బూరల పండుగ

బూరల పండుగ

1మన తలలు వంచెదము.

ప్రభువా, ఒకసారి నీ ప్రియ శిష్యులు "మాకు ప్రార్ధి౦చుట నేర్పుము" అనడిగిరి. పరలోకమందున్న గొప్ప దేవుని మేము చూచినప్పుడు మేమెంతగా అవసరతలోనున్నామో గ్రహించెదము. కాబట్టి ప్రభువా, ఇప్పుడు మా హృదయములకు ప్రార్థించుట నేర్పుము, నీ సేవకులకు, మరియు నీ రాజ్యమునకు ఉపయోగపడు వాటిని మాకు నేర్పుము. ఇక్కడున్న ప్రతివారి యొక్క అక్కరను నీవెరుగుదువు.

మరియు ఈ ఉదయమున ఈ బల్లమీద చేతిగుడ్డలు ఉంచబడినవి. శరీర రుగ్మతలు, ఆయా అక్కరలు గల వారియొద్ద నుండి చిన్న చిన్న గుడ్డలు, పొట్లములు మరియు చిన్న మరియు కుటుంబ సంబంధమైన విషయములో మరియు ఏమైనా వుండనీ, కాని నీవు మాత్రమే నిజదేవుడవు, మరియు ఈ ప్రతి ఒక్కరిని నీవు స్వస్థపరచునట్లుగా నీ ప్రియ కుమారుడగు యేసు నామమున మేము అడుగుచున్నాము. మరియు స్వస్థత అవసరమై యుండియూ చేతిరుమాళ్ళు లేదా పొట్లములు పంపనివారు కూడా ఇక్కడ ఉండి యు౦దురు.

ప్రపంచములోని పలు దేశములలోని వారు తమ గృహములు మరియు ఆలయములలో కూడి దీనిని వినుచుందురు (టేపుల ద్వారా). ప్రభువా, ఈ ఆరాధన కొనసాగుచుండగా, ఈ టేపు వినబడుచుండగా, వారెట్టి పరిస్థితిలో ఉన్నాగాని పరలోకముందున్న గొప్ప దేవుడు ఈ ఉదయమున ఇక్కడ కూడియున్నవారి హృదయ యధార్థతను గౌరవించి వారికి అవసరమగు స్వస్థతను, సమస్తమును అనుగ్రహించును గాక.

ఈ రానున్న ఆరాధనలో మమ్మును దీవించుము. దేవుని రాజ్యము నిమిత్తము ముందెన్నడూ మాట్లాడని రీతిగా మాట్లాడుము. నీ జవాబు కొరకు యేసు నామములో మేము కనిపెట్టుచున్నాము. ఆమేన్.

2ఈ ఉదయమున సంఘములో మరల ఉండుట మంచిది. ఓహియో నుండి వచ్చిన కొంతమంది స్నేహితులతో ఇప్పుడే మాట్లాడాను, ఇక్కడకు ఒక చిన్న బాలికను కొన్ని నెలల క్రితం తీసికొని వచ్చిరి, ఆ పాప రక్తపు కాన్సరుతో మరణ స్థితిలో ఉండెను. ఆ తల్లిదండ్రులు చాలా పేదవారు. వారి సాక్ష్యమును ఈ ఉదయమున ఫైలులో ఉన్నదానిని చదువుటకు నాకు సమయము లేదు. ఆమెకు ప్రార్థన చేసిన మూడు దినముల తర్వాత ఆ బాలిక యొక్క చిత్రపటమును (ఎక్ష్-రే) తీసిరి. వైద్యులు ఆమె మూడు దినములే జీవించునని చెప్పిరి, అయితే మూడు రోజుల తరువాత ఆమెలో వ్యాధి చిహ్నములే కనబడలేదు. మరియు ఆమె ఇప్పుడు చాలా సంతోషముగా బడిలో యున్నది. ఆమెను ఇక్కడి గదిలో ఉంచిన సంగతి తప్పకుండా సంఘసభ్యులకు గుర్తుండును.

అలాగే చిన్న బిడ్డ ప్రేగులు వెలుపల ప్రక్కగా ఉన్న స్థితిలో జన్మించెను. ఈ స్వల్ప స్థితిలో ఈ విధముగా వున్న ప్రేగులు మరల యధాస్థితికి రావని వైద్యులు చెప్పిరి. అప్పుడే నూతనముగా జన్మించిన ఆ శిశువును తాకుటకు వారు భయపడిరి. మరిప్పుడు, ఆ చిన్న శిశువు ఒక సంవత్సర వయస్సులోనున్నది, అది ఏదో కొంత సహజమైన స్థితిలో వున్నట్లుగానే ఆ ప్రేగులు వున్నవని నేను ఊహించుచున్నాను. సమస్తము మామూలుగా ఎట్లు౦డవలెనో అది అక్కడ అట్లేయున్నది. అది కేవలము దేవుని కృప, ఆయన మనపట్ల ఎంత మంచివాడో చూడండి.

3ఇప్పుడు ఈ రోజు, నేను ఆ కూటమును దానిని మేము ఎక్కడ ఏర్పాటు చేయాలని సంకల్పించిన దానిని ప్రకటించగోరుచున్నాను. నేను ఈ వచ్చే వారమున సహోదరుడు జోసెఫ్ బోజ్ తో ఆఫ్రికాలోని కెన్యా మరియు టాన్గాన్యికాకు వెళ్లాలని ఉద్దేశించాను. కూటము ఏర్పరచుటకు సాధ్యపడలేదని సహా, బోజ్ టెలిగ్రామ్ వార్త సంపెను. "గత వారమున మన సొంత ముగ్గురు మిషనరీలు చంపబడి, మరియు — హత్య చేయబడిరి." మరియు వారికి అక్కడిప్పుడు ఉద్రిక్తముగా యున్నది, కమ్యూనిష్టులు స్థానికులకు తుపాకీలు ఇచ్చుచున్నారు, చేప దోనెల సాకుతో వారు ఎర్ర చైనా మరియు రష్యాల నుండి తుపాకులను స్థానికులకు చేరవేయుచున్నారు. మరియు వారికి ఏలాగు ఉపయోగించవలెనో అస్సలు వారికేమి తెలియదు. చూచిన దానిని వారు కొట్టుచున్నారు. కాబట్టి ఈ సమయములో కూటము ఏర్పరచుట మంచిది కాదని వారి ప్రభుత్వము తలంచెను. ఈ సమయములో నేను వెళ్ళనైయున్న ఆ స్థలంలో ఉన్న బడిని కూడా సహో, బోజ్ తెరువలేకపోయెను. కాని అని రద్దు కాలేదు, కాబట్టి ప్రశాంతత ఏర్పడువరకు కూటములను వాయిదా వేయుట జరిగినది.

4దక్షిణాఫ్రికా నుండి వచ్చిన సహోదరుడు జాక్సన్న్ ను సహోదరుడు సిడ్నీ జాక్సన్ను మరియు సహోదరి జాక్సన్ను చాలా సంవత్సరముల తరువాత ఈ ఉదయమున చూచుటకు సంతోషించుచున్నాను. అతడు మాట్లాడెనా? వీరు నిజంగా నా సోదరీ సోదరులు. గతసారి నా దక్షిణాఫ్రికా పర్యటనలో సహకరించారు. ఏదో ఒక రోజున దేవుని కృప ద్వారా మేము వారితో కలసి మరల అక్కడికి వెళ్తామని విశ్వాసించుచున్నాము, ఎందుకనగా అది అవసరమైయున్నది. మరియు నేను మరల వెళ్ళవలెనని తొమ్మిదేండ్ల నుండి ప్రయత్నించుచున్నాను, కాని సంస్థల వలన మరియు మొదలగు అనేక కారణములచే వారు నన్ను తిరిగి వెళ్ళనిచ్చుట లేదు.

కాబట్టి వారికి ఈ మధ్య ఈలాగు ఉత్తరం వ్రాశాను, "ఆ నశించిన ఆత్మల యొక్క రక్తాపరాధము మీ మీదనే యుండును, నా మీద ఉండదు." కొంత కాలము పాటు దేవుడు వారికొరకు నా పరిచర్యను వాడుకొనగోరుచున్నట్లు నేను నమ్ముచున్నాను. కాని వారి శాఖాభేదముల వలన మరల వారు నన్ను రానిచ్చుట లేదు. అయితే, సరే మంచిది, దానిని గూర్చి దేవుడు చూచుకొనును.

5ఇప్పుడు, ఈ ఉదయమున నేను ఏమి చెప్పాలని ఆశిస్తున్నానంటే, అది దేవుని చిత్తమైతే… సహోదరుడు నెవిల్ ఈ గుడారములో జరుగు ఆరాధనలను గురించి అడిగెను, కావున మేము మిమ్మల్ని ఆహ్వానించుచున్నాము. మరియు తర్వాత వచ్చే ఆదివారము, దేవుని చిత్తమైతే, తర్వాత వచ్చే రెండు లేదా మూడు ఆదివారములు నేనిక్కడ వుండవచ్చు, ఎందుకనగా ఏర్పాటు చేయబడిన కూటములు రద్దయి, అవి లేనందువలన.

6ఇప్పుడు, మేము ఇంకా దానిని చెప్పుటకు ఆశించుచున్నాము. ఏడు బూరల గురించి ఈ సమయమున మేము ప్రసంగిస్తామేమోనని నేను చెప్పితిని. వాతావరణమును అదుపులోనుంచు యంత్రములు చాలవు. (గదిలో గాలి లేదు; ఇంకా ఆ శీతోష్ణమును క్రమపరచు యంత్రములు తేలేదు). వాతావరణమును క్రమపరచు యంత్రములున్న పాఠశాలను అద్దెకు తీసికో గోరాము. ఏర్ - కండిషన్ సదుపాయము లేని మరియు చాలని ఈ చిన్న కట్టడములో దానిని మేము ఎలా తీయగలమని కొద్దిగా ఆశ్చర్యపడ్డాము. కూర్చుండు సీటు గురించి ఓ, నాకేమీ తెలియదు, అది చక్కగా కూర్చొనుటకు సౌకర్యముగల, ఒక మంచి పాఠశాల, కాని ఇంకా ఏది నిర్ణయము కాలేదు. వారు వచ్చేవారము మనకిచ్చెదరు. కాని వచ్చే వారము… చూడండి, ప్రపంచములోని వివిధ ప్రాంతముల నుండి; జమైకా, మరియు దీవిల నుండి, మరియు దక్షిణ అమెరికా, దక్షిణ ఆఫ్రికా నుండి కూడా, మరియు కెనడా మరియు మెక్సికో, మరియు దేశముల నలుమూలల నుండి ప్రతినిధులు వచ్చెదరు. మేము సోమవారము పత్రికలు పంపాము. బుధ వారము లేక గురువారము వారికి అందును. వారికి స్కూలు ఉండును. వచ్చే వారములు పాఠశాల సమయము వరకు అది ఒక రాత్రికి దానిని మీరు తీసుకొనిన మరియు ఒకవేళ ఒక రాత్రి లేదా రెండు రాత్రులుగానో, మరల తర్వాతనే, అప్పుడు… మనము ఊరకే అది చేయలేము; మీకు అది వీలుపడదు.

7నేను హృదయపూర్వకముగా ప్రార్థించునప్పుడు, ఎందుకో నేను ఆశ్చర్యపడ్డాను. అటు తర్వాత పిల్లలను పాఠశాలలో చేర్చుట నిమిత్తము అరిజోనాకి మరల వెనుదిరిగి వెళ్ళుటకు ఇది సమయమైయున్నందున, మరియు తర్వాత మేము… నేను నా భార్యతో మాట్లాడుచున్నాను మరియు…

నిన్న నేను గదిలోనికి వెళ్ళి ఇట్లు చెప్పాను, "ప్రభువా, నేను ఎక్కువ మాటలు ఉపయోగించకపోవచ్చును, కాని దయచేసి అర్థము చేసికొనుము. దేవా, నా హృదయ భావమును గ్రహించుము. ఆ బూరల గూర్చి బోధించకుండా ఈ అవాంతరములు ఎందుకు వచ్చుచున్నవి?" అప్పుడాయన వచ్చి మరియు దానిని ప్రత్యక్ష్యపరచెను.

మరిప్పుడు, ఎందుకు అను కారణము మీద ఈ ఉదయకాలమున నేను మాట్లాడగోరుచున్నాను.

మరియు ఇప్పుడు, మనము, పరిశుద్ద గ్రంథము మరియు ఎవరి దగ్గర వున్నవో - పరిశుద్ద గ్రంథములను త్రిప్పండి - మనము మొదటగా లేవీయ కాండము, 23వ అధ్యాయము, లేవీయ కాండమును త్రిప్పెదము.

ప్రభుని చిత్తమైతే, ఈ రాత్రి నేను "శిబిరము వెలుపలకు వెళ్ళుట" అను అంశము మీద బోధించెదను, అది క్లుప్తముగా ఉండును, అప్పుడు మీరు మీ పనులకు వెళ్ళవచ్చును.

8పట్టణము వెలుపల నుండి వచ్చిన సందర్శకులను చూచి సంతోషించుచున్నాము. ఇక్కడెంతమంది బయటి జనులున్నారు. మేము చూచుచున్నప్పుడు? తొంభై-ఐదు శాతము, అవును, తొంభై-ఎనిమిది శాతం మంది జనులున్నారు. కాబట్టి మీరు చూడండి, వారు జెఫర్సన్-విల్ వారు కారు, జెఫర్సన్విల్ లోనికి వచ్చియున్నారు. ప్రభుని కృపచేత మనమిక్కడ ఉన్నాము.

మరియు ఇప్పుడు ఈ ఉదయమున మూడు చోట్లనుండి నేను చదువగోరుచున్నాను. ఒక భాగము లేవీయకాండము 23వ అధ్యాయము నుండి మరొకటి యెషయా 18 మరియు యెషయా 17 నుండి చదువుదము. (వ్రాసుకోదలచిన వారు దానిని వ్రాసుకోవచ్చును.)

మరియు ఇప్పుడు, ప్రసంగించుటకు బదులుగా, ప్రభువుని చిత్తమైతే, ఈ రాత్రి నేను దానిని చేసెదను; కాని, ఈ ఉదయమున నేను, "ఏడు బూరల పండుగ" ను గూర్చి బోధించగోరుచున్నాను. ఈ నెలలోనే ఏడు బూరల పండుగ, ప్రారంభపు మరియు ఏడవ నెలలో, అది లేవీయుల ధర్మశాస్త్రము ప్రకారము బూరల పండుగ జూలై 15న ప్రారంభపు దినముగా యున్నది.

9ఇప్పుడు, మీ యొద్ద పేపరు మరియు పెన్ వున్నట్లయితే, లేఖన భాగములను, ముఖ్యాంశములను మరియు మొదలగునవి వ్రాసుకొనవచ్చును, మనము అలా ముందుకు సాగిపోవుచుండగా… ఈ ఆరాధనలో ఇక్కడ ఒక కార్యమున్నది, ఉష్ణముగా వున్నది, మరియు మనము సంవత్సరముల తరబడి దీనికి అలవాటు పడిపోయాము. కాని ఎవరో ఒకరు దానిని తలంచుచున్నారని నేను నమ్ముచున్నాను, మనము ఈ కట్టడములోనికి ప్రవేశించినప్పుడు మనము దీనిని వదలి వెళ్ళు సమయము ఆసన్నమై కొంచెం - కొంచెంగా నిత్యత్వములోనికి వెళ్ళుచున్నామని తలంచుచున్నాను - ఎంత కాలమని నేను ఈ ప్రజలను ఈ విధముగా ఉంచగలను. ఇది ఈ విధముగా ఉంటుందని నేను అనుకోవటము లేదు, కాని మనము యేసుక్రీస్తు యొక్క రాకడకు అతి సమీపములో ఉన్నామని నేను నమ్ముచున్నాను; ప్రతీ నిమిషము ప్రజలు కూడి వచ్చినప్పుడెల్లా, నేను ఈ ప్రయోజనమునే తీసుకొనుచున్నాను.

నేను రహదారిపై కారు నడుపుకుంటూ వస్తున్నప్పుడు, నేను ఆలోచిస్తూ వచ్చాను. (వేదిక ఎక్కుటకు ముందు చిన్న ప్రార్ధనకై బయటకు వెళ్ళాను, ఏ యదార్ధ బోధకుడైనా ఆలాగు చేయును), నేను ఇలా ఆలోచించుచున్నాను, "ఇక్కడ మనము కూడుకొను సమయము చాలా మహిమకరమగు సమయమని నీకు తెలియును రాష్ట్రముల నుండి జనులు ఇక్కడకు వచ్చి ఇక్కడ కూర్చొనిరి. వందలాది - వందలాది మైళ్ళ దూరము నుండి వచ్చిరి. వాక్యముతో సహవాసము చేయుటకు ఇక్కడ మేము చేరియన్నాము, కాని "ఇది ఒక జ్ఞాపకముగానే మిగిలిపోవు కాలము త్వరలోనే వచ్చును. అది సత్యము. ఈ సమయము మనయొద్ద నుండి జరిగిపోవును. కాబట్టి మనకు తెలిసిన సమస్తమును తప్పకుండా చేయవలెను. ప్రతి నిమిషమును లెక్కించవలెను. ఇప్పుడు దీనిని గురించి ఆలోచించుచు, ఈ ఉదయమున ఎండ వేడిలో మనము బాధపడుచున్నాము. మరియు మీకు తెలుసు, ప్రతి మానవ శరీరము వేడిని తనలోనే కలిగి యున్నది. మరియు అది మనకు చాలా కష్టమును (ఇబ్బందిని) కలిగించుచున్నది. మరియు నేను… కాని మీరు వాక్యమును గ్రహించవలెనని నేను కోరుచున్నాను. ఇప్పుడు, మనము దీనిని చదువు ముందు, ప్రార్థించుదము.

LUKE 24:32

 

10ప్రభువా, ఇక్కడ కూర్చొనియున్న తమ చేతులను కదిలించగల ఏ వ్యక్తి అయినా గాని ఈ బైబిలులోని పేజీలను త్రిప్పగలడు. కాని దానిని తెరువగల ఒకాయన ఈ ఉదయమున మా మధ్యన ఉన్నాడు, అది గొప్ప పరిశుద్దాత్మగా మా మధ్య ఉన్నది. ఎమ్మాయి మార్గములో నీ శిష్యులు వెళ్ళుచుండగా, మరియు లేఖనములను వారికి నీవు వివరించిన ప్రకారముగా, మేము ఈ వాక్యములను చదువుచుండగా, పభువా, మాకు ఈ వాక్యమును తెరచి చూపుము. ఎమ్మాయి నుండి యెరుషలేమునకు వచ్చిన వారి వలెనే మేమును ఈ స్థలమును వదిలి వెళ్ళునప్పుడు ఈలాగు చెప్పెదము గాక, "ఆ మార్గములో ఆయన మనతో మాట్లాడుచుండినప్పుడు మన హృదయములు మండుచుండలేదా?" దీనిని యేసు నామమున మేము అడుగుచున్నాము. ఆమేన్

వాక్యము పట్ల మర్యాద చూపుచూ నిలబడుదము.

LEV 23:23,24•

ISA 18:1-3•

ISA 27:12,13

 

11ఇప్పుడు, ఈ ఉదయము నా అంశము "బూరల పండుగ" ఇప్పుడు లేవీయ కాండము 23వ అధ్యాయము 23వ వచనము చదువుదము.

మరియు యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను.

నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనుము - ఏడవ నెలలో మొదటి దినము మీకు విశ్రాంతి దినము. అందులో జ్ఞాపకార్థ శృంగధ్వని వినినప్పుడు మీరు పరిశుద్ద సంఘముగా కూడవలెను.

ఇప్పుడు యెషయా గ్రంథము 18వ అధ్యాయము 1వ వచనము నుండి చదువుదము (దానికిది జత అగును):

ఓహో కూషు నదుల అవతల తటతట కొట్టుకొనుచున్న రెక్కలుగల

అది సముద్ర మార్గముగా జలముల మీద జమ్ము పడవలలో రాయబారులను పంపుచున్నది - వేగిరపడు దూతలారా, ఎత్తయిన వారును నునుపైన చర్మముగల వారునగు జనమునొద్దకు, దూరములోనున్న భీకరజనము నొద్దకు పోవుడి. నదులు పారుచున్న దేశముగలవారును దౌష్టికులై జనములను త్రోక్కుచుండు గలవారునగు జనము నొద్దకు పోవుడి.

పర్వతముల మీద ఒకడు ధ్వజమెత్తునప్పుడు లోక నివాసులైన మీరు భూమిమీద కాపురముండు మీరు చూడుడి. బాకా ఊదునప్పుడు ద్వజమెత్తుడి.

యెషయా 27:12,13.

ఆ దినమున యూఫ్రటీసు నదీప్రవాహము మొదలుకొని ఐగుప్తు నదివరకు యెహోవా తన ధాన్యమును త్రోక్కును. ఇశ్రాయేలీయులారా, మీరు ఒకరినొకరు కలిసికొని కూర్చబడుదురు.

ఆ దినమున పెద్ద బూర ఊదబడును. అశూరు దేశములో నశింప సిద్దమైనవారును ఐగుప్తు దేశములో వెలివేయబడినవారును, వచ్చెదరు, యెరూషలేములోనున్న పరిశుద్ద పర్వతమున యెహోవాకు నమస్కారము చేయుదురు.

12మనము మరల ప్రార్ధి౦చుదము.

ప్రభువా, ఈ మాటలు మా హృదయమునకు దీవెనగా ఉండుగాక. మా ఆలోచనలు మరియు మా ధ్యానములు నీకు అంగీకారముగా నుండును గాక! యేసు నామములో అడుగుచున్నాము. ఆమేన్. మీరు కూర్చొనవచ్చును.

13ఒక సంఘకాపరి తాను ప్రేమించుచున్న సంఘమునకు, వివిధ స్థలములలో నుండి వచ్చిన వివిధ జనులకు చాలా సంగతులను చెప్పగోరును, కానీ సమయమును బట్టి అన్నిటిని చెప్పలేరు.

ఇప్పుడు, ఈ అంశమును మనము సమీపించుచుండగా, మీరు స్వేచ్చగా ఉండవలెనని మేము కోరుచున్నాము. మీలో చాలామంది నిలబడియుండుట నేను వస్తూ చూచాను, హాలు నిండిపోయినది. తలుపుల బయట, ముందు భవనము చుట్టూ, గోడల చుట్టూ జనులు నిలబడియున్నారు. కావున, ఇప్పుడు మీరు ఒకరికొకరు స్థలములు మార్చుకొన్నచో బాగుండును.

14ఇప్పుడు, బూరల పండుగ. ఇప్పుడు, ఇది ఇశ్రాయేలీయులు కూడుకొను ఒక సమయము, వారందరు ఎక్కడ కూడుకొందురో అదే బూరలపండుగ. ఇప్పుడు, ముందుగా తెలుసుకొనుటకై ప్రకటన గ్రంథములోనున్న ఏడు బూరలు అనే అంశంపై నేను కొంచెం సేపు మాట్లాడాలనుకుంటున్నాను. మరియు ఇప్పుడు, నేను ఈ సమయములో దానిని ఎందుకు మాట్లాడలేదనే నిజమైన కారణమునకు గల పూర్వాపరములను ఒక్క క్షణము మనము వెలికితీయుదము; ఎందుకనగా ఈ కార్యములను గురించి ఈ సమయములో మాట్లాడవద్దని పరిశుద్దాత్మ నాతో చెప్పెను. గొప్ప విద్యావంతులకు, మరియు మేధావులకు ఇది పిల్లతనపు చేష్టలుగా అనిపించునని నాకు తెలుసు, కాని క్రైస్తవులకు అది వ్యత్యాసమైనది. మనము ఆత్మ నడిపింపును మాత్రమే వెంబడించెదము, అది మాత్రమే.

15ఇప్పుడు, ఏడు సంఘకాలముల గూర్చి నేను బోధించుచుండగా గమనించాను, సంఘములకు, సంఘకాలముల ద్వారా దేవుడు చేయబోవు దానిని ముందే మాదిరిగా చూపించెను. వాటిని చక్కగా స్థానములో ఉంచెను. ప్రకటన గ్రంథములోని మొదటి మూడు అధ్యాయములు సంఘములకు జరుగు సంఘటనలను బయలు పరచును. తరువాత 3వ అధ్యాయము నుండి 19వ అధ్యాయమువరకు సంఘము యొక్క ఛాయ కనబడదు. ప్రకటన 4వ అధ్యాయములో సంఘము పైకి వెళ్ళిపోయెను (ఎత్తబడును). ప్రకటన 19వ అధ్యాయములో వధువు, పెండ్లికుమారుడు కలిసి భువికి తిరిగి వచ్చెదరు. 19వ అధ్యాయము నుండి 22వ అధ్యాయమువరకు వెయ్యేండ్లపాలన గూర్చి, ఆ తరువాత జరుగు దానిని గూర్చి చెప్పబడినది. 4వ అధ్యాయము నుండి 19వ అధ్యాయమువరకు దేవుడు ఇశ్రాయేలుతో మాట్లాడుచున్నాడు.

16ప్రకటన గ్రంథములోని సంఘమును గూర్చిన అంశము మనము ముగించినప్పుడు అందులోనున్న మర్మములన్నింటనీ పరిశుద్దాత్మ బయలుపరచి ఆ మర్మములను మనకు విప్పెను. చరిత్ర ద్వారా ఆయన తన సంఘమును ఎట్లు తెచ్చెనో చూపెను. (దేవుడు ఆ ఏడు సంఘకాల సంఘములకు ఏమి చేసెననే దానిని, అచ్చట ప్రారంభదశలో వున్న లేదా ఆసియా మైనరులో వారికి ఛాయగా చూపించెను). మీ యొద్ద ఏడు సంఘకాలముల టేపు లేనియెడల, సంపాదించుకొని వినుట మంచిది. త్వరలోనే అది గ్రంథ-రూపములో వచ్చును.

దానితో దానిని విడిచిపెట్టి, కొద్దిసేపు తర్వాత ముద్రలపై ప్రసంగించుదామని అనుకున్నాను. ముద్రలలో వున్నవి ఏమిటని నాకు అప్పుడు తెలియదు. ఇతర సేవకులవలె నేను కూడా ఇతరులు చెప్పిన దానిని చదివి, వాటిని అలాగే నమ్మి, నా సొంత అభిప్రాయములను వాటిపై కలిగియుంటిని. శ్రీ. స్మిత్, ఉరియా స్మిత్ వ్రాసిన పుస్తకమును నేను చదివాను; ఆయన అడ్వెంటిస్ట్ ఉపాధ్యాయుడు, మరియు ముద్రలను గురించిన ఆయన యొక్క అభిప్రాయములను నేను చదివితిని. మరియు శ్రీ. లార్కిన్ వ్రాసిన పుస్తకమును కూడా నేను చదివితిని; అనేక రకముల పుస్తకములను, వారు వ్రాసిన వ్యాఖ్యానములను నేను చదివితిని; కాని కొన్ని స్థలములలో నా అభిప్రాయము వేరేలాగా కలిగినది. కాని ఒకసారి ప్రయత్నిస్తూ మూడు అంశములపై ప్రసంగించాను, మొదటిది లేదా నాలుగు అంశములు గుర్రములపై సవారి చేయువారి గురించి, నేను దానిని గురించి నాలుగు రాత్రులు ప్రసంగించితిని. ఒకదాని తర్వాత మరొకటి మరియు మరొకటి…

17కాని తర్వాత కొంచెం ముందుగా ఇది సంభవించినది. నాకొక దర్శనమివ్వబడినది. (అది ఏ టేపులో కలదని మీరందరును ఎరుగుదురు, "అయ్యలారా, ఇది ఏ సమయము?" నేను అరిజోనాలోని టుసాన్ కు వెళ్ళవలెనని చెప్పాను. ఎడారి వెనుకవైపునకు వెళ్ళమనెను. ఆ కొండ మీద కొందరు సోదరులతో నేను ఉన్నాను), గొప్ప ప్రేలుడు సంభవించునని చెప్పాను. మరియు నేను ఏడు దూతలు దిగి వచ్చుట చూచాను. నేను, నాయంతట తలంచుచున్నాను, నా జీవితము సమాప్తమవునని అనుకున్నాను. అవతల దరిని మేము మరల కలిసికొను వరకు పిల్లల గూర్చి ఏమి చేయాలో, బిల్లీ గూర్చి ఏమి చేయాలో మొదలగు కార్యములన్నింటిని గూర్చి నేను నా భార్యతో చెప్పాను.

18అయితే ఒకసారి సాబినో కాన్యనులో వేకువనే దేవుడు నన్ను అక్కడకు పిలచెను. నేను గాలిలోనికి చెతులెత్తి ప్రార్థించుచుండగా నా చేతులలోనికి ఖడ్గము వచ్చినది. అది మీరెరుగుదురు. నేను అక్కడ నిలబడి మరియు దానివైపు చూచాను. ఇప్పుడున్నట్టే నా చేయి సహజముగా నున్నది. దాని భావము నాకు తెలియదు. ఎడమవైపు నుండి నాతో ఒక స్వరము ఇట్లని పలికెను, "ఇది రాజు ఖడ్గము." అటు తర్వాత ప్రభుని దూత ఆ తరువాత దానిని నాకు బయలుపరచెను, ఆ చేతిలోనిది వాక్యమని చెప్పెను.

వెంటనే దాని తరువాత ప్రభుని దూతలు ప్రత్యక్షమై ఏడు బూరలను గురించి లేదా ఏడు ముద్రలను గూర్చి చెప్పెను. మరియు నేను ఇక్కడకు జెఫర్సన్విల్ కు తిరిగి వచ్చి మరియు ఏడు ముద్రలను గురించి ప్రసంగించితిని. మరియు అప్పుడు నేను ఎన్నడును దీనిని ఇంతటి ప్రేరేపణతో చెప్పలేదు, అది ఆ విధముగా యుండెను, ఎప్పుడైతే ప్రభువు దూత మమ్మల్ని సంధించినదో… పరిశుద్ద గ్రంథము ఒక నూతన పరిశుద్ద గ్రంథముగా అయినది. సంఘ సంస్కర్తలు, ఇంకా తదితరులు విడిచిపెట్టిన సంగతులనన్నింటిని అక్కడ బయలుపరచెను. అది యేసుక్రీస్తు యొక్క సంపూర్ణ ప్రత్యక్ష్యత, మనకు పూర్తిగా క్రొత్తది, కాని సంపూర్ణముగా, వాక్యముతో చక్కగా సరిపోయినది. అది ఎప్పుడూ ఉండిన వాక్యమే. నేనెంతో ఆత్మావేశముతో నడిపించబడితిని.

19ఏడు బూరలనే ఈ భాగము యొద్దకు నేను వచ్చునప్పుడు, "మంచిది, నేను దీనిని గురించి ప్రయత్నించను, ఆ సమయము ఆసన్నమగువరకు నేను వేచియుండి మరియు ఆయన నాకు దానిని ప్రత్యక్ష్యపరచను," అని నేను తలంచితిని. అటు తర్వాత నిన్న నేను నా గదిలోనికి వెళ్ళినప్పుడు మరియు ఎంతో ఆశ్చర్యముతో (క్షమించండి, దానిని అర్థం చేసుకొనుటకు ప్రయత్నించుటకై నేను మొన్న దినమున నా గదిలోనికి వెళ్ళితిని), దానివలన మన సంఘమునకు ఏ విధమైన ఉపయోగము ఈ సమయమున లేదని పరిశుద్దాత్మ నాకు దానిని తెరచి చూపించెను, ఎందుకనగా వాటన్నింటితో సంఘమునకు చేయవలసిన ఎట్టి కార్యము లేదు.

20ఇప్పుడు, క్రీస్తు యొక్క దాచబడిన మర్మములన్నియూ ఏడు సంఘ కాలములలో పూర్తిగా బయలుపరచబడినవి. కాలములను మరియు వాటిని పెట్టబడిన స్థానమును మొట్టమొదటగా ఏడు సంఘ కాలములలో తెరచి చూపించబడినవి, అని ఏ విధముగా వాటి స్థానములో అమర్చబడినవని చరిత్ర మరియు పరిశుద్ద గ్రంథము రెండునూ విశదపరచినవి. మొట్టమొదటి సంఘకాలము, ఒక గొప్ప సంఘకాలమైన ఎఫెసు నుండి… అన్ని సంఘకాలముల కంటే బహుగా చెడిపోయిన (నశించిపోయిన) లవొదికయ సంఘకాలములో మనమున్నట్లు కనుగొంటిమి.

మరియు ఇప్పుడు కూడ పరిశుద్దాత్మ ఏ విధముగా నాకొక దర్శనమును ఇచ్చి, మరియు ఏమి చేసినదో చూచితిమి, రెండు సంవత్సరముల క్రితము నల్లని పలక మీద గీచాను (ఇక్కడ దానిని గీచాను) అది ఏ విధముగా ఆ వెలుగు భూమిపై సన్నగిల్లుచున్నదో, సువార్త అనే వెలుగు భూమి మీదికి ఏ విధముగా వచ్చుచున్నదో, ఖచ్చితముగా అది అట్లే యున్నది; మరియు అది ఎట్లు సన్నగిల్లిపోయినదో చూచితిమి. దాని అర్థమేమిటో, మరియు అది ఎట్లు౦డునో ఆ సమయమున దానిని తెలిసికొనలేకపోతిమి. కాని గొప్ప ప్రపంచ సంఘ సమితి ఒక కూటము (కూడిక)లో రోమ్ తో సంబంధమును ఏర్పరచుకున్నది. మరియు రోమ్, అది సంస్థలన్నింటికిని తల్లి… చరిత్రలోనే మొట్ట మొదటిసారిగా పోప్ వాటికన్ నుండి యెరూషలేము మరియు అనేక స్థలములకు పర్యటించెను. ఇప్పుడు, మన మతములన్నింటికి పురాతన పుట్టినిల్లు యెరూషలేము. పోపుకు పురాతన చోటు రోమ్. అన్ని సమయములలోను సంఘమునకు మహా శత్రువు అదియే. దర్శించుటకు రోమ్ ను విడిచి — లేదా రోమ్ నుండి పాలస్తీనా, యెరూషలేములను సందర్శించెను.

21మరియు మనము చూచునట్లుగా, విద్యాభ్యాసములేని నాకు, ఆ మాటలను ఎలా వారికి చెప్పవలెనో తెలియుట లేదు; ప్రకృతిలోనున్న మాదిరులను, ఉదాహరణలను చూచి ఎప్పుడూ నేను నేర్చుకొనుచుందును. ప్రకృతి మరల ప్రకృతినే వె౦బడి౦చును; ప్రకృతి దేవునికి చెందును.

మీరు ఒక సహాయము తీసుకున్నప్పుడు, పొలములో సమూహముగా పశువులన్నియు పొలము యొక్క మూలలో కూడుకొనును. చేపను నీటి నుండి బయటికి తీయండి; (గాలముద్వారా) చేప మిమ్ములను కరువదు గాని మీరు నీటిలోనున్న చేపను పట్టుకోలేరు, చూచారా. పశువులు విశ్రాంతి తీసుకొనును. (మీరు గాలమును చేపలు విశ్రాంతి తీసుకొను చెరువు అనే మంచము యొక్క లోతువరకు దానిని వీస్తేనే తప్ప). అయితే పశువులు మేయుచున్నప్పుడు, మీరు గమనించండి! పశువులు మేయుచున్న సమయములోనే పక్షులు చెట్టు మీదకు ఎగురును; అవి ఆహారము తినవు, చూచారా. అది ప్రకృతి; అంత చక్కగా సరిపోవును. తేనెను సమకూర్చుకోకుండా తేనెటీగలు ఇటు అటు ముసురు కొనుట మీరు చూచారా? ప్రకృతి చక్కగా కలిసి పని చేయును.

22అటు తర్వాత, చెట్లు ఆకులు రాల్చుట మనము చూతుము, ఇప్పుడు రెండు నెలల్లోనే చెట్టు ఆకులు తప్పకుండా రాలిపోవును, ఆకు చెట్టు నుండి పడిపోవును. నీరును మరియు దానికి జీవాధారమగు రసము వేరులోనికి వెళ్ళి దాగును. చెట్టు నుండి రాలిన ఆకు నేల మీద పడి క్రుళ్ళిపోవును. ఆకులోనున్న పొటాషియం, కాల్లియం నేలలో కలిసిపోవును, ఆ తరువాత ఏమి జరుగును? జీవమునకు ఆధారమగు వేరులోని రసమును వెనుకకు తనంతట తానే పీల్చుకొని అది జీవముతో ముందుకు కొనసాగిపోవుచుండును, మరియు తిరిగి అది ఆకును తీసికొని వచ్చును. అదే మరణము, సమాధి, మరియు పునరుత్దానము.

23మరియు సమస్త ప్రకృతి… మరియు చంద్రుడు సూర్యునికి భార్య అగును; అది ఒక స్వల్ప కాంతి గలది, మరి అప్పుడు కూడా, సూర్యుడు అస్తమించినప్పుడు, సూర్యుడు లేనప్పుడు, చంద్రుడు భూమి పైకి కాంతిని ప్రసరించును; అది సంఘమునకు ఒక మాదిరిగా యున్నది. మరియు పోపు సంఘమునకు అనాది శత్రువు, రోమ్ ను వదలి మరియు యెరూషలేమునకు వచ్చెను, అది (యెరూషలేము) సంఘమునకు సింహాసనమై యున్నది (అది క్రొత్త యెరూషలేము మరియు పాత యెరూషలేముగా యున్నది), అది జరుగుటకు ముందుగా చంద్రుడు పూర్తిగా నల్లగా మారిపోవుటను మనము గుర్తించితిమి.

24మనము బోర్డ్ (నల్లని పలక)పై వున్న విధముగా, చంద్రుడు ఎట్లు వెలుగును కోల్పోయి చీకటిగా మారుటను దేశమంతట పేపర్లలలో చిత్రముగా వేయబడినవి. మరియు అది ఎంతో చక్కగా గోచరమైనది, చంద్రుడు ఆ మేఘములలో వుండిన విధముగానే రెండు సంవత్సరముల క్రితము పరిశుద్దాత్మ ఖచ్చితముగా నాతో దానిని గీయించినది, మరియు మూసిన దానిని చూపించుచున్నది! ఆరు చిత్రములను తర్వాత, అక్కడ ఏడవ దానిని నేను వుంచాను, ఎందుకనగా అది ఏడవ సంఘకాలము, అది కేవలము వెలుగుకు నీడగా నున్నది, యేసు తలుపును తట్టుట గూర్చి గీసితిని. కాని అది పూర్తిగా చీకటిలోనికి పోవును.

25మరియు ఎటువంటి ఒక ప్రతిబింబమైయున్నదో, ఎటువంటి ఒక వర్తమానమైయున్నదో అది దేవుని యొద్ద నుండియే వచ్చినది. ఈ సంగతులు సత్యములని అది రుజువు చేసెను. మొదటగా వాక్యములో దేవుడు దానిని రుజువు చేసెను, వేదికపై ఆత్మ ద్వారా దానిని నిరూపించెను, మరియు తరువాత ఆకాశములో దానిని వెల్లడి చేసెను.

ఆ సమస్త విషయంలో ఏమీ పొరబాటు లేదు. ఆ ముద్రలు మరియు కాలములు చక్కగా వరుసలోయున్నవి, ఖచ్చితముగా, దేవుడు తన సాక్ష్యము ద్వారా సహజాతీతమగు సూచనలను మరియు అద్భుతములను అనుగ్రహించి, అవి వాక్యముతోను మరియు చరిత్రతోను, సమస్తమును మనము ఇప్పుడు జీవించు ఈ కాలమునకు సరిపోవునట్లు అమర్చబడుచున్నవి.

ఇప్పుడు, దీనిని చూచుట సంఘములకు చాలా కష్టము. శాఖలు దీనిని చూచుట కష్టము. ప్రజలను విమర్శించుటే నీ ప్రయత్నమని వారు ఎల్లప్పుడును తలంచుటకు ప్రయత్నించుచున్నారు. నీవు అలా చేయుటలేదు; నీవు ఇది వారికి కీడు చేయుటకు ప్రయత్నించుట కాదు గానీ; ప్రజలను హెచ్చరించుటకు ప్రయత్నించుచున్నావు. వారిని కీడు నుండి తప్పించుటకు ప్రయత్నించుచున్నావు. సంస్థలోనున్న ప్రజలు చెడ్డవారు కారు, వారున్న పద్దతియే వారిని నాశనము చేయుచున్నది.

కాతలిక్కు, ప్రొటస్టెంటు, యూదులు వారెవరైనాగాని యధార్థపరులు, నిజాయితీ పరులు అందులో ఉన్నారు. ఎవరు…

26నన్స్ చెడ్డ స్త్రీలుగా నుండవలెనని కన్యా స్త్రీల మఠములోనికి చేరరు, మంచివారుగా ఉండాలనే స్త్రీలు అక్కడకు వెళ్ళుదురు. వారు తమ దేవునికి సన్నిహితంగా జీవించవలెనని ప్రయత్నించెదరు, కాని ఆ పద్దతి వారిని పాడు చేయుచున్నది. ప్రజలు చెడ్డవారిగా నుండవలెనని తలంచి సంఘములో చేరరు. మంచి వ్యక్తులుగా నుండవలెనని కోరుదురు. కాని వారి వ్యవస్థ వారిని వాక్యము నుండి దూరము చేయుచున్నది, దేవుడు ఈ దినమునకు నియమించిన సూత్రముల నుండి వేరు చేయుచున్నది; అందుకే వారు బయటకు వచ్చుచున్నారు.

AMOS 3:7•

REV 10:4,7

 

27ఇప్పుడు గుర్తుంచుకొనండి, దేవుడు వాక్యమైయున్నాడు. మరియు ప్రతి కాలమునకు ఆయన భూమిమీద వుండు ప్రతి కాలమునకు వాక్యమును నిర్ణయించెను. సంఘకాలములో ఆయన దానిని నిర్ణయించెను, మరియు దానిలోని ప్రతి ఒక్కొక్క దానిని ఏడు ముద్రలు బయలుపరచినవి, చూచారా.

అక్కడ ఎందుకు — ఇంకా అక్కడ దాచబడియున్న మర్మములున్నవా? ప్రకటన 10, చూడండి. ఏడవ దూత వర్తమానము సమాప్తమైన తర్వాత దాచబడిన మర్మములన్నియు బయలుపరచబడునని మనము కనుగొంటిమి; ప్రకటన 10:1 నుండి 7. గమనించండి, కారణమేమనగా అచ్చట ఏ ప్రవక్తలు ఈ కాలములో లేరు. మరియు పరిశుద్ద గ్రంథము చెప్పుచున్నది, దేవుడు తన దీర్ఘదర్శకులకు, తన దాసులకు, ప్రవక్తలకు బయలుపరచు వరకు ఆయన ఏమియు చేయడు. అన్ని యుగములలోను ప్రభుని వాక్యము ఒక శాఖ లేదా గుంపు యొద్దకు కాదు గాని, ప్రవక్తల యొద్దకే వచ్చును.

MAL 4:6

 

28దేవుడెన్నడూ ఒక గుంపును వాడుకొనడు. ప్రతీసారి ఏ గుంపైన ప్రజలు గాని సంస్థగా మారినప్పుడు, దేవుడు వారిని విడిచిపెట్టి మరియు ఇక ఎన్నడును వారియొద్దకు తిరిగిరాడు. అది నిజమో - కాదో చరిత్రలో అన్వేషించి చూడండి. దానిని ఎప్పుడో మనము చూచాము. ఒక గుంపు ప్రజలు వారు సంస్థగా మారిన తర్వాత ఆయన ఇక ఎన్నడును వారితో వ్యవహరించడు, అది దేవునికి విరుద్దమైనది.

కాబట్టి సంస్కరణ కాలములో సంస్కర్తలు ఎట్లు వచ్చిరో ఏడు ముద్రలు దానిని నిరూపించినది. కాని ఈ చివరి దినములలో ఇప్పుడు, అది మరల ప్రత్యక్ష్యపరచుచున్నది; ఎందుకనగా దీనిని మలాకీ 4లో మనము కనుగొందుము, అది అక్కడ ఒక అభిషేకముగా క్రిందకు దిగివచ్చి మరియు నిజమైన విశ్వాసమును మరల తీసుకొని వచ్చును. ఆది పెంతకోస్తు విశ్వాసమునొద్దకు జనులను మరల తీసుకొనివచ్చి విశ్వాసపు పితురుల తట్టుకు మరల్చును.

MAL 3:1•

MAL 4:5

 

29ఏలియా మొదటి దశను మనము చూచాము. అతనిని ఎలీషా వెంబడించుటను మనము తీసుకొన్నాము. ఆ తరువాత బాప్తిస్మమిచ్చు యోహానును చూచాము, ఆ దినమునకు ఎలీషా వంటివాడు, ఈ దినమున మరి యొకరు వచ్చెదరని వాగ్దానము చేయబడెను. ఇప్పుడు, బాప్తిస్మమిచ్చు యోహాను మలాకీ 4 లోని ఎలీషా కాదు. అతడు మలాకీ 3లోని ఎలీషా; యేసు ఇలాగు చెప్పెను: "మార్గమును సరాళము చేయుటకు నాకంటె ముందుగా ఒక దూతను పంపుదును." అతడే ఆ వ్యక్తి అని మనము కనుగొంటిమి.

ఇప్పుడు, ఎన్నో జరుగుచూ, వాటి స్థానములను కనుగొంటూ, దేవుని ద్వారా ప్రేరేపించబడి వ్రాయబడిన వాక్యములన్నియు మనము చివరి దినములో ఉన్నామని తెలియచేయుచున్నవి.

30ఇప్పుడు, నేను లవొదికయ సంఘకాలములో వుండి, పెంతెకోస్తు వర్తమానములో నేను వచ్చినయెడల, మరియు అది సరియైనదిగా యుండదు. అందుచేతనే వెస్లీ లూథర్ యొక్క వర్తమానమును తీసుకోలేదు. లూథర్ ఒక కాలములో - సంఘకాలములో, మరియు వెస్లే వేరే సంఘకాలములో యుండెను. యేసుక్రీస్తు మోషే వర్తమానముతో వచ్చినయెడల, అది క్రియ జరిగించియుండెడిది కాదు. అట్లే మోషే నోవాహు యొక్క వర్తమానముతో వచ్చి యుండిన యెడల అదియును పనిచేసియుండెడిది కాదు.

కాని దేవుడు ప్రతి కాలమునకు ఆయన యొక్క ప్రజలకు వాక్యమును కేటాయించెను; ఆ కాలను ఇంకా ఉనికిలోనికి రాకముందే సంఘములు చాలా కలగలుపు అయిపోయినవి, వారెక్కడున్నారో వారికే తెలియదు.

MATT 23:29•

JOHN 10:35

 

31ఆ కారణముచేతనే వారు యేసు దేవుని కుమారుడని గుర్తించుటలో విఫలమైరి. వారి ఆచారములు వారిని అంధులుగా మార్చెను, కాని అతడు అక్షరాలా వాక్యమునకు సరిపోయెను.

ప్రవక్తలును అలాగే యుండిరి. "మీయొద్దకు పంపబడిన ప్రవక్తలను మీరు రాళ్ళతో కొట్టి చంపిరి" అని యేసు చెప్పెను.

దేవుడు తన ప్రవక్తను పంపెను - మరియు ప్రవక్త అనేవాడు దేవుని యొక్క జీవవాక్యమును ప్రత్యక్ష్యపరచువాడు.

"నేను దేవుని కుమారుడనని చెప్పినందుకు నన్నెందుకు మీరు ఖండించుచున్నారు? దేవుని వాక్యము ఎవరియొద్దకు వచ్చునో వారే దైవములని వ్రాయబడలేదా? (వారే ప్రవక్తలు); వాక్యము నిరర్ధకము కానేరదు. మీరెట్లు నన్ను ఖండించుచున్నారు? అని యేసు ప్రశ్నించెను. వారు అక్కడ ఉన్నప్పుడు వారు ప్రమాణములో ఒక భాగమే, వారు దేవుని వాక్యములో భాగమైయున్నారు, కాని యేసు దేవుని వాక్యము యొక్క సంపూర్ణత, ఆయన పూర్తిగా విమోచన యొక్క ఉపాయమైయున్నాడు. ఆయన దేవుని యొక్క పరిపూర్ణమై (చాలినంతై) యున్నాడు.

MAL 3:6

 

32సంఘకాలములలో వారు ఆ విధంగానే చేసిరి; ఆ కాలములో విడిచిపెట్టబడియున్న మర్మములన్నియు ఏడు ముద్రలలో బయలుపరచబడినవి, ఎందుకనగా మనము ప్రవక్తలు లేక ఉన్నాము. వాక్యము ప్రవక్తల యొద్దకు వచ్చును గాని సంస్కర్తల యొద్దకు రాదు.

దేవుడు మారనివాడు. ములాకీ 3లో ఉన్నది, "నేను దేవుడను మరియు మార్పులేనివాడను." ఒక కార్యమును దేవుడు మొదటిసారి ఏ విధముగా చేయునో, ఆ విధానమే ఆయన ఎన్నడును అనుసరించే విధానముగా యుండును. ఏదెను తోటలో నిర్దోషమగు రక్తమును చిందించి మానవుని రక్షించుటకు దేవుడు నిశ్చయించుకొనెను. అప్పటి నుండి ఆయన ఆ విధానమును మార్చలేదు, మరియు దానిని మార్చలేడు. మనము విద్య ద్వారా, భవనముల ద్వారా, పద్దతుల ద్వారా, శాఖల ద్వారా, నీతిబోధల ద్వారా ఏదో చేయవలెనని ప్రయత్నించుచున్నాము, మరియు అవన్నియును విఫలమైపోయెను. ఒకే ఒక చోట దేవుడు మనిషిని సంధించగలుగుచున్నాడు. అదే నిర్దోషమగు చిందించిన రక్తము క్రింద, రక్తము ద్వారా మాత్రమే. అది ఆయన మొదటి నిర్ణయము. చూచారా?

మనము ఒక తీర్మానమును చేయుదుము, మరుసటి సంవత్సరము ఇంకా చక్కగా ఆలోచించుదుము. మరల వచ్చే ఏడు ఇంకా మంచి ఆలోచన వచ్చును. దేవుడు అలాగు చేయలేడు; ఆయన అనంతుడు; ఆయన మొదటి తీర్మానమే పరిపూర్ణము, దానిని ఏదియూ కదిలించజాలదు. నేను ఇంకా ఎక్కువగా నేర్చు కొందును; ఎందుకనగా నేను అసంపూర్ణుడను. నేను ఎక్కువగా నేర్చుకొందును, మీరు ఎక్కువగా నేర్చుకొందురు; కాని దేవుడు మరేమీ నేర్చుకోనవసరము లేదు. ఆయన ముందే పరిపూర్ణుడు. కాబట్టి, ఆయన మొదటి తీర్మానము మీద నీ ఆత్మను ఆధారము చేసికొనుము. బైబిలు చెప్పుచున్నది, అదే.

33ఏదో ఒక రోజున దేవుడు లోకమునకు తీర్పు తీర్చవలెను, కాతలిక్కు సంఘము ద్వారా ఆయన దానిని తీర్పు తీర్చునని ఒక కాతలిక్కు వ్యక్తి చెప్పుచున్నాడు. అది అట్లయినయెడల, ఏ కాతలిక్కు సంఘము ద్వారా తీర్పు తీర్చును? వారు ఒకరికొకరు బేధముగా వున్నారు, ఆయన ప్రొటస్టెంటు ద్వారా న్యాయమును తీర్చుననినయెడల, ఏ ప్రొటస్టెంటు సంఘము ద్వారా తీర్పు తీర్చును? వారు ఒకరికొకరు బేధముగానే యున్నారు. మరియు అది ఒక గందరగోళముగా యున్నది; ఎక్కడ నిలబడవలెనో ఎవరికి తెలియదు. మెతడిస్టు సరియైనచో, బాప్టిస్టులు నశించెదరు. ప్రొటస్టెంటులు సరియైనచో, కాతలిక్కులు నశించెదరు. కాతలిక్కులు సరియైనచో, ప్రొటస్టెంటులు నశించెదరు.

దేవుడు యేసుక్రీస్తు ద్వారా లోకమునకు తీర్పు తీర్చునని బైబిలు చెప్పుచున్నది. ఆయనే వాక్యము గనుక వాక్యము ద్వారా లోకమునకు తీర్పు తీర్చును.

మరియు సమస్త సంఘ సంస్థలు వాక్యమును విడిచిపెట్టి దూరముగా తొలగిపోయి వారి సొంత సిద్దాంతములను ఏర్పరచుకొనిరి. వారు ఎక్కడైనా పరిపూర్ణమైన వాక్యమును అనుసరించుచున్నట్లుగా ఎవరైనా నిరూపించవచ్చని నేను అడుగుచున్నాను. వారు దానిని చేయలేరు, ఎందుకనగా అది మనిషి ద్వారా ఏర్పరచబడిన ఒక పద్దతికి కట్టబడుచున్నది. మనిషి ఎక్కడ వున్నాడో… దేవుడు ఒకే సమయమున ఒక మనిషి ద్వారా మాట్లాడును. ఒకే సమయమున అయన ఎన్నడును ఇద్దరు ప్రవక్తలను కలిగియుండడు - ఒక్కరు మాత్రమే! దేవుడు ఒక మనిషిని తన హస్తములో కలిగియుండును. అతడు ఏ సంఘ శాఖలతో సంబంధము కలిగియుండడు, మీతోనే అతడు మాట్లాడును.

34ఇప్పుడు దీనిని ఆ ధారము చేసికొని బూరల పండగ యొద్దకు వచ్చుదము, ఇవి దాగియున్న మర్మములు. ఆ విధముగా అది యుండునని ముందే ప్రవచించబడెను; కాబట్టి, ఆ విధముగానే అది బయలుపరచబడవలెను. ఈ చివరి దినములలో అని బయలుపడునని, నేను మీకు కొద్దిగా ముందు చెప్పినట్లుగా, మలాకీ 4వ అధ్యాయము, లూకా 17వ అధ్యాయము, 30వ వచనము, హెబ్రి 13:8, హెబ్రి 4:12, ఇంకా చాలా ప్రవచనములు ఈ చివరి కాలమునకు చెందినవి. అవి అక్షరాలా నెరవేరును. (ఆయన ఆ విధంగానే చేయును)

ఇప్పుడు, ఇది మీలోని కొంతమందికి వింతగా కనబడవచ్చును, దానిని చెప్పుటకు నేను ఇష్టపడుచున్నాను, అదేమనగా, దేవుడు ప్రవక్త వలె ఉండి జనుల మధ్య తెలియపరచబడుచున్నాడు. యూదులు ఎప్పుడూ వారి ప్రవక్తలను నమ్మెదరు. "మీ మధ్య అట్టి వాడున్నచో, నేను, ప్రభువును, ఆత్మ సంబంధమగు కలలు మరియు దర్శనముల ద్వారా అతనితో నేను మాట్లాడుదును. అతడు చెప్పినది జరిగినయెడల అతని మాట వినుడి." వారు ఎల్లప్పుడును… వారు యేసును అందువల్లనే గుర్తించలేకపోయిరి మరియు వారాయనను మరేదో అనిరి. కావున వారాయనను దురాత్మ, బయల్జేబూ అనిరి, ఎందుకనగా వారి హృదయములోనున్న ఆలోచనలను ఆయన చెప్పగలిగెను. అది వాక్యము యొక్క గురుతు అని మనము ఎప్పుడూ తెలిసికొనవలెను.

JOHN 16:13•

HEB 1:1,2•

HEB 4:12

 

35దేవుని వాక్యము ఎటువంటి రెండంచులు గల ఖడ్గము కంటెను వాడిగలదై హృదయాలోచనలను, ఉద్దేశ్యములను బయటకు తెచ్చునని హెబ్రీ 4వ అధ్యాయము 12వ వచనము చెప్పుచున్నది.

"పరిశుద్దాత్మ మీ మీదికి వచ్చినప్పుడు నేను చెప్పిన ఈ సంగతులను మీకు జ్ఞాపకము చేయును. రాబోవు సంగతులను చూపించును."

"దేవుడు నానా సమయములలోను నానా విధములుగా (హెబ్రి 1) ప్రవక్తల ద్వారా పితరులతో మాట్లాడెను, ఈ అంత్యదినమందు తన కుమారుడగు యేసుక్రీస్తు ద్వారా మాట్లాడెను. ఆ దేవుడే ప్రవక్తల నుండి కుమారునిగా మారెను. అంతే. చూచారా? ఆ వర్తమానము మారలేదు, కాని అదే రీతిగా చేయుచున్నాడు.

MAL 4:1,5

 

36ఇప్పుడు, సంఘములు ఈ స్థితిలో యుండునని మరియు తిరిగి అవి సరిదిద్దబడునని ప్రవచించబడెను. ప్రవక్తయగు ఏలియాను పంపుదునని ఆయన మలాకీ 4లో చెప్పెను, అతడు జనులను మరల పూర్వ స్థితిలోనికి తెచ్చును. గమనించండి, మరియు అతని వర్తమానము అయిపోయిన వెంటనే ప్రపంచము దహించబడు ఒక కాలము వచ్చును. మరియు వారి బూడిద మీద నీతిమంతులు నడచిపోవుదురు.

ఇప్పుడు, ఇది కొంతమంది వేదపండితులకు (ప్రపంచములోనున్న ఎచ్చట నుండైన ఈ టేపును వినుచున్నవారికి), మీరు దీనిని యొహానును సూచించుచున్నదని తలంచినయెడల, గుర్తించుకొనండి, వాక్యములు తప్పగును, ఎందుకనగా యోహాను వర్తమానము తరువాత లోకము కాలిపోలేదు. యేసు వచ్చి వేయ్యేండ్ల పాలనకు ప్రజలను తీసికొనిపోలేదు, కాని భూమిమీదికి మరల ఏలియా ఆత్మ వచ్చిన తరువాత ఆలాగు చేయుదునని ఆయన వాగ్దానము చేసెను.

MAL 4:5•

LUKE 17:28,30

 

37ఇప్పుడు గమనించండి, ఇది దేనిని తిరిగి సమకూర్చుటకు జరుగునని మలాక్రీ 4లో చెప్పబడెను? ఆది తండ్రుల యొక్క విశ్వాసము నొద్దకు జనులను త్రిప్పును. ఆది తండ్రుల యొక్క పెంతెకోస్తు బోధ యొద్దకు మరియు ఆయన జనులను తండ్రుల యొద్దకు త్రిప్పును.

లూకా 17లో మనము చూచుచున్నాము, యేసు చెప్పెను, ఆయన చివరి దినములలో వచ్చేటప్పుడు, లూకా 17:33లో, "లోతు దినములలో ఉండినట్టే మనుష్యకుమారుడు ప్రత్యక్షమగు దినమున వుండును," అని యేసు చెప్పుటను మనము చూచుచున్నాము.

ఇప్పుడు చూడండి, ఆయన మూడు కుమారుల యొక్క నామములో వచ్చెను. ఆయన దావీదు కుమారుని నామములో — లేదా మనుష్యకుమారుడిగా, దేవుని కుమారుడిగా, దావీదు కుమారుడిగా వచ్చెను…

JOHN 5:36•

JOHN 10:25,37

 

38ఇప్పుడు, ఆయన ప్రవక్త గనుక మనుష్యకుమారునిగా రావలసి వచ్చెను. యెహోవాయే తన ప్రవక్తలను మనుష్యకుమారులనుగా పిలచెను. యేసు తాను దేవుని కుమారుడనని ఎన్నడూ చెప్పుకొనలేదు, ఆయన ఎప్పుడూ తాను మనుష్య కుమారుడననియే చెప్పుకోలేదు.

గమనించండి, ఆయన ప్రవక్తగా, (దీర్ఘదర్శిగా) తనను బయలుపరచు కొనెను. "తండ్రి క్రియలు నేను చేయనియెడల నన్ను నమ్మకుడి." వాక్యములో ఆయనను గూర్చి చెప్పబడినదంతయూ ఆయనలో నెరవేరెను. సిలువ మరణము, సమాధి, పునరుత్తానము, జన్మ, సమస్తమును చూడండి. ఆయన పని కూడ ప్రవక్త పనియే, ఆయన మనుష్యకుమారుడు.

LUKE 17:28,30•

REV 3:17

 

39ఇప్పుడు, ఆయన సంఘకాలముల ద్వారా బయలుపరచబడెను. (ఇప్పుడు, గమనించండి), సంఘకాలములలో దేవుని కుమారునిగా బయలుపడెను. దేవుడు ఆత్మపూర్ణుడైనందున - ఆయన పరిశుద్దాత్మ. సంఘకాలములలో పరిశుద్దాత్మగా జనులమధ్య ప్రత్యక్షమాయెను.

చివరి సంఘకాలనుగు లవోదికయ సంఘకాలములో ఆయన బయట ఉంచబడియుండుటను మనము కనుగొంటిమి. లవొదికయ కాలములో తప్ప మరే కాలములోను ఆయనను బయటకు త్రోసివేయలేదు. ఎందుకనగా వారు "మాకేమియు కొదువలేదు మరియు సమృద్దిగా యున్నదని" చెప్పిరి.

"నీవు దిక్కుమాలినవాడవును, దరిద్రుడవును, దిగంబరివి, గ్రుడ్డివాడివనియు ఎరుగకయున్నావు."

ఇప్పుడు ఆయన సంఘము నుండి బయటకు త్రోసివేయబడియున్నాడు. లూకా 17లో ఆయనిట్లు చెప్పెను, "సొదొమ దినములలో ఉండినట్లుగానే మనష్యకుమారుని రాకడలోను ఉండును." మనము చదివిన ఆదికాండమునే ఆయన చదివెను, సొదొమలో ఏమి జరిగినదో గమనించండి. సొదొమలో ఏమున్నది? అబ్రాహాము…

GEN 18:1•

GEN 19:1,16,26

 

40అక్కడ ఎల్లప్పుడునూ మూడు రకముల జనులున్నారు. అక్కడ అబ్రాహాము, ఎన్నుకొనబడినవాడై మరియు బయటకు పిలువబడినవాడై, సొదొమకు వెలుపలయుండెను. లోతు ఒక శాఖకు చెందిన సంఘ-సబ్యుడిగా అక్కడ వుండెను. అతడు లోక స౦బంది - అధికారిగా గవిని యొద్ద కూర్చొని న్యాయమును విచారించును, పట్టణము యొక్క అధికారిగా యుండెను, అక్కడ సొదొమ వుండెను.

ఇప్పుడు, సాయంకాల సమయము, లేదా మధ్యాహ్న సమయమందు అబ్రాహాము సింధూర వృక్షము క్రింద కూర్చొనియుండగా, ముగ్గురు దేవదూతలు ప్రత్యక్ష్యమయిరి. అందులో ఇద్దరు సొదొమలోనికి వెళ్ళి సువార్తను ప్రకటించి వారిని బయటకు పిలువ ప్రయత్నించిరి. వారు వినలేదు; వారు వంకర జనులు. లోతు, అతని భార్య, ఇద్దరు కుమార్తెలు బయటకు బయలుదేరిరి; అతడి భార్య వెనుకకు తిరిగి ఉప్పు స్తంభమాయెను.

GEN 18:3,8-10,12,13

 

41కాని ఒకాయన అబ్రాహాముతో నిలచియుండి మాట్లాడెను, అబ్రాహాము ఆయనను ఎలోహిం అని పిలచెను, సర్వశక్తుడు (ఆదికాండము 1, దేవుడు; "ఆదియందు దేవుడు," సర్వశక్తుడు, సృష్టింపబడనివాడు, అబ్రాహాము ఆయనను ఎలోహిం అని పిలచెను) మరియు ఆయన అబ్రాహాముతో కలిసి భోజనము చేసెను; నీరు త్రాగెను; ఆయన శరీరధారియైయుండెను. అబ్రాహామునకు ఆయనిచ్చిన సూచనను చూడండి.

ఇప్పుడు, వారు రాబోవుచున్న వాగ్దాన కుమారుడగు ఇస్సాకు కొరకు ఎదురుచూచుచుండిరి. పాతికేండ్ల నుండి వారు దీర్ఘముగా కనిపెట్టుచుండిరి; అయితే వారు యాత్ర చివరకు వచ్చిరి. దేవుడు చాలా రూపములలో ప్రత్యక్షమాయెను. సంఘ కాలములలో ఆయన చేసిన విధముగా వెలుగుగాను, (అబ్రాహాముతో ఆయన మాట్లాడినట్లు) స్వరముతో శబ్దముగా ఆయన మాట్లాడెను. అయితే వాగ్దాన కుమారుడు రాబోయే ముందు (దీనిని మనము చెప్పుకొనుట జరిగినది గాని మీకు మరల అర్థమగునట్లు చెప్పెదను. ఇదయిన వెంటనే, వారు కుమారుని పొందుకొనుట కొరకై ఆయన అబ్రాహాము, శారాల, శరీరములను మార్చెను), గమనించండి, ఆ కుమారుడు వచ్చు ముందుగా వారికియ్యబడిన చివరి సూచన ఏమనగా, యెహోవా మానవ రూపములో వచ్చి మాట్లాడుటయే. ఈయన యెహోవా అని వారు ఎట్లు తెలుసుకొనగలిగారంటే, ఆయన "అబ్రాహాము (అబ్రాహాము కాదు; కొద్ది దినములకు ముందుగా దేవుడు అతని పేరును మార్చెను), నీ భార్య శారా ఎక్కడ?" అనడిగెను. ఆమె పేరు శారయి కాదు, గాని శారా, రాజకుమార్తె.

''ఆమె నీ వెనుక గుడారములోనున్నది" అని అబ్రాహామనెను.

మరియు ఆయన చెప్పెను, "నేను (ఆయన వ్యక్తిగతముగా సర్వనాము) - నేను వాగ్దానము చేసినట్లు నిర్ణయకాలమున నేను వచ్చెదను. (వచ్చే ఇరవై-ఎనిమిది రోజులలో శారాకు ఏదో జరుగనైయున్నది.)"

గుడారములోనున్న శారా హృదయములో ఇట్లనుకొని నవ్వెను, "ఇదెలాగవును, నేనేమో ముసలిదానిని, నా యజమానుడైన అబ్రాహాముతో నాకు సుఖము కలుగునా? అతడు కూడా వృద్ధుడాయెను కదా?"

మరియు ఆ దూత లేక మనుష్యుడు చెప్పెను, "శారా హృదయములో ఎందుకు నన్వినదని ప్రశ్నించెను?" — ఆమె ఆయనకు వెనుక గుడారములో నిలబడి యుండెను! ఈ సంగతులు జరుగవని ఆమె ఎందుకు తలంచినది?" చూచారా? మానవ శరీరములోనున్న ఆయన ఒక ప్రవక్త, ఎలోహిం, శారా యొక్క హృదయాలోచనను ఎరిగియుండెను.

LUKE 17:28,30

 

42యేసు ఇట్లనెను, "లోతు దినములలో ఉండినట్టే, మనష్యకుమారుడు ప్రత్యక్ష్యమగు దినమునను ఉండును. యుగసమాప్తియందు ఆ ప్రకారమే జరుగును, మనష్యకుమారుడు, దేవుని కుమారుడు కాదు, మనష్యకుమారుడు ప్రత్యక్ష్యమగు దినమున.

వాక్యము పరిపూర్ణముగా నెరవేరుట ఈ కాలములన్నింటిలోను మనము గమనించుట లేదా? (ఇక్కడ మనము జీవించుచున్నాము.) ఏకత్వవాదుల ఉద్దేశ్యమునకు వ్యతిరేకముగా యేసుక్రీస్తు నామములో ఇవ్వబడే బాప్తిస్మము మరియు ఇలాంటి ఇతర కార్యముల యొక్క మర్మములను, పరిశుద్దాత్మ ఈ విధముగా కదలి వచ్చి మనకు పరిపూర్ణముగా చూపించినది. మరియు నిజమైన పరిశుద్దాత్మ బాప్తిస్మము, ఆనవాలు మరియు సమస్తమును ఇవ్వబడినవి. ఒక్కొక్క సంస్కర్తలు వారి - వారి స్థానములలో పొందుపరచి (అమర్చి) మరియు సమస్తమును (చూచారా?) మన కళ్ళ ముందుగానే ఖచ్చితముగా వాటి - వాటి స్థానములలో వుంచెను. అది ఒక మూలలో మాత్రము కాదు మరియు ప్రపంచమంతా దీనిని ఎరుగును. దేవుని కుమారుడైన యేసుక్రీస్తు వాక్యముల ద్వారా తనను బయలుపరచెను, ఈ కాలము కొరకై ముందుగా నిర్ణయించబడిన వాక్యములు జీవించునట్లు చేసెను (ఈ కాలములో ఆయన చేసినట్లుగానే, ఇతర కాలములలో కూడా). దానిని విశ్వసించుటయే పరిశుద్దాత్మను పొందుటకు ఆధారమైయున్నది.

43అదే నీతి.

ఆలయమునకు వెళ్ళుటయే కేవలము పరిశుద్దాత్మకు సూచన అని నీవు చెప్పలేవు. అలాగయితే పరిసయ్యలను పొందినట్టే, వణుకుట మరియు గంతులు వేయుట పరిశుద్దాత్మ అని నీవు చెప్పలేవు. అన్యులును అలాగు చేయుచున్నారు. దయ్యములను ఆరాధించువారును భాషలలో మట్లాడుచున్నారు గదా? నీవెట్లు దానిని పరిశుద్దాత్మ అందువు? ఆఫ్రికా నుండి వచ్చిన సహో, జాక్సన్ ఇక్కడ కూర్చొనియున్నాడు. అతడు దీనిని మీకు చెప్పగలడు.

ఇండియను నివాసములలోనికి నేను వెళ్ళాను. మంత్రగాళ్ళ, దేవతోపాసకులు తమ్మును తాము కోసుకొని రక్తమును కార్చుచూ భాషలలో మాట్లాడుదురు. మంత్రగాడు దానికి అర్థము చెప్పును, వారు పెన్సిలు తీసికొని తెలియని భాషలో వ్రాయుదురు. కాబట్టి అది కాదు. నిజమగు సూచన ఏమిటి? "నేనే ఆయననని మీరు నమ్ముడి" అని యేసు చెప్పెను. ఆయనే వాక్యము.

44వారెందుకు దీనిని గ్రహించరు? యూదులు దీనిని ఎందుకు గ్రహించరు? వారు నీతిమంతులు; వారు మంచివారు; వారు పరిశుద్దులు, వారు అన్ని రకముల ప్రజలు. కాని వాక్యము వినుట ఎవరికి అనుగ్రహింపబడినదో… అది వాక్యములో ఉన్నదా అని మీరు ఎట్లు తెలుసుకొందురు? ఒక్కొక్కరు ఒక్కొక్కటి చెప్పుచున్నారు. ఆ కాలమునుకు బైబిల్ యొక్క వాగ్ధానమును రుజువుపరచుటయై యున్నది. అక్కడే మీరున్నారు. పరిశుద్దాత్మయున్న చోటుకు నీవు తిరిగి రావలెను.

కొద్ది నిమిషములు బూర ధ్వనిని గమనించండి. అదేమి ప్రకటించునో వినండి. ఎవరు సువార్త యొక్క బూర ధ్వనిని వినగలరోయని చూడండి. ప్రాకారముగల పట్టణములో ఉన్నవారు సునాద వత్సరమునకు రాలేరు. లేదయ్యా. వారు గోడల లోపల ఉన్నారు, వారక్కడే నిలచియుందురు. వారు తమ శేషజీవిత మంతయూ బానిసలుగానే యుందురు, వారికి గురుతు వేయబడును.

ఇప్పుడు మనము ఈ మాదిరులన్నియూ చూచాము. గమనించండి.

HEB 13:8

 

45ఇప్పుడు, ఈ కార్యములు, మలాకీ 4 మరియు అన్నియు, మరియు హెబ్రి 13:8, "యేసు క్రీస్తు నిన్న, నేడు, నిరంతరము ఏకరీతిగా యున్నాడు." ఆయన నిత్యము వాక్యముగానే నిలచియుండును, వాక్యము శరీరధారి అయ్యెను. ఆయన ఖచ్చితముగా దానినే తన ప్రవక్తలకు ప్రకటించెను. ప్రవక్త అనగా కేవలము "ముందు జరుగు సంగతులను మాత్రమే చెప్పువాడు కాదు గాని, తన స్వంత జీవితములో వ్రాయబడిన వాక్యమును ప్రత్యక్షపరచును." అతని స్వంత క్రియలు, ఆ దినపు వాక్యమును బయలుపరచి ప్రత్యక్ష పరచును. నోవహు ఓడను కట్టెను, మోషే తన పనిచేయుట.. ఆ ఘడియకు కేవలము వాగ్దానము చేయబడిన వాక్యము.

46ఆయన మనతో ఉన్నాడని మనమెరుగుదుము. దానిని మనము నమ్ముచున్నాము. ఫోటోల ద్వారా, వాక్యము ద్వారా, భూమ్యాకాశములలోని సూచక క్రియల ద్వారా ఆయన వాక్యము ప్రత్యక్షపరచబడుట మీరు చూచారు. ఆయన చెప్పినది ఒక్కసారి కూడా విఫలము కాలేదు. ప్రపంచములోనున్న ఏ వ్యక్తి అయినా గాని వాక్యము ఎక్కడ తప్పిపోయినదో వ్రాయమని కోరుచున్నాను. ఇప్పుడు, అది ఒక వాగ్దానము.

47ఈ చివరి దినములలో ఆయన ఎందుకు ప్రత్యక్షము కావలెను? వధువు వృక్షము చూడండి. (టేపులు వినువారలారా) మీరు వధువు వృక్షమనే వర్తమానమును చూచినయెడల, ఏదెను తోటలోనున్న ఆ వృక్షము అది క్రీస్తే. మొదటి ఆదాము పడిపోగా, కడపటి ఆదాము పాపముతో నరకబడెను; ఆయనను ఒక రోమను చెట్టు మీద మనము వ్రేలాడదీశాము. దానిలో నుండి ఆయన వాగ్దానము చేసిన వధువు చెట్టు వచ్చినది. ఆయన వాగ్దానము చేసిన దానిని మనము వాక్యములో చూచుచున్నాము.

ఇప్పుడు, వధువును క్రమముగా పొందుకొనుటకు… పిరమిడ్ వలె ఉన్నది, ఎప్పుడూ అల్ప సంఖ్యాకులలోనే అది వచ్చుచున్నది. లూథర్ వెస్లీ, పెంతెకోస్తు అను గొప్ప వైశాల్యము నుండి అది వచ్చెను. తర్వాత దానిపైనున్న తలరాయి చాలా సన్నగా (సూదిలా) వచ్చియున్నది; ఆ ప్రతి ఒక్క రాయి చక్కగా అమర్చబడినది. (వారెట్లు చేసిరో ఇంకా మనకు తెలియదు); కాని అది పిరమిడ్లో చక్కగా పొదగబడినది (మనమిప్పుడు పిరమిడ్ గూర్చి చెప్పుట లేదు. దానిని చాలా సంవత్సరాల క్రితం హనోకు మొదలగువారు నిర్మించిరి); అది ఒక గురుతుగా నిలచియున్నది. సూర్యుడుదయించి అస్తమించినట్టే, చెట్టు ఆకులు రాల్చి చిగిర్చినట్లే అదియున్నది. చేపలు, పశువులు మొదలగునవన్నీ దానికి మాదిరిగానున్నవి. ఆ పిరమిడ్ ఒక చిహ్నముగా నిలచియున్నది.

48ప్రవక్త గదిలోనికి వెళ్ళి ఆ ఏడు అడుగులను గమనించండి. కావలివాడు ఎచ్చట ప్రతిజ్ఞను సంధించి వచ్చిన వానిని రాజు సన్నిధిలోనికి ఏ మెట్టు పైనుండి తీసుకొని వచ్చును? ఏడవ మెట్టు మీద నుండి, యోహాను మీద నుండిన ఆత్మతోనే మనమును తిరిగి రావలసియున్నామని ఇది చూపించుచున్నది. అతడు మెస్సియాను పరిచయము చేసెను; అతడు ప్రవక్తలందరికంటె గొప్పవాడు; ఆయనను అతడు పరిచయము చేసెను.

మెస్సీయాను పరిచయము చేయు ఆ స్థలమునొద్దకు మనము రావలసియున్నాము.

DAN 12:3,10•

MAL 4:6

 

49ఆయనను నమ్మినవారు దానిని ఎరుగుదురు. ఆయన వాక్యములో ఎడతెగక నిలచియున్నప్పుడే ఆయనేమైయున్నాడో తెలియును. జ్ఞానులు తెలిసి కొందురు, బుద్ధిహీనులు తెలిసికొనరు అని దానియేలు చెప్పెను. వారు తమ దేవుని ఎరుగుదురు.

ఇప్పుడు, జనులను మరల వాక్యము యొద్దకు తీసుకొనివచ్చి, వధువు తన చెలికాడును, తన భర్తను తెలుసుకొనుటకును, ప్రత్యక్ష్యపరచబడిన వాక్యమును తెలుసుకొనుట కొరకును అది మనకు అంత్యదినములలో కనబడునని ఆయన చెప్పెను. అందుకోసమే ఇది జరుగవలసియున్నది. అది సంస్కర్తలలో లేదు; లూథర్, వెస్లీ, పెంతెకోస్తవారిలో అది లేదు; అది అప్పుడు సంభవించదని వాక్యములు చెప్పుచున్నవి. కాని అది వచ్చును; అది ఈ కాలమునకు అనుగ్రహింపబడిన ఆయన యొక్క వాగ్దానమైయున్నది.

ఆయన వచ్చు కాలములో మనము జీవించుచున్నాము. ఆమె తప్పక ఆయనయందు గుర్తింపబడవలెను. అయినాగాని తన భర్తయందు గుర్తించబడును, ఏలయనగా వారిరువురును ఒక్కటి. క్రీస్తు యొక్క వధువు ఆయనతో గుర్తింపబడవలసియున్నది, వారిద్దరు ఒక్కటనీ, ఆయన ఒక శాఖ కాదు, ఆయన వాక్యమైయున్నాడు. మనము వెలుగు పిల్లలముగా ఉండవలసి యున్నాము, వాక్యమే ఆ వెలుగు. అది ఈ కాలమునకు వాక్యమైయున్నది. వెలుగు వాక్యములో నుండి వస్తేనే తప్ప, మనము ఎట్లు ఆ వెలుగును తెలుసుకొనగలము? సరే. శరీరధారియైన వాక్యము ఈ కాలపు వెలుగు, దానిని నీవు చూడుము; బైబిలు ఆలాగు చెప్పెను.

JOHN 5:46

 

50ఆ జనులు యేసును చూచి ఇట్లనిరి, "మ౦చిది, ఈ మనిషి, ఇతడు ఎవరు? ఎందుకు, ఇతడు అక్రమముగా పుట్టినవాడు. ఎందుకు, ఇతని తల్లి, తండ్రి పలాని వారు, లేక మరేదో, మరియు ఇవన్నియు." అయితే వారాయనను తెలిసికొనలేదు. వారు వాక్యమును ఎరిగియుండినచో, ఆయనను ఎరిగియుందురు; ఆయన ఆలాగు చెప్పెను.

"మేము మోషే శిష్యులము!" అని వారనిరి.

"మీరు మోషేను ఎరిగియున్నయెడల నన్నును ఎరిగియుందురు, ఏలయనగా మోషే నన్ను గూర్చి వ్రాసెను." అయినాగాని వారు చూడలేని అంధులయిరి! ఎంత దీనుడో చూడండి? ఆ శాఖలను, గుంపులను, విశ్వాసములను అన్నింటిని దాటి ఆయన మానవునిగా శరీరము ధరించి రక్తసంబంధియగు విమోచకుడు ఆయెను. ఆమె ఆయనతో గుర్తింపు పొందవలెను.

వెలుగు పిల్లలముగా ఉండుటకు మనము పిలువబడితిమి, మనము వెలుగులో నడతుము.

51కొంత కాలము క్రిందట, నాకు గుర్తున్నది, కెంటకీలో నేనొక కూటములోయున్నాను. నేను సంఘములో నుండి బయటకు వచ్చి తరువాత ఒక ముసలి వ్యక్తి చేతిలో లాంతరు పట్టుకొని నిలబడి యుండుటను చూచాను. స్వస్థతను నమ్మని ఒక సంఘమునకు అతడు చెందినవాడు. "బ్రెన్హాం సోదరుడా, ఈ విషయంలో నేను నీతో విభేదించుచున్నాను'' అనెను.

"మంచిది, నీకు ఆ హక్కున్నది" అన్నాను.

"మీరు చూడండి? నేను ఏదయినా కళ్ళారా చూస్తేనే గాని నమ్మను. నేను చాలా తేటగా చూడవలెను" అన్నాడు

"అయితే దేవుడు నీ ఎదుట స్పష్టముగా నిలబడియుండుట ఎన్నడైనా చూచావా?" అనడిగాను. (అతడు దర్శనములు మొదలగు వాటిని నమ్మడు.)

"లేదు!" అని చెప్పాడు.

"మంచిది, అయితే నీవు ఒక విశ్వాసివి కావు, అయ్యా; నేను నీతో మాట్లాడలేను. (చూడండి, చూడండి?) మేము దేవుడు వాగ్దానము చేసిన దానిని నమ్మి హత్తుకొందుము" అని చెప్పాను.

అతడు చెప్పెను, "నీవెట్లు నమ్మగలవు?" నేను చెప్పాను - అతడు చెప్పెను, "రండి, మా ఇంటికి వచ్చి ఈ రాత్రికి మాట్లాడుము" అన్నాడు.

"నాకు రావాలనియున్నది, గానీ రాలేను. నీవెక్కడుందువు?" అని అడిగాను.

"ఆ కొండమీదికి పోవు త్రోవ ఒకటున్నది" అన్నాడు.

"నీ ఇల్లు కనబడుటలేదు గదా? ఎట్లు నీవు వెళ్ళుచున్నావు?" అనడిగాను.

"ఆ దారి నీకు కనబడుటలేదు గదా?" అనడిగాను.

"మంచిది, నా చేతిలో ఒక లాంతరున్నది" అన్నాడు.

"ఆ లాంతరు నీ ఇంటిని చూపించదు గదా?" అన్నాను.

"ఓ, లేదు, కాని ఆ దారి నన్ను ఇంటికి తీసికొని పోవును" అన్నాడు.

"కాని ఆ లాంతరు వెలుగు ఒక్కొక్క అడుగుకు మాత్రమే చూపించును."

52మనము ఆ వెలుగులో నడచెదము, అందమైన వెలుగులో, ఒక్క సారి ఒక్క అడుగు వేసుకుంటూ, ప్రభువా, మీ యొద్దకు అత్యంత సన్నిహితముగా వచ్చి చేరెదము.

అవును, ఆయన వాక్యమును వెలుగు యొక్క పిల్లలు అంగీకరింతురు. అలా నడుచుకుంటూ వెళ్ళుతూవుంటే ఎక్కువగా బయలుపడును. దానిని విడవకండి, ఎవరు ఏమి చెప్పినా, దానియందే అచ్చటనేయుండండి మరియు దానితోనే నడుచుకుంటూ వెళ్ళండి. మరియు అది తెరచుకొని తనను తానే బయలు పరచుకొనును. వాక్యము ఒక విత్తనమైయన్నది; సారవంతమైన నేలలో విత్తబడిన విత్తనము దానియొక్క స్వభావమును మొలపించును.

REV 10:3,4,7

 

53ప్రకటన 10:1 నుండి 7 గమనించండి. లవొదికయ సంఘ వర్తమానికుని ద్వారా ఈ మర్మములన్నియు వధువుకు బయలుపరచబడును. ఎవరి యొద్ద అయినా రివైజడ్ వెర్షన్ బైబిలున్నదా? అందులో మీరు దేవదూత అని వ్రాసియుండుట గమనించెదరు. పక్షిరాజునకు అది సారూప్యము. లవొదికయ సంఘ వర్తమానికుడు (చూడండి?) ప్రకటన 10:1-7.

ఆయన దిగివచ్చి ఆ చిన్న పుస్తకమును తినుట ఆ దినమున మనము చూతుమని ఆయన చెప్పెను. అతడు ఒక పాదమును నేల మీద, ఒక పాదమును సముద్రము మీద వేసి ఇక సమయము లేదని సదా జీవించుచున్నవాని తోడుగా ప్రమాణము చేసెను. ఆ విధముగా అతడు పలుకగా, ఏడు ఉరుములు ఉరిమెను. ఆ ఏడు ఉరుములు ఉరిమినప్పుడు, యోహాను వ్రాయుటకు ఉపక్రమించెను. మరియు ఆయన, "దానిని వ్రాయవద్దు" అని చెప్పెను. చూడండి? మరియు దానిని అతడు ముద్రించెను.

REV 22:18,19

 

54ఇప్పుడు, "బ్రెన్హాం సోదరుడా, మంచిది, ఆ ఏడు ముద్రలు, దేవుని యొద్దకు మనము ఎట్లు సన్నిహితముగా చేరుకోవాలనే దానికై ఈ చివరి దినములలో ఇంతటి గొప్ప మర్మము బయలు పరచబడినదా…" అని ఎవరో ఒకరు అడిగిరి. లేదండి, కానే కాదు. "బైబిలుకు ఎవరూ ఒక మాట చేర్చరాదు, ఒక మాట దానిలోనుండి తీసివేయరాదు. ఆలాగు చేసిన వానికి జీవగ్రంథములో పాలుండదు. అది ఏమిటనగా, దీనికి ముందు కోల్పోయిన దానికి అది ప్రత్యక్షతయగును, దాని తెచ్చుటకు… అదెప్పుడో ఇక్కడ వ్రాయబడెను; ఇంతకు ముందు వ్రాయబడినదే; ఇప్పుడు బయలుపరచబడెను (చూడండి?), ఎందుకనగా దానికి ఒక మాట చేర్చరాదు. దానిలోనుండి ఒక మాట తీసివేయరాదు.

GEN 3:4•

REV 22:18,19

 

55బైబిలులోని మొదటిదగు ఆదికాండములో ఒక్క స్త్రీ దానిని నమ్మనందున ఇంత జరిగెను. ఒక మాటను (వాక్యము) అపార్ధము చేసి చెప్పుటకు ఆమె అనుమతించినది, "నిశ్చయముగా…" చూడండి? దాని వలన ఇంత శ్రమ వచ్చినది. దేవుడు తన మాటను పలుకుచున్నాడు, దేవుని యొక్క వాక్యము. ప్రకటన చివరి అధ్యాయములో యేసు, అదే దేవుడు, ఇట్లు చెప్పెను, "ఒక మాట దానికి చేర్చరాదు. ఒక మాట దానినుండి తీసివేయరాదు. ఇది యేసుక్రీస్తు యొక్క సంపూర్ణ ప్రత్యక్షత. ఏడు ముద్రలలో దాగియున్న మర్మములన్నియూ ఈ చివరి కాలమగు లవొదికయ సంఘకాలములో బయలుపడును. సంఘమునకు వర్తమానమును ముగించిన దేవునికి వందనములు, ముందు నుండియున్న దానిని వారు చూచిరి. దాని ముగింపును సంఘకాలములో చూచిరి.

1COR 14:8

 

56ఇప్పుడు గమనించండి, మనము మాట్లాడుకొనుచున్న బూరలు ఒక పండుగ, ఒక వ్యక్తి, ఒక పవిత్ర దినము మొదలగు వాటిని గూర్చి జనులకు తెలియ చేయుటకు వీటిని వాడుదురు (గమనించండి, "ఒక వ్యక్తికా?" అని మీరు అడగవచ్చు అవును), లేదా హితవత్సరమున రాబోయే స్వాతంత్ర్యమును అది ప్రకటించునప్పుడు వారు మరల తిరిగి వెళ్ళుటకు ఉపయోగించుదురు. ఇప్పుడు, దానిని చెప్పవలెనన్న ఒక పూర్తి ఉదయము మనకు చాలదు. కాని, ఇప్పుడు బూరలను గూర్చి చెప్పుచూ ముద్రలు మరియు సంఘము గూర్చి చెప్పితిమి. ఇప్పుడు, మనము తిరిగి బూరలలోనికి వెళ్ళుదము.

బూర మ్రోగినది; అది పండుగను గాని యుద్దమును గాని వెల్లడి చేయును. లేదా… అది దేనిని సూచించుననగా ఆ బూర జనులను ఒక చోటుకు చేర్చును. "బూర స్పష్టముకాని ధ్వనిని ఇచ్చినచో, యుద్దమునకు ఎవరు సిద్దపడెదరు?" అని పౌలు చెప్పెను. ఎవరికి తెలియును? బూర ధ్వని నీకు తెలియును. బూర మ్రోగుచున్నప్పుడు నేడు భూమిమీద ఒక సంగతిని మనము చూచుచున్నాము. ఎక్కడో ఒక గొప్ప శ్రమ యున్నది; అందరూ దానిని ఎరుగుదురు. ప్రతివారు ఉద్రిక్తులగుచున్నారు. సర్వ ప్రపంచము ఉద్రిక్త స్థితిలోనే యున్నది, ఏదో పొరపాటున్నదని మనమెరుగుదుము. పెంటగాన్ తదితర చోట ఏదో పొరపాటు జరుగుచున్నదని మనకు తెలియును.

57ఇప్పుడు, బూర ఏ ధ్వనిని వినిపించుచున్నదో నీవు తెలిసికొనుటకు సంగీతపు కాగితమును చూడవలెను. అంతే చాలు. అదొక గొప్ప సంగీత బాణి. (చూడండి?) గ్రంథమును వ్రాసినవాడు సమకూర్చెను, మరియు దర్శకుడు కూడా అతడి ఆత్మతోనే యుండవలెను. అతడు లేనియెడల, అతడు తప్పు బాణీ ఇచ్చును, అపుడ౦తయూ పాడగును.

నేడు ఇదే జరుగుచున్నది. సమకూర్చినవాని ఆత్మలో లేని ఎందరో దర్శకులు మనకున్నారు. వారు తమ శాఖ మాటను "మంచిది, మేము దానిని నమ్ముచున్నామని" అందురు. నీవు చెప్పేది కాదు గాని, బైబిలు చెప్పునదియే సరి. ఇక్కడ మన ముందున్న సంగీతపు కాగితములో వున్న ప్రకారముగా దానిని వాయించవలెను. అప్పుడు దేవుని యొక్క ఆ గొప్ప నాదము సరిగా వినబడును. మనము జీవించుచున్న ఈ ఘడియలో మనము ఎక్కడ నిలబడి వున్న మన స్థానమును మనము చూడగలము.

58ఇప్పుడు గమనించండి, జనులను ఒక్కటిగా ప్రోగుచేయుటకు బూర మ్రోగును - ఏదో ఒకదాని కొరకై వారందరిని ఒక్కటిగా కలుసుకొనునట్లు చేయును. కొన్నిసార్లు అది యోసేపు వంటి ఒక ప్రముఖ వ్యక్తి రాకను చాటించును. వారు బూర ఊదగా, యోసేపు ప్రత్యక్షమాయెను. అది గొప్ప ఒక బూర చిహ్నముగా నున్నది. (మనము తరువాత దానిని గురించి మాట్లాడుకుందాము). యెషయాలో చెప్పినట్లు ఆ గొప్ప బూరను ఊదినప్పుడు మరియు పతాకము ఎగురవేయబడును, పిదప ఒక కాలము వచ్చును, గొప్ప బూర ఊదినప్పుడు, మరియు దేశములన్నియూ యెరూషలేములో కూడుకొనును. వెయ్యేండ్ల పాలన ఆరంభమగును, గొప్ప బూర మ్రోగును.

REV 8:7

 

59బూరల పండుగకైన ఆహ్వానము ఏదో ఒకదానిని సమీపించుట చూపించుచున్నది… ప్రకటన 8 మరియు 7 గమనించండి, కావలెనన్న వ్రాసికొనండి. మొదటి బూర ఊదగా వడగండ్లు, రక్తము, అగ్ని భూమిమీద పడెను. నిర్గమ కాండములో దేవుడు తన జనులను యాత్రకొరకై బయటకు పిలచినట్లుగానే ఇది యుండును.

ఇప్పుడు, ఈ ఏడు బూరలు ఈ కాలమునకు మరియు ఈ సంఘమునకు చెందక పోవుటకు కారణము అది ఇశ్రాయేలుకు మాత్రము వర్తించుటయే. జనులను ప్రోగు చేయుటకు అది ఊదబడినది. ఇక్కడ ఒకే ఒక సారూప్యమున్నది. మరియు ఇప్పుడు కొద్ది నిమిషములలో దానిని మీకు నేను చెప్పెదను, ఈ ఏడు బూరలు మనము జీవించుచున్న ఈ కాలమునకు ఎందుకు వర్తించదనే దానిని ఇక్కడ మీరు కనుగొనెదరు.

60నాకు తెలుసు చాలామంది ఈ విషయముతో విభేదించవచ్చును, కాని అది నాకు తెలుసు. అది నాకు తెలుసు. మీరు అలాగ చెప్పినందువలన నేను చెప్పుటలేదు, ఎందుకనగా దానిని నాకు - నేనే పొండుకోలేదు; నా యొక్క తలంపులు నా సొంత తలంపులు కావు. వేరొకరు ఏదైతే నాతో చెప్పుచున్నారో, అది తప్పైనయెడల, అది తప్పగును. కాని, నేను స్వంతగా దీనిని చెప్పుట లేదు, ఎవరో చెప్పినదే నేను చెప్పుచున్నాను, అనగా దేవుడే మనతో మాట్లాడి జరిగిన ఈ క్రియలన్నింటిని ఆయన జరిగించెను. ఆయన చేసిన క్రియలన్నియూ మనము చూచాము, చూచారా. కావున అది సత్యమని నేనెరుగుదును.

61ఇశ్రాయేలీయులను బూరలే ప్రోగు చేయును. ఇశ్రాయేలీయులను సమకూర్చుటకే ఆ బూర.

గమనించండి, ఇప్పుడు మొదటి బూర మ్రోగగానే రక్తము, అగ్ని భూమి మీద పడెను, చూచారా. ఆయన ఏమి చేయుచున్నాడు?ఇశ్రాయేలీయులను ఆత్మ సంబంధ ఐగుప్తు నుండి స్వభూమిలోనికి తీసికొని వచ్చుచున్నాడు. (చూచారా?)

ఇప్పుడు, దీనిని నేను ఇక్కడ చెప్పుటకు ఇష్టపడుచున్నాను. ఊదబడిన ప్రతి బూరయు, ఆరవ ముద్ర క్రిందనే ఊదబడినది. కొద్ది నిమిషములలో దానిని మనము చూతుము, ముద్రను కనుగొందుము. ఆరవ ముద్రలోనే బూరలన్నియూ మ్రోగెను, ఎందుకనగా ఏడవ ముద్రలో నిశ్శబ్దముండెను. ఎవరికి తెలియదు; క్రీస్తు వచ్చు ఘడియ లేదా నిమిషము అదే, దానిని మనకు బయలుపరచెను.

LEV 23:24-28

 

62ప్రతి బూరయు ఆరవ ముద్రలోనే ఊదబడెను, యూదులు హింసించబడిరి.

గమనించండి, ఇప్పుడు ప్రకటన గ్రంథములోని 8వ అధ్యాయములో 7వ వాక్యముతో ప్రారంభించెదము - ఈ సమస్తము సహజమైన ఐగుప్తు నుండి ఇశ్రాయేలీయులను బయటకు పిలుచుట; ఇప్పుడు ఆత్మ సంబంధముగా ఇశ్రాయేలీయులను బయటకు పిలుచుచున్నాడు. ప్రాయశ్చిత్త పండుగకు రండని వారిని ఆయన సిద్దము చేయుచున్నాడు.

గమనించండి, బూరల పండుగ మొదటిది, అది పెంతెకోస్తు, ప్రాయశ్చిత్త పండుగ ఏబది దినముల తర్వాత ఆరంభమగును. ప్రాయశ్చిత్త పండుగ, ఇక్కడ దానిని చదువుదము, మంచిది — బహుశా మనకు సమయము ఉండవచ్చు — మంచిది ఇక్కడ పరిశుద్ద గ్రంథములో వెదకి మరియు మీరు చదవండి, లేవీయ గ్రంథము 12, లేదా లేవీయ గ్రంథము 23ను లేవీయ గ్రంథము 16. మొదట బూరల పండుగను ప్రాయశ్చిత్త పండుగ వెంబడించుటను మనము కనుగొన్నాము మరియు అటుపిదప పెంతెకోస్తు వెంబడించుటను, ప్రాయశ్చిత్త పండుగను బూరల పండుగ వెంబడించుటను మనము కనుగొన్నాము.

REV 8:7

 

63గమనించండి, బూర మ్రోగగా జనులు పోగయిరి. మొదటి బూర మ్రోగెను. అగ్ని వడగండ్లు, రక్తము భూమి మీద పడెను. ఐగుప్తులో జరిగినట్లే జరిగెను. పరిహార దినమునకు సిద్దముకండని వారిని పిలచెను, చూచారా. వారు నిజమైన పరిహారమును తిరస్కరించిరి, ఈ సంవత్సరములు పొడిగించబడినవి. పెంతెకోస్తు సంవత్సరము వచ్చినది, చూచారా. ఇప్పుడు, తరువాత యూదులకు బూర మ్రోగును. ఇది సంఘము నుండి బయటకు పిలచుట. ఇప్పుడు జాగత్తగా వినండి, తరువాత ఆయన వారిని వాగ్దాన దేశమునకు కొనిపోయెను. సంఘమును వాగ్దాన దేశమునకు తీసికొని వెళ్ళుటకు ఇది సాదృశ్యము. మరువవద్దు, ప్రతి బూరయు ఆరవ ముద్రలోనే ఊదబడెను. అప్పుడే ఇది మ్రోగెను.

64ఇప్పుడు గమనించండి. వాక్యము యొక్క కొనసాగింపు అక్షరాలా అలాగే యన్నది. సంఘమునకు ఏడవ ముద్ర ఎట్లున్నదో, ఇశ్రాయేలునకు ఏడవ బూరయు అలాగే యున్నది. ఏడవ ముద్రలో బలిపీఠము క్రిందనున్న ఆత్మలు అంగీలను పొందినవి, వారు సంపాదించుకొనలేదు గాని వారికి అంగీలు ఇయ్యబడినవి. దేవుడు యూదులతో గాక, అన్యులతో కృపాయుగములో మాట్లాడెను. ఇశ్రాయేలు ఒక దేశముగా రక్షించబడెను. ఇశ్రాయేలును ఒక దేశముగానే దేవుడు వారితో వ్యవహరించుచుండెను. అన్యులు ఆయన నామము నిమిత్తము జనులుగానున్నారు గాని ఆయన నామము నిమిత్తము ఒక దేశముగా కాదు; ఇశ్రాయేలు.

HEB 10:10-12•

REV 8:5•

REV 9:14,16,17•

REV 11:19

 

65హిట్లర్ మరియు ఇతరులు యూదులను హింసించినప్పుడు, మరియు వారు ఈ కార్యములన్నింటిని వారు దాని క్రింద వీటిని చేసిరి… చూడండి, వారు… స్టాలీన్, హిట్లర్, మరియు ఆ నియంతులందరు ఉద్భవించి (మనకు సమయము లేదు, క్రొత్తగా వచ్చిన వారి కోసము మరల దానిని చెప్పెదము, దానిని మనము ఇంతకు ముందే చూచియున్నాము), అదే కాలములో జర్మనీ మరియు ఇతర దేశములన్నియు… యూదులు అన్ని దేశములలోకి చెదరిపోయారు, అయితే గత ఇరువది సంవత్సరముల నుండి యూదులకు వ్యతిరేకముగా కఠిన హింస చెలరేగినది.

వారి శరీరములను కాల్చిన చోట్లను నేను చూచాను. కాల్చబడిన యూదుల పిల్లల, స్త్రీల బూడిదను భూములకు ఎరువుగా ఉపయోగించిరి. వారు దానిని కప్పిపుచ్చుచున్నారు. అది జరిగిన ప్రాంతమునకు వారిని తీసుకు వెళ్ళి చూపించండి. ఇశ్రాయేలీయులను హింసించుట ఒక నిరంతర క్రియయైనది. వారిని తిరిగి ప్రాయశ్చిత్తమునకు పిలచుచున్న కాలమది. స్వాభావిక గొర్రెపిల్లను ఒక పరిహారముగా ఇంకా ఉపయోగించుచున్నారు. నిజమగు దేవుని గొర్రెపిల్లయే పరిహారము, దానిని వారు తిరస్కరించిరి, అప్పటినుండియు ఆ రక్తము వారిపై నున్నది.

జనులను సిద్దపరచు ధ్వనిని గమనించండి. ఏడవ బూర మరియు ఏడవ ముద్ర ఎంత ఖచ్చితముగానున్నవో చూడండి. యూదులు హింసించబడిరి.

66ప్రకటన 9వ అధ్యాయము 13వ వచనము. (జాగ్రత్తగా చూడండి), ఆరవ బూర, క్రింద (ప్రకటన 9:13) 200,000 మంది గుర్రపు రౌతులు బయలుదేరిరి. ఆరవ బూర క్రింద, గమనించండి, యూఫ్రటీసు నదిలో బంధించబడి యున్నవారు విడుదల చేయబడిరి. ఆరవ బూర క్రింద, ఇప్పుడు ప్రపంచమంతటితో 200,000 మంది గుర్రపు రౌతులు మాత్రమే లేరు. కాని ఇక్కడ 200,000 మంది విడుదల చేయబడిరి. గమనించండి. (మీరు దానిని వ్రాసుకోవాలని కోరుచున్నాను, కావున మీరు దానిని చదువుకోగలరు). అవి మామూలు గుర్రములు కావు. అవి అగ్నిని ఊదినవి, గుర్రములపై కూర్చున్నవారి రొమ్ములపై అగ్నివర్ణము వంటి కవచములను ధరించి యున్నారు. వాటి తోక చివర సర్పమువలె కనిపించెను. దాని చివరలో ముల్లు, సర్పపు తలయుండెను. అవి కరచును, చూచారా. అవి ఆత్మ సంబంధమగు గుర్రములు, ఇన్ని సంవత్సరములు అవి యూఫ్రటీసులో బంధించబడినవి. సహజాతీతమైన దయ్యములు. ఏమిటది? పాత రోమా సామ్రాజ్యము ఉజ్జీవింపబడినది, యూదులను హింసించుటకు యూఫ్రటీసు నది యొద్ద వారు దాదాపు రెండు వేల సంవత్సరములపాటు బంధించబడిరి. వాగ్దానమును దాటలేక పోయిరి, వారు అద్దరికి వెళ్ళగోరిన ఒక మతగుంపు, యూఫ్రటీసు ఏదెనునుండి వచ్చెనని మీకు తెలియును. హింసించు 200,000 దయ్యములు అచ్చట బంధించబడెను.

REV 7:9•

REV 9:18

 

67ఆరవ ముద్రలో ఏమి జరిగినదో గమనించండి. యూదులను హింసించుటకు అవి వదలబడినవి. దాదాపు రెండువేల సంవత్సరములపాటు ఆ సహజాతీతమైన దయ్యములు బంధించబడి స్టాలీన్, హిట్లర్ల ద్వారా యూదుల మీదికి విడువబడెను.

"అది రోమను కాదని మీరనవచ్చును. ప్రాచీన అన్యరోమా దినములలో క్రైస్తవులు హింసించిన ఆత్మ ఇప్పుడు యూదుల మీదికి విడువబడినది. (ఇక్కడ మనము మామూలు ఇశ్రాయేలును మరియు ఆత్మీయ సంఘమును ఇచ్చట మనము వేరు చేయుటను చూడగలము).

ఆరవ ముద్ర క్రింద దేవుని వాక్య ప్రకారము హత సాక్షులుగా మరణించిన ఒక్కొక్కరు కేకలు వేయుచూ అంగీలను పొందుకున్నది మీకు గుర్తున్నదా? కృపచేతనే వారు దానిని పొందుకొనిరి, ఎందుకనగా వారు గ్రుడ్డితనముచే సువార్తను చూడలేకపోయిరి, వీరు అన్యులలో నుండి వధువుగా నుండుటకు పిలువబడిరి. వారికి వస్త్రములియ్యబడెను, ఆ యూదులు అన్ని విధములా క్రీస్తుకు విరోధులు. వారు గ్రుడ్డితనముచే అలాగయిరని బైబిలు చెప్పెను. మీ నిమిత్తము వారు గ్రుడ్డివారయిరి, లేనిచో వారు చేర్చుకొందురని నీతిమంతుడగు దేవుడెరుగును, కాని మీ కోసమే వారు అంధులయిరి. ఆలాగు బైబిలు చెప్పెను.

68రోమా సామ్రాజ్యము దేనివలన బంధింపబడెను? మత అధికారమువలన రోమా బంధించబడెను. అన్యరోమ్ పోపుగా మారి, దానియొక్క క్రైస్తవ ఆచారములచే అది బంధింపబడెను, అనగా క్రైస్తవ మార్గములోని ఒక భాగముతో రోమ్లోని మూఢనమ్మకము లన్నింటిని ఒక్కటిగా కూర్చి, స్త్రీని ఆరాధించుట క్రిస్మసు ప౦డుగను చేయుట, మరియు ఇలాటి అనేక కార్యములను, మరియు పరిశుద్ద సెలవు దినములను, మరియు పవిత్ర దినములు వంటి కార్యములను చేర్చిరి. విప్పబడని బంధకములవలె ఆచారములు తయారయినవి, అవి క్రైస్తవ నియమములకు విరోధము. అదే విధమైన దేవుడు కాని దానిని ఆరాధించే అన్య ఆత్మ! యెహెజ్కేలు, మరియు ఇంకా ఆయా ప్రవక్తలు చెప్పినట్లుగా ఆ ఆత్మ ప్రపంచములోని దేశములన్నింటిలోను వ్యాపించినది. అవి యూదుల మీదికి పంపబడెను, ఆ ఆత్మను గూర్చి వారేమి ఎరుగరు. అదే ముద్ర క్రింద దాగియున్న మర్మయుక్తమైన రహస్యం, దానిని ముందే మనము కనుగొంటిమి, చూసారా. గమనించండి ఇప్పుడు, ఆ బూరను మీకు చూపించబోవుచున్నాను. చివరి బూర ఊదునప్పుడు ఏమి జరుగుచున్నది. ఈ బూరలు అన్యులపైకి కాదు అవి యూదుల మీదికి ఊదినవి. ముద్రలు విప్పబడినప్పుడు అన్యజాతి (వధువు) ముద్రింపబడుచున్నది. సమయము సమాప్తమగుచున్నది; సంఘము పిలువబడుచున్నది.

1COR 15:52

 

69ఆ దర్శనము మీకు గుర్తున్నదా? దానికి ముందున్నది చూడండి. గత ఆదివారములోనిది ఎందరికి గుర్తున్నది? అక్షరాలా అది జరిగినది. ఆ మురికిగా, అపవిత్రముగానున్న దానిని సంఘమని పిలచెను. (పూర్తిగా అసభ్యతకు చేరినది), ప్రతి దేశములోని చిన్న వధువుయు వారున్న దేశపువారివలె దుస్తులు ధరించిరి. ప్రభుని ఎదుట నడచుచుండిరి. మీరు గమనించండి, "ఉపద్రవములకు (శ్రమలకు) ముందు సంఘము ఎత్తబడునని అనుకున్నాను! ఎత్తబడుట ఉన్నదని నేను అనుకున్నాను" అని వారు చెప్పే కాలం ఒకటి రాబోవుచున్నది."

అది ఎప్పుడో జరిగినది కాని వారది ఎరుగరు. ఒకసారి యోహాను గూర్చి ఆయన అదే చెప్పుటను మీరెరుగుదురు.

"ఏలియా ముందు వచ్చునని శాస్త్రులు ఏల చెప్పుచున్నారు?"

"అతడు ఎప్పుడో వచ్చెను" అని ఆయన చెప్పెను. శిష్యులకు కూడా అది తెలియలేదు. వారాతనికి చేయవలసినది చేసిరి." ఎత్తబడుటయు అలాగే యుండును. అనుకొనని ఒక ఘడియలో ఆలాగు చేయుదునని ఆయన వాగ్దానము చేసెను. ఏలియాను ఆ విధంగా చూపించెదనని ఆయన వాగ్దానము చేయలేదు గాని మీరనుకొనని ఘడియలో, రెప్పపాటు కాలములో వధువును కొనిపోదునని ఆయన వాగ్దానము చేసెను. నీవు విడిచిపెట్టబడుదువు. అదే ఆ కాలము!

70రెండువేల సంవత్సరముల నుండి ఈ ఆత్మ రోమా జనులలో నుండి గాని, రోమా సంఘములో నుండి వెడలిపోలేదు. అదే ఆత్మ రోమ్ నుండి ముస్సోలినీ నియంత మీదికి మొదట వచ్చెను.

జరుగబోయే ఐదు — ఏడు సంభవముల గురించి ఆయన 33వ సంవత్సరమున నాకు చూపించిన దానిని మీరెరుదురు? అందులో ఐదు ఇప్పటికే నెరవేరినవి. ఇప్పుడు దానిని గూర్చి డాక్టర్ లీవైల్ ఒక పుస్తకము వ్రాయుచున్నాడు, చూచారా. అయిదు సంగతులు ఖచ్చితంగా జరిగెను. రె౦డు జరుగవలెను. రాకడకు ముందు జరుగునని చెప్పెను. ఇప్పుడు మనము అంతమందున్నాము, ఆరవది జరుగబోవునట్లు కనిపించినది, చూచారా. ఖచ్చితంగా, నిస్సందేహముగా, జరుగబోవు యుద్దముల గూర్చి చెప్పబడినట్టే, అక్షరాలా జరిగెను. ఒక్కసారి కూడా అది తప్పుకాలేదు.

వినండి జనులారా, ప్రతి ఘడియ మనము పరిశోధించవలెను! ఎక్కడ నిలబడి యున్నామో మనమెరుగము — అతి సమీపములో!

REV 9:16

 

71ఇప్పుడు, ఇప్పుడు ఆయన వాటిని విప్పెను… ఆరవ ముద్ర క్రింద 200,000 ఆత్మీయ దయ్యములు రోమ్ నుండి బయలుదేరి జర్మనీలోని — హిట్లర్. గమనించండి, వారు రాజులవలె అధికారమును పొందుకున్నారు, కాని కిరీటమును ధరించలేదని పరిశుద్ద గ్రంథము చెప్పుచున్నది. నియంత ఒక కిరీటముగల రాజు కాదు, కాని రాజుగా అధికారమును పొందెను.

ఓ, ఇప్పుడు దేవుని యొక్క ఆత్మను నేను అనుభవించుచున్నాను (మీకు తెలుసా?) ఏమి చెప్పాలో ఏలాగు చెప్పాలో నాకు తెలియదు, చెప్పకుండా ఉండుట మంచిది.

REV 7:9•

REV 9:16,18

 

72గమనించండి, 200,000 దుర్మాతలు యూదుల మీదికి విడిచిపెట్టబడినవి. వారిని దహించిరి, సిలువ వేసిరి, వారి నాడులలో గాలి బుడగలనుంచిరి; వారిని చంపుటకు వాయువు (గాలి) లేనంతవరకు వారు వారిని ఆ విధంగా చేసి చంపిరి. వారు తుపాకీలలో వేసుకున్న తూటాలు అయిపోయేంత వరకు వారు వారిని కాల్చి చంపిరి. వారు తమకు చేతనయినదంతయూ చేసిరి. వారు ఆ శరీరములను కాల్చిరి. కంచెల మీద వ్రేలాడదీసిరి. పిల్లలను మరియు అందరిని, అమాయక ప్రజలను వారు చంపిరి. ఎందుకనగా యూదులగుటచే వారు వారిని ఆ విధంగా చేసిరి. కాని దేవుని యొక్క కృపచేత వారు అనర్హులైయుండి కూడా ఒక్కొక్కరికి ఒక అంగీని (వస్త్రము) యిచ్చెదనని ఆయన చెప్పెను. ఆయన కృప చేత మనము ఆయనను చూచుట (కనుగొనుట) కొరకై వారిని అంధులుగా చేసెను.

ఇంకా ఆ ఏడవ ముద్ర విప్పబడలేదని మీరెరుగుదురు; అది ఆయన యొక్క రాకడ.

73కావున వారు ఇంకా దాని క్రిందయుండగా… ఆయన యోహానుకు చూపించినట్లుగా మనకు ముందుగా ఆ దృశ్యమును చూపించెను. ఆయన అతడిని పైకి కొనిపోయి… ఒక సముద్రతీరమున నడుచుకుంటూ వస్తున్నప్పుడు, పేతురు, "నీ రొమ్మున ఆనుకొనియున్న ఇతడి గురించి ఏమిటని?" అడిగెను.

"అతడు నేను వచ్చువరకు జీవించియుండినయెడల మీకేమి?" అనడిగెను. చూడండి, అంతవరకు అతడు లేడు, ఆయన అతడిని పైకి కొనిపోయి, ఆయన వచ్చువరకు సంభవించబోయే సంభవములను అతడికి చూపించెను. అతడికి తన పూర్తి పధకమంతటిని చూపించెను.

74గమనించండి, సహజమైన శక్తిగల, సహజ దేశమైన ఇశ్రాయేలు మీద బంధించియున్న వాటిని విప్పబడెను. అది దేనిని చేసినది? అది వెళ్ళి యుద్దమును చేసినది, హత్యలను చేసి హింసాకాండను జరిపెను.

ఇప్పుడు ఈ మార్గమునకు సంబంధమైన ఆధిక్యతతో… మీరు… దేవుడు మీ కన్నులను తెరచునని నేను నమ్ముచున్నాను. దీనిని ఈ సంఘమునకు మాత్రమే నేను చెప్పుట లేదని గ్రహించుచున్నాను. ఈ టేపు ప్రపంచమంతా వెళ్ళును. ఎవరి భావములను నేను చిన్నబుచ్చగోరుట లేదు, కాని నిజ౦ చెప్పుచున్నాను. ఇప్పుడు మతసంబంధమైన ఆధిక్యత ప్రాచీన అన్యరోమ్ దేశము నుండి పునరుజ్జీవింపబడి, అది యూదుల యొద్దకు వెళ్ళినది. అది యూదులకు ఎప్పుడూ శత్రువే. ఇప్పుడు మతసంబంధ భాగము కూడా తెరువబడినది. (రోమ్ సింహమువలె నోరు తెరచుకొని జనులమీదికి ఉరికినది), అదెప్పుడూ దేవుని శత్రువే. అదే ఆత్మ ప్రపంచములోని నియంతల మీదికి వచ్చినది, ఎందుకనగా ఆ మత సంబంధమైన సిద్దాంతము అప్పటికి ఇంకా సడలలేదు. అది విప్పబడినది.

75అది ఏమి చేసినది?

మంచిది, అది ఏమి చేసినది? అతడు తంత్రములతో మరియు పొగుడుచు వచ్చునని ఆయన చెప్పెను. వాడేమి చేసెను? వాడు ప్రపంచ సంఘసమితిగా ప్రొటస్టెంటు సంఘములను కూర్చుచున్నాడు. క్రీస్తువిరోధి ఆత్మ వారిద్దరి మీదనున్నది. వారిని వధకు తెచ్చెను. ఇంతకుముందు చేసినట్టే చేసిరి. అది వధువుని పిలుచు సమయములో జరుగును. ఏలాగు? మత సంబంధమగు సంఘము మీద ఆత్మ వదలబడినది. ఎవరి శాఖలమీదకి కాదు గాని, వధువు మీదికి. దీనిని మీరు గ్రహించెదరు, ఆ సమయములో వధువు వెళ్ళదు. బైబిలు ఆలాగు చెప్పుచున్నది. సంఘము వెళ్ళును గాని వధువు వెళ్ళదు. దానిని మీరు చూడగలరా? సేవకులారా, మీ వలన చూడగలుగుచున్నదా, సహోదరులారా?

సంఘము పరిపూర్ణమవుట కొరకు శ్రమలోనికి వెళ్ళవలెనని మీరు చెప్పుచున్నారు. యేసుక్రీస్తు రక్తము వధువును పరిపూర్ణము చేయును. పెండ్లి చేసికొనుటకు భార్యను ఎన్నుకొను వ్యక్తి ఆమెను ఎక్కువ శిక్షకు గురిచేయడు; ఆమె ఇంతకుముందే ఆయన యొద్ద కృపను పొందుకున్నది; ఆమె ఆయన యొద్ద కృపను కనుగొనెను. ఆయన ఆమెను వివాహము చేసికొనుటకు ఖాయము చేసికొనెను. ఏది జరిగినను, ఆమెను (కీడు సంభవించు) స్థలముల యందున ఆయన తప్పించును. ఆయన కృప వారిపై ఎంతో గొప్పగా ఉండెను, మరియు ఆలాగుననే వధువుపై కూడా ఉండును, మరియు ఆలాగుననే వధువుపై ఉన్నది.

JOHN 6:37,44

 

76మనము అయోగ్యులము, నరక పాత్రులము, కాని ఆయన కృప మనలను పట్టుకొన్నది. ఎంతమంది నశించిరో, ఎందరు గ్రుడ్డివారయిరో చూడండి. నేను రక్షించబడిన ఘడియలో ఎందరు పావులున్నారో చూడండి. నన్ను ఒక ఉద్దేశ్యమును బట్టి దేవుడు రక్షించెను. ఆ ఉద్దేశ్యము నెరవేర్చుటకు ఆయన చిత్తమును బట్టి నేను తీర్మానము చేసికొన్నాను. ఏమైనాగాని నేను దానిని చేయగోరుచున్నాను.

ఈ ఘడియలో నేను చూచిన సంఘములను, వాటియొక్క గొప్ప వెలుగు - జిలుగులను, వాటికి ఐశ్వర్యములు కలిగి, మాకేమి కొదువలేదని వారు చెప్పుదురు, కాని వారు నిర్భాగ్యులుగాను, దిక్కుమాలినవారుగాను, గ్రుడ్డివారుగాను ఉంటూ నీ భుజములను తట్టుచు, వారితో రాజీపడమని నిన్ను వారు కోరుదురు, కాని నేను ఒక ఉద్దేశ్యము కొరకు జన్మించాను; దానిని ఖండించి, బయటకు పిలువగోరుదును! అవును, అది చేసెదను.

యేసు ఈ భూమిమీదికి వచ్చెను గాని ఆ సమయమున నూటికి ఒక్కరు కూడా ఇక్కడాయన ఉన్నట్లు గమనించలేదు. ఆయన ఎన్నిక చేయబడిన గుంపును చేర్చుకొన వచ్చెను. "నా తండ్రి ఆకర్షించితేనేగాని ఎవడును నా యొద్దకు రాలేడు. తండ్రి నాకనుగ్రహించిన వారందరూ నా యొద్దకు వచ్చెదరు." (భూతకాలము) వారిది తెలిసికొందురు; వారు విందురు.

77గమనించండి, ఈ మతసంబంధమగు ఆత్మ విడువబడియున్నది. ఇప్పుడు, ఆ యుద్దమైన పాతికేండ్ల తరువాత మరల మనము మతసంబంధమగు ఆత్మ విడువబడుట చూచుచున్నాము. దేనిక్రింద? ఏడవ ముద్ర, యూదులకు ఏడవ బూర ఊదబడెను. చంద్రునికి మబ్బు క్రమ్ముట చూడండి. దేనిక్రింద? దానిని చిత్రముగా చిత్రించిన దానిని చూచితిరా? సంఘము నుండి మనుష్యకుమారుడు తోలివేయబడెను. మతసంబంధమగు గుంపులతో వారు కలిసిరి. ఇది ప్రపంచ సంఘసమాఖ్య. ఇది ఐక్యత యొక్క కదలిక, అది ప్రతియొక్క వ్యక్తిని నడిపించినది…. ఇది దేనికొరకు నిలబడినది? నీ సువార్త బోధను మరియు నీ సమస్తమును వారికి సమర్పించుకోవలెను. సమ్మతింపకుండా ఇద్దరు ఏలాగు కూడి నడతురు? వారివలన కాదు, వారివలన కాదని యేసు చెప్పెను. మెతడిస్టువారు, బాప్టిస్టు వారు ఏలాగు కలిసి నడచెదరు? క్రీసు సంఘము వారు, ప్రెస్బిటేరియనులతో ఎట్లు నడచెదరు? కాతలిక్కులు, ప్రొటస్టెంటు వారితో ఎట్లు నడచెదరు? వధువు వాక్యమైన క్రీస్తుతో కలిసి నడచును. కాని వధువు వాక్యముతో నడచును, క్రీస్తే వాక్యమైయున్నాడు; అందుకు తప్పకుండా సమ్మతించవలెను, అది మత సంబంధమైన సిద్దాంతపు సమ్మతము (ఒప్పందము) కాదు, కాని అది వాక్యమైయున్నది. నీవు వాక్యమును అంగీకరించి ఆ వాక్యానుసారముగా వాక్యముతో నడువవలెను, యేసు అలాగు చెప్పెను; అది సరియైనది చేయును.

78గమనించండి, అదిగో ఆమె అక్కడ వున్నది. విప్పబడియున్న ఈ కొద్ది చివరలను ఇప్పుడు అదే గ్రహింపునకు తీసుకురావటానికై ఆమె విప్పబడియున్నది. "ఓ, మంచిది, అందులో ఏమీ పెద్ద తేడాలేదని మీరందరు. హవ్వతో అలాగే చెప్పెను, "దానివలన పెద్ద తేడా ఏమియు లేదులే. అదేమి ఫరవాలేదులే, నిజంగానే దేవుడు మంచి దేవుడు, ఆయన మనలనందరిని ప్రేమించుచున్నాడు." ఆయన అలా చేయడు!

దేవుడు మంచివాడుగా వుండుటను గూర్చి మీరు చాలా వినుచున్నారు. ఆయన మంచి దేవుడే, కాని ఆయన మంచివాడుగా వుండుటచే నీతిగలవానిగా యుండవలెను. నీతి, న్యాయము లేకుండా మంచివాడు కాజాలడు; చట్టము లేకుండా న్యాయము లేదు, శిక్ష లేకుండా న్యాయము లేదు. కాబట్టి మనము ఆ ఘడియలో జీవించుచున్నాము.

79గమనించండి, ఇప్పుడు త్వరితముగా, ఈ మతసంబంధ దయ్యములను గుర్తించండి. ఒక దైవిక ఐక్యదేశముల క్రింద, ఐక్యగుంపుగా ఏకమగుచు, తూర్పు మరియు పడమర దేశములు… దానియేలు చూచిన ఆ కుడి మరియు ఎడమ పాదములు విగ్రహ రూపములో ఏకమైయున్నట్టే ఇది ఉన్నది. వారు సమ్మతించరు గాని ఒకరితో ఒకరు కలువగోరుదురు. "ఐసన్హోవర్" అనగా "ఇనుము" అని ఆనాడు గుర్తించబడెను. "కృశ్చెవ్" అనగా "మట్టి" మరియు అతడు తన కాళ్ళకు ఉన్న చెప్పును తీసుకొని ఆ బల్లను కొట్టెను — దేశములు ఒక్కటిగా ఏకమవుతున్నప్పుడు, లేదా… ఐక్యరాజ్యసమితిలో కృశ్చెవ్ అలాగే చేసెను. దులుపుకోనుచు…

ఓ మై, నేడు మనము జీవించుచున్న ఘడియను, సంఘమును మరియు దాని పరిస్థితిని చూడండి. కాని దేవునికి వందనములు, చిన్న వధువు తన్ను సిద్దపరచుకొన్నది. ఎంతో సమయము లేదు, అలాగే యుండుడి. ఎంత కాలమో, ఎంత ఆలస్యమో నాకు తెలియదు గాని సమీపించినదని మనకందరికి తెలియును. (ఎప్పుడో ఎవరికీ తెలియదు)

80స్వాభావికముగా యూదులకేమి జరిగినదో గమనించండి. వారు దేవుని చట్టములను వెంబడించు జనులు. ఎన్ని సంఘములు ఉదయించినను, క్రీస్తును చూడలేనట్టి గ్రుడ్డివారైరి. శాసనములను అనుసరించుచు వచ్చిరి. దేవుడు వారికి ఒక్కొక్కరికి వస్త్రములను అనుగ్రహించెను, ఎందుకనగా వారు హత సాక్ష్యులుగా మరణించిరి, చూడండి. వారు మన నిమిత్తము అంధులైరి.

బైబిలు తప్ప మరి దేనినీ ఎరుగని సంఘమిచ్చటున్నది; మతపద్దతి, శాఖ, వారికి ఏమీ పట్టదు, దాని గురించి వారికి ఏమియూ తెలియదు, అది అంతయూ వారికీ అన్యమైనది. వారు ఆయనను మాత్రమే ఎరుగుదురు మరియు కేవలము ఆయనను మాత్రమే.

MATT 17:4•

MARK 9:5,7

 

81జనులు నేడు రూపాంతరపు కొండమీదనున్న పేతురును పోలియున్నారు. ఆ సహజాతీతమైనది చూచి వారు ఆశ్చర్యచకితులయిరి. "ప్రవక్తలకు ఒక సంఘము మోషేకు ఒక సంఘము కట్టుదమని" వారనిరి. పెంతెకోస్తువారు అలాగే చేసిరి. ఒక అసెంబ్లీ-ఆఫ్-గాడ్, ఒక ఏకత్వ సంఘము, ఒక ద్విత్వ సంఘము కట్టుదమనిరి. కాని అతడిలా మాట్లాడుచుండగానే యెహోవా ఈలాగు పలికెను, "ఈయన నా ప్రియకుమారుడు, వాక్యమైయున్నాడు; ఆయన మాట వినుడి; ఆయనే వాక్యము."

82మనము జీవించుచున్న ఈ ఘడియలో మతశక్తులు, ఆత్మలు ఏకమగుచు, ఒక పెద్ద మారణకాండ జరిపించుటకు సమాయత్తమగుచున్నవి. ఇప్పటికే ఈ దేశములో అది వ్రాతపూర్వక శాసనమగుచున్నది. ఆ సంస్థకు చెందని సంఘములు మూసివేయబడును. అది ఒక ఏకీభవము (ఐక్యత), అది ఒక వెలివేయుట, అది మృగము యొక్క ముద్రవలెయుండును. మృగము అనగా ఏమిటో ఇప్పుడు మీరు చూచుచున్నారు. అది ఒక అధికారము, మతాధికారము. నిజమగు దానికి పోలిక వలె అత్యంత సమీపముగావుండి, సాధ్యమైతే ఏర్పరచబడినవారిని సహితము అది మోసపుచ్చునని యేసు చెప్పెను. కాని ఆయన నేటికొరకు మనకు ఒక వాగ్దానము చేసెను. మనము మోసపుచ్చబడము, వాక్యమగు క్రీస్తు మనకు ప్రత్యక్షమగును.

ఈ సహజాతీత దయ్యములు మన కళ్ళకు కనిపించవు, కాని అవి ఏమి చేయుచున్నవో వాటిని మీరు చూడగలరు. చూచారా?

REV 19:11

 

83గమనించండి, ఆ గుంపు గుర్రము (మతము) పై సవారి చేయుచు వారితో కలువని వారిని అణచివేయుటకు సిద్దమగుచున్న సమయములో, వేరొక గుంపు సిద్దమగుచున్నది. ప్రకటన 19లో అక్కడే మరోసారి సంఘమును గురించి మనము వినుచున్నాము, ఆమె కూడా వచ్చును, కాని ఆ గుర్రముల మీద రాదు. ఆయన తెల్లని గుర్రముల మీద వచ్చెను. పరలోకపు సైన్యము తెల్లని గుర్రములను ఎక్కి ఆయన వెనుక వెళ్ళినదని పరిశుద్ద గ్రంథము చెప్పుచున్నది. ఆయన తెల్లని గుర్రము మీద వచ్చునని బైబిలు చెప్పెను. అది సరియేనా? యూఫ్రటీస్ నది యొద్దనున్న రెండు వేల సంవత్సరములుగా బంధించియున్నట్లు, సంఘము కూడా దాదాపుగా రెండువేల సంవత్సరములుగా సంఘ కాలములో హతసాక్ష్యులుగా మరణించిన వారిని పరిశుద్దాత్మచే కట్టబడియున్నది. కాని, యూఫ్రటీసు నదియొద్ద కట్టబడలేదు, కాని సిద్దాంతములు, మూఢ నమ్మకములనే ద్వారము యొద్ద కట్టబడి, మానవులచే రూపొందించబడిన పద్దతులవలన పరిశుద్దాత్మ సంఘములో పని చేయలేకపోయెను. కాని, ఆమె విడుదల పొందును, ఆమె తిరిగి వచ్చును. అది బైబిలు చెప్పెను. వీరిద్దరు ఆ యుద్ధ రంగములో కలసికొందురు. ఆదిలో లూసిఫరు, మిఖాయేలును కలుసుకున్నట్లుగా.

దాదాపు రెండువేల సంవత్సరములు వారు బంధించబడిరి — దాదాపు రెండు వేల సంవత్సరములు.

EZEK 9:4

 

84ఖచ్చితముగా రెండువేల సంవత్సరములు కాదు, (తీతు క్రీ.శ. 96లో) రోమనులు ఆపక చంపుచుండిరి. యూదులనెవరు చంపిరి? తీతు ఎవరు? ఒక రోమను సైన్యాధిపతి, స్త్రీలు, పిల్లలను మరియు సమస్తమును హతము చేసినందువలన రక్తము గవునుల గుండా పారినది. యెహెజ్కేలు 9లో అలాగు జరుగునని చెప్పలేదా? పట్టణము మధ్యకు వెళ్ళి ముద్ర వేసెను, పరిశుద్దాత్మకు వారు మొరపెట్టిరి. పిదప కట్టబడియున్న సంహరించు మనుష్యులు వచ్చి (వాళ్ళు వెళ్ళేవారిని "పట్టుకోండి, పట్టుకోండి" అనిరి) అక్కడున్న ప్రతివారిని వారు వధించిరి. యవ్వన స్త్రీలు - స్త్రీలను, పిల్లలను, చంటి బిడ్డలను, మరియు సమస్తమును, వారు వారందరిని వధించిరి. ఖచ్చితముగా, ఇక్కడ అదే మరల పునరావృతమగుచున్నది. ఆ మతసంబంధమగు పద్దతి (సిద్దాంతము) మరల బయలుదేరి వచ్చుచు దేవుడు అనబడే సమస్తమును అణిచి వేసి, నిర్మూలము చేయుచున్నది. ఓ, వారికి వారి ఆచారములు, సంస్థలు, శాఖలు ఉన్నవి, కాని బైబిలుతో వారికి పనిలేదు. దానిని వారు నమ్ముట లేదని మీయొద్ద వేగముగా చెప్పుదురు. అవునండి! సంఘము చెప్పినదే చెప్పవలెనని వారు చెప్పుదురు.

GEN 1:3•

ISA 7:14

 

85దేవుడు చెప్పునది అదియే; అదియే వాక్యము.

వధువు వాక్యముతోనే యుండును, వారిద్దరు ఒక్కటి. వారెట్లు ఏకమగుదురు? వ్రాయబడిన వాక్యము నీలోనికి వచ్చినప్పుడు నీవు, వాక్యము ఒక్కటిగా అయ్యెదరు. (అది కచ్చితముగా ఆయన వాగ్దానము), అప్పుడది అర్థమగును…

దేవునికి ఎట్టి అనువాదకుడు అవసరము లేదు. "మంచిది, దీనికి మేము ఈలాగు అర్ధము చెప్పుచున్నామని" వారందురు. నీకు దేనిని అనువదించు హక్కు లేదు. దేవుడే స్వంతగా తనకు తానే అనువదించుకొనును.

దేవుడు "వెలుగు కలుగునుగాకని" పలుకగా, వెలుగు కలిగెను. దానికెవరు అర్ధము చెప్పిరి? "ఒక కన్యక గర్భవతియగునని" ఆయన సెలవిచ్చెనని ఆయన పలుకగా, అలాగు జరిగెను. దానికెవరూ అర్థము చెప్పనవసరము లేదు. అది ముందే అనువదించబడినది. ఈనాడు ఈ సంగతులు జరుగునని ముందే దేవుడు చెప్పెను. అది ఆలాగే జరిగినది. దానికి ఎట్టి అర్థము అక్కర లేదు. దానికి అదే అనువదించుకొనును.

ఓ మై!

ISA 14:12•

REV 9:16•

REV 17:8

 

86ప్రకటన 9:1, ఐదవ బూర క్రింద… వారియొక్క రాజు — గమనించండి, (ఇప్పుడు ప్రకటన 9:1) 200,000 గుర్రముల గొప్ప గుంపు యొక్క రాజు, వారికి ఒక రాజు ఉ౦డెను. మరియు మనము గమనించినట్లయినయెడల, అది ఒక పడిపోయిన (త్రోయబడిన) నక్షత్రమైయున్నది. "ఓ లూసిఫరూ, నీవేల ఆకాశము నుండి పడితివి?" (ఓ, డా. స్మిత్ కు దానిని గురించి ఎట్లు సందేహము కలిగెనని తెలియలేదు, కాని ఫరవాలేదు. చూడండి? అది ఈ ఘడియ కొరకు కాదు. చూడండి? సరే.)… అది మట్టిలేని బిలము. వారి రాజు ఆ మట్టి లేని బిలమునకు రాజు, ప్రకటన 17:8. (నేను ఏదో ఒకదానిని ఇక్కడ వ్రాసియుంచుకున్నాను. దానిని నేను కొంచెం చదువబోవుచున్నాను ఇక్కడ మీరు చూడండి ప్రకటన - 17:8, అది ఏమి చెప్పుచున్నదనే దానిని నేను చూడవలయునని ఆశించుచున్నాను, ఎందుకనగా దీని తర్వాత ఏలాగు వెళ్ళవలెనో నాకు తెలియుట లేదు..), 17:8:

నీవు చూచిన ఆ మృగము ఉండెను గాని ఇప్పుడు లేదు; అయితే అది అగాధజలములో నుండి పైకి వచ్చుటకును నాశనమునకు పోవుటకును సిద్దముగా ఉన్నది. భూనివాసులలో జగదుత్పత్తి మొదలుకొని జీవగ్రంథమందు ఎవరి పేరు వ్రాయబడలేదో వారు, ఆ మృగమ౦దు౦డెను గాని ఇప్పుడు లేదు, అయితే ముందుకు వచ్చునన్న సంగతి తెలిసికొని ఆశ్చర్యపడుదురు.

చూచారా? ఒక పోపు చనిపోతే మరో పోపు ఎక్కుచుండును. ముందున్నది, ఇప్పుడు లేనిది, ఇంతకు ముందుండినది, ఇప్పుడు లేనిది అదే. దాని క్రమమును మార్చవద్దు. పోపు ఎల్లవేళలాయుండును. ప్రతీదీ — ప్రతీదీ అదే క్రమముగా వెళ్ళుచుండును.

87అదెక్కడికి వచ్చును? మట్టిలేని బిలములోనికి. వీరి నాయకుడు మట్టిలేని బిలములోనికి వెళ్ళునని బైబిలు చెప్పెను, అతడే వారి రాజు; ముక్కోణపు కిరీటముతో అతడు కూర్చొని ప్రొటస్టెంటులను తనతో కలుపుకొనుచున్నాడు.

ఒక రోజున లూథరను బోధకుడు ఈలాగు చెప్పుట నేను విన్నాను, "ప్రజలు ఈ కాలరు ఎందుకు ధరించానని అడుగుచున్నారు. అట్లు చేయని యెడల, ఇతరులమధ్య వారు నన్ను ఎలా తేడా కనుగొందురు?" అనెను. మీరు అప్పుడు ఉన్నారా? అవును, అది పరిహాసాస్పదమైనదిగా లేదా? ఆ మాట విని నాకు వాంతి వచ్చినట్లయినది, నేను వేదిక దిగి వెళ్ళిపోయాను. "ఒక్క తేడా కూడా ఉండకూడదని" వారు చెప్పిరి.

మార్టిన్ లూథర్ ఆ మాట విన్నచో, తన సమాధి మీదనుండి ఇట్లనును. "వేషధారులారా, నా పేరు చెప్పుకొనే అర్హత నీకు లేదు." చూచారా?

అయితే అది ఎక్కడ నుండి వచ్చినదో మీకు తెలుసా? "అక్కడ వ్యత్యాసమే లేదు."

88అక్కడ ఒక తేడా ఉన్నది, ప్రతి ఒక్కరిలో ఒక భేదము ఉన్నది. "పౌలు, బర్నబాల నుండి నన్ను వేరు చేయుడని" దేవుడు చెప్పెను. అది సరి. వారి సేవ… వేరు చేయుడి. దేవుడు వేరుపరచువాడు, దేనిని ఆయన కలుపువాడు కాడు. ఈనాడు సంఘము ఈతకు ఉపయోగించే వస్త్రములను ధరించుటకు, మరియు పొట్టి దుస్తులను, మరియు ఇంకా సమస్తమును ధరించుకొని, మరియు బయలుకు అటువంటి దుస్తులతో తిరుగుటకు వారిని అనుమతించు ఒక మంచి మిశ్రకుని కోరుచున్నది. దేవుడు చెప్పెను, "నన్ను వేరుపరచుము!" నిన్నునీవు లోకమునుండి వేరు పరచుకో.

LEV 23:23-27

 

89ప్రకటన గ్రంథము. వారి రాజు మట్టిలేని బిలమునుండి వచ్చెను. వాడు నాశనములోనికి వెళ్ళెను. లోపలికి వెళ్ళి, బయటకు వచ్చి లోపలికి వెళ్ళి, బయటకు వచ్చి, బయటకు వచ్చెను… గమనించండి, లేవీయ కాండము 23వ అధ్యాయము చూడండి. వాక్యముతో ఎట్లు ఆ అనువాదము క్రమముగా ఎంతో ఖచ్చితముగా పొందుపరచబడుచున్నది. దీనిని మనము ఇచ్చుటకు ప్రయత్నించుచున్నాము. ఆ క్రమమును చూడండి.

ఇప్పుడు మనము గమనించవలెను… మన పరిశుద్ద గ్రంథమును కొంచెం త్రిప్పుచూ, దానిని కొంచెం సేపు చదువుదాం. ప్రసంగి. ప్రసంగి కాదు, — లేవీయకాండము 23. దీనిని ఇక్కడ గమనించండి.

(లేవీయకాండము 23వ అధ్యాయము). ఇప్పుడు… (దీనిని మనము కోల్పోవుటకు ఇష్టపడుట లేదు, ఇప్పుడు, దేవుడు దానిని మన కోసము ఏ విధముగా వ్రాసియుంచెనో, ఆ విధముగానే దానిని గ్రహించుటకు మనము ఇష్టపడుచున్నాము. లేవీయ కాండములో కనుగొనలేక పోవుచున్నాను. నేను నిర్గమ కాండములో నేను కనుగొనగలనా?) సరి, ఇప్పుడు లేవీయకాండము.

మరియు [23వ వచనము] యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను.

నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనుము, ఏడవ నెలలో మొదటి దినము మీకు విశ్రాంతిదినము. అందులో జ్ఞాపకార్ధ శృ౦గధ్వని వినినప్పుడు మీరు పరిశుద్ద సంఘముగా కూడవలెను… [చూచారా?]

అందులో మీరు జీవనోపాధికరమైన ఏ పనియు చేయుట మాని యెహోవాకు హోమము చేయవలెను… [ఇప్పుడు, పరిశీలించండి. ఇప్పుడు, గమనించండి.]

మరియు దేవుడు మాట్లాడుచు… మోషేతో చెప్పెను,

ఏడవ నెల పదియవ దినము పాపము నిమిత్తమైన ప్రాయశ్చిత్తార్ధ దినము:…

90చూడండి? ప్రాయశ్చిత్తము నుండి వెంబడించుచున్నది…. ఇప్పుడు గమనించండి, బూర ధ్వని తర్వాత ప్రాయశ్చిత్తము వచ్చుచున్నది, చూడండి. ఎంత చక్కగానున్నది! చూచారా? ప్రాయశ్చిత్తార్ధ దినము బూరధ్వనికి తర్వాత వచ్చుచున్నది. ఇప్పుడు, ఏబది దినములుగా బూరను ఊదుట, పెంతెకోస్తు మనకు బూరధ్వనిని ఊదుటకు సాదృశ్యముగా నున్నది, అది ఏబది దినములు. ఇప్పుడు దీనికి తరువాత, యూదులు దానిని నిరాకరించిరి. వారు నిరాకరించిన ప్రాయశ్చిత్తమునకు తిరిగి పిలచుటకే ఆ బూర ధ్వని. ప్రాయశ్చిత్తమును వారు నిరాకరించిరి. మరియు వారు దానిని నిరాకరించిరి, కావుననే మన కన్నులు తెరువబడెను; వారి నేత్రములు మూయబడెను. ఈ బూరలూదిన సమయములో ముద్రలు విప్పబడినవి. మెస్సీయా వచ్చు ముందుగా ఈ బూరలూదబడును — ఎందుకనగా వారు పాలస్తీనాలో ఉండవలసి యున్నారు; మీకు జ్ఞాపకమున్నదా, వారిని ఐగుప్తు నుండి వెళ్ళగొట్టుటకు దేవుడు ఫరో హృదయమును కఠినపరచవలసి వచ్చెను. 144,000 మంది ఉండవలసిన వాగ్దాన దేశమునకు వారిని తిరిగి తెచ్చుటకు స్టాలీన్, ముస్సోలినీ మొదలగువారి హృదయములను ఆయన కఠినము చేయవలసివచ్చెను. ఎన్నో వేల సంవత్సరముల తరువాత 2,500 సంవత్సరముల తరువాత ప్రధమంగా ఇశ్రాయేలు ఒక రాజ్యముగా మారినది. స్వంత పతాకము, స్వంత సైన్యము కలిగి ఐక్యరాజ్య సమితిలో సభ్యత్వము పొందెను. ఇదే మొదటిసారి. భూమిమీద ప్రాచీన పతాకము మరల ఎగురుచున్నది. దావీదు యొక్క ఆరు కోణముల నక్షత్రము. చివరి దినములలో తిరిగి లేపెదనని ఆయన వాగ్దానము చేసెను. మనము నిస్సందేహముగా చివరి కాలములో ఉన్నాము.

91ప్రకటన 9ని త్వరగా గమనించండి, (ఏడవ ముద్రలో వారి రాజు మట్టిలేని బిలములో నుండి వచ్చెను), లేవీయకాండము. దాని అనువాదమును వాక్యములో ఎంత ఖచ్చితముగా పొందుపరచబడినది, ఎందుకనగా (చూచారా?) పెంతెకోస్తు ఉత్సవము అయిన వెంటనే ప్రాయశ్చిత్తపు దినము వచ్చినది. పెంతెకోస్తు పండుగకు, ప్రాయశ్చిత్త పండుగకు మధ్య చాలా వ్యవధియున్నది, బూరలు ఊదబడుటకు చాలా కాలవ్యవధి యున్నది.

చూడండి, పెంతెకోస్తు పండుగకు, బూరల పండుగకు మధ్య చాలా కాలవ్యవధి యున్నది. పెంతెకోస్తు పండుగ నుండి ప్రాయశ్చిత్త పండుగకు ఏబది దినముల వ్యవధి యున్నది. ఇప్పుడు, ఏబది దినములు ఖచ్చితముగా ఏడు సబ్బాతులు.

92మరియు ఏడు సబ్బాతులు ఏడు సంఘముల సంవత్సరములు…. సంఘకాలములు. అర్థమైనదా? చూడండి, చూచారా?

ఇప్పుడు, యూదులు గ్రుడ్డివారిగా చేయబడి పెంతెకోస్తు ప్రధము ఫలములు సంఘము మీద కుమ్మరించుచున్న కాలమంతయును వారు వేచి యున్నారు. హతసాక్ష్యుల కాలమును మనము చూచాము, సంఘసంస్కర్తల కాలము చూచాము, ఇప్పుడు బయటకు పిలువబడుచున్న కాలము, మూడు భాగములు; తండ్రి, కుమార, పరిశుద్దాత్మలు ఒక్కటనే ఆత్మ, చూచారా. అయితే ఏడు విశ్రాంతి దినములు, ఏడు సంఘకాలములు, కోత యొక్క ధ్యానపు వెన్నుల కట్టను అల్లాడించు దినము ఆరంభించి, సరిగ్గా ఏడు విశ్రాంతి దినములవరకు పెంతెకోస్తు పండుగ, తరువాత పెంతెకోస్తు జూబిలీ. అటు తర్వాత జూబిలీ నుండి ప్రాయశ్చిత్త దినమువరకు ఏడు విశ్రాంతి దినములు, ఏబది దినములు. ఏబది దినములు ముగిసేటప్పుడు చివరగా పాయశ్చిత్తము చెయ్యబడుచున్నది. అర్థమగుచున్నదా?

ఇప్పుడు ఇది ఒక మాదిరిగా సంఘములో,

93ఆయన దేవుని యొక్క కుమారునిగా, పెంతెకోస్తు కాలం ద్వారా వచ్చు కాలముల నుండి పరిశుద్ద ఆత్మ ద్వారా, ఆయన తనను సంఘమునకు బయలుపరచుకొనుచు వచ్చిన దానికి ఇది సాదృశ్యముగానున్నది, చూచారా. కొంచెం, కొంచెంగా, అభివృద్ధి చెందుచూ వచ్చినది: లూథర్ వలన నీతీకరణము, వెస్లీ ద్వారా శుద్దీకరణము, తరువాత పరిశుద్దాత్మ బాప్తిస్మము వచ్చినది;

REV 6:12

 

94ఇప్పుడు బయటకు పిలచు కాలము.

ఆరవ ముద్ర విప్పబడినప్పుడు, యూదులకు శ్రమలు ప్రారంభమగుచున్నవి. అదే సమయమున మతసంబంధమైన శ్రమ వచ్చుచున్నది, ఎందుకనగా వధువు అప్పటికే కొనిపోబడెను. విశ్రాంతి దినములు అయిపోయినవి, యూదులు పిలువబడుటకు సిద్దముగా నున్నారు. ఎక్కడికి? ప్రాయశ్చిత్త పండుగకు. ఓ, సంఘమా, నీవు దానిని చూడలేదా? ప్రాయశ్చిత్త పండుగకు పిలువబడుచున్నారు. ఎందుకు? ప్రాయశ్చిత్త ఆనవాలును గ్రహించుటకు — ఇంతవరకు వారు చేసిన (వారు అర్పించిన బలులు) కోళ్ళలను, బాతులను, ఇంకెప్పటికి సరిపోవు; జగత్తుకు పునాది వేయబడక ముందే వధించబడిన దేవుని గొర్రెపిల్ల. ఇశ్రాయేలు దానిని తెలుసుకొనును.

MARK 14:49

 

95గమనించండి, ఇక్కడ ఒక గొప్ప సంగతి ఉన్నది. చూడండి! ఈ రెండువేల సంసత్సరములు పరిశుద్దాత్మను శాఖలు బంధించినవి. దానిని మనము చూచాము. ఇప్పుడు, విశ్రాంతి దినములు, ఏడు విశ్రాంతి దినములను గమనించండి. ఎన్నో కాలములుగా వారివలన బయటకు రాలేకపోయిరి. పగలు, రాత్రి కాని దినము ఒకటి వచ్చునని బైబిల్ చెప్పెను. లేఖనములన్నియూ నెరవేరబడవలెనని యేసు చెప్పెను. అది నిజమైతే "ఆమేన్" చెప్పండి. పగలు కాని, రాత్రి కాని ఒక దినముండునని ప్రవక్త చెప్పెను. సాయంకాల సమయములో వెలుగుండును. ఏమిటది? తూర్పున ప్రకాశించు సూర్యుడే పశ్చిమాన ప్రకాశించును.

ఒక్కొక్కసారి దేవుడు ఉదయించుచు, అస్తమించుచుండును. అది నీ జీవితమునకు ఒక సాదృశ్యముగానున్నది. చిన్న బిడ్డ బలహీనముగా ఉదయమున జన్మించుచున్నది; సుమారుగా ఎనిమిది గంటలకు ఆ బిడ్డ పాఠశాలకు వెళ్ళుచున్నది, పదకొండున్నరకు ఆ చిన్న బిడ్డ విద్యాభ్యాసమును ముగించుకొని పాఠశాల నుండి బయటకు వచ్చుచున్నది, అప్పుడు పగలు ఉష్ణకాలము. ఏబది సంవత్సరముల వయస్సులో అది అస్తమించుటకు ప్రారంభించును: అరవై, డెభ్బై, తొంభై సంవత్సరములకు అది అస్తమించి మరుగైపోవుచున్నది. మరుసటి దినమున అది మరల ఉదయించుచు, జీవము, మరణము, సమాధి, పునరుత్థానము వున్నదనే దానిని అది చూపించుచున్నది.

96చూడండి, సూర్యునితో పాటు నాగరికత ప్రయాణము చేయుచున్నది. ప్రాచీన నాగరికత చైనాకున్నది (అందరూ దానిని ఎరుగుదురు). పరిశుద్దాత్మ ఎక్కడ పడినది? తూర్పు దేశములోని తూర్పు జనులమీద, సూర్యునితో కూడా సువార్త పయనించెను. అది తూర్పు నుండి జర్మనీలోనికి; జర్మనీలో నుండి ఇంగ్లాండులోనికి వచ్చెను (కాలువను మూడుసార్లు దాటెను); మధ్యధరా ప్రాంతము నుండి జర్మనీకి; మధ్యధరా ప్రాంతము నుండి తూర్పు జర్మనీకి, మధ్యధరా ప్రాంతము ద్వారా; జర్మనీలో నుండి ఇంగ్లిష్ కాలువ దాటి ఇంగ్లాండులోనికి వచ్చెను; ఇంగ్లీష్ కాలువను దాటి పసిఫిక్ - లేదా అట్లాంటిక్ సముద్రము దారి ద్వారా అమెరికా ఐక్యదేశములలోనికి; ఇప్పుడు, పశ్చిమతీరాన ఉన్నది! అది నాగరికతగల దేశములను దాటి ముందుకు పోతున్నది, నాగరికత ప్రయాణించినది; సువార్త దానితో ప్రయాణించినది. ఇప్పుడు సమస్త చెత్తా చెదారము పశ్చిమ తీరమున కలదు, అలలు పైకి ఎగసి దానిని చేర్చినని.

ZECH 14:6

 

97కాని నేటివరకు సూర్యుడు ప్రకాశించడని ప్రవక్త చెప్పెను; అది ఒక చీకటి దినముగా యుండును. వారికి చాలినంత వెలుగున్నది, నిజంగా ఒక వర్షపు దినమువలె ఉన్నది; వారు సంఘములలో చేరెదరు, ప్రభువును నమ్ముదురు, అది ఆ విధముగా యుండును; కాని సాయంకాల సమయమున మబ్బులు తొలగిపోవునని ఆయన చెప్పెను, శాఖలు కనుమరుగవును, అదే సువార్త, మాంసమైన అదే వాక్యము (లూకా 17:33లో ఆయన వాగ్దానము చేసెను), నీడలు తొలగి పోయినప్పుడు, అదే సువార్త, సాయంకాల సమయమున అదే కార్యములను చేయును.

అదే సువార్త, తూర్పు జనుల మధ్య ఆరంభకాలములో శరీరధారిగా జీవించిన అదే క్రీస్తు, అంత్యకాలమందును మరల పశ్చిమ జనుల మధ్య జీవించును. "సాయంకాలమున వెలుగు కలుగును." లేఖనమంతయూ దైవావేశము వలన ఇయ్యబడెను మరియు అది తప్పిపోదు.

98పెద్ద ఏబది దినములు గతించినవి; పెంతెకోస్తు పండుగ గతించినది. ఏడు విశ్రాంతి దినములు, తర్వాత బూరలు, ఏడవ సంఘకాలమునకు ఒక సాదృశ్యము (మాదిరి).

గుర్తుంచుకొనండి, గుర్తుంచుకొనండి, ఆరవ బూర క్రింద (మీరు వినుచున్నారా?) — ఆరవ బూర క్రింద పెంతెకోస్తులు పరిశుద్ద గ్రంథమును నిరాకరించిరి, నులివెచ్చనివారైరి, పెంతెకోస్తులు మాత్రమే కాదు, ఇతరులు కూడా ఆ విధముగా అయినారు. సంఘ ప్రపంచము క్రీస్తును విసర్జించెను, అయినను బయట నిలబెట్టిరి. మరియు అదే బూరలో… లేదా అదే ముద్రలో, అది తెరువబడినప్పుడు యేసు సంఘము బయట నిలబడుకొని, లోపలికి వెళ్ళుటకు ప్రయత్నించుటను సూచించుచున్నది; అదే సమయమున యూదుల కొరకు బూర ఊదబడును, వారు ప్రాయశ్చిత్త ఆనవాలును కనుగొనెదరు! మహిమ! హల్లేలూయ! ఓ మై!

పరిశుద్దాత్మ సంఘశాఖలనే నదుల యొద్ద దాదాపుగా రెండువేల సంవత్సరములుగా కట్టబడినది, కాని సాయంకాల వర్తమానమువలన సాయంకాల సమయములో అది విడిపించబడును: పరిశుద్దాత్మ మరల సంఘములోనికి వచ్చును, సాయంకాల సమయములో, క్రీస్తే, తనకుతానుగా, శరీరధారిగా ప్రత్యక్షమగును. ఆయన అట్లు చెప్పెను; దానిని ఆయన వాగ్దానము చేసెను.

JOHN 14:12•

HEB 13:8•

REV 10:7

 

99దానిలో మూడు దశలు కలవని నేను చెప్పితిని; అది హతసాక్ష్యుల కాలము, వారు హత సాక్ష్యులుగా మరణించినవారు, తర్వాత సంఘసంస్కర్తల కాలము, ఇప్పుడు బయటకు పిలువబడు కాలము. అది లవొదికయ కాలములో సమాప్తమగునప్పుడు, ప్రకటన గ్రంథము 10వ అధ్యాయము ప్రకారముగా పరిశుద్ద గ్రంథములోనున్న సమస్త మర్మములను వధువుకు తెలియజేయబడి యుండును. అది సరియేనా.

ప్రకటన 10 (ఇప్పుడు జాగ్రత్తగా వినండి), వాక్యము ద్వారా వధువు పిలువబడినది, క్రీస్తు తనకుతానుగా ఆ వధువును పిలచెను, హెబ్రి 13:8 తేటతెల్లమాయెను (ఆయన నిన్న, నేడు, నిరంతరము ఏకరీతిగా యున్నాడు. ఆయన క్రియ మారదు; "ఆయనయందు విశ్వాసముంచువాడు ఆయన చేయు క్రియలు చేయును." చూచారా?), లూకా 22 — లూకా 17:30, మరియు మలాకీ 4 కూడా, హెబ్రీ 4 వాగ్దానము చేయబడిన ఈ లేఖనములన్నియూ బయలుపరచబడినవి. ఆరవ మరియు ఏడవ ముద్ర మధ్యలోను, ఆరవ మరియు ఏడవ బూర మధ్యలోను సంభవించును.

100పెంతెకోస్తు పండుగ ఏడవ బూర కాలమప్పుడు, లేదా ఏడవ ముద్ర ఆరంభమవుటకు ముందు సమాప్తమగును, ఎందుకంటే పిదప మర్మమైన క్రీస్తు యొక్క రాకడ, యూదులకు కూడా బూర ఊదబడును. ఆరవ బూర ఊదినప్పుడు, అది బయలుపరచబడిన దేవుని కుమారుని మరియు తెలియజేయుచున్నది. ఒక అరగంట నిర్ణయించబడినది. గుర్తుంచుకొనండి, ఆరవ ముద్రలో బూరలన్నియూ ఊదబడును. ఆరవ ముద్ర మర్మములను ముగించును — ఆరవ ముద్ర క్రింద ఏడవది విప్పబడుటకు కొంచెం ముందుగా.

101గమనించండి, లేవీయకాండము 23 మరియు 26 చూడండి. వాక్యము ఎంత క్రమముగా ఉన్నదో చూడండి! పెంతెకోస్తు యొక్క చాలా కాలమునకు తర్వాత… ఇశ్రాయేలు దానిని నిరాకరించినది… పెంతెకోస్తు పండుగ ద్వారా అన్యసంఘములను ఆహ్వానించెను.

పెంతెకోస్తు పండుగను ఎందరు అర్థము చేసికొన్నారు? అది కోత యొక్క ప్రథమ ఫలములు, పునరుత్తానము యొక్క ప్రథమ ఫలము, అదియే పెంతెకోస్తు పండుగ.

జనులారా దీనిని కోల్పోవద్దు! మరియు ఈ టేపును వినుచున్నవారలారా, దీనిని జాగ్రత్తగా వినండి. ఇదే పెంతెకోస్తు పండుగ సమయము. యూదులు మౌనముగా ఉండిరి; వారు విసర్జించిరి. ఇప్పుడు వారు మరల ప్రాయశ్చిత్త పండుగకు పిలువబడవలెను. ఆ ప్రాయశ్చిత్తము ఎవరో మనకు తెలియును; వారెరుగరు. పెంతెకోస్తు జూబ్లీకి పిదప ఊదబడే బూర, యూదులను ఏకమగుటకు పిలుచుచున్నది. హిట్లర్ తదితరుల క్రింద శ్రమలనే బూర ఊదబడి వారిని వధించి, వాక్యము నెరవేరునట్లుగా యూదులు ఏకమవ్వవలెననేది మీరు చూడగలుగుచున్నారా? ఇప్పుడు మీకు అర్థమగుచున్నదా? దీనిని గ్రహించిన వారందరూ "ఆమేన్" చెప్పండి. సరే. మంచిది

LEV 23:27•

ZECH 13:6

 

102గమనించండి, ఇక్కడ ఉన్న లేవీయకాండము 26, లేఖనముల యొక్క క్రమమును చూడండి. పెంతెకోస్తు యొక్క దీర్ఘకాలము పిదప, అది వధువును బయటకు పిలుచుట సమాప్తమగును. వధువు ఒక సేవకుని ద్వారా బయటకు పిలువబడెను గాని తిరస్కరించెను. ఇశ్రాయేలునకు ప్రాయశ్చిత్త పండుగను గూర్చి తెలియచేయబడును. ఇప్పుడు లేవీయకాండము 16వ అధ్యాయములో ఇక్కడ దానినే చూడండి, ఆయన పెంతెకోస్తు పండుగ — లేదా ప్రాయశ్చిత్త పండుగకు ఆజ్ఞాపించిన దానికి ఇది సాదృశ్యముగా ఉన్నది. కాని ఈ స్థలమందు (ఓ, ఎంతటి పరిపూర్ణముగా అమర్చబడినది, బోధకులారా, చూచారా? దానిని గ్రహించుటకు కోల్పోవద్దు). లేవీయకాండము 23:26లో సూచించబడిన బూరల పండుగ, దుఃఖపడే (వ్యసన) పండుగ, చంపబడే పండుగ కాదు, పరిహారపు బలి ఇవ్వబడినది. (లేవీయకాండము 6వ అధ్యాయమునకు అది ఎంతో చక్కగా అమర్చబడినది), కాని ఇచ్చట మాత్రమే ఇశ్రాయేలు జనులు తమ పాపములకొరకై దుఃఖపడుచు ఏడ్చుచున్నారు.

నేటికిది చక్కగా తగియున్నది. మరల చంపబడుటకు కాదు (మోషే బండను రెండవసారి కొట్టినట్లుగా; అది పని చేయలేదు) ఒక మృగమును చంపుట కాదు గాని, పరిహారమును విసర్జించినందుకు ఏడ్చుచున్నారు. ఓ, మై!

ఇది ఒక బూర, నిరాకరించినవారికి పండుగ, అటుపిదప వారు మెస్సీయాను తెలుసుకొందురు.

ZECH 13:6

 

103గమనించండి! వారు వారి మెస్సియాను కనుగొనునప్పుడు, ఆయనను గురించి తెలుసుకొందురు. వారు ఎదురు చూచిన ఈయన ఈసారి అధికారముతో వచ్చును. అన్యవధువు కొరకు ఆయన అధికారముతో వచ్చును, మరియు యూదులు ఆయనను గుర్తించెదరు. (ఆరు నెలల క్రితం దీనిని గూర్చి మనము ఇక్కడ బోధించాము), "నీకు గాయములు ఎచ్చటయినవి? అని వారాయనను అడుగుదురు. (ఈ వర్తమానము ఎందరికి గుర్తున్నదో చేతులెత్తండి.) నీకు గాయములు ఎచ్చటయినవి?"

"నా స్నేహితుల ఇంటిలో," అని ఆయన చెప్పెను.

ఆ సమయమున నేను ప్రసంగించినది మీకు జ్ఞాపకముండును, యాకోబు పదార్ధములను, మరియు ఆహార ధాన్యమును తీసుకురమ్మని తన పిల్లలను ప౦పెను, మరియు యోసేపు వారిని ఎరుగనట్లు నటించెను. ఆ కార్యము లన్నియు జరిగిపోయిన తర్వాత, ఆ తరువాత అతడు తన్నుతాను తెలియపరచుకొనెను. మీకు గుర్తున్నదా? వారు చాలా భయపడి ఏడ్వసాగిరి. యాకోబు బాధలో నున్నట్టే యుండెను. ఇక్కడ యూదులు శ్రమలలో ఉన్నట్లుగా మనము చూచుచున్నాము, వారెచ్చటున్నారో వారికే తెలియదు.

కాని వారు తిరిగి వచ్చుచున్నారు; పరిహార బలిని వారు చూచినప్పుడు, బైబిలు వారిని గూర్చి చెప్పుచున్నది, వారు తమ గృహములలో నుండి వేరైరి, దినముల తరబడి ఏడ్చిరి. ఎట్లనగా - కలిగిన ఒకే ఒక్క కుమారుని పోగొట్టుకొన్న కుటుంబమువలె ఏడ్చిరి. "నీకు ఈ గాయములు ఎచ్చట ఏర్పడెను?"

"నా స్నేహితుల ఇంటిలో," అని ఆయన చెప్పెను.

GEN 45:5•

ZECH 13:6

 

104గుర్తుంచుకొనండి, వధువు అప్పటికే పరలోకములో యున్నది. యోసేపు భార్య రాజనగరులో ఉన్నది, యోసేపు తన చుట్టూన్న వారినందరిని పంపి వేసెను, అతడు తన సోదరులకు తన్నుతాను తెలియచేసికొనెను. మీరు చూచారా? ఆయన తన్నుతాను యూదులకు తెలియచేసికొను సమయములో ఆయన భార్య, పిల్లలు రాజనగరిలో ఉండిరి. అక్కడే పరిహారమున్నది, బూర మ్రోగును. వరందురు, "ఓ…" ఇది ఏమిటి? అక్కడే పరిహారమున్నది. "ఆ గాయములు ఎక్కడయినవి." అక్కడే అది ఉన్నది.

''నా స్నేహితుల ఇంటిలో."

గుర్తుంచుకొనండి, యోసేపు సోదరుడు ఏమి చెప్పెను? "మనము నిశ్చయముగా చంపబడుదుము. మనము కీడు చేశాము." — అది అట్లు౦డును.

"కాదు, ప్రాణములను రక్షించుటకు దేవుడీలాగు చేసెను," అని అతడనెను. ఆదికాండములోని గాధ మీకు గుర్తున్నదా? చూడండి, చూడండి? అన్యజనులలో నుండి వధువును రక్షించుటకు దేవుడాలాగు చేసెను.

"నా స్నేహితుల ఇంట్లో వాటిని పొందితిని, కాని కోపించవద్దు" అని ఆయన చెప్పెను. చూచారా? ''భయపడకండి.''

LEV 16:29•

LEV 23:27

 

105వారిట్లనిరి, "నిజంగా మనమాయనను చూడలేకపోతిమా? పరిహారముగా నున్న ఆయనను చూడలేకపోతిమా?" వారు తమ్మను తాము వేరుచేసికొని చాలా దినములు దుఃఖించిరి. ఏమిటది? పరిహారము. దుఃఖము.

ఈసారి, ఆయన రాక పాపపరిహారమును తెలియపరచుటకు. లేవీయ కాండము 16లో వలె నిరంతర బలి ఇక సాగదు. లేవీయకాండము 23లో వారు తమ పాపములకొరకు ఏడ్చెదరు; వారు ఆయనను తిరస్కరించినందున వారి పాపము నిలచియున్నది.

ఓ, మనమెక్కడున్నామో మీరెరుగరా? ఆ బూరలకు మనకు ఏ సంబంధము లేదనే దానిని మీరు చూడగలుగుచున్నారా? అవన్నియు ఆరవ ముద్ర క్రింద మ్రోగెను. పరిశుద్దాత్మ నన్ను వాటిని ఎందుకని చెప్పనీయుట లేదనేది మీరు గమనించినారా? పరలోకమందున్న తండ్రికి, ఇది సత్యమని తెలియును, బైబిలు నా ఎదుటున్నది. నిన్నటి ముందు రోజున (మొన్న) ఆయన నా గదిలోనికి వచ్చి, నాతో మాట్లాడి, నాకు బయలుపరచునంతవరకు నేను దానిని తెలిసికొనలేక పోయాను. నేను నా గదిలో నుండి బయటకు వచ్చి; నా భార్యతో, "ఇప్పుడు నాకు అర్ధమయినది, ఆయన ఇప్పుడే నా గదిలో నన్ను సంధించి నాకు తెలిపెను, ఇదిగో అది, నా ప్రియురాలా" అని చెప్పాను, (చూచారా?) ఇది పరిపూర్ణంగా పొందుపరచబడినది.

ఓ, ఆయనలేని జనులు త్వరితముగా లోనికి ప్రవేశించండి, ఒకవేళ ఇదియే మీ చివరి తరుణమై యుండవచ్చును. ఆయన ఏ సమయములో వచ్చునో మనకు తెలియదు.

బూరల పండుగ… వారు ఒకరికొకరు వేరై బిడ్డను పోగొట్టుకున్న వ్యక్తివలె ప్రార్ధి౦చి ఏడ్చెదరని పరిశుద్ద గ్రంథము తెలుపుచున్నది.

REV 11:1-3

 

106చూడండి! ఒక్క సంగతి మీకు చెప్పగోరుచున్నాను. ఇప్పుడు జాగ్రత్తగా గమనించండి, దీనిని తప్పిపోవద్దు. ఎంత సంచలనము కలిగించును! ఏడవ దూత యొక్క (ఏడవ ముద్రయొక్క దూత) వర్తమానము నుండి (ప్రకటన 10లో ఏడవ ముద్ర) ఏడు బూరలవరకు. ఈ రెండు కాలములకు మధ్య… ఓ, దేవా! జనులు అర్థంచేసుకొనులాగున దీనిని నేను ఎట్లు చెప్పవలెను? అది ఆరవ బూరకు (ఆరవ బూరయు, ఆరవ ముద్రయు ఒకే సమయమున పలుకును), ఆరవ బూరకును, ఏడవ బూరకు మధ్యలో అన్యజనులకై ఒక ప్రవక్త కనబడి, జనులను ఆది పెంతెకోస్తునకు పిలువవలెను. మరియు ప్రకటన 11లో చెప్పబడియున్న ఇద్దరు సాక్ష్యులు యూదుల యొద్ద ప్రత్యక్షమై వారిని యేసు యొద్దకు పంపించునప్పుడు, సంఘము ఎత్తబడును — ప్రవక్తలందరును. ఆమేన్! దేవుని యొక్క వాక్యము ఎన్నడును తప్పిపోదు. అది ఒక శాఖగా ఉండదు! మీరు దానిని అర్థం చేసుకున్నారా?

REV 7:4•

REV 14:1,3

 

107ఆరు మరియు ఏడవ బూర మధ్య యూదులు పిలువబడినట్లున్నదో లేదో మీ పుస్తకములో చదవండి. ఐదవ, ఆరవ ముద్రల మధ్య - ఆరవ, ఏడవ ముద్రల మధ్య 144,000 మంది పిలువబడుట (మీకు జ్ఞాపకం ఉన్నదా?), అక్కడే బూరలు వచ్చుచున్నవి. అక్కడే (చూచారా?) గుర్రములు కట్లు విప్పబడి హింసించుచున్నవి.

అటు తర్వాత దాని మధ్యలో పెంతెకోస్తువారిని ఖండించు ఏడవ దూత వర్తమానము బోధించబడును. యేసును బయటకు త్రోసివేసిరి. ఏ ఒక్కరి సహాయము ఆయనకుండదు, ఆయన వెలుపలకు త్రోయబడి, నిరాకరించబడును (పరిశుద్ద గ్రంథము ఆ విధముగా చెప్పుచున్నది); క్రీస్తు మనమధ్య బయలుపడి, యేసు మనందరిమధ్య స్వచ్చమైన వాక్యముతో ప్రత్యక్ష్యమై, దానిని తెలుసుకొనునట్లు చేసెను… ఇది ఏదో ఒక కల్పితము కాదు, స్నేహితులారా, ఇది యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు అయివున్నది, ఇది లేఖనము.

108అదే సమయమున… ఇప్పుడు, సంఘము, వధువు పరస్పరము చేర్చబడిన వెంటనే ఆమె పైకి ఎత్తబడును; దానిలో ఏడవ ముద్ర యొక్క మర్మము, లేదా మర్మముగా వున్న ఏడవ ముద్ర గతించును. మరియు మర్మమైన ఏడవ బూర ద్వారా, ఏలియా మరియు మోషే అను ఇద్దరు ప్రవక్తల ద్వారా యూదులు పిలువబడుదురు. వారు మరల వచ్చెదరు, మరియు అక్కడ పెంతెకోస్తులందరు ఏకమగుదురు. ఏదో సంభవింపవలెనని వారు ఎదురు చూచుచున్నారు, మరియు సంఘము వెళ్ళిపోయినది, మరియు జరుగవలసినది యూదులకే!

MATT 17:3•

MARK 9:4•

JOHN 11:43,44

 

109ఇప్పుడు, అది మోషే కాదని ఎవరో తన మనస్సులో తలంచుటను గ్రహించుచున్నాను. అవును అది మోషేయే; ఇప్పుడు మీరు గుర్తుంచుకొనండి, మీ తలంపులను ఆయన నాకు తెలుపగలడు. దానిని నేను గ్రహించుచునే వచ్చాను… సరి.

అది మోషేయేనా, ఇది కదా మీ తలంపు. మోషే చనిపోయెను, కాబట్టి అది అతడైయుండడని మీరు తలంచుచున్నారు. అది ఏలియాయని మీరు తలంచుచున్నారు — అది నిజమే ఏలియానే అది, అది హానోకు అన్నది మీ ఆలోచన. మీరు చెప్పవచ్చు మోషే ముందే చనిపోయెనని కాని, అతడు మరల సజీవుడు కాగలడనేది గుర్తుంచుకొనండి. అతడు సజీవుడయ్యెను, ఎనిమిది వందల సంవత్సరముల తరువాత; అదే సంవత్సరములకు తరువాత అతడు రూపాంతరపు కొండమీద ప్రత్యక్షమయ్యెను. "ఒక వ్యక్తి చనిపోయిన తరువాత?" అని మీరు అడగవచ్చు. అవునయ్యా. లాజరు మరణించి, సజీవుడై, మరల చనిపోవలసి వచ్చెను. కాబట్టి అతడు మోషే కాడను ఆలోచనను మనస్సులో నుండి మీరు తీసివేసికొనండి; అతడు మోషేయే.

మీ సేవను గమనించండి, మోషే ఎలియాలు చేసిన విధముగానే వారు ఆకాశములను మూసిరి మరియు అగ్నిని కురిపించిరి… వారు ఏమి చేసిరో మీరెరుగుదురు.

REV 11:1-3

 

110దానిగూర్చి ఆలోచించుడి. జనులారా! ఇది చివరి కాలము. హల్లెలూయా! ప్రభువు యొక్క మహాదినము సమీపముగానున్నది. మీరు పోగవుడి. మెస్సీయా యొక్క వి౦దు, ఆయనను వారు విసర్జించెదరు, వారు ఆయనే మెస్సీయా అని తెలుసుకొందురు. దీనిని వారు చూచి ఆశ్చర్యపడుదురని బైబిలు చెప్పెను.

ప్రకటన 11, ఏడవ దూత! యొక్క వర్తమానము ద్వారా పెంతెకోస్తు ఆచారము నుండి వధువును బయటకు పిలిచినట్లుగానే, వారి సేవ కూడా, మోషే మరియు ఏలియాల సేవ ద్వారా ఇశ్రాయేలీయులను యూదుల ఆచారముల నుండి బయటకు రమ్మని పిలిచెదరు. ఈ మోషే మరియు ఎలీయాలు ఇశ్రాయేలీయులను గొర్రెపిల్ల, మరియు పొట్టేలు, మరియు రక్తము, మరియు మేకల మరియు పాపపరిహారపు బలుల నుండి నిజమైన బలియైన వాక్యమునకు పిలువబడుటనేది మీరు గుర్తించుకొనండి.

111మరియు అదే బూర క్రింద ఏడవ దూత యొక్క వర్తమానము, సమస్తము ఖచ్చితముగా అదే కార్యములు, అదే ముద్ర, అది ఏమి చెయ్యవలెను? వధువు పెంతెకోస్తు యొక్క ఆచారముల నుండి, మరియు లోక ఆచారముల నుండి నిజమైన పాప పరిహారపు వాక్యమనే క్రీస్తు యొద్దకు, మన మధ్యలో మాంసమైన వాక్యము యొద్దకు పిలుచుకొనివచ్చును.

పటముల (ఫోటో) ద్వారా సైన్సు దీనిని రుజువు చేసెను. ప్రపంచ వ్యాప్తముగా నున్న సంఘములు దీనిని ఎరుగును. దీనిని ధృఢంగా మనము ఎరుగుదుము. యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడని చెప్పినది ఎప్పుడూ సత్యమే. ఆయన నదియొద్ద ఆ మాట చెప్పలేదా? "బాప్తిస్మమిచ్చు యోహానును పంపినట్లు నిన్ను పంపు కాలమున ఈ వర్తమానము ద్వారా బయటకు పిలువు…"

నేను చూడగా పండ్రెండు గంటలయినది. స్నేహితులారా, అర్ధరాత్రి ఘడియ మనమీద ఉన్నది, వాక్యమెంత ఖచ్చితముగానున్నదో చూడండి. పరిపూర్ణముగా అది ఎంతటి —

MAL 4:6•

REV 13:11,12,16

 

112అది…

చూడండి, ఎదో ఒక సంస్థ అక్కడికి వెళ్ళి యూదులను పిలువదు గాని, మోషే ఏలియా అను ఇద్దరు ప్రవక్తలు వెళ్ళెదరు.

ఇప్పుడు గమనించండి, అన్యులలో నుండి వధువును పిలచుదునని మలాకీ 4లో వాగ్దానము చేసెను. ఏడవ సంఘకాలములో ఆయన బయట ఉండునని బైబిలు చెప్పెను. ఆయన సంఘమునకు వెలుపల ఉన్నాడు. అది పూర్తిగా అంధకారమును… అది ఎక్కడ అంధకారమైనది? అది మత సంబంధమైన దానిలోనికి వెళ్ళి ప్రపంచ సంఘ సమితిలోనికి ప్రవేశించును. ఆయన పూర్తిగా బయటికి త్రోసివేయబడవలెను; ఆయన వాక్యము, వారు ఆయన వాక్యమును సమ్మతించరు. వారు సమ్మతించరని మీకు తెలుసు. వారు తమ తమ స్థానిక గుంపులలోనే భేదములు కలిగియున్నారు. వారెట్లు వాక్యమును అంగీకరించగలరు? కాబట్టి వారు మరొక మృగముయొక్క ముద్రను వేసికొందురు.

మృగము యొక్క ప్రతిమ ఒకటి చేయబడినదని బైబిలు చెప్పిన మాట జ్ఞాపకము చేసికొనండి.

113ఈ అమెరికా సంఖ్య 13. అది పదమూడు రాష్ట్రములతో, పదమూడు నక్షత్రములతో, పదమూడు చారలతో అది ఆరంభమాయెను. పదమూడు సంఖ్య ఎల్లప్పుడూ స్త్రీయే. ఆమె ప్రకటన పదమూడవ అధ్యాయములో కనబడును. మొదటగా అతడు గొర్రెపిల్ల స్వాతికుడిగా కనిపించును. వాక్ స్వాతంత్ర్యము, మత స్వాతంత్ర్యము ఉండినది. పిదప అది అధికారమును పొందుకొని, దానికి ము౦దున్న ఘట సర్పము యొక్క అధికారముతో మాట్లాడినది. అది ఏమిటి? ఆ ఘటసర్పము ఏమిటి? ఆ ఘట సర్పము రోమ్. అది ఆ మృగము యొక్క ప్రతిమగా ముద్రను పొందుకొని నిజమైన దేవునికి సంఘమునకు విరోధముగా బయలుదేరును. శాఖలన్నియు ఒక్కటిగా చేరి ఈ విధముగా మూసివేయును. కాని, వారు ఆ విధముగా దానిని చెయ్యుటకు ఆరంబించినప్పుడు…

గొర్రెపిల్ల తన వధువును కొనిపోవును

నిత్యమూ ఆయన ప్రక్కనుండును.

పరలోక సైన్యమంతయూ కూడును;

ఓ! అది మహిమాన్విత దృశ్యము.

పరిశుద్దులందరూ మచ్చలేని తెల్లదనముతో నిత్యమూ యేసు విందులో పాల్గొందురు.

(ఆమేన్!)

"వచ్చి భోజనము చేయుడి?" యాజమానుడు పిలచుచున్నాడు.

"వచ్చి భోజనము చేయుడి;" … (ఆమేన్!)

మనము ఎట్టి దినము, ఎట్టి ఘడియలో జీవించుచున్నాము! జనులారా! మీ ప్రాణములను దక్కించుకొన పరుగిడి రండి!

ISA 18:1,3•

ISA 27:12,13

 

114ఇప్పుడు ముగింపులో గమనించండి, ఏడవ దూత యొక్క సేవలాంటి ఒక సేవ, ఇద్దరు హతసాక్ష్యులు ఏడవ బూర క్రింద, ఆరవ బూర క్రింద, ఏడవ బూరకు కొ౦చెం ముందుగా.

ఇప్పుడు జ్ఞాపకముంచుకొనండి, మరియు ఈ మహత్తరమైన బూరను గురించి మీ యొద్ద మాట్లాడెదనని నేను చెప్పితిని… ఆయన ఏమి చేస్తానని యెషయా గ్రంథములో చెప్పెను? ఆ మహత్తరమైన బూర పలుకునప్పుడు (మహత్తరమైన బూర, బూరలు కాదు, బూరల పండుగ, బూరలు ఊదుటకు ఇద్దరు కలరు మోషే మరియు ఏలియా), అయితే మహత్తరమైన బూర క్రింద (ప్రభుని రాకడ, యోసేపు మరల తిరిగి వచ్చుటను తెలుపుట, చూచారా?) దేశములన్నియు యెరూషలేము౦లో కూడుకొనును, ఆమేన్, దానిని మీరు యెషయూ గ్రంథములో చూడవచ్చును, కొంచెం సేపు ముందే దానిని నేను మీ యొద్ద చెప్పితిని, మనము చదివిన అధ్యాయములో అదొకటి; యెషయా 18:1 నుండి 3 వరకు.

యెషయా 27:12, 13లో ఆయన బూరను ఊదును, అప్పుడు ఇశ్రాయేలు తన స్వంత దేశములో ఉన్నదని దేవుడు ఆమెలో యున్నాడని సమస్త దేశములు తెలుసుకొనును.

115వధువు పెండ్లికుమారునితో ఉండుటకు వచ్చును, మరియు పెండ్లికుమారుడు వధువుతో (అణు శక్తిచే ప్రపంచము నాశనమైన తరువాత క్రొత్త భూమి మరియు కొత్త ఆకాశము వచ్చును, తరువాత వెయ్యేండ్లపాలన) నిత్యమూ జీవించును.

ఇప్పుడు గమనించండి! మోషే మరియు ఏలియా సేవను… అందరికి ఇది అర్థం అయినదా? దీనిని మరల మీకు చెప్పెదను. ఆరవ, ఏడవ బూరలను మధ్యలో మోషే మరియు ఏలియాల ఇద్దరి సేవ, వారు ఇద్దరు ప్రవక్తలు… వారు… ఇశ్రాయేలీయులు ఎల్లప్పుడు తమ ప్రవక్తలను విశ్వసించెదరు.

116ఇప్పుడు, (ఆయన దేవునియొక్క కుమారుడని ఇశ్రాయేలీయులకు చూపించవలెనని తలంచి నేను అక్కడికి వెళ్ళవలెనని నిర్ణయించుకొన్నప్పుడు) పరిశుద్దాత్మ నాతో, "ఇప్పుడు వద్దు" అని చెప్పెను? ఐదు సంవత్సరములకు ముందు నేను ఇండియాకు వెళ్ళే దారిలో మీకు జ్ఞాపకం ఉన్నదా? ఆయన "దానిని చెయ్యవద్దు" అని చెప్పెను.

"ఇది మెస్సీయా వలన కలిగినదయితే ప్రవక్త సూచన కనుపరచుము; మేము ప్రవక్తను నమ్ముదుము" అని వారు పలికిరి.

సహో, లెవి పెత్రస్ తదితరులు ఆ బైబిలును నాకు పంపిరి. ఇరాన్ నుండి వచ్చుచున్న యూదులకు, ఆయా దేశముల నుండి వచ్చుచున్న యూదులకు ఒక మిలియను బైబిళ్ళను వారు పంచిరి. వారొక దేశముగా కూడుకొనుచున్నారు.

"'ఇది నా సమయము" అనుకొన్నాను. నేను అప్పటికే ఐగుప్తులోని కైరోలో ఉన్నాను. అయితే "ఇంకా సమయము రాలేదు గనుక ఆ పని చెయ్యవద్దని" ఆయన నన్ను హెచ్చరించగా, నేను తిరిగి వచ్చితిని.

ఓ, మై!

ZECH 13:6

 

117మోషే మరియు ఏలియాలు పిలువవలసియున్నారు. పెంతెకోస్తు ఉత్సవము ఇంకా కొనసాగుచున్నది లేదా అది ఈ సమయము వరకు ఉండును, చూచారా. బూరల ప౦డుగ తెలియజేయబడును. మలాకీ 4లో దానికి దీనికి అసలు ఏ సంబంధము లేదు. లేనే లేదు, లేనే లేదు.

ఇక్కడ గమనించండి! ఇది మోషే యొక్క సేవయు, ఏలియా యొక్క సేవగా యున్నది. ఇశ్రాయేలీయులను యూదుల యొక్క పారంపర్య ఆచారముల నుండి మార్చి పిలచెదరు (వినండి!), వారు మిశ్రమమైయున్న యూదుల ఆచారములనుండి (వారు ప్రవక్తలైయున్నందున, వారు వీరిని (ప్రవక్తలను నమ్మెదరు), వీరు వారిని పాపపరిహారపు పండుగకు, క్రీస్తు యొద్ద తీసికొని వచ్చి, క్రీస్తును గుర్తెరుగునట్లు చేయుదురు. వారు, "ఆయన వచ్చుచున్నాడు," అని చెప్పెదరు. యూదులందరు ఏకముగా కూడుకొందురు, కార్యములన్నీ ఈ విధముగా సంభవించును, పిదప ఆయన వచ్చినప్పుడు, "ఇదిగో నేను ఇక్కడ," అని అనును. చూచారా?

"ఆ గాయములు ఎక్కడివి?"

"నా స్నేహితుల ఇంటిలో కలిగెను."

118ఇప్పుడు, ఆ ఇద్దరు ప్రవక్తలు చేసిన అదే అద్భుతములను… అన్యవధువు యొక్క ఏలియా అనే ఒక ప్రవక్తను కలిగియుందురు. అతడు వారిని వారి ఆచారముల నుండి బయటకు పిలుచును, ఆ ఇరువురు ప్రవక్తలు యూదులను యూదుల ఆచారముల నుండి పాపపరిహారమైన క్రీస్తు యొద్దకు పిలచునట్లుగా. అన్యవధువు ఇప్పటికే ఈ పాపపరిహారమును ఎరుగును, కాని ఈ ఏబది విశ్రాంతి దినములు, ఈ ఏడు విశ్రాంతి దినములనుండి వారు దానినుండి తొలగిపోయిరి, చివరి దినములలో వారిని ఆది పాపపరిహారమునకు మరల పిలువ వలయును.

ఏడు (వినండి!), ఏడు సంఘ దూతలు, ఏడు బూరల దూతలు ఇద్దరు ప్రవక్తలే. ఇప్పుడు, అది సత్యము. 144,000 మంది చొప్పించబడిరి (తీసుకొనబడిరి). ముద్రలను తెరచి పిలువబడేది అన్యజనులు మాత్రమే… అది అన్యజనుల కోసమే వుండవలయును. అది వారికొరకై తెరువబడి, అన్యజనుల సంఘమును చూచుటకు. అంతవరకే మనకు తెలుసు; దీనిని మనము వినుచున్నాము; ఇది ఎప్పుడో జరిగి పోయెను. యేసుకొరకు మనము చూచుచున్నాము.

"బ్రెన్హాం సోదరుడా! ఒక్క నిమిషము ఆగు! వారు మరేదో చేయుదురని నమ్ముచున్నాను," అని నీవనవచ్చును.

119అబ్రాహాము చూచిన చివరి గురుతు. వాగ్దాన కుమారుడు వచ్చు ముందుగా అబ్రాహాము చూచిన చివరి గురుతు ఏమిటి? (మనము అబ్రాహాము యొక్క రాజ సంతానము. వధువుగా ఉన్నాము) దేవుడు మానవ శరీరములో వచ్చి ఒక మానవుని యొక్క హృదయూలోచనలను బయట పెట్టెను. ఒక మనిషి, ఒక డజను మంది కాదు, ఒక మనిషి అనుకరణలు ఎన్నో వున్నప్పుడు వారు ఒకాయనను కలిగియున్నారు. ఆయన అక్కడున్నవారి హృదయాలోచనలను బయట పెట్టెను. ఏమిటి? తరువాత అబ్రాహాము, శారాలు యౌవ్వనమును పొందిరి. అది మనమెరుగుదుము.

ఇప్పుడు, అది కొద్దిగా మిమ్మును గలిబిలి చేయునని నాకు తెలియును. కాని గుర్తుంచుకొనండి, మీరు నిశ్చయంగా దీనిని తెలిసికొనవలెను. ఈ విధంగా మీరు బైబిలు చదువరు; మీరు దానిని లోతుగా చదివి గూడార్ధమును తెలుసుకొని (చూచారా?), దాని సన్నివేశమును చిత్రించుకొనవలెను.

GEN 18:12,14•

ROM 4:19

 

120గమనించండి! శారా ఒక ముసలి స్త్రీ, ఆమె గర్భము ఉడిగెనని బైబిలు చెప్పెను. అవునా? అబ్రాహాము కూడా మృతతుల్యుడే. అది సరియేనా? అబ్రాహాములోనున్న విత్తనము మురణించియున్నదనే దానిని జ్ఞాపకము వుంచుకోండి. కాని ఆ తరువాత నలుబది సంవత్సరములకు అతడు మరో స్త్రీ ద్వారా ఏడుగురు కుమారులను కనెను. ఏమి జరిగినది? ఆయన వారి శరీరములను మార్చెను.

చూడండి. వారు మూడువందల మైళ్ళ సుదీర్ఘ ప్రయాణము చేసి గెరారుకు వచ్చిరి? ముసలివారికది కష్టము. తమకు ఇక సంసార సంబంధముండదని శారా తలంచెను. (ఇరవై లేదా ఇంకా ఎక్కువ సంవత్సరములకు పైగానే వారు ఆ సంబంధము కోల్పోయిరి.) "నేను వృద్ధురాలను, మరియు నా యజమానుడు వృద్ధుడు, మేమెట్లు పిల్లలను కనగలము?" అని ప్రశ్నించెను.

"దేవునికి కష్టమైనది ఏదైనా ఉన్నదా?" అని ఆయనడిగెను.

GEN 20:1-4

 

121గమనించండి, ఏమి జరిగినది? ఆమె వెంటనే ఒక అందమగు స్త్రీగా మారినది. వాగ్దానము చేయబడిన కుమారుని పొందుకొనుట కొరకు ఆయన అబ్రాహాము యొక్క రాజసంతతికి ఏమి చెయ్యబోవుచున్నాడనే దానిని దాని ద్వారా చిత్రీకరించి చూపించెను. ఆమె యౌవ్వన స్త్రీగా మారినది… గమనించండి! వారు గెరారుకు వెళ్ళినప్పుడు ఏమి జరిగెను? రాజగు అబీమెలెకు ఆమెను ప్రేమించెను. "ఆమె చక్కగాను, అందముగాను ఉన్నట్లు" చెప్పెను. ఆమెను పెండ్లాడగోరెను. (అది సరియేనా?), ఈ వృద్ధురాలిని, మరియు అక్కడ అనేకమంది అందమైన స్త్రీలు వున్నను — వృద్ధురాలిని. "ఆమె అందమైనది — ఆమె చూచుటకు చక్కనైనదిగా ఉండెను." చూచారా?

దేవుడామె శరీరమును మార్చెను మరియు యూవ్వనస్థులుగా వారిని చేసెను. ఇది ఒక మర్మము దానిని ఇప్పుడు ఈ దినములో మనుష్యకుమారుని ద్వారా బయలుపరచబడినది (చూడండి?), సాయంకాలపు వర్తమానము, చూడండి. వెనుతిరిగి… వారు చూచిన చివరి గురుతు ఏమిటి? శరీరమార్పు రాక ముందే వివేచన వచ్చెను. కుమారుని పొందు ముందుగా ఏమి జరిగెను? "దేవుని బూర మ్రోగెను; క్రీస్తునందు మృతులు మొదట లేతురు (క్రొత్త శరీరము); ఆ తరువాత సజీవులమై నిలచియున్న మనము కనురెప్పపాటులో మార్పు పొందుదుము. (హల్లెలూయా!); ప్రభువును కలిసికొనుటకు మధ్యాకాశములోనికి వెళ్ళెదము." రహస్యము బయలుపడినది; ముద్రలు విప్పబడినవి; ఇశ్రాయేలు కొరకు బూర మ్రోగెను; వారి ఇద్దరు ప్రవక్తలు ప్రత్యకమగుటకు సిద్దముగా నున్నారు. ఏమిటది? వారు కనబడునట్లుగా సంఘము రంగము మీద నుండి తీసికొనబడును. ఇద్దరితో ఒకేసారి ఆయన వ్యవహరించడు; ఆయనాలాగు ఎన్నడూ చేయడు, చూచారా.

JOHN 1:29,36

 

122ఓ! సోదరుడా! గమనించుము! ఖచ్చితముగా, వారిని శాఖల నుండి మరియు ఆచారముల నుండి బయటకు పిలుచుటకు… పెంతెకోస్తు సంఘము సమాప్తమైనదని మనము చూచుచున్నాము. వధువు ఇప్పుడు పైకి ఎత్తబడవలసి యున్నది. ప్రకటనలోని ఇద్దరు దేవుని దాసులు, ఇద్దరు దేవుని దాసులు, ఏడవ బూర ఊదుటకు, క్రీస్తును వారికి బయలుపరచుటకు రంగము మీదికి వచ్చెదరు.

ఏడవ వర్తమానికుడు ఇట్లు చెప్పెను, "ఇదిగో, లోక పాపమును మోసికొని పోవుచున్న దేవుని గొర్రెపిల్ల." ఇదిగో మెతడిస్టు, ఇదిగో బాప్టిస్టు, ఇదిగో పెంతెకోస్తు అని అతడు చెప్పలేదు; కాని వాక్యమును, దేవుని కుమారుని, దేవుని గొర్రెపిల్లను చూడవలెను, లోక పాపమును మోసికొని పొవుచున్న గొర్రెపిల్ల అదే; మరో పునాది లేదు. యూదులు స్వదేశమును చేరిరి; "ఇంకా ఎంత కాలము కలదు?" అని వారు అడుగుచున్నారు. వధువు పిలువబడినది. ఆయన వాగ్దానము చేసిన ప్రతీది ఆయన చెప్పినట్టే ప్రతి లేఖనము నెరవేరినది; మనము సిద్దపడితిమి. ఆ ఘడియ ఇదే.

దేశములు ముక్కలగుచున్నవి;

ఇశాయేలు మేల్కోనుచున్నది;

బైబిలు ముందే చెప్పిన గురుతులు ఇవే:

అన్యుల దినములు లెక్కించబడినవి,

విడువబడినదానా, నీ స్వంతదాని యొద్దకు రమ్ము,

విమోచనా దినము దగ్గరయినది.

భీతితో మానవ హృదయములు చెదరిపోవుచున్నవి,

దేవుని ఆత్మతో నింపబడుడి,

మీ దివిటీలు శుభ్రము చేసి వెలుగనీయుడి;

పైకి చూడుడి, మీ విడుదల సమీపించినది.

అభద్ద ప్రవక్తలు అబద్దమాడుచున్నారు;

దేవుని సత్యము వారు నిరాకరించుచున్నారు,

యేసుక్రీస్తే మన దేవుడు.

(అది నిజము!)

అపోస్తలులు నడచిన త్రోవలో మనము నడచెదము,

ఏలయనగా విమోచనాదినము ఆసన్నమయినది;

భీతితో మానవ హృదయములు చెదిరిపోవుచున్నవి;

ఆత్మతో నింపబడుడి,

మీ దివిటరీలు శుభ్రపరచి వెలుగునీయండి;

(అవకాశము తిసుకోనకుడి.)

పైకి చూడుడి, మీ విమోచన ఆసన్నమైనది.

123సాయంకాల సమయమందు వెలుగుండునని ప్రవక్త చెప్పెను.

సాయంకాల సమయమందు వెలుగుండును;

మహిమ బాటను నిశ్చయంగా మీరు కనుగొందురు;

నీటి మార్గమే నేటి వెలుగు,

ప్రశస్తమగు యేసు నామములో సమాధి చేయబడుము.

యువకులు మరియు వృద్దులు, పాపముల గూర్తి పశ్చాత్తాప పడుడి;

పరిశుద్దాత్మ నిశ్చయంగా ప్రవేశించును.

సంధ్యా వెలుగులు వచ్చినవి;

దేవుడు, క్రీస్తు ఒక్కటే అనునది సత్యము.

మనము ఇచ్చటున్నాము! మనము అంతమ౦దు ఉన్నాము! ఇది ఏదో మానవుని మాట కాదు, అది యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు.

మన తలలు వంచుదము.

EXOD 20:19•

JOHN 1:1,14

 

124కృపగల దేవా, యెహోవా, సర్వశక్తుడా, సీనాయి కొండ మీద ఉరిమినవాడా, జనులు ఆనాడు ఇట్లనిరి, "దేవుడు మాట్లాడిన యెడల మేము చనిపోవుదుము. మోషే మాట్లాడితే చాలును." గొప్ప యెహోవా, నీవు ఇట్లు చెప్పితివి, "వారికొరకు ఒక ప్రవక్తను పుట్టించెదను. ఈ విధముగా ఇక మీదట వారితో మాట్లాడను. నీవు వాగ్దానము చేసిన దానిని నీవు చేసితివి. ప్రభువైన యేసును నీవు లేపితివి. ఆయన వాక్యమైయున్నాడని నీవు చెప్పితివి. "ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవునియొద్ద ఉండెను, వాక్యము దేవుడై యుండెను. ఆ వాక్యము శరీరధారియై మనమధ్య నివసించెను…"

పత్మసు ద్వీపములో తన ప్రవక్తయగు యోహాను ద్వారా ప్రవచించిన సంగతులు మనము చూచాము. అక్షరాలా అది నెరవేరుట మనము చూచాము. ఈ భూమి మీద పరిశుద్దాత్మ ప్రత్యక్ష్యమగుట మనము చూచాము. వాక్యమగు ఆయనను శాఖలు బయటకు త్రోసివేయుట మనము చూచాము. ప్రజలపట్ల వారికేమియూ లేదు గాని, వాక్యమునే వారు ద్వేషించుచున్నారు. అది వారి ఆచారమునకు విరోధము. ఈ భూమి మీద నీవు వాక్యముగా ఉన్నావు. వారి ఆచారములకు నీవు విరోధివి; వారు నిన్ను తమ సంఘముల నుండి బయటకు త్రోసివేసిరి.

125మరిప్పుడు, ప్రభువా, ఎక్కడను సహకారము లేదు. కొన్ని ఆత్మలు ఎదురుచూచుచున్న దక్షిణాఫ్రికాలోనికి వెళ్ళవలెనని నేను ప్రయత్నించుచున్నాను. ప్రభువా, ఎక్కడా నన్ను చేర్చుకొనుటకు ఇష్టపడుట లేదు. ప్రభువా, నన్ను బట్టి కాదు గాని, ప్రభువా, ఈ వర్తమానమునుబట్టియే, ఈ విధముగానే యుండునని నీవు చెప్పావు, దీనిని నీవు మాకు తెలియచేశావు, కనుక మేము అధైర్యపడము. మేము జీవించుచున్న ఈ ఘడియను ఎరుగుదుము.

దేవా, ఈ వేడిగానున్న గదిలో ఈ ఉదయమున జనులు కూర్చొనిరి. వారు జాగ్రత్తగా వినిరి. వారు ఇప్పుడు చూచితిరని నిశ్చయంగా నాకు తెలియును. ఒకవేళ వారికి అర్థము కాకపోయినయెడల ప్రభువా, ఆ బూరల గూర్చి నన్నెందుకు నీవు చెప్పనీయలేదో వారికి బయలుపరచుము. దానికి మనకు ఏమియు సంబంధము లేదని చూచుచున్నాము. ఆరవ ముద్ర క్రింద సమస్తము సంభవించెను. ఆరవ ముద్ర విప్పబడుటను మేము చూచితిమి. రెండు వారముల క్రితము వధువు మరియు సంఘము యొక్క దర్శనమును నేను చూచినట్లుగా చెప్పిన విధముగా, అట్లే నీవు నాకు చూపించిన విధముగానే ప్రభువా, నేను దానిని చెప్పితిని. ఇక్కడ మేము వున్నాము. మేము అనుకున్న దానికంటె ఆలస్యం కావచ్చును.

126ఓ, తండ్రీ, ఈ ఉదయమున ఎవరైనా మూఢ నమ్మకమును, వేదశాస్త్ర అభిప్రాయములను, ఎవరో ఒక వేద పండితుని వాక్యమును కలిగియుండి, (అది దేవుని యొక్క వాక్యమునకు విరోధము); సత్యమైన క్రీస్తును, సత్యమైన పరిశుద్దాత్మను ఎరుగని వారైయున్నయెడల, వారికి వాక్యము ఇంకా బయలుపడలేదు, ఈ దినములో వాక్యము ఎట్లు వుండవలెననేది చూడక ఒక ఆచారమును మాత్రమే చూచుచున్నారు; గ్రుడ్డితనము కలుగజేయు వెలుగును వారు చూచుచున్నారు. ప్రపంచమున ఎక్కడా జరగని ఒక గొప్ప దొంగతనము ఇంగ్లాడులో జరిగినది. అది నకిలీ వెలుగు ద్వారా జరిగించబడినది, మరియు ఆ విధముగానే మీ సంఘములో జరిగిన అతి పెద్ద దొంగతనమనేది వారు సత్యమైన పరిశుద్ద గ్రంథములోని క్రీస్తు యొక్క వెలుగును అంగీకరించుటకు నిరాకరించి, శాఖ యొక్క వెలుగును అంగీకరించుట జరిగినది. వారు ఒక శాఖా వెలుగును స్వీకరించి, బైబిలు యొక్క వెలుగు క్రీస్తును నిరాకరించినందువలన నీ సంఘమునకు గొప్ప దొ౦గతనము జరిగినది.

ఓ, దేవా, కృప చూపుము. ప్రభువా నశించిన వారిని రక్షించుము. యేసూ, మిమ్మును బ్రతిమాలుచున్నాను. మరి కొంత వ్యవధి ఇవ్వమని నేను అడుగుచున్నాను. మాకు ప్రియులున్నారు. మరికొంత వ్యవధి ఇమ్ము. ఆ కొండ నుండి ఆ గొప్ప రాయి తీయబడును. ప్రభువా, దానిని దయచేయుము. నీవు లేకుండా ఉన్నవారు ఈ ఉదయాన ఇక్కడ ఎవరైనా ఉన్నయెడల ఇప్పుడే నిన్ను స్వీకరించెదరు గాక.

127మనము తలలు వంచియుండగా, ఎవరైనను చేతులెత్తి ఇట్లు చెప్ప వచ్చును, "బ్రెన్హాం సోదరుడా, నన్ను జ్ఞాపకము చేసికొనుము." వేదిక నిండిపోయినది. దేవుడు నిన్ను దీవించును! దేవుడు నిన్ను దీవించును! అక్షరాలా వందలాది చేతులు పైకి లేచినవి.

JOHN 5:24•

REV 3:18

 

128తండ్రియగు దేవా, ఎక్కడో ఒక చిన్న నీడయున్నది. ప్రభువా, దానిని తీసివేయుము. వారు ఈ గదిలోనే యున్నారు. గతించిన కాలములో సాతాను వారి కన్నులకు గ్రుడ్డితనమును కలుగచేసియుండును, కాని అనేక దినముల క్రితము నీవు మాకు చేసినట్లుగానే దానిని చూడకుండా వుండునట్లు ప్రార్థించుచున్నాను. ఇప్పుడు మేమందరము చూచునట్లుగా మమ్ములను మరల పిలచుదురు… వారు గ్రుడ్డివారుగా వుండి ఎరుగనివారైయుందురని పరిశుద్ద గ్రంథము చెప్పుచున్నది. "నీ యొద్ద కాటుక కొనమని" నీవు సెలవిచ్చుచున్నావు. దేవా, వారు చూడగలుగునట్లుగా ఆ కాటుకను వాడనిమ్ము, కాని ఆదియందు అలాగే వున్నారు. ప్రభువా, నీ అనుగ్రహము ఇమ్ము ఇప్పుడే వారు పొందెదరు గాక! నీ కుమారుడు యేసు ద్వారా వీరిని నీకిచ్చుచున్నాను.

మరియు నీవిట్లు చెప్పితివి, "నా మాట విని (ప్రభువా, నాకు తెలిసినంతవరకు వారు విన్నారు.) నన్ను పంపినవానియందు విశ్వాసముంచువాడే (వాక్యము చెప్పినది నమ్మిరి, వేషధారులు కారు, కాని నిజముగా నమ్ముట) నిత్యజీవము గలవాడు; వారు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి యున్నారు. యోహాను 5:24,

ప్రభువా, ఈ ఘడియ నుండి వారు నీ వారగునట్లుగా కృప చూపుము. వారి మనస్సులో ఒక ఆశ్చర్యమున్నచో తీసివేయుము. మా మధ్య ఒక రోగియున్నచో ఆ గొప్ప పరిశుద్దాత్మ స్వస్థత ఇచ్చునట్లుగా ప్రభువా, ప్రార్థించుచున్నాను. (వారి ఆలోచనలను వెలికితీయుట ఈ వేదిక మీద చూచావు) దానిని వారు ఎరుగుదురు. నేను ప్రార్థించుచున్నాను, నీవు వారిని స్వస్థపరచుము, ప్రభువా. వారి ప్రశ్నలన్ని౦టికి జవాబు దయచేయుము.

ACTS 19:5•

GAL 1:8

 

129యేసుక్రీస్తు నామములో ఇంకా మునుగు బాప్తిస్మము పొందనివారి కొరకు కొలను సిద్దముగా యున్నది. పెండ్లికుమారుని పేరు ధరించుకొనండి. వారికి శాఖ సంబంధమైన, మత సంబంధమైన పద్దతి కలదు. తండ్రి, కుమార, పరిశుద్దాత్మలను బిరుదులలో ఎన్నడూ ఎవ్వరూ బాప్తిస్మము పొందలేదు, లేదా చిలకరింపబడలేదు, ఈ ఆచారములు ఈ సంఘకాలమునకు చెందియున్నవి. ఇది అంత్యక్రీస్తు ఉద్యమము, మృగపు ప్రతిమ. కాతలిక్కు సంఘము వచ్చువరకు ఎవరును తండ్రి, కుమార, పరిశుద్దాత్మ బిరుదులలో బాప్తిస్మము పొందలేదు. బైబిలు మరియు చరిత్ర యేసు నామములో బాప్తిస్మము పొందుటను గూర్చియే చెప్పెను.

పౌలు గలతీ 8:1 లో ఇట్లు చెప్పెను, "పరలోకము నుండి మరో దూత దిగి వచ్చి వేరొక సువార్త బోధించినయెడల శాపగ్రస్తుడగును." యేసుకు బాప్తిస్మమిచ్చిన యోహాను ద్వారా బాప్తిస్మము పొందినవారిని యేసుక్రీస్తు నామములో తిరిగి బాప్తిస్మము పొందమని అపొ.కా. 19లో నీవు ఆజ్ఞాపించితివి. "దేవదూత చెప్పినా మీరు వినకూడదు."

ACTS 2:38

 

130చివరి దినములలో ఒక వర్తమానికుడు వచ్చును. అసలు విశ్వాసము నొద్దకు, మొదటి ఫలము నొద్దకు తిరికి జనులను అతడు నడిపించును. మా మధ్యనున్న మహత్తరమైన వర్తమానికుడు, మహత్తరమైన క్రీస్తు, పరిశుద్దాత్మ, దానిని తేటపరచి, వాక్యమును తెరచి ఇచ్చి, దానిని మాకు బయలుపరచి ఇచ్చుచున్నాడు. ఆయనే మమ్మల్ని ఆది పెంతెకోస్తు విశ్వాసము నొద్దకు నడిపించునట్లు దయచూపుము, ప్రభువా, పెంతెకోస్తు దినమున పేతురు ఇట్లు చెప్పెను, ప్రతివాడు మారుమనస్సు పొంది పాపక్షమాపణ నిమిత్తము యేసుక్రీస్తు నామములో బాప్తిస్మము పొందవలెను. ప్రతివారికి, ఎన్నటికి అదే మార్గము. నైసియా యొద్ద రోము సంఘము వచ్చినంతవరకు అది ఆ విధముగానే ఒక్కొక్కరికి వుండి యున్నది.

దేవా, ఇప్పుడు కృప చూపుము. కొలను సిద్దముగా యున్నది. హృదయములను తెరవుము. ప్రభువైన యేసూ, రమ్ము, (మనము చివరి ఘడియలో వున్నాము). ఈ ఘడియలో వారు లోపలికి వచ్చుట సత్యమైతే, అది సత్యమని నేను నమ్ముచున్నాను. లోపలవున్న మేము ఆయన యొక్క వాక్యము ద్వారా మాట్లాడే దేవుని యొక్క స్వరమును విని, చూచిన, ఎరిగినవారమై, ఎటువంటి ఘడియలో మనము జీవించుచున్నామనే దానిని పరీక్షించుకొని చూచెదము. తండ్రీ, కృప చూపుము! నీ కుమారుని నామములో వీరిని నీకు అప్పగించుచున్నాను. ఇప్పుడు తలలు వంచెదము:

మృదువుగా మరియు నెమ్మదిగా యేసు పిలచుచున్నాడు,

నీ కొరకు మరియు నా కొరకు పిలచుచున్నాడు;

చూడండి, ఆయన ఎదురు చూచుచున్నాడు మరియు…

Search Messages

0 / 0 matches
Enter characters above to process real-time text query scopes...