శిబిరము వెలుపలకు వెళ్ళుట
1ఒక్క క్షణము లేచి నిలబడుదము. ప్రియదేవా, దేవుని ఆలయములో నిలబడి, సజీవ దేవునిని ఆరాధించు ఈ మరో భాగ్యమును అనుగ్రహించినందులకు మేము నీకు కృతజ్ఞులము. ఈ దేశములో ఇంకా ఈ భాగ్యమును కలిగియున్నందుకు మేమెంతయో నీకు ఋణస్తులము. మరియు ఈ నమ్మకస్తులగు జనులను బట్టి కూడా ఇప్పుడు మేము నీకు వందనములు చెల్లించుచున్నాము. ప్రభువా, వీరిలో చాలామంది అనేక మైళ్ళు, వందలకొలది మైళ్ళు ప్రయాణించి వచ్చిరి. అందులో కొందరు - ఈ రాత్రి తిరిగి విశాల మార్గములలో - ప్రధాన రహదారులను దాటి తిరిగి ప్రయాణమును చేయుటకు ఉద్రిక్తులైయున్నారు. దేవా, నీవు వారితో ఉండి, సహాయము చేయుమని నేను ప్రార్ధి౦చుచున్నాను. ఓ తండ్రీ, వారిని నడిపించుము.
మా కొరకు గాలిని తాత్కాలికముగా చల్లబరచిన ఈ చిన్న జల్లును బట్టి నీకు వందనములు చెల్లించుచున్నాము. మరియు, తండ్రీ, ఈ రాత్రి నీ వాక్యముతో మమ్మును సంధించుమని ప్రార్ధి౦చుచున్నాము. ఎందుకనగా అందుకొరకే ఇక్కడ మేము కూడియున్నాము. ప్రభువా, వాక్యములో నిన్ను కలిసికొనవలెననియే. ప్రభువా, మా కూడిక నీ రాజ్యమునకు ఎంతో ఉపయోగకరముగాను, మరియు మాకు సహాయకరముగా ఉండునట్లుగాను ఇతరులకు మేము సాయపడునట్లుగా చేయుము. యేసు నామమున ఇవి అనుగ్రహించమని మేము అడుగుచున్నాము. ఆమేన్. మీరు కూర్చొనవచ్చును.
2అక్కడ ఇప్పుడే కొద్ది వ్యక్తిగత పరిచయ సమీక్షలు జరిగినవి. మరియు ఈ కూటము ప్రారంభము అగుటకు కొంచెము ముందే బిల్లీ నాకు చాలా మంది మాట్లాడగోరుచున్నట్లుగా తెలుపు పత్రములు అనేకములను ఇచ్చెను - ఎట్లు ప్రారంభించవలెనో నాకు అసలు తెలియలేదు. కానీ సాయంకాలపు ఆరాధన కొరకు ఉండిపోవలెనను మీ ప్రయత్నమును బట్టి దేవుడు మిమ్మును దీవించవలెనని మేము ప్రార్ధి౦చుచున్నాము.
ప్రభుని చిత్తమయితే, వచ్చే ఆదివారపు ఉదయమున నేను మరల ఆరాధనను తీసికొందును. ఇప్పుడే నేను సంఘకాపరితో మాట్లాడాను, అది వారికి అనుకూలమేనని చెప్పిరి.
3ఇక్కడుండిన నా ప్రతి మంచి స్నేహితునిని గుర్తించగలిగిన సమయముంటే బాగుండునని నేను కోరుచున్నాను, కానీ మీరు కనిపెట్టుచున్నారని నాకు తెలియును. చాలా వేడిగా యున్నది. మరియు ఆ సమయమును నేను తీసికొనక ఈలాగు మాత్రమే చెప్పెదను: "దేవుడు మిమ్ము దీవించు గాక."
"దేవుడు మిమ్మును దీవించును గాక!" అని చెప్పుట కంటే మరే గొప్ప దానిని ఎవరునూ అడుగరని నాకు తెలియును. చూచారా? ఆయన అది చేసినట్లయితే నాకు అవసరమగునదంతయూ అదే, కేవలము అదే. "దేవుడు మిమ్ము ఆశీర్వదించును గాక" అను ఆ మాటయే భాషలో అతి గొప్పది అని నేను తలంచుచున్నాను. మరియు ఇప్పుడు… ఆయన అది చేయునని నాకు తెలియును.
4మరియు నేను స్నానము చేయుటకు ప్రయత్నించుచూ కొద్ది క్షణముల క్రితము నా భార్యతో నేను చెప్పినదేమనగా నేనెన్నడూ పొడిగా ఉండలేను అని నేను ఆరిపోచేసికొన్ననూ మరల తడిగా అవుదును. నేను తుడుచుకొనిన తరువాత కూడా నా చొక్కాను ధరించలేను. టుసాన్లో అది చిన్న తేడా. ఇంతకంటె రెండు రెట్లు వేడిగా ఉండును. కాని మీకేమీ చెమట పట్టదు. గాలిలో ఎట్టి తేమయూ ఉండదు గనుక మీరు బయటకు వచ్చిన వెంటనే ఆరిపోవును. అక్కడ మీరు పళ్ళెములో నీరు పెట్టినచో అది ఆవిరి అయిపోవును. మీకు చెమట రాదు. ఎందుకనగా మీలో నుండి అది బయటకు రాక ముందే అది దానిని తీసి వేయును. మీకు చెమట పట్టినా గాని దానిని మీరెన్నడూ చూడజాలరు. కాబట్టి. ఇక్కడ పొడిగా ఉండవలెనంటే చాలా అసాధ్యముగా యున్నది. ఇప్పుడు నేను నానిపోయి యున్నాను.
ఇంతకు ముందే అక్కడున్న గదిలో యున్నాను. అక్కడ అత్యవసర పరిస్థితిలో ఉన్న ఏడు, ఎనిమిది మంది యున్నారు. వెంటనే వారిని చూడవలసి వచ్చెను.
5మీరు రావలెననియు, వచ్చి యుండవలెననియు కోరుటకు కారణమేమనగా అది మనకు ఉపయోగకరము అని భావించుచున్నాను. స్నేహితులారా, లేనిచో అది నేను చేయను. ఎవరి మాటలో వినవలెనని లేదా నేను చెప్పగోరునది వినవలెనని లేదా మరేదో కోసరము మీరు రావలెనని నేను కోరుట విపరీతముగా ఆలోచించుచున్నాను. అది నేను చేయను. అది సరయినది కాదు. కేవలము అందుకొరకు వచ్చుటయే నా కోరిక అయినచో నేను మీ పట్ల నా ప్రేమను చూపించలేను. నేను మిమ్మును ప్రేమించునట్లుగా మీరు నన్ను ప్రేమించుచున్నారని నాకు తెలిసినప్పటికినీ మీరు వచ్చుదురని నాకు నమ్మకము లేదు. కనుక ఆలాగు నాకు తెలియును. లేకపోయినచో మీరు చేయుచున్న కార్యములు మీరు చేయరు. కనుక మీ గూర్చి నేను చాలినంతగా ఆలోచించుదును. మీకు దీనివలన ఏదో సహాయము అందునని నేను తలంచనిచో ఈ వేడి, ఈలాంటి పరిస్థితులలో మిమ్మును నేను కూర్చోబెట్టను.
6ఇక్కడికి నేను రాకముందు ఏదో ఒక చిన్నదానిని, ఒక విధమగు లేఖనమును, దేవుని యొద్ద నుండి పొందుటకు ఎల్లప్పుడునూ శాయశక్తులా నేను ప్రయత్నించుదును. వచ్చు ముందు చివరిగా ఆయన నడిపింపు కొరకు అడుగుదును. "ప్రభువగు దేవా, సహాయము చేయుము. ఆ ప్రియమగు ప్రజలకు ఏలాగయిననూ నీవు ఇవ్వగలిగిన అ౦తయూ ఇమ్ము." ఎల్లప్పుడూ నేను మీతోనే జీవించవలెనను ఆశ, నమ్మకము కలిగి యున్నాను. ఈలాగు మనము కూడికొని నిలబడియుండుటయే మనము కలిగియున్న అత్యల్ప సమయమని నేను నమ్ముచున్నాను. మనందరమూ కలిసి నిత్యత్వములో యుందుము. చూచారా? అది నేను చేయుదును. దానిని నేను నమ్ముచున్నాను. మరియు మీకు సహాయము చేయగోరుచున్నాను. నేను ఏదయినా తప్పు చెప్పినచో, అది ఉద్దేశపూర్వకముగా చెప్పినది కాదని పరమందున్న తండ్రి ఎరుగును. నేను తెలియకనే అది చేసితినని ఎరుగుడి. నేను దానిని అజ్ఞానరీత్యా చేసియుందును.
7కాబట్టి, మీరు నా బాధ్యత అని ఎరిగియుండి నా చేతుల మీద యుంచబడిన, సువార్త కొరకు. ఈ బైబిలు యొక్క పేజీలలోనే మిమ్మును ఎల్లప్పుడూ ఉంచవలెనని నా కోరిక. చాలా సార్లు ప్రజలు నా యొద్దకు వచ్చి ఈలాగు చెప్పుచుందురు. "బ్రెన్హాం సోదరుడా, జబ్బుగానున్న నా చిన్న బిడ్డకు నీవు వచ్చి "యెహోవా ఈలాగు సెలవిచ్చు చున్నాడు? అని చెప్పితే చాలును, బాగుపడును." వచ్చి ఆలాగు పలికినచో అది నయమవును. "నీవు చేయవలసినదంతయూ అదే."
అది చాలా విధేయతతో కూడినది మరియు చక్కనిది. ఎంతగానో దానిని నేను ప్రశంసించుదును కాని మొదట ఆయన నాకు తెలియచేయనిచో నేను దానిని చేయజాలనని మీరెరుగుదురు. చూచారా? నేను బిడ్డకొరకు ప్రార్ధి౦చగలను, నాకు సాధ్యమైనదంతయూ చేయుదును. కాని మీరు చూడండి. దానిని నేను ఉత్సుకత క్రింద చెప్పిన యెడల ఎట్లు౦డును? చూడండి? "యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు? అని నేను చెప్పిన యెడల అది నిజముగా నా యొక్క ఉత్సుకత ద్వారా పలికిన ఈలాగు సెలవిచ్చుచున్నాడే అగును. చూడండి. చూచారా? అప్పుడు అది జరుగవచ్చును లేదా అది జరుగకపోవచ్చును, నా ఉత్సుకత ద్వారా పలికినప్పుడు అది జరుగని యెడల ఆ వ్యక్తి ఎట్లు౦డును? కొన్నిసార్లు ఆ వ్యక్తి చావు బ్రతుకుల మధ్య నుండుట జరుగవచ్చును. అప్పుడు వారి నమ్మిక ఎక్కడుండును? నేను మరలా నా ఉత్సుకత ద్వారానే చెప్పుచున్నానేమోనని భయపడుదురు. చూడండి? కనుక దానిని నేను చెప్పునప్పుడు అది పూర్తిగా నిజము అని చెప్పుటకు నేను ధృడ నిశ్చయతను ముందే కలిగియుండగోరుదును. అప్పుడు ఆయన నాతో మాట్లాడినప్పుడు ఆయన నాకు చూపించిన దానిని మాత్రమే నేను చెప్పగలను. అది మంచి అయినా, చెడు అయినా దానిని నేను చెప్పవలెను. కొన్నిసార్లు ఆ సంగతులు ప్రజలకు చెప్పుట ఆనందకరముగా ఉండదు. అయినా గాని వారిని పతనము చేయు చెడు కార్యములను గూర్చి చెప్పవలసిన బాధ్యత నాపై యున్నది. ఎందుకనగా వారికి సంభవించు మేళ్ళు చెప్పవలసిన బాధ్యత ఎట్లున్నదో ఇదియూ ఆలాగే నాపై యున్నది.
ఏమయినా గాని, ప్రభుని యొక్క చిత్తమే మనకు కావలెను. కొన్నిసార్లు ప్రభుని యొక్క చిత్తము మన కోరికలకు వ్యతిరేకముగా యుండును. కాని ప్రభుని యొక్క చిత్తము మనము కోరుచున్నచో, ప్రభుని చిత్త ప్రకారము మన మీద కీడు జరుగనైయున్నదని తెలిసికొనుటయూ అంతే ప్రశస్తముగా ఉండును. అది మేలు అయినా, కీడు అయినా మనము ప్రభుని చిత్తమునే చేయగోరుచున్నాము. దానిని మనము ఆ విధముగానే చూతుమని నాకు తెలియును.
8ఆదివారము రాత్రి ఇరవై లేదా ముప్పది నిమిషముల వర్తమానమును వినుట ఇక్కడి సోదరులకు పరిపాటి అని నాకు తెలియును. ఆలాగు నేను చేయగలనో లేదో నాకు తెలియదు గనుక శాయశక్తులా నాకు సాధ్యమైనది చేయగోరుచున్నాను.
ఇది అయిన వెంటనే ఒక బాప్తిస్మ కార్యక్రమమున్నదని తలంచుచున్నాను. ఈ ఉదయమున ఒక గొప్ప గుంపు ప్రజలకు బాప్తిస్మమిచ్చి యున్నారని నేను విన్నాను. ఇక్కడ అన్నివేళలా, బాప్తిస్మము కొనసాగుచున్నది. సేవకులు, మొథడిస్టులు, బాప్టిస్టులు, ప్రెస్బిటేరియనులు, దేవుని సంఘము వారు, ఇంకా ఎవరెవరో వచ్చి ప్రభువైన యేసు క్రీస్తు నామములో బాప్తిస్మము పొందుచున్నారు. తీర్పు సమయమున దేవుని ఎదుట నేను నిలువబడినప్పుడు దానికి నేను జవాబు ఇయ్యవలెను. నా జీవితములోని ప్రతిదాని విషయములోను నేను నీతిమంతునిగా తీర్చబడియున్నానన్న స్పష్టతను నా ఆలోచనలలో కలిగియుండినట్లుగానే దాని విషయములోనూ కలిగియున్నచో, ఇప్పుడే నేను ఎత్తబడుటకు సిద్ధముగా యున్నాను, అది సువార్త సత్యమని నాకు తెలియును. చూచారా? అది సత్యము.
9యేసు క్రీస్తు నామములో తప్ప మరే ఇతర విధముగాను ఎవరునూ బాప్తిస్మము పొందలేదని బైబిలులోని లేఖనములు చెప్పుచున్నవి. "కాబట్టి మీరు సర్వలోకమునకు వెళ్ళి వారికి తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్దాత్మ యొక్కయు నామములో బాప్తిస్మము ఇయ్యుడి," అనునవి మాత్రమే తండ్రి కుమార పరిశుద్దాత్మ యొక్క ఆజ్ఞయై యున్నది. వారి పైన ఈ బిరుదులు ఉచ్చరించుట కాదు గాని తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్దాత్ముని యొక్కయు నామములో వారికి బాప్తిస్మమియ్య వలెను, అది ప్రభువైన యేసు క్రీస్తు నామము.
బైబిలునందలి ప్రతివారును యేసు క్రీస్తు నామములోనే బాప్తిస్మము పొందిరి. దానిలో నుండి ఒక్కమాట తీసివేసినా గాని, దానికి ఏ విధముగాను ఒక్కమాట చేర్చినా గాని అట్టివారికి శ్రమ! కనుక లేఖనములో నుండి ఒకటి తీసివేయుటకు గాని, ఒకటి కలుపుటకు గాని నాకు భయము కలిగించునది సరిపడునంత యున్నది. చాలా సార్లు అది నాకు బాధ కలిగించినది, కాని నేను అక్కడే నిలచియున్నాను. ఆయనే నా పరిరక్షకుడు. నా స్నేహితులలో చాలామంది నుండి వేరగుటకు అది కారణమాయెను. దానినిబట్టియే వారు నా నుండి విడిపోయిరి. కానీ ఈ ప్రభువగు యేసును కలిగియున్నంత కాలము నాకు చాలును. ఆయనే వాక్యము! మార్గము ఎంత కరకుగా యున్ననూ, త్రోవ ఎంత కఠినముగా యున్ననూ పరవాలేదు. ఆయన ఆ మార్గములోనే వచ్చెను. "ఇంటి యజమానుని వారు బయల్జెబూబు అని పిలచిన ఎడల, ఆయన శిష్యులను మరెంత ఎక్కువగా వారు పిలచుదురు!
10ఇప్పుడు, ప్రభువు మీతో యుండి ఈ వారమంతయూ మిమ్మును ఆశీర్వదించును గాక, మీకు ఎంత శ్రేష్టమైనది ఇవ్వవలెనని దేవునికి నేను ప్రార్ధి౦చగలనో అంత శ్రేష్ఠమైనది మీకివ్వవలెననియే నా ప్రార్థన.
ఇప్పుడు, ప్రశస్త వాక్యము నుండి మనము చదువగోరుచున్నాము. మరల ఇప్పుడు గుర్తు౦చుకొనండి. బుధవారము రాత్రి . [ఆరాధనలను గూర్చి సహో. నెవిల్తో సహో బ్రెన్హాం ముచ్చటించుచున్నారు.] సోమవారము మరియు మంగళవార రాత్రులందు గృహ కూటములు జరుగును. ప్రజలెరుగుదురని తలంచుచున్నాను.
11సహో. జూనియర్ జాకెసన్ ఈ భవనములో యున్నాడా? సహోదరుడా జాక్సన్, నాకు తెలియదు… ఆయన ఇక్కడున్నాడు. మంచిది, నేను… మరో సహో జాక్సన్ ఇక్కడ, మరియు సహో డాన్ రడెల్ ఈ రాత్రి ఈ భవనమందున్నాడా? సహో, డాన్? ఇక్కడున్నాడు. చాలామంది ఇతర సోదరులు. ఆర్కన్సాస్, లూసియానా, ఇంకా దేశములోని వివిధ స్థలముల నుండి వచ్చిన సోదరులను ఇక్కడ నేను చూచుచున్నాను.
ఈ రాత్రి కొందరు పెద్ద సోదరులు కూడా ఇచ్చటున్నారు. కుడివైపు సహో, థామస్ కిడ్ ఇక్కడ కూర్చొనియున్నాడు. కొద్ది రోజులలో ఎనుబది నాలుగు సంవత్సరములు నిండును. దాదాపు మూడు నాలుగు సంవత్సరముల క్రితము ప్రోస్టేటు నిమిత్తము శస్త్రచికిత్స జరిగినది. మరియు కాన్సరుతో చనిపోవుచుండెను. వైద్యుడు ఇక అతడు చనిపోవునని అక్కడుంచెను. ఒహియోలో ఆయన యొద్దకు వెళ్ళి నా పాత కారును శిధిలము చేయుట నాకు ఇష్టమాయెను. మరియు ప్రభువైన యేసు ఆయనను సంపూర్తిగా స్వస్థపరచెను. ఈ రాత్రి ఆయన, ఆయన యొక్క చిన్న సహధర్మచారిణి ఇక్కడున్నారు. మీలో అనేకులు వారిని ఎరుగుదురు. బహుశా కొందరు ఎరుగరు. కాని నేను జన్మించక ముందునుండియే సువార్తను బోధించుచున్న స్త్రీ, పురుషులు ఇచ్చట ఉన్నారు. దానిని గూర్చి ఆలోచించుచున్నచో నేను వృద్దుడనని అనిపించుచున్నది. చూచారా? అయితే వారిని చూచుచున్నప్పుడు, ఇంకా వారు పనిచేయుట చూడగా, నాకు ధైర్యము కలుగుచున్నది.
ఇక్కడ ఆ మూలన కూర్చొనియున్న సహో, బిల్ డాచ్ను మనందరము ఎరుగుదుము.
12ఓ! దేవుని యొక్క గొప్ప దీవెనలన్నింటి కొరకు ఎంతగా ఆయనకు వందనములు చెల్లించవలెను! కడబూర మ్రోగు వరకు అది మనతో ఎడతెగకయుండును గాక. మరియు "ప్రభువును మధ్యాకాశములో కలిసికొనుటకు మనందరము కలిసి ఎత్తబడుదుమని మీరెరుగుదురు. దానిని గూర్చి ఆలోచించుడి! తప్పిపోయిన మనుష్యులు, ఇక మీదట మిమ్మును చూడనేరరు, కాని మీరు తక్కిన గుంపుతో కలిసి వెళ్ళెదరు. "సజీవులమై నిలచియుండు మనము నిద్రించినవారికంటె ముందుగా ఆయన సన్నిధి చేరము" (వారిని "అడ్డగించజాలము" అన్నమాట) చనిపోయినవారు కాదు. క్రైస్తవులు చనిపోరు. వారు కేవలము చిన్న విశ్రాంతి పొందెదరు. చూచారా? అంతే! ఓ దేవుని యొక్క బూర మ్రోగును. క్రీస్తునందు మృతులు మొదట లేచెదరు." అనేకులకు కనబడెదరు. ఒక్కసారిగా మీరు నిలబడి చూచుట సంభవించును. "సరే. ఒక సోదరుడున్నాడు…" మరియు అది ఎక్కువసేపు పట్టదని కూడా మీకు తెలియును. కొద్ది నిమిషములలో ఒక్క క్షణములో, కనురెప్పపాటులో మనము మార్పుపొందుదుము. భూమి మీద కనబడకుండపోయిన వారితో కలిసికొందుము. ప్రభువును మధ్యాకాశములో కలిసికొనుటకు ఎత్తబడుదుము.
13లేఖనములలో మనము చూచిన వాటన్నింటిని బట్టియూ ఆలోచించినచో, మనము జీవించుచున్న ఈ ఘడియ యొక్క స్పష్టమగు ప్రత్యక్షతలను చూచినచో అది ఈ కూడిక ముగియక ముందే జరుగవచ్చును! ఈ రాత్రి దాని గూర్చి కాస్త ఆలోచించండి. అప్పుడు దాని ద్వారా, ఆయన వాక్యమును మనము సమీపించగలము, మనము హెబ్రి 13 అధ్యాయము తెరచుదము. హెబ్రి 13: 10-14 వరకు చదువుదము.
ఇప్పుడు, మన పతాకమునకు వందనము చెల్లించి ప్రతిజ్ఞ చేయునప్పుడు ఎల్లప్పుడును నిలబడుదుమని - నేను చెప్పుచుందును. (అది మంచిదే), ఆలాగే గొప్ప సంఘటన లన్నింటిలోనూ - అనగా మన దేశమునకు వందనము చెల్లించుట మొదలగు సందర్భములలో గౌరవసూచకముగా నిలబడుదుము. వారు ఆ నక్షత్ర అచ్చాదన పతాకము అని పాడునప్పుడు, మనము మన దృష్టిని కేంద్రీకరించి నిలబడుదుము.
HEB 13:10-14
14ఆలాగే క్రైస్తవ సైనికులముగా మనము దేవుని వాక్యము చదువుచుండగా లేచి నిలబడుదము.
చదువుచున్న వాక్యమును జాగ్రత్తగా వినండి. దానిని చదువుటకు ఇష్టత చూపుటకు కారణమేమనగా, నా మాటలు తప్పిపోవును గాని, ఆయనవి తప్పిపోవు. కాబట్టి ఆయన మాట మాత్రమే నేను చదివినచో మీరు దీవించబడెదరు. హెబ్రి 13 అధ్యాయము 10 పచనము:
మనకొక బలిపీఠమున్నది. దాని సంబంధమైన వాటిని తినుటకు గుడారములో సేవచేయు వారికి అధికారము లేదు.
వేటి రక్తము పాప పరిహారార్ధముగా పరిశుద్ధ స్థలములోనికి ప్రధాన యాజకుని చేత తేబడునో ఆ జంతువుల కళేబరములు శిబిరమునకు వెలుపట దహించబడును.
కావున యేసు కూడా తన స్వరక్తము చేత ప్రజలను పరిశుద్ధపరచుటకై గవిని వెలుపట శ్రమపొందెను.
కాబట్టి మనమాయన నిందను భరించుచు శిబిరము వెలుపలికి ఆయన యొద్దకు వెళ్ళుదము.
నిలువరమైన పట్టణము మనకిక్కడ లేదుగాని ఉండబోవుచున్నదాని కోసము ఎదురుచూచుచున్నాము.
15ఈ వాక్యమునకు బాధ్యత వహించు ప్రభువగు దేవుడే అన్ని యుగములలోను అది కల్తి చేయబడకుండా మన యొద్దకు వచ్చు బాధ్యతను వహించియున్నాడు. అది స్వచ్చమగు దేవుని యొక్క కన్యా వాక్యము. ఈ క్షణమందు మన హృదయములో ఎంతగానో దానిని ప్రీతికరముగా ఎంచుచున్నాము. ప్రభువా, ఈ వాక్యమును విరచి ఈ రాత్రి దానిని ఒక సందర్భములోనికి మార్చుము. మనష్యు పిల్లలమగు మేము దేవుని యొక్క పిలుపును గ్రహించునట్లుగా చేయుము. యేసు నామములో దీనిని మేము అడుగుచున్నాము. ఆమేన్.
16ఈ సాయంకాలమునకు నా అంశము - "శిబిరము వెలుపలకు వెళ్ళుట," చాలా చిన్న అంశము. అది కొద్ది వింతగా ఉండును. కాని మీకు తెలియును. సాధారణంగా మనము దేవునిని వింతసంగతులలోనే కనుగొందుము. ఒక ఆచార సంగతిలో ప్రపంచము ఎంతగా పాతుకొనిపోయినదంటే, ఒక క్రమ ధోరణి నుండి అక్రమ ధోరణికి ఏదయినా వెళ్ళినప్పుడు అది వింత అని ఎంచును. కొద్ది రోజుల క్రితము నేను ఈ ఆలయములో వింత వ్యక్తి అను అంశము మీద బోధించినట్లుగానే అది ఉన్నది. వ్యాపారికి వ్యవసాయదారుడు వింతగా యుండును. వ్యవసాయదారునికి వ్యాపారస్తుడు వింతగా ఉండును. అవిశ్వాసికి క్రైస్తవుడు వింతగా యుండును. నీవు ఎవరికో ఒకరికి వెర్రివానిగా కనిపించవలసియుందువు.
కనుక ఏదయినా వాడుకలో లేనిది నీవు వెంబడించినప్పడు మామూలు ధోరణిలో ఉన్నవారికి వెర్రిగా కనబడెదవు. కాబట్టి దేవుని ప్రజలు, ఆయన ప్రవక్తలు, వాక్యము నుండి ఆయన వర్తమానమును యుగములన్నింటిలోనూ మోసికొనివచ్చిన ఆయన వర్తమానికులు బయటివారికి వెర్రివారిగా కనబడిరి.
నోవహు ఆనాడు తాను బోధించిన ఆ గొప్ప జ్ఞాన ప్రపంచమునకు వెర్రివానివలె కనబడెను. తన కాలును సింహాసనము మీద మోపిన ఫరోకు మోషే నిశ్చయముగా ఒక వెర్రివానిలాగే యుండెను. ఎందుకనగా అతడు దానిని ఒక అడుసు త్రోక్కు గుంపు కొరకు అంతయూ విడిచిపెట్టెనని తలంచిరి. యేసు కూడా ప్రజలకు వెర్రివానివలెనె కనబడెను. మరియు దేవుని కొరకు పనిచేసి, జీవించిన ఆ మిగతావారందరునూ వెర్రివారిగా ఎంచబడిరి. వారు తాముండిన శిబిరము వెలుపలకు పోవలసివచ్చెను.
17మరి ఎక్కువగా, ప్రజలు క్రీస్తు యొద్దకు రాలేకపోవుచున్నారని నేను నమ్ముచున్నాను. ఆ విధముగా వారిని చేయుటకే నాకు తెలిసిన విధముగా, బహు తేటగా నా వాక్యమును ప్రకటించి సహాయము చేయుటకు నేనిక్కడుండి శాయశక్తులా ప్రయత్నించుచున్నాను. మీకిష్టమైనచో మీరు నాతో భరించుదురు.
దేశము నలుమూలలా నేను బోధించి ప్రజలను గమనించి చూచునప్పుడు. క్రీస్తునొద్దకు ప్రజలు వచ్చుటలేదని నాకు పూర్తిగా విశదమగుచున్నది. ఈ ఆటంకమును కలుగ చేసినది శత్రువే అని నేను నమ్ముచున్నాను. ఎందుకనగా ఆయనను వారికి గురిగా చూపించుట లేదని నేను విశ్వసించుచున్నాను. వారు ఒక మత నమ్మకము లేదా సిద్దాంతము లేదా ఒక పక్షము లేదా అనుభవము లేదా ఒక క్షణికోద్రోకము లేదా అట్టిది మరొక దాని వైపునకు క్రీస్తుయొక్క వాక్యమునకు బదులుగా త్రిప్పబడుచున్నారు. ఏదో మత నమ్మకము లేదా ఏదో భావోద్రేకము మీద తమ నిత్యత్వపు గురిని నిర్మించుకొనుచున్నారని నేను జనులను గూర్చి తలంచుచున్నాను. కొందరు "నేను ఆత్మయందు నాట్యమాడుచున్నాను" లేదా
"నేను భాషలు మాట్లాడుచున్నాను"
"నా మీద నుండి అగ్నిపారుచున్నట్లుగా అనిపించుచున్నది," అని చెప్పెదరు.
కానీ అవన్నియూ అపవాది ద్వారా అనుకరించబడునని మీకు తెలియునా?
18వాడు అనుకరించలేనిది ఒక్కటే యున్నది; అది వాక్యము!
వాడికి యేసుకు మధ్య వివాదము చెలరేగిన ప్రతిసారి, యేసు "ఈలాగు వ్రాయబడియున్నది" - వాక్యము! అని చెప్పి వాడిని ఓడించెను. క్రీస్తు నొద్దకు ప్రజలు నేడు రాకపోవుటకు కారణము వారు (వారిలో అనేకులు) ఒక శాఖ వైపునకు నడపించబడుటయే అని నమ్ముచున్నాను. "మీరు వచ్చి మా సంఘములో చేరండి" లేదా; "మా విశ్వాస నియమావళి చదవండి" లేదా; "మా సిద్దాంతము నమ్మండి." - లేదా ఏదో విధమగు ఒక క్రమము. వారు తప్పు త్రోవలో నడిపించబడుచున్నారు. వారి క్రియలు, క్రీస్తు లేకుండా వారు జీవించుచున్న జీవితము వారి స్వంత జీవితముల ద్వారానే రుజువగుచున్నది. దానివలననే అది ప్రత్యక్తపరచబడుచున్నది.
1COR 11:15
19ఉదాహరణమునకు, ఎవరి భావములను నేను కించపరచగోరుట లేదు. కాని జుట్టు కత్తిరించుకొనిన స్త్రీలను దేశములోని నలుమూలలా నేను ఖండించుచున్నాను. అది బైబిల్. పొట్టి వస్త్రములను ధరించి, రంగులు పూసికొనిన స్త్రీలను నేను ఖండించాను. అయితే ప్రతి సంవత్సరము అది ఇంకా దిగజారుచున్నది. అయితే ఎక్కడో మరొక వేలు మరోవైపునకు చూపించుచున్నదని అది నిరూపించుచున్నది. వారు క్రీస్తునొద్దకు వచ్చుట.
"మేము ఒక సంఘమునకు చెందినవారము. మా సంఘము అది చేయదు," అని వారందురు. నీ సంఘము నమ్ముచున్న దానియందు ఏ భేదమూ కలుగదు. "అది తప్పు!" అని దేవుడు చెప్పెను. వారు క్రీస్తు నొద్దకు వచ్చియుండినచో అది మానివేయుదురు, అంతే కాదు, క్రీస్తు నొద్దకు వచ్చినప్పుడు పురుషుడు తన స్థానమును గుర్తించి దానిని ప్రతిఘటించును. భార్యలు ఆలాగు ప్రవర్తించునట్లుగా భర్తలు అనుమతించరు. అసలయిన పురుషుడు తన భార్య ఆ విధముగా ప్రవర్తించుటకు కోరుకొనడు.
20అప్పుడొక రోజు పట్టణములో ఉన్న ఒక యువకుడు మరో ఇద్దరు యవ్వన బాలురను చంపెను. వారు అక్కడ ఒక ఇంధనము నింపుకొను స్థలమందు ఉన్నారు. (జెఫర్సన్ విల్లో ఉన్నవారు దీనిని పత్రికలలో చదివియుంటారు) ఆ యువకుని భార్య ఇంచుమించు ఏమి వేసుకోకుండా (ధరించకుండా) అక్కడికి వెళ్ళింది. ఈ ఇద్దరు యవ్వన బాలురు ఆమెను చూసి గేళి చేసారంట. అతడు వారిని చంపిన మూలముగా ఖైదీ చేయబడెను న్యాయాధిపతి దగ్గర "ఎందుకు ఆమె ఆ విధముగా బట్టలు వేసుకున్నది?" అని అడిగాడు.
అందుకతడు "ఆమె ఆ దుస్తులలో అందముగా వుండునని తలంచుట వలన నేను సమ్మతించాను," అని సమాధానమిచ్చాడు.
ఇప్పుడు, ఆ వ్యక్తిలో ఏదో పొరపాటున్నది. వాడు ఎవడైనను నాకు లెక్కలేదు. వాడు పాపి, అయితే వానిలో ఏదో పొరపాటున్నది. ఆమె కుక్కలాగా ప్రవర్తించటానికి అనుమతించిన అతడికి ఆమె మీద నిజమైన ప్రేమ లేదు. ఎక్కడో పొరపాటున్నది. అసలు మానవునికి తాను మంచి, చెడ్డలను న్యాయ విమర్శ చేయగల జ్ఞానమును కలిగియున్నాననే స్పృహ ఎన్నడైనా కలిగినదా?
MATT 5:31
21వారు తీసికొని వచ్చిన క్రొత్త స్నానపు దుస్తులు మీరు చూచారా? ముప్పది మూడేండ్ల క్రితము చివరకు స్త్రీ అంజూరపు ఆకులు చుట్టుకొను స్థితికి వచ్చునన్న నా జోస్యమును మీరెరుగుదురా? వారిప్పుడు అంజూరపు ఆకులతో తమ్మును ధరించుకొనుచు, లోపలి అంగములు అంతయూ బహిర్గతపరిచేటటువంటి పారదర్శక వస్త్రములను ధరించుచున్నారు. ప్రభుని వాక్యము ఎన్నడూ తప్పిపోదు. అంత్యకాలమునకు ముందు అది జరుగవలసియున్నది… మరల అంజూరపు ఆకునొద్దకు వచ్చుట. దానిని నేను లైఫ్ పత్రికలో చదివాను. స్త్రీ పతనమగుటకు ముప్పది మూడు సంవత్సరములకు ముందే అది చెప్పబడెను. ఈనాడు వారేలాగు చేసెదరో చెప్పబడెను. అదిప్పుడు జరుగుచున్నది. వారు పురుషుల వలె ఎట్లు దుస్తులు ధరించెదరో, ఈ దేశములో స్త్రీల యొక్క నైతిక స్థాయి ఎంతవరకు దిగజారునో ముందే చెప్పబడెను. ప్రపంచ దేశములన్నింటిలోను అతి నీచ స్థాయిలో ఈ ఆమెరికా యున్నది. గుంపులో అదియే అపవిత్రమైనది. అది గణాంక లెక్కల ప్రకారము చెప్పబడినది.
ప్రపంచములోని ఏ స్థలములో కంటెను ఈ దేశములో వివాహము మరియు విడాకుల రేటు ఎక్కువగా యున్నది. ఇతర దేశముల మాదిరి. ఫ్రాన్సు నుండి అనగా ఆ దేశపు మురికి, అపవిత్రత మనము అనుకరించెడివారము మరియు ఇప్పుడు వారు మన నుండి దుస్తుల మాదిరిని అనుకరించుచున్నారు. వారికంటె మనము హద్దులు దాటిపోయాము.
PROV 26:11•
HEB 13:12
22క్రీస్తునొద్దకు ప్రజలు రాకుండుటకు ఒక కారణమున్నదని నాకు తెలియును. వారు వచ్చినచో, ఆ విధంగా వారు ప్రవర్తించరు. యేసు తన స్వరక్తముతో తన జనులను శుద్దీకరించునట్లుగా శిబిరము వెలుపట శ్రమపొందెను. శుద్దీకరణ అను గ్రీకు పదమునకు "పరిశుభ్రము చేయబడి సేవకొరకు ప్రక్కన పెట్టబడినది," అను బహు అర్ధము గలదు. మరియు దేవుడు తన ప్రజలను యేసుయొక్క రక్తములో శుద్దీకరించునప్పుడు, అతడు వారిని లోకపు చెడు కార్యముల నుండి శుద్దీకరించి, సేవకొరకు వారిని ఒక ప్రక్కన పెట్టుచున్నాడు. కాబట్టి యేసు కూడా తన స్వరక్తముతో జనులను శుద్దీకరించునట్లుగా గవిని వెలుపట శ్రమపడెను.
సంపూర్ణ సువార్త జనులు కూడా తాము ఎందులో నుండి బయటకు వచ్చిరో అదే మురికిలోనికి తిరిగి వెళ్ళుచున్నారు. నలుబది లేదా ఏబది సంవత్సరముల క్రితము పెంతెకోస్తు సంఘము ఏమిటి? వారెందులో నుండి బయటకు వచ్చిరో ఆ శాఖలను శపించి, ఖండించి, హేళన చేసిరి. వారేమి చేసిరి? "కుక్క తన వాంతికి తిరిగినట్లును, కడుగబడిన పంది తిరిగి బురదలోనికి పోయినట్లును." ఎందులో నుండి తీయబడిరో ఆ స్థలములోనికే వారు తిరిగిపోయిరి. మరియు ఇప్పుడు వారి సంఘముల అపవిత్రత తక్కిన సంఘములకే మాత్రమూ తీసిపోదు.
MATT 17:4,5•
MARK 9:5,7
23అది ఈ ఉదయము నేను చెప్పినదానివలెనె యున్నది. "ఇక్కడ మనముండుట మంచిది. ఇక్కడ మనము మూడు పర్ణశాలలు కట్టుదుము" అని మత్తయి 17: 4-8లో పలికిన పేతురు వలె ఈ ప్రజలున్నారు.
కాని అది చేయవద్దని ఆత్మవారికి ఆజ్ఞాపించెను, "ఈయన నా ప్రియకుమారుడు, ఈయన మాట వినుడి," అని చెప్పెను. మరియు ఆయనే వాక్యము. మనము చూడవలసినది ఆ వాక్యము వైపునకే, మన ఉత్సాహము లేక మరొకటి కాదు. "ఈయన నా వాక్యము, ఈయన మాట వినుడి." వారితో ఈ స్వరము మాట్లాడిన తరువాత వారేమి చూచిరి? మోషే, ఏలీయాలు కూడా అచ్చట లేరు; ఒక విశ్వాస సూత్రము కూడా లేదు; యేసు తప్ప మరేదియూ అచ్చట లేదు. మరియు ఆయనే వాక్యము. వారు చూచినదంతయు అదే.
ఇప్పుడు, శిబిరము వెలుపలకు వెళ్ళుట.
MATT 4:4,7•
LUKE 4:4,8
24ఈ గొప్ప సంఘటన రూపాంతరపు కొండ మీద జరిగినది. దానినే తరువాత "పరిశుద్ధ పర్వతము" అని పేతురు పిలచెను. అక్కడే ఆయన వారిని కలసికొనెను. ఇప్పుడు, ఆ పర్వతము పరిశుద్ధమైనది అని ఆ అపోస్తలుడు అనుకొనెనని నేను నమ్మట లేదు. ఆ పర్వతము మీద పరిశుద్దుడగు దేవుడున్నాడని అతని భావము. పవిత్రమైన సంఘము కాదు; పరిశుద్దులైన ప్రజలు కారు; కానీ ప్రజలలోనున్న పరిశుద్దాత్మ. పరిశుద్దాత్మయే పవిత్రమైనది. ఆయనే మీ దర్శకుడు మరియు నాయకుడు.
ఈ రూపాంతరపు కొండ మీదనున్న ఈ చిన్న పాళెములో వారికి వినవలెను అను ఆజ్ఞ వినబడినప్పుడు. వాక్యమును వినుట మాత్రమే వారు నెరవేర్చవలసిన ఆజ్ఞ. వారు చూచినది కేవలము ఒక మత నమ్మకము కాదు. వారు యేసును తప్ప మరి దేనినీ ఎన్నడూ చూడలేదు. ఆయనే శరీరధారి అయిన వాక్యము. ఏదెను తోటలో నుండిన గుంపునకు అది ఎంత మాదిరిగా నున్నది! దేవుడు ఏదెను తోటలో తన సంఘమునకు, తన ప్రజలకు రక్షణ కల్పించినప్పుడు వారు ఒక్క గోడ వెనుక మాత్రమే నిలబడవలసి యుండిరి; అదియే వాక్యము. వారికి ఒక కేడెము, ఒక కవచము ఉండెను, ఎందుకనగా అపవాదిని ఏది ఓడించునో దేవుడెరుగును; అదియే వాక్యము!
యేసు కూడా అదే చేసెను. అది వాక్యము; అది వ్రాయబడియున్నది. సాతాను దానిని కప్పుకొన చూచెను. ఉన్నది ఉన్నట్లుగా చెప్పుట కాదు, గాని ఆయన ముందు దానిని కప్పుకోజూచెను. మరియు "ఈలాగు కూడా వ్రాయబడియున్నది," అని యేసు చెప్పెను. ఇప్పుడు, మనము తప్పక ఆ వాక్యముతో నిలచియుండవలెను!
MATT 17:5•
MARK 9:7
25ఆ చిన్న శిబిరములో పేతురు, యాకోబు, మరియు యోహానులు ఉండిరి. యేసు, మోషే, మరియు ఏలీయాలు. వారు తమ శిబిరములో ఛాయ యొక్క పరలోక సైన్యమును లేదా ప్రభువైన యేసును రూపాంతరము చెందించిన ఈ మేఘములో వ్రేలాడుచుండిన అగ్ని స్తంభమును చూచిరి. మరియు వారు ధర్మశాస్త్రము కొరకు ఒకటి మరియు ప్రవక్తల కొరకు ఒకటి శాఖను తయారుచేయ సిద్ధపడినప్పుడు ఆ స్వరము ఇట్లనెను. "ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన మాట వినుడి." "వాక్యముతో నిలచియుండుడి," అని ఏదెనులో వారికి ఆజ్ఞాపించబడిన రీతిగానే సరిగ్గా వీరికిని ఆజ్ఞాపించబడెను. అది దేవుని యొక్క ప్రజల కొరకు దేవుని యొక్క శిబిరము.
26ప్రతి విషయములోను జనులు శిబిరము దాటి వెళ్ళిపోవుచున్న దినమువలె నేటి దినము కనబడుచున్నది. వారు అవతలకు దాటిపోవుచున్నారు.
మీకది తెలియునా, కిటికీలను కదిలించు శబ్దములు చేయగల జెట్ విమానములను వారు కలిగి యుండినట్లు కొంతకాలము క్రిందట నాకు చెప్పబడెను. విమానము తన ధ్వనినే తానే దాటిపోవునంత వేగముగా తయారయినది. ధ్వని హద్దునే అది దాటిపోయినది. తన స్వంత ధ్వని హద్దునే అది దాటి వెళ్ళిపోవుచున్నప్పుడు, అది చేయకలిగినది దాదాపు అపరిమితమే. మరియు అక్కడ మనకు ఒక పాఠమున్నదని నేను తలంచుచున్నాను. మనము మనయొక్క స్వంత ధ్వని హద్దును దాటి దేవునియొక్క వాక్యములోనికి వెళ్ళినప్పుడు, శిబిరము ఆవలకు దాటి వెళ్ళుటకు సిద్ధముగా నున్న మానవునితో దేవుడు చేయకలిగినది అపరిమితము, అది మానవ శిబిరము, అది అదే.
27ఇప్పుడు మనము శిబిరము వెలుపలకు వెళ్ళుటను చూస్తున్నాము, దానిని దాటి వెళ్ళుచున్నాము. సాతాను కూడా తన ప్రజలను వివేకము, ఇంగిత జ్ఞానము (common sense) అనే శిబిరమును దాటించి అవతలకు తీసికొని వెళ్ళుట చూచుచున్నాను. శిబిరము యొక్క మరోవైపునకు సాతాను తన జనులను తీసికొనిపోయినది. దేవుడు తన జనులను ఈ మరోక దారిలో తీసికొని వెళ్ళెను. సామాన్య సభ్యత ( common decency) యొక్క శిబిరమును దాటించి సాతాను వారిని తీసికొనిపోయినది. నైతిక క్రమపరిధిలో ఈనాడు జనులు చేయుచూ, ప్రవర్తించుచూ దాని ద్వారా మనగలుగు స్థితికి వచ్చియున్నారు. ఒకడు తన భార్యను ఆలాగు దుస్తులు ధరించుకోనిచ్చి, అందువలన ఆమెను అవమానపరచిన వారిని చెంప మీద కొట్టుట నా ఆలోచనకు అంతుబట్టుట లేదు. అది ఇంగిత జ్ఞానమునకు ఆవలగా దాటిపోయెను. దానికన్న ఇంకా ఎక్కువ అతడు తెలిసికోవలసియున్నాడు. సాధారణ సభ్యతను దాటిపోయిరి.
ఆగిపోవు స్థలము ఎక్కడ?
28నా వయస్సులో నున్న స్త్రీ పురుషులను ఇది అడుగవచ్చునా? ఈనాడు బికినీలు, పొట్టి స్కర్టులు ఇంకా ఏవేవో పేరు పెట్టి పిలచుచున్న ఆ బట్టలు ధరించి దాదాపు ఏబది ఏండ్ల క్రితము మీ తల్లి లేదా నా తల్లి వీధిలో నడిచినచో ఎట్లు౦డెడిది? చట్టము వారిని వెంటనే పట్టుకొని పిచ్చివారి ఆసుపత్రిలో పడవేసెడిది. పై బట్టలు లేకుండా ఒక స్త్రీ గృహము దాటితే తప్పక ఆమె పిచ్చివారి ఆసుపత్రిలో ఉండవలసి వచ్చెడిది. ఎందుకనగా ఆమె మానసికంగా దెబ్బతిన్నది. ఆనాడు ఈలాగు వారు చేసినయెడల వారిని పిచ్చివారని, మతిపోయినవారని జమకట్టెడివారు. ఇంకనూ అది మతిపోయినట్లుగానే పరిగణించబడును. హేతువును దాటిపోవుట అపవిత్రతయే.
29పొగ పీల్చుట వలన ప్రతి సంవత్సరము వేలాది మంది చనిపోవుచున్నారని వైద్యులు రుజవు చేసినా గాని, ఒక వ్యక్తి సిగరెట్లు ఊదివేయుచున్నాడంటే ఆ వ్యక్తి యొక్క మతి ఎక్కడో దెబ్బతిన్నది. ఒక వ్యక్తి మానసిక క్షోభకు గురి అయినప్పుడు, అతడు తన్ను తాను సంభాళించుకొనలేని స్థితిలో యుండి తనకు ఏమి జరిగినదో ఆ పొరపాటును కనుగొనుటకు దేశములోని ప్రతి వైద్యుని కార్యాలయమును దర్శించును. అప్పుడతడు సారాయి కొట్టులోనికి వెళ్ళి లేదా కారులో కూర్చొని పూర్తిగా మతిపోవు వరకు త్రాగును. దానిలో తన్ను తాను పాతిపెట్టుకొను వరకు ద్రవ్యమును ఖర్చుచేయును. మద్యపు మత్తుతో అతడు నింపబడనియెడల తనకు దొరికిన ప్రతి పైసాను తనకేమయినదో తెలిసికొనుటకు వైద్యుని కార్యాలయములో ఖర్చుచేయును. అది అర్థరహితము.
30పట్టణము మీద కోడిపిల్లలను ఎత్తికొనిపోవు ఒక గ్రద్ద ఎగురుతూ యున్నప్పుడు, నేను నా రైఫిల్ తీసికొని నా వెనుక ఆవరణలోనికి వెళ్ళి ఈ గ్రద్దను గురి చూచి కాల్చిన యెడల పది నిముషములలో నేను జైలులోయుందును. పట్టణములో తుపాకీని ఉపయోగించి అక్రమముగా ప్రవర్తించినందులకు వారు నన్ను అరెస్టు చేయుదురు. రైఫిల్తో ప్రజల ప్రాణములకు అపాయము కలుగునట్లుగా గాలిలోనికి గురిపెట్టి ఆ గ్రద్దను కాల్చితిని. నేను ఎవరినయినా చంపవచ్చునని వారందురు. అట్టి వ్యక్తిని దూరముగా ఉంచవలెను. అదే సమయములో వారు కావలసినంత మద్యము అమ్మి ఒకడు త్రాగునట్లు చేసి, వాడు కారు నడుపుట ద్వారా మొత్తము కుటుంబమును చంపుటకు అనుమతించుదురు. వాడు దొరికిన యెడల 5 డాలర్ల జరిమానా చెల్లించును. ముందుగానే వ్యూహించబడిన హత్య! లోకము యొక్క సంగతి ఏమిటి? ఎక్కడో ఏదో పొరపాటున్నది.
31ఇప్పుడు, శిబిరము దాటి వెళ్ళుట, సభ్యత దాటిపోవుట, కారణమును దాటిపోవుట. మీరు గమనించండి, ఈనాడు మన రాజకీయ నాయకులు పాఠశాలలో బైబిల్ బోధించుట గూర్చి ఏమియూ చెప్పుట లేదు. వారు భయపడుచున్నారు. గాలి ఎటు వీచునో వారికి తెలియదు. దీని మూలముగా వారు ఓటులను (votes) పోగొట్టుకుందురేమోనని భయపడుచున్నారు.
మరొక అబ్రహాం లింకను మనకు అవసరము; మనకు మరొక జాన్ క్విన్సీ ఆడమ్స్ కావలెను; ఎటు గాలి వీచుచున్నాగాని లెక్కచేయక నిలబడి తమ యధార్థ అభిప్రాయమును వ్యక్తము చేయగలవారు మనకు అవసరము. ఈనాటి శాఖా బోధకునికి నీవు సత్య వాక్యమును చూపించినా గాని అతనికి ఏమి చేయవలెనో తెలియదు. తన భోజనపు టికెటు (Meal Ticket)ను పోగొట్టుకొందునేమోనని అతడు భయపడును. సువార్తతో మండుచున్న స్త్రీ పురుషులు మనకు ఈనాడు అవసరము. తమ మార్పును, ఏది తప్పో, ఏది ఒప్పో, దేవుని వాక్యము సరియో, లేదా శాఖ సరియో అను తమ ధృఢ అభిప్రాయమును నొక్కి చెప్పగలవారు అవసరము.
MATT 24:35•
MARK 13:31•
LUKE 21:33•
ROM 3:4
32యేసు ఈలాగు చెప్పెను, "ప్రతివానియొక్క మాట అబద్ధము. నా మాటయే సత్యము. భూమ్యాకాశములు గతించును గాని నా మాటలేమాత్రమును గతించవు." కాబట్టి మీరు చూడండి, వారు తమ జవాబును కనుగొనుటకు దేవుని వాక్యమను శిబిరమును దాటి వెళ్ళిపోవుచున్నారు.
దేవునియొక్క వాక్యశిబిరము నుండి వారు ఆవలకు పోవునట్లు ఏది ఒప్పించెను? ఏదెను తోటలో ఆదాము అవ్వలకు చేసినట్లుగానే, సాతాను నేడును అదే చేయుచున్నది. సరే మంచిది. దానిని మనము కనుగొందుము. శిబిరము లేకుండా ప్రజలు తమ విశ్వాస సూత్రములు మరియు నియమములకు ఒప్పించబడిరి. అది వారి విశ్వాస సూత్రము మరియు నియమము యొక్క శిబిరము. వారికి కూడా ఒక శిబిరమున్నది. అది వారిని వాడి శిబిరములో ఉంచుచున్నది. వాడిది విద్య, వేదాంతము, క్రియలు, డాక్టరు డిగ్రీలు, సాంస్కృతిక, వ్యక్తిత్వపు శిబిరము. దేవుని యొక్క వాక్య శిబిరమునకు పూర్తిగా విరోధమైన ప్రతిదియూ వాడి శిబిరమే. దేవుడు తన ప్రజల కొరకు ఒక శిబిరమును కలిగియున్నాడు. శాఖకు తన స్వంత శిబిరమున్నది.
33మూడువేల సంవత్సరముల క్రితము ఒక మనిషి దేవునిని దాదాపు ఏ చోటనయినా గాని కలిసికొనకలిగిన స్థితిలో యుండెడి వాడు. మానవుడు దేవునిని కలిసికొనుట ఒక సామాన్య సంగతి. కాని నేడు వారాయనను ఎందుకు కలిసికొనుట లేదు? ఇప్పుడున్న జనులు మూడు వేల సంవత్సరముల క్రితం ఉన్న జనుల కంటె వేలాది, మిలియనుల కొలది రెట్లు ఎక్కువ అయినను, దేవుడనగా ఏదో ఒక పురాణ గాధగా, ఏదో పురాతన చరిత్రగా చెప్పుకొనుచున్నారు. చాలా సంవత్సరముల క్రితము వారు చేసిన రీతిగా, ఇప్పుడు వారు దేవుని వ్యక్తిగతముగా కలిసికొనుట లేదు, నేను చెప్పినట్లుగా మూడువేల సంవత్సరముల క్రితము అది వేరుగా నుండెను. మానవుడు దేవునిని కలిసికొనుట ఇప్పుడు సామాన్యమైనది కాదు. ఎవరైనా ఒక వ్యక్తి దానిగూర్చి మాట్లాడినచో, అతనిని పిచ్చివానిగా ఎంచుదురు, మతి పోగొట్టుకొనిన వ్యక్తిగా తలంచుదురు. ఇప్పుడది వారికెంతో అసామాన్యమయిపోయినది.
34అబ్రాహాము మరియు అతని పాళ్ళెంలో ఉన్నవారి విషయములోనయితే దేవునిని కలిసికొనుట ఒక అనుదిన కృత్యమాయెను. అబ్రాహాము ఆయనతో మాట్లాడెను. అంత మాత్రమే కాదు, వారు గెరారులో కాపురముండుటకు వెళ్ళినప్పుడు, దేవుడు ఫిలిష్తియుడగు అబీమెలెకు శిబిరములోనున్నట్లు కూడా మనము కనుగొందుము. అది బహు సామాన్యమగు సంగతి. వారు ఆయన సన్నిధి యొక్క పాళెములో నివసించిరి. ఈనాడు వారు తమ స్వంత శిబిరములో జీవించుచున్నారు. మరియు దేవుని యొక్క నివాసముతో వారికేమీ సంబంధము లేదు. వారికి దానితో ఎట్టి పొత్తునూ లేదు, ఎందుకనగా లోకమునకు అది పిచ్చితనము. అది వారికి వెర్రితనముగా నుండును. కాని గుర్తు౦చుకొనండి, దేవుడు జనుల కొరకు తన మొదటి పాళెమును నియమించినప్పుడు, ఆయన తన వాక్యముతో వారికి రక్షణ ఇచ్చెను. ఆయన ఎల్లప్పుడూ అదే చేయును. కానీ, నేడు వారి శిబిరములలో అది వారు చేయరు. దేవుని గూర్చి అంత ఎక్కువగా మీరు వినకపోవుటకు అదే కారణము.
ఇప్పుడు, నేను నమ్ముచున్నాను. ఆ పాళెములో…
EXOD 3:1
35ఆయన అరణ్యములో మోషేను కలిసికొనిన విధానమును చూడండి. మోషే ఆ పాలెము వెలుపట తన మామగారైన ఇత్రో గొర్రె మందలను మేపుచుండెను. అది ఎడారికి వెనుక భాగము. ఒక రోజున ఈ ఎనుబది సంవత్సరముల ముసలి గొర్రెల కాపరి ఒక వెలుగును లేదా ఒక పొదలో మండుచున్న అగ్ని స్తంభమును చూచెను. దేవుని నుండి పారిపోవుచున్న ఆ మనిషి, దేవునిని కలిసికొనెను. మరుసటి రోజు… కొన్నిసార్లు దేవునిని కలిసికొనుట అసహజ కార్యములు చేయుటకు దారితీయును. ఆ మరుసటి రోజున మోషే చాలా అసామాన్యముగా యుండెను. అతడు గాడిద మీద తన భార్యను కూర్చొండ బెట్టుకొనెను, ఆమె యొక్క ఒడిలో చిన్నబిడ్డ యుండెను. అతనికి పొడవైన గడ్డము, చేతిలో ఒక వంకర కర్ర యుండెను. ఒక దేశమును బయటకు తెచ్చుటకు ఐగుప్తునకు వెళ్ళుచుండెను. అది హేళన చేయు దృశ్యముగా నుండెను! "మోషే నీవు ఎచ్చటికి వెళ్ళుచున్నావు?"
"ఐగుప్తునకు వెళ్ళుచున్నాను."
"ఎందుకొరకు?"
"స్వాధీన పరచుకోనుటకు!" అతడు దేవునిని కలిసికొనెను. ఒక్క మనిషి దండెత్తుట. అది బహు వింతగా కనిపించెను. అయితే సంగతి ఏమనగా, అతడు దానిని చేసెను. ఎందుకనగా అతడు దేవునిని కలిసికొనెను! అది ఏలాగనగా ఒక్క మనిషి రష్యాను ముట్టడించుటకు వెళ్ళినట్లే యుండును. నీకు అవసరమగునదంతయూ అదే, దేవుని యొక్క చిత్తములో నున్న ఒక్క వ్యక్తి మోషే దేవుని యొక్క చిత్తములో ఉండెను. అతని చేతిలో ఒక వంకర కర్ర యుండెను, ఒక ఖడ్గము కాదు, ఒక కర్ర. దేవుడు చేయు అసహజ కార్యములు
EXOD 3:14
36కాని గుర్తుంచుకొనుడి, దీనిని చేయుటకు మోషే తాను నివసించుచున్న పాళెమును విడిచిపెట్టవలసి వచ్చెను. ఎందుకనగా అతడు అక్కడ ఒక గొప్ప సైన్యముతో ఉండెను గాని దానిని చేయజాలకపోయెను. ఐగుప్తు సైన్యములన్నింటితోనూ దానిని అతడు చేయలేకపోయెను. కాని ఒక దినమున దేవుడు అతనిని తన పాళెములోనికి ఆహ్వానించెను. "నీవు ఎవరవు?" అని ఆయన ప్రశ్నించెను.
అందుకాయన, "నేను ఉన్నవాడను అనువాడను," అని చెప్పెను. "ఉంటిని" లేదా "ఉందును" అని కాదు. వర్తమానకాలము. "నేనున్నాను! నేను అబ్రహాము, ఇస్సాకు మరియు యాకోబుల దేవుడను. జనుల మొరను నేను విన్నాను, మరియు నా వాగ్దానమును గుర్తుచేసికొన్నాను, ఇది నెరవేర్చబడుటకు ఇదే కాలము. మోషే, నీ చేతిలో ఉన్న ఈ కర్రతో నిన్ను నేను పంపుచున్నాను."
37ఏమిటది? ఆయన…
ఇప్పుడు, అతడు వేర్రివాడని జనులు తలంచిరి, కాని అతడేమి చేసెను? తన స్వంత శిబిరము నుండి బయటకు వచ్చెను. ఫరో నలుబది ఏండ్ల పాటు స్కూలు శిబిరములో అతనికి విద్య నేర్పించెను, కాని అతడు విఫలమాయెను; దానిని అతనిలో నుండి తీసివేయుటకు దేవునికి మరో నలుబది ఏండ్లు పట్టెను. అతడు నేర్చుకొనిన విద్య మరియు అతని యొక్క వేదాంతము అంతయూ తీసివేయుటకు నలుబది సంవత్సరములు ఆయనకు పట్టెను. అప్పుడు అతనిని దేవుడు నలుబది ఏండ్ల పాటు వాడుకొనెను.
దేవుడు తన జనులను సిద్ధపరచుటకు ఎంతో శ్రమపడవలసివస్తుంది. కాని మీరు చూడండి, మానవ నిర్మితమైన, సైనికపరమైన, తన స్వంత మానవ నిర్మితమైన పాళెమును విడిచి మోషే బయటకు వచ్చు వరకు, సహజాతీత కార్యములను అతని (మోషే) ద్వారా చేయుటకు దేవుని వలన సాధ్యము కాలేదు. దేవుని యొక్క శిబిరములోనికి అతడు వచ్చినప్పుడు మాత్రమే, దేవుడు అతనిని వాడుకోగలిగెను.
38వారు ధృడ చిత్తముతో ఐగుప్తు నుండి, యాజకుని శిబిరము నుండి దేవుని యొక్క శిబిరములోనికి వచ్చినప్పుడు ఈలాగు చెప్పుట మనము గమనించుదుము. "తక్కిన కాలమంతయూ మీరు బానిసలుగా స్థిరపడుడి!" ప్రవక్తయగు మోషే వచ్చి చేరువనేయున్న దేవుని యొక్క వాక్యము బయలుపరచెను. వాగ్దానము చేసిన దేవుడు జనులను విడిపించుటకు అక్కడుండెను. వారు తామున్న శిబిరములో నుండి బయలుదేరి ఆ ఘడియ యొక్క దేవుని వాగ్దాన వాక్యము యొక్క శిబిరములోనికి తరలిపోయిరి. వారు ఆ ప్రవక్తను నమ్మిరి, ఎందుకనగా అది సరిగ్గా దేవుని యొక్క వాక్యమేనని ప్రత్యక్షత యొక్క సూచన రుజవు చేయుచుండును. అతడు చేసిన కార్యములు అది సరియేనని నిరూపించెను. అతనిని వెంబడించిన అగ్నిస్తంభము, అది దేవుని యొక్క వాక్యమేనని రుజువుచేసెను.
39ఇప్పుడు, ఈ శిబిరములో… అద్భుతములు, సూచకక్రియలు, మహత్కార్యములు ఉండెను. వారు అరణ్యములోనికి వాటి ద్వారా తరలిపోయిరి. వారు తమ స్వాభావిక శిబిరమును విడిచిపెట్టిరి. వారు మట్టి శిబిరమును విడిచిపెట్టిరి; ఎండుగడ్డి మరియు ఇటుకలతో కట్టిన శిబిరమును వారు విడిచి ఆ బయట అరణ్యములో గుడారములందు నివసించుటకు వెళ్ళిరి. అక్కడ ఆహార గింజలు గాని మరేమి గాని లేవు. కొన్నిసార్లు దేవుడు మన స్వంత ఆలోచనలకు వెర్రితనముగా కనబడు వాటిని చేయమని చెప్పెను. మరియు నీ స్వంత హేతుబుద్ధి శిబిరమును నీవు విడిచిపెట్టినప్పుడు మాత్రమే నీవు దేవునిని కనుగొందువు.
గమనించండి, వారు అరణ్యంలోకి వెళ్ళినప్పుడు అక్కడ అద్భుతములు, సూచక క్రియలు సంభవించెను. వారు పాళెములోనికి తరలి వెళ్ళినప్పుడు ఇవి జరిగెను. ఇప్పుడు గుర్తు౦చుకొనండి, వారు ఐగుప్తు శిబిరమును విడిచిపెట్టి దేవుని శిబిరముతో అరణ్యములోనికి కదిలి వెళ్ళిరి. అది జరిగెనని మీకేలాగు తెలియును? "నీ ప్రజలు నాలుగు వందల సంవత్సరముల పాటు యాత్ర చేయుదురు. కాని వారిని నేను బలమగు హస్తముతో బయటకు తీసికొని వచ్చెదను. మరియు నేను వారికి ఇక్కడున్న ఈ దేశమును ఇచ్చెదను," అని దేవుడు చెప్పెను. ఒక బయలుపరచబడిన వెలుగు, ఒక బయలుపరచబడిన ప్రవక్త ద్వారా, సూచక క్రియలు మరియు అద్భుతములతో వారు తమ మార్గములో వెళ్ళిరి. దేవుడు తమ శిబిరములో ఉన్నాడని రుజువాయెను. వారు తమ మార్గములో యుండిరి. వారికి ఒక అగ్నిస్తంభముండెను; వారికి ఒక ప్రవక్త యుండెను; వారికి మన్నాయుండెను; వారికి జీవజలములుండెను. ఆమేన్! వారు శిబిర స్థలములను మార్చుచుండిరి. వారది చేయవలసియుండిరి; వారు ఐగుప్తులో అట్టి సంగతులను చూడలేకపోయిరి. సహజాతీతమగు దానిని చూచుటకు వారు శిబిర స్థలములను మార్చుకోవలసి వచ్చెను.
ఆలాగే ఈనాటి జనులును వారి శాఖల శిబిరముల నుండి మారవలెను. ఎందుకనగా అవి ఈలాగు చెప్పుచున్నవి, "అద్భుతములు జరుగు దినములు అయి పోయినవి. పరిశుద్దాత్మ బాప్తిస్మము అనునటువంటిది ఏదీ లేదు." మరియు "లేఖనములన్నియూ తప్పు; అవి మరో కాలమునకు చెందినవి!" నీవు నీ శిబిర స్థలములను మార్చుకోవలెను. సమస్తమునూ సాధ్యమగు ఆ పాలెము వెలుపలకు నీవు వెళ్ళుము.
NUM 26:10
40వారందరునూ ఆయన సన్నిధిని శిబిరములో బయలుపరచుచుండిరి. ఇప్పుడు గమనించండి. వారు మోషే చనిపోయిన తరువాత వారు ఆచార సాంప్రదాయములు మరియు విశ్వాస సూత్రములతో నిర్మితమయిన మానవ కల్పిత శిబిరమును తయారుచేసిరి. చాలా సంవత్సరముల పాటు దేవుడు జనులతో ముచ్చటించెను. దేవుడు ఇక వారి శిబిరములో లేడు, ఎందుకనగా వారు ఆ శిబిరమును తమకు తామే స్వంత౦గా చేసికొనిరి.
గుర్తు౦చుకొనండి, వారు ఐగుప్తులో నుండి బయటకు పిలువబడినప్పుడు, దేవుడు వారికి ఒక ప్రవక్తను ఏర్పాటు చేసెను, ఒక బలి గొర్రెపిల్లను ఏర్పాటు చేసెను, వారికి అవసరమగునదంతయూ ఏర్పాటు చేసెను. వాక్యమును, ఒక సూచనను, ఒక అద్భుతమును, వారిని నడిపించుటకు ఒక ప్రవక్తను, వారిగూర్చి శ్రద్ధవహించుటకు ఒక పరిహారమును, వారికి మార్గదర్శిగా ఒక అగ్నిస్తంభమును ఆయన ఏర్పరచెను; వారు అరణ్యములోనికి వెళ్ళినప్పుడు, వారు ఇంకనూ సంతృప్తిచెందలేదు. వారు తమకు తాము చేయగలిగిన దానిని మరిదేనినో కోరుకొనిరి. దానిని కృప అనుగ్రహించును; వారు ఇప్పుడు తమకు తామే చేసికోగలిగిన దేనినో ఒక దానిని కోరుకొనిరి. ఆ విధముగా వారు ఒక సంస్థను తయారుచేసికొని, ఎవరో ప్రధాన యాజకునిగా లేదా దీనిగా, దానిగా, మరోదానిగా ఉండవలెను అని తమలో తాము తగవులాడుకొని పోరాడుకొనుచుండిరి. ఒకరోజున దేవుడీలాగు చెప్పెను, "మోషే, వారినుండి నీవు ప్రత్యేకముగా ఉండుము," కోరహు తిరుగుబాటు చేసినప్పుడు ఆయన వారందరినీ మ్రి౦గివేసెను.
41ఇప్పుడు గమనించండి, ఈ సూచనలు మరియు అద్భుతములన్నియూ ఆయన సన్నిధిని ప్రత్యక్తపరచెను. అప్పుడు మనిషి తనకు తాను ఒక శిబిరము చేసికొనెను, అది ఒక మత విశ్వాసపు, ఆచారపు శిబిరము. దేవుని వాక్యముయొక్క శిబిరము కాదు, వారియొక్క స్వంత శిబిరము. ఆయన వారిని విడువవలసి వచ్చెను. ఎందుకనగా ఆయనే వాక్యము. ఈ వాక్యము గాకుండా మరొకటి జనులకు నేర్పించబడుచోట ఆయన ఉండజాలడు. దేవుడు ఆ శిబిరములో ఉండజాలడు. ఆయన ఉండలేడు! ఆయనెన్నడూ ఉండలేదు. ఆయన వాక్యమెక్కడున్నదో సరిగ్గా అక్కడే ఆయన ఉండును.
ACTS 7:32
42ఐగుప్తు నుండి బయటకు తీసికొని వచ్చిన ఆ సర్వ సమాజపు ప్రజలను ఆ శిబిరమును ఆయన విడిచినప్పుడు, ఎవరి యొద్దకు వాక్యము వచ్చునో ఆ ప్రవక్తల యొద్ద మాత్రమే ఆయన నివసించెను. ఆ ఘడియను బయలుపరచుటకు వాక్యము ప్రవక్త యొద్దకు వచ్చెను. ఆయన ప్రవక్తల మధ్యన నివసించి ప్రవక్తలకు, ఆ జనులు, సంగతులను ఎట్లు శపించిరో తెలియచేసెను. దేవుడు తన ఆజ్ఞలను, జీవన విధానమును వారికి నేర్పించెను. మరియు ప్రజలు ఎల్లప్పుడూ దానికి వ్యతిరేకములే. ప్రవక్తను హింసించి, చివరకు అతనిని రాళ్ళతో కొట్టి చంపిరి లేదా రంపములతో ముక్కలుగా కోసిరి. ఆ విధముగా అతనిని వదిలించుకొనిరి.
యేసు చెప్పెను, "ఏ ప్రవక్తను మీ పితరులు చంపకుండా వదిలిపెట్టారు? మీ దగ్గరకు పంపబడిన ఏ నీతిమంతుడు మీరు మీ తండ్రులు చేసిన దానినే చేయుచున్నారు!" అని చెప్పెను. ఆయన కమ్యూనిస్టులతో మాట్లాడుట లేదు; ఆయన యాజకులతో, శాఖకు చెందిన జనులతో మాట్లాడుచున్నాడు, పరిసయ్యులు, సద్ధూకయ్యులతో మాట్లాడుచుండెను. ఈ రాత్రి కూడా ఆయన స్వరము మారలేదని నేను తలంచుచున్నాను, వారిని చూచి మరింత ఘోరముగా మాట్లాడెను, అంతే.
43అప్పుడు ఆయన ప్రవక్తల మధ్యన నివసించియున్నాడని ఇప్పుడు కనుగొన్నాము. అప్పుడాయన వారికి పరదేశి ఆయెను, ఎందుకనగా ఆయన తన వాక్యమును స్థిరపరచుటకు దానిలోనే జీవించును. ఆయన తన వాక్యమును స్థిరపరచుటకు దానికి కావలియుండునని బైబిల్ చెప్పెను. ఆయన ఎవరినో ఒకరిని కనుగొన ప్రయత్నించుచున్నాడు. సమ్సోను వలె అర్ధ-హృదయమిచ్చిన వ్యక్తి అయినా దొరుకునేమో అని. సమ్సోను తన బలమును దేవునికి అప్పగించెను గాని, తన హృదయమును దెలీలాకు ఇచ్చెను. ఈనాడు అనేకసార్లు మనము అదే చేయుచున్నాము, దేవునికి అంతా కాకుండా కొంత మాత్రమే ఇచ్చెదము. కాని దేవునికి మనదంతయూ కావలెను.
జీవిత భీమా పధకము వలె, నీవు భీమా పధకమును పొందినప్పుడు, నీకు పూర్తి హామీ లభించును. మరియు ఈ శుభ్రపదమగు నిశ్చయత మనకు అదే చేయును. ఇది పూర్తి హామీ పధకము. ఈ జీవితములో మనకు కావలసిన సమస్తమును, మన పునరుద్దానమును, నిత్యజీవమును; అది ప్రతిదానిని అనుగ్రహించును.
44గమనించండి! అప్పుడు దేవుడు నాలుగు వందల సంవత్సరముల పాటు వారి శిబిరమునకు అవతలగా ఉండెను. ఎందుకు? ఆయనకు మరే ప్రవక్తలు లేరు. మలాకీ ప్రవక్త నుండి యోహాను ప్రవక్త వరకు నాలుగు వందల సంవత్సరములు. ఇశ్రాయేలు ఆ మధ్య కాలములో పొందిన అగచాట్లు అన్నీ ఇన్నీ కావు. దేవుడు శిబిరమునకు వెలుపట యుండెను. వారు ఆయనను తమ మత నమ్మకములు, స్వార్థము, వాక్యము పట్ల తమకున్న భేదమును బట్టి బయటకు త్రోసివేసిరి. వాక్యము లేకుండా నాలుగు వందల సంవత్సరములుండిరి! ఒక ప్రవక్త నుండి మరో ప్రవక్త వరకు ఆలాగు మలాకీ ప్రవక్త వరకు ఆయన పయనించెను, గాని అక్కడ నుండి నాలుగు వందల సంవత్సరముల పాటు వారికి ప్రవక్త లేడు.
అప్పుడు దేవుడు మరల రంగము మీదకు వచ్చెను. ఒకరోజున ఆయన మరల వారి మధ్యకు నడిచి వచ్చెను, కానీ వారి ఆచారములు ఆయన స్థానమును పూర్తిగా ఆక్రమించినవి. ఆయన వారికి పరదేశిగా కనబడెను. వారి పితరుల సంప్రదాయములు. నీటి తొట్టివలె యుండెను… తమ జుట్టును దువ్వుకొనుటకు, తమ కోటు మీద పలాని గుండీలు పెట్టుకొనుటకు, వారి తెల్లని యాజక వస్త్రములకు శాసనములు తయారుచేసిరి - ఒకడు కరడు గట్టిన పరిసయ్యుడు, మరొకడు సద్దూకయ్యుడు; అది వారి మధ్య దేవుని స్థానమును ఆక్రమించెను. చివరకు దేవుడే వచ్చి వారిని దర్శించినా, ఆయన ఒక పరదేశిగా కనబడెను.
HEB 13:8
45మీ మనస్సులో పదిలమవ్వాలనే నేను దీనిని మర్యాద మరియు ప్రేమతో చెప్పుచున్నాను. ఈ దినమును ఆలాగే యున్నది! ఏ మాత్రమూ మారలేదు! ఆయన తన శక్తి మరియు బయలుపాటుతో తన జనుల మధ్యకు వచ్చినప్పుడు, తన వాక్యము నిన్న, నేడు, నిరంతరము ఏకరీతిగా యున్నదను దానిని ఆయన రుజువుచేసెను, ఎందుకనగా ఆయనే వాక్యమైయున్నాడు. ఆయనను జనులు, "ఒక అదృష్టము చూచి చెప్పువాడు, ఒక బయల్జేబూబు, ఒక యేసు మాత్రమే" లేదా అట్టిది మరేదో అనిరి. కొందరు నిన్ను ఎక్కడో వర్గీకరించుదురు. కాని అది ఆలాగే ఉండవలసియున్నది. చూడండి, ఇప్పుడు మనకు దాదాపు రెండువేల సంవత్సరముల నుండి ప్రవక్తలేడు. అంతమందు అన్యులకు ఒకడు అనుగ్రహించబడునను వాగ్దానమును మీరెరుగుదురు. లేఖనమును బట్టి అది మనమెరుగుదుము. ఇది మనకు వాగ్దానము చేయబడినదని చరిత్రను బట్టి మనకు తెలియును.
ISA 9:6•
JOHN 1:14•
REV 3:20
46ఇప్పుడు, నాలుగు వందల సంవత్సరముల తరువాత, ఒక రోజున దేవుడు వారి మధ్య నడిచెను. వాక్య ప్రకారము ఆయన శరీరధారియై వారిమధ్య నివసించవలసియుండెను. "ఆయనకు ఆలోచన కర్త సమాధానాధిపతి, బలవంతుడగు దేవుడు, నిత్యుడు అగు తండ్రి," అని పేరు పెట్టబడును. ఆయన జనుల మధ్యకు వచ్చునప్పుడు, "ఇతనిని మా మీద తీర్పరిగా నియమించినవాడెవడు! అతనికి ఏ సహవాసపు కార్డున్నది? ఏ శాఖ అతనిని పంపినది?" అని ప్రశ్నించిరి. అతనికి ఏ సహకారము లేదు; అతడు వెళ్ళిన ప్రతి సంఘమునుండి త్రోసివేయబడెను. వారికి అతనితో పొత్తు లేదు, ఎందుకనగా అతడు వారిలో ఒకడుగా లేడు. అప్పుడుండినట్లుగానే ఇప్పుడునూ యున్నది! లవొదికయ సంఘము ఆయనను బయట పెట్టునని బైబిల్ చెప్పెను. మరియు ఆయన లోనికి వచ్చు ప్రయత్నములో తట్టుచున్నాడు. ఎక్కడో ఏదో పొరపాటు యున్నది.
JOHN 1:1,14•
JOHN 5:39
47ఇప్పుడు, ఎందుకు? వారు తమ స్వంత శిబిరమును తయారుచేసికొనిరి. వారు… వారు వాక్యమును ఎరిగియుండినచో, ఆయనెవరో ఎరిగియుండెడివారు. యేసు చెప్పెను, "మీరు లేఖనములను పరిశోధించినచో నన్ను గూర్చి అవి చెప్పుట చూతురు. అందులో నిత్యజీవమున్నదని మీరు నమ్ముచున్నారు గదా!" లేఖనము అదే చెప్పెను. "అవి నన్ను గూర్చి సాక్ష్యమిచ్చుచున్నవి. నేను చేయుదునని వాగ్దానము చేయబడిన క్రియలు నేను చేయనియెడల, నా తండ్రి క్రియలు నేను చేయని యెడల నమ్మకుడి." ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవునియొద్ద ఉండెను, వాక్యము దేవుడై యుండెను. ఆ వాక్యమే శరీరధారియై మన మధ్య నివసించెను. "ఇప్పుడు, నేను ఆ వ్యక్తిని అయినచో లేఖనములను పరిశోధించి చూచి నేను చేయవలసియున్న కార్యములు తెలిసికొనుడి. అందుకు నేను సరిపడనిచో, నా క్రియలు, వాక్యము సాక్ష్యమిచ్చుచున్న క్రియలు, తండ్రి నా గూర్చి ఇచ్చుచున్న వాక్యము నేను ఎవరినై యున్నానో ప్రత్యక్షపరచనిచో నేను తప్పు వ్యక్తినే!" అది సరి! "మీరు నన్ను నమ్మనిచో, వాక్యమును నమ్ముడి." - "వాక్యము ఉత్పత్తిచేయు క్రియలు," అని ఆయన చెప్పెను.
48చూడండి, ఆయన వారి మధ్య పరదేశిగా ఉండెను. వారాయనను తెలిసికొనలేదు. "ఈ మనిషితో మాకేమీ సంబంధము లేదు." ఎక్కడో పశుల పాకలో పుట్టిన వింత మనిషి;" అతని తల్లి అతనిని అక్రమముగా గర్భము ధరించి కనినది అని వారు నమ్మిరి — గర్భము ధరించిన పిదప యోసేపును పెండ్లిచేసికొని ఆమెకు వచ్చిన మచ్చను, శీలములోని కళంకమును ఆలాగు చెరిపివేసెను, అని తలంచిరి. అతడు అక్రమముగా పుట్టిన కారణము వలననే అంత వింత వ్యక్తిగా తయారయెనని చెప్పుకొనిరి. ఆయన బయటకు వచ్చినప్పుడు ఏమి చేసెను? వారి మత నమ్మకములను చీల్చివేసెను, వారి బల్లలను తలక్రిందులు చేసెను, వారిని వారి స్థానములలో నుండి కొట్టివేసెను; "ఈలాగు వ్రాయబడియున్నది!" అని చెప్పెను. ఆమేన్! ఆయనెవరైయుండెనో అందుమూలమున తెలిసికోవచ్చును. "ఈలాగు వ్రాయబడియున్నది!"
JOHN 3:2
49సరే, అటువంటి వానితో వారికేమీ సంబంధము లేదు. కాని వారి హృదయాంత రంగములో ఆయనెవరై యుండెనో వారెరిగియుండిరి. ఎందుకనగా నికోదేము దానిని స్పష్టముగా చెప్పెను: "రబ్బీ, మేము (పరిసయ్యులము) - నీవు దేవునియొద్ద నుండి వచ్చిన బోధకుడవని మేమెరుగుదుము, ఎందుకనగా దేవుడు తోడై యుంటేనే గాని ఎవడునూ నీవు చేయు కార్యములు చేయలేడు!" అయితే వారెందుకు ఆయనను ఒప్పుకొనలేదు? ఎందుకనగా వారి శిబిరము ఒక హద్దును ఏర్పరచినది. ఆయనను శిబిరము లోనికి రానీయలేదు. ఎవరినీ అందులో నుండి ఆయన యొద్దకు రానీయలేదు. వారికి వారి స్వంత శిబిరమున్నది. అతడు రాత్రిలో వచ్చెను, ద్వారము నిజంగా మూయబడెను, అయినా గాని ఆయనను ఏలాగయినా కలిసికోవలెనని వచ్చెను.
అవును, ఇప్పుడునూ ఆలాగే యున్నది! ఆయన ఒక అపరిచితుడు, పరదేశి అయ్యెను. దానిని వారు గ్రహించలేదు: "ఎందుకిట్లు జరిగినది?" "అదెందుకు ఆలాగయినది? ఈ దినమున జరుగవలసియున్నది ఖచ్చితంగా ఇదేనని వాక్యము సాక్ష్యమిచ్చుచుండెను. దీనిని గురించి మనము పదేపదే కనిపెట్టుచునే వచ్చుచున్నాము, కాని ఇది మాత్రమే సత్యము.
50ఆయన వారి శిబిరమునకు, పిచ్చివానిగా, మత సాంప్రదాయమును విచ్చిన్నము చేసి, తమ సంఘములను అయోమయపరచిన వానిగాను, నిజంగా ఒక అదృష్టము చెప్పువానిగాను, బయల్జేబూబు అని పిలువబడు ఒక మత సంబంధమైనవానిగా కనబడెను. ఆయన వారికి ఆలాగే యుండెను. ఆయన ఈ రోజు మన మధ్యకు వచ్చినా మనకునూ అలాగే కనబడునని నమ్ముచున్నాను. ఎందుకనగా మనకును ఆచారములు, శాఖలు ఉన్నవి. మనము కనీసము ఒకరితో ఒకరము కలిసి కొనసాగలేకపోవుచున్నాము. ఎందువలన? మనుష్యులు కలిసి మనగలుగు చోటు ఒకే ఒకటున్నది; అది చిందించబడిన రక్తము క్రిందనే. రక్తము చిందించబడినది గనుక వాక్యము అను ఈ విత్తనము జీవముతో మొలకెత్తబడినది. దానికి బయట, మన శాఖల హద్దులు ఏర్పడి ఎల్లప్పుడునూ జనులను దూరముగా ఉంచుచున్నవి.
PS 22:1•
ISA 53:4
51కాని ఈ రోజున ఆయన పరదేశిగా ఉండును; ఆలాగే ఆయన పిలువబడును. ఆయన శిబిరము వెలుపట ఉంచబడును. "ఆయన మనుష్యులచే విసర్జింపబడును. దుఃఖాక్రాంతుడుగాను, చింతతో మొత్తబడినవానిగాను ఉండును," "వారాయనను తిరస్కరించిరి; ఆయనను మొత్తబడినవానిగాను, దేవునిచే శ్రమపరచబడినవానిగాను, మనము ఎంచితిమి," అని బైబిలు చెప్పిన సంగతి మీరెరుగుదురు. ఆ ప్రవక్తయే ఇట్లు పాడెను. "నా దేవా, నా దేవా, నన్నేల చేయి విడిచితివి? నా ఎముకలు, వారు నా చేతులలో పాదములలో పొడిచిరి? వారు తమ బలిని అర్పించి ఆ పాటను సంఘములో పాడుచూ, ఆయనకు సేవచేయుచున్నామని తలంచిరి, కానీ వారు సిలువవేయుచుండిరి. నేడును ఆలాగే యున్నది! అదే దేవుడు…
52సమరయకు వచ్చినప్పుడు ప్రవక్తయగు ఆమోసు ఏమి చెప్పెనో చూడండి. ఆ పాప పట్టణమును సమీపించి చూచినప్పుడు, అతని చిన్న కండ్లు సన్నబడినవి, వీధుల్లో స్త్రీలు పురుషులతో విచ్చలవిడిగా ఉండిరి - ఆధునిక అమెరికా. అతడు దానిని చూచినప్పుడు, కండ్లు సన్నగిల్లెను. మరియు అతనినెవరూ బలపరచి ఆహ్వానించువారు లేదు; అతనికి సహవాసపు కార్డు లేదు. దేవుడే అతనిని పంపెను. ప్రజలు అతని వర్తమానమును విందురా? లేదు, వారాతని మాట వినరు. కాని అతడు ప్రవచించి ఇట్లు పలికెను, "మీరు యే దేవుని సేవించుచున్నామని చెప్పుచున్నారో ఆ దేవుడే మిమ్మును నాశనము చేయును!" ఈ దేశము భక్తిగల మత దేశమని చెప్పుకొనుచున్నది. వారు సేవించుచుచున్నామని చెప్పుకోనుచున్న ఆ దేవుడే వారిని వారి అతిక్రమములలోనే నాశనము చేయును. ఆయన ప్రతి శాఖను ఆయన భూమి మీద నుండి నాశనము చేయును, వారు దేనినైతే సేవించుచుచున్నామని చెప్పుకోనుచున్నారో దానిని.
కనుక గమనించండి, వారిని ఆయన గద్దించెను, వారు ఆయనను తమ శిబిరములో నుండి బయటకు త్రోసిరి. "యేసు శిబిరమునకు వెలుపట శ్రమపడెను." వారు ఆయనను తమ శిబిరమునకు వెలుపలగా, చాలా దూరమున ఉంచిరి.
ఈ చివరి దినమున ఈ లవోదికయ సంఘకాలము క్రింద వారు మరల అలాగే చేయుదురని బైబిల్ చెప్పుట మనము కనుగొందుము. వారు శిబిరమునకు వెలుపట నుంచబడుదురు. (ఇప్పుడు, గమనించండి ముగింపులో ఆయన ఏమి చేయుదునని చెప్పెనో చూడండి) - బలులు దహించబడు ఆ బయట శిబిరమున ఉంచుదురు. ఆయన దానికే చెందును; ఆయనే ఒక బలి.
53ఇప్పుడు, సోదరీ, సోదరుడా, మీలో ప్రతిఒక్కరును తప్పక దేవుని యొక్క బలిగాను ఈ లోకపు విషయములు, ఈ ప్రపంచము యొక్క మీ స్వంత భోగములు, లోకపు సంగతులు బలిగా త్యజించవలెననియు ఎరుగుదురా? దానిని జనులు చేయకుండుటకు మీరు కారణము ఎరుగుదురా?
మీకు తెలుసా ఒక గొర్రె, ఒక గొర్రెకు అర్పించుటకు ఒకే ఒక్కటి యుండునని మీరెరుగుదురు, అది దాని ఉన్ని. మరియు ఇప్పుడు, ఈ సంవత్సరము కొరకు కొంత ఉన్నిని ఉత్పత్తి లేదా తయారుచేయమని దానిని నీవు అడుగనవసరము లేదు. ఉన్నిని ఉత్పత్తి చేయమని చెప్పనక్కరలేదు. మనలను కూడా ఏదో ఉత్పత్తి చేయమని అడుగనవసరము లేదు; ఆత్మ ఫలములను ఫలించుమని మనలను అడిగెను. అది, గొర్రె యొక్క అంతరంగమున… దాని అంతర్భాగమున ఉన్నికలదు గనుకనే బయటకు ఉన్ని వచ్చును. ఒక వ్యక్తి అంతరంగమున క్రీస్తును కలిగియున్నప్పుడు, బయట కూడా క్రీస్తువలె ఉండునట్లుగా అతనిని చేయును. కృత్రిమముగా ఏదో ధరించుట కాదు.
అది జరిగినప్పుడు, తిరిగి క్రీస్తు వచ్చినప్పుడు, ఆయన ఏలాగు మర్యాద పొందును? సరిగ్గా ఆదిలో యున్నట్లుగానే యుండును. ఎల్లప్పుడూ ఆలాగే యుండును.
54కనుక ఆయన వారిని గద్దించెను, వారు ఆయన శిబిరములో నుండి వేరై ఆయనను ఒక పాపిగా చేసిరి; "ఆయనే మనకొరకు పాపమాయెను."
ఇప్పుడు, వందల సంవత్సరముల తరువాత - అవును, దాదాపు వందల సంవత్సరములు — చివరి దినములలో తాను చేయుదుని చెప్పిన తన వాగ్దాన వచన ప్రకారము మరల ఆయన వారి శిబిరమును దర్శించును. ఆయన మరల శిబిరమును దర్శించును. మోషే దినమున ఆయన చేసినట్లుగానే, ఆ వెనుక ఆ దినమున ఆయన చేసినట్లుగానే, ఈనాడు ఈ వాక్యమును ప్రత్యక్ష్యపరచుటకు ఆయన శిబిరమును దర్శించును. దానిని మోషే చేయుట కాదు; మోషే ఒక మనిషి; దానిని చేసినది క్రీస్తే.
GEN 37:28
55యోసేపు జీవితము వైపు చూడండి: తండ్రిచే ప్రేమించబడెను, అతడు ప్రవక్త అయినందున తన సోదరులచే ద్వేషించబడెను. నిర్దేతుకముగా వారాతనిని ద్వేషించిరి. వారతనిని ద్వేషించుటకు అదొక్కటే కారణము. ఖచ్చితంగా నేటి మాదిరిగా యున్నది. సంఘమును ఆలాగే మరల ద్వేషించుచున్నారు. ఆత్మీయముగా నుండినందునే. దాదాపు ముప్పది వెండి నాణేముల కొరకు అతడు అమ్మబడెను. చనిపోయెనని భావించబడెను, పైకి లేపబడి బందీ గృహములో ఉంచబడెను. సిలువపైన యేసు ఉంచబడినట్లే, ఒకడు నాశనము కాబడెను, ఒకడు రక్షించబడెను, అక్కడి నుండి ఫరో కుడి పార్శ్వమునకు లేపబడెను. అది అక్షరాలా యేసుకు జరిగినట్టే జరిగెను.
HEB 13:8
56దావీదు వీధులలో ఏడ్చుచూ, విసర్జించబడిన రాజుగా వెళ్ళెను, మరియు కొండమీద కూర్చొని యొరూషలేము వైపు చూచుచూ ఏడ్చెను. అది దావీదు కాదు! కొద్ది వందల సంవత్సరముల తరువాత దావీదు కుమారుడు అదే కొండమీద ఏడ్చుచూ యుండెను. ఎందుకనగా ఆయన తన జనుల మధ్య ఒక విసర్జించబడిన రాజాయెను. అది ఎల్లప్పుడునూ క్రీస్తే, శిబిరములోనికి క్రీస్తు తప్పక రావలసియున్నాడని నేడు ప్రవచించుచుండగా ఏమి జరిగినదో మీకు తెలియునా? అది సరిగ్గా అప్పుడుండినట్లుగానే యుండెను. ఆయన ఏమి చేయునని ఇక్కడ వాక్యము వాగ్దానము చేసినదో అది నెరవేర్చబడుటకు అది ఆ విధముగానే ఉండవలసియుండెను.
ఇప్పుడు గుర్తుంచుకొనండి, నోవహు యుగములో క్రీస్తుండెను. అది క్రీస్తే, యేసు క్రీస్తు నిన్న, నేడు, నిరంతరము ఏకరీతిగా యున్నాడు. ఆ ఘడియ యొక్క విసర్జించబడిన వాక్యము.
REV 3:17
57గమనించండి. ప్రకటన 3లోని ఆయన ప్రవచనమును ఈ చివరి దినమున ఆయన వచ్చుటలో కనుగొందుము — ఈ చివరి దినమున తాను వచ్చుదునని వాగ్దానము చేసినట్లుగానే, లవోదికయ సంఘమును ఆయన ఏలాగు కనుగొనును? "ధన సమృద్ధి చేసికొని, ఏమియూ అక్కరలేదని" చెప్పుచూ "రాణివలె కూర్చొని ఏ దుఃఖమును చూచుట లేదు." "ఆయనను సంఘము వెలుపట ఉంచినది." ఆయనకు ఏమీ పనికి రాలేదు. ఆయన మరల శిబిరము వెలుపలకు వెళ్ళెను. అయితే తాను దిగంబరియు, గ్రుడ్డిదియు, నీచురాలునై యున్నానన్న సంగతి ఎరిగియుండలేదు.
అప్పుడు, వచ్చిన రీతిగా ఆయన మరల వచ్చియుండినచో, పొట్టి దుస్తులు ధరించిన ప్రతి స్త్రీని ఆయన గద్దించును. జుట్టు కత్తిరించుకొనిన ప్రతి స్త్రీని, రంగులు పులుముకొనిన ప్రతి ముఖమును, తన భార్య ఆలాగు చేసినా గాని ఏమీ పట్టించుకోని ప్రతి పురుషుని ఆయన గద్దించును. ఆయనింకనూ దానిపై నిలబడును. ఉన్న ప్రతి శాఖను ఆయన చీల్చివేయును. మనకున్న ప్రతి మత సిద్దాంతమును ఆయన విచ్చిన్నము చేయును. ఆలాగు ఆయన చేయునని మీరు నమ్ముదురా? నిశ్చయంగా ఆయనాలాగు చేయును! అది నిజము!
ఆయనను వారేమి చేయుదురు? శిబిరము వెలుపట ఆయన నుంచుదురు. వారు నిశ్చయంగా ఆయనతో సహకరించరు. లేదండీ!
HEB 13:8
58ఇప్పుడు, ఆయనను శిబిరము వెలుపట ఉంచుదురని బైబిల్ చెప్పిన విధముగానే ఈ దినమున ఆయన ఉండుటను మరల కనుగొనుచున్నాము. ఎందుకనగా ఆయన ఎల్లప్పుడూ ఏకరీతిగా యుండును. వాక్యము నిన్న, నేడు, నిరంతరము ఏకరీతిగా యుండును.
వారాయనను కోరుకొనరు. వారు తమ ఆలోచన సభతో మరలా ఆయనను విసర్జించుదురు. ఆయనను విచారణ చేసినప్పుడు ఆనాడు వారు ఏలాగు కోరుకొనిరో నేడును వీరు ఆలాగే కోరుకొందురు. ఈనాడు వాక్యము విచారణకు గురి అవుచున్నప్పుడు, ఏమి జరిగినది? ఆనాడు వారు చేసినట్లుగానే ఆయనను విసర్జించి, క్రీస్తుకు బదులుగా ఒక హంతకుడగు బరబ్బాను కోరుకొనినట్లే యుండును. ఆలోచన సభ అదే తిరిగి చేయును. ఈనాడు వారు వాక్యమును తిరస్కరించి, ఘడియ యొక్క పరిపూర్ణ ప్రత్యక్షతను త్రోసివేసిన ఎడల, వారు అమ్ముడుపోయి వాక్యమును హత్యచేసిన ప్రపంచ సంఘ సమితి అను బరబ్బాను కోరుకొనినట్లే.
JOHN 14:9
59వారాయన వాక్యమును తిరస్కరించిరి, ఆయన బాప్తిస్మమును తిరస్కరించిరి, ఆయన శక్తిని తిరస్కరించిరి, ఆయన సూచనలను తిరస్కరించిరి. ఆచారపు పద్దతులు లేదా మత నమ్మకములు, గుండ్రని కాలరు ధరించుట, తమకు తాము సిద్దాంతములు మొదలగునవి ఏర్పరచుకొనుటను వారు కోరుకొనుచున్నారు. మంచి కార్యములు చేసి ఏదో పొందవలెనని ప్రయత్నించుచున్నారు. ఆదిలోనే వారు జీవమునకు నిర్ణయించబడలేదు. అసలు నమ్ముటకు వారికేమియూ లేదు. "నన్ను ఎరిగినవాడు తండ్రిని ఎరుగును! తండ్రి నన్ను పంపినట్లుగా నేను మిమ్మును పంపుచున్నాను." యేసును పంపిన దేవుడు, యేసులో వెళ్ళెను. మరియు మిమ్మును పంపిన యేసు మీలో వెళ్ళును. "నా యందు విశ్వాసముంచువాడు నేను చేయు క్రియలు చేయును. సర్వలోకమునకు వెళ్ళి సర్వసృష్టికి సువార్త ప్రకటించుడి. (నలుపు, పసుపు, తెలుపు, గోధుమ రంగు, మరే రంగు వారయినా గాని) నమ్మినవారివలన ఈ సూచక క్రియలు కనబడును." ఎందుకొరకు? సర్వలోకమునకు, సర్వసృష్టికి,
ACTS 2:38
60కొద్దికాలము క్రితం ఒక చిన్న బాప్టిస్టు సేవకుడు ట్యుసాన్లో నా యొద్దకు వచ్చి ఇట్లనెను, "బ్రెన్హాం సోదరుడా, నీ పొరపాటు ఇక్కడున్నది. దీనిని నీవు అపొస్తలుల యుగము వలె చేయుటకు ప్రయత్నించుచున్నావు. ఈనాడు అపోస్తలుల యుగము అనునది ఏదీ లేదు. అపోస్తలుల కాలము అయిపోయినది."
"ఆలాగా? అది నాకు తెలియదే," అన్నాను నేను.
"అవును. ఆలాగే!" అన్నాడతడు.
"నిశ్చయంగా నీకు తెలియునా?" అనడిగాను.
"నిశ్చయంగా, నిశ్చయంగా నాకు తెలియును. అవును." అన్నాడు.
"అది అయిపోయినదని నీకేలాగు తెలియును?" అనడిగాను.
"అది అపోస్తలులకు." అన్నాడు.
"పేతురు పెంతెకోస్తు దినమున చెప్పెను… అతని మాటను నీవు నమ్ముచున్నావా?" అనడిగాను.
"అవునండి!"
"ఆయన అన్నాడు, ప్రతివాడును మారుమనస్సు పొంది యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందవలెను. ఈ వాగ్దానము మీకును, మీ పిల్లలకును, మీ పిల్లల పిల్లలకును, దూరస్తులందరికిని, ప్రభువుగు దేవుడు ఎందరిని పిలచెనో వారందరికిని చెందును," అని అతడు చెప్పెను!"
JER 8:22
61అదే వాగ్దానమిది, దాని యొద్దకు మనము తిరిగి రావలసియున్నాము!
డాక్టర్. సీమోను పేతురు ఒక చీటీ వ్రాసెను. "గిలాదులో గుగ్గిలము లేదా? అక్కడ ఏ వైద్యుడును లేడా?" అని బైబిల్ అడుగుచున్నది. డాక్టరు యొక్క మందు చీటిని తీసికొనుట మీరెరుగుదురు. నీ శరీరమందున్న వ్యాధిని అతడు కనుగొనినప్పుడు, అతడు ఆ చీటీని వ్రాయును. దానిని నీవు వాడుట మంచిది. అది వ్రాయబడిన ప్రకారము మందులను ఇచ్చు నిజమగు మందులమ్ము వానియొద్దకు నీవు వెళ్ళవలెను. ఎందుకనగా అతడు నీ శరీరక్రమము స్వీకరించగలుగు విషమును, వ్యాధి నిరోధక మందును (antidote) లోనికి పంపవలసియున్నాడు. మీరు చూడండి. అది అంతకు ముందే పరీక్ష చేయబడి వాడబడినిది. నీవు తప్పక ఆ మందుల పట్టికను వాడవలెను. నీవు తీసికొనని యెడల, దానితో ఆటలాడు ఒక పిచ్చి వైద్యుని యొద్దకు వెళ్ళవలెను, మందును సరిగా కొలువజాలని అతడు నిన్ను చంపును. బాగా బలహీనమగు మందును ఇచ్చిననూ, దాని వలన నీకు ఏ మేలు కలుగదు.
ACTS 2:38
62మీలో చాలామంది వైద్యుల సంగతి ఆలాగే యున్నది. ఆ మందుల వివరణతో ఆటలాడుచున్నారు. "నేను మీకు ఒక నిత్యమగు వివరణను ఇచ్చుచున్నాను. అది మీకు, మీ పిల్లలకు, దూరస్తులందరికి, మన ప్రభువగు దేవుడు పిలచిన వారందరికి చెందును," అని పేతురు చెప్పెను. "వచ్చి చేరండి!" అని కాదు గాని, "ప్రతివాడును మారుమనస్సు పొంది పాపక్షమాపణ నిమిత్తము యేసు క్రీస్తు నామమున బాప్తిస్మము పొందవలెను. అప్పుడు మీరు పరిశుద్దాత్మ పొందుదురు, ఫలితములు. ఆమేన్! ఈ వాగ్దానము, ఈ వివరణ మీకు, మీ పిల్లలకు చెందును." మీలో కొందరు మతిలేని వైద్యులు ఆ అబద్ధ వివరణ ఇచ్చి మీ ప్రజలను చంపుచున్నారు. ఆ కారణము వల్లనే వారికి అసలయినది అందుటలేదు అవును!
63మీకు తెలియునా, ఈ వివరణ చీటి మీదనే వైద్యుడు తన మందును ఎట్లు కనుగొనును. శాస్త్రజ్ఞలు ఏదో కనిపెట్టి దానిని గినియా పందికి (Guinea pig) ఇచ్చి అది దానిని చంపునో లేదో పరీక్షించుదురు. మందును ఒకసారి ప్రయోగించుట అవసరమని మీరెరుగదురు. మీరు బాగుపడ వచ్చును లేదా అది మిమ్ము చంపవచ్చును. చూచారా? ఎందుకనగా ప్రజలందరూ గినియా పందుల వంటి వారు కారు, కాబట్టి. అయితే వివరణ చీటీ గురించి ఒక విషయము యున్నది, అది అందరి కొరకు.
ఒక నిజమగు మంచి వైద్యుడు తన స్వంత మందులో తనకు ఎక్కువ నమ్మకము లేనప్పుడు మరెవరినో అడుగడు. అందులో కొందరు పిరికివారయి ఒక జీవితకాలపు ఖైదీను తీసుకొని, దాని మీద అతడు బ్రదికిన యెడల స్వేచ్చగా విడిచిపెట్టెదరు, అతనిని ఆ మందులు వాడనిచ్చెదరు.
MATT 16:13,16,17,19•
JOHN 11:25-27
64కాని ఈ స్థలమందు మనము ఒక నిజమగు వైద్యుని కలిగి యున్నాము. ఆయనే వచ్చి తాను ఆ మందుల వివరణ చీటీని తీసికొనెను.
"నేను ఉన్నవాడను, నేను౦దును! పునరుద్దానమును, జీవమును నేనే, అని దేవుడు చెప్పెను. "నా యందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రదుకును, బ్రదికి నాయందు విశ్వాసముంచువాడు మరెన్నడును చనిపోడు." "నీవు ఇది నమ్ముచున్నావా?" అని ఆయన మార్తను అడిగెను.
అందుకామె, "అవును ప్రభువా, లోకములోనికి రానైయున్న క్రీస్తువు నీవేనని నమ్ముచున్నాను. తక్కినవారందరూ నిన్ను ఏలాగు పిలచినా గాని నాకక్కరలేదు. దానిని నేను చూచాను," అన్నది.
కల్వరి యొద్ద, ఆయన తానే ఆ సూది మందు తీసికొనెను. ఈస్టరు ఉదయము మరణము ఆయనను పట్టుకొని యుంచలేకపోయెను: "పునరుద్దానమును మరియు జీవమును నేనే!" వారాయనలోనికి మరణమును ఎక్కించిరి, కాని ఆయన మరణము, పాతాళము, సమాధి మీది విజయము పొంది లేచెను. ఆ సూది మందును ఆయనే తీసికొనెను. ఆయన ఏమైయుండెనో ఆ ప్రత్యక్షత కలిగిన కొందరు వైద్యులకు వివరణ చీటీ వ్రాసి ఇచ్చి పంపెను. "మనుష్య కుమారుడనైన నా గూర్చి మనుష్యులు ఏమని చెప్పుకొనుచున్నారు?"
"నీవు క్రీస్తువు, సజీవుడగు దేవుని కుమారునివి," అని పేతురు చెప్పెను.
"సీమోనూ, నీవు ధన్యుడవు, ఇప్పుడు నీవు దానిని పొందియున్నావు. రాజ్యము యొక్క తాళపు చెవులు నీకిచ్చుచున్నాను. నీవు భూమి మీద దేనిని బంధించుదువో, దానిని నేను పరలోకమందు బంధించుదును. నీవు భూమిమీద విడిపించినచో, నేను పరలోకములో దానిని విడిపించెదను," అని ఆయన చెప్పెను.
ACTS 2:37,39
65పెంతెకోస్తు దినమున ఇదంతయూ జరుగుట వారు చూచినప్పుడు - వారు, "మేము ఈ సూది మందును పొందుటకు ఏమి చేయవలెను?" అని అడిగిరి.
ఇక్కడ అతడు ఆ వివరణ చీటీని చదివెను. అతడిట్లు చెప్పెను, "మీకును, మీ పిల్లలకును, దూరస్తు లందరికిని, మన ప్రభువగు దేవుడు పిలచిన వారికిందరికిని చెందు ఒక వివరణను వ్రాయబోవుచున్నాను!" ఆ వివరణ చూచియు మీరు ఆటలాడవద్దు; బుద్ధిహీనముగా ప్రవర్తించినచో మీరు చనిపోవుదురు! దానిని వారు ఈనాడు ఎంతో బలహీనముగా తయారుచేయుచున్నారు, చివరకు అది శాఖయొక్క నీరు అనునట్లుగా చేయుచున్నారు, అవును, చనిపోయినవాడు మరింత చనిపోయినవానిగా ఉండునట్లుగా వారు అతని లోనికి సిద్ధపరచు ద్రవము ఎక్కించుచున్నారు. ఓ! కాని సోదరుడా, ఒక నిజమగు అభిషేకమున్నది! గిలాదులో ఒక గుగ్గిలమున్నది; అది ఆత్మయొక్క స్వస్థత కొరకే. ఆ వివరణతో బుద్ధిహీనముగా ప్రవర్తించవద్దు. వ్రాయబడినది వ్రాయబడియున్నట్లు గానే, ఆ వివరణను తీసికొనుము. దేవుడు ఆయన వాక్యమునకు బద్దుడై యున్నాడు. ఒక మత విశ్వాసమునకు లేదా సిద్దాంతమునకు లేదా శాఖకు ఆయన బద్దుడు కాడు. ఆయన తన వాక్యమునకు బద్దుడు. ఆ వివరణను వెంబడించుము. అదే మొదటి ప్రాతిపదిక. ప్రారంభించుము; అప్పుడు నీవు పనిచేయుటకు ఉపక్రమించుదువు.
గమనించండి, శిబిరము వెలుపటకు!
66వారు ఈనాడు ఒక బరబ్బాను ఎన్నుకొనిరి. సువార్త ప్రపంచము నలుమూలలా బయలువెళ్ళుచున్నది. ఆ ఉజ్జీవమును గొప్ప సూచక క్రియలు మరియు అద్భుతములు వెంబడించుచున్నవి, కాని లోనికి వచ్చి దానిని చేయుటకు బదులుగా వారు బరబ్బాతో ఏకమగుచున్నారు. "మన సంఘములో ఈ అసభ్యత మొదలగునవి చోటు చేసికొనకముందే. తక్కినవారివలె మనము వర్గీకరణ పొందుదుము." ఇప్పుడు, వారికి రోమ్ యున్నది మరియు వారంతా ఏకమవుచున్నారు, ఒక బరబ్బావలె.
గమనంచండి, అప్పుడు మనము ఆ గొప్ప శిబిరములో యున్నాము.
JOHN 10:37•
HEB 13:12
67ఆ శిబిరము వెలుపలకు వెళ్ళుటకు మనము ఆహ్వానించబడితిమి. జనులను తన స్వరక్తముతో శుద్దీకరించబడునట్లుగా యేసు కూడా శిబిరము వెలుపట శ్రమపొందెను. ఆయన నిందను భరించుచూ మనము కూడా శిబిరము వెలుపటకు ఆయనతో వెళ్ళుదము. (గమనించండి!)
ఎందుకొరకు ఆయన నిందించబడెను? ఆయన మెథడిస్తు లేదా బాప్టిస్తు అయినందువలన కాదు, అది మీకు నేను ఖచ్చితంగా చెప్పగలను! ఆయన పరిసయ్యుడు లేదా సద్దూకయ్యుడు అయినందు వలన కాదు ప్రత్యక్ష్యపరచబడిన వాక్యము అయినందు వల్లనే.
"ఆయన నిందను భరించుచు…" దేనికొరకు? ప్రత్యక్తపరచబడిన వాక్యము కొరకు. అది నిజము! ఆయన చేసినది అదే. "నేను తండ్రి క్రియలు చేయని యెడల, నన్ను నమ్మకుడి. లేఖన పూర్వక ప్రశ్నలన్నింటికి నేను జవాబు కానిచో నన్ను నమ్మకుడి," అని ఆయన చెప్పెను.
68క్రొత్త నిబంధన యొక్క యేసు పాత నిబంధనలోని యెహోవాయే. అక్షరాలా నిజము! ఇక్కడ మీకు కొద్దికాలము క్రిందట చెప్పిన రీతిగానే, లేదా ఎక్కడో ఒక కూటములో చెప్పాను. అది ఇక్కడ కాకపోవచ్చును. "పాత నిబంధనలోని యెహోవా, క్రొత్త నిబంధనలోని యేసు," అని నేను నమ్ముచున్నాను. మీకు గుర్తు౦డియుండును. ఆ ఉదయాన నేను ఊడుతల వేటకు వెళ్ళుచున్నప్పుడు అక్కడ మూడు పెద్దవి ఆ కొండ మీద పరుగిడుచున్నవి. నేను వాని వైపు చూస్తూ నిలబడియున్నాను మరియు నేను దగ్గరగా వెళ్ళి నా టోపీని తీసివేశాను, నా రైఫిల్ క్రింద ఉంచాను, అక్కడికి చేరుకొన్నాను. ఆ అడవిని కుదిపివేసిన ఒక స్వరము ఇట్లు పలికినది. "క్రొత్త నిబంధనలోని యేసు పాత నిబంధనలోని యెహోవాయే. నమ్మకముగా నిలిచియుండుము." ఆ క్రింది భాగములోనే ఉడుతలు కనబడినవి, అక్కడ ఒక్కటియూ లేనప్పుడు ఉనికిలోనికి వచ్చినవి. చూచారా? అది సత్యము! చూడండి? అది సత్యము, కనుక దేవునికి తెలియును - నేనెవరి యెదుట నిలబడియున్నానో, అది సత్యము అని చెప్పుచున్నాను. అది నిజము. అది యధార్ధము.
కెంటాకీలో… అది అనగా ఆ సంగతియే మరల సంభవించినప్పుడు, అక్కడున్నవారు ఈ రాత్రి కొందరు ఇక్కడ కూర్చొనియున్నారు. అవును. అది సత్యమని మనకు తెలియును. పాత నిబంధనలోని యేసు…
69చైనా వారు మొదటగా ఇక్కడికి వచ్చినప్పుడు, మన భాషను వారు చదువలేక పోయిరి. వ్రాయలేకపోయిరి. కాని వారు గొప్ప చాకలి పనిచేయువారు. మీరు చైనా వారి ఇస్త్రీ చేయు చోటునకు వెళ్ళవచ్చును. అతడు చక్కని కొన్ని పాత తెలుపు కాగితపు ముక్కలను తన యొద్ద ఉంచుకొనును. అతడు బొత్తిగా చదువలేడు మరియు అతడు వ్రాసినచో దానిని మీరు చదువలేరని అతడెరుగును. కనుక మీరు వచ్చినప్పుడు - ఏదో ఒక క్రమ పద్ధతి చొప్పన ఈ తెల్లని కాగితపు ముక్కలను తీసి, ఒక ప్రత్యేకమగు రీతిగా దానిని చింపి మీకు ఇచ్చును. ఇప్పుడు, చింపిన ముక్కలలో ఒకటి మీకిచ్చి, ఆ తక్కినది తనయొద్దనే ఉంచుకొనును. నీవు తిరిగి బట్టల కొరకు వచ్చినప్పుడు అతడు, "మీ కాగితపు ముక్కను చూడనీయండి," అని అడుగును. అతడు దానిని తీసికొని తన యొద్ద ఉ౦డిన సగం ముక్కతో జోడించి చూచి అది సరిగ్గా అతికితేనే నీవు వేసిన మురికి బట్టలు శుభ్రము చేయబడి తిరిగి నీకు ఇవ్వబడును.
"పాత నిబంధనలోని యెహోవా క్రొత్త నిబంధనలోని యేసు" అను ప్రతీ ప్రవచనమును, ప్రతీ రూపమును యేసుకు సరిపోయెను. ఆయన ప్రతిదానికిని సరిజోడు అయ్యెను దీనిని నేను దైవ భయము, మర్యాద, ప్రేమ, యధార్థతతో నేను ఎక్కడ నిలబడియున్నానో నేను ఎరుగుదును అని చెప్పుచున్నాను. ఈ ఘడియను గూర్చి బైబిల్ చెప్పిన ప్రతిదానికిని ఈ ఘడియ యొక్క వర్తమానము సరిజోడు అయినది. మరియు నీకు కొన్ని మురికి బట్టలున్నచో వాటిని విడువుము. గొర్రెపిల్ల యొక్క రక్తములో నీవు కడుగబడితివా?
JOHN 5:43•
HEB 13:8
70గమనించండి, ఆయన నిందను భరించుట, ఎందుకనగా ఆయన ప్రత్యక్ష్యపరచబడిన వాక్యము. అప్పుడున్నట్లుగానే ఇప్పుడునూ యున్నది. ఆయన నిన్న, నేడు, నిరంతరము ఏకరీతిగా యున్నాడని హెబ్రి (13) 12 మరియు 13, హెబ్రి 13:8లో కూడా
"సువార్త కొరకు ఆయన యొక్క నిందను" కనుగొందుము. సువార్త యొక్క ఆ సిగ్గును, ఆయన నామమును మోయుదుము . "నేను నా తండ్రి నామమందు వచ్చియున్నానని"ఆయన చెప్పెను. తండ్రియొక్క పేరేమిటి? ఆయన తన తండ్రియొక్క నామములో వచ్చెను. "నేను నా తండ్రి నామములో వచ్చినను మీరు నన్ను చేర్చుకొనలేదు," అని చెప్పెను. సరే, మరి తండ్రి నామము ఏమిటి? మీరు తెలిసికొనియుండవలసినదని నేను తలంచుచున్నాను. వాక్యమును గూర్చి మీరు నిందను మోయవలెను. అది ఎల్లప్పుడూ వారి శిబిరమునకు అవతలగానే తీసికొని పోబడెను; వారు దానిని త్రోసివేసిరి. నిన్ను చూచి నవ్వుదురు, మరియు హేళన చేయుదురు…
JOHN 6:53
71మరియు ఈ దినము, నేను ఎక్కడైతే దేశ వ్యాప్తముగా ప్రారంభించాను, నా గూర్చి ఈనాడు నేనేమీ చెప్పుకొనుటలేదు; ఇది వ్యక్తిగతమని భావించవద్దు. కాని నా సమయము అయిపోయినది; ఇక్కడ పది పేజీలు చెప్పవలసినది ఉన్నది. నోట్సులో ఎంత ఇంకా మిగిలి పోయినదో మీరు చూడగలరు. (చూడండి? చూడండి? సరే)
కానీ వినండి, మొదటి ప్రారంభమయినది… యేసు మొదలుపెట్టినప్పుడు మీరు గమనించారా, "ఓ, యువ బోధకుడు. ఓ, అతడు అద్భుతమగు వ్యక్తి, మా దారిలోనికి రమ్ము మా యొద్దకు వచ్చి బోధించు!"
కాని ఒకనాడు ఆయన వారితో కూర్చొనియుండి ఇట్లనెను, "మనుష్యకుమారుని యొక్క శరీరము తిని, ఆయన రక్తము త్రాగితేనే గాని మీలో జీవముండదు!"
ఆ జనములోని డాక్టరు, మేధావులు ఏమనుకొనిరని మీరు తలంచుచున్నారు? "ఈ మనుష్యుడు ఒక పిశాచి." చూచారా? "మానవ రక్తము త్రాగమని ఇతడు మిమ్మును కోరుచున్నాడు. అది మనకు చాలా ఎక్కువ. ఆయనకు దూరంగా వచ్చేయండి. అతడు పిచ్చివాడని యాజకులు చెప్పిరి; అది నేను నమ్ముచున్నాను!" వారు వెళ్ళిపోయిరని బైబిల్ చెప్పెను.
JOHN 6:62
72డెబ్బదిమంది అభిషేకించబడిన బోధకులు ఆయనకుండిరి. "వారిని నా యొద్ద ఉంచుకోలేను," అని ఆయననెను. కాబట్టి ఆయన వారివైపు తిరిగి ఇట్లనెను, "మనుష్య కుమారుడు తాను వచ్చిన ఆ పరలోకమునకు ఎక్కిపోవుట మీరు చూచునప్పుడు ఏమందురు?" ఇప్పుడు, ఆయనెన్నడూ ఈ సంగతులను వివరించలేదు. వారిని ఒంటరిగా ఆయన విడిచిపెట్టెను. చూచారా?
"మనుష్య కుమారుడా? ఏమిటది? అతనితో మేము భోజనము చేశాము; అతనితో మేము చేపలు వేటాడాము. ఆయనతో కూడా మేము ఆ దరిని పరుంటిమి. అతడు ఊగిన ఉయ్యాల మేము చూచాము. అతని తల్లిని మేమెరుగదుము; అతని సోదరుని మేమెరుగుదుము. ఇట్టి సంగతిని ఎవరు అంగీకరించగలరు?" అని వారనిరి. "ఆ మీదట వారాయనతో నడువలేదని" బైబిల్ చెప్పెను.
JOHN 6:70
73అప్పుడాయన పేతురు వైపు ఇంకా ఆ మిగిలిన వారివైపు తిరిగి ఇట్లనెను, "నేను మీ పండ్రెండు మందిని ఏర్పరచుకొన్నాను…" వేలమంది నుండి ఇప్పుడు పండ్రిండుమంది యొద్దకు వచ్చినది. "నేను పండ్రెండుమందిని ఏర్పరచుకొన్నాను; మీలో ఒకడు అపవాది. ఆదినుండియూ అది నేను ఎరుగుదును." "ఇప్పుడు మీరును వారితో పాటుగా వెళ్ళి పోవలెనని తలంచుచున్నారా?" అనడిగెను. ఆయన వారిని బుజ్జగించి, వీపు నిమిరి, "మీరు సంఘములో చేరితే మిమ్మును ఒక సంఘ పెద్దగా చేయుదునని" చెప్పలేదు. పదును పెటుటకు ఏ గొడ్డళ్ళు లేవు. ఆయనెన్నడూ దానిని వివరించనయినా లేదు. శిష్యులు కూడా దానిని వివరించలేదు,
కాని మీరు గుర్తుంచుకొనండి, ఆయన వారితో ఈలాగనెను, "జగత్తు పునాది వేయబడక ముందే నేను మిమ్మును ఎరుగుదును. నాతో పాటు సంతోషము పొందుటకు మిమ్మును నిర్ణయించాను." అది అక్కడే ఉండెను, జగత్తు పునాది వేయబడక ముందే, ఆయన ముందుగా నిర్ణయించెను.
JOHN 6:68
74ఆ అపోస్తలులు అక్కడే ఎంతో దృఢముగా నిలబడియుండిరి. వారాయన రక్తమును ఏలాగు త్రాగి, ఆయన శరీరమును ఏలాగు తిందురో వివరించజాలకపోయిరి. అన్నివేళలా తమతో ఉండిన ఆయన తిరిగి క్రిందికి దిగి వచ్చుట అనగా ఏమిటో వారికే మాత్రము అర్ధము కాలేదు. దానిని ఆయన వివరించలేకపోయెను. ప్రజలు దానిని వివరించలేకపోయిరి; ఎవరునూ దానిని వివరించలేకపోయిరి. కానీ పేతురు ఆ గుర్తింపదగు మాటలు పలికెను. అతనికి తాళపు చెవులు ఇచ్చుటలో ఆశ్చర్యము లేదు. "ప్రభువా, మేమెవరి యొద్దకు వెళ్ళుదము? నీవొక్కడివే, నీవు మాత్రమే ఈనాటి వాగ్దాన వాక్యము యొక్క ప్రత్యక్షత అని మేము తెలిసికొనియున్నాము, ఒప్పించబడియున్నాము. నీవు మాత్రమే జీవ వాక్యము కలవాడవని మేమెరుగుదుము. ఆ సంగతులను మేము వివరించలేము, కాని ఏమయినా మేము నమ్ముచున్నాము," అని చెప్పెను.
JOHN 11:21,25-27,34,43
75చిన్న మార్త అన్నది, "నా సోదరుడు చనిపోయి యున్నాడు. అతడు సమాధిలో పడియున్నాడు. అతడు క్రుళ్ళిపోయియున్నాడు; అతడు దుర్వాసనగోట్టుచున్నాడు. ప్రభువా, నీవిక్కడ ఉండినయెడల నా సోదరుడు చనిపోకయుండును. కానీ ఇప్పుడయిననూ, నీవు దేవుని ఏమి అడిగిననూ దానిని నీకు దేవుడు అనుగ్రహించును." ఓ, మై!
"నేనే పునరుద్దానమును మరియు జీవమును. నాయందు విశ్వాసముంచువాడు, చనిపోయినను బ్రదుకును. బ్రదికి నా యందు విశ్వాసముంచువాడు, ఎన్నడునూ చనిపోడు. దీనిని నీవు నమ్ముచున్నావా?" అని ఆయన చెప్పెను.
అందుకామె, "అవును, ప్రభువా. దానిని నేను వివరించజాలను, గాని దానిని నమ్ముచున్నాను. లోకములోనికి రావలసియున్న క్రీస్తువు నీవేనని నేను నమ్ముచున్నాను. దాని యొక్క అర్హతను నీవు పొందుదువని, వెల్లడి అయిన లేఖనము బట్టి నేను నమ్ముచున్నాను," అన్నది.
"అతనిని ఎక్కడ మీరు పాతిపెట్టితిరి?" అని అడిగెను.
ఓ, మై! ఏదో ఒకటి జరుగవలసియున్నది. ప్రతిదియు తగిన సమయములో సమకూడి జరుగుచున్నది. చూచారా? ఆయన సమాధి యొద్దకు నడిచి వెళ్ళెను. "ఆయనలో మనము చూచి అపేక్షించునట్లుగా ఏ స్వరూపము లేదు," అని బైబిల్ చెప్పెను. బహుశా భుజములు వంగిన ఒక చిన్న మనిషి, భుజములు క్రిందికి వాల్చి నిలబడెను. నడక వలన అలసటతో సొలసిపోయెను. "లాజరూ, బయటకు రా!" అని ఆయన పలికెను, చనిపోయి నాలుగు దినములయిన వ్యక్తి లేచి తన కాళ్ళపై నిలబడెను.
76ఒక క్రైస్తవ విజ్ఞాన స్త్రీ… మీ భావములను కించపరచినట్లు తలంచినచో నన్ను క్షమించుము; అది నా భావము కాదు. ఈ సంఘము నుండి వచ్చిన ఒక క్రైస్తవ విజ్ఞాన స్త్రీ ఒకరోజు బయట నన్ను కలిసికొని, శ్రీ బ్రెన్హాం, నీ బోధ నాకు ఇష్టమే, కాని ఒకదానిని నీవు మరల ఇదిగా పట్టుకొని వ్రేలాడుచున్నావు," అన్నది.
"ఏమిటది?" అనడిగాను.
"యేసును గూర్చి మరీ ఎక్కువగా చెప్పుచున్నావు," అన్నది.
"నాకు వ్యతిరేకముగా ఆయనకున్నదంతయూ అదేనని తలంచుచున్నాను," అన్నాను.
"నీవు ఆయనను దైవముగా చేయుచున్నావు," అన్నది. చూడండి, ఆయన దైవమని వారు నమ్మరు. ఆయన కేవలము ఒక మామూలు మనిషి అని వారు నమ్ముదురు, మంచి బోధకుడు, తత్వవేత్త అందురు. "నీవు ఆయనను దైవముగా చేయుచున్నావు గాని ఆయన దేవుడు కాదు," అన్నది.
"ఓ, అవును! ఆయన దేవుడే," అన్నాను.
"నీ స్వంత బైబిల్ ద్వారా ఆయన దేవుడు కాడని నేను రుజవు చేసినచో నీవు నమ్మదువా?" అన్నది.
"నా బైబిలు ఆలాగు చెప్పినచో, నేను వాక్యమును నమ్ముదును. ఆయన దేవుడై యున్నాడు," అని చెప్పాను.
"పరి. యోహాను 11వ అధ్యాయములో యేసు లాజరు సమాధి యొద్దకు వెళ్ళి ఏడ్చెను," అని బైబిలు చెప్పినదని ఆమె నాతో అన్నది.
"అది దానితో ఏమి చేయబోవుచున్నది?" అనడిగాను.
"'అవును, ఆయన దైవము కాదని అది చూపించుచున్నది," అన్నది.
"ఆ నరుడు ఎవరై యుండెనో చూచుటలో నీవు విఫలమయినావు. ఆయన నరుడు, దేవుడు కూడా అయి యున్నాడు. ఆయన నరుడుగా దుఃఖాక్రాంతునిగా యుండి ఏడ్చుచున్నవారితో ఆయన ఏడ్చెను, కాని ఆయన నిలబడి "లాజరూ, బయటకు రా!" అని చెప్పినప్పుడు నాలుగు దినముల క్రిందట చనిపోయిన వ్యక్తి లేచి నిలబడెను, అప్పుడు ఆయన మానవునికంటే ఎక్కువ!" అని చెప్పాను. అవునండీ! అవును. నిశ్చయంగా!
MATT 4:2•
MATT 14:19-21•
MATT 19:28,29•
MATT 27:46•
MARK 6:41-44•
MARK 15:34•
LUKE 4:2•
LUKE 9:14-17•
JOHN 6:11-13
77మరియు నేను తరచూ ఈలాగు చెప్పెదను, ఆ రాత్రి ఆయన కొండ దిగి వచ్చుచుండగా, ఆకలిగొనెను. ఆయన ఒక మానవుడు, మరుసటి రోజు ఆయన ఆకలి గొనెను, ఆయన ఒక నరుడు. కానీ ఆయన ఐదు రొట్టెలు, రెండు చేపలు తీసికొని అయిదు వేలమందికి ఆహారము పెట్టినప్పుడు, మిగిలినవి ఏడు గంపల నిండా ఎత్తునట్లు చేసినప్పుడు ఆయన మానవాతీతుడుగా ఉండెను. అవునండీ! ఆయన మానవునిగా సిలువ మీద ఈలాగు కేకవేసెను, "నా దేవా, నన్నేల చేయి విడిచితివి." "నేను దప్పిగొను చున్నాను," అని ఆయన కేక వేయగా వారు చేదు కలిపిన చిరకనిచ్చిరి. కేక వేసినప్పుడు ఆయన మానవునిగా ఉండెను. కాని ఈస్టరు ఉదయమున ఆయన మరణము, పాతాళము, సమాధి యొక్క ప్రతి ముద్రను విరుగగొట్టి తిరిగి లేచినప్పుడు మానవునికన్న అధికునిగా కనిపించెను.
MARK 4:39
78ఆ చిన్న దోనెలో ఆ రాత్రి వెనుక పరుండియుండగా ఆయన మానవునిగా కనిపించెను. ఆ బయట ఆయన శిష్యులతో యుండెను. ఆయనను ముంచివేయుదుమని పదివేల దయ్యములు ప్రతిన పూనినవి. ఆయన ఆ చిన్న దోనెలో సీసాలో బంధింపబడిన వారివలె యుండెను. ఆయనెంతో అలసిపోయి యుండెను, ఆయన మేల్కోన లేదు కూడా. నిద్రపోయినప్పుడు ఆయన ఒక నరుడే. కాని ఆయన దోనె అమరము మీద నిలబడి, పైకి చూచి, "నిమ్మళము కలుగు గాక!" అనినప్పుడు గాలి మరియు అలలు ఆయనకు లోబడెను. అప్పుడు ఆయన మానవాతీతుడు. ఆయన దేవుడు! ఆ కవి ఈలాగు పలుకటలో ఆశ్చర్యము లేదు!
జీవించుచూ ఆయన నన్ను ప్రేమించెను; మృతి పొందుచూ ఆయన నన్ను రక్షించెను;
సమాధి చేయబడి ఆయన నా పాపములను దూరపరచెను;
తిరిగి లేచి ఉచితముగా నిత్యమూ నీతిమంతునిగా నుండునట్లు చేసెను:
ఒక దినమున ఆయన వచుచున్నాడు — ఓ, మహిమకరమగు దినము!
అవునండీ! శిబిరము వెలుపలకు వెళ్ళుము. అదెంత ఖరీదయినా నాకు లెక్కలేదు.
పరిశుద్ధపరచబడిన సిలువను నేను మోయుదును.
మరణము వరకు నన్ను స్వతంత్రునిగా చేయును.
గృహమునకు వెళ్ళిన తరువాత, ధరించుటకు
ఒక కీరిటమున్నది నాకు ఒక కీరిట మున్నది.
79ముగింపులో ఇది చెప్పెదను. ఒక న్యాయాధిపతి మీద ఒక కథ కొంతకాలము క్రిందట చదువుచున్నాను. అతడు నీతిమంతుడు, మంచివాడు, అందరిచే ప్రేమించబడిన వాడు. ఆ పట్టణములో నున్న కొంతమంది గుంపు తామేమి చేసినా పరవాలేదని భావించి ఒక అసభ్య గృహమును తెరచిరి. సారాయి కొట్టు, ఇంకా అటువంటి చట్ట వ్యతిరేక కార్యకలాపములను నడుపసాగిరి. వారు చట్టము ద్వారా పట్టుకోబడిరి. ఆ అధికారులు కోర్టుకు అప్పగించిరి మరియు ఆ చిన్న పట్టణపు ప్రజలందరూ గుమిగూడినప్పుడు ఈ వ్యక్తులు ఆ చుట్టుప్రక్కల ఈలాంటి కార్యములు చాలా చేసిరని వారెరుగుదురు. ఆ వ్యక్తి వేశ్యా గృహమును నడిపెనని తెలిపెను. నేరము చేయుచుండగా అతడు పట్టుబడెను గనుక న్యాయాధికారులు వారు దోషులని తెలియచేసిరి. న్యాయాధిపతి వారు దోషులని కనుగొని చాలా సంవత్సరముల శిక్ష వారికి విధించెను. జామీనుగాని, అప్పిలుగాని మరేదీ చేసికొన వీలులేకుండా వారిని పంపివేసెను. ఎందుకనగా అది చట్టమైయున్నది.
80కోర్టు బయటనున్న జనులు అతని మీద పడి ఈలాగనిరి, "నీకేమి తెలియును? ఈ పట్టణములో నున్న ప్రతి వ్యక్తి నిన్ను ద్వేషించును!" వారి మీద ఆ శిక్షా నిర్ణయము నీవు తీసికొన్నందులకు వారు నిన్ను ద్వేషించెదరు." వారందరూ వారికి వారే జూదరులు. "మేమంతా నిన్ను ద్వేషించుదుము! తిరిగి మరెన్నడూ నిన్ను ఎన్నుకొనము! మాలో ఏ ఒక్కరము తిరిగి ఓటు వెయ్యము!" అని చెప్పి వీధిలో పోతున్న అతనిని తూలనాడుచుండిరి.
అయితే అతడు నిలబడి ఇట్లనెను, "ఒక్క నిమిషము!" ఆగండి. "ఒక్క మాట నన్ను చెప్పనీయండి!" నేను అక్షరాలా నా కార్య నిర్వహణను నిర్వర్తించాను. అతడెవరయినా కావచ్చు గాని, అతడు మాత్రము దోషి, చట్ట ప్రకారము నేను అతనికి శిక్ష విధించాను. ఆ చట్టమునకు నేను కట్టుబడియుందునని ప్రమాణము చేశాను."
ఆయన చెప్పెను, "ఈ పట్టణములో ద్వేషింపబడును!"
"కాని ఇంటి యొద్ద నా ప్రజలచే గొప్పగా ప్రేమించబడుదును!" అని అతడు జవాబిచ్చెను.
మనమును ఆలాగే ఆలోచించవచ్చును, నా మాటను మీరు క్షమించినచో ఏది చేయుటకు నేను రక్షించబడితినో దానికే నేను నిలబడితిని. ఈ దేవుని వాక్యమును పైకెత్తి పట్టుకొన్నాను! నేను చెప్పుచున్న సంగతుల బట్టి శాఖలు నన్ను ద్వేషించునని నాకు తెలియును. కాని ఆయన ఇంటిలో, ఆయన జనుల మధ్య నేను గొప్పగా ప్రేమించబడుదును. మనము ప్రార్ధి౦చుదము!'
PHIL 2:5
81ప్రభువైన యేసూ, లోకము ద్వారా మేము ద్వేషించబడవచ్చును, కాని తండ్రి ద్వారా ప్రేమించబడుదుము. మాకు సహాయము చేయుము, ప్రియదేవా; ఈ జనులలో ప్రతిఒక్కరికి సహాయము చేయుము. ప్రభువా, వారి మీద నీ ఆశీర్వచనములు నిలిపియుండునట్లు చేయుము. ఇప్పుడు మనము శిబిరము వెలుపటకు వెళ్ళుదము. మన స్వంత ఆలోచనను దాటి వెళ్ళుదము. దేవుని ఆలోచనను బట్టి మనము కొనసాగుదము. బైబిలులో ఈలాగు చెప్పెను. "క్రీస్తునకు కలిగిన మనస్సు మీరు కలిగియుండుడి." కనుక మనము ఆయన ఆలోచనలు ఆలోచించుదము, మన స్వంత ఆలోచనలు కాదు, ఎందుకనగా ఎక్కువ కాలము మనము తప్పులోనే యుండుట జరుగుచున్నది, కనుక మనలో ఆయన మనస్సు నిలిచియుండునట్లు నిశ్చయముగా ఆశించవలెను. తండ్రి చిత్తమును చేయుటయే ఆయన యొక్క మనస్సు, ఆయన యొక్క వాగ్దాన వాక్యమే తండ్రి యొక్క చిత్తము.
ఈ రాత్రి శిబిరము దాటి వెలుపటకు వెళ్ళి, ప్రభువా, మరియు యేసును కనుగొందము. సంఘములో చేరుట ద్వారా ఆయనను ఎన్నడూ మనము కనుగొనము; ఏదో ఒక సేవకునితో కరచాలనము చేయుట ద్వారా ఆయనను మనము కనుగొనలేము, లేక ఏదో విశ్వాస నియమావళి మీద సంతకము చేయుట ద్వారా కాదు, లేక సంవత్సరములో ఇన్నిసార్లు ఆదివారపు బడికి వెళ్ళుదునని వాగ్దానము చేయుట మొదలగు దానివలన కాదు. వాక్యము నందు మాత్రమే ఆయనను మనము కనుగొందుము. ఎందుకనగా ఆయన వాక్యమై యున్నాడు.
ఆయన శిబిరము వెలుపటనుంచబడునను ఈ దినమును గూర్చిన వాగ్దానము మనము చూచుచున్నట్లుగా మరల బయట ఉంచబడును. ఇప్పుడు మనము శిబిరము వెలుపటకు వెళ్ళుదము. ఆయన నిందను భరించుటకు సిద్ధపడుదము. ఈ లోకము ద్వారా ద్వేషించబడుదుము, కాని మనలను శిబిరములోనికి ఆహ్వానించిన ఆయన ద్వారా ప్రేమించబడుదుము. ప్రభువా, దానిని అనుగ్రహించుము.
GAL 1:8•
REV 22:18,19
82ఆయనను ఎరుగనివారు, ఏదో ఒక సంఘ సహకారపు శిబిరము అవతలకు ఎన్నడూ వెళ్ళని వారు ఎవరైనా ఇక్కడుండి యందురు, అయినా మీరు క్రైస్తవులుగా చెప్పుకొనుచున్నారు. "అది మరియొక దినమునకు అని నేను నమ్ముచున్నాను," అని నీవు ఈ సంగతులను గూర్చి చెప్పుచున్నయెడల అది పరిశుద్దాత్మ కాదని చూపించుచున్నది. పరిశుద్దాత్మ పొందిన మనిషి, ఎన్నడైనా తండ్రి, కుమార, పరిశుద్దాత్మ నామములో బాప్తిస్మము పొందగలడా? ఆ గొప్ప అపోస్తలుడగు పౌలు ఈలాగు చెప్పెను, "పరలోకము నుండి ఒక దూత దిగి వచ్చిననూ…" భేదము తెలియక ఒకప్పుడు మీరాలాగుచేసియుండ వచ్చును. అ.పొ.కా. 19లో ఆ జనులు తేడా తెలియకనే ఆలాగు చేసిరి, కానీ "పరలోకము నుండి దూత దిగి వచ్చి దానికి వేరయినది చెప్పినచో శాపగ్రస్తమగును," అని చెప్పెను. "ఆ నిజమగు పరిశుద్దాత్మ బాప్తిస్మము యొక్క వాగ్గానము మీకు అని చెప్పుచుండగా, ఏదో మత నమ్మకమును, లేదా ఏదో వాదమును, మరో దానిని మీరెట్లు అ౦గికరి౦చుదురు…
వాక్యమును వ్రాసిన పరిశుద్దాత్మ మీలో ఉండినచో వాక్యమును ఎట్లు నిరాకరించుట జరుగును? "ఎవరయినా దీనికి ఒక మాట చేర్చినా, ఒక మాట దీనిలో నుండి తీసివేసినా, జీవగ్రంథములో వానికి పాలు పంపులుండవు," అని పరిశుద్ధాత్మ తానే చెప్పగా ఎట్లు అది నిరాకరించగలదు? అలాగయితే పరిశుద్ధాత్మ వాక్యమునకు ఒకటి చేర్చుట గాని, వాక్యము నుండి ఒకటి తీసివేయుట గాని ఎట్లు చేయును?
83నా స్నేహితులారా! ఇక్కడ మరియు ఆ టేపు వెళ్ళు అదృశ్య ప్రపంచములో, ఇప్పుడు మనకు అది కనబడునది. ఈ ఉదయకాల వర్తమానపు బోధ మీ హృదయము యొక్క లోతునకు పోనిచ్చి మనమున్న చోటు చూచుచుండగా, కొద్దిసేపటి క్రితం నేను చెప్పిన ఆ వివరణ చీటిని ఇంకనూ నీవెన్నడూ తీసికొననిచో దానిని ఇప్పుడే పొందుకొనవా? మీకు సాధ్యమగు సహాయము అందించుటకే ఇక్కడ మేమున్నాము.
నేను ఒక సాక్షిని మాత్రమే; నేను కేవలము ఎన్నికలో నిలబడు వాని తరపున ప్రచారము చేయువాడిని మాత్రమే. ఇప్పుడు కెంటాకీలోని లూయిస్విల్లో - డెమొక్రటిక్ మీటింగు మనకు జరుగుచున్నది. వారు తమ వ్యక్తిని ఎన్నుకొనుటకు వేదిక నిర్మించుచున్నారు. ఆలాగే నేనునూ నా ప్రభువు కొరకు ఒక వేదిక నిర్మించుచున్నాను. ఈ రాత్రి ఆయనను నీ స్వంతవానిగా చేర్చుకొనవా?
84ఈ క్షణములో మన తలలతో పాటు మన హృదయములను కూడా వంచుదము. మీరు మీ చేతులెత్తి దేవునితో - నాతో కాదు, నేను కేవలము ఒక మనిషిని - చేతులెత్తి ఈలాగు చెప్పండి, "దేవా, నా పట్ల దయచూపుము. నేను వినిన ఈ సంగతులన్నియూ నిజంగా నేను కోరుచున్నాను. నేను శిబిరము వెలుపలకు వెళ్ళగోరుచున్నాను. ఎవరేమన్నా నాకు లెక్కలేదు." దేవుడు నిన్ను దీవించును! ఓ! చాలా చేతులు పైకి లేచినవి. "నేను శిబిరము వెలుపలకు వెళ్ళగోరుచున్నాను. ఎంత వెల చెల్లించవలసినా నాకు అక్కర్లేదు. నేను నా సిలువను ఎత్తికొని ప్రతి దినము మోయుదును. నేను శిబిరము వెలుపటకు వెళ్ళెదను. నా గురించి జనులు ఏమి చెప్పుకొన్నాగాని నాకు అక్కర లేదు. నేను శిబిరము వెలుపట ఆయనను వెంబడించగోరుచున్నాను. నేను వెళ్ళుటకు సిద్ధముగా యున్నాను."
85పరమ తండ్రీ, నీవు ఆ చేతులను చూచియున్నావు. బహుశా వంద లేదా అంతకు ఎక్కువ చేతులు ఈ భవనములో పైకెత్తబడినవి. ప్రభువా, వారి చేరువగా ఒకాయన యున్నాడు, ఆయనే క్రీస్తు అను వ్యక్తి, స్వాభావిక కన్నులకు కనబడడు. అయితే ఆయనే వారీ తీర్మానము చేసికొనునట్లు చేసెను. వారి స్వంత జీవితము వారు అద్దములో చూచికొనినప్పుడు వారికి కనబడును. వారికి తెలియును; ఏదో పోగొట్టుకొన్నామని వారు చూచుకొనుచున్నారు; మరియు దేవుని యొక్క వాగ్దానము ప్రకారము వారు తమ జీవితములు రూపొందించబడవలెనని కోరుచున్నారు మరియు గాఢమగు యధార్థతతో వారు తమ చేతులను ఎత్తియున్నారు. ఈ రాత్రి ఆ గొర్రెల ద్వారము నొద్దకు, ఆ గొప్ప తలుపు నొద్దకు వారిని నడిపించుటకు ప్రభువా సహాయము చేయుము. వారు దీనముగా, మాధుర్యముగా వచ్చెదరు గాక. అది దయచేయుము! ప్రభువా, వారు నీ వారు. వారితో మాట్లాడుము.
86ఇప్పుడు, ఏదో ఒక సహజాతీతమగునది పని చేయనిచో వారు తమ చేతులు ఎత్తియుండెడివారు కారు. ఆ తీర్మానము చేసియుండెడివారు కారు. ఎక్కడో ఒక జీవమున్నదని అది చూపించుచున్నది. విజ్ఞాన శాస్త్రము ప్రకారము భూమ్యాకర్షణ శక్తి వారి చేతులను క్రిందికి లాగుచున్నది. అయితే ఏదో వారి మనస్సులను తాకినందున వారు ఆకర్షణ శక్తిని ఎదిరించి, తమను తీసికొని వచ్చిన సృష్టికర్త వైపునకు తమ చేతులు ఎత్తియున్నారు. "అవును, నేను మార్గమంతయూ వెళ్ళగోరుచున్నాను. ఈ రాత్రి శిబిరము అవతలకు నేను వెళ్ళగోరుచున్నాను."
ప్రభువా, మారుమనస్సు తరువాత మొదటి మెట్టుయగు బాప్తిస్మము పొందుటకు నీరు సిద్ధముగా యున్నది మరియు పరిశుద్దాత్మను పొందుటకు వాగ్దానము కూడా, ఈ చివరి దినములలో అసలు విశ్వాసము వైపునకు, అసలు వివరణ యొద్దకు పిలువబడుచున్నది. చాలామంది జనులు క్రీస్తుకు దూరముగా ఉండుట మేము చూచుచున్నాము, ఇతర మానవ నిర్మిత వివరణల క్రింద చనిపోవుచున్నారు. వారు తమ శాఖలలో ఎంతో మంచివారు కావచ్చును, కాని ప్రభువా, నాకు నీ వివరణ కావలెను. నీవే మా వైద్యునివి; ఒక వైద్యుడున్నాడు; గిలాదులో గుగ్గిలమున్నది. ప్రతి భౌతిక జీవిని స్వస్థపరచుటకు, ప్రతి పాపము వలన రోగ గ్రస్తమయిన ఆత్మను బాగుచేయుటకు ఈ రాత్రి ఒక వైద్యుడున్నాడు. ఎన్నడూ లేని గొప్ప వైద్యుడు. భూమ్యాకాశములను సృజించిన గొప్ప సృష్టికర్త, ఇప్పుడే రమ్ము నీవు మా మధ్యకు వచ్చి మాట్లాడుము. యేసు క్రీస్తు నామమున అడుగుచున్నాము.
87ప్రతివారును తమ హృదయములలో ఈలాగు ప్రార్ధి౦చండి, "ప్రభువగు యేసూ, ఇప్పుడు నాకు సహాయము చేయుము!" మీరెన్నడూ బాప్తిస్మము పొందనిచో, మీరు ఒప్పించబడి యుండినచో - నేను బాప్తిస్మము మీద బోధించలేదు - కాని మీరు క్రైస్తవ బాప్తిస్మము పొందుటకు ఒప్పించబడియున్నారు. ఏ క్రైస్తవునికయినా అదే మార్గము.
మరో విధముగా మీరు బాప్తిస్మము పొంది వచ్చుట కాదు, యేసు తానే ఈలాగు చెప్పెను, "ఒక మాట కలిపినా, ఒక మాట తీసివేసినా, అట్టి వానికి జీవగ్రంథములో పాలిభాగ ముండదు." దానిని యేసు చెప్పెను, "ప్రతి లేఖనము దైవావేశము వలన వచ్చినది, అది తప్పక నేరవేరబడవలయును," అని ఆయన చెప్పెను. ఇప్పుడు, మీకు
వేరుగా తెలిసినది. దాని గూర్చి మీరేమి చేతురు?
88మీకు కేవలము ఒక భావోద్రేకము లేదా మరేదో కలిగియుండవచ్చును… భావోద్రేకములందు నాకు నమ్మకమున్నది. మీరు ఆత్మలో నాట్యమాడి, భాషలలో మాట్లాడ వచ్చును… అది కూడా నేను నమ్ముదును, కాని మీరింత వరకే వచ్చి, మీలో నున్న ఆత్మ వాక్యము వెంబడించుటకు నిరాకరించుమని చెప్పినప్పుడు, నీకది నిజమని తెలిసినప్పుడు, ఆ ఆత్మలో ఏదో పొరపాటున్నది. అది పరిశుద్దాత్మ కాదు. అది కాజాలదు. చూచారా? అది దాని స్వంత వాక్యమును గుర్తించును. అది మీకు తెలియును. మేము ప్రార్ధి౦చుచుండగా ఇప్పుడు మీరు వచ్చుటకు సిద్ధపడవచ్చును.
నజరేయుడగు యేసూ, ఇప్పుడు దగ్గరకు వచ్చి ప్రతి హృదయముతో మాట్లాడుము. వారిని నీకు అప్పగించుచున్నాను, వారు ఈ చేతులన్నియూ, వర్తమానము యొక్క బహుమానములు, ప్రభువా, నీ గొప్ప ప్రసన్నత ఇప్పుడు మాతో యున్నది. ఆత్మ యొక్క జ్ఞానము గల ఏ వ్యక్తి అయినా గాని, నీవిక్కడ ఉన్నావని చెప్పగలడు. అది పరిశుద్దాత్మ యొక్క గొప్ప అనుభూతి. ఇప్పుడే అది అనుగ్రహించుము. ప్రభువా, యేసు క్రీస్తు నామమున అడుగుచున్నాము.
ఇప్పుడు, మనము తలలు వంచియుండగా.
89మారుమనస్సు పొంది, యేసు క్రీస్తు నామములో బాప్తిస్మము పొందగోరు ఒక వ్యక్తులు ఇక్కడున్నచో, ఆత్మ యొక్క బాప్తిస్మమును వెదకుచున్నచో, నా ఎడమ వైపున ఒక గది తెరచియుంచిరి. స్త్రీలకు కుడి ప్రక్కన, మీకు ఉపదేశించుటకు అక్కడ ఒకరున్నారు. బాప్తిస్మపు గౌనులు అక్కడ వేచియున్నవి, ప్రతియొక్కటి. మనము ఇప్పుడు పాడుచూ తలలు వంచియుండగానే:
నేను నా రక్షకుడు పిలచుట వినుచున్నాను.