మహోన్నత కళాఖండము
1ఇప్పుడు ప్రార్థనకు తలలు వంచుదము. దేవుని ఎదుట మన తలలు, హృదయములు వంచుదము. దేవుడు తమ మనవిని వినవలెనని కోరువారందరూ చేతులెత్తి చూపించండి? మేము ప్రార్థించుచుండగా మీరు మీ విన్నపములను మీ హృదయములలోనే నిలిపి యుంచుకొనండి.
1PET 4:12
2ప్రభువైన యేసూ, నీవు తరగని ఊటవు. జీవపు ఊటవు. ప్రభువా, నేడు మా ద్వారా ప్రవహించి మమ్ములను సమస్త అవిశ్వాసము, పాపము నుండి శుద్ధి చేయుము. నీ సన్నిధిలో ఇప్పుడు నిలబడగలము. మా మధ్య అవసరతను ఎరుగుదుము. మేము పాపులమనియు, ఎట్టి ఆశీర్వచనమునకు యోగ్యులము కామనియు ఎరుగుదుము. ఆయన దిగి వచ్చి మా పాపములను భరించెను! ఆయన రక్తము అచ్చటున్నది. దేవుని సన్నిధిలో యున్నది మేము కాదు గాని, ఆయనే — ఆయన రక్తము ద్వారా మా స్వరము వినబడుచున్నది; ఆయన రక్తము మాట్లాడుచున్నది. ఓ, దేవా! మా హృదయములను పాపము మరియు అవిశ్వాసముల నుండి శుద్ధీకరించుము.
మా హృదయ వాంఛలను తీర్చుము, నిన్ను సేవించవలెను ఆశలే మేము నిజంగా కలిగియున్నాము. మమ్మును పరిపూర్ణులనుగా చేయుటకే కొన్నిసార్లు ఈ బలహీన పరిస్థితులు, బాధలు, లోక సంగతులు మా మీదికి వచ్చుచుండును… మాకు అది చెప్పబడినది, "ఈ శోధనలు వచ్చుట వింత కాదు," అని ఆయన చెప్పెను. మన మేలు కొరకు, మనలను పరిపూర్ణులనుగా చేయుట కొరకు, ఆ స్థానము లోనికి మనలను తెచ్చుటకు అవి పని చేయును. ఇవి గొప్ప అనుభవపు ఎడారులు, నీతిమంతులు ఇందు మూలముగా పరిశుద్ధులుగా మలచబడుదురు. ప్రభువా, ఈ అనుభవములను బట్టి మీకు వందనములు చెల్లించుచున్నాము. నీ చిత్తమునకు భిన్నమైన దానిని దేనిని మేము చేయగోరుట లేదు. తండ్రీ, వీటి ద్వారా మేము నీకు సన్నిహితముగా వచ్చునట్లు చేయుమని ప్రార్థించుచున్నాము.
భారము మరింత హెచ్చయినప్పుడు మేము ముందుకు పోజాలము, అప్పుడు మేము మా చేతులెత్తి తండ్రికి మొరపెడుదుము. ప్రభువా, అప్పుడు పరము నుండి మా మొరను వినుము. దేవుని రాజ్యము నిమిత్తము మమ్మును బాగుచేసి స్వస్థపరచుము.
ప్రభువా, ఈ ఉదయము నీ వాక్యమును దీవించుము. నీ వాక్యమే సత్యము.
3ఇప్పుడు మేము సంఘములో కూడికొని యున్నాము. సహో. నెవిల్, సహో. కాప్స్, సహో. కాలిన్స్, ఇంకా సేవకులందరి కొరకు, ట్రస్టీలు, పెద్దలు, సంఘస్థులు, క్రొత్తగా వచ్చిన వారందరి కొరకును మేము ప్రార్థించుచున్నాము. నీ సన్నిధి యుండుటను బట్టి మేము ఈ దినమును ఎక్కువ కాలము జ్ఞాపకముంచుకొనెదము గాక!
ప్రభువా, ఈ ఉదయము మేము గొప్ప వాటిని ఆశించి ఇక్కడికి వచ్చి యున్నాము. మేము మామూలుగా ఇక్కడ కూడికొని యుండవచ్చును, కాని ఇది ఒక ఉద్ధేశ్యము కొరకని తలంచుచున్నాము. ప్రభువా, నీ ఉద్ధేశ్యమే నెరవేరును గాక! యేసు నామములో మేము దీనిని అడిగి, మమ్మును-మేము నీకు సమర్పించుకొనుచున్నామ. ఆమేన్.
4ఇక్కడుండుట, జనులతో నిండిపోయిన సంఘములో సమకూడుట చాలా గొప్ప సంగతి. ఈ ఉదయము ఇక్కడెవరూ ఉండరనుకొన్నాను, ఎందుకనగా ఇక్కడికి వచ్చుట ఇప్పుడే నిర్ణయించబడినది.
ఫిలదెల్పియా నుండి ఇప్పుడే మేము వచ్చాము. నా స్నేహితుడగు కెప్టెన్ జిమ్ మోస్లే సమాధి కార్యక్రమమునకు వెంటనే ఆరిజోనాకు వెళ్ళవలెననుకొన్నాను. చాలా ప్రశస్తమగు దైవ బిడ్డ. ముగ్గురు మోస్లే సోదరులను కొద్దికాలం క్రితమే క్రీస్తు యొద్దకు నడిపించాను. అందులో ఒకడు విమానములో నుండెను, పడిపోయి వెంటనే చనిపోయెను. పది గంటల పాటు అతడు అగ్నిలో యుండెను. ఆ తరువాత అతనిని కనుగొనిరి. లీ వయస్సు ఇరవై ఎనిమిది సంవత్సరములు, అతని భార్యకు ఇరవై-ఆరేండ్లు, ముగ్గురు చిన్న పిల్లలు — పెద్దవానికి ఏడేండ్లు. చాలా విచారము. మరుసటి దినమే అతనిని సమాధి చేయవలసి వచ్చెను. నాకు వెళ్ళే అవకాశము లేదు. సహో. మోస్లే సమాధి కార్యక్రమములో చెప్పవలసిన దానిని నేను టెలిగ్రాం పంపాను. ఇట్టి కొన్ని సంగతులు మనకు అర్థము కావు, కాని ఆయన అన్నియూ సరిగానే చేయును.
ROM 8:28
5ఈ ఉదయము ప్రభుని ఆరాధించుటకు ఇచ్చట మనము కూడియున్నాము, దేవుని మనము నమ్ముచున్నామని ఎరుగుదుము, ఆయన అన్నియూ అక్షరాలా సరిగానే చేయునని విశ్వసించుచున్నాము. అదేమయినా గాని, ఎట్లు జరిగినాగాని అది మేలు కొరకే సమకూడి జరుగును అని ఎరుగుదుము. ఆయన వాగ్ధానమది. ఆ విధముగా అది జరుగవలసి యున్నది. కొన్నిసార్లు దానిని మనము అర్థము చేసికోలేము. చాలా గందరగోళములో చిక్కు కొందుము, అయినా గాని అది సత్యమని మనకు తెలియును, ఎందుకనగా అది సత్యమని బైబిలు చెప్పుచున్నది. మనకు బైబిలు అనగా అక్షర రూపములో ఉన్న దేవుడే.
మనము ఎక్కడో ఒక చోట విశ్వాసముంచవలసియున్నాము. నేను గాని, మీలో ఎవరయినా గాని జీవితములో ఏదో సాధించవలెనని ప్రయత్నించెదము, కోటీశ్వరులము కావలెనని చాలాసార్లు తలంచుదుము… కాని దానితో మనమేమి చేయుదుము? మనము దారి చివరకు రావలసియున్నాము. అప్పుడు దాని వలన మనకేమి లాభము? చూచారా? డబ్బు అనగా ఒక మారక సాధనము; కాని జీవితమును దానితో మారకము చేయజాలవు. జీవము దేవునిలో మాత్రమే యున్నది.
6కాబట్టి ప్రతికూల రూపములో ఇచ్చట మనమున్నామని మనకు గ్రహింపు కలిగినది. ప్రతికూలత ఉన్నది గనుక అనుకూలత కూడా ఉండవలసి యున్నది. అనుకూలత లేకుండా ప్రతి కూలత ఉండదు, చూడండి, ఎందుకనగా ప్రతికూలతను తయారు చేయునది అనుకూలతయే. ఒక దాని యొక్క ప్రతి కూల బొమ్మను నీవు కలిగి యుందువు. దాని యొక్క అసలు రూపము ఎక్కడో ఉండి యుండును, ఎందుకనగా ఆ కటకమును వెలుగు తాకినది లేని యెడల ఆ ప్రతికూల బొమ్మ రాదు. కాబట్టి ఇక్కడ మన జీవితమును ప్రతికూలతలో చూచుచున్నాము, కాబట్టి దాని యొక్క స్వరూపము ఎచ్చటో యున్నదని మనమెరుగుదుము. ఆ మూల స్వరూపమును వెలుగు తాకగానే దాని ప్రతి కూల బొమ్మ ఈ భూమి మీద ప్రతిబింబించినది. మనము కేవలము ఆ ప్రతిబింబమై యున్నాము. అసలయినది ఎక్కడోయున్నది. ఆలాగు కానియెడల ప్రపంచములో నా కంటె మోసపోయిన వ్యక్తి మరొకరుండరు; నా జీవితమును వ్యర్థముగా గడిపినట్లే. కాని నిస్సందేహముగా అది అచ్చటున్నదని ఎరుగుదును. చూచారా? అందుకే ఇచ్చట మనము ఉన్నాము.
7మీరు దేశము నలుమూలల నుంచి వచ్చుట చూచాను. మీతో నన్ను పోల్చికొన్నప్పుడు, నేను ఇట్టి కూటమునకు ఏమీ ప్రయాస పడలేదనిపించుచున్నది, ఇక్కడకొద్ది నిమిషముల ఆరాధనలో పాలుపొందుటకు వందల కొలది మైళ్ళు కారు నడుపుకొని జనులువచ్చారని నేనెరుగుదును.
ఒక రోజున ఎవరో స్త్రీలు ఒక మాట అన్నారు, "ఈ భూమి మీద అటువంటి వారిని చూపించండి, వారి వెనుకే నేను నడిచి బాగవుదును." జనులు ఆ విధంగా నిన్ను నమ్ముదురు. నీవు క్రీస్తు ప్రతినిధివి. అయితే మనమేమి చేయవలెను? మనము చాలా జాగ్రత్తగా యుండవలెను, ఎందుకనగా నీ తప్పుతో నిన్ను నీవు నాశనము చేసికొనుటయే గాక, నిన్ను వెంబడించు వారిని కూడా నీవు నాశనము చేయుచున్నావు.
కావున నీవు ఆశ్రయించుటకు లేక ఏ శాఖను మరేదియు నేనెరుగను. నా విశ్వాసమంతా ఒక దానిలోనే యున్నది, నన్ను మీరు నమ్మినయెడల, నేను మీతో చెప్పిన దానిని వెంబడించుడి. నేను బైబిలును నమ్ముచున్నాను, అది దేవుని వాక్యము. మిగిలినవి తప్పిపోవును. ఆయనే జీవము. ఆయనే వాక్యము.
8ఇప్పుడు, మిమ్మును ఇక్కడ ఎక్కువసేపు ఉంచుచున్నాను. నేను దేవునికి ప్రార్థించాను, ఈ రోజు నాకు రావలెననిపించినది… నాకు చాలా పిలుపులు, ఆహ్వానములు వచ్చినవి; కొందరిని ఈ ఉదయం నేను కలిసికోవలసియున్నాను. "మంచిది, సహో. నెవిల్ నన్ను నిస్సందేహంగా మాట్లాడమని అడుగును." అది శుక్రవారము. సహో. నెవిల్ బహుశా నన్ను మాట్లాడమని కోరునేమోనని చెప్పాను. నేను దేవునికి ప్రార్థించాను… చాలా వేడిగా యున్నది, ఆయన వర్షమును పంపి మేలు చేసెను, వేడి చల్లారినది, మంచి ఉదయము నేడు మనకిచ్చెను. మీ ప్రతి ఒక్కరి మీద ఆయన మంచితనము వర్షించునని ప్రార్థన. ఈ ఉదయం ఇచ్చట ఉన్న సంగతి మీరెన్నడూ మరువ కుందురు గాక! ఆయన కృప, దీవెనలు మీ మీద ఉండునుగాక!
9గత రాత్రి వ్యాధిగా నున్న నా స్నేహితుడగు సహో. బిల్ డాచ్‌ను దర్శించాను. ఈ ఉదయం ఆయన నాకు కనబడలేదు…. ఓ! ఇచ్చటున్నాడు. తొంబది-ఒక్క సంవత్సరము వచ్చిన వృద్ధుడు ఇంకా దేశమంతా తుఫాను వలె చుట్టి వచ్చుచున్నాడు. ఎడారులు, మంచు పర్వతములు, జారుడు రహదార్లు దాటివెళ్ళుచున్నాడు. ఆయన ఆలాగు చేయవలసిన పనిలేదు. దేవుడాయన పట్ల మేలు చేసెను. అతడు ఇంట్లో కూర్చొని కొందరు సేవకులతో గాలి విసరించుకోగలడు, కాని బిల్‌డాచ్‌కు ఏదో జరిగినది. అతడు తిరిగి జన్మించెను. అతని హృదయములోనికి ఒకటి వచ్చెను. బ్రదికియున్నంత వరకూ ఈ ఆరాధనలకు హాజరు కావలెనని నిశ్చయించుకొనెను. నేను దేవుని బూరను అయినచో, నా స్నేహితుని మోసము చేయుదునా? అంతకంటె చనిపోవుట మంచిది. ఈ బైబిలులో నుండి సత్యమును మాత్రమే ఆయనకు చెప్పెదను. అది దేవుని వాక్యము. ఆయన చెప్పిన దానినే తిరిగి చెప్పుచున్నాను.
ఇపుడు బైబిలులో నుండి కొన్ని మాటలు చదువుదును.
10చదువు ముందుగా చెప్పుచున్నాను, ఈ రాత్రికి ప్రభురాత్రి భోజనమున్నదని నమ్ముచున్నాను. పనులకు వెళ్ళవలసిన కొందరు తిరిగి తమ ఇండ్లకు వెళ్ళిపోవుదురు — ఇక్కడ స్థానికంగా యున్న వారు గుర్తుంచుకొనండి, ఈ రాత్రికి సోదరులు సంస్కారము ఇచ్చెదరు.
11ఇప్పుడు, ఆఫ్రికాకు వెళ్ళుటకు చివరి పిలుపు కొరకు ఎదురుచూచుచున్నాను. నన్ను మిషనెరీగా వారు రానియ్యరు. నేను కెన్యా, ఉగాండా, టాంగ్యానికాల గుండా వెళ్ళుట ఒక్కటే మార్గము. మొదటగా సంఘములే నన్ను రానియ్యరు, ఎందుకనగా వారు ఆఫ్రికాలోని కొన్ని చోట్ల నన్ను బోధించవలెనని కోరారు. ఆలాగు నేను వెళ్ళను. నేను వేషధారి వలె పని చేయను. కాబట్టి నేను వారికి ఆలాగు చేయనని చెప్పవలెను, "దేవుడు నా హృదయములో ఉంచిన దానినే నేను బోధించెదను. అంతే!" చూచారా? నేను ఏమీ బోధించవలెనో వారు నాకు చెప్పుటకు ప్రయత్నించుచున్నారు. త్రిత్వ బాప్తిస్మము మొదలగు వాటి గూర్చి చెప్పుచున్నారు.
12సహో. బోజ్ ద్వారా ఒక పెద్ద కూటమునకు ఆహ్వానించబడితిని. మనము నమ్ము దానిని చూచుటకు అతడు సిద్ధముగా యున్నాడు. వెలుతురును చూడవలెనని ఒడ్డున వేచి యున్నాడు. కాబట్టి వేట పర్యటనకు వచ్చుచున్నట్లుగా నన్ను రమ్మని అతడు కోరెను. వారు వేటకయితే నన్ను రానిత్తురు. ఎవరయినా నన్ను వేటకు తీసికొని వెళ్ళుదుమని చెప్పవలెను. ఆ దౌత్య కార్యాలయంలో నాకు ఒక స్నేహితుడున్నాడు, అతడు డాక్టరు, షికాగో నివాసి, నాకు వ్యక్తిగత స్నేహితుడు — నేను అక్కడికి వెళ్ళిన వెంటనే అతడు ఇట్లనును, బ్రెన్‌హాం సోదరుడు ఇచ్చటున్నాడు. కూటము ఏర్పాటు చేయుదము. అక్కడికి వెళ్ళిన తరువాత ఎంబసీ వారు నన్ను పొమ్మనరు. వారిప్పుడు ఆ ఏర్పాట్లు చేయుచున్నారు. అది దేవుని చిత్తమయితే ఆ విధంగా జరుగును, చూచారా. ఆయనకే అప్పగించాను, మీకు ఏ సంగతి తెలియచేయుదును.
13దేవుని చిత్తమయితే ఏడు బూరల మీద నేను మాట్లాడెదను. ఎనిమిది దినముల కూటము జరుగును; బహుశా ఈ ఆలయంలో కాకపోవచ్చు; బహుశా ఇక్కడి ఆడిటోరియం కొరకు ప్రయత్నించుదము.
ఇక్కడ క్రొత్తగా కట్టిన ఆడిటోరియం గూర్చి నేను ఆలోచించలేదు. దర్శనంలో యేసును మొదటి సారిగా నేను అందులో చూచాను — అదే స్థలంలో ఆడిటోరియం కట్టబడినది. దానిని చూచుటకు మొన్న వెళ్ళాను, ఆయన తూర్పు వైపు చూచుట నాకు కనబడినదని మీతో చెప్పాను గుర్తున్నదా? నేను నా తండ్రి కొరకు ప్రార్థించుచున్నాను. అప్పుడు నేను బాల బోధకుడను. అక్కడే ఆయనను చూచాను. ఆయన నా వైపు చూడకుండా ముఖమును ప్రక్కకు త్రిప్పుకొనెను. ఆ పొలములో నేను గొంతు సవరించుకొంటూ నడిచి వెళ్ళుచున్నాను. ఆయనను కనిపెట్టుచునే యున్నాను. ఆయన నా వైపు చూడలేదు. అప్పుడు నేను యేసూ అని పిలిచాను. ఆయన నా వైపు తిరిగి తన చేతులు చాపెను. నాకు గుర్తున్నదంతా అదే. తెల్లవారినది, నేను పొలములో నుండి తిరిగి వచ్చాను. కాబట్టి బహుశా ప్రభువు ఆ బూరల గూర్చి ఇక్కడ నన్ను చెప్పమన వచ్చును. ఏది ఏమైనా గాని, దేవుని చిత్తమే జరుగును.
14ఇప్పుడు, మీ బైబిలులో యెషయా 53వ అధ్యాయము తీయండి. ఈ ఉదయము ఇక్కడికి కూడి వచ్చితిమి. దేవుడు మన అల్ప ప్రయత్నములను దీవించునని నమ్ముచున్నాను. ఇప్పుడే మేము ఫిలదెలిఫీయ నుండి వచ్చాము. సంపూర్ణ సువార్త పనివారల కూటమునకు వెళ్ళాను. వారి వారి సాక్షములను అచ్చట విన్నాను.
నేను, బిల్లీపాల్, రిబ్కా , చిన్న కాలిన్స్ పాప, చిన్న బెట్టీ కాలిన్స్ , కలిసి తిరిగి వచ్చాము. బిల్లీ చాలా చక్కగా నిద్రపోవును, బెక్కి కూడా అంతే. కాబట్టి బెట్టీ, నేను మాట్లాడుకొన్నాము. ఆమె బెక్కితో కూడా వెనుక సీటులో కూర్చొన్నది. దారిలో ఏదో జరుగుట చూచాను. ఏదో నన్ను తాకినది. నేను మాటలు ఆపి ఏదో వ్రాయసాగాను. బెట్టీ ఇక్కడున్నచో ఆమెకు ఇది తెలియును. ఈ ఉదయము నా అంశము అదే.
ISA 53:1-12
15ఇప్పుడు, లేచి నిలబడదుము. యెషయా 53వ అధ్యాయము చదువుచుండగా దేవుని వాక్యమును గౌరవించుచూ లేచి నిలబడుదము.
మేము తెలియచేసిన సమాచారము ఎవడు నమ్మెను? యెహోవా బాహువు ఎవనికి బయలుపరచబడెను? (గమనించండి, ఇది ప్రశ్నతో ప్రారంభమైనది)
లేత మొక్క వలెను, ఎండిన భూమిలో మొలిచిన మొక్క వలెను అతడు ఆయన యెదుట పెరిగెను. అతనికి సురూపమైనను సొగసైనను లేదు. మనమతని చూచి ఆపేక్షించునట్లుగా అతని యందు సురూపము లేదు.
అతడు తృణీకరింపబడినవాడును ఆయెను. మనుష్యుల వలన విసర్జించబడిన వాడును, వ్యసనాక్రాంతుడుగాను వ్యాధిననుభవించిన వాడుగాను, మనుష్యులు చూడనొల్లని వాడుగాను ఉండెను. అతడు తృణీకరింపబడినవాడు గనుక మనము అతనిని ఎన్నిక చేయక పోతిమి.
నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను. మన వ్యసనములను వహించెను. అయినను మొత్తబడిన వాని గాను, దేవుని వలన బాధింపబడిన వాని గాను, శ్రమ నొందిన వాని గాను మనమతనిని ఎంచితిమి.
మన అతి క్రమ క్రియలనుబట్టి అతడు గాయ పరచబడెను. మన దోషములను బట్టి నలుగ గొట్టబడెను. మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను. అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది.
మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి. మనలో ప్రతి వాడును తన కిష్టమైన త్రోవకు తొలిగెను. యహోవా మనయందరి దోషమును అతని మీద మోపెను.
అతడు దౌర్జన్యము పొందెను. బాధింపబడినను అతడు నోరు తెరువ లేదు. వధకు తేబడు గొర్రెపిల్లయు, బొచ్చు కత్తిరించు వాని యెదుట గొర్రెయు మౌనముగా నుండునట్లు అతడు నోరు తెరువ లేదు.
అన్యాయపు తీర్పునొందినవాడై అతడు కొనిపోబడెను. అతడు నా జనుల యతిక్రమమును బట్టి మొత్తబడెను గదా? సజీవుల భూమిలో నుండి అతడు కొట్టి వేయబడెను. అయినను అతని తరము వారిలో ఈ సంగతి ఆలోచించిన వారెవరు?
అతడు మరణమైనప్పుడు భక్తిహీనులతో అతనికి సమాధి నియమింపబడెను. ధనవంతుని యొద్ద అతడు ఉంచబడెను. నిశ్చయముగా అతడు అన్యాయమేమియూ చేయలేదు. అతని నోట ఏ కపటమును లేదు. అతని నలుగ గొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను. ఆయన అతనికి వ్యాధి కలుగ జేసెను. అతడు తన్ను తానే అపరాధ పరిహారార్థ బలిచేయగా అతని సంతానము చూచును. అతడు దీర్ఘాయుష్మంతుడగును.
యెహోవా ఉద్ధేశము అతని వలన సఫలమగును. అతడు తనకు కలిగిన వేదనను చూచి తృప్తినొందును. నీతిమంతుడైన నా సేవకుడు జనుల దోషములను భరించి తనకున్న అనుభవ జ్ఞానము చేత అనేకులను నిర్ధోషులనుగా చేయును.
కావున గొప్ప వారితోనేనతనికి పాలు పంచి పెట్టెదను. ఘనులతో కలిసి అతడు కొల్ల సొమ్ము విభాగించుకొనును; ఏలయనగా, మరణము నొందునట్లు అతడు తన ప్రాణము ధారపోసెను. అతిక్రమము చేయు వారిలో ఎంచబడిన వాడాయెను. అనేకుల పాపమును భరించుచూ తిరుగుబాటు చేసిన వారిని గూర్చి విజ్ఞాపనము చేసెను.
PS 119:105
16తండ్రియగు దేవా, నీ వాక్యము ఒక దీపము. దేవుని యొక్క సన్నిధికి ప్రతి విశ్వాసిని తీసికొని వెళ్ళు త్రోవను వెలిగించు దీపమై యున్నది. మన చేతిలోని లాంతరు వలె అది దారి చూపును. ఆది నుండియే అంతమును చూచు దానిని నీవు మాకేమీ ఇయ్యలేదు గాని విశ్వాసముతో నేను నడచుచున్నాను. రాత్రిలో చీకటి అరణ్యమందు పయనించు వ్యక్తి వలెయున్నాము (మనము అందే యున్నాము). అతడు పట్టుకొన్న దీపమే ఒక్కొక్క అడుగును చూపును. పైకి చూపుచున్న మార్గమును దీపము వెలుగుతో నడచెదము. దేవుని యొక్క రాజ్యములోనికి ఒక అడుగు ముందుకు మమ్మును నడిపించు నట్లుగా వాక్యము పైన నేడు వెలుగు ప్రకాశించును గాక! యేసు నామములో దీనిని అడుగుచున్నాము. ఆమేన్. కూర్చొనండి.
17నేడు నేను జనులతో చెప్పనైయున్న అంశము: "మహోన్నత కళాఖండము." బైబిలులోని అతి క్రూరమగు, దారుణమగు దృశ్యములలో ఇది ఒకటి. ఈ పరిపూర్ణుడగు దాసుడు శ్రమపొంది, గాయపరచబడి, నలుగగొట్టబడెను అని బైబిలు చెప్పుచున్నది. ఇట్టి మాటలలో నుండి మహోన్నత కళాఖండము అను అంశము తీసికొనుట వింతగాను౦డెను
మేము తిరుగు ప్రయాణములో యుండగా ఈ ఉదయము నా మనస్సు చాలా సంవత్సరముల వెనుక జరిగిన వాటి మీదికి వెళ్ళినది. కాలిఫోర్నియో లోని లాస్ ఏంజలస్‌లో ఉన్న ఫారెస్ట్‌లాన్‌కు ఆహ్వానించబడితిని. ఫోర్ స్కేర్ ఉద్యమ స్థాపకురాలగు ఎమీ సెంఫీల్ మెక్ఫర్‌సన్ సమాధిని దర్శించుటకు అక్కడికి వెళ్ళుటలో గల నా ప్రథమ ఉద్ధేశ్యము. ఆమె సమాధి యొద్దకు వెళ్ళాను. ఈ స్త్రీ సేవకురాలితో నాకు భేదాభిప్రాయములున్నప్పటికి, ఆమె తాను నిలబడిన దాని కొరకు ఆ ఘడియలో శ్రమలు, హింసలు ఎన్నో సహించినందున నా హృదయములో ఆమె పట్ల గౌరవమున్నది. ఆమె ప్రియ కుమారుడగు రాల్ఫ్ మెక్ఫర్‌సన్ నా సన్నిత మిత్రుడు.
18ఒక సేవకుల బృ౦దముతో అచ్చటికి నేను వెళ్ళాను. చిన్న పెట్టెలో శరీరములను పెట్టి ఒక ప్రక్కన దహనము చేసిరి. ఆ చోటికి మేము వెళ్ళలేక పోయాము.
ప్రభురాత్రి భోజనము, ఇంకా కొన్ని గొప్ప కళాఖండములచ్చట ఉన్నవి. సూర్యుని వెలుగుతో అవి వెలిగింపబడును. లోనికి వారు వెళ్ళినప్పుడు, వెలుగు౦డును; వారు మాట్లాడనారంభించినప్పుడు, చీకటి యగును. కొంతసేపటికి అంతా చీకటి యగును. అప్పుడు జనులు బయటకు వచ్చుదురు.
రాత్రి భోజనము వారంతా చేసెదరు…
19ఈ స్థలములో ఒక అద్ధమున్నది, వాటితో ఈ చిత్రములన్నియూ చేయబడినవి. దీని రహస్యము ఒకామెకు తెలియును, ఇది చాలా సంవత్సరముల నుండి కుటుంబ సంప్రదాయంగా వచ్చుచున్నది. కళ ఆ పిల్లలకు ఇయ్యబడినది, ఆ స్త్రీయే వారిలో చివరిది. వారే ఈ బొమ్మను వేసిరి. వారు యూదా ఇస్కరియోతు, యొక్క పటము గీసిన గాజును కాల్చుచుండినప్పుడు అది బ్రద్ధలై పోయినదట. "తన శత్రువు యొక్క పటము తన ప్రక్కనుండుట మన ప్రభువుకు ఇష్టము లేదేమోనని ఆమె తలంచినది." అది "మరల పగిలితే ఇక ఆ బొమ్మను పూర్తి చేయనని ఆమె అనుకొనెను." కాని, అది ఆ సమయములో బాగుండెను. ఇట్టి సంగతులు చాలా వింతగా నుండును.
20అయితే అప్పుడు, ఫారెస్టు లాన్ లో నాకు ప్రధానంగా ఆసక్తిక లిగించినది గొప్ప శిల్పకారుడగు మైకెలేంజెలో యొక్క మోషే విగ్రహము. అది అసలుది కాదు గాని, దానికి నమూనా అయినా గాని, అది ఒక మహా-కళాఖండము. దానిని నేను నిలబడి చూడగా, అందులో నాకు ఏదో కనబడినది… ఒక దానికి అది ప్రతినిధి.
నేను కళను నిజంగా ప్రేమించెదను. కళలో దేవుడున్నాడని నేను నమ్ముదును. సృష్టిలో దేవుడున్నాడని నేను నమ్ముదును. సంగీతములో దేవుడున్నాడని నేను నమ్ముదును. దేవుడు ప్రతి చోటా ఉన్నాడు. అసలయిన దానికి భిన్నమగు ప్రతిదియూ నకిలీయే. నాట్యములో దేవుడున్నాడు, ఇక్కడ చేయుచున్న నాట్యము కాదు. దేవుని ఆత్మలోయుండి దేవుని కుమారులు, కుమార్తెలు నాట్యమాడిరి. ఉదయం రెండు గంటల వరకు నిలబడి గుద్దులాడుకొనుట నకిలీ నాట్యము.
21కాని, ఇది మైకేలేంజెలో యొక్క కళాఖండము. దానిని చేయుటకు అతడు చాలా ఖర్చు చేసెను. అతడు గొప్ప వ్యక్తి. తన జీవితంలో ఎక్కువ భాగమతడు ఖర్చు చేసెను, ఎందుకనగా చాలా సంవత్సరములు దానిని చెక్కెను. ఒక పాలరాయిని తీసికొని చెక్కుచుండెను. ఆ శిల్పికి మాత్రమే ఆ చెక్కబోవునది తెలియును. అది అతని మనస్సులోయుండును. బయట వానికి ఆ చెక్కుచున్న రాయిలో ఏమున్నదో తెలియదు. అది వానికి బుద్ధిహీనముగా కనబడును. కాని ఆ శిల్పి మనస్సులో ఒక దర్శనమున్నది. తన మనస్సులో ఉన్నదానిని అతడు ఆ విగ్రహములో పొందుపరచి తయారు చేయుచున్నాడు. అందుకే అతడు రాళ్ళను త్రవ్వుచున్నాడు.
22నీవు ప్రారంభించినప్పుడే, నీ నమూనాను సరిగా ప్రారంభించవలెను. చూచారా? చిన్న ముక్కను తీసికొని నీవు ప్రారంభించావు. అతనికి ఖచ్చితమగు ఒక నమూనా యుండును. ఆ నమూనా అతని మనస్సులోయున్నది. ఆ నమూనా నుండి అతడు తొలగిపోడు. దీనిని చేయుటకు అతడు తన మనస్సులో పటము గీయును. ఎందుకనగా, నిజమగు మోషే బొమ్మ మనకు లేదు — అయితే మోషే ఎట్లుండెనో ఆ బొమ్మను అతడు మనస్సు నందు వేసికొనును.
23ఒక నిజమగు కవి, ఒక నిజమగు గాయకుడు, ఒక నిజమగు సంగీత దర్శకుడు ఏ విధంగా ప్రేరణ పొందునో, ఆ విధంగానే ఒక నిజమగు శిల్పియు ప్రేరణ పొందును. నిజమగునదంతా ప్రేరణ వల్లనే వచ్చును. మోషే యొక్క రూపము అతని మనస్సులో యున్నది. కాబట్టి అతడు కూర్చొని ఆ గొప్ప చలువ రాయి మీద నమూనా ప్రకారము చెక్కుచూ, తన మనస్సులో యున్న నిజ పటమును తీసికొని వచ్చెను.
24అతడు దానిని పరిపూర్ణముగా చెక్కెను. ప్రతి మూలను పరీక్షించి రుద్దెను. కండ్లు చక్కగా యున్నవి, జుట్టు, గడ్డము అంతా అనుకొన్నట్లే వచ్చెను. నిలబడి దానిని చూచెను. చాలా సంవత్సరములు అతడు కష్టపడెను. దాని దృశ్యమును అన్ని సంవత్సరములు అతడు తన మనస్సులో నిలుపుకొని యుండెను. అన్ని సంవత్సరములు అతని మనస్సులో ఆ దృశ్యముండుట చూడండి. ఆ దర్శనమునకు అనుగుణంగా పని చేసి, చెక్కి దానిని తయారు చేసెను. దానిని అతడు పరిపూర్ణముగా మలిచెను. అది నిజంగానే పరిపూర్ణతను పొందెను. దానిని పూర్తి చేసిన ఉదయమున అతడు తన చేతిలో సుత్తె పట్టుకొని నిలబడి చూచుచుండెను. దాని వైపు అతడు చూచినప్పుడు ఎంతో ఆవేశము పొందెను, ఎందుకనగా తన మనస్సులో ఉండిన దర్శనము ఇప్పుడు వాస్తవ రూపమై తన ఎదుట నిలబడెను. మోషే గూర్చి తనకుండిన భావము ఇప్పుడు తన ఎదుట రూపమై నిలబడినది. ఎన్నో సంవత్సరములు అది తన హృదయములో ఉండెను. శ్రమ, లేదా నా ఘడియలు, నిరుత్సాహము, విమర్శలు ఎదుర్కొనెను, కాని అతడు అది పూర్తియగు వరకు ఆ దర్శనముతో నిలచి యుండెను.
25అది పూర్తి అయినప్పుడు అతడు తన సుత్తి చేతితో పట్టుకొని ఆ విగ్రహమును చూస్తూ నిలబడియుండెను. ఆ విగ్రహమును చూచి అతనిలో ఆవేశము కట్టలు తెంచుకొనెను — అతడు ఇక ఆగలేక దాని ప్రక్కకు వెళ్ళి "మాట్లాడు," అని పలికి, మోకాలు మీద కొట్టెను.
ఆ మహా విగ్రహములో ఒక దోషము ఉన్నది, మోకాలు మీద చిన్న గాటు ఉన్నది. అది కుడి మోకాలు. మోకాలుకు అరంగుళముల పైన లోతయిన గాటు పడినది. దానిపై నా చెయ్యి పెట్టాను, దాదాపు అంత లోతు.
26దీనిని చెక్కుటకు అతడు ఎన్నో సంవత్సరములు పనిచేసెను. తన దర్శనములో, తన హృదయములో, తన కోరికలో చూచినది నెరవేరెను, చూడగోరినది పూర్తి అయ్యెను. దాని వలన అతడు ప్రభావితుడై, ఆవేశముపొంది ఆ మహా-కళాఖండము తిరిగి మాట్లాడవలెనని అతడాశించెను. అతడు దాని కాలు మీద కొట్టి మాట్లాడు అనెను. దాని వలన గుంట ఏర్పడెను. ఆ విగ్రహమునకు దెబ్బ తగిలెను.
నాకయితే ఆ పగిలిన దాని వల్లనే అది మహా-కళాఖండముగా తయారయినట్లు కనిపించుచున్నది. నా మనస్సు వేరుగా ఆలోచించవచ్చును. మీరు దానివలన అది పాడయినదని అనవచ్చు. నాకయితే అందువలనే అది గొప్పగా మారినది. ఎన్నోసంవత్సరాలు అతడు ప్రయాసపడెను, జాగ్రత్తగా పని చేసెను, ఆవేశభరితుడయ్యెను. అతని శ్రమ వృధా కాలేదని రుజువయ్యెను. అది పరిపూర్ణముగా యున్నది, అందుకే అతడు మాట్లాడు అనెను, ఎందుకనగా అతడు తన మనస్సులో ఉన్న దర్శనమును మంచి రూపములోనికి మలచి కళ్ళ ముందర చూచెను; కాబట్టి అతడు ఆవేశపూరితుడై మామూలుగా చేయని పని చేసెను. దానిని అతడు కొట్టి "మాట్లాడు!" అనెను. చూడండి, ఆలోచించినయెడల అతడు ఆ పనిచేసియుండెడివాడు కాడు. కాని అతడు ఆలోచించలేదు. తన మనస్సులో యున్నది పరిపూర్ణముగా తన ఎదుట నిలచియుండుట చూచి అతడు ఆవేశపూరితుడయ్యెను.
27అతని శ్రమ, ప్రయాస, దీర్ఘ రాత్రులు, దినముల తరబడి లోకమునకు దూరముగా ఉండుట, చిన్న అప్పము తిని గడుపుట సంపూర్తి అయ్యెను. దానిని ఎన్నోసార్లు ఆలాగు కాదు, ఈలాగు, అని సరిదిద్ది యుండును. చివరికది పరిపూర్ణముగా, వాస్తవముగా అతని కళ్ళ ముందు నిలబడెను. అతని మనస్సులో యున్న ప్రతికూల పటము ఇప్పుడు అనుకూల నిజ రూపమాయెను; కాబట్టి అతడు చలించెను. అది ఎంతో వాస్తవముగా కనబడెను గనుక అతడు "మాట్లాడు!" అనెను.
నాకయితే అది ఒక ప్రతిబింబము, అది అతని పనికి ఫలితము. అతని స్వంత పని అతనిని ఎంతో ఆవేశపరచెను. అతడు తన్నుతాను మరచిపోయి "మాట్లాడు!" అని కొట్టెను.
28నేను అక్కడ నిలబడి ఆ విగ్రహమును చూచాను. దానిని తయారు చేయుటకు అతడు ఎన్ని గంటలు గడిపి యుండునో, చాలా సంవత్సరములు ప్రయాసపడెను. అతని గొప్ప పనికి, గొప్ప కళా ప్రతిభకు అది ఒక మచ్చుతునక. దానిని అతడు చివరకు సాధించెను, అది చాలా గొప్పది.
29ఇప్పుడు, మనము మైకెలేంజిలో పేజిని త్రిప్పి, పుస్తకమును మూయుదము. మరియొక గ్రంథము తెరచి, మహా-శిల్పియగు సర్వశక్తుని గూర్చి చదువుదము. ప్రపంచము అనునది లేనప్పుడు, పునాదులు ఏర్పడక ముందే ఆయన మనస్సులో మానవుడుండెను. తన పోలికలో నరుని ఆయన చేయగోరెను. ఆయన ఆలోచనా ప్రకారము, దర్శనము ప్రకారము అతనిని చేయగోరెను.
30మైకెలేంజిలోకి అయితే అది అతని ఆలోచనా స్వరూపము. మహా-శిల్పియగు దేవుడు తన పోలిక చొప్పున మానవుని చేయగోరెను. అందుకు పనిచేయ పూనుకొనెను. ఆయన చేసిన వాటిని గమనించండి. బహుశా మొదట చేపలను, తరువాత పక్షులను, తరువాత భూమి మీద ప్రాకు వాటిని ఆయన చేసియుండును. ఆయన మానవుని వంటివాడు కాడు. ఆయన సృష్టికర్త. మామూలు శిల్పి అయితే ఇంతకు ముందు సృష్టించబడిన దానిని చూచును. దాని ప్రకారము చెక్కును, కాని ఆయన నిత్యమగు వాటిని తయారుచేయు శిల్పకారుడు. ఆయన తన మనస్సులో యున్న దానిని ఉనికిలోనికి తేగలవాడు. ఆయన సృష్టించగల శిల్పి. ఆయన తాను కోరిన స్వరూపమును తయారు చేయగలడు.
31ఆయన నేల మీద ప్రాకు పురుగులను, చిన్న జంతువులను సృష్టించెను. ఆ తరువాత ఇంకా ఉన్నత మగు వాటిని ఆయన సృజించెను. చివరగా, ఆయన పెద్ద వాటిని సృజించెను, సింహాము, పులి, ఎలుగుబంటి మొదలగు వాటిని చేసెను. కోతులు మొదలగు వానిని కూడా ఆయన అప్పుడే సృజించి యుండును. ఒకదానిలో నుండి ఒకటి వచ్చినదని వారనుకొనుచున్నట్లు పరిణామము కాదు. దేవుడు పూర్తిగా సృష్టి చేసెను, దేవుడు ఒక క్రమములో పనిచేయుచుండెను.
అయితే చివరకు భూమి మీదికి ఒక పరిపూర్ణత వచ్చెను, మరియు అతడే మానవుడు. ఆ మానవునిలో ఆయన తన్ను చూచుకొనెను, అతడు ఆయన వలె ఉండెను. అతడు సృష్టికర్తను ప్రతిబింబించుచుండెను. దేవుడు తాను అనుకొన్న దానిని సాధించెను. మానవుడు దేవుని స్వరూపములో ఉండెను.
32నేను దీనిని చెప్ప వచ్చును: ఆయన మానవుని తయారుచేసెను. కాని ఇంకా ఏదో లోపముండెను, అదేమనగా, అతడు ఒంటిగా యుండెను. దేవుడు కూడా ఆలాగే యున్నాడు. ఆయన నిత్యుడు. దేవుని పోలికలో యున్న మానవుడు కూడా తన మట్టుకు తాను యుండెను. కాబట్టి ఆయన అతని ఎడమ వైపున కొట్టెను, అందులో నుండి ఆయన ఒక సాటియగు సహాయకురాలిని, భార్యను తీసెను. ఇప్పుడతడు ఒంటరిగా లేడు; అతనితో ఒకరున్నారు. అదే ఆయన యొక్క గొప్ప పని.
MATT 5:15•
LUKE 11:33
33ప్రతి గొప్ప శిల్పికి ఒక గొప్ప కళాఖండముండును. మొదటగా ఆయనే ఒక మహా-కళాఖండము. కాని ఆ కళాఖండము ఒంటరిగా యుండుట ఆయన చూచెను. తన కళాఖండము యొక్క ప్రక్కను చీల్చి ఒక సహాయమును తీసెను.
అందరి శిల్పుల వలెనె ఈయన కూడా వీరిని అందమగు స్థలములో ఉంచెను. ఒక శిల్పకారుడు గొప్ప కళాఖండమును సృష్టించి, దానిని ఏ సందులోనో, ఇండ్ల వెనుకనో, దాచి యుంచడు. మన ప్రభువు చెప్పెను గదా, ఎవరును "దీపమును వెలిగించి కుంచము క్రింద పెట్టరు." మనము దేవుని కళాఖండములమయినప్పుడు, ఎక్కడో సందులో యుండము; మనము తప్పక వెలుగునియ్యవలెను.
GEN 2:2,15
34ఆయన ఈ కళాఖండమును తయారు చేసిన తరువాత ఏదెను తోటలో దాని నుంచెను. అది భూమి మీద సుందర స్థలము. ఇద్దరూ ఒక్కటై యుండిన ఆ కళాఖండమును ఏదెను తోటలో ఆయన ఉంచెను. ఆయనెంతో ఆనందించి యుండును, ఆ మహా-కళాఖండము బాగున్నదనుకొనెను. ఆ తరువాత ఆయన విశ్రమించెనని మనము ఎరుగుదుము. ఆయన తన పనిని బట్టి ఎంతో సంతోషించెను.
35నా ఉద్దేశమును గుర్తుంచుకొనండి, మైకెలేంజిలో కొట్టిన దెబ్బ వల్లనే ఆ మోషే విగ్రహము గొప్ప కళాఖండమయినది. ఆయన తన కళాఖండము యొక్క ప్రక్కను చీల్చి వధువును తీసెను. ఏదెను తోటలో వారిని ఒక కళాఖండము కుటుంబముగా మనము చూచెదము. ఎంత అందముగా అది ఉన్నది! అది ఆయనకెంతో సంతోషము కలిగించెను, ఆయన విశ్రాంతి తీసికొనెను. "నేను విశ్రాంతి పొందుదును," అని ఆయననుకొనెను.
కాని ఆయన తక కళాఖండమును నమ్మి, విశ్రాంతి తీసికొనుచుండగా, శత్రువు వచ్చి ఈ కళాఖండమును చూచెను. మోసము ద్వారా ఆ తోట గోడలను దాటి ప్రాకి వచ్చెను. ఈ గొప్ప కళాఖండమును చెరచెను, కావున అది పడిపోయెను.
36ఇప్పుడు, ఆ గడియారమును నేను గమనించుటకు ప్రయత్నించుచున్నాను. నా మేనల్లుడు మైక్‌ను ముప్పది నిమిషాలయి పోగానే గంట కొట్టమని అడిగాను. ముప్పది నిమిషాలయిపోయాయి, కాని అతడింకా గంట కొట్టలేదు. మరి కొద్దిగా చెప్పుకొందము, చూడండి. ఈ నియమములను నేను దాటిపోగోరను; నేనే ఈ నియములను చేశాను, చూచారా. నీ నియమమును నీవే మీరకూడదు.
37ఇప్పుడు, ఈ కళాఖండమును చూడండి, మోసగాడను సాతాను గోడలను దాటి వచ్చి ఈ కళాఖండమునకు చెరుపు కలుగచేసెను. దానినెట్లు చేసెనో వివరముగా చెప్పెదను. దేవుని వాక్యమే ఈ కళాఖండమునకు గోడగా యున్నది ఈ కుటుంబమునకు వాక్యమే దుర్గము. కాని దానిని బ్రద్ధలు చేసినందున, సాతానుకు చోటు దొరికెను. ఆ సంగతుల గూర్చి నా నమ్మకమేమిటో మీకు తెలియును. కాబట్టి నేనేమీ చెప్పనక్కర లేదు. కళాఖండము బ్రద్ధలయినది.
తన కుటుంబమగు ఈ కళాఖండము పతనమగుట ఈ గొప్ప శిల్పి చూచెను. దానిని ఆలాగు నాశనములో విడిచి పెట్టుట ఆయనకు ఇష్టము లేదు. వెంటనే ఆయన దానిని కట్టుటకు పనిచేయసాగెను. ఎప్పుడూ అది ఆ విధంగా నశించి పోయియుండుట ఆయనకు ఇష్టము లేదు. ఆయన దేవుడు గనుక ఓడిపోడు. కనుక ఆయన వెంటనే పనికి ఉపక్రమించెను మరియు తన స్వరూపములో మానవుని మరల నిర్మించసాగెను.
38జల ప్రళయము వచ్చి యావత్తు ప్రపంచమును నాశనము చేసినట్లు మనకు తెలియును, ఎందుకనగా షరతుల ప్రకారము నిబంధనలు చేయబడినవి. నీవిది చేసినయెడల లేదా నీవది చేయనియెడల మానవుడు నిబంధనను గైకొనలేడని దేవునికి తెలియును. ఆయన మహా-శిల్పి. ఇక మార్గము లేదు.
కొద్ది నిమిషముల క్రితం ఒకాయనతో గదిలో నేను మాట్లాడుచున్నాను. ఇప్పుడాయన ఇచ్చటున్నాడు. ఇట్లనెను, "బ్రెన్‌హాం సోదరుడా, అది తప్పు అనెను." మరియు చిన్న బక్తిగల స్త్రీ.
"కాని చూడు, సహోదరి, నిన్నునీవు నిజంగా దేవుని ప్రేమించుచున్న యెడల, నీ నిండు హృదయముతో ఆయనను సేవించుదువు. అప్పుడు నీ తప్పులన్నియూ ప్రభువైన యేసు రక్తములో దాయబడును, అన్నాను, చూచారా. ఆయన త్రోవ చూపెను."
39కావున ఆయన ప్రారంబించెను. ఇప్పుడు, మానవుని నిబంధనలను తిసుకోనినచొ, "నీ విధి చేసినచో, నేనది చేయును." అబ్రహాము అను మానవునితో ఆయన ఆరంభించెను మరియు షరతులు లేని నిబంధనను ఆయన అబ్రహామున కిచ్చెను. ఆయన కళాఖండమును తయారు చేసిన ప్రతిసారి సాతాను చెడగొట్ట గోరెను. ఆయన అబ్రహాముతో మొదలు పెట్టెను. "నీవు చేసినచో, నేను చేయుదును," కాదు. "అది అయిపోయనది." కాని ఇది షరతులు లేనిది, అని ఆయన చెప్పెను. శిల్పియగు ఆయన ఈ కళాఖండమును నిర్మించ పూనుకొనెను.
అబ్రహాములో నుండి పితరులు వచ్చిరి. దేవుడేమి చేయుచున్నాడు? పగిలిపోయిన కళాఖండమును తిరిగి నిర్మించుచున్నాడు, మొదటగా మనము అబ్రహామును కనుగొందుము.
40గమనించండి. ప్రతి కళాఖండమును ఒక పునాదిపై ఉంచుదురు. శిల్పియగు మైకెలేంజిలో మోషే విగ్రహమును మూడు లేదా నాలుగడుగుల చలువ రాయి మీద ఉంచెను. దానికి ఒక పునాది ఉన్నది. పితరులు అను పునాది మీద దేవుడు ఈ కళాఖండము నుంచి పనిచేయ ప్రారంభించెను. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, యోసేపులను వారు నాలుగు మూలలుగా యుండిరి.
అబ్రహాము విశ్వాసమునకు పునాది. నాలుగు పునాదులని చెప్పుకొందము. విశ్వాసపు పునాది అబ్రహాము. ప్రేమ పునాది ఇస్సాకు. కృపకు పునాది యాకోబు. దేవుని కృప యాకోబునకు వెల్లడాయెనని మనందరికి తెలియును. యోసేపులో పరిపూర్ణత యుండెను. దాని మీద ఆయన తన విగ్రహము నుంచెను. మొదటి పునాది మీద కాదు, రెండవ పునాది మీద కాదు, మూడవ పునాది మీద కాదు, కాని నాలుగవ పునాది మీద.
GEN 46:34•
GEN 47:3
41అబ్రహాము క్రీస్తుకు, మాదిరి. ఆలాగే ఇస్సాకు కూడా ప్రేమలో క్రీస్తుకు మాదిరి. ఆయన కృపకు యాకోబు మాదిరి. యాకోబు అనగా, మోసగాడు. కాని దేవుని కృప అతనికి తోడై యుండెను. కాని యోసేపులో అట్టిది ఏదీ లేదు, ఒక చిన్న పగులు ఆ కళాఖండములో యుండెను, ఎనుడుకనగా పునాది కూడా కళాఖండమై యుండవలెను. తన ప్రవక్తయగు తండ్రికి ఇట్లు చెప్పెను, "నీ జనులు గొర్రెల కాపరులు కారు గాని, పశుల కాపురులని ఫరోతో చెప్పుము, ఎందుకనగా గొర్రెల కాపరి ఐగుప్తు వారికి హేయుడు."
ముసలి ప్రవక్త ఫరో ఎదుటకు వెళ్ళి, "నీ దాసులు పశుల కాపరులు," అని చెప్పెను. కావున ఒక పగులు ఏర్పడెను, చూడండి. అయినా గాని అది కళాఖండమే.
MATT 11:11•
LUKE 7:28
42ఇప్పుడు, విశ్వాసము, ప్రేమ, కృప మరియు పరిపూర్ణతల ద్వారా, పితరుల ద్వారా పునాది వేయబడెను.
ఇప్పుడు, గొప్ప కళాఖండమునకు ప్రవక్తలు శరీరము వలెయుండిరి, అనగా వాక్యము. దానిని మీరు గ్రహించగలరని నమ్ముచున్నారు. చూచారా, ప్రవక్తలు, ధర్మశాస్త్రము కాదు, ప్రవక్తలు. ప్రవక్తలకు బయలుపరచబడిన వాక్యముండును, అదే శరీరము; పితరులు కారు, ప్రవక్తలు. ప్రవక్తలే వాక్యమైయుండిరి.
మోషే కాలము నుండి ఆయన మొదలు పెట్టి ప్రవక్తలు ప్రతి ఒక్కరి ద్వారా వచ్చుచుండెను — శరీరమును నిర్మించుచూ అంతకంతకూ దగ్గరగా వచ్చుచుండెను. వారందరిలోకన్న గొప్పవాడు యోహాను. ఆలాగు బైబిలు చెప్పెను. యేసు చెప్పెను: "స్త్రీలు కనిన వారిలో బాప్తిస్మమిచ్చు యోహాను కంటె గొప్పవాడు లేడు," ఎందుకనగా వాక్యమును పరిచయము చేసినవాడతడు.
ISA 42:1•
JOHN 14:9
43చివరగా దానంతటికి శిరస్సు వచ్చెను. మిగిలిన శరీరమంతయూ దానిని గూర్చి చెప్పెను.
పితరుల ద్వారా పునాది వేయబడెను, కాని వాక్యమై యున్న ప్రవక్తల ద్వారా శరీరము నిర్మించబడెను. అంతటికీ శిరస్సగు యేసు ఇచ్చట రంగము మీదికి వచ్చెను. శిరస్సు అతుకబడినది. దేవుని యొక్క చేతి పని అంతటినీ ఆయనలో మనము కనుగొనగలము. వాక్యము యొక్క పూర్తి ప్రత్యక్షతను ఆయనలో మనము కనుగొందుము. ఆయన వాక్యము. వాక్యము యొక్క సంపూర్ణత ఆయనే. మరల దేవుడు పరిపూర్ణ కళాఖండమును తయారు చేయసాగెను. యెషయా చెప్పెను, "ఇదిగో నా సేవకుడు, నా కళాఖండము, అన్ని కాలములోను ఈ పరిపూర్ణుడు వచ్చుట గూర్చి తెలియచేసితిని. ఇక్కడ ఆయన పరిపూర్ణినిగా నా యెదుట నిలబడియున్నాడు. తన స్వరూపములో దేవుని ప్రతిబింబించుచుండెను." యోహాను 14లో ఆయన చెప్పెను, "నన్ను చూచినవాడు తండ్రిని చూచి యున్నాడు."
ISA 53:2•
JOHN 1:1
44ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను. వాక్యము చెక్కబడినది. ఆదియందున్న వాక్యమును మరల ప్రతిబింబింప చేసెను. ఆయన వాక్యమై యుండి తన స్వరూపములో యున్న కళాఖండములో ప్రత్యక్షమాయెను. దేవుడు తిరిగి తన స్వరూములో వచ్చెను. మానవ కళాఖండములో వాక్యరూపము ప్రతిబింబించెను.
ప్రవక్తలందరూ లోపములను కలిగియుండిరి. వారందరూ ఒక్కొక్క భాగముగా యుండిరి. కాని చివరగా ఒక కళాఖండము వచ్చుచున్నది, ఆయన పరిపూర్ణుడు, ఏ లోపమును లేదు, ఆయన పనిలో ఆయనే పరిపూర్ణముగా ప్రతిబింబించెను. దేవుడు మరియు క్రీస్తు ఒక్కటే, ఆయనలో తన స్వంత ఆత్మను ఉంచెను; శిల్పి మరియు శిల్పము చివరకు ఏకమైనవి. దేవుడే శిల్పియై ఆ కళాఖండమును నిర్మించెను. మైకెలేంజిలో పనిలో మోషే కనబడెను. అది రాతితో చేయబడినది, గనుక నిర్జీవమైనది. కాని ఈ మహా-నిర్మాణకుడు తన చేతి పనిని పరిపూర్ణముగా దిద్దెను. దానిలో అడుగు పెట్టెను.
MATT 3:17•
MARK 1:11•
MARK 9:5,7•
LUKE 3:22
45ఆయన మానవ విమోచకుడు, దేవుని స్వరూపి, అయినా గాని ఆయనలో మనమపేక్షించునది ఏదియూ లేదు. కన్యకకు జన్మించిన ఈ దేవుని సజీవ కుమారుడు పరిపూర్ణుడు మరియు దీనుడు, దేవుని స్వరూపి; ప్రవక్తలు పలికిన దానంతటికి ఆయనే నెరవేర్పు. ఆయన ఎంతో పరిపూర్ణుడై యుండెను గనుక దేవుడు చూచి తన్మయుడై "మాట్లాడు!" అని కొట్టెను. మైకెలేంజిలో మాట్లాడు అన్నట్లే యున్నది.
"అది ఆలాగా," అని మీరనవచ్చు. మార్కు 9:7లో చూడండి. రూపాంతరపు కొండ ధర్మశాస్త్రమునకు ప్రతినిధిగా మోషే, ప్రవక్తలకు ప్రతినిధి ఏలియా నిలబడియుండిరి. పితరులు, ధర్మశాస్త్రము, ప్రవక్తలు అందరూ అచ్చట నిలబడియుండిరి. మేఘములో నుండి ఒక స్వరము వచ్చి ఇట్లనెను, "ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన మాట వినుడి." వారు వినుటకు సిద్ధపడినయెడల, ఆయన మాట్లాడును. ఆ తరువాత కొన్ని రోజులకు ఆయన కొట్టబడెను. "ఈయన నా ప్రియ కుమారుడు, ఈ యనలో నివాసము చేయ ఇష్టపడుచున్నాను. ఈయనను నేను మలచితిని. ఈలాగు చేయుటకు నాకు నాలుగువేల సంవత్సరములు పట్టెను. ఇప్పుడాయన ఎంతో పరిపూర్ణుడైయున్నాడు. ఆయన మాట్లాడునట్లుగా ఆయనను నేను కొట్టవలసియున్నాను. ఆయన మాట వినుడి, ఆయన పరిపూర్ణుడు. ఆయనే ఆ కళాఖండము."
EXOD 33:23•
1COR 10:4
46మరువకుడి, ఆయన పాత నిబంధన కాలము నుండి అన్నికాలములలోను బయలు పరచబడెను. అరణ్యములో కొట్టబడిన బండ ఆయనే: "అరణ్యములో ఉండిన బండను నేనే." కాని, ఆ బండ ఇంకా పరిపూర్ణత లోనికి రాలేదు. కాని అది సంఘమునకు సాదృశ్యము. అది జీవమును ఇచ్చుచుండెను. అరణ్యములోని బండ ఆయనే. మానవుని ఇంకా ఆయన తయారుచేయలేదు. ఆయన మాదిరిగా యుండెను.
ఈ బండ మీద ఆయన నిలబడియుండుట మోషే చూచెను. ఆయన దాటిపోవుట చూచెను, అది "మానవుని వీపు భాగము వలెయుండెను," అని చెప్పెను. క్రీస్తు యొక్క రూపమును ఆ శిల్పి మోషేకు చూపించుచుండెను. పరిపూర్ణముగా తయారయిన పిదప ఆ గొప్ప కళాఖండము ఎట్లుండునో చూపించెను. ఆ మహా-కళాఖండము ఎట్లు కనబడునో, మోషేకు దర్శన రీతిగా చూపించెను. అరణ్యములో అది దాటిపోయినప్పుడు, మానవుని వెనుక భాగము వలె కనిపించెను.
47మరువకుడి, 'ఏంజిలో' కేక వేసి ఈ విగ్రహమును "మాట్లాడు," అని కొట్టెను. కాని, మహా-శిల్పియగు దేవుడు ఆలాగు కాదు. ఆయన తన స్వరూపమందు మానవుని చేసి ఆ మానవ రూపము ద్వారా మాట్లాడెను. ఆ స్వరూపము పరిపూర్ణతగలదియై ఆయనను ప్రతిబింబించెను. ఆయన చేయబోవు దానిని చూపించెను. ఆయన ప్రవక్తల ద్వారా వారి వారి కాలములలో మాట్లాడెను. శిరస్సును ఆయన తెచ్చుచుండెను. శిరస్సు రాగానే పూర్తి దేవుని స్వరూపము కనబడెను. ఆయన తన్నుతాను కనుపరచుకొనెను. మన కొరకు కొట్టబడెను… ఇప్పుడు ఆయనే మనకు గొప్ప కళాఖండము, దేవుని వరము, యేసు క్రీస్తే నిత్య జీవము. దానినెన్నడూ మనము మరువమని నమ్ముచున్నాను.
48చీకటి దినములను, నీడల కాలమును మనము చూచుచున్నాము. నా జోస్యము ఇది, ఇంకొద్ది సూర్యోదయముల తరువాత ఈ దేశము గతించును. నిన్న జూలై నాలుగు, తామస్ జేఫర్సన్, ఇంకా ఆయనతో ఉన్న బోర్డు వారు స్వాతంత్య్ర ప్రకటనపై సంతకము చేసిరి. స్వేచ్ఛా గంట మ్రోగినది. స్వాతంత్య్ర దేశముగా మనము ప్రకటించుకొంటిమి. చరిత్ర ప్రకారము రెండు వందల సంవత్సరములకు పైగా ఎన్నడూ ప్రజాస్వామ్యము ఉండలేదు. 1776, జూలై నాలుగున అది జరిగెను. ఇంకా పదకొండు సంవత్సరములు మిగిలియున్నవి. ఆలాగు జరుగునా? ఏమో! మనము చూడలేము. పదకొండు సంవత్సరములు, ఆలాగు జరిగితే మొత్తం చరిత్ర బ్రద్ధలగును.
49కాల పరిస్థితిని మనము చూస్తున్నాము. జనుల పరిస్థితిని మనము చూచుచున్నాము. రాజకీయముల స్థితిని మనము చూస్తున్నాము. ప్రపంచ పరిస్థితిని మనము చూస్తున్నాము. అది నిలబడదు! టైటానిక్ వలె అది మునిగిపోవును. తప్పక అది క్రిందికి పోవును. ఒక దేశము పతనమై మరియొకటి లేచును. ఒక దానికి మరొకటి చోటు ఇచ్చును. ఎన్నడూ పతనము కాని రాజ్యము వచ్చుచున్నది. గనుక దానికి చోటిచ్చుటకు ఈ రాజ్యమే కాదు ప్రతి రాజ్యము చోటు ఇచ్చును, కూలి పోవును. కదలని రాజ్యము మనకు ఇచ్చును. దేవుని యొక్క పరిపూర్ణ స్వరూపము ద్వారాను, మహా-కళాఖండము ద్వారాను అది వచ్చును.
ISA 53:4,5
50దేవుడు ఆయనను చూచి ఎంతో ఆవేశము పొందెను. విమోచకుని యొక్క పరిపూర్ణ స్వరూపమును చూచి ఆయన ఎంతో ఉప్పొంగెను — యేసే ఆ విమోచకుడు. దేవుడు కొట్టబడుటకు ఇష్టపడెను, జరిమానాను స్వంతగా చెల్లించ గోరెను. దేవుడు క్రీస్తు ఒక్కటి అయ్యెను. దేవుడు కొట్టబడి గాయపరచబడును. అందుకే యెషయా చెప్పెను, "ఆయన దేవుని చేత కొట్టబడిన వానిగాను, శ్రమ పరచబడిన వాని గాను ఉండెను! "ఆయన మన అతిక్రమముల నిమిత్తము గాయపరచబడెను. మన పాపముల నిమిత్తము నలుగగొట్టబడెను. మన సమాధానార్థమైన శిక్ష ఆయన మీద పడెను; ఆయన పొందిన దెబ్బలచేత మనము స్వస్థతనొందితిమి."
51ఆ దైవ-నరుడు పరిపూర్ణ స్వరూపము. దేవుడు, అనగా సహజాతీతుడు. అదృశ్య స్వరూపము నుండి దృశ్య స్వరూపిగా మారెను. దర్శనము రూపముగా మారెను. సహజాతీతుడగు వాడు మరణమును రుచి చూచునట్లుగా ఆ దేవుని యొక్క పరిపూర్ణ కళాఖండము కొట్టబడెను. మోషేలో ఆయనాలాగు చేయలేక పోయెను. ప్రవక్తలలో ఆయనాలాగు చేయలేక పోయెను. యెషయాను రంపములచే ముక్కలుగా కోసిరి. రాళ్ళతో కొట్టి చంపబడిన ప్రవక్తలలో ఆయనేమియూ దానిని చేయలేకపోయెను, ఎందుకనగా ఆయన స్వయంగా దానిని అనుభవించవలెను. కాని, వారాయనలో ఒక భాగముగా మాత్రమే యుండిరి. కాని ఈ పరిపూర్ణ కళాఖండములో దైవత్వము శరీరరీత్యా సంపూర్తిగా నివసించెను. ఆయన మోషేను మాత్రమే చూపించలేదు గాని తన యొక్క పూర్తి వ్యక్తిత్వమును ఈయనలో చూపకలిగెను. సర్వమానవ జాతి కొరకు ఆయన మరణమును రుచి చూడ కలిగెను. దేవుని యొక్క పరిపూర్ణ కళాఖండము. దేవుడు దానిని చూచి ఎంతో ప్రభావితుడై అన్ని యుగములకు ఆయనే విమోచకుడాయెను. ముందున్నవారికిని, ఇప్పుడున్న వారికిని ఆయన ప్రతినిధి.
అన్ని వాగ్ధానములు ఆయనలో కలిసికొనినవి. ఆయనే పరిపూర్ణతకు పరిపూర్ణుడై యున్నాడు. అన్ని మాదిరులు ఆయనలో నెరవేరును; రూతు, బోయజులలో యున్న మన రక్తసంబంధియగు విమోచకుడు ఆయనే; మన ధర్మశాస్త్ర దూత; సీనాయి కొండ మీద అరణ్యములోను ఉన్న ప్రవక్త ఆయనే — ఆయన నిత్యత్వములో నుండి వచ్చిన మానవుడాయెను, పరిపూర్ణ రూపము.
52దేవుడు, కాలములన్నింటిలోనూ చెక్కబడుచూ వచ్చుచున్నాడు. పితరుల ద్వారా పునాది వేయబడెను. ఈ పునాది మీద ఆయన వివిధములగువాటిని నిర్మించెను. దీని మీద ఆయన తన వాక్యమును నిర్మించెను. వారే ప్రవక్తలు, చివరగా పరిపూర్ణ ప్రవక్త, పరిపూర్ణ పునాది వచ్చెను, దేవుడు కలిగి యుండిన పరిపూర్ణ దర్శనము అదే.
ఆయన వాక్యమై యున్నాడు — వాక్కు మాట్లాడబడవలెను గనుక ఆయన ఒక స్వరూపమై రావలసి వచ్చెను. ఆ స్వరూపము మాట్లాడుటకు కొట్టబడెను. ఆయన స్వరూపము ధరించి విమోచకునిగా పరిపూర్ణముగా మాట్లాడెను. పాత నిబంధనలోని మాదిరులన్నియూ ఆయనలో నెరవేరెను.
ఒక రోజున నేను చెప్పినట్లుగా పాత నిబంధనలోని యెహోవాయే క్రొత్త నిబంధనలోని యేసు. అవును!
53చాలా మంది నా వయస్సులోని స్త్రీలు, పురుషులు ఉన్నారు. మన దేశములో చైనా వారి చాకలి షాపులు చాలా యుండెడివి. చైనా వారు మొదటగా పశ్చిమ తీరము నుండి వచ్చిరి, తూర్పు వైపుకు కదిలిరి, తూర్పుదేశముల నుండి వచ్చి ఇటువైపు కదిలిరి. మన భాష, మన పద్ధతులు వారికి తెలియవు, కాని వారు చక్కని చాకలి వారు. వారు చీటి వ్రాసి ఇవ్వలేకపోయెడివారు. చైనా వారి యొద్ద కొన్ని ఏమి వ్రాయని కార్డులుండెడివి. నీవు బట్టలు వేసినప్పుడు, వారు కార్డును ఒక విధంగా చింపి నీకు ఒక ముక్కను ఇచ్చి, తక్కిన ముక్కను వారి యొద్ద ఉంచుకొనెడి వారు. ఇప్పుడు మన విధానము కంటె అదే మంచిది. నీవు నీ బట్టలు తీసి కొనుటకు వచ్చినప్పుడు, నీవు తెచ్చిన ఆ కార్డు ముక్కను వారి యొద్ద ఉన్నదానితో అతికి చూచెడి వారు. ఆ రెండు ముక్కలు అతికినప్పుడే నీ బట్టలు వచ్చును. దానిని నీవు అనుకరించలేవు. నీవు ఉత్తరముల ప్రతులు తీయవచ్చును, కాని ఆ చింపబడిన దాని వలె దేనినీ తయారుచేయజాలవు. మిగిలిన దానితో నీ దగ్గరున్నది సరిపోవలెను. నీవు తెచ్చిన మురికి బట్టలు ఈ టికెట్ ద్వారా విడుదల పొందును, ఎందుకనగా నీ చేతిలోని భాగము అవతలి భాగముతో సరిపోయినది.
54దేవుడు, ప్రవక్తల ద్వారాను, ధర్మశాస్త్రము ద్వారాను మనలను పాపులనుగా తీర్చెను. ధర్మశాస్త్రములో కృప లేదు; నీవు పాపివని మాత్రమే అది చెప్పును. కాని యేసు రంగము మీదికి వచ్చి నెరవేర్చెను. దేవుడు వాగ్ధానము చేసిన సమస్తమునకు ఆయనే నెరవేర్పు. వాగ్ధానము యొక్క గుర్తింపు, పరిపూర్ణ రూపము ఆయనే. పాత నిబంధనలోని వాగ్ధానములన్నియూ యేసుక్రీస్తులో నెరవేరెను. మోషేలో గాని, మరే ఇతర ప్రవక్తలలో గాని నెరవేరవు, కళాఖండములోనే అవి నెరవేరెను. ఆయన జరుగునని చెప్పిన వన్నియూ సరిపోయెను. ఆలాగే సంఘము కూడా దేవుడు చేసిన ప్రతి వాగ్ధానమునకు సరిపోవలసియున్నది. చింపబడిన ముక్కగా అది ఉండవలసియున్నది. అసలుది వాక్యమై యున్నది గనుక మిగిలిన వన్నియూ వాక్యముగానే ఉండవలసియున్నవి. ఆయన అనుచరులందరు అందుకు సరిపడి యుండవలెను.
GEN 3:15
55నీవు దోషివని, నీవు అపవిత్రుడవని ధర్మశాస్త్రము నిన్ను ఖండించి చేరసాలలో ఉంచవచ్చును; కాని ఆయన తగిన వానిగా వచ్చెను, నిన్ను బయటకు రప్పించగలడు, నిన్ను తిరిగి తీసికొని రాగలడు — ఏదెను తోటలో దేవుడు వాగ్ధానము చేసిన విమోచనా పూర్తిగా దొరుకును. "నీ సంతానము సర్పము యొక్క తలను చితుకగొట్టును, ఆయన తన మడిమెతో దాని తలను చిదుకద్రొక్కును."
56దేవుడు పూర్తి చేసిన ఈ పరిపూర్ణ కళాఖండమును చూచుచున్నాము. వాగ్ధానము చేయబడి వాడాయనే. దేవుని యొక్క వాగ్ధానములు, ప్రవచనములు అన్నియూ ఆయనే. నీ సంతానము సర్పము యొక్క తలను చిదుక ద్రొక్కును. ధర్మశాస్త్రముతో ఆయన దానిని చిదుక ద్రొక్కలేడు. ప్రవక్తల చేత ఆయన దానిని చిదుకగొట్టలేడు, కాని స్త్రీ సంతానమగు క్రీస్తు మహోన్నత కళాఖండమై సర్పము తలను చిదుక గొట్టెను. చేతి సహాయము లేకుండా కొండలో నుండి వచ్చిన రాయి ఆయనే. ఆయనే చితుకగొట్టగలడు. సర్పము యొక్క తలను చిదుకత్రొక్కగలవాడు ఆయనే.
ఆయన జీవితము అక్షరాలా మోషేకు సరిపోయెను. ఆయన జీవితము దావీదుకు సరిపోయెను. ఆయనే సరిపోయిన వాడు.
2SAM 16:9
57తన స్వంత జనులచే విసర్జించబడిన దావీదు రాజును చూడండి. అతని స్వంత కుమారుడే అతనిపై సైనిక తిరుగుబాటును లేపెను. ఇశ్రాయేలు సైన్యములను అతడు వేరు చేసి విభాగించెను. దావీదును అతని స్వంత జనులే సింహాసనము పై నుండి తరిమివేసిరి. అతడు దారిన పోవుచుండగా, ఒకడు అతనిని తిట్టి ఉమ్ము వేసెను. సైనికుడు కత్తి దూసి "రాజు మీద ఉమ్మివేసిన ఆ కుక్క వంటి వాని తల ఛేదించునని పలికెను."
"వానిని అననీయండి. దేవుడ తనికి ఆలాగు చేయమని చెప్పెను," అని దావీదు పలికెను. మీరు చూడలేదా? ఆయన దుఃఖక్రాంతుడు. వేదనతో నిండినవాడు. బొచ్చు కత్తిరించువాని యెదుట మౌనియై నిలబడిన గొర్రెపిల్ల వలె ఆయన ఉండెను. బహుశా దావీదు ఏమి చెప్పెనో తెలియకుండానే చెప్పెను. ఆ తరువాత అయిదు లేక ఆరువందల సంవత్సరముల తరువాత అదే వీధుల గుండా దావీదు కుమారుడు ఉమ్మి వేయబడెను. కాని దావీదు దేశము నుండి వెళ్ళగొట్టబడి తిరిగివచ్చినప్పుడు ఏమి జరిగినదో ఎరుగుదురా? వాడు వచ్చి కరుణించమని అడిగెను. ఆయన తిరిగి వచ్చునప్పుడు, ఆయనను పొడిచిన వారు ఆయనను చూచెదరు.
GEN 37:3-5
58యోసేపును చూడండి, యోసేపు వింతగా పుట్టెను, పునాదిలోని చివరి పైభాగము అతడే. దాని మీదనే కళాఖండము నిర్మించబడెను. విశ్వాసము, ప్రేమ, కృప మరియు పరిపూర్ణతల మీద పునాది నిర్మించబడెను. కాళ్లు మొదలుకొని క్రీస్తు యొక్క పరిపూర్ణత వరకు వచ్చెను.
పునాదిలోపై భాగమయిన యోసేపులో ఆయనను చూడండి, వారందరిలోను పరిపూర్ణుడు. యోసేపు క్రమ సంతానముగా జన్మించెను; అతని తండ్రి అతనిని ప్రేమించెను; అతని సోదరులు ద్వేషించిరి. ఏ కారణము అందుకు లేదు. ఎందుకు ద్వేషించిరి? అతడు వాక్యము గనుక. పునాదిని చూచారా? పునాది మూలమును చూడండి? ఆ శరీరమునకు శిరస్సు వచ్చుచున్నది చూడండి. వధువు యొక్క శిరస్సు వచ్చుచున్నది, గమనించండి. ఆయన వాక్యము. అతడు ప్రవక్త గనుక వారతనిని ద్వేషించిరి. ముందే జరుగబోవునవి చూచి వారికి చెప్పెను. ఆలాగు జరిగినవి. ఎంత కాలము పట్టినా గాని అది జరిగెను. ఆత్మసంబంధియై నందున అతని సోదరులు అతనిని వెలివేసిరి. వారతనిని ప్రేమించియుండవలసినది. వారతని ద్వేషించిరి, ఎందుకనగా అతడు ప్రవక్త మరియు ఆత్మసంబంధి, వారతని అందుకే ద్వేషించిరి.
GEN 37:24,28•
GEN 39:20•
GEN 40:21,22•
GEN 41:40,43•
LUKE 23:39,40,43
59చూడండి, దాదాపుగా ముప్పది వెండి నాణెములకు అతడు అమ్మివేయబడెను. గోతిలో పడత్రోయబడెను, చనిపోయిన వాడాయెను, కాని గుంటలో నుండి తీయబడెను. చెరసాలలో అతనికి శోధక కాలము వచ్చెను. చెరసాలలో ఒకడు రక్షించబడెను, ఒకడు నశించెను. క్రీస్తు యొక్క చెరసాలయగు సిలువ మీద ఇద్దరు దొంగలలో, ఒకడు రక్షించబడెను, ఒకడు చనిపోయెను.
అతడు చెరసాలలో నుండి తీయబడి ఫరో కుడిపార్శమునకు హెచ్చింపబడెను. యోసేపు ద్వారానే ఎవరయినా ఫరోతో మాట్లాడవలెను. ఆ ఫరో సింహాసనము మీద నుండి ఫరో లేచినప్పుడు బూర ఐగుప్తు దేశమంతటా మ్రోగెను. "అందరూ మోకాళ్ళు వంచవలెను, యోసేపు వచ్చుచున్నాడు," అని చెప్పబడెను.
MATT 26:15•
MATT 27:60•
MARK 15:46•
LUKE 23:33,53•
JOHN 15:25•
JOHN 19:42•
ROM 8:28•
ROM 14:11•
PHIL 2:10,11•
HEB 1:3•
HEB 10:12
60యేసుతో కూడా ఆలాగే జరుగును. ఆయన తండ్రిచే ప్రేమించబడెను మరియు కారణము లేకుండానే శాఖల సోదరులచే ద్వేషింపబడెను. ఆలాగే ముప్పది వెండి నాణెములకు అమ్మబడెను, గోతిలో పెట్టబడెను, చనిపోయిన వానిగా ఎంచబడెను. సిలువ మీద ఒకరు రక్షించబడిరి, ఒకరు నశించిరి. సిలువ మీద నుండి లేపబడెను. మహోన్నతుడగు దేవుని కుడి పార్శమున కూర్చొండ పెట్టబడెను. ఆయనలో గొప్ప ఆత్మ ప్రతిబింబించెను. యేసుక్రీస్తు ద్వారానే ఎవరైనా దేవునితో మాట్లాడగలరు. ఆలోచించండి! ఆయన సింహాసనము మీద నుండి లేచునప్పుడు, బూర మ్రోగును, ప్రతి మోకాలు వంగును, ప్రతి నాలుక ఒప్పుకొనును.
గుర్తుంచుకొనండి, ఆయన వర్థిల్లు కుమారుడు. ఆయన చేసిన సమస్తమూ వర్థిల్లెను. అది చెరసాల అయినా, మరేదయినా వర్థిల్లెను. ఆయన బిడ్డలకు సమస్తమూ సమకూడి జరుగునని ఆయన చెప్పలేదా? అది వ్యాధి అయినా, చెరసాల అయినా, మరణము అయినా, దుఃఖమయినా, మరేదయినా ఆయనను ప్రేమించువారికి మేలు కొరకు సమకూడి జరుగును. అది ఆయన వాగ్ధానము గనుక జరిగి తీరును. జరుగవలసి యున్నది. అది ఉపమాన రీతిగా చెప్పబడియున్నది. ఆయనలో మనకు చెప్పబడెను. ఆయనే దేవుని యొక్క పరిపూర్ణ స్వరూపము.
ఇక్కడ, కూడా మనము చూచుచున్నాము…
JOHN 3:16
61గుర్తుంచుకొనండి, యోసేపు ప్రత్యక్షత ద్వారాను, తన గొప్ప ప్రవచనము ద్వారాను లోకమును రక్షించెను. యోసేపు ఆలాగు అయియుండని యెడల లోకము చనిపోయి యుండెడిది. యేసు ఆలాగు అయి యుండనియెడల లోకము చనిపోయియుండును: "దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారుని అనుగ్రహించెను. ఆయన యందు విశ్వాసముంచు వారు నశించరు." దేవుడే నిత్యజీవమై యున్నాడు.
62ఇంకా ఎన్నో మనం చెప్పుకోవచ్చును. ఎందుకనగా సూక్ష్మంగా ఆయన దావీదునకు సాటి. మోషేకు ఆయన సాటి. ఆయన ఏలియాకు సాటి. ఆయన యోసేపుకు సాటి. ఆయన గూర్చి పాత నిబంధనలో ముందు చెప్పబడినది లేదా వివరించబడినది ఆయనకు సరిగ్గా సరిపోయెను. ఏమిటది? పరిపూర్ణ విమోచకుని చూపించెను. మన పాత మురికి బట్టలను ఈ చాకలి వానికి ఇయ్యవచ్చును, మరలా వెళ్ళి తెచ్చుకోవచ్చు. గొర్రెపిల్ల రక్తములో అది కడుగబడును. మన స్వంత దానిని మనము పొందవచ్చును. ఆయన ఎందుకొరకు చనిపోయెనో దానినంతటినీ మనము పొందవచ్చును. ఆయన పరిపూర్ణ వాక్యముగా చూపబడెను.
ISA 53:4,5
63ఆయనను కొట్టుట ఆ గొప్ప శిల్పికి, దేవునికి ఇష్టమాయెను. ఇక్కడ యెషయాలో ఆయనను మనము చూడగలము: "మనందరము ఆయన నుండి తన ముఖమును త్రిప్పుకొన్నాము. ఆయనను చూచి అపేక్షించినట్లుగా ఆయనలో సురూపము లేదు. అందరూ ఆయనను గూర్చి మాట్లాడిరి, ఆయనను హేళన చేసిరి. నేడు నేను ఆయన గూర్చి మాట్లాడుచున్నాను. అందరూ ఆయనను అపహాస్యము చేసిరి, చూచారా. ఆయనను మనము కొట్టబడిన వాని గాను, దేవుని చేత శ్రమపొందిన వానిగాను చూచితిమి. ఆయనెందుకు ఆ విధముగా ఉండెను? ఆయన మన అతిక్రమముల నిమిత్తము గాయపరచబడెను. "మన దోషముల నిమిత్తము నలుగగొట్టబడెను."
ఇప్పుడు, దాని గూర్చి ఇంకా చాలా చెప్పుకోగలము, కాని మీరు నేను చెప్పుచున్న దాని అర్థమును గ్రహించి యున్నారని నమ్ముచున్నాను — దేవుడు తన మహోన్నత కళాఖండమును తిరిగి నిర్మించుచున్నాడు.
64ఆదిలో ఆదాము ప్రక్కను ఆయన కోసినప్పుడు అందులో నుండి ఒకటి తీసెనని మనము మరువరాదు. క్రీస్తు ఒక కారణము కొరకే కొట్టబడెను, ఆయన తనలో నుండి ఒక కుటుంబమును, వధువును తీయును. ఆయన తన కొరకు వధువును తీయును. ఆయన మహా-కళాఖండము పరిపూర్ణము చేయబడినది, దానిని ఆయన కొట్టవలసి యుండెను, మరో భాగము కాదు, మరో సృష్టి కాదు, కానీ అదే సృష్టిలో నుండి ఆమెను తీయవలెను.
నా సోదరుడా, దీనిని చెడుగా తలంచవద్దు, ఒక నిమిషము ఆలోచించు. తన కొరకు వధువును తయారు చేయుటకు అసలు సృష్టిలో నుండియే ఆయన తీసెను. మరో సృష్టిని ఎన్నడూ ఆయన చేయలేదు. అసలు సృష్టిలోనుండియే ఒక భాగము తీసెను. ఆయన వాక్యము గనుక వధువు ఏమై యుండును? అసలు వాక్యమై యుండవలెను, దేవుని వాక్యములో జీవించును.
65దక్షిణాఫ్రికాలో, కింబర్లీ యున్నది, ఒకసారి నేను వజ్రములను చూచుచున్నాను. వాటిని భూమి నుండి ఎట్లు తీసిరో చూచాను. అవి అక్కడ పడియున్నవి. ఆ గని యొక్క పర్య వేక్షకాధికారి నా కూటములోని ప్రార్థనా వరుసను అదుపుచేయు వ్యక్తి. నేను ఆ వజ్రములను చూచాను, అవి వేలాది డాలర్ల విలువ గలవి. ఒక చోట పోగు చేసిరి; కాని అవి లైటు క్రింద కూడా మెరయుట లేదు. "అవెందుకు వెలుగుట లేదు?" అని నేను ఆ గని అధికారిని అడిగాను.
"అయ్యా! అవి ఇంకా కోయబడలేదు. అవి కోయబడుట తప్పనిసరి. కోయబడినప్పుడు అవి వెలుగును ప్రతిబింబించును," అని అతడు చెప్పెను. అక్కడే మీరున్నారు.
మహోన్నత కళాఖండము కోయబడవలెను. గమనించండి, ఎందుకు కోయవలెను? ముక్కను కోసి పారవేయుదురా? లేదు, లేదు! కోయబడిన ముక్క సూదిగా చేయబడును. ఆ సూది రికార్డు మీద ఉంచినచో, ప్రపంచమునకు సంగీతము వినబడును. వాక్యము యొక్క నిజ అనువాదమును ఆ సూదియే బయటకు తీసికొని వచ్చును.
ISA 53:4
66ఆయన జీవితము అందరికి సరిపడును. ఆయనను కొట్టుట దేవునికి ఇష్టమాయెను. ఆయనెందుకు కొట్టెను? ఆదామును ఎందుకు కొట్టెనో, అందుకే కొట్టెను.
ఇప్పుడాయనను, కొట్టబడిన వానిగా చూచుచున్నాము. దేవునిచే కొట్టబడి శ్రమపరచబడెను. పాపుల కొరకు వధించబడిన పరిపూర్ణ గొర్రెపిల్ల, ఒక పరిపూర్ణ కళాఖండము.
67దాదాపు రెండువేల సంవత్సరముల నుండి దేవుడు ఒక మహా-కళాఖండమును ఆయన కొరకు చేయుచున్నాడు. ఆయన ఆదాము యొక్క ప్రక్కను చీల్చి ఒక భార్యను తీసెను. ఆ పరిపూర్ణ కళాఖండము కల్వరి యొద్ద కొట్టబడెను. ఆయనలో నుండి ఒక ముక్క వచ్చెను. అది క్రొత్త నిబంధన. ఆయన పాత నిబంధనను నెరవేర్చెను. ఇప్పుడిది క్రొత్తనిబంధన. మరో భాగము నెరవేర్చబడవలెను. చూడండి, పాతది, క్రొత్తది భార్యాభర్తల వలె యున్నవి. క్రొత్త దానిని పాతది ముందుగా చూచెను. క్రీస్తు వచ్చెను, దానిని నెరవేర్చు మహా-కళాఖండము ఆయనే. క్రొత్త నిబంధనలో యున్న సమస్తమును ఇప్పుడాయన వధువు నెరవేర్చును. మరో కళాఖండము తయారగుచున్నది.
MATT 24:35•
MARK 13:31
68ఈ కళాఖండమును తయారు చేయుటకు ఆయనకు నాలుగువేల సంవత్సరములు పట్టెను. మరో కళాఖండమును ఆయన ఇప్పుడు దాదాపు రెండువేల సంవత్సరముల నుండి తయారు చేయుచున్నాడు. క్రీస్తు కొరకు వధువు తయారగుచున్నది. మరో కళాఖండము. ఆయన తన మార్పులేని విధానము ద్వారా దానిని తయారు చేయుచున్నాడు, ఆ రీతిగానే ఆయన కళాఖండమును చేసెను, ఆయన వాక్యము. ఆ రీతిగానే తన కళాఖండమును తయారు చేయును. ఎందుకనగా పరిపూర్ణ వాక్యము మాత్రమే పరిపూర్ణ కళాఖండము కాగలదు. మురికిని, చెత్తను బ్రద్ధలు చేయును; భూమ్యాకాశములు గతించును గాని ఆ వాక్యము ఎన్నడూ బ్రద్ధలు కాదు. వజ్రమును కోయుటకు ఒక పరిపూర్ణమగు పనిముట్టు కావలెను, అది అన్నిటివలె ఉండక ప్రత్యేకముగా ఉండును. టన్నుల బరువు గల పెద్ద తిరుగటి రాళ్ళ గుండా అవి వెళ్ళుట నేను చూచాను. లేదు, అంత పెద్ద బరువు కూడా వజ్రమును బ్రద్దలు చేయజాలదు. దానిని కోయవలెనే గాని బ్రద్దలు చేయలేరు.
MAL 3:6
69ఎన్నడూ మారని తన విధానము ద్వారా ఆయన అదే చేసెను. మలాకీ 3లో ఆయనిట్లు చెప్పెను, "నేను మార్పులేని దేవుడను." ఆయన తన విధానమును మార్చుకొనజాలడు.
అబ్రహాముతో ఆయన ప్రారంభించెను… మొదటి మహోన్నత కళాఖండము పతనమైన తరువాత, అబ్రహామును పునాదిగా ఆయన చేసికొని మరో మహా-కళాఖండమును నిర్మించ పూనుకొనెను. మరో మహా-కళాఖండమును నిర్మించుట ఆయన పెంతెకోస్తు దినమున ప్రారంభించెను. అది అసలయిన వాక్య విత్తనము. మొదటి సంఘములో ప్రారంభమాయెను. అది ఏమిటి? వాక్య విత్తనము. వాక్యము బయలుపరచబడినది. వాగ్ధానము అనుగ్రహించబడినది. యోవేలు చెప్పెను, "అంత్యదినములలో సర్వశరీరుల మీద నా ఆత్మను కుమ్మరించుదునని యెహోవా సెలవిచ్చుచున్నాడు. మీ కుమారులు, కుమార్తెలు ప్రవచించెదరు. మీ ముసలి వారు కలలు కందురు. మీ యవనస్థులు దర్శనములు చూచెదరు." చివరి రెండువేల సంవత్సరములలో ఆయన చేయునది అదియే.
LUKE 8:11
70గమనించండి, అసలయిన దాని వలెనె అది ప్రారంభమాయెను. యేసు చెప్పెను, దేవుని వాక్యము విత్తువాడు చల్లుటకు తీసికొనివెళ్ళిన విత్తనము వలె యున్నది. ఆయనే విత్తువాడు. వాక్యమే విత్తనము. ఒంటిగాయున్న విత్తనము ఏమి చేయజాలదు. అది మరల ఉత్పత్తిని చేయవలెనన్నచో, భూమిలో పడవలెను. విత్తనముగా యున్న ఆ పరిపూర్ణ సంఘము రోమ్‌లోని నైసియా వద్ద భూమిలో పడెను. అది శాఖగా మారినది.
ఇపుడు, చరిత్రకారులు, గుర్తుంచుకొనండి, ఈ మీరు ఈ టేపును విందురు. అది నిజమో కాదో పరీక్షించండి. సంఘము రోమ్‌లోని నైసియాలో చచ్చినది, ఎందుకనగా అది అసలయిన విత్తనమగు వాక్యమునకు బదులుగా ఆచారములను మరియు సిద్ధాంతములను స్వీకరించినది. ఏమిటది? తానే దేవుడనని ఆయన మొదటి సంఘము ద్వారా చూపించెను. పరిపూర్ణపరచబడిన సంఘము ఆయనకున్నది; ఇతర విత్తనములన్నింటి వలెనె, సంఘము కూడా భూమిలో పడి చనిపోవలెను. ఇప్పుడు, అది భూమిలో పడినది, మరియు చనిపోయినది, మరియు మట్టిగా మారినది.
JOHN 12:24
71కొద్ది కాలము క్రిందట ఒక పుస్తకం నేను చదివాను. మౌన దేవుడు, అను పుస్తకమును ఒకరు వ్రాసిరి. మీరది చదివి యుందురు. బృంబాక్ అనుకుంట… లేదు అది వ్రాసిన వాని పేరు నాకు గుర్తులేదు. పుస్తకం పేరు మౌన దేవుడు. అందులో ఇట్లు వ్రాసెను, "వేలాది సంవత్సరముల చీకటి కాలములో దేవుడు తన చేతిని కదపలేదు. నమ్మకస్థులు సింహములచే చంపబడిరి, రోమనుల ద్వారా కాల్చబడిరి. ఎన్నో రీతులుగా హత్యగావించబడిరి; స్త్రీలను దిగంబరులనుగా చేసిరి, వారి పొడవైన జుట్టుకు తారు పూసి అగ్నిని అంటించిరి." అయినా దేవుడేమీ చేయలేదు? దేవుడెక్కడ? చూడండి, పొట్టి జుట్టు రోమ్‌లోనే ప్రారంభమాయెను. పొడవైన జుట్టుగల క్రైస్తవ స్త్రీలను తారులో ముంచి తగులబెట్టిరి. దిగంబరులుగా చేసి సింహములకు పారవేసిరి. "అందుకే దేవుడెక్కడ," అని అతడు ప్రశ్నించెను. ఓ! కొన్నిసార్లు మానవుడు గ్రుడ్డివాడగును. విత్తనము చావవలెనని మీకు తెలియదా? అందుకే ఆయన ఎన్నడూ వారిని విమోచించుటకు ప్రయత్నించలేదు. వారు జయమును పొందిరి. రక్తము కార్చుచూ వారు తమ ప్రాణములను అర్పించిరి. ఎందువలన? అది ఒక విత్తనము. అది భూమిలో పడిపోవలసియున్నది. యోహాను 12లో చెప్పబడి యున్నది. గోధుమ గింజ భూమిలో పడి చావవలెను. చనిపోవుట మాత్రమే కాదు గాని, క్రుళ్ళిపోవలెను. కాని ఆ జీవము అక్కడే యున్నదని ఆ శాఖకు కొంచము కూడా తెలియదు.
JOHN 12:24
72పదిహేను రోజుల పాటు రాజకీయముగా బుద్ధిహీన చర్చ నైసీయా ఆలోచన సభలో జరిగినది. రాజ వంశీకులు వచ్చి పెద్ద హోదా గల వారిని సంఘములో ప్రవేశపెట్టిరి. అక్కడున్న అరణ్యములలో నుండి ప్రవక్తలు ఆకులు, పురుగులు తింటూ, జంతు చర్మములు చుట్టుకొని వచ్చిరి. అసలయిన ఆ ప్రవక్తలను వారు త్రోసివేసిరి. ఎందువలన? విత్తనము నేలలో పడవలసియున్నది. అది చనిపోవలసి యున్నది.
చీకటి యుగములలో అంధకార బురదలో అది కూరుకొనిపోయి చచ్చినది. దాని పని అయిపోయినదని వారనుకొనిరి. యోహాను 12:24లో యేసు చెప్పినది గుర్తుంచుకొనండి, "గోధుమ గింజ భూమిలో పడి చావని యెడల ఒంటిగానే యుండును." మొదటి సంఘము అట్టి పునరుత్పత్తియై యున్నది. అది వధువు, అది విత్తనము. ప్రత్యక్షపరచబడిన వాక్యము, మరియు అది రోమ్‌లోని నైసియా వద్ద నేలలో పడినది.
73సంఘమా, దీనిని వినుము, దేశమంతటా దీనిని వినుచున్నారు. ఆ శాఖలలో మురికి యున్నది. అక్కడే వాక్యము సిలువవేయబడినది, వారు ఆచారములను అంగీకరించిరి. వందలాది సంవత్సరమలు ఆ చీకటి కాలము కొనసాగినది. వాక్యము యొక్క శక్తి మరియు ప్రత్యక్షత లోకమునకు మరుగయినది. కాతలిజం పరిపాలించినది. చరిత్రను చదివిన మనము దీనిని ఎరుగుదుము. కేవలము కాతలిజం పరిపాలన చేసెను.
కాని మొలకెత్తుచున్న విత్తనమును నీవు దాచిపెట్టలేవు. అది బయటకు రావలసియున్నది, ఎందుకనగా మహా శిల్పి పనిచేయుచున్నాడు. ఎందుకు? మరల ఆయన దానిని నిర్మించుచున్నాడు. వాక్యమను విత్తనము భూమిలోనికి వెళ్ళినది.
74పరిశుద్ధ పౌలు, పేతురు, యాకోబు, యోహాను మొదలగు వారు వాక్యమును వ్రాసిరని మనకు తెలియును. వారు వ్రాసిన ఆ వాక్యము జీవించినది. అది పరిపక్వత చెందనారంభించిన తరువాత యోహాను పత్రికలను వ్రాయసాగెను. కాగిన నూనెలో ఇరవై-నాలుగు గంటల పాటు ఉంచిన తరువాత వారతనిని పత్మసు ద్వీపములో పడవేసిరి. కాని వాక్యము బయటకు రావలసి యున్నది. అది వ్రాయబడవలసియున్నది. వారు వారిలో నున్న పరిశుద్ధాత్మను కాల్చివేయజాలరు. నూనెలో తగులబెట్టలేరు, కనుక అతడు బయటకు వచ్చెను. అతని పని ఇంకా పూర్తి కాలేదు. అతడు స్వాభావిక మరణమును పొందెను.
యోహాను శిష్యుడగు పొలికార్పు వాక్యమును ముందుకు తీసికొనిపోయెను. పొలికార్పు తరువాత ఐరేనియస్ వచ్చెను, ఐరేనియస్ ఒక గొప్ప దైవజనుడు, మనము నమ్మిన సువార్తనే నమ్మెను, "వాక్యము వృద్ధి చెందినది!" దానిని సంఘము బయటకు త్రోసివేయచూచెను.
75చివరగా అది రోమ్‌లోని నైసీయా యొద్దకు వచ్చినది. అక్కడది నేలలో పడినది, పరిశుద్ధ మార్టిన్‌ను హత్య చేసిరి. మనము నమ్మిన దానినే పరిశుద్ధ మార్టిన్ నమ్మెను. దీని కొరకే అతడు నిలబడెను. పరిశుద్ధాత్మ బాప్తిస్మమును, యేసు నామములో నీటి బాప్తిస్మమును నమ్మెను. మనము చేసిన దానినే అతడు చేసెను, మరియు అతడు దేవుని ప్రవక్త, దేవుని యొక్క వాక్యమును సంపూర్తిగా నమ్మెను. చివరకు వారిని సిలువవేసిరి, నేలలో త్రొక్కివేసిరి, వందల సంవత్సరములు కుళ్ళిపోయి అక్కడే యుండెను. విత్తనము యొక్క బయటి పొట్టు కుళ్ళిపోయినది, పాత శరీరములు కుళ్ళిపోయినవి. వారు చనిపోయిన సెయింట్ ఏంజిలో యొద్దకు వెళ్ళి, వారి ఎముకలు విరువబడి యుండుటను చూచాను. వారి ఎముకలు కూడా మట్టిగా మారినవి, కాని ఆ జీవము ఇంకా అక్కడే యుండెను.
JOHN 12:24
76నైసీయా ఆలోచన సభ యొద్ద నేలలో పడిన గోధుమ గింజ మార్టిన్ లూథర్‌లో తిరిగి మొలకెత్తనారంభించెను. ఏ విత్తనమైనా అంతే. కుళ్ళిన తరువాత జీవము బయటకు వచ్చును. మార్టిన్ లూథర్‌లో అది చిగురించసాగెను. అతడు మొదట చేసినది ఏమిటి? కాతలిక్కు శాఖను విసర్జించి, అది తప్పు అని ఎదిరించెను. "నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును," అని చెప్పెను. ఏమిటది? చిన్న బలహీనమగు జీవము బయటకు తన్నుకొని వచ్చుచున్నది. వారే లూథరనులు. అది నేలలో పడిన గింజవలె అసలు కనబడలేదు, కాని జీవము బయటకు వచ్చుచున్నది.
తరువాత అది కాండముగా మారినది. అప్పుడేమి జరిగెను? జాన్ వెస్లీ దినములలో శుద్ధీకరణ బయటకు వచ్చెను. సంస్థను తయారుచేసిరి. కాబట్టి ఒకటి జరుగుటకు అది సమయము. మహా-కళాఖండము ఇప్పుడు నిర్మాణమగుచున్నది. అతడేమి చేసెను? ఆంగ్లికను చర్చి మీద తిరుగుబాటు చేసి సంస్కరణ చేయుటకు బయటకు ఒక కాండము వలె వచ్చెను. ఏమిటది? విత్తనము ఇప్పుడు జీవమును పొందుచున్నది, ఎదుగుచున్నది.
MATT 24:24•
MARK 13:22•
JOHN 12:24
77ఇప్పుడు, కాండము గాని, దళములు గాని విత్తనము వలె కనిపించవు.
దేశమంతటిలో యున్న పెంతెకోస్తు సోదరులారా, నా సోదరులారా, మీరు వినవలెనని కోరుచున్నాను. ఒక వేళ ఇదే నా చివరి వర్తమానమైనచో, ఇది ఒక మహా-కళాఖండము. నేలలో పడిన గోధుమ గింజ తిరిగి బయటకు వచ్చును?
ప్రకృతిని గమనించండి. ప్రకృతి సరిగ్గా దేవుడే, దేవుడు ప్రకృతి ద్వారా పనిచేయును. వారు పెంతెకోస్తు ఉజ్జీవమునే విత్తనమని తలంచిరి, కాని కాదు. ఇప్పుడు చూడండి! మత్తయి 24:24లో యేసు చెప్పినది వినండి, చివరి దినములలో ఆ రెండు ఆత్మలు ఒకేలాగుండును, సాధ్యమయితే, ఏర్పరచబడినవారిని సహితము మోసము చేయును.
JOHN 12:24
78ఆ కాండము విత్తనము వలె కనిపించలేదు; ఆ దళములు విత్తనములు వలె కనిపించలేదు. కాని, ఇప్పుడు గమనించండి, లూథర్ రోజును కాదు, ఈ చివరి దినమును చూడండి.
మొదటి సంగతి. (గోధుమ పండించు రైతులు ఇక్కడ కూర్చొని యున్నారు.) — గోధుమ గింజ మొలకెత్తిన వెంటనే చూడండి, గింజ వంటిది బయటకు వచ్చును గాని, అది ఏమిటి? అది పై పొట్టు. దాదాపు గింజ వలె అది కనబడును. అది పొట్టు. విత్తనమునకు పైన రక్షక కవచము వలె అది యున్నది, కాని అది గింజ కాదు, కాండము గాని, దళములు గాని గింజ కావు; అవి గోధుమ గింజ యొక్క జీవమును మోసికొని వచ్చుచున్నవి. యోహాను 12లో యేసు మాట్లాడిన దానిని చూడండి.
REV 17:5,15,18
79గింజ వలెనె ఆ పొట్టు కనబడినది, వెస్లీ తరువాత, అది నేలలోనికి వెళ్ళిన గింజ వలెనె యున్నది. అది బయటకు వచ్చినప్పుడు, జీవమును కలిగి యున్నది, కాని గింజ మాత్రము కాదు. పుప్పొడి వచ్చినది గాని, అది కూడా గింజ కాదు. ఆ తరువాత వచ్చిన పొట్టు గింజవలె యున్నది, కాని అది కూడా అసలు గింజ కాదు.
పెంతెకోస్తు వారు నిజమగు గోధుమ గింజ వలెనె కనిపించిరి. ఒక దాని నుండి ఒకటి, దానిలో నుండి మరొకటివచ్చినవి, కాని అవి వాహకములు మాత్రమే. అవి శాఖలుగా మారును. పెంతెకోస్తు కూడా శాఖగా మారినది. గింజవలె కనిపించిన పెంతెకోస్తు ఏమి చేసినది? ప్రకటన17లో చెప్పినట్లుగా, తిరిగి తన సోదరి శాఖలలో ఒక దానిగా మారిపోయినది. యేసు చెప్పినది అదే.
MATT 24:24•
MARK 13:22
80ఇప్పుడు చూడండి. లూథర్, వెస్లీ, పెంతెకోస్తు ద్వారా సువార్త రావలసియున్నది. చివరి దినములలో అది సాధ్యమయితే ఏర్పరచబడిన వారిని కూడా మోసము చేయును. ఏర్పరచబడిన వారిని! ఓ, పెంతెకోస్తు సోదరులారా, మీరు చూచారా?
గోధుమ గింజ యొక్క పొట్టు కూడా మొదట గింజ వలె కనిపించెను; కానీ అది పొట్టు. అది శాఖగా మారినది. వారు లూథర్‌ను ఆ విధంగా చేసిరి. ప్రకటన 17 దానినే రుజువు చేయుచున్నది. సంఘములను చూడండి.
అసలు విత్తనము మొదట నైసీయా యొద్ద పడిపోయినది, ఎందుకనగా అదే మొదటి శాఖ.
ఇక్కడ చూడండి! కాండములోను, దళములోను ఉన్న జీవము చివరకు గింజగా మారును. మూల విత్తనములో ఉన్న జీవము వివిధ దశలను దాటి తిరిగి తన మొదటి దశకు, అనగా, విత్తనముగా మారును. హల్లెలూయా! ఒ, మై! లోకములో నేను అతి గొప్ప సంతోషకరమగు వ్యక్తిని, ఎందుకనగా, దేవుడు దీనిని నాకు చూపించెను!
ఈ వాక్యము మరియు ప్రకృతి ఎంత చక్కగా కలిసిపోవుచున్నవో చూడండి.
81పునరుత్థానమును మనము సూర్యోదయముతోను, సూర్యాస్తమయముతోను పోల్చి రుజువు చేసితిమి మరియు సూర్యుడు తిరిగి లేచును; ఆకు రాలిపోయి నేలలోనికి పోవుచున్నది. రసము వేరులోనికి పోవుచున్నది, తిరిగి మరల అవి వచ్చుచున్నవి. నేల మీద పడిన ఆకు యొక్క జీవమును తిరిగి చెట్టు తీసికొనుచున్నది. కాల్షియం, పొటాష్ మరో ఆకుగా మారుచున్నది. ప్రకతిని చూడండి, ప్రతిదియూ దేవుని వాక్యమునకు జతగా పనిచేయుచున్నది. ఈ సంఘ కాలములలో పరిపూర్ణముగా దానిని చూడగలరు. ఆ కారణము చేతనే పరిశుద్ధాత్మ దిగి వచ్చి ఈ సంగతులన్నియూ తెలియచేసెను. ఆయన ఉన్న రీతిగా మనకు ప్రత్యక్షమాయెను. ఇది నిశ్చయముగా తెలియుచున్నది.
82ఇక్కడ చూడండి. జీవమును పొట్టు దాచెను, కాండములోను, దళములోను పొట్టులోను ఆ గింజ దాగి యున్నది. కాండము నందున్న జీవమే మరో గింజను తయారు చేయుటకు వెళ్లినది. శుద్ధీకరణ కొరకు దారిని నీతీకరణ ఏర్పాటు చేసినది. శుద్ధీకరణ పరిశుద్ధాత్మ బాప్తిస్మమునకు దారిని ఏర్పరచెను. వాక్య సంపూర్ణత కొరకు దారిని పరిశుద్ధాత్మ బాప్తిస్మము ఏర్పాటు చేసెను. తిరిగి వాక్యము బయలుపరచబడినది.
శాఖగా మారినది చచ్చినది. లూథర్‌లో నున్న జీవము వెస్లీని తయారు చేసినది. వెస్లీలో నుండి అది పెంతెకోస్తులోనికి వెళ్ళినది. పెంతెకోస్తు నుండి అది అసలయిన విత్తనమును తయారుచేయ వెళ్ళినది. వెస్లీలో నుండి పెంతెకోస్తు బయటకు వచ్చినది, ఎందుకనగా అప్పుడు పెంతెకోస్తు శాఖగా లేదు. ఆ కారణము చేతనే అది బయటకు వచ్చెను. ఆ తరువాత పెంతెకోస్తు ఒక శాఖగా మారినది, అది ఏమి చేసినది? అది పొట్టుగా మారెను. అది నిజమగు దాని వలె కనిపించెను.
83మరియు ఎవరైనా….
ఒక గోధుమ గింజ మొలకెత్తుటను ఎందరు చూచారు? మొదటగా ఏమి వచ్చును? పొట్టు బయటకు వచ్చును. అది గింజ వలె కనిపించును కాని కాదు, మూడు దశలు చూడండి. వేరు, కాండము, పుప్పొడి. ఆ తరువాత పొట్టు వచ్చును. పొట్టుల నుండి అసలు విత్తనము బయటకు వచ్చును. అది విత్తనము కాదు, అది విత్తనము యొక్క జీవము. ఎదిగి విత్తనముగా మారుచున్నది. ఆమేన్, ఆమేన్! దానిని మీరు చూచారా? ఏమిటది? ఒక పునరుత్థానము. లోనికి వెళ్ళిన దానివంటిదే తిరిగి మరల వచ్చుచున్నది. ఒక మహా-కళాఖండము తయారగుచున్నది.
వెస్లీలో నుండి పెంతెకోస్తు వచ్చినది, ఎందుకనగా వెస్లీ ఒక సంస్థగా మారెను. పెంతెకోస్తు బయటకు వచ్చినప్పుడు ఒక సంస్థగా కాదు గాని, తరువాత సంస్థగా మారెను. పొట్టు తయారు కావలసినచో ఆలాగే అది మారవలసియున్నది. నిజవాక్య జీవము దాని మీద యున్నది. ఇన్ని దశలు దాటి నిజమగు గింజగా మారుచున్నది: ముందు కాండము, తరువాత పుప్పొడి, ఆ తరువాత పొట్టు, ఆ తరువాత గింజ.
84లేదు … కాండము, దళము, పొట్టు!
విత్తనము యొక్క కొంత జీవమును అవి ఉత్పత్తి చేసినవి. (అది వారి ముందు ఉజ్జీవము) కాని వారు సంస్థగా మారిన వెంటనే జీవము అందులో నుండి కదిలి వెళ్ళిపోయినది. చరిత్ర ద్వారా అది రుజువు చేయుబడినది. సంస్థగా మారిన తరువాత ఏదయినా గాని చనిపోవుట జరుగును. ఇది నిజము.
గమనించండి, జీవము ముందుకు పయనించుచున్నది. అది కదలుచున్నది.
చూడండి, వారందరూ ఏమి చేసిరో గమనించండి. చరిత్ర ద్వారా రుజువైనది. ఆ సంఘము మరల ఎన్నడూ ఆయనకు ఉపయోగము కాలేదు. సంస్థగా మారిన సంఘము పనికిరాక చచ్చినట్లు మనకు చరిత్రలో చూచెదము. చచ్చిన సంస్థ మరల ఎన్నడూ పైకి లేవదు. దానిని మీరు గమనించారా? గ్రుడ్డివారలారా! కళ్ళు తెరవండి! ప్రకతి మరియు వాక్యము ఒకదానికొకటి సరిపోవుచున్నది. ఇది సత్యము అని రుజువు చేయుచున్నవి. అదే సత్యము: ఆ కాండమును విడిచిపెట్టిన జీవము ఇంకా ముందుకు పోయి, పొట్టును తయారు చేయును; పొట్టు నుండి అది అసలు స్థితికి మరలా వెళ్ళును.
గమనించండి, ఆయనకెన్నడూ తిరిగి ఉపయోగపడదు.
REV 22:18,19
85చెట్టులో నున్న జీవము గింజలోనికి ప్రయాణించు విధానము ఎంత చక్కగా యున్నదో చూడండి. దేవుడు తన ప్రజలను చెట్టుతో పోల్చెను, చూడండి. క్రిందికి వెళ్ళిన చెట్టులోని జీవము మరల పైకి వచ్చును. కాండము, దళము, పొట్టు గుండా ఆ జీవము ప్రవహించి గింజ తయారగును. అది మరల చనిపోవును, ఇక దాని వలన ప్రయోజనము లేదు. అది సంపూర్ణతలోనికి సాగిపోవును. ఆమేన్! ఆయన ఎన్నడూ సంస్థను ఉపయోగించుకొనక పోవుటకు కారణమును చూచారా? అది చచ్చినది, గనుక ఆయన అందులోనికి తిరిగి రాలేడు. కాని జీవము ముందుకు పోవును. వారు ఆచారములను, పద్ధతులను అందులోనికి చొప్పించెదరు. "దానికి ఒక్క మాట చేర్చరాదు, దానిలో నుండి ఒక్క మాట తీసివేయరాదు." చూచారా? దానికి అడ్డము పెట్టరాదు. విత్తనములోని జీవము ముందుకు పోవలెను.
EPH 5:27
86దీనిని నేను ఒక ఉపమానముగా వాడుచున్నాను. వధువు ఒక మహా కళాఖండముగా బయటకు వచ్చుచున్నది. ఒక మహా-కళాఖండము పడిపోగా, మరో మహా-కళాఖండము లేచుచున్నది. రోమ్‌లోని నైసియా యొద్ద ఒక కళాఖండము పడిపోయినది, ఆ తరువాత ఒక పద్ధతి ద్వారా అది వచ్చుచున్నది. మరల పరిపూర్ణమగు ఆ మహా-కళాఖండముగా అది మారుచున్నది, ఎందుకనగా ఆమె ఆయనచే పలుకబడిన వాక్యములోని భాగమై యున్నది. ముడత లేదా మచ్చలేని ఒక సంఘమును ఆయన పొందును. (శాపగ్రస్తమగు) ఏ సంఘముతో గాని, సంస్థతో గాని, దానికి పొత్తు లేదు. వాటిని దాటి అది వచ్చినది గాని, వాటితో మిళితము కాలేదు.
87చూడండి. విత్తనము యొక్క జీవము ముందుకు వచ్చుచున్నది, వెనక్కు వెళ్ళుట లేదు. దీని తరువాత ఇక పునరుత్థానముండదు. పునరుత్థానములోనికి పరిపూర్ణతలోనికి జీవము వెళ్ళుచున్నది.
చూడండి, అసలయిన విత్తనమును పొట్టు బయటకు పెట్టినది. ప్రకటన 3వ అధ్యాయములో దీనిని కనుగొందుము.
ఇప్పుడు గుర్తుంచుకొనండి, ఏ సంఘ కాలములోను ఆయన బయటలేడు. బైబిలులోని ఏడు సంఘ కాలములను చూడండి. ఎందరికి గుర్తున్నది? సంఘ కాలమును ఆయన దాటి పోయెను. మరేదో ఆయన తయారు చేయనైయున్నాడు. అది ఇదే. మరేమీ కాదు, శిల్పి, మరల పరిపూర్ణతను తీసికొని వచ్చెను. వాక్యముగా అది రూపు దిద్దుకొనెను, చూచారా. నేను తిరిగి వెనక్కు వెళ్ళను. ఎంత తేడాగా యున్నది! అవును!
ఓ,
REV 3:20
88గమనించండి. పొట్టు బయటకు వచ్చి గింజ వలె కనిపించెను. కాని ఆ పొట్టును విడిచి పెట్టిన జీవము గింజను వధువును తయారు చేయును. పొట్టు తెరువబడును, గింజను బయటకు విడిచిపెట్టును. నిజమేనా? ప్రకృతిని చూడండి. సరిగ్గా సరిపోవును.
లవొదికయ సంఘము ఆయనను బయట ఉంచినట్లు ప్రకటన 3లో మనము చూడ గలము. ఇతర సంఘ కాలములలో ఆలాగు జరుగలేదు, ఎందుకనగా ఇంకా తయారుకావలసినది ఒకటున్నది. అది మరో దాని లోనికి పయనించి వెళ్ళినది. ఇక ఏ శాఖలు రావని మీకు ఎప్పటి నుండో చెప్పుచున్నారు. మనము అంతములో యున్నాము. ఆయన వాక్యమై యున్నాడు గనుక వారాయనను బయటకు త్రోసివేసిరి. ఎందువలన? నేలలో పడిపోయిన వాడు ఆయనే. ఆది నుండి వచ్చుచున్న హిత బోధ ఆయనే.
వాక్య బీజము ఎదుగ సాగగానే దాని నుండి పొట్టు రాలిపోయినది. జీవము అన్నిటిని విడిచిపెట్టును, దానినే అన్నియూ వెంబడించినవి; వారే నిజవిశ్వాసులు, జీవము ఎక్కడికి వెళ్ళితే అక్కడికి వారు కూడా వెళ్ళుదురు.
89మనకు సమయమున్నచో… ఇశ్రాయేలు యొక్క పరిపూర్ణ మాదిరిని మనము చూద్దాం. కొద్ది నిమిషముల సమయమున్నది. ఆది యందున్న పరిపూర్ణ మాదిరిని చూడండి. అగ్ని స్తంభము జీవమునకు మాదిరి. దేవుడే ఆ వెలుగు. అది అర్థరాత్రి అయినా లేక వారు ఎన్నుకొనిన స్థలములో ఉండినా గాని, ఆ అగ్ని స్తంభము కదిలి వెళ్ళినప్పుడు బూర మ్రోగును. దానితో పాటు ఇశ్రాయేలు ముందుకు పోవును. హల్లెలూయా! బూర మ్రోగగానే దానితో పాటుగా మార్టిన్ లూథర్ కదిలిపోయెను. ఆ తరువాత వచ్చిన వారు దానిని సంస్థగా మార్చిరి. అప్పుడు దేవుడు దానిలో నుండి జీవమును తీసివేసి దానిని సమాధిలో ఉంచెను.
ఆ తరువాత వెస్లీ వచ్చెను. అతడు ఆ పెద్ద సంస్థను చూచి శుద్ధీకరణ అను బూరను ఊదెను. మరింత వాక్యము వచ్చినది. చూచారా? లూథరులో నుండి మెథడిస్టు లోనికి అది కదిలి వెళ్ళినది.
దానిని పెంతెకోస్తు చూచి ఒక బూరను ఊదెను. వరములు తిరిగి పొందు సమయమది. వారేమి చేసిరో చూచారా? వారు బూర ఊదగా మిగిలిన వారు బయటకు వచ్చిరి, కాని సంస్థగా మారిరి. గుర్తుంచుకొనండి. పొట్టు తరువాత మూడు దశలను మనము గమనించాము. గింజ తప్ప మరేదీ మిగల లేదు. ఓ! దేవా! గింజ పూర్తిగా తయారైనది. ఆమేన్ మరియు ఆమేన్! వాక్య విత్తనము రూపుదిద్దు కొనుచున్నది. జీవము ముందుకు వచ్చును..
ఇప్పుడు గమనంచండి, వధువు ముందుకు వచ్చుచున్నది.
90గుర్తుంచుకొనండి, సంఘము పెంతెకోస్తు యొద్ద ప్రారంభమయ్యెను, మరియు అది నైసియా యొద్ద పడిపోయెను. అది మొలకెత్తెను గాని, అసలు గింజ వలె లేదు. అందులో కొంత జీవమున్నది, కాని ఒక సంస్థను తయారు చేయుటకు అది మొలకెత్తెను. ఆ సంస్థలో నుండి ఆయన బయటకు వచ్చెను. ఆ తరువాత ఏమి జరిగెను? అది ఒక సంస్థలో నుండి మరో సంస్థలోనికి కదిలి పోయినది. వాక్యము యొక్క దశలు చూడండి: నీతీకరణ, శుద్ధీకరణ, పరిశుద్ధాత్మ బాప్తిస్మము, చూచారా. ఈ కాండము మరియు వివిధ దశలను దాటి అది వచ్చుచునే యున్నది.
గుర్తుంచుకొనండి, కాండము కంటె దళము గింజకు దగ్గరగా యుండును. దాని కన్న దగ్గరగా పొట్టుండును. కాని వాటికి ఆవలగా గింజ యుండును, చూచారా. అవన్నియూ వాహకములుగా ఉపయోగపడినవి.
91వధువును గమనించండి. ఆదియందు పెండ్లికుమారుడు వాక్యముగా ఉండెను. పెండ్లి కుమారునిలో నుండి వధువు తీయబడినది. గనుక ఆమె కూడా వాక్యమై యుండవలెను.
పెండ్లి కుమారుడు బయలుపరచబడిన వాక్యమైయుండెను. పెండ్లి కుమారుడు మరియు వధువు ఒక్కటై యున్నారు. ఆమె ఆయనలో నుండి తీయబడిన భాగము. కళాఖండముగా ఉండిన ఆయన కొట్టబడెను.
మైకెలేంజిలో మరొక దానిని తయారు చేయజాలడు. తిరిగి దానిని రూపుదిద్దలేడు. అయితే దేవుడు దానిని చేయనై యున్నాడు. ఈ చిన్న వధువును ఆయన తీసికొని రానైయున్నాడు. ఆయన కొట్టబడెను. అసలు వాక్యము యొక్క ప్రక్కలో నుండి ఆమె వచ్చెను. ఆయన మహోన్నత కళాఖండము. ఆ కుటుంబము తిరిగి ఏదెను తోటలో యున్నది.
JOEL 2:25•
MAL 4:6
92ఈ వధువు దీనిని ఎట్లు చేయగలదు? గోధుమ గింజ దీనిని ఎట్లు చేయగలదు? మలాకీ 4లో చెప్పెను, "చివరి దినములలో తిరిగి అదంతయూ సమకూర్చబడును. ఆది యందున్నట్లే యుండును. గొంగళి పురుగులు, పసర పురుగులు మొదలగునవి తినివేసిన దానినంతటినీ తిరిగి ఇచ్చుదునని యెహోవా సెలవిచ్చుచున్నాడు. మలాకీ 4లో చెప్పెను, "ఆయన జనుల హృదయములను జనుల విశ్వాసమును, అసలు తండ్రుల యొక్క విశ్వాసము నొద్దకు తెచ్చును." సంఘమా, దీనిని మనము చూచుచున్నాము. మనము ఎక్కడున్నాము?
MAL 4:6
93ఇప్పుడు, కొద్ది నిమిషములలో ముగించెదను. జరిగిన దానిని గమనించవలెనని కోరుచున్నాను.
మలాకీ 4 అసలయిన దానిని తిరిగి తెచ్చును. సంఘ శరీరము నుండి ఆమె కొట్టబడినది. ఒకే ఉద్ధేశము కొరకు ఆమె తన యజమానితో సహా కొట్టబడినది, ఆమె వాక్యము, తన సోదరుల నుండి యోసేపు కొట్టబడినట్లే యున్నది, ఎందుకనగా అతడు వాక్యము. యేసు తన సోదరుల నుండి కొట్టబడెను, ఎందుకనగా ఆయన వాక్యము. సంఘములో నుండి వధువు కొట్టబడినది, ఎందుకనగా ఆమె వాక్యము. ఒకటి, రెండు, మూడు దశలు. చూచారా? కచ్చితముగా.
94వాక్యము, సజీవమై పనిచేయుచున్నది. ఆమె బైబిలు వధువు, మానవ-నిర్మిత వధువు కాదు. దేవునిచే ఆమె కొట్టబడి గాయపరచబడినది, బైబిలు వధువు. మనము చూచి అపేక్షించునట్లుగా ఆమెలో అందము లేదు. దేవుని వలన శ్రమపరచబడిన దానిగాను, కొట్టబడిన దానిగాను ఆమెను మనము ఎంచితిమి. అది నిజము. ఆమె ఒంటరిగా నిలబడినది. అన్ని శాఖలలో నుండి ప్రకటన 3 ప్రకారము ఆమె తరుమబడినది. ఆమె పుట్టి పెరిగిన లవొదికయ సంఘములో నుండియే ఆమె తరుమబడెను, చూచారా.
ఈ సంఘము లవొదికయ సంఘ కాలములో పెరిగినది. అది పొట్టు. ఆ పొట్టు చనిపోయినదని పెంతెకోస్తు వారగు మీరు చూడలేదా. కాండము, దళము చనిపోయినట్లే, పొట్టు కూడా చనిపోవలెను. సంస్థల యొక్క మూడు దశలను చూడండి.
మీరు చెప్పినది గుర్తుంచుకొనండి. "చాలా కాండములు వ్రేలాడుచున్నవి; చాలా ఇవి యున్నవి." అవును! మెథడిస్టు, బాప్టిస్టు, ప్రెస్బిటేరియను, లూథరను, క్రీస్తు సంఘము ఇంకా చాలా యున్నది. ఇవన్నీ ఆకుల వలె, కాండముల వలె యున్నవి గాని, రాలిపోయినవి; కాని అసలయినది సంస్కరణ. ఇప్పుడు, చూచారా?
MAL 4:6
95పెండ్లి కుమారుని వలె, ఒంటిగా నిలబడియున్నది, సంఘముల ద్వారా విసర్జించబడినది. మనుష్యుల ద్వారా తృణీకరించబడినది. ఆ విధంగానే వధువు నిలబడియున్నది. ఏమిటది? అది ఆయన యొక్క మహా-కళాఖండము, చూచారా. అది వాక్యము దాని ద్వారానే ఆయన పనిచేయగలడు, బయలుపరచుకొనగలడు — విసర్జించబడినది అదే!
కాబట్టి కాండము, దళము, పొట్టు ఎన్నడూ గింజగా మారవు, కాని అవి గింజవలె రూపము పొందుటను మనము ఎప్పుడూ చూతము.
ఇప్పుడు కోత కాలము, గింజ అసలు జీవమును పొందును, తిరిగి బైబిలు యొద్దకు వచ్చును. ఆ విధముగా అది వచ్చునని మలాకీ 4లో చెప్పబడెను. పూర్తిగా వాక్యమై అది ఉండవలెను. ఓ, మై!
ఆ రీతిగా అది ఉండవలెను. నిజమేనా?
REV 10:7
96ఇప్పుడు, ప్రకటన 10లో ఆయన ఏమి చెప్పెను? ఏమి జరుగును? టుసాన్‌కు ఎందుకు ప్రయాణము చేయవలసి వచ్చెను? సంఘమును తెరచుటకు. (ఏడవ దూత పలుకు దినములలో) దేవుని యొక్క వాక్యమంతయూ బయలు పరచబడును. ఈ కాలములో ఆ ముద్ర, కాండము విడిచిపెట్టినదంతయూ ప్రత్యక్షపరచబడును. ఆలాగు వాక్యము చెప్పలేదా? దానిని మనము చూచుచున్నాము. మనమెక్కడున్నామో చూడండి. ఎక్కడున్నాము? ఒకే ఒకటున్నది. అది కోత కాలము. అది పూర్తిగా పండినది. రాకడ కొరకు ఆమె సిద్ధమై యున్నది.
గమనించండి.
97లేదు, అదెన్నడూ ఆలాగుండదు. కోత కాలములో గింజ మరల తన అసలు స్థితికి వచ్చును. విత్తనముగా ఉండవలెనన్నచో, వాక్యమంతటినీ తప్పక కలిగి యుండవలెను. సగం విత్తనముగా నీవుండలేవు; ఆలాగు ఎదుగదు. పూర్తి విత్తనముగా అది ఉండవలెను. "నేను పరిశుద్ధాత్మ బాప్తిస్మమును నమ్ముచున్నాను. హల్లెలూయా! నేను భాషలలో మాట్లాడు చున్నాను అని అందువు." అది విత్తనములో కొంత భాగము. కాని ఇపుడు, దానికి కొంత చేర్చవలెను. హల్లెలూయా! చూచారా, వరములు కావు, జీవము, వరముల యొక్క జీవము కావలెను, చూచారా. చూడండి నా భావము గ్రహించారా? సోదరులారా, మనము అంత్యకాలములో ఉన్నాము.
కాండము, దళము, పొట్టు ఇపుడు చనిపోయి ఎండిపోయినవి. ఇక దానికి ఒకటి జరుగవలసియున్నది, ప్రపంచ సంఘసమాఖ్యలో పోగుచేయబడి కాల్చబడవలెను.
98లూకా 17లోను, మలాకీ 4లోను చెప్పినట్లుగాను, ఆయన వాగ్ధానము చేసినట్లుగాను, వాక్యము శరీరధారియైనది. అది నిజము. ప్రత్యక్షతలు…
కాండము, దళము, పొట్టులో యున్న జీవమంతయూ ఇప్పుడు విత్తనములోనికి సమకూర్చబడును, పునరుత్థానమునకు సిద్ధపడును. కోత కాలము వచ్చి యున్నది. ఆల్ఫా ఇప్పుడు ఓమేగాగా మారెను. మొదటి వాడు కడపటివాడాయెను. లోనికి వెళ్ళిన విత్తనము ఒక విధానము ద్వారా మరల విత్తనముగా మారెను. ఏదెను తోటలో పడిన విత్తనము చనిపోయి మరల బ్రదికినది. (పరిపూర్ణత లేని విత్తనముగా అది అచ్చట పడిపోయినది) — కాని పరిపూర్ణమగు విత్తనముగా తిరిగి లేచినది — కడపటి ఆదాము.
ZECH 14:7•
REV 1:8,11•
REV 21:6•
REV 22:13
99మొదటి హవ్వ పడిపోయెను, రెండవ సంస్కరణలో, రెండవ రాకడలో ఆమె వాడబడెను. బిడ్డను తీసికొని వచ్చునట్లుగా వాడుకోబడెను. ఇప్పుడామె నిజమగు వధువుగా, విత్తనముగా మారినది, తిరిగి మూలవిత్తనముగా మరల మారినది. ఆల్ఫా మరియు ఓమేగా ఒక్కరే. "అల్ఫాయి, ఓమేగాయు నేను," అని ఆయన చెప్పెను. మధ్య రకంగా ఆయన ఎన్నడూ ఏమియూ చెప్పలేదు. "అల్ఫాయు, ఓమేగాయు నేనే. మొదటివాడను, కడపటి వాడను నేనే." అవును!
మొదటి పరిచర్య, చివరి పరిచర్య ఒక్కటే. మొదటి వర్తమానము మరియు చివరి వర్తమానము (రెండవది) ఒక్కటే. నేనున్న వాడను. "నేను అల్ఫాలో యుంటిని; నేను ఓమేగాలో యుంటిని." "రాత్రిగా గాని, పగలుగా గాని పిలువబడని ఒక దినము వచ్చును, సాయంకాలమున వెలుగు కలుగును." చూడండి. అల్ఫా మరియు ఓమేగా; మొదటి వాడు, కడపటి వాడు ఒక్కటాయెను. ఓ, నా, సోదరులారా, గంట్ల కొలది దానిపై మాట్లాడుకోవచ్చును.
100కుటుంబములోని మహోన్నత కళాఖండములయిన చివరి ఆదాము, చివరి హవ్వ ఇప్పుడు వెయ్యేండ్ల పాలన అను తోటలోనికి వెళ్ళుటకు సిద్ధముగా యున్నారు. ఆమేన్. తిరిగి భూమి మీదికి వచ్చుదురు. హల్లెలూయా! ఆ మహా శిల్పి వారిని అక్కడ విడువడు. ఆయన సమయము తీసికొనెను. మిలియనుల సంవత్సరములు ఆయన తీసికొని మొదటి పరిపూర్ణ జంటను ఆయన మలిచెను, కాని వారు పడిపోయిరి. ఇప్పుడు మరల వేలాది సంవత్సరముల నుండి ఆయన మలచుచున్నాడు, ఇప్పుడు వారు సిద్ధముగా యున్నారు.
మహా-కళాఖండము కొట్టబడెను — ఆయన ప్రక్కలో నుండి సాటియగు సహాయకురాలు వచ్చెను. ఆమె అదే విధానములో తీసికొని రాబడెను. ఇప్పుడామె మరల ఇక్కడున్నది. ఇక్కడ మనమున్నామని సర్వసృష్టి, బైబిలు, ప్రతిది చూపించుచున్నది.
దేశములు బ్రద్ధలగుచున్నవి; ఇశ్రాయేలు మేల్కొనుచున్నది.
బైబిలు ముందే చెప్పిన గురుతులు;
అన్యుల రోజులు లెక్కించబడినవి.
(మనము ఈ చెత్తను చూడవలె!)
ఓ! విడువబడినదానా! నీ స్వంత వాని యొద్దకు తిరిగి రమ్ము!
అది నిజము. నీవు వెళ్ళుచున్నట్లయితే త్వరగా అక్కడికి చేరుట మంచిది. (అయిదు లేదా పది నిమిషములలో నేను ముగించుబోవుచున్నాను.)
101ఆ గొప్ప కళాఖండము యొక్క కుటంబమును గమనించండి. భార్య భర్తలు ఒక్కటవునంత వరకు నిజమగు కుటుంబముగా పిలువబడరు. ఆలాగు వారు ఏకము కావలసియున్నారు. ఆలాగు కాని యెడల వారు మంచి కుటుంబము కారు — భార్య ఒక వైపుకు, భర్త మరో వైపుకు లాగరాదు. ఆలాగయితే అది ఒక భయంకర కుటుంబము. కాని వారు ఒకరియెడల ఒకరు ప్రేమ కలిగి సమ్మతించినప్పుడు మంచి కుటుంబముగా ఉందురు. అది దేవుని యొక్క మహోన్నత కళాఖండము; ఇక్కడున్న నిజ కుటుంబములు దానికి ప్రతి రూపములు, చూచారా. మహోన్నత కళాఖండ కుటుంబము మరల వచ్చినది — క్రీస్తు మరియు ఆయన వధువు వచ్చుటకు సిద్ధముగా యున్నారు. కడపటి ఆదాము మరియు కడపటి హవ్వ తమ ఇంటికి తిరిగి వచ్చుటకు ఇప్పుడు సిద్ధముగా యున్నారు. ఇదంతయూ విమోచనకు సాదృశ్యము, అది ఖచ్చితంగా తిరిగి వచ్చుచున్నది. ఉన్న చోటు నుండి వచ్చుచున్నది.
తరువాత…
102క్రైస్తవ వ్యాపారుల యొద్ద ఒక రోజున నేను నిలువబడియున్నాను. మీలో చాలామంది అక్కడున్నారనుకొనుచున్నాను. ఆ లూథరను గురువు లేచి ఏదో హాస్యముగా మాట్లాడెను. మనము నమ్ము దానిని గూర్చి హేళన చేసెను. సంపూర్ణ సువార్త మనుష్యులు అతనిని అక్కడికి ఆహ్వానించగా అతడాలాగు మాట్లాడెను. అతడు గుండ్రటి కాలరు గల అంగీ ధరించెను. చాలామంది వాటినే ఇప్పుడు ధరించుచున్నారు. అతడిట్లనెను, "నేను ఆ గుండ్రని కాలరు ఎందుకు ధరించానని జనులు అడుగుచున్నారు." అతడిట్లనెను, "కాథలిక్కు గురువుకు మనకు మధ్య ఎట్టి తేడా లేదు, ఉండరాదు. మనందరం దేవుని పిల్లలమే. కాథలిక్కు గురువు సర్వాంతర్యామివలె అన్ని చోట్ల ఉండవచ్చును."
103సర్వజ్ఞానివి కాకుండా నీవు సర్వాంతర్యామివి కాజాలవు. దేవుడు కూడా సర్వాంతర్యామి కాజాలడు. దేవుడు సర్వజ్ఞాని గనుకనే సర్వాంతర్యామి అయ్యెను. (ఆయనకు అన్నియూ తెలియును.) అయితే ఆయన ఒక జీవిగా ఉండుటకు ఒక జీవిలోనికి రావలసి వచ్చెను. ఆయన సర్వ జ్ఞాని గనుక సర్వాంతర్యామి కాగలడు, ఎందుకనగా ఆయనకు సమస్తమూ తెలియును. ప్రపంచము ప్రారంభము కాకముందే, ఎన్ని ఈగలు, ఎన్ని పేలు, ఎన్ని పురుగులు ఉండునో ఆయనకు తెలియును. అవి ఎన్నిసార్లు రెప్పలు వాల్చునో ఆయనకు తెలియును. వాటి గూర్చి అంతయూ ఆయనకు తెలియును (చూచారా?), ఎందుకనగా ఆయన సర్వజ్ఞాని. అనంతుడుగా లేకుండా సర్వజ్ఞాని కాజాలడు. దేవుడు మాత్రమే అనంతుడు. ఆమేన్!
మరియు అప్పుడు మనము…
DAN 12:3,10
104ఏమిటది? అపవాది వారిని తిన్నగా వధ స్థలమునకు తీసికొనిపోవుచున్నది. బైబిలు చెప్పినట్లే అక్షరాలా వారందరూ వరుసగా పోవుచున్నారు. ఇక్కడ చూడండి. పెంతెకోస్తు వారి మధ్యకు అది వచ్చుచున్నది. వారిని తిన్నగా ఈడ్చుకొని పోతున్నది. ఎట్టి కాలమిది!
ఎవరో నాతో చెప్పిరి, అది మంచిదే. దాని గూర్చి నేనేమి అనను, వారు నన్ను బహుశా చెరసాలలో వేయవచ్చును; "అది అక్కడ ఉన్నది," అని నేను అనుకున్నాను. నేర్చుకొనిన జనులకు తెలియును. "ఆ దినమున బుద్ధిగలవారు తమ దేవుని ఎరుగుదురు," అని దానియేలు చెప్పెను. అవును! చూడండి? జ్ఞానముగలవారు తమ దేవునిని ఎరుగుదురు; వారు ఆ సంగతుల కొరకు ఎదురుచూచుచున్నారు.
అది జరుగుట నేను చూచినప్పుడు పెంతెకోస్తు వారు వారితో నిలబడియుండిరి. ఓరల్ రాబర్ట్ కూడా నా వైపు ఆలాగు చూచెను. ఓ, మై! అనుకొన్నాను.
విద్య, ప్రతిభ గలిగి అతడాలాగు నిలబడి యున్నారు గదా అనుకొన్నాను. దేవుడు తన వారిని ఆ విధంగా మెరుగుదిద్దడు. ఆయన తన వారిని విద్యతో దిద్దడు; దీనత్వముతో ఆయన దిద్దును మరియు తన యొక్క బయలుపరచబడిన వాక్యపు శక్తితో ఆయన మెరుగు పెట్టును. లోనికి వెళ్ళిన గింజ యొక్క రూపమును ఆయన చూపించును.
105ఎవరో నాతో ఇట్లనిరి, "బ్రెన్‌హాం సోదరుడా," "నీ గూర్చి నాకు ఒకటి అర్థమగుట లేదు."
"ఏమిటది?" అనడిగాను.
సోదరి డాచ్ తదితరులు హాలులో నిలబడియున్నారనుకొనుచున్నాను. బిల్ తో కరచాలనము చేసి అక్కడ నేను నిలబడియున్నాను. మొత్తం జనులందరూ మూలకు వెళ్ళిరి. గుండ్రని కాలరు గల అంగీ ధరించిన ఒక వ్యక్తి త్రోసికొని ముందుకు వచ్చి ఇట్లనెను, "నీవెందుకు ఎప్పుడూ జనులను తిట్టుదువు?" "ఆ జనులు నిన్ను దైవజనునిగా నమ్ముచున్నారు, వారి పట్ల చక్కగ ప్రవర్తించు, మృదువుగా మాట్లాడుము. స్త్రీలు జుట్టు కత్తిరించుకొనిరని, రంగులు పూసికొన్నారని, పొట్టి బట్టలు వేసికొన్నారని, ఇంకా ఏవేవో చేయుచున్నారని కేకలు వేయుటే ఎప్పుడూ నేను వినుచున్నాను. వారు చల్లబడిరని, అలవాటు భక్తి చేయుచున్నారని, భేదములతో జీవించుచున్నారనియే ఎప్పుడూ చెప్పెదవు. నీవెందుకాలాగు చేయుచున్నావు? ఆ జనులు నిన్ను ప్రేమించుచున్నారు. నీవు ఆ విధంగా తిట్టుచూ దేవునికి ప్రియ కుమారునిగా ఎట్లుండగలవు?"
నేనిట్లు తలంచాను, "ప్రభువా, ఈ తెలివిగలవానికి సరియిన జవాబును ఇవ్వనిమ్ము. అతని త్రాడుతో అతడే బిగించుకొనునట్లు చేయుము. సరయిన జవాబు ఇమ్ము. నేనిట్లు పలికాను, "అయ్యా! గొప్ప సంగీత కర్తయగు బీదోవెన్ గూర్చి ఎప్పుడైనా చదివావా?"
"ఓ! బీదోవెన్ గూర్చి చదివాను," అన్నాడు.
బహుశా అతడు తన చిత్తు కాగితములతో చెత్త బుట్ట అంతటినీ నింపియుండును, కాని ప్రపంచమునకు మహా-కళాఖండములను అందించెను." అతడు తన గదిలో కూర్చొని ప్రేరేపణతో ఏదేదో వ్రాసెను. తన అధ్యయనం తరువాత ప్రార్థించేవాడు. వ్రాసినవి సరికాదని మరలా చింపేసేవాడు. వాటిని చెత్త బుట్టలో పారేసేవాడు. అయితే అతడు ప్రేరితుడై లోకమునకు మహా-కళాఖండములందించెను. నాకు అతడు జవాబిచ్చుటకు నోరు తెరువలేదు. వాక్యము బాగుగా కోయును, కాని అది మహా-కళాఖండములను పుట్టించును, పొట్టును మరియు చెత్తను తీసివేయును, అది మహా-కళాఖండమును సృష్టించెను.
106ఇంకా నాకు ఏడు నిమిషముల సమయమున్నది. మొన్న జరిగిన ఒక సంగతి చెప్పెదను, ఇక్కడున్న షాపింగ్ సెంటరులో జూలై మూడున కూర్చొని యున్నాను. రోమ్‌లోని పిగ్ ఆలీలో నేనున్నాను… ఫ్రాన్సులో యున్నాను, మరియు న్యూయార్కు పట్టణములో యున్నాను, లాస్ ఏంజలస్‌లో యున్నాను; కాని నా జీవితంలో అతి అసభ్యమగు స్త్రీల గుంపును ఇండియానాలోని జెఫర్‌సన్ విల్‌లోనే చూచాను. ఆ జనుల మధ్య ఉన్నంత మురికిని, అసభ్యతను నా జీవితంలో మరెక్కడా చూడలేదు. నా గుండె బాధతోకొట్టుచున్నది, ప్రభువు నాకు ఒక దర్శనమిచ్చెను. ఇప్పుడు నేను ఆ దర్శనమును చెప్పనైయున్నాను. దానికి నేను అర్థము చెప్పగలనను కొనుట లేదు, కాని మొదటి సారిగా నేను ఆదర్శనమును చెప్పబోవుచున్నాను.
107నేను ధ్యానంలో యున్నాను. ఎవరో నాతో యున్నట్లు చూచాను. ఆ వ్యక్తి నాకు కనబడలేదు. అది కేవలము ఒక స్వరము. నేను చూచాను. ఇటువైపు నేను చూడగా, ఆయన నాతో ఇట్లు చెప్పెను "వధువు ఇప్పుడు ముందుగా కనబడుచున్నది." నేను చూచాను, నా జీవితంలో ఎన్నడూ చూడని అతి సుందర స్త్రీలు చక్కని పవిత్ర వస్త్రములు ధరించి, నా వైపు వచ్చుట కనబడెను. కాని వారు ప్రతి ఒక్కరు వేర్వేరు దుస్తులు ధరించినట్లు కనబడెను. వారందరికి పొడవైనజుట్టున్నది, వారి దుస్తులు పొడవుగా యున్నవి. వారు ఇరవై సంవత్సరముల యవ్వనములో ఉన్నట్లు కనిపించిరి.
ఇప్పుడు, నా ముందు బైబిలు తెరచియున్నది. నేను చూచిన దానిని మాత్రమే చెప్పగలను, "నీవు దేని వైపు చూచుచున్నావు?" అని మీరడిగినచో, నేను గడియారము వైపు చూచుచున్నానని చెప్పుదును. "ఎవరి కొరకు నీవు చూచుచున్నావు?" అన్నచో జనుల కొరకు చూచుచున్నాను అందును. దేనివైపు నీవు చూచుచున్నావు అనినచో, బైబిలు వైపు చూచుచున్నానని చెప్పెదను. నేను నిజము చెప్పుచున్నాను; నేను దానిని చూచాను. నేను చూచిన దానినే చెప్పెదను. అదంతా ఏమిటో నాకు తెలియదు…. దాని గురించి అంతటిని, నేను మీకు చెప్పవలసి యున్నాను.
108ఈ వధువు చూచుచున్నది. (నేను ఆమె కలిసి నిలబడి యుండగా, ఆమె నాతో మాట్లాడుచున్నది.) ఆమె కన్నులు పవిత్రంగా యున్నవి. నా జీవితంలో అంత పవిత్రమైన, మధురముగా కనిపించు జనులను ఎన్నడూ చూడలేదు. ఒక డజను మంది ఉన్నట్లు కనిపించారు. ఎంతమందో నాకు లెక్క తెలియదు, కాని ఒక గుంపుగా వారున్నారు. ఆమె ప్రక్క నుండి మాధుర్యంగా వెళ్ళి పోయినది. ఆమె దాటిపోవుచూ కండ్లు పైకి ఎత్తి గమనించుచుండెను. ఓ! ఆమె అందముగా యున్నది! ఆమె వైపు నేను చూచాను. ఆమె వధువు అని ఆయన నాతో చెప్పెను. "ఇప్పుడు మనము సంఘములను సమీక్షించుదము." వారు వచ్చిరి. వారి రాకను నేను గమనించాను. వారు ఒకరి తరువాత ఒకరు రాగా, చూచాను. ఒకరి కంటె ఒకరు అధ్వాన్నంగా యున్నారు. నా జీవితంలో అంత అపవిత్రత గుంపును ఎన్నడూ చూడలేదు. "తరువాత…" అని ఆయన చెప్పగా, నేను ఒక శబ్దము విన్నాను. "తరువాత అమెరికా గుంపు వచ్చుచున్నది," అని ఆయన చెప్పెను.
109ఇప్పుడు, నేను ఒక అమెరికను పౌరుడను, కాని ఇది నన్ను కలవరపరచెను. కలగలుపుగా ఉన్న జనంలో ఏమి జరుగుచున్నదో చెప్పేటంత వాగ్ధాటి నాకు లేదు. మీరే దానిని అర్థము చేసికోవలెను. స్త్రీలు వచ్చుచుండిరి, వారి నాయకురాలు ఒక మంత్రగత్తె. ఆమెకు పొడవైన ముక్కు, పెద్ద నోరు ఉన్నది. వారందరూ ఒక రకమగు పొట్టి బట్టలు ధరించిరి, పైన దాదాపు అరంగుళపు త్రాడు వంటిది తగిలించుకొనిరి. ప్రతి స్త్రీ దాదాపు ఆలాగేయున్నది. చాలా సంవత్సరాల క్రితం మనందరము వార్తా పత్రికను కత్తిరించి పైకి ఎగురవేసే చిన్న ఆకారమును చేసెడి వారము.
మీకు గుర్తున్నదా, ఎందరికది గుర్తున్నది? మీరెరుగుదురు. వారు దీనిని కార్నివాల్‌లో వాడుదురు. ఒక విధమగు కాగితమును ఆ విధంగా వ్రేలాడదీసెడివారు. వారి క్రింది భాగమున ఏదో పట్టుకొన్నట్లు కనిపించినది. ఈ భాగమంతయూ బయటకు కనబడుచున్నది. ప్రతి ఒక్కరు పొట్టిగా జుట్టు కత్తిరించుకొనిరి, వింత-వింత వాటిని అంతటా ధరించారు, చాలా పొట్టిజుట్టున్నది, నిండుగా రంగుల పూసికొనిరి. నిజంగా వారు వీధిలోని వేశ్యల వలె కనిపించారు. ఏమీ తేడా లేదు. వారు ఈ కాగితముతో నడచుచున్నారు. ఎంత అపవిత్రత! ఆ కాగితమునే వారు ముందు చుట్టుకొనిరి. వారు ఆ ముందు శ్రేణిని దాటిపోయారు; వారు వెళ్ళుచుండగా చూచాను… వారి ముందు భాగము, వెనుక భాగము బయటకు కనిపించుచూ ఏదో రకంగా నాట్యమాడుచూ వెళ్ళుచుండిరి. "అది సంఘమేనా?" అనడిగాను.
110ఆమె వెళ్ళిపోయెను. వారు పాటలు పాడుచూ త్రిప్పుకొంటూ వెళ్ళిపోయిరి. మీరు ఆ నాట్యమును ఏదో అనవచ్చును. "అది సంఘమా?" అనడిగాను. అక్కడ నేను నిలబడియున్నాను. నా హదయంలో ఏడ్చుచున్నాను. ఈ మంత్రగత్తె, నా ఉద్ధేశంలో ప్రపంచ సంఘసమాఖ్య తప్ప మరొకటి కాదు, ఆమె తాను పోవుచున్న దారిలోనే వారిని నడిపించుచున్నది. వారు ఎడమవైపుకు వెళ్ళిరి. అగాధంలో పడి కనబడలేదు, ఇంకా ఈ సంగీతము వాయించుచూ, చాలా వింత ధ్వనులు చేయుచూ తమ శరీరములను ఒక వైపు నుండి మరో వైపుకు కదుపుచుండిరి. ఆ విధంగా చేసికొంటూ వారు సాగిపోవుచుండిరి.
111నేను నా తలను వంచసాగాను, ఆయన నాతో ఇట్లనెను, "ఆగుము! వధువు తిరిగి రావలసియున్నది." నేను చూచాను, వారు మరలా వచ్చుచుండిరి. వారు దాటి వెళ్ళుచుండిరి, చక్కగా కనబడుచున్న స్త్రీలు వారు. వెళ్ళిపోతూ వారందరూ నా వైపు చూచుచుండిరి. వారు ప్రతి ఒక్కరు వేర్వేరుగా దుస్తులు ధరించియుండుట గమనించాను. పొడవైన జుట్టు వ్రేలాడియుండుట చూచాను. ఈ విధంగా దానిని చుట్టిరి. జర్మను లేదా మరెవరో కావచ్చును. వారిని నేను గమనించాను. వారిలో ఇద్దరు లేదా ముగ్గురు వెనుక నుండి వెళ్ళిపో సాగారు. వారు మెట్టు దిగుచుండగా నేను వారిని పిలిచాను. వారు మరల మెట్టు ఎక్కుటకు ప్రయత్నించుచుండిరి. వారిని నేను చూచాను. ఆ దర్శనము నా నుండి దూరమైపోయినది మరియ మారిపోయినది.
112ఇప్పుడు, దానికి భావము చెప్పెదను: దానికి వ్రాయుటకు ప్రారంభించాను — ఇంకా పూర్తి చేయలేదు. ఇంకా ఆ నోట్సు పూర్తి చేయలేదు. కాని, ఈ ఉదయము బోధించుచుండగా, అది బయలుపరచబడినది, నా ప్రసంగములోనే. మీరు గమనించారా, సంఘము కనబడినది… స్నేహితులారా, ఇప్పుడు అది నిజము. వాక్యమును వ్రాసిన పరలోక తండ్రి నేను సత్యమును చెప్పుచున్నానని ఎరుగును. చూచారా? నేను సత్యము చెప్పుచున్నాను — నేను ఎరుగుదును. ఈ కొద్ది నిమిషాలలోనే దానిని నేను ఎరిగియున్నాను, మీరు గమనించారా? వధువు రెండుసార్లు కనబడినది. మొదటి విత్తనము మరియు రెండవ విత్తనము, రెండునూ ఒక్కటే. అన్ని దేశముల నుండి వచ్చిన వారు వధువుగా ఉండిరి. అందుకే వారు వేర్వేరు దుస్తులు ధరించిరి, ప్రతి ఒక్కరికి పొడవైన జుట్టున్నది, రంగులు పూసికోలేదు, చాలా అందమగు బాలికలు. వారు నన్ను గమనించుచున్నారు. అన్ని దేశములలో నుండి వధువు వచ్చుటకు వారు సాదృశ్యము. చూచారా? ఆ ప్రతి ఒక్కరు ఒక్కొక్క దేశమునకు ప్రతినిధిగా ఉండిరి. వారు వాక్యముతో పరిపూర్ణ వరుసలో పయనించుచున్నారు, చూచారా.
113ఆ తరువాత ఆమెను నేను గమనించవలసియున్నది. నేను గమనించనియెడల, ఆమె ఆ వాక్యములో నుండి మెట్టును దాటి పోవును, ఆమె దాటి పోవుచున్నది. నా కాలము అయిపోయి యుండవచ్చును, చూడండి. నేను గతించవచ్చును, ఏమిటో నాకు తెలియదు.
గమనించండి! వారు వెనుకకు వచ్చుచుండిరి, వరుసలోనికి వచ్చుటకు తమ శాయశక్తులా ప్రయత్నించుచుండిరి. ఎందుకనగా వారు ఎటువైపుకో చూచుచున్నారు. అగాధములోనికి వెళ్ళిన సంఘమును వారు గమనించుచున్నారు. ముందున్న వారెటూ తొలగలేదు. కాని వెనుకనున్న వారిలో — ఇద్దరు లేదా ముగ్గురు కుడిప్రక్కకు కొద్దిగా తొలగినట్లు కనిపించినది. వరుసలోనికి వచ్చుటకు వారు ప్రయత్నించినట్లు కనిపించినది. వారు నన్ను దాటి పోయారు. ఇక్కడ నుండి గోడ ఉన్నంత దూరము వెళ్ళిపోయారు. అక్కడ నేను నిలబడియున్నాను. అప్పుడు అందరూ కదిలి వెళ్ళిపోవుట చూచాను.
కాని, చూడండి, ఒక్కసారే సంఘము కనబడినది. ప్రతి దేశము వారు ఆ సంఘములో యున్నారు. వధువు రెండు సార్లు కనిపించినది, చూచారా. అదేమిటో మీరు చూచారా? దాని గూర్చి తెలియనిచో, ఈ ఉదయము నా వర్తమానముతో పోల్చి చూడండి. దానిని ఎరుగను, చూచారా.
114నైసియా యొద్ద విత్తనము నేలలో పడినది. అది అసలయిన విత్తనము. ఆమె ఆ శాఖల దశల గుండా వచ్చినది, అవి ఒక్కసారి మాత్రమే ఉనికిలో యుండును. కాని చివరి దినములలో వధువు తిరిగి వచ్చును: "నేను తిరిగి సమకూర్చుదును," చూచారా. మహోన్నత కళాఖండము తేబడినది. ఆ కారణము చేతనే ఆమె రెండవ సారి చూపించబడినది. మొదటిసారి ఆమె చూపబడినది, రెండవసారి ఆమె చూపించబడినది. ఆమె మొదటిసారి యున్నంత పరిపూర్ణముగానే రెండవసారి కూడా ఉన్నది. ఓ, దేవా! కృప చూపుము. త్వర త్వరగా జీవము గింజలోనికి వెళ్ళుచున్నది. త్వరగా!
115మిగిలిన వారందరూ ఇక కనబడలేదు. వారు వెళ్ళిపోయిరి, మరెన్నడూ తిరిగి రాలేదు. కాని వధువు తిరిగి వచ్చెను, ఎందుకనగా ఆమె అల్ఫా మరియు ఓమేగా. మహా-శిల్పియగు దేవుడు ఆయనను ఒక మహా-కళాఖండముగా చేసెను, ఎందుకనగా అది ఆయన మొదటి మహా-కళాఖండములోనికి ఒక భాగము. ఏదేను తోటలో ఆయన అతని ప్రక్కలో నుండి ఒక భాగమును తీసెను, అయితే అది చెడిపోయి పడిపోయెను; దానిని ఇంత కాలము ఆయన నిర్మించుచునే యుండెను. ఈ కళాఖండమును ఆయన మరల తీసికొని వచ్చెను, అది కొట్టబడెను — ఈ కొట్టబడిన ఈ భాగము ఈ మహా-కళాఖండమును తిరిగి తీసికొని వచ్చును.
కాబట్టి ఆ మహా-కళాఖండము మరియు దేవుని కుమారుడు, ఆ మహా-కళాఖండము మరియు వధువు ఆయనలోని భాగమైయున్నారు. అది వాక్యము యొక్క నెరవేర్పు. వాక్యము నెరవేరినది, మనము ప్రభుని రాకకు సిద్ధముగా యున్నాము.
116ఓ, సజీవ దేవుని సంఘమా! మీ హృదయములను వంచుడి. దేవుని ముందు సాగిల పడుడి. ఈ సంగతులు సత్యము. ప్రపంచ దేశములన్నింటికి వ్యాప్తి చెందవలసిన గొప్ప సంగతివలె అది ఎన్నడూ కనిపించదు. ఎప్పుడూ అంతే! ఆయన తన విధానమును మార్చడు.
సంఘమా, కృతజ్ఞత కలిగియుండుము. ఈ రోజున నీవు క్రీస్తునందున్న స్థితిని బట్టి కృతజ్ఞత కలిగియుండుము. మీరు చూడండి. గుర్తుంచుకొనండి, ఆ జీవమంతయూ పునరుత్థానము కొరకు గింజలోనికి సమకూర్చబడును, కాని పొట్టు కాల్చబడవలెను. మిగిలిన చెత్తంతయూ నాశనము కాబడవలెను. ఆ శాఖల యందు మీరు విశ్వాసముంచ వద్దు. జీవమైయున్న వాక్యమందు, దేవుని యందు, ఆయన మహా-కళాఖండము నందు నిలచియుండుడి. వెయ్యేండ్ల పాలనలో ఏముండును? క్రీస్తు మరియు ఆయన వధువు. వెయ్యేండ్ల పాలనా తోటలో తిరిగి ప్రవేశించెదరు. ఆమేన్!
నేనాయనను ప్రేమించెదను,
నేనాయనను ప్రేమించెదను,
ఏలయనగా ఆయనే మొదట నన్ను ప్రేమించెను
నా రక్షణ కొనెను
కల్వరి మ్రానుపైన.
ISA 53:4,5
117అక్కడే ఆయన కొట్టబడెను. దేవుని వలన మొత్తబడిన వానిగాను, శ్రమపరచబడిన వానిగాను మనమాయనను ఎంచితిమి. కాని ఆయన మన అతి క్రమముల నిమిత్తము గాయపరచబడెను, మన పాపముల నిమిత్తము నలుగగొట్టబడెను.
ఆ విత్తనములో లేని వారు ఈ ఉదయమున ఇక్కడెవరయినా యున్నారా? పొట్టు నుండి ఇక చివరి జీవము ముందుకు దూసికొని వచ్చుచున్నది, పొట్టు ఎండిపోవుచున్నది… పెంతెకోస్తు సంఘము ఎండిపోవుచున్నదని ఎందరికి తెలియును? ఏమిటది? దానిని జీవము విడిచి వెళ్ళుచున్నది. నిజంగానే అది విడిచిపోయినది. వధువు ఇప్పటికే కనబడుచున్నది, అప్పటికి ఇక వధువు తయారుకాదని చెప్పలేరు.
నేనాయనను ప్రేమించుదును,
నేనాయనను ప్రేమించుదును,
ఎందుకనగా, ఆయనే మొదట నన్ను ప్రేమించెను.
నా రక్షణను కొనెను
కల్వరి మ్రానుపైన.
118ఇప్పుడు, మన తలలు వంచుదము. ప్రార్థనలో జ్ఞాపకము చేసికోబడగోరు వారెవరైనా యున్నారా? స్నేహితులారా, ఇది చాలా తేటగా యున్నది. ఏదయినా జరగనిదే లేదా వెంబడించనిదే నా జీవితంలో ఎన్నడూ దర్శనము రాదు. నేను సత్యము చెప్పెదను. ఎన్నిసార్లు నేను సత్యము చెప్పితినని, దేవుడు దానిని రుజువు చేసెను. ఈసారి కూడా నేను సత్యమే చెప్పుచున్నాను.
ఏ దినములో మనము జీవించుచున్నామో నేనెరుగను, కాని ఇక జరుగవలసినదేదీ లేదని మాత్రము ఎరుగుదును. దీనిని చక్కబరచు ఏ రాజకీయవేత్త ఒక ఉండడు. రాజకీయము, దేశము చెడిపోయినవి. ఓ దేవా, మీరు దానిని చూడకలిగినంత లోతుగా వెళ్ళవలెను. దేశము చెడిపోయినది — ఒక్క దేశము కాదు, దేశములన్నీ చెడిపోయినవి. ఉన్నవాటిలో ఇదే మంచిది, మరియు ఇదే చెడిపోయినది. దేశములు చెడిపోయినవని అంటే, ప్రపంచమే చెడిపోయినది. నా దృష్టిలో, పెంతెకోస్తు అన్ని సంఘములలోను శ్రేష్టమైనది; అయితే అది చెడిపోయినది. ఓ దేవా! మా పట్ల కృప చూపుము!
119మీరాయనను ఎరుగని యెడల త్వరపడండి! మీరు జీవమును పొందగోరినచో, మీ పాపము నుండి, ఇప్పుడు మీరున్న స్థితిలో నుండి బయటకు రండి! వెంటనే ఆ గింజలోనికి వెళ్ళండి. మీరు కాండములో లేదా పొట్టులో యున్నచో చనిపోవుదురు. పాట పాడుచుండగా, ప్రార్థించండి.
నేనాయనను ప్రేమించెదను……
ఇప్పుడు మీవంతు. మాకు ఏ శాఖ లేదు. క్రీస్తు మాత్రమే మనకున్నాడు. ఆయనతో, మాతో కలిసి ఆయన వచ్చు వరకు ఆరాధించుటకు మిమ్ము ఆహ్వానించుచున్నాము. మీ పేరును పుస్తకములో వ్రాయలేము. మాకు ఏ పుస్తకములు లేవు. మీ పేరు జీవగ్రంథములో యుండవలెనని మా కోరిక. జన్మ ద్వారా మాత్రమే మీకది సాధ్యపడును. ఇప్పుడే మీరది పొందరా? నూతన జీవము కొరకు క్రీస్తును అడుగుడి. మిమ్మును లోనికి తెచ్చును. మీ పేరు ఆయన గ్రంథములో లేనియెడల వ్రాయును. అప్పుడు మీరు మాతో సహవాసము చేయగలరు. మీరు మాతో ఆరాధించుట మేము ప్రేమించెదము.
నేనాయనను ప్రేమించెదను… …
ISA 53:4
120ప్రియదేవా, ప్రతి వ్యక్తి పరీక్షించుకొనుటకు కృప చూపుము. ఆయనలో మేమున్నామో లేదో చూచుకోవలెను. నీవు మమ్మును ప్రేమించావు. మా కొరకు నీవు కొట్టబడినావు. నిన్ను మేము దేవుని వలన మెత్తబడినవానిగాను, శ్రమనొందిన వానిగాను ఎంచితిమి. దేవా, నీవు ప్రతి ఒక్కరిని పిలువమని ప్రార్థించుచున్నాను. ప్రభువా, నా పిల్లలతో, నా ప్రియులతో, నా స్నేహితులతో మాట్లాడుము. ప్రభువా, ఇప్పుడే అది దయచేయుమని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాను.
ప్రభువా, ఎవరినీ ఎక్కువ కాలము నిరీక్షింపనియ్యకుము. బహు సమీపముగా యున్నట్లు కనిపించుచున్నది. కోత కాలము నిజంగా పండియున్నది. ఈ దినములలో ఏదో ఒక దినమున దేవుని యొక్క గొప్ప కోత యంత్రము భూమి మీదకు వచ్చును; గడ్డి ప్రతి చోటకు ఎగిరిపోవును; కాని గోధుమలు సమకూర్చబడి కొట్టులో సమకూర్చబడును, ఎందుకనగా అందులో జీవమున్నది. ప్రభువా, ప్రతి మనవికి జవాబు దయచేయుము. ప్రతి ప్రార్థనను నీ ముందుంచుచున్నాము. ఉత్తరమిమ్ము.
ప్రభువా, వారి కొరకు ప్రార్థించుచున్నాను. ప్రభువా, ఇక్కడున్న ఏ ఒక్కరు నశించరాదని ప్రార్థించుచున్నాను. వారు కష్టములతో కూర్చొనియున్నారు… వందలాది మైళ్ళు కారు నడుపుకొని వారు వచ్చారు. ప్రభువా, మాకు అవసరమగు దానిని, మాకు మేలుకరమగు దానిని దయచేయుము. మా దృష్టికి మంచిగా కనబడవచ్చును, కాని నీ దృష్టికి మంచిగా నున్న దానిని దయచేయుము. కన్యక వలె మేము నీ యెదుట నిలువవలెనని కోరుచున్నాము. దేవుని చేత గద్దించబడి శిక్షించబడిన కన్యక వలె ఉండగోరుచున్నాము. మా పాపముల నుండి పరిహారము పొందగోరుచున్నాము.
ప్రభువా, వారి కొరకు ప్రార్థించుచున్నాను.
HEB 12:24
121ఎట్లు ప్రార్థించవలెనో నాకు తెలియదు. సర్వశక్తుడగు దేవునితో మేము మాట్లాడుచున్నాము. సజీవుడగు దేవుని ఎదుట మానవ మాత్రుడు, మర్త్యుడు ఏమి ప్రార్థించగలడు? కాని ప్రభువా, వచ్చిరాని మాటలు ఉచ్చరించాను, తప్పులు పలికాను, చిన్నపిల్లవాని అ-ఆ లు నీవు తీసికొని మాటను తయారు చేయుము. ప్రభువా, నా తప్పులనుమన్నించి, నా నమ్మికను చూడుము. నిన్ను నమ్ముచున్నాను. ఈ వాక్యమును నమ్ముచున్నాను. ఇక్కడున్న ప్రతి ఒక్కరి కొరకు విశ్వసించుచున్నాను. ప్రభువా, విశ్వాసము ద్వారా వారిని బలిపీఠము యొద్దకు తీసికొని వచ్చుచున్నాను. మాకును, గొప్ప యోహావాకును మధ్య ఆయన కుమారుడగు యేసు రక్తమున్నది. ఆ రక్తము మా పక్షముగా మాట్లాడును. ఆయనను నీవు కల్వరి యొద్ద కొట్టి మాట్లాడుము, ఈయన మాట వినుము అనియున్నావు. పాత నిబంధనలోని గొర్రెపిల్ల యొక్క రక్తము కన్న క్రీస్తు రక్తము గొప్పగా మాట్లాడును, హేబెలు రక్తము కన్న అది గొప్పది అని బైబిలు చెప్పుచున్నది. ప్రభువా, మాట్లాడుము, రక్తము ద్వారా మాకు విమోచన దొరకును.
122గొప్ప జీవదాతా, ప్రభువా, మమ్మును అందులో చేర్చుము. మా పాపములను తీసి వేయుము. ప్రభువా, ఆ విధంగా మేము ఉండగోరుట లేదు. అది మా ఉద్ధేశ్యము కాదు. భయంకరమగు, చీకటి దారిలో మేము జీవించుచున్నామని గ్రహించుచున్నాము. ముందు మేము చెప్పినట్లుగా కరకు స్థలముల గుండా నడచుచూ కొండను ఎక్కుచున్నాము. దారి కనబడుట లేదు; కాని మేము వెలుగును మోసికొని పోవుచున్నాము. ఒక్కొక్క మెట్టు ఎక్కుచూ ఇపుడు మేము వెళ్ళుచున్నాము. యాత్రికుని ప్రయాణము వలె యున్నది. చివరకు కొండను మేము చేరుకోవలెను. ఓ, గొర్రెల కాపరీ, మమ్మును నడిపించుము. గొప్ప యెహోవా, నీ ఆత్మ ద్వారా మమ్మును నడిపించుము.
మేము గొప్ప కళాఖండమునకు దూరముగా ఉన్నామని ఎరుగుదుము, కాని మేము ఎక్కడ నుండి చెక్కబడితిమో ఎరుగుదుము, నిజమగు మహా-కళాఖండము నందు విశ్వాసముంచుచున్నాము. ప్రభువా, ఆయన యొద్దకు మమ్మును తీసికొని వెళ్ళుము. ప్రభువా, దయచేయుము.
ISA 53:4,5
123ప్రభువా, ఇక్కడున్న రోగులనందరినీ బాగుచేయుము. ఆయనను కొట్టబడిన వానిగాను, శ్రమ పొందినవానిగాను మేము ఎంచితిమి. కాని ఆయన మా అతి క్రమముల నిమిత్తము గాయపరచబడెను. దేవుని యొక్క గొప్ప కళాఖండము కొట్టబడినది. మన అతిక్రమముల నిమిత్తము ఆయన గాయపరచబడెను. ఆయన పొందిన దెబ్బల వలన మనకు స్వస్థత కలిగినది. ప్రభువా, రోగులకు స్వస్థపరచుము. ఇపుడు, నీ దైవ సన్నిధి ఇక్కడున్నది, నీవిచ్చటున్నావని మాకు తెలియును.
సమస్త చెడుతనము, చెడ్డ ఆలోచనలు, చెడ్డ మాటలు, తప్పు క్రియల నుండి మా ఆత్మలను మరియు హదయములను పవిత్రపరచుము. మా రోగములను బాగు చేయుమని తండ్రీ, నీకు ప్రార్థించుచున్నాము. నా యొద్ద శుద్ధీకరణ పొందిన పిల్లలముగా అనుభవము పొంది ఇక్కడ నుండి వెళ్ళ కలుగునట్లు చేయుము. మా పైని రక్తమున్నది. వాక్యము, రక్తము ద్వారా మేము మాట్లాడుచున్నాము. ప్రభువా, దయచూపుము. యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము. ఆమేన్.
124తండ్రియగు దేవా, ఈ చేతిగుడ్డల కొరకు ప్రార్థించుచున్నాము. ప్రభువా, నీ సన్నిధితో వాటిని అభిషేకించుము. అవి వెళ్ళు ప్రతిచోటకు నీ సన్నిధి వెళ్ళునట్లు చేయుము. అవి ఏ రోగి శరీరము మీద ఉంచబడునో, ఆ రోగి బాగవునట్లు చేయుము. ప్రభువా, విరిగిన గృహములను కట్టుము. ప్రభువా, నీవు గొప్ప శిల్పివి. దయచూపుము.
దేవుని కుమారులు, కుమార్తెలుగా మమ్మును మలచుము, తయారు చేయుము. వధువు తుది మెరుగును దిద్దుకొనుచున్నదని మేము నమ్ముచున్నాము. సంస్థ నుండి అది కొట్టబడును, గొప్ప కోత కాలము వచ్చును. ప్రభువా, అంత వరకు వారు నీకు సేవ చేయుటకై ఆరోగ్యము, సంతోషములతో నింపుము. యేసు నామములో అడుగుచున్నాము. ఆమేన్.
నేనాయనను ప్రేమించుదును. (మీరు నిజంగా
ఆయనను ప్రేమించుచున్నారా?)
ఏలయనగా ఆయనే మొదట నన్ను ప్రేమించెను
నా రక్షణను కొనెను
కల్వరి మ్రానుపైన.
JOHN 13:35
125మిమ్మును ఎందుకు గద్దించానో, ఇప్పుడు అర్థమయినదా? మిమ్మును ప్రేమించినందున — లేదా మిమ్మును ప్రేమించనందువలన కాదు; మిమ్మును నిశ్చయముగా ప్రేమించుచున్నాను. యజమాని కొరకు ఒక మహా-కళాఖండమును నేను కోరుచున్నాను. కొన్ని ముక్కలుగా నేను చీల్చవలసి యుండును, కాని ఈ వాక్యము మీద సరిగా నేనుంచినచో, ఈ దినములలో ఒక దినమున మహా-కళాఖండము ఏర్పడును. నిజము.
ఇప్పుడు, యేసు చెప్పెను, "మీరు ఒకరి నొకరు ప్రేమించుకొనుడి, ఇందును బట్టి మీరు నా శిష్యులని మనుష్యులందరూ తెలిసికొందురు." ఆ విధంగా మనము ఒకరినొకరు ప్రేమించుకొనవలెను.
బంధించు ముడి దీవింపబడును
మన హృదయములను క్రైస్తవ ప్రేమలో;
ఏక మనస్సు గల సహవాసము
ఆ పై నున్న దానికిపోలిక.
ఒకరి చేతుల ఒకరు పట్టుకొనండి.
మనము విడిపోయినప్పుడు,
అంతరంగమందు బాధకలుగును;
అయినా ఇంకా హృదయములోకలిసే యుందుము,
తిరిగి కలిసికొనుటకు నిరీక్షించుదుము.
యేసు నామము నీతో కొనిపొమ్ము,
దుఃఖము, శ్రమతో నిండిన బిడ్డా!
అది నీకు ఆనందము, ఆదరణ ఇచ్చును,
నీవు వెళ్ళు ప్రతిచోటకు కొనిపొమ్ము.
ప్రశస్త నామము, ఓ! ఎంత మాధుర్యము!
భూలోక నిరీక్షణ, పరలోక ఆనందము.
ప్రశస్త నామము. ఓ! ఎంత మధురము!
భూలోక నిరీక్షణ, పరలోక ఆనందము
ఇప్పుడు, మీ యాత్రలో గుర్తుంచుకొనండి:
యేసు నామమును నీతో కొనిపొమ్ము.
ప్రతి చింత నుండి విడిపించు కేడెము,
శోధనలు నిన్ను చుట్టుకొన్నప్పుడు,
(నీవేమి చేయుదువు?)
పరిశుద్ధ నామములోప్రార్థనలో ఊదుము.
ఓ! ప్రశస్త నామము, ఓ! ఎంత మధురము!
భూలోక నిరీక్షణ, పరలోక ఆనందము
తిరిగి మనము కలిసికొను వరకు.
(మన తలలు వంచుదము.)
(ఓ! నాకు పాడుట ఇష్టము.)
యేసు పాదముల యొద్ద మనము కలిసికొను వరకు
మనము కలిసికొను వరకు!
మనము కలిసికొను వరకు, దేవుడు మీకు తోడైయుండు గాక!