అప్పుడు యేసు వచ్చి పిలిచెను

అప్పుడు యేసు వచ్చి పిలిచెను

1పరిశుద్ధ యోహాను 11వ అధ్యాయము, 18వ వచనము నుండి ప్రారంభించి, నేను చదువగోరుచున్నాను.

బేతనియ యెరూషలేమునకు సమీపమైయుండెను; దానికి ఇంచుమించు కోసెడు దూరము:

గనుక యూదులలో అనేకులు వారి సహోదరుని గూర్చి మర్తను మరియను ఓదార్చుటకై వారి యొద్దకు వచ్చియుండిరి.

మార్త యేసు వచ్చుచున్నాడని విని ఆయనను ఎదుర్కొన వెళ్ళెనుగాని, మరియ ఇంటిలో కూర్చుండియుండెను.

మార్త యేసుతో - ప్రభువా, నీవిక్కడ ఉండినయెడల నా సహోదరుడు చావకుండును.

ఇప్పుడైనను నీవు దేవుని ఏమడిగినను దేవుడు నీకనుగ్రహించునని యెరుగుదుననెను.

యేసు - నీ సహోదరుడు మరలా లేచునని ఆమెతో చెప్పగా,

మార్త ఆయనతో - అంత్యదినమున పునారుత్థానమందు లేచునని యెరుగుదుననెను.

అందుకు యేసు - పునరుత్థానమును జీవమును నేనే; నా యందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును:

బ్రదికి నాయందు విశ్వాసముంచు ప్రతివాడును ఎన్నటికిని చనిపోడు. ఈ మాట నమ్ముచున్నావా? అని ఆమెను అడిగెను.

ఆమె - అవును ప్రభువా, నీవు లోకమునకు రావలసిన దేవుని కుమారుడైన క్రీస్తువని నమ్ముచున్నానని ఆయనతో చెప్పెను. [దానిని గమనించండి!]

ఆమె ఈ మాట చెప్పి వెళ్ళి - బోధకుడు వచ్చి నిన్ను పిలుచుచున్నాడని, తన సహోదరియైన మరియను రహస్యముగా పిలిచెను.

2మనము ప్రార్థన చేసుకొందాము.

ఇప్పుడు నీ కొరకు మేము కనిపెట్టుచుండగా, పరలోకపు తండ్రి, ఈ రాత్రి ఆ మాటలను మా హృదయములకు ధృవపర్చుము. నీ వాక్యమును, నీ సేవకుడిని, మరియు ఈ అంశమును, అంతయూ యేసుక్రీస్తు నామములో నీకు అప్పగించుచున్నాము. ఆమేన్. మీరు కూర్చొన వచ్చును.

3నేను ఇక్కడ యుండుటలో ఉద్దేశ్యము దేవుని బిడ్డలకు సహాయపడుటకు ప్రయత్నించుటయే. కొంత వరకు ప్రార్థన చేయుట, రోగులపై చేతులుంచుట మాత్రమే కాదు, కాని దేవుని కుమారుడైన యేసుక్రీస్తు మన మధ్య యున్నాడని, వారు తప్పక గుర్తించవలసియున్నది. ఈ రాత్రి ఈ అంశము మీద మనము మాట్లాడుచున్నాము, "అప్పుడు యేసు వచ్చి పిలిచెను."

4ఇప్పుడు మనము మాట్లాడుతున్న సమయము, అది ఒక చాలా విచారకరమైన సమయమైయున్నది. మీరు ఎన్నడైనా ప్రభువు యొక్క జీవితములోని కథను మీరు చదివినట్లైతే, ఆయన ఈ కుర్రవానికి లాజరకు, గొప్ప స్నేహితుడైయున్నాడు. యోసేపు చనిపోయిన తరువాత, ఆయన ఆ స్థలమును విడిచి, మరియ, మార్త, లాజరుతో జీవించుటకు వచ్చియున్నాడు. వారు గొప్ప స్నేహితులైయున్నారు. ఆయన వారికి, ఒక కాపరివలె, ఒక నిజమైన స్నేహితునివలె యున్నాడు. ఆయన ధరించుటకు కొన్ని చిన్న వస్తువులను, ఒక అంగీని, వారు తయారు చేశారు. ఆ అంగీ పై నుండి క్రింది వరకు కుట్లు లేనిదీగా, అల్లిక చేయబడినదిగా వారు చెప్పుచున్నారు అని నేను నమ్ముచున్నాను. వారు ఆయన కొరకు కొన్నిటిని చేశారు, ఎందుకనగా వారు ఆయనయందు నమ్మికయుంచారు. వారు దానిని నమ్మియున్నారు మరియు చూసియున్నారు. వారు ఆయనను వెంబడించుటకు, వారి సంఘమును తదితరమైన వాటిని విడిచి పెట్టారు.

ఆ దినమున అలా చేయుట ఒక గొప్ప కార్యమైయున్నది, దాని నుండి దూరముగా వెళితే, దానికి మరణమే జరిమానాయై యున్నది.

MATT 15:6•

MARK 7:13

 

5కాని యేసు… ఈ వ్యక్తి చుట్టూ తిరిగుచు వారు చెప్పియున్నట్లుగా, వారి యొక్క సంఘములను చీల్చివేయుచూ, వారి యొక్క యాజకులను గూర్చి చెడ్డ విషయములను మాట్లాడుతున్నాడు, ఆయన వారికి గొప్ప కీడును జరిగించియున్నాడని వారు తలంచిరి. కనీసము ఆయనను ఒప్పుకొంటే, వారి సమాజ మందిరములో నుండి వెలివేయబడతారు.

అలాగైతే నీవు వారి యొక్క సంఘమునకు బయటయున్నట్లైతే, నీకు విమోచించబడే అవకాశము లేదని వారు తలంచారు. పరిసయ్యులు, సద్దూకయ్యులు లేక అలాటి మరి దేనికైనను నీవు చెందకపోయినట్లైతే, దానికి బయట అక్కడ నీకు విమోచన లేదు. వారు హక్కును కలిగియున్నట్లుగా, తాళపుచెవులు కలిగియున్నట్లుగా, వారు కోరినట్లైతే, వారు నిన్ను బయటకు తన్నివేయగలరు. అది వారి యొక్క సొంత నినాదము. ఆశ్చర్యము లేదు, యేసు అన్నాడు, "మీరు, మీ యొక్క ఆచారము ద్వారా, దేవుని యొక్క వాక్యమును ప్రభావము లేనిదిగా చేశారు," చూచారా.

2PET 1:20

 

6మరియు ఇప్పుడు పునరావృత్తమైనది, ఎందుకనగా చరిత్ర పునరావృత్తమవుతుందని మనందరికి తెలుసు. అది చెప్పుట విచారము, కాని అది పునరావృత్తమవుతుందని ప్రవచించబడింది, అది మరలా అది దానిని చేసింది. వారు యేసును గూర్చి బాగుగా తలంచలేదని మనము కనుగొన్నాము.

అనేకసార్లు, వారితో సమ్మతించని మనిషికి తీర్పు తీర్చుతారు. మనము దానిని చేయరాదు. మనము ఒకరితో ఒకరము సమ్మతించకపోవచ్చు, ఇంకనూ స్నేహముగా యుండుడి. నేను ఒక మనిషితో సమ్మతించకపోయినట్లైతే, లేఖనముల యొక్క ఆధారము మీద అతనితో సమ్మతించకపోవచ్చు. ఇంకనూ అతని కొరకు ప్రార్థించండి మరియు అతనిని ప్రేమించండి, మరియు మంచి అవగాహన కొరకు, అప్పుడు అతనితో నేను ఏమియు చెప్పను. నేను ఎల్లప్పుడూ అతనితో స్నేహపూర్వకముగా అసమ్మతితో యుంటాను, ఏలయనగా నేను అతనిని ప్రేమిస్తాను, మరియు నిశ్చయముగా అతడు తప్పిపోవుట నాకు ఇష్టము లేదు. అతడు తప్పక నాతోను దానినే చేయవలసియున్నది. మేము నశించిపోవుటను కోరము. తప్పక వాక్యము ఏమి చెప్పుతుందో దానిపై మన తలంపులను ఆధారము చేసుకోవాలి. వాక్యమే సత్యముగా యుండనిమ్ము. మన సిద్దాంతములు కాదు, లేక మన తలంపులేమై యున్నవో అవి కాదు, కాని ఆయన ఏమి చెప్పుతాడో అదియే; సొంత అనువాదము వద్దు — సరిగ్గా వాక్యము ఏమి చెప్పుతుందో అదియే.

HAB 2:4•

ROM 1:17•

GAL 3:11•

HEB 10:38

 

7మొన్నటి రాత్రి, అది దరిదాపుగా దైవ దూషణగా కనబడునట్టి ఒకదానిని నేను చేశాను, అది మొన్న ఉదయమున సేవకుల అల్పాహారపు విందులో అని నేను నమ్ముతాను. నేను యేసును ఒక పరీక్షపై యుంచాను. నేనన్నాను, "సరిగ్గా అప్పుడు వారు చేసినట్లుగా, ఇప్పుడును వారు ఆలాగు చేయుచున్నారు." బహుశ ఒక్క క్షణము నేను దానిని, మనకు సమయముయున్నట్లైతే, దానిని తిరిగి చెప్పాలనుకొనుచున్నాను. లూధర్ యొక్క పునరుద్దరణలో, ఆ సమయములో, నీతిమంతుడు విశ్వాసమూలముగా జీవిస్తాడని అతడు చెప్పాడు. "దానిని నమ్మిన వ్యక్తి, దానినతడు కలిగియున్నాడు." కాని మనము కనుగొనేదేమంటే, అనేక మంది దానిని నమ్మియున్నామని చెప్పుతారు, కాని అది వారు కలిగిలేరు.

జాన్ వెస్లీ దినములలో, వారు రెండవ దీవెనను పొందినట్లైతే, వారు దానిని శుద్ధీకరణ అని పిలిచారు, పూర్తి శుద్ధీకరణము, వారు సంతోషించి కేకలు వేశారు. ప్రతి ఒక్కరూ కేకలు వేసి, దానిని కలిగియున్నామనుకొన్నారు. కాని వారు దానిని కలిగిలేరని వారు కనుగొన్నారు. వారిలో అనేకులు కేకలు వేసి దానిని కలిగిలేరు.

పెంతెకొస్తు దినాలు, వారు చెప్పారు, "ఇప్పుడు వరముల పునరుద్దరణ వచ్చియున్నది, ఆత్మ యొక్క బాప్తిస్మము. భాషలతో మాటలాడువాడు దానిని పొందియున్నాడు." అనేకమంది భాషలతో మాట్లాడినట్లు మనము కనుగొనియున్నాము మరియు దానిని పొందుకోలేదు.

GAL 5:22

 

8వారన్నారు, "మంచిది, ఆ ఆత్మఫలమైయున్నది, అది అదే అయి యున్నదన్నారు." ఓ, కాదు, ఆత్మ యొక్క ఫలము కాదు. క్రైస్తవ శాస్త్రము దానిని కలిగియున్నది, ప్రేమ ఆత్మ యొక్క ఫలమైయున్నది. అలాగైతే, వారు ఏ ఒక్కరి కంటెను ఎక్కువ ప్రేమను కలిగియున్నారు, మరియు యేసు క్రీస్తు దైవత్వమును నిరాకరిస్తారు, కేవలము ఆయనను ఒక ప్రవక్తగా పిలుస్తారు, ఒక సాధారణమైన మనిషంటారు, చూడండి. కాబట్టి దానిని చేయలేదు. ఒక్క నిమిషము దానిని నన్ను ప్రశ్నింపనియ్యండి.

యేసును పరీక్ష కొరకు తీసుకొందాము. ఒక్క నిమిషము నేను ఆయనకు వ్యతిరేకముగా యుండబోవుచున్నాను, వేదిక మీద నుండి నేను దీనిని చెప్పుచున్నందున దేవుడు నన్ను క్షమించును గాక, కాని నేను సరిగ్గా మీకు వెలుగును తెస్తాను, చూడండి.

EXOD 29:38•

GAL 5:22,23•

1JN 4:8,16

 

9ఇక్కడ ఇద్దరిని నేను ఇక్కడ కలిగియున్నాను… నేను మీతో మాట్లాడుచున్న ఈ రాత్రి నజరేయుడగు యేసు భూమి మీదయున్నప్పుడు, ఆ వెనుక నేను మరొక దినములో యున్నాను. ఇప్పుడు ఈ మనిషికి, నజరేయుడగు యేసుకు వ్యతిరేకముగా తర్కించుటకు, నేను మీ యొద్దకు వస్తాను.

ఇప్పుడు దేవుడు ప్రేమయైయున్నాడని మన అందరికి తెలుసు. ఆయన ప్రేమయైయున్నాడని బైబిలు చెప్పుతుంది. మంచిది, ప్రేమ, ఆత్మ యొక్క దీర్ఘశాంతము, సాత్వికము, సహనము, మంచితనము మొదలగునవి, ప్రేమయైయున్నవి.

ఇప్పుడు నేనంటాను, నేను మిమ్మును ఒకటి అడుగుతాను. మనము ఎరిగియున్నట్లుగా ఒక క్రైస్తవుని తీసుకొందాము. "మీ ప్రాచీనమైన యాజకుని వైపు చూడండి. అతని యొక్క తాత, తాత, తాత, ముత్తాత ఒక యాజకుడైయున్నాడు. ఒక యాజకుడిగా యుండుటకు, అతడు ఆ వంశావళిలో జన్మించవలసియున్నది. ఇప్పుడు, మనము కనుగొనునది ఏమనగా, మీలోని మిగిలిన వారి వలే, అతడు ఒక యవ్వనస్తుని జీవితమును కలిగియుండలేదు. అతడు ఏమి చేస్తాడు? అతడు ఆ పైన దేవుని వాక్యమును పఠిస్తూ యుంటాడు, ఆ గ్రంధపు చుట్ట మీద ప్రతిమాటను అతడు ఎరుగవలసియున్నాడు. దేనిని గూర్చియైనా, తప్పక అతడు దానిని ఎరుగవలసియున్నాడు.

10తరువాత, అదియును గాక, నీ యొక్క తల్లిదండ్రులకు వివాహమైనప్పుడు, భార్య భర్తలుగా వారిని జతపరిచినవారెవరు? మీ దైవభక్తిగల వృద్ధ యాజకుడు గదా. తన పొలము మీద బాకీపడినప్పుడు, దానిపై కొంత రుణమున్నప్పుడు, తన దారులు దానిని తీసుకొనుటకు వచ్చినప్పుడు, నీ తండ్రి యొద్దకు వచ్చిన వారెవరు? ఆయన పక్షమున నిలబడినది ఎవరు? నీ యొక్క దయగల వృద్ద యాజకుడు గదా. ఆ గదిలో నీకు జన్మనిస్తూ యుండగా, నీ తల్లి పక్షమున నిలబడినది ఎవరు? దయగల వృద్ద యాజకుడు గదా. నీవు అవసరతలో యున్నప్పుడు, నీవు రోగిగా యున్నప్పుడు, నీ యొద్దకు వచ్చేదెవరు. అప్పగించి, ఎనిమిదవ దినమున నీకు సున్నతి చేసింది ఎవరు? నీ దయగల వృద్ధ యాజకుడు గదా. నీ తల్లిదండ్రులు దరిదాపుగా విడిపోవుటకు సిద్ధమైనప్పుడు, వారిని తిరిగి ఏకము చేసి, ఒక్కటిగా పట్టుకొన్నది ఎవరు? నీ దయగల వృద్ద యాజకుడు. మీ ఇరుగు పొరుగులో ఇబ్బంది ఏర్పడినప్పుడు, దాని పట్ల శ్రద్దవహించేది ఎవరు? నీ దయగల వృద్ద యాజకుడు. నిశ్చయముగా.

11ఇప్పుడు, బలి అర్పణ కొరకు గొర్రెపిల్ల అవసరమైయున్నదని ఈ విధమైన వృద్ద యాజకులకు తెలుసు. మీలో అనేకమంది మనుషులు వ్యాపారస్తులు యున్నారు, కాబట్టి మీరు గొర్రెపిల్లను పెంచరు, అయినను దేవునికి ఒక గొర్రెపిల్ల అవసరమై యున్నది. వారు కొన్ని వ్యాపారపు కొట్లను తయారుచేసి, వారి యొక్క గొర్రెలను అమ్ముతారు, ఆ ప్రకారము వ్యాపారస్తులు అక్కడకు వెళ్ళి, వాటిని కొని, దేవుడు కోరినట్లుగా, వారి ఆత్మకు ఒక బలి అర్పణకు అర్పిస్తారు.

ఈ యేసు అని పిలవబడు యవ్వనస్తుడు ఏమి చేశాడు? అతడు ఎక్కడ నుండి వచ్చాడు? ఒక కన్యక గర్భమున జన్మించానని చెప్పాడు. అలాటి వెర్రి సంగతిని మీలో ఎవరైనా విన్నారా? అతని తల్లి మరియ యోసేపు వివాహమునకు ముందే అతడు జన్మించాడు. ఇప్పుడు మనము కనుగొనేదేమంటే, ఆరంభము నుండియే అతడు ఒక చెడ్డ పేరును కలిగియున్నాడు. "ఏ సభ్యత్వపు కార్డును అతడు కలిగియున్నాడు? అతడు ఒక దైవభక్తి గల మనిషి అయితే, ఏ గుంపులో అతడు చేరాడు? మీ యాజకులు, వాక్యమును తెలుసుకొనుటకు పఠించి, పఠించి, పఠించి, పఠించి యున్నారు; అతడు ఇక్కడకు వచ్చి, మనము నిర్మించినవాటిని చీల్చివేయుచున్నాడు. అది దేవుడు అని మీరు పిలుస్తారా? నిశ్చయముగా కాదు.

MATT 21:12•

JOHN 2:15

 

12ఇప్పుడు, మొన్నటి దినమున, మీరు బలి అర్పణ కొనగలుగునట్లు, మీ యొక్క యాజకులు ఆ స్థలమును అక్కడ సిద్దము చేసినప్పుడు, ఈ యవ్వనస్తుడు ఏమి చేశాడో తెలుసా? దయా? త్రాళ్ళతో, తోలుతో కొరడాలు చేసి, కోపముతో ప్రజల వైపు చూసి, ఆ బల్లలను తన్నివేసి, అక్కడ నుండి వారిని కొట్టి బయటకు తరిమివేశాడు. మరియు కోపముతో వారి వైపు చూచుట, ఆత్మ యొక్క ఫలమంటారా చూడండి?

యెహోవాను ఆరాధించే అవకాశమును ఒక మనిషికి లేకుండా చేశాడు. వ్యాపారస్తులు ఆయనను ఆరాధించ గోరుచున్నారు. అతడు గొర్రెలను పెంచడు, దానిని కొనడానికి అతడు అక్కడకు వెళ్ళాడు. ఆయన వారి బల్లలు పడద్రోసి, వారిని తన్ని, బయటకు వెళ్ళగొట్టెను. అక్కడ ఆత్మయొక్క ఫలమును ఎవరు కలిగియున్నారు? చూడండి?

అక్కడే నీవున్నావు, చూడు. ఆత్మ యొక్క ఫలము కాదు, భాషలు మాట్లాడుట కాదు, కేకలు వేయుట కాదు.

13నీవంటావు, "అలాగైతే బ్రెన్హాం సోదరుడా, రుజువు ఏమిటి? రుజువు ఏమియున్నది?" ఆ ఘడియలోని వాక్యమే సత్యమని రుజువైయున్నది. వారు బైబిలును కలిగియున్నారు. యెహోవా ఏమి సంభవిస్తుందని చెప్పియున్నాడో, ఆయన ఖచ్చితముగా అదే అయి యున్నాడు. దానికి ఏ అనువాదము అవసరము లేదు. అది ఎక్కడ అనువదింపబడింది. అక్కడ మీ యొక్క యాజకులున్నారు, మరియు సమస్తమూ జరుగవలసిన క్రమములో జరిగియున్నది, కాని ఇంకనూ వాక్యమును చూచుటలో వారు తప్పిపోయారు. ఆ యుగము కొరకు ఆ వాక్యము జీవించునట్లుగా ఆయన తయారు చేశాడు. అదే ఆ యుగము యొక్క రుజువైయున్నది.

లూధర్ తన యుగము యొక్క రుజువును కలిగియున్నాడు, వెస్లీ తన యుగములో, పెంతెకొస్తు దాని యుగములో రుజువును కలిగియున్నది, కాని మనము మరొక యుగములో యున్నాము. అవి మంచి కార్యములై యున్నవి. కాని సరిగ్గా ఒక చిన్న బిడ్డవలె, ఒక వేలిని, ఒక కంటిని, ముక్కును కలిగియున్నట్లుగా; కాని కొద్ది కాలము తరువాత అతడు, ఒక మానవ జీవిగా మారతాడు. అతడు పరిపక్వమైన బిడ్డగా మారవలసియున్నది; అతడు పరిపక్వమైన ఒక బిడ్డగా మారతాడు, అప్పుడు పుడతాడు — ఒక ఆత్మను, శరీరమును, ప్రాణమును కలిగియుంటాడు, అప్పుడు చుట్టూ కదలగలడు.

14ఇప్పుడు మనము కనుగొనేదేమంటే, ఇదంతయూ యేసు కొంచెము మట్టుకే ప్రకటించియున్నాడు. సరిగ్గా జీవమునకు నిర్ణయించబడిన వారు, ఆయనను చూశారు. గొప్ప సమూహములు కాదు. ఆయన జనసమూహములు ఎన్నడూ కయప యొక్క జనసమూహముల వలె యుండలేవు. ఎందుచేత, కయప దేశమునంతా ఒక్కటిగా పిలవగలడు. యేసు కొద్దిమందినే ఏకముగా పిలిచెను. అనేకులు ఆయనను ఎరుగలేదు. వేలకొలది సార్లు వేలకొలదిగా, ఆయన భూమి మీదకు వచ్చినప్పుడు. ఆయన భూమి మీద నడిచాడు, కనీసము ఆయన అక్కడ యున్నాడని వారికి తెలియదు.

కాబట్టి అది ఆలాగునే మరలయుంటుంది. జీవమునకు పిలువబడిన వారి యొద్దకు ఆయన వచ్చాడు. ఎవరు జీవమునకు పిలువబడ్డారో ఆయనకు తెలుసు. దాని పట్ల శ్రద్ద వహించుట ఆయన పనియైయున్నది.

15ఇప్పుడు వారు సంఘములో నుండి బయటకు వచ్చారని, మనము గమనించాము, మరియు వారు ఆయనను నమ్మియున్నారు. వాక్యము ఆయనను గూర్చి సమస్తమూ చెప్పియున్నది. ఆయన అక్కడ యున్నాడు. ఒక రోజు ఆయన వారి గృహమును విడిచి వెళ్ళాడు. నేను మూడు విషయములను గూర్చి మాట్లాడతాను. యేసు వారిని విడిచి వెళ్ళాడు, మరణము లోనికి వచ్చింది, అన్ని ఆశలు గతించిపోయినవి. కొన్ని నిమిషములు ఆ మూడు విషయముల మీద నేను మాట్లాడతాను.

యేసు వెళ్ళిపోయాడు. ఆయన వెళ్ళిపోయినప్పుడు, ఇబ్బంది వచ్చింది. ఇప్పుడు ఆయన నిన్ను విడిచిపెట్టినప్పుడు, లేక గృహమును లేక నీవు నివశించు స్థలమును విడిచినప్పుడు, ఇబ్బంది, మార్గములో యున్నది. యేసు వెళ్ళిపోయినప్పుడు, సాతానుకు ద్వారము తెరవబడింది. ఆయన వెళ్ళిపోయాడు. ఆయన వెళ్ళిపోగానే, మరణము లోనికి వచ్చింది. యేసు బయటకు వెళ్ళిపోయినప్పుడు, మరణము లోనికి వస్తుంది. ఆయన నుండి వేరగుట మరణమై యున్నది, కాబట్టి యేసు బయటకు వెళ్ళిపోయినప్పుడు, మరణము లోనికి వచ్చింది.

JOHN 5:19•

JOHN 11:3,6,22•

ROM 8:28

 

16మరణము లాజరుతో నిలిచియున్నది.

అప్పుడు వారు నమ్మియున్న, మరియు ప్రేమించినవాని కొరకు, వచ్చి లాజరుకు ప్రార్థించమని కబురు పెట్టారు, ఏలయనగా ఆయన దేవునిని ఎరిగియున్నాడని, వారు చూసియున్నారు. ఆ వెనుక మార్త చెప్పినట్లుగా, ఆయన దేవుని ఏమి అడిగినను, "ఆయన దేవునికి ఏది చెప్పినను, దేవుడు దానిని చేస్తాడు." దేవుడు మరియు ఆయన ఒక్కటేనని ఆమె గుర్తించింది. ఆయన ఘడియకు వాక్యమైయున్నాడు, కాబట్టి ఆమె దానిని గ్రహించింది. ఆయనను కనుగొనగలిగినట్లైతే, బాగుండేదని ఆమె ఎరిగియుండెను, కాని ఆయన వెళ్ళిపోయాడు, వారు ఆయనను కనుగొనలేకపోయారు. ఆయన కొరకు వారు కబురు పెట్టారు, మరియు వచ్చుటకు బదులుగా, ఆయన ఇంకా ముందుకు వెళ్ళాడు. మరలా ఆయనను కబురు పెట్టారు, ఆయన వచ్చుటకు బదులుగా, ఇంకా ముందుకు వెళ్ళాడు.

కొన్నిసార్లు అలాటి సంగతులు ఎందుకు జరుగుతాయని మనము ఆశ్చర్యపోతాము, కాని "ఆయనను ప్రేమించువారికి సమస్తమును సమకూడి మేలు కొరకు జరుగుచున్నవి," అని లేఖనము చెప్పుట లేదా? ఆయన ఏమి చేయుచున్నాడో ఆయన ఎరుగును. ఆయన ఆలస్యము చేసినను, అది పరవాలేదు. ఆయన ఏమి చేస్తున్నాడో ఆయనకు తెలుసు, అక్కడ ఒక ఉద్దేశ్యమున్నది.

JOHN 11:11,14,15

 

17యోహాను 5:19లో మనము కనుగొన్నాము, "తండ్రి యేది చేయుట కుమారుడు చూచెనో, అదే కాని తనంతట తాను ఏదియు చేయనేరడు అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను." కొన్ని దినములు దూరముగా వెళ్ళమని తండ్రి ఆయనకు చెప్పాడు.

ఆ దినములు సంపూర్తియైన తరువాత, అప్పుడు ఏమి చెప్పాడో, తరువాత ఆయన చెప్పాడు, అదే, "మన స్నేహితుడైన లాజరు నిద్రిస్తున్నాడు." ఆయన అన్నాడు, "సరే, అతడు బాగుగానే యున్నాడు." ఆయన అన్నాడు, "అతడు చనిపోయాడు. మిమ్మును బట్టి నేను అక్కడ లేనందున సంతోషము." ఏలయనగా వారు ఆయనను అతని యొద్దకు వెళ్ళి స్వస్థపర్చమని లేక ఆయన ఏమి చేయాలో చెప్పుతున్నారు. కాని ఏమి జరుగవలసియున్నదో ఆయనకు తెలుసు, కాబట్టి ఆయన ఏమి చేయుటకు నిర్ణయించబడిందో, ఖచ్చితముగా దానినే ఆయన చేశాడు.

ఆయన తిరిగి వచ్చినప్పుడు, మీరు ఆయనను సమాధి వద్ద గమనించినట్లైతే, ఆయన తిరిగి వచ్చినప్పుడు, ఈ గృహమును కనుగొన్నట్లు ఆయన వ్యక్తపర్చాడు.

JOHN 11:17,39

 

18అన్ని ఆశలు గతించిపోయినవి. లాజరు చనిపోయాడు. ప్రతి ఘడియ, "ఆయన రంగము మీదికి వస్తాడని తప్పక, వారు ఆలోచిస్తూనే యున్నారు. ఆయన తప్పక రంగము మీదికి వస్తాడు." చివరిగా అతడు చనిపోయెను, ఊపిరి అతనిని విడిచిపోయెను.

వారు బయటకు వెళ్ళి, రక్తమును అతని దేహము నుండి తీసివేసి, దేహము క్రుళ్ళిపోకుండా సుగంధ ద్రవ్యములు పూసి, నార వస్త్రమును చుట్టి, పరిమళ ద్రవ్యములు పూసి, అతనిని సమాధిలో యుంచిరి, ఒక రాయిని సమాధిపై యుంచిరి, అది ఆ దినములలో సమాధి చేయు పద్దతైయున్నది.

మొదటి రోజు గతించింది, రెండవ రోజు గతించింది, మూడవ రోజు గతించింది, ఇంతక మునుపే సమాధిలో అతడు క్రుళ్ళిపోవుచున్నాడు. అతని ముక్కు బహుశా రాలిపోయింది (అదే మొదటగా రాలిపోయేదని నేను అనుకొంటాను, అదే ముక్కు), అతడు ఇదివరకే క్రుళ్ళిపోయాడు. అతని శరీరము తిరిగి భూమి యొక్క ధూళిగా మారింది, అతని ఆత్మ, అతని నుండి నాలుగు రోజులు ఎక్కడికో ప్రయాణములో యున్నది. ఎన్నడైనా, ఈ జీవితములో అతనిని చూస్తే ఆశలన్నీ పోయినవి.

అన్ని ఆశలు గతించిపోయినవి… వారు కనిపెట్టియున్నారు — బహుశ ఆయన మొదటి రోజు వస్తాడనుకొన్నారు, రెండవ రోజు కూడా రాలేదు. తరువాత అతడు చనిపోయాడు. ఆయన రాలేదు. అప్పుడు నిరాశ చోటుచేసుకొన్నది.

19కొద్ది సమయానికి ఎవరో తప్పక చెప్పియుంటారు, "బోధకుడు బయట యున్నాడని," ఇక్కడ మార్త వీధిగుండా వెళ్ళింది.

ఆ చీకటి ఘడియలో, అన్ని ఆశలు పోయినప్పుడు, యేసు వచ్చాడు. సాధారణముగా ఆయన వచ్చేది అప్పుడే. ఆయన సరిగ్గా అంధకార ఘడియలో వస్తాడు, యేసు రంగము మీద ప్రత్యక్షమయ్యేది అప్పుడే. ఇప్పుడు గమనించండి. ఆయన వచ్చి మార్తను పిలిచెను. ఆయన సన్నిధి క్రొత్త ఆశలను తీసుకొనివచ్చెను. ఆ కుర్రవాడు చనిపోయినప్పటికి లెక్క కాదు, ఇంకను ఆయన సన్నిధి కొత్త ఆశలను తెస్తుంది.

20ఈ రాత్రి ఇక్కడ గుండె జబ్బుతో, కాన్సర్ తో నీవు కూర్చొండి యుండవచ్చు, వైద్యులు నిన్ను వదిలి వేసి యుండవచ్చు. బహుశా, కుర్చీలో కుంటివాడవుగా ఉండవచ్చు, నీకు ఏ ఆశయు లేదని సైన్సు చెప్పియుండవచ్చు, తగినంత కాల్సియం లేనందున, నీ ఎముకలన్నియూ మెలి తిరిగిపోయినవి, ఇంకెంతమాత్రము నీవు వాటిని వంచలేవు, లేక నీగుండె బాగా చెడిపోయింది, నీవు ఏ క్షణములోనైనా చనిపోవచ్చని వైద్యుడు చెప్పవచ్చు. ఓ, కాన్సర్ తో క్షయ వ్యాధితో యున్న ఎందరో ప్రజలు, వారికి చివరి ఆశ కావచ్చు, బహుశా వైద్యుడు నిన్ను తోసివేసినట్లుగా కనబడుతుంది. ఇంకనూ, యేసుక్రీస్తు యొక్క సన్నిధిని గుర్తించుట, తిరిగి నీకు నిరీక్షణను తెస్తుంది.

21కనీసము ఎవరూ నీకు ఆ పేరు చెప్పకపోవచ్చును. బహుశ ఇది వరకు ఎన్నడూ నీవు దానిని వినియుండకపోవచ్చును, కాని ఎవరో అన్నారు, "అక్కడ ఒక సంఘము యున్నది, వారు దేవునిని నమ్ముతారు, వారు రోగుల కొరకు ప్రార్థన చేస్తారని నాకు తెలుసు." త్వరగా (ఇప్పుడు, నీవు చనిపోవుటకు సిద్దముగా యున్నావు, చూడు), కొత్త ఆశలుపైకి లేస్తాయి. అది ఎల్లప్పుడూ అలా జరుగుతుంది. ఆ చీకటి ఘడియలో సాధారణముగా, ఎవరో దానిని గూర్చి చెప్పుతారు, యేసును గూర్చి నీకు చెప్పుతారు. ఆయన సన్నిధి క్రొత్త ఆశలను తెస్తుంది.

గత రాత్రి అది చేసినట్లుగా, ఏ అనుమానపు ఛాయ లేకుండా, సత్యమని రుజువు చేయబడిన వాక్యమును మనము చూశాము, అది ప్రత్యక్షపర్చబడి, రుజువు చేయబడింది, అది ఈ రాత్రి దానినే చేయును గాక; అదేమనగా పందొమ్మిది వందల సంవత్సరముల క్రితం జీవించిన ఆ యేసు, కల్వరిలో చనిపోయి, మూడవ దినమున తిరిగి లేచి, శిష్యులకు ప్రత్యక్షమై, వారి కన్నులను తెరచియున్నాడు, మరియు ఈ దినము యొక్క వాగ్దానమును చేసినవాడు, ఇప్పుడే తిన్నగా మన మధ్యలో యున్నాడు. అది తప్పక ప్రజలకు నిరీక్షణ తెస్తుంది. క్రొత్త నిరీక్షణలు పైకి ప్రకాశిస్తాయి.

22బహుశ ఎవరో అన్నారు, "కొద్దికాలము నుండి సంఘము ఒక విధముగా ఎండిపోయినట్లుగా యున్నది. కొన్ని నెలల నుండి మాకు తాజా నీరు లేదు. మేము ఒక ఉజ్జీవమును కలిగియుండలేదు. ప్రతి ఒక్కరూ పేరుకుపోయినట్లుగా కనబడుచున్నది, లేక ఎదో మరొకటి." "మేము కేవలము సంఘమునకు వెళ్ళి, ఒక కీర్తన పాడి, కొన్ని వర్తమానములు విని తిరిగి వెళతాము." కాని అకస్మాత్తుగా, అప్పుడు, మేము ఎండిపోవుట ప్రారంభముకాగానే, యేసు రంగము మీదికి వస్తాడు, మనలను తాజా పరుస్తాడు, మనకు ఏదో కొత్త దానిని తెస్తాడు. ఆయన దానిని చేయుటకు ఎల్లప్పుడూ అక్కడ యున్నాడు. యేసు లోనికి వచ్చినప్పుడు, క్రొత్త ఆశలు పుట్టుకొస్తాయి. ఆయన యొక్క సన్నిధి నూతన నిరీక్షణను తెస్తుంది.

ఆయన ప్రత్యక్షపర్చబడిన దేవుని యొక్క వాక్యమైయున్నాడని ఆమె ఎరిగి యుండెను. ఆమె ఆ యుగమును చూసియుండెను — లేక ఆమె చూడకపోయినట్లైతే, ఆమె ఇంకనూ ఆ సాంప్రదాయా సంఘములోనే యుండేది. ఆమె ఇంకనూ ఆ సంఘమునకు చెందియుండేది. కాని ఆమె ఆ వాగ్దాన వాక్యమును చూసియుండెను. ఆ వాగ్దాన వాక్యము ఆయన ద్వారా ప్రత్యక్షపర్చబడియున్నారని, ఆయన సజీవమైన వాక్యమైయున్నాడని ఆమె ఎరిగియుండెను. ఆమె దానిని గూర్చి విన్నప్పుడు, ఎంత మంది ఆమెను విమర్శించినప్పటికి, అది ఏమైనప్పటికి, ఆమె ఆయన కొరకు వెళ్ళ వలసినంత వేగముగా బయటకు వెళ్ళింది, చూచారా. ఆయన ప్రత్యక్షపర్చబడిన వాక్యమై యున్నాడని ఆమె ఎరిగియుండెను.

2KGS 4:16,19,20•

AMOS 3:7

 

23సందేహము లేదు, కాని తన దినములలో ఏలీయా ఏమైయున్నాడో, ఆమె ఆ కథను చదివియున్నది. ఇప్పుడు, ఆ దినమున అతడు ప్రత్యక్షపర్చబడిన దేవుని వాక్యమైయుండెను. అతడు ఒక ప్రవక్త అయి యున్నాడు, మరియు ప్రభువు యొక్క వాక్యము అతనియొద్దకు వచ్చింది. అక్కడ ఒక స్త్రీ యున్నది, ఆమెకు ప్రవక్త యొక్క దీవెన ద్వారా ఒక బిడ్డ అనుగ్రహించబడ్డాడు, ప్రవక్త ఆమెను దీవించి యుండెను, ఆమె ఒక బిడ్డను కలిగియుండెను. ఒక రోజు, పదకొండు గంటల సమయములో, అతనికి తప్పక ఎండ దెబ్బ తగిలింది. తన తండ్రితో పాటు అతడు పొలములో యుండెను. అది ఎండ దెబ్బ అని బైబిలు చెప్పలేదు, అయితే అతడు "నా తల! నా తల!" అని ఏడ్చుట ప్రారంభించెను. పగలు పదకొండు గంటల వేళలో అతడు ఒక సేవకుని కలిగియుండెను, తండ్రి అతనితో బాలుని ఇంటికి పంపెను. మధ్యాహ్నము అతడు తల్లి తొడ మీద పండుకొని, రోగిగా, ఇంకా రోగిగా మారి, చివరకు చనిపోయాడు.

GEN 37:28•

2SAM 15:30•

2KGS 4:21,24•

MATT 23:37•

LUKE 13:34•

REV 22:16

 

24ఇప్పుడు, ఆమె నిరాశ చెందుటకు బదులుగా… పొరుగు వారందరూ వచ్చి ఏడ్చుచున్నారు, కాని తల్లి నిబ్బరముగా యున్నది, బిడ్డ చనిపోయాడు, ఆమె ప్రవక్త కొరకు సిద్దపరచి ఆ చిన్న పై గదిలోనికి బిడ్డను తీసుకొని వెళ్ళి, అతనిని మంచము మీద పెట్టింది, ఆ విధముగా తన పనివానితో అన్నది, "నాకు గాడిదకు గంత కట్టుము, తిన్నగా పోనియ్యి, నేను చెప్పేవరకు దానిని ఆపవద్దు." ఓ మై! అది అంతే! రచ్చ చేయుటకు మరియు వాదించుటకు నాకు సమయము లేదు, ఆ దినము గతించిపోయింది. మనము ముందుకు సాగుదాము. మనము తప్పక అక్కడకు వెళ్ళాలి. మనకు ఒక అవసరతయున్నది.

"నీవు ముందుకు సాగిపో, నేను నీకు ఆజ్ఞాపించేవరకు త్రోలుట ఆపవద్దు," కాబట్టి అలాగేనని అతడన్నాడు. వారు ఏలీయాను సమీపించేవరకు వెళ్లారు.

ఏలీయా, దైవజనుడైయుండి — క్రీస్తువలే కాదు; క్రీస్తు అన్నిటిని ఎరుగును, ఏలయనగా ఆయన దేవుడైయున్నాడు — ఏలీయా దేవునిలో ఒక భాగమైయున్నాడు. అది ఏలీయాలో యున్న క్రీస్తు. అది ఆ ఘడియ యొక్క వర్తమానమై యున్నది, ఏలయనగా ఆ ఘడియ యొక్క వాక్యము ఆ ప్రవక్తతో యున్నది.

యేసు ప్రవక్తల యొక్క సంపూర్ణత అయి యున్నాడు, వారిలో ప్రతిఒక్కరు ఆయనను ప్రత్యక్షపర్చారు, అది అంతే. యోసేపు మొదలుకొని, ప్రతి చోట, ముప్పయి వెండి నాణెములకు అతడు అమ్మబడ్డాడు, అతడు క్రీస్తును సూచించాడు. ఆలాగునే మోషే కూడా.

PS 22:1,16-18

 

25దావీదు, ఒక త్రోసివేయబడిన రాజుగా, ఏడుస్తూ, కొండ మీద కూర్చొన్నాడు, ఎందుకనగా అతడు త్రోసివేయబడ్డాడు. ఎనిమిది వందల సంవత్సరముల తరువాత, దేవుని యొక్క కుమారుడు కొండ మీద కూర్చొన్నాడు. అది దావీదులో యున్న క్రీస్తు యొక్క ఆత్మ అయి యున్నది. ఆయన దావీదు యొక్క వేరు మరియు చిగురు రెండూ అయి యున్నాడు. ఒక త్రోసివేయబడిన రాజుగా కొండమీద కూర్చొండి ఏడుస్తున్నాడు, "యెరూషలేమా, యెరూషలేమా, కోడి తన పిల్లలను రెక్కల క్రిందికేలాగు చేర్చుకొనునో, ఆలాగే నేనును నీ పిల్లలను ఎన్నోమారులు చేర్చుకొనవలెనని యుంటిని." అది ఏమైయున్నది? అది ఆ వెనుకయున్న క్రీస్తు అయి యున్నాడు.

దావీదు ఆ కీర్తన వ్రాసినప్పుడు, అది విలపించుచున్న క్రీస్తు అయి యున్నాడు, "నా దేవా, నా దేవా, నీవు నన్నేల విడనాడితివి? వారు నా చేతులను, పాదములను పొడిచియున్నారు. నా యెముకలను నేను లెక్కింపగలను. నా వస్త్రములను వారు పంచుకొనుచున్నారు, నా అంగీ కొరకు ఓట్లు వేయుచున్నారు." అది దావీదులో యుండి మాట్లాడుచున్న క్రీస్తు అయి యున్నాడు.

అది వాక్యము యొక్క ప్రత్యక్షతయైయున్నది. ప్రవక్తల చేత పలుకబడిన వాటిని నెరవేర్చుటకు క్రీస్తు వచ్చియున్నాడు, ఎందుకనగా వాక్యము ప్రవక్తలతో యున్నది. ప్రవక్తలు ఆయనను గూర్చి ఏమి చెప్పారో దానిని నెరవేర్చుటకే ఆయన వచ్చాడని, గతరాత్రి పాఠములో నేను చెప్పియున్నాను, ఎందుకనగా వారు వాక్యమును కలిగియుండిరి. మరియు ఏలీయా దేవుని యొక్క ప్రవక్తయైయున్నాడు, ఆ దినము యొక్క వాక్యము.

2KGS 4:30,34,35

 

26కాబట్టి షూనేమీయు స్త్రీ, ప్రవక్త వచ్చి దేవుని యొక్క శక్తిని ప్రత్యక్షపర్చువరకు ఆ ప్రవక్తతో నిలిచియుండెను, మరియు అతడు తన్నుతాను ఆ బిడ్డపై పండుకొనగా, ఆ బిడ్డకు జీవము వచ్చెను.

ఇప్పుడు, మార్త పాత్రలు కడుగుచూ తదితరములు ఇంటి పట్ల శ్రద్ద తీసుకొంటున్నప్పటికి, మార్త తప్పక దానిని గుర్తించెను. ఆమె తన నిజమైన రంగును చూపించింది. ఆమె లోపట నిజముగా ఏమి యున్నదో ఆమె చూపింది. ఆమె త్వరగా ఆయనను తీసుకొని వచ్చుటకు వెళ్ళింది. ఏలీయాలో దేవుడు యున్నట్లైతే, దేవుడు క్రీస్తులో యుండవలసియున్నాడు, ఎందుకనగా ఆయన ఆ వ్యక్తియేనని, ఆయన రుజువు చేసియున్నాడు. ఆమేన్! అది నాకు ఇష్టము, ఆ తీర్మానము! ఆమె ఆయన వద్దకు వెళుతుంది. ఆమె ఆయన యొద్దకు వెళ్ళాలి. ఆమె ఆయన యొద్దకు వెళ్ళగా, ఆయనను కనుగొన్నది. ఇప్పుడు గుర్తుంచుకోండి, దేవుడు ఎన్నడూ తన ప్రణాళికను మార్చలేదని ఆమె ఎరిగియుండెను. ఆయన ఏలీయాలో యుండి మృతులను లేపినట్లైతే, ఆయన క్రీస్తులో యుండి మృతులను లేపగలడు, ఆయన దానిని చేయకపోయినప్పటికి, ఏలయనగా అదే దేవుడై యున్నాడు.

MAL 3:6•

HEB 13:8

 

27ఇంకనూ ఆయన మారలేదు! ఆయన ఎన్నడైనా ఎంత దేవుడుగా యున్నాడో, ఈ రాత్రియు ఆలాగునే యున్నాడు. ఆయన నిన్న, నేడు, నిరంతరము ఏకరీతిగా యున్నాడు. ఆయన మారనివాడు. ఆయనలో అది యున్నదని ఆమె ఎరిగియుండెను. గమనించండి, కొన్ని నిమిషములలో అది దానిని రుజువు చేసింది, ఆమె సోదరుని గూర్చి ఆమె ఆయనకు ఒకటి చెప్పినప్పుడు, ఆమె అన్నది, "ప్రభువా, నేను నమ్ముచున్నాను నీవు…"

ఆయనన్నాడు, "పునరుత్థానమును మరియు జీవమునునేనే. అతడు చనిపోయినను, ఇంకా అతడు బ్రతుకును. మరియు నాయందు విశ్వాసముంచువాడు ఎన్నడును చనిపోడు. నేనే — మోషేతో మండే పొదలో యున్న వాడనునేనే. పునరుత్థానమును నేనే! జీవమును నేనే! అది నేనే! నేను ఇంకనూ ఆయననై యున్నాను! పునరుత్థానమును, జీవమును నేనే: నా యందువిశ్వాసముంచువాడు, చనిపోయినను బ్రతుకును: జీవించి మరియు నాయందు విశ్వాసముంచువాడు ఎన్నటికిని మరణించడు."

ఈ యొక్క గొప్ప నిశ్చయతను ఆమె కలిగియున్న పిదప అనగా వాగ్దానము చేయబడిన వాక్యము ఆయనే, (ప్రవక్తగా ఆయన చెప్పినప్పుడు, ఆయన దానిని అబద్ధమాడలేడు), కాబట్టి ఆయన, "నేను ఉన్నవాడను అనువాడునైయున్నానని చెప్పెను. నేను ఆయనను, "పునరుత్థానమును, జీవమునైయున్నాను."

MATT 8:8•

LUKE 7:7•

JOHN 11:22,25-27,39

 

28ఆమె అన్నది, "ఈ లోకములోనికి రావలసిన దేవుని కుమారుడవు నీవే అని నేను నమ్ముచున్నాను. నా సోదరుడు చనిపోయినను, సమాధిలో అక్కడ యుంచబడినను (అతని శరీరము ఇప్పుడు క్రుళ్ళిపోవుచున్నది), కాని ఇప్పుడైనను, నీవు ఏది చెప్పినను అది నెరవేరుతుంది."

ఆమె కోరినదంతా, దానిని ఆయన చెప్పుట వినుటయే. ఓ, మార్త, ఈ రాత్రి మనము ఎక్కడయున్నాము? "కేవలము మాట సెలవిమ్ము, నా సేవకుడు బ్రతుకుతాడు." కేవలము ఆయన దానిని చెప్పుట వినుము. ఆయన దానిని చెప్పాడని, వారు వచ్చి ఆమెకు చెప్పారు, కాని ఇక్కడ ఆయనే స్వయముగా ఇక్కడున్నాడు. ఓ, దేవా! వారు చూడగలుగునట్లు, గ్రుడ్డి నేత్రములను తెరువుము, ఆయన సన్నిధిలో, ఆయన వాక్యమును మాట్లాడినప్పుడు, అది ఎల్లప్పుడూ ప్రత్యక్షపర్చబడుతుంది.

ఆమె అన్నది, "నీవు దేవుని ఏమడిగినను, అది దేవుడు నీకిస్తాడు. కేవలము నన్ను దానిని విననియ్యండి."

ఆ మాట ఆయన చెప్పాలని ఆమె కోరింది. అంతమట్టుకే ఆమె వినగోరింది. కేవలము వాక్యమును పొందుము, ఆమెకు అవసరమైనది అంతమట్టుకే, ఆయన దానిని చేస్తానని చెప్పుట వినుటయే.

JOHN 11:25-27

 

29అప్పుడే ఆయన చేసియుండేవాడు, కాని మీరు చూడండి, తండ్రి యొక్క దర్శనము ప్రకారము, ఆయన సమాధి వద్ద నిలబడవలసి యుండెను.

ఓ, మై! నీ విశ్వాసమును పట్టుకొనియుండుము. సమస్తమును దేవుడు సరిగ్గా చేస్తాడు. అదంతయూ సక్రమముగానే యుంటుంది. ఆయన సమాధి యొద్దకు కొంచెము కనిపెట్టుము. గమనించండి, ఆశలన్నియు, సమస్తమూ పోయినప్పుడు సహితము, ఆయన దానిని చెప్పాలని ఆమె కోరింది. అతడు చనిపోయాడు, సమాధిలో క్రుళ్ళిపోవుచున్నాడు, కాని ఆమె కోరినదల్లా, ఆయన దానిని చెప్పుట వినుటయే.

ఇప్పుడు, ఆయన చెప్పినప్పుడు, "పునరుత్థానమును జీవమును నేనే," ఆమె దానిని నమ్మింది. ఇప్పుడు గమనించండి, "పునరుత్థానమును జీవమును నేనే, అని ఆయన చెప్పుటను ఆమె విన్నప్పుడు, ఆమె అసాధ్యములను నమ్మవలసియున్నది. అతడు చనిపోయినను, తిరిగి బ్రతుకును, మరియు బ్రతికి, నా యందు విశ్వాసముంచువాడు ఎన్నటికిని చనిపోడు." "నీవు నమ్ముచున్నావా?" అని ఆయన అన్నాడు.

ఆమె అన్నది, "అవును ప్రభువా, నేను దానిని నమ్ముచున్నాను. నీవు ఈ లోకమునకు రావలసిన దేవుని కుమారుడవైయున్నావని, నేను నమ్ముచున్నాను." అది నాకు ఇష్టము.

అది నాకు ఇష్టము.

JOHN 12:45•

JOHN 14:9

 

30నేను దీనిని ఇది వరకు చెప్పాను. అది తిరిగి మరలా నిలబడుతుంది, ఈ మధ్యనే నేను ఒక స్త్రీతో మాట్లాడుచుంటిని, అది ఒక ఫలానా సంఘమైయున్నాదని కొద్దిసేపటి క్రితము నేను సూచించాను, ఆయన దేవుడైయున్నాడని, ఆయన దైవత్వమును వారు నమ్మరు. ఆయన ఒక ప్రవక్త, ఒక మామూలు మనిషి అని అంటారు. ఆయన నిజముగా అదే అయి యున్నాడు, ఆయన అది, మరియు దేవుడై యున్నాడు. యేసు శరీరమైయున్నాడు, బాలుడు, మానవుడు. దేవుడు ఆయనలో నివసించియున్నాడు. దేవుడు ఆయనలో యున్నాడు. ఆయన దైవ-మానవుడు. ఆయన మానవుడై యున్నాడు, ఇంకనూ ఆయన శరీరములో ప్రత్యక్షపర్చబడిన దేవుడై యున్నాడు. మనము యేసును చూసినప్పుడు, మనము దేవునిని చూస్తాము. అదే ఆయన చెప్పాడు, "మీరు నన్ను చూసినప్పుడు, తండ్రిని చూసియున్నారు." మీరు తండ్రిని చూసియున్నారు, ఏలయనగా ఆయన ప్రతిబింబమైయున్నాడు, ఏలయనగా ఆయన వాక్యమై యున్నాడు, ఆమేన్, అది ఆదియందున్నది. ఆమేన్.

JOHN 10:34-36

 

31"దేవుడు," అని ఆయన ప్రవక్తలను పిలిచెను. మీకు అది తెలుసా? "దేవుని వాక్యము ఎవరికి వస్తుందో, వారిని మీరు 'దేవుడు,' అని పిలిచారు, 'నేను దేవుని యొక్క కుమారుడనని,' చెప్పినప్పుడు, మీరు ఎలా నన్ను దోషిగా చేస్తారు?" ఎందుకనగా అదే వాక్యము, ఆయన అక్కడ యున్నాడని చెప్పింది, అక్కడే వాక్యము తిరిగి ప్రత్యక్షపర్చబడింది. మరియు ఇంకను వారు దానిని నమ్మరు.

ఈ స్త్రీ నాతో అన్నది, "నేను నీకు రుజువు చేయగలను," "నీవు బోధించుట నాకు ఇష్టము, కాని ఒక్క విషయము నీవు ఎంతో ఎక్కువగా చేస్తున్నావు," అన్నది.

"మంచిది, ఏమిటది?"

"నీవు యేసు మీద ఎంతో ఎక్కువగా గొప్పలు చెప్పుతున్నావు," అన్నది.

నేనన్నాను, "ఆయన వచ్చినప్పుడు అంతమట్టుకే నాపై వ్యతిరేకతను కలిగియుంటాడని నేను నమ్ముతాను." ఆమె అన్నది, "అంతమట్టుకే ఆయన నీలో కనుగొనే పొరపాటు." అప్పుడు నేనన్నాను, "నాకు పదివేల నాలుకలున్నను, ఆయన ఏమైయున్నాడో నేను తగినంతగా మాట్లాడలేను. ఓ, మై!"

ఆమె అన్నది, "అయితే నీవు ఆయనను దేవునిగా చేస్తున్నావు."

నేనన్నాను, "ఆయన దేవుడైయున్నాడు, లేక ఆయన దేవుడు కానిచో ఎన్నడైనా ఈ ప్రపంచము కలిగియున్న గొప్ప మోసగాడైయున్నాడు."

ఆమె అన్నది, "ఆయన ఒక ప్రవక్త."

నేనన్నాను, "ఆయన ఒక ప్రవక్త అయి యున్నాడు, అది సత్యము, ఒక దైవ-ప్రవక్త: వాక్యము యొక్క సంపూర్ణత. వాక్యము ఎవరియొద్దకు వస్తుందో, అదే అతనిని ప్రవక్తగా చేస్తుంది. కాని ఆయన వాక్యము యొక్క సంపూర్ణత అయి యున్నాడు."

ఆమె అన్నది, "నేను నీకు రుజువు చేయగలను…" "నీవు ఆయనను దైవముగా చేయుచున్నావు," అన్నది. .

నేనన్నాను, "ఆయన దేవుడైయున్నాడు."

ఆమె అన్నది, "ఆయన దేవుడుగా యుండలేడు."

నేనన్నాను, "ఆయన దేవుడై యున్నాడు."

ఆమె అన్నది, "నీవు బైబిలును నమ్ముతానని నీవన్నావు."

నేనన్నాను, "నేను నమ్ముతాను."

JOHN 11:25,35,43

 

32ఆమె అన్నది, "ఆయన దేవుడు కాదని నీ సొంత బైబిలు ద్వారా నేను రుజువు చేస్తాను."

నేనన్నాను, "చేయిమన్నాను. బైబిలు అలా చెప్పితే, అప్పుడు నేను దానిని నమ్ముతాను, ఏలయనగా వాక్యమే సత్యమైయున్నదని నేను నమ్ముతాను."

ఆమె అన్నది, "లాజరు సమాధి యొద్దకు వెళ్ళే దారిలో, మీకు గుర్తున్నదా పరిశుద్ద యోహాను 11వ అధ్యాయము?"

నేనన్నాను, "మేడమ్. నాకు నిశ్చయముగా జ్ఞాపకమున్నది." ఆమె అన్నది, "బాగుంది, ఇప్పుడు, ఆ మార్గమున వెళ్ళుచుండగా ఆయన ఏడ్చాడు. ఆయన కన్నీళ్లు విడిచాడని, బైబిలు చెప్పింది."

నేనన్నాను, "ఆయన కన్నీళ్లు విడిచాడని, నిశ్చయముగా బైబిలు చెప్పింది."

ఆమె అన్నది, "ఆయన దేవుడై యుండి, ఎలా ఏడ్వగలడు?"

నేనన్నాను, "ఆయన మానవుడు."

"మానవుడు మరియు దేవుడు?"

నేనన్నాను, "అవును స్త్రీ. నీవు దానిని చూచుటలో తప్పిపోయావు. ఏడ్చుచున్న వారితో ఏడ్చుచు, ఆయన వారితో పాటు దారిలో వెళ్ళుచుండెను, అది నిజము, దుఃఖపడువారితో ఆయన దుఃఖపడ్డాడు. ఆయన ఒక మనిషి. కాని ఆయన తన పెళుసైన దేహమును తిన్నగా చేసుకొని, 'లాజరు బయటకు రా,' అన్నప్పుడు, నాలుగు రోజుల క్రితము చనిపోయిన మనిషి, తన పాదముల మీద నిలబడ్డాడు — అది మనిషికంటే ఎక్కువ తీసుకొంటుంది, అది మనిషిలో యున్న దేవుడై యున్నాడు. దేవుడు తప్ప, చనిపోయిన వారిని ఎవరు లేపగలరు?" పునరుత్థానము మరియు జీవము ఆయనే. అది సత్యము.

MATT 8:24,26•

MATT 14:19,21•

MATT 21:18,19•

MARK 4:38,39•

MARK 6:41,44•

MARK 11:12,13•

LUKE 8:23,24•

LUKE 9:14,16,17

 

33ఆ రాత్రి సముద్రము మీద, ఆయన అలసిపోయి పడవ వెనుక పండుకొన్నప్పుడు, అక్కడ పదివేల దయ్యములు ఆ రాత్రి, సముద్రములో ఆయనను ముంచి వేయాలని ప్రతిజ్ఞ చేసినవి, ఆ పాత పడవ, తుఫానుతో యున్న సముద్రము మీద, చుట్టూ, మూతవలే ఎగురుచుండెను. ఆ దయ్యములు అనుకొన్నాయి, "మనము ఇప్పుడు ఆయనను పట్టుకొన్నాము, ఆయన నిద్రపోతున్నాడు, వీళ్ళందరిని మనము ముంచి వేద్దాము." ఓ, ఆయన మానవుడు, అలసిపోయాడు, కానీ ఆయన ఒక్కసారి మేల్కొనగానే, ఆయన పడవ అమరము పై నిలబడి, పైకి చూసి, "నిమ్మళించుము," అన్నాడు, అలలు మరియు గాలులు ఆయనకు లోబడినవి. ఆయన మానవుని కంటే ఎక్కువైనవాడు.

ఆ కొండ మీద నుండి దిగివస్తున్నప్పుడు, తినుటకు ఒక రొట్టె ముక్క కొరకు ఎదురు చూచుచుండెను, లేక అంజూరపు ఫలము కొరకు. కాని ఆయన అయితే రొట్టెలు మరియు రెండు చిన్న చేపలను తీసుకొని, ఐదువేల మందికి భోజనము పెట్టినప్పుడు, అది ఆ మనిషిలోని దేవుడు. అది సత్యము.

34ఓ, ఎన్నడైనను ప్రాధాన్యత ఇవ్వని ప్రతిమనిషి దానిని నమ్మాడు, కవులందరూ దానిని నమ్మారు. అది నిజము. ఆశ్చర్యము లేదు ఒకరు ఇలా వ్రాశారు:

జీవిస్తూ, ఆయన నన్ను ప్రేమించాడు; చనిపోతూ, ఆయన నన్ను రక్షించాడు;

సమాధి చేయబడి, నా పాపములను దూరముగా మోసుకొని వెళ్ళాడు;

తిరిగి లేచి, శాశ్వతముగా ఉచితముగా నన్ను నీతిమంతుడిగా చేశాడు:

ఒక దినమున ఆయన రానైయున్నాడు — ఓ మహిమకరమైన

దినము!

ఎడ్డీ పెరొనెట్, అతడు తన పాటలను అమ్ముకొనలేదు. ఒక రోజున, పరిశుద్ధాత్మ యొక్క బలమైన ప్రభావము క్రింద, తత్తరిల్లుచు, కాలమును లాగుకొని, ప్రారంభోత్సవపు పాటను అతడు వ్రాసెను:

యేసు నామము యొక్క శక్తిని అందరము స్తుతిద్దాము!

దూతలు మోకరిల్లి సాగిల పడాలి;

రాజరికత్వపు కీర్తిని ముందుకు తెద్దాము,

అందరికీ ఆయనను ప్రభువుగా కిరీటముపెడదాము!

నిశ్చయముగా, ఆయన అదే అయి యున్నాడని మనము నమ్ముతాము. అవునండి!

JOHN 11:22

 

35ఇప్పుడు, ఆ దినము యొక్క అధునాతన ఆలోచన విధానమునకు వ్యతిరేకముగా, ఆమె అసంభవములను తప్పక నమ్మవలసియుండెను. కాబట్టి ఏదో సంభవించుటకు, క్రొత్త జీవమును చూచుటకు, నీవు అసంభవములను నమ్మవలసియున్నది. ఆయన గుర్తింపబడినట్లైతే… ఆయన వాక్యముగా యున్నాడని ఆమె ఆయనను గుర్తించింది, అప్పుడు అసంభవములు సంభవిస్తాయి, ఏలయనగా ఆయన రక్షకుడైయున్నాడు, మరియు ఆయన చెప్పిన ప్రతి దాని ప్రక్కన ఆయన నిలబడతాడు.

"మరియు నమ్మువానికి సమస్తమును సాధ్యమే." అది ఆయన మాట. అయితే దేవుడు తన వాక్యము నొద్ద తీసుకొనబడినప్పుడు, అసంభవములు సంభవములుగా ప్రత్యక్షపర్చబడతాయి. అవునండి! దేవునిని ఆయన వాక్యము నొద్ద తీసుకొన్నప్పుడు, అసంభవములు, సంభవములుగా ప్రత్యక్షపర్చబడతాయి. అది ఆలాగున యుంటుందని దేవుడు చెప్పినప్పుడు, నీవు ఆ మాటను తీసుకొని మరియు అది ఏమిటో గమనించు… అసాధ్యములు సంభవిస్తాయి. అవి నిశ్చయముగా సంభవిస్తాయి.

కాని గమనించండి, వాటన్నిటి మధ్యలో సహితము, ఆమె అన్నది, "ప్రభువా, ఇప్పుడైనను, నీవు దేవుని ఏమడిగినను, దేవుడు దానిని చేస్తాడు." ఆ మాటను ఆయన నుండి పొందాలని ఆమె ఎరిగియుండెను. ఆమె చేయవలసినదంతా అదియే, ఆ మాటను పొందుటయే. అవును, అది అంధకార ఘడియైయున్నది, మరియు యేసు దారి వెంబడి వచ్చి, పిలిచియున్నాడు. ఓ, ఎలాటి కార్యమును వారు చూశారు! ఒక పునరుత్థానము!

ఆ చీకటి ఘడియలు వచ్చినప్పుడు, మనము మరికొందరిని చూద్దాము.

JOB 1:7,8,10,11•

JOB 2:2,3,5

 

36ఒకప్పుడు యోబు అను పేరుగల ఒక మనిషి యున్నాడు, బైబిలులోని అతి ప్రాచీనమైన ప్రవక్తలలో ఒకరు. అతడు ఒక గొప్ప మనిషి. అతడు ప్రభువును ప్రేమించియున్నాడు, మరియు సమస్తమూ ఏలాగు చేయాలో అతడు ఎరిగియున్నాడు. మరియు సాతానుడు అతనిని పరీక్షకు పెట్టాలనుకొన్నాడు, కాబట్టి ఒక దినమున అతడు దేవునితో ఇలా అన్నాడు.. అవును, "సాతానా, నీవు ఎక్కడ యుండి యున్నావు?" అని ఆయన వాడితో అన్నాడు.

వాడన్నాడు, "ఓ, భూమి మీద ముందుకు-వెనక్కు, మరియు దానిపై క్రిందికి మరియు పైకి సంచరించు వచ్చితిని."

ఆయనన్నాడు, "నా సేవకుడైన యోబు సంగతిని ఆలోచించితివా? ఈ భూమి మీద అతనివంటి వాడెవడును లేడు. అతడు ఒక పరిపూర్ణమైన మనిషి."

"ఓ," వాడన్నాడు, "నిశ్చయముగా, నీవు అతనికి సమస్తమును ఇచ్చియున్నావు, అతనికి సమస్తమును చేసియున్నావు. నిశ్చయముగా, అతడు ఒక గొప్ప మనిషి. అయితే ఒక్కసారి నన్ను అతనిని తీసుకోనియ్యి. నేను రాగమును మార్చి వేస్తాను, నీ ముఖము ఎదుటే నిన్ను శపించునట్లు చేస్తాను."

ఆయనన్నాడు, "నీవు దానిని చేయలేవు." ఒక విశ్వాసియందు అది ఆయన నమ్మకమై యున్నది. ఎందుచేత? ఆయన అనంతుడైయున్నాడు. ఆయన నిత్యుడైయున్నాడు. ఆయన ఆది నుండి అంతము వరకు ఎరిగినవాడు. సాతానుడు దానిని చేయలేడని ఆయనకు తెలుసు, ఎందుకనగా ఆయన వాక్యమైయున్నాడు. యోబు ఏమి చేస్తాడో ఆయన ఎరిగియున్నాడు.

JOB 1:18,19•

JOB 2:7•

JOB 3:3,4•

JOB 4:7•

JOB 14:7,9,10,13,21

 

37ఇప్పుడు, యోబును గుర్తుచేసుకోండి, వాడు కురుపులతో యోబును బ్రద్దలుచేశాడు, అతని పిల్లలను చంపాడు, అతడు కలిగియున్న సమస్తమును తీసుకొన్నాడు. అతని ఆరోగ్యము క్షీణించిపోయింది. అతనిని ఓదార్చు వారు సహితము వచ్చి, అతడు ఒక రహస్య పాపియని నిందించుట తప్ప, మరి ఏమియు చేయలేకపోయారు. వృద్దుడైన యోబు ఎలాటి స్థానమునకు వచ్చాడనగా, అతడు ఎంతో చింతా క్రాంతుడయ్యాడు. మొదటగా, నీవు చింతాక్రాంతుడవు కావాలి. నీవు నీ యొక్క మార్గములోని సమయము యొక్క అంతములోనికి రావాలి.

యోబు తన మార్గము యొక్క అంతములోనికి వచ్చాడు, అప్పుడతడన్నాడు, "నా జన్మదినము శపించబడును గాక. కనీసము సూర్యుడు ప్రకాశింపకుండును గాక, రాత్రి వేళ కనీసము చంద్రుడును ప్రకాశింపకుండును గాక, నా పేరు ఎన్నడూ పిలవబడకుండును గాక." ఆ వేధనలో, అప్పుడు యేసు దాని వెంబడి వచ్చియున్నాడు.

అతడు క్రిందకు చూసి అన్నాడు, "నేను మనిషిని చూస్తాను, ఒక పుష్పము చనిపోతుంది, అది మరలా వసంత కాలములో తిరిగి బ్రతుకుతుంది. ఒక చెట్టు క్రిందికి ఊడ్చి వేయబడుతుంది, నీటి యొక్క సువాసన ద్వారా అది తిరిగి పైకి బ్రతుకుతుంది." వృక్ష జీవమంతయూ తిరిగి బ్రతుకుటను అతడు చూశాడు, కాని అతడన్నాడు, "ఒక మనిషి, అతడు తన ప్రాణమును విడిచిమట్టిలో ఉంచబడతాడు, అతడు ఎక్కడయున్నాడు?"

అతడు ఒక వృద్దుడై యున్నాడని ఎరిగి యుండెను. అతడన్నాడు, "అతని కుమారులు, అతనిని గూర్చి విలపించటానికి వచ్చారు, కాని అతడు దానిని గ్రహించలేదు. ఓ, నీ ఉగ్రత దాటిపోవువరకు, నన్ను సమాధిలో దాచి, నన్ను రహస్య స్థలములో దాచి పెట్టుము. నాకు ఒక సమయమును నియమించుము మరియు నాకు ఒక కాలమును నిర్దేశించుము."

మరియు అతడు మాట్లాడుచు ఆలాగున ముందుకు వెళ్ళాడు. అతడు తన వేధన యొక్క అంతములో యున్నాడు. ఏమి సంభవిస్తుంది? ఆకులు బ్రతుకుతాయి, మరలా తిరిగి చెట్టు మీద వస్తాయి, పుష్పములు మరలా తిరిగి వస్తాయి, సమస్తము పైకి వస్తుంది, కాని మనిషి తన ప్రాణమును విడిచి, మట్టిలో యుంచబడతాడు. అతడు వేధనలో యున్నాడు. ఆ యుగములో అతనికి ఏమి సంభవిస్తుందో అతడు ఎరుగక యుండెను.

JOB 1:21•

JOB 2:9,10•

JOB 19:25,26

 

38అతడు ఆలాగున యున్నప్పుడు, అప్పుడు యేసు క్రిందికి వచ్చెను. దేవుడు ఆకాశము వైపు అతని తలను త్రిప్పెను, మరియు చివరి దినములలో యేసు వచ్చుటను అతడు చూసేను.

ఆ కటిక చీకటి ఘడియలో అతని భార్య అన్నది, "దేవుని శపించి చనిపొమ్ము." అయినను అతడన్నాడు, "నీ, నీవు మూర్ఖురాలువలె మాట్లాడుతున్నావు. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను, యెహోవా నామము స్తుతించబడునుగాక." అతని భార్య సహితము అతనిని నెట్టివేసినది. అతని సంఘము అతనిని త్రోసివేసినది. ప్రతి ఒక్కరూ అతనిని త్రోసివేశారు. ఆ చీకటి ఘడియలో, ఎక్కడ నుండి ఎక్కడికి వెళ్లుచున్నాడో, అతనికి అక్కడ తెలియదు, అంతట యేసు వచ్చాడు. అప్పుడు అతడు బిగ్గరగా కేకలు వేశాడు, "నా విమోచకుడు సజీవుడనియు, అంత్యదినమున ఆయన భూమిమీద నిలబడుననియు నేను ఎరుగుదును. ఈలాగు నా చర్మము చీకిపోయిన తరువాత, శరీరముతో నేను దేవుని చూసెదను. నా మట్టుకు నేనే చూసెదను. అతని కటిక చీకటి ఘడియలో యేసు క్రిందికి వచ్చెను. అవునండి!

EXOD 3:12,14

 

39మోషే… మోషేకు, ఇశ్రాయేలులో అతనికి కటిక చీకటి ఘడియ వచ్చింది. అతడు తిన్నగా విధి నిర్వహణ మార్గములో యున్నాడు. ఆ పైన పొదలో దేవుని కలుసుకొన్నాడు, "ఉన్నవాడను నేనే అన్నాడు." అతడు దిగువకు వెళ్ళి, యన్నే, యంబ్రే అను అన్ని రకముల అనుకరణలు చేయువారితో, ఆయన పనిని అనుకరించువారితో అతడు పోరాడియున్నాడు. ఇదంతయూ, అతడు దేవుని కొరకు నమ్మకముగా నిలబడ్డాడు. చివరగా ఇశ్రాయేలును ఒప్పించాడు.

ఇక్కడ అతడు ఐగుప్తు నుండి బయటకు వచ్చాడు, పైకి వాగ్దాన భూమికి వెళ్లుచున్నాడు, అక్కడ దేవుడన్నాడు, "మీరు ఈ పర్వతము మీద నన్ను ఆరాధిస్తారు." అది దేవుని వాక్యమై యున్నది. ఆ పర్వతము గుండా వెళ్ళవలసియున్నదని మోషే ఎరిగియుండెను. ఆమేన్. దేవుడు ఆ రీతిగా చెప్పాడు! ఏ ఫరో అతనిని చంపలేడు. ఏ దయ్యము అతనిని చంపలేదు. ఏది అతనిని చంపలేదు. అతడు ఆ పర్వతమునకు వెళ్లుచున్నాడు.

కాబట్టి మనము మహిమకు వెళ్ళే మార్గములో యున్నాము. ఏదియు మనలను ఆపబోవుట లేదు. దేవుడు ఆయన వాక్యమును సత్యమని రుజువు చేయబోవుచున్నాడు. ఏది సంభవించినప్పటికి నేను లెక్క చేయను, ఎలాగైనను ఆయన దానిని చేయబోవుచున్నాడు. అవును.

EXOD 14:10-12,20

 

40అతడు దారిలో యున్నాడు, తిన్నగా విధి నిర్వహణలో యున్నాడు. అతడు ఇక్కడ పర్వతములలో ముట్టడి వేయబడియున్నాడు. అతని వెనుక గర్జనను అతడు వింటున్నాడు. అది ఏమిటి? వేలకొలదిగా వచ్చుచున్న ఫరో యొక్క రథములు; ఆయుధములు ధరించిన వారు, ఈటెలతో, స్వారీ చేయుచు వారిని క్రిందికి తొక్కి వేయుటకు వస్తున్నారు. అక్కడ ఎర్ర సముద్రమున్నది, అతనిని కత్తిరించి వేసినది. అతడు ఏమి చేశాడు? అతడు కలవరములో పడ్డాడు. ప్రజలు కేకలు వేయుచున్నారు, "ఓ, ఇప్పుడు దానికొరకు మనము లోపల యున్నాము. ఫరో మమ్మును చంపివేస్తాడు, అతని కత్తులు మా గుండా చీల్చివేస్తాయి, మా పిల్లల ఇక్కడ, అరణ్యములో చనిపోతారు."

"ఓ, దేవా!" అని మోషే మొర్రపెట్టాడు.

అప్పుడు యేసు రంగము మీదికి వచ్చాడు. ఆయన అగ్నిస్తంభమైయున్నాడు. అది నిజము. ఆయన దిగి వచ్చి, అతనికి మరియు అపాయము మధ్యలో నిలబడ్డాడు. ఆమేన్. ఆయన మన మధ్యవర్తియై యున్నాడు. ఆయన మన మధ్య నిలబడువాడై యున్నాడు, ఆమేన్! ఒక మధ్యవర్తి. ఆయన అక్కడ నిలబడ్డాడు; అక్కడ నిలబడియుండగా, దానిని గూర్చి ఏదో వ్యతిరేకముగా చేయుటకు ప్రయత్నించుచున్న ఐగుప్తీయులకు చీకటిగా యుండెను. వారు నడుచుటకు, ఆయన వారికి వెలుగుగా యుండెను. అప్పుడు ఉదయమున, గాలి బహుబలముగా వీచుట ప్రారంభమైనప్పుడు, ఆ రాత్రి, అప్పుడు ఆయన ఏమి చేశాడు? ఆయన అగ్నిస్తంభము రూపములో లోనికి వచ్చాడు.

JOHN 16:28•

ACTS 9:3-5

 

41గుర్తుంచుకోండి, ఆయన ఇంకనూ ఆ అగ్నిస్తంభమైయున్నాడు. అవునండి.

ఆయన ఈ భూమి మీద యున్నప్పుడు, ఆయన అన్నాడు, "నేను దేవుని యొద్ద నుండి వచ్చాను, మరియు దేవుని యొద్దకు వెళతాను." ఆయన మరణము, సమాధి, పునరుత్థానము, మరియు ఆరోహణము తరువాత, పరిశుద్దుడైన పౌలు, ధమస్కు మార్గమున అగ్నిస్తంభము ద్వారా తాకబడెను. గుర్తుంచుకోండి, అతడు ఒక హెబ్రీయుడు. "ప్రభువా, నీవు ఎవరవు?" అని అతడన్నాడు, లేనిచో అతడు ఆలాగు చెప్పియుండేవాడు కాదు. [పెద్ద అక్షరాలలో L-O-R-D, ఎలోహిం] "నేను హింసించుచున్నదెవరిని?"

ఆయనన్నాడు, "నేను యేసును."

ఆమేన్! హల్లెలూయ! ఆయన మొదటివాడు మరియు కడపటివాడు. ఆయన ఇంకనూ అదే అయి యున్నాడు. "కొంచెము కాలము లోకము నన్ను ఇక ఎంత మాత్రమును చూడదు, అయినను మీరు నన్ను చూతురు. నేను మీలోను, మీతోను యుంటాను." అదే అగ్నిస్తంభము, అదే దేవుడు - అదే కార్యమును చేయుచున్నాడు, అదే వాగ్దానములో, ఆమేన్, ఆయన వాక్యమును ప్రత్యక్షపర్చుచున్నాడు. "పునరుత్థానమును జీవమును నేనే. నేనే ఉన్నవాడను, అనువాడను రాబోవువాడను." అవునండి! "మీ పితరులు అరణ్యములో మన్నాను తిన్నారు." ఆయనన్నాడు, "వారిలో ప్రతి ఒక్కరూ చనిపోయారు. అయితే ఉన్నవాడను నేనే." మోషే మరియు మండే పొదలో, ఉన్నవాడు. ఆయన ఇంకనూ ఉన్నవాడు. ఉండేవాడను కాదు, ఉన్నవాడను. (వర్తమానకాలము, ఎల్లవేళలా).

EXOD 14:15•

HEB 11:26

 

42మోషే తిన్నగా ఈ మూలలోనికి ముట్టడివేయబడ్డాడు, మరియు క్రీస్తు దిగివచ్చియున్నాడు. ఇప్పుడు బైబిలు దానిని చెప్పింది, "మోషే ఐగుప్తు సంపదలన్నిటి కంటే, క్రీస్తు విషయమైన నిందను గొప్ప సంపదగా ఎంచుకొన్నాడు." క్రీస్తు విషయమైన నింద — క్రీస్తు అభిషేకమైయున్నాడు, దేవుని నుండి బయలువెళ్ళిన లోగోస్, దూత. బైబిలు పఠించే ఏ వ్యక్తికైనా తెలుసు ఆ దూత క్రీస్తు అయి యున్నాడు. అక్కడ అతడు అరణ్యములో యున్నాడు, మరియు ఆయన తప్పక ప్రత్యక్షపర్చబడవలసిన రూపములో, ఆయన లోనికి వచ్చాడు. దేవునికి మహిమ! ఈ దినమున ఆయన, అదే రూపములో, అదే క్రీస్తుగా, తన్ను ప్రత్యక్షపర్చుకొనుచున్నాడు. ఆయన వారిని బయటకు తెస్తానని చెప్పాడు. ఆయన దానిని చేయుచుండెను. అక్కడ ఆయన దానిని సత్యమని రుజువు చేయుటకు, ఆయన వాక్యము ప్రక్కన నిలబడుటకు ఆయన వచ్చాడు.

అప్పుడు ఆయన వచ్చిన తరువాత, అప్పుడు మార్తకు చేసినట్లుగా పిలిచెను. ఆయనన్నాడు, "మోషే నీవు ఎందుకు నాకు మొర్రపెట్టుచున్నావు? వారిని ముందు వెళ్ళమని, ఈ ప్రజలతో మాట్లాడు." ఆ చీకటి ఘడియలో, ఎర్ర సముద్రము తెరవబడింది, దేవుని యొక్క వాక్యమును నెరవేర్చుటకు వారు, ఈ వైపు నుండీ ఆ వైపునకు దాటి వెళ్లారు. అవును, మోషే యొక్క కటిక చీకటి ఘడియలో యేసు వెనుక వచ్చాడు. మనకు సమయమున్నది…ఆయన మోషేను పిలిచెను.

43మీ దృష్టిని మేము మరొక చిన్న మనిషి వైపు ఆకర్షించాలని కోరుచున్నాము. ఆయన పేరు యాయీరు. అలాటి వారు నేటి ప్రపంచములో అనేక మందియున్నారు. ఆయన ఒక రహస్య విశ్వాసి. అతడు యేసును ప్రేమించాడు. అతడు ఆయనను గూర్చి విన్నాడు. అతడు ఆయనను నమ్మాడు. కాని మీరు చూడండి, అతడు ఇదివరకే తనకై తాను ఒక సంస్థలో చేరియున్నాడు. అవును, అతడు బయటకు రాలేకపోయాడు మరియు దానిని ఒప్పుకొనలేకపోయాడు. అతడు దానిని నమ్మాడు, కానీ దానిని ఒప్పుకొనలేకపోయాడు, కాబట్టి అతడు అవిశ్వాసులతో చేరియున్నాడు; కాని అతడు నిజముగా దానిని నమ్మాడు.

మీకు తెలుసా, ఒక మనిషి ఆ స్థితిలోనికి వచ్చినప్పుడు, కొన్నిసార్లు దేవుడు అతనిని పోరాటమును ముఖాముఖిగా తెస్తాడు. మన నిజముగా కలవరములో యున్నప్పుడే మనము నిజముగా ఏమైయున్నామో, మన యొక్క నిజమైన రంగులను చూపుతాము. కాబట్టి అతడు అక్కడ యున్నాడు, అతడు ఇదివరకే, అవిశ్వాసులతో చేరియున్నాడు, మరియు అతని పేరును వారి పుస్తకముతో వుంచాడు. అతడు ఒక యాజకుడై యున్నాడు, అతడు కనీసము ఒక ఒప్పుకోలును చేయలేకపోయాడు, ఏలయనగా అది అతని భోజనపు టిక్కెట్టు అయి యున్నది. కాబట్టి, ఇంకనూ అతడు యేసును నమ్మియున్నాడు.

44ఒక రోజున అతని చిన్న కుమార్తెకు జబ్బు చేసింది. ఓ, మై. సందేహము లేదు, అలాటి మనిషి వైద్యుని పిలిచియుంటాడు. వైద్యుడు వచ్చి, బిడ్డను చూశాడు. ఆమె జ్వరము ఎంతో ఎంతో ఎక్కువయింది. కొద్ది సమయము తరువాత, ఆమె ఒళ్ళు ఎంతో మండిపోయింది. చివరగా ఆమె మరణపు అంచుకు చేరింది. అతడు కలవరములో యున్నాడు. అతడు ఏదో చేయవలసి యుండెను. ఏమి చేయాలో అతనికి అర్థము కాలేదు. "ఆయన ఎక్కడ యున్నప్పటికీ, ఇప్పుడు ఆయనను కనుగొంటే మాత్రము చాలునను కొన్నాడు. ఇప్పుడు నీకొదేము వలె, వ్యక్తిగత దర్శనము కొరకు, రాత్రి అయ్యే వరకు అతడు కనిపెట్ట లేదు. అది పని చేయవలసిన సమయమై యుండెను, అతడు పనిచేయవలసిన సమయము వచ్చియుండెను, మరియు అప్పుడు అతడు తప్పక పని చేయాలి.

సోదరుడా, సోదరీ, ఇప్పుడు అదే సమయమై యున్నదని నేను నమ్ముతాను. పని చేయవలసిన సమయము వచ్చింది. నమ్మటమా లేక నమ్మక పోవటమా అను దానికి సమయము వచ్చింది. అదే వేరు చేయు గీత, ప్రతి స్త్రీకి మరియు పురుషునికి వస్తుంది. అది ప్రతి బిడ్డకు వస్తుంది. కొన్ని సార్లు నీవు ఆ గీతను దాటినప్పుడు, అక్కడ ఒక్కటి మాత్రమే మిగిలింది: అదే తీర్పు, నీవు కృపకు మరియు తీర్పుకు మధ్య దాటినప్పుడు, నీవు ఆ గీతను దాటతావు.

45గుర్తుంచుకోండి, అతడు చీకటిలో పడ్డాడు. ఏమి చేయాలో అతనికి అర్థము కాలేదు. అక్కడ యాజకులు, అరబ్బీలందరూ అక్కడ నిలబడియున్నారు. అతని సహవాసము వారందరు అక్కడ యున్నారు, ఆ చిన్న బిడ్డ చనిపోవుటను గమనించుచున్నారు. వైద్యుడు బయట నిలబడి, అతని చేతులను కట్టుకొనియున్నాడు, అతని చేతులతో కరచాలనము చేస్తున్నాడు, "నేను ఎరిగియున్న మందులన్నిటిని ఇచ్చాను, అన్నాడు, మరియు ఇంకనూ…" చూడండి, అది ఎల్లవేళలా పనిచేయుచున్న యేసు. ఒక ఉద్దేశ్యము కొరకు, ఆ చిన్న వ్యక్తిలో నుండి రంగును బయటకు తెచ్చుట కొరకు, యేసు దానిని చేయుచుండెను.

కొద్దిసేపటి తరువాత, అతడు తన నల్ల టోపిని లాగి, తలపై పెట్టుకొని, తన చిన్న యాజకుని కోటును వేసుకొనుటను నేను చూడగలను.

"నీవు ఎక్కడికి వెళ్ళుచున్నావు?"

"ఆ దిగువ నది యొద్ద యున్నాడని నేను విన్నాను. నేను ఆయన కొరకు వెళ్ళుచున్నాను."

"ఓ, మై! అతడు దూరముగా వెళ్ళాడు.

MATT 9:19•

MARK 5:24,35•

LUKE 8:49•

2COR 5:19

 

46ఆ కలవరపు ఘడియలో, అతడు ఒక తీర్మానమును చేయవలసియుండెను: అతని బిడ్డను చనిపోనియ్యి, లేక అది వాక్యము యొక్క ప్రత్యక్షతయైయున్నదని అతడు ఎరిగియుండెను. అతడు ఒక యాజకుడు, అతడు వాక్యమును చదివియుండెను, మరియు ఆయన దేవుని వాక్యము యొక్క ప్రత్యక్షత అయి యున్నాడని అతడు ఎరిగియుండెను. దేవుడు క్రీస్తులో యుండి, లోకమును తనతో సమాధాన పర్చుకొనుచున్నాడు. అతడు దానిని ఎరిగియుండెను, మరియు ఆ విషయమునకు అతడు ఒత్తిడి చేయబడ్డాడు. అతడు ఒక పొరపాటు చేయవలసియుండెను, బిడ్డను చనిపోనివ్వటమా లేక తన "ఒప్పుకోలును ప్రకటించటమా, అతడు ఆ కలవరములో యున్నప్పుడు, ఆ సమయములోనే యేసు మార్గములోనికి వచ్చెను. అతడు ఆయనను చూచుటకు వెళ్ళియున్నాడు. "ఆయనన్నాడు, నీవు ఏమి చెప్పినా, నేను నీతో వస్తాను."

వారు మార్గములో యుండగా, ఆయనను నమ్మియున్నానని, అతడు తన ఒప్పుకోలును చేశాడు. అతడు అప్పుడు తన్ను తాను వేరుచేసుకొని, అతడు యేసుక్రీస్తులో ఒక విశ్వాసి అయి యున్నాడని, బహిరంగముగా అందరియెదుట తన్నుతాను చెప్పుకొన్నాడు.

MARK 5:36,41•

MARK 10:46•

LUKE 8:50

 

47ఆ వార్త తెచ్చినవాడు అన్నాడు, "ఎవరినీ ఇబ్బంది పెట్టవద్దు, ఎందుకనగా నీ కుమార్తె ఇంతకు మునుపే చనిపోయింది. ఆమె నిన్న చనిపోయింది. ఆమె ఇదివరకే చనిపోయింది. ఇక ఎంత మాత్రము దానితో వెర్రివాడవు కావద్దు."

ఓ, అతని చిన్న గుండె ఆగిపోయినట్టింది, కాని అతడు ఆ యేసు కన్నుల వైపు చూశాడు, నీవు దేవుని మహిమను చూడగోరినట్లైతే, "భయపడవద్దు, అని నేను నీకు చెప్పలేదా? నీవు దేనికి భయపడేది? నేను నీతో వస్తానని, ఇంతకు మునుపే చెప్పలేదా."

ఆయన వస్తానని ఇదివరకే చెప్పాడు. ఆయన ఇది చేస్తానని ఇదివరకే చెప్పాడు, ఇక్కడ ఆయన దానిని చేయుచున్నాడు. ఆయన చేసియున్నట్లుగా, చివరి దినములలో ఆయన లేచి, ఈ కార్యములు చేస్తానని ఆయన చెప్పియున్నాడు, మనము గత రాత్రి మాట్లాడినట్లుగా, ఇక్కడ ఆయన దానిని చేయుచున్నాడు. నీవు దేనికి భయపడుచున్నావు? గుర్తుంచుకోండి, ఆయన వచ్చినప్పుడు, ఆమెను మృతులలో నుండి లేపియున్నాడు. ఆయన రంగము మీదికి వచ్చి, మృతులలో నుండి ఆమెను లేపియున్నాడు.

వృద్ధ బర్తమయి, ఒకప్పుడు, అతని కటిక చీకటి ఘడియన తాకాడు.

MATT 21:9,15•

MARK 10:48•

MARK 11:9,10•

LUKE 18:38•

JOHN 12:13

 

48యేసు అక్కడ, యెరికోలో ఫుల్-గాస్పెల్-జినెస్ వ్యాపారస్తుల అల్పాహార విందును నిర్వహించియున్నాడు, మరియు అక్కడ జక్కయ్యను కలిగియున్నాడు. ఆ వీధిలోని చెట్టులో, ఆయన అతనిని కలుసుకొని యున్నాడు. కాబట్టి ఆయన అక్కడ యుండగా, అతడు ఏమియు నిర్వహించలేదు. నాకు నిశ్చయతయున్నది, చూడండి. కాబట్టి అతడు క్రిందికి వచ్చినప్పుడు, ఆయన అతనిని కలిగియున్నాడు, జక్కయ్య ఆయనతో వెళ్ళియున్నాడు. చిన్న బిడ్డగా యున్నప్పటి నుండి, వృద్దుడైన గ్రుడ్డి బర్తమయి, గ్రుడ్డివాడిగా యుండి యున్నాడు. కాబట్టి అతడు కనిపెట్టుచున్న గవీని యొద్దకు యేసు వస్తాడని అతడు తలంచి యున్నాడు.

కొద్ది సేపటికి, పెద్ద శబ్దమును అతడు విన్నాడు, ప్రతి ఒక్కరూ అక్కడికి వస్తున్నారు. యాజకులు ఈలాగు చెప్పుటను అతడు విన్నాడు, "హే, హే, నీవు, నీవు ఆ కొండ మీదికి వెళ్లుచున్నావు… నీవు మృతులను లేపియున్నావని మేము విన్నాము. ఇక్కడ మాకు నిండుగా సమాధుల దొడ్లు వున్నాయి. నీవు మెస్సీయావై యున్నట్లైతే, ఇక్కడకు వచ్చి మృతులను లేపుము."

నీవు చూశావా, అదే దయ్యము ఇంకా జీవిస్తుంది, మతము యొక్క రూపములో, చూడు, అదే విధానము. "నీవు మెస్సీయావై యున్నట్లైతే, నీవు చనిపోయిన వారిని లేపుతావు, మాకు ఇక్కడ సమాధుల నిండా చనిపోయిన వారున్నారు. రమ్ము."

ఓ, ప్రతి ఒక్కరూ కేకలు వేయుచున్నారు, "ప్రవక్తకు హోసన్నా," అని మరొకరు అరుస్తున్నారు. మరొకరు ఈలాగు, ఆలాగు, మరొక లాగా అరుస్తున్నారు - ఎలాటి గందరగోళము.

వృద్ధబర్తమయి, "ఓ, నేను ఆయన పోగొట్టుకొన్నాడని తలంచాడు. ఆయన అక్కడకు వెళ్ళాడు, ఆయన ఇక్కడకు వస్తాడని అతడు తలంచాడు. నేను తప్పు స్థలములో ఉంచబడి యున్నాను." అతడు కేకలు వేయుట ప్రారంభించాడు, "ఆయన వాక్యమై యున్నాడు, ఆయన దేవుడై యున్నాడు, ఆయన తప్పక ఆలాగు అయి యుండాలి," అని అతడు తలంచాడు. కాబట్టి, "ఓ, యేసు, దావీదు కుమారుడా, నాపై కనికరము చూపుము." దుఃఖముతో యున్న ఆ ఘడియలో, అతడు బిగ్గరగా పిలిచెను.

MARK 10:49

 

49ఇప్పుడు యేసు, మీరు గుర్తుపెట్టుకొనగోరినట్లైతే, అది యెరికోలో, యేసు యున్న చోట నుండి ఒక వంద లేక నూట-ఏభై గజముల దూరములో అతడు కూర్చొనియున్నాడని వారన్నారు. వేల మంది ప్రజలు ఆయన చుట్టూ క్రిక్కిరిసియుండగా, ఆయన ఆ మనిషి యొక్క కేకను వినియుండేవాడు కాదు. లేదు, కానీ ఆయన దానిని స్పృశించాడు. అప్పుడు ఆయన ఆగియున్నాడు. ఈ రాత్రులలో ఒక రాత్రి, "మరియు అప్పుడు యేసు ఆగియున్నాడు," అనే విషయాన్ని నేను బోధించగోరుచున్నాను. ఓ, మరియు అప్పుడు యేసు ఆగియున్నాడు. ఓ, కాని యేసు ఆగినప్పుడు, అది ఏమైయున్నది? ఆయన అతనిని పిలిచెను.

"బోధకుడు వచ్చాడు. చింతపడవద్దు," అని శిష్యులు చెప్పారు, "ఆయన నిన్ను పిలుస్తున్నాడు. ఆయన నిన్ను పిలుస్తున్నాడు." జనసమూహములో నుండి అతనిని బయటకు పిలిచెను!

ఆయన అదే కార్యము ఇప్పుడును చేస్తాడు. అది లోపల నాననిస్తారా? బోధకుడు వచ్చి నీ కొరకు పిలిచెను. గ్రుడ్డితనము నుండి వెలుగులోనికి, చీకటి నుండి వెలుగులోనికి ఆయన పిలుస్తున్నాడు. మరణములో నుండి జీవములోనికి దాటియున్నావని ఆయన అతనిని పిలిచెను. "బోధకుడు వచ్చి, నీ కొరకు పిలుస్తున్నాడు. ఆయన అతనిని పిలిచినప్పుడు, అతనికి చూపును తిరిగి ఇచ్చియున్నాడు.

MARK 5:25,26•

LUKE 8:43

 

50రక్త స్రావముతో యున్న ఆ చిన్న స్త్రీ, ఒకప్పుడు, ఆ కొండ మీద నివసిస్తుంది. ఆమె తనడబ్బునంతా వైద్యులకు ఖర్చుపెట్టి యున్నది. సందేహము లేదు, ఆమె తన వ్యవసాయ క్షేత్రములను అమ్మివేసింది, దానిని తాకట్టు పెట్టింది. వారు వైద్యులకు తమకున్నదంతయు ఖర్చు పెట్టియున్నారు, వారిలో ఎవరునూ ఏ మేలు చేయలేదు. ఆమె ఎడతెగకుండా హీనముగా, ఎంతో హీనముగా మారిపోయింది. రక్తము కారుట ఆగలేదు. ఎడతెగకుండా, ఆలాగుననే అది ఇంకా ముందుకు, ఇంకా ముందుకు కొనసాగింది, ఆమె లోతునకు ఇంకా లోతునకు వెళ్ళిపోయింది. ఒక రోజున, ఆమె నివసిస్తున్న కొండ మీద కూర్చొని అల్లుకొనుచుండగా, ఆమె క్రింది లోయలోనికి చూసింది, మరియు ఒక పడవ లోపలకు వచ్చుటను ఆమె చూసింది, "ప్రవక్తకు హోసన్నా!" అని ప్రతి ఒక్కరూ పరుగెత్తుట ప్రారంభించారు.

MATT 9:21•

MARK 5:28,30,31•

LUKE 8:45,46•

ROM 10:17

 

51ఆమె ఆయనను గూర్చి విన్నది. వినుట ద్వారా విశ్వాసము కలుగును. ఇప్పుడు ఆమె అనుకొంది "నేను వెళ్ళి ఆయనను చూస్తే బాగుంటుంది." ఆమె అక్కడకు నడిచి వెళ్ళినప్పుడు, ఆమె మొదటిసారిగా, శరీరములో ప్రత్యక్షపర్చబడిన దేవుని వాక్యము చూసింది, అక్కడ ఆయన యొక్క సంభాషణను గూర్చి, ఆయన చూపులను గూర్చి, ఒక ప్రత్యేకత యున్నదని, అది ఆయనే అయి యున్నాడని ఆమె గ్రహించియున్నది. అవునండి!

"ఓ, నేను ఎలాగైనా ఆయన దృష్టిని ఆకర్షించగలిగినట్లైతే, నేను ఎలాగైనా ఆయనను తాకగలిగినట్లైతే, బాగుంటుంది అనుకొంది."

కాబట్టి ఆమె జనసమూహము గుండా జారుకొంటూ, ఆయన వస్త్రపు చెంగును తాకింది. ఇప్పుడు గుర్తుంచుకోండి, ఆయన స్పృశించి యున్న ఆమె వ్రేలును కాదు. కాదండి, ఏలయనగా ఆ పాలస్తీనా వస్త్రము వదులుగా వ్రేలాడుతుంది.

పేతురు అన్నాడు, "ప్రతి ఒక్కరూ నిన్ను ముట్టుచున్నారు."

ఆయనన్నాడు, "కాని ఇది ఒక వేరైన తాకుటగా యున్నది. నేను బలహీనమై యున్నానని గ్రహించాను."

HEB 13:8

 

52యేసు వచ్చియున్నాడు. ఆమె డబ్బంతా పోయింది, సమస్తమునూ పోయింది. కాని ఆ చీకటి ఘడియలో రక్తస్రావము ఆగలేదు, వైద్యులు దానిని ఆపలేకపోయారు, అంతట యేసు వచ్చాడు. ఆయన ఏమి చేసియున్నాడు? ఆయన ఆమెను పిలిచియున్నాడు. ఆమెను కనుగొనువరకు ఆయన చుట్టూ చూశాడు, ఆయనన్నాడు, "నీవు రక్త స్రావము వ్యాధిని కలిగియున్నావు, అయితే అది ఆగిపోయింది." ఆయన నిన్న, నేడు, నిరంతరము ఏకరీతిగా యున్నాడు. బోధకుడు వచ్చి, నిన్ను పిలుస్తున్నాడు. ఆయన వచ్చియున్నాడు, మరియు పిలిచియున్నాడు." ఆయన తిరిగి ఆమెను ఆరోగ్యమునకు పిలిచెను.

53గత రాత్రి మనము మాట్లాడియున్నాము, ఆ బావినొద్ద యున్న చిన్న స్త్రీ, అన్ని ఆశలు పోయినవి. బహుశ, అయిదవ భర్త విడిచిపెట్టాడు, ఆ రాత్రి సరిగ్గా ఆరవ భర్తను తీసుకొన్నది, అతనిని గూర్చి ఆమెకు చిన్న సందేహము యున్నది. నైతికముగా, ఆమె ముగించబడింది. ఆమె ఒక నిజమైన స్త్రీగా యుండాలనుకొన్నది; ఆమె, సందేహము లేదు, ఆమె బైబిలు చదువుతూయున్నది. ఆమె పదకొండు గంటల సమయములో, దారి వెంబడి అక్కడకు వెళ్ళింది.

నీతిమంతురాలైన స్త్రీలు పెండలకడ ఉదయమున అక్కడకు వచ్చే సమయములో, వారితో అక్కడకు రాలేదు. వారు నీళ్ళను కూజాలతో తలలపైన పెట్టుకొని, తిరిగి వెనుకకు వెళ్ళిపోయారు. మరియు ఆమె వారితో కలసి అక్కడకు రాలేదు. ఆ దినమున వారు జాతిభేదమును కలిగియున్నారు. తప్పు మరియు ఒప్పు, ఒక్కటిగా మిశ్రమము కాలేదు. ఆ నైతికముగా యుండేవారు వారి స్థానములో యుంటారు, కాబట్టి ఆమె మిగిలినవారితో కలసి అక్కడకు రాలేదు. వారు ఆమెను రానియ్యరు.

కాబట్టి ప్రతిఒక్కరూ వారి నీళ్ళను తోడుకొని తిరిగి వెళ్ళిపోయారు… ఆమె మంచి సమయములో వచ్చింది.

JOHN 4:7

 

54ఆమె తన తల మీద కడవను పెట్టుకొని పైకి వచ్చింది.

సందేహము లేదు, మార్గము వెంబడి ఆమె ఆలోచిస్తుయుంది, "ఇప్పుడు, నేను వివాహము చేసికొన్న మనిషి, లేక గత రాత్రి నేను పట్టుకొన్న మనిషిపై నాకు సందేహముగా యుంది. ఆయన ఒక మనిషై యున్నాడు. ఆయన ఎంతో వింతగా పనిచేస్తాడు. ఆయనను గూర్చి నాకు ఏమియు తెలియదు. నాకు అవకాశము దొరకలేదు. నేను సమాజము నుండి త్రోసివేయబడ్డాను. నేను ఆ సంఘములకు వెళ్ళలేను. కొంచెము వారి వైపు చూడండి. ఏమి చేయాలో నాకు అర్థమగుట లేదు. ఆమె కలవరములో యున్నది.

"నేను బైబిలు చదువుచూ యున్నాను. నిశ్చయముగా, ఒక రోజున, ఆ ప్రవక్త రంగము మీదికి వస్తాడు. ఇప్పుడు అలాటి కార్యమేమియు అక్కడ యుండదని వారు చెప్పుతున్నారు, ఇది అలాగే యున్నది, బహుశ వందల సంవత్సరములు గడిచిపోయినవి, ఒక వెయ్యి సంవత్సరములు గడిచినవి. 'ఎన్నో వేల సంవత్సరముల నుండి మేము దాని కొరకు ఎదురుచూస్తున్నాము, మరియు అది ఎన్నడూ ఇంకనూ సంభవించలేదు. కాబట్టి దాని కొరకు మేము ఇప్పుడు ఎదురుచూచుటలేదు. సమస్తమును ఆలాగునే యున్నది, ఓ… లేదు, మేము సంఘములను, వాటన్నిటిని కలిగియున్నాము. అలాటిది ఇప్పుడు మాకు అవసరము లేదు.'"

కాబట్టి అప్పుడు ఆమె దానిని ఆలోచిస్తూ, దారి వెంబడి వెళ్ళుచున్నది. నీకు తెలుసా, మనము ఆయనను గూర్చి ఆలోచిస్తున్నప్పుడు, అప్పుడే ఆయన నీకు ప్రత్యక్షమవుతాడు. గతరాత్రి మనము కలిగియున్నట్లుగా, వారు ఎమ్మాయి మార్గములో యుండగా అది జరిగింది.

55ఆమె ఈ విషయములను గూర్చి ఆలోచిస్తున్నప్పుడు, "నాకు దాహమునకిమ్ము," అని ఒక మనిషి చెప్పుట ఆమె విన్నది. దాని సంగతి ఏమిటి? ఆమె కటిక చీకటి ఘడియలో, ఆమె నైతిక విలువలన్నియూ దిగజారిపోయినవి. బహుశ, ఒక చక్కని చిన్న స్త్రీ, ఆ విధముగా జీవించుటకు వీధులలోనికి వదలబడింది. కొన్నిసార్లు అది, ఆ చిన్న బాలిక యొక్క పొరపాటు కాదు, అది ఆమెను ఆ విధముగా బయటకు వదులుట, అది ఆమె తల్లిదండ్రుల పొరపాటైయున్నది.

ఆమె అక్కడ యున్నది, ఆమె ఉంగరాల జుట్టు అంతా క్రిందికి వ్రేలాడుతుంది. ఆమె ఖాళీయైపోయింది, దారివెంబడి చింతిస్తూ వెళ్ళుచున్నది, మరియు ఎవ్వరికి ఆమె అవసరములేదు, ఆ బిడ్డ, బహుశ ఒక పెద్ద కధ దాని వెనుక యున్నది. ఎలాగైనను, ఒక్క సంగతి నాకు తెలుసు, ఆమె బైబిలును చదివియున్నది, మరియు బైబిలును నమ్మియున్నది. మరియు అక్కడ చిన్న విత్తనము, ఆమె హృదయముతో ఉంచబడియున్నది, అది చెప్పుతుంది, "అది ఎన్నడైనా సంభవిస్తే, నేను దానిని గుర్తిస్తాను." ఆమె దానికొరకు ముందుగా నిర్ణయించబడియున్నది.

JOHN 4:19,25,26•

HEB 13:8

 

56అక్కడ నిలబడియున్న పాత యూదా వైపు చూడండి, అతడు ఏమి చేశాడో, దానిని చేయునట్లుగా నటించుచున్నాడు. అతని హృదయంతరంగములో అది నల్లగా యున్నది. అతని క్రియలలో, వెలుగు పైకి ప్రకాశించుచున్నది, కాని అతని హృదయంతరంగములో, అతడు దానిని నమ్మియుండలేదు. కాని ఆమె అక్కడ యున్నది… చూడండి, వెలుగు దాని యొద్దకు వెళ్ళలేకపోయింది. కాని ఆమె ఇక్కడున్నది, నమ్మింది, ఆమె దానిని నమ్మియున్నది, ఆమె జీవితము నల్లగా మారింది. వెలుగు దానిని తాకినప్పుడు, అది నలుపును బయటకు తీసివేసింది. కాని అక్కడ వెలుగు తాకినప్పుడు, అది అంతయూ నల్లగా దానిని చేసింది. అదే భేదమైయున్నది.

చూడండి, ఆమె ఒక ఉద్దేశ్యము కొరకు పుట్టియున్నది. ఆమెకు ఎంత మంది భర్తలున్నారో ఆయన చెప్పినప్పుడు, ఆమె అన్నది… ఏమి సంభవించింది? ఆమె ఎంతగానో పులకించిపోయింది. ఆమె కలవరములో పడింది. ఆమె అన్నది, "అయ్యా, నీవు ప్రవక్తవని గ్రహించుచున్నాను. మెస్సీయా వచ్చినప్పుడు, ఆయన ఈ కార్యములను చేస్తాడని నేను ఎరుగుదును." అప్పుడు ఆయన ఆమెను పిలిచెను.

అప్పుడు ఆయన ఆమెను పిలిచెను. "నీతో మాట్లాడుతున్న నేనే ఆయనను."

దేవుని వాక్యము ద్వారా దానిని ఆమె గుర్తించింది. ఆమె యొక్క పాపముల నుండి ఆయన ఆమెను జీవములోనికి పిలిచెను. ఆమె పేరు బైబిలులో యున్నది, మరియు ఈ దినమున ఆమె అమర్త్యమైన జీవమును కలిగియున్నది.

ఆ మార్గములోనే, ఆయన నిన్ను పిలవగలడు, ఏలయనగా ఆయన నిన్న, నేడు, నిరంతరము ఏకరీతిగా యున్నాడు. అవును, ఆమె నైతిక విలువలు క్షీణించిపోయినవి, కాని ఇంకనూ ఆయన వివేచనను కలిగియున్నాడని ఆమె ఎరిగియుండెను. అది మెస్సీయాగా యుండవలసియున్నదని ఆమె ఎరిగియుండెను. తరువాత, "నేనే ఆయనను, నేనే ఆయనను," అని యేసు చెప్పినప్పుడు, అది ఆయనేమైయున్నాడని ఆమె ఎరిగియుండెను.

MATT 14:26,27•

MARK 6:48-50•

JOHN 6:19,20

 

57ఒకసారి శిష్యులు దోనెలో యున్నారు, అన్ని ఆశలు గతించిపోయినవి. తుఫానులు, వారు యేసు లేకుండా వెళ్ళిపోయారు, లాజరు ఇంటి మీదికి వచ్చినట్లుగా తుఫానులున్నవి. అన్ని ఆశలు గతించిపోయినవి. ఆ చిన్న పడవ నీళ్ళతో నిండిపోయింది. వారు కేకలు వేస్తూ, ఏడుస్తున్నారు, బహుశ ప్రార్థిస్తూ యున్నారు, మెరుపులు ప్రకాశిస్తున్నాయి, దోనె నీళ్ళతో నిండిపోయింది, దోనె నిలువ కొయ్యలు పడిపోయినవి, తెడ్డు పగిలిపోయినవి, వారు ఒకరి చేతులను ఒకరు పట్టుకొని, ఏడుస్తున్నారు.

ఆ నిజమైన కటిక చీకటి ఘడియలో, అప్పుడు యేసు మార్గము వెంబడి వచ్చాడు. అయితే ఆయన వారికి ఒక నీడవలె కనపడ్డాడు. ఆయన చాలా భయంకరముగా కనిపించాడు, మరియు వారు భయముతో కేక వేశారు. అదే ఈ దినమున విషయమైయున్నది. యేసు నీ యొక్క చీకటి ఘడియలో వస్తాడు, మరియు నీవు దానిని గూర్చి భయపడతావు. అది ఏమిటో నీకు అర్థము కాదు. ఆయన ఏమైయున్నాడో వారికి తెలియలేదు. వారన్నారు, "ఓ, అది ఒక భూతము!" వారు కేకలు వేయుచున్నారు.

MATT 14:28,29

 

58అప్పుడు ఆయన వారిని పిలిచి, "భయపడవద్దు, నేనే," అన్నాడు. కటిక చీకటి ఘడియలో, వారికి సహాయము చేయుటకు మార్గముగుండా యేసు వచ్చాడు. ఆయన ఎల్లప్పుడు ఆ విధానములోనే చేస్తాడు, కటిక చీకటి ఘడియలో వస్తాడు. యేసు వారియొద్దకు వచ్చి, తన్ను తాను ప్రత్యక్షపర్చుకొన్నాడు.

పేతురు అన్నాడు, "అది నీవే అయితే, నన్ను కూడా నీళ్ళ మీద నడవనిమ్ము."

యేసు అన్నాడు, "ముందుకు రమ్ము."

అది ఏమిటో మీకు తెలుసు, స్నేహితులారా? ఆయన త్వరలోనే, ఈ చివరిసారి వారికొరకు వస్తాడు. ఇప్పుడు, ఈ చీకటి ఘడియలో మరలా సంఘము యుండుట, అది వింతగా లేదా?

59నేను ఒక విషయాన్ని ఇక్కడ చెప్పబోవుచున్నాను. నేను సరిగ్గా ప్రవచించుచున్నాను. ఏమి సంభవించియున్నదో మీకు తెలుసు? త్వరలోనే అది ఒక స్థానమునకు రాబోవుచున్నది, నా మాటను గుర్తుపెట్టుకోండి, సంఘ శాఖలన్నియు సంఘముల సమాఖ్యలోనికి చేరబోవుచున్నవి. వారు ఆలాగున చేయకపోతే, ఆ సభ యొక్క సహకారము వారికి యుండదు.

అందుచేత, అక్కడ ఒక వెలివేయుట ఉండబోవుచున్నది, మరియు ఎవ్వరూ ఈ సంఘములకు వెళ్ళలేరు, లేక ఏ సంఘమునకు వెళ్ళలేరు. నీ సొంత సంఘము నుండి ముద్రయుంటేనే గాని, నీవు అమ్మటానికి లేక కొనటానికి వీలు లేదు. అది సరిగ్గా యుండి యున్నట్లుగా, మీరు చూడండి, కాబట్టి మరలా అది యుండబోవుచున్నది, ఒక మృగపు ముద్ర. సంఘము, వారు దానిని గుర్తిస్తున్నారు, ఆత్మ సంబంధమైన ప్రజలు. పెంతెకొస్తు ప్రజలైన మీరు, ఎలాగైనా, దానిని గుర్తించుచున్నారు. మీరు దానిని స్పృశించుట ప్రారంభించుచున్నారు. మీ యొక్క సంఘము… పెంతెకొస్తులోని అనేకమైన సంస్థల, (మరియు మీ పేరులను నేను పిలవవలసిన పనిలేదు, కాని మీకు తెలుసు), వారు తిన్నగా ఇప్పుడే, వారు దానిలోనికి వచ్చుచున్నారు. వారు దానిలో యుండి యున్నారని సాక్ష్యమిచ్చియున్నారు.

మీరు దానిని చేసినప్పుడు, నీవు ఏమి చేయబోవుచున్నావు? పరిశుద్ధాత్మ యొక్క సువార్త ఉపదేశములను మీరు తాకట్టు పెట్టుచున్నారు. నీవు బైబిలు యొక్క సిద్ధాంతమును తాకట్టు పెట్టబోవుచున్నావు. సంఘ సభ్యులు దాని కొరకు నిలబడలేరు. నిజముగా తిరిగి-జన్మించిన విశ్వాసులు, మొదటగా చనిపోతారు. వారు వాక్యము ద్వారా హెచ్చరించబడ్డారు, ఈ సంగతి వచ్చుచున్నదని వారికి తెలుసు. అవునండి.

60అది వింతగా లేదా? మరియు ఈ కటిక చీకటి ఘడియలో, అప్పుడు యేసు మార్గము వెంబడి వచ్చి, వారిని పిలిచి, "అది నేనే, భయపడవద్దు, అన్నాడు. నేను ఇంకనూ మీతోయున్నాను. నా వాక్యమును ప్రత్యక్షపర్చుటకు, నేనిక్కడ యున్నాను." ఆయన అప్పుడు ఎలా యుండియున్నాడో, ఇప్పుడును ఆలాగునే యున్నాడు. ఆయన దానిని చేస్తానని చెప్పాడు. ఓ, మై! బోధకుడు వచ్చి మమ్ములను పిలిచియున్నాడు.

వ్యాధిగ్రస్తులైన ప్రజలారా, సందేహము లేదు, వైద్యుడు మీకు ఏ ఆశయు లేదని చెప్పియుండగా, మీరు ఇక్కడ కూర్చొనియున్నారు. బహుశ, మీరు మీ యొక్క చీకటి ఘడియలో యుండవచ్చు. గుర్తుంచుకోండి, యజమాని వచ్చియున్నాడు, మరియు నిన్ను పిలిచియున్నాడు.

61ఒక రోజున, మన యజమాని రాబోవుచున్నాడు, గొర్రెపిల్ల జీవగ్రంథములో వ్రాయబడిన ప్రతి పేరును పిలుస్తాడు. నీ పేరు అక్కడ యుండకపోయినట్లైతే, ఇప్పుడే దానిని అక్కడ పొందుము, ఎందుకనగా ఆయన వచ్చి, పిలవబోవుచున్నాడు. సమాధులలో యుండువారు సహితము, ఆయన స్వరమును విని జీవమునకు ముందుకు వస్తారు. యజమాని వచ్చును, మరియు నిన్ను పిలుస్తాడు.

ఈ రోజున ఆయన పిలుస్తూ యుండగా, ఆ దినము కొరకు సిద్ధపాటు చేసుకొమ్మని, నేను మీకు సలహా ఇస్తున్నాను. ఈ యుగము వాగ్దానము, ఆయన ఇక్కడ యుంటానని వాగ్దానము చేసియున్నాడు. ఆయన చేసిన కార్యములను, ఆయన మరలా చేస్తాడు, మరలా ఇప్పుడు యజమాని తిరిగి వచ్చి, నిన్ను పిలుస్తాడు.

62మన తలలను వంచుదాము. ఇంకా ఇక్కడనా దగ్గర ఆరు పేజీలు యున్నాయి. నేను వాటి యొద్దకు ఇప్పుడు వెళ్ళలేను, మన తలలను వంచుదాము. నేను పెందలకడ మిమ్మును బయటకు పంపివేస్తానని వాగ్దానము చేశాను, ఇప్పుడు అది పావుగంట దాటింది.

పరలోకపు తండ్రి, ఓ ప్రభువా, అది మరల సంభవింపనిమ్ము. "యేసు వచ్చి నీ కొరకు పిలుస్తున్నాడని, నేను చెప్పాను. ఆయన వచ్చినప్పుడు ఆయన ఏమి చేస్తాడు? ఆయన పిలుస్తాడు." మరియు ప్రభువా, అది మరలా జరగనిమ్ము. ఈ రాత్రి పరిశుద్దాత్ముడు, నీ ప్రజల మధ్యకు, ప్రభువైన యేసు రూపములో రానిమ్ము.

ఈ రాత్రి ఆయన తనకు తానుగా వచ్చి, అప్పుడు తన్ను తాను బయలుపర్చుకొని, ప్రత్యక్షపర్చుకొననిమ్ము. వారు ఎలా నమ్మియున్నారో, ఆ ప్రజలవలే, ప్రభువా మేము కూడా నమ్ముతాము. బహుశ, ఇక్కడ యున్న అనేకమంది ఇలాటి అవకాశమును కలిగియుండలేదు. ఈ రాత్రి మరలా దానిని వారికి దయచేయుమని మేము ప్రార్థించుచున్నాము, ఏలయనగా దేవుని మహిమ కొరకు యేసు నామములో మేము దానిని అడుగుచున్నాము. ఆమేన్.

63[సహోదరుడు బ్రెన్హాం పియానో వాయించు సహోదరితో మాట్లాడుచున్నాడు] అది అంతే, సహోదరీ. అయితే సరిగ్గా దానితో ముందుకు వెళ్ళుము. అది బాగున్నది. తిన్నగా ముందుకు వెళ్ళుము. ఓ.. నిజముగా, నెమ్మదిగా, ప్రతిఒక్కరు.

ఆయన వచ్చియున్నాడని మీరు నమ్ముతున్నారా? ఆయన వచ్చాడు. ఆయన వచ్చినప్పుడు, ఆయన ఇంకనూ పిలుస్తాడా? ఇప్పుడు మీరు కేవలము నమ్మినట్లైతే, దేవుని వాక్యమును మీరు సరిగ్గా నమ్మినట్లైతే, దేవుడు మీకు దానిని అనుగ్రహిస్తాడు.

ఇప్పుడు, చూడండి. ఈ పైకి ప్రార్ధన వరసను పిలుచుటకు నాకు సమయము లేదు. ప్రభువు చిత్తమైనయెడల ఈ రాత్రికి, బయట నేను వారిని పిలవబోవుచున్నాను.

అయితే యజమాని వచ్చియున్నాడు. చివరి దినాలలో ఆయన వాక్యమును నేరవర్చుటకు రావలిసియున్నది. ఆయన అప్పుడు ఏమైయున్నాడో, ఈ రోజున అదే అయి యున్నాడు. ఆయన యొక్క ప్రత్యేక్ష్యపరచబడుట లేక గుర్తింపు అప్పుడు ఏమైయుండెనో, ఈ రోజు అది అదే అయి యున్నది, ఎందుకనగా ఆయన ఇంకనూ దేవుని యొక్క వాక్యమైయున్నాడు. మీరు దానిని నమ్ముతారా? దేవుని యొక్క వాక్యము, హృదయము యొక్క తలంపులను, ఆలోచనలను వివేచించువాడైయున్నాడు. అప్పుడు చేసియున్న విధానములోనే, ఆయన ఎల్లప్పుడును చేసియున్నాడు. ఆయన ఇంకనూ ఒకే రీతిగా యున్నాడు. ఇప్పుడు ఆయన దానిని చేసినట్లైతే, మీరు ఆయనను నమ్ముతారా? అది మీరు ఆయనను నమ్మినట్లు చేస్తుందా?

ఇప్పుడు ఇక్కడ యున్న ప్రజలు.. ఇక్కడ కూర్చొనియున్న వారిలో, ఎవరైనా నేను ఎరిగినవారుయున్నారేమో, మొదటగా నన్ను చూడనియ్యండి.

64నన్ను ఎరుగనివారు, ఈ చుట్టూ యున్నవారు, పైన ఇక్కడ యున్నవారు మీ చేతులను ఎత్తండి, మీరు రోగులై యున్నారనియు, మీ గూర్చి నాకు ఏమియు తెలియదని, మీకు తెలుసు, మీరు చేతులను ఎత్తండి. ప్రతిఒక్కరూ అని నేను ఊహిస్తున్నాను. మంచిది.

ఇప్పుడు, మీరు నమ్ముము. మీరు కేవలము మీ హృదయమంతటిలో మీరు నమ్ముము. విశ్వాసమును కలిగియుండండి. దేవుని నమ్మండి. మీరందరు ఎంతో నిశ్శబ్దముగా కూర్చొని యుండమని, నేను అడుగుచున్నాను. చుట్టూ తిరగవద్దు, దయచేసి కదలవద్దు. చూడండి, నీవు ఒక ప్రాణము, శరీరము, మరియు ఆత్మ అయి యున్నావు. మరియు మీ ఆత్మ… ఇప్పుడు, పరిశుద్ధాత్ముడు నిజముగా నిమ్మళమైనవాడు.

65ఎన్నో సంవత్సరముల క్రితము, మీలో ఎంతమందికి గుర్తున్నది, పరిశుద్దాత్మ నేను ఇక్కడకు వచ్చి చెప్పియున్నాను? ప్రజల చేతిని నేను తీసుకొన్నప్పుడు, అప్పుడు వివేచన వస్తుందని చెప్పాడు, అది అప్పుడు ముందుకు వెళ్ళింది? మీకు గుర్తున్నదా, అది గుర్తున్నదా? కాని ఆయన అన్నాడు, "నీవు ప్రజలు నిన్ను నమ్మగలుగునట్లు చేసినట్లైతే." ఆ దినములు గుర్తున్నదా, అనేక సంవత్సరముల క్రితము? నీవు నమ్మవలసియున్నది.

నేను ఒక మనిషిని చూశాను, మరొక కూటములో తిన్నగా అక్కడే కూర్చొన్నాడు అని నమ్ముచున్నాను. మరియు పరిశుద్దాత్ముడు… నేను బోధిస్తూయుండగా, అతనిని గమనిస్తూ యున్నాను. అతడు ఒక కుంటి మనిషి. అతని చేతుల క్రింద చంక కర్రలున్నవి. నేను సరిగ్గా పిలుపును ఇచ్చుటకు ప్రారంభించినప్పుడు, ఒక నల్లని ఛాయగా సాతానుడు అతని యొద్దకు వచ్చాడు. మరియు నేను నా స్వంత కాళ్ళతో నేను గమనించితిని. అతడు లేచి మరియు బయటకు నడచి వెళ్ళిపోయెను. అతడు ఇక ఎల్లప్పుడూ కుంటివాడిగా ఉండును, చూడండి. కాబట్టి, అతడిని వాడు కొట్టినది అక్కడే. ఒకవేళ అతడు… చూచారా. కాని కేవలము… అది ఎందుకో సరిగ్గా నాకు తెలియదు. అతడు శత్రువు యొక్క మాటను విన్నాడని నేను ఊహిస్తాను. అయితే మీరు అక్కడ నిలబడి, ఆ నీడలను గమనించినట్లైతే, అవి యుండియున్నట్లుగా, ఆ రూపములలో యున్న ఛాయలు, అవి ఎలా చేస్తాయో వాటిని గమనించండి. చూడండి, అది ఆలాగు వుంటుంది…

66ఇప్పుడు, నేను స్వస్థపర్చలేను. మిమ్మును స్వస్థపర్చలేను. మిమ్మును స్వస్థపర్చుతానని చెప్పే వ్యక్తి, అతడు తప్పైయున్నాడు. నీవు ఇదివరకే స్వస్థపడియున్నావు. కాని, అది యేసుక్రీస్తు యొక్క సన్నిధిని గుర్తించుట అయి యున్నది. ఇప్పుడు మార్త ఆయనను మరలా చూడగలిగినట్లైతే, ఆమె ఆశ తీర్చబడుతుందని ఆమె ఎరిగియుండెను, ఏలయనగా ఆయన ప్రత్యక్షపర్చబడిన వాక్యమైయున్నాడు, ఈ రాత్రి మనము అంతమట్టుకు దానిని నమ్మలేమా? నిశ్చయముగా, మనము తప్పక నమ్మాలి. ఆయన వచ్చియున్నాడు. ఆయన వచ్చియున్నాడు. ఆయన పరిశుద్ధాత్మ యొక్క రూపములో వచ్చియున్నాడు. ఆయన అదే అయి యున్నాడు.

ఇప్పుడు, మీరు కేవలము ప్రార్థించండి. చూడండి, ఈ పైన ఎవరో, తిన్నగా నా ప్రక్కన నిలబడి, మీరు కేవలము… ప్రార్థించండి. అనేకులు ప్రార్థన చేయుటను నేను చూసియున్నాను. ఈ కట్టడము అంతటా ప్రార్థించుచున్నారు. మీరు దానిని సరిగ్గా గమనించవలసియున్నది. "బ్రెన్హాం సోదరుడా…" అని నీవు అనలేవు. లేదండి. నీవు నా కొరకు ఎంత మాత్రము ఒక కలను ఎలా కనలేవో, నేనును దానిని చేయలేను, చూడండి. నీవు కల కనవచ్చు. దేవుడు నా గురించి నీకు ఒక కలను ఇవ్వవచ్చు. నీవు దానిని నమ్ముతావా, కాని నీకై నీవు దానిని చేయలేవు. "బ్రెన్హాం సోదరుడా, ఇప్పుడు నిన్ను గూర్చి నేను ఒక కలను కనబోవుచున్నాను," అని నీవు చెప్పలేవు. లేదు. నీవు దానిని చెయ్యలేవు. ఆలాగుననే నేనును ఒక దర్శనము చూడలేను. ఎల్లప్పుడు, నీకు కలను ఇచ్చేవాడు, ఆయనే దానిని చేయవలసి యున్నది. అదే మార్గములో ఒక దర్శనము కూడా యున్నది.

MATT 13:58

 

67ఒక మనిషిని నేను చూసాను, అతడు తిన్నగా ఈ వరుసలో ఆఖరులో యున్నాడు, అతడు నరముల వ్యాధితో బాధపడుచున్నాడు. అతడు తన హృదయమంతటితో నమ్మినట్లైతే, ఆ నరముల వ్యాధి నుండి దేవుడు అతనిని బాగుచేస్తాడు. అయ్యా, ఆయన దానిని చేస్తాడని నీవు నమ్ముతావా? ఆ బయట మెక్సికో నుండి మనిషి, ఆ వరుస చివరలో కూర్చొండియున్నాడు, నీవు దానిని నమ్ముతావా? అయ్యా, మంచిది.

నీ ప్రక్కన కూర్చొన్న ఆ స్త్రీ కూడా నరముల వ్యాధితో బాధపడుచున్నది. ఓ స్త్రీ, దేవుడు నిన్ను బాగుచేస్తాడని నీవు నమ్ముతావా? (ఈ మాటలు ప్రతిధ్వనించుచున్నాయా? ప్రజలకు అర్థమగుట లేదని నేను భయపడుచున్నాను.) నీవు నమ్ముచున్నావు? మంచిది. ఆ ప్రక్కనే కూర్చొనియున్న ఆ చిన్న మెక్సికన్ స్త్రీ సంగతి ఏమిటి? ఆమె కడుపు జబ్బుతో బాధపడుచున్నది. ఓ స్త్రీ, దేవుడు నీ కడుపు జబ్బును స్వస్థపరుస్తాడని నీవు నమ్ముతావా? ఆమె దానిని పొందియున్నది. ఆ వెలుగు క్రిందికి వెళ్ళుట నేను చూసినప్పుడు, దాని భావము అది సంభవించియున్నది. అవును. అది అంతే. అది ఆమెను తాకింది. అది అక్కడ యున్నది, చుట్టూ గిరగిర తిరుగుచున్నది… [టేపు మీద ఖాళీగా యున్నది.] అది దానిని చేస్తుంది, చూడండి. ఆయన విశ్వాసమును కనుగొనగలిగినప్పుడు, చూడండి… వారి అవిశ్వాసమును బట్టి అనేక కార్యములను ఆయన అక్కడ చేయలేకపోయెను.

68ఇక్కడే ఒక స్త్రీ కూర్చొని ప్రార్థించుచున్నది. ఆమె భయపడుచున్నది. ఆమె తప్పక భయపడింది. ఎంతో హీనమైన స్థితిలో, కాన్సర్ తో ఆమె నిండిపోయియున్నది. నీవు నాకు తెలియదు, కాని దేవునికి నీవు తెలుసు. ఈ కాన్సర్ ను గూర్చి, లేక మరొక దానిని గూర్చి, దేవుడు నాకు చెప్పగలడని నీవు నమ్ముచున్నావా? నావైపు చూడు. అక్కడ ఎందరో ప్రార్థించుచున్నారు, నీవు చూడు, నీకు నేను చెప్పుచున్నాను. మా వైపు చూడండి. ఇప్పుడు, నీవు ఇక్కడి స్థలము నుండి కావు. ఇది నీ ఊరు కాదు. నీవు కాలిఫోర్నియాలోని, పోర్టర్-విల్ అను ఒక స్థలము నుండి వచ్చియున్నావు. అది నిజము. నీవు ఎవరవో దేవుడు నాకు చెప్పగలడని నీవు నమ్ముతావా? ఆయనకు తెలుసు. నీ పేరు శ్రీమతి. విన్ హేమ్. అది నిజము. ఇప్పుడు నమ్ముము, మరియు కాన్సర్ నిన్ను విడిచిపెడుతుంది. నీవు నమ్మగలిగినట్లైతే — నీవు చేయమని దేవుడు కోరునది అదే — నీవు నమ్మగలిగినటైతే. నీ హృదయమంతటిలో నీవు నమ్ముచున్నావా?

ఈ భాగములో ఇక్కడ యున్నవారు ఎవరైనా, నీవు నమ్మగలవా? యాజకుడు వచ్చి నీ కొరకు పిలిచియున్నాడు. ఆయన నిన్ను మరణములో నుండి జీవములోనికి, వ్యాధి నుండి ఆరోగ్యమునకు పిలుస్తున్నాడు.

69తిన్నగా ఈ వెనుక, ఒక మనిషి కూర్చొని, తలవంచి ప్రార్థించుచున్నాడు. అతడు నిజానికి తన కొరకు ప్రార్థన చేయుట లేదు. అతడు ఎవరి కొరకో ప్రార్థన చేయుచున్నాడు. అది ఒక బాలిక. అది అతని కుమార్తె. అయ్యా, నీవు నమ్ముతావా? నీ కాళ్ళలో జబ్బు యున్నది. నీ మోకాళ్ళు ఇబ్బందిగా యున్నాయి. అది నిజము. నీవు ఏడ్వవలసిన పనిలేదు. అక్కడ నీతో నిలబడియున్నది ఆయనే. నీ కుమార్తె హాస్పిటల్ లో యున్నది. ఆమె లేదా? క్షయ వ్యాధి నీవు నమ్ముతావా. నీవు నమ్ముతావా? యజమాని వచ్చియున్నాడు, మరియు ఆమెను పిలుస్తున్నాడు. ఆమె తండ్రిగా నీవు నమ్ముతావా? ఈ రాత్రి ఆయన ఆమెను నిన్ను దర్శించును గాక. అది సమాప్తమగును గాక.

ఇక్కడ ఒక చిన్న గోధుమ రంగు ముఖముతో యున్న ఒక బాలుడున్నాడు. అతడు ఒక చర్మ వ్యాధితో, ఆస్తమాతో బాధపడుతున్నాడు, ఒక చిన్న మెక్సికన్ కుర్రవాడు అక్కడ కూర్చొనియున్నాడు. అతడు ఇక్కడివాడు కాదు. అతడు శాన్ జోస్ నుండి వచ్చియున్నాడు. కుమారుడా, నీవు నమ్ముచున్నావా? మరొక విషయము, నీ తండ్రి ఇక్కడ నీతో యున్నాడు. అతడు ఒక సేవకుడు. అది నిజము. నీ పేరు ఏమిటో దేవుడు నాకు చెప్పగలడని నీవు నమ్ముతావా? అది నిన్ను నిజముగా బలమైనవాడిగా చేస్తుందా? నీ పేరు రూబేను. ఇప్పుడు నమ్ముము.

యజమాని వచ్చియున్నాడు, మరియు ఆయన నిన్ను పిలుస్తున్నాడు. ఓ, పాపి! ఓ, వ్యాధిగ్రస్తుడా! యజమానుడు మనుష్యులలో, విశ్వాసుల మధ్యలో బయలుపర్చబడతాడని, నీవు చూడలేవా? నమ్ముచున్న ఆయన పిల్లలను ఆరోగ్యమునకు పిలుచుటకు ఆయన వచ్చియున్నాడు. పాపి మారుమనస్సు పొందునట్లు పిలుచుటకు ఆయన వచ్చాడు. వెనుకకు జారినవాడా, సంఘ సభ్యుడా, యజమానుడు వచ్చియున్నాడు, మరియు నిన్ను పిలుస్తున్నాడు.

JOHN 4:29

 

70నీవు దానిని నమ్ముతావా? నీ అవసరత కొరకు ఇప్పుడే నీవు దానిని నమ్ముతావా? నీవు నమ్మినట్లైతే, నీ చేతిని పైకెత్తి చెప్పు, "నా అక్కర కొరకు నేను నమ్ముచున్నాను." అలాగైతే నీ పాదముల మీద నిలబడి దానిని అంగీకరించుము. యజమాని వచ్చియున్నాడు, మరియు నిన్ను పిలుస్తున్నాడు. నీవు ఎవరివైయున్నప్పటికి, నీ అవసరత ఏదైనప్పటికీ, యజమాని వచ్చియున్నాడు, మరియు నిన్ను పిలుస్తున్నాడు. ఆయన నిన్న, నేడు, నిరంతరము ఏకరీతిగా యున్నాడు.

ఆ చిన్న స్త్రీ పట్టణములోనికి వెళ్ళి, ఇలా అన్నది, "వచ్చి, నేను తప్పుగా యున్నానని చెప్పిన ఒక మనిషిని చూడండి." నీవు పట్టణములోనికి వెళ్ళలేదు. నీకై నీవుగా వచ్చి చూసియున్నావు. కాబట్టి యజమాని వచ్చియున్నాడు, మరియు నిన్ను పిలుస్తున్నాడు. మీ చేతులను ఎత్తి ఆయనను స్తుతించండి, ఇలా చెప్పండి, "ప్రభువైన యేసు, నేను ఒక పాపిని; నన్ను క్షమించు. నేను ఒక వెనుకకు జారిన వ్యక్తిని; ప్రభువా, నన్ను తిరిగి తీసికొమ్ము. నాకు పరిశుద్దాత్మ కావాలి, నన్ను నింపుము. నేను రోగిని; నన్ను స్వస్థపర్చుము. నేను కుంటివాడను; నన్ను బాగుచేయుము." యజమాని వచ్చియున్నాడు, మరియు నిన్ను పిలుస్తున్నాడు. మీ చేతులను పైకెత్తి, ఇప్పుడు ఆయనను స్తుతించండి.

71మీరు నమ్ముతున్నారా?

నేను ఆయనను స్తుతిస్తాను, నేను ఆయనను స్తుతిస్తాను,

ఓ, పాపుల కొరకు వధించబడిన గొర్రెపిల్లను స్తుతిద్దాము;

ప్రజలందరూ, ఆయనకు మహిమను ఇవ్వండి,

ఏలయనగా ఆయన రక్తము, ప్రతి మరకను కడిగివేసింది.

మీరు ఆయనను ప్రేమిస్తున్నారా? ఇప్పుడు, ఆయన ఇక్కడ యుండగా, నీవు ఆయనను పాడుటను ప్రేమించవా? ఈ కట్టడము అంతటి గుండా, ఆయన ఆత్మ కదులుచున్నది. మీ హృదయములను ఆయన ఎరుగును. మన హృదయమంతటితో ఆయనకు పాడుదాము.

నేను ఆయనను స్తుతిస్తాను, (దానిని చేయునప్పుడు మీ చేతులనెత్తండి),

నేను (ఇప్పుడు ఆయనను స్తుతిద్దాము) ఆయనను స్తుతించండి,

ఓ, పాపుల కొరకు వధించబడిన గొర్రెపిల్లను స్తుతిద్దాము;

ఓ, ప్రజలందరూ, ఆయనను మహిమను ఇవ్వండి,

ఏలయనగా ఆయన రక్తము ప్రతి మరకను కడిగివేసింది.

ఓ, స్త్రీ, చక్రాల కుర్చీలో యున్న నీవు. నీవు ఇంకా కొంచెము ఇక్కడ నమ్మగలిగినట్లైతే…

"నేను…" (మనము మరొక్కసారి ప్రయత్నము చెద్దాం, నేను మరొక దాని కొరకు కనిపెట్టుచున్నాను.)

నేను ఆయనను స్తుతిస్తాను, నేను ఆయనను స్తుతిస్తాను,

ఓ, పాపుల కొరకు వధించబడిన గొర్రెపిల్లను స్తుతిద్దాము;

ఓ, ప్రజలందరూ, ఆయనకు మహిమను ఇవ్వండి,

ఏలయనగా ఆయన రక్తము ప్రతి మరక కడిగివేసింది.

ఇప్పుడు దానిని మరలా పాడుచుండగా, చుట్టూ తిరిగి, ఎవరి చేతినైనా పట్టుకొని, దానిని మనము పాడదాము, "నేను ఆయనను స్తుతిస్తాను." అందరూ కలసి పాడండి.

నేను ఆయనను స్తుతిస్తాను, నేను ఆయనను స్తుతిస్తాను,

ఓ, పాపుల కొరకు వధించబడిన గొర్రెపిల్లను స్తుతిద్దాము;

ఓ, ప్రజలందరూ, ఆయనకు మహిమను ఇవ్వండి,

ఏలయనగా ఆయన రక్తము ప్రతి మరకను కడిగివేసింది.

72ఓ, పాపివైన స్నేహితుడా, నీవు ఇక్కడకు నడిచి రావా? ప్రజలందరూ పైకి వచ్చి, ఆయనకు స్తుతిని చెల్లించండి. ఆయనను వారి రక్షకుడిగా ఒప్పుకొనగోరువారు. ఆయన సన్నిధిలో, పరిశుద్దులందరూ ఆయనను ఆత్మలో ఆరాధించుచుండగా, మీరు ఇక్కడకు వచ్చి నిలబడి మరియు చెప్పండి, "ఈ రాత్రి నేను సాక్ష్యమివ్యగోరుచున్నాను. నేను ఆయనకు స్తుతిని చెల్లించాలి. నేను రాగోరుచున్నాను. నేను ఆయనను గూర్చి సిగ్గుపడువాడను కాను. ఆయన ఇక్కడే తిన్నగా హాజరైయుండగా, ఆయనను నా రక్షకుడిగా అంగీకరించగోరుచున్నానని ప్రపంచము తెలుసుకోవాలని నేను కోరుచున్నాను," అని చెప్పండి. దానిని మనము పాడుచుండగా, రండి.

నేను ఆయనను స్తుతిస్తాను, (మీరు రారా?)

నేను ఆయనను స్తుతిస్తాను,

ఓ, పాపుల కొరకు వధించబడిన గొర్రెపిల్లను స్తుతిద్దాము;

ఓ, ప్రజలందరూ, ఆయనకు మహిమను ఇవ్వండి,

ఏలయనగా ఆయన రక్తము ప్రతి మరకను కడిగివేసింది.

MARK 8:38•

LUKE 9:26

 

73ఓ, అది అంతే ఓ స్త్రీ, ముందుకు రమ్ము. క్రీస్తు సన్నిధిలోనికి ఇంకా ఎవరు వస్తారు? సహోదరీ, తిన్నగా పైకి రండి, ఇక్కడ నిలబడండి. ఇంకా ఎవరైనా, ఆయనను నీ రక్షకుడిగా చేసికొనగోరువారు, ఇప్పుడే, సిగ్గుపడనివారు. ఆయనన్నాడు, "మనుష్యులు ముందు మీరు నన్ను గూర్చి సిగ్గుపడినట్లైతే, నా తండ్రి ఎదుటను ఆయన దూతల ఎదుటను నేను సిగ్గుపడతాను." ఇప్పుడు ఆయనను గూర్చి మీరు సిగ్గుపడనియెడల, ఆయన నీ రక్షకుడిగా చేసికొనగోరినట్లైతే, ఆయన ఇక్కడ యుండగా. మీరు ఆయనను చూసియున్నారు. అది ఎంతో పరిపూర్ణమైనది, వాక్యమే దానిని స్వయముగా తెలియపరుస్తుంది. పరిశుద్దులు ఆరాధిస్తూ యుండగా, పైకి రండి. మీరు పైకి రారా? అయ్యా, ప్రభువు నిన్ను దీవించును గాక. ఇక్కడ ఒక వృద్ధురాలు ఒక నిజమైన వయస్సునకు వచ్చుచున్నది. ఇప్పుడు మీరు రారా?

నేను వస్తాను (మరలా దానిని పాడండి) నేను ఆయనను

స్తుతిస్తాను

ఆయనను స్తుతించుడి (అది నిజము, యవ్వన జనులారా,

తిన్నగా చుట్టూ ముందుకు రండి.)

ప్రభువు మిమ్మును దీవించును గాక, (ఓ స్త్రీ దానిని చేయుట

ఆ విధముగానే, యవ్వనస్తులారా,

ప్రభువు మిమ్మును దీవించును గాక.)

ఓ, పాపుల కొరకు వధించబడిన;

ప్రజలందరూ, ఆయనకు మహిమను ఇవ్వండి,

ఏలయనగా ఆయన రక్తము ప్రతి మరకను కడిగివేసింది.

సేవకులు ప్రజల యొద్దకు వెళ్ళుచుండగా, ఇంకా ఎవరైనా వస్తారా? వెనుకకు జారినవాడా, నీవు వచ్చి, "నా జీవితమును గూర్చి నేను సిగ్గుపడుచున్నాను," అని చెప్పవా? ఆయన ఇక్కడ యున్నాడు. నేను దేవుని సేవకుడనని మీరు నమ్ముతారు? మీ చేతులను ఎత్తండి. ఎందుకు, యేసుక్రీస్తు మన మధ్యలో యున్నాడు. నీవు రావా?

ఆయనకు మహిమను ఇవ్వండి (మీరు వచ్చి ఆయనకు

మహిమను ఇవ్వరా?)… ప్రజలారా,

ఎందుకనగా ఆయన రక్తము కడిగివేసియున్నది…

74మార్తా, నీవు వస్తున్నావా, లేక నీవు మరియతో ఇంటి వద్ద కూర్చొండగోరుచున్నావా? నీవు ఏదో సంఘ సంస్థల వెనుక నిలిచియుండి. "ఓ, మా సంఘము దీనిని ఈ విధానములో నమ్మదు," అని చెప్పుతావు. క్రీస్తు ప్రత్యక్షపర్చబడినప్పుడు? నీవు వెనుక కూర్చొని ఆలాగు చెప్పగోరుచున్నావా, లేక నీవు బయటకు వస్తావా? "మంచిది, నేను మీకు చెప్పుతాను…"

"నేను ఈ రోజు పిలిచియున్నాను." ఇదే ఆ ఘడియ. యాయీరు కుమార్తె వలె మరణము నీ చుట్టూ వేలాడుచున్నది. ఇప్పుడే రమ్ము. వెనుకకు జారినవాడా, ఇప్పుడే రమ్ము. ఇదే ఆ సమయము.

యజమాని వచ్చియున్నాడు, మరియు నిన్ను పిలుస్తున్నాడు. ఆయన నిన్ను పిలుస్తున్నాడు. నీవంటావు, "నాకు ఎలా తెలుసు?" ఆయన నా స్వరమును వాడుకొనుచున్నాడు. ఆయన నా స్వరమును వాడుకొని - వ్యాధిని, ఆపదలను, మరియు ఇతర కార్యములను చెప్పుతున్నప్పుడు, పాపమును కూడా ఆయన పిలుచుచున్నాడని నీవు ఎరుగవా? బయటకు రమ్ము. ఇప్పుడు రమ్ము. ఇది ఎన్నడైనా నీవు కలిగియుండబోవు చివరి అవకాశము కావచ్చు.

75మరొక్కసారి, స్నేహితులారా, ఇక్కడ ఇంకా మరి కొందరు తప్పక రావలసియున్నది, బయట మిమ్ములను ఈ విధముగా పిలిచి, మిమ్మును ఇబ్బంది పెట్టుట నాకు ఇష్టము లేదు. అది సరి కాదు. కొన్నిసార్లు నీవు బహుశ ఆ పరిసయ్యులవలె, వారు రక్షించబడినట్లుగా యున్నారు, కాని వారు రక్షించబడలేదు. నీవును దానినే ఆలోచించుచున్నావు. ఇప్పుడు రమ్ము, నిశ్చయత కలిగియుండండి, దాని సగము అవకాశమును తీసుకొనవద్దు. నీ మనస్సులో చిన్న అనుమానము యున్నట్లైతే, ఏ అవకాశమును తీసుకోనవద్దు. ఇప్పుడు ముందుకు రండి. ఊట తెరవబడి యుండగా, పరిశుద్దాత్ముడు ఇక్కడ యుండగా, ఇదే ఆసమయము. యజమాని వచ్చియున్నాడు. ఆ చిన్న అనుమానము, అదే ఆయన చెప్పుటకు ప్రయత్నించుచున్నాడు, "మీరు సందేహించుచున్నారు." దానిని వదిలివేయండి. ఇప్పుడు, ముందుకు రండి. యజమాని వచ్చియున్నాడు, మరియు నిన్ను పిలుస్తున్నాడు. అది నిజము.

నేను ఆయనను స్తుతిస్తాను, నేను ఆయనను స్తుతిస్తాను,

(నీవు వచ్చి ఆయనకు స్తుతి చెల్లించవా?)

పాపుల కొరకు వధించబడిన గొర్రెపిల్లను స్తుతిద్దాము;

ప్రజలందరూ, ఆయనకు మహిమను ఇవ్వండి,

ఏలయనగా ఆయన రక్తము ప్రతి మరక కడివేసెను.

ఆయన నావాడని, పాపులు చెప్పుకొంటూ వస్తూయుండగా; ఇప్పుడు మనము పాడుచుండగా, ప్రజలు స్తుతిని చెల్లించుదురు గాక. ఇప్పుడు అందరూ కలసి, మన చేతులను పైకెత్తి, ఆయనను స్తుతిస్తూ పాడుదాము.

నేను ఆయనను స్తుతిస్తాను, నేను ఆయనను స్తుతిస్తాను,

ఓ, పాపుల కొరకు వధించబడిన గొర్రెపిల్లను స్తుతిద్దాము;

ఆయనను స్తుతిని చెల్లించండి, ఈ చుట్టూ యున్న ప్రజలు ప్రార్థించుచుండగా. ఆయన మిమ్మును క్షమించాలని అడగండి. ఆయన చేయునది అదియే. యజమాని వచ్చియున్నాడు, మరియు నిన్ను పిలుస్తున్నాడు. ప్రభువు మిమ్మును దీవించును గాక.

Search Messages

0 / 0 matches
Enter characters above to process real-time text query scopes...