దేవుడు తన గుణలక్షణముల ద్వారా గుర్తించబడెను

దేవుడు తన గుణలక్షణముల ద్వారా గుర్తించబడెను

1పరమతండ్రి, మరల ఈ టెక్సాస్ లోని బోమో౦ట్ కు నడిపించినందుకు నీకు వందనములు చెల్లించుచున్నాము. ఈ బాల్కనీల వైపు చూస్తూ ఉంటే ఇంతకు ముందు ఇక్కడ గడిపిన దినములు మరియు నీవు చేసిన ఎన్నో గొప్ప క్రియలు గుర్తుకు వచ్చుచున్నవి, చాలామంది జనులు ఈ రాత్రి ఇక్కడ కూర్చొనియున్నారని నిస్సందేహముగా చెప్పగలను. వారి రోగగ్రస్థ శరీరములను నీవు తాకి యుండనియెడల ఈ రాత్రి వారిచ్చట కూర్చొనియుండెడివారు కారు, కాని నీవు చేసితివి, మరియు వారిచ్చటున్నారు. చాలా జ్ఞాపకములు సుడులు తిరుగుచు; అవన్నియు నిత్యత్వము వరకూ మాతో కొనసాగును.

ఆత్మయొక్క గొప్ప కుమ్మరింపు నీవు వూకు ఇచ్చెదవని (నమ్మి) నీకు ప్రార్ధిచుచున్నాము. మమ్మును కలిపి దీవించుము. ప్రతి ఆలయమును, ప్రతి సభ్యుని దీవించుము.

మరియు ప్రభువా, ప్రత్యేకముగా ఇక్కడ మా వధ్యనున్న యవ్వన సోదరుడగు సహో. పెర్రీ గ్రీన్ ను దీవించుము, దీనిని ము౦దుంచవలెనను ప్రయత్నములో అగ్రభాగమున నడుచుచున్నాడు. తాను ప్రేమించుచున్న జనులను క్రీస్తునొద్దకు తెచ్చుటకై ఈ యువకునికి గల భారమును ఈ చక్కని పట్టణము చూచును గాక, మరియు తాను సరియైనదని తలంచు ప్రతి సేవను అతడు అందుకొనుటకు ప్రయత్నించుచున్నాడు, వాక్యమును బట్టి ఆయన పరీక్షించబడుచున్నాడు, మరియు ప్రజలు రక్షించబడవలెనని ఆయన కోరుచున్నాడు.

తండ్రీ, సేవకొరకై మమ్మును మేము నీకు సమర్పించుచుండగా మా ప్రయత్నములలో మాకు సహాయము చేయుము. దేవుని యొక్క ఘనత మరియు మహిమకొరకు యేసు నామములో దీనిని అడుగుచున్నాము. ఆమేన్.

GEN 1:3•

ISA 7:14•

2PET 1:20

 

2ఇప్పుడు, ప్రతి రాత్రి జ్ఞాపకము చేసికొనుము, మీతో ఎవరినో ఒకరిని తీసికొని రండి, లేక ఫోను చేసి చెప్పండి మరియు ప్రతి సంఘమునకు, ప్రతి సంఘకాపరికి చెప్పండి. వారు మీతో విభేదించినా గాని పరవాలేదు. వచ్చి కూర్చోనీయుడి, వారితో చక్కగా ప్రవర్తించుడి, మీరిక్కడ వున్నందుకు నిశ్చయముగా అభినందించుచున్నాము.

మరియు ఇప్పుడు, మీ బైబిలును తెచ్చుకొనండి, ఒక పెన్సిలు తీసికొనిరండి, అంశమును వ్రాసికొనండి. వెళ్ళి వాటిని పరిశోధించుడి; అవి సరిగా నున్నవో, లేదో వాక్యముతో పరీక్ష చేయుడి. చూచారా? ఆ తరువాత మీరు మీ స్వంత వ్యాఖ్యానము చేసికోవద్దు; పరిశుద్ద గ్రంథములో వ్రాయబడిన ప్రకారము దానిని తీసికొనండి. చూడండి, చాలాసార్లు మనము, "దీని భావము ఇది, దీని అర్ధము ఇది," అని చెప్పుచుందుము. దేవునికి అనువాదకులు అవసరము లేదు; ఆయనే తన స్వంత వాక్యమును అనువదించుచున్నాడు. చూరారా?

"దేవుడు వెలుగు కలుగును గాక," అని పలుకగా వెలుగు కలిగెను. దానికి ఎట్టి భావ వివరణ అక్కర లేదు. అది ఆయన చెప్పిన విధముగానే జరిగెను. "ఒక కన్యక గర్భవతియగును," అని ఆయన చెప్పెను, మరియు ఆమె (గర్భవతి) అయ్యెను. దానికి ఎట్టి భావ వివరణ అక్కర లేదు.

దేవుడు ఈ యుగములో కొన్ని ప్రత్యేక కార్యములు జరుగునని వాగ్దానము చేసెను. దానిని ఆయన చెప్పెను, అప్పుడు దానికి అనువాదవు అవసరము లేదు. దేవుడు ఆలాగు చెప్పెను, మరియు ఆయనే అనువదించును, కాబట్టి దానికి ఎట్టి స్వంత భావము ఇవ్వనక్కరలేదని బైబిలు చెప్పెను. దేవుడు తన స్వంత వాక్యమును బయలుపరచుట ద్వారా దానికి అనువాదము చెప్పును.

JOHN 1:1,14•

HEB 1:1-3•

HEB 13:8

 

3ఇప్పుడు హెబ్రియులు పుస్తకము 1వ అధ్యాయము నుండి ఆయన యొక్క వాక్యమును చదువుచుండగా మనము లేచి నిలబడుదము. ఈ వాక్యవును గౌరవించుటయే నేను మిమ్మును నిలబడమని కోరుటలో గల కారణము. దేవుడు వాక్యమైయున్నాడని నేను నమ్ముచున్నాను, "ఆదియందు వాక్యము౦డెను, వాక్యము దేవునియొద్ద వుండెను, మరియు వాక్యము దేవుడైయుండెను. మరియు ఆ వాక్యము శరీరధారియై మనమధ్య నివసించెను." "యేసు క్రీస్తు నిన్న, నేడు, నిరంతరము ఏకరీతిగా యున్నాడు," అదే మన ఈ సభలయొక్క ఇతివృత్తము. కాబట్టి, ఇక్కడ ఈ ముద్రించబడిన ఆయన వాక్యమును మనము చదువునపుడు మనము నిలబడుదుము. ఆ జె౦డాకు మనము ప్రతిజ్ఞ చేయుచున్నాము. మన జండా కదిలిపోవుచుండగా మనము గౌరవార్ధము నిలబడుదుము, మన దేశ గౌరవము కొరకు ఆలాగు చేయవలెను. అలాగయితే, దేవుని వాక్యమును చదువుచుండగా మనమెంతగా గౌరవము చూపవలెను. మనము హెబ్రియులు 1:1-3 చదువుదము.

పూర్వకాలమందు నానాసమయములలో నానావిధములగాను ప్రవక్తల ద్వార మన పితరులతో మాట్లాడిన దేవుడు.

ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడేను. ఆయన ఆ కుమారుని సమస్తమునకు వారసునిగా నియమించెను. ఆయన ద్వారా ప్రపంచములో నిర్మించెను.

ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును, ఆయన తత్వము యొక్క మూర్తిమంతమునైయుండి తన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహించుచు, పాపముల విషయములలో శుద్ధికరణము తానే చేసి, దేవదూతలకంటె ఎంతో శ్రేష్టమైన నామము పొందెనో వారికంటే అంత శ్రేష్టుడై, ఉన్నత లోకమందు మహామహుడగు దేవుని కుడి పార్శ్వమున కుర్చుండెను.

4మనము ప్రార్ధి౦చుదము. ఇప్పుడు, వంచబడిన శిరములు మరియు హృదయుములతో ఇక్కడ ఈ ప్రార్ధనలో జ్ఞాపకము చేసికొనవలెనని ఈ కూటుములలో దేవుడు మీ మనవిని ఆలకించవలెనని, మీలో ఎందరు కోరుచున్నారు? మీ చేతులను ఎత్తండి. ప్రభువు మీ చేతులను చూచుచున్నాడు.

మా పరమతండ్రీ, నా మానవ కన్నులు చూడకలిగినంత మేరకు ఎత్తబడిన చేతుల సముదాయుమును కనుగొనుచున్నాను. నిశ్చయంగా సహోదరుడు గ్రీన్యొక్క ప్రత్యక్షత, మరియు రావలెనను నా కోరిక, సరియైనది. ఇప్పుడు, తండ్రి, నీ వాక్యప్రకారము మరియు నీ వాగ్దానమును బట్టి వారి వాంఛలను తీర్చుము. వారిని నీకు అప్పగించుచున్నాము. మరియు మా జీవితములు వాక్యముతో చక్కగా సరిపోవును గాక, వాక్యము మా మధ్య శరీరధారియై మరియు పరలోక ధననిధి నుండి వారు తమ విశ్వాసమును గ్రహించుదురు గాక, వారి యాత్రలో పాపమునకు, వ్యాధులకు యేసు ఎన్నడో దానిని ఉంచెను. ప్రార్ధి౦చుచుండగా ఇప్పుడు మమ్మును దీవించుము, నీ వాక్యమును మాకు బయలుపరచుమని, నీ కొరకు కనిపెట్టుకొనియుండగా, దానిని మా మధ్య శరీరధారిగా చేయుము. యేసు నామమున దీనిని మేము అడుగుచున్నాము. ఆమేన్. (మీరు కూర్చొనుడి.)

5ఇప్పుడు, వచ్చే నలుబది అయిదు లేదా ఏబది నిమిషములు, ఆ విధముగా మీరు లేచి అటు ఇటు తిరుగవద్దని కోరుచున్నాను, అంతకన్న మీరు చేయకలిగిన సహాయము మరి ఏది లేదు.

ఇప్పుడు, సత్యము అనగా ఏమిటో మనము తెలిసికోగోరుచున్నావు. మరియు నాకు తెలిసినంతవరకు ఒకే ఒక సత్యమున్నది, అది పరిశుద్ద గ్రంథము. ఏదో ఒక దినమున దేవుడు లోకమునకు తీర్పు తీర్చనైయున్నాడు — మనము దానిని నమ్ముచున్నాము — మరియు శరీరులమగు మనలో ప్రతి ఒక్కరము తీర్పు కొరకు ఆయన సన్నిధిలోనికి రాబడుదుము. ఇక్కడ నేను కొన్ని సంగతులను వ్రాసియుంచాను, మరియు రాబోవు కొద్ది నిమిషములలో ఆ వాక్యములను ప్రస్తావించవలెనని నేను కోరుచున్నాను.

JOHN 1:1,14•

1TIM 2:14•

HEB 13:8

 

6ఇప్పుడు, జ్ఞాపకముంచుకొనండి, "ఇక్కడ ఎవరైనా కాథలిక్కు వారు ఉన్నారా?" అని ఈ రాత్రి నేను అడిగినచో.

"అవును," అని వారు చెప్పుదురు. మరియు…

"మంచిది, దేవుడు దేనిని బట్టి లోకమునకు తీర్పు తీర్చును?"

"కాథలిక్కు సంఘము ద్వారా," అని వారందురు.

అప్పుడు నేను మరల, "ఏ కాథలిక్కు సంఘము ద్వారా?" అని అడిగిన యెడల మీరు ఏకీభవించరు. చాల అసమ్మతులున్నవి. ఒకరు ఒక రోమను, మరొకరు ఒక గ్రీకు, మరొకరు సనాతనవాదులు, ఈలాగు చాలామంది యున్నారు. మనకు చాలామంది యున్నారు. ఒకవేళ నేను (ఇలా) చెప్పినట్లయిన..

మెథడిస్టు వారు లేచి, "ఆయన వెథడిస్టు సంఘమును బట్టి తీర్పు తీర్చును," అని చెప్పెదరు. మ౦చిది, ఆలాగయినచో, అప్పుడు బాప్టిస్టు వారికి అవకాశము ఉండదు. మరియు బాప్టిస్టు ఆలయము ద్వారా తీర్పు తీర్చినయెడల మెథడిస్టువారికి తరుణముండదు.

గుర్తుంచుకొనండి, ఒక చిన్న వాక్యమును తప్పుగా ప్రస్తావించినా గాని (పూర్తి వచనము కాదు) ఒక చిన్న పొల్లును నమ్మకపోయినా గాని, ప్రతి మరణము, ప్రతి వ్యాధి, ప్రతి దుఃఖము కలుగుటకు కారణమగును. హవ్వ ఆ విధముగానే ఏదెను తోటులో చేసినది. ఇప్పుడు, ఒకవేళ వాక్యమును ఒక్క స్త్రీ అపార్ధము చేసికొన్నందుకు, మూల్యమును చెల్లించవలెను. వాక్యమును ఒక్క స్త్రీ అపార్ధము చేసికొన్నందుకు, మూల్యమును చెల్లించవలెను . ఆమె ఉద్దేశపూర్వకముగా దానిని చేయ లేదు, ఆమె మోసపుచ్చబడినది అని పరిశుద్ద గ్రంథము చెప్పెను. "మోసపుచ్చబడుట" అను పదమే దీనంతటికి కారణమయినది, అప్పుడు నీవు మరియు నేను పూర్తి వాక్యమును స్వీకరించుట తప్ప మరొక గత్యంతరము లేదు.

ఇప్పుడు, పరిశుద్ద గ్రంథము చెప్పుచున్నది, నేను నమ్ముచున్నాను, ఆయన… దేవుడు పెంతెకోస్తు సంఘము ద్వారా గాని, మెథడిస్టు ద్వారా, బాప్టిస్టు లేక కాథలిక్కు సంఘము ద్వారా గాని, లోకమునకు తీర్పు తీర్చునని నేను నమ్మును. యేసుక్రీస్తు ద్వారానే ఆయున దానికి తీర్పు తీర్చును. ఆయన ఆలాగు చెప్పెను, మరియు క్రీస్తే వాక్యవు, "ఆదియందు వాక్యముండెను, వాక్యవు దేవునియొద్ద ఉ౦డెను, మరియు వాక్యము దేవుడై యున్నాడు. మరియు ఆ వాక్యమే శరీరధారియై మనమధ్య నివసించెను." ఆయన నిన్న, నేడు, నిరంతరము ఏకరీతిగా యున్నాడు."

JOHN 6:37,44

 

7ఆ సమస్తమూ గొప్ప నిత్యమైనదిగా ఉన్నది. నిత్యత్వము అనుదానికి ఎన్నడూ ఆదియు, అంతము ఉండదు. కాబట్టి ఈ గొప్ప నిత్యుడగు వానియందు తండ్రి గాను, కుమారుని గాను, రక్షకుని గాను, స్వస్థపరచువాని గాను ఉండు లక్షణములన్నియు ఆయనలో ఉన్నవి. వురియు ఇప్పుడు జరుగుచున్నదంతయూ ఆయన లక్షణములను వెల్లడి చేయుటయే. అంతే.

ఇప్పుడు జగత్తు, పునాది వేయబడక ము౦దే మన పేర్లు గొర్రెపిల్ల జీవగ్రంథములో వుంచబడియున్నవి. మరియు వాక్యము దానిని తాకినపుడు, జీవమునకు నిర్ణయించబడిన వెలుగు అక్కడున్నప్పుడు, యేసు చెప్పెను, "నా తండ్రి ఆకర్షించితేనే గాని ఎవడును నా యొద్దకు రాడు, మరియు తండ్రి నాకు అనుగ్రహించిన వారందరూ నా యొద్దకు వచ్చెదరు." కనుక మీరు చూడండి, అది వాక్యమే, నిరంతరముగా, వాక్యము, వాక్యమే.

8ఇప్పుడు, మనము చదువుకొనిన వాక్యభాగము నుండి ఈ రాత్రి ఒక అంశమును తీసికొని, మాట్లాడగోరుచున్నాను, "దేవుడు తన గుణలక్షణముల ద్వారా గుర్తించబడెను."

ఇప్పుడు, మనము కనుగొను ప్రతిదానిని దాని యొక్క గుణలక్షణముల ద్వారా గుర్తించబడుట జరుగుచున్నది.

ఇప్పుడు, మనము గమనించుదము. ఒక జంతు జీవములో వున్నట్లుగా, లేదా ఒక పక్షి జీవములో ఉన్నట్లుగా మీరు తీసికొనండి. ఇప్పుడు, ఒక రకమగు పక్షిని (Yellowhammer) మీరు తీసికొనండి, ఇది మరియొక పక్షి ( Jaybird) ఎగురుచున్నప్పుడు; అవి పూర్తిగా అని ఒకేలాగు కనిపించును. కాని ఒక పక్షి, రెక్కలు విదిలించుచూ, క్రిందికి పైకి ఎగురు చుండును, అది దాని గుణలక్షణము. అదే గుణలక్షణము. మీరు గవునించినట్లయిన, పక్షి మరో సరళరేఖ క్రమములో ఎగురును.

క్వెయిల్ (quail) పైకి ఎగురునపుడు దానిని గమనించండి, బాబ్ వైట్ ( bobwhite) అను పక్షి ఏ విధముగా ఎగురునో గమనించండి. గాంబెల్ క్వెయిల్ అను పక్షి ఎగురునప్పుడు దానిని గమనించండి. మీరు చూడండి, అక్కడ ఒక వ్యత్యాసమువున్నది. జాక్ స్నైప్ మరియు విల్సన్స్ స్నిప్ గవునించండి, దాని గుణలక్షణములను బట్టి దానిని నిర్ధారించవచ్చును.

పర్వతప్రాంతములో ఒక గొప్ప గొర్రె నిలబడియుండును. అది వెనుకకు తిరిగి నిలబడినట్టయిన, గొర్రె యొక్క వెనుక భాగము తెల్లగాను, కొన్ని భాగములు బూడిద రంగు గాను కనబడును. మీరు ఆ గొర్రె గుణలక్షణములను ఎరుగనియెడల దానిని దుప్పి అందురు. చూచారా? చూడండి, అది ఏమిటో మరియు ఏమి కాదో మీరు తెలిసికొనుటకుగాను దాని యొక్క గుణలక్షణములను మీరు తెలిసికోవలెను. ఈ విధముగా ప్రాణుల గూర్చి ఎన్నో సంగతులు మనము చెప్పుకోగలము.

9ఇప్పుడు మానవ జీవితము నొద్దకు వచ్చుదము, ఒక స్త్రీ మరియు ఒక పురుషుని మధ్య వున్న గుణలకణములను చూద్దాం. అందులో ఒక తేడాయున్నది. వారిద్దరూ మానవులే, కానీ వారిద్దరిమధ్య గల గుణలక్షణములను బట్టి వారిని గుర్తించగలము. కొంతకాలము క్రిందట రాణి ద్వారా నేను సొలోమోనుకు పెట్టబడిన పరీక్షల గూర్చి నేను చదివాను, కొందరు స్త్రీలను పురుష వేషములో ఆమె తీసికొని వచ్చెను. మరియు సొలొమోను వారితో మాట్లాడి మరియు నడిపించి దానిని బట్టి, వెంటనే అతడు, "వీరు స్త్రీలు," అని చెప్పెను. చూడండి, ఎందుకనగా వారి తీరును బట్టి చెప్పకలిగెను, వారి యొక్క గుణలక్షణములు స్త్రీ వలె నుండెను. దానిని గురించి అక్కడ కొంత వున్నది, దానిని మీరు దాచజాలరు, అది ఒక స్త్రీ, ఎందుకనగా ఆమె ఒక స్త్రీ అని చూపించును.

మనుష్యులకు కుడి, ఎడమ చేతులవలె అదియున్నది. వారిరువురూ మానవులే. మీరు గమనించండి, మరియు వారిలో ఒకరు కుడిచేతివారు మరియు మరొకరు ఎడమ చేతివారు. వారి గుణలక్షణములు వారిని కనిపెట్టు రీతిని గమనించండి, వారు కుడి చేతి వారా లేక ఎడమచేతి వారా లేక కాదా అని మీరు చెప్పగలరు. చూచారా? అయినను వారిరువురికి చేతులున్నవి; రెండు చేతులూ ఖచ్చితంగా ఒకేలాగు కనిపించును, ఖచ్చితముగా ఒకేలాగు కనిపించును.

MATT 24:24•

MARK 13:22

 

10ఇక్కడ నేను ఒక చిన్న సంగతి చెప్పవచ్చును. మత్తయి 24వ అధ్యాయములో యేసు చెప్పెను, "అంత్య దినములలో రెండు ఆత్మలు ఎంతో దగ్గరగా కనబడును. సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సహితము మోసము చేయును."

ఇప్పుడు, అది కేవలము ఒక ఎడమ చేయి, ఒక కుడి చేయివలెనే యున్నది. అవి రెండింటికి బొటన వ్రేళ్ళు, వ్రేళ్ళు, గోరులు, చిటికెన వ్రేళ్ళు, మధ్య వ్రేళ్ళు, ఇంకను చూపుడు వ్రేళ్ళుయున్నవి, అన్నియూ వేర్వేరు వ్రేళ్ళుగా వున్నవి. రెండు బొటన వ్రేళ్ళు యొక్క ముద్రలు, ఒకటి మాత్రము ఒక విధముగా తిరిగియుండును మరియు ఇంకొకటి మరొక విధముగా తిరిగియుండును, రెండును ఒకే ముద్రలు, బొటన వ్రేలి ముద్రలు ఒకే రీతిగా చేయబడెను. చూచుటకు అన్నియూ ఒకేలాగుండెను. కాని దాని లక్షణములోనే తేడాయున్నది. ఒకటి ఎడమ చేయి, మరొకటి కుడిచేయిగానున్నది; అది మాత్రమే తేడా.

మరియు చివరి దినములలో ఆత్మలు ఆలాగే యుండును, అది దేవునికి చెందియున్నదో లేదో దాని యొక్క గుణలక్షణము బట్టి చెప్పవచ్చును. అందులో ఒకటి సరియైనదిగా వుండును మరియు ఇంకొకటి తప్పుగా వుండును. దేవుని యొక్క గుణలక్షణమును బట్టి మాత్రమే దానిని నీవు తెలిసికొనగలవు. అది ఖచ్చితంగా, అదే రీతిగా వుండవలసియున్నది. అయితే కుడిచేతిని "సరయినది" అనియు, ఎడమ చేయిని "తప్పు" అనియు చెప్పెదము. (చూచారా?) లేదా ఆ రెండింటిలో ఏదో ఒకటి అని చెప్పెదము. వాటి గుణలక్షణములను బట్టియే వాటిని నిర్ణయించుదము. దాని గుణలక్షణమును బట్టియే నీవు దానిని తెలిసికొనగలవు.

11ఇశ్రాయేలు ప్రయాణములో నుండినట్టే అదియున్నది, ఐగుపు నుండి వెలుపలకు వచ్చినది. ఇప్పుడు, దేవుడు ఇశ్రాయేలునకు తోడైయుండెను; అక్కడ క్రింద ఆయన వారికి గొప్ప సూచన చూపించెను, వారికి ఒక ప్రవక్తను ప౦పెను మరియు తన వ్రాయబడిన వాక్యమును గుర్తింపుగా ఇచ్చెను. మరియు వారిని పైకి తెచ్చుచుండగా, ఆయన గుణలక్షణమును, ఆయన మోషేను కలిసికొనిన విధానము, ఇంకా ఆయా క్రియలను జరిగించిన విధానమును మనము గమనించగలము. మరియు వారు వచ్చుచుండగా, దారిలో మోయాబు అను మరో రాజ్యము ఎదురయ్యెను. మరియు మోయాబు ఒక గొప్ప రాజ్యము. ఇప్పుడు, ఏ విధముగాను అన్యుల దేశము కాదు. వారు లోతు కుమార్తెల యొక్క పిల్లలు, మరియు వారు విశ్వాసులు. ఇప్పుడు, రెండు దేశములను గమనించండి. అందులో ఒకటి గుర్తించబడిన రాజ్యము, మరొకటి యాత్రలో ఉన్నది. వారు వాగ్దాన దేశమునకు పోవు విధినిర్వహణలో వుండగా ఈ గొప్ప మోయాబు దేశము ఒకచోటు వారికి ఎదురు వచ్చినది. ఇప్పుడు వారికి …

ఆ రెండు దేశముల వైపు చూడండి; వారిద్దరికి ఒక్కొక్క ప్రవక్త వుండెను. అందులో ఒకరు గొప్ప బోధకుడు మరియు ప్రవక్త బిలాము. మరొకరు మోషే. ఇప్పుడు, బిలాము ఇశ్రాయేలును శపించుటకు వచ్చెను.

NUM 23:1

 

12మరియు, గమనించండి, వారిద్దరును సంపూర్తిగా సాంప్రదాయవాదులు. ప్రవక్తయగు బిలాము, సంప్రదాయ వాదులతో ఇట్లనెను, "నా కొరకు ఏడు బలిపీఠములు నిర్మించుడి," అది ఖచ్చితంగా దేవుని సంఖ్య. "ప్రతి బలిపీఠము మీదను పవిత్రమగు బలిని, ఒక ఎద్దును అర్పించుడి." ఇశ్రాయేలీయుల పాళేములో సరిగా అలాగే బలి అర్పించబడుచుండెను. మరియు అతడు చెప్పెను, "ప్రతి బలిపీఠము మీదను ఒక పొట్టేలును అర్పించుడి," అది క్రీస్తు యొక్క రాకను సూచించుచున్నది. ఇశ్రాయేలులో కూడా అదే బలిని అక్కడ సమర్పించిరి.

ఒకే బలిపీఠములు, ఒకే దేవుడు కాని అందులో ఒకరు తప్పుగా మరొకరు సరిగా వున్నారు. మరియు ఇప్పుడు, మీరు చెప్పగలిగిన ఒకే ఒక మార్గము… వాక్యము బట్టి చూచినా సంప్రదాయ రీత్యా వారు సరిగానే యున్నారు. కాని, మీరు చూడండి, అతని ఉద్దేశ్యములు తప్పు, తమ సోదరులను దేవుడు వారికిచ్చిన వాగ్దానము నుండి తొలగించవలెనని ప్రయత్నించెను.

13మరియొక సంగతి, బిలాము ప్రవక్త ఆచారబద్ధుడు, కాని ప్రవక్తయగు మోషే దేవుని యొక్క గుణలక్షణములను బట్టి గుర్తించబడెను. అక్కడ సహజాతీతమగు వెలుగు, అగ్నిస్తంభము వారిపై వ్రేలాడుచుండెను. మరియు వారి పాళేములో గొప్ప స్వస్థతలు జరుగుచుండెను. సహజాతీతమగు దేవుడు, సహజాతీతమగు సూచనలను చూపించుచుండెను. మరియు ఆ రెండు దేశములు గతంలో ప్రారంభమయినపుడు, దేవుడు అబ్రాహామునకిచ్చిన వాగ్దానమునే వారు పట్టుకొనియుండిరి. కాని ఇప్పుడు, మోషే అబ్రాహాము యొక్క వాగ్దానము కలిగియుండి, వాగ్దాన దేశవునకు వెళ్ళుచున్నాడు. అలాగే యొహోవా ప్రవక్తయుగు బిలాము అక్కడ నిలబడి యుండెను. మరియు వారిని నీవు వారియొక్క సాంప్రదాయ బోధను బట్టి గుర్తించలేవు, కాని దేవుని యొక్క గుణలక్షణములను బట్టి మాత్రమే వారిని గుర్తించగలవు.

రాజు స్వరము యొక్క కేక ఇశ్రాయేలు వారితో కూడ యుండెను. పరిహారము ప్రభావముతో యుండెను, ఒక ఇత్తడి సర్పము, కొట్టబడిన బండ ఉండెను. మరియు దేవుడు వారితో యుండెను, ఒక సహజాతీతమగు వెలుగులో ఆయనను తానే గుర్తించుకొనెను, వారికి వచ్చిన వ్యాధులను, రుగ్మతలను ఆయన బాగుచేయుచుండెను. ఆ గుణలక్షణములే ఆయన ఏమైయుండెనో రుజువు చేయుచుండెను, ఆ కాలమునకు నిర్ణయించబడిన వాక్యపు వరుసలోనే యుండెను, వారు జీవించుచున్న కాలము అదే. దేవునియొక్క గుణలక్షణములు మోషేలో గుర్తించబడెను: చూడండి దేవునియొక్క గుణలక్షణములు మోషేలో గుర్తించబడెను, అగ్నిస్తంభము వచ్చెను, పరిహారము అమలులో యుండెను, సహజాతీతమైనది, కొట్టబడిన బండ, మరియు ఇత్తడి సర్పము కూడా అక్కడే యుండి, స్వస్థత గూర్చి మాట్లాడుచు౦డెను, మరియు వారు మరల దేవుని యొక్క వాగ్దానమును బట్టి విధి నిర్వర్తించుచుండిరి.

MATT 1:18,19,21•

LUKE 1:31

 

14మరల, దేవునియొక్క గుణలక్షణములు సహజముగా ఉండవు. దేవుని యొక్క గుణలక్షణము సహజాతీతముగా వుండును. ఎందుకనగా ఆయన సృష్టికర్త. ఆయన ఒక సహజాతీతమగు వాడు. మరియు దేవునియొక్క గుణలక్షణములు వెల్లడి అగునపుడు అది అధునిక ఆలోచన విధానమునకు అసాధారణముగా ఉండును, అందువలన వారు తొట్రుపాటుకు గురియగుదురు. దానిని వారు అర్ధము చేసికొజాలరు, అయితే ఆయన మాత్రము ఎన్నడూ తన వాగ్దానమును మరువడు. ప్రతి యుగములోను దేవుడు వాక్యమును కేటాయించెనని నేను చెప్పాను.

ఒక ఉదాహరణను మనము చూద్దాం. మరియకు భర్తయైన యోసేపు ఉన్నాడు మరియు ఇప్పుడు, ఈ యువతిని ప్రధానము చేసికొనెను, వారు వివాహము చేసికోనైయుండిరి. అయితే వారు ఏకము కాకమునుపే, ఆమె పరిశుద్ధాత్మవలన గర్భవతియాయెను.

ఇప్పుడు, మనము క్రైస్తవులమయితే దానిని నమ్ముదుము. ఒక క్రైస్తవునిగా ఉండుట కొరకు మనము తప్పక దానిని నమ్మవలెను. అది బైబిలు. ఒక క్రైస్తవునిగా ఉండుటకు నీవు పరిశుద్ధ గ్రంథములోని ప్రతి మాటును నమ్మవలసియున్నావు, ఇప్పుడు, ఎందుకనగా పరిశుద్ధాత్మ ఇక్కడ యున్నచో, అది ప్రతి వాక్యమునకు మరియు ప్రతి వాగ్దానమునకు "ఆమేన్" అని పలుకును.

ఏలయనగా ఇప్పుడు, యోసేపు ఒక పురుషుడు; అతడు ఒక మంచి మనిషి.

మరియ గబ్రియేలు తనను దర్శించినట్లును, పరిశుద్ధాత్మ తన్ను కమ్ముకొన్నట్లును, మరియు ఒక కుమారుని కననైయున్నట్లును, మరియు ఆయనకు "యేసు" అను పేరు పెట్టనైయున్నట్లును ఆమె తప్పక యోసేపునకు చెప్పియుండెను. మరియు యోసేపు ఆమె యొక్క పెద్ద ముదురు గోధుమ రంగు కండ్లలోనికి చూచెను, మరియు అందులో అతనికి అమాయకత కనిపించుచున్నది, మరియు దానిని అతడు నమ్మగోరెను. అతడు తన పూర్తి మనస్సుతో దానిని నమ్మగోరెను, కాని అది మరీ అసాధరణముగా ఉండెను, అందువలన అతడు ఆమెను రహస్యముగా విడనాడనుద్దేశించెను.

MATT 1:19

 

15ఇప్పుడు, ఒక మనిషి యథార్ధముగా వున్నచో, దేవుడు సత్యమును అతనికి ఏదో ఒక విధముగా బయలుపరచును. నీవు యథార్థపరునివైనచో, ఆయన అలాగు చేయవలెను. నీవు దానిని చూచియు, దాని నుండి దూరముగా వెళ్ళిపోయినచో, అప్పుడు నీవు తీర్పునకు గురియగుదువు. కాని, నీవు యథార్థపరునిగా వున్నచో సత్యమును చూచెదవు…

ఇప్పుడు, యోసేపు తన మనస్సులో "ఇది అసాధారణము" అనుకొనెను.

ఈనాడు మ౦చి జనులు, చక్కని పురుషులు, మంచి శీలముగల పురుషులు, మంచి సేవకులు, చాలామంది యాజకులు అలాగేయున్నారు, కాని ఈనాటి సహజాతీతమగు ప్రత్యక్షత వారికి అసాధారణముగా తోచుచున్నది, అది వారిని పడగొట్టుచున్నది. అది దేవునియొక్క గుణలక్షణమును వెల్లడిచేయుటవలననే అలాగు జరుగుచున్నది.

MATT 1:19•

LUKE 2:44,46•

JOHN 1:1

 

16ఇప్పుడు, ఆమె భర్తయుగు యోసేపు నీతిమ౦తుడైయుండి, ఆమెను బయటపెట్టుటకు ఇష్టపడలేదు. దానిని అతడు నమ్మలేకపోయెను; నమ్ముటకు అతడు ప్రయత్నించెను. కాని ఈ సంగతుల గూర్చి అతడు ఆలోచించుచుండగా, యెహోవా దూత అతనితో మాట్లాడెను మరియు చెప్పెను.

ఇప్పుడు, ఆయన ఎల్లప్పుడూ కలలోనే మాట్లాడవలసిన పనిలేదు, ఆయన తనను తాను నీకు వాక్యము ద్వారా బయలుపరచుకొనును, మరియు అది నిజము అని నీకు చూపించును, దానిని చూడగలిగిన యథార్థత నీవు కలిగియున్నట్లయిన దేవుడు తన గుణశీలమును బయలుపరచుచుండగా దానిని నీవు చూడవలెను. అయితే అది ఎల్లప్పుడూ దేవునియొక్క వాగ్దాన వాక్యమునకు అనువుగా వుండును.

మరియు ఇంకొక సంగతి, దేవునియొక్క వాక్యము ఎల్లప్పుడు తప్పును సరి చేయును. మీరది నమ్ముదురా? వాక్యము దానిని స్థిరపరచును. దేవుడు ఆ వాక్యమును బయలుపరచినపుడు, అది దానిని స్థిరపరచును.

ఇప్పుడు, నా మనస్సుతో ఒక సంగతిని ఆలోచించగోరుచున్నాను. ఎక్కువ సమయుము మనము తీసికొనము, ఎందుకనగా రోగుల కొరకు మనము ప్రార్ధి౦చవలెను. ఇప్పుడు మనము చూద్దాము; యేసు వాక్యముగా వున్నప్పుడు. ఆయన వాక్యమైయుండెనని పరిశుద్ద గ్రంథము చెప్పెను. దానితో మనందరము సమ్మతించుదుము, ఆయనే వాక్యము. ఆయన పండ్రెండ్లెండ్ల వయస్సులో వున్నప్పటి సంగతి గమనించండి. ఇప్పుడు, ఆయన బడికి వెళ్ళినట్లు మనకు ఎట్టి ఆధారము లేదు. కాని పన్నెండేండ్ల వయస్సులో ఉండిన ఆయనే ఎంతో గొప్పవానిగా కనబడెను, పస్కా పండుగ ఆచరించుటకు ఆయన తన తల్లిదండ్రులగు మరియు యోసేపులతో కలిసి దేవాలయమునకు వెళ్ళేను. మరియు వారు పస్కా పండుగ నుండి తిరిగి ఇంటికి వచ్చుచుండిరి. అది మూడు రోజుల ప్రయాణము, మరియు వారికి యేసు ఎక్కడా కనబడలేదు. మరియు మూడు రోజులు వారు ఆయనను వెదికిన పిదప, దేవాలయములో ఆ పెద్దలతో దేవుని వాక్యము గూర్చి తర్కించుచుండగా చూచిరి.

LUKE 2:48,49

 

17మరియు, ఇప్పుడు మరియ మాటు వినండి. ఆమెను జనులు ఇప్పుడు ఒక దేవతగా ఎంచుచున్నారు, చూడండి. మీరు చూడండి, ఆదియందు స్త్రీ మోసపుచ్చబడెను. మరియు ఆమెను ఇక్కడ గమనించండి. మీరెన్నడూ దానిని గమనించనియెడల, ఇప్పుడు చూడండి. "నేనును, నీ తండ్రియు ఏడ్చుచూ వెదకుచున్నాము," అని ఆమె అన్నది. గమనించండి. ఆమె తాను పొందియున్న వాక్యమును ఆ యాజకుల యెదుట త్రోసిపుచ్చినది. ఆమె పరిశుద్ధాత్మవలన గర్భము ధరించినట్టుగా చెప్పినది, మరియు ఇక్కడ యోసేపును ఆయనకు తండ్రిగా చెప్పుచున్నది.

ఇప్పుడు, ఆ పండ్రెండేండ్ల బాలుని గమనించండి, ఆ ఘడియకు అతడే వాక్యము. ఆ ఘడియకు వాగ్దానము చేయబడిన వాక్యము ఆయనే, అభిషిక్తుడగు మెస్సియా, ఆయన చెప్పినది గమనించండి, "నేను నా తండ్రి పనిమీద యుండవలెనని మీరెరుగరా?" వాక్యము తప్పును సరిదిద్దును. చూడండి, మరియు ఒక పండ్రెండు సంవత్సరముల బాలుడు, కాని సహజాతీతమగువాడు. యేసు తాను పలికిన దానిని అర్థము చేసికొనెనని నేననుకొనను, కాని ఆయనే వాక్యము, మరియు వాక్యము తప్పును సరిదిద్దును. చూడండి, ఆయన తన తల్లిని సరిచేసెను, మరియు ఆమె అలాగు అన్నందుకు గద్దించెను. ఇప్పుడు, యోసేపు తన తండ్రి అయినచో ఆయన యోసేపు పనిమీదనే ఉండియుండును.

కాని, చూడండి, ఆమె హవ్వవలెనె ఆశ్చర్యముతో నిండెను, మరియు ఆమె ఉద్రేకపూరితురాలై ఇట్లన్నది, "నేనును, నీ తండ్రియు ఏడ్చుచూ వెదకు చున్నాము."

"నేను నా తండ్రి పనిమీద ఉండవలెనని మీరెరుగరా?" అని ఆయన పలికెను. వాక్యమెంతగా సరిచేయునో చూడండి, అది తప్పును సరిచేయును.

సాతాను యేసును శోధించుటకు ప్రయత్నించినపుడు, ఒక పొరపాటు చేసెను. కాని ఆయన తన స్వంత వాక్యముతో ఎదుర్కొనెను, మరియు వాక్యముతోనే వాడిని ఓడించెను.

HEB 1:1

 

18"దేవుడు" ఆయా సమయములలో ఆయా రీతులుగా తన ప్రవక్తలకు బయలుపరచుకొని; ఆయన ఆ ప్రవక్తలద్వార పితరులతో మాట్లాడెను అని బైబిలు ఇక్కడ చెప్పెను. ఇప్పుడు, మానవునికి ఆయన తనను తాను ఏ గుణలక్షణముల ద్వారా గుర్తింపచేసికొనునో (చూచారా?), ఆయన ప్రవక్తలతో మాట్లాడెను. రుజువు చేయబడిన ప్రవక్తల యొక్క దర్శనములు, అది ప్రవక్తల యొక్క దర్శనము ద్వారా తెలియజేయబడిన దేవునియొక్క గుణలక్షణము.

ఇప్పుడు, ఒక దర్శనమును ఏ మనిషియూ వివరించజాలడు; దానిని వివరించు మార్గము ఏదియూ లేదు. అది సహజాతీతము. జరిగిన దానిని, జరుగుచున్న దానిని, జరుగబోవు దానిని నీవు అందులో చూచెదవు. మరియు అది ఒక మనుష్యుని పంపి సంగతులను పలికించి, జరుగనైయున్న విషయములను చూపించును (ఈ రాత్రి మాత్రమే కాదు) ప్రతి రాత్రి, ప్రతి సమయము చూపించు దేవునియొక్క విధానము. ఆయన చెప్పిన ప్రతిదియు ఖచ్చితమైనదిగా నుండును, అది ప్రభుని వాక్యముగా ఉండవలెను.

EXOD 2:2•

ISA 40:3•

JER 1:5•

MATT 6:27•

LUKE 12:25•

ROM 11:29

 

19దీనిని బట్టి, వరములు మరియు పిలుపులు మారుమనస్సుతో సంబంధము లేనివిగా నున్నవి. నీలముగానున్న నీ కండ్లను ముదురు గోధుమ రంగుగా మార్చలేవు. నీవు నాలుగు అడుగుల ఎత్తుగా వుంటే నిన్నునీవు ఆరడగుల ఎత్తుగా చేసికోలేవు. "ఎవడు తన ఎత్తుకు మూరెడెక్కువ కలుపుగొనగలడు?" మనము ఏమైయున్నామో అది దేవుని కృపను బట్టియే అయివున్నాము.

ఇప్పుడు, వరములు మరియు పిలుపులు మారుమనస్సుకు సంబంధము లేనివి. ఈ ప్రవక్తలు పుట్టుకతోనే ప్రవక్తలు. మోషే ఒక చక్కని బిడ్డగా జన్మించెను. యేసు దేవునియొక్క కుమారునిగా జగత్తు పునాదికి ముందే ఉండెను. దేవునియొక్క లక్షణము. ఆయన పుట్టుకకు ఏడు వందల పండ్రెండు సంవత్సరముల ముందే యిర్మియూ వుండెనని నేను నమ్ముచున్నాను, అతడు జన్మించుటకు ము౦దే ఆయన ఒకనియొక్క స్వరముగా వుండెను. కాదు, నన్ను కమించండి, అతడు జనములకు ప్రవక్తగా అభిషేకించబడెను, అతని తల్లియొక్క గర్భములోనే పవిత్ర పరచబడెను మరియు దేశములకు ప్రవక్తగా నిర్ణయించబడెను. నేను బాప్తిస్మమిచ్చు యోహానును గూర్చి ఆలోచించుచున్నాను. ఆయన పుట్టుకకు ఏడు వందల పన్నెండు సంవత్సరముల ముందే చెప్పబడెను, అతడే అరణ్యములో కేకవేయుచున్న ఒక స్వరము.

JER 28:9•

JOHN 1:14•

JOHN 3:30•

JOHN 5:35•

JOHN 10:33,37•

HEB 1:1,2

 

20చూడండి, అది దేవుని స్థానము. ఆయన ఒక మనిషిని పంపును, ఆ కాలపు వాక్యమును తీసికొని వచ్చును. కాని ఇప్పుడు నీవు ఆ కాలపు వాక్యమును నమ్ముటకు ముందుగానే ఆయన తన గుణశీలములో జ్ఞానముద్వారా, దర్శనము ద్వారా తనను తాను బయలుపరచుకొనును, చూచారా? జరుగబోవు సంగతులను ఆయన చెప్పెను, మరియు అవి జరుగుచున్నవి. మరియు దేవుడు ఈలాగు చెప్పెను, "అది జరిగినపుడు అతనికి వాక్యభావము తెలియచేయబడెనని నమ్ముడి, ఎందుకనగా ఇతని యొద్దకు యెహోవా యొక్క వాక్కు వచ్చును." మరియు అతడు ఆ యోగ్యతలను బట్టి ఒక ప్రవక్తగా గుర్తించబడుట పాత నిబంధనలో చూడగలము. అది బహు తేటగా యున్నది, ఆయనయొక్క గుణ లక్షణములు గుర్తించబడెను, ఆయన శీలము తెలియ చేయబడును.

ఇప్పుడు, "దేవుడు అ యా సమయములలో మాట్లాడుట అలాగే "వివిధ రీతులుగా ప్రవక్తలద్వారా పితురులతో మాట్లాడిన దేవుడు ఈ చివరి దినములలో కుమారుడగు యేసు క్రీస్తుద్వారా మాట్లాడెను," అని పరిశుద్ద గ్రంథము చెప్పుచున్నది.

ఇప్పుడు, యోహాను 10:37లో యేసు ఇట్లు చెప్పెను, "నా తండ్రి క్రియలు నేను చేయనియెడల నన్ను నమ్మకుడి."

చూడండి, "నీవు మానవునివి, నిన్నునీవు దేవునిగా చేసికొనుచున్నావు," అని వారనిరి.

ఆయన చెప్పెను, "నా తండ్రి క్రియలు నేను చేయునియెడల నన్ను నమ్మవద్దు." ఇప్పుడాయన ఇట్లనెను, "యోహాను ప్రకాశించుచున్న ఒక మంచి వెలుగు. మీరు అతని వెలుగులో ఒక కాలము పాటు నడువగోరితిరి. ఇప్పుడు, యోహాను ఇట్లు చెప్పుచున్నాడు, "నేను ఇక వెళ్ళిపోవలెను; ఆయన హెచ్చింప బడవలెను." ఆయనే లోకమునకు వెలుగు, ఎందుకనగా ఆయనే బయలుపరచబడిన, గుర్తించబడిన శరీరధారియగు వాక్యము. చూచారా? ఆయన మనకు తోడైయున్న దేవుడు.

GEN 1:3•

JOHN 10:35-37

 

21ప్రవక్తలతో దేవుడుండెను. యేసు అలాగు చెప్పెను. "దేవుని వాక్యము ఎవరి యొద్దకు వచ్చునో వారు దేవుళ్ళు," అని మీరు పలుకుచున్నారే, మరి నేను దేవుని కుమారుడనని చెప్పుచుండగా నన్నెందుకు ఖండించుచున్నారు?" అని ఆయన అడిగెను. చూచారా? కావున దేవునిచే పలుకబడిన వాక్యము బయలుపరచబడినది, దేవుడు తన్నుతాను తన గుణశీలముద్వారా తెలియపరచుకొనుచున్నాడు, ఆయన మాట నెరవేరుచున్నది. దానికి ఎట్టి భావవివరణ అక్కర లేదు. అది ఎప్పుడో వివరించబడినది, అది ఏమిటో దానికదే రుజువు చేసికొనుచున్నది.

"వెలుగు కలుగును గాక," అని ఆయన పలికిన రీతిగానే అక్కడ వెలుగు కలిగెను. "దాని భావము ఏమిటి?" అని నీవు అడుగనవసరము లేదు… దాని భావమును అదియే రుజువు చేయును. అది ఇప్పటికే నెరవేరియున్నది.

ఇప్పుడు, "నా తండ్రి క్రియులు నేను చేయునియెడల," అని యేసు చెప్పెను. లేక మరొక రీతిగా "నా తండ్రియొక్క లక్షణములు నాలో లేనియెడల నన్ను నమ్మకుడి అని అర్థము. నేనెవరిని అను నా శీలమును అవి సూచించును. మీరు నన్ను నమ్మనియెడల దేవుడిచ్చిన గుర్తింపును చూచి నమ్ముడి. ఒకవేళ నా గుణలక్షణము నా స్థానమును గుర్తింపచేయనియెడల, నేను చెప్పునది నమ్మకుడి." చూచారా? ఈ రాత్రి దానిని మీరు గ్రహించారా? ఎంతమంది దానిని గ్రహించారు? మీ చేతులెత్తండి. చూచారా? "నేనెవరినని చెప్పుకొనుచున్నానో దానిని నా శీలము సూచించనియెడల నమ్మకుడి." "నేనేమైయున్నాను అను గుర్తింపును నా గుణశీలమే ఇచ్చుచుండగా … మీరు నమ్ముడి," అని యేసు చెప్పెను.

JOHN 5:39•

JOHN 10:37,38•

JOHN 14:12•

HEB 1:1,2

 

22యోహాను 14:12, "నాయందు విశ్వాసవయించువాడు నేను చేయు క్రియలు చేయును," అని యేసు చెప్పెను. ఇప్పుడు, చూడండి, "నాయందు విశ్వాసముంచువాడు," ఒక నిజమగు విశ్వాసి, "నేను చేయు క్రియలు చేయును." గమనించండి. మరో మాటులో చెప్పవలెనన్నచో, "నాయందు విశ్వాసముంచువాడు నా గుణశీలమును, నా క్రియలను కలిగియుండి గుర్తించబడును," అని భావము. ఇప్పుడు, ఆయన చేసినది అదే. "తండ్రి క్రియలు నేను చేయనియెడల నన్ను నమ్మకుడి," అని ఆయన చెప్పెను. మరియు ప్రవక్తలతో తండ్రి మాట్లాడెను, మరియు అదే వారియొక్క గుణలక్షణము, గుర్తింపు. కావున యేసు విషయములో కూడా అలాగేయుండెను. మరియు నమ్మినవానికి ఆయన దానిని వాగ్దానము చేసెను, "నాలోయున్న గుణలక్షణములే వానిలోనువుండును. మరియు నేను నా తండ్రి క్రియలు చేయనియెడల, నన్ను నమ్మకుడి. కాని నేను క్రియలు చేసినను నన్ను మీరు నమ్మకున్నను, క్రియలను నమ్ముడి, ఎందుకనగా, ఆ క్రియలు నన్ను గూర్చి సాక్యమిచ్చుచున్నవి."

ఆయన ఈలాగు చెప్పెను, "లేఖనములను పరిశోధించుడి, ఏలయనగా అందులో నిత్యజీవము కలదని మీరు తలంచుచున్నారా గదా? నేనెవరినో అవే మీకు చెప్పుచున్నవి. అది యేసు, చూచారా? చూడండి. దేవుడు ప్రత్యకపరచబడి తన్నుతాను చూపించుకొనెను. "నేనెవరిని అను సాక్ష్యమును అని ఇచ్చుచున్నవి." అదియే హెబ్రియులు 1:1, "దేవుడు నానాసమయుములలో ప్రవక్తలద్వారా మాట్లాడెను," ఇప్పుడు తేటగా ఆయన కుమారునియొక్క పునరుత్తానము యొక్క గుణలక్షణమును గుర్తింపచేయుచున్నది. అప్పుడు, దేవుడు ప్రవక్తల ద్వారా మాట్లాడెను. ఇప్పుడు తన కుమారుని ద్వారా మాట్లాడుచున్నాడు. మారని దేవుడు అదే గుణమును కలిగియున్నాడు. "నేను చేయు క్రియలు మీరును చేయుదురు. దేవుడు తన యొక్క గుర్తించబడిన గుణశీలము ద్వారా బయలుపరచబడెను. ఆలాగే మీరు తెలిసికొనిరి.

"మంచిది, నేను దీనిని చెప్పుదును; దీనిని పాడుదుము, మనము దీనిని చేయుదుము, మరియు మనము దీనిని చేయుదుము," అని మీరు అనవచ్చును. నేను దానిని గూర్చి మాట్లాడుట లేదు.

శరీరధారియైన వాక్యము గూర్చి నేను మాట్లాడుచున్నాను, ఈ జీవము దానిని సూచించుచున్నది. ఒక కాలమునకు వాగ్దానము చేయబడిన వాక్య గుణలక్షణము అది.

ఆ పరిసయ్యులకు పరిశుద్ద గ్రంథము అందరికంటె బాగుగా తెలియును. ఈనాడు బోధకులమగు మనకెవరికీ అంత బాగుగా తెలియదు. వారు దానివలనే జీవించవలసియుండిరి. వారి పూర్వీకులు కూడా యూజకులే. దానిని వారు దివారాత్రులు అధ్యయనము చేసిరి, అయితే వారు ఆ గుర్తించబడిన వాక్యమును చూచుటలో విఫలమయిరి.

JOHN 10:37

 

23"నీవు నమ్మినపుడు, దానిని నీవు పొందినట్టే," అని నేడు లూథరనులు చెప్పెదరు. "నీవు ఆర్భాటము చేసినప్పుడు, నీవు దానిని పొందినట్టే," అని మెథడిస్టువార౦దురు. "నీవు భాషలలో మాట్లాడినయెడల, నీవు దానిని పొందినట్టే? అని పెంతెకోస్తువారందురు. అదంతయూ తప్పు, అని మనము కనుగొందుము. "ఆత్మ యొక్క ఫలములు వారు పొందినచో చాలును," అని కొందరు చెప్పుదురు. మరియు అది తప్పు. ఒకే ఒక అధారము ఏదనగా, దేవుడు తానే ఈ ఘడియ యొక్క వాగ్దాన వాక్యమును గుర్తించునప్పుడు, దానిని రుజవు చేసినప్పుడు. అక్కడే అది వున్నది.

ఆ యూజకులకంటే ఆత్మ ఫలములు కలవారు ఎవరున్నారు? వారి పిల్లలు సున్నతి చేయబడిరి, వారికి దీవెనయున్నది. అంతా చక్కగా యున్నది. మరియు యేసు అను ఇతడు వచ్చి వారియొక్క బలిపీఠపు బల్లలను పడగొట్టేను, వారివైపు కోపముతో చూచెను, వారిని కొట్టెను, వారిని వెలుపలకు తరిమెను. ఏ గుర్తింపు ఆయనకు లేదు. వాక్యమే ఆయనయొక్క గుర్తింపు. ఆయనకు ఏ సహవాసపు అట్ట (కార్డు) లేదు; ఆయన ఏ సంస్థకు చెందలేదు. కాని దేవుడు ఆయన గూర్చి చెప్పెను; అదే ఆయన గుర్తింపు.

ఏ ఘడియలోనైనా గాని దేవునియొక్క అసలు గుర్తింపు అదే, ఆయన గుర్తింపు అదే. వాగ్దానము చేయబడిన వాక్యము దేవుని గుణశీలము ద్వారా గుర్తింపును పొందును, దేవుడే వాక్యము. మరియు ఆ వాగ్దానముయొక్క గుణశీలవు గుర్తించబడినది, దాని వలన విశ్వాసి తయారగును. యేసు ఆలాగు చెప్పెను, మరియు అదే స్థిరము. ఆమేన్.

గమనించండి, గుణలక్షణములు ఆయనను గుర్తింపచేయును అని ఇప్పుడు మనము కనుగొనియున్నాము. "ఆలాగు జరుగనియెడల నన్ను నమ్మకుడి," అని ఆయన చెప్పెను. ఇప్పుడు, అది ఆయనను గుర్తించునని యేసు చెప్పెను.

HEB 1:1,2•

HEB 13:8

 

24మరియు ఇప్పుడు గుర్తుంచుకొనండి, హెబ్రియులు 1:1లో ఈ చివరి దినముల గూర్చి చెప్పబడినది. "ఆయా సమయములలో, ఆయా రీతులుగా ప్రవక్తలద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు, ఈ దినముల అంతమందు ఆయన కుమరుడగు యేసుక్రీస్తు ద్వారా మనతో మాట్లాడెను. చూచారా? పూర్వసమయములందు దేవుడు తన్నుతాను ఏలాగు బయలుపరచుకొనెనో, అదే రీతిగా ఇప్పుడును మారని తన గుణశీలము ద్వారా తనను గుర్తింపచేసికొనును. ఆమేన్. హెబ్రియులు 13:8 చెప్పినది గవునించండి, "ఆయన నిన్న (ఆయా సమయములలో) నేడు, నిరంతరము ఏకరీతిగా యున్నాడు." మారని ఆయన రీతి, మారని ఆయన మార్గము, మారని ఆయన గుణలక్షణము నుండి దూరము కాజాలడు తన ఆజ్ఞ నుండి దూరముగా పోజాలడు. అది ఆయనే అయివున్నాడు, ఆయన వాక్యమైయున్నాడు. ఆయనే ఘడియ యొక్క వాక్యము. ఆయన ప్రపంచమును సృష్టించినపుడు; ఆయన వాక్యముగానే యుండెను. ఆయన నరుని సృష్టించినప్పుడు ఆయన వాక్యముగానే యుండెను, ఆయన గుణములుయున్నవి. ఆయన క్రీస్తును సృజించినపుడు ఇమ్మానుయేలుగా ఉండిన దేవుడు. అది. మరియు ఆయన ఆయనను ఒక రక్షకునిగా తయారుచేసినప్పుడు, అది ఆయన యొక్క గుణముగా వుండెను. చూచారా? ఎల్లపుడూ అది గుర్తించబడిన వాక్యమే, అందులో దేవునియొక్క గుణలక్షణములు వెల్లడాయెను. ఆ రీతిని గమనించండి, ఆయన ఎల్లపుడూ, ఆయన ఎన్నడును మారనివాడు.

GEN 11:31•

GEN 12:1•

GEN 17:19

 

25అబ్రహామునొద్దకు వచ్చిన ముగ్గురు మనుష్యులను చూడండి, ఆ దినమున అతని గుడార ద్వారమునొద్ద కూర్చొనిరి.

కొద్ది నిమిషముల పాటు అక్కడ అతనిని చూద్దాం. అతడు వచ్చియుండెను. అతడు కల్దియుల దేశములోని ఊరు అను పట్టణము నుండి వచ్చెను. దేవునియొక్క ఆజ్ఞను బట్టి అతడు ఆ పట్రుణము నుండి బయటకు వచ్చెను. అతడు తననుతాను సమస్త అవిశ్వాసము నుండి వేరు చేసికొనెను. అది దేవునియొక్క మొదటి గుణలక్షణము. నిన్ను దేవుడు పిలచినప్పుడు, అవిశ్వాసమునుండి వేరగుము.

మరియు మానవుని సహజ మనస్సునకు ఖచ్చితముగా, సంపూర్తిగా నమ్ముటకు అసాధ్యమగు దానిని అతనికి ఆయన ఇచ్చును. ఆయన చెప్పెను, "అబ్రాహాము, నీకు …" అతనికి డెబ్బది అయిదేండ్లు, మరియు శారాకు అరువది అయిదేండ్లు. ఆమె అతనికి సగము సహోదరి; వారు ఇన్ని సంవత్సరములు కలిసి జీవించినాగాని సంతానము లేదు. "శారా వలన నేను నీకు ఒక కుమారుని ఇవ్వబోవుచున్నాను, మరియు అతడు. అతని వలన నేను నిన్ను అనేక జనములకు తండ్రిగా చేతును? అని ఆయన చెప్పెను. ఈ అయిదేండ్లుడు, దానిని అతడు నమ్మెను.

ROM 4:19-21

 

26కాలము జరిగిపోయెను, గాని శారాలో ఏ మార్పు రాలేదు. చూచారా? ఆమెకు కాలము తీరిపోయెను, ఆమెకు రుతుక్రమము ఆగిపోయెను. అరువది-అయిదు, అనగా అదే కాలము. అబ్రాహామునకు డెబ్బది-అయిదు సంవత్సరములు, అతని శరీరము మృతతుల్యమాయెను , ఆమె గర్భము మృతతుల్యమాయెను, కాని అబ్రహాము ఎన్నడూ అవిశ్వాసమును బట్టి దేవుని వాగ్దాన విషయములో సందేహించలేదు. అతడు నమ్ముచునేయుండెను, ఎందుకనగా దానిని దేవుడు చెప్పెను, అందుచే ఒప్పించబడెను, "దానిని దేవుడు చెప్పినయెడల ఆయన గుణలక్షణములు ఆయన చెప్పినదానిని వెల్లడిచేయును." ఇప్పుడు, మనము అబ్రాహాము పిల్లలముగా ఎంచబడుచున్నాము, అబ్రాహాముయొక్క సంతానముగా ఎంచబడుచున్నాము. ఇంకను, ఇరవై-ఐదు సంవత్సరములు గతించి పోయినవి. శారాలో ఏ మార్పును లేదు, ఏమీ లేదు, కేవలము ఇంకా ఆమె వృద్ధురాలై వంగిపోయి, భుజములు జారినవి, అతడు అలాగే యుండెను. కాని ఇంకా అబ్రహాము దానిని నమ్మెను.

GEN 18:1-3•

GEN 19:1

 

27మరియు ఒక రోజు, నేటి జనులకు తన దాసుడు ఒక మాదిరిగా యుండుటకు నిర్ణయించుకొనెనని దేవుడు చూచి, అతని ద్వారా జనములను దీవించనైయున్నట్లు చెప్పుటుకు ఒక ఎండవేళ, సుమారు పదకొండు గంటలకు అతని యొద్దకు ముగ్గురు మనుష్యులు నడిచి వచ్చిరి. వారు అతనితో మాట్లాడిరి. మరియు వారిని రమ్మని, కూర్చొనుమని అతడు ఆహ్వానించెను. వారు మానవులకు వేరుగా కనిపించిరి. ఆత్మీయ సంగతులు ఆత్మసంబంధులకే అర్థమగును. గమనించండి, మరియు వారు వచ్చి కూర్చొనిరి. అబ్రహాము వారిని చూచెను: "నా ప్రభువా" అని అతడు పలికెను. అతడు ఏమి చేయవలెను?

వారిలో ఇద్దరు వెళ్ళి సోదోమలో ప్రసంగించిరి. నేటికది ఒక ఆధునిక వాక్యము. మూడు తరగతుల జనులచ్చటున్నారు. సొదొమ మరియు సొదొమలో వున్న సంఘము; సొదొమలో లేని ఏర్పరచుకొనబడిన అబ్రహాము. ఇద్దరు వర్తమానికులు; ఒక అధునిక బిల్లీ గ్రాహం… మరియు గుర్తుంచుకొనండి, ఎందరో వర్తమానికులు సంఘమునకు వున్నారు. కాని, హాము అను చివర పేరుతో నామకార్ధ సంఘమునకు వెళ్ళిన వ్యక్తి ఎన్నడూ ఎవరూ లేరు. ఫిన్సీ, సాన్కి, నాక్స్ కాల్విన్, బిల్లీ సండే, మరియు ఇంకా చాలామంది ఉన్నారు, గాని గ్రాహం లేదా హాం అను చివర నామము గలవారు లేరు, దానికి "జనములకు తండ్రి అని అర్తము. అక్కడ బోధించుటకు అతడు వెళ్ళేను. ఘడియవైపు చూడండి! ఇక్కడ వేషధారులు, అవిశ్వాసులు, మరియు విశ్వాసులు ఉన్నారు. ఈ ముగ్గురును వచ్చిరి. అందులో ఇద్దరు పట్టణములోనికి వెళ్ళిరి, ఒక ఆధునిక బిల్లీ గ్రాహం, మరియు ఓరల్ రాబర్ట్స్ ఆ జనులమధ్య ప్రసంగించుచున్నారు. ఆ దృశ్యమును యేసు ప్రస్తావించెను.

GEN 18:3,8-10,12,13

 

28గమనించండి, ఏర్పరచబడినవారు వచ్చుచున్నారు, ఇక్కడ బయట కూర్చొనియున్నారు, అది అబ్రాహాము మరియు అతని గుంపు. మరియు అబ్రహాముతో నిలచియుండిన ఈ మనుష్యుని గమనించండి, అతడు దేవునియొక్క గుణలక్షణమును వెల్లడిచేసెను. "శారా ఎక్కడ?" అని ఆయన అడిగెను. ఆమె పేరు శారయిగా ఆ ముందు రోజన్నది; ఇప్పుడు శారా, శా-రా. "అబ్రాము కాదు," అబ్రాహాము. "అబ్రాహాము, నీ భార్యయగు శారా ఎక్కడ? అని అడిగెను.

"ఆమె నీ వెనుకనున్న గుడారములో యున్నది," అని చెప్పెను.

"నిన్ను నేను దర్శించనైయున్నాను," అని చెప్పెను. అప్పుడు అబ్రహాము ఆ సంభాషణను వినెను. "వాగ్దాన ప్రకారము నిర్ణయకాలములో నిన్ను దర్శించెదను."

మరియు శారా చెంగుచాటున నవ్వుకొనెను, మరియు "నేను నా యజమానుడు ముసలివారమైపోయాము, ఇంకా మేము యువ్వన స్త్రీ పురుషులవలె జీవించగలమా? మానవ సంబంధము ఎన్నో సంవత్సరముల నుండి లేనే లేదు. నేను కనుటయా?" అని చెప్పి ఆమె నవ్వుకొనెను.

మరియు ఆ మనుష్యుడు అబ్రాహాము వైపు చూచుచుండెను, శారా అతని వెనుకనున్న గుడారములో యుండెను, "ఈ సంగతులు ఎట్లు జరుగును అని శారా నవ్వుచున్నది గదా?" అని అడిగెను. ఆయన తన్నుతాను గుర్తించుకొనెను.

మరియు అబ్రాహాము అతనిని "ఎలోహిం" అని పిలచెను. ఇప్పుడు, పరిశుద్ద గ్రంథము చదువువారు దీనిని ఎరుగుదురు గదా? ఎలోహిం, దేవుడు, సర్వసమృద్ధిగలవాడు (చూచారా?), మానవ శరీరములో ప్రత్యక్షమాయెను, ఒక దూడయొక్క మాంసము తినెను, ఆవు పాలు త్రాగెను, వెన్న రొట్టె తినెను. ఎలోహిం దేవుని యొక్క గుణలక్షణములను చూపించెను. మరియు అబ్రాహాము అతనిని దేవుడు అని పిలచెను. ఏమిటి? ఆయన ఎలోహింగా గుర్తించబడెను.

LUKE 17:28,30•

HEB 1:1,2

 

29లూకా 17వ అధ్యాయములో యేసు చెప్పెను. (ఆయా కాలములలో ప్రవక్తల ద్వారా మాట్లాడిన దేవుడు అంత్య దినములందు కుమారుని ద్వారా మాట్లాడెను) ఇప్పుడు గమనించండి, ఆయన చెప్పెను, "మనుష్య కుమారుడు ప్రత్యకమగు దినములలో." గమనించండి, "ప్రత్యకపరచబడెను," "తెలియజేయబడెను." ఈ చివరి దినములలో అంతమునకు ము౦దుగా, మనుష్య కువూరుడు ప్రత్యకపరచబడినప్పుడు, ఈ సొదొమ దృశ్యము మరల కనబడును. "సొదొమా దినములలో ఉండినట్లుగానే, మనుష్య కుమారుడు ప్రత్యకమగు దినములలోను ఉండును. ఆయన బయలుపరచబడి, సంఘమునకు తెలియచేయబడును, ఏర్పరచబడినవారి (సాదొమకు గాని లేక సొదోమీయులకు కాదు, లేక సొదొమలో వున్నవారికి కాదు గాని ఏర్పరచబడినవారికి.) అబ్రాహాము ఏర్పరచుకొనబడిన వాడు. అబ్రాహాము యొక్క రాజరిక సంతానము విశ్వాసులే, వాక్యమైయున్న యేసుక్రీస్తు ద్వారా వారు ఏర్పరచుకొనబడిరి. మరియు మనుష్య కుమారుడు ప్రత్యకపరచబడినపుడు, అలాగే మరల అదే స్థితియుండును.

2PET 2:8

 

30ఈనాటి ప్రపంచమువైపు చూడండి. ఇంతకన్న ఘోరమగు సొదొమ గొమోర్రాను ఎన్నడూ నేను చూడలేదు. సోదొమ మరియు గొమోర్రా! సంఘము వైపు చూడండి, లోతు అక్కడ కూర్చొనియున్నట్లుగానే యున్నది, నీతిమంతుడగు లోతు హృదయము సొదొమ యొక్క పాపమును చూచి దుంఖించుచుండెను. చాలా మ౦ది సేవకులు, వారు చాలా మ౦చివారే, కూర్చొని ధ్యానించుచూ తమ ప్రసంగ అంశములను తయారు చేసికొనుచున్నారు. బయటు వీధుల్లో స్త్రీలు పొట్టిబట్టలు ధరించుకొని; మరియు నీతిమాలినవారిగా తిరుగుచూ, మరియు క్రియలు చేయుచూ ఉంటే తమకు పట్టనట్టు కూర్చొని యున్నారు; ఏమైనా అన్నచో అతడు సంస్థ నుండి వెళ్ళగొట్టబడును. నీతి కొరకు నిలబడి మాట్లాడ కలిగిన ధైర్యము లోతునకు లేకపోయెను, ఈనాటి ఆదునిక సొదొమ మరియు గొమోర్రా కూడా అలాగేయున్నది.

అయితే సోదొమ బయుట కొందరున్నారు, వారు మనుష్య ఇచ్చవలన పుట్టినవారు కారు, కాని దేవుని చిత్తమువలన, దేవుని బీజమువలన పుట్టినవారు. అక్కడున్న గుర్తింపును గమనించండి, కేవలము బోధకాదు, ఒక మానవునిలో దేవుని యొక్క వాక్యము శరీరధారియొన సూచన గుర్తించబడినది. అప్పటివలెనె మరల ఇప్పుడును జరుగనైయున్నది, మరియు ఇది ఖచ్చితంగా ఆ దినమే. ప్రతిదియు పరిపూర్ణముగా యున్నది. సమస్తము వరుసలోనికి వచ్చియున్నది. దానిని కొద్ది నిమిషములు చెప్పుకొను సమయమున్నచో బాగుండును, కాని సమయము లేదు, కావున తొందరపడవలెను. చివరి దినములలో మరల అదే స్థితి తిరిగి ఏర్పడి యున్నది.

EXOD 3:7,8•

HEB 1:1,2•

HEB 13:8

 

31ఇప్పుడు, హెబ్రియులు 10:1, "దేవుడు ఆయా సమయములలో ప్రవక్తల ద్వారా తననుతాను బయలుపరచుకొనెను. మరియు చివరి దినములలో తననుతాను కువూరుని ద్వారా బయలుపరచుకొనెను, హెబ్రియులు 13:8గా ఆయన మారెను, "నిన్న, నేడు, నిరంతరము ఏకరీతిగాయున్నాడు."

గమనించండి, దేవుడు గత కాలములో మోషేతో మాట్లాడెను. మరియు ఇప్పుడు, గుర్తుంచుకొనండి. ఆయన తనను తాను మండుచున్న పొదలో అగ్నిస్తంభముగా, ఒక వెలుగుగా గుర్తింపుచేసికొనెను. దేవుడు ఆయా సమయములలో అలాగే చేసెను. మరియు ఆయన మోషేతో మాట్లాడెను. మరియు ఆ వెలుగు ఏమి చేసెను? అది దేవునియొక్క గుణలక్షణమును వెల్లడిపరచెను; అది వాక్కును పలికెను "ఐగుపులోని నా ప్రజల మూలుగును నేను వినియున్నాను. వారి మొరలను, మరియు ములుగులను వినియున్నాను, మరియు నా వాక్యమును గుర్తుకు తెచ్చుకొనుచున్నాను. నేను వెలుగుగా అగ్నిస్తంభములో దిగి వచ్చి వెళ్ళి నా జనులను విమోచించెదను. మోషే, నిన్ను నేను పంపుచున్నాను."

DEUT 18:15,19

 

32దేవునియొక్క గుణలక్షణములను గమనించండి. చేతినిండా ధూళిని పట్టుకొని గాలిలోనికి విసరెను. మరియు అది ఈగలుగా మారెను. దేవునియొక్క సృష్టిచేయు గుణలక్షణము మోషేలో వుండెను.

మరియు మోషే ద్వితీయోపదేశకాండము. 18:15లో ఇలా పలికెను, "మీ ప్రభువగు దేవుడు నావంటి యొక ప్రవక్తను పుట్టించును." ఇప్పుడు, గమనించండి, అది మరల వాక్యము యొక్క గుణలక్షణము. దేవుడు మోషే ద్వారా మాట్లడుచున్నాడు, తనవంటి యొక ప్రవక్తను ప్రభువు లేపునని వారికి చెప్పెను. ఇప్పుడు ఈ వాగ్ధాన వాక్యముగా ను౦డుటకు యేసు యొక్క గుణలక్షణములు గుర్తించబడినవో గమనించండి. యేసు యొక్క గుణలక్షణములను గూర్చి మోషే ముందే చెప్పెను. ఇప్పుడు గవునించండి. "మీ దేవుడగు యొహోవా," అనగా దేవుడు అదే వాక్యము; "నావంటి ఒక ప్రవక్తను మీలో పుట్టించును. ఆ ప్రవక్త యొక్క మాట విననివాడు జనులలో నుండి కొట్టివేయబడును." ఇప్పుడు, గమనించండి. యేసు వచ్చినప్పుడు ఎట్టి గుణశీలమును కలిగియుండును? చూచారా? గమనించండి. ఇప్పుడు, ఈ వాగ్దాన వాక్యము, ఆయన మోషే వంటి ఒక ప్రవక్తగా ఉండునని వాగ్దానము చేయబడెను.

33ఇప్పుడు, వారికి అన్ని రకముల ఉపదేశకులు, అన్ని రకముల బోధకులు ఉండిరి. మలాకీ తరువాత నాలుగు వందల సంవత్సరముల పాటు ప్రవక్తలేడు, మరియు ఇప్పుడు ఒక్కసారిగా రంగము మీదికి ఒకాయన వచ్చెను.

ఇప్పుడు, అక్కడ ఒకనికి ఇద్దరు కుమారులుండిరి, వారు జాలరులు, మరియు ఒకని పేరు అంద్రేయ, మరొకని పేరు సీమోను. ఆ దినములలో ఏలాగు కనిపెట్టి చూడవలెనో వారికి వారి తండ్రి చెప్పెను; అక్కడ ఎన్నో అబద్ద సంగతులు జరుగనారంభించినవి. ఆ వృద్ధుడు, ఒకప్పుడు నేను ఒక చిన్న పుస్తకమును చదివాను, ఒకవేళ - అది కట్టుకథ కావచ్చును, నాకు తెలియదు - "కుమారులారా, మనమదరము ఎదురు చూచుచున్నటుగా, ఇప్పుడు మెస్సీయా రాకడకు ముందుగా, అన్ని రకముల సంగతులు జరుగు కాలము ఒకటి వచ్చును. కాని మెస్సియాను తెలిసుకోను మార్గము ఒక్కటే, ఆయన వాక్యానుసారముగా ఉండును. ఆయన ప్రవక్తగా ఉండును, ఎందుకనగా ఆయన ప్రవక్తగా వుండునని దేవుని వాక్యము చెప్పెను," అని ఆ వృద్దుడు చెప్పెను.

JOHN 1:42•

JOHN 5:35,36•

ACTS 4:13

 

34అంద్రేయు యోహాను మాట వినెను. యోహాను చేయుచుండిన ఒకే ఒక పని ఏదనగా, ప్రవచనము చెప్పుచుండెను. యేసు ఈలాగు చెప్పుట మీరెరుగుదురు, "మీరు యోహాను వెలుగులో నడచియున్నారు, కాని నా యొద్ద యోహానుకంటె గొప్ప వెలుగున్నది. యోహానుకంటె గొప్ప గుర్తింపు నాకున్నది, ఎందుకనగా నేను చేయుటకు తండ్రి నాకిచ్చిన కార్యములు నన్ను గూర్చి సాక్ష్యమిచ్చుచున్నవి." యోహాను కేవలము ప్రసంగించెను, అతడు మార్గమును సరాళము చేసెను, దేవుడు వాగ్దానము చేసిన అద్భుతములు గాని మరేమీ ఇతర గుణలక్షణములు గాని వెల్లడి కాలేదు. కాని ఇక్కడ యేసు ఆ గుణలక్షణముతో వచ్చెను.

ఒక రోజున సీమోను ఆయన మాటలు వినుటకు వెళ్ళేను, మరియు ఆ వెంటనే… సీమోను బహుశా అంద్రేయతో వెళ్ళియుండును. అంద్రేయ ముందు నుండియే హాజరగుచుండెను, కాని సిమోను, అతడు ఆయన సన్నిధిలోనికి వచ్చునపుడు. ఇప్పుడు, ముగింపులో ఉన్నాము - అతడు యేసు సన్నిధికి రాగానే, యేసు అతనివైపు చూచి; "నీ పేరు సీమోను, నీవు యోనా కుమారునివి," అని ఆయన చెప్పెను. చూడండి. ఆ వాగ్దానము చేయబడిన గుణలక్షణము ఈయనలో గుర్తి౦పబడును.

అతడు సంతకము కూడా చేయజాలడు, అతడు విద్యలేని వాడు మరియు పామరుడు అని పరిశుద్ద గ్రంథము చెప్పెను. అయితే ఆ గొప్ప గుర్తింపును చూచి వెంటనే అతడు తన అవిశ్వాసమునంతటినీ విడిచిపెట్టి, మరియు "మేము ఎదుర చూచుచున్న మెస్సీయా ఈయనే," అని అతడు చెప్పెను. సరి, అతడు దానిని నమ్మొను.

JOHN 1:45,46

 

35ఫిలిప్పు అను పేరుగల ఒకతను అక్కడ నిలబడియుండెను, అతడు పట్టణమును దాటి, కొండ దాటి, దేశమును దాటి, పదిహేను మైళ్ళు వెళ్ళి ఆ మరుసటి రోజు తన స్నేహితుడగు నతానియేలును తీసికొని వచ్చెను. అతడు ఒక చెట్టు క్రింద ప్రార్ధి౦చుచుండెను. "వచ్చి చూడుము, యోసేపు కుమారుడగు నజరేయుడగు యేసును మేము కనుగొనియున్నాము," అని అతడు చెప్పెను.

"ఇప్పుడు, ఇప్పుడు, నజరేతు నుండి మంచిది ఏదయినా రాగలదా, అక్కడున్నవారు క్రింద తరగతి జనులు గదా?" అనెను.

"వచ్చి చూడుము!" అని అతడు చెప్పెను.

ఒక మనిషి చెప్పగలిగిన మేలైన మాట అంతకన్న మరొకటి యుండదు. ఇంటియొద్ద కూర్చొని విమర్శించవద్దు. వచ్చి కనుగొనుము, లేఖనములను పరిశోధించుము. వచ్చి చూడుము.

JOHN 1:47-50

 

36వారు ఆ చుట్టు దారిన నడచి వచ్చిరి. జరుగుచున్న దానినిగూర్చి సంభాషించు కొనుచుండిరి, సిమోను పేరును, అతని తండ్రి పేరును ఆయన ఎట్లు చెప్పెనో ముచ్చటించుకొనిరి.

అప్పుడు నాకు తెలియదు గాని, అతడు ఒక ప్రార్ధన వరుసలోనికి గాని, ఆ బయటనున్న జనసమూహములోనికి గాని అతడు వచ్చియుండును. కాని ఎక్కడికి వచ్చినప్పటికిని, మొదటిసారిగా యేసు కన్నులు అతని మీద పడెను, "చూడుడి, ఇతడు ఏ కపటము లేని ఇశ్రాయేలీయుడు," అని ఆయన చెప్పెను.

"బోధకుడా, నీవు ఎప్పుడు నన్ను ఎరుగుదువు?" అని అతడు అడిగెను.

"ఫిలిప్పు నిన్ను పిలువక ముందే, నీవు ఆ చెట్టు క్రింద ఉన్నప్పుడే, నేను నిన్ను చూచాను" అని ఆయన పలికెను. అది అభిషిక్తుడగు దేవునియొక్క గుణలక్షణములకు గుర్తింపు.

"రబ్బీ, నీవు దేవుని కుమారుడవు," అని అతడు పలికెను. ఏమిటది? ఆయన గుణలక్షణములు ఆయనను గుర్తించినవి. ఆయనే అభిషిక్తుడని లేఖనముల ద్వారా తెలియపరచబడెను, దేవుడు శరీరమందు అభిషేకించబడెను. దేవుడు క్రీస్తునందుండెను, లోకమును తనలో సమాధానపరచుచుండెను. "రబ్బీ! నీవు దేవుని కుమారుడవు. నీవు ఇశ్రాయేలుకు రాజువు!" అని అతడు చెప్పెను.

యేసు ఇట్లనెను, "నేనది చెప్పినందున నీవు నన్ను నమ్ముచున్నావా? ఇంతకంటె గొప్పవాటిని నీవు చూతువు."

MATT 12:24,31,32•

MARK 3:22,28,29•

LUKE 11:15•

LUKE 12:10

 

37అప్పుడు అక్కడ నిలబడియున్న వారిలో ఆ మాటలని నమ్మనివారున్నారు. ఈ మనుష్యుడు బయల్జేబూబు; అదృష్టములు చెప్పువాడు" వారు పలికిరి.

యేసు ఇట్లనెను, "అందును బట్టి మిమ్మును క్షమించుచున్నాను. కాని పరిశుద్ధాత్మ వచ్చినపుడు మీరు ఈలాగు మాట్లాడినయెడల మీకు ఈ లోకములో గాని, రాబోవు లోకములో గాని క్షమాపణ యుండదు."

చూడండి. ఇంకా పరిహారము జరుగలేదు. చూడండి, నీకు వుండదు… తీర్పు జరుగకుండా నిన్ను నరకములోనికి త్రోయరు. ఈ దేశము ఆలాగు చేయదు; దేవుడు కూడా ఆలాగు చేయుడు. తీర్పును పొందువరకు మీరు గొలుసులతో బంధించబడి చెరసాలలో యున్నట్లుగా వుందురు. మరియు మీరు చూడండి, ఆయన వారిని శిక్షించలేడు, ఎందుకనగా పరిహారము జరుగలేదు.

కాని ఆయన మరణము, సమాధి తరువాత రక్తమునుండి ఒక గురుతుగా పరిశుద్ధాత్మ వచ్చెను, దానికి విరోధముగా మాట్లాడుటయే క్షమాపణలేని పాపము. దానికి విరోధముగా కేవలము ఒక్క మట పలికినా; ఎన్నడూ, ఎక్కడా క్షమాపణ యుండదు. దానికి విరోధముగా ఒక్క మాటయు పలుకరాదు, (చూచారా?). అది ఎంత గొప్ప సంగతి.

ఇప్పుడు, కావున ఇది ఆయనను ఆభిషిక్త మెస్సీయాగా గుర్తించెనని మరల మనము కనుగొ౦దుము, క్రీస్తునందు దేవుడు, చివరి దినములకు పరిహారము క్రీస్తు చేసెను. ఇప్పుడు, నతానియేలుకు, అతడు దానిని నమ్మి మరియు ఆయనను గుర్తించెను.

JOHN 4:4,5,8•

JOHN 5:19•

HEB 1:1,2

 

38సుకారు అను పట్టణము సమరయలోనున్నది, ఒకసారి ఆ పట్టణపు ఒక స్త్రీ నీళ్ళ కొరకు బావియొద్దకు వచ్చెను. యేసు ఆ దారిన వెళ్ళవలసిన అవసరత కలిగియుండి, యెరూషలేము నుండి యెరికోలోనికి కొండదిగి, వెళ్ళుచుండెను, కాని ఆయన సమరయ చుట్టు తిరిగి వెళ్ళుచుండెను. ఆయనకు వెళ్ళవలసిన అవసరము వచ్చెనని ఆయన చెప్పెను; తండ్రి అక్కడికి ఆయనను నడిపించెను. ఆయన అక్కడకు చేరినప్పుడు ఆయన శిష్యులను బయటకు పంపి, ఎదురు చూచుచూ కూర్చుండెను, అశ్చర్యముగా వున్నది, అది ఏమైయుండునో నేను ఊహించుచున్నాను.

ఇప్పుడు, గుర్తుంచుకొనుడి, యోహాను 5:19లో యేసు చెప్పెను, "తండ్రి చేయుచున్న దానిని చూచి మాత్రమే కుమారుడు ఏదయినా చేయును, గాని తనంతట తాను ఏమియు చేయడు, అని మీతో నేను నిశ్చయముగా చెప్పుచున్నాను." ఇప్పుడు, గురుంచుకొనుడి, ఆయన చూడకుండా, వినకుండా, ఏ ఒక అద్భుతమును కూడా ఎన్నడూ చేయలేదు. "మొదటగా తండ్రి చేయుట చూచినప్పుడే కుమారుడు దానిని చేయును."

చూడండి, ఆయన ఎవరైయుండెనో దానిని చూపించెను, ఆయన ప్రవక్త, దైవ ప్రవక్త. ప్రవక్తకంటే గొప్పవాడు, ఆయన దేవుడు. ప్రవక్తలో ఉన్నదంతయూ ఆయనలో యుండెను, దానికి అదనముగాను ఉండెను. ప్రవక్తలు వాక్యములో ఒక భాగమును మాత్రమే కలిగియుండిరి. ఆయనలో పూర్తి వాక్యముండెను, ఆయనే వాక్యము యొక్క సర్వసంపూర్ణతయై యుండెను. కాని గమనించండి, "దేవుడు ఆ యూ సమయుములందు, ఆయా విధములుగా చిన్న చిన్న భాగముల ద్వారా మాట్లాడెను. ఈ చివరి దినమున, వాక్యము యొక్క సంపూర్ణత ఆయన కుమారుడగు యేసు క్రీస్తునందు వచ్చెను. దేవుడు మన మధ్య శరీరధారి అయ్యెను."

JOHN 4:7•

JOHN 8:57,58

 

39ఈ స్త్రీ, ఈమె చెడ్డదిగా పేరొందెను, కొన్నిసార్లు మనము ఆమెను వేశ్య అని పిలచుచుందుము. బహుశా విచ్చలవిడిగా పెరిగియుండవచ్చును. అది ఆమె తప్పు కాదు గాని, ఈనాటివలె, అది ఆ చిన్న యువతి వెలుపలకు వెళ్ళి మరియు ఆ విధముగా చేయుటకు అనుమతించిన తల్లిదండ్రుల పొరపాటుగా వున్నది. ఆమె అందమైనది కావచ్చును, ఆమె సుమారు పదకొండు గంటల వేళలో కుండతో నీళ్ళు తెచ్చుటకు వెళ్ళేను.

ఇప్పుడు, జ్ఞాపకముంచుకొనుడి, మీరు తూర్పు దేశములకు వెళ్ళి చూడండి, వారు కొంచెము కూడ ఏమీ మారలేదు; ఇంకా అదే ఆచారములున్నవి. స్త్రీలు బయటకు వెళ్ళుదురు, కన్యకలు వేకువనే లేచి నూతి యొద్దకు వెళ్ళి నీళ్ళు తెచ్చెదరు, ఒక వేశ్య లేదా చెడ్డ పేరుగల స్త్రీ వారితో పాటుగా వెళ్ళజాలదు. వారు ఒకరితో ఒకరు కలియరు.

వారందరూ వెళ్ళిపోయిన తరువాత ఆమె రావలెను. ఆమె బహుశ అలసిపోయి వచ్చియుండును, ఆమె ఆ రాత్రి ఒక క్రొత్త స్నేహితునితో, ఆమె భర్తతో కాలము గడిపియుండును. ఆమె ఈ కుండ పట్టుకొని వచ్చినది, దానిని క్రింద పెట్టినది. దానిని పెట్టి, నూతిలోనికి చేదవేయుచుండగా ఒక మనుష్యుడు ఈలాగనుట విన్నది, "నాకు దాహమున కిమ్ము."

ఆమె చుట్టు చూడగా ఒక మధ్యవయస్కుడు అక్కడ నిలబడియుండెను, ఆయన గడ్డము నెరసినట్లున్నది. ఆయన వయస్సు ముప్పది ఏండ్లే గాని ఆయన ఏబది ఏండ్ల వానివలె కనబడినట్లు పరిశుద్ద గ్రంథము చెప్పుచున్నది. "నీకింకా ఏబది ఏండ్లు కూడా లేవు గదా, నీవు అబ్రాహామును చూచితినని ఏల చెప్పుచున్నావు?"

"అబ్రాహాము కంటే ముందే నేనున్నాను," అని ఆయన చెప్పెను. చూచారా? చూడండి, వారికది అర్థము కాలేదు. ఆయన మాటలు వారికి పాములు జెర్రులు పాకినట్టుండెను.

ఈ రోజున మనము క్రైస్తవులను గుడికి రమ్మని బ్రతిమాలుచూ, అర్ధించుచూ, వీపు నిమురుచూ, వాగ్దానములు చేయుచూ యున్నాము, "మీరు ఆలయమునకు వచ్చినచో పలానిది చేయదము," అని చెప్పుచున్నాము.

JOHN 6:53,66

 

40యేసు ఈ భూమిమీద వున్నపుడు, ఆయనతో చాలామంది యుండిరి. ఆయన జనులవైపు చూచి, వారిని విడిపించుకోగోరి; ఆయన ఇట్లనెను, "మనుష్య కుమారుని యొక్క శరీరమును తిని ఆయన రక్తమును త్రాగితేనే గాని, మీకు జీవముండదు."

అక్కడ ఒక వైద్యుడు కూర్చొనియున్న దానిని మీరు ఊహించగలరా? "ఎందుకు," "ఈ మనుష్యుడు మనలను నరరూప రాక్షసులుగా ఉండగోరుచున్నాడు. ఆయన రక్తమును త్రాగుటుయా? అవివేకము. ఈ పిచ్చివానిని విడిచిపెట్టి మీరందరూ వచ్చేయండి," అని (అతడు) అనెను. వారు వెళ్ళిపోయిరి.

ఆయన దానిని ఎన్నడూ వివరించలేదు. దానిని ఆయన వివరించనవసరము లేదు. నీవేమి చేయుదువో అని ఆయన కొన్నిసార్లు నీ విశ్వాసమును ఊపుచున్నాడు. మరియు ఈ దినమున ఆయన దానినే చేయుచున్నాడు. అవును, నీవు నిజముగా నమ్ముచున్నావా, నీవు ఎక్కడ నిలబడియున్నావు అని చూచుటకు ఇది మిముమ్ములను కొంత భయపెట్టునదిగా కనిపించనిమ్ము.

గుర్తుంచుకొనండి, ఆ శిష్యులు దేవునిచే ముందుగా అభిషేకించబడిరి, ఎన్నడూ కదలలేదు. వారు దానిని వివరించలేరు, కాని వారు కదలగోరలేదు. అప్పుడు ఆయన మరలా వచ్చుచున్నాడు. ఆయున చెప్పెను…

వేలకోలది, ఆ సభ యంతయూ ఆయనను విడిచి వెళ్ళిపోయిరి.

JOHN 6:60,62

 

41అక్కడ కూర్చొనియున్న తన డెబ్బదిమంది సేవకులతో ఆయన చెప్పెను, వారిని ఆయన అభిషేకించి వెళ్ళి తనకంటె ముందుగా బోధించుడని చెప్పెను. వారినే ఈలాగడిగెను, "నేను వారిని కదిపి మరియు వారు ఎక్కడ వున్నారో చూచెదను." కావున ఆయన చెప్పెను, "మనుష్య కుమారుడు తాను వచ్చిన చోటుకు తిరిగి ఎక్కిపోవుట మీరు చూచునపుడు ఏమందురు?"

"మనుష్య కుమారుడు పరలోకమునకు ఎక్కిపోవుట ఏమిటి? మనము ఆయనతో చేపలు వేటాడితిమి; ఆయనతో మనము నదియొడున పరుండి యుంటిమి; ఆయనతో మనము భుజించాము. ఆయన పుట్టిన పశుల తొట్టి మనము చూచాము. ఆయన తండ్రిని, ఆయన సోదరులను మనము ఎరుగుదుము. మరియు ఈ మనుష్య కుమారుడు తిరిగి తాను వచ్చిన చోటికి ఎక్కిపోవుట ఏమిటి? ఆయన నజరేతునుండి వచ్చెను. ఇది కఠినమగు మాట. వారు కూడా వెళ్ళిపోయిరి. "దీనిని మనము చూడలేము," అని వారు చెప్పిరి. మీరు చూచారా? ఏమి జరిగినది? (ఆ శిష్యులను మాత్రము ఎన్నడూ కదలించలేదు. దానిని వారు వివరించలేరు.) వారందరూ వెళ్ళిపోయిరి. దానిని ఆయన ఎన్నడూ వివరించలేదు. ఆయన వివరించనవసరము లేదు.

JOHN 4:7•

JOHN 6:67,68,70

 

42ఈనాడు మనకు ఎరువు వేయబడిన మొక్కలవంటి క్రైస్తవులున్నారు, వారికి నీవు మందు చల్లి, గారాబంగా నవ్వించవలసియున్నావు, "నీవు నాకు సహవాసమిచ్చెదవా? సహకరించెదనా, దీనిని చేసెదవా?" ఓ, మీరు ఎరువు వేయబడిన మొక్కలవలె యున్నారు. మనకు అసలయిన క్రైస్తవ్యము అవసరమై ఉన్నది, వారు దేవుని ఆత్మ మూలముగా జన్మించవలసియున్నారు. మరియు వారికి సహాకారము, మరేదియూ అవసరము లేదు; వారు దేనినీ కోరరు.

యేసు ఆ శిష్యుల వైపు తిరిగి, ఇట్లడిగెను, "మీరును వెళ్ళిపోవలెనని అనుకొనుచున్నారా? మీరును పొగోరుచున్నారా?" "మిమ్మును పన్నెండుమందిని నేను ఏర్పరచుకొనియున్నాను, గాని మీలో ఒకడు అపవాది. మీరు కూడా పోవచ్చును గదా?" అని ఆయన అడిగెను.

అప్పుడు పేతురు మరచిపోజాలని ఆ మాటులు పలికెను, "ప్రభువా, మేమెక్కడికి పోదుము? మేము నమ్ముచున్నాము. నీవే గుర్తించబడిన జీవపు ఊట అని మేము ఎరిగియున్నాము. నీవద్ద వాక్యము కలదు. మాకు నమ్మకము కుదిరినది."

ఈ చిన్న స్త్రీ అక్కడ నిలబడియున్నది… "నాకు దాహమున కిమ్ము" అని ఆమెను అడిగెను.

JOHN 4:9,16-19,25,26,28,29

 

43ఆమె ఇట్లన్నది, "మనకు ఆచారము కాదు గదా, మన మధ్య తేడాయున్నది; ఆలాగు మనము వ్యవహరించము గదా."

యూదులకు మిగతావారికి మధ్య ఎట్టి తేడా లేదని వెంటనే ఆమె తెలిసికొనవలెనని ఆయన కోరెను. ఆయన దేవుడు, "వెళ్ళి నీ భర్తను ఇక్కడికి తీసికొని రమ్ము," అని ఆయన పలికెను.

"నాకు భర్త లేడు" అన్నదామె.

"నీవు నిజమే చెప్పితివి. నీకు అయిదుగురున్నారు, కాని నీతో ఇప్పుడున్నవాడు నీకు భర్త కాడు," అని ఆయన అనెను.

ఇప్పుడు ఆ స్త్రీని గమనించండి. ఏదో జరిగినది, ఆమె హృదయములో ముందుగా నిర్ణయించబడిన చిన్న బీజమున్నది.

ఆయన ఆ పరిసయ్యులకు చెప్పినపుడు, వారివైపు చూడుడి, వారు తాము నమ్మినదానివలన అంధకారములో యుండిరి. వారు క్రైస్తవులమని చెప్పుకొనిరి, వారు శిష్యులమని చెప్పుకొనిరి, వారాయునను ప్రేమించుచున్నట్లు చెప్పుకొనిరి. కాని సత్యము వచ్చినప్పుడు, అది వారిని అంధులను చేసెను.

కాని ఇది వచ్చినపుడు, ఇది జీవమును తీసికొని వచ్చెను, వారిలోవున్న నలుపును దూరము చేసి వారిని తెల్లగా చేసినది. అడిగెను…

"అయ్యా! నీవు ప్రవక్తవని నేను గ్రహించుచున్నాను. ఇప్పుడు, నాలుగు-వందల సంవత్సరముల నుండి మాకు ప్రవక్తలేడు. చూచారా? నీవు ప్రవక్తవని నేను గ్రహించుచున్నాను. ఇప్పుడు, మెస్సియా వచ్చినపుడు, ఆయన యొక్క గుర్తింపు ఆ విధమైన గుణలక్షణముగా వుండును; ఆయన ఈ సంగతులను మూకు చెప్పును," అని ఆమె అన్నది.

ఆయన, "నీతో మాట్లాడుచున్నవాడు ఆయనే," అనెను.

మరియు ఆమె కుండను అక్కడే విడిచిపెట్టి, పట్టణములోనికి వెళ్ళి, మరియు ఈలాగు చెప్పెను, "నేను చేసినవన్నియు నాతో చెప్పిన ఈయనను వచ్చి చూడండి. హృదయూలోచనలను ఎరిగిన వాక్యమైన, అభిషిక్తుడైన మెస్సీయా యొక్క గుణలక్షణము ఇదియే కదా? ఈయన మెస్సీయా కాడా?" ఓ! మై

MATT 9:20-22•

MARK 5:28,30-32,34•

MARK 8:25•

LUKE 8:43,45,46,48•

HEB 4:12

 

44చూడండి. రక్తస్రావముతో వున్న స్త్రీ, ఆయన గుణలక్షణముబట్టి ఆయన మెస్సీయా అని గుర్తించెను.

ఆయనే వాక్యమని ఆ రక్తస్రావ రోగముగల స్త్రీ గుర్తించెను.

హెబ్రియులు 4:12లో పరిశుద్ద గ్రంథము ఇట్లు చెప్పెను, "దేవునియొక్క వాక్యము రెండంచుల ఎటువంటి ఖడ్గముకంటెను వాదిగాలదై, హృదయాలోచనలను పరిశోధించి మనస్సులోనివి బయటకు తెచ్చును." (ఎందరు దీనిని ఎరుగుదురు?) "మనస్సులో." వాక్యము అదే అయివున్నది. ఆయనే వాక్యమై యుండెనని మీరు నమ్ముచున్నారా? ఆయన నిన్న నేడు, నిరంతరము ఏకరీతిగా యున్నాడని, మీరు నమ్ముచున్నారా? దానిని మీరు నమ్మినచో, అది దానిని స్థిరపరచును.

గమనించండి, ఈ చిన్న స్త్రీ ఇట్లనెను, "నేను ఆయనను తాకినచో చాలును, వారు ఆయననుగూర్చి ఎంత చెప్పినా నాకు అవసరము లేదు. ఆయన ఏమైయున్నాడని ఆయన చెప్పెనో దానిని నేను నమ్ముచున్నాను. ఆయనను నేను తాకిన యెడల, నేను బాగవుదును." ఆమె చొరబడి వచ్చి ఆయనను తాకెను, తిరిగి జనసమూహములోనికి పోయెను.

యేసు ఆగిపోయి, మరియు "నన్నెవరు తాకిరి?" అని అడిగెను.

మరియు ఆయన ఏదో మతిపోయినవానివలె వున్నాడని పేతురు చెప్ప ప్రయత్నించెను; "ఎందుకు, ప్రతి ఒక్కరూ, ఆలాగు నీవు మాట్లాడుట ఏల, నీగూర్చి ఏమనుకోవలెనో వారికి అర్థమగులు లేదు. ఇంత హోదా కలిగిన నీవు ఎవరు నన్ను తాకిరి?" అని అడుగుచున్నావా? అందరూ నీమీద పడుచున్నారు," అని అతడు పలికెను.

"కాని నేను బలహీనమయినట్లు నాకు తెలియుచున్నది; నాలో నుండి ప్రభావము పోయినది," అని ఆయన పలికెను. ఏదో జరిగినదని ఆయనకు తెలియును.

ఇప్పుడు, చూడుడి, తరువాత జరిగిన గొప్ప సంచలనమును చూడుడి. ఆమెను కనుగొనువరకు ఆయన ఆమెను చుట్టూ వెదకెను, మరియు ఆమె యొక్క స్థితిని ఆమెకు ఆయన చెప్పెను, మరియు ఆమె విశ్వాసము ఆమెను రక్షించినదని ఆయన పలికెను. ఆయన దేవుని యొక్క వాక్యముగా గుర్తించబడెను, హృదయ రహస్యములను తెలిసికొనెను. ఓ! మై, వాక్యము శరీరమును వివేచించును.. హృదయమును వివేచించును.

LUKE 24:17,18,31•

HEB 13:8

 

45ఇప్పుడు, ముగింపులో కొద్ది కణములు వినండి. ఇప్పుడు, హెబ్రియులు 13:8 నిజము, "ఆయన నిన్న, నేడు, నిరంతరము ఏకరీతిగా వున్నాడు," దానిని నీవు నమ్ముదువా? ఇప్పుడు, నేను చెప్పవలసినదానిని ఎంతో ఇక్కడ చెప్పుట లేదు. అప్పటివలె ఆయన నిన్న, నేడు, నిరంతరము ఏకరీతిగా యున్నచో. ఈ ప్రస్తుత సమయములోను ఆయన గుణలక్షణము అలాగేయుండి గుర్తించబడును, అది సరియేనా? ఆయన దానిని వాగ్దానము చేసెను. మరియు, మీరు గుర్తుంచుకొనుడి, ఆయన గుణలక్షణమే ఆయనకు గుర్తింపు. ఎంతమందికి ఇది అర్థమైనది? మీ చేతులెత్తండి. ఆయన గుణశీలమే ఆయనకు గుర్తింపు.

ఎమ్మాయి నుండి వచ్చిన వారిని గూర్చి చెప్పవలెను. యేసు సిలువ వేయబడెన. వారందరూ విచారముగా యుండిరి. వారు సమాధియొద్దకు వెళ్ళిరి, ఇప్పుడు వారు, "ఎవరో వచ్చి మరి ఆయనను దొంగిలించుకొనిపోయిరి?" అనుకొనిరి. ఒకనాడు ఆయన పొదల మధ్యనుండి వచ్చి మరియు వారిని వెంబడించెను, వారితో కూడా నడిచెను. ఆయన ఎమ్మాయి వెళ్ళుచున్నట్లుగా కనబడెను. మరియు వారు ఇలా అనిరి…

"మీరేల విచారముగా వున్నారు?" అని ఆయన అడిగెను.

"మంచిది, నీవు ఇక్కడ క్రొత్త వ్యక్తివి," అని ఆయన పలికెను.

ఆ తరువాత ఆయన వారితో లోపలకు వచ్చి ఆయన సిలువ మరణమునకు ముందు చేసినట్లుగానే, ఇప్పుడును ఒక క్రియ చేసెను. ఆలాగు చేయుటు ఆయన గుణలక్షణము. మరియు వారు వెంటనే ఆయనను ఆయన గుణలక్షణము బట్టి ఆయన సిలువవేయబడిన యేసు అని గుర్తించిరి. ఆమేన్.

HEB 4:15

 

46దేవుడు ఆయనను మృతులలో నుండి లేపెను, ఈనాడు ఆయున గుణశీలము అప్పటివలెనె యున్నది. మరియు యేసు ప్రవచించిన రీతిగా, సొదొమ దినములు తిరిగి వచ్చుచున్నవి. కుమారుడు ప్రజలకు బయలుపరచబడునప్పుడు అదే జరుగును. అది ఆయన గుణలక్షణమునకు గుర్తింపు. హెబ్రియులు 4:14, మరియు 15, "ఇప్పుడు ఆయన మన బలహీనతలను తాకగల మన ప్రధానయాజకుడు, ఆయన అప్పటివలెనె యున్నాడు." దానిని మీరు నమ్ముదురా? మన బలహీనతలు ఆయనను తాకెను. మంచిది, అది ఆయనను తాకినయెడల, ఆయన నిన్న నేడు, నిరంతరము ఏకరీతిగా యున్నట్లయిన ఆయనేలాగు ప్రవర్తించును? ఆయన గుణశీలము ఒకే రీతిగా వుండును. ఆ స్త్రీ ఆయన వస్త్రమును తాకినపుడు ఎట్లు ప్రవర్తించెనో అట్లే ఇప్పుడును ఆయన ప్రవర్తించును. దానిని మీరు నమ్ముదురా? ఆయన సదా జీవించుచున్నాడు, ఆయన సదా జీవించును, మరియు ఈనాడు ఆయన గుణలక్షణము ఇంకా ఆయనవలెనె యున్నటు వెల్లడిచేయుచున్నది. దానిని మీరు మీ పూర్ణహృదయముతో నమ్ముదురా? దేవుడు తన గుణలక్షణములను బట్టి గుర్తించబడును, అది ఆయనను సూచించును.

మన తలలు వంచుదము.

MATT 24:40•

LUKE 17:34•

REV 22:18,19

 

47పరమతండ్రీ, ఈ రాత్రి ఇక్కడ స్త్రీ, పురుషులము కూర్చొనియున్నాము. అయితే మేము, వాక్యమును తాకుట దేవుని తాకుటయే. మరియు, ఇక్కడ లేని దానిని చెప్పవలెనని నేను ప్రయత్నించుటకు నేను భయపడుదును. దానికి నేను నా స్వంత అనువాదమును చెప్పుటకు భయపడుదును, ఎందుకనగా నేను తప్పు చెప్పవచ్చును. మరియు "దీనిలో నుండి ఒక మాట తీసివేసినా, దీనికి మరో మాట కలిపినా, అట్టి వానికి జీవగ్రంథములో పాలులేకుండా పోవును," అని నీవు చెప్పితిని. ప్రభువా, అటువంటి చెడు పని నేను చేసినయెడల నా జీవితమునకు ఏమి లాభము? కాబట్టి నేను ఉన్నది ఉన్నట్టుగా చెప్పుచున్నాను.

మరియు, తండ్రి, దానిని నీవు గుర్తింపచేయుదునని వాగ్దానము చేసియున్నావు. రెండు-వేల-సంవత్సరముల క్రితము నీవు మృతులలోనుండి లేచి, ఈ రాత్రి సజీవముగా ఉన్నావని నేను నమ్ముచున్నాను, ఎప్పటివలెనె నీవు ఇక్కడ ఒకరిని, అక్కడ ఒకరిని సమాన్యులను పిలచుచున్నావు; గుంపులను కాదు, సంస్థలను కాదు, మానవులేర్పరచిన గొప్ప విధానములను కాదు. కాని నీవు అన్యజనులలో నుండి ఒక జనాంగమును పిలచుదునని చెప్పియున్నావు, "ఇద్దరు పొలములో యుందురు; ఒకరు విడిచిపెట్టుబడుదురు, ఒకరు కొనిపోబడుదురు. ఇద్దరు మ౦చముమీద యుందురు; ఒకరు కొనిపోబడుదురు, ఒకరు విడిచిపెట్టుబడుదురు." నీ నామము కొరకు పెండ్లికుమార్తెగా ఇక్కడ ఒకరిని, అక్కడ ఒకరిని ఏర్పరచుకొందువు.

AMOS 3:7•

LUKE 17:28,30•

JOHN 1:14

 

48నీ గుణశీలము నిన్ను గుర్తింపచేయునని నేను నమ్ముచున్నాను. వాక్యమైయున్న నీవు, ప్రత్యకపరచబడు దినమున సొదొమ దినములలో యుండినట్లుగానే యుండునని నీవు వాగ్దానము చేసియున్నావు. ఈ ఘడియ యొక్క వాక్యము ఆనాడు ప్రవక్తల యొద్దకు వచ్చిన వాక్యమువలెనె దానంతట అది ప్రత్యక్షమగునని తలంచుచున్నాము. మరియు, తండ్రి, యోహాను ఈ భూమి మీద నిలబడియుండుట మేము చూచుచున్నాము, అతడు బయలుపరచుచున్న వాక్యమును చూచుచున్నాము, మరియు వాక్కు ఎల్లప్పుడు ప్రవక్తల యొద్దకు వచ్చును, అని పరిశుద్ద గ్రంథము చెప్పెను. మరియు వాక్యము అప్పుడు శరీరధారి అయ్యెను, కావున అది తిన్నగా నీటిలోని యోహాను యొద్దకు నడచి వచ్చెను. ప్రవక్త యొద్దకు వాక్యము వచ్చెను.

తండ్రియగు దేవా, ఈ రాత్రి మాకు సహాయము చేయుమని ప్రార్థించుచున్నాము. మాకు అవిశ్వాసము లేకుండా చేయుము. మా తప్పులను క్షమించుము. రోగులను మరియు బాధపడుచున్నవారిని స్వస్థపరచుము. ప్రభువా, నీ నుండి వచ్చు ఒక్క మాట ఏ మానవుని మాటకంటెను అర్ధవంతముగా ఉండును. తండ్రీ, నీవే మాట్లాడుము, నీ ఒక్కమాట ఎంతో భావయుక్తమై యుండును. ఇప్పుడు, నీవు నిన్న, నేడు, నిరంతరము ఏకరీతిగావున్నావు. ఇప్పుడు, మమ్మును మేము నీకు అప్పగించుకొనుచున్నాము. మరియు మేము ఈ రాత్రి ఇక్కడ నుండి వెళ్ళిపోవుచున్నప్పుడు, ఆ ఎమ్మాయి గ్రామస్తులవలె తిరిగి లేచిన నిన్ను గుర్తించుదువు గాక. నీవు చేయు క్రియను చూతువు గాక. వారు వినినదానిని ఇక లెక్కచేయలేదు, ఆయనను ఎవరో దొంగిలించుకొనిపోయిరి, మరియు- ఇది, అది, లేక మరొకటి జరిగెను," అన్న మాటలను మరచిరి, "ఆయన మృతులలోనుండి తిరిగి లేచెనని వారికి తెలియును. ఈ రాత్రి నిన్నునీవు మరల సజీవునిగా చూపించుకొనుము, మరియు ఈ పట్టణములో వున్నవారిని, చుట్టు ప్రక్కల వున్నవారిని జీవమునకు అభిషేకించి నీ యొద్దకు తీసికొని రమ్ము. దీనిని యేసు నామమున అడుగుచున్నాము. ఆమేన్.

49ఇప్పుడు, పదిహేను నిమిషములపాటు మీరు కూర్చొనండి. మనకు దాదాపు పది నిమిషములు ఆలస్యమగును. నేను త్వరపడవలెను. ప్రార్ధన అట్ట (కార్డు)లను పిలచెదను. నేను నమ్ముచున్నాను బిల్లీ… వారిచ్చినది "జి" ప్రార్థన కార్డు గదా? జి ప్రార్థన కార్డులు G 1 నుండి 15 లేక 20, ఆ విధముగా మనము తీసికొనెదము. జి-1, ఎంతమంది . ఎవరికి జి సంఖ్య-1 వున్నది, మీ చేతిని ఎత్తండి, ఇది ఇక్కడ వున్నట్లయితే, చూద్దాము. నేను [టేపు మీద ఖాళీయున్నది] మరియు గుర్తుంచుకొనుడి. మీ ప్రార్ధన కార్డులను పట్టుకొనియుండండి, మీకు ప్రార్ధి౦చెదను. ఈ రాత్రికి మీకు ప్రార్ధి౦చెదను. ఒకటి, రెండు, మూడు, నాలుగు, అయిదు, ఆరు, ఏడు, ఎనిమిది, తొమ్మిది, పది. వీలయినంత త్వరగా ఇక్కడికి మీరు నడచిరండి, వరుసలో నిలబడవలెను. సరే. ఒకటి, రెండు, మూడు, నాలుగు, అయిదు, ఆరు, ఏడు. ఇక్కడ మూడు కనబడుట లేదు. ఏడు, ఏడు, మరియు ఒకటి, రెండు, మూడు … మరియు గుర్తుంచుకొనుడి. వారిని లెక్కించండి, రాయ్, నా కొరకు ఈ పనిని చేయువు. సరే, పది వరకు ఉన్నారు. చక్కగా ఉన్నారు. చక్కగా ఉన్నది, 1 నుండి 10. ఇప్పుడు 15, జి-1 నుండి 15, అది పదిహేను… లేక పది, పదకొండు, పండ్రెండు, పదమూడు , పధ్నాలుగు, పదిహేను. మంచిది. ఇక్కడ మనము— మనము ఆగుదమా? …? …మంచిది.

ఇప్పుడు, మేము తొమ్మిదిన్నరకు ముగించుదుము అను మా మాటను (చూచారా?) నిలబెట్టుకొనుటకు ప్రయత్నించుచున్నాము, కాని ఈ రాత్రి ఆ విధంగా చేయలేము, నాకు తెలియును. కాని ఇప్పుడు, మీరు శ్రద్దగా ఇక్కడ ఉండవలెనని నేను కోరుచున్నాను.

ISA 7:14

 

50ఇప్పుడు, నేను మీకు సత్యము చెప్పాను మరియు చెప్పిన సంగతులు ఈ బైబిలులో వున్నవి, మరియు ఇదే ఆ ఘడియ, మీరు మరో పాఠశాలలో చదువుకొని యుందురు. పరిసయ్యులు కూడ అంతే. కాని పరిశుద్ద గ్రంథము ఆ దినమున ఈలాగు పలికెను, "ఒక కన్యక గర్భవతియగును." ఆమె అయినది. మెస్సీయా యొక్క గుణలక్షణములు ఆలాగుండునని ఆయన చెప్పెను. ఆలాగుండెను. కాని దానిని వారు నమ్మలేదు. అయితే అది ఆయనను ఎప్పటివలె ముందుకు పోకుండా అడ్డగించలేదు. ఇప్పుడు వున్నట్లుగానే. మనము చివరి దినము యొక్క చివరి ఘడియలలో జీవించుచున్నాము.

మధ్య రాత్రికి మూడే నిమిషములున్నవని విజ్ఞానశాస్త్రము చెప్పుచున్నది. ఇప్పుడు అంత కూడా లేదని నేను తలంచుచున్నాను, ఏ క్షణములో అయినా సంభవించును. కమ్యూనిజము దేశమును బుజ్జగించుచున్నది, మరియు బోధకులు క్రీస్తుకు బదులుగా కమ్యూనిజమును వెంటనాడుచున్నారు. దానిని వారు ఖండించుటకు బయటకు వెళ్ళుచున్నట్లున్నది; గాని మనము ఏ ఘడియలో జీవించుచున్నామో వారు ఎందుకు చూచుట లేదు? కమ్యూనిజము, మనకు లేదు. ఓ, మై, నాకు కమ్యూనిజమును గూర్చి భయుము లేదు? ప్రభుని రాకడను ఎదుర్కొనుటకు నీవు సిద్దపడనియెడల ఏలాగుండును, సంఘమునకు ఏమగును. ఇప్పుడు, ప్రతి అమెరికను, దేవుని వైపు తిరిగి, కమ్యూనిజమునకు ఏమి జరుగునో గమనించవలెను. నీవు వ్యాధిని కనుగోవలెను, అప్పుడు నివారణను గూర్చి ఆలోచించెదవు.

51ఇప్పుడు, ప్రతివారు మర్యాదగా యుండవలెను; దయచేసి లేచి తిరుగవద్దు. ఇప్పుడు, ఎంతమంది ప్రార్ధన కార్డులు లేనివారున్నారు, మరియు దేవుడు మిమ్మును స్వస్థపరచవలెనని కోరుచున్నయెడల చేతులెత్తి "నేను నమ్ముచున్నాను," అని చెప్పండి. మీరెక్కడున్నా పరవలేదు.

ఇప్పుడు, చూడండి, ఇది బాగున్నదనుకొంటాను, [సహోదరుడు బ్రన్హం మైక్రోఫోనులోనికి ఊదుచున్నారు.] వెనుకనున్న మీకు వినబడుచున్నదా? మంచిది. మంచిది. రాయ్ సోదరుడా, ఇప్పుడు దానిని గమనించుము.

ఇప్పుడు, నేను చెప్పగలిగిన దానంతటికంటె, దేవుని నుండి వచ్చిన ఒక్క మాటు ఎంతో అర్థము కలిగియుండును.

ఇప్పుడు, ఇక్కడ నుండి చూచుట కష్టముగా యుండును, ఇది ఎల్లప్పుడు అలాగే వుండును. చూడండి. ఆ దీపములు నేరుగా మీ కండ్లలో పడుచున్నవి, మరియు ఆ జనులను దూరంగా చూచుట చాలా కష్టము.

మరియు నాకు తెలియదు… నిజంగా, ఏ ఒక్కరిని నేను చూడలేకపోవుచున్నాను, ఎంత మ౦ది నాకు అపరిచితులో, మీ గూర్చి అసలు నాకు ఏమీ తెలియదని చెప్పువారు చేతులెతుదురా? ప్రతిచోటు అట్టివారుందురని నేను ఊహించగలను. ప్రార్థన వరుసలో నాకు తెలియనివారు, మీ గురించి నాకు ఏమీ తెలియదు, అని చెప్పువారు ఎందరున్నారో చేతులు ఎత్తండి. ఆప్రార్ధనా వరుస అంతటిలో, నేను మీకు క్రొత్తవాడినని చెప్పువారు, మీరు వినగలుగుచున్నయెడల, మీ చేతులెత్తండి, అందరూ.

MARK 5:27,29•

LUKE 8:44•

HEB 4:15

 

52ఇప్పుడు, ఆయన ఎవరు? ఆయన మన బలహీనతలను త్రాకగల ప్రధాన యాజకుడు. ఆయన వస్త్రపు చెంగును ముట్టిన ఆ స్త్రీ ప్రార్ధన కార్డు లేనిది, కాని ఆమె ఆయనను అంటుకొన్నది, మరియు ఆలాగు చేయగా ఒక కార్యము జరిగినది. ఇప్పుడు, మీరును ఆ విధంగానే తాకండి, ఆయనను తాకండి. హెబ్రియులు 4. అధ్యాయము ఇలా చెప్పుటను ఎందరు ఎరుగుదురు? "ఇప్పుడు ఆయన మన బలహీనతలను తాకు ప్రధాన యూజకుడు." ఎందరికిది తెలియును? మంచిది ఆయన తన గుణలక్షణములను ఆలాగే వెల్లడిచేయనా? నిన్న, నేడు, నిరంతరము ఆయన ఏకరీతిగా యున్నచో, ఆలాగే ఆయన ఉండును. మ౦చిది. ఇప్పుడు, ఇది ..

పెర్రీ సోదరుడా, వారిని ఇప్పుడు నా యొద్దకు తెమ్ము. ఇప్పుడు, ప్రతివారు నిజముగా మర్యాదగా యుండవలెనని నేను కోరుచున్నాను. సరిగా ఇక్కడే, సరిగా సోదరీ, ఇక్కడికి రమ్ము.

నా మాట వినబడుచున్నదా? దీనిని చూచు ఇంజినీరు ఎవరో నాకు తెలియదు, ఏలయనగా నాకు దీని సంగతి ఏమీ తెలియదు.

53ఒక దర్శనము. ఇప్పుడు, గుర్తుంచుకొనండి. నేను మెస్సీయాను కాను. నేను క్రీస్తును కాను. కాని ఆయన ఇక్కడున్నాడు. ఆయన ఇక్కడున్నట్లు మీరు చూడవలెననియే నేను ప్రయత్నించుచున్నాను. ఆయన తన మాటను నిలబెట్టుకొనుచున్నాడు.

ఇప్పుడు ఈమె రోగియని నాకు తెలియదు. ఆమెను నేనెరుగును.

ఆమె నాకంటె వయస్సులో పెద్దది. మేము వేరువేరు సంవత్సరాలలో, వేరువేరు స్థలాలలో పుట్టితిమి. మేము కలిసికొనుట ఇదే మొదటిసారి.

ఇప్పుడు, అది కేవలము మన ప్రభువు యోహాను 4లో ఒక స్త్రీని కలిసికొనుటువలె వున్నది. మీరు దీనిని చూడకండా ఉండకుండునట్లు, నేను దీనిని ఎంతో సరళము చేయుటకు ప్రయత్నించుచున్నాను, తరువాత ఆ రోజున న్యాయతీర్పు సింహాసనమువద్ద రక్తాపరాధము నా చేతులపై వుండదు. ఇప్పుడు, చివరి దినములలో ఇది మరలా సంభవించునని యేసు వాగ్దానము చేసియున్నాడు. మనము ఈ వారములో గడచిపోవునప్పుడు ఇది ఒక వాగ్దానమని మీరు కనుగొ౦దురు.

54ఇప్పుడు, ఈమెను నేను ఎరుగను; మేమిరువురము మొదటిసారిగా సంధించుచున్నాము. ఇప్పుడు, నీవు ఇక్కడికి ఎందుకొరకు వచ్చితినో, లేదా మరెవరికొరకు వచ్చితివో, నీ వ్యాధి ఏమిటో, నీవేమి చేసినావో, నీకు ఆర్థిక ఇబ్బందులో గృహ సంబంధమైన ఇబ్బందులో లేదా మరేమిటో ప్రభువగు యేసు నాకు బయలుపరచినయెడల, అది సహజాతీతమగు శక్తివలన సాధ్యమైనదని నమ్ముము, ఎందుకనగా నిన్ను నేను ఎరుగను. అది సహజాతీతమగు శక్తినుండి వచ్చినదని చెప్పుటకు ఎందరిచ్చట సాక్షులున్నారు? ఇప్పుడు, పరిస్యయులవలె ఆడవచ్చు. అది ఒక… అని చెప్పండి. (రాయ్ సోదరుడా, మరోవైపు చూచారా?) మీరును పరిసయ్యులవలె ఆడవచ్చు, మరియు, "ఇది ఒక దురాత్మ," అని చెప్పవచ్చును, అనేకులు అలా అందురు. అది నీకు మరియు దేవునికి మధ్యగా నుండును. నీవు అలాగన్నచో వారి ఫలమును పొందెదవు. "అది దేవునినుండి కలిగినది," అని నీవు చెప్పినచో ఆయన ఫలమును పొందెదవు. (ఇప్పుడు, అది మంచిది. చూచారా?)

ACTS 3:2,4•

HEB 4:12

 

55ఇప్పుడు, నావైపు ఒక్క నిమిషం చూడండి. యేసు చెప్పినట్లుగా… పేతురు మరియు యోహానులు శృంగారమను దేవాలయ గుమ్మముగుండా వెళ్ళుచూ, "నానైపు చూడు," అని పలికిరి. మిమ్మును నేను ఎరుగను. మరియు ఇప్పుడు మీ హృదయములో వున్నదానిని పరిశుద్ధాత్మ నాకు బయలుపరచినయెడల, బైబిలు ఇట్లు చెప్పుచున్నది, "దేవునియొక్క వాక్యము రెండంచులుగల ఎటువంటి ఖడ్గముకంటెను వాడియైనదై హృదయాలోచనలను, రహస్యములను బయుట పెట్టును." పరిశుద్ద గ్రంథము చెప్పుచున్నది ఖచ్చితముగా అదే. ఇప్పుడు, అది హృదయ రహస్యములను బయటకు తెచ్చును. ఇప్పుడు, అది దేవునియొక్క గుణలక్షణముగా నుండును, ఈ దినమున వాక్యము ప్రత్యక్షమాయెను. ఇప్పుడు, దానిని ఎందరు నమ్ముచున్నారు? ఇప్పుడు, అదేమిటో మీరు చూచుచున్నారా?

56నేను ఇప్పుడు దానిని ప్రసంగించాను, దాని గూర్చి చెప్పాను, కాని అది సత్యమా? అది తరువాత సంగతి. చూచారా? ఇప్పుడు, ఇది సత్యమైనచో, మీలో ప్రతి ఒక్కరు. అది సత్యమైనచో దానిని ఆమె ఎరుగును. నిశ్చయంగా, ఆమెకది తెలియును. మీరు కూడా దానిని ఎరుగుదురు. కాని అది నిజము కానియెడల, నేను క్రీస్తును గూర్చి తప్పుగా సాక్యమిచ్చినట్లు గ్రహించండి. అది నిజమైన యెడల, మీలో ప్రతి ఒక్కరు మీ హృదయములను ఆయనకు ఇయ్యడి, మీ పూర్ణ హృదయువుతో నమ్ముడి, మరియు మీకు అవసరమగు ప్రతిదాని కొరకు ఆయన యొద్దకు వెళ్ళి ఆయనను నమ్ముడి. అది సత్యము.

ఇప్పుడు, యేసుక్రీస్తు నామములో పరిశుద్ధాత్మ తననుతాను గుర్తింపచేసికొనెను గాక. ఇప్పుడు, నీవెందుకు వచ్చియున్నావో నాకు ఏమీ తెలియదు. నీవు తల్లివలె, చక్కగా కనబడుచున్నావు, నీగూర్చి నాకు తెలిసినదంతయూ అదే, కాని పరిశుద్ధాత్మ నీవు ఎందుకొరకు ఇక్కడికి వచ్చితివో, నీ వ్యాధి ఏమిటో నాకు బయలు పరచగలడు. అది సత్యమో కాదో నీకే తెలియును, ఇప్పుడు, నీ ముఖములోని కండరముల కొరకు నీవు ప్రార్ధన కోరుచున్నావు. నీ ముఖమునందలి నరములకు వ్యాధియున్నది. ఇప్పుడు, అది నిజమైనచో చేతిని ఎత్తుము. నీవు నమ్ముదువా?

ఇప్పుడు, "ఏదో ఊహించి చెప్పియుండును," అని నీవనుకోవచ్చును.

57ఇప్పుడు, ఆమె చక్కని స్త్రీ కూడా. ఇప్పుడు, సోదరీ, ఒక నిమిషము చూడు. ఆయన నీకేమి చెప్పెనో నాకు తెలియదు. అది ఏదయినా గాని, అది సత్యమే. నీవే ఇప్పుడు అందుకు సాక్షివి, కాదా? [అది నిజము] ["ఇరవై సంవత్సరముల నుండి" అని ఆ సోదరి చెప్పుచున్నది.] మై! దాని నుండి దేవుడు నిన్ను బాగుచేయగలడని నమ్ముచున్నావా? ఇప్పుడు, ఇది ఆయన సన్నిధి అని నీవెరుగుదువు; నిన్ను ఎరిగినవారు ఎవరో ఇక్కడున్నారు, ఒక విధమైన. ఆ స్త్రీతో యేసు ఆమె వ్యాధి ఏమిటో చెప్పినట్లుగా, ఆ వ్యాధి ఎక్కడున్నదో ఆయనెరుగును.

మరియు నీకు మరొకరి గూర్చియు భారమున్నట్లు కనిపించుచున్నది. అది నీ యొక్క… అతడు ఒక పురుషుడు; అతడు నీ భర్త, ఆయనకూడ ఇక్కడే యున్నాడు. అది నిజము. మరియు నీ భర్త యొక్క వ్యాధిని దేవుడు నాకు బయలుపరచునని నీవు నమ్ముచున్నావా? అతడు నిజమైన రోగి; అతనికి చాలా బాధలున్నవి. అతనిని బాధించుచున్నవానిలో గుండెపోటు ఒకటి. అతనికి గుండె రోగమున్నది. అది నిజమయినచో, నీ చేతిని ఎత్తిచూపుము. అతనికి హెర్నియా కూడా వున్నది. అది నిజము. అది నిజమా? అతడు బహుగా ఉద్రేకపడును, అవును, బహుగా ఉద్రేకపడును. అది నిజము, కదా?

యేసు నాకు బయలుపరచినచో… పేతురు ఎవరో ఆయన చెప్పెను. నీవెవరవో ఆయన నాకు బయలుపరచినయెడల, అది ఆయనే అని నీవు నమ్మెదవా? నీవు ఈ స్థలము నుండి రాలేదు. ఇక్కడికి తూర్పుదిశ నుండి వచ్చితివి; నీవు లూసియానా నుండి వచ్చితివి. అది నిజము. ["నిజము"] మరియు నీ పేరు శ్రీమతి కోల్మన్ ఇంటికి వెళ్ళుము; యేసుక్రీస్తు నిన్ను బాగుచేయును. నీ విశ్వాసము నీకు స్వస్థతను ఇచ్చును.

58ఇప్పుడు, విశ్వాసించుము. ఇప్పుడు నీవు నీ పూర్ణ హృదయువుతో నమ్ముచున్నావా? యేసుక్రీస్తు తన పునరుత్థానమందు తననుతాను గుర్తించుకొనుచున్నాడు, నా భావమును గ్రహించావా? ఇప్పుడు, దీనిని ఏ మానవమాత్రుడు చేయలేడని ఏ మనిషి అయినా గ్రహించగలడు.

ఇప్పుడు, ఆ బయటవున్న మీరు, దేవునితో ఈలాగు చెప్పడి, "నన్ను ఆయన ఆ మనుష్యుడు ఎరుగడని నాకు తెలియును. కాబట్టి నేను ఒకదాని కొరకు ప్రార్థించుచున్నాను. ప్రభువా, నేను నీ వస్త్రమును తాకగలనా? ఆలాగయినచో, నిన్నునీవు నీ పునరుత్తానమందు కనబరచుకొనుము. తిరుగుము, నేను నిన్ను అంటుకొననిమ్ము, అప్పుడు ఆయన ద్వారా నీవు నాతో మాట్లాడుము." ఏమి జరుగునో చూడండి. దానిని ప్రయత్నించండి.

అయ్యా! మీరెట్లున్నారు? మీరింకను కొద్దిగా దగ్గరకు వచ్చెదరా? మీ వెనుక జనులున్నారు. చూచారా?

ఇప్పుడు సమస్తము, అందరి ఆత్మలు ఒక గంభీరమైన శబ్దమువంటవి. మీరు గ్రహించారా? (చూచారా?), ఇంకను వాటి ఆలోచనలను తెలిసికొని, మరియు ఆ సమ్మేళనమును నీవు పొందగలవు. (చూచారా?)

నేను ఆయన దాసుడనని మీరు నమ్ముచున్నారా? మీరెందుకు ఇక్కడికి వచ్చారో క్రీస్తు నాకు బయలుపరచునని మీరు నమ్ముచున్నారా? మరియు, జ్ఞాపకముంచుకొనుడి, ఒక దినమున మనము తీర్పు సింహాసనమునొద్ద నిలబడి మరియు ఈ రాత్రిని గూర్చి లెక్క చెప్పవలసియున్నాము. దానిని మీరెరుగుదురా? మీ వీపు మీద బాధయున్నది. మీకు చాలా బాధలున్నవి. మీకు వీపు నొప్పియున్నది. మరియు మీ కన్నులు క్షీణించుచున్నవి; మీకు నేత్రవ్యాధి యున్నది. అది నిజమైన యెడల, చేతిని ఎత్తండి. ఇప్పుడు, దాని నుండి విడుదల పొందుటకు మీరు ఏదో చేయుచున్నారు. దానిని నేను చెప్పవచ్చునా? మీరు పొగత్రాగుట మానవలెను అనుకొనుచున్నారు. మరియు ఇంకొక విషయం, మీకు… పరిశుద్ధాత్మను మీరు పొందకుండా అడ్డగించుచున్నది. అదియే అని మీరు భావించుచున్నారు. ఇప్పుడు, పరిశుద్ధాత్మను పొందవలెనను కోరిక మీ హృదయములో వున్నది. అది నిజమైనయెడల, మీ తలను ఈలాగు ఊపండి. మ౦చిది, అది ఇప్పుడు మిమ్మును విడిచిపెట్టినది; వెళ్ళి పరిశుద్ధాత్మను పొందండి, మరియు యేసుక్రీస్తు నామములో స్వస్థతను పొందండి. దేవుడు మిమ్మును దీవించును.

59మీరు నమ్ముచున్నారా? ఇప్పుడు, దయచేసి బహు మర్యాదగా ఉండుడి. ఇప్పుడు, మనకు చాలా ఆలస్యమైనది, అయినా ఒక్క క్షణం నెమ్మదిగా కూర్చొనండి.

మీరెట్లున్నారు? మనమిద్దరము ఒకరికొకరము అపరిచితులము. ప్రభువైన యేసు మనిద్దరిని ఎరుగును. ఇప్పుడు, భయపడవద్దు. (చూచారా?) మీరు ఒక విధమైన. చూడండి, సాఫీగా వుండుడి; ఇది ఆయన సన్నిధి. చూడండి, అది నిశ్చయం. ఇది ఆయన సన్నిధి. ఇప్పుడు, మీరు ఒక వింత అనుభూతిని, ఆ, ఒక మధురమగు దీన అనుభూతిని పొందుచున్నారు. చూచారా? ఇప్పుడు, ఒక మనుష్యుని సన్నిధిలో నిలబడినయెడల మీకు ఆ అనుభూతి రాదు.

ఆ అగ్నిస్తంభమును ఎందరు చూచారు? రెండు పర్యాయములు ఇక్కడి టెక్సాస్లోనే దానిని తీసిరి. ఆమె యొద్దనే అది వ్రేలాడుచున్నది. (చూచారా?), ఇప్పుడు ఈ కోణములో యున్నది. మీరు దానిని చూడగలిగిన ఎంత బాగుండును.

మీరు కదులుటకు ఆరంభించినపుడే, దాని పని ఆరంభమయినది, చూచారా? రేపు రాత్రి తొమ్మిది గంటలకు ఈ ప్రార్ధన వరుస మనకు వుండును, చూచారా; నేను మిమ్మును చాలాసేపు ఉంచాను. తరువాత మనము ఈమెను చూద్దాం. కేవలము ఒక్క నిమిషము.

MARK 9:23

 

60అక్కడ కూర్చొన్న నీవు నమ్ముచున్నావా? అవును, నీవు ఆ బలహీనతతో బాధపడుచున్నావు. చూచారా? ఆమె దేనిని తాకినది? ఆమె నాకు తెలియదు. ఆమె ప్రధానయూజకుని అంటుకొన్నది. కాని చూడండి, నేను ఆమె వైపు నా వీపును పెట్టాను, అబ్రహాము కాలములో జరిగినట్టే జరిగినది. ఇక్కడ, సోదరీ, ఇటువైపు ఒక్క నిమిషము చూడుము. నీ హృదయములో నీవు భారము కలిగియున్నట్లు కనబడుచున్నావు. అవును. అది నీ వెనుకనున్న నీ కుమార్తెను గూర్చినది. ఆమెకు చెవులలో వ్యాధియున్నది. అది నిజము. ఇప్పుడు నీవు నీ పూర్ణహృదయముతో నమ్ముచున్నారా? సరే, కేవలము ఇప్పుడు నమ్ముము, మరియు ఆమె బాగవును.

నా భావమును గ్రహించారా? నమ్ముట నీవలనయితే సమస్తము నీకు సాధ్యమే. నీవు నమ్ముదువా?

ఆ వెనుకనున్న ఒకామె తన చేతిని క్రిందికి దించినది; ఆమె తిన్నగా నావైపు చూస్తున్నది. ఆమె చక్కెర వ్యాధితో శ్రమపడుచున్నది. అక్కడ కూర్చొనియున్న నీవు, దేవుడు నీ చక్కెర వ్యాధిని బాగుచేయగలడని నమ్ముచున్నావా? మంచిది, నీవు అడిగిన దానిని పొందెదవు. కేవలము విశ్వాసముంచుము.

అక్కడున్న స్త్రీకి పెద్ద ప్రేగులో వ్యాధి మరియు మూత్రాశయ వ్యాధి యున్నది. దేవుడు దానిని బాగుచేయునని నీవు నమ్ముదువా? సరే, నీవడిగిన దానిని పొందుము. ఆమె చేయి అది. చూడండి, ఇప్పుడామెను అడగండి, నిజంగా ఆమెను ఏదో మధురమైనది తాకినది. చూడండి. దానిని చేయుచున్నది ఆమె యొక్క విశ్వాసమే. అది నేను కాదు. అది దేవుడే.

61ఇక్కడ, ఆ చివరన ఒకాయన కూర్చొనియున్నాడు. అతనికి శ్వాస సంబంధమైన వ్యాధియున్నది. ఆ కూర్చొనియున్న పెద్ద మనిషి నా వైపే చుచుచున్నాడు. అయ్యా, దేవుడు దానిని బాగుచేయునని మీరు నమ్ముదురా? నీ ప్రక్కన కూర్చొనియున్న స్త్రీ, అంటువ్యాధితో బాధపడుచున్నది. అది నిజము, సోదరీ, అది నిజమైనచో నీ చేతి రుమాలును ఊపుము. మ౦చిది. మీరందరూ ఒకరిమీద ఒకరు చేతులుంచుకొనండి, మరియు మీ నిండు హృదయుములతో నమ్మండి. తండ్రి, కువూర్తె, ఎందుకు కాకూడదు? మీరు ఒకరిపై ఒకరు చేతులుంచుకొని, మీ నిండు హృదయాలతో నమ్మండి; యేసు మిమ్మును బాగుచేయును.

దానిని నమ్మునట్లు, మీ విశ్వాసమును నేను సవాలు చేయుచున్నాను.

అతని వెనుక కూర్చొనియున్న ఆ స్త్రీ, ఉదర సంబంధమైన వ్యాధితో బాధపడుచున్నది. అమ్మా, దేవుడు నిన్ను బాగుచేయునని నీవు నమ్ముదువా? అదే నీ వ్యాధి. అది నిజమైనచో, ప్రజలు నిన్ను చూచునట్లుగా లేచి నిలబడుము. చూచారా? అక్కడ వారు ఎవరిని తాకుచున్నారు? నీ ప్రక్కన కూర్చొన్న ఆమె నీ తల్లి, అని నేను పొరబడక చెప్పుచున్నాను. ఆమె ప్రేగులలో అంటువ్యాధి యున్నది. అమ్మా, దేవుడు దానిని బాగుచేయునని నీవు నమ్ముదువా? లేచి నిలబడి మరి స్వస్థతను పొందుము.

62నమ్ముము! ఆయన నిన్న, నేడు, నిరంతరము ఏకరీతిగా యున్నాడు. ఆయన తననుతాను చూపించుకొనుచున్నాడు. నేను ఆయన ప్రవక్తను లేదా దాసుడను అని నమ్ముచున్నావా? "ప్రవక్త" అనగానే జనులు తికమక అగుదురు; వారు అర్తము చేసికొనరు.

ఇటు చూడుము. నీ హృదయమంతటితో నీవు నమ్ముచున్నావా? నీవు తీవ్ర నరముల ఉద్రిక్తతో బాధపడుచున్నావు. దానికి కారణము ఏమిటో నేను చెప్పినచో, నీవు నమ్మొదవా? నీవు వాహన ప్రమాదమునకు గురైనావు. అది నిజము. అది నిజము, వాహనము గుద్దుకొని, మరియు నీ వీపు, నీ ఒక భుజము దెబ్బతినినని. అది నిజమే కదా? ఇప్పుడు అది నిన్ను విడిచిపెట్టను. అది నిన్ను శ్రమపరచుచున్నది, బాధపరచుచున్నది గాని, నీవు బాగవుదువు. నీ హృదయములో నమ్మి, వెళ్ళుము. నీవు నమ్మినయెడల, యేసుక్రీస్తు నిన్ను బాగుచేయును. ఆమేన్.

నీవు నమ్ముదువా? ఎముకల వ్యాధిని ఆయన బాగుచేయునని నీవు నమ్ముదువా? మ౦చిది, అయితే నడువుము, అప్పుడు ఆయన నిన్న బాగుచేయును.

MARK 16:17,18

 

63ఎంతమంది మీ పూర్ణ హృదయముతో నమ్ముచున్నారో వారందరూ ఈలాగు చెప్పండి, "నేను నిజంగా నా హృదయమంతటితో నమ్ముచున్నాను," నమ్ముట నీవలననైతే!

ఆయన చక్కెర వ్యాధిని బాగుచేసి, మరియు వారిని స్వస్థపరచునని నీవు నమ్ముచున్నావా? నీవు నమ్ముచున్నావా? "ప్రభువా, దానిని బట్టి నీకు వందనములు," అని చెప్పి, నడువుము. నీ హృదయమ౦తటితో నమ్ముము, మరియు నీవు బాగయ్యెదవు.

ఇప్పుడు, ఎందరు తమ పూర్ణ హృదయములతో నమ్ముచున్నారు? చూడండి, మీరు లేచి తిరుగుచున్నారు; స్నేహితులారా, మీరు దానికి అవాంతరము కలిగిస్తున్నారు, ఎందరు నమ్ముచున్నారు? "స్నేహితులారా, నా పూర్ణ హృదయముతో నమ్ముచున్నాను," అని చెప్పి మరియు మీ చేతులెత్తుడి.

ఇప్పుడు, మీరు ఒకటి చేయవలెనని నేను అడుగుచున్నాను. ఇప్పుడు, యేసు తన మాటను రుజువుపరచి నిలబెట్టుకొన్నట్లయిన, మరియు దానిని మీకు నిరూపించి యున్నట్లు మీరు నమ్మినట్లయిన. యేసు చివరిగా, తన సంఘమునకు ఈలాగు కూడ ఆజ్ఞాపించెను, "నమ్మినవారివలన ఈ సూచక క్రియలు కనబడును." ఇప్పుడు, ఎందరు నమ్ముచున్నారు? "వారు రోగులమీద చేతులుంచినపుడు బాగవుదురు," అని ఆయన చెప్పెను. ఆ వాగ్దానమును మీరు నమ్ముదురా? అయితే మీ ప్రక్కన వున్నవారి మీద చేతులుంచుడి.

ఆయన నిన్ను బాగుచేయునియెడల నీవు మరణించెదవు. నిన్ను అది కమ్మినది. కాని యేసుక్రీస్తు నిన్ను బాగుచేయుచున్నాడు. దానిని నీవు నమ్ముదువా? మంచిది, నీ (నమ్మికను) ఉంచి … నమ్మి ఇప్పుడు ముందుకు పొమ్ము, మరియు నీవు బాగయ్యెదవు.

అమ్మా, రమ్ము, దేవుడు ఆ క్షయు, చక్కెర వ్యాధుల నుండి నిన్ను బాగుచేయునని నీవు నమ్ముచున్నావా? తీసుకో, మ౦చిది, నీ పూర్ణ హృదయముతో నమ్మి వెళ్ళుము. మరియు బాగవుము.

MARK 16:17,18

 

64ప్రార్ధి౦చుట, నీవు మరొకరి కొరకు ప్రార్ధి౦చుచున్నావా? మీరు ఒకరిపై ఒకరు చేతులు వేసికొనండి; మనందరము కలిసి ప్రార్ధి౦చుదము. ప్రతి వారు ఒకరిపై ఒకరు చేతులు వేసికొనండి. ఆలస్యమయినది, మీరొకరిపై ఒకరు చేతులుంచుకొనండి, మరియు మనము ప్రార్ధి౦చుదము.

ప్రభువగు యేసూ, దేవుడు తన జనుల మధ్య కనబరచుకొనెనని నిశ్చయంగా మేము చెప్పగలము. ఆయన గుణలక్షణములు నిన్న, నేడు, నిరంతరము ఏకరీతిగా యుండి, ప్రత్యకమగుచున్నవి. ఓ, ప్రభువగు దేవా, వాక్యమును వాగ్దానము చేసిన నీవు ఈలాగు పలికితివి, "నమ్మువారివలన ఈ క్రియలు జరుగును. వారు రోగుల మీద చేతులుంచినపుడు బాగవుదురు." ఈ జనులు విశ్వాసులుగా ఒప్పుకొనిరి, పునరుత్తానుడగు యేసును నమ్మిరి, భూమి మీద ఉన్నప్పుడు ఆయన ఏ గుణలక్షణములు కనపరచెనో, అవే ఇప్పుడు కనపరచి వాక్యము సత్యమని నిరూపించెను, ఆయన నిన్న, నేడు, నిరంతరము ఏకరీతిగా యున్నాడు. ప్రభువగు యేసూ, పునరుత్తానుడైన, గుర్తింపబడిన దేవుని కుమారుని దైవ సన్నిధిలో ఈ విశ్వాసులు ఒకరిపై ఒకరు చేతులుంచుకొనియుండగా, ఈ రాత్రి విశ్వాసుల శరీరములందు మరల శరీరధారి అయ్యెను. ఈ విశ్వాసులు వారి చేతులను ఒకరిపై ఒకరు వేసుకొనియుండగా, ప్రతి అపవిత్రాత్మను, ప్రతి వ్యాధి, రోగమును గద్దించి, ఈ జనులలో నుండి పొమ్మని నేను ఆజ్ఞాపించుచున్నాను. యేసుక్రీస్తు నామములో అలాగు జరుగును గాక.

65పునరుత్తానుడగు దేవుని కుమారుని సన్నిధిని మీరు గుర్తించి, మీ స్వస్థతను ఇప్పుడు మీరు అందరూ నమ్ముచున్నారు, మీరడిగినది మీకు ఇవ్వబడినదని నమ్ముచూ, నిలబడి ఈలాగు చెప్పండి, "నా పూర్ణ హృదయముతో దానిని నేను అంగీకరించుచున్నాను." యేసుక్రీస్తు సన్నిధిని నమ్మువారందరూ ఇప్పుడు లేచి నిలబడుడి. ఆయనను స్తుతించుడి! ఆయనకు స్తుతి, మహిమ చెల్లించుడి. మీ చేతులెత్తి మరియు ఆయనకు వందనములు చెల్లించుడి. దేవుడు, తాను చేసిన ప్రతి వాగ్దానమును స్థిరపరచును.

Search Messages

0 / 0 matches
Enter characters above to process real-time text query scopes...