వింత వ్యక్తి

వింత వ్యక్తి

1ఒక్క క్షణము లేచి నిలబడుదము. ప్రశస్త ప్రభువా, ప్రార్ధన అను మార్గము ద్వారా నీ యొక్క దైవ సన్నిధిలోనికి మరల మేము వచ్చుచున్నాము. మొదటగా నీవు మా పట్ల చేసిన సమస్తమును బట్టి వందనములు చెల్లించుచున్నాము. నీ పట్ల, నీ వాక్యము పట్ల మరియు నీ పట్ల మా హృదయములో పెట్టిన గొప్ప ప్రేమను బట్టి వందనములు. ప్రభువా, ఈ రాత్రి ఈ జనులను నా నిండు హృదయముతో ప్రేమించుచున్నాను. వారు త్యాగము చేసి వచ్చి ఈ వేడి గదిలో కూర్చొనియున్నారు, ఎందుకనగా వారు నీ వాక్యమును ప్రేమించుచున్నారు.

ప్రభువా, ఈ రాత్రి మేము రోగుల కొరకును అవసరతలో నున్నవారి కొరకును ప్రార్ధించుటకు వచ్చియున్నాము. ఈ కూటము అయిపోవుసరికి మా మధ్య ఏ ఒక్క బలహీనుడును లేకుండు గాక. ప్రభువా, వారి నమ్మకత్వమును బట్టి వారికి ప్రతిఫలము దయచేయుము. నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడి, ప్రభువా, మేము నిందను భరించ వెళ్ళుచుండగా, మమ్ము బలపరచుము. దీనిని చేయుట మాకెంతో భాగ్యము. యేసు నామమున అడుగుచున్నాము. ఆమేన్. మీరు కూర్చోవచ్చును.

2వచ్చి ఈ భవనములో కూర్చొనియుండు ఈలాటి గుంపువంటి జనులకు నా కృతజ్ఞతను వ్యక్తము చేయుటకు నాకు మాటలు దొరుకుట లేదు. మరుసటి కూటము కొరకు కాన్సాస్ లోని బొపేకా వెళ్ళనైయున్నామని నేను చెప్పగోరుచున్నాను. వచ్చే ఆదివారమునకు అది ముగియును. అక్కడ నుండి మనము ఫిలదెల్ఫియాకు వెళ్ళుదుము. మేము విదేశములకు వెళ్ళి కొన్ని జాతుల వారిని కలిసికోవలెనని తలంచుచున్నాము. అనగా కెన్యా, టాంగాన్యకా, ఉగాండా వెళ్ళుదుము. మవు మవు వారితో కొంత కల్లోలము చెలరేగుచున్నది. ఒక మిషనెరీగా నేను వెళ్ళలేనుగాని ఒక వేటగానిగా అక్కడికి ప్రవేశించవలెనని తలంచుచున్నాను. వారది సిద్ధపరచుచున్నారు…

మామూలుగా, నేను మిపనైరీగా వెళ్ళి వేటాడుచుందును, కానీ ఈసారి వేటగానిగా వెళ్ళి మిషనైరీ పనిచేయుదును, ఏలాగయినా అక్కడి వారియొద్దకు వెళ్ళవలెను. నన్ను లోనికి ప్రవేశింపచేయు పనిలో అక్కడ సహోదరుడు మాట్సన్-బోజ్ నిమగ్నమై యున్నాడు. నేను వెళ్ళి వేటాడునట్లుగా ఒక సఫారిని ఏర్పాటు చేయుచున్నాడు. నేను ఆ వన్య ప్రాణులుండు స్థలములోనికి వెళ్ళినప్పుడు, అతడు ఈలాగు తెలియచేయును, అచ్చట యుండు దౌత్య కార్యాలయమునకు వెళ్ళి, "మన సోదరుడు బ్రెన్హాం ఈ దేశములో యున్నాడు. ఇక్కడ చిన్న కూటము ఏర్పాటు చేయుట మీకిష్టమా?" అని అడుగును. చూచారా? అప్పుడు అది ఆరంభమగును. అక్కడ నుండి ఆలాగు దొర్లుతూ పోవును. దానిని మేము చేయగలమో లేదో తెలియదు. మేము ప్రయత్నించుచున్నాము. ఒకవేళ ఆలాగు జరుగకుండా ఏదయినా అడ్డము వచ్చినచో, దానిని నేను ఒక సూచనగా స్వీకరించి మరల ఈ జెఫర్సన్-విల్ కు వచ్చి, ఏడు బూరలు ప్రసంగించుదునని ప్రభువుకు చెప్పాను. జూలై లేదా ఆగష్టు ప్రాంతములో అక్కడుందును.

3ఎయిర్ కండిషన్ చేయబడిన ఈ పాఠశాల గదిని మనము సంపాదించవలెనని ప్రయత్నములు చేయుచున్నాము, ఎందుకనగా మనకు చక్కగా చాలా చల్లగా ఉండును. పదిహేను లేదా పద్దెనిమిది వందల మంది జనులు కూర్చొనుటకు సరిపోవును. అది ఎయిర్ కండిషను చేయబడినది. చాలా క్రొత్త స్థలము. దీనికంటే దాదాపు అయిదు చతురస్రముల ఎత్తు మాత్రమే యున్నది. ఒకసారి దానికొరకు అడిగాము. వారు మనకది ఇవ్వలేదు. దానిని మనకు ఇవ్వకుండా చేసిన వ్యక్తిని ఆ బోర్డులో నుండి బయటకు పంపించి వేసిరి. ఇప్పుడు ఆ స్థానములో యున్న వ్యక్తి, మనము ఏ సమయములోనయినా గాని దానిని పొందవచ్చునని తెలియచేసెను. కాబట్టి మనము సంతోషించుచున్నాము. ఇప్పుడే దానిని మనము సంపాదించవచ్చును, లేక జూలైలో ఏదో ఒక సమయమున మనము పొందవచ్చును. ఎందరో దాని కొరకు ప్రార్ధించిరి.

4నాకు ఆరిజోనా అంటే ఇష్టమని మీకు తెలియును. అది అద్భుతమగు ప్రదేశము. నేను ఎప్పుడూ అక్కడుండవలెనని ఆకాంక్షించుదును. (దానిని కొద్దిగా ముందుకు తోయండి. బెన్ సోదరుడా, కాస్త సహాయము చేయుము. ఓ, మంచిదండీ. ఏమనుచున్నారు? ఓ, అది టేపుల సంచియేనా? ఓ, ఇక్కడ మరియొకటి యున్నది. క్షమించండి. మంచిది. బెన్ సోదరుడా.) కాబట్టి నేను…

ఆరిజోనా నుండి ఇక్కడికి తిరిగి వచ్చుచున్నాను. వాతావరణము మారినందున గొంతు బొంగురుపోయినది. ఇక్కడ మనకు సుమారు ఎనభై-ఏడు నుండి తొంభై, కొన్నిసార్లు వంద శాతము వరకు వేడియుండును. అక్కడయితే సున్నా ఉండును. కొన్నిసార్లయితే సగటున ఒకటికి ఇరవై వంతుల వేడి శాతము మాత్రమే యుండును. మీరు ప్రాణవాయువు గుడారము క్రింద నివాసము చేయుచున్నారు. అట్టి వాతావరణము నుండి ఇచ్చటికి వచ్చుట మీకు ఎంత తేడా కలుగజేయునో గ్రహించగలరు. కాబట్టి స్వరము వలన మీకు ఇబ్బంది కలుగవచ్చును. (దానిని మీకెటు ఉంచుట ఇష్టమో అటు వైపునకు లాగండి. బెన్ సోదరుడా, నేను పొరపాటు చేసి బయటకు లాగాను. దానిని వారు తొక్కుదురనుకొన్నాను.)

MATT 25:40

 

5మీ ప్రతిఒక్కరూ మా కొరకు ప్రార్ధన చేయండి. మిమ్మును ఎంతో నేను అభినందించుచున్నాను. బుట్ట నిండా పీచ్ పండ్లు, ఇంకా చిన్న కానుకలు మీరు తెచ్చారని బిల్లీ నాకు చెప్పుచుండును. తగినంతగా మీకు వందనములు చెల్లించజాలము. ఏలాగు వ్యక్తపరచవలెనో నాకు తెలియదు. మీ నుండి ఇవ్వన్నియూ నేను తీసికొనుటకు అయోగ్యుడనని తలంచుచున్నాను. మిమ్మును దీవించెవలెనని దేవుని ప్రార్ధించుచున్నాను. ఆయన తప్పక ఆశీర్వదించును. ఎందుకనగా ఆయనీలాగు చెప్పెను, "మిక్కిలి అల్పులైన యీ నా సహోదరులలో ఒకనికి మీరు చేసితిరి గనుక నాకు చేసితిరని మీతో చెప్పుచున్నాను." దేవుడు మిమ్ము దీవించును. నాకు నిశ్చయముగా తెలియును.

ఆరిజోనా అట్టి చక్కని ప్రాంతము. ఒకటి నేను పోగొట్టుకొన్నాను. అది మీ అందరినీ. అది నిజము! మీ అందరినీ అక్కడ నేను చూడను. మీరు లేకుండా ఎక్కడికి వెళ్ళినా నాకు అసంతృప్తియే. ప్రపంచమంతయూ నాకు స్నేహితులున్నారు, కాని మీరు లేనిచో అసంతృప్తియే. ఈ చిన్న గుంపులో ఏదో యున్నది. నాకు తెలియదు. వారిని గూర్చియే నేను ఆలోచించుచున్నాను.

టుసాన్ ఒక పర్యాటక పట్టణము. మీకు తెలియును. సంఘములు లాగుచున్నవి. మీరెరుగుదురా? ఒక రకమగు కష్టమది. అంత ఆత్మీయము కాదు, ఎందుకనగా ఈ పోటీ చాలా బలంగా యున్నది. అందువలన కష్టమేర్పడుచున్నది. మీరందరూ, మరియు సంఘము కలిసి అక్కడ జీవించినచో చక్కగా సరిపోవును అని నేను తలంచుచున్నాను. చూచారా? అయితే ఇక్కడ ఇది సంఘముగా ఉండి మీరు వచ్చుచున్నంతకాలము, యేసు వచ్చు వరకు ఇది ఇక్కడనే యుండునని భావించుచున్నాను.

6కొద్దిసేపటి క్రితం నేను చెప్పినట్లుగా నా కొరకు ప్రార్ధించండి. దానిని తిరిగి చెప్పవలెనని నేను అనుకోలేదు, కాని నేను మీ ముందు నిలబడినప్పుడు ఉద్వేగపడుచుందును. అవ్యక్త భావము, నిగూఢ ఉద్వేగము, మానసిక ప్రేరణతో నేను నిండియుందును. అసలు నేను మొదటి నుండియూ అంతే. అందువలననే నేను లోలోపల చిందరవందరయ్యాను. నా ప్రక్కకు వచ్చి అంటుకొని నిలబడు ఇంటువంటి గుంపు మరెక్కడికి వెళ్ళినా నాకు దొరకదు అని నాకు తెలియును. రానున్న రాజ్యములో ఇది విడిపోకుండా ఈలాగే దేవుడుంచవలెనని, అక్కడ మనమందరము కలిసియుండవలెననియే నా ప్రార్ధన.

తలుపునొద్ద కూర్చొని ఒక క్షణము క్రితము బిల్-డాచ్ తో ఒకరిని క్రీస్తు యొద్దకు నడిపించిన విషయము గూర్చి ముచ్చటించుచున్నారు. తొంభై-ఒక్క సంవత్సరముల వృద్దుడగు ఆయనతో నేను ముచ్చటించుచుండగా నాతో ఇట్లనెను, "నేను బలహీనుడనగుచున్నాను. నా కండ్లు ఇంతకు ముందున్నట్లుగా లేవు." రెండు సంవత్సరముల క్రితం నేనతని యొద్దకు వచ్చినప్పుడు, అతని గుండె పూర్తిగా దెబ్బతిన్నది. గుండెకు అవరోధము ఏర్పడి చనిపోవుచుండెను. అతడు ఇక నయమవడని అతనికి వైద్యము చేసి చెప్పిన వైద్యుడే ఇప్పుడు చనిపోయియున్నాడు. ఇక్కడ బిల్-డాచ్ తొంబది-ఒక్క సంవత్సరముల వయస్సులో కూర్చొనియున్నాడు. ''బిల్, నీవు ఈ భూమి మీద ఇంతకు ముందు పని చేసిన రీతిగా చేయలేవు, కాని దేవుడు నీకు ఆరోగ్యము ఇవ్వవలెనని నేను ప్రార్ధించుటకు కారణము నీవు కూటములను ఎంతో ప్రేమించుటయే," అని నేను చెప్పాను. ఎండ, వేడి, చలి, మరి ఎట్టి తారతమ్యములున్నాగాని వాక్యమును వినుటకు ఆ తొంబది-ఒక్క సంవత్సరముల వృద్ధుడు దేశములో ప్రతిచోటకు ప్రమాణము చేయుచున్నాడు. ఆ యోధుడగు ఆత్మను దేవుడు దీవించును.

7ఈ ఉదయమున మూడు గంటలసేపు మిమ్మును నిలిపియుంచినందుకు క్షమాపణ అడుగుచున్నాను. వర్తమానమునకు నేను న్యాయము చేకూర్చలేదు, ఎందుకనగా దానిని నేను కుదించాను. దానిలోని భాగము విడిచిపెట్టాను. ఒక భాగమును దాటిపోయాను, ఆ కారణము చేతనే వారిని టేపు చేయవద్దని కోరాను. చల్లగా నున్నప్పుడు మరోసారి నేను దానిని వివరించెదను. ఆత్మ సంచారము నాకు తెలిసినది; కాని నేను మీ వైపు చూడగా, మీరు గాలి విసరుకొనుచున్నారు. మీకు వేడిగా నున్నదని తెలిసినది. అది నన్ను ముక్కలుగా చేసినది. మీరు శ్రమపడుట నాకు ఇష్టము లేదు. మీరు సుఖముగా ఉండవలెనని నా కోరిక, చూచారా. అది నన్ను కలవరపరచినది.

రోగులను చూచి నేను కలత చెందెదను. రోగుల పట్ల నాకు సానుభూతి లేనిచో వారికి ఎట్టి మేలు నేను చేయజాలను. వారిపట్ల నాకు దయ అవసరము. మీ పట్లను అంతే. నేను మీ పట్ల దయచూపనిచో, మీ సోదరునిగా ఉండలేను, చూచారా. మీ కొరకు నేను జాలి చూపవలెను. అది నేను చేయుదును. అది నిజమని దేవునికి తెలియును.

8ఈ రాత్రి రోగుల కొరకు నేను ప్రార్ధించుదును. నేను సహోదరుడు కాలిన్స్, హిడర్సన్, నెవిల్, కాప్స్, ఈ ట్రస్టీలు, వీరందరినీ ఆశీర్వదించి మరియు అభినందించగోరుచున్నాను. ఎంత క్రమముగా సంఘమును ఉంచుచున్నారో, అన్ని విషయములను ఎంత చక్కగా వాటి వాటి స్థానములో ఉంచుచున్నారో చక్కని సమాచారము అందుచున్నవి. మీ అందరికీ నేను కృతజ్ఞుడను. ఒక క్రమమును ఏర్పరచుటకు మీరు ప్రయత్నించుచున్నారు గనుక ప్రభువు మిమ్ము దీవించును. టుసాన్ నుండి నాకు ఉత్తరము మీద ఉత్తరము వచ్చుచున్నది. "బ్రెన్హాం సోదరుడా, ఇది ముందుండినట్లుగా లేదు. ఎంతో బేధము కనబడుచున్నది. దేవుని యొక్క సన్నిధిని అనుభవించుచున్న మంచి అనుభూతి కలుగుచున్నది." దానిని బట్టి నేనెంతో కృతజ్ఞడును. ప్రభువు సదా మిమ్ము దీవించు గాక!

9ఈ రాత్రి నేను ఒక చిన్న లేఖనభాగము చదువగోరుచున్నాను. మాట్లాడుటకు కొన్ని మాటలున్నవి. మొదటి వాక్యము చదివి, బహుశా రెండు లేఖన భాగములు చదివి, కొద్ది క్షణములు మీతో మాట్లాడెదను. అటు పిమ్మట రోగుల కొరకు ప్రార్ధించెదను. కొద్ది క్షణములే నేను మాట్లాడుదును. గడియారమును నేను చూస్తున్నాను. వీలయినంత త్వరగా ముగించెదను.

జనులు గుంపుగా కూడియున్నప్పుడు వాక్యము చదువకుండా, ఒక హెచ్చరిక ఇవ్వకుండా వెళ్ళినయెడల, ఆ కూటమునకు నిండుదనముండదు. మీలో చాలామంది ఎదురు చూచారు. మీలో అనేకులు ఈ రాత్రి ఇంకా చాలా మైళ్ళు ప్రయాణము చేయాలి. దానిని నేను ప్రశంసించుదును. ప్రతిఒక్కరినీ నేనేలాగు చూచుచున్నానో… ఆరిజోనాలో యుండగా నేనిట్లు తలంచుదును, "అతనిని మరల చూచుట జరిగినది కనుక వెళ్ళి, అతనితో కరచాలనము చేసి మెడ మీద పడి హత్తుకొంటే ఎంత బాగుండును!" ఇక్కడ మీరు కూర్చొనియున్నారు. నేనెక్కడికి వెళ్ళగలను? మీకు తెలియును. ఎవరియొద్ద నుండి నేను ప్రారంభించాలో నాకు తెలియదు. ఇక్కడ నుండి ఎట్లు లేవవలెనో ఎరుగను. కాని మిమ్మును నేను ప్రేమించుచున్నాను. దేవుడు కూడా మిమ్మును ప్రేమించుచున్నాడు.

1COR 1:18-25•

2COR 12:11

 

10ఇప్పుడు నేను పొరబడలేదనుకొంటాను. నేను ఇక్కడ తప్పు వాక్యభాగము చూపించుట లేదని నమ్ముచున్నాను. I కొరింథీయులకు 1వ అధ్యాయము 18 వచనము మరియు II కొరింథీయులకు 12:11 మీ కొరకు చదువగోరుచున్నాను. అందులో నుండి ఒక అంశమును తీసికొందును. నేను వాటిని వెంటనే కనుగొని చదువగోరుచున్నాను. తదుపరి ప్రార్ధించుదము. వెంటనే చిన్న అంశము మీద కొద్ది నిమిషములు మీతో మాట్లాడుదును. I కొరింథీయులకు 1వ అధ్యాయము 18 వచనము నుండి ప్రారంభించుదము:

సిలువను గూర్చిన వార్త నశించుచున్నవారికి వెర్రితనము గాని రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి.

ఇందు విషయమై - జ్ఞానుల జ్ఞానమును నాశనము చేతును. వివేకుల వివేకమును శూన్య పరతును అని వ్రాయబడియున్నది.

జ్ఞాని ఏమయ్యెను? శాస్త్రి ఏమయ్యెను? ఈ లోకపు తరవాది ఏమయ్యెను? ఈ లోక జ్ఞానమును దేవుడు వెర్రితనముగా చేసియున్నాడు గదా? [మరల అది చెప్పెవచ్చా?] ఈ లోక జ్ఞానమును దేవుడు వెర్రితనముగా చేసియున్నాడు గదా? [ఈ లోకము యొక్క జ్ఞానము ఏమిటి? వెర్రితనము.] … ఈ లోక జ్ఞానమును దేవుడు వెర్రితనముగా చేసియున్నాడు గదా?

దేవుని జ్ఞానానుసారముగా లోకము తన జ్ఞానము చేత దేవునిని ఎరుగకుండినందున సువార్త ప్రకటనయను వెర్రితనము చేత నమ్మువారిని రక్షించుట దేవుని దయాపూర్వక సంకల్పమాయెను. [మరల ఈ వచనము చదవనా? జాగ్రత్తగా వినండి] దేవుని జ్ఞానానుసారముగా లోకము తన జ్ఞానము చేత దేవునిని ఎరుగకుండినందున సువార్త ప్రకటనయను వెర్రితనము చేత నమ్మువారిని రక్షించుట దేవుని దయాపూర్వక సంకల్పమాయెను.

యూదులు సూచక క్రియలు చేయమని అడుగుచున్నారు. గ్రీసు దేశస్థులు జ్ఞానము వెదకుచున్నారు.

అయితే మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించుచున్నాము. ఆయన యూదులకు ఆటంకముగాను, అన్యజనులకు వెర్రితనముగాను ఉన్నాడు.

గాని యూదులకేమి, గ్రీసు దేశస్థులకేమి, పిలువబడిన వారికే క్రీస్తు దేవుని శక్తియును దేవుని జ్ఞానమునై యున్నాడు.

దేవుని వెర్రితనము మనుష్య జ్ఞానము కంటే జ్ఞానము గలది. దేవుని బలహీనత మనుష్యుల బలము కంటే బలమైనది.

మరియు II కొరింథీయులకు 12వ అధ్యాయము, 11వ వచనములో పౌలు చెప్పుచున్నాడు:

నేనవివేకినైతిని, మీరే నన్ను బలవంతము చేసితిరి. నేను మీ చేత మెప్పుపొందవలసిన వాడను, ఏలయనగా నేను ఏమాత్రపువాడను కాకపోయినను మిక్కిలి శ్రేష్ఠులైన ఈ అపోస్తలులకంటే నేను ఏ విషయములోను తక్కువవాడను కాను.

11మనము ప్రార్ధించుదము. ప్రభువైన యేసూ, గొప్ప అపోస్తలుడగు పౌలు ద్వారా గడిచిన దినములలో మాట్లాడిన ఈ కొద్ది మాటలకు ఈ రాత్రి మేము వినుట ద్వారా అభివృద్ది పొందునట్లు, ఈ రాత్రి వాటిని మా జీవితములకు అన్వయించుకొనునట్లు, మేము దేవుని చేతిపనియగునట్లు, ఆయన మేమెట్లుండవలెనని ఒక రూపమును ఎన్నుకొనెనో ఆ రూపములోనికి వచ్చునట్లు నీవు మరికొంత కలుపుము. యేసు నామమున దీనిని అడుగుచున్నాము. ఆమేన్.

12"వింత వ్యక్తి" అను అంశము మీద ప్రభుని చిత్తమయితే కొద్ది నిమిషముల పాటు ఈ రాత్రి ప్రసంగించవలెనని కోరుచున్నాను. అది చాలా విడ్డూరంగా, మొరటుగా కనబడుచున్న అంశము, అయితే అది — నేను వ్యక్తము చేయవలసియున్న విధానమును బట్టి కొద్దో గొప్పో ఆలాగే చెప్పవలెనని తలంచుచున్నాను.

మీకు తెలియును, ఈనాడు చాలా వాటిని, వ్యక్తులను వింతైనవారని పిలచుట మనము వినుచున్నాము. ఆ పదమును విన్నవారికి దాని అర్ధము తెలియును, అనగా విచిత్రము అని అర్ధము. ఒక వ్యక్తికి మరో వ్యక్తి వింతగా కనబడును. మనలో చాలామందిమి ఒకరికి ఒకరము వింతగా కనబడుచుందుమనుటలో సందేహము లేదు.

13నేను ఒకసారి కాలిఫోర్నియాలోని లాస్-ఏంజలస్ లో ఒక వీధి గుండా వెళ్ళుచున్నాను. నేను వింతగా ప్రవర్తించుచున్న ఒక వ్యక్తిని చూచాను. చాలా వింత వ్యక్తి. అతడు వీధిలో నడిచిపోవుచున్నాడు. తడబడుచూ నడుచుట లేదు గాని మధ్యాహ్న సమయమున ఊరకే అలా తిరుగుచూ నడుచుకొంటూ వెళ్ళుచున్నాడు. అతడేమి చేయుచున్నాడో చూచుటకు వీధి అవతలి ప్రక్కకు వెళ్ళాను. అందరూ అతని వైపు తిరిగి అతని చూచి నవ్వుచున్నారు, ఎందుకనగా అంత వింతగా యున్నాడు. అతని ముందు ఒక వ్రాత అట్ట వ్రేలాడుచున్నది అని నేను గమనించాను. ఈ వింతగా, విడ్డూరంగా ఉన్న వ్యక్తిని చూచి అందరూ ఎందుకు నవ్వుతున్నారో చూద్దాం అని తలంచాను. అతనిని గమనించాను. ప్రజలు అతనిని చూడగానే నవ్పుచున్నారు, కాని అతని చిరునవ్వులో ఏదో తేడాయున్నది. అది సంతృప్తితో కూడిన చిరునవ్వు. అయితే ఇతరులు ఇచ్చుచున్న చిరునవ్వులు అతనిని ఎగతాళి చేసినట్లుగానే యున్నవి. కాని అతడు తాను చేయుచున్నదానిలో సంతృప్తి పొందుచున్నట్లుగా కనిపించెను.

2COR 12:11

 

14సరే, అది తలంచాలంటే చాలా సమయము పట్టును. తాను చేయుచున్నది సరి అని తలంచినప్పుడే ఒక వ్యక్తి సంతృప్తి చెందును. కొందరకి అతడు ఒక విడ్డూరంగా కనిపించినా తాను చేయుచున్నది సరియేనని అనుకొన్నప్పుడు సంతృప్తిచెందును. ఆలాగే అతనిని ఉండనీయుడి. ఈ చిన్న వ్యక్తి దగ్గరకు నేను వచ్చినప్పుడు, అతని గుండె మీద వ్రాసిన ఒక అట్ట వ్రేలాడుట గమనించాను. "నేను వెర్రివాడను," అడుగున "క్రీస్తు కొరకు!" అని వ్రాసియున్నది. "నేను వెర్రివాడను," అని పెద్ద అక్షరములలో వ్రాయబడియున్నది; అడుగున "క్రీస్తు కొరకు" అని వ్రాయబడియున్నది. దీనిని చూచి అందరూ నవ్వుచున్నారు.

హేళన, గేళి చేయుచున్న ఈ జనసందోహము గుండా ఈ చిన్న వ్యక్తి ముందుకు వస్తూండగా అతని వీపుపై ఏమి ఉన్నదా అని చూచాను. అతని వీపు మీద ఒక పెద్ద ప్రశార్ధకమున్నది. అడుగున ఇట్లున్నది, "ఇప్పుడు నీవు ఎవరి నిమిత్తము వెర్రివానిగా యున్నావు?"

అక్కడ అతనికెదో దొరికినది కాబోలునని నేననుకొన్నాను. చూచారా? అతడు క్రీస్తు కొరకు వెర్రివానిగా నుండుటకు సంతృప్తి చెందినట్లుగా కనబడెను. పౌలు కూడా అదే చెప్పెను, తాను క్రీస్తు కొరకు వెర్రివానినయితిననెను.

15సంపూర్ణ సువార్త వ్యాపారస్తుల గుంపుకు చెందిన సహోదరుడు ట్రాయ్ నాకు చాలా సన్నిహిత మిత్రుడు. అతడు మాంసమును కోయు వ్యక్తి. ఒకసారి పంది మాంసమును కోయుచుండగా, అతని చేతిలోనికి ఒక విధమగు పురుగు వెళ్ళినది. ఆ పురుగు పేరు ఎవరికయినా తెలిసినచో చెప్పమని అడుగుచున్నాను, కాని అది మనిషిని తినివేయును. కాబట్టి అతని ప్రాణము రక్షించుటకై అతని యొక్క మూడు వ్రేళ్ళను తీసివేసిరి. అతని ఒక చేతికి రెండే వ్రేళ్ళున్నవి, కాని ఇంకా అతడు మాంసము కోయువానిగానే పనిచేయుచున్నాడు.

లాస్-ఏంజలెస్ లో నున్న ఒక మాంసమును విక్రయించు దుకాణములో అతనితో పనిచేసిన ఒక చిన్న జర్మను వ్యక్తియున్నాడు. ఆ చిన్న డచ్ వ్యక్తిని క్రీస్తునొద్దకు నడిపించుటకు ఇంకా ప్రయత్నించుచునేయున్నాడు. తాను "లూథరన్" అని అతడు చెప్పెను. సరే, మంచిదే. తాను "లూథరన్" సంఘమునకు చెందియున్నాను కాబట్టి తాను క్రైస్తవుడననే అని అతడు సంతృప్తి చెందెను. అయితే ఒక రాత్రి అతనిని చర్చికి తీసికొని వచ్చు అవకాశము సహోదరుడు ట్రాయ్ కు దొరికినది.

16అతని పేరు హెన్రీ. "హెన్రీ"కి జర్మనులో "హెయిన్రిక్" అందురు, కనుక అతనిని "హెయినీ" అందురు. మీరాలాగు పిలచుట వినియే యుందురు. "హెయినీ," ఈ రాత్రి నాతో చర్చికి వస్తే ఎట్లుండును? అని అడిగాడు.

"సరే, వచ్చెదను," అన్నాడతను. కాబట్టి అతడు ఆ పాతకాలపు విధానములో జరుగు కూటమునకు వెళ్ళెను. అక్కడ ప్రార్ధన కూటము జరుగుచున్నది. నిజంగానే అతడు మార్పుపొంది క్రీస్తుకు తన హృదయమిచ్చెను. ఓ, ఆ మరుసటి రోజు ఈ చిన్న డచ్ వ్యక్తి నిన్నటి దినమున విన్న వర్తమానమును తలంచుచూ, ఆనందించుచూ, ఊప్పొంగుచూ తనకు తానే సంతోషించుచుండెను. అతడు భవనములో అటు ఇటు తిరుగుచూ మధ్య మధ్యలో చేతులు గాలిలో కెత్తి ''దేవునికి స్తోత్రములు. ప్రభువైన యేసూ, వందనములు," అని చెప్పుచుండెను. అతడు వారందరి దృష్టిని ఆకర్షించెను.

మీరు చూడండి, ఆ కసాయి వారందరికి అతడు ఒక వీడూరంగా కనిపించెను. అతడు మాంసము నరుకుచూ ప్రభువును గూర్చి ఆలోచించసాగెను. పెద్దగా కేకలు వేయుచుండెను. అతడు కత్తి క్రింద పడవేసి అటు ఇటూ నడచుచుండెను. మతిపోయి కాదు గాని ప్రేమించుట బట్టియే, "ఓ, యేసూ, నీన్ను ఎంతగానో నేను ప్రేమించుచున్నాను అనుచుండెను. ఆలాగనుచు ముందుకు మరియు వెనుకకు నడచుచుండెను.

17అతని యజమానుడు వచ్చి దీనిని చూచెను. అతడు కేకలు వేయుచూ నడచుచూ తన యజమానుని రాకను గమనించలేదు. అతడు యేసు గూర్చి ఆలోచించుచుండెను. తన చేతులు గాలిలోనికి ఎత్తి బుగ్గల మీద నుండి కన్నీరు జారుచుండగా, "ఓ, దేవా, నినెంతగానో నేను ప్రేమించుచున్నాను" అని చెప్పసాగెను.

అప్పుడు యజమానుడు ఇలాగనెను, "హెయినీ. నీకు ఏమి వచ్చినది? వీరందరూ నీ గురించే చెప్పుకొనుచున్నారు. అసలు నీకు ఏమి సంభవించినది హెయినీ?"

ఆ చిన్న డచ్ వ్యక్తి ఇట్లనెను, "ఓ, యజమానుడా, దేవునికి మహిమ! నేను రక్షించబడితిని!"

"నీకు ఏమి వచ్చినది?" అనడిగెను.

"నేను రక్షించబడితిని. నేను సహోదరుడు ట్రాయ్ ఒక చిన్న చర్చికి వెళ్ళాను. నేను రక్షించబడితిని. యేసునా హృదయములోనికి వచ్చెను. నేను ప్రేమతో నిండిపోయాను" అని చెప్పెను.

"నీవు ఆ నట్టుల (పిచ్చివాళ్ళ - అనువాదకుడు) గుంపులోనికి వెళ్ళియుంటావు," అన్నాడతను.

"అవును! దేవునికి మహిమ. ఆ నట్టులను బట్టి దేవునికి వందనములు. రోడ్డు మీద వెళ్ళుచున్న ఒక మోటారు వాహనములోని 'నట్టులను' మీరు ఊడదీసినయెడల, అది ఎందుకూ పనికిరాని ఇనుప ముక్కలగా మారి, చెత్తను అమ్మే దుకాణమునకు మాత్రమే అది పనికి వచ్చును," అని చెప్పెను.

అతడు చెప్పినది సరియని నేననుకొంటున్నాను. మీరు నట్లలన్నింటిని ఊడదీసి చూడండి? ఆ నట్టులే వాటన్నింటిని ఏకముగా పొందుపరచుచున్నది. కొన్ని సమయములందు సంఘమును, నాగరికతను ఏకముగా నిలిపియుంచునది అదేనని నేను తలంచుచున్నాను.

18కొద్ది దినముల క్రిందట ఒకచోట నుండి ప్రెస్కాట్ వస్తున్నాను. ఆ ఎడారి వైపు చూస్తూ, ఆ ఫీనిక్సులో జపాను తోటలు ఎట్లు పెంచిరో గమనించుచున్నాను. పూలు, అందమగు పూలు పూసినవి. నేను బాలునిగా నున్నప్పుడు ఆ స్థలములలో పశువులను మేపాను. ఆవులకు అక్కడ గడ్డి లేదు. కేవలము ఎడారి మొక్కలు మొదలగునవి తిని అవి బ్రదికెడివి.

ఎడారిని సస్యశ్యామలము చేయు విధానమును అప్పుడు నేను గమనించాను. ఎడారిలో ఆ ముండ్ల చెట్లు, పూలు మనము కనుగొందుము. మా ఇంట్లో లేక మేము అద్దెకున్న ఇంట్లో అవి ఉన్నవి. ఈ ఉదయాన లార్సన్ సోదరి ఇచ్చట ఉన్నదనుకొనుచున్నాను. ఆమె యొక్క ఇంటి బయటనున్న పూలతోటలో ఆ చెట్లున్నవి. అక్కడ ఇసుక తప్ప మరేది లేదు. కాబట్టి ఆమె తన తోట పెంచుచోట ఇరువైపుల కొంత మట్టిని పరచినది. ప్రతి ఉదయమున నేను వెళ్ళి, ఆ పెద్ద పూల తోటకు నీరు పోసెడివాడిని. నేను నీరు పోయనిచో, అవి చనిపోవును. తరువాత వాటిని చీడబారి నుండి రక్షించుటకు మందు చల్లెడివాడిని; లేనిచో చీడ వానిని తినివేయును.

19మీరు దానికి ఇంకా కొద్ది ముందుకు, ముప్పది అడుగుల అవతలకు వెళ్ళినయెడల, ఆ ఎడారిలోనే కొన్ని పూలు ఎదుగుట మీరు గమనించగలరు. మీరు ఇరవై అడుగుల లోతునకు త్రవ్వినాగాని ఇసుక తప్ప మరేమీ రాదు. ధూళి తప్ప మరేమీ అక్కడ లేదు. అసలు నీరే లేదు. వాటికెవరు మందు చల్లుదురు? చూచారా? ఇక్కడ మీరు కుండీలలో పెంచుచున్న వాటికయితే నీళ్ళుపోయక, మందు చల్లక ఉన్నచో చీడ, పేలు, పురుగులు పట్టి వాటిని తినివేయును. కాని ఆ ఎడారిలో ఉన్న వానిని ఏ చీడ అంటుకోలేదు. ప్రతిరోజు నీరుపోసి వానిని పెంచనవసరము లేదు. అది సృష్టికర్త యొక్క సృష్టి. ఇది సంకర జాతి ప్రత్యుత్పత్తి.

నేడు క్రైస్తవత్వము జనులకు 'నట్టు' (Nuts)లు వలే కనిపించుటకు కారణమేమనగా, మనయందు నిజమైన క్రైస్తవులు లేకుండా, దానికి బదులుగా ఎన్నో ప్రత్యుత్పత్తులే ఉన్నవి. సంఘములు అటువంటి వారిని ఉంచుకొనుట కొరకై వారిని బుజ్జగిస్తూ, మందు చళ్ళుతూ వారిని కనిపెట్టుకొంటూ ఉండవలెనని నేను తలంచుచున్నాను.

20మొదటి సంఘము ఎట్లుండెడిదో నేనూహించగలను. నేటి ఈ ప్రత్యుత్పత్తితో పోల్చి చూడండి. ఇది ఒక చవకబారు ఉత్పత్తియైనందువలన దీనిని ఆ నిజమైన మొదటి సంఘ కాలముతో పోల్చిచూడలేము, వారు దేవునియందు దృడమైన విశ్వాసమును కలిగియుండి, పరిశుద్ధాత్మతో నింపబడియుండిరి. అల్పమైన మీవంటి వారితో వారిని పోల్చిచూడలేము. వారి వీపును నిమురుతూ, బుజ్జగిస్తూ, వారికి ప్రయోజనకరముగా ఏదో ఒకటి చేయుటకై దీనిని తీసుకోండి, దీనిలో ఉండండి అని నీవు చెప్పనవసరము లేదు. అచ్చట వారికి ఏ గుర్తింపు కలగకపోయినయెడల, విసిగి వేరోక చోటకు వెళ్ళిపోయెదరు. ఒకవేళ నీవు వారిని డీకన్ గా చేస్తానంటే, తాముండే సంఘమును వదిలి ఇచ్చటకు వచ్చి దీనిలో చేరెదరు. అది సంకర జాతి ప్రత్యుత్పత్తి.

21నేను మైకెల్ ఏంజిలియో గీసిన అసలైన 'చివరి ప్రభురాత్రి విందు' చిత్రపటమును గూర్చి ఆలోచించాను. దానినతడు చిత్రీకరించెను. ఆ అసలు చిత్రము ఎంత వెల యుండునో నీవు గ్రహించావా? ఎన్ని వేల డాలర్లు ఇచ్చినా గాని దాని వెలను తాకజాలవు, ఎందుకనగా అది వెలకు అందనిది. దాని విలువ అంత ఉన్నతము. కాని నీవు అదే చిత్రము యొక్క ప్రత్యుత్పత్తిని చవుకగా అనగా రెండు డాలర్లకు కొనగలవు.

అందుకే ఈనాడు జనులు నిజమగు, అసలగు విశ్వాసుల యొక్క దృఢత్వమును అర్ధము చేసికొనలేకపోవుచున్నారు. వారు ఒక నట్టుగా కనబడుచున్నారు. లోకము బహు నీచమైన స్థితికి దిగజారిపోయే స్థితికి వచ్చినందువలన దాని వంకరతనమును సరిదిద్దుటకు అప్పుడప్పుడు ఇటువంటి ఒక 'నట్టు' లాంటి వాడు వచ్చి తీరవలయును. కొద్దిగా తేడా గల వ్యక్తి ఎవరో ఒకరు రంగము మీదికి వచ్చి, ఆ తరమునకు అతడు ఒక 'నట్టు'గా యుండవలసియుండును. ఆ విధముగా యుండువాడు ఎవరు అని నేను ఒకానొక దినమున ఆలోచిస్తూ యుంటిని?

నేడు ఎవరు ఆ 'నట్టు'గా యుండగోరువాడు? మీలో ఎవరో ఒకరు నట్టుగా యుండవలయును. ప్రపంచము పూర్తిగా పిచ్చి స్థితిలోనికి పోయినదని నేను నమ్ముచున్నాను. తప్పు మరియు ఒప్పు, నిజము లేక అబద్దము మధ్య తేడాను ప్రజలు కనుగొనలేని సమయమిదేయని మీరెరుగుదురా?

22రాజకీయవేత్తలకు "మంచి ఏదో, చెడు ఏదో తెలియదని మీరెరుగదురా?" పాఠశాలల్లో తిరిగి బైబిలును ప్రవేశపరచవలెనన్న సంగతికి వారు నోరు విప్పక వోటు వేయక ఉంటున్నారు. వారికి తమ రాజకీయములు ఎప్పుడు ముక్కలగునో తెలియదు. దానిగూర్చి ఆలోచించండి! ఇప్పుడు ఇండియానాలో ఎట్లున్నదో నాకు తెలియదు గాని, ఆరిజోనా రాష్ట్రములో పాఠశాలలో బైబిలు చదువుట చట్ట విరుద్దము. ఇండియానాలోను, దాదాపుగా అమెరికా అంతటా అదే రీతిగా ఉన్నదనుకొంటాను, ఎందుకనగా ఒక నాస్తికురాలు మొత్తం కార్యక్రమమునే మార్చివేసినది. గుర్తుంచుకొనండి, మన పబ్లిక్ పాఠశాలలో బైబిలు చదువుట చట్ట విరుద్ధము. కాని విశ్వాసుల పన్నులు పాఠశాలల్లో నాస్తికత్వమును నేర్పుటకు ఉపయోగపడుచున్నవి.

మరొక అబ్రాహాం లింకన్ మనకు కావాలి; మరొక పాట్రిక్ హెన్రీ మనకు కావాలి; రాజకీయములు ఎక్కడ తగులబడినా గాని తప్పును తప్పు అని, ఒప్పును ఒప్పు అని నిస్సంకోచముగా చెప్పగల అమెరికనులు మనకు కావాలి!

ROM 3:4

 

23దేవుని వాక్యమా లేక సంఘ శాఖయా వీటిల్లో ఏది సరియైనదని నేటి బోధకులు నేర్చుకోలేకపోతున్నారని మీరెరుగుదురా? ఏ దారి అనుసరించవలెనో వారెరుగరు. తప్పు, ఒప్పులను వివేచించలేరు. "బైబిలు ఈలాగు చెప్పుచున్నదని నాకు తెలియును గాని, మా సంఘము ఇలా చెప్పుచున్నది…" అని నీళ్ళు నములుచున్నారు. చూచారా? తప్పు, ఒప్పులను వివేచించు స్థితిలో ప్రజలు లేరు. బైబిలునకు విరోధముగానున్న ప్రతిదియూ తప్పు! దేవుని వాక్యమే సరియైనది. ప్రతి మనిషి మాట అబద్దమే, అది దానికి విరుద్దము. ఇటువంటి కాలములో సరియగు దానికొరకు నీవు నిలబడుట వలన నీవు ఒక "నట్టు' గానే ఉందువు.

GEN 6:17•

EXOD 5:1

 

24కొందరిని మనము చూద్దాం. ప్రవక్తయగు నోవహు అతడు జీవించిన ఆ గొప్ప దినమున, ఆ మహా విజ్ఞాన యుగములో ఎట్లుండెనో నేనూహించగలను. వారు పిరమిడ్లు, స్పినిక్స్ లను నిర్మించారు. శాస్త్రీయ పరిశోధన ద్వారా ఆకాశములో నీరు లేదని నిరూపించగలరు. ఈ ముసలివాడు వచ్చి, "ఆకాశము నుండి వర్షము పడునని చెప్పెను. ఆ తరమునకు నోవహు ఒక కొరుకుపడని 'నట్టు'గానే ఉండెను. అతడొక 'నట్టు'గానే మారెను.

మోషే గూర్చి మనము ఆలోచించుదాం. మోషే, ఫరో యొద్దకు వెళ్ళుట గూర్చి ఉదయకాలము మనము మాట్లాడుకొన్నాము. ఫరో యొద్దకు వెళ్ళి ఇట్లనెను, "ఈ బానిసలను బయటకు తీసికొని రమ్మని యెహోవా నన్ను పంపెను." సర్వ ప్రపంచమును జయించిన ఆ మహా సైన్యమునకు విరోధముగా అతని చేతిలో ఒక కర్ర ఉండెను. ఫరో తన శాస్త్రీయ మేధస్సు అంతటితో మోషే ఒక నట్టు అని తలంచెను. వారికతడు మ్రింగుడు పడని నట్టుగానే ఉండెను.

25తాను జీవించిన ఆ గొప్ప దినమున ప్రవక్తయగు ఏలియా ఆలాగే యుండెనని ఊహించగలను. నాజూకు పెచ్చు పెరిగిన కాలమది. ఆహాబు, యెజెబెలులు ప్రపంచమును ఆ రోజులలో పరిపాలించిరి. ఆ నాజూకులు, వస్త్రధారణలు యెజెబెలు అనుకరించుచుండెను. తక్కిన స్త్రీలందరూ ఆమె వలెనే దుస్తులు ధరించిరి. ఆమె రంగులు పూసికొనుట, నాజూకులు, మితిమీరినవి. ముసలివాడగు ఏలియా, రంగము మీదికి వచ్చి మొత్తం దేశము మీద విరుచుకు పడెను. ఆహాబుకు అతడు ఒక నట్టుగా నుండెను. అది నిజము!

ప్రవక్తయగు ఆమోసు సమరయకు వచ్చిన దినమున, సమరయ ఈనాటి హాలీవుడ్ వలె ఉండెను. వీధిలో స్త్రీల వస్త్రధారణ ఆలాగే యుండెను. బహిరంగ వ్యభిచారము వలే యుండెను. వారెట్లు విచ్చలవిడిగా జీవించారో చూడండి. అనేకమంది పురుషులతో విచ్చలవిడిగా తిరుగుచుండెడివారు.

26మీ కండ్ల ఎదుటనే నేడు దాదాపు బహిరంగ వ్యభిచారము జరుగుచున్నది.

ఒక రాత్రి నేను ఏదయినా తినవలెనని ఒక చోటకు వెళ్ళాను. చిన్న బాలురు బాలికలు ఒకరునొకరు కౌగలించుకొని, ముద్దు పెట్టుకొనుచున్నారు. అది దాదాపుగా బహిరంగంగా వ్యభిచారము చేయుట యగును. నాకది ఏమిటో తెలియలేదు. నా చిన్న సోదరీ, అది నిజంగా ఒక వ్యభిచారమేనని ఎరుగుదువా? ఒక వ్యక్తి నిన్ను ముద్దుపెట్టుకొన్నప్పుడు, అతడు నీతో వ్యభిచారము చేసినట్లే. నీవు వివాహము చేసికొనువరకు ఏ పురుషుడు నిన్ను ముద్దు పెట్టుటకు అనుమతించకూడదు. ఎందుకనగా స్త్రీ, పురుష గ్రంథులు రెండునూ పెదవులలోనే యున్నవి. మీకర్ధమయినదా? అది ఏ చోటనయినాగాని. స్త్రీ, పురుష గ్రంథులు రెండూ ఒక్కటయినప్పుడు అక్షరాలా వ్యభిచారము చేసినట్లే. నీకు వివాహము జరుగునప్పుడు నీ ముఖము మీద ముసుగు తీయబడు వరకూ, ఒక పురుషునికి నీవు భార్యవు అగు వరకూ ఎవరినీ నీవు ముద్దుపెట్టుకొనుటకు అనుమతించరాదు. ఆలాగు చేయవద్దు. అది వ్యభిచారము చేసినట్లే. అది స్త్రీ, పురుష గ్రంథులను ఏకము చేయుట యగును.

పురుషుడు ఒక పురుషుని, స్త్రీ మరో స్త్రీని పెదవుల మీద ఎందుకు ముద్దు పెట్టుకొనరు? ఎందుకనగా అది గ్రంథులను ఉత్తేజితము చేయదు. గ్రంథుల సంయోగము వల్లనే పిల్లలు పుట్టుచున్నారు. కాబట్టి అది ఒక బహిరంగ వ్యభిచారమే. తెరల మీద, ఆయా చోట్ల చూడండి, విచ్చలవిడి పోకడ, ఏహ్యత కొనసాగుచున్నది. అనైతికత పెచ్చురిల్లుటలో ఆశ్చర్యము లేదు. స్త్రీలను నోటిలో ముద్దు పెట్టుకొనుట ద్వారా వారేలాగు అందులో ఇముడుచున్నారో చూడండి, అది వ్యభిచారమని తెలియును! పశ్చాత్తాపపడితేనే గాని దేవుడు దానిని క్షమించడు.

AMOS 5:6

 

27ఈ గొప్ప ప్రవక్తయగు ఆమోసు వచ్చుచున్నాడు. చిన్న ప్రవక్తలలో ఒకనిగా అతడు పేర్కొనబడెను, ఎందుకనగా అతని గూర్చి ఎక్కువగా వ్రాయబడలేదు. కాని అతనికి ప్రభువు యొక్క వాక్కున్నది. అతడు ఆ పట్టణము వైపు చూచుచుండెను, పార్కులలో పురుషులు తమ చేతులను స్త్రీలపై వేసి పెనవేసుకొని యుండుట, స్త్రీలు తమ చేతులను పురుషులపై వేసుకొని వారిపై ఒరిగిపోయి యుండుట మరియు అది ఒక ఆధునిక హాలీవుడ్ గా యుండుట అతడికి కనబడుచున్నది. ఆ పట్టణము గుండా అతడు నడచి వస్తూ ఇట్లనెను, "మీరు మారుమనస్సు పొందండి లేదా నశించిపోండి!" అతడు ఒక నట్టు (Nut) వలె ఉండెను. అతడు వారికి దాదాపుగా పిచ్చివానిగా కనబడెను.

MATT 3:9•

LUKE 3:8

 

28బాప్తిస్మమిచ్చు యోహాను రంగము మీదికి వచ్చినప్పుడు ఆనాడున్న మత శాఖలకు ఒక కొరుకుపడని నట్టుగా కనబడెను. అతడు తన తండ్రి అడుగు జాడలను వెంబడించి ఒక యాజకుడగు అవకాశమును కలిగియుండెను. కాని దానిని చేయుటకు అతడు అంగీకరించలేదు, ఎందుకనగా దేవుడు అతనిని ఆ మత సిద్ధాంతములు, శాఖల నుండి బయటకు రప్పించి ఉంచెను. అతని యొక్క పని అతి ప్రాముఖ్యమైనది అగుటయే అందుకు కారణము. మెస్సీయా రాకడను అతడు ప్రకటించవలసియుండెను. పరిస్యయులతో గాని, సద్దుకయ్యుతో గాని మరెవరితో గాని అతనికెట్టి పొత్తులేదు, మొత్తం ఆ గుంపంతటిని అతడు తిరస్కరించెను, వారితో అతడిట్లు చెప్పెను, "అబ్రాహాము మాకు తండ్రి అని చెప్పవద్దు. దేవుడు ఈ రాళ్ళ ద్వారా అబ్రాహామునకు పిల్లలను పుట్టించగలడు." ఆనాడున్న మత ప్రపంచమునకు అతడు ఒక అంతుపట్టని నట్టుగా యుండెను. అది నిజము!

JOHN 8:48•

ACTS 9:5•

ACTS 26:25•

2COR 12:11

 

29యేసు రంగము మీదికి వచ్చినప్పుడు ఆయన దినములలో ఉండిన మత ప్రజలకు ఆయన కూడా ఒక అర్ధము కాని నట్టువలె ఉండెను. ఎందుకనగా వారిట్లనిరి, "నీవు ఒక సమరయుడవు. నీ మతి చలించినది. నీవు పిచ్చివానివి." మరో మాటలో చెప్పాలంటే, ఆయనను "వెర్రి" అని పిలచిరి. వారికాయన ఆలాగే యుండెను - నీకయితే ఆయన ప్రభువు మరియు రక్షకుడు. గమలియేలు ద్వారా శిక్షణ పొందుట వలన పౌలు ఏదో ఒక దినమున ప్రధానయాజకుడిగా అగుటకు అవకాశము వచ్చుటలో ఆశ్చర్యమేమీ లేదు. దమస్కునకు పోవు మార్గములో యుండగా అతడు ఒక సహజాతీతమగు వెలుగు ద్వారా తాకబడెను. ఒక యూదుడుగా అతడు పైకి చూచెను. తన ప్రజలను గతంలో నడిపించినది ఆ అగ్నిస్తంభమేనని అతనికి తెలియును. "ప్రభువా, నీవెవరవు?" అని అతడడిగెను.

"నేను యేసును," అని ఆయన చెప్పెను.

అతడు తాను పాఠశాలల్లో శిక్షణ పొంది నేర్చుకొనిన సమస్తమును, పాండిత్యమును కాలదన్ని, విద్యను కాలదన్ని ఒక మామూలు వీధి బోధకునిగా మారెను. అతడు వారికి తల నొప్పి కలిగించే ఒక నట్టుగా మారెను. "నేను వెర్రివానినయితిని," అని అతడు చెప్పెను.

అతడు పిచ్చివాడాయెనని ప్రజలు తలంచిరి. "నేను పిచ్చివాడిని కాను," అని అతడు ఫేస్తుతో చెప్పెను. అతడు ప్రభువును ఎరిగియుండెను గాని ఒక మత సంబంధములోని గుంపు ప్రభువుని ఎరిగినట్లుగా కాకుండా — దీనిని మీరు తప్పిపోకుండా వినండి — ఈనాటి ఒక మత గుంపు మధ్యలో ఉండి యేసును తెలిసికొనుట మూలముగా నీవు ఒక నట్టుగా మారుదువు. ఆ పోకడ మారలేదు. దీని మీద ఎంతో నేను చెప్పగలను, కాని ప్రార్ధన వరుస యున్నది, కాబట్టి తొందరగా ముగించవలెను.

ROM 1:17

 

30మార్టిన్ లూథర్ అను ఆ చిన్న జర్మను మత యాజకుడు ఒకనాడు ప్రభురాత్రి సంస్కారపు వస్తువులను మెట్ల మీదకు విసిరివేసి ఇట్లనెను, ''ఇది యేసుక్రీస్తు యొక్క శరీరము కాదు. ఇది కేవలము వారు తయారుచేసిన రొట్టె మాత్రమే." నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును అని అతడు ప్రకటన చేసెను. కాథలిక్కు సంఘమునకు అతడొక అంతుపట్టని ఒక నట్టుగా మారెను. వారందుకు అతనిని హతమార్చి యుండేవారే, కాని అతడు ఒక నట్టు గనుక అతని జోలికి పోలేదు. కాని ఆ తరమునకు అతడొక కొరుకుపడని నట్టుగా ఉండెను.

ఇంగ్లాండు గొప్ప అనైతిక ఘడియలో ఉండగా జాన్ వెస్లీ వచ్చెను. వెస్లీ ఉజ్జీవము రంగము మీదికి వచ్చినది. అప్పుడు మొత్తం ప్రపంచము చెడిపోయి, ఎక్కడ చూచినా నీతిహీనతయే యుండెను. ఆంగ్లికను చర్చి ఒక ఉజ్జీవము పూర్తిగా చల్లారిపోయినదన్నంత దూరపు స్థితికి వచ్చెను. అది కాల్వనిస్టు ఆలోచనా శైలి! అప్పుడు జాన్ వెస్లీ దుర్నీతిని శుభ్రపరచుచూ, శద్దీకరణ వాక్యముతో రంగము మీదికి వచ్చెను. అతడు ఒక మ్రింగుడుపడని నట్టుగా మారెను.

31వెస్లీ ఒకసారి తన పుస్తకములో ప్రస్తావించిన దానిని చెప్పుచున్నాను. ఒక త్రోవలో గుండా అతడు వచ్చుచుండెను, ఇంగ్లాండు చర్చికి చెందిన ఒక వ్యక్తి దారిలో అడ్డముగా నిలబడియుండెను. ఎందుకనగా అతనిని పిచ్చివాడని వారందరు గేళి చేయుచుండిరి. వెస్లీ చాలా చిన్న మనిషి, కాబట్టి ఇతనిని ఒక దెబ్బతో పడగొట్టుదునని ఆ పెద్దగా నున్న వ్యక్తి తలంచెను. వెస్లీ అతని యొద్దకు నడిచి వెళ్ళి, "అయ్యా, క్షమించండి. కాస్త దారిలో అడ్డం తప్పుకొంటారా? నేను త్వరగా వెళ్ళాలి," అన్నాడు.

"ఒక వెర్రివాని కొరకు నేను దారిలో అడ్డం తప్పుకోను," అని ఆ ఆంగ్లికను అతనికి జవాబిచ్చాను.

వెస్లీ విధేయతగా తన టోపీతో అభివందనము చేసి అతని తప్పించుకొని చుట్టు దారిలో వెళ్ళెను. "ఎల్లప్పుడూ ఆలాగే నేను చేయుదును," అని అతడు పలికెను. చూడండి, క్రీస్తు కొరకు ఒకరు మరియు సంఘము కొరకు ఒకరు ఒక నట్టుగా నిలబడుటను మీరు గమనించితిరా! కాబట్టి నీవు ఎవరి కొరకో ఒకరి కొరకు నట్టుగా ఉండి తీరవలయును.

32ఏబది సంవత్సరముల క్రితము ఆ పెంతెకోస్తువారు రంగము మీదికి వచ్చినప్పుడు వారందరూ ''వీరు పిచ్చివారు" అని పిలిచారు. వారు నటులుగా నున్నారు, అది నిజము, ఎందుకనగా వారు రంగము మీదికి వచ్చినప్పుడు ఆ సంఘ యుగములలో నుండిన చెడునంతటినీ వారు ఖండించిరి. కాని పెంతెకోస్తువారు చేసినది ఏమిటి? వారు కక్కిన వాంతినే తిరిగి తినుటకు వెళ్ళిరి. శాఖా సంబంధ కలుషితములోనికే తిరిగిపోయిరి. అదేమిటో మీరెరుగుదురా? అది మరియొక నట్టు వచ్చు కాలము. అవును, అది మరొక దానికి కాలము. అది నిజము!

గమనించండి, అసలు ఒక నట్టును తయారుచేయు ముందు దానికి సరిపడు బోల్టును తయారుచేయవలసియున్నది. ఆ బోల్డుకు సరిపడు మరను ఆ నట్టుకు యుండవలెను, లేనియెడల అది సరిపడదు. అప్పుడు ఆ నట్లు, బోల్టు (bolt)కు సరిపడే ఆ నట్టు ( nut) యొక్క మరను సరిచేయవలెను. గమనించండి, నోవహు దినములలో అతడి సువార్త యొక్క వర్తమానము ప్రకారముగా ఎవరినైతే దానికి తగిన విధముగా మరలు (threads)గా మరల్చెనో వారినందరిని నోవహు అను ఆ నట్లు వారిని ఓడలోనికి లాగెను. బిగించబడుటకు నీవు ఏ మరలుగా కోయబడితివో దానిపైనే అది ఆధారపడి యున్నది. నీవు లోకముతో బిగించబడియున్నట్లైతే అది నిన్ను లాగివేయును, ఒకవేళ నీవు వాక్యముతో బిగించబడియున్నట్లైతే అది నిన్ను లాగును. నీవు దేనితో బిగించబడుటకు మరలుగా కోయబడితివో, ఏ నట్టును నీవు వెంబడించుచున్నావో, అది దానిపైనే ఆధారపడి యున్నది.

కాని నోవహు దేవుని యొక్క వాక్యముతో బిగించబడుటకు ఒక నట్టు (nut)గా యుండెను. తాను జీవించిన ఆ శాస్త్రీయ యుగము మరియు మత యుగమునకు ఒక నట్టుగా కనబడుటచే, రక్షించబడుగోరు వారిని మరియు అందుకొరకే ముందుగా నిర్ణయించబడిన వారిని, ఆ నట్టుకు తగిన బోల్టుగా యుండుటకై ముందే తయారుచేయబడిన వారిని అతడు ఆ ఓడలోనికి లాగగలిగెను. ఆ బోల్డు తప్పక ఆ నట్టుకు అమరునట్లుగా మరలుగా కోయబడవలెను.

MATT 24:24

 

33ఆలాగే సాతానుకు కూడా కొన్ని బోల్టులు కొన్ని నట్లును కలిగియున్నాడు. ఆ బోల్టులు మరియ నట్టులు ఈ లోక రాజ్యమునకు సంబంధించినవి. ఫరో మోషేకు, మోషే ఫరోకు నట్టువలె కనిపించిరి. ఫరో తనయొక్క అన్ని వైజ్ఞానికపు గమ్మత్తులతో దేశమును తన వైపునకు త్రిప్పుకొనెను. అయితే దేవునికి ఒక నట్టుగా నుండిన నోవహు (మోషే - తర్జుమాదారుడు). సంఘమును వాగ్దాన దేశము వైపునకు లాగెను. నీవు ఏ విధముగా బిగించబడియున్నావో దానిపైనే అది ఆధారపడి యున్నది. నోవహు లోకము నుండి సంఘమును ఓడలోనికి లాగినట్లుగా, అతడు సంఘమును ఐగుపులో నుండి బయటకు లాగెను. మోషే ఐగుప్తులో నుండి దేవుని యొక్క వాగ్దాన దేశములోనికి సంఘమును లాగేను.

నట్లు మరియు బోర్డులు అన్నియూ ఒకే రీతిగా కనబడును గనుక జాగ్రత్తగా యుండుడి అని యేసు చెప్పెను. ఆ మరను గమనించండి. మత్తయి 24:24, "సాధ్యమయితే ఏర్పరచబడిన వారిని సహితము మోసపుచ్చునని," ఆయన చెప్పెను.

ఇప్పుడు అమెరికనులకు, మొత్తం ప్రపంచ శాఖకే ఒక నట్టు కావలెను.

34మెథడిస్టు, బాప్టిస్టు, ప్రెస్బిటేరియను మొదలగు వారందరూ ఇటు అటు చెదరిపోయి పోట్లాడుకొనుచున్నారు. కాని అటు పిదప వారందరూ ఒకే బోల్టుకు బిగించబడిరి, కాబట్టి దేవుడు వారి కొరకు ఒక బోల్టును ఇచ్చి ప్రపంచ సంఘ సమితి అనే నట్టును పంపించెను. అది వారందరిని ఏకముగా చేసి, తనవైపు వారందరిని లాగుకొనును. అది నిజము! అది నిశ్చయంగా ఆలాగే చేయును. ఆ ప్రపంచ సంఘ సమితి వారందరిని తన వైపుకు లాగుకొనును.

అది ఇంతకు ముందే ఇక్కడకు రావలసియున్నదని మీరు తెలిసికొనండి. ఒక కారణము లేకుండా ఏదియూ జరుగదు. స్త్రీలు తమ దుస్తులు తీసి పారవేసి, అర్ధనగ్నంగా పొట్టి నిక్కర్లు వేసికొని తిరుగుటకు ఆశించుచున్నారు. వారింకా సంఘమునకు చెందినవారుగా, సంఘ సభ్యులుగా పిలువబడాలని ఆశించుచున్నారు. 'బికినీ' లేదా ఇంకా ఏవేవో పేర్లు పెట్టి పిలచుచున్న వానిని వారు ధరించవలెనని కోరుచున్నారు. వారు అది చేయగోరుచున్నారు. అయినా సంఘ సభ్యులమేనని చెప్పుచున్నారు. వారు కేకలు వేసి, గోల పెట్టి, నాట్యమాడి, ఆరాధన చేయగోరుచున్నారు. అది ఒక ఆరాధన.

35నాకు సమయమున్నచో దానిని మీకు రుజువు చేయుదును. అది ఒక దయ్యపు ఆరాధన. ఆలాగు నాట్యమాడుచు, అట్టి పనులు చేయుట దయ్యపు ఆరాధన. అన్యుల దేశములో దానిని మీకు రుజువు చేయగలను. వారు ఆరాధన చేయుచూ, తమ సాక్ష్యము నిలబెట్టుకొంటూ ఇంకా సంఘములో నిలిచియుండగోరుచున్నారు. కనుక దేవుడు వారికి ఒకటి, రెండు, మూడు నట్లు ఇచ్చెను. ఒకని పేరు ఎల్విస్ ప్రేస్లీ, మరొకరు పాట్ బూన్, మరొకరు ఎర్నీ ఫోర్ట్. పాటలు పాడుతూ, ఇంకా ఏవేవో చేయుచూ, క్రైస్తవునిగా చలామణీ అగుచున్నారు. అది ఒక నట్టు. అది వాక్యమనే బోల్టుతో బిగించబడిన నట్టుగా లేదు. నిజము.

అర్థగంటలో ముగించుదునని నేను చెప్పాను, అది అయిపోయినది. కాని వినండి, లోకము ఒక నట్టును కోరుకొనుచున్నది. వారది పొందునట్లుగా దయ్యము సహాయము చేయుచున్నది. వారిదివరకే దానితో బిగించబడిరి. లోకము ఈ విధముగా ఒక నట్టును కలిగి తనతో బిగించబడియుండగా, అదే సమయమున అచ్చట వధువు అను ఒక జనాంగము కూడా యున్నది. అది కూడా ఒకదానితో బిగించబడియున్నది. నేనిక్కడ నిలబడియుండుట ఎంత నిజమో, అంతే నిజముగా ఇది జరుగునని చెప్పుచున్నాను. దేవుడు ఒక నట్టును పంపి, ఈ గందరగోళములో నుండి దేవుని సన్నిధిలోనికి వధువును లాగును. అది వాక్యపు మరలు గల నట్టుగా ఉండును.

EXOD 7:1•

JOHN 10:34

 

36ఒక విమర్శకుడు కొద్దిరోజుల క్రితము టూసాన్లో నాతో ఇట్లనెను, "నీకు తెలియునా, కొందరు నిన్ను నట్టు అనుచున్నారు. మరికొందరు నిన్ను దేవుడని పిలచుచున్నారు.''

"సరే, ఆలాగే అననీయండి, మంచిది," అన్నాను. అతడు నన్ను విమర్శించుటకు ప్రయత్నించుచున్నాడని నాకు తెలియును, చూచారా.

"ప్రజలు నిన్ను దేవుడని తలంచుచున్నారు," అని అతడనెను.

నేనిట్లు చెప్పాను, "సరే, కేవలము…." ప్రజలు ఆలాగు చేయరని నాకు తెలియును. దానిని అతడు అర్ధము చేసికోలేదని నాకు తెలియును, ఎందుకనగా అతడు అవిశ్వాసపు తీరాన యున్నాడు. మీరు చూచారా? దానిని అతడు తెలిసోకోలేదని నాకు తెలియును. "అది దేవుని యొక్క వాక్యమునకు అంత దూరము కాదు గదా?" అని నేను చెప్పాను. చూచారా? మనము నశించిపోలేదని అతనిని తెలిసికోనిమ్ము. మనమెక్కడ నిలబడియున్నామో మనకు తెలియును. ఎటువంటి నావలు మనము సిద్ధము చేసికొన్నామో, ఎటువంటి గాలి వీచుచున్నదో, మనయొక్క మర ఎట్టిదో, మనయొక్క నట్టు ఎట్టిదో, మనమేలాగు నిలబడియున్నామో మనకు తెలియును. "అది దేవుని యొక్క వాక్యమునకు అంతగా విరుద్ధమైనది కాదు, నిజమే కదా?" అని నేను అన్నాను. గుర్తుంచుకొనండి, ఇశ్రాయేలీయుల యొద్దకు దేవుడు మోషేను పంపినప్పుడు, మోషేను ఒక దేవునిగా తయారుచేసెను. అది నిజము! తనయొక్క సోదరుడగు అహరోను ఒక ప్రవక్తగా చేసెను," అని చెప్పాను. అది నిజము! 'ప్రవక్తలందరూ దేవుళ్ళని' యేసు చెప్పెను. 'వారు మానవ దేవుళ్ళు.' అది నిజము! దేవుడు ఆ విధముగా దానిని తలపెట్టెను.

37వినండి, ఈ ఉదయకాలమున మేము బోధించిన సువార్త మరియు నేను చెప్పిన వాక్యము ఇదే. ''దేవుడు చర్మముల వెనుక సముద్ర వత్సల చర్మములోను దాగియున్నాడు. ఒక మానవ చర్మము వెనుక దాగియున్నాడు." చూచారా? ఆయన ఆలాగే చేసెను. దేవుడు ప్రపంచములో ప్రత్యక్షమయినప్పుడు ఒక ముసుగు వెనుక, యేసు అని పిలువబడిన ఒక మానవ చర్మము వెనుక ఆయన దాగియుండెను. ఆయన ముసుగు వేయబడి మోషే అను మానవ పేరు గల ఒక చర్మము వెనుక దాగియుండెను. వారు దేవుళ్ళు, దేవుళ్ళు కాదు, కాని వారిలో దేవుడైయుండి, ఒకే దేవుడు - కేవలము ఆయన ముసుగు మాత్రమే మార్చుకొనుచుంటూ, ప్రతిసారి ఆయన అదే చేయుచూ ఈ వాక్యమును తీసికొని వచ్చుచుండెను. చూడండి, దేవుడు దానిని ఆలాగు నీయమించెను.

ఈ లోకమున జన్మించిన మన ప్రతిఒక్కరు…

38ఈ ఉదయకాలమున నేను చెప్పినట్లుగా, అక్కడ మోషేను వెంబడించుచూ అచ్చటకు వెళ్ళుటకు ఎవరికీ ధైర్యము లేదు. దేవుడు ఒకేసారి ఇద్దరితో పనిచేయడు, ఆయన ఎప్పుడూ ఒకనితో మాత్రమే పనిచేయును. మోషేను ఎవరూ అనుకరించుటకు ధైర్యము కలిగిలేరు. అతనిని అనుకరించి ప్రయత్నించినచో మరణమే. స్వాభావిక మరణమే. అతనితో పాటుగా ఆ అగ్నిస్తంభములో ప్రవేశించి ప్రయత్నించినచో మరణమే సంభవించును. ఆ సహజాతీతమగు దానిలోనికి చొచ్చుకొనిపోవునట్లుగా నీవు నిర్మాణము కాలేదు. ప్రజలు ఆలాగు రూపించబడలేదు… అయితే దేవుడు తనకు రాయబారులుగా నుండుటకు, తనకు ప్రతినిధులుగా నుండుటకు కొందరిని భూమి మీద నీయమించెను. తెలియబడని ఆ గొప్ప సహజాతీతమగు దానిలోని ప్రవేశించి, దానిని వివేచించుటకు ఆ రాయబారి దేవునిచే అభిషేకించబడి, స్వాభావిక మనస్సు గ్రహింపజాలని సంగతులను అతడు బయటకు తెచ్చును. దేవుని యొక్క మర్మమును అది బయటకు తెచ్చును, జరుగబోవు సంగతులను గూర్చి ముందే చెప్పును. ఉన్నవాటిని, జరుగుచున్న వాటిని ముందే చెప్పును. ఏమిటది? దేవుడు, చర్మముల వెనుక, మానవ శరీరము వెనుక ఉన్న దేవుడు! అక్షరాలా నిజము!

39సామ్ కాన్నెల్లీ, టుసాన్లో జీవించుచున్నాడు. శ్రీ. కిడ్ తో కలిసి అతడు చాలా సంవత్సరముల క్రితము ఇక్కడికి వచ్చి చాలా సంవత్సరముల నుండియున్న అల్సర్ నుండి స్వస్థత పొందెను. గత ఆకురాలు కాలములో నేను వెళ్ళినప్పుడు, చలువరాతి అంత పెద్దగానున్న ఒక రాయి సామ్ లో ఉండెను. టుసాన్ లోని నిపుణుడు దానిని పరీక్షించెను. సహో, సామ్ కాన్నెల్లీని మీలో చాలామంది ఎరుగుదురు. అతడు ఓహియో నివాసి. అతనికి వైద్యుడీలాగు చెప్పెను, "సామ్, వచ్చేవారము నీవు సిద్దపడి రా. నేను ఆ రాయిని బయటకు తీసివేతును."

ఇంకా కొన్ని రోజులలో, "నేను ఆ రాయిని మలము ద్వారా విసర్జించగలనా డాక్టర్?" అని అతడు ప్రశ్నించెను.

"అది అసాధ్యము. రాయి చాలా పెద్దగా యున్నది," అని చెప్పెను.

కాబట్టి అతనిని కారులో ఎక్కించుకొని ఇంటికి తీసికొనిపోయెను. అతడు నన్ను ఫోనులో పిలచి ఇట్లనెను, "బ్రెన్హాం సోదరుడా, నీవు వచ్చి నా కొరకు ప్రార్దించవలెనని కోరుచున్నాను." అటువంటి దానికొరకు అతడు నన్నెందుకు పిలిచినట్లు?

నేనతని కొరకు ప్రార్ధించనారంభించాను. "సామ్, ఇది యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు. ఆ రాయి దానికదే పోవును," అని నేను చెప్పాను.

మరుసటి ఉదయాన అతడు వైద్యుని యొద్దకు ఆ రాయిని తీసికొనిపోయెను. వైద్యుడు ఇట్లనెను, "శ్రీ. కన్నెల్లీ, ఇదెట్లు జరిగినదో నాకు ఏమి అర్ధమగుట లేదు."

అందుకతడీలాగు చెప్పెను, "నేను దేవుని యందు విశ్వాసముంచు వ్యక్తిని. దేవుడు ఆ రాయి నా కొరకు బయటకు తీసివేసెను." ఆ వైద్యునికది నమ్మశక్యము కాలేదు. నా భార్య ప్రక్కలో నుండి పెద్ద కంతి కనబడకుండా పోయినప్పుడు, ఎట్లు ఆశ్చర్యపడినదో, ఆలాగే ఈ విషయములోను ఆశ్చర్యపడిరి. దానిగూర్చి మీకు తెలియును, చూచారా. కాబట్టి అతడు ఈలాగు చెప్పెను…

40సుమారు ఆరు నెలల తర్వాత అనగా దాదాపు రెండు మూడు వారముల క్రితము శ్రీ. సామ్ కన్నెల్లీ తీవ్రమగు గుండె వ్యాధికి గురికాబడెను. దాని పేరు నాకు తెలియదు. కరోనరీ లేదా ఏదో రకమగు గుండెపోటు. అది చాలా ప్రమాదకరమైనది. అది వచ్చినచో నీవు బ్రదుకవని అందురు. గుండెపోటు. అతని గుండె స్తంభించిపోయినది. అతని అవయవములు పొంగినవి. అతని చీలమండలు అతని కాళ్ళకంటే వాచిపోయినవి. కనుక వారతనిని వైద్యుని యొద్దకు తీసికొనిపోయిరి. వైద్యుడు ఇట్లనెను, "అతనిని నెమ్మదిగా ఇంటికో లేక ఆస్పత్రికో తీసికెళ్ళండి."

"నేను ఆస్పత్రికి వెళ్ళగోరుట లేదు!" అని సామ్ చెప్పెను.

"ఇతనిని ఇంటికి తీసికొనిపొండి. పడక మీద వేసి తలగాని, చేయిగాని లేదా కాలు గాని ఆరునెలల పాటు కదపనీయవద్దు. నీవు ఏ నిమిషములోనయినా చనిపోదువు," అని వైద్యుడు చెప్పెను.

41సహోదరుడు నార్మన్ పిలచినప్పుడు సహోదరుడు సామ్ ను చూచుటకు ఆ రాత్రి మేము వెళ్ళి అతనికి ప్రార్థించినప్పుడు ప్రభువు మాట్లాడెను. మరుసటి ఉదయాన మేము సామ్ వైద్యుని కార్యాలయమునకు వెళ్ళి, కాళ్ళు చాపి నిలబడి వైద్యునితో, "నన్ను చూడండి డాక్టర్" అని చెప్పెను.

వైద్యుడతనిని ఒక విద్యుత్ పరీక్షా యంత్రము క్రింద ఉంచి ఇట్లనెను, "ఇది నాకు అర్ధము అగుట లేదు. నీవు నీ పనికి తిరిగి వెళ్ళు. నీవు ఏ సంఘమునకు చెందినవాడవు?"

"వాటిల్లో నేను దేనికీ చెందినవాడిని కాను," అని అతడు జవాబిచ్చెను.

అందుకతడు ఇట్లనెను, "ఏ శాఖకూ చెందకుండా, నీవు ఒక క్రైస్తవునిగా ఉండజాలవు. నీవు ఏదో ఒకదానికి చెందియుండవలసియున్నావు." చూడండి, ఆ వైద్యునికి తెలిసినదంతయూ అదియే. సామ్ అతనికి ఒక నట్టు వలె ఉండెను. అటువంటి ప్రశ్న అడుగుట ద్వారా సామ్ కు వైద్యుడు ఒక నట్టుగా ఉండెను.

అప్పుడు ఏమి జరిగినది? సామ్ వచ్చి నాతో ఇట్లనెను, "ఆ విధంగా నన్ను ప్రశ్నించువారికినేనేమి చెప్పగలను? బ్రెన్హాం సోదరుడా?" "నీవు ఒకే ఒక్క సంఘమునకు మాత్రమే చెందియున్నావని చెప్పుము. అందులో నీవు చేరలేదు; అది ఒక శాఖ కాదు; దానిలోనికి నీవు జన్మించియున్నావు."

JOHN 12:32

 

42సుమారు ఆరు నెలల క్రితం ఒక స్త్రీ, సహోదరి నార్మన్ భుజము మీద ఆనుకొనియుండెను. ఆమె పేరు నేను మరచిపోయాను. ఆమె చాలా అందంగానున్న ముప్పదేండ్ల స్త్రీ. ఆమె, ఆమె భర్త వేరైరి. ఆమెకు లుకేమియా వ్యాధి వచ్చినది. ఆమె అసలు లేవలేని స్థితిలోనికి వచ్చినది. చివరకు పరిస్థితి విషమించి, వైద్యులామెను పడకలో యుంచిరి. వైద్యులు ఆమెకు పరిచర్య చేసి మరుసటి బుధవారమువరకు మందులు ఇచ్చుచుమని చెప్పిరి. ఆమె బుధవారములోగా చనిపోవునని అనిరి. శ్రీమతి. నార్మన్ ఆమెను ఏలాగో పడక మీద నుండి లేపినది. బయటకు తెచ్చి కుర్చీలో ఆమెను కూర్చోబెట్టినది. ఆమె చిన్నగా యుండి, పాలిపోయి కుర్చీలో ముందుకు వెనుకకు జోగుచూయున్నది. లుకేమియా అనగా కాన్సరు వలన శరీరము పసుపు రంగుగా మారినది.

"సరే, సోదరీ, నీ కొరకు నేను ప్రార్ధించగలను," అని నేను చెప్పాను.

ఆమె మాట్లాడ ప్రయత్నించినది మరియు కళ్ళ నుండి నీరు కారుచుండగా, ఆమె ఏదో చెప్ప…

"నీవొకక్రైస్తవురాలివా," అని నేను ఆమెను అడిగితిని.

"నేను ఒక మెథడిస్టును," అన్నదామె.

"క్రైస్తవ సంఘమునకు చెందియున్నాననేగా మీ అర్ధము," అని ఆమె అన్నది.

"కాదమ్మా! నీవు దేవుని ఆత్మమూలముగా జన్మించితివా? ప్రభువైన యేసును ప్రేమించుచున్నావా?" అనడిగాను.

"నేను ఎల్లప్పుడూ ఒక సంఘమునకు చెందియున్నాను," అన్నదామె.

"దేవుడు నీకు జీవము ఇచ్చినయెడల నేను నీకు ప్రభువు యొక్క మార్గము మరింత తేటగా చూపించగలుగునట్లుగా, నా యొద్దకు తిరిగి వచ్చుచునని వాగ్దానము చేసెదవా?" అని అడిగాను.

"నేను దేవునితో ఏ వాగ్దానమైనా చేయుదును. ఆయన నా జీవితమును రక్షించినచో, ఆయనను నేను సేవించెదను," అన్నదామె.

అప్పుడే ఒక దర్శనము వచ్చినది, చెప్పెను, "యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు, సిద్దపడవద్దు; మరణమును గూర్చిన నీ సంగతులను ఎల్లుండి నీవు విచ్చిన్నము చేయుదువు. (అది సోమవారము. ఆమె బుధవారము చనిపోగైయున్నది.) నీవు చనిపోవు." గత ఆదివారము, అనగా ఈ ఆదివారమునకు ఒక వారము అయినది, ఆమెతో నేను గదిలో కూర్చొనియున్నాను. ముప్పది పౌనులకన్నా ఎక్కువ బరువు పొందినది. ఆమెలో ఎక్కడ ఒక్క లుకేమియా లక్షణము కూడా కానవచ్చుట లేదని వైద్యుడు చెప్పెను. ఆమె ప్రభువు యొక్క మార్గము తెలిసికొనగోరినది. ఆమె యేసుక్రీస్తు నామములో బాప్తిస్మము పొందునట్లుగా ఆమెను పొలములో నున్న ఒక చెరువు యొద్దకు తీసుకు వెళ్ళితిని. ఒక నట్టు కావచ్చును, "నేను పైకెత్తబడినప్పుడు, మనుష్యులందరినీ నా వైపుకు ఆకర్షించుకొందును."

43ఇక్కడ టేపులు తీయు కుర్రవాని పేరు లియో మెర్సియర్; అతడు పరీక్షా కోర్టులో నిలబడవలసి వచ్చెను. నేను కొందరి కొరకు ప్రార్ధించుచున్నాను. లోకర్ అను పేరుగల ఒకామె కొరకు నేను ప్రార్ధించాను. ఆమెకు కాన్సరు వలన పధ్నాలుగు ఆపరేషనులు జరిగినవి. వైద్యులు ఆమె చనిపోవునని చెప్పిరి. ఆమెకు ప్రార్ధించి, ఆమె చనిపోదని చెప్పాను. ఆమె బ్రదుకునని అన్నాను. కాన్సరు వ్యాధి యొక్క లక్షణము అసలు ఎక్కడా ఆమెలో లేదు. ఆ కారణము బట్టి ఆమె అచ్చట ప్రాణములతో నిలబడియుండుట వలన ఆమె కుటుంబములోని ఇరువది-ఎనిమిది మంది కుటుంబ సభ్యులు రక్షించబడి, పరిశుద్ధాత్మతో నింపబడిరి. ఆమె ఒక నట్టుగా కనబడియుండవచ్చును. కాని వచ్చుటకు ఇచ్చయించు వారినందరిని ఆయన తనయొద్దకు ఆకర్షించుకొనుట అదే ఆయన విధానమైయున్నది. ఆ మర వాక్యముతో బిగించబడిన విధముగా కోయబడినది. నా భావము గ్రహించారా?

44మొన్న ఒక ఉత్తరము నాకు అందినది. అది ఫైలులో యున్నది. సంవత్సరం క్రితం, అనగా గత ఆకురాలు కాలములో లేదా నేను వేట కొరకు వెళ్ళేటప్పుడు, అది ఒక సంవత్సరమునకు ముందు… ఆస్కర్ అను పేరు గల రెడ్-ఇండియన్ జాతి బాలునితో కలిసి మేము ప్రధాన-రహదారి యందు వేటకు వెళ్ళితిమి. అచ్చటే ప్రభువు యొక్క దూత ఆ కారిబో (Caribou) అనే జింకను మరియు ఒక పెద్ద గోధుమ రంగు ఎలుగుబంటిని అచ్చట కనబడునట్లు వాగ్దానము చేసెను. దానిని గురించి ఇచ్చట మీ దగ్గర ఇంతకు ముందే చెప్పియున్నాను. అది మీకందరికి జ్ఞాపకముండియుండును. నేను నడుచుకుంటూ లోపలికి వచ్చినప్పుడు అప్పుడు ఆ బాలుడు… ఆ గుడారములోకి వచ్చెను. అది గత వసంతకాలము. సహోదరుడు బడ్, నన్ను ప్రార్ధించమని చెప్పినప్పుడు (ఈ బాలుడు తన చేతులకు యున్న గ్లోవ్స్ ను తీసివేసెను, అతడు గుర్రమును స్వారీచేయుచున్నాడు) - ఆ బాలుడు మరల ఆ చేతి తొడుగులను చేతికి వేసుకొని బయలుదేరుటకు సిద్ధముగా యున్నాడు. అతడు ఒక కాథలిక్కు గనుక అతడు ప్రార్ధించుట యందుతనకేమీ సంబంధము లేనట్లుగా యుండెను.

MATT 6:9•

LUKE 11:2

 

45గత ఆకురాలు కాలములో అతడు నా ప్రక్కనే నిలబడియుండెను. ఆ సమయములో ఆమె తల్లి గుండె పోటుతో చనిపోవుచుండెను, "మీరు వచ్చి ఆమెకు ప్రార్ధన చేయరా?" అని అతడిగెను. అక్కడున్నఇండియనుల యొక్క ఆ చిన్న గుడిసెలోనికి నేను వెళ్ళాను. అక్కడ వారందరూ చనిపోవుచున్న ఆ తల్లి చుట్టూ మూగియుండిరి, ఒక్క ఇంగ్లీషు మాటయూ మాట్లాడలేరు. పరిశుద్ధాత్మ దిగి వచ్చి, ఒక అనువాదకుని ద్వారా, అనగా ఆమె కుమార్తె ద్వారా ఏమి జరిగినదో ఆ తల్లికి చెప్పెను. ఆమె పేరు సహితము చెప్పెను, ఆమె ఏ తెగకు చెందినచో, ఇదేలాగు జరుగునో ఆమెతో చెప్పెను. ఆ తల్లి ఆ క్షణమందే స్వస్థత పొందెను.

మరుసటి ఉదయాన వారిని చూచుటకు నేను తిరిగి వెళ్ళినప్పుడు, వారందరూ అక్కడ కూర్చొనియుండిరి. ఒక గొర్రె కొరకు తిరిగి నేను నలుబది మైళ్ళు స్వారీ చేసికొని వెళ్ళాను. ఆమె మూస్ అను జంతు మాంసమును ఎండ బెట్టుటకు గుర్రము మీద వెళ్ళుటకు సిద్ధపడుచున్నది. నేనిట్లు చెప్పాను, "గత రాత్రి నేను ప్రార్ధించినప్పుడు, పరలోకమందున్న మా తండ్రి అన్నాను. కాథలిక్కు ప్రార్ధన కూడా అదే గనుక మీరందరూ ఏకీభవించిరి. నేను మీకే విడిచిపెట్టాను. ఇప్పుడు నేను దేవునికి వందనములు మాత్రమే చెల్లించగోరుచున్నాను. మేము ప్రార్ధనలు వల్లించము; మేము ప్రార్ధించెదము."

"మేము ఇక ఎంత మాత్రము కాథలిక్కులము కాము!" నీవు నమ్మినట్లుగానే మేము నమ్ముదుము. మా అందరిని తీసికొని వెళ్ళి, నీవు బాప్తిస్మమిచ్చు రీతిగా మాకు బాప్తిస్మము ఇమ్ము. మాకు పరిశుద్ధాత్మ కావలెను!"

46ఆ పర్యటన నుండి వెనక్కు వస్తుండగా… ఆ కుర్రవాడు అంతకు కొన్ని నెలల ముందే తన గుర్రములను పోగొట్టుకొనెను. వాటిని అతడు కనుగొనలేకపోయెను. అచ్చట యుండే అతడు మార్గదర్శి, "ఆస్కార్, నీవు ఆ విధంగా గుర్రములను విడిచిపెట్టుట మంచి పని కాదు. ఈ పాటికే ఎలుగుబంట్లు (చాలా ఉన్నవి) వాటిని తినివేసియుండును" అని అతడనెను.

అతడు నా దగ్గరగా నిలబడియుండెను. ఒక రాత్రి నాతో, "ఒక సంగతి మిమ్మునడగనా?" అనెను.

"ఆలాగే," అన్నాను.

బ్రెన్హాం సోదరుడా, దేవునికి ప్రార్ధించు! దేవుడు నా గుర్రములను తిరిగి నాకిచ్చును,'' అన్నాడు

"ఎలుగుబంట్లు వాటిని తినివేసియుండునని, బడ్ అన్నాడు కదా?" అని నేను పలికాను.

"బ్రెన్హాం సోదరుడా, దేవుని అడుగు! దేవా, ఆస్కార్ కు అతని గుర్రములను తిరిగి ఇచ్చివేయుము," అని చెప్పు అనెను.

"ఆస్కార్, అది నీవు నమ్ముచున్నావా?" అనడిగాను.

"నేను నమ్ముచున్నాను. దేవుడు నా తల్లిని బాగుచేసెను. ఎలుగుబంటి ఎక్కడున్నదో, వేట ఎక్కడున్నదో దేవుడు నీకు చెప్పెను. ఆ వేట ఎక్కడున్నదో నీకు చెప్పిన దేవుడు నా గుర్రములెక్కడున్నవో ఎరుగును," అని పలికెను.

47ఒక సంవత్సరము క్రితము ఫ్రెడ్ సాత్మన్ ఈ రాత్రి ఇక్కడున్నాడు, నా కుమారుడగు బిల్లీపాల్లతో అక్కడ నిలబడియుండగా, పరిశుద్ధాత్మ దిగి వచ్చెను. నేనిట్లు చెప్పాను, "ఆస్కార్, నీవు నీ గుర్రములను కనుగొందువు. అవి మంచులో నిలబడి యుండును. గతవారము నాకు వ్రాసిన ఉత్తరము అక్కడున్నది. అది శుక్రవారము అందినది. ఇప్పుడది ఆ ఫైలులో యున్నది: "బ్రెన్హాం సోదరుడా, గుర్రములు మంచులో నిలబడియుండుటను ఆస్కార్ కనుగొనెను!"

అమెట్లు బ్రదికినవో ఎవరికీ తెలియదు. సంవత్సరములోని ఈ జూన్ మాసములో ఎక్కువగా మంచు ఉండును. వాటి చుట్టూ ఇంకా ఇరవై లేక ముప్పయి అడుగుల మంచు ఉన్నది. ఈ లోయలో అంత శీతాకాలములో అవెట్లు బ్రదికియుండినవి? ఆస్కార్ మంచు బూట్లు వేసికొని, వాటి యొద్దకు వెళ్ళగలడు, కాని గుర్రములకు అతడు మంచు బూట్లు వేయలేడు కదా? అయితే ప్రభువు యొక్క మాట ప్రకారము వాటిని కనుగొనెను! అది ఒక నట్టువలె వినిపించవచ్చును; ఒక్కసారి దానిని నమ్మండి. నీ మరలు ఎట్లున్నవో దాని మీదనే అది ఆధారపడియుండును.

JOHN 1:1

 

48దాని మరలు ఒక శాఖతో బిగించుటకు సరిపోవును. అది వాక్యముతో మాత్రమే బిగించుటకు సరిపోవును. ఆ వాక్యమును నమ్ము కొందరు జనులు ప్రపంచములో యున్నారు! వధువును సిద్ధపరచి బయటకు తెచ్చుటకు ఒక నట్టు [స్పష్టతలేని మాటలు], ఏలయనగాపెండ్లికుమార్తె, పెండ్లికుమారుడు ఒకటి, మరియు… దేవుడు ఒక్కడే, వాక్యమే దేవుడు! అది వాక్యముతో బిగించబడియుండవలయును, అప్పుడది ఆ వధువును ఈ శాఖలలో నుండి వెలుపలకు లాగును.

అవును, అతడు నన్ను విమర్శించగోరెను.

దేవుడు చర్మముల వెనుక, మానవ చర్మము వెనుక దాగియున్నాడన్న విషయము గూర్చి మాట్లాడుట ఈ ఉదయమున నాకు గుర్తువచ్చుచున్నదని మీరు తెలిసికొనుడి.

49చిన్న కథ చెప్పి నేను ముగించెదను. ఇప్పటికి నలుబది-అయిదు నిమిషముల పాటు ఇక్కడ మిమ్మును ఉంచినందుకు నేను చింతించుచున్నాను. అక్కడ ఒక గృహము గలదు. క్రైస్తవ గృహము. ఈ కథను నేను ఆ విమర్శకునికి చెప్పాను. ఈ గృహములోని వారు దేవునియందు విశ్వాసముంచిరి. వారికి ఒక చిన్న బాలుడుండెను, అతడు తుఫాను వలన మరణ భయము కలిగియుండెను. మెరుపులు మెరిస్తే, వాటిని చూచి ఓ, చనిపోదునని భయపడుచుండెను. అతడు బల్లల క్రిందకు, ఎక్కడెక్కడికో పరుగిడుచుండెను గాని మెరుపులు వచ్చుచుండెను.

కాబట్టి ఒక రాత్రి పొలములో పెద్ద తుఫాను వచ్చుచుండెను. వారచ్చటే నివసించుచున్నారు. చెట్లు ఊగుచుండెను, మెరుపులు మెరయుచుండెను, చాలా రాత్రి అయినది. తల్లి ఆ పిల్లవానితో ఇట్లు చెప్పెను, "చూడు బాబూ, నీవు వెళ్ళి పై అంతస్థులోని పడక మీద పరుండు, భయపడవద్దు; పైకి వెళ్ళు."

కాబట్టి ఆ చిన్నవాడు పైజామా వేసికొని మెట్లు ఎక్కి వెళ్ళుచూ, వెనక్కి చూస్తూ, సగము ఏడుపుతోనే చేరెను. పరుండి నిద్రపోవ ప్రయత్నించి తల కప్పుకొనెను. అయినా నిద్రపట్టలేదు. కిటికీ గుండా ఆ మెరుపులు, ఉరుములు వినబడుచున్నవి. "ఓ అమ్మా, నీవిక్కడికి ఎక్కివచ్చి నాతో పరుండు," అని అతడు పిలిచెను.

"బాబూ, ఆ మెరుపులు నీకేమీ బాధ కలిగించవు. ఆ ఉరుములు నిన్నేమీ బాధించవు,'' అని ఆమె చెప్పెను.

అయినాగాని, "అమ్మా, వచ్చి ఇక్కడ నాతో పరుండవా?" అని అతడడిగెను.

కాబట్టి తల్లి మెట్లు ఎక్కిపైకి వెళ్ళి, ఆ బాలునితో కూడా పరుండెను. "బాబూ, నా చిన్న కుమారుడా, మనము క్రైస్తవులము. మన కుటుంబము దేవుని నమ్మిన కుటుంబము. దేవుడు తుఫానులలో మనలను రక్షించునని నమ్ముచున్నాము. అది మన విశ్వాసము. దేవుడు తన వారిని గూర్చి శ్రద్ధవహించును." "నీవు కూడా అది నమ్మవలెనని నా కోరిక బాబూ. భయపడవద్దు; దేవుడు మనతో యున్నాడు, ఆయన మనలను రక్షించును," అని ఆమె చెప్పెను.

చిన్నవాడు కొన్నిసార్లు ఊపిరి విడచి ఈలాగనెను, "అమ్మా, అది నేను కూడా నమ్ముచున్నాను. కాని ఆ వెలుగు కిటికీకి అంత దగ్గరగా వచ్చినప్పుడు, దేవుడు ఒక చర్మముతో నా దగ్గర ఉండినయెడల, అది ఎంతో బాగుండునని నాకు అనిపించుచున్నది." కావున మనలో చాలామంది పెద్దవారము కూడా ఆలాగే తలంచుదము. దేవుడుకు తెర లేదా చర్మము వంటి ముసుగు యుండిన బాగుండుననియు. అది లోకమునకు వెర్రి వలె అనిపించవచ్చు గాని, అది మనుష్యులనందరిని ఆయన యొద్దకు లాగుచున్నది. మనము ప్రార్దించుదము.

EPH 4:11•

COL 1:19•

COL 2:9

 

50పరమతండ్రీ, ఇవి అనుభవములతో కూడిన చిన్న గాధలు. కొన్నిసార్లు అవి ఒక కారణము వల్లనే జరుగును. అది ఎంత గజిబిజిగా యున్ననూ, అవి ఎందుకొరకు జరిగినవో ఆ భాషను మేము అర్ధము చేసికొందుము. ఈ రాత్రి మేము ప్రభువా, దేవుడవగు నీ యంతట నీవే స్వకీయముగా మాలో నివాసము ఏర్పరచుకోగలవు. కాబట్టి నీకు వందనములు చెల్లించుచున్నాము. మా కొరకు ప్రాయశ్చిత్తమును ఏర్పరచుటకై నిరపరాధియగు నీతిమంతుడగు యేసు రక్తము చిందించబడినందుకు మేము కృతజ్ఞతస్తుతులు చెల్లించుచున్నాము. ఆయనే దేవత్వము యొక్క సర్వ పరిపూర్ణత, శరీరరీత్యా దేవత్వము యొక్క సంపూర్ణత ఆయనే. ఆయన తన ప్రశస్త జీవమును మాకై ఇచ్చెను, బలవంతముగా ఆయనలో నుండి దానిని తీసికొనుట కాదు గాని, ఆయనే దానిని తన హృదయపూర్వకముగా ఇచ్చెను. అందువలన మేము ఆయన జీవించిన షకీన మహిమ యొక్క ఆయన పరిపూర్ణ సన్నిధిలో మేము ఆనందించుచున్నాము. ఆయన రక్తముతో మా ఆత్మలు పవిత్రీకరించబడి, ఆ గొప్ప పరిశుద్ధాత్మ మాలో జీవించుటకు వీలు ఏర్పడుచున్నది. ప్రభువా, మేము అవసరతలుగల వానికొరకై బోధకులము గాను, ప్రవక్తలముగాను మరియు అనేక విధములైన వంటివారుగా యుంటూ, దేవుని యొక్క వరములను కలిగినవారమైయున్నాము. దేవుడు తనంతట తానుగా ఆధునిక కాలమందు, తనయొక్క గొప్ప వరములను బయలుపరచుచు ప్రకాశింపజేయుచున్నాడు.

ACTS 20:29•

1COR 1:21,25•

1COR 2:4•

2COR 12:11

 

51ప్రభువా, 'నట్ (nut)' అనే పరిపక్వము లేని ఈ మాటను బట్టి…

నేడున్న ఈ సంఘము యొక్క పరిస్థితిని బట్టి మేము చెప్పిన దానిని అర్ధము చేసుకొనుటకు నేటి కాలమందు కొద్ది సమయము పట్టునని మేము ఎరుగుదుము, ఎందుకనగా వారు క్రొత్త సంఘముల యందు, క్రొత్త సంస్థలయందు చేరుటలోనే యున్నారు. వాక్యముతో బయటకు వచ్చిన వ్యక్తి ఒక నట్టుగాను, పిచ్చివానిగాను పరిగణించబడుచున్నాడు. ఒక వేదాంత పండితునిగా, ఒక యాజకునిగా ఉండుటకు తర్ఫీదు పొందిన ఆ గొప్ప అపోస్తలుడగు పౌలు దేవుని మహిమార్ధము తాను వెర్రివానినయితినని చెప్పెను. అతడు తన విద్యను వదిలిపెట్టెను. ప్రజలు మెరుగు పెట్టిన మాటలు వినకుండా జాగ్రత్తపడెను. వశపరచుకొను మాటలతోను, మానవ జ్ఞానముతోను తాను రాలేదని అతడు చెప్పెను. వారి విశ్వాసము ఆలాటిది కాకూడదని అతని ఉద్యేశ్యము. అతడు ప్రవచించినట్లుగా ఈనాడు సంఘమేలాగు తిరిగిపోయినదో చూడండి. "నేను వెళ్ళిపోయిన తరువాత తోడేళ్ళు ప్రవేశించి, గొర్రెలను ఏ మాత్రము కనికరించవు." కాని తాను శక్తి తోను, పరిశుద్ధాత్మ యొక్క ప్రత్యక్షతలతోను వారి విశ్వాసము దేవుని యందుండునట్లుగా వారి యొద్దకు వచ్చుచునని చెప్పెను.

తండ్రి, అతడు యేసును తెలిసికొనుటకు ఒక వెర్రివాడాయెను. ప్రభువా, ఈనాడు మేమునూ ఆలాగే యున్నాము. పిచ్చివారుగా పరిగణించబడిన జనులు ఇచ్చట కూర్చొనియున్నారు, ఎందుకనగా వారు తమ స్వస్థత కొరకు, తమ నిత్య గమ్యము కొరకు, దేవుని నమ్ముటకు సిద్దముగా యున్నారు. ఆయనను ఆరాధించుటకు, ఆయనకు వందనములు చెల్లించుటకు, ఆయనను స్తుతించుటకు, దేవుని ఆరాధించుటలో తమ ఆత్మకు స్వాతంత్ర్యము ఇచ్చుటకు వారు తమ ప్రతిష్టను పణముగా పెట్టియున్నారు. వారు ఉన్మాదులుగా ఎంచబడియున్నారు. కాని దేవుని యొక్క వెర్రితనము మానవుని యొక్క జ్ఞానముకన్నా బలమైనది అని నీవు చెప్పియున్నావు (మేము వెర్రివారమయితే), ఎందుకనగా మనిషి తన జ్ఞానము బట్టి దేవుని ఎరుగలేడు, కాని బోధించుట యొక్క వెర్రితనము ద్వారా రక్షించబడగోరు వారిని ఆయన రక్షించుటకు ఇష్టత చూపుచున్నాడు. దేవా, ఈ గొప్ప వాక్యమునకు మూలమైయున్న నీవు ఈ రాత్రి రోగులను బాగుచేసి, నశించిన వారిని రక్షించుమని ప్రార్ధించుచున్నాము. యేసు నామములో దీనిని అడుగుచున్నాము. ఆమేన్.

52ఈ రోజు చెప్పిన దాని విషయములో మీరు గందరగోళపడకుండునట్లుగా దేవునిని నేను ఒక నిత్యమగు, గొప్ప వజ్రముతో పోల్చుచున్నాను. ఆఫ్రికాలోని గనుల యందు నీలిరంగు రాళ్ళ నుండి వజ్రమును వెలుపలికి వెలికి తీసి బయటకు తెచ్చినప్పుడు… నేను ఆ గనుల దగ్గరకు వెళ్ళి చూచితిని, వారేవిధముగా రాళ్ళను విరగగొట్టు ఆ యంత్రములో వాటిని వేసి ఆ రాళ్ళను విరగగొట్టి వాటిల్లో నుండి నీలపు అగ్ని వజ్రములు, నల్లని వజ్రములను బయటకుతీయుచున్నారో నేను చూచితిని. వాటికి ఒక స్థిర ఆకృతి ఉండదు. కేవలము ఒక పెద్ద రాయివలె యుండును. ఆ సమయములో నిజంగా వాటిలో ఏ అగ్నియూ ఉండదు. అవి కేవలము ఒక రాయి వలె గుండ్రముగా యుండును. ఈ వజ్రమును కోయుట తప్పని సరి. కోయకుండా వజ్రమును ఉంచుకొనుటచట్ట విరుద్దము. తప్పక కోయవలెను, దానిని ఎక్కడ కొన్నావో రసీదు నీవు చూపించవలెను, ఎందుకనగా అది కోట్ల కొలది రూపాయల ఖరీదు చేయును.

నేను ఆ వజ్రముతో దేవుని పోల్చగోరుచున్నాను. వజ్రము లోపట యున్న అగ్ని దాని లోపలి ప్రకాశం బయటకు ప్రతిబింబింప చేయవలెనన్నచో తప్పక దానిని కోయవలెను. ముక్కోణముగా ప్రతి ఆకృతిని కోయవలసియున్నది. ఒక వజ్రము యొక్క ముక్కోణములను ఒక ముక్కోణ వస్తువునకు ఎదురుగా ఉంచి వెలుగును ప్రసరింపచేసినచో, అది ఏడు రంగులను వెదజల్లును, చూచారా… సప్త వర్ణములు ఇచ్చును.

ISA 53:5•

1PET 2:24

 

53ఇప్పుడు గమనించండి, "దేవుడు మన అపరాధముల కొరకు గాయపర్చబడెను. మన దోషముల నిమిత్తము నలుగగొట్టబడెను," చూచారా. ఆయన కోయబడెను, నలుగ గొట్టబడెను. ఆ గొప్ప వజ్రము నుండి సంఘమునకు వరములు ప్రతిఫలించునట్లుగా అది జరిగెను. ఆది వెలుగు కాదు; ఎందుకనగా సూర్యుడు లేనప్పుడు అదెక్కడ నుండి కోయబడినదో, అక్కడికి ఆ వెలుగు తిరిగి వెళ్ళుట అగత్యము. కాని కోయుట ద్వారా పడిన ఏ ముక్క కూడా నాశనము కాదు; అది ఉపయోగపడును. అందులో చాలా వరకు విక్ట్రోలా సూదులుగా తయారగును. వజ్రము నుండి చెక్కగా రాలిన ముక్క ఒక సంగీతమును ఉత్పత్తి చేయును. వాటిని ఆలాగు కూర్చినప్పుడు అది జరుగును. నేను చెప్పినది మీకు అర్ధమయినదనుకొంటాను.

క్రీస్తు నుండి వచ్చిన ముక్క, క్రీస్తు నుండి వచ్చిన వరము, బైబిలు మీద పెట్టబడినప్పుడు విశ్వాసికి దాగిన దేవుని మర్మములను వివరించును. ఆయన హృదయ రహస్యములను ఎరుగును. ఆయన ప్రతి వ్యక్తిని ఎరుగును. అది మీరు నమ్ముదురా? అది వజ్రమును గూర్చి నేను చెప్పినట్లుండదు, "నేనేమైయున్నానో మీరు చూడండి"; ఆయన అందులో నుండి వచ్చెను. వజ్రము వజ్రమే, ఎందుకనగా ఆయన వజ్రము నుండి వచ్చినవాడు.

EPH 4:11

 

54ఒక వ్యక్తికి ఆత్మ యొక్క వరముల విధానము ఆలాగే యున్నది. అది ఆ వజములోని భాగము. అది పంపబడినది, క్రిందికి తేబడినది, భాషలకు అర్ధము చెప్పుటకు, బోధించుటకు, ఉపదేశించుటకు అది వరముగా తేబడియున్నది.

అయిదు ఆత్మీయ వరములున్నవి: ఆపోస్తలులు, ప్రవక్తలు, బోధకులు, కాపరులు, సువార్తికులు, వారందరూ క్రీస్తు యొక్క శరీరమునకు క్షేమాభివృద్ధి కలుగజేయుటకే పనిచేయుదురు. బోధకులు, సంఘ కాపరులు ఎంత నిశ్చయముగా ఉన్నారో, అంతే నిశ్చయముగా ప్రవక్తలును ఉండవలసి యున్నారు. అది మనమెరుగుదుము.

దేవుడు అంత్యదినమున తన జనుల మధ్య, ఏర్పరచబడిన సంతానమునకు బైబిలు ప్రకారము ప్రవక్త రూపములో ప్రత్యక్షపరచబడవలసియున్నాడు. అది అక్షరాలా వాక్య సత్యము. ఆ మనిషి దేవుడని కాదు గాని, ఆ వరమే దేవుడై యున్నాడు. (చూచారా?) అదియే గ్రామఫోను రికార్డులోని సూది యగును. కాని సాధారణ సూదిని ఉపయోగించని యెడల, ఆ గ్రామఫోను రికార్డులో నుండి సంగీతము రాదు. కాని వజ్రముతో చేయబడిన సూది మాత్రమే దానికి శ్రేష్ఠమైనది. ఆ వజ్రపు మొనగల సూది మాత్రమే ఆ రికార్డులో సంగీతమును స్పష్టముగా పలికించగలదు.

ఈ రాత్రి దేవుడు… నీ జీవితము అను రికార్డును తీసికొని, దానిలో ఎట్టి పొరపాట్లున్నాగాని, దేవుడు నుండి నీవు కోరు ప్రతిదానిని అనుగ్రహించును గాక! తన చేతిలో వజ్రపు మొనగల సూదిని పట్టుకొనియున్న ఆ గొప్ప బోధకుడు నీవెందుకు ఇక్కడికి వచ్చితివో, నీ కోరిక ఏమిటో తెలియపరచును గాక. అప్పుడు ఆయన ఇచ్చటున్నాడని మనము తెలిసికొందుము.

1COR 14:23,24

 

55పరమ తండ్రీ, ఈ ప్రార్ధన వరుసను ఆరంభించక ముందే అది నీవు అనుగ్రహించెదవా? ఇది చేయవలెనని నేను ఉద్దేశించలేదు గాని, నీవు దానిని ప్రజలు తెలిసి కొనునట్లు అనుగ్రహించెదవు. బహుశా ప్రార్ధన కొరకు క్రొత్తవారు ఇక్కడికి వచ్చియుందురు. నేను వారిని ఎరుగను గాని, నీవు ఎరుగుదువు. పౌలు ఇట్లనెను, "నీవు భాషలతో మాట్లాడుచుండగా దానికి అర్ధము చెప్పు వ్యక్తి లేనియెడల, ఎట్టి క్షేమాభివృద్ది అందువలన కలుగనియెడల, జనులు నిన్ను పిచ్చివాడని తలంచుదురు. కాని ఒకడు ప్రవచించి హృదయములో నున్నదానిని బయటపెట్టినప్పుడు, 'నిజంగా దేవుడు మీతో నున్నాడు,'" అని జనులు పలుకుదురు. దేవా, ఈ ఆఖరి ఘడియలో అది మరల జరుగనిమ్ము. నీవు దానిని వాగ్దానము చేశావు, అది ఆలాగు జరుగును. యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాము. ఆమేన్.

JOHN 14:12

 

56ఈ రాత్రి ఎందరు రోగులున్నారు. బిల్లీ ఎన్ని కార్డులిచ్చెను? అసలు ప్రార్ధన కార్డులు బయటకు ఇచ్చారా? ఇచ్చారు. సరే, ప్రతి రోగి ఒక ప్రార్ధన కార్డును కలిగియున్నాడని తలంచుచున్నాను. దానిమీద మీరేమి వ్రాశారో నాకు తెలియదు. అతడు కేవలము ప్రార్ధన కార్డు మాత్రమే మీకిచ్చెదనుకొనుచున్నాను. దానిమీద మీరేమి కోరుచున్నారో అది వ్రాయండి. అంతే గదా, కేవలము మీకు కార్డు ఇచ్చెను? మీరు కోరునది అక్కడ వ్రాయండి.

మిమ్మును నేనెరుగను. నేను మీకు తెలియనని చెప్పు రోగులెందరున్నారు? "దేవుడు చర్మముల వెనుక, దేవుడు మానవ చర్మము వెనుక దాగియున్నాడు, అని చెప్పుట నేను విన్నాను," అని ఎందరు చెప్పగలరు? మీకు ఆత్మీయ నేత్రములున్నచో, తెరచి ఆయనేమైయున్నాడో దానిని మీరు చూడగలరు. యేసు చెప్పినది మీరు నమ్ముదురా? "నా యందు విశ్వాసముంచువాడు నేను చేయు క్రియలు చేయును. నాకంటే గొప్పవియు చేయును, ఎందుకనగా నేను తండ్రి యొద్దకు ఎక్కిపోవుచున్నాను."

ఇప్పుడు, మీరు మీ పూర్ణహృదయముతో నమ్మినయెడల…

57ఇక్కడున్న రోగులలో నేను తెలియనివారు ఎందరున్నారో చేతులెత్తండి. మీ వ్యాధి ఏమిటో నాకు తెలియదు. ఈ విధంగా చెప్పండి; నేను రోగిని, నాకు అక్కరయున్నది." రోగులు కాకుండా, తమ హృదయములలో కోరికలు కలిగియున్నవారెందరున్నారు? మంచిది. చేతులెత్తిన వారు తప్ప ఎక్కువ మంది నాకు కనబడుట లేదు.

ఇక్కడ కూర్చొనియున్న ఈయన నాకు తెలియును. అతడు సహోదరుడు జేమ్స్ మరియు ఆమె సోదరి జేమ్స్ అని నేను నిశ్చయంగా తలంచుచున్నాను. సహోదరుడు బెన్ నాకు తెలియును. సోదరుడు ఫోటోలు తీయుచున్నాడు గనుక మీ ముఖములు కొన్నిసార్లు నాకు తెలియును. ఈ వర్తమాన ముగింపులో నేను ఈ సవాలును విసరుచున్నాను. ఇక్కడున్నవారెవరైనా రండి.

GEN 18:10•

HEB 4:12,15

 

58చివరి దినములలో ఇది జరుగునని దేవుడు వాగ్దానము చేసెనని మీరెరుగుదురా? ఆయన వాగ్దానము చేసెను. చూచారా? నేనది జరుగునట్లు చేయలేను. చూచారా? అది నేను చేయజాలను. అది ఆయనే చేయవలెను. దానిని చేయువాడు ఆయనే గాని నేను కాదు. కాని ఆయన యందు నేను విశ్వాసముంచుచున్నాను, లేనియెడల ఇక్కడ నేను నిలబడి నాకు నమ్మకము లేని దానిని మీకు చెప్పను. ఇప్పుడు మీరు ప్రార్ధించండి. "ప్రభువైన యేసూ, ఇప్పుడు నీవు ప్రధానయాజకునిగా వున్నావని బైబిలు ద్వారా నాకు నేర్పించబడినది. నా బలహీనతలను తాకగలవు," అని చెప్పండి. మీరెక్కడున్నా చింత లేదు. ఈలాగు చెప్పండి, "నిన్ను నేను నమ్ముచున్నాను. విశ్వాసమును బట్టి ఈ రోజు ఆయన చెప్పినది నేను నమ్ముచున్నాను." దేవుని దూత నాతో అదే చెప్పెను. "నిన్ను నమ్మునట్లుగా జనులను సంధించుము."

నేను దేవుని వాక్యమును చెప్పినప్పుడు మీరు నన్ను కాదు గాని, వాక్యమును నమ్ముడి. అది వాక్యము కానియెడల దానిని నమ్మవద్దు. కాని అది వాక్యము అని మీరు నమ్మినయెడల, ఏమయినా గాని మీరు ప్రార్ధించండి, విశ్వసించండి. మీ హృదయములో నున్నదానిని ఆయన ఇంకా ప్రత్యక్షపరచగలడేమో చూడండి.

"దేవుని యొక్క వాక్యము రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగలదియై, హృదయము యొక్క ఆలోచనలను, ఉద్దేశ్యములను బయటకు తెచ్చును," అని బైబిలు చెప్పుచున్నది. ఎవరికయినా తెలియును. అది దేవుడే అని అబ్రాహాము ఆలాగే తెలిసికోగలిగెను. వెనుక గుడారములో శారా ఏమి చేయుచున్నదో, ఆమె ఏమని ఆలోచించుచున్నదో ఆయన చెప్పగలిగెను. "నిన్ను దర్శించుదును," అని ఆయన చెప్పిన సందర్భములో ఇది జరిగెను. "అది ఆలాగు జరుగదు," అని శారా తన హృదయములో అనుకొనెను.

59నిన్ను స్వస్థపరచుటకు ఇప్పుడాయన ఇక్కడున్నాడని నేను చెప్పుచున్నాను. దానిగూర్చి నీవేమి తలంచుచున్నావు? నేను స్వస్థపరచు మార్గము ఏదీ నాకు లేదు. పరలోకపు తండ్రి దానినెరుగును. చూచారా? దానిని నేను చూడవలసియున్నాను. ఏది చూచుదునో అదే చెప్పెదను, నేను చూడని దానిని చెప్పజాలను, దానిని తెలియచేయువాడు దేవుడే. దానిని ఆయన చేసినయెడల మీ విశ్వాసము వృద్దిచెందునా? ఈ విధముగా బోధించుట నన్ను కొద్దిగా తొందరపెట్టును, కాని ఇక్కడాయన ఉన్నాడు. దానిగూర్చి నాకు బాగా తెలియును.

ఈ వెనుక ఒకాయన తన తలను వంచుట నేను గమనించుచున్నాను. అతని ప్రక్కన అతని భార్య కూడా కూర్చొనియున్నది. ఇక్కడే! మీ హృదయములో ఏదో యున్నది. నీ భార్య ప్రార్ధించుచున్నది, నీ హృదయములో భారమున్నది. అది నీ అత్తను గూర్చి. అది నిజము. నీ అత్త వ్యాధి ఏమిటో దేవుడు నాకు చెప్పగలడని నమ్ముచున్నావా? నిన్ను నేనెరుగను. మనము ఒకరికొకరము క్రొత్తవారము. అవునా? ఆమె వ్యాధి ఏమిటో దేవుడు నాకు చెప్పగలడని నమ్ముచున్నావా? ఆమె ఇక్కడ లేదు. చాలా దూరము నాకు కనబడుచున్నది. ఇక్కడకు తూర్పు భాగాన ఆమె ఉన్నది. ఆమె ఓహాయోలో ఉన్నది. అది నిజము! ఆమె ఒక రక్తపు వ్యాధితో బాధపడుచున్నది. ఏడ్చుచున్న నీ భార్య చేతిలో యున్న ఆ చేతిగుడ్డను, సందేహించక, ఆమె మీద ఉంచినచో ఆమె బాగవును. అది నమ్ముదువా?

నా ముందుర ఒక చిన్న స్త్రీ కూర్చొనియున్నది. ఆమె ఏడ్చుచున్నది. బిడ్డకు ఏదో వ్యాధి గలదు. నాకు తెలియదు… కాదు, ఏమి లేదు. ఆమెకు ఒక కోరిక యున్నది. ఆమె పరిశుద్ధాత్మ బాప్తిస్మము పొందవలెనని కోరుచున్నది. అది ప్రభువు ఈలాగు సెలవిచ్చుచున్నాడు! బిడ్డా, నీవు నమ్ము, అది పొందబోవుచున్నావు.

60ఆ వరుస చివరన ఇక్కడ ఒకామె కూర్చొనియున్నది. ఆమె ప్రార్ధించుచున్నది. ఆమెకు నేను క్రొత్త వ్యక్తిని, కాని ఆమెను ఏదో కమ్మియున్నది. నీకు ఆపరేషన్లు జరిగినవి. మనము ఒకరికొకరము క్రొత్తవారమని తలంచుచున్నాను. నిన్ను నేను ఎరుగను, నీవు నన్నెరుగవు. బహుశా నా గూర్చి నీవు వినియుందువు. నీవు ఇక్కడి వ్యక్తివి కావు. మా మధ్య నీవు క్రొత్త వ్యక్తివి. నీవు విస్కానిసిన్ నుండి వచ్చావు. మీల్వాకీ పట్టణస్థురాలివి. నీ వ్యాధి కాన్సరు, అది రొమ్ముపై ఉన్నది. ఆపరేషను మీద ఆపరేషను జరిగినది గాని, ఏమి విజయవంతము కాలేదు. ఆయన వస్త్రపు చెంగును ముట్టిన విశ్వాసము ఇప్పుడే నీకు రానిమ్ము. నీ హృదయములో దానిని లోతుగా నాటుకోనిమ్ము, అది జరుగును! విశ్వాస ముంచుము!

ఇక్కడ మూలన ఒకాయన కూర్చొనియున్నాడు. అతడు తన తల్లి గూర్చి ప్రార్ధించుచున్నాడు. అతనిని నేనెరుగను. కాని అతడు తన తల్లి గూర్చి ప్రార్ధించుచున్నాడు. ఈ స్త్రీ వలె అతని తల్లియూ కాన్సరుతో బాధపడుచున్నది, లేక ఆ భయము కలిగియున్నది. నీవు ఒక వ్యక్తి కొరకు ప్రార్ధించుచున్నావు. అతడు వీపు నొప్పితో యున్నాడు. అతడు మద్యముతో మత్తిల్లి యుండుట కూడా నాకు కనబడుచున్నది. అతడు త్రాగుబోతు, నీ సోదరుడే. నీవిక్కడ నుండి రాలేదు, నీవు ఇల్లినాయ్ నుండి వచ్చావు. నీ పేరేమిటో దేవుడు చెప్పగలడని నీవు నమ్ముచున్నావా? వ్యవసాయకుడివి. నిజమేనా? చేతిని ఎత్తుము. నమ్ముము!

61ఒకరు మోకరించియుండగా మరొకరు ప్రార్ధించుచున్నారు. ఎవరో మంచము మీద పరుండియున్నారు. మంచిది! అమ్మా. నీవు వినినది సత్యమని నీవు నమ్ముచున్నావా? నమ్ముచున్నావు. నేను నిన్ను స్వస్థపరచగలిగినచో, వచ్చి చేయుదును. కాని నీవు క్రీస్తు ద్వారా ఇదివరకే స్వస్థపడియున్నావు. చూడండి, చూచారా? దానిని నీవు నమ్మితే చాలును. నీవు ముట్టబడవలెనని ఆ నిలబడియున్న స్త్రీ ప్రార్ధించుచున్నది. నిన్ను నేను ఎరుగను, కాని దేవుడు నిన్ను ఎరుగును. నీవు కూడా బయటి స్థలము నుండి వచ్చిన వ్యక్తివే. అది నిజము. నీవు ఇల్లినాయ్ నుండి వచ్చావు. అది నిజము. నీ పట్టణము పేరు ఈస్ట్ మోలిన్, ఇల్లినాయ్. నీవు కాన్సరుతో బాధపడుచున్నావు. నీవు ఒక సేవకుని భార్యవు. నీవు నమ్ముదువా? అక్కడే నీవు పడియున్నచో చనిపోదువు. ఈ రాత్రియే ఆయనను స్వీకరించి నీవెందుకిలా చెప్పకూడదు? "నా హృదయములోనికి స్వీకరించుదును. నేను స్వస్థపరచబడియున్నానని ఇక్కడున్న ప్రతీదానికంటే మిన్నగా విశ్వాసముతో నమ్ముచున్నాను. నేను దేవుని యొక్క సన్నిధిలో యున్నాను." లెమ్ము; నమ్ముము; ఇంటికి వెళ్ళుము, స్వస్థత పొందుము. ఆమె సంగతి అది. నీ పూర్ణ హృదయముతో నీవు నమ్ముదువా? దేవునిని స్తుతించుదము.

62పరమ తండ్రీ, నీ యొక్క కృప మరియు మంచితనమంతటికి వందనములు చెల్లించుచున్నాము. ఈ బాధ అంతటి మధ్యను, వంకరగానున్న ఈ లోకములోను నీవున్నావని నీకు వందనములు చెల్లించుచున్నాము. ప్రభువా, నీ ఆత్మను నిత్యమూ మాతో నుండనిమ్ము. చర్మము అనే తెర వెనుక మరుగుపరచుకొనియున్న దేవునిగా, మానవ హృదయములలో విశ్వాసమనుగ్రహించుచూ, ప్రత్యక్షత, దర్శనము ఇచ్చుచూ నీవిక్కడుండుట మేము చూచుచున్నాము. నీవు నీ సంఘములో యుండు దేవునిగా యున్నావు. నీ ప్రజలలో యుండు దేవునిగా యున్నావు. ప్రభువా, దీనిని బట్టి మేము నీకు వందనములు చెల్లించుచున్నాము. ఏక మనస్సుతో ఈ రాత్రి నమ్ము ప్రతిఒక్కరూ స్వస్థత పొందెదరు గాక! యేసుక్రీస్తు నామమున ప్రార్ధించుచున్నాను. ఆమేన్.

MARK 16:18•

JAS 5:15

 

63ఆ ప్రక్కనున్న వారిలో ఎందరికి ప్రార్ధనా కార్డులున్నవి? ఆ వెనుక ప్రక్కనున్నవారిని కదిలి ఈ వరుస మధ్యలోనికి రమ్మని చెప్పండి. ఆ వరుసలో నున్నవారు ఈ ప్రక్కకు రండి. మీ స్థలము మీరు తీసికొనండి. ఈ వైపునకు తిన్నగా రండి. వారికి అయిపోయిన వెంటనే ఈ వరుస వారు మరో ప్రక్కకు వచ్చెదరు.

పెద్దలు, ఇచ్చటకు రావలెను. రాయ్ సాహోదరుడా, ప్రభువు నిన్ను దీవించును! నీవక్కడ కూర్చొనియున్నావని నాకు తెలియదు. డీకన్లు వెంటనే ఇక్కడికి రావలెనని కోరుచున్నాను. వారెక్కడున్నాగాని, ఇక్కడికి రాగలిగినచో రావలెను. చిన్న సహాయము కొరకు ఇచ్చటకు రండి. ప్రార్ధించబడగోరు వారందరూ చేతులెత్తమని కోరుచున్నాను. నా వెనుక ఇది చెప్పండి, "ప్రభువా, నాకు అవిశ్వాసము లేకుండా సహాయము చేయుము. నీ వాక్యమును అనుసరించుదునని నీ సన్నిధిలో చెప్పుచున్నాను. ఈ రాత్రి నా మీద చేతులుంచబడియున్నవి. నా స్వస్థతను నేను అంగీకరించనైయున్నాను. యేసు నామమున. ఆమేన్!" దేవుడు మిమ్ము దీవించును.

ఇప్పుడు గమనించండి. "విశ్వాస సహితమగు ప్రార్ధన రోగిని రక్షించును. వారు రోగుల మీద చేతులుంచినప్పుడు బాగవుదురు." వర్షము రానున్నదని ఆయన నోవహుతో చెప్పెను. వెంటనే అది రాలేదు, - వెంటనే ఆయన దానిని చేయలేదు… నేను ఎన్నడూ చెప్పలేదు, "మీరు ప్రార్ధన చేసిన వెంటనే స్వస్థత పొందుదురని," ఆయన ఎన్నడూ చెప్పలేదు. "వారు బాగవుదురు (recover)," అని ఆయన చెప్పెను.

GEN 6:17•

GEN 17:16•

ISA 7:14

 

64వర్షము కురియనైయున్నదని ఆయన నోవహుతో చెప్పెను. నూట-ఇరవై సంవత్సరముల పాటు ఎన్నడూ వర్షము కురియనే లేదు, కాని వర్షించినది. శారా ద్వారా బిడ్డను కననైయున్నట్టుగా అబ్రాహాముకు చెప్పెను; ఇరవై-అయిదు సంవత్సరముల పాటు అది జరుగునే లేదు గాని, చివరకు జరిగెను. ఒక కన్యక గర్భవతియగునని యెషయాకు చెప్పెను, అయితే ఎనిమిది వందల సంవత్సరముల పాటు అది జరుగలేదు, అయితే ఆమె గర్భము ధరించెను. అది నిజమేనా? ఆయనాలాగు వాగ్దానము చేసెను. అదెంత కాలము పట్టినప్పటికిని జరిగి తీరును. ఆయన చేయును. అది మీరు నమ్ముచున్నారా? ఇప్పుడు ముందుకు రండి.

సహోదరుడు కాప్స్ పాటలను నడిపించును. మీరు శృతి చెప్పండి… ఇప్పుడు, అందరూ ప్రార్ధనా పూర్వకంగా ఉండండి.

MATT 17:20•

MATT 21:21•

MARK 11:23•

LUKE 24:49•

ACTS 1:4•

HEB 4:12

 

65మా పరమ తండ్రీ, ఈ రోగుల మీద చేతులుంచుట ద్వారా మేము నీ ఆజ్ఞలకు లోబడుచున్నాము, ప్రభువా, నీవు వారి స్వస్థతను కొనియున్నావని నీవు నీ వాక్యములో చెప్పియున్నావు. ఈ రాత్రి నీవు మాతో ఇక్కడ ఉన్నావని రుజువు చేసియున్నావు. వాక్యము హృదయములోని ఆలోచనలను పరిశోధించగలిగినది. నీవు మా మధ్య ఉన్నావని రుజువు చేసితివి. తప్పిపోజాలని నీ వాక్యము నీవు చెప్పినట్టుగా ప్రతి హృదయమునకు వాస్తవమగునట్లు చేయుమని, తండ్రి, నీకు ప్రార్ధించుచున్నాను. "మీరు సందేహించక విశ్వాసముతో ఈ పర్వతమును కదిలిపొమ్మని చెప్పినప్పుడు, ఆలాగు జరుగును." అది ఎప్పుడు కదిలి పోవునో ఆయన చెప్పలేదు.

పెంతెకోస్తునాడు నీవు జనులను వెళ్ళి మేడగదిలో కని పెట్టమని చెప్పితివి. నీవు గంటలను, దినములను ఎన్నడూ చెప్పలేదు గాని "వరకు" అని చెప్పావు. ఇప్పుడు వారు తమ స్వస్థతను అంగీకరించుటకు వచ్చియున్నారు. విడుదల వచ్చు వరకు వారు తమ స్వస్థత గూర్చి గాక మరిదేని గూర్చియూ ఆలోచించకుందురు గాక! విశ్వాసులముగా మేము వారిపై చేతులుంచుట ద్వారా నీకు లోబడుచున్నాము. యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాము. ఆమేన్.

66మంచిది. ఇప్పుడు రండి [టేపుపై ఖాళీ యున్నది].

మీరు స్వస్థపడితిరి. దేవుడు మిమ్ము దీవించును. మంచిది [టేపుపై ఖాళీ యున్నది].

సమస్తము సాధ్యమే, కేవలము నమ్ముము!

కేవలము నమ్ముము! కేవలము నమ్ముము!

ప్రభువైన యేసూ, ఈ చేతిగుడ్డల కొరకు ప్రార్ధించుచున్నాను. యేసుక్రీస్తు నామమున. ఆమేన్.

మనము ఆ మాటలను మార్చితే ఎట్లుండునో గదా!

ఇప్పుడు నేను నమ్ముచున్నాను! దీనిని ఇప్పుడు నేను నమ్ముచున్నాను!

సమస్తము సాధ్యమే, ఇప్పుడు నేను నమ్ముచున్నాను!

ఇప్పుడు నేను నమ్ముచున్నాను! దానిని ఇప్పుడు నేను నమ్ముచున్నాను!

సమస్తము సాధ్యమే; ఇప్పుడు నేను నమ్ముచున్నాను!

అడిగినది, కోరినది అనుగ్రహింపబడునని మీరు నమ్ముచున్నారా? అది జరుగును.

67షికాగో నుండి వచ్చిన కొందరు నా ఇటాలియను స్నేహితులను వరుసలో నుండి కదిలి వచ్చుట కొద్ది క్షణముల క్రితము నేను చూచాను. షికాగో నుండి వచ్చిన సోదరి బొటోజీని ఎందరు ఎరుగుదురు? ఈ మధ్యనే ఆమెకు చాలా తీవ్రమైన మానసిక అస్వస్థత కలిగినది. కాని ఆ ఉదయమున షికాగోలో క్రైస్తవ వ్యాపారస్తుల అల్పాహార విందులో, పరిశుద్ధాత్మావేశము క్రింద ఆ సోదరికి నేను చెప్పాను, ఆమె తన ఆధీనము కోల్పోయి, నిలబడలేక ప్రక్కకు ఒరిగిపోయినది. ''సోదరీ, నీవు వెంటనే ఇందులోనుండి విడిపించబడవు గాని బాగయెదవు. అది పద్దెనిమిది నెలలు లేక రెండు సంవత్సరములు పట్టవచ్చును. అయితే నీవు తప్పక ఆ వ్యవధిలో బాగయెదవు," అని చెప్పాను.

68ఒక రోజు ఆమెతో నేను మాట్లాడుచుంటిని. ఆమె సాక్ష్యమిచ్చుట విని ఎంతో సంతోషించాను. ఆమె తన జీవితములో ఎన్నడూ లేని ఆనందముతో కనిపించినది. ఆమె ఒక కారులో ప్రయాణము చేయుచున్నది, ఆమెకు శాంతి లేదు. దేవుని యొక్క సన్నిధి ఆమె యొద్ద నుండి విడిపోయినట్లుగా కనబడినది. (మీకు తెలియును గదా, అది మానసిక రుగ్మత), అకస్మాత్తుగా గొప్ప ఆనంద వెల్లువ తిరిగి వచ్చెను. పరిశుద్ధాత్మ యొక్క శక్తి ఆమె పైకి వచ్చెను. ఆమె ఏడ్చినది, కన్నీరు కార్చినది. అది గొప్ప సమయము. ఇది సుమారు మూడు లేక నాలుగు వారములు లేదా నెల క్రిందటి సంగతి. గత ఆదివారము ముందు ఆమె సాక్ష్యమిచ్చుట విన్నాను. ఇట్లు పలికినది, "బ్రెన్హాం సోదరుడా, నేను తిరిగి వెళ్ళి, గుర్తుంచుకొని ఆ టేపును తీసికొన్నాను. అది సరిగ్గా పద్దెనిమిది నెలలు అయినది." ఆమేన్!

మీరాయనను ప్రేమించుచున్నారా? ఆయన ఆశ్చర్యకరుడు కాడా?

MATT 24:35•

MARK 13:31•

LUKE 21:33

 

69ఖచ్చితంగా ముందుగానే చెప్పగల అదే పరిశుద్ధాత్మ ఈ సంవత్సరములన్నింటిలోను ఏ ఒక్కసారి కూడా తప్పిపోకుండా ఆయన వాక్యము ద్వారా తెలియపరచెను. దేవుడు ఎక్కడో దూరంగా ఉన్న వస్తువు కాడనియు, ఆయన ఏదో చరిత్ర పురుషుడు కాడనియు నేడు మీకు ఆ వాక్యమే చెప్ప ప్రయత్నించినది. ఆయన నేటికి, వర్తమాన కాలమందు సజీవునిగా యుంటూ తనయొక్క వాక్యమును ప్రత్యక్షపరచుచుండెను. ఆయన తన సంఘములో, మానవ ముసుగులో తనను మరుగుపరచుకుంటూ మీ విశ్వాసము, నా విశ్వాసమును, మనందరి విశ్వాసమును కలిపి, తద్వారా ఆయన తన్నుతాను బయలుపరచుకొనుచున్నాడు, మనము కలిసి దేవుని యొక్క ఏక కుటుంబము అవుచున్నాము. మీరు లేకుండా నేనేమియూ చేయజాలను, నేను లేకుండా మీరేమియూ చేయలేరు, దేవుడు లేకుండా మనమెవరము ఏమీ చేయజాలము. కాబట్టి కలిసినప్పుడు ఒక్కటగుదుము. అనుసంధానము చేయుటకే దేవుడు నన్ను పంపెను. మీరు దానిని నమ్మినచో అది జరుగును. అది నిశ్చయము, చూచారా. ఖచ్చితంగా ధృవపరచబడినది. మీ వ్యాధి ఏమైనా, ఎవరు ఏమి చెప్పినా, నాకు లెక్క లేదు, మీరు బాగవుదురను విశ్వాసమును మీ హృదయములో కలిగియున్నచో దానిని ఏదియూ ఆపజాలదు. ఆయనాలాగు చెప్పెను! "భూమ్యాకాశములు గతించును గాని నా మాటలేమాత్రమును గతించవని," ఆయన చెప్పెను.

అది మీరు నమ్ముదురా? నేను వెళ్ళవలసియున్న ఇతర కూటముల గూర్చి ఎందరు ప్రార్ధించెదరు? ప్రార్ధన అవసరమగు వారిలో నేను ఒకడిని, చూడండి, మీరు తప్ప అందరూ త్రోసివేసిరి. అయినా, అక్కడ విత్తనమున్నది.

70దక్షిణ ఆఫ్రికాకు నేను ఉత్తరము పంపాను. తండ్రి పేరు చెప్పి ఒకసారి, కుమారుని పేరు చెప్పి ఒకసారి, పరిశుద్ధాత్ముని పేరు చెప్పి ఒకసారి ఆ విధముగా ఒక్కొక్కరికి మూడుసార్లు బాప్తిస్మమిస్తూ అదే సిద్దాంతము అని నేను బోధించనియెడల, వారు నన్ను రానియ్యరు. వారికి ఈలాగు ఉత్తరము వ్రాశాను: "మరల ఆఫ్రికాకు వెళ్ళమని గత కొద్ది సంవత్సరముల నుండి పరిశుద్ధాత్మ నాకు హెచ్చరిక చేయుచున్నది. ఒక్క మధ్యాహ్నమే ముప్పది వేలమంది క్రీస్తును అంగీకరించిన ఆ స్థలమందు ఆయన నా సేవను ఉపయోగించుకోవలెనని కోరుచున్నాడు." గుర్తుంచుకొనండి, వారి ఆత్మల యొక్క రక్తము మీ మీద యుండును గాని, నా మీద కాదు. నేను వచ్చుటకు సంసిద్ధుడనయ్యాను గాని, మీరు రానిచ్చుట లేదు." దేవుని కుమారుడగు యేసు ఈనాడు సంఘములో నుండి వెలివేయబడినయెడల, వాక్యము విసర్జించబడినయెడల ఎట్లుండునో గదా, అని ఆశ్చర్యపడుచున్నాను. అయినా గానీ ఇంకా ఆయన తన్నుతాను జనులకు తెలియపరచుకొనుచున్నాడు. దానిని బట్టి మీరు వందనములు చెల్లించరా?

JOHN 12:32

 

71ఈ రాత్రి వారియొద్దకు వెళ్ళివారి మీద చేతులుంచాను. కొందరు వయస్సు మళ్ళిన స్త్రీలు, కొందరు యవ్వనులు, కొందరు ముసలివారు ఉన్నారు. నేను తడిసిపోయాను. ''వీరు కూర్చొని వాక్యము వినుచుండగా, తక్కిన లోకమంతయూ వీరు పిచ్చివారని తలంచుచున్నారు గదా," అనుకొన్నాను. చూచారా? ఆ నట్టుకు మరలు కోయుటకు ఇక్కడ దేవుడున్నాడు. వారే బోల్టులు, మీ వ్యాధి నుండి తిన్నగా మిమ్మును బయటకు లాగును, అది వాక్యము యొక్క వాగ్దానము. కేవలము గుర్తుంచుకొనండి, అది బిగించుట ప్రారంభించును: "నేను పైకెత్తబడినయెడల వారిని నావైపు ఆకర్షించుకొందును.'' ఆయన మీలోనుండి దానిని లాగును, ఆయన నిశ్చయంగా అది చేయును, మీరాయనను నమ్మితే చాలును. ఆయన యందు విశ్వాసముంచుడి; ఆయనను సందేహించవద్దు; ఆయనను నమ్ముడి!

72నా కొరకు ప్రార్ధించండి. మీకు ఎవరూ ప్రార్ధించుటకూ లేనప్పుడు నన్ను కాస్త జ్ఞాపకము చేసికొనండి.

మనము సంధించే వరుకు!

మళ్ళీ మనము సంధించే వరుకు!

మనము సంధించే వరుకు, మనము సంధించే వరుకు.

అంత దూరముల నుండి వచ్చినందుకు వందనములు; మీరు తిరిగి గృహములకు వెళ్ళుచుండగా దేవుడు రక్షించును.

మనము సంధించే…

క్రైస్తవులందరిని అభినందించండి; ఇక్కడున్న ఈ గుంపు నుండి వందనములు తెలుపుడి. దేవుని సమాధానము మీ మీద నుండును గాక; షాలోమ్!

మళ్ళీ మనము సంధించే వరుకు

దేవుడు నీకు తోడుగా యుండును గాక!

మళ్ళీ మనము సంధించే వరుకు

దేవుడు నీకు తోడుగా యుండును గాక!

HEB 13:5

 

73నాకు చాలా ఆనందముగా యున్నది. చూడండి, నాకు తెలియని సంగతులు ఎన్నో యున్నవి, ఆలాగే నాకు తెలిసిన సంగతులు కొన్ని ఉన్నవి. మీకు ఎంతగానో నా కృతజ్ఞత తెలుపుచున్నాను. మీతో కలిసియుండుటను బట్టి నేనెంతగానో వందనములు చెల్లించుచున్నాను, మీలో ఒకనిగా నేనుండుటకు ఎంతో సంతోషించుచున్నాను. దేవుడు మీతో నుండును. ఆయన ఉండును; ఆయనెన్నడూ మిమ్మును విడువడు; ఆయనెన్నడూ మిమ్మును ఎడబాయడు; ఆయన మిమ్మును విడిచిపెట్టడు. ఇప్పుడు మీరు ఆ ముసుగు అనే తెరను చీల్చుకొని వచ్చితిరి.

జార్జియా నుండి వచ్చిన మాతో సహవాసము చేయు సంఘ కాపరులలో ఒకరగు సహోదరుడు పామరను ఈ రాత్రి ఇక్కడ చూచుట ఎంతో సంతోషముగా యున్నది. సహోదరుడు జూనియర్ జాక్సన్ ఈ భవనములో ఏదో మూలన యున్నాడు, ఆయన మనతో యుండుట సంతోషము. సహోదరుడు డాన్ రాడల్ ఇక్కడ కూర్చొనియున్నాడు. ఓ, చాలామంది యున్నారు. నాకు తెలియదు. ఎవరినయినా నేను మరిచానా… సహోదరుడు బెన్ బ్రయంట్ ఇక్కడున్నాడు. ఇంకా చాలామంది ఇతరులు ఇచ్చట ఉన్నారు, విల్లర్డ్ కాలిన్స్, చక్కని సోదరుడు. మీ అందరిని ఇక్కడ మాతో చూచుట ఎంతో సంతోషము. ఇప్పుడు ఒక్క క్షణము మనము లేచి నీలబడినచో బాగుండును. ఇప్పుడు మన తలలు వంచుదము.

మనము సంధించే వరుకు, మనము సంధించే వరుకు,

యేసు యొక్క పాదముల యొద్ద మనము సంధించే వరుకు,

మనము సంధించే వరుకు, మనము సంధించే వరుకు,

మళ్ళీ మనము సంధించే వరుకు,

దేవుడు నీకు తోడుగా యుండును గాక!

PROV 18:24

 

74ఆత్మతో ఆ సన్నిహిత సహవాసమును మీరు పొందుచున్నారా? దానిని మనము ఆలపించుదము.

ఓహాయో నుండి వచ్చిన సహోదరుడు మెకెన్నీ మనతో యుండుట గమనించాను; సహోదరుడు జాన్ మార్టిన్, అతని సోదరుడు, మీ అందరూ మాతో యుండుట ఎంతో ఆనందము. సోదరులారా, మిమ్మును నేను చూడలేకపోవచ్చును. ఆయన మిమ్మును ఎరుగును… తిరిగి మనము కలిసికొను వరకు; నా హృదయము, మీ హృదయము దేవునితో ఏక హృదయముగా ఉండును గాక.

ఇప్పుడు మనము ప్రార్ధనకు శిరములు వంచుదము. ప్రతి దైవజనుడు ఇక్కడ ఉండుటను బట్టి సంతోషించుచున్నామని తెలియచేయుడి. జనులను బట్టియూ, టెన్సిస్సీ, ఓహాయో, ఇంకా వివిధ ప్రాంతముల నుండి వచ్చినవారందరి బట్టియు సంతోషించుచున్నాము. ఈ రోజు నేను కొందరు స్త్రీలను అక్కడ కలిసికొన్నాను. వారు బోస్టన్ అను దూర ప్రాంతము నుండి వచ్చిరి. అక్కడ నుండి వచ్చిన మన వర్ణ సోదరులు కూడా ఈ ఉదయము ఇచ్చటున్నారు. దేశములోని వివిధ భాగముల నుండి ఎందరో వచ్చియున్నారు. మీకు నా వందనములు చెల్లించుచున్నాను. నా విధేయ స్నేహితులు, దేవుడు మీకు తోడైయుండును. నా స్నేహితులని మిమ్మును పిలచుదును. దానిగూర్చి యేసు ఏమి చెప్పెనో గుర్తుచేసికొనండి. "సహోదరుని కంటె హత్తుకొని యుండువాడు," స్నేహితుడు.

ఇప్పుడు మనము శిరములు వంచియుండగా… రాబోవు కొద్ది రోజులలో తిరిగి మనము కలిసికొనువరకు దేవుడు మీకు తోడైయుండు గాక. మన మంచి, విధేయ సోదరుడగు రిచర్డ్ బ్లయర్ ను చిన్న ప్రార్ధనతో ముగించమని అడుగుచున్నాను. బ్లయర్ సోదరుడా.

Search Messages

0 / 0 matches
Enter characters above to process real-time text query scopes...