సర్వశక్తిమంతుడగు దేవుడు మన యెదట ప్రత్యక్షమాయెను
1మీతో మాట్లాడుటకు కొన్ని లేఖనములు నేను వ్రాసికొని వచ్చాను. మన బలహీన ప్రయత్నములను దేవుడు దీవించునని నేను నమ్ముచున్నాను. మనమెందుకు ఇంత వింతగా, శబ్దము చేయుచున్నామని చాలామంది ఆశ్చర్యపడుతున్నారు. ఇది మామూలుగా జనులు చూచు కూటమునకు వేరయినది. మామూలు కూటము చిన్నగా, అంత ఆసక్తిగా లేకుండా యుండును. కాని ఈ కూటములకు మనము వచ్చినపుడు మనమేమి చేయవలెనో మనకేమి తెలియదు (ప్రారంభించినప్పటి నుండి నేను ఈ కూటములలో హాజరగు భాగ్యము దొరికినది), మనము వచ్చి సమర్పించుకొనుచున్నాము. అది మాత్రమే చేయుట మనకు తెలియును. తక్కిన దంతయూ దేవుడే చేయును. అందువలన మనము ఒక వింత ప్రజలమని పిలువబడుచున్నాము.
"మీరు నిజంగా వింతైన మనుషులు," అని ఒక రోజున ఒక వ్యక్తి పలికెను.
"మంచిది, మేము అలాంటివారిమే," అని నేను అన్నాను.
2ఒక కూటము నాకు గుర్తున్నది. ఒక జర్మను దేశీయుడు పరిశుద్ధాత్మ బాప్తిస్మము పొందినట్లు ఒకసారి సహోదరుడు ట్రాయ్ నాతో చెప్పెను. మరుసటి రోజున అతడు తన షాపులో చేతులు పైకెత్తి, ప్రభువును స్తుతించుచూ భాషలలో మాట్లాడసాగెను. చివరకు ఈ గోలంతా విని పై ఆధికారి వచ్చి, "హెయినీ, నీకు ఏమయింది?" అని ఆడుగసాగెను.
"ఓ, నేను రక్షించబడితిని. నా హృదయము ఆనందము వలన ఉప్పొంగుచున్నది," అని అతడు చెప్పెను.
"ఆయితే నీవు అక్కడ వెర్రి జనుల గుంపులో చేరియుండవచ్చు," అని అన్నాడు.
"అవును! దేవునికి మహిమ!" అని చెప్పెను. "ఆ నట్స్ (వెర్రివారి) గూర్చి ప్రభువుకు వందనములు." ( nuts, అనగా ఆంగ్లములో వెర్రి అని కూడా అర్ధము వచ్చును - తెలుగు తర్జుమాదారుడు.) "ఆ రోడ్డు మీద వచ్చుచున్న కారుకు నట్లన్నీ నీవు విప్పి వేసినచో, చివరకు తుక్కు తప్ప మరేమి మిగలదు. అది నిజము, నీకు తెలుసా," అని అతడు చెప్పెను.
3ఒకనాడు నేను కాలిఫోర్నియోలో ఉండగా, లాస్-