ఆత్మీయ మతిమరుపు

ఆత్మీయ మతిమరుపు

1దేవుని వాక్యము నిమిత్తము ఇప్పుడు మనము ఒక క్షణము ఆలాగే నిలిచియుందము. ఆమోసు గ్రంథమును త్రిప్పుదము. ప్రవక్తయైన ఆమోసు పుస్తకములో మూడవ అధ్యాయము, మొదటి వచనము నుండి ప్రారంభించెదము.

సోదరి జానిట మరియు అన్నా జేనే, మరియు సోదరి మూర్, పాడిన ఆ ప్రియమైన గానములకు నేను వందనములు తెలుపుటకు ఇష్టపడుచున్నాను. వాటిని వినుచుండగా వెనుకటి తలంపులకు అవి నన్ను కొనిపోయినవి. మనము గత కూడికలలో ఉన్నప్పుడు వారు మనతో కలసిపాడిన పాటలను జ్ఞాపకమునకు వచ్చినవి. నేను సహోదరుడు జాక్తో మాట్లాడుచున్నప్పుడు, వారి కుమార్తెలు, ఆ బాలికలు వారి పదహారేండ్ల వయస్సులో చూడచక్కని వారుగా, మంచి బాలికలుగా ఉండెడివారు. సోదరి అన్నా జేనేకు, ఐదుగురు పిల్లలున్నారని తలంచుచున్నాను. సోదరి జానిట ఇద్దరు బిడ్డలకు తల్లియాయెను. స్త్రీలారా, మనము నిజముగా అస్తమయమునకు సమీపముగా ఉన్నాము, పదహారు సంవత్సరముల వ్యత్యాసములో అప్పటికన్నను ఇప్పుడింకా అధిక సమీపముగా ఉన్నాము. అదెంతో దూరము కాదు. ఆ మహిమ కాలమును మనము దాటి వెళ్ళుదము.

AMOS 3:1-8

 

2ఇప్పుడు అమోసు 3వ అధ్యాయమును చదువుదము.

ఐగుప్తు దేశము నుండి యోహోవా రప్పించిన ఇశ్రాయేలీయులారా, మిమ్మును గూర్చియు ఆయన రప్పించిన కుటుంబము వారినందరిని గూర్చియు ఆయన సెలవిచ్చిన మాట ఆలకించుడి.

అదేమనగా భూమి మీది సకల వంశములలోను మిమ్మును మాత్రమే నేను ఎరిగియున్నాను; గనుక మీరు చేసిన దోష క్రియలన్నింటిని బట్టి మిమ్మును శిక్షింతును.

సమ్మతింపకుండ ఇద్దరు కూడి నడతురా?

ఎర దొరకక సింహము అడవిలో గర్జించునా, ఏమియు పట్టుకొనకుండనే కొదమ సింహము గుహలో నుండి బొబ్బపెట్టునా?

భూమి మీద ఒకడును ఎరపెట్టకుండ పక్షి ఉరిలో చిక్కుపడునా? ఏమియు పట్టబడకుండ ఉరి పెట్టువాడు వదలి లేచునా?

పట్టణమందు బాకా నాదము వినబడగా జనులకు భయము పుట్టకుండునా? యెహోవా చేయనిది పట్టణములో ఉపద్రవము కలుగునా?

తన సేవకులైన ప్రవక్తలకు తాను సంకల్పించిన దానిని బయలుపరచకుండా, ప్రభువైన యెహోవా యేమియు చేయడు

సింహము గర్జించెను, భయపడని వాడెవడు? ప్రభువైన యెహోవా ఆజ్ఞ ఇచ్చియున్నాడు, ప్రవచింపకుండు వాడెవడు?

మనము తలలు వంచుదము.

3ప్రభువైన యేసు, ఇది నీ వాక్యమై యున్నది. ప్రభువా, మేము ఈ రాత్రి ఈ వాక్యభాగము చుట్టూ చేరి సహవాసము చేయబోవుచున్నాము. ప్రభువా, ఈ పాఠ్య భాగములో ఉన్న భావమును మాకు దయచేయుమని మేము ప్రార్ధి౦చుచున్నాము. దానిని మేము కొనిపోవుచుండగా, అది నీకు మహిమ తెచ్చును గాక. ప్రభువా, మేము ఈ రాత్రి నీ వాక్యము కొరకు వేచియుండగా మమ్ము ఆశీర్వదించుము. వ్యాధిగలవారిని, బాధలలో ఉన్నవారిని స్వస్థపరచుము, నశించిన వారిని రక్షించుము. ప్రభువా, బలహీనులను బలపరుచుము; ఆత్మీయముగాను, శారీరికముగాను బలహీనులగుచున్నవారిని బలపరచుము. నీ ప్రసన్నతను మా పై కుమ్మరించుమని యేసు నామములో అడుగుచున్నాము. ఆమేన్.

ఈ పాఠ్య భాగము నుండి "ఆత్మీయ మతిమరుపు," అను అంశమును తీసికొనుటకు నేను ఇష్టపడుచున్నాను.

4మరిచిపోకండి, రేపటి దినమున, రోగుల కొరకు ప్రార్థన చేయబడును. మధ్యాహ్నము 2.00 గంటలకు జరుగు కూడికలలో, దేవుడు గొప్ప కార్యములను చేయునని ఎదురు చూచుచున్నాము. మనము అప్పుడు మన ఆరాధనను ప్రారంభించెదము. ప్రార్థన అట్టలను ఇచ్చుటకు గాను ఒక బాలుడు ఇక్కడున్నాడు. ప్రార్ధి౦పబడుటకు ఇష్టపడు ప్రతివారు ప్రార్ధి౦పబడెదరు. రేపటి దినము ప్రభువు నందు మనము గొప్ప సమయమును ఎదురు చూచుచున్నాము.

ఇప్పుడు వేరే పట్టణము నుండి వచ్చిన వారు ఇచ్చట యున్నారు. పట్టణమంతటను మంచి సంపూర్ణ సువార్త సంఘములున్నవని జ్ఞాపముంచుకొనుడి. వాటన్నిటికిని మీరు ప్రేమతో ఆహ్వానింపబడుచున్నారు.

వెలుపల నా తోటి కాపరులలో ఒకరితో మాట్లాడుచున్నప్పుడు, సహోదరులు జాక్సన్, ఆయన ఒక మెథడిస్తు సంఘస్తుడుగా ఉండెను. ఆ సంఘము మనమున్న దానికి క్రింది భాగమున ఉన్నది. ఆ సంఘములో ఉన్నవారిక్కడ ఎందరున్నారు, మీ చేతులను చూడనివ్వండి, ప్రతి స్థలమందున్నారు. మై! మీరిక్కడుండుటలో నేనెంతో సంతోషించుచున్నాను. నేను ఇండియానాకు వెళ్ళుటకు ముందు ఇది చివరి కూడికగా ఉన్నది. నేను త్వరగా వచ్చుటకు యోచించుచున్నాను. ఇక్కడ ఒక గుడారమును నిర్మించిన తరువాత ఆ చివరి ఏడు బూరలను, ప్రభువు చిత్తమైతే మాట్లాడుదము.

అందువలన ఇప్పుడు, రేపటిని గురించి జ్ఞాపకముంచుకొనండి. మరచిపోకండి. రేపటికి 2.00 గంటలకు, ఇప్పుడు దీని తరువాత ఆరాధన మరుసటి వారములో జరుగును, ఫ్లోరిడాలోని, టంపా అను స్థలమందు జరుగును.

5ఇప్పుడు నేను "ఆత్మియ మతిమరుపు," అను అంశము పై మాట్లాడనున్నాను.

ఇప్పుడు, మనము పాఠములోనికి వెళ్ళుటకు ముందు ఒక్క క్షణము ఈ చిన్న వ్యక్తి, ఆమోసు వెనుకటి చరిత్రను గూర్చి పరిశీలించెదము. అది సమరయలోని గొప్ప వైభవ కాలమందు జరిగినది. ఇశ్రాయేలు నిజముగా వర్ధిల్లినది. ఇశ్రాయేలు లోకమును అనుసరించి దానిని వెంబడిస్తూ వర్ధిల్లినది. లోకరీతిగా వర్ధిల్లుట ఎల్లప్పుడు ఆత్మీయ ఆశీర్వాదము కానేరదు, అయితే కొన్నిసార్లు దానికి వ్యతిరేకముగా ఉండును. లోకరీతిగా ఐశ్వర్యములో వర్ధిల్లుటను దేవుడే నిన్ను దీవించెనని జనులు తలంచెదరు. అది సత్యము కాదు. కొన్నిసార్లు అది వేరు విధముగా ఉండును.

AMOS 1:1•

AMOS 7:14

 

6అయితే ఇతనిని మనము చూచినప్పుడు, ఆ చిన్నవానిని గూర్చి మనకంతగా తెలియదు, అతనిని గురించి మనకు ఎలాంటి చరిత్రయు లేదు. అతడెక్కడ నుండి వచ్చాడో అది మనకు తెలియదు. లేఖనముల ప్రకారము అతడొక కాపరియని మాత్రము మనకు తెలియుచున్నది. అయితే దేవుడు అతనిని పైకి తెచ్చాడు.

సమరయలోని ఒక ఉష్ణ దినమందు దానిని చూచి నేనూహించగలను. ఆ పట్టణము ప్రపంచములో, అతి గొప్ప విహారయాత్రిక స్థలముగా ఉండినది. ఈనాడు మనము చూచినట్లైన "మయామి" లా౦టి లేక హాలివుడ్, లేక లాస్ఏంజెలిస్, అలాంటి వాటిలో ఒకటిగా ఉండినది. ఒక గొప్ప విహార యాత్రీక స్థలముగా ఉండినది. మనము అతనిని ఊహగా చూడగలము… అతడు అటువంటి పట్టణములో ఎప్పుడు గాని జీవించలేదు. అయితే అతని యొద్దకు ప్రభువు వాక్యము వచ్చినందున, ప్రతీచోటా ఘోర పాపముతో నిండిపోయిన ఆ గొప్ప పట్టణమునకు అతడు వచ్చుచున్నాడు. అక్కడున్న సేవకులందరు దేవుని వాక్యము నుండి దూరమైపోయారు. అనేక సంవత్సరములుగా వారికి ఒక ప్రవక్త యైనను లేకుండెను.

7అందువలన, ఈ చిన్నవాడు సమరయలోని ఉత్తర భాగమున ఉన్న కొండలపై నిలచినప్పుడు, అతడు ఆ పట్టణమును ఏ విధముగా చూచుచున్నాడో నేను ఊహించగలను, ఎర్రని సూర్యుడు ప్రకాశించుచుండగా అతడి ముఖములోని నెరిసిన గడ్డముతో, అతడి కండ్లను చిట్లి౦చుచూ, ఎర్రని ఎండకు అతడి బట్టతల నిగనిగలాడుచుండగా, అతడు ఆ పట్టణమును పరిశీలించుచుండెను. అతడి కండ్లు ఆ పట్టణమును తీక్షణముగా చూచుచున్నవి. యాత్రికులు సాధారణముగా పట్టణములోనికి వెళ్ళి ఆ చుట్టూ వున్న అందమైన పరిసరాలను మరియు దానిలోని గొప్పవాటిని చూచెదరు. అయితే అతడేమి చూచుచున్నాడనగా, ఒకప్పుడు దేవుని పట్టణముగా ఉండిన ఈ పట్టణము, అప్పటికి దిగజారిపోయినదై నీతిని విడచినదై భ్రష్టత్వముతో నిండిపోయినది. అది ఆ విధముగా మారిపోయినందునకు అందులో ఎలాంటి ఆశ్చర్యము లేదు.

8ఎవరిని ఎరుగని ఈ చిన్నవాడు, ఆమోసు అను ప్రవక్తగా ఉన్నాడు.

అతనిని గురించి మనకంతగా తెలియదు. అతడెక్కడ నుండి వచ్చాడో అదియు మనమెరుగము. ప్రవక్తలు తెలియకనే దృశ్యములోనికి వచ్చి తెలియకుండానే మరుగైపోవుదురు. వారెక్కడ నుండి వచ్చారో, ఎక్కడికి వెళ్ళుచున్నారో మనకు తెలియదు. వారి పుట్టుపూర్వోత్రాలు కూడా మనకు తెలియదు. దేవుడు వారిని తెచ్చుచున్నాడు.

అతడిని చూచుటకు ఏ గొప్పతనము అతడిలో లేకున్నను, అతడు ప్రభువు సెలవిచ్చుచున్నాడను దానిని కలిగి యుండును. నేను చూచు ప్రధాన కార్యమదియే. బహుశా అతడు తన మొదటి ప్రచారమును ప్రారంభించుటకు గాను, సమరయకు అతడు వచ్చి యుండవచ్చు. అతనికి ఎవ్వరి నుండియు ఎలాంటి సహాయము లేదని నేను ఖచ్చితముగా ఎరుగుదును. అతనికి ఏ సంస్థ నుండియు ఎలాంటి ప్రాతినిధ్య సహవాసపు పత్రికను పొందియుండలేదు. అతడు ఏ సమూహమునకు చెందినవాడని చూపుటకు ఎలాంటి ప్రాతిపదికలు అతనికి లేవు. అయితే, అతడు ఒక దానిని మాత్రము కలిగియున్నాడు, అది ఆ పట్టణము కొరకైన ప్రభువు యొక్క వాక్యముగా ఉన్నది.

ఒకవేళ ఈ ఆమోసును మన దినమునకు పోల్చినట్లయిన మనమతనిని మన పట్టణమునకు ఆహ్వానించియుందుమా, అని నేను ఆశ్చర్యపడుచున్నాను. మన ఈ కాలములో మనమాయనను అంగీకరించెదమా లేక వారు ఆ దినములలో చేసినట్లే చేసి యుందుమా అని నేను ఆశ్చర్యపడుచున్నాను. మనము మన పట్టణములు కూడా అదే విధమైన దిగజారిపోయిన స్థితిలో యుండుటను కనుగొనుచున్నాము. అచ్చట ఆనాడు యున్న విధముగానే, నేడు ఇచ్చట కూడా ఘోర పాపముతో మన మధ్య యుండుటను మనము కనుగొనుచున్నాము. పరిచయము లేని ఈ చిన్నవాడు ఎట్లు తన ప్రచారమును ప్రారంభించనైయున్నాడని, నేను ఆశ్చర్యపడుచున్నాను. ఏ విధముగా, ఎక్కడ ప్రారంభించనై యున్నాడు? ఏ సంఘము లేక ఎవ్వరు అతనితో కలసి పనిచేయబోవుచున్నారు? అతడెక్కడ నుండి వచ్చాడో చూపుటకు అతనికి ఏదియు లేదు, అయితే అతడు ఆ పట్టణము కొరకై యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు," దానిని కలిగియున్నాడు.

9అతడు ఆ పట్టణపు వారిని ఎంతో క్షీణ స్థితిలోను, అవినీతితోను ఉండుట కనుగొన్నాడు. అది ఒక గొప్ప కాలముగా యుండినది. ఆ పట్టణములోని స్త్రీలు చివరకు ఆనాటి అమెరికాలోని స్త్రీలవలెనె ఉన్నారు — వారు అవినీతికి దిగజారిపోయారు. వారిలో నుండి దేవుడు ఎదురు చూచిన ప్రతిదానిలో నుండి వారు తొలగిపోయారు. ఆ స్థలములో వీథులలో నాట్యములను, వివస్త్రులై తిరుగుటయు, అలాంటి కార్యములను అనేకములను మనము కనుగొనగలము. బహుశా, వారి దినములలో బాహ్య ప్రజలు సంతోషించు కార్యములుగా అవి ఉండినవి. ఇప్పుడు, ప్రతి దినము అలాంటివి జరుగుచున్నవి. ఆ విధమైన వాతావరణము ఉష్ణమగునట్లు చేయుచున్నందున ఏ ప్రదర్శనకు మీరు వెళ్ళనక్కరలేదు. సమస్తమును వీధులలో జరిగిపోవుచున్నవి, ఏదో ఒక విధముగా ప్రతి స్థలములోను జరిగిపోవుచున్నది. స్త్రీలారా, మీరలాంటి కార్యములు చేయుట ఎంతో అవమానకరము? మిమ్ములను గురించి మీరు సిగ్గుపడుట లేదా?

DEUT 22:5

 

10అంతట, కొంతకాలము క్రితము ఒక స్త్రీతో మాట్లాడుచు నేను దీనిని చెప్పాను, అందుకామె, "బ్రన్హం సోదరుడా, అయితే ఏమిటి? అందరి స్త్రీల వలె మేము కూడా ఉంటున్నాము, అంతేకదా!" అని చెప్పినది.

అప్పుడు నేను, "కాని మనము ఈ లోక స్త్రీలందరివలె యుండకూడదు, మనము వేరైయున్నాము, మన స్వభావము వేరైయున్నదని," చెప్పాను.

ఒక స్త్రీ చెప్పినది నాకు జ్ఞాపకము వచ్చుచున్నది, "మంచిది, బ్రన్హం సోదరుడా, అలాంటి పొట్టిబట్టలను నేను వేయను, అయితే పొట్టి చొక్కాలను వేయుదును," అని చెప్పినది.

"అది బహు నీచము," అని నేను చెప్పాను. "పురుషుల వస్త్రములను ధరించుట దేవుని దృష్టిలో హేయమైన కార్యముగా యున్నది, అని దేవుడు చెప్పెను." అది ఖచ్చితముగా వాస్తవమై యున్నది.

"మంచిది, అటువంటి వస్త్రములు వారికి దొరుకుట లేదు," అని ఒక వ్యక్తి చెప్పెను. అది ఖచ్చితముగా వాస్తవమై యున్నది, "ఇంకా కుట్టు మిషనులు మరియు తదితరములు దొరుకుచున్నవి కదా!"

సాకులు చెప్పుటకు దారి లేదు. వారి హృదయములో ఏమున్నదో అదియే వెలుపల ప్రత్యక్షమగును. అది దానంతట అదియే తానేమైయున్నదో తనను గురించి చూపించుకొనుచున్నది.

11ఇప్పుడీ పట్టణము నీతి తప్పినదిగా మనము కనుగొనుచున్నాము. బోధకులు దానిని గురించి చెప్పుటకు భయపడుచున్నారు. అయితే ఆ చిన్నవాడైన లేక స్వల్పుడైన అతడు (ఆమోసు) కొండపై నుండి దిగి వచ్చుచు, "యెహోవా వారికి సెలవిచ్చిన దానిని చెప్పుటకు వచ్చుచున్నాడు: వీటిని శుభ్రపరచుకొనుడి, లేకున్నయెడల చెరలోనికి పోయెదరు," అని చెప్పసాగెను.

అతడు ప్రవచించినది నెరవేరు వరకు ఆ దినములను చూచునంత వరకు అతడు జీవించాడు. రెండవ యరోబాము కాలమువరకు ప్రవచించాడు. అయినను అతడు త్రోసివేయబడెను. అతడు ఇతర దేశములను గౌరవించెను. మరియు ఈ చిన్నవాడైన ఆమోసు వారికి ప్రవచించి వారితో ఇలా చెప్పాడు, "ఏ దేవుని మేము ఆరాధించుచున్నామని మీరు చెప్పుచున్నారో, ఆయన మిమ్మును నాశనము చేయును." ఆయన (దేవుడు) ఆలాగే చేశాడు.

అతని (ఆమోసు) స్వరము ఇక్కడ ఈ రాత్రి మనమధ్య ఉన్నయెడల ఈ బిర్మింగ్ హాములో, ఈ స్థలములోనే ఉన్న ఈ సంఘములకు ఆ మాటనే ఆరోపించును. "మీరు ఆరాధించుచున్నామని చెప్పుచున్న ఆ దేవుడే (ఆ యేసుక్రీస్తు) ఒక దినమున మిమ్ము నాశనము చేయును." నేను ఇక్కడున్న ప్రేక్షకులతో మాత్రమే మాట్లాడుట లేదు. నేను మాట్లాడుచున్న టేపులు ప్రపంచమంతటికి వెళ్ళును. ఇప్పుడు జ్ఞాపకముంచుకొనండి, అది సత్యము.

1COR 11:15

 

12ఆ తరువాత అతడు పట్టణములోనికి వచ్చినప్పుడు, తాను పంపబడిన దేవుని ప్రజలు నీతిలేని స్థితిని, సమస్త కల్మషమును చూచినప్పుడు అతడెంతగా బాధపడి యుండునోనని నేను ఆశ్చర్యపడుచున్నాను. ఇప్పుడు, మనము ఆయనను అంగీకరించగలమా? అని నేను ఆశ్చర్యపడుచున్నాను. అతడు మనమధ్యకు వచ్చినయెడల మనమతనితో సహకరించగలమా? మన శాయశక్తుల అతనికి సహాయపడలగమా? మన దృష్టిని అతనివైపు ఉంచగలమా? అతడు మనతో ప్రభువు వాక్యమునకు తిరుగవలసియున్నదని చెప్పినయెడల, మనము మారు మనస్సును పొంది ప్రభువు చెప్పినట్లు చేయగలమా?

మన సోదరిలు కత్తిరించుకున్నవారి పొట్టి వెంట్రుకలను గురించి ఏమి చేయుదురోనని నేను ఆశ్చర్యపడుచున్నాను. ఆమోసు వచ్చినట్లైన వారు వారి తలవెంట్రుకలను మరలా ఎదుగ నిచ్చెదరా? అతడు దానిని ప్రసంగించునని నేను మీతో చెప్పుచున్నాను, ఎందుకనగా అది దేవుని వాక్యమైయున్నది.

13మన సంఘ పెద్దలు (deacons), మూడు లేక నాలుగు పర్యాయములు పెండ్లి చేసికొనిన మన సంఘ పెద్దలను సంఘములో నుండి వెలుపలికి వెలివేయగలమా మరియు అటువంటి అనేక కార్యములను గూర్చి నేను ఆశ్చర్యపడుచున్నాను.

పొట్టి దుస్తులను వేసికొనునట్లు తమ భార్యలను అనుమతించు భర్తలను అతడు (ఆమోసు) ఏమి చేయును? అని ఆశ్చర్యపడుచున్నాను. ఆ విధముగా పొట్టి దుస్తులను ధరించి వీధులలో మరియు వెలుపల ప్రాంతముల యందు పురుషుల ముందు ఆ విధముగా తిరుగుచుండు తన భార్యను గద్ది౦చలేని అటువంటి భర్తయగు పురుషుని చూచి అతడు ఏమని అడుగునోనని నేను ఆశ్చర్యపడుచున్నాను. ఖచ్చితముగా, అతడు రెచ్చిపోవును, ఎందుకనగా అతడు "యెహోవా సెలవిచ్చుచున్నాడు," దానిని కలిగియున్నాడు, అతడు దానిని తప్ప వేరొక దానిని చేయడు.

భయంకర వ్యాధితో వారు మొత్తబడియుండుట అతడు కనుగొన్నాడు. అదే ఆత్మీయ మతిమరుపు. ఖచ్చితముగా దానినే మనమీనాడు కలిగియున్నాము

EZEK 18:4,20•

ROM 6:23

 

14ఇప్పుడు, ఏమి జరుగవైయున్నదని అతడెలా తెలిసికొనగలడు? ఆమోసు ఎలా తెలిసికొనగలడు? మొదటిగా, అతడొక ప్రవక్తయై యున్నాడు; ఆ తరువాత అతడు ఆ వ్యాధిని ఎరిగియుండుట వలన ఆ వ్యాధి యొక్క లక్షణములు ఏలాగుండునని కూడ ఎరిగియున్నాడు; దాని ఫలితమేమిటని కూడ ఎరిగియున్నాడు. ఒక వైద్యుడు ఒక వ్యాధి యొక్క ముదిరిపోయిన స్థితిని చూచి మరియు అది వేగముగా వ్యాపించుచూ ఆ శరీరములో స్థిరపడినప్పుడు అది మరణమునకే దారితీయునని అతడు ఎరుగును. అది మాత్రమే మిగిలియున్నది. దేవుడు దానికొరకు ఏదైనను చేయనియెడల అది అంతటితో ముగించిపోయినది.

మంచిది, మీరు ఒక పట్టణమును చూచినప్పుడు, మరియు మీరొక ప్రజలను చూచినప్పుడు, ఒక సంఘమును చూచినప్పుడు, దేవుని నుండి ఎంతో దూరమైన ప్రజలను చూచినప్పుడు, అది పాపము! పాపము యొక్క జీతము మరణము అనే వ్యాధి యొక్క గుణలక్షములు ద్వారా మీరు దానిని గూర్చి నిర్ణయించి, "మరణము తప్ప వేరే మార్గము లేదని చెప్పవచ్చును. అది మరణమే!" అది ఏమిటనే దానిని గూర్చి నిర్ణయించిన నిర్ణయమును అది ఋజువుపరచును. మీరు గమనించండి, ప్రజలు దేవుని నుండి దూరమై, వాక్యమును విననొల్లనప్పుడు, వాక్యము పట్ల వాంఛ లేనప్పుడు, దానికి నిర్ణయము ఒక్కటే: "ఏ ఆత్మ పాపము చేయునో, ఆ ఆత్మ మరణించును. అవిశ్వాసము మిమ్ములను దేవుని నుండి దూరపరచును." ఖచ్చితముగా అది వాస్తవమై యున్నది. అతడా పట్టణపు వ్యాధిని చూచినప్పుడు, ఆ వ్యాధిని ఎరిగియుండెను, మరియు ఆ వ్యాధి ఫలితములను కూడ ఎరిగియుండెను.

15ఇప్పుడీ మతిమరుపును గురించి మనకు చెప్పబడినదేమనగా… నీవు ఎచ్చట ఉన్నావో నీయంతట నీవు ఎరుగక పోవుటయగును. ఇప్పుడు, అదొక అసాధారణ కార్యము, అది ఎక్కువగా అప్పుడప్పుడు సంభవించు సంభవము కాదు. కాని అది భయముతో కూడిన దిగులుకలుగునప్పుడు ఏర్పడునదిగా ఉన్నది. వారెవరని వారెరుగలేక యున్నారు.

కొన్ని సమయములయందు యుద్ధములలో సైనికులకు అలాంటి స్థితి ఏర్పడును. కొన్ని అసాధారణ సందర్భముల యందు ప్రజలకు కూడ ఏర్పడును. మరొక కారణమేదనగా ఎక్కువ వ్యాకులము ఏర్పడుట ద్వారా సంభవించును. వ్యాకులము దానికి కారణమగును. వ్యాకులమునకు ఏలాంటి సద్గుణము లేదు. అవును. అందువలన వ్యాకులమును విడిచి విశ్వాసమును అంగీకరించుము.

ఎవరో ఇలా చెప్పారు. "మంచిది, రేపటి ఉదయము నీవు కాల్చి చంపబడెదవనగా, వ్యాకులము చె౦దవా?"

అప్పుడు నేను, "లేదు, అలా తలంచను?" అని చెప్పాను.

"ఎందుకు?"

"వ్యాకులము నన్ను అధిక హీన దశకు తెచ్చునే గాని మరొకటి చేయదు," అని చెప్పాను.

"మంచిది, విశ్వసించుట ద్వారా వచ్చు మంచి ఏది?" అని అతడడిగెను.

"అది నన్ను విడిపించును," అని చెప్పాను. అది వాస్తవము. చూచారా.

16అందువలన, వ్యాకులమునకు ఎలాంటి సద్గుణము లేదు; అయితే విశ్వాసమునకు సమస్త సద్గుణములు గలవు. దానిని విశ్వసించుము!

ఇప్పుడు, వ్యాకులము (ఆ మతిమరుపునకు) కారణముగా ఉన్నది. ప్రజలలో అది ఏర్పడుటకు మరొక కారణమున్నది, అది రెండు రకముల భేదాభిప్రాయముల మధ్య చిక్కుబడినప్పుడు ఏర్పడుచున్నది. మతిమరుపు ఏర్పడుటకు అది కారణమగుచున్నది. చివరకు నీవు చేసిన వాటి తలంపులను నీవు పోగొట్టుకొను స్థలమునకు అది నిన్ను తెచ్చుచున్నది. నీవు నీ మతిని పోగొట్టుకొన్నావు. నీవు దానిని సరిచేయలేవు. నీవెవరివో నీకు తెలియదు. నిన్ను నీవు గుర్తించలేవు. నీవు చుట్టూ తిరుగ వచ్చును, భోజనము చేయవచ్చును, ప్రతి కార్యము నీవు చేయవచ్చును; అయినను నీవు నీ మతిని పోగొట్టుకొన్నవాడివే. నీకు కొంత పాండిత్యముండవచ్చు. అయితే అది ఎక్కడ నుండి వచ్చెనో అది నీకు తెలియదు, నీవెవరివో నీకు తెలియుట లేదు, నీవెక్కడికి చెందినవాడివనియు తెలియుట లేదు — అదే మతిమరుపు, ఆ విధముగా మనకు చెప్పబడినది.

17ఈ మానవ జీవితములో పెండ్లి చేసికొనుట ద్వారా మన కుటుంబాలతో మనము గుర్తింపబడుచున్నాము, మనము పెండ్లి చేసి కొనుచున్న మన భార్యతో మన వివాహ బంధము ద్వారా, మన కుటుంబాలను గుర్తించగలుచున్నాము. ఆ తరువాత ఆ భయంకర కార్యమగు మతిమరుపు నీకు ఏర్పడుట వలన నీవు ఎవరిని వివాహము చేసుకున్నావో జ్ఞాపకము లేనివాడవై నీ భార్య ఎవరో, నీ పిల్లలు ఎవరో, నీ తల్లిదండ్రులు ఎవరో, నీ పొరుగువారు ఎవరో అని కూడా మర్చిపోయి జ్ఞాపకము రాకపోయిన యెడల ఎట్లుండును? అది ఒక ఘోర కార్యముగా నున్నది.

మరలా జ్ఞానమును పొందుట ద్వారా, వ్యత్యాసమైన జంతువుల నుండి మనలను మనము మానవులుగా గుర్తెరుగ గలుగుచున్నాము. జంతువు ఆలోచించదు. అది కేవలము శబ్దము ననుసరించి వెళ్ళుచుండును. దానికి అంతరాత్మ అనునది లేదు. మనది కూడా ఒక రకమైన జంతు జీవితమే, మనలో వ్యత్యాసమేదనగా, మనము పాలిచ్చు వర్గమునకు లేదా స్తన జాతి జంతువులమై యున్నాము. ఈ పాలిచ్చు వర్గమునకు చెందిన జీవి, వెచ్చని రక్తము గల జంతువు, మనము జంతువు రక్తమునకు సంబంధించినవారమే. అయితే మనలోని వ్యత్యాసమేదనగా, మనము ఒక అంతరాత్మ ద్వారా గుర్తింపబడుచున్నాము మరియు మన మనసాక్షి ఏది తప్పో మరియు ఏది ఒప్పో మనకు చెప్పుచున్నది.

DAN 4:30-33

 

18ఇప్పుడు, నీవు మతిమరుపును పొందిన స్థలమొకటున్నది, నెబుకద్నెజరునకు జరిగినట్లు నీకును జరుగవచ్చు, ఒకప్పుడు అతడు తనను తాను హెచ్చించుకొనినప్పుడు, అతడు తానొక జంతువుననుకొన్నట్లుగా దేవుడు అతడిని మార్చివేసెను. తలవె౦ట్రుకలు పక్షి ఈకలవలె పెరిగిపోయినవి. అతని గోళ్లు పక్షుల గోళ్ల వంటివాయెను. మరియు అతడు మృగ హృదయమును కలిగియుండెను.

చూశారా, అదియే మతిమరుపు, ఎందుకనగా అతడొక రాజని అతడు మరచిపోయాడు. అతడొక మానవ జీవియని మరచిపోయాడు, అతడొక జంతువని తలంచుచున్నాడు; అందువలన అతడు జంతువువలె ప్రవర్తించుచున్నాడు, ఎందుకనగా తానొక మానవుడనని మరచిపోయాడు.

ఈ దినమున అది ఎంతో సాధారణముగా జరుగు కార్యమైపోయినది. క్రైస్తవ సంఘమనగా ఏమిటో కొన్ని సమయములలో మరచిపోవుచున్నాము. మనము లోకస్తులవలె ప్రవర్తించుచున్నాము. ఆ కార్యమే మనకు ఆత్మీయ మతిమరుపు కలిగియున్నామనే దానిని చూపించుచున్నది, ఎందుకనగా నీవు ప్రవర్తించే ప్రవర్తనబట్టి నీవు ఒక క్రైస్తవుడవు కాదు. నీవు లోక రీతిగా ప్రవర్తించుచున్నావు. ఈ లోకపు హృదయమును పొ౦దియున్నావు, దీనికి కారణము అదియే.

EZEK 16:5,6,9,15

 

19ఇచ్చట ఇశ్రాయేలీయులు ఈ లోకమునకు నిర్ణయించబడిన ఊబిలో పడిపోవుటను మనము చూడగలుగుచున్నాము, మరియు ఆ విధముగా ఈ లోకపు కాలుష్యములో పడిపోయారు. వారిని త్రవ్వి వెలుపలకు తీయుట కొరకు ఈ ప్రవక్త అక్కడకు పంపబడెను, వారితో వారి స్థితిని చెప్పుటకు అక్కడకు ప్రవక్త వచ్చుచున్నాడు.

దేవుడు తన కృప వలన భూమిపైనున్న జాతులలో నుండి ఇశ్రాయేలును ఎన్నుకొనెను. కృప ఆ కార్యమును చేసెను. ఫలవంతమైన భూములను ఆయన వారికి దయచేసెను. వారు నిర్మించని భవనములను ఆయన వారికి దయచేసెను, దేవుడు వారిని ఎన్నుకొని దానిని చేసెను. వారు కొనని పొలములను ఆయన వారికిచ్చెను. వారు నాటని ఆహారమును ఆయన వారికిచ్చెను. వారు త్రవ్వని బావులను ఆయన వారికిచ్చెను. వారు జయించలేని విజయములను ఆయన వారికిచ్చెను. వారు అర్హులు కానప్పటికిని, ఆయన వారికి కృపను చూపెను. ఇశ్రాయేలు తన ప్రజలకు ఆయన కృప ద్వారా దేవుడు దానిని చేసెను, ఇశ్రాయేలు ఆయన ఎన్నుకొనినవారును, ఆయన ప్రేమించినవారునై యున్నారు.

బైబిలులో ఆయన చెప్పినదేమనగా, "పొలములో ఒక చిన్నది తన రక్తములో పడియుండగా, ఆయన ఆమెను కనుగొని, కడిగి శుభ్రపరచి చేయవలసినదంతయు చేసెను. అయితే ఆమెకు తన కృపలన్నింటిని ఆయన దయచేసిన తరువాత ఆమె ధనవంతురాలైనది. అప్పుడామె మతిమరుపును పొందినదై, ఈ ఆశీర్వాదములన్నియు ఎక్కడ నుండి వచ్చినవో దానిని మరచిపోయినది."

HEB 13:15•

1PET 2:9

 

20అది 1964లో అమెరికా దేశము గూర్చి ఇది సాదృశ్యముగా యున్నదని నేను తలంచుచున్నాను, అదే రకమైన వ్యాధితో ఆ దేశము బాధపడుచున్నది. మనము గొప్ప శక్తిగల సంఘములుగా ఉన్నాము. మనము శక్తిగల గొప్ప ప్రజలము. మనము లక్షల సంఖ్యలో ఉన్నామని తలంచుచున్నది, అయితే ఇవన్నియు ఎక్కడి నుండి వచ్చినవో దానిని మనము మరచిపోయాము. దానివలన వారికి అతి క్లిష్ట పరిస్థితి ఏర్పడినది. దేవుడు వారికి మంచివాడై యుండి, సమస్త అన్యదేశముల నుండి వారిని వెలుపలకి రప్పించి, వారిని ప్రత్యేకపరిచెను. వారు ఆయన కొరకు ప్రత్యేక ప్రజలుగా నిలిచారు. ఆయన వారిని గురించి చెప్పినదేమనగా, మరొక దేశపు ద్రాక్షావల్లిని తీసి మరొక దేశమందు నాటితిని. అది ఫలించి ఫలములిచ్చునట్లు దానిని పెంచితిని; అయితే ఆ ద్రాక్షా తీగెలు, ఆ ఆశీర్వాదములు ఎక్కడ నుండి వచ్చాయని అది మరచిపోయినది.

అదే విధముగా ఈ చివరి దినములయందు దేవుని పిల్లలు క్రైస్తవ సాక్షమేమిటని మరచిపోయారు. ఆ మతిమరుపు ఈ ప్రజలపై మరలా వచ్చినది. వారు వారినే గుర్తించుకోలేకపోవుచున్నారు. వారు దానిని గుర్తించవలసిన సమస్తమును మరచిపోయారు. ఆయన యొక్క పరిశుద్ధతను గురించి మరచిపోయారు, వారు ఆయన యొక్క న్యాయ విధులను మరచిపోయారు. ఆ స్త్రీలు లోకపు స్త్రీలవలె జీవించుచున్నారు.

LEV 11:44,45•

LEV 19:2•

LEV 20:26•

HEB 12:14•

1PET 1:16

 

21దేవుని సంఘమును మరియు ఆయన ప్రజలును ఒక ప్రత్యేక ప్రజలుగా ఉన్నారు, వెలుపలకు పిలువబడిన ఒక జనా౦గముగా ఉన్నారు, ప్రత్యేకమైన ప్రజలుగాను, ఒక పరిశుద్ధ దేశముగాను, ఒక రాజరిక యాజకత్వమును కలిగి, దేవునికి ఆత్మీయ యాగములను సమర్పించువారై, వారి పెదవుల ఫలములను అర్పించుచు, ఆయన నామమును స్తుతించువారునై యున్నారు.

దేవుడు తన సంఘమును పిలచి లోకము నుండి దానిని ప్రత్యేకపరచెను, ఆ ఒకే ఒక్క కారణము చేత ఆలా చేసెను. ఆయన వారికి న్యాయవిధులనిచ్చెను, ఆయినయు, ఆ (న్యాయ ప్రమాణములును) పరిశుద్ధముగా ఉండవలసియున్నది. "నేను పరిశుద్ధుని గనుక మీరును పరిశుద్ధులై యుండుడి," పరిశుద్ధత లేనిదే ఏ మనిషియు ప్రభువును చూడలేడని, ఆయన చెప్పెను. దేవుడు తానే దానిని సెలవిచ్చెను. మరియు ఆయన ఈ ప్రజలను అలాంటి ప్రజలుగా ఉండవలెనని పిలిచెను, అయితే వారు దానిని మరచిపోయారు. వారు ఆయన ఆజ్ఞలను మరచిపోయారు, వారికున్న నీతులను మరచిపోయారు. ఆ స్త్రీలు వీధులలో తిరుగుచూ, ఇశ్రాయేలీయుల స్త్రీలు వీథులలో తిరుగుబోతులుగా తిరుగుచూ పరిశుద్ధాత్మచే గర్భమును ధరించినవారివలె వారు నటించుచూ, మెస్సీయాను తెచ్చెదమని ప్రతీ ఒక్కరు ఎదురుచూచుచున్నారు. వారి స్వభావము బహు నీచమైనదిగా యున్నది.

నేనిక్కడ ఒక్క నిమిషము ఆగవలెనని ఆశపడుచున్నాను, దానిని గురించి చెప్పవలెననగా, మన ప్రజల మధ్య ఇప్పుడు ఆ విధముగానే జరుగుచున్నది, తమను తాము క్రైస్తవులని పిలచుకొనుచున్నారు. వారి స్వభావము పూర్వమున్నట్లే ఉన్నది, మీరు దానిని గ్రహించవలసియున్నది!

22దక్షిణ ప్రాంతములో ఒకప్పుడు, ఇక్కడ ఒక కథను విన్నాను. అది బానిసలను వాడుకొను కాలము. వారు ఆ బానిసలను తీసికొని వెళ్ళి సంతలో అమ్మేవారు, మీరు ఒక కారును ఎలా కొనెదరో ఆ విధముగానే వారిని కొనెదరు. అక్కడ కొనువాడొకడుండును, దళారి ఒకడుండును. అతడు ఆ బానిసలను కొని, అమ్ముచుండును, మీరు కారును లేక మరొక దానిని అమ్ము విధముగానే అది ఉండును. ఆ బానిసలు వారి స్వంత దేశము నుండి ఎంతో దూరమైపోయారు. వారు ఆఫ్రికా దేశము నుండి వచ్చారు. దళారులు వారిని దొంగతనముగా తరలించుకొని ఈ దీవుల లోనికి తెచ్చి ఆ తరువాత అమెరికా దేశములోనికి దొంగతనముగా తెచ్చెదరు. జమైకా, దాని చుట్టు ప్రక్కల ప్రాంతముల నుండి వారిని తెచ్చి బానిసలుగా అమ్ముచుండెడివారు.

ఆ ప్రజలు ఎంతో దుఃఖముతో ఉండుట మనము చూడగలము. వారు వారి స్వంత ఇంటి నుండి తరలించుకొని రాబడినవారు. ఒక శత్రువు చేత వారు తీసుకొని రాబడిరి, వారెంతో దుఃఖముగా ఉన్నారు. వారి భర్తలను ఇకపై వారు చూడరు, లేక వారి భార్యలను వారు ఇకపై చూడరు, వారి తల్లిని గాని, తండ్రిని గాని వారి పిల్లలను గాని, వారికపై చూడరు. వారిని కొట్టి పనిచేయించవలసి వచ్చెను, ఎందుకనగా వారెప్పుడు దుఃఖముగానే ఉండెదరు.

23ఒక దినము, ఒక స్థలమునకు ఒక వర్తకుడు వచ్చాడు, ఆ పొలములో, బానిసల గుంపు ఒకటి పనిచేయుచుండినది. అప్పుడా వ్యాపారి స్వంతవాని యొద్దకు వెళ్ళి "ఎందురు బానిసలను నీ వద్ద యున్నారని?" అడిగినప్పుడు.

"సుమారు వందమంది?" అని అతడు చెప్పాడు.

అందుకతడు, "నీవు విక్రయించు వారెవరైనా ఉన్నారా?"

అని అడిగినప్పుడు, 'అవును' అని అతడు బదులిచ్చాడు.

"నేను వారిని చూడనిమ్మని," అతడడిగాడు. అతడా విధముగా ఆ పొలములోనికి వెళ్ళి వారిని గమనించాడు. కొందరు వారిని బంధించియున్నారు, చుట్టూ నిలచియున్నారు. అప్పుడా వ్యాపారి, వారి మధ్య ఆ పొలములో ఒక యవ్వనుని చూచాడు. అతనిని వారు బంధించియుంచలేదు. అతడు ఎంతో ధైర్యముగా ముఖమును పైకెత్తి ఒక ధైర్యశాలివలె నిలచియున్నాడు. అతనిని బంధించవలసిన అవసరము లేదు. కావున ఆ వ్యాపారి చెప్పినదేమనగా, "నేనా బానిసను కొనుటకు ఇష్టపడుచున్నాను," అని చెప్పెను.

అందుకతడు, "అతడిని మాత్రము అమ్ముటకు వీలు లేదు," అని చెప్పాడు.

"మంచిది, తక్కిన బానిసలలో ఇతని ప్రత్యేకత ఏమిటి? అతడు తక్కిన బానిసలపై అధికారిగా ఉన్నాడా?" అని అడిగాడు.

"లేదు, అతడు కూడా ఒక బానిసగానే ఉన్నాడు," అని చెప్పెను.

"మంచిది, వీనిని నీవు వ్యత్యాసముగా పెంచుచున్నావా?" అని అడిగెను.

"లేదు, మిగిలిన బానిసలు తిను ఆహారమే ఇతనికివ్వబడుచున్నది," అని చెప్పెను.

"అయితే, మిగిలిన బానిసలకన్నను ఇతనికున్న వ్యత్యాసమేమిటి?" అని అడిగెను.

అప్పుడతడు "మంచిది, దీనిని గురించి నేను కూడా ఎంతోకాలముగా ఆశ్చర్యపడుచుంటిని, అయితే ఒక దినము నేను తెలిసికొనినదేమనగా, అతడు తరలించుకొని రాబడిన అతని స్వంత దేశములో అతని తండ్రి ఆ జాతికంతటికి రాజుగా ఉన్నాడు. అతడు బానిసగా దూరముగా ఉన్నప్పటికిని, అతడు ఒక రాజు కుమారుడని అతడెరిగి యున్నాడు. అతడు తనను ఒక రాజకుమారునిగా కనబరచుకొనుచు ప్రవర్తించుచున్నాడని చెప్పెను."

EXOD 20:14,17•

ROM 13:9

 

24ఆఫ్రికా దేశము నుండి వచ్చిన ఒక నీగ్రో (ఆఫ్రికా దేశస్తుడు) తన తండ్రి ఏ జాతికి రాజుగా ఉన్నాడని ఎరిగియుండిన యెడల, క్రొత్తగా జన్మించిన క్రైస్తవుని గురించిన మాట ఏమిటి? మన తండ్రి పరలోకపు రాజుగా మహిమలో ఉన్నాడు. మనము క్రైస్తవ స్త్రీ, పురుషులుగా ప్రవర్తించవలసియున్నది, ఆ విధముగా మనము ప్రవర్తించవలసియున్నది, ఆ విధముగా దుస్తులు ధరించవలసియున్నది, ఆ విధముగా మాట్లాడవలసియున్నది, ఆ విధముగా జీవించవలసియున్నది. మనము బానిసలమైనప్పటికిని, మనము దేవుని పిల్లలముగా ఉన్నాము. మన స్వభావము, ఇప్పుడు మన దుర్నీతి యందు మనము జీవించు దినములలో యున్నాము…

అదే విధమైన దుర్నీతి యనే ఊబిలో ఇశ్రాయేలు విడువబడినది. వారు దేవుని ఆజ్ఞలను మరచిపోయారు: "వ్యభిచరించవద్దు," "నీ పొరుగువాని భార్యను ఆశించవద్దు," అను ఆయన ఆజ్ఞలను వారు మరచిపోయారు. వారు ఇకపై ఆ ఆజ్ఞలను ఇష్టపడుట లేదు. మరియు వారు మిగిలిన ప్రపంచము ఉన్నట్లే ఉండుటకు ఇష్టపడుచున్నారు. ఈనాటి సంఘము వలె వారుండుటకు ఇష్టపడుచున్నారు.

1SAM 8:5-7,19•

1SAM 12:3,4

 

25ఒకప్పుడు, ఇశ్రాయేలు, ప్రారంభ దశలో ఉండగా వారిని పాలించుటకు వారిపై ఒక రాజును నియమించవలసినదిగా సమూయేలును కోరారు. వారి కొరకు పంపబడిన ప్రవక్త సమూయేలు వారితో ఇలా చెప్పాడు, "ప్రభువు నామములో నెరవేరినది గాక వేరొకటి మీతో ఎప్పడైనను ఏదైనను చెప్పానా?"

అందుకు వారు, "లేదు నీవు చెప్పలేదు," అని బదులిచ్చారు.

"మిమ్ములను ఎప్పడైనా గాని ధనము కొరకైనను, ఆహారము కొరకైనను నేను జీవించుటకు గాను మిమ్మును భిక్షమడిగితినా?"

"లేదు, నీవా విధముగా చేయలేదు. సమూయేలు నీవు వేరొక దానిని చెప్పలేదు, కాని నీవు చెప్పినవన్నియు నెరవేరినవి, నీవు జీవించుటకై మమ్ములను ధనము అడుగలేదు. అయితే అన్ని ఉన్నను (అన్యుల వలె) మమ్ములను పాలించుటకు మాకొక రాజు కావలసి యున్నది."

అప్పుడు సమూయేలుతో దేవుడు చెప్పినదేమనగా, "వారిని ఆలాగే ఒక రాజును కలిగియుండనిమ్ము. నిన్ను కాదు వారు నిరాకరించినది; వారు నన్ను త్రోసివేశారు."

26ఇశ్రాయేలు అదే విధముగా ప్రవర్తించిరి. వారికిక దేవుని ప్రవక్తలు అక్కర్లేదు. వారితో వారికి పనిలేదు. ఒకరు వచ్చి వారి కొరకు వాక్యమును తెచ్చినయెడల వారిని వాక్యమునకు త్రిప్పటకు ప్రయత్నించిన యెడల, వారు దానిని త్రోసివేయుదురు. వారు అన్నివేళల అలాగే యుందురు, వారా అవినీతియందే నిలచిపోయారు. ఎప్పుడైతే ప్రపంచముతో సంఘము తనంత తానుగా ఏకమైనదో, అప్పుడు వారు ఆత్మీయ సంబంధమైనదేదియు ఆశించరు. "యెహోవా సెలవిచ్చునది," వారికక్కరలేదు. వారికి కావలసిన దానిని వారు కోరుచున్నారు. వారికి ఈ ప్రపంచము కావలసియున్నది. క్రైస్తవులమని మాత్రము చెప్పుకొనుచున్నారు; కాని ఈ ప్రపంచపు తీరులో జీవించుచున్నారు, ప్రపంచముతో జీవించుచు మరియు లోకము ప్రవర్తించు రీతిగా జీవించుచున్నప్పటికిని వారు క్రైస్తవులని చెప్పుకొనుచున్నారు.

అది మీకు బాగుగా తెలిసియున్నది. దానికి కారణమేదనగా, "ఆత్మీయ మతిమరుపు." కచ్చితముగా, అది అదే అయి యున్నది. వారెవరో వారికి తెలియుట లేదు. వారు ఏమి చేయవలసియున్నదో వారు దానిని మరచిపోయారు.

HOS 8:7•

ROM 6:23

 

27ఈనాడు ఒకరు ఆత్మీయముగా దేనినైనను చెప్పినయెడల ఆ పూర్వ అలవాటు ప్రకారమే వారు దానిని త్రోసివేయుచున్నారు. వారు ఆ వ్యాధి యందు ముదిరిపోయి నశించుపోవు స్థితిలో ఉన్నారు. ఆ విధముగానే ఈనాడును ఈనాటి క్రైస్తవులున్నారు. ఆత్మీయముగా ఆత్మీయ కార్యములతో వారు గుర్తింపబడుట లేదు, ఎందుకనగా వారికి ఇకపై అది అక్కరలేదు. వాక్యము, సువార్త వారికి అక్కర్లేదు. పాపపు వ్యాధి వారిని బహుశా బాధించియున్నది, వారు దానిని అధికముగా ప్రేమించారు.

మారుమనస్సు లేదా పశ్చాత్తాపము పొందని హృదయమునకు పాపము ఎంతో ప్రీతికరముగా ఉండును. మారుమనస్సు లేని మనస్సుకు అది ఎంతో అందముగా ఉండును. అయితే అది మరణమునకు మార్గమై యున్నది. మరణము తప్ప మరొకటి మిగులదు. పాపము యొక్క జీతము మరణము, మరియు నీవా జీతమును పొందుకోవలసి యున్నది. నీవు గాలికి అనుకూలముగా విత్తావు, మరియు ఇప్పుడు సుడిగాలిని పొందుచున్నావు.

ఆత్మీయ సూచనలు గాని, దేవునిచే అభిషేకించబడిన వర్తమానికుని ప్రకటన గాని వారిని ఇకపై కదలించలేవు. ముఖము ఎదుటనే వారి స్త్రీలు నవ్వుచున్నారు, "అటువంటి వాటిని వినుటకు నేను వెళ్ళవలసిన పనిలేదు," అని చెప్పుచున్నారు. అటువంటిది ఈనాడు మరలా ఏర్పడకున్నయెడల, మనమధ్యనున్న ఈ స్థితి ఏమైయున్నది? అది ఆత్మీయ మతిమరుపుగా ఉన్నది, ఖచ్చితముగా అదే కారణమై యున్నది. దేవుడు మరియు ఆయన వాక్యము, ఒక్కటై యున్నారని వారు మరచిపోయారు. ఆయన మారడు. దానిని మార్చడు.

HEB 12:11

 

28వారి దినములలో ప్రవక్త దృశ్యమునకు వచ్చినప్పుడు ఒక ఆత్మీయ సూచన కనబడుచున్నది, అది ఒక ఆత్మీయ స్వరము, దాని వెనుకనున్న దేవుని శబ్దమును అది వినిపించును. వారు కేవలము దానిని చూచి నవ్వుతూ పరిహాసము చేయుచున్నారు. పాత సామెతను చెప్పుట మీకు తెలిసేయున్నది, "దేవదూతలు వెళ్ళుటకు భయపడు స్థలమునకు, బుద్ధిహీనులు మేకులు దిగగొట్టిన కాలిజోడులను వేసికొని వెళ్ళుదురు." ఈ ఆత్మీయ మతిమరుపు గలవారు చేయునది కూడా ఆ విధముగానే యున్నది. అది ఈ ప్రజలను, వారి అంతర్యములోనికి అనుభూతి లేని స్థితిని వెలుపలకు తెచ్చుచున్నది. అత్మీయమైనది ఏది గాని వారికి అక్కర్లేదు.

ఇప్పుడొక నిజ ఆత్మీయ కూడికను తీసికొందము, అక్కడ పరిశుద్ధాత్మ రోగులను స్వస్థపర్చుచు, వారి హృదయాలోచనలను వెలుపలకు తెచ్చుచుండగా, సంఘములలోని అధిక జనము ఈ ప్రదర్శనశాలలో కూడియుండగా, ఏమి జరుగుచున్నదో చూడుడి. కొన్ని నిమిషములలో ప్రతి ఒక్కరు లేచి వెలుపలకు వెళ్ళిపోవుదురు. దానితో వారికి ఏలాంటి పనియు లేదు. వారు చేయకలిగినది ఏదియు లేదు.

వారు లోకరీతియైన జ్ఞానయుక్తమైన మాటలను వినెదరు.

ACTS 2:4•

HEB 13:8

 

29అయితే అది యేసుక్రీస్తు శక్తి యొద్దకు వచ్చినప్పుడు, ఆయన పునరుత్థానము యొద్దకు వచ్చినప్పుడు, దానితో వారు చేయగలిగినది ఏమియు లేదు, ఎందుకనగా అది వారిని ఖండించుచున్నది. వారు ఎరుగవలసిన కార్యములను కూడ చేర్చి వారిని అది దహించివేయును. ఖండించుచు నిన్ను ఎరుగునట్లు చేయును, ఒకవేళ ఆ దినమునకు అది నీకు యిష్టమైనదిగా యుండకపోవచ్చును, అయితే నీవు దానికి లోబడినప్పుడు, అది మారుమనస్సు అనుసారమైన ఫలములను తెచ్చును.

అందువలన ఈ ఆత్మీయ మతిమరుపు ప్రజలను ఆవరించినప్పుడు, వారు బహు నీచమైన స్థితికి దిగజారిపోవుదురు. ఇప్పుడు మనము ఆ స్థితినే చూచుచున్నాము.

ఇప్పుడు నేను ఇష్టపడునది…. నీవు గుర్తింపబడవలసియున్నది. ఎక్కడో ఒక దగ్గర నీవు కనబడవలసియున్నది, నీ జీవితము కనబడవలసియున్నది, ఈ రాత్రి నీవెక్కడ గుర్తింపబడుచున్నావు? నీవు క్రీస్తులో గుర్తింపబడుచున్నావా, లేక క్రీస్తుకు వెలుపల గుర్తింపబడుచున్నావా; నీవు మధ్యలో ఉండుటకు వీలులేదు. మద్యము త్రాగిన వ్యక్తి, మతి లేని వ్యక్తిగా యుండలేడు. తెలుపు మరియు నలుపు రంగు అను పక్షి ఎక్కడ లేదు. నీవు రక్షణ పొందిన వ్యక్తిగా యుండవలయును, లేదా రక్షణ పొందని వ్యక్తిగా యుండవలసియున్నది. నీవు ఒక పరిశుద్ధినిగా యుండవలెను, లేక పాపిగానైనను యుండవలెను. ఈ విధముగానైనను లేక మరొక విధముగానైనను యుండవలెను. దేవుని వాక్యము పట్ల నీ యొక్క ఆత్మీయ వాంఛ, నీవెక్కడ నిలచియున్నావని గుర్తించుచున్నది.

ఆనాడు పెంతెకోస్తు దినమునగాని వేరొక కాలమందైనను గాని క్రుమ్మరింపబడిన పరిశుద్ధాత్మ అభిషేకము ఇప్పుడు, ఎప్పుడూ ఒకే విధముగా యున్నదని దేవుని యొక్క వాక్యము దానిని నిరూపించి రుజవుపరచినది. యేసుక్రీస్తు నిన్న, నేడు, నిరంతరము ఏకరీతిగా ఉన్నాడు. దానిపట్ల నీ వైఖరి, నీవు ఆత్మీయ మతిమరుపులో ఉన్నావా, లేదా యని గుర్తించుచున్నది. అది నిజము. నీవు సంఘ పెద్దగా ఉండవచ్చు లేక నీవు ఒక బోధకునిగాను ఉండవచ్చు. దానితో ఏమియు లేదు. అవును, వారు కూడ ఆ విధముగానే ఉన్నారు. (ఆత్మీయ మతిమరుపులో ఉండవచ్చు) అందువలన అది అంటు వ్యాధిగా ఉండి, సమస్తమును నాశనము చేయుచున్నదని మనము కనుగొన్నాము.

ఇప్పుడు మనము దానిని గమనించాము.

30ఇప్పుడు ఒక అమెరికనుగా ఉండవలసియున్నది… నేనొక అమెరికను దేశస్తునిగా ఉండవలెనన్న, నేను నా దేశముతో గుర్తించబడవలసియున్నది. ఇప్పుడు శ్రద్ధగా వినండి. ఒక అమెరికనుగా ఉండవలెనన్న నేను ఈ దేశమందు జన్మించియుండవలెను, అప్పుడు నేనొక (అమెరికా) పౌరుడనగుదును. అప్పుడు ఈ దేశముతో గుర్తించబడుదును, ఆ దేశమునకు పూర్తి ప్రతినిధిగానే నున్నాను. ఆ దేశములో ఉన్నదంతయు నేనై యున్నాను, ఎందుకనగా నేనొక అమెరికా దేశస్తునిగా గుర్తించబడితిని. అప్పుడు దాని అవమానమే గాని, దానికున్న సమస్త మహిమయే గాని, మరి ఏదియొనను అదంతయు నేనై యున్నాను, ఎందుకనగా నేను దానితో (ఆ దేశముతో) గుర్తించబడుచున్నాను. ఆమేన్.

మీరు దానిని గ్రహించవలయునని నేను కోరుచున్నాను. నేనొక అమెరికా దేశపు పౌరునిగా గుర్తింపబడినప్పుడు, దాని స్థితి అంతయు నేనైయున్నాను. దానిలో ఉన్నదంతయు నేనైయున్నాను. ఖచ్చితముగా నేను దానిలోని భాగమైయున్నాను. నేను అలా ఉండవలసియున్నది. నేనొక అమెరికా పౌరుడవై యున్నప్పుడు నేను అమెరికా దేశములోని భాగమగుచున్నాను. అదంతయు నేనైయున్నాను.

31ఖచ్చితముగా, నేను దీనిని మరచిపోకూడదు. నేను నిజమైన అమెరికా దేశపు పౌరునిగా ఉండదలంచినయెడల, నా దేశమేమై యున్నదో నేను దానిని పోలియుందునని ఖచ్చితముగా జ్ఞాపకముంచుకొనవలసియున్నది, ఎందుకనగా నేను నా దేశముతో గుర్తించబడియున్నాను. ఆమెను మరచుట లేక ఆమె కొరకు పోరాడుటకు, లేక మరణించుటకు, లేక ఆమె కొరకు నిలచు సమస్తములో నేనామె కొరకు నిలచుటకు సిద్ధముగా ఉండవలసియున్నది. నా దేశము ఏమైయున్నదో అది నేనైయున్నాను. అది దేని కొరకు నిలచునో నేను దాని కొరకు నిలచెదను. ఒక నిజాయితీ అమెరికనుగా ఆమె కొరకు మరణించుటకు కూడ సిద్ధముగా ఉన్నాను. ఆమె కొరకు పోరాడుటకు, ఆమె కొరకు నిలచుటకు, మరేది చేయవలసి వచ్చినను నేను దానిలోని భాగమైయున్నాను.

నా పైనుండి తీయనిదే నీవు దానిపైనుండి తీయలేవు. ఆ దేశమునకు వ్యతిరేకముగా నీవేమైనను చెప్పినయెడల నాకు విరోధముగా నీవు దానిని చెప్పుచున్నావు, ఎందుకనగా నేనొక అమెరికా దేశస్తుడను. ఒక అమెరికనుగా ఈ దేశమునకు వ్యతిరేకముగా మాట్లాడుట, మీకు వ్యతిరేకముగా మాట్లాడుటయే అగును, ఎందుకనగా మీరు దానిలోని భాగమగుచున్నారు. దానిని మీరు మరిచిపోకూడదు. అలా మరచిపోయినప్పుడు, నిశ్చయముగా నీవు ఆ మతిమరుపును కలిగియున్నావు. జ్ఞాపకముంచుకొనుడి, మీరు దానిలోని ఒక భాగము కానప్పుడు మీరు అమెరికా దేశపు పౌరులుగా ఉండుటకు వీలు లేదు. నీవు ఖచ్చితముగా ఉండవలసియున్నది… ఒక అమెరికను ఏమైయున్నాడో నీవు అదే విధముగా ఉండవలసియున్నది.

నేను ఖచ్చితముగా దానిలోని భాగమైయున్నాను. ఇది నా దేశము. నేను దానిలోని భాగమైయున్నాను. ఆమె ఏమైయున్నదో నేను అదేగా ఉన్నాను. చూడండి, ఆమె ఏమైయున్నను దానితో పని లేదు. ఆమె ఏమైయున్నదో నేను అదేయైయున్నాను. ఒక అమెరికనుగా ఉండుటకు, పూర్వపు తండ్రులతో (తాత ముత్తాలతో) నేను (అమెరికా దేశములోని) 'ప్లేమౌత్ రాక్" అను స్థలమందు దిగితిని. నేను అలా చేయవలసియున్నది. నేను ఆ దేశములో ఒక భాగమైయున్నాను. ఆమె యొక్క ఆపదల నుండి ఆమెను హెచ్చరించుటకై పాల్ రెవెర్ తో ప్రయాణము చేసాను. నేనొక నిజ అమెరికా పౌరుడనై యుండటకు 'ప్లేమౌత్ రాక్" అను ఈ స్థలము నందు దిగియుండ వలసియున్నది. సేనేమి చెప్పుచున్నానో మీరు గ్రహించుచున్నారా?మంచుతో కూడిన ఆ దెలవేర్ ( Deleware) అను స్థలమును జార్జ్ వాషింగ్టన్ గారితో, కాళ్లకు బూట్లు లేక అతని సైనికులతో చేరి దాటి రావలసియున్నది. నేను ఆ దేశములతో గుర్తించబడినందున నేనక్కడ ఉన్నాను. అక్కడతడు చేసినది నాలోని భాగమైయున్నది. ఇప్పుడు నేను చేయుచున్నది, అతనిలోని భాగమైయున్నది. ఇప్పుడు నేను చేయుచున్నది, అతనిలోని భాగమైయున్నది. దెలవేర్ అను స్థలములో, వాషింగ్టన్తో నేను గుర్తింపబడితిని. నేను స్టోన్ వాల్ జాక్సన్ తో నిలిచియుంటిని, "కఠినముగా నీకు వ్యతిరేకమున్నప్పుడు రాతి గోడవలె నీవేలాగు నిలచావు?" అని వారడిగిరి.

నీలి రంగు కళ్ళు కలిగిన ఆ వ్యక్తి ఈ ధూళిని తన కాలి బూట్లలతో తన్నుతు, "సర్వశక్తిగల దేవునికి నేను వందనములు చెల్లించనిదే నీళ్లు త్రాగను అని చెప్పాడు." అతనితో ఒక రాతి గోడగానే నిలువవలసియున్నది. నేనొక అమెరికనుగా ఉండుటకై అతనితో అక్కడ నిలచి, గుర్తింపబడవలసియున్నది.

అలా దెలవేర్ అను స్థలమును దాటుచు యుద్ధము చేయవలసియున్నది

32అప్పుడు ఆ పతాకమును నేను పైకెత్తాను. వారు 'గుఅమ్' (Guam) అను స్థలములో పతాకమును ఎత్తినప్పుడు, నేను వారితో ఉంటిని. అనేక వేల అమెరికా సైనికులు తమ ప్రాణమును పణముగా పెట్టి అక్కడకు పరుగెత్తుకొని వెళ్ళి ఆ పతాకమును పైకెత్తినప్పుడు, ఆ పతాకము పైకి లేచుచుండగా, నేను అక్కడ గుర్తించబడితిని. మనలో ప్రతి ఒక్కరు గుర్తింపబడినవారే. గుఆమ్ అను స్థలములో ఎగురు పతాకమును ప్రతి ఒక్కరు గుర్తింపబడి వారక్కడ పతాకమును స్థాపించిన దానిని నేను వినినప్పుడు, కన్నీరు చెక్కిళ్లపై దొరలినవి. అది నేనైయున్నాను. అది మీరైయున్నారు. అది మనమందరమునై యున్నాము. మనము దానితో అక్కడ గుర్తించబడినప్పుడు అది మనమే.

ఆమెలో ఉన్నదంతయు, నేనైయున్నాను. ఆమె మహిమ అంతయు నా మహిమగా ఉన్నది. ఆమె అవమానమంతయు, నా అవమానముగా ఉన్నది. ఆమె అవమానకరమైన కార్యములు చేసినయెడల, నేను ఆ నిందను భరించవలసియున్నది. ఆమె మహిమను పొందినప్పుడు, ఆమెతో కూడ నేను మహిమను పొందుచున్నాను, ఎందుకనగా నేను ఆమెతో గుర్తింపబడుచున్నాను. ఇప్పుడు ఒక అమెరికనుగా గుర్తింపబడుటకై ఆమె అవమానమునకైనను, మహిమకైనను, ఆమెకున్న దానంతటితో నేను గుర్తింపబడవలసి యున్నది. ఆమెకున్నదానంతటితో, లేక ఆమె ఏమైయున్నదో దానంతటితో మీరు గుర్తింపబడుచున్నారు.

GEN 15:4•

GEN 17:16•

GEN 18:10,14•

GEN 22:1,2,13•

JOB 38:7

 

33ఇప్పుడు ఒక నిజ క్రైస్తవుడుగా ఉండుటకు గాను నీవు ఆలాగే ఉండవలసియున్నది. మనము దానిని మరచిపోవుటకు ఇష్టపడకూడదు. ఆయన ఏమైయున్నాడో ఆ విధముగానే నేను ఆయనతో గుర్తింపబడుచున్నాను. నేనాయనతో గుర్తింపబడుచున్నాను. గమనించుము. ఆయన నాలోను, నేనాయనలోను ఉన్నాము. గమనించుము. ప్రతి నిజ క్రైస్తవుడు - ప్రతి క్రైస్తవుడు ఆయనతో ఉన్నాడు. జగదుత్పత్తికి మునుపే ఉదయ నక్షత్రములు ఏకముగా కూడి పాడినప్పుడు, దేవుని కుమారులు సంతోషముతో ఆర్భటించినప్పుడు వారాయనతో ఉండిరి. మనము దేవునితో మరణము లేని పరిధులలో గుర్తించబడితిమి. ఈ ప్రపంచము ఏర్పడుటకు ముందు కొన్ని లక్షల సం.లకు ముందే మనమాయనతో గుర్తింపబడితిమి. అక్కడ నేనాయనతో ఉంటిని. నేను నిత్యజీవమును పొందియున్నయెడల నేనాయనతో అక్కడ ఉంటిని. "ఉదయ నక్షత్రములు ఏకముగా కూడి పాడినప్పుడు దేవుని కుమారులు సంతోషముతో ఆర్చటించినప్పుడు, నేనాయనతో గుర్తింపబడితిని.

డెబ్బై-ఐదు సం.ల వయస్సులో ఆయన అబ్రాహామును పిలచినప్పుడు, నేనాయనతో ఉంటిని. ఆయన భార్యకు అరవై-ఐదు సం.ల వయస్సు ఉన్నప్పుడు వారికి ఒక కుమారుడు కలుగునని చెప్పినప్పుడు, నేను ఆయనతో ఉంటిని. "యెహోవా సెలవిచ్చుచున్నాడు, నేను కుమారుని పొందబోవుచున్నానని," అను దానిపై అతడు దృఢముగా నిలచినప్పుడు, నేనతనితో యుంటిని. నేను నేనాయనతో నిలబడితిని. ప్రతీ క్రైస్తవుడు అతడితో నిలచియున్నాడు. ఆయనకు శోధన కలిగినప్పుడు నేనాయనతో ఉన్నాను. ఇస్సాకును బలిగా అర్పించుటకు ఆయన కొండపైకి వెళ్ళినప్పుడు, నేనాయనతో ఉన్నాను. ఆ పొదలో పొట్టేలు కనబడినప్పుడు నేనాయనతో ఉన్నాను.

GEN 32:24•

GEN 37:4,24•

GEN 41:40•

EXOD 3:2•

EXOD 14:21,22

 

34తన సహోదరులందరితో యోసేపు నిరాకరించబడినప్పుడు, నేనాయనతో ఉన్నాను; ఎందుకనగా అతడు ఆత్మకు సంబంధించినవానిగాను, అతని సహోదరులు శరీరానుసారులుగాను ఉన్నారు. తన స్వంత సహోదరుల వలన నిందను భరించుటకు అతడు నిలచినప్పుడు, నేనాయనతో ఉన్నాను. అతడు ఏమైయున్నాడో, నేను కూడా అదే అయితిని; ఎందుకనగా మనము క్రీస్తు యేసునందు ఒక్కటైయున్నాము. యోసేపు తన మరణ గుహలో ఉన్నప్పుడు, నేనతనితో ఉన్నాను. అతడు ఫరో కుడి చేతి ప్రక్కకు వెళ్ళినప్పుడు, నేనతనితో ఉన్నాను. మీరు అతనితో గుర్తింపబడవలసినవారైయన్నారు.

ఆ రాత్రి యాకోబు ఆ రాత్రంతా, ఆ దూత్రతో పోరాడినప్పుడు, నేనాయనతో ఉన్నాను. నా అంతట నేనే పోరాడితిని. అతడు దేని ద్వారా వెళ్ళాడని నేనెరిగియున్నాను. అందువలన యాకోబు పోరాడిన అదే సమయములో నేను కూడ పోరాడితిని, ఎందుకనగా నేనతని సహోదరునిగా ఉన్నాను.

మోషే ఐగుప్తులో వెళ్ళినప్పుడు, నేనతనితో ఉన్నాను. ఆ మండుచున్న పొద దగ్గర, నేనతనితో ఉన్నాను. మీరు క్రైస్తవులైన యెడల పరిశుద్ధ గ్రంథములోని గుణలక్షణములతో గుర్తింపబడుదురు. దానిని మరచిపోకండి. ప్రజలందరు మోషేకు ఎదురు తిరిగినప్పుడు, నేనతనితో ఉన్నాను. మోషే ఎర్ర సముద్రమును దాటినప్పుడు, నేనతనితో యున్నాను. అతడు తన చేతిని ఎత్తి ముందకు నడచినప్పుడు, ఎర్ర సముద్రమును తెరచినప్పుడు. నేను క్రీస్తుతో గుర్తింపబడుచున్నాను, ఎందుకనగా ఆ సమయములో నేను మోషేతో నిలచియున్నాను.

EXOD 14:21,22•

1KGS 18:21

 

35ప్రతి క్రైస్తవులు ఏమై యున్నారో, ప్రతి విశ్వాసి ఏమై యుండవలసియున్నదో, ఇప్పుడు ప్రతి విశ్వాసి అదే వ్యక్తితో గుర్తింపబడియున్నారు. ఏది ఏమైనప్పటికిని, నీవు గుర్తింపబడవలసియున్నది. దానిని మరచిపోవద్దు. అలా మరచిపోయావంటే, నీకు ఆత్నీయు మతిమరుపు ఏర్పడియున్నది. నీవెవరివో నీవు మరచిపోయావు. ఇప్పుడు, అతడు ఎర్ర సముద్రమును దాటునప్పుడు, మోషేతో గుర్తింపబడెను.

ఆహాబు రాజు కాలములో, నేను ఏలీయూతో ఉన్నాను. ఆ దినమందు వారు దేవుని ఆరాధించవలెనా, లేక బయలును ఆరాధించవలెనా, అని ఎన్నిక చేయవలసి వచ్చెను. అతడు ఆ ఎన్నికను చేయునప్పుడు అతనితో మనము కర్మెలు పర్వతమందున్నాము, ఎందుకనగా వారు గుర్తించబడిన ఆ దేవుని శరీరముతో మనమును గుర్తింపబడితిమి. అందువలన మనమూ శరీరముతో గుర్తించబడినయెడల అప్పుడు అచ్చట మనమతడితో యున్నామనే దానిని జ్ఞాపకముంచుకోండి. అది నిజము.

1SAM 17:28•

DAN 3:23,25•

DAN 6:16•

LUKE 23:33•

LUKE 24:6

 

36ఇప్పుడు, దావీదు తన స్వంత సహోదరులు అతనిని త్రోసివేసినప్పుడు, నేనాయనతో ఉంటిని. నేను దావీదుతో ఉంటిని. మీరు ఒక క్రైస్తవులయితే, మీరు కూడా అక్కడ ఉన్నారు. అతనిని త్రోసివేసినప్పుడు, మీరు కూడా అతడితో గుర్తింపబడవలసియున్నది.

ఆ మండుచున్న అగ్నిలో ఆ హెబ్రీ పిల్లలతో, నేను ఉంటిని. ఆ నాలుగవ మనిషి నిమిత్తము ఆ అగ్ని వారిని దహించలేదు. ఆయన సన్నిధి అక్కడ ఉండినది ఆ సింహపు గుహలో నేను దానియేలుతో ఉంటిని. అక్కడ ఆ దేవుని దూత ఆయనను గుర్తించినప్పుడు, నేను కూడ అక్కడే గుర్తింపబడితిని.

ఆ కల్వరిలో అతి నిశ్చయముగా నేనాయనతో ఉంటిని. ఆ కల్వరిలో నేను ఆయనతో కూడ గుర్తింపబడవలసియున్నది. కల్వరిలో నేనాయనతో మరణించాను. ప్రతి క్రైస్తవుడు కల్వరిలో ఆయనతో మరణించియున్నారు. ఆయనతో కల్వరిలో మరణించని యెడల, ఆయన వానిగా నీవుండలేవు. ఆయన అక్కడ మరణించినప్పుడు, నేనక్కడ ఉన్నాను. నేనాయనతో మరణించాను.

అంతట ఆయన పునరుత్థానుడైనప్పుడు, నేను కూడా ఆయనతో లేచాను. ఆయనతో ఈస్టరు ఉదయము పైకి వచ్చాను. ఆయన ఏమి చేశాడో, అక్కడ ఆయనతో నేనున్నాను. ప్రతి విశ్వాసి ఆలాగే ఉన్నాడు.

JOHN 14:12•

EPH 2:6•

HEB 13:8

 

37యేసుక్రీస్తునందు పరలోక స్థలములలో, నేనాయనతో కూర్చొనియున్నాను. ఆయన ద్వారా పాతాళపు శక్తులను జయించియున్నాను. ప్రతి క్రైస్తవ విశ్వాసీ ఆ విధముగానే కూర్చొనియున్నాడు, ఎందుకనగా నీవు (ఆయనతో) గుర్తింపబడవలసియున్నది.

ఈ కడవరి దినములలో నేను చూచునదేమనగా, అనేక క్రైస్తవ విశ్వాసులు ఆయన సేవయందు గుర్తింపబడుచున్నారు. "ఆయన నిన్న, నేడు, నిరంతరము ఏకరీతిగా ఉన్నాడు. ఈ దినమందు నేను ఆయన సేవలో గుర్తించబడుటను చూచుచున్నాను. మీరు దానిని నమ్ముచూ, దానితో నడచుచు దానితో గుర్తింపబడితిరని మీరు ఎరిగియున్నారా? గమనించండి, ఆయన చేసిన క్రియలను విశ్వాసి కూడ చేయునని ఆయన సెలవిచ్చెను. "నేను చేయు ఈ క్రియలను మీరును చేయుదురు." అట్లయిన మీరాయనతో గుర్తింపబడుచున్నారా? అట్లయిన వాక్యము నిమిత్తము నింద వచ్చినప్పుడు, ఆయన నిలచినట్లే నిలిచి ఆయనతో గుర్తింపబడితివేమో చూచావా? నేను ఆయనతో గుర్తింపబడితిని.

ACTS 2:1,4•

HEB 13:8

 

38పెంతెకోస్తు దినమందు నేనాయనతో ఉన్నాను. అక్కడ పైనున్న ఆ శిష్యులతో నేను ఉండి, పరిశుద్ధాత్మ బాప్తిస్మమందు వారితో గుర్తించబడినది. నేను ఆశ్చర్యపడుచున్నది ఏదనగా, సంఘము (ఈనాటి సంఘము) ఎంతగా మతిమరుపు స్తితిలో ఉన్నదనగా, పరిశుద్ధాత్మ ఉన్నాడని, వారిలో అనేకులకు తెలియదు. అంతేగాక అనేకులు విశ్వసించరు. సంఘము ఎంతటి దీన స్థితికి దిగజారిపోయినదో గమనించితిరా? బహు ఘోరమైన క్షీణించిపోయే మతిమరుపు వ్యాధి గలిగినదిగా ఉన్నది! చూడండి.

యేసుక్రీస్తు ఏమైయున్నాడో అనే దానిని గూర్చి వారు పూర్తిగా మరచి పోయారు. వారు మరచిపోయారు. వారాయనను ఒక ధర్మశాస్త్రమును ఏర్పరచినవానిగానో, లేక ఒక ప్రవక్తగానో, లేక ఒక మంచి మనిషిగా తలంచుచున్నారే గాని; ఆయన నిన్న, నేడు, నిరంతరము ఏకరీతిగా ఉన్నాడని వారు మరచిపోయారు. ఒక బహు ఘోరమైన ఆత్మీయ మతిమరుపను వ్యాధిని సంఘము పొందియున్నది. వారు ఈ కార్యములన్నింటిని మరచిపోయారు. వారు ఎన్నడూ దానిని గ్రహించలేరు.

MARK 16:15,17

 

39అక్కడ పెంతెకోస్తు దినమందు, మనము ఆ శిష్యులలో ఉండి గుర్తింపబడవలెను. అపో, కార్యములు 2వ అధ్యాయములో అపోస్తలుడైన పేతురు ప్రసంగించిన ప్రసంగముతో నేను గుర్తింపబడితిని. ఆయన మాట్లాడినది నేను విన్నాను, అతడు చెప్పిన దానిని నేను నమ్ము చున్నాను, అతడు చెప్పిన దానికి నేను లోబడుచున్నాను. ఇప్పుడు నేను ఆ కార్యముతో గుర్తింపబడితిని.

అత్మీయ మతిమరుపు స్థితిని పొందవద్దు, ఎందుకనగా మీరు మరొక దానితో మిమ్మును గుర్తించుకొనవలసి వచ్చెను. (మరొక దాని పోలికను పొందెదరు) వాక్యముతో నిలచియుండుడి.

మార్కు సువార్త 16వ అధ్యాయములో "సర్వలోకమునకు వెళ్ళి ప్రతివారికి సువార్తను ప్రకటించుడని," యేసుక్రీస్తు చెప్పిన సంఘముతో నేను గుర్తింపబడి, మనమా సంఘముతో నిలచియున్నాము. సర్వలోకమునకు వెళ్ళి ప్రతివారికి అక్కడే గుర్తింపబడ వలెనని నేను ఆశించుచున్నాను. "నమ్మిన వారివలన ఈ సూచనలు జరుగును," అనునది దానిలో గుర్తింపబడుచున్నది.

మంచిది, ఇప్పుడు, మీరు దానితో గుర్తింపబడితిరా, లేక ఆత్మీయ మతిమరుపును పొందుట ద్వారా ఒక విశ్వాసిని వెంబడించు సూచనలను నమ్మలేకపోవుచున్నారా? చూడుము, నీవు వాటిని నమ్మలేకపోయినయెడల, నీవు ఆత్మీయ మతిమరుపులో ఉన్నట్లే. దేవుడే దానిని వాగ్దానము చేసెనని నీవు మరచిపోయావు. ఆయన సెలవిచ్చినదేమనగా "నమ్మిన వారివలన ఈ సూచనలు కలుగును." దానిని మరచిపోవద్దు. నీవు దానిని మరచిపోయి కూడ ఒక క్రైస్తవునిగా ఉండలేవు. నీవు దానితో గుర్తింపబడవలసియున్నది.

MATT 17:20•

MARK 11:23•

JOHN 14:12•

JOHN 15:7•

ACTS 2:14

 

40మీరు యోహాను సువార్త 14వ అధ్యాయము 12 వచనముతో ఖచ్చితముగా గుర్తింపబడవలసియున్నది. నా యందు విశ్వాసముంచువాడు నేను చేయు క్రియలను అతడును చేయును. దానిని మరచిపోవద్దు. నీవు మరచిపోయావంటే, నీకు ఆత్మీయ మతిమరుపు ఉన్నట్లే. నీవెవరివో నీవు మరచిపోయావు. నీ సాక్ష్యమేమిటోయని నీవు మరచిపోయావు. మరి ఆయన సెలవిచ్చిన దాని గురించి ఏముందువు? "నీవు నాయందు, నా మాటలు నీ యందును ఉన్నప్పుడు నీవు ఏది అడిగినను అది నీకు అనుగ్రహింపబడును." అది సత్యమని నమ్మునట్లు నీవు ఆ కార్యములతో అక్కడ గుర్తింపబడియున్నావా? మార్కు 11వ అధ్యాయములో ఆయన చెప్పినప్పుడు, "ఎవడైనను ఈ పర్వతమును చూచి కదలి పొమ్మని" అని చెప్పుచూ, నీ హృదయములో సందేహించక తాను చెప్పినది జరుగునని నమ్మినయెడల వాడు చెప్పినది జరుగునని, మీతో నిశ్చయముగా చెప్పు చున్నాను." అక్కడ నీవు గుర్తించబడితివా? అది సత్యమని విశ్వసించితివా? విశ్వసించని యెడల నీకు ఆత్మీయ మతిమరుపు ఏర్పడినదని భావము. మరియు, నీవు సమస్తమును మరచిపోయావు. నీ క్రైస్తవ స్థిమితమును నీవు పోగొట్టుకున్నావు. నీవు ఎక్కడికి సంబంధపడినవాడివని నీవు చెప్పలేవు.

"నేను మెథడిస్టును," అని నీవు చెప్పుదువు.

"నేనొక బాప్టిస్టును - దాని గురించి నాకు తెలిసినది అదే" అని చెప్పుకొనుచున్నావు.

"నేను పెంతకోస్తూ."

నేను ఇది, అది లేక మరొక దానికి సంబంధించి యున్నానని చెప్పుచున్నావు. గమనించండి! ఆ వ్యాధికి సంబంధించిన గురుతు నీపై కనబడుచున్నదని అర్ధము. నీవు ఆత్మీయ మతిమరుపును పొందియున్నావని చూపుచున్నది.

41"మంచిది, బ్రన్హం సోదరుడా, నేను దీనిని నమ్ముచున్నాను," అని నీవు చెప్పవచ్చు. ఇప్పుడు ఒక్క నిమిషము ఆగుము. ఈ కార్యములన్నిటిని జరుగునని దేవుడు వాగ్దానము చేసి, ఆవి చివరి దినములలో జరుగునని చెప్పుచు, అప్పుడు మీ సిద్దాంతములు మిమ్మును దానినుండి దూరము చేయునని కూడ చెప్పుచున్నప్పుడు, మీ పై ఆ వ్యాధి గురుతును నేను చూడగలుగుటకు అది ఒక ఖచ్చితమైన ఆనవాలుగా ఉన్నది. అది ఆత్మీయ మతిమరుపుగా ఉన్నది. వాక్యముతో నిన్ను గుర్తించుకొనుటకు నీవు మరచిపోయావు.

"మేము వ్యాధిగ్రస్తులు స్వస్థపడుటను నమ్ముట లేదని," అని నీవు చెప్పినప్పుడు, మీకు ఆత్మీయ మతిమరుపు ఏర్పడి ఉన్నది. "పరిశుద్ధాత్మ బాప్తిస్మమందు మాకు నమ్మకములేదని," మీరు చెప్పునప్పుడు, అది ఆత్మీయ మతిమరుపు.

MARK 16:15,17

 

42ఈ కడవరి దినములలో దేవుడు ఈ కార్యములను వాగ్దానము చేసెనని మేము నమ్ముటలేదనిన? నీవు పరిశుద్ధ గ్రంథమునకు బదులుగా ఒక సిద్దాంతమునకు లేక పారంపర్య క్రియలకు, చెవి యొగ్గియున్నారు. మీరు ఆత్మీయ మతిమరుపును పొందియున్నారు. మీరు ఎక్కడికి సంబంధించిన వారో మీరు ఎరుగరు.

మీరు ఒక క్రైస్తవునిగా? ఒప్పుకొనుచు వాక్యమును నిరాకరించుచున్నారు. మరలా ఆత్మీయ మతిమరుపు స్థితికి దిగజారిపోవుచున్నారు. చూడండి. మీరెక్కడ నిలచియున్నారో ఎరుగకున్నారు. మీరు ఆత్మీయ మతిమరుపును పొందియున్నారు. లేఖనములతో మిమ్మును మీరు గుర్తించలేకపోవుచున్నారు. మీరా శిష్యులతో ఉండవలసియున్నది, సమస్త వాక్యములతోను, ఆజ్ఞను పొందుకున్నప్పుడు యుండిన సంఘముతో నీవు నిలచియుండవలసినదే. అయితే, ఇప్పుడు "మీరు సర్వలోకమునకు వెళ్ళి సువార్తను ప్రకటించుడి; నమ్మినవారివలన ఈ సూచక క్రియలు జరుగును అను ఆజ్ఞను సంఘమునకు ఆదేశించినప్పుడు, అది ఆమెకు ఆదేశింపబడిన ఆజ్ఞగా ఉన్నది. ఇప్పుడు వారు. అదియే ఆదేశించబడిన ఆ ఆజ్ఞగా యున్నది. ఆత్మీయ మతిమరుపను వ్యాధి బహుగా ముదిరిపోయిన స్థితిని వారు కలిగియున్నారు, ఒకానొక దినమందు ఏదేను తోటయందు హవ్వ పొందుకున్నట్లుగానే.

ఇప్పుడు, ఆమె (సంఘము), ఇశ్రాయేలు వలెనే ఇదే వ్యాధితో బాధపడుచు, ఆత్మీయ మతిమరుపును కలుగజేయు సెమినరీల ఆహారము వలన సంఘమునకు దురవస్థ యేర్పడినది. సెమినరీ ఆహారము తీసికొనుట ద్వారా వ్యాధి ఏర్పడుచున్నది. అప్పుడు మొదటిగా జరుగు సంగతి మీకు తెలియునా? ఆత్మీయ మతిమరుపు అనే వ్యాధిని పొందుకొని బహు ఘోరమైన స్థితిని కలిగిన వాడివై, పరిశుద్ధ గ్రంథము చెప్పు ఏ కార్యమును నీవు నమ్మవు.

DEUT 18:15•

ISA 7:14

 

43ఈనాడు సంఘముతో వచ్చిన తొందర అదియే. ఈనాడు మనము ఉజ్జీవము పొందలేకపోవుటకు కారణము అదియే. ఈనాడు ప్రజలతో వచ్చిన బాధకు అదియే కారణము. వారు ఏది మంచిది, ఏది చెడ్డది అనే దానిని పరిశీలించి ఎరుగలేని ధారుణమైన స్థితికి ఒక్కొక్క ఇజమ్ (ISM) యొక్క సమస్త సిద్దాంతపు బోధ అనే ఉష్ణమునందు పెట్టి పొదగబడి జనులకు మత్తెక్కించుచున్నారు. అది ఖచ్చితము. ఆమె (సంఘము) తన ప్రభువును జ్ఞాపకము చేసికొనలేకపోవుచున్నది. ఆమె ఆయన వాక్యమును జ్ఞాపకము చేసికొనలేకపోవుచున్నది. ఆమె ఆ వాగ్దానమును జ్ఞాపకము చేసికొనలేకపోవుచున్నది.

యేసు రంగము మీదకు వచ్చినప్పుడు ఇశ్రాయేలు స్థితి కూడ ఇలాగే ఉండినది. వారు "ఒక కన్యక గర్భవతి అగునని," అనే ప్రవచనము వారికి జ్ఞాపకము రాలేకపోయినది." నీ దేవుడైన యెహోవా నీ మధ్యను నా వంటి ప్రవక్తను నీ కొరకు పుట్టించును," అని ప్రవక్త మోషే చెప్పిన ప్రవచనము వారికి జ్ఞాపకము రాలేకపోయినది. వారు ఆత్మీయ మతిమరుపును కలిగియుండిరి.

44ఈనాడు సంఘము ఆ స్థితినే కలిగియున్నది. "చివరి దినముల యందు అది జరుగునని," ఆయన చెప్పెను. ఇవి జరుగును, అవి జరుగుచుండుటను మనము చూచుచున్నాము. 12 గం.ల వద్ద నిలిచిపోయిన గడియారపు ముండ్లవలె సంఘము అక్కడే కూర్చొనియున్నది. అది ఏమిటి? అదే ఆత్మీయ మతిమరుపు.

మనలను మనము పెంతెకోస్తులమని పిలచుకొనుచున్నాము. అయితే మనము ఎక్కడున్నామో గుర్తించుకోలేక పోవుచున్నాము. క్రీస్తుయొక్క పునరుత్థాన శక్తితో వాక్యము బోధించబడునప్పుడు, ఆ వాక్యములో మన స్థానమెక్కడ ఉన్నదని గుర్తించుకోలేక పోవుచున్నాము. మరియు ఆయన ఇక్కడ మనమధ్య ఉన్నాడు, అవే కార్యములను చేయుచున్నాడు. ఆయన చెప్పిన వాటిని ఖచ్చితముగా చేయుచున్నాడు. అయితే గమనించండి, మన సంఘ సంస్థల యొక్క విధానము మనలను ఆత్మీయ మతిమరుపులోనికి కొనిపోయినది, ఇప్పుడు మనము బాధపడుచున్నాము. మనము ఎక్కడికి సంబంధించినవారిమో మనకు తెలియుట లేదు. ఒకరు తమ కాగితములను (ఆ సంఘములో నమోదు చేసికొనిన కాగితములను) ఈ సంఘము నుండి మరొక సంఘమునకు, ఆ తరువాత మరొక సంఘమునకు, ఈ ఇజము ( ISM) నుండి మరొక ఇజమునకు కొనిపోవుచున్నాము. చూచారా?

ఇప్పుడు మనకు కావలసినదేమనగా మరొక అమోసు ప్రవక్త రంగము మీదికి "యెహోవా సెలవిచ్చుచున్నాడు" అను దానితో రావలసియున్నది. అతడలా వచ్చినప్పుడు మనమతనిని అంగీకరింతుమా? లేక వారు చేసినట్లే చేసెదమా? వారాయనను అంగీకరించలేదు; ఈనాడు వీరు కూడా ఆయనను అంగీకరించరు. అతడు ప్రసంగించుటకు ఏ స్థలమందైనను తన తలను పెట్టలేడు (అది ఖచ్చితముగా నిజమైయున్నది), ఎందుకనగా సంఘము ఆత్మీయ మతిమరుపుతో బాధపడుచున్నది.

LUKE 17:28,30•

HEB 13:8

 

45ఇప్పుడు ఏమైనది? దేవుడు ఈ చివరి దినములలో వాగ్దానము చేసినదేమనగా లూకా 17వ అధ్యయము ప్రకారము, మనుష్య కుమారుడు ప్రత్యక్షమగు దినమున ఆలాగే జరుగును, సొదొమలో జరిగిన సూచన ఇప్పుడు మరలా జరుగును. అది జరుగుటను ప్రజలు చూచుచున్నారు. అయితే కొందరు దానిని విశ్వసించుట లేదు. అదేదో ఒక భ్రమగా వారు భావించుచున్నారు. అది ఒక దురాత్మ, దయ్యపు ఆత్మయని వారు తలంచుచున్నారు. అది ఏమిటి? వారు ఆత్మీయ మతిమరుపుతో బాధపడుచున్నారు.

అది వాస్తవము. వారు ప్రభువును గ్రహించలేరు. "ఆయన నిన్న, నేడు, నిరంతరము ఏకరీతిగా ఉన్నాడు." ఆయన అప్పుడేమై యుండెనో ఇప్పుడును ఆ విధముగానే ఉన్నాడు. అయితే జరిగినదేమి? మనము మనలను వాక్యముతో గుర్తింపబడలేకపోయాము.

ఎందుకు, ఆమె (సంఘము) ఒక విడిది ( lodge) గృహమా లేక ఒక సంఘమా అనేది కూడా ఆమెకు తెలియుట లేదు. విడిది గృహము అని పిలువబడుటకు ఆమెకు ఇష్టము లేదు, కాని అదే సమయమున ఒక సంఘమని ఆమెను పిలచుటకు ఆమె అందుకు అర్హురాలు కాదు, ఎందుకనగా సంఘము అని పిలువబడేది ఆమె తనను తాను క్రీస్తుతో గుర్తించబడవలసియున్నది. అలా కాకున్నప్పుడు, ఆ స్థితి ఆమెకు ఆత్మీయ మతిమరుపును కలుగజేయుచున్నది. అయితే ఆమె (సంఘము) విడిది గృహముగా పిలుచుకొనుటకు ఇష్టపడుట లేదు, అందువలన అది, పెంతెకోస్తు సంఘమని, మెథడిస్టు సంఘమని, బాప్టిస్ట్ సంఘమని పిలచుకొనుచున్నది. అయితే అది పెంతెకోస్తు విడిదిగాను, మెథడిస్టులకు విడిదిగాను, బాప్టిస్టుల విడిది గృహముగాను ఉన్నది — ఎందుకనగా అది తనను వాక్యముతో గుర్తింపబడలేకపోవుచున్నది. వాక్యము ప్రత్యక్ష్యమైనప్పుడు, దానిని వారు ఇంకనూ నమ్మలేకపోయారు — అది ఒక వ్యాధి, ఆత్మీయ మతిమరుపు. వారుని వారు గుర్తించుకొనలేరు. వారు దేనికి చెందియున్నారో, వారు ఎరుగరు. అది నిజము.

46అది ఒక దానిని సంకరము చేయునట్టున్నది. నేను పలుమార్లు చెప్పు చుండునట్లు, నేను చూచిన వాటిలో అతి తెలివి తక్కువ విషయము, మ్యూల్ అను ఒక రకపు సంకర గాడిద. చూడండి, అది సంకరము చేయబడినదై యున్నది. చూడండి, దాని తల్లి ఒక ఆడ గుర్రము గాను, దాని తండ్రి ఒక మగ గాడిదగాను ఉన్నారు. ఆ సంకర గాడిద దేనికి చెందినదని అది ఎరుగదు. మొదటిగా ఏమిటో మీకు తెలియునా, మీరు దానిని గర్భము ధరింపజేసినప్పుడు, ఒక గాడిదను పొందగలరే గాని, లేక సంకరము చేసినప్పుడు ఒక సంకర గాడిదను పొందగలరు; అయితే ఆ సంకర గాడిద దానికదే దాని జాతిని పొందజాలదు.

చూశారా, అది జరుగదు. దానికి మీరేమి నేర్పలేరు. అది తలబిరుసు గల జంతువు. మీరు దానితో ఏది చెప్పలేరు. దానికి పొడవైన చెవులను ముందుకు పెట్టి. అది మరణించుటకు ముందు నిన్ను తన్నుటకై తన జీవితములోని దీర్ఘకాల దినము వేచి యుండును. అంతే. దానికి సాధ్యమైతే అది నిన్ను త్రోసివేయుటకే వేచియుండును.

47పేరుకు క్రైస్తవులమని చెప్పుకొనే వారిని చూస్తే, నా తలంపులో వారు ఒక సంకరము చేయబడిన క్రైస్తవులుగానే యున్నారు. వారు ఆత్మీయ మతిమరుపు పొందు వరకు సంఘమును సంకరము చేశారు. ఆ వ్యాధి వారిని ఆవరించినది. మరొక దానిని వారు ఉత్పత్తిచేయలేరు. వారు ఆ సంకర మొక్క జొన్న గురించి మాట్లాడెదరు. సంకరము ద్వారా ఉత్పత్తి చేయబడిన మొక్క జొన్న దేనికి పనికిరాదు. సంకరము ద్వారా ఉత్పత్తి చేయబడిన ఏదైనా గాని, నీవు తినే వాటిల్లో అన్నింటికంటే అది బహు వ్యర్ధమైనది. అందువలననే నీవు ఈ సంకరము చేయబడిన తాత్కాలిక మొలకలను తీసికొని, వాటిని పరామర్శించి దానిని పెంచవలసియున్నది. ఎందుకు? ఎందుకనగా వారు దాని నుండి (ఆ మొలకల నుండి) కీటకములను దూరపర్చలేరు. అయితే ఒక అసలైన, క్రమబద్ధకమైన ధాన్యమునకు నీవు ఎలాంటి మందులు వాడనవసరము లేదు. పురుగులు తాకకుండా వాటిని అడ్డుకునే శక్తి దానిలోనే అది కలిగి యున్నది. ఆ విధముగానే ఒక నిజమైన ఆత్మతో నింపబడియున్న వ్యక్తిని అవిశ్వాసమనే పురుగులు తినకుండా అది (ఆ ఆత్మ) వాటిని అడ్డుకొనుచున్నది.

MARK 16:17•

HEB 13:8

 

48ఒక వృద్ధ సంకరగాడిదను తీసికొనుము, దానితో మాట్లాడుటకు వెళ్ళి, "అబ్బాయి, నీవు అది, ఇది చేయాలని నేను ఇష్టపడుచున్నానని చెప్పినప్పుడు," అది అక్కడ నిలచి "హా! హా! హా!" అనుచు ఆ పెద్ద చెవులను పైకి, క్రిందికి ఆడించును.

అలాంటి క్రైస్తవులను అనేకులను నేను చూచాను. వారు కేవలము పేరుకు క్రైస్తవులమని పిలువబడువారు మాత్రమే. "యేసుక్రీస్తు నిన్న, నేడు, నిరంతరము ఏకరీతిగా ఉన్నాడు, నమ్మినవారిని ఈ సూచనలు వెంటాడును? అని చెప్పినయెడల."

"ఓహో! ఆ దినములు, సూచక క్రియలు జరుగు దినములు గతించిపోయినవని నేను నమ్ముచున్నాను. ఓహో! ఓహో! ఓహో! అని చెప్పుదురు.

చూశారా, అతడు దేనిని విశ్వసించవలసియున్నదో అతడెరుగడు. అతనికేమియు తెలియదు. అతడెక్కడ నుండి వచ్చాడో అతనికే తెలియదు. అతడెక్కడికి వెళ్ళుచున్నాడో అదియు అతడెరుగడు. అతడు ఆ సంకర గాడిదకి కలిగిన మతిమరుపు వ్యాధి సోకినది. అతడెక్కడ నుండి వచ్చాడో ఎరుగడు గనుక ముందుకు వెళ్ళలేడు.

ACTS 2:1,4

 

49అయితే ఒక నిజమైన పరిపూర్ణమైన గొప్ప జాతికి చెందినవానిని నేను ఇష్టపడెదను. ఓ, అతడెంతో సౌమ్యముగా ఉండును. మీరతనితో మాట్లాడవచ్చును. అతడు తన తండ్రిని ఎరిగియున్నాడు, తన తల్లిని కూడ ఎరిగియున్నాడు, అతని నానమ్మను, తాతగారిని కూడ ఎరిగియున్నాడు. అతడెక్కడ నుండి వచ్చాడనుటకు కావలసిన వంశపారంపర్య పత్రమును చూపగలడు.

అలాంటి వంశావళిని కలిగిన క్రైస్తవుని నేను ఇష్టపడుదును. అది వెనుకకు వెళ్ళి దేవుని వాక్యమునొద్ద నిలచును, ఆ పెంతెకోస్తు దినమునకు వెళ్ళును, అక్కడ ఆ పరిశుద్దులతో తనను గుర్తించుకొనును. ఎక్కడ ఆ పెంతెకోస్తు దినమున దేవుని శక్తి దిగి వచ్చెనో అక్కడ నిలచును. అతడే నిజ వంశావళిగల క్రైస్తవుడు. అతడెక్కడ నుండి వచ్చాడో అతడెరుగును, మెథడిస్టులతో తనను గుర్తించుకొనడు, బాప్టిస్టులతో గాని లేక మరొకరితో తనను గుర్తించుకొనడు.

దేవుని వాక్యముతో తనను గుర్తించుకొనును. అతడెక్కడ నిలచియున్నాడనే దానిని గూర్చి అతడెరిగియుండును. తన తండ్రి యొక్క రాజరికపు రక్తము అతనిలో ప్రవహించును; అది యేసుక్రీస్తు రక్తమే. అదేమి చేయునో అతడెరిగియున్నాడు! అతడు ప్రతి వాక్యమును నమ్మును. దేవుడతని ద్వారా క్రియ చేయుచు, ఆయన వాగ్దానమును సూచనలు ద్వారా నిర్ధారణ చేయును. అతనికి అత్మీయ మతిమరుపు అనునది ఉండదు. అతడొక అసలైన గొప్ప జాతికి చెందినవానిగా యున్నాడు. దానిని నేను ఇష్టపడుదును.

50అయితే ఈనాడు సంఘము బహు నీచమైన ఆత్మీయ మతిమరుపు కలిగియున్నది. అదెక్కడిదో దానికి తెలియుట లేదు. దానిని గురించి సమస్తమును మరచిపోయినది. ఏదైతే ఒక సంఘముగా తయారు చేయునో దానిని మరియు సమస్తమైన కార్యములన్నింటిని మరచిపోయినది.

ఇప్పుడున్నట్లు మనలను బహు ధనవంతులుగా చేసినదేది? ఇశ్రాయేలు ఐశ్వర్యముతో వర్ధిల్లియున్న సంఘ సంస్థలో ఏ విధముగా యుండినదో మరలా అదే విధముగా అదే స్థానమునకు లవొదికయ సంఘము వెనుదిరిగి వెళ్ళినది. అది పేదదై ఉండి, అది చేయు ప్రతి కార్యమునకు దేవుని వైపు చూచి నమ్మినప్పుడు ప్రతి దానిని పొందగలిగినది. అది దేవునియందు తన విశ్వాసముంచినది. దేవుడు దానితో ఉండినప్పుడు, అది ఆత్మీయముగా ముందుకు కొనసాగినది, అయితే అది ధనికురాలిగా మారినప్పుడు, ఈ విధముగా జరిగినది, వారి పట్టణములు కట్టబడినవి. వారి స్త్రీలు సిగ్గుమాలిన స్థితికి దిగజారిపోయారు. వారి పురుషులు అందుకు అనుమతించారు, వారి బోధకులు వారియొక్క అడ్డు గడియలను తీసివేశారు, మరియు వారు ప్రవక్తలను త్రోసివేశారు, అలాంటి స్థితికివారు దిగజారిపోయారు. వారెచ్చట నుండి ఆశీర్వాదములను పొందుకున్నారో నిజస్థితిని వారు మరచిపోయారు.

చూడండి, మరియు మెథడిస్టులైన మీరు, బాప్టిస్టులైన మీరు, ప్రెస్బిటేరియనులైన… మెథడిస్టులైన మీరు జాన్ వెస్లీని జ్ఞాపకముంచుకోలేరు. బాప్టిస్టులైన మీరు! జాన్ స్మిత్ ప్రజల కార్యముల కొరకు ఎంతగా ఏడ్చెననగా ఆయన కండ్లు వాచిపోవునంతగా ఆక్రందన చేయుచు, రాత్రియంతయు ప్రార్ధి౦చెను. అతని భార్య అతనిని (భోజనపు) బల్లయొద్దకు నడపించవలసి వచ్చెను. మరి ఏమైనది? జాన్ వెస్లీ అనేక గొప్ప కార్యములో దీనిని చెప్పాడు (ప్రారంభపు మెథడిస్టు తండ్రులు చెప్పినదని నేను నమ్ముచున్నాను), మెథడిస్టు సంఘ కుమార్తెల సిగ్గుమాలిన క్రియలతో వారు లోక మర్యాదను అనుసరించుచు, దానికి బానిసయై వారి వ్రేళ్లకు ఉంగరములు ధరించుట ప్రారంభించారు. ఆ విధముగా అతడు ఆనాడే చెప్పినప్పుడు, ఈనాడు పొట్టి దుస్తులను చూచి ఆయన వారినేమనును? ఏమి జరిగినది? వారికి ఆత్మీయ మతిమరుపు అనే వ్యాధి సోకినది, ఖచ్చితముగా జరిగినది అదియే. వారెక్కడనుండి వచ్చారో మరచిపోయారు. దేవుని దాతృత్వము వలన ఆయన మంచితనము వలన వీటన్నింటిని మీరు పొందారు.

REV 3:17

 

51ఇది ఒక ఆశ్చర్య కార్యమని మీరు తలంచుచున్నారా? అది ప్రవచనముగా ఉండి యేసుక్రీస్తు ఆత్మతో ఖచ్చితముగా ఉన్నది. ప్రకటన 3వ అధ్యాయములో "నీవు దౌర్భగ్యుడవును, దిక్కుమాలినవాడవును, దరిద్రుడవును, దిగంబరుడవునై యున్నావని ఎరుగక, నేను ధవవంతుడను, ధనవృద్ధి చేసియున్నాను. నాకేమియు కొదువ లేదని చెప్పుకొనుచున్నావు," అని చెప్పబడియున్నది. చూశారా? దాని స్థితిని అది ఎరుగుట లేదు. అదే ఆత్మీయ మతిమరుపు. వారు దానిని ఎరుగకున్నారు.

సంఘములకు ఎంతో ధనమున్నది. ఈ దేశమందు సంస్థాగతము కాని సంఘము ఒకటైనను లేదు. అయితే అవి కోట్ల డాలర్ల విలువ కలిగియున్నవి. కోట్ల విలువగల భవనములు, కార్యములు, ఇవ్వన్నియు కలిగి ప్రభు రాకడ సమీపముగా ఉన్నదని బోధించు చున్నారు. "నేను ధనవంతుడను, నాకేది కొదువ లేదని," చెప్పుచున్నది.

అందరికన్నా మంచి విద్యావంతులైన బోధకులు వారికున్నారు, అందరికంటే వారికి గొప్ప వేదాంత పాండిత్యముగలవారు గలరు, పట్టణ౦లో మంచి ప్రాముఖ్యమైన స్థలముల యందు కేటాయించబడిన గొప్ప భవనములు వారికి గలవు. వారిష్టపడినది దేనినైనను చేయుటకు వారికి చట్టబద్దమైన మార్గములున్నవి. అయినను వారేమి చేయుచున్నారు? వారు ఆత్మీయ మతిమరుపును పొందుకొనుట వలన ఇశ్రాయేలు చేసినట్లుగానే, దేవుడే తమకు వీటన్నింటిని సమకూర్చి యిచ్చెననే విషయమును వారు మరచిపోతిరి.

REV 3:17

 

52మరియు బైబిలు ప్రవచించునదేమనగా యేసుక్రీస్తు తన దూతను పంపి యోహానుకు తెలియపరచినదేమనగా, ఈ చివరి సంఘకాలము ఆత్మీయ మతిమరుపును కలిగియుండునని సెలవిచ్చెను. వారు దరిద్రులైయుందురని జ్ఞాపకముంచుకొనుము. వారు గొప్పవారని తలంచుకొనుచున్నారు. వారికేదో ఉన్నదని వారు తలంచుచున్నారు. అయితే ఆయన చెప్పుచున్నదేమనగా, "వారు దౌర్భాగులునై, దిక్కుమాలినవారునై, దరిద్రులై, గ్రుడ్డివారై, దిగంబరులై యున్నారని ఎరుగకయున్నారు." వారికి ఇకపై చెప్పగల మార్గమేదియు లేదు.

ఇప్పుడు, ఒక మనిషి అవమానకరముగా, లేక ఒక స్త్రీ వస్త్రములు లేకుండా వీధి వెంబడి వెళ్ళుచు గ్రుడ్డిదైయున్నయెడల అది ఎంత దైనందనీయ స్థితిగా ఉన్నది. అయితే వారు మంచి మనస్థితిని కలిగియున్నట్లైన, వారెవరో వారికి తెలిసియుండును, వారు మానవులని గ్రహించియుందురు, వారు మంచి వస్త్రములను ధరించియుందురు. మంచిది, మీరలా వెళ్ళుదురు. వారు మానవులై మానవ జాతితో గుర్తింపబడవలసిన వారైయున్నారు. అయితే వారు దౌర్బాగ్యులై, దిక్కుమాలిన వారునై, గ్రుడ్డివారై దిగంబరులుగా ఉన్నారు, "మీరు వెళ్ళి, సోదరా, నీవు దిగంబరివై యున్నావని," చెప్పినయెడల,

"ఇప్పుడు, ఇక్కడ, నేను ఫలాని-ఫలాని డాక్టరునై యున్నాను. నీ పని చూసుకొని వెళ్ళు. నేను నీతో చెప్పునది ఏమనగా నేను ఫలాని-ఫలాని దానికి చెందినవాడిని! నాతో నీకు ఏ పనియు లేదు. నీవు పరిశుద్ధతలో దొర్లువాడవు, నాకు చెప్పవలసినదేమియు లేదు," అని చెప్పును. మనుషులు ఇలా చేయుటకు [టేపు పై అంతరాయం] ప్రజలు వారు చేయు కార్యములనే వారు చేయుచూ యుందురు.

JOHN 1:1,13

 

53వారి బోధకుడు విశాల-మనస్సు గలవాడని వారు నీకు చెప్పెదరు. చూచారా? అది ఏమిటి? వారు యేసుక్రీస్తును మరచిపోయారు. ఆయన ఆజ్ఞలను మరచిపోయారు.

ఆయన దిగి వచ్చి చేయబడునని చెప్పిన కార్యములను చేసినను, వారు దానిని నమ్మరు; అది ఆత్మీయ మతిమరుపు చూడండి. వారు మరచిపోయారు! వారు దిగంబరముగా ఉన్నారు, అయితే దానిని తెలిసికొనలేకున్నారు. దానిని గ్రహించలేకపోవుచున్నారు.

వారనుకొనునదేమనగా, నేనొక సంఘమునకు చెందినవానిగా వుంటే చాలు, కావలసినదంతా అంతే, అది మాత్రము చాలును. ఓ, సోదరుడా, అది దేవునికి ఒక భవననముగానో లేక ఒక విడిదిగా ఉన్నదే గాని మరొకటి కాదు. సంఘమునకు చెందియున్నంత మాత్రమున, దేవుకి దానితో ఎలాంటి సంబంధము లేదు.

మీరు దేవుని కుమారులుగాను, కుమార్తెలుగాను ఉండవలసియున్నది. మీరు దేవుని ద్వారా జన్మించినవారై యుండవలెను. మరియు దేవుడు వాక్యమై యున్నాడు. నేను నా తండ్రిలో భాగమైనప్పుడు, నేను నా తండ్రికి వారసుడనగుదును. మీరు దేవునితో భాగమైనప్పుడు, మీరు పరిపూర్ణముగా దేవుని ఎరుగుదురు. ఆయన పరిపూర్ణ వాక్యమును, సమస్తమును మీరు నమ్మెదరు.

REV 3:17

 

54నీ పేరేమిటో నీవెరుగలేనప్పుడు నీకు ప్రయోజనమేమి? బహుశా నీవు ఒక గొప్ప చక్కని కుటుంబము నుండి వచ్చియుండవచ్చు. నీవలా ఉందువని నేను నమ్ముచున్నాను… నీవు ఒక మంచి కుటుంబము నుండి, వ్యక్తుల నుండి వచ్చియుండవచ్చు. నీ యింటి పేరు మరిచిపోయావనుకో, నీవేమగుదువు. నీవు వెళ్ళి అవమానకరముగా జీవించగలవా? "నీ పేరు జోన్స్ కాదా?" అని వారడిగినప్పుడు లేక అది మరేమైనను ఉండవచ్చు.

"మంచిది. నేనెవరినో నాకు తెలియదు," అని చెప్పావనుకో, చూశారా? మంచిది, చూడండి, అది ఒక భయంకర స్థితి. ఆలాగు అటువంటి ఘోరమైన స్థితికి దిగిజారిపోవుట ఘోరమైన స్థితిగా యుండును.

మంచిది, క్రీస్తుకు ప్రతినిధిగా ఉండవలసిన సంఘము అక్కడే అది దారి తప్పి పోయినది. అసలు తాను క్రీస్తు యొక్క ప్రతినిధిననే దానిని అది మరచిపోయినది, ఎందుకనగా దానికి మతిమరుపు అనే వ్యాధి సోకినది, ఆ వ్యాధిని దానిలోనికి చొప్పించిరి, అందువలన సంఘము దేవుని వాక్యమును అంగీకరించుటకు బదులుగా సిద్దాంతములను మరియు సంస్థగా మారుటకు అంగీకరించినది. "మరియు వారు దిగంబరులుగా ఉన్నారు, గ్రుడ్డివారైపోయారు, దౌర్భాగ్యులైపోయారు; కాని ఆ స్థితి వారిలో ఉన్నదని ఎరుగకున్నారు మరియు అది వారికి ఎత్తి చెప్పుటకు ఏ మార్గమును లేదు.

ఇక్కడ బర్మింగ్ హామునకు నేను మరలా రాకపోవచ్చు. అయితే ఈ ఒక్కసారియైనను మీరు దానిని వినగలరు. సరేనా. నేను విత్తిన విత్తనము వరకే బాధ్యుడను గాని వేరొక దానికి కాదు. ఆ విత్తనము ఎక్కడికి వెళ్లాలో అక్కడికి దేవుడే దానిని నడుపుచున్నాడు.

MATT 15:6•

MARK 7:13•

LUKE 17:28,30

 

55మరచిపోయారు — అవును, వారు వాగ్దానపు వాక్యమును మరచిపోయారు, వారు పూర్తిగా మరచిపోయారు. యేసు వచ్చినప్పుడు ఇశ్రాయేలీయులు అలాంటి స్థితిలోనే ఉండిరి. అది మరచిపోయినది. ఓ, మెస్సీయా అను ఒకరు రావలసి యున్నదని వారు చెప్పుచూ దానివైపే చూచుచుండిరి. కాని వారు ఎదురుచూచే ఆ మెస్సీయా వచ్చి ఆయన తనను వాక్యముతో నిరూపించుకొనినప్పుడు, దేవుని యొక్క వాక్యము వారికి ఏ ప్రయోజనము చేయలేనంతగా వారు అనేక పారంపర్య ఆచారములను తమకొరకు ఏర్పరచుకొనిరి.

మరియు యేసు ఇలా వాగ్దానము చేశాడు, చివరి దినములకు ముందుగా, "సొదొమలో ఉన్నట్లే ఇదియు ఉండును." అది ఒక నిరూపణగా ఉన్నది. దేవుని యొక్క వాగ్దానము వారికే ప్రయోజనము చేయలేనంతగా ప్రజలు ఎన్నో పారంపర్య ఆచారములను ఏర్పరచుకొనిరి. వారి పారంపర్య ఆచారములే దేవుని వాగ్దానము వారికి నిష్ప్రయోజనమైనది. ఆత్మీయ మతిమరుపు! అది ఖచ్చితముగా ఆత్మీయ మతభ్రష్టత్వముగా ఉన్నది. చూడండి, వారు ఈ కార్యములన్నింటిని మరచిపోయారు. ఓ, నేను దీనికి చెందినవాడిని, నేను దానిని చేశాను. నేను ఆత్మలో నాట్యమాడాను. నేను దీనిని చేశాను? మంచిదే, మై, మై! దానితో ఈ కార్యమునకు ఏ సంబంధము లేనే లేదు

JOHN 1:1•

JOHN 8:44

 

56నీవు వాక్యమును నిరాకరించుచు ఏ విధముగా క్రైస్తవునిగా ఉండగలవు? దేవుడు వాక్యమైయున్నాడు. వాక్యము నీలో ఉన్నయెడల; నీవును వాక్యమును ఏకమై యుందురు. నీవు వాక్యపు సంపూర్ణమైయున్నావు. ఆమేన్! నేను ఈ తరములో జీవించుచున్నప్పుడు, ఈ తరమునకు వాగ్దానము చేయబడిన వాక్యము దేనిని చేయుచున్నదో నేను కూడ దానిని చేయవలెను. నేను ఒక క్రైస్తవునిగా ఉన్నందున బైబిలు బోధించుదానంతటి కొరకు నిలువవలెను. హల్లెలూయా! నన్ను ఒక అతి పరిశుద్ధునిగానో మరే విధముగానో వారు పిలచెదరు. నేను ఆత్మీయ అనుభూతిని ఇప్పుడు పొందుచున్నాను.

అవునండి! బైబిలు కోరుచున్న ప్రతిదానితో నేను గుర్తింపబడవలసియున్నది మరియు అది తన వారిని కోరుచున్నది. నేను ఈ నాగరికపు దినమందుండు ఆత్మీయ మతిమరుపుతో ఏకీభవించుకున్నయెడల, నేను ఖచ్చితముగా వాక్యముతో నిరూపించబడగలను. అయితే నేను దానిని నిరాకరించినప్పుడు, నాకు ఆత్మీయ మతిమరుపున్నదని అర్ధము. ఏదో ఒకటి జరుగవలసియున్నది. నేను ఒక సిద్దాంతము లేక పారంపర్యమును అంగీకరించవలెను, లేక ఏదో ఒక సంఘములో నుండవలెను. నేను దానిని చేయలేను. అయినను వాక్యము వచ్చి మరియు దానికదే గుర్తింపచేసుకొనును. అందువలనే యేసు గుర్తింపబడలేదు.

"ఓ, "మంచిదే, ఈ మనుష్యుడు పరిశుద్దుడే, మన పరిశుద్ధ యాజకుడని," వారు చెప్పారు.

అందుకు యేసు, "మీరు మీ తండ్రియగు అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలు నెరవేర్చగోరుచున్నారు."

GEN 4:3

 

57కయీను కూడ ఒక మంచి బలిని అర్పించాడని మీరెరిగియున్నారా? అతడు నమ్మకముగా ఒక బలిపీఠమును కట్టి, మోకరించి ఆరాధించాడు. ఒక బలిని అర్పించాడు, దేవునికి ప్రార్ధి౦చాడు. అయితే దేవుడు అంత మాత్రమే కోరినయెడల, నీవు ఒక ఆలయమునకు చెందియుండుటయు, ఒక బలిపీఠమును కలిగియుండుటయు, నీ దశమభాగములను చెల్లించుటయు, సంఘమునకు వెళ్ళుటయు, మంచి జీవితము జీవించుటయు, వీటిని దేవుడు కోరినయెడల, ఆయన కయీనును నిరాకరించుట న్యాయము కాదు, ఎందుకనగా కయీను ఈ కార్యములన్నింటిని చేశాడు. అవునండి, అది వాస్తవము.

అయితే మతమనగా, ఒక ముసుగైయున్నది. అందువలన నీ మంచి కార్యములతో నిన్ను నీవు కప్పుకొనలేవు. దేవుడు అంగీకరించునది ఒకటున్నది, అది యేసుక్రీస్తు రక్తము మాత్రమే. అదొక్కటే నిన్ను కప్పునదిగా లేక నిన్ను మరుగుపరచునదిగా ఉన్నది. దాని వెలుపల నేనొక సిద్దాంతము నుంచుకొందునని నీవు చెప్పెదవేమి, నీకు ఆత్మీయ మతిమరుపున్నదే గాని మరొకటి కాదు. జరిగినది అదియే.

ఇప్పుడు గమనించండి, వారు వారి వాక్యమును మరచిపోయారు, వారు బైబిలును మరచిపోయారు, వారు వాగ్దానమును మరచిపోయారు. వారు మెథడిస్తు మెరుగులలో, బాప్టిస్తు మెరుగులలో మరికొందరి మెరుగులలో జీవించుటకు ప్రయత్నించుచున్నారు. అయితే ఈ దినపు వాగ్దానము ఇక్కడే యున్నది, దేవుడు తన వాక్యము ద్వారా ఆ వాగ్దానమును మాట్లాడుచున్నాడు, దాని నిర్ధారణ చేయుచు, అది అలాగున్నదని నిరూపించుచున్నాడు, అయినా గాని వారు దానిని నమ్మకున్నారు — ఆత్మీయ మతిమరుపు ఏర్పడినది. అది ఖచ్చితముగా వాస్తవమైయున్నది. పూర్తి మతిమరుపు. దానిని ఖచ్చితముగా అసలు నమ్ముటయే లేదు.

58ఒక ఫ్రెంచ్ సిపాయిని గురించి నాకొక కథ చెప్పారు, మనము ముగించుటకు ముందు, (ఆలస్యమగునో ఏమో తెలియదు. ఇప్పటికే పది పేజీల వివరాలు నా వద్ద ఉన్నాయి. కావున మరొక సమయములో మాట్లాడుకొందము.)

గమనించండి. ఒక ఫ్రెంచ్ సిపాయి, వారికి సైన్యములో అనేక సిపాయిలుండెదరు. వారికి ఈ మతిమరుపు ఏర్పడుట సహజము, యుద్ధములు జరుగు సమయములలో అది ఏర్పడును. వారికొక కార్యక్రమముండును, వారు ప్రజలను పిలచి వారి ప్రియులు తప్పిపోయారేమో గుర్తు చూడమని అడిగెదరు, వారికెలాంటి నమ్మకము ఉండదు; వారిలో ఒకరు ఇద్దరికి అలా జరుగును, మిగిలిన వారిని వైద్య సంబంధముగా ఆసుపత్రులకు కొనిపోయెదరు. ఆక్కడే వారి జీవితములు అంతమగును. వారు ఆ కొండ ప్రక్కగా ఎక్కి వెళ్ళునప్పుడు గొలుసును లాగుట వలన, వారొక స్టేషనులో నిలచారు. అప్పుడు ఆ యవ్వనులు క్రిందికి దిగి కొంతసేపు కాళ్లను సర్దుకొనుచుండగా, కావలి కాయువారు, కొండలపై నిలబడి వారిని గమనించుచుందురు, ఎందుకనగా వారు ఆత్మీయ మతిమరుపులో ఉన్నారు. ఎందుకు? వారిని వారు గమనించవలసియున్నది.

59అప్పుడు వారు ఒక యవ్వనుని గమనించుచుండిరి. ఆ యవ్వనుడు క్రిందికి దిగి అక్కడున్న నీళ్ల కొలను పక్కగా చూచాడు, ఆ కొండ చుట్టూ చూచాడు. తన ముఖమును తడుముకొనుచు అతడు నిదానించి చూచుచుండెను. అతడు మరలా అలాగే చూచుచుండెను. అతడు ఆ నీటి కొలనును, ఆ రైలు స్టేషన్ చుట్టూ చూస్తూ నిలచాడు. అంతట నడచుటకు ప్రారంభించాడు,

అప్పుడా కావలివారు అతనిని నిలుపుటకు బదులుగా అతనిని వెంబడించారు. ఒక చిన్న మార్గము ద్వారా ఆ యవ్వనుడు ఆ కొండ పైకి వెళ్ళాడు. ప్రక్కకు తిరిగి మరొక కొండ పైకి వెళ్ళాడు. అక్కడ నుండి ఒక చిన్న చెక్కలతో నిర్మించబడియున్న ఒక ఇంటి దగ్గరకు వచ్చి నిలిచాడు. అక్కడ చూచినప్పుడు ఒక వృద్ధుడు చేతి కర్రను పట్టుకొని వెలుపలకు వచ్చుచుండెను. వెలుపలకు వచ్చి ఆ యవ్వనునిపై తన చేతులుంచి దగ్గరగా చేర్చుకొనెను. అతడు "నా కుమారుడా, నీవు తిరిగి వచ్చెదవని నాకు నమ్మకముండినది. నీవు మరణించావని వారు నాకు తెలిపారు, అయినను నీవు తిరిగి వచ్చెదవని నాకు నమ్మకముండినది." అప్పుడా యవ్వనస్తుడు తన స్వాధీనమునకు వచ్చాడు. అతని మతిమరుపు అతనిని విడిచిపోయినది. తానెవరో అతడు గుర్తించగలిగెను. ఆ వృదుడు తన తండ్రియని గుర్తించగలిగెను.

LUKE 15:17•

HEB 13:8

 

60ఓహో, సిలువ సైనికుడా, తీవ్ర తర్ఫీదు వలన నీకు మతిభ్రమ ఏర్పడినది. సిద్దాంతముల, సంస్థల, భ్రమలు మరి ఇంకనూ ఎన్నో ఈ లోక కార్యములు నిన్ను ఆవరించినవి. నీవెందుకు దిగి వచ్చి కొన్ని నిమిషములు ఆ బైబిలులో ఉన్నదేమిటో ఒక్కసారి త్రిప్పి చూడకూడదు? నీవెంతగానో తిరిగియుండవచ్చు, కాని నీవొక విశ్వాసిగా ఈ దినములలో ఒక దినమందు, ఈ వాక్యముతో నిన్ను నీవు గుర్తుంచుకొనవచ్చు. అయినను నీవు దీనిని ఎరిగియుండకపోవచ్చు, ఆ తప్పిపోయిన కుమారుడు తన స్వాధీనమునకు వచ్చి తన తండ్రిని జ్ఞాపకము చేసికొనినట్లు నీవెందుకు గుర్తుచేసికొనకూడదు. నీవెవరివో తెలిసికొనుము, అప్పుడు దేవుని వాక్యమందు నిన్ను నీవు గుర్తించకోగలవు.

గత దినమందు ఎవరో ఇలా చెప్పారు, "అయితే బ్రన్హం సోదరుడా, ఈ పెంతెకోస్తు ప్రజలను చూచినప్పుడు వారికి ఎటువంటి అందమైన భవనములు, సంఘములున్నవి. ఇంతెందుకు వారికి తర్ఫీదైన బోధకులు ఎందరో ఉన్నారు."

వినుము, ఒక మనుష్యుడు ఒక భార్యను పెండ్లి చేసికొనినప్పుడు అతడు ఆమె యొక్క అందముపై విశ్వాసముంచడు. లేదు, ఆమె చేసిన ప్రమాణమునందు, ఆమె మాట యొక్క నిజాయితీ యందు నమ్మకముంచును. అతడు ఆమె అందమందు నమ్మకముంచడు, ఆమె నిజాయితీయందు అతడు నమ్మకముంచును. మరియు నీవు దేవునితో పెండ్లి చేసికొనినప్పుడు అదే విధముగా జరుగును. మీరు నిర్మించిన గొప్ప అందమైన సంఘములపై మీ విశ్వాసముంచకూడదు; అయితే యేసుక్రీస్తు చేసిన వాగ్దానమునందే మీ విశ్వాసముంచవలెను. "ఆయన నిన్న, నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నాడని" విశ్వసించవలెను. మీరు విశ్వసించుచున్నారా?

ఒక్క క్షణము మనము తలలు వంచుదుము.

61ఈ రాత్రి నేను ఆశ్చర్యపడునదేమనగా, ఈ కట్టడములో ప్రజలు ఎక్కడైతే కూర్చొనియున్నారో, ఎక్కడ నిత్యత్వమునకు సంబంధించి, నిత్యత్వము వైపునకు ప్రమాణము చేయు పురుషులు ఉన్నారో వారు ఏదో ఒక దినమందు దేవుని కలిసికొనవలసియున్నదని మీరెరిగియున్నారు. మరియు మీకు ఆ మతిమరుపు యొక్క శ్వాస కొద్దిగా ఉండినయెడల మీరు పొరపాటైన మార్గము యందు గాని లేక వేరొక దానితో గుర్తింపబడియున్నారు. మీరు ఈ రాత్రి ఆ విధముగా వెనుదిరుగవలెనని ఇష్టపడినయెడల, యేసు క్రీస్తునందు మీరు గుర్తింపబడలేదని మీరు ఎరిగియున్నారా? ఇప్పుడు మీ చేతులెత్తి, "బ్రన్హం సోదరుడా నా కొరకు ప్రార్ధి౦చుము, నేను ఒక నిజ క్రైస్తవునిగాను, ఒక విశ్వాసిగాను గుర్తింపబడుటకు ఇష్టపడుచున్నాను," అని చెప్పగలరా.

దేవుడు మిమ్ము దీవించును గాక! ఓ, అది నిజము. ఈ చుట్టూ ఉన్నవారందరు చేతులెత్తారు. ప్రభువైన దేవుడు మిమ్ము దీవించు గాక.

అక్కడ బాల్కనీలో కొందరు "సోదరా, అది సత్యమని నేను నిజముగా నమ్ముచున్నాను. క్రైస్తవునిగా నేను నమ్ముచున్నాను, పూర్వపు పాతకాలము క్రైస్తవులు ఉన్నట్లు మనము లేము."

62పెంతెకోస్తు ప్రజలైన మీరు ఏమి చేయనైయున్నారు, మీ తల్లిదండ్రులు ఆ వీధి చివరలలో నిలచి కంజెరలను వాయించుచు ప్రార్ధి౦చారు. మీ తల్లి ఎంతో శ్రమతో మిమ్మును పెంచినది. కొన్ని సమయములలో చాలినంత బట్టలు లేక, ఆహారము లేకున్నప్పటికిని క్రీస్తును చేపట్టి విశ్వాసముతో జీవించిరి. అయితే పెంతెకోస్తు ప్రజలైన మీరు చేయునదేమిటి? వారు ఏబది సంవత్సరముల క్రితము సంస్థల నుండి వెలుపలకు వచ్చారు — అదే మిమ్మును పెంతెకోస్తుగా చేసినది — అవిశ్వాసము నుండి మిమ్మును వేరుపర్చుకొన్నారు.

పంది మరలా అదే బురద గుంటలో వెళ్ళి పండుకున్నట్లుగా, కుక్క కక్కిన దానిని మళ్ళీ తినునట్లుగా మీరు వెనుకకు తిరిగి వెళ్ళి దానినే చేశారు. మీరు ఏ స్థితి నుండి వెలుపలకు వచ్చారో, ఆ స్థితికే తిరిగి వెళ్ళిపోయారు. ఒక సంగతి ఏమిటి? మీలో ఆత్మీయ మతిమరుపు ఏర్పడిపోయినది. ఇప్పుడు మీకు మిగిలినది మీ సిద్దాంతములు మరియు సంస్థల కాగితాల మాత్రమే, మరియు మీరు మిగిలిన వారతో నిలిచిపోయారు — మిగతా వారితో ఉండగోరుచున్నారు.

మీ స్త్రీలు తలవెంట్రుకలు కత్తిరించుకొనుటకు, జీన్స్ వేసుకొనుటను, రంగులు పూసికొనుటకును అనుమతించుచున్నారు. వారు ఈ కార్యములన్నిటిని చేయుటకు మీరు అనుమతించుచున్నారు. సంఘములో ఈ కార్యములన్నియు అనుమతించబడినవి. ఆది ఏమిటి? ఆత్మీయ మతిమరువు.

MARK 16:17•

ACTS 2:38,39

 

63మొదటిగా మీరు తెలిసికొనవలసినది, దేవుడు తన ప్రజల మధ్య సంచరించుటకు ప్రారంభించాడు, అప్పుడు జరిగినదేమిటి? మీరు దానిని అంగీకరించలేదు. చూశారా? మీరు ఆ మతిమరపు వ్యాధిచే బాధింపబడినవారై ఎంతో బలహీనులైపోయారు, చూడండి. మీరు దానిని మాత్రమే వినగలిగారు. మీరు మీ సిద్దాంతములను విడిచి కొన్ని నిమిషములు వెలుపలకు వచ్చి బైబిలును తీసికొని, ఒక క్రైస్తవుడు ఏ విధముగా గుర్తింపబడవలసియున్నదో చూడగలరా? "నమ్మినవారివలన ఈ సూచక క్రియలు కనబడును."

అపొ. కార్యములలో పేతురీలాగు చెప్పెను, "మీరు మారుమనస్సు పొంది, పాపక్షమాపణ నిమిత్తము, ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి. అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరము పొందుదురు. ఈ వాగ్దానము మీకును మీ పిల్లలకును దూరస్తులందరికిని, అనగా ప్రభువైన మన దేవుడు తనయొద్దకు పిలచిన వారికందరికిని చెందునని, వారితో చెప్పెను."

అది అలా కాదు అని మీ సంఘకాపరి చెప్పుచున్నాడంటే, అతడు ఆత్మీయ మతిమరుపు వ్యాధిని కలిగియున్నాడని అర్థము. అతడు సంఘములో తన స్థానమును గుర్తించుకోలేకపోయాడు. ఒక సంస్థతో తనను గుర్తించుకోగలిగెను గాని మహిమా శరీరమైన యేసుక్రీస్తు యొక్క సంఘముతో గుర్తించుకోలేకపోయాడు.

MATT 12:32•

MARK 3:29•

JOHN 3:18

 

64ఇప్పుడు పరిశుద్ధాత్మ ఇక్కడున్నాడు. ఆయన చేసిన వాగ్దానమును నెరవేర్చుటకు వేచియున్నాడు. ఇక్కడ మీరు తలలు వంచియుండగా ప్రార్థనలో ఉండండి. పరిశుద్ధాత్మ తానే మాట్లాడనివ్వండి. చూడండి. ఇది ఈ దినమునకై వాగ్దానమును మీలో ఎవరైనను ఎరిగియున్నారా.

ఇప్పుడు అవసరతలో ఉన్న మీరు, ఈ రాత్రి…. ఇక్కడ అనేకులు మీ చేతులెత్తియున్నారు. మీరలా చేయుటకు ముందుగా, మనమిక్కడ నిలచి రోగులకు ప్రార్ధి౦చనైయుండగా, నిజముగా మీరు అవిశ్వాసము నుండి దూరపడగలరా అని నేను ఆశ్చర్యపడుచున్నాను. ఈ సంస్థ, వారి సిద్దాంతములు, ఈ కార్యములన్నియు పొరపాటైనవని చెప్పుచున్నవి. ఈ కార్యములను మీకు చెప్పిన వారు దయ్యమునకు సంబంధించినవారు అని కూడ చెప్పుచున్నారు. వారలా చెప్పనప్పుడు, "వారికి క్షమాపణ అనునది లేదు; ఈ లోకమందైనను, రాబోవు లోకమందైనను క్షమాపణ లేదు." ఇది సత్యమైనయెడల ఏమందుము? తలంచి చూడుడి.

ఇది నిజమైయుండిన, మీరెక్కడ నిలచెదరు? చూడండి. మీరు అలా మాట్లాడకూడదు. కేవలము మీ హృదయమందు విశ్వసించవలసియున్నది. దానిని నమ్మిన ప్రజలు ఇక్కడున్నారు. నేను యిచ్చట గత రెండు రాత్రుల నుండి కూర్చొనియుండి దేనినో పొందుకోవలెననే తపనతో, బాధతో నా నాలుకను గట్టిగా బిగపట్టుకొంటూ దానిని వెలుపలికి పిలుచుటకై వేచియున్నాను. స్నేహితుడా, జ్ఞాపకముంచుకొనుము, అది దేవునికిని నీకును మధ్య ఉన్నది. అది పొరపాటుగా యుండునని నీవు దానిని గూర్చి ఆలోచించుచూ యుండెదనా? ఏమి జరుగుచున్నదో మీరెరిగియున్నారు. మీరు దాని నిమిత్తము మన్నించబడరు. అది ఆత్మీయ మతిమరుపు. మీరు తిన్నగా నిత్యమరణమైన అవిశ్వాసములోనికి వెళ్ళిపోవుదురు. "ఆయనను నమ్మనివారు శిక్షకు పాత్రులుగా తీర్చబడిరి."

GEN 17:5•

GEN 18:13•

MATT 12:24,31•

MARK 3:22,28,29•

LUKE 11:15•

LUKE 12:10

 

65ఇప్పుడు మీ రోగము నిమిత్తము ప్రార్ధి౦చి ఇలా చెప్పండి, "ప్రభువైన యేసు, నీవు వాగ్దానము చేశావు. నేను…. " ఇక్కడ క్రొత్తగా వచ్చినవారుండవచ్చు, వారు ఇంతకు ముందు వచ్చియుండక పోవచ్చు.

యేసు ఇలా వాగ్దానము చేసెను…

నేను ఒక లేఖన భాగమును మాత్రము తీసికొందును, "లోతు దినములలో జరిగినట్లును జరుగును," అక్కడ దేవుడు ఒక శరీరములో బయలుపడినప్పుడు, ఆ ప్రజలు, అబ్రాహాము ద్వారా ఎన్నుకొనబడిన ఆ గుంపు, వెలుపలకు పిలువబడినది. అబ్రాము పేరు అబ్రాహాముగా మార్చబడినది. అప్పుడు వాక్యము శరీరముగా రూపుదాల్చి ప్రత్యక్షమై శారా యొక్క హృదయములోని రహస్యములను వెలుపలకు బయలుపరచుటను అబ్రాహాము చూచెను.

అబ్రాహాము యొక్క రాజ సంతానముగా ప్రత్యక్షమైనప్పుడు, ఆయన చేసినది అదియే. కాని వారాయనను ఒక దయ్యమని పిలిచారు. అప్పుడాయన చెప్పినదేమనగా, "పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు ఆయన ఇవే కార్యములను చేయును. నన్ను ఆ విధముగా మీరు పిలుచునప్పుడు మీకు క్షమాపణ కలదు గాని, పరిశుద్ధాత్మకు వ్యతిరేకముగా మాట్లాడినయెడల వారికి క్షమాపణ లేదు."

66"ఇప్పుడు ఆయనే తన యొక్క శక్తి ద్వారా ఈ ప్రజల సమూహము యొద్దకు వచ్చి నీవు ఎచ్చట యున్నను, తన యొక్క ఆత్మీయ హృదయ రహస్యములను వివేచించు కార్యము ద్వారా ఆయన తాను వాక్యమై యున్నానని చూపించుకొనుచుండెను. కాబట్టి ఇక్కడ ఎవ్వరైనను ఆ విధముగా ఆత్మీయ మతిమరుపుతో బాధపడుచుండినయెడల వారు ఏ సాకులు చెప్పకుండా ఈ బలిపీఠపు పిలుపునకు ముందుకు రావలెను. ప్రభువు మీకు సహాయము చేయును గాక, మీరు తలలు వంచి వినయముతో ప్రార్ధి౦చుడి, చూడుము.

ఇక్కడ నాకు ముందుగా ఒక స్త్రీ కూర్చొనియున్నది, తన ముఖము వరకు తన చేతిని పైకెత్తియున్నది. ఆమె వెన్నెముక బాధచే బాధపడుచున్నది, నరముల బలహీనత చేతను బాధపడుచున్నది, ఆమెకు కడుపు సంబంధించిన బాధతో బాధపడుచున్నది. ఇప్పుడు నాకు ముందుగా ఆమె కూర్చొనియున్నది. ఆమె ఈ దేశస్తురాలు కాదు. ఆమె "మాకన్" అని పిలువబడు పట్టణస్తురాలు. అవును. నీవెవరవో దేవుడు నాకు తెలుపగలడని, నీవు నమ్ముదువా? నీవు మిస్. అయెర్స్, అది నిజమైనయెడల నీ చేతులను పైకెత్తుము. నేనెవరో నీవెరుగవు. అది సత్యము. నిజమేనా? ఇప్పుడు నీకున్న బాధ నిన్ను విడచిపోయినది. యేసుక్రీస్తు, నీవు ఆయన వస్త్రమును ముట్టావు; ఆయన నిన్ను పరిపూర్ణురాలిగా చేశాడు, ఇప్పుడు కేవలము దానిని నమ్ముము.

67ఈ కట్టడము వెనుక ఒక మనుష్యుడు కూర్చొనియున్నాడు. అతడు పరిశుద్ధాత్మ బాప్తిస్మమును కోరుచున్నాడు. అతడు ఆత్మచే బాప్తిస్మము పొందవలెనని ఆశించుచున్నాడు. అతడు నా ముందు నిలచియున్నాడు. అతడు ఇక్కడి వ్యక్తి కాదు. అతడు చార్లొట్టెలోని కరోలినాకు చెందినవాడు. లిపో (Lepoe), అనునది అతని పేరు. నీవు నీ హృదయమంతటితో నమ్ముము. దేవుడు పరిశుద్ధాత్మతో నీ హృదయమును నింపును. నా సోదరుడా నీవు దానిని నమ్ముము.

MATT 28:20•

JOHN 14:12,19•

HEB 13:8

 

68ఇక్కడ నా కుడి ప్రక్క ఒక మనుష్యుడు అతని భార్యకు ఎదురుగా కూర్చొని యున్నారు. వారు వృద్ధ దంపతులు, వారు నా కుడిప్రక్కగా ఉన్నారు. ఆ మూల వ్యాధిచే బాధపడుచున్నది. ఆమె భర్తకు గుండె జబ్బు చేసియున్నది. వారిక్కడి వారు కారు. వారు టెన్నెస్సీ పట్టణము నుండి వచ్చియున్నారు. మిస్టర్ మరియు మిస్టర్స్ థామస్, మీరు మీ హృదయమంతటితో నమ్ముచున్నారా? మీ చేతులెత్తండి. మీ స్వస్థతను మీరు అంగీకరించవచ్చు. యేసుక్రీస్తు మిమ్మును స్వస్థపర్చెను.

దానినే ఆయన చేయునని ఖచ్చితముగా వాగ్దానము చేసెను. అయితే నా జీవితములో ఆ ప్రజలను చూడ లేదు. ఆత్మీయ మతిమరుపు! యేసు ఇలా చెప్పెను, "నేను చేయు ఈ క్రియలు మీరును చేయుదురు, కొంతకాలము లోకము నన్ను చూడదు, అయినను మీరు నన్ను చూచెదరు; ఎందుకనగా "నేను" [వ్యక్తిగత సర్వనామము] నేను మీతో ఉందును, మీలో ఉందును, ఈ యుగ సమాప్తివరకుందును. "యేసుక్రీస్తు నిన్న, నేడు, నిరంతరము ఏకరీతిగా ఉన్నాడు."

69ఇప్పుడు, ఇక్కడున్న స్త్రీ పురుషులు, మీలో ఏదో కొంత పొరపాటున్నది, అది ఏమై యున్నదని మీరు చూడలేకయున్నారు. విశ్వసించుటకు ఇష్టపడుచున్నారు గాని దాని అంగీకరించలేకపోవుచున్నారు. మీరు ప్రార్థి౦చబడుటకు ఇష్టపడుచున్నారు. ఆయన ప్రసన్నత మీ మధ్య ఉన్నప్పుడు; ఆయనను అంగీకరించుటకు ఇష్టపడుచున్నారా, మీరు వచ్చి నా ప్రక్కగా నిలువగలరా, నా చేతులను మీ పై ఉంచి ప్రార్ధి౦చనియ్యుడి. ఇప్పుడు మీరు వచ్చినయెడల, మీలో ఎవరు ఆత్మీయ మతిమరుపుతో బాధపడుచున్నారో వారు ప్రార్ధి౦చుకొనుటకు ఇష్టపడినయెడల, దానినుండి మరల పొందగోరినవారు ఇక్కడకు వచ్చి నిలువుడి. మీరు ఒక విశ్వాసి కాకపోవచ్చు, అయినను ప్రార్ధి౦చుకొనుటకు ఇష్టపడినయెడల ఇక్కడకు వచ్చి నిలువుము.

యవ్వనుడా, దేవుడు నిన్ను దీవించు గాక, ఇంకెవరైనా రాగలరా? ఓ, దేవుడు నిన్ను దీవించును గాక, రమ్ము యవ్వనురాలైన నిన్ను దేవుడు దీవించును గాక, ఇంకెవరైనను రాగలరా? రండి, ఇప్పుడే ఇక్కడకు రమ్ము, యవ్వనురాలైన నిన్ను దేవుడు దీవించును గాక. ఇంకెవరైనను రాగలరా? రండి, ఇప్పుడే ఇక్కడకు వచ్చి నిలువుడి. ఆత్మీయ మతిమరుపు. మీరు ఆ అంటు రోగముతో బాధపడుటను నేనిష్టపడుట లేదు. దేవుడు మన్నించు గాక. నన్ను అనుమతించుడి — మరే మరణమునైనను పొందనివ్వ౦డి గాని అవిశ్వాసిగా మరణించుటకు అనుమతించకుడి.

రండి, ఇప్పుడే ఆయనను అంగీకరించుడి. మీరు దానిని చేయలేరా? అచ్చట నుండి రండి, స్నేహితులారా ఆ బాల్కనీ నుండి దిగి రండి. ఇక్కడికి కొన్ని మెట్లు మాత్రమే ఉన్నాయి, అవి మీకును మరణమునకు జీవమునకును మధ్య ఉన్నవిగా ఉన్నది. చూడండి, క్రీస్తు ఏదియు చేయనియెడల నేనేమియు చేయలేను. క్రీస్తు ఒక్క దానిని తప్ప మరొక దానిని చేయవలసిన పని లేదు. ఆయన తన వాక్యమును నిలబెట్టుకొనవలసి యున్నది. ఆయన క్రీస్తుగా ఉండుటకును, దేవుడుగా ఉండుటకును దాని చేయవలసియున్నది. ఆయన తన వాక్యమును నిలబెట్టుకొనవలసియున్నది.

ఇప్పుడు జ్ఞాపకముంచుకొనండి. మీ అనుభవమును గురించిన నమ్మకము మీకు లేకున్నయెడల ఎందుకు మీరు దిగి రాకూడదు. మీరు కేవలము ఒక సంస్థకు చెందినవారైయున్నంత మాత్రమున పెంతెకొస్తు మునుమనవళ్ళుగా ఉన్నంత మాత్రమున ఏ ప్రయోజము లేదు. దేవునికి మునుమనవళ్ళు అంటూ ఎవ్వరూ లేరు. ఆయనకు కుమార్తెలు, కుమారులు మాత్రమే ఉన్నారు, కాని ముది మనవళ్ళుగాని, మునుమనవరాళ్ళు గాని ఎవ్వరూ లేరు. చూశారా? దేవునికి అలాంటిదేమియు లేదు. ఆయనకు కుమారులు, కుమార్తెలు మాత్రమే ఉన్నారు. మరియు మీరు ఆయన మనవలు, మనవరాళ్ళు కాదని మీరెరుగుదురు. మీరు భాషలలో మాట్లాడవచ్చు, మీరు నాట్యమాడవచ్చు, ఇవన్నియు మీరు చేయవచ్చు; అది మంచిదే, దానికి విరోధముగా నాకేమియు లేదు. అయినను మీరు ఇంకనూ ఆత్మీయ మతిమరుపును కలిగియున్నారు. దిగి రండి. ఇక్కడకు వచ్చి నిలవండి. దానిని గురించి ప్రార్ధి౦చనివ్వండి. మీరేమి చెప్పుదురు?

సంఘసభ్యుడా, కేవలము ఒక పేరుకు మాత్రము సంఘ సభ్యుడివిగా ఉన్నావు. నీవెందుకు ఇక్కడకు దిగి వచ్చి దాని నుండి ఇప్పుడే విడుదల పొందకూడదు?

70నేను ఇక్కడ బర్మింగ్ హామును విడిచిపోవుటకు ఇష్టపడుట లేదు, ఒక దినమందు తీర్పు వచ్చునప్పుడు అక్కడ మీ ముందు నేను నిలువవలసియున్నది. జ్ఞాపకముంచుకొనండి, నేను మిమ్మును మరలా కలసికొనబోవుచున్నాను. నేను ఇక్కడ దీనియందు మిమ్మును కలసికొననియెడల లేక తీర్పులో మిమ్మును కలసికొనినప్పుడు, ఈ రాత్రి మీతో నేను చెప్పిన దానికి జవాబు చెప్పవలసియున్నది.

ఇప్పుడు వినండి. స్నేహితులారా, మారుమనస్సు పొందుడి! మారుమస్సుపొంది, దాని నుండి వెలుపలకు రండి. అక్కడ నుండి వెలుపలకు రండి. ఇప్పుడే రండి. అదియే ఈ దేశములోని బాబ్-కటింగులు గల ప్రతి స్త్రీని తయారుచేసినది, లేక ఈ స్థలములో ఉన్నవారిని ఆలాగు చేసినది. ఇప్పుడే ఇక్కడకు రండి. అదియే సరియైనది. నిజముగా చెప్పవలెనన్న చాలినంతగా కృప మీకు లేదు, "నేను ఇష్టపడుచున్నాను, బ్రన్హం సోదరుడా, నా వెంట్రుకలు పెంచుకొనుటకు నేను ఇష్టపడుచున్నాను, కాని దానిని చేయుటకు కృప నాకు లేదు," అని చెప్పవలసియున్నది.

"ఇంతెందుకు," మీరిలా చెప్పవచ్చు, "ఆ కార్యముతో దానికేమైన సంబంధమున్నదా?"

71ఇక్కడ కొంత కాలము క్రితము, ఒక గొప్ప సేవకుడు నా యెద్దకు వచ్చాడు, అతడు, "బ్రన్హం సోదరుడా, నా చేతులు నీ పై ఉంచుటకు ఇష్టపడుచున్నాను. ప్రతి ఒక్కరు నిన్ను ఒక ప్రవక్తగా చెప్పుకొనుచున్నారు," అని చెప్పెను.

అందుకు నేను చెప్పినదేమనగా, "నేను ఒక ప్రవక్తనని, నేనెప్పుడు చెప్పలేదే?"

అందుకతడు, "అయినను ప్రజలు నిన్ను ప్రవక్తగా గౌరవించుచున్నారు. ఎందుకనగా నీవు ఎల్లప్పుడు దుయ్యబట్టుచున్నావు, వారు వేయు పొట్టి బట్టలను గురించి మాట్లాడుచున్నావు," అని చెప్పెను. ఓ, అతడొక పెంతెకోస్తు మనుష్యుడు, "పొట్టి బట్టలు వేయుట, పొట్టిగా వెంట్రుకలను కత్తిరించుకొనుట, ఈ కార్యములన్నిటిని గురించి మాట్లాడుట నీ పని కాదు," అని చెప్పెను.

"అప్పుడు అది ఎవరి పని, అని నేను అడిగాను.

అందుకతడు, "ఆ ప్రజలకు, లేక ఆ స్త్రీలకు ఆత్మ వరములను గురించియు, ప్రజలకు ఎలా సహాయపడగలరో దానిని గురించియు చెప్పవచ్చును గదా? అని చెప్పెను. "వారు నిన్ను గౌరవించుచున్నారు, నీవు వారితో చెప్పు దానిని వారు విశ్వసించెదరు. వరములను ఏ విధముగా పొందవలెననియు, ప్రజలకు ఎలా సహాయపడగలదనియు, ఎందుకు వారికి నీవు బోధించకూడదు? దానికి బదులుగా వారినెందుకు నిందించుచున్నావు?" అని చెప్పెను.

అప్పుడు నేను, వారికి అ, ఆ, లు రానిదే వాక్యకరణమును ఎలా నేర్పగలను. వారికి ప్రారంభమే తెలియలేదు," అని చెప్పాను.

72క్రింద నుండి మనము ప్రారంభము కావలసియున్నది. "మారుమనస్సు పొందుటయా లేక నశించుటయా! ఇప్పుడు నిన్నునీవు దేనిలోనైనను అమర్చుకొనవచ్చును. మారుమనస్సు పొందుటయా లేక నశించుటయా!"

ఇక్కడ యేసుక్రీస్తు పరిపూర్ణముగా తనను తాను, రాత్రి వెంబడి రాత్రి, బయలుపరచుకొనెను. ఈ రాత్రి మనము రక్షణ వైపు తిరుగుచున్నాము. ఇక్కడికి కొన్ని మెట్లు మాత్రమే ఉన్నాయి, నేను వేచియుండుటకు ఎంతో సమయమున్నది. బర్మింగ్ హం, జ్ఞాపకముంచుకొనుము, మీ రక్తము నా పైన లేదు. నేను నిరపరాదిని. మీరు నిజముగా పరిశుద్ధాత్మను పొందియున్న ఎడల మీరు వచ్చుటకు ఇది ఒక తరుణమై యున్నది. మీరు ఏదో ఒక సంఘ విధానము కలిగియుండుట వలన ఈ ఆత్మీయ మతిమరుపు కారణమైనయెడల మీరెందుకు రాకూడదు? యేసే దానికి స్వస్థత. మీరు రారా?

ఇప్పుడు కొందరు బాల్కనీని విడచి వచ్చుచున్నారు. వారెక్కడికి వెళ్ళుచున్నారని చూచుటకు నేను వేచియున్నాను: వారు ఈ వేదిక నొద్దకు వచ్చుచున్నారా, లేక వెలుపలకు వెళ్ళిపోవుచున్నారా అని చూచుటకు నేను వేచియున్నాను. ఇక్కడకు చుట్టూ క్రిందికి రండి. అది మంచిది. ఇక్కడున్న మీరు, ఈ వేదిక చుట్టూ వచ్చి నిలిచి, "దీనితో నేను ముగించాను," అని చెప్పండి. అవును. ఇద్దరు స్త్రీలు దిగి వచ్చుచున్నారు. అది మంచిది. ఇప్పుడే దిగి రండి. అక్కడ నుండి కొన్ని మెట్లు మాత్రమే ఉన్నాయి. ఆ మెట్లే ఆ వ్యత్యాసముగా ఉన్నవి.

73ఇప్పుడు చూడండి, మిమ్ములను నేనొకటి అడుగబోవుచున్నాను. ఈ రాత్రి ఆయన వచ్చాడంటే ఎట్లు౦డును? ఆయన రాడని చెప్పవచ్చు? ఆయన వచ్చునో లేదో నాకు తెలియదు. ఇది చివరి సూచనగా ఉన్నది. జ్ఞాపకముంచుకొనుడి, "యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు [సత్యము కాక మరొక దానిని నేను మీతో చెప్పుట మీరు ఎప్పుడైనా విన్నారా?], మీరు మీ చివరి గురుతును చూచుచున్నారు." అది ఆత్మీయమైనది.

మీరు మీ చివరి గురుతును చూచుచున్నారు, అదే పెంతెకోస్తు, ఎత్తబడుట తరువాత ఆయన ఇశ్రాయేలుకు చేసిన వాగ్దానముతో మిళితము చేయవద్దు. అది మీకు కాదు. అప్పటికి మీ కార్యము సమాప్తమైపోవును. చూశారా? ఇది మీ దినముగా ఉన్నది. ఇప్పుడు మీ సూచనగా ఉన్నది. ఇది మీ కాలమై యున్నది. దానిని నిరాకరించవద్దు. అలా చేయకండి, మీరు వచ్చుట మంచిది.

నేను దేవుని సేవకుడనని మీరు నమ్ముచున్నారా? జ్ఞాపకముంచు కొనుడి. బర్మింగ్ హం, ఇంత చక్కని ప్రజలను నేను ఎక్కడ కలిసికొనుట లేదు. నేను నా జీవితములో కలిసికొన్న ప్రజలలో మీరు చక్కని ప్రజలైయున్నారు. అయితే మీకు ఉజ్జీవము కావలసియున్నది. మీరు మరణించుచున్నారు. మీరు ఆత్మీయ మతిమరుపును పొందుచున్నారు. మీరు మరణించుచున్నారు. అలా చేయకండి; మీకున్న దానికి ఉజ్జీవము నివ్వండి. త్వరగా దానిని తీసికొని రండి, యేసు వచ్చునంతలో చేయండి.

74మంచిది. వారలా వచ్చుచుండగా, మనమందరము ఏకమగునంత వరకు వారిని రానివ్వ౦డి, ఇక్కడ ప్రభువు పిలుచుచున్నాడు. ఇప్పుడు రండి. ఆ మతిమరుపు నుండి విడుదల పొందండి. ఆ గొప్ప పరిశుద్ధాత్మ మిమ్మును స్వస్థపరచుటకై ఇక్కడున్నాడు. దానిని (ఆ మతిమరపును) మీ నుండి తీసివేయండి. ఆయన ఇక్కడున్నాడని, ఆయన నిరూపించియున్నాడు. మీలో ఎందరు దానిని గుర్తించారు? మీ చేతులెత్తుచూ "నేను నిజముగా దానిని నమ్ముచున్నాను," అని చెప్పండి. ఆయన చెప్పాడు, మీరు. చూశారా? ఇప్పుడు ఆయన ఇక్కడున్నాడు. చూశారా? చూడగలిగారా? మీరు విశ్వసించండి.

నేను సత్యమునే చెప్పుచున్నానని ఎందరు ఎరిగియున్నారు? మీరు మరణించుచున్నారు. మీకు ఉజ్జీవము అవసరమైయున్నది. చూశారా? అది సత్యము. మీరు మంచి ప్రజలైయున్నారు. ఇంతకంటెను మంచిని మీరు కలిగియుండలేరు. ఇక్కడ ఈ పూర్వపు దక్షిన పొలిమేర ప్రాంతములలో జరుగు హృదయస్పందనకన్నను మరొక మంచి స్థలము లేదు. అది నిజము. నిజాయితీ ప్రజలు ఇక్కడున్నారు! అయితే మీరు మేలుకొనుట మంచిది. త్వరగా మేలుకొనండి! మీరు తలంచని ఈ ఘడియలో అది జరుగవచ్చు లేదా, అది జరుగకపోవచ్చు. నాకు తెలియదు.

75అయితే జ్ఞాపకముంచుకొనండి, మీరు మీ చివరి హెచ్చరికను పొందుచున్నారు. కావున మీరు ఎగిరిపోవుటకు సమయముండగానే ఎగిరిపొండి.

ఇప్పుడు రండి. మీరు వచ్చునంత వరకు నేనిక్కడ వేచియుందును, ఎందుకనగా ఒకవేళ, ఒక్క ఆత్మ పదివేల ప్రపంచములతో సమానము. మరియు ప్రజలు ఒప్పుకొనుచున్నంతవరకు…

ఈ ఏర్పాటు ఒక గొప్ప ఉజ్జీవముగా, ఇక్కడున్న ప్రతి సంఘములో వెళ్ళవలెనని ఆశించుచున్నారు. మీరు మీ బేధాభిప్రాయములను విడచి, మీలోని స్వార్ధమును దూరపర్చి పరిశుద్ధాత్మను అంగీకరించవలసియున్నది. మీరు దానిని విశ్వసించారని ఒప్పుకొన్నారు. దానిని నమ్మెదమని కూడ ఒప్పుకొన్నారు. మరియు ఈ కార్యము తనకు తానే నిరూపించుటకు వచ్చినప్పుడు, మీరు ఒకరి నుండి ఒకరు వేరైపోవుచున్నారు. దేవుని వాక్యముతో మన హృదయాలను ఎందుకు కలుపుకొని, ఆ సత్యమును నమ్మకూడదు? దానినే మనము చేయవలసియున్నది. మీరు మరణించుచు, లవొదికయ లోనికి నేరుగా వెళ్ళుచున్నారు. అది అలా ఉండునని ఆయన వాగ్దానము చేశాడు.

ఇప్పుడు మీరు రారా? ఇప్పుడే ఆ దినము మన మధ్య ఉన్నది. మనము ఒప్పుకొనవలసిన సమయమిదే. పరిశుద్ధాత్మ ఏమి చేయుచున్నదో గమనించండి.

76ఈ ప్రజలపై ఆసక్తిగల ఇక్కడున్న ప్రతి సేవకుడు నాతో కలసి ప్రార్ధి౦చ రావలసినదిగా నేను కోరుచున్నాను. ఈ ప్రజలయందు ఆసక్తిగల సేవకులు, ఇక్కడకు లేచి రండి. రండి ఈ చుట్టూ కూడి రండి. ప్రజలతో చేరి రండి. సేవకులైనను, వ్యక్తగతముగా సేవచేయు ఎవ్వరైనను, ఒక మంచి పనివాడుగా (సేవలో) ఉన్నవారు ఇక్కడకు రండి.

ఈ స్త్రీలతో నిలుచుటకు ఇష్టపడు ఒక స్త్రీ ఇక్కడికి రమ్ము, నా హృదయమంతటితో నేను నమ్మునదేమనగా, ఇప్పుడు పరిశుద్ధాత్మ ఇక్కడ ఈ ప్రజల మధ్యకు రాబోవుచున్నాడు. ఆయన తనకు తానే ఈ ప్రజల మధ్య నిరూపించుకోబోవుచున్నాడు.

77మొదటిగా ఇక్కడున్న ప్రజలకు నేను చెప్పునదేమనగా. స్నేహితులారా! ఇప్పుడు మీరు ఎందుకొరకు ఇక్కడకు వచ్చితిరో, ఆయన దానిని ఎరిగియున్నాడు. నేను మీకు దానిని బుజువుచేయగలను. నేను ఒక్కొక్కరినిగా వేదిక పైకి కొనిపోయెదను, ఆయన తెలుపనిది ఒక్కటియు లేదు. నేను చిన్న బాలునిగా ఉన్నప్పటి నుండి అలా జరుగుచున్నది. ఆ వరము ప్రశ్నగా లేదు. అయితే ప్రశ్న యేదనగా మీరు దానిని నమ్మగలరా? అనునదే. మీరు దానిని పొందగలరా? ఇప్పుడు ఆయన ఇక్కడున్నాడు. ఆయన ఇక్కడున్నట్లైన, ఒక్క కార్యము జరుగును: ఆయన తన వాక్యమును (మాటను) నిలుపుకొనును. మీరు పొందితిరని మాత్రము విశ్వసించుడి మరియు అంగీకరించుడి, లేచి నిలచి, "ప్రభువైన దేవా దానిని అంగీకరించుటకు నేనిక్కడ నిలచియున్నాను," అని చెప్పుము. అది జరుగు వరకు అక్కడ నిలచియుండుము.

ఒకప్పుడు బడ్డీ రాబిన్సన్ ఒక పంట చేనిలో చెప్పినట్లు, "ప్రభువా, నీవు పరిశుద్ధాత్మను ఇవ్వనట్లైన, నీవు తిరిగి వచ్చునప్పుడు ఇక్కడ ఎముకల గూడు మాత్రమే నిలచియుండును," అని అతడు చెప్పెను. ఆయన సంచకరువుగా మరణించెను. నీవు చాలినంత ఒత్తిడిని పొందువరకు దేవుని యొద్ద నుండి దేనిని పొందలేవు.

REV 3:16

 

78ఇప్పుడు, ఈ దినపు పంటను గమనించారా, ఈ దినమున మనము చేసినదేమని గమనించారా? మనము నిజముగా, మనము వేదికపైకి వచ్చి నేను వచ్చుట మంచిది, నిజమే, అని చెప్పుటకు చాలినంత దేవుని కలిగియున్నాము. [ఇది ప్రపంచమంతటి అనుభవముగా ఉన్నది.] నిజమే, నేనక్కడకు వెళ్ళి నిలచెదను, మంచిది, మంచిది, నాకేదియు తెలియదు. ఇక్కడ నేనున్నాను. చూడుము అని చెప్పుము. హుమ్! మనము లోపల నుండుటకు ఎటువంటి మంచి స్థలమది!

అక్కడ మండుచున్న అగ్ని లేదు. అక్కడ ఇచ్ఛకు సంబంధించిన సంతోషము లేదు. "దాని లోనికి వెళ్ళు" అనునది అక్కడ లేదు. ఒక సువార్తను ప్రకటించువానిగా, దేవుని ప్రజలను ఆ రూపములో చూచుటకు అది నన్ను చంపుచున్నది. మనము అగ్నిలో ఉండవలసిన వారము. అయితే, మీరు చూడండి, అది ఏమిటి? అది ఖచ్చితముగా నేను చెప్పినదై యున్నది — ప్రకటన 3 — నీవు నులివెచ్చనగా ఉన్నావు? ఆయన చెప్పునదేమనగా, "నీవు నులివెచ్చనగా ఉన్నావు గనుక నిన్ను నా నోట నుండి ఉమ్మివేయనుద్దేశించుచున్నాను." అది నిజమేనా? దానినే ఆయన చెప్పాడు. మరియు ఆయన దానిని చెప్పినందువలన, ఆయన దానిని చేయబోవుచున్నాడు. కావున మనము ఆ గుంపులో చేరకుందము గాక. ఇక్కడ మీరు అవసరతలో ఉన్నారు. దాని పొందెదము, లేక ఇక్కడే మరణించెదము. అది మంచిది. దానిని పొందెదము, లేక ఇక్కడే మరణించెదము.

79ఇప్పుడు, నా ప్రియ సోదరా, సోదరీ, నేను దిగి వచ్చి మీకు ఏదైనను సహాయము చేయగలను, నేను ఖచ్చితముగా చేయగలను. ఇప్పుడు, ఒక వరము ద్వారా మీరెందుకు ఇక్కడున్నారో నేను చెప్పగలను. దేవుని ఆత్మ ద్వారా, పరిశుద్ధాత్మ ద్వారా అది ఏమని నేను చెప్పగలను. మీరెందుకు వచ్చారోనని కూడ చెప్పగలను. మీరేమి చేశారోనని కూడ చెప్పగలను. భవిష్యత్తు ఏమిటి? అలా ఎన్నో వేల కార్యములను చేయగలను. అయితే అది దానిని గురించి ఏ అక్కర తీసికొనదు. నీవు దీనిని అంగీకరించవలసి యున్నది. నీకై నీవు అంగీకరించవలసి యున్నది. అది నీపై యుండవలసి యున్నది.

ఇప్పుడు, మీరు సిద్ధమా? మీ చేతులు పైకెత్తండి, "నేను సిద్ధమే. ఇక్కడే మరణించుటకు కూడ నేను సిద్ధమేనని చెప్పండి." అది నీ మనసులోని భావము కానట్లయితే అలా చేయకండి. "నేను ఇక్కడ మరణించుటకు సిద్దమే లేక, దేవుని దగ్గర నుండి నాకు కావలసిన దానిని పొందగలను." ఆమేన్. మీరు నిజముగా సిద్ధముగా ఉన్నారా?

80అట్లైన సభలో, ప్రతిచోట ఉన్నవారు లేచి నిలువుడి.

ఇప్పుడు ఏకముగా, ఇప్పుడు మనమందరము ఒక్కటిగా ఏకమగుదము. మనము ప్రార్ధి౦చుదము. ఇప్పుడు, సేవకులైన మీరు ఈ ప్రజల యొద్దకు వచ్చి నిలువుడి, ప్రతి ఒక్కరు; మీరు క్రీస్తు చేతులకు ప్రతినిధులుగా ఉన్నారు. పరిశుద్ధాత్మ కావలసినవారు, ఆ అనుభవము కావలసినవారు, ఇది ఒక రకమైన ఆవేశము కాదు, మీరు పరిశుద్ధాత్మను కోరినయెడల ఆ జీవము, నీలోనున్న జీవక్రిమి; నిన్ను తారుమారు చేయు ఆ మతిమరుపు నుండి విడుదల పొందవలెనని నీవు కోరినయెడల - నీవు నీకై గుర్తించుకోలేవు. మీరెక్కడ నిలచియున్నారో మీరెరుగరు. మీరేమై యున్నారో మీరెరుగరు; ఇప్పుడే, దాని నుండి విడుదల పొందగోరుడి! ఇక్కడ మీ కొరకు ఒక క్రొత్త జన్మ ఉన్నది, అది నిజమైనది మరియు అసలైన క్రొత్త జన్మ

ఇప్పుడు, మన చేతులను ఈ ప్రజలపై ఉంచెదము. మీలో ప్రతి ఒక్కరు మీ చేతులను పైకెత్తి ఏకమనస్సుతో ప్రార్ధి౦చెదము.

81పరలోకపు తండ్రీ, ప్రభువైన యేసుక్రీస్తు నామములో దీనిని మాకు దయచేయుము. ప్రభువా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో, పరిశుద్ధాత్మ వచ్చునట్లు, ఈ రాత్రి, ఈ శనివారపు రాత్రి, పరిశుద్ధాత్మ బలమైన గాలి వీచునట్లు అనుమతించుము. ఈ ప్రజలు పరిశుద్ధాత్మలో బాప్తిస్మము పొందనిమ్ము. దేవుని అగ్ని మరియు ఆయన శక్తి వారిని విడువకుండును గాక, వారు ఉదయము వరకు లేదా, వారు పరిశుద్ధాత్మ పొందుకునే వరకు వేచియుండెదరు గాక,

అదే ఆ ఆలోచనయై యున్నది, ఇది అదే, అది అక్కడే ఉన్నది. ఇదే పరిశుద్ధాత్మ రావడము. (నేను దానిని చేసి ముగించాను.) అదియే అది. ఇప్పుడే దానిని విశ్వసించుము. దానిని అంగీకరించుము; ఆయన (ఆత్మతో) నింపబడుము.

Search Messages

0 / 0 matches
Enter characters above to process real-time text query scopes...