దేవుడు తన గుణలక్షణముల ద్వారా తన్నుతాను బయలుపర్చుకొనును
1నేను నా స్నేహితుడైన జోసెఫ్ బొజ్ ను అక్కడ చూచుటకు ఒక విధముగా ఆశ్చర్యపడ్డాను, మరియు నేను చుట్టూ తిరిగి, అతనితో కరచాలనము చేయుటకు కొంత సమయమును తీసుకొన్నాను. ఇప్పుడు మనము హెబ్రీ 1వ అధ్యాయమునకు తిరిగుదాము. ఈ రాత్రి ఒక అంశమును తీసుకొనుట కొరకు, ఒక భాగమును, 1, 2, 3వ చనములను నేను చదువగోరుచున్నాను.
పూర్వకాలమందు నానా సమయములలోను నానా విధములు గాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాటలాడిన దేవుడు,
ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాటలాడెను, ఆయన ఆ కుమారుని సమస్తమునకు వారసునిగా నియమించెను. ఆయన ద్వారా ప్రపంచములను నిర్మించెను;
ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును, ఆయన తత్వము యొక్క మూర్తిమంతమునై యుండి, తన మహత్తుగల మాట చేత సమస్తమును నిర్వహించుచు… మహామహుడగు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండెను.
MATT 6:10•
LUKE 11:2•
JOHN 14:13•
PHIL 4:19
2ఇప్పుడు ప్రార్ధన కొరకు మన తలలను వంచెదము మరియు ఇప్పుడు ఆయన యొక్క దైవిక సన్నిధిలో, మీరు ఏదైననూ అభ్యర్ధనను కలిగివున్నచో అది ఆయనకు తెలియపర్చాలని కోరుకొనుచున్నచో, మీ చేతిని ఎత్తుదురా? మరియు ఆ యొక్క విన్నపమును దేవుడు…
మా పరలోకపు తండ్రీ, నీ కుమారుడైన యేసుక్రీస్తు నామములోని విశ్వాసము ద్వారా, ఇప్పుడు నీ సింహాసనము ముందుకు మేము వచ్చుచున్నాము. మరియు "ఆయన నామములో మేము దేనిని అడిగినను, అది మాకు అనుగ్రహించబడుతుందని," ఈ నిశ్చయత మాకు ఇవ్వబడింది. నీవు మా కోర్కెలను, అవసరములను ఎరిగియున్నావు, మరియు మాకు అవసరమైన వాటన్నిటిని, నీవు సరఫరా చేస్తానని వాగ్దానము చేసియున్నావు.
కాబట్టి, తండ్రీ, నీవు మాకు నేర్పినట్లుగా, మేము ప్రార్థిస్తాము, "నీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు, ఈ భూమిలోను జరిగించుము." ఈ రాత్రి అది మా మనవి, నీ ఇష్టప్రకారము దానిని మాకు దయచేయుము.
మరియు ఈ ఆధిక్యతలను అనుగ్రహించుము. వాక్యమును అభిషేకించుము, ప్రభువా, ప్రసంగీకులను మరియు వినువారిని అభిషేకించుము, ఈ రాత్రిమా మధ్యకు పరిశుద్దాత్ముడు లోనికి వచ్చి, వాక్యప్రకారము చేయువారిగా, మమ్మును ఉండనిమ్ము, మేము దానిని యేసు నామములో అడుగుచున్నాము. ఆమేన్. మీరు కూర్చొనవచ్చును.
3రేపు ఉదయమున, సంపూర్ణ సువార్త వ్యాపారస్తుల అల్పాహార విందుయున్నదని నేను గ్రహిస్తాను. సాధారణముగా, ఎక్కుడ వారి కూటమి ఒకటుంటుందో, అక్కడ వారి అల్పాహార విందులో మాట్లాడే ఆధిక్యత నాకు యుంటుంది. ఈ సమయమునకు, అది ఒకే సంస్థ అది — అది సంస్థ కాదు… అయితే నేను ఆ గుంపునకు మాత్రమే చెందినవాడను, అదే క్రైస్తవ వ్యాపారస్తుల కూటమి. ఇప్పుడు, అంతర్జాతీయముగా నేను వారికొరకు మాట్లాడతాను.
ఇప్పుడు, ఈ రాత్రికి ఈ కూడిక వ్యర్థముగా పోదనిమనము నమ్ముచున్నాను. నేను మీ యొద్దకు అలసిపోయి, అరిగిపోయిన గొంతుతో వచ్చాను, మరియు ఒక చిన్న ఊపిరితిత్తుల సమస్యతో యున్నాను… నేను టుసాన్ నుండి వచ్చాను, అక్కడ నిజముగా చక్కగా మరియు పొడిగా వున్నది., మరియు నేను ఇక్కడకు వచ్చినపుడు, అది చక్కగా మరియు మంచిగా, చెమ్మగా యున్నది. కాబట్టి అక్కడ అది వ్యతిరేఖముగా యున్నది. ఇక్కడ మీరు కలిగియున్న నీటినంతా, మీరు మా మార్గము లోనికి పంపినట్లైతే, మేము దానిని అభినందిస్తాము. కాని నిజానికి మీరు దానిని చేయలేరు.
కాని నేను మీకు ఒక సంగతి చెపుతాను: అక్కడ ఒక సమాంతరమున్నది. ఆరిజోనాలో మాకున్నవన్నీ, (మా చెట్లు), పూర్తిగా ముళ్ళతో యుంటాయి. ప్రతి దానికి ముళ్ళు వుంటుంది. దానికి కారణము అది ఎండిపోయియున్నందువల్ల. ఇప్పుడు అదే పొద, ఈ పైన పెరిగినట్లైతే, అది ఒక చక్కని ప్రియమైన ఆకుగా వుంటుంది. చూడండి, దానికి అక్కడ నీరు లేదు, ఆ కారణమును బట్టియే అది గ్రుచ్చుకొన్నట్లుంది. ఇప్పుడు సంఘము జీవజలముల లేకుండా మారినప్పుడు, అది ఎండిపోయి, గ్రుచ్చుకున్నట్లుగా కూడా యుంటుంది, గ్రుచ్చుతూ, ప్రతి దానిని గ్రుద్దుతూ యుంటుంది. కాని జీవజలములు అక్కడ ప్రవహించినపుడు, అది ఆకును తెరచి, దానిని మృదువుగా చేసి, తియ్యగా, శ్రావ్యముగా, మరియు పరిశుద్ధముగా, దేవునికి అంగీకారముగా యుంటుంది.
కాబట్టి ఈ రాత్రి మనము గ్రుచ్చే ముళ్ళుగా యుండకుండా, ప్రభువైన దేవుడు నీరు కట్టును గాక; అయితే చక్కని ఆకులతో, మార్గమున పోవు ప్రజలు, మన చెట్టు నీడ క్రింద, వారి ఆత్మలకు విశ్రాంతిని పొందుదురు గాక.
4ఇప్పుడు, ఈ రాత్రి నేను తీసుకొనగోరె అంశము, ప్రభువు చిత్తమైనయెడల, మరియు నా స్వరము తక్కువగా యున్నందున, నేను ఈ మైక్రోఫోనును, ఎంత దగ్గరగా యుండాలో, అంత దగ్గరగా లాక్కొనుచున్నాను. చదవబడిన హెబ్రీ 1:1 నుండి, నేను తీసుకొనగోరు అంశము: "దేవుడు తన గుణలక్షణముల ద్వారా తన్నుతాను బయలుపర్చుకొనును." మరల దానిని నన్ను చెప్పనియ్యండి, ఏలయనగా ప్రతిధ్వనించు పరికరములు, ఇక్కడ చాలా హీనముగా యున్నవని నాకు తెలుసు. "దేవుడు తన గుణలక్షణముల ద్వారా తన్నుతాను బయలుపర్చుకొనును."
ఇప్పుడు, మొత్తము మీద ఏదైనను దాని యొక్క గుణలక్షణముల ద్వారా అది గుర్తించబడుతుంది. కొన్ని లేఖనములను, ఒక గమనికను నేను ఇక్కడ కలిగియున్నాను, నేను వాటిని సూచించగోరుచున్నాను. ఇప్పుడు అది ఏమైయున్నదో, అది ఏదైనను దాని గుణలక్షణము ద్వారా, అది గుర్తించబడుతుంది. ఇప్పుడు, ప్రకృతిలో వలె, పుష్పములు వాటి యొక్క గుణలక్షణముల ద్వారా అవి గుర్తించబడతాయి. అవి దగ్గరగా, ఏకమైయున్నప్పుడు, అది ఒక జాతి నుండి, మరొక జాతికి, అది ఏ పుష్పమైయున్నదో, దాని గుణలక్షణముల ద్వారా, అవి గుర్తించబడతాయి.
మరియు అడవులలో, అనేకసార్లు…
5నేను ఒక వేటగాడిని. నీవు ఏ జంతువును వేటాడుచున్నావో, ఆ జంతువు యొక్క గుణలక్షణమును ఎరిగి యుండవలసి యున్నది, లేనిచో కొన్నిసార్లు నీవు నిశ్చయముగా మోసపోతావు. ఉదాహరణకు బ్రిటిష్ కొలంబియాలోని, రాతి గొర్రె వలె… నేను ఈ ఆకురాలు కాలములో, యూకాన్ లో యున్నాను, కొంత మంది సోదరులు నాతో యున్నారు, మేము వేటాడు చున్నాము. ఇప్పుడు ఒక గొర్రెను గాని లేక ఒక దుప్పిని గాని, నీవు వాటి జాడను వెదకుచున్నప్పుడు, నీవు ఒక చురుకైన వేటగాడివైతే తప్ప, నీవు దాని భేదమును చెప్పలేవు, ఎందుకనగా అవి ఒక విధమైన జాడను తయారు చేస్తాయి. అవి పరుగెత్తినపుడు, అవి గెంతుకొంటూ వెళతాయి. అప్పుడు దూరము నుండి నీవు ఒక దానిని చూస్తూ యున్నట్లైతే, అవి తమ తలను దించినట్లైతే, నీవు కనీసము వాటి భేదమును చెప్పలేవు. అవి వీపు బాగమున మీదుగా ఒక్కటి గానే యుంటాయి; అది సరిగ్గా తెల్లగా దుప్పివలె యుంటుంది. వాటిని అవి ఏమైయున్నవో చెప్పుట కష్టము. కాని దాని యొక్క కొమ్ములు, దాని గుణలక్షణములను గుర్తింపచేస్తాయి — వాటి కొమ్ముల ద్వారా. గుండ్రముగా యున్న కొమ్ములను గొర్రెలే కలిగియుంటుంది, కాని దుప్పి, అది పదునైన పొడుసుకొనే కొమ్మును కలిగియుంటుంది, మరొక సంగతి, అంత ఎత్తులో మేయుటకు దుప్పి వెళ్ళదు.
మరియు తరువాత మేక నడకలో కూడా, ఒక గుణలక్షణమున్నది, ఆలాగునే ఒక గొర్రె, వాటిలోని తేడాను నీవు తెలుసుకోనవలసియున్నది, నీవు ఎత్తైన స్థలములో యున్నప్పుడు, ఎందుకనగా అవి రెండును పర్వతము మీద ఎతైన స్థలములో యుంటాయి. నీవు వాటిలోని భేదమును ఎరుగవలసియున్నది. కాని మీరు గమనించారా, ఒక మేక అది నడుస్తున్నప్పుడు అది తొట్రుబాటుగా నడుస్తుంది; కాని ఒక గొర్రె నడుస్తున్నప్పుడు, తన పాదములను ఈ విధంగా క్రింద మోపినడుస్తుంది. దాని యొక్క అడుగు జాడలను వేయు గుణలక్షణము. నీ యొక్క ఆటను, అది ఏమి చేస్తుందో, అది ఎలా నటిస్తుందో, అది ఏమి భుజిస్తుందో, మరియు దాని సమస్తమును బట్టి దాని యొక్క గుణ శీలము దానిని బట్టి గుర్తించబడుతుంది. అప్పుడు నీవు ఒక దాని కొరకు దూకినపుడు, అది ఏమి సంభవిస్తుందో చూడండి, అవి వెళ్ళే మార్గమున నీవు చెప్పగలవు, ఆ జంతువు యొక్క భిన్నమైన గుణలక్షణములను బట్టి, నీవు దానిని చెప్పవచ్చును.
6అలాగైతే మీరు ఎన్నడైనా గమనించారా, అవి ఇక్కడ యున్నవో లేదో నాకు తెలియదు — యెల్లో హమర్ (ఫ్లికర్ దాని యొక్క సరైన పేరు) మరియు జెపక్షి. జెపక్షి కూడా యెల్లో హమర్ పక్షి అంతయుంటుంది. ఆ రెండు ఎగురుటను మీరు చూసినపుడు, అవి దరిదాపుగా రెండూ ఒకే రకమైన పక్షులు. నీవు రంగును చూడలేకపోయినట్లైతే, వాటిని గమనించు, ఏది యెల్లో హమర్ పక్షియో నీవు చెప్పగలవు.
జెపక్షి ఎక్కువ లేక తక్కువగా, రెండు దారుల మధ్యలో తిన్నగా వెళుతుంది; కాని యెల్లో హమర్, అది తన రెక్కలను ఆడిస్తూ, అది పైకి క్రిందికి ఎగురుకొంటూ వెళుతుంది. చూడండి, అది ఆ విధముగా గెంతుకొంటూ వెళుతుంది, అది ఎగిరే విధానమును బట్టి, నీవు యెల్లో హమర్ పక్షి యొక్క గుణలక్షణమును చెప్పగలవు.
మీరు గమనించినట్లైతే, కంజు పిట్ట బయటకు వచ్చినపుడు అది ఎలా పైకి వస్తుందో చూడండి, మరియు అప్పుడు ఏ పర్రలో ఆ కంజు పిట్లయున్నదో అక్కడ, ఒక ఉల్లంకి పిట్ట, వేటగాళ్ళేన మీకు తెలుసు. విల్సన్స్ ఉల్లంకి పిట్ట మరియు జాక్స్ ఉల్లంకి పిట్ట, అవి ఏ విధముగా బయటకు వస్తాయో, మరియు ఏ విధముగా వెళతాయో, ఆ విధముగా, అవి తమ్మును తాము, గుర్తింపచేసుకొంటాయి. అవి ఏరకమైన పక్షులో, అవి ఎగిరే గుణలక్షణముల ద్వారా, అవి తమ్మును తాము గుర్తింపచేసుకొంటాయి. అందుచేత, నీవు వాటి శబ్దమును విన్నప్పుడు, అది ఎగురుతున్న దాని యొక్క గుణలక్షణములను బట్టి, అది బయటకు వెళ్ళే విధానమును బట్టి, అది ఏమైయున్నదో నీవు చెప్పగలవు.
DEUT 22:5
7ఒక స్త్రీ మరియు ఒక పురుషుడు వలె: వారిద్దరూ మనుషులే, కాని ఒక స్త్రీ, పురుషుని నుండి వేరైన గుణలక్షణములను కలిగియుంటుంది. ఇక్కడ కొద్ది కాలము క్రితము, సొలొమోను మరియు రాణిని గూర్చి చదువుచున్నాను. దక్షిణ దేశపు రాణి, సొలొమోనులోని ఆ వివేచనా వరమును చూచుటకు వచ్చుటను గూర్చి, నేను ఎన్నడూ నా వర్తమానమును ఇక్కడ బోధించియుండలేదు. కొద్ది కాలము క్రితము నేను చదువుచున్నాను, వారన్నారు, ఆ రాణి సొలొమోను ముందుంచిన చిక్కు ప్రశ్నలలో ఒకటేమనగా, ఒక స్త్రీకి పురుషునివలె వస్త్రధారణ చేసి, సొలొమోను ముందు ఉంచింది. ఇప్పుడు, ఆ దినమున అది ఒక కొత్త విషయమైయున్నది, కాని ఈ రోజున అది సరిసమానముగా యున్నది. అది తప్పు అని మీకు తెలుసు. ఒక స్త్రీ దానిని తప్పక చేయరాదని బైబిలు చెపుతుంది. ఒక స్త్రీ, పురుషుని యొక్క వస్త్రములను ధరించుట, హేయమైయున్నది. మార్పులేని దేవుడు దానిని చెప్పియున్నాడు. దేవుడు దానిని చెప్పెను, కాబట్టి అది సత్యమైయున్నది. కాబట్టి మనము కనుగొనునదేమనగా, సొలొమోను వారిని గమనించిన వెంటనే, వెంటనే ఇలా అన్నాడు, "అది స్త్రీ." చూడండి, ఆమె ఒక స్త్రీ అని, అది పురుషుడు కాదని, ఆ స్త్రీ యొక్క గుణలక్షణములను బట్టి ఆమె తన్నుతాను ప్రవర్తించుకొను రీతిని బట్టి, అతడు చెప్పెను.
MATT 24:24
8అలాగైతే దరిదాపుగా సమస్తమూ, దాని యొక్క గుణలక్షణముతో యుంటుంది. కొందరు సరిగ్గా ఎడమచేతి వాటముగలవారు, కొందరు కుడిచేత వాటము గలవారు. వారు తమ్మును తాము ఎలా ప్రవర్తింప చేసుకొంటారో, అది వారి యొక్క గుణలక్షణమైయున్నది. వారు తమ్మును తాము ప్రవర్తింపచేసుకొనురీతిని బట్టి, వారు కుడి చేతి వాటము గలవారో, లేక ఎడమ చేతి వాటముగలవారో, వారు కుడిచేతి తోను లేక ఎడమ చేతితోను, అందుకొనుటను బట్టి, మనము చెప్పవచ్చు.
మరియు గుర్తుంచుకోండి, యేసు అలాంటి దానినే ఒకటి కలిగియున్నాడు, అదే.. రెండు చేతులు, దరిదాపుగా ఒకే రీతిగా యున్నాయి.. అవి ఒకే రీతిగా యున్నాయి. అవి ఒకే రకమైన బొటనవ్రేలి ముద్రలను, వ్రేలి ముద్రలను, చిన్న, మరియు చూపుడు వ్రేలు ముద్రలను కలిగియున్నాము. సరిగ్గా కుడి చేయి మరియు ఎడమ చేయి, సాధారణముగా ఒకే విధముగా వ్రేళ్ళను కలిగియున్నట్లుగా, ఖచ్చితముగా, రెండూ ఒకే పరిమాణములో యున్నట్లుగా. వాటిలో అక్కడ యున్న ఒకే భేదమేమనగా, ఒకటి కుడి చెయ్యి, మరొకటి ఎడమచెయ్యి. నీవు చెప్పగలిగే భేదము అంతమట్టుకు మాత్రమే. ఒకటి ఎడమ చెయ్యి; మరొకటి కుడి చెయ్యి.
కాబట్టి, అలాగైతే, దానిలో యేసు ఇలా చెప్పెను (నేను ఒక చిన్న విషయమును ఇక్కడ వదిలిపెడతాను), మత్తయి 24 అధ్యాయములో యేసు అన్నాడు, "కాబట్టి చివరి దినములలో, సాధ్యమైతే ఏర్పర్చబడినవారిని సహితము మోసపుచ్చునట్లుగా, ఆత్మ యొక్క గుణలక్షణములు యుంటాయి."
చూడండి, సరిగ్గా అవి అంత దగ్గరగా యుంటాయి… నీవు నీ చేతులను పైకెత్తి చూడు, నీవు గమనించినట్లైతే ఒకటి మరొక దానివలె ప్రతిదానిలో సమానముగా యుంటుంది, కాని వాటిలో ఒకటి ఎడమ చేయి మరొకటి కుడి చేయి. ఆ విధముగానే ఈ చివరి దినములలో ఆత్మలు యుంటాయి. అవి ఒకే విధముగా యుంటాయి, కాని వాటి గుణలక్షణములు వాటిని గుర్తిస్తాయి. ఒకటి సరియైనది, మరొకటి తప్పు, మరియు అది దాని యొక్క గుణలక్షణము ద్వారా గుర్తించబడుతుంది.
9దేవుని యొక్క ఆత్మ దాని యొక్క గుణలక్షణముల ద్వారా గుర్తింపబడుతుంది, చూడండి — దేవుని యొక్క ఆత్మ; మరియు సంఘము యొక్క ఆత్మ. అక్కడ సంఘము యొక్క ఆత్మ యున్నది; దేవుని యొక్క ఆత్మయున్నది, అది పరిపూర్ణముగా, ఏ మాత్రము సంఘము యొక్క ఆత్మ కాదు. అక్కడ ఒక సంఘ శాఖ యొక్క ఆత్మ ఉన్నది.
అక్కడ ఒక జాతీయ ఆత్మయున్నది. అక్కడ ఒక దేశము యొక్క అత్మయున్నది. ప్రతి దేశము, నేను దానిలోనికి నడిచి వెళ్ళినపుడు, నీవు ఒక భిన్నమైన ఆత్మను కనుగొంటావు. నేను ఫిన్లాండ్ దేశములోనికి వెళ్ళినపుడు, చక్కని ప్రజలు, కాని అక్కడ ఫినిష్ ఆత్మ ఉన్నది. నేను జెర్మనీకి వెళ్ళినప్పుడు, అక్కడ ఒక జర్మన్ ఆత్మయున్నది.
10ఈ మధ్య కాలములోనే, మేము ఇంకనూ ఇండియానా రాష్ట్రములో జీవించుచున్నాము, రెండు సంవత్సరముల క్రితము నేను నా భార్యతో కలసి, ఒక చిన్న సూపర్ మార్కెట్ లోనికి వెళ్ళుచున్నాము. నేను అప్పుడే ఇంటికి వచ్చియున్నాను. మేము వెళ్ళి కొంత ఆహారమును తేవలసియుండెను. నేను నా మార్గములో వెళుతూ యుండగా, అది వేసవి కాలమైయున్నది, మీరు దానిని నమ్మక పోవచ్చును, కాని మేము ఒక రకముగా బట్టలు వేసుకొన్న ఒక స్త్రీని చూశాము. అది ఎంతో వింతగా యున్నది, నేను… అది నన్ను దిగ్భ్రాంతికి గురిచేసింది, నేనన్నాను, "అక్కడ చూడు, అది ఎంత వింతగా యున్నదో, ఆ స్త్రీ ధరించిన బట్టలు." వారిలో అనేకులు స్త్రీలు ధరించకూడని బట్టలను ధరించుచున్నారు.
నేనన్నాను, "సరే, అది సరిగ్గా అమెరికా దేశపు ఆత్మ, చూడండి, అమెరికా దేశపు ఆత్మ."
ఇప్పుడు, అమెరికా ఆత్మ అది… తప్పక ఒక క్రైస్తవ దేశపు ఆత్మగా యుండవలసియున్నది, కాని ఈ దేశములోని ఆత్మ క్రైస్తవ ఆత్మ కాదు. అది ఒక క్రైస్తవ దేశముగా పిలవబడుతుంది, కాని గుణలక్షణములో అది, ఒక పది లక్షల మైళ్ళ దూరములో యున్నది. కాబట్టి నేను చెప్పిన ఈ స్త్రీ… నేనన్నాను…
ఆమె అన్నది, "మనము అమెరికా వాసులము కాదా?"
నేనన్నాను, "కాదు. మనము ఇక్కడ జీవిస్తున్నాము ఇది మన దేశము. మనము దీనిలో నివసిస్తాము. మనము దీనిని ప్రేమిస్తాము. ఇది ప్రపంచములోనే ఒక శ్రేష్ఠమైన దేశము. కాని, ఇంకనూ, మనము అమెరికా వారము కాదు." "మనము పైనుండి జన్మించియున్నాము. పరిశుద్ధాత్ముడు క్రిందికి వచ్చియున్నాడు. అది ఈలోకసంబంధమైనది కాదు." నేనన్నాను, "ఆ కారణమును బట్టియే, మన సహోదరీలు పొడవైన వస్త్రములను, పొడవైన జుట్టును కలిగియున్నారు, వారు ముఖమునకు రంగులు వేసుకొనరు." చూడండి, వారి యొక్క గుణలక్షణములు, 'ప్రభువునకు పరిశుద్ధమైనదిగా,' పై నుండి వారిని గుర్తిస్తాయి.
11అందుచేత, మనము ఒక రాజ్యమును వెదుకుచున్నాము. ఒక రాజు వచ్చి, ఆయన ఏలికలను ఆయన రాజ్యము లోనికి స్వీకరించుటకు మనము వెదుకుచున్నాము. వారు వారి యొక్క గుణలక్షణములను బట్టి వారు గుర్తించబడతారు, మరియు వారి యొక్క ఆస్తులు ఈ దేశములోని భూసంబంధమైనవి కావు. అవి పైన యున్న మహిమలోనివి. అందుచేత, వారు "దేవుడు దేనికి శిల్పి మరియు నిర్మాణకుడైయున్నాడో, ఆ పట్టణము కొరకు వారు ఎదురుచూస్తున్నారు." వారు సరియైనవారుగా గుర్తించబడతారు.
మీకు బోధించుటకు ఏదో ఒక రాత్రి నాకు తగినంత స్వరము ఉండాలని నేను కోరుచున్నాను. అయితే నేను దానిని విడిచి పెడతాను.
ఇప్పుడు, అది దాని యొక్క గుణలక్షణముల ద్వారా గుర్తించబడుతుంది.
GEN 15:13•
EXOD 3:8,19•
DEUT 6:21•
DEUT 7:8•
DEUT 9:26•
HEB 11:10,14
12ఇక్కడ ఒక మంచి మాదరిని వాగ్దాన భూమిలోనికి వచ్చిన ఇశ్రాయేలు కాలములో మనము "నీ సంతానము పరాయి దేశములో, నాలుగు వందల యేండ్లు యుంటారు, తరువాత నేను వారిని, ఒక గొప్ప బలమైన హస్తముతో నేను వారిని విమోచిస్తాను. తరువాత అప్పుడు వారికి వాగ్దానము చేయబడిన, పాలు తేనెలు ప్రవహించు దేశములోనికి వారు వెళతారు."
దేవుని యొక్క వాగ్దానము సమీపించినప్పుడు, వారి మధ్య గొప్ప సేవను కలిగియున్న, యోసేపును ఎరుగని, ఒక ఫరో అక్కడ లేచియున్నాడు. మరియు ఇక్కడ, మోషే అను పేరుగల ఒక ప్రవక్తను దేవుడు లేపాడు. ఈ మనిషి ఐగుప్తీయుల యొక్క సకల విద్యలలో ప్రవీణుడుగా నేర్పబడ్డాడు. సందేహము లేదు, అతడు ఒక చురుకైన గొప్ప తెలివిగల మనిషి, ఎందుకనగా ఐగుప్తీయులకే అతడు జ్ఞానమును నేర్పగలడు. విడుదల చేయుట కొరకు సరిగ్గా సరిపోయిన వ్యక్తిగా కనపడ్డాడు. కానీ, మీరు చూడండి, మనము విడుదల పిలిచే దానికీ, దేవుడు ఏది విడుదల అని పిలుస్తాడో దానికి, కొంత భేదమున్నది.
ఇప్పుడు, తన నీతి శాస్త్రములన్నిటితో యున్న ఈ మనిషిని గమనించండి. ఇశ్రాయేలు ప్రజలను విమోచించుటకు అతడు జన్మించియున్నాడని అతడు ఎరిగియుండెను. అయినను, అతని యొక్క విద్య అంతటిలో, అతడు ఎరిగియున్న దానంతటితో, ఆ పనిచేయుటకు అతడు పిలవబడియున్నాడని ఎరిగియున్నాడు, అతడు కళ్ళలో పట్ట భద్రుడైనప్పటికి, పిహెచ్.డి., ఎల్ ఎల్.డి., అలాటివి కలిగియున్నప్పటికి, ఇశ్రాయేలును విమోచించుటకు వెళ్ళినపుడు, అతడు పూర్తిగా విఫలమయ్యెను.
ఇప్పుడు, గమనించండి, ఫరోగా మారుటకు ఐగుప్తు సింహాసనము మీద అడుగుపెట్టిన తరువాత, అతడు ఫరోగా మారిన తరువాత అతడు ఇశ్రాయేలు ప్రజలను విడిపించగలిగి యుండేవాడన్నట్లుగా, అది కనబడింది, ఎందుకనగా సింహాసనము కొరకు అతడు తర్వాత వరుసలో యున్నాడు. కానీ, మీరు దానిని చూడండి, ఆ విధముగా చేయుట ద్వారా, ఆయన ప్రజలను విమోచించుటలో అది దేవుని యొక్క గుణలక్షణమును గుర్తింపచేసుకొనదు. వారిని విమోచిస్తానని ఆయన అన్నాడు. ఒక బలమైన హస్తముతో ఆయన వారిని విమోచిస్తాడు; మోషే యొక్క బలమైన సైన్యముతో కాదు, కాని దేవుని యొక్క బలమైన హస్తముతో..
EXOD 3:1,2,5,14•
ACTS 7:30,31,33
13ఈ ప్రవక్త పారిపోయాడని మనము కనుగొంటాము, మరియు అరణ్యములో అతడు నలుబది సంవత్సరములున్నాడు. అతనిలోనికి విద్యను ఎక్కించుటకు, అది ఫరోకు నలుబది సంవత్సరములు పట్టింది, మరియు దానిని మరల రంధ్రము చేసి, దానిని బయటకు తీసివేయుటకు దేవుడు నలుబది సంవత్సరములు తీసుకొన్నాడు. కాబట్టి, మనము కనుగొనేదేమంటే, ఒక దినమున, అతడు, ఎడారి వెనుక, అగ్నిస్తంభము రూపములో, పొదలో యున్న, మండుచున్న పొదలో ప్రభువైన యెహోవాను కనుగొన్నాడు. అతడు నిలబడియున్నది, పరిశుద్ధ స్థలమైనందున, తన చెప్పులను విడవమని అతడు అడగబడ్డాడు.
ఇప్పుడు చదువుకొనియున్న, నాగరికత గల, ఈ చక్కని మనిషిని చూడండి, అతడు దేవునిని కలుసుకొన్న తరువాత, మార్పు చెందుతున్న అతని యొక్క గుణలక్షనమును చూడండి. అతడు ఎక్కువగానే చేశాడు. కొన్నిసార్లు దేవుడు, కార్యములను ఎలాటి సామాన్యతలో జరిగిస్తాడంటే, అది శరీరానుసారమైన ఆలోచనకు, ఎలాటి వెర్రితనముగా యుంటుందో. పరిపూర్ణముగా ఓడిపోయిన, ఒక మనిషిని గమనించండి; దేవుని యొక్క చిత్తమును చేయుటకు తన చుట్టూ యున్న ఐగుప్తు సైన్యమంతటితో, మరియు సమస్తముతో, తన విద్య అంతటితో, నలుబది యేండ్ల వయస్సులో, అతని ఉన్నత దశలో, అతడు ఓడిపోయాడు. ఇప్పుడు ఇక్కడ అతడు ఎనభై ఏళ్ల మనిషి, గంత కట్టిన గాడిద తొడ మీద అతని భార్య, తొడ మీద తన యవ్వన బిడ్డను కూర్చొండ పెట్టుకొని కూర్చొన్నది, మరియు అతడు తన చేతిలో ఒక కర్రను పట్టుకొని, ఐగుప్తును స్వాధీనపర్చుకొనుటకు వెళ్ళుచున్నాడు! నీవు ఒక వింతైన దృశ్యమును గూర్చి మాట్లాడుచున్నావు!
కాని అది దేవుని యొక్క గుణలక్షణములను ప్రదర్శించుట, ఏలయనగా ఆయన మాటను నమ్ము ఒక మనిషిని ఆయన కలిగియున్నాడు. అంత మటుకే. దాని విషయమేమనగా, మీరు ఉహించగలరా, ఒకే మనిషి యొక్క దాడి, అక్కడే ఒక సైన్యము ఓడిపోవుట మీరు ఉహించగలరా? కాని అది ఏమిటి? ఆయన యొక్క గుణలక్షణములు, అతని ఎత్తుగడలు మారినవి. అతడు ప్రభవు యొక్క నామమున వెళ్ళుచుండెను, "నేను ఉన్నవాడను అనువాడను." దాని సంగతి ఏమనగా అతడు దానిని స్వాధీనపర్చుకొన్నాడు. అతడు దానిని చేశాడు, ఎందుకనగా అతడు ప్రభువు యొక్క శక్తితో వెళ్ళుచుండెను.
NUM 23:1
14ఇశ్రాయేలును, వాగ్దాన భూమికి నడిపించుచున్న అతని దారిలో, అతని సోదరుడు, అతని సంఘ శాఖ సోదరుడైన, మోయాబును కలిసికొనెను. ఇప్పుడు, మోయాబు అనగా భావము, వారు అన్యులు కారు. వారు లోతు కుమార్తె యొక్క కుమారులు. వారి పిల్లలలో ఒకరు మోయాబుగా ఎదిగి యున్నాడు.
ఇప్పుడు, ఈ పైన, ఈ రెండు దేశములను విరుద్ధముగా మీరు గమనించాలని నేను కోరుచున్నాను. ఇక్కడ ఐగుప్తు దేశమున్నది, ఒక చిన్న, చెదిరిపోయిన దేశము, వారు ఏ దేశమునకు వెళ్ళువారు కాదు, వారి మధ్యలో రాజు లేడు ప్రధానులు లేరు, లేక వారి మధ్యలో ఏ ఘనతవహించిన వారులేరు, వారు కేవలము వాగ్దాన భూమికి వెళ్ళుచున్న ప్రజలైయున్నారు. మరియు వారు మోయాబు దేశము గుండా వెళ్ళవలసియుండెను. అది తిన్నగా వాగ్దానము యొక్క విధినిర్వహణ మార్గములో.
మరియు మోయాబు కూడా యోహోవాయందు విశ్వాసులైయున్నారు, మరియు వారు ఒక ప్రవక్తను కలిగియున్నారు. వారిద్దరూ ప్రవక్తలై యున్నారు. మరియు ఇప్పుడు గమనించండి, వారు ఒక స్థలమునకు వచ్చియుండగా, ఈ సంస్థాగతమైన దేశము యొక్క ప్రవక్త, ఈ ఇతర దేశమును శపించుటకు వచ్చుచున్నాడు, వారు నిలుచుటకు ఒక స్థలము లేనివారు, వారు నిలకడగా ఒక చోటయుండనివారైయున్నారు. కాబట్టి వారు క్రిందికి వచ్చి. ఆ ఇద్దరి ప్రవక్తలను గమనించారు.
ప్రాథమికముగా మాట్లాడినట్లయితే, వారిద్దరూ ఖచ్చితముగా సరియే. ఏలయనగా గమనించండి, బిలాము (ఆ బిషప్), వారితో అన్నాడు, "మీరు నాకు ఏడు బలిపీఠములను కట్టండి [ఏడు సంఘ కాలమును సూచిస్తున్న ఏడు, దేవుని యొక్క పరిపూర్ణముగా సంఖ్యయైయున్నది, సృష్టి ఏడు దినములలో జరిగింది. ఇప్పుడు గమనించండి, ఏడు, దేవుడు ఏడులో సంపూర్ణము చేయబడ్డాడు — ఏడు బలిపీఠములు.], మరియు ప్రతి బలిపీఠము మీద ఒక ఎద్దు."
15ఇప్పుడు, అది ఇశ్రాయేలు పాలెములో యున్న అదే బలిపీఠమైయున్నది. ఇక్కడ కలిగియున్న అదే బలిపీఠముతో, వారు అక్కడ ఇశ్రాయేలులో యున్నారు. మరియు ఒకే బలియర్పణ — ఒక ఎద్దు, మరియు ఒక ఎద్దు; ఒక ప్రవక్త మరియు ఒక ప్రవక్త — వైరుధ్యముగా యున్న రెండు దేశములు. మనము దానిలోనికి వెళ్ళుటకు సమయము యున్నట్లైతే, మనము జీవించుచున్న దినము యొక్క ఒక పరిపూర్ణమైన మాదిరి. గమనించండి, మనము దాని యొక్క సమాంతరమును చూచునట్లుగా, దేవుడు దీనిని ఒక ఉపమానములో చేయుచున్నాడు.
ఇప్పుడు, బిలాము కూడా, ప్రతి బలిపీఠము మీదనూ ఒక కోడెను కోరియున్నాడు. అది రాబోవుచున్న మెస్సీయా యందలి విశ్వాసమును అది మాట్లాడుచున్నది. ఒక గొర్రె పొట్టేలు, ఒక మగ గొర్రె, అదే బలియర్పణకు వారు ఇశ్రాయేలులో కలిగియున్నారు; ఇశ్రాయేలు పాళెములోనూ, మోయాబులోను వారు దానినే కలిగియున్నారు. ప్రాథమికముగా వారిద్దరూ సరియే, కాని గమనించండి, (ప్రాథమికముగా సిద్ధాంతములో), కాని ఇశ్రాయేలు పాళెములో ఒక ప్రవక్త, దేవుని యొక్క గుణలక్షణములను మరియు దేవుని యొక్క వాక్యము కలిగియున్నాడు. అతడు ఆ యుగము యొక్క దేవుని వాగ్దానముతో నిలిచియున్నాడు, ఏలయనగా అతడు వాగ్దాన భూమికి వెళ్ళు మార్గములో యున్నాడు.
ఇప్పుడు, ప్రాథమిక భాగములో బిలాము, మోషే వలే సరిగ్గా గుర్తింపబడవచ్చును.
EXOD 3:8,17•
NUM 21:9
16కాని, మీరు చూడండి, మోషే, దేవుని యొక్క సరియైన ప్రవక్తయైయుండి, ప్రాథమిక భాగములనే కాక, దేవుని యొక్క గుర్తింపును కూడా అతడు కలిగియున్నాడు, చూడండి. ఖచ్చితముగా ఆ యుగమునకు వాగ్ధానము చేయుబడిన విధినిర్వహణ వరుసలో అతడు యున్నాడు; నోవాహు యుగమునకు కాదు, కాని అప్పటి యుగమునకు. "పాలు, తేనెలు ప్రవహించు దేశమునకు నేను మిమ్ములను తీసుకొని వెళతాను." వారు వారియొక్క మార్గములో యున్నారు. మరియు ఇశ్రాయేలు వారియొక్క ప్రవక్తలతో గుర్తింపబడెను, మోషేతో, ఆ యుగము యొక్క వర్తమానముతో గుర్తించబడ్డాయి.
దేవుని యొక్క గుణలక్షణములు మోషేలో గుర్తింపబడెను. ఒక అగ్నిస్తంభము అతనిని వెంబడించుచున్నది. అతడు ప్రాయశ్చిత్త బలిని కూడా క్రియా రూపకముగా కలిగియున్నాడు; దానిని గూర్చి మాట్లాడుటయే కాదు, కాని అతడు దానిని క్రియరూపములో ప్రత్యక్షముగా కలిగియున్నాడు. ఉండబోవుచున్నది కాదు; కాని అక్కడే ఇప్పుడు యున్నది. గమనించండి, ప్రజలు వారి యొక్క రోగములు, వ్యాధి నుండి స్వస్థత కొరకు, అతడు ఇత్తడి సర్పమును పైకి నిలబెట్టియున్నాడు. అందుచేత మోషే దైవిక స్వస్థతను పాటించుచుండెను. అతడు ప్రాయశ్చిత్త బలిని కలిగియున్నాడు, ఇత్తడి సర్పము సూచించుచున్న దేమనగా, దేవుడు ఆ పాళెములో యుండెను, మరియు ప్రజలు ఇత్తడి సర్పమును చూసి స్వస్థపడియున్నారు.
అతనిని వెంబడించుచున్న కొట్టబడిన బండను అతడు కలిగియుండెను. వారి మధ్య జీవజలములను, సంతోషమును మరియు రక్షణను ఉంచుచూ, వారు నిత్యజీవమును కలిగి నశించకుండా యుండునట్లు, అక్కడ అది దేవునిని గుర్తింపజేయుచున్నది. అది ఒక మాదిరి… అరణ్యములో ఆ చీల్చబడిన బండ క్రీస్తుకు మాదిరిగా యున్నది.
అలాగైతే, వారు విధినిర్వహణ వరుసలో ప్రయాణము చేయుచున్నారు, దేవుని యొక్క గుణలక్షణమును చూపుచున్న అది మరొక గుర్తింపైయున్నది. వాక్యముతో ఈ ఇతర వ్యక్తి ఎంత ప్రాథమికమైనవాడిగా కనబడినను లెక్క కాదు. కాని ఇతడు, మౌలికమైన గుర్తింపుతో కలిసి, దేవుని యొక్క గుణలక్షణమును వారి మధ్య కలిగియున్నాడు, దేవుడు తన్నుతాను అతనితో గుర్తింపజేసుకొన్నాడు. ఇద్దరూ ప్రవక్తలు, వారిలో ఇద్దరూ ప్రవక్తలే, మరియు వారిలో ఇద్దరూ ప్రాథమికమైనవారే; కాని దేవుడు తన గుణలక్షణమును మోషేలో గుర్తింపచేసుకొన్నాడు, ఎందుకనగా అతడు దేవుని యొక్క గుణలక్షణములను అతనిలో కలిగియుండెను.
17ఇప్పుడు, మరలా, దేవుని యొక్క గుణలక్షణములు ఎల్లప్పుడును, సహజాతీతమైనవి, ఎందుకనగా ఆయన సహజాతీతుడు. దేవుడు సహజాతీతమైనవాడు. అధునాతన ఆలోచన ధోరణికి, అది ఎల్లప్పుడూ అసాధారణముగా యుంటుంది. మీకు అది తెలుసు. ప్రతి యుగములో అది ఎన్నడైనా దాటి వెళ్ళిన ఆపిల్ పళ్ళ బండిని దేవుడు ఎల్లప్పుడూ బోర్లాపడేటట్లుగా చేశాడు.
మరియు ఒక వ్యక్తిగాని లేక ఒక గుంపు గాని, ఎన్నడైనా తమ్మును తాము ఒక వర్తమానముపై, ఒక సంస్థగా మారినపుడు, వారు చనిపోయి అరలో పెట్టబడ్డారు తప్ప, మరెన్నడూ వారు తిరిగి లేవలేదు. అక్కడ దానికి ఏ చరిత్రయు లేదు. వారు దానిని ఒక గుంపుగా చేయుటకు వెళ్ళినపుడు, లూథరన్ వారుగా, ప్రెస్బిటేరియన్ వారు గాని, మెథడిస్ట్ వారుగాని, బాప్తిస్తు వారు గాని, పెంతెకొస్తు వారు గాని, అలాటి గుంపులు వారు, ఎన్నడూ తిరిగి లేవలేదు. ఎప్పుడైతే వారు దానిని గుంపుగా…
దేవుడు వ్యక్తులతో వ్యవహరిస్తాడు. గమనించండి, సాధారణ ఆలోచనకు ఆయన ఎంతో అసాధారణముగా యున్నాడు. చూడండి, మనము ఎలాటి పోకడలోనికి వెళతామంటే, చివరకు దీనిని ఈ విధముగా నమ్మాలని అంటాము. అప్పుడు దానివెంబడి దేవుడు, ఆయన వాగ్దానము చేసిన, వాక్యముతో వచ్చి, మరియు ఆ వాక్యముతో తన్నుతాను గుర్తింపచేసుకొంటాడు. ఈ గుంపు వారు, ఆ గుంపు వారి యొద్దకు వెళ్ళరు, ఎందుకనగా అది దానిని నమ్మదు, చూచారా. అది దాని నుండి కత్తిరించి వేయబడింది.
NUM 21:9•
DEUT 22:21
18యోసేపు వలే — అతడు ఒక దావీదు కుమారుడు, మరియు అతడు ఒక మంచి మనిషి, అతడు మరియు భర్తయైన యోసేపు. అతడు ఒక మంచి మనిషి, మరియు సందేహము లేదు, అతడు ఎడతెగకుండా బైబిలు యొక్క గ్రంథపు చుట్టలను చదివియున్నాడు, ఏలయనగా… రాబోవుచున్న మెస్సీయా కొరకు అతడు ఎదురుచూచుచుండెను, ఆలాగు సంభవిస్తుందని లేఖనము చెప్పినట్లు, అతడు తప్పక ఎరిగియుండెను. యెషయా అన్నాడు, "ఇదిగో ఒక కన్యక గర్భవతి అగును." మంచిది, ఇప్పుడు, మరియ అను, ఈ యవ్వన బాలికతో అతడు వెళ్ళుచుండెను, బహుశ ఆమెకు పద్దెనిమిది సంవత్సరములు, మరియు అతడు బహుశా ఇంకా పెద్దవాడు. తరువాత వివాహము చేసుకొనుటకు వారికి ప్రధానమైనపుడు, ఆమె తల్లిగా కనబడినది. దాని మీద పరిష్కరింపబడుటకు, ఒక విధముగా అది యోసేపుకు కష్టముగా వున్నది. సందేహము లేదు, గబ్రియేలు యొక్క దర్శనమును ఆమె అతనికి వివరించి యుండవచ్చును. అయితే అతనిని ఎలా నడిపించుచున్నదో అతని యొక్క గుణలక్షణమును మనము గమనించాము, అతడు దానిని సందేహించాడు.
ఇప్పుడు, వారికి వివాహము కాకమునుపే ఆమె తల్లిగా మారింది. మరియు బైబిలులో, దానికి శిక్ష రాళ్ళతో కొట్టుట ద్వారా మరణమైయున్నది. ఒక వివాహము కాని స్త్రీ, తల్లిగా మారినట్లైతే, ఆమె రాళ్ళతో కొట్టబడవలెను. ఇశ్రాయేలులో అక్కడ ఏ విధమైన వ్యభిచారము లేదు. అది బయట ఉంచబడింది. కాబట్టి మనము కనుగొంటాము… ద్వితియోపదేశకాండములో అది దానిని మనకు చెపుతుంది.
LUKE 1:35
19ఇప్పుడు, మనము కనుగొనుచున్నదేమనగా, తాను జరిగించిన ఒక కార్యమును, యోసేపును ఒక కవచముగా, మరియ వాడుకొనుటకు ప్రయత్నము చేయుచున్నట్లుగా కనపడుచున్నది. ఎందుకనగా వివాహము కాకముందే ఆమె తల్లిగా కనబడినట్లైతే, అప్పుడు ఆమె తప్పక రాళ్ళతో కొట్టబడాలి, కాబట్టి ఆమె ఇప్పుడు ఎవరినైనా ఒక కవచముగా తనతో నిలబడుటకు తప్పక కలిగియుండాలి. అది ఎంతో ఎక్కువగా, ఆమె ఏమి చేయుటకు ప్రయత్నించుచున్నదో, అది ఆలాగునే కనబడింది.
కాని యోసేపు ఆమె యొక్క పెద్ద నేత్రములోనికి చూస్తున్నాడు, మరియు ఆమె చెపుతుంది, "యోసేపు, గబ్రియేలు నాతో చెప్పాడు, 'పరిశుద్ధాత్ముడు నిన్ను ఆవరిస్తాడు, మరియు నీవు గర్భము ధరించనైయున్నది పరిశుద్ధాత్మ వలన. అది దేవుడై యున్నాడు. దేవుడి కుమారుడుగా పిలవబడును.'"
యోసేపు దానిని నమ్మగోరియున్నాడు, కాని అది చాలా అసాధారణముగా యున్నది, అలాటిది ఎన్నడూ ఇంతకు మునుపు జరుగలేదు.
ISA 7:14•
MATT 1:20
20సరిగ్గా అది ఈ దినమున యున్నట్లుగా యున్నది. ఏదో ఒక విధమైన మార్గములో, అసాధారణమైన దానిని, ప్రజలకు నేను చూపించునట్లు చేయగలిగినట్లైతే, దేనిని గూర్చియైనా, అది వాక్యము ద్వారా గుర్తింపబడినట్లైతే, అప్పుడు అది ఏమైయున్నదో దానియొక్క గుణలక్షణములు దానిని రుజువు చేస్తాయి. అది పనిచేయుచున్న దేవుడైయున్నాడు. యోసేపు తప్పక దీనిని ఎరిగియున్నాడు. "ఒక కన్యక గర్భవతి అవుతుంది," అనే మాటను యోసేపు తప్పక ఎరిగియుంటాడు. అయితే అతడు దానిని గూర్చి యధార్ధముగా యున్నాడు. ఆమెను అవమానపరచనొల్లక, రహస్యముగా విడనాడాలనుకొన్నాడు, దానిని చేయుటను గూర్చి అతడు ఆలోచన చేయుచున్నాడు.
మరియు అప్పుడు ప్రభువు యొక్క దూత కలలో అతనికి ప్రత్యక్షమైనాడు. ఎందుకు ఆయన కలలో ప్రత్యక్షమయ్యాడో, మీరు ఎన్నడైనా ఆశ్చర్యపోయరా? ఆ దినములలో అక్కడ ఏ ప్రవక్తలు లేరు. వారి కల ఎంతో సామాన్యముగా వున్నది, దానికి ఏ అనువాదమును అవసరము లేదు. ఆయనన్నాడు, "దావీదు కుమారుడవైన యోసేపు, నీ భార్యయైన మరియను చేర్చుకొనుటకు భయపడవద్దు, ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మవలన కలిగినది." చూడండి, అప్పుడు అది పరిష్కరించబడింది. చూడండి, రెండవదిగా, ఆయన కలలో అతని యొద్దకు వచ్చాడు.
అయితే మీరు చూడండి, అదేమనగా, ఈ కన్యకయే గర్భము ధరిస్తుందని, గుర్తింపచేయుటకు, అక్కడ ఏ ప్రవక్తయు లేడు, చూడండి. కాబట్టి, అందుచేత, ఆయన అతనికి కలలో కనబడ్డాడు, ఎందుకనగా అతడు నీతిమంతుడు, యధార్థవంతుడు, ఒక మంచి మనిషి. ఆ మనిషి ఆ యుగము కొరకు పిలవబడియున్నట్లైతే, ఏ మంచి మనిషి యొద్దకైనా, ఏదో ఒక విధానములో దేవుడు అతని యొద్దకు వస్తాడని, ఆ యుగములో ఆయన కార్యములను ఆ మనిషితో గుర్తింపచేసుకొంటాడని నేను నమ్ముతాను.
ACTS 2:17
21ఇప్పుడు, అయితే అది అసాధారణముగా యున్నది, వారు కనీసము దానిని గ్రహించలేక పోయరు.
కాని ఎల్లప్పుడు ఆ యుగము కొరకు వాగ్దానము చేయబడిన వాక్యము ప్రత్యక్షమగుట, అదంతా ఎంతో అసాధారణముగా యుంటుంది. ఇప్పుడు, అక్కడ కొందరు ప్రజలు చుట్టూ వెళ్ళి, చెప్తారు "మంచిది, అది అసాధారణముగా వుంది, అది దేవుడైయున్నాడు, అని అంటారు. ఇది అసాధారణముగా యుంది." కాని మీరు చూడండి, అది వాక్యము ద్వారా గుర్తింపబడవలసియున్నది, మరియు వాక్యము దేవుడైయున్నాడు, చూడండి. అలాగైతే, ఈ గుర్తింపు యొక్క గుణలక్షణము, అది ఏమైయున్నదో దానిని గుర్తిస్తుంది, ఏలయనగా దేవుడు, "అది సంభవిస్తుంది చెప్పెను," మరియు అది సంభవిస్తుంది, చూడండి. ఏది సంభవిస్తూ ముందుకు వెళ్ళుచున్నదో, అది దాని యొక్క గుణలక్షణము ద్వారా, అది దేవుని యొక్క వాక్యమైయున్నదని, అది గుర్తించబడుతుంది.
అంత్యదినములలో, పరిశుద్ధాత్మను క్రుమ్మరిస్తానని ఆయన చెప్పియున్నాడు. ఆయన దానిని చేసాడు. అది దేవుడైయున్నాడని, దాని యొక్క గుణలక్షణములు దానిని గుర్తించినవి. చూడండి, అది ఎల్లప్పుడూ దానికి అది గుర్తించబడుతుంది. ఇప్పుడు, ఎల్లప్పుడూ, ప్రతిసారి అది తప్పు అని చెప్పినప్పుడు, వాక్యము తప్పును దిద్దుచున్నది. నీవు ఎన్నడైనా దానిని గమనించావా? అది నోవహు దినములలో, దేవుడు ఆకాశము నుండి వరమును తేబోవుచున్నాడని, ఆ శాస్త్రీయ యుగమును వాక్యము సరిదిద్దియున్నది. చూడండి, వారందరూ ఐగుప్తులో స్థిరపడినపుడు, అది మోషేయైయున్నాడు, అయితే దేవుని యొక్క వాక్యము గుర్తింపబడుటకు వచ్చియున్నది. మరియు వాక్యసత్యము తప్పును దిద్దుతుంది.
JOHN 1:1
22నన్ను మిమ్ములను ఒకటి అడగనివ్వండి. మనము ఇక్కడ కొంచెము లోతుగా వెళ్ళవచ్చు. సిద్ధాంతముపై నేను ఉపదేశమును తప్పక చేయకూడదు, కాని నన్ను ఒక్క విషయము మిమ్మును అడగనివ్వండి. యేసు వాక్యమైయున్నాడు. మనకు అది తెలుసు. ఆయన వాక్యమైయున్నాడు అని బైబిలు చెప్పింది.
పరిశుద్ధ యోహాను 1వ అధ్యాయము, "ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద యుండెను, వాక్యము దేవుడైయుండెను. వాక్యము శరీరధారియై మనమధ్య నివసించేను." ఆయన ఇంకనూ వాక్యమైయున్నాడు. అప్పుడు ఆయన తలంపులను వివేచించినపుడు, అది తప్పక వాక్యమైయున్నదని వారు గుర్తించవలసియున్నది, ఏలయనగా ఆయన దానిని చేస్తాడని దేవుని యొక్క వాక్యము చెప్పియున్నది. ఆయన ప్రవక్త అయి యుండెను.
LUKE 2:47
23ఇప్పుడు, గమనించండి. ఆయన జన్మించినపుడు — పన్నెండేళ్ళ వయస్సులో — ఆయన పర్ణశాలల పండుగకు వెళ్ళియున్నాడు. వారు పస్కా పండుగకు వెళ్ళియున్నారు. వారు తిరిగి వస్తూయుండగా, మార్గములో, మూడు దినముల ప్రయాణము తరువాత వారు ఆయనను తప్పిపోయారు, బహుశ ఆయన ప్రజల మధ్యలో యుంటాడని, గ్రహిస్తూ, ఆలోచిస్తున్నారు.
దానినుండి మనము ఒక పాఠమును తయారుచేయవచ్చు. అది ఈ రోజున ఎంతో ఎక్కువగా యున్నది. ఇప్పుడు, మెథడిస్టువారైన మీరు, బాప్టిస్టు, ప్రెస్బిటేరియన్, లూథరన్, కాథలిక్, మీరు ఎవరై యున్నప్పటికి, చూడండి, మీరును అదే కార్యమును చేస్తున్నారు. కొన్నిసార్లు ఆయన మన మధ్య లేనప్పుడు, వెస్లీ గొప్ప ఉజ్జీవమును కలిగి యున్నందువల్ల, లూథర్ గొప్ప ఉజ్జీవమును కలిగియున్నందువల్ల, లేక పెంతెకొస్తు గొప్ప ఉజ్జీవమును కలిగియున్నందువల్ల, ఆయన ప్రజల మధ్యలో యున్నాడని మనము గ్రహించుచున్నాము.
వారు ఆయనను వెతకటానికి వెళ్లారు. వారు ఆయనను ఎక్కడ కనుగొన్నారు? వారు ఆయనను ఎక్కడ వదిలిపెట్టారో అక్కడ, యెరూషలేములో.
వారు ఆయనను కనుగొన్నప్పుడు ఆయన ఏమి చేస్తున్నాడు? ఒక చిన్న పన్నెండేళ్ళ వయస్సున్న బాలుడు — బహుశ ఎన్నడూ ఏ పాఠశాలలో ప్రవేశించలేదు, ఆమె తల్లి నేర్పిన దాని కంటే ఎక్కువగా — మరియు ఆయన ఇక్కడ ఆలయములో యున్నాడు, దేవుని వాక్యమును గూర్చి యాజకులతో తర్కించుచున్నాడు. వారు ఈ బాలుని యొక్క జ్ఞానమును బట్టి, ఆశ్చర్యపడ్డారు. ఎందుకని? ఆయన వాక్యమైయున్నాడు.
ఇప్పుడు గమనించండి.
DEUT 18:15•
MATT 1:20•
LUKE 2:48,49•
JOHN 5:46•
JOHN 9:28
24ఇప్పుడు, మరియను దేవుని యొక్క తల్లియను పిలుచు, కాథలిక్ వారైన మీరు మిమ్మును గూర్చి అగౌరముగా మాట్లాడుట లేదు, కాని ఒక చిన్న పొరపాటును ఇక్కడ నన్ను మీకు చూపనివ్వండి. మరియపై సంఘము నిర్మించబడినట్లైతే, ఏమి సంభవించిందో గమనించండి. ఇప్పుడు ఆమె అక్కడకు వచ్చి ఇలా అన్నది, "ఓ, నీ తండ్రి మరియు నేను నిన్ను కన్నీళ్ళతో వెదికాము." ఆ ప్రకటనను గమనించండి, అప్పుడు ఆమె తన సొంత సాక్ష్యమును తప్పు అని ఖండించుచున్నది. ఆమె అన్నది, "నీ తండ్రి మరియు నేను కన్నీళ్ళతో నిన్ను వెదికాము."
ఆ వాక్యమును గమనించండి. ఆయన వాక్యమైయున్నాడు. ఆయనన్నాడు, "నేను నా తండ్రి పనుల మీద యుండవలెనని మీరు ఎరుగరా?" వాక్యము తప్పును దిద్దుటను గమనించండి.
నేరుగా, ఆ యాజకులముందే, ఆమె తన సాక్ష్యమును పాడు చేసింది. పరిశుద్దాత్మ ద్వారా గర్భవతియైనదని చెప్పింది; మళ్ళీ ఇక్కడ యోసేపును ఆయన యొక్క తండ్రియని చెపుతుంది, ఆ వాక్యము ఎంత త్వరగా దానిని పట్టుకుందో చూడండి? ఆయన వాక్యమై యున్నాడు. మీకు తెలుసా, ఇప్పుడు, పన్నెండేళ్ళ బాలుడు దానిని చేయగలడా, ఆయన వాక్యమైయున్నాడు. ఆయన ఆ దినమునకు పలుకబడిన మాటయైయున్నాడు, కాబట్టి, అందుచేత క్రీస్తులో దేవుని యొక్క గుర్తింపబడిన గుణలక్షణములున్నవి. ఆయన తప్పును సరిదిద్దియున్నాడు.
వారన్నారు, "ఏమిటి, మేము మోషే శిష్యులము."
ఆయనన్నాడు, "మీరు మోషే శిష్యులైయుంటే, నన్ను ఎరిగియుండేవారు. అతడు నన్ను గూర్చి వ్రాశాడు. మోషే అన్నాడు, 'ప్రభువైన యెహోవా నా వంటి ఒక ప్రవక్తను మీ మధ్య లేపును.' మీరు మోషేను ఎరిగియుంటే నన్నును ఎరిగేవారు." మరియు చూడండి, వాక్యము ఎల్లప్పుడు, ఆ దినము యొక్క తప్పును దిద్దుతుంది. కానీ ప్రజలు దానిని నమ్ముటకు ఇష్టపడలేదు. వారు అదే ప్రకారము వ్రేలాడుచూయుంటారు.
MATT 4:4,6,7,10•
LUKE 2:49•
LUKE 4:4,8,10
25అయితే యేసు ఆయన తల్లిని సరిదిద్దియున్నాడు. ఆయన తల్లి పొరపాటులో యున్నది, ఎందుకనగా ఆమె ఇదివరకే, ఆ బిడ్డను పరిశుద్దాత్మ ద్వారా గర్భము ధరించియున్నానని చెప్పియున్నది, మళ్ళీ ఇక్కడ, యోసేపు ఆయన తండ్రియని, యేసు యొక్క తండ్రియని ఆమె యొక్క సాక్ష్యమును త్రిప్పివేయుచున్నది.
ఇప్పుడు ఒకవేళ యోసేపు… ఒకవేళ యోసేపు కుమారుడైయుంటే, ఆయన తండ్రి పనిమీద, ఆ వడ్రంగిశాలలో ఆయన యుండి ఉండేవాడు. కాని ఆయన తండ్రి పనిమీద, ఆ సంస్థలను గద్దిస్తూ, ఆలయములో యున్నాడు. పన్నెండేళ్ళ బాలుడు, ఆయన తన తండ్రి పని మీద యున్నాడు. "నేను నా తండ్రి పనిమీద ఉండాలని మీకు తెలియదా?"
మీరు గమనించారా, యేసు సాతాను ద్వారా శోధించబడినప్పుడు, ఆయన గుణలక్షణములను అక్కడ చూడండి, ఆయన శోధించబడుచుండగా, ఆయన దేవుడిగా గుర్తింపబడ్డాడు, ఎందుకనగా ఆయన వాక్యముతో నిలిచియున్నాడు.
సాతాను, "అది ఈలాగు వ్రాయబడియున్నది," అన్నాడు.
"అది ఈలాగు కూడా వ్రాయబడియున్నదని," యేసు అన్నాడు. ఆయన వాక్యముతో నిలబడియున్నాడు.
DEUT 13:2•
AMOS 3:7•
HEB 1:1
26"దేవుడు, పూర్వకాలము, నానా సమయములలో, (మనము ఇక్కడ చదివాము), దేవుడు, నానా సమయములలో, (ఆ పూర్వకాలములలో), నానా విధములుగా, (అనేక విధములుగా), తన్నుతాను ప్రవక్తలను దర్శనముల ద్వారా, తన్నుతాను గుర్తింపచేసుకున్నాడు." అది ప్రవక్త యొక్క గుణలక్షణమైయున్నది, అదేమనగా ఆయన ముందుగా చెప్పిన సంగతులు సంభవించియున్నవి. ఇప్పుడు దేవుడు ఆయనతో యున్నాడని, అది ఆయన గుణలక్షణముల గుర్తింపైయున్నది. అలాగైతే ఆ దినము యొక్క వాక్యమును అనువాదము చేయుటకు, అది ఆయనకు హక్కులనిచ్చియున్నది, ఎందుకనగా దేవుని యొక్క వాక్యము ప్రవక్తల నొద్దకు వస్తుంది. అదే ఆయన ముందు చెప్పిన ప్రవక్త యొక్క గుణలక్షణము.
బైబిలు చెప్పియున్నది, "మీ మధ్య ఒకడు, అతడు ఏమి చెప్పాడో అది నేరవేరినట్లైతే, అప్పుడు మీరు అతని మాట వినండి. అది నెరవేరనియెడల, అతనిని నమ్మవద్దు, అతనికి భయపడదు… నా వాక్యము అతనిలో లేదు. కాని అతని మాట నేరవేరినట్లైతే, అప్పుడు నా మాట అతనిలో యున్నది. అదే అతని యొక్క గుర్తింపు. అదే ఒక ప్రవక్త యొక్క గుణలక్షణము.
ఇప్పుడు, పూర్వకాలములందు, ఆ విధముగా అని పిలవబడు ఒక మనిషి ద్వారా, దేవుడు ఒక మనిషికి తన్ను గూర్చిన గుణలక్షణముల యొక్క గుర్తింపును చూపించాడు. ఇప్పుడు బైబిలు దానిని చెప్పింది, పూర్వకాలమందు, నానా విధములుగా, ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు.
JOHN 10:37,38•
2COR 5:19•
2PET 1:21
27II పేతురులో కూడా మనము చదువుతాము, అదేమనగా దేవుని వాక్యమంతయూ సంపూర్ణముగా వారి ద్వారా వ్రాయబడింది. మనుషులు పరిశుద్దాత్మ ద్వారా ప్రేరేపించబడినవారై బైబిలును వ్రాసిరి. వారు ప్రవక్తలైయున్నారు. వాక్యము వారి యొద్దకు వచ్చియున్నది మరియు వారు దానిని వ్రాశారు, ప్రేరేపణ క్రింద వారు వాక్యమును వ్రాశారు. మొదటగా వారు గుర్తింపబడిన ప్రవక్తలు, అప్పుడు వారు వాక్యము యొక్క ప్రేరేపణను వ్రాశారు, మరియు దైవిక ప్రత్యక్ష యొక్క అనువాదమును వారు కలిగియున్నారు, ఎందుకనగా అది మనిషిలో దేవుడైయున్నాడు. ఆ విధానములోనే, తన గుణలక్షణము యొక్క గుర్తింపులో చూపించుకొన్నాడు, వారి దర్శనములు సత్యమని రుజువు చేయబడ్డాయి, అది వారిలోని దేవుని యొక్క గుణలక్షణముల, ద్వారా తన్నుతాను ప్రజలకు తెలియపర్చుకొనుచున్నాడు. ఇప్పుడు, ఆ విధానములోనే ఆయన క్రీస్తులో యున్నాడు. ఒక ప్రవక్త, ఒక చిన్న భాగమైయున్నాడు. క్రీస్తు దేవుని యొక్క పరిపూర్ణతయై యున్నాడు. మరియు దేవుడు క్రీస్తులో యుండి, లోకమును తనతో సమాధాన పరుచుకొనుచున్నాడు. ఆయన ఏమైయున్నాడో, ఆయన గుణలక్షణములు ఆయనను గుర్తించినవి, ఎంత మట్టుకనగా, ఆయనన్నాడు, "నేను నా తండ్రి క్రియలు చేయనియెడల నన్ను నమ్మవద్దు. నేను నా తండ్రి యొక్క గుణలక్షణమును కలిగియుండనట్లైతే, నన్ను, మరియు నా వాదనలను నమ్మవద్దు. నేను నా తండ్రి యొక్క గుణలక్షణమును నాలో కలిగియుండక పోయినట్లైతే, అప్పుడు నన్ను ఎంత మాత్రము నమ్మవద్దు."
28ఇప్పుడు, ఆయన గుణలక్షణములు ఎన్నడూ మారవు. ఒక గొర్రెపిల్ల ఏలాగు తన గుణలక్షణమును మార్చలేదో, లేక మరేదైనా దాని గుణలక్షణమును ఎలా మార్చలేదో, అలాగునే దేవుడును ఎంత మాత్రము తన గుణలక్షణమును మార్చలేడు. ఎందుకనగా అది అది దానియొక్క అసలైన స్థితిలో ఉన్నంతకాలము, అది దాని అసలైన స్థితి. నీవు దేనికైనా మార్చినట్లైతే, అప్పుడు నీవు దాని అసలైన రూపము నుండి దానిని మార్చియున్నావు.
నీవు సరిగ్గా ఒక పందిని తీసుకొన్నట్లుగానే, ఆ పందిని నీవు కడిగి, దాని బొటనవేళ్ళను రంగువేసి, స్త్రీలు చేసినట్లుగా, పెదవులపై రంగు వ్రాసి, దానికి ఒక మంచి వస్త్రమును తొడిగి సిద్దపర్చినట్లుగా, మరలా ఆ పందిని బయటకు వదలండి, మరలా అది బురదలోనికి వెళుతుంది. ఎందుచేత? ఆమె ఒక పందియైయున్నది, అంతవరకే. కాని నీకు తెలుసా, నీవు దానిని మార్చలేవని… ఒక గొర్రెపిల్ల దానిని చేయదు. అతడు కనీసము బురదలోనికి వెళ్ళడు. అతడు దానితో చేయునది ఏమియూ లేదు. అది దానియొక్క గుణలక్షణమైయున్నది, చూడండి. నీవు అతనికి అదే రకమైన బట్టలు వేసినను, ఇంకనూ అది నిశ్చయముగా దానిని చేయదు, కాని అతడు తప్పక దానిలోనికి వెళ్ళడు. బాహ్యమున ఉన్నది లెక్క కాదు; కాని అంతరంగము ముఖ్యమైయున్నది.
ఇప్పుడు, సమస్త జీవమునకు మూలము దేవుడైయుండి…
ISA 6:9•
HEB 1:1
29దీనిని గ్రహించుటలో తప్పిపోవద్దు. నాలో యున్న సమస్తముతో, మీరు దానిలో ఏదో చూడాలని, తెచ్చుటకు నేను ప్రయత్నము చేయుచున్నాను, చూడండి. ఏదో ఇక్కడ కనపడుటకు నేను వచ్చియుండలేదు. వెళ్ళుటకు ఏ ఇతర స్థలము నాకు లేదని, నేను ఇక్కడకు రాలేదు. నేను ఇక్కడకు వచ్చాను, ఎందుకనగా నేను ఇక్కడకు రావాలని నాకు తోచింది. ప్రభువు నాకు అనుగ్రహించిన పరిచర్యను, తప్పక ఇక్కడ ఉన్న ప్రజల మధ్య చూపాలని, నిజముగా దేవుడు ఏమైయున్నాడో, మీరు చూడాలని తెచ్చుటకు ప్రయత్నించుచున్నాను.
ఆయన ఆయన యొక్క వాగ్దానము చేసిన గుణలక్షణమల ద్వారా, ఆయన తన్నుతాను గుర్తింపచేసుకొంటాడు. వాక్యములోని, ఒక నిశ్చయమైన గుణలక్షణముల ద్వారా, ఆయన తన్నుతాను గుర్తింపచేసుకొంటాడు. వాక్యములోని, ఒక నిశ్చయమైన గుణలక్షణము, ఒక నిశ్చయమైన సమయములో లేవవలసియున్నట్లైతే, అప్పుడు తప్పక లేవవలసిన వ్యక్తి ఏ గుణలక్షణములో, యుండవలసియున్నదో, ఆ వ్యక్తి అతనేనని, అది గుర్తింపచేస్తుంది. ఆ కారణమును బట్టియే, ఆయన ఏమైయుండెనో, ఆ రీతిగానే యేసు యుండవలసియుండెను. వారు తప్పక దానిని చూసియుండవలసియున్నది.
ఆశ్చర్యము లేదు, వారు గ్రుడ్డివారుగా యుండిరి. అక్కడ చెప్పబడినదేమనగా… ఆయన ఎన్నో అద్భుతములు చేసినప్పటికీ, ఇంకనూ వారు ఆయనను నమ్మలేకపోయారు, ఎందుకనగా యెషయా చెప్పెను, "వారు కన్నులుండియూ చూడరు, చెవులుండియు వినరు." ప్రతి యుగము, ఆయన యుగము మాత్రమే కాదు; కాని ప్రతి యుగములో, "దేవుడు, నానా సమయములలో, నానా విధములగా…" ఇంకనూ అది వారికి అర్థము కాలేదు.
HEB 13:8
30ఇప్పుడు, ఆయన గుణలక్షణములు ఎన్నడూ తప్పిపోవు. అవి ఎల్లప్పుడు ఒకేరీతిగా యుంటాయి. ఇప్పుడు, గుర్తుంచుకోండి, ఆయన గుణలక్షణములు ఎన్నడూ తప్పిపోవు. ఒకవేళ అవి తప్పిపోతే, అప్పుడు దేవుడు తప్పిపోయినట్లు. బైబిలు చెప్పింది, హెబ్రీ 13:8లో, యేసుక్రీస్తు, నిన్న, నేడు, నిరంతరము ఒకే రీతిగా యున్నాడు. అందుచేత, ఆయన మార్పులేని దేవుడు. ప్రారంభములో ఆయన ఎలాంటి గుణలక్షణములను కలిగియున్నాడో, ఆయన ఇంకనూ అదే గుణలక్షణములను కలిగియున్నాడు. ఆయన పని చేసిన ప్రతిమార్గములో, ఎప్పుడైనా, ఎన్నడైనా ఆయన ఏమి చేసినా, ప్రతిసారి ఆయన ఒకే రీతిగా చేస్తాడు. ఆయన ఆలాగు చేయకపోయినట్లైతే, ఆయన గుణలక్షణము మారియున్నది, చూడండి. అప్పుడు అది దేవుడు కాని గుణలక్షణములను, అది ప్రదర్శిస్తుంది, చూడండి. కాబట్టి అప్పుడు మనము ఎక్కడ యుంటామో మనకు తెలియదు…
JOHN 1:1•
JOHN 4:25,26•
JOHN 6:31,48,49•
JOHN 10:18,37•
1COR 14:8
31పౌలు చెప్పినట్లుగా, "బూర స్పష్టముకాని ధ్వని ఇవ్వనట్లైతే, యుద్ధమునకు ఎవడు సిద్దపడగలడు?" బూర స్పష్టముకాని ధ్వని ఇవ్వకపోయినట్లైతే… ఇప్పుడు బూర, "వెనుకకు మరలు," అని శబ్దము చేసినట్లయితే, అదే మనము తప్పక చేయాలి: వెనుకకు మరలాలి. ఒక వేళ బూర, "దాడి చేయు" అని శబ్దము చేసినట్లైతే, అదే మనము తప్పక చేయవలసియున్నది, దాడి చేయువలెను. బూర అనగా ఏమిటి? అది దేవుని యొక్క వాక్యము. అదే దేవునిని గుర్తింపచేస్తుంది.
అది "పైకి వెళ్లుటయా, కుర్చొండుటయా, త్రిప్పుకొనుటయా, చేతులను వాటముగా పెట్టు," లేక అది ఏమైనప్పటికీ, అది దేవుని యొక్క బూర ధ్వని. ఒక స్పష్టముకాని ధ్వని… ఒక నిర్ణీత కార్యము సంభవిస్తుందని బైబిలు చెప్పినపుడు, ఎవరో అంటారు, "ఓ, అది మరొక దినమునకు చెందియున్నది, అది…" - అప్పుడు అక్కడ స్పష్టముకాని ధ్వని యున్నది. అప్పుడు ఏమి చేయాలో మీకు తెలియదు.
యేసు అన్నాడు, "నా ప్రాణమును పెట్టుటకు, మరలా దానిని తిరిగి లేపుటకు నేను శక్తిని కలిగియున్నాను." అక్కడ ఏ అస్పష్టమైన ధ్వని లేదు.
ఆ స్త్రీ అన్నది, "మెస్సీయా వస్తాడని మాకు తెలుసు. మరియు అయన వచ్చినపుడు, ఆయన చేసినట్లుగా ఈ విషయములను మాకు చెపుతాడు."
ఆయనన్నాడు, "నేనే ఆయనను." ఏ స్పష్టమైన ధ్వని లేదు. "నేను ఆయనను." ఆమేన్!
వారు అన్నారు, "మా పితరులు అరణ్యములో మన్నాను తిన్నారు."
ఆయనన్నాడు, "వారిలో ప్రతిఒక్కరూ చనిపోయారు." "పరలోకములోని దేవుని యొద్ద నుండి వచ్చిన జీవాహారమును నేనే." ఏ అస్పష్టమైన ధ్వని లేదు. "ఏదేను తోట నుండి, నేనే జీవవృక్షమునై యున్నాను." ఏ అస్పష్టమైన ధ్వని దానిని గూర్చి అక్కడలేదు. నిశ్చయముగా లేదు. దానిని గూర్చి ఏ అనిశ్చయత లేదు.
ఆయన చేసిన సమస్తములో ఆయన స్పష్టముగా యున్నాడు. బైబిలు అస్పష్టమైన ధ్వని ఇచ్చుట లేదు. అది ధ్వనించుటలో దేవుని యొక్క గుణలక్షణములను అది గుర్తించును. పరిశుద్ధ యోహాను 10:37లో యేసు చెప్పెను, "నేను నా తండ్రి యొక్క కార్యాములు చేయనియెడల, అప్పుడు నేను నా తండ్రి యొక్క గుణలక్షణము నాకు లేవు, అప్పుడు మీరు నన్ను నమ్మవద్దు. అవే నాలోని ఆయన గుణలక్షణములను గుర్తించుచున్నవి, ఆయన గుణలక్షణములు, ఎందుకనగా తండ్రి వాక్యమైయున్నాడు." ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్దనుండెను, వాక్యము దేవుడై యుండెను, మరియు దేవుని యొక్క గుణలక్షణములు, ఆయన వాగ్దానము ద్వారా, ఆ యుగమునకు ప్రదర్శించబడెను.
32ఇప్పుడు ఆయన మోషే కాలములో జీవించియుంటే, అది పనిచేసియుండేది కాదు. మోషే ఒకవేళ ఆయన కాలములో జీవించియుంటే, అది పనిచేసియుండేది కాదు. ఆయన నోవహు కాలములో జీవించియుంటే, అది పనిచేసియుండేది కాదు, లేక నోవహు ఆయన కాలములో జీవిస్తే - అది పనిచేసియుండేది కాదు. నోవహు ఆ దినము యొక్క కార్యములు కొరకు ప్రవచించుచుండెను. ఆయన గుణలక్షణములు, మరియు ఆయన చేసినది, దేవుని యొక్క వాక్యముతో ఆయనను గుర్తించినవి. మోషే అదే చేసియున్నాడు. ఇక్కడ యేసు వచ్చుచున్నాడు. మరియు ఆ యుగమునకు వాగ్దానము చేయబడిన వాక్యము, వాక్యము యొక్క గుణలక్షణములు, యేసుక్రీస్తును గుర్తించియున్నవి, అది దేవుడైయున్నాడు. ఆమేన్!
JOHN 14:12•
ACTS 2:17
33చివరి దినములలో, సామాన్య ప్రజలలో దేవుని ఆత్మ క్రుమ్మరింపబడుట, ప్రజలతో దేవుని యొక్క గుణలక్షణములను గుర్తించినవి. ఆయన దానిని వాగ్దానము చేశాడు. అది వాక్యమైయున్నది. అది దానిని చేస్తుందని ఆయన చెప్పెను. ఎవరును దానిని వెనుకకు తీసుకొనలేరు. ఆయన దానిని చేస్తానని చెప్పెను. కాబట్టి ఆయన వాగ్దానము చేసిన ఈ కార్యములన్నియు, అవే ఆయన చేసియున్నవి. అది ఆయన గుణలక్షణములను గుర్తించినది. అవునండి. "దానిని నమ్మవద్దు, నా గుణలక్షణము దేవునిది కానియెడల, నా వాదనలు నమ్మవద్దు."
ఇప్పుడు, యోహాను 14:12లో గమనించండి, "నా యందు విశ్వాసముంచువాడు," ఆయన చెప్పెను, "నా గుణలక్షణములను, నా గుర్తింపును కలిగియుంటాడు, నా యందు విశ్వాసముంచువాడు, నేను చేయు క్రియలు అతడును చేస్తాడు." క్రీస్తు యొక్క గుణలక్షణము ఆయనలో యున్నదని, ఆయన యొక్క గుణలక్షణములను ప్రదర్శించుచున్నది. ఆమేన్!
MARK 16:15,17•
JOHN 14:12•
HEB 1:1•
HEB 13:8
34ఇప్పుడే నేను ఎంతో భక్తిపూర్వకమైన అనుభూతిని పొందుచున్నాను, నా గొంతు బొంగురుపోయినట్లైతే. అవునండి. ఓ, మై!
చూడండి, దానిగూర్చి అక్కడ ఏ పొరపాటును లేదు. ఆయన జీవము… "నా యందు విశ్వాసముంచువాడు, నేను చేయు క్రియలు అతడును చేస్తాడు." చూడండి, అది గుణలక్షణములను గుర్తిస్తుంది. అదే విషయాన్ని ఆయన చెప్పెను, "నా గుణలక్షణములు నన్ను గుర్తింపనియెడల, [ఆయనలోని దేవుడు], అప్పుడు నన్ను నమ్మవద్దు." ఇప్పుడు, దానిలో ఆయన గుర్తింపబడతారని కూడా ఆయన చెప్పెను. అలాగైతే, అది ఆయనను గుర్తించనియెడల, ఆయన ఏమి చెప్పుచున్నాడో, అది ఆయన కాదు.
ఈ దినమున, క్రీస్తు తన్నుతాను గుర్తింపచేసుకోనట్లైతే — క్రీస్తు యొక్క గుణలక్షణము క్రీస్తు సంబంధి అని మనలను గుర్తిస్తుంది, వాక్యమును నమ్ముతూ… యేసు వాక్యమైయున్నాడు, కాబట్టి ఆయన వాక్యమును నమ్మవలసియున్నది. బైబిలులోని ఏ వాక్యమునైనా నిరాకరిస్తూ, మేము క్రీస్తువారమని ఎలా చెప్పగలము? నీలోని క్రీస్తు యొక్క పరిశుద్ధాత్మ దేవుడైయున్నాడు. మరియు అది ప్రతి వాగ్దానమును, "ఆమేన్," తో స్థిరపరచును.
బైబిలు చెప్పింది, "నమ్మినవారివలన ఈ సూచక క్రియలు వెంబడించును."
దేవుని యొక్క ఆత్మ "ఆమేన్," చెప్పింది. చూచారా.
[స్పష్టతలేని మాటలు] చెప్పెను, "కాదు, అది మరొక యుగానికై యున్నది. అది శిష్యుల కొరకు మాత్రమే."
"మీరు సర్వలోకమునకు వెళ్ళి, సర్వసృష్టికి సువార్తను ప్రకటించుడి. ప్రపంచములో ఎక్కడ నమ్మినను, ఈ సూచనలు అతనిని వెంబడిస్తాయి." అదే కార్యము - నిన్న, నేడు, నిరంతరము ఏకరీతిగా యున్నాడు, గుణలక్షణములు గుర్తింపబడినవి.
LEV 8:8
35హెబ్రీ 1:1 — "పూర్వకాలములయందు, ప్రవక్తల ద్వారా పితరులతో మాట్లాడిన దేవుడు," పూర్వకాలమందు ఆయన చేసినట్లుగానే, ఆయన చేసిన అదే గుణలక్షణముల ద్వారా, ఈ రోజున పునరుత్థానుడై, క్రీస్తును గుర్తింపచేస్తూయున్నాడు.
మీరు గమనించారా, దేవుడు ఎన్నడూ తన విధానములను మార్చడు. పూర్వము బైబిలు కాలములో, ఒక కలలుకనేవాడు, ఒక కలను కనినపుడు, మరియు ఆ కల సత్యమో కాదో, తెలుసుకొనుటకు ఆ దేశములో ఒక ప్రవక్త లేనపుడు, వారు దానిని కనుగొనుటకు మరొక మార్గమును కలిగియుండిరి. ఆ కలను కనిన వ్యక్తిని, ఆ గుణలక్షనమును ఆలయములోనికి తీసుకొని వెళ్ళేవారు. అదే ఆ కొయ్యకు వ్రేలాడ దీయబడి, ప్రధాన యజకుడైన అహరోను యొక్క న్యాయవిధాన పతకము. అప్పుడు కలను కనిన వ్యక్తి తన కలను దాని ముందు వివరిస్తాడు. అప్పుడు అది ఎంత చక్కగా వినపడినప్పటికి లెక్క కాదు, అది ఎంత నిజముగా కనబడినప్పటికి లెక్క కాదు, ఊరీము తుమ్మీముగా పిలవబడే, ఆ రాళ్ళలో సహజాతీతమైన వెలుగు ప్రకాశించనియెడల, బైబిలు పాఠకులకు తెలుసు; దేవుని యొక్క అసాధారణ, దేవునియొక్క గుణలక్షణము ఆ వర్తమానముతో ఆయన తన్నుతాను గుర్తింపచేసుకొన్నట్లుగా, సహజాతీతముగా ఆయన గుణలక్షణములు ప్రదర్శించబడవలసియున్నది.
ఈ రాత్రి దానినే నేను చెప్పుచున్నాను. ఆ పాత ఊరీము-తుమ్మీము గతించిపోయింది, కాని దేవుని యొక్క గుణలక్షణములను గుర్తింపచేయు వాక్యము ఇంకనూ అక్కడ యున్నది — అదే మనము జీవించుచున్న ఘడియ వాగ్దానము. మనము జీవించుచున్న వాగ్ధానము చేయబడిన ఘడియ ద్వారా దేవుని యొక్క గుణలక్షణము గుర్తించబడుచున్నది.
MARK 11:13•
LUKE 16:16•
HEB 1:1,2•
HEB 4:12•
HEB 13:8
36పూర్వకాలములలో ఉన్నవిధముగా ఆయన ఒకే రీతిగా యున్నాడని తెలియజేయుచున్నది.
చూడండి, నానా విధములుగా ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు. ధర్మ శాస్త్రము మరియు ప్రవక్తలు యోహాను కాలము వరకు ఉన్నారు; అప్పటి నుండి, పరలోక రాజ్యము. గమనించండి, అయితే చివరి దినములలో, ఆయన కుమారుడైన క్రీస్తు యేసు ద్వారా, (అప్పుడు చేసిన అవే కార్యములను గూర్చి మాట్లాడుచున్నాడు). పూర్వకాలము, నానా సమయములో, నానా విధములుగా మన పితరులతో ప్రవక్తల ద్వారా మాట్లాడిన దేవుడు; ఈ చివరి దినములలో (అదే కార్యమును చేయుచున్నాడు) ప్రజలతో (తండ్రులు) తన కుమారుడైన క్రీస్తు ద్వారా మాట్లాడుచున్నాడు. మృతులలో నుండి ఆయనను లేపియున్నాడు, మరియు మనలో ఆయన జీవించుచున్నాడు, ఆయన హృదయము యొక్క తలంపులను మరియు ఆలోచనలను వివేచించువాడై యున్నాడని, మనకు ముందుగా కార్యములను తెలియచేయుచూ, తన్నుతాను గుర్తింప చేసుకొన్నాడు. యేసుక్రీస్తు నిన్న, నేడు, నిరంతరము ఏకరీతిగా యున్నాడు.
"పూర్వకాలము నానా సమయములో, నానా విధములుగా, ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడెను; కాని ఈ చివరి దినములలో ఆయన కుమారుడైన క్రీస్తు యేసు ద్వారా మాట్లాడుచున్నాడు." లేఖనమును చెరపకూడదు. అది ఖచ్చితముగా…
37నేను ఇదివరకు చెప్పినట్లుగా, ఈ వాక్యమును అనువదించుటకు, దేవునికి ఏ అనువాదకుడు అవసరము లేదు. ఆయనతన సొంత వాక్యమును అనువదించును. ఆయన ఏదైనా చెప్పినపుడు, అది సంభవిస్తుంది, అదే దాని యొక్క అనువాదము, చూచారా. "మంచిది, దీని భావము అది అని నేను నమ్ముతాను…" అను ఏ ఒక్కరూ ఆయనకు అవసరము లేదు. దేవుడు తన సొంత అనువాదము ద్వారా దానిని గుర్తిస్తాడు.
ఆ దినమునకు అది ఆయన వాగ్దానమైనట్లేతే… లూథర్ యొక్క వెలుగులో మనము జీవించలేము, వెస్లీ యొక్క వెలుగులో మనము జీవించలేము, మనము తప్పక ఈ దినము కొరకు వాగ్దానము చేయబడిన వెలుగులో జీవించాలి.
EXOD 14:22•
MATT 28:20•
JOHN 14:12,19
38బహుశ మోషే ఐగుప్తు వెళ్ళి, "మంచిది, మనము ఒక పెద్ద ఓడను నిర్మించబోవుచున్నాము, అని ఉంటే. మనము ఈ దేశము నుండి తేలియాడుచూ బయటకు వస్తాము. నైలు నది పైకి రాబోవుచున్నది." వారు గ్రంథపు చుట్టలో వెనుకకు చూసి, అక్కడ అలాటి వాగ్దానము లేదు అనేవారు. అది సత్యము, కాని, మీరు చూడండి, అతడు తనకై తాను దేవుని యొక్క ప్రవక్తగా గుర్తింపబడ్డాడు, ఏలయనగా అతడు ఏమి చెప్పాడో అది నెరవేరింది, అప్పుడు అతడు ప్రభువు యొక్క వాక్యమును కలిగియున్నాడని వారు ఎరిగియుండిరి. ఫరో ఈటెలను కలిగియున్నాడు, కాని మోషే వాక్యమును కలిగియున్నాడు. కాబట్టి వారు సముద్రము నొద్దకు వెళ్ళినపుడు, ఈటెలు సముద్రము క్రిందికి వెళ్ళిపోయినవి; కాని మోషే, సముద్రము గుండా ఈ వైపు నుండి ఆ వైపు వరకు, ఆరిన నేల మీద ఇశ్రాయేలును తీసుకొని వెళ్ళాడు, ఎందుకనగా అతడు వాక్యమును కలిగియుండెను, మరియు అతడు ఆ ఘడియ యొక్క వాక్యమైయుండెను.
మోషే ఆ ఘడియకు ప్రత్యక్షపర్చబడిన వాక్యమైయున్నాడు. ఏలీయా ఆ ఘడియకు ప్రత్యక్షపర్చబడిన వాక్యమైయున్నాడు. క్రీస్తు, ఆయన చేసిన వాగ్దానములకు, ప్రత్యక్షపర్చబడిన వాక్యమైయున్నాడు. "కొంతకాలమైన తరువాత లోకము నన్ను మరి ఎన్నడునూ చూడదు, అయితే మీరు నన్ను చూతురు, నేను మీతోను, మీలోను యుగసమాప్తి వరకు యుంటాను. నేను చేయు క్రియలు మీరును చేస్తారు." ఆయన ఈ విషయములకు వాగ్దానము చేశాడు. అది ఏమిటి? ఆయన అన్ని యుగములలో చేసినట్లుగా, అది దేవుని యొక్క గుణలక్షణములు ఆయన వాక్యమును ప్రదర్శించుట.
MAL 4:5,6•
LUKE 17:28,30
39మలాకీ 4లో ఆయనన్నాడు, "యెహోవా నియమించిన భయంకరమైన మరియు ఆ మహాదినము రాక మునుపు, నేను ప్రవక్తయగు ఏలీయాను మీ యొద్దకు పంపుదును. ఆ దినము రాకముందు, అతడు పిల్లల విశ్వాసమును తండ్రుల తట్టును త్రిప్పును." ఆయన దానిని వాగ్దానము చేశాడు.
యేసు అన్నాడు, పరిశుద్ద లూకా 17వ అధ్యాయములో, "సొదొమ దినములలో జరిగియున్నట్లుగా, మనుష్యకుమారుని రాకడలోను, మనుష్యకుమారుడు బయలుపరచబడబోవు దినమున జరుగును." సొదొమ దినముల వలె లోకము యున్నప్పుడు, ప్రత్యక్షత దానికై అది విప్పబడుతుంది, అది ఏలాగు యుంటుంది? లేఖనము యొక్క గుణలక్షణము నెరవేర్చబడియున్నది — ఆయన గుణలక్షణము ద్వారా, దేవుడు తన్నుతాను గుర్తింపచేసుకొనుచున్నాడు — ఆయన ఎల్లప్పుడును కలిగియున్న గుణలక్షణములు. ఆయన దానిని విడిచి పెట్టలేడు.
40చివరి దినములలో, తన కుమారుని ద్వారా ఆయన గుర్తింపజేసుకొన్నాడు.
దేవుడు దీనిని ఎల్లప్పుడు ఎలా చేయుచున్నాడో గమనించండి, ఆయన ఎన్నడూ ఆయన మార్గమును మార్చడు. సొదొమ దినములలో, అక్కడ మనము మాట్లాడుతుండగా, ఈ ముగ్గురు మనుషులు అబ్రాహాముతో మాట్లాడియున్నారు. అబ్రాహాము, దేవుని యందు విశ్వాసముంచిన మనిషి దేవునిని ఆయన వాగ్దానము నొద్ద తీసుకొన్నాడు. అతని భార్యయైన శారాకు అరువది-ఐదు ఏళ్ళు. దేవుడు అతనిని పిలిచినపుడు, అబ్రాహాముకు డెబ్బది-ఐదు ఏళ్ళు. వారు ఒక బిడ్డను కలిగి యుండబోవుచున్నారని, ఆయన చెప్పెను. అబ్రాహాము శారా ద్వారా ఒక బిడ్డను కలిగియుంటాడు.
అది కొంచెం వింతగా ధ్వనించవచ్చు, కాని నేను ఊహిస్తాను, ఆమె చిన్న మెత్తని బూటులను మరియు పిన్నులను సమస్తము సిద్ధము చేసింది, ఎందుకనగా వారు బిడ్డను కలిగియుండబోవుచున్నారు. మొదటి ఇరవై-ఎనిమిది రోజుల తరువాత, ఎందుకనగా అబ్రాహాము శారాతో చెప్పి యుంటాడు, "ప్రియమైన దానా, నీకు ఎలాయున్నది?"
"ఏ భేదమును లేదు."
"దేవునికి మహిమ! ఎలాగైనా మనము దానిని పొందబోవుచున్నాము."
"నీకు ఎలా తెలుసు?"
"దేవుడు ఆ విధముగా చెప్పెను."
ఒక సంవత్సరము గడిచింది. "ప్రియమైనదానా, నీకు ఎలాయుంది?"
"ఏ భేదమును లేదు."
"ఎలాగైనా, మనము దానిని పొందబోవుచున్నాము, దేవుడు చెప్పెను."
అయిదు సంవత్సరములు గడిచాయి. "ప్రియమైన దానా, ఇప్పుడు నీకు ఎలాయుంది?"
"ఏ బేధమును లేదు."
"ఎలాగైనా, మనము దానిని పొందబోవుచున్నాము. దేవుడు చెప్పెను."
ROM 4:20,21
41అది ఏమైయున్నది? అతడు దేవుని యొక్క వాగ్దానమును కలిగియుండెను. అతడు దేవునిని నమ్మెను. అతడు దేవుని వలె ప్రవర్తించాడు. అతడు దేవుని వాగ్దానమును పట్టుకొనియున్నాడు. ఇరవై-అయిదు సంవత్సరములు గడిచాయి. ఆ మెత్తని బూట్లు పసుపు రంగుగా మారిపోయినవి, ఆమె ఇంకనూ వాటిని పట్టుకొనియున్నది. ఇప్పుడు అతడు వృద్దుడైయున్నాడు, వంగిపోయి యున్నాడు, మరియు అతడు భయంకరమైన స్థితిలో యున్నాడు, శారా యొక్క గర్భము మృతమైనది, అతడు నిస్సత్తువగా యున్నాడు. ఎలాటి స్థితిలో వారున్నారు!
"అబ్రాహామా, జనములకు తండ్రి, నీవు ఎలా యున్నావు?" అని అతని యొక్క వేషధారులైన స్నేహితులు అంటున్నారు.
"మంచిది, దేవునికి మహిమ! నేను చక్కగా యున్నాను. ఎలాగైనా మనము ఆ బిడ్డను కలిగియుండ బోవుచున్నాము." — ఏలయనగా అతడు అవిశ్వాసము ద్వారా దేవుని యొక్క వాగ్దానమును సందేహించలేదు, గాని బలముగలవాడై, దేవునికి స్తుతిని చెల్లించుచుండెను, ఏలయనగా అతడు దేవుడు ఏమి చెప్పాడో దేవుడు దానిని నేరవేర్చుటకు సమర్థుడని దానిని సంపూర్ణముగా నమ్మియున్నాడు. ఆమేన్! అక్కడే ఒక విశ్వాసి యొక్క గుణలక్షణమున్నది! నీ సంగతి ఏమిటి? అబ్రాహాము యొక్క పిల్లలమైన మన సంగతి ఏమిటి?
మనము దేవుని యొక్క వాక్యముతో, ఒక వాగ్దానముగా, మనము దానిని నిజముగా నమ్ముచున్నామని, మన గుణలక్షణములు, మనకై మనలను గుర్తించుచున్నవా? లేక నీవు కేవలమె తీవ్రత లేనివాడిగా ఇక్కడ నుండి అక్కడకు, అక్కడ నుండి ఇక్కడకు చుట్టూ దూకుచూ, దానిగూర్చి తీవ్రత లేనివాడిగా ఊహిస్తావా? అలాగైతే, మనము క్రైస్తవులము కాదు, మనము కేవలము నటించేవారము. కాని మనము నిజముగా వాగ్దానమునకు నిలబడినపుడు, తిన్నగా దానిని అక్కడకు లాగి, దానితో నిలబడియుంటాము… అబ్రాహాము దానిని చేసాడు.
42ఇప్పుడు, మనము కనుగొనేదేమంటే, ఒక రోజున ముగ్గురు మనుషులు నడుచుకొంటూ వస్తున్నారు. బైబిలు ఇక్కడ ఏమి చెప్పిందంటే, ఎండ వేళ. తప్పక మధ్యాహ్నమై యుంటుంది. ఈ మనుషులు అక్కడకు నడిచివచ్చి, అతనితో మాట్లాడుతున్నారు. వారిలో ఇద్దరు సొదొమాకు వెళ్ళారని మనము గ్రహిస్తాము. మొన్న రాత్రి దాని మీద మనము మాట్లాడమని నేను నమ్ముతాను. వారిలో ఒకరు అబ్రాహాముతో నిలిచియున్నాడు. అతనితో నిలిచియున్న, అతడు పిలిచినా ఈ మనిషిని… ఆ మనిషి ఏమి చేసాడో గమనించండి. ఒకరు, ఆయన "ఎలోహీం" అయి యున్నాడని, ఆయన గుణలక్షణముల ద్వారా గుర్తించబడ్డాడు. బైబిలులోని మొదటి మాట, "ఎలోహిం," "ఆదియందు దేవుడు…"
ఇప్పుడు, వేదాంత పండితులైన మీలో ఎవరికైనా, తెలుసు దేవుడనగా భావము హెబ్రీ భాషలో, "ఎలోహీం" అయి యున్నది; దాని భావము "సర్వశక్తిగల దేవుడు, సర్వసమృద్ధిగలవాడు, తనకై తానుగా యున్నవాడు," ఎవరి నుండి ఏ సహాయము ఆయనకు అవసరము లేదు, ఎవరి అనువాదము అవసరము లేదు. ఆయనే తన సొంత అనువాదకుడు. ఆయన సర్వసమృద్ధిగల దేవుడైయున్నాడు, సర్వాంతర్యామి, సర్వజ్ఞాని, సర్వశక్తిమంతుడు. ఆయన దేవుడైయున్నాడు.
GEN 18:9,10,12•
HEB 4:12
43అక్కడ ఆయన యుండెను. మరియు అబ్రాహాము, వాక్యమును పట్టుకొని యున్న ఈ పితరుడు ఈ తోటి వ్యక్తి వైపు చూశాడు. ఈ తోటి వ్యక్తి తన వీపును గుడారము వైపు త్రిప్పి, ఆయనన్నాడు, "నీ భార్యయైన శారా ఎక్కడున్నది?"
అతడన్నాడు, "ఆమె నీ వెనుక గుడారములో యున్నది."
ఆయనన్నాడు, "జీవము యొక్క కాలము ప్రకారము నేను నిన్ను దర్శించబోవుచున్నాను, మరియు నేను నీకు వాగ్దానము చేసిన కుమారుని నీవు పొందుతావు."
శారా ఆ మాట విని నవ్వింది. అతనితో మాట్లాడుతున్న ఆయన, ఆయన వెనుక గుడారములో, ఆమె ఏమి చెప్పిందో చెప్పియున్నాడు. ఇప్పుడు, ఆదికాండములో మీరు దానిని చదువుతారు.
అప్పుడు మనము కనుగొనునదేమనగా, ఈ మనిషి తన్నుతాను గుర్తింపచేసుకొన్న తరువాత.
తనకుతాను… అది ఏమిటి? హెబ్రీ 4:12వ వచనములో చెప్పబడింది, "దేవుని వాక్యము రెండంచులుగల యెటువంటి ఖడ్గముకంటెను వాడిగా యుండి, హృదయము యొక్క తలంపులను, ఆలోచనలను శోధించుచున్నది." అది ఈయనే అని అతడు ఎరిగియుండెను. అతడు తప్ప, ఆ దేశములో ప్రవక్తలు ఎవరూ లేరని అతడు ఎరిగియుండెను. అందుచేత ప్రభువు యొక్క వాక్యము అతని యొద్దకు వచ్చెను. అతడు ఒక ప్రవక్తయైయుండెను, మరియు ఇక్కడ ప్రవక్త యొద్దకు వాక్యము వస్తుంది.
MATT 3:14,15,17•
MARK 1:11•
LUKE 3:22
44బాప్తిస్మమిచ్చు యోహానుతో అదే విషయము. అక్కడ నాలుగు వందల సంవత్సరముల నుండి ఒక ప్రవక్త లేడు. నాకు గుర్తున్నది — బహుశ, విశ్వాసములో నాకు బాప్తిస్మమిచ్చిన, పాత మిషనరీ బాప్టిస్టు భోదకుడైన, వృద్దుడైన డాక్టర్ డేవిస్, ఈ రాత్రి ఇక్కడ కూర్చొండియుండవచ్చు. అతడు నాలో వాదించేవాడు. అతడన్నాడు, "బిల్లీ, ఇప్పుడు నీవు కేవలము ఒక చిన్న పిల్లవాడివి. నీవు తప్పక నా మాట వినాలి."
నేనన్నాను, "మంచిది, డేవిస్ సోదరుడా, నేను వింటున్నాను."
అతడన్నాడు, "నీవు చూడు, యోహాను బాప్తిస్మము పొందలేదు. కాబట్టి అతడు బాప్తిస్మమిస్తూయున్నాడు, కాని అతడు బాప్తిస్మము పొందలేదు. అతనికి బాప్తిస్మము మిచ్చుటకు యోగ్యుడైనవారెవరునూ లేరు." [అది మంచి బాప్టిస్టు వేదాంతము.] మరియు యేసు వచ్చెను."
యోహాను అన్నాడు, "నేను నీ చేత బాప్తిస్మము పొందవలసియున్నది. నీవు ఎందుకు నా యొద్దకు వస్తున్నావు?"
ఆయననన్నాడు, "అది ఆలాగున జరుగనిమ్ము."
అది "'ఆలాగున జరుగనిమ్ము' అని అతడు ఆయనతో అన్నప్పుడు, అప్పుడు "యేసు, యోహానుకు బాప్తిస్మ మిచ్చెను. ఆయన నీళ్ళలో నుండి బయటకు వచ్చినప్పుడు, ఆకాశము తెరవబడింది. మరియు దేవుని ఆత్మ పావురము వలె, ఆయన మీదికి వచ్చుట చూసెను. 'ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను" అని చెప్పెను.
కాని, లేదు. డాక్టర్ డేవిస్ తో అసమ్మతి ఉండుట కాదు, కాని అతను తప్పు.
MATT 3:14,15
45చూడండి, యోహాను ప్రవక్తయైయున్నాడు, మరియు వాక్యము ఎల్లప్పుడూ ప్రవక్త యొద్దకు వస్తుంది. కాబట్టి వాక్యము శరీరధారిగా మారినపుడు, ఎలాగైనా అది ప్రవక్త యొద్దకు రావాలి, ఏలయనగా అతడు వాక్యమును గూర్చి సాక్ష్యమిచ్చుచున్నాడు, మరియు అతని గుణలక్షణములే అతడిని గుర్తించినవి. ఇక్కడకు వాక్యము వస్తుంది.
ఇప్పుడు, ఏమి సంభవించింది? యేసు యొక్క సముఖమునకు అతడు నడిచిన వెంటనే, యోహాను అన్నాడు, "నేను నీ వలన బాప్తిస్మము పొందవలసియుండగా; నీవు ఎందుకు నా యొద్దకు వస్తున్నావు?"
యేసు అన్నాడు, "అలాగున కానిమ్ము; ఏలయనగా నీతి అంతయూ ఈలాగున నెరవేర్చుట మనకు తగియున్నది [మనలను యోగ్యులుగా ఉంచెను]," యోహాను ప్రవక్త అయి యుండెను, ఆయన వాక్యమైయున్నాడు — ఆయన బలి అర్పణమైయున్నాడు, మరియు హాజరు పర్చబడుటకు ముందు, బలియర్పణ కడుగబడవలసియున్నది. మరియు యోహాను ఆయనకు బాప్తిస్మము ఇచ్చాడు, ఏలయనగా అతడు ఎరిగియున్నాడు, "ఆలాగు నీతినంతయు నెరవేర్చుట, మనకు తగియున్నది." హాజరపర్చబడుటకు ముందు బలి అర్పణ కడగబడవలసియున్నది, కాబట్టి యోహాను ఆయనకు బాప్తిస్మమిచ్చియున్నాడు. యేసు యోహానుకు బాప్తిస్మమిచ్చుట కాదు; యోహాను యేసుకు బాప్తిస్మమిచ్చాడు. "దానిని ఆలాగున కానిమ్ము."
GEN 18:9•
LUKE 17:28,30
46గమనించండి, ఇక్కడ అబ్రాహామున్నాడు, మరియు అతడు ప్రభువు యొక్క వాక్యమును కలిగియున్నాడు. ప్రభువు యొక్క వాక్యము అతని యొద్దకు వచ్చింది. అతడు ప్రవక్త అయి యుండెను, మరియు అక్కడకు దేవుని వాక్యము వచ్చినది. ఆయన అతనిని, "అబ్రాహాము," అని పిలిచాడు, అబ్రాము కాదు. కొన్ని దినములకు ముందు, అతని పేరు అబ్రాము. ఇప్పుడు అది అబ్రాహాము. అతని భార్య పేరు, శారాయి, ఇప్పుడు అది "శారా." అబ్రాము కాదు, ఇప్పుడు అబ్రాహాము. "అబ్రాహాము!" అని ఆయన పిలిచినపుడు, ఈ మనిషి తన్నుతాను గుర్తింపచేసుకొన్నాడు. ఓ, మై!
"ఎలోహీం!" అని అబ్రాహాము అన్నాడు. అక్కడ ప్రవక్త మరియు వాక్యము, ఏకముగా యున్నారు, రెండు గుణలక్షణములు గుర్తింపబడినవి.
ఎలోహీం. ఆయనన్నాడు, "నీ భార్యయైన శార ఎక్కడ?"
"ఆమె నీ వెనుక గుడారములో యున్నది," అన్నాడు.
అప్పుడు ఒక అధ్బుతము జరిగించబడింది. ఎలోహీం. అబ్రాహాము ఆయనను, "సర్వసమృద్ధిగలవాడు, సర్వశక్తిమంతుడు, సర్వశక్తిగలవాడు," అని పిలిచాడు.
ఈ భూమి మీదయుండగా, యేసు అన్నాడు, ఎలోహిం చేసిన అదే కార్యమును ఆయన చేశాడు. ఆయన దేవుడైయున్నాడని, అది ఆయన యొక్క గుణలక్షణమును గుర్తించినది. ఆయనన్నాడు, దానికి ముందు, ఈ చివరి దినములలో, మనష్యకుమారుని రాకడ వద్ద, ఆయన ప్రత్యక్షపర్చబడునపుడు, ఇదే మాదిరి, సొదొమలో యున్నట్లుగా అస్తమించుట — ఆయన ప్రజలు మధ్యలో ఎలోహీం, సర్వశక్తిగల దేవుడు. దానినే లేఖనము చెపుతుంది — ప్రజల మధ్యలోని ఎలోహీం.
MATT 28:20•
JOHN 14:12,19
47నలభై సంవత్సరముల నుండి, మనకు పరిశుద్ధాత్మ బాప్తిస్మమును ఇచ్చుచున్నాడు — ఎలోహీం, దేవుడు మరియు సంఘము… చూడండి, అబ్రాహాము ఒక సూచన చూశాడు, మరొక పిలుపు, ఒక సూచన, ఒక పిలుపు, ఒక పిలుపు, ఒక పిలుపు, ఒక సూచన — ఆ వాగ్దాన కుమారుని కొరకు ఎదురు ఎదురుచూస్తున్నాడు. అయితే అతడు చూచిన చివరి సూచన, వాగ్ధాన కుమారుడు రంగము మీదికి రాకముందు దేవుడు చివరగా దర్శించుట, ఎలోహీం మానవ శరీరముగా యున్నాడు. అప్పుడు వాగ్దాన కుమారుడు వచ్చాడు.
అబ్రాహాము యొక్క సంతానము, వాగ్దాన కుమారుడైన యేసుక్రీస్తు కొరకు ఎదురు చూస్తున్నది. వారు సూచనలను చూసియున్నారు, పరిశుద్దాత్మ కుమ్మరించబడుట, భాషలతో మాట్లాడుట, దైవిక స్వస్థత, మొదలగునవి. కాని మనుష్యకుమారుడు బయలుపర్చబడినపుడు, ఎలోహీం, అబ్రాహాము యొక్క రాజ సంతానముకు తిరిగి వస్తాడు, మరియు ఆ దినమున చూపిన అదే కార్యమును చూపుతాడు, ఆమేన్! ఎలోహీం. అది అప్పుడు జరిగినట్లుగా… ఎందుచేత? అది దేవుని యొక్క గుణలక్షణమైయున్నది. ఇప్పుడు, క్రీస్తు దేవుడై యున్నట్లైతే… "కొంత కాలమైన తరువాత లోకము నన్ను మరి ఎన్నడునూ చూడదు, అయితే మీరు నన్ను చూతురు, ఏలయనగా నేను మీలోను, మీతోను యుగసమాప్తి పర్యంతము ఉంటాను. నేను చేయు క్రియలు మీరు చేస్తారు."
HEB 1:1,2•
HEB 13:8
48అది లూకా 17వ అధ్యాయములో యేసు చెప్పెను. మంచిది.
ఇవి చివరి దినములని నమ్ముతూ, మనము చూస్తున్నప్పుడు, ఈ అస్తమించుటను మరలా మనము చూస్తాము. అందుచేత, హెబ్రీ 1:1 "పూర్వకాలము నానా సమయములలో నానా విధములుగా మాట్లాడిన దేవుడు, ఈ చివరి దినములలో, మృతుల నుండి తన కుమారుని పునరుత్థానమును గుర్తింపచేయుచున్నాడు," ఆయన కలిగియున్న అదే గుణలక్షణమును సంఘమునకు ఇచ్చుట ద్వారా, హెబ్రీ 13:8ను ఖచ్చితముగా సత్యముగా చేయుచున్నాడు.
దానిలో నుండి ఏ ఈకెలు బయటకు లాగలేవు. అవి పక్షిరాజు యొక్క ఈకెలు: అవి గట్టిగా నిలిచి యుంటాయి, ఎందుకనగా అది పరలోకపు పక్షి అయి యున్నది. పక్షిరాజు ఆహారముతో ఆయన వాటిని పోషిస్తాడు.
MATT 12:39,40•
MATT 16:4•
LUKE 11:29•
HEB 1:1,2•
HEB 13:8
49ఇప్పుడు మనము దానిని గమనిస్తాము, "పూర్వకాలము నానా సమయములలో, నానా విధములుగా, ఆయనను మృతులలో నుండి లేపుట ద్వారా, మన పితరులతో మాట్లాడిన దేవుడు, ఈ చివరి దినములలో ఆయన కుమారుని ద్వారా మాట్లాడుచున్నాడు." ఇక్కడ రెండువేల సంవత్సరముల తరువాత, అదే యేసు — ప్రవక్తలలో ఒకడు కాదు — మన మధ్య ఆయన యున్నాడు. యేసు, (హల్లెలూయ!), పునరుత్థానుడైన దేవుని యొక్క కుమారుడు.
ఒక దినమున యేసు అన్నాడు, "వ్యభిచారులైన చెడ్డ తరమువారు ఒక సూచన కొరకు వెతుకుచున్నారు, మరియు వారు ఒక సూచనను పొందుతారు." వ్యభిచారులైన చెడ్డ తరమువారు. ఇప్పుడు ఉన్నదానికంటే ఎప్పుడు లోకము మరియు ఎక్కువ వ్యభిచారము, దుర్మార్గముతో యున్నది? "యోనా దినములలో జరిగినట్లుగా… యోనా మూడు రాత్రింబవళ్ళు తిమింగలము కడుపులో యున్నట్లుగా, మనుష్యకుమారుడను ఆలాగునే తప్పక, భూగర్భములో మూడు రాత్రింబవళ్ళు ఉండవలసియున్నది." అలాగైతే, "ఒక వ్యభిచారులైన చెడ్డ తరము," ఒక సూచనను పొందవలసియున్నది. ఏ రకమైన సూచన? ఒక పునరుత్థానము యొక్క సూచన.
ఈ దినమున మనము కలిగియున్నాము. మరియు రెండువేల సంవత్సరముల తరువాత, ఆయన ఇంకనూ సజీవుడైయున్నాడు. ఆయన మన మధ్య ఈ రాత్రి యున్నాడు. దేవుని యొక్క గుణలక్షణముల ద్వారా, తన్నుతాను గుర్తింపచేసుకొనుచున్నాడు, ఆయన చేస్తాడని వాగ్దానము చేసిన ఈ దినమున, వాక్యమును ప్రత్యక్షపర్చుకొన్నాడు. ఆమేన్. అక్కడ వాక్యమున్నది; ఇప్పుడు, మీరందరూ సూచనను నమ్ముతారు, తరువాత విషయమేమనగా, చివరి దినములలో, ఆయన యొక్క కుమారుని ద్వారా, ఆయన గుర్తింపుబడుట…
గమనించండి.
DEUT 18:15
50పూర్వకాలము దేవుడు, మోషేతో మాట్లాడెను. ద్వితియోపదేశాకాండము 18:15లో చెప్పెను, "ప్రభువైన యెహోవా నా వంటి ఒక ప్రవక్తను మీ మధ్య లేపును." ఇప్పుడు గమనిచండి. అది వాక్యమైయున్నది. అది వాక్యమైయున్నది. అది దేవుడై యున్నాడు; అది మోషే కాదు. మోషే దానిని ఎలా తెలుసుకొనగలడు? అతడు ఒక మనిషి. కాని దేవుడు, మోషే ద్వారా మాట్లాడుతూ దీనిని చెప్పెను. నీవు దానిని నమ్ముతావా? మంచిది. ఇప్పుడు యేసును గమనించండి. ఎలా ఆయన గుణలక్షణములు వాక్యము సత్యమని గుర్తించియున్నవో గమనించండి. ఆయన నిశ్చయముగా గుర్తించబడ్డాడు. ఆయన ఎలా యుంటాడని మోషే చెప్పెనో, ఆయన ఈ గుణలక్షణముల ద్వారా గుర్తించబడ్డాడు.
వారిలో అనేకులు… ఈ దినము వలె, ఒక గొప్ప నాయకుని వారు చూడాలనుకొంటారు, "ఓ, ఈయన డాక్టర్ పిహెచ్. ఫలానా-ఫలానా అంటారు. ఆయన హార్వార్డు విశ్వ విద్యాలయము నుండి వచ్చిన వ్యక్తి, లేక, అతడు ఏదో ఒక గొప్ప స్థలము నుండి వచ్చిన వ్యక్తియని అంటారు." అది దేవుని యొక్క గుర్తింపు కాదు. లేదు, లేదు. దానిని గూర్చి ఒక్క సంగతి లేదు.
దేవునిని గుర్తించేది వాక్యమైయున్నది. యేసు ఒక వేదాంత పండితుడు, లేక ఒక యాజకుడు కాదు. లోకమునకు ఒక రబ్బీ కాదు. ఆయన లోకమునకు ఒక ద్రోహిగా యున్నాడు. కాని దేవుడు ఆయన ద్వారా, తన వాక్యమును రుజువు చేయుచున్నాడు, అది ఆయనను ఇమ్మానుయేలుగా చేసింది. అదే ఆయన యొక్క గుర్తింపైయున్నది. ఇప్పుడు, ఇక్కడ, దేవుడు ఏమి చేస్తానని మోషే ద్వారా, పూర్వకాలము చెప్పియున్నాడో. దానినే ఆయన చేస్తున్నాడు.
DEUT 18:15•
JOHN 1:42,48,49
51ఇప్పుడు ఆయన పేతురును కలుసుకొన్నప్పుడు గమనించండి, మొన్నటి దినమున మనము చిత్రీకరించినట్లుగా, ఆయన పేతురును కలుసుకొన్నప్పుడు, అతడు ఏమైయున్నాడో ఆయన చెప్పెను. ఈ సూచన పేతురుకు, ఆయన మేస్సీయా వాదనను గుర్తించినది, ఏలయనగా వాక్యము చెప్పింది, "ప్రభువైన యెహోవా ఒక ప్రవక్తను లేపును." ఆయన ఎక్కడ యున్నాడో, అక్కడికి పేతురు వచ్చాడు, అప్పుడు అతడు సీమోను అయి యున్నాడు. యేస్తు అతని వైపు చూసి అన్నాడు, "నీ పేరు నీమోను, నీవు యోనా కుమారుడవు." అది క్రీస్తు యొక్క గుణలక్షణము, మోషే చెప్పిన వాగ్దాన వాక్యముగా యుంటాడని, అది గుర్తించినది. యేసును మెస్సీయాగా ఆ సూచన గుర్తించియున్నదని పేతురు గుర్తుపట్టాడు. "దేవుడు క్రీస్తులో యున్నాడు," చివరి దినముల యొక్క అభిషేకము.
నతనయేలుకు కూడా… గుర్తుంచుకోండి, సీమోను పేరును ఆయన చెప్పియున్నాడు. ఇప్పుడు, నతనయేలును గమనించండి, అతడు ఏమి చేసాడో ఆయన చెప్పియున్నాడు. "నేను చూసినపుడు నీవు ఒక చెట్టు క్రిందయున్నావు." అది మెస్సీయాను గుర్తించింది.
అతడన్నాడు, "నీవు దేవుని కుమారుడవు. నీవు ఇశ్రాయేలుకు రాజువు." ఆయన మెస్సీయా అయి యున్నాడని, వాగ్దాన వాక్యము యొక్క గుణలక్షణముల ద్వారా గుర్తించబడ్డాడు. "ప్రభువైన యెహోవా ఒక ప్రవక్తను మీ మధ్య లేపును."
ఆ బావి దగ్గర యున్న చిన్న స్త్రీ: ఆమె ఏమైయున్నదో ఆయన చెప్పెను, మరియు అది వాగ్దానము చేయబడిన మెస్సీయాగా అది గుర్తించింది. చూడండి, ఆయన గుణలక్షణము, ఆయన గుణలక్షణము… వాక్యము గుర్తింపబడింది. వాక్యము దేవుడైయున్నాడని, ఆయన గుణలక్షణములు చూపుచున్నవి. కాబట్టి అది దేవుడు క్రీస్తులో గుర్తించబడుట అయి యున్నది.
దానిని గమనించండి. కనిపెట్టండి. పేతురుకు — అతని పేరును పిలుచుట ద్వారా, పేతురుకు ఆయన గుర్తింపబడ్డాడు. అతడు ఏమి చేశాడో చెప్పుట ద్వారా, ఆయన నతనయేలుకు గుర్తించబడ్డాడు. ఆమె ఏమైయున్నదో చెప్పుట ద్వారా, ఆ స్త్రీ ద్వారా ఆయన గుర్తించబడ్డాడు. ఆయన ఎవరో, ఆయన ఏమైయున్నాడో, ఆయన ఏమి చేశాడో, మరియు ఆమె ఏమైయున్నదో: అదే మెస్సీయా యొక్క గుణలక్షణమైయున్నదని. ఆయన తన మెస్సీయా గుణలక్షణములను గుర్తింపచేసుకొన్నాడు.
MATT 9:21•
MARK 5:28,30•
LUKE 8:44•
JOHN 4:19,25,26
52ఆ చిన్న స్త్రీ వైపు చూడండి, ఆమె దానినే చెపుతుంది. "అయ్యా, నీవు ఒక ప్రవక్తవని గ్రహించుచున్నాను. ఎన్నో వందల సంవత్సరముల నుండి మాకు ప్రవక్త లేడు. మేము ఎన్నో సంఘములను కలిగియున్నాము, ఎన్నో వివాదములు, సంఖ శాఖల భేదములన్నవి, కాని ఎన్నో వందల సంవత్సరముల నుండి మాకు ఒక ప్రవక్త లేడు. మెస్సీయా వచ్చినపుడు, ఇదే ఆయనను గుర్తిస్తుందని, మాకు తెలుసు."
ఆయనన్నాడు, "నీతో మాట్లాడుతున్న నేనే ఆయనను." దానిని గూర్చి అస్పష్టమైనదేదియూ లేదు. "నేనే ఆయనను." అది ఆయనను గుర్తించింది.
రక్త స్రావముగల స్త్రీ, ఆయనను వాక్యముగా గుర్తించింది. ఎలా? ఆమె విశ్వాసము ఆయనను ముట్టినపుడు, ఆయన ఏమి చేశాడో దాని ద్వారా, ఆయన చుట్టూ తిరిగి, "నన్ను ఎవరు ముట్టారు?" అన్నాడు, ఏదో సంభవించిందని ఆయన ఎరిగెను. అది యేసును మెస్సీయాగా గుర్తించింది.
ఆమె దానిని నమ్మింది, మరియు ఆమె అన్నది, "నేను ఆయన వస్తపు చెంగును మాత్రము ముట్టినయెడల, నేను స్వస్థపడతాను." ఆమె ఆయనను ముట్టిన వెంటనే. ఆయన వెనుకకు తిరిగి.
ఆయన అన్నాడు, "నన్ను ఎవరు ముట్టినది?" వారందరూ దానిని నిరాకరించారు. కానీ ఆయన యొక్క మెస్సీయా గుణలక్షణము…
MATT 9:22•
MARK 5:31,34•
LUKE 8:45-48•
HEB 4:12•
HEB 13:8
53ఆమేన్! సంఘమా, మీరు దానిని చూస్తారని నేను నమ్ముతాను.
వినండి, మనము ముగించుచుండగా. ఆమె ఆయనను అక్కడ తాకినది. అక్కడ వందల మంది ఆయనను ముట్టుటకు ప్రయత్నము చేస్తున్నారు. పేతురు సహితము ఆయనను గద్దించి, "మంచిది, అందరూ నిన్ను ముట్టుచున్నారు."
ఆయనన్నాడు, "అవును, ఎవరో నన్ను ప్రత్యేకముగా ముట్టిరి. అదే భేదము, ఆ విశ్వాసపు తాకుడు, చూచారా. ఆయనన్నాడు, "ఎవరో నన్ను ముట్టారు. అది ఒక భిన్నమైన తాకుడు. నేను బలహీనమయ్యాను. నా నుండి బలము వెళ్ళిపోయింది; ప్రభావము నాలో నుండి వెళ్ళిపోయింది."
ఇప్పుడు, ఆయన అక్కడ నిలబడ్డాడు. ఇప్పుడు, మరొక మాటలో, ఆయన సొంత శిష్యులు సహితము అంటున్నారు, "నీవు ఒక విధమైన అభ్యంతరకరమైన వ్యక్తిగా యున్నావు. ఎందుకనగా, ప్రజలందరూ నిన్ను తాకుచున్నారు."
ఆయన గుణలక్షణములను గమనించండి. ఆయన చుట్టూ తిరిగి జనసమూహము గుండా చూశాడు. ఆయన తిన్నగా బయట ఆమెను గుర్తించాడు. ఇంకా ఎంతమాత్రము ఆమె తన్నుతాను దాచుకొనలేకపోయింది. ఆమె స్థితిని గూర్చి ఆయన ఆమెతో చెప్పి, ఇలా అన్నాడు, "ఆమె విశ్వాసము ఆమెను స్వస్థపరిచింది." దీనిని బట్టి ఆమె ఎరిగియున్నది. అది హెబ్రీ 4:12, "వాక్యము హృదయము యొక్క తలంపులను, ఆలోచలను వివేచిస్తుంది." ఆయన గుణలక్షణములు వాక్యముగా యుంటుందని గుర్తించబడింది, "దేవుని వాక్యము శరీరధారియై మనమధ్య నివసించాడు." ఆమేన్!
నిన్న, నేడు, నిరంతరము ఏకరీతిగా యున్న పునరుత్థానుడైన యేసు, ఈ రాత్రి మనమధ్య జీవించుచున్నాడని, అదే ఈ రాత్రి ఆయనను గుర్తించుచున్నదని నేను తలస్తాను. ఇప్పుడు హెబ్రీ 13:8 సత్యమైయున్నది, అప్పుడు చేసినట్లుగా, అదే విధానములో, ఆయన గుణలక్షణము ఆయనను గుర్తిస్తుంది.
HEB 1:1,2•
HEB 4:14,15•
HEB 13:8
54పునరుత్థానము తరువాత క్లియోపా, మరియు వారివైపు చూడండి. అయితే సిలువ వేయబడుటకు ముందు సరిగ్గా చేసియున్నట్లుగానే, రొట్టెను విరుచుట ద్వారా ఆయన తన్నుతాను గుర్తింప చేసుకున్నాడు. అది ఆయన గుణలక్షణమును గుర్తించియున్నది, ఏలయనగా ఆ మార్గములోనే ఆయన దానిని చేశాడు.
ఇప్పుడు, ఈ రాత్రికి ఆయన ఇక్కడ యున్నటైతే, ఎలా ఆయన తన్నుతాను గుర్తింపచేసుకొంటాడు? సరిగ్గా ఆయన నిన్న చేసియున్నట్లుగానే, ఏలయనగా ఆయన నిన్న, నేడు, మరియు నిరంతరము ఏకరీతిగాయున్నాడు. అదే గుర్తింపైయున్నది.
హెబ్రీ 4:14 మరియు 15వ వచనములు: "ఆయన ఇప్పుడు…" "ఆయన మన ప్రధానయాజకుడై యున్నాడని చెపుతుంది, మరియు మన బలహీనతలో మనము ఆయనను తాకవచ్చును." ఇప్పుడు తిన్నగా ఆయన మన ప్రధానయాజకుడైయున్నాడు. ఆయన మరణము, ఆయన సమాధి, ఆయన పునరుత్థానము, మరియు ఆయన ఆరోహణము తరువాత (ఆమేన్), ఆయన ఇంకనూ నిన్న, నేడు, నిరంతరము ఏకరీతిగా యున్నాడు — మన బలహీనతల ద్వారా మనము ఆయనను తాకవచ్చును. ఆమేన్! దానిని నమ్ము ప్రతి పురుషునికి మరియు ప్రతి స్త్రీకి, తిన్నగా, ఆయన అదే అయి యున్నాడు. ఆయన నిన్న, నేడు, నిరంతరం ఏకరీతిగా యున్న, మన ప్రధానయజకుడై యున్నాడు.
ఆయన సదాకాలము జీవించును. నీవు దానిని నమ్ముతావా? ఆయన భూమిమీద జీవించినప్పుడు యున్నట్లుగానే, ఆయన గుణలక్షణములు ఎడతెగకుండా గుర్తించబడతాయి, పరిశుద్ధాత్మ యొక్క రూపములో, ఈ రాత్రి ఆయన ఇంకనూ జీవించుచున్నాడు. ఆయన సదాకాలము జీవించును. ఆయన ఇంకనూ జీవుస్తున్నట్లైతే, సరిగ్గా ఎల్లప్పుడూ అది చేసినట్లుగానే, ఆయన గుణలక్షణము ఆయనను వెంబడించును. ఈ రాత్రి నేను ఎంతో కృతజ్ఞుడను, అదేమనగా, "పూర్వకాలము నానా సమయములలో నానా విధములుగా, మన పితరులతో ప్రవక్తల ద్వారా మాట్లాడిన దేవుడు, ఈ చివరి దినములలో, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా మాట్లాడుచున్నాడు."
HEB 13:8
55మై, నేను ఇంత దీర్ఘముగా మాట్లాడానని నాకు తెలియదు. దానిని గూర్చి నేను మర్చిపోయాను. నన్ను మన్నించండి. నేను ముగిస్తాను. మనము ప్రార్థన చేసుకొందాము.
పరలోకపు తండ్రీ, గొప్ప దయగల దేవా, ప్రభువా, నేను బహుశ ఎక్కువ మాట్లాడవచ్చు. దేవా, నేను ఎక్కువ మాట్లాడినట్లైతే, నన్ను క్షమించమని ప్రార్థిస్తాను. కానీ, ప్రభువా, నేను ఏమి చెప్పావో దానిని బట్టి నేను క్షమాపణ అడగలేను. నీ వాక్యములో సరిగ్గా నీవు ఏమి చెప్పావో, నేను దానినే చెప్పాను. ప్రభువా, నీ నుండి సరిగ్గా వచ్చే ఒకటి లేక రెండు మాటలు, బహుశ ప్రతి ఒక్కరూ దానిని ఇక్కడ చూచుదురు గాక. నీవు ఇంకనూ మా యొక్క గొప్ప ప్రధానయాజకుడవై యున్నావని చూసినపుడు, ఈ వ్యాధిగ్రస్తులు స్వస్థపడుదురు గాక. తరువాత ఈ కొద్ది నిమిషములలో, ఈ వర్తమానము తిరిగి జీవింపచేయుము. నీవు నిన్న, నేడు, నిరంతరము ఏకరీతిగా యున్నావని, నేను వాక్యము ద్వారా ఏమి చెప్పానో, ఈ రాత్రి నీ గుణలక్షణములు మా మధ్య గుర్తింపబడనిమ్ము. యేసు నామములో దానిని మేము అడుగుచున్నాము. ఆమేన్.
56ఇప్పుడు ఒక్కక్షణము. నాకు కొంచెము ఆలస్యమైనది. అయితే ఇంకా కొంచెము, ఒక చిన్న ప్రార్థనా వరుస కొరకు, పదిహేను లేక ఇరవై నిముషాలు పాటు మీరందరూ సహించగలరా? మీరు కోరినట్లయితే, మీ చేతులను ఎత్తండి, "మనము…" మంచిది, మీకు వందనములు. తొమ్మిదిన్నర గంటలకు మిమ్మును బయటకు విడిచిపెడతానని, నేను వాగ్దానము చేశాను. ఇప్పుడు అది సమయమైయున్నది. ఇప్పుడు దాని వరకు ఇంకా ఇరవై నిమిషాలు వున్నది, తిన్నగా నేను త్వరపడతాను.
మనము చూద్దాము. ఏ ప్రార్ధనా కార్డులు ఈ రోజు వారు బయటకు ఇచ్చారు? O? గతరాత్రి మనము ఏ సంఖ్య దగ్గర ప్రారంభించాము, ఒకటి, ఒకటా?అవును.
57అప్పుడు మేము.. తరువాత రాత్రి… పరిశుద్ధాత్ముడు…
నిన్న ఏమి చెప్పబడిందో నేను తిరిగి దానిని వింటున్నాను. వారిలో కొందరు ఫ్రెంచి పేర్లను కలిగియున్నారు. నేను చేయగలిగితే ఒక మార్గము, అది పరిశుద్ధాత్ముడు, కొంచెం కనిపెట్టి చూడండి. చూడండి, కొన్నిసార్లు నీవు దర్శనమును చూసినపుడు, అది మళ్ళీ చుట్టూ తిప్పబడి తప్పక అనువదించబడాలి, అనువదించబడియున్నది, ఒక దర్శనము. మీరు ఒక గొర్రెను చూసినట్లుగా, దాని భావము గొర్రె బొచ్చు కావచ్చును. చూడండి, నీవు దాని యొక్క అనువాదమును కూడా కలిగియుండవలసి యున్నావు, చూడండి, ఆ దర్శనమును చుట్టూ తిప్పి మరియు దానిని అనువాదము చేయాలి. గతరాత్రి నేను గమనించాను, నేను ఆ ఫ్రెంచి పేర్లను అనువదించవలెను. నేను వాటిని అక్షరముల ఉచ్చరించవలసియున్నది.
ఆఫ్రికా దేశములో యున్న ఆదిమవాసులు మరియు అన్యులు, మరియు వారి సంగతులు, తిన్నగా పేర్లను బయటకు ఉచ్చరించవలసియున్నది, వారు ఎవరో వారికి చెప్పండి, వారి భాషలోనే తిన్నగా ఉచ్చారణ చేయండి, నీవు దానిని ఉచ్చరించగానే అది ఏమైయున్నదో వారు తెలుసుకొంటారు. కానీ, మీరు చూడండి, ఆయనకు అన్ని భాషలు తెలుసు. ఆయన నిత్యుడైన దేవుడు.
58ఈ రాత్రి మనం 75 నుండి 100 వరకు "ఓ" లో ప్రారంభిద్దాము. అది "ఓ" అవునా?, అతడు చెప్పింది అదియేనా? ఓ, ఓ. అవును, మంచిది. 75 నెంబరు కార్డును ఎవరు కలిగియున్నారు , దానిని మనము చూద్దాము? "ఓ" లో 75 ప్రార్థనా కార్డు, దానిని మనము చూద్దాము? "ఓ" లో, ప్రార్ధనా కార్డు, మే చేతులను ఎత్తండి, ఎవరు దానిని కలిగియున్నప్పటికి, అవును. మంచిది, తిన్నగా ఈ పైకి రండి. 75, 80, 85, 90, 95, 100. మీరు రాగలిగితే, ఈ దారిగుండా రండి. తిన్నగా ఇక్కడే వరస కట్టండి, ఏలయనగా మనకు సమయము లేదు. మీరు దానిని సరిగ్గా చేస్తారని నేను నమ్ముతాను.
మీ యొక్క ప్రార్ధనా కార్డు వైపు చూడండి. మీ యొక్క పొరుగువాని ప్రార్ధనా కార్డు వైపు చూడండి. ఎవరైనా కుంటి వారు ఉన్నట్లైతే, తిన్నగా వారిని ప్రార్థనా వరుసలోనికీ నడపండి. కాబట్టి వారికి కార్డు ఉన్నట్లైతే, సరిగ్గా O-75 to 100, మీరు కోరినట్లైతే, ఇక్కడ వరుస కట్టండి. మీరు బాల్కనీ మీద ఎక్కడ ఉన్నప్పటికి, ఇంకా ఎవరైనా ఉన్నట్లైతే, మరియు తిన్నగా క్రిందికి రండి, మీరు కోరినట్లైతే, సమయమును పొదుపు చేయుటకు ఎంత త్వరగా రావాలో అంత త్వరగా వరుసలోనికి రండి.
ఇక్కడ ఉన్న మిగిలినవారు, మీకు ప్రార్థనా కార్డు లేక పోయినట్లైతే, మీ చేతులను ఎత్తి, ఇలా చెప్పండి, "బ్రెన్హాం సోదరుడా, నాకు ప్రార్ధనా కార్డు లేదు, కానీ నేను నమ్ముచున్నాను?" మీ చేతులను ఎత్తండి.
HEB 4:15
59ఇప్పుడు గుర్తుంచుకోండి, ఇప్పుడు ప్రధానయాజకుని గూర్చి నేను మీతో మాట్లాడబోవుచున్నను. "మన బలహీనతలతో మనము ఆయనను తాకగలుగునట్లు ఆయన మన ప్రధానయాజకుడు." ఆయన యెహోవా-యీరే, "యెహోవా తన కొరకు బలి అర్పణను సిద్దపర్చుకొనును." ఆయన యెహోవా రాఫా, "నీ వ్యాధులన్నిటిని స్వస్థపర్చు యెహోవా." మీరు దానిని నమ్ముతారా? ఆయన యెహోవా-మనషే. ఆయనే ఇంకనూ కేడెము, డాలు, మన సమాధానము. మంచిది, యెహోవా యొక్క విమోచనా నామములన్నీ యేసుకు అన్వయించబడతాయని, ఎంత మంది నమ్ముతారు? నిశ్చయముగా. ఆయన ఆలాగున యుండవలసియున్నది. అవి వేరుచేయబడనివిగా యున్నాయి. కావున ఆయన అవన్నియు అయి యుండవలసియున్నాడు. ఆయన ఇంకనూ యోహోవా-యీరే అయితే ఆయన యోహోవా-రాఫా అయి యున్నాడు. అయన యోహోవా-యీరే అయి యున్నటైతే, ఆయన యెహోవా యీరే, (రక్షణకు యెహోవా బలి అర్పణను సిద్ధము చేసాడు), అప్పుడు ఆయన యెహోవా రాఫా, మన రోగములన్నిటిని బాగుచేయువాడు. ఆమేన్. స్వస్థత దేవుని ద్వారా మాత్రమే రాగలదు.
60మంచిది.
ప్రజలు వరుస కడుతూయుండగా… వారు ఎవరో మరియు వారు ఏమైయున్నారో చూచుటకు నాకు సమయము లేదు. కాని ఇప్పుడు, నేను మిమ్మును ఎరుగనని, బయటయున్న వారందరికీ తెలుసు, మీ చేతులు ఎత్తండి, "నాకు దేవుడు అవసరమని చెప్పండి. అయితే బ్రెన్హాం సోదరుడా, నీవు నాకు తెలియదు, కాని నాకు దేవుని యొక్క అవసరత యున్నది. నేను కేవలము నా చేతిని ఎత్తబోవుచున్నాను." ఇప్పుడు, మీరు కొన్ని నిమిషములు సర్దుకొన్నట్లైతే, గమనించండి, జాగ్రత్తగా, నిశ్శబ్దముగా యుండండి. "నిశ్శబ్దముగా యుండమంటే," ఇప్పుడు నా భావము… ప్రభువు ఏదైనా చేసినట్లైతే, మీరు దేవునిని స్తుతులు చెల్లించుటకు ఇష్టపడతారు, అది ఆరాధన. కాని నా భావన ఏమనగా, "చుట్టూ తిరగవద్దు, పైకి లేవవద్దు," మీకు తెలుసా, అది అమర్యాదగా యుంటుంది, చూచారా.
పరిశుద్దాత్ముడు చాలా నిబ్బరమైనవాడు, చాలా నిబ్బరమైనపుడు, చూడండి. అలాటిది ఏదైనా జరిగితే, ఆయన నన్ను వదిలి వెళ్ళిపోతాడు, మరియు అప్పుడు నేను దాని కొరకు మరల యుద్ధము చేయవలసియున్నది, చూడండి. కాని మీరు విన్నటైతే… ఆయన మొదటి వాగ్దానము మీకు గుర్తున్నదా? "ప్రజలు నిన్ను నమ్మగలుగునట్లు చేసినట్లైతే, మరియు యధార్ధముగా యున్నట్లైతే, నీ ప్రార్ధన ముందు ఏదియు నిలబడదు." మీకు అది గుర్తున్నదా? అది నిజము. అది ఇంకనూ తప్పిపోవుట నేను చూడలేదు, అది తప్పిపోదు. అది దేవుడు.
HEB 4:15
61ఇప్పుడు, మనము ప్రార్థన వరుసలో త్వరపడదాము, కాబట్టి ప్రజలను బట్టి, తేగలిగినంత ఎక్కువ మందిని ప్రార్ధన వరుస గుండా తెద్దాము. అయితే ప్రార్ధన కార్డులు కలిగినవారు, మరియు ఈ రాత్రి పిలవబడని వారు, మీ కార్డును పట్టుకొని యుండండి, మేము మీ యొద్దకు రాబోవుచున్నాము. మంచిది. ఇప్పుడు, బయట ప్రార్ధన కార్డులు లేనివారు, గుర్తుంచుకోండి లేక బయటయున్న మీరు, మీకు ప్రార్ధనా కార్డులు యున్నా, లేకపోయిన, సరిగ్గా హెబ్రీ 4వ అధ్యాయములో యున్నట్లుగా మీరు నమ్మండి, "మన బలహీనతల ద్వారా ఆయనను తాకగలుగునట్లు ఆయన మన ప్రధానయాజకుడై యున్నాడు." ఆయన అలాగునే యున్నాడేమో చూడండి… సొదొమ దినములలో ఆయన చేసియున్నట్లుగా, యోహోవా తన ప్రజలు మధ్యలో తానే స్వయముగా, ప్రాతినిథ్యము వహించుచున్నాడేమో మీరు చూడండి. మంచిది.
HEB 13:8
62అయ్యా, మంచిది. ఇప్పుడు మనము ప్రార్థన చేద్దాము, నిజముగా గౌరముగా యుండండి. ఇప్పుడు గుర్తుంచుకోండి, ఎవరైనా చెప్పగలిగే దానికంటే దేవుని నుండి వచ్చు ఒక మాట ఎక్కువైనది. ఇప్పుడు, ఇక్కడయున్న మనిషి, అతడు ఎవరో నాకు తెలియదు. నీవు నాకు కొత్తవాడివని నేను ఉహిస్తున్నాను… అయ్యా, నీవు క్రొత్తవాడివి కాదా? నీవు క్రొత్తవాడివి. మనకు ఒక్కటి తెలుసు: ఒక దినమున మనము ఇద్దరము తప్పక దేవుని యొక్క సన్నిధిలో ఒక రోజున నిలబడవలసియున్నది. ఒక మనిషిగా, అక్కడ మనము తప్పక ఒకరిని ఒకరు కలుసుకోవాలి. ఇది మనము కలుసుకొనుట మొదటిసారి.
ఇప్పుడు, నీవు రోగిగా యుండి, ఇక్కడకు వచ్చినట్లైతే, నాకు తెలియదు. అది మరొక దానికొరకు కావచ్చు, చూడు, అయితే నేను నీ మీద చేతులుంచి, "ప్రభువుకు స్తోత్రము. వెళ్ళు, స్వస్థత పొందుము," అని అంటే, అది మంచిదే నీవు దానిని నమ్మగలవు. కాని నీ ఇబ్బంది ఏమైయున్నదో, ఆయన చెప్పినట్లేతే? ఇప్పుడు చూడు, అది వేరైనది, అప్పుడు ఆయన గుణలక్షణమును గుర్తించునని నీవు తెలుసుకొంటావు.
చూడు, అది నా గుణలక్షణము కాదు. నేను ఒక మనిషిని. వారిని గూర్చి నాకు ఏమియు తెలియదు. "వారిని నేను ఎరుగనని," ఇప్పుడే అతనికి నేను చెప్పాను. అతనికి నేను తెలియదు. అయితే అది ఏమి చేస్తుంది? అది, యేసుక్రీస్తు నిన్న, నేడు, నిరంతరము ఏకరీతిగా యున్నాడని గుర్తిస్తుంది. అది నేను కాదని ఎరిగియున్నాను, అది నేను కాలేను, ఏలయనగా, ఆ మనిషిని నేను ఎరుగును. నేను నా చేతిని ఎత్తుతాను. ఇక్కడ వాక్యము ఉన్నది, చూడండి. అతనిని నేను ఎరుగను; అతనికి నేను తెలియదు.
అయితే యేసుక్రీస్తు యొక్క గుణలక్షణము…
EXOD 4:9•
ISA 53:5•
1PET 2:24
63యేసు ఇక్కడ నిలబడియున్నట్లైతే, మరియు అతడు రోగియైయున్నట్లైతే… "ప్రభువైన యేసు, నన్ను స్వస్థపర్చు," అని అతడు చెప్పగలిగినటైతే, అప్పుడు యేసు అతనికి ఏమి చెపుతాడు?
"నేను ఇదివరకే దానిని చేశాను." అది నిజమేనా?
"మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను. అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది." మనము ఎన్నడైనా కలిగియుండబోవు విమోచన అంతయూ, కల్వరి నొద్ద పరిష్కరించబడింది. అక్కడ నుండి ముందుకు, ఆ ముగించబడిన కార్యమును నమ్ముట విశ్వాసమైయున్నది. అది నిజమేనా? మంచిది.
ఇప్పుడు, యేసు సజీవడైయున్నట్లైతే, నేను ఆయన వాక్యమును గూర్చి మాట్లాడియున్నాను. ఆయన వాక్యమును నమ్ముచూ — ఆ సామాన్యతకు మరియు విశ్వాసమునకు తిరిగి రమ్ము, నీవు అక్కడే యున్నావు. ఆ రాత్రి ఆయన నన్ను కలుసుకొన్నప్పుడు, ఆయన అన్నాడు, "నీవు వారి యొక్క హృదయ రహస్యములను సహితము నీవు గ్రహించుట సంభవిస్తుంది. ఆ మొదటి హస్తము యొక్క సూచనను వారు నమ్మకపోయినట్లైతే; వారు దీనిని నమ్మవలసియున్నది. వారు దానిని చేయకూడదు, అలాగైతే రక్తము భూమిని శపిస్తుంది."
సరిగ్గా అది మోషే కాలములో చేసినట్లుగా యున్నది. "ఆ రెండు సూచనలను నమ్మకపోయినట్లైతే, అప్పుడు భూమిమీద రక్తమును కుమ్మరించుము," చూచారా. భూమిమీద నీటిని క్రుమరించుము, అది రక్తముగా మారును."
64ఇప్పుడు కొంచెము దానిని కనుగొందాము… నేను నీ ఇబ్బందిని చూడగలిగినట్లైతే, అది నిన్ను తృప్తిపరుస్తుంది, నిన్ను నమ్మునట్లు చేస్తుంది, అది కాదా? నీకు తెలుసు, అది నేను మాట్లాడుతున్న వ్యక్తి, యేసుక్రీస్తు యొక్క గుణలక్షణముగా యుండవలసియున్నది.
నేను ఆ మనిషి వైపు చూస్తూయుండగా, ఆ మనిషి వెనుకకు కదిలాడు. అతని పై నీడ యున్నది, కనీసము ఏదియు, ఏ మందు అతనికి ఎన్నడూ అతనికి సహాయపడలేదు. అతడు చనిపోవు స్థితిలో యున్నాడు. అది నిజము. అతడు ఒక శస్త్ర చికిత్సను కలిగియున్నాడు, మరియు అది వీర్యగ్రంథి యొక్క శస్త్ర చికిత్స. అది కాన్సర్, మరియు ఆ కాన్సర్ వ్యాధి నీ అంతట వ్యాపించింది. అది సత్యమైయున్నట్లైతే, నీ చేతిని ఎత్తుము. దేవుడు మాత్రమే నిన్ను స్వస్థపర్చగలడు.
కాని చూడు. అయ్యా, నేను నీకు ఒక విషయము చెప్పాలి. ఆ దయ్యము, వైద్యుని యొక్క కత్తి నుండి దాగుకొనవచ్చు, కాని వాడు దేవుని నుండి దాగుకొనలేడు. మీరు దానిని నమ్ముతారా? అది మీరు నమ్ముతారా? అలాగైతే, నా ప్రార్ధన యేమనగా, యేసుక్రీస్తు నామములో అది నిన్ను విడిచిపెట్టును గాక, ఈ మనిషి జీవించును గాక. [అతడు మూర్ఛపోవునట్లుగా ఉన్నాడు.] ఏమియు లేదు. బలహీనుడయ్యాడు. మంచిది.
65నీవు మరియు నేను ఒకరి కొకరము క్రొత్తవారము, ఒక స్త్రీ మరియు పురుషుడు కలుచుకొనుట. ఇప్పుడు, ఒక మనిషిగా. నీవు నాకు తెలియదు. బహుశ, ఒక స్త్రీగా, నీవు నన్ను ఎరుగవు, నా పేరు గాని లేక నా చిత్రము గాని నీవు ఎంత మాత్రమును ఎరుగవు, లేక అలాటిది ఏదియు నీకు తెలియదు. అయితే మనము ఒకరినొకరము ఎరుగము. అవి మన గుణలక్షణములు. మనకు ఒకరి గుణలక్షణము మరియొకరికి తెలియదు. కాని క్రీస్తు యొక్క గుణలక్షణము… ఆయన వాక్యమైయున్నాడు, మరియు వాక్యము ఈ దినము కొరకు వాగ్దానము చేయబడియున్నది. దానిని గూర్చి నేను మాట్లాడుట నీవు విన్నావు. అప్పుడు గుణలక్షణములు, ఇక్కడ ఆయనను గుర్తిస్తాయి; నేను ఆయనను గుర్తించుట కాదు.
నీవు నాకు తెలియదు. నీకు అర్థమైనదా? సంఘమునకు అది అర్థమైనదా? నేను ఒక మనిషిని. నేను కేవలము మీ సోదరుడను. బావినొద్ద యున్న స్త్రీ వలె. అక్కడ ఏదో పొరపాటున్నది, నీతో పొరపాటున్నది, లేక నీకు ఏమి అవసరమో, లేక నీవు ఇక్కడ ఎందుకొరకు వున్నావో — దానికి దేవుడినే తీర్పరిగా యుండనిమ్ము. నీవు రక్తహీనతతో బాధపడుచున్నావు. అది నిజము. అది నిజమేనా?
నేను ఎడతెగకుండా దానిని తాకుచున్నాను: ఎవరో ఆలోచిస్తున్నారు, నేను దానిని ఉహించాను. నేను దానిని ఉహించలేదు, లేదు. అప్పుడప్పుడు, నేను దానిని స్పృశిస్తాను, ఎవరో… ఇప్పుడు నీవు నీ యొక్క తలంపులను దాచలేవు. ఇప్పుడు ఇక్కడ ఇద్దరూ చెడ్డ విమర్శకులు కూర్చొనియున్నారు, చూడండి; అయితే గుర్తుంచుకోండి, నేను మీ పేరును కూడా పిలువగలను, దేవుడు పిలువగలడు. కాబట్టి మీరు దానిని ఆలోచించుట మానండి…
ఇప్పుడు, నీకు నన్ను చూపనిమ్ము. ఇటు చూడు, స్త్రీ నా వైపు చూడు. ఆయన నీకు ఏమి చెప్పాడో నాకు తెలియదు; కాని ఆయన ఏమైయున్నాడో నాకు తెలుసు. అది ఆయన గుణలక్షణమును గుర్తిస్తుంది. అవును. అది రక్తహీనత స్తితి, రక్తము, నీరు. ఇప్పుడు, ఇక్కడ… ఒకటి యున్నది. చూడండి, అది ఉహించుట అని వారు ఆలోచించినట్లైతే. నీవు ఒక బిడ్డ కొరకు ప్రార్థించుచున్నావు, ఆ బిడ్డ ఇక్కడ యున్నది. అది నిజము. అది గొంతులో యున్నది. గవద బిళ్ళలు, శాలుకంలు. శస్త్రచికిత్స చేయవలసియున్నది. అది నిజమేనా? ఆ చేతిరుమాలును తీసుకొని, ఆ బిడ్డపై యుంచుము, మరియు నమ్ముము. సందేహించవద్దు. దానికి శస్త్రచికిత్స అవసరము లేదు. నీ హృదయమంతటిటో నమ్ముము.
HEB 4:12
66నీవు ఎలా యున్నావు? విషయమేమిటంటే, ఇక్కడ యున్న స్త్రీ నీవు ఒక దానినిగూర్చి భయపడుచున్నావు. ఆ పుట్టుమచ్చ కాన్సర్ గా మారుతుందని నీవు భయపడ్డావు. ఇప్పుడు, నమ్ముచు వెళ్ళుము. గుణలక్షణములు, నావి కాదు; ఆయనవి. ఇప్పుడు నీవు నమ్మతావా? అది తప్పక అందరిని నమ్మునట్లు చేయాలి.
ఇప్పుడు, నీవు నాకు తెలియదు. నేను నీకు క్రొత్తవాడను. దేవుడు నిన్ను ఎరుగును. నీవు దానిని నమ్ముతావా? నేను నిన్ను ఎరుగనని నీకు తెలుసు మరియు నీవు నన్ను ఎరుగవని నీకు తెలుసు, కాబట్టి ఇక్కడ మాట్లాడుచున్నది నా ఆత్మ కాదని నీవు నమ్ముతావా? ఎందుకనగా నేను ఒక మనిషిగా నిన్ను ఎరుగను. కాని వాగ్దానము చేయబడిన వాక్యము యొక్క గుణలక్షణము ఏమనగా, వాక్యము రెండంచుల గల ఖడ్గము కంటే పదునైనది, మరియు హృదయము యొక్క ఆలోచనలను తలంపులను వివేచిస్తుంది.
నీవు చాలా రోగిగా యున్నావు. నీవు ఒక స్త్రీ సంబంధమైన వ్యాధిని కలిగియున్నావు, అది గర్భము, అది గర్భములోని కాన్సర్ లోని వ్యాధి. మరియు నీవు వెళ్ళి ఒక రకమైన మందును తీసుకొన్నావు, అది ఒక రేడియం ద్వారా మందు, ఆ వ్యాధి నీ దేహమంతట వ్యాపించింది. దేవుడు నిన్ను స్వస్థపర్చకపోయినట్లైతే, నీవు చనిపోతావు. అది సత్యము. ఆయన నిన్ను స్వస్థపర్చుతాడని నీవు నమ్ముతావా? పరలోకపు దేవుడు. ఆ వైధ్యుని నుండి దాగుకొనియున్న దయ్యమును గద్దించును గాక. వాడు రేడియం నుండి దాగుకొనవచ్చు, కాని పరిశుద్దాత్ముని నుండి వాడు దాగుకొనలేడు. ఇప్పుడు సహోదరీ. వెళ్ళు, ఆయనను నమ్ముము. ఏ మాత్రము సందేహించవద్దు, కాని నమ్ముము.
JOHN 14:12
67ఆ ఆస్తమా వ్యాధిని, దేవుడు బాగుచేసి, నిన్ను స్వస్థపర్చగలడని నమ్ముచున్నావా? నీవు నమ్ముతావా? అలాగైతే, ఆనందిస్తూ నీ దారిని వెళ్ళుము, "ప్రభువా, నీకు వందనము. నా ఆస్తమా స్వస్థపరచబడినది అని నమ్ముచున్నాను," అని చెప్పుము.
నీవు ఎలా యున్నావు? నీవు నరముల వ్యాధితో యున్నావు నీవు ఎంతోకాలము నుండి నరముల వ్యాధితో యున్నావు, అది నీ కడుపులో పేగు పూతకు కారణమైంది, అది నీ కడుపును జబ్బుగా చేసింది. నీవు నీ యొక్క రాత్రి భోజనమును తినగోరుచున్నావా? నేను ఏమి చేయమని చెపుతానో, దానిని నీవు చేస్తావా? వెళ్ళు, యేసు నామములో భుజించుము.
నీ హృదయమంతటిలో నమ్ముచున్నావా? నీవు చక్కని బలమైన యవ్వన స్త్రీవి, నా వైపుచూడు. ఆయన సేవకుడని నీవు నమ్ముచున్నావు? ఆయన గుణలక్షణము ఇక్కడ యుండగలదని నీవు నమ్ముతావా, వాక్యము, దానికై అది, ఈ దినము యొక్క వాగ్దానము, "నేను చేయు క్రియలు మీరును చేస్తారు." నేను స్వస్థపర్చలేను. ఆయన ఇదివరకే చేసియున్నాడు. అయితే నీ ఇబ్బంది ఏమిటో చెపుతూ, ఆయన గుణలక్షణము, ఆయనను ప్రదర్శిస్తుంది. నీవు స్త్రీ సంబంధమైన వ్యాధిని కలిగియున్నావు, స్త్రీలకు వచ్చు వ్యాధి. ఇప్పుడు దేవుడు దానిని స్వస్థపర్చుతాడని, నీవు నమ్ముతావా? నీ దారిని వెళ్ళుము. అది ఇక ఎంత మాత్రము నిన్ను బాధించదు. నీ హృదయమంతటిలో నమ్ముము.
MARK 9:23
68నన్ను ఆయన సేవకునిగా మీరు నమ్ముతారా? నీ ఇబ్బంది ఏమిటో దేవుడు నాకు చెప్పినట్లేతే. అది యేసుక్రీస్తు యొక్క గుణలక్షణమైయున్నదని నీవు నమ్ముతావా? అది నీ వీపులో యున్నది. అది ఇంకా ఎంతమాత్రము లేదు. వేళ్ళు, నీ హృదయమంతటిలో నమ్ముము.
రమ్ము, ఓ స్త్రీ. నీవు కూడా కడుపులో బాధను కలిగియున్నావు. నీ హృదయమంతటితో నమ్ముము, మరియు వెళ్ళి నీ రాత్రి భోజనమును తినుము. దానిని గూర్చి మర్చిపొమ్ము. యేసుక్రీస్తు నిన్ను బాగుచేయును.
రండి, నీ బాధ రక్తములో యున్నది. నీవు మధుమేహ వ్యాధితో యున్నావు. దేవుడు నిన్ను దానినుండి స్వస్థపరచి, బాగుచేస్తాడని నమ్ముతావా? "ప్రభువైన యేసు, నీకు వందనములు" అని సంతోషిస్తూ వెళ్ళుము. ఆయన నిన్ను స్వస్థపర్చుతాడు. వెళ్ళు, నీ హృదయమంతటిలో నమ్ముము.
రండి, నీవు కూడా వెన్నులో బాధను కలిగియున్నావు. దేవుడు, నీ వెన్నులోని బాధను స్వస్థపరచి, శుద్ధురాలిగా చేస్తాడని నమ్ముతావా? "ప్రభువైన యేసు, నీకు వందనములు," అని చెప్పి సంతోషిస్తూ, నీ దారిన వెళ్ళుము.
నీవును వెన్నులో భాధను కలిగియున్నావు. "ప్రభువా, నీకు వందనములు, నేను స్వస్థపడ్డాను," అని చెప్పుకొంటూనే, నడుస్తూ వెళ్ళుము. నీ హృదయమంతటిలో దానిని నమ్ముము.
నీవును వెన్నులో బాధను కలిగియున్నావు. దానిని గూర్చి నీకు ఏమైనా తెలుసా? ఇప్పుడు నీ హృదయమంతటితో నమ్ముము, నీ దారిన వెళ్ళుము, శుద్దురాలివి కమ్ము. యేసు నిన్ను శుద్దునిగా చేస్తాడని నమ్ముము. "నీవు నమ్మగలిగినట్లైతే, సమస్తమును సాధ్యమే." మంచిది.
69నేను ఏమియు నీకు చెప్పకుండా, నీ మీద చేతులుంచి, నిన్ను దాటిపోనిచ్చినటైతే, ఆమె స్వస్థపడుతుందని నీవు నమ్ముతావా? నీ బాధ ఏమిటో వారు చూస్తారు. ఆమె బాగుపడుతుందని నీవు నమ్ముతావా? ఇక్కడకు రండి, యేసుక్రీస్తు నామములో, ఈ దయ్యమును నేను తిరిగి పారద్రోలుచున్నాను. దేవుని యొక్క శక్తి బిడ్డను స్వస్థపర్చును గాక. ఆమేన్. సందేహించవద్దు, ఏ మాత్రము సందేహించవద్దు, ఆమె బాగవుతుంది. నీ హృదయమంతటిలో నమ్ముము.
దేవుడు నిన్ను స్వస్థపర్చనియెడల, నీవు కీళ్ళ వ్యాధితో, ఒక రోజున చంక-కర్ర మీద యుంటావు. కాని దేవుడు నీ కీళ్ళ వ్యాధిని బాగుచేశాడని నమ్ముము? అలాగైతే వెళ్ళు, "ప్రభువా, నీకు వందనములు, నేను నిన్ను నమ్ముచున్నాను," అని చెప్పుము. మరియు నీవు నన్ను బాగుచేస్తాడు. మంచిది.
ఇప్పుడు రండి. అది నిజముగా నీ వయస్సు యున్నది. నీవు బాగా నరముల బలహీనతతో యున్నావు. సాయంకాలమయ్యే సరికి నీవు బాగా నరముల బలహీనతతో యుంటావు. నీవు పని చేసి సమస్తమును చేసినపుడు, నీవు నిజముగా నరముల బలహీనతలో యుంటావు. ఇప్పుడు నీవు నమ్ముతావా? అలాగైతే అది ఇక ఎంతమాత్రమును నిన్ను భాదించదు. "ప్రభువైన యేసు, నీకు వందనములు," అని నీ మార్గమున చెప్పుచూ వెళ్ళుము.
అయ్యా, రండి. దేవుడు గుండె జబ్బును బాగుచేస్తాడని నమ్ముతావా?ఆయన నీ గుండెను బాగుచేస్తాడు. "ప్రభువా, నీకు వందనములు, నా హృదయమంతటిలో నేను నమ్ముచున్నాను," అవి చెప్పుచూ వెళ్ళుము.
70దేవుడు క్షయ వ్యాధిని కూడా స్వస్థపరచి, బాగుచేయును. అయ్యా, నీ హృదయమంతటిలో దానిని నమ్ముతావా? మంచిది. "ప్రభువైన యేసు, నీకు వందనములు," అని చెప్పుచూ నీ దారిన సంతోషిస్తూ వెళ్ళుము.
ఆ బయటయున్న మీ సంగతి ఏమిటి, మీరు నమ్ముతున్నారా? శ్రోతల సంగతి ఏమిటి? శ్రోతలలో యున్న కొందరు ఇప్పుడు నమ్ముచున్నారా? తిన్నగా ఇక్కడే కూర్చున్న మనిషి, ఊపిరి తిత్తుల ఉబ్బస వ్యాధితో భాదపడుచున్నాడు, నీ ఉపిరితిత్తుల ఉబ్బస వ్యాధిని దేవుడు స్వస్థపర్చుతాడని నమ్ముతావా? మంచిది, అలాగైతే నీవు అడిగినది పొందుకొనుము. ఆమేన్.
తిన్నగా వెనుక కూర్చొన్న వ్యక్తి, అధిక రక్తపోటుతో భాదపడుచున్నాడు. నీ అధిక రక్తపోటును దేవుడు స్వస్థపర్చుతాడని నీవు నమ్ముచున్నావా? అయ్యా, అది నిన్ను విడిచి పెట్టింది. అతడు ఎవరో నాకు తెలియదు. నా జీవితములో ఎన్నడూ అతనిని నేను చూడలేదు.
71అయ్యా, చెప్పండి, నీ కండరములలోయున్న, కండరముల సంకోచమును, నరముల సంబంధమైన కండరముల సంకోచమును, దేవుడు దానిని స్వస్థపర్చుతాడని నీవు నమ్ముతావా? నీవు నమ్ముతావా? నీవు నమ్మినటైతే, నీ చేతిని ఎత్తుము. మంచిది. అక్కడ కూర్చొన్న నీ భార్య, సైనస్ వ్యాధితో బాధపడుతుంది. సహోదరీ, నిన్ను అది కూడా విడిచిపెడుతుందని నమ్ముతావా?
ఇక్కడ తిన్నగా మన వెనుక కుర్చొనియున్న స్త్రీ, వంటి వాపు వ్యాధిని కలిగియున్నది. ఓ, స్త్రీ, దేవుడు నీ వంటి వాపు వ్యాధిని స్వస్థపర్చుతాడని నమ్ముతావా? ఇక్కడ ఒక చిన్న స్త్రీ, ఎర్రని కోటు ధరించియున్నది. ఆమె అక్కడ కూర్చొనియున్నది. ఆమె కూడా వంటి వాపు వ్యాధిని కలిగియున్నది. నీ వంటివాపు వ్యాధిని దేవుడు బాగుచేస్తాడని నీవు నమ్ముతావా? నీవు నమ్మినట్లైతే, నీ చేతిని ఎత్తుము.
HEB 13:8
72యేసుక్రీస్తు యొక్క గుణలక్షణములు మన మధ్య యున్నవి, ఇక్కడున్న ఎవరైనను మీ చేతులను ఎత్తి, ఈ రాత్రి, "నేను దానిని నమ్ముచున్నాను," అని చెప్పండి.
ఇక్కడ యున్న వారందరూ, మీ పాదములపై నిలబడి, ఆయనను మీ యొక్క స్వస్థపరిచేవాడిగా నమ్మువారు, "నేను నమ్ముచున్నాను," అని చెప్పండి. పైకి లెండి, అది ఏమైయున్నప్పటికి కుర్చీలలో నుండి పైకి లేచి నిలబడండి. యేసుక్రీస్తు నిన్న, నేడు, నిరంతరము ఏకరీతిగా యున్నాడు. ప్రభువైన దేవుని పేరట, నేను ఆయనను మీకిచ్చుచున్నాను.