మూలపురుషుడైన అబ్రాహాము
1ఆదికాండము 22వ అధ్యాయము 15వ వచనము నుండి, కొద్ది సేపు చదివి కూటమును ప్రారంభించుకుందామని అనుకుంటున్నాను. ఆదికాండము 22వ అధ్యాయము, 15వ వచనము నుండి ప్రారంభించెదము:
యెహోవా దూత రెండవ మారు పరలోకము నుండి అబ్రాహామును పిలిచి ఇట్లనెను.
నీవు నీకు ఒక్కడే అయిన నీ కుమారుని ఇయ్య వెనుతీయక ఈ ప్రకారము చేసినందున, నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రములవలెను సముద్ర తీరమునందలి ఇసుకవలెను నీ సంతానమును నిశ్చయముగా విస్తరింప చేసెదను,
నీ సంతతి వారు తమ శత్రువుల గవిని స్వాధీనపరచుకొందురు. మరియు నీవు నా మాట వినినందున భూలోకములోని జనములన్నియు నీ సంతానము వలన ఆశీర్వదించబడును నా తోడని ప్రమాణము చేసియున్నానని యెహోవా సెలవిచ్చెననెను.
1SAM 15:22•
GAL 3:29
2విధేయతను కలిగియుండుట వలన — ఎంత గొప్ప వాగ్దానము! దేవుడు విధేయతను ఆశించుచున్నాడు. "బలులు అర్పించుట కంటే మాట వినుట శ్రేష్ఠము," అని ఒకసారి చెప్పబడియున్నది. నీవు దేవునికి అర్పి౦చు ఏ విధమైన అర్పనలకంటే ప్రభువు మాటకు లోబడియుండుటయే శ్రేష్ఠమైనది.
ఈ రాత్రి సమయమందు "మూలపురుషుడైన అబ్రాహాము" అను దివ్యమైన అంశమును ఎదుర్కొనబోవుచున్నాము, అతడు "విశ్వాసమునకు తండ్రి అని కూడా పిలువబడుచున్నాడు, ఎందుకనగా అతడును, అతడి సంతానమును ఈ భూలోకమును స్వతంత్రించుకొనునట్లు దేవుడు వాగ్దానము చేసెను అబ్రాహాము ద్వారా క్రీస్తులో మరణించినవారమై, అబ్రాహాము యొక్క మూలపురుషుడైన అబ్రాహాము సంతానముగా తీర్చబడి వాగ్దాన ప్రకారముగా ఆయనతో మనము కూడా వారసులమైతిమి.
GEN 11:30•
GEN 12:1,4
3అబ్రాహాము కేవలము ఒక సామాన్యమైన మానవుడే — అతడిలో ప్రత్యేకత అంటూ ఏదియు లేదు. డెబ్బది-ఐదు సంవత్సరములు అయ్యేంతవరకు దీనికి ముందు అతడిని దేవుడు పిలిచినట్లు మనకు ఏ సాక్ష్యాధారాలు లేవు; మారు తండ్రి యొక్క కుమార్తెయగు అతడి భార్య అప్పటికి అరువది-ఐదు సంవత్సరముల వయస్సు గలదైయుండెను. బహుశా వారివురు చాలా యవ్వన ప్రాయములో నుండే ఏకమై కలిసి - మెలిసి జీవించుచున్నారు. పిల్లలు ఇంకా పుట్టకుండా గొడ్రాలివలె యుండెను.
దేవుడు వారిని సంపూర్ణముగా ప్రత్యేకపరచుటకై లోకములోనున్న సమస్తమైన వాటి నుండియు, అతడి యొక్క సమస్త జనమునుండియు మరియు సమస్త బంధువుల నుండి వేరుచేసుకొని, అతడిని రమ్మని పిలిచెను. నీ ద్వారా ఒక అసాధారణమైన కార్యము ప్రభువు చేయగోరినయెడల, ఎటువంటి సందేహము నీకు కలుగకుండాయుండుటకై సంపూర్ణముగా నిన్నునీవు ప్రత్యేకపరచుకోవలెనని దేవుడు ఆజ్ఞాపించుచుండెను. ఆయన ఏమి చెప్పినా, ఆ మాటకు నీవు సంపూర్ణముగా విధేయుడవై యుండవలసియున్నది. ఆయన దీనిని అధికారముతో అడుగుచున్నాడు. దానిని నీవు వేరే విధముగా చెయ్యకూడదు. ఆయన ఎల్లప్పుడు దీనికి ఒక సాదృశ్యమును కలిగియుండును, అదేమనగా దేవునితో కలసి నడుచుటకు తగిన విధముగా ప్రత్యేకపరచబడినవాడిగా యుండుటకై అతని యొక్క సమస్త కుటుంబమును, సమస్త బంధువులను మరియు మొదలగువాటన్నింటి నుండి సంపూర్ణముగా అతడు ప్రత్యేకించపరచబడవలయును. అదియే ఆయన యొక్క సాదృశ్యమైయున్నది.
ROM 4:20
4సంవత్సరములు గతించిపోతున్నప్పటికిని జరిగిన కార్యము ఏమి లేదు, అయినను అబ్రాహాము ఇంకా కూడా వాగ్ధానముపై యున్న నమ్మకము సన్నగిల్లిపోకుండా అతడు అదైర్యపడలేదు. "అవిశ్వాసముచేత దేవుని యొక్క వాగ్దానమును సందేహించక, బలవంతుడై దేవునికి స్తుతులను చెల్లించెను." సంవత్సరముల వెంబడి సంవత్సరములు గతించిపోవుచున్నను, అనేకులైన విమర్శకులు అతడి యొద్దకు వచ్చి, "జనాంగములకు తండ్రియైన మూల పురుషుడైన అబ్రాహాము, అబ్రాహాము నీకు ఎంత మంది పిల్లలు ఇప్పుడు గలరు?" అని ప్రశ్నించి యుండవచ్చును. అతడిని అలాగే వారు అడిగియుందురు, అందులో ఏ సందేహము లేదు. అది అతడిని ఏ విధముగాను కలవరపరచలేక పోయినది. పిల్లలు ఇంకా పుట్టలేదు. పిల్లలను కనే వయస్సును శారా దాటిపోయినది గొడ్రాలిగానే మిగిలి పోవుటకు ఆమెలో ఋతు క్రమము కూడా ఆగిపోయినది, అయినాగాని అబ్రాహాము దేవుని యందు ఇంకా కూడా అదే నమ్మకమును కలిగియుండెను.
ఒక బిడ్డ కొరకు ఏమేమి కావాలయునో వాటన్నింటిని అతడు సిద్ధపరచుకొనుచూ యుండెను. వాగ్దానము చేసిన దేవుడు తాను చేసిన వాగ్దానమును నెరవేర్చగల సమర్థుడని అతడు సంపూర్ణముగా ఎరిగి, యుండెను. అతడి యొక్క సంతానము కూడా అదే విషయమును గూర్చి ఆలోచించవలయును. అది చూచుటకు ఎంత అవాస్తమైనదిగా యున్నను, స్వాభావికమైన కార్యమునకు అది ఎంతో అస్వాభావికమైనదిగా కనిపించినను, దేవుడు తాను నెరవేర్చలేని ఒక వాగ్దానమును ఆయన చేయడు. నేడు మనము కూడా అదే విషయమును నమ్ముచున్నాము. అబ్రాహాము యొక్క నిజమైన సంతానమంతా దానిని అట్లే నమ్ముచున్నది. ఎటువంటి భిన్నమైన పరిస్థితులు అచ్చట యుండినను, మనము ఎంతటి జ్ఞానమును కలిగియున్నామని కాదు గాని, ఎన్నో కార్యములు సంభవించినను, ఒక స్వాభావికమైన తలంపునకు విరుద్దముగా ఎంతటి అస్వాభావికమైన కార్యముగా గోచరించినను, అది ఎంతటి బుద్దిహీనమైన విషయముగా కనిపించినా గాని, అది మనకు ఎలాంటి వ్యత్యాసముగా కనిపించదు. దానిని దేవుడు ఆ విధముగా చెప్పినయెడల, అది ఆ విధముగానే యుండును. అబ్రాహాము యొక్క సంతానము ప్రభువు ఈలాగు సెలవిచ్చుచున్నాడను మాటను ఆధారము చేసుకొని, దానిపై ఆధారపడి యుండును. అది దానిని స్థిరపరచును.
GEN 22:2•
EPH 2:1•
HEB 11:19
5ఇరువది-ఐదు సంవత్సరములు గతించినా ఇంకా సంతానము కలుగలేదని మనము గమనించితిమి. అయినప్పటికినీ, అబ్రాహాముయెడల దేవుడు చేసిన తన వాగ్దానమును నెరవేర్చుటకు సమర్ధుడై యుండెను, ఎందుకనగా అబ్రాహాము దేవునియందు నమ్మకమును కలిగియుండుటచే, చిన్న బాలుడగు ఇస్సాకు రంగము మీదికి వచ్చెను.
చిన్న బాలుడగు ఇస్సాకు రంగము మీదికి వచ్చిన తర్వాత, దేవుడు అతడిని రెండింతలుగా శోధించెనని మనము కనుగొనగలము. అబ్రాహాము ఇంచుమించు నూట-పదిహేను - నూట-ఇరవై సంవత్సరముల వయసును కలిగియున్నపుడు, దేవుడు అబ్రాహాముతో, "నీకు ఒక్కడైయున్న నీ కుమారుని, అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసికొని మోరీయా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబోవు పర్వతములలో ఒకదాని మీద దహనబలిగా అతడిని అర్పించమని," చెప్పెను. ఇంకొక రీతిగా చెప్పాలంటే, అతడి కొరకైన వాగ్దానమును నెరవేర్చుట కొరకుయున్న సమస్త ఆధారములన్నింటినీ నిర్మూలము చేసే విధముగా అది యున్నది. అనగా అతడికి కలిగియున్న ప్రకృతి సంబంధమైన సమస్త కార్యములన్నింటిని తీసివేయుట అని అర్ధము.
"మృతులలో నుండి లేచిన ఒకనిని పొందుకున్నట్లుగా నేను అతడిని పొందుకున్నాను. మృతులలో నుండి అతడిని సజీవముగా లేపునని నేను సంపూర్ణముగా ఒప్పింపబడ్డాను," అని అబ్రాహాము చెప్పెను.
అబ్రాహాము యొక్క సంతానమునకు ఇప్పుడు కావలసినదంతా ఇదియే, ఎందుకనగా ఆయన మనలను మృతులలో నుండి లేపెను. మనము పాపములయందును, అతిక్రమములయందును మృతులవలె యుంటిమి. నా యొక్క మనస్సును మార్చుటకు, నా యొక్క ఆలోచనలను మార్చుటకును, నా స్వభావమును మార్చుటకును, నన్ను పరిపూర్ణముగా మార్చుటకు ఎవరైతే సమర్థుడైయున్పాడో, ఆయన తాను ఆశించిన రీతిగా తన కార్యములను నాలో చేయగలడు. ఆయన చెప్తే ఏ విషయానైనా అది సత్యమని నేను నమ్మెదను, అబ్రాహాము యొక్క ప్రతీ భీజము అదే కార్యమును నమ్ముచున్నది.
GEN 22:5•
MATT 10:8•
MARK 16:17•
HEB 13:8•
REV 20:4
6అబ్రాహాము దేవుని మాటకు విధేయుడై, అడిగిన ప్రకారముగానే ఆ చిన్న బాలుడిని బలికి తీసుకొని వెళ్లెను. ఆ ఉదయకాలమందు అబ్రాహాము తన దాసులతో, "మీరు గాడిదలతో ఇక్కడనే ఉండండి, నేనును ఈ చిన్నవాడును అక్కడికి వెళ్లి, దేవునికి మొక్కి మరల మీ యొద్దకు వచ్చెదమని," చెప్పెను. ఓ, అది ఏలాగు సాధ్యమగును? తనయొక్క స్వంత కుమారుడినే బలిగా అర్పి౦చుటకు అతడు ఆ కొండ శిఖరమునకు ఎక్కుపోవుటకు ఏలాగు సాధ్యమగును, అయినా గాని అతడిలా చెప్పెను, "నేనును, నా కుమారుడును మరలా వచ్చెదము." ఏదో సంభవించబోవు సంగతిని గూర్చి అతడు ముందుగానే ఎరిగియుండెను. దేవుడు దానిని ఏలాగు చేస్తాడో దానిని గూర్చి అతడికి తెలియదు. అయినాగాని అది అతడి యొక్క ప్రశ్న కూడా కాదు. దీనిని గూర్చి దేవుడు వాగ్దానము చేసెనని అతడు ఎరిగియుండెను — దేవుడు దానిని వాగ్దానము చేసెను. దానినే మనము కూడా ఎరిగియుండవలెను. అది ఏ విధముగా జరుగునని దానిని గూర్చి నేను చెప్పలేను, కాని దేవుడు దానిని గూర్చి చెప్పెను.
ఆయన యేసుక్రీస్తును రెండవసారి పంపును. ఆయన శరీరధారిగానే వచ్చును. ఆయన తనకు సొంతమైన దానిపై హక్కు కోరును. ఈ భూమిపై తాను విమోచించిన వారితో కలిసి వెయ్యేండ్ల పరిపాలన చెయ్యబోవుచున్నాడు. వెయ్యేండ్ల పరిపాలన యుండును. సమీపించబోవుచున్న ఆ ఘడియ కొరకు మనము ఎదురు చూచుచున్నాము. దానిని ఆయన వాగ్దానము చేసెను. రోగులను స్వస్థపరచెదరని, మృతులను లేపుదరని, దయ్యములను వెళ్ళగొట్టెదరని ఆయన వాగ్దానము చేసెను. దానిని చేసెదనని ఆయన వాగ్దానము చేసెను. ఆయన నిన్న, నేడు, నిరంతరము ఒక్కటే రీతిగా యున్నాడు. అది ఏలాగు జరుగునని నేనెరుగను? ఆయన దీనిని చేసెదనని వాగ్దానము చేసియున్నాడు, దానిని మనము నమ్ముచున్నాము. అది దానిని స్థిరపరచును.
ఒక వ్యక్తి దేవుడిని నమ్ముచున్నప్పుడు, ఆయన చెప్పే సమస్త కార్యములను అతడు నమ్మును. ఆ విధముగానే అబ్రాహాము దేవుడిని నమ్మెను. ఆ వాగ్దానము నెరవేర్చబడుననుటకు ఆధారముగా యుండు ప్రతి కార్యమును నాశనము చేయమని అతడికి ఆజ్ఞాపించబడెను, అయినాగాని దేవుని వలన అది సాధ్యమగునని అతడు దృఢ నిశ్చయతను కలిగియుండెను.
7ఇప్పుడు, ఇంతటి గొప్ప వాగ్దానమును ఆయన అతడికి మాత్రమే అనుగ్రహించలేదు గాని, అతడి యొక్క సంతానమునకు కూడా ఆయన దానిని అనుగ్రహించెను. ఎందుకనగా అబ్రాహాము దేవునికి విశ్వాస పాత్రుడైయుండి, దేవుడు అతడికి వాగ్దానము చేసిన మాటను దేవుడు నిలబెట్టుకొనెను గనుక ఆయన ఈ బిడ్డను మరల బ్రతికించగలడని అతడు ఎరిగియుండెను. అందుచేతనే తన స్వంత కుమారుడిని బలిగా అర్చించుటకు అతడు వెనుదీయలేదు. దేవుడు తన కుమారుడిని ఏ విధముగా ఇచ్చెనో, అదే విధమైన ఒక సాదృశ్యముగా అతడు ఆ కొ౦డపైకి ఏ విధముగా కట్టెలను మోసుకొని వెళ్ళెను, అలాగే క్రీస్తు కూడా తన యొక్క స్వకీయ బలి అర్పణ కొరకు కొయ్యతో చేయబడిన సిలువను, తానే ఆ కొండ శిఖరమునకు మోసుకొని వెళ్ళెను.
GEN 22:17
8భూమిపై యున్న సమస్తమైన వాటికంటే, తన స్వంత కుమారుడిని ప్రేమించిన ప్రేమకంటేను అబ్రాహాము దేవుడిని ఎంతగానో ప్రేమించెను, అతడు ఈ కార్యమును చేయుటవలన దేవుడు అతడి పట్ల ఎంతగానో సంతోషించెనని మనము గ్రహించగలుగుచున్నాము. ఎవరేమన్నాగాని బహుగా అతడు ఆయనను ప్రేమించెను. ఎవరేమి చేసినాగాని అబ్రాహాము దేవుడిని బహుగా ప్రేమించెను. ఆయన యొక్క వాక్యమును నమ్ముటకు కావలసిన నమ్మకము కంటే ఇంకా కూడా ఎంతగానో మరెక్కువగా అతడు ఆయనను ప్రేమించియుండెను. అబ్రాహాము యొక్క సంతానమంతా కూడా దేవుని యొక్క వాక్యమును అదే విధముగా నమ్మెదరు. వారు దేవుడిని నమ్మెదరు.
అది దేవునికి ఎంతగానో ప్రీతికరముగా యుండెనని మనము ఎరుగుదుము, అందుచేత ఆయన చెప్పిన దానిని బట్టి, "నీ సంతతి వారు తమ శత్రువుల గవిని స్వాధీనపరచుకొనెదరు. ఇచ్చట నీ సంతతి వారు తమ శత్రువుల గవిని స్వాధీనపరచుకొనెదరు." గుర్తుంచుకొనండి, ఇది ప్రభువు సెలవిచ్చినదిగా యున్నది. నీవు అబ్రాహాము యొక్క నిజమైన సంతానమైనయెడల, అబ్రాహామునకు దేవుని యందున్న అదే విశ్వాసము నీలో కూడా యుండును. అబ్రాహాము యొక్క సంతానము దానిని విశ్వసించును. దేవుడు తాను చేసిన వాగ్దానమును ఆయన నెరవేర్చుననియు, దేవుడు ఏమి చెప్పెనో దానిని నీవు నమ్మెదవు.
GEN 22:17•
ROM 3:4
9ఆయన చెప్పెను… ఇప్పుడు గుర్తుంచుకొనండి, దేవుడు అబ్రాహామునకు ఒక పరీక్షను పెట్టి శోధించిన తర్వాత మాత్రమే ఆయన దీనిని అతడికి వాగ్దానము చేసెను. అబ్రాహాము యొక్క సంతానము నిజముగానే దేవుని యొక్క వాక్యమును నమ్ముచున్నాదా, లేదా యని మొదట వారిని ఖచ్చితముగా పరీక్షించి చూడవలయును. గుర్తుంచుకొనండి, దేవుని యొక్క వాగ్దానమును కాపాడుకొనుటకు అతడికి ఒకే ఒక్క మార్గము మాత్రమే యున్నది, అదేమనగా అతడు దేవుని యొక్క వాక్యమును నమ్ముటను ద్వారాను, అతడు దానిని నమ్ముచున్నాడా, లేదా యని పరీక్షించబడుట ద్వారాను.
మనము ఆ పరీక్ష యొద్దకు తీసుకొని రాబడితిమి. నేటి దినమున అబ్రహాము యొక్క భీజము ఆ పరీక్ష యొద్దకు తీసుకొని రాబడవలసియున్నది. మనము దేవుని యొక్క వాక్యమును అంగీకరించుదుమా, లేక దానిని గూర్చి మనిషి చెప్పిన మాటలను అంగీకరించుదుమా? సంస్థ కలిగియున్న ఏదో ఒక సిద్ధాంతమును అంగీకరించుదుమా, లేక దేవుడు చెప్పిన దానిని అంగీకరించుదుమా? ఎవరేమి చెప్పినగాని దేవుని యొక్క వాక్యము సత్యమైయున్నయెడల, మనము దేవుని యొక్క వాక్యమును నమ్మెదము. ప్రతి మానవుని యొక్క మాట అబద్దము కాని దేవుని యొక్క మాట సత్యము. నీవు ఒక నిజమైన అబ్రాహాము యొక్క భీజము! కాని నీవు ఆ నిజ భీజముగా అగుటకు ముందుగా, అబ్రాహాము తాను ఏ విధముగా పరీక్షించబడేనో, నీవు కూడా ఒక పరీక్ష ద్వారా శోధించబడవలయును. కేవలము అబ్రాహామునకు మాత్రమే దేవుడు ఆ వాగ్దానము చేయలేదు గాని అతడి సంతానమంతటికీ చెందును. వారు తమ శత్రువు యొక్క గవిని స్వాధీనపరచుకొనుదురు.
ఓ, మై!
GEN 12:2•
GEN 17:4•
HEB 11:19
10దేవుని యొక్క వాగ్దానమగు వాక్య పరీక్షయందు, అది సత్యమని దానిని పూర్తిగా విశ్వాసించెను. దానిని గూర్చి ఆలోచించండి. పరిస్థితులు ఏ విధముగా యున్నను, ఇంకా కూడా అతడు దేవుని యొక్క వాక్యము సత్యమని నమ్మిక కలిగియుండెను. గొప్ప మూలపురుషుడగు అబ్రాహాము శోధించబడు కాలమునకు తీసుకొని రాబడినపుడు, అతడు ఏ మాత్రము కూడా విశ్వాసమందు తడబడలేదు. దేవుడు మృతులలో నుండి తనను లేపగల శక్తిమంతుడని అతడు నమ్మెను. అతడు దానిని నమ్మియుండెను, ఎందుకనగా దేవుడు ఆ వాగ్దానమును చేసియున్నాడు. "నీవు జనాంగములకు తండ్రి యగుదువని దేవుడు అతడికి వాగ్దానమును చేసినపుడు, అది ఆ విధముగానే జరుగునని అతడు దానిని నమ్మెను. అది ఏ విధముగా సాధ్యమగునో దానిని గూర్చి అతడికి తెలియదు. అతడు నమ్మకమును ఉంచిన తరువాత, ఆ విధముగానే అతడికి కుమారుడు జన్మించినపుడు, పిదప దేవుడు ఆ కుమారుడిని తనకు బలిగా సమర్పించవలెను, అప్పుడు కూడా దేవుని యొక్క వాగ్దానము ఇంకా కూడా సత్యమని అతడు నమ్మకమును కలిగియుండి, తన కుమారుడిని దేవునికి బలిగా సమర్పించెను.
ACTS 2:38,39
11అతడి సంతానము కూడా అదే విధముగా యుండును.
అబ్రాహాము యొక్క సంతానమునకు దేవుని యొక్క వాగ్దానము ఒక ముద్రగా యున్నది. వాగ్దానము ఒక ముద్రయై యుండి సాక్షార్ధమైన ఒక గుర్తుగా యుండును. వాగ్దానము చేయబడిన ప్రతీ మాటను మనము విశ్వాసించినపుడు ఆ వాగ్దానమును రుజువుపరచుటకై ఒక ముద్ర మనకు ఇవ్వబడుచున్నది.
గమనించితిరా, మనము అబ్రాహాము యొక్క సంతానముగా యుండినయెడల, పరిశుద్ధ గ్రంధమును మనము నమ్ముచున్నామా, లేదా యని శోధనలోకి వెళ్లవలసియున్నది. పరిశుద్ధ గ్రంధము దేవుని యొక్క వాక్యమైయున్నది, ఎందుకనగా అది దేవునిదైయున్నది.
ఆ శోధనలోనికి వెళ్లిన పిదప నీవు దానిని నమ్మెదవు, వారిలో కొందరు, "అద్భుతములు జరుగు దినములు గతించిపోయినది," అని చెప్పినపుడు, నీవు ఆ మాటలతో ఏకీభవించినపుడు అది వాక్యమునకు వ్యతిరేకమైనదిగా యుండును. ఒకవేళ నీవు, "ఈనాడు నీవు పరిశుద్ధాత్మను పొందలేవు అసలు అటువంటిదేమి లేదు, అది కేవలము పండ్రెండు మంది అపొస్తులకు మాత్రమే," అని చెప్పినట్టైతే. వాక్యము ఇలా చెప్పుచున్నది, (పెంతెకోస్తు దినమున పేతురు దానిని గురించి ప్రసంగించుచు), "మీరు మారుమనస్సు పొంది, పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరము పొందుదురు. ఈ వాగ్దానము మీకును, మీ పిల్లకును, దూరస్తులందరికిని అనగా ప్రభువైన మన దేవుడు తనయొద్దకు పిలిచిన వారికందరికిని చెందునని," చెప్పెను.
GEN 22:17
12ఖచ్చితముగా అదియే దానియొక్క అర్ధముయగును. అది…
ఇప్పుడు, ఒకవేళ పరీక్షకు నీవు సిద్దముగా యున్నయెడల, అనగా దేవుని యొక్క ఆసిడ్ పరీక్షకు సిద్దముగా యున్నయెడల, దానియొక్క విధిని లేదా ఆజ్ఞాపించబడిన ఆజ్ఞను నీవు పాటించవలెను, నీవు దానిని నమ్మినయెడల దేవుడు చెప్పిన తన మాటను తాను కాపాడుకొనుననే దానిని నీవు కనుగొనెదవని నేను నీకు చెప్పుచున్నాను. అది నిజము. కాని దానిని పొందాలంటే నీవు ఆ విధముగానే కొనసాగాలి. ఎందుకనగా అది ముద్రగా యున్నది, దానిని నీవు ఎప్పుడైతే పొందుకొనెదవో అప్పుడే ఆ వాగ్దానమును నీవు పొందుకొనెదవు. అది దేవుని యొక్క నియమముగా యున్నది.
ఇప్పుడు, దానిని ఏ విధముగా చెయ్యవలెనో దానిని మనము ఆ విధముగానే చెయ్యవలెను, ఖచ్చితముగా ఆయన ఏమి చెప్పెనో దానిని ఆ విధముగానే మనము వెంబడించుచు వెళ్ళవలెను. ఆయన ఏ విధముగా చెప్పెనో ఆ విధముగానే గాని ఏదో కొంత మట్టుకి కాదు కాని, "ఎవరైనాగాని" నమ్ముచున్న వారెవరైనా గాని, మారుమనస్సు పొందిన వారెవరైనాగాని వారికే అది. సమస్త తరములవారికి, సమస్త జనాంగమునకు, నమ్ముచున్న వారికెవరికైనా సరే, అది వర్తించును. దేవుని యొక్క వాక్యమునందు విశ్వాసముంచుట ద్వారా ఈ వాగ్దానము నీకు చెందుచున్నది.
అలాగైతేనే, దాని తర్వాత ఆ వాగ్దానము యొక్క ముద్రను స్వాధీనపరచుకొనే శక్తివంతమైనవాడవుగా నీవు యుండగలవు. మనము పొందుకునే ఆ వాగ్దానము, ఆ ముద్ర పరిశుద్ధాత్మ యొక్క బాప్తిస్మమైయున్నది. అవును. అది వాస్తవము. ఆ విధముగా, ఆత్మ రూపమున యున్న దేవుడు, ఆయన యొక్క వాక్యము నీలో నివాసమై నీవు ఆ వాక్యముగా మారిపోయిన తరువాత, ఆయన నీలో ప్రవేశించును. నీలోనికి నీవు వాక్యమును స్వీకరించినట్లైతే, పరిశుద్ధాత్మ మాత్రమే దానిని జీవింపచేయును. ఆ తర్వాతే, నిన్ను ఎదుర్కోనుటకు ప్రయత్నించే ప్రతీ శత్రువు యొక్క గవిని నీవు స్వాధీనపరచుకొనగలిగే ఆ వాగ్దానము నీకు పొందుకునెదవు. దేవుడే దానిని వాగ్దానము చేసెను, కాబట్టి అది అట్లే సంభవించును.
GEN 22:2,17•
HEB 11:19
13ఇప్పుడు, గుర్తుంచుకొనండి, అప్పుడే మీరు దానిని చెయ్యగలరు, అప్పుడు మాత్రమే, వాక్యము ద్వారా పరీక్షించబడిన తర్వాతనే.
అబ్రాహాము వాక్యము ద్వారా పరీక్షించబడెను. "నీవు నమ్ముచున్నావా, అబ్రాహామా, నీకు కుమారుడు కలుగునని నీవు నమ్ముచున్నావా?"
"అవును." ఆ విధముగానే కుమారుడు కలిగెను.
"ఇప్పుడు అతడిని నీవు బలిగా అర్పి౦చు. అబ్రాహామా, ఇంకా కూడా నీవు నమ్ముచున్నావా?"
"నేను ఇంకా కూడా దానిని నమ్మెదను, అవును. మరణము నుండి అతడిని నీవు జీవముతో లేపగల శక్తివంతుడవని నమ్ముచున్నాను."
అటు పిదప, ఆ పరీక్ష జరిగిన తర్వాత, ఇప్పుడు, "నీ సంతానము తన శత్రువుల యొక్క గవిని స్వాధీనపరుచుకొనును," అని ఆయన చెప్పెను! ఆమేన్!
మనము ప్రకృతి సంబంధమైన అబ్రాహాము యొక్క కొన్ని భీజములను తీసుకొని పరీక్షించి చూద్దాము. వాటిల్లో మనము నేడు ఆత్మ సంబంధమైన భీజమునైయున్నాము. దేవుని యొక్క వాక్యమును పరిపూర్ణముగా నమ్మి ఎన్నడు సందేహముతో ప్రశ్నించని ప్రకృతి సంబంధమైన భీజము (సంతానము)లను కొన్నింటిని మనము చూద్దాము.
14"ఎందుకొరకు, ఒక క్రైస్తవ యవ్వనస్తురాలు తనయొక్క లోపలి వస్త్రమును కనిపించేలా తన వస్త్రములను ధరించుకొనుట ద్వారా ఆమె యొక్క ఉద్దేశ్యము ఏమైయుండును? దానిని నేను అర్ధము చేసుకోలేకపోవుచున్నాను," అని నేను అన్నాను. నీవు దేవుని వలన మరలా జన్మించినవాడవు. నీవు ఎవరవని తెలుసుకొనుటకు పరిశుద్ధాత్మ యొక్క సౌందర్యము నీకు యుండవలసియున్నది. నీకు శీలము గలదు. ఇటువంటి అసహ్యమైన వస్త్రధారణతో నీవు యుండకూడదు. అవును. అది వాస్తవము. సద్గుణశీలముతో దేవుని కొరకు నిలచియుండు ఒక నిజమైన స్త్రీ, ఒకవేళ ఆమెను చూచి వెక్కిరించుచూ, "పాతకాలపు-మనిషి" అని వారు ఆమెను ఎగతాళి చేయుచున్నను, వారు తాకలేని ఏదో ఒకదానిని నీవు కలిగియున్నావు, వారు దానిని కోల్పోయిరి. వారు మరలా ఎన్నటికిని దానిని పొందుకోలేరు. అది నిజము. నీవు సద్గుణశీలమును కలిగియున్నావు. దానినే దేవుడు చూడాలని ఆశించుచున్నాడు, అది సద్గుణమైయున్నది, చూచారా.
ROM 3:4
15కాని, నీ మనస్సులో ఒక ప్రశ్నను నీవు కలిగియుండినయెడల, మొదటి విషయమేమనగా, నీవు దానిని అసలు ఎప్పటికిని చెయ్యవద్దు, నీ మనసులో ఒక ప్రశ్నను నీవు కలిగియుండినయెడల, ప్రార్ధన వరసలో వచ్చి నిలువ వద్దు, నీవు సంపూర్ణముగా దానిని నమ్మకుండా రావద్దు, నేను తప్పకుండా స్వస్థతను పొందుకుంటాననే దృఢమైన నిశ్చయతను నీ మనస్సులో నీవు కలిగియుండేంత వరకు నీవు రావద్దు. అప్పుడేగాని నీవు స్వస్థతను పొదుకున్న ఒక వ్యక్తిగా ఈ వేదికను వదలివెళ్లగలవు. అది వాస్తవము. నీ మనస్సులో ఎటువంటి ఒక్క ప్రశ్న కూడా ఉండకూడదు. నీవు దేవుని నమ్మవలెను. అపనమ్మకమును కాదు; నిజముగా నమ్మవలెను.
అబ్రాహాము యొక్క సంతానము దానిని నమ్మును, ఎందుకనగా వాక్యము దానిని ఆ విధముగా చెప్పుచున్నది, అ కారణము చేతనే మనము దానిని నమ్ముచునాము, ఎవరో విమర్శించారని కాదు గాని, ఎవరో దానిని చెప్తారని కాదు గాని, దేవుడు దానిని చెప్పినందువలననే, కాబట్టి అది నిజమై నిలుచును. దేవుడు దానిని చెప్పినపుడు, అది సమస్త ప్రశ్నలను అది స్థిరపరచును. ఆయనే ఆఖరి మాటగా యున్నాడు. ఆయనే ఆ చిట్టచివరి మాటగా యున్నాడు. దేవుడు దేనినైనా చెప్పినట్లైతే, అది దానిని స్థిరపరచును. దానికి వ్యతిరేకముగా మాట్లాడుటకు ఏదియు లేదు. "ప్రతీ మనిషి యొక్క మాట అబద్దము, నా మాట సత్యము."
DAN 3:6,20,25
16ఇప్పుడు, ఈ భీజములను కొన్నింటిని మనము పరీక్షించి చూద్దాము, దానిని కొంచెము ఆలోచించి చూద్దాము. హెబ్రీయుల పిల్లలను గూర్చి మనమూ ఆలోచించెదము, నేను ఇచ్చట, ఆ ప్రతిమకు నమస్కరించు పరీక్షయందున్న తర్వాత ఆ హెబ్రీయుల పిల్లల గూర్చి ఆలోచించుచున్నాను. ఇప్పుడు, మీరు జ్ఞాపకముంచుకోండి, "ఎవరైతే ఈ ప్రతిమకు సాగిలపడి నమస్కరించరో, వాడు మండుచున్న ఈ అగ్ని గుండములో వేయబడును," అని రాజు ఆజ్ఞాపించెను. ఇప్పుడు ఈ పిల్లలు తాము ఏ ప్రతిమకు సాగిలపడి నమస్కారించకుండా, దేవుని యొక్క వాక్యము సత్యమని నమ్మియుండిరి. అందుకొరకై వారు నిలబడుదురో లేదో నిరూపించుకొనుటకై వారికి ఒక పరీక్ష సమయము ఆసన్నమైనది.
అచ్చటయున్న పిల్లలందరూ రాజాజ్ఞను అంగీకరించి దానికి నమస్కరించినప్పుడు, వారు రాజాజ్ఞను అనుసరించుచు ఆ మార్గముననే కొనసాగిరి. ఆనాడు అనేకులలో అంగీకరించబడిన ప్రసిద్ధిగాంచిన ఆ ఆజ్ఞకు ఏకీభవించి దానిని చెయ్యుటకు పూనుకొనిరి. వారు ప్రతిమలను ఆరాధించెదరా లేక దేవుని వాక్యము బ్రద్దలు చేయుదురా అనే విషయమందు ఆ ముగ్గురు పిల్లలను పరీక్షించబడినప్పుడు, పరిస్థితులను చూచి దేనిని లెక్క చేయకుండా, సత్యమైన దేవుని యొక్క వాక్యమందే వారు నిలిచియుండిరి. మండుచున్న అగ్నిగుండమందు వారిని వేసినప్పుడు, దేవుని యొక్క వాగ్దానము అచ్చట క్రియ చేయుట ద్వారా వారు తమ శత్రువుని యొక్క గవిని స్వాధీనపరచుకొనిరి. అగ్ని యొక్క వేడిని బంధించే తాళపు చెవిని కలిగియున్న నాల్గవ వ్యక్తి దాని యందు నిలచియుండెను. అది వారిని ఏమి చెయ్యలేక పోయినది, కాని అది వారి బంధకముల నుండి విముక్తి చేసినది.
17ఒక పురుషుడు లేదా స్త్రీ పరీక్షను ఎదుర్కొనుటకు సిద్ధమైనప్పుడు, ఆసిడ్ పరీక్షకు… మీరు గమనించండి, వారు ఆ అగ్నిలోకి పడవేయబడవలసియున్నది. వారు ఆ విధముగా చేసినప్పుడు, వారు అగ్నిలో యున్నప్పుడు, అచ్చట ఒక కార్యము సంభవించినది, ఈ అగ్ని పరీక్ష నుండి విడుదల పొందుకొనిరి మరియు వారి చేతులకుయున్న బంధకములు నుండి విముక్తి కలిగినది. అనేక సమయములయందు మనము లోక సంబంధమైన బంధకములలో మనము బంధించబడి యుండుటకు, దేవుడు మనలను వెళ్ళుటకు అనుమతించుచున్నాడు. ఎందుకనగా, మనము ఆ అగ్ని పరీక్షగుండా వచ్చుటకు ఆయన అనుమతించుచున్నాడు, ఇచ్చటనే మనము ఒక తీర్మానమును చేయవలసిన వారమైయున్నాము.
మనము దానిని చేసినప్పుడు, పరీక్ష మాత్రమే దానిని చేయగలదు. ఒక తీర్మానమును తీసుకొనుటకు కూడలి యొద్ద ఒక నిజమైన అబ్రాహాము యొక్క సంతానము నిలచియున్నప్పుడు, తాను దేవుని కొరకు సేవ చేసెదననే ఆ తీర్యానమును తీసుకొనును, అతడు తీసుకునే ఆ తీర్మానమే అతడి బంధకములను తెంపి అతడిని విముక్తి చేయును. సాతాను నీకు వ్యాధిని కలిగించవచ్చును లేదా ఇంకొకటి ఏదైనా అతడు నీకు కలిగించవచ్చును. దేవుడు నిన్ను ఆ కూడలి యొద్దకు తీసుకురాలేదనే దానిని గూర్చి నీవు ఏ విధముగా తెలుసుకొనెదవు, ఏ విధమైన తీర్మానమును నీవు తీసుకొనెదవు, అని దేవుడు గమనించి చూచును.
GEN 22:17•
DAN 3:27
18వారు అగ్ని అనే గవిని స్వాధీనపరచుకొనిరి. ఆ అగ్ని వారిని కాల్చలేకపోయినది. అసలు వారిపైన అగ్ని పొగయొక్క వాసన కూడా రాలేదు, ఎందుకనగా తాము అబ్రాహాము యొక్క సంతానము అని వారు ఎరిగియుండిరి. వారు దేవుని యందు మరియు ఆయన వాక్యము యందును నిలిచియుండిరి. వారు తమ శత్రువుని యొక్క గవిని స్వాధీనపరచుకొనిరి, అగ్ని వారిని కాల్చలేక పోయినది, ఎందుకనగా వారు గవిని స్వాధీనపరుచుకొనిరి.
GEN 22:17•
DAN 6:10,16
19అటు తర్వాత, అచ్చట ఒక వ్యక్తి యున్నాడు, అతడొక ప్రవక్త, అతడి పేరు దానియేలు. ఒకే ఒక్క నిజమగు ఆ దేవునికి అతడు సేవచేయునో లేదో అనే పరీక్ష అతడికి ఆసన్నమైనది. ఒక్క నిజమగు దేవునిని సేవించుటయో లేక అన్య దేవుని ఆరాధించుటయో, అనే పరీక్షా సమయము ఆసన్నమైనప్పుడు, అతడు అన్య దేవుడిని ఆరాధించుటను నిరాకరించి, తన ఇంటి కిటికీ తలుపులను తెరచి యుంచి, ప్రతీ దినము దేవుని యొద్ద విజ్ఞాపించెను. అతడు ఆ విధముగా చేయుటవలన ఆ దేశపు కఠిన చట్టము వలన శిక్షార్హుడై దండించబడుటకు ఒక సింహపు బోనులోనికి తోసి వేయబడెను. ఆకలిగొనియున్న ఒక సింహపు గుంపు అతడిని చూచి గర్జించుచుండెను. అతడు ఏమి చేసెను? అతడు తన శత్రువు యొక్క గవిని స్వాధీనపరచుకొనెను. సింహములు అతడిని తమకు ఆహారముగా, తినలేకపోయినవి. అతడికిని మరియు ఆ సింహములకు మధ్య ఒక దేవదూత నిలచియుండుటకై దేవుడు అచ్చటికి ఒక అగ్నిస్తంభమును పంపెను. అతడు తన శత్రువుని యొక్క గవిని స్వాధీనపరచుకొనెను, ఎందుకనగా అతడు నిజమైన ఒక్క దేవునిని ఆరాధించునా లేక కొన్ని అన్య దేవతలను ఆరాధించునా అనే విషయములో పరీక్షించబడెను.
పరీక్షయందు అతడు నిలబడి తన శత్రువు యొక్క గవిని స్వాధీనపరచుకొనెను. సింహము కనీసము అతడిని తాకనన తాకలేకపోయినది, ఎందుకనగా దేవుడు అతడికి తోడుగా యుండెను గనుక. అతడు ఒక నిజమైన దేవుని సంతానము, కాబట్టి దేవుని యొక్క వాగ్దానము సత్యమందు నిలచియుండెను.
EXOD 3:12•
EXOD 7:11•
2TIM 3:8
20ఓ, మోషే, ఇంకొక గొప్ప వ్యక్తి, దేవుడు అతడికి వాగ్దానము అనుగ్రహించి, అతడిని కూడా పరీక్షించి చూచెను. "నీవు అచ్చటకి వెళ్ళినప్పుడు నీతో కూడా నేను ఉండెదను." అతడికి అనుగ్రహించినబడిన వరము వంటి దానిని అనుకరణ చేయువారగు వారియెదుట అతడు నిలువబడినప్పుడు, మోషేకు ఏదైతే చేయాలని దేవునిచే ఆజ్ఞాపించబడినదో, అదే కార్యమును అనుకరణ చేయుటకు యన్నే, యంబ్రెలు లేచి నిలబడిరి. మోషే దేవునిచే పిలువబడినవాడు, ఈ ఆజ్ఞను చేయుటకు అతడికి మాత్రమే దేవునిచే అనుగ్రహింపబడినదని అతడు ఎరిగియుండెను. అచ్చట అతడు నిలబడి, దేవుడు ఆజ్ఞాపించిన విధముగానే అతడు ఆ అద్భుత కార్యమును చేసెను. అదే కార్యమును చేయుటకై అనుకరణ చేయువారు ఇచ్చట నిలబడియుండిరి, అయినాగాని దానిని గురించి మోషే ఏమి పట్టించుకోలేదు. అతడు దేవుని వాక్యము కొరకై యదార్ధవంతుడుగా అతడు నిలబడెను, శత్రువుల యొక్క గవిని అతడు స్వాధీనపరచుకొనెను (ఆమేన్!) ఎవరు దానిని అనుకరణ చేయుటకు ప్రయత్నించినను దానిని గురించి అతడికేమి బాధలేదు, ఎందుకనగా దేవుడు అతడికి అనుగ్రహించిన వాగ్దానమందు అతడు యదార్ధముగా నిలబడియుండెను.
GEN 22:17•
EXOD 3:10•
EXOD 19:1
21ప్రతి క్రైస్తవుడికి అదెంతటి ఒక గుణపాఠముగా యున్నది! మీరు మీ చుట్టు చూస్తు ఒక వేషధారిని కనుగొనినప్పుడు అతడు ఒక నిజమైన దానిని అనుకరణ చేస్తూ నటించుటకు ప్రయత్నించుచున్నాడనే దానిని నీవు గుర్తించుకోవలెను. కాని, దానియొక్క భావమేమనగా, నిజమైనది ఒక్కటి మాత్రమే యుండును. దేవుని యొక్క వాక్యమందు యధార్ధవంతులుగా నిలబడండి, ఏమి సంభవించినా, సంభవించకపోయినా గాని ఫరవాలేదు. ఆయన వాగ్దానమును గైకొనుము.
నిజము, దానియేలు దేవుని యొక్క వాక్యము కొరకై యదార్ధముగా నిలచియుండెను. ఎంతమంది అతడివలె నటించుటకు ప్రయత్నించినను లెక్క లేదు. సమస్త కార్యములందును అతడు యధార్ధవంతుడుగా నిలబడెను. ఐగుప్తు నుండి ఇశ్రాయేలీయులను వెలుపలికి తీసుకొనివచ్చి, వారిని వాగ్దాన దేశమునకు తీసుకొను వెళ్ళు ఉద్దేశ్యము కొరకే మోషే వచ్చెను. ఐగుప్తును విడిచి వాగ్దానము చేయబడిన భూమికి వెళ్ళు సమయము ఆసన్నమైనప్పుడు మార్గ మధ్యమున మృత సముద్రము అడ్డుగా నిలబడియుండెను. నీళ్ల యొక్క ద్వారమును అతడు స్వాధీనపరచుకొనగా, ఆ నీళ్ల ప్రవాహపు ద్వారములు తెరువబడెను. ఆ నీటి ప్రవాహము వెనుకకు పొర్లి పారిపోగా, అరణ్య మార్గముగుండా మోషే ఇశ్రాయేలీయులను, దేవుడు అతడిని ఏ కొండ యొద్దకు వారిని తీసుకొని వెళ్లవలేనని ఆజ్ఞాపించెనో, అచ్చటికి అతడు వారిని తీసుకొని వెళ్ళెను. అతడు తన శత్రువుని యొక్క గవిని స్వాధీనపరచుకొనెను.
అతడి యొక్క తండ్రియగు అబ్రాహాము ఆ వాగ్దానమును కలిగియుండెను, అతడి యొక్క నిజ సంతానము తమ శత్రువుని యొక్క గవిని స్వాధీనపరచుకొందురు. నీళ్ల యొక్క ద్వారములు మూసియుండుటవలన అతడు ముందుకు కొనసాగిపోలేకపోయెను. అదియే అతడు చేయవలసిన కర్తవ్యము యొక్క మార్గమైయున్నది. అతడు ఆ పిల్లలను ఆ కొండ యొద్దకు తీసుకొని రావసియున్నది. దేవుడు అతడికి ఆ విధముగా చెప్పి యుండెను. అచ్చట ఆ ద్వారము అతడు వెళ్లవలసిన మార్గమునకు అడ్డుగా నిలబడియుండగా, అతడు తన శత్రువుల యొక్క ద్వారములను స్వాధీనపరచుకొనెను.
EXOD 3:8,17•
EXOD 13:5•
LEV 20:24•
NUM 13:2,4,27,30-33•
NUM 14:30•
NUM 20:1
22కొన్ని దినములు అయిన తరువాత, యెహోషువా, కాదేషు బర్నియా యొద్దకు వారు వచ్చినప్పుడు, ఆ కాలమందు అది ప్రపంచానికి న్యాయపీఠముగా యుండినది. ఇశ్రాయేలీయులు తమ తీర్పును సంధించవలసిన స్థానముగా అది యుండెను. యెహోషువా, కాలేబు మరియు పండ్రెండుగురు, లేదా పదిమంది మరియు ఇతరులును మనము కనుగొనుచున్నాము. ఒక్కొక్క మూలపురుషుడైన అబ్రాహాము గోత్రము నుండి ఒకరిని ఎంపిక చేసి, వారు స్వాధీనపరచుకొనుటకు సిద్దముగానున్న భూభాగమును వేగు చూచుటకు పంపించబడిరి.
అచ్చటయున్న ఉన్నత దేహులను వారు చూచినప్పుడు, వారిలోయున్న పదిమంది బహుగా భీతినొందిరి. "దానిని మనము స్వాధీనపరచుకోలేము, అది బహు గొప్పగా యున్నది. ఎందుకు, మనము ఎదుర్కొనబోవు విరోధులను గమనించండి," అని చెప్పిరి.
కాని వారు వెనుదిరిగి వచ్చి సమాచారమును తీసుకొని వచ్చినప్పుడు, వారు చెడ్డ సమాచారమును తీసుకొని వచ్చిరి. "నేను మీకు ఆ దేశమును ఇచ్చితిని, అది మీకు చెందినది," అని దేవుడు వారికి చెప్పియుండగా, వారెందుకు ఆ చెడ్డ సమాచారమును తీసుకొని వచ్చితిరి? ఆయన దానిని ఐగుప్తులో చెప్పియుండెను. "నేను మీకు ఈ దేశమును ఇచ్చితిని. ఇది మంచి దేశము. ఇది పాలు - తేనెలు ప్రవహించు దేశముగా నున్నది," అని దేవుడు చెప్పియుండెను.
అయితే వారు ఎదుర్కొనబోవు శత్రువులు గొప్ప ఉన్నత దేహులుగా యుండుట వారు చూచినప్పుడు, వెనుదిరిగి వచ్చిన వారిలో పదిమంది, "దానిని మనము స్వాధీనపరచుకొనలేము," అని వారు చెప్పిరి.
యెహోషువా, అతడు జనులను నిమ్మళపరచి, "దానిని జయించుటకు మన శక్తి చాలుననెను, మనకు శక్తి చాలుననెను!" అలా చెప్పుటకు గల కారణమేమి? అతడు వాగ్దానము వైపు చూచుచున్నాడు. అతడు అబ్రాహాము యొక్క నిజమైన సంతానమైయుండెను. తాము ఎదుర్కొనబోవు శత్రువులు ఎంతటి బలవంతులైనా గాని దానిని గూర్చి భయము లేదు. "మనము మన శత్రువుని యొక్క గవిని స్వాధీనపరచుకొనెదము, ఎందుకనగా ఆ దేశమును దేవుడు వాగ్దానము చేసెను." అతడు ఆ విధముగానే తన శత్రువు గవిని స్వాధీనపరచుకొనెను.
GEN 22:17
23అటు తర్వాత, ఆ ఇశ్రాయేలీయుల జనాంగమును నది ఒడ్డునకు తీసుకొని వచ్చినప్పుడు, ఏప్రిల్ నెలలో ఆ గొప్ప నది ఉప్పొంగుచూ ప్రవహించుచున్నది. కొండ శిఖరములలో నుండి ప్రవహించుకుంటూ ఆ యొర్దాను నది పల్లపు ప్రాతాల గుండా వ్యాపించియుండెను. ఆ సంవత్సరములో ఆ నది బహు ఉదృతంగా ప్రవహించే క్లిష్టమైన సమయమున అతడు అచ్చటకు రావలసివచ్చినది. అయినాగాని, అతడు అబ్రాహాము యొక్క సంతానమై యుండెను. తాను ఒక వాగ్దానమును కలిగియుండెనని అతడెరిగి, తనకు ఇవ్వబడిన కర్తవ్యమనే మార్గము గుండా అతడు ముందుకు కొనసాగిపోవుచుండెను. దానిని ఏ విధముగా చేయవలెనో దానిని గూర్చిన దేవుడను గ్రహించిన ఒక దర్శనమును అతడు కలిగియుండెను మరియు అతడు ఆ నది యొక్క ప్రవాహ ద్వారమును స్వాధీనపరచుకొనెను. ఆ నది యొక్క ప్రవాహ ద్వారము తెరచుకున్నపుడు, నీళ్ళు కొండ శిఖరముపైకి ఎక్కి వెళ్ళుటకు ఉరకలు వేసుకుంటూ వెనుదిరిగినవి. యెహోషువా మరియు ఇశ్రాయేలీయులు తన శత్రువుల యొక్క గవిని స్వాధీనపరచుకొని మరియు వారికి వాగ్దానము చేయబడిన దేశములోని ప్రవేశించిరి, ఎందుకనగా దేవుడు అలా చేసెదనని వారికి చెప్పెను గనుక. అతడు నిజమైన అబ్రాహాము యొక్క సంతానము.
JOSH 6:4,5,20
24సోదరీ మరియు సోదరులారా, ఆ స్థలము యొద్దకు వారు చేరుకున్నప్పుడు. గొప్ప ప్రాకారములు గల యెరికో పట్టణము, ఆ ప్రాకారపు గోడలు ఎత్తుగా వుంటూ, వాటిపై భాగమున మూడు రధములు ఒకే సారి ప్రయాణించేంతటి విశాలమైన గొప్ప గోడలుగా అవి గలిగియున్నది. అరువుగా తెచ్చుకున్న కత్తులలో, కజ్జలతో, బండలతో మరియు మొదలగు వాటితో ఇశ్రాయేలీయులు ఏ విధముగా ఆ పట్టణములోనికి ప్రవేశించి వారితో ఏ విధముగా యుద్దము చేయగలరు? అయినా గాని అతడు ఎప్పటికిని అబ్రాహాము యొక్క సంతానముగానే యున్నాడు. దానిని ఏ విధముగా చేయవలెనో చెప్పుచూ, దేవుడు అతడికి ఒక దర్శనమును ఇచ్చి "బూరను ఊదుము," అని చెప్పెను. దానిని మాత్రము చేస్తే చాలును "బూరలు ఊదుచూ, గోడలు చుట్టు తిరుగుతూ యుండవలెను, ద్వారములు మీ ముందు కూలిపోవును." అతడు అబ్రాహాము యొక్క రాజ సంతానముగాను మరియు అతడు దేవుని యొక్క నిజ విశ్వాసిగా యుండెను. "నీ ఎదుట ద్వారాలు కూలిపోవును. కేవలము బూరను ఊదుచూ, ఆర్బాటముగా కేకలు వేయుము. నీవు చేయవసినదంతా అంతే." ఏమి జరిగినది? ఆ కట్టడ ప్రాకారములు కూలిపోయెను, యెహోషువా ఆ పట్టణమును స్వాధీనపరచుకొనెను.
JOSH 10:12,13•
HEB 11:33,34
25కొద్ది దినముల తరువాత, శత్రువులు తమ మార్గమును సమకూర్చుకుంటూ మరియు ముందుకు కొనసాగిపోవుచూ యుండిరి. అయినా గాని, అతడు ఆ సూర్యుడు చేరుకోబోయే గమ్యమును నిలిపివేయటను కూడా మనము కనుగొనగలము. "నమ్మశక్యము కాని నిజము," అనే అంశము మీద ఒకనాటి ఉదయకాలమున నేను మాటలాడితిని, అతడు తన శత్రువుని యొక్క గవిని స్వాధీనపరచుకొను వరకు సూర్యుడుని అస్తమించకుండా నిలిపివేసిను. ఆమేన్.
శత్రువులు చెల్లాచెదిరైపోయిరి, అయినా మరలా ఆ శత్రువులందరూ ఏకమై ఒక్కటిగా వచ్చినయెడల విజృభించెదరు. అదే సమయమున సూర్యుడు అస్తమించుచుండెను. అమోరీయులు మరియు అమాలేకీయులు మరియు మొదలగు వారు చెదరగొట్టబడియున్నారు. ఒకవేళ వాళ్ళందరూ మరలా ఏకమై, మార్గమును సమకూర్చుకొని ఎదురు నిలబడినయెడల, వారిని ఎదుర్కొనుటకు అతడికి బహు కష్టమగును. కాబట్టి అతడికి ఒకే ఒక్క అవకాశము మాత్రమే గలదు. అదేమనగా, చీకటి పడకుండా సమయమును కాపాడుకోవాలి. అందుకే గతించి పోవుచున్న సమయమును అతడు నిలిపివేసెను. ఆమెన్! ఆమేన్! వాగ్దానములో నుండి కాపాడుకోవలసిన ఒకే ఒక్క కార్యము గలదు. అదేమనగా సూర్యుడు, సృష్టి యొక్క నియమము ప్రకారము సమయము దాటిపోవుచున్నది గనుకనే అతడు ఆ సృష్టినే నిలిపివేసెను. ఎందుకని? అతడు ఒక అబ్రాహాము యొక్క సంతానమై యుండెను. అతడు దేవుని యొక్క వాగ్దానమును నమ్మెను. అతడు సూర్యుడిని నిలిపివేసి, తన శత్రువుని యొక్క గవిని స్వాధీనపరచుకొనెను. అవునండీ!
ఈ గొప్ప వ్యక్తులు — వీరందరూ గొప్ప వ్యక్తులే. మీరెరుగుదురా, వారిలోని ఒక్కొక్కరు, మరణమనే ద్వారము యొద్దకు వారు వచ్చినప్పుడు వారందరూ మరణించిరి, వారందరూ మరణము పొందే తీరవలయును. ఎందుకనగా వారందరూ గొప్ప వ్యక్తులు, సింహముల నోళ్లను మూసివేసిరి. అగ్ని నుండి తప్పించుకొనిరి మరియు ఖడ్గపు అంచుల నుండి తప్పించుకొనిరి మరియు హెబ్రీయుల పత్రికలో 11వ అధ్యాయములో చెప్పిన రీతిగా ఇంకా అనేక వాటి నుండి వారు తప్పించుకొనిరి. వారందరు ఒక శత్రువగు, మరణమనే శత్రువు తప్పించి, వారు తమ శత్రువుని యొక్క గవిని స్వాధీనపరచుకొనిరి. వారిలోని ప్రతీ ఒక్కరిని మరణము మ్రింగివేసినది.
MATT 16:19•
MATT 18:18•
LUKE 2:7•
HEB 4:15•
JAS 4:7
26అటు పిదప ఒకానొక దినమున, విశ్వాసము ద్వారా అబ్రాహాము యొక్క సంతానము వచ్చెను, అబ్రాహాము యొక్క రాక సంతానమగు యేసుక్రీస్తు, దేవుని కుమారుడుగా వచ్చెను. ప్రకృతి సంతానమగు ఇస్సాకు ద్వారా రాలేదు. వారు వారి పాత్రలను నిర్వర్తించిరి. కాని ఇచ్చట వచ్చిన ఆయన ప్రకృతి సంభందమైన జన్మ ద్వారా రాలేదు, లైంగిక వాంఛ ద్వారా ఈయన జన్మించలేదు. ఈయన కన్యక గర్భము దాల్చుట ద్వారా జన్మించెను. దేవుని యొక్క కుమారుడు, అబ్రాహాము యొక్క ప్రకృతి సంబంధమైన వారందరూ ప్రకృతి సంబంధముగానే జన్మించిరి; కాని ఈయన కన్యక ద్వారా జన్మించెను.
భూమి మీదికి ఆయన వచ్చినప్పుడు ఆయన చెయవలసిన కార్యమేమిటి? సాతాను యొద్దయున్న ప్రతీ శత్రువుని ఆయన జయించెను. ఆయన సమస్తమును జయించెను! ఆయన ఏమి చేసెను? ఆయన వ్యాధిని జయించెను. ఆయన చుట్టూ ఏ వ్యాధులు లేకుండా పోయెను, ఎచ్చటెచ్చట వ్యాధులు గలవో వాటిపై ఆయన జయమును పొందెను.
దానిని జయించిన తరువాత ఆయన ఇంకా ఏమి చేసెను? ఆయన మనకు తాళపు చెవులను ఇచ్చెను — ఆమేన్! "భూమి మీద మీరు దేనిని బంధించెదరో దానిని నేను పరలోకమందు బంధించెదను," అని చెప్పెను. ఆమేన్! అదే అబ్రాహాము యొక్క రాజ సంతానమునకు ఆయన చేసిన వాగ్దానము పరిశుద్ధాత్మ ఇప్పుడు మనలో వుంటూ వ్యాధులను బంధించుటకు మనము తాళపు చెవులను కలిగియున్నాము. ఆయన వ్యాధుల మీద జయమును పొందెను. ఆయన సన్నిధియందు వ్యాధులు నిలువ జాలవు. "భూమిమీద మీరు దేనిని బంధించెదరో దానిని నేను పరలోకమందు బంధించెదను," అని ఆయన మనకు చెప్పి, ఆయన ఏమి చేసెనో అదే విధముగా మనము కూడా చేయుటకై, వ్యాధులపై జయము పొందుటకై ఆయన మనకు తాళపు చెవులను అనుగ్రహించెను.
శోధించబడుటయందు కూడా, మనవలె ఆయన కూడా ప్రతీ విషయములోను శోధించబడెను. ఆయన ఏమి చేసెను? ఆయన దానిని జయించెను. ఆయన మనకు ఏమి చెప్పెను? "అపవాదిని ఎదురించండి, అతడు మీ యొద్దనుండి పారిపోవును." ఆయన మనకొరకు వ్యాధులను జయించెను. మనకొరకు ఆయన శోధనలను జయించెను. ద్వారములను బ్రద్దలు చేసెను, వంచకుడగు శోధకుని యొద్దనుండి తాళపు చెవిని స్వాధీనపరచుకొని మరియు దానిని ఆయన తన విశ్వాసియగు అబ్రాహాము యొక్క సంతానము చేతులలో పెట్టి, "వాడు మిమ్మల్ని శోధించినయెడల వాడిని ఎదుర్కొనండి, వాడు మీ యొద్దనుండి పారిపోవును," అని ఆయన చెప్పెను. ఓ మై! వాడిని ఎదుర్కొనండి!
JOHN 6:57•
JOHN 14:14,19•
JOHN 15:16•
JOHN 16:23,33•
ROM 8:37•
1COR 15:4
27ఆయన మరణమును మరియు పాతాళమును జయించెను. ఆయన మూడవ దినమున పునరుత్థానుడై, "నేను జయించితిని, నేను జీవించుచున్నాను గనుక మీరును జీవించెదరు," అని ఆయన చెప్పెను. ఓ, ఎంత గొప్ప వాగ్దానము! అది అబ్రాహాము యొక్క సంతానమునకు చెందును. ఆయన మనలను నీతిమంతులుగా తీర్చుటకై సమాధిపై జయమును పొందుకొని, మూడవ దినమున లేచెను. ఆయన పునరుత్థానుడైనప్పుడు, ఆయనే మన నీతి ఆయెను. తద్వారా మనము పొందునది ఏమిటి?
ఆయన మరణమును జయించెను, ఆయన పాతాళమును జయించెను, ఆయన సమాధిని జయించెను, ఆయన శోధనలను జయించెను! ఓ, మనము అబ్రాహాము యొక్క రాజు సంతానమై యుండుటచే, దేవుడు మనలను ప్రేమించి, మనకొరకు తన ప్రాణమునే అర్చించుట ద్వారా మనము గొప్ప జయశీలుగా యున్నాము, ఆయనలో యున్న అదే దేవుని యొక్క ఆత్మ మనలో గలదు.
మనము జయమును పొందినవారము. ప్రతీ ద్వారము మనకొరకు జయించబడినది. మనము చేయవలసినదంతా దానిని స్వాధీనపరచుకొనుట మాత్రమే. అది ఎప్పుడో ఇంతకు ముందే జయించబడినది. ఆయన వ్యాధులను జయించెను, మరణమును జయించెను, పాతాళమును జయించెను, సమాధిని జయించెను, సమస్తమును జయించెను! ఆయన కృప ద్వారా మనము ఆ తాళపుచెవులను కలిగియున్నాము. "యేసుక్రీస్తు నామమున నేను వచ్చుచున్నాను," అని చెప్పి ఆ తాళమును తెరుచుటకు భయపడుతున్నావా? " [నా నామమున తండ్రిని మీరేదైతే అడుగుదురో, నేను దానిని ఘనపరతును.]"
MATT 27:51•
MARK 15:38
28రెండు వేల సంవత్సరములు గతించిపోయిన పిదప, రెండు వేల సంవత్సరములు, ఇంకా ఇప్పటికీని… ఆయన మన మధ్యలోనే యున్నాడు, ఆ గొప్ప శక్తివంతుడైన జయశాలి," ఆ దేవాలయపు తెరలను రెండుగా చీల్చి ప్రతీరోగమును, ప్రతీ వాధిని, సమస్తమును తానే భరిస్తూ మన బలహీనతలను, మన వ్యాధులను మరియు మన రోగములను సిలువ మ్రానుపై భరియించి, సమస్తముపై జయమును పొంది; మనలను నీతిమంతులుగా తీర్చుటకై పునరుత్థానుడై, రెండు వేల సంవత్సరములుగా జీవముగా మన మధ్య నిలచి, సమస్తమునకు వారసులగు అబ్రాహాము యొక్క రాజ సంతానము మధ్య ఆయన తనను తాను జీవిస్తున్న యేసుక్రీస్తుగా తనను ప్రత్యక్షపరచుకొనెను. ఓ, ఎంతటి ఆనందము! దీని తర్వాత ఎవరైతే శోధనల ద్వారా వాగ్దానము చేయబడిన వాక్యములోకి వెళ్లెదరో, వారే! దానిలోనికి ప్రవేశించెదరు.
నీవు దేవుని యొక్క వాక్యమును నమ్మినయెడల, నీవు కూడా అబ్రాహాము యొక్క సంతానమగుదువు. ఆ విధముగానే నీవు దానియొద్దకు రాగలవు.
HEB 13:8
29వాక్య పరీక్షను నీవు స్వీకరించకపోయిన యెడల… దానిని సందేహించినా, దానిపట్ల కొద్దిగా అపనమ్మకమును, దానిని నీవు నమ్ముటకు కష్టము. ఏదో హేతువు చేత లేదా దేనివలనో నీవు దానిని నమ్మలేక పోవుచున్నావు. అట్లైన యెడల, ప్రార్ధనా వరుసలోనికి నీవు రావద్దు. దేవుని యొక్క వాక్యము సత్యమైనదని ఎరిగేంతటి కృపను నీవు పొందుకునే వరుకు, నీవు రావద్దు. నేను వేదికపై బుద్ధిహీనుడుగా నీ కొరకు ప్రార్ధించలేను. ఎప్పుడైతే నీవు అవిశ్వాసమనే అడ్డు తెరను చీల్చివేయగలుగుతారో తద్వారా పిదప మరణముపై, పాతాళముపై మరియు సమాధిపై జయమును పొందుటకు నీ చేతుల్లోకీ ఆ తాళపుచెవులను పొందుకోగలవు, ఎందుకనగా ఎవరైతే నీ కొరకు జయమును పొందెనో, ఆ జయశీలిని నీవు కలిగియున్నావు. అప్పుడు నీవు హెబ్రీయుల పత్రిక 13వ అధ్యాయము 8వ వచనములో చెప్పబడిన రీతిగా, "యేసుక్రీస్తు - నిన్న, నేడు, ఒక్కటే రీతిగా యున్నాడు, అవును యుగయుగములకు ఒక్కటే రీతిగా యున్నాడు," అనే దానిని నీవు కలిగి యుందువు.
అది మనకు ఏ విధముగా సాధ్యమగును?
GEN 18:13•
LUKE 17:30
30నేడు ప్రజలు ఈ విదముగా, "ఓ, నేను చెప్పెదను, ఆయన ఒక విధముగా, ఆయన," అని చెప్పెదరు. ఆయన ఒక్కటే రీతిగా యున్నాడని పరిశుద్ధ గ్రంధము చెప్పుచున్నది. "ఓ, మంచిది, ఆయన ఆనాడు చేసిన విధముగా నేడు ఆయన చేయుట లేదు," అని చెప్పెదరు. ఇప్పుడే దీనిని మనము కనుగొనగలము, ఆయన తన వాక్యమును నిరూపించుటను మనము చూచెదము. అది ఏమి చేయుచున్నది? అది మరలా దానిని వారి ఒడిలోనికే త్రోసివేయుచున్నది. ఆమేన్! నిజమైన అబ్రాహాము యొక్క సంతానము దానిని నమ్మును… వారు దానిని ఎరుగుదురు.
లోతు దినములలో అబ్రాహామును సంధించి, ఆయన వెనుక గూడారములోయున్న సారా, తన మనస్సులో ఏమి అనుకున్నదో దానిని చెప్పినటువంటి అదే అద్భుతమైన కార్యములను నేటి రాత్రి సమయమున ఇచ్చట ఆయన మన మధ్య నిలిచియుండి, దానినే చేసి చూపించెను. ఆయన రాకడకు ముందుగా సంఘము అటువంటి అద్భుత కార్యమునే మరలా చూచునని యేసు అబ్రాహాము యొక్క రాజ సంతానమునకు వాగ్దానము చేసెను. అది ఏమిటి? అది జరుగవలసియున్నది — దానినే దేవుడు వాగ్దానము చేసెను. అది ఆ విధముగానే జరుగునని యేసుక్రీస్తు దానిని రుజువుపరచెను. ఇదిగో ఇప్పుడు ఇచ్చట మనము రెండువేల సంవత్సరములకు తరువాత ఇప్పటికీ ఆయన శక్తివంతుడైన జయశాలిగా మనమధ్య యుండుటను చూచుచున్నాము.
ఆయన మరణమును, పాతాళమును, సమాధిని, సమస్త మూఢభక్తిని జయించెను, వాక్యమును తీసుకొనెను మరియు మీ యొద్దకు తెచ్చెను.
JOHN 3:16•
JOHN 5:24•
JOHN 15:7
31"నాయందు మీరును, మీయందు నా మాటలును నిలిచియుండినయెడల, మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును," అని ఆయన చెప్పెను. అది ఏమిటిది? అది నీ హృదయములో యుండవలయును, ఆ వాక్యమే క్రీస్తుగా యున్నాడు. "నాయందు మీరును, మీయందు నా మాటలను నిలిచియుండినయెడల, మీరు సమస్తమును జయించిన వారగుదురు, ఎందుకనగా నేను దానిని మీ కొరకు జయించితిని. నాయందు మీరు నిలిచియుండినయెడల, [మీరు నన్ను అర్ధము చేసుకోగలరు], మీరు నాయందు నిలిచి యుండినయెడల, [నాయందు విశ్వాసముంచువాడు నన్ను చేర్చుకొనును, ఏదో నమ్ముచున్నట్లు కాదు గాని, నన్ను చేర్చుకొనును]… నా మాటలు విని వాటియందు విశ్వాసముంచువాడు, [నా మాటలను గ్రహించును], మరియు ఆయన పంపించిన వానియందు నమ్మిక యుంచువాడు నిత్యజీవమును గలవాడైయుండును, అతడు (శోధనలోనికి లేదా) తీర్పులోనికి రాకుండా మరణములో నుండి జీవములోనికి దాటియున్నాడు."
అదిగో శక్తివంతమైన జయశీలుడగు ఆయన ఇచ్చట వున్నాడు.
HEB 4:12•
HEB 13:8
32నిన్న, నేడు, మరియు నిరంతరము ఒక్కటే రీతిగా ఉన్నవాడు - ఆయన ఇదిగో ఇచ్చట యున్నాడు. బబులోను నుండి వెలుపలికి పిలిచినవారగు, సొదోము నుండి వెలుపలికి పిలిచినవారగు, లోకములో నుండి వెలుపలికి పిలిచినవారగు, మరియు సమస్తము నుండి ప్రత్యేకింపబడినవారగు అబ్రాహాము యొక్క సంతానము ఎదుట ఆయన చేసిన వాగ్దానము ఆయన చెప్పినట్లుగానే నెరవేర్చుచూ ఇచ్చట ఆయన దానిని చేసి చూపించుచున్నాడు. హృదయాంతరంగములో నున్న రహస్యములను వివేచించగల దేవుని యొక్క వాక్యముగా, శక్తివంతుడగు జయశీళునిగా రెండువేల సంవత్సరములు గతించిపోయినా కూడా ఇంకా నేటి రాత్రి సమయమందు ఆయన మన మధ్య ఇచ్చట నిలిచియున్నాడు.
అది ఏమిటది? నీ సంతానము శత్రువు యొక్క గవిని స్వాధీనపరచుకొనును." అది ఎవరు? వారు దేవుని వాక్యము యందు విశ్వాసముంచు అబ్రాహాము యొక్క సంతానము, రాజ సంతానము, మరియు వాక్యము దేవుడై యున్నాడు.
33ఇప్పుడు, మనము దీనిని చూచినప్పుడు, ప్రాచీన కాలపు కవి పాడు విధముగా మనము వారితో కలిసి బిగ్గరగా పాడెదము.
జీవించి, ఆయన నన్ను ప్రేమించెను; చనిపోయి, ఆయన నన్ను రక్షించెను;
పాతిపెట్టటబడి, ఆయన నా పాపములను దూరముగా మోసుకొనిపోయెను;
పునరుత్థానుడై, ఉచితముగా ఎల్లప్పుడును నీతిమంతునిగా తీర్చెను;
ఏదో ఒక దినమున ఆయన రాబోవుచున్నాడు — ఓ, అది మహిమకరమగు దినము!
ఏవరో ఒకరు ఈ విధముగా, "నీవు వృద్దుడువగుచున్నావు," అని చెప్తారు. దానిని నేనేమి చేయలేను. నా చిన్న బాల్యము నుండి నేను జీవించుచూ, నేను సాధించవలసినది ఏదైనా ఒకటి వున్నాదంటే, అది యేసుక్రీస్తు యొక్క రాకడను చూచుటయే తప్ప మరేమియు లేదు. ఆ ఉద్దేశ్యము కొరకే నేను నా జీవితమును సమర్పి౦చుకున్నాను. నేనొక వృద్దుడుగా ఇంకా ఈ వేదికయందు నిలబడియున్నాను. నేను తలంచు గొప్ప విషయమేమనగా, ఆయన తన స్వకీయులను స్వీకరించుకొనుటకై, యేసుక్రీస్తు పరలోకము నుండి దిగి వచ్చుటను చూచుటయే. దీనినే నేను నమ్ముచున్నాను, దేవుడు, పిదప నేను… మనము ఈ విధముగా పాడుటలో ఏ ఆశ్చర్యమేమీ లేదు.
యేసు నామమునయున్న శక్తితో అందరూ ఆర్బటించండి!
దూతలు సాష్టాంగముగా పడి నమస్కారించుదురు గాక;
రాజ కీరీటమును తీసుకొని వచ్చి,
సమస్తమునకు ప్రభువువగు ఆయనను పట్టాభిషేకము చేయుదము!
GEN 22:17•
JOHN 15:7
34ఎందుచేత? ఆయనే శక్తివంతుడైన జయశీళుడు. నీవు ఆయనలో వున్న యెడల, నీవు వాక్యములో వున్నట్లుయగును. ఆయన చెప్పెను, "మీరు నాయందు వున్నయెడల, మీకు ఏది ఇష్టమో అడుగుడి." ఏది ఇష్టమో అని ఆయన చెప్పెను, ఎందుకనగా ప్రతీ ద్వారము ఇదివరకే జయించబడినది.
అప్పుడు మనము ఈ విధముగా చెప్పగలము,
"పరిశుద్ధ గ్రంధములోని ప్రతీ వాగ్దానము నాకే చెందును,
ప్రతీ అధ్యాయమును, ప్రతీ వచనమును నాది.
ఆయన యొక్క దైవిక వాక్యమందు నేను నమ్మికయుంచుచున్నాను,
పరిశుద్ధ గ్రంధములోని ప్రతీ వాగ్దానము నాకే చెందును."
స్నేహితులారా, దానియొక్క భావమేమని మీరు గ్రహించగలుగుచున్నారా? అబ్రాహాముకు దేవుడు అనుగ్రహించిన ప్రతీ వాగ్దానము, ప్రవక్త ద్వారా పలుకబడిన ప్రతీ వాగ్దానమును, నేటి దినమున కొరకై యేసుక్రీస్తు చేసిన ప్రతీ వాగ్దానమును రుజువుపరచుటకై ఆయన నిరంతరము జీవించుచున్నాడు అని వాటిని చూపించుట కొరకై ఆయన ఇప్పుడు ఇచ్చట యున్నాడు. "మరణము యొక్క అంచుయందు అంతిమ ఘడియలలో నీవు యున్నను, నీ యొక్క సంతానము తమ శత్రువుని యొక్క గవిని స్వాధీనపరచుకొనును. నీవు చెప్పెదవు, "దాని సంగతి ఏమిటి?" నీవు ఇంకను దానిని స్వాధీనపరచుకొనియున్నావు.
1COR 15:55
35పౌలు చెప్పినట్లుగానే, నీవు కూడా నిబ్బరము కలిగి ఈ విధముగా చెప్పగలవు, "ఓ, సమాధి, నీ విజయమెక్కడ? ఓ మరణమా, నీ ముళ్ళెక్కడ? ఆ శక్తివంతుడైన జయశీళుడగు యేసుక్రీస్తు ద్వారా మనకు జయమును అనుగ్రహించిన ఆ దేవునికి స్తోత్రములు కలుగును గాక." ఓ. దూతలు సాష్టాంగముగా పడి నమస్కరించుదురు గాక! రాజ కిరీటమును తీసుకొని వచ్చి, సమస్తమునకు ప్రభువువగు ఆయనను పట్టాభిషేకము చేయుదుము. నేటి రాత్రి సమయమున, రెండువేల సంవత్సరములు గతించిపోయినప్పటికినీ ఇంకా మనము ఆయనను చూచుటకై నిలిచియున్నాము, దేవుని యొక్క వాగ్దానము నుండి మనలను వేరుపరచే ఆ అడ్డు తెరలను చీల్చివేసిన శక్తివంతుడైన జయశీలునిగా ఆయన మరింత ఎంతగానో మనము ఆయనలో జయశీలులుగా యున్నాము. మనము ప్రార్ధించుకొనెదము.
JOHN 14:12
36పరలోకపు తండ్రి, ఆ మహా గొప్పవాడగు యేసుక్రీస్తు అనే ఆత్మస్వరూపియగు, పరిశుద్ధాత్మ యొక్క సన్నిధిలో నేటి రాత్రి సమయమున మేమిచ్చట నిలబడియున్నాము, ఆయన రాజ సంతానమగు, అబ్రాహాము. సంతానము పైకి వచ్చునని వాగ్దానము చేసెను. ఓ దేవా, ఒక పురుషుడైనా లేక స్త్రీ అయినా, బాలుడైనా లేక బాలికయైనా నిన్ను ఎరుగనివారుగా ఇచ్చట నిలబడియున్నయెడల, దేవుని యొక్క వాక్యము గూర్చి అది నిజమా, లేక కాదా అనే ఏదైనా సందేహముతోగాని, ఆందోళనగాని వారి మనసులో యున్నయెడల, అట్టివారి కొరకు మేము ప్రార్ధించుచున్నాము. ఓ, మహిమోన్నతుడగు దేవా, వాగ్దానమున చేసినవాడవగు నీవు నేటి రాత్రి సమయమున రమ్ము.
ఒక గొప్ప వాగ్దానమును నీవు అనుగ్రహించితివి, ప్రభువా. ఆ వాగ్దానమును నీవు నెరవేర్చగలవు. "నేను తండ్రి యొద్దకు వెళ్ళుచున్నాను గనుక నేను చేయు క్రియలు నాయందు విశ్వాసముంచువాడును చేయును, వాటికంటే మరి గొప్పదియు అతడు చేయునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను," అని నీవు చెప్పితివి. తండ్రియగు దేవా, మీ యొక్క వాక్యమును మీరు నిరూపించమని మేము ప్రార్ధించుచున్నాము.
MATT 24:37,38•
MARK 13:8•
MARK 16:17•
LUKE 17:26-28,30•
LUKE 21:10,11,25•
JOHN 14:7,12,14•
JOHN 16:23•
HEB 4:12
37నేటి రాత్రి సమయమందు అబ్రాహాము యొక్క సంతానమగు మీలో అనేకులు ఇచ్చట వ్యాధితో యున్నారు. ఓ, దయ్యము, వారిని లోపలకు తోసి, తలుపులను బంధించి, తాళము వేసి, "ఇప్పుడు నీవు చనిపోయెదవు, నీకు గుండె నొప్పి, నీకు ఇది, అది ఇంకా ఏదేదో వ్యాధులు గలవు, నీవు మరణించాల్సిందే," అని చెప్పుచున్నది. ఓ దేవా, ప్రతీ బానిస విడుదల పొందుకొని వెళ్లినట్లుగా, నేటి రాత్రి సమయమున సువార్త యొక్క సునాదపు బూరను ఊదుము.
ఆ ద్వారములను యేసుక్రీస్తు జయించెను. మన చేతులలో ఆ తాళపుచెవులను కలిగియున్నాము. "ఓ, నా నామమున మీరు దెయ్యములను వెళ్ళగొట్టెదరు. నా నామమున తండ్రియొద్ద మీరేమి అడిగినను దానిని నేను మీకు అనుగ్రహించెదను. నేను చేయు క్రియలు నాయందు విశ్వాసముంచువాడును చేయును. దేవుని యొక్క సజీవమైన బలముగలదైన వాక్యము రెండంచులుగల ఎటువంటి ఖడ్గము కంటేను వాడిగా ఉండి, ప్రాణాత్మలను కీళ్ళను మూలుగును విభజించునంత మట్టుకు దూరుచు, హృదయము యొక్క తలంపులను ఆలోచనలను అది శోధించుచున్నది."
నోవహు దినములలో జరిగినట్లు మనుష్యకుమారుని దినములలోను జరుగును. నోవహు ఓడలోనికి వెళ్లిన దినము వరకు జనులు తినుచు, త్రాగుచు, పెండ్లాడుచు, పెండ్లికియ్యబడుచు నుండిరి. [గొప్ప భవనములను నిర్మించే పధకములు — ప్రపంచమును మనము గమనిద్దాము; సూచనలు, ఆకాశమునందు గోళాకార దృశ్యములు అవేమనగా ఎగిరే పల్లెములు.]
"అనేక ప్రాంతములో భూకంపములు ఏర్పడును, సముద్రము ఘోషించుచు అలలు విజృంభించుట, మనుష్యుల యొక్క హృదయము భయముతో కూలుదురు, దేశములయందు వినాశములు కలుగును, భయాందోళనలతో కూడిన పరిస్థితులను కలిగియుందురు. లోతు దినములలో వుండినట్లుగానే, ఆ ప్రకారముగానే మనుష్యకుమారుడు ప్రత్యక్షమగు దినమున జరుగును." ఓ దేవా, నేటి రాత్రి సమయము నందు నీవు వచ్చి నీ వాక్యమును నిరూపించుము, అబ్రాహాము యొక్క సంతానపు విశ్వాసమును ఘనపరచుటకు నేటి రాత్రి సమయమందు రమ్ము. యేసు క్రీస్తు నామము ద్వారా మేము దీనిని అడుగుచున్నాము. ఆమేన్.
ACTS 2:41
38ప్రభువు మిమ్మల్ని మిక్కిలిగా ఆశీర్వదించును గాక. ఈ సమయమున వేదిక యొద్దకు నేను మిమ్మల్ని పిలుచుట లేదు. దాని విషయమై నేను మీకే వదిలి పెట్టుచున్నాను. అనేక సమయములలో నేను వేదిక పిలుపు… దానియందు నాకు నమ్మకము గలదు, అయితే "ఆయనను ఎందరంగీకరించిరో వారందరు బాప్తిస్మమును పొందిరి." ఆయనను ఎందరంగీకరించినవారు.
వ్యాధిగ్రస్తుల కొరకు మేము ప్రార్ధించబోవుచున్నాము. రాత్రంతా నేను మాట్లాడగలను. మీరు ఒక మంచి ప్రేమగల జనులు. కాని నేను మాట్లాడిన నా మాటలు మానవుని మాటలుగా యుండును. నేను ఆయన మాటలను చెప్పినట్లైతే ఆ మాటలు నా మాటలు రావు కాని అవి ఆయన మాటలుగా యుండును. ఒకవేళ నేను ఏదైనా చెప్పినయెడల మరియు అది… దేవుడు దానిని లక్ష్యపెట్టడు, అప్పుడు అది నా మాట అగును. నేను ఆయన మాట చెప్పినపుడు మరియు ఆయన దానిని లక్ష్యపెట్టును, అప్పుడు పురుషుడైనా లేదా స్త్రీ అయినా, బాలుడైనా లేదా బాలికైనా, అది ఆలాగు కాదు అని చెప్పు పాపి ఎవరు?
MATT 12:24,32•
LUKE 12:10
39యేసు చెప్పెను… యేసు ఈ కార్యములను చేసినప్పుడు, "ఈ మనిషి సోదే చెప్పువాడు, దెయ్యము పట్టినవాడు," అని వారు చెప్పిరి. ఒక సోది చెప్పువాడు సోది చెప్పుట అది దెయ్యమునకు చెందినదని ఎవరైనా ఎరుగురురా? "ఆయన ఒక సోదె చెప్పువాడు," అని అనిరి. సోదిని చెప్పు ఎవడైనా, ఎన్నడైనా సువార్తను ప్రకటించుటను మీరు చూచితిరా! సోదెను చెప్పువాడు ఎవడైనా దెయ్యములను వెల్లగొట్టుటను మీరు ఎన్నడైనా చూచితిరా? లేదు, వారు ఆ పనిని చెయ్యరు.
ఇప్పుడు, "మనుష్యకుమారుడైన నేను దీనిని క్షమించగలను, అయితే పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు, పరిశుద్ధాత్మకు వ్యతిరేకముగా మాటలాడువానికి ఈ యుగమందైనా లేక రాబోవుయుగమందైనా పాపక్షమాపణ లేదు — ఎందుకనగా ఇవి దేవుని యొక్క క్రియలు, వీటిని అపవిత్రాత్మ అని పిలుచుచున్నారు అని ఆయన చెప్పెను.
దేవా, నేటి రాత్రి సమయమందు మాయందు కృపను కలిగియుండుము. దేవుడు తానే దిగివచ్చి ఈ వాక్యమును మీ ముందు నిరూపించునట్లుగా నేను ప్రార్ధించుచున్నాను.
GEN 22:17•
PROV 14:12
40సోదరుడా, సహోదరీ, ఇది నా యొక్క ఆత్మ నేను దేవుడిని సంధించవలసి యుండవలసియున్నాను. నేను మీకు దేనిని గూర్చి చెప్పితినో, దాని విషయమై బాధ్యుడనైయున్నాను. దాని విషయమై నేను దేవునికి లెక్కను అప్ప చెప్పవలసియున్నది. అది నిజము. ఇచ్చట నిలబడి ఈ సంగతులను గూర్చి మీకు చెప్పుచూ, నేను తీర్పునకులోనై, నా ఆత్మ పాతాళమునకు పోవునని ఎరుగుట వలన నాకేమి ప్రయోజనము గలదు? ఒక మానవుని దృష్టికి సరియైనదని కనిపించే మార్గము ఒకటి గలదు, అయితే ఆ మార్గము యొక్క అంతము మరణమునకు దారి తీయును."
నేను చెప్పినట్లుగా, దేవునికి అనువాదకుడు అవసరము లేదు. ఆయన స్వంత వాక్యమును ఆయనే అనువాదము చేసుకొనును. అబ్రాహాము సంతానము తన శత్రువుని యొక్క గవిని స్వాధీనపరచుకొనును. దానిని నీవు నమ్ముదువా?
HEB 4:12
41నేను మిమ్మల్ని స్వస్థపరచగలిగితే నేను దానిని చేసియుండెడివాడను. కాని క్రీస్తు ఇదివరకే మిమ్మల్ని స్వస్థపరచెను. అసలు విషయమేమిటంటే, ఆ తాళపుచెవి మీ చేతిలోనే యున్నది. ఆ తాళపుచెవియే మీ విశ్వాసమగును. దానిని స్వాధీనపరచుకొనుటకు సాధనము అదియే. ఈ రాత్రి సమయమందు దానిని ఉపయోగించి తెరవండి, మీరు ఆ విధముగా చేయగలరా? సమస్త వ్వాధులను జయించిన ఆ శక్తివంతుడైన జయశీలుడు మన మధ్యకు ఆయన వచ్చినప్పుడు, ఆయన దానిని చేసి ముగించెనని మీకు చూపించగలడు, ఎందుకనగా ఆయన ఇంకను వాక్యముగానే యున్నాడు, ఆ వాక్యమే హృదయములోని తలంపులను వివేచించును.
42[సహోదరుడు బ్రెన్హాం, ఒకరితో వేదికపై మాట్లాడుచున్నాడు.] మనము ఏబదవ సంఖ్య నుండి ప్రారంభించెదము, ఎవరి యొద్ద బి ప్రార్ధనా కార్డు ఏబది గలదు? మీ చేతులను పైకెత్తి చూపించండి. ప్రార్ధనా కార్డు బి. మేము గత రాత్రి ఒకటి నుండి ప్రారంభించితిమి, ఇప్పుడు నేటి రాత్రియందు ఏబది నుండి ప్రారంభించుచున్నాము. ఎవరి యొద్ద బి, బి ఏబది గలదు? మీ చేయిని పైకెత్తండి, ప్రార్ధనా కార్డు బి, ఏభై, ఏభై, బి ఏభై ఒకటి, అది ఎవరి యొద్ద గలదు. బి, ఏభై-ఒకటి, సరే మంచిది బి. ఏభై-రెండు ఎవరి యొద్ద బి ఏభై-రెండు గలదు? సరే మంచిది. మీ యొద్ద గలదా? బీ ఏభై-మూడు, ఏభై-నాలుగు క్రమముగా ఇచ్చటకు వచ్చి నిలబడండి, ఏభై-నాలుగు, ఏభై-ఐదు.
నా కుమారుడు నేను ఇచ్చటకు వచ్చుటకు ముందుగానే వచ్చి కొన్ని ప్రార్ధనా కార్డులను ఒక్కటిగా కలిపి నాకు ఇచ్చును. అది ఏ విధముగా యున్నదో చూడండి ఒకటి ఇచ్చట మరొకటి అచ్చట యుండు విధముగా యుండును. వారికి అది తెలియదు. ఒకవేళ మీరు వచ్చి ఈ వరుసక్రమముగా వచ్చి ఒకటవ సంఖ్య కార్డును తీసుకొనవచ్చి నీ తరువాత వ్యక్తి పదవ సంఖ్య కార్డును తీసుకొనవచ్చు ఇంకొకరు ఇరువది-ఐదవ సంఖ్య కార్డును తీసుకొనవచ్చు. అది ఎచ్చట యున్నదో దానిని మేమెరుగము, కాని అది ఎచ్చటయున్నో మంచిదే.
ఇప్పుడు, ఎంత మందిని పిలుద్దాము. ఐదుగురునా, నలుగురునా? బీ ఏభై-ఐదు, ఏభై-ఆరు, ఏభై-ఏడు, ఏభై-ఎనిమిది, ఏభై-తొమ్మిది, ఆరవై, ఇప్పుడు వారిని చూద్దాము, ఒకటి, రెండు. వారిని లెక్క పెట్టండి, బిల్లీ, మంచిది. అరవై, డెభై, వారికి వీలైతే వారిని లేచి నిలబడమని చెప్పండి, బి ఏభై నుండి డెభై, డెభై-ఐదు నేను జనులతో మాట్లాడుచుండగా, రాయ్ సోదరుడా మీకు వీలైతే వారిని లెక్కపెట్టండి.
MATT 9:20,21•
MARK 5:27,28,30•
LUKE 8:44,46•
JOHN 14:12•
HEB 4:15•
HEB 13:8
43అచ్చట ఉంటూ ఈ వైపు చూస్తున్న వారిలో ఎంత మందికి ప్రార్ధనా కార్డులు లేవు. గుర్తుంచుకోండి, "నేను చేయు క్రియలు మీరును చేసెదరు" అని యేసు చెప్పెను. అది నిజమేనా? అది నిజము. దానిని మీరు నమ్మగలరా? అబ్రాహాము యొక్క సంతానము దానిని ఆ విధముగానే చెప్పును. "ఆయన మన ప్రధానయాజకుడు" అని పరిశుద్ధ గ్రంధము చెప్పుచున్నది. "మన ప్రధానయాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభవము గలవాడుగాయున్నాడు. హెబ్రీయులు నాల్గవ అధ్యాయములో చెప్పుచున్న దానిని మీరు నమ్ముతున్నారా? ఆయన నిన్న, నేడు, యుగయుగములకు ఒక్కటే రీతిగా యుండగా ఆయన దానిని చేయలేడా?
నేను చెప్పుచున్న దానిని మీరు గమనించండి, పరిశుద్ధ గ్రంధములో ఒక చిన్న స్త్రీ గలదు. పరిశుద్ధ గ్రంధములోని ఒక చిన్న స్త్రీ ఒకవేళ ఆమె యొద్ద ఒక ప్రార్ధనా కార్డు లేకపోవచ్చు, అయినా గాని "నేను ఆయనను నమ్ముచున్నాను, ఆయనను నేను తాకితే చాలును," అని ఆమె తన మనస్సులో అనుకొనెను. ఆమె తన వ్యాధికొరకు వైద్యులకు ఎంతో ధనమును ఖర్చు పెట్టెను, అయినా వైద్యులు ఆమె వ్యాధిని సరిచేయ లేక పోయిరి, ఆమె యొక్క పరిస్థితి చాలా కష్టముగా యున్నది. వారు ఆమెకు ఏమీ సహాయము చేయలేకపోయిరి. అయినాగాని దేవుడు ఆమెకు సహాయము చేయగలడని ఆమె నమ్మినది. ఆమె ఆయన వస్త్రపు యొక్క అంచును తాకినది.
"నాలో నుండి ప్రభావము వెడలిపోయినదని గ్రహించాను," అని ఆయన అన్నాడు. అవును. ఈ రాత్రి వేళ ఆయన మారనివాడుగానే యున్నాడని మీరు నమ్మగలరా? ఆయన ఇచ్చట వున్పాడు, మీరు నమ్మగలరా? ఆయన మృతులలో నుండి పునరుత్థానుడై లేచెనని ఎంతమంది నమ్ముచున్నారు?
ఇప్పుడు, ఆయన మృతులలో నుండి సజీవుడుగా లేచెనని నీవు ఏ విధముగా నిరూపించగలవు?
44సమీప కాలమందు ఒక ప్రసిద్ధిగాంచిన బాప్టిస్టు వ్యక్తి నా యొద్దకు వచ్చి, "సహోదరుడా బ్రెన్హాం గారు, ఒకసారి నేను ఒక మహ్మదీయుని యొద్ద ఓడిపోతిని," అని చెప్పెను ఆయన సజీవుడుగా లేచినయెడల, ఆయన చేసిన అదే క్రియలను చేసెదనని ఆయన వాగ్దానము చేసెను, కాబట్టి, ఆయన చేస్తానని చెప్పిన ఆ క్రియలను చేయుట మేము చూడవలయును అని అతడు చెప్పెను, చూడండి, ఆయన వాగ్దానము చేసిన క్రియలు జరుగుట లేదని వారు నమ్ముతున్నారు. ఆయన వాటిని చేస్తున్నాడని మనము నమ్ముచున్నాము. ఆయన మృతులలో నుండి పునరుత్థానుడై లేచెనని మనము నమ్ముచున్నాము. ప్రపంచములో క్రైస్తవత్వము తప్ప వేరే ఇతర ఏ సంస్థాపకుడు సజీవుడుగా యున్నట్లు నిరూపించునట్టి మతము మరొకటి లేనే లేదు. దేవుడు దానిని నిరూపించునటువంటి గల ఒకే ఒక్క మార్గమేదనగా, దానిని నమ్మిన వారి ద్వారానే దానిని నమ్మినవారి ద్వారా మాత్రమే ఆయన తన వాక్యమును నెరవేర్చి చేసి చూపించు మార్గముగా అది యున్నది.
1PET 2:24
45ఇప్పుడు, ఈ చిన్న ప్రార్ధనా వరుస క్రమములో యున్నవారు, ఎంతమంది దానిని పొందుకోగలరు. నేనెరుగను, మీలోని ప్రతి ఒక్కరు మీ స్థానములోనే యుండండి, మీ కుర్చీలోనే కూర్చొని వుండండీ, కదలకుండా వుండవలెనని నేను మిమ్మకోరుచున్నాను. ఈ వైపుగా చూస్తు ప్రార్ధించుచు ఈ విధముగా చెప్పండి, ప్రభువగు యేసు, నేను నిన్ను నమ్ముచున్నాను."
"ప్రజలు నిన్ను నమ్మునట్లు నీవు చేసుకొనగలిగితే, నీవు యదార్థ హృదయముతో ప్రార్ధించునప్పుడు," అని ఆయన నాతో చెప్పిన విషయము. దేవుడు చేయలేని ఒక కార్యమున్నది. అదేమనగా తప్పిపోవుట. ఆయన తన మాటను (వాక్యము) నిలబెట్టుకొనును. నేను దానిని నమ్ముచున్నాను. నేను ఇచ్చట నిలబడియుండుట ఎంత వాస్తవమో.. అంతకన్నా మరెంతో ఎక్కువగా దానిని నేను నమ్మెదను. ఈ భవనములో ఉన్నదాని కంటే ఎక్కువగా దానిని నేను నమ్మెదను. ఇది ఒక ఎండమావు కాదనే దానికన్నా ఎక్కువగా దానిని నేను నమ్మెదను. ఇది ఒక స్పష్టము కాదనే దానికన్నా మరిఎక్కువగా దానిని నేను నమ్మెదను. నా ఆత్మలో, దేవుని కుమారుడగు యేసుక్రీస్తు జీవిస్తున్నాడని నేను ఎరుగుదును. నీవు ఒక అబ్రాహాము యొక్క సంతానముగా యుండుట వలన, నీవు క్రీస్తులో మృతి చెందినందువలన, నీవు అబ్రాహాము యొక్క సంతానమైయున్నావు.
MARK 9:23•
ACTS 19:12•
GAL 2:20
46ఇప్పుడు వారిచ్చటకు కొన్ని చేతిరుమాళ్లను తెచ్చియున్నారు. నమ్మికయుంచు జనుల వలన గొప్ప జయము చేకూర్చబడును. ఇప్పుడు మనము మన తలలను వంచుదాము, వారు సిద్దపడు లోపల వారి కొరకు మనము ప్రార్ధించెదము. పరలోకపు తండ్రి, పరిశుద్ధ గ్రంధములోయున్న కార్యమును గూర్చి మేము బోధించబడి యుంటిమి. నీవు చెప్పిన ప్రతి వాక్యము సత్యమని నమ్మిన జనులు ఇచ్చట వున్నారు. ప్రభువా, కొన్ని సార్లు తాళపుచెవిని తాళపు రంధ్రములో పెట్టి తెరుచుటకు తడబడుచు గురితప్పి విఫలమవుచున్నారు, అయితే అది అచ్చటనే యున్నదని వారు నమ్ముతున్నారు. వారు ఆ విధముగానే అట్లే తడబడుచున్నాగాని అది అచ్చటనే యున్నదని వారే దానిని కనుగొనెదరు. దాని తాళపుచెవి అదియే, అది నిజమైనది, "నీవు నమ్మినయెడల సమస్తము సాధ్యమే." ఇప్పుడు పాడిన పాట వంటిది లేదా వాయించినటువంటి పాట వలె
పరిశుద్ధ గ్రంధములో దీనిని ఈ విధముగా చెప్పుచున్నది. పౌలు తన శరీరము నుండి వస్త్రములను, చేతిరుమాళ్ళను తీసి వ్వాధి, బాధలలోయున్న వారి యొద్దకు పంపించగా జనులలోయున్న దురాత్మలు వెడలిపోయెను, వారు స్వస్థత పొందిరి. ఇప్పుడు, ప్రభువా, పరిశుద్ధుడైన పౌలు నీతో కూడా యున్నాడని మేము ఎరుగుదుము, అయితే అది అతడు కాదు, అది నీవై యున్నావు. ప్రభువా, క్రీస్తు అతడిలో యున్నాడు. "ఇక జీవించేది నేను కాదు, నా యందు జీవించుచున్నది క్రీస్తే," అని అతడు చెప్పెను. ఇప్పుడు ఈ తరము వారికి, నిన్నటివలే నేడు కూడా ఇంకా నీవు క్రీస్తు గానే యున్నావు, నేను చేతిరుమాళ్ళపై చేతులుంచి ప్రార్ధించుచుండగా, వారిని నీవు తాకి ప్రతీ శత్రువుని నీవు పారద్రోలవలెనని నేను ప్రార్థించుచున్నాను. శత్రువు ఓడిపోయెనని వారెరుగునట్లుగా వారికి కావలసిన విశ్వాసమును అనుగ్రహించుము.
ఇప్పుడు మనము మాట్లాడుకున్న విధముగా ఒకప్పుడు ఇశ్రాయేలీయులు వారి కర్తవ్య మార్గములో ఉన్నప్పుడు ఎర్ర సముద్రము వారు పొందుకోవలసిన వాగ్దానమును పొందుకొనియకుండా, అడ్డుగా వచ్చి వారిని ఆటంకపరచినది. దానిని ఒక కవి ఈ విధముగా వర్ణించుచు, "దేవుడు ఉగ్రుడైన తన కళ్ళతో ఆ అగ్నిస్తంభము గుండా క్రిందికి తొంగిచూడగా సముద్రము భయముతో తన ద్వారపు గవులను తెరుస్తూ పారిపోవుచుండగా వారు దానిని దాటి పోయిరని చెప్పెను. ప్రభువా, నేటి రాత్రి సమయమునందు యేసుక్రీస్తు రక్తము గుండా క్రిందికి చూడుము. ఈ చేతిరుమాళ్ళను వ్యాధి గ్రస్తులపై వుంచినప్పుడు, నేటి రాత్రి యందు మేము విశ్వాసముతో వారి కొరకై ప్రార్ధించునప్పుడు శత్రువు మా విశ్వాసమును చూచును గాక, ప్రతీ ఒక్కోక్కరు యేసుక్రీస్తు నామమమున విడుదలను పొందుదురు గాక!
ISA 53:5
47ఇప్పుడు మీ యొక్క దృస్టినంతటినీ ఇచ్చట కేంద్రీకరించవలెనని నేను కోరుచున్నాను. మైకు దగ్గర వున్నవారెవరైనా సరే బహుశా దానిని ఇంకా కొంచెం ఎక్కువగా పెట్టవచ్చును, ఎందుకనగా ఒకవేళ పరిశుద్ధాత్మ దీనిని చేసినయెడల… ఆయన చేయునని నేను చెప్పుట లేదు. ఎవరైనా ఇచ్చటకు వచ్చి వ్యాధి గ్రస్తులను స్వస్తత పరచుటకు వారికి శక్తి గలదని చెప్పినయెడల, దానిని మీరు నమ్మవద్దు. ఆ శక్తి యంతా క్రీస్తుది మాత్రమే. నీవు, నేను కాదు, ఆయనే జయించిన వాడు. ఆయన చేసిన దానిని మనము కేవలము అంగీకరించుచున్నాము. ఏ మనిషికి రక్షించుటకు గాని లేదా స్వస్థపరచుటకు గాని శక్తి లేదు. ప్రపంచముననున్న ప్రతీ వ్యక్తికి వాని కొరకైన క్రయమును ఇంతకు ముందే చెల్లించబడినది. చెల్లించబడవలసిన క్రయ ధనము చెల్లించబడినది. అది ఏ విధముగా చెల్లించబడినది? "మన అపరాధముల నిమిత్తము ఆయన గాయపరచబడెను, ఆయన పొందిన దెబ్బల వలన మనకు స్వస్థత కలిగినది."
నీ స్వస్థత కొరకు క్రయము చెల్లించబడినది, నీ రక్షణ కొరకు చెల్లించబడినది. దానిని అంగీకరించి వచ్చుటకు నీకు తగిన విశ్వాసము గలదా? అది చాలు. నీవు అబ్రాహాము యొక్క సంతానమైయున్నావు. అది నీకు కలదు. దేవుడు దానిని వాగ్దానము చేసెను. అది నీలోనే యున్నదని చెప్పి ఏదో ఒకటి నీలో గలదు. అది నీలో యున్నది.
GEN 18:13•
LUKE 17:28-30•
JOHN 14:19
48వరము అనగా ఏమిటి? బయలు వెళ్లి జనులను స్వస్థత పరచుట ఒక వరమా? కాదు. ఒక వరము అనగా, నిన్ను నీవు తొలగించుకున్నప్పుడు తద్వారా దేవుడు తన కొరకు నిన్ను ఉపయోగించుకొనుటయే అగును.
ఇప్పుడు, ఆయన దానిని వాగ్దానము చేసెను, యేసుక్రీస్తు యొక్క వాగ్దానము ప్రకారము సోదోమ కాలిపోక ముందు "సోదోమ నాటి దినములు ఏ విధముగా యుండెనో అనేదే అంత్యకాల సూచనయగును. ఇతరేతర కారములు సంభవించుటకు ముందు కాదు. లోతు మరియు ఇంకా ఇతరుల ద్వారా సువార్తను ప్రకటించినప్పుడు కాదు గాని, అది అగ్నిలో కాలిపోయే ముందుగా దేవుడు ఒక మానవ శరీరమును దాల్చి క్రిందికి దిగి వచ్చి వాగ్దానము గలవారగు అబ్రాహాము మరియు అతడి వర్గమునకు చెందిన ఎన్నుకొనబడిన సంఘముతో యుండును.
కేవలము అబ్రాహాము యొక్క సంతానము మాత్రమే దానిని పొందుకోగలదనే దానిని ఇప్పుడు గుర్తుంచుకోడి. ఇంకా కొంచెము కాలమైన తరువాత లోకము ఎన్నడు నన్ను చూడదు. మీరు నన్ను చూచెదరు, యుగాంతరమువరకు నేను మీతోను, మీలోను యుందును," అని యేసు చెప్పెను. కాని ఆయన మరలా తిరిగి వచ్చుటకు ముందుగా సొదొమ యున్నట్లుగా అని ఆయన వాగ్దానము చేసెను. సొదొమ దేనిని పొందుకొనుచున్నాడో చూడుము, అదే విధముగా ఎన్నుకొనబడిన సంఘము దేనిని పొందుకొనుచున్నదో చూడుము, ఆ ప్రకారమే మనుష్యకుమారుడు ప్రత్యక్షమగు దినమున జరుగును దేవుడు ఒక మానవ శరీరమందు ప్రత్యక్షమై, తన వీపు వెనుక భాగమున గుడారముయున్నది, ఆ గుడారములోయున్న శారా ఏమి చేసినదో ఆయన చెప్పెను, అది సత్యమని ప్రతీ ఒక్కరు ఎరుగుదురు, మీ చేతులను పైకెత్తండి. అవును అది ఖచ్చితముగా వాస్తవమే, ఇప్పుడు ఆయన దానిని వాగ్దానము చేసెను. మనము అంత్యకాలమందు ఉన్నాము.
చివరగా సంభవించిన కార్యము అదే అనే దానిని గుర్తుంచుకోండి. సొదొమనే అన్య ప్రపంచము దహించ వేయబడినది మరియు వాగ్దాన పుత్రుడు రంగము మీదికి వచ్చెను, దేవుని కుమారుడగు, వాగ్దానపు కుమారునికై మనము ఎదురు చూచుచున్నాము.
49ఇచ్చటే మనము యున్నాము. దేవుడు మీ నేత్రములను తేరుచును గాక. నేను చెప్పుటకు వేరేమియు లేదు. దేవుడు మీ నేత్రములను తెరుచును
ఇప్పుడు పరలోకపు తండ్రి, నీవు మలచి ఇచ్చట యుంచిన మట్టి ముద్దగా యున్నాను. నేను నిస్సహాయుడును. ఓ దేవా, "నీవు ఇచ్చట వుంచిన చిన్న మట్టి ముద్దలు నీ కొరకై ఉపయోగపడు విధముగా నేటి రాత్రి సమయ మందు నీ కృప మరియు సన్నిధి ఇచ్చట యుండును గాక. ప్రభువా, నిత్యజీవము కొరకు ఎవరైతే పిలువబడితిరో, ఇంకా దానిని వారు అంగీకరించక పోయినయెడల, ఈ వాగ్దానములను వారు చూచునట్లు చేయుము. అది ఇంకొక దినమునకు అన్నట్లుగా ఒకవేళ వారికి బోధించబడి యుండవచ్చును, కాని అది ఇచ్చట పరిశుద్ధ గ్రంధములో గలదు. అది నీ స్వకీయ అనువాదమని, ప్రభువా, దానిని నిర్ధారణ చేయుము, కాబట్టి దానికన్నా మించిన అనువాదము దానికి అవసరము లేదు. నీవు దానిని ఆ విధముగా చేసినట్లైతే అప్పుడు వాక్యము సత్యమని వారు ఎరుగగలరు. తండ్రి దానిని అనుగ్రహించుము. మమ్మల్ని నీకు సమర్పి౦చుకొనుచున్నాము. ప్రభువా, నేటి రాత్రియందు ఇచ్చట యున్న ప్రతీ వ్యక్తి వారి విశ్వాసమును ఉపయోగించుదురు గాక. యేసుక్రీస్తు ద్వారా అబ్రాహాము యొక్క వంశమువారగు ప్రతీ ఒక్కరు నేటి రాత్రియందు విశ్వాసము గలిగినవారై యుండి, నీ ప్రసన్నతను అంగీకరించుదురు గాక. మరియు నీకే మేము స్తుతులు చెల్లించుచున్నాము. ఆమేన్.
50ఇప్పుడు, ఇది ఒక వింతగా యున్నది ఇప్పుడు మీరు నాకు సహాయము చేయండి, నా కొరకు ప్రార్ధించండి, నిశ్శబ్దముగా ఉండండి, ఇటు అటు తిరుగవద్దు, అట్లే కూర్చొని ప్రార్ధించండి. ఇప్పుడు గమనించండి, ఇది సువార్త సేవ ద్వారా ఒక విధమైన మార్పుతో మీకు విరామమును కలుగజేసి దేవుని ఆత్మ మిమ్మల్ని సంపూర్తిగా వేరొక పరిణామములోకి తీసుకొని వెళ్ళును.
ఇచ్చట ఒక యవ్యనస్తురాలు నిలబడియున్నది, కొంచెము ఈ ప్రక్క ఇటువైపుకు రండి చాలు, నేను ఈ మైకు నుండి తొలగిపోకుండునట్లుగా చూడండీ. ఏమి సంభవించుచున్నదన్నది నేనెరుగను. ఏమి సంభవించినదో నేను తెలుసుకోవాలంటే వున్న ఒకే మార్గమేమనగా, ఈ మైకు ద్వారానే. వారు దానిని పట్టుకోవాలని ప్రయత్నించుచున్నారు, అది ఏమిటనే దానిని నేనెరుగను…
MATT 12:24•
JOHN 4:18,19,25•
HEB 13:8
51ఇప్పుడు మనము ఒకరికొకరు ఎరుగని వారము. నేను నిన్ను ఎరుగను నా జీవితములో నిన్నెడును నేను చూడలేదు. అయితే నీవు నాకన్నా చాలా చిన్నదానివి బహుశా కొన్ని మైళ్ల దూరంలోసు, కొన్ని సంవత్సరాల వ్యత్యాసములో జన్మించాము. ఇదే మొదటి సారిగా మనము కలుసుకోవటము, అది నిజమేనా? అది నిజమే అయిన యెడల, జనులు చూచునట్లుగా నీ చేయిని పైకెత్తుము.
ఇచ్చట కేవలము ఒక స్త్రీయే నిలబడియున్నది. గమనించండి, మళ్లీ లేఖనములను తీసుకొనెదము, ప్రతీ ఒక్కరు పరిశుద్ధ యోహాను 4వ అధ్యాయమును ఇంటికి వెళ్లి చదవండి. ఈ స్త్రీ - ఆ స్త్రీ లాంటిదని కాదు, కాదు. నాకు తెలియదు. మీకు తెలుసు, నేను యేసుక్రీస్తును కాదు, కాని ఆయన ఇచ్చట ఉన్నాడు. అది ఆయనేయగును. ఆ బావియెద్దకు వచ్చిన ఆ స్త్రీని గూర్చి ఆయన ఎరిగినట్లుగా ఇప్పుడు ఆయన ఆత్మ మనలను అభిషేకించి ఈమె యొక్క బాధను ఎరుగునట్లుగా చేయును. విషయము ఒక్కటే. యాజకులు మరియు అనాటి నాయకులు చెప్పిన విధముగా, "ఈయన సోది చెప్పువాడు, ఒక దెయ్యము లేదా బెయల్జెబూబు," అనిరి. అయ్యా, నిన్ను ఒక ప్రవక్తగా గ్రహించుచున్నాను, మెస్సయా వచ్చునని మేమెరుగుదుము, ఇదే ఆయన గురుతు," అని ఈ స్త్రీ చెప్పినది.
ఇప్పుడు, అది సత్యమని ఎంతమంది ఎరుగుదురు? మంచిది, ఆయన నిన్న, నేడు, మరియు నిరంతరము ఏకరీతిగా యుండినయెడల, ఈ రాత్రి అదే ఆయన సూచనగా యుండును కదా! అంత్యకాలమునకు ముందు ఈ విధముగా వుండునని ఆయన వాగ్దానము చేసెను కదా? ఇప్పుడు గమనించండి, అబ్రాహాము సంతానమునకు ఆయన తన వాగ్దానమును నెరవేర్చును.
52ఇప్పుడు, ఇక్కడ ఉన్నవారిలో అది తప్పని ఎవరైనా తలంచినయెడల ఇచ్చటకు వచ్చి అదే కార్యమును మీరూ చెయ్యవచ్చును. ఆ విధముగా చెయ్యనియెడల పిదప దానిని గూర్చి ఏమియు చెప్పవద్దు. మీకు ఈ అవకాశము ఇవ్వబడినది. ఇప్పుడు దేవుని యొక్క కృపా మహిమ మరియు ఘనత కొరకై యేసుక్రీస్తు నామమున ప్రతీ ఆత్మను నా స్వాధీనములోనికి తీసుకొనుచున్నాను.
DEUT 18:18•
JOHN 4:7•
JOHN 5:19
53యవ్వన స్త్రీ, ఒక్క క్షణము నేను నీతో మాట్లాడవలయును మన ప్రభువు బావియొద్దకు వచ్చిన ఆ స్త్రీతో మాట్లాడేనని నీవు ఎరుగుదువు, "త్రాగుటకు నాకు నీళ్ళు ఇమ్ము" అని ఆయన అడిగెను. ఆయన ఏమి చేయుచున్నాడు? ఇప్పుడు గమనించండి, పరిశుద్ధ యోహాను 5వ అధ్యాయములో మీతో నిశ్చయముగా నేను చెప్పుచున్నాను, "తండ్రి ఏది చేయుట కుమారుడు చూచునో, [అది ఆయనే శరీరమున] తనంతట తాను ఏమియు చేయనేరడు." తండ్రి వేటిని చేయునో ఆయన చేయువాటిని కుమారునికి అగపరచుచున్నాడు. [చూడండి.] నా అంతట నేను ఏమియు చేయను గాని తండ్రి వేటిని చేయుట నేను చూతునో," అని ఆయన చెప్పెను. కాబట్టి దేవుడు ఆయనకు ఒక దర్శనము ద్వారా ఏదియు చూడనంతవరకు యేసు ఏ ఒక్క అద్భుత కార్యమును చేయడు. ఆయన చెవిలో చెప్పుట కాదు గాని, ఆయనకు చూపించుట, "నేనేమి చూచెదనో [వినుట కాదు], తండ్రి చేయునది ఏదో చూచుట," అదియే ఆయనను మోషే వంటి ఒక ప్రవక్తగా చేసినది, మోషే చెప్పిన రీతిగా.
ఆయన తండ్రిని ఎరుగును. ఆయన..
MATT 12:24•
MATT 16:16•
MARK 3:22•
LUKE 11:15•
JOHN 1:49•
JOHN 4:4,5,7
54ఆయన యెరికోకు వెళ్ళుచుండెను, కాని ఆయన సమరయ మార్గమున వెళ్లవలసి వచ్చెను. ఆయన సుఖారను ఒక ఊరికి వచ్చెను. ఇప్పుడు గమనించండి, సమరయ వారు ఒక మెస్సియా రాకడ గూర్చి ఎదురు చూచుచున్నారు. యూదులు అందుకొరకై ఎదురు చూచుచున్నారు, వారికి ఆయన తన సూచనను చూపించెను. ఆ సూచన చేసిన వెంటనే ఫిలిప్పు, నతానియేలు,పేతురు అనువారు, "నీవు దేవుని కుమారుడవు," అని చెప్పిరి. కాని రబ్బీలు "ఈ మనిషి బయల్జేబూబు," అని చెప్పెను.
కాని ఇప్పుడు గమనించండి, అన్యజనులగు ఆంగ్లో సాక్సన్లమైన మనము మెస్సియా కొరకు ఎదురు చూడలేదా, మనము అన్యులము, రోమీయులము మరియు మొదలగువారము. మనము మెస్సియా కొరకు ఎదురు చూడలేదు. ఆయన కొరకు ఎవరైతే ఎదురు చూచుచున్నారో వారి కొరకు మాత్రమే ఆయన వచ్చెను.
JOHN 4:9,10,16-19,25,26,28,29•
HEB 13:8
55కాని సమరియులు ఆయన కొరకు ఎదురుచూచుచుండిరి. కావున ఆయన వారికొరకై సమరయ మార్గమున వారి యొద్దకు వెళ్ళెను. బావి యొద్దకు వెళ్లి ఆయన కూర్చోనెను. యించుమించు నీ వయస్సుగల ఒక యవ్వన స్త్రీ అచ్చటకు వచ్చెను. ఆమె చెడు ప్రవర్తనగల ఒక స్త్రీ, ఆ కధను నీవు చదివి ఉందువని నేను ఊహించుచున్నాను, "స్త్రీ నాకు దాహమునకు నీళ్ళు ఇవ్వు," అని ఆయన అడిగెను.
"యూదుడువైన నీవు సమరియ స్త్రీవైన నన్ను దాహమునకిమ్మని ఏలాగు అడుగుచున్నావు," అని అమె అడిగెను.
"నిన్ను అడుగుచున్నవాడెవడో అదియు ఎరిగియుంటే నీవు ఆయనను అడుగుదువు," అని ఆయన చెప్పెను. ఆ సంభాషణ, ఆ విధముగా కొనసాగుతుండగా, చివరకు, ఆమె యొక్క సమస్య ఎచ్చటయున్నదో దానిని ఆయన కనుగొనెను. అదేమిటని మీకు జ్ఞాపకమున్నదా? ఆమెకు అనేక మంది భర్తలు గలరు. "నీవు వెళ్ళి, నీ భర్తను పిలుచుకొని ఇచ్చటకు రమ్ము, అని ఆయన అనెను.
నాకు భర్త లేడు," అని ఆ స్త్రీ చెప్పెను.
"నాకు భర్తలేడని నీవు చెప్పిన మాట నిజమే, నీకు అయిదుగురు భర్తలుండిరి, ఇప్పుడు ఉన్నవాడు నీ భర్త కాడు," అని ఆయన చెప్పెను.
"అయ్యా, నీవు ప్రవక్తవని నేను గ్రహించుచున్నాను. మెస్సియా వచ్చునను దానిని మేమెరుగుదుము, ఆయన వచ్చినప్పుడు మాకు సమస్తమును తెలియజేయును," అని ఆమె చెప్పెను.
"నేనే ఆయనను," అని ఆయన చెప్పెను.
ఆమె తన కుండను విడిచిపెట్టి ఊరిలోనికి వెళ్లి, "మీరు వచ్చి, నేను చేసినవన్నియు నాతో చెప్పిన మనుష్యుని చూడుడి, ఈయన మెస్సియా కాడా?" అని ఆమె వారితో అనెను. నాలుగు వందల సంవత్సరములుగా వారి మధ్య వారికొక ప్రవక్త లేకుండెను. ఇచ్చట మెస్సియా అనబడే ఈయన మరియు ప్రవక్తగా చెప్పబడిన ఈయన, మెస్సీయా యొక్క సూచనను చూపించెను.
56అదే కార్యమును నమ్ముటకు నీకు సాధ్యమగునా, ఆయన అదే విధముగా అదే కార్యమును చేసినయెడల, ఆయన దానిని చేయునని, ఆయన నిన్న, నేడు, మరియు నిరంతరము ఏకరీతిగానే యున్నాడని లేఖనముల ద్వారా వాగ్దానము చేసెను.
కూడియున్న మీకు అది విశ్వాసమును కలుగుజేయుచున్నదా, నీవు మూత్ర గ్రంధుల వ్యాధితో బాధపడుచున్నావు అది నిజమైన యెడల నీ చేయిని పెకెత్తి చూపించుము. ఎందుకని అదెప్పుడు నా ముఖముపైనే త్రిప్పి కొట్టుచున్నవి? "అతడు దానిని ఊహించి చెప్పుచున్నాడు," అని ఎవరో చెప్పుచున్నారు. మాటలను నేనెన్నడూ ఊహించి చెప్పను. ఇచ్చట యున్న ఈమె ఒక మంచి స్త్రీ నీవు నన్ను నమ్ముచున్నావా? నేను నీతో చెప్పుచున్న మాటలు ఊహించి చెప్పుట లేదని నీవెరుగుదువు, కొన్ని కార్యములను నేను నీకు చెప్పెదను, నీ భర్త కూడా ఒక వ్యాధితో బాధపడుతున్నాడు, అతడు వెన్నెముక నొప్పితో బాధపడుచున్నాడు. అతడు నీతోనే ఉంటున్నాడు. అది నిజమా? కాదా? నీతో ఒకచిన్న బాలుడు గలడు, అతడు కూడా వ్యాధితో బాధపడుచున్నాడు. ఆ బాలునికి కూడా ప్రార్ధించాలని నీవు ఆశించుచున్నావు. అతడి కళ్ళలో ఏదో ఒక విధమైన బాధను కలిగియున్నాడు. అది నిజమేనా? నీకొక చిన్న బాలిక కలదు, ఆమె కూడా నీలాగే మూత్ర గ్రంధుల వ్యాధితో బాధపడుచున్నది. అది నిజమేనా? నీవు నమ్మినయెడల, ఇప్పుడు మీరందరు బాగవుగలరు. దానిని నీవు నమ్ముచున్నావా? దేవుడు నిన్ను దీవించును గాక! నీవు నీ మార్గమున ముందుకు కొనసాగిపోతూ ఆరోగ్యముగా ఉండుము.
GEN 22:17•
HEB 13:8
57మీరు నమ్ముచున్నారా? ఆయన నిన్న, నేడు, నిరంతరము ఏకరీతిగా యున్నాడు. అది ఏమిటది? నీ కొరకు ఆయన ఏమి చేయుటకై ప్రయత్నించుచున్నాడు? అబ్రాహాము సంతానమైన నీకు ఆయన, తాను సజీవుడుగానే యున్నాననే దానిని చూపించుచున్నాడు. నేను ఆ కార్యములను చేయలేను. ఆయన చనిపోలేదు, ఆయన జీవము గలవాడై నీ శత్రువుల గవిని స్వాధీనపరచుకొనుటకు నీకు హక్కు గలదనే దానిని చూపించుచున్నాడు. అది దానిని ముగించినది.
LUKE 17:28•
JOHN 14:12
58ఈ స్త్రీ… ఈ వైపు రండి. ఒక నిమిషము, మన ఇద్దరిది ఇంచుమించు ఒకే వయస్సు అనుకుంటున్నాను, కాని నాకు తెలిపినంతవరుకు మన ఇద్దరము ఒకరికొకరము పరిచయము లేనివారము. నేను నిన్ను ఎరుగను, మనము పరిచయము లేనివారము. నీ గురించి నాకు ఏమియు తెలియదు. అది నిజమైనయెడల, నీ చేతిని పైకెత్తి చూపించుము. కేవలము ఎవరో ఒకరు నీకు ఈ ప్రార్ధనా కార్డును ఇచ్చుట వలన నీవు ఇచ్చట యున్నావు.
సరే, మంచిది. ఇప్పుడు నీ గురించి ప్రభువగు యేసుక్రీస్తు చెప్పిన యెడల.. ఒకవేళ నేను సహోదరుడు ఓరల్ రాబర్డ్ లేదా మరి వేరెవరైనా గొప్ప విశ్వాసము గల సహోదరుల స్థానమును తీసుకొనుటకు ప్రయతీస్తు ఈ విధముగా స్త్రీ, నీ బాధ ఏమిటీ?" అని నేను అడగవచ్చు.
"నాకు ఫలానా, ఫలానా ఉన్నది," అని నీవు చెప్పవచ్చును, ఒకవేళ అది సరిగా కూడా యుండకపోవచ్చును, అర్ధమయ్యిందా, దానిని గురించి నేనెరుగను గమనించారా? అయినాగాని నీలో యున్న బలహీనత ఏమిటో దానిని గురించి నీవు అతడితో చెప్పియుండవచ్చు.
"రోగుల కొరకు ప్రార్ధించమని దేవుడు నన్ను పంపెను," అని అతడు నీ మీద చేతులు వుంచి చెప్పవచ్చును. దానిని నీవు నమ్ముచున్నావా?
"అవును."
దేవునికి మహిమ! దానిని నమ్ముచు వెళ్ళుము."
అది మంచిదే, అది మంచిదే, దేవుడు దానిని వాగ్దానము చేసియున్నాడు. కాని, మీరు గమనించండి, ఆ దినములయందు ఉన్న స్థితి కంటేను ఇప్పుడు ఇంకా కొంచెము ఉన్నత స్థితియందు మనము జీవించుచున్నాము. "సొదోము దినములలో జరిగినట్లువలె, నేను చేసిన క్రియలను మీరు కూడా చేసెదరని," యేసు వాగ్దానము చేసియున్నాడు.
JOHN 4:39
59నీవు ఏ విధముగా ఉన్నావని దానిని గూర్చి దేవుడు నాకు చెప్పినయెడల, అది సత్యమా, కాదా నీవు దానిని గూర్చి ఎరుగుదువు. నీవు ఏమైయుందువో అనేది ఆయన చెప్పగలడు. అట్లు అది సత్యమైనయెడల మరి ఇది కూడా సత్కమేయగును. నీకు ఏమైయునదని దానిని గూర్చి ఆయన చెప్పిన యెడల, దానిని గూర్చి నాకు తెలియదు, కాని నీకు ఉన్న ఇబ్బ౦ది ఏమిటని ఆయన నాకు చెప్పిన యెడల. జనులారా మీరు దానిని నమ్మగలరా?
వాస్తవముగా నేను ఇచ్చట నిలుపవలసియున్నది. కొద్దిసేపు ముందు ఇచ్చటయున్న ఆ వ్యక్తి దానిని గూర్చి రుజువు చేయవలసియున్నది. యేసు దానిని ఒకసారి చేసియుండెను. ఆయన దానిని మరలా మరోసారి చేయలేదు. సుఖారను ఊరిలో ఉన్నవారందరు దానిని నమ్మిరి. ఆమె చెడు ప్రవర్తన కలిగిన స్త్రీ అయినను, ఆ స్త్రీ అచ్చట వారియొద్దకు వెళ్ళి తనయొక్క సాక్ష్యమును చెప్పినప్పుడు, వారు దానిని నమ్మిరి. ఒక క్రైస్తవుడు మీ అందరి ముందుగానే ఇప్పుడే ఈ వేదిక నుండి వెళ్ళెను. ఆమేన్. అయినా గాని, ఆ కార్యములు గతించి పోయినట్లుగా మనము తలంచుచున్న తలంపులకంటేను, ప్రభువు, తనకు తానుగా అబ్రాహాము యొక్క సంతానమునకు ఆయన మహా గొప్ప పరాక్రమవంతుడైన జయశాలిగా నిరూపించునుగాక! దానిని అబ్రాహాము కొరకు ఆయన ఒకసారి దానిని చేసెను. పిదవ దానిని నిర్మూలించి, ఆయన మరలా దానిని చేసెను. అబ్రాహాము ఎప్పుడూ దేవునిని నమ్ముతునే యుండెను.
60నీవు ఇచ్చట నా కొరకు రాలేదు. వేరే ఎవరికొరకో వచ్చితివి. ఆమె ఒక స్త్రీయై యున్నది. ఆమె ఎవరో కాదు నీ సోదరి. ఆ స్త్రీ మరణమనే నీడతో కట్టబడియున్నది. ఆ స్త్రీ మధుమేహ వ్యాధితో బాధపడుచున్నది. మరియు ఆమె ఈ ప్రాంతానికి చెందినది కాదు. చిత్తడి నేలవంటి నేల కలిగిన దేశములోని లుసియానా అనే ప్రాంతమునకు చెందినది. నిజము. ఇచ్చట ఇంకొక కార్యము కూడా గలదు, దానిని గూర్చి ఈ జనులకు కూడా తెలియును. చాలా జబ్బుతో యున్న ఒక కుమార్తె నీకు గలదు. ఈ కూటమునకు రావాలని ప్రయత్నించింది. ఆమె చాంద్ర వ్యాధితో బాధపడుచున్నది. అది నిజము, అవును, అది నిజము. అది నిజమే కదా? నీవిప్పుడు నమ్మకలుగుచున్నావా? నీవు అబ్రాహాము యొక్క సంతానమైనయెడల, దానిని అంగీకరించి మరియు ముందుకు కొనసాగిపో. ప్రభువైన యేసుక్రీస్తు నామమున స్వస్థత పొందెదవు గాక.
మీరు నమ్ముచున్నారా? నిశ్చయముగా. అది ఆయన చేసిన వాగ్దానమని గుర్తుంచుకోండి. ఆయన దానిని చేస్తానని ఆయనే చెప్పాడు. ఆయన చేసిన వాగ్దానమును ఆయన నిలబెట్టుకొంటాడు.
నీవెలాగ వున్నావు? మనము ఒకరికొకరము అన్యులము నిన్ను గురించి నాకు తెలియదు, కాని దేవుడు నిన్నెరుగును. నీకున్న బాధను గూర్చి దేవుడు నాకు బయలుపరచినయెడల, నీవు దానిని నమ్మగలవా, అప్పుడు అది ఏదో ఒక ఆత్మీయసంబంధమైన శక్తితో నుండి వచ్చుచున్నదనే దానిని నీవు ఎరుగుగలవు. ఇప్పుడు రెండు కార్యముల ద్వారా మాత్రమే అది రావలసియున్నది. దానిని నీవు ఊహించగలవు, కాని అది సంభవించినప్పుడు దానిని గూర్చి వివరించలేని కార్యముగా యున్నది, ఎందుకనగా అది ఒక ఆగోచరమైన కార్యముగాయున్నది. అంతే కదా! అది ఒక నమ్మలేని నిజమైన విషయముగా యున్నది. అయినా గాని అది నిజము.
అది సత్యమో, అసత్యమో అనే దానిని గూర్చి నీవు ఎరుగుదువు. ఆయన సత్యమునే చెప్పియున్నాడా, లేదా అనే దానిని నీవు తెలుసుకుంటావు.
MARK 3:22•
LUKE 11:15•
JOHN 1:42
61నీవెవరవనేది నేనెరుగను, నీవు జ్ఞాపకముంచుకో, నా ప్రక్కన ఎవరో ఒకరు యున్నారు. అది 'అశుద్ధాత్మ' అని ఆ పరిసయ్యులు చేప్పినట్లుగా మీరు కూడా చెప్పినయెడల అటుతర్వాత దానికి మీరు మూలమును చెల్లించవలసి యుండును. అది 'క్రీస్తు' అని మీరు నమ్మినయెడల, అప్పడు దాని ఫలమును మీరు పొందగలరు, ఎందుకనగా నీవు దానిని నమ్మితివి గనుక, ఆయన ఈ దినము కొరకు దానిని వాగ్దానము చేసియున్నాడు, ఇది ఆ కాలము నుండి ఈ కాలము వరకు కాదు గాని, ఇది అంత్యకాలమునకే వర్తించును.
ఎవరో ఒక వ్యక్తి నీ ముందు ఎప్పుడు కనబడుతునే యున్నాడు. అతడు నెరసిన వెంట్రుకలు గల వ్యక్తిగా యున్నాడు. అతడు నీ భర్త, అచ్చట కూర్చొని యున్నాడు. కేన్సర్ వ్యాధి అతడిపై నీడలా కప్పియున్నను, అతడు తన స్వస్థతను అంగీకరించుటకు ప్రయత్నించుచున్నాడు. నీకు మూత్ర పిండము, మూత్రాశయ వ్యాధిగలదు. నీ పేరు శ్రీ మరియు శ్రీమతి. లిటిల్. అది నిజమేనా? నీ హృదయమంతటితో నమ్మి స్వస్థతను పొందుకొనుము.
"నీవు అతడి, వారి పేర్లను చెప్పితివి," అని నీవందువు.
నిశ్చయముగా, "నీ పేరు సీమోను, నీవు యోనా కుమారుడవు," అని పేతురుతో యేసు చెప్పలేదా?
62ఇచ్చట ఒక వ్యక్తి గలడు. అయ్యా, మనము ఒకరికొకరము పరిచయము లేని వారము. నిన్ను నేను ఎరుగను గాని, పేతురు యేసు దగ్గరకు వచ్చినట్లుగా, నీవు ఒక వ్యక్తిగా వచ్చియున్నావు. నేను ఆయన సేవకుడినని నీవు నమ్మగలుగుచున్నావా? నేను చెప్పుచున్నది సత్యమని నీవు నమ్మగలుగుచున్నావా? నీవు నమ్మినయెడల నీకు చెయ్యవలసిన కార్యమేదైనా యున్నయెడల, నేను దానిని నీకు చేసెదను. అయితే నేను చేయవసినదేమియు లేదు, ఎందుకనగా ఆయన ముందే దానిని చేసి ముగించెను. దానిని నీవు పొందుకొనాలంటే, నమ్మితే మాత్రము చాలును. గమనించావా? అది నేను చేయవలసిన కార్యము కాదు. నేను చేయవలసిన కార్యమైనయెడల, నేను చేయగలిగినదంతా నీకు చేసెదను. కాని ఆయన నాకు ఒక వరమును అనుగ్రహించెను, నేను ఆయనకు ముందు సామాన్యముగా యుండుటకు ఆయన సంభాషణ కొనసాగించుచున్నాడు, నీవు దానిని నమ్ముచున్నావా? జనులారా దానిని మీరు నమ్ముచున్నారా?
63నేనొక వ్యక్తిని కనుగొనవలసి యున్నది. నీకు అనేక బాధలు గలవు. ఆ బాధలలో ఒకటిగా, నీ కుడి కంటిలోపల కండరము పేరుగుచున్నది. అదే నీ బాధలలో ముఖ్యమైనది. అది కాకుండా ఇంకొక బాధ గలదు. ఒక స్త్రీ ఇచ్చట కనబడుచున్నది. ఆమె నీ భార్య. ఇప్పుడు నీ భార్యకు గల బాధ ఏమిటన్నది దేవుడు నాకు బయలుపరచగలడని నీవు నమ్ముచున్పావా? ఆమెకు నోటిలో వ్యాధి గలదు, అనగా ఆమె పళ్లకు సంబంధించినది. అది నిజము. సీమోనగు పేతురును గురించి ఎరిగిన అదే దేవుడు నీవు ఎవరనే దానిని గూర్చి నాకు బయలుపరచగలడని నీవు నమ్మగలవా? అది నీ నమ్మకమును వర్ధిల్లింపజేయుచున్నదా? అది చేయుచున్నదా? నీ పేరు ఆస్కర్ బర్న్స్. అది నిజమేనా? నీ మార్గమున ఇంటికి వెళ్ళి — స్వస్థతను పొందుకొనుము.
64[టేపు ఖాళీగా యున్నది.]… నీకు పరిచయము లేనివాడిని. నీ గురించి నాకు తెలియదు గాని, దేవునికి నీ గురించి తెలియును. నీలోయున్న బాధ ఏమిటనే దానినిగూర్చి ఆయన నాకు చెప్పగలడని నీవు నమ్మగలుగుచున్నావా? హృదయపూర్వకముగా దానిని నీవు నమ్మగలుగుచున్నావా? నీ బాధంతా నీ గొంతు చుట్టుయున్నది. నీ గుండె నందు ఎముక క్రుళ్ళి చెడిపోవుట వలన నీ ఎముకలయందు ముడులు, ముడులుగా ఏర్పడి గుండ్రముగా మారినవి. అవును. నీవు ఈ ప్రాంతానికి చెందినవాడివి కాదు. చుట్టు ఆరంజి పండ్ల తోటలు గల పట్టణములో యున్నావు. అది ఒక లోయ వంటిదై, దాని వెనుక చుట్టు ఎత్తైన పర్వతములతో గలదు. ఆంట్లర్ అనే హోటలు అచ్చట గలదు. అది సాస్-బెర్నార్డ్డినో. అచ్చట నుండియే నీవు వచ్చితివి. నీవు నమ్మగలిగితే, నమ్మి తిరిగి వెళ్ళుము — యేసుక్రీస్తు నిన్ను స్వస్థపరచును.
కేన్సర్ వ్యాధి స్వస్థత పరచుటకు ఒకే ఒక్క మార్గము మాత్రమే గలదు. అది దేవునివలన మాత్రమే యగును. ఆయన నిన్ను స్వస్థతపరచగలడని నీవు నమ్మగలవా? దానిని నమ్ము. నమ్మి వెళ్ళు, ప్రభువగు దేవుడు నీకున్న ప్రతి చిన్న కార్యమును సరి చేయును గాక!
65నీవు ఇచ్చటకు వచ్చుటకు గల కారణమేదనగా నీకు నరముల బలహీనత గలదు. చాలా విసుగు చెందితివి. ఈ నరాల బలహీనత వలన నీ కడుపు పరిస్థితి బాగుండదు. నీవు తీసుకొనే ఆహారము జీర్ణము కాకపోవుట వలన మరల అది నీ నోటి గుండ బయటకు వచ్చును, నీ నోటి యందు ఒక విధమైన ఆమ్లము ఉరుచుండును. సాయంకాల సమయమందు వీటన్నిటి వలన చాలా అలసిపోతావు. నీకు కడుపులో పెప్టిక్ అలర్ అనే వ్యాధి గలదు. దానిని యేసుక్రీస్తు చెప్పెనని నీవు నమ్మ గలుగుచున్నావా.
నీవు ఎలాగ వున్నావు? నీరు అనేక బాధలు గలవు. కాని వీటన్నింటిలోను నిన్ను ముఖ్యముగా భయపెట్టుచున్నది ఒకటి గలదు, అది కీళ్ల నొప్పివలన నీవు క్రుంగి పోవుచున్నాను. కాని దాని నుండి విడుదల చేసి దేవుడు నిన్ను స్వస్థపరచగలడని నీవు నమ్ము చున్నావా? ప్రభువైన యేసూ, మా సోదరికి దృష్టిని అనుగ్రహించమని ప్రార్ధించుచున్నాను. స్త్రీల బాధనుండి విడుదల దయచేసి, కీళ్ళ నొప్పి నుండి బాగుచేయుము. యేసుక్రీస్తు నామమున. ఆమేన్. ఇప్పుడు నమ్మి వెళ్ళుము, ఆయన దానిని బాగుచేయును. అది మంచిది. దానిని సందేహించకు. నీ హృదయమంతటిలో దానిని నమ్మి ముందుకు కొనసాగిపో.
గుండె నొప్పి అనునది ఒక భయంకరమైనది, అయితే యేసు ఆ గుండెను స్వస్థపరచగలడు. దానిని నీవు నమ్ముచున్నావా? నమ్ముచు వెళ్ళుము, అది జరిగి తీరును.
నీవు వికలాంగుడవైపోతావని నీవు నమ్ముచున్నావా? లేదు, నేను అలా తలంచుట లేదు. అది కీళ్ల నొప్పి అని అనుకుంటున్నాను. ఆ నీడ అచ్చట గలదు, ఓ, అది కేన్సర్. ఆయన దానిని స్వస్థపరచగలడని నమ్ముచున్నావా? నమ్ముచూ వెళ్ళుము — నీ సమస్తమును ఆయన సరి చేయును.
కొద్ది కాలముగా నిన్ను బాధ పెట్టుచున్న ఆ వ్యాధి గుండెనొప్పి, కాని ఈ రాత్రి అది ఇక వుండదని నీవు నమ్ముచున్నావా? యేసు క్రీస్తు నిన్ను స్వస్తపరచెనని నమ్మి వెళ్ళుము.
అది స్త్రీలకు యుండు వ్యాధి, అది చిన్న వ్యాధియే నీకు చాలా కాలముగా అది గలదు. ఉదయమున నీవు లేచుటకు చాలా ఇబ్బంది పడతావు. నీ కాళ్ళు పట్టుకుపోతాయి. చాలా పొద్దుపోయే వరుకు నీవు సరిగ్గా నడువలేవు. అది కీళ్ల వ్యాధి. అది ఇక నీకు ఉండదు. దానిని సందేహించకుండా, కేవలము నీ హృదయ పూర్వకముగా నమ్మి ముందుకు వెళ్ళుము.
66నీవు అనేక సమస్యలతో బాధపడుతున్నావు, కాని ఒక కార్యము అది నిన్ను ఎంతగానో బాధపెట్టుచున్నది. కీళ్ళ నొప్పిను గూర్చి కూడా నీవు ఆలోచించున్నాను. అది నిన్ను కృంగదీయుచున్నది. ఆయన నిన్ను నడిపించగలడనియు మరియు నిన్ను ఆయన స్వస్థపరచుననియు నీవు నమ్ముచున్నావా? యేసుక్రీస్తు నిన్ను స్వస్తపరచునని నీ హృదయమంతటిలో నమ్ముచు వెళ్ళుము.
నీకు గుండె బలహీనత మరియు కీళ్లనొప్పులు గలవు - కాని దేవుడు నిన్ను స్వస్థపరచునని నీవు నమ్మగలుగుచున్నావా? నీవు నమ్మగలవా? వెళ్ళుము, ప్రభువగు యేసు నిన్ను బాగుచేయును.
కొన్ని సంవత్సరములుగా నీ కడుపులో ఎన్నో ఇబ్బందులు గలవు. నిజమే కదా, అది ఇక మీదట నీకు యుండదు. నమ్మి వెళ్ళుము, దేవుడు నిన్ను దీవించును గాక!
నీకు కూడా కడుపులో ఇబ్బంది గలదు. సందేహించకుండా, నమ్మి వెళ్ళుము, అది స్వస్థపరచబడినది.
శ్వాస పీల్చుకొనుటకు నీవు చాలా ఇబ్బంది పడెదవు. ఆ పాత ఉబ్దస రోగము నిన్ను బాగ కృంగదీయుచున్నది. అవును కదా! అది బాగుచేయబడియున్నదని నీవు ఇప్పుడు నమ్మగలుగుచున్నావా? అది మంచిది. నమ్మి, వెళ్ళుము. హల్లేలూయా! మీరు మీ హృదయమంతటితో నమ్మగలుగుచున్నారా!
67ఒక్క నిమిషము ఆగండి, అచ్చట ఆ వెలుగును మీరు చూడగలుగుతున్నారా! అచ్చట కూర్చొనియున్న ఒక నల్లని స్త్రీ నా వైపు చూచుచున్నది. ఆమెకు ఎడమ ప్రక్కన కండరము పెరిగియున్నది. మూత్ర పిండముల వ్యాధితోను, అనేక ఇబ్బందులతో బాధపడుచున్నది. నీవు ఎక్కువ విశ్వాసమును కలిగియుండవలయును. నీవు ఇచ్చటకు పైకి రావలసిన అవసరము లేదు. అది బాగైపోయినది. కేవలము దానిని నమ్ముము. ఆమేన్. దేవునియందు విశ్వాసము కలిగియుండుము. మీరు వచ్చుచున్నారా!
సహోదరీ, నీవు నమ్ముచున్నావా? అచ్చట కూర్చొనియున్న, సోదరీ, నీకు గల వెన్నెముక నొప్పి నుండి నీవు విడుదల పొందుకోగలవా? ఏ మాత్రము సందేహించకు, నీవు కేవలము నమ్మితే చాలును, స్వస్థతను పొందుకోగలవు.
ఇచ్చట కూర్చొని నా వైపే చూచుచున్న వ్యక్తి, అతడు ప్రోస్టేట్ సమస్యతో బాధపడుతున్న వ్యక్తి, రాత్రులయందు అలా లేచి కూర్చున్నట్లుగా యుండును. అయ్యా, నీవు నమ్ముచున్నావా? అది బాగవును, దానిని కేవలము నమ్ముము.
68నా వైపే నన్ను చూస్తూ ఇచ్చట నల్లని వ్యక్తి ఒకరు కూర్చునియున్నాడు. అతడు మూర్చ వ్యాధితో బాధపడుచున్నాడు. పరిశుద్ధాత్మ బాప్తిస్మము పొందుకోవాలని కూడా ఆశించుచున్పాడు. నీ కాళ్ల మీద నీవు నిలబడి, నీ స్వస్థతను నీవు అంగీకరించుము. నీవు కోరుకుంటున్న పరిశుద్ధాత్మ బాప్తిస్మమును దేవుడు నీకు అనుగ్రహించును గాక! ఆమేన్. నమ్ము, నీ హృదయ పూర్వకముగా దానిని నమ్మి ముందుకు వెళ్ళుము.
నీ ప్రక్కనే కూర్చొనియున్న, అచ్చట ఒక బిడ్డ కూర్చొనియున్నది. ఆ బిడ్డకు కూడా మూర్చ వ్యాధితోనే బాధపడుచున్నది. ఒక విధముగా పడిపోతూ వుంటాడు, ఆ ప్రక్కన కూర్చొని యున్నాడు. అచ్చటయున్న ఆ బిడ్డను దేవుడు స్వస్థపరచునని నీవు నమ్మగలుగుచున్నావా? నీ హృదయమంతటిలో నీవు దానిని నమ్ముము. అట్లైన ఆ బిడ్డను దేవుడు స్వస్థపరచును.
GEN 22:17
69మీలో వున్న ప్రతీ ఒక్కరు, మీరు నమ్ముతున్నారా? ఆయన నిజముగా అబ్రాహాము యొక్క రాజ సంతానము కాదా? ఆయన గొప్ప జయశీలుడు కదా! శత్రువుల యొక్క గవిని మీరు స్వాధీనపరచుకొనుదురని ఆయన వాగ్దానము చేసియుండలేదా? మీలో ఎంతమంది బంధింపబడియున్నారు, శత్రువు యొక్క ఒత్తిడిని ఎంతమంది తెలుసుకో గలుగుచున్నారు? మీ చేతులను పైకెత్తండి, శత్రువు యొక్క ఒత్తిడిని ఎరుగగలిగినవారు. మీరు అబ్రాహాము యొక్క సంతానమై యున్నారు. బ్రెన్హాం సహోదరుడా, నేను నరముల ఉద్రిక్తతతో బాధపడుచున్నాను, అని చెప్పెవారు, మీ చేతులను పైకి ఎత్తండి. ఓ, మీలో ఎనభై శాతం మంది దానితో బాధపడుతున్నారు.
అది చాలా మందముగా కనబడుచున్నది. భవనము లోపలంతా జనసమూహముతో ఒక గొప్ప పెద్ద పాల వెన్నెల వంటి వెలుగువలె మారిపోయినది. అది ఇంచుమించు నన్ను గ్రుడ్డివానిగా చేయుచున్నది, అచ్చట వెలుపల మీరెచ్చట యున్నారు.
HEB 13:8
70మీరు చూచుచున్నారా — ఇరువది, ముప్పది లేదా అంతకంటే ఎక్కువ మందే ఆ జనులలో నుండియు ఇచ్చట వేదికయందు అటువంటి పరిస్థితిని గలవారు గలరు. దేవుడు తప్పిపోడు. యేసుక్రీస్తు నిన్న, నేడు, నిరంతరము ఏకరీతిగా యున్నాడు. మీరు దానిని నమ్ముతున్నారా? అట్లైన, ఎందుకని, అబ్రాహాము యొక్క ప్రతీ సంతానము ఆ తాళపుచెవిని ఎందుకు ఉపయోగించకూడదు? ఆ గొప్ప జయశాలి, నీ కొరకే దానిని జయించెను. ఇచ్చట, ఆయన ఇచ్చట దానిని రుజువుపరచియున్నాడు, ఆయనను మీరు నమ్ముచున్నారా? అట్లైనయెడల, విశ్వాసమనే ఆ తాళపుచెవిని మీరు ఉపయోగించండి, దానిని మీ చేతులలో తీసుకొని, ఇప్పుడు, ఈ క్షణమందే, "యేసుక్రీస్తూ, నీవు నాకు అనుగ్రహించిన స్వస్థతను నేను నమ్ముచున్నాను," అని చెప్పండి. మీ కాళ్ళపై మీరు నిలబడండి. ఇప్పుడు మీరు విశ్వాసము తెరచి, మీ చేతులను పైకెత్తండి. "ప్రభువైన యేసూ, నేను నమ్ముచున్నాను, ఈ క్షణమందే నేను నమ్ముచున్నాను."
ఇప్పుడు ఒకరి మీద ఒకరు మీ చేతులను ఉంచండి. ఒకరిపై ఒకరు అబ్రాహాము సంతానముపై మీ చేతులను ఉంచండి. ఇప్పుడు ఆ వ్యక్తి కోసము మీరు ప్రార్ధించండి. మీ చేతులను వారిపై ఉంచండి. "విశ్వసించువారియందు ఈ సూచక క్రియలు వెంబడించుననియు, వ్యాధిగ్రస్తులపై చేతులుంచి ప్రార్దించునప్పుడు, వారు స్వస్థత పొందుదురని యేసు చెప్పెను."
సాతానా, యుద్ధమందు నీవు ఓడిపోయావు. ఈ జనులు దేవుని మహిమార్ధముగా విడుదల నొంది వెళ్ళునట్లుగా, యేసుక్రీస్తు నామమున బయటకు రా.