సముద్రము మీద ఒక సాక్ష్యము

సముద్రము మీద ఒక సాక్ష్యము

1మనము మన తలలు ప్రార్థన కొరకు వంచుటకు ముందు, కొద్దిగా దేవుని యొక్క వాక్యము నుండి నేను చదువగోరుచున్నాను, ఆయన వాక్యమును చదవుటకు నేను ఎల్లప్పుడును ఇష్టపడెదను; ఏలయనగా నాయొక్క మాటలు గతించిపోవును, అవి ఒక మనుష్యునివి, అయితే ఆయన వాక్యము గతించిపోదు. మరియు వాక్య పాఠమును అనుసరించి దానిని గుర్తుంచుకొనువారి కొరకు మరియు ఆ విధమైన వారికి గాను, ఈ రాత్రి మనము మత్తయి 14వ అధ్యాయము 22వ వచనము నుండి ప్రారంభించి చదువుకొనెదము.

వెంటనే ఆ జన సమూహములను తాను పంపివేయునంతలో తన శిష్యులు దోనెయెక్కి తనకంటె ముందుగా అద్దరికి వెళ్ళవలెనని ఆయన వారిని బలవంతము చేసెను.

ఆయన ఆ జనసమూహములను పంపివేసి, ప్రార్ధన చేయుటకు ఏకాంతముగా కొండయొక్కి, సాయంకాలమైనప్పుడు ఒంటరిగా ఉండెను. అప్పటికా దోనె దరికి దూరముగనుండగా గాలి యెదురైనందున అలల వలన కొట్టబడుచుండెను.

రాత్రి నాలుగవ జామున ఆయన సముద్రము మీద నడుచుట శిష్యులు చూచి తొందరపడి, భూతమని చెప్పుకొని భయము చేత కేకలు వేసిరి.

వెంటనే యేసు -ధైర్యము తెచ్చుకొనుడి; నేనే, భయపడకుడని వారితో చెప్పగా.

2ప్రార్ధన కొరకు ఇప్పుడు మనము మన తలలు వంచెదము. ఈ రాత్రి మనయొక్క తలలు మరియు హృదయములు దేవుని ఎదుట వంచియుండగా, ప్రార్థనలో జ్ఞాపకముంచుకొనవలయునని, మీయొక్క చేతులను పైకెత్తి దేవునికి తెలియపరచబడుటకైగాను ఏదైన అవసరత గలవారు ఈ భవనములో యున్నారా? ప్రభువు మీపై చూచి మరి మనయెడల దయగలవానిగా నుండును గాక.

JOHN 15:16•

JOHN 16:23

 

3మా పరలోకపు తండ్రీ, ప్రభువైన యేసు నామమున మరియు ఆ మార్గము ద్వారా ఇప్పుడు మీ యొక్క సన్నిధికి మేము వచ్చుచున్నాము. మనము గనుక ఆయన నామమున ''దేనినైనను అడుగుడి,'' మరి మీరు మాకు దానిని అనుగ్రహించెదరనియు, ఆయన మాకై వాగ్ధానము చేసిన ఆశీర్వదింపబడిన నిశ్చయత మాకు కలదని ఎరిగియున్నాము. దీని కొరకు మేము చాలా కృతజ్ఞులముగా యున్నాము. ఇప్పుడు మీరు మేము చెప్పునది వినుచుండగా, మేము కలిగియున్న నిశ్చయతను గురించి మేము పొందు ఆ అనుభవమును గురించి మరి దానిని వ్యక్తపరచుటకు మాటలు చాలవు, మాటలు ఆ అనుభవమును బయలుపరచలేవు. ప్రభువా, మీరు ఆ చేతులను చూసియున్నారు. వారికి గల అవసరమును మీరు ఎరిగియున్నారు.

మీరే సర్వశక్తిమంతుడివి, సర్వజ్ఞుడివి, సర్వాంతర్యామియైన దేవుడవు మీరు జనుల యొక్క హృదయములను ఎరిగియున్నారని మాకు తెలియును. మా తలంపులను మీరు ఎరిగియున్నారు. మేము సృష్టింపబడక మునుపే, మేము తలంచుబోవు తలంపులను మీరు ఎరిగియున్నారు, ఏలయనగా నిరంతరము ఉన్నవానిగా యున్నావు.

మా యొక్క కోరికలు మీయొద్దకు చేరుచుండగా, పరలోకము నుండి క్రిందికి చూచి మమ్ములను చూడుము ప్రభువా, మరియు మా విన్నపములను మీ యొక్క సొంత హృదయములోనికి మరి మహిమలో గల ఐశ్వర్యము చొప్పున మాకు ప్రత్యుత్తరమిమ్ము, ప్రభువాయని ఈ ఘడియలో మేము ప్రార్థించుచున్నాము.

మా యొక్క హృదయ వాంఛలను మాకు తీర్పుము, అది మీ యొక్క దైవీక చిత్తమని నమ్ముచున్నాము. మీ యొక్క చిత్తమును చేయుటయే మీకు ప్రీతి కరమైనదని మేము ఎరిగియున్నాము, ప్రభువా. ఈ రాత్రి మరల ఒక మహత్తరమైన మీ యొక్క సన్నిధిని మాపై కుమ్మరించుము. వ్యాధి గ్రస్థులను స్వస్థపరచుము. ఈ రాత్రి నశించినవారిని రక్షింపుము, పాపములోను మరియు అక్రమములలోను చనిపోయిన వారిని లేపి మరి వారిని ఒక నూతన జీవములోనికి తీసికొనిరమ్ము. యేసును మేము చూడనిమ్ము. ఆయన నామములో దీనిని మేము అడుగుచున్నాము. ఆమేన్. మీరు కూర్చొనవచ్చును.

4జనులనందరిని కూర్చుండబెట్టుటకై తగిన స్థలమును ఏర్పరచలేనందుకు మేము క్షమాపణ కోరుచున్నాము. అయితే మొదటి రాత్రి కూడా స్థలము లేనందున అనేక జనులను వెనుకకు పంపివేసిరని వారు చెప్పిరి, కావున మేము దానికొరకై చింతించుచున్నాము. మరియు సహోదరుడు గ్రాంట్ ఇంకొక గదిని కట్టలేదు, మరి… ఈ యొక్క భాగమును ఎడమ ప్రక్కగా జరుపబోవుచున్నాడని నేను నమ్ముచున్నాను. ఈ దినమున ఆ అమూల్యమైన సహోదరుడు డెల్టాస్లో నున్న తన సంఘమునకు ప్రతి సంవత్సరమును నేను రావలయునని నన్ను కోరుకొనెను. ద్వారములు చాలా త్వరితముగా మూయబడుతున్న ఈ సంవత్సరము అటువంటి ఒక గొప్ప ఆహ్వానము, మరియు అటు పిదప ప్రతి సంవత్సరము నేను రావలయునని అదొక సంవత్సరాంతపు కూడికగా నుండవలయునని నన్ను కోరుచున్నాడు. నేను దానిని అభినందించుచున్నాను.

ఈ దినపు ఉదయమున సహోదరుడు గొర్డెన్ లిండ్సేతోను మరియు వారితోను మరి వారిలో అనేకులతో నేను ఒక సహవాసపు సమయమును కలిగియుంటిని, రాబోవుచున్న బ్యూమౌంట్ కూటమునకు సహోదరుడు వెర్రీగ్రీన్ బాధ్యత వహించుచున్నాడు, ఈ రాత్రి అతడు నా వెనుక కూర్చొనియున్నాడు, మరియు మన స్నేహితులు అనేకులు సహోదరుడు డాన్ మరియు అతని భార్య, వారిక్కడ నుండుటకు మేము చాలా ఆనందించుచున్నాము. దేవుడు వారిని ఆశీర్వదించును.

5ఇప్పుడు, ఈ రాత్రి కేవలము… ఒక చిన్న బిడ్డ కూడా దానిని అర్ధము చేసికొనునట్టుగా నేను నా యొక్క వర్తమానమును చాలా సాధారణముగా నుండునట్లుగా ప్రయత్నించుచున్నాను. రేపు మధ్యాహ్నము ఒక సువార్తిక కూటము గలదు. మరియు మీరందరును రావలయునని నేను కోరుచున్నాను. ఇప్పుడు మీ యొక్క స్వంత సంఘములలో గనుక ఆరాధనయున్న యెడల మీరెక్కడ యున్నారో మరి అక్కడనే యుండండి. మీ యొక్క స్వంత సంఘమును వదిలిరావలయునని మేము ఎవరిని కోరుటలేదు.

మరియు మీరు గనుక వ్యాధితో నుండి మరి ప్రార్థించుకొనుటకై రావలయునని కోరినయెడల, మరియు మీ యొక్క సంఘములో రేపు మధ్యాహ్నము ఆరాధనయున్న యెడల దానిని గురించి మీ సంఘ కాపరితో మాటలాడుడి, కావున ఆయన మీ చర్యను తప్పుగా ఎంచడు, మీకు తెలియును. డల్లాస్ లోను మరియు చుట్టు ప్రక్కలను పరదేశులుగా సంచరించుచు ఇక్కడ నివసించు యేసుక్రీస్తు యొక్క పూర్ణ శరీరమునకు సహాయపడుటకై మనమిక్కడ ఒకరి కొకరం ఐక్యముతో ఆ సహవాసములో యున్నామని అతను తెలుసుకొననిమ్ము.

కావున రేపు మధ్యాహ్నము రెండున్నర గంటలకని నేను అనుకొనుచున్నాను, నేను సువార్తికుని వర్తమానమును మాటడబోవుచున్నాను, మరటు పిదప వారమంతా మిగిలిపోయిన అన్ని ప్రార్ధనా అట్టలను ఏరి వ్యాధిగ్రస్తులందరికి మేము ప్రార్ధన చేసెదము. ఆలాంటి వారి కొరకు మరియు వారందరి కొరకు రేపు ప్రార్ధింపబోవుచున్నాము.

MATT 14:27

 

6ఇప్పుడు నా యొక్క పాఠ్యాంశము కొన్ని క్షణములకు ఒక చిన్న నాటకమువలె నుండును. నేను ఈ రాత్రి వ్యాధిగ్రస్తుల కొరకు ప్రార్ధించనై యుండగా, నాకు సాధ్యమైనంత వరకు అనేక మందిని ప్రార్ధనా వరుసలో తీసికొని వచ్చుటకు ప్రయత్నించెదను. నా యొక్క పాఠ్యాంశము, "భయపడకుము, అది నేనే" అని యేసు మాటలాడుచున్నాడు. నా యొక్క పాఠ్యాంశము: "సముద్రము మీద ఒక సాక్ష్యము."

7అది మధ్యాహ్నమును దాటుచున్న వేళగా యుండవచ్చును, ఈ సంఘటన సంభవించుచుండగా సూర్యాస్తమై యుండవచ్చును, మరియు ఇక్కడ ఇప్పుడున్న విధముగా అది ఒక ఉష్ణమైన దినముగా యుండి యుండవచ్చును. చల్లదనమును నిచ్చు సాధనము చెడిపోయినది. ఆ కారణము చేత నేను నా పాఠ్యాంశమును మార్చాను. నేనేమి మాట్లాడాలనుకున్నానో దానిని గురించి, కాబట్టి వేడిలో మీరీవిధముగా కూర్చొవటము ఇష్టము లేక నేను త్వరితముగా సాగిపోయెదను.

8ఈ పేరుగాంచిన పెద్ద జాలరులు, ఆ దినమున జరిగిన కార్యములన్నిటిని చూచిన పిదప, యేసును, ఆయన యొక్క ఘనమైన పరిచర్యను గమనించుచున్నారు. ఆ రోజు నేను కూడా జీవించుచూయుండి, ఆయనను వెంబడించుటకు నేను ఇష్టపడుచున్నాను. అయితే మీకు తెలియునా, ఆయన చేయు కార్యములను నేను గమనించుచు, అదే కార్యములను చేయు భాగ్యమును నేను కలిగియున్నందుకై నేను సంతోషించుచున్నాను.

అప్పటి కంటె ఈనాడు ఆయనను గమనించుట ఘనమైన విషయముగా ఉంటున్నది. ఇప్పుడు ఆయన యందు ఎంత విశ్వాసమును నేను కలిగియున్నానో అప్పటికంటె ఇప్పుడు ఎంతో ఎక్కువ విశ్వాసము ఆయనపై నాకు కలదు, ఎందుకంటే సువార్త సత్యమని నిరూపించుటకు మనకు రెండువేల సంవత్సరములుండెను. మరియు రెండువేల సంవత్సరములకు పిదప, ఆయన ఇంకా జీవించుచు, ఆయన అప్పుడు ఏ విధముగా చేసెనో ఇప్పుడు అదే విధముగా చేయుచున్నాడు.

కావున అప్పట్లో వారికున్న విశ్వాసము కన్నను మనకు ఒక మహత్తరమైన నమ్మిక మరియు విశ్వాసమునకైన ఒక శ్రేష్టమైన పునాదిని కలిగియున్నాము. ఏలయనగా, ఆయన కేవలము ఒక మనుష్యునిగా తాను దేవునియొద్ద నుండి పంపబడియున్నాడనియు, తాను దేవుని కుమారుడనియు, మరియు ఆయన ద్వారా ఆ దినమునకైన ఆయనయొక్క వాగ్ధానపు వాక్యమును దేవుడు నిరూపించుచున్నాడనియు దానిని చెప్పుచు చుట్టు ప్రక్కల సంచరించుచుండగా,

దానిని గురించి వారు సందేహించుటకు వారికి ఒక కారణము యుండెను. వారు వేదపండితులు! మరియు మీరు గమనించుడి, అది ఒక విషాదకరమైన విషయము, అది నిజముగా విషాదమే, ఎందుకనగా నిజముగానే అది పరితపించతగినది, ఏలయనగా దేవుడు గనుక వారి నేత్రములను మూయకున్నట్లైతే వారు దానిని నిజముగా నమ్మియుండెడివారు. బైబిలు ఆ విధముగానే చెప్పుచున్నది.

2TIM 3:3,4

 

9మరియు వారు దానిని చూడకుండునట్టుగా మరల ఈ దినమున కూడా వారి కండ్లను గ్రుడ్డిగా చేసెదనని ఆయన చేసిన వాగ్ధానమును మీరు ఎరిగియున్నారా? "వారు మూర్ఖులు, గర్వాంధులు దేవునికంటె సుఖానుభవము నెక్కువగా ప్రేమించువారు, అతి ద్వేషులు, అపవాదకులు, అజితేంద్రియులు సజ్జన ద్వేషులు. పైకి భక్తిగల వారివలె ఉండియు దాని శక్తిని ఆశ్రయించనివారునై యుందురు." ఖచ్చితముగా మరల ఒక వాగ్ధానము.

మరియు మీరు ఏమియు చేయలేరు, అయితే ఈ దినమునకు వారి కండ్లు గ్రుడ్డిగా చేయబడియున్నందున మరి ఆ జనుల కొరకు జాలిపడటము తప్ప ఏమియూ చేయలేము. ఈ దినముకైన, దేవుడు వాగ్ధానము చేసిన లేఖనములు నెరవేరుచుండగా మరి మనము ఈ ఘడియలో వాటిని కన్నుల్లారా చూచుచు మరియు గమనించుచున్నాము. మరి ఆ విధముగా నుండగా జనులు చూచుచు, మరివారి తలను ఆడించుచు మరి దానికి దూరముగా దాటిపోవుచు, "దానిని నేను చూచుట లేదు" అని చెప్పుచున్నారు, అది విషాదకరమైన విషయముగా నున్నది, అయినప్పటికిని లేఖనములు తప్పక నెరవేరవలసియున్నది. మరది ఆ విధముగానే నుండును.

JOHN 6:37,68•

EPH 1:4

 

10కావున, ఈ శిష్యులు దేవుని ద్వారా ఎన్నుకొనబడిన వారు. మీరు గమనించి యున్నారా, యేసు వారితో చెప్పెను, "జగత్తుకు పునాది వేయబడక ముందే" ఆయన వారిని ఎన్నుకొని యున్నాడు, మరియు వారు ముందుగా నిర్ణయింపబడిన దేవునియొక్క విత్తనమైయున్నారు. మరియు ఆ కారణము ద్వారానే శ్రమలు వచ్చినప్పుడు, యేసు ఒక మూలన వున్నట్టుగా ఒక ప్రశ్నగా ఆయనను చూచుచున్నారా? వారికి ప్రశ్న లేదు. వారికి దానిని గ్రహించలేరు. అయినను వారు ఆయనను తప్ప మరి మరొకటి ఎరుగకుండునట్లుగా వారు "నీయొద్ద మాత్రమే జీవవాక్యము కలదు." మరియు వారు దానితోనే నిలిచియుండుటకు నిర్ణయించు కొనిరి, ఎందుకనగా ఆ విధి కోసమే వారు నిర్ణయింపబడియున్నారు. మరియు ఆ విధముగానే ఈ దినమున కూడా యున్నది, పురుషులు మరియు స్త్రీలు నిత్యజీవమునకై ఎవరు నిర్ణయింపబడియున్నారో, వారే నిత్య జీవమునొద్దకు వచ్చెదరు. "రండ్రి నాకు అనుగ్రహించిన వారందరును నాయొద్దకు వచ్చెదరు." అది ఆయనయొక్క వాక్యము, అది తప్పిపోదు, ఓడిపోదు. అది దేవుని వాక్యము.

MATT 14:22

 

11మరియు ఇప్పుడు మనము ఈ శిష్యులను చూచుచున్నాము, అక్కడ కొండ ప్రక్కగా పెద్ద మైదానములో ఒక గొప్ప కూటము అప్పుడే జరిగినది. మరియు యేసు వారితో చెప్పెను,"ఇప్పుడు మీరు నాకు ముందుగా సముద్రమునకు ఆవలి ప్రక్కకు దాటి వెళ్ళండి." మరియు ఆయన ఒక కొండపైకి ప్రార్థించుటకై ఒంటరిగా వెళ్ళెను. మరియు ఈ శిష్యులు స్నేహితులనంతయు కలిసిన తరువాత, వారు ఎటువంటి భావమును కలిగియుందురో నేను ఊహించగలను, ఏలయనగా, పరిచయమైన స్నేహితులను కలిసిన పిదప అప్పుడే బాగా సన్నిహితులుగా మెలుగుచు తర్వాత ఆ స్నేహితులను వదలి వెళ్ళునప్పుడు మీరు వారికి విడ్కోలు చెప్పాలంటే బాధగాయుండును.

మరియు దేశమంతటా, ప్రపంచ మంతటాయున్న స్నేహితులను కలిసికొని మరి ఇక మీదట వారిని చూడబోవుట లేదనియు వారిని న్యాయతీర్పులో మాత్రమే చూడగలనని తెలిసికొనినప్పుడు వారిని వదిలి వెళ్ళునప్పుడు నాకు ఒక విధమైన హృదయ వేదన కలుగును. అది ఒక విషాదకరమైన విషయముగా యున్నది.

12ఆ దోనె ముందు భాగమునకు కొక్కివలె ఒకటి తగిలించి మరి దానిని ఒడ్డున ఉంచబడి యుండుటను నేను ఊహించుకొనుచున్నాను, మరియు ఆ కండ పుష్టిగల చేతులు మరియు భుజములు కలిగి సీమోను పేతురులే ఆ దోనెను త్రోసి దానిని సముద్రములోనికి నడిపించి యుండవచ్చును. మరియు వారు తీరమున నిలిచియున్న వారికి వీడ్కోలు చెప్పుచున్నట్టుగా చేతులు ఊపుచు నుండి యుండవచ్చును. మరియు తీరమున నిలుచుకొని వీడ్కోలిచ్చు వారు ''తిరిగి రండి మరియు మమ్ములను దర్శించుటకు యజమానుని తీసికొనిరండి! మరి వచ్చి ఇంకొక ఉజ్జీవమును కలిగించండి. ఈ దినమున మేము చాలా ఆశీర్వదింపబడి యున్నాము'' యని కేకలేయుచుండిరి. మరియు నూతన స్నేహితులు చేతులు ఊపుచుండిరి.

మరి పేతురు, తక్కిన శిష్యులను దాటుకొని మరి బహుశా అంద్రెయ ప్రక్కన కూర్చొనియుండి యుండవచ్చును, మరి పడవను నడపు తెడ్డును చేతిలో తీసికొనెను. పడవలు గాలి లేక పడవను నడుపు తెడ్డు ద్వారా ముందుకు నడుపబడును. మరటు పిదప ఒక పడవలో ఇరువురు ఒక ప్రక్క, ఒక ప్రక్క ఇరువురుగా… లేక ఇరువురు ఒక స్థలమందు, ఒకవేళ ఆరు లేక ఎనిమిది మంది తెడ్డును బిగించు యుంచు చోటు నుండెదరు. తుఫాను వచ్చినప్పుడు వారు ఆ తెడ్డును తగిన సమయములో లాగి యుండెదరు మరి ఆ విధముగా వారా దోనెను ఆ దోనె క్రింది వెన్ను దూలములో పట్టియుంచెదరు. మరటు పిదప గాలి మామూలుగా వీచునప్పుడు వారు ఒక తెరచాపను పైన కట్టి మరి ప్రయాణమును కొనసాగించెదరు.

13అది బహుశా ఎంత తీవ్రతయున్న మధ్యాహ్నముగా నుండి యుండ వచ్చును, ఈ సంఘటన సంభవించుటకు ముందు లేఖనముల ద్వారా చూచిన యెడల.

ఆ సమయము నెమ్మదిగా, సూర్యుని వెలుగులో, వుంచి ఎండతో యుండు మధ్యాహ్నముగా నుండి యుండవచ్చును. సూర్యుడు అస్తమించుచుండెను. మరియు వారు దోనెను నడుపుచు మరి కొద్దిసేపు వదులుచు జనులకు వెళ్ళి వస్తామని చేతులు ఊపుచు, "మరల ఒక్కసారి మిమ్ములను చూస్తామని నిరీక్షించుచున్నాము," అని చెప్పుచు వారు మరి సముద్రములోనికి వెళ్ళిరి, మరియు సూర్యాస్తమయమైపోయి, సంధ్య వెలుగు ఆవరించినది. మరటు పిదప చీకటి క్రమ్ముకొనెను.

మరియు వారు తెడ్లను ఉపయోగించుచు మంచి వేగముతో వెళ్ళచుండిరి మరియు ఆ పెద్ద తెడ్లను సముద్రములో ముంచుచు దోనె నడపుట చాలా కఠినమైన పని. మరియు వారిలో అనేకులు చేపలు పట్టువారు మరియు బలమైన వ్యక్తులు సముద్రమునకు అలవాటుపడినవారు.

మరియు యేసు చాలా త్వరితముగా వచ్చి వారితో కలిసి పడవలో ప్రయాణించునని వారు ఎదురు చూచుచుండిరి. ఏలయనగా వారు కొద్ది దూరమువెళ్ళిన పిదప తీరము వెంబడియే దోనెను నడుపుచు దోనెను కదిలించుటకు ప్రారంభించి మరి వదిలి వేసిరి.

14బహుశా మొట్టమొదటిగా సంభాషణను ప్రారంభించినవాడుగా యవ్వనస్తుడైన యోహానై యుండవచ్చును; ఎందుకంటే వారందరిలో అతడే వయస్సులో చిన్నవాడు. మరి అతను ఒకవేళ దానిని చెప్పియుండవచ్చును, "నేను ఇప్పుడు కొద్దిగా అలసట చెందియున్నాను. మనము ఒడ్డుననే కొద్దిగా వెళ్తూ వుండెదము ఒక్క నిమిషమాగుము; మనము తొందరపడ నవసరము లేదు. ఆయన అప్పుడే వచ్చేటట్టుగా లేడు, మనము ఇంకొద్దిసేపు ఆగి, కొంచెం నుంచి గాలిని పీల్చుకుందాము."

మరియు అతను తన తల కొద్దిగా వాల్చి మరక్కడ కూర్చొని ఒక సాక్షి కూటమును ప్రారంభించి యుండవచ్చును. మరిదానిని గురించియే నేను మాట్లాడాలని నేను ఆశించుచున్నాను. అతడు బహుశా మొదటి వ్యక్తిగా లేచి మరి ఈ విధముగా చెప్పియుండవచ్చును, "సహోదరులారా, జనులు ఏమి చెప్పినను ఫరవాలేదు, మరియు ఎందరు సందేహించినను, నేను ఇప్పుడు నిశ్చయముగా నున్నాను, ఈ దినమున జరిగిన కార్యములకు పిదప మనము ఒక వంచకుడిని వెంబడించుట లేదు, దేవుడు తప్ప మరి దానికంటే స్వల్పమైన దేనిని మనము వెంబడించుట లేదు, దేవుడు తప్ప మరి ఎవరూ ఆయన ఈ దినమున చేసిన కార్యములను చేయలేరు. మీకు తెలియునా, ఆయన ఆ ఐదు రొట్టెలను తీసికొని మరి వాటిని విరచిమరి అక్కడున్న ఆ ఐదువేల మందికి పోషించినప్పుడు అది వాకు మిగుల ఆశ్చర్యకరమైన విషయముగా యుండెను. ఈ దినము వరకు ఒక ప్రశ్నగా నుండి యుండవచ్చును, [ఇప్పుడు నేను అతను చెప్పిన విధముగా ఆ సాక్ష్యమును మరల చెప్పుచున్నాను.] అయితే అది స్థిరపరచినది."

15చెప్పెను, "యోర్డానుకు చేరువగా నేను గత సంవత్సరములయందు నివసించుచుంటిని, మరియు ఒక చిన్న పిల్లవానిగా నేనున్నప్పుడు, ఏ విధముగా యూదురాలైన నా చక్కటి తల్లి నన్ను ఎత్తుకొని, మధ్యాహ్నవేళలో, తన తొడపై కూర్చుండబెట్టుకొని యోర్దాను తీరమున చెట్టు వికసించుచుండగా మరి నన్ను ఇంటి వసారాలో జోకొట్టుచూ ఊపుచూనుండెనో నాకు జ్ఞాపకమున్నది. మరియు ఆమె మన జనులు ఈ యొక్క ఎడారి ద్వారా ఏ విధముగా నడిపింపబడి తీసికొని రాబడ్డారో దానిని ఎడారిలో చూచుచుండెను. మరియు ఆమె నాకు బైబిలు కథలను చెప్పుచుండెడిది. నాకు గుర్తున్న ఒక గొప్ప కథ ఏదనగా షూనేమీయురాలు యొక్క చిన్న బిడ్డ చనిపోయినప్పుడు, మరి ఆ ప్రవక్త ఈ చిన్న బాలుడు చనిపోయినప్పుడు మరల అతనిని లేపెను. అది పులకరింపజేయు ఒక కథ.

16"అయితే నా తల్లి నాకు చెప్పిన పులకరింపజేసిన కథలలో, ఆమె చెప్పెను, "ఇప్పుడు, యోహాను నీవు ఒక చిన్న బాలునివి. అయితే నీవు ఎదుగుచుండగా నీవు గుర్తుంచుకొనవలయునని చెప్పుచున్నాను, ఆ గొప్ప యెహోవా మన ప్రజలను ఐగుప్తు నుండి తీసికొని వచ్చెను. మరియు అక్కడ నదికి ఆవలి ప్రక్కనున్న అరణ్యము ద్వారా మనము వచ్చియున్నాము. మరియు నలువది సంవత్సరములంతా వారు ఆ అరణ్యములో ప్రయాణము చేసిరి, వస్త్రములు తీసికొనుటకు స్థలము లేదు, మరియు తినుటకు స్థలము లేదు. మరి దేవుడు ఆకాశమునుండి ప్రతి రాత్రియు రొట్టెను వర్షింపజేసి మరి ఆ అరణ్యములోన్ను మన ప్రజలను పోషించెను, ఏలయనగా, వారు కర్తవ్యమను క్రమములో గొప్ప యెహోవాను వెంబడించుచుండిరి, మరిప్పుడు ఏదో ఒక దినమున యెహోవా భూమిపై ఒక మానవుని రూపములో శరీరధారియగును, ఆయన అభిషేక్షింపబడిన ఒకడుగా, మెస్సీయాగా యుండును."

17"మరియు అతను చెప్పుట నాకు జ్ఞాపకమున్నది, "ఒక చిన్న బాలునిగా, నా యొక్క చిన్న బాలుని మనస్సు తెలివి దానిని ఏ విధముగా చిత్రీకరించుకొన వలయును, "దేవుడు ఇరవై ఐదులక్షల మందిని ఆ అరణ్యములో ఎట్లు పోషించెను? ఆయన అన్ని రొట్టెలు ఎట్టు తెచ్చెను? మరియు నేను నా తల్లిని ఇట్లు ప్రశ్నించు చుండెడివాడిని, అమ్మా, యెహోవా యొద్ద అక్కడ ఆకాశములో పెద్ద పొయ్యిలున్నవా, మరియు రొట్టెలన్నిటిని వండి రాత్రులలో క్రిందికి దిగి వచ్చి మరి జనులకై నేలపై పెట్టియుంచునా, మరియు యెహోవా యొక్క పెద్ద ఆకాశము నిండుగా పొయ్యిలున్నవా ఆమె చెప్పియుండును.

"కాదు, కుమారుడా, నీవు దానిని అర్థము చేసికొనుటకు చాలా చిన్నవాడివి. చూడుము, యొహోవా సృష్టికర్త, ఆయనకు పొయ్యి అక్కర లేదు. ఆయన మాటలాడును అంతే, మరియు ఆయన యొక్క వాక్యమును ఆయన పలుకునప్పుడు అది బయలుపడును. ఆయన గొప్ప యెహోవా, మరియు ఆయన దానిని కేవలము పలికెను. మరి దూతలు ప్రజలకొరకై నేరమైన దానిని పంచిరి."

ISA 9:6•

JOHN 10:37,38

 

18"మరియు ఈ దినమున, ఆయన అక్కడ నిలుచుకొని యుండుట నేను చూచినప్పుడు మీరు ఆయన ముఖములో గల భావమును చూశారా? ఆయన మనస్సులో ఏ సందేహము లేదు. ప్రజలకు పంచి ఇచ్చుటకు గాను ఆయన ఆ రొట్టెను తీసికొని మరి దానిని విరచి ఆయన పరిచారకులైన మనకు వాటిని అందించుచున్నప్పుడు నేను ఆ బండకు వెనుక ఎక్కి ఆయనను గమనించుచుంటిని. మరియు ఆయన రొట్టెను విరుచుచుండగా ఆ రొట్టే మరల పూర్తి రొట్టెగా మారుచుండెను. మరియు ప్రతియొక్కరు కడుపు నిండుగా తిను వరకును, మిగిలినవి గంపల నిండుగా ఎత్తబడువరకు ఆయన ఆ విధముగా పలు వందల సార్లు రొట్టెను విరచుచుండెను. ఆయన యెహోవాకు తక్కువ కాదని నేను ఎరిగియుంటిని, ఏలయనగా యెహోవా చేసిన విధముగానే ఆయన చేసెను. యెహోవా మాత్రమే సృష్టింపగలడు. మరియు ఆ మనుష్యుడు ఒక వంచకుడు కాదని నేనెరుగుదును. ఒకే ఒక సృష్టికర్త కలడు, మరది యెహోవా, మరిప్పుడు నేను చూచిన కార్యములన్నిటిలోను అది నన్ను తృప్తిపరచినది.

"నా యొక్క హృదయము సంపూర్తిగా సమర్పించబడినదని ఇప్పుడు మీరు తెలుసుకొనవలయునని నేను మిమ్ములను కోరుచున్నాను మరియు ఆయన ఒక ప్రవక్త మాత్రమే కాదనియు నేను పూర్తిగా నమ్ముచున్నాను. ఆయన ఒక ప్రవక్త అయితే ఆయన ఒక ప్రవక్త కన్నను గొప్పవాడు. ఆయన మన మధ్యలో నివసించు యెహోవా దేవుడు, దానికన్నా స్వలమైనవాడు కాదు, ఏలయనగా ఆయన రొట్టెను సృష్టించెను మరియు యెహోవా యొక్క గుణములను ఆయన కలిగియున్నాడు. "నేను నా తండ్రియొక్క క్రియలు చేయనియెడల, అప్పుడు నన్ను నమ్మకుడి; అయితే నేను నా తండ్రియొక్క క్రియలు చేసి మరి మీరు నన్ను నమ్మనియెడల, నా క్రియలను నమ్ముడి, ఏలయనగా అవి నన్ను గురించి సాక్ష్యమిచ్చుచున్నవి మరియు నేనెవరని చెప్పుచున్నవి" అని ఆయన చెప్పుటలో ఆశ్చర్యము ఏమి లేదు. జనులు దానిని చాలా సులభముగా చూడగలుగునట్టు౦డెను.

''మనకు కుమారుడు అనుగ్రహింపబడెను మరియు ఆ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును,'' అని యెషయా చెప్పిన మెస్సీయా ఆయనయని యోహాను తృప్తి చెందెను. మరియు అతను చూచిన దానిని గురించి అతను తృప్తినొందెను.

ఆ యవ్వనుడు తన సాక్ష్యమును ఇచ్చుచుండెను…

19ఆ సమయమున సీమోను పేతురు చెప్పెను, "మంచిది, ఇప్పుడు ఒక్క నిమిషము, మనము గనుక సాక్యము చెప్పు కూటమును జరుపనున్న యెడల, నేను ఏదైనను చెప్పుటకు ఇష్టపడుచున్నాను. మీకు తెలియునా, మెస్సీయా రాబోవుచున్నాడు అనియు, తాను ఆయనను పరిచయము చేయబోవు చున్నాడనియు సాక్యము ఇచ్చిన ప్రవక్తైన యోహాను ఉజ్జీవ కూటములలో నా యొక్క సహోదరుడైన అంద్రెయ పాల్గొనప్పుడు, ఆ పూర్తి కార్యమును గురించి నేను సందేహము గలవానిగా అవిశ్వాసిగా నుంటిని. అంద్రెయ నాతో ఏమైతే చెప్పినాడో దానిని గురించి నేను కొద్దిగా సందేహముగల వానిగా నుంటిని, ఏలయనగా సకల విధములైన మెస్సీయా కథలు మరియు సమస్త కార్యములను నేను వినియున్నాను.

''అయితే సహోదరులైన మీరందరు నా యొక్క వృద్ధుడైన తండ్రిని గుర్తుంచుకొని యుండెదరు. ఆయన పేరు యోనా, మరియు ఆయన ఏ విధముగా ఒక దృఢమైన విశ్వాసియని మీకందరికి జ్ఞాపకముండే యుండును. నా తల్లిదండ్రులు ఎలాంటివారో నాకు జ్ఞాపకమున్నది. మరియు మా జీవనోపాధి కోసము మేమందరమును జీవించుటకుగాను చేపలు పట్టెడివారము మరియు చేపలు మా వలలో పడెడివికావు. మాకు ఆహారము కావలసియుండును, మరి మేము ఏ విధముగా నేలపై వంగి మరి "మేము పట్టిన చేపలు అమ్మి, మరియు మా యొక్క అప్పులు తీర్చునట్టుగాను, భుజించుటకు ఆహారము యుండునట్టుగాను ఈ దినమున మాకు సరిపడ్డ చేపల నియ్యుము," అని దేవుని ప్రార్థించెడివారము.

మరియు మేము ఆ తుఫానులో గాలి వానను ధైర్యముగా ఎదుర్కొని ఏ విధముగా సముద్రముపై వెళ్ళెడివారము.

20ఒకానొక దినమున మా నాన్న తన నెరసిన వెంట్రుకలతో భుజాన వ్రేలాడుచుండగా పడవ వెనుక భాగమున కూర్చొని నాతో ఈ విధముగా చెప్పెను, సీమోను, నీవు నా యొక్క పెద్ద కుమారునివి. సీమోను నేను మెస్సీయాను చూచెదనని ఎల్లప్పుడును నమ్మెడి వాడినని, నీకు తెలియును. ఏదెను నుండి మన ప్రజలు ఆయన కొరకు ఎదురు చూచుచున్నారు. అదెంత కాలమైనప్పటికిని ఆయన వచ్చునని మాకు నిశ్చయత గలదు.

"అది నాలుగు వేల సంవత్సరములకు ముందని" మీరు చెప్పవచ్చును. అయితే ఆ మెస్సీయా వచ్చునని నేను నమ్ముచున్నాను. మరియు అతని సంతతిలో మెస్సీయాను అతను చూచునని ప్రతి యూదుడును నమ్మెను. అయితే ఇప్పుడు నేను వృద్ధుడనగుచున్నాను, సముద్రములోనికి వెళ్ళటము ఇక నేను చాలించవలెను. మరియు నాకు నొప్పులు బాధలు కలుగుచున్నవి, బహుశా నా జీవితములో ఆయనను నేను చూడనేమో. అయితే నా కుమారుడా ఒకవేళ నీవు చూడవచ్చును." "మరియు నేను లేఖనములతో నీకు తర్ఫీదు నియ్యవలయుననియున్నాను. కుమారుడా మెస్సీయా దృశ్యములోనికి రాకముందు, అనేక విధములైన తప్పిదమైన కార్యములన్నియును జరుగుచుండును, ఏలయనగా ఆయన వచ్చినప్పుడు నిజమైన మెస్సీయా యొక్క ప్రాబల్యమును నాశనము చేయుటకుగాను సాతాను దానిని చేయును." అదెల్లప్పుడును ఆ విధముగానే నుండును." (ఇప్పుడు కూడా ఆ విధముగానే యున్నది.)

AMOS 3:7

 

21మరటు పిదప మనము కనుగొనునది ఏమనగా, అతను చెప్పెను, "నేను గుర్తు తెచ్చుకొనుచున్నాను, ఆయన నాచుట్టు తన చేతులు వేసి, చెప్పెను, "కుమారుడా, ఆ మెస్సీయాను గుర్తించుటకు ఒకే ఒక మార్గము మాత్రమే యున్నది. ఇప్పుడు ఏ ప్రవక్త లేకుండా వందలకొలది సంవత్సరములు మనము యుంటిమి." "మలాకీ మనయొక్క చివరి ప్రవక్త, అది నాలుగు వందల సంవత్సరములకు ముందు అప్పటి నుండి మనకు ప్రవక్తలేడు. అయితే గుర్తుంచుకొనుడి మెస్సీయా వచ్చినప్పుడు ఆయన దృశ్యములోకి వచ్చినపుడు ఆయన ఒక ప్రవక్తగా నుండునని లేఖనములలో మనకు మోషే చెప్పియున్నాడు.

ప్రవక్తలను నమ్మునట్టుగా యూదులైన మనము తర్పీదు పొందియున్నాము. మరియు ఆయన మనకు వాగ్ధానము చేసిన విధముగా మెస్సీయా యొక్క యాత్ర భూమిపైన ఒక పలుకబడిన వాక్యముగా నుండును. మరియు వాక్యము ఎల్లప్పుడును ఒక ప్రవక్త యొద్దకు వచ్చును, మరియు ఒక ప్రవక్త ఆ వాక్యమును నిరూపించును. కుమారుడా! దానిని మరచిపోకుము. అక్కడ గొప్ప కార్యములు లేవవచ్చును, గొప్ప ఉత్సాహములు మరియు గొప్ప కార్యములు రావచ్చును. అయితే గుర్తుంచుకొనుడి, మెస్సీయా ఒక ప్రవక్తగా నుండును, ఏలయనగా ఆయన మార్గమును దేవుడు ఎన్నడును మార్చుకొనడు, మరియు మెస్సీయా ఒక ప్రవక్తగా నుండునని ఆయన చెప్పియున్నాడు. కావున గుర్తుంచుకొనుము కుమారుడా, దేవుని వాక్యమును ఎవరైతే కలిగియున్నారో వారే ప్రవక్తలు. మరియు మెస్సీయా వచ్చునప్పుడు ఆయన ఒక ప్రవక్తగానుండును.

"ఆయన యొక్క హస్తము నాపై నుండుట ఇంకా నేను ఆ అనుభూతి నొందుచున్నాను," సీమోను చెప్పెను, "ఆయన నాపై నా చుట్టు చేతులుంచెను. మరియు ఆ సమయమున అంద్రెయ వల కడుగుకొనుచు అక్కడ నిలుచుకొని యుండెను. అంద్రెయ అది నీకు గుర్తున్నదా?"

''అవును సీమోను, నాకు అది గుర్తున్నది.''

22''మరియు ఈ యోహాను ఒక ప్రవక్తయని అంద్రెయ నాకు చెప్పుటకు ప్రయత్నించుచుండెను. నేను చేయవలసిన ఇతర కార్యములు నాక్నువి, చేపలు పట్టుకొని వాటిని అమ్మవలసియుండెను. కావున, నా తండ్రి మరణించి చాలా సంవత్స రము లాయెను, అయిననునేను దానిని నా మనస్సులో ఎల్లప్పుడూ ఉంచుకొని యుంటిని. తండ్రి నాకు చెప్పియున్నాడు, ''ఈ యొక్క మెస్సీయా లేఖనములు వలన గుర్తించబడు ఒక ప్రవక్తగా నుండును, మరియు దానిని మరచి పోవద్దు, ఏలయనగా, అది దేవుని యొక్క పలుకబడిన ఒక వాక్యముగా యున్నది. మరియు ఆ వాక్యము ఎల్లప్పుడు కూడా ప్రవక్తల యొద్దకే వచ్చును. అది దానిని గుర్తుంచులాగున చేసి లేక ఆ కాలమునకు ఏమి వాగ్ధానము చేయబడియున్నదో మరి దానిని ప్రత్యక్షపరచును.''

మరిప్పుడు సీమోను, ''మీకు తెలియునా, అంద్రెయ ఒక దినమున ఒక కూటమునకు వెళ్ళమని నాతో చెప్పెను. మరియు ఈ యేసు ఎక్కడ యుండెనో నేనచ్చటికి వెళ్లాను, మరియు నేను అనేక విధములైన పుకారులను వినియున్నాను. ఆయనకంటే ముందు యేసను ఒకతను లేచి ఏదో గొప్ప కార్యమును చేయబోవుచున్నాడని వాగ్ధానము చేసి మరియు నాలుగు వందల మందిని నడిపించుకొని వెళ్ళెను మరి వారందరును నశించిరి. మరి అటువంటి సంగతులను వినెను. మరియు ఇది కూడా ఉల్లాసమును కలిగించు వ్యక్తిలాంటి ఒకడు వచ్చాడని నేను తలంచాను. ఒక విధమగు ఉత్సాహముతో కూడిన ఏదో ఉజ్జీవ కూటములన్నియు లేక ఏదో గొప్ప సంఘ శాఖలు చేయువారు లేచారని నేను అనుకొన్నాను. అయితే ఒక దినమున నేను నా సహోదరుడైన అంద్రెయతో కూడా కలిసి వెళ్ళాలని అనుకొన్నాను.''

23మరియు ఆ సమయమున ఆ దోనె కదలుటకు ప్రారంభించెనని నేను ఊహించుకొనుచున్నాను. ఎవరో ఒకరు అరచుటకు ప్రారంభించిరి మరియు అతను ''క్రింద కూర్చొనుము! దోనెను ఊపవద్దు. ఒక్క నిమిషముండుము. నెమ్మదిగా కూర్చుండుము!" అని చెప్పెను.

మరియు అతను చెప్పెను,''మీకు తెలియునా, నేనచ్చటికి వెళ్లి మొట్టమొదటి సారి ఆయన ముఖములోనికి చూశాను. ఆయన నా కండ్లలోనికి నేరుగా చూసి మరి నా పేరేమిటని నాతో చెప్పెను. అంత క్రితము ఆయన నన్నెన్నడూ చూడలేదు. నన్ను మాత్రమే ఆయన ఎరిగియుండుట కాదు గాని, లేఖనములను నాకు ఉపదేశించిన దైవభక్తిగల నా తండ్రిని గురించి కూడా ఎరిగియుండెను. మరియు అది మెస్సీయాయని నేను గ్రహించాను. అదియే మెస్సీయాయని. అక్కడికక్కడే ఆ కార్యము నన్ను స్థిరపరచెను. అది నాకు దానిని సరిగా చేసినది.''

JOHN 1:46

 

24ఒకవేళ ఫిలిప్పు ఇలా చెప్పియుండవచ్చును, ''ఇచ్చట నేనొక మాట చెప్పవచ్చునా?'' ఇప్పుడతను చెప్పెను, ''సహోదరుడైన నతనయేలు, నేను ఇప్పుడు చెప్పే విషయము నిన్ను గాయపరచుకుండును గాక, ఎందుకనగా నీకు తెలియును మనము మెస్సీయా ఏ విధముగా నుండునని లేఖనములను సంవత్సరముల కొలది చదవియున్నాము. అయితే ఆయన దానిని చేయుట చూచినప్పుడు, నేను వెళ్ళి మరి నా స్నేహితుడైన నతనయేలును ఇచ్చటికీ పిలుచుకొని వచ్చాను. మరియు అతను వచ్చి''

నతనయేులు చెప్పెను, ''దానిని నన్ను చెప్పనిమ్ము, దానిని నన్ను చెప్పనిమ్ము.''

ఓ, మీకు తెలియునా, యేసు మీకు ఏదైనను చేసినప్పుడు, మీరు ఊరక నుండలేరు, దానిని ఎవరికైను మీరే చెప్పాలనిపించును. అది నిజమేనా? అది గనుక ఒక నిజమైన కార్యమైన యెడల, దానిని మీరే చెప్పవలయును, ఆయన నన్ను పరిశుద్ధాత్మతో నింపినయెడల దానిని గురించి నేను చెప్పవలయును. దానిని గురించి ఎవరైనను తెలుసుకొనవలయునని నేను కోరుచున్నాను. దానిని గురించి వేరే ఎవరో చెప్పుట కాదు గాని, మరి దానిని గురించి నాయంతట నేనే చెప్పవలయును.

JOHN 1:48

 

25మరియు నేను ఊహించుచున్నాను, నతనయేలు చాలా ఉత్సాహముతో నిండినవాడై మరియు ''మీకు తెలియునా, దీనిని నేను చెప్పుటకు ఇష్టపడుచున్నాను,'' యని చెప్పెను. ఫిలిప్పు నీవు దానిని గురించి నాకు చెప్పినప్పుడు నేను దానిని నమ్మలేకపోయాను.

''నజరేతులో నుండి మంచిదేదైన రాగలదా?''యని నేను నిన్ను అడిగితిని. మరియు నీవు ఏ మనుష్యుడైనను కలిగియుండలేనిది,

''వచ్చి చూడుమని,'' బదులిచ్చితివి. ఈ దినమునకు కూడ అది సరిగా యున్నది. అది సరియే. ఇంటిలోనే కూర్చొని మరి విమర్శింపవద్దు. వచ్చి మరి నీకై నీవు కనుగొనుము, చూశారా.

చెప్పెను, ''నజరేతులోనుండి మంచిదేదైన రాగలదా?''

చెప్పెను, "నీవే వచ్చి చూడుము." మరియు నీవు నాకు ఏమి చెప్పితివని నీకు తెలియును. "మరియు నేను ఆయన యొక్క సన్నిధిలోనికి నడచి వచ్చినప్పుడు, మరి నేనొక - ఒక హెబ్రీయుడనని, ఒక ఇశ్రాయేలీయుడనని, మరియు నేనొక కపటము లేని నిజాయితీ గలవాడినని'', ఆయన నాతో చెప్పెను నాకది తెలియును.

"అయితే, నేను ఆశ్చర్యపడ్డాను, "అదెట్లు సాధ్యమగును?" ఆయన ఒక సామాన్యమైన వ్యక్తివలెనుండెను. పరలోకము నుండి ఇక్కడున్న సంఘశాఖ పీఠము యొక్క రాజధానియైన యెరూషలేమునకు బంగారు వసారా గుండా మెస్సీయా వచ్చునని నేను ఎదురు చూచిచుంటిని, మరియు ఆ విధముగా నడచి వచ్చి, "కయపతో, నేను వచ్చియున్నానని," చెప్పెనని నేను అనుకున్నాను. అయితే ఆయన నజరేతులోనున్న ఒక బీద కుటుంబము నుండి మరియు "అక్రమ సంతానమను" తన వెనుక ఒక చెడ్డ పేరుతో బయటికి వచ్చెను. ఇదిగో ఇక్కడ ఆయన ఒక యూజకునివలె కాక లేక వేరెవరో వలె కాక ఒక సామాన్యమైన వస్త్రములను ధరించినవాడై నిలుచుకొని యున్నాడు… ఒక సామాన్యమైన మనుష్యుడు. మరియు ఆయన అచ్చటికి నడచి వచ్చినప్పుడు ''ఆయన ఏ విధముగా మెస్సీయాగా నుండగలడు,'' యని నేను తలంచాను. ఆయన ఒక యవ్వనస్తునిగానున్నప్పటి నుండి ధరించిన అదే పాత వస్త్రమును ఆయన ధరించుకొని యుండెను, ఇప్పుడిక్కడ కూడా అదే వస్త్రమును ధరించుకొని యుండెను. మరియు ఆయన వెనుక ఆయనయొక్క వెంట్రుకలు వ్రేలాడు చుండెను, మరియు వీధిలో నుండు సామాన్యమైన వ్యక్తివలె నుండెను." ''మరియు ఆయన నా ముఖములోనికి చూచి మరి చెప్పెను, ఫిలిప్పు నిన్ను పిలువకమునుపే, నీవు చెట్టు క్రింద నున్నప్పుడే, నేను నిన్ను చూచియున్నాను.'' నాకు ఆ కార్యము దానితో దృఢపరచెను. వాక్యము ద్వారా అది మెస్సీయాయని నేను ఎరిగియుంటిని, అది ఆయనే."

JOHN 4:4

 

26మరియు ఆ దోనె కదలిపోతున్నది, మరియు సాక్ష్యపు కూటము కొనసాగింపబడుచుండెను. ఓ, అక్కడ సముద్రము మీద ఎటువంటి ఒక అద్భుతమైన సమయమును వారు కలిగియుండిరి, ఒక గొప్ప సమయము అది.

అంద్రెయ చెప్పెను, ''కొద్దిసేపు నన్ను కలవరపెట్టిన ఆ కార్యమును గురించి నేను చెప్పుటకు ఇష్టపడుచున్నాను. మనము యెరికోకు పోవుచున్నప్పుడు మీకు గురున్నదా? ఆయన చెప్పెను, ''మనము ఇంకా ముందుకు పోవలయును. సమరయ గుండా పోవలసిన అవసరము నాకున్నది. కావున ఆయన సమరయలో నున్న సుఖారను ఊరికి వెళ్ళెను, అప్పుడు ఆయన మనల్ని సామాగ్రి కొనుటకు పట్టణములోనికి పంపించెను గుర్తున్నదా,"

''ఓ, అవును, నాకు అది బాగుగా గుర్తున్నది!''

"అవును."

"అవును."

దోనె కదలాడుచుండెను, ప్రతి యొక్కరును ఉజ్జీవమునకు పిదప ఒక అద్భుతమైన సాక్షి కూటమును కలిగియుండిరి. కావున వారు ఈ సాక్ష్యపు కూటమును కలిగియుండిరి.

JOHN 4:16-18

 

27మరియు అతను చెప్పెను, "మనము సామాగ్రి కొనుటకు వెళ్ళకుండా మెల్లగా జారుకొని మరి మన యజమానుడు ఒక గుర్తింపబడిన వ్యభిచారితో మాటలాడుట చూచి ఆశ్చర్యపడ్డాము. "హు-హ," మనము తలంచాము, అది చెడ్డగా నున్నది. ఈ యొక్క యవ్వనస్త్రీతో ఆయన మాటలాడుటను చూడండి అని మనము మాటలాడుకొన్నాము. మరియు ఆయన మనలను దూరముగా పంపివేసెను, మరిక్కడ ఆయన ఈ చెడ్డ పేరుగల స్త్రీతో కూర్చొని యున్నాడు.'' గుర్తుంచుకొనండి, మనము అక్కడ ఆ పొదలవెనుక దాగుకొనియుంటిమి మరియు మనము వారు మాటలాడుకొనిన సంభాషణను వినియున్నాము.

"మరియు ఆయన ఆ స్త్రీతో ఇట్లు చెప్పుట విన్నాము, స్త్రీ, నీవు వెళ్ళి నీ పెనిమిటిని తీసుకొని ఇచ్చటికి రమ్ము." మరియు మనము అప్పుడు చెప్పుకొన్నాము, "సరి, మనము అపార్ధము చేసియున్నాము, ఒకవేళ ఆ స్త్రీ చట్టబద్దముగా వివాహము చేసికొనియుండి యుండవచ్చును."

"మరియు ఆమె ఆయన ముఖములోనికి తిరిగి చూచి, మరి చెప్పెను, "అయ్యా, నాకు పెనిమిటి లేడు."

''హృదయాలు ఎంతగా నిరుత్సాహపడ్డాయో మీకు జ్ఞాపకమున్నదా? మనము నమ్మిక యుంచిన ఆ మన గొప్ప మెస్సీయా ఇక్కడ ఒక అబద్దములో చిక్కుకున్నాడని మనము తలంచుకొన్నాము, ఎదురెదురుగా చిక్కుకొనెను, ఏలయనగా ఆయన చెప్పెను, ''వెళ్ళి నీ భర్తను తోడుకొని రమ్ము,'' మరియు ఆమె దానికి బదులుగా తనకు భర్తలేడని సాక్ష్యమిచ్చెను. ఇప్పుడది అతనికి విరోధముగా ప్రేలెను." మీకు గుర్తున్నదా, మనము ఏ విధముగా ఆశ్చర్యముగా ఒకరినొకరము చూచుకొన్నామో మరి మన ఊపిరి ఆగిపోయేయంత పనియాయేను?"

''అవును, అది నాకు గుర్తున్నది.''

''మరటు పిదప దాని తరువాత మాటలను మీకు గుర్తున్నదా? ఆయన చెప్పెను, నీవు సత్యమును చెప్పితివి, ఏలయనగా, నీకు ఐదుగురు పెనిమిట్లుండిరి, ఇప్పుడు ఉన్నవాడు నీ పెనిమిటి కాడు.

"ఓ, పొద వెనుక జరిగిన సాక్ష్యపు కూటమును గురించి మీకు జ్ఞాపకమున్నదా? మై! చూడుడి, మీరు ఆయనను ఒక మూలకు నెట్టి తప్పును ఆయనలో కనిపెట్టలేరు, ఆయన దేవుడు!"

"ఓ" సీమోను చెప్పెను,"అది ఊరక…"

అంద్రెయ చెప్పెను, ''నాకు దానితో ఆ కార్యము స్థిరపడెను ఆయన మెస్సీయాయని.''

28బర్తోలోమయి చెప్పెను, ''కొద్దిగా యుండుడి, నేను ఒక సాక్ష్యమును చెప్పవలయునని యున్నాను. సహోదరులారా, నేను దానిని చెప్పవచ్చునా?''

''ఓ, మంచిది, మనకు చాలా సమయమున్నదని నేను అనుకొనుచున్నాను. ఆయన ఇంకా రాలేదు, కావున మనము ఇంకొద్దిగా తెడ్డుతో పడవను నడిపెదము. ముందుకు సాగిపోయెదము, బర్తొలొమయి, నీవు సాక్ష్యమిమ్ము''

''సరి, నేను చూసిన గొప్ప కార్యములలో నాకు అది ఒకటి. అక్కడ క్రింద నున్న యెరికోలోగల రిబ్కాయను పేరు గల సహోదరి మీకు గుర్తున్నదా?''

''అవును'' ''మరియు ఆమె భర్త ఒక అల్పాహారశాలను అక్కడ నడిపించుచున్నాడు.'' ''ఉహ్ - హు.''

''మరియు అతను ఒక వ్యాపారి మరతని పేరు జక్కయ్య.''

''అవును, అవును, అతడు నాకు బాగుగా గుర్తున్నది.''

MATT 12:24•

MARK 3:22•

LUKE 11:15•

HEB 4:12

 

29''మీకు గుర్తున్నదా, ఆమె మన సహోదరిలలో ఒకతె. ఆమె ప్రభువును నమ్మియున్నది మరియు ఆమె భర్త జక్కయ్య యేసును అంగీకరింపక యుండిపోవునేమోయని చాలా భయపడుచుండెను. మరియు ఓ, జక్కయ్య అక్కడున్న యాజకునికి చాలా మంచి స్నేహితుడు. మరియు ఏదో ఒక కార్యము సంభవించి అతని కండ్లు తెరువబడాలని తద్వారా ఆయనే యజమానుడనియు, ఇదియే ఋజువు చేయబడిన దేవుని వాక్యముగా శరీరధారియై మనమధ్య యున్నాడనియు అతడు గుర్తించవలెనని ఆమె ప్రార్థించుచుండెను. మరియు మనము ఏ విధముగా ఆమెకు చెప్పుటకు ప్రయత్నించియున్నామో… నజరేయుడైన యేసు ఏ విధముగా హృదయ రహస్యములను ఎరిగియున్నాడనియు, ఆయన వాక్యమని చూపించుచు జక్కయ్యకు మనము చెప్పుచుంటిమి, ఏలయనగా, హృదయ తలంపులను వాక్యము వివేచించును.

''బుద్ధిహీనత, అని అతడన్నాడు. ''నేను యాజకుడినే నమ్ముతాను'' యాజకుడు ఏమి చెప్పునో అదే నాకు మంచిది.'' ఏలయనగా అతను నగరములో నున్న క్రమమున కంతటికిని చెందినవాడు, కివానీస్ మరియు సమస్తమునకు చెందినవాడు, జక్కయ్య వీటన్నిటిని నమ్ముట వలన వాటిని వదిలివచ్చుట బహు కష్టమైన కార్యమని మీకు తెలియునా.

కావున మేము అతని కొరకు ప్రార్ధింపవలయునని రిబ్కా మమ్ములను కోరెను. మరియు ఆయన ఒక ప్రవక్తయను అంశమును గురించి మేము మాటలాడు సమయము వచ్చునప్పుడు అతను అది ''బుద్ధిహీనత'' యని చెప్పుచుండెడివాడు! యాజకుడు చెప్పుచుండును, ''అతను బయల్జెబూ. అతను ఒక దయ్యము. ఆయన దానిని దయ్యముయొక్క శక్తి వలన చేయుచున్నాడు. మరియు ఆయన కేవలము మానసిక పఠనము చేసేవాడుగా యున్నాడు. దానిలో నున్న సంగతి అదే. దానిలో వేరే ఏమియును లేదు."

''కాబట్టి ఈ రోజు అటువంటిదేది లేదు. వందలకొలది సంవత్సరములుగా మనము ఏ ప్రవక్తను కలిగియుండ లేదు, మరి ఒక సహవాసపు పత్రము యొక్క సభ్యత్వమును కూడా కలిగియుండని ఆ వ్యక్తి ఏ విధముగా ఒక ప్రవక్తగా నుండగలడు? ఓ, ఆయనను ప్రవక్తయనుటకు ఏ ఆధారము లేదు!

LUKE 19:3,4

 

30అయితే, మీకు తెలియును, జక్కయ్య భార్య రిబ్కా, చాలా గట్టిపట్టుదలతో నుండి మరి ప్రార్ధించుచుండెను. మరియు ఒక ఉదయమున యేసు నగరములోనికి వచ్చుచుండగా రిబ్కా తన భర్త జక్కయ్య ఆయనను చూచుటకు వీధిలోనికివెళ్ళినని మనతో చెప్పుట మనము చూచియున్నాము. ఆయన ఒక ప్రవక్తయని అతను నమ్మలేదు, కావున "నేను ఆయనను సమీపములో చూడబోవుచున్నాను," అని అతను చెప్పెను, దానిని గురించి ఆ దినమున మనము భోజనశాలలో భుజించునప్పుడు అతను ఏ విధముగా సాక్ష్యమిచ్చెనో గదా.

కావున ఆతడు ఒక మేడిచెట్టెక్కి మరి చెప్పెను, మీకు తెలియునా ఏమిటని, ఆయన నన్ను కనిపెట్టకుండా యుండుటకై నేనిక్కడ మరుగుగా దాగుకొనెదను. మరియు నేను ఎత్తైనను పొట్టి వ్యక్తిని, మరియు నేను క్రింద ఆ గుంపులో నిలబడియుంటే ఆయనను చూడలేను, కావున నేను చెట్టు పైకెక్కెదను. ''మరియు ఎక్కడైతే రెండు కొమ్మలు కలియునో అక్కడ ఆ కొమ్మల మధ్య అతడు కూర్చొని యున్నాడు.''

"మరి దానిని గురించి పరిశోధించి తెలుసుకొనుటకు అది ఒక మంచి స్థలము. మరి అక్కడే రెండు మార్గములు కలియును — మీ మార్గమును మరియు దేవుని మార్గమును — మీ అభిప్రాయములు. దానిని గురించి ఆలోచించుటకు అది ఒక మంచి కార్యము.

31"కావున అతను చెప్పెను, "అదేమిటో మీరెరుగుదురా, ఆయన ఒక మంచి ప్రవక్తగా నుండి యుండవలయును. ఆయన ప్రవక్తగా యుండవలయును. నేను గనుక పొరపాటు పడుటకు ఆస్కారము కలదు. కావున అదేమిటో నేను మీకు చెప్పెదను, నేను ఆయనను బాగుగా చూచెదను మరియు ఆయనకు నేను తెలియదు. నేను ఆకులన్నిటిని లాగి ఈ విధముగా నా చుట్టు చుట్టుకొని నన్నునేను ఆయనకు తెలియకుండా మరుగుపరచుకొనెదను, కావున ఆయన నన్ను కనిపెట్టలేడు. మరియు ఆయన వచ్చునప్పుడు నేను ఆయనను గమనించెదను. మరియు ఆయన గనుక మంచి వ్యక్తివలె కనిపించనియెడల, నేను ఇక్కడ ఈ చెట్టుపైన కూర్చొని నా యొక్క తెలివిని ఆయనపై ప్రయోగించెదను. కావున, అతను చెట్టు పైకెక్కి కూర్చొని ఒక ఆకును పైకెత్తి పట్టుకొని ఆయన వచ్చునప్పుడు చూచుట కనువుగా నుంచుకొనెను.

"మరియు ఆయన ఆ మూల నుండి వచ్చునప్పుడు, వీధి గుండా నడచి వచ్చునప్పుడు, అటు ఇటు చూచుచు నడచుచుండగా, మరి శిష్యులు చెప్పుచు సముద్రము మీద ఒక సావ్యము చుండిరి, దూరముగా వుండండి. నన్ను కమించండి. నన్ను మన్నించుడి. (మరియు జనులు వ్యాధిగల బిడ్డలతోను మరియు ఆ విధమగు వారు అచ్చట నిలబడుకొనియున్నారు.) "నన్ను క్షమించండి, గత రాత్రి జరిగిన ఆ గొప్ప ఆరాధన వలన యజమానుడు చాలా అలసటగా యున్నాడు. మరియు గౌరవనీయులైన పురుషులారా, దయచేసి మీరు ఆ ప్రక్కగా నిలుచుకొని మరి ఆయనను వెళ్ళనిచ్చెదరా, మంచిది, ఆయన నగరములోనికి వచ్చుటకు మార్గము ద్వారా వచ్చుచున్నాడు మరి మీరు దయచేసి ప్రక్కగా నిలిచెదరా?

"మరియు జక్కయ్య ఇక్కడ చెట్టుపైన కూర్చొని క్రింద ఆయన వైపే చూచుచున్నాడు."

LUKE 19:5

 

32"మరియు యేసు నేరుగా ఆ చెట్టు క్రిందకు వచ్చి, అచ్చట ఆగి మరి పైకి చూచి జక్కయ్య అక్కడ నుండి క్రిందికి దిగుము. ఈ దినమున నేను నీ గృహములో భోజనము చేయబోవుచున్నాను" అని చెప్పెను,

అది మరి నన్ను ఆయన ప్రవక్తయని స్థిరపరచెను. ఆయన అక్కడ క్రింద నిలుచుకొని యున్నప్పుడు ఆయన జక్కయ్య యొక్క పేరును ఎరిగియుండెను, అతను ఎవరైనది ఎరిగియుండెను. అది రూఢి పరచెను. నాకు అదియే మెస్సీయా, అవునయ్యా, ఏలయనగా దానిని మెస్సీయా మాత్రమే చేయునని మేము ఎరిగి యున్నాము. నిశ్చయముగా. కావున ఆయన ఆ దినమున భోజనముకై అతనితో కూడా అతని ఇంటికి వెళ్ళవలసి యుండెను. అది ఎటువంటి ఒక గొప్ప సమయము! అది మనకు జ్ఞాపకమున్నది."

33మీకు తెలియునా, మరి ఆ సమయమున సాక్ష్యి కూటము కొనసాగుచుండెను. మీకు తెలియునా శిష్యులు వారియొక్క సాక్ష్యము నిచ్చుచుండగా అది ఉత్తర దిక్కున ఫైన చీకటి క్రమ్మిన రాత్రిగా నుండి యుండవచ్చును, సాతాను కొండపైకి కదలి మరి క్రిందికి చూచెను. ఆ సాతాను ఆ సాక్ష్యి కూటమును చూచి మరి అచ్చట ఆయన వారితో లేకుండుట వాడు గమనించెను. అచ్చట వాడికి ఒక అవకాశము దొరికినది. చూడుడి, మరల అదే దృశ్యము పునరావృత్తమగుచున్నదని నేను అనుకుంటున్నాను. వారు ఉజ్జీవము యొక్క ఉత్తేజపు ఉత్సాహముతో ఆయన లేకుండానే వెళ్ళిరి.

మరియు ఈ దినమున ఈ గందరగోళపు సమయమున మనము చూచిన గొప్ప ఉజ్జీవమునకు పిదప మరి ఈ విధమైన కార్యము మనకు కూడా సంభవించియున్నది, అది ప్రపంచమునంతటిని కదిలించినది. ప్రతి దేశములోను ఉజ్జీవపు మ౦టలు లేచి మ౦డుచున్నవి — గొప్ప స్వస్థల కూటములు, వేలకొలది వేలకొలది జనులు పరిశుద్దాత్మను పొందుచున్నారు; మరియు దానియొక్క ఉత్సాహము వలన, ఆయన ఏమిచేసెనో దానిని గురించి శిష్యులు ఏవిధముగా సాక్యమిచ్చుచుండిరి — మరియు "ఓ, ఆయన దీనిని చేయుట మనము చూచియున్నాము, మరియు దానిని చేయుట చూచియున్నాము," మరియు ఆయన లేకుండా ఆయన శిష్యులు వెళ్లిన విధముగా మనము కూడా వెళ్లి యున్నామని నేను నమ్ముచున్నాను.

34ఉజ్జీవము అనుగ్రహించిన గొప్ప పెద్ద అవకాశములను మనము దాటి వచ్చేశాము. మనము అధిక ధనము సంపాదించుటలోను, సంఘములను, పెద్ద గొప్ప భవనములను కట్టుటలోను, గొప్ప లక్షలకొలది డాలరు విలువ చేయు స్థలములను, గొప్ప పాఠశాలలను, విధ్యా విధానములను, మరియు మన సంఘ శాఖలను, సంస్థలను అభివృద్ధి చేసుకోనుటకు తగిన అవకాశములను విస్తరించుకొంటూ వచ్చాము.

మరటు పిదప మన కమ్యూనిజమ్ ప్రణాళికలను, కమ్యూనిజముకు విరోధమైన కార్యక్రమములను కలిగియున్నాము — వాటిని గురించి ఈ దినమున మనము మాటలాడుచున్నాము. మరియు మొదటి కార్యమేదనగా మీకు తెలియునా, మన సంఘ సంస్థలయందున్ను కమ్యూనిజమ్ కు వ్యతిరేకమైన కార్యక్రమములను, మరియు ''ఇంకను పదిలక్షలు,'' మరి ఆ విధమైన పధకములను వారు కలిగియున్న వాటిని సాతానుడు మనలో చూచియున్నాడు. మనయొక్క పాతకాలపు ప్రార్థనా కూటములను, పరిశుద్దాత్మ అభిషేకములను మరల పొందుకొనుట మనము వదిలివేశాము, ఎంతవరుకనగా అగ్ని చల్లారిపోయెంతవరుకు.

మీరు ఏడ్వవచ్చును, మరియు బలిపీఠము నొద్దకు జనులను తీసికొని వచ్చుటకు ప్రయత్నింపవచ్చును, మరివారు చనిపోయినవారివలె ఆ చోటికి నడచి రావచ్చును, వచ్చుటకు భయపడవచ్చును. మరటు పిదప వాక్య సేవకులను వచ్చి వారికొరకు ప్రార్ధింపమని కోరెదరు. ''ఓ, అతను ఎందులకై నన్ను అడిగెను?'' మరియు వారు అచ్చటికి వెళ్లి మరి మీరు వారిని తీసికొని రాలేరు. మరియు వారు కొద్ది నిమిషములు అక్కడ నిలుచుకొని మీ వైపు చూచెదరు, మరి వారు తిరిగి వెళ్ళి వారి సీట్లలో కూర్చొనెదరు.

నా మట్టుకు అగ్ని ఆరిపోయినది. ఏదో కార్యము సంభవించినది. వినండి! మనకు కావలసినది ఏమిటనగా, ఒక ఉజ్జీవము, ఆ పాపులు, క్రీస్తువైపు తిరిగి చూచి, మారు మనస్సు పొంది, వారి చేతులను పైకెత్తి బలిపీఠము యొద్దకు పరిగెత్తుకొంటూ రావలెను! దయకొరకు కేకలేస్తూ, మరియు సంఘమంతయూ అగ్నితో రగులుకొని దేవుని మహిమతో నిండియుండును.

35మనయొక్క సంఘ సంస్థలను విస్తరించుకొనుటకును, మన వాక్య పరిచారకులను విద్యావంతులుగా చేయుటకై మనము పెద్ద పాఠశాలలను కట్టితిమి మరియు ఇటువంటి అవకాశములను పెంపొందించుకొనుటకు యున్న మన ఉత్సాహము వలన, ఆ సేవకులను పూర్వస్థితి కంటె మరెంతో దూరంగా దేవుని నుండి వారిని పంపివేశాము. విద్య ద్వారా దేవుడిని గుర్తెరుగలేవు, వేదాంత పాండిత్యము ద్వారా ఆయనను గురించి తెలుసుకోగలవు. విశ్వాసము ద్వారా మాత్రమే దేవుని గురించి తెలిసికొనవచ్చును. మీరు దేవుని వివరింపలేరు. ఆయన వివరింపబడిన దాని కన్నను ఘనమైన వాడు. అది ఏమి చేసినదని గమనించుడి.

ఒకప్పుడు పెంతెకోస్తుగానున్న పెంతెకోస్టు జనులైన మనము, మన స్త్రీలు వారి వెంట్రుకలను కత్తిరించుకొని, రంగులు పూసుకొనుచున్నారు; మన పురుషులు దానిని అనుమతించుచున్నారు. మనదైన వాక్య సేవకులు దానిని అనుమతించుచున్నారు. దానిని గురించి చెప్పుటకు వారు భయపడుచున్నారు. వారు గనుక దానిని గురించి చెప్పినయెడల సంఘము వారిని బయటికి నెట్టివేయును. ఓ, ప్రసంగ వేదికల నుండి అడుగుమట్టము వరకు మనకు దేవుని గృహము శుద్దీకరించకపోయినట్లైతే, అది అవమానము. అది అపకీర్తి!

MATT 13:20•

1COR 11:5

 

36సమీప కాలవయిన ఎవరో వ్యక్తి నా యొద్దకు వచ్చి మరి చెప్పెను, "సహోదరుడా బ్రెన్హాం, జనులు మిమ్ములను ప్రేమించుచున్నారు," అయితే, "మీరు ఎల్లప్పుడును వారి విషయమై గద్దించుచున్నావు, స్త్రీలను వారు వెంట్రుకలు కత్తిరించుకొనుటను గురించియు మరి మొదలగు విషయములను గూర్చి నీవు వారిని గద్దించుచున్నావు," అని చెప్పెను. నేను చెప్పాను, "ఆమె ఆ విధముగా నుండుట అవమానమని బైబిలు చెప్పుచున్నది."

ఆమె ఆ విధముగా చేసినయెడల ఆమె తన భర్తను అవమానపరచుచున్నది, మరియు నీవు దేవుని విడిచి దూరమైపోయావనుటకు అది ఒక పరిపూర్ణ సూచనగా యున్నది. గుర్తుంచుకొనుడి, సమ్సోను యొక్క విషయములో, పొడుగైన వెంట్రుకలు, అతను లోకము నుండి వేరైయుండుటను మరి దేవుని వాక్యము నొద్దకు వెళ్ళి యున్నాడనుటకు అది ఒక నాజీరునకు సూచనగా యున్నది.

మరియు స్త్రీలారా, మీరు మీ వెంట్రుకలను కత్తిరించుకొనినవైతే మీరు నాజీరుని చిహ్నమును నిరాకరించుచున్నారు. మీరు తిరిగి బైబిలు యొద్దకు వెళ్ళుటకు బదులుగా హాలివుడ్ కు వెళ్ళిపోయారు. బైబిలు చెప్పుచున్నది, వారు క్షౌరము చేయించుకొనరాదు." అది అవమానకరము. మరియు దైవసేవకులు దానిని గురించి ఏమియు చెప్పరు.

37ఈ మనుష్యుడు నాతో చెప్పెను, "మీరేల స్త్రీలను వారి దారిన వారిని వదిలి వేయకూడదు?" చెప్పెను, "వారు మిమ్ములను ఒక ప్రవక్తయుని గౌరవించుచున్నారు" కదా!

నేను చెప్పాను, "నేను ఒక ప్రవక్తయని ఎన్నడును నేను చెప్పలేదు."

చెప్పెను, "వారు ఆ విధముగా మిమ్ములను భావించుచున్నారు. ఆత్మీయ వరములను ఏ విధముగా పొందవలయునో వారికి బోధించుము మరి దానిని గురించి ఏదైనను చేయుము. మీరు వారికి పెద్ద కార్యములను, గొప్ప కార్యములను బోధింపవలయును."

నేను చెప్పాను, "వారు ఎ.,బి.,సి.,లు కూడా నేర్చుకొనని పరిస్థితులలో నున్నయెడల వారికి నేనెట్లు ఆల్జీబ్రా బోధింపగలను, దానిని గురించి వారు ఏ విధముగా యోగ్యులుగా నుండగలరు? దానిని మీరెట్లు చేయగలరు?

అవును, మొదటి కార్యమునకు దిగి వెళ్ళుడి. సంవత్సరము తర్వాత సంవత్సరమునకు దేశమంతటా వెళ్ళి చూడగా మరది ఇంకా హీనముగా దిగజారిపోవుచున్నది. ఎక్కడో ఏదో తప్పుయున్నది, అది వాక్య ప్రకారముగా లేదు. మనలో ఉజ్జీవపు అగ్నిమండకుండా నుండుటలో ఆశ్చర్యము లేదు. మనకు కావలసిన కార్యము ఇల్లు శుద్ధీకరింపు. మనము మరల తిరిగి వచ్చువరకు దేవుడు దానిని చేయడు. మనకు కావలసినది ఇంటిని శుభ్రపరచు సమయము.

2TIM 3:5•

REV 3:16

 

38మరియు పురుషులైనవారాలారా, మీరు మీ భార్యలను పొట్టి దుస్తులు ధరించుకొనుటకు అటువంటి కార్యములు చేయుటకు అనుమతించు చున్నారు! వారు మెతడిస్టులు, బాప్తిస్తులు కారు. వారు వెంతెకోస్టులు, అది నిజము, "పైకి భక్తిగలవారివలె నుండి, లవొదికయ సంఘకాలము, నులివెచ్చగా," వెంతెకోస్తని చెప్పుకొనుచు, అంతే, పెంతుకోస్తు అనునది ఒక పేరు కాదు గాని, అది పరిశుద్ధాత్మ యొక్క బాప్తిస్మము అనుభవము, అది జనులను పరిశుభ్రపరచును.

మనము గొప్ప స్వస్థతా కూటములను మరి ఆ కార్యములను కలుగకుండా నుండుటలో ఆర్యము లేదు, ఎక్కడో ఏదో తప్పు జరిగియున్నది, అది సాతాను బయట మనలను చూచి ప్రయత్నించుచున్నాడు. ''మంచిది, దానిని గురించి మనము ఏదైనను చెప్పినయెడల, వారు వారి సభ్యత్వమును మార్చుకొనెదరు.'' గుర్తుంచుకొనుడి, క్రైస్తవులను మీరు బుజ్జగించనక్కర్లేదు. క్రైస్తవులు కరుకైనవారు. ఎవరేమి చెప్పినను దేవుని కొరకు నిలువబడు దేవుని యొక్క పురుషులు మరియు స్త్రీలువారు. మీరు వారిని బ్రతిమాలనవసరము లేదు, నీవు బ్రతిమాలనవసరములేదు, నీవు వారియొద్ద భిక్షమెత్తనవసరము లేదు. నీవు వారికి వాసనలను పూయనవసరము లేదు, వారిని చిన్న పిల్లలవలె బుజ్జగించనవసరము లేదు, అవి సంకరజాతి యొక్క మెతక నేల మొక్కలవి. వాటివలన ఏ ప్రయోజనము లేదు వారు దేనిని ఉత్పత్తి చేయలేరు.

39ఒకటి నాకు గుర్తుకు వచ్చుచున్నది, ఒక…

అది గూడుకట్టు కాలము సమీపించుచున్నది, అచ్చటయున్న ఆ చిన్న పక్షులు, చిన్న పిచ్చుకలు తమయొక్క గూడును కట్టుకొనుటకు గడ్డిని చేర్చుచున్నవి — అవి గూడులను కట్టుకొనుటకు ఎంతో కాలము పట్టలేదు, వాటి చిన్న గ్రుడ్డులను పొదుగుట కొరకై అవి దానిని చేయుచున్నవి. మీకు తెలియునా, ఒక చిన్న పక్షి ఒకగూటి నిండా గ్రుడ్లను పెట్టి, వాటిపై కూర్చొని ప్రతి నిమిషము వాటిని కదిలించుచుయుండును. ఇప్పుడు ఆ గ్రుడ్లు వేడెక్కిన పిదప ఆమె గనుక వాటిని చల్లార్చినయెడల మరి ఆ గ్రుడ్లు పొదగవు. మరియు ఆమె ఎగిరిపోయి నోటి నిండుగా ఆహారమును తీసికొని వచ్చి మరి వెంటనే వాటిపైన కూర్చుండును.

మరియు మీకు తెలియనా, ఆ వృద్ద తల్లి పక్షి — ఆ గ్రుడ్లపైన కూర్చొని మరి వాటిని ప్రతి రెండు నిమిషములకు త్రిప్పుచుండును, మరియు. ఆ తల్లి పక్షి సరిగా తినక వాటికొరకు త్యాగము చేసి మరి గూటిని వదిలి లేవలేనంతగా బలహీనముగా నుండును. అయినను ఆ తల్లి పక్షి మగ పక్షితో సంబంధము కలిగి యుండకపోతే ఆ గ్రుడ్డు పొదగవు. వాటిని ఎంతగా పెంచినను గాని చూచుకొన్నను గాని అవి పొదగవు, అవి ఆ గూటిలోనే యుండి మరి క్రుళ్లిపోవును.

MATT 17:10•

MATT 25:10

 

40కావున మరి జతయైన యేసుక్రీస్తుతో పెంతుకోస్తుకు పరిచయముంచుకొనవలసిన సమయముయున్న యెడల — ఏలయనగా ఇంకొక క్రుళ్ళిన గ్రుడ్లతో నిండిన గూటిని మనము పొందుకొనుచున్నాము. విశ్వాసమును తృణీకరించి ప్రపంచ క్రైస్తవ ఐక్య సమావేశమునకు వెళ్ళి మరి పోపుతో కూర్చొని మరి అది ''ఆత్మీయమునకు సంబంధించినది'' అని చెప్పుచున్నారు. పెంతెకోస్తు ప్రజలైన మీకు ఏమి సంభవించినది? బైబిలు ఆ కార్యములను గురించి చెప్పియున్నదని మరి అవి ఆ విధముగా సంభవించునని మీకు తెలియదా?

మరియు మనము కేకలేయుచున్నాము, ఏలయనగా మెతడిస్టులు మరియు బాప్తిస్తులు లోనికి వచ్చుచున్నారు, మరియు ఈ తదితర కార్యములన్నియు సంభవించుచున్నవి, బుద్ధిలేని కన్యక నూనె కొనుటకు వచ్చునప్పుడు, మరి ఆ ఘడియలో పెండ్లి కుమారుడు వచ్చునని మీరు గుర్తించుటలేదా? మరియు వారు నూనెను పొందలేక పోయిరి!

మీకు తెలియునా, ఎత్తబడుట కూడా ఆ విధముగా రహస్యముగా వచ్చును, ఒకానొక ఈ సమయములలో వెళ్లిపోవుట సంభవించునని మరియు అది సంభవించునప్పుడు, మీరు ఎరుగను కూడా ఎరుగరు. ఆ సంభవము సమాప్తమైపోయి యుండును. మరి మీరు ఏమి సంభవించినదని ఆశ్చర్యపడెదరు.

MATT 17:12

 

41యోహాను భూమిపైకి వచ్చిన విధముగానే అని బైబిలు చెప్పుచున్నది, మరియు వారు ఆయనను అడిగిరి, "మంచిది, ఏలియా మొదట రావలయునని."

ఆయన చెప్పెను, "అతడు ఇది వరకే వచ్చియున్నాడు, మరి మీరు దానిని ఎరుగకయుంటిరి."

కావున అది అదే విధముగా నుండును, ఒకానొక దినమున వారు చెప్పెదరు, ''ఇది శ్రమలకు ముందుగా జరుగవలసిన సంగతని నేను తలంచుకొన్నాను. ఎత్తబడుట సంభవించునని నేను తలంచితిని,'' అని చెప్పెదరు.

ఆ మాటలు, ''అది ఇదివరకే సంభవించి ముగిసినది మరి మీరు దానిని ఎరుగకలేకపోయిరి, ''యది తిరిగి వచ్చును. ఉహ్-హు. మీరు తలంచు ముందుగా జరుగవలసిన సంగతిని అది చాలా ఆలస్యముగా నుండును. ఓ, సంఘము మేలుకొనును!

నేను దానిని వదిలి వేయుట మంచిది. నేనిక్కడ సిద్దాంతము కొరకు రాలేదు, మీరు దానిని మీలో పొందుకోవలెనని నేను దానిని మీలో బలముగా దూర్చవలయునని నేను తలంచాను.

ACTS 2:1

 

42గుర్తుంచుకొనుడి, సహోదరుడా, సాతాను ఈ గొప్ప ప్రణాళికలను చూచాడు, ఒక సంఘము ఇంకొక సంఘమును మించి వెళ్ళుటకు ప్రయత్నించుచున్నది, ఒక సంఘ సంస్థ ఇంకొక దానికన్నా మించి యుండుటకై ప్రయత్నించుచున్నది, వారిని మానసిక పరీక్ష పెట్టుటకై వారిలోనున్న నిరక్షరాస్యతను తుడిచి పెట్టుటకై సువార్త పొలములోనికి ఒక వ్యక్తి వెళ్ళక ముందే అతనిని పరీక్షకై ఒక ఆత్మ తత్త్వ జ్ఞాని యొద్దకు పంపుటలాటి కార్యములు చేయుచున్నారు. పెంతెకోస్తు! కాదు, అది ప్రెస్బెటేరియన్లు కాదు, అది పెంతెకోస్తు, మిషనెరీలు వాక్య సేవకై వేర్వేరు స్థలములకు వెళ్ళుటకు ముందే ఒక వర్గపు పెంతెకోస్తు వారు ఒక మానసిక పరీక్షకు వారిని పంపుటకు ఆశించుచున్నారు, ఆ గుంపు (పెద్దగుంపు).

అటువంటి పరీక్ష వలన వారికే ప్రయోజనము కలదు? వారికి ఒక పరీక్ష యుండెను. దేవుని యొక్క శక్తియు మరియు అగ్ని ఉన్నతముల నుండి దిగి వచ్చు వరకు వారు మేడ మీద గదిలో వేచియుండిరి, అదియే ప్రారంభములోనున్న పెంతెకోస్తు పరీక్ష, అదియే పరీక్ష, ఏదో ఒక లోక సంబంధమైన పరీక్ష కాదది, సగము త్రాగిన మనస్తత్త్వ శాస్త్రజ్ఞుడు అక్కడ నిలుచుకొని మనస్సును ఒక విధముగా ఉద్రేకపరచుచు లేక ఏదో కార్యము చేసి, ''నీవు అంతా నాశనము చేస్తావు,'' యని చెప్పుట కాదు. పూర్తిగా ఆత్మీయతోనున్న ఒక వ్యక్తి నరముల బలహీనతతో నున్నట్టుగా నిరూపింపబడిన యెడల, దానిలోనికి అతడు చేరుటకు ఆ స్థితిలో అతడు యుండవలసియున్నది. కావున మీరు అక్కడే యున్నారు, సంవత్సరాల తరబడిగా దేవుడేమి చేయుటకై యత్నించుచున్నాడో దానినంతటిని గందర గోళముగా చేయుటను మీరు గమనించుము, మరల వెంటనే వారి ప్రణాళికలతో వారి గొప్ప…

43అనేక జనులు గుంపులుగా కూడి వచ్చుటను వారు చూచినట్లైతే వారు ఉత్సాహముతో ఉప్పొంగిపోతారు, ''నేను గనుక వారినందరిని అసెంబ్లీస్ వారిగా చేసినట్లైతే…"

"నేను గనుక వారినందరిని ఏకత్వము" వారిగా చేయగలిగినట్లైతే!

"నేను గనుక వారినందరిని మెతడిస్టులుగా చేయగలిగిన యెడల!" అని చెప్పెదరు.

మెతడిస్టులు వారినందరిని మెతడిస్టులుగా చేయుటకు ప్రయత్నించుచున్నారు, బాప్తిస్థులు వారినందరిని బాప్తిస్థులుగా చేయుటకు ప్రయత్నించుచున్నారు, పెంతెకోస్టులు వారినందరిని పెంతెకోస్తులుగా చేయుటకు ప్రయత్నించుచున్నారు! ఓ, దానిని మీరేమియు చేయలేరు, జగత్తుకు పునాది వేసినప్పటి నుండియే దేవుడు వారిని ఆ విధముగా నిర్ణయించియున్నాడు.

మనము సువార్తను ప్రసంగింపవలయును, అంతే. అయితే ఆ అగ్ని లేకుండా మన గొప్ప ప్రణాళికలతో మనము సాగిపోతున్నాము. ఆ విధముగా మనము సాగిపోతూ మనకొరకు మనమే ఇంటిలోనే రాజేసుకొనేలాంటి అగ్నిని తయారుచేసికొని యున్నాము, అనగా మునుపున్న విధముగా మనమే స్వయముగా నిప్పును తయారు చేసికొనియున్నాము.

44మరియు మన యొక్క కమ్యూనిజము, ఇప్పుడు మనము చాలా భయపడుచున్నాము, కమ్యూనిజములోనికి వచ్చి స్థిరపడియున్నది, ''ఏమి జరుగనైయున్నది?'' అయితే మీకు తెలియునా, కమ్యూనిజము గొప్ప విషయమేమి కాదు. ఇప్పుడు నేను మీకు చెప్పనిమ్ము, నేను కమ్యూనిజము గురించి భయపడుట లేదు.

పెంతెకోస్థు వారైన మిమ్ములను గురించి నేనెందుకు భయపడుచున్నానంటే, ఈ ప్రపంచ క్రైస్తవ ఐక్యసభ మిమ్ములను వారితో చేరుకొనబోవుచున్నది. అదియే ఆ సంగతై యున్నది. అది ఒక మృగము యొక్క ముద్ర. రూపముతో రూపొంది వచ్చుటకు సంసిద్దముగా యున్నది. మరి మీరు దానిలోనికి పోబోవుచున్నారు, ఏలయనగా మీరు ఒక నిర్మింపబడియున్న సంస్థగా యున్నారు, మీరు దానిలోనికి వెళ్ళవలసియున్నది, లేనియెడల అందులోనుండి వెలుపలికి రావలసియున్నది. అదే ఆ విషయము. మరియు ఎవరైనా జ్ఞానముగల ఆత్మ సంబంధమైన మంచి వ్యక్తి దానిని గ్రహించును. మనకు ఇంకొక సముద్రము మీద సాక్ష్యము అవసరమై యున్నది.

మనమిప్పుడు దానిని కనుగొనియున్నాము. మరియు మన పెంతుకోస్థు వారు గాలము యొక్క కొక్కేమును, దారమును సమస్తమును మింగివేయుచున్నారు, ''అదెటువంటి ఒక గొప్ప విషయముగా ఉన్నదని,'' చెప్పుకొనుచున్నారు. మెతడిస్టు, ప్రెస్బిటేరియన్, లూథరన్, చర్చ్ ఆఫ్ క్రైస్ట్ మరియు పె౦తెకోస్థులు మీరు ఆ మృగము ముద్రలోనికి వెళ్ళుటకై మీరు మీ యొక్క గొప్ప అపొస్తలుల బోధనను తృణీకరించవలసి యున్నది. వారును అదే కార్యమును చేయవలయును. దానిలో మీరు చేయవలసిన కార్యమేమియూ లేదు. ఇప్పుడు నిరూపింపబడిన ప్రకారము అదంతయూ రోముతో చేర్చబడి ఐక్యమైపోయున్నవి. లేఖనములు ఆ విధముగా ఖచ్చితముగా చెప్పుచున్నవి.

45ఈ స్థితి వరకు వచ్చుటకు ఈ విషయములన్నియూ అనుమతించుచు జనులను హెచ్చరింపకుండా యుండు ప్రసంగికులను గురించి ఏమిటి? వారి హస్తాలు దేవునికి లెక్క అప్పజెప్పవలయును. ఈ శ్రమల కాలములోనే, వారు శ్రమలలో నున్నారు, వారు శ్రమలలో నున్నారు. కమ్యూనిజమ్ వచ్చి స్థిరపడుట లేదు… సమస్త గుంపులను క్రైస్తవ ప్రపంచ ఐక్యసభ మ్రింగివేయబోవుచున్నది. మరియు గుర్తుంచుకొనుడి, ''అది జరుగునప్పుడు చూచుకొనెదము,'' అని మీరు చెప్పినయెడల పిదప అప్పుడు ఆలస్యము కావచ్చును, అప్పటికే మీరు మృగము యొక్క ముద్రను ధరించుకొని యుండవచ్చును. అప్పుడు మీరు దానికి చెందినవారు. దానినుండి ఇప్పుడే మీరు బయటికి రాగలిగిన యెడల మీరు ఇప్పుడే బయటికి రండి. అవునయ్యా.

దేవుని యొక్క రాజ్యములో ముద్రింపబడండి. క్రీస్తుయొక్క శరీరము క్రీస్తు మర్మమైయున్న శరీరమగుచున్నది. శరీరము పరిశుద్ధాత్మ ద్వారా దానిలోనికి బాప్తిస్మము నొందియున్నది; అందులో చేరుట వలన కాదు, దానిలో తీసుకొనుట వలన కాదు, దానిలో మాట్లాడుట వలన కాదు, దానిలో అన్య భాషలు మాట్లాడుట, దానిలో చేరుట వలన కాదు, దానిలో కేకలు వేయుట వలన కాదు, మీరు దానిలోనికి పరిశుద్ధాత్మ ద్వారా జన్మించియున్నారు! అది నిజము. నిశ్చయముగా.

REV 3:20

 

46ఇప్పుడు శ్రమలు ఆకస్మాత్తుగా పైకి వచ్చునని మనము ఈ కార్యములన్నిటిని గమనించియున్నాము. ఓ, దయ్యము అక్కడ చూచి మరి చెప్పెను, ''ఉహ్-హ, వారు ఉద్వేగముతో దేవుని కొరకు సాక్ష్యమిచ్చుచు వెళ్ళారు, వారు పైకి క్రిందికి దూకుచు, అరచుచు ఒక మంచి సమయమును కలిగియున్నారు. మీకు తెలియునా ఏమిటని, వారిని ముంచి వేయుటకు ఇదియే నా సమయము అని దయ్యము అనుకొనెను. ఇప్పుడే వారిని సరిగా బంధించెదను.''

కావున వాడు కొండపైకి లేచి మరి తన విషపు వాయువును ఊదుటకు ప్రారంభించెను. [సహోదరుడు బ్రన్హం ఊదిన శబ్దము చేసెను.] అద్భుతములు జరుగు దినములు గతించిపోయినవి.

"ఈ జనులందరు కేవలము ఒట్టి పిరికివారని నేను నమ్ముచున్నాను. వారు విదేశ సేవలకు వెళ్ళక ముందు వారికి మానసిక పరీక్ష ఉండవలసి యుండవలయును.'' పెంతుకొస్తు వారలారా! ఉహ్-హు.

వాడియొక్క విషవాయువు ఏ విధముగా చంపుచున్నదో గమనించాం! ''ఓ, అది వేరే ఏదో కార్యమని నేను అనుకొనుచున్నాను, నేను నమ్ముచున్నాను…."

''ఇతర సంఘ సంస్థలు చేసినట్టుగా వారు తిన్నగా వెనుకకు వెళ్ళిపోవుట, అది ఖచ్చితముగా వారు నడిచిన మార్గమందే మీరు కూడా నడచుటగా యున్నది, దానిలోనే నడచుచున్నారు. అది దానిని చంపుచున్నది. మీరు సంఘ సంస్థగా స్థాపింపబడినప్పుడే మరి ఆ ఘడియలోనే అది మిమ్ములను చంపివేయును. అదెల్లప్పుడును ఆ విధముగానే చేయుచున్నది, అది ఎల్లప్పుడూ ఆ విధముగానే చేయుచున్నది. అది మరల లేవదు. ఆ విధముగా సంఘ సంస్థగా మారినట్టుగా ఆది చరిత్రలో తెలుపబడలేదు.

ఈ లవొదికయ సంఘ కాలమున, క్రీస్తు సంఘమునకు వెలుపల నిలుచుకొని మరి లోనికి వచ్చుటకు ప్రయత్నించుచు తట్టుచున్నాడు. మరియు వారు దానికి నిలువలేరు. దానిని వారు వినరు.

ఇప్పుడు మనము కనుగొనియున్నాము, మనము జీవించుచున్న ఈ ఘడియలో ఇబ్బందులు ప్రారంభించియున్నవి.

47మరియు ముందు జరిగినట్లు అద్భుతములు సంభవించుట లేదని మనము కనుగొనియున్నాము. వ్యాధిగ్రస్తులు స్వస్థత నొందక ఇంటికి వ్యాధిగ్రస్తులు గానే వెళ్ళుచున్నారు. అది దేవుడిని బట్టి కాదు. ఆ విధముగా ఎందులకు జరుగుచున్నదనగా జనుల మధ్య ఉజ్జీవము లేకపోవుటచేత, ఉజ్జీవములేదు. వారు ఊరక కూర్చొని మరి వినుచున్నారు, ఇంటికి వెళ్లి మరి, "మంచిది, అది చాలా బాగుండెను,'' యని చెప్పుచున్నారు. "ఉహ్-హు." ఆ శక్తి అక్కడ లేదు చూశారా, అక్కడ యుండవలసిన ఆ ఏదో కార్యము అక్కడున్న జనులలో లేదు.

48పదునయిదు సంవత్సరములకు క్రితము నాకు గుర్తున్నది, ఇక్కడున్న అర్కాన్సాస్ లో అక్కడున్న జోనెస్బోరోలో నేను ఒక చిన్న కూటమును నడిపించునప్పుడు, సుమారు పదునయిదువేల మంది జనాభా గల ఆ పట్టణములో సుమారుగా నలుబది వేలమంది జనులు ఆ కూటములో కలసికొనుటకు ప్రయత్నించిరి. వారు ప్రత్తిని తీసుకొని వెళ్ళు బండ్ల క్రిందను, మరియు సమస్తము క్రిందను వారిని పరుండబెట్టిరి. మరియు లోపలికి ప్రవేశించుటకై వారు, వారి వ్యాధిగ్రస్థులైన బిడ్డలపైన కాగితములను నుంచి పట్టుకొనియుండిరి. మరియు వారు వారి సీట్లలో కూర్చొని మరి బయటికి పోక రాత్రింబగళ్ళు అట్లేయు౦డిరి, మరియు వారి ప్రియులను పంపి హోమ్ బర్గర్ (మాంసముతో చేయబడిన తినుబండారము) మరియు త్రాగుటకు సోడా వంటివాటిని తెప్పించుకొనిరి; ఎప్పటికీ కదలక, మరియు రాత్రింబగళ్ళు అచ్చటనేయుండిరి. వారు హృదయములు అగ్నితో మండుచుండెను. దేవుడు ఊరక ఒక చిన్న కార్యమును చేసెను, అది వారిలో మంటను చెలరేపినది. మరియు వందలకొలదిలోనికి వచ్చిరి. ఆయన పదునయిదు సంవత్సరములకు మునుపు ఎట్లుండెనో, మరి ఆ విధముగానే, ఈ రాత్రి కూడా మారని అదే దేవుడుగా ఆయన యున్నాడు.

49ఆకాశములను మరియు భూమిని సృష్టించినప్పుడు ఆయన ఏ విధముగా నుండెనో మరి ఆయన ఈ రాత్రి కూడా ఇంకా అదే దేవునిగా యున్నాడు.

అయితే అదేమిటి? మనము ఎంతో ఉత్సాహవంతులమై మరి మన సంఘ సంస్థలను కట్టుటకు కోరుచున్నాము, దీనిని కట్టవలయుననియు, మరియు దీనిని కట్టవలయుననియు కోరుచున్నాము, మరియు ఏదో గొప్పగా నుండుదానిని, మరియు తళతళమని మెరయు; దానిని జోనెసెస్తోను, మెతడిస్థుతోను, బాప్తిస్టుతోను, ప్రెస్బిటేరియన్తోను పోల్చిచూచుచున్నాము. మీరు వారికి చెందినవాడవు కాదు. కాదు, మీరు కాదు.

వారు సంఘ సంస్థకు చెందిన జనులు, అది నిజము, ఆ జనులకు విరోధముగా కాదు. వారి మధ్య అనేక చక్కటి క్రైస్తవులు కలరు, అయితే మీరు ఆ అవిశ్వాసులైన గుంపులతో సహవాసము చేయకూడదు. "దానియొక్క శక్తిని తృణీకరించిన ప్రజలు, "మీరు వారితో సహవాసము చేస్తూ వారి ప్రక్కన నుండరాదు, వారు చేయునది సరియని చెప్పకూడదు.

50మీకు తెలియునా, వచ్చిన చిక్కేమిటనగా, మీరు హాలీవుడ్ ను సంఘము లోనికి తీసికొని వచ్చుటకు ప్రయత్నించుచున్నారు. అయితే మీరు చేయవలసిన విషయమేమనగా సంఘములో నుండి హాలీవుడ్ ను బయటికి నెట్టుటయే. చూశారా, జనులను ఆకర్షించుటకై వారి చూపు దానిపై నుండునట్టుగా మీరు మీ యొక్క సంఘ సంస్థలను చాలా పెద్దదిగాను మరియు మీ యొక్క భవనములను చాలా అందముగా నుండునట్టుగా చేయుటకు మీరు ప్రయత్నించుచున్నారు.

మనము వారియొక్క దారిలోనికి వెళ్ళలేము. మనము వారిని మన ప్రక్కకు తీసికొని రావలయును. సమస్తమును తళతళయని మెరయుచున్నది, గుర్తుంచుకొనుడి, హాలివుడ్ ప్రపంచ కార్యములతో మెరయుచున్నది, మరి సువార్త ఏమో తగ్గించుకొనుచు అణకువతో ప్రకాశించుచున్నది. తళతళయని మెరయుటకును, మరి ప్రకాశించుటకును చాలా బేధమున్నది. సువార్త దీనత్వముతోను, సాత్వికముతో, నమ్రతతో మరియు శక్తితో ప్రకాశించుచున్నది. మరి హాలివుడ్ తళతళమెరయుచు, మరి ప్రతి యొక్కరును శభాస్యనుచు మరి కేక లేయుచు మరి దానిలోనికి వెళ్ళిపోవుచున్నారు, చూశారా. మనకు అది అవసరములేదు.

MATT 5:13

 

51మనము అటువంటి ప్రకాశించు వెలుగుగా జీవింపగోరుచున్నాము. ఆయన చెప్పెను, "మీరు లోకమునకు ఉప్పైయున్నారు." "ఉప్పు గనుక తన సారమును కోల్పోయిన యెడల," (సువార్తలో గల దాని బలము అదియే.) మెతడిస్టులు, బాప్తిస్టులు, ప్రెస్బిటేరియన్లు, మరి వారందరును మన యొక్క ఆలయములలోనికి వచ్చుటకు తాపత్రయపడునట్టుగా ఏదో కార్యము మన ఆలయములలో కదలాడుచుండవలయును. మనము ఉప్పువలె సారము కలిగి యుండవలయును! ఉప్పు దప్పికను పుట్టించును, దప్పికను కలిగింపచేయును. దానితో గనుక సంబంధము కలిగియున్నట్లైతే ఉప్పు సారముతో నుండును. ఉప్పు దానితో సంబంధము కలిగియుండవలయును.

మరియు మనము కనుగొనినది ఏమనగా మనయొక్క ఉద్రేకము వలన వెర్రితనము వలన మెతడిస్టులతో, మరియు బాప్తిస్టులతో, పెద్ద కట్టడములతో మరియు పెద్ద స్థలములతో మరియు నాజూకైన విద్యావంతులైన జనులతో మరియు, గొప్ప పాఠశాలలతో, పెద్ద కళాశాలలతో మరి విధమైన సమస్తముతో పోల్చి చూచుకొనుచున్నాము. మనము ఉద్రేక పూరితమైన కార్యముల వెనుక వెళ్ళి యున్నాము, మరి దానివలన ఇక్కడ చిక్కులులోనికి రాతొడగినవి. మరియు ఆత్మీయ మనస్సు చుట్టు చూచి మరి చెప్పుకొనుచున్నది, "ఒక్క నిమిషము ఇక్కడ ఆగుము, మనమందరమును ఆ ప్రపంచ సంఘ ఐక్యసభలో సభ్యత్వమును తీసికొనబోవుచున్నామా? మన యొక్క గుంపు సమస్తము దానిలోనికి పోబోవుచున్నదా?" నిశ్చయముగా మీరు దానిలోనికి పోవుచున్నారు. అది ఖచ్చితముగా నున్నది. మీరు చేరియున్నారా లేదాయని మీరు వేచియుండి చూడండి. మీరు సరిగా ఆ విధముగా నుండెదరని మరి క్రీస్తు వెలుపట నుండునని బైబిలు చెప్పుచున్నది. ఆ దినమున రాత్రి పోపుకు ముందు

(రోము నగరమునకు వెళ్లిన మొదటి పోపు) చంద్రుడు వెలుగు నియ్యక తనను అంధకారము చేసికొని, ఆకాశములో మీకు ఒక సూచనను చూపించెను. ముందుగా చెప్పబడియుండలేదు, అయితే అది జరిగినది. దేవుడు ఈ దినమున ఏ విధముగా కార్యములను చేయుచున్నాడో, అది అద్భుతముగా నున్నది!

52అటు పిదప ఈ యొక్క భయంకరమైన కటిక చీకటి ఘడియలలో వారచ్చటే యుండగా, గాలి పైకి లేచెను. సమస్తపు నిరీక్షణ యొక్క ఆధారము నశించిపోయెను. ఇప్పుడు మీ యొక్క సంఘసంస్థ ప్రపంచ సంఘ ఐక్యసభలోనికి వెళ్ళిపోయినదైతే మీరేమి చేసెదరు? మరియు ఇచ్చట భూమిపైన మనము కట్టిన గొప్ప కార్యముల కన్నిటికి ఏమి సంభవించును, నిరీక్షణ కూడా గతించిపోవునా?

అయితే మీకు తెలియునా, వారు కేకలేయుటకునుండగా, మరియు ఎదురు చూసిన ఆశలన్నియును నిరాశలైనప్పుడు, వారు రక్షింపబడలేనప్పుడు… మరి ఆక్మసాత్తుగా, ఆయన నీటిపై నడచి వచ్చుట వారు చూచిరి. చీకటి ఘడియలో నడచుచు ఆయన వచ్చెను.

MATT 12:39•

LUKE 17:28,30

 

53మీకేమిటని తెలియునా? ఆయన వారిని విడచి వెళ్లినప్పుడు, అది సంభవింపవైయున్నదని ఆయన ఎరిగియుండెను, కావున ఆయన ఆ ప్రాంతములోనున్న ఒక ఎత్తైన ఒక కొండను ఎక్కెను. ఎక్కిపోవు కొలదీ ఆయనను మీరింకా బాగా చూడగలరు. అందుచే వారిని గమనించి చూచుటకై ఆయన పైకి ఎక్కెను.

మీరెరుగుదురా, మరియు ఇది రాబోవుచున్నదని ఆయనకు తెలియును. ఈ దినమున ఈ విధముగా ఇది యుండునని ఆయన ముందుగానే ఎరిగియుండెను. "మనుష్య కుమారుడు బయలుపడునప్పుడు సొదొమ దినములవలె మనుష్యకుమారుని రాకడ దినములయందు యుండును." అప్పుడు కుమారుడు ప్రత్యక్ష్య పరచబడవలయును.

ఈ మూర్ఖ మరియు వ్యభిచార సంతతి ఒక సూచనను వెదకుచున్నది, అది ఒక సూచనను పొందును. అప్పుడు వారు చేసిన విధముగా దానిని వారు నిరాకరించెదరు, అయితే అది పునరుత్థాన సూచనగా నుండును. ఆయన ఇంకా సజీవుడై యుండి ఆయన ముందే చేసిన విధముగా ఇప్పుడును చేయుచున్నాడు.

MATT 10:31

 

54ఈ గొప్ప సమయములో ఆ శిష్యులందరూ ఆపదలో యున్నప్పుడు ఆయన వారిని గమనించుటకనువుగా ఒక ఎత్తైన స్థలమునకెక్కి వెళ్ళాడని మనము చూచియున్నాము. ఆయన అక్కడ పైన ఒక కొండపై కూర్చొని మరి వారిని గమనించుచుండెను.

మరిప్పుడు ఆయన ఈ సారి ఒక పర్వతమును ఎక్కలేదు, అయితే ఆయన సమాధి నుండి లేచెను, గాలి ద్వారా చంద్రుడు, నక్షత్రములను దాటి చాలా ఎత్తుగా వెళ్లి, ఆకాశమును క్రింద తొంగి చూచులాగున చాలా ఎత్తుకు వెళ్ళెను. మరియు ఆయన అక్కడ ఆ ఉన్నత స్థానమందు కూర్చొనియున్నాడు. ఇప్పుడు "ఆయన కన్నులు పిచ్చికపై నున్నవి మరియు ఆయన మనలను గమనించుచున్నాడని నాకు తెలియును." ఆయన గమనించుచున్నాడు.

2TIM 3:4

 

55మరియు ఈ చీకటి ఘడియలో, సంఘమలన్నియును గొప్ప ప్రణాళికలతో నిండియున్నవి. మరియు వారు ఈ కార్యక్రమమును మరియు ఆ కార్యక్రమమును కలిగియున్నారు, సంఘసంస్థలు మరియు తక్కిన సంఘములవలె వారు కార్యక్రమములను కలిగియున్నారు. మరియు ఏమి సంభవించినది? చీకటి ఘడియలలో నిజమైన ఆత్మతో నింపబడిన జనులు "ఏమి సంభవింపనై యున్నది? యని ఆశ్చర్యపడుచున్నారు. ఆ మనుష్యుడు, నా యొక్క బిడ్డలను గమనించండి" "నా యొక్క భార్యను గమనించండి! దీనిని గమనించండి" యని చెప్పుచున్నాడు. మరియు వారు టెలివిజనులలో ప్రసారము చేయు "మేము సూసిని ప్రేమించు," లేక మరి ఆ విధమైన కార్యక్రమములను చూచుటకనువుగా ఆదివారము లేక బుధవారము ప్రార్ధనా కూటములను శీఘ్రముగా వదిలివేయుచున్నారు; "దేవుని ప్రేమించుట కంటె సుఖానుభవమును ఎక్కువగా ప్రేమించుదురు, వారివలె ప్రవర్తించుచున్నారు.

MATT 5:28

 

56బిగుత్తుగా దుస్తులు ధరించుకొనియున్న ఒక స్త్రీతో ఆ దినమున నేను చెప్పాను. ''సహోదరి, ఆ దుస్తులు చాలా బిగుతుగా యున్నవి. ఆ విధముగా నీ దుస్తులను గురించి చెప్పుట నాకు బాగనిపించుట లేదు అయినను చెప్పుచున్నాను. నీవు ఒక క్రైస్తవురాలివి మరియు నీవు మరియొకరికి అభ్యంతరముగా యున్నావు.''

ఆమె చెప్పెను, ''మంచిది, బ్రెన్హాం సహోదరుడా, మీకు ఏమిటని తెలియునా?'' ఆమె చెప్పెను, "ఈ విధమైన దుస్తులను మాత్రమే వారు తయారు చేయుచున్నారు.''

నేను చెప్పాను, ''వారింకా వస్తువులను అమ్ముచున్నారు, మరియు వారు కుట్టు మెషీన్లను కలిగియున్నారు. కావున కుంటి సాకులు చెప్పుటకు వీలు లేదు.''

నా యొక్క ప్రియమైన స్నేహితుడా, నేను మీకు ఒక కార్యమును చెప్పనిమ్ము, వినుము, నేను మిమ్ములను నొప్పించుట లేదు. లేదయ్యా, వేదనకరమగు స్థలము నుండి నిన్ను వెలుపలికి లాగుటకే నేను ప్రయత్నించుచున్నాను. ఆ ఆత్మ మీలో నుండు వరకు మీరు దానిని చేసెదరు. అది నిజము. మీరు దానినుండి బయటికీ జన్మింపవలయును. ఆ నేరారోపణను నీకు నీవే చేసుకోగలుగుతావు. అయితే నేను మీకు ఒక కార్యమును చెప్పనిమ్ము. చూశారా, ''నీ ధనమెక్కడ నుండునో అక్కడనే నీ హృదయము ఉండును.''

MATT 5:28•

1JN 2:15

 

57నేను మీకు చెప్పనిమ్ము. మీరు మీ భర్తకు లిల్లీ పుష్పమువలె పరిశుద్ధముగా నుండవచ్చును, మరియు మీరు మీ యవ్వన బాల్య స్నేహితునికి ఒక పరిశుద్ధమైన లిల్లీ పుష్పమువలె యవ్వన బాలికగా నుండవచ్చును, అయితే ఒక దినమున మీరు వ్యభిచారము చేసినందులకుగాను దేవుడు మీరు బదులు చెప్పునట్టుగా చేయును. మీరు ఆ విధముగా దుస్తులు ధరించినప్పుడు మీరు నేరస్తులగుచున్నారు.

యేసు చెప్పెను, "ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారము చేసినవాడగును." నేను మిమ్ములను ప్రేమించుచున్నాను, మరి ఆ కారణము వలననే నేను దానిని చెప్పుచున్నాను. ప్రేమ సరిదిద్దును.

58మనము ఒక గొప్ప వెర్రివ్యామోహములో నున్నాము. ఒక గొప్ప దుస్తుల వెర్రివ్యామోహములో యున్నాడు, ఈ లోక పోకడనను సూచించు విధముగా మీ వస్త్రధారణ యున్నది. ఆయన చెప్పెను,''ఈ లోకమునైనను, లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. ఎవడైనను లోకమును ప్రేమించినయెడల తండ్రి ప్రేమ వానిలో నుండదు, "మీరు ఎంతగా అన్యభాషలలో మాటలాడినను నాకు అక్కర లేదు, క్రిందికి పైకి దూకినను, నటనమాడినను, వెంట్రుకలు కత్తిరించుకొనినను, ఆ విధమైన దుస్తులు ధరించినను నాకు అక్కర లేదు. పురుషులైన మీరు దానిని అనుమతించుచున్నారు. మీరు ఎక్కడయున్నారని ఏవిధమైన స్థితిలో యున్నారని మీయొక్క స్వయమైన ఫలములు మీకు చెప్పును. అది ఖచ్చితముగా సరియే. మరియు మనము అటువంటి గందరగోళములో యున్నాము.

మనము గందర గోళములో, కమ్యూనిజమును గాలులు, సంఘ సిద్ధాంతమను గాలులు, ప్రపంచ క్రైస్తవ సంఘసంస్థలుయను గాలులు వీటి గందరగోళములలో మనము యున్నాము! ఇది ఒక మిశ్రమమగు సమయముగా యున్నది, ఒక ఐక్యమును పొందుకొను కాలముగా కార్మిక సంఘములు ఒక్కటిగా చేరుటచే మరి దానివలన గందరగోళముగా నున్నది. రాజ్యములకు ఐక్యరాజ్యసమితియున్నది వారు ఏకమగుచున్నారు. సంఘములు ఏకమగుచున్నవి. అది దేనిని చూపించుచున్నది? అది క్రీస్తు మరియు వధువు ఒక్కటిగా ఐక్యపడుటను చూపించుచున్నది. మరిదానినే అది పలుకుచున్నది. ఈ నీడవంటి కార్యములన్నియును రానున్న నిజమైన కార్యములను చూపించుచు సూచించుచున్నవి.

59మనము ముగించబోవు చుండగా ఇప్పుడు గమనించుడి, ఏలయనగా నేను ఆలస్యము చేయుచున్నాను. మరిప్పుడు గమనించుడి, నమ్మకమంతయును కోల్పోయిన ఆ గొప్ప ఘడియలలో, బ్రదుకుతామన్న ఆశ గతించిపోయినప్పుడు, ఎవ్వరో నీటిపైన నడచి వచ్చుటను వారు చూచిరి, పైన నడచి వచ్చుచుండుటను, మరియు అక్కడున్న కార్యమును, విషాదకరమైన విషయమేమిటంటే, (చాలా జాగ్రత్తగా వినుడి), ఏ ఒక్కరైతే వారికి సహాయం చేయగలరో ఆ ఒక్కరిని గురించి వారు భయపడిరి. వారు చెప్పిరి, "ఇది భూతమువలె నున్నది. అది ఒకవేళ భూతముగానుండ వచ్చును, మీకు తెలియునా భూతము."

అది మరలా పునరావృతము కాలేదా! దానిని గురించి వారు భయపడిరి. వారు ముందుగా సంగతులను వివేచించి చెప్పుటను గురించి భయపడిరి. మీరు ఒక విధమైన దయ్యపు శక్తియని భయపడుచున్నారు, ఈ దినమున కూడా అది సంభవించునని యేసు చెప్పియున్నారు. వారికి సహాయపడగల ఆ ఒక్కే ఒక్కడూ యేసుక్రీస్తే, మరి ఇంకొక సంఘసంస్థ కాదు, వారందరును ఒక్కటిగా కూడుకొని యుండుట వారికి సహాయపడదు. అది వారిని ఇంకా ఉన్నప్పటి కంటెను ఘోరమైన స్థితికి తీసికొని వచ్చును.

మీకు సహాయపడగల ఒకే కార్యము యేసుక్రీస్తు.

60మరియు ఈ అంత్యదినములయందు ఈ యొక్క రూపములో ఆయన మరల వచ్చి దీనిని చేసెదనని వాగ్ధానము చేసినప్పుడు, మొదటి విత్తనమైన అబ్రాహాము యొద్దకు వాగ్ధానము చేయబడిన కుమారుడు వచ్చుటకు ముందు యుండినట్లే, అబ్రాహాము యొక్క రాజరికపు సంతతియు అదే విధమైన కార్యమును చూచునని యేసు చెప్పియున్నాడు. చివరి దినములలో జరుగునని చెప్పబడియున్న ప్రకారము, ఆయన చేసెదనని చెప్పబడియున్న ప్రకారము, వాగ్ధాన కుమారునికి మునుపు దేవుడు తననుతానే శరీరములో బయలుపరచుకొని మరి యేసు చేసిన విధముగానే చేయును. మరియు ఆ వాగ్ధానములన్నియూ, మరి వాటిని మనము డజన్లకొలది మీకు ముందు పెట్టవచ్చును, మరి ఇవన్నియును సంభవింపనైయున్నవి.

మరియు చేతులు చాపి వాటిని అంగీకరింపవలసిన సంఘములన్నియూ చెప్పుచున్నవి, ''దానిని గురించి నాకు భయముగా నున్నది. అది మా గుంపుకు సంబంధించినది కాదు, చూడండి.'' మరియు వారు దానిని గురించి భయపడుచున్నారు. మరియు వారిని క్రీస్తు యొద్దకు తీసికొనివచ్చు ఒకే ఒక్క కార్యము, క్రీస్తే, మరి వారు ఆయనను గురించి భయపడి, అది భయముగానున్నదని చెప్పుచున్నారు.

"ఓ, నాకు తెలియదు. అది భూతముగా నుండవచ్చును, మీరు చూడండి. మరియు దానిని గురించి నాకు తెలియదు." వారికి సహాయపడగల ఒకే ఒక కార్యమును గురించి వారు భయపడుచున్నారు.

MATT 14:27•

HEB 13:8

 

61మరియు, ఆ నిరాశలోనున్న ఆ నిశిధి ఘడియలలో ఆ ఎన్నుకొనబడిన సంఘము, అక్కడ కూర్చొనియున్నది, అది ఒకవేళ భూతముగా నుండవచ్చునని భయపడుచు, మరి దానితో వారికేమి సంబంధము లేదనుచున్నారు. మరప్పుడు "నేనే భయపడకుడి" అనే ఆ తియ్యని స్వరము వచ్చెను.

ఆయన వాక్యముగా నున్నాడు. ఆయన వాక్యముగా లేడా? ఆయన వాక్యముగా నుండును ఎన్నడు మారడు. ఈ రాత్రి వాక్యము,''ఆయన నిన్న నేడు, నిరంతరము ఏకరీతిగా యున్నాడని,'' చెప్పుటను ఇప్పుడు మీరు వినుట లేదా. నేనే భయపడకుడి.

మన తలలు వంచెదము.

MATT 13:47

 

62పరలోకపు తండ్రీ, సాయంకాలము చాలా వేడిగా నున్నది. ఘఢియలు చాలా అంధకారముగా యున్నవి, మరియు ఆ బలిపీఠము యొద్ద నుండి ఏ విధముగా అగ్ని వెళ్ళిపోయినది. మీరు పొలమునందు పరిగను ఏరుకొనుచున్నారు. మీరు చెప్పిరి, "పరలోకరాజ్యము ఒక మనుష్యుడు ఒక వలను తీసికొని మరి సముద్రము లోనికి వెళ్లి మరి దానిలోనికి విసిరి దానిని బయటికి లాగినట్టున్నది. రాజ్యము ఆ విధముగా నున్నది."

ప్రభువైన దేవుడా, ఒక దినమున ఆ నీళ్ళలో చివరి చేప… మీరు చెప్పిన విధముగా, "వారు ప్రతివిధమైన వాటిని బయటికి తీసియున్నారు." ఆ సువార్త వల సమస్త విధమైన వాటిని పట్టెను. అది తాబేల్లను, గాజా రొయ్య అను రకపు చేపలను, సాలె పురుగులను, పాములు, తొట్టిలో నుండు చేపలను పట్టును. ఆ వల దేనిని పట్టునో మనకు తెలియదు, అయితే మీరు వెదకు ఏదో చేప అక్కడ యున్నది. మీరు ఒక్కరే ఆ న్యాయాధిపతి. అయితే తాబేలు, గాజు రొయ్య రకపు చేప మరి అవన్నియును తిరిగి రొంపిలోనికి వెళ్లిపోవును, నీళ్ల లోనికి తిరిగి వెళ్ళిపోవును.

అయితే ఒక దినమున రావలయునని ముందుగా నిర్ణయింపబడిన ఆ చివరి చేప, ఆ శరీరపు చివరి భాగము ఆ నదినుండి బయటికి లాగబడును.

JOHN 4:19

 

63లూథరు, మరియు వెస్లీ, అలెగ్జాండరు కేంప్బెల్, జాన్ స్మిత్, కాల్విన్, నాక్స్, ఫిన్సీ, సాంకీ మరియు ఆ విధమైన వారి దినములలో మీరు ఒక వలను విసిరి వెంతెకోస్థు కాలమున, ఎఫ్,.ఎఫ్. బోస్వార్డ్ మరియు ఫ్రాక్ మాన్, ఆ గొప్పవ్యక్తుల దినమును కూడా వలను వేసితివి. బిల్లీ సన్ డే దినములలో కూడా మీరు ఆ కాలమున వలను విసిరియున్నారు.

మరిప్పుడు మీరింకా సముద్రము గుండా వెదకుచున్నారు.

ప్రభువా, ఈ రాత్రి వారిలో ఒకరు ఇక్కడ కూర్చొనియున్నారా? ఆ విధముగా ఇక్కడున్న యెడల, ఆ బావి యొద్దనున్న ఆ చిన్న స్త్రీ వలె వారుండనిమ్ము. ఆమె తన వ్యభిచార స్థితియందును, మీరు మెస్సీయయని గుర్తించెను. ఆమె ఆ సూచనను చూచెను. దానిలోనున్న కార్యమదియే. ఆమె చెప్పెను, "నీవు ప్రవక్తవని గ్రహించుచున్నాను." అది మెస్సీయయని ఆమెకు ఎటువంటి తలంపు కూడా లేకుండెను, ఆమె చెప్పెను, "మేము మెస్సీయ కొరకు ఎదురు చూచుచున్నాము," ఇంకొక మాటలో చెప్పవలయుననిన, "మెస్సీయ వచ్చునని మేమెరుగుదుము, ఆయన వచ్చినప్పుడు మాకు ఈ కార్యములన్నియును చెప్పును." మరి మీరు చెప్పియున్నారు,

"నేనే ఆయననని." అదియే దానిలోనున్న సంగతి.

MATT 14:27•

LUKE 24:32•

HEB 13:8

 

64ఇప్పుడు ఈ రాత్రి, ప్రభువా, వారు దానిని చూడనిమ్ము, ''ఇది నేనే. భయపడకుము. ఇది నా యొక్క వాగ్ధానము.'' వ్యాధిగ్రస్తులను స్వస్థపరచుము, ప్రభువా, తప్పిపోయిన వారిని రక్షించుము, ఖాళీగానున్న వారిని నింపుము.

ఎమ్మాయు నుండి వచ్చినవారివలె మేము కూడా ఈ రాత్రి తిరిగి వెళ్ళుచున్నప్పుడు, ''ఆయన యొక్క దైవిక ప్రసన్నతలో ఆయన మాకు ఈ భవనములో వాక్యము నందించుచుండగా మా హృదయములలో మండుచుందా లేదా యని మా హృదయములలో చెప్పుకొననిమ్ము.'' అది మీరని వారికెట్లు తెలియును, వారు మిమ్ములను లోనికి ఆహ్వానించగా వారి కండ్లు తెరువబడెను, ఈ రాత్రి మాలోనున్న ప్రతియొక్కరును మిమ్మలను లోనికి ఆహ్వానించెదరు. దానిని గురించి మాకు అర్ధము కాకున్నను ఫరవాలేదు, మేము మిమ్ములను ఏ విధముగానైనను లోనికి ఆహ్వానింపనిమ్ము, అది ఒక్కటియే మీరు మిమ్ములను ప్రత్యకపరచుకొను ఒకే మార్గము.

మీరు సిలువలో వేయబడకముందు మీరేమి చేసియున్నారో మరి అదే విధముగా మీరు మిమ్ములను మీరు పునరుత్థానమునకు పిదప చేసికొని యుండుట మేము గమనించి యున్నాము, సిలువకు ముందు చేసినట్టే లేచిన పిదప చేసియున్నారు, ఇప్పుడు ఈ రాత్రి రమ్ము ప్రభువా, ''నిన్న, నేడు, నిరంతరము మారక ఏకరీతిగా నున్నానని,'' మీరు చెప్పియున్నారు. భూమిపైన మీరు శరీరములోనున్నప్పటి దినములలో మీరేమి చేసియున్నారో మరి అదే విధముగా మాకు మరల చేయుము, వారివలె తేలికైన హృదయముతో మేము ఇండ్లకు వెళ్ళెదము. యేసు నామమున మేము ప్రార్థించుచున్నాము. ఆమేన్.

ACTS 10:26

 

65ఇప్పుడు ఈ రాత్రి ఆరాధనలో ఇక్కడ చాలా ఉష్ణముగా యున్నదని నాకు తెలియును, సరైన సమయములో మనము బయటికి వెళ్ళుటకు మనకింకా ఇరువది నిమిషములను కలిగియున్నాము. నేను… నేను చేయు కార్యములను నేను నిలుపుటయో లేక వాటికి అడ్డముగా నుండుటయో నేను చేయను. నేను ఏదో ఒక కార్యము వలన నడిపింపబడుచున్నాను, నేనెల్లప్పుడును ఆ విధముగా నడిపింపబడుచున్నాను, నా జీవితమంతయూ నేను నడచుట సరియని నిరూపింపబడుచుండెను. అది బైబిలులో నున్న కార్యములను తప్పనిచ్చి మరి దేనిని నాకు చెప్పలేదు. దానిని నేను నిలుపలేను. దానిని గురించి నేను ఏమియూ చేయలేను. ఏది ఏమైనను, ఏదో విధముగా అది చేయుచున్నది. నేను నిశ్చయత కలిగియున్నాను.

మరియు నేను విధేయుడనైతే అది తప్పదు, అది అవసరమైన వారు ఒకరున్నారు. నేను నమ్మకస్థుడుగాయుందును. మరియు ఆ దినమున, మహనీయుడైన పరిశుద్ధ పౌలు చెప్పినట్టు, ''ఏ మనుష్యుని యొక్క రక్తమును నా చేతిపై లేదు.'' హు-ఊహ్, నేను మీకు సత్యమునే చెప్పగోరుచున్నాను, ఏదో నేను… నేను మిమ్ములను ప్రేమించుచున్నాను.

REV 3:19

 

66మరియు మీకు గనుక ఒక చిన్నబాలుడు యున్నయెడల — స్త్రీ ఇప్పుడు దానిని గురించి ఆలోచింపుము, కొద్దిసేపటికి ముందు నేను గద్దించిన ఆ స్త్రీ, వెంట్రుకలు కత్తిరించుకొని మరియు ఆ విధమైన కార్యములతోనున్న సహోదరిలైన మీరు. మీకు గనుక ఒక చిన్న బాలుడుయున్న యెడల అతను వీధిలో బయట కూర్చొనియున్న యెడల మరియు మీరు చెప్పెదరు, ''ప్రియమైన చిన్నవాడా, నీవు లోనికి వచ్చుట మంచిది, ప్రియమైన వాడా. అక్కడ బయట ఒకవేళ కారు నీపై నడిపించవచ్చును, నాకు తెలియదు, ''మీరు ఆ బిడ్డను ప్రేమింప లేదు. అది నిజము. మీరు బయటికి వెళ్లి మరి వాని తోలువలచి వాడిని లోపలికి వచ్చునట్లుగా చేయుదురు. అది నిజము. మీరు అతనిని ప్రేమించుచున్నారు. సువార్త కూడా మరి ఆ విధముగానే యున్నది. దేవుడు మిమ్ములను ప్రేమించుచున్నాడు. ''మరియు ఆయన ప్రేమించువారిని, ఆయన దండించుచు మరియు గద్దించుచు ఆయన యొద్దకు వచ్చువారిని, ఆ విధముగా చేయుచున్నాడు.'' మీరు గనుక శిక్షకు లోబడకపోయినట్లైతే, మీరు దూరముగా వెళ్ళిపోయి కోపపడినట్లైతే, మీరు దుర్భీజకులుగా యుందురు, మీరు దేవుని బిడ్డలు కారు. కావున దానిని గుర్తుంచుకొనుడి, అది లేఖనముగా యున్నది.

ఇప్పుడు ఆయనయొద్ద నుండి ఒక మాట, నేను పదిలక్షల సార్లు చెప్పుట కన్నను ఆయన యొక్క ఒక్క మాటలో ఎంతో అర్ధము గలదు. అది ఆయనే. ఆయన యొక్క వాగ్ధానమును మనము ఎరిగియున్నాము. ఆయన ఏమి చేయునని వాగ్ధానము చేసియున్నాడో మనము ఎరిగియున్నాము.

ఇప్పుడు నాకు తెలియదు మనము … నుండి మనము …

67(అతను మరల అట్టలను ఇచ్చియున్నాడా? ఈ దినమున అట్టలను మీరు ఇచ్చియున్నారా? అదేమిటి? జె? అది సరి.) సరి, కాలమును వృధాపరచక మనము ఒకటవ సంఖ్యనుండి మొదలు పెట్టెదము. ఇప్పుడు బహుశా, వారందరూ భవనములో యుండి వుంటారు. జె. మొదటి సంఖ్య. మరిప్పుడు చెదిరిపోయినవి ఇచ్చట మనయొద్ద యున్నవి. మనము ఒకసారి ఈ విధముగా దీనినుండి ప్రారంభించితిమి మరల ముందుకు వెనుకకు వెళ్ళాము. మరియు చుట్టూ అయితే అవి చెదిరిపోయినట్లుగానే యున్నది. అయితే లోపలికి వచ్చిన ప్రతివారికి, ప్రతి దినమునను వరుస యొద్దకు వచ్చుటకు ఒక అవకాశము కలదు.

మీరు ఇక్కడున్నందువలన కాదు దాని ప్రభావము…

68ఇక్కడ ఈ ప్రార్థనా వరుసలో స్వస్థతనొందిన వారెందరో వారికి రెండింతలుగా బయట నున్న శ్రోతలలోనున్న వారు ఈ కూటములో స్వస్థత నొంది యున్నారని ఎందరికి తెలియును? నిశ్చయముగా మీరు ఎరిగియున్నారు.

చూడుడి, ఒక ప్రార్థనా అట్ట జనులను ఇచ్చటికి తీసికొని వచ్చుటకు మాత్రమే, పరిపద్ధాత్మను వారి మధ్యలోనికి తీసికొని వచ్చుటకును, ఏలయనగా మీరు ఆ విధముగా చేయుటకు అలవాటు పడియున్నారు. ఇప్పుడు మనము దానిని ఆ విధముగా చేయనక్కర లేదు. మనము ప్రార్ధనా అట్టలను వదలివేయవచ్చును. గత రాత్రి మనము చేసిన విధముగా, గత రాత్రి మనము ప్రార్ధనా అట్టలను కలిగియుండ లేదు. ప్రార్థనా అట్టలు లేని వారి మధ్య పరిశుద్ధాత్మ వెళ్లినది. నేను దానిని గురించి చెప్పని అనేక కార్యములను నేను చూచియున్నాను, ఏలయనగా అది ఆ విధముగా నుండునా లేదాయని కూడా నాకు తెలియదు. ఇంకను వారిపై నల్లగాయున్నది, మరి నేను దానిని అట్టే వదిలివేసి యున్నాను. నాకు తెలియదు. వారిని పిలుచుట వలన ఏ ప్రయోజనము ఉండదు. ఆయన ఏమి చెప్పినను అది సరియే, కావున ఆయన ఏమి చెప్పునో వినండి.

69ఇప్పుడు… (మీరు అది జె యని చెప్పియున్నారా? జె, మొదటి సంఖ్య), జె, మొదటి సంఖ్య, ఎవరియొద్ద ప్రార్థనా అట్టయున్నదో మీ చేతిని పైకెత్తుడి. (మీరు పొరపడియుందురు, కుమారుడా.) ఓ, నన్ను క్షమించండి. ఓ, వెనుక గోడకు ఆనుకొని యున్నవారు. స్త్రీ పైకి ఇచ్చటికి రమ్ము, ఇప్పుడు వారు ఈ అట్టలను తీసికొని వచ్చుచున్నారు క్రిందికి, బాలుడా, సహోదరుడు బార్డర్స్ లేక బిల్లీ, ఎవరో ఒకరు కొన్ని సమయములలో ఇరువురును మీకు ముందుగా ఆ అట్టలను కలిపివేసి మరి మీకు మీ అట్టలను మీరు కోరు వాటిని ఇచ్చెదరు. మాకు తెలియదు అవి కేవలము, ఇది బహశా సంఖ్యగా నుండవచ్చును. మరి అది ఏడవ సంఖ్యగా నుండవచ్చును, ఇది పదునయిదవ సంఖ్యగా, మరది తొంబది-ఐదు మరి మాకు ఏ సంఖ్యయని తెలియదు.

మరటు పిదప నేను వచ్చినప్పుడు నా హృదయములో ఏది తోచినయెడల నేను అక్కడినుండి పిలిచెదను, అది ఎక్కడున్నను అక్కర లేదు. నేను ఊరక… నేను గనుక చెప్పినయెడల… కొన్ని సమయములలో ఒక వరుసలో ఎన్ని యుండునని నేను లెక్కించెదను మరి దానిని ఈ వరుసలోనున్న వాటితో భాగించి మరి బదులు పొందెదను, చూశారా. మరటు పిదప నేను ఆ విధముగా చేయకున్న యెడల, నేను కేవలము. మొదట నా మనస్సులో ఏమి వచ్చునో, నేను దానిని పిలిచెదను.

70ఒకటవ సంఖ్య, జె. రెండవ సంఖ్య. రెండవ సంఖ్య, "మూడవ సంఖ్య, నాలుగవ సంఖ్య, ఐదవ సంఖ్య, ఆరవ సంఖ్య, ఏడు, ఎనిమిది, తొమ్మిది, పది, వారురండి, చూశారా. ఒకటి, రెండు, మూడు, నాలుగు, ఐదు, ఆరు, ఏడు, ఎనిమిది, తొమ్మిది, పది. అది మంచిది. ఆ విధముగా, నేరుగా రండి. ఉండుడి, ఒకరు ఇంకొక మార్గము గుండావెళ్లియున్నారు. నేను . ఒకటి, రెండు, మూడు,నాలుగు, ఐదు, ఆరు,ఏడు, ఎనిమిది, తొమ్మిది,అది సరియే, ఇప్పుడు, ఇక్కడ,ఇదిగో ఇక్కడ యున్నది, పది. సరి. పదునొకండు, పండ్రెండు, పదుమూడు, పదునాలుగు, పదనయిదు, మరింకను ఐదు. ఒకటి, రెండు, మూడు, నాలుగు, ఐదు, మంచిది, అది మంచిది. పదహారు, పదిహేడు, పదునెనిమిది, పంతొమ్మిది, ఇరవై ఒకటి, రెండు, మూడు, నాలుగు. నేను నలుగురిని మాత్రమే చూచుచున్నాను. ఇరువది, ఇరువది బదులిచ్చారా? అది సరి.

ఇప్పుడు ఒకేసారి అనేకులు ఇక్కడ నిలుచుకొని యుండుటను మేము కోరుటలేదు. ఇప్పుడు మనము గనుక వీరికొరకు ప్రార్ధి౦చిన పిదప మరి సమయమున్న యెడల మనము ఇంకొందరిని పిలిచెదము. మనము పిలువము… ఒకవేళ మనము … మనము ఇంకొందరిని పిలిచెదము, మనము ఐదుమందిని పిలిచెదము, చాలు ఇరువది ఒకటి నుండి ఇరువది ఐదు మీరు గనుక లేచి నిలువగలిగిన యెడల నిలబడండి. ఒకటి, రెండు, మూడు, అక్కడ వెనుక నాలుగు, ఒకటి, రెండు, మూడు, నాలుగు ఐదు, సరి, మనమిక్కడ నిలిపెదము. అక్కడ ఇరువది ఐదుగురు వరుసలో యున్నారు మరి వారు, ఇక్కడ వరుసగా నిలబడుకొని యున్నారు.

71ఇప్పుడు, నేను ఒకటి మీ నుండి కోరుచున్నాను. మీరు మీ యొక్క ఏకాగ్రత . దేవుని యెడల మీరు మీ యొక్క ఏకాగ్రతను రాబోవు పదునయిదు, పదహారు నిమిషములకు యుంచుడి. మీరు దానిని చేసెదరా? మరియు మీరు దీనిని చేయుచుండగా మీ హృదయములను తెరచెదరా? ఇప్పుడు నేను ఏమి చెప్పియున్నానని గుర్తుంచుకొనుడి. పాత సామెత చెప్పినట్టు, ఒక బాతు వెనుకాల నీళ్ళలో పడి పోతున్నట్లుగా అది మీ వెనుక వృధాగా పోనియ్యకుడి. దానిని చేయకుడి. దీనిని ఆలోచించుడి.

లేఖనములలో లేని కార్యమును నేను చెప్పినయెడల మరియు ఈ ఘడికైన వాగ్దానమును నేను చెప్పనియెడల మీరు ఇక్కడున్న మేనేజరును చూచి మరి దానిని గురించి నాకు చెప్ప౦డి. అది సత్యము. నేను వాక్యములోనున్నది తప్పనిచ్చి, మరి దేనిని బోధింపలేదు. మరియు నేను ఆ వాక్యముతో సవ్యముగా నిలిచియుండిన యెడల మరియు అదియే మార్గమని నేను చెప్పినయెడల, మరియు దేవుడు. అది బైబిలులో యున్నది. ప్రభువు యొక్క దూత బైబిలులో లేని కార్యమును నాకు చెప్పిన యెడల, అది ప్రభువు యొక్క దూత కాదు. అది నిజము. ఆయన ఆ వాక్యములో నున్నది తప్పనిచ్చి నాకు వేరే ఏమియు చెప్పలేదు, దానికి మీరు సాక్ష్యులుగా యున్నారు, (ప్రపంచములోనున్న భాషలలో), ఆయన చెప్పిన వందల కొలది మరియు వేలకొలది కార్యములలో ఎప్పుడైనను ఒక్కసారైనను తప్పుడు కార్యమును చెప్పియుండలేదు లేక నెరవేరని ఏ కార్యమును చెప్పియుండలేదు.

72వినండి. మేనేజరును మరియు ఇక్కడున్న వారిని అడుగుడి.

ఇక్కడ మీరు చూచునదంతా చాలా కొద్ది మాత్రమే. అది సరియేనా సహోదరులారా? అక్కడ మరియు మీ యొక్క వ్యక్తిగత జీవితములో ఆయన ఇట్లు చెప్పుట, ''ఈ స్థలమునకు వెళ్ళండి, మరియు దీనిని చూడుడి. మరియు ఇది నెరవేరును. మరియు ఇక్కడ అక్కడ జరుగునని చెప్పును.'' ప్రతి సంవత్సరమును ఎల్లప్పుడూ ఆ విధముగా జరుగుచున్నది. శ్రోతలలో చిన్న కార్యములను చూచియున్నారు.

అయితే మీరు గనుక ఇప్పుడు భయ భక్తులతో నున్నయెడల. ఇప్పుడు ఇక్కడ ప్రార్ధనా వరుసలో నిలుచుకొనియున్న ప్రతి యొక్కరును నాకు అపరిచితులా? మీరు గనుక అపరిచితులైన యెడల మీ చేతులను పైకెత్తుడి. అది సరి. మిమ్ములను గురించి నాకు ఏమియు తెలియదని ఇక్కడున్న ఎందరికి తెలియును? మీ చేతిని పైకెత్తుడి. ఇప్పుడు, మీకు వందనములు. మీరెక్కడున్నను నాకు అక్కర లేదు, మీరు గనుక బాల్కనీలో యున్నయెడల, గోడకు ఆనుకొని నిలుచుకొనియున్న యెడల, ఇక్కడ క్రింద నిలుచుకొనియున్న యెడల, మీరు ఎక్కడున్నను నేను… ఇప్పుడు ఇది మీ మంచికే. ఇది మీయొక్క మేలుకొరకే. చూడుడి, ఇది మీయొక్క మేలు కొరకే.

73అప్పుడు నాతో మాటలాడినది నా యొక్క చిన్న మనమడుయని నేను తలంచాను అయితే కాదు. ఈ రాత్రి నా యొక్క చిన్న మనుమడు ఇక్కడెక్కడో యున్నాడు, అతను అంత ఎత్తులో యుండును మరియు నేను అది చిన్న పౌలు అని తలంచుచున్నాను. అతను నా కొరకు వచ్చి మరియు అక్కడ వేదికపై నా కొరకు ప్రసంగించునని ఎల్లప్పుడును చెప్పును మరియు అతడికి ఇంకా రెండు సంవత్సరములు కూడా నిండలేదు. ఆ చిన్న బాలుడు తన తల్లిని వెదకుచున్నాడని నేను తలంచుచున్నాను.

కావున గుర్తుంచుకొనుడి, నేను మీకు సహాయము చేయుటకు ప్రయత్నించుచున్నాను. నేను… దేవుడు దానిని ఎరిగియున్నాడు. నేను మీకు సహాయము చేయుటకు ప్రయత్నము చేయుచున్నాను, చూశారా. ఇప్పుడు గమనించండి, ఆయన గనుక మనమధ్య వచ్చినయెడల మీరు ఆ మేలును పొందవలయునని కోరుచున్నాను. ఇప్పుడు దానిని గురించి ఆలోచించుడి, ఆయన చివరి దినములలో చేసెదనని వాగ్ధానము చేసినట్లు యేసు క్రీస్తుయను వ్యక్తి శరీరములో క్రియ చేయుచున్నాడు. ఆ విధముగా వాగ్ధానము చేసినాడని ఎందరికి తెలియును? అక్కడ సోదొమలో చేసిన విధముగా దూత తన వెనుక భాగమును త్రిప్పుకొని మరియు… అది దేవుడు. అది దేవుడని మీరు నమ్ముచున్నారా? అది దేవుడని ఎందరు నమ్ముచున్నారు? నిశ్చయముగా అది దేవుడే. బైబిలు చెప్పుచున్నది, అది దేవుడని. మరియు ఆయన యేసు దానిని గురించి చెప్పియున్నాడు.

ఇప్పుడు గమనించుడి.

74ఇప్పుడు అక్కడ ప్రార్థనా అట్టలు లేనివారు బయట నున్నవారు, మీరు ఎక్కడున్నను మీరు నా కొరకు ఏదియో చేయవలయునని నేను మిమ్ములను కోరుచున్నాను. ఇప్పుడు గుర్తుంచుకొనుడి, ఈ కార్యములను, మీరు స్వస్థత నొందినారని అది మీకు చెప్పినప్పుడు మీరు గమనించండి లేక అది ఏమి చేయమని చెప్పునో గమనించండి. నేను ఏమి చెప్పుదునో గమనించండి, అది గనుక మీకు చెప్పినయెడల అది మీ విశ్వాసమును పెంచుటకే. మరటు పిమ్మట మీ యొక్క విశ్వాసము ఆ స్థానమునకు వచ్చిన పిదప మీరు దానియొద్దకు వెళ్ళి మరి దేవుని అంగీకరించండి. అది నేను కాదు, ఏలయనగా పరలోకపు తండ్రి ఎరిగియున్నాడు.

ఇక్కడున్న ఈ క్రిందవరుసను నేను చూచుచున్నాను, నేనెరిగిన ఒక్క వ్యక్తిని కూడా నేను చూచుట లేదు. నేను ఎరిగియున్న ఇద్దరు లేక ముగ్గురు వ్యక్తులను తప్పనిచ్చి శ్రోతలలో నేను వేరే ఎవరిని చూచుట లేదు. ఇప్పటి వరకు నాకు తెలియలేదు, నా వలన ఒకరిని చూచి చూపించగలను. ఎడ్మండ్ వే కొద్ది నిమిషములకు మునుపు ఇక్కడ నుండెనని నాకు తెలియును. నేను అతనిని చూచితినని అనుకొనుచున్నాను, మరియు నేను వదిలి వేసితిని …

75నేను గనుక సరైనయెడల, నేను ఎరిగిన ఒకరిని చూచుచున్నాను, ఒక మనుష్యుడు మరియు అతని భార్య, మరియు ఒక చిన్న బాలిక పేరు ఫ్రీజ్జింగర్, ఓహైయో నుండి వచ్చియున్నారు. సహోదరుడు ఫ్రీజ్జీంగర్ అది నీవేనా? అక్కడున్న ఒక చిన్న దారిలో నీవు కూర్చొని యున్నావు. అది ఓహైయో నుండి వచ్చిన నా స్నేహితులైన సహోదరుడు మరియు సహోదరి ఫ్రీజ్ జింగర్. మరియు దానికి బయట వెనుక కూర్చొనియున్న ఒక … ఇక్కడ ఒక ప్రక్కగా నేను తొంబది-రెండు సంవత్సరముల వయస్సు గల విల్లియమ్ డౌ అను వృద్ధుని నేను చూచుచున్నాను. అతను మరియు అతని భార్య. ఆమె ఒక నర్స్ విల్లియమ్ డౌ, ఓహైయోలో నాకు ఒక మంచి వ్యక్తిగత స్నేహితుడు.

సమీప కాలమున తొంబది-ఒకటి సంవత్సరముల వయస్సుగల అతనికి గుండెపోటు వచ్చెను మరియు అతని భార్య నన్ను వెంటనే రమ్మని పిలిచెను, అప్పుడు అతను చనిపోవుచుండెను. మీకు తెలియునా,

76అతను నాకు ఆప్త మిత్రుడు. నేను అతనిని చూచుటకు వెళ్ళచుండగా నేను చాలా దిగులుపడ్డాను. మరియు నా యొక్క కారు చక్రములలో ఒకటి ఊడిపోయి బయటికి వచ్చి మరి వైరును కోయుచుండెను మరి నేను టెక్సాకోస్టేషన్ కు వెళ్లి దానిని సరిచేసి మరి పెట్రోలు పోసుకొని వచ్చుచుండగా మరి వారు బయటికి వచ్చుచుండిరి, వారు దానివైపు చూచారు. మరియు నేను పైకి చూశాను, మరి సహోదరుడు డౌ నా చర్చిలో నుండి నడచి వచ్చుచుండుటను మరియు అతను నాతో కరచాలనము చేయుటను చూశాను. నేను "దేవునికి స్తోత్రములు," అని చెప్పాను. మరియు నేను ఈ మార్గము ద్వారా చూడగా, మరి అతను వీధి గుండా వచ్చుచుండెను మరియు నాతో కరచాలనము చేయుచుండెను. నేను అతని యొద్దకు వెళ్లాను.

నేను అతని యొక్క వైద్యుని చూశాను, ఒక యవ్వన యూదుడు లేక అతను మధ్య-వయస్కుడుగా నుండవచ్చును, యూదుడు. మరియు నేను అడిగాను, ''అతనిని గురించి ఏమిటి డాక్టరు?''

చెప్పెను, ''అతను జీవించుటకై పోరాడుటకు శక్తి కూడా లేదు,'' అని చెప్పెను. ''అతను ఆక్సిజను గుడారము క్రింద నున్నాడు. ''చెప్పెను, "అతను అక్కడే చనిపోవును." అతను చెప్పెను, ''గుర్తుంచుకొనుడి, అతను తొంబది-ఒక్క సంవత్సరముల వయస్సుగలవాడు.''

నేను చెప్పాను, "అవునయ్యా."

ఆ వైద్యుడు చెప్పెను, "అది పరిపూర్ణ గుండెపోటు, ఏమి చేయుటకు వీలు లేదు." చెప్పెను, ''ఇది చనిపోవుటకు సమయము.''

మరియు నేను చెప్పాను, ''అవునయ్యా. (అయితే అతను చనిపోవుట లేదు. అంతే.'')

నేను లోనికి వెళ్లాను, నా చేతిని ఆ గుడారము క్రింద నుంచాను. నేను అడిగాను, సహోదరుడు డౌ, నీకు నా మాట వినబడుచున్నదా? "అతను పైకి నా వైపుకు చూచెను. ఇప్పుడు వాస్తవముగా అతను ఒక జర్మను దేశస్టుడు, అతని పేరులో డౌ హు అని యున్నది, మరి నేను దానిని డౌ యని ఉచ్చరించియున్నాను, చూడుడి. మరియు నేను - మరి నా చేతిని గుడారము క్రింద నుంచాను, మరియు నేను అడిగాను, ''సహోదరుడు డౌ నీకు వినబడుచున్నదా?"

అతను చెప్పెను, ''అవును.''

నేను చెప్పాను, "నీవు చనిపోవుట లేదు. నీవు బ్రతికియుండుట నేను చూచియున్నాను.''

77అప్పటి నుండి ఒక వారమునకు నేను నా చర్చిలో నిలబడుకొని యుండగా, అచ్చటకు నడిచి వచ్చినది వేరే ఎవరో కాదు మరి సహోదరుడు డౌ! నేను కూటమును విడిచి మరి నదియొద్దనున్న హోటలుకు భుజించుటకు వెల్లెను, మరి నేను కారునుండి బయటికి వచ్చి వీధిగుండా నడచి వచ్చుచుండగా ఆక్కడ సహోదరుడు డౌ తన చేతిని బయట నుంచుకొని వచ్చెను. ఆ దర్శనములు ఎన్నడును తప్పిపోవు. మరియు ఆ వ్యక్తి తొంబది-ఒకటి సంవత్సరముల వయస్సుగలవాడై "కాలిఫోర్నియాలో జరుగు ప్రతి కూటమునకు వచ్చుచుండెను. ఇప్పుడిక్కడ ఎటువంటి ఒక నిజమైన వీరుడు యున్నాడని జనులు చూచునట్టుగా, అక్కడ కూర్చొనియున్న సహోదరుడు డౌ మీ చేతిని మీరు ఎత్తగలరా, ప్రతియొక్క కూటమునకు వెళ్ళ తొంభై-ఒకటి సంవత్సరముల వయస్సు గల అతడు ఇక్కడ కూర్చొనియున్నాడు. నేను గుడారములో ప్రసంగించునప్పుడు, నేను ప్రసంగించు ఆ చిన్న ప్రసంగమును వినుటకు అతను ప్రతి దినమును వందలకొలది మైళ్ళ కారు నడుపుకొనుచు వచ్చెడివాడు, తిరిగి వెళ్లిపోయెడివాడు. దేవుడు, "అది సాయంకాల సమయమున వెలుగుండును."

నేను ఆ దినమున అతనితో మాటలాడుచుండగా, నేను అతనిని అడిగాను, ''సహోదరుడు డౌ, నేను మీకు ఏమి చేయగలను?''

''ఒక చిన్న విన్నపము, సహోదరుడా బ్రెన్హాం. ఆయన వచ్చినప్పుడు, నేను ఆయనతో వెళ్ళిపోవాలన్నదే నా ఆశ.''

చెప్పితిని,"చింతింప వద్దు. అది నీ కొరకు భద్రపరచినది. నిశ్చయము."

ఇప్పుడు, ఆ మనుష్యుడు లోపలికి వచ్చియున్నాడు, బాప్తిస్మము పొందియున్నాడు… లోనికి వచ్చి మరి పరిశుద్ధాత్మ యొక్క బాప్తిస్మమును పొందుడి మరియు సమస్తమును, ఒక అద్భుతమైన క్రీస్తుయొక్క సేవకుడు.

JOHN 14:12•

HEB 4:15•

HEB 13:8

 

78ఇప్పుడు మీరందరును నిజముగా భయభక్తులతో నుండవలయునని నేను మిమ్ములను అడుగబోవుచున్నాను, మీరు ఈ విధముగా చూచి మరి ప్రార్థించుడి. ఇప్పుడు మన యొక్క బలహీనతలను గురించి వ్యాజ్యమాడు ప్రధాన యాజకుడు ఆయనే యనుటను ఇక్కడయున్న ఎందరు బోధకులు సరిగా ఎరిగి యున్నారు? మంచిది, ఆయన గనుక నిన్న, నేడు, మరియు నిరంతరము ఏకరీతిగా యున్నయెడల మరియు అదే మారని ప్రధాన యాజకునిగా యున్నయెడల, ఆయన అదే విధముగా వ్యవహరించును. ఆయన మాత్రమే, ఆయన యొక్క శరీరము… దేవుని యొక్క సింహాసనముపైనున్నది. ఎందిరికి అది తెలియును? యేసు యొక్క శరీరము దేవుని సింహాసనముపై నున్నది. అయితే ఆయన వాగ్ధానము చేసినట్లు ఆయన మన శరీరములను ఆయన ప్రత్యక్తపరచుటకొరకై ఉపయోగించుకొనును. ''నేను చేయు క్రియలు మీరు కూడా చేసెదరు.''

మీరు నిశ్శబ్దముగా భయభక్తులతో నుండి, కనిపెట్టుకొనియుండి, మరి ప్రార్ధింపవలయునని నేను మిమ్ములను అడుగుచున్నాను.

MATT 14:27

 

79మా పరలోకపు తండ్రీ, దానిని గురించి నేను ఎంతటి భయభక్తులతో నుండవలయునని ఎరిగియున్నానో, మరి ఆ విధముగా నుండుటకు ప్రయత్నించియున్నాను. ఇప్పుడు, మీ నుండి ఒక మాట చాలును ప్రభువా, మరటు పిమ్మట ఆ నిమ్మళమైన స్వరము ఈ శ్రోతల ద్వారా వచ్చి మరి, ''నేనే భయపడకుడి,'' అని చెప్పనిమ్ము. తండ్రీ, దానిని అనుగ్రహించుము. ఈ రాత్రి ప్రసంగించిన వర్తమానముతో నన్నునేను మీకు సమర్పించుకొనుచున్నాను, మీ వాక్యముతో దానిని దృఢపరచుము, మీరు దానిని చేయనక్కర లేదు. అయినను మీరు దానిని చేసెదరు లేక దానిని మీరు చేసెదరు, ఏలయనగా మీరు చేసెదరని వాగ్ధానము చేసియున్నారు. దీనిని యేసు నామములో మీరు అనుగ్రహించెదరని నేను ప్రార్ధించుచున్నాను. ఆమేన్.

80మరియు ప్రతియొక్కరును నిజముగా భయభక్తులతో, నుండుడి. మీరు ఎట్లున్నారు? మనము ముందుకు కొనసాగుచుండగా నేను మీకు లేఖనములను ఇచ్చెదను. దేవుడు గనుక చేసినయెడల, నాకు తెలియదు. అయితే నేను ఆ విధముగా ప్రసంగించుచున్నాను… చూశారా, అది ఒక విధమైన అభిషేకము; ఇది ఇంకొక విధమైన అభిషేకము. అది కేవలము ఆశీర్వాదము మాత్రమే. ఇది, ఒక కార్యము మీలోనున్న జీవమును తీసివేయును.

81ఇప్పుడు ఇక్కడ స్త్రీ నిలబడుకొనియున్నది. ఆమెను నా జీవితములో నేనెన్నడూ చూడలేదు. మనము అపరిచుతులమా? నేను నిన్ను ఎరుగనని కొద్దిసేపటికి ముందే నీవు చెప్పియున్నావని నేను నమ్ముచున్నాను. దేవుడు నిన్ను ఎరిగియున్నాడు. ఆయన నన్ను కూడా ఎరిగియున్నాడు. ఇప్పుడిక్కడ ఎందుకొరకు మనము నిలుచుకొనియున్నామో న్యాయతీర్పు దినమున మనము దానికి లెక్క అప్పజెప్పవలయునని మీకు తెలియునా? నీకు అది తెలియునా? ఇప్పుడు మనము ఏమి చేయుచున్నామో పైన అచ్చట దానికొరకు మనము లెక్క అప్పజెప్పునట్లుగా దేవుడు చేయును, మీరు దానిని ఎరిగియున్నారా? నేను దానిని ఒక ఉద్దేశ్యమునకై ఇప్పుడు చెప్పియున్నాను. ఇప్పుడు ప్రభువైన యేసు మీరేమి చేయుచున్నారనియు, మీ యొక్క మనస్సులో ఏమున్నదని లేక ఆ విధమైన కార్యము నాకు బయలుపరచిన యెడల దానిని మీరు నమ్మెదరా? మీరు దానిని నమ్మవలయును, మీరు నమ్మెదరా? అక్కడున్న శ్రోతలైన మీరు దానిని నమ్మెదరా?

JOHN 4:18

 

82ఇప్పుడు బావియొద్ద నిలుచుకొనిన స్త్రీ వలె, ఖచ్చితముగా మనము ఆ విధముగా నిలబడియున్నాము, మరియు మన ప్రభువు, ఒక మనుష్యుడు మరియు ఒక స్త్రీ మొదటిసారిగా కలుసుకొనుచున్నారు, చూశారా. ఇక్కడ మనము కలుసుకొనియున్నాము. అది పరిశుద్ద యోహాను 4వ అధ్యాయము. ఇప్పుడు పరిశుద్దాత్మ గనుక ఇట్లు చెప్పినయెడల, నీవు గనుక వేరెవరికొరకో ఇక్కడున్నావు, నీవు గనుక వ్యాధితోనున్న యెడల, కుటుంబ సమస్యలున్న యెడల, ఆర్థిక ఇబ్బందులున్న యెడల, అది ఏమైనను యుండవచ్చును, నాకు దానిని గురించి తెలియదు. అయితే ఆయన చేయును. అయితే ఆయన మీ హృదయములోనున్న తలంపులను వివేచింపగలడు. ఆయన వాక్యముగా నున్నాడు. నేను చేయలేను; నేను ఒక మనుష్యుడినే.

నీవు ఒక విధముగా ఉద్రేకముగా నున్నావు, మరి ఆ కారణము వలననే నేను దీనిని చేయుచున్నాను, మీరు చూడుడి. నీకు గల బాధలలో నరముల బలహీనత ఒకటి. అది నిజమే. మరియు మధుమేహ వ్యాధి గలదు, మరియు ఇంకొక బలహీనత కూడా యున్నది. అది నిజము. అనేక ఇబ్బందులు, అనేక దుష్కార్యములు గలవు. అది సరియేనా? అది గనుక సరైనయెడల, నీ చేతిని వైకెత్తుము. ఆయన నిన్ను స్వస్థపరచునని నీవు నమ్ముచున్నావా? నీవు నమ్ముచున్నావా? ఇప్పుడు నీ యొక్క వయస్సు వలన నీకు నరముల బలహీనత వచ్చియున్నది, చూశారా, అయితే ఇప్పుడు అదంతా నిన్ను విడచి వెళ్లిపోవును.

మరియు మన మందరమును కల్వరికి వెళ్ళి ఒక రక్తమార్పిడిని పొందబోవుచున్నామని నేను విశ్వాసము ద్వారా నమ్ముచున్నాను.

JOHN 4:18

 

83ఇప్పుడు చేసిన కార్యము ఖచ్చితముగా అదియే. బావియొద్ద ఆమె యొక్క సమస్య ఏమిటని ఆయన ఆ స్త్రీతో చెప్పెను. ఆమెకు అనేక భర్తలుండిరి. మీది ఏమిటి… నరముల బలహీనతయని నేను తలంచుచున్నాను, మరియు నీకు రెండు లేక మూడు సరికాని కార్యములున్నవని నేను తలంచుచున్నాను. అవును, అటువంటి విషయములే.

ఇపుడు, ఆయన సీమోను యొద్దకు వచ్చినప్పుడు, అతనెవరని ఆయన చెప్పెను. నీ పేరేమిటని దేవుడు నాకు చెప్పునని నీవు నమ్ముచున్నావా? ఆ విధముగా చేసిన అది నీవు ఇంకా ఎక్కువగా నమ్మునట్లుగా చేయనా? అది చేయనా? శ్రీమతి స్ట్రాంగ్. స్థావ్ట్, నీవు నమ్మెదవా? పోయి మరి నమ్ముము, మరి నీవు… సమస్తము బాగైయున్నది. ఆమేన్.

84రమ్ము. నీవు నమ్ముచున్నావా? నేను కూడా నీకు అపరిచితుడిని. నాకు నీవు తెలియదు. దేవునికి నిన్ను తెలియును. నీ యొక్క సమస్య ఏమని ఆయన నాకు బయలుపరచునని నీవు నమ్ముచున్నావా? మరియు ఆయన ఆ విధముగా చేసిన యెడల, అప్పుడు ప్రభువైన దేవుడు ఆశీర్వదింపబడును. అది నిజమేనా? ఇప్పుడు చింతింపనక్కర లేదు, చూడుడి, అది ఆయనే, దానిని నీవు స్పర్శించుచున్నావు. అది మంచిది. నీవు నరముల బలహీనతలో, మతి చలించిన స్థితితో మరియు సులభముగా పరిస్థితులకు బానిసగా మారుచున్నావు, వీటన్నిటితో బాధింపబడుచున్నావు. మరియు నీవు మూత్రాశయము వ్యాధితో, కాలేయములో కూడా కొద్ది జబ్బున్నది, మరియు నీకు కావలసిన రక్తము లేక నీవు బాధపడుచున్నావు. అది సరియే. నీవు ఏదో కలిగియున్నావు . ఒక మనుష్యుడు ఇక్కడ అగపడులాగున అది చేయుచున్నది. దేవుడు నిన్ను స్వస్థపరచునని నీవు నమ్ముచున్నావా? నీ యొక్క భర్తను కూడా స్వస్థపరచును, అతనిని స్వస్థపరచునా? కడుపు నొప్పి దానివలన యుండు బాధ వదలి, అతడు స్వస్థత నొందునని నీవు తలంచుచున్నావా? అతను దానివలననే బాధడుచున్నాడు. పోయి నీ చేతులు అతనిపై నుంచుము మరియు ఆ కడుపు నొప్పి అతనిని వదిలి వేయును.

85నేను నీకు అపరిచితుడిని. ప్రభువైన యేసు మన ఇరువురిని ఎరిగియున్నాడు. ఆయన ఎరిగియున్నాడు కదూ? దేవుడు నిన్ను స్వస్థపరచునని నీవు నమ్ముచున్నావా? నీ హృదయములో ఏమున్నదో ప్రభువైన యేసు నాకు గనుక బయలుపరచినయెడల, ఆయన నిన్ను బాగుచేయునని నీవు నమ్ముచున్నావా? నీకు కొన్ని సమస్యలుండెను. ఒక కార్యము వలన నీకు పిత్తాశయము బాధయుండెను. మరియు ఇంకొక కార్యము, దానివలన నీ మూత్రాశయములో పుండు వచ్చెను, దానినే నీకు వైద్యుడు చెప్పియున్నాడు. ఇప్పుడు ఇంకొక కార్యము ఏమనగా, వారు దానికొరకు శస్త్రచికిత్స చేయవలయునని యుండిరి, అది ఖచ్చితముగా సరియే. అది నిజమేనా? ఇప్పుడు, ఆయన దానంతటిని దాటి నీకు స్వస్థత నియ్యగలడని నీవు నమ్ముచున్నావా? ఆయనయందు నీకు విశ్వాసము యున్నదని నీవు తలంచుచున్నానా? ఇప్పుడు దానిని చేయుట నేను కాదని నీవు ఎరిగియున్నావు. నీవు నమ్ముచున్నావా? అది మంచిది. పొమ్ము, నీవు నమ్మిన ప్రకారము నీకు జరుగును.

86మనము ఒకరికొకరము అపరిచితులము అని నేననుకొనుచున్నాను. ప్రభువైన దేవుడు మన ఇరువురిని ఎరిగియున్నాడు. నీకు సహాయపడగల కార్యములను ఆయన నాకు బయలుపరచగల సామర్ద్యుడని నీవు నమ్ముచున్నావా? నీవు, ఆయన చేయగలడని నమ్ముము. ("వాస్తవము.") నేను చెప్పుచున్నాను "వాస్తవము," అది చాలా మంచిది. అది చాలా బాగున్నది. ఇప్పుడు నీకు అనేక సమస్యలున్నవి, చాలా చిక్కులున్నవి మరియు దగ్గులాంటివి, మరి వాటిని జయించలేకున్నావు. మరియు నీవు చాలా నరముల బలహీనతలో యున్నావు. మరియు అది సరి. పిదప నీ హృదయములో ఒక భారమున్నది మరి ఎవరికో ఒకరికొరకు, అది నీ కుమారుడు. మరియు అతనికి ఒక సమస్య కలదు, ఏదో కుటుంబ సమస్యలు, అతను మరియు అతని భార్య వారు ఎల్లప్పుడును గొడవ గోలలతో మరి కొనసాగుచున్నారు. మరినీకు వారిని గురించి భారము యున్నది. అది సరియే, ఇప్పుడు నీవు నీ హృదయమంతటితో ఆ సమస్యలన్నియును తీరిపోవునని నమ్ముము. ఇప్పుడు నీవు నమ్ముము.

దేవుడు నిన్ను ఆశీర్వదించును.

87అయ్యా మీరెట్లున్నారు? నేను మీకు అన్యున్ని మరియు నీవు నాకు అన్యుడివి, మరియు ఇప్పుడు ఆరంభించియున్నది. ఇప్పుడు దర్శనములు, నేను చూచుచున్నాను, ఇల్లరితయూ వెలుగుతో నిండియనట్లుగా, ఒక సుడిగాలి చుట్టు తిరుగునట్టుగా యున్నది, చూశారా. అయితే అక్కడ నీవు దేనికొరకు నిలుచుకొనియున్నావో దానిని ప్రభువైన యేసు నాకు బయలుపరచునని నీవు నమ్ముచున్నావా? ఆయన చేయగలడని నీవు నమ్ముచున్నావా? దానిని కూడా నేను నమ్ముచున్నాను. నేను నీ యొక్క ఆత్మను పట్టుకొనుటకై మాటలాడుచున్నాను, దానికొరకే నేను చేయుచున్నాను. చూడుడి, నాకు నీవు తెలియదు. కావున నేను తప్ప వేరే ఎవరో దానిని చేయుచున్నారు. ఆయన తనకుతానుగా చేయునట్టుగా నేను పూర్తిగా నాకునేను నా తలంపులకు నా స్వకీయమునకు దూరముగానుండవలయును. మీరు గ్రహించుచున్నారా?

88ఇప్పుడు ఒక కార్యము, నీవు అమితమైన నరముల బలహీనతతో బాధపడుచున్నావు, అది కొంతకాలముగా నీకు యున్నది. అది నిజము. మరియు ఆ నరముల బలహీనత స్థితి మరి దానివలన అది నీకు రక్తపుపోటును కలిగించుచున్నది. మరియు నీకు ఒక గుండెపోటు వచ్చెను. అది నిజము. అదియే దానిలోన్ను కార్యము, నీవు ఒక బోధకుడిగా యుండవలెను లేదా నీవు ఒక బోధకుడిని.

ఇప్పుడు నీవు ఒక బోధకుడివి, వీవు ప్రసంగ వేదికపై నుండుటను నేను చూచుచున్నాను. అదైనయెడల దేవునియందు విశ్వాసముంచుము, మరి ఆ నరముల బలహీనత నిన్ను వదిలిపోవును. వాక్య సేవకులందరు దానిని కలిగియున్నారు. నీవు స్వస్థపరచబడెదవు. నీ యొక్క ప్రసంగవేదిక యొద్దకు తిరిగి పొమ్మ, మరియు దేవునికి లోబడి మరి ఆ వాక్యమైన యేసు క్రీస్తుకు నమ్మకస్తుడుగా నుండుము.

కుర్చీలో కూర్చొనియున్న నీకు నీ వీపు నొప్పి నిన్ను వదిలి వెళ్లినదని నీవు నమ్ముచున్నావా? దానిని నీవు నమ్ముచున్నావా? అది మంచిది, అయ్యా, ''స్తోత్రములు ప్రభువా,'' యని చెప్పుచు ముందుకు సాగిపొమ్ము.

89స్త్రీ, రమ్ము. నీవెట్లున్నావు? నేను ఆయన యొక్క సేవకుడని నీవు నమ్ముచున్నావా? అది మ౦చిది. ఆ స్త్రీల సమస్య, నిన్ను వదిలి పోవునని నీవు నమ్ముచున్నావా? నీవు నమ్ముచున్నావా? అదైన "ప్రభువా, నీకు వందనములు," యని చెప్పుచు ముందుకు సాగిపొమ్ము.

మూత్రపిండముల సమస్య, వీపు వెనుక నొప్పి, బాధ, దానినుండి దేవుడు నిన్ను స్వస్థపరచగలడని నీవు నమ్ముచున్నావా? ఆయన నిన్ను స్వస్థపరచగలడని నీవు నమ్ముచున్నావా? అది సరి. ముందుకు వెళ్ళుము.

స్త్రీ, రమ్ము. నేను నీకు అన్యున్ని. నేను నీకు ఏమి చెప్పకున్నను, వ్యాధిగ్రస్తులను స్వస్థపరచు దేవుని ప్రసన్నత ఇచ్చట యున్నదని నీవు నమ్ముచున్నావా? నీవు నమ్మెదవా? సరి, నీవు నమ్మిన యెడల, నీ కడుపు నొప్పి బాధ… నేను నీకు చెప్పియున్నాను, నీవు చూడుము. అది వెళ్ళిపోయున్నది.

90అయ్యా మీరెట్లున్నారు? దేవుడు హృదయములో నివాసముండును. ఇచ్చట కొంచె౦ కాలముగా నీ హృదయము నీచముగా నున్నదని చూపింపబడుచున్నది, దానిని ఆయన సరి చేయునని నీవు నమ్ముచున్నావా? నీ మార్గమున నీవు పోయి మరి దానిని నమ్ముము, దేవుడు నిన్ను ఆశీర్వదించును. నీవు నమ్ముము; ఆయన దానిని సరిచేయును.

మీకు నరముల బలహీనత యున్నది, అందువలన అది మీకు కడుపు వ్యాధిని కలిగించి మరి కడుపులో పుండు వచ్చెను. మీరు భుజించిన మీకు ఇబ్బంది కలిగించును. ఇప్పుడు అదంతయు పోయినదని మీరు నమ్ముచున్నారా? వెళ్ళి భుజించుటకు ఏదైనను తీసికొనుడి.

మీకు వెన్నెముక నొప్పి ఎంతో బాధను కలిగించుట వలన మీరు లేచుటకు చాలా భ్రమపడుచున్నారు. దానిని మీరు నమ్మినయెడల అది మిమ్ములను ఇకనుండి బాధించదు. మీరు నమ్మెదరా? అది మంచిది. పొమ్ము, మరియు ప్రభువైన యేసు పరిపూర్ణముగా మిమ్ములను స్వస్థపరచును గాక.

నీవెందుకు చాలా భయపడుచున్నావు? "నేను ఇకనుండీ కంపరముగా బలహీనుడిగా నుండను," అని చెప్పుకొనుచు పొమ్ము, మరి నీవు ఇకనుండి ఆ విధముగా నుండవు. వెళ్ళి మరి నమ్ముము. అది మంచిదయ్యా.

91రమ్ము, స్త్రీ, ఇప్పుడు కూషీయురాలైన స్త్రీ మరియు తెల్లని మనుష్యుడు యేసును సంధించిన విధముగా అదే మాదిరి ఖచ్చితముగా నున్నది. దక్షిణ ప్రాంతమున వారికి వేరుపరచబడినట్లుగా అయితే మనకు ఆ విధముగా వేరు పరచుట లేదు. యేసు సమస్త ప్రజలు దేవుని ప్రజలమని తెలిసికొనునట్లుగా చేసెను. ఆమె యూదురాలైనను లేక సమరయురాలైనను అక్కడ ఏ విధమైన బేధము లేదు, చూడుడి, ఇప్పుడు దేవుడు గనుక నీకు సహాయము చేయనియెడల, చాలా త్వరగా, ఆ కీళ్ళ నొప్పి నిన్ను కృంగదీయును. అయితే ఆయన నీకు సహాయపడ బోవుచున్నాడనియు, నిన్ను స్వస్థపరచునని నీవు నమ్ముచున్నావా? ఆ స్త్రీ చేసిన విధముగా, నీ దారిన వెళ్ళి మరి దేవుడు నీకు ఏ విధమైన గొప్ప కార్యములు చేసినాడని నీ జనులకు చెప్పుము. అది మంచిది.

ఇప్పుడు ఒక శస్త్ర వైద్యుడు ఒక కత్తితో పలాయనము చేయుటకు సిద్ధముగానున్నాడు…

92ఒక్క క్షణము, అది ఈ స్త్రీ కాదు. ఇప్పుడు ఒక్క క్షణము, ప్రతియొక్కరును ఇప్పుడు భయభక్తులతో నుండండి. సాతాను ఎదో చేయుటకు ప్రయత్నించియున్నాడా. ఇదిగో ఇక్కడ కణితి, కణితి మీ ఇద్దరికి గలదు. అది నిజము. మీకు కణితి గలదు, ఆమెకు కూడా కణితి గలదు. మరియు ఆ దయ్యము ఒకరిని మార్చి ఒకరియొద్దకు సహాయము కొరకు కేకలేయుచున్నది. అయితే పరిశుద్ధాత్మ కూడా కేకలేయుచున్నది. ఎవరిని మీరు నమ్మబోవుచున్నారు, ఆయననే? అది మంచిది. ఆ మంచముపై నుండి పైకి లెమ్ము, స్త్రీ, ఆ స్త్రెచెర్ నుండి పైకి లెమ్ము. దానినుండి పైకి లేచి మరి నమ్ముము. వెళ్ళు మరి ఇప్పుడు ఆయనను నమ్ముము.

మీరు నమ్ముచున్నారా? సమస్త కార్యములను సాధ్యమగును. మీరు నమ్ముచున్నారా? శ్రోతలలో యున్న మీ గురించి ఏమిటి? మనమిప్పుడు లేచి నిలిచెదను. దానిని చేయుటకు ఇదియే సరైన సమయము. ప్రతియొక్క వ్యక్తియు. దేవుడు మిమ్ములను ఆశీర్వదించును. ప్రతియొక్కరును ఇప్పుడే లేచి నిలువుడి. దేవునికి స్తోత్రముల నియ్యుడి. మీ చేతులను వైకెత్తుడి. ప్రభువైన యేసు మీకు వందనములు! మీ యొక్క మహత్త్వము కొరకును, మరియు వ్యాధిగ్రస్తులను మీరు స్వస్థపరచినందులకు మేము మిమ్ములను స్తుతించుచున్నాము.

Search Messages

0 / 0 matches
Enter characters above to process real-time text query scopes...