దేవుడే తన స్వంత అనువాదకుడు

దేవుడే తన స్వంత అనువాదకుడు

1మా పరమ తండ్రీ, నీ నుండి వచ్చు మాట ఏ సమయములోనయినా సరే ఏ మానవుడయిననూ చెప్పునది లేక చేయునదాని దేనికన్ననూ అర్థవంతమయినదిగా నుండును, ఎందుకనగా ప్రజలు నిన్ను చూచుటకు కనిపెట్టుచున్నారు. ఆశతో వచ్చిన వారు ఏదో జరుగవలెనని చూచుచున్నారు గనుక నిన్ను మేము స్తుతించుచున్నాము. ప్రజలు ఒకదాని కొరకు దాహము కలిగియున్నపుడు, కరడు కరడును పిలచుచున్నపుడు ఆ పిలుపునకు స్పందించుటకు అక్కడ తప్పుక ఒక కరడు ఉండవలసియుండును. అందుకే మేము ఇక్కడ ఈ రాత్రి ఉన్నాము, ఎందుకనగా ఈ సేవకుల హృదయములలోను, జనుల హృదయాలలోను, మేమందరము కలిసి నీ యొక్క దీవెనలు, ఉపకారములు అడుగుటకు వచ్చియున్నాము. రోగులను బాగు చేయుదువనియు, నశించినవారిని రక్షించుదువనియు, నీ వాక్యమును బయలుపరచుదువనియు నమ్మికతో యున్నాము.

రాత్రి వెంబడి రాత్రి మేమందరము దీనముగా నీ కొరకు కనిపెట్టుకొనియుండగా, దీనిని మాకు అనుగ్రహించుమని పరమ తండ్రి మేము ప్రార్థించుచున్నాము. దేవునిని తప్పు తమ చుట్టూ ఉన్న మరి దేనిని చూడకుండా గ్రుడ్డి వారగునట్లు ప్రతి వారిపైని అట్టి పరిశుద్ధాత్మ కుమ్మరింపును దయచేయుము. ఇక్కడున్న ప్రాంతమంతటిలోను ఉజ్జీవము వచ్చునట్లును, ప్రతి సంఘము నిండుగా జనులతో క్రిక్కిరిసిపోవునట్లును, పాపులు దేవుని కృప కొరకు మొర్రపెట్టునట్లును, పరిశుద్ధాత్మ రోగులను బాగుపరచి, కుంటివారు నడచునట్లు, మృతులు తిరిగి లేచునట్లు, నీ వాక్యములో వాగ్దానము చేయబడినవి అనుగ్రహించబడునట్లు చేయులాగున దేవుని పట్ల దాహము, జనులమధ్య ఒక గొప్ప కేక వెళ్ళును గాక!

ప్రభువైన యేసూ, వచ్చి నీ వాగ్దానమును నెరవేర్చుము. ఈ రాత్రి మా యొద్దకు రమ్ము. నీవు నిన్న, నేడు, నిరంతరము ఏకరీతిగా ఉన్నావని మేము నమ్ముచున్నాము. నీ వాగ్దానములు తప్పిపోవు. భూమ్యాకాశములు రెండును గతించును గాని నీ వాక్యము తప్పిపోదు. మా అవగాహన తెరువబడును గాక. పరిశుద్ధాత్మ వచ్చి బీడు భూమిని దున్నును గాక. ఈ రాత్రి దేవుని శక్తి ఆత్మల వైపునకు మా అవగాహన తెరువబడి, మా ద్వారా ఆయన తన వాగ్దాన వాక్యములను బయలుపరచును గాక. యేసు నామములో దీనిని అడుగుచున్నాము. ఆమేన్.

2PET 1:15-21

 

2ఇపుడు, ఈ రాత్రి వాక్యమును పరిశీలించగోరువారు II పేతురు 15వ వచనముతో ఆరంభించి బైబిలు గ్రంథము నుండి చదువుదము. వాక్యముపై కొన్ని క్షణములు మాట్లాడుటకు ఒక మార్గము.

నేను మృతి పొందిన తరువాత కూడ మీరు నిత్యము వీటిని జ్ఞాపకము చేసికొనునట్లు జాగ్రత్త చేతును.

ఏలయనగా చమత్కారముగా కల్పించిన కధలను అనుసరించి మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క శక్తిని ఆయన రాకడను మేము మీకు తెలుపలేదు గాని ఆయన మహాత్యమును మేము కన్నులార చూచినవారమై తెలిపితిమి.

"కన్నులార చూచిన వారము" అన్న మాటను నేను ప్రేమించుచున్నాను. ఏదో కట్టు కధ కాదు. మేము దేని గూర్చి మాట్లాడుచున్నామో దానికి మేము సాక్షులము.

ఈయన నా ప్రియ కుమారుడు, ఈయనయందు నేను ఆనందించుచున్నాను అను శబ్దము మహా దివ్య మహిమ నుండి ఆయన యొద్దకు వచ్చినపుడు తండ్రియైన దేవుని వలన ఘనతయు, మహిమయు ఆయన పొందగా,

మేము ఆ పరిశుద్ధ పర్వతము మీద ఆయనతో కూడా ఉండినవారమై శబ్దము ఆకాశమునుండి రాగా వింటిమి.

మరియు ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యము మనకున్నది. తెల్లవారి వేకువ చుక్క మా హృదయములలో ఉదయించు వరకు ఆ వాక్యము చీకటి గల చోటున వెలుగిచ్చు దీపమైనట్టున్నది. దాని యందు మీరు లక్ష్యముంచినయెడల మికు మేలు.

ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనములో ఏ ప్రవచనమును పుట్టదని మొదట గ్రహించుకొనవలెను.

ఏలయనగా ప్రవచనము ఎప్పుడును మనుష్యని ఇచ్చనుబట్టి కలుగలేదు గాని మనష్యులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడినవారై దేవుని మూలముగా పలికిరి.

చదువబడిన వాక్యమునకు ప్రభువు తన దీవెనలు దయచేయును గాక. ఇపుడు, నేను దీనిని ఒక అంశముగా తీసికొనగోరుచున్నాను: "దేవుడే తన స్వంత అనువాదకుడు."

JOHN 1:1,14•

ROM 2:16

 

3మనము గలిబిలిగా ఉన్న దినములలో జీవించుచున్నాము. స్త్రీ, పురుషులకు ఏమి చేయవలెనో ఎరుగని దినమున మనము జీవించుచున్నాము. ప్రతిదియు చిందర వందరగా నున్నట్లు కనుగొనుచున్నాము. ప్రతిదియు చూచుటకు అనేక విభిన్న రీతులలో నున్నట్లుగా కనిపించుచున్నది. దానిని సాతాను ఆలాగు చేయుచున్నది.

ఇప్పుడు, దేవుడు మానవులకు తీర్పు చేయుటకు ఒక కొలబద్ద ఏదో కలిగియుండవలెను, లేనిచో ఆయన నీతి బద్ధముగా మనుష్యులకు తీర్పు తీర్చజాలడు. యేసుక్రీస్తు ద్వారా మానవులందరికి ఆయన తీర్పు తీర్చునని బైబిలు చెప్పుచున్నది. యేసుక్రీస్తు అనగా వాక్యము. పరిశుద్ధ యోహాను సువార్త 1వ అధ్యాయములో ఇట్లు చెప్పబడెను:

ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడైయుండెను.

ఆ వాక్యమే శరీరధారియై మన మధ్య నివసించెను…

4నేడు మనందరము ఆయన పోలికలను ప్రదర్శించుచున్నాము. దేవునిలో… మొదటగా ఆయన దేవుడే కాడు. ఆయనను, "నిత్యుడగువాడు" అని మనము పిలచుచున్నాము. అదే దేవుడు అను మాట. ఆయన దేవుడు కాదు, ఎందుకనగా దేవుడు (ఆంగ్ల పదము) అను మాటకు "ఆరాధనకు ఆధారుడు," అని అర్థము. అక్కడ ఆయనను ఆరాధించుటకు ఏదియూ లేదు. కాబట్టి ఆయన నిత్యుడు, సమస్త జ్ఞానమునకు ప్రధాన ప్రవాహము. ఈ సమస్త జ్ఞానము యొక్క మూలములో ఒక అణువుగాని, మాలిక్యూలుగాని మరేదీ లేదు. ఎక్కడా వెలుగులేదు. నక్షత్రము, చంద్రుడు, ఏదియూ లేదు. దేవుడు, ఇప్పుడు మనము ఎరిగిన దేవుడు నిత్యత్వము కలిగిన ఒక గొప్ప ఆత్మ. (ఆది - అంతము ఎన్నడూ లేదు), ఆయన అక్కడ ఉండెను. ఆయనలో లక్షణములుండెను. దేవునిగా ఉండు లక్షణము. తండ్రిగా ఉండు లక్షణము, కుమారునిగా ఉండు లక్షణము, రక్షకునిగా ఉండు లక్షణము, బాగుచేయువానిగా ఉండు లక్షణము ఆయనలో ఉండెను. ఈ లక్షణములన్నియు ఆయనలో ఉండెను. ఇప్పుడు, అప్పటినుండియు విడమరచబడిన ఈ సంగతులన్నియూ బయలుపరచబడిన ఆయన యొక్క లక్షణములైయుండెను.

5లక్షణములు అని నేను చెప్పు దానికి నా భావములో ఆయన యొక్క ఆలోచనలు, అని అర్థము. "ఒక వ్యక్తపరచబడిన ఆలోచనయే," మాట. అప్పుడది ఆయన ఆలోచనలో ఉండెను. "కలుగును గాక," అని ఆయన పలికినప్పుడు, అది అక్కడ ఉండెను. "కలుగును గాక" అన్నపుడు అది కలిగెను.

ఒక ప్రపంచము అనునది లేకముందే క్రైస్తవులగు మీరు ఆయన ఆలోచనలుగా ఉన్నారని గుర్తుచేసికొనండి. ఆయన యొక్క ఆలోచనకు మీరు ప్రత్యక్షత. ప్రపంచము అనునది ఒకటి అక్కడ లేక ముందే మీరు క్రీస్తు నందున్నారు (ఆమేన్) ఆదియందు దేవుడుండెను. అది నిన్ను ఆయనకు సంబంధించినవారిగా చేయును. ఆ మొత్తము దేవుడే, తనకుతాను, తాక కలుగునట్లుగాను, చూడ కలుగునట్లుగాను - ఇంకా అట్టి రీతిగా చేయ కలుగునట్లుగాను ఆయన తానే దృశ్య రూపములో కనబరచుకొనెను. అదే దేవుని యొక్క పూర్తి సంగతి అయియున్నది.

6"వ్యాఖ్యానం…" అని జనులు అప్పుడనుచుందురు. ఇక్కడ ఒక కూటములో కొద్ది కాలము క్రితము ఒకాయన నాతో ఇట్లు అనెను, "బ్రెన్హాం సోదరుడా, నీవు తప్పు తర్జుమా చేయుచున్నావు. దానిని సరిగా నీవు అనువదించుట లేదు."

ఇప్పుడు, మనము విందుము… వారు మెతడిస్టు, వారి యొద్దకు వెళ్ళెదరు. "బాప్టిస్టు వారు సరిగా అనువదించుట లేదని," వారందురు. "పెంతెకోస్తు వారు సరిగా అనువదించుట లేదని," బాప్టిస్టు వారందురు. "ఏకత్వము వారు సరిగా చేయుట లేదని," పెంతెకోస్తు వారందురు. అసెంబ్లీసు వారు సరిగా చేయుట లేదని," ఏకత్వము వారందురు. ఇతరులు సరిగా చేయుట లేదని ఒకరికొకరు చెప్పుచున్నారు.

దేవుడే తనకు స్వంత అనువాదకుడు. ఆయనకు అనువదించుటకు ఎవరూ ఆయనకు అక్కర లేదు. ఆయన తనకు తానే అనువదించుకొనును. దేవునికి అనువదించకలిగిన మానవుడెవడు? దేవుడే తనకు స్వంత అనువాదకుడు.

GEN 1:3

 

7పేతురు ఇక్కడ మాట్లాడుచున్నాడు, ఆదియందు, దేవుడు, "వెలుగు కలుగును గాక," అని చెప్పుట మనము కనుగొందుము. అక్కడ వెలుగు కలిగెను. అదే దానికి అనువాదము. దేవుడు ఏదయినా పలికినప్పుడు, అది ప్రత్యక్షపరచబడినప్పుడు అదే ఆయన చెప్పిన మాట సరయినదనుటకు అనువాదము, చూచారా. "వెలుగు కలుగును గాక," అని ఆయన పలికినప్పుడు అసలు వెలుగు అనునది ఏదీ లేక పూర్వమే, ఆయన ఆలోచనలో అది ఉండెను. "వెలుగు కలుగును గాక" అని ఆయన పలికినప్పుడు, వెలుగు ఆకాశములలో దూసికొని వచ్చెను; అదియే అనువాదము. ఎవరునూ దానిని అనువదించనవసరము లేదు, ఎందుకనగా దేవుడు ఆలాగు పలికెను మరియు అది అక్కడ ఉండెను. దేవుడు పలికినప్పుడు, అది ప్రత్యక్షమయినప్పుడు అదే ఆయన మాటకు అనువాదము. మానవుడు దానిని ఎందుకు చూడలేదు? ప్రజలెందుకు దానిని చూడజాలరు?

8దేవుడు ఒక వాగ్దానము చేసి, దేవుడు చెప్పినప్పుడు… ఆదియందు ఆదికాండములో ప్రతి కాలమునకు ఆయన తన మాటను కేటాయించెను. అది ఆది నుండి అంతము వరకు ఆలాగు దిగి వచ్చెను. ఈ కాలముల వరకును వీటన్నింటిని ఆచారములు మొదలగు వాని ద్వారా సంఘ ప్రపంచము వీటిని కలగలుపు చేసినప్పుడు, పాత నిబంధన నుండి క్రొత్త నిబంధన వరకును ప్రవక్తలను రంగము మీదికి పంపించుచున్నాడు! యెహోవా వాక్కు ప్రవక్త యొద్దకు వచ్చును. అది ఏలాగు దానిని చేయును? అది దేవుని వాక్యమును బయలు పరచును. అది తప్పో, ఒప్పో దేవుని ప్రత్యక్షత చెప్పును. ఎవరూ దానిని అనువదించనవసరము లేదు. వాక్యము తనకదే అనువదించుకొనును. దానిని దేవుడు వాగ్దానము చేసెను మరియు అది అక్కడ జరుగును!

దాని గూర్చి మరి ఏదయినా చెప్పుట వలన దానికి ఏమి మేలు జరుగును? ఆ అనువాదము తప్పు అని చెప్పుటకు ప్రయత్నీంచు పాపాత్ముడెవడు? (దేవుడు వాగ్దానము చేసినప్పుడు, దానిని దేవుడు చేయును) తన అనువాదమును దేవుడు తానే స్వంతముగా చేసికొనుచున్నాడు, అనువదించును. ఆయనకు అనువదించుటకు ఎవరూ ఆయనకు అక్కరలేదు. తాను చేయుదునని వాగ్దానము చేసిన దానిని బయలుపరచుట ద్వారా తనకుతాను ఆయన అనువదించుకొనును.

ఓ, సంఘము దానిని చూడలిగినచో, ప్రతికాలమునకు కేటాయించబడిన వాగ్దానములను చూడగలిగినచో చాలును! తక్కిన కాలములన్నియూ దేవుడు తెర మీదికి పంపించెను. (ఏడు సంఘ కాలముల ద్వారా కూడాను) చేయుదునని వాగ్దానము చేసిన ప్రతి దానిని ఆయన బయలుపరచెను; సమస్తమును. చేయకుండా లేనిది ఒక్కటి కూడా మిగిలియుండలేదు. ఖచ్చితంగా! ఏది ఆయన చేయుదునని చెప్పెనో, దానిని ఆయన చేసెను.

ISA 7:14•

MATT 17:5•

MARK 9:7•

LUKE 9:35

 

9వెనుక యెషయాలో దేవుడు ఈలాగు చెప్పెను, "ఒక కన్యక గర్భవతి యగును," మరియు ఆమె అయినది. ఇప్పుడు ఎవరు దానిని అనువదించగలరు? దేవుడు అనువాదము జరిగించెను. "ఒక కన్యక గర్భవతి యగును," అనగా ఆమె గర్భవతి అయినది. ఇప్పుడు, దాని గూర్చి ఏదియూ చెప్పబడజాలదు, ఎందుకనగా ఆమె అగును అని దేవుడు చెప్పెను మరియు ఆమె ఆయెను. కాని దానిని సంఘము చూడలేనంతగా గ్రుడ్డిది అయినది. చూడండి, దానిని గూర్చి వారికి తమ స్వంత ఉద్దేశ్యమున్నది. వారు ఊహించుచున్న దానికి అది ఎంతో తేడాగా యున్నది.

పేతురు ఇక్కడ వెనుక దానిని ప్రస్తావించుచున్నాడు, "దేవుడు తన మాట ద్వారా క్రీస్తును ప్రత్యక్షపరచెను. 'ఈయన నా ప్రియకుమారుడు'" అని ఆయన చెప్పెను. ఈ విశ్వాసులు అక్కడ నిలబడియుండిరి. క్రీస్తే దేవుని యొక్క ప్రత్యక్షత, ఎందుకనగా క్రీస్తే వాక్యము. ఆయన ఎల్లప్పుడూ ప్రత్యక్షపరచును.

ISA 7:14•

JER 28:9

 

10ఆయన చెప్పెను… నోవహు దినములవలే, నోవహులో క్రీస్తు ఉండెను. దానిని నీవు నమ్ముదవా? "వర్షము పడును, వాన వచ్చును, భూమి నాశనము అగును," అని నోవహు చెప్పెను. వర్షించెను. దానికి ఏ అనువాదము అవసరము లేదు. వర్షించుటకు కారణము ఏమనగా నోవహులో దేవుడు ఉండి, "వర్షించును" అని పలికెను. అతడు ఒక ప్రవక్త. అతడు చెప్పినది జరుగుటయే దానికి నిదర్శనము. కనుక దానిని వారు అనువదించవలసిన పనిలేదు.

చుట్టూ ఉన్నవారు కొందరు, "ఈ మనిషి అర్థములేని మాటలు పలుకుతున్నాడని చెప్పియుందురు."

కాని దేవుడు ఎల్లప్పుడూ ఈలాగు వాగ్దానపరచెను, "మీ మధ్య ఆత్మ సంబంధియు లేదా ప్రవక్తయూ ఎవడైననూ ఉన్నయెడల, అతడు చెప్పినది నెరవేరినప్పుడు దానిని వినవలెను." అది సరియై, ఎందుకనగా అది సత్యము. అది తప్పక వాక్యానుసారమై యుండవలెను. నోవహు వాక్యానుసారముగా యుండెను. వర్షించునని అతడు ప్రవచించగా, వర్షించెను. దానికి ఎట్టి అనువాదమూ అవసరము లేదు, ఎందుకనగా అది ఆలాగు జరిగెను.

యెషయా చెప్పెను,. "కన్యక గర్భవతి యగును," మరియు ఆమె ఆయెను. అది అసాధారణమగు విపరీతము. ఏలయనగా చూడండి, ఈ కన్యక గర్భవతి యగుటకు ఎన్నో సంవత్సరముల ముందే అది చెప్పుబడెను.

MATT 1:19

 

11ఆమె భర్తయగు యోసేపు అను ఒక మంచి మనిషి. అది ఒక అసాధారణ సంగతి. "అతడు మంచివాడైయుండి ఆమెను బహిరంగముగా చూపించనొల్లక…" ఆ రోజులలో అతడొక మంచివాడు. యోసేపుకు మరియతో ప్రధానము చేయబడెను. భార్యగా ఆమె ఉండును.

ఆమె ప్రధానము చేయబడినది. ఆ దినమున దానిని మీరుట వ్యభిచారము చేయుటతో సమానము. తన తప్పునకు అతనిని ఒక రక్షణగా, లేదా కేడెముగా మరియు ఉపయోగించుకొన ప్రయత్నించుకొనుచున్నట్లుగా యోసేపునకు కనిపించెను, ఎందుకనగా ఆమె పెండ్లి కాకముందే లేక ప్రధానము చేయబడినప్పటికే తల్లి కానున్నది. అటువంటి తంత్రమునకు ధర్మశాస్త్రమును బట్టి రాళ్ళతో కొట్టి చంపబడవలసియుండెను.

అయితే ఆమె భర్తయగు యోసేపు ఒక నీతిమంతుడు. చాలా న్యాయపరుడు. అతడు దేవుని విశ్వసించెను. ఆమె చక్కని పెద్ద కండ్లతో అతని వైపు చూచి, "యోసేపూ, ప్రధాన దూతయగు గాబ్రియేలు నన్ను దర్శించి, పురుషుని ఎరుగకుండానే నేను గర్భము ధరించనైయున్నానని చెప్పెను," అన్నది.

యోసేపు గనుక వెనుక వాక్యమును చూచినట్లయితే, ఆమె ఆ విధముగా ఉండునని ప్రవక్త చెప్పెను! అది దేవుడు తన స్వంత వాక్యమును అనువాదము చేయుట మాత్రమే, చూచారా. కాని అది ఎంతో అసాధారణము.

MATT 1:20

 

12ఏ కాలము లోనయినా గాని అదే సంగతి. దేవుని వాక్యము జనులకు పరాయిగా నుండును. అది చాలా అసాధారణముగా నుండును. దేవుడు ఎల్లప్పుడు అసాధారణమైనది చేయును. దేవుడు ఎక్కడున్ననూ అది అసాధారణముగానే ఉండును. అది ప్రపంచము యొక్క క్రమములకు విరోధముగా నుండును, ఎందుకనగా వారు తాము ఏ విధముగా ఉండవలెనని అనుకొనిరో, ఆ విధముగానే అన్నియూ కలిగియుండిరి. కాని దేవుడు వచ్చి అసాధారణమైనది చేయును.

"ఈ కన్యక ఎట్లు గర్భవతి యగును?" అతడు యధార్థవంతుడు; దానిగూర్చి దేవునిని అతడు విచారించెను.

అప్పుడు దేవుడు అతనికి ఒక కలలో చెప్పెను, "దావీదు కుమారుడగు యోసేపు, నీ భార్యయగు మరియను చేర్చుకొనుటకు భయపడవద్దు. ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భము ధరించినది. దేవుడు ఆమెను కమ్ముకొనెను. ఇది దాని వలనే జరిగినది."

13అక్కడ యోసేపుతో దేవుడు ఎట్లు వ్యవహరించేనో మీరెప్పుడైనా గమనించారా? రెండవ విధానములో అనగా, స్వప్న రీతిగా మాట్లాడెను. ఇప్పుడు, కలలున్నవని మన మెరుగుదుము; కలలందు మనము విశ్వాముంచుచున్నాము. నేను కలలను నమ్ముదును. దేవుడు ఎల్లప్పుడూ కలల ద్వారా మానవులతో మాట్లాడును. కాని కలలు రెండో విధానము, చూచారా; అది భావము తెలియ చెప్పబడువరకు అవునో లేక కాదో తెలియదు. కాని అతనికి ఏ అనువాదము అవసరము లేదు. అది దేవుడే యోసేపుతో ప్రత్యక్షముగా మాట్లాడుట, ఎందుకనగా ఆ దినములలో భావము తెలియ చేయుటకు దేశములో ప్రవక్త లేడు. నాలుగు వందల సంవత్సరముల పాటు అక్కడ ప్రవక్త లేడు. కనుక తరువాత ఉత్తమమైనది, దేవుడు తన కుమారుని సంరక్షణ కొరకు ఉద్దేశించినది భావము చెప్పనక్కరలేకుండా ఒక కల ద్వారా యోసేపుతో మాట్లాడుటయే. "ఆమె మంచిది. ఆమె గర్భము ధరించిన ఆ పవిత్రమైనది దేవుని కుమారుడే," అని చెప్పెను. ఏ అనువాదము అవసరము లేదు.

ISA 7:14•

2PET 1:20,21

 

14యధార్థమగు, నిజమగు హృదయములకు, మర్మయుక్తముగా నున్న సంగతుల వైపు చూచు స్త్రీ, పురుషులకు దేవుడు తన స్వంత అనువాదమును చెప్పును. నీవు నిజముగా, యధార్థముగా నమ్మినచో, దానిని తెలియ చెప్పు మార్గము దేవునికి ఒకటున్నది. అది వాగ్దానమేమో కనుగొనుము. యోసేపు కొద్దిగా వెనుకకు వెళ్ళి, ఆచారముల నుండి దూరమయి, బైబిలు యొద్దకు తిరిగి వెళ్ళినచో - ఆమె ఆలాగుండునని యెషయాలో చెప్పబడి యుండుట కనుగొనును.

చెప్పబడిన సంగతులన్నియూ, ఆయన జన్మ, దాని గుర్చి చెప్పబడినదంతయూ, వాక్యమంతయూ "పరిశుద్ధ ప్రవక్తల ద్వారానే." పేతురు చెప్పినట్లుగానే, దానికి ఎట్టి స్వంత అనువాదము చేయుటకు ఏ మనుష్యునికి హక్కు లేదు. ఏది జరుగునని దేవుడు చెప్పెనో, సరిగ్గా అదే. ఆ దినమునకు వాగ్దానము చేయబడిన దేవుని యొక్క వాక్యమునకు ఆయనే ప్రత్యక్షత. దేవుడు దానిని చెప్పెను, అది ఆలాగు జరిగెను. అది స్థిరపరచబడెను.

JOHN 5:39

 

15యేసు చెప్పెను… ఆయన భూమి మీద ఉన్నప్పుడు, ఆయన సేవను వారు అర్థము చేసికోలేనప్పుడు అది గొప్ప ఆశ్చర్యకరమగు సంఘటనగా, ఆశ్చర్యకరముగా ఉండెను. వారు చేసికోలేదు… వారాయనను అర్ధము చేనకోలేకపోయిరి. "వాక్యమును పరిశోధించుడి," అని ఆయన చెప్పెను. (దానిలోనికి గట్టిగా ధ్వని చేయుట వలన అక్కడున్న మాకు చెవుడు కలుగ చేయుట లేదని తలంచుచున్నాను.) "ఈ లేఖనములను పరిశోధించుడి, ఎందుకనగా వాటిలో నిత్యజీవము కలదని మీరు తలంచుచున్నారు, మరియు నన్ను గూర్చి సాక్ష్యమిచ్చునవి అవే." చూచారా? "నేనెవరినో అవి తెలియ చెప్పును."

ISA 7:14•

ISA 9:6•

JOHN 5:39

 

16చూడండి, దేవుడు వాక్యమును కేటాయించెను. ఆ దినము దేవుని యొక్క ప్రత్యక్షతా దినముగా నుండును. దేవుడు — ఇమ్మానుయేలు — మనకు తోడు. "ఆయన పేరు ఆశ్చర్యకరుడు, ఆలోచన కర్త, సమాధానాధిపతి, బలవంతుడగు దేవుడు, నిత్యుడగు తండ్రి. ఆయన పేరు ఇమ్మానుయేలుగా పిలువబడును, 'దేవుడు మనకు తోడు.'" దేవుడు దావీదులో ఉండెను. దేవుడు మోషేలో ఉండెను. దేవుడు, ఆ కాలమున తన్నుతాను ఆ విధముగానే బయలుపరచు కొనుచుండెను. కాని ఈ కాలము, "ఒక కన్యక గర్భవతియై కుమారుని కనును, ఆయనే మనతో నున్న దేవుడు."

తన్నుతాను దేవునిగా చేసికొన్నాడనియు, సబ్బాతును ఉల్లంఘించెనని కూడా వారాయనను సిలువ వేసిరి. ఆయన - సబ్బాతు మీద దేవుడు. ఆయన దేవుడై యుండెను. ఆయన ఎదో మామూలు మనిషి గాని, లేదా మామూలు ప్రవక్త గాని కాదు — అయినను ఆయన ఒక సామాన్య మనిషి మరియు ఒక ప్రవక్త — అయితే ఆయన దేవ-ప్రవక్త. ఆయన వాక్యమునకు నెరవేర్పు, ఖచ్చితముగా దేవుడు ఏది చేయునని చెప్పెనో అదే. "నాలో పాపమున్నదని ఎవరు నిరూపించగలరు? లేఖనములను పరిశోధించుడి! వాటిలో నిత్యజీవమున్నదని మీరు తలంచుచున్నారు, మరియు అవే నన్ను గూర్చి సాక్ష్యమిచ్చుచున్నవి." కాని వారి ఆచారములు… వారు మరియొక కాలపు మిరమిట్లు గొలుపు కాంతిలో జీవించుచున్నారు.

17కొద్ది వారముల క్రితము నేను, "మిరమిట్లు గొలుపు కాంతిలో జీవించుట" (Living in a glare) అనునది ప్రసంగించాను. ఆ మిరుమిట్లు గొలుపు కాంతి అనగా, "ఒక ఎండ మావి," సూర్యుడు తనకుతాను ప్రతిబింబించును, అది నిజము కాదు. మరియొక కాలము యొక్క ఏ ప్రకాశమైనా గాని ఒక తప్పు ప్రతిబింబమే. సంవత్సరాల క్రితము జరిగిన దానిలోనే ప్రజలు ఎల్లప్పుడూ నడచుచున్నారు. లూథరన్ వారు ఒక లూథరన్ మిరమిట్లు గొలుపు కాంతిలో నడచుచున్నారు. తన దినమున లూథరు యొక్క సూర్యకాంతి మంచిదే; వెస్లీ తన దినమున మంచిదే; పెంతెకొస్తు దాని దినమున మంచిదే. మనము నిచ్చెనలో పైకి ఎక్కుచున్నాము; మనము మరియొక కాలములో జీవించుచున్నాము! మనము ముందుకు, ముందుకు సాగిపోవుచున్నాము; వెనక్కు తిరిగి చూడజాలము.

సంగతులలో మనలను మనము స్ధిరపరచుకొన్నప్పుడు, దానిని అంతా చేసినామని అనుకొందుము, మనము మన ఆచారములను చుట్టుదుము; ఆ దినమునకు అది సరియే, కాని మనము ముందుకు సాగిపోవుచున్నాము! లేఖనములను పరిశోధించుడి, నేటి కొరకు ఏది వాగ్దానము చేయబడినో చూడుడి. అప్పుడు మనము ఎక్కడున్నోమో తెలుసుకోగలము, అప్పుము ఎక్కడ నిలబడియున్నామో చెప్పగలము.

JOHN 5:39

 

18లూథర్; ఆ సార్దిస్ కాలములో సరిగ్గా ఏమి వాగ్దానము చేయబడిలో మీరు చూడగలరు. వాక్యములో మీరు దానిని చూడగలరు. ఎటువంటి వాడు గుర్రము మీద వెళ్ళెనో చూడండి. ఏది కలిసికొనుటకు వెళ్ళినో చూడండి. సరిగ్గా "మానవుని యొక్క కుతంత్రము," మరియు సంస్కరణ. వెస్లీ, మొదలగువారిని గమనించండి. అది పెంతెకోస్తు కాలము యొద్దకు వచ్చుసరికి ఆ కాలము నుండి దిగువకు, అదెట్లు ప్రయాణించెనో గమనించండి. వాక్యము వైపు చూచి మనము ఎక్కడున్నాయో చూడండి. అదే కారణము. "లేఖనములను పరిశోధించుడి," అని యేసు చెప్పెను.

మనము ఎక్కడున్నాయో చూడండి! ఇప్పుడు మనము దేవుని కుమారుని యొక్క రాకడ యందు ఉన్నామని నమ్ముచున్నాను. ఏ సమయము లోనయినా ఆయన ప్రత్యక్షమగును అను అదే ఘడియలో మనము ఉన్నామని నమ్ముచున్నాను. దానిని లేఖనములు వివరించుచున్నవి, ఈ లోకము యొక్క చరిత్ర యొక్క చివరి గంటలలో మనమున్నామని అవి ప్రకటించుచున్నవి. సంగతులు అవి రూపొందుతున్న విధానమును చూడగలుగుచున్నాను. మృగము యొక్క ముద్రలోనికి ఈ ప్రపంచ సంఘ సమితి, సంఘములన్నింటిని నడిపించుట చూడండి. రోమా సామ్రాజ్యమును, దాని కార్యములను, తక్కిన వాటన్నింటిని చూడండి. అవి కలిసి వచ్చుటను చూడండి. వెలుగును మూసివేయుచున్నవి. సువార్తను మూసివేయుచున్నవి. ప్రతివారు దానికి చెందవలసియున్నారు. వారి వెలుగులో నడువవలసియున్నారు, లేనిచో అసలు నీవు నడవనే లేవు. చూడండి, మనము అంత్యకాలములో ఉన్నాము. దేవునిని పట్టుకొని, ఆయన మాటను నమ్ముట తప్ప మనకు మరి ఏదియు మిగిలి లేదు. వాక్యము ఎల్లపుడూ సరియే.

HEB 4:12•

REV 3:20

 

19లవొదికయ సంఘ కాలములో, సంఘము నుండి క్రీస్తు బయటకు నెట్టివేయబడి యున్నాడు. అన్ని కాలములలోను అదొక్కటే కాలములో అలాగు జరిగినది. ఆయన బయట యుండి తట్టుచున్నాడు. ఏమి సంభవించెను? ఈ ప్రపంచ సంఘ సమితియే ఆయనను బయటకు గెంటనై యున్నది. ఆయన వెలుపట ఉండునని బైబిలు చెప్పెను, ఆలాగే యున్నాడు. అది దేనిని మూసివేయును? వాక్యము. ఆయన వాక్యమైయున్నాడు, ఆయన ఎల్లప్పుడూ వాక్యమైయుండెను, మరియు ఈ రాత్రికి ఇంకనూ ఆయన వాక్యముగానే యున్నాడు! ఆయనే వాక్యము.

బైబిలు చెప్పెను, "వాక్యము రెండంచుల ఎటువంటి ఖడ్గము కంటేను వాడిగలదై యున్నది." హెబ్రీ 4వ అధ్యాయము "హృదయము యొక్క ఆలోచనలను, రహాస్యములను వివేచించును." వాక్యము ఆలాగే యుండును! యేసు ఆ దినమున చెప్పినప్పుడు, ఆయన ఎవరైయుండెనో వారు ఎరిగియుండవలసినవారై యుండెను.

DEUT 18:15•

JOHN 1:42

 

20ఆయన ఏమి చేసెనో గమనించండి. ఒక రోజున ఆయన అక్కడ నిలబడియుండెను, అది ఆయన సేవ యొక్క మొదటి ప్రారంభము. సీమోను పేతురు అను పేరు గల ఒక మనుష్యుడు అక్కడికి వచ్చెను. పేతురు ఆయనను చూచినప్పుడు - యేసు అతనితో ఇట్లు చెప్పెను, "నీ పేరు సీమోను మరియు మీ తండ్రి పేరు యోనా." (మోషే చెప్పినది అతడు ఎరిగియుండ వలసినది, "మీ దేవుడైన యెహోవా నా వంటి యొక ప్రవక్తను మీ మధ్య పుట్టించును. ఆయన మాట మీరు తప్పక వినవలెను.") తనను జీవితములో ఎన్నడూ చూడని ఒక వ్యక్తి ఇక్కడ ఉండి ఇట్లు చెప్పెను, "నీ పేరు సీమోను. నీ తండ్రి పేరు యోనా." అప్పుడే అతనికి తెలిసియుండెను… వందలాది సంవత్సరముల పాటు వారికి ప్రవక్త లేడు, మరియు ఇక్కడ ఈయన తానెవరో చెప్పుచుండెను. అతడు దానిని స్వీకరించుటలో అశ్చర్యము లేదు.

JOHN 1:47-49

 

21ఆ సమయములో ఫిలిప్పు - చెట్టు క్రిందనున్న నతానియేలును కనుగొని, యేసు నొద్దకు తీసికొని వచ్చెను. "ఇదిగో ఏ కపటము లేని ఇశ్రాయేలీయుడు," అని యేసు చెప్పెను.

"రబ్బీ, నీవు నన్నెప్పుడు ఎరుగుదువు?" అనడిగెను.

"ఫిలిప్పు నిన్ను పిలచుటకు ముందే, నీవు ఆ చెట్టు క్రింద ఉన్నప్పుడే నిన్ను చూచాను," అని చెప్పెను.

"రబ్బీ, నీవు దేవుని కుమారుడవు! నీవు ఇశ్రాయేలీయులకు రాజువు," అని చెప్పెను. అదేనని అతడు ఎరిగియుండెను. ఏమిటి? దానికి ఎట్టి అనువాదము అవసరములేదు; యెహోవా దానిని చెప్పెను!

MATT 12:24,32•

MARK 3:22,28,29•

LUKE 11:15•

LUKE 12:10•

HEB 13:8

 

22దానిని నమ్మనివారు అక్కడ నిలబడియుండిరి. "ఈయన బయల్జెబూబు. ఏదో మంత్రము ద్వారా ఇది లాగుచున్నాడు. ఇతడు అదృష్టము చెప్పువాడు, లేదా మరేదో," అని వారనిరి.

యేసు వారి వైపు చూచి ఇట్లనెను, "మీరు మనుష్యకుమారునికి విరోధముగా మాటలాడిన దానికి క్షమాపణ కలదు, కాని అదే చేయుటకు పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు, దానికి వ్యతిరేకముగా మాట్లాడినచో ఈ లోకములో గాని, రాబోవు లోకములో గాని మీకు క్షమాపణ దొరకదు." మనము చూడవలసిన ఈ దినమును గూర్చి, మన రోజును గూర్చి ఆయన ప్రవచించుచున్నాడు. ఎందుకనగా ఆయన నిన్న, నేడు, నిరంతరము ఏకరీతిగా ఉన్నాడు.

గుర్తుంచుకొనండి, అప్పుడు మోషేలో ఉన్నది యేసుక్రీస్తు అయి యుండెను.

2SAM 15:30•

MATT 23:37•

LUKE 13:34•

JOHN 1:49

 

23దావీదులో నున్నది యేసుక్రీసే. దావీదు… ఒక విసర్జించబడిన రాజుగా యెరూషలేము వైపు చూచి ఏడ్చుచూ, దావీదు కొండ యెక్కెను. అది అతనిలో నున్న క్రీస్తు తప్ప మరొకరు కాదు. సుమారు ఎనిమిది వందల సంవత్సరముల తరువాత దావీదు కుమారుడు ఒలీవ కొండ మీద కూర్చుని, యెరూషలేము వైపు చూస్తూ, ఏడ్చి ఇట్లనెను, "యెరూషలేమా, యెరూషలేమా, కోడి తన రెక్కల క్రింద పిల్లలను ఏలాగు చేర్చుకొనునో ఆలాగు ఎన్నో మారులు మిమ్ము నేను చేర్చుకోవలెననియుంటిని గాని మీరొల్లకపోతిరి!"

చెరసాలలో యోసేపు ఉండినప్పుడు, అది యేసే. ఆయన దాదాపు ముప్పది వెండి నాణెములకు అమ్మబడినప్పుడు, అది యేసే. ఫోతిఫరు కుమారునిగా అతడు చేయబడెను, అది యేసే. అతడు ఫరో కుడి పార్శ్వమున కూరుండపెట్టబడెను. ఇతడు అందరినీ విడిచి పెట్టినప్పుడు… బూర మ్రోగెను, ప్రతివారు మోకరించవలెను, అది యేసే. యోసేపు ద్వారా తప్ప, ఎవరును ఫరో యొద్దకు రాలేరు; యేసు ద్వారా తప్ప, ఎవరును దేవుని యొద్దకు రాలేదు. అది యేసే, ప్రవచించబడిన - ఛాయలు, మాదిరిలులో చెప్పబడిన వాక్యము నెరవేరెను.

యేసు భూమి మీద ఉండినప్పుడు, ప్రవక్తలు చేసినదే చేసెను; అందువల్లనే వారు ఆయన దేవుని వాక్యము యొక్క ప్రత్యక్షత అని వారు తెలిసికొనిరి. దానికి అనువాదము అవసరము లేదు.

నతానియేలు ఇది చూచి సాగిలపడెను, "నీవు ఇశ్రాయేలుకు రాజువు, దేవుని కుమారునివి, ఇశ్రాయేలు రాజవు. ఏ మనుష్యుడును ఇది చేయజాలడని మేము ఎరుగుదుము."

JOHN 3:2

 

24నికోదేము రాత్రి యందు వచ్చి పరిసయ్యులకు అదే చెప్పెను. కాని మీరు చూడండి, వారు తమ ప్రపంచ సంఘ సమితిలో ఎంతగా లీనమైపోయారంటే, వారు దానిని అంగీకరించలేకపోయిరి. వారు చెప్పినది ఆయన వ్యక్తము చేసెను; "రబ్బీ, మేము…" ఎవరు ఈ "మేము?" వారి యొక్క ఆలోచనా సభ! "నీవు దేవుని యొద్ద నుండి దిగి వచ్చిన బోధకుడవని మేమెరుగుదుము, ఎందుకనగా దేవుడు తోడైయుంటేనే గాని ఎవడును ఈలాగు చేయజాలడు." దానిని వారు గుర్తించిరి, అది అదేనని వారెరుగుదురు, కాని వారు దానిలో ఎంతగానో ఇరుక్కొనిపోయిరి.

దేవుడు, గత నలుబది సంవత్సరములలో పరిశుద్ధాత్మ బాప్తిస్మముతో ఈ దేశమును కుదిపెను. అయినను స్త్రీ, పురుషులు ఇంకనూ దానికి వెలుపలగా నుండిరి, ఎందుకనగా వారి అదే దానిలో ఉండిరి. మరియొక దినము యొక్క మిరమిట్లు గొలుపు కాంతిలో నివసించుచున్నారు. ఏమిటి సంగతి? ప్రతి వారును ఒక మెతడిస్టుగా, బాప్టిస్టుగా, పెస్పిటేరియనుగా, లూథరనుగా, లేదా మరేదోగా ఉండగోరుచున్నారు. చూడండి, అది ఒక మిరమిట్లు గొలుపు కాంతి.

JOHN 5:46•

JOHN 9:28

 

25వారు మోషే దినము యొక్క మిరమిట్లు గొలుపు కాంతిలో జీవించుచుండిరి. ఆయనేమి చెప్పెను? ఆయన పలికెను… వారనిరి, "మేము మోషే శిష్యులము."

"మీరు మోషేను ఎరిగియుండినచో, నన్నును ఎరిగియుందురు. మోషే నన్ను గూర్చి వ్రాసెను," అని ఆయన చెప్పెను.

మీరు లూథరను ఎరిగియుండినచో, ఈ కాలమును ఎరిగియుండెడివారు! మీరు మెతడిస్టును ఎరిగియుండినచో, ఈ కాలమును ఎరిగియుందురు! ఎందుకనగా క్రీస్తు ఈ కాలమును గూర్చి వ్రాసెను. నెరవేర్చుచున్న మాటలు ఈ కాలములోనే నెరవేరవలసియుండెను. దానికి ఎవరూ అనువాదము చెప్పనవసరము లేదు; దేవుడు తన స్వంత అనువాదమును చేసుకొనును. దేవుడు తనంతట తానే అనువాదము చెప్పుకొనును, ఎందుకనగా దానికి అర్ధము చెప్పగలిగినవాడు ఆయన మాత్రమే. దేవుని వాగ్దానము ఎల్లప్పుడు ఆయన చెప్పిన దానిని బయలుపరచును, మరియు అదియే అనువాదము.

LUKE 17:28,30•

JOHN 14:12

 

26ఇప్పుడు, యేసు, సమయము ఆదా చేయుటకు పరిశుద్ధ యోహాను 14వ అధ్యాయము 12వ వచనములో యేసు చెప్పెను, "నా యందు విశ్వాసముంచువాడు నేను చేయు క్రియలు చేయును." దానిని ఆయన చెప్పెనా? అది నిజము. దానికి ఏ అనువాదము అవసరము లేదు. ఎవరైనా ఆ పని చేసినప్పుడు అది దేవుడే. నిశ్చయంగా.

అక్కడ ఆయన ఈలాగు కూడా చెప్పెను, "లోతు దినములలో ఉండినట్లుగానే మనుష్యకుమారుని రాకడయందును ఉండును." యేసు అది చెప్పెను. దానిని ఆయన పలికెనా? నిశ్చయంగా, ఆయన దానిని చెప్పెను. దానికి ఏ అనువాదము అవసరము లేదు.

"దాని భావము…" అని వారందురు.

సరిగ్గా దాని భావము ఆయన చెప్పినట్లుగానే! "లోతు దినములలో ఉండినట్లుగానే మనుష్యకుమారుని రాకడలోను ఉండును." లోతు దినముల మాట ఏమిటి? ఒక్క క్షణము వెనుకకు వెళ్ళి, వారేమి చేయుచుండిరో చూద్దాం.

27లోతు దినములలో మూడు రకముల మనుష్యులుండిరి: విశ్వాసి, నటించు-విశ్వాసి, మరియు అవిశ్వాసి. ప్రతి గుంపులోను అదే రీతిగా ఉండును.

సొదొమ వారు అవిశ్వాసులై యుండెనని మనము కనుగొన్నాము.

లోతు నటించు-విశ్వాసి.

అబ్రాహాము విశ్వాసియైయుండెను. నిబంధన స్థిరపరచబడినది అతనికే. వాగ్దాన కుమారుని కొరకు ఎదురు చూచుచున్నవాడు అతడే. దానికొరకు కనిపెట్టి చూచుచున్నవాడు అతడే. ఆమేన్. (నాకు నేనే "ఆమేన్" చెప్పుట లేదు. ఆమేన్ అనగా, "ఆలాగు జరుగును గాక," అని భావము.) అది నిజము. అబ్రాహాము సొదొమలో లేడు. అబ్రాహాము సొదొమనకు అవతల ఉండెను. అతడు నేటి ఆత్మీయ సంఘమునకు మాదిరిగా ఉన్నాడు.

2PET 2:8

 

28లోతు ఇంకా సొదొమలో ఉండిన శాఖా సంఘమునకు మాదిరిగా ఉన్నాడు. గమనించండి; బైబిలు అది చెప్పెను, "సొదొమ యొక్క పాపములు నీతిమంతుడగు అతని ఆత్మను సంతాపపరచుచుండెను." అయితే దానికి విరోధముగా నిలబడు ధైర్యము ఎందుకు అతనికి లేదు? ఈనాడు చాలామంది మంచివారు సంఘములలో కూర్చొని బయట స్త్రీలు, పురుష దుస్తులు ధరించుటయు, పురుషులు ఈ పనులు చేయుటయు, వారి సభ్యులు ఆదివారమున గోల్ఫ్ ఆట ఆడుటయు, వినోద విందులకు వెళ్ళుటయు, ఈత కొట్టుట, మొదలగునవి చేయటయు, సంఘమునకు హాజరగుటకు బదులుగా, ఈ పనులన్నీ చేయుచున్నారు. బుధవారము రాత్రి ఇంటిలో కూర్చొని సంఘమునకు వెళ్ళుటకు బదులుగా, టెలివిజను చూచుచున్నారు. దానిగూర్చి వారు ఏదో చెప్పవలెననుకొనుచున్నారు గాని, బోర్డు వారిని బయటకు త్రోసివేయును. ఏమిటి సంగతి? అది మరల లోతు స్ధితియే, తన కిటికీలో నుండి బయట పాపమును చూస్తూ, దానిని "పాపము," అని పిలచుటకు భయపడెను.

GEN 18:1,2•

2PET 3:10

 

29అబ్రాహాము వారి గందరగోళములో లేడు; అతడు దానికి వెలుపలగా నుండెను. అతడు ఆత్మీయ సంఘమునకు మాదిరిగా నుండెను. అంత్యకాలమున ఏమి జరిగినో ఇప్పుడు గమనించండి. అగ్ని పడుటకు ముందుగా! వారు అన్యులు. నేటి అన్యుల దేశము మీద అగ్ని పడుటకు అది ముందుగా చూపించుచున్నది. రాజ్యములు విచ్చిన్నమయి మరియు దహించబడును. "ఆకాశములు, అగ్నికి కాలిపోవును," అని యెహోవా సెలవిచ్చుచున్నాడు. "అవి మహా వేడివలన కాలిపోవును." అది దానికి ఛాయ అయి యుండెను.

ఇప్పుడు వాటి రూపమును చూద్దాం. ఇక్కడ అబ్రాహాము అప్పటికే బయటకు వచ్చెను, సొదొమలో లేడు; సొదొమకు వెలుపట ఉండెను. లోతు ఇంకా సొదొమలోనే ఉండెను.

వింత సంగతి, ఒక ఎండ ఉదయాన, బహుశా పదకొండు గంటల వేళ అయి యుండును. మామూలుగా నున్న మనుష్యులు ముగ్గురు వచ్చుచుండుటను అతడు చూచెను. రోడ్డు వెంబడి దారిలో నడచి వచ్చుచుండిరి. అబ్రాహాము సింధూర వృక్షము క్రింద కూర్చొని విశ్రాంతి తీసికొనుచుండెను. అతడు బయటకు, బహుశా ఆ ఉదయాన మందలను బయట మేపుటకు వచ్చియుండును. దాదాపు మధ్యాహ్న మాయెను. ముగ్గురు మనుష్యులు వచ్చుటను అతడు చూచెను. ఈ ముగ్గురు వ్యక్తులలో ఏదో ఉన్నదని గంట మ్రోగెను. ఓ, మై!

GEN 18:3-8,16

 

30దేవుని గూర్చి ఎల్లప్పుడూ ఒక సంగతి యున్నది. అది జనుల మధ్యకు వచినప్పుడు, అది గంటను మ్రోగించును. వారు దానిని ఎరుగుదురు. అక్కడ ఒక రుజువు ఉన్నదని వారికి ఏదో చెప్పును.

అబ్రాహాము త్వరగా పరుగిడి ఇట్లనెను, "నా ప్రభువా, వచ్చి కూర్చోండి, కొద్దిగా నీరు తెచ్చెదను, కాళ్ళు కడుగుకొనుడి, కొద్దిగా ఆహారము ఇచ్చెదను ఆ తరువాత మీరు మీ దారిని వెళ్ల వచ్చును." కనుక అతడు వెనుకకు తిరిగెను. అతడు మందలోనికి పరుగెత్తి వెళ్ళి, ఒక దూడను పట్టుకొని దానిని చంపి, దాసుని ద్వారా సిద్ధపరచెను. తనకు దిగువగా నున్న గుడారములోనికి వెళ్ళి, శారాను కొంత పిండి పిసకి, పొయ్యి మీద కొన్ని రొట్టెలు కాల్చమని చెప్పెను. వాటిని బయటకు తెచ్చి, వడ్డించెను. అతడు అక్కడ కూర్చొనియున్నప్పుడు, వారు తినుచుండగా… ఈయన ఆ సొదొమ వైపు అదే పనిగా చూచుచుండుట వారు గమనించిరి.

GEN 18:22

 

31వారిలో ఇద్దరు సొదొమలోనికి దిగి వెళ్ళిరని మీకు గుర్తుండును. ఇద్దరు సొదొమలోనికి వెళ్ళిరి. దయచేసి దీనిని తప్పిపోవద్దు. యేసు చెప్పిన దానిని నేను ప్రస్తావించుచున్నాను. లోతును, అక్కడ సిద్ధముగా నున్న వాటిని బయటకు తెచ్చుటకు వారు సొదొమ లోనికి వెళ్ళిరి. అక్కడికి దిగి వెళ్ళిన వారు ఇద్దరు బోధించిరి. ఒకరు అబ్రాహాముతో నిలచియుండెను, అతడు చేసిన సూచన గమనించండి. అక్కడ వారు ఒక సూచన పొందిరి, అక్కడ… సొదొమ వారు గ్రుడ్డితనముతో మొత్తబడిరి. సువార్త బోధించుట అవిశ్వాసికి ఎల్లప్పుడూ గ్రుడ్డితనము కలుగజేయును. అది ఏమి చేసెనో గమనించండి.

32ఇప్పుడు, ఇక్కడ ఒకాయన ఉండిపోయి అబ్రాహాము ఎదుట సూచనను చేసెను.

ఇప్పుడు, నీవెన్నడైనా గమనించావా, ఏ చరిత్రకారునయినా, లేఖనములను చూడు, చరిత్రను చూడు. బయట ప్రపంచములో నున్న నామకార్థ సంఘములోనికి, బయట నున్న శాఖలలోనికి వెళ్ళిన ఏ వ్యక్తి పేరు అయినా గాని ఇంతకు ముందు అబ్రాహాము వలె ముగింపు ఉండుట, అనగా హాం అని ఉండుట సంఘ కాలములలో ఎన్నడూ జరుగలేదు. కాని ఈ రోజున వారు ఒకని కలిగియున్నారు, గ్రాహం. అది నిజము. అక్కడికి వెళ్ళి, వారిని పిలచుచున్నాడు. దాని ద్వారా ఆయన అద్భుతమైన పనిని చేయుచున్నాడు. గ్రాహం, బిల్లీ గ్రాహం, శాఖల మధ్య రాజకీయ వేత్తలు మొదలగు వారి మధ్య దేవుని దాసుడుగా ఉన్నాడు. దానిని తుత్తునియులు చేయుచున్నాడు.

ఒక రోజున వారు ఆయనను అధ్యక్షునిగా చేయగోరిరి. కాని ఆయన దానిని సూటిగా తిరస్కరించెను. దేవుడు దానిని బట్టి ఆయనను దీవించును. ఆ విస్కీ కంపెనీలు, ఎప్పుడూ ఉన్నట్లుగా మొదటి ప్రాతిపదికగా ఎన్నడూ, అవి ఆయనకు ఉండలేదు. వారు బిలియనుల కొలది డాలర్లు ఖర్చుపెట్టి యుండెడివారు, ఎందుకనగా ఏలాగయినా వాటిని ఆయన బయటకు త్రోసియుండెడి వాడు. ఆ సిగరెట్టు కంపెనీలు మొదలగునవి బయటకు త్రోసియుండెడి వాడు. చూడండి, ఆయన సొదొమ వారికి దేవుని వర్తమానికునిగా ఉన్నాడు. అది ఖచితము.

GEN 17:5,15•

GEN 18:9,10,12,13,22

 

33అయితే గుర్తుంచుకొనండి, ఒకాయన అబ్రాహాముతో నిలచియుండెను, మరొక వ్యక్తి బయట బోధించుటకు ఆధునిక సువార్తికుల వలె వెళ్ళిన ఆ ఇద్దరు కారు. గమనించండి, అక్కడ ఒకాయన నిలచియుండెను. ఇద్దరు ఆ వైపుగా దిగిపోయిరి. ఇక్కడ ఒకాయన అబ్రాహాముతో నిలచియుండెను. అబ్రాహాముతో నిలచియుండిన ఈయన ఒక గురుతును ఇచ్చెను.

అతని పేరు "అబ్రాము" గాను, అతని భార్య పేరు "శారయి" గాను దానికి, ఒకటి రెండు రోజుల ముందుగానే ఉండుట మీరు గమనించండి. దేవుడు కనబడి అతనితో ఇట్లనెను, "నీ పేరును అబ్రాము నుండి అబ్రాహాముగా మార్చుచున్నాను." (చూడండి. G - R - A - H - A - M నకు ఆరు అక్షరములు, మానవుడు.) కాని అబ్రాహామునకు ఏడు అక్షరములు. హాముతోనే ముగియుచున్నది. ( A - B - R - A - H - A - M)

ఇప్పుడు, ఇక్కడున్న ఆత్మీయ సంఘములో ఒకాయన అబ్రాహాముతో ఉండెను. ఆయన చెప్పినది గమనించండి. "అబ్రాహామా," అని పిలిచెను. ("అబ్రాము" కాదు). "అబ్రాహామా, నీ భార్య ఎక్కడ?" "(శారాయి కాదు) శారా?" నీ భార్యయగు శారా ఎక్కడ?

అతడు చెప్పినది గమనించండి, "నీ వెనుకనున్న గుడారములో యున్నది."

"నిన్ను నేను దర్శించుదును. నిన్ను దర్శించబోవుచున్నాను," అని ఆయన చెప్పెను. ఆ వ్యక్తిగత సర్వనామము చూడండి. తాను చేసిన వాగ్దానమునుబట్టి వచ్చువాడు. అది దేవుడే! "నిన్ను దర్శించనైయున్నాను," అని చెప్పెను.

శారా (అందరికి ఈలాగు అది అర్థమగును) తన బట్టల చాటులో, తనలో తాను నవ్వుకొని ఇట్లనుకొనెను, "నేను వృద్ధురాలను, నా యజమానికి (అబ్రాహాము) వంద సంవత్సరములు." "ముసలిది కూడా యువతుల వలె నుండు కాలమును దాటిపోయినది." "ఇక మీదట ఎన్నడూ మేము అప్పటి వలె ఆనందముగా ఉండజాలము. నేను, అతడు వృద్ధులమయినాము, ఇక ఆలాగు ఆనందించజాలము. ఏలాగు ఈ సంగతులు సాధ్యము?" అనుకొనెను.

ఆ మనుష్యుడు - శరీరములో యుండిన దేవుడు - ఇట్లనెను, "ఎందుకు శారా నవ్వి మరియు సందేహాపడి, వెనుకనున్న గుడారములో ఈ మాటలు పలుకుచున్నది?''

JOHN 1:42,47•

JOHN 4:7,9,10,16-18

 

34ఇప్పుడు గమనించండి, యేసుక్రీస్తు చేసినది అదే పరిచర్య కాదా? జనసమూహములోనికి ఆయన చూచి వారి ఆలోచనలను గ్రహించెను. పేతురు ఎవరో, అతని తండ్రి పేరు ఏమిటో అతనికి చెప్పెను. నతానియేలుకును చెప్పెను.

బావి యొద్ద నున్న స్త్రీతోను చెప్పెను, "వెళ్ళి, నీరు తెమ్ము" లేదా దాహమునకు ఇమ్ము," అని అడిగెను.

ఆమె ఇట్లనెను, "యూదులగు మీరు సమరయులతో సాంగత్యము చేయుట అలవాటు కాదు గదా. మనకు ఒకరితో ఒకరుకు పొత్తులేదు గదా?"

ఆయనట్లు చెప్పెను, "నీవు ఎవరితో మాట్లాడుచున్నావో, నిన్ను దాహమునకు ఇమ్మని అడిగినది ఎవరో నీవెరిగియుంటే చాలును." సంభాషణ కొనసాగెను. "వెళ్ళి, నీ భర్తను తీసికొని రమ్మని," ఆమెతో చెప్పెను.

"నాకు పెనిమిటి లేడు," అన్నది.

"నీవు చెప్పినది నిజమే, నీకు అయిదుగురు పెనిమిట్లున్నారు," అన్నాడాయన.

"అయ్యా!" అని ఆమె అనెను.

MATT 12:24•

MARK 3:22•

LUKE 11:15

 

35ఆయనకును వారికిని మధ్య నుండిన తేడాను చూడండి - ఆ నాటి యాజకులు, ఆ సభ, మరో దినము యొక్క మిరమిట్లు గొలుపు కాంతిలో జీవించుచుండిరి. వారిట్లు పలికిరి, "ఇది దయ్యము!" వారు తమ సమాజమునకు ఏదో జవాబు చెప్పవలెను, ఎందుకనగా అది అవసరమైయుండెను.

కాని ఈ దీన స్త్రీ చేసినది చూడండి, ఆమె హృదయములో ఆ ముందు నిర్ణయించబడిన విత్తనము పడియున్నది… ఆ సంగతులు విని విని ఆమె అలసిపోయి మరియు విసిగెత్తినది. ఆమె వీధుల్లో వేశ్యగా మారినది. అయితే ఆమె దానిని చూడగానే, ఇట్లు పలికెను, "అయ్యా, నీవు ఒక ప్రవక్తవని గ్రహించుచున్నాను. మాకు నాలుగు వందల సంవత్సరముల నుండి ప్రవక్త లేడు. మెస్సీయా వచ్చినప్పుడు ఈ సంగతులను తెలియచేయునని మాకు చెప్పుబడెను. "ఓ, మై! అక్కడ పడియుండిన విత్తనము జీవముతో గంతు వేసెను. ఎందుకు? దానికి ఎట్టి అనువాదము అవసరము లేదు.

36యేసు చెప్పెను, "నీతో మాట్లాడచున్నవాడు ఆయనే." దానికి ఎట్టి అనువాదము అవసరము లేదు. ఆయన అద్భుతము చేసి, ఆ మెస్సీయా తానే అని సాక్ష్యమిచ్చెను, ఆమేన్, ఖచ్చితముగా దేవుడు వాగ్దానము చేసినదానికి సాక్ష్యము ఇచ్చెను. ("నా వంటి ప్రవక్తను ప్రభువైన దేవుడు మీ మధ్య పుట్టించును," అని మోషే చెప్పెను.) ఏమిటది? లేఖనము యొక్క ఒక ప్రత్యక్షత!

ఆమె పట్టణములోనికి పరుగిడి వెళ్ళి, ఇట్లనెను, "నేను చేసినవన్నియూ నాతో చెప్పిన ఈయనను వచ్చి చూడుడి. ఈయన క్రీస్తు కాడా? అది ఆయనే కాడా? నేను చేసినవి నాతో ఆయన చెప్పెను."

37ఇపుడు గమనించండి, యేసు, గుడారము వైపునకు వీపు పెట్టి, ఆ గుడారము లోపల శారా ఏమి ఆలోచించుచున్నదో చెప్పిన మనిషి ఆయనే.

హెబ్రీ 4వ అధ్యాయములో దేవుని వాక్యము చెప్పుచున్నది… ఇది ఆయన చెప్పుచున్నాడు, "దేవుని వాక్యము రెండంచుల ఎటువంటి ఖడ్గము కంటేను వాడిగలదై, శక్తిగలదై ఎముకల యొక్క మూలుగు లోనికి దూసికొని వెళ్ళుచూ హృదయము యొక్క ఆలోచనలను, ఉద్దేశ్యములను బయట పెట్టుచున్నది." అది వాక్యము! ఒక ప్రవక్త వచ్చిన ప్రతిసారి అతడు వాక్యముతోనే వచ్చెను. అతడు ఆ కాలమునకు వాక్యముగానే ఉండెను. అది ఏమి చేసెను? హృదయములో ఉండిన ఆలోచనలను వివేచించకలిగిన ఒక ప్రవచకుడు.

యేసుక్రీస్తులో అది ఆలాగు చేసెను, ఎందుకనగా ఆయన వాక్యము యొక్క పరిపూర్ణత.

38యేసు చెప్పెను, "సొదొమలో ఉండినట్లుగానే, మనుష్యకుమారుని రాకడ యందును ఉండును." మానవుల యొక్క ఆకారములో దేవుని యొక్క ఆత్మ భూమి మీదికి దిగి వచ్చును. దేవుడు మానవ శరీరములో ప్రత్యక్షమగుట. (ఆమేన్! దానిని నీవు చూచావా?) సొదొమ యొద్ద మానవ శరీరములో దేవుడు ఏమి చేసెనో, అదే చేయును. గుర్తుంచుకొనండి, వారు ఒక వాగ్దాన కుమారుని కొరకు ఎదురు చూచుచున్నారు. దాని వెంటనే వాగ్దాన కుమారుడు వచ్చెను. వాగ్దాన కుమారుడు వచ్చు ముందుగా సొదొమ మరియు అబ్రాహాము గుంపు వారు చూచిన చివరి గురుతు అదే. దానిని మీరు గమనించారా? ఇప్పుడు ఆత్మీయ సంఘము ఆ ఘడియకు వచ్చియున్నది.

ఎవరో ఇట్లనిరి, "సహోదరుడు బ్రెన్హాం, 'అది దేవుడని నీవు అందువా?'"

"అది దేవుడు!'' అని బైబిలు చెప్పెను. దానికి ఎట్టి అనువాదము అవసరము లేదు. ఆయన ఎలోహిం. అబ్రాహాము ఆలాగే పిలచెను. ఏ బైబిలు పాఠకుడైననూ దానిని ఎరుగును. ఎలోహిం, "అన్నిటిని-చాలినవాడు." ఆయనే ఆది, అంతము; మొదటివాడు, కడపటివాడు. ఎలోహిం! అబ్రాహాము ఆయనను "ఎలోహిం" అని పిలచెను. దేవుడు. (పెద్దక్షరములలో హెబ్రీ భాషలో అది) ఎలోహిం; ఆదిలో యుండినట్లుగానే "దేవుడు," ఎలోహిం.

ఆయన మానవ శరీరములో ప్రత్యక్షమయిన ఎలోహిం. మానవ బట్టలు ధరించెను. మానవ ఆహారము తినెను. ఆమేన్! చివరి దీనములలో దేవుడు తన జనుల మధ్య మానవ శరీరములో ప్రత్యక్షమగుననుటకు అది సూచన! ఆమేన్! యేసు చెప్పెను, "నేను చేయు క్రియలు మీరును చేయుదురు. సొదొమ దినములలో ఉండినట్లుగానే మనుష్యకుమారుని రాకడయందును జరుగును." ఆమేన్! దానికి ఎట్టి అనువాదము అవసరము లేదు; దానికి ప్రత్యక్షత కావలెను, అదే దానికి అవసరము. ఆమేన్! దానిని నీవు నమ్ముదువా?

మన తలలు వంచుదము.

39మా పరమ తండ్రి, ఈ సంగతులు నీవు పలికినావని ఈ రాత్రి నీ వాగ్దానమును నీకు మేము ఇచ్చుచున్నాము. నీవు వాటిని వాగ్దానము చేశావు. నీవు తప్ప మరెవరును నీ వాక్యమును జీవింప చేయజాలరు. "వెలుగు కలుగును గాక," అని నీవు పలుకగా, అక్కడ వెలుగు కలిగెను, దానిని ఎవడును అనువదించనవసరము లేదు, అది ప్రత్యక్షమాయెను.

యెషయా ప్రవక్త పలికినది మనము చెప్పుకొన్నాము, "ఒక కన్యక గర్భవతియగును," ఆమె అయినది; ఏ ప్రత్యక్షత అవసరము లేదు, అది ఆమె చేసెను. జరిగినది అదే.

ఆయన వచ్చునప్పుడు, బెత్లహేములో జన్మించునని, నీవు చెప్పావు, "బెత్లహేము, యూదాలో నుండి వచ్చును. ఇశ్రాయేలు, యూదా ఆధిపతులలో నీవు మిక్కిలి అల్పమైనదానవు కాదా? కాని నా జనులను ఏలు అధిపతి నీలో నుండి వచ్చును."

ఆయన చేయు కార్యములు, సిలువ యొద్ద ఆయన ఏమి కేక వేయునో అది, ఆయనెట్లు శిక్ష విధింపబడి, కాలు చేతులందు పొడువబడునో; "ఆయన మన పాపముల నిమిత్తము గాయపరచబడెను, మన దోషముల నిమిత్తము నలుగ గొట్టబడెను. మన సమాధానార్దమైన శిక్ష ఆయన మీద పడెను. ఆయన పొందిన గాయముల వలన మనము స్వస్థత పొందితిమి.''

40దావీదు ఎట్లు చెప్పెనో చూడండి, "ఆయన ఆత్మను నేను పాతాళములో విడిచిపెట్టను, నా పరిశుద్ధుని కుళ్ళు పట్టనియ్యను." మూడవ దినమున ఆయన శరీరమును క్రుళ్ళ చేయుటకు డెబ్బది-రెండు గంటలు కాక ముందే, దేవుని వాక్యము చెప్పెను, "ఆయన తిరిగి లేచును." (వారు ఆయన శరీరమును దొంగలించుకొని పోయిరని చెప్పిరి; దానిని ఇంకా వారు నమ్ముచున్నారు.) కాని మేము, ప్రభువా, నీ వాక్యమును నమ్ముచున్నాము! అది బయలుపరచబడినది. యేసుక్రీస్తు తిరిగి లేచి ఇట్లు చెప్పెను, "… ఇదిగో! నేను సదాకాలము మీతో కూడా ఉన్నాను, యుగసమాప్తి పర్యంతము ఉందును."

ఈ రాత్రి ఇక్కడ నీవున్నావని మేము నమ్ముచున్నాము. నీవు ఎప్పుడూ ఉండిన యేసుక్రీస్తు వలెనే ఈ రాత్రియు ఉన్నావని మేము నమ్ముచున్నాము. నిన్నునీవు వెల్లడి చేసికొనునట్లుగా కండ్లు, చేతులు, కాళ్ళు, నోరు, ఆత్మలు, శరీరములను ఉపయోగించకొనుటకు మాత్రమే నీవు చూచుచున్నాను. సజీవుడగు యేసుక్రీస్తు మా మధ్య జీవించుట మేము చూడకలుగునట్లుగా దేవా, ఈ రాత్రి మమ్ము శుద్ధిపరచుము. ఆయననే రానిమ్ము! అప్పుడు మేము, "అయ్యా, మేము యేసును చూడగోరుచున్నాము" అని ఆ రోజున వచ్చి పలికిన ఆ గ్రీకుల ఆకలిని కలిగియుందుము. వారు ఆయనను చూడగోరిరి. ఓ, వారు ఆయనను చూచినప్పుడు ఎంతగా పులకరించిరో గదా!

దేవా, నీవు నేడును ఆలాగే యున్నావు. మేము ఆకలిగొన్నచో నిన్ను మేము చూచెదమని నీవు వాగ్దానము చేసియున్నావు. "ఇక కొద్ది కాలమైన పిదప, లోకము నన్ను చూడదు" (అవిశ్వాసి); "అయినను మీరు నన్ను చూతురు, ఎందుకనగా నేను మీతో ఉందును, మీలో ఉందును, యుగసమాప్తి వరకు ఉందును." నీవు నిన్న, నేడు, నిరంతరము ఏకరీతిగా ఉన్నావని మాకు తెలియును.

ప్రభువా, మాటలు చెప్పబడినవి, అది వ్రాయబడినది, ఆయన తన మాటకు కట్టుబడియుండునని చూపించుటకు దేవుని మహిమ కొరకు ఇప్పుడు దానిని జరుగనిమ్ము. ఆమేన్. దేవుడు మిమ్ము దీవించును గాక.

41నేను ప్రార్థనా వరుసను పిలువగోరుచున్నాను. ఒకటి నుండి వంద వరకు లేదా అట్టి విధంగా ప్రార్థన కార్డులు ఇచ్చినట్లుగా బిల్లీ చెప్పాడనుకొంటాను. ఇప్పుడు ఇక్కడ అతడు లేడు…. ప్రార్థన కార్డు నంబరు ఏమిటి… ఎవరైనా మీ కార్డు వెనుక చూడండి… అది నంబరు లేక - అక్షరము (ఎ, బి, సి, డి లేదా ….) అది ఏమిటి? ఎ? మంచిది.

"ఎ" మొదటిది, రెండవది, మూడవది, నాలుగవది, అయిదవది చూద్దాం, ఈ విధంగా నిలబడుటకు ఆరంభించండి. "ఎ" ఒకటి, రెండు, మూడు, నాలుగు నిలబడుట నాకు కనబడలేదు. ప్రార్థన కార్డు నంబరు నాలుగు. ఒకటి, రెండు, మూడు. ప్రార్థన…. వారు లేవలేరేమో, వారు లేవనివారయినచో ఎవరైనా మీ ప్రక్కవారి కార్డు చూడండి. కార్డు కలిగియుండియు లేవలేని స్థితిలో ఉండవచ్చును. ఇప్పుడు త్వరపడండి. అదిగో అక్కడ నాలుగు ఉన్నది. ప్రార్థన కార్డు సంఖ్య అయిదు. ఆరు, ఏడు, ఎనిమిది, తొమ్మిది, పది, పదకొండు, పండ్రెండు. మీ నంబర్లు పిలిచిన ప్రకారము ఇక్కడికి వచుటకు ఆరంభించండి. ఒకటి, రెండు, మూడు ఇటు వైపుగా రండి. ప్రార్థన కార్డు సంఖ్య ఒకటి, రెండు, మూడు, నాలుగు, అయిదు, ఆరు, ఏడు, ఎనిమిది, తొమ్మిది, పది, పదకొండు. మీ స్థానములు తీసికొనండి. పదకొండు, పండ్రెండు, పదమూడు, పధ్నాలుగు, పదిహేను, పదహారు, పదిహేడు, పద్దెనిమిది, పందొమ్మిది, ఇరవై, ఇరవై-ఒకటి. ఇరవై-రెండు ఇరవై-మూడు, ఇరవై-నాలుగు, ఇరవై-అయిదు ఎవరికి లేదో వారు ఎవరయినా గాని…

42అక్కడ వెనుక చక్రాల కుర్చీలో నేను ఒక యువకుని చూస్తున్నాను. కుమారుడా, నీ నంబరు పిలువబడినచో - నీవు లేవలేనిచో…. మంచిది. నీ చేతిని ఎత్తియుంచుము. నీవిక్కడకు వచ్చునట్లు మేము చూతుము. చూచారా?

ఇక్కడ ఇంకా ఎందరు రోగులుగా ఉండియు, ప్రార్థన కార్డు లేని వారు ఎందరున్నారు? ఎక్కడున్నా సరే, మీ చేతిని చూపించండి. ఇక్కడే ఉన్నారు. మీ చేతులు ఎత్తండి. మీరు నమ్ముదురా? వారు వారందరినీ పోగుచేయుచుండగా; ఆయన నిన్న, నేడు, నిరంతరము ఏకరీతిగా ఉన్నాడని మీరు నమ్ముదురా? ఎందరున్నారు? ఈ సేవకులను గమనించండి. సోదరులారా, ఈనాడు వాక్యము ఆయన మన రోగములను అంటుకోగల ప్రధానయాజకునిగా ఉన్నాడని చెప్పుట లేదా? అది నిజమేనా? ఎందరు దానిని నమ్ముచున్నారో చేతులెత్తండి. ఆయన ప్రధానయాజకుడైయుండియు, మన బలహీనతలలో ఆయనను మనము తాకగలము.

"ఆయన నిన్న, నేడు, నిరంతరము ఏకరీతిగా ఉన్నాడు," అని బైబిలు చెప్పుచున్నప్పుడు, దానిని ఎందరు నమ్ముదురు! అయితే ఆయన నేడు ఎట్లు పని చేయును? ఆయన నిన్నటి వలెనే పని చేయవలసియున్నాడు. అది నిజమేనా? ఆయన ఈ రాత్రి ఎక్కడున్నాడు? మహోన్నతుని యొక్క కుడి పార్శ్వమున కూర్చునియున్నాడు, ఆయన శరీరము; ఆయనను తెలియపరచుటకు పరిశుద్ధాత్మ ఇక్కడ భవనములో ఉన్నాడు.

43గమనించండి, ఇప్పుడు చూడండి. ఒక రోజున ఒక స్త్రీ గతంలో ఆయన వస్త్రమును ముట్టినప్పుడు ఏమి జరిగెను? ఆమెకు ప్రార్ధన కార్డు లేదని మనము చెప్పుదుము, కాని ఆమె ఆయన వస్త్రపు చెంగును ముట్టెను. ఆమె ఆయన వస్త్రమును తాకినప్పుడు, యేసు తిరిగి చూచి ఎవరు నన్ను తాకిరి?" అని అడిగెను.

పేతురు ఆయనను గద్దించెను, "ప్రభువా, ఆ మాట ఏమి అర్థవంతముగా కనబడుట లేదు. అందరూ నిన్ను అంటుకొనుటకు ప్రయత్నించుచున్నారు గదా? నన్నెవరు తాకిరి," అని నీవు ఏల అడుగుచున్నావు?"

"కాని నేను బలహీనమయినట్లు గ్రహించుచున్నాను," అని ఆయన చెప్పెను. ఎందరు దీనిని ఎరుగుదురు. ప్రభావము అనగా, "బలము" ఆయనలో నుండి వెడలిపోయెను. "నేను బలహీనమయ్యాను. ఎవరో నన్ను వేరే విధమైన తాకిడితో ముట్టుకొనిరి." ఆయన జన సమూహము వైపు తిరిగి చూచి ఆ విశ్వాసమునకు మార్గము ఎక్కడున్నదో కనుగొనెను.

"ఓ రబ్బీ, నిన్ను మేము నమ్ముచున్నాము," అని ఇదంతా చెప్పుచూ అందరును ఆయన చుట్టూ చేతులుంచుచున్నారు.

కాని దానిని నిజంగా నమ్మినవారు కొందరు అక్కడున్నారు. ఆమె ఆయన వస్త్రమును తాకి బాగయితినని నమ్మినది, ఎందుకనగా ఆమె ఆ విధముగా చేసినచో అది జరుగునని తన హృదయములో అనుకొన్నది.

44ఆయన వెనుకకు తిరిగి జనసమూహము వైపు చూచి ఆమెను కనుగొను వరకు వెదికెను. ఆయన ఇట్లనెను… ఆమె యొక్క రక్తస్రావము ఆగిపోయినదనియు, ఆమె బాగయినదనియు చెప్పెను. అది నిజమేనా? ఇప్పుడు, ఆయన జనుల యొక్క గుంపులో చేసిన విధానము అదే.

ఇప్పుడు, ఆయన చనిపోలేదని ఇప్పుడు నేను ప్రకటించుచున్నాను. ఆయన ఎప్పుడు సజీవముగా ఉండినట్లే, ఇప్పుడును సజీవముగా ఉన్నాడు. బైబిలు చెప్పెను, యేసు స్వయముగా చెప్పెను, "సొదొమ దినములలో ఉండినట్లుగానే మనుష్యకుమారుని రాకడ యందును ఉండును."

ఇప్పుడు చూడండి, దేవుడు ఇక్కడ ఎంత గొప్ప కానుక పెట్టిననూ లాభము లేదు. దానిని పరిగ్రహించుటకు కూడా ఇక్కడ ఒకడుండవలెను. ఆయన ఒక పట్టణములోనికి వెళ్ళినట్లు బైబిలు చెప్పెను. "వారి యొక్క అవిశ్వాసమును బట్టి అక్కడ ఆయన అనేక కార్యములు చేయలేకపోయినట్లు చెప్పెను." అది నిజమేనా? ఈనాడును అంతే. మీరాయనను నమ్మవలసియున్నారు. మీరు ఆయనను కేవలము విశ్వసించినచో చాలును. మీరు చేయకలిగిన మార్గము అదొక్కటే.

45ప్రార్థనా వరుస సిద్ధముగా నున్నదా? పది నిమిషముల పాటు అందరూ మర్యాదగా ఉండండి. అక్కడికి వెళ్ళగలనో లేదో చెప్పలేను. దాదాపు ఇరవై, ముప్పయి మంది అక్కడ నిలబడి యుండిరి. కాని ఇపుడు, ప్రార్థనా వరుసలో, ఆ వరుసలో ఉన్న వారందరికి నేను క్రొత్త వ్యక్తినని తెలియును. మీ గూర్చి ఎమియూ ఎరుగనని చెప్పువారు చేతులెత్తండి. ప్రార్థన వరుసలో ఉండిన ప్రతివారును.

మీ గురించి నాకేమియు తెలియదని చెప్పువారు జనములో నున్నవారు మీ చేతులను ఎత్తండి. స్నేహితుడా, చూడండి. నేను చెప్పగోరుచున్నది ఇక్కడ ఉన్నది. ఇప్పు ఇక్కడే ఉన్నది. ఈ వేదిక మీద ఉన్న సేవకులందరునూ… క్రీస్తు ఈ వాగ్దానమును చేసెను. చూడండి, ఇది వ్రాయబడినది. ఎప్పుడు అది నెరవేరును? చివరి దినములలో, ప్రభువు రాకకు ముందుగా. అది నిజమేనా? అపుడే అది నేరవేరును.

46నేటి కొరకు ప్రవచించబడిన వాక్యము అదే. లూథరు వెలుగు కాదు; వెస్లీ వెలుగు కాదు; పెంతెకొస్తు వెలుగు కూడా కాదు; అది ఇప్పుడు దారిలో ముందు ముందుకు సాగిపోవుచున్నది. ఇప్పుడు, లూథరుది సరియైనదే; మెతడిస్టు సరియైనదే; బాప్టిస్టు సరియైనదే; అవన్నీ, పెంతెకొస్తు సరియైనదే. ఈ రాత్రి అన్ని రకముల వారు ఇక్కడ కూర్చొనియున్నారు. అది - వ్యక్తులు కాదు - కాదు - కాదు. అయితే ఏమిటి …..

లూథరు గూర్చి నీవు ఎన్నడునూ ఒక మెతడిస్టుకు చెప్పజాలవు, ఎందుకనగా అతడు శుద్ధీకరణమును నమ్మును, లూథరు నమ్మడు. చూచారా?

"శుద్ధీకరణమే సమస్తమూ" అని నీవు ఎన్నడూ పెంతెకోస్తునకు చెప్పజాలవు. అతడు వరముల యొక్క పునరుద్ధరణను చూచెను. దానిని అతడు నమ్మజాలడు. కాదు, అతడు దాని కన్న గొప్పది పొందెను. చూచారా? మనకు ఉన్న చివరి సంఘ కాలము అదే. ఇక ఏ సంఘ కాలములు ఉండవని బైబిలు చెప్పెను.

కాని జనుల కూడిన ఒకటి ఉండవలసియున్నది, చూడండి, ఇక్కడ మనమున్నాము. ఇప్పుడు గుర్తుంచుకొనండి, చివరి సూచన. మనము ఒక వాగ్దాన కుమారుని కొరకు చూచుచున్నామా? మీ చేతులెత్తండి. క్రీస్తు నందు ఉండుట ద్వారా మీరు అబ్రాహాము సంతానమైయున్నారని నమ్ముచున్నారా? మీ చేతులను ఎత్తండి. అయితే, అబ్రాహాము సంతానమా, మి గురుతును పొందండి! అది బయట బబులోనులో లేదు, సంఘ శాఖా ప్రపంచములో అది లేదు. అది మీ మధ్యనే ఉన్నది, ఆ బయటనున్న గందరగోళములో లేనివారు. దానిని నమ్మండి!

47ఇక్కడ ఒక స్త్రీ యున్నది, ఆమె నాకు పూర్తిగా క్రొత్తది. దాదాపు ఇదే వయసులో ఉండవచ్చును. నా జీవితములో ఎన్నడూ ఆమెను చూడలేదు. ఆమె జబ్బుగా ఉన్నచో, నేను బాగుచేయగలిగినచో, తప్పక బాగుచేయుదును. ఆమె గూర్చి ఏమియూ తెలియదు. కొద్ది నిమిషముల క్రితము ఆమె తన చేతిని ఎత్తుట మీరు చూచారా? నేను ఎన్నడూ ఆమెను చూడలేదు. ఆమె కేవలము అక్కడ నిలబడిన ఒక స్త్రీ.

ఈనాడు వారు ఇక్కడికి వచ్చి కొన్ని ప్రార్థన కార్డులను తెచ్చి, వాటన్నింటిని కలగలుపు చేసి, వాటిని జనులకు ఇచ్చిరి. ఒకటవది ఇక్కడున్న వారికి వచ్చెను. పదియవది వెనుక వచ్చెను. పదిహేనవది, ఏడవది, సంఖ్య… ఆ విధముగా వచ్చెను. అవన్నియూ కలిసిపోయినవి. ప్రతి దినము మీ ఎదుటనే జరుగుచున్నది. పిలువబడినపుడు, వారు ఎక్కడున్న వారినందరినీ పిలచుచున్నారు. చూచారా? మీరు ప్రార్థన కార్డు కలిగి యుండనవసరము లేదు. కేవలము కూర్చొని విశ్వసించండి, ఎందుకు…

మిమ్ములను మీరు పరీక్షించుకొని, నేడు మనము జీవించుచున్న ఘడియను కనుగొనండి. చూచారా? అది దాటిపోయినది కూడా స్నేహితుడా. ఇప్పటికే అయిపోయినది!

అబ్రాహాము దేవుడు యేసుక్రీస్తును మృతులలో నుండి లేపెను. "వాగ్దాన కుమారుడు వచ్చు ముందుగా అబ్రాహాము ఎదుట దూత చేసిన అవే సూచనలను చివరి దినములలో యేసు వాగ్దానము చేసెను. (మానవ శరీరములో నున్న దేవుడు) నేడును అదే జరుగునని యేసు చెప్పెను.

48అణువులను, శాఖలను, వీటన్నింటిని, అవి ఉన్న గందరగోళము యంతటినీ ఇప్పుడు మనము చూస్తున్నాము. ఆవల బిల్లీ గ్రాహంను, ఓరల్ రాబర్టును, అక్కడున్న ఇంకా అనేకులను మనము చూస్తున్నాము; పెంతకోస్తు వర్తమానికుడు, సంఘ శాఖా వర్తమానికుడు అక్కడున్నారు. అదంతా జరుగుట చూస్తున్నాము. సూచనను మోసికొనిపోవుచున్నారు. బిల్లీ గ్రాహం నిక్కచియైన వేదాంత పండితుడు. సంఘ శాఖ అదే నమ్ముచున్నది. ఓరల్ రాబర్ట్స్ నిక్కచ్చిగా స్వస్థత చేయువాడు, ఖచ్చితముగా పెంతెకోస్తుది…

కాని ఇక్కడ చూడండి, అబ్రాహాము సంతానమునకు మరేదో వాగ్దానము చేయబడినది. వారు అక్కడ శాఖల మధ్యన ఉన్నారు. శాఖలకు వేలుపట జరుగవలసినది ఒకటి ఉన్నది. జనులు సమకూడుట. రేపు రాత్రి వరకు మనందరమూ దానిని విడిచి పెట్టవలెను.

49గమనించండి, ఆ స్త్రీని నేను ఎరుగను. నేను నా వీపును ఆమెకు త్రిప్పుదును. ఆమెకు ప్రభువైన దేవుడు ఏదయినా చెప్పినచో - అది కుటుంబ సంబంధమైనది, ఆర్థిక సంబంధమైనది, జబ్బు సంబంధమైనది, మరేదయినా కావచ్చును; నాకు తెలియదు. అది అబద్ధమో లేక సత్యమో ఆమె ఎరుగును.

అప్పుడు ఆయన చేసినదే ఈ రాత్రి ఆయన చేసినచో, యేసుక్రీస్తు చివరి దినములలో జరుగునని వాగ్దానము చేసినది జరుగునని మీరు దేవుని నమ్ముదురా? సొదొమలో వలె మనము జీవించుచున్నామని ఎందరు నమ్ముదురు? ప్రపంచమంతయు సొదొమ స్థితిలోనికి పోయినది. ఈ రాత్రి నేను చెప్పినది సత్యమని మిలో ఎందరు నమ్ముదురు? అయితే, అబ్రాహాము యొక్క సంతానము మరియు పిల్లలు అయిన మీరు దేవుని నమ్ముడి!

50ఆ స్త్రీ ముఖమును చూచి గాని, లేదా మానసిక పఠనము ద్వారా గాని, లేదా మీరనుకొనుచున్న మరి దేని ద్వారా గాని నేను ఏదో ఆమెను గూర్చి చెప్పు ప్రయత్నించుచున్నానన్న అభిప్రాయమును మీ మనస్సులో నుండి తొలగించుకొనుటకు ఆలాగు చెప్పుచున్నాను. మనస్సును చదువుటను గూర్చి ఎరిగిన వారెవరైననూ దానికంటే మంచి భావమును కలిగియుందురు. చూచారా? చూచారా? మనస్సును చదువువాడు ఎన్నడైనా సువార్తను బోధించుట మీరు చూచారా? భూత వైద్యుడు ఎన్నడైనా గాని సువార్తను బోధించి, సూచక క్రియలు, అద్భుతములు జరిగించి, యేసుక్రీస్తు ఏకరీతిగా ఉన్నాడని చెప్పుట విన్నారా?

చూడండి, అది కేవలము…. అది ప్రజల మనస్సు. చూడండి, వారు గ్రుడ్డివారు. వారు అంధులుగా ఉండగలరని మీరు నమ్ముదురా? వారుందురని బైబిలు చెప్పెను. అది నిజమేనా? "గర్వాంధులు, దేవుని కన్న సుఖానుభవమును ఎక్కువగా ప్రేమించువారు, అతిద్వేషలు, అబద్ధ నేరారోపకులు, తృప్తి లేని వారు, సజ్జన ద్వేషులు, పైకి భక్తిగల వారివలె ఉండియు దాని శక్తిని ఆశ్రయించనివారు."

పరిశుద్ధ ముత్తయి 24:24 లో, యేసు చెప్పలేదా, "సాధ్యమైతే ఏర్పరచబడినవారిని సహితము మోసపుచ్చునంత దగ్గరగా ఆ రెండు ఆత్మలు చివరి దినములలో ఉండును." కాని అది సాధ్యము కాదు. వారు ఆదియందే దేవుని ఆలోచనలలో ఉన్నారు, మరియు వారు దేవునిలో భాగమైయున్నారు.

51అబ్రాహాము, యాకోబు, ఇస్సాకుల దేవా, నీ గూర్చి సత్యమే చెప్పితినని ఈ రాత్రి తెలియ చేయుము. ప్రభువా, అది నీవే. నీ దాసులు మార్గములో నుండి తమ స్వంత ఆలోచలను తీసివేసికొనునట్లుగా దీనముగా వేడుచున్నాను. అప్పుడు నీవు, నీ మహిమ కొరకు మా దేహములను వాడుకొనుము. దేవుని కుమారుడగు యేసు నామమున. ఆమేన్.

52వరము అనగా ఏమి? నీవు తీసికొని త్రిప్పికొట్టునది కాదు. కాదు, కాదు. దేవుడు నిన్ను వాడుకొనునట్లుగా నిన్నునీవు మార్గములో నుండి ఎట్లు తొలగించుకోవలెనో తెలిసికొనుటయే. నిన్నునీవు అడ్డము లేకుండా తొలగించుకొనుటయే వరము, అప్పుడు దేవుడు వాడుకొనును.

స్వస్థత పొందనిచో నా వెనుక నున్న స్త్రీ వెంటనే చనిపోవుటకు సిధముగా ఉన్నది. ఈ మధ్యనే మరో వ్యక్తి ద్వారా నా వెనుక నున్న స్త్రీ ప్రార్థించబడినది. ఆమెకు కాన్సరు. కాన్సరు ఆమె రొమ్ములోను, ఊపిరి తిత్తులలోను ఉన్నది. ఈ మధ్యనే ఆమెకు ప్రార్థన చేసిరి. బాగుపడితినని ఆమె విశ్వాసము ద్వారా అంగీకరించుటకు ప్రయత్నించుచున్నది. అది "యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు!" అది నిజమేనా, అమ్మా? ["అవును, అది ఖచ్చితంగా సత్యము," అని ఆమె చెప్పెను.] అది నిజమయినచో జనము వైపు చేతిని ఊపుము. అబ్రాహాము దేవుడు ఇంకా సజీవుడు! మంచిది, నీవు నమ్మిన దానిని విశ్వసించి వెళ్ళుము. నీవు బాగయ్యెదవు. ఆమేన్.

నీవు నమ్ముదువా? "జనసమూహము సంగతి ఏమిటి?" అని నీవందువు.

53ఆమెతో ఇక్కడ కూర్చొనియున్న ఈ స్త్రీ… ఆ వరుస చివరన, అక్కడున్న రెండవ స్త్రీ. నేను తిరిగినప్పుడు అక్కడే ఏదో చూచాను. ఆమె చేయి చుట్టూ ఒకటి చూచాను. రక్తపుపోటు ఉబుకుచున్నది. ఆమెకు అధిక రక్తపు పోటున్నది. అది నిజమేనా అమ్మా? నీ చేతిని ఎత్తుము. నీవు నమ్మినచో, నీ రక్తపుపోటు దిగిపోవును. అబ్రాహాము దేవుడు ఇంకా రంగము మీదనే యున్నాడు. ఆయన సరిగ్గా అప్పుడేమైయుండెనో, అదే దేవుని వాక్యమై నేడు ఉన్నాడు!

54నీవెట్లున్నావు? ఇప్పుడు నీవు నమ్ముచున్నావా? దేవుని యందు విశ్వాసముంచుము! కేవలము ఒక చిన్న బిడ్డ వలె కనిపించుచున్నది. యవ్వన స్త్రీ, నీ హృదయమును దేవుడెరుగును. నాకు తెలియదు. ఏమి వ్యాధియో దేవుడు నాకు బయలుపరచగలడని నీవు నమ్ముదువా? నేను తెలియచేసినచో నీవాయనను నమ్ముదువా? నీ గూర్చి కాదు, ఎవరి కొరకో వచావు. నీ సహోదరుని కొరకు, అతడు చాలా ప్రమాదకరమగు స్థితిలో యున్నాడు. ఇక్కడకు ఉత్తరాన ఉన్న ఒక పట్టణములో అతడున్నాడు. టులేర్. అతడు ఆస్పత్రిలో ఉన్నాడు. అతనికి లుకేమియా వచ్చెను. వైద్యులు మరణించునని చెప్పి ఆశ విడిచారు. ఎట్టి ఆశ ఇక లేనే లేదు. అది నిజము. నీవు నమ్ముదువా? [ఆ స్త్రీ ఏడుచూ "అవును" అని జవాబిచ్చెను.] మంచిది. నీ చేతిలో ఏమున్నది? దానిని తీసికొని వెళ్ళి, అతని మీద ఉంచుము. సందేహించక నమ్ముము! ఆమేన్.

నీవు నమ్మెదవా? ఎన్నడూ ఆ స్త్రీని నా జీవితములో చూడలేదు. కాని దేవుడు ఎన్నటికినీ దేవుడే! ఇప్పుడు చెప్పండి, ఒక మానవుడు దానిని చేయగలడేమో దానిని చేయగలుగుట మానవ నిర్మాణములోనే లేదు. అది దేవుడే, చివరి దినములలో అది ఇక్కడ ఉండునని యేసుక్రీస్తు వాగ్దానము చేసెను. సొదొమ దినములలో వలెనే తన్నుతాను బయలుపరచుకొనును. (అబ్రాహాము సంతానమునకు ముందు)

55ఇప్పుడు ఇక్కడ, ఈ స్త్రీని నేను ఎరుగను. మేము ఒకరికొకరము క్రొత్తవారము. మా జీవితములో మొదటిగా కలిసికొనుట ఇదే ఆనుకొనుచున్నాను. ఆయన దాసునిగా నీవు నన్ను నమ్ముదువా? ఇది వాక్యముగా నీవు నమ్ముదువా? నీకు తెలియును… ఈ వాక్యము ఇంకనూ హృదయము యొక్క ఆలోచనలను, ఉద్దేశ్యములను వివేచించును. అది నిజమేనా? నీవు నమ్మినట్లయితే, వాక్యము స్వస్థనిచ్చునది. నీవు నమ్ముదువా? నీవు నల్లని ఛాయతో కప్పబడియున్నావు. అది కాన్సరు. ఆ కాన్సరు ఎక్కడున్నదో దేవుడు చెప్పగలడని నీవు నమ్ముదువా? అది దిగువ ప్రేవులలో ఉన్నదని వైద్యుడు చెప్పెను. నీవు బాగవుదువని ఇప్పుడు నమ్ముదువా? వెళ్ళి, ఏమి సందేహించకుము. దేవుడు నిన్ను బాగుచేయును. ఆమేన్.

మీరందరూ నమ్ముచున్నారా? ఆయన ఏది చేయునని వాగ్దానము చేసెనో అదే! దేవుని యందు విశ్వాసముంచుడి, సందేహించవద్దు.

మనము ఒకరికొకరము క్రొత్తవారము. నిన్ను నేను ఎరుగను. మనము కొత్త వారమయినచో, జనులకు తెలియ చేయుటకు మన చేతులను ఎత్తుదము. నా జీవితములో ఎన్నడూ ఆ స్త్రీని చూడ లేదు.

అక్కడున్న నీవు నమ్ముచున్నావా? అది యేసుక్రీస్తేనని నమ్ముచున్నావా? ఏమిటది? అది ఆయన వాక్యము. ఈ ప్రజలు దానిని నిరాకరించినప్పుడు, వారు ఒక మనష్యుని విసర్జించుట లేదు గాని, వారు వాక్యమునే విసర్జించుచున్నారు. వెలుపల నున్నది వాక్యమే, అది లోనికి రాలేకపోవుచున్నది.

56ఇప్పుడు, ఆ స్త్రీ నాకు కొత్తది. నా జీవితములో ఎన్నడూ ఆమెను నేను చూడలేదు. దేవుడు బాగుచేయువాడు. స్వస్థత కొరకు కాదు గాని, మరి దేనికొరకో కావచ్చును. నీ బాధ ఏమిటో దేవుడు నాకు వివరించినచో, నీవు నన్ను నమ్ముదువా? మొదటగా నీకు ప్రార్థన కావలసినది, నీ చెడు చెవి కొరకు. ఒక చెవి నీకు వినబడుట లేదు. అది నిజము. అది సత్యము. నీకు ఒక అలవాటున్నది. నీవు ఆ అలవాటు నుండి విడిపింపబడగోరుచున్నావు, అది సిగరెట్లు త్రాగుట. నీ మంచి చెవిలో ఇప్పుడు నీ వ్రేలు నుంచుము, మంచిది, నీ మంచి చెవిలో, మంచిది. ఇప్పుడు దేవుని నమ్మి, నీ దారిన వెళ్ళుము. నీవు నమ్మినచో ఇక సిగరెట్లు ఏ మాత్రము త్రాగవద్దు. వెళ్ళు, ప్రభువు నిన్ను దీవించును.

ఏమి జరిగినదో నీవు చూచావా? ఆయన వాస్తవముగా లేడా?

నిన్ను నేను ఎరుగను. మనము ఒకరికొకరము క్రొత్తవారము. నా జీవితములో ఎన్నడూ నిన్ను నేను చూడలేదు, కాని దేవుడు నిన్ను ఎరుగును. దేవుడు నీ గూర్చి ఏదయినా నాకు చెప్ప కలిగినచో నీవు నమ్ముదువా?

జనులందరూ నమ్ముదురా? అక్కడున్న వారు ఎవరైననూ ఆమెను ఎరుగుదురా? ఈ జనులలో ఎవరైననూ ఆమెను ఎరుగుదురా? మంచిది. ఇది నిజమో కాదో మీరెరుగుదురు. ఇది దానిని స్థిరపరచవలెను. ఇది సత్యమును చెప్పవలెను.

57గత కొద్ది నిమిషములలో ఏమి జరిగినదో మీరిప్పుడు చూడగలరు. చూచారా? నేను కొద్దిగా తడబడుచున్నాను. చూడండి? అంతా నాకు గ్రుడ్డిగా కనబడుచున్నది. చూడండి, అది వివేచన. చూడండి, అది పరిశుద్ధాత్మ. అది నేను కాదు. ఈ దినమునకు వాగ్దానము చేయబడిన వాక్యమది! అపొస్తలుల దినముల నుండి ఇప్పటి వరకు ఎన్నడూ అది లేదు, ఎన్నడూ ఉండలేదు. "మనష్యకుమారుని రాకడకు ముందు ఆలాగు జరుగును. లోతు దినములలో ఉండినట్లుగానే మనుష్యకుమారుని రాకడ యందును ఉండును," అని చెప్పబడెను. అవిశ్వాసులు దానిని నమ్మరు. దానిని నమ్ముటకు వారు ఊహించరు. కాని విశ్వాసులు దానిని విశ్వసించెదరు!

58ఇప్పుడు, పరిశుద్ధాత్మ దీనిని బయలుపరిచినచో మీలో ఎందరు పూర్ణహృదయముతో నమ్ముదురో చేతులెత్తండి?

మీకు కొంత నష్టము జరిగెను. కారు ప్రమాదము జరిగినది. అది నీ మెడలోని కొన్ని వెన్నుపూసలను లాగినది. ఒక మూత్రపిండము కూడా వదులుగా లాగబడినది. అది నిజము, కాదా? నీవు నమ్ముదువా? నీవు బాగయెదవు. దేవునికి స్తోత్రము.

మూత్రపిండపు వ్యాధిని దేవుడు బాగు చేయునని నీవు నమ్ముదువా? అయితే వెళ్ళి, నీ స్వస్థతను అంగీకరించుము.

అమ్మా, రా! ఇటు చూడు. గుండె వ్యాధిని బాగుచేయునని దేవుని నీవు నమ్ముదువా? మంచిది, నీ దారిన వెళ్ళి, నమ్ముము. నీ గుండె బాగవును.

ఇక్కడకు రా. నీ వెన్నును దేవుడు బాగు చేయునని, నీవు మంచిగా అయ్యెదవని నీవు దేవుని నమ్ముచున్నావా? వెళ్ళి, నమ్ముము.

కేవలము దేవుని నమ్ముము. నీవు చేయవలసినదంతా అదే!

అమ్మా, రా! కడుపు వ్యాధిని బాగుచేయునని నీవు దేవుని నమ్ముదువా? వెళ్ళి, నీ రాత్రి భోజనము తినుము. నీ పూర్ణహృదయముతో నమ్ముము.

59రమ్ము. ఎముకల వ్యాధిని దేవుడు బాగు చేయగలడని నీవు నమ్మెదవా? అయితే విశ్వాసముతో వెళ్ళుము… దేవుడు నిన్ను బాగు చేయును.

మంచిది, రమ్ము. నీవు నీ పూర్ణహృదయముతో నమ్ముచున్నావా? నీవు నమ్ముదువా? మరలా ఎముకల వ్యాధియే. దేవుడు నిన్ను బాగు చేయునని నీవు నమ్ముదువా? వెళ్ళుము, నమ్ముము. "ప్రభువా వందనములు," అని చెప్పుము.

ఆ బయట ఎందరు నమ్ముతున్నారు? మీరు నమ్ముదురా?

ఎర్ర దుస్తులు ధరించి ఇక్కడ కూర్చోనియుండిన ఈమె, ఇక్కడ తన చేతిని ఎత్తి యున్నది. అధిక రక్తపు పోటుతో బాధపడుచున్నది. దేవుడు నిన్ను బాగుచేయునని నమ్ముచున్నావా? నీవు నమ్ముదువా? మంచిది. ఆక్కడ ఆ స్త్రీ ప్రక్కనున్న ఆమెపై నీ హస్తము వేసి, ఆమె స్వరము బాగవునని చెప్పుము. ఆమేన్.

అదిగో అక్కడేయున్నది. ఆమేన్. నీవు నమ్ముదువా? విశ్వాసముంచుము!

60ఇక్కడ ఒకాయన కూర్చొనియున్నాడు, హేమరేజ్ ఉన్నది. ఇక్కడ కూర్చొనియున్న మీరు నమ్ముదురా? అవును, నీకు హేమరేజ్ ఉన్నది. అది బాగవునని నీవు నమ్ముదువా?

నీ ప్రక్కనున్న ఆమెకు కూడా హేమరేజ్ ఉన్నది. ఆమెకు వెన్ను నొప్పి ఉన్నది. దేవుడు నిన్ను బాగు చేయనైయున్నాడని నీవు నమ్ముదువా? నమ్ముదువా? నీ చేతిని పైకెత్తి దానిని అంగీకరించుము. నమ్ముము.

నీ ప్రక్కనున్న స్త్రీ తన కాళ్ళు, నడుము నొప్పి కలిగియున్నది. అమ్మా, అది నిజమేనని నీవు నమ్ముదువా? నీవు బాగవుదువని నమ్ముదువా? "నేను దానిని అంగీకరించుచున్నాను," అని చెప్పి, నీ చేతిని ఎత్తుము.

మంచిది, ఆమెకు ప్రక్కనున్న స్త్రీకి వ్యాధి సోకినది. కండ్లద్దములు పెట్టుకొనిన ఆ యవ్వనురాలు, దేవుడు నీ సోకిన వ్యాధిని బాగుచేయునని నమ్ముదువా? "దానిని నేను అంగీకరించుచున్నాను," అని చెప్పి, నీ చేతిని ఎత్తుము. మంచిది, దానిని నమ్ముము.

61ఆమె ప్రక్కనున్న స్త్రీకి మూత్రపిండపు వ్యాధి యున్నది. అమ్మా, మూత్రపిండపు వ్యాధిని దేవుడు బాగుచేయునని నమ్ముచున్నావా? మంచిది, నీ చేతిని ఎత్తి, దానిని అంగీకరించుము.

ఆమె ప్రక్కనున్న చిన్న పాపకు గాయిటర్ జబ్బున్నది. అక్కడున్న ఆ గాయిటర్ వ్యాధిని దేవుడు బాగుచేయునని నమ్ముదువా? నీ చేతిని పైకెత్తి, దానిని అంగీకరించుము.

మీ పూర్ణహృదయముతో ఎందరు నమ్ముతున్నారు? అయితే మీరు నిలబడి దానిని అంగీకరించుడి. అబ్రాహాము, ఇస్సాకు, యాకోబుల దేవుని యొక్క సన్నిధిలో నిలబడుడి.

ప్రభువైన యేసుక్రీస్తు నామమున ఇప్పుడు ఈ భవనములో పరిశుద్ధాత్మ దిగి వచ్చి, దైవ సన్నిధిలో ప్రతి వ్యక్తిని బాగు చేయును గాక!

Search Messages

0 / 0 matches
Enter characters above to process real-time text query scopes...