ఆయన ఈ త్రోవను రానైయుండెను
1దేవుని వాక్యము చదువుచుండగా, కొద్ది నిమిషములు మనం లేచి నిలబడుదుము. దాని యొక్క పరిచయమంతటిని గురించి నేను ఆలోచించుచుంటిని, యదార్ధముగా నేను దాని (వాక్యము) మట్టుకు జీవించవలసియున్నాను, నేను జీవించకపోవుదునా? ఈ జనులు మిమ్ములను ప్రేమించువారు.
పరిశుద్ద లూక సువార్తలోని 19 అధ్యాయము లేఖనములోని కొంతభాగమును, మొదటి అయిదు వచనములు చదవవలెనని కోరుచున్నాను. మొదటి అయిదు వచనములు.
ఆయన సంచరించుచు యెరికో పట్టణములో ప్రవేశించి, దాని గుండా పోవుచుండెను.
ఇదిగో సుంకపు గుత్తదారుడును ధనవంతుడునైన జక్కయ్య అను పేరుగల ఒకడు.
యేసు ఎవరోయని చూడగోరెను గానీ, పొట్టివాడైనందున జనులు గుంపుగూడియుండుట వలన చూడలేకపోయెను.
అప్పుడు యేసు ఆ త్రోవను రానైయుండెను, గనుక అతడు ముందుగా పరుగెత్తి ఆయనను చూచుటకు ఒక మేడిచెట్టెక్కెను.
యేసు ఆ చోటుకి వచ్చినప్పుడు, కనులెత్తి చూచి, జక్కయ్య త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంటనుండ వలసియున్నదని అతనితో చెప్పగా…
అతడు త్వరగా దిగి, సంతోషముతో ఆయనను చేరుకొనెను.
అందరు అది చూచి, … ఈయన పాపియైన మనుష్యునియొద్ద బస చేయ వెళ్ళెనని చాలా సణుగుకొనిరి.
జక్కయ్య నిలబడి - ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగము బీదలకిచుచున్నాను; నేనెవని యొద్దనైనను అన్యాయముగా దేనినైనను తీసికొనినయెడల అతనికి నాలుగంతలు మరల చెల్లింతునని ప్రభువుతో చెప్పెను.
అందుకు యేసు - ఇతడును అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చియున్నది.
నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్యకుమారుడు వచ్చెనని అతనితో చెప్పెను.
మనము ప్రార్దించుదాం.
2మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ ఉదయకాలమున మేము నీకు కృతజ్ఞలమై యున్నాము. ఆ కారణమును బట్టియే, రక్షించుటకు నీవు ఇంకనూ తప్పిపోయిన అబ్రహాము కుమారులను వెదకుచున్నావు. పరలోకపు తండ్రి, ఈ దినమున మా కూడికను దీవించి, మా దీనప్రార్థనలను స్వీకరించునట్లు మేము ప్రార్దించుచున్నాము. మరియు ఇది వ్యర్ధముగా పోకుండునట్లు, ఆ గొప్ప పరిశుద్దాత్మ మాకు జీవించ విధానమును బోధించును గాక; ఒక దినాన మేము ఆయన సన్నిధిలో నిలిచి, ఈ జీవితముతో మేము ఏమి చేసితిమో లెక్క ఇవ్వవలసినవారమై యున్నామని ఎరిగినవారమైయున్నాము. నీవైపు కనిపెట్టుకొనియుండు మమ్మును ఆశీర్వదించుము. యేసు నామములో. ఆమేన్. కూర్చొనవచ్చు.
3నమ్మే ప్రజలను, మరియు మీరు ముందుకు నడుపుటకు చేయు ప్రయత్నమును నమ్మే మంచి స్నేహితులను కలిగియుండుటను బట్టి నే సంతోషించుదును. వ్యత్యాసముగా ఉండవలెనని నేను ఏదైనా బాహ్యముగా కనబరచినయెడల, నేనొక నిజమైన పాపిగా యుందును. అయితే నా ఉద్దేశమంతా యేసుక్రీస్తును మహిమపరుచుటయే. మరి నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన వర్తమానమును కలిగియున్న వ్యక్తి అయినట్లయితే: నిన్నునీవు ఆపజాలవు, నీలోనున్నదేదో అది నిన్ను తీవ్రముగా కొట్టుచుండును. దానినీ నీవు నిమ్మళపరచలేవు, దానిని నీవు పూర్తిగా ఆపలేవు, లేదా దానిని ప్రారంభించనులేవు. అదే నిన్ను ఆపును మరియు ప్రారంభించును మరియు శాంతపరచును, (నిమ్మళపరచును), చూచారా. కేవలం అది నిన్ను అదుపు చేయును. మన ప్రభువైన యేసును గూర్చిన సాక్ష్యమును కలిగియున్న ఈ మంచి సహోదరులకు కృతజ్ఞతలు. వారు నన్ను గూర్చి మాట్లాడలేదు. నా గురించి కాదు. వారు ఆయనను గూర్చి మాట్లాడిరి.
JOHN 12:32
4కొంతకాలం క్రితం నేను మూడి గురించి వ్యాసమును చదువుచుంటిని, చికాగో పట్టణపు వార్తపత్రిక ఆయన గురించి ఒక సంపాదకీయమును వ్రాయబోవుచుండెనని చెప్పెను. మరియు ప్రజలు ఎందుకు మూడి గురించి వినుటకు కూడుకొనుచున్నారని కనుగొనుటకు వారు పత్రికా సంపాదకీయం ఒకరిని బయటకు పంపియుండిరి. మూడీ, వ్యాసమును చదువుటకు సరిపడనంతగా కూడా విద్యలేని నావంటివాడు. కావున వ్యాసమును అతని యజమాని చదువవలసియుండెను. ఒకప్పుడు శ్రీ. మూడీ బూట్లను కుట్టేవాడు, అతడు ఆ కాలపు వర్తమానముకు దేవునిచేత పిలువబడినవాడుగా ఉండెను.
మరియు అతని యజమాని ఆ వ్యాసమును అతని కొరకు చదివేవాడు. మరి "ఎవరైనను డ్వైట్ మూడీ చెప్పినది వినుటకు ఎందుకు వెళ్ళెదరని?" అడిగెను. "మొదటిగా నేను చూచిన వారిలో అతడు అత్యంత వికారముగలవాడు." మరియు అనెను, "అతడు బట్టతల గలవాడు, పొడవాటి మీసాలు ఆ విధంగా వుండువాడు." మరియు ఇంకా అనెను, "మరి అతడు త్రాగుబోతువలే మాట్లాడేవాడు. నేనెన్నడు వినని చెత్త వ్యాకరణము అతనిది." ఓ, అతడు ఆ విధంగా చెప్పుకొంటూపోయెను.
శ్రీ. మూడీ తన భుజములను భయముతో కదిపెనని అతడు చెప్పెను. నిజానికి వారు శ్రీ. మూడీని కాదు కానీ, క్రీస్తునే చూచుటకు వచ్చేనని చెప్పెను. కావున, అదియే దానికి సమాధానమని నేను తలంచుచున్నాను. మనం చూడగోరునది క్రీస్తే, "నేను భూమి మీదనుండి పైకెత్తబడినయెడల అందరిని నాయొద్దకు ఆకర్షించుకొందును."
5ఇక్కడున్న ఈ పట్టణమును దర్శించిన తర్వాత ప్రజలు, ఎంతో చక్కని వారని, డెన్హమ్ స్ప్రింగ్స్ హైస్కూల్ (లేదా) పాఠశాల ఆడిటోరియం వద్ద మనం ఎంతో మంచి కూటములను కలిగియుంటిమని నేను కనుగొంటిని. ప్రజలు ఇక్కడున్న కాఫీవలె ఉన్నారని నేను తలంచుచుంటిని. మై! అది పరిమాణము కాదు; కానీ అది నాణ్యత ముఖ్యం. అదంతయూ ఒకే కప్పులో ఉన్నట్టు ఉండెను!
మొదటిసారిగా ఇక్కడనున్న విమానాశ్రయములో విమానము దిగుటను నేను జ్ఞాపకము చేసికొనుచున్నాను. ఇచ్చట సహోదరులు నన్ను స్వీకరించుటకు వచ్చి కూర్చొనియుండిరి. మరియు అక్కడ ఒక చిన్న ఫ్రెంచి బాలిక ఉన్నది. నేను ఒక కప్ప కాఫీ మరియు ఒక రొట్టె కొరకు అడిగితిని. ముప్పై-ఎనిమిది సంవత్సరాలు వచ్చేటంత వరకు నేనెప్పుడు దానిని త్రాగియుండ లేదు. దాని గురించి నేనింక ఎక్కువుగా తెలిసికోటం మంచిదైయున్నది. కానీ అప్పుడు సహోదరుడు బ్రౌన్, అతడు ఈ ఉదయమున ఇచ్చటే ఇక్కడే కూర్చొనియుండునని నేను భావించుచున్నాను. అతడు దానినెంతగానో ఇష్టపడెను, అతడు దానిని నాకిచ్చి యుండెను. సేవకుల యొక్క అల్పాహార కూటం ఏడు గంటలకొకటి, ఎనిమిది గంటలకొకటి మరియు తొమ్మిది గంటలకొకటి చొప్పున కలిగియుండేవాడిని. అంతటిని మీరు ఒకసారే తినలేరు, అందువల్ల వారు కాఫీ పోయుదురు, మరియు మొదటిగా నేను దానిని కొంచెం కొంచం చప్పరించి త్రాగవలసియున్నది.
కావున నేను ఆ బాలికను అడిగితిని, నేను ఆమెతో చెప్పితిని, "నాకొక సాండ్విచ్ రొట్టె మరియు ఒక కప్పు కాఫీ కావలెనని అడిగితిని. వారు ఆ చిన్న కప్పును బయటకు తెచ్చునప్పుడు, "మై, మై. వారు వారి కాఫీ పైన కూడా మరియు ఎంతో చిక్కగా ఉండెనని," నేను తలంచాను. మొదటిగా త్రాగి, మొదటిగా నా నోటితో పీల్చి తీసికొంటిని (ఓ, మై!), శ్వాసకై నేను పోరాడవలసి వచ్చెను.
ఆ చిన్న స్త్రీ, "నీవు అమెరికానందలి యాంకీ ప్రాంతీయుడవై యుండవచ్చు," అనెను. "నీకు సరిపడే యాంకీ కాఫీనొక దానిని సమకూర్చెదనని" ఆమె అనెను.
6కావున ఆ విధముగా నేను ప్రజలను కనుగొందును. గతములో నేను గొప్ప గుంపులకి బోధించితిని, కానీ గుంపు ముఖ్యం కాదు కానీ, యదార్ధమైన గుణలక్షణములను గలవారిని నేను కనుగొంటిని. అందుకు నేను వారికెంతో కృతజ్ఞుడను, ఎందుకనగా వారెంతో శ్రద్దగా వినే శ్రోతలు, నీవు చెప్పుదానిని కూర్చొని విని, ఆసక్తి చూపేవారు కొందరున్నారు. మీరు కూడా అలానే చేయాలని నేను కోరుదును. ఒక మనుష్యుడు చెప్పుదానిని దేవుని వాక్యము చేత పరిశీలించుడి. ఒకవేళ అది సత్యము కానియెడల, అది సత్యము కాదు. అది అంతే. అది దేవుని వాక్యమైనయెడల, దేవుడు దానిని తన వాక్యముతో ఋజువుపరచవలసియున్నాడు. కారణం ఆయన చేయుదునని వాగ్దానము చేసేను. కావున, మనం ఈ సంగతులన్నిటిని ఆ విధముగానే పరిశీలించి కనుగొనవలసియున్నాము.
7ఇప్పుడు, ఈ ఉదయకాలమున, ఈ కూడిక బిజినెస్ మెన్ సంపూర్ణ సువార్త యొక్క అల్పాహార విందుగ ఉండెనని మరియు సంపూర్ణ సువార్త సేవకులలో నేను కూడా ఒకడిని. మరియు వారిలో కొంత మంది ఇచ్చట ఉన్నారని వారు చెప్పిరని నేను తలంచుచున్నాను. వారిలో కొందరు రాలేదు. వారు వ్యాపారాల నిమిత్తం బహుశా, హాజరు కాలేదు. నేను వారిని కొంతమట్టుకు మన్నించుదును. సరే, ఏమైనప్పటికి ఇక్కడనున్న చాలామంది వారి ప్రజలని నాకు చెప్పబడియుండెను. అదేంతో మంచిది.
ఇప్పుడు, నేను ఒక చిన్న హాస్యమును చెప్పబోవుచున్నాను. ఇది హాస్యములు చెప్పు స్థలము కాదు. అయినను కొద్దిపాటి హాస్యమును కలిగించునదిగా అది ఉండును. కొంతసేపటి క్రితం మనం మాట్లాడుకొన్నట్లుగా, మీరు మాట్లాడినచో ప్రజలు హాస్యములోనికి వెళ్ళుదురు.
8నాకొకటి జ్ఞాపకమున్నది, ఒకసారి నేను నా స్నేహితుడు పాఠశాలలో ఉంటిమి. అతని పేరు విల్మర్ స్నిడర్. అతని సహోదరుడు ఒక బాప్టిస్టు సేవకుడు. మరియు అతడు "మేడగది" అను పత్రిక సంపుటికి కొన్ని వ్యాసములు వ్రాయువాడు. అప్పుడు మేము పాఠశాలకు వెళ్ళే బాలురుగా యుంటిమి. మరి నేను పరిచర్యను అధ్యాయనము చేసితిని, మరియు అతడొక బీమా అధికారి అయ్యెను. ఒకసారి అతడు నన్ను దర్శించుటకు నా గృహమునకు వచ్చెను.
మరియు ఇప్పుడు ఇక్కడ బీమా చేయు అధికారులు ఉండీ యుండవచ్చు. మరియు ఇప్పుడు నేను బీమా గురించి ఏమియూ చెప్పట లేదు. తప్పుగా భావించొద్దు, కానీ నేను చెప్పబోవు దాని భావమును మీరు పట్టుకొనవలెనని నిరీక్షించుచున్నాను. అంతే కాదు. నా సహోదరుడు కూడా సంరక్షణ బీమా అధికారియై ఉండెను.
9కావున ఒకానొకప్పుడు బీమా చేయు కంపెనీ ద్వారా ఒక దానిని నేను కలిగియుంటిని, దానిని గూర్చి నాకేమి తెలియనట్లుగా నేను… వారు తప్పుడు పాలసీను చదివి వినిపించారు, మరియు అది నాకు తప్పుడు అనువాదమును ఇచ్చెను, మరియు నేను దానిని తీసికొనియుండలేదు.
కావున ఒక రోజు చూచుటకు విల్మర్ నా యొద్దకు వచ్చెను. అతడు ఇలా అడిగెను," బిల్లీ ఏ విధముగా నీవు కొనసాగుచున్నావు?"
"అందుకు నేను "క్షేమమని" చెప్పాను.
నీవు కూటములకు వెళ్ళినట్లుగా నేను విన్నాను" అని అడిగాడు. "అవును, బయటి దేశములందు కూటములకు వెళ్ళియుంటిని" అని నేను చెప్పాను.
ఒక వ్యక్తి నాతో చెప్పిన దాని గురించి అతనికి చెప్పుచుంటిని, "నీవొక బోధకుడవు, ఈ వ్యాపారవేత్తలతో ఇటు అటు తిరుగుచూ నీవేమి చేయుచున్నావు?" అని అనెను.
అందుకు, "నేనొక వ్యాపారిని," అని బదులిచ్చాను.
మరియు వారు అడిగిరి, "ఆహ్, ఏ వ్యాపారములో నీవున్నావు?"
నేను చెప్పాను "నిశ్చయత వ్యాపారములో." మరి గమనించండి, అతడు దానిని గ్రహింపకుండెను. "బీమా" అని నేను చెప్పలేదు; "నిశ్చయత" అని మాత్రమే నేనంటిని. కావున "నిశ్చయత వ్యాపారము" అని నేను చెప్పితిని.
"ఓ, అలాగైతే, ఏ నిశ్చయత వ్యాపారము అది?" అని అడిగాడు
నేను చెప్పాను, "నిత్యజీవపు నిశ్చయతను అమ్ముదునని." మరియు ఇంకను నేను దానిని అమ్ముచుంటిని, కావున మీలో ఎవరైనా దాని గురించి ఆసక్తి కలిగియున్నయెడల, అది మీకు సరి అయినట్లయితే, ఈ కూటము ముగించబడిన తర్వాత ఆ పాలసీ (నిత్యజీవపు యోచన) గురించి మీతో మాట్లాడుదును.
మరియు అతడు అడిగెను, "నిత్యజీవమా?" అతడు అడిగెను, "అటువంటి కంపెనీ గురించి నేను ఎన్నడైనను విన్నానని నేను అనుకోవట్లేదు."
నేను చెప్పాను, "ఓ, ఎన్నడూ నీవు వినలేదా? అది సుపరిచితమైనదే" నని నేను చెప్పితిని. మరియు అతడు చెప్పెను, "అది పూర్వమందు స్థాపించబడినది"నని చెప్పాను.
అయితే దాని యొక్క ప్రధాన కార్యాలయాము ఎక్కడున్నదని?" అడిగాడు.
"మహిమలో" అని నేను చెప్పాను.
10విల్మర్ నాతో అనెను, అతడు అన్నాడు, "బిల్లీ, నీ యొద్దకు వచ్చి మరియు నీకు ఒక బీమాను అమ్మవచ్చునని నేను తలంచాను, ఎందుకనగా నీకేలాంటి బీమా లేదని నేను విన్నాను."
అందుకు నేను చెప్పాను, "ఓ అవును. నేను నిశ్చయతను కలిగియున్నాను."
మరియు "ఓ, నన్ను క్షమించు" అని అతడనెను. "బహుశా, నీ సహోదరునితో కలసి దానిని కలిగియన్నావని నేను ఊహించుచున్నాను" అనెను.
నేను చెప్పాను, "లేదండి, ఖచ్చితంగా అతనితో కలిసిలేను."
నీవు నాకేదో కథ చెప్పచున్నావని అనుచున్నట్లుగా నా భార్య నావైపు చూచుచున్నది. నేను ఎటువంటి బీమా కలిగిలేననీ ఆమెకు తెలియును. అయినను ఆమె దానిని గ్రహింపలేకపోయెను: "నిశ్చయత; "బీమా" కాదు," అని నేను చెప్పాను.
"బిల్లీ, నీవు ఎటువంటి బీమాను కలిగియున్నావు?" అందుకు అతడు అడిగెను.
"ధన్యకరమైన నిశ్చయత, యేసు నావాడు! ఓ, ముందుగా రుచి చూచిన, ఎంతటి దేవుని మహిమ! నేను దేవునిచే కొనబడిన రక్షణ స్వాస్ధ్యమును ఆయన ఆత్మలోనికి జన్మించి, ఆయన రక్తంలో కడుగబడ్డాను," అని అంటిని.
"బిల్లీ, అది చాలా మంచిది." "అది చాలా రమ్యమైనది" అని అతడు చెప్పెను. "నేను దానికి వ్యతిరేకిని కాదు, అని చెప్పెను. అయితే "నీవు పోవునప్పుడు అదెంతమాత్రము నిన్ను ఈ సమాధిలో పెట్టి ఉంచదని" చెప్పెను.
"అది నన్ను వెలుపలకి తీసుకొని వచ్చును! లోనికి వెళ్ళుట గూర్చి నేనెంత మాత్రం చింతించుటలేదు. లోనికి వెళ్ళుటను గూర్చి నేను చింతపడుటలేదు; కాని బయటకు వెళ్ళుటయే అసలు విషయం," అని నేను చెప్పాను. మరియు కావున, మిమ్ములను వెలుపలకు తీసుకొనువచ్చుటకు నేనెరిగియున్న ఒకే ఒక కార్యము అదియే. కావున మీరు వెలుపలకి వెళ్ళుట గురించి ఆసక్తిగా ఉన్నట్లయితే, మనం దాని గురించి మాట్లాడుకొందుము.
11ఈ ఉదయకాలమున, శ్రోతలైన మిమ్ములను ఎక్కువ సమయం కాక, కొద్ది నిమిషాలు మాత్రమే ఉంచుదును. బోధించుటకు ఒక పాఠ్యాంశమును కలిగియుంటిని, కావున కాలయాపన చేయకుండా వుండుట మంచిదని అనుకొనుచున్నాను. బైబిలునందలి, ఒక వ్యక్తిని గూర్చి కొద్దిగా నాటిక రూపములో బోధించుటకు దానిని నేను కలిగియున్నాను.
క్రైస్తవులుగా ఇచ్చట మనం కూర్చొనియుండగా, గంభీరమైన యొక సంగతిని గూర్చి నేనాలోచించుచుంటిని. మనమందరము ఈ రీతిగా మునుపెన్నడూ లేని విధముగా ఐక్యముగా కూడి కలిసి భుజించే చివరి ఉదయకాల అల్పాహార విందు, బహుశా ఇదేనని మీలో ఎంతమందికి తెలియును? ఎప్పడైనా మీరు దాని గురించీ ఆలోచించారా? ఇచ్చట నేను బోధించే స్వల్పమైన మాటల విషయమై ఒక దినాన నేను దేవుని తీర్పు వద్ద జవాబు ఇవ్వవలసినదని మీరు గ్రహించితిరా? చూచారా? మరియు ఇచ్చట కొన్ని ఆత్మలను నేను కలిగియున్నాను. అదెంత చిన్న గుంపు అయినప్పటికి పర్వాలేదు, మంచిది నేను చెప్పే ఆ మాటలకి అచ్చట నేను సమాధానము ఇవ్వవలసిన వాడనైయున్నాను. కావున మనమంతా కలసి ఇక ఎప్పటికి మరో అల్పాహారం భుజించక పోవచ్చును; కానీ ఒక దినాన మనము ఆయనతో కలసి ఒక విందును భుజింతుమని నిరీక్షించుచున్నాను. ఆయనలో కూడి ఉండే చివరి విందు అదియే, మరియు అది అచ్చట మొదటిగా వుండును.
మరియు ఈ ఉదయమున మనం ఇచ్చట కూర్చొనియుండగా, ఇక్కడనున్న గొప్పసేవకులను నేను చూచుచున్నాను. వారిలో కొందరు గొప్ప చదవరులు (నేనైతే ఎటువంటి విధ్యలేని ఒక వేటగానిగా వున్న) డాక్టర్ పట్టా కలిగియున్న వారిముందు బోధించుటకు తగిన అర్హతలున్న వారిముందు నిలిచి మాట్లాడుటకు నన్ను నేను అల్పునిగా భావించుదును. అయినను, నేను భావించు దానిని వ్యక్తపరచవలసియున్నది. వారి కృతజ్ఞత, దయ నన్ను నిలుచునట్టు చేయును గాక, సహోదరులు కలిసికట్టుగా కూడుకొని కూటమునకు సహకరించుచున్నారు. నేను దానిని ప్రశంసించుదును, మీకు సహకరించుటకు ఇక్కడ నేనున్నాను, దేవుని కృపను బట్టి మీలో ప్రతిఒక్కరికి నా శక్తి కొలది నేను దానిని చేయుదును.
MATT 25:21,23,34
12మరియు ఒక దినాన ఇదంతయూ జరిగిన తరువాత (మరలా నేను మీతో కలసి అల్పాహారమును తినినయెడల), ఇదంతయూ (ఎత్తబడుట) జరిగిన పిదప, మరల మనం ఆ భోజనపు బల్ల చుట్టూ ఒకరి హస్తాలు మరొకరు పట్టుకొనియుండగా — నేను ఆ సమయము కొరకు ఎదురుచూస్తున్నాను. సందేహము లేదు, మన బుగ్గల పైనుండి ఆ చిన్ని కన్నీళ్ళు కారుచుండును. అప్పుడు దాని భావము మరొక విధముగా ఉండును. పని చేయుటకు సమయమింకా ఉండగానే, సూర్యుడు ఇంకానుండగా మనం దానిని చేయుదుము. కొద్ది సమయము తర్వాత అది క్రిందికీ పోవును. అది ఇంకను క్రిందికి దిగిపోవుచు ఉండెను.
ఆ సమయమున దానిని గూర్చి ఆలోచించుటకు అచ్చట మనం మన చేతులు కలిపి కూర్చొని, మరియు చిన్నగా ఏడ్చుచుండగా, మరియు ఆ గొప్ప రాజు వెలుపలకు వచ్చుచుండగా, ఆయన వస్త్రపు చెంగులు క్రిందకి దిగుచూ ఆ పంక్తి గుండా వచ్చుచు, మన కన్నుల నుండి కారు కన్నీటిని తుడిచి, "నా మంచి నమ్మకముగల దాసులారా, జగత్తు పునాది వేయబడినప్పటి నుండి మీ కొరకు సిద్దపరచిన ప్రభువు యొక్క ఆ ఆనందములోనికి ప్రవేశించుడని" చెప్పును. ఆ సూర్యుడు అస్తమించుచుండగా పనిచేయుటకు ఇంకనూ వెలుగుండగా, మనం పని చేయుదుము.
13ఇప్పుడు, ఇచ్చట ఈ పాఠ్యాంశము, అది హస్యముగా అనిపించవచ్చు. కానీ మనం "ఆయన ఈ త్రోవన రానై యుండెను" అను ఈ అంశంపై మాట్లాడబోవుచున్నాము.
అది ఆ చిన్న వ్యక్తికి తప్పక ఒక భయంకరమైన భీతిని కలిగించు రాత్రియై ఉండును. అతడు రాత్రంతయూ అటు ఇటు తిరుగుచూ, పైకి క్రిందికి ఎగురుచూ, తికమకపడుచూ నిద్రించకుండెను. అది సూర్యోదయ దినమై యుండెను. మరి ఆ విశ్రాంతి లేని రాత్రులు ఎటువంటివో మనమందరం ఎరుగుదుము. నీ మనస్సులో ఏదో వచ్చియున్నది, లేదా కొంత నీ నరములకు ఉద్రిక్తతను కలుగుజేసెను. నీవు నిద్రపోజాలవు.
మరియు ఆ చిన్న వ్యక్తి యెరికో అను పట్టణములో ఇక్కడనున్న వ్యాపారము చేయు స్త్రీ, పురషులైన మీవలే, ఎదుగుచున్న వ్యాపారము కలిగిన ఒక వ్యాపారస్తుడై యుండెననుటలో ఏ సందేహంలేదు. మరియు అతడు సమూహములో, ఇతరమైన వాటన్నింటిలో నిలిచియుండి మరియు సంఘములో ఒక సభ్యునిగా ఉండి (సన్హేద్రిను సభలో) ఒక యాజకున్ని కలిగియుండెను, మరియు అతడు ఆ యాజకున్ని నమ్మియుండెను.
14మరియు వింతేమిటంటే, ఇతనికి భార్య ఉన్నది. ఆమెను మనం రిబ్కాగా పిలిచెదము. ఆమె తప్పైన త్రోవలో ఉందని అతడును మరియు యూజకుడును భావించెను, ఎందుకనగా ఆమె నజరేతువాడైన, యేసు అను పేరుగల ఒక ప్రవక్తను వెంబడించుచున్నది. ఆ పేద-తరగతికి చెందిన బీద ప్రజలు ఆయనను ఒక ప్రవక్తగా, వాగ్దానము చేయబడిన ఒక మెస్సీయాగా నమ్మియుండిరి. కానీ వారి నమ్మకము ఆ సన్హేద్రిను యొక్క అధికారమునకు ఏ మాత్రము తగినట్లుగా లేకుండెను.
విచిత్రమేమిటంటే, కొన్నిసార్లు మనం అనుకొన్నట్టుగా కార్యములను దేవుడు జరిగించునని భావించుదుము, "ఈ మనుష్యుని చూడండి, వారి ఆలోచనకు అతడి జన్మ అక్రమమైనదిగా కనిపించెను. అతని తల్లి వివాహాము కాకమునుపే, అతడికి జన్మిచ్చెనని వారి అభిప్రాయం. మరొక విషయమేమిటంటే, ఆయనకు పాఠశాల విద్యలేదు. ఆయన ఇంతక ముందెన్నడూ పాఠశాలకు వెళ్ళినట్టు పుస్తకములో వారియొద్ద ఏలాంటి ఆధారాలు లేవు. ఆయన ఒక యాజకుడు కాదు. బోధకుడును కాదు, ఆయన తనకు తానే సేవకుడనని ప్రకటించుకొనెనని వారి యొక్క అభిప్రాయం. ఈ ఉదయమున సహోదరుడు డాన్ ఎంతో ఘనముగా చెప్పినట్టుగా, "అది ఒక మలుపును త్రిప్పట అయినది." వారు దానిని గుర్తించలేకపోయిరి. సాధారణముగా అది ఆ విధముగానే జరిగెను. అది ఆ మలుపు తిరిగే సమయమునకు వచ్చియున్నది.
కానీ, ఏది ఏమైనా అతడి భార్య , ఆ కాలమునకు రావలసియున్న ప్రవక్త ఆయనేనని బలముగా నమ్మి మరియు వెంబడించి, ఆయనను నమ్మియుండెను. మరి ఆమె దానిని తన భర్తకు చెప్పుటకు ఎంతో ప్రయత్నించియుండెను, కానీ అతడు తన వ్యాపార వ్యాపకములను బట్టి మనస్కరించకుండెను. అయినను అతడొక సంఘమునకు చెందియుండెను, అది సరిపోయినట్టు లేదా?
MATT 19:16,17,20•
MARK 10:17,19,20•
LUKE 18:18,20,21
15అతడు ధనవంతుడైన ఆ యవ్వన అధికారివలెవుండెనని మీకు తెలియునా? అతడు కూడ ఒక వ్యాపారమును కలిగియుండెను, కానీ అతడొక సంఘమునకు సభ్యునిగా యుండెను, అయినను అతనికి నిత్యజీవము లేకుండెను. మరి అతడు… ఇతరులలో లేని దానిని అతడు యేసులో చూచెను. శక్యమైతే నిత్యజీవమును పొందుటకు తనేమి చేయవలెనో ఆయన వద్దకు వచ్చి తెలిసికొన గోరెను.
మరి, "ఆజ్ఞలన్నిటిని పాటించమని" యేసు అతనితో చెప్పెను.
అందుకతడు, "బాల్యమునుండే వీటినన్నింటిని అనుసరించుచున్నాననెను." చూడండి, అతడొక విశ్వాసి అని అది చూపించుచున్నది. అయినను యాజకులకు బోధకులకు లేని ఒకదానిని యేసు కలిగియుండెనని అతడు ఎరిగియుండెను. మరి ఒక వ్యక్తి యేసుక్రీస్తును వ్యక్తిగతముగా కలసుకొన్నచో, అప్పుడతడు ప్రత్యేకమైన వాడుగా ఉండును. ఒక్కసారి నీవు దేవుని వెలుతురుని నీలో పొందుకొంటే ఇంతకముందు ఉన్నట్లుగా నీవెన్నడు ఉండలేవు.
16కావున రిబ్కా ఈ యేసును కనుగొనియుండెను. మరియు ఆయన నిశ్చయముగా ఆమెకి ఆ దినమున నెరవేరవలసిన, యూదులు వారి దినమునకు నెరవేర్పుకు ఎదురుచూస్తున్న వాగ్దానమైయుండెను. కావున, ఆయన ఒక అల్పాహారము లేదా ఏదో ఒకరకమైన విందు కొరకు యెరికోలో యుండునను వార్త ఆ ప్రదేశమంతటను వ్యాపించెను. అందుచేత ఆమె వ్యాపారవేత్త అయిన తన భర్త కోసం ప్రార్దించుటలో ఎంతో ఆసక్తిగా ఉండెను. మీరు గమనించుడి, ప్రతిచోట మనం చాలా రిబ్కాలను కలిగి యుండవలసి యున్నది, చూచారా. చూడండి, ప్రార్ధన పరిస్థితులను మార్చివేయును. నీ భర్తను, లేదా రక్షింపబడని ఒకరిని దేవుని యెదుట ఉంచి ప్రార్ధించినట్లయితే, దేవుడొక మార్గమును ఏర్పరచును, కారణం దానిని చేయుదునని ఆయన వాగ్దానము చేసియుండెను.
అందుచేతనే రిబ్కా దృడమైన విశ్వాసియై, ప్రభువైన యేసును వెంబడించుచు, మరియు తన ఇల్లంతటిని గూర్చి ఆసక్తిని కలిగిన చక్కని, ప్రియమైన వ్యక్తిగా యుండెను. మరియు మరలా అదే ప్రతిబింబించునని నేను దానిని తలంచుచుంటిని. ఒకడు యేసును కలిసికొని, నీ హృదయమందు ఆయనను కనుగొనిన యెడల, అప్పుడు నీవు నీ సొంత ఇంటియందే కాక, ప్రతిచోట దేవుని ఇంటిలోను ఆసక్తి కలిగియుందువు. వారు ఆయనను తెలిసికోవాలని నీవు గట్టిగా కోరుకొందువు. "మరియు ఆయనను యెరుగుటయే జీవమైయున్నది." ఆయనను యెరుగుట; చూడండి, వాక్యమును ఏ విధముగా చదువవలెనో కాదు, లేక… కాని ఆయనను ఎరుగుటయే జీవమైయున్నది. కావున ఆమెంతో పట్టుదలగా ప్రార్ధించెను.
17మరియు యేసు ఆ పట్టణంలో ప్రవేశించుటకు సమయం సమీపించియున్నది. మరే సందేహం లేదు, ఆ దినమునకు ముందు అతని వైఖరిలో ఏమైనా మార్పు వుండునేమోనని ఆమె చూచియుండవచ్చును. కావున ఆమె "జక్కయ్య ఉదయమున ఆ అల్పాహార-విందునకు నీవు వెళ్ళచున్నావా?" అని అడిగెను.
"ఎందుకనీ, నిస్సందేహముగా లేదు! ఎందుకనీ, ఆ గుంపు ప్రజలు… మరియు అచ్చటకు నేను వెళ్ళుదునని నీవు అనుకొనుచున్నావా, పట్టణములో నేను మంచి హోటళ్ళను కలిగి యున్నాను. మరియు వారు దానిని లెవిన్స్కి వద్ద కలిగియుండిరి. [ఇచ్చట ఏ లెవిన్స్కి లేదని అనుకొనుచున్నాను. కానీ ఏదేమైనప్పటికీ, అది వేరొక స్థలమునందు మీరు చూడగలరు.] మరియు పట్టణములో నాకు మంచి స్థలము కలదు, మరియు వారు ఆ దిగువున ఆ స్థలమును ఎంచుకొనిరి. ఎందుకనీ, వారు దానిని చేయకూడదు, దానిని కలిగియుండుటకు వారు నా స్థలమునకు రావలసియున్నది." అతడు వెళ్ళకుండెను.
అప్పుడు ఆమె నిజముగా, నిర్విరామంగా ప్రార్దించుచుండెను.
కావున అప్పుడు, ఆ రాత్రి ఆ చిన్న మనుష్యుడు విశ్రాంతి లేకయుండెను. మీకు తెలుసా, ఏదో దాని గూర్చి కొంత అచ్చట ఉన్నది, నిజముగా మీరు ఒకదాని గూర్చి ఎడతెగక ప్రార్దించినట్లయితే, దేవుడు ఇరుపక్షముల వుండి కార్యము జరిగించును, చూడండి. ఆయన ప్రార్థనలకు జవాబిచ్చును.
18అందుచేత ఆ చిన్న మనుష్యుడు, ఆ రాత్రంతయూ అతడు తప్పక ఆలోచించియుండును. "నేనచ్చటికి వెళ్ళి, మరియు ఆ మనుష్యుడు చెప్పినది వినినయెడల ఎలా వుండును? ఇప్పుడు, ఆయనొక ప్రవక్త అయియున్నాడని రిబ్కా చెప్పెను. ఇప్పుడు, మనకు వందల సంవత్సరాల నుండి ఏ ప్రవక్తయూ లేడని మనకి తెలుసును, దాని గురించి నేను యాజకున్ని అడిగితిని, అందుకు అతడు, "అదొక బుద్ధిహీనత తప్ప మరేదో కాదు. ఒకవేళ ప్రవక్త రావలసినయెడల ఆయన సంఘము ద్వారా వచ్చును గదా? ఆయన ఆ విధముగానే రావలసియున్నాడు" అని అతడు పలికెను. "ఆయన మన పరిసయ్యల యొద్దకును, లేదా సద్దుకయ్యూల యొద్దకును, లేక మన గుంపు జనులయొద్దకు రావలసియున్నాడు, లేని యెడలఅతడు ప్రవక్తగా ఉండలేడు."
మీకు తెలుసా, ఆ వైఖరే నేడును వుండెను. ఆ విధముగానే రావలసియున్నదని వారు అనుకొనిరి, లేనియెడల అది సరైనది కానేరదని భావించిరి. అందునుబట్టి, వారన్నారు, సందేహం లేదు ఖచ్చితముగా గొప్పదైన ఈ కాలములో… ఆమె దానిని నమ్మియుండెను. మరియు అతడు దానిగూర్చి యూజకునితో చర్చించెను.
యాజకుడు చెప్పెను, "ఇప్పుడు ఇటు చూడు, ప్రవక్తల దినములు చాలా, చాలా సంవత్సరాల క్రితమే గతించిపోయినవి. మనం ధర్మశాస్త్రమును పొందియున్నాము. దానంతటిని మనం లిఖించియున్నాము. మనం పరిస్థితినంతటిని మన స్వాధీనములో (నియంత్రణలో) పెట్టియున్నాము. దానిని మన చేతులతో కలిగియున్నాము. మరియు మనం ఈ సంగతులను గూర్చి ఎరిగియున్నాము.
కానీ అప్పుడు, జక్కయ్య మాత్రం దానితట్టు చూడక, ఖచ్చితముగా అతడు కేవలం అనుకొనెను, దానిని నిర్లక్ష్యముగా తీసుకొని (అధికారముతో కాక, దానిని సాహసించెను), ఎందుకని, అతడు సంఘమునకు చెందినంతకాలం - అతడు అదంతయూ సరియేనని తలంచెను, అతడు చేయవలసినదంతా అదియే, అని అతడు అనుకొనెను.
అయితే రాత్రి వచ్చినప్పుడు, అకస్మాత్తుగా అతని హృదయములో ఒక కోరిక కలిగిన, "వ్యక్తి ఈ పట్టణములో ఉండినప్పుడు, బహుశా ఇలాంటి సదావకాశం, మరలా ఆయన ఇక్కడికి రాకపోవును. నేను తప్పక వెళ్ళి, మరియు నా మట్టుకు నేను పరిస్థితంతటిని పరిశీలించి కనుగొందును."
ఇప్పుడు, అదొక మంచి ఆలోచన. నీకునీవే స్వయంగా దానిని తెలిసికొనుట. విమర్శించుటకు వెళ్ళవద్దు. వాక్యమును తీసికొని, వాక్యము చేతనే దానిని పరిశీలించుము.
కావున, రిబ్కా ఒక స్త్రీ చేయకలిగినంతగా ఆమె, ప్రవక్తలేమి చెప్పారో, మరియు మోషే ఏమి చెప్పియుండెనో, మరియు ఆయన వచ్చినప్పుడు ఆయన అలానే ఉండునని వివరించుటకు ప్రయత్నించెను. కనుక ఆమె దానంతటిని అతనికి వివరించుటకు తలంచియుండెను. అయితే అతని భార్య రిబ్కా యొక్క ప్రభావము కంటే, ఆ యాజకుడి యొక్క ప్రభావమే అతనిపై అధికముగా యుండెను.
19అంతట, తెల్లవారుచుండగా, ఆ చిన్న మనుష్యుడు… రిబ్కా, నేను ఆమెను ఊహించగలుగుచున్నాను, అతడిని బలంగా త్రోయుచూ, "జక్కయ్య, నీవు అక్కడికి వెళ్ళాలని కోరుటలేదా?" అని అడుగుచుండెను.
"లేదు, దానితో నాకు ఏమి సంబంధము లేదు."
మీకు తెలుసా, రిబ్కా - నీవేమాత్రమూ విసుగు చెందవద్దు. కొన్నిసార్లు అదొక మంచి సూచన, చూచారా. ఎప్పుడైతే అతడు ఇతరమైనవి తప్ప, కేలము దానిగురించి మాట్లాడుటకు నిరుత్సాహపడినప్పుడు, కొన్నిసార్లు అదొక మంచి సూచన.
కావున, కొద్దిసేపటి తర్వాత… రిబ్కా నిద్రలో వున్నట్లు నటించెను, కానీ ఆమె ప్రార్దించుచున్నది. మరియు జక్కయ్య తన పరుపు నుండి సులభంగా జారుటను ఆమె చూచెను, మరియు చుట్టూ తిరుగుచు చక్కగా తయారవుచుండెను, మరియు అతని తలను ఆ విధముగా కొద్దిగా దువ్వుకొనుచు, శ్రేష్టమైన దుస్తులను ధరించుకొనుచుండెను. మరి ఆమె ఒక కన్నుతో అతడు చేయుచున్నదానంతటిని తొంగి చూచుచుండెను. ఆ సమయమ౦దే, దేవుడు తన ప్రార్థనకు జవాబు ఇచ్చియున్నాడని ఆమె ఎరిగియుండెను. ఎదో జరుగబోవుచున్నదని ఆమె ఎరిగి యుండెను.
కాబట్టి, మీకు తెలియునా, జక్కయ్య తాను ఎక్కడికి పోవునది రిబ్కాకు తెలియకుండుటకు - మెల్లగా తన కాలివ్రేళ్ళపై నడిచి బయటకు వెళ్ళెను. మరియు అతడు బయటకు చేరుకొనెను, మరియు బయటకు వెళ్ళి మరి వెనుకకు తిరిగి చూచెను.
1KGS 18:44
20ఆమె ఆ తెరను పైకిలేపి, అతను బయటకు వెళ్ళుటను చూచెను. "కృతజ్ఞతలు ప్రభువా, ఇప్పుడు అదంతా సరియే" అని ఆమె చెప్పుచున్నది, చూచారా. ఏలియా చేసినట్లే, "మనిషి చెయ్యియంత చిన్న మేఘమును నేను చూచుచున్నానని" అతను చెప్పెను. యదార్ధమైన మొదటి చిన్న నిరూపన, ఏదో జరుగునై యుండెను.
అతడు బయటకు వెళ్ళి మరియు విధులలోనికి వెళ్ళెను. అతడు అనుకొనెను, "ఇప్పుడు, నేను గ్రహించగలుగుదును, ఆయన ఆ దక్షిణం వైపునున్న ద్వారము గుండా పట్టణములోనికి ప్రవేశించును. అచ్చటికి వెళ్ళి నిలబడెదను." "మరియు నేను నాకొక చోటును చూచుకొని, సరిగ్గా అచ్చటనే నిలిచియుందును. మరి ఆయన లోనికి వచ్చునప్పుడు, అతడు ఎలాంటి ప్రవక్తయై యుండెనో నేను చూతును. మరియు నేను నేరుగా నడచి, మరియు నా వ్రేలును అతని ముక్కుపై పెట్టి, మరియు నేను నా యొక్క ఆలోచనను అతడికి ఇచ్చేదను," అని అనుకొనెను.
"మరియు ఆయన వచ్చునప్పుడు, ఈ ప్రార్ధన కూటములు ద్వారా, మరలాటి వాటి ద్వారా నా భార్యకు బుద్ధిహీనత కలిగినదని తెలిపెదను, వాటివలన నేనెంతో విసిగి మరియు అలసియు౦టిని. నేను వీటిని గురించి ఆయన ఏదైనా చెప్పెదను. మరి నేను ఆయనకు చెప్పెదను. మరియు నాకు తెలుసు, మా యొక్క బోధకుడు తప్పక నన్ను వీపుపై తట్టి, "జక్కయ్య నీవు మా సంఘమునకు మంచి సభ్యుడవని చెప్పును. నిశ్చయముగా నీవు ఒక మంచి వ్యక్తివి అని చెప్పును." "నేను అచ్చటికి త్వరగా దిగిపోవుదును" అని అతడు అనుకొనెను.
కావున, అతడు వెళ్ళెను…
21అతడు పట్టణపు గవిని మొదటి లేదా రెండవ వీధిని సమీపించుచుండగా, ఆ స్థలమంతయూ జనంతో కిక్కిరిసియుండుటను కనుగొనెను. వారు గోడలపై మరియు ప్రతిచోట వ్రేలాడుచుండిరి. ఏదేమైనప్పటికిని ఆయన ఇదివరకే మాట్లాడినను, ఆయన చెబితే వినుటకు ఇంకను ఎవరో అచ్చట ఉందురు. ఎవరో ఒకరు విందురు. అతడు ఈ విధముగా చెప్పియుండెను, "ఇప్పుడు ఆయనను ద్వారమునుండి వచ్చుచుండగా నేను ఏ విధముగా చూతును?" ఆ కారమందు అతడు పొట్టివాడని బైబిలు చెప్పెనని గుర్తుంచుకొండి. మరియు అతడు చెప్పెను "నేను చాలా పొట్టివాడిని." అతడు "నాకు కొంచం స్థలమియ్యుడని, ఆ చుట్టంతయూ త్రోసివేసెను."
అయినను అతడింకను క్రైస్తవుడు కాదని మీరు చెప్పగలరు, గమనించుడి, ఆ విధముగా ప్రవర్తించుచుండెను. చూడండి, "క్రైస్తవులు ఆ విధమైన వైఖరిని కలిగియుండలేరు."
"వెనక నిలువుము. నేనెవరో నీకు తెలుసా? నేను జక్కయ్యను. ఇక్కడ నేనొక భోజనశాలను కలిగియున్నాను. నా మర్గము నుండి ప్రక్కకు మళ్ళుడి."
"చూచారా, ఇప్పుడు అది క్రైస్తవ్యం కాదు, మరియు అతడు క్రైస్తవుడు కాదని ప్రతి ఒక్కరు ఎరిగియున్నారు. వారిలో కొందరు రిబ్కా ప్రార్దించుచున్నదని ఎరిగియుండిరి. వారు చెప్పిరి "మంచిది, మంచిది, నీవు వెనుక నిలువుము."
22మరి అందుచేత ఆ జనసమూహమంతటిలో ఆయనను చూడటం ఎంతమాత్రం కుదరదని అతడికి అర్థమయ్యెను. అందుచేత తన తలంపులన్నిటిని వ్యక్తపరచుట వీలుకాకపోయెను. "మంచిది, ఇప్పుడు నేనేమి చేయవలెను? బహుశా ఇంటికి తిరిగి వెళ్ళి ఆ విషయమంతటిని మరచిపోవుదునని," అతడు తలంచెను. అయితే మీకు తెలుసా? దానిగూర్చి అచ్చట ఏదోయున్నది, ఎప్పుడైతే ఆయనను చూడాలని నీవు నీ మనసునందు సిద్ధపడితే, ఆయనను చూడకుండునట్లు నిన్నేది ఆపలేదు. అది ఏమైనప్పటికి దాన్ని నేను లెక్క చేయను, నీవు స్థిరముగా ఉందువు. మరియు యేసును తాకవలెనని ఆ చిన్న గ్రీకు స్త్రీ స్థిరముగా ఉండెను.
మరియు దానిగురించి ఎదో ఉన్నది, ఆయనను చూడాలని నీవెప్పుడైతే - నీ మనస్సునందు సిద్దపరచుకొందువో, నిన్ను ఏదియూ ఆపలేదు. అయితే గుర్తుంచుకొనుడి, నీవు నీ మనస్సున స్థిరముగా నిశ్చయించుకొనినప్పుడు, అప్పుడే దయ్యము నిన్ను ఆపుటకు చేయవలసిన ప్రతి ప్రయత్నము చేయును. దానిని నీవు అర్ధం చేసుకోకూడదని, దానిని నీవు చూడబోవని సాతాను నిర్ణయించుకొనును. ఆయనను నీవు చూడకుండునట్లు, సాతాను తాను విసరవలసిన ప్రతి నల్లని దుప్పటిని నీ దారిలో అడ్డుగా విసురును.
23కావున అక్కడే అతడి యొక్క నిరోదించు మొదటి అడ్డుకట్ట యుండెను.
కనుక అప్పుడు, అతడు ప్రారంభించి. అనుకొనెను, "మంచిది, నేను…" మరి అతడు పైకి చూడగా, అచ్చట అతని పోటీదారులు కొందరుండిరి. మరి వారు, అతనిని ఎరిగినవారిలో కొంతమంది సంఘ సభ్యులు అచ్చట నిలిచి చూచుచుండిరి. ఆ విధముగా అతడు అచ్చట నిలిచిన ప్రవక్తయగు నజరేతువాడైన ఈ యేసును గూర్చి ఎంతో ఎగతాళి చేసెను, అదే గుంపులో అతని సంఘ సభ్యులలో కొంతమంది అతని వైపు చూచుచుండిరి. తాను నిలిచియున్న అదే సమూహములో అక్కడే వారును ఉన్నారు. అతడు దాగుకొనలేకపోయెను. అతడు గుర్తించబడెను.
ఇప్పుడు జక్కయ్య, ఇదివరకే నీవు గుర్తించబడితివి. కావున మీకు తెలుసా, ఇక్కడ ఎవరైనా వున్నట్లయితే, ఇదివరకే నీవు గుంపులో కలుపబడియుంటివి. కావున, ఇంతకుమునుపే నీవు ఇక్కడ ఉన్నవని వారు ఎరిగిరి. కావున మనము కూడా ఇచ్చట పరస్పర పరిచయం కొరకు ఒకటిగా కూడి వచ్చితిమి.
JOHN 1:1
24కాబట్టి అతడు, "మంచిది, ఇచ్చట ఇదొక వింతగా ఉన్నది" అనెను. మరియు అతడు చుట్టూ చూచి, ఇక్కడ ఒకరు నిలబడటును కనుగొనెను, మరియు…
మరి నీకు తెలుసా, వారంతా కేవలము ఇంచుమించు నీవలేనే వారు ఏదో చూడగోరుచున్నారు. తాను ఎచటో ఆవలి నుండి వచ్చితినని ఒకడు ఎరిగివుండును. తాను విడిచి వెళ్ళునప్పుడు తాను తిరిగి ఎక్కడికో వెళ్ళిపోవును. మరి అతడు ఎల్లప్పుడూ తాను ఎక్కడ నుండి వచ్చి ఎచ్చటికి పోవుచున్నాడో కనుగొనుటకు ప్రయత్నించుచున్నాడు. దానికి ఒకే ఒక్కడు సమాధానము కలిగియున్నాడు — అది దేవుడే. ప్రతి మనుష్యుడు ఆ తెరవైపే చూడగోరుచుండెను. మరి అటువంటి దానిని నీవు కనుగొనునట్లయితే — నీవు ఎక్కడికి వచ్చితివో, మరియు నీవు ఎవరివో, ఎక్కడి నుండి వచ్చితివో, అను మొదలగునవి ఆ తెరకు ఆవల వున్నవాటిని నీకు చూపును.
వ్రాయబడిన లక్షల టన్నులకొద్ది గ్రంధములన్నిటిలో ఒకే ఒక గ్రంధమున్నది. ఇది నీవు ఎక్కడి నుండి వచ్చావో, ఎక్కడికి వెళ్ళుచున్నావో, నీకు తెలుపునది ఈ గ్రంధమే. బైబిల్ తప్ప మరే గ్రంధం అది చేయలేదు. వాక్యము దేవుడని బైబిల్ చెప్పుచున్నది.
25ఇప్పుడు, అరచుచు, ఏడ్చుచుచూ, ఎంతో గట్టిగా కేకలు వేసి, ఎంతో కలవరపరిచే, మరియు బుద్ధిలేని వారిగా నటించే ఆ గుంపు మధ్యలో తానున్నానని ఈ మనుష్యుడు గ్రహించెను. కావున, అతడు కేవలం వారితో గుర్తించబడి, అక్కడ కూర్చొండెను. అందుచేత అతడు అక్కడ ఉండవలసియుండెను. అక్కడ అతడు చేయగలిగినదంతయూ అదే. "మంచిది, నేనింత దూరం వచ్చియున్నాను, నిజముగా నేను ఆయనను కనుగొనువరకు వెళ్ళనని," అతడు చెప్పెను.
ఇప్పుడు, జక్కయ్య, అదొక మంచి ఉద్దేశ్యమైయున్నది. ఇక్కడ అల్పాహరమునకు వచ్చితిరి, కావున మనం ఆ విధముగా వెళ్ళుదాం. చూడండి, మనమందరము ఇంతదూరం వచ్చియున్నాము కదా!
కాబట్టి వారు ఆ విధముగా వెళ్ళుచుండగా అతడు చెప్పెను, "ఇప్పుడు నేను ఇక్కడే ఉండినయెడల, నేనాయనను చూడలేను, ఎందుకనగా నేను చాలా పొట్టివాడిని. అందుచేత మీకు తెలుసా, ఈ వైపు నుండి బయటకు వెళ్ళి మరియు క్రిందికి పరుగెత్తి, ఆ మూలన నిలుచుటకు నాకై ఒక మంచి స్థలమును ఆ దారి అంచునా పొందుకొందునని అనుకొనుచున్నాను. మరియు ఆయన ఆ విధముగా వచ్చుచుండగా, తిన్నగా ఆ వీధులలోనికి నడుచుకొంటూ వెళ్ళి, ఆయనను గూర్చి నేను ఏమి తలంచుచున్నానో ఆయనతో చెప్పుదును. ఆయనకు నా స్వంత అభిప్రాయమును ఇచ్చెదను.
26కావున, అతడు ఆ గుంపును విడిచి మరియు ఆ క్రిందికి వెళ్ళెను. "ఇప్పుడు, ఆయన ఏ మార్గమున వెళ్ళునని" అతడు ఆలోచించెను.
మంచిది, హల్లెలూయ మార్గమున క్రిందకి అతడు వెళ్ళెను. మీరు గమనించండి, సాధారణముగా ఆయన ఆ మార్గముననే ప్రయాణించును. మరియు "ఆమేన్ మలుపుకు," అక్కడ నుండి అది భుజించు స్థలమునకు వెళ్ళెను. మీకు తెలియునా, అదింకా మీరు వెళ్ళు: "హల్లెలూయా మార్గము" మరియు "ఆమేన్ మలుపు." మరియు అప్పుడే నీవు వాక్యమును భుజించుటకు సిద్దముగా ఉన్నావు.
ఆ విధముగా అతడు ఈ మూలకు దిగిపోయెను, మరియు ఆ మూలన నిలుచుని చెప్పెను, "ఇప్పుడు ఇచ్చట ఎవ్వరూ లేరు, మరియు నేను…" (ఇది కొంచెం హాస్యాస్పదముగా వినపడవచ్చును, కానీ నేను… ఒక నిమిషం ఉండండి.) మరప్పుడు, మొదటి విషయం మీకు తెలియునా, అతడు ఈ మూలకు దిగివచ్చి, మరియు అతడు చెప్పెను, "ఇక్కడ ఎవరును లేరు, అందుచేత నేను ఇక్కడే నిలబడుదును. ఆయన వచ్చునప్పుడు, ఆయన ఎటువంటి ప్రవక్తయో నేను చూచెదను. తిన్నగా నేను ఆ వీధిలోకి నడిచి, ఆయనకు నేను ఒక విషయము చెప్పెదను."
27కావున అతడు అచ్చట నిలిచి, అతడు ఆలోచించసాగెను, "ఇప్పుడు ఒక నిమిషము. మీకు తెలుసా, ఒకవేళ అక్కడ నేను చాలా పొట్టిగా ఉన్నట్లయితే, ఆయన ఎక్కడికిపోవునో అక్కడికి బహుశా ఆ సమూహమంతయూ వెళ్ళిపోవును. మరియు నేను ఆయనతో మాట్లాడుచుండగా, ఎవరూ నన్ను ఆటంకపరచుట నేను కోరుట లేదు. నేనాయనతో చెప్పగోరుచున్నాను, ఆయన నేను చెప్పునది వినును. వారు 'ఆమేన్ మరియు హల్లెలూయ,' మరియు 'దేవునికీ మహిమ,' 'ప్రభువు పేరిట వచ్చు ఆ ప్రవక్తకు హోసన్న' అనుచు కేకలు పేడితే — అప్పుడు ఆ గోలలో నేను చెప్పేది వారు ఎంతమాత్రం వినరు. కావున ఒకే ఒక కార్యం అక్కడ వున్నది. అప్పుడు వారందరు నా చుట్టూ గుమికూడుదురు. మరప్పుడు నేను కనీసం ఆయనను ఏ మాత్రమూ చూడలేను."
కాబట్టి అతడు ఆ మూలన నిలిచి చూడగా, మరి ఒక పురాతన మేడిచెట్టు అక్కడ వుండెను — అదొక మంచి ఇండియానా చెట్టు. ఆ విధముగా ఆ మూలపై నిలిచి, "మంచిది, నేను అక్కడ ఆ పెద్ద కొమ్మపైకి ఎక్కి, నేను అక్కడ పైన ఉంటే, అప్పుడు ఆ వైపు ఆయన వచ్చుచుండగా, నిజంగా నేనాయనతో చెప్పవచ్చునని" అని అతడు ఆలోచించెను.
28కనుక అతడు పరుగెత్తి వచ్చెను, మరియు అతడు చాలా పొట్టివాడు. ఆ కొమ్మపైకి ఎక్కలేకపోయెను. అతడు చెప్పెను, "మంచిది, ఇప్పుడు నేను చేయగల ఒకే కార్యమున్నది." అక్కడ, పట్టణపు చెత్తపడేసే కుండి ఆ మూలనున్నది. కాబట్టి ఇప్పుడు, "మంచిది, ఒకవేళ నేనచ్చటికీ పోయి, ఆ చెత్తవేయు కుండిని ఇక్కడకు తెచ్చినట్లయితే, అప్పుడు దానిమీద నుండి పైకి సులువుగా నేను ఎక్కుటకు అది నాకు సహాయపడునని" అతడు అనుకొనెను.
కనుక అతడక్కడికి వెళ్ళెను. మరప్పటికి ఆ ఉదయమున ఆ చెత్తను తీసేసే యంత్రము ఇంకా రాలేదు. కనుక అది చాలా బరువుగా వుండెను. అంతే కాక, అతడు చాలా పొట్టివాడైయున్నందున, దానిని కదపలేకపోయెను. దాన్ని ఎత్తవలెననగా, దానిచుట్టూ చేతులేసి పట్టుకోవాలి. అతడు మంచి వస్త్రమును ధరించియుండెను. కాబట్టి, మీకు తెలుసు, ఎప్పుడైతే మీరు యేసును చూచుటకు ప్రయత్నించుదురో అక్కడ ఎల్లప్పుడూ ఆటంకములు ఉండును. అయితే అది మంచి వస్త్రమైనను కాకపోయినను, అదేమైనను, అతడు యేసును చూడగోరెను. కాబట్టి అతడు ఆ చెత్తకుండి చుట్టూ తన చేతులువేసి, దానిని అచ్చటికి తెచ్చుకొనెను. కావున, అతడు తనపై చెత్త అంతయూ పడుచుండగా, దానిని అచ్చటికి మోసికొని వచ్చెను. మంచిది, ఏ వ్యత్యాసము లేదు — ఏదేమైనను అతడు ఆయనను చూడగోరెను.
ఆ విధముగా అతడు ఆ చెత్తకుండి చుట్టూ తన చేతులు వేసి లాగుచుండగా, ఎవరో నవ్వినట్లు అతడు వినెను. చుట్టూ చూసెను, "మంచిది, నీకు తెలుసా! జక్కయ్య తన రెస్టారెంట్ నుండి ఒక క్రొత్త ఉద్యోగమును పొందెను. అది ఆ చెత్తను తొలగించు పనియైయుండెను." అతని పోటీదారుడైన లావెన్స్కి అక్కడ నిలబడి అన్నట్లుగా బహుశా అతనికి అనిపించినది.
మీకు తెలుసా, నీవు యేసును చూడకుండా ఉండునట్లు దయ్యము నీ మార్గములో తాను విసరవలసిన ప్రతిదానిని నీకు అడ్డుగా వేయాలని కోరును. "వారొక పరిశుద్ద గుండ్రాళ్ళ గుంపు" అని వాడు నీకు చెప్పును. "వారొక మూర్ఖపు గుంపుకు చెందినవారనీ" వారు నీకు చెప్పెదరు. "వారు కేవలం, వారి గురించి పెద్దగా చెప్పుకోవల్సిందేమి లేదు. వారు కేవలం ఆ పట్టణపు పనికిరాని చెత్తవంటివారని," వాడు చెప్పును. వాడు ఏమైనా అనగలడు, కానీ నీవు మాత్రం ఆయనకు చూచుటకు నీ హృదయములో నిశ్చయించుకొనినయెడల, అప్పుడు దేవుడే నీకు ఆయనను చూచే మార్గముకు చూపును, దానిని మీ మనస్సులో ఉంచుకొనుడి. ఆ ఆకలి నీ హృదయంలో రగిలినయెడల ఏదో కార్యం జరుగును — ఏదో ఒక కార్యము. ఏది ఏమైనను, నీవాయనను చూచెదవు.
కనుక, అది ఏ వ్యత్యాసమును చేయలేదు. చిన్న వృద్ద ముఖము ఎర్రబారెను. మరియు అతడెంతో ఇబ్బందిపడెను. అతడు ఆ చెత్త కుండిని పట్టుకొని మునికాళ్ళ మీద ప్రాకి పైకి ఎక్కెను. (అది మంచిది, ప్రాకుట? దక్షిణాదివారగు మీకు "ప్రాకుట" అనగా ఏమిటో తెలుసు. అది చెట్టు ఎక్కుట.) చెట్టుపైకి ఎక్కి. మరియు అతడు అక్కడికి ఎక్కి, తన రెండు కాళ్ళను చెట్టు రెండు కొమ్మల మద్యలో వుంచి, అక్కడ కూర్చొండెను.
ఇప్పుడు కూర్చొనుటకు మంచి చోటైయున్నది, ఎందుకనగా అక్కడ అది రెండు మార్గములు కలిసే చోటుగా వున్నది. నీ మార్గము మరియు దేవుని మార్గము — నీ ఉద్దేశ్యము మరియు ఆయన ఉద్దేశ్యము, కూర్చొని దానిగురించి ఆలోచించుటకు అదొక మంచి సమయమై యున్నది. ఆయన గూర్చి నీ సొంత తలంపులు, మరియు ఆయన ఏమైయున్నాడని ఆయన వాక్యం చెప్పుచుండెను; ఆయన ఏమైయున్నాడని నీవేమి తలంచుచున్నావో, అలాగే ఆయన ఏమైయున్నాడని, ఆయన వాక్యము చెప్పుచున్నదో; నీ ఆలోచనకు ఈ కాలవర్తమానము ఏమైయున్నదో, మరియు ఆయన వాక్యమునకు కాలవర్తమానము ఏమైయున్నదో తలంచుట అదే వ్యత్యాసము. అక్కడ కూర్చొని దానిని గురించి కొద్దిసేపు ఆలోచించుము.
29సందేహమే లేదు, సాతాను అతని యొక్క భుజముపై కూర్చొని, "ఏమిటో నీవెరుగుదువా? చూడటానికి నీవెంతో అందంగా అగపడుచున్నావు, ఇక్కడ కూర్చొని చేతులతో కొద్దిపాటి కొమ్మలను విరుచుచున్నావు; నీవు మంచి వస్త్రములు ధరించి వచ్చావు.. అయితే దానిపై చెత్త పడినది. మరి నీవు ఇక్కడ కూర్చొన్న సంగతి పట్టణమంతయు ప్రచారము చేయబడును. నీపై పరిహాసములు అన్నీ చెప్పబడును. నీవు ఇక్కడ కూర్చొని నీవెంత మూర్ఖపు పనిచేసియున్నావు" అని వాడు పలికెను. సాతానుని గమనించండి… నీవు ఎప్పడైతే ఒకదానిని ప్రారంభిస్తావో, అప్పుడు నీవు ఒక తప్పు చేసావని నీకు చెప్పుటకు అతడు ప్రయత్నించును.
అక్కడతడు ఆ స్థితిలో కూర్చొని "మంచిది, అతడొక ప్రవక్తని రిబ్కా చెప్పెను. నేను అతనిని విచారి౦తును. అతడు ప్రవక్తయో కాదో, నేను చూచెదనుని" చెప్పెను. "ఆయన ఈ వైపుగా వచ్చునప్పుడు, ఇక్కడ నేను ఉన్నానని ఆయన తెలిసికొనకుండునట్లు, నన్నునేను మరగుచేసికొందును. మొదటిగా, నేను ఆయనను ఒక మారు చూచెదను. మరియు నేను ఆయనను చూచునప్పుడు, ఈ చెట్టు నుండి దూకి క్రిందికి వెళ్ళి, ఆయనతో చెప్పుదును. అతడు అనుకొనెను, "ఇప్పుడు ఒకవేళ ఆయన… ఆయనొక ప్రవక్తయైన యెడల, ఆయన ప్రవక్తని రిబ్కా చెప్పినప్పటికీ, అదే నిజమైతే, నేను ఈ చెట్టుపై ఉన్నానని ఆయన నన్ను తెలిసికొననిమ్ము. అప్పుడు నేను ఆయనను నమ్ముదునని చెప్పుదును."
కావున అతడు కనబడకుండా, అతడు ఆకులన్నిటిని మరగుచేసికొనుటకు తన చుట్టూ లాగుకొనెను, మరియు బయటకు చూచుటకు ఒక ఆకును వదిలి, ఆయన మూలను తిరిగుచుండగా చూచుటకు ఆకుల వెనుక దాగుకొనెను.
EXOD 28:33-35•
EXOD 39:26•
LUKE 19:37-40
30మరప్పుడు అతడు దానంతటిని గూర్చి ఆలోచించుకొనుచూ, అక్కడ కూర్చొండెను. కొంతసేపటి తర్వాత, అతడు ఆ మూల నుండి ఒక శబ్దము వచ్చుట వినెను. అది వింతగా వున్నది. ఆయన ఎక్కడెక్కడ ఉండునో అక్కడంత ఎల్లప్పుడు ఆధికమైన ధ్వని వుండును. మీకు తెలుసా, ధ్వని (శబ్దము) జీవమునకు సూచనయై యున్నది. ప్రధానయాజకున్ని జ్ఞాపకముంచుకొనుడి, అతడు వస్త్రములు ధరించి పరిశుద్ద స్థలము నుండి అతిపరిశుద్ద స్థలమునకు వెళ్ళునప్పుడు, అతని వస్త్రపు చెంగుకు చివరన బంగారపు దానిమ్మ మరియు ఒక గంటను అతడు కలిగియుండెను. మరియు అతడు అతిపరిశుద్ద స్థలములోకి వెళ్ళినప్పుడు, అతడు బ్రతికేవున్నాడా లేడా అని బయట నిలిచియున్నవారు తెలిసికొనే ఏకైక విధానం — ఆ శబ్దము. మరియు ఎప్పడైతే ధ్వని వచ్చుట ఆగునో అప్పుడు, అతడు చనిపోయి యుండును.
మంచిది, నేడు అదే మన సంఘములలో ఎక్కువగా ఉన్న సంగతి. అక్కడ దానిగురించి సరిపడునంతగా శబ్దములేదు, సరిపడునంత ఉత్సాహములేదు, సరిపడునంత ఆసక్తి లేదు.
మరి, యేసు ఎక్కడ ఉండునో, అక్కడ ఎల్లప్పుడు శబ్దము ఉండును. ఒకసారి, ఆయన యెరూషలేమునకు వచ్చినప్పుడు, "ప్రభువు పేరిట వచ్చు రాజుకి జయమని" చెప్పుచూ వారు అరచుచూ, కేకలు పెట్టిరి.
మరి ఆ యాజకులలో కొందరక్కడ నిలిచి, "ఎందుకు, వారు ఆ విధముగా అరచుచున్నారు, ఊరకుండుమని" గద్దించిరి.
"వీరు ఊరకుండిన యెడల, ఈ రాళ్ళు కేకలు వేయునని" ఆయన చెప్పెను. ఆయనయందు విశ్వాసముంచువారి సమీపాన ఆయన ఉన్నప్పుడు, (గమనించండి, మరప్పుడు) ఏదో కదిలిక జరుగువలెను.
31మరియు అప్పుడతడు ఆ మూల నుండి ఈ శబ్దము వచ్చుటను మరియు కేకలను వినియుండెను. "మంచిది. ఆయన తప్పక సమీపించుచున్నాడు," అని అతడు అనుకొన్నాడు. అతడు తన ఆకును సైకిలాగి, మరియు దానిలోనుండి చూచుటకు లేచెను. "ఇప్పుడు, నేను ఆయన పూర్తిగా దగ్గరకు వచ్చాడు. ఆయనెటువంటి ప్రవక్తయో మనం చూచెదము." కావున అతడక్కడ, ఆ చెట్టుపై అందరి తలలకు పైగా ఉండి, తనపై ఆకులు కప్పుకొని, అక్కడ కూర్చొని మరియు వారందరు ఆ చెట్టు క్రింద నుండి వెళ్ళుచుండగా చూచుచుండెను.
కాబట్టి, ఆ మూలనుండి మొదటిగా ఒకడు వచ్చుటను గమనించి, అది తప్పక అపోస్తలుడైన పేతురు అయి యుండవచ్చును, ఎందుకనగా అతడు ఆకారములో పెద్దగా, దృఢముగా, లావుగా ఉండెను. అతడు ఆ గుంపును వెనుకకు త్రోయుచు, "స్నేహితులారా, నన్ను మన్నించండి. మన బోధకుడు గడిచిన రాత్రి ఒక గొప్ప పరిచర్యను కలిగియుండి, చాలా ప్రభావమును తనలోనుండి కోల్పోయెను. మీకు అర్ధమగును. కావున బోధకుడు వచ్చుచుండగా, దయతో కొంచెం ప్రక్కకు నిలుచుదురా? దయతో జరగండి" అని చెప్పుట నేను చూచుచున్నాను.
మరి, ఇక్కడికి మత్తయి, మార్కు మరియు మిగతావారితో నుండి చెప్పుచుండిరి. "ఇప్పుడు మేము కఠినముగా నుండాలని కాదు. మేము ఆ ఉద్దేశ్యముకై ఇక్కడ లేము. అయితే మా బోధకుడు ఎంతోగానో అలసియుండి, ఇంకను ఆయన అల్పాహారము తినకయుండెను. కావున మేము… మీకిష్టమైతే ప్రక్కకు జరగమని మిమ్మును వేడుకొనుచున్నాము."
32అక్కడొకడు నిలిచియుండెను, జక్కయ్య అతని వైపు చూచియుండవచ్చు. కొద్ది దినముల క్రితం ఒక వ్యాపార స్థలమునందు ఒకానొక కూటములో ఒక వైద్యుడు అక్కడ ఉండియుండెను. మరియు ఈ చిన్న వ్యక్తి తనకొక కుమార్తెను కలిగియుండి, జ్వరముతో పీడించబడి, మరియు ఆమె బ్రతుకుట కొరకు అతడు చేయవలసినదంతయూ చేసియుండెను.
మరి జక్కయ్య, తన ఆకును పైకిలేపి, మరియు ఈ మనుష్యుడు ఆ మూలన ఈ దుప్పటిలో బిడ్డను చుట్టుకొని వచ్చుచున్న మనుష్యుని చూచెను. "ఆ తండ్రి కేవలం ప్రవక్తయని పిలువబడు అతనిని వెంబడించుటకు ప్రయత్నించుచు, ఆ తండ్రి ఎంతటి మూర్ఖమైన పని చేసియుండెనని, తలంచెను. "అతడు ఆ మూల తిరిగి, జ్వరముతోనున్న బాలికతో వచ్చి వెలుపల ఈ గాలిలో నిలిచెను" అని అనుకొనెను.
కానీ, మీకు తెలుసా, నీవు నిజంగా నమ్మినయెడల, జక్కయ్యవలే నిన్ను కూడా ఆపేది ఏదియు ఉండదు. ఆమె తన బిడ్డను ఆయన యొద్దకు తేగోరెను. వారు ఒక మలుపును లేదా తిరిగిన ప్రతిసారి, అతడు వెనుకకు నెట్టబడెను. కానీ, అతడు ఒక మూర్ఖపట్టుగలవానిగా వెళ్ళుచుండెను. చివరిగా, ఈ మూలవద్ద ఆ చిన్న తల్లి తన చేతులలో బిడ్డతో వచ్చెను. మరియు ఆమె క్రింద పడియుండవచ్చు. మరియు ఆమె, "ప్రభువా, నా బిడ్డను కరుణించమని" అడిగెను — మరియు జక్కయ్య స్నేహితుడగు ఆ బిడ్డయొక్క తండ్రియు అక్కడ ఉండి ఎంతగానో ఏడ్చుచుండెను.
"అతని వైఖరిని ఏది మార్చినది?" అని అతడు అనెను. కావున ఆ గుంపులో ఉన్నది ఎవరోయని అతడు ఇంకను గ్రహించలేకపోయెను. ఆయన ఆ గుంపులో ఉండెను.
అకస్మాత్తుగా ఈ చిన్న దుప్పటిపై ఒక హస్తము చాచి తాకుటను అతడు చూచెను. వెంటనే ఆ చిన్న బాలిక ఆ దుప్పటిని తీసివేసి, ఆ వీధిగుండా గంతుల వేయుచూ వెళ్ళెను. (ఇప్పుడు, దానికి ఏదో ఉండవలసియున్నది, జక్కయ్య.)
LUKE 19:5
33చివరకు ఆయన కనిపించెను. ఒక్కసారి ఆయన వైపు చూచి, జక్కయ్య తన ఉద్దేశ్యమును మార్చుకొనెను — కేవలం ఆయన యొక్క ఒక్క చూపు. అక్కడాయన ఉండెను. ఆయన మనుష్యునివలె అగుపించలేదు. ఆయనెంతో భిన్నముగా కనబడెను. మృదువుగా, సాధువైనట్టుగా, జాలిగా, కనబడెను; అయినను, ఆయన పలికినట్లయితే, ఈ లోకమంతయూ అంతమగునట్లుగా కనబడెను. అతడు ఆలోచించియున్నదానికి వ్యత్యాసమైన గుణలక్షణముతో ఆయన ఉండెను. అంతట జక్కయ్య వైఖరిలో మార్పు… అతడు ఆయనను చూచినప్పుడు, అతని కఠిన-వైఖరియంతయూ కడిగివేయబడెను. ఆయన నడుచుకొంటూ, ఆ వీధి క్రిందికి వచ్చెను… అతడు ఆ చిన్న ఆకు గుండా చూచుచు, ఏమి జరుగబోవుచు వుండెనని ఆలోచించుచుండెను. ఆయన అలా నడుచుకొంటు అతడున్న చోటు దగ్గరకి వచ్చెను. మరియు అతడు చెప్పెను, "మీకు తెలుసా, ఆ మనుష్యుడు ఒక ప్రవక్తయైయుండెనని రిబ్కా చెప్పినది నిజమైయుండును. లేఖనము గూర్చి నాకన్న ఆమెకు ఎంతో బాగుగా తెలిసియుండవచ్చు."
కావున తిన్నగా ఆయన అక్కడికి దీనముగా, మృదువుగా, ఎప్పటివలే — తల దించుకొని నడచుచూ వచ్చెను — ఆయనకు జనులు అడ్డురాకుండా శిష్యులు చేయుచుండిరి. మరి ఆయన ఆ చెట్టు క్రిందకి రాగానే, ఆయనక్కడ నిలిచి పోయెను — జక్కయ్య ఆ చెట్టు కొమ్మలో నుంచి తొంగి చూచుచుండెను. ఆయన చెట్టు పైకి చూచి, "జక్కయ్య కిందికి దిగుము" అని చెప్పెను.
అతడు ఆ చెట్టుపై నుండెనని ఎరుగుట మాత్రమే కాక, అతని పేరు జక్కయ్య అని కూడా ఆయన ఎరిగియుండెను. తాను చెట్టు నెక్కేటప్పుడు శ్రమపడినట్టుగా కాక, ఇప్పుడు ఎంతో సుళువుగా దిగివచ్చెను. ఆయన అతడిని ఎరిగియుండెను. అతని పట్ల ఆ అద్భుతము జరిగియుండెను.
LUKE 19:8,9
34చూచారా, అతడు చెప్పెను, "ప్రభువా, నేను ఇప్పటి వరకు తప్పులో వున్నాను. నేను తప్పులో ఉన్నానని ఒప్పుకొనుటకు నేను సిద్దముగా యున్నాను. నేను అన్యాయముగా దేనినైన తీసికొంటే, నేను దానిని తిరిగి చెల్లింతును. నా ఆస్తిలో సగము బీదలకిచ్చెదను."
"నేడు నీ ఇంటికి రక్షణ వచ్చియున్నది," అని యేసు చెప్పెను.
అతనిని మార్చినది ఏమిటి? సహోదరుడా, సహోదరీ, ఆ మార్పు ఏమైయుండెను? ఒక క్షణము ఆలోచించుము. అతడు ఏదో నిజమైన దానిని చూచెను, మరదే అతనిని మార్చెను. చేయబడిన వాగ్దానములన్నింటిని అతడు వినుచు వచ్చెను. వాటిగురించి యూజకుడు చెప్పుచు, గొప్ప ప్రవక్త మోషే, ఈ గొప్ప, ఆ గొప్ప, లేక భవిష్యత్తులో ఒక గొప్ప దానిని వాగ్దానము చేయుచుండెను; కాని దానిని చూస్తూ ప్రస్తుతం జరుగుదానిని పట్టించుకోకుండెను. అది మానవుని యొక్క పద్ధతి.
అతడు వాస్తవమైనదానిని చూచెను, తనకుతాను దానిని చూడగలిగెను. అతనిపట్ల ఆ అద్భుతము జరిగియుండెను. ఆయనే ఆ ప్రవక్తయై యుండెను, ఎందుకనగా అతడు ఆయనను ఎరుగలేదు; అది కానియెడల అతడిని ఆ చెట్టుపై ఆయన ఎన్నడూ కనుగొనియుండేవాడు కాదు. అయితే ఎప్పుడైతే ఆయన ఆ చెట్టు క్రిందికి వచ్చెనో, ఆయన అక్కడ ఆగి, పైకి చూచి, "జక్కయ్య క్రిందికి రమ్ము. నేడు నీ ఇంటికి రక్షణ వచ్చియున్నది," అని అనెను.
HEB 13:8
35సహోదరులారా, మనుష్యుని యొక్క మనస్సును మార్చి, వారి వైఖరులను మార్చునదియే నిజమైన కార్యము. కొన్నిసార్లు దానిని పొందుకొనుట అంత సుళువేమి కాదు. అయితే, "నేను ఒక విమర్శకుడిగా ఉండను. కాని ఆయన ఏమైయుండెనో అని నేను లేఖనములను అధ్యాయనము చేసి తెలిసికొందును," అని ఈ ఉదయమున నీవు క్రీస్తును సమీపించే ఉద్దేశ్యముతో నీ హృదయమందు ఉండినట్లయితే. ఈ రాత్రి ఆయన కూటమునకు వచ్చియున్నయెడల…
మీరు రావడానికి మునుపే, ఆయన ఏమై యుండెనో కనుగొనుడి. గతములో ఆయన ఏమై యున్నాడో, నేడును ఆయన అదేరీతిగా ఉండవలసియున్నాడు. ఆయన యొక్క… గడిచిన రాత్రి నేను మాట్లాడిన విధముగా, (మీలో చాలామంది ఇక్కడ ఉండినట్లయితే, గమనించండి), దేవుడు తన గుణలక్షణముల ద్వారా గుర్తించబడుచున్నాడా? ఎల్లప్పుడు ఆయన ఆ విధముగానే ఉండవలసియున్నది, ఎందుకనగా ఆయన నిన్న, నేడు, నిరంతరము ఒక్కటే రీతిగా ఉన్నవాడు. పురుషుల హృదయాలు చాలా… దేవునికి భయపడు ఒక నిజమైన స్త్రీ లేదా పురుషుడు, వ్యాపారవేత్తయైనను, లేదా అది ఏమైనప్పటికీ, అతడు ఎల్లప్పుడూ… ఒకవేళ దేవుని గురించిన భయం అతడు కలిగియుండినయెడల, దేవుని గురించి తెలిసికొనవలెనని అతని హృదయములో ఎదో ఉండి యుండును.
36జక్కయ్యకు ఏమి జరిగియుండెనో నేనింతవరకు మీకు చెప్పియుండ లేదు, అని అనుకొనెదము. కాని అతడు యెరికోనందు సంపూర్ణ సువార్త వ్యాపారస్తుల పరిచర్య సభ్యులలో ఒకనిగా మారెను, చూడండి. మొదటిగా నేను అతని గురించి మీకు చెప్పాలనుకొంటున్నాను, చూచారా. ఎందుకు ఖచ్చితముగా, అతడు సంపూర్ణ సువార్త తప్ప మరేదియునై యుండకపోవచ్చు. కచ్చితముగా కాదు. యేసు బోధించినదంతా అదియే. కావున అతడు అక్కడ ఒక సభ్యునిగా మారెను. మరి నీవు కూడా తప్పక అలానే సభ్యునిగా ఉండవలసియున్నది.
ఇప్పుడు, గమనించండి. అయితే అతడు నిజమైనదానిని చూడగోరెను. అతడు తనంతట తాను లేఖనానుసారముగా గుర్తించబడిన ఒకదానిని కనుగొనినప్పుడు, దానికొరకు అతడు సిద్దపడెను. అది నిజమైన సంగతులే విలువగలవైయుండును…
37ముగించు ముందుగా ఒక చిన్న కథ. ఇక్కడున్నవారిలో, వేటాడువారు ఇక్కడ ఎంతమంది యున్నారు? సహోదరులారా! మేము మీ హస్తములను చూచెదము. ఓ, మై! నేను ఒంటరిగా లేనని తెలిసికొనియున్నాను. వేటాడుటను నేను ప్రేమించుదును, మరియు నేను న్యూ హంప్శైర్ నందలి, ఉత్తర అరణ్యమునకు నేను వెళ్ళుచుండేడి వాడిని, అది తెల్లని దుప్పులకు నివాసమైయున్నది. వాటిని వేటాడుటను నేనెంతో ప్రేమించుదును! మరియు ప్రతి సంవత్సరము అచ్చటికి నేను వెళ్ళుచుంటిని. మరియు ఎప్పుడూ నాతో పాటు వేటాడు బెర్ట్ కౌల్ అను ఒక మంచి వ్యక్తిని కలిగియుంటిని. మరియు ఎల్లప్పుడూ అరణ్యమునకు వెళ్ళుట నా స్వభావమైయున్నది. నేను అరణ్యములో జన్మించి, మరియు ఆ విధముగానే నేను అక్కడ పెంచబడితిని, మరి నా మార్పుచెందుట కూడా దానిని నా నుంచి వేరుచేయలేకపోయెను — అలా వేట కొరకు కాదు కాని, కేవలము అరణ్యములో ఉండుటకు నాకు ఇష్టము.
దేవుడక్కడ ఉన్నాడని నేననుకొనుచున్నాను. ఆయన ఎలా చలించుచున్నాడో చూచుటకు వెళ్ళుచుందును, ప్రకృతి, అది ఎలా చనిపోయి భూమిలోకి పోయి, పునరుత్తానము ద్వారా తిరిగి ఎలా పైకి వచ్చుచున్నదో, అక్కడ గమనించుదును… సూర్యుడు ఉదయకాలం పైకి లేచును, అనగా ఒక చిన్న బిడ్డ జన్మించుట, అటు తరువాత తొమ్మిది గంటలకు పాఠశాలకు పోవును, మరియు పది గంటలకు అది ముగియును, పన్నెండు గంటలకు అది బలము పొందుకొనును, మధ్యాహ్నమందు అది ఇంచుమించు నావలె వయస్సు కలిగి, మరియు అయిదు గంటలకు ఆది ఎనబది సంవత్సరములో వృద్ధుడై చనిపోవును. అది క్రిందికి దిగిపోవును — అది దేవుని ఉద్దేశ్యమును నేరవేర్చినది. అది చనిపోలేదు; అది మరలా మరుసటి ఉదయమున (సూర్యుడు) తిరగి వచ్చును. అక్కడ దేవుడు - జీవము మరణము, పాతిపెట్టబడుట, పునరుత్థానముల గూర్చి సాక్ష్యమిచ్చుచున్నాడు.
వెలుపలనున్న చెట్లను గమనించుడి. శీతాకాలము వచ్చుటకు ముందుగా చెట్టులోని ఆ రసమంతయూ క్రిందనున్న వేరులోనికి పోయి, చివరికి అది రాలిపోవును. అదేమి చేయుచుండెను? సమాధిలోనికి పోవుచుండెను. అటు తరువాత ఏమి జరుగును? అది మరలా తిరిగి వసంత ఋతువులో వచ్చును. అది చనిపోలేదు. అది క్రిందికి వెళ్ళి నేలలో ఉండి, తిరిగి వచ్చును. అది అక్కడే ఉండినట్లయితే శీతాకాలము దానిని చంపివేయును, చూశారా. అక్కడ విత్తనము దాని యొక్క స్వంత జ్ఞానాన్ని కలిగి యుండుట లేదు; అది దేవుడు ఏర్పరచిన మార్గమైయున్నది. కావున అది ఆవిధంగానే దేవుడు ఏర్పరచిన మార్గమును వెంబడించును: క్రిందికి వెళ్ళి, శీతాకాలమంతయూ దాచబడి, క్రొత్తజీవముతో మరుసటి సంవత్సరమున మరలా వెనుకకు వచ్చి — అక్కడ జీవము, మరణము, పాతిపెట్టబడుట, పునరుత్తానము ఉన్నవని సాక్ష్యమిచ్చుచున్నది. ప్రతిచోటను అది ఆ విధముగానే ఉండును, దేవుడు గొప్పదైన తన సృష్టిలో ఉండి, తన్ను గూర్చి సాక్ష్యమిచ్చుచున్నాడు.
38ఈ వేటగాడు మంచి గురిని కలిగినవాడై ఒక మంచి వేటగాడిగా ఉండెను. కానీ అతడు నేను కలిసినవారిలో క్రూరమైన వ్యక్తిగా ఉన్నాడు. ఎల్లప్పుడూ అతడు నన్ను గేళి చేయుచుండెను. అతడు జింకపిల్లలను కాల్చి చంపెను. ఇప్పుడు, చట్టము జింకలను చంపమని ఆ విధముగా చెప్పినచో, అది తప్పు కాదు. కానీ మీకు తెలుసా, అబ్రహాము ఒక దూడను చంపి, దానిని దేవునికి భోజనము పెట్టెను, కావున అది లింగబేధములను చూచుట లేక ఆకారము చూచుట కాదు; వైఖరి ముఖ్యము. నన్ను బాధపెట్టుటకే అతడు వాటిని చంపును.
"ఓ, నీవు ఇతర యాజకులవలె పిరికివాడవు" అని అనేవాడు. "బిల్లీ నీవు ఒకవేళ బోధకుడవు కాకపోయినచో, మంచి వేటగాడిగా వుండేవాడవు" అని చెప్పెను. "అయితే నీవు చాలా పిరికి వాడవు. అందును బట్టియే నీవు ఆ బోధకులతో యున్నావు. "వారును పిరికి వారని" చెప్పెను.
మరియు నేను చెప్పితిని, "బెర్ట్, నీవు క్రూరమైనవాడవు." ఏదేమైనను అతడు బల్లి కన్నుల వంటి కన్నులను కలిగియుండెను. మరియు అతడు చెప్పెను… మీకు తెలుసా, అతడు స్త్రీలు వారి కన్నులకు రంగులు వేసికొనునట్లుగా, ఆ విధముగా దానిని చేయును.
అతడు ఆ విధముగా చూచి, మరియు అతడు చెప్పెను, "నీవు కేవలం పిరికివాడవు."
అతడు ఆ చిన్న జింకపిల్లలను చంపును. కేవలం నన్ను బాధపెట్టుటకు ఒకదానిని చంపి, దానిని ఆ విధముగా పడవేసి, మరియు ఆ విధముగా మరొకదానికై వెళ్ళెను.
మరియు అతడు చెప్పెను, "కొద్ది దినములలో నిన్ను ఆ బోధ నుండి బయటకు తెచ్చెదనని" చెప్పెను.
మరియు నేను చెప్పితిని, "ఓ, లేదు, బెర్ట్. లేదు, లేదు."
39ఒకనాడు… ఆకురాలు కాలములో ఆలస్యముగా నేను వెళ్ళితిని, ఆ కాలము కేవలం వారం మాత్రమే వేటాడుటకు అనువువుగా వుండెను, అప్పటికే నేను తీరిక లేకుండా ఉంటిని. గతంలో నేను ఇండియానా రాష్ట్రము యొక్క క్రీడా సంరక్షణాధికారిగా ఉంటిని, సరిగ్గా వేటాడే ఆ ఋతువంతయూ తీరిక లేకుంటిని, తరువాత నేను కొద్ది విశ్రాంతి కొరకు సెలవు తీసికొంటిని, అందువలన కొంచెం ఆలస్యముగా నేనక్కడికి వెళ్ళితిని. ఆ తెల్లని తోక గల దుప్పులు, కాల్చుటకు అవి చిక్కవు. ఇంధ్రజాలికుడైన హౌడిని గూర్చి, తప్పించుకొనుటలో అతని చాకచక్యమును గూర్చి మీరు మాట్లాడదురు. మై! వాటి ముందు అతడు ఏ మాత్రమూ సరిపోడు. మరియు కావున, అవి నిజముగా దాగుకొనియుండును. నేను వేటకెళ్ళినప్పుడు చంద్రుని వెలుతురు బాగా ఎక్కువగా వుండేను, నేలపై ఇంచుమించు ఆరు అంగుళముల వరకు మంచును పడుచుండెను, వాటిని వెంబదించుటకు అనువుగా ఉండెను.
అప్పుడు బెర్ట్, నేనుండిన గుడారమునకు వచ్చి, "బిల్లీ, ఈ సంవత్సరమునకు నేను నీ కొరకు ఒక మంచి దానిని తెచ్చియున్నానని" చెప్పెను.
అంతట నేను "ఏమిటది?" అని అడిగాను.
అతడు జేబులోనికి చేయి చాచి, దానిని బయటకు తీసెను. అతడు ఒక చిన్న ఈలను కలిగియుండెను. అతడు దానిని ఊదెను, మరియు అది ఒక చిన్న జింకపిల్ల దాని తల్లి కొరకు ఏడ్చుచున్నట్లుగా శబ్దం చేసెను. చిన్న జింకపిల్ల తన తల్లి కొరకు ఏడ్చుటను మీరెరుగుదురా!
"బెర్ట్, ఏ విధంగా నీవింత క్రూరమైనవాడిగా ఉండగలవు?" నేను అడిగితిని, "అట్టి విధముగా నీవు చేయకూడదు."
అతడు చెప్పెను, "హా, హా! నీవు పిరికి బోధకుడవనెను."
40ఆ దినము మేము వేటకు వెళ్ళితిమి, మరియు మేము జఫర్సన్ అంచుపైకి వెళ్ళితిమి. అతని గురించి మీరు బాధపడనక్కరలేదు; తన దారిని తిరిగి ఎట్లు కనుగొనవలెనో అతనికి తెలియును. కావున ఇంచుమించు మధ్యాహ్నం సమయం వరకు మేము పైకి ఎక్కితిమి, అటు తరువాత మేము చెరొక దారికి వెళ్ళితిమి. మరియు మేము జింకను పొందినట్లయితే, దానిని పైన వ్రేలాడజేసి. వెళ్ళి, మా గుర్రములను తీసికొని దానిని తెచ్చుటకు వెళ్ళదుము.
అందుచేత, ఇంచుమించు పదకొండు గంటలకు మేము చేరుకొంటిమి. అయితే జింక కాదు కదా, కనీసం వాటి జాడ కూడా మాకు కనిపించలేదు — వాటి యొక్క అడుగు జాడలు ఒక్కటైనను కనపడలేదు. దుప్పులన్నియు పండుకొని యుండెను. మరియు చెట్లు నరుకువారు వాటిపై భాగములను పడవేసిన చోట అవి సేదదీర్చుచుండెను. మరియు దూరముగా అవి దాగుకొనెను, ఎందుకనగా ఇంతకమునుపు అవి కాల్చివేయుటకు గురిపెట్టబడియుండెను. అవెంతో భయపడియుండెను.
41ఇంచుమించు పదకొండు గంటలకు, బెర్ట్ ఆగి కూర్చొనెను. అక్కడొక చిన్న తెరవబడినట్టుగా, ఓ, ఈ భవనమంతా ఆకారంలో మరియు లోపల దీని రెండంతలుగా పరిణామం కలిగి అక్కడ ఒక చిన్న ద్వారముండెను. అతడు కూర్చొండి, దేనినో తీయుటకు తన చేతినిలోనికి పోనిచ్చెను. బహుశా అతడు తన ధర్మాస్ ను తన ధరించిన కోటులో నుండి బయటకు తీయబోవుచున్నాడని నేను అనుకొన్నాను. సాధారంగా మేము వేటకి వెళ్ళినప్పుడు మాతో పాటుగా వేడి చాక్లెట్ పానము గల ధర్మాస్ ను తీసుకోని వెళ్ళుదము, ఎందుకనగా అది శక్తిని ఇచ్చును. ఆ తరువాత సాండ్విచ్ రొట్టెను మేము తీసుకొని మరియు వేట కొరకు తలో వైపునకు విడిపోదుము.
మేము పైనున్న కలప దుంగలవైపు వెళ్ళితిమి, కనుక బెర్ట్ తన సాండ్ విచ్ రొట్టెను తీయబోవుచున్నాడని అనుకొన్నాను. కనుక అతడు తన ధర్మాస్ తీయుటకు కూర్చున్నాడు, అతడు బయటకి తీయునని అనుకొన్నాను. నేను కూడా నా తుఫాకిని చెట్టుకు తగిలించి, నా దానిని తీయుచుంటిని. కానీ అతడు ఏమి తీయుచున్నాడు, అతడు తన జేబులో నుండి ఆ చిన్న ఈలను బయటకు తీసెను.
దానిని బయటకు తీసి ఊదెను. మరియు ఎప్పుడైనా ఒక చిన్న జింకపిల్ల ఏడ్చుటను ఎవరైనా విన్నారా? ఏమైనను అది జాలిని కలిగించేదిగా ఉండును. ఆ ఈలను ఊదగానే, సరిగ్గా అతనికి ఎదురుగా తల్లియైన ఒక పెద్ద జింక వచ్చి నిలబడుట నాకు ఆశ్చర్యము కలిగించెను. ఇప్పుడు ఆ "డౌ" (doe) తల్లియైన జింక. కావున ఆ విధముగా అక్కడ నిలిచి యుండెను. అక్కడ ఆమె తన పెద్ద గోధుమవర్ణపు కన్నులు విభాగించి, ఆ విధముగా తన చెవులను పైకి నిలుచునట్లుగా చేసెను. గమనించండి, తన బిడ్డ ఆపదలో ఉండెను.
42మరియు అతడు మరలా ఊదెను, ఆమె చుట్టూ చూచెను. మరియు ఆమె ఆ విశాలము లోనికి నడుచుకొంటూ వెళ్ళెను. ఇప్పుడు ఒక జింక అలా చేయుట అసాధారణమని వేటాడు మీలో ఎవరికైనా తెలియును. అక్కడికి ఆమె నడుచుకొంటూ వెళ్ళెను. దాని పెద్ద కన్నులను నేను చూడగలను. అది నాకు ఇరవై అడుగుల దూరములో కూడా లేదు. మరియు నేను ఆలోచించితిని, "ఓ బెర్ట్ నీవు దానిని చేయకూడదు, మరియు ఆ దీన అందమైన తల్లిని చంపుట, అది తన బిడ్డకై వెదకుచూ మరియు నీవు దానిని ఆ విధముగా మోసపరచుచున్నావు."
మరియు ఈ ఈలను ఊదగా మరియు అది… అది అక్కడకు నడుచుకొంటూ వెళ్ళెను. మరి మీకు తెలుసా? ఆ వేటగాడు రైఫిల్ మీటను పైకి లేపి, రక్షణగా ఉంచుటకు ఆ తుపాకీ వున్న రక్షణ మీటను ఆపివేయుటకు నొక్కేను. అది దానిని విని, మరియు చుట్టూ గమనించి వేటగాడిని చూచెను. దాని చెవులు పైకి లేచెను. సాధారణముగా అవి అప్పటికే పారిపోవును; మరియు చెప్పాలంటే - ఆ దినమున, ఆ సమయమునాకు, అది అక్కడకు వచ్చియుండేది కాదు.
కానీ మీరు గమనించుడి. అది ఒక తల్లి, దానిలో ఏదో, కొంత నిజమైనది ఉండెను. కనబరచుకొనుటకు అది ఆ విధముగా ప్రవర్తించుటలేదు. అదొక తల్లియై యుండెను. అదొక తల్లిగా జన్మించి యుండెను. మరియు దానిబిడ్డ ఆపదలో ఉండెను. మరియు అది దానికి ఆసక్తి కలిగించునదిగా ఉండెను.
43మరియు అతడు బల్లి-చూపు వంటి కన్నులతో నా వైపు చూచి, మరియు కన్నులను పెద్దగా తెరచెను. నేను చెప్పితిని, "బెర్ట్ దానిని చేయకుము, దానిని చేయకుము," అతడు ఇంకొద్దిగా పెద్దగా తెరచి, ఆ రైఫల్ తో వెనుకకు తిరిగెను.
ఓ, మై! మరియు ఆ నమ్మకమైన తల్లి గుండె పైకి వ్రేలాడుచున్న దాని వెంట్రుకలు వచ్చుటను నేనెరుగుదును. అతడు దాని గుండెను చీల్చునట్లుగా దానిని పేల్చివేయును. అది చనిపోవును చూచారా? అది ఇరువది గజములంత దూరాన కూడా నిలబడిలేదు. పెద్ద నూట-ఎనబది యూనిట్ల… నూట-ఎనబది యూనిట్ల పుట్టగొడుగు వంటి తూటా, మరియు ఇరుప్రక్కల అతడు దానిగుండెను చీల్లివేయునట్టుగా దానిని పేల్చియుండేవాడు. నేననుకొన్నాను, "తన బిడ్డ కొరకు వెతుకుచున్న ఆ ప్రియమైన తల్లిగుండెను పేల్చునట్లుగా, నీవు అంత క్రూరముగా ఎలా ఉండగలవు? నీవు దానిని ఎలా చేయగలవు, బెర్ట్?" అని నాలోనేను అనుకొనుచున్నాను.
అతని చేతులు క్రిందకు స్థిరముగా వుండెను. ఆ దృశ్యాన్ని నేను చూడలేకపోతిని, అసలు చూడలేకపోతిని. అందుకే వెనక్కి తిరిగితిని. దానిని నే చూడలేకపోతిని. అచ్చట నిజమైన, నమ్మకంగల ఆ తల్లి నిలబడియుండెను. అది కపటమైనది కాదు. దేనినో ఆకర్షించుటకు అది ఆ విధముగా ఉంచబడలేదు. అదొక తల్లియైయుండెను. అందునిమిత్తమే అది దానిని చేయుచున్నది. మరణము దానికి లెక్కలేదు. దానిబిడ్డ శ్రమలో యుండెను. అది తన ప్రాణముకన్న అధికముగా తన బిడ్డ కొరకు ఆలోచించెను. వేటగాళ్ళు ఏదైనా పేల్చనివ్వుడి, నమ్మకమైన దాని హృదయంను మాతృత్వముకై కొట్టుకొనుచుండెను, దానిలోని మాతృత్వము పిలుచుచుండెను. దాని బిడ్డ కేకలు పెట్టుచున్నది. దానిలో కొట్టుకొనుచున్నదేదో, అది నిజమై యుండెను.
క్రూరుడైన ఆ వేటగాడు నమ్మకమైన దానిగుండెను ఏ విధంగా పేల్చివేయగలడు? నేను దానిని చూడలేకపోయాను. నేను నా తలను త్రిప్పివేసితిని. "ప్రభువైన దేవా, అతడు దానిని చేయకుండునట్లు చేయమని" నేను తలంచితిని. నేను ఈ విధముగా నిలిచితిని, తుపాకీ పేలుటను నేను చూడదల్చుకోలేదు. అదెంతో ఘోరం, నేను వేచియుంటిని. తుపాకీ ఎంతకీ ప్రేలుటలేదు. నేను చుట్టూ తిరిగి చూచాను, మరియు అది అలానే పోవుచున్నది. అతడు దానిని చేయలేకపోయెను. అతడు చుట్టూ తిరిగి చూచి, మరియు నావైపు చూచెను. మరియు అతని పెద్ద కన్నులు మారిపోయెను. కన్నీళ్ళు అతని చెంపల పై నుండి కారుచున్నవి. అతడు నావైపు చూచెను. మరియు అతని పెదవులు వణుకుచుండెను. మరియు అతడు ఆ తుపాకీని మంచు దిబ్బపై విసిరి, నా కాలు యొక్క వస్త్రమును గట్టిగా లాగి, నన్ను హత్తుకొనెను. "బిల్లీ, ఇది నాకు చాలును, నీవు మాట్లాడుచున్న ఆ యేసునొద్దకు నన్ను నడిపించమని" చెప్పెను.
అక్కడ ఆ మంచు దిబ్బలో, నేను అతనిని ప్రభువైన యేసునొద్దకు నడిపించితి, ఎందుకని? అతడు ఒక యదార్థమైనదానిని చూచెను. అతడు అన్ని రకములైన సంఘములోనికి వెళ్ళి యుండెను. అతడు ఏదో పైకి కనబడుచున్న దానిని చూచి యండలేదు. అతడు యదార్థమైనొక దానిని కనుగొనెను.
44స్నేహితులారా, మనము సంఘ విధులను, నియమాలను, మరియు సిద్దాంతాలను మరియు అన్నింటినీ, మనం కలిగివుండవచ్చు. కానీ నిజమైన యదార్థమైన యేసు అక్కడ ఉన్నాడు. ఇప్పుడు మనము తలలు వంచియుండగా, ప్రార్థనలో ఆయనవైపు చూచెదము. మీ తలలతో పాటు మీ హృదయములను కూడా వంచి యుండగా నేను మిమ్మును ఒక ప్రశ్న అడుగగోరుచున్నాను, క్రైస్తవ్యమును విశ్వసించి, మీరు కలిగియున్న విశ్వాసమంతటీతో ఒప్పుకొనీన వారెవరైనా ఇక్కడ యున్నారా?మీలో ఎంతమంది యదార్థమైన ఆ తల్లియైన జింకవలె, మీరు కలిగియున్న ప్రాణముకంటే లేదా మీరు కలిగియున్న ఏదైననొక దాని కంటేను అధికమైనదిగా అగుపించు ఒక క్రైస్తవునిగా ఉండగోరుదువా?
మరి నీవు, దీనిని చెప్పవచ్చు, "సహోదరుడా బ్రెన్హా౦, నేను సంఘమునకు చెందియున్నాను. నేనొక వ్యాపారము చేయు పురుషున్ని, వ్యాపారము చేయు స్త్రీని, లేదా గృహిణిని. కానీ నిజముగా ఆ విధమైన క్రైస్తవునిగా ఉండుటకు లోకమును ప్రక్కకు నెట్టివేసి, విమర్శను లేదా మరేదైనను సంహించే, ఆ తల్లియైన జింక ఉండినట్లు - నా హృదయమందు ఒక క్రైస్తవునిగా నేను ఉందగోరుదును."
ఇప్పుడు మీ తలలు వంచి, మీ కళ్ళు మూసియుండగా, కాలము ముగించబడుచుండగా దేవుని యెదుట, క్రీస్తు నామములో నీ చేయు పైకెత్తుదువా? అని మిమ్మును అడుగుచున్నాను. స్థలము లేకపోవుట వలన బలిపీఠపు పిలుపును చేయలేక పోవుచున్నాను. కానీ, "సహో బ్రెన్హా౦, నా గురించి ప్రార్దించుము, ఆ తల్లియైన జింకవలె ఒక క్రైస్తవునిగా ఉందును," అని చెప్పండి. దేవుడు నిన్ను దీవించును. అక్కడ అంతటను హస్తములు లేపబడియున్నవి. "క్రైస్తవునివలె నన్ను ఉండనిమ్ము …"
ఇప్పుడు జక్కయ్య, నీ చేయిని పైకెత్తినప్పుడు, అది ఆయన నిన్ను కనుగొని యున్నాడని సూచించును. ఇప్పుడు, ఎందుకు నీవు ఆ చెట్టు నుండి కిందికి దిగకూడదు? నేడు ఆయన నీతో, నీ ఇంటికి విందుకు వచ్చును. నీ దినములన్నిటను ఆయన నీతో నిలిచియుండును.
45పరలోకపు తండ్రీ, ఆయన సన్నిధికై ప్రభవైన యేసుకు కృతజ్ఞలమైయున్నాము. సంవత్సరముల నుండి స్త్రీ మరియు పురుషులుగా మరియు వారిలో కొందరిని క్రైస్తవులుగా ఉండునట్లు చేయువంటినొక దానిని మేమెరిగియున్నాము. కానీ, జక్కయ్య వలె వారు, అంగీకరించినవారికి కారణమగు ప్రస్తుత సంబంధమైనది ఉండి క్రీస్తు చేత తాకబడి, దానిని చేయుటకు వారిలోనున్న ఏదో వారికి చెప్పెననుటకు సాక్ష్యముగా వారి చేయిని పైకెత్తియున్నారు.
ఇప్పుడే వారు యేసును ఎరుగునట్లు దయచేయుము. ఆయన ఈ త్రోవను రానైయుండెనని మరియు ఆయన వచ్చెనని ఎరుగునట్లు అనుగ్రహించుము. ప్రభువా, అక్కడ నూట-ఏబది హస్తములు పైకెత్తి యుండెనని నేను ఊహించుచున్నాను. ప్రతి ఒక్కరిని దర్శించి, ఒక నిజక్రైస్తవుని వలె ఉండుటకు వారికి యదార్థతను అనుగ్రహించుము. నిరుత్సాహపరచుటకు లోకము ఎంతగానో ప్రయత్నించినను, ఇతరులు నిన్ను అధైర్యపరచుటకు ప్రయత్నించినప్పటికి అద్దరికి చేరుటకు ఒక పోరాటమున్నదని మేము ఎరుగుదుము గాక. కానీ నిజమైన దానితో కలుపబడినప్పుడు, అప్పుడది మిమ్మును మార్చును.
ప్రతి హృదయమును మార్చి, ప్రభువా, ఈ సమయములో ప్రతి ఒక్కరిని దేవుని సన్నిధిలో ఉండునట్లు పరిశుద్ధాత్మను వారి జీవితములో పెట్టుము, జింక ఎలాగైతే తల్లివలె ఉన్నదో అదే విధముగా క్రైస్తవులుగా ఉండునట్లు అనుగ్రహించుమని ప్రార్ధన చేయుచున్నాను. ఆమె ఒక తల్లిగా జన్మించెను. మరియు వారు దేవుని ఆత్మచేత జన్మించి, యేసుక్రీస్తును వెంబడించే నిజమైన వారుగా ఉందురు గాక.
నిత్యమైన గృహమునకు మమ్మును కొనిపోవు ఆ గడియ వరకు ఉండునట్లు మాలో ప్రతి ఒక్కరితో మా గృహములకు వచ్చుదువు గాక, యేసు నామమున దీనిని మేము అడుగుచున్నాము. ఆమేన్.
46దయతో మీకు కృతజ్ఞతలు. ప్రభువు మిమ్మును దీవించును. చాలా సమయము మిమ్మును ఉంచితిని. పది గంటలకు ఇక్కడ నుండి నేను వెళ్ళవలసినవాడను. పది-నిమిషాలు-తక్కువ-పదకొండు కావొచ్చుచున్నది. దేవుడు, అనాగరిక, బలహీనమైన, కలవరంతో కూడిన ఈ చిన్న మాటలను తీసికొని మీ హృదయములో నింపునని నేను నమ్ముచున్నాను. గుర్తుంచుకొనుడి, క్రీస్తును గురించిన యదార్థమైనది ఒకటి ఉండియున్నది. దేవుడు మిమ్మును దీవించున గాక.