యేసు తనయొక్క నియాకములన్నిటిని నిలుపుకొనును
1ఇంకను ఆ విధముగా నిలబడియుండగా, ప్రార్ధన కొరకు మనము శిరములు పంచుదుము. మన శిరములతో పాటు మన హృదయములు వంచియుండగా, రక్షణ పొందుటకు, క్రీస్తు నొద్దకి వచ్చుటకు మరియు పరిశుద్ధాత్మను పొందుటకు ప్రత్యేకింపబడిన రాత్రిగా మనము ఈ రాత్రిని కలిగియుంన్నందుకు నేనెంతగానో ఆశ్చర్యపోవుచున్నాను. అలాగే "ప్రభువగు దేవా, నన్ను జ్ఞాపకము చేసికొండి, నేనిప్పుడే నీతో సరికాగోరుచున్నాను," అని చెప్పగోరుచున్నాను, మీలో ఎందరికి అటువంటి విన్నపము వున్నదోనని నేను తెలిసికొనగోరుచున్నాను, అటువంటి వారు, మీరు మీ చేతిని ఎత్తి చూపగలరా? ప్రభువు మిమ్మును దీవించును గాక.
MATT 7:7
2మా ప్రియ పరలోకపు తండ్రీ, నీ సన్నిధి కొరకు నీకెంతో కృతజ్ఞతలు, అలాగే నీ రాకడను గూర్చిన గొప్ప సంఘటన కొరకు ఈ యొక్క వేలాది సంవత్సరముల నుండి యదార్ధముగా ఎదురుచూస్తున్న ఆ యదార్ధ హృదయముగల జనుల కొరకు కృతజ్ఞతలు, ఇది వరకు ఉన్నట్టు గానే ఇప్పుడున్న ఈ కాలము ముగియబోవుచుండుటను, నిత్యత్వము దానిలో కదిలిపోవుట ఆరంభించుటను చూచుచున్నాము. ఇది ప్రత్యక్షమగుటను మేము చూచుచున్నాము. కావున, మా హృదయములు వింతగా వేడెక్కుచున్నవి. తండ్రి, ఈ రాత్రి నీవు హృదయములను పరిశోధించి మమ్మును సరిచేయమని ప్రార్ధించుచున్నాము. ప్రభువా, మాలో ద్వేషమేదైనా వున్న యెడల, దానిని మాలో నుండి తీసివేయండి. నీ గొప్ప సన్నిధిలో ఈ వారమంతా మేము గమనించితిమి. ఈ సమాజములో ఇది లోతునకు వెళ్ళి, హృదయములో నున్న తలంపులన్నిటిని త్రవ్వి, వాటిని మాకు తెలియజేసి, అన్నిటిని మాకు చెప్పితివి, నీవే దానిని చేసితివని మేము ఎరిగితిమి.
ఇప్పుడు, ప్రభువా, ఈ రాత్రి మా హృదయములు నీ యెదుట యదార్ధమైనవిగాను, నీతో సరిచేయబడినవి గాను వుండాలని మేము కోరుచున్నాము. మమ్మును దీవించమని ప్రార్ధించుచున్నాము. ఈ వేదిక మీద, (లేదా) ఈ బలిపీఠము మీద చేతిరుమాళ్ళు పెట్టి, అవసరతలో వున్న వారి కొరకు వెళ్ళనై యున్న పార్శిల్లు ఉంచబడినవి. పరలోకపు తండ్రి, అవి ప్రార్ధింపబడి ఇక్కడి నుండి పంపబడిన తరువాత, వీటి ద్వారా దేవుని యందు విశ్వాసముంచు కొనవలెనని, ఈ చేతి రుమాళ్ళలోని ప్రతి ఒక్కటిని, ప్రతి చిన్నగుడ్డను, ప్రతి పార్శిల్ ని తాకిన రోగులెల్ల స్వస్థపడునట్లు చేయమని నేను ప్రార్థించుచున్నాను; ఎందుకనగా నేను మరియు ఈ శ్రోతలందరు కలిసి ఏక మనస్సుతో వారి స్వస్థత నిమిత్తం తండ్రి ప్రార్ధించుచున్నాము. తండ్రి, మేము అడుగు ఇది ఒక జ్ఞాపకార్ధమై వుండాలి. "అడుగుడి మీరు పొందుకొనెదరు. నీవు ప్రార్ధించునప్పుడు, నీవు తిరిగి అడుగునదెల్లా నీవు పొందుకొనియుంటివని నమ్ముడి," అని నీవు సెలవిచ్చితివి. ప్రభువా, నేను నమ్ముచున్నాను. మేమందరము నమ్ముచున్నాము. మరి దానిని మేము అడిగితిమి. దేవుని రాజ్యము నిమిత్తము అదిప్పుడు మాకు అనుగ్రహింపబడును గాక, యేసు నామమున ప్రార్ధించుచున్నాము. ఆమెన్. దయచేసి కూర్చొనండి.
3మంచిది, ఈ రాత్రి మరల ఈ ఆడిటోరియంలోకి తిరిగి వచ్చుట నిశ్చయముగా బావుంది. ఈ రాత్రి ప్రభువు మనల్ని మరలా దర్శించునను గొప్ప ఆశతో ఎదురుచూపుతో మనము ఈ రాత్రి రోగుల కొరకు ప్రార్ధించుటకు ఈ రాత్రిని ప్రత్యేకించితిమి… అలాగే మన ఆత్మల రక్షణార్ధం కనిపెట్టుచుంటిమి. మనలో ప్రతి ఒక్కరం మరొకసారి మనలను పునః ప్రతిష్టించుకోవలసి యున్నది. ఈ వారము మనము యేసుక్రీస్తు యొక్క సన్నిధిని, బయలుపర్చబడిన లేఖనమును, స్వయంగా ఆయనే మన మధ్య కదులుటను చూచితిమి, ఆయన చేసిన దానిని గమనించితిమి. ఆయన భూమి మీద వున్నప్పుడు ఏ కార్యాలను జరిగించియున్నాడో ఇప్పుడు కూడా సరిగ్గా అవే కార్యాలను ఆయున జరిగించుచున్నాడు.
ఇప్పుడు, పరిపూర్ణ దినమునకు, పరిపూర్ణ సంఘమునకు మనము ఎలాగైతే ఎదుగుచున్నామో, మరలాగే పరిచర్య అనేది కూడా పైకి ఎదుగుటను మనము చూచుచున్నాము. మనము ఆరంభించితిమి, ఈ ఉదయమున మనము చెప్పుకొన్నట్టు సరిగ్గా అది కూడా అలాగే ఎదుగుచున్నది.
4మనకి ఇంపైన చిన్న సహవాసము, ఈ ఉదయ కాలమున, అల్పాహార విందు సమయమందు నిశ్చయముగ మనమొక అద్భుతమైన సమయమును కలిగియుంటిమి. తమ యొక్క చక్కని సహకారమును బట్టి సహోదరులకు నేను వందనములు చెప్పుచున్నాను. మనందరిని ఇచ్చటికి తీసికొని వచ్చిన, మరియు ఈ కూటమునకు ఆర్ధిక సహాయమందించిన ఈ చక్కని మనుష్యులు, వారిలో అనేకులకు నేనెంతో కృతజ్ఞుడను.
ఇది ప్రజల పట్ల వారి యొక్క శ్రద్ధను చూపించుచున్నది. వారు కాపరులు, మరియు గొర్రెల పట్ల శ్రద్ధను కలిగియున్నారు. మరియు కావున నేను వారిని బట్టి ఎంతో కృతజ్ఞత కలిగియున్నాను. ఏ కాపరి అయినా తమ గొర్రెలకు విటమిన్లు ఇచ్చుటకు శ్రద్ధను కలిగియుండును. మరియు ఇది వరకు వలే ఇప్పుడు కూడా ఇది ఆత్మీయ విటమిన్లు, మన దేవుని విశ్వాస విషయంలో బలముగా ఎదుగుటకు గొర్రెలకు అవి ఎంతో సహాయపడును. కావున, అటువంటి మనుష్యులను నేనెంతో అభినందించుచున్నాను.
5మరిప్పుడు, ఈ ఉదయకాలమున సంఘము యొక్క ఎదుగుదల అనే ఆలోచన మీద మాట్లాడుకొంటిమి, చూశారా, అది భూమిలో పడి, ఎదిగిన ఒక విత్తనము వలె వున్నది. మరి ఆ విత్తనము, భూమీలో నాటబడి, మహిమ నుండి మహిమకు అది ఎదిగినట్లుగా వున్నది. తరువాత అది కొంత కాలానికి పుష్పించి (విరబూసీ) తదుపరి తిరిగి అది విత్తనముగా మారును. అది నాట బడిన మూల విత్తనముగా వున్నది.
సంఘము కూడా సరిగ్గా అలానే వున్నది. సంఘ కాలము ఆరంభమైనది, ఈ చివరి దినములయందు. చీకటియుగము అనంతరం, అది పునరుద్దరణలో అది మార్టిన్ లూథర్ తో ఆరంభమైనది, విశ్వాసము ద్వారా నీతీకరణము అతడు బోధించెను. అతని యుగము తరువాత వారు సంఘమును సంస్థగా చేసారు, గనుక అది అక్కడే చనిపోయినది. లూథర్ తరువాత జ్వంగ్లీ వచ్చెను. జ్వంగ్లీ కనీసం ఆయన కన్య గర్భమున జన్మించినని కూడా నమ్మలేదు. అతడు స్విట్జర్లాండ్ అంతటికి వెళ్ళెను. స్విట్జర్లాండ్ వారు జ్వంగ్లీ సిద్దాంతమును బట్టి యేసు కన్య గర్భమున జన్మించలేదని నమ్ముదురు. ఆయన యేసేపు కుమారుడని, దేవుని కుమారునిగా పిలువబడెనని వారు అందురు.
అది పూర్తిగా క్రైస్తవ పునాది నుండి వైదొలిగించేదిగా వుండెను. నిశ్చయముగా, ఆయన కన్యకకు పుట్టాడు. నీవలే - నావలే ఆయన ఒక మానవునిగా జీవించాడు. ఆయన దేవుని కుమారుడు.
సరే, దాని తరువాత కాల్విన్ వచ్చెను, తర్వాత తర్వాత.
6చివరిగా, మరొక పునరుద్ధరణను సంఘము పొందుకోవల్సి వచ్చినది. అప్పుడు శుద్దీకరణ వర్తమానముతో జాన్ వెస్లీని దేవుడు పంపాడు, ఆత్మలో శుద్ది అనే వర్తమానం. మరిప్పుడు అతడు మరియు వైట్- ఫీల్డ్ ఇంకా అనేకమంది ఆ గొప్ప పునురుద్దరణతో వెళ్ళిరి - మరియు ఆస్బరి కూడా వారు అమెరికాకు వచ్చిరి. మరియు ఆ గొప్ప ఉజ్జీవము ఇంగ్లాడును మరియు మిగతా ప్రపంచమంతటిని ఆ కాలమందు రక్షించెను.
తర్వాత వచ్చిన వారేమి చేసిరి? పునాది వేసిన వారు మరణించిన తరువాత, వారు ఒక సిద్దాంతము మీద సంస్థను తయారు చేయ నారంభించిరి, వారు చేసిన మొదటి కార్యమును మీరు ఎరుగుదురు, వారు ఒక సంస్థను తయారు చేసిరి. అప్పుడు వారు తరువాత మరొక కదిలికను మనము కలిగియుంటిమి. అలెగ్జాండర్ క్యాంప్బెల్, జాన్ స్మిత్, మరియు బాప్తిస్టు చర్చి లాంటి కదలికలు వచ్చెను. తదనంతరం నజరీన్లు, పిలిగ్రిమ్-హోలినెస్ వారు, ఇంకా ఇతరులు వచ్చిరి.
7తిరిగి గొప్ప పునరుద్దరణ పెంతెకోస్తు రూపములో వచ్చినది. అది ఆయా సంస్థలలో నుండి వరముల పునరుద్దరణ, అనగా బాషలు మాట్లాడుట, దైవిక స్వస్థత లాంటి వాటితో అది వచ్చినది. గొప్ప అద్భుతాలు, సూచనలు బయలు వెడిలినవి. చాలా కాలము వరకు అది నడిచినది. బహుశా అది యాభై లేక యాభై-ఎనిమిది ఏండ్లు వరకు కావచ్చును. కాలిఫోర్నియాలోని అజూస వీధిలో పరిశుద్ధాత్మ వారి మీద వ్రాలటం ఆరంభమైనది. ఆ కుమ్మరింపు ఈ అమెరికా దేశములోనే ఆరంభమైనది. గొప్ప సమయము వచ్చినది.
అప్పుడు పెంతెకోస్తు ఏమి చేసినది? ఒకడు దానిని ఒక సంస్థగా చేసెను. ఒకడు అన్నాడు, "ఆయన తెల్లని గుర్రము మీద వచ్చుచున్నాడు"; మరొకడు "తెల్లని మేఘము మీద వచ్చుచున్నాడు," అని అనెను. అలా ప్రతీవాడు ఒక్కొక్కడిగా విడిపోయి, ఒక సంస్థను తయారుచేసి, ప్రజల మధ్య వారికుండవల్సిన సహోదర ప్రేమను విడగొట్టిరి.
EXOD 19:8
8సరిగ్గా ఇశ్రాయేలీయులు వలే నది ఒడ్డున వారు కేకలు వేసినప్పుడు, వాగ్దాన దేశమునకు వారు కేవలం నాలుగు రోజుల ప్రయాణ దూరములోనే వుండిరి, కేవలం నలభై మైళ్ళ దూరములోనే వున్నామని వారికి ఎక్కువగా తెలియకపోయెను. అయితే దానిని చేరుకోడానికి తమకి నలభై ఏళ్ళు పట్టునని వారు ఎరుగకుండిరి. అది ఏమిటి? కృప వారికి ఒక ప్రవక్తను ఒక అగ్నిస్తంబమును, ఒక వధించబడిన గొర్రెపిల్లను, ఒక విడుదలను సమకూర్చినది. అయినప్పటికి వారు ధర్మశాస్త్రము కావాలని కోరుకొనిరి, స్వయముగా వారు ఏదో చేయాలని దేనినో వారు కోరుకొనిరి. దాన్ని కావాలని, దాని మీద వారు తమ చేతులుంచిరి. నిర్గమ 19లో వారు ఎన్నడూ చేయని గొప్ప తప్పునొక దానిని వారు చేసారు. అదేమనగా వారు కృపను తృణీకరించి, ధర్మశాస్త్రమును అంగీకరించారు.
అప్పుడు వారికేమైనది? అందునిమిత్తమే ఆయన వారిని అరణ్యములో నలభై ఏళ్ళు ఉండనిచ్చెను. వారు ద్రాక్షా తోటలను నాటిరి, వారు ఫలములను భుజించిరి, వారు భార్యలను వివాహమాడిరి, పిల్లల్ని పెంచిరి. ఎప్పటి వరకు అనగా పాత తరము గతించిపోయి, క్రొత్త తరము వచ్చేటంత వరకు. నలబై ఏళ్ళు తరువాత, నలబై ఏండ్లకు ముందు కాదు, ముందుకు వెళ్ళుటకు నలబై ఏళ్ళు వరకు అలానే వుండిపోయిరి. అంతట ఒక క్రొత్త నాయకుడు, యెహోషువా వచ్చెను, ఒక క్రొత్త గుంపుతో వారు వాగ్దాన భూమిలోకి కదిలిపోయిరి.
9ఇప్పుడు, మనం కనుగొనే ఒక చక్కని మాదిరి ఇది అని నేను అనుకొనుచున్నాను. చాలా కాలం క్రితం, పెంతెకోస్తులో వున్న మన పితరులు, వారు అందు పెంచబడిరి. వారు పాత సాధారణ ఆలోచన సభను కలిగియుండిరి. అందులో నుండి వారు అసంబ్లీస్-ఆఫ్-గాడ్ అను దానిని రూపొందించిరి. దాని నుండి యు.పి.సి. అనేది వెలువడినది, తర్వాత ఐక్య, మొదలగునవి; ఎంతవరకు అనగా, గడబిడ మరియు గొడవలు; ఒక సంస్థ తర్వాత మరొక సంస్థ వచ్చువరకు. దేవుడు వారిని అక్కడ స్థిరపరచి యుండెను, కావున వారు భార్యలను వివాహాము చేసికొనిరి, పిల్లల్ని పెంచిరి, బాషలలో మాట్లాడిరి, ఆత్మలో కేకలు వేసిరి. కాని ఇప్పుడు కొత్త కొత్త గుంపులు పుట్టుకొచ్చినవి.
వాగ్దాన భూమికి వారు కేవలం కొద్ది దినముల దూరములోనే వుండిరి. వారు పొందుకొనిన, మరియు కలిగియున్న దీవెనలన్నియు మంచివే. అయితే గుర్తుంచుకోండి, వాగ్దాన భూమిలోని సమస్తము వారికే చెందియున్నది. ఇప్పుడు వాగ్దాన భూమిలోనికి వెళ్ళుటకు మనము నియమించబడితిమి. కావున వీటిని చూచుటలో ప్రభువు మనకి సహాయం చేయును గాక, చూశారా.
10పిరమిడ్ వలె… పిరమిడ్ తయారుచేయబడినది నీకు తెలుసా — పిరమిడ్ సిద్దాంతము తయారు చేయబడటం కాదండీ. కేవలం పిరమిడ్ తయారవటం. మీ యొక్క డాలరును గమనించండి, అమెరికా సంయుక్త రాష్ట్రాల చిహ్నాం పక్షిరాజు. మంచిది, దాని మీద ఆ పిరమిడ్ యొక్క "గొప్ప (విశిష్ట) ముద్ర" ఎందుకు వున్నదో తెలుసా? అమెరికా సంయుక్త రాష్ట్రాల చిహ్నాం, గొప్ప ముద్రగా కన్ను, చూచునట్టుగా అమెరికా సంయుక్త రాష్ట్రాల చిహ్నాం ఎందుకు గొప్పగా వున్నది? ఆ పిరమిడ్ మీద మూలరాయి… అది తృణీకరించబడినది. అదేన్నడు పిరమిడ్ మీద లేకుండినది; నేటి వరకు వారు తమదిగా వాదించే తలరాయిని నేటివరకు తృణీకరించుచూనే వుండిరి. దాని మీద ఎన్నడూ మూలరాయి పెట్టబడలేదు. ఎందుకు?
పురాతన దినములలో హనోకు మరియు వారు ఐగుప్తులో పిరమిడ్లను నిర్మించిరని మనం కనుగొన్నా౦, అక్కడ తలరాయి, (మూలరాయి) తృణీకరించబడునని వారు ఎరిగియుండిరి. ఏ సిమెంట్ సహాయము లేకుండానే వారు ఎంతో చక్కగా పిరమిడ్ లోని రాళ్ళను అమర్చిరి. ఎంతో గొప్ప పరిజ్ఞానముతో రాయి మీద రాయి పేర్చబడినది, ఆ రాళ్ళ మధ్యలో కనీసము రేజర్ బ్లేడును కూడా దూర్చలేము.
ఇప్పుడు, కప్పుగా అది అలా పైకి పైకి పేర్చబడి మరియు ఉపరితలము చదును చేయబడియున్నది, దాని కొనమీద మిగిలింది కేవలం తలరాయి వచ్చుట మాత్రమే. సరిగ్గా అలానే దేవుడు తన సంఘమును తీసికొని వచ్చాడు, అది నీతీకరణ, శుద్ధీకరణ, పరిశుద్ధాత్మ బాప్తిస్మము. మరిప్పుడు ఆత్మ యొక్క పరిచర్య — అది వాక్యముమ జీవింపజేయును — సంఘములో ఆ పరిచర్య, ఆయన కోరినట్లుగా వుండవలసి వున్నది.
2COR 5:19
11నా నీడ, నా చేతి నీడవలే అది వున్నది… నా చేయి అనేది లేకుండా దాని నీడను నేనెన్నడూ చూడలేను, నీడను చూస్తున్నానంటే దానర్థం… అది దూరంగా జరిగితే దాని కాంతి (నీడ) నీకు అగుపడదు. అయితే దానినెంత దగ్గరగా, మరియు ఇంకా దగ్గరగా దానిని నీవు తీసికొని వచ్చినప్పుడు, నెగిటివివ్ మరియు పాజిటివ్ ఏకమైనప్పుడు అవి ఒక్కటే అగును. సరిగ్గా సంఘము మరియు వాక్యము అలానే ఏకమవ్వాలి. యేసు మరియు దేవుడు వలే, సరిగ్గా అలానే అవ్వాలి.
దేవుడు క్రీస్తునందు వుండి లోకమును తనతో సమాధానపర్చుకొనుచుండెను. కావున వాక్యాభిషక్తుడగు క్రీస్తు ప్రతి దానిని నెరవేర్చు నిమిత్తం సంఘములో ఆ విధముగా వుండవల్సి వున్నది. చివరి సంఘ కాలమందు ఆ తలరాయి దిగివచ్చును. లవోదికయలో కాదండి, ఇప్పుడు లవొదికియలో ను౦డి అది బయటకు పిలవబడును: సంఘములో నుండి వధువు, మరొక మాటలో సంఘములో నుండి సంఘము బయటకు పిలవబడును. అదెలాగనగా ఐగుప్తు దేశములో నుండి దేశమును బయటకు పిలిచినట్లు. ఇప్పుడు మనం ఆ కాలమందు జీవించుచున్నాము. మనము చూచుచున్న ఈ గొప్ప సంగతుల కొరకు మనమెంతో కృతజ్ఞులమై యున్నాము.
12ప్రభువు చిత్తమైతే, రేపు మద్యాహ్నం కూటముతో ఈ కూటములు ముగియును, రోగుల కొరకు ప్రార్ధించబడుట వుండును. స్వస్థత కొరకు ప్రార్ధన చేయించుకొనాలనుకొన్నవారు వరుసలో నిలబడు నిమిత్తం అవసరమైన ప్రార్ధన కార్డులను ఇప్పుడే తీసికోవాలని కోరుచున్నాను. స్వస్థత ప్రార్ధనల కొరకు అందరిని వరుసలో వుంచే నిమిత్తమే మేము ప్రార్ధన కార్డులను ఇచ్చెదము. ఒకవేళ అది నీకు లేకపోతే, అలా అలా నెట్టుకొని రావల్సి వస్తుంది. చూశారా, వారు, కావున నీకు… గనుకనే మేము ప్రార్ధనా కార్డులను ఇచ్చెదము. నీకు ప్రార్ధనా కార్డు వుంటే అప్పుడు ప్రార్ధన వరుసలోనికి వచ్చి నిలువబడుము; మరియు అప్పుడు నీవు చూచెదవు… మరియు నమ్ముము, నీవు దేవుని మహిమను చుచెదవు. అప్పుడు అదెంతో గొప్పగా వుండును.
13మీరు మాకు చేసినదంతటిని బట్టి మీకు వందనములు, ఈ సేవక సహోదరులు మధ్యలోనికి మరియు ఇంకా అనేకమైన వాటి కొరకు, మీ యొక్క ఘనమైన ఆహ్వానం కొరకు వందనములు. సరే, రేపు ఆదివారము, ఈ సంఘములన్నియు తెరువబడును. కావున రేపు ఉదయ కాలమున ఇక్కడ కూటము వుండదు. సండే స్కూలు వుండును. సందర్శకులైన మీరు… ఇక్కడ నాతో పాటు నా బృంధములో వున్నవారు, మనలో వుండుటకు నా స్వస్థలము నుండి వారిలో కొందరు వచ్చారు.
ఇప్పుడు, ఈ కూటములను ఏర్పాటు చేసిన (ఆర్ధికంగా సహాయపడిన) వారు వీరు. ఇటువంటి కూటముల మీద వారికి నమ్మిక యున్నది. ఒకవేళ నేనే ఈ పట్టణములో నివసించినట్లైతే, వీరి యొక్క సంఘములలో ఏదో ఒక దానికి తప్పక నేను చెందియుండేవాడిని. నిశ్చయంగా నేనావిధంగా వుండేవాడిని, ఎందుకనగా నేను దేనినైతే నమ్ముదునో, సరిగ్గా వారు కూడా దానినే నమ్ముదురు. ఒకవేళ నేనిక్కడ నివసించినట్లైతే వీటిలో ఏదో ఒక దానికి నేను చె౦దియుండేవాడిని.
14ఈ వారం ఎవరైతే మీ జీవితములను క్రీస్తుకు సమర్పించుకొనియున్నారో, అట్టివారు మీకంటు వెళ్ళుటకు సొంత సంఘము లేనియెడల, ఇక్కడున్న సేవకులతో మీరు మాట్లాడండి? వీరు కూడా సరిగ్గా దానినే నమ్ముదురు, లేనియెడల వారు ఇచ్చట కూర్చొని యుండెడి వారు కాదు, చూచారా. ఇప్పుడు, మీరు ఇటువంటి చక్కని సంఘములలో ఒకదానిని ఎన్నిక చేసికొని రేపటి ఆరాధన కొరకు మీరు అచ్చటికి వెళ్ళండి. వారు మీకు మంచే చేయుదురని నేను ఖచ్చితంగా చెప్పగలను. వారు మీకు సహాయపడుదురు. నమ్ముటకు మీకు వారు సహాయం చేసెదరు. మీరు ఒకవేళ బాప్తిస్మము పొందనియెడల, వారిని అడగండి. మీరు ఒకవేళ పరిశుద్ధాత్మను పొందనియెడల, దాని విషయమై మీరు వారిని అడగండి. క్రీస్తునొద్దకు తిన్నగా మీరు చేరుటకు వారు సహాయపడెదరు. ఆయన తిరిగి వచ్చునప్పుడు ఆయనను కలుసుకొనే మార్గములో మిమ్మును వారు నడిపించెదరు. ఇప్పుడు, మీలో ప్రతి ఒక్కరిని ప్రభువు దీవించును గాక.
మరిప్పుడు ప్రేస్పిటేరియన్లు మాటిమాటికి కూర్చోటం లేవటం చేసెదరని మీరు అందురు. నేనైతే పెస్పిటేరియన్ కాను; అయితే దేవుని వాక్యము చదువునప్పుడు మనము తప్పనిసరిగా లేచి నిలబడుటను నేను నమ్ముదును, ఎందుకనగా లేచి నిలబడుటమనేది దేవున్ని మనము ఘనపరచినట్లని నా నమ్మకం. జండా వందన సమర్పణ చేసేటప్పుడు, ప్రతిజ్ఞ చేసేటప్పుడు, ఇంకా అటువంటి వాటిని చేయునప్పుడు దాని గౌరవార్ధమై మనం నిలబడేదం కదా, వాక్య పఠణం చేసేటప్పుడు కూడా మనం అలా లేచి దానిని ఘనపర్చవలెను, ఎందుకనగా మనము లేచి నిలబడుట దేవుని ఘనపర్చట.
15ఇప్పుడు, ఈ రాత్రి కొన్ని లేఖనభాగములను చదువుటకు నేను ఎన్నుకొన్నాను, లూకా సువార్త 7వ అధ్యాయం 36వ వచనం నుండి ఆరంబించెదను. మరిప్పుడు ఇచ్చటికి నేను వచ్చుచున్న మార్గములో ఒక తలంపు నా మదిలో మెదిలినది, అదేదనగా "బలవంతుడగు దేవుని యొక్క ముసుగు తీయబడెను." ఈ వారమంతా నేను దాని మీదనే బోధించితిని. కాని దాని గుండా నేను వెళ్ళునప్పుడు, నేను వ్రాసికొన్న లేఖనము, ఇంకా అనేక సంగతులను చూచినప్పుడు ఇంకా ఇరవై పేజీలు నా యొద్ద వుండిపొయినవి. వాటన్నిటిని చెప్పాలంటే ఈ గంట సమయం నాకు సరిపోదు. గనుక ఈ తలంపును ఈ రాత్రి మార్చవలెనని అనిపించినది, అందుకే వేరొక అంశమును నేను ఎన్నుకొన్నాను.
LUKE 7:36-50
16ఈ సంగతులను చెప్పటం దేవుని చిత్తమని నేను నమ్ముచున్నాను.
ఇప్పుడు లూకా సువార్త 7వ అధ్యాయం, 36వ వచనం.
పరిసయ్యులలో ఒకడు తనతో కూడా బోజనము చేయవలెనని ఆయననడిగెను. ఆయన ఆ పరిసయ్యుని ఇంటికి వెళ్ళి, భోజనపంక్తిని కూర్చుండగా,
ఆ ఊరిలో ఉన్న పాపాత్మురాలైన యొక స్త్రీ, యేసు పరిసయ్యుని యింట భోజనమువకు కూర్చున్నాడని తెలిసికొని, యొక బుడ్డిలో అత్తరు తీసికొనివచ్చి వెనకతట్టు ఆయన పాదములయొద్ద నిలువబడి, యేడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి, తన తలవెంట్రుకలతో తుడిచి, ఆయన పాదములను ముద్దుపెట్టుకొని, ఆ అత్తరు వాటికి పూసెను.
ఆయనను పిలచిన పరిసయ్యుడు అది చూచి - ఈయన ప్రవక్తయైన యెడల తన్ను ముట్టుకొనిన యీ స్త్రీ ఎవతియో ఎటువంటిదో యెరిగియుండును; ఇది పాపాత్మురాలు అని తనలో తాను అనుకొనెను.
అందుకు యేసు - సీమోనూ, నీతో ఒక మాట చెప్పవలెనని యున్నానని అతనితో అనగా అతడు - బోధకుడా చెప్పమనెను.
అప్పుడు యేసు అప్పు ఇచ్చు ఒకనికి ఇద్దరు ఋణస్టులుండిరి. వారిలో ఒకడు ఐదువందల దేనారములను మరియొకడు ఏబది దేవారములను అచ్చియుండిరి.
ఆ అప్పు తీర్చుటకు వారి యొద్ద ఏమియు లేక పోయెను గనుక అతడు వారిద్దరిని క్షమించెను. కాబట్టి వీరిలో ఎవడు అతని ఎక్కువగా ప్రేమించునో చెప్పుమని అడిగెను.
అందుకు సీమోను - అతడెవనికి ఎక్కువ క్షమించెనో వాడే అని నాకు తోచుచున్నదని చెప్పగా,
ఆయన - నీవు సరిగా యోచించితివని అతనితో చెప్పి, ఆ స్త్రీ వైపు తిరిగి, సీమోనుతో ఇట్లనెను - ఈ స్త్రీని చూచుచున్నావే, నేను నీ యింటిలోనికి రాగా నీవు నా పాదములకు నీళ్ళియ్యలేదు గాని, యీమె తన కన్నీళ్ళతో నా పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచెను.
నీవు నన్ను ముద్దు పెట్టుకొనలేదు గాని, నేను లోపలికి వచ్చినప్పటి నుండి యీమె నా పాదములు ముద్దు పెట్టుకొనుట మానలేదు.
నీవు నూనెలో నా తల అంటలేదు గాని, ఈమె నా పాదములకు అత్తరు పూసెను.
ఆమె విస్తారముగా ప్రేమించెను గనక ఆమె యొక్క విస్తార పాపములు క్షమించబడెనని నీతో చెప్పుచున్నాను.
ఎవరికి కొంచెముగా క్షమించబడునో, వాడు కొంచెముగా ప్రేమించునని చెప్పి -
నీ పాపములు క్షమించబడినవి అని ఆమెతో అనెను.
అప్పుడాయనతో కూడ భోజన పంక్తిని కూర్చుండిన వారు - పాపములు క్షమించుచున్న యితడెవడని తమలో తాము అనుకొనసాగిరి.
అందుకాయన - నీ విశ్వాసము నిన్ను రక్షించెను;
సమాధానము గలదానవై వెళ్ళుమని ఆ స్త్రీతో చెప్పెను.
17ప్రార్థించుకొందాం. ప్రభువైన యేసూ, ఈ కథ జరిగి అనేక సంవత్సరములైనది. కాని అది నిజముగా జరిగిన కధ, మన బైబిలు యొక్క పేజీలలో అది వ్రాయబడినది, కావున అది నిజమైనదని మేమెరుగుదుము. ఇప్పుడు ఏ విధము చేతనైనను దీనిని ఈ రాత్రి కధలాగా దీనిని వివరించాలని మేము కోరుటలేదు, కాని దీనిలో నుండి నీవు ఒక వర్తమానమును తీసికొని ఈ రాత్రి జనులకు తీసుకురావాలని, తద్వారా నీవు ఎన్నడూ మారని ప్రభువగు యేసువని వారు తెలుసుకోవాలని కోరుచున్నాము. మా ఆందరి మీద నీ దీవెనలు నిలిచియుండాలని మేము ప్రార్ధించుచున్నాము. ప్రభువా, నీ అవసరత మాకున్నది.
గ్రుడ్డి వారిని చూచేటట్లుగాను, చెవిటి వారిని వినేటట్లుగాను, కుంటివారిని నడిచేటట్లుగాను చేసితివి, అంతేకాక వివిధ సమయములయందు, ఐదుగురు మృతులను నీవు లేపితివి, అ౦దుకు డాక్టర్లు సహితము నివేదికలు ఇచ్చిరి, అయితే ప్రభువా, ఈ రాత్రి పూర్తిగా రోగగ్రస్తమైనది నాకు తెలిసినంతమట్టుకు భూమీ మీదనున్న క్రీస్తు యొక్క శరీరమేనని నేను నమ్ముచున్నాను. అది సంఘమేనని నా నమ్మకం. ప్రభువా, అది బాగా నిజంగానే రోగగ్రస్తమైయున్నది గనుక దానిని బాగుచేయుము.
ఈ రాత్రి ఇక్కడ కూర్చొనియున్న సంఘములోని ఈ భాగమును, టంపాలో జీవన ప్రయాణం చేయుచున్న ఈ గుంపును, ఈ చక్కని జనసమూహమును స్వస్థపరచుము, ప్రభువా ప్రతి గాయమును మాన్పుము. ఆత్మ దానిని మాకు దయచేయును గాక, ఎందుకనగా ఈ పట్టణములో ఇక్కడ సంచరించుచున్న మాకు, ఆయన మహిమ నిమిత్తం ఆయన ఘనత నిమిత్తం ఈ విన్నపములను యేసు నామమున అడుగుచున్నాము. ఆమేన్.
18దయతో మీరు కూర్చొనండి.
కొద్ది నిమిషముల పాటు నేను బోధించే ఈ అంశమునకు… మరి ప్రయత్నించలేదు. ప్రతీ రాత్రి… మీరు నన్ను మన్నించాలి, ఎందుకనగా ఎంతో సమయం మించిపోయినప్పటికి మీరు లెక్క చేయక చక్కగా వాక్యం విన్నారు… మీరెంతో చక్కని జనులు, మీలాంటి వారికి భోధించడం ఏ బోధకునికైన సుళువే. మీరు అలా చక్కగా వాక్యమును స్వీకరిస్తూ, దానిలో పోషించబడుటంను చూచు ఏ బోధకునికైనా ఇంకా ఇంకా ఎక్కువ చెప్పాలనిపిస్తుందని నేను అనుకొనుచున్నాను. నిజానికి నేను మీ యొద్దకు వచ్చినప్పుడు… ఇది వరకెన్నడు లేనంత నీరసముగా నేను వు౦టిని.
చూశారా, క్రిస్మస్ దగ్గర్నుంచి ఇక్కడికి వచ్చేటంత వరకు ఎన్నడు అలా లేకుంటిని. మరి ఈ కూటములను ముగించుకొని ఇక్కడ్నుంచి నేరుగా టూసాన్ కి వెళ్ళవలెను, మరి అక్కడ కూడా కూటములను ఆరంభించవలెను. మరి అక్కడి తర్వాత తిన్నగా బ్రిటీష్ కొలంబియాకు వెళ్ళాలి. అక్కడ ఇండియన్ల జాతికంతటికి బాప్తిస్మమిచ్చుట కొరకు వెళ్ళవల్సి వుంది, ఎందుకనగా వారంతా ఒకప్పుడు క్యాథలిక్ వారు. అయితే గత నా వేట పర్యటనలో నేమ వారిని క్రీస్తు నొద్దకు నడిపితిని. అక్కడున్న ఒక తల్లి స్వస్థత ద్వారా, అక్కడున్న తల్లులలో ఒక తల్లి పొందిన స్వస్థతను బట్టి ఆ గుంపు వారంతా తమ జీవితములను క్రీస్తుకి సమర్పించుకొన్నారు. ఆ తల్లిని వైద్యులు కూడా బాగుచేయలేకపోయారు. ఆమె అక్కడ పడివుండి, చనిపోవుచుండెను. కాని ఆమె ఆశ్చర్య రీతిలో క్రీస్తు ద్వారా బాగుపడినది, అందువలన వారంతా బాప్తిస్మమునకు సిద్దపడిరి. అయితే ఆ ప్రాంతమంతా ఎంతో భయంకరముగా మంచు గడ్డ కట్టినందున వారు నన్ను మరొకసారి మరలా రావల్సినదిగా ఆహ్వానించారు. చూశారా, సున్నాకి 85 పాయింట్లు దిగువున ఉష్ణోగ్రత వుండెను.
కావున మంచు కరిగిన తర్వాత నేను వారిని, అందరిని బాప్తిస్మములోకి నడిపించెదను.
19దిగువునున్న అలస్కా హైవే రహదారిలో దోపిడి దారులుగా, వేటగాళ్ళగా ఉన్న ఒక పెద్ద గుంపు జనులు నన్ను కలుసుకొనిరి. వారు క్రీస్తును అంగీకరించి బాప్తిస్మమును కోరిరి. ప్రభువు యొద్ద నుండి ఒక దర్శనము కలిగినది. అది ఒక ప్రత్యేకమైన కార్యమును గూర్చి అచ్చట ఒక ప్రత్యేకమగు ఎలుగుబంటి వుండునని, దాని బరువు మరియు అది ఏ రకమైనదో, అది ఎక్కడ నివశించుచున్నదో, అదిలా వుండునో, అచ్చట ఎవరు వుందురో, వారే ఏ విధముగా వస్త్రధారణ చేయుదురో దానంతటిని గూర్చి ప్రభువు దర్శనమందు నాకు చూపించెను.
దాని ప్రకారమే అదంతయు సంభవించినది. అచ్చట వారన్నారు "అటువంటి రకపు ఎలుగుబంటి ఈ దేశములో ఎక్కడా లేదు." అయితే మేము తిన్నగా అచ్చటికి వెళ్ళితిమి. ఒక్క పొళ్లు కూడా తప్పిపోకుండా దర్శనము ప్రకారమే అది జరిగినది. అచ్చట నాకు లబించిన బహుమతు (జ్ఞాపక చిహ్నములు)లు నా గదిలో వ్రేలాడుచున్నవి, చూశారా. వారన్నారు, "మాకు కూడా బాప్తిస్మము కావాలి," వారెంతో కటినులు, కాని మీకు తెలుసా, ఆయన విత్తనములు అంతటా అచ్చట పడియన్నవి.
20ఈ రాత్రి నా అ౦శము: "యేసు తనయొక్క నియామకములన్నిటిని నిలువుకొనును." మనం మాట్లాడుకొనుచుండగా, దానిని మీరు మీ మదిలో నిలుపుకోవాలని కోరుచున్నాను. ఎక్కువ సేపు వుంచను. దాన్ని గూర్చి మీరు తలపోయాలని నేను కోరుచున్నాను. జ్ఞాపకముంచుకోండి, ఈ రాత్రి ఇచ్చటవున్న ఒకాయనను మీరు ఒక రోజున కలసికోవల్సియున్నది.
21ఇప్పుడు, ఈ రాత్రి కూటం ఆరంభించేటప్పుడు దాదాపు ప్రొద్దుగ్రుంకినది. బహుశా అది కూడా ఖచ్చితంగా ప్రొద్దు గ్రుంకే వేళ కావొచ్చును. మరి ఈ వార్తాహరుడు (సమాచారమందించే బంటు) దినమెల్లా అటు ఇటు కలియ తిరిగాడు. బహుశా రెండు మూడు రోజుల నుండి కాబోలు అతడు ఆయనను కనుగొనాలని ప్రయత్నించుచున్నాడు. బహుశా అతడు దాను మొదలుకొని బెయేర్షెబా ఆయన కొరకు వెదకుచుండెను, ఎందుకనగా ఆ దినాలలో యేసు పరిచర్య నిమిత్తం అంతటా సంచరించుచున్నాడు. "ఒక దగ్గర వుండి ప్రకటించి," సూచనలను అద్భుతాలను జరిగించేవాడు, ప్రజలు అచ్చటికి గుమిగూడేవారు. తర్వాత అక్కడి నుండి సెలవుతీసికొనేవాడు, "నేను ఖచ్చితంగా మరొక పట్టణముకు వెళ్ళవల్సి వుంది."
అతనికి (వార్తాహరునికి) అది చాలా క్లిష్టమైన సమయముగా ఉన్నది. వాడు ఆయన కొరకు కపెర్నేహూముకి వెళ్ళాడు, వారన్నారు, "ఓ, వారం క్రితమే ఆయన ఇక్కడ నుండి వెళ్ళిపోయాడు. ఆయన ఎక్కడికి వెళ్ళాడో అనేది ఖచ్చితంగా చెప్పలేం. ఆయన ఎక్కడికో వెళ్ళివుంటాడు." మరి అతడు, ఓ ఆతడెంతో అలసిపోయాడు, ఒళ్ళంతా చెమటలు పట్టిపోయినవి. కాని ఎట్టకేలకి వాడు యేసు ఏ విందులో వుండి మాట్లాడుచుండెనో అచ్చటికి చేరుకొన్నాడు.
మరి యేసు కూడా అలసిపోయాడు. దినమెల్లా ఎడతెరిపి లేకుండా ఆయన మాట్లాడుచూనే వుండెను. అధికముగా మాట్లాడినందున ఆయన నోరు ఎండిపోయెను. ఆయన చేతులు వణుకుచున్నట్టు కనబడెను. ఆయన కళ్ళు అస్తమించుచున్న సూర్యున్ని చూడలేనంత అలసటగా వు౦డెను.
అయితే ఈ వార్తాహరుడు యేసుని చూడగోరెను. ఆయన కొరకు అతడు ఒక సమాచారమును కలిగియుండెను.
22మరిప్పుడు, జనులు ఆయనపై పడకుండా చూసేందుకు పండ్రెండు మంది మనుష్యులు ఆయనకుండిరి. వారు ఆయనతోనే వుండి ఆయనను వెంబడించేవారు. కావున వారు… (దీనిని నేను ఒక నాటకముగా చెప్పుచున్నాను, తద్వారా ప్రతి ఒక్కరు దానిని అర్ధం చేసికొందురు.) యేసు యొక్క మనుష్యులు చుట్టూవున్నారు. అతడు ఫిలిప్పు యొద్దకు వచ్చాడని అనుకుందాము, ఫిలిప్పు బహుశా ఇలా చెప్పి వుండవచ్చును. "అయ్యా, యవ్వనుడా బోధకున్ని చూసేందుకు మేము నిశ్చయముగా నిన్ను వెళ్ళనిచ్చేవారమే, కాని ఇప్పుడు ఆయనెంతో అలసిపోయాడు. మేము మేము ఆయనను గూర్చి శ్రద్ధవహించవలసి వున్నది. ఆయనిప్పుడు పూర్తిగా నీరసించిపోయాడు. ఇప్పటికే మేము విరివిగా అనేక కూటములలో వుంటిమి, ఎన్నో ప్రయాణాలు చేసితిమి, కావున ఆయనెంతో అలసిపోయి యుండెను. నీతో మాట్లాడే స్థితిలో ఆయన వున్నాడని మేము ఎంత మాత్రం అనుకోవట్లేదు."
అయితే అతడన్నాడు, "నా యొద్ద ఆయన కొరకు ఒక సమాచారమున్నది. మతభక్తి గల వారిలో అత్యంత ప్రముఖుడగు వాని యొద్ద నుండి నేను దానిని తీసికొని వచ్చాను. ఆ సమాచారమేదనగా, ఒక ఆహ్వానం, మీ బోధకునికి అదొక ఆహ్వానం. ఆయన బహుశా రాగలిగినట్లయితే, ఆయనకి అదొక గొప్ప సన్మానంగా వుండును గనుక నేనిప్పుడే ఖచ్చితంగా మీ బోధకున్ని కలుసుకోవల్సి వుంది, ఎందుకనగా ఈ సమాచారమును వ్యక్తిగతముగా నేనే ఆయన్ని కలిసికొని, దానిని ఆయనకే ఇవ్వాలని ఆజ్ఞాపించబడ్డాను."
23సరే ఎట్టకేలకు వారతన్ని ప్రభువైన యేసు నొద్దకు తీసికొని వచ్చారు. ఆయన అతనిని చూచుచూ, బహుశా ప్రభువైన యేసు బోధించుటకు తన శిష్యులు ఆయనకు ఏర్పరచిన ప్రసంగవేదికను విడిచి అతనివైపు తేరిచుచుచుండెనేమో, ఎందుకో ఆయన అతని వైపే నిదానించి చూచుచున్నాడు. బహుశా అతడిని ఆయన ఇష్టపడియుండవచ్చు.
వార్తాహరుడగు ఆ యవ్వనస్తుడు ఆయనతో ఇలా చెప్పాడు, "అయ్యా, నాకివ్వబడిన ఆజ్ఞ నిమిత్తం నేను ప్రయాణం చేసుకొంటూ వచ్చాను. ఫలాని పట్టణంలో ఉన్నత తరగతికి చెందిన ఒక వ్యక్తి వున్నాడు. అతడొక పరిసయ్యుడు. బహు మతనిష్ట గలవాడు. అతడొక విందును సిద్దము చేయుచున్నాడు - గొప్ప సమయమది, ఒక విందు - దానికి మీరు ఒక ఘనమైన అతిదిగా రావాలని అతడు కోరుచున్నాడు. మరి "అతడు… అతని ఆహ్వానంను అందుకొని అతిదులుగా వచ్చేందుకు అనేకమంది వున్నప్పటికి అతడు నిన్నే ఎన్నుకొన్నాడు. ఆ విందు ఆహ్వానం మీకందించుటకు దేశమంతా నేను మూడు దినముల నుండి నీ కొరకు గాలించుచున్నాను. అయ్యా, మిమ్మును ఇక్కడ కలుసుకొన్నందుకు నాకు నిజంగా చాలా సంతోషంగా వుంది. అతని నుండి తెచ్చిన ఈ ఆహ్వాన సమాచారమును ఇదిగో ఇప్పుడు నీకిచ్చుచున్నాను."
24ఆయన ఆ సమాచార పత్రమును తీసికొని దానిని చదివెను. ఫలానీ పరిసయ్యుడగు ఇతడు ఒక విందు చేయుచున్నాడు, ఘనమైన అతిధిగా వుండుటకు అతడు ఆయనను ఆహ్వానించెను. కావున యేసు కొద్ది నిమిషములు అలా నిలబడి, ఆ యవ్వనస్తుని వైపు తేరిచూచుచుండెను. ఆయనె౦త బిజీగా వున్నా నీవెప్పుడు ఆయనను ఆహ్వానించినా, ఆయన తప్పకుండా వస్తాడు. పరిస్థితి ఏదైనాసరే నేను లెక్క చేయను, ఆయన మాత్ర౦ ఖచ్చితంగా వస్తాడు.
ఆయన ఇలా అన్నాడు, "నీవు చెప్పుము - నీ యజమానునితో చెప్పుము, నేనక్కడ వుంటానని. నిర్ణయించిన దినమున, నిర్ణయ కాలమున నేనచ్చటవుందునని."
అంతట ఆ వార్తాహరుడు తప్పక నవ్వి, తృప్తి నొంది, తిరిగి వెళ్ళిపోయి, మరియు ఏ వ్యక్తికైతే విందు ఆహ్వానమును అందజేయుటకు తాను పంపబడ్డాడో, సరిగ్గా ఆయనకే దాన్ని చేరవేయుటలో తాను సఫలీకృతుడనైతినని, ఆనందించి, ఆ శుభవార్తను తిరిగి తన యజమానికి తెలియజేయటానికి బహుశా అతడు ఆ కొండల మీద నుండి సంతోషంగా పరుగెత్తుచూ వుండొచ్చును.
25సరే ఇంతకీ ఈ వార్తాహరుని గూర్చిన సంగతేమిటి? అదెలావుండగలదు? తానేమి చేసాడో దానిని అతడు ఎరిగియున్నాడా? బహుశా జీవితంలో అతనికి మొట్ట మొదటిసారిగా యేసు సన్నిధిలో నిలబడే అవకాశం దొరికినది, కాని అతడు ఆయనను తన పాపముల విషయమై ఏ మాత్రం క్షమాపణ అడుగలేదు. అతడెన్నడు - ఆ అవకాశాన్ని అతనెప్పుడూ తీసికొనలేకపోయాడు. ఓ, నేటి జనులు కూడా సరిగ్గా అలానే వున్నారు. అనేకసార్లు వారు - ఆయన సన్నీధిలో పున్నామని అనేకసార్లు గుర్తిస్తారు; అయినను పాపక్షమాపణ కావాలని ఎన్నడూ వారు ఆయనను అడుగరు. మంచిది, బహుశా అటువంటి ఒక సువర్ణావకాశం అతడెన్నడూ మరోసారి కలిగియుండకపోవచ్చును, తనకి పాపక్షమాపణను అడిగే అద్భుత అవకాశాన్ని అతడు చేతులా పోగొట్టుకున్నాడు. దానిని అతడు ఇంకెన్నడు చేయగలడు? తన యజమానుని యొక్క సమాచారమునైతే దేవుని కుమారుని సన్నిధికి మోసుకొనివచ్చాడు, అందులో సఫలీకృతుడయ్యాడు గాని తన పాపక్షమాపణను అడిగే విషయంలో మాత్రం వాడు పూర్తిగా విఫలమైపొయ్యాడు. వార్తను చేరవేయుటమే వృత్తిగా పెట్టుకొన్నాడు.
26మరి, మీకు తెలుసా, నేడు ప్రజలు ఇష్టపడే కొంత పాఠం దానియందు వున్నదని సంఘము, మరియు క్రీస్తు ఒక వ్యాపార వ్యవహారమయిరి, లేదా సామాజిక వ్యవహారమైరి. సంఘములో, జనులు ఎందుకు చేరుతున్నారు. వ్యాపార అభివృధి కొరకు, లేదా సామాజిక పరమైన అవసరాల కొరకు చేరుతున్నారు. పొరిగింటి వారిని ఆదుకొనుటలో నీవు ఇంకొంత మెరుగుపడాలి. ఒక పాపి ఏమి చేయాలి? నిశ్చయముగా, అతడు పశ్చాతాపపడుటకు రావాలి. అనేకసార్లు జనులు ఈ వార్తహరుడు చేసినట్లుగానే చేస్తున్నారు. వారు క్రీస్తు సన్నిధికి వచ్చి ఈ వార్తహరునివలే క్షమాపణ అడుగకుండా అచ్చట నుండి తిరిగే వెళ్ళిపోవుచున్నారు.
ఓ, ఆయన ఎవరో అనే దానిని అతడు అతడు తన మోకాళ్ళ మీద పడి వుండాల్సింది. మరియు ఇలా చెప్పాల్సింది, "ప్రభువా, నీకు చెప్పుటకు నేనొక వార్తను మోసికొచ్చాను. కాని దానికి ముందు నీవు నా పాపములను క్షమించుము." వాడు ఆయనను చేరుకోవల్సిన సరైన విధానమది. ఆ తదుపరి చేయాల్సిన పని ఏదైనా దాని తరువాతనే జరిగించవల్సి వుంది. మొదట అతడు దేవునితో తన సొంత ప్రాణమును సరి చేసుకోవల్సి వున్నది.
JAS 5:16
27అందుకోసమే అనేక స్వస్థతలు జరుగట్లేదు. స్వస్థత కావాలనుకొన్నా రావట్లేదు. ఎందుకనగా ప్రజలు అసలు స్వస్థత అనుదాని కొరకు సిద్దపడిలేరు. వారు తమ పాపములను ఒప్పుకోరు. బైబిల్ చెప్పుచున్నది, "మీ పాపములు ఒకరితో ఒకడు ఒప్పుకొనుడి, మీరు స్వస్థత పొందునట్లు ఒకని కొరకు ఒకడు ప్రార్ధన చేయుడి." దానిని చేయుటకు మనము ఇష్టపడము.
మనము స్వస్థతను తీసికొని ముందుకి మరియు వెనుక్కి వెళ్ళి మరియు ఏదైతే చెయ్యాలో దానిని చేసినట్లైతే వారు దానిని అంగీకరించెదరు. కాని అది వాస్తవమునకు వచ్చినట్లైతే, మొదట చేయవల్సినది ఏమనగా, దేవునితో సరియగుట, అయితే జనులకు అది ఇష్టముండదు. ఆ కారణము చేతనే దైవిక స్వస్థత మీద దురభిప్రాయము వుండినది. ఆ విధముగా నడిచే అనేకమంది జనులను నీవు చూడవచ్చును, వారలా నడుచుచూ పాపములను ఒప్పుకోకుండా వుండెదరు. అటువంటి వాటన్నిటిని గురించి దేవునికి తెలియును.
28ఇప్పుడు ఇతడు అనాలోచన కార్యాన్ని జరిగించాడు, దానిని మనం మనస్కరించితిమి. మనం తలంచితిమి, "ఒకవేళ నేనే అతడి స్థానంలో వుంటే, నేనే ఆయన సింహాసనం యెదుటకి వెళ్ళితే, మరియు ఒక సమాచారమును తీసికొని వెళ్ళితే, నేను చేసే మొదటి కార్యం ఏదనగా…" నీవైతే ఏమి చేయుదువు? దాని గురించి తెలిసికొను నిమిత్తం నీ సంస్థ నిన్ను అచ్చటికి పంపుటకు ఆసక్తి కలిగివుంటే నీవేమి చేస్తావు, లేదా పరలోకం ఎలా అలంకరించబడిందో చూచుటకు చుట్టూ చూస్తావా? లేదా ఆయన సన్నిధిలో నిలిచి, "ప్రభువగు దేవా, నేనొక పాపిని నన్ను క్షమించుము," అని మొదటిగా చెప్పవా? నిజానికి ఇలా చేయటమే సరైన పని.
29ఇప్పుడు, యేసు ఆ బాలున్ని గమనించాడు, మరి అతడు వెళ్ళిపోయాడు, ఆయన మనస్సులో ఈ తలంపు కలిగివుండొచ్చునేమో… ఈ బాలుడు ఎందుకని దానిని చేయలేకపోయాడు? కారణం ఆయన ఎవరనే ఎరిగే స్పహ అతడికి లేకుండెను. నేను దీనిని చెప్పగోరుచున్నాను. దైవదూషణ అనుకొనవద్దు సుమా. దీనిని చెప్పగోరుచున్నాను. ఈ కూటము లేక ఏ కూటము అనుకొని కాదు సుమా, కాని అసలు సంగతి అదేనని నేను అనుకొనుచున్నాను. దాని విషయమై జనులకు స్పహలేకుండా పోయినది. లేఖనాలు ఖచ్చితంగా గుర్తించబడుటను వారు చూచెదరు. జనులు అది ఎవరో అనే దాని విషయమై స్పృహ లేకుండా వున్నారు.
వారంతా దేనినో చూచెదరు, వారు ఇలా అందురు, "ఓ, అదెంతో అద్భుతం. అదెంతో బావుంది. నేను…" అది ఏమిటో అనే స్పృహ నీకు లేకుండ పోయినది. ఒకవేళ వుంటే నిశ్చయముగా పశ్చాతాపపడుటము, దుఃఖించుటం, కన్నీరు కార్చటం లాంటివి తప్పక వుంటాయి. పట్టణము అటువంటి ఉజ్జీవమును కలిగివుండును, నీలో సగభాగం ఉదయమునకు ముందే తాళం వేయబడును. అవును, అది నిజం, మనం నిజంగా దాని విషయమై స్పృహ లేనందున పలుమార్లు మనం దానిని దాటిపోతాము, కేవలం దాని విషయమై స్పహ లేకుండా వుండుటమే.
30ఆ బాలుడు సరిగ్గా గ్రహించాడని నేననుకోవట్లేదు. అతడు పరిసయ్యుని యొద్ద పెంచబడ్డాడు, ఈ పరిసయ్యుడు గొప్ప అధికారి, ఒక రాకుమారుడు లేదా ఒక మతసంబంధి. అతని యొద్ద ఆ బాలుడు పెరిగాడు గనుకనే మరి అతడు ఆ పరిసయ్యుని మతభక్తి వైపు మొగ్గు చూపినట్టు కనబడ్డాడు. మరి ఆ పరిసయ్యుడు యేసు విషయమై హేళనగా నవ్వియుండెను. ఆయన విషయమై కించపర్చి, ఆయనను గేలిచేసియుండెను, లేదా వారు ఆ దినమందు ఇంకా ఏదో జరిగించియుండెను, గనుకనే ఈ బాలుడు యేసు విషయమై చుళకన భావన కలిగివుండెను. అందువలనే అతడు, "ఆ సమాచారమును చాలా తేలిగ్గా తీసికొని," ఆయనకి చేరవేసెను. ఆయనను కలుసుకొనే గొప్ప బాగ్యం అతడికి దొరికింది, కాని దాని విలువ ఆ బాలుడు ఎరుగకుండెను. దాని విషయమై అతడకి ఏ మాత్రం మనస్సు లేకుండెను. ఒకవేళ అతడు నిజంగా మనస్సు కలిగియున్నట్లైతే, నేడు ఆ బాలుడు మన మధ్య మృతులలో నుండి లేపబడి, ఈ వారమంతా మనం జరుపుకొనుచున్న ఈ కూటములో వుండి, ఏదో ఒకటి చేసి వుండేవాడు. మనందరిని కదిలించివేయగల సాక్ష్యమును అతడు కలిగియుండేవాడు. అయితే అతడు, ఆయన సన్నిధిపట్ల స్పృహ లేకుండెను.
31ఇప్పుడు, ఇక్కడున్న ఈ సంఘటనలో ఏదో ఒక పొరపాటు కనబడుచున్నది. అది కేవలం ఆ విధంగా కాక… అది సరి కాదు, ఆ బాలుడు అలసట చెంది, చింతక్రాంతుడై వెళ్ళినట్టు యేసు చూచెను. కాని అసలు సంగతి పూర్తిగా అది కాదు — అక్కడ ఎదో తప్పిదము ఉన్నది. పరిసయ్యులగు వారు యేసుని ద్వేషించువారు. మరైతే అలాంటి వారు వారి విందులోనికి ముఖ్య-అతిధిగా ఆయననెందుకు ఆహ్వానించారు? ఆ పాత సామెత ప్రకారం జూదగాడు దొంగచాటుగా తన చేతి షర్టు మడతలో పేకముక్కను కలిగియున్నాడు. తన షర్టు మడతలో ట్రిక్ కార్డును వుంచుకొని పైకి బాగానే ఆడుచున్నట్టుగా వుంది ఆ పరిసయ్యుల వ్యవహారశైలి. పైకేమో ఆయనను ముఖ్య-అతిధిగా ఆహ్వానించటం, లోలోపలేమో ఆయనను కించపర్చాలనే దురుద్దేశ్యం. అదంతయు ఆయనకు అప్పుడే తెలుసునని నా నమ్మకం.
చూశారా, ప్రజల యొక్క సంగతులు సాధారణముగా ఒకేలా ఉండాలి. నా తల్లి ఎల్లప్పుడు ఇలా అంటుంది, "ఏ జాతి పక్షి, ఆ జాతీతో కలిసి ఎగురును." డేగలు మరియు పావురాళ్ళు కలిసి ఎగరటాన్ని నీవెన్నడు చూడలేవు. అందులో ఒకటి కుళ్ళిపోయిన పదార్థాలను తినే పక్షి. మరి రెండవది అనగా, పావురము అలాంటి వాటిని అసలు తినదు, ఎందుకనగా దానిని జీర్ణించుకొనే పైత్య రసమును అది కలిగియుండలేదు. అవును, అటువంటి కుళ్ళిన దానిని తిని అది జీర్ణించుకోలేదు.
ఒక ఉద్దేశ్యమంటు లేకుండా విశ్వాసులు, అవిశ్వాసులు కలిసి తిరుగటను నీవు చూడలేవు. అలా తిరుగుతున్నారంటే ఏదో పొరపాటు వారి మధ్య వున్నదని అర్ధం. ఈ బాలుడు తన అంతరంగములో ఒక కిటుకును కలిగి, ఆయన యొద్దకు వచ్చాడు. దానిని వాడు వచ్చి యేసు మీద ప్రయోగించగోరాడు.
32ఇప్పుడు, మీరు జనులును గమనించండి, యవ్వనస్తులను తీసికొండి, వారు వృద్ధులతో సాంగత్యం చేయడానికి ఇష్టపడరు, ఎందుకనగా వారి సంగతులు వారికి సాధారణముగా ఒకేలా వుంటాయి. యవ్వన దంపతుల సంగతులు యవ్వనదంపతులకే వుంటాయి. వృద్ధులు, వయస్సు అయిపోయిన వారు చంటి పిల్లల మధ్య ఎక్కువ సేపు ఉండరు. వారికుండవల్సిన సంగతులు వారి కుంటాయి. ఒక చిన్నపిల్ల ఎల్లప్పుడు తన అవ్వతోనే గడిపినట్లయితే, అప్పుడు, అక్కడ ఏదో ఒక పొరపాటు వున్నట్టుగా మనం చూడగలం. ఎందుకనగా వారిద్దరి మధ్య వయస్సు రీత్య ఎంతో వ్యత్యాసం వున్నది. బహుశా ఆ చిన్నపిల్ల అవ్వకు ఎంతో అనురాగమైయుండవచ్చు, లేక అవ్వ ఇచ్చే చాక్లెట్ కోసమైనా కావొచ్చు, చూచారా. అక్కడ ఎదో కిటుకు ఉన్నది. నాకొక మనవరాలు ఉన్నది, ఒక చిన్న కిటుకు ఎక్కడో వున్నది, చూశారా. చిన్న బాలిక అవ్వ చుట్టే ఎల్లప్పుడు తిరుగుతుందంటే, అవ్వ ఏదో చాక్లెట్, మరలాంటివి ఏవో కలిగియున్నట్టు అర్థం.
ఈ పరిసయ్యుడు ఏదో ఒక కుట్రను రహస్యముగా కలిగియున్నాడు.
33అసలు ఈ కుట్రకు బీజం పడింది వారి యొక్క సేవకుల కూటంలోనే. తన్ను ప్రవక్తనని చెప్పుకొనుచున్న ఈయన విషయమై వారు తమ సేవకుల కూటములో చర్చించుకొన్నారు. ఈయన్ని ప్రవక్తగా వారు నమ్మరు, ఎందుకనగా మానవ-కల్పిత సిద్దాంతాలు కలిగిన వారిలో కనీసం ఒక్కడు కూడా ఆయన ప్రవక్త అని ఒప్పుకొని ఆయనను వెంబడించలేదు. కావున ఈ సేవకుల కూటంలో వారొక నిర్ణయానికొచ్చారు, అదేమిటనగా వారందరు ఆయన ప్రవక్త కాడు అని నిర్ణయించేసారు.
కనుక ఆయన ప్రవక్త కాడు అనే ఈ సంగతిని ఈ పండితుడగు పరిసయ్యుడు తన మిగతా పరిసయ్యులకు నిరూపించదల్చాడు. పరిసయ్యుడు ఖచ్చితపర్చగోరాడు, మరియు ఆయన అతని పట్టణమును సందర్శించుటకు ముందే ఆ పట్టణ ప్రజలకు, మరియు సమాజమునకు ఆయన ప్రవక్త కాడని అతడు చూపించగోరాడు. ఆయనైతే ఇదివరకెన్నడూ ఆ పట్టణమునకు వచ్చియుండలేదు, కావున ఆయన వచ్చుటకు ముందే, అతడు ఆయనను బయట పెట్టాలనుకొన్నాడు. ఓ, ఆ ఆత్మ! నేటికిని పనిచేయుచున్నది: ఆయన అక్కడ జరుగబోయే కూటమును ఆటంకపర్చుటకు ఆయనలో ఏదైనా తప్పు దోరుకునేమోనని, దానిని బయట పెట్టుటకు అతడు సంకల్పించాడు.
34అందుకనే అతడు ఇలా అన్నాడు, "నేనొక విందు చేయబోవుచున్నాను. ప్రతి ఒక్కరిని అందులోనికి ఆహ్వానింతును, పట్టణములోని వారిని, పట్టణానికి బయట వున్న ప్రతి ఒక్కరిని ఆహ్వానింతును. అప్పుడు అందరి యెదుటే ఆయన ప్రవక్త కాడని నేను నిరూపించెదను."
దానిని చేయుట ద్వారా ఆ పరిసయ్యుడు తన పరపతిని.. తన హోదాను లేక ఇంకా ఏదో పెద్ద పదవిని పొందగోరాలని బహుశా తలంచవచ్చును. అతడు అతడు… నిజంగా తన జనులను ఈ కార్యము ద్వారా అతడు కదిలించగోరాడు, ఏదో రకంగా ప్రభువైన యేసుని ఇరుకున పెట్టి, విందులో అందరి యెదుట ఆయనను హేళన చేసి, ఆయన ప్రవక్త కాడని నిరూపించుటకు సిద్దపడుచున్నాడు. తద్వారా తన్నుతాను వారి యెదుట గొప్ప చేసికొని గొప్ప వ్యక్తిగా అనుపించుకోవాలనుకొన్నాడు.
35ఇప్పుడు, ఆ వార్తాహరుడు తిరిగి తన యజమానుని యొద్దకు వచ్చి ఇలా చెప్పినట్టు మనం చూచెదము, "నేనాయనను కనుగొన్నాను. వస్తానని ఆయన మాట ఇచ్చాడు. ఇక్కడ ఉంటానని వాగ్దానం చేసాడు, ఎందుకనగా ఎలాగు చెబితే ఆయన వస్తాడో ఖచ్చితంగా నేను అలానే ఆయనకి చెప్పాను. ఆయన నిశ్చయంగా ఇక్కడ ఉంటాడు." మంచిది.
ఇప్పుడు పరిసయ్యుడు ఆ సమయము కొరకు ఎదురుచుచుచుండెను. విందు ఎప్పుడు సిద్దపర్చాలో, ప్రతి దానిని ఎలా జరిగించాలో దానంతటిని వారు ఎరిగియున్నారు. ఈ రాత్రి మనం చెప్పే ఈ చిన్న నాటకంలో అతడు ఈ విందును దాక్షా పంటను కోయు కాలములో ఏర్పాటు చేసాడనుకొందాం. నీవు ఎప్పుడైనా దాక్షా పంటను కూర్చుకొనే కాలమందు పాలస్తీనా లేదా కనీసం కాలిఫోర్నియా వెళ్ళినట్లైతే, ద్రాక్ష తోటలో ద్రాక్షలను త్రొక్కుచుండగా దాని మధురమైన రసం స్రవించుచుండగా ఆ ప్రాంతమంతా లేక ఆ లోయంతా కమ్మని వాసనలు వెదజల్లుటను నీవు కనుగొంటావు. అటువంటి సరైన కాలమందు విందును ఏర్పాటు చేస్తే బావుంటుందని అతడు ఎరిగియుండెను. కావున అతడు ఫలానా-ఫలానా తేదీన విందు ఏర్పాటు అని సమయాన్ని నిర్ణయించారు.
36ఎట్టకేలకు ఆ సమయం రానే వచ్చింది. సాద్యమైనంత వరకు అతడు పిలవాలనుకొన్నవారందరిని, ప్రముఖులను, తన సంస్థ వారిని, తాను ఏ క్లబ్బుకి చెంది యున్నాడో వారందరిని విందుకి ఆహ్వానించాడు. వారందరు తన యొక్క అందమైన గొప్పదగు భవంతికి చేరుకొన్నారు. అది పట్టణములో ఉన్నతమగు ఒక ఎస్టేట్ ని తలపిస్తుంది. విందు జరుగు సమయం వచ్చేసినది. భవంతి ఆవరణమంతా చక్కగా అలంకరించబడి బోజన బల్లలు వేయబడినవి, విందు గది సిద్దపరచబడినది.
ఇప్పుడు అతడు తన అతిధులను పరామర్శించబోవుచున్నాడు… వచ్చిన వారిని సాదరంగా ఆహ్వానించబోవుచున్నాడు. ఆహ్వానించే వారు దానిని చేయుదురు. తన అతిధులలో కొందరు రధముల మీదను, కొందరు గాడిదల మీదను, కొందరు కాలినడకను వచ్చే వారుందురనే ఆలోచన కలిగి అతడు గుర్రములు, గాడిదలను దొడ్డిలో చేర్చే, పనివారిని కొందరిని పురమాయించుకొన్నాడు. తమ అతిధులను సంతోషపర్చుటకు విందు చేసే ఎవరైనా సరే ఈ ఏర్పాటులు చేసికొందురు.
కావున ఈ పరిసయ్యుడు అంతటిని సిద్ధపరచుకొన్నాడు. తన పనివారినందరిని, అన్నింటిని సిద్దం చేసికొన్నాడు. అలాగే గుర్రములను మరియు గాడిదలను దొడ్డిలోకి చేర్చి, వాటికి కావల్సిన గ్రాసమును నీరంతటిని సిద్దపర్చు పనివారిని సహితం అతడు సిద్దంచేసికొన్నాడు, ఆ తరువాత అతిధులను ఆహ్వానించుటకు ద్వారములకు ఇరుప్రక్కల కాపలాదారులను సహితం ఏర్పాటు చేసికొన్నాడు, ఎందుకనగా ద్వార పాలకులు అనుమతించనిదే ఏ ఒక్కరు లోనికి ప్రవేశించజాలరు. విందుకి వచ్చేవారు తమ ఆహ్వాన పత్రికల ప్రకారం వారి పేర్లను ముందుగానే అతడు కలిగి యుంటాడు. కావున విందుకు వచ్చేవారు లోనికి వచ్చునప్పుడు తమ పేర్లు అచ్చట వుంటేనే వారు లోనికి అనుమతించబడతారు.
37సరే, కొద్దిగా ముందుకెళ్ళి చూద్దాం, వారేమి చేయుదురో, తూర్పు దేశాలలో వారి యొక్క మర్యాదలు ఎలా ఉంటాయో నేను ఎరుగుదును, బహుశా మీలో అనేకులు వారెలా చేస్తారో గమనించే వుండవచ్చును. వారు ఎలా చూచుకొంటారో కొద్దిగ పరిశీలన చేస్తే నిజంగా అది ఎంతో ఆశ్చర్యముగా వుంటుంది. ఏర్పాట్లన్నీ అయిపోయిన తర్వాత, అతిదులు ద్వారము నొద్దకు వచ్చినప్పుడు, అక్కడుండే ద్వారపాలకులు చేసే మొదటి పని ఏదనగా, "మీరు ఏవరు?" అని అడిగెదరు. వారు తమ్మును అడిగిన వారికి తామేవరో చెప్పెదరు. అంతట ద్వారా పాలకుడు తన వద్దనున్న పట్టికను తీసికొని చెప్పబడిన ఆ పేరు ఆ పట్టికలో వు౦దో లేదో పరిశీలనగా చూసి, వుంటే సాదరంగా అతనిని లోనికి తీసుకొని వెళ్ళును. అక్కడున్న పని వారు ప్రయాణము చేసివచ్చిన వారి గుర్రములను లేక గాడిదలను అందుకొరకు ఏర్పాటు చేసిన దొడ్డిలోనికి వాటిని తోలుకొని వెళ్ళి, వాటిని చూచుకొనెదరు.
38దాని తర్వాత ఆ అతిధి ప్రవేశ గదిలోనికి ప్రవేశించును. ఇక్కడ ఒక గుంపు పనివారు వుంటారు, వారిని పాదములు కడిగే నౌకర్లు అని పిలుస్తారు. వారికున్న ఉద్యోగాలన్నిటిలో చాలా తక్కువ జీతం చెల్లించే పని అదియే. పాదములు కడిగే నౌకరు ఉద్యోగం చాలా తక్కువ ఉద్యోగం.
దానిని ఆలోచించండి — మనమేదో గొప్ప అనుకొంటాం, కాని భూమి మీద వున్నప్పుడు మన ప్రభువు అతి తక్కువైన పాదములు కడిగే నౌకరు పనీలో తన్నుతాను గుర్తించుకొన్నాడు. ఆయన చేసినది సరిగ్గా అదేనండి. మనమైతే మనల్ని ఎంతో గొప్పవారిగా భావించుకొంటాం. కొద్దిపాటి విద్య కొరకు పాఠశాలకు పరుగు తీస్తాం, పెద్ద పెద్ద మాటలు పలుకుటకు నేర్చుకొంటాం, తిరిగి వచ్చి దర్జాగా వస్త్రధారణ చేసి, డాక్టరు లేక రెవరెండు లేక ఇంకేదోనని పిలవండి, అంటూ డంబాలు పలుకుతుంటాం.
39కొద్దికాలము క్రితం నేను ఒక పెద్ద మ్యూజియంకి వెళ్ళాను, అక్కడ సుమారు నూట-యాభై పౌండ్లు బరువున్న మనిషి యొక్క ఖరీదు ఎంతో, అతని శరీరములో వున్న రసాయనాల వీలువెంతో అక్కడ ప్రదర్శించబడటాన్ని చూచాను. నూట-యాభై పౌండ్లు బరువుగల మనిషి తిరిగి రసాయనముగా మారితే, అతని వీలువెంతో తెలుసా? కేవలం 84 సెంట్లు, కాని చూడండి 84 సెంట్లు ఖరీదు గల అతడు పది డాలర్ల టోపిని ధరించును, ఐదువందల డాలర్ల విలువు గల కోటు ధరించును, ముక్కు పైకెత్తు కొనును. ఒకవేళ వర్షం ఏదైన వచ్చి, తాను అందులో పడి చస్తే, తిరిగి 84 సెంట్లు ఖరీదులోనికి పడిపోవును. అది నిజం! నీవేదో ప్రత్యేకమైన గొప్పవాడినని అనుకొనుచున్నావు. కాని నిజానికి నీలో వున్న ఆత్మ పదివేల ప్రపంచముల కంటే విలువైనది! గమనించారా తేడాను, దానిని ఎలా పొందుదుము.
40ఇప్పుడు, పాదములు కడిగే నౌకరిగా ఆయన వారి పాదములు కడిగియుండెను. ఇప్పుడు, ఇందులో… నీవు పాలస్తీనాలో ప్రయాణించేటప్పుడు, పాలస్తీనా వారు ధరించే వస్త్రమును చూడుము. అది నేలమట్టుకు వుంటుంది. లోపలి వస్త్రము పాదముల దిగువ వరకు విస్తరించి వుంటుంది. పశువు మరియు మనుష్యులు ఒకే దారిన నడిచారనుకోండి. ఆ దారినే ఇరువురు నడుచుకొంటు వెళ్ళారనుకోండి, మరి ఆ దారినే నడిచిపోయారనుకోండి, పశువులు నడిచిన ఆ దారి అంతయు దుమ్ము మరియు దూళితో నిండి ఉండును, అలాగే పశువుల పేడ మరియు మూత్రము ఆ దారిని కంపు కొట్టేదిగా మార్చును. పాదముల దిగువ వరకు ధరించిన ఈ మనిషి నడిచినప్పుడు బట్టల ని౦డా అది అంటుకొనును. అతని పాదములు, దాని వస్త్రములు పూర్తిగా మట్టిమయమైపోతాయి. పూర్తిగా చెమటతో తడిచిపోతాయి. అంతే కాదు, అది అంతే ఎండిపోయి, ఒంటికి అంటుకొనిపోతాయి.
పశువులు వెళ్ళిన ఆ దారి అంతయు మురికితో కంపుకొట్టును, మరి పాలస్తీనా వారి వస్త్రములు, స్త్రీ ధరించే పొడువైన దుస్తువుల వలే క్రింద వరకు వుండి నేలంతయు ఈడ్చుకొంటు వెళ్ళును. అప్పుడు అది కాళ్ళ నిండా అంటుకొనును. వారు దారిన వెళ్ళిన ఆ పశువుల వాసన లాంటి వాసనతో కంపుకొట్టెదురు. కావున ఆ విధముగా పరిసయ్యుని ఇంట్లోకి అలా వచ్చుట అంటే… వారు అలాంటి మట్టి గొట్టుకొని వచ్చిన అతిధులను పెర్షియా (గది)లోకి పంపుదురు. అక్కడ వారికి అందమైన పెద్ద దుప్పట్లు ఇచ్చెదరు, ఇంకా ప్రతీది సమకూర్చెదరు. ఎందుకు, నీవు ఆ విధంగా కంపుకొట్టుచున్నట్లైతే ఆహ్వానించిన వారి యెదుటకి అంత మురికిగాను, వాసనగాను వుంటే వారు నిన్ను రానివ్వరు.
గనుక దాని విషయమై వారు శ్రద్ధ తీసికొంటారు. అందుకే పాదములు శుద్ధిచేసే కార్యక్రమమును వారు కలిగియుండెదరు, అక్కడ అతడు పాదములను శుద్ధిచేసేవారు అక్కడ ఉండెదరు.
41నీవు లోనికి వచ్చిన వెంటనే నీ పేరు నమోదు చేయబడుతుంది. పనివారు నీ గుర్రములను నీ పశువులను వెనుక వున్న దొడ్డిలోనికి తోలుకొని పోయెదరు. ఆ పని కొరకే కొందరు పురమాయించబడెదరు. తర్వాత ద్వార పాలకుడు తన వద్దనున్న పట్టి ప్రకారం నీ పేరును గుర్తించును. ఆ తర్వాత నీ పాదములు కడిగే నిమిత్తం నీవు తీసికొనిపోబడిదపు.
అంతట లోనికి వెళ్ళెదవు. నీవు నీ పాదములను అక్కడ వుంచగానే, అక్కడున్న పాదాలు కడిగే నౌకరు నీ చెప్పులను నీ పాదముల నుండి విప్పి, వాటిని ఒక ప్రత్యేక చోట వుంచును తర్వాత నీవు తిరిగి వెళ్ళేటప్పుడు నీ చెప్పులు ఏ చోటు వున్నాయో అతడు ఎరిగి యుండును. మరో ప్రక్క అతడు నీ కొరకు మరోక చెప్పుల జతను కలిగివుండును. నీ పాదములు కడిగి శుద్ది చేసిన తర్వాత, బాగా కడిగి శుద్ది చేసిన తర్వాత, మట్టి దుమ్ము అంతయు పోయేటంత వరకు కడిగి, వాటిని తాజాపర్చి, అప్పుడు మృదువైన గుడ్డతో తయారు చేసిన జోళ్ళను నీ కాళ్ళకి తొడుగును. విదేశాలకి నీవు విమానాల్లో ప్రయాణించేటప్పుడు నీవు చూచెదవు, రాత్రి పూట కప్పుకొనుటకు వారు నీకు వాటిని ఇచ్చెదరు. నీవు… వారు ధరించే ఆ చిన్న వాటిని, ఆ స్త్రీలు ఆ మేజోళ్ళను దరించేటప్పుడు వారు వాటిని కలిగి యుండెదరు. వాటిని, స్త్రీలు ధరించిన వాటిని, నా భార్య మరియు నా కుతురు ధరించటాన్ని (కాళ్ళకు చేతులకు దరీంచే మేజోళ్ళు)ను నేను చూసాను. కొన్ని సార్లు వారు… అది ఒక చిన్న… దానిని ఏమని వారు పిలుస్తారో నాకు తెలియదు, కాని అది సాక్సు యొక్క అడుగు భాగము వలే వుంటుంది, మీకు తెలుసా, మరి - దానిని నీవు నీ పాదమునకు తొడుగుదువు. ఒక పద్ధతి ప్రకారము అది జరుగును, కేవలం అది కొద్దిగా ఉన్నతంగా, ఎందుకనగా నీవు ఆ విధముగా కాక మురికి చెప్పులతోనే వెళ్ళి, అచ్చట నడుచుటకు వారు ఒప్పుకొనరు. గనుక నీ పాదము కడుగవల్సివుంది. దాని తర్వాత జరిగే కార్యమేమిటంటే కడగబడిన ఆ పాదములకు చెప్పులు ధరింపచేయుదురు. వాటిని నేను బూటి అని పిలువగోరుదును.
42దాని తర్వాత జరిగే తదుపరి కార్యక్రమమేమిటంటే, ఒక వ్యక్తి అక్కడ తన భుజముల మీద తువాలను వేసికొని నిలబడి వుంటాడు, తన చేతులలో కొంత పరిమళ సువాసన ద్రవ్యాలను కలిగివుంటాడు. అది సువాసన నిచ్చే తైలము. ఇప్పుడు ఆ పాలస్తీనా సూర్య కిరణాలు తిన్నగా నీ మెడ మీద పడినప్పుడు, అది నీకు బొబ్బలు వచ్చునట్లు చేయును. మరొక సంగతి, వారిని కమ్మిన ఆ ధూళీ, కొన్నిసార్లతే గడ్డము నిండా మరియు తలనిండా పడును, గనుక పరిమళ తైలం పట్టుకొని ఒక మనుష్యుడు అక్కడ వుంటాడు. ఒక చిన్న పాత్రలో అతడు దానిని పట్టుకొని వుంటాడు. దానిలో నీ చేతులను నీవు ముంచి, నీ ముఖము మరియు మెడ చుట్టూ దానిని రుద్దుకొనెదరు. తర్వాత అతడి భుజముల మీదనున్న ఆ తువ్వాలను తీసికొని తుడుచుకొని, వెంట్రుకలు దువ్వుకొనెదవు.
ఇప్పుడు కొన్నిసార్లు…
43ఇది (అత్తరు) చాలా అరుదు, ఎందుకనగా అది చాలా చక్కగా అద్భుతమైన సువాసనను వెదజల్లును. చాలాసార్లు వారు దానిని ఎత్తైన పర్వతాల మీదనే పొందుకొంటారు, అడవి గులాబి పొదల నుండి అది లభ్యమగును. "షెబా దేశపు రాణి సొలోమోనును దర్శించుటకు వచ్చినప్పుడు, తనతో పాటు ఇటువంటి ద్రవ్యాలనే ఆమె సొలొమోనుకి తెచ్చెనని చెప్పబడినది. చాలా అరుదు. దాని కొరకు వారు ఆ ఎత్తైన పర్వతములను చేరుకోవటం చాలా కష్టం.
44మరియు దానితో వారు తుడుచుకొన్నప్పుడు, ఆ తువాలతో గడ్డం మెడచుట్టు తుడుచుకొని, తల దువ్వుకొని వున్నట్లైతే, ఆహ్వానించిన వారిని కలుసుకొనుటకు వారు సిద్దముగా వున్నారని, విందు ఏర్పాటు చేసిన దానిని ఎదుర్కొనుటకు సిద్ధపడి ఉన్నారని అర్థం. చూశారా, మురిగా వుండి లోనికి వెళ్ళటం సరి కాదు అనేది వారి బావం. అందుకోసమే పాదశుద్ది, చూశారా. వారియొద్ద దుర్వాసన వచ్చుచున్నది కావున వారి పాదములు కడుగబడవలెను. దుమ్ము దూళితో వారి చెప్పులతో వారు లోనికి వెళ్ళుటకు సరికాదు అనేది వారి బావం. అది ఇబ్బందిగా వున్నట్టు వారి భావన. అయితే ఇప్పుడు అతని పాదములు కడుగబడినవి, ఇప్పుడు అతడును శుభ్రపరచబడి యుండెను. వారు రాసిన జటామాంసి అత్తరును బట్టి అతడెంతో చక్కగా సువాసనను వెదజల్లుతున్నాడు. "వారి తలలు నూనెతో అంటబడినవి," అని వారు పిలిచే వరకు పరిమళ తైలము ముఖం మీద పూసి, తువాలతో తుడుచుకొని యున్నారు. ఇప్పుడతడు పరిశుబ్రపరచబడివాడు ఆయెను.
ఇప్పుడు తర్వాత అతడు చేయు కార్యమేదనగా, అతడు విందుకు తనను ఆహ్వానించిన వానిని కలుసుకొనుట, తనను విందుకి రమ్మన్న వానిని కలుసుకొనుట. అతడిని కలుసుకోవాలని అతనికి అనిపించును. తాను పూర్తిగా మురికిగా వుండి అతనిని కలుసుకోవాలని అనుకోడు, కాని పరిశుబ్రపరచబడి, సిద్దపడి విందునకు ఆహ్వానించిన వారిని కలుసుకొనుటకు సిద్దపడివుండెను.
LUKE 22:48
45అప్పుడు ఆహ్వానించువాడు అతడిని ద్వారము యొద్ద కలుసుకొనును, వారికొక వింత విదానముండెను. ఆ విధానం కొన్ని సంఘాలలో ఇంకను కొనసాగుచున్నది, అదేదనగా లోనికి రమ్మని చెప్పి ముద్దు పెట్టడం. కావున వారు చేయిపట్టుకొని ఇలా మెలిక త్రిప్పి ఒకరినొకరు కౌగిలించుకొని, ఒకరి మేడ మీద ఒకరు ముద్దు పెట్టుకొందురు. విందునకు ఆహ్వానించినవాడు నిన్ను ముద్దు పెట్టు కొన్నప్పుడు, అది నీకు స్వాగతం అని అర్థం. అది లోపలికి ఆహ్వానించే ముద్దు.
ఇప్పుడు, నిన్ను ఆహ్వానించువాడు నీకు స్వాగతపు ముద్దు పెట్టాలంటే మొదట నీవు శుభ్రపరచబడాలి, నీ మురికంతయు కడిగివేయబడాలి. కాని ఓ! ఒకసారి నీకు స్వాగతపు ముద్దు పెట్టబడిందంటే దానర్ధం నీవు పూర్తిగా అంగీకరించడిన సహోదరుడవని అవును. అదంతే. నేడు నీవు చేయాల్సిందల్లా ఇంటిలోనికి ప్రవేశించటమే, తర్వాత అది నీకు నీ స్వగృహముగా అనిపిస్తుంది. నీవు వారిలో ఒకడివి అవుతావు, ఎందునగా ఆయన నీకు స్వాగతపు ముద్దు పెట్టి లోనికి తీసికొని వెళ్ళాడు.
యేసును యూదా పెట్టుకొన్న ముద్దును జ్ఞాపకము చేసికోండి. గమనించారా, అది వేషదారణ? చూశారా, ఆయన నిన్ను ముద్దాడాడంటే అది లోపలికి స్వాగతం అని అర్థం. అదొక స్నేహితుని ముద్దు. పెదాల మీద కాదండీ, మెడమీద — వారిని మెడ మీద ముద్దాడుదురు.
ఇప్పుడు. మనం గమనించినట్లైతే, నీవు లోనికి వెళ్ళావు. నీవు ఫ్రిజ్ దగ్గరికి వెళ్ళాలనుకొంటే నేడే అది చేయుము, అందులో నుండి మంచి పెద్ద శాండ్ విచ్ ను అందులో నుండి తీసికొని, హాయిగా మంచం మీద కూర్చొని తినుము. మొహమాటపడకు, నీ స్వగృహంలో వున్నట్టుగానే భావించుకొనుము, ఎందుకనగా "నీకు స్వాగతం, లోనికి రమ్ము," అని నీకు చెప్పబడింది. అదంతే, నీకు అంతా బాగానే వుంది. కుటుంబములో నీవు కూడా ఒకడివి అని బావించుకొనుము, ఎందుకనగా నీవు లోనికి వచ్చేసావు.
46ఇప్పుడు, నీకు ఇదంతా చేయబడినది, అబిషేకించబడితివి, అంత చక్క పెట్టబడినది. నీకు స్వాగతపు ముద్దు పెట్టబడినది, అంతట నీవు లోనికి వెళ్ళావు, కరచాలనం చేసావు, విందు యొద్దకు వెళ్ళావు. నీ మిత్రులను కలుసుకొన్నావు. నిన్ను ఆహ్వానించినవాడు నీకు ముద్దు పెట్టి యున్నాడు. కావున నీవిప్పుడు స్వతంత్రుడవు. వారిలో నీవు కూడా ఒకడివే అనే భావనతో వుండుము. నీవు ఆహ్వానించబడితివి. శుద్దిచేయబడితివి, స్వాగతపు ముద్దు నీకు పెట్టబడియున్నది. ఇప్పుడు నీవు వారిలో ఒకడివి. లోనికి వెళ్ళి, నీ సహవాసమును వారితో చేయుము.
ఇప్పుడు , ఈ పాటికి, గొర్రె మాంసం యొక్క వేపుడు మరియు క్రొత్త ద్రాక్షరసము యొక్క సువాసనలు వంట గదిలో నుండి ఆ ప్రాంతమంతయు వ్యాపించెను అని నేను ఊహించున్నాను. ఆ ప్రాంతములో వున్న పేదవారు ఆ వాసనను బట్టి ఆ ఇంటి ప్రహరీ గోడకి అవతల ప్రక్కన నిలబడి, నోట్లో నీళ్ళు నమరుకొనుచున్నట్టుగా వుండిరని నీవు ఊహించుకొనవచ్చును. కాని వారికి ఆహ్వానం లేదు — కేవలం ప్రముఖులకు మాత్రమే అక్కడికి ఆహ్వానం. విందు శీఘ్రముగా సిద్దపాటు అగుచున్నది. ప్రతీ ఏర్పాటు ఎంతో చక్కగా జరుగుచున్నది.
47సరే ఇప్పుడు ఆ పరిసయ్యిడు మరియు అతని స్నేహితులు ఆ సమయమందు పాలస్తీనాలో దొరికే అతి శ్రేష్ఠమైన ద్రాక్షారసమును గ్లాసులో పోసుకొని, ఆరోగ్యకరమైన ఒక మంచి పానము పోయబడిన గ్లాసులను తగిలించుకొనుచూ త్రాగుటను నేను ఊహించుకొనుచున్నాను. ఎందుకనగా వారు ధనికులు, కావున అంతటి విలాసవంతమైన, ఖరీదైన విందును చేసికొనే సామర్థ్యం వారికే ఉంటుంది. మరి వారు, ప్రతి ఒక్కరు, స్త్రీలు, అలంకరింపబడిన వారి స్త్రీలు ఆ మూలన వుండి వారితో సహవాసం చేయుచుండిరి. దివాను కుర్చీలు మరియు అలాంటివి అతంటా వేయబడినవి, అది ఆ కాలమందు వారి యొక్క రివాజు; మరి పురుషులు, అందరు తినుచు మరియు ముచ్చటించుకొనుచుండిరి; మరియు యాజకులు, రబ్బీలందరు, ప్రతీ ఒక్కరు గొప్ప సమయమును కలిగియుండిరి. మరియు విందు చాలా చక్కగా సాగిపోవుచున్నది.
అప్పుడు యేసు, ఆయన ఎంత బిజీ అయినప్పటికి, ఎంత బిజీ కార్యక్రమాలలో ఉన్నప్పటికి ఆయన ఎల్లప్పుడు తన నియామకమును నిలుపుకొనును. దాని మీద నీవు నిబ్బరంగా ఆనుకోవచ్చును. ఆయన తన నియామకమును నిలుపుకొనును.
48ఇప్పుడు. గదిలోకి తొంగి చూచి, ఏమి జరుగుచున్నదో ఒకసారి చూద్దాం. పరిసయ్యుడు తన గ్లాసును తన చేతిలో నుంచుకొని దానిని అటు ఇటు కదిలించుచూ ఇలా చెప్పుటను నేను చూడగలను. "రబ్బీ, అదేమిటో నీకు తెలుసా?" గొప్ప సంబాషణ అక్కడ కొనసాగుచున్నది. వ్యాపారస్థులు వారి వ్యాపారాలను గురించి, ఇంకా దేని దేనిగురించే మాట్లాడుకొనుచున్నారు. విందు ఎంతో చక్కగా సాగిపోవుచున్నది, ఈ గొప్ప విందు.
కాని చూడు. గోడ మీద యేసు కూర్చొని వున్నాడు, ఆయనను ఎవరూ గమనించట్లేదు, ఆయన తన నియమకాన్ని నిలుపుకొన్నాడు. ఆయన తాను చెప్పిట్టుగానే అక్కడికి వచ్చాడు. ఆయన ఎల్లప్పుడు తన మాటను నిలబెట్టుకొనును. ఆయన తానిచ్చిన నియామకములన్నిటిని, ఆయన నిలుపుకొనును. కాని ఆయనను గమనించండి. ఆయన అక్కడ మురికిగా వుండి కూర్చొనియున్నాడు. దానిని పలకటం నేను ఇష్టపడుటలేదు. దాన్ని చెప్పటమంటే నా ప్రాణం పోయినట్టేవుంది. అక్కడ ఆయన పాదము మురికిగా వుండెను, ఆయన్ని ఎవరూ అభిషేకించలేదు, ఆయనకి ఆహ్వానం వున్నప్పటికిని ఏ ఒక్కరు ఆయనకి స్వాగతపు ముద్దు పెట్టలేదు.
49నేటి మన ఉజ్జీవములు కూడా సరిగ్గా అలానే ఉన్నవి. (ఫ్రెంచ్ వారు ఆయనను "యేసూ మురికి కాళ్ళు గల యేసూ" అని పిలుచుచున్నారు.
దానిని ఒకసారి ఊహించగలవా? ఆయన్ని ఆహ్వానించారు, ఆయన వచ్చాడు. ఆయన అక్కడ వున్నాడు, ఏదో దారిన ఆయన వచ్చాడు. ఆయన్ని ఎవరూ గమనించలేదు. గోడ మీద పువ్వులాగా ఆయన అక్కడ కూర్చొన్నాడు. ఆ రోజు ఆయన అక్కడ ఎవరి గమనంలో పడకుండా ఎలాగైతే వున్నాడో, మరి నేడు కూడా ఆయన మన యొక్క కొన్ని నవీన ఉజ్జీవములయందును, విందుల యందును, నామకార్థ మత కూటముల యందును సరిగ్గా అలానే ఉండి యున్నాడు. ఆయన యొక్క స్థానములో లేదు. ఏ ఒక్కరూ ఆయన మీద దృష్టి పెట్టలేదు. ఆయన అక్కడికి ఆహ్వానించబడినప్పటికీ, వారందరూ వారి వారి సొంత కార్యకలాపాలలో పూర్తిగా బిజీ అయిపోయారు. ఆయనక్కడికి వచ్చినప్పుడు ఎవరూ ఆయనకు స్వాగతం పలులేదు.
పాదములు కడిగే ఆ నౌకరికి ఏమైంది? వారికి ఆయన పాదములను కడిగే అవకాశం ఎలా తప్పిపోయింది? ఆ అవకాశం నాకు రావాలని నేను కోరుకొనుచున్నాను. ఓ, మై! ఆయన వచ్చుచున్నాడని నేను ఎరిగినట్లైతే, గడప యొద్దకు వెళ్ళి ఆయన రాక కొరకు కని పెట్టుకొని యుండేవాడిని. అందుకొరకు నేను సిద్ధపాటు కలిగియుండేవాడిని. అతడు ఎందుకు ఆయనను ఆ విధంగా పట్టించుకోకుండా వుండెను? ఇప్పుడు అతడిని మరి ఎక్కువగా ఖండించకుండా వుందాం, ఎందుకనగా మనం కూడా మనకు తెలియకుండానే అదే కార్యము చేయుచుంటిమేమో, చూశారా. అతడు (నౌకరు) ఆయన యొక్క పాదములు కడుగుట తప్పిపోయెను. ఓ, మై!
50గమనించండి. నేడు మనం పిలిచినా కూడా ఆయన వచ్చును. ఆయన మన మధ్యకు వచ్చును. దీనిని నేను చెప్పాలనుకోవట్లేదు. అయినా ఖచ్చితంగా చెప్పితీరాలి, అదేమనగా ఆ రోజు ఆయన అక్కడ ఎలాగైతే ఆ విందుకు వచ్చి ప్రజల నిమిత్తం మురికిగా, అనామకునిగా వారి మధ్య కూర్చొని యున్నాడో మరి ఇప్పుడు కూడా ఆయన అదే రీతిన మన మధ్యకును వచ్చియున్నాడు, కాని ఆయనను "పరిశుద్ద గుండ్రాలు," మరింకా ఏదేదో పేర్లతో ఆయనను పిలుచుచున్నాము. వస్తానన్న చోటుకీ ఆయన ఖచ్చితముగా వచ్చును, కాని మనం కూడా వారు చేసినట్టే ఆయనకి చేస్తున్నాము.
యేసు ఇక్కడికి రావడం తటస్థించినట్లైతే ఎవరో ఒకరు దేవుని ఆత్మతో నింపబడి లేచి, "ఆమేన్" అనుచూ దొర్లుచూ లేదా కేకలు పెట్టుచూవుందురు, లేదా ఇంకొకరు ఆ విధంగా చేయుదురు. ఎందుకు, ఎవరైనా అలా చేస్తే అట్టివారిని వారు సంఘమునకు బయట ఉ౦చుదురు. అవును, స్వయంగా యేసే వారి మధ్య గుండా కదిలి వెళ్ళినప్పుడు, ఆ విధముగా చేయుట సంఘమునకు మరియు జనులకు అదొక గొప్ప అపకీర్తిగాను, సిగ్గుగాను ఉండును.
51ఆనాడు ఆయన ఎలాగైతే తన మాట ప్రకారం వారి మధ్యకు వచ్చెనో, ఈనాడు కూడా ఆయన వచ్చుటను, తన వాక్యముందు తన్ను గుర్తించుకొనుటను చేయును, కాని నేడు వారు ఇలా అంటారు, "అది సోది చెప్పటమే, మనస్సు చదవటమే, లేదా దానిని దయ్యపు ఆత్మ జరిగిస్తుంది." ఆనాటి వలే ఆయన పాదములు మురికిగా వుండి అక్కడ కూర్చొని యున్నాడు — యేసు, దేవుని వాక్యము. మరియు దానిగూర్చి మనము ఏమి చేయము.
మనం మన యొక్క సంస్థల యందు లేదా మన సామాజిక వ్యవహారాలయందు ఎంతో ఆసక్తి కలిగియున్నాము. వాస్తవంగా చెప్పాలంటే ఆయన్ని బట్టి మనమెంతో సిగ్గుపడుచున్నాము. ఆయనకి మురికి ఉన్నందున వారు ఆయన్ని బట్టి ఎంతో సిగ్గుపడరు. అతిధులు ఆయనను తెలిసికొనలేకపోయారు. ఆయన మురికిగా ఉన్నాడని ఆయన్ని బట్టి వారెంతో సిగ్గుపడ్డారు.
నేడు కూడా సరిగ్గా అలానే వుంది. వారు ఇంకను ఆయనను బట్టి సిగ్గుపడుచున్నారు, ఎందుకనగా వారు వేయగలిగినంత మురికిని కుప్పలు కుప్పలుగా ఆయన మీద వేయుచున్నారు. "వారు పరిశుద్ద గుండ్రాళ్ళు" అని హేళనచేయుచున్నారు మరియు వారు తమ ఆలోచన చొప్పున ఎన్నెన్నో మాటలు అనుచున్నారు. దాని విషయమై సరిగా ఏ ఒక్కరూ పలకట౦ లేదు.
అక్కడ ఆయన మురికి పాదములతో, విందు జరిగే చోటున్న గోడమీద పువ్వువలే, మతసంబంధమగు కూటములో గోడమీద పువ్వువలే ఒంటరిగా కూర్చుండిపోయాడు. ఉజ్జీవమునకు రమ్మని మనం ఆయనను అడిగాము, ఆహ్వానించాము. ఆయన వస్తే, వారాయనకు ఏ విధముగా చేసియున్నారో మనం కూడా అదే చేయుచున్నాము. ఆయన వచ్చి, తన్నుతాను గుర్తింపచేసుకున్నాడు. కాని ఏ ఒక్కరికి ఆయనతో చేయునది ఏమియు లేదు.
JOEL 2:28•
ACTS 2:17•
HEB 13:8
52"ఆయన ఏదో ఒక జిమ్మిక్కు చేస్తే బావుండును, లేదా ఏదో ఒక అద్భుతం చేస్తే బావుండును… పిలాతు యెదుట ఆయన చేసినట్టుగానే… పిలాతు, యేసుని కలుసుకొనే గొప్ప అవకాశం అతడికి వచ్చినది, ఏదో జరగాలని అతడు కోరుకొన్నాడు. "ఒక సూచన చూద్దాం," అని అతడన్నాడు. కాని ఆయన్ని కలుసుకొన్న వేళ అతడు పశ్చాత్తాపపడి వుండవల్సింది! నరకపాత్రమైన ఈ లోకం కూడా ఈ రాత్రి చేయవల్సిన కార్యమదే, అది తన పాపముల విషయమై పశ్చత్తాపపడవల్సి వుండెను. ఈ సంఘసభ్యులనే వారు చేయవల్సిన కార్యమదేనండీ, వారు తమ అవిశ్వాసమును బట్టి పశ్చాత్తాపపడవల్సివుంది. ఆయన కొరకు వారు నిలబడవల్సీ వుంది. ఆయన నిన్న, నేడు, నిరంతరం, ఏకరీతిగా ఉన్నాడు. అప్పటి వలే ఇప్పుడు కూడా ఆయన తన్ను తాను గుర్తించుకొనుచున్నాడు.
నేటి జనులు ఆ పరిసయ్యుని వలే అదే నడతను వెంబడించుచున్నారు, అదే నడత; ఆయనను ఆహ్వానించిన తర్వాత ఆయన్ని పట్టించుకోవకపోవటం, మాట వరసకైతే ఆయన్ను పిలుస్తున్నారు, కాని ఆయన్ని మాత్రం గుర్తించటం లేదు. అది ఆయనకు తెలుసు. అప్పుడు వారు చేసినట్టే నేడు మనం ఆయనకు చేయుచున్నాము; ఆయన పాదములను, ఆయన నిందను (అవమానమును) కడుగలేకపోతున్నాం. "జనులారా మీరు చేస్తున్నది తప్పు. ఇది బయలుపరచబడిన దేవుని వాక్యం. అది ఆయన చేసిన వాగ్దానం. అంత్యదినముల యందు ఆయన తన ఆత్మను కుమ్మరింతునని ఆయన వాగ్దానం చేసియున్నాడు. మనమిప్పుడు అంత్యదినముల యందు జీవించుచున్నాము," అని ధైర్యముగా నిలబడి చెప్పటానికి బదులు, మనం వారి వలే మౌనముగా కూర్చుండిపోవుచున్నాము. దైర్యంగా నిలబడి మాట్లాడుటకు భయపడిపోవుచున్నాము.
53"అది నజరేయుడైన యేసు. ఆయన దేవుని ప్రవక్త అని నేను నమ్ముచున్నాను!" అని వారిలో ఏ ఒక్కడు అనలేకపోయాడు. ఎందుకు వారు అనలేదో మీకు తెలుసా? ఆయన ఒక ప్రవక్త అని వారు నమ్మలేదు. నేటికిని వారు దానిని నమ్మరు. ఆయన ఒక విద్యావంతుడు అని వారు అనుకొన్నారు. ఆయన ఒక సంఘ శాఖ అని వారనుకొన్నారు. ఆయన నేడు ఇంకను ప్రవక్తేనని వారికి తెలియదు. ప్రశ్నించుట కొరకే వారు ఆయనను అక్కడ కలిగియున్నారు.
నేడు కూడా ప్రశ్నించబడుటకే ఆయన ఉన్నాడు. ఆయన పక్షమున నిలబడుటకు ఏ ఒక్కరు లేకుండెను. సుళువుగా ఇలా అంటారు, "మంచిది, ఆయనతో మనకేం పనిలేదు, చూశారా. ఎందుకనగా నేనొక సంఘమునకు చెందియుంటిని, అక్కడ నా పాస్టర్లు, వారందరూ నా చుట్టు కూర్చొనియున్నారు. నేనొక మంచివాడిని." యేసు మురికి పాదములతో ఉండెను, కాని ఏ ఒక్కరు దాన్ని మనస్కరించుటలేదు — ఆయనే ఆ బైబిల్!
54ఇప్పుడు మనం నడుచుకొంటు వచ్చి, కరచాలనం చేసి, సంఘ పుస్తకంలో మన పేరును నమోదు చేసికొంటాం. మరియు మెథడిస్టులకి మనం గిట్టకపోతే, వెంటనే బాప్తిస్టుల యొద్దకు పరుగెత్తుతాము. వారు మనల్ని తన్ని బయటికి నెట్టివేస్తే, నజరేయన్ల దగ్గరికి వెళతాము. ఏకత్వపు వారు తన్ని బయటకు నెట్టివేస్తే, ద్విత్వపు వారి యొద్దకు వెళతాము. ఇక వారు కూడా కాదని తన్నీ బయటకు నెట్టివేస్తే త్రీత్వపు వారి యొద్దకు వెళతాము. నిజానికి వీటిలో ఏ ఒక్కదానిలో మనం చేరవల్సిన పనిలేదు. అవన్నియు గంజిబెట్టి గట్టిగా మడతలుపడ్డ బట్ట వలే వున్నాయి. అవన్నీ ఒకటేనండీ, మనం…
మరి యేసు వచ్చినప్పుడు, కనీసం మనం ఆయనను గుర్తుపట్టలేకపోయాం. మనం లెక్క చేయలేకపోయాం. వారు కూడా అదే చేసారు. అయినప్పటికి మనం ఇలా ఆక్రందన చేస్తాం, "రమ్ము, ప్రభువైన యేసూ. రమ్ము, ప్రభువైన యేసు," మరియు ఆయన వచ్చును. అయితే ఆయన వస్తే మనం ఏం చేస్తాం? వారేది చేసారో సరిగ్గా మనం కూడా అదే చేస్తాం. ఎందుకు? వారేదైన చెప్పినట్లయితే, దానిని అంగీకరించు; వారిని హేళన చేయటాన్ని ఎవరైన వినెదరు. వారు ఆయనను మురికిగానే కూర్చోనిచ్చారు. అది అపవిత్ర ఆత్మ అనబడును.
DEUT 18:15•
MATT 12:24,32•
MATT 15:6•
MARK 3:22,28,29•
MARK 7:13•
LUKE 11:15•
LUKE 12:10
55ఒకనాడు వారు యేసుతో ఇలా అన్నారు, "ఈ మనుష్యుడు బయల్జెబూబు ద్వారా వీటిని చేయుచున్నాడు." అందుకు యేసు అన్నాడు, "నాకు విరోధముగా మీరు మాట్లాడినను మీకు క్షమాపణ దొరుకుతుంది. కాని ఒక రోజు పరిశుద్ధాత్మ వచ్చును. ఇవే కార్యాలు చేయును. పరిశుద్ధాత్మకి విరోధముగా ఒక్క మాట పలికినా, ఇక ఎన్నటికి క్షమాపణ ఉండదు. అక్కడే మనము ఇప్పుడున్నాం. మురికి కాళ్ళతో యేసు వున్నాడు.
దానిని నీవు ఊహించగలవా? మేము దేవున్ని ప్రేమిస్తున్నామని చెప్పే ఈ జనులు సిద్దాంతాలలోను, తమ శాఖలలోను, ఇజమ్ (వాదనల) లోను ఏ విధముగా కలిసిపోవుచున్నారో నీవు ఊహించగలవా? యేసు అన్నాడు, "మీ పితృపారం పర్యాచారాల చేత మీరు దేవుని వాక్యమును నిష్పలము చేయుచున్నారు."
ఆయన అక్కడ ఉన్నాడు, వాక్యము ఫలభరితముగా (శక్తివంతముగా) వున్నది, వాక్యము శరీరధారియై అక్కడ ఉన్నది. క్రీస్తుగా ఆయన అక్కడ ఉండి ఏ కార్యములను చేసియున్నాడో, సరిగ్గా అదే కార్యాలను చేయుచున్నది. కాని జనులు తమ ఆచారాలను చేయుటను బట్టి ఇతర జనుల మీద ఆ వాక్యము ప్రభావముగా పనిచేయకుండా చేస్తున్నారు. వాక్యరూపంలో ఆయన వుండి వాక్యాన్ని రుజువు పర్చుచున్నాడు, చూచారా. ఆయన ఒక ప్రవక్త అని వారు నమ్మలేదు. బైబిలు చెప్పుచున్నది, అయినను ఆయన ఒక ప్రవక్తగా వుండునని బైబిల్ చెప్పినది. మోషే చెప్పాడు, "ప్రభువగు దేవుడు ఒక ప్రవక్తను మీ మధ్య లేపును." ద్వితియోపదేశకాండము 18:15 — ఆయన ఏమి చేయునో దానిని బైబిల్ ఖచ్చితంగా ముందే చెప్పియున్నది. ఆ రీతిగానే ఆయన ఇక్కడ వుండి జనుల మధ్య కార్యాలను చేయుచున్నాడు.
HEB 13:8
56అక్కడ ఆయన్ని ఎలాగైతే పట్టించుకోలేదో, నేడు కూడా మనం ఆయనను మురికి నామముగా విడిచి పెట్టుచున్నాము. "అద్భుతాలు జరిగే రోజులు గతించిపోయాయి. అటువంటి కార్యాలంటు ఇక ఏమి లేవు," అని అంటూ ఆయనకి విరోదముగా ఒక ప్రక్క మాట్లాడుచున్నాము. కాని మరో ప్రక్క ఆయన నిన్న, నేడు, నిరంతం ఒకే రీతిగా ఉన్నాడని బైబిల్ చెప్పుచున్నది. బైబిల్ చెప్పేదాని కొరకు నిలబడి, దానిని చెప్పుట విషయమై మనమింకా సిగ్గుపడుచున్నాము. మనం నమ్ముచున్నాము, అని హక్కుగా చెప్పేదాని విషయమై సాక్ష్యమిచ్చుటకు మనం సిగ్గుపడుచున్నాము.
ఆయనను కడుగుటకు బదులుగా, మురికిని శుభ్రపరచుటకు బదులుగా ఇలా చెప్పుచున్నాము. "దానితో నేను చేయవల్సిందంటు ఏదీ లేదు. నా చేతులుంచి కడగటం, మరి అలాంటి వాటికి నేను సహకరించను," చూశారా.
2TIM 3:5
57నీవు కూడా అక్కడే వున్నావు. నీవు కూడా ఆ పరిసయ్యుల గుంపులోనే వున్నావు, కాకపోతే పేరు మార్పు. ఆయన నేడు కూడా ఒక ప్రవక్త అని నమ్మకపోవుటను బట్టి, అదే కారణమున బట్టి మనం మరోకసారి ఆయనను అక్కడే కూర్చొండ నిచ్చుచున్నాము. మనం దాన్ని బట్టి సిగ్గుపడవల్సివుంది. ఎందుకనగా మనం వారి వలే ఆయన ప్రవక్త అని నమ్ముటలేదు. ప్రజలు నమ్ముటలేదండీ. ఆయన రాగలడు, తన కిష్టమైనదేదైనా చేయగలడు. వారు వారి మార్గములలోనే కూర్చొండిపోయారు. వారిని అవివేకులుగా చేయ ప్రయత్నించవల్సిన పన్లేదు. వారా విధముగానే ఉండేదరని బైబిల్ ముందే చెప్పెనని మీకు తెలుసా: సరిగ్గా అలానే, నులివెచ్చని వారుగాను, పైకి భక్తిగలవారై యుండి దాని శక్తిని ఆశ్రయించని వారైయుందురని బైబిల్ ముందే చెప్పినది, చూశారా. నిజము.
విద్యతోను, నాగరికతతోను అక్కడ నిలబడిన గుంపుతో మనం కలిసిపోయాం, మరియు గొప్ప వ్యవస్థిత సమాజములను, సమయములను మరియు చక్కని సంఘములను, మరియు చక్కగా అలంకరించబడిన వాటిని కలిగియున్నాం. ఇక యేసుక్రీస్తు లోపలికి వచ్చినప్పుడు, నీవు వీటన్నిటిని బట్టి ఆయనను పట్టించుకోవు. ఆయనను ఆ విధముగానే మురికిగా ఉండనిచ్చెదవు. వాక్యము మన మధ్య శరీరము దాల్చగలదు, అయినను మనమింకా దాని చుట్టు తిరుగుచుందుము. ప్రజలు దాన్ని గూర్చి మాట్లాడుకోనిమ్ము. ఓ. మై!
58సరే ఈ రాత్రి మన కథను త్వరగా ముగించు నిమిత్తం ఇప్పుడు దాని దృశ్యమును మార్చుదాం. ఎగువునవున్న మద్యపానం నిషేదించిన ఆ పాత గదికి దిగువున వున్న ఆ మురికి ఇరుకు వీధి వైపుకి మనము మనయొక్క దృష్టిని మరల్చుదాం
తలుపు తెరవబడినది, మరియు ఒక స్త్రీ లోనికి ప్రవేశించినది. మంచిది,తన జనులు బాగా ఇష్టపడే అమ్మాయేం కాదు. ఆమె ఒక పాపి, తప్పుడు మార్గములో ఆమె తన జీవనోపాధిని సంపాదించుకొనేది. ఇప్పుడు ఆమె బయటకి దొర్లుచు వచ్చి, కిర్రు కిర్రుమని శబ్దంచేసే ఆ పాత మెట్లు ఎక్కుచున్నది. తర్వాత ఆ మురికి సందులోకి ప్రవేశించి మరియు చెత్తకుండీలను దాటుకొంటు క్రిందకి వెళ్ళుచున్నది, వీధి దాటి వెళ్ళిపోయినది.
59"బయట అక్కడ ఒక్కరు కూడా ఆమెకి కనబడలేదు." కనుక తనలో తాను ఇలా అనుకొనుచున్నది… "ఓ, నాకు గుర్తున్నది. పైన ఒక పరిసయ్యుడున్నాడు, పాస్టర్ పరిసయ్యుడు, అతడు ఈ వేళ గొప్ప విందు ఒకటి చేయుచున్నాడు కదా. బహుశా అందరూ అక్కడికే వెళ్ళివుంటారనుకొంటాను. అయ్యో, ఈ రోజు వ్యాపారులకి ఇదోక దుర్దినం," ఆమె అలా అనుకొనుచు షికారుగా నడుచుకొంటుపోవుచున్నది.
ఆమె అలా నడుచుకుంటు ఇంకా అనుకొనుచున్నది. "మంచిది, అది ముగిసేవరకు నేను వేచియుండెదను." మరియు ఆమె చెడ్డ మార్గములో తన జీవనాన్ని సంపాదించుకొనుచున్నది. కావున ఆమె వీధిలోనికి నడుచుకొంటు పోవుచున్నది. కొద్దిసేపటి తర్వాత ఆమె యొక్క చిన్న ఆకలి పొట్టకి గొర్రె మాంసము యొక్క వేపుడు వాసన తగిలినది. ఆమె అనుకొన్నది, "మై, ఆ వాసన చాలా బావుంది. తినుటకు అటువంటి కమ్మని వాసనగల తిండిని నా జీవితంలో నేనెన్నడు కలిగియుండలేదు." బహుశా ఎవరో ఒక తల్లిదండ్రుల ద్వారా ఆమె వీదులలోకి వదిలివెయబడినదేమో.
మీకు తెలుసా, అనేక సార్లు మనం చిన్న వయస్కుల తప్పులను గూర్చి తలంచుదుము. కాని తల్లిదండ్రుల తప్పులే అతి పెద్ద తప్పులని నేననుకొనుచున్నాను. దేవున్ని సేవించుటకు, ప్రార్ధించుటకు బిడ్డలు నేర్పించబడాలి. అయితే అందుకు బదులు మరో కార్యాలు జరుగుచున్నవి. అమ్మ ఎక్కడో ఒక కార్డు పార్టీలో, మతసంబంధమైన కార్డు పార్టీలో వుండును, మరియు తండ్రి ఇంకెక్కడో గొప్ప శిక్షణలో వుండును. తోబుట్టువులు బయట ఏ కుర్రబ్బాయిలతో వీదులలో పరుగు తీస్తూ వుండును. అయితే వారింట్లో పాత-కాలపు ప్రార్ధనా బలిపీఠము, మరియు పేకాటలకు బదులు బైబిల్ ఉన్నట్లైతే, సంగతులు మరోలా వుండి వుంటాయి. అలాగే టెలివిజన్ ని ఇంతకు మునుపే బయటకు విసిరి వేసినయెడల, కుటుంబములో గొప్ప తేడా అనేది కనబడి వుండేది.
మీరందరూ సినిమా హాలుకు వెళ్ళి చూడటం పూర్తిగా తప్పుగా ఉండేది. మరిప్పుడైతే, దయ్యమే దానిని మీ మీదికి విసిరాడు: వాడు తిన్నగా దానిని మన ఇంటిలోనికే తీసికొనివచ్చాడు.
60ఆమె ఆకలి గొన్నది. ఆ కమ్మని వాసనను పసిగట్టినది. ఆమె అన్నది, "మై, వాసన చాలా బావుంది. ఆ గొర్రె మాంసపు వేపుడు నోట్లో వేసుకొంటేనే చాలు, అదెంతో కమ్మగా వుండుననుకొంటా, అదెలా వుంటుందో నాకు తెలియదు. నేనచ్చటికి నడిచిపోదునని అనుకొనుచున్నాను."
ఇప్పుడు, ఆమె అచ్చటికి అతి సమీపముగా రాలేకపోయినది, ఎందుకనగా ఆమె మలినమైన స్త్రీ. వారు స్వనీతిపరులు, మీరు చూశారా. వారందరు సంఘమునకు చెందియుండిరి. కావున వారున్న చోటుకి వీరు చేరుకోలేకపోయారు. ఆమె ఒక పాపిగా ఎంచబడినది.
కావున ఆమె అక్కడికి దగ్గరికి నడిచివచ్చినది, వారు అక్కడ నిలువబడి వుండటాన్ని మరియు గొర్రె మాంసం లేదా పొట్టేలు మాంసం వేపుడు వేగుచుండగా, వారి నోట్లో నీళ్ళు వచ్చుటను చూచినది. మీకు తెలుసా, మరియు చక్కని బోజన పదార్ధములన్నియు మరియు సకలము చక్కగా అచ్చట పెట్టబడినవి. అదెంతో అద్భుత సమయం.
61మరి ఆమె అక్కడున్న గుంపు వైపు తేరి చూస్తున్నది, కాని ఆమె దృష్టి ఆయన మీద పడినది.
"ఆయన ఎవరు? ఆయన పాదములు మురికిగా వున్నవి, ఎవరు ఆయన అని ఆశ్చర్యపోవుచున్నది… ఆయన ఎవరో నాకు ఎవరైనా చెప్పగలరా? చెప్పండి, మీరైన… తర్వాత అక్కడ నుండి వెనక్కి తిరిగినది, అక్కడ తనకి ఏ పనిలేదనుకొన్నది. ఆమె ఒక పాపి. కావున ఎవరినో అడిగినది, చివరికి తనలాగ కనబడే మరియు విశ్వసించే ఒక చిన్న స్త్రీని అడిగినది, "అమ్మగారండీ దయచేసి… క్షమించండి, నీవు చెప్పగలవా… అక్కడ కూర్చొన్నది ఎవరో చెప్పగలవా? ఎలాగు ఆయన… ఆ వ్యక్తిని గూర్చి…?"
"మంచిది, ఆయన ఎవరో నీకు తెలుసా? ఒక ప్రవక్త అని చెప్పబడుచున్న నజరేయుడైన యేసుని గూర్చి నీవిన్నావా?"
"ఓ, అవును, అది ఆయనేనా?"
"అది ఆయనే."
"మంచిది, ఆయన శుభ్రపరచబడలేదు. లోనికి వచ్చే ప్రతి ఒక్కరు కడుగబడి, తైలముతో అభిషేకించబడవల్సిందని నాకర్ధమైనది, కాని ఆయన వైపు చూడండి. మంచిది, ఆయన కడుగబడకుండా వుండుట మంచిగా లేదే."
62ఆమెకు ఒక అవకాశం దొరికినది. తనకు ఎవరో చెప్పిన ఒక కథను ఆమె జ్ఞాపకం చేసికొన్నది. ఒకసారి తనలాంటి వృత్తి గలిగిన ఒక స్త్రీ సమరయలోని సుఖారు అను గ్రామములో వుండేదని, ఆమె తన పాపము విషయమై క్షమాపణ పొందుకొన్నదని చెప్పబడినది. ఆలాగైతే ఇదే తనకి సరైన అవకాశమని తాను భావించినది.
కావున ఆమె ఇప్పుడు ఆయనను ఏలాగు చేరుకోగలదు? ఆయన అక్కరలో వున్నాడని ఆమె చూచినది, మరియు ఆమె ఆయనను సేవించగోరినది. అయితే ఆమె ఆయనను చేరుకోలేకపోయినది. అది అలా వున్నది, కావున ఆమె అనుకొన్నది. "నేను ఏమి చేయగలను? ఆయనకి తైలాభిషేకం చేయబడలేదు. ఆయన పాదములు మురికిగా వున్నవి. ఆయనను ఎవరూ పట్టించుకోవట్లేదు. ఓ అక్కడికి నేను ఎలాగైనా సరే చేరుకోగల్గితే చాలు." [నిజమైన పశ్చాతాప హృదయమది.] "ఓ నేను అక్కడికి ఎలాగైనా చేరుకోగలిగితేచాలు."
ఇప్పుడు ఆమె అనుకొనుచున్నది… ఆమె మనస్సు ఒక దానిని పట్టుకొన్నది. "నేనేది చేయుదును అనుకొనుచున్ననో నీకు తెలుసా? నాకు తెలుసు."
63సరే ఆమె అక్కడి నుండి వెంటనే త్వరగా వీధిలోకి పరుగెత్తినది, ఆ విధముగా ఇరుకు సందులోకి ప్రవేశించి, ఆ పాత కిర్రు కిర్రుమనే మెట్లెక్కి, తలుపులు తెరచినది. లోనికి వెళ్ళి డబ్బులు దాచుకొన్న డబ్బా పట్టుకొని, దానిలో వున్నదానంతటిని బయటికి లాగినది, దానంతటిని లెక్కగట్టినది.
ఆమె ఇలా అన్నది, "అభిషేక తైలము కొనుటకు ఈ సొమ్ము సరిపోతుందా? లేదా, సరే చూద్దాం. అక్కడ ఇరువై రోమా దేనారాలున్నవి. బహుశా, అది సరిపోవునేమో, కాని కొద్దిగా ఆగు దానిని నేను చేయజాలను, ఎందుకనగా ఆయన ఒక ప్రవక్త. ఈ సొమ్ము నాకెలా వచ్చినదో ఆయన ఎరుగును, గనుక ఈ సొమ్ముతో దానిని నేను చేయ్యలేను." అంతట ఆమె ఆ సొమ్మును తిరిగి అక్కడే పెట్టినది.
ఆమె దానిని అక్కడే వుంచినప్పుడు, ఆమె హృదయములో ఏదో ఎడతెగక చెప్పుచున్నది. "ఆయన్ని ఆ విధముగా మురికి కాళ్ళతో నీవు కూర్చోనిచ్చెదవా? నీ పాపములను తీసివేయగలిగిన వాని యొక్క పాదములు మురికిగానే వుంటూ నీవు అలానే ఆయనను కూర్చోనిచ్చెదవా, నీవు ఆయనకు సేవచేసే అవకాశముండి కూడా అలాగున వుండనిచ్చెదవా? కావున ఆమె తనతో ఇలా
చెప్పుకొన్నది, "ఆయనకి ఏం తెలిసినా, తెలియకపోయినా నేను మాత్రం ఆయనకి చేయవల్సిన దాన్నిచేసెదను."
అంతట ఆమె వీది గుండా వెళ్ళినది, ఒక కిరాణా కొట్టులోనికి ప్రవేశించినది. అక్కడ ఒక పాత ఒంగిన ముక్కుగల వాడు కూర్చొని వున్నాడు. అతడు "మరి సరే, నీకేం కావాలి ఇక్కడ?" అని ఆమెను అడిగాడు.
ఆమె చెప్పినది, "నీ యొద్దనున్న వాటిలో అతి శ్రేష్ఠమైన చలువరాయి పెట్టెలోని తైలము నాకు కావలెయును. చవకైనది వద్దు; నాకు అతి శ్రేష్టమైనదే కావాలి." ఆమెకి ఒక ప్రత్యేకమగు కారణమున్నది.
మనము చేయవల్సింది కూడా సరిగ్గా అదేనండీ. మన యొక్క శ్రేష్ఠమైనది ఆయనకు మనం ఇవ్వవలసినది , మనకున్న సమస్తము, మన యవ్వన జీవితం కూడా, ముసలివారై చనిపోయే ముందు మనల్ని సమర్పించుకోవటం కాదండీ. మనకున్న సమస్తములో ను౦డి అతి శ్రేష్ఠమైన దానిని ఆయన కిచ్చెదము.
అక్కడ ఆమెకు అతి శ్రేష్ఠమైనది దొరికినది. అతడు పైకి వెళ్ళి ఆమెతో, "దీని ఖరీదు ఎంతో చూద్దాం."
ఇంతకసలు దీనికి సరిపడే డబ్బులు నీవద్ద వున్నాయా?" అని అడిగాడు, ఎందుకనగా ఇది వరకే ఆమె అతడికి పరిచయం. అందుకే ఆలాగడిగాడు… అవును, ఆమె యొద్ద తగిన పైకం వుంది. అతడు, "సరే, దీన్ని తీసికొని ఎక్కడికి వెళ్ళుచున్నావు?" అని అడిగాడు.
"ఒక ప్రత్యేక కార్యక్రమము కొరకు దీనిని తీసికొనుచున్నాను," అని ఆమె బదులిచ్చింది.
64సరే, ఆమె అక్కడికి వెళ్ళినది.
ఇప్పుడు ఆమెకి ఎట్టి ఆహ్వానంలేదు. అయితే మరి ఆమె ఎలా అక్కడికి వెళ్ళగలదు? ఏదో రకంగా యేసును సేవించాలనే తపన నీలో ఉంటే యేసుకి నీవు ఒక సేవ చేయగోరితే, అందుకు తగిన మార్గమును ఆయనే నీకు చూపును. ఏదో రకంగా ఆమె అక్కడికి చేరుకొన్నది.
అప్పటికి కూడా యేసు అక్కడే కూర్చొనియున్నాడు. ఎట్టకేలకి ఆమె అక్కడికి చేరుకొన్నది. తన హృదయం ఎంతో వేగంగా కొట్టుకొనుచున్నది. "ఓ, మై! ఆయన నన్ను ఛీకొడితే పరిస్థితి ఏంటి?" ఇలా పలు విధములుగా ఆలోచించుకొనుచున్నది. "ఆయన వచ్చి, 'ఓ మలినమైనదానా ఇక్కడ నా సన్నిధిలో నీవు ఏమి చేయుచున్నావు? నేను దేవుని కుమారున్ని అని నీవెరుగవా? నా సన్నిధిలో నీవెంత మాత్రం ఉండజాలవు?'" అని ఒకవేళ ఆయన అన్నట్లైతే ఎలా? తన గుండె ఒక్కసారిగా కొట్టుకోవటం ఆగిపోయినట్లైనది. మరియు ఆమె ఇలా అనుకొన్నది, "నేను ఏమి చేయగలను? నేనెలాగైనా సరే, ఆయన యొద్దకు చేరుకోవాలి. ఈ సదావకాశాన్ని నేను పోగొట్టుకోలేను. నాకిదే చివరి అవకాశం కావొచ్చునేమో."
బహుశా, ఇది నీకు కూడా చివరి అవకాశమేమో సుమా.
LUKE 7:38
65క్రిందికి చూచినది, మరియు ఆమె హృదయం ఉప్పొంగుట ఆరంభించింది. ఆమే ఆయన సన్నిధిలో వున్న సంగతిని ఎరిగియున్నది. ఆయన సన్నిధిలోకి వచ్చినప్పుడు ఏదో జరుగును, తన చెక్కిళ్ళ మీద కన్నీరు దొర్లిపారటమును ఆమె గమనించినది. ఆమె అక్కడ నిలబడి వున్నది. తన చేతిలో ఈ పెట్టెను పట్టుకొని వణుకుచున్నది. మరియు ఆమె ఆయన పాదముల యొద్ద పడినది. మరియు ఆమె అనుకొన్నది, "నేను పైకి చూడలేను, నేనెంతో అపరాద బావముతోను, మలినముతోను నిండియున్నాను, కావున నేను పైకి చూడలేను," గనుక ఆమె ఏడ్వటం ఆరంభించినది. వారు ఆయన పాదముల మీద పడటం ఆరంభించిరి. ఆమె ఆయన పాదములను తన చేతులతో ఆ విధముగా కడుగుచున్నది. ఆయన పాదముల మీద పడిన తన కన్నీటిని ఆమె తుడవనారంబించినది, మరి తన కన్నీటితో ఆయన పాదములను కడుగుచున్నది.
కొద్దిసేపటి తర్వాత…
1COR 11:5
66ఆయన పాదములను తుడుచుటకు ఆమె యొద్ద ఏ తువాలు లేదు. ఆమె తల వెంట్రుకలు వ్రేలాడుచున్నవి, ఆమె తన జుట్టు వెంట్రుకలతో ఆయన పాదములను తుడవనారంభించినది. ఆ కార్యమును చేయుటకు మరి మన సహోదరీలకు సమయమున్నదా? నేడు మన సహోదరీలు దానిని చేయుటకు వారు తలక్రిందులుగా నిలబడవలెను, చూశారా.
దేవుడు తన వాగ్దానములన్నిటిని నెరవేరుస్తాడని స్త్రీలు గుర్తిస్తే బావుండునని నేను అనుకొనుచున్నాను. ఆ విధమైన వాటిని నీవు పొందటం పూర్తిగా నీకు అసాధ్యమని నీవు గుర్తించగలిగినట్లైతే బాగుండునని నేను అనుకొనుచున్నాను. ఆయన తన వాగ్దానములన్నిటిని నెరవేర్చును. నీవు దానిని జరిగించినప్పుడు నీవు దేన్ని జరిగించితివో దానిని గుర్తించావా? నీవు సద్గుణమును తృణీకరిస్తున్నావు. బైబిల్ చెప్పినది, ఏ స్త్రీ అయితే తన జుట్టు కత్తిరించుకొనునో ఆమె ప్రార్ధించుటకు కూడా తగదు. ఆమె దానిని చేయుట ద్వారా తన భర్తను అవమానపర్చుచున్నది.
67మరి గుర్తుంచుకోండి, ఇన్ని జరుగుటకు కారణం ఒక స్త్రీ దేవుని యొక్క ఆజ్ఞను ఉల్లంగించుట వలననే. ఉల్లంగించిన ఆ ఒక్కటి తిరిగి తీసుకొని రాబడుతుందని నీవు అనుకొనుచున్నావా? దాన్ని గూర్చి యోచించుము. బహుశా, కొన్ని సార్లు సేవకులు దానిని చెప్పుటకు తగినంత ఉద్రేకం పొందుకొని ఉండకపోవచ్చును. దానిని మీరు ఈ ఒక్కసారి వినబోవుచున్నారు. ఇది నిజం.
"నీవు స్త్రీలను ఎందుకు విడిచి పెట్టకూడదు? "అని ఎవరో నన్ను అడిగారు. కొద్దికాలం క్రితం ఒక గొప్ప వ్యక్తి నాతో అన్నాడు, "మంచిది, నీవొక ప్రవక్తవని వారు నమ్ముచున్నారు. పరిశుద్ధాత్మను ఎలా పొందుకోవాలో అనేది నీవు వారికి బోధించు, అలాగే ఈ గొప్ప కార్యాలు ఎలా పొందుకోవాలో, ప్రవక్తలాగా ఎలా ఉండాలో చెప్పుము."
నేను చెప్పాను, "అలాంటి సంగతులు వారికి నేర్పవలెనా?" అందుకు నేను అన్నాను, "అ, ఆలే వారికి రాకపోతే, గుణింతాలెలా నేను వారికి బోధించగలను?" లోపల ఏది ఉన్నదో అదే బయటకి ప్రదర్శించబడును. అయితే ఏదో రకంగా నీవు దాని వైపు కొనసాగి, దాని చేసెదవు. ఎందుకని? దానిని నీవు మనస్కరించావు.
LUKE 7:38
68అదిగో ఆమె అక్కడ వున్నది. తన తల వెంట్రుకలతో ఆయన పాదములను తుడుపుటకును, వాటిని ఆరబెట్టుటకును ఆరంభించినది. చచ్చేటంతగా ఆమె భయపడుచున్నది. ఆ తర్వాత ఆమె తనతో పాటు తీసికొని వచ్చిన అతి శ్రేష్ఠమగు తైలమున్న చలువరాతి పెట్టెను పగులగొట్టినది, ఆమె దానిని కొట్టుచూ, ఏదోరకంగా దానిని తెరువ ప్రయత్నించినది. మరియు ఆ తైలమును ఆయన పాదముల మీద పోసెను. ఆమె ఏడ్చుచుండెను. ఆమె ఏడ్చు ప్రతిసారీ, ఆయన పాదములు పట్టుకొనుటకు వంగి వాటిని పట్టుకొని వాటిని ముద్దు పెట్టుకొనుచున్నది. అంతట ఆమె పట్టలేనంత ఆనందంతో ఉక్కిరి బిక్కిరి అయిపోయినది.
దేవుని సన్నిధిలోనికి నీవు వచ్చినప్పుడు, అది నిన్ను ఉక్కిరి బిక్కిరి చేయును. నేనా స్థితిని పొందుకొంటిని. ఆయన సన్నిధిలోనికి వచ్చి, ఆయనను నమ్మి, అయన యందు విశ్వాసముంచిన ఎవరైనా సరే, ఇట్టి స్థితిలోనికి వారు వెళ్లారు. పెంతెకోస్తు దినాన ఆయన పరిశుద్ధాత్మ రూపములో అక్కడికి దిగివచ్చినప్పుడు, వారందరు అట్టి అపస్మారక స్థితిలోనికే వెళ్ళిరి (మూర్చిల్లిరి), నీవు నిజముగా నమ్మినప్పుడు, నీవు దానిని నీ అవకాశముగా గుర్తించినప్పుడు, ఆయన సన్నిధిలో నీవున్నప్పుడు, నిశ్చయముగా నీవు ఆ స్థితిలోనికి వెళ్ళెదవు.
69ఆమె వెళ్ళి [బ్రదర్ బ్రెన్హాం ముద్దు పెట్టుకొనే శబ్దమును చేయుచున్నాడు], ఆయన పాదములను ముద్దు పెట్టుకొని, కడిగి, తుడిచి, మరియు మరలా ఆయన పాదములను ముద్దు పెట్టుకొనెను. మీకు తెలుసా, ఒకవేళ ఆయన తన పాదములను కాస్త కదిలించినా, ఆమె భయపడి ఎగిరి గంతేసి, అక్కడి నుండి పరుగెత్తుకొని పోయేది. అయితే మీకు తెలుసా, ఆయన అలానే కూర్చొని ఆమెను ఆ విధముగా చేయనిచ్చెను.
మీకు తెలుసా, ఆయన కొరకు మీరేదైనా చేయాలనుకొంటే, దానిని ఆయన ఆటంకపర్పడు. అదంతయు క్రమమునకు బయట వున్నప్పటికి, ఏది ఏమైనా ఆయన నిన్ను దానిని చేయుటకు అనుమతించును.
అది ఆయన కొరకు చేసే ఒక పరిచర్య, మరియు ఆమె ఆయన పాదములను కడుగుచుండెను. ఆయన అక్కడ అలానే కూర్చొని, ఆమె వైపు చూచెను. పైకి చూచుటకు ఆమె భయపడినది, ఎందుకనగా తాను చేయుచున్న దానిని ఆయన భంగపర్చునేమోనని భయపడినది. మరి, చూశారా, ఆమె ఆయన పాదములను కడుగుచుండెను. ఆయన కొరకు పరిచర్య చేసే అవకాశం అది. మరియు ఆమె కేవలం… ఇప్పుడు, చూడండి, మరి ఎప్పుడైతే ఆయన…
పరిసయ్యునితో యేసు మాట్లాడినప్పుడు, ఆమె చేసిన క్రియలను బట్టి ఆయన ఆమెను సమర్థించెను. ఆయన ఆమెను సమర్థించినప్పుడు, ఆమెయొక్క విశ్వాసమును బట్టి ఆయన ఆమెను: "నీ విశ్వాసమే నిన్ను రక్షించెను," ఆమె చేసిన క్రియను సమర్థించెను. ఆమె యొక్క క్రియలను ఆయన పరిసయ్యునికి చూపెను, ఎందుకనా నీ క్రియలే నీ విశ్వాసమున వెల్లడిపరచును.
70ఇప్పుడు, నీ తలవెంట్రుకలను పెరగనిమ్ము! ఇప్పుడు, చూశారా, నీవు దేనిని నమ్మావో లేదా నమ్మలేదో దానిని అది వెల్లడి పర్చుచున్నది. అది దేవుని వాక్యము. బైబిల్ లో ఉన్న లేఖనములన్నియు సత్యము. నీ వెందుకు దానిని చేసితివి? ఇప్పుడు గమనించండి. పెంతెకోస్తులో హాలీవుడ్ పాత్ర బాగా ఎక్కువైపోయినది - అది అసలు సంగతి. అది వాస్తవమని మనమిప్పుడు కనుగొన్నాం. హాలీవుడ్ అందులో మరి ఎక్కువైనది. వీటిని నీవు గమనించు, నిన్ను నీవు వాటితో సరిపోల్చి చూచుకొనుము.
కొద్దికాలం క్రితం ఒక స్త్రీ నాతో ఆ పాత బిగుతు (పొట్టి) దుస్తులను గూర్చి మాట్లాడినది. అప్పుడు నేను, "సరే మరి నిన్ను నీవు ఒక సహోదరిగా చెప్పుకొనుచు, నీవెందుకు అటువంటి బిగుతు దుస్తులను ధరించుచున్నావు?" అని అడిగాను.
అందుకామె "బ్రదర్ బ్రెన్హాం, ఎందుకనగా అటువంటివి తప్ప మరే దుస్తులను వారు అమ్ముటలేదు కదా?"
MATT 5:28
71నేనన్నాను, "ఆ దుస్తులను తయారు చేసే కుట్టు మిషన్డ్, వాటి పరికరములు, ముడి పదార్ధములు అందుబాటులోనే వున్నాయిగా" చూశారా.
నీకు నిజంగా మనసుంటే, ఎందుకో నేను మీకు చెప్పెదను, సహోదరిలాగా నన్ను చెప్పనివ్వండి [సమాజము చప్పట్లు కొట్టుచున్నది, సహోదరుడు బ్రెన్హాం ధన్యవాదములు చెప్పుచున్నాడు.] నీవు చేసిన వ్యభిచార పాపము నిమిత్తం ఈ దినాలలో ఒక దినాన నీవు జవాబు చెప్పవల్సి వుంది. నీవిలా అనొచ్చు, "సరే, బ్రదర్ బ్రెన్హాం, నేను నా భర్తకు ఉండగల్గినంత పరిశుద్దముగా జీవించుచున్నాను."
"నా బాయ్ ఫ్రెండ్ (ప్రేమికుడికి) ఉండగల్గినంత పరిశుద్ధముగా ఉన్నాను."
అది ఒకవేళ నిజమే కావొచ్చును, కాని యేసు అన్నాడు, "ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారము చేసినవాడగును." బయట నీవు ఆ విధముగు అసహ్యమగు కురుచ దుస్తులతో నిన్ను నీవు చూపించుకొనుచున్నావు. మరి అక్కడున్న ఆ పాపి నీ బహిరంగ ప్రదర్శనను చూచి, దాని మీద మనసు పారేసుకొనును. తాను చేసిన వ్యభిచార పాపము నిమిత్తం తీర్పు దినాన వాడు దేవునికి లెక్క అప్పజెప్పుచున్నప్పుడు, అపరాది ఎవరవుతారో ఒకసారి యోచించు? ఓ, స్త్రీ! తిరిగిరా, సహోదరిలారా, క్రీస్తునొద్దకు తిరిగి రమ్ము. అలాగే సహోదరులారా, మరి మీరు కూడా నేను ఇంటి యజమానున్ని, నేను మగవాడిని అని నిన్ను నీవు పిలిపించుకొనుచున్న పురుషులారా, మరి మీ బార్యలను వాటికి ఎందుకు అనుమతించుచున్నారు… గమనించండి. స్నేహితుడా మనమొక భయంకరమైన కాలంలో జీవిస్తున్నాము.
LUKE 7:39
72మరి ఇక్కడ ఈ చిన్న స్త్రీ ఆయన పాదములను ముద్దు పెట్టుకొనుచు, ఆయన పాదములను కడుగుచు తన తల వెంట్రుకలతో వాటిని తుడుచుచున్నది అని మనము గమనించాము. హఠాత్తుగా ఆ పాత పరిసయ్యుడు, ఆ మూలన ఉండి, జరిగిన దానంతటిని గమనించుచుండెను. ఓ, మై! అతని యొక్క నీతి బహు రౌద్రముతో ఊగిపోయెను, మరియు అతని పెద్ద గడ్డం ఉబ్బిపోయినట్టు అయ్యెను, మరలాగే అతని ముఖము పగిలిపోయినట్టుగా కనిపించెను. ఓ, మై!
అతడు అన్నాడు, "ఇక్కడికి రండి, ఇటు చూడండి, అక్కడ చూడండి." మరి అతడు తన హృదయములో ఇప్పుడు, తనయొక్క మనస్సులో, ఇలా అనుకొన్నాడు, "అతడు ఒక ప్రవక్త అయినయెడల, తనని ముట్టిన స్త్రీ ఎటువంటిదో ఆయన ఎరిగియుండవలెను కదా."
LUKE 7:40,44,47
73ఆయన ఒక ప్రవక్తయో, లేక కాదో చూడండి. చూశారా, ఆయన అతని హృదయములో వున్న తలంపులను గ్రహించెను. మరియు ఒక్కసారిగా ఆయన కదిలెను. ఆ చిన్న స్త్రీ లేచి నిలబడినది, పైకి చూచుటకు, ఆమె దృష్టి తడబడుచున్నది. ఆయన అటువైపు చూచి, ఆయనిలా అన్నాడు, "సీమోను, నీకో విషయం చెప్పాలి." ఓ, మై! "ఇక్కడున్న సీమోను, నీతో చెప్పడానికి నా యొద్ద ఒక విషయం వున్నది. నీవు నన్నిక్కడికి ఆహ్వానించావు, నీ విచ్చిన అహ్వానం మేరకే నేనిచ్చటికి వచ్చితిని. నీవు నన్ను ఆహ్వానించావు. నేను ద్వారమునొద్దకు వచ్చినప్పుడు, నా పాదములను నీవెన్నడూ కడుగలేదు. మరి నేను లోనికి వచ్చినప్పుడు, నీ వెన్నడూ నా తలను అభిషేకించలేదు. నన్ను మురికిగానే లోనికి రానిచ్చితివి. ఈ విందుకి స్వయంగా నీవే నన్ను ఆహ్వానించినప్పటికిని, నీవు ఏ మాత్రం నాకు ఆహ్వాన ముద్దు పెట్టలేదు.
అయితే ఇక్కడున్న ఈ స్త్రీ, ఆమె ఎవరనేది నాకనవసరం, కాని ఈమె తన కన్నీళ్ళతో నా పాదములను కడిగినది. తన తల వెంట్రుకలతో వాటిని తుడిచినది, నా పాదములను అభిషేకించినది. తాను వచ్చిన దగ్గర్నుంచి ఇక్కడే పడివున్నది. నా పాదములను ఎడతెగకుండ ముద్దు పెట్టుకొనుచూనే వున్నది." ఆయన ప్రవక్త కాదో కనబరచుకొన్నాడు.
ఇంకా ఆయన అన్నాడు, "సీమోను, ఒక దానిని నీవు చూడాలని నేను కోరుచున్నాను, నీకో ఉపమానం చెబుతాను, ఆమె నన్ను ఎంత ఎక్కువగా ప్రేమించినదో, అంత ఎక్కువుగా పాపములు ఆమెకి క్షమించబడినవి." ఆయన అతనితో ఉపమానరీతిగా ఈ సంగతులు చెప్పినప్పుడు, సీమోను ఆయనకి తిరిగి జవాబిచ్చాడు.
74గమనించండి, ఆయన పాదములను కడుగుటకు అతని యొద్ద శ్రేష్ఠమైన నీరు వున్నప్పటికిని సీమోను ఆయనకి ఏమి ఇవ్వలేదు, పశ్చాత్తాపపడిన పాపి యొక్క కన్నీరు యేసు యొక్క మురికి పాదములను కడిగివేసెను — పాపి కన్నీరు ఆయన పాదముల మురికిని కడిగివేసినది. ఓ స్త్రీ, పురుషులారా, ఈ రాత్రి సువార్త నిమిత్తం వచ్చిన నిందను నీవు చూడుము. మన మెంతగానో బిగుసుకుపోయాం, మనము ఒక చుక్క కన్నీటిని విడిచినయెడల, అది మన ముఖముల మీదున్న మేకప్ అంతటిని తీసివేస్తుం, వీధులలోకి వెళితే మనమేంతో భయంకరముగా కనిపిస్తాము. అలాగయితే పరలోక గుమ్మముల తట్టు నీ ముఖమును త్రిప్పినపుడు నీ పరిస్థితి ఎలా వుంటుందో తెలుసా?
LUKE 7:38
75ఇదిగో ఆమె ఇంకా అక్కడే వున్నది. తనకి పాపక్షమాపణ కావాలని తాను ఆశపడినది గనుకనే ఆమె వచ్చి ఆయన పాదములను కడిగి, వాటిని ముద్దు పెట్టుకొని, ఆయనను తైలముతో అభిషేకించినది మరియు తాను చేయగలిగిన దంతయూ చేసినది. అయితే ఆమె, ఇప్పుడు ఆయనేమి చేయబోవుచున్నాడో అనే దాని విషయమై ఆమె ఒక్కసారిగా కుదేలైపోయినది. సీమోనుకి దానిని ఆయన చూపినప్పుడు, అది అతన్ని తిరిగి కొట్టినది. "ఆయన ప్రవక్త కాడు," అని అతడన్నది తప్పు అని, ఆయన ఒక ప్రవక్త అని మరియు ఆయన దేవుని వాక్యమై యున్నాడని అది నిరూపించినది.
ఇప్పుడు, అతడు చిన్నబోయిన ముఖముతో అక్కడ నిలువబడి యున్నాడు. వీలైతే అతడు ఆ చిన్న స్త్రీని లాగి, సంఘములో నుండి బయటకి విసిరివేసేటట్టుగా కనబడెను. తానేమి అడిగినదో దానిని ఆమె పొందుకొన్నది. ఆమెన్. ఎవరు ఎన్ని అన్నా ఏ వ్యత్యాసము తీసుకొని రాలేదు; తానేమి అడిగినదో దానిని ఆమె పొందుకొన్నది.
LUKE 7:48
76ఇప్పుడాయన ఆమె తట్టు తిరిగాడు. ఆమె యొక్క చిన్నగుండె చాలా వేగంగా కొట్టుకోటం మొదలైంది. ఇప్పుడు ఆయన ఏమి చేయబోవుచున్నాడు? ఆమె ఉత్కంఠతో అక్కడ నిలబడిపోయింది. ఆమె యొక్క ఉంగరాల జుట్టు తన నడుము భాగము వరకు అంతటా వ్రేలాడుచున్నవి. మరియు ఆమె కళ్ళలో నుండి కన్నీరు ఉబుకుచున్నది. ఆమె ముఖము మరియు పెదాలు అన్ని కూడా ఆయన మీద తైలము పోసి, పాదములను ముద్దు పెట్టుకొనుట చేత ఎంతో జిడ్డుగా వుండెను. ఆమె ఎంతో కంగారు కంగారుగా వున్నది. కాని వారి పెద్ద నేత్రాలు ఆయన ద్వారా ఏమి చెప్పబడుబోయెదాని కొరకు ఆసక్తిగా ఎదురు చూచుచున్నవి. ఆయన అన్నాడు, "మరియు నేనామెతో చెప్పాను, అదేమనగా ఆమె యొక్క పాపములన్ని క్షమించబడినవి."
నేను వినగోరేది అదే మరి! ఓ, నాకు కావల్సిన మాటలు అవేనండి. మిగతావారు ఏమి చెప్పారో నేను లెక్క చేయను, ఆయన దేవుని వాక్యమైయున్నాడని నేమ వారి సంఘ శాఖల మధ్య నిలబడి తేల్చి చెప్పగోరుచున్నాము. వారేమి అన్నా అనకున్న నేను లెక్క చెయ్యను. "మనసు చదివేవాడు, సోది చెప్పేవాడు" అనుచూ, దాని మీద ఎంత బురద జల్లినా, లేదా ఇంకేది అనుకొన్నా అనుకోనియ్యి, బురద చల్లనీయి. నేను మాత్రం ఆయన పాదములను, వారు అవమానించిన పాదములను ముద్దు పెట్టుకొనుటే చేసెదను, ఎందుకనగా అది వాక్యమై యున్నది. నిశ్చయముగా, ఆయన దానిని వాగ్దానం చేసెను. ఆయన అక్కడ ఎలాగైతే వాక్యముగా ఉండెనో, సరిగ్గా ఈ రోజు ఇక్కడ కూడా ఆయన అదే రీతిగా ఉన్నాడు. ఆయన అలాగని సెలవిచ్చియున్నాడు.
77ఇప్పుడు, స్నేహితుడా, ఆయన ప్రవక్త కాడని అంగీకరించని జనులు బహుశా ఇక్కడ కూర్చొని యుండవచ్చును. ఆయన వ్వస్థపర్చువాడు కాడని బహుశా నీవు ఒప్పుకోకపోవచ్చును. కాని ప్రతి ఒక్క సంఘసభ్యుడు తప్పకుండా ఒప్పుకొని తీరాల్సిన ఒక సంగతి వున్నది, అదేదనగా ఆయన రక్షకుడై యున్నాడు.
ఇప్పుడు ముగించబోయే ముందు నేను దీనిని చెప్పగోరుచున్నాను. కొద్ది కాలము క్రితం ఒకరికొకరు విడిపోవాలనుకొన్న ఒక దంపతుల కేసును స్వీకరించిన నాకు మిత్రుడగు లాయరు ఒకరుండేవారు. ఆ న్యాయవాది ఒక చక్కని మంచి క్రైస్తవుడు. అతడు వారితో ఇలా అన్నాడు, "వద్దు విడిపోవద్దు." వారిని విడిపోకుండ వుంచేందుకు అతడు చేయగల్గిన ప్రయత్నమంతా చేసాడు. కాని వారు విడిపోవుటకే వారు గట్టిగా నిర్ణయం తీసికొన్నారు. అయితే వారి మధ్యలోకి ఏదో వచ్చినది.
కొద్ది కాలము తర్వాత అతడు చెప్పాడు, "మంచిది, మీకు ఒక ఇల్లు వున్నట్లైతే వెళ్ళి ఇరువురు చెరిసగం పంచుకోండి, ఎందుకనగా వారు అక్కడికి వచ్చినట్లైతే న్యాయవాదులు ఇంకా అవి జరిగితే, మీకు తెలుసా ఏం జరుగుతుందో, దానంతటిని వారు స్వాధీనపర్చుకొందురు."
78కావున వారు తిరిగి ఇంటికి వెళ్ళి ఉన్నదానంతటిని సరిసమానంగా పంచుకొనుచుండిరి, వారు ఇంట్లో వున్న ముఖ్య గదిలోనికి వచ్చారు. "దీనిని నేను కొన్నాను," మరియు "ఇది నా ద్వారా వచ్చినది," అని అనుకొంటూ హడాహుడిగా వస్తువులను పంచుకొంటున్నారు. తర్వాత మరొక గదిలోనికి వెళ్ళి అక్కడ కూడా ఆ ప్రకారమే పంచుకొనిరి.
చివరిగా వారు అటక మీదకెక్కిరి అక్కడ వారు ఒక దానిని… దాని మీద ఒక పాత ఇనుప పెట్టెను ఒకదానిని పెట్టినట్టు వారు గుర్తుచేసికొనిరి. వారు అక్కడికి చేరుకొని దానిని తెరిచి దానిలోని వస్తువులను బయటకు తీస్తు ఇలా చెప్పుకోవటం ఆరంభించిరి. మంచిది, ఇది నా తల్లికి చెంది యున్నది." "ఇది నా తల్లిది," అంటూ పరస్పరం అనుకొనుచుండిరి. చివరికి ఆ "పెట్టి యొక్క అడుగుభాగానికి చేరుకొన్నారు. అక్కడ ఒక ముక్క పట్టుకొన్నారు. వారిరువురు నేల మీద మోకరిల్లారు, ఆ పెట్టె తెరువబడినది, దానిలోని వాటిని పంచుకొనుచుండిరి. నాదంటే నాది అనుకొనుచుండిరి.
"ఇది నాకు చెందినది. దీనిని నేను కొన్నాను. నేను కష్టపడ్డాను."
"నువ్వు కష్టపడితే నేను ఇంట్లో వుండి అన్నిటిని చక్కబెట్టాను," ఇలా అనుకొనుచుండిరి.
చివరిగా దానిని బయటకు తీసిరి, ఒకేసారి ఇద్దరూ దాన్ని లాక్కొనిరి, ఇంతకీ ఏమిటది? తమ దాంపత్య కలయికకు గుర్తుగా పుట్టిన తమ బిడ్డయొక్క కాలి బూట్ల జత, ఆ బిడ్డను దేవుడు తీసికొన్నాడు. ఆ బిడ్డ యొక్క కాలి బూట్లను వారు ఆ పెట్టెలో దాచి పెట్టిరి. అన్నిటి విషయమై వారు వాదించుకోగల్గారు గాని వాటి విషయమై మాత్రం వారు. వాదించుకోలేక పోయారు. ఇరువురికి చెందిన ఒకదానిని వారు కలిగియుండిరి, అంతట వారు ఆ విధముగా తన చేతులతో పట్టుకొనియున్న దానిని బట్టి ఆ బిడ్డకి ఆమెయే తల్లియైయున్నదని అతడు గుర్తుచేసికొన్నాడు. ఆ బిడ్డకు జన్మనిచ్చిన తల్లి ఆమెయేనని అతడు గుర్తుచేసికొన్నాడు. అలాగే తాను కనిన ఆ బిడ్డకి తండ్రి అతడేనని ఆమె గుర్తుచేసికొన్నది. వారీవిధముగా బూటును పట్టుకొని, ఒకరిమీద ఒకరు చేతులు వేసికొని ఇరువురు కౌగిలించుకొనిరి. అంతట విడాకులు తీసికొనే ఉద్దేశ్యమును రద్దుచేసికొనిరి, ఎందుకనగా ఇరువురికి చెందిన ఒక దానిని వారు కలిగియున్నట్టుగా వారు కనుగొనిరి.
79పరిశుద్ధాత్మ ఇక్కడికి వచ్చి, ఈ మాటలను ఈ సంగతులను ఈ వారమంతా జరిగించిన దానిని బహుశా నీవు నాతో కలిసి సమ్మతించకపోవచ్చును. పరిశుద్ధాత్మ పని చేయుటను ఒకవేళ నీవు విభేదించవచ్చును, రోగులు బాగుపడుటను నీవు విబేదించవచ్చును. కాని మన ఇరువురిని కలిపే ఒక సంగతి వున్నది. అది పాపముల నుండి మనల్ని రక్షించే యేసుక్రీస్తు రక్తం. ఈ రాత్రి ఆయన పాదములకున్న మురికి (దూళి)ని నీవు కడిగెదవా?
కొద్ది నిమిషాల పాటు మన శిరములు వంచెదము. గుర్తుంచుకోండి, ఆయన ప్రతీ వాగ్దానమును నెరవేర్చువాడై యున్నాడు. ఆయన ప్రతి వాగ్దానమును నెరవేర్చును. "ఎర్రని కెంపు వలే మీ పాపములు వున్నను, హిమము వలే అవి తెల్లగా మారును. నీవు కేవలం నమ్మితే చాలు, నీ పాపములన్నియు క్షమించబడును," అని ఆయన వాగ్దానం చేసాడు.
ఇప్పుడు మనమలాగే శిరములు వంచుదాం "బ్రదర్ బ్రెన్హాం, ఆయన ఆ విధముగా ఎవరు పట్టించుకోని స్థితిలో ఉండటం, అవమానపర్చబడటం, ఇప్పుడు నా శేషజీవితమంతయు నాకిష్టంలేదు. మరియు ఆ స్త్రీ అలా ఆయనకు చేసే అవకాశమును పొందుకొన్నట్టు ఇప్పుడు నేను కూడా అవకాశం పొందుకొన్నాను. నేను నా సాక్ష్యం ద్వారా ఆయన పాదములకున్న మురికిని కడగాలని వుంది, ఆయన ప్రశస్త నామమును?" అని మీలో ఎందరు చెప్పగలరు? "బ్రదర్ బ్రెన్హాం, నా కొరకు ప్రార్ధించు," అని మీలో ఎందరు మీ చేతిని పైకెత్తి చూపగలరు? దేవుడు నిన్ను దీవించును గాక, దేవుడు నిన్ను దీవించును గాక. అది మంచిది.
80ఇప్పుడు, పరలోకపు తండ్రి, ఇప్పుడు ఇక్కడ అనేక మంది, అనేక మంది తమ చేతులను ఎత్తి యున్నారు. యేసుక్రీస్తు నామమును మురికిలో దింపి యున్నట్టుగా మేము చూచి యున్నాము. పరలోకమందున్న ప్రతి దానికి ఆ పేరు వున్నది. భూమి మీద వున్న ప్రతి దానికి ఆ పేరు వున్నది. ప్రతి సంఘ సభ్యుడు, క్రీస్తు శరీరములో వున్న ప్రతి ఒక్క సబ్యుడగు ఒక శ్రీమతి యేసుయై యుండెను. పరలోకపు తండ్రి, దానిని మేము చూచి గ్రహించునట్లు చేయుమని మేము ప్రార్ధించుచున్నాను. ఈ రాత్రి నీ కృప ఇప్పుడు ఈ ప్రజల మీదకి రానిమ్ము మరియు ప్రతీ పాపమును క్షమించుము, తద్వారా వారు ఇప్పుడు నీ సన్నిధిలో వున్నారని నీవిక్కడున్నావని వారు తెలిసికొందురు గాక.
నీ పరిశుద్ధాత్మ మాకు సమస్తమును బోధించనిమ్ము, మా పాపముల నుండి తప్పిదముల నుండి మేము క్షమించబడుదుము గాక. దయచేయుము. నీ సన్నిధి విషయమై మేము సృహ కలిగి వుందుము గాక. యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాము.
81మనమలాగే తలవంచియుండగా, నేను ఆశ్చర్యపోవుచున్నాను, ఈ రాత్రి… ఇప్పుడు, నేను పాపులతోను మరియు సంఘ సభ్యులతోను, వెనక్కి జారిపోయినవారితోను, పరిశుద్ధాత్మను ఇంకా పొందనివారితోను మాట్లాడుచున్నాను. మీతో నేను మాట్లాడుచున్నాను. ఎందుకు పరిసయ్యుడు ఆయనను అంగీకరించలేకపోయెను?
మనమంతా ఇంకా ఆయనను పిలుచుచూనే వున్నాము. "ఓ ప్రభువా, దయచేసి రాగలవా?" నీ బిడ్డ అనారోగ్యముతో ఉన్నప్పుడు, ఆ బిడ్డ నిమిత్తం నీవు పిలవబడితివి. ఏ సందేహము లేదు, ఆయన దయగలవాడు. నీ ఆరోగ్య౦ పూర్తిగా క్షీణించినప్పుడు ఆయనను పిలువుము. ఆయన దానిలో నుండి నిన్ను బయటకు తీసికొని వచ్చును. మనం ఆయనను అడిగిన విషయాలన్నిటిని బట్టి మనమాయనను ఆహ్వానించనట్లైతే, ఈ విధముగా ఆయన మనల్ని దర్శించునట్లు వచ్చునట్లైతే మనమేమైనా ఆయనను సిగ్గుపరుస్తామేమోనని నేను ఆశ్చర్యపోవుచున్నాను.
82"మంచిది, నేను సంఘ సభ్యునిగా ఇంతకాలము నుండి ఉన్నాను, కాని ఈ రాత్రి నేనాయనను పరిశుద్ధాత్మ బాప్తిస్మములో కనుగోనాలనుకొనుచున్నాను. నాకు ఆయన కావాలి. ఆయన నాకు అవసరం దాని విషయమై మిగతా ప్రపంచం ఏమనుకొనుకొంటుందో నాకనవసరం."
పరిశుద్ధాత్మ బాప్తిస్మము నీవు పొందగోరుచున్నావా? పొందుకోవాలంటే, ఒక కార్యమును నీవు చేయాలని నేను అడుగుదును, అదేమనగా నీవిక్కడికి రావాలి, ఇప్పుడు నేను ఉన్న ఈ చోటుకి రమ్ము, ఇక్కడికి దిగిరమ్ము మరియు నా ప్రక్కనున్న ఈ దిగువ చోటుకి వచ్చి నిలువబడుము. ఇక్కడున్న ప్రతి వ్యక్తి, రక్షించబడని ప్రతి వ్యక్తి, మొదటిగా నీవు ఇక్కడికి నడిచివచ్చి ఒక నిమిషం ఇక్కడ నిలబడగలవా? ఆయన నీ ప్రార్ధనను ఆలకించునని నీవు నమ్మినయెడల, నీవు ఇచ్చటికి రాగలవా మరియు ఒక నిమిషం ఇచ్చట నిలువబడగలవా, మనమిప్పుడు ఆ పాటలోని ఒక వచనం పాడుచుండగా? ఏమిటి ఆ పాట? "యేసు పిలుచుచున్నాడు మృదువుగా దయగా. మంచిది, మన తలలు అలనే వంచియుండగా, ప్రతి ఒక్కరు ప్రార్ధించుచూ ఇక్కడికి వచ్చి నిలబడండి. ఇక్కడున్న ఈ దిగువ చోటున నిలబడి యుండండి.
మృదువుగా, దయగా, యేసు…
స్నేహితుడా, నీవెక్కడున్నా రాగలవా?
నీ కొరకే పిలుపు మరి… .. …
ఈ అంత్యదినములయందు యేసు, తాను భౌతికరూపము నందు కనబడుటకు ముందు, ఇప్పుడు మురికి వున్న పాదములతో ఇక్కడ కూర్చొనియున్నాడు. నీ పాత్రను నీవు తీసికొనుటకు నీకు ఇష్టమేనా! ఆయన నామమునకున్న నిందను తీసికొనుటకు సంసిద్దమేనా?
ఓ పాపి పిలుచుచున్నాడు, ఇంటికి రమ్ము,
ఇంటికి రమ్ము………..
త్వరగా ఇప్పుడు లెమ్ము, నీ మనస్సును సిద్దపర్చుకొనుము. ఇప్పుడే ఉన్న చోటు నుండి రమ్ము. మనకింకా ఎంతో సమయమున్నది. రేపు ఆదివారము తొమ్మిదిన్నర వరకు సండే స్కూలు ఆరంభం కాదు. కావున ఇప్పుడే రమ్ము.
అలసిపోయినవాడా, ఇంటికి రమ్ము;
వా౦ఛతో, దయగా…
యేసు ఇక్కడ వున్నాడని నీవు గుర్తించావా?
ఓ పాపి పిలుచుచున్నాడు, ఇంటికి రమ్ము.
ఇంటికి రమ్ము ……………
అది మంచిది. బాల్కానిలో నుండి రమ్ము. నీ నిమిత్తం మేము వేచి యుందుము. ప్రతి ఒక్కరు, ఇక్కడికి పైకి రండి, ఇక్కడున్న చోటులో నిలబడండి. ఇప్పుడు కేవలం… ఇది నీ జీవితమును నడిపించు.
ఏమైనది? లోకమంతా సoభవించుచున్న భూకంపములు చూడుము, మరొకసారి అవి భూమిని కంపించుచున్నవి, అ౦తటా విరుగుచున్న దానిని చూడుము. సమయము సమీపించినది. మరి చూడుము ద్వారము కొద్ది కాలము తర్వాత ముసివేయబడుతుంది; తర్వాత లోపలికి రావాలని నీవు ఏడ్చినను, నీవు రాలేవు.
83కొద్దికాలం క్రితం నేనొక యవ్వనస్తురాలితో మాట్లాడాను. ఒక బాప్తిస్టు చర్చిలో నేనొక కూటమును జరుపుచుంటిని, మరి క్రీస్తు నొద్దకు రమ్మని నేను ఆ రాత్రి ఆ అమ్మాయిని అడిగితిని, కాని ఆమె రాలేకపోయినది. మరి ఆ తర్వాత ఒకసారి ఆమె నన్ను ఎక్కడో బయట కలిసినది, ఆమె ఇలా అన్నది, "ఇంకేప్పుడైనా సరే, నీవు నన్ను ఆ విధముగా ఇబ్బంది పెట్టవద్దు!" ఒక సంవత్సరం తరువాత నేనొక వీదిలో వెళ్ళుచున్నాను. ఆమె ఒక ఘనత గల యవ్వన బాలిక. నేను వీధిలో వెళ్ళుచున్నాను. పొట్టి బట్టలు వ్రేలాడేసుకొంటూ, సిగరెట్టు త్రాగుచూ ఆ వీదిలో నడిచి వెళ్ళుచున్నది. ఆమె ఒక డీకన్ కూతురు. మరి నేను పలకరించాను "హలో, …?"
ఆమె అన్నది, "హలో బోధకా" అని వెటకారంగా (ముతక మాటలతో)
"హలో బోధకా!" అని పలకరించినది.
అంతట నేను ఆమెతో, "ఆ సిగరెట్టును బట్టి నీకు సిగ్గుగా అనిపించట్లేదా?" అని అన్నాను.
అందుకామె అన్నది, "హే, నా మధ్యపు సీసాలో నుండి ఒక చుక్క పుచ్చుకుంటావా?"
అప్పటికే ఆమె కొద్దిగ మత్తులో వున్నది.
అందుకు నేనన్నాను, "అలా అన్నందుకు నిన్ను గూర్చి నీకు సిగ్గు అనిపించుట లేదా?"
ఆమె అన్నది, "ఇలా రమ్ము, నేను నివాసముంటున్న చోటుకి నిన్ను తీసుకెళ్తాను."
నేను అడిగాను, "అంటే నీవు ఇంటి పట్టున ఉండటం లేదా?"
"లేదు."
"ఏమైనది?" అని అడిగాను.
"నేనిచ్చే బాటిల్ లోనిది కొద్దిగా పుచ్చుకో, ఆ సంగతి అప్పుడు చెబుతాను," అని ఆమె అన్నది.
"నన్ను మధ్యం త్రాగు, సిగరెట్టు త్రాగు అని అంటున్నావు, అలా అన్నందుకు నీకేమాత్రం సిగ్గు అనిపించట్లేదా?" అని అన్నాను.
అందుకామె, "బోధకుడా, నీకో సంగతి చెప్పాలి. ఇదే నీ ఆఖరి అవకాశం, అని నన్ను గూర్చి నీవు ఆ రోజున అన్నావు గుర్తుందా?"
"అవును, నాకు గుర్తుంది," అని అన్నాను.
"నీవన్నది నిజం. ఇక అప్పటి నుండి నా ఆత్మ ఎంతో కఠినమైపోయినది."
ఇంకా చెప్పింది (ఇక్కడే ఆ వ్యాఖ్య. అది నా వెన్నులో వణుకు పుట్టించినది.) ఇంకా అన్నది, "ఒక రొట్టె (పాన్ కేక్)వలే నా తల్లి యొక్క ఆత్మ నరకంలో వేగటం నేను చూడగలిగాను, దాన్ని చూసి నవ్వటం జరిగినది."
మరి నీవు కూడా అలాంటి స్థితిలో వుండాలమకొంటున్నావా? ఆయన తట్టు తిరగవా? సరే, ఇప్పుడే నీవు రాలేవా, వీరితో కలిసి ఇక్కడ నిలబడి వుండలేవా?
ఇంటికి రమ్ము, ఇంటికి రమ్ము,
ఆయనను తిరస్కరించకు. గుర్తుంచుకో, క్రితం సారి ఆయన్ని తిరస్కరించావు
ఇంటికి రమ్ము;
మృదువుగా…
ఆయన తన నియామకములన్నిటిని నిలుపుకొనును. నీవు ఆయనను స్వీకరించాలి. ఇక్కడైనా సరే, లేదా తీర్పు దినానైన సరే నీవు ఆయనను కలుసుకోవటం ఖాయం.
పిలుచుచున్నాడు, ఓ పాపి, ఇంటికి రమ్ము!
84మీకు తెలుసా, నేనెంతో ఆశ్చర్యపోవుచున్నాను. నా హృదయం నిజంగా హాస్యస్పదంగా వున్నట్టు అనిపించింది. ఈ రోజు నేను ప్రార్థన చేసుకొనుచుండగా నేననుకొన్నాను… ప్రసంగించుటకు మరొక వర్తమానము నేను కలిగియుంటిని. అయితే ఆయన దానిని చేయమని నాతో చెప్పాడు. దానిని చెప్పమని ఆయన నాతో చెప్పాడు. జుట్టు కత్తిరించుకొన్న ప్రతి స్త్రీ ఈ వేదిక యొద్ద నిలబడునేమోనని నేను భావించాను. చూశారా, నీవు కేవలం ఎంతో కఠినముగాను ఎంతో దూరముగా నుండిపోయావు, చూశారా, దేవుని వాక్యమును నీవు వినకుండా, చూశారా నీవు ఆ గీతను దాటుచున్నావు, నిశ్చయముగా అది జరుగునని నేను అనుకొన్నాను. కాని నేను నిజంగా ఊహించిన దాని కంటే కూడా తర్వాత ఇది ఎక్కువని నేను అనుకొన్నాను.
గుర్తుంచుకోండి, రక్తం నా చేతుల మీద ఎంతమాత్రం లేదండి. దేవుని ఆలోచనను ఉన్నది వున్నట్లు మీకు చెప్పుటకు నేమాత్రం భయపడలేదు. గుర్తుంచుకోండి, లోపలి ఉన్నది ఏదో, అదే బయట దావీదు గుర్తించును. ప్రియమైన సహోదరి దాని నుండి తొలగిపొమ్ము, సహోదరుడా ఆమె చేతిని పట్టుకొని ఇక్కడికి తీసికొని రమ్ము. నీవెందుకు ఆ పని చేయలేవు? ఉండలేవా, నిజమైన క్రైస్తవునిగా వుండలేవా? సగం జీవితంను జీవించి, శిక్షావిధి క్రింద వుండుట వలన నీకు ప్రయోజనమేమిటి? దానిని నీవు దయచేసి చేయవద్దు. చూశారా, నీవు అంటావు, "మంచిది, నేను…" నీవేం చేసావో నాకవసరంలేదు. నీ ఫలములను బట్టి నీవు తెలియబడుదువు.
85నేను అనునిత్యం అమెరికా అంతట ప్రయాణించాను. ప్రతి సంవత్సరం నేను అలా చుట్టి వస్తాను. అయితే అది (అమెరికా) నానాటికి ఇంకా ఇంకా దిగజారిపోవుచున్నది. గనుక ఏదో తేడా వుందని నేనెరిగితిని. కృపా దినము దాటిపోవుచున్నది. టంపాలో వున్న నీకు అది దాటిపోయినట్లుగా పుండనీయకుము. సమస్తము ఎంతో అందముగా వున్న ఒక గొప్ప, పెద్ద, అద్భుతమైన నగరంలో వున్నావు. ఇది అచ్చం హాలీవుడ్ వలే వున్నది.
లోకమంతా చెడిపోయింది. టెలివిజన్ లలో మరియు అనేక కార్యాలలో అంతా పాత బూతు, మురికి తప్ప మరే మంచి లేదు. వాటిని చూచి వాటివలే ఉండాలని నిన్ను నీవు ప్రయత్నించుచున్నావు. యేసుని నీవు మాదిరిగా తీసికోలేవా? నీవు నీవు ఆయనను అనుమతించలేవా? ఆయన మాటను నీవు వినలేవా? వాస్తవమైన వీటిని నీవు చేయలేవా?
86నేను పరిశుద్ధాత్మను పొందుకోలేదని మీలో ఎందరు యదార్థముగా చెప్పెదరు? నిన్నునీవే పరీక్షించుకొనుము. పొందుకోలేదని తెలుసుకొనుము. నీ సొంత జీవితం వైపు చూచుకొనుము, నీవు ఏ విధముగా జీవిస్తున్నావో తెలుసుకొనుము.
"నేనొక సంఘమునకు చెందియున్నాను," అని చెబితే సరిపోదు. "నేను మెథడిస్టుకి చెందియున్నాను, బాప్తిస్టుకి, ప్రెస్పి.. నేను చెందియున్నాను" అని చెబితే చాలదు. అవన్నీ సరే, దానికి వ్యతిరేకముగా నేనేమి చెప్పుట లేదు, కాని వీరు వ్యక్తిగతముగా యేసుక్రీస్తు తెలుసా? అనేది మాత్రమే నేను అడుగుచున్నాను. ఆయన నీలో జీవించుచున్నాడా? ఒకవేళ ఆయన నీలో జీవించుచున్నట్లైతే, ఆయన తన్ను తాను అక్కడ గుర్తుంచుకొనును. ఆయన అక్కడ ఉన్నట్లైతే ఆయన తన్ను తాను నీకు కనబరచుకొనుటకు బద్దుడైయుండెను. ఆయన అక్కడ నిలిచియున్నాడు గనుక నీవు ఆయనను దాచలేవు.
నీవు పరిశుద్ధాత్మను పొందలేదా, పొందుకోలేదని మీకు అసలు తెలుసా, అలాగైతే ఇప్పుడే నీ చెయ్యి పైకి ఎత్తుము. యదార్థముగా చేయుము, ఇలా చెప్పుము, "నేను పరిశుద్ధాత్మను పొందలేదు, పొందలేదనీ నేను ఒప్పుకొనుచున్నాను." నీ యదార్థతను బట్టి దేవుడు నిన్ను దీవించును గాక. దేవుడు ఆ యదార్థతను గౌరవించును. నీకు పరిశుద్దాత్మ కావాలని కోరినయెడల, ఇదిగో ఇక్కడికి వచ్చి, పశ్చాత్తాపపడుచున్న ఈ పాపులయొద్దకి వచ్చి వారి ప్రక్కన నీవు వారితో కలిసి నిలబడగలవా? ఇప్పుడే ఇక్కడికి రాగలవా? మరలా మనం ఈ పాటను పాడుచుండగా ఇక్కడికి "పైకివచ్చి నిలబడుము. చెప్పుము "బ్రదర్ బ్రెన్హాం, అది నాకు కావాలి," దానిని అది తీసికొనునని నేను చెప్పుచున్నాను. ఎత్తబడుట కొరకు నీవు దానిని కలిగియుండబోవుచున్నాను. అది నిశ్చయంగా నిజము.
ఇప్పుడు, గుర్తుంచుకో. నీతో దేవుడు మాట్లాడుతున్నాడని నీవు నమ్ముదువా? అది యేసు క్రీస్తేనని నీవు నమ్మగలవా? అలాగైతే నీవు నీ చేయిని పైకెత్తుము. ఈ వారమంతా జరిగిన కూటములన్నిటిలో స్వయంగా క్రీస్తే మాట్లాడియున్నాడని నీవు నమ్మినట్లైతే, చేయి పైకెత్తుము. మంచిది, అలాగయితే నీవుండాల్సిన చోటు బలిపీఠము నొద్ద.
87ఆమె ఆయన పాద సేవ చేసినది. మరి స్త్రీ, పురుషులను మీరు దానిని చేయకపోతే అది మీకు అవమానంగా ఉండదా. ఇక్కడున్న జనులారా, వాటిని మీరు జరిగించరా! మీలో వున్న సేవకులగు కొందరు, సర్వశక్తిగల దేవుని వాక్యమునకు బదులుగా బలముగా వున్న డాలర్ వైపు మొగ్గు చూపుతున్నారు. మీ సమాజమును మీ సంస్థను బట్టి ఆ విధమగు రూపమునకు మలుచుచున్నారు. అది మీకు సిగ్గుగా లేదా.
నేను చదివే అదే బైబిల్ ని మీరును చదువుచున్నారు. యేసు ఆ విధముగా మురికి పాదములతో ఉండుటను మీరు చూచుచున్నప్పటికి, ఏమి పట్టించుకోకుండా వుండుటను బట్టి మిమ్మును మీరు సిగ్గుగా బావించుకొనుటలేదా? లేచి నిలబడి, చేయవల్సిన దానిని చేయుటకు నిజమైన క్రైస్తవునిగా వుండే ధైర్యము నీకు లేదా? నీవు నిశ్చయముగా దానిని కలిగి యున్నట్టు కనబడవలెను. దేవుడు నీ మీద దయ చూపును గాక.
ఈ సమాజము ఇప్పుడు ఎక్కడ కూర్చొనియున్నదో అనే గ్రహింపును, దానిని తెలిపే పరిశుద్ధాత్మను దేవుడు మీకు అనుగ్రహించునట్లు నేను ప్రార్ది౦తును.
ACTS 2:38,39
88ఇది నీకివ్వబడిన సదావకాశమని నీవు తెలిసికొన్నావా? ఆ వార్తహరుడు తనకి దొరికిన చివరి అవకాశమును చేజార్చుకొన్నట్లు నీవు కూడా నీ అవకాశాన్ని చేజార్చుకొంటావా? దానిని నీవు దానిని చేయబోతున్నావా? దయచేసి ఆ పని మాత్రం చేయకు. ఇంకా ఏదైన సందేహం నీకున్నా లేక ఇంకా ఏదైనా పొరపాటు నీలో వున్నా ఇక్కడే నీ చోటుకి రమ్ము, నీ స్థానమును తీసికొనుము. ఇది నీ స్థానము.
"మంచిది, నేనాలా చేయాలనుకోవట్లేదు.." అని చెప్పినట్లయితే. వారికి కూడా అది అవసరం లేకుండా పోయింది. ఆయన అక్కడ కూర్చొని యున్నాడని వారక్కడికి వెళ్ళి చూడలేకపోయారు. వారు అక్కడికి వెళ్ళి తమ్మును తాము దానితో గుర్తుంచుకోలేకపోయారు, ఎందుకనగా అది వారి సమాజమునకు వ్యతిరేకము వున్నది. మరి నీ పరిస్థితి ఏంటి… అయితే అది ఆయనకి వ్యతిరేకముగా మాత్రం లేదండీ. ఆ చిన్న స్త్రీ వీటన్నిటిని పట్టించుకోలేదు. తానొక పాపినని ఆమె గ్రహించినది. పాపక్షమాపణ పొందుచున్నది.
ఏం జరిగిందో నాకు తెలియదు. ఈ రాత్రి వారు ఎచ్చట ఉన్నారు? ఈ చిన్న స్త్రీ ఈ రాత్రి ఎక్కడవున్నదని నీవు అనుకోనుచున్నావు? మరియు ఎంతో మతపరమైన ఆ పరిసయ్యుడు ఈ రాత్రి ఎచ్చట ఉన్నాడని నీవనుకొనుచున్నావు? వారిరువురిని నీవు వినవచ్చును, వారిప్పుడు ఎచ్చట వున్నారు. ఎప్పుడైనా నీవు నిశ్చయంగా ఆమె చోటును తెలుసుకొనెదవు. కావున, నీవెంత మతపరమైనవాడవైన సరే…
యేసు ప్రతి నియామకాన్ని నిలుపుకొనును, ఆయన యొక్క ప్రతీ ఆజ్ఞకి నీవు జవాబు దారిగా ఉ౦దువు.
89గమక నీవు వచ్చుట మంచిది, నీవు పరిశుద్ధాత్మను పొందుకోనట్లైతే, దానిని నీవు పొందుకోవాలని ఆయన నీకు ఆజ్ఞాపించాడు, పేతురు అన్నాడు, "మారుమనస్సు పొందుడి, పాపక్షమాపణ నిమిత్తం మీలో ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి. అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరమును పొందుదురు. ఈ వాగ్దానం మీకును, పిల్లలకును, దూరస్థులందరికిని అనగా, ప్రభువగు మన దేవుడు తనయొద్దకు పిలచిన వారందరికి చెందును." మరియు ఆయన ఇంకను పిలుచుచున్నాడు. ఇంకను ఆయన తన పరిశుద్ధాత్మను అనుగ్రహించుచున్నాడు.
మనమింకను పాడుచుండగా, నీవు రాలేవా? ఇప్పుడు ఇదే నా చివరి సారి. గుర్తుంచుకోండి, ఇంతవరకు క్రీస్తే ఇక్కడ వుండియున్నాడు. అది ఆయనేనని మరియు ఆది ఆయన వాక్యమేనని గుర్తించిన మీరంతా మీ చేతులను ఎత్తియున్నారు. మరియు క్రీస్తు నా హృదయములో వుండి ఆయన దుఃఖించుచున్నాడు.
MATT 23:37•
LUKE 13:34•
HEB 12:1
90యేసు ఒకసారి యెరూషలేముకు ఎదురుగా కూర్చొని అన్నాడు, "యెరూషలేమా, యెరూషలేమా కోడి తన పిల్లల్ని తన రెక్కల క్రింద కేలాగు చేర్చుకొనునో అలాగే నేనును నీ పిల్లలను ఎన్నోమారులు చేర్చుకొన ఉద్దేశించితిని, గాని మీరు ఒల్లకపోతిరి." అనేకసార్లు నేను మీ మధ్యకు వచ్చినప్పుడు, ఉదయకాల అల్పాహార విందులో చక్కని పెంతెకోస్తు జనులగు మీకు మరియు అన్నిర కములుగా నేను చెప్పితిని, నేను మీ మధ్యకు వచ్చినప్పుడు, నాలో వున్న పరిశుద్ధాత్మ చెప్పెను. "ఎన్నిసార్లు నేను వారిని సమకూర్చలేదు? నేడు సంఘము ఎంతో శక్తివంతమైన స్థితిలో వుండవల్సి వుంది. కాని మీరు అలాగు పుండలేకపోతున్నారు," చూశారా. మీరు అలా పుండలేకపోతున్నారు.
ఇప్పుడే మీరది చేయరా? ఇదే సరైన సమయం. ప్రతీ భారమును ప్రక్కకు నెట్టి, సుళువుగా చిక్కులు పెట్టే పాపమును ప్రక్కకు నెట్టి మన యెడల ఉంచబడిన పందెమును ఓపికతో పరుగెత్తుదము. మరొకసారి మనం పిలుచుచుండగా, ప్రతి ఒక్కరు నాతో కలిసి పాడండి, ఇప్పుడే మీరున్న చోటు నుండి లేచి, ఇక్కడికి రండి. నీవు పరిశుద్ధాత్మ బాప్తిస్మము పొందుకోకపోయినట్లైతే, నీవి౦కా పాపిగాను, వెనుకకు జారిపోయిన వాడిగాను, లేక ఇంకా ఏ విధముగా నీవున్న సరే, ఇప్పుడే ఇక్కడికి ఎక్కి రమ్ము మరియు అందరం కలిసి ప్రార్ధింతుము. రాగలవా ఇప్పుడు? ఇది మన ఆఖరి పిలుపు.
మృదువుగా, దయగా యేసు పిలుచుచున్నాడు.
నిన్ను, నన్ను పిలుచుచున్నాడు?
గడప యొద్ద ఆయన నిలబడి వేచియున్నాడు.
మరియు వేచియున్నాడు
నీ కొరకు నీ కొరకు వేచియున్నాడు.
ఒకవేళ ఈ రాత్రి ఆ పరిసయ్యుడు ఆ వెనుక కూర్చొని బలిపీఠపు పిలుపును వినగలిగినట్లైతే అతడు ఏమి చేసియుండేవాడు?
ఇంటికి రమ్ము, ఇంటికి రమ్ము,
అతడు తన మార్గమున పాపము చేసియున్నాడు, దినమును పోగొట్టుకొన్నాడు. మరి నీవు కూడా అదే చేస్తావా? ఆ వార్తాహరుడగు ఆ బాలుడు మరలా ఆయన యెదుట ఇంకోసారి నిలబడగల్గినట్లైతే, మొదటిగా ఏ కార్యము జరుగును?
… ఇంటికి;
మృదువుగా, దయగా యేసు పిలచుచున్నాడు,
పిలచుచున్నాడు, ఇంటికి రమ్ము, ఇంటికి రమ్ము!
అలసిపోయిన వారలారా, రండి…
భూమి మీద నేడు జరుగుచున్న సూచనలు తెలుసుకొనుట బట్టి అవి నిన్ను కలవర పెట్టుచున్నాయా? లేదా ఆ చోటును ఇదివరకే దాటి వచ్చితివా? ఇంకా ఏదైన మృదువగు చోటు ఉన్నదా? ఒకవేళ ఉంటే ఇప్పుడే రా, అక్కడికి ఆయన వచ్చి దానిని ఆయనను తీసికొననిమ్ము. ఆయన నిన్ను నూతన సృష్టిగా చేయును. ఇదివరకు ఎన్నడూ ఉండనంత సంతోషము గల వ్యక్తిగా నీ విక్కడ నుండి వెళ్ళెదరు.
పిలుచుచున్నాడు, ఓ పాపి. ఇంటికి రమ్ము!
91మన తలలు ఇప్పుడు వంచియుండగా దీనిని ఆలపించెదం
ఇంటికి నీవు రావా? దేవుడు నిన్ను దీవించును గాక, యవ్వనుడా.
అలసినవాడా, ఇంటికి రమ్ము,
(ఓ వెనుకకు జారినవాడా, ఇంటికి రమ్ము.)
మృదువుగా దయగా…
నీవు మనస్కరిస్తున్నావా? నీవు ఒప్పింపబడితే, అప్పుడు నీవు మనస్కరిస్తావు. కాని అది యేసు అని నీవు ఒప్పింపబడకపోతే, నీవెంత మాత్రం మనస్కరించలేవు. "ఇంటికి రమ్ము."
ఇప్పుడు, ఇక్కడే బహిరంగముగానే దాని విషయమై మనము ఏం చేయలేం. ఇక్కడ నిలువబడి ఒక ఒప్పుకోలు చేయుటకు నీవు రమ్ము. కొంత కాలం క్రితం నేనొక కథను విన్నాను. మీరు దానిని జాగ్రత్తగా వినాలని కోరుచున్నాను. డానీ మార్టిన్ అనే వ్యక్తి వున్నాడు. ఈ దేశంలో అనేక గొప్ప ఉజ్జీవములు అతని ద్వారా వచ్చినవి. ఒక రాత్రి అతడు చనిపోయినట్టు అతనికి కల వచ్చిందని వారు చెప్పారు. మరియు అతడు పరలోకమునకు వెళ్ళుట ఆరంబించెను. అతడు ఒక పెద్ద గేటు దగ్గరికి చేరుకొన్నాడు. అక్కడ ఆయన అడిగాడు, "సమీపించినది ఎవరు?"
అందుకతడు, "నా పేరు డానీ మార్టిన్, నేనొక సువార్తీకుడిని," అని చెప్పాడు.
గేటు వద్ద వున్న వ్యక్తి చెప్పాడు, "నీ పేరు గ్రంథంలో ఉన్నదేమో చూచెదను," అని చెప్పి, "నీ పేరు ఇక్కడ కనబడుట లేదు," అని అతనితో అనెను.
అందుకతడు, "లేదా! నేనొక దైవసేవకుణ్ణి."
అతడన్నాడు, "నీవెవరివైనా సరే, నేను చేసేదేం లేదు, నీ పేరు ఇక్కడ లేకపోతే నీవు ఈ గేటు దాటి లోపలికి రాలేవు. ఇది గట్టిగా బిగించబడింది. నీవు లోపలకి రావాలంటే నీ పేరు గ్రంధంలో తప్పక ఉండవల్సి వుంది."
"అలాగే అయితే ఇప్పుడు నేనేం చేయ్యాలి? " అని వానిని అడిగెను.
అందుకతడు నీకు కావలంటే దేవుని దవళసింహాసనం యొద్ద నీవు నీ కేసును వేసికొనవచ్చును." ఓ, సహోదరుడా, సహాదరి అక్కడికి వెళ్ళాలని ఎన్నడూ కోరవద్దు.
కావున అతడన్నాడు, "అక్కడే నా కేసు విజ్ఞప్తి పెట్టుకోవడం తప్ప మరే ఇతర అవకాశ మార్గాలు వున్నట్టుగా నాకు కనిపించుట లేదు."
92కావున, అతడు చెప్పాడు, "అతడు చివరకు ఎక్కడికో వెళ్ళనారంబించాడు, ఎక్కడికి వెళ్ళాడో ఎరుగకుండెను." (ఇది మనిషికొచ్చిన కల.)
అతడింకా ఇలా అన్నాడు, "నేను వెలుగు నొద్దకు వచ్చాను, ఒక ప్రత్యేక స్థలమంటు వచ్చేది లేదు. కాని నేను నీదానించి మరియు కొద్దిసేపటి తర్వాత ఆగితిని. అక్కడ ఒక స్వరమును విన్నాను. "నా నీతి గల సింహాసనంను సమీపించునది ఎవరు? "అని చెప్పటం విన్నాను.
దానికతడు స్పందించి ఇలా జవాబిచ్చాడు, "నేను డానీ మార్టిన్ ని, అమెరికా సంయుక్త రాష్ట్రాల నుండి వచ్చిన ఒక సువార్తికుడిని, నేను అనేక ఆత్మలను సంపాదించాను. కాని అక్కడ వారు నన్ను ఆ గేటు గుండా లోనికి ప్రవేశింపనియ్యలేదు."
ఆయన అడిగాడు, "మంచిది, నా కోర్టులో వాదించబడుటకు నీవు నీ వ్యాజ్యమును వేసితివి. సరే, నేను నీతి న్యాయమును కోరువాడను. వాటిని నా కట్టడలులో వుంచితిని. డానీ మార్టిన్, నీ జీవితంలో నీవు ఎప్పుడైనా అబద్దమును ఆడితివా?"
"అప్పుడు వెలుగు ప్రసన్నతలో నేను ఆడిన మాటలలో కొన్ని మచ్చలు వున్నట్టు నాకర్ధమౌతున్నది. అవునయ్య, నేను అబద్దములు ఆడితిని," అని అతడు జవాబిచ్చాడు.
మరలా ఆయన నన్ను అడిగాడు, "ఎప్పుడైనా దొంగిలించితివా?"
అందుకతడు, "నేను యదార్థవంతునిగానే వున్నాను అనుకొనుచున్నాను, కాని కొన్ని వర్తకములలో దొంగిలించినట్టు నాకు కనబడుచున్నది."
DEUT 22:5
93వెలుగు ప్రసన్నతలోకి ప్రవేశించే వరకు నీవు ఎదురు చూచెదవా, నేనిప్పుడు బాగానే వున్నానులే అని అనుకొనుచున్నావా, అక్కడికి చేరుకొన్నాక చూచుకొందాములే అని అనుకొనుచున్నావా, జుట్టు కత్తిరించుకొని సిగరెట్లు త్రాగుచూ ఒకసారి సమీపించుటకు ప్రయత్నిస్తావా. నేను చెప్పేది లేఖనాల ద్వారా నేను నీకు నిరూపించగలను. అది ఖచ్చితంగా వాస్తవం. ఇష్టమొచ్చిన దుస్తులు, పొట్టి దుస్తులు వేసుకొని ప్రయత్నించావనుకో అప్పుడు తెలుస్తుంది నీవెక్కడ ఉన్నావోనని. బైబిల్ చెప్పుచున్నది, "దేవుని దృష్టిలో అది అపాయకరమగు పాపము అని." ఒకసారి ప్రయత్నించుట, అసలు నీకు మనసాక్షి వుందా?
అడిగాడు, "మంచిది, నీవెప్పుడైనా ఇది చేశావా, అది చేశావా?" "అవును, చేశాను" అని బదులిచ్చాడు.
"డానీ, నీవెన్నడైనా పాపం చేశావా?"
"అవును, నేను చేశాను," అని బదులిచ్చాడు.
ఆయన వినబోయే సమయానికి… "నా సన్నిధి విడిచి నిత్యనరకాగ్నికి వెళ్ళిపోండి," అని చెప్పబడటంను అతడు విన్నప్పుడు, అతని కీళ్ళలో నుండి తన ఎముకలు ఊడిపోయినట్టుగా తనకి కనబడినవి అతడు చెప్పాడు.
తర్వాత అతడు ఇంతకి మునుపెన్నడూ వినని అతిమదురమైన స్వరమును తాను వింటినని అతడు చెప్పెను. మరియు అది ఎవరా అని చుట్టూ కలియజూసితినని పలికెను. తాను ఇంతకు ముందెన్నడూ చూడని అతిమధురమైన ముఖమును తాను చూచినట్టు అతడు చెప్పెను.
ఏ స్వరమును తాను విన్నాడో, తాను ఎవరినైతే చూచాడో స్వయంగా ఆయనే ఇలా అన్నాడు, "తండ్రీ, ఇది నిజం, ఎలా జీవించాలోనన్న దానివి తనకి తెలిసినంతమట్టుకు శాయశక్తులా తాను జీవించుటకు డాని ప్రయత్నించాడు. కాని అతడు కొన్ని పొరపాటులనే చేశాడు. కాని భూమి మీద తాను వున్నప్పుడు తానోక పనిని చేశాడు, అదేదనగా అతడు నా కొరకు నిలబడ్డాడు. నా కొరకు నిలబడ్డాడు, నా మాటను స్వీకరించి దాని ప్రకారం చేయకలిగినంత చేశాడు. కనుక నేనిప్పుడు అతని కొరకు ఇక్కడ నిలబడుచున్నాను."
ఇప్పుడు నీవు చేయుచున్న కార్యమదే. నీవు అయన పక్షమున నిలబడుచున్నాను, గనుక ఆయన పక్షమున తండ్రియెదుట నిలబడును.
94ప్రభువైన యేసూ, నీ దయలో ఈ జనుల యొక్క పాపములకు క్షమాపణ దయచేయమని నేను ప్రార్ధించుచున్నాను. నీ కొరకు నిలబడాలనే దృడమైన నిశ్చయత కొరకే వారిచ్చటికి వచ్చియున్నారు. వారిలో ప్రతి ఒక్కరు పరిశుద్ధాత్మతో నింపబడగోరుచున్నారు. అనుగ్రహించండి, అప్పుడది వారికివ్వబడును. ఒక సాక్ష్యముగా వారు ఈ ప్రేక్షకుల ఎదుట నిలబడియున్నారు. వారిని నాకిమ్మని నీ మహిమ కొరకు నేను అడుగుచున్నాను.
వారిలో కొందరు సంఘ సభ్యులు గాను కొందరు వెనుకకు జారిపోయినవారు గాను మరి కొందరు ఇదివరకు ఎన్నడూ నిన్ను అంగీకరించని వారు గాను వారిప్పుడు ఇచ్చట నిలబడి యున్నారు. ఒక నిజమైన, యదార్ధమైన క్రైస్తవ ఒప్పుకోలునకు అంటుకొనిన మురికిని వారు చూచియున్నారు. అయితే తాము పాపులమని ఆ స్త్రీ ఒప్పుకొన్నట్టుగానే వారు కూడా ఒప్పుకొనుటకు ఇప్పుడు సిద్దముగా యున్నారు. ప్రభువా, వారు తమ పశ్చాతాపపు కన్నీటితో నీ నామమునకున్న మురికిని కడుగగోరుచున్నారు. దానిని వారు చేయునట్లు అనుగ్రహించుము.
95ఇప్పుడు, నేనొక సంగతిని అడుగబోవుచున్నాను. అచ్చట బహిరంగముగా జనుల ఎదుటకి రాలేని వారి కొరకు ఇక్కడే వెనుక భాగమున వారు ఒక గదిని మీ కొరకు సిద్దపర్చియున్నారు. మాతో తిరిగి అక్కడికి వెళ్ళడానికి ముందు మీరు అచ్చటికి వెళ్ళాలని నేను కోరుచున్నాను. ఈలాగు మెట్లెక్కి ఇచ్చటికి వచ్చి, ఇక్కడి నుండి బయటకు వెళ్ళండి. నా కొరకు మీరు దీనిని చేయగలరా? ఇప్పుడే ఇక్కడికి రండి. ప్రతి ఒక్కరిని దేవుడు నిన్ను దీవించును గాక.
వారు వెళ్ళుచుండగా, ఇంకా ఎవరైనా ఇక్కడికి రావలనుకొనుచున్నారా? ఇక్కడున్న ప్రతి ఒక్కరు ఇలా వచ్చి బయటికి మరి వచ్చి తిరిగి వెళ్ళగోరుచున్నారా, కొద్దిసేపట్లో వారందరు నిన్ను కలిసికొందురు. ఈ రాత్రి మరి అందుకొరకే ఇవ్వబడినది. పరిశుద్ధాత్మను పొందే సమయమిదే సుమా, ఇంతకమునుపెన్నడు నీవు దానిని పొందనట్లైతే ఇదే సమయం, గనుక వచ్చి దానిని పొందుకొనుము. దేవునితో సరిచేయబడే సమయం ఇదేనండి. ఇప్పుడు నీవు దానిని చేయనియెడల అక్కడ ఆయన నీ కొరకు నిలబడలేడు.
96దేవునికి నీ జీవితమును ఇవ్వుము.
ప్రభువు ఈ జనులను దీవించును గాక. వారు నిజంగా ఎంతో యదార్ధముగా వున్నారని నేను నమ్ముచున్నాను. చాలా కాలము తరువాత టంపా ఇలాంటి గొప్ప రాత్రిని చూచితినని నేననుకొనుచున్నాను. ఇప్పుడు ముందుకు వచ్చువారు ఇంకా ఎవరు లేరా? ఇదిగో అచ్చట వెనుక సొంత పనివారున్నారు. వారిని గుర్తుపట్టడానికి వారి మీద కొన్ని గుర్తులున్నవి. వారితో కలసి లోనికి పోవుడి. అక్కడికి వెళ్ళుచున్న వారితో వుండుటకు మనం మరికొద్ది నిముషములలో అచ్చట వుండబోవుచున్నాము. వారందరు ఇంకా భవనము లోపలే పున్నారు.
సహోదరులైన మీరు దయతో అక్కడికి వెళ్ళి, వారిని కలుసుకొని మరియు గదిలో వారిని ప్రత్యేకపరచండి. ఇంకో నిముషములో మీతో వుండబోవుచున్నాము.
ఇప్పుడు వారు ఇంకను వెళ్ళుచుండగా వెళ్ళుటకు ఇంకెవరులేరా? కేవలం అచ్చట బయట నిలబడండి.
97ఈ దినమున యేసుని నీవు కూర్చొండనిచ్చెదవా? నీవు ఇలా అంటావేమో, "నేనే అచ్చట వున్నట్లైతే ఆయన ఆ విధంగా వుండుటను నేనే చూచినట్లైతే, తప్పనిసరిగా నేను దానిని చేసియుండేవాడిని." అది సరే గాని మరి ఇప్పుడు సంగతేంటి? ఇప్పటి నీ సొంత వైఖరే అచ్చట నీవేమి చేసెదవో అనే దానిని గుర్తించును. ఇప్పుడు నీవు తీసికొనే వైఖరే అతి ప్రాముఖ్యం. నేనంతా బాగానే వున్నాము అని నీవనుకొనుచున్నావా? సరే మంచిది, అది నీకు దేవునికి మధ్య నున్న సంగతి, నేనేమి నీకు తీర్పరిని కాను. వాక్యమునకు మాత్రమే నేను బాద్యుడను. ఆయన ఇప్పుడు ఈ కూటములలో వున్నాడు. అదిగో వారు కూడా సంఘములలో నుండి బయటకి వచ్చారు. కాని వారు ఇప్పుడు దానిని స్థిరపరచబోవుచున్నారు. అదంతయు అంతే మరి. వారు సిద్దపడి వున్నారు.
సగం క్రైస్తవ జీవితమునే వీవెందుకు జీవించగోరుచున్నావు? వుంటే దేవుని కొరకైనా ఉండు లేదంటే ఆయనకు భిన్నముగానైనా వుండు, అప్పుడు లోకానికి ఏ రంగు ఏమిటో తెలుస్తుంది. నీవు ఎక్కడ నిలబడి యున్నావో అర్ధమవుతుంది.
98వారు పోవుచుండగా దేవుడు వారిని దీవించును గాక. తమ నిమిత్తం తాము చనిపోవుట కొరకు వారు వెళ్ళుచున్నారు. వారు తమ జీవితమును సమర్పించుకొనుటకు వెళ్ళుచున్నారు. వారు కల్వరి యొద్దకు వెళ్ళుచున్నారు. లోక కార్యములు సిలువ వేయబడుట కొరకు వెళ్ళుచున్నారు, మరియు ఇక్కడ మనం జీవిస్తున్న ఈ అందమైన ఫ్యాషన్ ప్రపంచానికి సిలువ వేయబడుటకు వెళ్ళుచున్నారు. ఎవరి సన్నిధైతే ఇక్కడ వుందో, ఆ యేసు క్రీస్తు కొరకు చనిపోవు నిమిత్తం వారెళ్ళుచున్నారు. తమ సొంత ఇష్టాలను చంపివేసి యేసుక్రీస్తులో నూతన౦గా తిరిగి జన్మించుటకు వారు వెళ్ళుచున్నారు.
దేవుడు వారిని దీవించును గాక. మనం మెల్లగా పాడుచుండగా ఇంకా ఎవరైనా రాగోరుచున్నారా?
మృదువుగా, దయగా యేసు పిలుచుచున్నాడు,
పిలుచుచున్నాడు, ఓ పాపి, ఇంటికి రమ్ము,
ఇంటికి రమ్ము. నీవు రాగలవా? ఇంటికి రమ్ము,
అలసినవాడా ఇంటికి రమ్ము;
ఇప్పుడు, నిజంగా పరిశుద్ధాత్మ నా హృదయములో నుండి మాట్లాడుచుండెను. అనేకులు దీనిని పోగొట్టుకొనుచున్నారని నాకు తెలుసు.
పిలుచుచున్నాడు, ఓ పాపి, ఇంటికి రమ్ము!
బాల్కానీలో వున్న వారికి, గుర్తుంచుకోండి అక్కడ ఇక్కడ అంతటా వున్న వారికి యేసుక్రీస్తుని మీకు పరిచయం చేస్తున్నాను. మీరాయనను స్వీకరిస్తారా? మీరాయనను స్వీకరిస్తారా? సహోదరీ, నీవు ఆయనను స్వీకరిస్తావా? సహోదరుడా, నీవు ఆయనను స్వీకరిస్తావా? వచ్చి మీ యొక్క… నీవు ఆయన కిచ్చిన ప్రమాణమును తిరిగి పునరుద్ధరించుకొనుము మరియు ఆయనను మాత్రమే సేవించెదననే ప్రతిజ్ఞను చేసికొనుము.
99నేను వివేచన అను దాని క్రింద లేనియెడల నేను ఇక్కడ నిలబడి ఏమీ చెప్పలేనని మీకు తెలుసా? ఎవరో ఒకరు తమ తుది పిలుపును పొందుకొనుచున్నారు. ఇప్పుడు స్వీకరించని ప్రజలను బయటకు లాగుట ద్వారా త్వరపెట్టవల్సి వుంది. దానిని మనం గుర్తించాం, కాని ఇది ఇలా జరగటం సిగ్గుకరం, కాని అది ఇలా జరుగటమే సరైనదని నేను బావించుచున్నాను. నా లోపల, ఏదో నన్ను చీల్చివేయుచున్నట్టున్నది.
ఇప్పుడు, మీకు కొంత చూపెదను. ఇక్కడ చూడండి. రోగులుగా మరియు అవసరతలో వున్న వారి కొరకు ఆయన ఇంకను ఇక్కడ పున్నాడని చూపించుటకే. వాసన చూచే స్పర్శను పోగొట్టుకొనిన ఒక వ్యక్తి తట్టు నేను చూచుచున్నాను, ఆమె ఒక స్త్రీ, ఇక్కడ కూర్చొని యున్నది. దాని కొరకే ఆమె ఇంతసేపు ప్రార్ధించుచున్నది. అది నిజమైతే, అది సరైతే నీవు నీ చేతిని పైకెత్తగలవా.
100ఇక్కడ ఒక వృద్ద స్త్రీ, ఇక్కడే చివర కూర్చొని యున్నది. ఈ దినమే ఆమె ఈ ప్రాంతమునకు వచ్చియున్నది. జార్జియా నుండి ఆమె వచ్చినది. ఆమె శరీరము లోపల ఒక పెద్ద కణితిని ఆమె కలిగి వుంది. అది చాలా బాదిస్తున్నది. ఆమె నమ్మినట్లైతే, ఆమె బాగుపడుతుంది. ఆమె ఇప్పుడే వచ్చినది. ఆమె పేరు శ్రీమతి. టర్న్ర్. యేసుక్రీస్తు నిన్ను స్వస్థపరుస్తాడని ఇప్పుడు నీవు హృదయపూర్వకముగా నమ్ముదువా. దానిని నీవు నమ్ముదువా?
నీవు దేవుని యందు విశ్వాసముంచుదువా? నీవొక క్రొత్తదానివా? నీకు ప్రార్ధనా కార్డు లేదు, ఉందా? నీవు ఈ రోజే వచ్చావు. నీకుగా నీవు రాలేదు గానీ, ఒకరెవరో నిన్ను ఇక్కడికి తీసికొని వచ్చారు. నీవు పైనున్న జార్జియా రాష్ట్రం నుండి వచ్చితివి, నీవు ఇప్పుడు దేవుడు చేస్తాడని నమ్ముదువా… నిన్ను నీ కుమారుడు ఇక్కడికి తీసికొని వచ్చాడు, అది నిజమేనా? ఇప్పుడు నిన్ను గూర్చిన ఇన్ని విషయాలు నాకు తెలియటం పూర్తిగా అసాధ్యం, ఎందుకనగా నీవు కొద్ది సేపటి క్రితమే ఇచ్చటికి వచ్చావు, ఇక్కడ కూర్చొని యున్నావు, అది నిజమేనా, అలాగైతే నీ చేయిని పైకెత్తి చూపుము. చూశారా?
101ఇప్పుడు ఈ సంగతులన్నిటిని నాకు చెప్పిన ఆ పరిశుద్ధాత్మ ఇప్పుడు ఇక్కడున్న జనులకి విరోధముగా విషయములను పైకి తోడుచున్నాడు. చూశారా, జనులారా ఆయన గుర్తించబడియున్నాడు. దానిని చేయవద్దు. అలా నీవు చేయుచున్నట్లైతే, నీవు పెద్ద తప్పు చేయుచున్నావు. నేను నిన్ను ప్రేమించుచున్నాను. మీరు నా బోధ వినుటకు ఇక్కడికి వచ్చారు. గుర్తుంచుకోండి, దానిని నేను అభినందించుచున్నాను. ప్రేమ సరిచేయును. నీ బిడ్డ బయట వీధిలో ఉన్నాడనుకో, "జూనియర్ నీవు అలా ఉండరాదు?" అని నీవు అంటే సరిపోదు కదా! నీవు నిజంగా బిడ్డను ప్రేమిస్తే, స్వయంగా నీవే బయటకు వెళ్ళి, బిడ్డను లోపలికి తేవాలి కదా! ప్రేమ సరిదిద్దును; వీపు పై తట్టడము కాదు. నేను నిన్ను సరిదిద్దవల్సివుంది. మీ కానుకలు మరియు సహకారములే కూటముల ఖర్చులను చెల్లించినది, ఇక్కడ వుండ వీలు కల్పించినది.
నా హృదయపూర్వకముగా నేను మిమ్మును ప్రేమించుచున్నానా? సహోదరి, నీవు చేయు కార్యములకు విరోధముగా నేను బోధించానని బహుశా నీవు అనుకొనవచ్చును. నిజానికి నీకు విరోధముగా నేనేమి కలిగియుండలేదు సహోదరి. నీ యెడల నాకున్న దైవిక ప్రేమ ఇది. ఎవరో ఇలా అన్నారు, "నీవు కుర్రాడివైతే, నీవలా తలంచేవాడివి కావు." నేను కూడా పద్నాలుగేళ్ళ ప్రాయంలో వున్నప్పుడు అలానే తలంచాను. అలా వుందురని బైబిల్ చెప్పుచున్నది. గనుక అది ఇప్పుడును అదే విధముగా ఉన్నది.
LUKE 17:30•
HEB 13:8
102ఆ తప్పును నీవు చేయవద్దు. పరిశుద్ధాత్మను పొందితిని అనేదానికి బాషలు మాట్లాడుట అనేది సూచన అనే దానిని నీవు నమ్ముదువా? పరిశుద్ధాత్మ బాషలలో మాట్లాడును. ఆత్మలో నాట్యమాడుట, ఏదో ఒక ఉద్రేకం అనే వాటి యందు నీవు నమ్మకమును కలిగియుంటివా. క్రీస్తు ఒక వ్యక్తి. నిశ్చయముగా ఆయన వాక్యమైయున్నాడు. ఆయన ఇక్కడ వున్నట్లైతే, వాక్యము ఎలా వుండాలో సరిగ్గా అలానే వుండునట్లు ఆయన ఎల్లప్పుడు తన వాక్యమును జరిగించును. దానిని నీవు త్రిప్పి వేస్తే అది క్రీస్తు అని నీవు ఎలా చెప్పగలవు? "ఇంటికి రమ్ము, రమ్ము." ద్వారము ఇంకను తెరువబడే వున్నది.
గుర్తుంచుకో, తీర్పు యొద్ద నేను నిరపరాధిగా వుందును.
"అలసినవారు…" క్రీస్తు మీ మధ్య వున్నాడని రుజువు చేసికొన్నాడు. అదే ఆత్మ అని నిరూపించుకొన్నాడు. ఆయన అన్నాడు, "మనుష్యకుమారుడు ప్రత్యక్షమగు దినములలో…" ఆయన నిన్న, నేడు, ఏకరీతిగా ఉన్నాడు, అప్పుడు మురికి కాళ్ళతో కూర్చొన్న అదే యేసు మారనివాడిగా వున్నాడు. ఒక వేషదారి యొద్దకు తిరిగి వచ్చునా? అది వాక్యమని తెలుసుకొనుటకు అదియే ఖచ్చితమైన గుర్తింపు. నేను సత్యమును చెప్పుచున్నాను. దానిని వదులుకోవద్దు.
"ఇంటికి రమ్ము…"
MATT 5:18
103చివరి సారిగా… మిమ్మును కలిసికొనుటకు ఇచ్చట నిలబడియున్నాను. గదులన్ని, అక్కడ కావల్సినన్ని గదులున్నవి. ప్రజలు అంతటా మోకరించియున్నారు. "అలసిపోయిన వాడా, ఇంటికి రమ్ము…"
దేవా, దయ చూపు, దయ చూపు. ఆ దుఃఖమును నీవు అనుభవించలేకున్నావా?
మృదువుగా, దయగా, యేసు పిలచుచున్నాడు.
పిలుచుచున్నాడు, ఓ పాపి, ఇంటికి రమ్ము!
ఇంటికి రమ్ము, ఇంటికి రమ్ము.
(యవ్వనుడా, దేవుడు నిన్ను దీవించును గాక. గొప్ప నిర్ణయం.)
……ఇంటికి రమ్ము;
మృదువుగా, దయగా, యేసు పిలుచుచున్నాడు;
పిలుచుచున్నాడు, ఓ పాపి…
పాపి అంటే ఎవరు? పొగ త్రాగేవారు కాదండి, పొగత్రాగటం పాపం కాదు. మద్యం సేవించడం పాపం కాదు. శపించటం పాపం కాదు. వ్యభిచారం చేయటం పాపం కాదు. లేదు, లేదు. అవన్నీ అవిశ్వాసము యొక్క లక్షణములు. నీవు వాటిని చేస్తున్నవ౦టే దానర్థం నీవు ఒక విశ్వాసివి కాదన్నమాట. రెండే విషయాలున్నాయి, నీవు ఒక విశ్వాసివైన కావాలి, లేదా విశ్వాసివి కాకుండా నైనా వుండాలి. నీవొక విశ్వాసివి కాకపోతే, వీవెంత మతసంబ౦దివైనా సరే, బైబిల్ నందు ప్రతి వాక్యమును, దాని యొక్క ప్రతి మాటను నీవు అంగీకరించనట్లైతే వీవింకను పాపివే అగుదువు.
"భూమి, ఆకాశములు గతించినను, నా మాటలలోని ఒక సున్నా అయినా, ఒక పొల్లు అయినా తప్పిపోదు." దాన్ని గూర్చి లెక్క మన౦ అప్పగించవల్సి వుంది. "మంచిది, నేను సంఘమునకు చెందియున్నాను, నా జనులు దానిని ఒప్పరు…" అని అంటావేమో, దాని వల్ల ఏ లాభం లేదు. నీవేం చేసావో నేను లెక్క చేయను. "నేను మాత్రం దీనిని చేతును." నీవు ఒక పాపిగానైనా వుండాలి, లేదా ఒక విశ్వాసిగానైనా వుండాలి. అదే బలముగా వుండును. నేనీ సంగతులు ఎందుకు చెప్పుచున్నానంటే నీ హృదయంతరంగమును ఎరిగిన ఆయనే నన్ను ఈ మాటలను చెప్పమనుచున్నాడు.
104అ౦దరూ వచ్చారా? మరొక ఇద్దరు రావటాన్ని నేను చూచుచున్నాను. నేను ఇంకా వేచి యుంటున్నాను, ఎందుకనగా ఇంకా ఎవరైనా వస్తారేమో. కేవలము కొద్ది క్షణములు.
నీళ్ళు కదులుచున్నప్పుడే నీవెందుకు రాకూడదు? తిరిగి ఇక్కడ కొద్ది నిమిషములలో ఒక గొప్ప సంగతిగా నీవు వుండెదవు. రమ్ము, రాలేవా? అలాగైతే అక్కడే వుండి నీ చేతిని పైకెత్తి చూపుము. "ప్రభువగు దేవా, నేను చేసిన దానిని క్షమించుము. నేను నీకు మాట ఇచ్చుచున్నాను. నేను ఒక క్రైస్తవునిగా వుంటానని అన్నాను. కాని ప్రభువా నాలో ఏదో వుండి నాతో చెప్పుచున్నది, అదేమనగా ప్రభువైన యేసుక్రీస్తుగా తన్నుతాను గుర్తించుకొనుచున్న వాని యొక్క సన్నిధిలో ఇప్పుడు నేను ఖండించబడుచున్నానని, నా హృదయములో నేనిప్పుడు ఖండించబడుచున్నాను. నేను ఖండించబడుచున్నాననే సంగతి చాలా తేటగా ఇప్పుడు నాకు తెలుపబడుచున్నది. కావున ఇప్పుడు నేను ఇక్కడే సరికాగోరుచున్నాను. ఇది మొదలుకొని ఖచ్చితముగా నేను ఆయన కొరకు బ్రతుకుదునని దేవునికి నేను ప్రతిజ్ఞ చేయుచున్నాను." మీరది చేయరా? మంచిది.
105ఆ విధముగా, మనము ఆ విధముగా చేయుచూ ఇప్పుడు అందరం కలిసి ఒక నిమిషం పాటు లేచి నిలబడదాం, అలాగే బయట వున్నవారు కూడా, నేను పాడాలని ఆశపడుచున్నాను. ఆ పాట పాడాలని కోరుచున్నాను.
క్షమించు, ప్రభువా, మరియు మరొకసారి నన్ను రక్షించుము.
నేను నీవాడనగుదును, ప్రియ దేవా, నీవు నావాడవైతే,
నేను పడిపోయినా, లేదా నేను తప్పిపోయినా,
మరొకసారి లేపి నన్ను రక్షించుము.
క్షమించు, ప్రభువా, మరియు మరొకసారి నన్ను రక్షించుము.
సరే ఇక్కడ క్రైస్తవులెందరున్నారు. మీరు క్రీస్తులో లంగరు వేయబడివున్నారని నమ్మితిరా, రాబోవుచున్న తీర్పు కొరకు సిద్ధపడియున్నారా? బూర మ్రోగినప్పుడు, కొనిపోబడుట తప్ప మరే కార్యం మిగలలేదు. అది చాలా త్వరగా జరుగును, ఏం చేయటానికి కొద్దిగా కూడా సమయముండదు, "ఒక నిమిషములోనే, కను రెప్పపాటునే మనం మార్పు చెందుదుము." దాని కొరకు నీవు సిద్దపడి వుండాలి. ఈ దినాలలో ఒక దినాన అది సంభవిస్తే మరి నీ గతి ఏమిటి? దానిని నీవు పోగొట్టుకున్నట్లైతే, నిత్యముగా, ఎన్నటిన్నటికి దూరమౌతావు సుమా. క్షణికమైన ఇహలోక సౌఖ్యాలు నీవు కోరవద్దు. వాటిలో ఏమీ లేదు.
106ఇప్పుడు, మనమందరం మన జీవితాలను క్రీస్తుకి సమర్పించుకోవల్సి వుందని నేననుకొనుచున్నాను. మరి నీకలా అనిపించట్లేదా? ఈ రాత్రే మీలో ఎంతమంది మరలా మీ జీవితములను పునఃప్రతిష్టించగోరుచున్నారు?
ఇప్పుడే నేను నా జీవితమును పునఃప్రతిష్టించుకొందును ప్రభువా… ఇప్పుడు తలంచండి… ఏ పాపము నిన్ను చిక్కులు పెట్టుచున్నది, ఇప్పుడు మనము, మనలో ప్రతి ఒక్కరం మన చేతులను దేవుని తట్టు ఎత్తెదము. మీరు మీకు ఎలా కుదిరితే అలా మీ చేతులెత్తండి. ఆయన సర్వవ్యాప్తి అని గుర్తుంచుకోండి. ఇప్పుడు ఇక్కడ సుమారు పద్దెనిమిది వందల మంది లేక రెండువేల మంది బహుశా ప్రార్ధించుచుండవచ్చును, మరిప్పుడే లోకమంతట లక్షలాది మంది ప్రార్ధించుచున్నారు. అయినను ఆయన ప్రతి ఒక్కరి ప్రార్ధనను వినుచున్నాడు. ఆయనకి తెలియకుండా కనీసం ఒక పిచ్చుకైనా వీదిలో పడిపోలేదు. నీ హృదయాంతరంగములో ప్రతి ఆలోచనను ఆయన ఎరిగియున్నాడు.
మన సొంత విధానంలో ప్రతి ఒక్కరం ప్రార్ధిద్ధా౦, క్రీస్తుకి మనల్ని మనం అర్పించుకొందాం.
1JN 1:9
107ప్రభువైన యేసూ, నా ఊపిరి సల్పలేనంత బలముగా కొద్ది నిమిషాల క్రితం నుండి నీ సన్నిధి మా మధ్యకొచ్చినది. నేను విడిచి పెట్టి పోదునేమో అన్నట్టు అది అనిపించినది. నీవు ఈ రీతిలో దీనిని చేయగోరితివనే ఒక ఉద్దేశ్యమును నేనెరుగుదును. అది నాకు అర్ధం కాలేదు. ప్రభువా, కాని నీవు దానిని చేసితివి, ఎందుకనగా నీవు దేవుడవు. నీవు ఇచ్చట ఉన్నావని మేమెరుగుదుము.
మరియు ఇక్కడ, ఈ కట్టడములో వందల చేతులు ఎత్తబడినవి. మమ్మును మేము మరొకసారి నీకు సమర్పించుకొనుచున్నాము. ప్రభువా, నేను బోధించిన ఈ బలిపీఠము మీద, ఈ వారమంతా నీవిక్కడ నిలబడి నిన్ను నీవు గుర్తుంచుకొన్న సంగతిని నేను చూచితిని, నన్ను నేను నీకు పునఃప్రతిష్ఠించుకొనుచున్నాను. నీ సేవ కొరకు మరొకసారి నన్ను నేను సమర్పించుకొనుచున్నాను.
నేను అలసిపోయాను అని చెప్పిన నా పిర్యాదులన్నిటిని బట్టి నన్ను క్షమించుము, మరియు దేవా, నీ రెక్కల్లోనికి నన్ను తీసికొనుము. ప్రభువా, మమ్మునందరిని తీసికొనుము. ప్రభువా, ఇహలోక చింతల నుండి మరియు ఈ లోక కార్యముల నుండి మమ్మును తప్పించుము, తద్వారా మేము పూర్తిగా నీకు సమర్పించబడిన వారమగుదుము, ప్రభువైన యేసుక్రీస్తు యొక్క సమర్పణగల సేవకులమగుదుము. తండ్రి, దీనిని అనుగ్రహించుము. ఈ రాత్రి, మా మనవి ఆలకించుము.
పరిశుద్ధాత్మ బాప్తిస్మము కొరకు ఎవరైతే వెనుక వైపున వుండి అడిగియున్నారో వారిని దీవించుము, మరోకసారి పరలోకము నుండి శబ్దము, బలమైన గాలివంటి ద్వనివలే దిగివచ్చును గాక. దేవుని బలిపీఠము మీద నుండి అగ్ని దిగివచ్చి, ఇక్కడున్న ప్రతి ఒక్కరిని ని౦పును గాక. నిన్ను స్తుతించుచున్నాము. మమ్మును చేర్చుకొన్నందుకు నీకు కృతజ్ఞతలు, మరియు స్తుతులు చెల్లించుచున్నాము. "మేము మా పాపములను ఒప్పుకొంటే వాటిని క్షమించుటకు దేవుడు నీతిమంతుడును, నమ్మదగినవాడని,'' నీవు పలికిన మాటకై మేము నీకు స్తుతులు చెల్లించుచున్నాము. మేమంతా క్షమించబడునట్లు, ప్రభువా, దానిని దయచేయుము. పాపములను మేము ఒప్పుకొన్నందున ఈ దేశము ఎన్నడూ చూడని అతి గొప్ప స్వస్థత ఉజ్జీవమును మాకు చూపించుము. ప్రభువా, దానిని అనుగ్రహించుము. యేసుక్రీస్తు నామమున మమ్మును మేము నీకు సమర్పించుకొనుచున్నాము. ఆమెన్.
బ్రదర్ కాక్స్ రండీ. మీ సమస్తము దేవునికి సమర్పించుకొనుడి. ఇప్పుడు నేను మీ పాస్టర్లలో ఒక రైన బ్రదర్ కాక్స్ ని ఇక్కడికి వచ్చి ప్రార్ధనను కొనసాగించమని కోరుచున్నాను.