19•

ISA 6:1-3,7

 

20ఒకసారి, యవ్వన ప్రవక్త, యెషయా గతకాలంలో ఇక్కడే ఫీనిక్స్‌లో అతని గూర్చి నేను మాట్లాడాను, వ్యాపారస్తుల మధ్య అని అనుకొంటాను. అతడు ఏవిధముగా ఎంత గట్టిగా రాజైన ఉజ్జియా భుజాలపై ఆనుకొన్నది. ఉజ్జియా తాను గర్వించినప్పుడు కుష్టిరోగము ద్వారా మొత్తబడినది మనము చూసాము. ఆ తరువాత యెషయా ఆలయంలోకి వెళ్ళి ప్రార్ధించి, అతడు పాపి అని ఒప్పుకోవలసి వచ్చెను. సెరాపులు తమ రెక్కలతో వారి పరిశుద్ద ముఖములను మరియు పాదములు కప్పుకొని, రెండిటితో ఎగురుతూ ప్రభువైన దేవుడు పరిశుద్దుడు, పరిశుద్దుడు, అని మొర్ర పెట్టుట అతడు చూసాడు.

యేసుక్రీస్తు యొక్క క్షణమైన దర్శనం యెషయా పొందుకున్నాడు. అతడేమి చూసాడో ఇక్కడ ఉన్నది. సాధారణ మనిషిని అతడు చూడలేదు, వేదాంతిని అతడు చూడలేదు.

21ఈ దినాన అనేకమైన మన ప్రొటెస్టెంట్ సంఘములు వాటిలో నూటికి అరవైలేదా అరవై ఎనిమిది పాళ్ళు పరిశీలనలో నమ్మకమును తృణీకరించిరి. మనయొక్క ప్రొటెస్టెంట్‌ బోధకులు, వారు యేసు క్రీస్తు యొక్క ఆయన కన్యక వలన జన్మించిన దానిని తృణీకరించారు, అవును అది నిజం, ఇవి గణాంక వివరాలు, ఇంకా కిందకు, కన్య వలన జన్మను వారు తృణీకరించారు. అది నిజంగా కన్య అని, వారు నమ్మరు.

కాబట్టి, యెషయా అటువంటిది చూడలేదు, వారిలో కొందరు, చెబుతారు, ఆయన మంచి మనిషి అని మన సంఘశాఖలో కొందరు చెబుతారు, ఆయన మంచి వాడు నిజమే ఆయన యందు ఏ నేరము లేదు, అయితే నేను మీతో చెప్పుతున్నాను, ఆయన వాక్యములు స్థిరమైనవి కావు లేక ఈనాడు నమ్మలేనివి అంటారు.

ISA 9:6•

MATT 4:4•

MATT 13:31•

MATT 24:35•

LUKE 4:4•

LUKE 21:33

 

22ఎలాంటి విశ్వాసము గాని, ఎటువంటి నమ్మకము గాని, వాక్యానికి ఆవల నిర్ణయించబడినట్టయితే అది అలాగే ఉండనిమ్ము.

యేసు చెప్పాడు.. "ప్రతీ మనుష్యుని మాట అబద్ధము.." నా మాట కాదు ఆకాశము, భూమియు గతించును గాని నా మాటలెన్నడు గతించవు, అందుచేత ఏ నమ్మకము గాని ఏదైనాగాని ఈ దేవుని వాక్యము మీద కట్టబడదు, వాక్యమంతటి మీద కట్టబడదు యేసు చెప్పాడు "మనుష్యుడు రొట్టె వలన మాత్రమే గాక దేవుని నోట నుండి వచ్చు ప్రతీమాట వలన జీవించును." ఇక్కడొక మాట వలన, అక్కడొక మాట వలనకాదు, ఇక్కడొక చిన్నది, అక్కడొకటి దానిని కలువుట వలన కాదు అయితే "\దేవుని నోటనుండి వచ్చు ప్రతీ మాట వలన జీవించును.

మనుష్యుడు బైబిల్‌ గ్రంధంలోని ప్రతీ మాట వలనే జీవించును." దానిని కలుపుము, అది కలపబడి ఉన్నది…దానిని అలాగే చదువు, దానిని నమ్ము, దాని ప్రకారము నడువుము, దానిని దేవుడు గౌరవిస్తాడు.

అది మనము చూసాము, యెషయా ఆయనను చూచినప్పుడు "నీ వేమి చూసావు?" యెషయా ఆలోచన కర్త, సమాధాన కర్ష్తయగు అధిపతి, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి అను ఒకరిని అతడు చూసాడు, అది అతడు చూసాడు,

DAN 2:34

 

23నేను మరియొక మనిషిని చెప్పినట్లయితే…, దానియేలు ఒకసారి ఆయనను చూచినటువంటి తరుణము అతనికి లభ్యమైనది. "ఒక గొప్ప ప్రవక్త, నీవేమి చూసావు?"

అతడు చెప్పాడు, "చేతి సహాయం లేకుండా పర్వతంలో నుండి చెక్కబడిన రాయిని చూసాను, అది లోకములోని రాజ్యములన్నిటిలోనికి దొర్లి పోయి, వాటిని తునాతునకలుగా చేసినది, వారందరు కళ్ళములోని చెత్తవలె ఊది వేయబడ్డారు, ఆ రాయి పెరిగి పెద్దదైపోయి, భూమి అంతయు కప్పినది, అది అతడు ఆయనను గూర్చి చెప్పినది. అందుచేత ఒక దినమున ఆయన లోకమును పరిపాలనచేయును.

ఈ దినాన ప్రజలు ప్రపంచ పరిపాలకుని కొరకు ప్రయాసపడుతున్నారు. ప్రతీ దేశము తన సొంత భాషను కోరుతుంది. వారి యొక్క వారి ఆలోచనలు, ప్రతీ శాఖ ఒక దానిమీద మరొకటిగా వారి గుంపులను కోరుచున్నారు, అయితే వచ్చుచున్నవాడు ఒకరు ఉన్నారు, అది "ప్రభువైన యేసు క్రీస్తు అయి ఉన్నాడు," ప్రపంచం యొక్క పరిపాలకుడు దేవుడు తప్ప మరియొకరు కాదు.

EZEK 1:16•

EZEK 10:10•

DAN 3:20,25

 

24ఒకానొక దినాన నెబుకెద్నెజరు ఒక చెడ్డకార్యం చేసాడు. మండుచున్న అగ్ని గుండములో విశ్వాసులైన ముగ్గురు దేవుని బిడ్ణలను త్రోసివేసాడు. అక్కడ వారు ఏలాగు ఉన్నారో చూచుటకు తలుపు త్రోసినప్పుడు, అగ్ని గుండములో నాల్గవ మనిషిని అతడు చూసాడు, నీవు చూసినప్పుడు నెబుకెద్నెజరు, నీవు ఏమి చూసి ఉన్నావు ?

అతడు చెప్పాడు, "దేవుని కుమారుని వలె ఉన్నటువంటి ఆయనను చూసాడు." అతడు చేసిన నేరములోనికి అతడు చూసినప్పుడు అక్కడ ఒకని వలె చూచెను. "దేవుని కుమారుని వలె ఉన్న వానిని"

యెహేజ్కేలు ఒక దినాన ఒకటి చూసాడు అతడు ఏమి చెప్పాడు, నేను కూడ ఆయనను చూసాను, చక్రం మధ్య చక్రం ఉన్నట్టు అతడు చూసాడు, ఆయన ఆవిధంగా ఉన్నాడు, ఆకాశం మధ్యన తిరుగు తున్నట్టుగా ఆయన ఉన్నాడు. యెహేజ్కేలునకు ఆయన ఎలా కన్పించినది అదే.

AMOS 3:7•

MATT 3:13•

MATT 11:11•

LUKE 7:28•

JOHN 1:14

 

25యోహాను ప్రవక్తలందరిలో గొప్పవాడు, అతడు యేసును పరిచయం చేసినవాడు, యేసు చెప్పాడు, "జన్మించిన మనుష్యులందరిలో గొప్పవాడు," ఆలాగు ఎందుకు అని నీవు ఎప్పుడైన ఆలోచన చేసావా? మిగతా వారందరు ఆయనను గూర్చి చెప్పారు, ప్రభువు వాక్యము ప్రవక్తల యొద్దకు మాత్రమే వచ్చును. అని బైబిల్‌ గ్రంధం చెప్పుచున్నది. మరియు మిగతా ప్రవక్తలందరి వద్దకు అది దర్శనములలో వచ్చెను. అయితే, "వాక్యము యోహాను వద్దకు వచ్చినప్పుడు అది శరీరమాయెను," యేసు వాక్యము, ఆయన వాక్యమై ఉన్నాడు, ఆయన ఎల్లప్పుడు వాక్యమై ఉండును. అయితే ఇక్కడైతే దేవుని యొక్క సంపూర్ణత శరీరధారియై మన మధ్య నివసించెను.

అతని యొద్దకు ఆయన నీళ్ళలో వచ్చినప్పుడు అతడు ప్రవక్త, వాక్యము శరీరధారియైనట్లయితే అది ప్రవక్త యొద్దకు రావలసి ఉన్నది, వాక్యము అది ఎక్కడ ఉన్నప్పటికి అది ఒక ప్రవక్త యొద్దకు తప్పక రావలసి ఉన్నది. ఎందుకనగా వాక్యము వచ్చునది ప్రవక్త యొద్దకు మాత్రమే. ఆ దినము యొక్క ప్రవక్త యోహాను.

MATT 1:16•

MATT 3:11,14,15•

MARK 1:10•

LUKE 3:16,22•

JOHN 1:32

 

26వాక్యము అతని యొద్దకు వచ్చి, నీటిలోనికి నడుచుకుంటు వెళ్ళి, "నేను బాప్తిస్మము పొందవలసియున్నది." అని అన్నాడు.

యోహాను చెప్పాడు, నేను నీ చేత బాప్తిస్మము పొందవలసియున్నది. నీవు నా దగ్గరకు ఎందుకు వచ్చావు?

ఇప్పటికి ఈలాగు కానిమ్ము నీతి యావత్తు నెరవేర్చుట మనకు తగియున్నది.

అది ఎందుకు యోహాను చెప్పాడో మీరు ఎప్పుడైన తలంచారా? యోహాను యేసుతో అది ఎందుకు చెప్పాలి? ఎందుచేత? ఎందుకనగా అది వారు చేయవలసియున్నది. అక్కడ ప్రవక్త వాక్యము ఉన్నారు. వాక్యము ప్రవక్త వద్దకు వచ్చెను. నీతి యావత్తు నెరవేర్చుట వారికి తగియున్నది.

ఏమి జరిగెను? ఆ తరువాత యోహాను యేసుకు బాప్తిస్మం ఇచ్చెను. ఎందుకనగా యోహాను ప్రవక్త యై ఉండి వాక్యము ఎరిగినవాడై అర్చణ చేయబడకముందు అది కడుగబడవలసి ఉన్నది. అందుచేత యోహాను యేసుకు బాప్తిస్మం ఇచ్చెను.

యోహాను చూసాడు, అతడు చూసాడు… ఇతడే యేసు అని అతనికి ఏలాగు తెలియును? అతడు ఒక పావురమును చూసాడు, దేవుని ఆత్మ చేత అది అతనికి చెప్పబడెను. "ఎవరి మీద దేవుని ఆత్మ దిగి నిలచి యుండుట నీవు చూతువో ఆయనే పరిశుద్దాత్మతోను అగ్నితోను బాప్తిస్మం ఇచ్చును."

GEN 6:14•

EXOD 12:13•

1COR 12:13

 

27నోవాహు చూసాడు మరొక మనిషి చూచుట ఇక్కడ మనము చూచుచున్నాము. అతడు నోవాహు…నోవాహు… దేవుని యొక్క న్యాయము లేక న్యాయ తీర్పు వాక్యమును తృణీకరించిన దుష్టతరమైన వారిపైన నీళ్ళు పోయబడుటను అతడు చూసాడు. నోవాహు అతడు ఒక ప్రవక్త అయి ఉండెను. ఏ విధముగ ఓడను కట్టవలెనో అట్టి దర్శనాన్ని దేవుడు అతనికి ఇచ్చాడు. మరియు దానిని ఏ విధముగా నిర్మాణము చేయవలెను, అది ఏ ఏ విధముగా కట్టవలెనో ఆయన ఇచ్చాడు, ఇందులో ఆ దర్శనం వాక్యమై ఉండి అతడు ఈ ఉగ్రతను చూచి, సిద్ధపాటు మార్గాన్ని ఏలాగు నోవాహు చేసుకోవాలో చూసాడు. ఎల్లప్పుడు కూడ రాబోవుతున్న న్యాయతీర్పుకు ముందు, ఒక సిద్ధపాటు జరుగును, అది ఎల్లప్పుడు దేవుని వాక్యమై ఉండును. దేవుని వాక్యమును కలిపి కడుతున్నప్తుడు అతని యొక్క దర్శనం నిజమని దాన్ని అతడు నమ్మినప్పుడు అపహాస్యకులు మొదలగువారు అతన్ని ఎగతాళి చేసారు. అయితే, నోవాహు ముందుకు చూచి ప్రజలపైకి రావలసిన తీర్పు యొక్క దేవుని న్యాయమును గూర్చి అతడు చూసాడు. మరియు తన సొంత కుటుంబమును రక్షించుటకు అతడు ఓడను కట్టెను.

అతడు చూచినప్పుడు రానున్న దేవుని ఉగ్రతను అతడు చూచెను, దీని నుండి తప్పించుకొనుటకు ప్రజలకై సిద్ధపాటును అతడు చేసియున్నాడు. ఆ విధముగానే బాప్తిస్మం ఇచ్చు యోహాను తప్పించుకొనుటకై ఏర్పాట్లు చేసియున్నాడు. ఆలాగుననే ఈ రోజు కూడ యేసు క్రీస్తురాకడకు ముందుగా పరిశుద్దాత్మ యేసు క్రీస్తు శరీరమును నిర్మాణము చేయుచున్నాడు. మనము అందులోనికి బాప్తిస్మము పొందియున్నాము. మూఢ భక్తి వలన కాదు, సంఘశాఖల వలన కాదు, లేక మన చేతుల కర స్పర్శ వలన కాదు, అయితే దేవుని ఆత్మ వలననే, మనము యేనుక్రీస్తు శరీరములోనికి బాప్తిస్మము పొందియున్నాము. న్యాయ తీర్పులకు నిలబడ గలిగిన కట్టడము, ఎందుకనగా అది ఎప్పుడో తీర్పు తీర్చబడినది. "నేను రక్తమును చూచినప్పుడు మిమ్ములను దాటి పోవుదును." అవును. నోవాహు, చూసాడు, రాబోవుచున్నది అతడు చూసాడు.

EXOD 3:2

 

28మోషేయు చూసాడు, ఒక దినాన అగ్ని స్థంభాన్ని చూసియున్నాడు. అది అతని దృస్టిని ఆకర్షించింది, ఈ గొప్ప వేదాంతి తన యొక్క వేదాంత తర్పీదుతో వాక్యమును గూర్చి తన తల్లి యొక్క ఉపదేశముతోను దాని అంతటితో పారిపోయాడు. ఇశ్రాయేలును అతడు ఏలాగు విడిపించగలడు. అయితే తన మార్గము ద్వారా అతడు అపజయమొందాడు. అతడు ఏమి చేయవలసి ఉన్నది, అతడేమి చేయునో తన యొక్క తల్లి ఎంతో విశదముగా విపులీకరించినప్పుడు, మరియు అతడు ఏమి చేసి ఉ౦డెనో ఎందుకు దేవుడు అతన్ని పెద్ద చేసాడో, అది విన్నప్పుడు … ఈ జ్ఞానమంతా అది ఎంత మంచిది అయినను, అది మంచిదే, అయితే అది ఇంకా బయలుదేరవలసి యున్నది.

అది కేవలం యాంత్రికములు మాత్రమే.

యాంత్రిక వాహనములు నడుపునవి, యాంత్రికము కాదు. బల శక్తి సంబంధమైనవే వాటిని నడిపించును. సంఘమును నడుపునది యంత్రములు కాదు, గమనాత్మక శక్తులు నడుపునది ఈ వాక్యములోనికి వెళ్ళు పరిశుద్ధాత్మయే. అంతా మత వేదాంతాన్ని గ్రీకు అనువాదాన్ని ఉపయోగించునది సెమినెరి కాదు, పరిశుద్దాత్మ బల శక్తి అందులోయున్నది. దాన్ని అగ్ని ముట్టించి, అది జరుగునట్లు చేసి ఈ కాలానికి ఏదైతే వాగ్ధానం చేయబడినదో ఖచ్చితంగా దాన్నే అది జీవింపచేస్తుంది. యాంత్రికము కాదు, గమనాత్మ శక్తులను చేయును, అది యాంత్రికము చేయును, గమనాత్మ శక్తులను చేయును. వాక్యము మరియు ఆత్మ జీవము నిచ్చు ఆ ఒక్కటి అవే.

29ఈ కాలము కొరకు దేవుడు ఏమి వాగ్ధాన౦ చేసాడో, అది నెరవేర్పు కొరకు ఎదురు చూడు, నీవు తప్పక ఆయన వైపు చూడవలెను. వాక్యము ద్వారా మాత్రమే నీవు ఆయనను చూడగలవు, అది ఒక్కటే మార్గము ఆయనవైపు చూచుటకు, వాగ్ధానం చేయబడిన వాక్యము ఈ దినమున నెరవేరవలసి యున్నది. నోవాహు యొక్క కాలము ఈ దినానికి నెరవేరదు, మోషే కాలము మొదలగునవి…, అవి కేవలము పోలిక మాత్రమే.

అయితే ఇప్పుడు మనము ఆనందించుచున్న దేవుడు, వాగ్దానం చేసిన విషయాలు, మనము ఇప్పుడు చూచుచున్న లోకము, నవ్వుచున్న విషయాలు ఈ యొక్క దినాలకు చెందినవి. పాపి యొక్క హృదయాన్ని మార్చగల అది ఎక్కడ నుండి వచ్చెనో అది అతడు, ఎక్కడ నుండి వచ్చాడో ఆ సంఘమును మండించుటకు, అతనికి ఒక సాక్ష్యమిచ్చిన పరిశుద్దాత్మ శక్తి యొక్క ఘనమైన ప్రాముఖ్యత ఈ దినానివి, అది వాక్యములో ఉన్న గమనాత్మక శక్తి.

ISA 5:22

 

30నేను తరుచుగా చెప్పుకున్నట్టు రెండు తరగతుల వారిని నేను గమనిస్తున్నాను. అందులో ఒకరు మూలాధారమైన సిద్ధాంతం గలవారు, క్రీస్తులో అతడు ఎక్కడ ఉన్నారో, వాక్యాన్ని బట్టి, స్థానాన్ని బట్టి అతడెరిగిన వాడు. అయితే అతడు ఏమి చేయుచున్నాడో దాని మీద ఎటువంటి విశ్వాసం ఉండదు, అతడు పరిశుద్దాత్మను పొందలేదు. ఆ తరువాత పెంతెకొస్తు వారు, వారిలో అనేకులు పరిశుద్దాత్మను పొందుకొంటారు. అయితే వారెవరో వారికి తెలియదు. ఈ విధముగా ఉంటుంది. ఒక మనుష్యుడు బ్యాంకులో డబ్బు ఉంచుకొని చెక్కు వ్రాయుట చేతకాని వాడు, మరియొకడు చెక్కు వ్రాయగలడు గాని, బ్యాంకులో డబ్బు లేదు, వారిద్దరిని ఏకము చేయగలిగితే పెంతెకొస్తు ఎవ్వరనేది నీవు గ్రహింపచేయ గలిగితే నిండైన దేవుని వాక్యము అను నిజమైన దాని యొద్దకు తిరిగి వచ్చి ఆ పరిశుద్దాత్మ బాప్తిస్మం వలన తిరిగి వస్తే ఒక కొత్త పెంతెకొస్తు ఉజ్జీవం ద్వారా తిరిగి అది లోకమును మండించును. సహోదరి, సహోదరుడా… అది నిజము. సుమా

"భూదిగంత నివాసులారా నా వైపు చూడుడి, నేనే దేవుడను నేను తప్ప మరొకరు లేరు." ఓ, మనము కమ్యూనిజమును వివేచింపగలము, ప్రతీ దాన్ని మనము వివేచింపగలము, అయితే దేవుని ద్వారా ఈ దినమునకు పంచిపెట్టిన వాక్య భాగమును వినియోగించగలుగుచున్నామా? అని ఆశ్చర్యపడుచున్నాను.

EXOD 3:7,8,12,14

 

31అవును.

తిరిగి మోషే యొద్దకు అందును గూర్చి అన్ని యాంత్రికములు అతనికి ఉన్నవి. అయితే అగ్ని పొదలో మానవ స్వరంతో ఒక మనుష్యుడు, మాట్లాడుట అతడు విన్నాడు. ఒక మండుచున్న అగ్ని స్థంభము పొద వెనుక "ఉన్న వాడను, అను వాడను" అనునది మానవ స్వరములో చెప్పబడెను. "నేను నా ప్రజల మూల్గులను విన్నాను. నా మాటలు నేను జ్ఞాపకము చేసికొనుచున్నాను. వారిని విడిపించుటకు నేను దిగి వచ్చి యున్నాను, అది చేయుటకు నేను నిన్ను పంపుచున్నాను". అది, అతడు వెంటనే అతడెంతో మార్పు చెందిన వాడాయెను, అతనికి యాంత్రికాలు ఉన్నవి, అయితే అందులో అతనికి గమనాత్మక శక్తులు కావలెను. "నిశ్చయముగా నీతో ఉందును". మోషే వెళ్ళుటకు అది చాలును. అతడు చూసాడు, అతడు మండుచున్న పొదలో చూసాడు…..

NUM 21:9•

MATT 14:26•

MARK 6:48•

JOHN 6:19•

JOHN 11:1,17

 

32అటు తరువాత యాత్రలో ఇశ్రాయేలీయులు వచ్చుచుండుట మనము చూన్తున్నాము. వారింకా చూసారు వారు, ఇత్తడి సర్పమును చూసారు. ఈ ఇత్తడి సర్పములో వారి యొక్క వ్యాధి నిమిత్తము అది ఉంచబడినది. వారు పాపము చేసారు, వారు ఒక ఇత్తడి సర్పమును చూసారు, ఈ యొక్క ఇత్తడి సర్పములో యేసుక్రీస్తు పైన దేవుడు పెట్టనైయున్న తీర్పును ఒక పోలికగా చూసారు. నేర స్థలమును నిరుపయోగులమైన మన అందరి కొరకై యేసుక్రీస్తు పైన దేవుడు పెట్టిన న్యాయ తీర్పును పోలికగా వారు చూసారు…,అదే వారు చూసినది.

అక్కడ ఒకసారి శిష్యులు ఇబ్బందిలో ఉండుట ఆయన చూసారు, వారు ఏమి చూసారు? వారి సహాయమును వారు చూసారు, ఆయన ద్వారా వచ్చు సమయమును వారు చూసారు.

మార్త ఒక దినాన కుటుంబములో మరణము కలిగి ఉన్నప్పుడు ఆమె యొక్క సొంత సహోదరుడు, ఆమెకున్న ఒక్కగానొక్క సహోదరుడు చనిపోయాడు. మరణ సమయాల్లో ఆమె ఆయన వైపు చూచినది. ఆమె పునరుత్థానమును, జీవమును చూచినది. ఆమె ఆయనలో చూచినది, ఆమెను ఆయన లెక్కచేయకున్నట్టుగా ఉన్నది, ఆమె సహోదరుడు చనిపోయినప్పుడు ఆయన ఆ సమయంలో అక్కడ లేడు. మొదటిగా ఏమి జరిగినదో తెలిసినదా? అకస్మాత్తుగా ఆయన కనిపించాడు. ఆ అబ్బాయి చనిపోయి పొతిపెట్టబడి నాలుగు దినములు అయిన తరువాత అతడు ఎప్పుడో కుళ్ళి పోయిన తరువాత ఆయన అగుపించాడు.

DEUT 8:3•

2KGS 4:35•

MATT 4:4•

LUKE 4:4•

JOHN 11:25

 

33ఆయనలో ఒక ప్రత్యేకమైనది కలదని మార్తకు తెలుసును. ఆమె లేఖనము చదివినది. ఆయన దేవుని కుమారుడని, దేవుడు ప్రత్యక్షమైన ఇమ్మానుయేలు ఆయనే అని, ఆమె నమ్మి ఉన్నది.

ఆయన దేవుని యొక్క ప్రతినిధి అని ఆమెకు తెలుసు, ఆ కాలానికి ఏలియా వాక్యము యొక్క కొంత బాగమై ఉండి, చనిపోయిన బిడ్డను లేపగలిగినట్లు అయితే అది ఆమె ఎరిగి ఉన్నది. క్రీస్తు వాక్యము యొక్క పరిపూర్ణతై ఉన్నాడు. కనుక తన సహోదరుని ఆయన లేపగలిగిన శక్తిని కలిగి ఉన్నాడని ఆమె ఎరిగి ఉండెను. మరియు మరణ ఘడియల్లో, విపత్తులో ఆమె ఆయన వద్దకు వెళ్ళినప్పుడు ఆమె ఆయన వైపు చూడగా ఆమె పునరుత్థానమును జీవమును పొందెను. ఆయనను విమర్శ చేయడానికి ఆయన వైపు చూడలేదు, ఆయన ఎందుకు రాలేదు అని అడుగుటకు లేక ప్రశ్నించుటకు ఆయన వద్దకు వెళ్ళలేదు.

నీవెన్నడు దేవుని వాక్యమును ప్రశ్నించకూడదు అదే సర్వమానవాళినంతా ఇబ్బందిలో పడుటకు కారణమైనది. దేవుడు ఆయన వాక్యమునంతా కాపాడు కుంటాడా లేదా అని అవ్వ ప్రశ్నించగా అప్పుడు అవిధముగా జరిగినది, ప్రియులారా ఈ రాత్రి నేను చెబుతున్నాను. దేవుడు వ్రాసిన ప్రతీ వాక్యమును నమ్మవలసిన సమయము వచ్చినది. దాని యొక్క ప్రతీ చిన్న ముక్క కూడ సత్యమై ఉన్నది." మనుష్యుడు రొట్టె వలన మాత్రమే కాదు గాని దేవుని నోట నుండి వచ్చు ప్రతీ మాట వలన జీవించును."

LUKE 23:42,43•

JOHN 6:35,48

 

34ఇప్పుడు, మరియ జీవమును, పునరుత్థానమును కనుగొన్నట్లు మనమిప్పుడు చూసాము. ఆ విధముగానే చిన్న యాజకుడైన ఒక రహస్య విశ్వాసియైన యాయీరు కూడ అతడు యేసును చూచి, ఆయన వైపు చూచినప్పుడు, పునరుత్థానము, జీవమును కనుగొనెను. ఒకానొక దినమున ఆకలితో ఉన్న ప్రజలు ఆయనవైపు చూసారు, పోషణాధారమైన ఆహారమును, రొట్టెను వారు కనుగొన్నారు. ఈ దినమున ఆకలితో ఉన్నవారు జీవపు రొట్టెను కనుగొనుటకు పోలికై ఉన్నది. మూఢ నమ్మకాన్ని కాదు, క్రీస్తును నీవు కనుగొన్నప్పుడు, జీవపు రొట్టెను నీవు కనుగొనినప్పుడు, నీవు వ్యవన్థాపకుని కనుగొన్నావు, దిద్దుబాటు కర్తను నీవు కనుగొన్నావు, నీవు నీ జీవమును కనుగొంటావు, నీవు జీవమును కనుగొంటావు.

నిరాశ గడియల్లో చనిపోతున్న దొంగ ఆయనను చూసెను. అతడు ఏమి కనుగొన్నాడు? అతని క్షమాపణను అతడు కనుగొన్నాడు. ఎవరి వైపు అతడు చూడగలిగెను? రోమా ప్రభుత్వము అతనిని క్షమించదు, ఎవ్వరు కూడ అతనిని క్షమించరు. అయితే అతని దుర్ధశలో యేసు వైపు చూచెను. అతడిని క్షమించగలిగిన ఒకరిని అతడు కనుగొన్నాడు.

నా సహోదరి …నా సహోరుడా, ఈ రాత్రి అతనివలె, ఈ దినమందు అతని వలె శిక్ష యొక్క త్రాసు నందు నీవు వేలాడుతుంటే నీవు ఒక నులివెచ్చని సంఘ సభ్యునిగా లేక నులివెచ్చని పెంతెకొస్తుగా లేక అది ఏదైనప్పటికి, నీవు ఎరిగి ఈ రాత్రి చనిపోతే నీవు ఎక్కడికి వెళ్ళి పోతావో నీకు తెలుసు, ఈ రాత్రి ఆయన వైపు చూడుము, నిన్ను విడిపించగలవాడు ఆయన ఒక్కడే, ఈ రాత్రి నీకు సభ్యత్వం మాత్రమే ఉన్నట్టు అయితే మానవ హృదయంలో నివసించుటకు క్రీస్తు యొక్క పురుద్ధానమేదో అర్ధం నాకు తెలియకపోతే ఆయన వైపు చూడుము. ఆయన దేవుడు ఆయన మాత్రమే సిలువలో వ్రేలాడుతున్న ఆ అభాగ్యుడైన పాప రోగముతో నిండి ఉన్న దొంగకు చేసినట్టుగా లేక దొంగ పొంది ఉన్నట్టుగా నీవు క్షమాపణ పొందుతావు.

HEB 13:8

 

35వ్యాధిగ్రస్తులు ఆయనవైపు చూచిరి, వారేమి కనుగొన్నారు? ఈ రాత్రి వ్యాధి గ్రస్తులు ఇంకా ఆయన వైపు చూడగలిగినట్లయితే, వారు స్వస్థత పొందగలరు, ఇత్తడి సర్బములో ఏది పోలికయై ఉన్నదో ఆయననే అది వారు కనుగొన్నారు. వారు స్వస్థపరచువానిని కనుగొన్నారు, అది పోలికయైనట్లయితే ఇది ముందు ఫోలికై ఉన్నది. గ్రుడ్డి వాడు దృష్టి పొందెను. ఆయన నిన్న, నేడు, యుగ యుగములు ఒక్కటే రీతిగా ఉన్నాడు. హెబ్రీయులు 13:8.

పద్యకారుడు ఒకప్పుడు చూసాడు, అతడు చూడగలిగినది చూసెను. గ్రుడ్డివాడైన ఫాన్నీ క్రాస్‌ బి ఒకసారి చూసాడు. ఆమె ఏమి చూడగలిగినదో అది చూచుటకు చూచెను, అంధురాలైయిండి, ఇదిగో ఆమె జవాబు.

నా సమస్త ఆదరణకు సెలయేరు నీవే,

నా ప్రాణము కంటే ప్రాముఖ్యుడవు నీవే,

నీ కంటే భూమి మీద నాకెవ్వరు లేరు?

లేక పరలోకంలో నీకంటే మరి ఎవరు నాకు లేరు,

ఎడ్డీ పెర్రోనట్‌ ఒకసారి తన పాటలు అమ్ముడు పోకుండినప్పుడు ఏమి చెయ్యాలో తెలియలేదు. తిరిగి తన కార్యాలయానికి వెళ్ళి పోయాడు. పరిశుద్దాత్మ ప్రేరణ అతనిపైకి దిగి వచ్చినది. తటాలున కలము తీసుకొని ఆయనవైపు చూసాడు. కలములో ఆయనను చూసాడు. కలమును దించి పాటను వ్రాసాడు.

యేసు నామము బలమునకే,

దూతలు సాగిలపడుదురు గాక,

రాజు కిరీటమును తెచ్చి అందరికి

ప్రభువగు ఆయనకు పట్టము కట్టుదురు గాక…

అది ఆయనలో చూచినది ఓహో…!

JOHN 1:47

 

36పేతురు స్థానికుడు చేపలు పట్టువాడు… అతని సహోదరుడైన ఆంద్రెయ బాప్తిస్మమిచ్చు యోహాను యొక్క ఉజ్జీవ సభకు హాజరు అవుతుండేవాడు. మెస్సియా ఏలాగు ఉండునో అని వారు మాట్లాడుకుంటూ తర్కిన్చుచుచుండెడి వాడు. దాన్ని గూర్చి వాళ్ళ నాన్న అతనికి ఈలాగు చెప్పాడు. మెస్సియా రాక ముందు అనేక మతావేశపరులు వస్తారు, అయితే "నీవు ఆయనను తెలుసుకుంటావు, ఆయన ప్రవక్త అవుతాడు, అతను ప్రవక్తయై ఉండును అని, ప్రభువు చెప్పాడు. మన ప్రవక్తలను నమ్ముటకు మనము గ్రహింపును కలిగి ఉంటాము".

చిట్ట చివరకు ఒకరోజు ఆంద్రేయ తనకున్న నిండైన దృడ విశ్వాశముతో ఆయన బోధను వినటానికి చివరికి పేతురును పట్టుకున్నాడు. ఎందుకంటే ఒకరోజు ఉదయ వేళ తీరాన ఉన్న అక్కడ కూటమునకు అతడు వెళ్ళనైయుండెను. దేవుని యొక్క వాక్యము వినటానికి అతడు అక్కడకు వెళ్ళిపోయాడు. యేసు క్రీస్తు సన్నిధానమునకు అతడు నడుచుచు వెళ్ళినప్పుడు ఆయన చూచినప్పుడు పేతురు ఏమి చూసాడు? ఆయన చెప్పాడు నిజముగా, ఆయన ఈ విధముగా చెప్పియున్నాడు, "నీ పేరు సీమోను, నీవు యోనా కుమారుడవు" అని, చెప్పాడు. అది నిరంతరముగా అయి పోయినది. దేవుని యొక్క వాక్యము నెరవేర్చబడుట అతడు ఎరిగి యున్నాడు.

JOHN 1:42,48

 

37ఒకానొక సమయమందు పాతనిబంధనలో ఒక నిజమైన విశ్వాసియగు నతానియేలు మెస్సియా రాకకై ఎదురుచూచుచున్నాడు. అతని స్నేహితుడైన ఫిలిప్పు ద్వారా అతడు ఆయనయొద్దకు తీసుకుని రాబడ్డాడు. యేసు వేదిక యొద్ద నిలబడి, మొద్దు పెట్టెయగు అది ఏమైనప్పటికి అక్కడ నిలబడి రోగులకొరకై ప్రార్దిస్తున్నాడు. నతానియేలు ప్రార్ధన వరునలోనికి వచ్చినప్పుడు ప్రధమముగా ఆయన వైపు చూసాడు, అతడు వెనుక నుండి ఒక స్వరము వచ్చుట విన్నాడు. "ఇదిగో ఈయన నిజముగా ఇశ్రాయేలీయుడు, ఇతని యందు ఏకపటమును లేదు," అను ఒక స్వరము విన్నాడు.

"రబ్బీ, నీవు ఎప్పుడు నన్ను ఎరిగి యున్నావు? నీవు ఎప్పుడు నన్ను చూసావు?" అని అతడు చెప్పాడు.

"ఫిలిప్పు నిన్ను పిలువకముందే నీవు ఆ చెట్టు కింద ఉన్నప్పుడు, నేను నిన్ను చూసాను." అని అతడు అన్నాడు.

LUKE 17:28•

JOHN 1:49

 

38అతడు చూచిన దానిని బట్టి, నతానియేలు ఏమి ఒప్పుకున్నాడు? అతడు ఏమని చెప్పాడు? "నీవు క్రీస్తువు ఇశ్రాయేలు యొక్క రాజువు. నీవు…,నీవు దేవుని కుమారుడవు." ఆ దినము కొరకు ఉన్నటు వంటి నిజమైన దేవుని వాక్యమును, అతడు చూచినప్పుడు అతడు చూచినది అదే. ప్రవక్త లేకుండా నాలుగు వందల సంవత్సరములు అతని హృదయంలో ఉన్నటు వంటి తలంపునే ఆయన ఎరుగుట. మరియు అతడు ఏమి చేసినది ఎరుగుట, ఆయన మెస్సియ గాక మరొకరై యుండరు, అని అతడు తెలుసుకున్నాడు. మనకది లేదు, వారికది లేదు, అది వాగ్ధానం చేయబడినది. కాలము సమీపమై యున్నది అని ప్రతీ ఒక్కరూ ఎరిగి యున్నారు.

కనుక ఈ రోజు అటువంటి విషయం మనము ఎరిగియున్నామా? యేసు ఈ విషయాలను వాగ్దానం చేసియున్నాడని మనకు తెలుసు. ఆయన, చెప్పియున్నాడు, "లోతు దినాలలో ఉన్నరీతిగా, మనుష్యకుమారుని రాకడయందును ఉండును," ఆయన వచ్చినప్పుడు ఈ విధంగా ఉండును.

JOHN 7:20

 

39ఈ సంగతులు జరుగుట మనము చూస్తున్నాము. నీవు చూస్తున్నప్పుడు ఏమి చూచి ఉన్నావు? నీవు చూచుచున్నావా? కల్పిత గాధలుగా నీవు అనుకుంటున్నావా? లేదా ఒక విధముగా మనస్సును చదువుట లేక అక్కడ వారు చేసినట్లుగా నీవేమని తలంచుచున్నావు?

పరిసయ్యులు ఆయన వైపు చూసారు, వారేమన్నారు? "ఇతనికి దయ్యము పట్టినది". అని వారన్నారు, ఒకే వ్యక్తిని ఒకే రకమైన ప్రజలు, మానవులు, ఒకరు "వాగ్దానం చేయబడిన ప్రత్యక్షమగు వాక్యమగు దేవుని కుమారునిగా ఒకరు చూసారు." మిగతా వారు దయ్యం అని అన్నారు.

నీవేమి చూచుచున్నావు? ఈ కడవరి దినాలలో ఆయన ఏమని వాగ్దానం చేసియున్నాడో ఆ వాగ్దానం ఆయన నెరవేర్చుచూ, భవనంలోకి పరిశుద్దాత్మ శక్తి తీసుకు వచ్చుట నీవు చూచినప్పుడు, దేని వైపు నీవు చూస్తున్నావు? దేవుని యొక్క వాక్యము ప్రత్యక్షమగుట నీవు చూచుచున్నావా? అలాగైతే అది దేవుని యొక్క పరిశుద్దాత్మ అవునండి.

JOHN 4:7

 

40అభిషేకించబడిన వాగ్దానం శరీరధారియైనప్పుడు, అతడు దేనికై బ్రతుకుచున్నాడో అట్టి వాగ్ధాన వాక్యమును నతానియేలు చూసాడు. ప్రవక్తయైన మోషే అలాగని చెప్పెను. అది అభిషేకించబడిన మోషే ఆ వాక్యమును వాగ్ధానం చేసెను.

ఒక దినాన బావి యొద్ద ఉన్న స్త్రీ. అనేక మంది ఆయనను తిరస్కరించారు, పరిసయ్యులు, సద్దూకయ్యులు, ఆయనను దెయ్యం అని పిలిచారు. ఆయన దీనిని, జోష్యము చెప్పు దాని వలన దీనిని చెప్పాడు అని అన్నారు. ఆయన ఒక చెడ్డ ఆత్మ. ఆయన పిచ్చి పట్టినవాడు, ఆయన వెళ్ళుటకు ఎక్కడ స్థలము లేదు. అదే ఆయనలో ఉన్నటువంటి ఇబ్బంది. ఆయన ఒక దుర్మార్గుడు అని వారన్నారు.

JOHN 4:5,7,9,10

 

41ఏమి జరిగినది? ఏమి జరిగినది?

సుకారను పట్టణమునకు సమరయ గుండా ఆయన వెళ్ళుచుండెను. ఒక రోజు ఆయన అక్కడకు వెళ్ళినప్పుడు అక్కడ ఆయన నలుదిక్కులు కనబడునట్లు కూర్చొన్నాడు. ఒక స్త్రీ నీళ్ళు తెచ్చుకొనుటకై అక్కడకు వచ్చుచున్నది. ఆమె మాటను అతడు విన్నాడు. "ఓ స్త్రీ నాకు దాహమునకు ఇమ్ము" అను స్వరమును ఆ….సమయంలో ఆమె వింటున్నది. ఆమె ఆ విధంగా అక్కడ ఆయనను చూచినది. ఆమె ఏమి చూచినది .

మొదటిగా ఆమె అర్ధము చేసుకొనలేక పోయినది, ఆమె ఆయనను ప్రశ్నించింది… "సమరయులమైన మమ్ములను అడుకుటకు యూదులైన మీరు ఆవిధంగా అడుగుట ఆచారము కాదే" అని, ఆమె అన్నది.

అయితే "ఆ స్తీ తో ఆయన అన్నాడు, నీతో మాట్లాడుతున్నది ఎవరో నీవు ఎరిగి యుంటే …"

MARK 16:17•

JOHN 4:16-19,25•

JOHN 14:12•

REV 17:8

 

42జ్ఞాపకముంచుకో, అక్కడ కొద్ది వెలుగు ఉన్నది. జగదుత్పత్తి మొదలుకొని ఏర్పరచుకొనిన విత్తనము యొక్క జీవము అక్కడ ఉన్నది. ఆమె దాని కొరకై ఎదురు చూచుచున్నది. ఆమె వారు చెప్పు వారు చెప్పుచున్నటువంటి అన్ని విధానాలైన వేదాంతాన్ని బట్టి విసుగు చెంది వ్యధ చెందింది. అయితే ఆమె ఒక దాని కొరకు కని పెట్టుచున్నది. ఎందుకనగా అమె మెస్సియా వచ్చునని ఎరిగి యున్నది. ఆయన అడిగాడు. "వెళ్ళి నీ భర్తను ఇక్కడకు తీసుకు రా.."

"నాకు ఎవరూ లేరు" అని, ఆమె అన్నది.

"నీవు సత్యమునే చెప్పితివి, నీకు ఐదుగురు పెనిమిటిలు ఉన్నారు". అని, చెప్పాడు.

తక్షణమే ఆ చిన్న విత్తనము జీవము పొందుకున్నది, ఆమె ఏమి చూచినది? ఒక మనుష్యునిలో మెస్సియా యొక్క నూచనను చూచినది. ప్రత్యక్షపరచబడిన వాగ్దాన వాక్యమును ఆమె చూచినది. ఆమె అన్నది "అయ్యా …నీవు ప్రవక్తవని నేననుకొంటున్నాను. సంవత్సరాలు తరబడి మాకు ప్రవక్తగా ఏ ఒక్కరు లేరు. మెస్సియా వచ్చునని ఆయన వచ్చునప్పుడు ఇది మాకు తెలియపరచునని మాకు వాగ్దానం చేయబడెనని" మాకు తెలుసు. అది ఆయన చేయునని ఆమె చెప్పినది. చూసారా..ఆమె ఏమి చూచినది? ఆ దినానికి వాగ్దానం చేయబడి బయలు పరచబడిన ఆయన సూచనను ఆమె చూచినది.

"నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు జరుగును", అనునది సంఘమునకు ఈదినమున వాగ్దానం చేయబడిన పరిశుద్దాత్మ పునరుత్తాన శక్తియై ఉన్నది. "నేను చేయు కార్యములు మీరును. చేతురు".

మీరు చూస్తున్నప్పుడు ఏమి చూచుచున్నారు?

MATT 19:26•

MARK 9:23•

MARK 10:27

 

43మీరు ఆదివారమున ఆలయానికి వెళ్ళినప్పుడు ఆ విధముగా వెళ్ళుట అనేది మంచి ఆర్గాన్‌ని చూచుటకా? మంచిగా వస్త్రములను ధరించిన బోధకులను చూచుటకా? వస్త్రధారణనైన సంగీత కచేరి చూచుటకా? రంగులు పూసుకున్న స్త్రీలను చూచుటకా? దేనిని చూచుట కొరకు? సంఘములో ఒక విధమైన సమూహమునా? నీవు దానికి సంబంధించిన వాడవు …,దీనికి సంబంధించిన వాడవు. అవునా? దేని కొరకై నీవు చూస్తున్నావో దానికొరకై నీవు చూస్తావు.

ఇటు విను ఇది ఆశ్చర్యం ఏమీ కాదు, నీవు సమతలమైన సువార్తను తీసుకొని వెళ్ళినప్పుడు పరిశుద్ధాత్మ వచ్చి ప్రాతఃకాల గుంపు వారి మధ్య దాన్ని బయలుపరచును, అది నీకు కొత్తగా యుంటున్నది. నీవు అది నమ్ముటకు కష్టంగా ఉంటుంది.

నేను యోసేపును గూర్చి గత రాత్రి చెప్పినట్లుగా మరియ గర్భవతియైనదని ఆలోచించుటకు అతనికెంతో కష్టతరముగా ఉన్నది. అటువంటి చిన్న పరిశుద్ధురాలు ఆమె ఏలాగు ఆలాగు కాగలదు. గాబ్రియేలు ఆమెను దర్శించెనని ఆమె చెప్పినది. అయితే అదెంతో అసాధారణమైనది. అలాంటి విషయం ఎంతో అసాధారణమైనది. మునుపు ఎన్నడూ ఆ విధముగా ఎప్పుడూ జరుగలేదు, అది అప్పుడే…

అక్కడే దేవుడు నివాసం ఉ౦డునది, అసాధారణమైన దానిలో ఆయన ఉండును. ప్రకృతి సంబంధమైన మనుష్యునికి …నమ్ము వారికైతే ఆయన నిన్న, నేడు, యుగ యుగములు ఒక్కటేరీతిగా ఉన్నాడు. సమస్తమును సాధ్యమే ఆయన వాగ్దానం చేసిన ప్రతీ మాట నెరవేర్చబడును. అది ఆయనను దేవునిగా చేయుట అసాధారణమైన విషయం. ఆయన అసాధారణమైన దానిగుండా వెళ్ళును. ప్రజలకు అన్నీ కూడ ఆయన అసాధారణమైనవిగా చేయును, అవునండి, మంచిది.

ఆ స్త్రీ ఆయనవైపు చూచినది, దేవుడు శరీరములో బయలుపరచుకొనుటకు మెస్సియా సూచనను ఆమె చూసినది. దేవుడు శరీరములో బయలుపరచుకొనుటకు మెస్పియా సూచనను ఆమె ధృడముగా మరి నిశ్చయంగా చూసినది, అక్కడ ఉన్నటువంటి అనేకమైన ప్రజలు ఆయనను చూసారు. వారికి ఆయనను గూర్చి ఏమియు కనుపరచబడలేదు. ఆ విధముగా చాలా మందికి…

LUKE 24:49•

ACTS 1:8

 

44నోవాహూ దినాలలో అవిశ్వాసులు వారేమి చూసారు? ఒక మూడుడిగా పిలిచారు.. పడవను తప్పుడుగా నడిపించుట. అదే వారందరు చూసారు. అదే పడవ సర్వశక్తిమంతుడైన దేవుని దర్శనం వలన కట్టబడినది. దేని మీదనైతే అతడు జాగ్రత్తను కలిగి ఉన్నాడో, అతడు బోధిస్తున్న వర్తమానము, తన వర్తమానము ద్వారానే అతడు కడుతున్నాడు, దాని వలననే అతడు నీతిమంతుడని ఎదురు చూచుచున్నాదని సాక్ష్యమిచ్చుచున్నాడు. అతడు ఏమి బోధ చేసాడో దాని వలన అతడు జీవించాడు.

అదే ఈ దినమున మనము చేయవలసినది. పరిశుద్దాత్మను ఒకరు పొందేవరకు కూడ బోధించుటకు అతనికి హక్కులేదు. అవును వేదాంతులు గణితశాస్త్రజ్ఞలు మొదలగువారు, అది అంతా నీకు వివరించగలరు. అయితే ఒకరు ఎడారి ఆవలకు వెళ్ళనట్లయితే ఆ యొక్క పవిత్ర స్థలము యొద్దకు వెళ్ళి, మోషేవలె దేవుని కలుసుకొంటే, ఏ మనుష్యుడు అతని నుండి దానిని తీసివేయలేడు. అది అక్కడ ఉన్నది. ఆయనే అని అతనికి తెలుసు, దాన్ని గూర్చి మరెవ్వరు ఆయనకు చెప్పలేదు. అతను అక్కడ ఉన్నాడు.

ఆ కారణము చేతనే "మీరు యెరుషలేమునకు వెళ్ళి పైనుండి శక్తి పొందు వరకు, మీరు వెళ్ళి బోధ చేయవద్దు, అప్పుడు మీరు నాకు శిష్యులైయుందురు" అని, యేసు ఆయన శిష్యులకు ఆజ్ఞ ఇచ్చెను. అది వారు చూచినది.

45నోవాహును వారేమి చూడలేదు, అది చేసిన తరువాత వారేమి చూసారు? దేవుని యొక్క వాక్యమును నిరాకరించారు. వారి మీదికి వారే న్యాయ తీర్పు తెచ్చుకున్నారు, అది ఖచ్చితము, సహోదరుడు జాక్‌ మోర్‌ తో కలసి నేను చెబుతున్నాను. అతడిని నిర్వచించుట కాదు, అయితే ఇది చెబుతున్నాను. ఇది సమయానుకూలమని తలస్తున్నాను. కాబట్టి జాక్‌ మూర్‌ "దేవుడు అమెరికాను కాల్చివేసి ముంచి వేయకపోతే, ఆయన సొదొమ, గొమొర్రాలను లేపి క్షమాపణ అడగవలసి వుంటుంది" అని, అన్నాడు. అది సత్యము. దేవుడు న్యాయవంతుడు ఆయన న్యాయ ఫలమిచ్చును. ఆయన వాక్యమునకు వ్యతిరేకమైన లోకకార్యాలనుబట్టి ఆయన తప్పకుండా ఈ దినాన లోకానికి తీర్పు తీర్చును.

మనకెన్ని సభలు ఉన్నవని కాదు, మత సంబంధమైన ఎన్ని కూటములు ఉన్నవని కాదు. అది కాదు. ఈ వాక్యము…

46చూడు యేసు భూమి మీదకి వచ్చినప్పుడు…యేసు భూమి మీదకి వచ్చిన సమయం కంటే మరి ఘనమైన మత సంబంధ సమయాలు లేవు. ప్రతీది కూడ మతముతోను మత పారం పర్యాచారముల తోను మ్రింగివేయబడి ఉండెను" అంతా తప్పుడువే.

అలాగునే చిన్న బట్టతల బోధకుడైన ఆమోసు కాలంలో అతడెక్కడనుండి వచ్చెనో మనకు తెలీదు కొండ ప్రక్కకు వెళ్లి సమరయ వైపు చూచినప్పుడు, అతని చిన్న కళ్ళు చిట్లించుకున్నాడు. ఫీనిక్స్‌లో ఎలాగో అలాగే అది పెద్ద యాత్ర నగరము, అది ఎంత అందంగా ఉంటుందో. ప్రపంచమందలి అనేకులైన ప్రజలు వచ్చెదరు…ఓ…ప్రతీది కూడా జరుగుతూ ఉండును. రాత్రి పూట వినోదశాలలు, నిజమైన ఉల్లాస సమయాలు జీవించు స్థలమే అని వారు అంటారు.

అయితే ఈ చిన్న వ్యవసాయ కుర్రవాడు పరిశుద్ధాత్మతో తాకబడి అక్కడకు వచ్చాడు, ముందుగా వెళ్ళిపోయి కూటము కొరకు ఏర్పాటు చేయువారు ఎవ్వరూ లేరు. అతనికి ఎటువంటి గురుతులు లేవు, అతనితో కలసిపోయే సంఘశాఖలు లేవు లేక అతనిని ఆదుకొనే వారు ఎవ్వరు లేరు. అయితే అతడు కొండ ప్రక్కగా వెళ్ళి తన చిన్న కళ్ళను ముడుచుకొని, ఆ నగరం వైపు చూస్తున్నాడు. వారిలో ఇతరులు ఎవ్వరు చూడనిది ఒకటి చూసాడు…అందరు కూడ ఉల్లాస సరసాలను చూసారు, అయితే తీర్పు కోసం కాచుకొనియున్న దేవుని న్యాయ తీర్పును అతడు చూసాడు, దానికి వ్యతిరేకంగా అతడు ప్రవచించాడు. వారతన్ని పిచ్చివాడు అని పిలిచారు. అయితే పదకొండు సంవత్సరముల తరువాత అతడు ఏ విధంగా చెప్పియున్నాడో అది ఆ విధంగా జరిగియున్నది.

HEB 13:8

 

47సంఘము ఈ దినమున ఏ విధముగా కొనసాగుతుందో ప్రజలు అదే పద్ధతిలో కొనసాగితే ఒక మనిషి భవిష్యత్‌లో ఆశీర్వాదాలు చూడగలడా ? న్యాయతీర్పును చెప్పుచున్నాను. అంతే ఆయన వాక్యమును నిరాకరించినందుకు న్యాయాధిపతియైన దేవుడు తీర్పును కోరును. ఆయన వచ్చి మన యెదుటనే దానిని గుర్తింపు చేసి, దాన్ని మంచిగా సరి చేయును, అయితే న్యాయవంతుడైన దేవుడు అన్ని కాలాల్లోను ఆయన ప్రణాళకను మార్చడు. ఆయన నిన్న, నేడు, యుగ యుగములు ఒక్కటే రీతిగా ఉన్నాడు, అన్నిటీలో ఆయన ఒక్కటే రీతిగా ఉన్నాడు. ఆయన మార్గాలు ఒక్కటే. ఆయన వాక్యము ఒక్కటే, అన్నిటిలో ఆయన ఒక్కటే. ఒకరు పశ్చాత్తాపము పొందితే ఆయన కరుణా సంపన్నుడు, అయితే నీవు పశ్చాత్తాపము పొందకపోతే తీర్పు నిన్ను వెంటాడుతుంది.

MATT 27:54•

MARK 15:39•

LUKE 16:23

 

48ఫరో, అతడు చూచినప్పుడు మోషేను మతావేశపరుడుగా పిలువబడేవానిగా, మతావేశపరుడుగా పిలువబడే ప్రవక్తగా, అనేకులు చెప్పుకునేవానిగా , అంతే అతడాలాగు చూసాడు, అయితే, దేవుని హస్తము మోషే మీద ఉండుట ఇశ్రాయేలీయులు చూసారు. అవునండీ,

ధనవంతుడు కార్యరూపము దాల్బే శక్తిని చూసాడు. అయితే అతని సమస్తము అతడు దానితో వెళ్ళ గలిగినంత పెద్దదిగా ఉన్నది. అతనిని తదుపరి చూపేది… నరకములో నుండి చూసాడు. అది ఖచ్చితము. అతనికి తీర్చు వచ్చినది. అది తరువాత సమయం, అతడు చూచునది, ఈ దినమున అనేకమంది అలాగే ఉంటున్నది.

వారు యేసును సిలువ వేయునప్పుడు ఒకసారి రోమా సైనికుడు ఒకసారి చూసాడు, ఆయన ఏమి చేసాడో చూడాలని చూసాడు, అయితే అప్పటికి ఆలస్యం అయిపోయినది.. స్నేహితులారా…,అమెరికా కూడ అదే చేయబోతున్నది. వారు ఒకని చూడబోతున్నారు. "నిజముగా దేవుని కుమారుడని" చెప్పబోతున్నారు. అయితే అది ఎంతో ఆలస్యం అయి పోతున్నది, వారు నవ్వి ఆఖరిగా ఎగతాళి చేసారు. అప్పుడతడు అతడెక్కడ రక్షింపబడవలెనో కేకలు …కేవలం చూచుట మాత్రమే జరిగెను, అయితే అది అలస్యం అయిపోయినది. జీవాధిపతిని వారు సిలువవేసారు. ఈ రోజు ప్రజలు చాలా సార్లు యేసు క్రీస్తును వారి హృదయం గుండా తృణీకరిస్తారు. వారి మధ్యనే సాక్షాత్తుగా ఆయన ఎవరు అనేది విశదముగా బుజువు చేయబడినప్పటికి కూడ అలా చేస్తారు. అవునండీ.

LUKE 23:4•

JOHN 18:38

 

49పిలాతు ఒక రోజు చూసాడు. పశ్చాతాపపడ్డాడు, అయితే అతని రాజకీయాలు ఎంతో పెద్దవి, అతడు నిలబడలేకపోయాడు. లూధర్‌ ఒక చూపు చూసాడు, అతడు నీతిమత్వమును చూసాడు, దానితో అతడు వెళ్ళిపోయాడు. ఆ తరువాత వారు సంస్థగా మారారు. వెస్లీ వచ్చాడు, అతడును చూసాడు, అతడు క్రీస్తును చూసినప్పుడు శుద్దీకరణను చూసాడు. సంఘము శుద్దీకరించబడాలని దానితోనే వెళ్ళాడు. దాని వెంట పెంతెకోన్తు వచ్చినది, వరములు పునరుద్దరణను చూసినది. వారంతా ఏమి చేసారు? కాధలిక్‌ వారు ఏలా చూసారో ఖచ్చితంగా వారు అలాగే చేసారు. అది దానిని కూడ సంస్థాగతం చేసి తిరిగి వెనుకకు పెట్టారు.

ఓ, దేవా! ఒక దినాన నేను చూసాను, మరియు నేను ఆల్ఫాయు, ఓమెగయు అయిన వానిని , ఆదియు, అంతము అయిన వానిని, నిన్న నేడు నిరంతరము ఏక రీతిగా ఉన్న యేసుని మరియు నాపాపమును క్షమించగల ఒకరిని నేను చూసాను. నా స్థానాన్నితీసుకున్న ఒకనిని నేను చూచితిని,…అయ్యో నీవు చూస్తున్నప్పుడు ఏమి చూసావు ?

HEB 13:8

 

50నా యొక్క వృద్ధుడైన స్నేహితుడు బిల్ డౌచ్ ఇప్పుడు ఇక్కడ కూర్చుండుట నేను చూస్తున్నాను. ఆ మనుష్యునికి తొంభై-రెండు సంవత్సరాలు వస్తున్నవి. కొద్ది దినాల క్రితము ఈ మధ్యనే సుమారు ఆరు నెలల క్రితము అతనికి సంపూర్తిగా గుండె ఆగి పోయి, గుండె జబ్బు వచ్చినది. అతడు చనిపోతున్నాడని వైద్యుడు చెప్పాడు.

అతని భార్య నన్ను పిలచి "సహోదరుడా బ్రన్హాం, రండి …అతడు చనిపోతున్నాడు, బిల్‌, నీ స్నేహితుడు" అని చెప్పినది.

అలాగే…."ఆ విధముగానే నేనాలాగు ప్రార్ధన చేస్తున్నాను" అని చెప్పాను. అతని స్థలానికి వెళ్ళు రహూదారిన వెళ్ళుతూ నేను ప్రార్ధించుకుంటున్నాను, "దేవా నేనతడికి ఆఖరి వీడ్కోలు చెప్పుటకు అయిష్టంగా ఉన్నాను. నేను అక్కడకు చేరువరకూ అతడు బ్రతికి యుంటే అతనికి వీడ్కోలు చెప్పగలుగుతాను" అని ప్రార్ధించాను. ప్రాణవాయువు పెట్టారు. సంపూర్ణముగా గుండె విఫలమైపోయినది. తొంభై-ఒకటి సంవత్సరములు.

ఇంధనం నింపుకునే స్థావరం నుండి బయటకు వచ్చాను. నేను చూసాను, నేనలా చేసినప్పుడు బిల్‌ వీధుల గుండా వస్తూ నాతో కరస్పర్శ చేసియున్నాడు.

అతడు ఈ రాత్రి ఇక్కడ కూర్చొని ఉన్నాడు, అది అతనికి చెప్పిన వైద్యుడు చనిపోయాడు. నేను వెళ్ళు ప్రతీ కూటమును అనుసరిస్తూ వడగండ్ల వాన, మంచు గుండా నడుపుకుంటూ ఓహియో, లీమా, నుండి వచ్చి బిల్‌ డాచ్‌ కూర్చొన్నాడు. ఎందుకని? మనము చూసాము. మనము ఒకటి చూసాము.

అదే దేవుడు అక్కడ దూరాన కొలరాడలో తుఫాను సమయాన గత దినాన నేను మాట్లాడిన అదే దేవుడు, ఆయన నిన్న, నేడు, యుగ యుగములు ఒక్కటేరీతిగా ఉండుట నేను చూసాను.

51ఇక్కడే ఆంగ్లేయుడైన మిష్టర్‌ వే, ఇప్పుడు ఇక్కడ కూర్చొని ఉన్నాడు. ఇక్కడ కూర్చొని ఉండుట… ఇప్పుడే నేను గమనించాను. అతడు ఇండియానా నుండి వచ్చాడు. అతడు ఒక ఆంగ్లేయుడు. అతని భార్య గుర్తింపు పొందిన నర్సు, అతడు ఒక మంచి మనిషి. ఒక రోజు నేను అతనితో మాట్లాడితిని. నేను ఒక కూటములో అతనితో మాట్లాడితిని. నేను ఏమి చెప్పితినో, అది అతడు హృదయంలో తిరస్కరించాడు. అతడు ఆలాగు చేసినప్పుడు, ప్రజల మధ్య పడిపోయి చనిపోయాడు. అక్కడ అతడు చనిపోయి యుండెను, అతని భార్య అతన్ని పట్టుకొని తాకి చూసినది. అతని కళ్ళు… ముఖము నలుపైపోయినవి, అతని కళ్ళు బయటికి వచ్చి తలలో వెనక్కి పోయినవి.

"చక్కగా నిలబడు" అని నేను అన్నాను. అక్కడ అతని వైపు చూచి, "ఓ .. ఆ మనుష్యుడు అక్కడ చచ్చి పడి ఉన్నాడు". నేను అనుకున్నాను వెళ్ళిపోయి అతని పైన నా చేతులు పెట్టాను, అక్కడ బల్ల ఎంత చల్లగా ఉన్నదో అంత చల్లగా అతడు ఉన్నాడు. అతడు అయి పోయాడు.

శ్రీమతి వే ఇలాగన్నది, "ఓహ్, సహోదరుడా బ్రాన్హాం, అతడు అయిపోయాడు," అయిపోయాడు. గొంతెత్తి ఆమె స్వరముతో ఆమె అరుస్తుంది.

JOHN 11:44•

HEB 13:8

 

52నేను ఆలాగు చూసాను, నేను పునరుత్దానమును, జీవమును చూసాను. యేసు చేయమన్న ప్రార్దన నేను చేసాను. సహోదరుడు వే పైకి లేచాడు. ఈ రాత్రి ఇక్కడే కూర్చొనియున్నాడు. మృతుల్లో నుండి లేచి, వచ్చి ఈ రాత్రి ఇక్కడే కూర్చొని ఉన్నాడు. అవును, అది నిజము. మిష్టర్‌ వే? ప్రజలు చూచునట్లుగా ఒక్క నిముషము నిలబడు. ఇక్కడే బిల్ డౌచ్ ఇక్కడ కూర్చొన్నాడు. ఏంటది ఎందుకనగా, లాజరును ఎవరైతే లేపి యున్నాడో. అదే ఆయనను ఆయన వైపు మనము చూసాము, కాబట్టి ఆయన నిన్న, నేడు, యుగ యుగములు ఒక్కటే రీతిగా ఉన్నాడు. అవును ఆయన మారని వాడుగా ఉన్నాడు.

HEB 13:8

 

53నా యెదుటనే బ్లైయర్‌ అను ఒక చిన్నబోధకుడు, కూర్చొన్నాడు. గడిచిన దినము అతని చిన్న బాలుడు గొప్ప విపత్తులో పడ్డాడు. కన్నీళ్ళు తుడుచుకుంటూ అతని భార్య అక్కడ కూర్చొని ఉన్నది. అక్కడ టెలిఫోనులో నన్ను పిలిచి, "సహోదరుడా బ్రన్హాం, మా చిన్న బిడ్డ కారులో ఉన్నాడు, కొండమీద నుండి కారు దొర్లి అతను గుజ్జు అయిపోయాడు, అతని మెదడుకు తీవ్ర గాయము తగిలినది. అతడు అయిపోయాడు, గాలిని కూడ పీల్చలేక పోతున్నాడు. అతడు, "నా కొరకు ప్రార్ధిస్తావా" అని అడిగాడు……

"ప్రార్ధించుకొందాం" అని నేను చెప్పాను. చూసాము ఆ విధముగా ప్రార్ధించుట మొదలుపెట్టాను. ఫోన్‌లో నేను చెప్పాను, "ప్రభువైన దేవా వారితో నేనేమని చెప్పను?". చిన్న బిడ్డ పరుగులు తీస్తూ తాడుతో ఎగురుతూ అలా పరుగులు తీయుట నేను చూసాను, "అతడు బాగుపడతాడని నేను చెప్పాను". ఈ రాత్రి అతడు ఇక్కడయున్నాడు, ఇక్కడే వారు కూర్చొని యున్నారు. ఎందుకని? ఎందుకనగా యేను క్రీస్తు నిన్న, నేడు, యుగ యుగయులు ఒక్కటే రీతిగా ఉన్నాడు!

చూడు! ఆయనను నీవు చూచినప్పుడు నీవు ఏమి చూసావు? అదే ఆయన స్వస్థపరచు వాడని నేను చూస్తాను. ఆమెన్‌! గలిలయలో నడచిన అదే ఆయనను నేను చూస్తాను. ఆయన బలములో నేనాయనను చూస్తాను. హృదయం యొక్క రహస్యాలను మరియు ఆలోచనలను ఆయన వివేచించుట నేను చూస్తాను. కడవరి కాలమునకు కొంచెం ముందుగా గురుతును చూపించుట నేను చూస్తాను. ఆయన ఈ రోజు ఏమై ఉన్నాడు అని ఈ సభికులగుండా దేశ దేశాలగుండా ఏలాగు వెళ్ళిపోయి చెప్పగలము?

54నేను ఏమనుకున్నానో మీకు తెలుసా? బానిసత్వములో ఒకసారి ఒక పెద్ద వాడైన నీగ్రో అతను చెప్పునట్లుగా అని నేను అనుకున్నాను. ఒకరోజు అతడు వచ్చి చెప్పాడు, "నేను ఇప్పుడు స్వతంత్రుడను" తెలుసా ? అని అన్నాడు. కాబట్టి అతడు ఇతర బానిసల మధ్య చెప్పవలసి ఉండెను….. అది తిరిగి యజమాని వద్దకు చేరినది.

శ్యామ్‌, "ఇక్కడకు లోపలికి రా" అని యజమాని చెప్పాడు.

"నీవు ఇతర బానిసలతో చెబుతున్నది ఏమిటి?" అని అడిగాడు.

అతడు చెప్పాడు, "అయ్యా నేను స్వతంత్రుడను."

"నీవు ఏలాగు స్వతంత్రుడవని?" యజమాని అడిగాడు,

అతడు చెప్పాడు, "నేను పాపము యొక్కయు, మరణము యొక్క నియమం నుండి విడుదల పొందాను. ఎందుకనగా యేసు క్రీస్తు నన్ను స్వతంత్రునిగా చేసెను." అని చెప్పాడు,

అతడు అడిగాడు, "శ్యామ్‌ అది నీ యొక్క భావమా? అని,

"అవును" అని, చెప్పాడు.

"నేను వెళ్ళిపోయి నీ విడుదల సంతకం చేస్తాను. నీవు వెళ్ళి నీ సహోదరులకు అది తెలియజేయుము".

55ఆ వృద్ద మనిషి సంవత్సరాలు, సంవత్సరాలు బోధ చేసాడు. చివరకు ఒకరోజు తన తలుపు యొద్దకు వచ్చాడు. ఈ జీవము నుండి అతడు వేరు కావలసియుండెను. కొద్ది దినాలు అతడు మగతలో పడకపై ఉన్నప్పుడు, అతని యొక్క అనేక మంది తెల్ల సహోదరులు అతని చూచుటకు అతనికి వీడ్కోలు చెప్పటానికి వచ్చారు. ఎందుకంటే అతడు క్రీస్తు యొక్క దీనుడైన వృద్ద సైనికుడు, అతడక్కడ పడకపై ఉన్నప్పుడు చుట్టూ చూసి,

"శ్యామ్‌ నీవింకా వెళ్ళపోలేదా"?

"లేదు," అన్నాడు, "నేను తిరిగి వచ్చాను" అని చెప్పాడు, "నేను అక్కడ ఉన్నానని అనుకున్నాను" అని చెప్పాడు. "నేను తప్పక కల కనియుండవచ్చును." "నేను అక్కడ ఉన్నాననుకున్నాను." నేను అక్కడ ఉన్నప్పుడు అతడు చెప్పాడు, "ఒక దేవదూత… నేను తలుపు యొద్దకు తీసుకొని రాబడ్డాను". ఇంకా చెప్పాడు "ఒక దేవదూత వచ్చి చెప్పాడు, శ్యామ్‌ వచ్చి కిరీటము పెట్టుకో, వచ్చి నీ వస్త్రము తీసుకో" అని అతడు చెప్పాడు

"వస్త్రము, కిరీటము గూర్చి మాట్లాడకు, నేను ఇక్కడే నిలబడి లక్షల, లక్షల, సంవత్సరాలుగా ఆయననే చూస్తూ ఉంటాను."

మరణము నుండి, పాపము నుండి అతనిని విడిపించిన ఆయనను ఆయనలో అతడు చూసాడు. ఇరుకుల్లో ఇబ్బందుల్లో తనను తాకి ఆదుకున్న ఆయనను అతడు చూసాడు.

56గడిచిన ఉదయం నా పడకపై నేను పడుకొని యున్నాను. (నా జీవిత కథ మీకు తెలుసు), నాకు వయస్సు ఎధిగిన కుక్క ఒకటి ఉన్నది, మేము దానిని 'ఫ్రిట్ట్‌ అని పిలుస్తాము. అతడు నన్ను బడికి పంపేవాడు. పిల్లి మొదలైనవి మరుగై ఉండుట కొరకు ప్రతీ ఉదయం నేను దానిని పైకి తీసుకొని వెళ్ళేవాడను. పైన చిన్న చెక్క ఇంట్లో మెట్ల మీదికి ఎక్కే వాడను. క్రింద సొరంగంలో అది మొరుగుట నేను వినేవాడను. అది నా యొద్ద ఎప్పుడు పడుకొనేది కాదు. ఎప్పుడు దాని యొద్దకే వెళ్ళేది. అది నాకొక ప్రత్యేకంగా ఉండేది. మీకు తెలుసా ఒకానొక ఉదయవేళ వాగులో అది అరచుట నేను వింటాను. నేను అక్కడకు తప్పక వెళ్ళి, అది ఏమి పొందుకున్నదో నేను చూస్తాను. అది చాలా బాగుంటుంది.

HEB 13:8

 

57విను సహోదరుడా, నేను నీకు చెప్పనివ్వు. నీవు యేసును చూచినప్పుడు, నీవు చూచుటకు ఒకటే ఒకటున్నది, అది ఆయనలో దేవుని చూచుటయై ఉన్నది. ఆయన నిన్న, నేడు, యుగయుగములు ఒక్కటే రీతిగా ఉండుట, ఆ రీతిగా చూచుట. ఈ రాత్రి ఆయన ఇక్కడ ఉండి అప్పుడు ఏమి చేసాడో అది చేయుటకై ఇక్కడ ఉండుట చూచెదవు. మనము ప్రార్ధించుచుండగా ఒక్క క్షణము మన తలలు వంచుకొందాము. ప్రార్ధించుకొందాం.

"సహోదరుడా బ్రన్హాం, నా యెడల దేవుడు కనికరము చూపమని దేవుని అడుగు అని చెప్పేవారు ఈ రాత్రి ఇక్కడ ఎవరైన ఉన్నారా? నేనాయనను వ్యత్యాసమైన వానిగా చూడాలనుకొంటున్నాను, నేను ఆయన వైపు చూసాను, నేను ఆ విధానములోనే ఊహించుచున్నాను. నేను ఆయన వైపు చూస్తాను ఆశ్చర్యపడ్డాను, నేను ఆయన వైపు చూసాను…, ప్రశ్నించాను? అవును నిజం, ఆయన నా కొరకై జాగ్రత్త తీసుకున్నాడా? ఆయన నన్ను ప్రేమిస్తున్నాడా? ఆయన గూర్చి నేను చెప్పినవన్నియూ …ఇవన్నియు నిజమేనా? అవి నిజమా అని నేను తెలుసుకోవాలని కోరుతున్నాను, ఈ రాత్రి నాకు అది బయలు పరచమని నీవు ఆయనను అడుగుతావా?" నీ చేయి ఎత్తుతావా? ప్రభువు నిన్ను దీవించును, అది మంచిది ప్రతీ ఒక్క చోటను…

MATT 28:20•

JOHN 14:12,19•

ROM 8:34•

HEB 13:8

 

58మా ప్రశస్తమైన దేవా, నిన్ను గూర్చి ఎంతో వ్రాయబడినది. నీవు నిన్న, నేడు, యుగయుగములు ఒకటే రీతిగా ఉన్నావని మేము ఎరిగి యున్నాము. ఈ… రాత్రి …ప్రభువా మేము…చూచునప్పుడు,

మేము యేసుక్రీస్తును చూస్తామని ప్రార్థిస్తున్నాము. నీవు చేసిన కార్యములు మేమును చేస్తామని నీ వాక్యమునందు నీవు వాగ్ధానము చేసియున్నావు, కడవరి దినాలలో పరిశుద్ధాత్మ రూపంలో నీవు మరల భూమి మీద ఉందువని, సంఘము పరిశుద్ధాత్మతో నిండైన బలముతో ఉండునని నీవు వాగ్ధానం చేసియున్నావు. కొంచెము కాలము తరువాత చూచుటకు లోకమునకు అది ఏమి మంచిగా కనపడదు, ఎందుకనగా అది వారు చూడరు. అయితే మీరది చూతురు ఏలయనగా, "నేను మీతోను, మీలోను, యుగ పర్పయంతము మీతో ఉందును,".

ప్రభువైన యేసు, మనుష్యులు చూచుటకు ఇంకా తరుణము ఉండగనే ఈ రాత్రి వారు చూచి, ఆయన పునరుత్తాన శక్తిలో వారు ఆయనను చూచెదరుగాక… ఆయన మృతుడు కాడు అయితే ఆయన నిరంతరము జీవించుచున్నాడు. ఆయన యెడల ఒప్పుకోలు చేయ సంసిద్ధపడువారి యెడల విజ్ఞాపన చేయ సంసిద్దుడై ఉన్నాడు. ప్రభువా, దయచేయుము…

అడగబడిన విన్నపములన్నీ అనుగ్రహించబడును గాక, తండ్రీ, యేసుక్రీస్తు నామములో ఇవన్ని దయచేయును గాక, ఆమెన్‌.

59ఇది ఇప్పుడు రోగులకొరకు ప్రార్ధన సమయమై ఉన్నది. నేను మీ కొరకు ప్రార్ధించి యున్నాను. దేవుడు జవాబు దయచేయునని నమ్ముచున్నాను. ఇప్పుడు, బిల్లీ ప్రార్ధన కార్డులను చాలా ఇచ్చి యున్నాడని ఆ విధముగా చెప్పియున్నాడని అనుకుంటున్నాను. అది Bయేనా, అవున? బిల్‌, అది మంచిది మనకు సమయం లేదు, నేను కొంచెం ఎక్కువ సమయం తీసుకున్నాను. నన్ను క్షమించండి, కొద్ది నిముషాలు నాకు ఉన్నవి.

B. గడచిన రాత్రి మనమెక్కడ విడచి పెట్టాము, ఎక్కడ మనము వదిలాము, మంచిది గడచిన రాత్రి మనమెక్కడ విడచిపెట్టాము. మనము బి ఒకటి తో ప్రారంబిద్దాము. సరియేనా, సంఖ్య ఒకటి? ఎవరు… (టేపులో ఖాళీ యున్నది. - సంపా ) B4, 5.

60ఇప్పుడొకరు గమనించండి, మీలో ఒకరు, బిల్లీ ఇక్కడకు రా. త్వరగా, ఎందుకనగా మనకిక సమయంలేదు. మనము ఎక్కువ సమయం తీసుకోము. కొన్నిసార్లు వారు చెవిటి వారై వారు వినలేరు, లేక లేవలేరు లేక మరొకటి, వారు అలా ఉన్నవారైనయెడల, ఎందుచేతననగా మనం, సంఖ్య 1, 2, 3, 4, 5…మంచిది మీరు ఇష్టపడితే, ముందుకు రండి. అక్కడ 1, 2, 3, 4,…అది నిజము, నన్ను క్షమించండి. అయ్యా 6, 7, 8, 9, 10… ఇప్పుడు వారిని నిలబడనివ్వండి.

ఆరు, 7, 8… ఇప్పుడొకరు 8, 9, 10..8, 9…నరే… 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10…సరే 10 నుండి 15 వరకు నిలబడండి, Bలో అవి అయిపోయిన కార్టులు, పదిహేను. సరేనా. 15 నుండి 20 వరకు నిలబడండి. 1 నుండి 20 వరకు ఇక్కడ మీ స్థలాల్లోకి రండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9,10, 11,12, 13, 14, 15, 16, 17, 18, 19, 20. అది అదే… 20 నుండి 25 వరకు.

HEB 4:14,15

 

61ఎంతమంది ఇంకా ప్రార్ధనా కార్డులు లేకుండా ఉండియున్నారు? మీరింకా ఆయనను నమ్ముతున్నారా? వారు వచ్చినప్పుడు, వారి స్థలాల్లో ఉండండి. ఆ 25 మంది వచ్చునప్పుడు, మిమ్మును అడుగుతాను. బైబిల్‌ గ్రంధం చెబుతుంది హెబ్రీ పుస్తకములో "యేసుక్రీస్తు మన ప్రధాన యాజకుడు" అని చెబుతుంది. మీరు అది నమ్ముతున్నారా? (సంఘము ఆమేన్‌ చెప్పుచున్నది-సంపా) ఈ దినాన మన బలహీనతల యొక్క భావముచే తాకబడినవాడు, ఈ దినాన నెమ్మదిగా కూర్చొని మన మధ్య ప్రధాన యాజకుడు తన్ను తాను తెలియపరచుకొనుట మనము చూద్దామా లేక వచ్చి తరమబడిన మూగవైన జంతువులవలె కూర్చొందామా?.. లేదండి మనము ఏలాటి పోరాటానికైనా లేచి చేద్దామా? తరమబడిన మూగ జంతువులవలె ఉండవద్దు. వీరుని వలె ఉండుము. ప్రజలైన మీరు ఈ వైపు చూచి నమ్ముడి, ఆయన ఏమి వాగ్జానం చేసాడో లేఖనములవైపు చూడుడి. అది మంచిది. మనము ఇంకా సమయం తీసుకోవటం లేదు. ప్రార్ధనా వరుసను ప్రారంభించుదాం. మరలా ప్రార్దించుకొందాం.

JOHN 14:2•

HEB 1:1,2

 

62ప్రభువైన యేసు, అది ఇప్పుడు నీ హస్తాలలో ఉన్నది. నేను నీ యొక్క ప్రశస్తమైన హస్తాలలో ఉన్నాను. ప్రభువా "సొదొమా దినములవలె అది ఉండును," అని నీవు చెప్పావు. నేను ఈ రాత్రి నిర్వచించిన వాక్యమును తీసుకో, ఆ విధమైన క్రమములో తీసుకొనుము. వెళ్ళుచున్న నీ శిష్యులతో నీవు మాట్లాడుతున్నప్పుడు, యోహాను 14: 12లో, నీవు చెప్పియున్నావు. "నా యందు విశ్వాసముంచువాడు నేను చేయు కార్యములు అతడును చేయును" అని నీవు చెప్పితివి.

బైబిల్‌ గ్రంధం చెప్పుచున్నది, పూర్వ కాలంలో నానా సమయాల్లో నానా విధములుగా పితరులతో మాట్లాడిన దేవుడు లేక ప్రవక్తలలో ఉండి మాట్లాడిన దేవుడు కడవరి కాలములలో ఆయన కుమారుడైన యేనుక్రీస్తు ద్వారా మనతో మాట్లాడెను, ఆయనే వాక్యమై ఉండెను. ప్రవక్తలు వచ్చియున్నారని వారిపైకి ఆత్మ వచ్చినప్పుడు, ఆ తరమునకు వాక్యము జీవింపచేయబడెనని మేము ఎరుగుదుము. రాజులను సంహరించిరి, తీర్పును తెచ్చిరి, నీతిని తీసుకొచ్చితిరి, నశించిన వారిని రక్షించిరి. ప్రవక్తల యొద్దకు వాక్యము రాగా ఆలాగు వారు చేసిరి.

GEN 18:2,9,10,12,13,22•

LUKE 17:28

 

63ఇవుడు, ప్రభువా, కడవరి దినాన, నీవు మాకు వాగ్జానం చేసియున్నావు, సొదొమా దినములలో ఉన్న రీతిగా అని నీవు చెప్పితివి. అబ్రహాము ఎండవేళలో అక్కడ కూర్చొని ఉండగా, చిన్న బయటకు పిలువ బడిన సంఘము ఉన్నది…

తండ్రీ, ఈ దినాన మేము లోకమును చూచుచుండగా, ఖచ్చితముగా సాదొమా అను అన్యుల తారుమారు స్థితిని నులివెచ్చనిదిగా చూచుచున్నాము, అబ్రహాము ఎదుట ఆ ముగ్గురు దూతలును చూచుచున్నాము. వారిలో ఇద్దరు నులివెచ్చని సంఘములోనికి వెళ్ళిరి, లోతు వారిని బయటకు పిలవటానికి వెళ్ళిరి. ఇద్దరు అక్కడికి వెళ్ళిరి. నవీన బిల్లి గ్రహాం వంటి వాడు, వారిని బయటకు పిలుచుటకు, అద్భుతాలు లేవు. కేవలం వారి కన్నులు మూయుటకు మాత్రమే సువార్త ప్రకటన అది చేయును.

అయితే అక్కడ అబ్రహాము గుంపుతో ఒకరు నిలిచి ఉండెను, ఏర్పరచుకొన్న వారికి నూచన, బయటకు పిలువ బడిన వారికి సూచన, అది సాదొమలో కాదు, సొదొమాకు బయట పుట్టిన వారు, ఈనాడు అబ్రహాము నిజ సంతానము, అది నిజ సంఘమే. అబ్రహాము సంతానము. వారితో మాట్లాడిన ఆ మనుష్యుడు అడిగాడు- "నీ భార్యయైన శారా, ఎక్కడ"?

"ఆమె నీ వెనుక గుడారములో ఉన్నది" అని, చెప్పెను.

"నిర్ణయ కాలమునకు నీ యొద్దకు వచ్చెదను." అని, ఆయన అన్నాడు. అందుకు ఆమె నవ్వినది.

"ఆమె ఎందుకు నవ్వినది" అని ఆయన అడిగాడు, ఆమె ఉన్న వైపునకు ఆయన వీపు ఉంచి, ఆమె ఏమని తలంచినది? ఆమె ఏమి చెప్పుచున్నదని వివేచించుట…,

NUM 21:8•

MATT 25:6•

LUKE 17:28,30

 

64నజరేయుడైన యేసు, దేవుని కుమారుడు, ఆయన వాక్యమునందు మనకు చెప్పాడు, "ఆ దినము ఉన్నరీతిగా, మనుష్యుకుమారుని రాకడయందును ఉ౦డును" అని,". తండ్రి అని కాలాల్లో పరివర్తన చేయువారు ఒక్కరు కూడ ఉండకుండా, అది ఎంతో వింతైన విషయం … అనగా… తండ్రీ అది చాలా వింతైన విషయం, సకల యుగములలో, నేటి వరకు ముగింపులో "హామ్‌" అనే పేరుతో సొదొమాలోనికి వెళ్ళెను, అక్కడ ఏ ఒక్క సంస్కర్త లేడు. నీ యొక్క సేవకుడు, బిల్లి గ్రహాం, సొదొమలో అక్కడ అతని పనిని చేయుచున్నాడు.

ఇప్పుడు, తండ్రీ, ఈ రాత్రి ఇక్కడ ఉన్న అబ్రహాము యొక్క సంతతిని నీవు రక్షించి, నీ ప్రశస్త వాగ్ధాన కుమారుని పరిశుద్దాత్మ చేత వారిని నింపుమని నిన్ను ప్రార్ధిస్తున్నాను. ఇది అయిన వెంటనే, దేవుడు శరీరములో ప్రత్యక్షమై ఈ సూచనను చేసెను, ఆ తరువాత వాగ్ధాన కుమారుడు రంగం పైకి వచ్చెను, దేవా, అబ్రహాము సంతానము కొరకు 2000 సంవత్సరముల నుండి మేము ఎదురు చూచుచున్నాము.

అనేక మంది నిద్ర పోవుచున్నారు. "ఇది ఏడవ గడియ, ఇదిగో పెండ్లి కుమారుడు వచ్చుచున్నాడను" కేక ఏ సమయంలోనైన వచ్చుటకై మేము ఎదురుచూచుచున్నాము. తండ్రీ, ఈ రాత్రి ప్రజల యొక్క అవగాహనను తెరవమని, కుమారుని రాకకు ముందు, వాగ్దానము చేయబడిన సూచనను చూచునట్లు అనుగ్రహము చూపుము, ఇంకా ఇత్తడి సర్పము క్రీస్తుకు సాదృశ్యముగా ఏలాగో, అలాగే ( ప్రకృతి రీత్యా) వచ్చుచున్న కుమారుడు ఆయన రాక యొక్క సూచన, అబ్రహాము రాజ సంతానమగు ఈ దినపు యేసు రాకడ, ఆత్మ సంబంధమైన పోలికై ఉన్నది, ప్రభువా, అనుగ్రహము చూపుము. మమ్మల్నిమేము మీకు అప్పజెప్పుకొంటూ యేసు నామములో అడుగుచున్నాము. ఆమేన్‌.

JOHN 5:2,19,30•

JOHN 14:10

 

65రోగుల కొరకు (ప్రార్దన చేయకముందు ఒకవిషయం చెప్పాలనుకుంటున్నాను. వరములను గూర్చి అనేకమంది తప్పుడు అభిప్రాయం కలిగిఉన్నారు. "ఇక్కడ నేను ఇక్కడకు వెళ్ళి, ఇదీ తీసుకుంటాను, అదీ తీసుకుంటాను, నేను ఇది చేస్తాను" అని, నీవు వెళ్ళి చెప్పుటకు దేవుడు అనుగ్రహించినది కాదు. అవి వరములు కావు. అనేకులు అలాగు తలస్థారు, అయితే వారు పొరబడుతున్నారు. దేవుడు నిన్ను వాడుకోవటానికి మార్గము నుండి నీకు నీవు బయటకు వచ్చుట ఏలాగో అది ఎరుగుటయే దేవుని వరము. చూసారా… నీలో నీవు వున్నంతవరకు……

ఆయనకు ఆయనే చెప్పలేదా ? "పరిశుద్ద యోహాను 5;19 లో కుమారుడు తనంతట తాను ఏమియు చేయక" అని, మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను, అక్కడ కోనేటి వద్ద పడి ఉన్న కుంటి వారందరిని దాటి పోయి, కాళ్ళు ముడుచుకొని పోయిన ఒకనిని లేదా ఒకవిధంగా నడవలేక యుండిన అటువంటి జబ్బుతో ఉన్న అతన్ని స్వస్థపరచెను. ఆయన చెప్పాడు, "కుమారుడు తనంతట తాను ఏదియు చేయడు, తండ్రి ఏది చేయుట ఆయన చూచునో కుమారుడు అలాగే చేయును." కార్యములు చేయునది నేను కాదు,. "నా యందు నివశించు నా తండ్రియే ఆయనే కార్యములు చేయుచున్నాడు" అని, ఆయన చెప్పాడు.

66ఇప్పుడు, అక్కడ కుర్పొన్న మీరు ఏ మనుష్యుని వైపు చూచుటకు తెగించకండి, క్రీస్తువైపు మీరు చూడుడి, ఆయన ఒక్కడే , సొదొమా యొద్ద ఆయన ఏలాగు చేసెనో , ఆలాగున ఆయన మానవ శరీరంలో కడవరి కాలంలో ప్రత్యక్షపరచుకొనునని ఆయన వాగ్దానం చేసాడు. ఇప్పుడు మీ శరీరము, నా శరీరము, మన యొక్క స్వంత తలంపులను తొలగించుకోవటానికి , ఈ రాత్రి మనలో వాక్యము దాని స్థానమును స్వీకరించుటకు మనయొక్క హృదయాలు తెరుద్దాం. ఆ తరువాత ఆయన పరిశుద్దాత్మ యొక్క… ఆయన ఫరిశుద్దాత్మ యొక్క దేవుని గొప్పవరములు మన యెదుటనే ప్రత్యక్షమగుటకు మనము చూద్దాం.

భయభక్తులతో ఉండండి.. ఎవరు వదలవద్దు. నిశ్సబ్దముగా ఉండి ప్రార్ధి౦చండి, మీరు తప్పక అభినందిస్తారు. ఇక్కడ ఉన్నవారు ఎవరైన ఇది తమాషా, వంచన అని తలస్తే, వేదిక యొద్దకు రమ్మని సవాలు చేయుచున్నాను, ఎవరైనను ! మీరది చేయుటకు భయపడినట్లయితే, దాన్ని గూర్చి ఏమి చెప్పవద్దు.

దేవుని వాక్యము తెలియచేయుట కొరకై ఇక్కడున్న ప్రతీ యొక్క ఆత్మను, యేసుక్రీస్తు నామమును నా అధీనమందు ఉంచుకొనుచున్నాను.

JOHN 4:7

 

67ఇక్కడ ఈ రాత్రి ఒక చిత్రమున్నది. పరిశుద్ద యోహాను 4వ అధ్యాయము వలె…ఒక పురుషుడు, స్రీ ఇద్దరు కలసి ఉన్నారు. బహుశ మొదటిసారి అనుకుంటాను. నీవెవరవో నాకు తెలీదు, బహుశ పత్రికల ద్వారా మామూలు సంభాషణ ద్వారా నీవు నన్ను ఎరిగి ఉంటావు. అయితే. నీవు నాకు తెలీదు, అది నీకు తెలుసు. ఒకరికి ఒకరం మనం కొత్త వారము. బావి యొద్ద మన ప్రభువు ఒకప్పుడు ఒక స్త్రీని కలుసుకొన్నట్లుగా, మనము ఒకరికి ఒకరము అపరిచితులము. ఒక స్తీ పురుషుడు కలుసుకొని, మాట్లాడుకొనుట.

మన సహోదరులలో ఒకరు వచ్చునట్లు నేను వచ్చి, దేవా స్వస్థతావరమును దయచేయుము అని చెప్పినట్లయితే … స్వస్థతావరము అనగా ఏమిటో మీకు తెలుసా? స్వస్థతలో విశ్వాసం ఉంటుంది. చూసారా, ఒకరి కొరకు ప్రార్ధించుట ద్వారా, ఒకరి కొరకు ప్రార్ధనచేయుట ద్వారా నీవిశ్వాసాన్ని నీవు విడుదల చేస్తున్నావు, స్వస్థతా వరమనగా అదే , ప్రతీ యొక్క దైవ సేవకుడు దాన్ని కలిగి యుండవలసినది, ప్రతీ ఒక్కరు చూడండి, స్వస్థతా వరమును కలిగియుండ వలసినది. నిన్ను స్వస్థపరచు శక్తి నీ లోపల ఉన్నది. పరిశుద్దాత్మ అది బయట వని చేయుటకు దానిని నీవు విడిచిపెట్టవలసినది. అంతా అదే.

68అంతే చెట్టు లోపల జీవం వలె అది ఉంటున్నది. ఆపిల్‌ పండ్లు కాయుటకు చెట్టులో నీవు యాపిల్‌ ను నీవు పోయనవసరం లేదు. అది కేవలం భూమిలో నాటబడి ఉండి, అది త్రాగుతుంది , ఆ విధంగా అది త్రాగి బయటకు తెస్తుంది. పరిశుద్ధాత్మతో నీవు చేయు విధానం అదే. అది నీలోపల ఉంటున్నది, తరగని యేసుక్రీస్తు యొక్క ఊటలో నుండి నీవు త్రాగుతావు. ఆమేన్‌. ఆత్మ ఫలమును అది బయటకు తెస్తుంది. చూసారా…

ఇప్పుడు నేను ఇక్కడే నిలబడి ఉన్నాను, నిన్ను ఎరుగక యున్నాను. అది దేవునికి తెలుసు. నీవు సంపూర్తిగా అపరిచితుడవు, ఇప్పుడు నేను అపరిచితురాలను అని… ఇప్పుడు నేను వెళ్ళిపోయి నీ మీద చేతులు పెట్టి, "సహోదరి నీవు బాగుపడబోతున్నావు" అని, చెబితే నీవు బాగుపడతావని నీవు నమ్మగలవా ? అయితే చూసారా.

అవి గడిచిపోయిన దినాలు వెనుకటి పెంతెకోస్తు దినాలు. ఇప్పుడు మనము దానికి ముందు ఉన్నాము.పెంతెకోస్తుకు ఆవల ఉన్నాము. మెతడిస్టు , బాప్టిస్టు, లూధరన్‌లుగా , మనమున్నట్లుగా ప్రభువు రాకడకు దారిపైన మనమున్నాము, ఎక్కడైతే యేసుక్రీస్తు యెక్క స్పంత పరిచర్య ప్రయోగాత్మకంగా ఉన్నదో ఖచ్చితంగా ఆ పరిచర్యలోనే ఉన్నాము. ప్రతీ యొక్క రాయి పరిపూర్ణంగా దానిలో ఒకటి అమర్చబడు వరకు ఎంతగానో అది పదునైన పిరమిడ్‌ మీద తలరాయివలె ఉంటుంది. అది ఎంతగానో సానపెట్టబడవలసి యున్నది, శిఖరపు రాయి స్వీకరించుట కొరకు సంఘము అట్టి స్థితికి రావలసి యుంటుంది, ఆ తరువాత శరీరము లేచినప్పుడు, పునరుత్థానమందు సమస్తమును స్వీకరించును.

JOHN 4:7

 

69మీరు దాన్ని నమ్ముచున్నారా ? నేను మీకు చెప్పినవన్ని సత్యమని మీరు నమ్ముతున్నారా ? మీరు నమ్ముతున్నారా ? నీవు చేసినది ఒకటి, నీవు చేయగోరనిది ఒకటి, నీలో ఉన్న తప్పు ఒకటి లేదా అది ఏమైనప్పటికి, ఆర్ధిక విషయం, కుటుంబ విషయం, అది ఏమైనప్పటికి నాకు తెలియదు, దాన్ని ప్రభువైన యేసు నాకు చెప్పినట్లయితే …నీవు నన్ను నమ్ముతావా ? ఆయన సేవకుడను అని, నేను అని నీవు నమ్ముతావా ?

నీవు కైస్తవురాలవు చూడు..నీ ఆత్మను ఎరుగుటకొరకు నేను నీతో మాట్లాడితిని, చూడు, అవునా .., బావి యొద్ద ఆయన ఆ విధముగా చేసాడు "నాకు దాహమునకు నీళ్ళు ఇమ్మని" ఆయన అడిగాడు…నీవు కైస్తవురాలవు, నీవు విశ్వాసివి అవునా ? నిశ్చయంగా, నిర్భంధముగా తోయుదానివి కావు. నీవు ఒక విశ్వాసివి, ఆది మంచిది. సరే నీ యొక్క భాధ, నీ ప్రాముఖ్యమైన భాధ, నీ మెడలో నీ యొక్క వెనుక నీకు వాపు ఉన్నది, ఆ వాపు నీకు పోటును తీసుకు తెస్తుంది… నీ కళ్ళు మొదలయినవి వాటినది పాడు చేన్తుంది. అది నిజమేనా ? అది "యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడనునది". అది నిజమా ? నీవు అది నమ్మితే అది పోతుంది. దేవుడు నిన్ను దీవించును. ఇప్పుడు వెళ్ళు. ( సహోదరి చెప్పుచున్నది, అది నిజం- సంపా)

HEB 13:8

 

70ఆయ్యా మీరు ఏలాగున్నారు? నీవు నాకు తెలీదు, మనము ఒకరికి ఒకరం అపరిచితులము. యేసుక్రీస్తు నిన్న నేడు యుగ యుగములు ఒక్కటేరీతిగా ఉన్నాడు. నాకు నేనుగా సడలింపు చేసుకో గలిగినట్లయితే పరిశుద్దాత్మ అంతగా నా "పెదవులను నా కన్నులను వాడుకోగలడు, కేవలం అలాగే… .

నీకు ఎప్పుడైన కల వచ్చినదా? నిజం, నీలో కొంత భాగము, నీ ఐదు జ్ఞానేంద్రియాలలో నీవు నిస్సత్తువై పోవలసి ఉన్నది. నీకు మనసాక్షి ఉపమనసాక్షి ఉన్నవి. నీ యొక్క మొదటి స్మ్రతి ఇక్కడ ఉంటుంది. మరి నీ ఉపస్మతి లేక ఉపమనసాక్షి ఇక్కడుంటుంది. నీవు నీ యొక్క 5 జ్ఞానేంద్రియాలలో నీవు పనిచేయకుండా ఉండవలసి ఉంటుంది. కల కనటానికి ఇక్కడకు వెళ్ళుటకై నిరాశత్వము కలిగి ఉంటావు. అయితే నీవు తిరిగి వచ్చినప్పుడు నీవు కల కనినది నీకు జ్ఞాపకం ఉండే వరకు ఇది దీనిని ముద్ర వేస్తుంది. ఇప్పుడు, ఇప్పుడు, దీర్ఘదర్శులు, ప్రవక్తలు, వారి యొక్క ఉపమనసాక్షి , లేక వారి యొక్క ఉపస్మ్మతి అక్కడ ఉండదు. అది ఇక్కడ ఉంటుంది.

నీ యొక్క 5 ఇంద్రియాల నుండి నీవు వెళ్ళిపోవు. నీవు నిలబడి ఉంటావు, నీవు నిలబడి కలకంటావు. "నాకై ఒక కల కను" అని, నేను చెబుతాను, నీవది చేయలేవు, లేక నేను దర్శనమును కూడ చూడలేను. అది చేయుట అనునది దేవుడు చేయాలి. అయితే అది చూడటానికి నేను నిద్ర పోను. నేను ఇక్కడ నిలబడే కలను కంటాను. అది దేవుని యొక్కవరము. మొదటి మనసాక్షికి ఆవలకు నేను వెళ్ళగలిగితే, దేవుడు ఏదైన చెప్పవలెనంటే, ఆయన మరొక మనసాక్షిని వాడుకొనును. అది ఆయనకు సంబంధించినది.

71యేసు నా కనుగ్రహించిన ఈ సూటు బట్టలు ధరించి, ఆయన ఇక్కడ ఉన్నట్లయితే …, నీవు వ్యాధితో ఉంటే ఆయన నిన్ను స్వస్థపరచలేడు, ఆయన కల్వరిలో చనిపోయినప్పుడే, ఎప్పుడో ఆయన అది చేసియిన్నాడు.

అయితే నీవెందుకు ఇక్కడ ఉన్నావో నాకు తెలియదు. నీవు కేవలం పురుషుడవు, మనం సుమారు ఒకే వయస్సు గల వారము. వేదిక యొద్ద ఆలాగు నిలబడి యున్నావు, ప్రధమముగా కలయుట కొరకు నిలబడ్డావు. నీ యొక్క కోరిక లేమిటో లేక నీవేమి చేసావో లేక నీ యొక్క అడ్డంకులు ఏమిటో దేవుడు నాకు బయలుపరచగలడని నీవు నమ్ముచున్నావా? నీకు ఏమి జరుగుతుందో ఆయన చెప్పగలిగితే, ఏమవుతుందో ఆయన చెప్పగలడు. నీవు దాన్ని నమ్ముతున్నావా?

నేను ఎక్కువ సమయం తీసుకోవటానికి నేను ఇష్టపడను. నేను కఠినముగా బోధించాను. నీవు కదిలింప బడుట కొరకై నీవు నిజముగా విశ్రాంతి పొందుకోవలసిఉంది. ఎందుకనగా ఆయన చూపించే వరకు నే నది చేయలేను.

అవును , అదిక్కడే ఉన్నది. వెలుగు ఆ మనిషి పైకి వచ్చుచున్నది. సరేనండి, లేదండి, నీ కొరకై నీవు ఇక్కడ లేవు, నీవు ఇంకొకరి నిమిత్తం ఇక్కడ ఉన్నావు, అది కుమార్తె కొరకు .., ఆ కుమార్తె కాలిఫోర్నియాలో నివాసముంటున్నది, కొంచెము కాలము క్రితము, ఆమెకు ఒకయాంత్రిక బండి వలన విపత్తు సంభవించినది. నీవు నన్ను కోరుచున్నావు. ఆమె కొరకు నేను ప్రార్ధించుటకై నీవు ఇక్కడ నిలబడ్డావు, కారణం ఆమె దాని వలన ఇంకా భాథపడుతున్నది, మరియు విను, నేను నీకు ఒకటి చెబుతాను, ఆ యొక్క మోటారు కారు వలన దుస్సంఘటన జరిగినది కాలిఫోర్నియాలో కాదు. అది టెక్సాస్ లోని డల్లాస్‌లో ఆ యొక్క మోటారు కారు దుస్సంఘటన జరిగినది. అది నిజమేనా ? ఆమె స్వస్థపరచబడుతుంది, మరచిపోవద్దు, ఆమె నడచి వెళ్ళుట చూసాను. మంచిది, నమ్ము సహోదరుడా, ఇప్పుడు వెళ్ళు విశ్వసించు, దేవుడు నిన్నుదీవించును.

72ఆమ్మా, ఏలాగున్నారు మీరు ? నేను మీకు పరాయి వాడను. మనము ఒకరికి ఒకరం తెలియదు. మనము సంపూర్తిగా అపరిచితులమే. యేసుక్రీన్తు నిన్న నేడు యుగ యుగములు ఒకటే రీతిగా ఉన్నాడని నీవు నమ్ముతున్నావా ? నీవాయనను నమ్ముతున్నావా ? ఇప్పుడు పరిశుద్దాత్మ నిన్ను గూర్చి ఒకటి, నీవు ఎరుగునది, అది నాకు తెలియనిది ఒకటి చెప్పినట్లయితే, అప్పుడు అది నిన్ను నమ్మునట్లుగా చేస్తున్నది. అవును …కాదా ? నీవున్నావు… నీవు క్లిష్ట పరిస్థితులలో ఉన్నావు. నీకు అనేకములైనవి ఉన్నవి, అయితే, నీ యొక్క ముఖ్య విషయం ఏదనగా కణితిని గూర్చి శస్త్ర చికిత్స నీవు చేయించుకోబోతున్నావు, ఆ కణితి ని ప్రక్కలో ఉన్నది. అది నిజము, అది నిజము. దానికై ప్రార్ధించుట కొరకై దాని ప్రార్ధన కొరకై నీవు ఇక్కడికి వచ్చావు, నీ యొక్క పేరు నేను చెప్పగలిగినట్లయితే నేను ఆయన ప్రవక్తనని నీవు నమ్ముతావా ? లేక అది సత్యమని నమ్ముతావా ? "మిస్‌ హోల్‌ మెన్‌ ", సంతోషిస్తూ,నీ దారిన వెళ్ళు. చూసారా?… దేవుడు నిన్ను దీవించును. ఇప్పుడు నమ్ము. అనుమానం పడవద్దు.

HEB 4:15

 

73అమ్మా ఏలాగున్నారు ? ఒకరికి ఒకరం అపరిచితులము. నీవు నా కంటే చిన్నదానవు, కేవలం ఒక స్త్రీ పురుషుడు… ఒక క్షణం, ప్రతీ ఒక్కరు ఎంతో భయభక్తులుగా ఉండండి. ప్రభువు ఆత్మ ఇక్కడ విడిచి పెట్టబడినది.

అద్దాలు పెట్టుకొని, ఇక్కడ కూర్చొన్న ఈ పురుషుడు , నీ మనస్సులో ఒక ఆత్మ సమస్య ఉన్నది. ఏమి చెయ్యాలో నీకు తెలియడంలేదు. నీవంతా గజిబిజిగా ఉన్నావు. నీవు నమ్ము నీవు క్షేమంగా బయట పడతావు. అవునండీ, నీవది చేస్తావా ? మంచిది. ఇప్పుడు భయభక్తులతో ఉండుడి.

ఇక్కడొక చిన్న స్త్రీ ఉన్నది, ఇక్కడే కూర్చొని చేతులుంచి ఈలాగు చూస్తూ ఉన్నది, ప్రార్ధన చేస్తూ ఉన్నది. ఆమెకు చెడిపోయిన చేయి ఉన్నది. అలా దానికై ఆమె ప్రార్ధిస్తున్నది. నీవు నమ్మి యున్నట్ల యితే, అవును, దేవుడు నిన్ను బాగు చేస్తాడు. నీవు నాకు తెలియదు, నేను నీకు తెలియదు, అయితే నీవు ఒకటి ముట్టావు, నీవు నన్ను ముట్టలేదు. నాదగ్గర నుండి 20 అడుగుల దూరంలో ఉన్నావు, యేసుక్రీస్తు నిన్ను స్వస్థపరచువాడు. నీ విశ్వాసము నిన్ను పరిపూర్ణురాలుగా చేసినది.

అది ఈ యేను కాదా, మన యొక్క బలహీనతలను వహించిన ప్రధానయాజకుడు ! ఆ విధానములో మీరు నమ్మరా ? ( సంఘము, "ఆమేన్ అని చెప్పుచున్నది - సంపా)

74. నన్ను క్షమించండి, అది ఏ దారిన వెళ్ళునో నేనది వెంబడించవలసియున్నది. ఇప్పుడు బలహీనపరచబడుట, గమనించారా, ఒకటి మన ప్రభువును ఒకసారి ఒక స్త్రీ ఆయన వస్త్రపు చెంగును ముట్టడం చూసారా ? ఆయన అన్నాడు

నన్ను క్షమించండి, ఇక్కడ ఈ రంగు జాతి స్తీ కూర్చొని ప్రార్దిస్తున్నది. ఫిత్తాశయము బాధ ఎక్కువ రక్తపోటు బాధతోయున్నది. అమ్మా నమ్ము, అది నిన్ను విడిచి పెడుతుంది. ఆమేన్‌. ఒక రంగు జాతి స్తీ ఇక్కడ ఉన్నది, నేనామెను చూస్తున్నాను, చూడండి, ఆమె విశ్వాసము దాన్ని నేరుగా లాగినది. ఆమేన్‌, ఆమె వెనుక ఉన్నఆ స్తీ, ఉబ్బసముతో ఉన్నది. ఆ ఉబ్బసము జబ్బు నుండి దేవుడు నిన్ను బాగు చేయునని నీవు నమ్మియున్నట్లయితే నీవు పొందుకుంటావు. నీవు నమ్మి యున్నట్లయితే…,

75నీ హృదయంలో నీకు గొప్ప అశ ఒకటున్నది. మరియు అది - యుక్తమైన కోరికే.. నీకు బిడ్డ కావాలి. అది నీవు పొందకుండా ఉండుటకు కారణము, నీకు స్తీ సంబంధమైన జబ్బు ఉన్నది, అది నిజము. (ఆ సహోదరి చెప్పుచున్నది, "నేను కార్డుమీద వ్రాసినది అదే -సంపా) అది సరియే, ఇప్పుడు నీవు అది పొందగలవని నమ్ముదువా… దేవుడు అది నీకు ఇవ్వగలడు. (అవును, అది నిజము) నీవు ఎవరైనది (ప్రభువైన యేసు చెప్పినట్లయితే, నీవు నన్ను నమ్ముతావా ? (అవును") మిష్టర్స్‌ లాంబర్ట్‌, ("అది నిజము") ఇప్పుడు నీవు వెళ్ళి, దానిని నమ్ము . అది నిన్ను నమ్మునట్లు చేయును, (ఆమెన్‌") దేవా, యేసుక్రీస్తు నామములో, ఆమె అది ఫొందుకొనును గాక. విశ్వాసము కలిగి ఉండుము.

అయ్యా మనం ఒకరికి ఒకరం అపరిచితులము, అయితే దేవుడు మన ఇద్దరిని ఎరుగును. నీ బాధలేవో ప్రభువైన యేను నాకు బయలు పరచును అని నీవు నమ్ముతావా ? నీవు నమ్ముతావా ? ఇక్కడ వాడవు కావు నీవు, నీవు అరిజోనాకు చెందిన వాడవు కావు, నీవు తూర్పు మార్గాన మిచిగన్‌కు చెందినవాడవు, అది నిజము. అవును. నీకు అధిక రక్తపోటు, దవడలు గట్టిబడినవి, వినబడుట కష్టంగా ఉండుట, అది నిన్ను విడిచిపెట్టినది. ప్రభువైన యేసు నిన్ను బాగుచేయును. మిచిగన్‌కు తిరిగి వెళ్ళు, దేవుని యందు విశ్వాసం ఉంచు.

MARK 9:23

 

76ఇక్కడ కుర్చున్న స్తీ, ఆమె కొరకు ప్రార్ధన చేస్తున్నది. పార్మన్‌సన్‌ వ్యాధి అతనికి ఉన్నది. ఇప్పుడు నేను అతనిని చూస్తున్నాను. మరియు నీడగా అయిపోయాడు… మరణించడానికి, నీడగా మాత్రము కాదు గాని, నిశ్చయ మరణానికి, ఆ విధముగా అయిపోయాడు, ఎందుకనగా అతడు రక్షించబడలేదు. అది నిజం. దేవుడతని రక్షించునని స్వస్థపరచునని నీవు నమ్ముచున్నావా ? యేసుక్రీస్తు అను మన ప్రధానయాజకుడను, ముట్టుటకు తగినంత విశ్వాసం నీకు ఉన్నట్లయితే, నీవు తప్పక అది అంగీకరించుము.

ఇప్పుడు నీవు నాకు అనుకూలత చూపగలవా ? నీ ప్రక్మనున్న ఆ స్తీ పైన ఆ చేయి పెట్టు, ఆమె తన సహోదరుడు కొరకు ప్రార్థిస్తుంది. అవును ఆ సహోదరుడు వ్యాధితో ఉన్నాడు. మరియు అతడు త్రాగుబోతు కూడ, అది సత్యము, కేవలము నమ్ముము. అతడు త్రాగుడు మానివేస్తాడు, బాగవుతాడు, "నీవు నమ్మితే సమస్తము సాధ్యమే".

77ఇక్కడే నాకు ఎదురుగా తన తలవంచుకొని, ప్రార్ధిస్తున్నది. "ప్రభువా నాకది అవును గాకని" ఆమె ప్రార్ధిస్తున్నది. నీకది చెప్పగలను ఒక స్నేహితురాలు కొరకు ఆమె ప్రార్ధిస్తున్నది. ఆ స్నేహితురాలు ఇక్కడ ఆసుపత్రిలో కొరుకుడు పుండుతో చనిపోబోతున్నది, ఆమె కొరకు కూడ , అది ఆమె పోగొట్టు కోబోతున్నది, మిసెస్‌ కెల్లీనీ పాదాలపై నిలబడి, యేసుక్రీస్తు నామములో, స్వస్థతను అంగీకరించు. నా జీవితములో, ఆమెను ఎన్నడూ నేను చూడలేదు.

గుండె జబ్బును దేవుడు బాగుచేయునని నీవు నమ్ముతున్నావా? ఆయన నీకున్నది బాగుచేయునని నమ్ముతున్నావా? అలాగైతే, ఆ విధముగా కదులుతూ "పియమైన దేవా మీకు కృతజ్ఞతలు" అని చెప్పు."

ఉదయాన్నే లేవటము కష్టతరముగా ఉంటున్నది, కీళ్ళవాత జబ్బు వలన నీవు ఎంతో గట్టిగా ఉంటావు. నీవు అలా ..,నమ్మి వెళితే నీకు ఆ విధముగా బలహీనతలన్నింటినుండి కూడ నీ నిండు హృదయంతో నీవు నమ్మితే, నీవు బాగుపడగలవు, రేపు ఉండదు. అవునండి, వెళ్ళుము..

సరేనండి, నీకు కల్వరిలో రక్తమార్పిడి అవసరమై ఉన్నది. అది మధుమేహ వ్యాధినుండి మరియు ఇతరమైన వాటినుండి అది నిన్ను బాగుచేస్తుంది. అది ఆయన చేయగలడని నీవు నమ్ముచున్నావా ? మంచిది ఆ విధముగా నీకున్న బలహీనతలన్నింటి నుండి కూడ నీ నిండు హృదయంతో నీవు నమ్మితే, నీవు బాగుపడగలవు.

MARK 16:17

 

78ఇక్కడకు రా, నీవు త్వరగా కంగారుపడుతూ ఉంటావు. అదే నీవు ఇబ్బంది కలిగించినది. నీకు కడుపులో పుండుయున్నది. దానిని దేవుడు స్వస్థపరచునని నీవు నమ్ముతున్నావా? (సహోదరి-అవును నేను నమ్ముచున్నాను-సంపా.) నేను నీకు ఒకటి చూపించాలి అని కోరుతున్నాను. ఒక నిముషము నా గడియారము తీస్తాను, కంగారు పడవద్దు. అది ఒక విధముగా కష్టం అయితే, నీవు మంచి ఆత్మను కలిగియున్నావు. నీ చేయి నన్ను పట్టుకోనివ్వు, నేను నీ చేయిని తీసుకొనగోరుచున్నాను. నా చేయి నీవు చూడాలని కోరుతున్నాను. ఇప్పుడు గమనించు, నాచేయి పైన నీ చేయి పెట్టబోతున్నాను. ఇప్పుడు నీవధి చూడు. అక్కడ కదులుతున్న వాటిని చూడు, అక్కడ చిన్న ఊగులాడునది చూడు, (అవును), అదే అక్కడ బ్రతికి యున్న పుండు. ఇప్పుడు గమనించు, నీ చేయి తీయు. అది తిరిగి మామూలుగా అయిపోతున్నది. ఇప్పుడు నా చేయి అక్కడ పెడతాను. అది ఆలాటీది చేయదు, చేసినదా ? (లేదు.) అయితే నేను మరలా నీ చేయి దానిపైన అక్కడే ఉంచినప్పుడు తిరిగి చూస్తున్నావా? (అవును)

ఒకటి అక్కడ సూచనగా ఉన్నది, అది నీ సొంత కళ్ళతో చూడగలుగుతావు, అవును అది నిజమా? (అవును- ఆమేన్‌. ) అది నిజమని సభికులు చూడగలుగుట కొరకై నీ చేయి పైకెత్తు.

79ఇక్కడ ఇటు సభలోని వారు అది చూడగలుగుతారు. నీ చేయి ఇక్కడ పెట్టు, ఆమ్మా ఇప్పుడు నీ చేయి తీయు, ఇప్పుడు మరలా నీచేయి అక్కడే ఉంచు. అది ప్రాణమున్న పుండు. అది ధాతువు, ధాతువు, ధాతువును తింటున్నది. అది కంగారు పడటం వలన, విస్తరిస్తున్నది. నీకు స్త్రీ సంబంధమైన జబ్బుకూడ ఉన్నది, అంతా సరియైనదిగా ఉన్నది. ఇప్పుడు, ఇక్కడ, ఇదే మొదట నీవు చొరవ తీసుకోవలసి ఉన్నది, ఈ స్త్రీ తెలుసుకొన్నట్లుగా చెయ్యాలి. ఇప్పుడు సభలోని వారు తలలు వంచి ప్రార్ధించాలని కోరుతున్నాను. ఎందుకనగా, ఇది ఒక చోట నుండి మరొక చోటుకు వెళ్ళుచున్నది. యేసు చెప్పాడు, "నా నామమున వారు దయ్యములను వెళ్ళగొట్టుదురు." అవును.

నీకు ఒక పుండు, ఆ విధమైైనది అవసరం లేనట్లయితే, ఇప్పుడు నీవు తలవంచి యుండు, చూసారా ? నీవిక్కడ గమనించాలని కోరుతున్నాను. నీకు పుండు ఉన్నది. ఇప్పుడు నా చేయిని నీవు గమనించు, మరియు చూడు, నా చేయిని నేను కదిలించుట లేదు. పరలోకపు తండ్రీ, ఈ స్త్రీ ని , ఈ స్త్రీ బాగుపడుట కొరకై, నీ యొక్క కృపా కనికరములు ఆమె పైన ఉండును గాక, ఈమే నా చేయిని కనిపెడుతుంది. తంట, అక్కడ ఏదైన మార్చు ఉన్నదా ? అని చూచుటకు ఆమె గమనించుచున్నది, ఆమె విశ్వాసము, నరాల బలహీనతగలదై యున్నది, అని నాకు తెలియును, దేవా అందువలన ఆమెకు నీవు సహాయము చేయుమని (ప్రార్ధిస్తున్నాను. యేసు నామములో ఆమెకు సహాయము చేయుము.

MARK 16:17

 

80ఇప్పుడు, అమ్మా, నేనింకా నా కన్నులు తెరువలేదు. అయితే నా చేయి ఇంకా ఆలాగున్నదని ఆమెకు తెలుసు. అమ్మా అది నిజము కాదా? (సహోదరి, అవును అయ్యా , అని చెప్పుచున్నది. -సంపా) ఇప్పుడు అది జాగ్రత్తగా గమనించు. ఇది జరిగినది, కనుపరచుకోవటానికి కాదు, యేసు ఆయన వాక్యమును నిలబెట్టుకోవటానికి ఇది జరిగినది. కనుక ఇప్పుడు, ఆయన చెప్పియున్నాడు , "నా నామమున వారు దయ్యములను వెళ్ళగొట్టుదురు." నేనిప్పుడు నా చేయిని అలా నిలకడగానే ఉంచబోతున్నాను. నా చేయిని పట్టుకొనగోరు విధము అది కాదని నేను గమనించగోరుతున్నాను. చూసారా, అది ఎప్పుడు అక్కడే ఉంటున్నది. ఏ విధముగా అది ఉబ్బుతున్నదో ? (సహోదరి-అవును- అని చెప్పుచున్నది-సంపా) సమయమంతటిలో కూడ ఇంకా చెడిపోతున్నది. (అవును"), ఎందుకనగా నేను పట్టుకున్నాను, నా ముంజేయి వరకు, నాచేయి అంతా కూడ తిమ్మిరెక్కి పోయింది. ఇప్పుడు నీవు కేవలం, ఒక్క క్షణము గమనించు.

MARK 16:17

 

81ప్రభువైన యేసు, ఒక ప్రదర్శన కొరకై (మేమిది చేయుట లేదు.) అయితే నీ యొక్క వాక్యము నెరవేర్చబడుట కొరకు. నీవు ఏనాడు దేవుడవని చూపించుకోవటానికి ప్రజలను స్వస్థపరచలేదు, అయితే అది వాక్యము యొక్క నెరవేర్చు అయి ఉ౦డెను, మరియు ఆ విథముగా నేను, అందుకని తండ్రీ, ఈ రాత్రి దీనిని చేసాను, ఈ దయ్యము నుండి ఈ మంచి స్త్రీ స్వస్థత పొందుటకై నా విశ్వాసము నమ్ముతున్నది.

యేసుక్రీస్తు నామములో ఎవరైతే సమస్త వ్యాధుల మీద జయము పొందెనో మరియు అట్టి వ్రభువైన యేసుక్రీన్తు నామములో సాతానా, నేను నీకు ఆనబెట్టుచున్నాను. అది ఆయన పాదములక్రింద ఉన్నది. ఆయన యొక్క సేవకునిగా నేను చొరవ తీసుకుంటున్నాను, యేసుక్రీస్తు నామములో ఈ స్త్రీ ని విడువుము, ఆమెలో నుండి బయటకు రా…

ఇప్పుడు, నాచేయిని నేను కదిలించలేను. ఆమె నాకు సాక్ష్యము, నా చేయికి ఒకటి జరిగినది, అవును కదా? (సహోదరి - అవును, అయ్యా,) అని చెప్పుచున్నది. -సంపా) అది నిజము అయితే, "ఆమేన్‌" అని చెప్పు, (ఆమేన్‌, అవును.") అది పోయినది, అది అలా కాధా? (అవును, ఆమేన్‌, అది పోయినది." ) నీవు స్వస్థతపొందావు, {"హల్లెలూయ !"} ఇప్పుడామె అక్కడ ఉన్నది. (యేసు నీకు వందనములు ఇప్పుడు ఇటు చూడు, నా చేయి పెట్టాను, అదే విధముగా ఇప్పుడు నీ చేయి మీద పెట్టు, నీవు స్వస్థత పొందావు.( అవును, ఆమేన్‌, హల్లెలూయ.) వెళ్ళి నీ సాయంకాల విందు నీవు భుజించు, యేసుక్రీస్తు నిన్ను బాగుచేయును. "నా నామమున వారు దెయ్యములను వెళ్ళగొట్టెదరు !"

అవును.

82సహోదరి, నీవు నమ్ముతున్నావా? నీవు నమ్ముతున్నావా? నీ దగ్గర నుండి ఉబ్బసపు సంభంధమైన స్థితిని దేవుడు తీసివేసి నిన్ను బాగుచేయునని నీవు నమ్ముతున్నావా ? "సరే, ప్రభువైన యేసు, నా నిండు హృదయంతో, నేను నిన్ను నమ్ముతున్నాను. నీకు ధన్యవాదములు అని చెబుతూ", నీ దారిన వెళ్ళు,

ఆయ్యా, ఏలాగున్నారు? గుండె నీకు కంగారు పెడుతుంది. నరముల బలహీనతకు ఒక విధముగా కారణమైనది. పౌను, రెండింతల పౌను రెండు ఒకదానిపై ఒకటి.., సరేనండి. అదిప్పుడు ఆగిపోయింది, వెళ్ళు, అయ్యా నీ విశ్వాసము నిన్ను సంపూర్ణునిగా చేస్తుంది. వెళ్ళు నీనిండు హృదయంతో నమ్ముతూ వెళ్ళు మంచిది.

మరియొక కడువు బాధను, యేసు నిన్ను బాగుచేస్తాడని నీవు నమ్ముతున్నావా ? "ప్రభువైన యేసు నీకు ధన్యవాదములు" అని, చెబుతూ వెళ్ళు, దానిని నమ్ము నీవు ఏమై ఉన్నది ఆయన చెప్పగలిగితే, తప్పకుండా ఆయన నిన్ను బాగుచేస్తాడు.

అక్కడ కుర్చిలో కూర్చున్నవారు నీతో ఒక్క మాట కూడ చెప్పకుండా నీ మీధ చేతులు పెట్టినట్లయితే నీవు స్వస్థత పొందుతావని నీవు నమ్ముతావా ? నీవు నమ్మి యుందువా? "ప్రభువా నీకు ధన్యవాదములు" అని చెబుతూ దారిన వెళ్ళు, నీవు నమ్మినదే అవుతుంది.

రమ్ము, అక్కడ కూర్చొన్న వారు, ఆ వీపు నొప్పి దేవుడు స్వస్థపరచునని నీవు నమ్ముతున్నావా ? సరే "ప్రభువా నీకే ధన్యవాదములు" అని చెబుతూ నీవు వెళ్ళవచ్చును. నీ నిండు హృదయంతో నమ్ము. వెళ్ళు, నమ్ముము.

ఆయ్యా, దేవుడు నిన్ను స్వస్థపరచకపోతే, ఒక దినమున నీవు కుంటివానిగా ఈలాగు కర్రపట్టుకొని కీళ్ళ నొప్పులతో నడుస్తావు. ఇప్పుడే ఆయనను ఎందుకు అంగీకరించకూడదు? నీవది నమ్ముతున్నావా? "ప్రభువా నీకే ధన్యవాదములు" అని చెప్పుకుంటూ నీ ధారిన వెళ్ళు. అడుగులు త్రొక్కుతూ ఆనందిస్తూ, నీ దారిన వెళ్ళు.

83యేసు నీ వీపును బాగు చేయును, మరియు నిన్ను బాగుచేయును. దానిని నమ్ముతున్నావా ? మంచిది, "ప్రియమైన దేవా నీకు కృతజ్ఞతలు" అని చెబుతూ నీ దారిన వెళ్ళుము.

అమ్మా ఇక్కడికి రా, నీవు దేనికి భీతి చెందేది ? నీవు భయపడు కారణం, ఏదనగా నీకు బుతువు ఆగిపోయే సమయమిది. నా అర్ధమేదో నీకు తెలిసినదా స్తీ మార్పు కాలమిది, ప్రతీ దానిలో సాయంకాల సమయంలో నీవు అలసిపోతావు, నీవు పని చేసుకోలేవు, నీవెంతో అలసిపోతావు, అది నిజమే కదా ? ( ఆ సహోదరి చెప్పుచున్నది, అది సత్యమే -సంపా) అంతా సరైనది. ఇప్పుడంతా మంచిది. వెళ్ళు నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచును.

మరొకరికి, నరముల బలహీనత, అయితే నీ బ్రతుకంతా నీవు నరముల బలహీనతతో ఉంటున్నావు, నీవు చిన్న వానిగా ఉన్నప్పటి నుండి నీవు కొంత నరముల బలహీనత కలిగి ఉన్నావు. ఒక విధముగా ఒక విధమైన చెడ్డ పేరు నీకుంటుంది. అయితే ఇప్పుడు నిన్నొకటి పట్టుకున్నట్లుగా ఉన్నది. నీ వెప్పుడు కృంగిపోయి ఉ౦టావు. అది నిజము కాదా ? ఇప్పుడే నీవు నన్ను దేవుని ప్రవక్తవని నమ్మినట్లయితే, అది ఇక ఉండదు, వెళ్ళు, ఆ విధముగా నమ్ము.

MARK 16:17,18•

HEB 4:12

 

84అక్కడున్న వారు ఎంతమంది మీ నిండు హృదయంతో నమ్ముతున్నారు ? ఒకరిపైన ఒకరు చేతులు పెట్టండి. ఇక్కడున్న స్త్రీ, పురుషుడు, ఒకరిపైన ఒకరు చేతులుంచమని, నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ఆనబెట్టుచున్నాను. దేవుని యెక్క వాక్యము సగము నిజమా? లేక అంతా నిజమా అని, యేసుక్రీస్తు చెప్పెను "నా నామమున వారు దయ్యములను వెళ్ళగొట్టుదురు, దేవుని యొక్క వాక్యము హృదయం యొక్క ఆలోచనలను, తలంపులను పరిశోధించును." యేసు చెప్పాడు, "వారు రోగుల మీద చేతులుంచినప్పుడు వారు స్వస్థత నొందెదరు". అందుకై ఇక్కడున్న ప్రతీ విశ్వాసి "ఆమేన్‌" అని చెప్పండి. (సమాజం ఆమెన్‌ అని చెప్పును- సంపొ) చేతులు పెట్టిన వారి కొరకు నీవు ప్రార్ధించు, అలాంటప్పుడు మీరు విశ్వాసులై యున్నారు.

మీ పైన చేతులు పెట్టిన వారి కొరకై ప్రార్ధించండి. ఎందుకంటే వారు మీ కొరకై ప్రార్ధన చేస్తున్నారు. యేసుక్రీస్తు యొక్క సన్నిధానములో, ఇక్కడున్న ప్రతీ వ్యాధిగ్రస్తుడు స్వస్థత పొందునట్లును, శత్రువును ఓడించుటకై మనము కలసి ప్రార్ధన చేద్దాం.

MARK 16:17•

HEB 13:8

 

85సర్వశక్తిగల దేవా, జీవానికి కర్తా, మంచి ఈవులన్నింటికి ప్రధాతా,

ఈ ప్రజలపైకి నీ ఆశీర్వాదాలను కుమ్మరించుము. సాతానా, యుద్ధంలో నీవు ఓడిపోయావు. యేసుక్రీస్తు ఇక్కడే ఉన్నాడు. ఆయన నిన్న, నేడు, యుగ యుగములు ఒక్కటే రీతిగా ఉన్నాడు.

"నమ్మిన వారి వలన ఈ నూచక క్రియలు జరుగునని" నీవే చెప్పియుంటివి. వారిలో ప్రతీ ఒక్క క్రైస్తవులు ఒకరిపైన ఒకరు చేతులుంచారు. విశ్వాస సహితమైన ప్రార్ధన వారు చేస్తున్నారు. వారిలో ప్రతీ ఒక్కరూ "ఆమేన్‌" అని చెప్పారు. వారు నమ్మిరి. "నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు జరుగును" అని నీవు చెప్పినప్పుడు నీ హృదయపు ఆశను, వారు నొక్కి వక్కాణించారు. వారు ఒకరిపైన ఒకరు చేతులుంచారు.

సాతానా నీవు యేసుక్రీస్తు నామములో, వానిలో నుండి బయటకు రా. యేసుక్రీస్తు నామములో, ఈ స్థలాన్ని ఈ భవనాన్ని విడువుము.

నమ్మిన ప్రతీ యొక్క స్త్రీ పురుషుడు, ఆ యొక్క విశ్వాసి తన యొక్క చేతులు నీ మీద ఉంచియున్నాడు, విశ్వాస సహితమైన ప్రార్ధన చేయబడినది, నీ యొక్క వ్యాధిని దాన్ని గూర్చిన తలంపును నీవు మరచిపోవుటకు సంసిద్ధముగా ఉన్నావు, నీ హృదయంలోనికి వెళ్ళుటకు దేవుని యొక్క వాక్యమును అంగీకరి౦చుము, యేసుక్రీస్తు నామములో నీవు లేచి, నీ స్వస్థతను అంగీకరించుము.

ఆమేన్‌.., ఆమేన్‌! ఇప్పుడు నీ చేతులు పైకెత్తి ఆయనకు స్తుతి అర్పించుము, ఎందుకనగా అదంతా అయిపోయినది.

Search Messages

0 / 0 matches
Enter characters above to process real-time text query scopes...