నీ దినమును మరియు దాని వర్తమానమును గుర్తించుట
1శుభోదయము స్నేహితులారా. మనము కొద్ది క్షణములు నిలచియుందుము.
ప్రియమైన దేవా, భారముగా, వేగముగా కదలు జీవితములో నుండి, ఈ రానున్న కొన్ని క్షణములు లేక గంటలు, మీరు మాకు దయచేయునది ఏమైనప్పటికిని, నిన్ను స్తుతించి, మహిమపరచి, నీ వాక్యమును ఉపదేశించుటకు, ఇంకనూ అధికముగా నిన్ను తెలిసికొనుటకు, ఈ ఉదయకాలము మేము సమకూడి యున్నాము. మరియు వినుటకు తమ్మును తాము సిద్దపరచుకొని, ఇచ్చటకు వచ్చియున్న ప్రజలకొరకై నీకు కృతజ్ఞతలు చెల్లించుచున్నాము. దేవా, మేము నివసించు కాలము, పరిస్థితులు ఏ విధముగా ఉన్నప్పటికిని, వారు దీనిని నమ్ముచున్నారు. వారి నిమిత్తము మీకు వందనములు చెల్లించుచున్నాను.
దేవా, మీ ఉన్నతమైన స్వస్థత శక్తి కొరకు, మీ వాక్య వాగ్దానముల కొరకు నేనెంతో కృతజ్ఞతగలవారము. ఈ సాక్ష్యములను వినుచున్నప్పుడు మా హృదయములు ఎంతగానో మ౦డుచున్నవి. అన్ని రకముల వ్యాకులములు, మనుష్యకుమారులపై వచ్చిన వాటినన్నిటిని, నీను, నీ వాగ్దానముతో కూడిన నీ కృపయు మరియు శక్తియు, వారిని స్వస్థపరచినవి. వారు దానికి సాక్ష్యమిచ్చుచు, దేవుని స్తుతించుచు ఇచ్చట ఉన్నారు. దీనికై మేము వందనములు చెల్లించుచున్నాము. ఈ సమయమునకై నీవు మా కొరకు ఏర్పాటు చేసిన సందేశమును ఈ రోజున మేము వినగలము. నీ వాక్యము నుండి మేము చదువుచుండగా, మేము చదువుచున్న దాని సందర్భమును మాకు తెలియపరచుము. సమస్తమునందును నీ చిత్తము జరుగనిమ్ము. యేసు నామమున అడుగుచున్నాను. ఆమేన్. మీరు కూర్చొనవచ్చును.
2ఈ ఉదయకాలమందు మనము ఈ స్థలమందుండుట గొప్ప భాగ్యమై యున్నది. మీ అందరి నిమిత్తము నేనెంతో సంతోషించుచున్నాను. ఇందు నిమిత్తము సహో. ఉడ్స్, సహో రాయ్ రాబెర్సన్ మరియు అనేక సహోదరులు, గత రెండు దినములుగా ఈ కట్టడమును, శీతలీకరణము చేయుటకు ఎంతో విశ్వాసముతో పని చేసిరి, ఎందుకనగా గత ఆదివారము మీరెంతగా ఇబ్బంది పడ్డారో వారు గమనించారు. సంఘ ఖజానాలో కొద్దిగా డబ్బున్నప్పటికిని, మీరు కానుకలుగా వేసిన దానితో, ప్రశాంతముగా కూర్చొనుటకుగాను వారు ఆ పనిని త్వరితముగా ముగించిరి. మీరిప్పుడు నెమ్మదిగా సందేశమును వినవచ్చును. అప్పటికన్నను ఈ దినము ఎక్కువ చల్లగానున్నది. మేము దేవునికిని, మీకును, ఈ అవకాశము నిమిత్తము కృతజ్ఞతగల వారమైయున్నాము.
సహో, రాయ్ బాడర్స్ చాలా సంతోషము… ఆయన ఈ ఉదయము, వెనుక ప్రక్కగా నిలచుటకు ఆశించాడు. ఈ కుర్చీని తీసికొని, ఇక్కడ ఈ సేవకులతో కూర్చోమని నేను అతనితో చెప్పితిని, కాని ఆయన ఆ విధముగా చేయలేదు. సహో, బాడర్స్ సువార్త పొలమందు మన నిమిత్తము ప్రాతినిధ్యము వహించుట మీకందరకు తెలిసినదే. సహో, బాడర్స్ మరియు అనేక సేవకులు, స్నేహితులు, ఇచ్చట వుండుటలో చాలా సంతోషము.
3"ఆదివారము, నేనిక్కడకు వచ్చినప్పుడు, ప్రతి సేవకుని, ప్రతివారిని గుర్తించగలనని," ఈ వారమంతటను తలంచుచుంటిని. మీరు ఇక్కడకు వచ్చి సమస్తమును మరచునట్లు సందేశములో లీనమైపోవుచున్నారు. అదియే విశేషము.
ఇప్పుడు, నేను ఆరిజోనాకు తిరిగి వెళ్లవలసియున్నది. పిల్లలను పాఠశాలలో చేర్చుటకుగాను, రానున్న సోమవారము, ఒక వారము పాటు ట్యూసాన్లో వుండుటకు వెళ్ళుచున్నాను. ఆ తరువాత మరలా వచ్చెదను. పాఠశాలలు తెరచుటకు రెండు వారములకు ముందుగా పిల్లలను, నమోదు చేయుటకుగాను, నా భార్య అక్కడ వుండవలసియున్నది. అటు పిమ్మట కొంతకాలము ఇక్కడ ఉండుటకు వచ్చెదను.
ఇప్పుడిది నా సెలవు కాలమైయున్నది. నేను డిసెంబరు, జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే, జూన్, మరియు జూలై నెలల వరకు ఉపదేశించానని మీరెరుగుదురు. దేవుని చిత్తమైతే మరొక ప్రత్యేక పిలుపు లేనట్టయిన, ఇదియే నేను సెలవుగా, విశ్రాంతి పొందుకాలమైయున్నది. నేను వేటాడుటకు వెల్లెదను.
MARK 6:31
4ఇప్పుడు, దేవుడు మరొక దానికి నన్ను పిలచినట్టయిన దానిని పూనుకొందును. ఎప్పుడైననూ దేవుడే మొదటివాడు, మరియు ఆయన మొదటిగా వుండుటను ఆశించుచున్నాను. ఆయన మొదటిగా వుండుటను మీరును ఆశించెదరు. ఏ పిలుపు లేనట్టయిన, మరియు ఆయన చిత్తమైన యెడల రానున్న రెండు నెలల కాలము వేటాడుటకు వెళ్ళుదును. ఆ విధముగా విశ్రమింతును.
దాని ద్వారా నేను వెళ్ళుదానిని, మీరు గాని, ప్రపంచముగాని గ్రహించరు, చూశారా. అది అటువంటి ఒత్తిడియై యున్నది. ప్రభు తన శిష్యులతో నడచుచుండినప్పుడు, వారితో ఈ విధముగా చెప్పిన దానిలో ఆశ్చర్యము లేదు. "మీరు ఏకాంతముగా అరణ్య ప్రదేశమునకు వచ్చి కొంచెము సేపు అలసట తీర్చుకొనుడని? చెప్పెను. చూశారా? నేను ప్రతి దినమును, ముఖ్యముగా దినములు ఈ భూమిపై గడచుకొలది ఎక్కువగా దానిని గ్రహించుచున్నాను. మీరునూ వృద్దులగు కొలది దానిని గ్రహించెదరు. దానికి మన కాపరియు "ఆమేన్" అని చెప్పుటను వినగలరు. మనకు ఏబది సంవత్సరములు గడచినట్టయిన మనము పిల్లలము కాజాలము. మనకిప్పుడు కొద్ది సమయము మాత్రమే వున్నది.
మనము ఇప్పుడు వినిన సాక్ష్యములకుగాను మనమెంతో వందనస్తులమై యున్నాము. నిన్నటి రోజున నా భార్య శ్రీమతి. ఉడ్స్ వద్దకు వెళ్లినది. అక్కడున్న అలబామా నుండి కొందరు వచ్చి ఆ కూడికలయందు ప్రభు జరిగించిన అనేక గొప్ప కార్యములను, చిన్న పిల్లలు స్వస్థత పొందినదియు, మరియు అనేక ఇతర కార్యములను చెప్పుటలో ఎంతో సమయమును తీసుకొనిరి.
5నేనునూ దానిని జ్ఞాపకము చేసికొంటిని… సహోదరి. లార్సన్, రెండు ఆదివారములు తన చిన్న బిడ్డతో ఇచ్చట ఉన్నట్లు కొందరు నాతో చెప్పారని నమ్ముచున్నాను. ఆ సంగతి నాకు తెలియదు గాని, ఆ బిడ్డ ఆమె మనుమడని ఆ బిడ్డను అభిషేకించుటకుగాను తెచ్చినట్లు నేను నమ్ముచున్నాను. ఆమె చికాగో నుండి వచ్చుచున్నది. మనపట్ల ఎంతో దయగలిగిన స్త్రీ, మరియు మనము ఆమెను అభినందించుచున్నాము. ఆమె చికాగో నుండి ఆ చిన్న బిడ్డను అభిషేకించుటకుగాను తెచ్చినది. అభిషేకమునకు చాలా కొద్ది సమయము మాత్రమే నున్నదని నేను తలంచుచున్నాను; అయితే ఈ బిడ్డను ప్రతిష్ఠ చేయుటకు ఆమె ఎంతో ఆసక్తి కలిగియున్నది. కావున సహోదరి లార్సన్ నేను మాట్లాడు ఈ సమయములో ప్రతిష్ఠ ఆరాధనకు ఆ బిడ్డను తీసుకు రావచ్చును…
6ఆమె సిద్దపడు ఈ సమయములో ఈ సందేశము నేను సిద్దపడిన వాటన్నిటిలోకెల్లను కఠినమైనదని చెప్పుటకు ఇష్టపడుచున్నాను. నిన్నటి రాత్రి వరకు ఒక్క వారమంతయు నా గదికి వెళ్లి, నా పిలుపులను, ఇతర కార్యములను ప్రక్కగా వుంచి, ఈ సమయమునకై నా మనస్సునకు కొంత తెచ్చుటకు ప్రయత్నించాను. నేను వెళ్లినప్పుడు నా మనస్సు శూన్యముగా వుండినది. నిన్నటి దినమున నేను గది క్రింది భాగమునకు వెళ్లాను. ఉష్ణము అధికముగా వున్నట్లు తెలిసినందున ఆ గది అడుగు భాగమునకు వెళ్లి కూర్చొన్నాను. నా బైబిలును తీసికొని చదువుచూ అలాగే నిద్రించాను. ఆ తరువాత లేచి గ్లాసుడు నీళ్లు త్రాగి దేహమును కదల్చుకొని, వెలుపలకు వెళ్లి, కొంత దూరము నడచి, తరువాత మెట్లుపై వచ్చి కూర్చొన్నాను.
నేను వచ్చి మెట్లుపై కూర్చుండుట ఎవరో గమనించెను, అదెంతో ఉష్ణముగా వుండినది. వారు వెళ్ళుతూ చేయూపారు. వారెవరో ఈ పట్టణ ప్రాంతపువారైవుండవచ్చు లేక ఆలయమునకు సంబంధించినవారుగా వుండవచ్చు. వారు నాకు చేయూపారు. నేను ఆలాగే ఆలోచించుకొంటూన్న సమయములో ఆ కారు ఒక్క కనురెప్పపాటులో నా ప్రక్కగా వెళ్లిపోయినది. నేనునూ చేయూపాను.
7గత రాత్రి కారులో కూర్చొని చార్లెస్ టౌన్ ప్రక్కకు వెళ్లి, ఏదైనా కొంత తీసికొని వచ్చుటకు ప్రయత్నించాను. అప్పుడు ప్రభు ఏదో చెప్పుటకు ఇష్టపడుచున్నట్లు కనబడుచుండినది, కాని సాతాను నా త్రోవలో నిలచి దానిని జరుగనీయకుండా అడ్డగించుచున్నది. అతడు ఆ విధముగా చేసినట్టయిన నేను వేచి యుండి ఆయన తలుపు తెరచువరకు తలుపును తట్టుచుందునని తలంచాను. అప్పటినుండి కొన్ని ముందు క్షణాల వరకు లేక హృదయం ఏడు గంటలవరకు వేచియున్నాను, నా పడక నుండి నేను త్వరగా లేచాను.
నిన్నటి దినమున, కొంత అనారోగ్యముగా వుండినది. నాకు సరిపడని కొన్ని ధాన్యపు ఆహారమును భుజించుటవలన, అధిక ఉష్ణమువలన, ఆ విధముగా జరిగినది. నేను అటువంటి స్థితి నుండి కోలుకొనుటకు ప్రయత్నించుచుంటిని. అటు తరువాత నేను తీసికొనిన లేఖనభాగము నన్నెంతో ఆశ్చర్యపరచినది. నేను ఆ లేఖనభాగమును పదే పదే చూస్తూ వుండినాను. అది అధికముగా నన్ను ఆశ్చర్యపరచినది. లేఖనముల ద్వారా దానిని వెంటాడుచూ వెళ్లాను; కొన్ని నిమిషముల ముందువరకు నేను ఆ విధముగానే చేశాను. కావున సాతాను అడ్డగించుటకు ప్రయత్నించిననూ, ప్రభువు ఇప్పుడు మనకు ఒక సందేశమును ఏర్పాటు చేశాడు.
సహోదరి లార్సన్, ఆ చిన్న బిడ్డను ఇచ్చుటకు తేగలరా? [సహో, బ్రెహా౦ ఆ బిడ్డను అభిషేకించుచున్నారు.] దేవుడు వారితో ఉండును గాక మరియు సహాయము చేయును గాక.
8ఇప్పుడు, నేను మిమ్ములను గత రెండు ఆదివారములుగా ఇచ్చట వుంచి యున్నాను. ఉదయము, సాయంత్రము రెండు ఆరాధనలున్నవి. ఆ స్థితి మీకు ఎంతో కఠినముగా వుండునని తలంచుచున్నాను. మీలో కొందరు ఎంతో దూర ప్రయాణము చేయవలసియున్నది. ఒకరోజు పనిని కూడ విడచిపెట్టవలసి యున్నదని గ్రహించుచున్నాను. కావున ఆదివారము - సోమవారము ముగించబడనట్లయిన, ఒక వారము తరువాత, ప్రభుని చిత్తమైతే మరుసటి ఆదివారమునకు ప్రకటింతును. (చూశారా?), సమాజము కోరినయెడల ఈ రాత్రికి ఆగవలసియున్నది. మీలో అనేకులు ఇక్కడ న్నారు. ఎందరు ఆరాధనను ఈ రాత్రికే కలిగియుండవలెనని ఇష్టపడుచున్నారు? లేక మరుసటి ఆదివారమునకు ఇష్టపడుచున్నారో మేము చూచునట్లుగా మీ చేతులు చూపుడి. తరువాత… ఓ, మై. అదెంతో సమీపముగా వున్నది. ఇప్పుడు ఏమనెదవు బెన్?
9ఈ ఉదయమున ఒక సుదీర్ఘమైన సందేశమును కలిగియున్నాను… అయితే నాకు అది ఎలా అని తెలియదు… మరియు దానిని సంఘ నియమములకు అనుకూలముగానే వుంచుదునని ఎరుగుదును, అయితే మీరు గమనించినయెడల, "సందేశములు టేపు చేయబడనియెడల" అని నేను చెప్పి యుంటిని. చూచారా, కావున ఈ సందేశము ఇప్పుడు టేపు చేయబడుచున్నది. కావున మనము ఈ రాత్రికిని, మరుసటి ఆదివారమునకును మరలా వచ్చెదము, ప్రభు చిత్తమైనయెడల ఆ విధముగా చేయుదము.
ఇప్పుడు, ఈ వారము మీకు సందేశము అందనియెడల, రానున్న వారము మీరు రండి. మిమ్ములను రెండుసార్లు రప్పించుటను నేను ఇష్టపడుట లేదు, అయితే మనకు కొద్ది సమయము మాత్రమే ఉన్నది. మరియు జ్ఞాపకముంచుకొనుడి, కాలము గడచుకొలది ఈ అవకాశమును ఎంతో కాలము మనము కలిగియుండలేము, చూశారా. ఏదో ఒకటి జరుగనైయున్నదని జ్ఞాపకముంచుకొనుడి. చట్టము మనలను ఆపు చేయును లేక సాతాను ప్రవేశించి మిమ్ములను చెదరిపోజేయును. అది అన్ని సమయములయందును, ఆ విధముగానే యున్నది. చూశారా? ఏదో కొంత జరుగనైయున్నది. కావున మనము కలసియుండు ప్రతి నిమిషమును అభినందించుదము.
10ఇప్పుడు, మీ గృహములకు వెళ్ళదలచినవారికి ఈ రాత్రి గత ఆదివారపు రాత్రివలెనె వుండును. కొద్ది సందేశమును మాత్రమే నేను కలిగియున్నాను. గృహములకు వెళ్ళువారికి టేపులు కావలసినయెడల వారికి పంపబడును. లేని యెడల, దేవుని చిత్తమైతే, ఈ రాత్రికి ఉపదేశించనైయున్నాను.
నిన్నటి రోజు లేక దానికి ముందు రోజున నాకు జ్ఞాపకమునకు వచ్చిన సందేశమును గుర్తుంచి ఉన్నాను. అవి చాలా కాలముగా నాలో ఉన్నవి అని రెండు సందేశములు, వాటిలో ఒకటి "నీళ్లు నిలువని తొట్టి" మరొకటి "గాలికి విత్తి - సుడిగాలిని కోయుట" అను సువార్త సందేశములు. ఈ ఉదయమున ఈ ఉపదేశముండును. కావున ఈ రాత్రికి "గాలికి విత్తి - సుడిగాలిని కోయుటను" గాని "నీళ్లు నిలువని తొట్టి" అను సందేశమునుగాని మాట్లాడెదను.
11మరియు ఈ ఉదయ కాలమున, పరిశుద్ద ప్రతినుండి చదువవలెనని కోరుచున్నాను. మీరందరు సౌకర్యముగా ఉన్నారా? "ఆమెన్" అని చెప్పుడి. అది చాలా మంచిది. ఇప్పుడు, చదువదలచినవారు నాతో కలసి మీ బైబిళ్ళను హోషేయా పుస్తకమునకు త్రిప్పవలెనని కోరుచున్నాను. ప్రవక్తయైన హోషేయా పుస్తకము నుండి 6వ అధ్యాయములో కొన్ని వచనములను చదువుదము. మరియు మనము లేచి నిలుచుదము.
HOS 6:1-11
12ప్రియమైన దేవా, ఈ పుస్తకమును మా చేతులలోనికి తీసికొనుటకు మేము యోగ్యులము కాము, ఎందుకనగా ఆకాశమందే గాని, భూమియందే గాని, భూమిక్రింద గాని ఈ పుస్తకమును తీసికొని, దానిని చూచుటకు యోగ్యులైనవారు లేరని, లేఖనభాగములయందు చదువుచున్నాము. ఓ, అదిగో గొర్రేపిల్ల వధించబడినట్లు ఒకరు వచ్చెను; ఆయన యోగ్యుడైనందున ఆయన ఆ పుస్తకమును తీసికొనెను; మరియు ఆయన ముద్రలను విప్పెను. ఈ ఉదయమందు దీని య౦దు వ్రాయబడిన అంశములను, మాకు బయలుపరచుటకు మేము ఆయన వైపునకు చూస్తున్నాము, ఎందుకనగా ఇది విమోచన గ్రంథమైయున్నది; విమోచింపబడినవారందరు ఆ పుస్తకములో వ్రాయబడియున్నారు. మేము జీవించు ఈ కాలముందు, మా స్థానమును గొనుటకు, ఈ ఉదయకాలమున సహాయము చేయుము. యేసు నామములో అడుగుచున్నాము. ఆమేన్.
మనము యెహోవా యొద్దకు మరలుదము రండి, ఆయన మనలను చీల్చివేసెను, ఆయన మనలను స్వస్థపరచును, ఆయన మనలను కొట్టెను, ఆయనే మనలను బాగుచేయును.
రెండు దినములైన తరువాత ఆయన మనలను బ్రదికించును, మనము ఆయన సముఖమందు బ్రదుకునట్లు మూడవ దినమున ఆయన మనలను స్తిరపరచును.
యెహోవాను గూర్చిన జ్ఞానము సంపాదించుకొందము రండి; యెహోవాను గూర్చిన జ్ఞానము సంపాదించుకొనుటకు ఆయనను అనుసరించుదము రండి.
ఉదయము తప్పక వచ్చురీతిని ఆయన ఉదయించును; వర్షమువలె ఆయన మనయొద్దకు వచ్చును; భూమిని తడుపునట్టి తొలకరి వర్షము కడవరి వర్షమువలె ఆయన మనయొద్దకు వచ్చును.
ఎప్రాయిమూ, నిన్ను నేనేమి చేతును? యూదా, నిన్ను నేనేమి చేతును? తెల్లవారగానే కనబడు మేఘము ఎగిరిపోవునట్లును, ప్రాతఃకాలమున పడు మంచు ఆరిపోనట్లును మీ భక్తి నిలువకపోను.
కాబట్టి నేను చేసిన తీర్పులు వెలుగువలె ప్రకాశించునట్లు ప్రవక్తలచేత నేను వారిని కొట్టి బద్దలు చేసియున్నాను, నా నోటిమాటల చేత వారిని వధించి యున్నాను.
నేను బలిని కోరను గాని కనికరమునే కోరుచున్నాను, దహనబలులకంటె దేవుని గూర్చిన జ్ఞానము నాకిష్టమైనది.
ఆదాము నిబంధన మీరినట్లు వారు నాయెడల విశ్వాసఘాతకులై నా నిబంధనను మీరియన్నారు.
గిలాడు పాపాత్ముల పట్టణమాయెను, అందులో నరహంతకుల అడుగు జాడలు కనబడుచున్నవి.
బందిపోటు దొంగలు పొంచియుండునట్లు యాజకులు పొంచియుండి షెకెము మార్గములో నరహత్య చేసెదరు; వారు ఘోరమైన కాముకత్వము జరిగించువారై యున్నారు,
ఇశ్రాయేలువారిలో ఘోరమైన సంగతి యొక్కడి నాకు కనబడెను, ఎప్రాయిమీయులు వ్యభిచారక్రియలు అభ్యాసము చేసెదరు, ఇశ్రాయేలువారు తమ్మును అపవిత్రపరచుకొనెదరు.
చెరలోనికి వెళ్లిన నా ప్రజలను నేను తిరిగి రప్పించినప్పుడు, ఓ యూదా, అతడు నీకు కోత కాలము నిర్ణయించును.
ప్రభువైన యేసు, మేము నీ వైపునకు ఇంకనూ వేచియుండగా, నిర్ణయించిన దీని భావమును నీ పరిశుద్దాత్మ ద్వారా మాకు దయచేయుము. యేసు నామమున అడుగుచున్నాము. ఆమేన్.
13ఇప్పుడు, ఈ ఉదయమున నా అంశము: "నీ దినమును దాని వర్తమానమును గుర్తించుట." మనము గత ఆదివారపు పాఠములో బూరల పండుగను గురించి నేర్చుకొంటిమి, మరియు ఇప్పుడు దేవుని గడియారము నుండి ఇశ్రాయేలు కాలము వైపునకు మీ తలంపును ఆకర్షించుటకు ఇష్టపడుచున్నాను.
ఈనాడు ఆదివారపు పాఠశాల పాఠముపై వ్యవహరించుచున్నాము. మనము జీవించు ఈ కాలమును గ్రహించి గుర్తించవలెనని కోరుచున్నాను. మీరు చూస్తున్న విధముగా మన జీవితములు గతించిపోవుటకు సిద్దముగా ఉన్నవి. కావున మీరు ఆ ఖచ్చితమైన కాలమును, సమయమును, సూచనను, మీరు పొందవలసిన వర్తమానమును తెలిసికొనవలసియున్నది.
14ఇప్పుడు, గత ఆదివారము ప్రారంభించిన విధముగా… ఉపదేశించాలని మాట్లాడుకొంటిమి. బైబిలులోని చివరి ఏడు బూరలు, ఆ బూరలు ముద్రలవలె విప్పబడునని నాలో నేను తలంచాను. కాని అది ఒక్కొక్కటి విప్పబడినప్పుడు ఒక గొప్ప సంగతి జరుగుటను నేను గమనించాను. మేము ఏడు సంఘకాలములను ఉపదేశించుచుండగా, పరిశుద్దాత్మ తానే వచ్చి వాటిని చక్కగా నిరూపించి, పత్రికల యందు ముద్రింపబడి దేశపు నలుమూలలకు వెల్లునట్లు చేశాడు. ఆకాశమందు చంద్రునిలో దానిని చూపించాడు. అది జరుగుటకు కొన్ని వారములు లేక నెలల క్రితము చక్కగా అది ఉన్నది ఉన్నట్టే నాకు నిరూపించాడు. ఇచ్చట ఈ మ౦దిరమందు దానిని తెలియపరచిన ఆ సమయములోనే ఆయన సూర్య, చంద్రులయందును తెలియపరచెను. మరియు ఈ సమయములో దేశముల యొక్క స్థానములయందు దానిని చూపించాడు. ఆ సమయముననే రోమా గురుపీఠాధిపతియైన పోపు రోమును విడిచి పాలస్తీనాకు వెళ్ళెను; బహుశా పేతురు నుండి (వారు చెప్పుచున్నట్లు వారి మొదటి పోపు) ఇప్పటి వరకు ఉన్న పోపులలో, మొదటి పోపుగా పాలస్తీనాకు వెళ్లాడు. ఇప్పుడు, అది ఎంతో ఆశ్చర్యము.
15అటు తరువాత సమస్త మర్మములు ఏడు ముద్రలయందు దాచబడిన దానిని మనము చూచాము… అవి ఏవో నాకు తెలియవు కాని దేవునికి తెలియును. కేవలము దర్శనము ద్వారా మాత్రమే వాటిని చిత్రించాను. దేవుడు ఆ తరువాత ఒక్క సంవత్సరము, ఆరు నెలల కాలమందు ఆకాశమందలి చంద్రునిలో దానిని నిరూపించి జాతీయ పత్రికలు దానిని వెలువరించునట్లు చేశాడు. అది నాకైతే తెలియదు. ఈ లవొదికయ కాలమును సూచించుచూ, మర్మమైన పూర్తి చీకటి చంద్రునిలో ఏర్పడుట నాకు తెలియదు.
ఇప్పుడు, పత్రికలయందు మీరు ఆరు కాలములను మాత్రమే చూడగలరు. ఏలయనగా లవొదికయ సంఘము పూర్తిగా కొట్టివేయబడినది. మీరు దీని ఆత్మీయ అనుకరణను గమనించారా? దేవుడు ఆకాశమందు చెప్పిన విధముగానే… భూమిపై దానిని నేను చూపించినప్పుడు, కొంత స్థలమును, కొద్ది వెలుగును ఉన్నట్లు సూచించాను. అది ఎన్నుకొనబడిన దానిని భూమిపైనుండి పిలువబడుటకు ముందు స్థితిగా ఉన్నది. అందుకొరకే ఏడవ కాలమందు దానిని అక్కడ వుంచాను. అయితే దేవుడు ఆకాశములో దానిని వుంచినప్పుడు, అది పూర్తి చీకటి కమ్మినదైయున్నది. ఒకవేళ ఆ చివరి ఒక్కరు లవొదికయ కాలము నుండి పిలువబడవచ్చును; అది మనకు తెలియదు. దానిపై ఒక ప్రసంగమున్నది.
16ఇప్పుడు, ఆ ఏడు ముద్రలకు ముందు, వాటిని గురించి నాకు ఏదియూ తలంపునకు రాలేదు. ఇచ్చట మందిరమందు ఆయన దానిగురించి మాట్లాడి, జరుగనైయున్న దానిని తెలిపి, అరిజోనాలోని ట్యూసాన్ కు నన్ను పంపెను. అది ఏ విధముగా ఇచ్చట చెప్పబడినదో, అదే విధముగా అక్కడ నెరవేరిన దానిని చూచిన ఒకరు మన మధ్యన ఉన్నారు: ఏడుగురు దూతలు వచ్చిరి. దేశవ్యాప్తముగా పత్రికలు దానిని వెలువరించాయి: మర్మయుక్తమైన వెలుగు వృత్తము, పిరమిడ్ ఆకారములో అది ఉన్నది. ఇక్కడ దానిని గీచి చూపించిన విధముగానే అది వుండెను. ఆ దూతలు నిలుచున్న చోటు నుండి ముప్పది మైళ్ల ఎత్తునకు, ఇరువది-యేడు మైళ్ల వెడల్పునకు లేక ఇరువది-ఏడు మైళ్ల ఎత్తునకు, ముప్పది మైళ్ల వెడల్పునకు నేను దానిని మరచిపోయాను. పైకి ఎత్తబడి అది సంభవించిన అదే సమయములో అరిజోనాలోని - ట్యూసాన్ కు పైభాగమున రాష్ట్రములన్నియు చూచునట్లు అది నిలుచున్నది.
REV 22:18,19
17చూడండి, ఇదేదో కొంత మీ పై ఒత్తిడి చేయునది కాదు, అయితే మీకు ఈ ఘడియకు సంబంధించిన ఆత్మీయ అనువాదమును బయలుపరచుటయై యున్నది.
మరియు ఆ తరువాత సందేశము ఏడు ముద్రలను విప్పునదైయున్నది. బైబిలునందు దాగియున్న సమస్త మర్మములను, సిద్దాంతములను, ఈ లోకము మూర్ఖముగా ఎదిరించుచు, అది అబద్దమని చెప్పుచున్న, అనేకములైన సత్యములను బయలుపరచినది.
ఇక్కడ అరిజోనాలో గత దినమందు, టేపులలో, చెప్పని దానిని నేను చెప్పినట్లు కొంత అతికించారు. అరిజోనా సంయుక్తమును గురించిన దర్శనమును జ్ఞాపకమునకు తెచ్చుకొనుడి. మీ మెడలకు ఒక బండ కట్టబడుట మేలని పరిశుద్ద గ్రంథమందు చెప్పబడినది. మరియు మరొక విషయము: "ఎవరైనను (అతడు సేవకుడు కావచ్చు లేక మరెవరైనను కావచ్చు) దీనిలో నుండి ఒక పదమును తీసివేసిన లేక ఒక పదమును దీనికి కలిపినయెడల…" ఇవ్వబడిన వాక్యమునకు ప్రజలు తమ స్వంత అనువాదమును ఇచ్చి, నేను చెప్పని దానిని చెప్పినట్లును, అదేదో మరొకటిగా చేయుటకు ప్రయత్నించుచున్నారు, అది నా మాట కాదు, అది ఆయన మాటయైయున్నది. "ఎవరు దానితో చేర్చినా, లేక దాని నుండి తీసివేసినా…"
మరియు అప్పుడు కొన్ని ఆదివారములకు ముందు నేను మీకు వివరించిన ప్రకారము, ఆ దర్శనమందు ఈ ప్రవక్తలు క్రిందికి దిగుటను చూచాను, నేను నమ్ముచున్నాను, కొన్ని ఆదివారముల మునుపు, ఆ విధముగానే నేను చెప్పినట్లుగా. అది అంతయు. నేను చెప్పితిని, "కేవలము దానినుండి దూరముగా యుండుడి." నేను దానితో పోరాడునంతవరకు, దేవుడు దానితో పోరాడడు. అయితే ఆయననే దానిని కలిగియుండనిమ్ము. ఆయన దానిని గురించి చింతించువాడై యున్నాడు, చూశారా.
18ఇప్పుడు, గత ఆదివారము పండుగ దినములను గురించి ప్రసంగించుటను మనము గమనించాము…. మరియు అక్కడ పెంతెకోస్తు పండుగయున్నది. పెంతెకోస్తు ప౦డుగకును బూరల పండుగకును మధ్య ఎంతో కాలవ్యవధిమున్నది. మరియు పెంతెకోస్తు పండుగకును బూరల పండుగకును మధ్య ఖచ్చితముగా ఏబది దినములున్నవి. పెంతెకోస్తు అనగా "ఏబది"; ఆ ఏబది దినములు పన అల్లాడి౦చుట లేక కోతకాలమందు క్రొత్త ఫలములను సమకూర్చునదైయున్నది. అది వెనుకట ప్రకృతి సంబంధమైన ప్రథమ-ఫలముల మాదిరిగా ఉన్నది, మరియు పరిశుద్దాత్మ యొక్క ప్రథ-ఫలాలు ప్రజలపై క్రుమ్మరింపబడుటకు సాదృశ్యముగా ఉన్నదని మనము చూచుచున్నాము. అటు తరువాత ఆ ఏబది దినములు అన్యులచే స్వీకరించబడుటను చూశాము. దేవుడు తన నామమునకై అన్యుల మధ్యనుండి పిలచిన ఒక జనముగా ఉన్నది — అదియే పెంతెకోస్తు పండుగ. మనము ఆ సుదీర్ఘమైన పెంతెకోస్తు పండుగ ద్వారా ఇప్పుడు వెళ్లుచున్నాము.
ఇప్పుడు, నిజమునకు ఏబది రోజులు ఏడు సబ్బాతులుగా ఉన్నవి. ఆ ఏడు సబ్బాతులు. పెంతెకోస్తు కాలములో పిలువబడు ఏడు సంఘకాలములకు సాదృశ్యముగా ఉన్నవి - పెంతెకోస్తు పండుగ, అవి ఆయన నామము కొరకు అన్యుల నుండి ఒక జనమును పిలుచునవైయున్నవి. ఏడు సబ్బాతుల చివరన పాయశ్చిత్తార్ధ దినము వచ్చును, అవియే ఏడు బూరలు. మరలా ప్రాయశ్చిత్తమునకు ప్రలాపించు, దినమునకు పిలచునదైయున్నది. అప్పుడు ఈ ఏడు బూరలు ఇశ్రాయేలీయులకు మాత్రమే సంబంధించినవని మనము చూశాము.
19మరియు అప్పుడు, సమస్తమును సిద్దముగా వుండినప్పటికిని ఆ ఏడు బూరలను ఉపదేశించుటకు ఆయన అనుమతించలేదు… అప్పుడు నేను ఈ విధముగా చెప్పితిని, "ఏదో నన్ను కఠినముగా తొందర పెట్టుచున్నది." మన పనులలో ముందుకు సాగుచుంటిమి. బిల్లీ మరియు మనమందరమును ఈ కట్టడను శీతలీకరణ చేయుటకును, రానున్న వారములో ఏడు బూరల కొరకునూ ప్రయత్నించుచుంటిమి. ఎనిమిది లేక పది రోజులు మాత్రమే వుండినవి. పాఠశాల సభామందిరము కూడ సిద్దమైనది. అయితే పరిశుద్దాత్మ, మరేదో కొంత కారణమునుబట్టి నన్ను అనుమతించలేదు. ఎందుకని నేనెంతో ఆశ్చర్యపడితిని. నేను ప్రార్థించుటకు వెళ్లినప్పుడు… నా భార్యతో చెప్పి, గదిలోనికి వెళ్లి, నమ్మకముగా మోకాళ్లపై దేవుని ఎదుట ప్రార్థించాను. ఆ ఏడు బూరలును, ఆరవ ముద్ర క్రింద పలుకుటయు, దానిని నేను అతీతమైన రీతిగా ప్రసంగించిన దానిని ఆయన నాకు బయలుపరచెను, చూశారా. అదంతయు దేవుని హస్తమైయున్నది. ఇది ఇశ్రాయేలుకు సంబంధించినది; మరియు దానిని మనము ఆరవ ముద్ర క్రింద తీసుకున్నాము, ఏ విధముగా యూదులు హింసించబడిరో చూచాము …
MATT 20:9
20అన్యుల కాలము పెంతెకోస్తు పండుగలలో ఉన్నది. ఆ బూరలు అన్నియు, ఆరవ ముద్రయందు పలికినని. మీరు దానిని పొందదలచిన, అది గత ఆదివారపు బూరల పండుగ వర్తమానములో ఉన్నది. అవి ఏమి చేయబోవుచున్నవి? ప్రపంచపు అన్ని భాగముల నుండి యూదులను తమ స్వదేశమునకు చేర్చునవైయున్నవి. అది (ఇశ్రాయేలు) అక్కడ వుండవలసియున్నది. ముద్రలు విప్పబడినప్పుడు, ఆరవ ముద్ర క్రింద, ఆ ఏడు బూరలు పలికినవి.
ఇప్పుడు, ఆ ఏడవ దూత సందేశము ముద్రల మర్మమును విప్పునదై యున్నది. మరియు పదకొండవ గంటయందు, అన్యులైన పనివారిని, ఆ మొదటి గంట పనివారు పొందిన అదే కూలిని పొందుటకు పిలచునదైయున్నది. చూశారా? యేసు దానిని బోధించెను. కొందరు కోత కోయుటకు వెళ్లి, కూలికి కుదర్చబడిరి. వారు ఆ విధముగా ఉదయమున కుదర్చబడినప్పుడు, ఒక్క దినమునకు ఒక్క దేనారమును పొందిరి. మధ్యాహ్నమున కొందరు కుదర్చబడి, పని చేయుటకు వెళ్లిరి. పదకొండవ గంటకును కొందరు ప్రవేశించి అదే కూలిని పొందిరి. అది ఆ దినపు చివరి గంటగా ఉన్నది. మొదటి గంటకు వెళ్లినవారికి దొరికినట్లే, చివరి గంటకు వెళ్లినవారికిని దొరికెను.
అది ఎంత చక్కగా ఉన్నది, ఆ మొదటి గంటలోని వర్తమానికులు, వాక్య సువార్తతో సత్యముగలిగి పెంతెకోస్తు దినమున ప్రవేశించిరి. ఆ తరువాత ఒక చీకటి యుగము వారిని మరుగుపరచినది. అప్పుడు ఆ దినపు మధ్యలో లూథర్, వెస్లీ అనువారు వచ్చారు. చివరిగా సాయంకాల వర్తమానము రావలసియున్నది. ప్రారంభములో వారు పొందిన దానినే వీరును పొందుదురు. సాయంకాల వర్తమానము మరలా సమకూర్చబడి, అవే కార్యములను చేయునదైయున్నది.
21మరియు గత వారములోని దర్శనమునందు వధువు ప్రథమ దర్శనమునకు వచ్చిన దానిని జ్ఞాపకము చేసికొనుడి; ఆ దర్శనమందు ఒక చక్కని వధువు వచ్చినది. దానిని ఎరుగకయే వెలుపలవైపుగా చూస్తున్నప్పుడు ఆ వధువు వచ్చినది. అప్పుడు నేను, నా ప్రక్కగా ఒక స్వరము పలుకుటను వింటిని. "ఇక్కడ ఆ వధువు ప్రథమ దర్శనమున్నది." మరియు ఆమె నా ప్రక్కగా వచ్చినప్పుడు, ఎంతో చక్కగా, అందముగా, యౌవ్వనురాలిగా వుండుటను గుర్తించాను. ఆమె త్వరపడునది కాక నెమ్మదిగా ఒక మంచి స్త్రీ వలె నడుచుచూ వచ్చినది. ఆమె నా ఎడమ ప్రక్కగా వచ్చి అటు తరువాత మరుగైపోయినది.
22అటు తరువాత నా కుడి ప్రక్కగా కాలములనుండి వచ్చిన సంఘములను చూపించెను. మరియు ఓ, ఎంత అసభ్యకరముగా ఉన్నదో! మరియు చివరిగా వుండునది ఈ చివరి దినపు సంఘముగా ఉన్నది. అది ఒక మంత్రగత్తె ద్వారా నడిపించబడియున్నది. వారెంతో అసభ్యముగా కనబడునట్లు దుస్తులు ధరించియుండిరి. వికారముగా ఆడుచూ, తూలుచూ వచ్చుచుండిరి. వారు బూడిద రంగు కలిగిన కాగితములాంటి దానిని మరుగు చేసికొని, వికారముగా వెళ్లుచున్నారు. బూడిద రంగు తెలుపునకు, నలుపునకు మధ్యగా వుండి, మోసపుచ్చు రంగుగా ఉన్నది. మరియు బూడిద రంగు కాగితములను వారి ముందు భాగములకు చుట్టుకొని, నడుములకు పైన పూర్తిగా నగ్నముగానున్నారు. ఆ విధముగా కూనిరాగాలతో తిరిగి పోవుచూ పైకి నడచి వెళ్ళుచున్నారు. "అదియే సంఘమని" అతడు చెప్పెను.
అది ఆ విధముగా నా ప్రక్కగా వెళ్లినప్పుడు నా హృదయము స్థిమితము తప్పినది. "క్రీస్తుకు సమర్పింపబడు వధువు ఈ విధముగా వుండునా? అని నేను తలంచాను. ఎన్నో కార్యముల ద్వారా, ప్రయత్నముల ద్వారా, మానవుడు క్రీస్తునకు తెచ్చు వధువు అసహ్యముగా, నీచముగా, వ్యభిచారిగా వున్నప్పుడు, క్రీస్తుకు వధువు కాగలదా?" ఆ దృశ్యము నా హృదయమును ఎంతో బలహీనపరచినది!
23మరియు ఆ విధముగా మేము నిలుచున్న స్థలము వైపునకు అది వచ్చుచూ, తూలుచూ, ఆడుచూ, ఒక కాగితమును చుట్టుకొని, ఈనాటి నాగరిక నాట్యములను వేయుచూ అవినీతి కార్యములతో వెళ్లుచున్నది.
ఇటువంటి కార్యములకు నేను బాధ్యుడను కాను. నేను దేనిని చూశానో దానిని మాత్రము చెప్పగలను. దేవుడే నా తీర్పరిగా నున్నాడు. అది అమెరికా దేశపు సంఘముగా ఉన్నది.
ఇప్పుడు, ఆమె ఆ విధముగా వెళుచున్నప్పుడు, వెనుక భాగము పూర్తిగా నగ్నముగా ఉన్నది. ఆ విధముగా ఆమె వెళ్లినప్పుడు నేను సృహ తప్పిపోయాను.
అప్పుడు "అదిగో వధువు ప్రథమ దర్శనమునకు మరలా రానైయున్నది," అని ఆయన నాతో చెప్పెను. దాని వెనుకగా వధువు వచ్చినది. మొదటిగా వెళ్లిన దాని వలె కనబడినది. అప్పుడు నా హృదయము, ఒక వధువున్నదని తెలిసి, సంతోషముతో గంతులు వేసినది. ఆమె మొదటి వధువువలె చక్కగా దుస్తులు ధరించియున్నది. ఆమె పిలువబడనైయున్నది. అది సత్యమని నేనెరుగుదును. అది సత్యము కానియెడల గతములోని ప్రతి దర్శనము అసత్యమగును. ఆయన సత్యమైనది గాక మరేదియు చెప్పలేదనియు మీకందరికిని తెలియును. ఆ విధముగానే జరుగనైయున్నది.
మరియు ఈ నవనాగరిక సంఘము అంత నీచముగా వుండి తన్నుతాను సంఘమని పిలచుకొనుచున్నదని మీరు చూడగలుగుచున్నారా?
24గత దినములో ఎవరో చెప్పినట్లు, బహుశా సహో, రద్దెల్, ఆయన నా ప్రియమైన సహోదరుడు, అక్కడ గోడ ప్రక్కగా నిలువబడియున్నాడు, ఆయన మాట్లాడుచు ఆ సంఘము ఒక ద్రాక్షవల్లి నుండి జీవమును పిల్చు కొమ్మగా చూశాడు. మేము గత దినమున దానిని గురించి వివాదించుకొనుచుంటిమి. సాహో రద్దెల్ కాలపరిస్థితులను గురించియు, ఈనాటి సంఘమ౦దున్న ఆత్మను, అది ఏ విధముగా పడిపోచున్నదో దానిని గురించియు కలత చెందెను. ప్రతి స్థలమునుండి వచ్చిన సేవకులు "సహో, బ్రెన్హా౦, ఏమి జరిగినది? ఏమి జరిగినదని?" నన్ను దర్శించుటకు వచ్చినప్పుడు అడుగుచుండిరి. ఓ, మై!
సహో, రడ్జెల్, నాతో, "వారు సాతాను ఆత్మ ద్వారా జీవించుచున్నారా లేక మరేమిటి?" అని ప్రశ్నించెను.
అందుకు నేను, "కొమ్మ ద్రాక్షవల్లి సారమునందే జీవించునదైయున్నది గాని మరేమి లేదని" చెప్పితిని. ఏ విధముగా జీవించుననగా, నిమ్మ కొమ్మ ఆరంజి చెట్టున జీవించును, అయినను ఆరంజి పండును కలిగియుండదు. అది ఆరంజి చెట్టునుండియే ఎదుగుచున్నది. సంఘమని పిలువబడునది కూడ తమ నామములైన కాథలిక్, ప్రొటెస్టంట్ అను మతసంఘముల పేరునందుండి, కొమ్మలుగా ద్రాక్షావల్లి సారమును పొందుచున్నవి, కాని అవి ఏమైయున్నవో ఆ ఫలములనే కలిగియున్నవి, వారు మార్చబడలేదు. దేవుడు ముందుగా ఎన్నుకొనిన కార్యమందు వారు లేరు. అందుకొరకే వారు వాక్యమును నిరాకరించి, మరొక రకమైన ఫలములను కలిగియున్నారు. నిజమైన చెట్టు దాని వేరునుండి వాటి ఫలములను తెచ్చునట్లు ముందుగా గుర్తించబడినది. యేసు, "నేను ద్రాక్షావల్లిని, మీరు కొమ్మలని" సెలవిచ్చెను.
అయితే ఆ అంటు కట్టిన చెట్టు మరొక కొమ్మను వేసినప్పుడు అది దాని నిజ ఫలములను కలిగియుండును. ద్రాక్షవల్లి చివరన ఈ కార్యములన్నియు, మరలా సమకూర్చబడును. అంతటికి ఒక పునరుద్దరణ రానైయున్నది, ఒక సాయంకాలపు వెలుగు దానిని వెలిగించి సరిచేయును. అది ద్రాక్షావల్లినుండి రావలసియున్నదే గాని అంటు కట్టబడిన సంస్థ నుండి అది రాదు. అది అసలైన వాక్యపు ఉత్పత్తిగా వుండును. సాయంకాల సమయమునకు అది రావలసియున్నది. సాయంకాల సమయమందు వెలుగుండును. అది ఫలించుటకు ఆ వెలుగును పొ౦దును.
ZECH 14:7•
JOHN 8:12
25లేఖనము ఎంత చక్కగా న్నదో చూడుడి. "ఒక దినము అది పగలు కాదు రాత్రి కాదు. " సూర్యుడు ఫలింప చేయనిదే ఫలములు పక్వమునకు రావు. నీవెంతగా ఉపదేశించినను, మరేది చేసినను అది ఫలించదు. నిజస్థితికి రాలేవు రూపించబడవు. "నేను లోకమునకు వాక్యవెలుగైయున్నాను" అని చెప్పిన ఆయన ద్వారా మాత్రమే అవి ఫలించును. కావున దానిని ఫలింపచేయుటకును, నిరూపించి, తెలియపరచుటకును, పరిశుద్దాత్మ తానే ఒక శక్తిగా రావలసియున్నది. ఆయన దేనిని ప్రవచించెనో ఈ దినమున అది నెరవేరినది. సాయంకాలపు వెలుగు దానిని ఉత్పత్తి చేసినది, ఎంత చక్కని కాలము!
వధువు ప్రారంభములో ఏ విధముగా కదలి వెళ్లినదో, అదే విధముగా ఆమె చివరను వెళ్లినది. ఆమె తడబడులను గ్రహించి వెనుకకు లాగుటకు ప్రయత్నించాను. మనము జీవించు ఈ దినమున వీటినిగురించి అధికముగా చెప్పవచ్చును.
EZEK 37:1,2•
HOS 6:1,2
26ఇప్పుడు, హోషెయా 6:1లో ఈ విధముగా చెప్పుచున్నాడు, "ప్రభు యొద్దకు తిరిగి రండి." వారు చెదరిపోదురని ఆయన చెప్పెను. ఆ విధముగానే జరిగినది. వారు చెదరిపోయిన తరువాత తిరిగి వచ్చెదరని ఆయన చెప్పెను. వారిని ఆయన బాగుచేయును. చెదరిన వారినందరిని రెండవసారి తిరిగి రమ్మని చెప్పుచున్నాడు. వారు చీల్చబడి, గ్రుడ్డివారగునట్లు చేయబడిరి. అదియే నిజముగా జరిగినది. "ఆయనే మనలను స్వస్థపరచును, మనలను బాగుచేయును." యెహెజ్కేలు 37లో ఎండిన ఎముకలు, ఆ లోయ అంతయు ఎండిన ఎముకలతో నిండియున్నది. వారు మరలా తిరిగి రావడము యెహెజ్కేలు చూశాడు. "రెండు దినముల తరువాత…. రెండు దినముల తరువాత ఆయన వారియొద్దకు వచ్చును. ఆయన మనలను ఉజ్జీవింపజేసి, అంగీకరించును." ఉజ్జీవింపచేయును అను పదమునకు "పునరుత్దానము" అని అర్ధము కాదు. ఆ విధముగా అనేకచోట్ల వ్రాయబడియున్నది. (నేను చూచినప్పుడు) "ఒక ఉజ్జీవము" అను అర్థము వచ్చుచున్నది. "రెండు దినముల తరువాత ఆయన మనలను ఉజ్జీవింప చేయును. అది మూడవ దినమున జరుగనైయున్నది. "ఆయన మనలను చెదరి పోవునట్లు చేసెను, గ్రుడ్డివారినిగాను చేసెను, మనలను చీల్చెను. ఆయనే మనలను మరలా చేర్చుకొనును."
మనము చూపు పొందునట్లు యూదులు గ్రుడ్డివారిగా చేయబడిరని మీకు తెలియును. వారు చీల్చబడి ఒక దేశముగానే చెదరిపోయిరి. మెస్సీయాను మనము పొందునట్లు ఆయన నామము కొరకు ఒక జనము పిలువబడునట్లు వారి మెస్సీయాను వారు నిరాకరించిరి.
27ఇప్పుడు, పురుషుడు వచ్చుచుండగా స్త్రీ అతని పేరును తీసికొనుచున్నది. ఈ గ్రుడ్డివారైన అన్యులు ప్రభువైన యేసుక్రీస్తు అను నామమును, బాప్తిస్మమునందు చూడలేకయున్నారు. అది ఎంతో దౌర్భాగ్యస్థితి అయినప్పటికిని అది ఆ విధముగా వుండవలసియున్నది. యూదులు దానిని చూడలేరు. ముందు గుర్తించబడినవారు మాత్రమే దానిని చూడగలరు, లేనియెడల మీరు దానిని చూడలేరు. యూదులు మీరు చదువుచున్న బైబిలునే చదుచుండియు, గొప్ప పండితులై ధర్మశాస్త్ర నిపుణులైయుండియు, గొప్ప బిరుదులు కలిగి యుండినను, అది వారి మెస్సీయాయే అని వారు చూడలేదు. ఇప్పుడు తెలియపరచబడిన తరువాత మెస్సీయా ఆయనేనని చూడగలుగుచున్నాము. అయిననూ వారు దానిని చూడలేరు. ఈ దినమునకును వారు చూడలేకున్నారు. వారు గ్రుడ్డివారగుదురని ప్రవచింపబడెను.
ఈనాటి సంఘము గ్రుడ్డిదై సాయంకాలపు వర్తమానమును నిరాకరించునని ప్రవచింపబడెను. ప్రకటన 3 ఈ విధముగా చెప్పుచున్నది: "నీవు దౌర్భాగ్యుడవు, దిక్కుమాలిన వాడవును …!" గత రాత్రి సంఘ స్థితిని చూచినప్పుడు, దిగంబరియై గ్రుడ్డిదై దానిని తెలిసికొనలేకున్నది. ప్రభువైన యేసు, మా పట్ల కృప చూపుము. బైబిలు అది దిగంబరిగా ఉన్నదని చెప్పుచున్నది. ఇప్పటివరకు నేను దానిని చూడలేదు. లవొదికయ సంఘము దిగంబరిగా ఉన్నది. ఆమె గతరాత్రి కనిపించినప్పుడు దిగంబరిగా వుండి, (దానిని గుర్తించడము లేదు), దానిని ఎరుగ లేకున్నది!
HOS 6:2
28ఓ, మనము ఎంత వందనస్తులమైయున్నాము… మనము కృతజ్ఞత కలిగి యుండుటలో ఆశ్చర్యము లేదు. అయినను దేవుడు అనేక కార్యముల ద్వారా, ఆయన చేసినవన్నియు మనకు తెలిపినందుకు చాలినంత కృతజ్ఞతకలిగిలేమని నమ్ముచున్నాను.
దిగంబరి, ఆ దర్శనమునందు ఆమె దిగంబరిగా నున్నప్పటికిని, దానికది తెలియకున్నదని చెప్పబడినది. గ్రుడ్డీదైనది. ఇశ్రాయేలు గ్రుడ్డిగా నున్నప్పుడు, అన్యులు ప్రవేశించిరి. ఇప్పుడు వధువు ఎత్తబడుట్లు అన్యులు గ్రుడ్డివారైరి, మరియు ఇశ్రాయేలు బూరల పండుగను పొందగలదు.
"రెండు దినములైన తరువాత ఆయన మనలను ఉజ్జీవింపజేయును. (లేక ఉజ్జీవమును దయచేయుము) మనలను పరస్పరము చేర్చుచున్నాడు. (యూదులు ఇప్పుడు బూరలపై మాట్లాడుచున్నారు). ఆయన సముఖమ౦దు బ్రతుకుదుము. (లేక నిత్యజీవమును పొందుదుము. చూశారా?) మనము ఆయన సముఖమందు వుందుము." బైబిలునందు హోషేయ, "మనము ఆయన సముఖమందు బ్రతుకుదుము, ఆయన సముఖమందు జీవము కలిగియుందుము. (అది ఆయన స్వంత జీవమైయున్నది, అదియే నిత్యజీవము). ఆయన సముఖమ౦దు జీవము కలిగియుందుము" అని చెప్పబడినది. సుఖ-సంతోషములతో జీవించునది, బ్రతికియుండియు చనిపోయినదగును. ఇశ్రాయేలు ఆయన అనుగ్రహమందు మరలా జీవమును పొందునని హామీ ఇచ్చుచున్నాము. ఆమె ఈ సత్యములకును, పెంతెకోస్తు పండుగకును, మరణించినదై యున్నది.
HOS 6:2
29ఇప్పుడు జాగ్రత్తగా గమనించుడి, రెండు దినములైన తరువాత… అవి రెండు ఇరువది నాలుగు గంటల దినములని అర్ధము కాదు, ఎందుకనగా అది వందలాది సంవత్సరముల క్రితము ఇది జరిగినది. చూశారా? ప్రభువునందు రెండు దినములు - రెండువేల సంవత్సరముల తరువాత అని అర్థమిచ్చుచున్నది. అప్పటి నుండి ఎంత కాలమో మీరెరుగుదురా? అది ఇరువది-ఏడు వందల సంవత్సరముల క్రితము జరిగినదైయున్నది. ఎందుకనగా హోషేయా కాలము క్రీ.పూ. 780-1964. చూచారా, అది సుమారు ఇరువది-ఏడు వందల సంవత్సరములుగా వుండియున్నది. "రెండు దినములైన తరువాత మూడవ దినమందు, ఆయన మరలా ఉజ్జీవింపజేయును మరియు, ఆయనయందు జీవము దయ చేయునని హోషేయా చెప్పుచున్నాడు." బూరలు వచ్చుచున్నవి. ఇదియే మనము జీవించు కాలమును, దినమునైయున్నది.
ZECH 13:6
30ఇప్పుడు, వారు గ్రుడ్డివారై, చెదరిపోయి, మరలా సమకూర్చబడి, మూడవ దినములోనికి ఎంతో దూరముగా వెళ్లియున్నారు. మీరు దానిని చూచుచున్నారా? వారు పాలస్తీనా నుండి ప్రపంచమంతటకు చెదరిపోయిరి. వారు మెస్సీయాను నిరాకరించుటకు గ్రుడ్డివారిగా చేయబడిరి. ఇప్పుడు వారు వారి స్వదేశమునకు చేర్చబడియున్నారు; ప్రాయశ్చిత్తమును గుర్తించునట్లు బూరల కొరకై సిద్దముగానున్నారు. బైబిలునందు, "వారు దానిని పొందునప్పుడు, ఆయనను చీలల గాయములతో కనుగొందురని? వ్రాయబడియున్నది. (సంఘము ఎత్తబడిన తరువాత), "ఈ గాయములెక్కడ పొందితివని" వారు అడిగెదరు. "నా స్నేహితుల ఇంటిలోనని," ఆయన చెప్పును. వారు కుటుంబమునకు కుటుంబముగా ప్రత్యేకింపబడి, తమ ఏకైక కుమారుని పోగొట్టుకొనినట్లు దినముల తరబడి ప్రలాపింతురు. బూరల పండుగ వధింపబడిన బలి నిమిత్తము, మూల్గి ఏడ్చునట్లు చేయును; ఏలయనగా ఆ బలిని వారు నిరాకరించిరి.
వారు వారి స్వదేశమందున్నారు. వారు గ్రుడ్డివారిగా చేయబడి చెదరిపోయిరి — ఇప్పుడు వారు సమకూర్చబడిరి. అదంతయు ఆరవ ముద్ర క్రింద జరిగినది. వారియొక్క ఏడు బూరలు వారిని సమకూర్చుటకు గాను ఏకముగా పలికినవి. ఏడవ బూర మహాబూర (గత ఆదివారమున మనము చూచినట్లు). ఆ బూరలు ఆరవ ముద్ర క్రింద పలికినవి. ఆరవ ముద్ర విప్పబడిన రీతిగానే ప్రతి ఒక్కటి అదే సమయమున జరిగినది; పెంతెకోస్తు పండుగయందు మనము రెండు వేల సంవత్సరములుగా వున్నాము, వారి బూరలు ఒకే సమయముననే శబ్ది౦చినవి.
HOS 6:2•
REV 11:3
31ఇప్పుడు, ఆనాటి నుండి ఇరువది ఏడు వందల సంవత్సరములైనవి… "మూడవ దినమందు మనము సమకూడెదము, ఆయనయందు జీవమును పొందుదుమని, రెండు దినముల తరువాత మూడవ దినమున సమకూడెదమని" ఆయన చెప్పెను. ఆ వాగ్దానమును మీరు చూచుచున్నారా? ఆ కాలము చక్కగా గోడపై వ్రాయబడినది. మనమెక్కడ జీవించుచున్నామో మనము చూస్తున్నాము.
ఇప్పుడు, వారు తమ స్వదేశమ౦దు, బూరల పండుగకు లేక ప్రాయశ్చిత్తమును గుర్తించుటకు, ఆయన రాకడ కొరకు వేచియుండి, మొదటి దానిని నిరాకరించినందున, మూల్గుటకుగాను వారి స్వదేశమందు వేచియున్నారు ప్రతి ఒక్కటి క్రమముగా అమర్చబడియున్నది.
సువార్త సేవకునిగా, వధువు వెళ్లిపోవుటను మాత్రము నేను ఇంకనూ చూడలేదు. వారు జరిగిన దానిని గుర్తించునప్పటికి వధువు వెళ్లిపోవలసియున్నది. వారు గ్రుడ్డివారై చెదరిపోయిరి, ఇప్పుడు సమకూర్చబడిరి. మరేది మిగిలియున్నది? వారి మార్గము నుండి వధువు ఎత్తబడవలసియున్నది. వారు వధువు ఎత్తబడుటకై వేచియున్నారు. అప్పుడు ప్రకటన 11లోని వారి ప్రవక్తలు, వారిని బూరల పండుగకు పిలచెదరు, అప్పుడే వారు చేసిన దానిని వారికి గుర్తుచేయుదురు.
REV 7:4
32ముద్రల మధ్యగా ఆరవ ముద్ర వచ్చినప్పుడు అక్కడ 1,44,000 మంది ఎన్నుకొనబడి, పిలువబడుటను జ్ఞాపకము చేసికొనుడి. ఆరవ మరియు ఏడవ బూర మధ్య, ప్రకటన 11 కనబడుచూ, ఆరవ ముద్రతో సమాంతరముగా అక్కడ ఉన్నది.
ఏమి చేయుటకుగాను అచ్చటున్నది? అది ఇద్దరు సాక్ష్యులైన మోషే ఏలియా ప్రవక్తలను తెచ్చునదైయున్నది; యూదులు వారి ప్రవక్తలను మాత్రమే నమ్ముదురు. వారు ప్రవక్త సూచనతో వచ్చెదరు. వారు ప్రవక్తలవలెనె పని చేయుదురు. ఆ విధముగానే వారు చేశారు. నేనొక దానిని తెలుపుచున్నాను. మానవుడు మరణించినప్పుడు, లేక ఏమైనను — మీరు ఈ ప్రపంచమును విడచునప్పుడు, మీ స్వభావము మారదు. ఇక్కడ ఒక అబద్దికునిగావున్నయెడల అక్కడను అబద్దికునిగానే వుందును. ఇక్కడ నీవొక సందేహపరునిగా వుండినయెడల, అక్కడను నీవొక సందేహపరునిగానే వుందువు.
స్త్రీ మరియు పురుషులారా, ఈ సమయమందు మిమ్ములను సరిచేసికొని, పరీక్ష చేసికొనుడి. మనము ఎక్కడ నిలచియున్నామో చూడుడి! మరణము దానిని మార్చ జాలదు.
33రెండు వేల సంవత్సరముల క్రితము వారు వెళ్లిపోయిరి. మోషే 2500 సంవత్సరములకు ముందును, ఏలియా ఇంచుమించు 2500 సంవత్సరములకు ముందు వెళ్లిపోయిరి. మోషే వెళ్లినప్పటికిని, ఆయన స్వభావముతోనే, అవే కార్యములను చేయుచూ, తిరిగి వచ్చుచున్నాడు. మరణము మనిషి నివాస స్థలమును మార్చునేగాని, నీ స్వభావమును మార్చదు. నీ విశ్వాసమును మార్చదు. నీలో మరి ఏ దానిని మార్చదు గాని నీ నివాసమును మాత్రమే మార్చునదైయున్నది.
కావున ఈ ఉదయము నీ స్వభావము ఏ విధముగా ఉన్నది… నీ దేవుని వాక్యమును సందేహపడువానివిగా వున్నయెడల, అక్కడను నీవొక సందేహపరునిగానే వుందువు. నీవు ఎంత పరిశుద్దుడవైనప్పటికిని, నీవు ఏ విధముగా జీవించుచున్నను ఎంత మంచి జీవితము నీకు వున్నప్పటికి అది లెక్కకు రాదు. మరణించుటలో, అది నిన్ను ఎంత మాత్రమును మార్చవు. కేవలము నివాసము మాత్రమే మారును. వ్రాయబడినరీతిగా నీ పూర్తిగా వాక్యమును అంగీకరించనియెడల, అక్కడ నీవది చేయలేవు. అందువలన నీవేమి బాధపడ వద్దు. నీవు అక్కడ వుండవు. నీవు దానిని, దాని పరిపూర్ణతను, దాని నిరూపణ శక్తిని, అది ఏమైయున్నదను ప్రత్యక్షతను అంగీకరించినప్పుడే, దానిలో నీవొక భాగమగుదువు. ఆయన తన వాక్యమును మాత్రమే పైకి తీయును. మొదటి పునరుత్దాన దినమందు, ఆయన తన వాక్యమును చేసినట్లుగానే చేయును. ఆయన తన వాక్యమందు ఎవరైతే చనిపోయారో, వాక్యమును నమ్మినందునను, దానికి నిరూపణగా ఉన్నందునను, ఆయన వాక్యమైనవారు మాత్రమే ఎత్తబడుదురు.
34గమనించండి. ఇప్పుడు, అది ఇరువది-ఏడు-వందల సంవత్సరముల క్రితము జరిగినది. గమనించండి, వారు చెదరగొట్టబడిరి, గ్రుడ్డివారిగా చేయబడిరి, ఇప్పుడు వారు సమకూర్చబడుచున్నారని గమనించుడి. ఇప్పుడు, తరువాత వారు జీవమును పొందవలసియున్నది.
మరియు అన్యులు పిలువబడిరి. వధువు సిద్దముగా ఉన్నది. ఎత్తబడుట సమీపముగా ఉన్నది. మనము దానిని గ్రహించుచున్నామా? దానిని నిజముగా నమ్ముచున్నామా? అది ఒక చెప్పబడిన కథగా వున్నదా? అది ఒక కల్పిత గాథగా వున్నదా? లేక నిజముగా పలుకునదై యున్నదా? లేక వెలుపలవున్న దానిని నమ్మునదైయున్నదా? లేక మనలో అది ఒక భాగమైయున్నదా? అది జీవముకన్నను అధికమైనదిగా మనకున్నది. ఈ ఉదయకాలములో మనము ఏ ఉద్దేశ్యముతో ఇక్కడ కూర్చొనియున్నాము. దానిని పొందువారు చిన్నమందగా వుందురని జ్ఞాపక ముంచుకొనుడి.
ఇప్పుడు, (ఇశ్రాయేలు) స్వదేశమందు బూరలకొరకై వేచియున్నది. వధువు ఎత్తబడుట ద్వారా ప్రకటన 11 నెరవేరుటకు వేచియున్నది. సంఘ కాలములు గతించినవి. సంఘకాలములలో విడిచిపెట్టిన దానిని, నిరూపణకు తెచ్చు ముద్రలు విప్పబడినవి. మరియు సందేశము ఇవ్వబడినది. ఇశ్రాయేలు దృశ్యమునకు వచ్చినది. (హల్లెలూయ!) బూరల పండుగకు సిద్దముగా ఉన్నది
35ఓ, ఇతర దేశాలలో ఈ టేపును వినుచున్న మీరు, మేలుకొనలేరా! సోదరుడా? ఇది మిమ్ములను అంధులుగా చేయుచున్నదా? దానిని అబద్ద ప్రవచనమని చెప్పి నెట్టివేయుచున్నారా? అది ప్రపంచము ద్వారా మీ ముందు నిరూపించబడినది. దానిని వ్రాసిన పరిశుద్దాత్మ కాలములయందు, ప్రజల ద్వారా దానిని నిరూపించినది. అది ప్రకృతి సంబంధముగా, ఆత్మ సంబంధముగా, వస్తు సంబంధముగా నిరూపించబడినది. ఆయన చెప్పిన ప్రతి ఒక్కటియు, నెరవేర్చబడి నిరూపించబడినది.
ఇశ్రాయేలు తమ స్వదేశమ౦దున్నది; గొర్రేలు ఒక్కటిగా కూర్చబడినట్లు వారక్కడ చేర్చబడిరి. తోడేళ్లు వారి వెనుకపడి ఇశ్రాయేలును వారి స్వదేశమునకు పరుగిడ చేసినవి. జ్ఞాపకముంచుకొనుడి, ఇశ్రాయేలు తమ స్వంత దేశమందున్నంత కాలము మాత్రమే ఆశీర్వదించబడునని వాగ్దానము చేయబడియున్నది. ఆ దేశమునకు వెలుపల దేవుడు ఇశ్రాయేలును ఆశీర్వదించడు. అబ్రాహాము ఆ దేశమును విడిచి వెళ్లినప్పుడు అతడు నిరాకరించబడెను. ఆ దేశమును విడిచిపెట్టిన ప్రతి ఒక్కరు నిరాకరించబడుదురు. ఇశ్రాయేలు తమ స్వంత దేశమందున్నపుడు మాత్రమే దేవుడు దానిని దీవించగలడు. ఇప్పుడు ఇశ్రాయేలు అక్కడ ఒక దేశముగా ఉన్నది. సంఘము పిలువబడినది. ఇశ్రాయేలు కేవలము వధువు ఎత్తబడుట జరుగుటకుగాను వేచియున్నది.
ముద్రలు విప్పబడినవి. అవి మనకు బయలుపరచబడినవి. అవి దేవునిని విడిచిపెట్టలేదని మీరు చూచారు. సర్పసంతానమును, నీటి బాప్తిస్మమును గురించి వాదించుటకు ఇష్టపడువారైన మీరు గ్రుడ్డివారై దానిని తెలిసికొనలేకున్నారు. ఈ లోకపు దేవుడు వాటికి మిమ్ములను గ్రుడ్డివారినిగా చేసినందున, దానిని తెలిసికొనలేక పోవుచున్నారు. (ఈ ఉదయకాలమున ఆ ఒత్తిడులతో నేను పోరాడిన దానిలో ఆశ్చర్యము లేదు).
అందువలన ఆ ప్రవక్తలు ఈ చివరి దినమున వారికి బయలుపడెదరు. బూరల పండుగకు ముందుగా దానిని చేయలేరు.
HOS 6:5•
MAL 4:5
36ఆయన హోషేయా ద్వారా చెప్పినదేమనగా, "నేనే వారిని చీల్చితిని [ఆయన ఇశ్రాయేలుతో మాట్లాడుచున్నాడు.] - నేను చీల్చితిని…" ఇంకొక విధముగా చెప్పవలెనన్న "నేను వారిని ముక్కలు చేసితిని. ప్రవక్తల ద్వారా వారిని ముక్కలు చేసితిని." దేవుడు తన ప్రజలను ఆ విధముగా చేయుచున్నాడు. ఇతర దేశములనుండియు వారిని వేరుచేయుచున్నాడు. దేనిచేత? ఆయన తనయొక్క రెండంచుల ఖడ్గమైన వాక్యముచేత వారిని వేరుచేయుచున్నాడు. తన సొంత దేశమును, ఇతర దేశముల నుండి, తన ప్రవక్తలచేత, తాను నిరూపించిన వాక్యముతో, ప్రత్యేకము చేయును. ఆ విధముగానే ఆయన తన వధువు, సంఘ సంస్థల నుండి ఈ చివరి దినములలో మలాకి 4నందు తాను వాగ్దానము చేసిన తన వాక్యముతో చెక్కి, తన వధువును వేరుపరచును, ఇతర సంఘముల నుండి ఆమెను చెక్కివేయును. ఆయన వధువును ఆ విధముగా ప్రత్యేకపరచును.
1SAM 8:19•
HOS 6:5
37ఆయన తన వాక్కుతో ప్రవక్తల ద్వారా ఇశ్రాయేలును చెక్కును. "ఇతరులనుండి వేరుపడుము."
వారు ఇతరులవలె వుండుటకు ఇష్టపడి, ప్రవక్తయైన సమూయేలునొద్దకు వచ్చి, అతడు "మీ ధనమును ఎప్పుడైనను ఆశించితినా?
జరిగినది తప్ప మరేదైనను ఆయన నామమున చెప్పితినా?" అని అడిగెను.
అందుకు వారు "లేనే లేదు. అది నిజము. అయినను మాకొక రాజు కావలసియున్నదని" అడిగిరి.
సంఘములు ఆ విధముగానే చేసినవి. "ఓ, మేము వాక్యమును నమ్ముచున్నాము. అది సత్యమైనదే; అయినను మేము కోరిన దానినే చేసెదమని" చెప్పుచున్నవి. వారేమి చెప్పినను నాకు లెక్కలేదు, వాక్యమే ఖచ్చితమైనది.
(ఇశ్రాయేలు) వేచియున్నది. ఆయన వారిని తన ప్రవక్తల ద్వారా చెక్కును.
సహోదరుడా, ఇది ఏ సమయమైయున్నది? సేవకుడా, ఇది ఏ సమయమైయున్నది? నీవు జీవించు దినమును, దాని సమయమును, సూచనను చూడగలుగుచున్నావా? నీవు దానిని గ్రహించగలుగుచున్నావా? దానిని చూడగలుగుచున్నావా?
38ఇప్పుడు ఎక్కడ చూచినా గాని ఉజ్జీవము లేదు, ప్రతి ఒక్కరు ఫిర్యాదు చేయుచున్నారు. సేవకులు ప్రలాపించుచున్నారు. నేను ఈ మధ్యన సంఘమునకు వచ్చిన ఒక ప్రాముఖ్యమైన పత్రికను, చదుచున్నప్పుడు, "ఉపవాసము, ప్రార్ధన, ఉపవాసము, ప్రార్థన, బూర శబ్దము" అనునవి తప్ప మరే ఇతరమైన వాటిని చదువలేము. వారు ఇంకేమియు ముద్రించరు. ఆ సంపాదకులను నేను ఎరుగుదును. వారు ఎక్కువ దైవ భక్తిగలవారు. వారెవరో కాదు సహోదరుడు, సహోదరి మూర్ దంపతులే. అది "ఆగమన దూత్ర" అను పత్రికయై యున్నది. సువార్త పొలమందు శ్రేష్టమైన పత్రిక. ఆ పత్రికయందు, ఉపవాసము, ప్రార్థన, అను వాటిని మాత్రమే మనము వినగలము. మరియు "మనము ఒక గొప్ప దిన ప్రారంభమును కలిగియున్నాము. గొప్ప కార్యమొకటి జరుగనైయున్నది. అందరును ప్రార్థించుడి, ప్రార్ధించుడి, మనమెంతో ఆలస్యముగా లేము," అని ఆ పత్రికయందు వ్రాయబడియున్నది.
వారెందుకు ఆ విధముగా వ్రాయుచున్నారు? వారొక గొప్ప మేలుకొలుపును కోరుచున్నారు. ఆ మేలుకొలుపును నమ్మి, వారు మొర్రపెట్టుచున్నారు. వారు చాలా మంచివారు. అయినను మరేమి జరిగినది? వారు వధువు మేలుకొలుపును గుర్తించడము లేదు, చూశారా. క్రైస్తలుగా వున్నందున ఈ ఈడ్పును చూడగలుగుచున్నారే గాని, అక్కడ ఏమి జరుగుచున్నదో గుర్తించలేక పోచున్నారు. అదియే వారిని ఆ విధముగా తలంచునట్లు చేయుచున్నది. ఏదో ఒకటి జరుగనైయున్నదని వారికి తెలియుచున్నదే గాని, దానిని వారు ఎంతో దూరమున, భవిష్యత్కాలములో రావలసిన దానిగా చూచుచున్నారు, కాని అది వారి ప్రక్కనే జరిగినది.
ఈ విధముగా పూర్వ దినములయందును జరిగినది. వారు మెస్సీయా వచ్చునని నమ్మిరి. రాకడను ముందు సూచించువాడు ఒకడు వచ్చునని నమ్మిరి. అయితే అది వారియొద్దనే వుండినది గాని వారు దానిని ఎరుగలేదు. వారు దానిని గుర్తించలేదు. మెస్సీయాను తెలుపుచూ ఒక ముందు దూత వచ్చునని నమ్మిరి. వారు అతని తలను నరికి వారి మెస్సీయాను చంపివేసిరి, ఎందుకనగా వారు గ్రుడ్డివారు అగుదురని ప్రవచింపబడినది. హోషేయ ఆ విధముగానే చెప్పెను.
REV 3:17,20
39మరియు హోషేయా ద్వారా మాట్లాడిన అదే ఆత్మ యోహాను ద్వారాను మాట్లాడి, చివరి దినములలోని సంఘము దిగంబరియై, గ్రుడ్డిదై, ఆయనను సంఘము వెలుపల వుంచునని చెప్పెను. వారు ఆ ప్రవచనములు నెరవేరుటను చూచుటలో తప్పిపోయిరి. వారక్కడ వున్నందున, ఏదో కొంత జరుగునైయున్నదని గ్రహించుచున్నారు. అయినను వారు దానిని పొందలేకున్నారు. వారు దానిని గ్రహించలేకున్నారు. పూర్వకాలములోని యూదులవలె లవొదికయ గ్రుడ్డిదై - ధనముతో వేదాంతముతో, సంఘములతోను నిండినదై, వర్తమానము పట్ల విరోధభావమును కలిగియున్నది. యోహానుపట్ల యూదులు ఎంత విరోధభావమును కలిగి యుండిరో, అలాగే యేసు యెడల కూడా విరోధబావము కలిగి యుండిరి. వారు ఎవరి కోసము ఎదురుచూచుచున్నామని చెప్పుచున్నారో అతడే ఆయనైయున్నాడు.
విద్యుత్తు ఆగి పోయినదని నమ్ముచున్నాను. టేపు చేయు సాధనములును ఆగిపోయినవని నమ్ముచున్నాను. కాని ఆ విధముగా జరిగినట్లు లేదు. మంచిది.
40వారు వర్తమానమునకు ఎంత విరోధముగానున్నారు…
మీలో ప్రతి ఒక్కరు ఒక రకమైన ఉష్ణసాధనముగా నున్నందున, ఇటువంటి సమయములో, సాధారణ స్థితిని కలిగియుండలేము. మనలో ఒక్కొక్కరి నుండి 98 ఫారెన్హీట్ ఉష్ణము వచ్చుచునేయుండును. చాలినంత ఉన్నప్పటికిని, అధిక ఉష్ణము వెలువడుట ద్వారా, అనుకూలముగా వుండదు.
పూర్వపు యూదులవలే విరోధభావమును కలిగి, గ్రుడ్డివారైనది గమనించుడి; వారు లవొదికయనందున్నారు. వారు దిగంబరులై, దౌర్భాగ్యులై, దిక్కుమాలినవారైనను దానిని ఎరుగలేకున్నారు. ఈ దినపు సంపదలు, గొప్ప వేదాంత బోధనలు, గొప్ప చదువులను కలిగి వర్తమానమునకు విరోధులైరి. నజరేయుడైన యేసు భూమిపై వున్నప్పటి దినములవలెనె, దానితో వారు చేయగలిగినది ఏమియు లేకపోయినది.
MATT 24:37•
LUKE 17:26
41నోవహు దినములలో ఆ ప్రజలు, ఆ దినపు వర్తమానమును గాని, ఆ వర్తమానికుని గాని గుర్తించనందున, ఆ ఓడలో ప్రవేశించలేకపోయిరి. వారు నశించుటకు అదొక్కటే కారణమైనది. వారు జీవించు సమయమును వారు గుర్తించలేదు. దేవుడు వాగ్దానము చేసినట్లు, పాపము పట్ల ఆయన చర్య తీసికొనునని వారు గుర్తించలేదు. ఆయన మానవులను భూమిపై నుండి నాశనము చేయునని ప్రవచించెను, దానిని నెరవేర్చెను. ఆనాటివలె ఈనాడును, ఆ విధముగానే ఆయన చేయుటకు ఉద్దేశించుచున్నాడు.
ప్రజలు నోవహునకు అనుకూలముగా వుండుటకు బదులుగా, అతనినొక అడవి మనిషిగా తలంచిరి. వారు నోవహును ఒక ప్రవక్తగా నమ్మలేదు. ఆయనను నిందించి, అపహసించిరి. ఒక మూఢభక్తిపరునిగా మాట్లాడిరి. యేసు ఇట్లు చెప్పెను, "నోవహు దినములయందు ఉండినట్లు…" ఆయనే స్వయముగా చెప్పినప్పటికిని, ఆ కాలమునుగాని, ఆ దినమును గాని, ఆ సూచనను గాని, వర్తమానికుని గాని గుర్తించక, వెలుపల వుంచి అపహసించిరి.
42ఇశ్రాయేలు తమ స్వదేశమందున్నది, సమస్తమును చక్కగా సమకూడి, అనుకూలమైన వర్తమానము వచ్చుచున్నది. సోదరుడా? ఎచ్చటున్నాము?
వారు ఆ దినమును తెలిసికోన లేదు. అది వారికి తెలియలేదు. వారు దానిని గుర్తించక విడిచిపెట్టిరి. వారును ఈనాటి ప్రజలవలెనె ఉన్నారు. శాస్త్రీయ నిరూపణల ద్వారా, విద్యా విధానముల ద్వారా, వేదాంత పాఠశాలల ద్వారా, ఆనాటి కార్యములు వారిని గ్రుడ్డివారినిగా చేసినవి, ఈనాడును ఆ విధముగానే జరుగుచున్నది. ఆ విధానమే వారిని గ్రుడ్డివారినిగా చేసినది.
43అతి సామాన్యత — సామాన్యమైన వర్తమానము మరియు వర్తమానికుడు వారిని గ్రుడ్డివారినిగా చేసినది.
నోవహు చదువుకొన్న జ్ఞాని కాడు, సామాన్య సందేశముతో, సాత్వికుడైన పేద వ్యవసాయకుడైయున్నాడు. వారి నేర్పరితననకు, అది అతి సామాన్యముగా వుండినది. ఈనాడును ఆ విధముగానే ఉన్నది. ఆయనను విశ్వసించి, ఆయనను నమ్మిన విశ్వాసులకు తన వర్తమానమును దేవుడు ఎల్లప్పుడు అతి సాధారణ స్థితిలో ఇచ్చుచున్నాడు. అది వ్యత్యాసమైన వర్తమానమైనప్పటికిని, దేవుడు ఆయనే అయిన్నాడు. దేవుడు తానే దానిని మాట్లాడెనని గ్రహించి విశ్వసించమని కోరుతున్నాను.
తన ప్రవక్తయైన నోవహును వారు అపహసించినట్లు యేసు చెప్పెను. ఆయన రెండవ రాకడయందును, వారు ఆ విధముగానే చేయుదురు. అవే కార్యములను చేయుదురు. ఆ కారణముచేతనే ఫరో సముద్రములో మునిగిపోయెను. అతడు తన దినమును గాని, ఆనాడు జరుగుచుండిన దానిని గాని గుర్తించలేదు. అతడు బానిసలైన పనివారితో, తన శాస్త్రీయ కాలముందు పట్టణములను కట్టుచూ, తన సాధనయందు నిమగ్నుడైయుండెను. అతడు తనకున్న అవకాశమును చూడలేనంత అధికముగా పనులను కలిగియుండెను. దేవుని ప్రవక్తయగు వర్తమానికుని అరణ్యమునకు పంపివేసెను. అతడు దానిని గుర్తించనందున, ఆ కార్యములు జరుగవలసిన విధముగానే జరిగినవి. అతడు దానిని గుర్తించలేదు. అది ఆనాటి ప్రజలకు దేవుని వాగ్దాన వాక్యమని అతడు గుర్తించియుండిన ఎడల బాగుండును.
44ఈ దినపు సంఘములు కూడ ఇది ఈ కాలపు ప్రజలకు దేవుని వాక్యవాగ్దానమని గుర్తించినయెడల వారు నశించరు. అమెరికా దేశము పూర్వము తాను రూపించిన తీర్మానములను, గుర్తించినయెడల వారి నాణేములపై దేవుని పేరును గాని, పాఠశాలలో బైబిలును గాని, దేవుని ఆజ్ఞలకు లోబడియుండుటను గాని, త్రోసివేసియుండదు. అయితే అది దానిని గుర్తించలేదు. ఎందుకు? అమెరికా దేశము గ్రుడ్డిదై, దిగంబరిగా ఉన్నది. ఇటువంటి మ౦చి అవకాశములకై యుద్దమందు చనిపోయిన యువకుల అమూల్యమైన రక్తమును అది గుర్తించలేదు. వారు మరచిపోబడి ధూలిలో కలసిపోయిరి
45అయినను చిదించబడిన ప్రవక్తల రక్తమును విచారించుటకు ఒకరున్నారు. ఈనాటి సువార్తను మనకు తెచ్చుటకు గాను వేలాదిమంది గుహలయందు సింహములకు ఆహారముగా వేయబడిరి. కోయబడి, కాల్చబడి, శిలువ వేయబడిరి. వారిని దేవుడు గుర్తించుచున్నాడు. సంఘము తన ప్రవక్తలను మరచినది. ప్రవక్తలను గురించి మాట్లాడుదురే గాని, వారికి ఆ ప్రవక్తలతో నిజమైన అవసరత లేదని చెప్పుచున్నారు. కాని ప్రవక్తలను కలిగియుండవలసియున్నదని దేవునికి తెలియును. ఆయన తన వాక్యముతో ప్రజలను చెక్కును. ఈనాడును వారికది చాలా పురాతన పద్దతిగా ఉన్నది. వారు దానిని గుర్తించనందున, వారున్న స్థితిలోనే వారున్నారు. వారు దిగంబరులుగా, దౌర్భాగ్యులుగా, దిక్కుమాలినవారుగా, గ్రుడ్డివారుగా నున్నప్పటికిని, దానిని ఎరుగలేకున్నారు. అదియే ముఖ్య కారణము, మనము జీవించు కాలమును గుర్తించలేకున్నారు. దానిని చూడలేకున్నారు.
EXOD 3:14
46మోషే తన పిలుపును, ఆ దినమును, ఆ దినపు దేవుని వాగ్దానమును, అది నెరవేరుటను చూచి గుర్తించెను. ఆ వాగ్దానము ద్వారా తాను చేయవలసిన దానిని తెలిసికొని, గ్రహించెను. ఇతరులు ఏమి చెప్పుదురోనని అతడు భయపడలేదు. ఆనాటి మత గురువులు, ఫరో, అధికారులు, ప్రతి పరిస్థితి తనకు అనుకూలముగా లేకపోయినను, తాను గుర్తించిన వర్తమానము పట్ల సిగ్గుపడినవాడు కాడు. అతడు ఆ పొదలో అగ్నిస్తంభమును చూచినప్పుడు, "నేను నిన్ను ఆ కార్యము చేయుటకు పిలచాను," అను దేవుని పిలుపును అతడు గుర్తించెను. అతడు రాజు యొక్క బెదిరింపులకు భయపడలేదు. దేవుని వాక్యవాగ్దానము ప్రకారము ఆ ప్రజలను ఒక నిర్గమమునకు సిద్దపరచుటకు వెళ్ళెను.
47వాగ్దాన నెరవేర్పును చూచినప్పుడు, ఆ ప్రజలను వారి నిర్గమమునకు సిద్ధపరచెను. ఎప్పుడు? నిరూపించబడిన దేవుని వాగ్దానమును చూచినప్పుడు. గుర్తుంచుకొనండి, అతడు తన వేదాంతముతో వెల్లెను; అతడు తన శిక్షణతో వెల్లెను. అయితే అతడు దేవుని వాక్యనిరూపణను చూచినప్పుడు, "నేను ఉన్నవాడనై యున్నాను?" అను నిరూపణను చూచినప్పుడు, ఎవరేమి చెప్పుదురని చింతించలేదు. ఫరో ఏమి చెప్పునని చింతించలేదు. ఇతరులేమి చేయుదురని భయపడలేదు, కాని దేవుని అపార్ధము చేసికొందునేమోనని ఆయనకు మాత్రమే భయపడెను. ప్రజలు ఏమి చెప్పుదురో లేక ఏమి చేయుదురోనని భయపడలేదు గాని, అది దేవుని వాక్యమని గుర్తించి దేవునికి మాత్రమే భయపడెను.
JOB 14:7,10,13,14•
JOB 19:25
48తనలాంటివాడు అక్కడకు ఏ విధముగా పంపబడునని అతడు గ్రహించలేకపోయాడు. అయితే ప్రత్యక్షమైన వాక్యము ఏమైయున్నదో, దానిని గ్రహించినప్పుడు, రాజాజ్ఞలకు అతడు భయపడలేదు. నీవు గ్రహించినయెడల చాలును. ఈనాడును మనము గుర్తించినయెడల! మోషే వాక్యనిరూపణను చూచి గుర్తించాడు, నిరూపణను చూచాడు. అతడు ఆ ప్రజల నిర్గమమునకు సిద్దపడ్డాడు.
యోబు మొదట అది దేవుడునని గుర్తించలేదు. నీ పొందు స్వల్ప శ్రమలు, దేవుని శిక్షగా సాతాను నిన్ను నమ్మించుచున్నాడు. దేవుడు యోబుకు ఏదో కొంత చూపుటకు ప్రయత్నించుచున్నాడని, మోషేవలె దర్శనమునందు దానిని చూచువరకు, యోబు దానిని గ్రహించలేదు. యోబు తన ప్రశ్నయందు "మనిషి మరణించిన తరువాత మరలా బ్రదుకునా? చెట్టు మరణించి, మరలా జీవించుట చూచుచున్నాను, పువ్వురాలి మరలా వచ్చుచున్నది కాని మనిషి నిద్రించి, ఆత్మను అప్పగించి వ్యర్ధమైపోవుచున్నాడు. తన కుమారులు ప్రలాపమునకు వచ్చినను, అతనికి తెలియకున్నది. ఓ, నీవు ఉగ్రత గడచువరకును సమాధిలో నన్ను దాచెదవు అనుచున్నాడు. ఎందు నిమిత్తము ఒక పూవు రాలి మరలా వచ్చుచున్నది? ఏ విధముగా ఆకు భూమిలో పడి మరలా వసంతములో వచ్చుచున్నది? దానినతడు గ్రహించలేకున్నాడు. అతడు ఈ విధముగా చెప్పుచున్నాడు, "మనిషి నిద్రించి ఎక్కుడకు వెళుచున్నాడు? నేను దేవుని నమ్ముచున్నాను; అయితే మనిషికి జరుగునదేమి?" (ఇదియే తన ప్రశ్నయైయున్నది).
అయితే ఒక దినమున వెలుగు ప్రకాశింప మొదలు పెట్టెను, ఉరుములు గర్జి౦చుటకు మొదలుపెట్టెను, ఆత్మ ప్రవక్త పై వచ్చెను, అప్పుడతడు ఒక "మనుష్యుడు" వచ్చి, పాపియైన మానవునిపై ఆయన చేతిని వుంచుటను చూచెను. మరియు పరిశుద్ద దేవుడు ఆ మార్గమును సంధి చేయుచున్నాడు. అప్పుడతడు ఇలాగున ప్రలాపించెను, "అయితే నా విమోచకుడు సజీడని నేను ఎరుగుదును. ఈ విధముగా చర్మపు పురుగులు నా శరీరమును తిని వేసినను, ఆ తరువాత నా శరీరముతోనే నేను దేవుని చూచెదను.." పునరుత్థానము ఏమిటో అతడు గుర్తించెను.
49గాడిద భాషలతో మాట్లాడినంతవరకు బిలాము దేవుని దూతను గుర్తించలేదు. దేవుని దూత తన మార్గములో నిలువబడియుండుటను బిలాము గుర్తించలేదు. ఒక గ్రుడ్డి బోధకుడు ధనము కొరకు తన వరములమ్ముకొనుటను అడ్డగించుచు దేవుడే తన మార్గమందు నిలచియుండుటను అతడు గ్రహించలేదు. గాడిద మానవ స్వరముతో మాట్లాడినప్పుడు, దేవుని దూత తన మార్గమందు నిలచి తాను చేయుచున్న దానినుండి తప్పించుచున్నాడని బిలాము గుర్తించెను.
ఓ, అంధులైన సంస్థలారా, ఒక సేవకుడు తన మార్గము నుండి తప్పియుండుటను తెలుపుటకు గాను భాషరాని మూగదైన ఒక గాడిదను దేవుడు వాడుకోగలిగినయెడల, ఒక మానవుని అదే పనికి ఆయన వాడుకొనలేడా? అందులైన ప్రజలారా.
1KGS 21:19•
1KGS 22:6•
2CH 18:5
50ఆహాబు తన దినమును గుర్తించినయెడల, వాగ్దానము చేయబడిన దేవుని వాక్యముతోనున్న మీకాయాను నిరాకరించియుండడు.
ఆహోబు ఆ దినమున ఎహోశాపాతుతో నిలువబడియున్నప్పుడు… నాలుగు వందలమంది ప్రవక్తలు, "వెళ్ళుము సమస్తమును చక్కగా ఉన్నది. ఆహాబు, నీవు పాపములో జీవించుచున్నావు. నీవు మమ్ములను ఒక పెద్ద సంస్థగా చేసియున్నావు. మేము గొప్ప జనమై, ఒక గొప్ప సేవను కలిగియున్నాము. ఇదిగో ఇక్కడ నాలుగు వందలమందిగా మతయాజకులు లేక ప్రవక్తలు నేర్పరులమై యున్నాము, నాలుగు వందలమందిగానున్న మేము వాక్యమందు వేదాంతమందు నేర్పరులైయున్నాము, మాకు అదంతయు తెలియునని" ప్రవచించిరి. అందువలన వారికి దానంతటిని గురించి తెలియదని ఇప్పుడు నిరూపించబడినది.
ఏలియా ఆ తరమువారి ఎదుట వెర్రివానిగా పిలువబడినను, అతడొక దేవుని నిజమైన ప్రవక్తయై "యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు, ఆహాబు, నీ రక్తమును కుక్కలు నాకును" అని ప్రవచించెను. చూశారా?
అయితే ఆ మత యాజకులు, మానవ కల్పిత ప్రవక్తలై సమస్తమును చక్కగా అమర్చబడియున్నదనుకొనిరి. వారు "తండ్రివైన అబ్రహాము - తండ్రివైన ఆహాబు, ముందుకు సాగుము, దేవుడు నీకు తోడైయున్నాడు. నీవు లేఖనములను కలిగియున్నావు, ఎందుకనగా దేవుడు ఈ భూమిని ఇశ్రాయేలుకు ఇచ్చియున్నాడు. ఇది ఇశ్రాయేలునకు స్వంతమైనది. ముందుకు సాగుము దేవుడు నీకు తోడైయున్నాడు" అని చెప్పిరి. ఓ, మై!
1KGS 22:7,8•
2CH 18:6,7
51అయితే మీకు తెలుసా, ఆహాబువలె పాపములో చేరని యొహోషాపాతు కార్యములను కొంత వ్యత్యాసముగా చూచెను. అతడు, "మరొకరు ఇచ్చట లేరా?" అని అడిగెను.
అందుకతడు "ఒకడు మాకున్నాడు గాని, అతనిని నేను అసహ్యించుకొందును" చూశారా? దేవుడేమి చేయుచున్నాడు? ఒక ప్రవక్తచేత తన ప్రజలను మరలా నరికివేయుచున్నాడు. "అతనిని నేను అసహ్యించుకొందును. అతడు నన్ను త్రోసివేయడము తప్ప మరేమి చేయడు. నేను గొప్పవాడినని నీకు తెలియును. నేను ఒక గొప్ప విశ్వాసిని కానట్టయిన, ఇక్కడ ఈ వేదాంత పాఠశాలను కలిగియుండలేను. చక్కని నేర్పరులైనవారు నాకు కలరు. వారిని చక్కని పుస్తకలతో వుంచి ఉన్నాను, వేదములున్నవి, మరియు సమస్తమును, దీనిని బోధించుటకుగాను ఉన్నవి. వారు గొప్పవారని నాకు తెలియును" అని ఆహాబు చెప్పుచున్నాడు. అయితే ఆహాబు ఇమ్న కుమారుడును, చూపునకు మొరటువాడును, తమాషాగా కనబడువాడైన (మీకాయా)ను, అతడు నిలువబడి "యెహోవా సెలవిచ్చినదేమనగా?" అని చెప్పుచున్నప్పుడు. అతనిని (ఆహాబు) గుర్తించినయెడల, చేసిన మరణకరమైన తప్పును మరెన్నడూ చేసియుండడు. అయితే అతడు మీకాయాను త్రోసివేసెను. అతడు ఎన్నడూ…
ఓ, ప్రజలారా, మీరు ఏ కాలమందు జీవించుచున్నారో గుర్తించుడి! ఏమి జరిగినదో చూడుడి. చేయబడిన వాగ్దానమేమిటో చూడుడి. మీరు జీవించు దినమును గుర్తించుడి.
JOHN 6:44
52సంఘ సంస్థలు ఎందునిమిత్తము నిరాకరించబడి, ఇశ్రాయేలు ఐగుప్తును విడిచి వెళ్లినట్లు, సంఘ సభ్యులు పారిపోవుచున్నారు. దానిని గ్రహించినయెడల మీకు మేలగును. సంఘసంస్థలు టేపులను నిరాకరించక, వాటిని వినినట్లయిన ఎంతో మేలు. ఈ టేపును వినుచున్న బోధకుడవైన నీవు దీనిని వినుము; నీవు జీవించుచున్న సమయమును, సూచనను గుర్తించినయెడల, ప్రజలందరు ఎందుకు సంస్థలను విడిచి వెళ్లుచున్నారని చూడగలవు. దేవుని ఆత్మ పిలచుచున్నది… "నా తండ్రి ఆకర్షించనిదే ఎవడును నా యొద్దకు రాడు. గతములో తండ్రి నాకిచ్చిన వారందరు నాయొద్దకు వచ్చెదరు" అని యేసు చెప్పెను.
MAL 3:1
53బావి దగ్గర ఆ యౌవ్వన స్త్రీ మరియు ఆ యాజకుడు ఎంత వ్యత్యాసముగా ఉన్నారు. ఈనాడును చేవ్రాత గోడపై ఉన్నది. వారు దానిని చూచిరి, అయితే వారు దానిని గుర్తించలేదు.
యూదుల చివరి ప్రవక్తయైన మలాకీ 3లోని, వారి మెస్సీయా వాగ్దాన సూచనయైన "ఇదిగో నాకు ముందుగా మార్గమును సిద్దపరచుటకై నేను నా దూతను పంపుచున్నాను" అను దానిని గుర్తించియుండిన మేలైయుండును. వారు అతనికొరకు ఎదురు చూచుచున్నామని చెప్పుకొనుచున్నారు. ఈనాటి వరకు ఎంత ఖచ్చితమై సమానాంతరముగా ఉన్నది.
ఏదో ఒకటి జరుగుట కొరకు ఎదురుచూచుచున్నామని చెప్పుకొనుచున్నారు. సంఘములన్నియు ఉపవాసములుండి, ప్రార్ధనలు చేయుచూ, ఇప్పుడు మనమందరము ప్రార్థించెదము, మనము సమకూడెదము, సంభవించవలసిన ఒక గొప్ప కార్యము మనకున్నది; సంఘము సిద్దపడవలసియున్నది" అని చెప్పుచున్నవి. ఇలా దానిని గురించి వారు ప్రార్ధి౦చుచున్నారు.
JOHN 1:26
54దాని నిమిత్తము వారు చేయు ప్రార్థన అదియే. బాప్తిస్మమిచ్చు యోహాను వచ్చాడు. వారి వేదాంత పాఠశాలలను నిరాకరించాడు. వారి తల్లిదండ్రులు బోధించిన దానికి వ్యతిరేకముగా కార్యములు చేశాడు. అతడు విద్యలేక, అరణ్యము నుండి వచ్చినవాడు. ఈనాడు చెప్పుకొనుచున్నట్లు, అతడు తన కాలర్ ను మడచుకొని రాలేదు. అతడు పెద్ద వేదాంతపు గుంపులతో రాలేదు, కాని దేవుని వాగ్దానమును తెలిసికొని వచ్చాడు. అతడు మెస్సీయాను తెలుపవలసియున్నది. "మీ మధ్య ఆయనున్నాడని" చెప్పెను. అతడు వారి పాఠశాలల నుండి రానందున అతనినొక వెర్రివానిగా తలంచారు. గోడమీద చేవ్రాత ఉన్నది, గాని వారు దానిని తెలిసికొనలేకున్నారు. వారు అటువంటివాని కొరకు ఎదురుచూచుచున్నామని చెప్పుకొనుచున్నారు; ఆయనేమో వారిమధ్యనే ఉన్నాడు; ఆయన కొరకు ఎదురు చూచుచున్నామని చెప్పుకుంటున్నప్పటికినీ, ఆయనను వారు గుర్తించడము లేదు.
55ఇదియూ యూదులవలెనె ఉన్నది, లోకసంబంధమైన అన్యులతో భోజనము చేయుచున్నారు, ఎందుకనగా వారు ఆ విధముగా చేయునట్లు ప్రవచించబడినది. వారేమో ఆయనకొరకు ఎదురు చూచునట్లు చెప్పుచున్నారు. అయితే అన్యుల లవొదికయ సంఘకాలములలోని సంఘశాఖలు వారివలె గ్రుడ్డివైయున్నవి. ఎందుకనగా, వారు ఆ విధముగా వుందురని ప్రవచింపబడియున్నది. అది నెరవేరవలసియున్నది.
ఇశ్రాయేలు వారి సూచనను గుర్తించినట్లయిన మెస్సీయా వారి మధ్య కనబడిన కాలమును ఎరిగియుందురు. వారు దానిని గుర్తించియుండిన…
మీకు తెలియునా "ఏలియా మొదలు రావలసియున్నదని శాస్త్రులు ఎందుకు చెప్పుచున్నారు?" ఆయన శిష్యులు యేసును అడిగిరి.
మరియు "ఏలియా ఇది వరకే వచ్చెను, వారది తెలియక తమకు ఇష్టము వచ్చినట్లు అతని ఎడల చేసిరని" యేసు చెప్పెను. అతడు అంతకు ముందుగానే అక్కడున్నాడు. వారు ఆయనను ముందుగానే చంపివేసిరి. వారేమి చేయుదురని లేఖనములు చెప్పెనో, ఖచ్చితముగా ఆ విధముగానే చేసిరి.
MATT 3:7,9•
LUKE 3:7,8
56వారు చేసిన ప్రతి రెండు రకములైన కార్యములను ఖండించిన ఆ వెర్రి బోధకుని వారు గుర్తించవలసియున్నది. అతడు వారు చేయు ప్రతి దానిని ఖండించెను. "వేషధారులారా, గడ్డిలోని పాములైన సర్పసంతానమా! రాబోవు ఉగ్రతను తప్పించుకొనుటకు మీకు బుద్ధి చెప్పినవాడెవడు? అబ్రాహాము మాకు తండ్రి అని మీలో మీరు చెప్పుకొనవద్దు. మాకు ఇది, అది, మరేదో ఉన్నదని తలంచకుడి, దేవుడు ఈ రాళ్లవలన అబ్రాహాముకు పిల్లలను పుట్టించగలడు అని మీతో చెప్పుచున్నాననెను."
ప్రపంచ సంఘ-సమాఖ్య మీ చేతులలో ఉన్నదని తలంచకుడి. చక్కగా అలంకరించబడిన సభ్యులు మీకున్నారని తలంచకుడి, దేవుడు తన వాక్యమును నెరవేర్చుటకు ఈ సందులలోన్న ఎలుకల ద్వారా పిల్లలను పుట్టించగలడు — వేశ్యలు, వీధులలో తిరుగువారు, త్రాగుబోతులు, జూదగాళ్ళు. ఆయన దానిని చేయగలడు; ఆయన ఇప్పటికిని దేవుడైయున్నాడు.
57అంధులైన ఇశ్రాయేలు వలె సంస్థలును అంధులైరి, వారిరురును ఆ విధముగానే వుందురని ప్రవచింపబడెను. (మీకు దానిని సమానముగా చూపుతూ, నేను రావలసిన స్థలమునకు వచ్చెదను.) గ్రుడ్డివారైరి, లవొదికయ కాలపు అన్యుల సంస్థలు గ్రుడ్డివై, ఈనాడు వారున్నట్లేవున్నవి.
లవొదికయ కాలము మలాకీ 4 వర్తమానమును అంగీకరించవలసి యున్నది. వారు దేనికొరకు ఎదురు చూచుచున్నారో? "వారి సంస్థలు దానిని బయలుపరచునని తలంచుచున్నారు. అది మన ద్వారా, అనగా బాప్టిస్టులు ప్రెస్బిటేరియనులు, అసెంబ్లీలు మరియు ఏకత్వముల ద్వారా అది జన్మించకున్న యెడల అది సత్యము కాదని చెప్పుకొనుచున్నారు." అదే కార్యమును, ఆనాడు వారునూ చేశారు. మరియు అది వచ్చి వెళ్లిపోయినది, మరియు వారు దానిని గుర్తించలేదు. ప్రతి వార్తయు నెరవేరినా గాని వారు దానిని గుర్తించలేదు. "వారేమి చేయుదురని వ్రాయబడెనో, ఆ విధముగానే వారు చేశారు. ఆ విధముగానే మనుష్యకుమారునికిని చేయుదురు. ఆయన నిరాకరించబడును" అని యేసు చెప్పెను.
MAL 4:6
58ఇప్పుడు, గమనించండి. అదే విధముగా మలాకీ 4లోని వాగ్దానము ప్రకారముగా అన్యుల దినములయందును నెరవేరును. "లేఖనములన్నియు, ఆత్మావేశమువలన కలిగినవి. దానిలో ఒక చిన్న భాగము కూడ నెరవేరక మానదని" యేసు చెప్పెను. లేఖనము నెరవేరకుండుటకు వేరే మార్గము లేదు. అదంతయు నెరవేరవలసియున్నది. అది నెరవేరునని యేసు చెప్పెను. ఇక్కడ దాని నెరవేర్పును మనము చూస్తున్నాము. మనము ఇంకనూ చూచెదము.
దేనిని పునరుద్ధరించవలెను? ఈ చివరి దినములలో… సంస్థలలోని సహోదరులారా వినుడి. మొదటివలె, అసలైన పెంతెకోస్తు పండుగను పునరుద్ధరించవలసియున్నది; కావున అది ఇశ్రాయేలు యొక్క బూరల పండుగకు ముందు పునరుద్ధరించబడునా, అది పునరుద్ధరించబడవలసియున్నది. దానిని చేయుటకు ఏదో కావలసియున్నది. మలాకీ 4వ లోని ఆది తండ్రుల విశ్వాసమును పిల్లలకు సమకూర్చును అని ఉన్నది. ఏమి జరుగనైయున్నది…
ఇశ్రాయేలు తమ వాగ్దాన సూచనగా వున్న మెస్సీయాను గుర్తించియుండిన, ఈనాడు వుండు స్థలములో అది వుండియుండదు, వారెందుకు దానిని చేయలేదు? ఎందుకనగా, వారు చేయరని దేవుడు సెలవిచ్చెను. మీలో ఎందరు దానిని నమ్ముచున్నారు "ఆమేన్" అని చెప్పుడి. వారు చేయరని దేవుడే చెప్పెను. ఆ దేవుడే లవొదికయ సంఘకాలములలో ఇది నెరవేరునని చెప్పెను; ఇప్పుడది వారి ముందున్నది. చెప్పబడిన దానిని చేయక, మరొక దానిని వారు ఏ విధముగా చేయగలరు?
JOHN 10:27
59వారు వాగ్దానము చేయబడిన మెస్సీయా సూచనను అనగా, మనుష్యకుమారుని సూచనను గుర్తించవలసియున్నది. ఆయన మనుష్యకుమారుని నామమున వచ్చెను. ఆయన దేవుని కుమారుని పేరులో పెంతెకోస్తు కాలములో పరిశుద్దాత్మగానున్నాడు. తరువాత కార్యము వెయ్యేండ్ల పాలనయై యున్నది. అందులో ఆయన దావీదు కుమారుడుగా వుండును. ముగ్గురు కుమారులును — ఆ ఒక్క దేవుడే. అదే తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ; అదే దేవుడు. దావీదు కుమారుడు, మనుష్యకుమారుడు — దావీదు కుమారుడు, అన్ని సమయముల యందును ఆ దేవుడే అయి ఉన్నాడు. మూడు రకముల కార్యాలయములలో ఉన్నట్లుగా ఉన్నది.
అదే విధముగా తండ్రి, కుమారుడు, మరియు పరిశుద్దాత్మయు ముగ్గురు దేవుళ్లు కారు, అయితే ఆ ఒక్క దేవుడే మూడు కాలవిధులలో, మూడు రకముల కార్యాలయ పనులలో తండ్రిగాను, కుమారునిగాను, పరిశుద్దాత్మగా నున్నాడు. ఈనాడును పారంపర్య గ్రుడ్డితనములో, ఆనాటివలె వీరును ఉన్నారు. పారంపర్యమును గ్రుడ్డితనముతో చూడలేకయున్నారు. వారెందుకు చూడలేకున్నారు? ఇకపై వారు దానిని చూడలేరు. జ్ఞాపకముంచుకొనుడి, అది యెహోవా సెలవిచ్చునదై? యున్నది. "మరి నీవెందుకు దానిని చెప్పుచున్నావు" అని చెప్పెదరు. అది యోహాను మరియు తక్కినవారు చేసినట్లున్నది. అక్కడక్కడ ఉన్న ఒక్కరిని బయటకు తేవలసియున్నది. ఓ, దేవుని మందా, దేవుని స్వరమును వినుము! "నా గొర్రెలు నా స్వరమును వినును."
JOHN 4:18,19,25,26,29
60బావియొద్ద ఆ స్త్రీ మెస్సీయా గుర్తు ద్వారా ఆమె యొక్క దినమును గుర్తించినది. ఆమె ఒక చెడు స్థితిలో ఉండినను, ఆ పూర్వపు సంఘ మార్గములో తన్నుతాను బుద్ధిహీనురాలిగా చేసికొనుటకు ఇష్టపడలేదు. వారు ప్రతి మార్గములో జీవించుచు, ప్రతి కార్యమును చేయువారైయున్నారు. ఆమె వారి స్థితిని నమ్మలేదు. ఒక దినమున ఒకరు వచ్చెదరని ఆమె ఎరిగియుండెను. ఆయన ఒక సాధారణ పేద వ్యక్తిగా తన మార్గమున వెళ్లుచూ, బావి దగ్గరకొచ్చాడు. ఆయన ఆమె యొక్క హృదయ రహస్యములను బయలుపరచి, ఆమె జీవించు పాపమును బయలుపరచినప్పుడు, ఆమె ఎదురు చూచిన దానిని పొంది, "అయ్యా, నీవు ఒక ప్రవక్తవని నమ్ముచున్నాను" (వారు నాలుగు వందల సంవత్సరములుగా ఒక్క ప్రవక్తను కూడా కలిగియుండలేదు), "నీవు ఒక ప్రవక్తవని గ్రహించుచున్నాను. మరియు మెస్సీయా వచ్చినప్పుడు ఈ కార్యములను ఆయన చేయునని నేనెరిగియున్నాను" అనెను.
"నేనే ఆయనను" అని ఆయన చెప్పెను.
ఆమె దానిని గుర్తెరిగినది. ప్రశ్నలు ఇకపై లేవు. ఏ విధముగా నీవు దానిని నిరూపించగలవు? అది ముందుగానే నిరూపించబడినది. "మెస్సీయా వచ్చినప్పుడు దీనినే ఆయన చేయును." మంచిది, ఆమె లేఖనభాగముల ద్వారా ఆయనను గుర్తించగలిగినప్పుడు, మనము ఈ సాయంకాలపు వెలుగును, ఈనాటి సూచనను గుర్తించలేమా? "మెస్సీయా వచ్చినప్పుడు, అతడు వీటన్నిటిని చూపునని మనకు తెలియును. దీనినంతటిని మనకు చూపించును, మనతో చెప్పును.
''నీతో మాట్లాడుచున్న నేనే ఆయనను" అని ఆయన చెప్పెను.
ఇకపై ప్రశ్నలు లేవు. ఆమె వెళ్లిపోయినది. ఆమె ఆ ప్రజలతో ఈలాగు చెప్పినది, "వచ్చి చూడుడి, ఆయన ఇక్కడున్నాడు!" ఆమెకు మరెలాంటి ప్రశ్నలు లేవు. అవన్నియు కుదిరినవి, ఎందుకనగా ఆమె తాను నివసించుచున్న తన దినమును గుర్తించినది. ఆమె దానిని గుర్తించినది.
JOHN 12:32
61గొప్ప హెబ్రియుడైన నతనయేలు వాగ్దానము చేయబడిన మెస్సీయా సూచనను చూచినప్పుడు, ఎందరు మతబోధకులున్నను, ఇతరులెందరున్నను, అతడు ఆ విధముగానే చేసెను. అదేమి చేసినది? ప్రజలు సమాజములను విడచి వెళ్లడము, ఆ మత యాజకులు చూచినప్పుడు అది వారిని కలవరపరచినది. వారు, "మీలో ఎవరైనా అతని కూడికలకు హాజరైనయెడల వారు వెలివేయబడుదురని లేకున్న మిమ్ములను సంస్థల నుండి బయటకు నెట్టివేయుదుము" అని చెప్పెదరు.
ఈనాడును అదే విధముగా యున్నది. "ఆయన కూడికకు హాజరైనయెడల మిమ్మును సంస్థల నుండి పంపివేయుదుము" అని చెప్పెదరు.
గ్రుడ్డివానిని జ్ఞాపకముంచుకొనుడి, ఆ తల్లి, తండ్రి ఏ జవాబును చెప్పలేకపోయారు. వారు ఎంతో భయపడిపోయారు, ఎందుకనగా ఎవరైనను యేసును చూడ వెళ్లినను, ఆయన కూడికలకు హాజరయినను, వారు వెలివేయబడుదురని చెప్పబడియుండిరి. అయినను ఆ గ్రుడ్డివాడు తనకుతాను మాట్లాడగలడు. ఒకప్పుడు గ్రుడ్డివాడైయుండి, ఆ తరువాత చూడగలిగెను.
నేనొకప్పుడు గ్రుడ్డివాడనైయుండి ఇప్పుడు చూడగలుగుచున్నాను. నేను ఈ సంగతులు తెలియనివాడిని, అని పరిశుద్దాత్మ ద్వారా నాకు తెలుపబడినవి. సంస్థలను విడిచిపెట్టి, వారు ఏ విధముగానైనను వచ్చెదరు!
"నేను పైకెత్తబడినప్పుడు అందరిని నావద్దకు ఆకర్షింతును."
EXOD 3:12
62నతనయేలు దానిని గుర్తించెను; అతడు దానిని తెలిసికొనెను.
మోషేవలె, లేఖన నిర్ధారణయు నిరూపించబడిన వాక్యమును; అది ఆనాటి వాగ్దానమని మోషే తెలిసికొనెను, ఎందుకనగా అది లేఖనానుసారమైనది. అది ఎంత విభిన్నముగా ఉన్నను "వాటిని ఎవరితో చెప్పగలను…? అరణ్యమునకు వెనుక నేనొక వెలుగును చూచానని వారితో చెప్పెదను. ఒక వెలుగు ఆ ప్రక్కగా నున్నదని, ఆ వెలుగు నన్ను దిగి వెళ్లమనినదని ఏ విధముగా చెప్పగలను."
"మోషే నిశ్చయముగా నీతోనుందును" అని ఆయన చెప్పెను. ఆయన ఐగుప్తులో మహత్కార్యములందును, సూచక క్రియలందు మాత్రమే గాక, ఎన్నుకొని, పిలువబడినవారందరూ ఒక్కటిగా చేర్చబడినప్పుడు, ఆయన వారి మధ్య ప్రత్యక్షమై వారి ఎదుట మోషే సేవను నిరూపించెను. ఆ ప్రవక్త వారిని ఆ దేశము నుండి విడిపించి తీసికొని వారినొక స్థలమునకు తెచ్చెను, అప్పుడు సీనాయి కొండపైన ఆ అగ్నిస్తంభము మరలా కనబడెను.
63ఈనాటితో దానిని సమాంతర పరచుము. ఆమేన్! దేవునికి స్తోత్రము కలుగును గాక. అది నాకు జీవముకంటెను అధికమైనది.
నా వయస్సు గతించుచుండగా మరియు నీచమైన, అవినీతి దేశములోను, వాటి కార్యములలోను ప్రాకుచుండు సమయమును చూచుచున్నాను, దాని వెనుక ఏమి జరుగుచున్నదో నేను చూస్తున్నాను. నేను నివాసము చేయు ఈ శరీరము శిథిలమైపోయినప్పటికిని, ఒక శరీరము నా కొరకు వేచియున్నదని ఎరిగి నా హృదయము సంతోషముతో గంతులు వేయుచున్నది. నేను ఒక జనమును ఈడ్చుటకు ప్రయత్నము చేయుచున్నాను. వారిని ఈ కార్యముల నుండి బయటకు తెచ్చి, ప్రత్యేకపరచి, దేవుడు అగ్నిస్తంభములో నిలువబడియుండుటను లేఖనముల ద్వారా చూపుటకు ప్రయత్నము చేయుచున్నాను. వందలాది, వేలాది మంది దానిని చూశారు. కాలములలో నిరూపించుటకు కెమెరాతో తీయబడెను.
64అనుకరణ చేయువారు లేచియున్నారు. నిశ్చయముగా, ఆ విధముగా జరుగవలసియున్నది. మోషే దినములలో అబద్దికులు వచ్చి, అవే కార్యములను చేశారు. దేవుడు ఈ విధముగా చెప్పుచున్నాడు, "మోషే నిన్ను ప్రత్యేకపరచుకొనుము. వారితోనుండకుము, నేను వారిని మ్రి౦గివేయుదును" అని దేవుడు చెప్పెను. అయితే ప్రపంచము వారిని కలిగియుండెను. అదే విధముగా ఈ దినమును ఉన్నది. ప్రపంచములోనికి వెళ్లిన అక్కడ ఆర్థిక పథకములు, ప్రతి ఒక్కటి ఉన్నవి. చూశారా?
మోషే ఒక ఆత్మీయ సూచనగా ఉన్నాడు… వారిని విడిపించుటకు వెళ్లిన దేవుని గొప్ప ప్రవక్తయైయున్నాడు. వారు దానిని గుర్తించారు; వారు ఆ సూచనను గుర్తించారు. ఆయన ఒక ఆత్మీయ వాగ్దాన నిరూపణయైయున్నాడు.
యేసు ఆ స్త్రీకి నిరూపించబడిన ఆ లేఖన వాగ్దానముగా వుండెను, లేక ఆయన వాక్యమునకు అనువాదముగా వుండెను. యేసే లేఖనమునకు అనువాదకుడుగా వుండెను. అతని స్వంత జీవితము లేఖనమును అనువదించెను.
ఈ ఘడియ యొక్క వర్తమానమును చూడలేవా? మనమెక్కడ ఉన్నామో గుర్తించావా? ఈ వర్తమానమే, ఏ ఘడియలో జీవించుచున్నామని, లేఖనముల ద్వారా అనువాదము చేయుచున్నది. అదియే అనువాదముగా ఉన్నది.
LUKE 19:41
65యేసు ఇశ్రాయేలుతో ఈ విధముగా చెప్పెను, "నీవు నీ దినమును మాత్రము తెలిసికొనిన ఎడల." ఒకప్పుడు ఒలీవల కొండపైనుండి చూచి ఆయన ఇట్లనెను, "యెరూషలేమా, ఓ, యెరూషలేమా…" అని ఆయన ఏడ్చెను. ఆయన క్రిందకు చూచెను; ఆయన చూచెను… మరొక దానితో పోల్చడము కాదు గాని గత రాత్రి గత ఉదయము పది గంటలకు నేను ఆ వేశ్యా సంఘమును చూచితిని. మీ హృదయములలో పరిశుద్దాత్మ కన్నీరు కార్చడమును సృశించుచున్నారు. "యెరూషలేమా, ఓ, యెరూషలేమా, ఎన్ని మార్లు నేను నిన్ను దగ్గర చేర్చుకొన్నాను. అయిననూ నీవేమి చేశావు? నీ వద్దకు పంపిన ప్రవక్తలను చంపితివి. వారిని హత్య చేసితివి!" వర్తమానములు ఈనాడు సంఘములకు పంపబడుచున్నప్పటికిని, అవి వారియొక్క సంస్థల సిద్దాంతములచే హత్య చేయబడుచున్నవి. యేసు ఈ విధముగా చెప్పెను, "నీవు ఈ నీ దినమును తెలిసికొనిన; కాని అది గతించి చాలా దూరమైనది, ఎంతో ఆలస్యమైనది." సంఘములు ఆ విధముగానే నున్నవి.
ఆమె విమోచనను దాటిపోయినదని నా పూర్ణ హృదయముతో నమ్ముచున్నాను. దానిగురించి మీరేమి తలంచినను పరవాలేదు. అది మీ స్వంత అభిప్రాయము. ఇది నాదైయున్నది, చూశారా. మీరు నా అభిప్రాయమును కలిగి యుండవలసిన పని లేదు. అయితే ఆమె విమోచనను దాటిపోయి, అయిదు లేక ఆరు సంవత్సరములైయుండునని నమ్ముచున్నాను. మీరు చికాగో సందర్భమును జ్ఞాపకము చేసికొనుడి. అప్పటి నుండి జరిగినదేమి? గమనించుడి, అది జరుగుచూ వుండుటను జాగ్రత్తగా గమనించుడి, చూశారా. నా పేరు దానికి ముందుగానున్నదని జ్ఞాపకము చేసికొనుడి. అది అక్కడ కొట్టబడినది. "అది యెహోవా ఈలాగు సెలవిచ్చినది." అది క్రమేణా పడిపోవుచున్నది.
661933వ సంవత్సరమును చూడుడి: ఈ చివరి దినములలో స్త్రీ నడచుకొను రీతిని, ఏ విధముగా అది చెప్పుచున్నది, ముస్సోలిని, ఏ విధముగా తన ముగింపునకు వచ్చునో అది చెప్పినది. హిట్లర్ ఆశ్చర్యమైన ముగింపునకు ఏ విధముగా వచ్చునో, మూడు ఇజమ్స్; కమ్యూనిజమునకు ఏ విధముగా వచ్చునో, ఏ విధముగా ఆ యంత్రములు గ్రుడ్డు ఆకారములో కనబడుచు వచ్చుచున్నవో, మరియు స్త్రీలు ఏ విధముగా మగవారివలె బట్టలు ధరించుదురనియు, ఇంకను వారు లోదుస్తులవలె వుండు వాటిని ధరించెదరని, అంజూరపు ఆకుల వలెనున్న వాటిని వారికి మరుగుగా వుంచుకొందురని చెప్పుచున్నది. ఆ అవినీతి కార్యము ఎట్లున్నది? ఈ దినమున వారు ఏ విధముగా నడచుకొనుచున్నారో చూడుము. అప్పుడది ఖచ్చితముగా మీ ఎదుట నున్నది.
క్రైస్తవ స్త్రీలు (క్రైస్తవ స్త్రీలు అనబడినవారు) — దయ్యపు అవినీతి ఆత్మ వారిపై వుండి, వారిని వెంట్రుకలు కత్తిరించుకొనునట్లు చేయుచున్నదని గ్రహించవలసియున్నది. దయ్యమే దానిని చేయును. మీ కొరకైన దేవుని వాక్యమునకు వ్యతిరేకమైనది. అది ఏదేను తోటలో వుండినట్లుగా ఉన్నది. వారేమి చేసిరి…? వారు దానిని గుర్తించి వుండవలసియున్నది. "ఓ, పరిశుద్దతలో పొర్లు ఆ బోధకుడు చెప్పుచున్నాడు…" అని వారు చెప్పుటకు ప్రయత్నింతురు. అది నేను కాదు, నీవు చేయవలసినదేమిటని చెప్పునది. అది నేను కాదు. నేను వాక్యమును మాత్రమే గుర్తుచేయుచున్నాను. వారు దానిని ఒక దయ్యమని గుర్తించవలసియున్నది.
LUKE 6:46
67వారు తమకు తామే క్రైస్తవులమని పిలచుకొనుచున్నారు. "నేను చేయుడని చెప్పినది చేయక ఏ విధముగా ప్రభువా అని నన్ను పిలచుచున్నారు" అని యేసు చెప్పెను. వారు క్రైస్తవులు కానేరరు. నేను వారికి తీర్పరిని కాను, అయితే వాక్యము చెప్పుచున్న దానినే నేను చెప్పుచున్నాను. "నేను చేయుడని చెప్పిన దానిని చేయక ఏ విధముగా నన్ను ప్రభువా అని పిలచుదువు?" అని యేసు చెప్పాడు. వాక్యమంతయు యేసుక్రీస్తు ప్రత్యక్షతయైయున్నది. "మీరు ఏ విధముగా నన్ను ప్రభువా అని పిలచుచున్నారు?"
అది దయ్యమై, అవినీతికరపు ఆత్మయైయున్నది. అక్కడున్న అందమైన స్త్రీలు దానిని గుర్తించవలసియున్నది.
దిగంబర స్త్రీలకు ఇండియానాలోని జెఫర్సన్విల్ అను ఈ ప్రాంతము, నా జీవితములో నేను చూచిన దానిలో మిక్కిలి అనినీతి స్థలముగా నున్నదని నేను తలంచుచున్నాను. నేను హాలీవుడ్నందుంటిని, ప్రపంచమంతటిలో ప్రతి చోటను నేను వుండి, అన్ని రకముల అశుభ్రతను చూచాను. పారిస్ లో దానిని చూచితిని; నేను దానిని ఇంగ్లాండులో చూచితిని, అశుభ్రతలో ఇది అన్నిటికంటే ప్రధానమైనది.
68ఇంగ్లాండు దేశము ఒక దినమున సముద్రపు అడుగు భాగములో వుండునని తలంచుచున్నాను; దానికది తగినదే. అశుభ్రత, మురికి, వ్యంగ్యము… అది ఒక ప్రపంచపు మురికి తొట్టిగా ఉన్నది. నా జీవితములో నేను చూచిన వారిలో అతి మిక్కిలి వాక్య వ్యతిరేకులైయున్నారు. అది సత్యమును నిరాకరించినందున ఆ విధముగా అయిపోయినది.
బిల్లీ గ్రహామ్ తన భార్యతో ఒక తోటలో కూర్చొనలేక వెళ్లిపోవలసి వచ్చినదని చెప్పెను. ఎందుకనగా ఆ తోటలలోనే బహిరంగముగా స్త్రీ, పురుషుల మధ్య, బాలబాలికల మధ్య జరుగు లైంగిక క్రియలు చూడలేనంతగా జరుగుచున్నందున ఆ విధముగా చేయవలసి వచ్చెనని ఆయన చెప్పెను. అది ఒక మురికి గుంటగా మారిపోయినది. అదే విధముగా ఫ్రాన్స్ దేశము తక్కిన ప్రపంచ మంతయు ఆ విధముగానే ఉన్నది. అమెరికా దేశము వాటన్నిటికి నాయకురాలిగా మారిపోయినది.
ఈ దినమును చూడుడి. వారు వెంట్రుకలు కత్తిరించుకొనుచూ, సగము దుస్తులు వేసికొనుచూ, పొగత్రాగుచూ, వారిని క్రైస్తవులుగా పిలచుకొనుచున్నారు. మీరు గ్రహించారా సోదరి - లేక స్త్రీ… క్షమించండి, సోదరీలు అలాంటి కార్యములు చేయుదురని నా భావము కాదు. అది దయ్యమని మీరు గుర్తించుట లేదా? అయితే ఏమి? ఆ పూర్వపు యూదులవలె, మీ కొరకు నిరూపించబడిన వాక్యమును మీరు నమ్ముటలేదు. అదంతయు చక్కగానున్నదని చెప్పుచూ, సంఘ సంస్థలు వాటి ఆచారములను పట్టుకొని వ్రేలాడుచున్నవి. మీరు భాషలతో మాట్లాడుచూ, పైకి క్రిందకు ఎగురుచూ, ఆత్మలో పాడుచున్నామని చెప్పుకొనుచూ, మీరు తల వెంట్రుకలు కత్తిరించుకొందురు. ఒక క్రైస్తవుడు, ఆ విధముగా చేయునని ఊహించుచున్నారా? నేను దయ్యములను, మాంత్రిక వైద్యులను, భాషలతో మాట్లాడి వాటికి అర్థము చెప్పువారిని చూచాను. ఆత్మలో నాట్యమాడు వారిని, మానవ పుర్రెలలో నుండి రక్తమును త్రాగుచూ యేసుక్రీస్తు నామమును శపించువారిని ఎందరినో చూచాను.
REV 3:17
69"నేను సంఘమునకు చెందినవాడిని, హల్లెలూయ! దేవునికి మహిమ…" అని చెప్పవచ్చు. నీ దేవునికి చెందియున్నావా? సంఘము వాక్యమైయున్నది; మరియు మీరు ఆ విధముగా వాటిని చేయుట అవమానకరమని వాక్యము చెప్పుచున్నది.
అంధులైన పరిసయ్యుల గుంపులారా, పేదలైన చిన్నవారిని ఆ విధముగా నరకమునకు నడిపించుచున్నారు. ఎందుకనగా కేవలము భోజన చీటి కొరకు భయపడుచున్నారు. మీరు మరొక దానిని ప్రారంభించిన ఎడల మీరు మీ సంస్థల నుండి వెలివేయబడుదురు. మీరు అవమానకరముగానున్నారు. వేషధారులారా, దానిని గుర్తించి సిగ్గుపడుడి. సమయము ఈ విధముగా సమీపించుచుండగా, దేవుని వాక్యము నుండి మీ పారంపర్యములచే త్రిప్పబడుచున్నారు. మీకెంత ధైర్యము, గ్రుడ్డివారలారా,
మీరు గ్రుడ్డివారగుదురని బైబిలు చెప్పలేదా? మీరు గ్రుడ్డివారుగా ఉన్నారని గ్రహించారా? మీరు ఆ విధముగా ఉన్నారని బైబిలు చెప్పినది. మరియు నీవు దిగంబరివిగాను, దిక్కుమాలినవాడివిగాను, దౌర్భాగ్యుడవుగాను, గ్రుడ్డివాడవుగాను వుండి మరియు నీవు దానిని ఎరుగకున్నావు; ఎందుకనగా పట్టణములో అతి పెద్ద సంఘము నాకున్నది, నేను దానిని, దీనిని చేయుదునని నీవు తలంచుకొనుచున్నావు; అయితే బైబిలు నీవు ఎంతో పేదవాడివిగాను, గ్రుడ్డివాడవుగానున్నావని చెప్పుచున్నది. ఆయన ఇంకనూ తలుపునొద్ద నిలుచుని నీకు కంటి కాటికమును అమ్ముటకు ఇష్టపడుచున్నాడు — అది నీకు అమ్ముట కాదు గాని, నీకు ఇచ్చుటయైయున్నది; అయితే నీవు దానిని అంగీకరించవు. అది వాక్యభాగమును నెరవేర్చుచున్నది.
MATT 7:14•
MATT 24:24,37•
MARK 13:22
70ప్రజలారా, మీరు ఏ దినమున జీవించుచున్నారు? మీరు ఆ సమయమును, సూచనను గుర్తించారా?
ఆ స్త్రీలు దానిని దయ్యమని గుర్తించవలసియున్నది. అది మతపు నామములోనున్న అసభ్య దయ్యమైయున్నది. వాడు ఎప్పుడును ఆ విధముగానే యుండును. వాడు ప్రతి ప్రవక్త యొద్దకు వచ్చెను. ప్రతి పరిశుద్దుని యొద్దకు వచ్చును. ఒక భక్తిగల వ్యక్తివలె యేసు నొద్దకు వచ్చెను. మరియు బైబిలు చెప్పున దేమనగా, చివరి దినములలో అతడు చాలా సన్నిహితముగా వుండును. (పెంతెకోస్తులు సహితము) పెంతెకోస్తు సంఘ౦ నుండి ఎన్నుకొనబడినవారిని సహితము వీలైతే అతడు మోసపరచును.
[టేపు పై ఖాలీ.] "… అయితే కొందరు," ఆయన చెప్పినదేమనగా, "ఆ ద్వారము ఇరుకును, ఆ దారి సంకుచితమైయున్నది. దానిని కనుగొనువారు కొందరే." నోవహు దినములలో ఎనిమిది ఆత్మలు మాత్రమే రక్షింపబడిన విధముగా, మనుష్యకుమారుని రాకడయందును వుండును." దానిని గురించి ఆలోచించుడి! మనము ఏ దినములో జీవించుచున్నాము? మీరు ఆ దినమును, దాని కాలమును గుర్తించారా? నేను అధికముగా మీ సమయమును తీసికొనుచున్నాను, అయితే కొన్ని నిమిషములు మాత్రమే నాకున్నవి.
1COR 11:13,15
71తల వెంట్రుకలు కత్తిరించుకొనునట్లు చేయుచున్నారు. "సంఘము దాని విషయములో ఏ మాత్రము శ్రద్దగైకొనదని" వారు చెప్పెదరు. ఎందుకో మీకు తెలుసా? వారు గ్రుడ్డివారైయున్నారు. "మీరు మీ తల వెంట్రుకలు కత్తిరించుకొనుటలో హాని ఏమియులేదని" వారందురు. అయితే బైబిలు చెప్పునదేమనగా, తల వెంట్రుకలు కత్తిరించుకొనుట అయోగ్యమైనదని, ఆ విధముగా ప్రార్ధించకూడదని చెప్పుచున్నది. మీరు "ఒక స్త్రీ ముసుగు వేసికొనవలెనని" చెప్పుదురు. అయితే బైబిలునందు ఆమె తలవెంట్రుకలే ఆమెకు ముసుగుగా ఉన్నది గాని, ఒక టోపీ కాదు అని చెప్పబడియున్నది.
"మోషే నా చెప్పులకు బదులుగా నా టోపీని తీసివేయుదునని చెప్పిన యెడల అది సరిపడదు. దేవుడు, "చెప్పులు" అని చెప్పుచున్నాడు. ఆయన "తల వెంట్రుకలు" అని చెప్పుచున్నాడే గాని, "టోపీ" అని చెప్పలేదు. దేవునికే మహిమ. ఆయన దానిని ఇష్టపడుచున్నాడని నేను నమ్ముచున్నాను. దేవునికి స్తోత్రము కలుగును గాక! ఆయన ఏమి చెప్పుచున్నాడో దానినే తీసికొనును. లేఖనమునకు మరొక ప్రత్యేక అనువాదము లేదు. అది మీ సంస్థలకు సంబంధించినదని భావము కాదు. అదేమి చెప్పుచున్నదో, అదే దాని భావముగా ఉన్నది; ఆయనే ఆ అనువాదకుడు.
72"దానిని చేయ ఒక స్త్రీ నాకు తెలుసు…" నీకేమి తెలిసియున్నదో, దానితో నాకు పనిలేదు; దేవుడు దానిని గురించి ఏమి చెప్పెనో, అది నాకు తెలియును. నిన్ను దానితో సరిచూచుకొనుము.
అది యేమిటో స్త్రీలుగా మీరు గ్రహించవలసియున్నది. ఉమ్! నీవు దానిని గ్రహించినట్లయితే — లేదా ఆడది, స్త్రీ కాదు.
అయిదవ వీధిలో వున్న బ్లూ బోర్ బీర్ అంగడిలో ఒక సంకేతమును నేను చూచాను. అదేమనగా, "స్త్రీలకు (ప్రత్యేకించి) బల్లలు." నేను అక్కడ నిలిచి ఈ విధముగా తలంచితిని "అటువంటి వారు ఒక్కరును అచ్చట వుండరు." ఒక స్త్రీ అటువంటి స్థలమునకు వెళ్లదు. ఒక ఆడది (వుమన్) వెళ్లవచ్చు గాని, ఒక స్త్రీ (లేడీ) కాదు.
ఒక ఆడదాని యొక్క అవినీతి వలన ఈ ప్రపంచము పడిపోయినదని గుర్తించావా? ఆడదాని యొక్క అవినీతి చివరకు అలాగే వుండునని మీకు తెలియునా? స్త్రీ సంఘమునకు సాదృశ్యముగా ఉన్నది. ఆత్మీయముగా మాట్లాడినట్లయిన, సంఘము ఒక స్త్రీగా ఉన్నది. ఆ విధముగానే వధువు కూడా ఒక స్త్రీగా ఉన్నది.
సంఘములలో అవినీతి ఏ విధముగా జరుగుచున్నది. దర్శనములను, జరుగు కార్యములను చూడుడి. దేవుడిచ్చు దర్శనములు సత్యమైనవి. నా బైబిలును నా హృదయముపై వుంచి వున్నానని టేపును వినుచున్న మీతో చెప్పుచున్నాను. ప్రేక్షకులైన మీరు దానిని చూచుచున్నారు. నేను చూస్తున్నాను. సర్వశక్తిగల దేవునికి అది సత్యమని తెలియును. ఇప్పటి వరకును అది (సంఘము) దానిని తెలిసికొనలేదు. అది దిగంబరిగా ఉన్న సంగతి దానికి ఇప్పటి వరకు తెలియదు. అది ఇప్పుడు తనకొక గొప్ప సమయమును కలిగియున్నది. అక్కడే మీరున్నారు. అయితే ఆ వధువు దృశ్యమునకు వచ్చినప్పుడు అది ఎంతో వ్యత్యాసముగా ఉన్నది. అల్పాయు, ఓమేగాయునై యున్నది.
JOHN 5:39
73దయ్యము దానిని చేసినది. వాక్యమును చూచినప్పుడు పూర్వపు యూదులవలెనె… యేసు తన శిష్యులతో: "లేఖనములను వెదకుడి, మీరు నన్ను గురించియు, నా సేవను గురించియు భ్రమ చెందియున్నారు. లేఖనములను పరిశోధించుడి, వాటియందు నిత్యజీవము కలదని తలంచుచున్నారు, అవి నన్ను గూర్చి సాక్ష్యమిచ్చుచున్నవి. నా వర్తమానమేమిటని అవి మీకు తెలుపుచున్నవి. మీరు నన్ను నమ్మకున్నను, దేవుడే మీ కొరకు అనువదించు తన వాక్యమును నమ్ముడీ."
"ఈ మనుష్యుడు మనకు అధిపతిగా వుండుటకు వీలుపడదు. మనకు మన సొంత యాజకులున్నారు. అలాగైతే ముందుకు వెళ్లు, అంత వరకే చెప్పుటకు వీలుపడును. అయిననూ అది ఎంతో ఆలస్యమైనది, చూశారా. సంస్థల ఆచారములు అదంతయు సరిగ్గానే ఉన్నదని చెప్పునప్పుడు — వారు దానిని వినుచున్నారు. దేవుని వాక్యమును నమ్ముటకంటెను మనుష్యుని వాక్యమును అధికముగా మీరు నమ్ముచున్నారు.
వారు దానిని గుర్తించరు… సంఘములు II తిమోతి 3ను గుర్తించవు. నీవు గుర్తించినయెడల….
2TIM 3:3-7
74మీలో కొందరు లేఖనములను నెట్టి వేయడమును నేను చూస్తున్నాను. ఇప్పుడు, నేను ఈ లేఖన భాగమును ఇచ్చటనుండియే ఉదహరించుచున్నాను. ఎవరైనను, నన్ను అడుగదలచిన, నేను వాటిపై నా చేతిని వుంచివున్నాను. దానికొరకైన లేఖన భాగములను చూపగలను. చూశారా?
వారు II తిమోతి 3 లేఖన భాగమును గుర్తించరు. అక్కడ చెప్పబడినదేమనగా: "అంత్యదినములలో - మనుష్యులు స్వార్ధప్రియులు, ధనాపేక్షకులు బింకములాడువారు. అహంకారులు దేవునికంటెను సుఖానుభవమును అధికంగా ప్రేమించువారును, అనురాగ రహితులు, అతి ద్వేషులు, అపవాదకులు, అజితేంద్రియులు, క్రూరులు, సజ్జన (వధువు. చూశారా?) ద్వేషులు, పైకి భక్తిగలవారివలె ఉండియు దాని శక్తిని ఆశ్రయించనివారునైయుందురు. అట్టి వారికి విముఖుడవైయుండుము. పాపభరితులై నానా విధమైన దురాశలచే నడిపించబడి, ఎల్లప్పుడు నేర్చుకొనుచున్నను సత్యవిషయమైన అనుభవజ్ఞానమును ఎప్పుడునూ పొందలేని అవివేక స్త్రీల యొక్క యిండ్లలోనికి చొచ్చి, వారిని చెరపట్టుకొని పోవువారైయున్నారు." లేదు… వారు దానిని చేయలేరు, మరియు వారు దానిని చేయరు. దేవుడు ఆ విధముగా చెప్పెను. గ్రుడ్డి పరిసయ్యుడా, నీవు దానిని చూడలేవా? నేను కోపపడుట లేదు. నేను చీలను కొట్టి దానిని వంచుచున్నాను. సంఘములు దీనిని గుర్తించలేవు. స్త్రీ (వుమన్) దానిని గ్రహించదు; వారు అవివేక స్త్రీలైయున్నారు. వారు తుచ్చమైన వాంఛలచే నడిపించబడి, హాలీవుడ్ యొక్క అన్ని రకముల స్థితులతో, కత్తిరించబడిన వెంట్రుకలతో , పొట్టి బట్టలు వేయుచూ, ముఖమునకు రంగులు వేసికొని, అన్ని రకముల అయోగ్యమైన స్థితులను కలిగియున్నారు.
ఈ చివరి దినములలో స్త్రీ ఒక గొప్ప పాత్రను పోషించనైయున్నదని మీకు తెలియునా?
ISA 4:2
75బైబిలులో చెప్పబడిన రీతిగా, ఈ గొప్ప శిక్ష నుండి తప్పించుకొనువారు. ప్రభు ఎదుట ఒక అందమైన తీగవలెయుందురని, మీకు తెలియునా? దేవుని చిత్తమైతే, ఏదో ఒక రోజు స్త్రీలైన మీ కొరకు ఆ అంశమును తీసికొందును. ఈ శిక్ష నుండి తప్పించుకొను స్త్రీని గురించి దేవుడు ఏమి తలంచుచున్నాడో మీరు చూడుడి. ఆమె చాలా చక్కనిదై యుండును.
ఒక దినము కొందరు యౌవ్వనులైన యువతులు, తల్లి కుక్క కంటేను హీనముగా అవినీతితో సగము దిగంబరులై, ఒక వృద్ధురాలైన స్త్రీని చూచి, ఆమె పొడుగాటి బట్టలను చూచి, పరిహాసము చేయుచుండిరి. మెలికలు తిరుగు యువతులారా, వినుడి, మీకు తెలియని దానిని ఆ వృద్ధురాలు కలిగియున్నది. ఆమె నీతిని కలిగియున్నది. మీకు దాని పేరైనను తెలియదు. మీరు దానిని పసిబిడ్డలుగా ఉన్నప్పుడే పోగొట్టుకొంటిరి. మీకు మంచి - చెడ్డలు తెలియవు. ఆమెకు అది తెలియును. మీకు తెలియని దానిని ఆమె హృదయమందు దాచుకొనియున్నది. మీరు దానిని పోగొట్టుకొంటిరి. దానిని ఇకపై కనుగొనలేరు. మీరు ఆమెను పురాతన నాగరికురాలిగా పిలువవచ్చును. మీకు తెలియని దానిని ఆమె తెలిసికొనియున్నది. నీతియుక్తమైన ఐశ్వర్యమును ఆమె తన హృదయమందు దాచుకొనియున్నది. దానిని గురించి ఒక్క మాటయైనను మీకు తెలియదు. మీ తల్లి ఆ విధముగా మిమ్మును పెంచినది. మీ కాపరి దానిని అనుమతించెను. అతను ఏ స్థితిలో నున్నాడని అది చూపుచున్నది. నేను అతనిని గురించియే ఇప్పుడిక్కడ ప్రసంగించుచున్నాను, చూశారా. సంఘములారా! మీరెక్కడ ఉన్నారో చూడుడి?
2TIM 3:8
76ప్రతి లేఖనము నెరవేరవలసియున్నదని యేసు చెప్పెను. మరియు అది నెరవేరినది.
గమనించుడి. యెన్నే యెంబ్రేలు మోషేను ఎదిరించినట్టే అతడును వచ్చును… అతడు మెథడిస్టులు, బాప్టిస్టులను గురించి ఇచ్చట మాట్లాడుట లేదు; వారు కనుచూపు నుండి దూరమైరి. చూశారా? అయితే యెన్నే - యెంబ్రేలు మోషేను, అహరోనును ఎదిరించినట్లు వారును ఎదిరింతురు. సత్యమును గురించి శుద్ధమనస్సు కలిగినవారై, సిద్దాంతములకు త్రిప్పబడి, బైబిలుకు బదులుగా వారి సంఘ ఉపదేశములకు మరలుదురు. యెన్నే - యెంబ్రేలు మోషే చేసినవన్నియు చేయుదురు, చూశారా. యెంబ్రేవలె (సమానాంతరమును చూడుడి?) యెన్నే - యెంబ్రేలు మోషేను ఎదిరించినట్లు సత్యవిషమై భ్రష్టమనస్సుగలవారై దానిని ఎదిరింతురు. వారి పొరుగున కూడ దానిని వుంచరు. దానితో సహకరించరు. దానితో వారికి ఎలాంటి అవసరతయు లేకయుందురు. "అవివేకము తెలియబడునని" చెప్పబడియున్నది. వధువు స్థిరపడి ఆకాశమునకు వెళ్లినప్పుడు, అది వారికి తెలియబడును. మీరు తొందర పడకుడి. మోషే ఇశ్రాయేలు పిల్లలను ఐగుప్తు నుండి తీసికొని వెళ్లినప్పుడు ఐగుప్తు మునిగి పోయినది. అది సరియే.
JOHN 10:36•
2TIM 3:16
77లేఖనములన్నియు ఆత్మానుసారముగా అనుగ్రహింపబడినవని యేసు చెప్పెను; అందువలన లేఖనములన్నియు ఖచ్చితముగా నెరవేరవలసియున్నవి. "నిన్నునీవు దేవునిగా చేసికొనుచున్నావని," వారు అడుగుచున్నారు.
అందుకు ఆయన, "మీ ధర్మశాస్త్రమందు, దేవుని వాక్యము వచ్చిన ప్రవక్తలను మీరు దేవుళ్లని పిలువలేదా? వారు ఆ విధముగానే యున్నారు" అని చెప్పెను. అట్లయిన నేను దేవుని కుమారుడనని చెప్పినప్పుడు, నన్ను ఏ విధముగా నిరాకరింతురు? అని అడిగెను. ఆత్మావేశమువలన కలిగిన లేఖనములన్నియు నిరూపింపబడి, నెరవేరవలసియున్నవి. చూడుడి, వారెంత గ్రుడ్డివారుగా ఉన్నారు. దేవుని మాటను గైకొనుటకంటెను, మనుష్యుని మాటను ఎంతగానో గైకొనుచున్నారు. అదియే స్త్రీలను ఆ విధముగా చేయునట్లు చేయుచున్నది. అదియే ప్రసంగీకులను ఆ విధముగా చేయనిచ్చుచున్నది. యేసు వైపునకు వచ్చుట కంటెను, బిషప్పులవైపుకు మరలుచున్నారు. ఒక గొప్ప సమావేశముగా వారి సంపదలవైపుకు వెళ్లిరి.
78నేను ప్రఖ్యాతిగాంచినవాడినేనా చూడుడి. జెఫర్సన్విల్ కు వెలుపలనుండి వచ్చిన వారిని తీసివేసిన, జెఫర్సన్విల్లోని వారు ఎంత కొద్దిమందో చూడుడి. ఈ ఉదయకాలము జెఫర్సన్విల్ వెలుపలనుండి వచ్చిన వారిని చూడుడి. వారిని తీసివేసిన ఎడల ఇచ్చట ప్రసంగించుటకు ఆరుగురు కూడ వుండరు. ఏమిటది? ఆమె దేశమంతటి నుండి, న్యూయార్కు నుండియు, మాసాచూసెట్స్ వరకును, బాస్టన్ వరకును, మైన్ వరకును, సముద్రము వరకును, జార్జియా, అలబామా, మరియు దేశమంతటి నుండి సమకూర్చబడుచున్నది. వారు ఒక్కటిగా సమకూడుచున్నారు. ఆమేన్! అది ఏమిటి? సాయంకాలమున సమయమున వెలుగుండును.
వారు ఆ సాయంకాల వెలుగును గుర్తించలేరు. అదియే అసలు సంగతి. ఆమె దానిని గుర్తించలేదు. ఆమె (సంఘము) ఎంతో గ్రుడ్డిదైనది. ఆమె ఆ విధముగా వుండునని బైబిలు చెప్పుచున్నది.
79రష్యా నలువది సంవత్సరములలోనే విజ్ఞాన శాస్త్రమునందు దాని స్థానమును పొందినది. మొదటి ప్రపంచ యుద్దమందు రష్యాను వారు గుర్తించలేదు. రాయ్ సోదరుడా, పూర్వపు భీకరులైన సైబేరియన్లు, వారు సమూహముగా ఏమియు గుర్తుకురాని వారుగా వుండిరి. వారి ముఖమంతయు, గడ్డము కలిగి, కుడి - ఎడమ హస్తమును ఎరుగని వారుగా వుండిరి. అది నిజము. అదియే రష్యా, అయితే వారు వారి స్థానమును గుర్తెరిగిరి. లేఖనములను నెరవేర్చుటకుగాను అది దానిని చేయవలసియున్నది. నేను చెప్పిన ప్రవచనములు నెరవేరినవని మీకు తెలియును. ఇప్పుడు రష్యా విజ్ఞానమునందు ప్రపంచములో ముందున్నది. మనము దాని వెనుక ఎంతో దూరములో ఉన్నాము. మిగిలిన ప్రపంచమంతయు వెనుకబడియున్నది. అది తన స్థానమును ముందుకు తెచ్చినది. దానికిని తెలివి ఉన్నదని అది గ్రహించినది.
గమనించుడి, మానవుడు ఆరువేల సంవత్సరముల క్రితము కలిగియున్న ఆరు జ్ఞానేంద్రియములనే కలిగియున్నాడు. ఆరువేల సంవత్సరముల నుండి దానినతడు కలిగియున్నాడు. ఆరువేల సంవత్సరముల క్రితము అతడు కలిగియున్న జ్ఞానేంద్రియములతో భూమిపైనున్న తన నివాసముతో సంబంధము కలిగి, దేవుని సేవించాడు. కాని గత డెబ్బై-యైదు సంవత్సరముల నుండి, గుర్రపు బండిలో ప్రయాణము చేసిన మానవుడు, వ్యోమగామిగా మారాడు. ఎందుకు? దేవుని యందున్న విశ్వాసము నుండి అతడు తిరిగిపోయి, తన జ్ఞానేంద్రియముల వైపుకును, మనిషిగా తన సామర్థ్యము వైపునకు తిరిగాడు. దానిని మీరు గ్రహించారా? దేవుని నమ్ముటను మానివేశాడు; తననుతాను నమ్ముకొన్నాడు.
80వాషింగ్టన్లోని అవిశ్వాసపు స్త్రీ వలె (ఆమె పేరేమిటి?) అచ్చటనున్న సమస్తమును మార్చివేసినది? ఆమె పేరేమి? "ముర్రే." ఆమె చెప్పినదేమనగా, "మనకు సైన్యమున్నంతవరకును, నావికాదళమున్నంతవరకును, ఆ పూర్వపు యొహోవా మనకక్కరలేదు!" మనకు ఏమైయున్నదని నేను చింతించను, యొహోవాయే లేని ఎడల అది నాకు శూన్యము. సైన్యమును, నావికాదళమును మునిగిపోనిమ్ము, అది ఆ విధముగా జరుగును. కాని యెహోవా ఎల్లప్పుడు నిలుచును. నేను ఆయనయందును, ఆయన కుమారునియుందును భాగముగావున్నంత కాలము, ఆయనతో ఎప్పుడును నిలిచిపోదును. నా ఆహ్వానములకు గాని, నేను ఎన్నుకొన్నదానికి కాదు గాని, ఆయన ఎన్నుకొనిన దానితో నిలిచియుందును. ఆమేన్ మరియు ఆమేన్! దానితో నేను చేయునది ఏమియూ లేదు. అది ఆయనే. నాకు ఆయనను ఇమ్ము లేక మరణమును ఇమ్ము. దేశములు పైకి వచ్చి, పడిపోనిమ్ము, యెహోవా ఎల్లప్పుడు నిలచును. కాలములలో వాటన్నిటిని ఆయన చేసెను. రోము పడి పోయినప్పుడు, ఐగుప్తు పడిపోయినప్పుడు, మిగిలినవన్నియును పడిపోయినప్పుడు, ఆయన యొహోవాగానే వుండెను. ఓ, హల్లెలూయా! నాకెంతో భక్తి కలుగుచున్నది.
రష్యా తనకు తానుగా వచ్చిన కారణము, ఆమె రావలసియున్నది. ఇశ్రాయేలు వారి స్వంత దేశమునకు వచ్చినట్టే బూరలకుగాను, ఇశ్రాయేలును వారి దేశమునకు దేవుడు నడిపించవలసి వచ్చినది. లేఖనములు చెప్పినట్లు అది చేయుటకుగాను దేవుడు రష్యాను కమ్యూనిజములోనికి నడిపించవలసి వచ్చినది.
81మానవుడును, అతని ఆరు జ్ఞానేంద్రియములును అతని గుర్రపు బండితో దేవుని నమ్ముచూ వచ్చినవి. ఈ చివరి డెబ్బది-యైదు సంవత్సరములలో అతడు దేవుని నమ్ముటను విడిచిపెట్టెను. వారు సంయుక్త రాష్ట్రముల తీర్మానములను వ్రాసినప్పుడు, వారు సమస్తమునందును దేవుని వుంచారు. ఇప్పుడు వారికి ఏ కూడికయు లేదు. ఆయన నామమును పలుకరు. అది నిజము. వారు తమ ఉన్నత శాస్త్రీయమందును, మోసమునందును ఆధారపడిరి. వారు కళంకమైన గుంపుగానున్నారు. అది నిజమైయున్నది. సర్వప్రపంచము బైబిలును మరచుటవలన మ్రి౦గివేయబడినది. సర్వప్రపంచము దేవునినుండి తొలగిపోయినది. అయితే దీనిని ఆలోచించుము. దీనినంతటినుండియు, సంఘ సంస్థల నుండియు, వాడి కళంకమైన పాఠశాలల నుండియు, ప్రతి దానినుండియు దేవుడు తన ప్రవక్త మాటతో ఒక వధువును చెక్కుచున్నాడు. ఆయన దానిని చేయుదునని చెప్పెను. ఆయన చేసెదనని వాగ్దానము చేసిన ప్రకారమే దానినుండి ఆయన దానిని చెక్కును.
వారు తమ మానవజ్ఞానముపై ఆధారపడి ఒకప్పుడు నమ్మిన దేవుని విడిచిపెట్టిరి. అమెరికా దేశము దేవుని విడిచి పెట్టినది. ఆయనను పాఠశాలల నుండి తీసివేసినది. మన చిన్న పిల్లలు ఆయనను గురించి వినలేకపోవుచున్నారు. వారు పాఠశాలలయందు ఆయనను మరిచారు. "మనము దేవుని నమ్ముచున్నాము" అను మాటను డాలర్నుండి తొలగించుటకు ప్రయత్నించుచున్నారు. తమ పతాకమందు వారు పణముగా వుంచిన విశ్వాసము నుండి, "దేవుని క్రింద ఒక దేశము" అను మాటను తొలగించనైయున్నారు.
82చూడండి, వారు వారి స్వంత జ్ఞానము వైపునకు, తలంపుల వైపునకు మరలిరి. ఎందుకనగా గత డెబ్బది-యైదు సంవత్సరములుగా మానవుడు తన జ్ఞానేంద్రియముల నుండి కొంచెము కూడ మారలేదు. ఆదిలో సృష్టించిన మనిషిగానే అతడున్నాడు, అయితే ఈ చివరి దినములందు, మనమెక్కడున్నామో గుర్తించలేరా? సంఘము దేవుని నుండి దానివైపునకు తిరిగిపోయినది. వాక్యమునకు బదులుగా సెమినరీలకును, అనుభవముల ప్రక్కకు తిరిగిపోయినది. వారి కూడికల యందు గాని, పాఠశాలలందు గాని ఆయనను గుర్తించడము లేదు. ఇకపై మిగిలినది ఏమియూ లేదు.
ఇశ్రాయేలు గత ఇరువది-యైదు సంవత్సరములలో వాగ్దానము చేయబడినట్లు వారు వారి దేశమునకు తేబడిరని గ్రహించియున్నది. అది ఏ విధముగా జరిగినదో వారికి తెలియదు. వారి బూరల క్రింద వారెంతో కష్టములను అనుభవించి, హతసాక్ష్యులైరి. అయితే వారు వారి స్వదేశమందున్నారు. ఎందుకో వారికి తెలియదు.
83రష్యా ఎందుకొరకు మేల్కొన్నది? దేశములెందుకు మేల్కొన్నవి? శాస్త్రజ్ఞులు మూడు వందల సంవత్సరముల క్రితము… ఒక ఫ్రెంచి శాస్త్రజ్ఞుడు ఒక బంతిని భూమిపై దొర్లించి, మానవుడు ముప్పది మైళ్ల వేగముకంటెను అధిక వేగమును ప్రయత్నము చేసినయెడల, భూమ్యాకర్షణ నుండి విడిపోవునని తన శాస్త్రీయ పరిశోధన ద్వారా నిరూపించెను. ఇప్పుడు అతడు ఒక గంటకు పదహేడు వేల మైళ్ల వేగముతో వెళ్ళుచున్నాడు. ఇంకను అధిగమించుటకు ప్రయత్నించుచున్నాడు. అతడు చాలా ఆలస్యముగా దానిని గుర్తించాడు. ఎందుకు? ఆ విధముగా వుండవలసియున్నది.
సంఘము యేసుక్రీస్తు యొక్క బండపై నిలచియున్నది. ఎవరేమి చెప్పినను పరవాలేదు, వారు ఈ కాలపు వర్తమాన వాక్యముపై చక్కగా నిలువబడియున్నారు. లూథర్ వెస్లీ ఇంకనూ అనేకులు దానిద్వారా వచ్చియున్నారు. అయితే ఇప్పుడు వారు పారంపర్యములకు తిరిగిరి. అదెందుకు జరిగినది?
గత ఇరువది-అయిదు సంవత్సరములుగా ఏదో ఒక దాని కొరకు, వారు వారి స్వదేశమందున్నారని గుర్తించినది. వారు మరలా సమకూర్చబడుదురని ప్రవచింపబడినది; హోషేయా ఆ విధముగానే చెప్పెను. దానిని మనము కొంత సమయమునకు ముందుగా చదివితిమి. దానిని గ్రహించుటకు దేవుడు సహాయము చేయును గాక. మంచిది.
84ఆ సమయముననే వధువు సాయంత్రపు వెలుగును గుర్తించినది. అప్పుడే గుర్తించుటకు ప్రారంభించినది. సంస్థలు వారెరుగుదురు చూచిన దానిని పొందలేదని, ఆకలిగొన్న పెంతెకోస్తులు గ్రహించుటకు ప్రారంభించిరి. వారెంతగానో చుట్టబడి, చీల్చబడిరి. చూడుడి, ఇది గుర్తించవలసిన సమయమైయున్నది. మీరు గుర్తించవలసియున్నది. ప్రపంచము గుర్తించినది, దేశములు గుర్తించినవి. విజ్ఞాన శాస్త్రము గుర్తించినది. దయ్యమును, స్త్రీని చీల్చుటకును, సంఘమును చీల్చుటకును, ప్రజలను చీల్చుటకును ఇదియే తన వర్తమానమును పంపు సమయమని గుర్తించినది. అతడు దానిని గుర్తించెను. దేవుడును ఒక జనమును తాను ముందుగా జీవము కొరకు నిర్ణయించినవారు ఈ భూమిపైయున్నారని గుర్తించెను. ఇదియే తన వర్తమానమును పంపు సమయమని గుర్తించెను. ఆయన దానిని చేసెను. ప్రజలు దానిని గుర్తెరిగిరి. వధువు కాలము సాయంత్రపు వెలుగును గుర్తించినది.
సొదొమ, దాని యొద్దకు వచ్చిన వర్తమానికులను అది గుర్తించవలసియున్నది, ఆ వర్తమానికులు బిల్లీ గ్రహం, ఓరల్ రాబర్ట్ వలెనున్నారు.
85ఇచ్చట ఫోనిక్స్ నందు ఒక కళంకమైన వ్యక్తి లేచి టేపునందు, "నేను యేసు నామమున బాప్తిస్మము పొందవలసియున్నదని" చెప్పిన భాగమును వేయుడని చెప్పుచూ, నేను ఆఫ్రికా దేశములో ముందు వెనుకలుగా మూడు పర్యాయములు ఏ విధముగా బాప్తిస్మము ఇచ్చెదరని చెప్పిన భాగమును వేసి, ఇదేమంత వ్యత్యాసమైనది కాదని చెప్పెను. చూడుడి, అతడు తక్కిన టేపు భాగమును వేయలేదు. ఆ మాటల భాగమును మాత్రము వేసి నిలిపివేసెను. ఆ విధముగా చేయుట, చెరసాలలో వేయునటువంటి తప్పిదమగును. ఆ టేపులు ఖచ్చితముగా విమోచించునవైయున్నవి. దానితో మరెవ్వరు మరేదియు చేర్చలేరు. నీవు ఆ విధముగా చేయకుండుట మంచిది. నీవు ఆ విధముగా చేసినట్టయిన, నీ పై చట్టమును కలిగియుందు. అయితే మనము దానిని చేయదగునా? లేదు. "వాటిని అలాగే వుండనియ్యుడని" ఆయన చెప్పెను. ఏమి జరుగునైయున్నదో దేవుడు నాతో చెప్పెను. నీవు నీ చూపును మాత్రము ఆ వ్యక్తిపై వుంచి గమనించుము, చూశారా.
REV 22:18,19
86వధువు సాయంత్రపు వెలుగును గుర్తించు సమయముననే, సొదొమ దాని ఘడియను గుర్తించవలసియున్నది.
ఇప్పుడు "పెంతెకోస్తు ప్రజలైన మీరును, బాప్టిస్టులైన మీరును చూడుడి, "విల్లియం బ్రెన్హాం అను ఈ మనుష్యుడు ఒక అబద్ద ప్రవక్తయైయున్నాడు. (మీరు చూశారా?), అతడు ఓరల్ రాబర్ట్స్ ను , బిల్లీ గ్రహాము అనువారు సొదొమలోవున్నారని చెప్పుచున్నాడని," అతడు చెప్పెను. చూశారా? ఆ తరువాత టేపును నిలిపివేశాడు. వారు (బిల్లీ గ్రహాము, ఓరల్ రాబర్ట్) సొదొమకు వర్తమానికులని చెప్పుచున్నను భాగమునకు, టేపునందు ముందుకు వెళ్లలేదు. సొదొమలో వుండడము కాదు గాని, వారు వర్తమానికులుగా అచ్చట ఉన్నారు. నేను చెప్పినది, అదేనని ప్రతి ఒక్కరికి తెలియును. మీ టేపులను వేసి చూడుడి. ఎవరైనను మరొక దానిని దానితో చేర్చినను, తీసివేసినను, అతనిలో నుండి అది తీసివేయబడును. చూశారా? అది దేవుని వాక్యమైయున్నది, అది ఆ విధముగానే నిలుచును.
MATT 11:22•
LUKE 17:30
87యేసు ఈ విధముగా చెప్పెను. "సొదొమ, తన వర్తమానికులను గుర్తించి వుండిన, అది నేటి వరకు నిలచియుండెడిది." అబ్రాహాము గుర్తించినట్లు అది గుర్తించవలసినది. ఒక వాగ్దాన పుత్రుడు వచ్చుచున్నాడని అబ్రాహామునకు తెలిసియుండెను. ఏదో ఒక విధముగా మార్చుచున్నదని గ్రహించెను, ఎందుకనగా అతడు చాలా వృద్దాప్యములో ఉన్నాడు. శారా కూడ ఆ స్థితిలోనే ఉన్నది. ఎప్పుడైతే అబ్రాహాము, వెనుకవున్న శారా హృదయమును గ్రహించిన ఆయనను చూచెనో, అప్పుడే తాను జీవించు ఘడియను ఎరిగినవాడై, ఈ విధముగా చెప్పెను, "నా ప్రభువా, నీళ్లు తెచ్చెదను, కాళ్లు కడుగుకొనుము." వారు కొంత ఆహారమును భుజించిరి. "కొంత విశ్రాంతి తీసికొనుడని వేడుకొనుచున్నాననెను." చూశారా? "నా ప్రభువా, ఇచ్చటున్నాను" (పెద్ద అచ్చులో ప్రభువా, ఎలోహిం). మానవశరీరములో ఉ౦డి దేవుడు మాట్లాడుచున్నాడని అతడు గ్రహించెను. తన సూచనను గ్రహించినవాడై ప్రభువుచే ఆశీర్వదించబడెను. సొదొమ దాని దినమును గ్రహించక దహించివేయబడినది. యేసు చెప్పెను, "ఆ దినమువలె, మనుష్యకుమారుడు ప్రత్యక్షమగు దినము — లేదా మనుష్యకుమారుడు ప్రతక్షపరచబడు దినము."
REV 22:11
88ఇప్పుడు, సంఘము దాని దినమును గ్రహించకున్నది. ఇశ్రాయేలు ఏ విధముగా పాలస్తీనాకు బలవంతముగా కొనిపోబడుచున్నదో, ఆ విధముగానే సంఘము "ప్రపంచ సంఘ సమాఖ్యలోనికి కొనిపోబడుచున్నది. ఎందుకు? అది తన కాలమును గుర్తించలేదు. ప్రజలారా దానినుండి బయటకు రండి! దాని పాపములలో పాలివారు కాకుడి! మీ ఆత్మలను తప్పించుకొని పోనియ్యుడి, లేనియెడల "మృగపు ముద్ర"లో చిక్కుకొనెదరు. ఆ తరువాత ఏమియూ చేయలేరు. అపవిత్రుడైన వాడు ఇంకనూ అపవిత్రుడుగానే వుండనిమ్ము. పరిశుద్దుడు ఇంకనూ పరిశుద్దుడుగానే వుండనిమ్ము. పరిశుద్దులనగా తల వెంట్రుకలు కత్తిరించుకొను స్త్రీలు కారు; ఆమె ఆ విధముగా వుండదు. ఇది వినుటకు ఒక విధముగా ఉన్నను, అది లేఖన బాగమైయున్నది. ఆమె తన శిరస్సును అవమానపరచునదై యున్నదని బైబిలు చెప్పుచున్నది. అతనికి శిరస్సు క్రీస్తనియు వ్రాయబడియున్నది. అందువలన ఆమె (తల వెంట్రుకలు కత్తిరించుట ద్వారా) క్రీస్తును అవమానపరచుచున్నది. ఆమె నీతిమంతురాలిగాను, అవమానపరచునదిగాను ఏ విధముగా వుండగలదు? తల వెంట్రుకలు కత్తిరించుకొనువారిని ఆ విధముగానే వుండనిమ్ము! పొట్టి దుస్తులు వేయువారిని ఆ విధముగానే వేయనిమ్ము! వాక్యము నిరాకరించువారిని ఆ విధముగానే నిరాకరించనిమ్ము! అయితే పరిశుద్దుడు ఇంకనూ పరిశుద్దుడుగానే వుండనిమ్ము, నీతిమ౦తుడు ఇంకనూ దేవుని వాక్య నీతియందు నీతిమ౦తుడుగానే వుండనిమ్ము, మనుష్యకుమారుడు ప్రత్యక్షపరచబడెను. అందువలన ఇంకనూ పరిశుద్దులుగా, నీతిమంతులుగా వుండుడి. అవునండీ! మీరు దానిని గుర్తించవలసి యున్నది.
తమ స్వదేశమందున్న ఇశ్రాయేలువలె తన దినమును సంఘము గుర్తించలేదు.
89ఆమె (ఇశ్రాయేలు) అక్కడకు ఏ విధముగా మరలి వచ్చినది. ఆమెకది తెలియదు. ఆమె స్వభావ సిద్దముగా అచ్చట వుంచబడినది. ఎందుకు? స్వదేశ శక్తులు దానిని దాని స్థానముందుంచినవి. నేను కొంత మీతో చెప్పనైయున్నాను. స్వదేశ శక్తులు ఇశ్రాయేలును తమ స్వదేశమునకు చేర్చినవి. అదే విధముగా స్వదేశ శక్తులు ప్రపంచ సంఘస మాఖ్యకు చేర్చును. అయితే దేవుని శక్తి తన ప్రజలను వధువును చేర్చుచున్నది. ప్రపంచ ఇటు ప్రక్కకును, అటు ప్రక్కకును ఒత్తిడి తెచ్చును. అయితే దేవుడు పై ప్రక్కకు నిన్ను ఒత్తిడి చేయును, అది దేవుని ఆత్మయైన వాక్యమైయున్నది. ("నా వాక్యము జీవమును, ఆత్మయునైయుండి, వధువును తన స్థానమందు వుంచుచున్నది, ఎందుకనగా ఆమె తన స్థానము నుండి వాక్యమందు గుర్తించును; అప్పుడామె క్రీస్తునందుండును.") తన స్థానమందు వుంచును, ఏ స్వదేశ శక్తియు దానిని చేయజాలదు. అయితే స్వదేశ శక్తులు ఇశ్రాయేలును తమ స్వస్థలమునకు చేర్చుచున్నవి. ఆ స్వదేశ శక్తులు సంస్థలన్నింటిని సంఘ సమాఖ్యలోనికి తెచ్చును. అయితే దేవుని శక్తి వధువును వాటినుండి మహిమలోనికి ఎత్తును.
ఓ ప్రజలారా, యేసు హెచ్చరించినట్లు మీ ఈ దినమును గుర్తించుడి, అది సొదొమ సూచనయు, సంఘముల స్థితియునైయున్నది.
LUKE 8:11
90ఈ దినము ఏమి జరుగునని ఆయన చెప్పెనో చూడుడి. సమీపముగా దానిని వినుడి. ఈ దినమున సొదొమ సూచన జరుగనైయున్నది. సొదొమకు ముందుగా అబ్రాహామును పిలచిన సూచనవలె ఉన్నది. ప్రవచింపబడినవన్నియు ఇప్పుడు జరుగనైయున్నవి. నీవు జీవించు దినమును గమనించుము. వాటి పైకి మనము వెళ్లుచున్నాము.
ఈ దినమునకు విత్తబడిన వాక్యపు విత్తనమును పక్వమునకు తెచ్చుటకు గాను, పరలోకపు వెలుగును పంపెదనని ఆయన వాగ్దానము చేసెను. ఆ విత్తనము ఇచ్చట ఉన్నది. బైబిలు ఆ విత్తనముగా ఉన్నది. ఎందుకు? యేసు ఆ విధముగా చెప్పెను: "విత్తువాడు విత్తినది వాక్యమైన విత్తనము." నీ విత్తనములు చల్లినప్పటికిని, కోతకు ముందు ఆ విత్తనము పక్వమునకు వచ్చుటకు వెలుగు కావలసియున్నది, లేనియెడల అది క్రుళ్లిపోయి ఎందుకూ పనికిరాదు; అది పాడైపోవును. అయితే మంచిరకపు భూమియందున్న విత్తనము, మంచిరకపు సూర్య వెలుగుచేత పండవలసియున్నది. ఆయన ఈ చివరి దినములలో సాయంత్రపు వెలుగునందు, ఆ విత్తనమును పండించునట్లు, సూర్యుడు వచ్చునని వాగ్దానము చేసెను. విత్తనము ఉపదేశించబడినది. దేవుని కుమారుడు ఆ విత్తనమును పండించును. దానిని మీ ముందుంచి నెరవేర్చి, అది నిజమని నిరూపించుచున్నాడు. దానిని నీవు పొందితివా? ఈ నీ దినమును గుర్తించుము.
నేను ముగించుచున్నాను. ఇది ముగించు సమయమైయున్నది.
JOHN 10:37
91ధనవంతురాలై, గ్రుడ్డిదై, విద్యావంతురాలైన లవొదికయ దాని మధ్యనుండి వాక్యమును వెలుపల వుంచినది. దానిని వారు చేశారా? "వారు ఆ విధముగా చేయుదురని" ఆయన చెప్పెను. వారి దినపు వాగ్దాన వాక్యమును వారి దినముల యందు నిరూపించుటకు పూర్వపు ప్రవక్తలు పంపబడినట్లు, ఈ దినమును ముందు ఎన్నుకొన్న ప్రజలు, వారి దినములో దానిని చూశారు. బావియొద్ద స్త్రీ వలెనె, నాతాను వలెను, గ్రుడ్డి బర్తిమయివలె, పేతురువలె, దానిని గుర్తించిన మిగిలినవారివలె, దానిని చూశారు. ఆయనే ఆ వాక్యము గాను, దాని ఉత్పత్తిగానున్నాడు. "నేను చేయుదునని, తండ్రి వాగ్దానము చేసినయెడల, నన్ను నమ్మకున్నను ఆ క్రియలను నమ్ముడి. అది నేనెవరినో తెలుపును." గ్రహించారా? మంచిది. ఈ దినమును తప్పించుకొనుడి. స్త్రీ పురుషులు దానిని గుర్తించి, దాని యందు ప్రవేశించి భద్రపరచబడిరి.
పెంతెకోస్తులారా! (ఓ, మై!), మీ ఈ దినమును ఎందుకు గుర్తించలేకపోవుచున్నారు? ఈ దినము యొక్క సాయంకాల సమయమును గుర్తించుడి. అది ఇక్కడున్నది, వచ్చుచున్న క్రీస్తును తెలియపరచుచూ, అది ఇచ్చట ఉన్నది. మనము చివరిలో ఉన్నాము. మీ దినమును గుర్తించుడి.
JOHN 18:14
92మిమ్మును అధిక సమయముగా ఇచ్చట వుంచియున్నాను. అది నాకు తెలియును. అయితే నేను ఈ ఆహారమును ఇష్టపడుచున్నాను. ఇది జీవమైయున్నది. అది విశ్వాసి కొరకై ఉన్నది. మీరు జీవించుచున్న ఈ దినమును, దాని కాల సూచనను గుర్తించుడి.
ప్రతి ఒక్కటి ఎక్కడున్నదో చూడండి, ఇశ్రాయేలు, మరియు సంఘము, ఎక్కడున్నదో, అవినీతి ఎక్కడున్నదో, వధువు ఎక్కడ నిలుచుని వున్నదో చూడుడి. మరేది విడిచిపెట్టబడియున్నది? వధువు ఎత్తబడుట ఒక్కటే. బహుశా ప్రతి సంఘము ఏదో ఒక దానికొరకు ఎదురు చూచుచున్నది. "దేవునికే మహిమ, మనము అది, ఇది చేయుటకు ఒక దినము వచ్చుచున్నది" అని పెంతెకోస్తువారు చెప్పుచున్నారు. చూశారా, వారు పండితులై దానిని నమ్ముచున్నారు.
ఒకప్పుడు కయప, "దేశమంతయు నశించుటకంటెను, ఒకడు చనిపోవుట యుక్తమని" చెప్పెను. అతడు ప్రధాన యాజకునిగా నున్నందున, ఆ విధముగా చెప్పెనని బైబిలు చెప్పుచున్నది. అతడేమి చెప్పుచున్నాడో తెలియకయే అతడు ప్రవచించెను. అయితే ఏ దేవునికి తానొక ప్రధానయాజకుడిగా నున్నాడో, ఆ దేవునినే బలి చేయుచున్నాడను సత్యమును అతడు గ్రహించాడా? ఈ దినమునను ఆ విధముగానే ఉన్నది! వారెక్కడో దూరమున ఒక గొప్ప కాలము వచ్చునని చూస్తున్నారు.
MATT 15:14
93వ్యాపారవేత్తల సమావేశమునకు వెళ్లాను. అచ్చట వారు "దేవునికి మహిమ!" అనుచూ సమాజమంతయు కదిలించబడునట్లు, ఈ విధముగా చెప్పసాగిరి, "ఒక గొప్ప ఉజ్జీవము రానైయున్నది. భూమిపై దేవుని హస్తము రాబోవుచున్నది!" ఎందుకు ప్రజలు ఆ విధముగా పరుగిడుచూ, ముందుకు వెళ్ళుచున్నారు… ఇశ్రాయేలు బూరల క్రింద అది జరుగుచున్నదని గ్రహించడము లేదు. ఆ విధముగా ఎందుకు చేయుచున్నారు? ఎందుకనగా వారు క్రైస్తవ పండితులైయున్నందుననే, గ్రహించడము లేదు. వారు తమకొరకు పంపబడిన వర్తమానమును, నిరాకరించుచున్నారని గ్రహించడము లేదు. ఆమేన్!
మనము వెళ్ళుచున్న ప్రతి లేఖన భాగము, దినమునకు దినము, వారమునకు వారము, వివాదము లేని సత్యమైయున్నది. గ్రుడ్డివారు దానిని పొందలేక పోయిన ఎడల వారిని ఆ విధముగానే వుండనివ్వుడి. "గ్రుడ్డివారు గ్రుడ్డివారిని నడిపించిన యెడల వారందరును గుంటలో పడుదురని" యేసు చెప్పెను. అదెప్పుడు జరుగునో నాకు తెలియదు; అదెక్కడ జరుగునని నాకు తెలియదు; అయితే అది వచ్చుచున్నదని నాకు తెలియును.
94నేను చూస్తూ ఉన్నాను, ఎందుకు సాతాను నేను ఈ విధముగా చెప్పుటను ఇష్టపడుటలేదని మీకు తెలియునా? నిన్నటి రోజున నేనెంతో బాధపడ్డాను. దేవుని యొద్ద నుండి ఏ మాటనూ పొందలేకపోయాను. చేయుటకు తెలిసినదంతయు చేశాను, అయినను దానిని పొందలేకపోయాను. ఈ ఉదయమున నేను లేచినప్పుడు… నిన్నటి రోజున నేను తీసికొనిన ధాన్యపు భోజనము నాకు జీర్ణము కాకుండుటచేత నేనెంతో జబ్బునపడ్డాను. ఎక్కువ బాధతో నేను లేవలేకపోయాను. "ఈ ప్రపంచపు సంగతి ఏమిటని? నేను తలంచుచూ ఉంటిని, నేను అక్కడకు వెళ్ళుచున్నాను, ఏమి చెప్పవలయునని తెలియడము లేదు. ప్రభువా, వ్రాయుటకు నా మనస్సులో ఒక్క లేఖన భాగమును కూడ చూడలేకపోవుచున్నాను; ఏ సందర్భమును చూడలేకపోవుచున్నాను." ఏమి చేయవలెనని తెలియడము లేదు. అప్పుడు సందేశము వచ్చుటకు ప్రారంభమైన తరువాత, సాతాను ఈ విధముగా చెప్పుటకు ప్రారంభించినది, "నీవు చాలా బాధపడుచున్నావు, తల బాధతో బలహీనముగానున్నావు. నీవు అక్కడకు వెళ్లలేవు. నీవు అక్కడ నిలుచుండలేవు. అది ఆ విధముగావున్నది, ఈ విధముగా వుండునని" చెప్పసాగినది.
95అప్పుడు నేనొక కథను జ్ఞాపకము చేసికొన్నాను. ఇంగ్లాండు దేశములో ఒక సాధారణమైన పిచ్చివాడు, అచ్చట కొందరు "రాజు తన భవనమునకు వెళ్లుచున్నాడని చెప్పుట" వినెను. అతనికి ఎవ్వరునూ లేరు. అతడొక ముఖ్యమైన, అవసరమైన, సందేశమును విరోధుల గురించి తెలుపవలసియున్నది, ఎందుకనగా శత్రువును… అక్కడ నిలబడియున్న ఆ వెర్రివానితో ఒకడు ఈ విధముగా చెప్పెను, "ఇదిగో ఈ సందేశమును తీసుకొని వెళ్ళుము, ఈ సందేశమును తీసుకొని ఆయా స్థలములకు త్వరపడుము, ఇది జరుగునట్లు ఆజ్ఞాపించుము." మరియు అతడు ఈ విధముగా చెప్పెను, "నా దండమును నీచేత కొనిపొమ్ము, అది నేను నిన్ను ప౦పితినని నిరూపించును" అని చెప్పెను.
అతడు దానిని తన అంగీలో వుంచుకొని వెళ్లిపోయాడు, ప్రతి స్థలములోను కావలివారు అతనిని నిలుపుతూ వచ్చారు, కాని అతడు "విడువడి! రాజు సందేశము నా యొద్ద ఉన్నది. నేను రాజు యొక్క వర్తమానికుడను!" అది నిరూపించబడిన వాక్యమై యున్నది!
"సాతానా, నా దారినుండి తొలగిపొమ్ము! నేను రాజు యొక్క సందేశమును కలిగియున్నాను. నేను వెళ్లవలసియున్నది!" అని తలంచాను.
96ఒకప్పుడు వారు సమాధాన రాజును, సమాధిలో వుంచి సమాధిని ముద్రించారు. మరణము ఆయనను మూడు రాత్రింబవళ్లు బంధించియుంచినది. అయితే పునరుత్దాన ఉదయమున, ఆయన తన చేతిలో రాజదండమును కలిగి ఈ విధముగా పలికెను. మరణమా, దూరముగా వెళ్లిపొమ్ము, దారి విడుము. నేను రాజు యొక్క సందేశమైయున్నాను. పునరుత్దానమును నిరూపించుటకు నేను వెలుపలకు రావలసియున్నది. నేను జీవమును, పునరుత్దానమునై యున్నాను. హల్లెలూయా! ఇప్పుడు నేనెంతో సంతోషించుచున్నాను. అది రాజుయొక్క సందేశము. స్నేహితులారా, దానిని గుర్తించుదము. బూర శబ్దమునకు మనము సమకూర్చబడి పిలువబడియున్నాము. ప్రభుని బూర పలుకును మరియు ఇక ఆలస్యముండదు.
ఆయన ఇశ్రాయేలును సమకూర్చెను. మూడు దినములు - మూడవ దినమున ఆయన దానిని చేయునని చెప్పెను. ఇరువది-ఏడు-వందల సంవత్సరములు గతించినవి. మూడవ దినమున వారిని సమకూర్చెదనని ఆయన చెప్పెను. దానిని ఆయన చేశాడు. జీవమూర్గమును, ఆయన తెలిపెదనని చెప్పెను. వారు అక్కడ వారి మార్గము నుండి వధువు తొలగిపోవరకు వేచియున్నారు. అప్పుడు మాత్రమే హెబ్రీ ప్రవక్తలు ఇద్దరును రాగలరు. అది వారిని గుర్తింపజేయును…
97నేను ఇశ్రాయేలుకు వెళ్ళుటకు కైరోలో వుండినది మీకు తెలియును. లేవి పెత్రూస్ నాతో ఈ విధముగా చెప్పాడు, "సహో, బ్రెన్హా౦, వారు దానిని చూచినట్లయిన… వారు ప్రవక్తలను నమ్ముదురు."
"ఇది నాకొక మంచి తరుణమని" చెప్పాను. మానవుడు ఏ విధముగానున్నాడో చూడుడి. అయితే దేవుని కృపను చూడుడి. "నేను ఈ క్రొత్త నిబంధనను వివరించెదనని" చెప్పాను. వారు దానిని చదివారు. స్వీడను దేశము నుండి లేవి సోదరుడు పది లక్షలకు పైబడి వీటిని అక్కడకు పంపాడు. అక్కడకు వచ్చుచున్న యూదులు దానిని చదివారు. వారు ఈనాటి నాగరిక యూదులు కారు, అయితే వారిప్పుడు వారి స్వదేశమందున్నారు. వారు ఈ విధముగా చెప్పిరి, "ఈయన మెస్సీయా అయినట్టయిన ప్రవక్తలు చేయు సూచనలను మమ్ములను చూడనిమ్ము, అప్పుడు మేము నమ్మెదము" అనిరి.
లేవి పెత్రూస్ ఈ విధముగా "సహోదరుడా. బ్రెన్హా౦, ఇదియే ఆ తరుణము, ఇదియే ఆ తరుణమని, కొంత అవకాశమున్నదని ఎవరో నాతో చెప్పిరి. అక్కడకు వెళ్లుటకు సమస్తమును సిద్దముగాన్నదని" చెప్పెను.
ఎవరో ఒకరు వచ్చి సహో, ఆర్గాన్ బైటుతో కూర్చొని, "సహో, బ్రెన్హా౦, ఇది ఇశ్రాయేలుకు మేలుకొలుపు సంకేతముగా వుండును. దీనికి వారిని తీసుకొని రమ్ము. ప్రవక్త సూచనను చూపినప్పుడు వారు దానిని నమ్మెదరు" అని చెప్పెను.
అందుకు నేను ఈ విధముగా చెప్పితిని, "ప్రభువా, నేను సిద్దముగా నున్నాను." (డబ్బు తీసుకొని టిక్కెటు కొని) విమానములోనికి ఎగిరి కూర్చొన్నాను, కైరోలో నిలిచాను; "అవును, నేను సిద్దముగా నున్నానని" చెప్పాను.
అప్పుడు పరిశుద్దాత్మ ఈ విధముగా చెప్పెను, "ఇది నీ స్థలము కాదు. ఇది నీ సమయము కాదు." చూశారా? నీకు నీవుగా ముందుకు వెళ్లితివి. నేను తలంచిన దేమనగా, "ఓ మై, నేనిక్కడకు వచ్చాను, నేను వెళ్ళనైయున్నాను."
ఏదో ఒకటి ఈ విధముగా చెప్పినది, "అక్కడే నిలువుము! ఈ మార్గమున వెళ్ళకుము. ఇండియాకు తిరుగుము. అక్కడకు వెళ్ళకుము… ఇండియాకు వెళ్ళుము, అయితే అక్కడకు వెళ్ళకుము!"
98"ఆ విధముగా ఎందుకైనదని…" తలంచాను. విమానములు నిలచు చోటికి వెనుక ప్రక్కకు వెళ్లి "ప్రభువా, దీని భావమేమిటని" అడిగాను. అప్పుడు ఆయన నాకు తెలిపెను. ఏ అన్యుడు…. ఈ ప్రవక్తలే. అది లేఖనానుసారమైనదిగా వుండవలసియున్నది. మోషే - ఏలియాలు రావలసియున్నది. ఇదికాకుండా వధువువు ఇంకనూ మార్గము నుండి ఎత్తబడలేదు. ఆ ప్రవక్తలు తిరిగి వచ్చెదరు, ప్రవక్త సూచనను వారు చేయుదురు. అది లేఖనమైయున్నది. అప్పుడు సమస్తమును చక్కగా నెరవేరును. ఇశ్రాయేలు ఒక్క దేశముగా ఒక్క దినమున జన్మించును. ఆమేన్! సాయంకాలపు వెలుగులు ప్రకాశించుచున్నవి.
సాయంకాలమున వెలుగుండును,
మహిమ మార్గమును నీ ఖచ్చితముగా కనుగొందు;
నీటి మార్గమున ఈనాడు వెలుగున్నది,
ప్రశస్తమైన యేసు నామములో సమాధి చేయబడుము.
యౌవ్వనులు, వృద్దులు, మీ పాపములకై పశ్చాత్తాపపడుము,
పరిశుద్దాత్మ మీలో ఖచ్చితముగా ప్రవేశించును.
సాయంత్రపు వెలుగులు వచ్చియున్నవి.
దేవుడును, క్రీస్తును ఒక్కటైయున్నారనునది నిజమైయున్నది.
99మనము చివరి కాలములో నున్నాము, స్నేహితులారా. ప్రేరేపించబడిన రచయిత చెప్పిన పాటలో దీనిని మనము తలంచగలము:
దేశములు విడిపోచున్నవి;
(ఇది పదిహేను సంవత్సరముల క్రితము) ఇశ్రాయేలు మేలుకొనుచున్నది;
ఆ సూచనలు ప్రవక్తలు ముందుగా చెప్పినవి;
అన్యుల దినములు లెక్కించబడినవి.
(వారి అసహ్యమైన స్థితిని చూడుడి.) భయములు అధికమైనవి.
నీ స్వాస్ట్యమునకు తిరిగి రమ్మ,
ఓ చెదరినదానా, సమీపించినది నీ రక్షణ దినము;
భయము చేత మానవ హృదయము పనిచేయకున్నది.
దేవుని ఆత్మచే నింపబడుము;
మీ దీపములను చక్కదిద్దుకొనుడి;
మీ విమోచన సమీపించినది, చూడుడి. (అది నిజము.)
ఆ ప్రవక్తలు అబద్దములాడుచున్నారు;
దేవుని సత్యమును వారు నిరాకరించుచున్నారు; (అది సత్యము కాదా!)
యేసుక్రీస్తు మన దేవుడైయున్నాడు.
వారు దానిని నమ్మరు. వారు అన్ని రకముల "ఇజమ్స్"ను కలిగియున్నారు. అయితే ప్రవక్త - లేక ప్రేరేపించబడిన రచయిత ఈ విధముగా చెప్పాడు:
అపోస్తలుల నడచిన మార్గములో మనము నడిచెదము.
100నా దర్శనము జ్ఞాపకమున్నదా? అక్కడ నేను చెప్పినది, "అపోస్తలుడైన పౌలు యొక్క ప్రజలు, ఎత్తబడినయెడల, నావారును దానిలోనికి వెళ్ళుదురు, ఎందుకనగా ఆయన చేసినట్టే నేనును చేశాను."
లక్షలాదిమంది ప్రజలు వారి చేతులు చూపుతూ ఈ విధముగా చెప్పిరి, "మేము దానియందు విశ్రమించుచున్నాము!" ఏమది? మనము జీవించు దినమును, కాలమును, కాలసూచనను గుర్తించుడి. మనము తలంచుచున్నది దాని కంటెను ఎంతో ఆలస్యమైనది. ఈ దినములలో ఒక దానియందు, వెలుపల ఉన్నవాడు ఇంకనూ వెలుపల వుండనిమ్ము. లోపల ఉన్నవారు ఎప్పటికిని లోపలనే వుండనిమ్ము. ద్వారము మూయబడును.
ఇక్కడ నున్న కొందరు ఎవరైననూ ఈ ఉదయకాలములో యేసు నామములో ప్రవేశించనియెడల నా ప్రియమైన ప్రజలారా! ఇక్కడ నిలువబడియున్న మంచి, చెడ్డలు తెలియని సేవకుని చూడకుడి, నేర్పరి కాని, చదులేని మోటువానిని చూడకుడి - అయితే నెరవేరిన వాక్యమును చూడుడి. అది సత్యమని నిరూపించిన పరిశుద్దాత్మవైపు చూడుడి. మనము సాయంకాల సమయములో వున్నాము. మీరు తలంచుదాని కంటెను ఎంతో ఆలస్యమైనది.
101స్త్రీ లారా, మీ తల వెంట్రుకలు పెరుగనియ్యుడి, సోదరీ, దయచేసి ఆ మురికి బట్టలను తీసివేయుము, సిగరెట్టులను విసరి పారవేయుడి. ఆ ఘడియ రానున్నది, అపవిత్రుడు ఇంకనూ అపవిత్రుడుగానే వుండనిమ్ము, నీతిమంతుడు ఇంకనూ నీతిమంతునిగా వుండనిమ్ము, లోపలకు ప్రవేశించినవాడు ఇంకనూ లోపలనే వుండనిమ్ము; వెలుపల ఉన్నవాడు ఇంకనూ వెలుపలనే వుండనిమ్ము. అతి చిన్నదైన అడ్డు గీత ఏ విధముగా ఉన్నదనగా నీతిమంతుడు రక్షించబడుటయే దుర్లభమైన ఎడల పాపియు, భక్తిహీనుడును (సత్యమును ఎదిరించువాడు మీకు తెలియను), ఎక్కడ వుందురు? మన తలలు వంచుదము.
ఇప్పుడు, మనము జీవించు ఈ దినపు వెలుగునందును, ఈ కాలపు వెలుగునందునున్న ప్రశస్తమైన, ప్రియమైనవారలారా, దేశపు అనేక రాష్ట్రముల నుండి వచ్చియున్న మీరును, నేనును ఈ బలిపీఠముపై ఇప్పుడు మనలను పరీక్షించుకొందము. మన హృదయాలలో ఈనాడు దేవుని ఆత్మ ఎలా ఉన్నది? జ్ఞాపకము చేసికొనుడి. ఆత్మయే పరిశుద్దమైనది, అంగీకరించదగినది… ఏ సంఘ సిద్దాంతమైనను, మరొకటియైనను పూర్తిగా మరుగైపోవును.
102మీరు దీనితో మరొక దానిని చేర్చుటుయైనను, తీసివేయుటయైనను చేయకుడి. మీ స్వంత అనువాదమును దీనికి వుంచిన ఎడల జీవగ్రంథము నుండి మీ భాగము తీసివేయబడును. ఆత్మ చెప్పని దానిని చెప్పుటకు ప్రయత్నించుచున్నావా? మరేదో చెప్పినట్లు నీవు పలుకుటకు ప్రయత్నించుచున్నావా? లేక అది ఉన్నది ఉన్నట్లే గైకొని ఆ విధముగానే వుంచుచున్నావా? ఒకవేళ దీనిని కత్తిరించుటయు లేక దీనితో మరొక దానిని చేర్చుటయు లేక టేపుతో అతికించుట లాంటి కాని పనులు చేయుచున్నావా? నీవు…
"నేను దీనిని చేయుటకు మనస్సు నాకు లేదు, నా సంఘము దీనిని నమ్మదని తెలియును. అది ఒక మనిషి మాటయైయున్నది" అని చెప్పుచున్నావా? ఆ ఒక్క మనుష్యుడు దేవుడైయున్నాడు. బైబిలునందు నీ తల వెంట్రుకలను కత్తిరింపకూడదని చెప్పబడియున్నది. స్త్రీలు, పురుషులవలె వస్త్రములు ధరించుదురని, దేవునికి ఏ విధముగా వారు అవమానకరముగా వుందురని బైబిలునందు చెప్పబడినది. ఏ విధముగా పరిశుద్దాత్మ ఒక వినయమైన, విలువలేని పాత్రగా, ఆ గొప్ప రాజు చెప్పిన ఈ కాలములో నిలువబడవలసినవాని ద్వారా మాట్లాడెను. "ఇదిగో నా రాజదండము, నా వాక్యము — నా రాజ దండమును తీసుకొని ముందుకు వెళ్లి వర్తమానమును తీసుకొని రమ్ము."
103సంస్థలు దానిని నిలుపుటకు ప్రయత్నించునని నాకు తెలియును. వారు దానిని నిరాకరించి నెట్టివేయుదురు; కాని దేవుని కృపచేత నేను నా మార్గములో ఈ విధముగా దేశము నుండి దేశమునకు, స్థలము నుండి స్థలమునకు, సంఘము నుండి సంఘమునకు వెళుచూ, "దానినుండి బయటకు రండని!" కేక వేయుచున్నాను. అది ప్రఖ్యాతి గాంచినది కాదు, కాని అది సత్యమైయున్నది.
వ్రాయబడిన దానిలోని ఆత్మను నీవు గైకొందువా? ఆత్మలో ఇచ్చిన దానిని నీవు గైకొందువా? ఇంకనూ నీవు ఆ విధముగా చేయనియెడల, బలిపీఠమునకు స్థలము ఇకలేదు. (నీ హృదయమే బలిపీఠమైయున్నది), మీ చేతులెత్తి ఈ విధముగా చెప్పగలరా, "దేవా, నా పట్ల కృప చూపుము. దేవుని ఆత్మను నాలోకి రానిమ్ము, నాలోనున్న సమస్త పాపమును, ఆశలను, దురలవాట్లును, శోధనలను రచ్చల నుండి, వ్యసనములను, వాదములను, నాకున్న ప్రతిదానినుండి నన్ను దూరపరచుము. నా ఆత్మ పరలోకమునకు మధురముగా లేదని నాకు తెలియును. ప్రభువా, ఈ కడవరి క్షణములో నన్ను మధురముగా చేయుము. ఇది నా చివరి ఆరాధనగా వుండవచ్చు. నేనిక దీనిని వినక పోవచ్చును. ఇకపై ఈ సందేశమును వినుటలో ఇదియే నా చివరి సమయముగా వుండవచ్చు. నా చేతులెత్తుచున్నాను. ప్రభువా, దేవా నాకు కృపను చూపుము."
దేవుడు నిన్ను దీవించును గాక. అనేక చేతులు కనబడుచున్నవి. ఇప్పుడు, మీ కొరకు క్షణకాలము మౌనప్రార్ధన. చేతులను ఎత్తిన మీరు వాంఛ కలిగియున్నారని చూపుచున్నారు. ఆత్మ మిమ్ములను పిలచుచుండగా నా వైపుకు చూస్తున్నారు.
ROM 8:29,30•
ROM 9:21
104ప్రియమైన దేవా, నీ సమస్తమును ఎరిగినవాడ. సమస్తము కొరకు అన్నింటిని నీవు చేశావు. కొందరేమో ఖండింపబడవలసియున్నది; కొందరు గ్రుడ్డివారు కావలసియున్నది; కొందరు, కుమ్మరివాడు పాత్రలను చేసినట్లు ఉన్నది. అపోస్తలుడైన పౌలు, "ఒక దానిని ఘనమైనదిగాను, మరొక దానిని ఘనహీనముగాను, ఘనమైన దానిని కనబరచుటకు ఘనహీనమైనది చేయబడినది. అయితే కుమ్మరి తాను దేవునిని చేయుటకు ఇష్టపడుచున్నాడో, అది అతని చేతులలో లేదా? అది దేవుని ముందెరిగిన తీర్మానములో ఉన్నది… ఆయన ఎరిగినవారిని, ఆయన పిలచెను. ఎవరిని పిలిచెనో, వారిని నీతిమంతులుగా తీర్చెను. ఎవరిని నీతిమంతులుగా తీర్చెనో, వారిని మహిమపరచలేదా?
మీలో కొందరు ఆ బావివద్ద స్త్రీ వలె, అవినీతియందు అవిశ్వాసమునందు మనుష్య పారంపర్య సిద్దాంతములయందు వుండవచ్చు. ఒకవేళ వీటిని వినుట ఇదియే మొదటిసారిగా వుండవచ్చును, అయితే ఏదో కొంత ఆశ్చర్యముగా వారి హృదయములను గద్దించినది. ప్రభువా, అనేకమైన చేతులు ఎత్తబడినవి. ఇదిగో ఆ కుమ్మరి, ఆ పాత్రను తీసుకొని విలువైన పాత్రగా చేయనిమ్ము. ప్రభువా, అక్కడే ఏదో ఒక కారణమున్నది, లేనియెడల వారు ఆ విధముగా చేయరు, వారు దానిని చెప్పరు. నేనింకను విశ్వసించుచూ పైకెత్తుచున్నాను.
105ప్రభువా, ఈ దీనుడైన సేవకుడు నిన్ను బ్రతిమాలుకొనుచున్నాడు. మరణమునకును, జీవమునకును మధ్యనున్న వారికొరకు, "బయటకు రండి, బయటకు రండి," అని సొదోమీయుల కొరకు విజ్ఞాపనలు చేయువారివలె, ప్రభువా విజ్ఞాపన చేయనిమ్ము.
106వారు ఎంతో వినయముగాను, ప్రీతిగాను, ఇప్పుడు వారి హృదయములోనున్న దేవుని సింహాసనము యొద్దకు, "యేసు ఈనాటి నుండి నీవు నావాడవు" అని చెప్పుచూ వచ్చెదరు గాక. నీ ఆత్మ నన్ను తాకిన ఈ స్థలము నుండి నేను నీకు విజ్ఞాపన చేయుచున్నాను. అది ఇచ్చట నన్ను తాకినయెడల మరెక్కడకు ఈ స్థలము విడిచి వెళ్లవలసినపని లేదు. ఇచ్చటనే నీవు నన్ను కలసికొన్నావు. ఇచ్చటనే, అది మొదటి లేక రెండవ లేక మరొకటైనను, దానిని ముగించనైయున్నాము, ఎందుకనగా ఇచ్చటే, నీ దానిని ఖండించి సరి చేయుదునని వాగ్దానము చేశా. నేను అవినీతిపరునిగాను, భ్రష్టునిగా నున్నప్పటికిని తెల్లని మంచువలె మార్చబడుదును. నీ వాక్యమంతటిని నేను నమ్ముచున్నాను; నేను దానిని నమ్మి అంగీకరించి దానియందు నడచుటకు సిద్దముగానున్నాను. నేనిప్పుడు దీనిని దేవుని మహిమార్థమై చేయుచున్నాను. నా జీవితము మంచిది కాదని నాకు తెలియును, అది దేవునికిని మంచిది కాదు, నా పొరుగునానికిని మరొక దానికిని మంచిది కాదు. అది కేవలము సాతాను కొరకు మాత్రమే ఉపయోగపడునదై యున్నది. ఇది ఒక కీలుబొమ్మవలె తిరుగుచూ ఒక స్త్రీకి ఉపయోగపడు విగ్రహముగాను, మనిషి ఆడుకొనుటకు మాత్రము ఉపయోగపడును. అయిననూ ప్రభువా, నన్ను నీ సేవకునిగా చేయుము, దేవా అనుగ్రహించుము. యేసు నామమున వారిని నీకు సమర్పించుచున్నాను.
మన హృదయములను, శిరస్సులను వంచియుండగా:
నా రక్షకుడు నన్ను పిలచుటను నేను వినుచున్నాను, (స్నేహితుడా,
నమ్మకముగా ఇది నీ చివరి సమయమైయున్నది. నీ ఆ మెల్లని స్వరమును వినగలుగుచున్నావా?) పిలచుచున్నాడు,
వినగలను, (అతడు ఏమై… నీ రక్షకుడు నిన్ను పిలచుచున్నాడు, వాక్యము.) రక్షకుడు పిలచుచున్నాడు,
(అతడు ఏమి చేయవలసియున్నది? ప్రపంచమును నిరాకరించి మరియు…)
"నా సిలువను ఎత్తికొని వెంబడించుము, వెంబడించుము
(ప్రభువా, నేను యేసు నామములో బాప్తిస్మమును త్రోసివేసితిని.)…"
తోట మధ్యన నేనాయనతో వెళ్ళుదును,
నేను వెళ్ళుదును (ఆయనతో ఎచ్చటుకు? నీటి మూలముగాను,
తోట మూలముగాను, దేని మూలముగానైనను,
ప్రార్ధన గృహములకును, ఆ కొలనునకును, మరెక్కడికైనను.
దానిని తీర్మానించుకొనుము.)… తోట ద్వారా ఆయనతో వెళ్లుదును,
నేనాయనతో వెళ్ళుదును, మార్గమంతటను నేనాయనతో వెళ్లుదును.
న్యాయతీర్పు ద్వారా నేనాయనతో వెళ్లుదును.
(వాక్యము సరైనదైనా సరే లేక సంఘము సరైనదైనా సరే.)
నేను వెళ్ళుదును…………….
"నేను మంచివాడనైనను, లేక ఆయన మంచివాడైనను. నా మనస్సాక్షి సరైనదా లేక ఆయన వాక్యము సరైనదా." నీవు న్యాయతీర్పు స్థానములో వున్నావు. "నేను నమ్మినది సరైనదా, లేక ఆయన వాక్యము సరైనదా? పొట్టి దుస్తులను వేయుట, తల వెంట్రుకలను కత్తిరించుకొనుట సరియని తలంచుచున్నావా? నేను ఒక సంస్థకు సంబంధించి వుండుట సరియని తలంచుచున్నావా?" ఆయన చెప్పిన దేమిటి?
నేనాయనతో వెళ్ళుదును, మార్గమంతటను వెళ్లుదును.
ఇపుడు, ఆయన నన్నెక్కడకు నడిపించునో అక్కడకు ఆయనను వెంబడింతును,
ప్రభువా, నీ వైపునకు నా చేతులెత్తియున్నాను, అదెక్కడున్నది, మరొక సందేశము ఎక్కడ ఉపదేశించబడుచున్నది? అది ఈ రాత్రి ఇక్కడున్నదా, ఆఫ్రికాలోనా, జర్మనీలోనా, లేక స్విట్జర్లాండు లోనున్నదా, ప్రభువా, అది ఎక్కడున్నది?
ఆయన ఎక్కడ వుండునో (ఎక్కడకు నన్ను నడిపించుదువో,
ప్రభువా) నేను వెంబడింతును,
నేనాయనతో వెళ్ళుదును, మార్గమంతయు నేనాయనతో వెళ్ళుదును.
ఇప్పుడు, మీ తలలు వంచియుండగా, ఆయన నడిపించు ప్రతి స్థలమునకు ఆయనతో వెళ్ళుదువా?
MATT 10:39
107కాలములు మెల్లగా పరుగిడునప్పుడు, ఆయనతో వెళ్లేదవా? "ప్రజలు హింసించినప్పటికిని, నవ్వుచున్నప్పటికిని, పరిహాసము చేసినప్పటికిని, నేనాయనతో వుందును; నేను ఇంకనూ వెళ్ళుదును. నీవెక్కడవున్నా. ప్రభూ, నేను నీతోనే ముందుకు వెళ్ళుదును. నేనింకనూ నీతిగా, నిజముగా నిలువబడెదను. నేను పడినను, ప్రభువా, నీ నన్ను లేపెదవు. "నా కొరకు తన ప్రాణమును పోగొట్టుకొనువాడు దానిని కాపాడుకొనునని" ఆయన చెప్పెను.
అందువలన నేనాయనతో వెళ్లుదును, మార్గమంతటును ఆయనతో వెళ్ళుదును.
ఇప్పుడు, అదంతయు హృదయులోనున్నయెడల, నా హృదయములను మరియు చేతులను ఆయనవైపుకు ఎత్తుదము.
ఆయన నన్ను ఎక్కడకు నడిపించునో నేను వెంబడింతును,
ఆయన నన్ను ఎక్కడకు నడిపించునో నేను వెంబడింతును,
ఆయన నన్ను ఎక్కడకు నడిపించునో నేను వెంబడింతును,
నేనాయనతో వెళ్ళుదును, మార్గమంతటను వెళ్లుదును.
ఆయన నాకు కృపను మరియు మహిమను అనుగ్రహించును,
ఆయన నాకు అనుగ్రహించును….
ప్రభువైన యేసూ, ఈ చేతిగుడ్డలపై ఇప్పుడు శ్వాసించుము, ప్రభువా, వ్యాధిగ్రస్తులను, బాధింపబడువారిని స్వస్థపరచుము, దయచేయుము ప్రభువా, వారికి యేసు నామమున స్వస్థత దయచేయుము.
మరియు నాతో రండి, మార్గమంతటను నాతో
108మీరు సంతోషంగా వున్నారా? ఇప్పుడిక్కడ దానిని ముందే చూచారా? దేవుని బూర మ్రోగును, ఇక ఆలస్యముండదు. ఇది చివరి బూరగా ఉన్నది. ఉదయించినప్పుడు నిత్యత్వములో ప్రకాశముగాను, సుందరముగాను వుండును. మనమందరము కలసి ఆ పాటను పాడెదము: ప్రభుని బూర మ్రోగినప్పుడు. (పాటకు తాళము ఇవ్వండి.)
ప్రభుని బూర మ్రోగినప్పుడు,
ఇక ఆలస్యముండదు,
మరియు ఉదయించినప్పుడు, నిత్యత్వము ప్రకాశమును;
సుందరమును భూమిపై రక్షించబడినవారు
ఆ తీరాన చేరినప్పుడు, దూరమున పేర్లు పిలచునప్పుడు
నేను కూడ చేరియందున్ అచ్చట,
సమీపముగా వరుసన పిలచునప్పుడు,
సమీపముగా వరుసన పిలచునప్పుడు,
సమీపముగా వరుసన పిలచునప్పుడు,
సమీపముగా వరుసన పిలచునప్పుడు,
నేను కూడ చేరియందున్ అచ్చట
ఆ ప్రకాశమైన, మేఘరహిత ఉదయమందు,
మృతులు క్రీస్తునందు లేచునప్పుడు,
మరియు పునరుత్తాన మహిమను పొందునప్పుడు;
భూమిపై మన జీవము ముగియునప్పుడు,
మనకున్న పనినంతటిని చేసి ముగించినప్పుడు,
సమీపముగా వరుసన పిలచునప్పుడు,
నేను కూడ చేరియందున్ అచ్చట.
సమీపముగా వరుసన పిలచునప్పుడు,
సమీపముగా వరుసన పిలచునప్పుడు,
సమీపముగా వరుసన పిలచునప్పుడు,
సమీపముగా వరుసన పిలచునప్పుడు,
నేను కూడ చేరియందున్ అచ్చట.
109మన చేతులెత్తి, "ప్రభువా, నీ కృప ద్వారా. నీ కృప ద్వారా ప్రభువా," అని చెప్పుదము. ఇప్పుడు, మనము క్రీస్తునందు సోదరీ సోదరులము. మనము ప్రక్కకు తిరిగి ఒకరి చేతులు ఒకరు కలుపుచూ ఈ విధముగా చెప్పుదము.
"దేవుడు సహాయము చేసిన ఎడల, అక్కడ మన పేర్లు వరుసన పిలచునప్పుడు…"
సమీపముగా వరుసన పిలచునప్పుడు,
సమీపముగా వరుసన పిలచునప్పుడు,
సమీపముగా వరుసన పిలచునప్పుడు,
సమీపముగా వరుసన పిలచునప్పుడు, నేను కూడ చేరియందున్ అచ్చట.
మనము దేవునికొరకు వేచియున్నాము?
దేవుని ఆ బూర (చివరిది!)
మోగును, ఇక ఆలస్యముండదు,
(నిత్యత్వములోనికి ఒక క్షణలో, రెప్పపాటున)
మరియు సుందరమును;
భూమిపై రక్షించబడినవారు ఆ తీరాన చేరినప్పుడు,
దూరమున పేర్లు పిలచునప్పుడు, నేను కూడ చేరియందున్ అచ్చట ఇప్పుడు అందరము కలసి పాడుదము!
సమీపముగా వరుసన పిలచునప్పుడు,
సమీపముగా వరుసన పిలచునప్పుడు,
సమీపముగా వరుసన పిలచునప్పుడు,
సమీపముగా వరుసన పిలచునప్పుడు,
నేను కూడ చేరియందున్ అచ్చట,
110ఓ, అది సమయము కాదా? ఒక దినము మార్గము వెంట నడిచి వెళ్లునప్పుడు, ఎవరో మిమ్మును పిలుచుటను వినెదరు. "అదెవరు?" తల్లి! ఆమేన్! "అదెంతో ఆలస్యము లేదు." కొద్ది నిమిషములలో నీ మార్పు చెందెదము. వారితో కలసి ఆకాశములో ప్రభును కలసికొనుటకు ఎత్తబడుదుము. ఓ, ఒక్క క్షణములో, ఒక్క రెప్పపాటున, "ఇదిగో ఇచ్చట సహో, రెవొర్డ్ (పూర్వము ఈ సంఘ మందున్న సహోదరుడు). సహా , డిఆర్క్. సహోదరుడు ఇక్కడ… కావున — ఎందుకు, ఇక్కడ చూడండి, వారందరు నా చుట్టు వున్నారు. ఏంటి విషయము?" "వారు నాకు కనబడిరని నాకు తెలుసు. ఎంతో ఆలస్యము లేదు; నేనిప్పుడు మార్పు చెందనైయున్నాను, ఒక్క క్షణములో, ఒక్క కక్షములో." ఓ, అది నిజము! ఉదయించినప్పుడు నిత్యత్వము, ప్రకాశముగాను, మరియు సుందరముగాను. మర్మయుక్తమైన మేఘాలు…
111ఆయన చెప్పినట్లు ఇశ్రాయేలు ఒక ఉదయపు మేఘమువలె ఉన్నది — ఆవిరివలె నీ నీతియు గతించిపోను. అదంతయు సూర్యుని వెలుగులో గతించి పోయినప్పుడు, దానినంతటిని అతడే కలిగియున్నాడు. (ఆమేన్),
సమీపముగా వరుసలో పిలుచునప్పుడు, నేను కూడ చేరియందున్ అచ్చట. మంచిది, ఈ రాత్రి వరకు మనము చేరువరకు,
మనము మరల కలుసుకొనువరకు, మనము మరల కలుసుకొనువరకు,
స్నేహితుడా, ఏ సమయమున ఇది జరుగునో మనకు తెలియదు. అది పురాతనము నుండి చెప్పబడిన ఓ గాథగా నున్నప్పటికిని, అది సత్యమైయున్నది; అది జరుగనైయున్నది. మనము ఆ కాలములోనే న్నాము.
మనము చేరువరకు, మనము చేరువరకు (దేవుని కృపవలన
ఈ రాత్రి 7.30 గంటలకు అని నమ్ముదుము.),
దేవుడు మీతో వ్రుండును గాక మరలా మనము చేరు వరకు.
ఇప్పుడు మనము లేచి నిలుచుదము.
112ఓ, ఇది ఎంతో ఆశ్చర్యము కాదా? క్రీస్తు యేసులో ఇది పరలోక స్థలము. వేరే దేనికోరకైనను దీనిని మార్చలేము. నేను వేటాడుటను ప్రేమింతును, చేపలు పట్టుటను ప్రేమింతును, అది మీకు తెలియును, ఎందుకనగా ఆ అరణ్యములో నేను దేవుని చూచెదను. అందుకని దానిని ప్రేమింతును. నా అనుభవమంతటి యందును, దీనికొరకు ఒక్క నిమిషము కూడా మార్చలేదు [స్పష్టతలేని మాటలు]. ఒక్క నిమిషమును, అది నా తృప్తియైయున్నది.
"దేవా, నాలో ఉజ్జీవమును సృష్టించుము. నన్ను ఆ ఉజ్జీవముగా వుండ నిమ్ము, మాలో వున్న ప్రతి ఒక్కరూ నాలో వున్న ఉజ్జీవమువలె వుందురు గాక. ప్రభువా, నాకు ఆకలియు, దాహమును కలిగించుము. ప్రభువా, నాకు కావలసిన దానిని నాలో సృష్టించుము. ఈ ఘడియ నుండి నేనొక తీవ్రమైన సేవకునిగాను, ఉత్తవమైన సేవకునిగాను, నీ చేత ఆశీర్వదించబడి, అధిక శక్తి కలిగి, వినయముతో, దయతో నీ కొరకు పనిచేయుటకు, అధికముగా నిజ స్థితిని చూపుటకును, గతములోని కాని వాటిని మరచుటకు సహాయము చేయుము. క్రీస్తు ఉన్నత పిలుపునకు నన్ను అమర్చుకొనుటకు సహాయము చేయుము." ఆమేన్. అది మన ఆశయమైయున్నది. కాదా మరి? మంచిది.
మంచిది, రాత్రికి మనమందరము కలుసుకొనువరకు, యేసు నామమును ప్రతి ఒక్కరము మనతో కొనిపోవుదము.
మీలో ప్రతి ఒక్కరు యేసు నామమును మీతో కొనిపోవడి,
శిఖము, వేదనగల కుమారుడా;
నీకది సంతోషమును, సహాయమును ఇచ్చును,
నీవు పోవు స్థలమంతటికీ కొనిపొమ్ము
ప్రశస్త నామము, ఓ ఎంత మధురము!
భూమిపై నమ్మకము పరలోక సంతోషము;
ప్రశస్త నామము, ఓ ఎంత మధురము!
భూమిపై నమ్మకము పరలోక సంతోషము.
ఇప్పుడు మన తలలను వంచుదము.
యేసు నామమును మీతో కొనిపోవుడి,
ప్రతి చిక్కునకు ఒక కేడెముగా;
శోధనలు నిన్ను ఆవరించినపుడు,
ప్రార్థనలో ఆ పరిశుద్ద నామమును వాడుము.