తెర తొలగించబడిన దేవుడు
1ప్రార్ధన కొరకు ఒక్క క్షణము మన తలలు వంచియుండగా, లేచి నిలబడుదుము.
మా కృప కలిగిన ప్రభువా, మీ రాకడకు ముందు ఈ భూమి మీద మేము ఈ విధముగా కూడుకొను భాగ్యము ఇచ్చినందుకు నిశ్చయముగా మేము నేడు కృతజ్ఞులమైయున్నాము. ఆయన ప్రత్యక్షమగు ఘడియకు మేము సిద్ధముగా యున్నామా అనియు, అందుకొరకై మేము విశ్వాసమును కలిగియున్నామా అనియు నీ వాక్యము ద్వారా మేము మా హృదయములను పరీక్షించుకొందుము గాక! ''నిద్రించినవారితో కూడా మనమును లేపబడి, మధ్యాకాశములో ప్రభువును కలిసికొందుము, సదా ప్రభువుతో ఉందుము.'' మేము ఆ వాక్యము చెప్పుచున్న రీతిలో ఉండవలెను.
ఇంకా లోకములోను, జనుల మధ్య ఉన్న నిజ క్రైస్తవాత్మనుబట్టి నీకు మేము కృతజ్ఞతలు తెలుపుచున్నాము, వందనములు. వారు ఇంకను నిన్ను, నీ వాక్యమును నమ్ముచున్నారు. కావున నేడు నీ ఆశీర్వాదములు మాపై కుమ్మరించమని మేము అడుగుచున్నాము. మా ఒక్కొక్కరి అవసరతనుబట్టి నీ దీవెనలు కుమ్మరించుము. వాక్యము ద్వారా నీరు పెట్టబడి ఈ చివరి దినములలో నీ చేతిలోని సాధనములుగా వాడబడునట్లు ఎదుగ చేయుము. ఆయన ప్రత్యక్షమగుటను మేము ఎదురుచూచు, మా గొప్ప కాపరియగు ప్రభువగు యేసుక్రీస్తు నామములో దీనిని అడుగుచున్నాము. ఆమేన్.
మీరు కూర్చోవచ్చును.
2మరలా ఈ ఉదయకాలమునందు ఇచ్చటకు నేను వచ్చి యుండుట మహా గొప్ప భాగ్యముగా ఎంచుచున్నానని చెప్పాలని ఆశించుచున్నాము. కావలసినంత చోటు కూర్చొనుటకు లేనందుకు చింతించుచున్నాము. ఈ రాత్రి రోగులకు ప్రార్ధించ ప్రయత్నించెదము. ఈ ఉదయ కాలమున అలాగు చేయుట కొద్ది కష్టముగా నున్నది.
ఈ రోజు వర్తమానమును నేను టేపు చేయుచున్నాను. ఓ, దీనిని గురించి ప్రభువు నాతో ఒక నెల లేదా రెండు నెలలుగా మాట్లాడుచుండెను, ఇది పెద్ద వర్తమానము. బయట కూటములలో నాకు సమయము చాలదు, ఎందుకనగా ఆ ఆరాధన కొరకు ముప్పది లేదా నలుబది నిమిషములు మాత్రమే నాకు అనుమతి యివ్వబడుచున్నది. అటు తర్వాత మనము, ఎందుకనగా జనులు మరల పనులకు వెళ్ళవలసియున్నారు. నా వర్తమానమును కుదించినచో బాగుండునని నాకు అనిపించుచున్నది. అచ్చట దీనిని రికార్డు చేయుటకు వారికి సమయముండుట లేదు, కాబట్టి ఈ గుడారమునకు వచ్చు వరుకు వేచియుండి ఇచ్చట దీనిని రికార్డు చేయించాలని నేను తలంచితిని. ఇది కొంచెము పెద్ద వర్తమానము, మీరు నిలబడియున్నారని నేనెరుగుదును. నాకు సాధ్యమైనంత వరుకు నేను దీనిని త్వరగా ముగించెదను. మరొకరికి మీరు కూర్చున్న కుర్చీల నుండి లేచి కూర్చొనుటకు స్థలమిచ్చినయెడల, అది నన్నేమి ఇబ్బందిపరచదు. అది నిజంగానే నాకేమి ఇబ్బంది అనిపించదు, ఎందుకనగా ఇది ప్రత్యేకమగు దినము గనుక ఈ రికార్డింగు చేయుచున్నాము.
ప్రభువు సువార్త కూటములలో చేసిన గొప్ప కార్యములను గురించి మాకు మంచి వార్తలు వచ్చుచున్నవి, వీలయినచో ఈ రాత్రికి సమయముండును గనుక వాటిని గూర్చి చెప్పెదను, దానికి ఎక్కువ సమయమిచ్చెదను.
3మీ ప్రతి ఒక్కరిని దేవుడు దీవించునని నమ్ముచున్నాను. మీ హృదయములు సంతోషముతో నిండియున్నవని నాకు తెలియును. ప్రభుని రాక కొరకు ఎదురుచూచుచున్నారు. జరుగుచున్నవాటిని చూచి నా సంతోషము ఉప్పొంగుచున్నది. దేశములో పోరాటములు, సంఘము యొక్క పరిస్ధితి చూడండి, లోక సంబంధముగాను, ఆత్మ సంబంధముగాను ఆయన రాకడ గురుతులు చూడండి. ఆయన రాకడ సమయము చాలా సమీపముగా నున్నదని ఎరుగుడి. ఒక దినమున మనము మార్పుచెందుదుమని ఎరుగుదుము గనుక మన హృదయములు ఆనందముతో నిండియున్నవి. ఇప్పుడు మనమున్న స్ధితిలోనుండి మారుదుము.
4టెలిఫోను సంబంధము ఏర్పాటు చేయుట ద్వారా ఫీనిక్సు, ఇంకా ఆయా ప్రాంతములలోని వారు ఈ వర్తమానమును వినుచున్నారని నేను తలంచుచున్నాను. నాకు పూర్తిగా ఇది తెలియదు, ఇక్కడికి వచ్చుటకు ముందే అది నాకు తెలిసినది అక్కడున్నవారు మంచి ఆరోగ్యమును కలిగి ప్రభువుయొక్క మహిమను అనుభవించుచున్నారని నమ్ముచున్నాను.
5ఇప్పుడు ప్రభుని వాక్యము తెరువబోవుచున్నాము. ఇచ్చటకు మనము వచ్చిన కారణమేమనగా, దేవుని యొక్క ప్రసన్నతను రుచి చూచుటకు, మన గురించి మనము జాగ్రత్త వహించియుండుటకే. ఇచ్చట ఉండాలని మనము ఇచ్చటకు రాలేదు, ఏ మనిషి కూడా ఇటువంటి వేడి వాతావరణములో ఇచ్చుటకు వచ్చి కూర్చొందురని ఎవరు తలంచరు. దేవునితో దగ్గరగా నడువలెనను ఉద్దేశ్యముతో మనము ఇక్కడ ఉన్నాము, ప్రభువైన యేసు మనకు తోడైయున్నాడని మనము నమ్ముచున్నాము. ఆయనతో మనము సన్నిహితంగా నడువవలెనని ఇక్కడికి చేరాము.
6ఈ వేడి నాకు కొద్ది బాధ కలిగించుచున్నది. టుసాన్‌లోని పొడి వాతావరణమునకు నేను అలవాటుపడితిని. అక్కడ ఇక్కడికంటె ఎండ ఎక్కువే గాని అది పొడిగా నుండును, మన తేమ ఒక్కోసారి ఒకటిలో ఇరవై భాగము కూడా ఉండదు. ఒక వేళ అలాగు యుండవచ్చునేమో, అనగా దాదాపుగా ఒక ప్రాణవాయువు ఒక గూడులో ఉన్నట్లుగానే అది యున్నది. కాని ఇక్కడ తేమయున్నది, మేము ఇచ్చట చెప్పుచున్నట్లుగా తడిగుడ్డను పిండినట్లుగా యుండును. అందువలన అది మీకు చాలా ఇబ్బందిగా యుండును, దానిని నేనెరుగుదును. పిల్లల తల్లులు, ముసలివారు, యువకులు అందరూ మీరు ఈ విధముగా నిలబడియుండుట కష్టముగానే యుండును. మీ త్యాగముబట్టి ప్రభువు మీకు బహుమానము ఇచ్చునని ఆశించుచున్నాను.
7సహో. రాయ్ బార్డర్స్ ఇచ్చటనే యున్నాడని నమ్ముచున్నాను. ఆ విధముగా ప్రకటించుటను నేను ఆలకించితిని, కాని లోనికి రాలేకపోయినట్లు తలంచుచున్నాను. సరే, ఈ కూటములకు అతడే నిర్వాహకుడు.
మన మధ్య ఉండిన ఒక వ్యక్తి ఈ ఉదయాన ప్రభువుతో నుండుటకు వెళ్ళినట్లు ప్రకటించుచున్నాము. అతడు మిచిగన్ వాసియగు సహో. జాక్‌సన్. స్టర్గిస్ నుండి వచ్చెను. అతడెట్లు చనిపోయెనో ఎవరికీ తెలియదు. కావున ఇప్పుడు మిచిగన్ - స్టర్గిస్ నుండి మనమధ్య ఉండి వచ్చు ఒక వ్యక్తియగు సహోదరుడు జాక్సన్ ఈ ఉదయమున ప్రభువుతో నుండుటకై వెళ్ళిపోయెనని మీకు తెలియజేయుచున్నాను. దానిని గూర్చిన పూర్తి వివరములు నాకు అందలేదు. అతడు చక్కగానే యుండెను. సహో. జాక్‌సన్ క్రైస్తవుడయినందుకు ప్రభువుకు వందనములు చెల్లించుచున్నాను. చాలా సంవత్సరముల నుండి అతనిని నేను చూడలేదు, కాని అతడు చనిపోయినట్లు చూచిరో లేదా వేరే ఏమైనా అనేది తెలియుదు. (దేవుడా యోధుని ఆత్మకు శాంతి ఇచ్చును గాక!) అతడు వెళ్ళిపోవలసిన సమయము వచ్చెను. దేవుడు దానిగూర్చి మనకుగాని, అయనకు గాని ఏమీ ముందు హెచ్చరింపలేదు. అతడు వెళ్ళిపోయెను, ఆ విధంగా ఇది జరిగినది. నేను సాధ్యమైనంత త్వరగా అతని భార్యను పిలచి మన సంతాపము తెలియచేసెదను. అతని ధైర్యమగు క్రైస్తవ జీవితమునుబట్టి దేవునికి వందనములు చెల్లించవలెను. భూమి మీద ఒక అర్ధవంతమగు జీవితము జీవించెను, ముఖ్యంగా ఈ స్థానిక సంఘములో అలాగు అతడుండెను.
8ఈ రాత్రి రోగుల కొరకు ప్రార్ధించుదునని మేము ప్రకటించాము. రోగుల గూర్చి ఈ రాత్రి ఎక్కువగా మాట్లాడుదును.
కాని ఈ సమయములో తిన్నగా వాక్యము లోనికి వెళ్ళుదము, ఎందుకనగా చాలా వేడిగా, ఇరుకుగా యున్నది. మనము సూటిగా వాక్యములోనికి వెళ్ళుదము. ఈ ఉదయమున వాక్యభాగములో నుండి రెండు సందర్భములను చదువుదము. నేను చెప్పగోరుదానికి మూలము ఇక్కడినుండియే నాకు దొరుకును.
సహో. సాద్‌మన్ తదితరులు టేపును ప్రజలకు అందించు ముందు నాకు వినిపించవలెనని కోరుచున్నాను.
9ఫిలిప్పీ రెండవ అధ్యాయము 1 నుండి 8 వరకు; 2వ కొరింధీ 3వ అధ్యాయము 6వ వచనము నుండి 2వ కొరింధీ 4 వరకు చదువుదము. మొదటిగా ఫిలిప్పీ 2వ అధ్యాయమును నేను ముందుగా చదివెదను.
చదువుటకు ముందుగా, మనము ప్రార్ధించుదము:
MATT 24:7•
LUKE 21:10,26•
JOHN 17:17•
REV 5:3,5
10ప్రభువైన యేసూ, నీ వాక్యమే సత్యము. మేము గందరగోళ ఘడియలో జీవించుచున్నాము, దేశము మీద దేశము లేచుచున్నది, కరవులు, చాలా చోట్ల భూకంపములు వచ్చుచున్నవి, మానవుల గుండెలు చెదరిపోవుచున్నవి, భయపీడితులగుచున్నారు. గోడమీద చేవ్రాతను మేము చూచుచున్నాము. ఇప్పుడు దీనిని సమస్త లోకము చూచునట్లు అది ప్రకృతి యొక్క ఆధీనములో యున్నది. కాని ఇప్పుడు అచ్చట ఒక ఆత్మీయత యొక్క ప్రభావముగా కూడా యున్నది. గొప్ప సంఘటనలు జరుగుట చూచుచున్నాము. వాటిని గూర్చి మనమీనాడు చెప్పుకొనుచున్నాము.
నీ వాక్యము ద్వారా మా హృదయములను దీవించుము. ఈ గ్రంథమును తీసికొనుటకు గాని, ఈ ముద్రలను విప్పుటకు గాని కనీసము దానిని చూచుటకు గాని యోగ్యులెవరూ భూమ్యాకాశముల మీద ఎవరూ లేరని మేమెరుగుదుము, కాని అచ్చట ఒకాయన దృశ్యములోకి వచ్చి వధింపబడిన గొర్రెపిల్ల రక్తము కార్చుచూ వచ్చి ఆ గ్రంథమును తీసుకొని, దానిని తెరచుటకు యోగ్యతను కలిగియుండెను. ఓ దేవుని గొర్రెపిల్లా, మా హృదయముల ఆదరణ కొరకు దానిని నేడు విప్పుము. మేము నీ దాసులము ప్రభువా, మా పాపములు క్షమించుము. నేడు మా జీవితములలో గొప్ప శక్తి, ప్రభావము కలిగించకుండా వాక్యమును అడ్డగించుచున్న దానిని తీసివేయుము. నీ వాక్యము ద్వారా ఏ ఆశీర్వచనములు పొందుమని వాగ్దానము చేయబడెనో, ఆ వాగ్దానములు పూర్తిగా పొందకుండా అడ్డగించుచున్నవాటిని, ప్రభువా తీసివేయుము. యేసు నామములో దీనిని అడుగుచున్నాము. ఆమేన్.
PHIL 2:1-8
11ఫిలిప్పీ 2:1-8
కావున క్రీస్తునందు ఏ హెచ్చరికయైనను, ఆత్మయందు ఏ సహవాసమైనను, ఏ దయారసమైనను, వాత్సల్యమైనను ఉన్నయెడల,
మీరు ఏక మనస్కులగునట్లుగా ఏక ప్రేమ కలిగి ఏక భావము గల వారుగా ఉండి ఒక్కదానియందే మనుస్సుంచుచూ నా సంతోషమును సంపూర్ణము చేయుడి.
కక్షచేతనైనను, వృధాతిశయము చేతనైనను ఏమియు చేయక, వినయమైన మనస్సుగలవారై ఒకనినొకడు తనకంటె యోగ్యుడని ఎంచుచు, మీలో ప్రతివాడును తన సొంత కార్యములను మాత్రమే గాక ఇతరుల కార్యములను కూడా చూడవలెను.
క్రీస్తు యేసునకు, కలిగిన ఈ మనస్సు మీరును కలిగియుండుడి.
ఆయన దేవుని స్వరూపము కలిగినవాడై యుండి, దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని,
మనుష్యుల పోలికగా పుట్టి, దాసుని స్వరూపమును ధరించుకొని తన్నుతానే రిక్తునిగా చేసికొనెను.
ఆయన ఆకారమందు మనుష్యుడుగా కనబడి, మరణము పొందునంతగా, అనగా సిలువ మరణము పొందునంతగా విధేయత చూపినవాడై తన్నుతాను తగ్గించుకొనెను.
2COR 3:6-18•
2COR 4:1-3
12ఇప్పుడు, 2వ కొరింధీయులు 3వ అధ్యాయము 6వ వచనము నుండి 18వ వచనము వరకు చదువుదము. 4వ అధ్యాయారంభము వరకు.
ఆయనే మమ్మును క్రొత్త నిబంధనకు అనగా అక్షరమునకు కాదు గాని ఆత్మకే పరిచారకులమవుటకు మాకు సామర్థ్యము కలిగించియున్నాడు. అక్షరము చంపును గాని ఆత్మ జీవింపచేయును.
మరణ కారణమగు పరిచర్య రాళ్ళ మీద చెక్కబడిన అక్షరములకు సంబంధించినదైనను, మహిమతో కూడినదాయెను. అందుకే మోషే ముఖము మీద ప్రకాశించుచుండిన ఆ మహిమ తగ్గిపోవునదైనను ఇశ్రాయేలీయులు అతని ముఖము తేరి చూడలేకపోయిరి. ఇట్లుండగా ఆత్మ సంబంధమైన పరిచర్య ఎంత మహిమగలదై యుండును?
శిక్షావిధికి కారణమైన పరిచర్యయే మహిమ కలిగినదైతే, నీతికి కారణమైన పరిచర్య ఎంతో అధికమైన మహిమగలదగును.
అత్యధికమైన మహిమ దీనికి ఉండుట వలన ఇంతకు మునుపు మహిమకలదిగా చేయబడినది ఈ విషయములో మహిమలేనిదాయెను.
తగ్గిపోవునదే మహిమగలదైయుండిన యెడల నిలుచునది మరి ఎక్కువ మహిమగలదై యుండును గదా?
తగ్గిపోవుచున్న మహిమయొక్క అంతమును ఇశ్రాయేలీయులు తేరిచూడకుండునట్లు మోషే తన ముఖము మీద ముసుగు వేసికొనెను. మేమట్లు చేయక ఇట్టి నిరీక్షణగలవారమై బహు ధైర్యముగా మాటలాడుచున్నాము. మరియు వారి మనస్సులు కఠినములాయెను గనుక నేటివరకును పాత నిబంధన చదువబడునప్పుడు అది క్రీస్తునందు కొట్టివేయబడునని వారికి తేటపరచబడక ఆ ముసుగే నిలచియున్నది.
నేటివరకును మోషే గ్రంథము వారు చదువునప్పుడెల్ల ముసుగువారి హృదయముల మీద నున్నది గాని, వారి హృదయము ప్రభువు వైపునకు ఎప్పుడు తిరుగునో అప్పుడు ముసుగు తీసివేయబడును.
మనమందరమును ముసుగులేని ముఖముతో ప్రభువుయొక్క మహిమను అద్దమువలె ప్రతిఫలింపచేయుచు మహిమ నుండి అధిక మహిమను పొందుచు ప్రభువగు ఆత్మచేత ఆ పోలికగానే మార్చబడుచున్నాము.
కాబట్టి ఈ పరిచర్య పొందినందున కరుణింపబడినవారమై అధైర్యపడము.
అయితే కుయుక్తిగా నడుచుకొనకయు, దేవుని వాక్యమును వంచనగా బోధింపకయు సత్యమును ప్రత్యక్షపరచుటవలన ప్రతి మనుష్యుని మనసాక్షి యెదుట మమ్మును మేమే దేవుని సముఖమునందు మెప్పించుకొనుచు అవమానకరమైన రహస్యకార్యములను విసర్జించియున్నాము.
మా సువార్త మరుగుచేయబడినయెడల నశించుచున్నవారి విషయములోనే మరుగుచేయబడియున్నది.
13చదువబడిన ఆయన వాక్యమును ప్రభువు దీవించు గాక!
ఈ ఉదయకాలపు నా అంశమును దేవుడు బయలుపరచునని నేను నమ్ముచున్నాను. మీరు టేపులను తీసుకొని వాటిని ఆలకించినప్పుడు, ప్రతీసారి మీకు ఒక ఆత్మీయ అవగాహన ఏర్పడుచున్నదని నేను తలంచుచున్నాను, దానిని నేను నమ్ముచున్నాను. దేవుడు సంఘమునకు దేనినైతే చెప్పాలని ఆశించుచున్నాడో దానిని ఆయన సంఘములో సూటిగా చెప్పకుండా ఈ విధముగా చెప్పుచున్నాడు, చూచారా. కొన్ని సమయములలో సంఖ్య తగ్గిపోవలెననే కారణము చేతనే ఈ విషయములను ఆ విధముగా చెప్పవలసి వచ్చుచున్నది. ఆ విషయమును మేము చెప్పినప్పుడు కొంతమందిని అది వెలుపలికి వెళ్ళిపోవునట్లుగా అది చేయును, అదే విధముగా కొంతమంది ఆ విషయమును గూర్చి ఆలోచింపచేయునట్లుగా కూడా అది క్రియచేయును. కాని అది ఉద్దేశపూర్వకముగా అలాగు చెప్పుట జరుగుచున్నది. దానిని ఆ విధముగానే చెయ్యవలసి వచ్చుచున్నది.
JOHN 6:53
14అట్లైనయెడల, ''దేవుడు ఉద్దేశపూర్వకముగానే ఒక ఉద్దేశముతో ఒక కార్యమును ఆయన ఆ విధముగా చేయుచున్నాడని నీవనుచున్నావా'' అని మీరు అడుగవచ్చును. ఆయన ఖచ్చితముగా అలాగే చేయును. ఇంకనూ అలాగే చేయుచున్నాడు.
ఆయన చుట్టూ వేలాదిమంది పోగయిన ఒక దినమున ఆయనిట్లు చెప్పెను, ''మనుష్యకుమారుని శరీరము తిని, రక్తము త్రాగితేనే గాని మీకు నిత్యజీవముండదు.''
ఆయనకు యున్న సేవవంటి ఒక సేవను కలిగియున్న ఒక వ్యక్తి ఆ మాటను చెప్పిన యెడల, ఒక వైద్యుడు, లేదా నర్సు, లేదా విద్యగల వ్యక్తి ఆ మాటను విని ఏమనుకొందురు? ''శరీరము తినుటయా? ఇతడు నరమాంస భక్షకుడు, మానవ రక్తము త్రాగుటయా, అది పిశాచి పని. ఇంకో విధంగా చెప్పాలన్నచో మనల్ని నరమాంస భక్షకులముగాను, పిశాచములుగాను ఉండవలెనని ఆయన కోరుచున్నాడు.'' జనసమూహమంతా ఆయనకు దూరమయిరి.
JOHN 6:62,66
15ఏర్పాటు చేయబడిన డెబ్బదిమంది సేవక బృందము ఆయనకు ఉన్నది. ఆయన వారివైపు తిరిగి ఇట్లనెను ''మనుష్యకుమారుడు తాను దిగి వచ్చిన పరలోకమునకు అరోహణమగుట గూర్చి ఏమని తలంచుచున్నారు?'' దానిని గూర్చి ఆయన వివరించలేదు. ఏలాగో ఆయన ఎన్నడూ చెప్పలేదు, పౌలు ఆ తరువాత దానిగూర్చి చెప్పెను, ఆయన కేవలము చెప్పి ఊరుకొనెను. చూచారా. మనుష్యకుమారుడు పరలోకమునకు ఎక్కిపోవుట చూచినప్పుడు, ఈ సేవకులు ఏమందురు?
వారు నిస్సందేహముగా ఇట్లనియుందురు, ''ఒక్క క్షణము ఆగండి. ఆయనతో మేము భుజించాము. మేము ఆయన కలిసి చేపలను పట్టితిమి. ఆయనతో మేము నిద్రించాము. ఆయనెక్కడ పుట్టెనో మేమెరుగుదుము, ఆయన ఊగిన ఊయ్యాల మేమెరుగుదుము. ఈయన ఈ మాటను ఏలాగు చెప్పుచున్నాడు? ఇది కఠినమగు మాట.''
''వారాయనను వెంబడించక వెళ్ళిపోయిరని పరిశుద్ధ గ్రంథము చెప్పుచున్నది.''
JOHN 6:66-68,70
16అటు తర్వాత ఆయనతో పండ్రెండుమంది ఉండిరి, ఆయన ఆ పండ్రెండుమందిని ఏర్పరచుకొనెను, వారిలో ఒకడు అపవాది. అందుకే ఆయన వారివైపు చూచెను. ఆయన అప్పుడు చెప్పిన దానిని ఎవరునూ వివరించలేకపోయిరి. ఆయన మాంసమును తిని, రక్తమును త్రాగుట వారికెట్లు సాధ్యము? ఆయన ఈ భూమిమీదనే జన్మించెను గదా? పరలోకము నుండి వచ్చెనని ఎట్లు చెప్పుచున్నాడు? చూచారా? దానిని వారు అర్థము చేసికొనలేకపోయిరి. అంతట ఆయన అపోస్తులుల వైపు తిరిగి ''మీరును వెళ్ళిపోవలెనని తలంచుచున్నారా?'' అని అడిగెను.
అప్పుడే అపోస్తలుడగు పేతురు ఈ గొప్ప మాట పలికెను. ''ప్రభువా, మేమెవరి యొద్దకు వెళ్ళుదము?'' చూచారా? ''మేము సంతృప్తి చెందితిమి. నీవు మాత్రమే ఈ ఘడియకు జీవవాక్యమని నిశ్చయముగా తెలిసికొన్నాము. ఆ విషయములో మేము సంతృప్తిచెంది యున్నాము.'' చూడండి, దానిని వారు వివరించలేకపోయిరి. నీవు విశ్వాసమును వివరించలేవు. మీరు విశ్వసించుచున్నది ఏదో ఒక కార్యమైయున్నది, అది అంత దృఢమైనదిగా యుండుట చేత వేరే ఏదీ కూడా దానియొక్క స్థానమును తీసుకొనజాలదు. అందువలన, వారు జీవించుచున్న ఆ ఘడియలలో మెస్సీయా కాలము కొరకు వ్రాయబడిన వాక్యములో ఆయన ఆ స్థానమునకు చక్కగా సరిపోవుచున్నాడని వారెరిగియుండిరి. వారు విడిచి, వెలుపలికి వచ్చిన ఆ చల్లారిపోయిన సాంప్రదాయ సంఘములోకి మరలా వెళ్ళినయెడల వారికి ఏ ప్రయోజనముగలదు. ''మేమెక్కడికి పోదుము?'' అనిరి. చూచారా? ''నీవే జీవవాక్యముగలవాడవని మేము పూర్తిగా నమ్మియున్నాము,'' చూడండి. దానిని వారు వివరించలేకపోయిరి, కాని దానిని వారు నమ్మిరి, చూచారా.
ACTS 17:22
17యేసు తన చుట్టూనున్నవారిలో ఒక గుంపును ఏర్పరచుకొనుచుండెను. వారందరిలోను పన్నెండుమంది మాత్రమే ఆయనెవరైయుండెనో పూర్తిగా ఎరిగియుండిరి. ఆయన మాత్రమే దేవుడని వారెరిగియుండిరి.
ఈ ఉదయ కాలమున నేను మాట్లాడబోవు అంశమేమనగా, ఆ దేవుడిని బయలుపరచుట లేదా తెరను తొలగించుట.
ప్రతి కాలములోను దేవుడు ఒక తెర వెనుక ఉండెను, కాని ఆయన ఎప్పుడూ దేవుడే, చూచారా. కాని ఆయన తన్నుతాను లోకములో దాచుకొని, ఆ దినములలో యున్న అపోస్తలులవంటి ఏర్పరచుకొనిన వారికి ఆయన తనను బయలుపరచుకొనెను. క్రీస్తులో ఉండి దేవుడు మాట్లాడుట అదియే.
మానవుడు ఎప్పుడూ ఆ దేవునిని (శరీరకంగా) చూడవలెనని ఆశించెను, అది అతడియొక్క సహజమైన స్వభావముగా యుండినది, అతడు ఎప్పుడూ ఆయనను చూడవలెనని ఆశించెను. ఆయనవలె కనబడు సృష్టిని మానవులు తయారు చేసుకొనిరి, వారు తలంచిరి….. ఇండియా వారు సూర్యుని ఆరాధించుదురు. ఆఫ్రికాలోని వారు వివిధ జంతువులను ఆరాధించెదరు. అలాస్కా ధృవప్రాంతము వారు తమ ఆలోచనలకు అనుగుణంగా తయారు చేసికొందురు. ఆనాడు మార్స్ కొండ మీద ఆ సమయమున పౌలు ఏదెన్సులో మాట్లాడినట్లుగా, ఈ తెలియని దేవుడిని గురించి ఎంతో మూర్ఖత్వముతో అనేక సాంప్రదాయములను చేయుచు, వారు దేవుడు అచ్చట యున్నాడనుకొనుచున్నారు, వారు దేవుడును ఎరుగకయున్నారని పౌలు చెప్పెను.
JOB 38:1
18ఆ విధముగానే మనము యోబుయొక్క కాలము వరుకు చూచుచున్నాము. దేవుడనేవాడు ఒకడు అచ్చట యున్నాడని యోబు ఎరిగియుండెను. దానిని అతడు ఎరిగియుండెను. ఎచ్చటో ఒకచోట ఎవరో ఒకరు యున్నారనే సరియైన విషయమును చక్కని మానసిక స్థితిలో యుండు ఏ మనిషైనా గాని ఎరుగును. యోబు ఆయనతో మాట్లాడగోరెను. యోబుతో మాట్లాడుటకు దేవుడెన్నుకొనిన రూపమును మీరు గమనించవలెనని కొరుచున్నాను. యోబుతో మాట్లాడినప్పుడు దేవుడు తెరలో మరుగుపరచుకొనెను. ఆయన సుడిగాలి అనే తెరలో తనను మరుగుపరచుకొనెను, ఆయన సుడిగాలి ద్వారా క్రిందకు దిగివచ్చెను. దేవుడు తన్ను బయలుపరచుకొనుటకు సుడిగాలిలో ఇంకా వచ్చునని మీరు నమ్ముదురా?
2KGS 2:20•
2KGS 6:6•
MATT 14:19•
MARK 6:41•
LUKE 9:16•
JOHN 2:7
19ఒకానొక దినమున ఆయన సుడిగాలిలో నుండి దిగి వచ్చినప్పుడు మాతోయున్న అనేకులు ఇప్పుడు ఇక్కడ కూర్చొనియున్నారు. సహో. బాంక్స్ ఉడ్ తదితరులున్నారు. ఆయన నాతో ఇట్లనెను, ''ఈ రాయిని తీసికొని గాలిలోనికి విసరుము. ప్రభువు ఈలాగు సెలవిచ్చుచున్నాడని! చెప్పుము. నీవు వెంటనే దానిని చూచెదవు.'' ఆ కొండపైన నేను ఒక రాయి తీసికొని గాలిలోకి విసిరాను… అది క్రిందికి రాసాగినప్పుడు సుడిగాలి చుట్టివేసినది, చూడండి, అది పీల్చుకొను శక్తిని కలిగియుండెను.
మీరేమైనా ఒక పనిని చేసినప్పుడే, ఆ హేతువు చేతనే ఏదో ఒక విషయము దానిని వెంబడించునట్లుగా చేయును. యేసు ఒక రొట్టెను తీసికొని విరచినప్పుడు, ఆ తర్వాతే ఆ రొట్టెలో నుండి అనేక రొట్టె ముక్కలు కలిగినవి. ఆయన నీటిని తీసికొని ఒక బానలో పోసెను. ఏలియా ఉప్పును తీసికొని కుండలో వేసెను, ఒక కర్రను నరికి నీటిలో వేసెను. అది ఒకదానికి సాదృశ్యము. ఈ రాయిని తీసుకొని గాలిలోనికి విసరగా, అది క్రిందికి వస్తూ సుడిగాలిగా మారినది.
20అటు తర్వాత మరుసటి దినమున మేము వేటకు వెళ్ళినప్పుడు మాతో కూడా ఒక సేవకుడుండెను. అతడు నా దగ్గరే నిలబడి ఇట్లడిగెను, ''బ్రెన్హాం సోదరుడా, ఈ విధముగా వెలుపల స్థలములో ప్రభువు ఇటువంటి దర్శనములను ఇచ్చునా?''
''అవును, కాని మామూలుగా నేను విశ్రాంతి కొరకు ఇచ్చటికి వచ్చుచుందును.'' అన్నాను. సరిగ్గా ఆ సమయమందే ఒక దర్శనములను ఇచ్చునా?''
సహో. బోర్డర్స్ కూడా నాతో ఉండెను, (ఇప్పుడతడు బయట ఉన్నాడు అనుకుంటున్నాను), సహో. బాంక్స్ ఉడ్, ఇంకా అనేకులు కొండపైన యుండిరి, ఎనిమిది లేదా పదిమంది వరకు ఉన్నారు. సహో. బాంక్స్ ఉడ్ దీనిని గమనించుచుండెను. సరిగ్గా కొండ శిఖరము పైనుండి ఏడు దూతలు ప్రత్యక్షమైన స్థలము నుండి సుమారుగా అర్ధమైలు దూరము వరకు నేను అచ్చటకు వెళ్ళునట్లుగా ఇచ్చట నుండియే వెళ్ళితిని. ఆ తర్వాత తిరిగి వచ్చి ఈ ఏడు ముద్రల గురించి చెప్పాను. దాని నుండి ఇంచుమించు ఒక అరమైలు దూరముగలదు.
21అటు తర్వాత మరుసటి దినమున, ఇది సంభవించుచున్న తరుణములో … ఆ సోదరునితో నేనీలాగు చెప్పాను, ''నీ కంటికి వ్యాధియున్నది. దానిని ఆపవలెనని వైద్యులు కొన్ని సంవత్సరముల నుండి ప్రయత్నించిరి, అయినా ఏమి చేయలేకపోయిరి. నీ కన్ను పూర్తిగా పోవునని వారు చెప్పిరి. కాని నీవేమి చింతించవద్దు, నీ విశ్వాసమును ప్రభువైన యేసు గౌరవించెను.'' అతడు తుపాకిని జారవిడిచెను. ''నీ తల్లిని గురించి'' అని చెప్పి, ఆమె గురించి మరియు ఆమెయొక్క వ్యాధిని గురించి కూడా నేను చెప్పితిని.
''అది సత్యము,'' అని చెప్పెను.
22ఈ సంఘమునకు చెందిన సహో. రాయ్ రాబర్‌సన్ ఆ సమయమున అక్కడుండెను, మీరందరు ఆయనను ఎరుగుదురని నమ్ముచున్నాను. అతడు రణమందు దీర్ఘానుభవము గలవాడని ఎరిగినవాడనై, ఏమిసంభవింపబోవుచున్నదనే దానిని నేను ఎరిగినవాడనై నా చేతులను అతడి భుజములపై వేసి, ''సహోదరుడా రాబర్సన్, జాగ్రత్తగా యుండుము, గమనించుచు యుండుము, ఏదో ఒకటి సంభవించబోవుచున్నది,'' అని నేను అన్నాను.
నేను ఎచ్చటకు వెళ్ళి నిలబడవలెనో అచ్చటకు నడుచుకొంటూ వెళ్ళితిని. అప్పుడు ఆకాశములో నుండి సుడిగాలి (క్రింద లోయగుండా) క్రిందకు దిగి వచ్చినది. అది ఎంతో బలమైన ప్రభావము గలదై కొండ యొక్క శిఖరముపైనున్న రాళ్ళను ఎనిమిది లేదా పది అంగుళముల వరుకు బ్రద్దలు చేయుచు వాటిని రెండువందల గజముల దూరము వరుకు విసిరివేసినది. ఈ విధముగా మూడు సార్లు చప్పట్లు కొట్టునట్లు ఒక ధ్వనిని కలుగచేసినది, దానిలోనుండి ఒక ధ్వని వచ్చినది. చూచారా?
వారందరు అచ్చట నిలబడిరి. సహో. బాంక్స్ నా యొద్దకు వచ్చి ఇట్లనెను, ''నీవు నిన్న నాతో చెప్పినది ఇదే.''
''అవును అదే,'' అన్నాను.''
ఆ శబ్దము నీ దగ్గర ఏమి చెప్పినది?'' అని అతడు అడిగెను.
''బాంక్స్ సోదరుడా, అది నాకు మాత్రమే వర్తించును, ఎందుకనగా అది … జనులు వినినచో భయకంపితులగుదురు.'' అన్నాను.
23కాని ఆ సుడిగాలి అచ్చట నుండి బయలు వెళ్ళి … అది ఇంకా ఉత్తర దిశగా పయనించి వెళ్ళినది. కొద్ది దినముల తరువాత అది సముద్రమును తాకినది. ఫెయిర్ బాంక్స్ పరిసరాలలో ఏమి జరిగినదో మీరు చూచారు. అది తీర్పు సూచన. చూడండి, జనులు దానిని చూచి భయపడిరి, అది జరుగవలసియున్నది. జరుగవలసియున్న సంఘటనలు ఏలాగయిననూ జరుగవలసియున్నవి. ఏమైనాగాని అవి జరుగును, చూడండి.
EXOD 33:21
24మోషే ఒకప్పుడు దేవునిని చూడనాశించెను. ఒక బండపై నిలబడమని దేవుడు అతనితో చెప్పెను. మోషే బండమీద నిలబడి దేవుడు దాటిపోవుట చూచెను. ఆయన వీపు మానవుని వీపువలె కనిపించెను. మోషే బండమీద నిలబడియున్నప్పుడు దేవుడు… సుడిగాలిలో యుండెను.
మేమును అదే బండయొద్ద నిలబడియున్న పటమును మీరందరూ చూచితిరని అనుకొనుచున్నాను. ఆ వెలుగు ప్రభువుయొక్క దూతయైయున్నది. ఆ స్థలమందే ధ్వని ఏర్పడినది. ఆ ఫోటోను ప్రకటన పలకలో పెట్టి బయటయుంచాము.
25గమనించండి, పాత నిబంధనలోని యెహోవాయే క్రొత్త నిబంధనలోని యేసు. చూచారా? ఆయన అదే దేవుడై యుండి, కేవలము తన రూపమును మాత్రమే మార్చుకొనెను.
టుసాన్‌లోని ఒక బాప్టిస్టు సేవకుడు ఒక దినమున ఇట్లు చెప్పెను, ''యేసు మరియు దేవుడు ఒకే వ్యక్తి ఎట్లు కాగలరు?''
''నీవు నీ స్వంత ఆలోచనను విడిచిపెట్టినచో, లేఖనపూర్వకముగా దానిని ఆలోచించిన యెడల అది తేలికగానే అర్థమగును. ఇద్దరూ ఒక్కరే, దేవుడు ఆత్మస్వరూపిగా యున్నాడు. యేసు అనే శరీరములో ఆయన తనను మరుగుపరచుకొనెను. చూచారా? ''నా ఇంట్లో నా భార్యకు నేను భర్తను, నాకు రిబ్కా అను ఒక యువకుమార్తె యున్నది, ఆమెకు నేను తండ్రిని నాకు ఒక మనుమడున్నాడు. వాని పేరు పాల్, అతనికి నేను తాతను. నేను భర్తను, తండ్రిని, తాతను. అయితే నా భార్య నన్ను తండ్రిగా, తాతగా ఒప్పుకొనదు. ఆమెకు నేను భర్తను మాత్రమే. నా కుమార్తె నన్ను భర్తగా, తాతగా ఒప్పుకొనదు. ఆమెకు నేను తండ్రిని మాత్రమే. చూచారా? అయినా ఈ ముగ్గురిని నేనే. దేవుడు అలాగే యున్నాడు: తండ్రి, కుమార, పరిశుద్దాత్మ అనునవి యుగములుగా హక్కును కోరుటగా యున్నది. దేవుడు మారనివాడుగా యున్నాడు.
PHIL 2:6
26ఆయన అదే దేవుడుగా యుండి, తనను మార్చుకొనుచు, తన రూపమును మార్చుకొనుచున్నాడు.
మీరు గమనించినయెడల, ఫిలిప్పీలో ఆయనిట్లు చెప్పెను, ''అది దోపిడి అని తలంచకుడి, ఆయన మానవ రూపమును ధరించెను.''
ఇప్పుడు, ఆ రూపమునకు అచ్చట ఇవ్వబడిన పదముయొక్క తాత్పర్యమును నిన్న దినమంతా వెదుకుచూ, అది ఏ విధమైనదిగా యుండునని దాని భావమును గురించి ఆలోచించుచూ యుంటిని.''ఎన్‌మార్ఫే'' (E-n-m-o-r-p-h-e) అనే గ్రీకు పదమును నిఘంటువును తీసి కనుగొనదలచితిని … ఒకవేళ దానిని నేను తప్పుగా ఉచ్ఛరించియుండవచ్చును, కాని నేను… దానిని నేను అక్షరముల పొడిపొడిగా చదివి ఉచ్ఛరించిన హేతువేమనగా ఈ టేపు విడుదలైనప్పుడు, జనులు, పండితులు, నేను ఏ పదమును గురించి చెప్పుచున్నాననే దానిని గురించి ఎరగవలెననే ఉద్దేశ్యముతోనే ఆ విధంగా ఉచ్ఛరించితిని. ''ఎన్‌మార్ఫే,'' దానికి అర్ధము ఆయన తన్నుతాను మార్చుకొనెను అనియే. ఆయన క్రిందికి వచ్చెను. కనబడనిది, అయినా అది అచ్చట యున్నది. అటు తర్వాత అది కన్నులకు కనబడునట్లుగా యుండునది. కన్నులకు కనబడునట్లుగా మారిపోవుట అనేది గ్రీకులో దాని భావము. చూచారా?
2KGS 6:17
27దోతానులో ఏలియాయున్న రీతిగా, గమనించారా, అతడి దాసుని చుట్టూయున్న దేవదూతలను అతడు చూడలేకపోయెను. దేవుడు దానిని అట్లే మార్చివేసెను; దేవదూతలను క్రిందికి తేలేదు గాని ఆ దాసుని చూపును మార్చెను. ఆ పర్వతము దేవదూతలు, అగ్ని, అగ్నిగుర్రములు, అగ్ని రథములు ద్వారా తన ప్రవక్తను చుట్టుముట్టియుండుట చూచెను, చూచారా. ఆయన అతడి కనుచూపును మార్చెను. అది ముందే అక్కడున్నది. దేవుడు ఎల్లప్పుడూ ఇక్కడేయున్నాడు.
నేనును అదియే చెప్పుటకు ప్రయత్నించుచున్నాను, ఆయన మానవుడిగా మారినప్పుడు ఆయన తన ముఖము యొక్క ముసుగును మార్చుకొనెను. అర్ధమైనదా! ఆయన, ఇదియే ఎన్‌మార్ఫే యగును — ఆయన తనకుతానే గతములోయున్న దానినుండి ఇప్పుడు యున్న దానిలోనికి మార్చుకొనెను. లేదా ఆయన తనయొక్క రూపమును వేరొక వేషమునకు మార్చుకొని మరియొక ముసుగు ధరించి పనిచేసెను.
28గొప్ప నాటకము వలె యున్నది. ఈ ఉదయాన షెక్స్‌పియర్ గూర్చి నేను చెప్పాను. చాలా కాలమయినది. ఇంగ్లాండు రాజగు జేమ్స్ కొరకు షేక్స్‌పియర్ ఒక నాటకమును వ్రాసెను. అందులో మేక్‌బెత్ అను ఒక పాత్ర యున్నది. చూడండి, షేక్స్‌పియర్ మాంత్రికులను నమ్మడు, కాని రాజు నమ్మును గనుక ఆ నాటకములో మేఘమును సృష్టించెను, చూచారా. దీనిని చేయుటకు వారు వేషమును మార్చిరి.
బెక్కీ తన స్కూలులో కార్మెన్‌గా పాత్ర వేసినది. కొద్ది వారముల క్రితమే ఆమె తన కళాశాల విద్య పూర్తి చేసినది. ఒకే వ్యక్తి మూడు లేదా నాలుగు పాత్రలను అన్వయించి నటించి చూపెను. వేషమును లేదా అలాగు చేయవలెనన్న తన ముఖము యొక్క ముసుగును మార్చుకొనెను. ఒకసారి ఒక పాత్రలోను, మరోసారి మరో పాత్రలోను వచ్చెను. కాని వ్యక్తి మారలేదు.
29దేవుడు కూడా అలాగే యున్నాడు. ఆయన అగ్నిస్తంభము నుండి మానవునిగా మారెను, పిదప ఆయన మానవునిలో నివాసము చేయాలనే ఉద్దేశ్యముతోనే ఆయన తనను మరలా ఆత్మరూపిగా మార్చుకొనెను. దేవుడు నిజంగా ఏమైయున్నాడో, అదే విధముగా ఆయన మానవునిలోనుండి పని చేయుచున్నాడు. దేవుడు ఒక మానవునిలోనుండి పనిచేయుటయే యేసుక్రీస్తు - ఒక మానవునిలో. ఒక మానవునిలోనుండి, ఆయన ఆ విధముగానే యున్నాడు. ఆయన అగ్ని స్తంభములోనుండి తనను మార్చుకొనెను. అటు తర్వాత లోపలికి వచ్చెను. అది అరణ్య మార్గమున ఒక తెరగా మరుగుపరచుకొంటూ వచ్చెను. ఆ తెరయే ఇశ్రాయేలీయుల నుండి ఆయనను మరుగుపరచెను. ఆయన శరీరరూపమును మోషే చూచెను, అయితే ఆయన అగ్నిస్తంభములో అన్నివేళలా దాగియుండెను. అదియే దేవునినుండి బయలు వెళ్ళిన వాక్యము (logos)గా యుండెను.
ఇచ్చట మనము కనుగొనబోవుచున్నదేమనగా, పెంతెకోస్తు దినమునకు పిదప దేవుడు మానవునిలో నుండి పనిచేయకుండా… లేదా క్రియ (పని) … ఇప్పుడు ఆయన మానవుని ద్వారా పనిచేయుచున్నాడు, చూచారా. ఆయన అప్పుడు యేసుక్రీస్తు అనే మానవునిలో నుండి పనిచేసెను. ఇప్పుడు ఈ ఉద్దేశ్యము కొరకై ఆయన ఎన్నుకొనిన మానవుని ద్వారా పనిచేయుచున్నాడు. దేవుడు మానవరూపములో ఉండెను, ఆయన దైవ రూపమునుండి మానవ రూపమునకు మారెను.
EZEK 2:1•
EZEK 8:6
30ఆయన ముగ్గురు కుమారుల పేర్లలో వచ్చెను. మునుష్య కుమారుడు, దావీదు కుమారుడు, దేవుని కుమారుడు; మూడు కుమార నామములు.
మొదట ఆయన మనుష్య కుమారునిగా వచ్చెను, ఎందుకనగా ఆయన ప్రవక్తగా యుండెను. యెహెజ్కేలు ప్రవక్తను యెహోవా ఇట్లనెను, ''నరపుత్రుడా! నీవేమి చూచుచున్నావు?'' యేసు ఎన్నడూ తన్నుతాను దేవుని కుమారునిగా చెప్పుకొనలేదు; ఆయన తనను మనుష్యకుమారునిగానే చెప్పుకొనెను, ఎందుకనగా లేఖనము తప్పిపోదు. ఏ వాక్యము తప్పిపోదు. ప్రతి మాట లేఖన వాక్యముగా జరుగవలెను. ఆ విధముగానే నేను దానిని నమ్ముచున్నాను. నేను నమ్ముచున్నందువలన అది అలాగు జరుగుట కాదు గాని, అది దేవుని వాక్యము గనుక అలాగు జరుగును.
REV 22:18,19
31మీరు గమనించినయెడల, ఆదియందు, ఒక్కమాట, పరిశుద్ధ గ్రంథములోని మొదటి పేజీనందు, ఆదికాండము 1వ అధ్యాయములో మనము చూచునదేమనగా, సమస్తము… వ్యాధి, దుఃఖము, గుండెపోట్లు, మానవులకు జరుగుచున్న ప్రతిదియు ఒక్క వ్యక్తి ఒక్క మాటను నమ్మనందువలననే కలిగినవి. అదియే పరిశుద్ధ గ్రంథములో ప్రధమమైనది. పరిశుద్ధ గ్రంథములో చివరి గ్రంథమగు ప్రకటన 22లో ఆ దేవుడే ఇట్లు చెప్పెను, ''దీనికి ఎవడును ఒక మాట చేర్చరాదు, లేదా ఒక మాట తీసివేయరాదు.'' చూడండి, అది వాక్యమునకు వాక్యముగా, అది ఉన్నది ఉన్నట్లుగానే ఉండవలెను.
2PET 1:20
32అందుచేతనే, నేనెందుకు ఈ చిన్న విషయములు కూడా ప్రాముఖ్యమైనవిగా చెప్పుచున్నానంటే… స్త్రీలు తలవెంట్రుకలను కత్తిరించుకొనుటను గురించి నేను గద్దించినప్పుడు, దానిని గురించి ఒక వ్యక్తి నాపై విమర్శలను గుప్పించెను. ఆమె అలాగు చేసినంతకాలము ఆమె ఎంత పరిశుద్ధముగా ఉన్నా, ఆమెకు ఎంత తెలిసినా నేను లెక్కచేయను. ఆమె ఇంకా కూడా తప్పు చేయుచునేయున్నది. ఆమె అర్ధనగ్నంగా కనబడు పొట్టిబట్టలు ధరించుచున్నది. అలాటి స్త్రీ ఎంత పాడినా, ఎంత బాగుగా బోధించినా, మరేమి చేయకలిగినా, ఎటువంటి జీవితము జీవించుచున్నా నేను లెక్కచేయను, ఎందుకనగా ఆమె ఇంకా కూడా ఆ ఒక్క మాటను ఆమె అతిక్రమించినది. చూచారా? చూడండి, ప్రతి మాటను ఆమె వినవలసియున్నది. అది ఒక్కొక్క మాటగా యుండవలెను. ఒక వాక్యము కాదు; ఒక్క మాటయే! కాబట్టి పరిశుద్ధ గ్రంథమునకు స్వంత అనువాదము ఇయ్యరాదు. వాక్యమునకు వాక్యముగా వ్రాయబడిన రీతిగానే, నెరవేర్చవలెను. దానిని మునము తప్పక నమ్మవలెను.
33దానిని నమ్ముట మాత్రమే కాదు గాని, ఆ రీతిగానే జీవించవలెను. దానిని మనము జీవించనియెడల, దానిని మనము నమ్ముటలేదన్న మాట. కేవలము మనము చేయుచున్నామని చెప్పుచున్నాము. నేను చెప్పిన దానినిబట్టి చూచినప్పుడు, ఆ శిష్యులు దానిని వివరించలేకపోయిరని అర్ధమగుచున్నది, కాని ఏమైనా వారు అది నమ్మి, ఒప్పుకొని జీవించసాగిరి. తక్కినవారందరూ అందుకు దూరస్థులయిరి, కాని వీరు దానితోనే నిలచియుండిరి. దానిని వారు నమ్మిరి మనమును ఆ విధంగానే చేయుచున్నాము, ఆ విధంగా మనము చేయవలసియున్నాము. ఎవరేమి చేసినా గాని మనకు లెక్కలేదు గాని దానిని మనము నమ్మి, ఆ ప్రకారము జీవించవలెను. ఆ విధంగా నీవు చేయనియెడల దానిని నీవు నమ్మకుండా ఉండినట్లే.
DEUT 18:15,18
34ఇప్పుడు ఆయన వచ్చిన విధమును గమనించండి, ఆయన మనుష్యకుమారునిగా రావలసి వచ్చెను. అలాగే ఆయన వచ్చునని పరిశుద్ధ లేఖనము చెప్పెను, దేవుడు వారి కొరకు ఒక ప్రవక్తను లేపును. కావున ఆయన తాను దేవుని కుమారునని చెప్పుకోలేదు, ఎందుకనగా అది ఆ కాలము కాదు. ఆయన మనుష్యకుమారునిగా ప్రవచించుచూ, నెరవేర్చుచూ ఉండెను, అనేక కార్యములను వారికి బయలుపరచెను. ఆయన ఏమైయున్నాడో మాదిరిగా చూపించెను. అప్పుడు భూమిమీద ఆయన మనుష్యకుమారునిగా ఉండెను.
MATT 9:27•
MATT 15:22
35ఆ సురోఫెనికయ స్త్రీ ఆయన యొద్దకు పరుగెత్తికొని వచ్చి ''దావీదు కుమారుడా! నా మీద కృప చూపు'' అన్నది. ఆయన కనీసము తన తల ఎత్తికూడా చూడలేదు. ఆమె అన్యురాలు గనుక ఆయనను దావీదు కుమారుడా అని పిలచుటకు ఆమెకు తగదు. (నా కుమార్తె నన్ను భర్త అనుట, నా భార్య నన్ను తండ్రి అనుట ఎంత అవివేకమో, అది కూడా అంత అవివేకము అయిననూ సువార్తలో ఆమె కుమార్తెయే కాని భూసంబంధముగా ఆమె నన్ను అలాగు పిలచు హక్కు కలిగిలేదు, చూచారా.) ఇప్పుడు గమనించండి, ఈ అన్య స్త్రీ ఆయనను దావీదు కుమారుడా అని పిలువతగదు. కాని గ్రుడ్డి బర్తలొమయి అలాగు పిలచెను, ఎందుకనగా అతడు యూదుడు. ఇప్పుడాయన, మనుష్యకుమారుడు.
ఇప్పుడు మీరు ఈ మాటలను, ఈ కార్యములను తెలిసికొనవలెను. మూడవ ఈడ్పు యున్నప్పుడు, ఆ సమయమందు హాట్టి రైట్‌ను గమనించండి. అది మీకు గుర్తుండును. అన్ని విషయములలోను ఆమె సరిగ్గానే పలికినది. నీవు సరియైన మాటను, సరియైన కార్యమును, దేవునియందు చెప్పవలసియున్నావు.
LUKE 17:30•
REV 3:20
36ఇప్పుడు గమనించండి, మొదట ఆయన ప్రవక్తగా వచ్చెను, వారాయనను సిలువ వేసిరి. ఆయన స్వకీయులే ఆయనను సిలువ వేసిరి. ఆయన ఒక మనుష్యకుమారునిగా వచ్చెను.
పరిశుద్ధాత్మ వచ్చిన తరువాత ఆయన దేవుని కుమారుడాయెను. దేవుడు ఆత్మ స్వరూపి, ఆయనే పరిశుద్ధాత్మ, దేవుని కుమారుడు. సంఘ కాలములలో ఆయన దేవుని కుమారునిగా జీవించెను.
వెయ్యేండ్లపాలనలో ఆయన దావీదు కుమారునిగా, తన తండ్రియగు దావీదు సింహాసనము మీద కూర్చొనును. ఆయన దావీదు కుమారుడుగా యున్నాడు.
ఇప్పుడు మరువకండి, లవొదికయ సంఘకాలములోని వారు ఆయనను బయటకు త్రోసివేసిరి. లూకాలో ఆయన మరలా ఒక మనుష్యకుమారునిగా, ఒక ప్రవక్తగా ప్రత్యక్షమై మిగిలియున్న కార్యములన్నింటిని ఆయన నెరవేర్చునని చెప్పబడియున్నది. చూచారా? లేఖనములు ఒకదానికొకటి చక్కగా ముడివేయబడును. మనుష్యకుమారుడు, దేవుని కుమారుడు, దావీదు కుమారుడు, ఏమిటిది? అన్ని కాలములలోనున్న ఒకే దేవుడు గాని తన రూపమును మార్చుచుండెను. ఒక ఎన్‌మార్ఫేగా యుండెను. దానిని ఆయన మార్చెను. అది ఆయనకు గొప్ప నాటకము. దానిని ఆయన నటించుచూ యుండెను.
JOHN 4:25
37ఆయన మనుష్యకుమారునిగా, అనగా ప్రవక్తగా వచ్చెను. పాపము చేసిన ఆ స్త్రీ బావినొద్ద ఆయనను గుర్తించినది. ''క్రీస్తు అనబడిన మెస్సీయా వచ్చునని మాకు తెలియును. ఆయన ఈలాగే చేయును'' అన్నది. ఆమె ముందుగా నిర్ణయించబడిన బీజము గనుక ఆమె గుర్తించినది. మిగిలినవారు ఆయనను గుర్తించలేదు. ఆది నుండియు వారు పాపములోనే యున్నారు. వారాయనను గుర్తించలేదు.
REV 3:20
38ఆయన తన నటన కొరకు ఆయన తన రూపమును మార్చెను. అప్పుడాయన మనుష్యకుమారుని రూపములో వచ్చెను. సంస్కరణ కర్తల కాలముగుండా అనగా వెస్లీ, లూథర్ ఇ౦కా తదితరులు, అటు పిదప మనము చూచునదేమనగా, ఇశ్రాయేలీయుల వలె వారు బిర్ర బిగుసుకొని, చివర దినములలోని పెంతెకోస్తు కాలములో పరిశుద్ధాత్మగా ఆయన ప్రత్యక్షమైనప్పుడు, వారు ఆయనను త్రోసివేసిరి. వారును ఇశ్రాయేలీయులు చేసినట్లే చేసిరి. ఇప్పుడాయన ఏమి చేయుచున్నాడు? మనుష్యకుమారునిగా తిరిగి వచ్చుచున్నాడు. ఆ తరువాత దావీదు కుమారుడు, మనమెంత సమీపమందున్నామో చూడండి. మనుష్యకుమారుడు, దావీదు కుమారుడు, దేవుని కుమారుడు. మలాకీ 4 మరియు ఈ ఘడియకు సంబంధించిన అన్ని ప్రవచనముల ప్రకారము చివరి దినములలో ఆయన మనుష్యకుమారునిగా ప్రత్యక్షమగును. సంఘము ఆయనను బయటకు త్రోసివేసినది గనుక ఇక ఆయన దానితో మాట్లాడడు. ఆయన బయట నుండి తలుపు తట్టుచున్నాడు. ఇంకా కొన్ని నిర్ణంయించబడిన విత్తనములు అచ్చటయున్నవి. ఆయన వారిని సంపాదించుకోవలెను.
GEN 1:1•
JOEL 2:28
39దేవుడు ఒక మానవునితో తనను కుమ్మరించుకొనెను. యోవేలు 2:28లో ఇట్లు ''అంత్య దినములలో నా ఆత్మను కుమ్మరించెదను. ''ఆయన చెప్పియుండుటను మనము కనుగొందము. ఇక్కడ వాడిన గ్రీకు మాటను మీరు గమనించినయెడల… బహుశా నేను దీనిని తప్పుగా ఉచ్ఛరించవచ్చును, కాని నేను చూచుచున్న ఒకదానిని… మీరు ఆ మాటను గమనించవలెను.
ఆంగ్ల భాషలో కొన్నిసార్లు బహు అర్ధములుండును. మాటలు వాడుదురు, ''దేవుడు'' అను పదము అట్టిదే. దేవుడు భూమ్యాకాశములను సృజించెనని ఆదికాండము 1లో చెప్పెను. కాని మూల పరిశుద్ధ గ్రంథమందు, ''ఆదియందు ఎలోహింగా''గా యున్నది. ఆంగ్లములో దానిని ''దేవుడు'' అని అర్ధముతో వ్రాసిరి గాని దేవుడు అనే పదము ఎలోహిం అర్ధము వచ్చునది కాదు. దేవుడు అనే పదమునకు ఏదైనా గాని దేవుడుగా యుండగలదు. నీవు ఒక విగ్రహమును, లేదా ఒక పియానోను లేదా మరిదేనినయినా గాని దేవునిగా పిలువవచ్చును.
కాని ఎలోహిం అను పదమునకు అర్ధము అది కాదు. దానికి అర్ధమేమనగా ''తనంతట తానుగా జీవించువాడు'' అని అర్ధమగును. చూచారా? ఆపియానో తనంతట తానుగా జీవించలేదు, ఏదీకూడా తనంతట తానుగా జీవించలేదు. దానికి అర్ధము తనకు తానుగా ఉన్నవాడు. కాబట్టి ఎలోహిం అనగా ''ఆయన నిరంతరము యున్నవాడు.'' దేవుడు అను మాటకు ఏ అర్ధమయినా వచ్చును. ఆమాటలో యున్న తేడాను చూచారా?
COL 2:19
40ఆయన తనను ఖాళీ చేసుకొనెను, లేదా ధారపోసెను అని ఇచ్చట వ్రాయబడియున్న దానిని మనము చూచినప్పుడు, ఆయన ''కక్కివేసెను'' (vomit) అని మనము అనుకుంటున్నాము. ఖాళీ చేసుకొనుట లేదా ధారపోయుట అనే పదములు, ఏదో ఒక కార్యము ఆయనలో నుండి వెలుపలికి వెళ్ళినది. అది ఆయనలో నుండి బేధమైనదిగా యుండినది. కాని "కెనోస్" ( kenos) అనే గ్రీకుపదము, ఆయన ''కక్కెను'' లేదా… ఆయన యొక్క హస్తములు ఆయననుండి వీడి వెళ్ళినవి, ఆయనయొక్క కన్నులు వేరై వెళ్ళినవి, ఇంకొక వ్యక్తికి అనే అర్ధము కాదది.
ఆయన తన్నుతాను మార్చుకొనెను. ఆయన, ''వేరొక ముసుగులో లేదా వేరొక రూపములో తనను ధారపోసుకొనెను. (ఆమేన్!) ఆయనలో నుండి పరిశుద్ధాత్మ అను మరో వ్యక్తి రాలేదు గాని, ఆయనే వచ్చెను. మీరు గ్రహించారా? ఆయన తనకు తానుగానే జనులలోనికి పోయబడెను. క్రీస్తు నీలోనికి వచ్చెను. అది అంత ఆశ్చర్యకరమగు, అద్భుతమగు ఆలోచన! దేవుడు తన్నుతాను మానవునిలోనికి కుమ్మరించుకొనెను, విశ్వాసులలోనికి తననుతాను కుమ్మరించుకొనెను. ''కుమ్మరించుకొనుట!'' ఆ విధముగా చేయుట ఆయన నాటకములోని ఒక భాగమైయున్నది. దేవత్వముయొక్క సర్వపరిపూర్ణత శరీరరీత్యా యేసుక్రీస్తులో నివసించెను. ఆయనే దేవుడైయున్నాడు, ఆయన దేవుడు మాత్రమే. మూడవ వ్యక్తి, రెండవ వ్యక్తి, మొదటి వ్యక్తి కాదు; కాని దేవుడు మానవ శరీరము నందు మరుగుపరచుకొనిన ఆ వ్యక్తిగా యుండెను.
1TIM 3:16
411వ తిమోతి 3:16. ''నిరాక్షేపముగా దైవభక్తిని గూర్చిన మర్మము గొప్పదైయున్నది.'' అక్కడ దేవుడు అను పదమును పెద్ద అక్షరములలో పరిశుద్ధ గ్రంథములో వ్రాసిరి. ఎవరైనా గాని మూల పరిశుద్ధ గ్రంథములో త్రిప్పి చూడవచ్చును. అది ''ఎలోహిం'' ''ఆదియందు ఎలోహిం'' - చూచారా? ''ఎలోహిం… ఎలోహింను గూర్చిన మర్మము నిరాక్షేపముగా గొప్పదై యున్నది; ఎందుకనగా ఎలోహిం శరీరధారి అయ్యెను, మేము మా చేతులతో తాకితిమి. ఎలోహిం మానవ శరీరము ధరించెను! సమస్త అంతరిక్షమునందు, కాలమునందు, సమస్త స్థలముల యందును నిండియుండిన మహోన్నతమైన యెహోవా మానవుడుగా అయ్యెను. ఈ ఎలోహింను మేము మా చేతులతో తాకి చూచితిమి. ''ఆదియందు ఎలోహిం ఉండెను. ఆ ఎలోహిం శరీరధారియై మనమధ్య నివసించెను.''
42ఏమిటి? ఇది ఆయన మార్గము, ఆయన నాటకములోని భాగము. ఆ విధంగానే ఆయన నటించవలెను. మనకు ఒక వేరే వ్యక్తిగా ఆయన తన్నుతాను బయలుపరచుకొనెను. మనము మర్త్యులమని ఆయనెరుగును, మర్త్యుడగువానినే మనము అర్ధము చేసికొందుము, శరీరధారినే మనము ఎరుగుదుము, మన శరీర స్పర్శను బట్టియే మనము ప్రతిది తెలిసికొందుము. ఇంకా దానికంటే ఉన్నతమైన వాటిని మనము మన విశ్వాసముతోనే నమ్మవలెను. దేవునిని చూచినా, చూడకపోయినా ఉన్నాడని మనము విశ్వాసముబట్టి చెప్పుచున్నాము. దేవుడు ఆ విధంగా చెప్పెను గనుక అక్కడది మనము విశ్వాసముబట్టి చెప్పుచున్నాము. దేవుడు ఆ విధంగా చెప్పెను గనుక అక్కడది ఉన్నా లేకపోయినా మనము నమ్ముచున్నాము.
ROM 4:19-21
43ఉదాహరణముగా, అబ్రహాము కుమారుని చూడలేదు, శారాలో గర్భమును గాని, మరే సూచన గాని చూడలేదు. ఆమె గర్భము మృతతుల్యమాయెను. అయినా గాని దేవుడు ఆ విధముగా చెప్పెను, సమస్త నమ్మకము నిర్జీవమైపోయెను. అతనిలో జీవము లేదు. అతని జీవ ప్రవాహాము ఎండిపోయెను. ఆమె జీవము ఎండిపోయెను. అయినను అతడు అవిశ్వాసము చూపకుండా, దేవుడు చేసిన వాగ్ధానమును నెరవేర్చగల సమర్ధుడని పరిపూర్ణమైన నిశ్చయతను గలవాడై, దేవుడిని మహిమపరచుచు విశ్వాసమునందు ఇంకా బలపడెను. ఈనాడు వాక్యమును మనము అలాగే నమ్మవలెను. అదెట్లు జరుగను?నాకు తెలియదు. ఆ విధంగా జరుగునని దేవుడు చెప్పెను గనుక అంతే.
GEN 18:1
44ఈ గొప్ప అదృశ్య వ్యక్తి ఎవరు? అబ్రాహాము దర్శనములలో చూచిన అయనెవరు? చివరగా శరీరమందు ప్రత్యక్షమైనప్పుడు, వాగ్దానము చేయబడిన కుమారుడు కలుగుటకు ముందుగా, దేవుడే అబ్రాహాము యొద్దకు చివరలో మానవ రూపములో వచ్చెను. ప్రత్యక్షత! ఒకసారి చిన్నవెలుగులో ఆయనను అతడు చూచెను. దర్శనములలో ఆయనను చూచెను, ఆయన స్వరమును వినెను, చాలా ప్రత్యక్షతలు పొందెను; కాని వాగ్దాన కుమారుడు వచ్చు ముందు మానవ రూపములో ఆయనను చూచెను, ఆయనతో మాట్లాడెను. ఆయనకు మాంసము, నీళ్ళు ఇచ్చెను, చూచారా. గమనించండి, దేవుడు తనకు తానుగా మానవ శరీరము అనే తెరలోనుండి మరుగుపరచుకొనెను.
JOHN 1:1
45ఇది ఆయన విధానములోని ఒక భాగము. మనకు ఆయన ఈ విధముగానే ప్రత్యక్షమగును. తన నిత్య వాక్యమును బయలుపరచును. యెహోవా శరీరధారి అయ్యెను. మరి. యోహాను 1లో ఇట్లున్నది, ''ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవునియొద్ద ఉండెను, ఆదియందు ఎలోహిం ఉండెను. ఆ ఎలోహిం వాక్యమాయెను. ఆ వాక్యమే ఎలోహింగా మారెను.'' చూడండి? ఇది మారనిది, ప్రత్యక్షమయినది.
దేవునిలో ఎన్నో గుణలక్షణములున్నవి, అది ఆలోచనయే. ఆదియందు దేవుడు నిత్యుడు, ఆయన ఒక దేవుడుగా కూడా లేడు. ఆయన నిత్యుడు. ఆయన దేవుడుగా కూడా లేడు, దేవుడు అనగా ఆరాధింపతగినవాడు. చూచారా? కాబట్టి ఆయన ఆ విధముగా లేడు. ఆయన నిత్యుడు, ఎలోహిం. కాని ఆయనలో తలంపులుండెను. ఆయన ఒక శరీరమందు రావలెనని ఆశించెను. ఆయనేమి చేసెను? ఆయన ఒక మాట పలికెను. ఆ మాట మాంసమాయెను. ఆదికాండము నుండి ప్రకటన వరకు అదే మనము చూతుము. ఏదీ తప్పిపోలేదు. కాబట్టి ఎలోహింను చేతులతో తాకుటకును, తాకి అనుభూతి చెందుటకును శరీరమందు ప్రత్యక్షమాయెను. వెయ్యేండ్ల పాలనలో ఎలోహిం సింహాసనము మీద కూర్చొనును. ఆయన చుట్టూ జనులుందురు. వారు జగత్తు పునాది వేయబడక ముందే నిర్ణయించబడినవారు.
46పోతపోయు వానిని చూడండి, ప్రతి గంట వేర్వేరు ధ్వని వచ్చునట్లు చేయును. ఒకే రకమగు ఇనుము, ఇత్తడి, ఉక్కు తీసికొనును గాని మోత వేరుగా నుండును.
దేవుడు కూడా అలాగే చేసెను. ఆయన తాను కోరినది వచ్చు వరకు వాటిని తయారు చేయుచునేయుండును. ఆ విధంగానే ఆయన క్రిందికి వచ్చెను. ప్రవక్తలద్వారా దేవుడు అగ్ని స్తంభములో ప్రత్యక్షమాయెను. ఆ తరువాత దేవుని కుమారుడాయెను. (దేవుడే) ఒకే దేవుడు గాని పరిపూర్ణత నుండి అధిక పరిపూర్ణతకు, మహిమ నుండి మహిమకు వచ్చుచుండెను. సంఘము కూడా అలాగే యుండును.
JOHN 10:34-36•
HEB 13:8
47గమనించండి, ఆయన తన ప్రవక్తల ద్వారా అన్ని యుగములలోనూ ఆ ప్రకారమే చేసెను.తన్నుతాను ప్రత్యక్షపరచుకొనెను. వారు నిజంగా ప్రవక్తలు కారు, వారు దైవములే. ఆయనా విధంగా చెప్పెను. వారు పలికినది దేవుని మాట. దేవుడు వారిని తెరగా చేసుకొని తనను మరుగుపరచుకొనెను. వారు దైవములు. ''నేను దేవుని కుమారునిగా చెప్పుకొన్నందుకు మీరేలాగు నన్ను ఖండించుదురు? ప్రభువు యొక్క వాక్కు ఎవరియొద్దకు వచ్చునో వారు దైవములని మీ ధర్మశాస్త్రము చెప్పుచున్నది గదా?'' అని యేసు చెప్పెను.
కాబట్టి ప్రవక్తగా పిలువబడిన మానవునిలో రూపించుకొనబడిన దేవుడుగా ఆయన వారిలో నివసించెను. చూచారా! యెహోవా వాక్కు వీరియొద్దకు వచ్చెను. కాబట్టి అది ప్రవక్త కాదు. ప్రవక్తనే ఒక ముసుగు మాత్రమే. కాని వాక్యము దేవుడైయుండెను. మానవుని మాట ఆ విధంగా పనిచేయదు. నా భావము గ్రహించారా? ఆ విధంగా అది పనిచేయజాలదు. కాని ఆ మాట దేవుడే. ''నరునిగా'' పిలువబడుచూ ఆయన మానవ రూపములోనున్న దేవుని వాక్యముగా యున్నాడు. గమనించండి, ఎన్నడూ తన స్వభావమును మార్చుకోలేదు గాని తన రూపమునే మార్చెను. "ఆయన నిన్న, నేడు, నిరంతరము ఏకరీతిగా యున్నాడు'' - హెబ్రీ 13:8లో యున్నది, కాబట్టి ఆయన వచ్చునప్పుడు తన స్వభావమును మార్చుకొనలేదు గాని ఆయన కాలముల గుండా అదే ప్రవక్తగా, వాక్యముగా వాక్యముగానే యుండెను. ఆయన తన స్వభావమును మార్చుకొనజాలడు, కాని తన రూపమును మార్చుకొనెను. ఆయన తన ముఖము యొక్క ముసుగును మాత్రమే మార్చెను.
48నాకు బిడ్డ జన్మించగానే నేను తండ్రిగా మారితిని. నాకు మనుమడు పుట్టగానే తాతనయితిని, చూచారా. కాని నేను మారలేదు. నేను ఇంకా నేనే. (దేవుడు అంతే) నీరూపము మార్చవచ్చును. గమనించండి. స్వాభావికంగా ఒక మనిషి యవన దశనుండి, నడివయస్సుకు, తరువాత ముసలితనమునకు మారును. నీ రూపము మాత్రమే మారుచున్నది.
ఇక్కడ నిలబడియున్నపదహారేండ్ల బాలుని నీవు తాతా అని పిలువవు. ఎందుకనగా అతని రూపము మారలేదు. కొన్ని సంవత్సరములు గతించగానే అతడు తాత అగును. నా భావము మీరు గ్రహించారా?
అయితే అన్ని కాలములయందు వ్యక్తి ఎప్పుడూ ఒక్కడే, అన్ని కాలములయందు దేవుడూ ఒక్కడే. ఈ విధముగా ఆయన జనులకు తన్నుతాను బయలుపరచుకొనును. గమనించండి, ఆ కాలములో అగ్ని స్తంభము ద్వారా ఆయన జనులకు బయలుపరచుకొనెను. మరో కాలములో యేసుగా ప్రత్యక్షమాయెను. మరో కాలములో పరిశుద్దాత్మగా, దేవుని కుమారునిగా ఆయన తనను ప్రత్యక్షపరచుకొనెను. దావీదు కుమారుడుగా … ఆ విధంగా ఆయన ప్రజలకు తన్నుతాను బయలుపరచుకొనును. జనులు ఆయనను తెలిసికొందురు. ఆయన అదే విధముగా ఏదో ఒక కార్యము అనే ఒక తెరలో తనను మరుగు పరచుకొనుచుండెను. ప్రతీసారి అదే స్వభావము.
49దేవుడు యేసు అనే తెరలో తనను మరుగుపరచుకొనెను. సిలువనొద్ద విమోచన క్రియచేయుటకు, దేవుడు నిత్యుడు, ఆత్మస్వరూపి, గనుక ఆయన చనిపోజాలడు. మరణ పాత్రను పోషించుటకు ఆయన ఒక వేషమును ధరించవలసి వచ్చెను. ఆయన మరణించెను, కాని దానిని ఆయన దైవ రూపమునందు చేయజాలడు, ఆయన దానిని కుమారుని రూపమునందు, ఈ భూమిపై మనుష్యకుమారుని రూపములోనే చేయవలసియుండెను. గమనించారా! ఆయన కుమారుని రూపమున యుండవలసియుండెను, పిదప పెంతుకోస్తు దినమున ఆయన తిరిగి వచ్చినప్పుడు ఆయన మరలా దేవుని కుమారుడుగా వచ్చెను. నా భావము గ్రహించారా? ఆ ఉద్దేశ్యము గ్రహించండి.
50ఆయన శరీరములో రావలసి వచ్చెను. ఆయన ఏ శరీరేచ్ఛవలన జన్మించలేదు. మనయొక్క అభిప్రాయమగు సర్ప సంతానము, అది మరలా రుజువుపరచబడుచున్నది. చూడండి. ''శరీరేచ్ఛ,'' ఖచ్చితముగా లైంగిక సంబంధమైనది. ఆపిల్ ఫలములు కాదు; లైంగిక సంబంధము! అది నిజము. అది అట్లే యుండవలయును. ఇచ్చట గమనించండి, ఏ మంచి వ్యక్తైనా గాని… ఆ వెనుకటి ప్రవక్తలను చూడండి, కాని ఆయన ఆ ప్రవక్తకంటె శ్రేష్టమైనవాడుగా యుండవలయును. దానిని చేయుటకై హేతువుగా, కన్యక ద్వారా జన్మించుటకు నిరూపించబడునట్లుగా చూపించుటకై ఆయన కన్యక ద్వారా జన్మించవలసివచ్చెను. విషయమునకు విరుగుడు ఔషధముగాను, శాపమును తొలగించుటకై ఆయన కన్యక ద్వారా జన్మించవలసి యున్నది. నా మాట గ్రహించండి. తానే స్వకీయముగా వచ్చుట ద్వారా ఆయన దానిని నిరూపించెను, కాని ఆయన శరీరేచ్ఛను బట్టి కాదు గాని కన్యక ద్వారా వచ్చెను. సిలువయొద్ద దేవునిలో ఆయన చేయుచున్న నాటకములో యున్న రక్షణయొక్క క్రియను చేయుటకై ఆయన యొక్క వేషమును యెహోవా నుండి యేసుగా మార్చుకొనెను.
JOHN 12:20,21
51గ్రీకు వారు ఆయనను చూడగోరిరి. ''అయ్యా, మేము యేసును చూడగోరుచున్నాము'' అని నేను పరి. యోహాను 12:20 మీద ప్రసంగించుట మీలో అనేకులు వినియుందురు. మీరు దానిని గమనించితిరా?
ఇప్పుడు, గ్రీకు పండితులు, వారు గొప్ప వ్యక్తులుగా యుండిరి. వారికి దేవుని పట్ల సద్బావన యున్నది. మార్స్ కొండపై పౌలు వారికి బోధించిన విధముగా, వారు ప్రపంచమును విజ్ఞానములోను, విద్యలోను నడిపించిన ఘనులు వారు గొప్ప వ్యక్తులుగా యుండిరి. కాని వారు పురాణ గ్రంథములను, ఆసక్తి కలిగించు కళలను మరియు మొదలగువాటిని ఆరాధించుచు, వాటియందు నమ్మకమును కలిగియుండిరి.
రోగులను బాగుచేయుచు, సంభవింపని కార్యములను ముందుగానే వివరించి చెప్పుచున్న వ్యక్తియగు ఈయనను చూచి వారు కలవరపడిరి. అటువంటి ఒక కలవరమును కలిగినవారై ఈయనను చూడవలెనని ఆసక్తిగలవారై ఆయనను చూచుటకై వారు వచ్చిరి. ఇది మీరు జాగ్రత్తగా వినండి. దీనిని మీరు వదిలివేయవద్దు, అర్థమైనదా? వారు వచ్చి బేత్సయిదా వాడగు ఫిలిప్పుతో ఇట్లనిరి, ''అయ్యా, మేము యేసును చూడగోరుచున్నాము.'' ఫిలిప్పు, మరియొక శిష్యుడు యేసు నొద్దకు వారిని తీసుకొని వచ్చిరి.
యేసు వారికి తిరిగి జవాబిచ్చిన మాటలు ఇప్పుడు మీరు గమనించి చూడండి, ఎందుకనగా ఆయన ఎవరైయున్నాడో చూడ వచ్చిన వారైన వారు ఆయనను చూడలేకపోయిరి, వారు ఆయన రూపమును చూడ వచ్చిరి, గాని ఆయన తన ఆలయములో యుండెను. దేవుడు తన ఆలయములో మానవుని శరీరమనే తెరయందు తనను మరుగుపరచుకొనెను, ఆయన చెప్పిన మాటలు గమనించండి. ''గోధుమ గింజ భూమిలో పడి చావకుండినయెడల ఒంటిగానే యుండును.'' చూచారా? ''మనుష్యకుమారుడు మహిమపరచబడు ఘడియ వచ్చియున్నది. ఆయన ఈ భూమిమీద నుండి వెళ్ళిపోవలెను.'' ఈ ఘడియ రానియెడల దానిని మీరెన్నడూ చూడలేరు.'' చూచారా?
JOHN 3:2•
JOHN 12:24
52వినండి! వారెందుకు యేసును ఇచ్చట చూడలేకపోయిరి? ఆయన మారు వేషము నందు యుండెను. దేవుడు మారు వేషమును ధరించుకొనెను. గ్రీకులకు ఒక దేవుడు కావలసివచ్చెను. ఆయన అచ్చటుండెను, కాని ఆ ముసుగు వలన వారాయనను చూడలేకపోయిరి. నేడును ఆ విధంగానే యున్నది! ఆ ముసుగుబట్టి ఆయనను వారు చూడలేకపోవుచున్నారు. అది వారి ముఖముల మీద ఉన్నది. ఈ గ్రీకులు మసుగును ధరించి యుండిరి లేదా ఆ గ్రీకులకు యేసు ముసుగు వేయబడినవానిగా ఉండెను.
గమనించండి, ఆయన వారితో ఇట్లనెను, ''గోధుమ గింజ భూమిలో పడి చావనిచో ఒంటిగానే యుండును.''
వారెందుచేత ఆయనను చూడలేకపోయిరనే దానిని వారు గ్రహించుకొనలేకపోయిరి. అక్కడ ఒక వ్యక్తి నిలబడెను. వారు దేవుని చూచుటకు వచ్చిరి గాని వారికి ఒక నరుడు కనబడెను. ఏమిటది? దేవుడు ముసుగు ధరించెను గనుక వారాయనను చూడలేకపోయిరి. మీరిది మనస్సులో ఉంచుకొనండి. దేవుడు తనను నరుడనే తెరయందు మరుగుపరచుకొనెను. ''దేవుడు తప్ప మరెవరును ఈ క్రియలు చేయలేరని వారనిరి. ఏ మనిషి ఇటువంటి క్రియలు చేయలేడు, ఒక మానవునిగా కనబడుచున్న ఈయన ద్వారా దేవుని క్రియలు ఎట్లు ప్రత్యక్షమగుచున్నవి,'' అని వారు ఆశ్చర్యపడిరి. దేవుడు ముసుగు ధరించెనన్న సంగతి వారికి అర్ధము కాలేదు.
JOHN 12:21-24•
HEB 13:8
53ఆయన ఎప్పుడూ తనను తెరయందు మరుగుపరచుకొను విధముగానే ఆయన ఒక మానవ శరీరమనే తెరయందు తనను మరుగుపరచుకొనెను. కాని ఆయన వారికి తెరయందు తనను మరుగుపరచుకొనెను, ఆయన యొక్క మానవ శరీరమనే ఆలయములో ఆయన ఉండెను. దేవుడు ఒక మానవ శరీరమనే ఆలయములో యుండెను. దయచేసి చాలా జాగ్రత్తగా వినండి. ఆయన నిన్న, నేడు, నిరంతరము ఏకరీతిగా యున్నాడు. చూడండి. దేవుడు తనను ఒక తెరయందు మరుగుచేసుకొని లోకమునకు మరుగయ్యెను, మానవునిగా ముసుగు ధరించెను. చూచారా?
ఇక్కడ దేవుడున్నాడు! ఆ గ్రీకువారు ''మేమాయనను చూడగోరుచున్నాము,'' అని చెప్పిరి. యేసు ఇట్లనెను, ''గోధుమ గింజ భూమిలో పడి చావవలెను.'' నీ ఉద్దేశ్యములన్నిటిలోను నీవు చనిపోవలెను. నీ స్వంత ఆలోచనల నుండి నీవు బయటకు రావలెను. ఆయన శిష్యులుయున్న విధముగానే, ఆయన శరీరమును తినుట ఆయన రక్తమును త్రాగుట గూర్చి శిష్యులు వివరించలేకపోయిరి, కాని, గమనించండి, వారు వాటి విషయములో చనిపోవలసియున్నారు. వారు ఒక నియమమునకు చనిపోయిరి, క్రీస్తునకు చనిపోయిరి, ఆయన ఏమి చేసినా గాని, ఎంత అపజయము ఎదురయినా గాని వారు నమ్మికయుంచిరి. చూచారా. ఆయన ఒక నరునిగా తిని, త్రాగి, నిద్రించెను, చేపలు పట్టెను, ఈ భూమిమీద జన్మించెను, వారితో నడిచెను, వారితో మాట్లాడెను, మిగతావారివలె బట్టలు ధరించెను, కాని ఆయన దేవుడు.
JOHN 12:24
54కావున గ్రీకులు ఆయనను చూడలేకపోయిరి, ఎందుకనగా ఒక మానవ శరీరమందు తనను మరుగుచేసుకొని వారికి తనను మరుగుపరచుకొనెను. వారితో ఆయన పలికిన మాట చూడండి. ''గోధుమ గింజ భూమిలో పడి చావవలెను!''
దేవుడు ఒక మానవ శరీరమనే తెరయందు తనను మరుగుపరచుకొని వారియొక్క కనుచూపులనుండి ఆయన తనకు తానుగా మరుగుపరచుకొనెను, ఒక నరుడినే చూడగలిగితిరి. కాని ఆ ముందుగా నిర్ణయించబడినవారు దేవునిని చూచిరి. ఒకరు నరునిగా చూచిరి, మరొకరు దేవునిగా చూచిరి. అది ఒక మానవ శరీరమనే తెరయందు తనను ఆయన మరుగుపరచుకొనుట యగును, వారిద్దరూ సరియే, కాని మీరుదేనినైతే చూడలేకపోతిరో దానియందు నీకు విశ్వాసము గలదు, ఏమైనా గాని నీవు దానిని నమ్మెదవు, దేవుడు ఒక మానవ శరీరమనే తెరయందు తనను మరుగుపరచుకొనెను. ఆయన ఆ శరీరములో ఉండెను, ఆ శరీరమే ఆయనకు ఒక తెరగా ఉండెను. దేవుడిని ప్రత్యక్షపరచునట్లుగా ఆ తెర అనునది చినిగిపోయెను.
JOHN 13:3•
JOHN 16:28•
ACTS 9:3
55పాత నిబంధనలో దేవుడు కరుణాపీఠము మీద యున్నప్పుడు దాగియుండెను, కరుణా పీఠమునకు ఒక తెరయుండి, ఆ తెర వెనుక తనను మరుగుపరచుకొనెను. పాత నింబంధనలో, ఆయన తన ఆలయములో నుండెను. కాని జనులు వచ్చి ఈలాగున ఆరాధించిరి, కాని, గుర్తుంచుకొనండి, అచ్చట ఒక తెర యుండినది, ఆమేన్, అది దేవుడిని మరుగుపరచినది. అక్కడ దేవుడున్నట్లు వారెరుగుదురు, వారాయనను చూడలేకపోయిరి. ఆ అగ్నిస్తంభము మరెన్నడూ వారికి కనబడలేదు. మీరది గమనించారా? ఆ తెర వెనుకకు వెళ్ళిపోయిన నాటినుండి ఆ అగ్నిస్తంభము, యేసు క్రీస్తు మరల వచ్చినప్పటి వరుకు అది మరలా కనబడినట్లుగా పరిశుద్ధ గ్రంథమునందు ఎచ్చటా ఒక్కచోటైనా లేదు, దేవుడు తెరయందు మరుగుపరచుకొనెను.
ఆయన భూమి మీద నిలబడి ఇట్లనెను, ''నేను దేవుని యొద్దనుండి వచ్చాను. దేవుని యొద్దకు వెళ్ళుచున్నాను.''
యేసు మరణము, సమాధి, పునరుత్థానము తరువాత: పౌలు దమస్కు దారిలో వెళ్ళుచుండగా, మరల ఆ అగ్నిస్తంభము కనబడెను. ఏమిటది? తెర వెనుకనుండి బయటకు వచ్చెను! దేవునికి మహిమ!
56ఆయన తెర వెనుక ఉండెను.
ఇప్పుడాయన దేని వెనుక యున్నాడు? చర్మమనే తెరవెనుక; గమనించారా, ''సముద్ర వత్సల చర్మము,'' చర్మము వెనుక మరుగైయుండెను. సిలువ మరణము పొందినప్పుడు ఆ తెర చినిగెను. ఆయన తనపై చుట్టుకొని లోపల మరుగుపరచుకొనియుండు ఆ తెర అనునది ఆ సిలువలో మరణమును పొందిన దినమునందు ఆ తెర చినిగి, పూర్తిగా కరుణాపీఠము కనబడునట్లుగా అయ్యినది.
ఇప్పుడు, మనవంటి పాపులు, నీచుల పైన దేవుడు కృపను ఎట్లు చూపించుచున్నాడో యూదులకు అర్ధము కాలేదు. కాని వీరు ఆ కృపను ఇచ్చుచున్న ఆయనను వారు చూడలేకపోయిరి, ఆయన చర్మపు తెర వెనుక దాగియుండెను. లోపల ప్రక్కన కరుణా పీఠమునందు ఆయనయుండెను, సముద్రపు వత్సల చర్మము వ్రేలాడుచు ఆయనను మరుగుపరచుచూ యుండినది.
57ఇంతకు ముందైతే ఏ వ్యక్తైనా గాని ఆ తెరకు వెనుక నడచి లోపలికి ప్రవేశించినయెడల ఆ క్షణమందే అతడు మరణించును. (ఆమేన్). ఓ, ఇంకొక నిమిషములో మనము ఒక పాఠమును నేర్చుకొనబోవుచున్నాము. మీకు సాధ్యమైతే మీరు దానిని అంగీకరించండి. ఆ తెర వెనుకకు ఒకసారి యాజకుల కుమారులలో ఒకరు వచ్చుటకు ప్రయత్నించి చనిపోయెను. ఆ తెర వెనుకకు వెళ్ళవద్దు. ఆ తెర వెనుక నడిచిన వ్యక్తి మరణించెను … ఎందుకని? అచ్చట ఇంకా విమోచన కలుగలేదు. ఆ విమోచన అనేది అచ్చట సంభవనీయతమైనదిగా యుండినది. అది సంభవనీయతముగా మరుగుచేయబడి యుండినది; మరుగు పరచబడిన సంభవనీయతమైన ఆ కార్యము ఇంకా నిజ రూపము దాల్చుకోలేదు. అది విమోచనగా యుండినది… పాపమనేది కప్పబడియున్నది, కొట్టివేయబడలేదు… తీసివేయబడుట, లేదా తీసివేయబడకపోవుట, కొట్టివేయబడుట అనగా ''తీసివేసి దూరముగా బయటకు పారవేయుట'' అని అర్ధము. గొర్రెల, మేకల రక్తము ఆ పనిని చేయలేదు. కావున యెహోవా ఒక తెరవెనుక దాగియుండెను. ఇప్పుడు, ఈ తెర వెనుక, అచ్చటే ఆయన దాగియుండెను. దానిలోనికి ప్రవేశించుటకైనను, దాని లోపలికి ప్రవేశించుటకై ప్రయత్నించిన, ఆ వ్యక్తి మరణమై క్రింద పడవలసినదే.
MATT 27:51•
MARK 15:38•
LUKE 23:45•
2COR 3:15
58కాని పెంతెకోస్తు దినము నుండి, సిలువ మరణమునకు తరువాత, ఆ తెర పైనుండి క్రిందికి ఆ సంతతి కొరకై చినిగినప్పుడు… తెర వెనుక మరుగైయున్న ఆ దేవుడు యేసుగా యుండెను. ఆ కల్వరియొద్ద మరణించినప్పుడు దేవుడు అగ్ని, మెరుపులను తీసికొని వచ్చి ఆ తెరను పైనుండి క్రిందికి చింపి ఇప్పుడు కరుణాపీఠము తెరువబడి పూర్తిగా కనబడునట్లుగాయున్నది. మోషే గ్రంథమును వారు చదువుచున్నప్పుడు ఇంకా దానిని వారు చూడలేని గ్రుడ్డివారయిరి. ఇశ్రాయేలీయుల హృదయాలను తెర కప్పినదని పౌలు చెప్పెను. ఓ సోదరీ, సోదరుడా, తెర చినిగి దేవుడిని అందరూ చూచునట్లుగా వెలుపలికి తీసుకొని వచ్చి సిలువలో వ్రేలాడుచున్నట్లుగా, యూదులు దానినే చేసిరి. అందరూ చూడగలుగునట్లుగా ఆయన యుండెను, కాని వారు ఆయనను చూడలేకపోయిరి.
59అన్యులు కూడా అలాగే చేయుట జరిగినది కదా? (ఓ దేవా!)సంఘ కాలములలో దేవుని కుమారుడుండెను, ఇప్పుడు ఈ సంఘశాఖల కార్యములనే తెరను, పెంతెకోస్తు ఆరంభించిన ఈ ఆచారములనే తెరను, సంఘము యొక్క తెరను చీల్చివేసి నా జనులు చెప్పిన మాటలేమనగా, ''అద్భుతములు గతించి పోయినవని,'' చెప్పుచున్నారు. దేవుడు దానినుండి తెరను తొలగించి, దానిని అందరూ చక్కగా చూడగలుగునట్లుగా చేసెను, కాని వారేమో సరిగ్గా అదే విధముగా దానిని మరలా సిలువలో వ్రేలాడదీయుటకు సిద్ధమయ్యిరి. అక్షరాలా నిజము!
60తెర వెనుక మరుగైయున్న దేవుడు, ఆ తెరను తొలగించుట ద్వారా ఆయన బట్టబయలుగా కనబడుచున్నాడు. ఆయన అచ్చట నిలబడియుండుటను వారు కనుగొని యుండవలయును. ఆయన ఎంతో సామాన్యమైనవానిగా కనిపించినను, ఆయన ఒక సామాన్యమైన వ్యక్తిగా కనిపించినా గాని ఆయనను వారు చూడలేకపోయిరి. చూడండి, అక్కడే ఆయన నిలబడియున్నాడు. ''ఇతడు ఏ పాఠశాల నుండి వచ్చెను?'' అని వారడిగిరి. వారు ఆ ఈటెతో ఆయన శరీరమును పొడిచినపుడు, ఆ ఆత్మ ఆయనను విడిచెను, ఆలయమును… బలి అర్పణములు, రాళ్ళు బోర్లపడినవి, మెరుపులు ఆలయములోనికి దూసుకొని వెళ్ళి ఆ తెరను చీల్చివేసెను. అది ఏమిటి? అచ్చట వారి దేవుడు కల్వరి మీద వ్రేలాడుచున్నాడు, అయినా వారు చూడలేని అంధులయిరి.
ఆయన అందరికీ కనబడునట్లు వచ్చెను, అయినా వారు చూడలేదు. వారు గ్రుడ్డివారుగా చేయబడిరి, మానవ శరీరమనే తెరయందు మరుగుపరచబడి యుండెను!
MATT 3:9•
LUKE 3:8•
JOHN 3:9
61ఆ తరువాత ఆయన పౌలుయొద్దకు, చెరసాలలోనున్న అగ్నిస్తంభ రూపములో వచ్చెను. మీకు గుర్తున్నదా?
ఈ చివరి దినములలో ఆయన తిరిగి రానైయున్నాడు. మనుష్యకుమారుని ప్రత్యక్షపరచుటకు మరియు వాక్యమనే వెలుగును చూపించుటకై తిరిగి ఒక అగ్నిస్తంభము రావలసియున్నది. ఆ ఆచారములన్నియూ తుడిచిపెట్టబడును, ఏదియూ నిలబడదు, ఏమైనాగాని అది జరుగును. దేవుడు ఆ శాఖలను, ఆచారములను చీల్చివేయును. ఆయన ఎటువంటి ఆత్మతో దానిని చేయును? మొడటసారి చేసినట్లే. ఏలియా దినములలో, యోహాను దినములలో ఆయన చేసినది చూడండి. ''అబ్రాహాము మా తండ్రి అని మీలో మీరు తలంచవద్దు. దేవుడు ఈ రాళ్ళ ద్వారా అబ్రాహాముకు పిల్లలను పుట్టించగలడు.'' చూచారా? నేను దీనికి చెందాను, దానికి చెందాను అని తలంచవద్దు. చూచారా? ఆ తెరను దేవుడు చీల్చివేయుచున్నాడు; ఆయన తానెవరనే దానిని బయలుపరచుకొనుటకై, చూడండి, ఇచ్చట ఇప్పుడు ఆ తెరను చీల్చివేయుచు౦డగా, దానిని మనము కనుగొనెదము.
62ఒకప్పుడు ఆ తెర వద్దకు వెళ్ళిన వ్యక్తి వెంటనే చనిపోయెను. ఇప్పుడు దానిగుండా వెళ్ళకుండుటయే మరణము, ఆమేన్! దేవుడ్ని, ఆయనయొక్క శక్తితో చూచునట్లుగా, ఆ ఆచారపు తెరను నీవు చీల్చుకొని, ఆ సంఘశాఖ యొక్క గోడను బ్రద్దలు చేసుకొని నీవు వెళ్ళలేనియెడల, అది నీకు మరణముగా యుండును. ఒకప్పుడు లోపలికి ప్రవేశించుట మరణముగా యుండినది. ఇప్పుడు వెలుపల యుండుట మరణముగా యున్నది. కరుణా పీఠము పూర్తిగా కనబడుచున్నది, దానిని ఎవరైనా చూడవచ్చును, తెర అనునది చీల్చబడినది. దేవునికి మహిమ! ఆ కరుణాపీఠము పూర్తిగా కనబడుచున్నది.
MATT 27:51•
MARK 15:38•
LUKE 23:45
63దేవుడు తనను మరుగుపరచుకొని ఒక రహస్యముగా యుంటూ వుండగా, మనవంటి ఘోర పాపులపై ఏ విధముగా ఆయన కృప చూపగలిగెను. ఇప్పుడు తెరవబడిన దృశ్యముగా యున్నది, లేదా ఆయనయొక్క వాక్యము ద్వారా ప్రత్యక్షపరచబడి ఇప్పుడు పూర్తిగా కనబడు ఒక దృశ్యముగా అది యున్నది. ఎల్లప్పుడూ వాక్యమే, ఆ దేవుడు నిరంతరము వాక్యమైయున్నాడు వాక్యమే తెరచును. యేసు చనిపోయిన ఆ దినమున ఆ జనులు దేవుని వాక్యమును ఎరిగియుండినచో ఆ కరుణా పీఠమును వారు చూచియండెడివారు. ఆయనెవరై యున్నాడో వారు గ్రహించెడివారు.
''ఆయన ఎవరు? ఎందుకు తెర చినిగినది?'' గుర్తించుకొనండి, అందులోనికి వెళ్ళుట వలన మరణముగా యుండినది, ఎవరును దానిని చూడలేకపోయిరి. మోషే ఒక రూపములో దానిని చూచెను, అది ఒక మనుష్యుని వెనుక భాగముగా యుండెను, అది ఇచ్చట యున్నది, అదే వ్యక్తి వీపు ఇప్పుడు రక్తము కారుచున్నది. ఏమిటది? దేవుడు వారికి కరుణా పీఠమును చూపించగోరుచున్నాడు, తానేమైయున్నాడో వారికి చూపించగోరుచున్నాడు. అందుకే దేవాలయములోని తెర దేవునియొక్క హస్తముచే పైనుండి క్రిందికి చీల్చబడి, దేవుడిని ఒక సామాన్యమైన దృశ్యముగా చూపించెను, అది సిలువలో వేల్రాడుచున్న యేసు క్రీస్తుగాయుండెను, ఆయనే కరుణా పీఠము. అయితే అది ఏమైయున్నది? దానిని జనులు చూడలేని గ్రుడ్డివారయిరి.
64ఇప్పుడు మరల అదే జరుగుచున్నది. పెంతెకోస్తు దినమున వాక్యము వచ్చెను. అది దేవుని కుమారుని రూపములో వచ్చెను. అయితే రోమ్‌లోని నైసియాలో వారు సంస్థగా దీనిని మార్చిరి. మెతడిస్టు, బాప్టిస్టు, ప్రెస్బిటేరియను,పెంతెకోస్తు అను శాఖలుగా అది మారినది. ఒక వ్యక్తి తాను ఎచ్చట నిలబడియున్నాడనే దానిని గ్రహించలేనంతగా పారంపర్య ఆచారములతో ఆ శాఖలు ఎంతగానో మారిపోయినవి. కాని దేవునికి మహిమ! ఆయన చివరి దినములలో ఆయన తాను ఏమిచేయబోవుచున్నాడనే దానిని గూర్చి వాగ్దానము చేసియున్నాడు. మరల మన ముందు దానిని తెరచి ఆయన తన వాక్కును తేటగా చూపించును, అవి తెరువబడుట చూడండి.
వారు వాక్యమును ఎరిగియుండినచో, యేసు ఎవరో ఎరిగియుండెడివారు. ఒక వ్యక్తి దేవుని వాక్యమును గుర్తెరిగియున్నచో, తాను జీవించుచున్న ఘడియను, ఆ సమయమునందు ఏమి సంభవించుచున్నదనే దానిని గూర్చి అతడెరిగియుండును. వారు ఆ వాక్యమునకు చెవి యొగ్గుటకు నిరాకరించుచున్నారు. వారి దృష్టంతా వారి పారంపర్య ఆచారముల పైనే యుండును. ఆ యూదులు అలాగు చేయుటకు ఏమి కారణము? వారు నిజముగానే దానిని చూచినట్లుగా కనబడుచున్నది, ఎందుకంటే ఆ కార్యమనునది చీల్చి తెరవబడినది. ఒక ఉద్దేశ్యము కొరకు అది చీల్చి తెరవబడినది.
ROM 3:4
65ఇప్పుడీ ఉజ్జీవము ఇక్కడ ఎందుకు వచ్చినది? అదెట్లు విస్తరిల్లును? అదెట్లు దీవించబడును? దీనికి ఎన్ని అనుకరణలు వచ్చినా లేదా వేరే ఏదైనా గాని నేను లెక్కచేయను, అది ఏ… మోషేతో పాటు మిశ్రిత జనాంగము బయలుదేరెను. కాని అది ఎందుకొరకు చేయబడినది? తప్పు, ఒప్పుల మధ్య తేడా చూపించుటకు యెహోవాయే తనంతట తానుగా ఆ తెరను, దేవుడే దానిని తొలగించెను. మెతడిస్టు, బాప్టిస్టు, ప్రెస్బిటేరియనులలో ఎవరిది సరి? దేవుని వాక్యమే సరియైనది. ''మానవుని మాట అబద్ధము, దేవుని మాట సత్యము.'' దేవునికి ఒక అనువాదకుడు అవసరము లేదు. ఆయనే తన స్వంతంగా అనువదించుకోగలడు. ఆయన దానిని బయలుపరచి అర్ధము చెప్పును. దేవుడే తనంతట తానుగా తెరను తొలగించుకొనెను. ఓ! మనమధ్య, ఆయన గొప్ప హస్తము ఈ కార్యములు చేసి, ఈ సంగతులు చెప్పుట మనము చూచుచున్నాము.
దానిని గూర్చిన విషయము నేటి రాత్రియందు కలదు, దేవుని హస్తమును గమనించుట ఎట్లో, అది ఏమి చేయునో, అది ఏ విధముగా తనను బయలుపరచుకొనునో అనేది గమనించండి, చూడండి?
''అది అబద్ధము. అది మతమౌఢ్యము. అది బుద్ధిహీనత. అందులో ఏమీ లేదు. అది అవివేకము. అది బయల్జెబూబు. అది దయ్యము. అది అదృష్ట జాతకము, అది మరేదో'' అని జనులు చెప్పుచున్నారు. చూచారా, వారు ఆయనను గూర్చియు అలాగే చెప్పిరి.
66ఓ సంఘమా, ఈ టేపు వెలుపలికి వెళ్ళినయెడల, సువార్త సేవకులారా, మీరెచ్చట జీవించుచున్నారనే దానిని మీరు చూడలేకపోవుచున్నారా? మనము ఏ ఘడియలో ఉన్నామో చూచారా? దేవుడు అచ్చట దానిని ఒక ప్రక్కగా త్రోసివేసి తన్నుతాను బయలుపరచుకొనుచున్నాడు. గమనించండి, ఆయన ఆ దేవాలయపు తెరను పట్టుకొని దానిని ముక్కలుగా చింపివేసి, వారు ఆయనను ముసుగులేని ముఖముతో చూచునట్లుగా ఆయన దానిని చేసెను, అయినా వారు చూడలేని గ్రుడ్డివారయిరి. నేడును ఆయన అదే చేయుచున్నాడు, ఆయన ఏ వాగ్దానమును చేసెనో అదే వాక్యమును ఆయన మనముందు యుంచుచున్నాడు. వాక్యములోనున్న ప్రతీ వాక్యమును తేటతెల్లగా చూచునట్లుగా మన ఎదుట పెట్టుచున్నాడు.
అన్య సంఘము ఏమి చేయుచున్నదో మీకు తెలియునా? యూదుల సంఘము చేసినదే వీరును చేసిరి, దానిని చూడలేని ఎంతో గ్రుడ్డివారై యున్నారు. అంతే. ఆ దినములలో వారి హృదయములును ఆ విధంగానే యున్నవి.
67గమనించండి, ఇప్పుడు దానికి దూరముగా యుండుట వలన మరణము. మీరు దాని లోపలికి ప్రవేశించవలెను. ఈ తెర ద్వారానే వెళ్ళవలెను, లేనియెడల మీరు బ్రతుకలేరు. దేవుడు వారిపై ఎట్లు దయ చూపగలడు. అయినా గాని అదేమైయున్నదో, గుర్తించుకోండి - ఆ తెర వెనుక ఏదైతే యున్నదో దానినే దేవుడు బయలుపరచుచున్నాడు. ఆ తెర వెనుక ఏమున్నదో గమనించండి. వాక్యము. అది దేనిని మరుగుచేసినది, వాక్యమునే. అది ఏమైయున్నది? అది మందసములోనున్నది. వాక్యమునే ఆ తెర మరుగుపరచియుంచినది. యేసే ఆ వాక్యమైయుండెను, ఆయనే ఆ వాక్యము. ఆయన శరీరమనే తెర దానిని మరుగుపరచెను.
ఈనాడు ఆచారపు తెర అనునది మరలా వాక్యమును, ''అది ఆ విధముగా కాదు'' అని చెప్పుచూ మరుగుపరచుచున్నది. కాని అది ఆ విధముగానే యున్నది! దేవుడు దానికి సాక్ష్యమిచ్చుచున్నాడు, ఆయన సూర్యునివలె ఎంతో ప్రకాశవంతముగా తనను తాను అందరి ఎదుటగా బ్రద్ధలు చేసుకొనుచున్నను, కాని దానిని వారు చూచుటలో తప్పిపోవుచున్నారు. దేవుడు మనపట్ల కృప చూపును గాక!
EXOD 19:20,21•
EXOD 34:29,33
68ఆ కాలమునకై దేవునియొక్క వాక్యముతో దేవునియొక్క సన్నిధినుండి మోషే వచ్చుట ఒక సాదృశ్యముగా యున్నది. ఇప్పుడు నిర్గమకాండము 19 గమనించండి. దీనిని తప్పిపోవద్దు, నిర్గమ కాండము 19. మోషే దేవుని సన్నిధినుండి వచ్చుచుండెను. 19:20 మరియు 21. మోషే దేవుని సన్నిధినుండి వచ్చుచుండెను. ఆతడు వాక్యములోనికి వెళ్ళెను, వాక్యము వ్రాయబడెను. అతడు వాక్యముతో కూడా దేవుని సన్నిధిలో ఆ యుగపు వాక్యమును అతడు కలిగియుండెను. ప్రతి యుగమునకు ఒక వాక్యమున్నది. మోషే వచ్చుచుండగా అతని ముఖము ప్రకాశించెను. చూచారా? వాక్యము అతనిలో యుండి దానిని ప్రత్యక్షపరచుటకై, జనులకు యిచ్చుటకై సిద్దముగా ఉన్నది.
ఆ నిజ వాక్యమును దేవుడే వ్రాసెను. అది మోషేయొద్ద ఉండెను. గమనించండి, అది మోషేయొద్ద ఉండి బయలుపరచబడబోవుచున్నది. అతడే వారికి వాక్యము. అతడే సజీవమైన, మరుగు పరచబడిన వాక్యమైయుండెను. అతడు తనకే తెరను వేసుకొనెను. మోషే తన ముఖము మీద ముసుగువేసికోవలసి వచ్చెను. ఎందుకు? అతడే ఆ వాక్యముగా యుండెను! ఆమేన్. ఆ వాక్యము తెలియచేయబడు వరకు మోషే ముసుగు వేసుకోవలసియుండెను.
మీరు దానిని చూడగలుగుచున్నారా? వాక్యము ఎచ్చట యున్నాగాని, అది తెర వెనుక మరుగు పరచబడియుండెను.
EXOD 34:33
69మోషే వాక్యమును కలిగియుండెను. మరువ వద్దు, వాక్యము ప్రత్యక్షపరచబడిన తరువాత మోషే మరలా మోషేగా మారెను. చూచారా? కాని వాక్యము అతనిలో యుండి ఇవ్వబడుటకు సిద్దముగా నున్నప్పుడు అతడు దేవుడుగా యుండెను. దానికి తర్వాత అతడు మోషేగా లేడు, ఆ కాలమునకు చెందిన ప్రభుని వాక్యము అతనియొద్ద ఉండెను. అది అయిపోవు వరకు ఏదియూ అతనిని అంటుకోలేకపోయెను. అతనితో వాక్యముండెను, కావున అతడు వచ్చినప్పుడు జనులు అర్ధము చేసికొనలేక తలలూపిరి. అతడు మారెను, వేరే మనిషిగా ఉండెను. అతడు ఆ వాక్యముతో వచ్చెననియు, "అతడు ముఖముపై అతడు ముసుగు కప్పుకొనెనని" పరిశుద్ధ గ్రంథము చెప్పుచున్నది. ఎందుకనగా అతడు "వాక్యమును కలిగియుండెను." అతడే వారికి వాక్యముగా యుండెను.
2COR 3:7,15
70ఇప్పుడు గమనించండి, ఒకవేళ మోషే… ఓ సోదరుడా, ఇక్కడ ఒక అవమానము జరుగుచున్నది. కాని మోషే … 2వ కొరింధీ 3వ అధ్యాయములో పౌలు అదే చెప్పెను. ఆ మహిమ కలిగినందున మోషే తన ముఖమును కప్పుకొనెను. అది సహజ మహిమ, స్వాభావిక ధర్మశాస్త్రము. ఆ ధర్మశాస్త్రము నశించునని మోషే ఎరిగియుండెను. ఆ గొప్ప మహిమ వలన జనులు గ్రుడ్డివారగునంతటి గొప్పదై యుండెను, కాబట్టి అతడి ముఖముపై వారు ఒక తెరను వేయవలసివచ్చినది. అది ఎంత గొప్పది! (ఆత్మసంబంధముగా గ్రుడ్డివారు) ఆ మహిమ వెడలిపోవును కాని, ఈ మహిమ తగ్గదు, చూచారా. మోషే యొద్ద శరీర సంబంధ ధర్మశాస్త్రమున్నది. అది శిక్షను విధించునది, కృప లేనిది, ఏమిలేనిది, అది మిమ్మల్ని శిక్షించినది. కాని మనము మాట్లాడుచున్నఈ కార్యము … దానిలో క్షమాపణ లేదు. మీరు ఏమైయున్నారో దానిని మాత్రమే చెప్పుచున్నది. ఇది నీకు ఒక తప్పించుకొను మార్గమును చూపించుచున్నది.
ఓ! ఆ వాక్యపు తెర తొలగించబడినప్పుడు, ఓ, ఆ ముఖము ఎటువంటి ముఖమైయుండును? అది తెర వేయబడవలయును. అది తెర వేయబడి మరుగుపరచబడాలి. అది తెరవేయబడి మరుగుపరచ బడవలయును. గమనించండి. ఆత్మ ఒక మానవ ఆలయమనే తెరలో మరుగుపరచబడియున్నది, చూచారా, ఆయన ఒక స్వాభావికమైన తెరలోనుండి స్వాభావిక వాక్యమును గూర్చి చెప్పెను.
EXOD 20:14-16•
2COR 3:6
71ఇక్కడ పౌలు ఆత్మ వాక్యము గూర్చి మాట్లాడుచున్నాడు. ''మనము అక్షరమునకు (ధర్మశాస్త్రము) సేవకులము కాము గాని ఆత్మకు సేవకులము,'' ఆత్మ అక్షరమును తీసికొని బయలుపరచును.
అది కేవలము ధర్మశాస్త్రము. ''వ్యభిచరించరాదు, దొంగిలించరాదు, అబద్ధమాడరాదు, ఇది చేయరాదు, అది చేయరాదు'' అని అది చెప్పును, చూచారా? నీవు దానిని చూచి చెప్పవలెను.
కాని ఇది ఈ కాలపు వాగ్దాన వాక్యము మీదికి వచ్చు ఆత్మయై యున్నది, రెండు రాతి పలకలను కాదు, సజీవ దేవుని సన్నిధిని ఇది ప్రత్యక్షపరచును. ఎవరో చెప్పిన వేదాంత ఆలోచన కాదు, లేదా మాయాజాలము కాదు, ఎత్తుగడ కాదు, కాని ఇది దేవుని వాగ్దానమై మన ఎదుట బయలుపరచబడి మరియు ప్రత్యక్షమైనది. ఎటువంటి తెర వెనుక అదియుండును? మన ఎదుట బయలుపరచబడియున్నది. ఆ వెనుక ఉన్నది ఎట్టివిధమగు ముసుగు?
EXOD 19:18
72గమనించండి, ఈ యెహోవా అగ్ని స్తంభములో నుండి క్రిందికి దిగి వచ్చినప్పుడు, భూమి కంపించుటను, కొండలను అగ్నితో దహించుటను, ఆ విధముగా ఆయన చేసిన కార్యములను చూచిన జనులు అది ఎంతో మహత్తరమైన కార్యమని చెప్పిరి. ఆ కొండ యొద్దకు ఎవరైనా వెళ్ళుటకు ప్రయత్నించినయెడల నశించిపోయెదరు. అది అంత భయంకరముగా కంపించుట వలన మోషే కూడా ఆ కంపమునకు భయపడెను. ఆ కాలములో పర్వతమును మాత్రమే కంపింపచేసెను గాని ఈ సమయములో భూమ్యాకాశములను ఆయన కంపింప చేయును.
ఈ మహిమ ఎట్టిది? అది ఒక సహజమైన తెర ద్వారా మరుగుపరచబడి యుండినయెడల ఇది అత్మయనే తెర ద్వారా మరుగుపరచబడి యుండవలయును. కాబట్టి సహజమగు దానివైపు చూడ ప్రయత్నించవద్దు, ఆత్మ సంబంధమైన దానిలోనికి చూచి నీవెక్కడున్నావో, ఏ ఘడియలో జీవించుచున్నావో గమనించుము.
MATT 4:4•
LUKE 4:4
73ఈ భావము నీవు గ్రహించుచున్నావా? చూడండి, జనుల మీద ఒక ఆత్మీయ తెర కప్పబడియున్నది. వారీలాగు చెప్పెదరు, ''నేను మెతడిస్టును. నేను అందరికన్న మంచివాడిని. నేను బాప్టిస్టుని, నేను పెంతెకోస్తును.'' అది ఒక ఆచారపు తెర అని మీరు గ్రహించలేరు. అది దేవుని నుండి నిన్ను దాచుచున్నది. నీవు అన్నీ అనుభవించకుండా అది ఆటంకపరచుచున్నది.
"ఓ! నేను కేకలు వేసి క్రిందికి పైకి ఎగురుచున్నాను,'' అనవచ్చు.
ఆయన ''ప్రతీ వాక్యము!'' అని చెప్పెను. హవ్వ ఒక్కమాట తప్ప అంతయూ నమ్మెను. చూచారా? అది దేవునియొక్క సంపూర్ణవాక్యమై ఈ ఘడియ యొక్క వాగ్దానమై బయలు పరచబడియున్నది.
ఇంకా ముందుకు చూద్దాం. చెప్పవలసినది చాలా యున్నది, ఇంకా చెప్పవలసినది నా దగ్గర ఇరువది పేజీలు గలవు, కాని దానిని అంతా చెప్పను. నేను త్వరపడుదము.
74జనులకు వాక్యమును ఇచ్చు ముందు ఆయన ఒక స్వాభావిక తెరయందు తనను మరుగుపరచుకొనెను. ఇప్పుడు, దేవుడు వాగ్దానము చేసినట్లుగా మానవ శరీరమును కప్పుకొనెను. మీరిది గ్రహించారా? దేవుడు తన్నుతాను మానవ శరీరమందు తననుతాను తెరయందు మరుగుపరచుకోవలసి వచ్చెను. దేవుడు! దానిని మీరు గ్రహించితిరా? దేవుడు జనులయొద్ద మాట్లాడుటకై ఆయన తననుతాను మానవ శరీరమనే తెరయందు మరుగుపరచుకొని, వారిపై ఒక ఆత్మీయ ("నేను ఇది, నేను అది అని" చెప్పుకొను) తెరతో మూసెను. అది తెరగా యున్నప్పుడు, అది ఆచారపు తెరగా యుండుటచే దానిని రెండుగా చీల్చెను "అద్భుతములు జరుగు దినములు గతించిపోయినవని" వారు చెప్పుచున్నారు.
MATT 4:4•
LUKE 4:4•
ACTS 2:39
75ఒక చిన్న బాప్తిస్టు సంఘకాపరి ఒకరోజు నా యొద్దకు వచ్చి, సహోదరుడు గ్రీన్ యొద్దకు వచ్చి ఆయన, ''బ్రెన్హాం సోదరుడా, నీకు వ్యతిరేకముగా ఒక్కటి నేను చెప్పెదను. నీవు ఈ జనులను ఈ విధముగా చేయుటకు ప్రయత్నించు… అది రమాడా ఇన్ వద్ద కూటములు జరుగుచున్నప్పుడు అది జరిగినది. అపోస్తులుల కాలమును విశ్వసించమనుచు, ఆ కాలములో యున్నవారివలె నేడు కూడా వీరిని జీవించాలని యువజనులు విశ్వసించునట్లు చేయుచున్నాననియు, అపోస్తులుల కాలము అపోస్తులులతోనే గతించి పోయినది," అని అతడు చెప్పెను.
అందుకు నేను ''గతించిపోయెనా?'' అనడిగాను.
''అవును.''
''అపోస్తలుల కాలపు ప్రతినిధి ఎవరు?'' అన్నాను.
''మేడ గదిలోనున్న పండ్రెండు మంది అపోస్తలులు,'' అన్నాడు.
''అయితే పౌలు లేడు." పేతురు వారి ప్రతినిధి, ఇదంతా జరుగుచున్నప్పుడు, పరిశుద్ధాత్మ పనిచేయుచున్నప్పుడు పేతురు ఇట్లనెను, "ఈ వాగ్దానము మీకును, మీ పిల్లలకును, దూరస్థులందరికిని, మన ప్రభువగు దేవుడు పిలిచిన వారందరికిని చెందును.'' ఆయన ఇంకా పిలచుచున్నాడంటే ఇంకా అదే కార్యము ఇంకా యున్నదని అర్థమగును. అట్లైనయెడల అపోస్తలుల కాలము ఎప్పుడు అయిపోయినది? దేవుడు పిలచుట ఆపినప్పుడు అపోస్తలుల కాలము ఆగిపోవును. అతడు మారు మాట్లాడక టోపి తీసికొని వెళ్ళిపోయెను.
దానిని చెయ్యాలంటే వాక్యము తీసుకొనవలయును. అది వాక్యమైయున్నది! యేసు సాతానుతో ''ఈలాగు వ్రాయబడియున్నది అని చెప్పెను.'' ''ఈలాగు వ్రాయబడియున్నది!''
''అది ఎన్నడూ అంతము కాదని పేతురు చెప్పెను. ప్రభువు ఎందరిని పిలచునో వారందరికి ఈ దీవెన దొరకును. నీవు అది ఆగిపోయినదనుచున్నావు. ఏది?'' అనడిగాను.''
"ఏ హాని కలుగలేదు.''
''లేదయ్యా, ఏమీ జరుగలేదు. ముందుకు సాగిపోవుడి, అని నేను చెప్పాను. చూచారా? దేవుడు ఎందరిని పిలచునో వారందరూ ఈ అపోస్తులుల ఆశీర్వచనము పొందుదురని పేతురు చెప్పెను? అవును. అది ప్రభుని వాక్యము, చూచారా.
76ఇప్పుడు సహజమగు తెరగా యున్నది. వాక్యమైయున్న దేవుడు మానవ శరీరమనే తెరయందు మరుగుపరచుకొనెను. అది ఏమిటి? దేవుడు మోషేయను తెరలో మరుగైయుండెను, దేవుడు మోషేయను తెరలో యుండెను. దేవుని సన్నిధి అతనిలో యన్నది, అతడు వాక్యముతో ఖచ్చితముగా ఉన్నందునే ముఖము మీద ముసుగు ధరించవలసివచ్చెను. ''ఇది చేయరాదు! ఇది చేయవచ్చు!'' అని చెప్పుటకు అతడు వాక్యమును బయలుపరచిన ప్రవక్తగా యుండెను.
EXOD 20:19•
DEUT 18:15,18
77ఆ తరమునకు తనయొక్క వాక్యమును ఇచ్చుటకు ఆయన మానవ శరీరమనే ఒక తెరయందు మరుగుపరచుకొనెను, లేనియెడల పిలువబడినవారు కూడా వాక్యమును చూడలేని గ్రుడ్డివారయినవారే. చూచారా? అచ్చట వెలుపలయున్న జనులు సహితము దానిని చూచి వారు సహించుకొనలేకపోయిరి. నిర్గమ కాండములో దానిని మనము చూతుము. ''దేవుడు కాదు, మోషే మాట్లాడితే చాలును'' అనిరి. అగ్నిస్తంభము ఎక్కువగా ప్రత్యక్షమవ్వకపోవటానికి కారణమును గ్రహించగలిగితిరా? చూచారా?
దేవుడు, ''నేను ఆ విధముగానే చేసెదను. నేను వారికొరకు ఒక ప్రవక్తను పుట్టించెదనని'' చెప్పెను. ఆమేన్! ''నేను వారికొరకు ఒకరిని లేపెదను. ఆ విధముగా ఒక ప్రవక్త వచ్చెను. అతడు వాక్యముగా యుండును.''
ఆయన, ''వాక్యము ఏమైయున్నదనే దానిని గూర్చి వారు ఎరుగవలెననినయెడల, మోషే, నీకు నేను మండుచున్న పొదలో కనిపించితిని. ఇప్పుడు నేను కొండ మీదికి అగ్ని వలె దిగి వచ్చెదను. నీవు సత్యమే చెప్పినట్లు వారు గ్రహించెదరు. నేను మరల మంటవలె కనబడుదును. నేను జనులకు ప్రత్యక్షమై రుజువు చేసెదను. నీ సేవను బయలుపరచెదను,'' అని దేవుడనెను. దేవుడు మోషేతో చెప్పినది అదియే.
EXOD 20:19•
EXOD 34:33
78''జనుల ఎదుట నిన్ను నేను మహిమపరచెదను." ఆ మండుచున్న పొదలో నిన్ను నేను కలిసికొనునట్లు నీవు వారికి చెప్పిన విధముగానే. నేను మరల అదే రీతిగా అగ్నివలె దిగి వచ్చి నీవు జనులతో అబద్ధము చెప్పలేదని నిరూపించెదను. నీవు కోరినయెడల దానిని శాస్త్రీయంగా కూడా రుజువు చేయవచ్చును. నేనే దిగి వచ్చి వారికి తెలియచేతును,'' అని చెప్పుట గమనించండి.
మరియు ఆయన ఉరుముటను ప్రారంభించినప్పుడు, యెహోవా ఉరుముటను జనులు చూచి, ''వద్దు! వద్దు! యెహోవా మాట్లాడవద్దు, మేము చనిపోదుము,'' అనిరి.
చూడండి, కాబట్టి దేవుడు తనను మోషే అను తెరయందు మరుగుపరచుకొని మరియు మోషేకు వాక్యమును యిచ్చెను. మోషే తన ముఖము మీద ముసుగు వేసికొని వచ్చి ప్రభుని వాక్కు వినిపించెను. నిజమేనా? యెహోవా ఒక ప్రవక్త రూపమునే తెరలో తనను మరుగుపరచుకొనెను, ఎందుకనగా అది సంపూర్ణతై యున్నది. దేవుడు ఇక ఎన్నడూ ఆ విధంగా జనులతో మాట్లాడనని, ఒక ప్రవక్త ద్వారా మాత్రమే ఆయన మాట్లాడుదునని చెప్పెను. అప్పటి నుండియు ఆయన ఆ విధంగానే మాట్లాడుచున్నాడు. ఇది సత్యము. మరో మార్గమున మాట్లాడనే లేదు. ఆయన అబద్ధమాడడు.
79గమనించండి, మోషే మాత్రమే వాక్యము కలిగియుండెను. అప్పుడు పరిసయ్యులు గాని, సద్దూకయులు గాని, మరే గుంపు గాని లేదు. మోషే ఒక్కడే! ఆయన ఒక వ్యక్తినే కలిగియుండెను. ఆయన రెండు లేదా మూడు భిన్నమైన మనస్సులను తీసుకొనలేడు. ఆయన ఒక మనిషినే ఉపయోగించుకొనును. మోషే వాక్యమును కలిగియుండెను, మోషే మాత్రమే దానిని కలిగియుండెను. యెహోషువా ఒక సైన్యమునకు అధిపతి, యెహోషువా ఒక విశ్వాసి, ఒక క్రైస్తవుడు, కాని మోషే ఒక ప్రవక్త! యెహోషువా యొద్దకు వాక్యము రాదు. అది మోషే యొద్దకు వచ్చును. ఆ ఘడి యకు అతడే పెద్ద ప్రవక్త. మోషే వెళ్ళిపోవు వరకు యెహోషువా యొద్దకు వాక్యము రాలేదని గమనించండి. దేవుడు ఒక్క సమయమందు ఒక్కరితోనే మాట్లాడును. దేవుడు ఒక్కడే, చూచారా. ఇప్పుడు, మోషేకు మాత్రమే వాక్కున్నది, ఆ గుంపంతటికి కాదు.
EXOD 19:13•
EXOD 24:2
80చూడండి, మోషేను అనుకరించుచు ఏ ఒక్క వ్యక్తైనాగాని ఆ తెర లోపలికి ప్రవేశించకూడదని దేవుడు హెచ్చరించెను. అనుకరించు (నటించు) వారు. స్త్రీలు, పురుషులు, యాజకులు, వారు ఎవరైనా గాని, ఎంతటి భక్తిగలవారైనను, ఎంత పెద్ద వ్యక్తైనను, ఎంతటి ఘనుడైనను, వారెంతటి వారెవరివారైనను గాని ''మోషే మాత్రమే రావలెను! ఏ మనిషైనా గాని, ఏ జంతువైనా గాని దానిని తాకినయెడల అక్కడిక్కడే అది చంపబడును,'' అని దేవుడు హెచ్చరించెను. ఎన్నటికిని ఆ తెరను దాటి వెళ్ళవద్దు. ఆ తెర ఒక్క వ్యక్తికే చెందును. ఆ వర్తమానము ఒక్కటే, చూచారా. సంవత్సరములో ఒక్కసారి మాత్రమే ఒక వ్యక్తి ఆలయములోనికి ప్రవేశించవలెనని నిర్ణయించబడినది. వాక్యమును వెలుపలికి తెచ్చుటకు కాదు గాని, రక్తమును అర్పించుటకై లోపలికి ప్రవేశించుచుండెను. దానికి ముందు అచ్చటకు నడచి వెళ్ళుటకు కూడా ఒకే ఒక్కరు మాత్రమే వెళ్ళవలెను. మరెవరు వెళ్ళినా చనిపోయెదరు, చూచారా.
MAL 4:3
81వారు ఇప్పుడు ఆత్మీయంగా చనిపోయిరి. ఒక ఆత్మీయ తెరగా యున్నది, చూచారా. అది ఒక సహజమైన తెరగా యున్నది, చూచారా. వాళ్ళింకా లోపలికి నడుస్తూ యున్నారు, మీరు వారియొద్ద ఈ విధముగా చెప్పవచ్చును, ''ఓ, నాకు తెలుసు! నాకు అది తెలుసు, కాని నేను …'' చూచారా, అదంతా ఏమి లేదులే, ముందుకు కొనసాగిపోండి అని చెప్పె ఆ మాట దేనిని సూచించుచున్నదంటే … మీరు గుర్తుంచుకొనండి, నిర్గమనమునకు ముందు ఐగుప్తులోనికి వచ్చిన చివరి తెగులు మరణమే. ఈ లోకమును వదిలి దాటిపోవుటకు ముందు దానిపైనున్న ఆఖరి తెగులు ఏదనగా ఆత్మీయ మరణముగా యున్నది. దాని తరువాత వారు సమాధి చేయబడి భూమి ధూళిగా మారిపోవుదురు. నీతిమంతులు వారి బూడిద మీద నడిచిపోవుదురు. కాని చిట్టచివరిది ఏదనగా వాక్యమును విసర్జించుట వలన కలుగు ఆత్మీయ మరణముగా యుండును.
82ఇప్పుడు చూడండి, ఆ అగ్ని తెరలోనికి ఎవరునూ మోషేతో కూడా ప్రవేశించరాదని దేవుడు హెచ్చరించెను. మోషే తెర వేసుకోవలసి వచ్చెను, అతడు అచ్చట నుండి వెలుపలికి రావలసియుండెను. మోషే మోషేవలె లోపలికి ప్రవేశించి, ఈ అగ్ని స్తంభములోనికి ప్రవేశించెను. మరియు అతడు వెలుపలికి వచ్చినప్పుడు, అతడు ముసుగు ధరించుకోవలసి వచ్చెను, ఎందుకంటే అతడియొక్క ఆచారములలో నుండి, పెద్దలయొక్క ఆచారములలోనుండి అతడు అచ్చట లోపలికి వెళ్ళెను. అతడు ఆ అగ్నిస్తంభమును చూచెను, కాని ఇప్పుడు అతడు అగ్నిస్తంభము లోపలికే వెళ్ళెను. ఆమేన్! అతడు ముసుగును ధరించుకొనినవాడై తిరిగి వచ్చెను. తెరవేయబడిన ఒక మానవునిలో దేవుని వాక్యము దాగి యున్నదా. ఇదిగో అతడు నడచి వెలుపలికి వచ్చుచుండెను. ఓ! నేను దానిని చూడగలుగుచున్నాను. దానిని ఎవ్వరూ అనుకరించ ప్రయత్నించకుండా యుండుట మంచిది, చూచారా. యాజకుడైనాగాని, పరిశుద్ధుడైనా గాని, బిషప్పు అయినా గాని, మరెవరయినా గాని ఆ తెరలోనికి ప్రవేశించ ప్రయత్నించినచో మరణమే. దేవుడు వారిని హెచ్చరించెను. మనము ఎట్టి అనుకరణ చేయరాదు.
83ఆయన వాక్యము కూడా ఒక్కరికే ప్రత్యక్షమాయెను. అది ఎప్పుడూ ఒక ప్రవక్తగా యుండెను, ఒక ప్రవక్త వాక్యముతో వచ్చెను, ప్రతీ యుగములోను, ప్రతీ సమయములోను దేవునియొక్క వాక్యము ఆ విధముగానే యుండెను. వాక్యము ఒక్కరియొద్దకే వచ్చును. మొదటి సంఘకాలము నుండి చివరి సంఘకాలము వరకు అలాగే జరిగెను. తక్కినవారు వారియొక్క స్ధానములు వేరు, కాని ఆ అగ్నిస్తంభమునకు దూరముగా యుండిరి, చూచారా. ఎట్టి పాఠము ఇక్కడ మనమునేర్చుకొనుచున్నాము! ప్రతివారు మోషేవలె ఉండగోరుచున్నారు. మరియు ప్రతి ఒక్కరు …
NUM 16:3
84దాతాను తదితరులు అక్కడ ఏమి చెప్పిరో గుర్తున్నదా? ''మోషే, నీవు అంతయూ నీమీద వేసికొనుచున్నావు. దేవుడు పిలిచిన మరో మనిషి ఇక్కడున్నాడు'' అనిరి.
అది సత్యము. వారు ఒక్కొక్కరు మోషేను వెంబడించినంత వరుకు ఎంతో చక్కగా వెంబడించుచూ వెళ్ళిరి, కాని ఒకడు ముందుకు వచ్చి దేవుడు మోషేకు యిచ్చిన స్థానమును మరియు ఆ పనికొరకై ముందుగా నిర్ణయించబడిన కార్యమును తీసుకొనవలెనని ప్రయత్నించినయెడల అగ్ని క్రిందికి దిగివచ్చి భూమి నెరవిడిచి వారిని తనలోకి మ్రింగివేసుకొన్నది, చూచారా. జాగ్రత్తగా ఉండుడి! చూచారా? వాక్యమును నమ్మి మంచి క్రైస్తవులుగా దేవునియందు భక్తిగా జీవించండి. ఆ స్తంభమునకు దూరముగా ఉండండి! ఎంత గొప్ప పాఠము!
85దేవుడు మొదట మోషేకు మండుచున్న పొదలో కనబడెను. దేవుడు అగ్ని స్తంభమనే తెరలో తనను మరుగుపరచుకొనెను. ఒక్క నిమిషము జాగ్రత్తగా వినండి. దేవుడు మొదట మోషే యొద్దకు వచ్చెను, ఆయన ముసుగు వేసికొనెను. దేవుడు అగ్ని స్తంభములో ఉండి ఒక పొదలో దాగెను. బలిపీఠము మీది కరుణాపీఠము చర్మము వెనుక దాగియున్నట్లే ఇది ఉన్నది. ఆయన తెరయందు తనను మరుగుపరచుకొనెను. ఎప్పుడూ ఆయన తెరయందే మరుగుపరచుకొనును. మోషే యొద్దకు ఆయన అగ్నిస్తంభములో వచ్చినప్పుడు అగ్నిస్తంభమనే తెరయందు తనను మరుగు పరచుకొనెను. ఇక్కడ జనులకు ముందు దేవుడు అతడికి అదే అగ్నిస్తంభము ద్వారా బయలు పరచెను, చూచారా. మోషే చెప్పెను …
REV 2:7
86ఇప్పుడు గమనించండి! మీరు గమనించుచున్నారా… మీ మనస్సులను ఎచ్చటకో తేలిపోనియ్యకుడి, మీకు అర్ధమగుచున్నదా? … ''చెవిగలవాడు వినును గాక!'' చూచారా?
దేవుడు మోషేకు కనబడినప్పుడు, ఆయన అతడిని తన సేవకొరకు పిలిచినప్పుడు అది ఒక అగ్ని స్తంభముగా యుండెను. మోషే వచ్చి దానిని గూర్చి జనులకు చెప్పెను. వారు దానిని నమ్మలేకపోయిరి. అతడు ఆశ్చర్య కార్యములను చేసెను, కాని ఈ సారి ఆయన దృశ్యరూపములో కనబడునట్లుగా విజ్ఞాన పూర్వకముగా ప్రత్యక్షమై, మోషే యొక్క సేవ దేవుడు అతడియొద్ద పలికిన విధముగానే యున్నదనే దానిని గూర్చి ఆయన నిరూపించెను, ఎందుకనగా ఆయన అగ్ని స్తంభముగా ఆ పర్వతము మీదికి దిగి పర్వతమును అగ్నిమయముగా చేసెను. అది మోషే యొద్దకు వచ్చినపప్పుడు, ఒక పొదలోకి వచ్చి అతడితో మాట్లాడెను. అది నిజము.
EXOD 3:10,12,14•
EXOD 7:11
87దేవుడు మోషేకు మొదటగా ప్రత్యక్షమైన దృశ్యమేదనగా మండుచున్న అగ్నిపొదగా యుండెను. జనులకు ముందు దేవుడు మరలా తనను మరుగుపరచుకొని, అదే అగ్నియందు తనకు తానుగా మరుగుచేసుకొని, అదే స్తంభము ద్వారా క్రిందికి దిగి వచ్చి, ఆ తెర అనే మరుగు ద్వారా మోషే యొక్క సేవను ఋజువుపరచెను. వారియొద్ద ఆయన తనను మరుగుపరచుకొనెను, అందుచేత దేవునియొక్క శబ్దమును మాత్రమే వారు వినగలిగిరి. మీకు అర్ధమగుచున్నదా? వాక్యమనే ఆయనయొక్క శబ్దమును మాత్రము వారు వినగలిగిరి, ఎందుకనగా మోషే వారికి సజీవ వాక్యముగా యుండెను. మోషే! గమనించండి, మోషే ద్వారా దేవుడు ఆ వాక్యమును అంతగా ఋజువుపరచెను. దేవుడు మోషేతో ఇట్లనెను, ''అక్కడికి వెళ్ళుము, నేను నీకు తోడైయుందును. నీ ఎదుట ఏదియూ నిలువజాలదు. నేను ఉన్నవాడను అనువాడను.''
మోషే క్రిందికి వచ్చి ఇట్లనెను, ''మీరు దీనిని నమ్మకపోవచ్చును గాని దేవుడు అగ్ని స్తంభములో నాకు ప్రత్యక్షమై ఈ సంగతులు చెప్పెను.''
ఫరో ఇట్లనెను, ''నీవు చాలా చవకబారు మాంత్రిక పనులు చేయుచున్నావు. కర్రను పాముగా మార్చగల మాంత్రికులు మా వద్ద ఉన్నారు. మాంత్రికులారా రండి.'' వారు వచ్చి ఆ ప్రకారమే చేసిరి.
DEUT 8:3•
MATT 4:4•
MATT 24:24•
LUKE 4:4•
2TIM 3:8•
REV 22:18,19
88మోషే దానిని ఎరిగియుండెను. ఏదియు అతడిని ఇబ్బంది పరచలేదు, అతడియొద్ద ఎంతమంది అనుకరణ దారులున్నా అది మోషేకు ఏ తేడాను కలిగించక పోయినది, మోషే నెమ్మదిగా నిలబడెను. మోషే సర్పము వారి సర్పములను మ్రింగివేసెను. ఎందువలన? ఆ అపోస్తలుల వలె వీరును దానిని వివరించలేరు. దేవుడు ఏమి చేయునో మోషే ఎరుగడు, కాని ఆయన దానిని చేయును.
చివరి దినములలో యన్నే, యంబ్రేలు వచ్చెదరని ఆయన చెప్పినది మరువకుడి. "అనుకరణ! సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని మోసపుచ్చుదురు." మత్తయి 24:24, చూచారా? సరిగ్గా అవే అద్భుతములను, క్రియలను చేయుదురు. ఆ మాట గమనించండి. ఆ వాక్యము గ్రహించండి! ఒక వ్యక్తి అద్భుతములను చేయును గాని ఇంకా ముగ్గురు దేవుళ్ళను నమ్మును. వారినుండి నీవు దూరమగుము. అది తప్పు అని మనకు తెలియును. చూచారా? అటువంటిది లేదు. ప్రతిమాట దేవుని నోటనుండి బయలు వెళ్ళినది. ఆదికాండములో ఒక్కమాట! "ఒక్కమాట తీసివేయరాదు, ఒక్కమాట చేర్చరాదు." ఆ వాక్యము మారదు, చూడండి.
89గమనించండి, ప్రజలు జరిగిన దానిని చూచిరి. మోషే ముసుగు ధరించియుండెను. మోషే ఒక ప్రవక్త, దేవుడు తన వాక్యమును రుజువుపరచి, అతడు అచ్చటకు వెళ్ళెను. అతడు అద్భుతములను, సూచకక్రియలను చూచెను. ఆ తరువాత జనులు ఒక సంఘముగా వేరయిరి. సంఘమనగా బయటకు పిలువబడినది. అర్ధమయ్యిందా? వారు లోకములోనుండి బయటకు పిలువబడిన తర్వాత వారు ఒక జనాంగమయిరి. దేవుడు ఆ అగ్నిస్తంభములో తన్నుతాను వారికి కనుపరచుకొనెను. మోషే వర్తమానమును ఆయన రుజువుచేసెను. వారికి కెమెరాలు ఉండినయెడల ఆ చిత్రమును తీసియుందురని నేననుకొనుచున్నాను, ఎందుకనగా అదంతా అగ్నిమయముగా యుండెను. ఆయనే ఆ అగ్నిస్తంభము. అతని వర్తమానము సత్యమైనదని రుజువుపరచుటకే దేవుడు ఆకార్యములను చేయుచు వాటిద్వారా రుజువుపరచుచుండెను. వర్తమానము చేతిలో యున్నది, సమస్తము యున్నది, వారు గొప్ప సమూహముగా వెలుపలికి వెళ్ళబోవుచున్నారు. ఈ నిర్గమన జనులకు ఆయన ప్రవక్తను ముసుగుగా ఉంచెను.
90(ఆలోచించండి!) ఆ జనులు అతనికి జరిగిన దానిని చూచిరి. ఇప్పుడతడు తక్కిన ఇశ్రాయేలీయులకంటే భిన్నముగా యుండెను. అతడు భిన్నముగా యుండెను. అతడి వర్తమానము భిన్నముగా యుండెను, యాజకుడు కంటే భిన్నముగా యుండెను, అన్ని విషయములలోను అతడు వేరైయుండెను. అతడు ఒక ప్రత్యేక వ్యక్తి. అతనిలో ఒక ప్రత్యేకతను జనులు చూచిరి. వారియొద్ద ఆయన వాక్యమును మాట్లాడుటకై దేవుడు తనంతట తానుగా ఆయన యొక్క ప్రవక్తయనే తెరయందు తనను మరుగుపరచుకొనెను. దానినే ఆయన చేసెను. మోషే ఆ జనులకు ఒక సజీవ వాక్యమై యుండెను. అగ్నిస్తంభమనే తెరయందు మరుగుపరచుకొని ఈ కాలమందు సముద్ర వత్సల చర్మముయందు ఏది మరుగుపరచవలెననే దానిని గూర్చి మాట్లాడుచుండెను, చూచారా.
EXOD 7:1•
MATT 11:25•
LUKE 10:21
91మొదట మోషే యొద్దనుండి వాక్యము రావలసియుండెను, చూచారా. మోషే యొద్ద వాక్కున్నది. దేవుని ద్వారా అది వ్రాయబడెను. ఎవరూ దానికి అర్ధము చెప్పజాలరు, మొదటగా మోషే అనువదించవలెను, ఆ కారణము చేతనే అతని ముఖమునకు ముసుగు వేయబడెను. అది మీరు చూచారా? చూచారా? అది ఇచ్చట యున్నది. మనము దానిని తీయవచ్చును, మూసివేయవచ్చును మరియు అచ్చట సమస్త కార్యములు చేయవచ్చును, అయినా గాని అది బయలుపరచ బడవలసియున్నది. అది క్రమముగా బయలు పరచబడవలయుననిన యెడల మోషే జనులకు దేవుడుగా యుండవలెను.
''అది బుద్ధిలేని మాట,'' అని నీవనవచ్చును.
ఎందుకని, ఆయన చెప్పెను … ఆయన మోషేతో ''నీవు దేవుని గాను, అహరోను నీ ప్రవక్తగాను ఉండును'' అని చెప్పెను. మీరు చూచారా? చూచారా? కాబట్టి ఇచ్చట ఆయన వచ్చి తనను మరుగుపరచు కొనవలసివచ్చెను, ఎందుకనగా దేవుడు ఎప్పుడూ ఒక తెరవెనుక దాగియుండును. ఓ! అది మీరు చూచుచున్నారా? దేవుడు జనులయొద్ద తనను మరుగుపరచు కొనియుండెను.
''త౦డ్రీ, నీకు వందనములు. నీవు జ్ఞానులకు, తెలివిగలవారికి దీనిని మరుగుచేసి నేర్చుకొనుటకు ఇష్టపడు పిల్లలకు బయలుపరచితివి'' అని చెప్పెను. చూచారా?
EXOD 20:19
92దేవుడు తెర వెనుక దాగెను. అప్పుడు మోషే జీవ వాక్యముగా యుండి తనను మరుగుపరచుకొనెను. ఆ అగ్ని స్తంభమును జనులు చూచి ''ఇప్పుడు మేము సంతృప్తి చెందితిమి.'' చూచారా? ''మోషేను మాట్లాడనివ్వు.'' చూచారా? ''దేవుడు మాతో మాట్లాడవద్దు, మేము మరణించెదము,'' అనిరి. మోషే అగ్నిస్తంభములోకి నడిచి వెళ్ళెను.
''ఈ రీతిగా మరెన్నడూ వారితో మాట్లాడను. వారికి ఒక ప్రవక్తను అనుగ్రహించెదను'' అని ఆయన పలికెను. ఆయన ఆ విధంగానే ఎప్పుడూ చేసెను. చూచారా, ప్రవక్తయొద్దకు ఆయన వాక్యము వచ్చును. అతనికి ఆచారమనే తెరయున్నయెడల దేవుడెన్నడూ అతడిని పంపించి యుండడు, కాని వాక్యముతో అతడు తెర వేయబడిన యెడల దేవుడు దానిని బయలుపరచును. దేవుడే తన స్వంత మాటను అనువదించును. మోషే వారితో చెప్పెను. దేవుడు వారికి అర్ధము చెప్పెను. ఆమేన్.
''ప్రభువు అలాగు పలికెను'' అని మోషే అనెను. దేవుడు తాను చెప్పినదానినే చేసెను. దానిని అది సరిగ్గా చేసినది.
93''మోషే, ఇప్పుడు జనులు అర్ధము చేసికొనిరని నీవు గ్రహించావా? నేను నీకు చూపించాను, నేను నిన్ను నిరూపించితిని'' అని ఆయన చెప్పెను. జనులకు తన మాట ఇచ్చుటకు దేవుడు తనంతట తానుగా ఈ ప్రవక్తయందు మరుగు పరచుకొనెను. మోషే వారికి సజీవ దైవమైయుండెను, సజీవ దేవుని వాక్యము బయలుపరచబడు వానిగాయుండెను. ఆ కారణము చేతనే అతని ముఖము కప్పబడినది, చూచారా.
ఒక నిజమగు క్రైస్తవుడు నేడు అవిశ్వాసులకు అలాగే మరుగైయున్నాడు. వారు "ఆ పొడవు జుట్టుగల స్త్రీలను చూచి వీరు పాతకాలపు వారనుచున్నారు." స్త్రీలు తమ జుట్టును పైకి కట్టుకొని ముడివేసుకొన్నచో ''గాలి పోయిన టైరు, పాత టైరు,'' అని పేర్లు పెట్టి పిలచుచున్నారు. చూడండి, ఇదంతయూ తెరవేయబడియున్నది. వారు గ్రుడ్డివారు. "నాకు పి.హెచ్.డి ఉన్నదని" చెప్పుకొనుచున్నారు. నీకేమి ఉన్నా నాకు లెక్కలేదు. నీకింకా వాక్య జ్ఞానము లేదు. అది ఖచ్చితముగా నిజము. "నీకున్నది చాలా అల్పము." మొదట చిన్న పాఠములు నేర్చుకొనుము.
94దేవుని సన్నిధిలో తాము ముసుగు ధరించియున్నామని చెప్పుకొనుచూ, ఏదో ఒక సంఘ ఆచారమును బోధించుచున్నవారి సంగతి ఏమిటి? ఓ, కృప, దేవుడు దయ కలిగియుండును గాక! దానిలో కలుపుతూ మరియు దానిలో తీయుచు, సమస్త కార్యములు చేయుచు తమ స్వంత అంశములను, స్వంత ఆలోచనలను అందులోనికి చొప్పించుచున్నారు. దేవుని వాక్యము కాదు, చూడండి! అది ఏవిధమగు తెరగా యున్నది? అది ఒక మత సంబంధమగు తెరగా యున్నది. దేవుడు అందరూ చూచునట్లుగా ఆ తెరను చించివేసెను.
"ప్రవక్తలను లేరని వారనుచున్నారు. చివరి దినములలో అపోస్తలులు మరియు ప్రవక్తలు లేరని చెప్పెదరు, దైవిక స్వస్థత లేదందురు, భవిష్యత్ వ్యక్తులు లేరని చెప్పెదరు. మార్కు 16 నెరవేరుట అసలు లేదందురు, అపోస్తలుల కాలము అయిపోయినదందురు." వారు దానిని జనులకు ఒక తెరను కప్పిరి, కాని దేవుడు తన పరిశుద్ధాత్మ అగ్నితో నడిచి వచ్చి దానిని పైనుండి క్రిందికి చీల్చెను. [టేపు పై ఖాలీ] దేవుడు తెరను చీల్చెను.
95మోషే ఒక తెరగా యుండెను, జీవించుచున్న దేవునియొక్క వాక్యము ఒక మానవ శరీరమనే ఒక తెరయందు మరుగుపరచబడియుండెను. అగ్నిస్తంభము మోషేలోయుండి ఆ తర్వాత చర్మపు తెరలో ఏమి యుండవలెననే దానిని గూర్చి మాట్లాడుచు యుండినది. మీకు అర్ధమగుచ్నుదా? బయలుపరచు దానికి ఇది ముంగుర్తు.
ఇప్పుడది వాక్యము, ఆ వాక్యము అనునది తీసుకొని రాబడి, తరువాత వ్రాయబడినది, తరువాత దానిని తెర వెనుక ఉంచిరి. అది ఇంకా వేయబడియున్నది. దేవుడెల్లప్పుడూ వాక్యములోనే యుండును. ఆమేన్. ఆయనే వాక్యము. ఆయన ఆ వాక్యములో ఉండెను. ఆ కారణము చేతనే ఆ వాక్యము తెరవేయబడవలసి యుండెను.
MATT 24:40,41•
LUKE 17:30,34,35•
REV 3:20•
REV 10:7
96ఓ, సోదరీ, సోదరుడా, దీనిని గ్రహించుచున్నావా? చూడు! మీరు చూచుట లేదా? దేవుడు చెప్పిన ప్రకారము ఈ యుగములన్నిటను అది తెరమరుగయినది. చివరి దినములలో అది విప్పబడి ఆ ఏడు ముద్రలు, విప్పబడి పూర్తి విషయమును యుగములన్నిటా జరిగిన కార్యములను సమస్తము జనులు చూచునట్లుగా యుండును. ఏడవ దూత వర్తమానము వినబడు ఘడియలో, దేవుని మర్మములన్నియూ ఆ ఏలియా ద్వారా ఈ చివరి దినముల యందు తెలియబడునట్లుగా చేయబడును: దేవుని కుమారుడగు యేసుక్రీస్తును ఏ విధముగా సంఘములో నుండి వెలుపలికి త్రోసివేసిరనియు; ఆయన మరలా మనుష్య కుమారుడుగా ఏ విధముగా బయలుపరచ బడుచున్నాడనియు తెలుపబడును; సంఘము మరియు సమస్త కార్యములు ఏ విధముగా క్రమములో పెట్టబడవలసి యున్నదనియు, ఏ సిద్ధాంతము లేకుండా, ఏ సంఘశాఖ అనేది లేకుండా సంపూర్తిగా వాక్యము వ్యక్తిగతముగా వ్యక్తులలో జీవించుచుండును. "నేను ఒకడిని అంగీకరించి, ఇంకొకరిని నిరాకరించెదను, నేను దీనిని తీసుకొని ఆ ఒక్కదానిని విడిచిపెట్టెదను," చూచారా. ఏ శాఖలు లేవు, ఏ కంచెలు లేవు, ఏ బంధములు లేవు, అది దేవునికి మాత్రమే ఇచ్చిన హృదయమై యుండాలి మరియు ఆయన మాత్రమే, చూచారా.
HEB 13:8
97గమనించండి, మానవ శరీరమనే తెరయందు మరుగుపరచుకొనెను. మోషే ఆ వాక్యమై యుండి రాబోయే కాలమందు సముద్ర వత్సల చర్మము వెనుక ఏమి యుండబోవుననే దానిని గూర్చిమాట్లాడుచూ యుండెను. క్రీస్తు మనకు మోషేగా ఉన్నాడు. క్రీస్తు మన మోషేగా యున్నాడు. ఆయన మానవశరీరమనే తెరయందు మరుగైయున్న, మానవ జాతియందు శరీరమనే తెరయందు మరుగుపరచుకొనిన దేవునిగా ఆయన యుండెను. అది నిజము. ఆయన" నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా యున్నాడు." ఆయన సముద్ర వత్సల చర్మమునందు మరుగైయుండెను, ఆయన మరుగైయుండెను. ఈసారి ఆయన ఒక మానవ శరీరమనే తెరయందు మరుగైయుండెను. "నిన్న, నేడు నిరంతరము ఏకరీతిగా నున్నవాడు," ఈ కాలమునకు తన వాగ్ధానమును వెల్లడి చేసెను. ఆయన మానవ శరీరమందు ఈ కాలమునకు వాగ్ధానము చేయబడిన వాక్యమనే క్రీస్తుగా ఇంకా యుంటూనే యున్నాడు. వాక్యమే దేవుడు.
COL 2:9
98అభిషిక్తుడైన ఒక వ్యక్తిగా యుండెను. క్రీస్తు అనగా ఒక "అభిషిక్తుడు" అని అర్ధము. చూచారా, ''ఒక అభిషిక్తుడు.'' అట్లైన యెడల మోషే, అతడి కాలమందు క్రీస్తుగా యుండెను, అభిషిక్తుగా యుండెను. యిర్మియా, అతడి కాలమందు క్రీస్తుగా యుండెను, ఆ కాలము కొరకైన వాక్యములో ఒక భాగముగా యుండెను.
కాని యేసు వచ్చినప్పుడు, ఆయన విమోచకునిగాను, అభిషిక్తునిగాను వచ్చెను. అది మోషేయు మరియు మోషేలో యున్న సమస్తమై యున్నది, వాక్యముయొక్క దైవత్వమంతయూ శరీరరీత్యా ఆయనలో యుండెను. ఆ కారణము చేతనే దేవాలయపు తెర చినిగి కరుణాపీఠము పూర్తిగా కనబడినది. ఆయన అభిషిక్తుడు. ఆయనే ఆ అభిషిక్తుడుగా యుండెను.
99ఇప్పుడు గమనించండి, ఈ కాలమునకు వాగ్ధానము చేయబడిన వాక్యము మానవ శరీరమనే తెరయందు మరుగు పరచబడియుండెను. గమనించండి. పాపమును ప్రేమించు సంఘ సభ్యులు, పాపులు ఆ మానవ ముసుగును బట్టి చూడలేకపోవుచున్నారు.
ఆ కారణము చేతనే వారాయనను చూడలేకపోయిరి. ''ఈయన నరుడు, ఈయన ఎక్కడినుండి వచ్చెను? ఇతనికి ఏ సహవాసపు కార్డున్నది? ఏ సంఘమునకు ఇతడు చెందెను?" (ఆయన ఆ సంఘమునకు చెందినవాడు? అను అంశము మీద ఈ రాత్రి మాట్లాడగోరుచున్నాను) "ఆయన ఏ సంఘమునకు చెందినవాడు? ఏ గుంపుకు చెందినవాడు? ఏ బడికి ఇతడు వెళ్ళెను? ఇతని చదువు ఏమిటి? ఇతడు పరిశుద్ధ వివాహము లేకుండానే పుట్టినట్లు ఈ చుట్లుప్రక్కల వారు చెప్పుకొనుచున్నారు గదా? నిశ్చయంగా, ఇతడు అపవాది సంబంధి!'' చూచారా? "ఇతడు దయ్యపు సంబంధి. అతడు పరిశుద్ధ వివాహమునకు విరుద్ధముగా జన్మించినవాడు. ఆమె వ్యభిచారియైనందు వలన ఆమెను రాళ్ళతో కొట్టి చంపెదరని తలంచి యోసేపు పెండ్లి చేసికొనెను. ఈ వ్యక్తి యాజకులమగు మనకు బోధించునా?'' అనిరి.
PS 22:1,16,17•
MATT 27:46•
MARK 15:34
100అక్కడ దేవుడు నిలబడి ఆ వాక్యమును బయలుపరచుచు, ''నా దేవా నన్నేల విడిచితివి?'' అని కేకవేసెను. క్రీస్తుకు సంబంధించి దావీదు వ్రాసిన కీర్తనలను సంవత్సరాల తరబడి వారు దేవాలయములలో పాడుచున్నారు. ''నా ఎముకలు నా వైపు తేరి చూచుచున్నవి. వారు నా చేతులను, నా పాదములను పొడిచిరి.'' వారు అక్కడ నిలబడి ఆ పాట పాడుచున్నారు. ఆయనే ఆ సిలువ మీద చనిపోవుచున్నాడు.
ఆయన చనిపోయినప్పుడు, పరలోక దేవుడు సీనాయి కొండ మీదికి దిగి వచ్చినట్లు పరిశుద్ధ అగ్నితో దిగి వచ్చి దహించి, దేవాలయపు తెరను పైనుండి క్రిందికి చీల్చెను. వారేమి చేయగలరు? ఆ కల్వరిని దేవాలయ కిటికిలో నుండి చూడండి, బలియైన దేవునిని చక్కగా చూడగలరు.
2COR 12:11
101నేటికి కూడా వారు చూడలేకపోవుచున్నారు. ఈ చివరి దినములలో దేవుడు ఆచారములను చీల్చివేసి ఈ యుగమునకు చెందిన వాక్యము తేటగా చూపించుచున్నాడు, అయినను వారది తెలిసికొనరు. అది చాలా సామాన్యముగా నున్నది గనుక వారు దానిని తెలిసికొనలేరు. అది లోక విషయములకు చాలా దూరముగా నున్నది.
ఒకానొక దినమున నేను ఒక కూటములో "నట్"గా యుండవలెనని ప్రసంగించాను. ("నట్" అనే ఆంగ్ల పదమునకు ''వెర్రివాడు'' అనే అర్ధమగును). రాబోవు దినములయందు నేను "నట్" గురించి ఇచ్చట మాట్లాడెదను. మనమెవరో ఒకరికి "నట్-గా" యుంటున్నాము క్రీస్తు కొరకు నేను అలాగే ఉందును. పౌలు వెర్రివాడాయెనని చెప్పబడినది. నిశ్చయంగా, అలాగే మనము ఎంచబడుదుము. విడి భాగములను ఒకదానితో ఒకటిగా కలుపుటకై ఈ "నట్" ఉపయోగపడుచున్నది. చూచారా? ఇది నిజము.
DEUT 18:15,18
102మానవ శరీరమను తెరను గమనించండి. పాపమును ప్రేమించు జనులు దానిని చూడలేరు. ఆ ఆచారపు, మత జనులు దానిని చూడలేరు, ఎందుకనగా ఆయన ఒక మనిషి, ఏమిటి? ఆ మానవ శరీరము దేవునిని దాచెను.
ఇప్పుడు, ఆయన ఒక గొప్ప అగ్నిస్తంభముగా దిగి వచ్చినచో, చూడండి, ఒక గొప్ప అగ్నిస్తంభముగా ఆయన దిగి వచ్చి మరియు తాను ఏమైయుండెనో దానిని ఆయన వారికి చూపించినయెడల, ఆయనే ఈ గొప్ప అగ్నిస్తంభముగా చూపించుకొనిన యెడల బహుశా వారు దానిని నమ్మియుండెదరు, యెహోవా దాని చుట్టూ తిరిగి యుండినయెడల వారు నమ్మియుండెదరు. కాని ఆయన ఏమిచేసెనో చూడండి, ఆ బుద్ధిమంతులు, జ్ఞానులు గుర్తించలేనట్లుగా ఆయన మోషేకు వాగ్దానము చేసినట్లుగా ఆయన తనకుతానుగా తనను బయలుపరచుకొనెను, చూడండి, నేను ఒక ప్రవక్త ద్వారా మాట్లాడెదని ఆయన వారితో చెప్పెను. ఆయన మనుష్యకుమారునిగా, ప్రవక్తగా తన్నుతాను ప్రత్యక్షపరచుకొనెను. ప్రపంచములోని నూటికి ఒక్కరు మాత్రమే ఆయనను గుర్తించి విశ్వసించిరి. తక్కినవారు గుర్తించలేదు, కాని ఆయన ఎల్లప్పుడు ఒకేరీతిగా యుండెను.
2SAM 6:9,10•
2SAM 15:30•
2SAM 16:11•
MATT 27:30•
MARK 14:65•
LUKE 23:18•
JOHN 19:15
103బలమగు దేవుని యొక్క కరుణా పీఠము ఇప్పుడు తెరువబడి బాహాటముగా కనబడుచున్నది. ''ఆయన మాకు వద్దు! ఆయనను త్రోసివేయమని!'' ఆయన స్వంత పిల్లలే దానిని కోరుచూ యుండగా ఆయన మరణించెను. ఆయన మీద ఉమ్మివేసిరి.
ఎంతోకాలము క్రిందట, విసర్జించబడిన రాజుగా దావీదు దేవాలయము నుండి వెళ్ళిపోవుటనేది ఒక సాదృశ్యముగా యున్నది. వీధిగుండా అతడు వెళ్ళుచుండగా, ఒక కుంటివాడు కుంటుకుంటూ వచ్చి, అతడంటే ఇష్టములేనివాడై, అతడిని, ''ఓయీ వేషదారీ'' ఇంకా ఏవేవో తిట్టుచూ అతని ముఖము మీద ఉమ్మివేసెను. దావీదు అంగరక్షకుడు ఖడ్గము తీసి, ''ఆ కుక్క తలను నరికి వేసెదను, నా రాజుపై ఉమ్మి వేసెదవా'' అని అనెను.
అందుకు దావీదు, ''వాని జోలికి పోవద్దు, దేవుడతనికి అనుమతినిచ్చెను,'' అని చెప్పెను. దావీదు బహుశా తానన్నది తెలియకనే అది చెప్పియుండును, ఏడ్చుచూ ఆ కొండ ఎక్కెను.
ఆ తరువాత ఎనిమిది వందల సంవత్సరములకు దావీదు కుమారుడు అదే కొండను ఎక్కుచూ, ఆయన విసర్జించబడిన రాజుగా యెరుషలేమును చూచి ఏడ్చుచు ఆయన కొండ ఎక్కెను. వారాయన ముఖము మీద ఉమ్మివేసిరి.
మీరు దానిని చూడగలుగుచున్నారా? అది విషయము. ఆ వాక్యము యుగయుగములుగా వచ్చుచు నేడు కూడా వచ్చుచున్న ఆ వాక్యమును చూచితిరా? అధిక సంఖ్యాకులు దానిని విసర్జించుచున్నారు, చూచారా, అల్ప సంఖ్యాకులు చూచి నమ్ముచున్నారు.
JOHN 6:42
104ఇప్పుడు, చూడండి, వారు నమ్మకపోయిరి. ఆ గ్రీకులు ఆయనను చూడలేకపోయిరి. ఆయన తన యొక్క మానవాలయములో ఉండెను. ''ఈయన పేరు యేసు, ఇతడు నజరేతులో నుండి వచ్చినవాడు కాదా?'' అనుకొనిరి.
ఆ రోజులలోని వారికి ఒకే పేరుండెడిది. ''జాన్, జిమ్'' వంటి పేర్లు. "జెఫర్‌సన్‌విల్ నుండి వచ్చిన జాన్ మరియు న్యూ-ఆల్బనీ నుండి వచ్చిన జిమ్" అని మనము చెప్పినట్లే ఆనాడును చెప్పెడివారు, మీరు చూచారా.
''ఈయన నజరేతువాడగు యేసు. ఈతని తల్లి ఒక సైనికుని ద్వారా గర్భవతి అయినదని సామాన్యముగా చెప్పుకొనుచున్నారు గదా?'' అని వారనిరి. వారు అదే నమ్మిరి. ఖచ్చితముగా! వారు అలాగే నమ్మిరి. ''ఇతడు నజరేయువాడగు యేసు'' అని చెప్పుకొనిరి. ''ఆయన ఎవరు?'' గమనించారా, ఆయన ఎవరో వారు అర్ధము చేసికోలేదు.
JOHN 5:39•
JOHN 8:28,38•
JOHN 10:38•
JOHN 12:49,50•
2COR 3:4
105కాని, ఎందుకని?
ఆ ఘడియకు తగిన ఈ వాక్యమును ఆయన బోధించుచున్నప్పుడు, "లేఖనములను పరిశోధించుడి. అందులో నిత్యజీవము కలదని మీరు తలంచుచున్నారు గదా? అవి నా గూర్చి సాక్ష్యమిచ్చుచున్నవి. మీరు నన్ను నమ్మనియెడల, ఒక తెరగా నన్ను మీరు మరచిపోండి, కాని వచ్చుచున్న వాక్యమును నమ్మండి. ఇద్దరు సాక్షులు చాలును. నేను, మాట్లాడుచున్నాను, నా తరపున తండ్రి మాట్లాడుచున్నాడు.'' ఆమేన్. అది సత్యము.
ఈ దినము యొక్క వాక్యమును నేను మాట్లాడుచున్నాను. దానిని తండ్రి ధృఢపరచుచున్నాడు. అది మీకు సాక్షియేనా? అవును. ఆ విధముగానే అది నెరవేరియున్నది.
106II కొరింధీ 3వ అధ్యాయము 6 వచనము గమనించండి. దేవుని యొక్క పాత దేవాలయము అనునది యూదుల యొద్ద నుండి దేవుడిని పాత చర్మము వెనుక యుంచబడినది. ఆ పాత చర్మమనేది చీల్చివేయబడినప్పటికిని ఆయన ఎవరైయుండెనో, ఆయన ఇంకా ఏమైయున్నాడనేది తెలియకుండానే యూదులు ఇంకా కూడా గ్రుడ్డివారిగానే యున్నారు. పిదప దేవునిచే తెర పైనుండి క్రింద వరుకు రెండుగా చీల్చబడినప్పుడు, పెంతెకోస్తు నిజమగు సజీవ దేవుడెవరనే దానిని గూర్చి బయలుపరచెను. ఆ తెర ఎందుకలాగు చేసినది? అదెందుకు అలాగ చేసినది?
అది చేసిన దానిని చేయునట్లుగా ఎందుకని అటువంటి ఒక వర్తమానము అచ్చట నేటికి రావలయును? అదెందుకని వచ్చినది? ఎందుచేత?
MATT 15:14•
LUKE 6:39
107అచ్చట ఎవరో ఒకాయన సంఘ కాలముల గురించి, అనగా "దేవుడు తన పరిశుద్ధ సంఘములో ఉన్నాడనువంటి విషయములను గురించి వాదించుటకై నన్ను ఎప్పుడో ఒక దినమున త్వరలో తీసుకొని వెళ్ళబోవుచున్నాడు." ఆమె ఎవరో ఒక స్త్రీ బోధకురాలని నేను కనుగొంటిని, చూడండి, దానిని గురించి నేను మరచిపోతిని. అది పురుషులైయున్న యెడల అది చక్కగానే యుండియుండెను, అది వేరుగా ఉండియుండును. కాని దానిని చేయుటకై ఇచ్చటయున్న కూటములను రద్దు చేసుకొని వేరొక దేశమునకు వెళ్ళుట వలన ప్రయోజనమేమి కలదు? కాబట్టి దానిని గూర్చి నేను వదిలివేసితిని. గ్రుడ్డివారు గ్రుడ్డివారికి త్రోవచూపుచున్నారు, వారిరువురు గుంటలో పడుదురు.
108కాబట్టి, ఇప్పుడు ఈ ఘడియ యందు దేవుని యొక్క వాక్యము నుండి పాత సంఘశాఖల ఆచారముల తెర అనునది చీల్చబడినది, కనుక ఇది ప్రత్యక్షమగుచున్నది. నా భావము గ్రహించారా? ఆ సంగతులన్నీ గతించిపోయినవని ఆచారము చెప్పుచున్నది. దీనిని ఇంకా కొంచెం మీ హృదయములలో లోతుగా నాటనివ్వండి. ''ఆ సంగతులన్నీ గతించిపోయినవి,'' కాని ఈ చివరి దినములలో ఆ ఆచారపు తెరనేది రెండుగా చీల్చబడి ఇదిగో అగ్నిస్తంభముగా నిలబడియున్నది. అర్ధమగుచున్నదా? ఇదిగో ఆయన ఈ ఘడియకు తగిన వాక్యమును ప్రత్యక్షపరచుచున్నాడు. తెర చీల్చబడినది! ఇప్పుడు, లోకము ఇంకా దానిని నమ్ముట లేదు. అది ఏమైనా గాని అది వారికి అక్కర్లేదు. దానిని వారు చూడలేకయున్నారు. దానిని వారు చూడలేదు, అది వారికొరకు పంపబడలేదు.
మరువకండి, దేవుని కుమారుడు సొదొమలో ప్రత్యక్షము కాలేదు, ఇద్దరు వర్తమానికులు మాత్రమే ప్రత్యక్షమయిరి. ఇది నిజము.
కాని, ఎన్నుకోబడిన అబ్రాహాముకు దేవుడే శరీరధారిగా రూపుదాల్చి ప్రత్యక్షమయ్యెను. తన్ను ప్రత్యక్షపరచుకొనుటకు ఆయన ఏమి చేసెనో గమనించండి. తన వెనుకనున్న శారా హృదయములో ఏమున్నదనే దానిని గూర్చి ఆయన ఎరుగుటను అబ్రాహాము తెలుసుకున్నప్పుడు ఆయనను ''ఎలోహిం! నీ దాసుడను….'' అని పిలచెను. చూచారా?
109కాబట్టి ఇప్పుడు గమనించండి, కాబట్టి దానిని అది ప్రత్యక్షపరచగలదు. ఇన్ని సంవత్సరములుగా జనులకు వాక్యము ఒక తెరగా మరుగుపరచబడి యుండెను, ''దానిని చెయ్యలేము.''
నేను మొట్టమొదటగా ఇచ్చట నుండి వెళ్ళి గొల్యాతు మరియు దావీదును గూర్చి నేను ఒక ఉదయాన బోధించిన వర్తమానము మీకు గుర్తున్నదా? అద్భుతములు జరుగు దినములు గతించినవి, అని వాడు సవాలు చేయుచున్నాడని చెప్పాను. ఆ టేపులు వెలుపలికి వెళ్లుచుండగా ఏ విధముగా అది ఇంకా, ఇంకా ఎంతో తేటగా బయలుపరచబడుచున్నదో ఒక్కొక్కదానిని జాగ్రత్తగా గమనించండి; మీకు చెవులు యున్నచో వినండి, కన్నులు యుండినచో చూడండి. అప్పుడు నేను ''మతసంబంధమైన లోకము అచ్చట నిలబడుచూ, ఈ విజ్ఞానకాలమందు అవన్నిజరుగవు అని చెప్పుచున్నది,'' అని చెప్పితిని. కాని నేను చెప్పిన భావమేమనగా … ఒకేసారి పటముగా తీయబడుటకు ముందుగా, అప్పుడు అది ఇంకా తీయబడలేదు. అప్పుడు ఆ వెలుగులో అచ్చటయున్న ఆ నది ఒడ్డున వారు ఆ పటమును తీసిరి. చూచారా? ''అది సంభవించునని ఆయన నా దగ్గర చెప్పెను, ఆయన ఒక ఆహ్వానము యిచ్చును, అది దేశములయందు అంతటా వ్యాప్తి చెందును'' అని నేను చెప్పాను.
డాక్టర్ డేవిస్ ఇట్లనెను, ''ఏడవ తరగతి చదివిన నీవు వ్యాకరణము రాని నీవు రాజులు, అధిపతులు కొరకు ప్రార్ధించెదవా? దేశములను తుడిచిపెట్టు ఉజ్జీవము తీసికొచ్చెదవా?
''ఆయన ఆ విధంగానే చెప్పెను,'' అని నేను అన్నాను.
అది జరిగినది. చూచారా? అది జరిగినది. దానియొక్క విషయములు ఆ విధముగానే యున్నవి. ఆయనకు ఏ అనువాదము చెప్పనవసరము లేదు. ఆయన దానిని చేసెను. చూచారా? ఎప్పుడో ఆయన దానిని జరిగించెను. దానికదే భావము చెప్పెను, చూచారా; ఏర్పాటు చేసికోబడిన వారిని పిలచుచున్నాడు, అన్ని జీవన రంగములలోని వారిని పిలచుచున్నాడు. ఇప్పుడు అది బయలు పరచబడియున్నది.
1SAM 17:39,44,46•
2TIM 1:12
110ఒక చిన్న, సన్నవాడిగా, పొట్టివాడిగా, గూనిగల దావీదు ఒక వడిసెల పట్టుకొని అక్కడ నిలబడియున్నాడు. సేవకుల సంఘ అధ్యక్షుడైన సౌలు అతనిని చూచి ఇట్లనెను, ''నీకు శిక్షణ కూడా లేదే? నీకు నేను పి.హెచ్.డి లేదా వేరే ఏదైనా ఇవ్వగలనేమో చూచెదనని చెప్పి అతనికి కవచము ధరింపచేయగోరెను, కాని అది ఒక దైవజనునికి అది సరిపోలేదని అతడు కనుగొనెను.
''ఇది నాకు వద్దు, తీసివేయుడి. "దీనిగూర్చి నాకేమి తెలియదు." "నాకు తెలిసిన విధంగా నన్ను పోనియండి. నేను ఒక సింహమును, ఎలుగుబంటిని చంపాను'' అని అతడు చెప్పెను. "అతడు ఒక అడవి మనిషి,'' ఈలాగు నన్ను పోనీయండి అని అతడనెను.
ఈ ముసలి గొల్యాతు ఇట్లనెను, ''నాతో పోరాడుటకు ఒక కుక్కను పంపితివి? నా ఈటె చివరతో నిన్ను ఎత్తి నీ శవమును పక్షులు తినునట్లు చేయుదును.''
దావీదు ఇట్లనెను, ''నీవు ఒక ఫిలిష్తీయుడవు, నీవు కవచము, ఈటె మొదలగు ఆయుధములతో నా మీదికి వచ్చుచున్నావు గాని నేను ఇశ్రాయేలీయుల దేవుడగు యెహోవా నామమున వచ్చుచున్నాను." "నేడు నేను నీ తలను పీకివేయుదును.'' ఆమేన్! అతడు తాను నమ్మిన వానిని ఎరుగును, ఆయన వాగ్దానము చేసెను, గనుక శత్రువు చేతిలోనుండి విడిపించ సమర్థుడని ఎరుగును. చూచారా? ఏమైనాగాని అది జరుగును అని పూర్తిగా నమ్మెను
"అద్భుతములు జరుగు దినములు గతించిపోయినవను," పాత సామెత యొక్క గోడలు కూల్చబడినవి. యెహోవా ఇంకా తెరవబడిన ముఖమువలె కనబడుచు తెర తొలగించబడి ఆయన వాక్యమును బయలు పరచుచున్నాడు. అది నిజము.
MAL 3:6
111గమనించండి, అన్య సంఘము కూడా తెర అనే క్రైస్తవ మత గురువుల తెరనుండి చీల్చబడి దేవుడిని కనబరచినను అది ఇంకా గ్రుడ్డిదానివలెనే యున్నది. ఏ విధముగా? మరల వాక్యము మానవ శరీరము అను తెరను ధరించెను. ఇశ్రాయేలు సరిగ్గా దానిని చూచుటలోనే విఫలమైనది. అది దేవదూతగాని మరేదయినా గాని అయినచో వారు విశ్వసించెడి వారే. అది దేవదూత కాదు గాని మానవుడే! ఆమేన్! దేవుడు తన మాటను మీరజాలడు. చివరి దినములలో తిరిగి అదే జరుగనైయున్నది. ఆ మనుష్యునిగా ఆయన వచ్చుట వలన ఇశ్రాయేలు గ్రుడ్డిదాయెను. ''మానవుడవగు నీవు దేవునిగా చెప్పుకొనుచున్నావే?'' అనిరి. అందుకొరకే వారాయనను చంపిరి. నేడు కూడా వర్తమానము దూతల ద్వారా కాక మానవుని ద్వారా వచ్చుచున్నది. చూచారా? దేవుడు తన విధానమును గాని, తన వాక్యమును గాని మార్చజాలడు. నేను మారనివాడను అని ఆయన చెప్పెను. గమనించండి, వాగ్దానము చేయబడినది, ఆనాడు ఆ ఇశ్రాయేలీయులు గ్రుడ్డివారైనట్లుగా నేడు ఈ అన్యజనులు చాలా గ్రుడ్డివారుగ యున్నారు. కారణమేమిటి? ముసుగు బట్టియే. దేవుడు మానవ తెరలో యుండి ఇశ్రాయేలీయులను గ్రుడ్డివారిని చేసెను, గమనించండి, ఒకరిని గ్రుడ్డివానిగా చేయుచు ఒకరికి అది గ్రుడ్డితనమును మరొకరికి అది సత్య ప్రత్యక్షతను దయచేయును. అది కొందరి నేత్రములను మూయును, కొందరి కండ్లు తెరచును.
MATT 12:24•
MARK 3:22•
LUKE 11:15•
JOHN 1:42,47-49
112చూడండి! యేసు ఇట్లనెను, ''నీ పేరు సీమోను. నీ తండ్రి పేరు యోనా.''
''ప్రభువగు దేవా?'' అని అతడనెను.
''నీకెట్లు తెలియును?'' అని ఫిలిప్పు అడిగెను.
''ఇదిగో! ఏ కపటములేని ఇశ్రాయేలీయుడు,'' అనెను.
''రబ్బీ! నీవు నన్నెట్లు ఎరుగుదువు?'' అనడిగెను
''ఫిలిప్పు నిన్ను పిలువక ముందే, నీవు చెట్టు క్రింద ఉన్నప్పుడే నిన్ను చూచితిని,'' అని చెప్పెను.
''రబ్బీ, నీవు దేవుని కుమారుడవు. నీవు ఇశ్రాయేలుకు రాజువు'' అని అతడనెను.
కాని అక్కడ నిలబడిన మరికొందరు ''ఇతడు బయల్జెబూబు'' అనిరి. చూచారా? ఏమి జరిగినది? కొందరి నేత్రములను తెరచెను, కొందరి నేత్రములను మూసివేసినది. యాజకులు ఏమనిరి? ''ఓ, అతడా బయల్జెబూబు!''
JOHN 4:25,26
113ఆ స్త్రీ ఇట్లన్నది, ''మెస్సీయా వచ్చునని నాకు తెలియును. అభిషక్తుడగు ఒకడని అర్ధము. చూచారా. అభిషక్తుడగు ఒకడు రావలసియున్నది. మాకు ప్రవక్తలు లేరు … నీవు తప్పక ఒక ప్రవక్తవై యుండవలెను. మేము అభిషక్తుని కొరకు ఎదురు చూచుచున్నాము ఇవి అన్యజనులకు … లేదా యూదులకు అంత్యదినములు,'' అని చెప్పెను. ''ఇవి అంత్య దినములు.'' చూచారా, "యూదులు, సమరయులు కూడా మోస్సీయా కొరకు ఎదురు చూచుచున్నారు. ఆయన ప్రత్యక్షమగు సమయము ఇది. ఆయన వచ్చునప్పుడు ఈ సంగతులు జరుగననియు, ఈలాగు తెలియచేయుననియు మాకు తెలియును.''
''నేనే ఆయనను'' అని ఆయన పలికెను.
ఆమె కన్నులు తెరువబడినవి, రక్షక భటులు, యాజకుల కన్నులు మూయబడినవి. సువార్త ఎల్లప్పుడూ అలాగే చేయును. అది కొందరి కన్నులు తెరచి సత్యమును బయలుపరచును, అదే సమయమున మరికొందరిని గ్రుడ్డివారినిగా చేయును. దానికి రెండు విధములగు అర్ధము కలదు. కొందరు ఆ కుమారుని వైపు సూటిగా చూచి గ్రుడ్డివారవుదురు. ఇంకొకరు దానిని అంగీకరించి మరియు దానితో ఏకమై నడుచుచున్నారు. అదియే తేడా.
114ప్రతి కాలములోను జరుగుచున్నట్లుగానే దైవత్వము మానవ శరీరమనే తెరలో మరుగు పరచబడియున్నది. గమనించండి, ఆయన చేసెను. ప్రవక్తలు ముసుగు ధరించిన దైవములే. మానవ శరీరమనే తెరయందుండు దేవుని వాక్యమైయున్నారు, అది నిజమేనా? కాబట్టి వారు మోషేను గాని, యేసును గాని చూడలేకపోయిరి.
గమనించండి, పాత దేవాలయములో సముద్ర వత్సల చర్మపు తెర వెనుక మరుగు పరచబడిన వాక్యముగా యుండినది. ఆ చర్మపు తెర వెనుక వాక్యము దాగియుండెను. రాతి పలకల మీద ప్రత్యక్షపరచబడిన వాక్యముగా యుండెను.
115ఇప్పుడు, ఇరవై నిమిషములలో దీనిని ముగించగోరుచున్నాను, పదకొండున్నరకు ముగించెదను. నేను చాలా వరకు కుదించాను. మీకు చాలా వేడిగా యున్నదని నాకు తెలియును, అలసిపోయిరి.
116పాత దేవాలయములో ఆ తెర వెనుక ఏమి ఉండెను? యెహోవా ఏమైయున్నాడు? ఆ వెనుక ఏమి దాగియుండెను? ఆ తెర దేనిని దాయుచున్నది? ఓ! హల్లెలూయ! ఆ తెర దేనిని దాయుచున్నది? వాక్యమును అది దాచుచున్నది. (ఆ చర్మపు) పాత సముద్ర వత్సల తెరవెనుక వాక్యము దాగియున్నది. వారి స్వాభావిక కన్నులకు వాక్యము మరుగుపరచబడి యున్నది. అచ్చట దాని వెనుక ప్రతిష్టితమగు సముఖపు రొట్టె కలదు. ఆ వెనుక షెకీనా మహిమయు ఉన్నది. కాని అది వారికి మరుగైయున్నది. దేవుని యొక్క మహిమ అంతయు ఆ సముద్రవత్సల చర్మము వెనుక మరుగుపరచబడియున్నది. అది సత్యము. స్వాభావికమైన కన్నులకు అదంతా మరుగు పరచబడియున్నది.
నేడును అలాగే ఉన్నది. వారు మనలను "పరిశుద్ధులు, మతమౌఢ్యులు," అని హేళన చేయుచున్నారు. కాని ఆ వెనుక ఏమి ఉన్నదో వారెరుగరు. చూచారా? దానిని వారు ఎరుగరు, చూడండి.
117దేవుడు కృప చూపి వారు చూచునట్లుగా ఆ తెరను చింపినను, కాని వారు తమ ఆచారములలో పూర్తిగా మునిగిపోయిరి గనుక ఈనాటికిని అది వారికి దాచబడియే యున్నది.
ఇప్పుడును అలాగే యున్నది! మహిమ, పరిశుద్ధాత్మ శక్తి, షెకీనా మహిమ విశ్వాసి మీదికి వచ్చుచున్నది. ఇప్పుడు నేను ఒక నిజమగు విశ్వాసిని గూర్చి చెప్పెదను. అది దేవుని యొక్క క్రియలను, విశ్వాసమును వారిలోనికి తీసుకొని వచ్చి ఆ కన్నులకు మరుగు చేయబడిన వాక్యమును నమ్మునట్లుగా అది చేయుచున్నది. ఆ "కార్యములన్నియు గతించిపోయినవని" వారు చెప్పుచున్నారు. వారింకా ఆ తెర వెనుకనే జీవించుచున్నారు. చూడండి, చిన్నపిల్లలారా, ఇక మీదట మీరు ఆ తెర వెనుక ఉండరు. దేవుడు పూర్తిగా మీకు కనబడుచున్నాడు.
118ఒక రోజున సహో. ఫ్రెడ్ సాద్‌మన్, టామ్ సింప్సన్ (అతడిచ్చటికి ఇంకా వచ్చాడో లేదో నాకు తెలియదు), మనలో అనేకమంది బాప్టిస్టు సంఘమునకు వెళ్ళితిమి. ఆ బోధకుడు ఒక మంచి విషయమును దేనినో చెప్పెను. మేము ''ఆమేన్'' అన్నాము. సంఘములో అందరూ మెడ చాచి తిరిగి చూట్టూ చూచిరి. చూచారా! మీరెరుగుదురు, ఆ షెకినాకు వెనుక నుండి ఒక తునక వచ్చి పడిన వెంటనే, దానిని పొందుకొనిన మనము సంతోషించితిమి. ఇంకొక విధముగా చెప్పాలంటే ''ప్రభువా, వందనములు,'' అని మేము చెప్పాము. వారు దానిని చేసినప్పుడు, ఈ జనులు అంతగా ముసుగును ధరించుట వలన వారు మమ్మును చూచి నవ్విరి. వారికి ఇదంతా ఏమిటో తెలియలేదు. ఇంకా వారు ముసుగులోనేయున్నారు. కాబట్టి లోపట, కొందరు బయట ఉందురు.
కాని దేవుడు మరుగు పరచబడినవాడై యుండియు, మనకు పూర్తిగా దృశ్యమగు తెరవబడిన ముఖముగా కనబడెను. ఇప్పుడును అట్లే యున్నది!
119పిదప దేవుడు తన కృపతో, ఆ తెరను చింపినప్పుడు ఆయన తేటగా దృశ్యమగునట్లుగా కన్నులకు కనబడెను. కాని వారు తమ ఆచారములలో ఎంతగానో మునిగిపోవుటవలన ఆయన ఇంకా కూడా వారికి మరుగు పరచబడియేయున్నాడు. ఇప్పుడును అలాగే యున్నది! మరుగుపరచబడిన ఆ మహిమయంతయూ క్రీస్తులో వాక్యముగా మనకొరకై మరుగుపరచబడియున్నది, ఆయనే మన దేవాలయము.
ఓ, ఇప్పుడు, దీనిని ఇంకొంచెము లోతుగా చెప్పగోరుచున్నాను. ఈ ఉదయాన కొంచెము ఉద్రేకపడినందుకు క్షమించండి, కాని నేను దీనిని ఇంత దీర్ఘముగా యివ్వాలని ఆశించుచున్నాను. అది అట్లే నా లోపల … నన్ను ఒత్తిడి చేయుచున్నది. చూచారా?
REV 22:18,19
120గమనించండి, దేవునిలో ఉన్న మహిమంతయు వాక్యములో యున్నది. దేవునిలో ఉన్న ఆశీర్వచనములన్నియు వాక్యములో యున్నవి. అవిశ్వాసులు ఆచారములను బట్టి గ్రుడ్డివారయిరి. నా భావము గ్రహించారా? కాని అవన్నియూ క్రీస్తులోనే యున్నది. దేవుడు తనయొక్క సమస్తమును ఖాళీ చేసుకొని ''కెనూష్'' (Kenos) క్రీస్తులోనికి వచ్చెను. మరియు మనము క్రీస్తులో తెర వెనుక యుండవలయును.
''నేను క్రీస్తులో యున్నాను'' అని నీవు చెప్పుకుంటూ, ముగ్గురు దేవుళ్ళు గలరని నమ్ముటయా? ''తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ'' నామములో బాప్తిస్మమిచ్చుటయా? ఈ ఆచారములన్నింటిలోను నమ్మకమును కలిగియుండుటయా? పెద్దవాళ్ళ యొక్క మూఢ నమ్మకములను నమ్ముటయా? లేదు, మీరింకా తెర వెనుకనే యున్నారు. చూచారా? తెర లోపలికి రండి. ఆయన క్రీస్తుగా, వాక్యముగా యున్నాడు. ఎలాగు?
''నాకు దైవిక స్వస్థతయందు విశ్వాసము లేదు. ఈ అద్భుతములు, సూచక క్రియలలో నాకు నమ్మకము లేదు.''
నీవు తెర లోపట లేవు, దానిగూర్చి నీకేమియూ తెలియదు, చూచారా. క్రీస్తే వాక్యము! మనము వాక్యములో ఉన్నప్పుడు, క్రీస్తులో ఉందుము. నేను క్రీస్తులో ఉండి క్రీస్తును నిరాకరించుదునా? "దీనిలో నుండి ఒక మాట తీసివేయరాదు, ఒక మాట చేర్చరాదు," అని ఆయన చెప్పెను. అట్లైనయెడల నీవేలాగు తీసివేయుదువు? ఏలాగు కలుపుదువు? చూచార, దానిని బట్టి నీవు ఏ ముసుగులో యున్నావో అర్ధమగుచున్నది.
GEN 1:3•
1COR 12:1-3
121మనము ఆయనలో ఉన్నాము! ఆయనలో నిలిచియుండిన మనము ఈ లోక మతప్రవిస్టులకు, తత్వవేత్తలకు మరుగైయుందుము. మనము ఈ మహిమను అనుభవించుచున్నాము, బయట వారికి తెర మరుగైయున్నాము. మనము "పిచ్చివారమని, కొరుకుపడని" వారమని వారనుకొనుచున్నారు. చూచారా? అది నిజము. కాని క్రీస్తులోనికి బాప్తిస్మము పొందిన మనమందరము (1వ కొరింధీ 12) ఈ మహిమలో పాలిభాగస్థులమై యున్నాము, చూచారా. కాని వెలుపలి ప్రాకారములో కాదు; మీరు ఇంకా లోపల చూస్తూ దానిని తిరస్కరించుచున్నారు, చూచారా.
కాబట్టి ఇప్పుడు, ఆయనలో పాలిభాగస్థులమై యుండుటకు ఇప్పుడు మనము ఆహ్వానించబడితిమి. ఆయన యొక్క మానవ శరీరమనే తెర ద్వారా ఆయనలోనికి మనము ఆహ్వానించబడితిమి, అది అవిశ్వాసులకు మరుగు పరచబడియున్నది, చూచారా. ఆ మహిమను వారెరుగుదురు. దానిని గూర్చి వారు చదివారు, అది ఈ వాక్యములో యున్నది. దేవునికి మహిమ, ఆ క్రియలు వారికి కేవలము పర్యాయపదములుగా నున్నవి. మనకు అది ప్రత్యక్షత! చూచారా? అది ఇక మాట కాదు గాని వాస్తవము! ఆమేన్.
"దేవుడు వెలుగు కలుగును గాక!" అనెను. అది మాట, కాని ఇప్పుడు వెలుగున్నది. ఇప్పుడది మాట కాదు గాని వెలుగు. నా భావము గ్రహించారా?
122ఇప్పుడు, అది మనకు వ్రాయబడిన వాక్యమే కాదు గాని వాస్తవమైయున్నది. మనము ఆయనలో ఉన్నాము. ఆయనను మనము అనుభవించుచున్నాము, ఇప్పుడాయనను మనము చూచాము. ఇప్పుడు మనము ఆయనను, వాక్యమును తనంతట తానుగా ప్రత్యక్షపరచుటను చూచుచున్నాము. అది అచ్చట వెలుపల మరుగు పరచబడియున్నది, ఎందుకనగా, ఎందువలన? అది మానవ శరీరమందు మరుగు పరచబడినందున.
''ఆ గుంపు జనులు నేర్చుకొనుటకు ఎచ్చటికి వెళ్ళుచున్నారు? ఎటువంటి విద్యను అభ్యసించారు? వారు దేనిలో నుండి వచ్చారు? వారే గుంపుకు చెందినవారు?'' అని వారందురు. చూడండి, వారికి అది అందలేదు.
ఒక రోజున ఒకాయన మరల ఆయనతో ''నీవు క్రైస్తవునివి కావలెనన్నచో ఒక శాఖకు చెందియుండవలెను'' అని అనెను.
అతడు ఇట్లనెను, ''నేను క్రైస్తవుడిని, నేను ఎవరికీ చెందను. దేవుడు ఈ కాన్సరును నాలోనుండి తీసివేసెను. ఏ శాఖ దీనిని చేయగలదో చెప్పుము?'' ఏ డాక్టరు చేయలేడు.
చూచారా, ఇంకా ముసుగు వేయబడియున్నది.
123మనము క్రీస్తుకు లోపల ఉన్నాము. ఇప్పుడు, ఆ దినము యున్నట్లుగానే నిజమగు విశ్వాసులందరూ ఆయనను, ఈ దినమునకు వాగ్దానము చేయబడిన వాక్యమును బహిరంగముగా ప్రత్యక్షపరచుటను చూచుచున్నారు. మీరు దీనిని ప్రసంగించినయెడల అది చాలా గొప్ప సంగతి అని గ్రహించండి, చూచారా. వాక్యములోనున్న నిజ విశ్వాసులందరూ దేవునిని బహిరంగముగా చూచెదరు. ఆ తెర చినిగెను, దేవుడు మీ యెదుట ప్రత్యక్షపరచబడి నిలబడియున్నాడు, చూచారా. దేవుడు బహిరంగముగా ప్రత్యక్షమాయెను!
దీనిని చేయుటకు మన పాతశాఖ ఆచారపు తెర తప్పక మరల చినిగిపోవలెను, ఇది ఏమిటో నీవు నిజంగా చూడగోరినచో, ఆ గుంపు నుండి నీవు బయటకు రావలసియున్నావు. మీరు దానిని ఎన్నటికీ చేయరు, వారు ఇంకా ఆ తెరను ఎప్పుడూ మీ ముందు లాగుచునే యుందురు. "ఓ, అటువంటిదేదీ లేదందురు." కాని ఇక్కడ వ్రాయబడినది, మీరు గమనించండి, అది ఇచ్చట ప్రత్యక్షపరచబడినది, మీరు చూచారా, గమనించండి.
124ఇప్పుడు, ఒకడు సూర్యుని చూడకుండా ఈలాగు అన్నాడనుకొనండి, ''దేవుడు వెలుగు కలుగు గాకని పలికెను గాని, అటువంటిది ఏదీ లేదు. నేను భూమి క్రిందికి వెళ్ళుచున్నాను. వెలుగును చూడను.'' అతడు పిచ్చివాడు. అతనికి మతిపోయినది
దేవుని వాగ్దానమును చూచియు, అది ప్రత్యక్షపరచబడుట చూచియు పిదప శాఖనే తెరను క్రిందికి లాగుటవలన దానిని నమ్మలేని ఏ పురుషుడైనను, స్త్రీ అయినను వారిలో ఏదో తప్పిదము కలదు. చూడండి, అదే ముసుగు.
125దీనిని చేయవలెనన్న మన ఆచారమనే తెరలను దేవుని యొక్క ఆత్మ, అగ్ని మరియు వాక్య ఖడ్గముతో చీల్చవలసియున్నది. ఎల్లప్పుడూ ఆయన వాక్యమే ఆయన ఖడ్గము. ఆ దినమున ఆయన తనయొక్క అగ్నిమయమైన ఖడ్గమును తీసికొని ఆ తెరను పైనుండి క్రిందికి చింపివేసెను. అదే ఖడ్గముతో ఆయన నేడును అలాగే చేయుచున్నాడు. నా సిద్ధాంతము కాదు, నా నియమముల గ్రంథము కాదు, నా మత సంబంధమైన బోధయు కాదు గాని ప్రభుని ఖడ్గము తెరను చీల్చినప్పుడు, దేవుడు తేటగా తనను కనబరచుకొంటూ నిలబడి తన వాక్యమును ప్రత్యక్షపరచుటను నీవు చూడగలవు. చూచుటకు అది ఎంతటి మహిమకరమగు దృశ్యముగా యున్నది! చూచారా? మంచిది. దేవుని పరిశుద్ధాత్మ మరియు అగ్ని, ఆయన ఖడ్గము దానిని చీల్చివేసెను, వాక్యము శాఖల యొక్క తెరను చీల్చివేసెను.
126నీవు ''వాక్యము'' అని నోటితో చెప్పుచూ, ఆ వాక్యము నీలో క్రియ చేయనియెడల, ఖడ్గము ఇచ్చట యున్నదని చెప్పుచు ''దానిని చీల్చలేము'' అని చెప్పినయెడల దానివలన ఏమి ప్రయోజనము కలదు. ''ఓహ్'' అది చీల్చలేదు అని చెప్పుచున్నాము
కాని మీరు ఆ దేవుని యొక్క ఖడ్గమును ఉన్నతమున యుంచి, ఆయన దానిని చీల్చుటను మీరు గమనించినప్పుడు, ఆ ఖడ్గము దానిని చేయునట్లుగా నియమించబడి, అందుకొరకై పంపించబడిన ఒక చేతిలో అది పట్టుకొనబడియున్నది, చూడండి! అది చీల్చి, దానిని తెరచుచున్నది మరియు అచ్చటే ఆయన యున్నాడు. అచ్చట అది దేవుడిని, మహోన్నతుడగు యెహోవాను తేటగా కనబరచుచున్నది. అది వాక్యమును బయలు పరచుచున్నది. అది ఈ ఘడియకు వాగ్దానము చేయబడిన భాగముగా యున్నది. మీకు అది అర్ధమగుచున్నదా? నేడు ఈ ఘడియకు వాగ్దానము చేయబడిన ఖడ్గముగా అది యుండి, దేవుడు తనయొక్క ఖడ్గమును చేతితో పట్టుకొని శాఖ యొక్క తెరను క్రింద వరకు చీల్చివేసి, మరలా దానిని వెనుకకు తీసి, తనను బయలు పరచుకొని, ఆయన అచ్చట యున్నాడనియు, ఇంకా అదే అగ్నిస్తంభముగా యున్నానని కనబరచుకొనుచుండెను? గమనించండి, నేటి వాగ్దానమునకు అది ప్రత్యక్షపరచబడిన దేవుని వాక్యముగా యున్నది.
JOHN 6:68
127పేతురువలె మనమును అందుము, ''ప్రభువా, దీనిని చూచిన మేము మరెక్కడికి వెళ్ళగలము.'' మన మెక్కడికి వెళ్ళగలము? మనము ఒక సంఘములో జన్మించియుండగా, ఏ సంఘములో చేరగలము? చూడండి. మీరు … ఈ సత్యమును ఎరిగిన తరువాత ఏ శాఖలో నీవు చేరగలవు? కాని దానిని వారు నిరాకరించుచున్నారు. వారిలో ప్రతి ఒక్కరు! వారిని గూర్చి చెప్పుటకు ఏ ఒక్క మంచి నాకు లేదు. ఇది సత్యము.
GEN 3:15•
MATT 11:25•
LUKE 10:21•
JOHN 14:9
128నన్ను నలుబది-రెండు సంఘములు ఏకముగా కూడి జరుపుచున్న కూటములలో కలుసుకొనుటకు నేను బయలుదేరి వెళ్ళితిని. నేను అచ్చటకు వెళ్ళేసరికి, నాకంటూ ఒక్కరు కూడా అచ్చట లేరు. వారు ''ఆయన నిత్య భద్రతను నమ్మును'' అని చెప్పిరి. అది లీగలిస్టులను వెళ్ళిపోవునట్లు చేసినది. ఒకరు ''అతడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మమిచ్చును'' అని చెప్పెను. అది మిగిలినవారినందరిని వెళ్ళిపోవునట్లు చేసినది, గమనించండి, వారిలో ఒకరు, ''అతడు సర్ప సంతానముపై నమ్మకమును గలిగినవాడు, సర్పమునకు సంతానము లేదు.'' అనెను. అది …..
''పరిశుద్ధ గ్రంథము ఆమె సంతానమునకును సర్పము సంతానమునకును మధ్య వైరము కలుగ చేసెదనని'' చెప్పుచున్నది.
చూడండి, వాక్యమును మరుగు పరచుచున్న తెరను అది తొలగించినది. చూచారా? అది నిజము. పసిపిల్లలకు అది బయలుపరచబడియున్నది. అది తొలగించబడినది. వారు దానిని చూచుచున్నారు. వాక్యముపై యున్న తెర తొలగించబడగానే, ఆచారములు వాక్యములో నుండి తొలగించబడుచున్నవి. యేసు ఒకసారి ఈలాగు చెప్పెను, ''నన్ను చూచినవాడు తండ్రిని చూచియున్నాడు,'' చూచారా. దేవుడు ఆయన వాక్యము ఒక్కటే. ఇప్పుడు మీకు ఆర్ధమైనదా? వాక్యము బయలుపరచడినది. చూచారా.
JOHN 5:39•
JOHN 10:30,37,38•
JOHN 14:9
129''లేఖనములను పరిశోధించుడి. మీరు దేవునియందు విశ్వాసముంచుచున్నారు, నా యందును విశ్వాసముంచుడి. నా తండ్రి క్రియలు నేను చేయనియెడల నన్ను నమ్మకుడి. కాని ఆ క్రియను నేను చేసినయెడల, నేనును నా తండ్రియు ఏకమైయున్నాము. నన్ను చూచినవాడు తండ్రిని చూచియున్నాడు'' అని యేసు చెప్పెను.
మీరు వాక్యము బయలుపరచబడుట చూచిన త౦డ్రిని, దేవుడిని మీరు చూడ గలుగుదురు, ఎందుకనగా వాక్యమే తండ్రి, వాక్యమే దేవుడు. వాక్యములు ప్రత్యక్షపరచునట్లుగా యున్నది. విశ్వాసులను కాకుండా మరి దేనిని అది జీవింపచేయలేదు. విశ్వాసులకు మాత్రమే మరేదియు కాదు.
MATT 13:4-8•
MARK 4:4-8•
LUKE 8:5-8•
JOHN 6:51,60,66
130మీరు ఒక గోధుమ గింజను తీసికొని దానికి సరిపోని నేలలో వేసినచో ఎన్నడూ అది ఎదగదు. ఆ గోధుమ గింజ ఎదుగుటకు నేలయందు దానికి తగిన సారవంతమైన మట్టిగా అది యుండవలెను. అది లేనియెడల … నేలయందున్న మట్టి సారవంతముగా లేనియెడల, ఆ మట్టిలో గోధుమ గింజ మొలకెత్తదు. అది ఎన్నటికిని ఎదుగదు. కాబట్టి వాక్యమును విత్తునప్పుడు, అది సరియైన హృదయములో విత్తనియెడల … కాబట్టి వాక్యము సరయిన హృదయులో పడవలెను.
యేసు అలాగే చెప్పెను, ''కొన్ని త్రోవ ప్రక్కను, కొన్ని రాతి నేలను పడెను. ఆకాశ పక్షులు వచ్చి దానిని తినివేసెను. కొన్ని ముండ్ల పొదలలోను, గచ్చ పొదల మధ్యను పడెను, అవి ఎదుగకుండా అణచబడినవి. ''ఆచారములు, శాఖలు, ఈ లోక చింతలు దానిని అణచివేసెను. కాని కొన్ని మంచి నేలను పడినవి, అవి నూరు రెట్లు పెరిగినవి." "అది దేవుని రాజ్యమునకు సాదృశ్యము."
అది అదే విషయము, చూచారా, అసలు కొందరు నమ్మనే నమ్మరు.
కొందరు కొంతకాలము మట్టుకు శిష్యుల వలె నమ్మెదరు. డెబ్బదిమంది ఆయనను సంవత్సరమున్నర లేక రెండు సంవత్సరముల పాటు వెంబడించిరి, ఆయనలో ఏమైనా దొరుకునేమో చూచిరి. ఆయనయొద్ద మంత్ర శక్తి తమకు దొరుకునేమో అని చూచిరి. తాము కోరినది నెరవేరునట్లు శక్తి ఏమైనా ఆయన ఇచ్చునేమో అని చూచిరి. ఆయన జనుల హృదయాలోచనలను బయటపెట్టుచుండెను. కాని చివరకు ఆయన ''నేను పరలోకము నుండి దిగివచ్చిన వాడిని'' మరియు ''నేనే వాక్యమునని'' చెప్పుటను వినిరి. వారికది విపరీతముగా తోచెను. ''ఇది ఎవరునూ అర్ధము చేసికోలేరని'' వారు పలికిరి. వారాయనను విడిచి వెళ్ళిపోయిరి. ముండ్ల పొదల మధ్య పడినవారు వీరే.
JOHN 6:53
131ఇది ఒకే సంగతిని సూచించుచున్నది. అదేమనగా ప్రతి సంఘములోను అవిశ్వాసులు, విశ్వాసులు, వేషధారులు ఉందురు. ప్రతి సమూహములోను వారుందురు. ఎప్పుడూ మీరు కనుగొందురు. కొందరు విశ్వాసులవలె నటించెదరు. అది చాలా నీచము. అవిశ్వాసులుగా నున్నవారివలన తొందరరాదు, వారు నమ్మమని చెప్పిపోదురు. కాని వేషదారులు నమ్ముచున్నామందురు, వారిని నీవు గమనించవలెను. కొందరు నిజ విశ్వాసులందురు. ఆ ముగ్గురుని చూడండి?
అక్కడ అవిశ్వాసులుండిరి. ''మనుష్య కుమారుని శరీరము తినవలెనని'' ఆయన చెప్పిన వెంటనే వారు వెళ్ళిపోయిరి.
మరి కొందరు వేషధారులు. (యూదావలె) వారు చివర వరకు ఉండిరి.
నిజ విశ్వాసులు ఉండిరి. వారు దానిని వివరించలేకపోయిరి, అయినా కాని వారు దానిని నమ్మిరి. వారు ఆఖరి వరకు నిలబడిరి.
132అవిశ్వాసుల యొక్క ఆచారమును తొలగించబడినప్పుడు, మీరు దేవుని చూడగలరు. ఆచారమనే తెర తొలగించబడిన వెంటనే దేవుడు ఇంకనూ మాట తప్పని వాడని నీవు చూడగలవు, ఆయన తన మాట నిలబెట్టుకొనును. ఆయన దేవుడుగాను, తన వాక్యము యొక్క మూలకర్తగాను, కొందరికి చర్మపు తెర వెనుక మరుగుపరచబడినవానిగా యుండెను. అవును, అది నిజము. ఆ తెర వెనుకకు వెళ్ళలేని వారికి ఆయన ఇంకా తెర వెనుకనే యున్నవాడుగా యున్నాడు.
JOHN 14:12•
COL 1:27
133గమనించండి, అప్పుడు మనము ఆయన యొక్క భాగమై పోవుచున్నాము. ఎందుకనగా మీరు ఆయనను మరుగుపరచు తెరయగుచున్నారు. (క్రీస్తు మీలో ఉన్నంతవరకు) మీరు ఆయన యొక్క భాగమైయుందురు — క్రీస్తు, దేవుని వాడుగా యున్నట్లుగా మీరుందురు. దేవుడు క్రీస్తులో నివాసమై యున్నందువలన అది ఆయనను దేవునిగా చేసినది. మహిమకు ఆధారమగు క్రీస్తు నీలో ఉన్నప్పుడు, నీవు క్రీస్తులో భాగమగుదువు. ''నాయందు విశ్వాసముంచువాడు నేను చేయు క్రియలు చేయును.'' చూచారా? నీలో క్రీస్తు దాగియున్నంతకాలము నీవు ఆయనలో భాగమైయుండి, క్రీస్తు చర్మపు తెర వెనుక కలిగియుందురు. అప్పుడు మనము… ఈ తెరకు వెనుక యుండుటచేత, మరలా మానవ శరీరమనే తెర దేవుడిని (వాక్యమును) అవిశ్వాసి నుండి మరుగుచేయుచున్నది.
2COR 3:2
134''వ్రాయబడిన ప్రకారము!'' చూడండి, ''మీరు వ్రాయబడిన పత్రికలుగా ఉన్నారు,'' అని బైబిలు చెప్పెను. పత్రిక అనగా ఏమిటి? ''వ్రాయబడిన వాక్యము'' ''వ్రాయబడిన'' ఇంకొక విధముగా చెప్పాలంటే, మీరు దీనిని ఈ విధముగా చదువవచ్చును, ''మీరు'' అది మీరు వ్రాయబడిన పత్రికలుగా లేదా ''మీరు వాక్యముగా యున్నారు, అనగా మీరు వ్రాయబడిన, ప్రత్యక్షపరచడిన వాక్యముగా యున్నారు'' అని చెప్పుచున్నది. దానికి మరేదియూ కలుపబడదు. ''నేను వ్రాయబడిన పత్రికను'' అని నీవు చెప్పుట కాదు. వ్రాయబడిన విధముగా కాకుండా వేరే విధముగాను నీవు జీవించకూడదు, ఎందుకనగా దానికి నీవేమీ చేర్చరాదు లేదా దానిలోనుండి ఏమీ తీసివేయరాదు.
135డాక్టర్ లీవైల్ వ్రాసిన ఈ ప్రముఖ గ్రంథమును తరువాత మీకు చూపించెదను, సహో వైల్ ఇక్కడే ఉన్నాడు. బయట అతనిని నేను చూచాను. అతడు లోనికి రాగలడు. కాని అక్కడ అతడు గ్రంథము వ్రాయచున్నాడు, లవొదికయ సంఘకాలము చాలా ఆశ్చర్యముగానున్నది. త్వరలోనే అది ముద్రించబడి బయటకు వచ్చును. ఇప్పుడు చివరి సారిగా దానిని చదువుచున్నాము, దానిని వ్రాయుచూ అతనితో చర్చించాను.
REV 10:4
136అందరూ నా యొద్దకు వచ్చి ఇట్లడిగిరి, ''బ్రెన్హాం సోదరుడా, ఆ ఏడు ఉరుములు ఉరిమినప్పుడు ఒక స్వరము ఆ గ్రంథము వ్రాయక మూసివేయుమని'' చెప్పెను గదా? చివరి దినములలో ప్రత్యక్షమగు ఏడు ఉరుములు అవేనా? ఆ ఏడు ఉరుముల గూర్చి చెప్పుము.'' అది మంచి ప్రశ్నయే. మీరు దేనిగూర్చి మాట్లాడుచున్నారో మొదట గమనించండి. ''దానిని వ్రాయవద్దని'' ఆయన చెప్పెను. ఈ ఏడు ఉరుములు ఉరిమినవి. ''అది వ్రాయవద్దని'' సర్వము చెప్పెను. చివరి దినమువరకు అది ముద్రించబడి యుండవలెను."
REV 22:18,19
137ఇప్పుడు, ఒకరు, చాలామంది వేదాంత పండితులు నాతో ఇట్లనిరి, ''బ్రెన్హాం సోదరుడా, ప్రభువగు దేవుడు … తన జనుల కొరకు దేవుడు నీకు అనుగ్రహించిన అనుభవమునుబట్టి'' - దీనిని ఎంతో దీనముగా చెప్పుచున్నాను — ''దేవుడు నీ ద్వారా బయలుపరచిన వాక్యమును ఒక పరిశుద్ధ గ్రంథముగా వ్రాయుటకు నీవు అర్హతను కలిగియున్నావు.''
''అది నిజమే కావచ్చు, కాని అలాగు నేను చేయలేను'' అన్నాను, చూచారా. నా జవాబు ద్వారా అతడు నన్ను పట్టుకోవాలని ప్రయత్నించెను.
''నీకు అన్ని అర్హతలున్నవి గదా? ఎందుకు చేయకూడదు?'' అన్నాడు.
''కాని చూడు, ఒక మాట చేర్చకూడదు, ఒక మాట తీసివేయకూడదు,'' అన్నాను.
''ఆ ఏడు ఉరుములు ఉరిమినప్పుడు నీకు ఒక ప్రత్యక్షత ఇవ్వబడెను గదా?'' అని నాతో అనెను.
''లేదండి, దానికి ఏదీ కలుపరాదు, దానిలో నుండి ఏదీ తీసివేయరాదు,'' అన్నాను. అక్కడే అదంతయూ బయలుపరచబడినది, దానియొక్క ప్రత్యక్షతను ఏడుముద్రలు విప్పినవి.
ఆయన ఇంకనూ వాక్యమే! ఆ వాక్యము నుండి నీవు బయటకు వెళ్ళలేవు. వాక్యమును ఆయన విడువడు. దేవుని ఆత్మ ఆ వాక్యమును ఎన్నడూ వీడదు. అది వాక్యముతోనే నిలచియుండును. కొందరికి గ్రుడ్డితనము కలిగించును, కొందరి కన్నులు తెరచును. అది ఎల్లప్పుడూ అలాగే చేయును.
ACTS 4:13•
2COR 3:2
138''మీరు మనుష్యులందరి చేత చదువబడు పత్రికలై యున్నారు. ''మీరు వ్రాయబడిన పత్రికలు'' అని మరో విధంగా మనము త్రిప్పి చెప్పవచ్చును. దానికి మీరేమియూ చేర్చజాలరు. ''మీరు మనుష్యులందరి చేత చదువబడు పత్రికలు.'' దానిని వేరే విధముగా చెప్పిన "దేవుని యొక్క ప్రత్యక్షపరచబడిన వాక్యమైయున్నారు." పేతురు, యోహానులు విద్యలేని పామరులనియు, వారు యేసుతో కూడా ఉన్నవారనియు గుర్తించిరి, చూచారా. వారు విద్యలేని పామరులు, కాని వారు వ్రాయబడిన పత్రికలు. వారు యేసుతో కూడా నున్నవారని చదివిరి, ఎందుకనగా వారి ద్వారా యేసు ప్రత్యక్షమగుచుండెను. క్రీస్తు వారి శరీరమనే తెరయందు మరుగుపరచబడి, ప్రత్యక్షపరచబడి, సజీవుడాయెను.
COL 2:9•
HEB 13:8
139ఆయన మోషేలో ఉండినట్లు సజీవునిగా ఉన్నారు.
వాక్యము మోషేలో యున్నప్పుడు, అతడు శరీరమందు బయలుపడిన దేవుడుగా యున్నాడు. యేసులో నున్నప్పుడు ఆ వాక్యము శరీరధారిగానున్న దేవుడాయెను. ఆయన తన ముసుగును మార్చెను గాని వాక్యమును గాని తన స్వభావమును గాని మార్చలేదు. ఆయన నిన్న, నేడు నిరంతరము ఏకరీతిగా యున్నాడు. ఆయన తన రూపమును మాత్రమే మార్చెను, నోవాహు నుండి మోషేగా మారెను; మోషే నుండి దావీదునకు; దావీదు నుండి యోసేపునకు ఇంకా తదితరులందరిలోనికి మారి చివరకు దేవత్వమే శరీరధారిగా ఆయనలో సంపూర్తిగా జీవించెను, చూచారా.
ఆయన ఇంకా అదే దేవుడుగా యున్నాడు! అదే దేవుడు. ఆమేన్! ఆమేన్! దీనిని గ్రహించారని తలంచుచున్నాను, చూచారా. అదే దేవుడు, కాని ఆయన మరో ముసుగును ధరించెను. చూచారా, ఆయన మరో తెరలో ఉండెను.
JOHN 3:30
140సంస్కరణ కర్తలలో ఆయన దానిని చేసెను, ఆయన ఒక తెరను వేసుకొనెను, వేరొక తెరను వేసుకొనెను. లూథరన్ యుగము నుండి ఆయా యుగములు వచ్చి చివరకు సంపూర్ణత ఏర్పడినది, అది వచ్చు ముందు మరల ఒక ప్రవక్త లేచును. అట్లు లేచునప్పుడు, అది వాక్యమునకు ముందు ఛాయగా చూపించుచు, అచ్చట ఏమి సంభవించినదనే దానిని కనబరచి, దానిని వివరించి, ఏదైతే విడువబడినదో దానిని కూడా వివరించి తెలుపుతూ, సంఘము… దీనిని గురించి జ్ఞానమును పొందుకొనునట్లుగా చేయుచున్నది. ఇది మరుగవుచున్నప్పుడు, యోహానువలె, ''నేను తగ్గవలసియున్నాను, ఆయన హెచ్చవలసియున్నాడు,'' అని చెప్పవలెను. అప్పుడు ఆయనే స్వరము అగును. లూథర్, వెస్లీ, పెంతెకోస్తు మొదలగు వారిద్వారా ఆయన పూర్తిగా బయలుపరచబడెను. ఆయన సంపూర్ణముగా బయలుపరచబడెను, చూడండి. దశలవారిగా బయలుపడుట, తనను బయలుపరచుకొని కనబరచుకొనుట, చూచారా. ఇప్పుడు గమనించండి, వారికి చేసినట్లుగా, నేడు కూడా ఆయన తన వాగ్దానములను నెరవేర్చుచున్నాడు.
COL 2:9
141ఆ దినమున వాక్యముగా మోషే ఉండెను, ఎందుకనగా ఆ దినపు వాక్యము మోషేకు ఇయ్యబడెను. యోసేపు తన దినములలో క్రీస్తుకు ముంగుర్తుగా నుండెను. వారందరూ వాక్యముగానే యుండిరి.
యేసు వాక్య సంపూర్ణుడుగా వచ్చెను, ఎందుకనగా రక్షణ సంకల్పమంతయు ఆయనలో యున్నది. మోషేలో గాని, యోసేపులో గాని, ఏలియాలో గాని రక్షణ పధకము పూర్తిగా లేదు. వారు వాక్యములో ఒక భాగముగా ఉండి, దానిని చూపించుచుండిరి. చూచారా? ఇప్పుడు గమనించండి, మీ ఆలోచనను పెట్టండి, నేను చెప్పుచుండగా, అది ఇక్కడ వచ్చెను. చూచారా, వారిలో పూర్తి సంకల్పము లేదు. దానిని వారు చూపించుచుండిరి.
HEB 1:1,2
142సంపూర్ణుడగు ఆయన వచ్చిన తరువాత మరి దేనివైపు మనము చూపించజాలము. తిరిగి వాక్యమైయున్న ఆయన వైపునకే మనము చూపించవలెను. ఇది పూర్తి ప్రత్యక్షత దానికి ఏదియూ చేర్చబడదు. దానినుండి ఏదియూ తీసివేయబడదు. అది సంపూర్ణ ప్రత్యక్షత. ఆయన రాకడ యొక్క నీడగా ఉండెను; కాని ఆయన వచ్చినప్పుడు, ఆయనే ఆ సంపూర్ణతగా యుండెను. హెబ్రీయులకు వ్రాసిన పత్రికలో 1వ అధ్యాయము నందు, ''పూర్వకాలమందు నానా సమయములలోను, నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాటలాడిన దేవుడు,'' దేవుడు ఈ తెరలు అనే ప్రవక్తల ద్వారా మాట్లాడెను, కాని ''ఈ చిదరి దినములందు ఆయన కుమారుడగు యేసుక్రీస్తు ద్వారా మాట్లాడెను.'' అక్కడే మీరున్నారు. కల్వరిలో, దేవుని కుమారుడు, తెరను తొలగించెను.
1COR 12:13
143గమనించండి, "జీవింప చేయబడితిమి." మానవ ఘటములలో నేడు వాక్యము బయలుపరచ బడుచున్నది. అది సంపూర్ణముగా ఆ దినమునందు నెరవేర్చబడిన వాక్యముగా యుండి, దేవుడిని సూచించునదిగా యుండెను. 1 కొరింథీ 12 ప్రకారము, ఆయనలో బాప్తీస్మము పొందిన మనము ఆయనతో గుర్తించబడితిమి. ఆమేన్.
144నేను అరగంట చెప్పాను, కాని ఇంకా ఎక్కువ పట్టవచ్చును. చూచారా? దీనిని తప్పిపోక చూడండి. ఆయనతో గుర్తించబడియున్నాము.
145గమనించండి. ఇక్కడ ఎందరు అమెరికా పౌరులున్నారు? మీ చేతులు ఎత్తండి. సరే. మీరు అమెరికా పౌరులు. ఈ దేశముతో మీరు గుర్తించబడియున్నారు. ఈ దేశమే మీరు. అవునా? దేశ మహిమ, దేశ అవమానము మీరే. మీరా దేశముతో గుర్తించబడిరి. మీరు అమెరికా వారు గనుక అమెరికాను స్వీకరించెదరు. హల్లెలూయ!
జార్జి వాషింగ్‌టన్ డెల్‌వేర్‌ను దాటినప్పుడు, నేనాయనతో కూడా ఉన్నాను. నేనాయనతో గుర్తించబడ్డాను. నిజము. నేను గెట్టీస్ బర్గ్ అడ్రసు యొద్ద అబ్రహాం లింకన్‌తో కూడా ఉన్నాను. సైనికులు పతాకము ఎగురవేసినప్పుడు, నేను వారితో కూడా గవుమ్ యొద్ద ఉన్నాను. నేను అమెరికా జాతీయుడ్ని గనుక దానితో గుర్తించబడితిని. ఆమేన్! నేను అమెరికనుగా ఉండవలెనన్నచో విప్లవములో ఆమె పొందిన అవమానమును నేను స్వీకరించెదను; ఎందుకనగా నేను అమెరికనును. అది సరి.
146ఆ విధముగానే ఒక క్రైస్తవుడిగా ఆయనతో నేను గుర్తించబడితిని. ఆమేన్! ఓడలోనికి వెళ్ళినప్పుడు నోవాహుతో కూడా నేనున్నాను. మోషే ఐగుప్తు నుండి బయటకు వచ్చినప్పుడు నేను అతనితో ఉన్నాను. ఆమేన్! కర్మెలు కొండ మీద నేను ఏలియాతో ఉన్నాను. దేవునికి మహిమ! అతడు దానిని చేసినప్పుడు నేను అతడితో ఉన్నాను. నేను నిజంగా ఆయనతో ఉన్నాను. లోక కార్యములకు, సమస్త ఆచారములకు నేను చచ్చినవాడినైనప్పుడు కల్వరిలో ఆయన మరణముతో నేను గుర్తించబడియున్నాను. ఆయన మృతులలో నుండి ఈస్టరు ఉదయాన పునరుత్థారుడైనప్పుడు, ఆయనతో కూడా నేను గుర్తించబడితిని. బలమగు గాలివలె పరిశుద్ధాత్మ పెంతెకోస్తు దినమున వచ్చినప్పుడు, నేను ఆయనతో గుర్తించబడితిని. ఆయన అంతా ఏమైయున్నాడో అదంతా నేనైయున్నాను. నేనంతా ఏమైయున్నానో అదంతా ఆయనై యున్నాడు. ఆమేన్. ఆయనలో చనిపోవుట ద్వారా ఆయనతో కూడా మనము గుర్తించబడితిమి. ఆయన ఏమైయున్నాడో అది నేనైయున్నాను. ఆమేన్!
1COR 12:13
147ఈ దేశము ఏమైయున్నదో అది నేనైయున్నాను. అట్లుండుట నేను గర్వించుదును. ఆమె అవమానమును భరించుటకు కూడా నేను సిద్దముగా యున్నాను. అమెరికనుగా నిందను అనుభవించుటకు సిద్ధముగా యున్నాను. నిజము యేసుక్రీస్తు విషయంలో అందుకు రెండు రెట్లు అనుభవించుదును. ఆయన ఏమైయున్నాడో అది నేనుగా యున్నాను. నేను ఆయనతో గుర్తించబడగోరుచున్నాను.
ఆ అపోస్తులులు తిరిగి వచ్చినప్పుడు వారు… వారు వారిని చూచి పరిహసించిరి, పలు రకముల పేర్లు పెట్టి హేళన చేసిరి. ఆయన నామము నిమిత్తము నిందను అనుభవించుట గొప్ప ఘనతగా ఎంచుకొనిరి.
వారిలో ఒకనిగా ఉండి, వాక్యమగు క్రీస్తుతో నేను గుర్తించబడితిని. ఆయనతో గుర్తించబడుటకు నేడు నేను ఎంతగానో సంతోషించుచున్నాను. ఆయనతో గుర్తించబడుట! ఆయనలోనికి బాప్తిస్మము పొందుటచేత మనము గుర్తించబడుచున్నాము. ఆయన వాక్యముతోను గుర్తించబడితిమి. ఆయనే వాక్యమైయున్నాడు. నేను క్రీస్తులో ఉన్నయెడల వాక్యమునగుదును. ఆయన ఏమైయున్నాడో అది నేనైయున్నాను. ఆమేన్. మీరిది గ్రహించారా? మంచిది.
ACTS 9:3
148అచ్చట అది ప్రత్యక్షపరచబడిన లేదా ప్రత్యక్షమైన వాక్యముగా యున్నది. అట్లైనయెడల అది నన్ను ఎచ్చట ఇముడ్చుచున్నది? ఆయన షెకీనా మహిమ ఆయినచో నేనును అందులో భాగమే. ఆమేన్! ఓ! ఆమేన్! నిజము. వాక్యము దానంతట అది బయలుపడును, తననుతాను బయలుపరచుకొనుచున్నది. ఆలోచించుము! ఆ దినములలోని వారికి తెలియచేసిన పరలోక వర్తమానికుడే ఈ దినములలో దేవుని మర్మములను మనకు తెలియచేయుచున్నాడు. అది అదే అగ్నిస్తంభము, మోషేను పంపించినది. అదే అగ్నిస్తంభము మోషేపై యుండి పరిశుద్ధ గ్రంథము వ్రాసినది. దమస్కుకు పోవు దారిలో నుండగా పౌలును అగ్నిస్తంభము కలిసికొనెను, మరియు పౌలు క్రొత్త నిబంధనను వ్రాసెను.
మత్తయి, మార్కు, లూకా, యోహానులు తాము చూచిన దానినే వ్రాసితిరని జ్ఞాపకముంచుకొనండి, కాని పౌలు ప్రత్యక్షత పొందినవాడుగా యుండెను. ఎందుకనగా అతడు అగ్నిస్తంభమును కలిసికొనుట వలన అతడు వాటిని బయటకు లాగెను. దానిని కొంచెము ఆలోచించి చూడండి.
ACTS 26:19
149అచ్చట యోసేపుకు మరియు వారికి సంభవించినవన్నియు వ్రాసిరి. ఆ దినములలో వారికి జరిగిన సంభవములను ఒక్కొక్కరుగా వ్రాసిరి. కాని మోషే రంగము మీదికి వచ్చినప్పుడు, అతడు ప్రత్యక్షతను పొందెను. అతడు అగ్నిస్తంభమును కలిసికొనెను, ఆదియందు ఏమి సంభవించినదో మోషేకు బయలుపరచబడెను. మోషే బైబిలులోని మొదటి నాలుగు గ్రంథములను వ్రాసెను. నిజమేనా? ఎందుకనగా అగ్నిస్తంభములో తెరగా యుండి అతడు దేవుడిని అగ్నిస్తంభపు రూపమున కలిసికొనెను.
మార్గమందు పౌలు ఆయనను కలుసుకొనినప్పుడు… శిష్యులు ఆయన వ్రాసిన వాటిల్లో వారేమి చూచితిరో వాటిని మాత్రము వ్రాసిరి, కాని మోషే ప్రత్యక్షతను కలిగినవాడుగా యుండెను. ఐగుప్తులోనికి వెళ్ళి మూడు సంవత్సరములు అధ్యయనము చేసెను. ''పాత నిబంధనలోని దేవుడు క్రొత్త నిబంధనలోని యేసే,'' అని చెప్పెను. అది ప్రత్యక్షత, ''ఆ పరలోక దర్శనమునకు అవిధేయుడను కాను.'' అది సత్యము. నిజము.
దానిని గూర్చి ఆలోచించు. వారి మీదికి అగ్నిస్తంభము వచ్చి పరిశుద్ధ గ్రంథమును వ్రాసిన అదే అగ్నిస్తంభము నేడు ఇచ్చట యుండి ఈ పరిశుద్ధ గ్రంథమును అనువదించుచున్నది. ఆమేన్! దానినిబట్టి ఆయననెంతో స్తుతించవలెను! ఎంత ఆదరణ! ఎట్టి గుర్తింపు! అందులో గుర్తించబడినందుకు ఎంతగానో వందనములు చెల్లించుచున్నాను, ఏమి చేయవలెనో నాకు తెలియుట లేదు. నేను బాప్టిస్టు, మెథడిస్టు, ప్రెస్బిటేరియను, లూథరను తదితరమగు వానిలో గుర్తించబడుట కంటె ఇందులో గుర్తించబడుటకు ముందుకు వచ్చెదను. షెకీనా మహిమ మరియు ప్రత్యక్షత ఆ వాక్యములో గుర్తించబడుట.
HEB 10:26
150మన మధ్యలో దృశ్యమగుచున్నట్లుగా యున్న అగ్నిస్తంభము వచ్చెను. ఈ వర్తమానము సరియని సీనాయి కొండమీద ఆయన చేసినట్లుగా గుర్తించుచున్నది. నిజ వర్తమానము వచ్చు ముందుగా మోషే ప్రసంగించి, వారిని ఐగుప్తు నుండి బయటకు నడిపించెను, కాని అచ్చట నిజమగు ఆజ్ఞలు ఇవ్వబడుటకు ముందు ముద్రలు తీసుకొనిరాబడెను, దేవుడు జనులముందుకు దిగి వచ్చి, మోషేను తానే పంపితినని నిరూపించెను. (నిజమేనా?) మండుచున్న పొదలో అగ్నిస్తంభమును ఆయనను చూచితిని, ఆయనయొద్ద మాట్లాడితిని మోషే చెప్పిన మాటలను ఆయన ఋజువుపరచెను.
ఓ! ఈ చివరి దినములలో అదే అగ్నిస్తంభమును మనమధ్య చూచుటకును అదే వాక్యము మాట్లాడుటకును అంతే కాకుండా దానిని ప్రత్యక్షపరచుట ద్వారా దాని భావమును కూడా చెప్పుచు అదే సత్యమని రుజువుచేయుచున్నది. కాబట్టి జనులు ఇష్టపూర్వకంగా తెలిసి చేయుట ద్వారా తప్ప, దానిని అవిశ్వాసించుటకు వారికి ఏ ఒక్క హేతువు కూడా లేదు. "సత్యమును గూర్చి జ్ఞానమును కలిగియుండియు ఇష్టపూర్వకంగా పాపము చేయు వానికి పరిహారము లేదు."
MAL 4:5,6•
MATT 28:20•
LUKE 17:30•
JOHN 14:12
151గమనించండి, పరిశుద్ధ గ్రంథమును మోషేకు మరియు పౌలుకు పంపబడిన అదే అగ్నిస్తంభము ఇప్పుడు బయలుపరచుటకు అది పంపబడియున్నది. దేవుని కృప అది, మారని దేవుడు తన వాగ్దానములను నెరవేర్చెను. మత్తయి 28. ''ఇదిగో, నేను యుగ సమాప్తి వరుకు సదాకాలము మీతో కూడా ఉన్నానని,'' పరి. యోహాను 14:12 నెరవేరుచున్నది. ''నేను చేయు క్రియలు మీరును చేయుదురు.'' లూకా 17:28-29 నెరవేరుచున్నది. ''అంత్య దినములలో మనుష్య కుమారుడు ప్రత్యక్షమగును.'' చూడండి, మలాకీ 4. ''ప్రవక్త ఏలియాను మీ కొరకు పంపుదును. జనులయొక్క విశ్వాసమును మూలవాక్యము వైపునకు అతడు త్రిప్పును.'' చూడండి? ఓ, మై!
152తన్నుతాను మనకు బయలుపరచుటకు ఆయన చనిపోయెను. ఆయనను ఇతరులకు బయలుపరచుటకు మనము మన స్వార్థమును చంపుదము. ఇతరులకు ఆయనను ప్రత్యక్షపరచుటకై ఆచారములు మొదలగు వాని విషయములో మనము చనిపోదుము. ఆయనను ఇతరులకు బయలుపరచవలెనన్నచో, శాఖల విషయములో మనము చనిపోవలసియున్నది.
EXOD 17:6•
NUM 21:9•
JOHN 3:14,16•
EPH 5:26
153గమనించండి, పాత దేవాలయములో షెకీనా మహిమయు, వాక్యము మీద షెకీనా వెలుగున్నది. వాక్యము ఒక భీజమైయుండి అది ప్రతిష్టితమగు సముఖపు రొట్టెను విశ్వాసులకు మాత్రమే యిచ్చెను. నిబంధన మీద రక్తము ఉన్నది; రక్తమే నీరు, ఆ నీరు ధాన్యమును, గోధుమ గింజను అనగా అది వాక్యమైయుండి దానిని అది జీవింపజేయుచున్నది.
యేసు చెప్పెను, ''మోషే ఇత్తడి సర్పమును ఎత్తినట్లుగా'' ఇంకా అయనిట్లనెను, ''దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా తన అద్వితీయ కుమారుని అనుగ్రహించెను. ఆయన యందు విశ్వాసముంచువారు నశింపరు.'' నశించి పోవుచున్న జనులను రక్షించుటకై, లేదా నీళ్ళను తెచ్చుటకై మోషే అరణ్యములో బండను కొట్టెను. నశించిపోవుచున్న జనులకు జీవాత్మనిచ్చుటకు దేవుడు యేసును కొట్టెను. ఆయనలో నుండి రక్తము వచ్చెను, అది ''వాక్యము ద్వారా ఉదక స్నానము చేయించెను.'' విత్తనమునకు జీవము నీటివలన వచ్చును, షెకీనా మహిమను అది తీసుకొని వచ్చి వాక్యము మీద ప్రకాశింపజేసి అది సముఖపు రొట్టెను తెచ్చెను. ఏర్పాటు కాబడిన ప్రజలకు మాత్రమే ఆ మందసపు రొట్టె. అది సత్యమేనా?
154తెరను చీల్చి ఆయన సన్నిధిలోనికి వచ్చుట ఇప్పుడు జరుగుచున్నది. వాక్యమున్నచోట షెకీనా మహిమ ఉండును, సంఘ ఆచారములో కాదు, అచ్చట లోపల షెకీనాను చూచి, షెకీనా, శక్తిని పరిశుద్ధాత్మ ఆ వాక్యము మీద ప్రకాశించుటను చూచుట, వాగ్ధానమును తీసుకొని వచ్చి నీవు ఆ తెర వెనుకనున్నావని చూపించును. ఆమేన్.
మహిమ ఎన్నడూ తగ్గని తెరలు నేను దాటాను
హల్లెలూయ, హల్లెలూయ;
రాజు సన్నిధిలో జీవించుచున్నాను
మహిమ ఎన్నడూ తగ్గని తెరలు నేను దాటాను,
రాజు సన్నిధిలో నేను జీవించుచున్నాను.
155ఆ పాత సముద్ర వత్సర చర్మమగు శాఖలు చీల్చబడినవి. నేను దానిగుండా షెకీనా మహిమలోనికి నేను ప్రవేశించియున్నాను. వాక్యమును నేను చూచుచున్నాను. అగ్నిస్తంభము కదలుటను నేను చూచుచున్నాను. వాక్యము బయలుపరచబడుట నాకు కనిపించుచున్నది. ఈ అంత్య దినములలో దేనినైతే చేసెదనని ఆయన చెప్పెనో అది ఎదుగుటను నేను చూచుచున్నాను. ఆ వాక్యము పరిపక్వము చెందుచు దానిలోనుండి వచ్చుచున్న షెకీనా రొట్టెను, దానిని నమ్ముచున్న పిల్లలు దానిని తినుటను నేను చూచుచున్నాను. ఆమేన్! ఎంత అద్భుతమగు ఘడియలో మనము జీవించుచున్నాము! వాక్యము మీద షెకీనా యున్నది, దాని క్రింద రొట్టెయున్నది, అక్కడ రక్తము ప్రోక్షించబడినది, దానిలోనుండి నీరు వస్తున్నది. ఆత్మ వాక్యమునకు జీవమును ఇచ్చుచున్నది. (''విచారణ'' అనే ప్రసంగము ఎందరు విన్నారు? చాలామంది విన్నారు.) వాక్యము తప్పక ఎదుగవలెను. అది ఎదుగవలెనన్న మంచి నేలలో ఉండవలెను, చూచారా. దేవుడు ఒక వాగ్దానము చేయగా అది హృదయమును తాకును, కాబట్టి తప్పిపోదు!
ISA 7:14
156నోవాహు, నూట-ఇరవై సంవత్సరములు ఎదురు చూచెను. అబ్రహాము బిడ్డ కొరకు పాతికేండ్లు కనిపెట్టెను. దేవుడాలగు చెప్పెను గనుక అది దానిని చేసి ముగించినది. చూచారా? అది ఏమిటది? వాక్యమునకు విశ్వాసమునకు విశ్వాసము ద్వారా నీరు పెట్టుట జరిగెను, దానిని నమ్ముట వలన ఫలితములు వచ్చెను. అది ఒక కుమారుని తెచ్చెను, అది వర్షమును తెచ్చెను, అది జల ప్రళయమును తెచ్చెను; కన్యక గర్భవతియగునట్లు చేసెను.
''ఒక కన్యక గర్భవతియగునని'' ప్రవక్త చెప్పెను. ప్రతి యువతి చిన్న బాలుని కొరకు వస్త్రములను సిద్ధపరచుకొనెనని చెప్పుటలో ఆశ్చర్యమేమియు లేదు. ఆ యెషయా ప్రవక్త దేవునిచే బయలుపరచినవాడుగా యుండెను, గుర్తింపు పొందిన ప్రవక్తగా దేవునిచే బయలుపరచినవాడుగా యుండెను. ''ఒక కన్యక గర్భవతియగునని ప్రభువు చెప్పెను. వారికి నేను సహజాతీతమైన ఒక మహోన్నత గురుతు ఇచ్చెదనని ఆయన చెప్పెను, ఒక కన్యక గర్భవతి యగునని'' చెప్పెను.
MATT 24:35•
MARK 13:31•
LUKE 21:33
157మీ అందరి విశ్వాసులవలెనె ఆ జనులందరూ ప్రవక్త చెప్పిన దానిని వినిరి. "మా కుమార్తె ఆ స్త్రీ కావచ్చునని అందరూ అనుకొనిరి." అందరూ ఆ పుట్టబోవు శిశువు కొరకు చిన్న చిన్న ఆట వస్తువులు సమకూర్చుకొని అందుకొరకై సిద్దపడిరి, ఎందుకనగా ఆమె దానిని కలిగియుండునని వారెరిగియుండిరి. అయినా ఆ తరము గతించినది, "గుర్తింపు పొందిన ఆ ప్రవక్త, దేవునిచే నిరూపించబడిన ఆ ప్రవక్త తప్పు ఎట్లు చెప్పును? అని వారనుకొనిరి. అది తప్పక నెరవేరును."
ఎనిమిది వందల సంవత్సరముల తరువాత ఆమె శిశువును కనెను. ''భూమ్యాకాశములు గతించినను నామాటలే మాత్రమును గతించవు.''
158"చివరి దినములలో ఈలాగు జరుగునని," దేవుడు చెప్పెను. చూచారా, ఇక్కడ మనమున్నాము. వాక్యము మీదే వెలుగున్నది. సూర్యుని వెలుగు విత్తనమును మహిమనుండి మహిమకు మార్చును. మనము కూడా ఆయన సన్నిధిలో జీవించునప్పుడు ఆయన పోలికలోనికి మార్చబడుచుందుము. ఆయనతో మనము నడుచుచుండగా మనము ఆయన యొక్క ఆశీర్వదించబడిన పోలికలోనికి మారుచుందుము.
సూర్యుడు చేయునది గమనించండి. నీవు విత్తనమును విత్తినప్పుడు ఏమి జరుగును? ఆ విత్తనము కుళ్ళిపోవును. ఆ విత్తనము లోపల జీవమున్నది. జీవము బయటకు రాగా కాడవచ్చును. అది మొదట దానివలె కనిపించదు. అదియే లూథరు ఒక కాడ. ఆ కాడ ఎదుగ ప్రారంభించినది, మీరు మొదటగా చూచునది చిగురును. చూచారా, అది వెస్లీ ఉజ్జీవము, ఇది ఆ మొదటి దానివలె లేదు. ఆ తరువాత పెంతుకోస్తు ఉజ్జీవము, పరిశుద్ధాత్మ బాప్తిస్మమును అది తీసుకు వచ్చినది. సరే. ఏమి జరిగినది? కంకుల (ear) పై పుట్టగొడుగు( fungus) లు మొలకెత్తుచున్నవి. అది చూచుటకు తప్పిదముగా కనిపించి, ఈ కార్యము, మరియు ఆ కార్యము అంటూ అది వాక్యమువలె కనిపించలేదు. అది మిగతా దానివలె కనబడలేదు, అది భూమిలోకి వెళ్ళిన ఆ అసలు గింజవలె లేదు.
159కాని దానివలె దానిని చేయుటకై దేవుడు ఎప్పటివలెనె పనిచేయుచున్నాడు.
అది ఏమి చేయును? చివరకు అది తిరిగి అసలు విత్తనముయొద్దకే అది వచ్చును. మార్టిన్ లూథర్ రూపములో ఆయన వచ్చినప్పుడు, ఆయన జాన్ వెస్లీ రూపములో వచ్చినప్పుడు, ఆయన పెంతెకోస్తు రూపములో వచ్చినప్పుడు భూమిలోనికి వెళ్ళిన అదే విత్తనమగు మనుష్య కుమారునివలెనె ఆయన తిరిగి తనను తాను బయలుపరచ బోవుచున్నాడు. కాడ ఒక దశలో ఆయన తనను దేవుని కుమారునిగా బయలుపరచుకొనెను, కాని ఈ చివరి కాలములో ఆయన మరల మనుష్యకుమారునిగా తన్నుతాను బయలుపరచుకొనెను. దానిని గ్రహించితిరా?
సరే మంచిది, ఆదియందు యున్నట్లుగానే అది మలచబడినది!
160ఆ కాండము ఎంత ఎదిగినది? అన్ని కాలములలోను అది ఎదుగుచునేయున్నది. ఆ చిన్న కాండముఎదిగినా, అది ఇంకా ఆ మూల గింజవలె కనబడలేదు. లూథర్ వర్తమానము కూడా మూల విత్తనమువలె లేదు. ఫెన్నీ, సాంకీ, నాక్స్, కాల్విన్ తదితరులందరూ ఒకరి తరువాత ఒకరుగా వచ్చిన అవి ఏవియు మూల విత్తనమువలె లేవు. వారు వర్తమానమిచ్చిరి, గాని సంపూర్ణ ప్రత్యక్షత పొందలేదు, ఎందుకనగా అది వారి సమయమింకా రాలేదు. కాలము రాకుండా వెన్ను రాదు. చివరకు భూమిలోనికి వెళ్ళిన మూల విత్తనము మరలా అచ్చట ప్రత్యక్షమగును.
161దేవుడు ప్రకృతిని అక్షరాలా అనుసరించును. ఆయన ఒక గొర్రెపిల్లగా జన్మించెను, ఆ కారణము చేతనే ఆయన తొట్టిలో జన్మించెను. గొర్రెపిల్లలు పరుపుల మీద పుట్టవు. చూచారా? ఆయన కల్వరి యొద్దకు నడిపించబడెను. గొర్రెలు నడిపించబడును. అది నిజము! చూచారా? ఆయన కల్వరి యొద్దకు నడిపించబడెను. గొర్రెలు నడిపించబడును. మేకలు వధశాలకు వాటిని నడిపించును. గొర్రెలు మేకలచే నడిపించబడును. ఇది సత్యము. కనుక వధించబడుటకై ఆయన నడిపించబడెను, ఎందుకనగా ఆయన ఒక గొర్రెపిల్లవలె యుండెను.
ప్రకృతి అంతయూ ఆయనలో గుర్తించబడెను. ఆ కారణము చేతనే ఆయన మార్చి లేదా ఏప్రిల్‌లో జన్మించి యుండును; డిసెంబరులో కాదు. ఆ సమయములో ఇరవై అడుగుల మంచుపడును. సూర్యదేవుడు కాదు గాని ఆయన దేవుని కుమారుడుగా యుండెను. అర్ధమయ్యిందా? రోమా సూర్య దేవుడు డిసెంబరు ఇరవై-అయిదున జన్మించెను. సౌర కుటుంబ వ్యవస్థను బట్టి వారు లెక్కించెదరు. సూర్య దేవుని జన్మదినమును మనుష్యకుమారుని జన్మదినముగా చేసిరి. ఆయన దేవుని కుమారుడు. ఆయన జన్మదినము ప్రకృతికి సరిపడియుండును.
ఇప్పుడు, ఇంకా కొంచెము గమనించండి, కొద్ది సమయమున్నది.
JOHN 12:21,24
162ఇప్పుడు సంపూర్ణతకు, కారణము వచ్చిన తరువాత వెన్ను లేక కంకి వచ్చిన తరువాత, గింజ పొట్టులోనికి వచ్చిన తరువాత అది సంపూర్ణతకు, మరలా ఎప్పటివలెనున్న ఆ గింజవలె అది రూపమిచ్చును. గుర్తించుకొనండి, గింజ అనునది జీవముగలదై యుండవలెను, లేనియెడల అది నిర్జీవమే. ఆ వర్తమానములకు వెలుపల నున్నవారు జీవమును పొందరు, దానికి జీవము రావలెను. కాని గుర్తుంచుకొనండి, వేరులోనున్న జీవమే గింజలో ఉండును. అది పరిపక్వము చెంది పూర్వస్థితిని చేరుకొనును. ఆయన తననుతాను బయలుపరచుకొనెను. భూమి లోపలికి వెళ్ళిన ఆ గోధుమ గింజవలె ఆయన మనుష్యకుమారునిగా బయలు పరచుకొనెను. ఆ గింజయే భూమిలోనికి వెళ్ళినది. వర్తమానము గ్రహించారా?
''మేము యేసును చూడగోరుచున్నాము'' అని గ్రీకులడిగిరి.
"గోధుమ గింజ భూమిలో పడిచావవలెనని ఆయన చెప్పెను." చూచారా? మంచిది.
MAL 4:5,6
163తరువాత ఆయన దేనిగా ప్రత్యక్షమగును? వేరు రూపములో, కాండము, ఆకులు, అన్నియూ వచ్చును. అటు తర్వాత ఆయన తనను ఏ విధముగా బయలుపరచుకొనెను, అదే ఆత్మ, కాని రూపము వేరు. చూచారా? కాని గింజ యొక్క చివరి స్థితి ఏమిటి? అది మరలా మూల గింజవలె వచ్చును.
ఆయన సేవ సంస్కరణల నుండి మూల విత్తనము యొద్దకు మరలా వచ్చును. వాక్యము ప్రవక్త యొద్దకు వచ్చును. మలాకీ 4 ఆయన దానిని వాగ్దానము చేసెను. జనుల విశ్వాసమును త్రిప్పి మూల విత్తనము నొద్దకు తిరిగి తెచ్చును. భూమిలోనికి ఏదైతే వెళ్ళినదో ఇచ్చట అదే యున్నది. గింజ అనునది ఇచ్చట దానిగుండా పైకి వచ్చినది. అది దేవుని కుమారునిగా పైకి వచ్చినది. ఇప్పుడు ఇచ్చట మనుష్యకుమారుడుగా ప్రత్యక్షమై పిదప అది సింహాసనము మీద దావీదు కుమారుడుగా అది ప్రత్యక్షపరచును. అదే విధముగా, సరిగ్గా ముగ్గురు కుమారులు. ఓ! మరలా ఆ మూలదానివలె!
MAL 4:5•
LUKE 17:28•
HEB 13:8
164ఆయన పరిపూర్ణ పరిచర్య చూడండి. ఒక మానవునిది కాదు, ఒక శాఖది కాదు. (వారు ఆ కాలములో క్రియ చేసినట్లుగా కాదు), కాని ఆయనే తనను ప్రత్యక్షపరచుకొనెను, చేసిన వాగ్దానము కొరకు ఆయన తననుతాను ప్రత్యక్షపరచుకొనెను. ఆయనే వాగ్దాన ప్రకారము ప్రత్యక్షమాయెను. లూకా 17:28, మలాకీ4, హెబ్రీ 13:8 ప్రకారముఅట్లే చేయుచున్నాడు. ఆ సమయమందు, అది ఏ ఘడియయై యుండి యుండును? అబ్రాహాము యొక్క రాజ సంతానము వాగ్దానము చేయబడిన కుమారుని ఎదురుచూచుచున్న సమయముగా అది యుండవలయును. అన్ని సాదృశ్యములు నెరవేరవలెను. నశించుటకు ముందుగా అబ్రాహాము యొక్క స్వాభావిక సంతానమునకు ఒక మానవ రూపమున దేవుడే ప్రత్యక్షమాయెను. వాగ్దానము చేయబడిన ఈ కుమారుడు తిరిగి వచ్చుటకు ముందుగా అదే కార్యము ఈ రాజ సంతానమునకు సంభవించునని యేసు చెప్పెను.
ISA 53:2
165మహిమను కప్పిన ఆ పాత ముసుగును గమనించండి. ఆ పాత సముద్ర వత్సల చర్మపు తెరలు అందమైనవి కావు; ఆయన శరీరము అంతే. అందుకే జనులు "ఆయనను వంగిన ముసలివాడనుచున్నారు." ముప్పది సంవత్సరముల వయస్సే గాని గడ్డము నెరసినది, అందము లేదు, ''ఆయనకు సురూపము లేదు,'' అని పరిశుద్ధ గ్రంథము చెప్పెను. ఆయన రాజువలె కనిపించలేదు. పాత సముద్ర వత్సల చర్మము. కాని అంతరంగము నందు ఏమున్నది?
ఈ వేడి భవనములో ఒక "పరిశుద్ధుల గుంపు" కూర్చొన్నది, వారిని ఎగతాళి చేయుచున్నారు. వారిలో అందము లేదు, కాని అంతరంగమందు ఏమున్నదో? అనేక హృదయములకు అది మరుగుగానే యున్నదని నేను నమ్ముచున్నాను. మీరు చూచారా?
సరే మంచిది.
SONG 2:1•
JOHN 6:35•
HEB 13:8•
REV 1:8
166బయటకు ఏమీ లేదు, కాని అంతయూ లోపలే ఉన్నది. ఒక్కసారి దానిలోపలికి ప్రవేశించినప్పుడు మీరు దానిని చూచెదరు. అందులోనికి ఎట్లు ప్రవేశించగలరు? కరచాలము చేయుట వలనా? చేరుట వలనా కాదు? అందులోనికి జన్మించవలెను. చచ్చిన వాడవై నీ పాత సముద్ర వత్సల చర్మమును వదిలించుకొని నూతనమైనదైన ఒకదానియందు ప్రవేశించండి. అర్ధమయ్యిందా? పాత సముద్ర వత్సల చర్మమును వదిలి వేయండి.
షెకీనా వెలుగు అనునది… సేవకులారా! వినండి. మీరిది వినవలెనని కోరుచున్నాను. ఒక్కసారి లోపలికి ప్రవేశించినప్పుడు … ఇప్పుడు దీనిని నేను చాలా తేటగా చెప్పగోరుచున్నాను. నిశ్చయంగా మీరు గ్రహించెదరు. ఒక్కసారి తెర లోపల, షెకీనా మహిమ క్రింద, షకీనా వెలుగు దేవునియొక్క వాక్యమును తీసుకొని యేసును ''ఒక మాంత్రికునిగా'' అది చూపించదు. ఈనాడు శాఖలు చేయుచున్నట్లుగా ''మానసిక వివేచన, బయల్జెబూబు, పరిశుద్ధ బండ'' అని పిలచుచూ హేళన చేయదు. షెకీనా మహిమ ఆయనను ఆ విధంగా ప్రత్యక్షపరచదు.
కాని షెకీనా మహిమ ఈ ఘడియకు వాగ్దానము చేయబడిన వాక్య బీజమును మొలకెత్తించి ఆయన లోయలోని పద్మము అని చూపించును. ఆ విత్తనము లోయలోని పద్మమును; జీవాహారమును, అల్ఫా మరియు ఓమేగాయైన వానిని. నిన్న, నేడు, నిరంతరము ఏకరీతిగా ఉన్నవాడిని తీసుకొని వచ్చుచున్నది. ఆయనే విశ్వాసుల యొక్క భాగముగా యున్నాడు. ఆయన నిన్న, నేడు, నిరంతరము ఏకరీతిగా యున్నాడని షెకీనా మహిమ విశ్వాసికి బయలుపడును.
HEB 13:8
167ఆయన గతించెను, చనిపోయెను, అంతా అయిపోయెను అనుట కాదు. కావున స్నేహితుడా, నీవు ఆ నమ్మకము కలిగియున్నయెడల, నీవు ఇటువంటి నమ్మకమును కలిగియున్నయెడల నీవు ఎన్నడూ షెకీనా మహిమను పొందలేవు. షెకీనా మహిమ ఆయనను ముగ్గురు వ్యక్తులుగా ఎట్లు బయలుపరచును? చూడండి? ఎవరు కూడా తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామములో పొందినట్లుగా పరిశుద్ధ గ్రంథములో లేనప్పుడు షెకీనా మహిమ ఏ విధముగా అటువంటి బాప్తిస్మమును ఇవ్వమనుచు ఆయనను బయలుపరచగలదు. ఆయన నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా యుండగా షెకీనా మహిమ ఆయనను ఒక అపోస్తలునిగా మాత్రమే ఎట్లు పరిమితము చేయును?
షెకీనా మహిమ ఆయనను ప్రత్యక్షపరచుచున్నది చూడండి. అది వాగ్దానము చేయబడిన వాక్యమును మీ యొద్దకు తెచ్చుచున్నది. ఆ కారణము చేతనే ఆయన మోషే ముఖము మీద ముసుగు వేయవలసి వచ్చెను, ఎందుకనగా అతనిలో వాక్యముండెను. యెహోవాను వారు చూడకుండునట్లుగా ఆయన ఒక దీన వ్యక్తియైన, ఒక సామాన్యమైన వ్యక్తియైన యేసు అనే తెరయందు ఆయన యుండెను. ఈనాడు మంటి ఘటములలో ఆయన షెకీనా మహిమను నింపియున్నాడు. బయటకు అది పాత చర్మమువలె కనిపించినా పరిశుద్ధ బండలువలె కనిపించినా కాని, అంతరంగమందు షెకీనా మహిమ దాగి యున్నది. మనము తినుచున్న మందసపు రొట్టెను అది పరిపక్వము చేయుచున్నది. దానిని పొందుకొనుటకై వందలాది మైళ్ళు కారు నడుపుకొని దేశములను దాటుచు వచ్చుచున్నాము, చూడండి, ఇది విశ్వాసుల ఆహారము. ఇది విశ్వాసులకు మాత్రమే. ఈ సముఖపు రొట్టె విశ్వాసికి మాత్రమే చూడండి. అది పరిపక్వము చెందిన సముఖపు రొట్టె. గమనించండి, అదేమి చేయును? ఆ సముఖపు రొట్టెమీదనున్న షెకీనా మహిమ దానిని పాడవకుండా కాపాడును.
168మరువకండి, పరలోకము నుండి పడిన మన్నా షెకీనా మహిమ వలన ఒక తరము నుండి మరో తరమునకు దాచబడినది. బయట ఉంచితే ఒక్క రాత్రిలోనే పురుగులు పట్టినది, చెడిపోయినది. అది నిజమేనా?
షెకీనా మహిమకు బయటనున్నవారు "అద్భుతములు జరుగు దినాలు అయిపోయినవి, అదంతా మన పిచ్చి అందురు."
169కాని లోపలి ప్రక్కన, చూడండి. ఐగుప్తులోని ధాన్యాగారము నుండి వారు కొన్ని ప్రొద్దు తిరుగుడు గింజలను తీసుకొని, దాదాపు నాలుగు వేల సంవత్సరముల క్రితము యేసేపు దినములలో అది వేయబడినది. యేసేపు దానిని ధాన్యపు గాదెలో ఉంచెను. దానిని వారు నాటిరి, దానివలన వారు జీవించిరి. ఎందుకు? వారికి జీవము దొరికెను.
170ఈ షెకీనా మహిమ నేడు ఏమైయున్నది? తెరకు వెనుక దాగియుండి ఎవరిని చూచుటకు, మీ ముందు దేవుడు నిలబడియుండుటయా, ఎవరిని చూచుటకు, మన ముందు నిలబడియున్న దేవుడినా? అగ్నిస్తంభమును. ఆయన మానవ శరీరమనే తెరయందు మరుగుపరచియున్నాడు. కాని ఆ షెకీనా ఏమి చేయుచున్నది? అది ఏమిచేయుచున్నది? సముఖపు రొట్టె భీజము, నేటి దినమునకై మనము జీవించు వాక్యమై, ఈ వాగ్దానముల వలన షెకీనా మహిమ ఆ సముఖపు రొట్టెను పరిపక్వపరచి, అది నెరవేర్పునకు తీసుకొని వచ్చి, విశ్వాసికి అది దానిని రొట్టెగా మార్చి, నేటి ఘడియకు చెందిన వాక్యముగా ప్రతీ సంవత్సరము అది పరిశుద్ధ గ్రంథపు పుటలలో యుంచబడినది.
శాఖలకు అది అడ్డుబండగా యున్నది. శాఖల వారు దానిని చూచి బోర్లపడుచున్నారు. లూథర్, వెస్లీ, మార్టిన్ లూథర్, సాంకీ, ఫిన్నీ, జాన్స్మిత్, నాక్స్ మొదలగు వారందరు దానిని చూచి పడిపోయిరి.
MAL 4:5
171కాని చివరి దినములలో అది ఏమి చేయును? అది దేనిని ప్రత్యక్షపరచును? "వెలుపలికి తీసుకొని రావలసియున్నది." మలాకీ 4 ఏమి చేయును? ప్రజలను అడ్డు బండ నుండి తప్పించి, ఆచారములను బ్రద్దలుచేసి, షెకీనా మహిమతో ఆహారమును బయలుపరచును. ఓ, ఈ ఘడియకు చెందిన సముఖపు రొట్టె, పరిపక్వము చెంది అది ఏమి చేయునని పలుకబడియున్నదో, సరిగ్గా అది ఖచ్చితముగా దానినే చేయుచున్నది, గమనించండి. శాఖలకు అది అడ్డుబండయే, వారికి ఒక పిచ్చి గుంపుగా కనబడును. కాని మనము ఆయనను నమ్ముచున్నాము.
MATT 11:25•
LUKE 10:21•
REV 10:7
172కాని ఇప్పుడు ప్రకటన 10 వాగ్దానము చూడండి. ''ఇంతకాలము ఆ పేజీలలో మరుగుగా నుండిన దేవుని వాగ్దానములన్నియు పరిపక్వము చెంది ఏడవ దూత వర్తమానము సమయములో వెలుపలికి తీసుకొని రాబడును." అది నిజమేనా? "సంవత్సరమున్నర లేదా రెండు సంవత్సరముల క్రితం ఆయన చెప్పినది ఏమిటి" ''టుసాన్ వెళ్ళుము. టుసాన్‌కు ఉత్తరాన ఒక పెద్ద ప్రేలుడు జరుగును," పిదప ఏమి సంభవించును? ''ముద్రలు విప్పబడును.'' ఈ సంగతులన్నింటిని ముద్రలు బయలుపరచును. ఆయన చెప్పినట్లే తిరిగి వచ్చాను. అది ఏమిటి అది? అది మానవుడు కాదని అది చూపించుచున్నది. అది సంపూర్ణముగా అలాగే యున్నది. ఎంత సరిగ్గా అదియుండవలెనో ప్రతీసారి అది అదే విధముగానే యుండెను. అది ఏమిటది? చూడండి, అది మన ఎదుటయున్న దేవుని హస్తముగా యున్నది. అది ఒక చిన్న గుంపైన మానవ శరీరమందు ఒక తెరగా యున్న యెడల అది బయట ప్రపంచమునకు ఒక తెరగానే యుండును. బయట ప్రపంచమునకు ఆయన తనను మరుగుపరచుకొని, నేర్చుకొను పసిపిల్లలవంటి వారికి ఆయన తననుతాను బయలుపరచుకొనుచున్నాడు. చూచారా? అది నిజము.
MATT 4:3•
MATT 26:68•
MATT 27:42•
MARK 14:65•
MARK 15:30•
LUKE 4:3•
JOHN 10:37
173ఇక్కడ మన యెదుట పరిశుద్ధ గ్రంథములోని ప్రతి మాదిరి, పరిశుద్ధ గ్రంథములోని ప్రతి ఉపమానము ప్రత్యక్షపరచబడినది. అగ్నిస్తంభములో నుండి పాత, క్రొత్త నిబంధనలను వ్రాసిన అదే దేవుడు ఇచ్చట దానిని బయలుపరచుచు, సరిగ్గా అది ఏమిటనే దానిని చూపించుచు అట్లే మరల దానిని అనువాదించుచు, అదియే అనువాదమని రుజువు పరచుటకై అట్లు చేయుచుండెను.
''అనువాదము మా యొద్ద యున్నది!'' అట్లైనయెడల అది సంభవించుటను మేము చూడవలెను. చూడండి, ఇదే విషయము, అది బయలుపడుటను మేము చూడవలెను.
ప్రత్యక్షత! యేసు చెప్పెను, ''నా తండ్రి క్రియలు నేను చేయనియెడల నన్ను నమ్మకుడి.'' చూడండి, కాని ఇప్పుడు యేసు వలె అది రుజువు చేయబడలేదు.
వారు యేసు కండ్లకు గంతకట్టి తల మీద కొట్టుచూ, ''నీవు ప్రవక్తవైన యెడల నిన్ను ఎవరు కొట్టిరో చెప్పుమనిరి.'' ''నీవు దేవుని కుమారునివైతే ఈ రాళ్ళను రొట్టెలుగా మార్చు'' అని అపవాది పలికెను. ''నీవు దేవుని కుమారునివైతే క్రిందికి దూకుమనిరి.''
MATT 24:35•
MARK 13:31•
LUKE 21:33•
HEB 13:8•
REV 10:7•
REV 19:11,13,14
174నేను చెప్పుచున్న భావమేమనగా ఆయన చేయబోవు ప్రత్యక్షత గూర్చి, అది అదే అయి యున్నది.
కాని ఇప్పుడు ప్రకటన 10వ అధ్యాయము బయలు పరచబడుటవలన ఏడు ముద్రల పుస్తకము వాగ్దానము చేయబడినట్లుగానే దేవుని మర్మములు బయలు పరచబడినది, అది ఎరుగునట్లుగా చేయబడినది.
ఇప్పుడు వాక్యమగు ఆయనలో మీ విశ్వాసము యుంచండి. ఎందుకనగా ప్రకటన 10వ అధ్యాయములో చెప్పుచున్నదేమనగా వాక్యమైయున్న ఆయన యందు మీరు విశ్వాసముంచుడి. ప్రకటన 19 ఇట్లు చెప్పుచున్నది. ఆయన తెల్లని గుఱ్ఱమును ఎక్కి వచ్చుచుండగా, పరలోకపు అనుచరులు ఆయనను వెంబడించుచుండగా, ఆయన వచ్చునప్పుడు ''దేవుని యొక్క వాక్యము'' అని ఆయనను పిలుచుదురు.
విద్య అను శాఖా ముసుగును చీల్చివేయండి. ఆచారముయను శాఖా ముసుగును చించండి. మిమ్మును ఆయనకు మరుగుచేయుచున్న తెరలను చించివేయండి. స్త్రీలారా, గర్వముయను మీ ముసుగును చించివేయండి. మీరు రాజ కుమార్తెలు, ఆ రీతిగా ప్రవర్తించండి, అలాగు జీవించండి. ప్రతి ముసుగును బ్రద్దలు చేయండి. పి.హెచ్.డి, ఎల్.ఎల్.డి చెప్పుచున్నది కాదు. పరిశుద్ధ గ్రంథమునకు విరోధమైనదైతే ఆ ముసుగును చీల్చివేయండి. ఎందుకనగా మనము ఆ ముసుగును దాటియున్నాము. మనము అవతల దరికి చేరియున్నాము. ఇప్పుడు మనము అవతల దరియందు యున్నాము. మీరు దానిని చేసి, ఆ పాత ఆచారముల మరియు తదితర కార్యములను పడగొట్టి ఆయన యొద్దకు వచ్చిన యెడల శక్తిమంతుడగు వాడును, జయశీలియైన వాడును, ఈ కాలము వాగ్దానము యొక్క వాక్యమైనవాడును నిలిచియుండి దానిని ప్రత్యక్షపరచుటను మీరు చూచెదరు. శక్తిమంతుగడు దేవుడు తెరను తొలగించబడి యుండుటను మీరు చూచెదరు. ఆచారముల వలన జయించలేని శక్తిమంతుడగు దేవుని ఇచ్చట మనమధ్య ఇప్పుడు తెర తొలగించబడినవాడై సామాన్యముగా ఆయనను చూచుచున్నాము.
MATT 11:18•
JOHN 7:20•
JOHN 8:48,52•
JOHN 10:20•
HEB 13:8
175వారాయనను ఆ వెనుక దాచ ప్రయత్నించిరి. చాలా సంవత్సరములు అలాగు చేసిరి, కాని వాగ్దానము కాలము దగ్గర పడినది. దేవుడు ఒక కాలములో మోషేను లేపి ఈ కార్యములలోనుండిఅతడు జనులను విడిపించెను. ఆయన ఇంకా కూడా దానిని చేయుచుండెను. ఆయనను జయించలేరు. ''భూమ్యాకాశములు గతించును గాని నా మాటలే మాత్రమును గతించవు.'' ఆయన నిన్న, నేడు, నిరంతరము ఏకరీతిగా యున్నాడు.
''దానిని చెయ్యలేము'' అని వారనుచున్నారు. కాని అది చేయబడినది. పిదప, దానిని ఎప్పుడు చేసారు, అట్లైన ''అది దయ్యము వలన జరిగినది'' అని వారనుచున్నారు.
కాని అది దేవుని వాక్యమును ఏ మాత్రము మార్చజాలదు. అది ఇంకా కూడా దేవునిగానే యున్నది. విశ్వాసికి ఆయన యొక్క స్వభావములోను, ఆయన వాక్యములోను; ''ఆయన శక్తిమంతుడగు జయశీలిగాను మరియు నిన్న, నేడు, నిరంతరము మారనివాడుగాను,'' హెబ్రీయులు 13:8 గాయున్నాడు.
176అయిదు నిమిషాల తక్కువ పన్నెండు అయినది. ముగించవలెను. ఇంకా పండ్రెండు పేజీలున్నవి. వీలయితే ఈ రాత్రికి చెప్పెదను.
దీనిని గమనించండి, ఒకసారి ఒక పాత ఫిడేలును వేలము వేయుచుండిరి. దీనిని మీరు చాలాసార్లు వినియుందురు. ఇది చాలా సంవత్సరముల క్రిందటిది. నా మనస్సుకు తట్టినది. నేను తప్పు చెప్పవచ్చును. ఆ పాత వీణె చాలా మోటుగాను, అసహ్యముగాను కనబడినది. దానినెవరూ పాడేవారు లేకపోయిరి. చివరకు ఒక వ్యక్తి ఒక డాలరుకు అడిగెను.
177అంతకు కూడా దానిని కొనువారుండరని తలచిరి, అయితే అక్కడ నిలబడి యుండెను; అది వెలకు అమ్మకూడదని అతడు అనుకొనెను, అందుచే అతడు దానిని చేతిలోకి తీసుకొనెను. అతడు చేతిలో దానిని చక్కగా పట్టుకొని దానిమీద ఒక రాగమును వాయించెను. అతడు దానిని వాయించుచుండగా అందరూ ఏడ్వనారంభించిరి. వారి జీవితములలో ఎన్నడును అటువంటి సంగీతమును వినలేదు.
అంతట ఆ వేలము వేయువాడు, ''దీనికి ఎంత ఖరీదు యివ్వగలరు?'' అనడిగెను.
''రెండు వేలు'' ''అయిదు వేలు'' ''పదివేలు'' చూచారా? ఏమిటది? ఆ పాత వాయిద్యములో దాగియున్నదానిని నిపుణుని చేయి బయట పెట్టెను.
ఇప్పుడును అలాగేయున్నది! పాత గ్రంథము, నలిగిన గ్రంథము, చూచి అందరూ నవ్విరి, కాల్చివేసిరి, హేళన చేసిరి. శాఖలు వేలము వేయు సమయము వచ్చెను. ప్రపంచ సంఘముల సమితి దానిని తమకు పట్టనట్టుగా అమ్ముచున్నారు. ఒక శాఖా సంబంధమగు వేలము వచ్చుచున్నది.
178కాని గుర్తుంచుకొనండి, ఆ పాత గ్రంథములో వాగ్దానము చేయబడినది ఒకటున్నది. ఒక దినమున ముందు నిర్ణయించబడిన, అభిషేకించబడిన హస్తము వచ్చునని వాగ్దానము చేయబడినది. అది ఈ గ్రంథములోని వాక్యమును తీసుకొని అది ఏ ఘడియ కొరకు నియమింపబడినదో ఆ క్రియను అది చేసి, దానిలోయున్న వాగ్దానములను ఒక ముందుగా నిర్ణయించబడిన హృదయము ద్వారా బయలుపరచును. కొందరికి వీరు హేళనగా కనబడవచ్చును, పరిశుద్ధుల గుంపు అని ఎగతాళి చేయుదురు; కాని ఆ వాక్యమును ప్రత్యక్షపరచవలెననిన యెడల ఒక యజమానుని యొక్క హస్తము ఆవాక్యము పైకి రావలెను. అది పరిశుద్ధ దొర్లు అనే దానికంటే శ్రేష్టమైనదిగా యగును. అది మన ప్రతి ఒక్కరికి చెందును. స్నేహితులారా, నిజము కాదా? ఇది మత మౌఢ్యము కాదు. అది ఆ వాయించే వాద్యము. ఎవరి చేతిలో యున్నదో దానిమీదనే ఇది అధారపడియుండును.
ప్రార్ధించుదుము.
MATT 13:46•
HEB 13:8
179మా పరమతండ్రీ, నేడు ఆ పాత గ్రంథపు యజమానిని విశ్వాసము ద్వారా చూచుచున్నాను. వారి ఆచారముల కొరకు దాని సారాంశమును మార్చుకొనిరి, శాఖల కొరకు వారు దాని సారాంశమును మార్చివేసిరి. వారు దానిని ఖరీదు కట్టుటకై ప్రయత్నించిరి. ఇప్పుడు దానిని వారు ప్రపంచ సంఘముల సమితి, కమ్యూనిజము, నాస్తికత్వము యొద్ద ఖరీదు కట్టిరి. ప్రభువా, వేలము ఇప్పుడు జరుగుచున్నది.
దేవా, ముందడుగు పెట్టుము! నిశ్చయంగా నీవు వచ్చెదవు. ప్రభువా, ఆ వాయిద్యమును వాయించుటకును, ఆ వాక్యమును బయలుపరచుటకును, యేసు క్రీస్తు నిన్న, నేడు, నిరంతరము ఏకరీతిగా యున్నాడని నిరూపించతగును ఆ ప్రవక్తను మా కొరకు పంపుము. ప్రభువా, చాలామంది తమ జీవితములను అమ్మివేయుచున్నారు, వారు వారి పాత ఆచారములను పారద్రోలుచున్నారు, తెరలను చీల్చివేయుదురు, ప్రభువా, దానిని వారు కోరుచున్నారు. వారు యేసు కావలెనని కోరుచున్నారు. అందుకై ఏమైనా చేసెదరు.
ప్రభువా, ఇప్పుడు దానిని వారికి రుజువు చేసితివని నేను తలంచుచున్నాను. అన్నిచోట్ల నుండి జనులు వచ్చిరి. కూటమునకు వచ్చుటకై వారు తమ జీవనాధారమును, కలిగిన సమస్తమును ఖర్చు చేసుకొనిరి, ఎందుకనగా ఈ గొప్ప వెలగల ముత్యమును కనుగొనుటకు వారు చేయకలిగినదంతయూ చేసిరి. తక్కినవి వారికి అల్పముగా కనబడెను. తండ్రీ, వీరిని ఆశీర్వదించుము.
180ప్రభువా, ఈ ఉదయమున వేదిక మీద చేతి గుడ్డలుంచబడినవి. ఈ రాత్రి స్వస్థతా కూటమునకు ముందే వారు కొందరు వెళ్ళిపోవుదురు. ఓ, నిత్యుడవగు దేవా, క్రిందయున్న వారిని చూడుము. నీవు ఇక్కడ ఉన్నావని నాకు తెలియును. నీవు ముసుగు వేసికొన్నావు. దేవా, ఈ జేబు రుమాళ్ళను చిన్న ''ముసుగులను'' నేను పంపుచున్నాను. చిన్నపిల్లల కొరకు చిన్న ''పాదరక్షలు'' ''చేతి రుమాళ్ళు'' పంపుచున్నాను. నీ వాక్యము నేటి ఉదయమున ఇచ్చట బోధించబడినదనుటకు గురుతుగా ఈ చిన్న తెరయను గురుతులను నేను పంపుచున్నాను. ఒక విశ్వాసి అనే రీతిగా నేను నమ్ముచున్నాననుటకు హేతువుగా నా శరీరపు హస్తములను వాటిమీద ఉంచుచున్నాను. ప్రభువా, విశ్వాసమును బట్టి ఈ భవనములో ఉన్నవారందరూ అలాగే చేయుచున్నారు. రోగులు బాగవుదురు గాక!
181ప్రభువా, ఆ నిపుణుడు వీణెను వాయించినట్లుగా నీవును నీ వాక్యమును మీటుము, సరయిన రాగము పలికించునట్లు చేయుము. ఆ నిపుణుని చేతిలో పనిముట్టు యుండి దానిని వాయించినప్పుడు, ఆయన సంపూర్ణముగా కనబడునట్లు మనము చూచెదము.
జనులు ఆ పాత వీణె కొరకు ఏమియూ చెల్లించమనిరి, దానికి ఏమియు యివ్వకపోయిరి, ఆ జనులు ఆ దినమున ఏమని తలంచి యుందురు, వారు తమకది వద్దనిరి. దానిని వారు తన గృహములో ఉంచుకొనుటకు యిష్టపడలేదు. కాని దానిలోయున్న మాధుర్యమును తీసి చూపించుటకు ఒకరు దానిని తన చేతిలోకి తీసుకొనినప్పుడు, అప్పుడు వారు తమకున్న సమస్తమును యిచ్చివేసి దానిని కొనుటకై ముందుకు వచ్చిరి. దాని కొరకువారు అరుస్తూ మరియు ఒకరిని ఒకరు తోసుకొనుచు యుంటుండగా, కాని అప్పటికే సమయము ఎక్కువైనందున వారికది దక్కకుండా పోయినది.
MATT 12:13•
MATT 28:20•
LUKE 13:28•
JOHN 14:19•
JOHN 16:16•
REV 10:6
182ఇక సమయముండదని ప్రభువు యొక్క బూర మ్రోగుచుండగా కొన్ని సమయములలో అది ఆ విధముగానే జరుగును. దాని వైపు చూచి ఎగతాళి చేసినారు, తొలగించబడిన తెరకు ఎదురుగా నిలబడయుండగా దేవుని యొక్క వాక్యము బయలుపడుటను వారు చూచెదరు. మరి కొందరేమో అందుకొరకై కేకలు వేసెదరు; కాని ''సమయము మించిపోయినదని,'' నీవు చెప్పినట్లుగానే యుండును. వారు పెండ్లి విందులోకి ప్రవేశించిరి, మరియు అచ్చట ఏడ్పును, పండ్లు కొరుకుటయు యుండు స్ధలమందు వారు విడువబడుదురు.
తండ్రీ, ఈ ఉదయమున ప్రతివారు నమ్మునట్లుగా ప్రతీ స్వార్థమైన తెరను, ప్రతీ అవిశ్వాసమను తెరను చీల్చుకొంటూ వెళ్ళి ''విశ్వాసుల యెదుట శక్తిమంతుడైన జయశీలిని తెర తొలగించబడునట్లుగా చూచెదరు గాక! ఎందుకనగా ''ఇదిగో, యుగ సమాప్తి పర్యంతము సదాకాలము నన్ను చూడరు, అయినను మీరు నన్ను చూచెదరు.'' ప్రభువా, ఎప్పటివలెనె నిన్నునీవు మాకు కనుపరచుకొనుము. నీ ఎదుట దృశ్యముగా మేము కనబడు వరకు అలాగే ప్రత్యక్షత ఇమ్ము. ఆ వేషమును మార్చుకొను ఎన్‌మార్ఫే గా మార్చబడి నీవు మరల మనుష్యకుమారునిగాను, దావీదు కుమారునిగాను కనబడుదువు. ప్రభువా, యేసుక్రీస్తు నామము ద్వారా దీనిని అనుగ్రహించుము.
అందరము ప్రార్ధనకు తలలు వంచుదుము.
183చాలామంది బయట, లోపట ఉన్నారు. వేదిక పిలుపు ఇచ్చుటకు స్ధలము లేదు. ఇది సత్యమని యధార్థముగా మీరు నమ్ముచున్నారా? నోవహు దినములవలె, మోషే దినములవలె మరియు యేసుక్రీస్తు దినములవలె గందరగోళము నిండిన ఈ విజ్ఞాన దినములలో మనయందరికి తండ్రియగు దేవుడు, ఆయనలో మనము జన్మించియున్నామని, ఆయన నేడు మన మధ్యలో యున్నాడనే దానిని మీరు మనము జీవించుచున్న ఈ దినమలో నమ్ముచున్నారా?
184ఈ దృశ్యమగు అగ్నిస్తంభము శాస్త్రీయంగా రుజువైనది. నేను చాలా సంవత్సరముల క్రితము చిన్న బాలునిగా ఉన్నప్పుడు ఆయన నాతో మాట్లాడెను, ఏమి జరుగునో ఆయన చెప్పెను, ఇక్కడ జీవించెదనని చెప్పెను, దానిగూర్చి మీకు చెప్పాను. ఈ సేవారంభమునకు ముందు, నదియొద్ద మొదటి ఉజ్జీవము వచ్చెను, ఆయన ఆకాశములో ప్రత్యక్షమై, ఆయన తనను తాను ఆనవాలుగా చూపించుకొని, ఆజ్ఞను యిచ్చెను. దీనిని నేను ఇన్ని సంవత్సరములు హృదయములో దాచుకొని, క్రీస్తును తెరయందు మరుగుపరచి, అదే అగ్నిస్తంభము వాగ్దానము చేసినట్లుగానే వాక్యమునకు అనువాదము చెప్పినది. మనము అంత్య దినములలో యున్నాము, ప్రభువు రాక మాత్రమే మిగిలియున్నది. నీవు ఆ తెరకు బయట ఉన్నట్లు తలంచినచో, బయట ఉండుట మరణము, విశ్వాసము ద్వారా ఈ ఉదయమే ఇట్లు చెప్పుము, ''ప్రభువా, నీ సహాయమును బట్టి ఈ తెరను చింపి రాగోరుచున్నాను. నీవున్న చోటికి రాగోరుచున్నాను, దేవునియొక్క సంపూర్ణ వాక్యమును చూడగోరుచున్నాను.''
185ఒక మోషెవలె నుండుటకు ప్రయత్నించవద్దు, ఒక ఆహరోనువలె నుండ ప్రయత్నించవద్దు. నీవేమై యున్నావో అలాగే యుండుము. క్రైస్తవునిగా ఉండుము.
మీరు తలలు వంచి, దేవుని వైపు చేతులెత్తి ఇట్లు చెప్పండి, ''ప్రభువగు దేవా, ఆ తెర లోపలకు వచ్చుటకు నాకు సహాయము చేయుము.'' దేవుడు నిన్ను దీవించును, దేవుడు మిమ్ము దీవించును. అదియే మంచిది.
వెలుపలనున్నవారు జ్ఞాపకము ఉంచుకొనండి, మీ చేతులను బహుశా నేను చూడకపోవచ్చును. నేను చూచుట వలన ఏమీ లాభము లేదు. దేవుడు దానిని చూడవలెను. విత్తనము పడినదని నాకు అర్ధమగుచున్నది… కాని దేవుడు యధార్ధమైన హృదయమును చూచుచున్నాడు.
చేతులను ఎత్తకుండా ఎవరైనా అచ్చట యున్నయెడల, ఇప్పుడు జ్ఞాపకము చేసుకొనుటకు ఇష్టపడినయెడల మీ చేతులను పైకెత్తుడి, మీ చేతులను పైకెత్తుడి. దేవుడు మిమ్మును దీవించును గాక! అది మంచిది! దేవుడు మిమ్మును దీవించును గాక!
186తండ్రీ, ఇంకా ఆ తెరగుండా వెళ్ళని నేడు వీరి కొరకు ప్రార్ధించుచున్నాము. ప్రభువా, ఇంకా ఆ తెరగుండా వెళ్ళని వారు ఇశ్రాయేలియులవలె కనిపెట్టి చూచుచున్నారు, వారు నమ్మిరి, కాని వారు ఇంకా దీనిని చీల్చుకొంటూ వెళ్ళి, ఆ గొప్ప షెకీనా మహిమను ఆత్మ సంబంధముగాను, శారీరిక సంబంధముగాను చూడలేదు. కెమెరా యొక్క యాంత్రిక కన్ను ఎంతో గొప్పగా ఆ పటమును తీయుచునేయున్నది, రెండు వారముల క్రితము అది మరలా పటముగా రాయబడినది. రెండు వారముల క్రితమే మరల ఆ పటము తీసినది. ప్రభువా, నిన్నునీవు బయలుపరచు కొనుచున్నావు. మహిమగల దేవుడు విశ్వాసికి తెర తొలగించబడి యున్నాడు. అవిశ్వాసి ఇంకా కూడా తెర వెనుక మరుగుగానే యున్నాడు, కాని విశ్వాసికి తెర తొలగించబడిన దేవుడుగా యున్నాడు. నేడు వారు బ్రద్దలు చేసుకొంటూ వెళ్ళుచూ, ప్రభువా, వారు ఆయన గొప్ప మహిమను, ప్రభావమును చూచెదరు గాక! ఈ రాత్రి మేము ఈ సంఘమునకు రాక ముందే వారి హృదయములు మారును గాక! వారికున్న విశ్వాసమును యజమానుడు చూచి వాక్యముతో వారిని తాకును గాక! ''దీనిని నమ్ముటకు జగత్తు పునాది వేయబడుటకు మునుపే నీవు నియమించితివి. నా బిడ్డా, నమ్మి రక్షణ పొందుము!" అను రాగము పలుకును గాక!
187తండ్రియగు దేవా, ఇప్పుడు వీరిని నీ చేతులకు అప్పగించుచున్నాను. ఇంతకంటే మేము ఏమియూ చేయలేమని గ్రహించి దీనిని చేయుచున్నాము. తండ్రీ, ఇక అంతా నీదే. వీరిని నీకు ఇచ్చుచున్నాను. యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాము. ఆమేన్'
నేనాయనను ప్రేమించెదను, ప్రేమించెదను
ఏలాగనగా ఆయనే మొదట నన్ను ప్రేమించెను
నా రక్షణను కల్వరి మ్రాను మీద కొనెను.
మీరాయనను ప్రేమించుచున్నారా?
యేసు నాకు అద్భుతమైన వాడు, అద్భుతమైన వాడు.
ఆలోచన కర్త, సమాధానాధిపతి, బలవంతుడగు దేవుడు.
సమస్త పాపము మరియు అవమానము నుండి నన్ను రక్షించెను,
నా విమోచకుడు అద్భుతమైనవాడు, ఆయన నామమునకు స్తోత్రము!
ఒకప్పుడు నేను నశించితిని, ఇప్పుడు రక్షించబడితిని.
శిక్షనుండి విడిపించబడితిని.
యేసు స్వేచ్ఛను, సంపూర్ణ రక్షణను ఇచ్చును.
సమస్త పాపము, మరియు అవమానముల నుండి ఆయన రక్షించెను.
నా విమోచకుడు అద్భుతమైన వాడు, ఆయన నామమునకు స్తోత్రము.
ఓ! యేసు నాకు, అద్భుతమైన వాడు, అద్భుతమైన వాడు.
ఆలోచన కర్త, సమాధానాధిపతి, బలవంతుడగు దేవుడు,
సమస్త పాపము, అవమానము నుండి నన్ను రక్షించెను.
నా విమోచకుడు అద్భుతమైనవాడు. ఆయన నామమునకు ప్తోత్రము!
JOHN 1:14•
REV 1:8•
REV 22:16
188ఆయన గొప్ప జయశీలిగా, శరీరధారియైన వాక్యముగా మనముందు తెర తొలగించబడినవాడును అల్ఫా, ఓమేగా గా, భూత - భవిష్యత్ - వర్తమాన కాలములలో ఉన్నవానిగా, దావీదు యొక్క వేరు మరియు చిగురుగా, మనుష్య కుమారునిగా, దావీదు కుమారునిగా నిలబడియుండుట ఎందరు చూచుచున్నారు? దానిని మీ పూర్ణ హృదయముతో మీరు నమ్ముదురా? ప్రతి యుగములోను ఆయన తనయొక్క తెరను తొలగించుకొని విశ్వాసికి కనబరచుకొనుచుండెను, అవిశ్వాసికి శరీరమనే తెరయందు ఆయన తనను మరుగుచేసుకొనుచుండెను. ఆయన తెర వెనుకన దాగియున్నాడు. దేవుడు ప్రతి తెరను చీల్చివేయగా అయనను ఉన్న రీతిగా చూతుము గాక!
ప్రతి సంకెళ్ళను యేసు బ్రద్దలు చేయును,
ప్రతి సంకెళ్ళను యేసు బ్రద్దలు చేయును,
ఓ! యేసూ, సంకెళ్ళను బ్రద్దలు చేయును,
ఆయనే నిన్ను స్వతంత్రునిగా చేయును!
యోర్దానుకు ఆవల వైపు,
ఏదెను మధుర పొలములలో
జీవ వృక్షము పుష్పించుచున్నది,
నా కొరకు అక్కడ విశ్రాంతి యున్నది.
ఇప్పుడు యోర్దానును మీరు దాటగోరుచున్నారా? ఎంతో కాలము అరణ్యములో ఉన్నాము. మనము వాగ్దానములలోనికి వెళ్ళుదము గాక!
యేసు ప్రతి బంధకమును తెంచివేయును,
యేసు ప్రతి బంధకమును తెంచివేయును,
ఓ! ఆయన నిన్ను స్వతంత్రునిగా చేయును.
ఇప్పుడు మన చేతులు ఎత్తుదము:
నేను సదా ఆయనను స్తుతించెదను,
నేను సదా ఆయనను స్తుతించెదను,
నేను సదా ఆయనను స్తుతించెదను.
ఆయన నన్ను స్వతంత్రునిగా చేయును! (ఆమెన్!)
189ఆమేన్! ఇది మీకు మంచి అనుభూతిని యిచ్చుట లేదా! ఓ! ఎంత అద్భుతము! ఎంత అద్భుతము అవును గదా? ఒకరితో ఒకరము కరచాలనము చేయూచూ ఈలాగు చెప్పుదము:
యేసు ప్రతి బంధకమును బ్రద్దలు చేయును,
యేసు ప్రతి బంధకమును బ్రద్దలు చేయును,
ఓ! యేసు ప్రతి బంధకమును బ్రద్దలు చేయును
(సహోదరుడా, దేవుడు నిన్ను దీవించును గాక!)
ఓ! ఆయన నిన్ను స్వతంత్రునిగా చేయును!
నేను… సదా ఆయనను స్తుతించెదను.
(బలవంతుడగు దేవుడు)
నేను…
''నిన్న, నేడు, నిరంతరము ఏకరీతిగా యున్నాడు.'' రూపము మాత్రమే మారెను)
ఆయనను స్తుతించెదను, నేను సదా ఆయనను స్తుతించెదను,
ఆయన నాలోని ప్రతి ఆచారమును ఆయన తీసివేసెను,
నన్ను ఆయన వాక్యమును నమ్మునట్లు చేసెను.
190ఓ! ప్రతిభావంతుడగు వీణె వినబడుచున్నదా? వాక్యము వైపులాగుచున్నది. ఆయన నిన్న, నేడు ఏకరీతిగా యున్నాడు!
నేను సదా ఆయనను స్తుతించెదను,
నేను సదా ఆయనను స్తుతించెదను,
నేను… (ఆయనే వాక్యము!)
సదా స్తుతించెదను …
(ఆయనేమి చేసెను?) ఆయన
(తెర వెనుక) నన్ను స్వతంత్రునిగా చేసెను.
దేవునికి మహిమ! నేనాయనను ప్రేమించుచున్నాను, మీరాయనను ప్రేమించుట లేదా? ఇది పరలోకము కాదా? నాకు ఆ వాక్యము యొక్క గుణాలక్షణములు నచ్చినవి, చూడండి. ఆ పరిశుద్దత్మ మాధుర్యముగా, దీపముగా ఉన్నది. నాకు అది ఇష్టము. ఓ! కాస్త ఆలోచించండి!
యోర్దానుకు అవతల వైపు
(ఇప్పుడు నేను దానిని సమీపించుచున్నాను)
మాధుర్యమైన అమర్త్యమైన ఏదేనులో
(అచ్చట నేనేమి కనుగొనెదను!)
పుష్పించుచున్న చెట్టును, …
(అది ఏదెను తోటలో యున్నది)
అక్కడ విశ్రాంతి యున్నది.
మీరు వెళ్ళాలని ఆశించుచున్నారా?
ఆయన ప్రతిబంధకమును పడగొట్టును.
యేసు ప్రతి బంధకమును కూలద్రోయును (ప్రతి ఆచారమును)
యేసు ప్రతిబంధకమును కూలద్రోయును
(అన్ని శాఖలు మరియు సమస్త సిద్ధాంతములను),
ప్రతి బంధకమును కూలద్రోయును.
ఓ! ఆయన నిన్ను స్వతంత్రునిగా చేయును!
ISA 9:6
191దేవునికి స్తోత్రము! నేనాయనను ప్రేమించుచన్నాను. యెషయా ఈలాగు చెప్పుటలో ఆశ్చర్యము లేదు. ''ఆయన ఆలోచన కర్త, సమాధానాధిపతి, బలవంతుడగు దేవుడు, నిత్యుడగు తండ్రి, అద్భుతమగు దేవుడు.''
యేసు నాకు అద్భుతమగువాడు, అద్భుతమగువాడు,
ఆలోచన కర్త సమాధానాధిపతి, బలవంతుడగు దేవుడు,
ఓ, నన్ను సమస్త పాపము మరియు అనుమానము నుండి రక్షించెను
నా విమోచకుడు అద్భుతమగువాడు, ఆయన నామమునకు స్తోత్రము!
ఓ! అది నా హృదయమును సంతోషించుచున్నది. ఆయనెంత అద్భుతమైన వాడు! దీనికి అంతము లేదని నేను మీతో చెప్పుచున్నాను, దీనిలోనికి నేను వచ్చి ముప్పది మూడు సంవత్సరములయినది, ఈ విధముగా ఉన్నాను, ఆయన ఆలస్యము చేసినట్లయితే ఒక దినమందు నేను కండ్లు మూసెదను. అదే మార్గములో నేను అవతల గట్టుకు వెళ్ళిపోయెదను. ఆమేన్!
యేసు నాకు అద్భుతమైనవాడు, అద్భుతమైనవాడు,
ఆయన ఆలోచనకర్త, సమాధానాధిపతి, బలవంతుడగు దేవుడు;
సమస్త పాపము నుండి, అవమానము నుండి ఆయన నన్ను రక్షించెను,
నా విమోచకుడు అద్భుతమైనవాడు, ఆయన నామమునకు స్తుతి చెల్లును గాక!
JOHN 4:23•
1COR 14:15•
HEB 13:8
192దినమంతా నేను దీనిని చెప్పగలను. ''నేను పాడితే ఆత్మతోనే పాడుదును. నేను బోధించితే ఆత్మతోనే బోధించెదను. నేను నడచినయెడల ఆత్మలోనే నడిచెదను. నేను మాట్లాడినచో ఆత్మతోనే మాట్లాడెదను,'' అని పౌలు చెప్పెను. సమస్తము వాక్యము మరియు ఆత్మ ద్వారా జరుగనీయుడి. అవును. ఆమేన్! ఇదంతయూ దేవుని సత్యము.
తెర తొలగించబడి బలవంతుడగు దేవునిగా నేను ఆయనను చూచుచున్నాను. మత ఆచారములు, శాఖలు, విధ్యా కార్యక్రమములు, ఆలోచనలు సమస్తమును ఆయన వెనుకకు నెట్టివేసి ముందుకు వచ్చి నిలబడి యుండుటకు నేను చూచుచున్నాను. సిద్ధాంతముల ద్వారా ఆయనను జయించవచ్చునని నీవు తలంచుచున్నావా? శాఖలు ఆయనను జయించగలవని తలంచుచున్నావా? ప్రపంచ సమితి ఆయనను జయించగలదని తలంచుచున్నావా? ఆయన సమస్తమును జయించి, ప్రతిబంధకమును పడగొట్టి, పాతాళమును పాతిపెట్టి, ముద్రలను చీల్చివేసి, అతి పరిశుద్ధ స్థలములోనికి ప్రవేశించెను. వాక్యమైయున్న ఆయన నిన్న, నేడు, నిరంతరము ఏకరీతిగా యుండి, తెర తొలగించబడిన వాడుగా మనకు ఆయనను కనబరచుకొనెను. ఆమేన్. నేనాయనను ప్రేమించెదను.
193ఈ మధ్యాహ్నము తిరిగి మనము కలిసికొను వరకు ఒక్కటి మనము చేయవలెను.
యేసు నామమును నీతో కొనిపొమ్ము,
దు:ఖము, వేదన కలిగిన ఓ బిడ్డా!
అది నీకు ఆనందము, ఆదరణ ఇచ్చును.
ఓ! దీనిని నీవు వెళ్ళు ప్రతి చోటికి కొనిపొమ్ము.
ప్రశస్త నామము, ఓ ఎంత మధురము!
భూలోక నిరీక్షణ, పరలోక ఆనందము
ప్రశస్త నామము, ఓ! ఎంత మధురము!
భూలోక నిరీక్షణ, పరలోక ఆనందము …..
నీవు ఒక సరియైన విషయము వైపు చూడలేదని, సాతాను నిన్ను శోధించ ప్రయత్నించినప్పుడు యేసువలె వాక్యము వైపుకు చూపించుము. చూచారా? ఆమేన్!
యేసు నామములో వంగును,
ఆయన పాదముల యొద్ద సాష్టాంగపడును,
రాజాధిరాజుగా పరలోకములో
ఆయనకు కిరీటము పెట్టెదము,
మన యాత్ర ముగిసిన పిమ్మట.
ప్రశస్త నామము (ప్రశస్త నామము)
ఓ! ఎంత మధురము!
భూలోక నిరీక్షణ, పరలోక ఆనందము
ప్రశస్త నామము (ప్రశస్తము)
ఓ! ఎంత మధురము! భూలోక
నిరీక్షణ, పరలోక ఆనందము.
194బీల్లీ దాదాపు ఆరు గ౦టలకు వచ్చి ప్రార్ధనా వరుసలో రాగోరు వారికి ప్రార్ధన కార్డులు ఇచ్చును. దానిని చేయుట మంచిదని తలంచుచున్నాను. గుంపుగా నున్నాము. గనుక మనము ఆ పని చేయుట మంచిది, చూచారా.
ఇప్పుడు, ఆయనను జ్ఞాపకముంచుకోండి! ఎల్లప్పుడూ మీ మనస్సులలో మీ హృదయములలో ఆయనను తలంచుచూ యుండండి; మీరెచ్చటికి వెళ్ళినను యేసును మీ మనస్సులలో యుంచుకొని తలంచుచూ యుండండి.
యేసు నామమును తీసికొని పొండి (వినండి),
ప్రతి బంధకము నుండి రక్షణ.
(ఏమి జరుగును?)
నిన్ను శోధనలు చుట్టుముట్టినప్పుడు,
(నీవేమి చేసెదవు?)
ఆ పరిశుద్ధ నామమును ప్రార్ధనలో శ్వాసించుము.
ప్రశస్తనామము (ప్రశస్త నామము)
ఓ! ఎంత మధురము!
భూలోక నిరీక్షణ, పరలోక ఆనందము
ప్రశస్త నామము ఓ, ఎంత మధురము!
భూలోక నిరీక్షణ, పరలోక ఆనందము!
ఇప్పుడు తలలు వంచుదుము. సంఘకాపరిని వచ్చి ముగించమని కోరుచున్నాను. నెవిల్ సోదరుడా, దేవుడు నిన్ను దీవించును! నెవిల్ సోదరుడా.