సూచనను రుజువు చేయు శబ్దము

సూచనను రుజువు చేయు శబ్దము

1ధన్యవాదాలు. దేవుని వాక్యము చదువుచుండగా, కొంత సమయము నిలువబడెదము, ఈ రాత్రి తిన్నగా వాక్యమునకు వెళ్ళుదము, ఏలయనగా సమయము ఎక్కువగా తీసికొనకుందుము. మీరు నాతో త్రిప్పవలనేని నేను కోరుచున్నాను, ఈ రాత్రి, నిర్గమకాండము 4వ అధ్యాయము ప్రారంభము నుండి చదువుకుందాము.

అందుకు మోషే చిత్తగించుము, వారు నన్ను నమ్మరు, నా మాట వినరు; యెహోవా నీకు ప్రత్యక్షము కాలేదందురు అని ఉత్తరమియ్యగా. యెహోవా - నీ చేతిలోనిది ఏమిటి అని అతని నడిగెను. అందుకతడు - కర్ర అనెను.

అప్పుడాయన, నేలను దాని పడవేయుమనెను. అతడు దాని నేల పడవేయగానే అది పామాయెను; అప్పుడు మోషే దాని ముందు నుండి పారిపోయెను.

అప్పుడు యెహోవా - నీ చెయ్యి చాపి దాని తోక పట్టుకొనమనగా. అతడు తన చెయ్యి చాపి దానిని పట్టుకొనగానే, అది అతని చేతిలో కర్ర ఆయెను.

ఆయన - దానిచేత తమ పితరుల దేవుడైన యెహోవా అనగా అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు ప్రత్యక్షమాయెనని నమ్ముదురనెను.

మరియు యెహోవా - నీ చెయ్యి నీ రొమ్మున ఉంచుకొనుమనగా, అతడు తన చెయ్యి రొమ్మున ఉంచుకొని దాని వెలుపలికి తీసినప్పుడు ఆ చెయ్యి కుష్టముగలదై హిమమువలె తెల్లగా ఆయెను.

తరువాత ఆయన - నీ చెయ్యి మరల రొమ్మున ఉంచుకొనుమనగా, అతడు తన చెయ్యి మరల తన రొమ్మున ఉంచుకొని తన రొమ్ము నుండి వెలుపలికి తీసినప్పుడు అది అతని మిగిలిన శరీరమువలె ఆయెను.

మరియు ఆయన - వారు నిన్ను నమ్మక, మొదటి సూచననుబట్టి వినకపోయిన యెడల రెండవ దానిబట్టి విందురు.

JOHN 14:13,14•

JOHN 15:16•

JOHN 16:23

 

2తలలు వంచుదము. మన తలలు వంచుటతో కూడ మన హృదయములు సహితము అణుకువగలదిగా ఉ౦చుకొందాము. ఈ రాత్రి యిచ్చట ఎవరైన ప్రార్ధన కొరకు కోరినవారున్నారా అను దానిని తెలిసికొనగోరుచున్నాను. మీ చేతులు పైకెత్తి చూపమని కోరుచున్నాను. దేవుడు మీ విన్నపములను అంగీకరించును గాక.

పరలోకమందున్న మా తండ్రి ప్రభువైన యేసు నామమున ప్రార్థనతో నీ యొద్దకు వచ్చుటకు ఇది ఒక మంచి అవకాశము కలిగించితివని మేము తలంచుచున్నాము. ఆయన నామము ఏమి అడిగినను దానిని చేయుదుననిన వాగ్దానమును ఆయన వలన మేము పొందితిమి. మా ప్రతి అవసరత నీవు ఎరిగియున్నావు. మా చేతులు పైకి ఎత్తబడినప్పుడు అవి దేనిని తెలియజేయుచున్నవో నీవు ఎరిగియున్నావు. ఈ రాత్రి, తండ్రి మా ప్రతి వినతికి జవాబు యివ్వగలవని నమ్మి ప్రార్థించుచున్నాము, మహిమ పొందుకోనుము.

మరియు ఇప్పుడు, వాక్యము యొక్క బోధకుడు అగు పరిశుద్దాత్మ, ఈ రాత్రి మా మధ్యకు వచ్చి తన్ను-తానుగా మాకు ప్రత్యక్షపరచుకొననిమ్ము ఆయన పునరుద్దాన రుజువుతో తన్ను-తాను ప్రత్యక్షపరచుకొనునట్లు చేయుము. ఈ రాత్రి ఆయన వచ్చి మా హృదయములను దర్శింపనిమ్ము, ఈ దినము కొరకు వేటిని ఆయన వాగ్దానము చేసెనో వాటి ద్వారా ప్రభువా, మాతో మాటలాడుము. ఈ సమయము కొరకు ఏ వాక్యములు వాగ్దానముగా మాకు చేయబడియున్నవో వాటియందు నమ్మికయుంచి నీవు చెప్పినట్లుగా, రాబోవు మహా-శ్రమల కాలము ఈ భూమి మీదికి వచ్చి ప్రజలెల్లరిని బాధించు సమయమున, వాటియందు (నీ వాగ్దానములందు) విశ్రమించునట్లు చేయుము, మరియు అది వాస్తవముగా తండ్రి, మానవుడు బోధింపబడునట్లు వచ్చే యున్నది. పలు విధములైన వర్తమానికులున్నారు గాని, వారేమిచేయవలెనో వారెరుగక యిరుకునబడి యున్నారు. అయితే, ప్రభువా, ఈ రాత్రి నీవు యిక్కడ ఉన్నావనియు, మరియు మాతోనున్నావనియు నిన్నునీవు ప్రత్యక్షపరచుకొనుమని ప్రార్థించుచున్నాను. మాకు సహాయకుడవుగా ఇచ్చటున్నావు. మా విన్నపములు యేసుకీస్తు నామమున అడుగుచున్నాము. అంగీకరించుము. ఆమేన్. కూర్చుండుడి.

3ప్రతి రాత్రి నేను కొంత ఆలస్యముగా వచ్చుచున్నాను. ఈ మైక్రోఫోను విషయము ఆలోచించుచుంటిని… కాని ఇది రికార్డర్కు సంబంధీ౦చినది. కాని ఇక్కడిది, నేను వినుటకు వాడవలసినది అనుకుంట, లేక మాట్లాడుటకు. రేపు రాత్రి విందు ఆరగించు రాత్రియని మరచిపోకండి. అది ఎక్కడ ఏర్పాటు చేయబడునో దానిని వినపించగలరని నేను తలంచుచున్నాను. బహుశా ప్రజలు ఎక్కడకు వెళ్ళవలెనో తెలియజేయుదురు. మన ప్రభువు జరిగించిన ఈ గొప్ప కార్యములలో మీ సహకార్యమును మేము వాస్తవముగా అభినందించుచున్నాము.

ఈ రాత్రి మనము దేవుని వాక్యమును ఎరిగియుంటేనే గాని మనము ఏమి చేయాలో మనమెరుగమని నేను తలంచుచున్నాను. దేవుని చిత్తము ఏమిటో మనము ఎరుగు వరుకు మనము విశ్వాసమును కలిగియుండలేము. మరియు దేవుని చిత్తమేమిటో మనము ఎరిగిన యెడల, దేవుని వాక్యము అదే విషయమును చెప్పిన, మనము తప్పక సంతోషముతో దానిని అనుసరించెదము. ఇప్పుడు, ప్రభువైన యేసు ఈ రాత్రి మానవ శరీరమందు ఈ భూమి మీద సంచరించినటైతే, రేపటి దినమున వర్షము దినమంతయు కురియను అని ఆయన చెప్పిన, ప్రాద్దున నేను బయటకు వెళ్ళునప్పుడు గొడుగును తీసికొని వెళ్ళుటకు అది సుళువైన కార్యము. ఎందుకనగా ఆయన దానిని గూర్చి చెప్పెను. ఆ రీతిగా ఆయన తెలియజేయకుండిన యెడల, దేనికొరకు నేను కనిపెట్టవలెనో నేను ఎరుగను. కాబట్టి మనము దేనినైన చేయనున్న అదే రీతిగా మనము జీవించుచున్న సమయమును, కాలమును ఎరిగియుండవలెను.

4ఈ వారము క్రొత్తగా వచ్చిన వారికి దేవుడు ప్రారంభమునుండి అంతమును ఎరిగియున్నాడని చూపించుటకు మేము ప్రయత్నించితిమి. అది ఆయన అంతములేనివాడని తెలియజేయుచున్నది. ఆయన అంతములేనివాడు కానియెడల ఆయన దేవుడు కానేరడు. ఆయన సర్వశక్తిగలవాడు, సర్వవ్యాప్తియైన, సర్వజ్ఞానియైన, సర్వశక్తిగలవాడైయున్నాడు. సమస్తమును, సర్వత్రను తెలిసికొను శక్తిగలవాడును మరియు ప్రారంభమును అంతమును ఆయన ఎరిగినవాడై యున్నాడు. అట్లు కానియెడల ఆయన దేవుడు కానేరడు. కావున అక్కడ ఏదియు నిజముగా తప్పిపోలేదు. అది మనము. కాని దేవుని వాక్యములో ఏదియు - అది టిక్, టిక్ అను గడియారము వలె. మరియు అది జరుగుటకు ఆ ఘడియ వచ్చినప్పుడు, ఆ కాలమునకు చెందిన దేవుని వాక్యము, అది జరుగును. అది జరుగబోదు అని మనము అనుకొందుము. కొన్నిసార్లు అది జరుగును, మరియు అది మనకు తెలియుదు.

ఒకప్పుడు యేసు ఈలాగు జవాబిచ్చెను .

GEN 4:10•

MATT 17:10,12•

MARK 9:11•

HEB 12:24

 

5అయన శిష్యులు, "ఏలియా ముందుగా రావలెనని శాస్త్రులు ఎందుకు చెప్పుచున్నారని?" అని ఆయనను (యేసుని) అడిగిరి, చూడుము. ఏలియా వచ్చునని వారు నమ్ముచున్నారు.

యేసు వారివైపు చూచి, వారితో, "ఏలియా ఇదివరకే వచ్చెను, కాని మీరు అతనిని ఎరుగలేదు," అని చెప్పెను. ఇప్పుడు, చూడండి, ఆ సంభవము శిష్యుల యెదుట, పరిచారకుల, శాస్త్రుల కన్నుల ఎదుట తిన్నగా జరిగినది. (రావలసిన ఏలీయా బాప్తిస్మ మిచ్చు యోహాను అని వారు గుర్తించరైరి.) అతడు బాప్తిస్మమిచ్చు యోహానుయై యుండెను, మరియు రావలసిన ఏలియా తెలియజేసిన ప్రతి మార్గమును అనుసరించి, అతడు వచ్చినను వారు అతనిని ఎరుగరైరి.

మరియు ఇప్పుడు, మనము జీవించుచున్న సమయమును, గడియను గుర్తించుట మన బాధ్యాత. దాని మీద, ఈ రాత్రి నేను మాట్లాడగోరుచున్నాను, "సూచనను రుజువు చేయు శబ్దము," ఒక వింతైన శిర్షిక. దేవుడు వింతైన విషయాలు అసాధారణ రీతిలో చేయును - అదే ఆయనను దేవునిగా చేయును. ఎందుకనగా ఆయన సహజాతితమైనవాడు. మరియు ఆయన చేయునవన్నియు, ఆయన చేయును.. ఆయన సహజాతితముగా చేయగలడు ఎందుకనగా ఆయన సహజాతితమైనవాడు.

ఇప్పుడు, సూచనను రుజువు చేయు శబ్దము. అది, అక్కడ చిహ్నం లేదా సూచనకు ఒక స్వరము ఉన్నది. రక్తమునకు స్వరము ఉన్నది. రక్తము భూమి నుండి స్వరమును వినిపించుచున్నది. ఆలాగే నీతిమంతుడైన హేబెలు రక్తము కయ్యీనుకు విరోధముగా (మాట్లాడు) మొర్రపెట్టుచున్నది. "యేసుక్రీస్తు రక్తము హేబెలు రక్తముకంటె శ్రేష్టమైనది మాట్లాడుచున్నది."

6ఈ రాత్రి ఇప్పుడు మన ప్రకరణము లేదా ప్రదర్శనము నిర్గమ కాండమునందు నిర్గము యొక్క సమయము ఒక దేశమును విడిచి బయటకు పిలువబడుచున్న సమయమైయున్నది, మరియు ఆ నిర్గమము సమీపముగా నుండెను. ప్రభువు యొక్క సేవకుడైన మోషే ఈ నిర్గమము యొక్క పనిని నిర్వహించుటకు పిలువబడియుండెను, అతడు ఐగుప్తు యొక్క ఉన్నత విద్యను ఐగుప్తు యొక్క జ్ఞాన మంతటిని కలిగిన మేధావిగా నుండెను మరియు సైనిక శిక్షణయందు ప్రతిభాశాలియై, ఫరోకు పిమ్మట అతడు ఫరో సింహాసనము అధిష్టించువాడైనందున తన ప్రజలైన హెబ్రీయులకు ఐగుప్తు బానిసత్వపు బంధకములో నుండి విడిపించుటకు శక్తిగలవాడై యున్నాడని అతడు తలంచియుండెను.

అది ఎంత సుళువైన మార్గముగా అది అతనికి ఉండెను! కాని, నీవు గమనించుము, అతడు ఆ విధముగా జరిగించి యుండిన అది ఒక సర్వసాధారణ కార్యమైయుండును. దేవుడు అట్లు సాధారణమైన వాటిని తీసికొనడు. ఆయన తన్ను ప్రత్యక్ష పరచుకొనుటకు, సహజాతితమైన వాటిని తీసుకొనును. గనుక తాను పొందిన నలుబది సంవత్సరముల ఉన్నత విద్యాభ్యాసము, తాను పొందిన ఉన్నత విద్య పాండిత్యము వలన కలిగిన పథకమును, తనకు తన తల్లి బోధించుటవలన తన ప్రజలను అతడే విడుదల గలుగజేయువాడని తెలిసికొని దానిని ఎరిగినవాడై, తన స్వబుద్ధితో బయటకు వెళ్ళి ఒక ఐగుప్తీయుని చంపెను. అతని స్వంతశక్తి వలన ప్రయత్నము వ్యర్ధమాయెనని కనుగొని అరణ్యమునకు పారిపోయెను. మరియు అతడు ఏ ఐగుప్తు విద్యను నలుబది సంవత్సరములు అభ్యసించెనో, వాటినుండి అతనిని తొలగించుటకు దేవునికి మరొక నలుబది సంవత్సరములు పట్టెను. గమనించితివా, గనుక యిప్పుడు అతడు తన నీతిశాస్త్ర విద్యయందు నమ్మక మంచడాయెను. అతడు సహజాతితమైన వాటియందు నమ్మికగలవాడాయెను.

GEN 12:7•

GEN 15:13,14•

GEN 26:3•

EXOD 3:19•

EXOD 13:9•

EXOD 32:11•

REV 12:17

 

7దేవుడు అబ్రహాముతో నాలుగు వందల సంవత్సరములకు ముందు అతని సంతానము అన్యదేశమునందు స్వల్పకాలము నివాసముందురు, మరియు వారిని అచ్చటనుండి బయటకు తీసికొని వచ్చెదనని చేసిన వాగ్దాన సమయము సమీపముగా ఉ౦డెను. నలుబది సంవత్సరములకు తర్వాత ఆయన తన బలమైన హస్తముతో వారిని బయటకు తీసికొని వచ్చును. ఆయన తన బలమైన హస్తముతో విడుదల తన ప్రజలకు కలుగజేయును. వాగ్దానము చేసిన సమయము సమీపించినప్పుడు, దేవుడు ఆ ప్రకరణ సమయమందు మోషేను ప్రవేశపెట్టెను. మోషే తనయొక్క సోలిపోయిన స్థితియందు అరణ్యమునకు పారిపోయెను.

ఇచ్చట నిశ్చయముగా వాస్తవమైన ఒక నమూనా (type) గలదు. చూచితివా? దీనిని నిన్ను దాటి పోనియ్యకుము. నమూనా, దేవుడు ఇశ్రాయేలీయులను తీసికొని వచ్చుచున్నాడు, తన ప్రజలను ఒక దేశమునుండి వెలుపలికి, ఒక దేశమునుండి మరొక దేశము బయటకు వచ్చుచున్న దృశ్యము. ఈనాడు ఒక చక్కని దృశ్యమును అనగా ఒక దేశమునుండి యింకొక దేశము బయటకు వచ్చినట్లుగా, క్రీస్తు సంఘము నుండి దేవుడు తన వధువును పిలుచుచున్నాడు, ఒక క్రైస్తవ సంఘమునుండి క్రైస్తవ వధువు, ఒక సంఘము నుండి ఒక వధువు సంఘము బయటకు పిలువబడినట్లు బైబిలునందు చూపింపబడినదగును. ఈ రాత్రి ఈ పాఠమునకు సంబంధించిన పలురచనలు మరియు లేఖనములు యిక్కడ కలవు. కొన్ని సమయములందు "ఏర్పరచబడినదనియు", "ఎన్నుకొనబడినదనియు" లేదా "స్త్రీ యొక్క శేషించిన సంతానమనియు," పిలువబడుచుండెను.

దేవుడు తన భవిష్య జ్ఞానమందు "వధువు" అని పిలువబడుట ముందుగానే అభిషేకించియుండెను. అదే సంఘము నుండి బయటకు వచ్చు వధువైయున్నది. చూడుము, సంఘము మిశ్రితమైయున్నది, కాని దేవుడు ఒక వధువుగా ఒక ప్రజను ఈ మిశ్రిత సంఘమునుండి తీసికొనుచున్నాడు. ఆయన చేయుదునని చెప్పెను.

AMOS 3:7

 

8గమనించు. చూడుము ఆయన దానిని ఎలా చేసెను, మరియు ఆయన దానిని చేసిన పద్ధతి చూడుము.

ఇప్పుడు మనము ఆయన ఏ విధముగా ఇశ్రాయేలీయులను బయటకు తీసికొని వచ్చెనో, అదే విధానముగా ఆయన దానిని చేసెను. గమనించుము, వాగ్దానము చేయబడిన వాక్యము యొక్క నెరవేర్పు సమయము వచ్చినప్పుడు, దేవుడు ఆ పని నిమిత్తము ముందుగా ఏర్పరచుకొని, అభిషేకించిన మోషేను పిలిచెను. చూచితివా? ఆ సమయమున, దేవుడు ఎల్లప్పుడు ఆ పనికై నిర్ణయింపబడిన వ్యక్తిని కలిగియుండును. దేవునితో కానిది ఏదియులేదు. దేవుడు చెప్పినది, అది తప్పిపోనేరదు. దేవుడు వాక్యమైయున్నాడు గనుక దేవుడు ఎన్నడును తప్పిపోనేరడు. గమనించుము, ఇప్పుడు వాక్యము ప్రత్యక్షపరచబడనున్నది. మరియు వాగ్దానము చేయబడిన వాక్యము ప్రత్యక్షపరచబడునప్పుడు దేవుడు ఎల్లప్పుడు ఒక ప్రవక్తను ఆ వాగ్దాన వాక్యము ప్రత్యక్షపరచబడునట్లు పంపును, ఏలయనగా ప్రభువు యొక్క వాక్యము ప్రవక్త యొద్దకు వచ్చును. మోషే ముందుగనే ఆ పని నిమిత్తము అభిషేకింపబడియుండెను గనుక, ఆ పని నిమిత్తము పిలువబడెను. దానిని మరెవరును చేయలేరు.

9దేవుడు ఒక పని నిమిత్తము ఒక మనిషిని పిలిచినప్పుడు, మరొకడెవరును ఆ స్థానమును తీసికొనలేడు. నీ స్థానమును, నీ యొక్క విశేషమును మరెవడును పొందుకొననేరడు.

ఓరల్ రాబర్ట్స స్థానమును నేను ఎట్లు తీసికొనగలను, సహో, బిల్లీ గ్రాహాం స్థానమును నేను ఎట్లు తీసికొనగలను అని కొందరు ఆశించుట, పలుమార్లు నేను ఎంతో అశ్చర్యపడుచుంటిని. బిల్లీ గ్రాహంవలె జనసమూహము యొద్దకు వెళ్ళి ప్రసంగించుట, పావులను బలిపీఠ వేదిక యొద్దకు పిలుచుట, అటుపిమ్మట దానిని మరచిపోయి ఇంటికి వెళ్ళును, కాని అచ్చట నిలువబడి ఆ పనిని స్థిరపరచునట్లు పోరాడుట లేదు. నేను బిల్లీ గ్రాహాం కానేరను, బిల్లీ గ్రాహాం నాకు వలె కాడు. మేము యిరువురము. నేను ఓరల్ రాబర్డ్సు కానేరను, ఓరల్ రాబర్డ్స నాకు వలె కానేరడు.

మీలో ప్రతిఒక్కరు దేవుని కార్యనిర్వక వర్గమైయుండి, సాధారణముగా ఒక స్థలమందుంచబడితిరి. ఒకడు ఎల్లప్పుడు ఉపవసించి, దేవునితో మాట్లాడుచుండును, మరియొకడు, ఇతడు ఉపవసించి ప్రార్థించుచుండగా, దయ్యములను వెళ్ళగొట్టుచున్నాడు. అయితే, ఇది అంతయు క్రీస్తు శరీరములోని అవయవముల ఐక్యతతో కూడి చేయు పనియైయున్నది. సంఘశాఖ అడ్డంకులు మనలని విడగోట్టునపుడు, ఆది నా హృదయమును ఎంతగానో బాధపరచుచును, చూచారా. ఏలయనగా, అది మనలను (ఒకటిగా ఉ౦డుటకు బదులు) వేరు చేయుచున్నది. మనము ఒకటైయున్నాము. మనలో అధికులనిగాని, గొప్పవారని గాని లేరు. మనమందరము సమానముగా ఉన్నాము. మనమందరము దేవుని పిల్లలమే.

మనలో అధికుడైనవాడు ఒక్కడు మాత్రముగలడు, ఆయన క్రీస్తే మనము ఆయనను ఎరుగవలెను. మరియు ఒకనికి మించి మరొకడు ఘనతపొందవలెనని ఆశించిన, మనము విశ్వాసము కలిగి యుండలేము, ఏలయనగా మనము (మనుష్యులయందు) మరొకరియందు విశ్వాస మంచుచున్నాము. క్రీస్తునందు మాత్రమే విశ్వాసము కలిగియుండవలెను, మనము విశ్వాసముంచవలసిన వాడు ఆయన మాత్రమే మరియు ఆయన ఏమి చేయుచున్నాడో, దేనిని మనకు యిచ్చెనో వాటియందు విశ్వాసముంచవలెను.

MATT 3:3•

MARK 1:3•

LUKE 3:4•

JOHN 1:20,21,23

 

10మోషే యొక్క స్థానమును ఎవడును తీసికొననేరడు. వాడు ఎంతగానో పరుగెత్తుచుండవచ్చును, అతడు దానిని పొందుకొనుటకు ఎంతగానో ప్రయత్నించుచుండ వచ్చును, అయితే దేవుడు ఏమిచేయవలెనో, ఆయన బాగుగా ఎరుగును, దేవుడు మోషే నుండి ఏమి తీసికొనవలెనో, అతనిని ఎట్లు వాడుకొనవలెనో ఆయన బాగుగా ఎరుగును, ఇవన్నియు జరుగవలసియున్నవి. ఇప్పుడు గమనించుము, అతని స్థానమును ఏ ఒక్కడును పొందుకొనలేడు.

దేవుడు అతనికి ఒక సూచన యిచ్చెను, యిప్పుడు గమనించుము, ఐగుప్తునందు ప్రవేశించునప్పుడు, అతని పిలుపును గూర్చిన అధికారమును రుజువు చేయుటకు అతనికి ఒక సూచన నిచ్చెను. దేవుడు ఎల్లప్పుడును ఒక వర్తమానికునికి ఒక సూచన యిచ్చును, మరియు ఆ స్వరము లేదా ఆ శబ్దము యొక్క సూచనయై యుండును. అది లేఖనములలో వ్రాయబడియుండిన ఆ సూచన అతనిని గుర్తింపజేయును. యోహానువలె — "అరణ్యములో కేకవేయువాని శబ్దమునై యున్నాను," అని తెలియజేసెను.

"నీవు మెస్సియావా?" అని వారు అతనిని అడిగిరి.

అందుకు యోహాను - "ప్రవక్తయైన యెషయా చెప్పినట్లు ప్రభువు త్రోవను సరాళము చేయుడి అని అరణ్యములో ఎలుగెత్తి చెప్పు ఒకని శబ్దము," అని చెప్పెను. అయితే నేను మెస్సియాను కాననెను. అతడు స్పష్టముగా తన్ను లేఖనముతో ఐక్యపరచుకొని తానెవరైనది బయలుపరచెను. అందునిబట్టి దేవుడు ఏదైనను తాను చేయుచున్న కార్యమును తెలియజేసిన పిమ్మట దానిని ఆయన మార్పుచేయడు. దేవుడు ఏదైన ఆయన ఒక కార్యమును ఏ పద్ధతిలో చేయనుద్దేశించు దానిని ఏకపరచి అదే మార్గమున ప్రతిదియు సరిగా అదే చేయును. గత రాత్రి నేను మీకు చెప్పినట్లుగా, ఒక నిరపరాధి చిందించిన రక్తమువలననే మనుష్యుడు రక్షింపబడును.

మానవుడు రక్షింపబడుటకు మనము సకలము ప్రయత్నించితిమి. నెబుకద్నెజరు కట్టినట్లుగా మనము కట్టిన ఒక పట్టణమునకు వానిని తీసికొనిపోవుటకు ప్రయత్నించితిమి. నిమ్రోదు కట్టినట్లు గోపురము వారు కట్టిరి. వారు నియమ శాస్త్రమును కలిగియుండిరి. వారికి దేవాలయములుండెను. వారికి ప్రార్ధనా మందిరములు ఉండెను. వారు స్థాపన సంఘములను కలిగియుండిరి. దేవుని యొద్దకు నడిపించుటకు వారు విద్యాభ్యాసను, స్థాపక సంఘముల యొక్క పద్ధతులను కలిగియుండిరి. అవి అన్నియూ తప్పిపోయినవి. అది ఎల్లప్పుడును తప్పిపోవును. తిన్నగా అది చిందించబడిన (నిరపరాధి) రక్తము యొద్దకు మాత్రమే రావలసియున్నది!

2PET 1:20•

REV 22:18,19

 

11దేనినైనా చేయుచున్న దేవుని యొక్క మార్గము ఆయన వాక్యమునందు మాట్లాడబడియున్నది. మరియు ఈ వాక్యము యేసుక్రీస్తు యొక్క సంపూర్ణ ప్రత్యక్షతయై యున్నది, దీనికి ఏదైన చేర్చవలెను అని కాని, లేదా ఏదైన తీసివేయవలసినది లేదు. ఎవడైనను ఆలాగు చేసిన యెడల… బైబిల్ ఈలాగు చెప్పుచున్నది, ఎవడైనను దీనిలోనిది ఏదైన చేర్చినా, లేక తీసివేసినా గొర్రెపిల్ల జీవగ్రంధములో నుండి వాని పాలులేకుండ తెసివేయబడును. కేవలము దానిని వ్రాయబడిన విధముగానే తీసుకొనండి.

పరిశుద్ధ గ్రంథమును అనువదించుటకు ఎవరునూ అవసర౦లేదు. దేవుడే తన స్వంత అనువాదకుడై యున్నాడు. ఆయన చెప్పునది నెరవేర్చుట వలన ఆయన అనువాదము చేయును. అది దానిని స్థిరపరచును. ఒకవేళ దేవుడు చెప్పినట్లయితే, మరియు ఆయన చేసెను, అంతే. దానికి అనువాదము అవసరములేదు. దానికి ప్రత్యేక అనువాదము అవసరములేదు అని బైబిలు చెప్పుచున్నది.

NUM 12:6•

DEUT 18:22•

AMOS 3:7

 

12దానిని దేవుడు చేయు మార్గము. ఆయన పంపిన సూచనకు ఎల్లప్పుడును బద్దుడైయున్నాడు. భూమిమీద దేవుడు పంపిన ప్రతి సూచనకు ఆయన తన స్వరము వలన గుర్తింపజేయుచుండెను.

ఇప్పుడు, దేవుడు తన సేవకులైన ప్రవక్తలకు ముందుగా తెలుపకుండ ఆయన ఏదియు చేయడని బైబిలు చెప్పుచున్నది. ఇప్పుడు, అది తప్పైనయెడల, తక్కిన సమస్తము తప్పైనదగును, చూచారా. ఆయన తెలియజేయకుండ ఏదియు ఆయన చేయడు. మరియు ఆ దీర్ఘదర్శి ఏమి ప్రవచించునో సంఖ్యా 12:6 ప్రకారముగా అది నెరవేరుట మనము కనుగొనినయెడల అతడు దేవుని ప్రవక్త అని గుర్తింపబడును. అప్పుడు దానిని నమ్మవలెను. అట్టి రీతిగా జరుగని యెడల, దానిని నమ్మకూడదు.

అది అతడు చెప్పినట్లుగా తప్పక జరుగవలెను. ఆయన ఏమి చెప్పినను అది తప్పక జరుగును. అది వాక్యనుసారముగా లేనియెడల అది తప్పిదమే. అది దేవుని వాక్యమును అనుమతించి యుండవలెను. వారు జీవించుచున్న కాలమునకు, ఆ సమయమును సూచించునట్టి గురుతుగా దేవుని వాక్యముతో క్రమముగా స్థిరపరచవలెను.

EXOD 6:1•

EXOD 13:9

 

13దేవుడు తన బలమైన హస్తముతో తన ప్రజలను విడిపించెదనని వాగ్దానము చేసియుండెను. ఇప్పుడు ఈ వాగ్దాన వాక్యము నెరవేర్చుటకు ఆయన ఒక మత గురువును పిలువలేదు, ఆయన ఒక రబ్బీని (బోధకుని) పిలువలేదు, శాసనము జరిగించు అధికారముగల వానిని ఆయన పిలువలేదు. పుట్టుకతోనే ముందుగా నిర్ణయింపడిన ప్రవక్తగా , తనకు ఆ ఉద్యోగము అక్కర లేదని కొండలకు పరుగెత్తికొనిపోయి, గొర్రెలు కాయుచున్న కాపరిని ఆయన పిలిచెను.

ప్రజలు ఇదియై, అదియై లేదా మరో ఏదోయై యుండవలెనని కోరిక గలవారై యున్నారని నీవు వినినప్పుడు… సరిగా కనిపెట్టము. దేవుడు వారిని ఎన్నడు ఉపయోగించుకోడు. దేవుడు మోషేను పొందుకొనుటకు వేటాడవలసి వచ్చెను. ఆయన పౌలును పొందుకొనుటకు వేటాడవలసి వచ్చెను. అది చేయుటకు ఇష్టపడని మనుష్యులు. వారు దానిని కోరుకోరు. అప్పుడు దేవుడు అది చేయుటకు ఇష్టపడని మనుష్యుని తీసుకోని దాని వలన ఆయన తన మహిమను కనుపరచగలడు.

EXOD 4:8

 

14ఇప్పుడు గమనించుము. దేవుడు పంపిన ప్రతి సూచన ఒక స్వరము వలన అనుసరింపబడును. ఇచ్చట మన అంశము స్వరమును గుర్తింపజేయు సూచన అని చూడగలవు. "వారు మొదటి సూచననుబట్టి నీ శబ్దమును విననియెడల, రెండవ సూచననుబట్టియైన నీ శబ్దమును విందురు."

ఇప్పుడు, సూచన ఒక శబ్దమును కలిగియుండెను. కావున దేవుడు పంపిన ప్రతి ఒక్క సూచన ఒక శబ్దమును కలిగియుండును, మరియు ఆ శబ్దము దేవుని వాక్య ప్రకారము సరిగా ఆ దినమునకు ఇవ్వబడినదిగా మాట్లాడును. మునుపు వినబడినట్టి శబ్దము, అదే శబ్దము వినిపింపబడిన యెడల. నీవు (ఆ శబ్దమును అనుసరించు) సూచనను చూడగలవు. కాబట్టి అదే సూచనను ఆ మనుష్యుడు ప్రాచీన పాఠశాల ఆలోచననుసరించి చేయుచుండినప్పుడు అది సరియే అని నీవు చెప్పుదువు. "అది దేవుని నుండి వచ్చినది కాదు." అది ప్రాచీన పాఠశాల ఆలోచనయని గుర్తింపజేసిన యెడల అది ఎన్నడు జరుగదు. అది దేవుని యొక్క సంకల్పము (కార్యక్రమము)నకు విరోధమై ఉన్నది.

అది ఏదో ఒక నూతనమైనదిగా నుండవలెను. అయినను అది ఆ దినము యొక్క వాక్యముతో గుర్తి౦పబడవలెను, చూచారా, దేవుని వాక్యము యొక్క అనుకూలత. అది ఆలాగు ఉండవలెను. దానియందు ఎలాంటి పొరపాటుండదు. అది తప్పక సత్యమునై యుండును, అది సత్యమని దేవుడు సూచన ద్వారా రుజువు చేయును సత్యమును మాట్లాడు శక్తిని దేవుడు తప్పక వానిని వాక్యానుసారముగా దేవుని నుండి వచ్చిన లేదా పంపబడిన దీర్ఘదర్శి అని నిరూపింపబడును, లేదా అది సరికానిదని దానిని మరెన్నడు చూడకుండునట్లును, దానిని నమ్మకుందురు.

AMOS 3:7•

2PET 1:20

 

15సూచనలు దేవుని నుండి వచ్చినవి. వెంబడించు సూచన. లేదా సూచనను వెంబడించు (స్వరము) శబ్దము ఆ కాలమునకు సంబంధించినదైన దేవుని శబ్దము వాక్యము ద్వారా మాటలాడుచుండెను. అది మీకు అర్థమైనదా? దేవుడు సూచనలు ఇచ్చును. వాటివలన ఆయన ఏమిచేయును? ఎల్లప్పుడు సూచనలు యిచ్చును! ఆ సూచనలలో వారు ఆయన కొరకు కనిపెట్టవలెనని ఆయన వారితో చెప్పెను. దేవుడు ఆ సూచనలు యిచ్చుట వలన తన ప్రజల దృష్టిని ఆకర్షించుకొనును.

ఇప్పుడు దీనిని గూర్చి విపులముగా చదువుకొందాము. చూడుము, ప్రజల యొక్క దృష్టిని ఆకర్షించుకొనుటకు సూచనలు ఇవ్వబడెను. ఇవ్వబడు సూచనను దేవుడు పంపినప్పుడు, దేవుడు మాటలాడుటకు సిద్ధముగానున్నాడని అర్థమిచ్చుచున్నది. సూచన యిచ్చినప్పుడు దేవుడు మాట్లాడుటకు సిద్ధముగానున్నాడు. అది పరలోకము నుండి వచ్చినయెడల, అది దేవునియొద్ద నుండి వచ్చినదే మరియు దేవుడు మాటలాడుటకు సిద్ధముగానున్నాడు మరియు ప్రజల దృష్టిని ఆకర్షించుకొనుటకు ఆయన ప్రయత్నించుచున్నాడు. మరియు వాక్యము ఆయన ప్రవక్త యొద్దకు వచ్చును. ఆ ప్రవక్త తనకు తెలియజేసిన సూచనల ద్వారా గుర్తించబడును మరియు అతడు వాక్యము నొద్దకు వచ్చును అప్పుడు ఆ వాక్యము ప్రత్యక్షపరచబడును. అది దానిని స్థిరపరచును, దానికి ప్రత్యేకమైన అనువాదము అవసరతలేదు. ఏలయనగా దేవుడే దానిని ముందుగనే తెలియజేసెను. చూడుము, అది సరిగా ఎంత పరిపూర్ణముగా ఉ౦డవలెనో, అంతగానున్నది. ఇప్పుడు గమనించుము, ప్రజల దృష్టిని ఆకర్షించుటకు దేవుడు సూచనలు ఇచ్చును.

16ఇచ్చట మండుచున్న అగ్నిపొద ప్రవక్తను ఆకర్షించు సూచనయై యున్నది. మండుచున్న అగ్ని పొద … మోషే అరణ్యమునకు అవతల, ఎనుబది సంవత్సరములు వయస్సు కలిగి, పొడవైన గడ్డమును కలిగినవాడై తనకు పరిచయమైన ఎల్లప్పుడు నడుచుచున్న త్రోవను గొర్రెల మందను నడుపుచు మేయుచుండెను, అది బహుశా ఒక వేడిమి గల ప్రాతఃకాలమై యుండవచ్చును. అంతట అతడు తటాలున అగ్నితో మండుచున్న పొదను చూచెను కాని ఆ పొద కాలిపోలేదు. అది మొత్తానికి ఒక అసామాన్యమైన కార్యమునై యుండెను, సరియే.

ఇప్పుడు, మోషే ఐగుప్తు జ్ఞానమంతయు నేర్చిన రసాయనిక శాస్త్రజ్ఞడు ఈనాటి విజ్ఞానము (Science) కంటే ఉన్నతమైన రసాయనిక విజ్ఞానము కలిగినవారు ఐగుప్తీయులు, అందువలన ఆ పొద కాలిపోకుండునట్లు ఏ రసాయనిక పదార్ధములు వాని ఆకులపై చల్లినారో, చూడవలెనని ఒక రసాయనిక విజ్ఞాన శాస్త్రజ్ఞునివలె చూడవెళ్ళెను. అగ్నితో కాలుచున్న పొద మోషేతో మాటలాడకపోవును. అదే రీతిగా ఈనాడు మనము పాఠశాలలో నేర్చుకొను విజ్ఞాన-శాస్త్రముతో దేవుని వెదకిన, కొన్ని లక్షలాది మైళ్ల దూరములో దేవునిని పోగొట్టుకొనిన వారమగుచున్నాము. మోషేవలె అతని చెప్పులు దూరముగానుంచుట అతని విధేయతను సూచించునట్లుగా వినయముతో దానిని సమీపించుదము.

EXOD 2:24•

EXOD 4:1

 

17మరియు ఇప్పుడు, అచ్చట ప్రవక్త దృష్టిని ఆకర్ష౦చుటకు ఒక సూచన ఉండెను. ఆ సూచన ఒక శబ్దమును కలిగియుండవలెను. ఆ శబ్దము (స్వరము) మాటలాడినప్పుడు అది లేఖనమును అనుసరించియుండని యెడల ప్రవక్త దానిని వినునని నేను నమ్మను. అయితే ఇచ్చట లేఖనమును గమనించుము, ఆ సూచనను శబ్దము (స్వరము) వెంబడించునట్లుగా, ఆ శబ్దము దేవుడై యుండెనని రుజువుచేయబడినది; ఎట్లనగా ఆయన (దేవుడైన యెహోవా) యిట్లనెను - నేను నా యొక్క ప్రజల మూలుగులను ఆలకించితిని, మరియు నేను వారితో చేసిన వాగ్దానమును జ్ఞాపకము చేసికొనినాను. ఆ సూచనను వెంబడించిన (స్థిరపరచిన) శబ్దమును చూడుము; ఆ సూచనను స్థిరపరచునట్టి లేఖనము యొక్క శబ్దము వెంబడించుచున్నది.

వెనుక ఏమి జరిగినదో దానినే సరిగా నేను మీకు చూపుచున్నాను. అది దేవుని నుండి యివ్వబడిన సూచనైయుండవలెను, అది ఆ దినమునకు గల వాగ్దానమైనయెడల లేఖనము యొక్క శబ్దము దానిని రుజువు చేయునట్లు వెంబడించి జరుగవలెను. ప్రాచీన పాఠశాలలో జరిగిపోయిన వాటిని పదే పదే, రబ్బీల వలన, మతగురువుల వలన పొందినవి కాదు. అయితే, ఇది ఒక క్రొత్త విషయము మరియు ఇది లేఖనము ప్రకారమైనది, అది ప్రవక్తను ఆకర్షించునట్టి వాగ్దాన సంబంధమైన ఒక సూచన.

అటు పిమ్మట, అతడు (మోషే) వారి మధ్యకు పోవుటకు ముందుగా, తాను ప్రవక్తనని రుజువు చేయుటకు ఏదైన సూచన కావలసియున్నదని అతడు చెప్పెను; చూడుము, "వారు అతనిని స్వీకరించుటకు ముందు, ప్రభువు నాకు కనబడెనని వారు చెప్పరు."

EXOD 3:6,12•

2TIM 3:8

 

18అప్పుడాయన— "నేను నీకు రెండు సూచనలు ఇచ్చెదను, వాటిని చేయుట వలన ప్రజల దృష్టిని ఆకర్షించెదవు," అని చెప్పెను. ప్రజల దృష్టిని ఆకర్షింపబడినప్పుడు వారితో యిట్లనుము — "నేను అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడను మరియు నా యొక్క వాగ్దానమును నేను జ్ఞాపకము చేసికొనియున్నాను. మరియు నేను వారి మధ్యకు నిన్ను వారిని విడిపించుటకై పంపితిని మరియు నేను నీకు తోడుగానుందును.

మొదటి అతని సూచనను చూచితివా? వాటి యొక్క అనుకరణను అనేక రకములుగా అతడు కలిగియుండెను. ప్రతి ఒక్కరు సర్పమును పడవేయునట్లు ప్రయత్నించిరి. అది ప్రజలను పరుగెత్తిపోవునట్లు చేయకుండిన, అది ఏమైయున్నది నేనెరుగను. జాగ్రత్తగా చూడుము చూచితివా? అయితే, దాని వెనుక ఎటువంటి స్వరము యున్నది? ఏమీ లేదు. లోక సంబంధమైన ఐగుప్తు స్వరము తప్పు అయినను వారు సూచక క్రియ చేయుచున్నారు. అయితే ఆ సూచక క్రియను స్థిరపరచునట్టి శబ్దము దాని వెంబడించలేదు. మోషేకైతే "యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు," అను శబ్దమును కలిగియుండెను. అదే అందున్న వ్యత్యాసము. అనుకరణ చేయువారు చాలా సమయము వరకు వెంబడించిరి. కానీ, చివరకు కొనసాగించ లేకపోయిరి,

"యన్నే యంబ్రే అనువారు మోషేను ఎదిరించినట్టు వీరును చెడిన మనస్సు గలవారై, విశ్వాస విషయములో భ్రష్టులై సత్యమును ఎదిరింతురు," అట్టివారు ఈ కడవరి కాలమందు మరల బయలుదేరుట జరుగునని బైబిలు చెప్పెనని మీరెరుగుదురా? సత్యము ఎవరు? యేసు క్రీస్తు సత్యమైయున్నాడు. చూచితివా? సత్యమును చూపించు మనస్సు గలవారు.

19ఇప్పుడు యెహోవా తన వాగ్దాన వాక్యము వలన మాటలాడబోవుచున్నాడు గనుక ఆయన ప్రవక్తను పంపుటకు సిద్ధపరచవలెను. ఏలయనగా, అది ఆయన ఆలోచనలోని క్రమము, ఆయన చేయు విధానమును ప్రతి సమయమందును ఎల్లప్పుడును ఆయన అనుసరించు మార్గమై యున్నది. ఎట్లనగా తన ప్రవక్తను తన (శబ్దము) వాక్యముతో పంపును మరియు ఆయన పంపిన ప్రవక్తయని తన వాక్య నెరవేర్పు వలన రుజువు చేయును. ఇది మరల వాగ్దానము చేయబడిన ఒక సూచన. ఒక ప్రవక్త తానే ఒక సూచనయై యుండును. ఆ రీతిగా బైబిలు చెప్పుచున్నది.

మనము సమయము గడచిపోవుట చూచుచున్నప్పుడు, అటు పిమ్మట వచ్చుచున్నది. బైబిలు చరిత్రను తీసికొని చదువుము. సమయము ఎక్కువగా గతించిపోయినప్పుడు, ప్రవక్తను ఆ సమయమందు చూసినప్పుడు న్యాయ తీర్పు యొక్క సూచనను చూడగలము. దేవుడు లోకమునకు న్యాయ తీర్పు చేయబోవుచున్నాడు ప్రవక్త వచ్చుట నీవు చూచినప్పుడు ఆయన దేశమును లేదా ప్రజలను న్యాయ తీర్పు చేయనున్నాడని సూచన. "ఒక నిజమైన సూచనను ఉపేక్షించుట" అను వర్తమానము దాని విషయమై ప్రసంగించియుంటిని, (దానిని నీవు టేపు చేసి యుంటివేమో జ్ఞాపకము చేసికొనుము.) వారెల్లప్పుడు దానిని లెక్కచేయనట్లు ఉపేక్షించుదురు. అయితే అది రాబోవు న్యాయతీర్పును గూర్చిన సూచన అని వారు గుర్తించరు.

20ఇప్పుడు, శబ్దము (స్వరము) నందు ఆయన వాక్యమును నెరవేర్చియున్నాడు. ఆయన వాగ్దానము చేసినప్పుడు ఆయన శబ్దమువలన ఆయన వాక్యమును నెరవేర్చును. ఒక ప్రవక్త రాకడ న్యాయతీర్పు సమీపముగానున్నదానికి సూచనయై ఉన్నది. ఎప్పుడును ఈలాగే సంభవించుచుండును. ఒక దానిని యిచ్చట ఉదాహరణముగా చెప్పనిమ్ము.

నోవహును చూడుము. నీటివలన మంచివేయబడు లోకము దినములలో కడవరి కాలమందు దానినిగూర్చి ప్రవచించుచు వచ్చిన ఒక ప్రవక్తను లేపుట చూడగలము, చూడుము. అది ఏమైయుండెను? ప్రవచించిన పిమ్మట వెంటనే న్యాయతీర్పు ఆనాటి లోకమును మొత్తెను.

సూచనలతో రుజువుచేయబడిన దేవుని ప్రవక్తయైన మోషే ఐగుప్తునందు ప్రవేశించెను. జరిగినదేమి? ఆ ప్రవక్త సూచనలు చేసిన వెంటనే సరిగా న్యాయతీర్పు ఐగుప్తును మొత్తెను.

దేవుని ప్రవక్తయైన ఏలియా రాకడ ప్రదర్శింపబడి ఆహాబును అతని రాజ్యమును గూర్చి ప్రవచించెను. జరిగినదేమి? న్యాయతీర్పు అతడు తెలియజేసిన విధమున సరిగా అది సంభవించెను.

బాప్తిస్మమిచ్చు యోహాను ప్రవక్త సూచనగా వచ్చెను. అతడు ఒక ప్రవక్తయై యుండెను. అతడు భూమి మీద సూచనగా యివ్వబడిన ఒక ప్రవక్తయైయుండెను. అతడు వచ్చిన తరువాత మెస్సీయా మాట్లాడును అని వారు ఎరుగుదురు. అది తప్పక జరుగవలెను, ఏలయనగా ఏర్పరచబడినవారు దానిని గుర్తించవలెను.

GEN 19:13•

1KGS 19:18•

MATT 3:3•

MARK 1:3•

LUKE 3:4•

JOHN 1:23•

JOHN 3:30

 

21నోవహు దినములలోవలె ప్రజలు వెలుపలికి వచ్చుటకు ఏర్పరచబడిన వారికి అది సూచనగా యివ్వబడినది.

ఏలీయా దినములలో వలె ఏడువేలు లేదా ఏడువందలు లేదా ఎందరైన కావచ్చు బయలునకు మోకరింపక (ప్రత్యేకపరచబడి యుండిరి.) యుండునట్లు బయటకు పిలువబడిరి. యోహాను ఏర్పరచబడిన వారిని (సాంప్రదాయక సంఘముల నుండి) బయటకు పిలుచుచుండెను క్రీస్తు వచ్చినప్పుడు వారిని ఆయనకిచ్చుటకు తన సంఘమును మార్చెను, అతడు చెప్పినదేమనగా- నేను తగ్గింపబడవలెను; ఆయన హెచ్చింపబడవలెను. ఏలయనగా అరణ్యములో కేకవేయువాని ఒక శబ్దమునై యున్నాను. ప్రభువు మార్గము సరాళము చేయువాడనని అతడు తెలిపెను. మరియు యేసు ఆ బయలుపరచిన మార్గమున రావలెను. దేవుని శబ్దము వినుటకు (యోహాను వలన) ఆయత్తపరచబడి, ఏర్పాటు చేయబడిన వారు ఆ సూచనను ( The Prophetic sign)నమ్మి బయటకు వచ్చిన వారిని (Elected) పొందుకొనుటకు యేసు వచ్చును.

ఓ! మీరు ఈ సందేశమును అనుసరించినయెడల ఏర్పాటు చేయబడినవారు (Elected that's called) మాత్రము సిద్ధపడుదురు, ఇతరులు కాదు. వారు ఎన్నటికిని ఈ సందేశమును వినరు. ఈ వర్తమానము ఏర్పాటు ప్రకారము పిలువబడిన వారికి మాత్రమే. ఆ సూచనను యిచ్చిన దూత ఎక్కడికి వచ్చినది? అబ్రహాము అతనిని (వెంబడించు వారి) సముదాయము నొద్దకు వచ్చెను. "సోదోము నుండి దూరముగా నుండుము, అది కాల్చివేయబడనున్నది!" చూచితిరా? యేసు తిరిగి ఈనాటి సోదోమునకు జరుగబోవు న్యాయతీర్పును గూర్చి వాగ్దానము చేసెను.

ఇప్పుడు గమనించుము.

NUM 12:6•

MATT 12:24,31,32•

MARK 3:22•

LUKE 11:15

 

22అది ఇప్పుడు ఏమి చేయనున్నది? నోవహు దినములలోవలె ఏర్పరచబడి పిలువబడిన వారికి దేవుని రక్షణ సిద్ధపాటును వారు పొందుకొనెదరు. మరియు అది ఏమి చేయును? అది ఈ లోకజ్ఞానులను, అవిశ్వాసులను న్యాయతీర్పున దోషిగా తీర్పుతీర్చును. ఎల్లప్పుడు అది ఆలాగే జరిగించును. కృపను నిరాకరించిన న్యాయతీర్పు తప్ప మరేదియునుండదు. గనుక జ్ఞానులను, అవిశ్వాసులను న్యాయతీర్పునకు అది సిద్ధపరచుచున్నది. ఏలయనగా, వారు చేసినదేమి? వారు దానిని అపహసించిరి.

ఆ కారణమును బట్టియే యూదులు తమ స్వంత (శరీర) మాంసమును తినిరి. అదే కారణమును బట్టి రోమా సైన్యాధిపతియైన టైటస్ ముట్టడిచేసి ఆ పట్టణమున తన సైన్యముతో ముట్టడి చేసి యూదులను హతము చేయుచుండగా, వారి రక్తము ఆ పట్టణపు కోటగోడ కాలువలవలె ప్రవహించెను, ఏలయనగా పరిశుద్దాత్మను నిరాకరించిరి మరియు దానిని అపహసించిరి అందువలన ఆ న్యాయతీర్పు వారి మీదికి వచ్చెను. యేసు వారితో తనను బయల్జెబూబు అని పిలిచిన "నేను వారిని క్షమించెదను," అని చెప్పెను, ఏలయనగా ప్రాయశ్చిత్తబలి ఇంకను అర్పించలేదు, "అయితే పరిశుద్దాత్మ వచ్చినప్పుడు ఆ కార్యములనే చేయునప్పుడు [దానికి విరోధముగా మాటలాడిన] అది ఎన్నడును క్షమింపబడదు అని చెప్పెను. ఆ తరము వారు ఎన్నడును క్షమింపబడరు. అది వాస్తవమైన సంగతి. అవిశ్వాసికి న్యాయతీర్పు!

అది విశ్వాసికి వెలుగును, అవిశ్వాసికి చీకటి కలుగజేయునట్టి హేతువుగా అది తెలియజేయబడినది. అగ్నిస్తంభము వాగ్దాన దేశము ప్రయాణములో ఉన్నవారికి వెలుగును, అవిశ్వాసులకైతే చీకటిగా ఉన్నది. దేవుడను గ్రహించు సూచనలు ఎల్లప్పుడు అవిశ్వాసులకు గ్రుడ్డితనమును, విశ్వాసులకు దృష్టి అనుగహింపబడి ఆ వెలుగులో నడిపించుటకు చేయును. అందు నిమితమే అది పంపబడును.

DEUT 1:21•

DEUT 18:22•

LUKE 12:10•

HEB 1:1,2•

2PET 1:21

 

23ప్రవక్త యొక్క ప్రవచనము, అది నెరవేరుట జరిగినయెడల ఆ ప్రవచనము వాస్తవమైనది అప్పుడు అది దేవుని యొక్క హెచ్చరికయై యున్నది. ఇప్పుడు దానినే సంఖ్యా 12:6 అను లేఖనమునందు చూడగలము. బైబిలు పరిశుద్దాత్మ వలన ప్రేరేపింపబడి ఈ మనుష్యులు వ్రాసిరి. ఇప్పుడు మనము 2 పేతురు 1:21లో చూతము. "ఏలయనగా ప్రవచనము ఎప్పుడును మనుష్యుని ఇచ్చని బట్టి కలుగలేదు గాని మనుష్యులు పరిశుద్దాత్మ వలన ప్రేరేపింప బడినవారై దేవుని మూలముగా కలిగెను." మరియు హెబ్రీ 1:1లో గత రాత్రి మనము మాట్లాడితిమి. "పూర్వకాలమందు నానా సమయములలోను నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాటలాడిన దేవుడు! ఈ దినముల అంతమందు తన కుమారుడునగు యేసుక్రీస్తు ద్వారా మాటలాడెను."

NUM 12:7,8•

NUM 16:3,26

 

24అగ్నిస్తంభము, శబ్దము సూచన: ఆ శబ్దము మాటలాడబోవుచుండెను. పోదలోనున్న అగ్నిస్తంభము దేవుడు మాటలాడుటకు ఏర్పాటు చేసిన గమనించదగిన శబ్దము (A noted voice).

దీనిని జాగ్రత్తగా కనిపెట్టుము, తప్పిపోకుండునట్లు దానిని చూడుము. మిరియాము తన తమ్ముడైన మోషే యెడల (నవ్వినప్పుడు మరియు ఆమె ప్రవక్తినియై యుండెను), మరియు దేవుడు అగ్ని స్తంభమునందు దిగి వచ్చెను, మోషే దేవుడు మాటలాడబోవుచున్నాడని యెరుగును. అది ఒక సూచనయై యుండెను. ఆ అగ్నిస్తంభము యొక్క సూచనను వెంబడించిన శబ్దము- "నీవు దేవునికి భయపడవా?" అని పలికెను. "నా సేవకుడైన మోషే వంటి ఈ భూమి మీద ఎవరును లేరు," అని చెప్పెను.

దాతాను, కోరహు తను ఘనతకై మోషేకు విరోధముగా తిరుగుబాటు చేసినప్పుడు, అదే విధముగా (శపింపబడిరి) జరిగినది. "ఈ సమాజమంతటిలో నీవు ఒక్కడవే పవిత్రుడవా, నిన్ను నీవు ఈ గుంపులో హెచ్చించుకొను ఆలోచన నీవు కలిగియున్నావని (దాతాను, కోరహు) వారు తిరుగుబాటు చేయుటకు లేచిరి." ఆ పని నిమిత్తము దేవుడు మోషేను అభిషేకించెను.

తమ్మును వెంబడించుటకు ఒక స్థాపన సమాజమును కలిగియుండుటకు కోరిక కలిగినప్పుడు ఆయన - మీరు వారి నుండి ప్రత్యేకముగా నుండుడి నేను వారిని తప్పించబోవుచున్నాను. వారిని అంతమొందింపబోవుచున్నాను," అని చెప్పెను. భూమి వారిని మ్రి౦గి వేయునట్లు ఆయన చేసెను.

25దేవుని మార్గము ఎల్లప్పుడు ఆ విధముగానే ఉండునని మనము చూడగలము. అగ్నిస్తంభము శబ్దము మాటలాడుటకు స్థిరపరచబడినదని సూచించుచున్నది. ఓహ్, దీనిని పట్టుకో! గ్రుడ్డివాడు దానిని ఏలాగు పట్టుకోగలడు? హుస్టన్ను ఇంకను నీవు జ్ఞాపకము చేసికొనుము. చిహ్నం లేదా సూచనను శబ్దము వెంబడించును. మోషే ఇశ్రాయేలీయులకు ప్రవక్త సూచనయై ఉన్నాడు, వాక్యము అతని గూర్చి వాగ్దానము చేయబడినదని రుజువు చేయుచున్నది.

ప్రతి సమయములోను దేవుని వాక్యము ఎంత సంపూర్ణమైనదిగా ఉ౦డును, గత రాత్రి నేను మాట్లాడిన ఉరీమ్ తుమ్మీమ్ వలెనుండును. అక్కడ ఉంచబడిన ఉరీమ్ తుమ్మీమ్, ఎంతవరకు ఆ ఉరీమ్ తుమ్మీమ్ మీద సూచనగా ప్రకాశించబడదో, పలుకబడిన ఆ శబ్దము (స్వరము) అంగీకరింపబడినదిగా ఉ౦డదు. అచ్చట తప్పక ఒక సూచన ఆ శబ్దము దేవుని యొద్దనుండి వచ్చినదని రుజువుచేయును. శబ్దమును సూచించు సూచన అది "అవును" అని గాని "కాదు" అని గాని రుజువుచేయును. దేవుడు దానిని నిరాకరించినప్పుడు ఆ శబ్దము "కాదు" అని పలుకును చిహ్నం (సూచన) అచ్చట ఉన్నయెడల దేవుడు "అవును" అని మాటలాడెను. దేవుని యొక్క క్రమము ఎన్నటికిని మార్పుచెందదు. మనము గంటల తరబడి అచ్చట నిలుచుండినగాని అది ఎన్నడును మార్పుచెందనేరదు.

PS 37:23•

MATT 12:39,40•

MATT 16:4•

LUKE 11:29

 

26ప్రవక్తయైన యోనాను చూడండి. యివ్వబడిన సూచనను కూడ చూడుడి. అతడు నినెవేకు పోవుటకు బయలుదేరి, తార్సీస్ వెళ్ళు మార్గమును అవలంభించి యుండెను. అనేకులు యోనాను దోషిగా నిందించుచుండిరి. యోనా ఆ రీతిగా నిందింపబడుటకు తగినవాడు కాడు. అతడు ఒక ప్రవక్తయై యున్నాడు. "నీతిమంతుని మార్గము యెహోవా వలన ఆజ్ఞాపింపబడును మరియు అతడు తార్సీస్కు పోవు మార్గమున బయలుదేరెను. మనము ఆ మనిషిని దోషిగా నిందించుటకు ప్రయత్నించెదము.

కాని యేసు అతనిని దోషిగా చేయలేదు. గమనించుము, ఆయన "యోనా మూడు రాత్రింబగళ్ళు తిమింగలము కడుపులో ఏలాగుండెనో? అది అతని కొరకు యివ్వబడిన సూచనయై (చిహ్నం) యుండెను, "ఆలాగు మనుష్యకుమారుడు మూడు, రాత్రింబగళ్ళు భూ-గర్భమందు ఉండును? వ్యభిచారులైన చెడ్డతరము వారు సూచక క్రియను అడుగుచున్నారు. ప్రవక్తయైన యోనాను గూర్చిన సూచక క్రియయేగాని మరి ఏ సూచక క్రియయైనను వారికి అనుగ్రహింపబడదు." యోనాను గూర్చిన సూచక క్రియ ఏమిటి? పునరుత్దానము.

ఇది సొదొమ తరము వారు వ్యభిచార సంతతి, దేవుని సత్యమునకు విరోధముగా ప్రవర్తించి, అపహసించుచు ఆత్మీయ వ్యభిచారము జరిగించిన వారికి సూచక క్రియయై ఉన్నది. "వ్యభిచారులైన చెడ్డతరము వారికి పునరుత్దాన సూచక క్రియ ఇవ్వబడినది."

యోనాను చూడుము.

27ఆ ప్రజలు విగ్రహారాధన చేయు అన్యజనులు అది (నినేవె పట్టణము) గొప్ప వ్యాపార సంబంధమైన పట్టణము వారి ముఖ్య వృత్తి చేపల వ్యాపారము. వారు ఆ దేశమంతటికి చేపలు సరఫరా చేయుచుండిరి. ఆ ప్రజలు చేపలు పట్టు (బెస్తవారు) వారు. అది వారి ముఖ్య వృత్తియై యుండెను. వారు అన్యులగుటను బట్టి జంతువులను, విగ్రహములను పూజించుచుండిరి, మరియు వారు బహు చెడ్డవారై యుండిరి.

ఇప్పటి ఈ దేశము (అమెరికా) వలె, హాలీవుడ్, కామాభిలాషతో నిండి, అన్ని రకములైన చెడు అలవాటులు కలిగి, ప్రార్థనా మందిరమనబడు ఆలయములలో ( In the churches) జరిగించుచున్నారు మరియు గమనించుము ఏమి సంభవించుచున్నదో అచ్చట. ఎందుకనగా, కొన్ని సమయములందు ఈ కామాభిలాష క్రియలను ప్రార్ధన మందిరమందు ఆధునిక పద్ధతి అని పిలువ బడుచున్నది. అలాంటి ప్రవర్తనగల ఈ దేశము (ఆమెరికాను గూర్చి ప్రవక్త విలియం మారియన్ బ్రనహోం మాట్లాడుచున్నాడు) న్యాయతీర్పుకు గురికాకుండ ఎట్లు నిలువబడగలదు? మిమ్మను మీరు క్రైస్తవులని పిలువబడుచు ఆ ప్రకారము ప్రవర్తించిన మీరు ఎట్లు నిలువబడగలరు? నా యొక్క మంచి స్నేహితుడు జాక్ మోరె కొన్ని సంవత్సరముల క్రిందట చెప్పినట్లుగా, "దేవుడు ఈ దేశమును (అమెరికాను) అదే స్థితిలో విడిచినయెడల, దేవుడు న్యాయవంతుడు గనుక సొదోము గొమొర్రాలను లేపినప్పుడు, వారిని అగ్నితో కాల్చినందులకు క్షమాపణ అడుగుకొనుటకు బద్దుడైయున్నాడు."

మీరు న్యాయతీర్పునకు బంధింపబడితిరి. అందుండి మీరంగీకరించుటకు వేరే మార్గము లేదు అది మీ బైబిలులలో వ్రాసికొనండి. నేను వృద్ధుడను కాబోవుచున్నాను. అది ఆ న్యాయతీర్పునకు నడిపింపబడుకుండునేమో. మీరు చూడుడి. నేను సర్వసాధారణముగా జీవించినయెడల, నా సర్వసాధారణ జీవితములో దానిని ( ఆ న్యాయతీర్పును) చూడగలను. మరికొన్ని సంవత్సరములకైన అది మరలును.

JON 3:4•

MATT 12:41•

LUKE 11:32

 

28యోన - వారందరు (నీనెవే వారు) మధ్యాహ్న సమయమందు చేపలు పట్టుటకు బయటకు వెళ్ళియుండిరి, వారు సముద్రపు దేవతగా ఎంచిన (ఒక పెద్ద చేప) తిమింగలము అందుండి పరుగెత్తుకొని ఒడ్డునకు వచ్చి దాని నోటి నుండి యోనా ప్రవక్తను కక్కెను. ఎటువంటి సూచక క్రియ! దేవుడు ఒక సందేశముతో తన ప్రవక్తను (విమోచించెను) విడుదల చేసెను. ఇప్పుడు వారు ఆ సూచక క్రియను చూచిరి, వారు ఆ సూచక క్రియను నమ్మిరి. ఇప్పుడు ఆ సందేశమేమిటి? "మారు మనస్సు పొందుడి" అదే సూచక క్రియ యొక్క స్వరము. ఆ సూచక క్రియ యొక్క స్వరము ఏమనగా "మారు మనస్సు పొందుడి లేదా నలుబది దినములలో మీరు నశించెదరు." మారు మనస్సు పొందుటను వారు బాగా ఎరిగిరి. యేసు, "వారు ఈ తరము వారితో నిలువబడి వారి మీద నేర స్థాపన చేయుదురు ఏలయనగా వారు యోనా వర్తమానమును విని మారు మనస్సు పొందిరి, యోనాకంటె గొప్పవాడు ఇక్కడ ఉన్నాడని," చెప్పెను. ఆ శబ్దము: "మారు మనస్సు పొందుడి లేదా నలుబది దినములలో నశింపబడుదురు."

MAL 3:1•

MATT 3:11•

MARK 1:7,8•

LUKE 3:16•

JOHN 1:26,27

 

29ప్రవక్తయైన యోహాను, నాలుగు వందల సంవత్సరములు ఏ ఒక్క ప్రవక్త లేని పిమ్మట ఒక ప్రవక్త - కనబడునన్న సూచన కనబడుచున్నది. వారు జ్ఞానులెల్లరిని కలిగియుండిరి. వారు ఎంత తారుమారైయుందురని నేను భావించుచున్నాను! నాలుగు వందల సంవత్సరములు ప్రవక్త లేకుండెను, అయితే మెస్సియా వచ్చు సమయము సమీపించినది. యోహాను ప్రవక్తయై ఉన్నందున మెస్సియా మాటలాడబోవుచున్నాడు అను శబ్దమునకు అతడు చిహ్నమై ఉన్నాడు, మలాకి 3లో — "ఇదిగో నాకు ముందుగా మార్గము సిద్దపరచుటకై నా దూతను పంపుచున్నాను," అని చెప్పబడుట చూడగలము. ఆయనకు ముందు ఏలీయా రావలసియుండెను. మరియు ఏలీయా వచ్చెను. అతడు ఏలియా ఆత్మతోను, శక్తితోను వచ్చిన యోహాను, అతడు లేఖనములలో చెప్పినట్లుగా వచ్చెను, లేఖనములలో ఏమి చెప్పబడెనో, అతడు సరిగా దానిని చేసెను మరియు వారు దానిని గుర్తించరైరి. లేఖనము, చెప్పినట్లు అతడు మెస్సియా మాటలాడ బోవుచున్నాడు అను దానికి ప్రవక్త చిహ్నముగా ఉ౦డెను.

తన వెనుక రానున్న మెస్సియాకు సూచనగా యివ్వబడిన ప్రవక్త దానిని బాగుగా ఎరిగియుండెను. అతడు తాను ఎరిగిన దానిని, "మీ మధ్యలో సరిగా ఈ సమయమందు నిలిచియున్న ఒకడని చెప్పవరకు బాగుగా ఎరిగియుండెను. ఏ మెస్సియాను గూర్చి మీతో మాటలాడితినో ఆయన మీ మధ్యనున్నాడు. "నేను ఆయన చెప్పుల వారును విప్పుటకు యోగ్యుడను కాను, పరిశుద్దాత్మ తోను, అగ్నితోను బాప్తిస్మమిచ్చు వాడు ఆయనే. నేను నీళ్లతో మారు మనస్సు నిమిత్తము బాప్తిస్మము యిచ్చుచున్నాను. కాని ఆయన నా వెనుక వచ్చును. ఇప్పుడు ఆయన మీ మధ్యనున్నాడు."

MATT 3:17•

MARK 1:11•

LUKE 3:22•

JOHN 1:32,33

 

30ఒక రోజు యావ్వనస్తుడొకడు క్రిందికి దిగి వచ్చుటను అతడు చూచెను. అగ్ని స్తంభము పావురము రూపములో పరలోకము నుండి దిగి వచ్చుటను అతడు చూచెను. ఆ స్వరము ఇలా చెప్పుచుండెను. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను నివసింపగోరుచున్నాను." "ఈయన యందు నివసించుటకు నేనానందించుచున్నాను," అని చెప్పెను. ఇది క్రియా విశేషణము ముందు క్రియవలె యున్నది, "ఎవరిలో నేను నివసించుటకు ఆనందించగోరుచున్నాను" లేదా "ఎవనియందు నేను నివసించుటకు ఆనందించగోరుచున్నాను" రెంటిలో ఏ వ్యత్యాసము లేదు. కాబట్టి అది ఒకేలాగు యున్నది. గమనించుము. "నేను ఆయనయందు నివసించుటకు ఆనందించుచున్నాను."

యోహాను సాక్ష్యమిచ్చినదేమనగా, "నేను ఆయనను ఎరుగనైతిని గాని నీళ్ళతో బాప్తిస్మమిచ్చుటకు నన్ను పంపినవాడు (అరణ్యము నుండి సెమినరీ నుండి కాదు) - నీవెవని మీద ఆత్మ దిగి వచ్చుట చూతువో [ఆమెన్!] ఆయనే పరిశుద్దాత్మలో బాప్తిస్మమిచ్చువాడని నాతో చెప్పెను. ఆ సత్యమును గూర్చి నేను సాక్ష్యమిచ్చుచున్నాననెను."

అది ఏమైయున్నది? మెస్సియా మాటలాడుటకు సిద్ధముగా ఉన్నాడు అనుటకు ప్రవక్త సూచనయై యున్నాడు.

మెస్సియా ఏమైయుండెను? మెస్సియా వాక్యము యొక్క పరిపూరుడై ఉండెను. ఆయన దేవుని యొక్క సర్వ-సంపూర్ణతయై యుండెను. ఆ ప్రవక్త దీపము ఆరిపోవుటకు ముందు బగ్గుమని మండు వెలుగై ఉండెను. కాని ఆయనయందు సంపూర్ణ వెలుగు యుండెను, ఆ వెలుగును కలిగియుండిన ఆయనే ఈ మెస్సియాయై యుండెను, గనుక ఆయన ప్రత్యక్షపరచబడిన దేవుడు, దేవుడు మనతో ఉ౦డుటకు రక్తమాంస-శరీరమున ఇమ్మానుయేలుగా ప్రత్యక్షుడాయెను.

AMOS 3:7•

MATT 3:14•

MATT 11:7-9•

LUKE 7:24-26

 

31మెస్సియా మాటలాడుటకు సిద్ధముగానున్నాడు.

బైబిలు చెప్పునది చూడుము, ప్రభువు వాక్యము ప్రవక్త యొద్దకు వచ్చును. యేసు యోహానును గూర్చి ఇంతవరకు గల ప్రవక్తలలో యోహాను గొప్పవాడు అని చెప్పెను. మరియు యేసు మత్తయి 11వ అధ్యాయములో చెప్పినదేమనగా "మీరేమి చూచుటకు అరణ్యములోనికి వెళ్ళితిరి? గాలికి కదలుచున్న మనుష్యుని? [నీవు దీనిని చేయుము నీకు అధికముగా ఇచ్చెదనని చెప్పు స్థాపన సంఘమునా? యోహానును కాదు! కాదు, సునాయాసముగా త్రోసిపుచ్చబడు ఒడుదుడుకైనవానినా? కాదు, మొరటువాడుగను, పెడసరముగా నుండు ప్రవక్తను.] మతగురు పోషకములు ధరించినవానినా? "లేదు. వారు చక్కని రాజ భవనములందు నివసించుదురు. వారు యవ్వనులను వివాహము చేసికొని, శిశువులను ముద్దు పెట్టుకొందురు మరియు వృద్దులను పాతిపెట్టుదురు." పురాతనమైనవి రెండంచులు కలిగి వాడియైన ఖడ్గమును గూర్చి ఏమియు ఎరుగని ఒక తెగవారు.

గనుక "మీరు దేనిని చూచుటకు వెళ్ళితిరి? ఒక ప్రవక్తనా?" "ప్రవక్తకంటె గొప్పవాడు!" అని ఆయన చెప్పెను. వాస్తవముగా, దేవుని వలన వాగ్దానము చేయబడి పంపబడిన నిబంధన దూత ఆయనయై ఉన్నాడు యోహాను నీళ్ళలో నిలువబడి బాప్తిస్మమిచ్చుచు చెప్పుచున్నదానిని జాగ్రత్తగా గమనించుము- "ఆయన వచ్చుచున్నాడు." మరియు వాక్యము ఇక్కడ ఉన్నది, పరలోకములో లేదు, అది శరీరధారి ఆయెను. ఆ వాక్యము శరీరముగానున్నది, అటుపిమ్మట సంభవించినదేమి? దేవుని లేఖనము యొక్క క్రమమేమిటి? ఆ వాక్యము ప్రవక్త యొద్దకే వచ్చెను. అతడు అరణ్యములోను, నీళ్ళలోను ఉండగా వచ్చెను. వాక్యము ప్రవక్త యొద్దకు వచ్చెను. యోహాను ఆయనను చూచి - నేను నీ చేత బాప్తిస్మము పొందవలసిన వాడనై యున్నానని చెప్పెను.

MATT 3:14,15,17•

MARK 1:11•

LUKE 3:22•

JOHN 1:36

 

32నా యొక్క ప్రియ పురాతన సహో, డాక్టర్ డేవిస్ బాప్టిస్తు చర్చి మిషనెరీ, అతడు నన్ను క్రీస్తునందు విశ్వాసమున నాకు బాప్తిస్మమిచ్చెను. ఈ రాత్రి అతడు యిక్కడ ఉ౦డిన యెడల అతని మనస్సును నొప్పించవలెనని నా ఉద్దేశము కాదు. ఏలయనగా, డేవిస్ మౌంటెన్ (ఒక స్థలము)ను విడిచి ఇక్కడకు వచ్చి టెక్సాస్లో నివసించుచున్నాడు. ఒక దినమున ఆ విషయమును తర్కించుచుంటిమి, అప్పుడు నేను సాధారణముగా ఒక బాలుని. "అది సరిగా ఉన్నట్లు నాకు తోచుట లేదు డాక్టరు డేవిస్ గారు," అని నేను చెప్పితిని.

యేసు యోహానునకు బాప్తిస్మమిచ్చెను, అటు తర్వాత యోహాను యేసునకు బాప్తిస్మమిచ్చినప్పుడు ఏమి జరిగినది, ఎందుకనిన యోహాను బాప్తిస్మము పొందియుండలేదు," అని అతడు చెప్పెను.

అతడు చెప్పినది నాకు సరిగా (కనబడలేదు) ఉన్నదని తోచలేదు. నేను ఆశ్చర్యపడుచు కనిపెట్టుచు కాచుకొనుచుంటిని. ఒక రోజున ప్రభువు దానిని బయలుపరచువరకు దానిని గురించి నేనేమియూ మాట్లాడలేదు. యోహాను - "నేను నీచేత బాప్తిస్మము పొందవలసినవాడనై యున్నానని, నీవు నా యొద్దకు ఏల వచ్చుచున్నావని" చెప్పినప్పుడు.

యేసు చెప్పినదానిని జాగ్రత్తగా గమనించుము. యేసు- "ఇప్పటికి కానిమ్ము నీతి యావత్తు ఈలాగు నెరవేర్చుట మనకు తగి యున్నదని," అతనితో చెప్పెను. ఆయన ఎవరైయుండెనో యోహాను ఎరుగును. ఇచ్చట ప్రపంచము యొక్క ఇద్దరు నాయకులు ఉన్నారు, సంఘము యొక్క ఇద్దరు నాయకులు, దేవుడు మరియు ఆయన ప్రవక్త కలసి నిలబడియున్నారు.

ఇప్పుడు జాగ్రత్తగా కనిపెట్టుము. వారు తప్పక తెలుసుకొనవలెను. యేసు - "ఇప్పటికి కానిమ్మ, అది సరియే, కాని వాగ్దాన వాక్యమును మనము నెరవేర్చుటవలన దేవుని నీతి యావత్తు మనము నెరవేర్చవలసి యున్నది," అని చెప్పెను. బలి అర్పణ చేయునది అర్పించుటకు ముందుగా దానిని కడుగవలెను. యేసు బలిగా అర్పింపబడబోవువాడుగా ఉన్నందున యోహాను ఆయనకు బాప్తిస్మము ఇచ్చెను. చూచితివా? బలి అర్పణకు సమర్పించుటకు ముందు అది కడుగబడవలెను. అతడు తిన్నగా వెళ్ళి బలిగా అర్పింపబడబోవు దానిని కడిగెను. బలి అర్పణకు అప్పగించెను.

అప్పుడు అతడు - "ఇదిగో లోక పాపమును మోసికొనిపోవు దేవుని గొర్రెపిల్ల," అని చెప్పెను.

ఆయన తిన్నగా ఒడ్డునకు రాగా, దేవుని ఆత్మ ఆయన మీదికి వచ్చెను "ఈయన నా ప్రియ కుమారుడని" ఆకాశము నుండి ఒక శబ్దము వచ్చెను. ఆయన బహిరంగముగా జనులకు బయలుపరచబడెను. అయితే బలి అర్పణ అర్పించుటకు ప్రధమముగా, అది పాత నిబంధన నియమానుసారముగా కడుగబడవలెను.

మంచిది.

MATT 3:7,9•

LUKE 3:7,8

 

33మెస్సియా మాటలాడుటకు సిద్ధపరచబడిన దానికి చిహ్నముగానున్నాడు. నాలుగు వందల సంవత్సరములకు తరువాత ఒక ప్రవక్త ప్రదర్శింపబడినాడనగా, అతని తరువాత మెస్సియా మాట్లాడు (శబ్దము)ను అది వారు ఎరుగుదురు.

పరిశుద్ధ గ్రంథము పఠనము చేయు మీకు కొన్ని నిమిషములు సరిగా తలంచుటకు కష్టముగా నుండును. అతని యొక్క స్వభావమును కనిపెట్టుచు వారెట్లు అతనిని కనుగొనక తప్పిపోయిరి? అతడు యోహాను అని ఎరిగియుండి వారు ఏలాగు అతనిని కనుగొనక తప్పిపోయిరి? అతని యొక్క స్వభావము గుర్తించబడినది. అతని ఆత్మ మరియు స్వభావమును ఎలీయా వలె గుర్తించబడెను. ఇప్పుడు, ఏ ఆత్మయో గమనించుము. ఇప్పుడు, అతడు బాప్తిస్మము ఇచ్చు యోహాను, కానీ, ఎలీయా యొక్క ఆత్మ అతనిపై యుండెను.

ఇప్పుడు చూడుము, ప్రధమ ఏలీయా ఒక మనిషియై యుండెను, అతడు అరణ్యమును ప్రేమించెను. చూడుము, యోహాను కూడ ఒక మనిషియే, అరణ్యములో నివసించుచుండెను. ఏలియా అతని కాలమందున్న స్థాపన సంఘముల పద్ధతులను బట్టి వారిని దోషులుగా నిరూపించి, ఖండించెను. ఆలాగే యోహాను - "సర్ప సంతానమా, రాబోవు ఉగ్రతను తప్పించుకొనుటకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడు? మేము ఫలాని ఇది, అది, మరేదొకటియై యున్నారని ఎందుకు చెప్పుచున్నారు. దేవుడు ఈ రాళ్ళవలన అబ్రహామునకు పిల్లలను కలుగజేయు సమర్ధుడు." చూడుము, వీరిద్దరి స్వభావములు?

1KGS 19:4•

MATT 11:3•

MATT 12:42•

LUKE 7:19•

LUKE 11:31

 

34ఏలీయాను చూడుము. ముఖంపై రంగులు పూసుకొని, అవినీతిగా ప్రవర్తించుచుండిన యెజెబేలులందరిని దోషులుగా ఆ కాలమందు ఖండించెను. యోహాను ఏమి చేసెను? అదే రీతిగా హేరోదియాకు చేసెను. వారిరువురు వారి మరణమునకు కారణభూతులు. ఏలీయాను చూడుము, అతడు ఆ గొప్ప కార్యము జరిగించిన పిమ్మట అతడు విసుగుచెందినవాడై, నా ప్రాణము తీసికొనమని ప్రార్థించెను. యోహాను కూడ చెరసాలలో నుండగా - "రాబోవు వాడవు నీవేనా, మేము మరియొకని కొరకు కనిపెట్టవలెనా? అని ఆయనను అడుగుటకు తన శిష్యులను పంపెను."

యేసు ఆ విషయమును ఎరుగును. అతడు ఏలీయాయై యుండెను. అతడు అతని స్వభావమునే కలిగియున్నాడు. ఏలీయావలెనే సరిగా అతడు ఏ వ్యత్యాసములేకుండ అదే స్వభావమును కలిగి యుండెను. (ఎట్లనగా) అతడు ఏలీయా ఆత్మను కలిగియుండెను. ఏలీయా ఆత్మ ఐదుమారులు రావలసియున్నది. ఆ ఆత్మ ఏలీయా మీద నుండి, అతని ఉపయోగించిన ఆత్మ ఏలీషాను, బాప్తిస్మమిచ్చు యోహానును మలాకి 4వ అధ్యాయము బయలుపరచబడిన విధముగాను, అటుపిమ్మట కడవరి కాలములో యూదుల నిమిత్తము వచ్చుట గమనించగలము [స్పష్టత లేని మాటలు]. ఏలీయా కలిగిన ఆత్మ!

గమనించుము. ఈనాడు, (అధునిక) ప్రస్తుత ఆహాబు యొక్క ప్రవక్తలను చూడవలెనని మిమ్మను కోరుచున్నాను, వారి యొక్క యెజెబెలులను (క్రాపు) వెంట్రుకలు కత్తిరించుకొనుట, ముఖమునకు రంగులు పూసికొనుట, పురుషుల దుస్తులు వేసికొనుట, సిగరెట్లు త్రాగుట, ఏదైన చేయుటకు "అది మంచిదే," అని అనుమతించుచున్నారు. ఈనాటి మన ఆహాబు ప్రవక్తలు సరిగా వారి యొక్క పాఠశాలలలో వెళ్ళుచు స్థాపన సంఘములలోని మానవ పద్ధతులలోని మతశాఖలు బోధను అనుసరించునట్లు వానిని నడుపుచున్నారు, అదేమిటి? ఆహాబు ప్రవక్తలను సూచించుచున్నది. మనకు మరొక మీకా లేపబడి రంగము మీదికి రావలసిన అవసరత యున్నది. లేదా ఆహాబు కాలములో, ఎలీయా రంగము మీదికి రావలసి యున్నది. ఎవరయితే వాగ్దానము చేయబడిరో.

వారు తమచుట్టు ఉ౦డునట్లును, తమకిష్టమైన మార్గమున వారిని నడిపించుచుండిరి. వారు దానికి ఒప్పుకొనని యెడల వారిని యిక్కడనో, మరెక్కడైనను ఆదరించకపోవుట వలన, వారు తిరిగి వెళ్ళి దానిలో చేరి, వారు తమ క్రైస్తవ వృత్తిని కొనసాగించెదరు.

ప్రారంభమున అసలు వారు రక్షింపబడలేదు. వారి స్వభావమే వారిని గూర్చి రుజువుచేయును. ముండ్ల చెట్ల నుండి ద్రాక్షా ఫలములు వచ్చునా? గుమ్మడి చెట్టు తీగ నుండి దర్బూజ పండు పొందుకొనగలమా? వాక్యముతో వారికి ఏమి పనిలేని స్వభావమును వారు చూపించెదరు. వారు వాక్యమును హేళనగా చేసెదరు. మరియు దానిని దూషించెదరు. "యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు," ఇవి ఈ విధముగా జరుగునని వ్రాయబడిన దానిని అపహాస్యము చేసెదరు మరియు వెక్కిరించినట్లుగా నవ్వుదురు.

JOHN 6:37,44

 

35"విమర్శ దినమున దక్షిణ దేశపు పురాణ ఈ తరము వారితో నిలువబడి వారి మీద నేరస్థాపన చేయును; ఆమె సొలోమోను జ్ఞానము వినుటకు భూమ్యంతముల నుండి వచ్చెను; ఇదిగో సొలోమోను కంటె గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు," అని యేసు చెప్పుటలో ఆశ్చర్యములేదు. తప్పక.

సాలోమోను అతని దినములందు గొప్పవాడుగానున్న దినములైయుండెను. సాలోమోనుకు దేవుడిచ్చిన ఈ (వరమును) దానమును ప్రజలందరు నమ్మియుండిరి, అతనిని గూర్చిన ఖ్యాతి ప్రతి చోట ప్రఖ్యాతిగాంచి యుండెను ఈనాటి ప్రజలమైన మనమును దానిని ఎరిగియుండిన ఏమి. అమెరికావారమైన మనము కమ్యూనిజమునకు విరోధముగా ఎల్లప్పుడు ఏవో కార్యములు చేయుటకు ప్రయత్నించుచున్నాము. ఇచ్చట - "మారుమనస్సు పొంది దేవునివైపు తిరుగుడి," అను దేవుని (ఫోగ్రాం) కార్యక్రమము ఉన్నది ఏ కార్యక్రమము? మనము దానిని చేసినయెడల కమ్యూనిజమును మరచిపోగలము.

మరియు ఇశ్రాయేలీయులందరు దేవుడు వారికి ఇచ్చిన వరమును నమ్మిరి. ఈ కడవరి దినములలో దేవుడు మనకు ఇచ్చిన వరము అనగా ఆయన కుమారుడు పరిశుద్దాత్మ రూపములో ఉన్నాడని, మరణము నుండి లేచి యున్నాడనియు, ఆయన చేసిన వాగ్దానము ప్రకారము మన మధ్య నివసించుచున్నాడనియు అమెరికా నమ్మినట్లయితే, మనము దానిని కాపాడుకొందుము.

ఇది ఏర్పాటు చేయబడినవారికి మాత్రమే చెందును. "నన్ను పంపిన తండ్రి వానిని ఆకర్షించితేనే గాని, యెవడును నా యొద్దకు రాలేడు." విత్తనములు సాధారణముగా విత్తబడుచుండగా, కొన్ని యిచ్చటను మరికొన్ని మరొక స్థలమున పడుచుండును, కాని విత్తనము ఏలాగైతేనేమి విత్తబడుచున్నది. అది ఎచ్చట పడినను దాని వేరులు కదలనివ్వకుండ పట్టుకొనును. వారు దానిని గ్రహించెదరు.

MATT 14:4•

MARK 6:18

 

36గమనించుము. వారు ఇక్కడే ఉండిరి. ఆహాబు, ఆ దినమందు, తమకిష్టమైన దేనినైనను చేయుచున్న రాష్ట్రమగు ఇశ్రాయేలీయులను కలిగియుండియు, పేరునకు ఇశ్రాయేలీయులని చెప్పుకొనుచుండుట చూడగలము. తాను కలిగియున్నదానంతటితో ఏలీయా ఏ విధముగా ఆ తరము వారిని దోషిగా చేసెను - ఆయన వచ్చుటకు ముందు, అతడు ఒక ప్రవక్తయై యుండెనని దేవుడు రుజువు చేయుచుండెను.

యోహాను కూడ అలాగే చేసెను. నేరుగా నడచి. మరియు ఇశ్రాయేలీయులు ఆ స్త్రీను హేరోదునకు వివాహము చేసిరి. ఆమె అతని సహోదరుడు ఫిలిప్పు భార్య అతని ముఖము యెదుటకు వెళ్ళి, ఆ రహస్యమును బయలుపరిచెను. తనను ఏదో మత నాయకుడు వెలివేయునని అతడు భయపడలేదు అతడు ఫలాన సహవాసమునకు చెందినవాడని తెలియజేయు కార్డు (పత్రిక) లేదు. అయితే దేవునితో మాత్రము అతడుండెను. అతడు ఆయన ప్రవక్తయైయుండెను. అతడు ఆయన వాక్యమును కలిగియుండెను. అతడు ప్రవక్తగా అభిషేకింపబడియుండెను. దేవుని వాక్యము అతడు కలిగియుండెను. గనుక అతడు ఏ బిషప్, డీకన్నో సంధించవలసిన అవసరత లేదు.

అతడు తిన్నగా అతని (హెరోదు) సమక్షమునకు వెళ్ళి, "నీవు ఆమెను కలిగియుండుట సరికాదు," అని చెప్పెను. ఇతరులు తనకు ఏదైన కీడు కలుగజేయుదురని భయపడలేదు. ఆ చెడ్డ స్త్రీలు వ్యభిచారము జరిగించుచునే ఉన్నారు!

37ఆమోసువలె, అతడు వచ్చినప్పుడు ఆ దృశ్యమును అచ్చట చూచియుండును. అతడు ఎక్కడ నుండి వచ్చునో మనము యొరుగము. ఆ సమరయ పట్టణమును అతడు ఎట్లు చూచియుండునో! దేశ సంచారకులవలె, అంతయు సోగసు. బోధకులెల్లరు ఐకమత్యమునందు ఆ రాష్ట్రముతో మరియు పరస్పర కట్టుబాటుతో ప్రతి యొక్కరు ఆ (రాష్ట్రము) దేశముతో కలిగియుండియు, పాపములోనే జీవించుచున్నారు. అతడు కోప దృష్టిగలిగి, మెరయుచున్న బట్టతలతో, ఆ రీతిగా అతడు అచ్చటికి వచ్చెను. అతడు మనము చూచుటకు ఆకర్షణీయుడుగా లేడు కాని "యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు," అను దానిని అతడు కలిగియుండెను.

ఈనాటి దృష్టమునందు ఒక ఆమోసు మనకు అవసరమైయున్నాడు. మనము అతనిని స్వీకరించగలమా? వాస్తవముగా అంగీకరించరు, అతడు చేసిన దానికంటే మరెక్కువ అతడు ఆ దృష్టమున వచ్చి ప్రతి స్థాపన సంస్థను, ప్రతి సాంప్రదాయక సంఘమును, కురుచని వస్త్రములు వేసికొను ప్రతి స్త్రీని వెంట్రుకలు క్రాపుగా కత్తిరించుకొను యొజెబెలును ముక్కలు, ముక్కలుగా చీల్చివేయును,

"ఓ పురాతన మూఢభక్తి గలవాడా!" పొమ్ము అని అపహస్యము చేయుచు వీధులలోనికి వారు అతనిని త్రోసిపుచ్పుదురు. అయితే, అతడు - "యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు," అని ఆ విధముగా వ్రాయబడినది అనునది కలిగియుండును. సాంప్రదాయక సంఘము అతనిని స్వీకరించునా? లేదు. ఇతని కార్యక్రమమును జరిగించుటకు పూచీ తీసికొనువారు ఎవరును లేరు. శరీర కామాభిలాషతో నిండిన ఈ పెద్ద సమరయ పట్టణము ఏలాటి సహవాస పరిచయ పత్రము లేకుండ, అతని విషయమై పూచీ వహించువారు లేనివారు, వారి దృష్టిలో ఎన్నికలేని ఇతనిని వారు స్వికరించగలరా? అతడు ఏ సిఫారుసు పత్రముగాని, ఏ సహవాసము యొక్క పరిచయ పత్రము గాని, అతని కొరకు ఎవరో పూచీ పడుట గాని అతనికి అవసరత లేదు, మరియు అతడు ఫలానా స్కూలు నుండి వచ్చిన వాడును కాడు. అయితే "యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు," అని దానిని కలిగియున్నాడు. అతడు ఒక ప్రవక్తయై యున్నాడను సూచన కలిగియున్నాడు, అతని స్వరము దేవుని నుండి కలిగినది, యెరోబియాం II, దినములందు అతడు ప్రవక్తయని నిరూపింపబడెను. అతడు పలికినదంతయు నేరవేరుచు వచ్చెను.

MAL 3:1•

MAL 4:5,6

 

38ఇప్పుడు మనము జీవించుచున్న ఈ దినములలో, తిరిగి జరుగుచున్న అదేయైయున్నదని మనము చూచుచున్నాము. పరిచారకులు, ప్రజలు ప్రసంగ వేదిక యొద్ద సత్య సువార్తకై నిలువబడుటకు పిరికితనము కలిగియున్నారు, ఆ సువార్తను పూట తిండి టికెట్టు కొరకు అమ్ముకున్నారు. వారేదైన చెప్పుటకు భయపడుచున్నారు. కొందరు మనుష్యులు తమ్మును దాని నుండియో, దీనినుండియో మరి దేనినుండియో వెలుపల పెట్టుదురని భయము. పరలోకము నుండి, మిమ్మను బయటకు గెంటివేయువారు ఒక (వ్యక్తి) మనిషి మాత్రమే గలడు, ఆయనే దేవుడు. మరియు మీరు దేవుని వాక్యముతో నిలవబడిన మీరు ఎలా పరలోకము నుండి బయటకు త్రోయబడుదురు? అందుకై ఆయన తన ప్రవక్తలను మీకొరకు పంపెను.

గుర్తుంచుకొనండి, ఏలీయా దినములలోని అటువంటి సమయమందు, యోహాను దినమున అటువంటి సమయమున మరియు మలాకి 4వ అధ్యాయమునందు చెప్పబడిన రీతిగా - "ఏలీయాను పంపుదునని," బైబిలు చెప్పినట్లుగా అతడు మరల ఈ భూమి మీదికి రాబోవుచున్నాడని జ్ఞాపకముంచుకొనుము. దీనిని మలాకి 3లో చెప్పబడిన - "ఇదిగో నాకు మార్గము ముందుగా సిద్ధపరచుటకై నేను నా దూతను పంపుచున్నాను," అను దానిని ఇచ్చట కలుప వద్దు. అతడు కూడ ఏలీయాయే. అయితే, మలాకి 4వ అధ్యాయంలో ఆయన చెప్పినదేమనగా - "యెహోవా నియమించిన ఆ మహా మరియు భయంకర దినము వచ్చుటకు ముందు, భూమి కొలిమి కాలునట్లు కాలునప్పుడు, నీతిమంతులైతే దుర్మార్గులు కాలువబడిన బూడిద మీద నడతురు" —అది వెయ్యియేండ్ల పరిపాలన గూర్చినదై యున్నది, "నా ప్రవక్తయైన ఏలియాను పంపుదును."

అతడు ఏమి చేయును? అతడు పిల్లల యొక్క విశ్వాసము పితరులనబడు అపొస్తులుల విశ్వాసమునకు, తిరిగి దేవుని వాక్యము యొద్దకు త్రిప్పును, అతడు ఒక ప్రవక్తయై యుండవలెను. "నేను అతనిని పంపుదును." ఏలీయా ఏలాటి స్వభావము కలిగియున్నాడో, అటువలెనే అతడును సంపూర్ణముగా అతడును పోలియుండును. అతని సందేశము కూడా ఏలీయా తెచ్చిన రీతిగానే ఉ౦డును. అతడు స్థాపన సంఘములను వాటి తప్పుడు బోధలను ఖండించి, వారిని దోషులుగా చేయును. అతడు సహవాసమును గాని, ఎవరి సహాయము గాని మరిదేనిని కలిగియుండడు. అయితే అతడు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు," అను దానిని కలిగియుండును.

39"ఇది ఏలీయా కంబళి," మరియు "ఇది ఏలీయా ఉపదేశము" అను చెప్పు కొనుచు పలురకములైన గుంపులు నిలువబడునని జ్ఞాపకముంచుకొనుము. ఆ గుంప అంతయు ఒక స్థాపన సంస్థగా మారి ఇది ఏలీయా గుంపు, లేదా ఏలీయా కంబళి గుంపుగా తయారగును. ఇది లేఖన ప్రకారములేదు. దేవుడు ఈలాంటి గుంపుతో ఎన్నడూ పనిచేయడు. ఏలీయా, బాప్తిస్మమిచ్చు యోహాను ఆ దృష్టమునందు వచ్చినప్పుడు, వీరిద్దరు స్థాపన సంఘములను, గుంపులను దోషులనుగా వారు ఖండించిరి. ఏలీయా, యోహాను వారిద్దరు చేసినట్లు ఆనాటి బోధకులు, ప్రజలెన్నడు చేయలేదు. ఏలీయా వారు అనుసరించిన మార్గమును ఖండించెను. వీరిరువురు వారి వారి కాలములలో ఏ గుంపును గాని, లేదా ఏ సంప్రదాయ సంఘమునకు చెందినవారు కారు, వారు వాటిని దోషులనుగా చేసిరి.

పిమ్మట ఏమిటి? కడవరి కాలపు స్వరమును, కడవరి కాలపు సూచన తప్పక జంటపోవును ఏలియా ఆ దృష్టము (Scene) నందు రావలసియుండెను అరణ్యమును ప్రేమించి, అందు నివాసము చేయుటకు అపేక్షగల ఆత్మవలన అభిషేకింపబడి గలవాడైన ఒక మనిషిని సూచించును. ఆ దృష్టమునందు వచ్చును. ఇప్పుడు గమనించుము లేఖనము ఏమి చెప్పుచున్నదో, అప్పుడు మోసగింపబడరు, కడవరికాల స్వరము ( Voice), దానిని కడవరి కాలపు సూచనను (Sign) చూడుము.

2COR 12:7

 

40దేవుడు ఎన్నడును ఒక గుంపును తీసికొని ఆయన కార్యమును జరిగించలేదు, అట్లు లేఖనములందెచ్చటను లేదు. ఆయన ఒక వ్యక్తితో నిర్వహింపజేయుచుండెను ఏలయనగా, ప్రతి మనుష్యుడు మరొకని నుండి వ్యత్యాసముగా నుండును. ప్రతి మనుష్యుడు. మన బొటన వ్రేళ్ళయందు వ్యత్యాసము, మన ముక్కులు వ్యత్యాసము, మన క్రియలలో వ్యత్యాసమును కలిగియున్నాడు. ఆయన ఒక మనుష్యుని పట్టుకొనును, అతడు దేవుని వాక్యమునకు సంపూర్ణ ఏకత్వము కలుగజేయును.

ఆ కారణముచేత అపొ, పౌలు చెప్పినదేమనగా— "నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషముగా ఉన్నందున నేను అత్యధికముగా హెచ్చిపోకుండు నిమిత్తము నాకు శరీరములో ఒక మల్లు, నేను అత్యధికముగా హెచ్చిపోకుండు నిమిత్తము. నన్ను నలుగగొట్టుటకు సాతాను యొక్క దూతగా ఉండేను." చూచారా? మత్తయి, మార్కు లూకా మరెల్లరు యేసును వెంబడించుచూ, ఆయన చెప్పినవాటిని వ్రాసిరి. కానీ, పౌలు ఆయన ఎవరై యున్నాడు అనే ప్రత్యక్షతను కలిగియుండెను. చూచారా? అదే విషయము. మీరు చూడండి. అతని ప్రత్యక్షత బహు విశేషమైనదైనందున పాత నిబంధనలోని మోషేవలె ఇతడును (పౌలును) బైబిలు వ్రాయుటకు వాడబడెను. ఆ గొప్ప మనిషి అయిన పౌలునకు కలిగిన బహు విశేష ప్రత్యక్షత ఏదనగా - క్రొత్త నిబంధనలోని యేసే, పాత నిబంధనలోని యెహోవాయై ఉన్నారు. అతడు ప్రత్యక్షత వలన బయలుపరచబడిన దానిని, హెబ్రీయులకు, రోమీయులకు ఎఫెసీయులకు పత్రికల రూపమున వ్రాసి పంపెను.

గమనించుము, ఆయన యొక్క సూచన అతనిని (పౌలును) గూర్చి నిరూపించుచుండిన తర్వాత అతడు పత్రికలు వ్రాసెను.

MAL 4:5•

MATT 24:3•

REV 19:11

 

41ఆ వచ్చు విధానము అదే రీతిగా నుండును. అది ఒక గుంపుగా కాదు అది ఒక (వ్యక్తి) మనిపై యుండును. ఒక మనిషిని తప్ప, దేవుడు మరి వేరే ఇతర మార్గమున చేయుటకు నిర్వర్తించడు.

ఇప్పుడు, ఏలీయా ఒక గుంపు కాదు, బాప్తిస్మమిచ్చు యోహానును ఒక గుంపు కాదు, వారెల్లను వ్యక్తిగతమైయుండిరి. దేవుడు మలాకీ 4వ అధ్యాయంలో "నేను ఒక గుంపును పంపుదునని," చెప్పలేదు. "ప్రవక్తయైన ఏలీయాను" పంపుదునని చెప్పెను. దేవుని వాక్యము ఎన్నడు మార్పులేనిదై యుండును.

ఇప్పుడు జాగ్రత్తగా కనిపెట్టము, కడవరి కాల సూచనయు కడవరి కాల శబ్దము లేఖనములో వాగ్దానము చేసిన రీతిగా వచ్చును. అంత్యకాలపు సూచనను మనము ఎరుగునట్లు, అది ఏమైయున్నది? యేసు మత్తయి 24, 25లో మనకు చెప్పెను. మరియు ప్రకటన గ్రంథములో 6వ,లేదా 1వ అధ్యాయము నుండి 10వ అధ్యాయమందును మరియు 19 అధ్యాయము వేయ్యియేండ్లు పరిపాలన స్థాపనకై తెల్లని గుర్రముపై వచ్చును. కడవరి కాలపు సూచనగా అది వచ్చును. ముగింపునందు జాగ్రతగా వినుము లేఖనములలో చెప్పబడిన రీతిగా సరిగా వచ్చును.

సూచనను రుజువుచేయు శబ్దమును జాగ్రత్తగా గమనించుము.

LUKE 17:30

 

42ఇప్పుడు, యేసు లూకా 17:30లో కడవరి కాలపు సూచనను వాగ్దానము చేసెను. ఆఖరి సూచన, దేవుడు మానవ శరీరమందు ప్రత్యక్షపరచబడి, ఆయన వెనుక గుడార ద్వారమందు నిలిచియున్న, శారా మనస్సులోని తలంపులను వివేచించ కలిగినదై యుండెను. అదే సూచనను ఈ కడవరి సమయమునకు ఆయన వాగ్దానము చేసెను. ఏమి చేయుదునని ఆయన చెప్పెను?

మనుష్య కుమారుడు ప్రత్యక్షపరచబడునప్పుడు, అవి కడవరి దినములని మనకు బయలుపరచబడును, "ప్రత్యక్షపరచబడును." మనుష్య కుమారుడు ప్రత్యక్షపరచబడినప్పుడు ఆయన ప్రత్యక్షపరచబడుట వలన అది సూచనయై ఉండును. దానికి ప్రతికూలము చెప్పకుందురేమో, చూడుము. తప్పక ఆలాగు జరిగించుదురు.

ఇప్పుడు, "కాదు, అది మరొక ఏదో విధముగా ఉ౦డును అది ఒక పెద్ద కట్టడము కట్టుటను, ఒక గొప్పదైన ఇది, అది మరొకటి లేక సార్వజన సమితిగల ఒక గొప్ప ఆలోచన సభ లేదా మరేదో అని చెప్పుదురా?" ఓ, అట్లు కాదు, కాదు అది ఎంతో దూరమైన మార్గము. అది మరొక భాగమందు జరుగు ఘట్టము. దేవుడు ఏమి చేస్తానని చెప్పెనో, ఆయన దానిని చేయును అను దానికి అది వ్యతిరేకమైయున్నది.

MATT 12:34•

MATT 19:17•

LUKE 6:45

 

43మేము ఏమి చెప్పితిమో ఇప్పుడు, గమనించుము. లేఖనములు ఏ మార్పు లేనిదిగా సరిగా ఆ రీతిగానే ఉ౦డును, ఏలయనగా సోదొము స్వాభావిక సూచనగా మనము కలిగియున్నాము. ఈనాటి వ్యభిచారులైన చెడ్డతరము వారిని పోలి, అవినీతి కామాభిలాష యందును, చెడు ప్రవర్తన విపరీతముగా కలిగినప్పుడు. పనికిమాలిన అసహ్యమైనట్టిదియు, హేయమైన కార్యములుగల హాలీవుడ్ చిత్రములను టెలివిజన్ యందు చూడకుండలేని మనస్సు కలిగినప్పుడు వారేమైయున్నారు? ప్రజలు తాము క్రైస్తవులమని తమ్ముతాము పిలువబడుచు, ప్రార్ధనా కూటములకు వెళ్ళక, అటువంటి వాటిని చూచుటకు నిలిచిపోవుచున్నారు. నీవు ఏ ఆత్మను కలిగియున్నావో ఆ ప్రవర్తన చూపించును. వారు హాలీవుడ్లో చూచినట్లుగా స్త్రీలు వస్త్రములు ధరించుట, పురుషులు వారిని తమచుట్టు వెంబడించునట్లు నడిపింపజేయు హాలీవుడ్నందు చేయునట్లు వారు చేయుచున్నారు.

హాలీవుడ్నకు మాదిరిగా మనము చేయుటకు వెళ్ళవలెనా? లేదా దేవుని వాక్యము ఏమి చెప్పుచున్నదో ఆ విధముగా నమ్మి ప్రవర్తించుటకు వెళ్ళుదమా? రుజువు చేయబడిన దేవుని వాక్యముతో ఆ గుంపు గూడగలరు గాని వారు చేయునదేమి? దానిపట్ల అపహాసముతో నవ్వెదరు. ఏలయనగా నిత్యమునకై మృతులైరి. వారెన్నడు బ్రతుకరు. వారు ఎన్నడైన బ్రతికిన యెడల నిత్యజీవము పొందుకొనుటకై వారు ఎల్లప్పుడు బ్రతుకుదురు. అయితే వారు ఎన్నడు బ్రతుకరు. వారు ఎల్లప్పుడు మృతులై యున్నారు.

ఓ, వారు చక్కగా అలంకరింపబడి యుండవచ్చును, దీనిని, దానిని లేదా మరిదేని నమ్ముదుము అందురు. యేసు - "వేషధారులారా?" [ఆ దినమందుగల బోధకులను] అని చెప్పెను. మీరు మీ హృదయమునందు నిండిన వాటితో మాట్లాడు మీరు, మంచి విషయములు ఎట్లు చెప్పగలరు? నన్ను మంచివాడని, మంచి బోధకుడని, మంచి యజమానుడని పిలుచుచున్నారే? ఆయన వారి హృదయములను ఎరిగియుండెను. వారి హృదయములో ఏమున్నదో ఆయన వివేచించును, ఏలయనగా, ఆయన వాక్యమై ఉన్నాడు.

LUKE 17:28-30•

HEB 4:12

 

44"దేవుని వాక్యము సజీవమై బలముగలదై రెండంచులుగల ఎటువంటి ఖద్దము కంటెను వాడిగా ఉండి, ప్రాణాత్మలను కీళ్ళను మూలుగను విభజించునంత మట్టుకు దూరుచు హృదయము యొక్క తలంపులను ఆలోచనలను బోధించుచున్నది," అని బైబిలు చెప్పుచున్నది. ఇప్పుడు స్వాభావికమైన సోదోమ యొక్క సూచన తిరిగి ప్రవేశపెట్టబడెను ప్రతిదియు స్వాభావికముగా వాటి స్థానమందు సరిగా జరుగవలసిన విధానమున స్థిరపరచబడినప్పుడు, అదే సమయమున ఆత్మీయమైనవి ఇచ్చట లేవని ఏ విధముగా నీ మనస్సు నుండి తొలగించగలవు? అవి రెండును దృష్టమునందు స్థిరపరచబడినవి.

అవును, స్వాభావికమైనది సరియే అని ప్రతి ఒక్కరు ఒప్పుకొందురు, ఆత్మీయ విషయమును… వారు నమ్ముటకు ఇష్టపడకున్నారు, ఎందుకనగా అది వారి సిద్దాంతములతో జోక్యము కలిగించును. లూకా: 17 అధ్యాయము సూచనయై యున్నది. యేసు లూకా 17లో చెప్పినట్లుగా - కడవరి దినములలో, దేశములు, సంఘములు, మరియు జనులు అన్యదేశమగు సోదోమలోని ప్రజలవలె, సోదోము అగ్నితో కాల్చబడుటకు ముందు ఏలాగుండిరో, ఆలాగు ఉందురని చెప్పినట్లుగా చూడగలము. అచ్చట ఒక చిన్న మంద అబ్రహామువలె కనిపెట్టుచున్నట్లుగా కనిపెట్టుచున్నది.

వెనుక జరిగిన వాటిని చూడవెళ్ళుడి, "సోదోము దినములలో జరిగినట్లు జరుగును…," అని యేసు చెప్పినప్పుడు. ఆ సోదోమలో ఏమి ఉండెనో, చూడ వెళ్ళుడి. మనము చదువు బైబిలునే ఆయన అదే బైబిలును చదివెను, అక్కడ ఏమి ఉండెనో, అదే బైబిలు యొద్దకు తిరిగిపోయి చూడుము.

GEN 18:9,10,12,13•

MAL 4:5,6

 

45ఇచ్చట ఏర్పరచబడిన ఒక సముదాయము కలదు - దానిని అబ్రాహాము యొక్క గుంపు అని పిలువబడుచున్నారు. వారు వాగ్దాన కుమారుని కొరకు ఎదురుచూచుచున్నారు. సోదోమీయులు దాని విషయము ఏ మాత్రము నమ్మరు. నులివెచ్చని స్థితి గలిగిన ఒక సంఘ సభ్యుడు, సోదోమలో ఉన్నాడు.

ఆ వచ్చుచున్న ముగ్గురు దూతలలో ప్రతి ఒక్కరిని ఏ సూచనను వారు చూపించిరో చూడుము. అప్పుడు, మనము నివసించుచున్న ఈ దినములకు ఏ సూచన యివ్వబడినచో మీరు బాగుగా గుర్తించగలుగుదురు. ఇప్పుడు మలాకి 4, ఆ సూచన యొక్క శబ్దము పితరులు అనబడిన అపొస్తులుల విశ్వాసమునకు ప్రజలను యధాస్థితికి తెచ్చునదైయున్నది. ఆ సూచనయే కలిగియుందుము. లేఖనముల ప్రకారము సూచనయు దానిని నిరూపించు శబ్దము గలదు.

చూచితివా? సోదోమలో దేవుడు మానవులయందు ప్రత్యక్షపరచబడెను అను సూచనను కలిగిన రీతిగా సూచనను కలిగియుందురు. "నీ భార్యయైన శారా ఎక్కడ ఉన్నది?" అని ఆయన అడిగెను.

"నీ వెనుక గుడారమందున్నదని," చెప్పెను.

అందుకాయన — "మీదటికి ఈ కాలమున నీ యొద్దకు నిశ్చయముగా మరల వచ్చెదను. అప్పుడు నీ భార్యయైన శారాకు ఒక కుమారుడు కలుగునని" చెప్పెను.

"శారా ఆయన వెనుకనున్న గుడారపు ద్వారమందు వినుచుండెను . శారా — నేను బలము ఉడిగినదాననైన తరువాత నాకు సుఖము కలుగునా? నా యజమానుడును వృద్దుడైయున్నాడు గదా, అని తనలో నవ్వుకొనెను." "ఆ విధముగా జరుగనేరదని," ఆమె చెప్పుకొనెను.

అంతట ఆయన — "ఇది ఏ విధముగా జరుగగలదు? అని శారా ఏల హృదయమున సందేహపడుచున్నది?" అనెను.

GEN 18:13•

ISA 35:6•

MAL 4:6

 

46"అదే (సూచన) మరల తిరిగివచ్చును," అని యేసు చెప్పెను.

అబ్రహాము ఆ మనుష్యుని "ఎలోహిం" దేవుడు అని పిలుచుచున్నాడని స్మృతికి తెచ్చుకొనుము. ఆయన దేవుడైయుండవలెను. ఎందులకు? ఆయన హృదయములోని తలంపులను వివేచించవలెను మరియు తాను చెప్పిన సమయమునకు ఖచ్చితముగా వచ్చెను. మరియు ఎలోహిం, పరిశుద్దాత్మ - మరో వ్యక్తి కాదు, అదే వ్యక్తి తిరిగి సంఘములోనికి వెళ్ళుచుండెను. మరియు అదే పనిని చేసెను. అదే సూచనయై యున్నది. ఆ స్వరము వాక్యము నొద్దకు తిరిగి రమ్మని పిలుచుచున్నది. పిల్లల విశ్వాసము పితరుల విశ్వాసమునకు రావలెను. దీనిని సూచించు సూచన, స్వరమై (శబ్దము)నై యున్నది.

సూచనలను సాధారణముగా అంగీకరించుదురు. గాని, దాని నిరూపించు శబ్దమును ఒప్పుకొనరు. వారికి శబ్దము ఇష్టము లేదు గాని సూచనలు వారికి కావలెను. సాధారణముగా వారు దానిని అంగీకరింతురు. వారికి సూచనలు ఇష్టము ఏలయనగా, వారు వాటిని వినోదము కొరకు చూచుటకు యిష్టపడుదురు. అయితే, ఆ సూచనను నిరూపించు శబ్దముతో వారికి పనిలేదు.

ఇప్పుడు ఈ శబ్దమును జ్ఞాపక ముంచుకొనుము… వాక్యము నొద్దకు మరల తిరిగి రమ్ము.

యెషయా 35 ప్రకారము— "కుంటి వాడు దుప్పివలె గంతులు వేయును? అదిగా చెప్పబడినవన్నియు మెస్సియా యొక్క సూచన యేసు.

MAL 4:6•

MATT 10:25•

MATT 12:24,34•

MARK 3:22•

LUKE 11:15•

JOHN 10:30,33•

JOHN 14:12•

REV 3:20

 

47వారు ఆ సూచనను నమ్మిరి. ఓ, దానిని వారు అంగీకరించిరి. అది మంచిదైయున్నది. ఎంత ఆశ్చర్యకరమైనది.

"రబ్బీ, మా సంఘమునకు రమ్మని పిలుచుచు, వారి సహకారమును యిచ్చుటకు సిద్ధముగా ఉన్నారని చెప్పుచు . నీవు యవ్వన ప్రవక్తవు, తప్పక సత్బోధకుడవు అని ఆయనను వారి సంఘములకు ఆహ్వానించుచుండిరి. ఆ సూచన ఎంతో అద్భుతమైనది అని చెప్పుచుండిరి."

"నేను, నా తండ్రి ఒకటై యున్నామని," అ శబ్దము పలికినప్పుడు.

ఓ, దానిని వారు నమ్మలేరు. నిన్ను దేవునిగా చేసికొనుచున్నావు. ఆ మాట్లాడిన శబ్దము వారికి అవసరము లేదు.

సూచన వారికిష్టమే. అది మెస్సియా యొక్క సూచనయే అని వారు ఒప్పుకొనిరి కాని, ఆ సూచనను నిరూపించు శబ్దము వారికిష్టము లేదు.

"నేను చేయుచున్న పనులను మీరును చేయుదురు."

అప్పుడు వారాయనను "బెయల్జేబూబు," అని వారు చెప్పిరి.

"సర్ప సంతానమా," అని ఆయన చెప్పెను. ఓ, వారు ఆ శబ్దమును ద్వేషించిరి.

వారు చేసినదేమి? వారి మధ్యనుండి ఆ శబ్దమును త్రోసిపుచ్చిరి. వారు ఆయనను వెలుపలకు గెంటివేసిరి. "వారు ఇంటి యజమానుని "బెయల్జేబూబు" అని పిలిచినప్పుడు ఆయన శిష్యులను మరెంతగా వారియెడల చేయుదురు?" అని యేసు చెప్పెను. ప్రకటన 3లోని లవొదికియ సంఘకాలమును జ్ఞాపకము చేసికొనుము. ఇది లవదికియా సంఘము సోదోమ యొక్క చిహ్నం (సూచన) రావలసియున్నది. మతశాఖల నుండియు, స్థాపన సంఘముల నుండి బయటకు వెడలి, "వాక్యము యొద్దకు తిరుగుడి అది ప్రకటన 3, ప్రకారము వచ్చినప్పుడు, ఆనాడు ఆయనను గుర్తించని విధముగా, ఈనాడు ఆయనను సంఘమునకు వెలుపల ఉంచుదురు.

EXOD 4:8,9

 

48శబ్దము కాదు కాని, సూచనయే కావాలి, వారికి శబ్దముతో ఏ నిమిత్తము లేదు. శబ్దము అవసరత లేదు, లేదు, లేదు. అయితే - వారు ఆ సూచనను నమ్మని యెడల అని మోషే చెప్పెను. "వారు మొదటి సూచననుబట్టి నిన్ను నమ్మని యెడల, రెండవ సూచన ద్వారా ప్రయత్నించుము. దానిని కూడ వారు నమ్మని యెడల, కొ౦త నీరు తీసికొని నేలమీద పోయము," అని దేవుడు మోషేతో చెప్పెను.

దానితో అది పరిష్కరింపబడును. నీవు చేయవలసినదంతయు అంతే. నీ కాలు దుమ్ము దులిపినట్లు నీ చేతులు కడుగుకొనుము. మరొక మాటలతో చెప్పాలంటే, యేసు చెప్పిన ప్రకారము-

"నదినుండి కొంత నీరు తెచ్చి నేల మీద పోయము, అది రక్తమగును, అది ఆ రక్తములో ముసుగును అనునట్టిది సూచించుచున్నది." గనుక సరిగా అది ఏమి కావలసియుండెనో, సరిగా అదేయాయెను.

MATT 3:7,9•

LUKE 3:8

 

49ఈ రెండవ సూచన నమ్మని యెడల మూడవ సూచనను వారు నమ్మునట్లుగా చేయును.

దేవుని యొద్ద నుండి పంపబడిన సూచనయైన యెడల, ప్రతి దేవుని సేవకుడు మూడు సూచనలు కలిగియుండును యేసు మూడు సూచనలు కలిగియుండెను. మోషే మూడు సూచనలు కలిగియుండెను. నోవహు మూడు సూచనలు కలిగియుండెను. ఏలీయా మూడు సూచనలు కలిగియుండెను, ప్రతిదియు మూడు సూచనలుగా వచ్చుచుండును.

స్నేహితులారా, విని చక్కగా గ్రహించండి. కొంత తడవు ఆలస్యమగుచున్నది. పావుగంట ఆలస్యమైనది. ఓ, దానిని నేను ఎరుగకుంటిని. లూకాలో ఆయన వాగ్దానము చేసిన సోదోము సూచనను నీవు నమ్మిన యెడల వాక్యము తట్టుకు త్రిప్పబడునను మలాకిలోని శబ్దము ఆ సూచనను రుజువు చేయుచుండగా, మీరు ఎందుకు నమ్ముటలేదు? [టేపునందు ఖాళీ స్థలము - సంపా.]

బైబిల్ ఆ విధముగా చెప్పుచున్నది, మీరు దానిని చూచుచున్నారు గదా, ఇప్పుడు ఆ సూచనను రుజువు చేయు శబ్దమును వినుడి. రానున్నదేవుని ఉగ్రత నుండి తప్పించుకో! "నేను యు.పి.సికి చెందినవాడను. అటువలె నేను అసెంబ్లీస్ ఆఫ్ గాడ్నకు, మెథోడిస్టునకు, బాప్తిస్టునకు, ప్రెస్బిటేరియన్నకు చెందినవాడను, అందులోనికి పోవుటకు నాకు హక్కు ఉన్నదని తలంచవద్దు. ఈ రాళ్ళవలన దేవుడు అబ్రహామునకు సంతానము కలుగజేయగలడు. వాక్యము యొద్దకు మరలుడి! ఈ లోకమాలిన్యము నుండి, మీ స్థాపన సంఘముల సిద్దాంతముల నుండి మరియు వాటి విషయముల నుండి. దేవుడు భూమిమీద నుండి వాటినన్నిటిని నాశనము చేయును. ఆయన ఒక రాష్ట్రము నుండి మరొక రాష్ట్రమగు ఇశ్రాయేలును అందుండి పిలిచినప్పుడు ఐగుప్తునకు కలుగజేసినట్లుగా, మరపుగల సముద్ర అగాధమందు ఆయన వారిని ము౦చి వేయును. ఆయన స్థాపన సంఘము నుండి (out of the Church),పెండ్లి కుమార్తె సంఘంనుండి పిలిచినప్పుడు, అది (స్థాపన సంఘములు) మహాశ్రమల కాలములో దాని రక్తముతో భూమిని తడువును. కావున రాబోవు ఆ ఉగ్రత కోపము నుండి తప్పించుకొనుటకు పారిపోవుడి, అది సమీపముగా ఉన్నది."

EXOD 2:24•

MAL 4:6

 

50మీరు ఈ విషయములను చూడలేరు. అది లేకుండ. వాటి విషయములో మీరు ఏమి తలంచుచున్నారో, నేను ఎరుగను. నేను వాటి విషయము చదువుటకును, వాటి విషయమై మాట్లాడుటకు అది నా బాధ్యత. నీవు సూచనను నమ్మినయెడల, సూచనను ఋజువుచేయు శబ్దమును నమ్ముదువు. అది మీకే విడువబడినది. ఓ, మై.

వెలుపటికి వెళ్ళుచున్న మోషే ఒక మాదిరియై యుండెనను దానిని చూడుము. అతడు తన పితరులకు చేసిన వాగ్దానమును గూర్చి ఆ ప్రజలకు తెలియజేయవలసి యున్నది. "నేను వారి పితరులతో చేసిన వాగ్దానమును జ్ఞాపకము చేసికొందును." మోషే ఇప్పుడు చేయవలసినదేమి? అతడు ప్రజల యొక్క హృదయములను, తమ పితరులు ఏమి చెప్పిరో, దాని వైపు త్రిప్పవలెను. మరియు ఆనాడు మోషే ఏలాగుండెనో, ఆలాగే ఈనాడు మలాకి 4 ప్రజలు పితరుల యొక్క విశ్వాసమునకు త్రిప్పబడుటయైయున్నది.

51వాక్యము నమ్మని ఈ స్థాపన సంఘములన్నియు దేవుని వాక్యము వైపు తిరుగవలెను!

మీలో అనేకులు ఆలాగే చేయుచున్నారు. అని నేను ఎరుగుదును, నేను మిమ్మును తిట్టుటలేదు. ఈ టేపులు ప్రపంచమంతట వెళ్ళనున్నవి, ప్రతి స్థలమునకు వెళ్ళును. నేను మిమ్మను తిట్టుటలేదు కాని, ఎవరు ఆలాగు చేయుచున్నారో, ఎచ్చటెచ్చట ఆలాగు ప్రవర్తించుచున్నారో వారికి నేను చీవాట్లు పెట్టుచున్నాను. నేను విత్తనము విత్తువాడను గనుక అది మాత్రమే నేనెరుగుదును. ప్రజలారా రాబోవు ఉగ్రత నుండి తప్పించుకొనుటకు పరుగెత్తు తీర్మానమనునది మీ నిర్ణయమై యున్నది!

నేను పెంతికోస్తు వాడనని తలంచవద్దు. మీ తల్లి మంచి పవిత్రీకరణ కలిగిన మెథోడిస్టుకు చెందినదని లేదా మీ తండ్రి చక్కగా అరచు బాప్టిస్టువాడని తలంచవద్దు. అది నీకేమైన మంచిది కలుగనియ్యదు. నీవు కట్టబడిన సంఘ కట్టడమునకు లేదా కట్టబడుచున్న సంఘ కట్టడమునకు చెందినవాడవని తలంచవద్దు. నలుబది సంవత్సరముల క్రితము అన్యభాష మాటలాడుచు, ఆత్మలో నాట్యమాడుచు, నేలమీద క్రిందికి పైకి పొర్లుచుండిన పెంతెకోస్తు గుంపునకు చెందినవాడవని తలంచవద్దు. రోగస్వస్థత ఆదిగా గల ఆత్మీయ మీటింగులు జరిగించుచుంటివని తలంచవద్దు. దేవుడు అగ్నిస్తంభము యొక్క సూచన వెనుక "దేవుని యొద్దకు తిరిగి మరలుడని," పలికిన శబ్దముతో రుజువు చేసినదానిని చూచుటకు తప్పిపోకుడి. అది నిన్ను దాటిపోనివ్వకుము. సూచనయు దానిని రుజువుచేయు శబ్దమును అచ్చట నున్నది.

ZECH 14:7•

MATT 3:3•

MARK 1:3•

LUKE 3:4•

JOHN 12:35

 

52ఒకడు తాను పురాతన పాఠశాలయందు నేర్చుకొనిన తలంపుతో సూచనతో వచ్చినప్పుడు, అచ్చట ఏదైన పొరపాటు (తప్పిదము) ఉండగలదు. ఏలయనగా, అది దేవునియొద్ద నుండి వచ్చినది కాదు. ఓ, ఆయన మార్గము సరాళము చేయుడి!" ఇప్పుడు దానిని మీరు నమ్మదురా? "ఓ, అంధులు మరియు చెదరగొట్టబడిన వారలారా, మీ స్వాస్ట్యమునకు ఇప్పుడు తిరిగిరండి." ఒక కీర్తనకారుడు వ్రాసినదేమనగా -

(ఆంగ్లమున) రాష్ట్రములు విరుగగొట్టబడుచున్నవి

బైబిలు చెప్పిన సూచనలు నెరవేరుచున్నవి;

అన్య రాష్ట్రముల యొక్క దుక్కి చదునుచేసినట్లు

వాటి దినములు లెక్కింపబడినవి.

ఓ, చెదిరిపోయిన వారలారా,

తిరిగి మీ స్వాస్త్యమునకు మరలుడి.

వెనుకకు రండి! వెనుకకు మరలిరండి! "సాయంకాలమున వెలుగు కలుగును," అని ప్రవక్త చెప్పెను. సూర్యుడు సంపూర్ణముగా నలుపయ్యే ముందు కొంత వెలుగుండును. వెలుగు ఉన్నప్పుడే వెలుగులో నడువగలము. ఆ తరువాత సర్వజన సమ్మతమైన ఆలోచన సభ (Ecumenical Council) వారు మిమ్మను ఏలనారంభించినప్పుడు ఆ వెలుగునకై అప్పుడు ఏ మార్గము ఉండదు. మనము తలలు వంచుదాము.

53మా పరలోకపు తండ్రి, ఇప్పుడు ఇది నీ హస్తములో ఉన్నది. నేను విత్తనము చల్లితిని. అవి ఎక్కడ పడినవో నేను ఎరుగను. వారు ఎక్కడ ఉండినను వారిని ఆశీర్వదించమని ప్రార్ధించుచున్నాను. అవి రాతి స్థలమును, పచ్చని ముండ్లపొదను తప్పించుకొని వాటి వేరులు లోతుగా పారు వాటి స్థలమును కనుగొనినట్లు, మార్గమునకు అడ్డదెడు సమస్త అవిశ్వాసము తొలగింపబడునట్లు చేయుము దానిని దయచేయుము తండ్రి. దీనిని యిప్పుడు నీకు యేసుక్రీస్తు నామమున అప్పగించుచున్నాము. ఆమేన్.

54మీ తలలు వంచియున్నవి, మరియు మీ కన్నులు మూయబడియున్నవి. రేపు రాత్రి విందు ఉన్నది. ప్రభువు చిత్తమైన ఈ పట్టణములో ఉన్న పాపులతో మాట్లాడుదును. ఇప్పుడు నేను మిశ్రీతమైన సమూహముతో మాట్లాడుచుంటిని. ఈలాంటి మీటింగులలో వారితో మాట్లాడుటకు సాహసించలేదు, అది వారికి ఎన్నడులేని అంధత్వమును కలుగజేయును. అయితే ఈ రాత్రి ఆ సూచనను చూచిన దానిని నమ్మితివా, మరియు మీరు ఆ శబ్దమును వింటిరా, ఆలాగు మీరు కలిగియుండిన యెడల దానిని విశ్వసించితిరా? మీరు పొందియుండలేదు - మీరు విశ్వసించితిరి గాని, ఆయన సంపూర్ణతలో క్రీస్తును ఇంకను అంగీకరించని మీరు మీ చేతులు పైకెత్తి చూపించుడి. ప్రతి శిరస్సు వంచి, ప్రతి కన్ను మూయబడియున్నవి. మీ చేతులెత్తి "బ్రన్హం సహోదరుడా, నీవు ప్రార్ధన చేయుచుండగా నన్ను జ్ఞాపకము చేసికొనమని," చెప్పండి. అట్లు చేయుటకు నేను సంతోషించుదును. దేవుడు మిమ్మను ఆశీర్వదించును గాక.

MARK 16:16•

ACTS 18:8•

EPH 4:5

 

55మా పరలోకపు తండ్రి - "ఎందరు విశ్వసించిరో, వారందరు బాప్తిస్మము పొందిరని," బైబిలు చెప్పుచున్నది. ఈ చేతులెత్తిన వారు దానియందు నమ్మికయుంచి యున్నారు అని ప్రార్థించుచున్నాను. వారు క్రైస్తవ బాప్తిస్మము పొందలేదు, ఆ విధముగా బాప్తిస్మమిచ్చు సంఘమును కనుగొని, దానిని పొందుకొనునట్లు, దయచూపుము ప్రభువా, వారు అంతరంగమున కలిగిన మార్పును బట్టి బాహ్యసాక్ష్యముగా నీటి బాప్తిస్మము పొందుట మాత్రమే గాక…

బైబిలు - "విశ్వాసము, ఒకే ప్రభువు, ఒకే బాప్తిస్మము," అని చెప్పెను, ఆ బాప్తిస్మము ఆత్మీయ బాప్తిస్మము. శరీరము నీటి బాప్తిస్మము వలన కడుగబడుట ఒక దృష్టాంతము మాత్రమే లేదా అంతరంగమున కలిగిన మార్పునకు ఇది యొక సూచనయై ఉన్నది. అయితే, అంతరంగమందున్న ప్రాణము (soul) పరిశుద్దాత్మతో బాప్తిస్మము పొందవలసియున్నది. అనగా నిత్యజీవము ( Eternal) మానవ స్వభావమును మార్చుటకు వచ్చుటయైయుండి ఒక విశ్వాసిగా చేయును. వారు పరిశుద్దాత్మ పొందవలెనని ప్రార్థించుచున్నాను. సందేశము యొక్క జయసూచకముగా నున్నవానిని, క్రీస్తుయొక్క కృపను నీకు దయతో ఆదరించమని అప్పగించుచున్నాను. ఆయన నామమున నేను ప్రార్ధించుచున్నాను. ఆమేన్.

ఇప్పుడు, భయభక్తితో మీ తలలు వంచియుండగా…

56ఏడు నిమిషములు మాత్రమే నేను కలిగియున్నాను. సమయమును అనుసరించి వెళ్ళలేకపోవుచున్నాను. కలిగిన ఈ సమయములో ప్రార్థన వరుసను అనుసరించలేను. మీరెక్కడ కూర్చున్నారో, అచ్చటనే కూర్చుండవలెనని మిమ్మును అడుగుచున్నాను. మిమ్మును ఆలస్యముగా ఉంచినందుకు నేను విచారపడుచున్నాను. మేము మీ ప్రతి ఒక్కరికొరకు ప్రార్థించెదము. మీలో ప్రార్థన కార్డు కలిగినవారు కొందరు బయటకు వెళ్ళినారు. విచారించకండి. మీరు వాటిని పొందుకొనునట్లు చూచెదము. అయితే, పరిశుద్దాత్మ మాకు బయలుపరచినయెడల, వాటిని సరిగా మనము చూడగలము.

మీరు ఆయనయందు విశ్వసించిన యెడల, ఇది సూచనయై యున్నదని మీరు నమ్ముదురు. ఆ దూతను జ్ఞప్తిచేసికొనుము, ఆయన ఒక మానవుడుగా నుండెను: అబ్రహాము ఎదుట ఆయన తినుచు ఆయన త్రాగుచునుండెను మరియు ఆయన ఒక మనిషిగా నుండినను తన వెనుక గుడార ద్వారమందు నిలుచుండియున్న శారా హృదయములోని తలంపును వివేచింపకలిగెను. అది (హృదయములోని తలంపులను) వివేచించుట సూచనయై ఉండెను. ఆయన వాక్యమై యుండెను. ఆ వాక్యము యిప్పుడు మన యొద్దకు వచ్చినయెడల, అప్పుడు కూడ దానినే ఆయన చేయును.

MATT 28:20•

JOHN 14:12,19

 

57ప్రార్థన కార్డు లేకుండా ఆ జనసమూహములో మీరు ఉండవచ్చును, మరియు ప్రార్ధనకై నిలువబడు వరుసలో మీరుండలేరని మీకు తెలియును ఏది ఏదైయున్నదో నేను వివేచింపలేను ప్రభువు నాకు బయలుపరచితేనే తప్ప, మరియు మీరు దేవుడు తప్పక రోగిని స్వస్థపరచునని నమ్ముము. కొన్ని నిమిషములతో పాటు ఇప్పుడే సరిగా మీరు నమ్మవలెనని నేను కోరుచున్నాను. ఈ విధముగా చెప్పుచు ప్రార్థన చేయుడి — "ప్రభువైన యేసు, ఆ మనుష్యుని నేను ఎరుగుదును," మాటలాడుచున్న అతడు ఒక మనిషి. అయితే ఈ రాత్రి అతడు చెప్పినది, మాకు రుజువుచేయుచు

"…లోకము పరిశుద్దాత్మను చంపనేరదు, అని చెప్పెను. యేసును ఆయన శరీరమందుండగా వారు చంపగలిగిరి; వారు ఆయనకు మరణమును విధించిరి. అయితే ఇప్పుడాయన మరణము నుండి లేచి మహిమ స్థితిలో ఉన్నాడు. మరెన్నడును ఆయనను చంపనేరడు. కొంత సమయము తర్వాత ఈ లోకము నన్ను చూడనేరదు, [కాని మీరు, ముందుగా ఏర్పాటు చేయబడినవారు, నిత్యజీవము కొరకు అభిషేకింపబడిన వారు, క్రీస్తు సంఘము (the Church), వధువు] — "మీరు నన్ను చూచెదరు, ఏలయనగా నేను మీతోను మీలోను అంతము వరకు ఉందును. నేను చేయునవన్నియు మీరు కూడ చేయుదురు." ఈ వాగ్దానములన్నియు ఆయన చేసెను.

MATT 9:21•

MARK 5:30•

LUKE 8:44,45•

LUKE 17:28-30•

JOHN 15:5•

COL 2:9•

1TIM 3:16•

HEB 4:15•

HEB 13:8

 

58"ఇప్పుడు, ఆయన ఇక్కడ భూమి మీదనున్నప్పుడు దేవుడు ఆయనయందు (యేసునందు) ఉండెను, అని నేను యెరుగుదును. ఆయన దేవుడైయుండెను. ఆయన దేవునియొక్క సర్వపరిపూర్ణతయై యుండెను. ఆయన ప్రత్యక్షపరచబడిన సంపూర్ణ వాక్యమై ఉండెను. బైబిలు వాక్యమును, నిశ్చయముగా దేవుడై ఉన్నది మరియు మరికొన్ని ప్రత్యక్షతలు ఇంకను బయలుపరచబడనున్నవి. మరియు ఆయన — "కడవరి దినములలో సోదోమువలె మారినప్పుడు మరల, మనుష్యకుమారుడు ప్రత్యక్షమగును, సోదోమునకు ఇవ్వబడిన సూచన తిరిగి వచ్చును. అప్పుడు నిత్యజీవమునకు నియమింపబడిన వారికి తిరిగి వాక్యమునొద్దకు రండి, అని శబ్దము పిలుచును, అని చెప్పెను. ఆయన ఈ భూమి మీద ఇక్కడ ఉన్నప్పుడు లక్షలాది ప్రజలు, ఆయన ఇక్కడ ఉండెనని వారు ఎరుగరని మనము ఎరుగుదుము, వారు తెలిసికొను నిమిత్తము లేకుండెను. గమనించితిరా? ఆయనను చూచుటకు ముందుగా నిర్ణయించబడిన వారి యొద్దకు ఆయన వచ్చెను."

ఇప్పుడు మీరు ప్రార్ధించండి. యధార్థముగా ఇప్పుడు మౌనముగా నుండుడి. మేడ మీద వసారలోను మేడ క్రింద గదిలోను, మరెచ్చటెచ్చట మీరున్నారో అచ్చటే ఉండుడి, తిరుగులాడకుడి, యధాస్థితిలో మీరు కూర్చున్న స్థలములోనే ఉండుడి.

మరియు ప్రార్థన చేయుచు ఈలాగు చెప్పుడి: "ప్రభువైన యేసూ, బైబిలు హెబ్రీ 4లో - వాస్తవముగా నీవు మా ప్రధాన యాజకుడవై మా బలహీనతలయందు మాతో సహానుభవముగలవాడవై యుంటివి. నీవు భూమి మీద యిక్కడ ఉన్నప్పుడు ఒక నిరాధారమైన స్త్రీ నీ యొక్క వస్త్రపు చెంగును ముట్టగా, వెంటనే నీవు నన్నెవరో ముట్టిరని చెప్పి, కలయ చూచితివి. ఆమె తన్ను మరుగుపరచగోరెను కాని ఆమె విశ్వాసము ఆమెను గూర్చి తెలియజేసెను. ఆమె రక్త పాపమును గూర్చి యేసు ఆమెతో - నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచెను," అని చెప్పెను. ఆయన ఇప్పుడును ఒకే రీతిగానున్న ప్రధానయాజకుడు.

ఆయన నిన్న, నేడు, ఎల్లప్పుడు ఒకే రీతిగా నుండిన యెడల, నీవు (అదే విశ్వాసము ద్వారా) ఆయనను ముట్టిన, అదే రీతిగా ఆయన నీ యెడల జరిగించువాడై యున్నాడు.

59నేడును ఆ విధముగా జరిగించాలంటే ఏమి చేయాలి? ఆయన శబ్దమును మాట్లాడవలెనని ఒక మానవ శరీరము అవసరమైయున్నది. "నేను ద్రాక్షావల్లిని, మీరు తీగెలు." దాని చుట్టు తిరుగుటకు వేరొక మార్గము లేదు, స్నేహితుడా, అది లేఖమునకు సరిగా నున్నది. అది సత్యమైయున్నది వెనుక తెలియజేయుచు వచ్చిన ప్రకారము, దేవుని పరిచారకులైన మీరు నమ్ముతారా? (ఆమేన్ అని - పరిచారకులందరు చెప్పిరి - సంపా.) ముందు మీరు చెప్పినట్లుగా.

ఇప్పుడు, గౌరవ సూచనగా వాస్తవమున సరిగా నుండి "ప్రభువైన యేసూ, నీ వస్త్రమును నన్ను ముట్టుకొననిమ్మని," ప్రార్థించుదము. నాకు సమీపమున ఇరువది అడుగులు లేదా ఎక్కువగానుండు ఒక వ్యక్తిని మీరు చూడండి. ఆ ప్రాణి విషయము నేనేమియు ఎరుగను. నాకెదురుగా కూర్చుండి యున్న నా స్నేహితుడు ప్యాట్ టైలర్ను తప్ప, మరి అచ్చట కూర్చున్న వారిలో ఎవరైనను ఈ రాత్రి వాస్తవముగా వారిని ఎరిగియుండలేదు. అచ్చటనున్న ప్రజలు మంచముల మీదను స్ట్రెచర్సులోను ఉన్నారు. గతరాత్రి ఒక మనిషి స్టెచ్చర్ (Stretcher) లో నుండి బయటకు వచ్చి లేచి నడిచి వెళ్ళినట్లుగా చూడగలిగితిమి. ఈ రాత్రి మీరందరు ఆ విధంగా ఎందుకు చేయలేరు? చూడుము, నీవు అదే రీతిగా విశ్వాసముంచుట మాత్రమే నీవు చేయవలసినది. ఆయన ప్రసన్నత దానిని జరిగించును. కడవరి దినములలో ఆయనతో నీవు నిలువబడబోవుటకు ఆయన ఇక్కడ లేపుటకు ప్రసన్నుడైయున్నాడు.

ACTS 3:4-6

 

60ఇప్పుడు విశ్వసించుచున్న మరియు ప్రార్థించుచున్న నీవు, సరిగా ఇచ్చటి విధానమును చూడుమ. పేతురు, యోహానులు చెప్పినట్లుగా - "మా వైపు చూడుము," ఆ మనుష్యుడు వారు చెప్పినట్లు చేయుటనుబట్టి వాడు ఏదో అక్కరతను కలిగియున్నాడని చూచిరి. అప్పుడు అతడు- "మా దగ్గర వెండి, బంగారము లేవు కాని, నా దగ్గర నున్నదేదో అది ఇచ్చెదమనెను …"

ఇప్పుడు, రోగ స్వస్థత మరేది నా దగ్గరలేదు, కాని దేవుని యొద్ద నుండి మేము పొందిన దానమును నీకిచ్చుదుమనెను. నీవు నమ్మిన యెడల దేవుడు దానిని (నీ అక్కరతను తీర్చు కార్యమును) జరిగించును. నేను మిమ్మను నమ్మమని మాత్రము అడుగుచున్నాను. నేను దేనినైతే కలిగియున్నానో, దానిని మీకిచ్చెదను. నీవు అది నమ్మిన యెడల దేవుడు దానిని చేయును, దానిని చేయుటకు ఇప్పుడే ప్రయత్నించుము.

61ఇప్పుడు ఇచ్చటనే ఆయన కార్యము సరిగా ఉన్నది. ఆమేన్. అది నాకు ప్రీతి.

సరిగా ఇచ్చట ఒక స్త్రీ కూర్చున్నది. ఆమె ఒక విధమైన బరువును కలిగినదై చివర ఇచ్చటనే కూర్చున్నది. అమ్మా నీవు ప్రార్థన కార్డును కలిగియున్నావా? నీవు ప్రార్ధన కార్డును కలిగియుండలేదు కదా? అవును, ప్రార్ధన కార్డును నీవు కలిగి యుండలేదు. ఎలాగైతేనేమి నీవు విశ్వసించినావు, నీవు నమ్మినయెడల ప్రార్థన కార్డుతో పనిలేదు. సర్వము తగ్గిపోవుటవలన ప్రజలను పిలుచుటకు కష్టతరముగానున్నది, కావున సమీపించి వినుటకు మీ శక్తికొలది ప్రయత్నించుడి.

నీవు ఎవరైనది నేను ఎరుగను. నీకు ప్రార్థన కార్డు లేదు గనుక ఈ వేదిక మీదకి రాలేకపోతివి. ఆయన నీ బాధను ఏమిటో నాకు తెలియజేసిన యెడల నీవు దానిని నమ్మదువా (ఏమిటి?) అనగా ఆ స్త్రీ యొక్క బాధ ఏమిటో ఆయన తెలియజేసినట్లుగా నీ విషయము తెలియజేసిన నీవు నమ్ముదువా? బావి వద్దనున్న ఒక స్త్రీ వలె? శారా హృదయములో తలంచిన దానిని ఆదిగా, ఆయన తెలియజేసిట్లుగా? అది వాస్తవమే అని నీవు నమ్ముదువా? అది అంతయు నిజమేనని నీవు నమ్ముచున్నావా? నీవు రక్తావస్థతో బాధపడుచున్నావు. నీ రక్తమునందు ఏదో దోషమున్నది. అది సరియైన నీ చేతిని ఎత్తి చూపించుము. యేసుక్రీస్తు నీ విధేయతను గౌరవించెను, నీపై వెలుగు ప్రకాశింపజేసెను. అది ఇప్పుడు నీకు లేకుండపోయెను. సరియేనా.

ఇప్పుడు, ఆ స్త్రీని నా జీవితములో ఎన్నడు చూడలేదు. ఇప్పుడు అది ఏమిటి? అది ఒక ఆత్మయైయుండును. పరిసయ్యులు చెప్పినట్లుగా - "అది దయ్యము," అని వారికి రాగల ప్రతిఫలమును నీవు పొందుదువు. "అది క్రీస్తు," అని నీవు చెప్పిన, క్రీస్తు యొక్క ఫలమును నీవు పొందుదువు. ఈ కడవరి దినములందు వాక్యము బయలుపరచబడుచున్నదని నేను నమ్ముచున్నాను, నేను కాదు.

JOHN 1:42

 

62ఇచ్చట, ఒక బాధతోనున్న మరొక సమీపమున కూర్చున్నది. ఆమె కాళ్ళయందు ఉబ్చిన నరములతో (Varicose Veins) బాధపడుచున్నది. ఆమె మిశ్రమైన చిక్కులు కలిగియున్నది. ఆమెకు గుండె బాధ ఉన్నది. ఆమెకు ప్రియముగా ఉన్న సహోదరుడు (డయాబిటిక్) చెక్కర వ్యాధి కలిగి చాలా ప్రమాదములోనున్న అతనిని సంధించుచు ఏడ్చుచు అతని విషయమై ప్రార్థించుచున్నది. మరియు అతడు పాపిగా నుండుటను ಬట్టి మరొక చీకటి కలుగజేయు ఛాయ ఆవరించినది. నీవు అతని విషయమై ప్రార్థించుచున్నావు. అది నిజమేనా. నీ హృదయపూర్వకముగా నమ్మిన యెడల మిస్. వెల్టన్, దేవుడు అతని పక్షమున తన కార్యము చేయును, నీవు నమ్ముచున్నావా శ్రీమతి. వెల్టన్, అది నీ యొక్క పేరు.

"నీ పేరు సీమోను, నీవు యోనా కుమారుడవని," యేసు సీమోనుకు చెప్పిన దానికంటె మరెక్కువైనదేదైన కలదా? విశ్వాసము మాత్రము ఉంచుము. అనుమానము పడకుము. నీ హృదయ పూర్వకముగా నమ్ముము. నీవు నమ్మినయెడల దేవుని కార్యమును జరుగుట చూచెదవు. నీవు దానిని నిశ్చయముగా కలిగినయెడల…

HEB 4:15

 

63ఇక్కడ మరొక స్త్రీ తిన్నగా నాకెదురుగా కూర్చుండి నా వైపు చూచుచున్నది. ఆమె వెంట్రుకలు ఒక రకమైన ఎర్రగానుండి, అవి వెనుకకు లాగినట్లుగా ఉన్నవి. ఆమె చుట్టు తిరుగుచున్న తృణమణివలె ప్రకాశించుచున్న మీరు చూడ గలిగితిరా? ఆమె ఇప్పుడు అది జరుగుచున్నదని ఎరుగును ఏలయనగా ఆమె దానిని స్పర్శము చేత అనుభవించుచున్నది. అది ఆమెను మిక్కిలి సమీపముగా అవరించుట వల్ల, దాని స్పర్శ చేత అనుభవించకుండపోవు మరి ఏ మార్గము లేదు. అది వాస్తవమైన యెడల, నీ చెయ్యి ఎత్తి చూపించుము. ఆమె తన చెయ్యి పైకెత్తి చూపించినది. అది వాస్తవమే.

నేను బొత్తిగా అపరిచయుడను నీకు. నీ విషయము నాకేమియు తెలియదు. నీవు ఇచ్చట కూర్చుండి ప్రార్ధన చేయుచుంటివి. అది వాస్తవము. అది వాస్తవమైన యెడల, నీ చెయ్యి పైకెత్తి ఈ రీతిగా ఇటు అటు ఊగునట్లు చేయుము. యేసు క్రీస్తు దేవుని కుమారుడు, దేవుని కుడి పార్శమున కూర్చుండిన ప్రధాన యాజకుడైన యెడల.. ఇచ్చట నేను దేవుడు నాకిచ్చిన ఆత్మీయ వరముతో నిలువబడియున్నాను, నన్ను నేను హేతువాదము నుండియు, నా స్వంత ఆలోచనలనుండియు బయటకు వచ్చి నా మనస్సునకు నా తలంపులకు ఏలాటి శ్రమ కలుగజేయక, దేవుడే ఆ కార్యము జరిగించుటకు ఒప్పుకొంటిని, నీవు ఆయనే వీటిని చేయువాడని నమ్ముచున్నావా? దేవుడెరుగును నేను నిన్ను ఎరుగను, అటువలె నీవును నన్ను ఎరుగవు.

దేవుడు నీ బాధను, దేనికొరకు నీవు కనిపెట్టుచున్నది, నీకేది అవసరమైనది ఏదో నాకు తెలిపిన యెడల, దేవుడు వాటిని చేయగలడని నీవు నమ్ముచున్నావా? నీ వెనుక భాగము బాధగా నున్నది. నీవు వేటికై ప్రార్థించుచుంటివో, అందు ఇది ఒకటైయున్నది. నీ కండ్లు బాధకలిగియున్నావు. దేవుడు వాటిని స్వస్థపరచి, వాటిని బాగుచేయునని నమ్ముచున్నావా? నీవు నమ్ముదువా? నీవు నమ్ముదువా? నీవు ఎవరైనది దేవుడు నాకు తెలుపునని నీవు నమ్ముచున్నావా? శ్రీమతి. హాల్మ్యాన్, ఇప్పుడు హృదయ పూర్వకముగా నమ్ముము, నీవు అడిగినది నీవు పొందుకొంటివి, నీవు నమ్ముచున్నావా?

64ఇచ్చట వయస్సు కలిగిన స్త్రీ ఆ మార్గమున కొంత వెనుక భాగమున కూర్చున్నది. ఆమెకు మధుమేహము లేదా బహు మూత్ర రోగము కలదు ఆమె ప్రార్ధన చేయుచున్నది కూడ. ఈ తరుణము తిన్నగా అది ఉన్నది. ఒక నిమిషము ఆగుడి, ప్రభువు నాకు సహాయము ఇప్పుడు చేయును గాక. ఆమె స్పర్శ కలిగినప్పుడు, చూడుము, ఆమె దాన్ని పట్టుకొన్నది, అది అంతయు సరియే. ఆమె యిక్కడి వ్యక్తి కాదు, ఆమె లూసియానా నుండి వచ్చినది. ఆమె లూసియానాలోని సింగర్ (Singer) అను పట్టణమునకు చెందినది. మరియు ఆమె బహు మూత్ర రోగముతో బాధపడుచున్నది. ఆమె పేరు మిస్సెస్ దాయిలె ( Mrs. Doyle). అది వాస్తవమైన యెడల, నీ చెయ్యి ఎత్తి చూపించుము. సరియే. నేను ఆమెకు అపరిచితుడను, నా జీవితములో ఎన్నడు ఆమెను చూడలేదు, కాని, యేసుక్రీస్తు, దేవుని కుమారుడు నీ సమస్త విషయమును యెరుగును.

ఆ వెనుక ఒక స్త్రీ కూర్చున్నది అక్కడ, ఆమె కూడ అదే సింగర్ అను పట్టణ స్థలమునుండి వచ్చినది. ఆమె రక్తమ యొక్క అధిక పీడనముతో (High Blood Pressure) బాధపడుచున్నది. ఆమె మిసెస్. క్లార్క్, నీవు విశ్వసించుదువా? సరియే. నీవు అడిగినది నీవు పొందుకొనెదవు.

మీరది నమ్ముచున్నారా?

MARK 16:17,18

 

65సూచనను గుర్తించుము; సూచనను రుజువు చేయు శబ్దమును వినుము! మారు మనస్సు పొందుడి, దేవుని యొద్దకు ఎంత త్వరితముగా తిరుగవలెనో, అంత త్వరగా తిరిగి వెళ్ళుడి! యేసుక్రీస్తు తన పునరుత్ధాన్న శక్తితో ఇక్కడ ఉన్నాడు, యేసు క్రీస్తు సూచనగా ప్రజల మధ్యలో నివాసము చేయుచుండగా, వ్యభిచారులైన చెడ్డ తరము వారు సూచన అడుగుచున్నారు. నాతోనే ఉన్నాడని ఆయన చేయలేదు కాని, మీతో కూడ ఉండినట్లు చేయును. ఆ స్త్రీని చూడుము. ఆయన వస్త్రమును ముట్టుకున్నది. నీవు ఆయన వస్త్రమును ముట్టుకొనుము. మేము సాధారణముగా వాడబడు పనిముట్లమై యున్నాము

ఇప్పుడు, నీవు నమ్మునట్లయితే… ఎంత మంది దీనిని నమ్ముచున్నారు? ఈ విధముగా చేతులు పైకెత్తుడి. "నేను నిజముగా నమ్ముచున్నాను," అని చెప్పుడి.

"నమ్మినవారి వలన ఈ సూచక క్రియలు జరుగును. రోగుల మీద చేతులుంచినప్పుడు వారు స్వస్థతను పొందుదురని," యేసు దీనిని చెప్పెనని మీరు ఇప్పుడు నమ్ముదురా? ఇప్పుడు ఆలస్యమై పోయినది. మనకిప్పుడు సమయము లేదు. ఇప్పుడు పది గంటలకు ఇరువదైదు నిమిషములు ఉన్నవి. కావున మీరు ఒకరిమీద మరొకరు చేతులుంచుదురా? మీరు ఒకరిమీద మరొకరు చేతులుంచియుండగా నేను చెప్పినట్లుగా.

66మేడ గదిలోను, ప్రతి స్థలములోనున్న మీరెరుగుదురు. లేఖనము బోధించిన తర్వాత, ఏ విధముగా సూచన క్రియల వలన వాక్యము రుజువు చేయబడినది ఈ మేడలో ఉన్న వారందరికి (విధితమే) చక్కగా బయలుపరచబడినది. ఇచ్చట మరొక విషయము నేను చూచుచున్నాను, సరిగా ఇక్కడనే వంగిపోయిన బాధతో క్షయరోగముతోనున్న స్త్రీ ఇది సాధారణముగా ఈ దినములందు ఉన్నదని చెప్పుదువు, కాని అది నిన్ను క్రుంగునట్లు చేసినది. అంతకు మించిన వ్యత్యాసమేమైన ఉన్నదా? కొన్ని మారులు యాభై నీవు చూచెదవు, మరొక సమయమందు డెబ్బై చూడగోరెదవా.

ఒక నమయమున సిఖార్ (Sychar) అను ఊరునందు యేసు జరిగించిన ఒక కార్యము నిమిత్తము వారందరు ఆయనను అంగీకరించిరి; ఏలయనగా వారు మెస్సియా కొరకు కనిపెట్టుచుండిరి. ఈ దినమునకు వాగ్దానము చేయబడిన మెస్సియా పరిశుద్దాత్మగా నుండి వాగ్దానము చేయబడిన వాక్యమును నిరూపించుచున్నాడు.

MARK 16:17

 

67మీరు విశ్వాసులైయున్న యెడల, మీలో ప్రతి ఒక్కరు, ఒకరి చేతులు ఒకరి మీద ఉంచవలెనని నేను కోరుచున్నాను.

ఇప్పుడు, నీవు - నీ కొరకు ప్రార్ధించుకొనవద్దు. నీవు అతని కొరకు ప్రార్థించుము, మరియు వారు నీ కొరకు ప్రార్థించెదరు. ఏ వాగ్దానము ఈ కడవరి దినముల కొరకు చేయబడినదో, ఇప్పుడు అదే వాగ్దానము "నమ్మిన వారివలన ఈ సూచక క్రియలు జరుగును," అని యేసు చెప్పినది జ్ఞాపకము చేసికొనుడి. శబ్దమును గుర్తింపజేయు సూచనయే స్వస్థత దానిని వెంబడించుచున్నది. "వారు రోగుల మీద చేతులుంచినప్పుడు పలుకబడిన శబ్దమునకు సూచనగానున్నది, హల్లెలూయా, ప్రభువు నన్ను స్వస్థపరచెను." ఈ సూచనలు ఆ (స్వరమును) శబ్దమును వెంబడించిన యెడల, అదే సూచనను నీవు విశ్వాసియైన యెడల అది వెంబడించును. శబ్దము సూచనను అనుసరించి వెంబడించును. నేను మీకు తెలియజేసిన సూచన, ఇచ్చిన యెడల అది దేవుని యొద్దనుండి వచ్చును, మరియు దేవుడు ఈ దినమునందు అది వాగ్దానము చేసెను, అది పరిపూర్ణముగా బయలుపరచబడినది, అచ్చట ఏ అనుమానస్పదము లేదు, అయితే అన్యుడు దానిని నమ్మకుండునట్లు దూరముగా నుండును. దేవుడు దానిని ఆ రీతిగానే నెరవేర్చును.

ఇప్పుడు ఆయన ఇక్కడ ఉన్నాడు.

68మీలో ప్రతి ఒక్కరును మీ సంఘములో, ప్రార్ధించిన రీతిగా, పెద్ద శబ్దముతోనో మరి ఏ విధముగా చేయుచుండిన యెడల, ఆ రీతిగా నీవు నీ చేతినుంచిన వ్యక్తికి ప్రార్థించుము, ఏలయనగా అతడును నీ గురించి ప్రార్థించుచున్నాడు.

ఇప్పుడు పైకి చూడుడి. మెస్సియా, క్రీస్తు, పునరుత్ధానుడై రెండువేల సంవత్సరముల నుండి జీవించుచున్న ఆయన సన్నిధిన ఆత్మలో చచ్చినవారివలె ఎలాగుండగలము? అది ఈ రాష్ట్రమును అగ్నితో కాల్చివేయును. అది బ్యుమౌంట్ (స్థలము) గోనెపట్ట కట్టుకొని, బూడిదలో నుండి మారు మనస్సు పొందునట్లు తప్పక చేయును, కాని, అది ఆ విధముగా చేయునా? చేయదు. అయితే, ఎవరు ఆయన వాక్యము గైకొని, ఆయనయందు విశ్వాసముంచి, ఆయన కొరకు కనిపెట్టుకొను వారికొరకు ఈ వాగ్గానము ఇవ్వబడినది. ఆయన ఆ విధముగా చేయును అని వారు నమ్ముదురు. మీ చేతులు మరొకరి ఎవరి మీదనైన ఉంచి, నేను ఇక్కడ నుండి ప్రార్ధన చేయుచుండగా, మీరును ప్రార్థించుడి.

LUKE 17:28-30

 

69ప్రభువైన యేసూ, సమృద్ధిగా చెప్పవలసినంతగా చెప్పబడినది, చేయవలసి నంతగా కార్యములు చేయబడినవి. వాగ్దానము చేయబడిన వాక్యము ప్రత్యక్షపరచబడెను. మెస్సయ్య, దేవుని యొక్క క్రీస్తు, పవిత్ర ప్రసన్నతయందున్నాడు. మేము ఆయనను చూచుచున్నాము, మేము ఆయనను స్పర్శచేత అనుభవించుచున్నాము. ఆయన ఈ కడవరి దినములందు "సోదోము దినములందువలె,"

మనుష్యకుమారుని ప్రత్యక్షత ఉండును అని వాగ్దానము ఆయన చేసినదానిని మేమెరుగుదుము. ఆకాశమందు ఆటోమిక్ బాంబుల అగ్నిని చూచుచున్నాము. రాష్ట్రములను తినుచున్న పురుగులను చూడుము, రాష్ట్రములు భిన్నములుగా చీల్చబడుచున్నవి. ఇశ్రాయేలీయులు తమ స్వదేశమును చేరుకున్నారు. వాగ్దానము చేయబడిన ప్రతి ఒక్క సూచన నెరవేరినది. అటు పిమ్మట జరుగునది వాగ్దాన కుమారుని రాకడ.

ఓ, నిత్యుడగు దేవా, యేసుక్రీస్తు ప్రసన్నతలో మహత్తరమైన పరిశుద్దాత్మ ఇచ్చట ఉండి, ఇచ్చట ప్రజలు చేయుచుండిన ప్రార్ధన వినుచున్నావనియు, క్రైస్తవుల ప్రార్థన వినుచున్నావని ధృఢపరచుచున్నది, మరియు సహోదరుడు బ్రెన్హాం దీనిని (అతడు చేతులుంచి ప్రార్థించెను) చేసెనని, నేను వెళ్ళినప్పుడు వారు చెప్పకుండునట్లు స్థిరపరచెను. ఎవరో తమపై చేతులుంచిరనియు, తాము స్వస్థతను పొందిరనియు వారెరుగరు. అయితే, ఆ స్వస్థతకు సూచనగా ఆ శబ్దము కలిగియుండునని నీవు వాగ్దానము చేసితివి. మరియు వారిని నీకు అప్పగించుచుండగా వారెల్లరు స్వస్థత పొందుదురు గాక, యేసు నామమున.

Search Messages

0 / 0 matches
Enter characters above to process real-time text query scopes...