పరలోక పెండ్లి కుమారుడు మరియు భూలోక పెండ్లి కుమార్తె యొక్క భవిష్య గృహము

పరలోక పెండ్లి కుమారుడు మరియు భూలోక పెండ్లి కుమార్తె యొక్క భవిష్య గృహము

1ఇప్పుడు దేవుని ఎదుట మన హృదయములు వంచి ఒక్క క్షణము నిలబడుదము.

మా పరమ తండ్రీ, ప్రభువైన యేసు నామములో నేడు ఇక్కడ కూడుకొను భాగ్యము దొరికినందులకు మేము నిశ్చయంగా కృతజ్ఞలము. ఈ మర్త్యతకు ఆవల నున్న జీవము వైపు, నిత్యత్వ సంగతుల వైపు మా దృష్టిని మళ్ళించుటకు ఇక్కడ మేము చేరియుండగా, మా పాపములను క్షమించుమని ప్రార్ధించుచున్నాము. మేమెటు తిరుగవలెనో, భవిష్యత్తులో మేమేమి చేయవలెనో, మాకు వాగ్దానము చేయబడిన స్థానమును ప్రస్తుతము ఎట్లు పొందవలెనో నీవు మాకు చూపించమని ప్రార్ధించుచున్నాము.

రోగములలోను, అక్కరలలోను గలవారు దేశములో చాలా మంది యున్నారు. వారింకా తమ యాత్రను ముగించలేదు. మా గొప్ప శత్రువు వారిని చిక్కులు పెట్టుటకు వచ్చినది. వాడు నీకును శత్రువే, వాడు వారి జీవమును ఆపి ముందుగానే సమాధికి పంపవలెనని కోరుచున్నాడు. ప్రభవా, నీ కృప మరియు దయ చొప్పున వారికి నిర్ణయించబడిన దినములను వారికనుగ్రహించమని నేడు నిన్ను అడుగుచున్నాము.

2ఈ వేదిక మిద చేతిరుమాళ్ళ పార్సిళ్ళు ఉంచబడినవి. హాలులోను, బయట స్థలములోను మంచములు, పడకలు కనబడుచున్నవి. రోగులు, బాధపడుచున్నవారు తమ శక్తినంతా కూడగట్టుకొని నిలబడియున్నారు.

ఓ, నిత్యుడవగు దేవా, ధన్యుడా, ప్రభువైన యేసు రక్తము ద్వార ఈ ఉదయమున మా ప్రార్ధననాలకించుము. మా దోషములు వైపు చూడక, ఆయన మా స్థానములో నున్నాడని నీవు ఎరిగి క్షమించెదవు. ఆయనే ఈ మా ప్రార్ధనకు ప్రతినిధి. ప్రభువా, ప్రతివారు నీ మహిమ నిమిత్తము స్వస్థత పొందెదరు గాక.

ఈ చేతి గుడ్డలను ఆశీర్వదించుము, రోగులు వాటి నుంచినప్పుడు వారు బాగవుదురు గాక!

తండ్రి, గొప్ప స్వస్థతా కూటము కొరకు నేను ఎదురు చూచుచున్నాము. అది వచ్చునని మేము నమ్ముచున్నాము. ప్రభువా! మేము నీ వాక్యము ద్వారా చేయవలెనో ఎరుగునట్లు జీవ మార్గమును మాకు చూపించుము, యేసు నామములో దీనిని అడుగుచున్నాము. ఆమేన్.

3దేవుని గృహములో యుండి, ఆయన జనులతో మాట్లాడుట నాకు దొరికిన ఒక మహూన్నత భాగ్యము. చాలా ఇరుకుగా ఉన్నదని నాకు తెలియును. నా యొద్ద పెద్ద పాఠమున్నది. కాబట్టి ఈ వర్తమానము ముగించు వరకు మీరు వీలయినంత సుఖంగా కూర్చొనండి.

4ఇప్పుడు, చాలా వేడిగా ఉన్నది, కానీ ఈ ఎయిర్ కండిషనర్ బట్టి వందనములు చెల్లించుచున్నాము. కాని ఇంత పెద్ద గుంపుకు ఇదేమి చాలును, చూడండి, ఎందుకనగా మీ శరీరము దాదాపు తొంబది ఎనిమిది డిగ్రీల వేడిని ఉత్పత్తి చేయును, ఆగక వేడిని విడుదల చేయును. దగ్గరగా కూర్చొన్నారు… కాని దేవుడు మీకు హాయిని అనుగ్రహించును. అది నా నమ్మిక.

5దీని వలన మీకు సహాయము దొరకునని, మేలు కలుగునని, లాభము ప్రాప్తించునని నేను తలంచనియెడల ఇక్కడికి మిమ్మును రమ్మని యుండకపోదును. ఈలాగు కూడుకొను ఆవకాశము కూడా ఎక్కువగా లేదని ఎరుగుదము. మనము ముగింపు ఘడియల లోనికి వచ్చియున్నాము. ప్రతి క్షణమును ఆయన రాజ్యము కొరకు నేను వాడవలెనని లెక్కించుచున్నాను.

మన కూడికను ప్రభువగు దేవుడు దీవించునని నమ్ముచున్నాను.

6నిన్న నేను అనేక స్థలములకు వెళ్ళి విశ్రాంతి గదులలో యున్న రోగులను బాధపడు వారిని చూచాను. ఈ వారములో భోజనశాలల మేనేజర్లను కొందరిని నేను కలిసికొనవలసియున్నాను. ఈ వారము నేను రాంచ్ హవుస్ కు వెళ్ళవలసియున్నాను. ఆ మేనేజరు ప్రారంభములోనే మాతో కరచాలనము చేసేను. అతడు నన్ను బ్రెన్హాం సోదరుడా అని పిలచెను. అతనికి నేనెట్లు తెలియునో నాకర్ధము కాలేదు.

"మీరేనా మేనేజరు?" అనడిగాను.

"నేను యజమానిని, మీ జనులు ఇక్కడికి భోజనమునకు వచ్చెదరు, వారు చాలా మంచివారు" అని అతడనెను.

నేనన్నాను, "మంచిది వారు చాలా పెద్ద గుంపుగా వున్నారనుకొనుచున్నాను."

అతడన్నాడు, "అయ్యా, నేనింతవరకు అలాంటి మంచి గుంపును చూడలేదు. వారు నిజంగా చాలా మంచివారు."

7నిన్న నేను ఒక యువతిని చూచుటకు హోటలుకు వెళ్ళాను. (ఆమె తల్లి దండ్రులున్నారు) వారున్న గదిని కనుగొనుటకు మేనేజరు యొద్దకు వెళ్ళాను.

"మీరేనా సహో. బ్రెన్హాం?" అనడిగెను. (ఓక్స్ యొద్ద)

"అవునండీ" అన్నాను.

"మీతో కరచాలనము చేయుదును," అన్నాడు.

(అతడు నన్ను అతని భార్యకు పరిచయము చేసెను. చాలా చక్కని దంపతులు.) "ఈ హోటల్లోని ప్రతి ఒక్కరు మీ కూటములకు హాజరగుచున్నారు. వారి కొరకే కేటాయి౦చాము. తక్కిన వారినందరిని వెళ్ళిపొమ్మన్నాము" అని అతడు చెప్పెను.

"మంచిది, దాని కొకరు మీకు వందనములు," అన్నాను.

"బ్రెన్హాం సోదరుడా, నీ కూటములకు వచ్చు జనులంత మంచివారిని నేనెచ్చటా చూడలేదు" అన్నాడు.

8ఇక్కడున్న నా స్నేహితుడగు బెకర్ యొద్దకు గత రాత్రి వెళ్ళాను. అతని సాండ్విచ్ లు నాకెంతో ఇష్టము. బాలునిగా ఉన్నప్పటి నుండి అతనిని నేను ఎరుగుదును. ఇప్పటికీ నాకు అతడు తెలియును. అక్కడున్న రివర్ సైడ్ హోటల్ యొద్ద ఒక జంట కూర్చొనియున్నారు… బెకర్ నన్ను "బిల్లి" అని పిలచెను.

"ఏమిటి హోమర్?" అన్నాను. (మేమిరువురం మంచి సన్నిహితులం.)

"మీ వారందరికి నేనే భోజనము ఏర్పరచెదను" అన్నాడు. ప్రతి ఆదివారం బ్లూ-బోర్ యొద్ద దాదాపు రెండు వందల మంది భోజనము చేయుదురు. నేను ఎక్కడికి వెళ్ళినా మీరు మంచివారని వినబడుచున్నది.

"రివర్-వ్యూ మొత్తం మీ కూటమునకు వచ్చిన జనులతోనే నిండి యున్నది. వందలాది తిరిగి వెళ్ళిపోయిరి" అని చెప్పెను.

9ఇవన్నీ వింటూంటే మీరు లోకమునకు ఉప్పయి యున్నారన్న మాట రుజువగుచున్నది. పాపులు మొదలుకొని పలురకముల జనులకు బోధించు అవకాశము నాకు దొరికినది. వీరు పాపులని నేను చెప్పుటలేదు. వ్యాపారము చేయుచున్న ఆ ప్రజలు మంచివారు, మీరు చక్కని వారని వారు చెప్పుచున్నారు. తమ వ్యాపారములలో, తమ స్థలములలో వారు మిమ్మును మెచ్చుకొనుచున్నారు. అదియే ఉప్పు, మీ నడవడిని నేను ప్రశంసించుచున్నాను. ఆ విధంగా మీరు జాగ్రత్తపడుచున్నందుకు వందనములు.

"ఎవరి యొద్దనైనా బిల్లు చెల్లించు డబ్బు లేనియెడల నన్ను పిలువమని చెప్పాను. దాని గూర్చి మేము శ్రద్ధ తీసికొందుము. వారి యొద్ద డబ్బున్నా, లేకపోయినా భోజనము పెట్టుమని చెప్పాను." చూచారా, ఏదయినా చేయగలము.

మిమ్మును నా బిడ్డలుగా తలంచుచున్నాను. నా సేవా కిరీటములో మీరే ముత్యములుగా ప్రకాశించెదరు. నా కిరీటములో మీరే నక్షత్రములుగా మెరియుదురు.

10గతించిన కాలములో ఏడు ముద్రలు, సంఘ కాలముల గూర్చి మీకు చెప్పాను. జరిగిన విషయములు తెలియ చేశాను. ఈ ఉదయూన చాలా ప్రాముఖ్య అంశము వున్నది. అది చాలా దీవెనకరమయినది. మీకును అది నాకు సహాయపడిన సహాయపడును. నేను పొందిన ప్రేరణను బట్టి దానిని మీకు ఇవ్వగలిగిన ఎడల, అది చాలా అద్భుతముగా యుండును, కాని ఆ పనిని దేవుడే చేయవలెను.

11ఎక్కడ ఏమి జరుగుచున్నదో నేను మీకు చెప్పుచునే యున్నాను. ఈ జరుగుచున్న సంగతులను మనము చూచుచున్నాము.

ఈ ఉదయకాలమున నేను "పరలోక పెండ్లి కుమారుడు మరియు భూలోక పెండ్లి కుమార్తె యొక్క భవిష్య గృహము" అను అంశము మీద మాట్లాడగోరుచున్నాను": వారు అక్కడే జీవించబోవుచున్నారు. దేవుని యొక్క ఆ గొప్ప సంకల్పములో దేవుని కృపచేత మనందరము భాగమై యున్నాము.

12మీరు నాతో ఏకీభవించుదురని నమ్ముచున్నాను. మీ బైబిల్సు, పెన్సిల్సు మొదలగునవి తీసికొనండి, ఎందుకనగా నేను చాలా లేఖనములను ప్రస్తావించెదను గనుక నాతో పాటు చూడండి. తరువాత రోగులకు ప్రార్ధించెదను. నేనా విధంగా వాగ్దానము చేశాను. బొత్తిగా ఆశలేని వారికి, బలములేని వారికి గత కొద్ది సమయము గదిలో ప్రార్ధించాము. ప్రభుని చిత్తమయితే పదహారున మరో ఆరాధన ఏర్పాటు చేయుదును. అప్పుడు కేవలము రోగులకు ప్రార్ధించెదను.

13ఇప్పుడు నాకు విరామము ఆరంభమగును; గత జనవరి నుండి నేను ప్రయాణము చేయుచునే యున్నాను. మరల ఇప్పుడు ఇక్కడికి వచ్చాను. (ఉదయాన నా కుటుంబమును టుసాన్కు తీసికొని వెళ్ళెదను). నేను తిరిగి వచ్చి ఇక్కడ (కెంటాకీలో) కొందరు నా స్నేహితులతో సమయమును గడుపుదును. కొన్ని వారములు లేదా ఏడెనిమిది లేదా పది దినములు వేటాడుదును మరియు ఉడుతల వేట. ప్రభువు నన్ను నడిపించునట్లు నడచుదును.

ఎక్కడికి వెళ్ళవలెనో నాకెన్నడూ తెలియదు. మనకది తెలియదు, ఎందుకనగా అది దేవుని చేతులలో యున్నది. దేవుడు మాత్రమే ఎరుగును.

14ఈ గొప్ప అంశమును నేను చెప్పుటకు కొన్ని వారములు కావలెను. (ఎందుకనగా చాలా సంగతులు చెప్పవలెను) నేను కొంత నోట్స్ వ్రాసియుంచాను. అందులోని ప్రముఖమైన అంశములను అధ్యయనము నిమిత్తము చెప్పెదను.

ప్రభుని చిత్తమయితే అక్టోబరులో లేదా ఆయన ఏర్పాటును బట్టి కొన్ని దినములు వరుసగా కూటములు పెట్టి ప్రకటన 12వ అధ్యాయమును దీనితో కూడా ముడివేయుటకు చెప్పుదును. (ఎప్పుడో నాకు తెలియదు) ఆది గొప్ప కార్యమని నమ్ముచున్నాను. ఆయన ఎట్లు చేసెనో చూచుట గొప్ప కార్యము.

15ఎప్పటి వలెనె ఈ ఉదయాన కూడా నా స్నేహితులందరినీ ఇక్కడ గుర్తించవలెనని చూచుదును, అది నేనెట్లు చేయగలను?

"నా మంచి స్నేహితుడు డాక్టర్ లీవైల్ మరియు అతని భార్య మరియు కుమార్తె ఇక్కడ కూర్చొని యున్నారు; బ్రదర్ రాయ్ బోర్డర్స్; బ్రదర్ రడెల్; బ్రదర్ బీలర్; బ్రదర్ పాల్మెర్; బ్రదర్ జాక్సన్, ఇంకా ఆయా ప్రాంతముల నుండి వచ్చిన ప్రియ సోదరులు ఇచ్చట యున్నారు. బ్రదర్ అంతోనీ మిలానో ఆర్కన్సాన్ నుండి వచ్చియున్నాడు. (ఎటు చూచినా ఎవరో ఒకరు కనబడుచున్నారు) బ్రదర్ జాన్, బ్రదర్ ఎరల్ మార్టిన్, బ్రదర్ బ్లయర్, ఇంకా చాలా మంది ఉన్నారు. (వారి పేర్లు రావు.) నేను దేవుని వాక్యము బోధించుచుండగా ఇంతమంది వినుటకు కూడినందుకు సంతోషించుచున్నాను. వారందరూ యోధులు, నిజంగా దేవుని ప్రజలు.

16ఈ చిన్న సంఘము బట్టి వందనములు చెల్లించుచున్నాను. ప్రజల కొరకు అయిదు ద్వారములు తెరువబడియున్నవి. ఇక్కడ ఆత్మ నింపుదల కలిగిన నలుగురురు డీకన్లు వున్నారు. ఆత్మ నింపుదల కలిగిన నలుగురు ట్రస్టీలున్నారు. ప్రతి గుమ్మము నొద్ద ఇద్దరిద్దరుగా వున్నారు. ఇద్దరు సంఘ కాపరుల కొరకు ముందు రెండు ద్వారములున్నవి. మీరు మాతో ఉండుట సంతోషము. దీనిని బట్టి దేవునికి వందనములు. ఆయన సదా మిమ్మును దీవించును గాక.

MATT 24:35•

MARK 13:31•

MARK 14:49•

LUKE 21:33

 

17ఇప్పుడు, II పేతురు 3వ ఆధ్యాయము నుండి, మరియు ప్రకటన గ్రంధము 21 నుండి చదువుచుండగా లేచి నిలబడుదుము.

ఓ ప్రభువా, నీ వాక్యము చదువుటను బట్టి మా హృదయములను ఆనందముతో నింపుము, భూమ్యాకాశములు గతించును గాని నా మాటలేమాత్రమును గతించవని యేసు చెప్పిన దానిని ఎరుగుదువు. లేఖనమంతయూ నెరవేర్చబడ వలెననియు ఆయన చెప్పెను.

ఈ సంగతులు చదువుచుండగా, మేము ఏ ఘడియలో జీవించుచున్నామో గ్రహించు మనస్సు దయచేయుము. గ్రంధకర్తయగు యేసు నామమున అడుగుచున్నాము. ఆమేన్.

2PET 3:1-18

 

18II పేతురు, ప్రియులారా, ఈ రెండవ పత్రిక మికిప్పుడు వ్రాయుచున్నాను;

పరిశుద్ద ప్రవక్తల చేత పూర్వమందు పలుకబడిన మాటలను, ప్రభువైన రక్షకుడు మీ అపోస్తలుల ద్వారా ఇచ్చిన ఆజ్ఞను మీరు జ్ఞాపకము చేసికొనవలెనను విషయమును మీకు జ్ఞాపకము చేసి నిర్మలమైన మీ మనస్సులను రేపుచున్నాను.

అంత్యదినములలో అపహాసకులు అపహసించుచు వచ్చి తమ స్వకీయ దురాశల చొప్పున నడుచుకొనుచు,

ఆయన రాకడను గూర్చిన వాగ్దానమేమాయెను? [ఈ నాస్తిక స్త్రీ అలాగే యున్నది…] పితరులు నిద్రించినది మొదలుకొని సమస్తమును సృష్టి ఆరంభమున నున్నట్టే నిలిచియున్నదే అని చెప్పుదురని మొదట మీరు తెలిసికొనవలెను.

ఏలయనగా పూర్వము నుండియు ఆకాశముండెనని, నీళ్ళలో నుండియు, నీళ్ళ వలనను సమకూర్చబడిన భూమియు దేవుని వాక్యము వలన కలిగెననియు వారు బుద్ది పూర్వకముగా మరతురు.

ఆ నీళ్ళ వలన అప్పుడున్న లోకము నీటి వరదలో మునిగి నశించెను.

అయితే ఇప్పుడున్న ఆకాశమును, భూమియు భక్తిహీనుల తీర్పును, నాశనమును జరుగు దినము వరకు అగ్ని కొరకు నిలువ చేయబడినవై అదే వాక్యము వలన భద్రము చేయబడి యున్నవి.

ప్రియులారా, ఒక సంగతి మరచిపోకుడి, ఏమనగా ప్రభువు దృష్టికి ఒక దినము - వెయ్యి సంవత్సరముల వలెను, వెయ్యి సంవత్సరమలు - ఒక దినము వలెను ఉన్నవి.

కొందరు ఆలస్యమని యెంచుకొనునట్లు ప్రభువు తన వాగ్దానమును గూర్చి ఆలస్యము చేయువాడు కాడు గాని ఎవడును నశింపవలెనని ఇచ్చయింపక, అందరు మారుమనస్సు పొందవలెనని కోరుచూ మీ యెడల దీర్ఘశాంతము గలవాడైయున్నాడు.

అయితే ప్రభువు దినము దొంగ వచ్చినట్లు వచ్చును. ఆ దినమున ఆకాశములు మహా ధ్వనితో గతించిపోవును, పంచ భూతములు మిక్కటమైన వేంద్రముతో లయమైపోవును. భూమియు దాని మీద నున్న కృత్యములును కాలిపోవును.

ఇవన్నియు ఇట్లు లయమై పోవునవి గనుక ఆకాశములు రవులు కొని లయమై పోవునట్టియు,

పంచ భూతములు మహావేంద్రముతో కరిగిపోవునట్టియు దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో ఆపేక్షించుచూ మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోను భక్తితోను ఎంతో జాగ్రత్తగలవారై యుండవలెను.

అయినను మనమాయన వాగ్దానమును బట్టి క్రొత్త ఆకాశముల కొరకును క్రొత్త భూమి కొరకును కనిపెట్టుచున్నాము. వాటి యందు నీతి నివసించును.

ప్రియులారా, వీటి కొరకు మిరు కనిపెట్టు వారు గనుక శాంతము గలవారై ఆయన దృష్టికి నిష్కళంకులు గాను, నిందారహితులు గాను కనబడునట్లు జాగ్రత్త పడుడి.

మరియు మన ప్రభువు యొక్క దీర్ఘశాంతము రక్షణార్ధమైనది ఎంచుకొనుడి. ఆలాగు మన ప్రియ సహోదరుడైన పౌలు కూడా తనకు అనుగ్రహింపబడిన జ్ఞానము చొప్పున మీకు వ్రాసియున్నాడు.

వీటిని గూర్చి తన పత్రికలన్నిటిలోను బోధించుచున్నాడు. అయితే వాటిలో కొన్ని సంగతులు గ్రహించుటకు కష్టమైనవి. వీటిని విద్యా విహీనులును, అస్థిరులైన వారును, తక్కిన లేఖనములను ఆపార్ధము చేసికొనుట్టు తమ స్వకీయ నాశనమునకు అపార్ధము చేయుదురు.

ప్రియులారా, మీరు ఈ సంగతులు ముందుగా తెలిసికొనియున్నారు. గనుక మీరు నీతి విరోధుల తప్పు బోధ వలన తొలగింపబడి, మీకు కలిగిన స్థిర మనస్సును నిడిచి పడిపోకుండా కాచుకొని యుండుడి.

మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు అనుగ్రహించు కృప యందును జ్ఞానమందును అభివృద్ధి పొందుడి. ఆయనకు ఇప్పుడును, యుగాంత దినము వరకును మహిమ కలుగును గాక. ఆమేన్.

REV 21:1-7

 

19ఇప్పుడు ప్రకటన గ్రంధము 21 వఆధ్యాయము నుండి చదువుచున్నాను.

అంతట నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచితిని. మొదటి ఆకాశమును మొదటి భూమియు గతించిపోయెను. సముద్రమును ఇక లేదు.

మరియు నేను నూతనమైన యెరూషలేము అను ఆ పరిశుద్ద పట్టణము తన భర్త కొరకు ఆలంకరింపబడిన పెండ్లి కుమార్తె వలె సిద్దపడి పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగి వచ్చుట చూచితిని.

అప్పుడు - ఇదిగో దేవుని నివాసము మనుష్యులతో కూడా ఉన్నది. ఆయన వారితో కాపురముండును. వారాయన ప్రజలై యుందురు. దేవుడు తానే వారి దేవుడై యుండి వారికి తోడైయుండును.

ఆయన వారి కన్నుల ప్రతి బాష్పబిందువును తుడిచివేయును. మరణము ఇక ఉండదు. దుఃఖమైనను, ఏడ్పయినను, వేదనయైనను ఇక ఉండదు. మొదటి సంగతులు గతించిపోయెనని సింహాసనములో నుండి వచ్చిన గొప్ప స్వరము చెప్పుట వింటిని.

అప్పుడు సింహాసనాసీనుడైయున్నవాడు - ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నానని చెప్పెను. మరియు - ఈ మాటలు నమ్మకమును, నిజమునై యున్నవి గనుక వ్రాయుమని ఆయన నాతో చెప్పుచున్నాడు.

మరియు నాతో ఇట్లనెను, సమాప్తమైనవి. నేనే ఆల్బాయు, ఓమెగయు, అనగా - ఆదియు అంతమును అయి యున్నవాడను. దప్పిగొను వానికి జీవజలముల బుగ్గలోని జలమును నేను ఉచితముగా అనుగ్రహింతును.

జయించువాడు వీటిని స్వతంత్రించుకొనును. నేనతనికి దేవుడనైయుందును. అతడు నాకు కుమారుడై యుండును.

మరల మనము ప్రార్ధించుదము.

20ప్రభువైన యేసూ, మేము సమీపించుచున్న ఈ ఘడియను గూర్చి యేసు మరియు అపోస్తులులు అంత ఖచ్చితముగా హెచ్చరించిరి; ఓ ప్రభువా, మాకు నడిపింపు ఇమ్ము, సరిగా ఎట్లు సమీపించవలెనో చూపించుము, ఎందుకనగా ఆ దినము వచ్చుచున్నదని మాకు తెలియును. వాక్యము నెరవేరుట తప్పదు. ఆలాగే జరుగును. ప్రభువా, నీ వాక్యమును అధ్యయనము చేయుచుండగా మరల నీ కృప కొరకు అడుగుచున్నాము. ప్రభువా, మాతో యుండి, దానిని మాకు విప్పుము, యేసు నామములో దీనిని అడుగుచున్నాము. ఆమెన్.

మీరు కూర్చోవచ్చును.

21ప్రధాన ఆడిటోరియంలోని లైట్లను ఆర్పి ఈ వేదిక మీద లైట్లు వెలుగనిచ్చు ఏర్పాటున్నదేమో చూడండి. ఒక రాత్రి ట్రాన్స్ ఫార్మర్ను మనము ఎక్కువగా కరెంటు ఖర్చు చేసి కాల్చివేశాము. దీనిని కస్టోడియన్ మన కొరకు చేసిన యెడల వందనములు చెల్లించెదము. ప్రధాన హాలు లోని లైట్లు ఆర్పివేయండి. అప్పుడు మీకు వ్రాయుటకు చక్కగా యుండును.

22ఇప్పుడు, మరల అంశమును ప్రకటించుచున్నాను. "భూలోక పెండ్లి కుమార్తె మరియు పరలోక పెండ్లి కుమారుని యొక్క భవిష్య గృహము."

చాలా వేడిగా యున్నది. గనుక దీనిని నేను తీసివేయవలసియున్నది. (సహెూ, బ్రెన్హాం తన కోటును తీసివేసిరి - సంపా) ఈలాను చేయట నా భార్యకు ఇష్టముండదని నేనరుగుదును. (కోటు తీసివేయుట) కాని ఇక్కడ చాలా వేడిగా యున్నది. అక్కడున్న వారికి గాలి వచ్చుచున్నది గాని ఇచ్చటకు వచ్చుట లేదు.

23గతంలో మనము ఏడు ముద్రలు, ఏడు సంఘకాలములు గూర్చి చదివి యున్నాము. వాటిని గ్రంధరూపములో తీసికొని వచ్చుటకు సహో. లీవైల్ తదితరులు నమ్మకంగా పనిచేయుచున్నారు.

24మనము చూచుచున్న ఈ మర్మయుక్త క్రియలన్నియూ నెరవేరుట ఎరుగుదుము. దీనిని బట్టి ఏ ఘడియలో, ఏ స్థానములో మనము జీవించుచున్నామో అర్థమగుచున్నది. చెప్పబడినది ఏమిటో, ఏ వాగ్దానము నెరవేరనైయున్నదో, ఏమి జరిగినదో అను దాని గూర్చి నిజంగా కూర్చొని పరీక్షించు వారెవరునూ లేరు. అవన్నియూ నెరవేరినవని మాత్రము తప్పక చెప్పగలరు. దేవుడు తాను చెప్పినదానిని తప్పక నెరవేర్చును; అక్షరాలా ఆయన అలాగే చేసెను.

25ఇప్పుడు, ఏ సమయమున ప్రభువైన యేసు ప్రత్యక్షమగునో అని నాకు దీనిని బట్టి ఆలోచన కలుగుచున్నది. అది మంచిది. దీని గూర్చి మాట్లాడుకొనుటకు పరిశుద్దాత్మ చూచి ఆనందించును. రెండు మూడుసార్లు మరల దీని గూర్చి చెప్పుకొందము, ఎందుకనగా దీనినంతటిని గూర్చి చెప్పుటకు చాలినంత సమయము లేదు. ఒకరికి చిన్న అభ్యంతరమును కలిగించిన అంశమును విశదంగా చెప్పవలెనన్నచో సమయము కావలెను. ఆ తరువాత అంశమును విశదంగా చెప్పవలెనన్నచో సమయము కావలెను. ఆ తరువాత అంశము తరువాత బోధించవలెను. ప్రభుని చిత్తమయితే, ప్రకటన 12వ అధ్యాయమును వచ్చేసారి బోధించుకొందము. అది ప్రభుని రాకకు, బూరల అంతమునకు మధ్య యున్నది. సాతాను ఎవరో, ఏమి చేసెనో, వాడెక్కడి నుండి వచ్చెనో, వాడి ఉద్దేశ్యమేమి వాడికిచ్చిన మహా సౌందర్యమే వాడి పతనమునకు ఎట్లు కారణమైనదో చెప్పెదను, వాడి అందమే వాడిని మోసపరచెను.

26సర్ప సంతానము అసాధ్యమని ఎవరూ అప్పుడు చెప్పలేరు. మామూలు అవగాహన గల వారెవరైనా గాని దానిని గుర్తించగలరు. ఒక పిల్లవాడు దానిని చూడగలడు. దాని గూర్చి తరువాత చూద్దాం.

REV 21:1

 

27ఇక్కడ రెండు వాక్యభాగములను చదివాం. II పేతురు 3వ అధ్యాయమును ప్రకటన 21తో పోల్చి చూచినప్పుడు ఆ రెండునూ ఒకే అంశమును గూర్చి పలుకుచున్నవి. పేతురు వలె యోహాను దానిని వ్రాయలేదు. చూచారా? పెండ్లి కుమార్తె యొక్క ఈ గొప్ప గృహము ఈ భూమిమీదనే యుండునని మనకు అర్థమగుచున్నది.

ప్రకటన 21వ అధ్యాయములో ప్రవక్త ఇట్లు చెప్పెను, "క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని నేను చూచితిని." ఒక సర్వనాశనము వచ్చుచున్నట్లు కనిపించుచున్నది.

28నా వర్తమానమును ఎప్పుడూ ప్రార్ధనలోనే కనుగొందును. నేను ప్రార్ధనలో కూర్చొనియుండగా అది బయలుపడును. కొద్ది నిముషములు దానిని నేను కనిపెట్టి చూచెదను. అది సరియైనదైనచో దానిని హత్తుకొనవలెననిపించును. కొన్నిసార్లయితే దర్శనముగా వచ్చువరకు వేచియుందును. అది దేవుని యొద్ద నుండి వచ్చినదని నేను సంతృప్తి చెందునప్పుడు వాక్యము యొద్దకు వెళ్ళెదను. ప్రతి ఆత్మీయ కార్యమును అదే స్థిరపరచును, ఎందుకనగా బైబిలు యేసుక్రీస్తు యొక్క సంపూర్ణ ప్రత్యక్షత. చూచారా? అది ఆయన శరీరము.

సరిగా కనబడని అంశమును వాక్యపూర్వకముగా నేను కనుగొనినప్పుడు, ఆశ్చర్యపడుదును. నేను మరల ప్రార్థనకు వెళ్ళెదను. అది మరలా వచ్చును. అప్పుడు మరలా నేను వాక్యముతో పరీక్షించెదను.

JOHN 14:2

 

29మన బైబిలు ఆంగ్లములో వ్రాయబడెను. ఇంగ్లీషులో ప్రతీసారి మాటలు మారుచుండును. ఉదాహరణకు యోహాను 14ను చూడండి. "నా తండ్రి ఇంట చాల భవంతులున్నవి" భవంతనగా ఇల్లు, అప్పుడు మీరు హెబ్రీ లేదా గ్రీకు బాష యొద్దకు వెళ్ళవలెను (ఆ మొదటి తర్జుమా) అక్కడ ఇట్లున్నది. (నా తండ్రి రాజ్యములో ఎన్నో రాజసౌధములున్నవి.) కింగ్ జేమ్స్ అనువాదము చేయబడిన కాలమును గమనించండి. ఆ కాలములో రాజ్యమును ఇల్లుగా ఇంగ్లీషులో పిలిచెడివారు. రాజు తన ప్రతినిధుల మీద తండ్రిగా యున్నాడు. అందుకే వారిట్లు తర్జుమా చేసిరి. "నా తండ్రి ఇంట అనేక నివాసములు గలవు." చూచారా? మీరు ఆ మాటలను వేటాడి కనుగొనవలెను.

JOHN 14:2

 

30ఈ వేదిక మీద నేను సూటిగా వాక్యమునే బోధించితిని గాని మరి దేనినీ బోధించలేదని ఈ ఉదయమున చెప్పుచున్నాను. ఆ విధంగానే సర్పసంతానము ఇంకా ఆయా అంశములన్నియు వచ్చినవి, చూసారా.

"నా తండ్రి ఇంట అనేక నివాసములు గలవు" అని ఒకడు చదువుకొంటూ వెళ్ళును. నీవు ప్రార్ధించి చదువుము. నీవు కంగారు చెందవు. ప్రార్ధించుట మానవద్దు, అది దేవుని నుండి వచ్చినదైన యెడల దేవుడు తప్పక దానిని సరిచేయును.

REV 21:1,2

 

31యోహాను రాబోవు మార్పును గూర్చి చూసెను. పేతురు దానిని చక్కగా వివరించెను. యోహాను ఇట్లనెను, "క్రొత్త ఆకాశము క్రొత్త భూమిని నేను చూచితిని. మొదటి ఆకాశము, మొదటి భూమి గతించెను. సముద్రమును ఇకను లేదు. యోహానను నేను తన భర్త కొరకు అలంకరింపబడిన పెండ్లి కుమార్తె వలె సిద్దపడి దేవుని యొద్ద నుండి పరలోకము, అనగా పరిశుద్ద పట్టణము దిగి వచ్చుట చూచితిని." ఇప్పుడు మనము II పేతురు చదివినచో, ఇదెట్లు జరుగునో వివరించెను. యోహాను చెప్పినది మీకిట్లు అర్థమగును. "మొదటి భూమ్యాకాశములు గతించినవి." నాశనమయి పోయినవి. చూచారా? అది చాలా వింతగా తోచును. అందుకే నేను గతించిపోవుట అను పదమును పరిశీలించాను. ఈ అపోస్తలులు మరియు ప్రవక్తలు ఇద్దరూ ఒకే దానిని చెప్పుచున్నారు.

ISA 65:17-25

 

32యెషయా 65:17 లో వెయ్యేండ్లపాలన గూర్చి చెప్పబడినది. (వాక్యములు వ్రాసికొనండి) యెషయా దానిని గూర్చి పలికెను. (దేవుని జనులకు వెయ్యెండ్ల విశ్రాంతి) ముందున్నవి గతించెను. ఇండ్లు కట్టి ఎట్లు నివసించెదరో యెషయా 65 చదువుదము. కొద్ది నిముషముల పాటు యెషయా 65:17 చూద్దాం.

ఇదిగో నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని సృజించుచున్నాను:

తన ప్రవచనములో పూర్తి బైబిలును వ్రాసిన ప్రవక్తలలో యెషయా ఒకడు. అతడు సృష్టితో ప్రారంభించెను. అతని గ్రంధ మధ్యలో (40వ అధ్యాయము) బాప్తిస్మమిచ్చు యొహాను వచ్చును. (క్రొత్త నిబంధన) వేయ్యెండ్లపాలనతో గ్రంధము ముగియును. బైబిలులో అరవై-ఆరు గ్రంధములున్నవి. యెషయాలో అరవై-ఆరు అధ్యాయములున్నవి. అతడు పూర్తి వాఖ్యానమును వ్రాసెను. అధ్యాయములో ఇతడు వెయ్యేండ్ల పాలన గూర్చి మాట్లాడుచున్నాడు. ఎంత చక్కగా యున్నదో గమనించండి!

"ఇదిగో నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని సృజించుచున్నాను. మునుపటివి మరువబడును. జ్ఞాపకమునకు రావు." (గతించును)

నేను సృజించుచున్నదాని గూర్చి మిరు ఎల్లప్పుడు హర్షించి ఆనందించుడి. నిశ్చయముగా నేను యెరూషలేమును ఆనందకరమైన స్థలము గాను, ఆమె ప్రజలను హర్షించు వారి గాను సృజించుచున్నాను.

నేను యెరూషలేమును గూర్చి ఆనందించెదను. నా జనులకు గూర్చి హర్షించెదను. రోదన ధ్వనియు, విలాప ధ్వనియు దానిలో ఇకను వినబడవు.

అక్కడ ఇకను కొద్ది దినములే బ్రదుకు శిశువులుండరు. కాలము నిండని ముసలి వారుండరు. బాలురు నూరు సంవత్సరములు వయస్సు గలవారై చనిపోవుదురు. పాపాత్ముడై శాపగ్రస్తుడగు వాడు సహితము నూరు సంవత్సరములు బ్రదుకును.

జనులు ఇండ్లు కట్టుకొని కాపురముందురు. ద్రాక్షాతోటలు నాటించుకొని వాటి ఫలముల ననుభవింతురు.

వారు కట్టుకొన్న ఇండ్లలో వేరొకరు కాపురముండరు. వారు నాటుకొన్న వాటిని వేరొకరు అనుభవింపరు. [అనగా, నీ క్షేత్రము నీ సంతానము దగును.] నా జనుల ఆయుష్యము వృక్షాయుష్యమంత యగును. [నేను ఏర్పరచుకొనిన వారు, తాము చేసికొనిన దాని ఫలమును పూర్తిగా అనుభవించెదరు. వారే నాటి అక్కడ జీవించెదరు. వారిది నిత్యజీవము] వారు వృధాగా ప్రయాసపడరు.

ఆకస్మికముగా కలుగు అపాయము నొందుటకై పిల్లలను కనరు. వారు యెహూవా చేత ఆశీర్వదింపబడిన వారగుదురు. వారి సంతానపు వారు వారి యొద్దనే యుందురు. (దీనిని గూర్చి తరువాత చెప్పెదనని గుర్తించండి).

వారికీలాగున జరుగును. వారు వేడుకొనకమునుపు నేను ఉత్తరమిచ్చెదను. వారు మనవి చేయుచుండగా నేను ఆలకించెదను.

తోడేళ్ళను గొర్రెపిల్లలను కలిసి మేయును. సింహము ఎద్దు వలె గడ్డి తినును. సర్పమునకు మన్ను ఆహారమగును. నా పరిశుధ్ర పర్వతములలో అవి హానియైనను, నాశనమైనను చేయకుందును అని యెహోవా సెలవిచ్చుచున్నాడు.

ISA 65:17•

REV 21:1

 

33ఈ మహిమకరమగు దినము వచ్చునని పూర్వదినములలోనే వారు చూచిరి. ఈ గొప్ప ప్రవక్తలు, భోధకులు బైబిలులో ఎంతో మంచి వాగ్దానములను వ్రాసిరి!

ఈ వచనమును బట్టి భూగ్రహమే లయమగునని ఎవరైన తలంచుట జరుగును. "నేను క్రొత్త భూమిని క్రొత్త ఆకాశమును సృజించుచున్నాను." చూచారా? — అనగా ముందున్న భూమ్యాకాశములు గతించెను. పూర్తిగా లయమైనవి. కాని జాగ్రత్తగా చదివినచో, పరిశుద్దాత్మ సహాయము వలన దీనిలోని సత్యమును మనము గమనించగలము.

34భూమి మీద నున్న వాతావరణములు మరియు పాపము మాత్రమే నాశనమగును. ఇప్పుడు, ఆకాశములు అనగా మనపైనున్న వాతావరణములని మనకు తెలియును.

35అదేమీ చేయును?

ఈ ముండ్లు, వ్యాధి, మరణము, రాజకీయము, పాపపు స్త్రీ పురుషులు, దురాత్మలు మున్నగునవి గతించును. నాశనమగును. ఆ విధముగా జరుగవలెను, ఎందుకనగా ఇక్కడ మనము జీవించబోవుచున్నాము. బైబిలు ద్వారా దానిని నిరూపించగలము. ఇక్కడే మనము జీవించుదుము.

ఇప్పుడు చూడండి. ముండ్లు, క్రిములు, వ్యాధులు మున్నగునవన్నియూ పూర్తిగా నిర్మూలింపబడును. ఇప్పుడు భూమి మీద మానవ-నిర్మిత పద్దతులు, రాజకీయము, పాపము, సమస్త దురాత్మలు ఉన్నవి. ప్రపంచము కలుషితమైపోయినది. పైనున్న ఆకాశములు దురాత్మల స్థావరములుగా నున్నవి. దీనిని మనము లోతుగా పరిశీలించుదము.

ఇప్పుడున్న వాతావరణము లేదా ఆకాశము, భూమి మీద ఇవన్నీ యున్నవి. కొన్ని అందుకొరకు అని నిర్మింపబడలేదు. పాపము వలన అలాగు మారెను. ఇది సృష్టికర్తయగు దేవుని ద్వారా చేయబడినది. ఇప్పుడున్న మన శరీరములన్నియూ భూమిని ధరించుకొని యున్నవి, ఎందుకనగా దేవుడు మట్టితో సృజించెను. మనము తిరిగి మన్నుగా మారెదము. దేవుని సృష్టించినప్పుడే ఇది ఇట్లు జరిగెను. మీరు ఆయన ఆలోచనలో, ఆయనలో, గొప్ప నిత్యత్వములో యున్నారు. ఆయన యోచనలోనే యున్నారు.

దీనంతటికి పాపమే కారణము. దేవుడు ఈ కాలములో తన వస్తువులన్నింటినీ పరలోక పెండ్లి కుమారుడు మరియు భూలోక పెండ్లి కుమార్తె యొక్క భవిష్య గృహము కూర్చుకొనుచున్నాడు.

36సాతాను ఇంకా ఇచ్చటే యున్నది. అందువల్లనే ఇవన్నియూ జరుగుచున్నవి. వాడు, వాని దుష్టశక్తులు ఇంకా ఇక్కడే యున్నవి.

చూడండి, అందుకే ఇప్పుడు భూమి మురికితో నిండియున్నది. రక్తపాతములు, యుద్దములు, రాజకీయములు, పాపము, వ్యభిచారము నానా దుర్నీతి ఇక్కడ చోటు చేసికొన్నవి — ఎందుకనగా ఈ భూమికి, వాతావరణమునకు సాతానే అధికారి.

"వాతావరణమునకు కూడానా?" అని మీరందురేమో,

అవునండీ!

37మనపై దేవుని ఎదుట నేరారోపణ చేసే దయ్యములతో భూమ్యాకాశములు ఇప్పుడు చెడిపోయియున్నవి. "వారది చేశారు" అని వాడు వ్రేలు చూపి నేరారోపణ చేయుచుండగా, యేసు మన కొరకు మధ్యవర్తిత్వము జరుపుచున్నాడు. (చూచారా?) రక్తము ఇంకా మనలను కప్పుచున్నది. ఆయన ముందే చూచిన ఏర్పాటు చేయబడిన వారిని విడిపించుటకు ఆయన వచ్చెను. నేడు అందుకే ఇంత చెడుతనము భూమి మీద యున్నది.

GEN 1:1,2•

MATT 12:32•

LUKE 18:30•

GAL 1:4•

EPH 1:21•

TIT 2:12•

HEB 6:5•

2PET 2:5,6

 

38II పేతురు 2వ అధ్యాయము 5 మరియు 6వ వచనములలో అపోస్తులుడు భూమి యొక్క మూడు దశలను ప్రస్తావించెను. (నా యొద్ద వ్రాసియున్నవి), దాని యొక్క మూడు దశలున్నవి. అతడెట్లు వివరించెనో చూడండి. పాత ప్రపంచము నీటిలో నుండి బయటకు తీయబడినది. అది జలప్రళయమునకు ముందున్న ప్రపంచము.

ఇప్పుడు మనము (ప్రపంచము) ఇక్కడ జీవించుచున్నాము. పాత ప్రపంచము నీటిలో నుండి రక్షించబడినది. (ఆదికాండము 1:1), ఈ ప్రస్తుత ప్రపంచము ఆదే. తరువాత మరియొక దానిని అతడు చెప్పెను. అది రానున్న ప్రపంచము, క్రొత్త ప్రపంచము — మూడు ప్రపంచములు, ప్రపంచము యొక్క మూడు దశలు చెప్పబడెను.

MAL 3:6

 

39దేవుడు తన విమోచనా పధకము ఎట్లు మనకు విశదపరచెనో చూడండి. ఓ, దీనిని చూచినప్పుడు నా ఆత్మ హర్షించుచున్నది. ఆయన తన విమోచనా పధకమును ఇక్కడ మనకెట్లు తేటతెల్లము చేసెనో చూడండి. మనము మన స్వనేత్రములతో దేవుడు ప్రపంచమును విమోచించుటకు చేసిన దానితో పోల్చి చూడండి. ఆయన తన జనులను విమోచించుటకును అదే చేసెను. ఎందుకనగా మారని దేవుడు తన పధకములు గాని మరేవీ గాని ఎన్నడూ మార్చడు. ఎంత మహిమకరమగు సంగతి!

40ఆయన తన యొద్దకు ఎట్లు మనలను నడిపించెనో చూడండి. మూడు దశల కృపను ఇచ్చెను. ఆయన లోకమును మూడు దశలుగా నడిపించినట్లే ఇది యున్నది. ప్రపంచము మూడు దశల శుద్దీకరణమును పొందిన తరువాత ఆయన దీని పైన వచ్చును. ఆ విధంగానే ఆయన మూడు దశల కృపలోను వచ్చును. ఆదియందు అలాగే నాకు నేర్పించబడినది; అప్పుడు నుండియు నేనెన్నడూ మారలేదు. అది దేవుని వాక్యము!

41మీరు ఈ మూడులను, ఏడులను, పన్నెండులను పరీక్షించుకొనవలెను. బైబిలు యొక్క సంఖ్యలు పరిపూర్ణము. ఆలాగు లేనియెడల పూర్తిగా నీవు దానిని అర్ధము చేసికొలేవు. నీవు అర్ధము చేసికోలేనియెడల ప్రార్ధించుము. అది చక్కగా అర్థమగును. దేవుడు మూడులో పరిపూర్ణుడైయున్నాడు. చూడండి!

MAL 3:6

 

42పాత ప్రపంచము. (జల ప్రళయమునకు ముందున్నది) ఇప్పుడున్న ప్రపంచము. రాబోవు ప్రపంచము. ఆయన యొక్క రక్షణ పధకము ఎప్పుడును ఒక్కలాగే యున్నది. అదే పద్దతిని ఆయన వాడును. ఆయన ఎన్నడూ మారడు. మలాకీ 3లో ఆయన ఈలాగు పలికెను, "నేను మార్పులేని దేవుడను." ఆయన మొదటి వ్యక్తిని నిర్దోష రక్తము చిందించుట ద్వారా రక్షించినట్లైతే, తరువాత వానిని కూడా ఆలాగే రక్షించవలెను. ఆయన ప్రతివారిని ఆ విధంగానీ రక్షించవలసియున్నాడు. ఒక వ్యక్తిని ఆయన ఏ షరతులతో స్వస్ధపరిచెనో, ఆ షరతులే నేడునూ వర్తించును. యేసు గాని, అపోస్తలులు గాని, ప్రవక్తలు గాని అందరూ ఆ విధంగానే చేసిరి. ఆయన మారడు. మానవులు మారుదురు, కాలములు మారును, యుగము మారును, కాని దేవుడు ఎల్లప్పుడూ ఒకే రీతిగా నిలిచి యుండును — పరిపూర్ణముగా! రోగులకు అదెంత నిరీక్షణను ఇచ్చుచున్నది.

43ఆయన ఒక వ్యక్తిని ఎట్టి షరతుల మీద స్వస్థపరచెనో, అదే షరతుల మీద మరల బాగుచేయును. ఒక వ్యక్తిని తొలిసారి ఆయన ఎట్లు రక్షించెనో, ఆ రీతిగానే ఆ తరువాతను ఆయన రక్షించవలసియున్నాడు. ఆయన ఆ తరువాత వానిని కూడా మొదటిసారి పరిశుద్దాత్మతో ఒక వ్యక్తిని ఎట్లు నింపెనో, అదే రీతిగా నింపును. ఒక వ్యక్తిని సమాధి నుండి మొదటిసారిగా ఆయన ఎట్లు లేపెనో, అదే రీతిగా ఆ తరువాతను ఆయన ఒకనిని లేపును. ఆ సూత్రము మారదు.

MATT 24:35•

MARK 13:31•

MARK 14:49•

LUKE 21:33•

ROM 3:4•

2TIM 3:16

 

44ఆయన ఎన్నడు మారడు.

ఓ! అది నాకెట్టి నిరీక్షణను ఇచ్చుచున్నది! ఏమిటది? ఏదో ఒక మానవ-కల్పిత సిద్దాంతము కాదు. మనుష్యులు ఒక గుంపుగా కూడి ఏదో రూపొందించుట కాదు గాని, ఆయన మారని వాక్యమే అది.

"అది సత్యమా?" అని మీరనవచ్చు.

"ప్రతివాడు అబద్దికుడే. నేను మాత్రమే సత్యవంతుడను. భూమ్యాకాశములు గతించును గాని నా మాట లేమాత్రమును గతించవు" అని ఆయన చెప్పెను.

లేఖనమంతయు దైవావేశము వలన, మేలైనది మరియు లాభకరమైనది. లేఖనమంతయూ నెరవేరునని మరువకుడి. ప్రతి చిన్నది నెరవేరును!

45గమనించండి, దేవుడు దీనిని ఎంతో తేటపరచెను. అది దేవుని యొక్క మహా ప్రేమ దీవెన, ఒక గొప్ప నిశ్చయత, బాలునిగా ఉన్నప్పటి నుండి దీనిని నేను చూచుచున్నాను. (క్రీస్తు మొదట నాతో మాట్లాడిన సమయమది), ఆ కృప యొక్క మూడు దశలను గూర్చి ఇంకా నేను నేర్చుకొనుచూయున్నాను. అది నిజమో కాదో ఇప్పుడు చూడండి.

ACTS 2:38

 

46దేవుని వైపు మారుమనస్సుతో తిరుగుట మొదటి మెట్టు. దాని తరువాత నీటి బాప్తిస్మము. "మారుమనస్సు పొంది యేసుక్రీస్తు నామములో బాప్తిస్మము పొందుడి." చూచారా? నిజమైన మారుమనస్సు నీటి బాప్తిస్మము సూచించును. మన గత పాపము పరిహరించబడును. భవిష్యత్ పాపముతో దానికెట్టి సంబంధము లేదు. "మారుమనస్సు పొంది యేసుక్రీస్తు నామములో బాప్తిస్మము పొందుడి." ఎందుకొరకు? - పాపక్షమాపణ నిమిత్తం, గతపాపము పోవును. భవిష్యత్ పాపముతో దానికెట్టి సంబంధముండదు. నీవు చేసిన పాపము కొట్టివేయబడును.

ఆదాము చేసిన దాని గూర్చి నీవు పశ్చాత్తాప పడలేవు. దానిని నీవు ఎన్నడు చేయలేదు. నీవు చేసినదానకే నీవు క్షమాపణ పొందెదవు. పాత స్వభావము ఇంకా అచ్చట ఉన్నది.

47ఒక్క నిమిషము ఈ బోర్డును (నల్లబల్ల) వాడుదును.

ఇక్కడ మానవ హృదయమున్నది. నేను చిత్రకారుడ్ని కాను, చూడండి ఇది మానవ హృదయము, ఇందులో ఒక పామున్నది. అదే పాపము అనగా పాపము. ఇక్కడ అతని ప్రాణమున్నది, ఇక్కడ పావురమున్నది, అనగా పరిశుద్దాత్మ. ఇది అతని జీవము. అతని యొక్క అసూయ, చెడుతనము, ద్వేషము ఇచ్చటున్నది. దీనివల్లనే ఇదంతా జరుగుచ్పుది. ఇక్కడ ప్రేమ, సంతోషము, దీర్ఘశాంతమున్నది. దీని వలన కలుగు ఫలితములు వేరుగా నున్నవి.

నీవు నీ పాపముల నుండి క్షమించబడితివి. వాటిని ఆయన తీసివేసెను, కాని దానిని చేయించునది ఇంకా అక్కడే యున్నది. ఆ చెడ్డ వేరు ఇంకా అచ్చట యున్నది.

చూడండి,

ACTS 2:38

 

48నీవు మారుమనస్సు పొంది యేసుక్రీస్తు నామములో బాప్తిస్మము పొందితివి. ఆయన నీ పాపములను క్షమించెను.

చూడండి, రెండవదిగా శుద్దీకరణ వచ్చును. మన మనస్సును పరిశుద్దత మీదికి మళ్లించును. సరిగా ఆలోచించినట్లు చేయును. పరిశుద్దత అను గ్రీకు పదమునకు పవిత్రము చేయబడి పనికొరకు ప్రత్యేకించబడుట అను బహుళార్ధము గలదు.

ఆ తరువాత అగ్ని మరియు పరిశుద్దాత్మ బాప్తిస్మము వచ్చును. దేవుడు మనలో నివసించును. దేవుని యొక్క అగ్ని మన హృదయమును పాపము నుండి శుద్దిచేసి, లోపట పరిశుద్దాత్మను ఉంచును. అప్పుడు ఆయన వంటి జీవమునే మనము కలిగియుందుము, ఎందుకనగా మనలో ఆయన జీవమున్నది.

49చూడండి, స్వాభావిక జన్మలో స్త్రీ శిశువును ప్రసవించు ముందుగా నీరు బయటకు వచ్చును. (స్వాభావికమైనది ఆత్మ సంబంధమైన దానికి సాదృశ్యము). మొదట నీరు, తరువాత రక్తము, తరువాత జీవము వచ్చును. ఆ చిన్న శిశువును పట్టుకొని ఊపినప్పుడు కెవ్వుమని ఏడ్చును. నీరు, రక్తము, ప్రాణము.

50ఇప్పుడు, దేవుని రాజ్యములోనికి పుట్టు బిడ్డయు అలాగే యుండును. నీరు, రక్తము, జీవము.

చూడండి, మూడవ దశ - శుద్దీకరణము. మనస్సు హృదయము పవిత్రమగును. పరిశుద్దతవైపు మనస్సు వెళ్ళును.

ఒకడు పాపమును గూర్చి పశ్చాత్తాప పడియు ఇంకను దురాలోచనలు కలిగి యుండవచ్చును. ఆమె చెడ్డ స్త్రీ అయినచో, చెడు తలంపులు వచ్చుచుండుట గమనించును. అతడు త్రాగుబోతు అయినచో, సారాయి వాసన తగిలినప్పుడు మనస్సు అటు లాగును. చూచారా? కానీ పరిశుద్దత పొందినప్పుడు, ఆ వాంఛ అతనిలో నుండి కడిగివేయబడును. ఆ కోరిక అచ్చట లేదు. అయినా ఇంకా అతడు సరికాలేదు. పరిశుద్దాత్మ మరియు అగ్ని బాప్తిస్మము పొందవలెను. శుద్దీకరించబడి, దహించబడి, పవిత్రము చేయబడి — దేవుని పని కొరకు ప్రక్కన పెట్టబడును. శుద్దీకరణ అనగా సేవకొరకు ప్రక్కన యుంచబడుటయే.

51అదెట్లు వచ్చునో గమనించండి. వర్తమానము వచ్చుచున్నది. మార్టిన్ లూధర్ నీతీకరణము; జాన్ వెస్లీ శుద్దీకరణము; పెంతెకొస్తు పరిశుద్దాత్మ బాప్తిస్మము. ఈ వర్తమానములను మించి మరేవీ ఎన్నడూ రావు. మనము అంత్యకాలములో ఉన్నాము. మూడు దశలు, పరిశుద్దాత్మ బాప్తిస్మము హృదయమును శుద్ధిచేయును.

52ఎంత చక్కగా యున్నది! మనము ఏ పద్దతుల గుండా వెళ్లవలెనో ఆయన చూపించుచున్నాడు. ఆయన సంఘమును నీతీకరణము ద్వారా పిలచుచున్నాడు. శుద్దీకరణ ద్వారా ఆయన దానిని పిలచుచున్నాడు. ఆ తరువాత పరిశుద్దాత్మ మరియు అగ్నితో పరలోక పెండ్లి కుమారుడు మరియు భూలోక పెండ్లి కుమార్తె యొక్క భవిష్య గృహము ఆయన నింపును. ఆయనే దానిని ఆ పద్దతుల గుండా తీసుకొని వెళ్ళును. మానవ హృదయములో పరిశుద్దాత్మ నివాసము చేయును. అయితే ఆయన అందులోనికి వచ్చు ముందు ఆ విధానముల గుండా ఒక వ్యక్తి వెళ్లవలెను. ప్రపంచమునకు ఆయన రక్షణ సంకల్పము ఆ విధంగానే యున్నది. (పెండ్లి కుమార్తె అచ్చట నివసించును.)

MATT 4:8,9•

LUKE 4:5,6

 

53జలప్రళయమునకు ముందున్న జగత్తును చూడండి. నోవాహ ఆనాటి పెండ్లి కుమార్తెయై యున్నాడు. ఆయన భూమిని నీటితో నింపెను. అదే నీటి బాప్తిస్మము. పడిపోయిన ప్రపంచమును ఆయన తిరిగి సమకూర్చనైయున్నాడు. పతనమైన ఏదెనును ఆయన మొదటి స్థితకి తీసుకొని రానైయున్నాడు. క్రీస్తు వచ్చి రక్తమును దాని మీద చిందించెను. దానిని ఆయన శుద్ధి చేసెను. చూచారా? ఆ ప్రపంచములో ఇప్పుడు మనముంటున్నాము.

దాని విషయములో దేవునికి ఉన్న పధకమును సాతాను ఎట్లు వమ్ము చేయవలెనని ప్రయత్నించెనో చూడండి. రక్తముతో ఆయన దానిని కొనకుండా చేయవలెనని కొండ మీద సాతాను ఆయనను శోధించి ప్రయత్నము చేసెను.

GEN 23:11,13,16•

MATT 4:8,9•

LUKE 4:5,6

 

54అబ్రాహాముకు వారు భూమిని ఉచితముగా ఇయ్య చూచిరి, కాని అతడు వెండిని ఇచ్చి ఆ పొలమును కొనెను. జనులు అందుకు సాక్షులుగా యుండిరి: "దీనిని నేను కొనియున్నానని నేడు మీరు తెలిసికొనుడి!" చూచారా? దానిని కొనెను. సాతాను తనకిప్పుడు చెందిన రాజ్యమును ఆయనకు ఇయ్యగోరెను. ఒక కానుకగా ఇయ్యగోరెను గాని ఆయన తీసికొనలేదు. ఆలాగు ఇచ్చినప్పుడు సాతానుకు ఇంకా హక్కుండును. కాని దానిని కొనవలసియున్నాడు. ఆమేన్! ఆయనే సంపూర్ణ వాక్యము. ఆయనను ఎవరూ మోసము చేయజాలరు.

ఇప్పుడు అగ్నిబాప్తిస్మము పొందవలెను.

55క్రీస్తు వచ్చి సంఘమును మారుమనస్సు నొద్దకు నడిపించెను. పాపక్షమాపణ నిమిత్తము యేసుక్రీస్తు నామములో బాప్తిస్మము పొందవలెనని చెప్పెను. దేవుని అగ్ని దిగి వచ్చి సంఘమును పవిత్రపరచి మానవ హృదయములో ఉన్న చెత్త మరియు మురికిని దహించివేసి అందులో నివాసముండెను.

56ఇప్పుడు, ప్రపంచము విమోచింపబడవలెనంటే ఆయన పద్దతి మారదు. నీటిలో ముంచి ఆయన దానికి బాప్తిస్మమిచ్చెను. దానిని శుద్ధి చేయుటకు ఆయన తన రక్తము కార్చెను. ఇది ఆయన సొత్తు.

"దానిని నీకిచ్చెదను" అని సాతాను చెప్పెను. లేదండి, నేను దానిని కొనెదను అన్నాడు ఆయన. దీనికి సాక్ష్యమున్నది. ఆయన ఒక గురుతు కొరకు దానిని ఎత్తెను. దానిని ఆయన కొనెను.

REV 20:9,10

 

57ఇప్పుడది అగ్ని బాప్తిస్మము పొందవలెను. దేవుని పరిశుద్దాగ్ని భూమ్యాకాశములను శుద్ధిచేయును. అప్పుడు విమోచింపబడిన వారు సమాధానముతో అందులో నివాసము చేతురు.

పాపము నుండి, వ్యాధి నుండి, క్రిముల నుండి, పాపులబారి నుండి, సాతాను దాని గుంపు బారి నుండి రక్షించుటకు అగ్ని బాప్తిస్మము కావలెనని గమనించండి. వాడు అగ్నిగుండములో పడద్రోయబడును. పరలోకమందున్న దేవుని యొద్దనుండి దేవుడు పరిశుద్దాగ్ని దిగివచ్చును. దానిని దహించి దేవునికి నివాసయోగ్యముగా సిద్దపరచును. రాబోవు నూతన ప్రపంచములో దేవుడు నివాసము చేయును. "దేవుడు? ఆయన మానవ హృదయములో నివసించును," అని మీరనవచ్చు. కాని ఆయన తన పెండ్లి కుమార్తెతో ఏకమై క్రొత్త ప్రపంచములో తన గృహములోనికి వెళ్ళును. ప్రపంచమును, వ్యక్తులను విమోచించుటకు ఆయన పథకము ఒక్కటే.

HEB 10:26

 

58చూడండి, ఆ విధంగా హృదయము శుద్ధి చేయబడవలెను. దేవుడు పరిశుద్దాత్మగా దిగి వచ్చు ముందు నీవు మారుమనస్సు పొందవలెను. క్రీస్తు దిగివచ్చి మానవ హృదయములో నివాసము చేయును. ఆయన నామములో నీటి బాప్తిస్మము పొందినప్పుడు నీవాయనకు చెందినవాడవగుదువు. యేసు రక్తము ద్వారా అది కడుగబడవలెను. అప్పుడు దేవుని యొద్ద నుండి పరిశుద్దాగ్ని మరియు పరిశుద్దాత్మ దిగివచ్చి పాపపు కోరికను, లోకస్వభావమును దహించివేయును. సత్యము విషయమై జ్ఞానము పొందిన తరువాత ఇష్టపూర్వకముగా పాపము చేసిన యెడల మరల మారుమనస్సు పొందుట అసాధ్యమని బైబిలు చెప్పుచున్నది. దేవుని మూలముగా పుట్టినవాడు పాపము చేయడు, చేయజాలడు. పాపము చేయు మార్గమతనికి లేనే లేదు. ఒకే సమయములో పాపిగాను, విమోచన పొందినవానిగాను ఎట్లుండగలడు? ఒకేసారి నేను రెండు చోట్ల ఎట్లుండగలను? ఓ! ఆయన తన రక్తము ద్వారా మనలను విడిపించెను. ఆయన తన ఆత్మ ద్వారా మనలను శుద్ధి చేసెను. ఆయన మనలో నివాసము చేయవచ్చెను. ( అదే సంఘము - శాఖ కాదు).

EPH 2:2

 

59దీనిని జాగ్రత్తగా గమనించండి. జలము ద్వారా అప్పుడు బాప్తిస్మము పొందినది. ఆ తరువాత క్రీస్తు వచ్చి దాని మీద తన రక్తము చిందించెను. దానిని శుద్దిచేసి తనదిగా చేసికొనెను. ఇప్పుడు ప్రపంచ నాశనము మరో విధంగా రానున్నది. "ఆకాశమందలి దుష్టశక్తులకు వాడే ప్రధాని దేవుని నుండి వచ్చే ఆశీర్వచనములను వాడు అడ్డగించుచున్నాడు. ఆకాశము నుండి ఉరుములు, మెరుపులు వచ్చి భూమిని తాకుచున్నవి, మంచు, వర్షము, తుఫాను, సుడిగాలి ప్రతిదియు ఆకాశము నుండియే వచ్చుచున్నది, అది సాతాను — ఆకాశమండలమునకు అధిపతి.

60ఏమి చెలించకుండానే యేసుకు దినిని ఇవ్వవలెనని వాడు ప్రయత్నించెను. అప్పుడు సాతానుకు ఇంకా దానిపై హక్కుండును. (చూచారా?) కాని యేసు తన రక్తము ద్వారా దానిని కొనెను. తన సొత్తుగా తిరిగి దానిని ఆయన చేసికొనెను. ఆయన తన రక్తము ద్వారా మనలను కొనెను. ఆయన సంఘమును కొనెను.

సమస్త క్రిములను, వ్యాధులను, రుగ్మతలను శుద్ధి చేయునది అగ్ని బాప్తిస్మము. ఆత్మీయ సంగతులను కూడా సరిచేయును. (మనకు కూడా ఆ రీతిగానే చేయును) దేవుడు నివాసముండునట్లు దానిని సిద్దపరచును. క్రొత్త యుగమురానున్నది. క్రొత్త భూమి వచ్చును.

ఆయన తన జనులను విడిపించినట్లే దానిని విడిపించును. ఆయన విమోచనా పధకము మారదు. ఎందుకనగా ఆయన మారని దేవుడు, ఆయన పధకము ఎల్లప్పుడూ ఒక్కటిగానే యుండును.

61అన్ని యుగములలో దేవుడు మారనివాడుగా యున్నాడని ఇంతకు ముందే చెప్పాను. అదే రీతిగా ఆయన బయలుపరచును. ఆయన తన మొదటి వర్తమానమును ప్రవక్తయగు నోవహు ద్వారా ముందున్న లోకమునకు తెలియపరచెను.

MATT 7:14•

MATT 24:37•

LUKE 17:26•

1PET 3:20

 

62ఇప్పుడిచ్చట కూర్చొనియున్న ఒక ప్రియ సోదరునితో నిన్న నేను మాట్లాడుచున్నాను. "బ్రెన్హాం సోదరుడా, నీవు చెప్పిన ఒక మాట నన్నెప్పుడూ కుదిపివేయుచున్నది" అన్నాడు.

"ఏమిటది సోదరుడా?" అన్నాను.

"రాబోవు దినములలో చిన్న గుంపు మాత్రమే రక్షింపబడును" అని చెప్పావు గదా అన్నాడు. (అది సత్యము).

యేసు చెప్పిన మాటలు మేము తలపోశాము, "ఇరుకు ద్వారము, సన్నని మార్గము. అందులో ప్రవేశించువారు కొందరే."

"బైబిలు చెప్పినది చూడండి, "నోవహు దినములలో ఉండినట్లే యుండును. అప్పుడు నీటి ద్వారా ఎనిమిది మంది రక్షింపబడిరి."

"ఎనిమిది ఆత్మలే రక్షింపబడినవి," అని మరువకుము అన్నాడు.

"అది కేవలము సగం మాత్రమే నీకర్దమైనది" అన్నాను.

1PET 4:18

 

63శేషించబడిన వారికి నోవహు సాదృశ్యముగా యున్నాడు. ఎత్తబడిన గుంపుకు సారూప్యముగా లేడు. ఆ ప్రళయమునకు ముందుగా హనోకు ఒక్కడే ఎత్తబడెను. సంఘము హింసకు గురికాదని ఇది చూపించుచున్నది. హనోకు ఒక్కడే ఎత్తబడెను. ఓ! సంఘము సంఖ్య చాలా ఎక్కువుండవచ్చును. కొని పెండ్లి కుమార్తె చాలా చిన్న గుంపుగా నుండును. ఎనిమిదిని ఒక్కటితో పోల్చి చూడండి. సంఘము కంటె పెండ్లి కుమార్తె ఎనిమిది రెట్లు తక్కువగా యుండును. "నీతిమంతుడు రక్షించబడుటే దుర్లభమైతే - పాపియు, భక్తిహీనుడు ఎక్కడ నిలుతురు?" తెలిసి కూడా తప్పు చేయువారి గతి ఎట్లుండును? వాక్యమునకు బదులుగా శాఖా నియమములను అనుసరించువారి గతి ఎట్లుండును? క్రీస్తు నామమును తీసికొని క్రైస్తవులుగా పిలువబడుచున్నారు.

64కొనిపోబడినవారికి నోవహు ప్రతీకగా యున్నాడు. నోవహు బయటకు వచ్చినప్పుడు అతనితో హాము ఉండెను. ఇంకా అచ్చట పాపముండెను. ఓడలోనికి అవిశ్వాసము కూడా వెళ్ళెను. తీర్పు నుండి తప్పించుకొనెను, కాని హానోకు ఓడ కంటె పైకి వెళ్ళెను. అతడు దేవుని యొక్క సన్నిధిలోనికి వెళ్ళెను, కాని నోవహు పైకి వెళ్ళి మరల క్రిందికి వచ్చెను. వెయ్యేండ్లపాలనకిది సాదృశ్యము. ప్రపంచ స్థితి ఇదే.

వెయ్యేండ్ల పాలన దీనికి అంతము కాదు. వెయ్యేండ్ల పాలన తరువాతను సమయముండును. వెయ్యేండ్ల పాలన అనగా, కాల వ్యవధి. క్రొత్త భూమి కాదు, నిశ్చయము.

దానిని గమనించండి; తరువాత దీనిని కొద్దిగా చూద్దాం.

65భూమి విడిపించబడి తిరిగి దాని అసలు యజమాని యొద్దకు వెళ్ళినది. సాతాను యొద్ద నుండి ఆయన దానిని తీసికొనెను. సాతాను నుండి ఆయన నిన్ను విడిపించినట్లే భూమిని కూడా విడిపించెను. ఆ బావి నొద్ద నున్న స్త్రీని ఆయన సాతాను నుండి విడిపించెను. యాజకుడయితే తాను దేవునితో యున్నాననుకొనెను. చూచారా?

JOHN 1:14

 

66ఒక్క నిమిషము దీనిని గీసి చూపించెదను. (సహెూ, బ్రెన్హాం నల్ల బల్ల మీద మరల వ్రాసి చూపించెను.)

ఈ పటమును జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ దేవుడు నిత్యత్వముతో యున్నాడు. ఆయన తప్ప నిత్యుడెవరూ లేరు. ఆయనలో కొన్ని లక్షణములుండెను. ఇది దేవుని యొక్క వాక్యము. అది శరీరధారియై యేసు అను వ్యక్తిగా మన మధ్య నివసించెను. ఈమె బావినొద్దనున్న స్త్రీ, ఇతడు యాజకుడు, పరిసయ్యుడు, ఈ ఖాళీ నల్లబల్ల కృప మరియు రక్షణలకు సాదృశ్యముగా నున్నది. (సహో, బ్రెన్హాం నల్ల బల్ల మీద ఉదాహరణలను చూపించెను.)

JOHN 1:1,14•

JOHN 6:37

 

67ఆదియందు వాక్యముండెను. ఆ వాక్యము శరీరధారియై మన మధ్య నివాసము చేసెను. మూడు దశలు: మొదటిది అది ఒక గుణముగా నుండెను. దేవుడు నరునిగా రావలెనని తలంచెను. ఆ తలంపు యేసుగా మారెను. నీవు అప్పుడు ఆయనతో యున్నావు. ఒకే ఒక నిత్యజీవ రూపమున్నది; ఆయన దేవుడు. ఆదిలోనే నీవు దేవునిలో భాగమై యుండవలసియున్నావు. నీవాయనను ఇక్కడ ఎన్నుకొనుట సరే గాని, ఆయనే నిన్ను ఎన్నుకొనెను. "తండ్రి నా కనుగ్రహించిన వారందరూ నా యొద్దకు వచ్చెదరు."

68యాజకున్ని చూడండి. ఇతని వెనుక జీవితము పాపముతో నిండియున్నది. ఇక్కడ నరకమున్నది. ఇది నల్లబల్ల వలె కనిపించుచున్నది. అది అతని పవిత్రత. అతడు యాజకుడు; ఒక గౌరవనీయుడు. అతడు సత్పురుషుడు కానియెడల యాజకుడు కాలేడు. కాని ఎట్లు దానిని పొందెను? తెలివితో నేర్చుకొనుటవలన.

MATT 12:24•

MARK 3:22•

LUKE 11:15•

JOHN 4:25•

HEB 4:12

 

69ఆమె యొక్క మొదటి జీవితం చూడండి. ఆమె వేశ్య, కాని ఆమె గ్రహించినది: "మెస్సియా వచ్చునని నాకు తెలియును" అన్నదామె.

చూడండి, యేసు వచ్చి వాక్యమును బయలుపరచెను, ఎందుకనగా వాక్యము హృదయ రహస్యములను పరిశోదించును (హెబ్రి 4:12లో యున్నది) వాక్యము హృదయాలోచనలను వెల్లడి చేయును. ఆయన ప్రవక్తగా, మనుష్యకుమారునిగా వచ్చెను. ఏమి జరిగినది? తెలివితో నేర్చుకొనిన యాజకుడు, "ఈయన అపవాది" అనెను — ఎందుకనగా అతని శాఖ అట్లే పిలచెను. అందువలన ఏమైనది? అతనికి ఎట్టి ప్రాతినిధ్యము లేకపోయెను.

JOHN 4:16-19,25,26

 

70కాని ఈ స్త్రీ యొద్ద ఏమియులేదు. ఆమె చెడిపోయిన అపవిత్రురాలు. కాని చూడండి, ఆమె లోపట ఎక్కడో అది యున్నది. ఆమె ఈ శరీరధారి కొరకు చూచుచున్నది. "నీ భర్తను ఇక్కడికి తీసుకొని రమ్మని" ఆయన చెప్పెను.

"అయ్యా నాకు భర్త లేడు," అన్నదామె.

"నీవు నిజమే చెప్పితివి. నీకు అయిదుగురు భర్తలున్నారు, కాని ఇప్పుడు నీతో యున్నవాడు నీ భర్త కాడు — అనగా నీకు ఆరుగురు భర్తలున్నారు" అన్నాడాయన.

"అయ్యా! నీవు బయల్జెబూబువు కావు. నీవు ప్రవక్తవని నేను గ్రహించుచున్నాను. క్రీస్తు అనబడిన మెస్సియా వచ్చునని నాకు తెలియును. ఆయన వచ్చినప్పుడు ఇట్లే చెప్పును" అన్నదామె.

"నేనే ఆయనను!" అన్నాడాయన.

ఎట్టి సందేహము లేదు! దానిని నీవు వివరించలేవు. ఆమె దానిని చూచెను. దానిని నమ్మెను. అది ఆమెను ఏమి చేసెను? ఆమెను విమోచించెను!

ఆయన విమోచకునిగా ఉండుటకు వచ్చెను. నిజమేనా? విమోచన అనగా ఏమిటి? తిరిగి తెచ్చుట. యాజకుని ఆయన ఎందుకు విడిపించలేదు? అసలు ఆ పధములోనే అతడు లేడు.

పతనమైన దానిని తిరిగి విడిపించుటకు ఆయన వచ్చెను. జగత్తు పునాది వేయబడక ముందే ఆమె ఆయన ఆలోచనలో యున్నది. ఆమెను శుద్ధి చేయుటకు ఆయన వచ్చెను. ఆయనలో నిత్యజీవమున్నదని ఆయన ఎరుగును. చూచారా?

71అతడేమయ్యెను? తన గురిని చేరెను. స్వంత తెలివి వలన అతడు దానిని నేర్చుకొనెను.

స్నేహితులారా, ఇప్పుడు వినండి. కేవలము ఈ జ్ఞానము నీకు చాలదు. దానికి వేరైనది నీకు కావలెను. దానిని పొందువరకు ఎన్నడూ నీవు దీనిని అర్ధము చేసుకోలేవు. ఆ కారణము చేతనే మీరు తూర్పు, పడమర, ఉత్తరము, దక్షిణముల నుండి వచ్చారని నేను నమ్ముచున్నాను. వాక్యము ప్రత్యక్తపరచబడినది.

JOHN 6:37,44•

REV 21:1

 

72ఇప్పుడు చూడండి, ఆదియందు ఆయన తన ప్రవక్తల ద్వారా మార్గమును తెలియచేసెను. ఆయన ఎన్నడూ మారడు. ఆయన మానవుని నీతిమంతునిగా తీర్చి శుద్దీకరించి, పరిశుద్దాత్మను, అగ్నిని పంపి, పాపమును దహించి అతనిలో నివాసము చేయును.

అదే రక్షణ పధకమును ఆయన భూమికిని వర్తింపచేయును. నోవహు ద్వారా అది మారుమనస్సు పొంది నీటిబాప్తిస్మము పొందెను. యేసు వచ్చి దాని మీద తన రక్తము కార్చుట ద్వారా పరిశుద్ద పరచెను. అది ఆయన దాయెను. రానున్న కొత్త భూమి మీద పరిశుద్ద అగ్ని పడి ప్రతి దయ్యమును, క్రిమిని, రోగమును పరిహరించి శుభ్రము చేయును. దానిని నూతనము చేయును. "నేను క్రొత్త ఆకాశమును, క్రొత్త భూమిని చూచితిని." నీవు క్రొత్త వ్యక్తివగుదువు. ఆమేన్! ఒక పాత వ్యక్తి సంఘములో చేరి లేదా ఎదో పేజి త్రిప్పి అతుకులతో తయారు చేయబడుట కాదు. నీవు సంపూర్ణముగా క్రొత్త వ్యక్తివి. దేవుడు పాత మనిషిని పరిశుద్దాత్మ మరియు అగ్నితో పూర్తిగా దహించును. "నా తండ్రి ఆకర్షించితేనే గాని ఎవడును నా యొద్దకు రాడు. తండ్రి నాకనుగ్రహించిన వారందరూ నా యొద్దకు వచ్చెదరు." చూచారా? అదే పద్దతి; అదే పధకము.

73నీలో నుండి సాతానును తొలగించినట్లే భూమి మీద నుండి సాతానును ఆయన తొలగించును. వాడు శోధించ వచ్చును, కాని తిరిగి జన్మించిన క్రైస్తవుని ఏమీ చేయజాలడు, ఎందుకనగా దేవుడు జగత్తు పునాది వేయబడక ముందు నుండియే అతనిని చూచెను. అతనిని విడిపించుటకు యేసును పంపెను. రక్తము అతని పక్షముగా మాట్లాడును. కాబట్టి అతడు పాపమెట్లు చేయగలడు? నీ స్వరమును మాత్రమే ఆయన వినును. ఆయన నీ తరపున పనిచేయును. ఆమేన్. అది సత్యము, చూచారా.

74అదే రీతిగా ప్రపంచము కూడా ఆయన గుణములలో ఒక గుణముగా మారును. (నీవు ఆయన గుణముగా ఉన్నట్లే ప్రపంచమును ఆయనలోని ఒక గుణముగా ఉన్నది) ప్రపంచము దేవుని యొక్క ఆలోచనలో యున్నది. ప్రపంచము, సింహాసనము, రాజు, విమోచకుడు, స్వస్ధపరచువాడు మొదలగున్నవన్నియూ ఆయన గుణలక్షణము.

ISA 7:14

 

75ఆలోచించకుండా నేను దానిని "స్తంభము" అనియు, "మనిషి" అనియు చెప్పలేను. నేను ఆలోచించియే "మనిషి" అని చెప్పెదను. ఆలోచించుట నా గుణము, వ్యక్తపరచుటయే మాట. చూచారా? కన్యక గర్భవతి యగునని యెషయా ఎట్లు చెప్పెను? ఆలోచన అనగా ఏమిటి?

PHIL 2:5

 

76ఆ వివేచన ఎట్లు వచ్చునని మిలో చాలా మంది ఆశ్చర్యపడుచుందురు. నేను చెప్పెదను వినండి. అది నా ఆలోచన కాదు, నేనేమి ఎరుగను. దాని గూర్చి ఆలోచించను. మిరెవరో నాకు తెలియకుండా మి పేరు, ఊరు ఎట్లు చెప్పగలను? నా జీవితంలో ఎన్నడూ చూడని మిమ్ములను గూర్చి మిరు పది సంవత్సరముల క్రితం చేసిన దాని గూర్చి ఎట్లు చెప్పగలను? పది సంవత్సరముల తరువాత మిరేమి చేయుదురో, ఎక్కడుందురో నేనెట్లు చెప్పగలను? భవిష్యత్తు నాకెట్లు తెలియును? అది ఇంకొకరి ఆలోచన.

"క్రీస్తుకు కలిగిన మనస్సు మిరును కలిగియుండుడి." క్రీస్తు మనస్సు మిరు కలిగి యుండవలెను. అది నీ ఆలోచన కాదు; నీ ద్వారా ఆయన ఆలోచించును, నీ స్వంత మాటలను నీవు వ్యక్తము చేయుట కాదు; ఆయన మాటలను నీవు వ్యక్తపరచుచున్నావు.

NUM 12:6•

ISA 7:14•

MATT 24:35•

MARK 13:31•

LUKE 21:33

 

77అందుకే చాలాసార్లు సోదరులు భాషలకర్దము చెప్పు విషయములో అయోమయ స్థితిలో ఉంటున్నారు. వారు చెప్పరానివి అది సాతాను వలన కలిగినదని వారు గ్రహించుట లేదు. "దేవుని తోటలో" అనుచున్నారు. అది సరియో, కాదో చూచు వరకు వేచి యుండుడి.

గోధుమలు, గురుగులు ఒకే పొలములో పెరుగును. ఆ రెండూ ఒకే సూర్యుడు, ఒకే వర్షము ద్వారా పెరుగును.

"మీ మధ్య ప్రవక్త ఎవడైన యున్నయెడల ప్రభువనగు నేను అతనితో మాట్లాడుదును. అతడు చెప్పినది జరిగిన యెడల అది నేనే అని గుర్తించుడి. అతడు తన ఆలోచనలను గాక, నా ఆలోచనలను వ్యక్తము చేయుచున్నాడు. నా ఆలోచనలను వ్యక్తము చేయుటకు అతని నోరు వాడుకొనుచున్నాడు. అతడు చెప్పినవి నెరవేరవలెను. భూమ్యాకాశములు గతించును గాని నా మాటలేమాత్రమును గతించవు."

"కన్యక గర్భవతియగును" అని యెషయా చెప్పెను. అది స్థిరమాయెను; ఆమె గర్భవతి అయ్యెను. దేవుడు చెప్పినది జరుగును.

78ఓ, ఆయన తన ప్రత్యక్షతలనన్నింటినీ తన ప్రవక్తల ద్వారా తెలియచేసెను. ఆయన తలంపులు వ్యక్తపరచబడినవి. ఈ స్త్రీ కూడా ఆయన ఆలోచనలో యున్నది. చూడండి.

ఆ యాజకుడు వెలుగుకు ప్రతినిధిగా యున్నాడు. అతడు బైబిలును నేర్చుకొనెను. దేవుడు దేవుడేనని అతడు నేర్చుకొనెను. పరిశుద్దత సరియని అతడు నేర్చుకొనెను. దేవుడు ధర్మశాస్త్రమున్నదని అతడు నేర్చుకొనెను. దానిని అతడు తన తెలివి ద్వారా నేర్చుకొనెను. అతడు సరియగు వంశావళిలో పుట్టెను. అతడు ఒక లేవీయుడు, తెలివి ద్వారా అతడు దానిని నేర్చుకొనెను. జరిగిన దానిని అతడు నేర్చుకొనెను. జరుగుచున్న దానిని అతడు తెలిసికొనినప్పుడు అతని శాఖ అతనికి అడ్డమయ్యెను.

JOHN 4:25,26,29

 

79అయితే ఆమె ఈ భూమి మీద ఉన్న విమోచకుని చేర్చుకొనెను.

దానిని ఆమె ఎన్నడూ ప్రశ్నించలేదు. "మెస్సీయా వచ్చినప్పుడు ఇట్లు జరుగును" అన్నదామె. "మెస్సయ్యా నేనే" అని ఆయన చెప్పగానే ఆమె ప్రశ్నలన్నియూ అగిపోయెను. "వచ్చి నేను కనుగొనిన ఈయనను చూడండి" అని ఆమె అందరితోనూ చెప్పినది.

80ఈ పద్దతులన్నియూ మనలను పవిత్రపరచును — ఆయన నివాస స్థలముగా మనమగుదుము. నీతీకరణము, శుద్దీకరణము, పరిశుద్దాత్మ మరియు అగ్ని బాప్తిస్మము వలన ఈ మందిరము పరిశుద్దపరచబడును.

81నీటి వలన ఆ పాత ప్రపంచ చట్రము నాశనము కాలేదు. భూచట్రము కడుగబడినది. (భూమి మీద చెత్త, మురికి శుభ్రమయినది), మొదటి ప్రపంచము నాశనమయినది బైబిలు చెప్పెను. కాని ఆ చట్రము నాశనము కాలేదు. దాని మీద నున్న పాపము, పాపులు నశించిరి గాని ఆ భూస్వరూపము అలాగే మిగిలి యున్నది.

82నీతీకరణము అనగా నమ్మి బాప్తిస్మము పొందుటయే కాదు. (బాప్టిస్టులు, మెతడిస్టులు దాని గూర్చి ఆలోచించుదురు)… నీవు మరల లోకము లోనికి జారిపోవచ్చును; జట్టు కత్తిరించుకొని, పొట్టి దుస్తులు ధరించి ఇంతకు ముందువలె ప్రవర్తించుదువు. వెనక్కు చూచి నీవు చేసిన తప్పును గ్రహించెదవు.

83నీతీకరణము వలన లోకమునకు ఏమి జరిగినది? ఏమీ జరుగలేదు. ఎప్పటి వలెనె పాపము చేయసాగినది. మనిషి కూడా అలాగే యుండును. గొప్ప సువార్తికుడగు బిల్లీగ్రహం దీనిని చూడవలసియున్నాడు. "నా కూటములో ముప్పది వేల మంది రక్షింపబడిరి. మరల సంవత్సరము వెళ్ళి చూడగా ముప్పయి మంది కూడా లేరు" అని అతడనెను. అంతే జరుగును. నిశ్చయంగా వారు పశ్చాత్తాపపడిరి. వారందరూ మారుమనస్సు పొందకపోయినా కనీసం కొందరయినా మారుమనస్సు పొందిరని తప్పక చెప్పగలము, కాని జరిగినది చూడండి. అదిక్కడ రుజువగుచున్నది.

84కాబట్టి నీటి వలన పాత భూస్వరూపము నాశనము కాలేదు. లోకము కడుగబడినది. అది బాప్తిస్మము పొందెను. అలాగే అగ్ని ద్వారా నశింపచేయబడినా గాని, ఆ స్వరూపము అలాగే నిలచియుండును. భూమి లయమగదు గాని దాని మీద పాపము లయమగును.

HEB 12:28•

2PET 3:10

 

85ఇక్కడ చూడండి, మిలో కొందరు బైబిలు విద్యార్ధులు ఉండవచ్చును. (ముఖ్యంగా డాక్టర్ వైల్ నా వైపు చూచుచున్నాడు). పేతురు 3వ అధ్యాయములో చూడండి. ప్రపంచము అను పదము అక్కడ వాడబడెను. గ్రీకులో దానికి కాస్మస్ అను పదమున్నది. అనగా ప్రపంచ క్రమము అను అర్ధము. భూమి గతించును. పంచ భూతములు మహా వేంద్రముతో లయమగును. చూచారా? దాని అర్ధము భూగ్రహము లయమగునని కాదు, కాని కాస్మస్ అనగా లోక క్రమము లయమగును. అనగా రాజకీయము, పాపులు, క్రమము, పాపము, వ్యాధి, క్రిములు, ప్రతి కీడు గతించును. దేవుడు ఒకసారి ఆకాశములను ఊపెను, కాని ఈసారి భూమ్యాకాశములను ఊపుదునని ఆయన చెప్పెను. చూచారా? ఏలననగా మనము కదలని రాజ్యమును పొందుదుము, అది నిత్యరాజ్యము. దాని నెట్లు ఆయన స్థాపించునో చూడండి.

2PET 3:10

 

86ఇక్కడ పేతురు చెప్పినది చూడండి, "దాని మిద నున్న కృత్యములన్నియూ మహావేండ్రముతో లయమైపోవును." భూగ్రహము కాదు గాని దాని మిది కృత్యములు అనగా రాజకీయములు, విధానములు, శాఖలు, మానవ-నిర్మిత పద్దతులు కాలిపోవును.

2PET 3:10

 

87"ఆకాశములు మహావేండ్రములో లయమగును." ఇక్కడ మిరు గమనించారా? మహా శబ్దముతో ఆకాశములు లయమగును. వినండి, భూమి యావత్తు అగ్నితో మండిపోయి దానిలోని వాయువుల నుండి భూమి బ్రద్దలగును. ఖచ్చితంగా ఇది జరుగును.

పేతురు బైబిలులో ఇట్లు చెప్పెను, "ఆకాశములు మహా శబ్దముతో లయమగును." (భూమియు) ఆ ప్రేలుడు దానిని కుదిపి వేయును — ఎందుకనగా అది ప్రతి వ్యాధిని, ప్రతి ముల్లును, ప్రతి పొదను దహించువలెను. అగ్ని దహించును. గుర్తుంచుకొనండి, ఇది పూర్తిగా అక్షరాలా అగ్ని కాదు. పరిశుద్ద అగ్ని కూడా అయియున్నది. (చూచారా?) అది సాతాను దాని అనుచరులనందరినీ లయము చేయును. భూమ్యాకాశములు రెండూనూ గతించును. క్రిములు, పురుగులు, దాని మిద నున్న ప్రకృతిక జీవము, ( H2O), నీరు అన్నియు మండిపోవును దానిని ఆలోచించండి. ఆధ్వని గూర్చి యోచించండి.

ఆయన ఆరు ముద్రలను విప్పినప్పుడు గొప్ప ప్రేలుడు ధ్వనించి ప్రాంతమంతా కూలిపోయినట్లయినది. ఆ ధ్వని టుసాన్లో వినబడినది. అందరూ దాని గూర్చి చెప్పుకొనిరి, ఈ భూమి బాప్తిస్మము పొందిన ఎడల ఎట్లుండును?

REV 21:1

 

88ఒక వ్యక్తి అగ్ని బాప్తిస్మము పొందినప్పుడు, ఆ చుట్టూ చాలా ధ్వని యుండును. ఆ విధంగా అరచుట, కేకలు వేయుట సిగ్గు అని అందరూ అనుకొందురు. భూమి బాప్తిస్మము పొందినప్పుడు ఎట్లుండును? — ప్రేలును, నీరు, (H2O), బైబిలులోని ప్రకటన 21లో చెప్పబడెను. "సముద్రము ఇకను లేదు," అంత ప్రేలుడు జరిగెను.

మొత్తం భూమి యొక్క ఉపరితలమంతయూ దీని వలన మారిపోవును. అది ప్రేలి ముక్కలగును. వందలాది అడుగుల ఉపరితలము పూర్తిగా తునాతునకలగును. ఇప్పుడు భూమిలో వాతావరణము, వాయువులు ఉన్నవి. క్షిపణులు వెళ్ళజాలని చోటులో అవి ఉన్నవి. (అదొక రకమగు గోళము), ఆ వాయువులన్నియూ బ్రద్దలవును. దేవుని యొక్క పవిత్ర ఉగ్రత దాని మీదికి వచ్చును. దానిని శుద్ధి చేయును. మొత్తం ఉపరితలమంతా మారిపోవును.

MATT 24:35•

MARK 13:31•

LUKE 21:33•

2PET 3:10

 

89లయమగునను గ్రీకు పదమును మీలో చాలామంది తెలిసికొనగోరుచున్నాను… నేనును కనుగొనవలెను. దీని మీద మనము జీవించవలసియుండగా ఇదెట్లు లయమగును? (మీలో కొందరు వ్రాసుకొనగోరుచున్నారు, గనుక ఆ పదమును చెప్పెదను — p-a-r-e-r-e-c-h-o-m-i-a), అను పదము వాడబడెను. దానినెట్లు పలుకవలెనో నాకు తెలియదు.

ఒక దాని గూర్చి నాకు ప్రేరేపణ కలిగినప్పుడు, వెళ్ళి ఆ పదమును చూచెదను. ఈ పదమును నేను పలుకలేను, కాని ప్రభువు అందులో ఒక దారి చూపెను. ఆ అర్ధము కనుగొన్నాను. "భూమ్యాకాశములు గతించును." ఈ పదము యొక్క అర్థమేమనగా, "ఒక రూపము నుండి మరో రూపమునకు వెళ్ళుట." దీని అర్థము సర్వనాశనము కాదు. ఆంగ్ల పదములో లయము అర్థము వచ్చును, కాని గ్రీకు పదములో గతించుట, అనగా ఒక దాని నుండి మరొక దానిలోనికి పోవుట. ఒక స్థితి నుండి మరొక స్థితి లోనికి వెళ్ళుట అని అర్ధము.

TIT 3:5

 

90చూడండి, తీతు 3:5లో పౌలు దీనిని వాడెను. (మీరు వ్రాసికొన్నచో తరువాత చదువుకోవచ్చును), ఇదే పదమును పౌలు వాడెను. మానవుడు తిరిగి జన్మించుట గూర్చి వాడెను. మనిషి పాపి నుండి పరిశుద్దునిగా మారెను, పూర్తి లయము కాదు. ఒక వ్యక్తి మారినప్పుడు, పూర్తిగా లయమగుట లేదు గాని, మారిన మనిషి అగుచున్నాడు. గతంతో ఉన్న స్థితి నుండి మారుచున్నాడు. అంతే గాని — లయము కాడు.

MATT 19:28•

MATT 21:2•

MARK 11:2•

LUKE 19:30•

JOHN 11:44

 

91మత్తయి 19:28లో యేసు ఆ పదమునే వాడెను. "మిరు నా తండ్రి రాజ్యములో నాతో పాటు కూర్చొందురు." నీవు మారినప్పుడు అది జరుగును. ఆ గాడిద పిల్ల గూర్చి ఆయన చెప్పినప్పుడు, ఆ పదమునే వాడెను, "ఆ గాడిదను విప్పిపోనియ్యుడి." లాజరు పునరుత్థానమందును అదే పదము వాడెను, "అతని కట్లు విప్పుడి" — అతనిని మార్చుడి! అతడు కట్టబడెను — వాటిని విప్పి, పోనియమనెను.

దీని భావమేమి? సాతాను గుప్పెట నుండి భూమి విడిపించబడును. అది విప్పబడును! రాజకీయము నుండి అది విప్పబడును; శాఖా సంబంధ మత బంధకముల నుండి అది విప్పబడును. దేవుని రాజ్యముగా అది ఉపయొగపడును. భూమి మిద దానిని స్థాపించును. ప్రస్తుతము సాతాను ఈ భూమికి యజమాని వాడి చేతిలోనే యున్నది. ఇది వాడిదే, కాని ఇప్పుడు క్రీస్తు దానిని విమెచించెను.

92ఒకప్పుడు నేను వాడి సొత్తునే, కాని ఇప్పుడు ఆయన సొత్తును. ఒకప్పుడు ఆమె వాడి సొత్తు, కాని ఇప్పుడు ఆయన ఆమెను విడిపించెను. నీ జీవితమును, నా జీవితమును సాతాను గుప్పెట నుండి ఆయన విడిపించెను. ఇప్పుడు వాడి సొత్తు కాదు, ప్రార్ధనలో తరచుగా నేనిట్లు చెప్పుట మిరు విందురు. "దేవుని సొత్తు మిద నుండి నీ చేతులు తీసివేయుము." ఆమేన్! నీ స్వంత వారిని రక్షించుకొను విశ్వాసము నీవు కలిగియుండుము, అది నీ హక్కు "ఆమె మిద నుండి నీ చేతులు తీసి వేయుము." "అతని మిద నుండి చేతులు తీసివేయుము!" అని చెప్పండి విశ్వాసము వలన అది జరుగును.

ఓ! దానిని నాశనము చేయుట అనగా వాడి చేతిలో నుండి దానిని విడిపించుట అని అర్ధము. వాని పట్టు గతించును. అది మారును. భూమి మార్పు పొందును. రాజకీయము మార్పు పొందును. మతము మారును, శాఖలు గతించును. రాజకీయము గతించును, దేవుని రాజ్యము స్థాపించబడును.

MATT 24:35•

MARK 13:31•

LUKE 21:33•

REV 6:14•

REV 21:10

 

93ప్రకటన 6:14 మనము చదివితే అది గ్రంధపు చుట్టవలె అయినట్లు అర్థమగును. యొహాను చెప్పెను, "మరియు ఆకాశ మండలము చుట్టబడిన గ్రంధము వలెనే తొలగిపోయెను." యేసు కూడా భూమ్యాకాశములు గతించునని చెప్పెను, అనగా భూమ్యాకాశములు మారునని చెప్పెను. అనగా భూమ్యాకాశములు మార్పు చెందెనని భావము. అదే మాట మరలా అచ్చట వాడెను. ఆ తరువాత ప్రకటన 21:2-24 లో అతడు దేవుని యొద్ద నుండి క్రొత్త యెరూషలేము దిగి వచ్చుట చూచెను. అది ఈ భూమి మిదనే యుండెను. దాని అర్థము ఇది లయమైపోయెనని కాదు. ఆ క్రమములు మూరినవి.

DAN 2:34,35•

REV 21:24

 

94దానియేలు కూడా అదే చూచెను. చేతితో తీయబడని రాయి లోకమును తాకెను. క్రమముల రూపములన్నియూ విచ్చిన్నమయ్యెను. ఎండకాలము కళ్ళములో నూర్చినప్పుడు వచ్చిన పొట్టు గాలికి ఎగిరిపోయినట్లు ఎగిరిపోయెను. ఆ రాయి మహా పర్వతముగా మారి భూమిని కప్పెను. ఆ కొండ ఇప్పుడు చిన్నదిగా కనిపించును; కాని ఆ కొండ భూమిని కప్పును.

ఆలాగే ప్రకటనలో ఇట్లు చెప్పబడెను, "క్రొత్త భూమి యొక్క రాజులు తమ మహిమను అందులోనికి తీసికొని వచ్చెదరు." క్రొత్త యెరూషలేము ఈ భూమి మిదనే యున్నది. కాబట్టి భూమి మారెను.

95దేవుడు నిన్ను పిలిచినప్పుడు, నీ పోలికలు శారీరకంగా ఏమి మారలేదు. ముందున్న పురుషుని వలెను, స్త్రీ వలెను నీవున్నావు. అయితే ఒక మార్పు కలిగినది. పాత జీవితము గతించినది; పాత కోరికలు గతించినవి. నీ త్రాగుడు, విందులు, వేడుకలు, ముచ్చట్ల, దుర్నీతి పోయినది. చూచారా? అప్పుడు నీవు సాతాను సాధనముగా ఉంటివి. ఇప్పుడు విడిపించబడితివి, లోకము కూడా ఆ విధంగానే విడిపించబడును. నీవు నూతన సృష్టివైనట్లే క్రొత్త ఆకాశము, క్రొత్త భూమియగుచున్నది. నీవు నూతన సృష్టివని గ్రీకు పదములో చెప్పబడినది. (మీరెరుగుదురు) ఆమేన్! అదే పాత మందిరములో ఒక క్రొత్త సృష్టియున్నది. హల్లెలూయా! ఇక్కడేమి జరుగుచున్నదో గమనించండి. మహిమకరము!

MATT 5:5

 

96ఈ భూమి మీద భూరాజులుందరని మనము చూచాము. మత్తయి 5:5 లో యేసు చెప్పెను, "సాత్వికులు భూమిని స్వతంత్రించుకొందురు." మనకు మరో భూమి యుండును; కాని అది ఇదే భూమి. విమోచనా పధకమును నేను మీ ముందుంచ ప్రయత్నించుచున్నాను — మరేమీ కాదు.

దానిని శుద్ధి చేసి, సాత్వికులుండు చోటుగా మార్చుటకు అగ్ని బాప్తిస్మము కావలెను. చూచారా? ఆయన మనలను చేసినట్లే అది యున్నది. ఆయన మనలోనికి వచ్చు ముందుగా మనకు అగ్ని బాప్తిస్మమును ఇచ్చును. అదే పరిశుద్దాత్మ బాప్తిస్మము. అదేమి చేయును? వాక్యమునకు వ్యతిరేకముగా నీలో యున్న ప్రతి దానిని అది కాల్చి వేయును. చూచారా? వాక్యమును తప్ప మరి దేనిని అది నమ్మదు, ఎందుకనగా అది వాక్యము.

97పరిశుద్దాత్మ యొక్క సూచన గూర్చి ఒక రోజు మనము సంభాషించాము. చూచారా. ఏదో ఒక శాఖ పద్దతిని కాదు గాని, వాక్యమును నీవు చేర్చుకొన్నప్పుడే పరిశుద్దాత్మను పొందినట్లు రుజువు, దానిని అర్ధము చేసికొందువు. వాక్యము తన్నుతాను బయలుపరచుకొనుటను గమనించుము. నీవు ఎన్నయినా చేయుచుండ వచ్చును. కలుపు మొక్కలు కూడా అదే రీతిగా జీవించును. (చూచారా?) కాని పూర్తి వాక్యమును నీవు చేర్చుకొనవలెను. పెండ్లి కుమార్తెగా నీవుండ వలెనన్నా, ఆయనలో నీవు భాగమై యుండవలెను. ఆయనే వాక్యము. చూచారా? ఆయనలో భాగము ఏమైయుండును? ఈ దినమునకు వాగ్దానము చేయబడిన వాక్యము. అందులో నీవు భాగమై యుండవలెను. అర్థమైనదా? దానిని విడిచిపెట్ట వద్దు. గమనించు. నిత్యత్వమంతయూ నివాస యోగ్యముగా ఉండునట్లు ఆయన దీనిని తయారు చేయును.

98చూడండి, వేయ్యేండ్ల పాలన క్రొత్త భూమి కాదు, చూచారా. వెయ్యేండ్ల పాలన వేరే పాలన. మనము ఆ వెయ్యేండ్ల పాలనలోనికి వెళ్ళేదము, కాని అది క్రొత్త భూమి, క్రొత్త ఆకాశము కాదు. అది కేవలము ఒక విశ్రాంతి స్థలము, విరామ సమయము మాత్రమే. క్రొత్త ఆకాశము మరియు క్రొత్త భూమి కాదు. వెయ్యేండ్ల పాలనలోని కొన్ని అందులోనికి వెళ్లవు. ఏదెనులోని ఏడవ దినమునకు అది సాదృశ్యము. ప్రపంచమును ఆయన సృజించిన తరువాత ఏడవ దినమును ఆయన ఏదెనులో విశ్రాంతి తీసికొనెను.

మరియు వేయ్యేండ్ల…

JOHN 14:3,28

 

99ఈ ప్రపంచమునకు దాదాపు ఆరువేల సంవత్సరముల వయస్సు ప్రతి రెండు వేల సంవత్సరములకు ఒక నాశనము జరుగుచున్నది. చూచారా? మొదటి రెండు వేల సంవత్సరములకు జల ప్రళయము వచ్చెను. దేనితో ఆయన బాప్తిస్మమిచ్చెను? "నీటితో." తరువాత రెండు వేల సంవత్సరములకు యేసు వచ్చి తన రక్తమును కార్చి దానిని తనదిగా చేసికొనెను.

"నేను మరల వచ్చెదను" తన రాణితో రాజుగా ఆయన వచ్చును. రెండవ రెండువేల సంవత్సరాంతమున ఆయన ఏమి చేయును? ఆయన వచ్చి విశ్రాంతిని తీసికొనును. దానిని ఆయన దహించి, తన స్వకీయుల కొరకు శుద్ధిచేయును. దాని మీద తన వారిని ఉంచును. చూడండి, ఈ వెయ్యేండ్ల పాలన ఏడవ దినమునకు మాదిరిగా ఉన్నది. ఆ తరువాత ధవళ సింహాసన తీర్పు వచ్చును. మనమింకా తీర్పులోను, వెయ్యేండ్ల పాలనలోను యుందుము. వెయ్యి సంవత్సరముల దినమది. అది ఒక కాల పరిమితి, దానికి క్రొత్త భూమికి ఏమీ సంబంధము లేదు.

100మరి ఇప్పుడు ఎవరైనా ఇట్లు నన్ను ప్రశ్నించవచ్చును, "బ్రెన్హాం సోదరుడా, ఇప్పుడు ఏడులన్నీ అయిపోయాయి గదా? నీవింకేమి చేయుదువు? నీవు యుగములను గూర్చి చెప్పుచుందువు. (నేను అట్టి వాడనే, దేవుడు కూడా అలాగే యున్నాడని నేను నమ్ముచున్నాను). నీ యుగముల మాదిరులన్నీ అయిపోయినవి. ఆ ఏడవ దినమునకు అవతల ఉన్నదానిని ఏమని చెప్పెదవు? ఇప్పుడు నీవెచ్చటికి వెళ్ళేదవు?"

మీరు ఒక దాని వైపు చూడవలెనని కోరుచున్నాను. ఇంకా నా యుగములు అయిపోలేదు. ఇక్కడ మరొక లేఖనము నాకున్నది. అదంతయూ ఏమీ విడిచిపెట్టబడక, నెరవేరవలెనని మీరు మరువ వద్దు."

101"సహోదరుడా బ్రెన్హాం, ఆ ఏడవ దినపు సబ్బాతుకు ఆవలగా మరో దానిని నీవు చేర్చగోరుచున్నావా?" అని మీరు ప్రశ్నించుదురు. దేవుడు భూమిని ఆరు దినములు శ్రమించి సృజించెను. ఏడవ దినమున విశ్రమించెను. అది కాలమునకు మాదిరి, కాని మనము నిత్యులమగుదుము.

"ఇప్పుడు నీ మాదిరి ఎచ్చటున్నది? నీవు మాదిరులను చెప్పే వ్యక్తివి. ఇక మాదిరులన్నీ అయిపోయాయి" అని మీరందరు. లేదు, ఇంకా అయిపోలేదు. ఇంకా అయిపోలేదని మనము చూడగలము.

LEV 23:15,24,34

 

102తిరిగి మనము లేవీయ కాండము 23వ అధ్యాయము చూద్దాం. గత ఆదివారము మనము లేవీయకాండము చూచాము. అదే నాకు ఒక అభిప్రాయమును ఇచ్చినది. "లేవీయ కాండము 23వ అధ్యాయము 26వ వచనము. ఏడు పండుగ దినములున్నవని మరువ వద్దు. బూరల పండుగ, పర్ణశాలల పండుగ, పనలు అల్లాడించు పండుగ మొదలగునవి. ఏడు పండుగలు ఏడు సంఘ కాలములకు సూచనలు, ఒక దానికి మరొక దానికి మధ్య ఎన్ని విశ్రాంతి దినములున్నవి? పెంతెకొస్తు మరియు బూరల పండుగకు మధ్య ఏడు సంఘ కాలములున్నవి. ఆ ఏడు పండుగలు ఏడు సంఘ కాలములకు సాదృశ్యములు. మీరు సంఖ్యలను గుర్తుంచుకొనండి.

LEV 23:36

 

103"నీ ఏడులన్నీ అయిపోయాయి గదా, బ్రెన్హాం సోదరుడా?" అని మీరునవచ్చును. సరే, చివరిదగు పర్ణశాలల పండుగను మనం చూద్దాం. 36వ వచనము చూడండి:

ఏడు దినములు మీరు యెహోవాకు హోమము చేయవలెను. ఎనిమిదవ దినమున మీరు పరిశుద్ద సంఘముగా కూడి యెహోవాకు హోమార్పణము చేయవలెను. అది మీకు వ్రతదినముగా ఉండును. అందులో మీరు జీవనోపాధియైన ఏ పనియు చేయకూడదు.

ఇప్పుడు మనకు ఎనిమిదవ దినము వచ్చియున్నది. ఏడు దినములే యున్నవనుకొన్నాము గాని ఇక్కడ ఎనిమిదవ దినమున్నది. పరిశుద్ద సంఘము కూడు దినము. చూడండి, అందులో ఏ పనియు చేయరాదు. ఎనిమిదవ దినము ఏమిటి? మరల మొదటి దినమే. ఇది నిత్యత్వమును గూర్చి మాట్లాడుచున్నది. కాలము ఆగకుండా దొర్లి వచ్చుచున్నది. ఆమేన్! మీరిది చూచారా?

LEV 23:36•

ISA 65:21

 

104ఈ చివరి దినమగు ఎనిమిదవ దినమున పర్ణశాల పండుగ కూడా వచ్చును; చూడండి, దాని తరువాత, చివరి పండుగ దినము తరువాత, చివరి సంఘ కాలము తరువాత, భూమి మీద చివరి ఏడు దినములు సంపూర్తి అయిన తరువాత, వెయ్యేండ్ల పాలన తరువాత, ఈ పరిశుద్ద సంఘముగా కూడుట వచ్చును.

ఇది పర్ణశాల పండుగని మరచిపోవద్దు, కూడికొను స్థలములే పర్ణశాలలు. ఆమేన్ ! వెయ్యేండ్లపాలనలో బైబిలు చెప్పినట్లు జరుగును. "వారు ఇండ్లు కట్టుకొని అందులో కాపురముందురు." కాని క్రొత్త భూమి మీద ఎప్పుడో ఆయన స్థలము సిద్ధపరచెను; అది కట్టబడినది. దాని నిర్మాణ విషయములో మనకెట్టి సంబంధం లేదు. ఆమేన్! నిత్యత్వము! ఓ, ఆ మాట నాకు ఇష్టము. ఎనిమిదవ దినమున పరిశుద్ద సమాజముగా కూడుట జరుగును.

105గమనించండి, ఏడు దినములే యున్నవి, ఎనిమిదవ దినమనగా తిరిగి మొదటి దినమునకు వచ్చుటయే. ఎనిమిదవ దినము పరిశుద్ద సమాజముగా కూడు దినము. ఏడు దినములు లోకపు సృష్టికి చెందిన కాలము, వెయ్యేండ్లపాలన అనగా విశ్రాంతి దినము. దేవుడు ఆరు దినములు శ్రమించి ఏడవ దినమున విశ్రమించినట్లే, సంఘము ఆరు రోజులు పనిచేసి ఏడవ దినము విశ్రాంతి పొందును. కాని ఇంకా కాలపు లెక్క అక్కడున్నది. నేను నిత్యత్వమును గూర్చి మాట్లాడుట లేదు. కాని ఎనిమిదవ దినమనునది లేదురు; మరల మొదటి దినమునకు వెళ్లుచున్నారు! చూచారా? మొదటి దినము.

ISA 28:10-12•

GAL 4:10,11

 

106గతించిపోవు పాత ధర్మశాస్త్రము గూర్చి సబ్బాతు మాట్లాడుచున్నది. సబ్బాతును ఆచరించుట గతించును. నేను చెప్పినట్లుగా మారిపోవును. లయము కాదు గాని మరో దాని లోనికి వెళ్ళును. వారములో ఒక దినము ప్రత్యేకముగా ఆచరించు ధర్మశాస్త్ర విధి మారును. యెషయాలో చెప్పబడెను. (28:19 అనకొంటాను) "సూత్రము వెంబడి సూత్రము; ఇక్కడ కొంచెము, అక్కడ కొంచెము; మేలైన దానిని చేపట్టుడి; నత్తి పెదవుల ద్వారాను ఇతర భాషల ద్వారాను ఈ జనులతో మాట్లాడుదును. ఇదే విశ్రాంతి." చూడండి, మీరు జీవము లోనికి ప్రవేశించెదరు. దినమును లేదా ఛాయను ఆచరించుట కాదు. పౌలు హెబ్రి 4వ అధ్యాయములో చెప్పెను, "మీరు దినములను, ఛాయలను ఆచరించుచున్నారు. మీ అనుభవము గూర్చి నేను భయపడుచున్నాను." చూడండి, మనము కొన్ని దినములను, క్రమములను ఆచరించుటకు వెళ్ళుట లేదు. మీరు మరణములో నుండి నిత్యజీవములోనికి దాటియున్నారు. దినములు, కాలములు కాదు. మీరు నిత్యత్వములోనికి వెళ్ళుచున్నారు, అదే పరిశుద్ద సంఘముగా కూడటకై యున్నది.

107ఏడు దినములు ఏమిటి? అవి మారును. ఎనిమిదవ దినము నూతన సృష్టికి సంబంధించినవి. పాత సృష్టి కాదు; ఎనిమిదవ దినము క్రొత్త సృష్టి. ఎనిమిదవ దినమున మన ప్రభువు మృతులలో నుండి లేచెను. అదియే పరిశుద్ద సంఘముగా కూడుటయై యున్నది. విశ్రాంతి దినములు లేదా పర్ణశాలల పండుగలు, పెంతెకోస్తు పండుగ మొదలగునవి ఆచరించుట కాదు. మనలను నీతిమంతులనుగా తీర్చుటకై యేసు ఎనిమిదవ దినమున తిరిగిలేచెను. ఏడు దినములు లేదా ఏడు సంఘకాలముల తరువాత యేసు మృతులలో నుండి లేచెను. ఎనిమిదవ దినమనగా మొదటి దినమే. అది పరిశుద్ద సంఘముగా కూడు దినము. మీరు సమయమును దాటి నిత్యత్వములోనికి వచ్చియున్నారు. దినములు, సబ్బాతులు, అమావాస్యలు ఆచరించుట కాదు. ఆ రూపము మారిపోయినది. అది లయమగుట కాదు. (మహిమ!) మరణములో నుండి నిత్యజీవములలోనికి దాటియున్నారు. ఓ, బైబిలు ఎంతగా మనకు నేర్పించుచున్నది! చూచారా? ఒకదాని నుండి మరొక దానిలోనికి దాటియున్నాము.

108పాత సబ్బాతు గతించినది. యేసు ఎనిమిదవ దినమున తిరిగి లేచెను, అది పరిశుద్ద దినము. అది "దినము" కాదు, ఎందుకనగా కాలము గతించినది. అది నిత్యత్వము లోనికి వెళ్ళినది. తిరిగి మనము మొదటి దినమునకు వచ్చియున్నాము.

నిత్యత్వమనునది ఒక వృత్తమువలె యున్నది. దానిలో మూలను నీవు కనుగొనలేవు. పరిపూర్ణ వృత్తములో నీకు అంతము దొరకదు. నీవు ఆలాగు ముందుకు కొనసాగవలెను. ఎంత దూరము వెళ్ళినా ఇంకా నీవు వెళ్ళవలసి యుందువు. భూమి చుట్టూ నీవు వెళ్ళినట్లే యుండును. [టేపు మీద కాళీ ఉన్నది]… సాతాను దీనిని చెరిపినది. (దానిని సృష్టించలేదు) ఆ గొప్ప బంగారు గంట మ్రోగినప్పుడు, బూర ధ్వనించినప్పుడు అది ముగియును. అది గొప్ప గొర్రెపిల్లకు సాదృశ్యము, తన రక్తమును చిందించుటకు వచ్చెను. కల్వరి సిలువ లేపబడినది. దాని కొరకు చూచిన వారు పాత నింబంధనలో నీతిమంతులుగా తీర్చబడిరి. ఈ క్రొత్త యుగములో ప్రభువు క్రొత్త భూమి మీదికి వచ్చును. రక్షణ తాడు, రక్తము, విమోచనా శక్తి గూర్చి నేను మాట్లాడుచున్నాను. అదే పద్దతి వలన మానవుడు, భూమి కూడా విమోచించబడుదురు, నిత్యత్వము లోనికి వెళ్ళుదురు. భక్తిహీనులను, ముందు నిర్ణయములేని వారిని అగ్నిగుండము దహించి వేయును. మీరది గ్రహించారా?

109చూడండి, ఎనిమిదవ దినమున యేసు మన నీతీకరణ నిమిత్తము తిరిగి లేచెను. నిత్య రాజ్యముతో నిత్యుడగు రాజుగా ఆయన వచ్చును. నిత్యజీవముతో దానికి బాప్తిస్మమిచ్చును. ఏడు దినములు కాదు; దినములతో ఇక పని లేదు. ఇది మరొక నిత్యత్వమును గూర్చి మాట్లాడుచున్నది. నిత్యత్వ కాలమును గూర్చి మాట్లాడుచున్నది. ఆ ప్రపంచము గూర్చి నేను మాట్లాడుచున్నాను.

110చూడండి యాబది దినముల తరువాత, లేదా ఏడు సబ్బాతుల తరువాత మరొక పరిశుద్ద సంఘము కూడుకొనును. ఏమి జరిగినది? పెంతెకోస్తు దినమున పరిశుద్దాత్మ దిగినది. అది ఎనిమిదవ దినము. ఏడు సబ్బాతుల తరువాత అది జరిగెను. ఆయన పునరుత్థానము తరువాత అది జరిగెను, చూచారా. అది అయిన పిమ్మట మరల వారంలో మొదటి దినము వచ్చును. కచ్చితముగా, చూచారా.

111అదియే మీ పరిశుద్ద సంఘము, అక్షరముతో పనిలేదు దానిని దాటిపోయెను. నిత్యజీవముతో దేవుని రాజ్యము లోనికి వెళ్ళేదరు. ముందు నిర్ణయించబడిన వారందరు, ఏ దినమున అది ప్రారంభము కాలేదు. నీవు ఏ దినమున రక్షించబడలేదు. నీవు సదా రక్షింపబడియున్నావు. దానిని విమోచించుటకు మాత్రమే యేసు వచ్చెను. ప్రారంభముందే నీవు నిత్యజీవము కలిగియున్నావు గనుక ఆదిలోనే నీవు రక్షింపబడియున్నావు.

112చేప ఎన్నడూ కప్పగా మారదు. రెండూ ఒకే నీటిలో కలసియుండవచ్చును. అయినా వాటి పుట్టుక వేరు. అయితే ఆ వల కేవలము దానిని పట్టుకొనెను, చూచారా, కాని మొదటి నుండి వాడు అదే అయి యున్నాడు. ఇప్పుడు,

మనము యుగములను దాటిపోలేదు. మనము వాక్యములోనే యున్నాము. ఏబది దినముల తరువాత అది వచ్చును.

113చూడండి, ఎనిమిదిని వారము క్రింద లెక్కించము. వారములో ఎనిమిది రోజులుండవు; మీరది చేయలేరు (చూచారా?), ఎందుకనగా వారమునకు ఏడు రోజులే. మీరెట్లు లెక్కవేసినా అంతే; వారములో మొదటి రోజు ఆదివారము. చూచారా? నీవు ఏడు లెక్కపెట్టి మరలా మొదటికే రావలెను.

114మనమిప్పుడు మాదిరులన్నీ చూచాము. ఎనిమిదిలోనికి వచ్చియున్నాము. నిత్యత్వములోనికి వచ్చియున్నాము.

ధర్మశాస్త్రములు, ఆచారములు, క్రమములు ద్వారా నీవు రాలేవు గాని ముందు నిర్ణయము వలన వచ్చెదవు. ఆమేన్! నిజమగు పరిశుద్ధ సమాజముండును. ఏడవ సంఘ కాలాంతములో మనమున్నాము. పెంతెకోస్తు యుగమంతరించుచున్నది. దానిని మీరు చూచుచున్నారా? మనము పరిశుద్ద సంఘములోనికి ప్రవేశించుచున్నాము. మనము నిజమగు నిత్యత్వములోనికి ప్రవేశించుచున్నాము. సంఘము ఒక శాఖలోనికి పిలువబడలేదు, కాని నిత్యరాజుతో నిత్యత్వములో యుండుటకు పిలువబడినది. దినములు, కాలము అనునవి ఇక మనకుండవు. మీరు నిత్యత్వములోనికి దాటి యున్నారు. అందులో నుండియే మీరు వచ్చితిరి. ఆదిలో మీరు అచ్చటనే యుంటిరి.

JOHN 6:44

 

115ఒకే ఒక్క నిత్యజీవమున్నది. అది దేవుని రూపము మీరాయన తలంపుబట్టి వచ్చిరి. చూచారా? లేనియెడల మీరక్కడకు ఏ విధంగాను వెళ్ళలేరు. "నా తండ్రి ఆకర్షించితేనే గాని ఎవడును నాయొద్దకు రాడు." చూచారా, పాతవన్నియూ గతించెను, కాని ఇవి గతించవు, కావున నిత్యత్వము గూర్చి ఇది మాట్లాడుచున్నది.

పరిశుద్దాత్మ నిత్యమైనది. గతించిన కాలమంతయూ మీరు ఈ నిత్యత్వములోనే యుంటిరి. జరిగిన దానిని మీరు గుర్తించితిరి. మీరు ఒక నిత్యత్వ ఉద్దేశ్యముతో సృజించబడితిరి, ఎందుకనగా దేవునిలో ఉన్న లక్షణములకు మీరు ప్రత్యక్షతయై ఉన్నారు. ఆయన నిన్ను గూర్చి ఆలోచించి సృజించెను. నీ కొరకు ఒక నేలను తయారు చేసెను, నిన్ను ఒక మానవునిగా చేసెను; పాపము వచ్చి ఆయన మార్గమును వంకర చేసెను. నీవు లోకముతో నశించిపోవుచుండగా ఆయన నిన్ను విడిపించుటకు వచ్చెను. ఆ విధంగానే ఈ లోకమును ఆయన విమోచించెను. ఆయన ఉద్దేశ్యము ఆలాగే కొనసాగుచున్నది. చూచారా? హల్లెలూయా! ఓ, అది నాకెంతో మేలు చేసెను. ముందున్న దానిని గూర్చి ఆలోచించండి.

EPH 1:10

 

116ఎఫెసీ 1:10 చూద్దాం. (వ్రాసికొనండి. ఎఫెసీ 1:10) దానిని ఒక యుగముగా పిలువబడదు. ఏడవ దినము కాదు; అది కాల సంపూర్ణతగా పిలువబడును. కాలము సంపూర్ణమైనప్పుడు, అనగా కాలము నెరవేరినప్పుడు మీరు నిత్యత్వము లోనికి వెళ్ళేదరు. ఏడవ సంఘ కాలము అయిపోయినది; లూధరు కాలము అయిపోయినది; మెతడిస్టు కాలము అయిపోయినది; పెంతెకోస్తు కాలము అయిపోయినది, ఇప్పుడు మీరెచ్చటికి వెళ్ళుచున్నారు? నిత్యత్వములోనికి ఏడులు ఇక లేవు; మూడులు ఇకలేవు; సంఖ్యలు, కాలములు మొదలగునవి లేవు. ఆమేన్! దానిని మీరు చూచారా?

117కాలము నెరవేరియున్నది. వెయ్యేండ్ల పాలనలో పాపమంతయూ పోవును, మహా ధవళసింహాసన తీర్పు పరిశుద్దాత్మకు మాదిరిగా యున్నది. లోకము ఆకాశము నుండి వచ్చిన అగ్నితో బాప్తిస్మము పొందును; పాపమంతయూ నిర్మూలమగును; క్రిములన్నియు పోవును; దయ్యములన్నియు పోవును; శోదనలన్నియు పోవును; సమస్త చెడుపోవును (ఇది నేటి మాదిరి). అయితే దేవుడు ఏమి చేయును? ఆయన భూమి మిద కూర్చొనును, ఎందుకనగా పాపమంతా పోయినది.

1COR 12:13•

EPH 2:6

 

118ఆయన నీకు పరిశుద్దాత్మ మరియు ఆగ్నితో బాప్తిస్మమిచినప్పుడు అదే జరుగును. ఆయన వచ్చి నీతో నివాసము చేయగలడు. యేసుక్రీస్తుతో పరలోకస్థలములందు మనము కూర్చోగలము, ఎందుకనగా ఎప్పుడో ఆయనలో మనమున్నాము! ఉందుము అని కాదు గానీ ఇప్పుడే యేసుక్రీస్తులో కూర్చొనియున్నాము. అందులోనికి ఎట్లు ప్రవేశించగలము? పరిశుద్దాత్మ బాప్తిస్మము ద్వారా, ఒకే ఆత్మ ద్వారా మనమందరము క్రీస్తులోనికి బాప్తిస్మము పొందియున్నాము. ఇప్పుడే క్రీస్తులో యున్నాము. ఆయనే గొప్ప ఆత్మీయ రాజు, మనలో ఉన్న ఆత్మపై ఆయనే రాజు, ఎందుకనగా ఆది యందే ఆయనలో మనమున్నాము.

GEN 1:3,6,14•

EXOD 20:19

 

119చూచారా, ఆదియందు నీవు దేవునిలో ఒక ఆలోచన యున్నావు. ఆయన తన ఆలోచనలను దృశ్యరూపములోనికి తీసికొని వచ్చెను. (చూచారా?) ఆయన పలుకగా సమస్తమును సృజించబడెను. చివరకు ఒకనాడు జనులు దేవుడు మాతో మాట్లాడవద్దనిరి. ఆయన ప్రవక్త ద్వారా మాట్లాడెను. ఇక నుండి ప్రవక్త ద్వారా మాట్లాడుదునని ఆయన చెప్పెను. ప్రవక్త జరుగబోవు దాని గూర్చి చెప్పెను. అది జరిగెను. మీరు గ్రహించారా?

120కాల సంపూర్ణత వచ్చి యున్నది. పాపము లయమైనది. లోకము బాప్తిస్మము పొందినందున తగిన స్థలమయినది: వ్యాధి లేదు; క్రిములు లేవు; ముళ్ళు లేవు; పొదలు లేవు; మరణము లేదు; దుఃఖము లేదు; గుండెపోటులు లేవు; ముసలి వయస్సు లేదు; మరణకరమైనది గాని; కీడు గాని ఏదీ లేదు. నిత్యత్వమే యున్నది. ఆయన లక్షణములు వ్యక్తమైనవి, ఎందుకనగా ఆదిలోనే అవి యుండెను. అది ఆయన ఆలోచన.

GEN 1:28

 

121తరువాత ఏమి జరిగినది? ఆయన ఆదామవ్వలను భూమి మీద ఉంచి "మిరు ఫలించి అభివృద్ధి చెందుడి" అని చెప్పెను. తినుట వలన శరీరము పెరుగును. ఆ విధంగా ఆయన నియమించెను. కాని మధ్యలో పాపము వచ్చి ఆయన పధకమును గల్లంతు చేసెను. ఆ కొనసాగింపు మనము చూచుచున్నాము.

122కాని యేసు ఏమి చేసెను? దేవుడే దిగి వచ్చి ఒక మానవునిగా తన్ను బయలుపరచుకొని తన ప్రాణమును ఇచ్చెను. (ఆయన రాజు) ఇక్కడ నిలిచి యుండలేదు గాని మిగిలిన వారి కొరకు తన ప్రాణమును ఇచ్చెను. మిరిది గ్రహించారా? అంతా అయిపోయిన తరువాత దేవుని ఉద్దేశ్యము నెరవేరినది. నిత్యుడగు రాజు తన నిత్య జనులతో మానవ శరీరమందు ప్రత్యక్షమాయెను. అక్షరాలా, అలాగే జరిగినది. పాపము తీసివేయబడినది. దయ్యము పోయినది. అంతా అయిపోయినది.

123అదేమి చేయును?

ఈ భూమి పరలోకమునకు చోటిచ్చు స్థితిలో ఇప్పుడు లేదు. పాపము వైపు చూడండి. అది శుద్ధి చేయబడవలసియున్నది. పరిశుద్దాత్మతో నింపబడకుండా ఏ మగవాడు, ఏ వ్యక్తి, ఏ స్త్రీ, ఏ బాలుడు, ఏ బాలిక వేదిక ఎక్కుటకు కూడా తగడు. క్రైస్తవులుగా పిలిపించుకొన తగరు. దేవుని యొక్క పరిశుద్ద అగ్ని ద్వారా శుద్ధి చేయబడువరకు ప్రభురాత్రి భోజనము తీసికొనుటకు గాని, పాదములు కడుగుటకు గాని నీకు హక్కు లేదు.

మోషే వలే ఆ పరిశుద్ద భూమి మీద ఆయనను నీవు కలిసికొను వరకు అసలు నీకు బోదించు అర్హత కూడా లేదు; ఆ అగ్ని స్తంభము అక్కడ వ్రేలాడుచున్నది. అతడున్న చోటు అతనికి తెలియును, చూచారా.

EPH 2:6•

1JN 3:2

 

124మనమెట్లు వెళ్ళుదుమో గమనించండి. లోకము అగ్ని బాప్తిస్మము పొందిన తరువాత ఈ భూమి మీదే పరలోకముండును. (క్రిములన్నియూ పోవును) పరలోకమునకు తగిన స్థలమగును. క్రీస్తు యేసునందు పరలోక స్థలములందు కూర్చొనుటకు ఇది మాదిరి. ఈ అపవిత్రత నుండి దేవుని పోలికలోనికి దాటి యున్నాము. (ఆ స్త్రీని చూడండి) ఇప్పుడు మనము దేవుని కుమారులము. దేవుని ఆలోచనలకు మనము ప్రతీకలము.

125"ఈ యాజకుని వైపు చూడండి; ఇతడు దేవుని కుమారుడు కాడా?" అని మిరనవచ్చు. కాడని రుజవైనది; అతడు ఆయనను గుర్తించలేకపోయెను. నేను బైబిలును నమ్ముచున్నాను అని అతడు చెప్పవచ్చును గాని ఆ ఘడియకు వ్యక్తమయిన వాక్యమును గుర్తించలేకపోయెను. అతడు అంతకు ముందున్న ఒక గుంపు యొద్ద నుండి పాండిత్యము సంపాదించెను. నేడును ఆలాగే యున్నది. చూచారా? ఇది చాలా కఠినమగు మాట గాని సత్యము. ఆ దినమునకు పలుకబడిన వాక్యమున్నది. అతడు పండితుడే పేరొందిన వ్యక్తియే, కాని దానిని గుర్తించలేకపోయెను. ఎందువలన? అతడెంత పండితుడైనప్పటికిని ముందు నిర్ణయము అతనిలో లేదు. చూచారా? ముందుగా నిర్ణయించబడినవారు మాత్రమే ఆలాగు చేయగలరు వారు మాత్రమే చూడగలరు నీవు దానిని చూడగలిగితివి అంటే నీవు ముందుగా నిర్ణయించబడితివని దానిని బట్టి రుజువగుచున్నది. నీవు నిత్యజీవము పొందినయెడల నీవు ఎల్లప్పుడూ దేవునిలో భాగముగా ఉండవలసి యున్నావు. దేవుడు ఒక్కడే నిత్యుడు. దానిని నీవు గమనించావా? ఓ! దాని గూర్చి ఆలోచించుము!

JOHN 5:24•

JOHN 11:25,26•

EPH 1:3•

EPH 2:6•

1JN 3:14

 

126ఆ గొప్ప వెయ్యేండ్ల పాలన ద్వారా ఏమి జరుగుచున్నదో గమనించండి.

పాపమంతా పోయినది; వెయ్యేండ్ల పాలన వచ్చినది. పరిశుద్దాత్మ మనలను శుద్ది చేసినట్లు దానిని శుద్ధి చేసెను. మరణము నుండి జీవములోనికి దాటి యున్నారు. క్రీస్తు నందు, ఆయన మహిమ గల సన్నిధియందు పరలోక స్థలము లందు నివాసము చేయుచున్నారు. అప్పుడు శరీర మరణము కూడా యుండదు. ఇప్పుడు ఆత్మీయ మరణము గతించినట్లే అప్పుడుండును. బాప్తిస్మము పొందిన దేవుని యొక్క పరిశుద్దరికి ఆత్మీయ మరణము లేదు. "అతడు చనిపోయినను బ్రదుకును. బ్రదికి నా యందు విశ్వాసముంచు వాడెన్నడూ చనిపోడు." లేఖనమంతయూ తప్పక నెరవేరవలెను. మీరు చనిపోరు. మీకు నిత్యజీవమున్నది. విమోచకుడు వచ్చి మీరు దానిని గుర్తించునట్లు చేసెను. ఆ కారణము చేతనే మీరు ఈ దినమును చూచుచున్నారు. ఎంత మంది చూచుచున్నారో చేతులెత్తండి! వందనములు. చూచారా? నేడు మనము జీవించుచున్న దినమును గుర్తించియున్నారు.

127గట్టిగా అరచినప్పుడు మీరు దానిని పొందియుందురని మెతడిస్తు వారందురు, లోతు మొదలగు వారు గట్టిగా అరచిరి గాని పొందలేదు. నీవు భాషలలో మాట్లాడినప్పుడు పొందియున్నావని పెంతెకోస్తు వారందురు. చాలామంది భాషలతో మాట్లాడుచున్నారు గాని దానిని పొందుట లేదు. ఆ పరిసయ్యులకు ఎన్నో ఆచారములున్నవి. వాక్యము ప్రత్యక్షమైనప్పుడు దానిని వారు గుర్తించలేకపోయిరి. చూచారా? పెండ్లి కుమార్తె భర్తలో భాగమై యున్నది. ఆ వాక్యములో నీవెట్టి భాగముగా నున్నావో గుర్తించుము. లేని యెడల పెండ్లి కుమార్తెగా నీ స్థానమును నీవు గుర్తించలేవు. ఎందరది చూచుచున్నారు. నీ స్థానమును నీవు గుర్తించవలసి యున్నావు.

DEUT 18:15,18•

JOHN 5:46•

JOHN 14:26

 

128మరొకరి స్థానమును నీవు గుర్తించలేవు.

నోవహు వర్తమానముతో వెూషె వచ్చిన యెడల ఏమి లాభము? ప్రయోజనముండదు. మోషే వర్తమానముతో యేసు వచ్చిన యెడల ఏమి ప్రయోజనము? అది మరో కాలము. అది మరొక ప్రపంచము. వాక్యములోని వేరే భాగము అచ్చట నెరవేరబడవలసియున్నది. అది వారములోని మరో రోజు. మంగళవారము పని బుధవారము చేయలేవు. బుధవారము పని బుధవారమే చేయవలెను, చూచారా. శనివారమునకు శనివారపు పనియుండును.

వారు గుర్తించుచుండిరి. " ఓ, మాకు మోషే ఉన్నాడు" అనిరి.

"మీరు మోషేను ఎరిగి యుండినచో నన్నును ఎరిగి యుందురు," ఎందుకనగా అతడు నా గూర్చి పలికెను. "మీ ప్రభువగు దేవుడు నా వంటి యొక ప్రవక్తను మీలో పుట్టించును" అని మోషే చెప్పెనని ఆయన వారితో అనెను. గ్రహించారా? యోహాను 14 లో యేసు చెప్పినది చూడండి, "పరిశుద్దాత్మ వచ్చినప్పుడు ఈ సంగతులన్నియు మీకు జ్ఞాపకము చేయును. చూచారా? మీరే దినములో జీవించుచున్నారో చూపించును. రాబోవు సంగతులను ఆయన మీకు చూపించును" మరల ప్రవచనము యొద్దకే నడిపించును.

REV 20:10

 

129క్రొత్త భూమి, క్రొత్త ఆకాశము మరల ఎన్నడూ అపవిత్రము కావు. కొత్త భూమి వచ్చినప్పుడు అపవాధి బంధించబడును. సాతాను ఇప్పుడు విప్పబడి యున్నాడు; నేరములు మోపుచున్నాడు, కాని కొత్త భూమిలో అతడు బంధించబడి ఈ పరిశుద్ద అగ్నిలో, అగ్ని గుండములో పడద్రోయబడును.

130కొత్త భూమిని కొద్ది నిమిషములు చూద్దాం.

ఈ కొత్త భూమిలో ఆకాశములు మరెన్నడూ అపవిత్రము కావు.

ప్రచండ మేఘము వలన నల్లబడదు. గాలులు ఆ విధంగా దాని మీద విసరబడవు. చెట్లు, ఇండ్లు, మొదలగునవి ఆ విధంగా గాలి వలన కూల్చబడవు. సాతాను నుండి మెరుపులు, ఉగ్రత వచ్చి రోడ్డు మీద నడిచిపోవుచున్న మనిషిని చంపుట జరుగదు. ఏ ఇంటిని దహించుట జరుగదు. చూచారా? తుఫానులు వచ్చి ఇండ్లను కూలద్రోసి చిన్న పిల్లలను చంపివేయుట జరుగదా, నాశనము చేయుట ఇక ఉండదు. సాతాను బంధింపబడినది.

మనకు సమయమున్నచో బాగుండును. ఆలస్యము కాకుండా కొన్ని వాక్యములను దాటిపోవుచున్నాను. రోగుల కొరకు నేను ప్రార్థించవలెను.

PS 51:5

 

131భూమ్యాకాశములు కలిసికొనవలసియున్నవి. దేవుడు, మానవుడు సమాధానపడిరి. పునరుద్దరించబడిన ఏదేను ఆరంభమాయెను, చూచారా. శాపమంతయూ పోయినది. పరిశుద్దాత్మ నిన్ను అంగీకరించునప్పుడు నీలో నున్న పాపశాపమంతయూ పోవును. నీవు దానిని అంగీకరించుట కాదు గాని అది నిన్ను అంగీకరించును. (ఎందుకనగా అది దైవ రూపము, పరిశుద్దాత్మ, అనగా దేవుని ఆత్మ దేవుని ఆలోచన నిన్ను అంగీకరించును) ఎందుకనగా నీవు ఆ పని కొరకే ముందుగా అభిషేకించబడితివి.

మీరు పాపములో జన్మించినప్పటికి దేవుని ఆత్మ ఈ భూమి మీదికి వచ్చి మిమ్మును వశపరచుకొనెను. భూమి మీద మీరు మీ రూపమును వెల్లడి చేసిరి. చూడండి. మీరు ఇక్కడున్నారు; మీరు దీనికి చెందియున్నారు. పాపపు శక్తి నశించినది. ఇది సత్యము. పరిశుద్దాత్మ నీ లోనికి వచ్చినప్పుడు పాపపు కోరిక నీలో నుండి పోయినది. నీవు సమకూర్చబడిన వ్యక్తివి.

2PET 3:10,12

 

132భూమియు ఆ విధంగా సమకూర్చబడినప్పుడు ఇక శాపము, తుపాను, గాలులు మరేవీ యుండవు. నీవు సమాధాన పరచబడితివి. దేవుడు, మానవుడు కలిసికొనెను.

క్రొత్త భూమి మరల ఏదెను అందమును సంతరించుకొనెను. అగ్ని-బాప్తిస్మము పొందిన భూమి దహించబడి క్రొత్తదగును. పంచ భూతములు మహావేండ్రముతో లయమగును. భూమి మీది కృత్యములన్నియూ కాలిపోవును. నీరంతయూ ప్రేలును. అది అంటుకొనుట వలన మొత్తము తునాతునకలై పోవును. అగ్ని పర్వతములు బ్రద్దలగును. వాటి ద్రవము గాలిలో వేలాది మైళ్ళు ఎగిసిపడును. వేడి లావా ఎగిరి వచ్చును. దేవుని యొక్క పరిశుద్దాత్మ ప్రతి పరిశుద్దాత్మ ప్రతి పాపమును దహించి వేయును. అపవాది బంధించబడి అగ్ని గుండములో పడద్రోయబడును.

133అది దేవుని ఉగ్రతాగ్ని నిన్ను నాశనము చేయు ఏ జంతువు అక్కడుండదు. నీవు పూల తోటలలో నడచునప్పుడు ఏ విష-సర్పము నిన్ను కరవదు. ఓ! అది చాలా అద్భుతము కాదా?

వినండి, క్రొత్త భూమిలో సమాధి కనబడదు. దేవుడు, మానవుడు ఏకమయిరి. పెండ్లి కుమార్తె, పెండ్లి కుమారుడు, భూమ్యాకాశములు ఒకరినొకరు కౌగలించుకొనిరి. మానవుల మధ్య నివసించుటకు దేవుడు వచ్చెను. ఆయన నివాసము వారితో కూడా యున్నది. పాపము, దుఃఖము ఇక లేదు. ఏ తల్లి తన బిడ్డను గూర్చి ఒక్క కన్నీటి చుక్కను రాల్చదు. ఆమేన్! ఆ క్రొత్త నేల మీద అది ఉండదు. అది విమోచించబడినది. అది ఆయనకు, ఆయన వారికి చెందును, అది విమోచింపబడెను, చూడండి.

134మీరు ఆ నేలలో పాలి భాగస్దులు, నిజమేనా? నిన్ను విమోచించినట్లే ఆయన భూమిని కూడా విమోచించెను. మీరిరువురు ఏకమయిరి. ఇదెంత తేటగా యున్నదో చూడండి? నీవు దానిలో భాగము గనుక నీవు విమోచించబడవలసియున్నావు. నీ మీద రక్తము పడని యెడల ఇంకా నీవు విమోచించబడనట్లే, పిలువబడనట్లే, ఆ తరువాత ఆయన దానిని శుద్ధిచేయును. అగ్నితో ఆయన అదే చేయును. రక్తము నిన్ను కడిగినా గాని అగ్ని దహించవలెను. అప్పుడే దేవుని నివాస స్థలమగుదువు, దేవుడు ముందే తన నివాస స్థలమును ఏర్పరచుకొనెను. ఇప్పుడు దేవుని యొక్క రాజ్యము పరిశుద్దుల హృదయములలో ఈ భూమి మీద యున్నది. ఆది యందు ఆయన తన రూపమును వారిలో పోసెను. ఇప్పుడు వారు విమోచించబడిరి. ఆయన దేని కొరకు కనిపెట్టుచున్నాడు? భూమిని విడిపించి దాని మీద తన వారిని కూర్చుండబెట్టుటకు చూచుచున్నాడు. తన ముందు నిర్ణయ సంకల్పమును ఆయన నెరవేర్చును. అది మీరు చూచుచున్నారా?

ISA 35:1

 

135గమనించండి: సమాధులు లేవు, కన్నీరు లేదు, రక్త పాతములేదు, కన్నీటి వలన గాని రక్తము వలన గాని భూమి తడియదు. యుద్దములుండవు, శీతల మేఘములుండవు. హిపపాతముండదు, మండుటెండ దాని గడ్డిని కాలదు హల్లెలూయా!

ఎడారిలో గులాబీలు పూయును. ఆ ఇసుక ఎడారి ఒక రోజున పుష్పించును. (దేవుడాలాగు చెప్పెను) విమోచించిన పిదప ఆయన దానికి అగ్ని-బాప్తిస్మమిచ్చును. ఇప్పుడు ఎడారిలో కాక్టసులు, బలురక్కసి మొదలగు చెట్లు ఎదుగుచున్నవి, కాని ఒక అగ్ని-బాప్తిస్మము రానైయున్నది. అగ్ని-బాప్తిస్మము పొందినప్పుడు మానవునిలోని ద్వేషము, పగ, అసూయ దహించబడును, ఆది సంపూర్తిగా శుద్ది చేయబడి దేవుని నివాస స్థలముగా మారును. గుర్తుంచుకొనండి, ఆయన బృందము అక్కడాయనను కలిసికొనును. ఆమేన్!

LEV 23:30•

ISA 35:1

 

136అది ఒక కధ కాదు; సత్యము. దేవుడు అదే చెప్పెను. ఆయన అదే వాగ్దానము చేసెను. పెండ్లి కుమార్తె అచ్చటికి వెళ్ళును.

ఎడారి కూడా పూయునని ఆయన చెప్పెను. సాతాను, పాపము, పాపులు అందులో ఉండరు. నిత్యత్వము లోనికి అది జారి వెళ్ళును. ఈ చెడు అంతటికి మూలమగు ప్రధాన దూత సాతాను నాశనము చేయబడును.

గుర్తుంచుకొనండి, ఆయన ఆత్మను కూడా నాశనము చేయగలడని బైబిలు చెప్పుచున్నది. కాని ఆయన తన్ను తాను నాశనము చేసికొని దేవునిగా మిగిలి యుండలేదు. అది లోక సంభంధమగు ఆత్మయైనచో నాశనము కాబడవలెను. అది దేవునితో కూడా నిత్యత్వము గలదైనచో దానికి ఆరంభమే యుండదు. అది దేవునిలో భాగము; అదెన్నడూ నాశనము కాబడదు. ఆమేన్! సంఘము దీనిని చూడవలసి యున్నది!

137జనులారా, మీరు చేసినదంతయూ ఇచ్చట యున్నది. అదే నేను చెప్పు ప్రయత్నించుచున్నాను. అందలో కొంత విడిచి పెట్టుచున్నాను, ఎందుకనగా తిరిగి దాని యొద్దకు వచ్చెదను.

138సాతాను సృష్టించలేదు. సృష్టిచేయ కలిగినచో అది దేవుడే యగును. చూచారా? సృజించబడిన దానిని అది వంకరపరచును, జీవమును వక్రీకరించుట వలన మరణము వచ్చెను. వంకరను సరిచేయుట జరుగును. అప్పుడిక మరణముండదు. ముసలి వయసు మరణమునకు సూచన. ముసలితనము పోయినయెడల జీవము వచ్చును. వంకరలన్నియూ సరిచేయబడును. ముళ్ళు మరియు పొదలు పాపమునకు సూచన, వాటితో భూమి శపించబడినది. దాని వలన వ్యాధి వచ్చెను. మరణము తీసివేయబడును. రక్తపాతము నిర్మూలించబడును.

139విమోచించబడిన వారిని పరిశుద్దత మాత్రమే తాకును. ఓ, నాకెంతో అది బాగున్నది!

దేవుడు తన స్వరక్తము ద్వారా సృష్టిని విమోచించెను; తన స్వంత శుద్ధిచేయు పద్దతిలో శుద్ధి చేసెను. ఆయన క్రిములను చంపెను. పాపమును చంపెను. అగ్ని ద్వారానే అత్యుత్తమ నిరోధకము జరుగును. మీరు ఎన్ని రసాయనములలో కడిగినా మురికి కొన్నిసార్లు పోదు గాని కాల్చివేసినచో ఏదీ మిగలదు.

ISA 35:1

 

140దేవుని పరిశుద్ద అగ్ని భూమిని శుద్ధిచేయును. ఆయన తన పెండ్లి కుమార్తెను పైకి కొనిపోవును. ఆయనతో పాటు పరలోకమునకు వెళ్ళెను. మరల క్రొత్త ఆకాశము, క్రొత్త భూమి మీదికి వచ్చును.

శీతలము దానిని బాధించజాలదు. తీవ్ర ఎండలు దానిని బాధించజాలవు. ఎడారులు పుష్పించును. పాపము, పాపులు పోయిరి. దేవుడు తన సృష్టితో చక్కటి పొందికగా కలిసి జీవించును.

భూమ్యాకాశములు భార్యభర్తలుగా యున్నట్లే, క్రిస్తు ఆయన సంఘము కూడా యున్నారు. వారందరూ ఒక పెద్ద మహిమకరమగు విమోచన పధకములో కలిసికొందురు. తిరిగి దేవుని రొమ్ము యొద్దకు తీసికొని రాబడుదురు. చూచారా?

JOHN 14:1,2

 

141క్రొత్త భూమి మీద క్రొత్త పట్టణముండును. (ఓ మై! దీనిని జాగ్రత్తగా వినండి. మరువ వద్దు!) యోహాను 14లో యేసు ఇట్లు చెప్పెను, "మీ హృదయములను కలవరపడనియ్యకుడి (ఆయన వెళ్ళిపోవుచున్నాడు). నేను వెళ్ళుటకు ఒక కారణమున్నది. మీరు దేవుని యందు విశ్వాసముంచుచున్నారు. నా యందును విశ్వాసముంచుడి. మీకు ఒక స్థలము సిద్దపరచ వెళ్ళుచున్నాను. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు. నా తండ్రి రాజ్యములో అనేక భవనములు గలవు." ఆయన దేవుడని వారు చూడలేకపోయిరి. ఇప్పుడు క్రీస్తు ఈ క్రొత్త యెరూషలేమును నిర్మించుచున్నాడు.

ఇప్పుడు జాగ్రత్తగా వినండి; కదల వద్దు; దీనిని తప్పిపోవద్దు. క్రీస్తు నేడు పరలోకమందుండి క్రొత్త యోరూషలేమును సిద్దపరచుచున్నాడు.

JOHN 14:3•

2PET 3:8

 

142దేవుడు భూమిని ఆరు దినములలో సృష్టిచేసెను. (లేక ఆరువేల సంవత్సరములు) వేయి సంవత్సరములు ఒక దినమునకు సమానమని లేఖనములో మనము చదువుచున్నాము. ఈ విషయములో అజ్ఞానులుగా యుండకుడి క్రీస్తు వెళ్ళి ఒక స్థలము సిద్దపరచుచున్నాడు. (ఎన్నో వేల సంవత్సరముల నుండి ఈ నిర్మాణము జరుగుచున్నది) "నేను వెళ్ళి మీకు స్థలము సిద్దపరచిన యెడల నేను మరల వచ్చి నేనుండు స్థలములో మీరును ఉండులాగున మిమ్మును తీసికొని వెళ్ళుదును." విమోచకుడు మరియు విమోచించబడిన వారు ఒక్కచోటనే యుందురు.

143మనకు సమయమున్నచో బాగుండును; సొలోమోను పెండ్లికుమార్తెను గూర్చి వ్రాసిన లేఖనములు ఇక్కడున్నవి. ఓ, ఆలస్యమగుచున్నది గనుక వాటిని చెప్పెను. చూచారా?

ఆమెను అతడు తీసికొని రావలెనని ప్రయత్నించెను గాని ఆమె అప్పటికే ఒక గొల్ల బాలునితో ప్రేమలో పడినది. అది అతడు పాడిన పాట అని కొందరు తలంచుదురు. భూమి మీద దావీదు సింహాసనమునకు సాలోమోను వారసుడు, ఆ రాజ్యము గతించునని అది చూపించుచున్నది. క్రీస్తు పెండ్లి కుమార్తెతో ప్రేమలో పడుటకు అది సాదృశ్యముగా నున్నది.

JOHN 14:2

 

144యేసు చెప్పినది గమనించండి. (యోహాను 14), "…ఒక స్థలము సిద్ధపరచ వెళ్ళుచుచున్నాను." ఓ! అదెట్లు కనిపించునో పెండ్లికుమార్తె అగు మీరెరుగుదురా? దైవిక నిర్మాణకుని ద్వారా అది రూపించబడి సిద్దపరచబడినది. ఆ పట్టణము ఎట్లుండును?

దాని గూర్చి కొద్ది నిమిషములు నేను మాట్లాడగోరుచున్నాను. దైవ నిర్మాణకుడు దానిని రూపొందించి సిద్ధపరచెను. ఆయన తన మెత్తని చేతులతో తన ప్రియ పెండ్లి కుమార్తె కొరకు దానిని రూపొందించెను. అదెట్లు కనిపించెనై యున్నది? ఒక భార్యను పెండ్లి చేసికొనిన వ్యక్తి ఆమెను నచ్చినట్లుగానే ఇల్లు నిర్మించును. ఆమేన్!

1COR 2:9

 

145దైవ నిర్మాణకుడు ఒక క్రొత్త పట్టణము రూపొందించెను. ఆమెతో ఆయన జీవించును. ఆమె ఇష్టానాగుణముగానే నిర్మించును. అపోస్తులుడు చెప్పిన దానిలో ఆశ్చర్యము లేదు. "కంటికి కనబడలేదు; చెవికి వినబడలేదు; హృదయమునకు గోచరము కాలేదు." ఒక్క క్షణము దానిని గూర్చి ఆలోచించుదుము. అదెట్లు కనిపించునో చూద్దాం. తన ప్రియురాలి కొరకు దైవ నిర్మాణకుడు దీనిని రూపొందించెను. చూచారా? దైవ నిర్మాణకుడు రూపొందించబడినది.

ఆ పట్టణము ఎట్లు కనిపించును? దాని గూర్చి ఆలోచించుము.

REV 21:2,10

 

146అది పరలోకము కాదని గుర్తించుకొనుము! యోహాను చెప్పెను, "అది పరలోకము నుండి దిగి వచ్చుట చూచితిని." అది భూమి మీద యుండును. చూచారా? గతించిపోవు ఈ భూమి మీద కాదు; అది విమోచించబడిన భూమి. ఒక క్రొత్త తరమును లేపెదనని దేవుడు చెప్పలేదు. ఇక్కడున్న వారినే ఆయన విమోచించెను. ఒక క్రొత్త ప్రపంచమును ఆయన సృష్టించడు. అదిప్పుడే ఇక్కడ యున్నది. దీనిని ఆయన దహించును. నిన్ను శుద్ధి చేసినట్లే దానిని శుద్ధి చేయును. ఆయన పధకములు సదా నిలచి యుండును.

MATT 3:14-16•

MARK 1:10•

LUKE 3:22•

REV 21:2,10

 

147గుర్తుంచుకొనండి, అది పరలోకము కాదు; పరలోకము నుండి అది దిగి వచ్చినది. అది ఒక నివాస స్థలము. ఆయన ఆ నివాసమును తీసికొనును. పత్మాసు ద్వీపములోనున్న యోహాను ప్రకటన 21వ అధ్యాయములో అది దిగి వచ్చుట చూచెను. ఒక పావురము వలె పరలోకమునుండి పట్టణము దిగి వచ్చుట చూచెను. దేవుడు భూనివాసము మీదికి దిగి వచ్చుచున్నాడు. యేసు పరలోకము నుండి దిగి వచ్చుచున్నాడు.

యేసు బాప్తిస్మము పొందినప్పుడు ప్రవక్తను కలిసికొనెను. (వాక్యము ప్రవక్త యొద్దకు వచ్చును. ఆయనే వాక్యము. వారి శాఖలన్నింటిని నిందించుచూ ప్రవక్త అక్కడ నిలబడియుండెను.) వాక్యము తన యొద్దకు వచ్చుట అతడు చూచెను. ప్రవక్త ఆశ్చర్యము చెంది ఇట్లనెను, "నేను నీ వలన బాప్తిస్మము పొందవలసియున్నాను. నీవేల నా యొద్దకు వచ్చితివి?"

అందుకాయన ఇట్లనెను, "ఇప్పటికీలాగు కానిమ్ము, నీతి యావత్తు ఈలాగు నెరవేర్చవలసియున్నాను. (ఆ వర్తమానము మీకు తెలియును) నేనే ఆ బలిని. అది కడుగబడవలెను." ఆ ప్రకారమే అతడు చేసెను.

MATT 3:16•

MARK 1:10•

LUKE 3:22•

HEB 11:3

 

148నీటిలో నుండి బయటకు వచ్చినప్పుడు అతడిట్లనెను, "ఆకాశము తెరువబడుట చూచితిని." ప్రవక్త దానిని చూచెను. పరలోకము తెరువబడుటయు, పరలోకము నుండి పావురము వంటి ఆకారములో ఒకటి దిగి వచ్చుటయు అతడు చూచెను. ఒక స్వరము ఇట్లన్నది, "నేను విమోచించిన భూమిలో ఇది ఒక భాగము. ఈ భూభాగము వలన నేను తక్కిన దానినంతయూ విమోచించెదను. ఈయనే నా ప్రత్యక్షపరచబడిన వాక్యము. సర్వలోకమును నేను నా మాట ద్వారా ఉనికి లోనికి తెచ్చితిని. ఇంత వరకు సాతాను దీనిని పట్టుకొని యున్నది, కాని దీనిని విడిపించుటకు నేను వచ్చితిని. (హెబ్రి 11) అందులో నేను నివసించుదును."

MATT 3:16•

MATT 4:1,2•

MARK 1:10,13•

LUKE 3:22•

LUKE 4:2•

REV 21:2

 

149యోహాను ఇట్లనెను, "యెరూషలేము అను పరిశుద్ద పట్టణము పరలోకము నుండి దిగి వచ్చుట చూచితిని, అది పెండ్లి కుమారుని కొరకు అలంకరించబడిన పెండ్లికుమార్తె వలె యున్నది." అది ఎక్కడున్నది? భూమి మీద యున్నది. పరిశుద్దాత్మ దిగి వచ్చిన ఆ భూమిలో యేసు భాగమై యుండును. (నిజమేనా?) అది సదా కాలము ఆయనకు చెంది యుండును. అదెన్నడు ఆయనను విడువదు. అదెల్లప్పుడు అచ్చటనే యుండును. ఆయనే దేవుడు. సదా నిలచి యుండువాడు. క్రొత్త యెరూషలేమును పరిశుద్ద పట్టణము పావురము వలె పరలోకము నుండి దిగి వచ్చి, విమోచించబడిన మొత్తం భూమి మీద నిలచినట్లు యోహాను చూచెను. ఎందుకొరకు? విమోచించబడిన స్త్రీ పురుషులకు ఆ భూమి ఇవ్వబడును. వారు నిత్యజీవము గలవారు. అగ్ని ద్వారా అది దహించబడినది. యేసు అరణ్యములో నలుబది దినములు అగ్ని వంటి శోధనలను సహించెను. తరువాత చూచినట్లయితే ఆయన సేవకు అది నాంది అయినది.

GEN 1:28•

REV 3:14

 

150దాని గూర్చి ఆలోచించుము, భూమి మీద పరిశుద్దాత్మ దిగినది. యేసు పరిశుద్ద రక్తము చిందించబడినది. ఇప్పుడు గమనించండి. మరీ లోతుగా వెళ్ళుట లేదని తలంచుచున్నాను.

దేవుని సృష్టికి యేసు ఆదియై యున్నాడు. ఆ పరిశుద్ద రక్తము దేవునిచే సృజింపబడినది. రక్తమే ప్రాణము. దానిని మీరు గ్రహించారా? సృష్టిలోనే దేవుడు తయారయ్యెను. ఆయన ఆత్మయై యున్నాడు. దేవుని యొక్క సృష్టికి ఆయన ఆదియై యున్నాడని బైబిలు చెప్పుచున్నది. ఆయనెట్లు ప్రారంభమాయెను. స్త్రీ గర్భములో ఏమున్నది ? ఆ గ్రుడ్డివారు సర్ప-సంతానమును చూడలేకపోయిరి. హవ్వ ఈ భూమి మీద ఉంచబడెను. సాతాను ఎన్నడూ ఆమెను అప్పటికి అంటుకొనలేదు. ఫలించి అభివృద్ధి చెంది భూమిని నింపుడని ఆయన వారితో చెప్పెను. కాని మధ్యలో సాతాను వచ్చినది. ఆదాము దేవుని యొద్దనుండి ప్రత్యక్షముగా వచ్చినవాడు. నీకు నీ తల్లిదండ్రుల స్వభావము వచ్చును. నీవు తిరిగి జన్మించినప్పుడు, నీ పరలోకపు తండ్రి యొక్క స్వభావమును పొందెదవు. నీ పరలోకపు తండ్రి యొక్క రూపము వాక్యము. కాబట్టి ఈ శాఖల మాటలు నమ్మి ఆ వాక్యమునెట్ల త్రోసివేయుదువు?

దీనిని మీరు తప్పిపోరని భావించుచున్నాను. ఇది దేవుని యొద్దనుండి వచ్చినదని నేనెరుగుదును.

GEN 3:15

 

151దేవుని రూపమగు యేసు ఇక్కడ దిగి వచ్చుచున్నాడు. నీవిది చేసినందున నీ సంతానమునకు సర్పము యొక్క సంతానమునకును మధ్య వైరము కలుగజేసెదనని దేవుడు చెప్పెను. స్త్రీకి ఎట్టి సంతానము లేదు. దాని గూర్చి మీరెన్నడైనా ఆలోచించారా? ఆమెకు పొలమున్నది గాని బీజము లేదు. సర్పము ముందే తన బీజమును అక్కడ ఉంచినది స్త్రీకి బీజము లేదు గనుక ఆమె బీజమును పొందువరకు వేచియుండవలెను.

GEN 3:1

 

152లైంగిక సంపర్కము వలన సాతాను తన బీజమును విడిచిపెట్టినది. సర్పమునకు కాళ్ళుండెను. అది మాత్రమే స్త్రీతో సంపర్కము చేయగలిగిన స్థితిలో యుండెను. ఒక జంతు బీజమును మానవ సంపర్కము చేయజాలరు. వారు ప్రయత్నించిరి గాని విఫలమైరి. మగవాని యొక్క బీజ జీవము స్త్రీ లోనికి వెళ్లజాలదు.

GEN 3:15-18•

REV 3:14

 

153అందుకే వారు చింపాంజీ మరియు మానవునికి మధ్య నున్న జాతిని కనుగొకలేకపోయిరి. పక్షుల నుండి, కోతుల నుండి పరిణామమున్నదని వారు చెప్పిరి గాని చింపాంజి దగ్గరకు వచ్చి వారు ఆగిపోయిరి. అది సర్పము, పాము కాదు. అది శపించబడెను గనుక దాని రూపము నశించెను.

దేవుడు ఆదామును శపించలేదు, కాని భూమిని శపించెను. అందువలన ముళ్ళు, పొదలు మొలిచెను. ఆదాము హవ్వను ఏలువని ఆయన చెప్పెను. ఆమె అందుకే ఏమీ బోధించ ప్రయత్నించలేదు. ఆదాము ఆమెను ఏలును. దుఃఖముతో నీవు బిడ్డలను కందువని ఆమెతో చెప్పెను. ప్రయాసతోనే భూమి మీదికి జీవము వచ్చుచున్నది. ఆమెకు ఎట్టి బీజము లేదు. ఆమె బీజమును పొందవలెను. దేవుడామెకు ఒక సృష్టి ద్వారా బీజమును ఇచ్చెను, శరీరేచ్చ వలన కాదు.

సర్ప సంతానమును చూడలేని గ్రుడ్డివారు దీనిని గ్రహించరా? ఆదాము కంటె ముందుగా సాతాను ఆమెను చేరినది. తన బీజము అక్కడ విడిచి పెట్టినది. కాని ఆమె దేవుని బీజమును కూడా పొందినది. ఆయనే సృష్టికి ఆదియై యున్నాడు.

MARK 4:11•

LUKE 8:10•

2COR 4:4

 

154హేబెలు నీతిమంతునిగా యుండెను. షేతు కూడా ఆ విధంగానే యుండెను, వారి తండ్రి మంచివాడు. అయితే ఆ హంతకుడు, అబద్దికుడు ఎక్కడ నుండి వచ్చెను? అది ఒక సంతానము. కయూను ఒక నరుడు. ఓ! ఇంకా వారెందుకు గ్రుడ్డిగా ఉంటున్నారు? ఈ లోక దేవత వారికి గ్రుడ్డితనము కలుగచేసెను. ఏ మానవుడు దీనిని చూడలేడని యేసు చెప్పిన దానిలో ఆశ్చర్యము లేదు.

"వారెందుకు దానిని చూడలేదు?" అని మీరడుగ వచ్చును. యేసు ఒకసారి తన శిఘ్యలతో ఇట్లనెను. "దేవుని రాజ్యమును గూర్చి ఎరుగు జ్ఞానము మీకియ్యబడినది కాని వారికియ్యబడలేదు."

GEN 4:1

 

155అందుకే మీరు పదిహేను వందల మైళ్ళ దూరం నుండి వచ్చారు. రాజ్యమును గూర్చి మీరు తెలిసికొందురు.

చూచారా, రాజ్యములోనికి వెళ్ళుటకు పెండ్లి కుమార్తె సిద్ధపడుచున్న ఈ చివరి ఘడియలో దక్షిణాఫ్రికా నుండియు జనులు వచ్చియున్నారు. నాకు సమయము చాలుట లేదు. గమనించండి.

సర్పసంతానమును మీరు చూడ గలుగుచున్నారా? ఎంత చక్కగా కనబడుచున్నది! టుసాన్లో ఒకతను బహుశా టేపు విని ఆ విధంగా పలికి యుండును. ఒక సంగతి చెప్పుచున్నాను. "యెహోవా యొద్దనుండి ఒక కుమారుని పొంది యున్నాను," అని హవ్వ చెప్పెను గదా? అనెను. నిశ్చయంగా! దేవునికి ఒక నియమమున్నది.

156ఒక పొలములో నీవు గోధుమలను, గురుగులను నాటితివనుకో, ఆ రెండు బీజములను ఒకే సూర్యుడు, ఒకే వర్షము ఎదుగ చేయును. అది దేవుని చట్టము. దానిని మీరలేము. ఈ పట్టణములో అతి నీచురాలయిన స్త్రీ కూడా బిడ్డను కన్నప్పుడు దేవుని నుండియే పొందితినని చెప్పెను. ఆమె పెండ్లి చేసికొనకుండా, పురుషునితో జీవించి బిడ్డను కని కూడా ఆలాగనును. (ఎందుకనగా అది దేవుని సూత్రము) ఆలాగు కానియెడల సాతాను నీవు సృష్టికర్తవని చెప్పినట్లుండును. అప్పుడు వాడు దేవుడగును. ఓ! నీవెంత గ్రుడ్డివాడవు! నిశ్చయంగా అది దేవుని చిత్తము. ఏశావు, యాకోబు లేదా యూదా మరెవరయిన గాని దేవుని ద్వారానే రావలెను. దేవునికి ఒక చట్టమున్నది.

MATT 5:45•

HEB 6:7•

REV 3:14

 

157"నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను సూర్యుడు ప్రకాశించుచున్నాడు" అని బైబిలు చెప్పుచున్నది. వర్షము కూడా ఆలాగే పడుచున్నది. హెబ్రి 6వ అధ్యాయములో చూడండి, "వర్షము భూమి మీద పడి సేద్యపరచుటకు భూమిని సిద్దపరచుచున్నది." ఆ విధంగా మనకు జీవనోపాధి దొరుకుచున్నది. అదే వర్షము అదే సూర్యుని ద్వారా ముండ్లు మరియు పొదలు కూడా బ్రదుకుచున్నవి. ప్రతి విత్తనమును పక్వములోనికి తెచ్చుట, ప్రతి విత్తనము ఉత్పత్తి చేయుట దేవుని యొక్క చట్టమై యున్నది. కనుక సర్ప సంతానమును అది ఉత్పత్తి చేయవలసియున్నది. అది దేవునిని ఎన్నడూ ఆటంకపరచజాలదు. ఆయన పూర్తి పధకమును అది నెరవేర్చినది. ఆయనను ఒక విమోచకునిగా చేసినది. లోకదేవత నిన్ను దీనిని చూడకుండా దాచి వేసినది. అది నీవు ఎంతో తేటగా చూడ కల్గినట్లున్నది. సర్ప సంతానమున్నది.

ఇప్పుడు చూడండి. యేసే దేవుని యొక్క సృష్టికి ఆదియైయున్నాడు.

158ఒక స్త్రీ ఏమి చేయును? స్త్రీలో ఎట్టి జీవము లేదు. ఆమెలో చిన్న అండమున్నది. దానిని పొలమునకు పోల్చవచ్చును. నీవు పొలమును దున్ని పిచ్చి మొక్కలను పీకి మందులు చల్లి సేద్యమునకు సిద్ధపరచెదవు. అందులో మంచి విత్తనములు వేయుదువు, ఎరువు వేయుదువు. శత్రువు వచ్చి మరొక విత్తనమును అందులో వేయును. దేవుని యొక్క అదే నియమము ఆ రెండు విత్తనములను కూడా పండించును. అయితే దేవుడు దానిని ఉద్దేశించలేదు. (చూచారా?) కాని ఏమి జరిగినది?

159పురుష వీర్యము హీమోగ్లోబిన్ను మోసికొనిపోవును, అదియే రక్తము. రక్తములో ప్రాణమున్నది. పశువులను సంకరము చేయునప్పుడు నేను దానిని చూచాను. సహెూ. షెకారియన్ మమ్ములను వైద్యుల యొద్దకు తీసికొని వెళ్ళి వీటన్నింటిని చూపించెను. (రసాయనములను ఉపయోగించెడి వారు) ఆడ వాటిలో నుండి అండములను సేకరించెడివారు. మగవాటి నుండి వీర్యమును సేకరించెడివారు. వీర్యము జీవకణములతో నిండియుండును. అండములో అవి యుండవు. స్త్రీ ఒక పొలము మాత్రమే. అందులో అండమున్నది. ఈ జీవమునకు అది సారవంతమగు నేల. ఈ జీవము కదలుచూ ప్రాకును. ఇది గొప్పమర్మము.

160మొదటిగా కలిసినది బ్రదుకును. ఆ తక్కినవన్నియూ చనిపోవునని మీరందురు.

"అదెట్లు నిర్ణయమగును?"

"మొదటిది" అని మీరందురు.

మొదటిగా నున్న అండము, మొదటిగా నున్న కణముతో కలియునందురు. కాదు, ఒక అండము బాగా వెనక్కు వెళ్ళిపోవచ్చును. వీర్యములోని మధ్య నున్న కణము (జీవి) వెళ్ళి దానిని కలియవచ్చును. ఏదో ఒక అతీతమగు జ్ఞానము దీనిని నిర్ధారించుచున్నది. ఆ జుట్టు ఎర్రగా ఉండవలెనో, నల్లగా ఉండవలెనో, పెద్దగా నుండవలెనో, చిన్నగా ఉండవలెనో, స్త్రీ కావలెనో, పురుషుడు కావలెనో ఒక శక్తి నిర్ణయించుచున్నది. దాని గూర్చి మీరేమియూ చేయలేరు. మీరు వాటిని మిశ్రితం చేసినా ఏమీ కాదు. దేవుడే దానిని నిర్ణయించును.

కొంతసేపటికి ఒక చిన్న జీవకణము అండమును చేరును. దానికి చిన్న తోక వంటిది యుండును. దానితో మెలికలు తిరుగుచూ వెళ్ళి ఆ శిశువు యొక్క వెన్నుముకను నిర్మాణించును.

MATT 5:45•

MATT 13:24,25,30

 

161ఆమెలో ఎట్టి బీజము లేదు. బీజమును చేర్చుకొను పొలమున్నది. కాబట్టి శత్రువు యొక్క బీజమును వెళ్ళెను. మంచి విత్తనములు చల్లవాడు వాటిని చల్లుటకు వెల్లెను. వాని వెనుకగా శత్రువు కూడా చెడ్డ విత్తనములు చల్లుటకు వెళ్ళెను. నీతిమంతుల మీద, అనీతిమంతుల మీద కూడా వర్షము కురియును. అవన్నియూ పెరుగును. "అవన్నియు కట్టలు కట్టబడు దినము వరకు వాటిని కలిపి ఎదుగనీ" అని యేసు చెప్పెను. ఆగురుగులే ఇప్పుడు కట్టలు కట్టబడుచున్నవి. పెద్ద సంస్థలను పెద్ద కట్టలు తయారగుచున్నవి. అవన్నియూ కలిసి ప్రపంచ సంఘ సమితి అను పెద్ద కట్టగా తయారగుచున్నవి. అంతము ఏమిటి? కాల్చబడును కాని గోధుమలు కొట్టులో సమకూర్చబడును. చూచారా? అవి రెండూ ఒకే నీరు, ఒకే ఎండ వలన బ్రదికినవి.

162అంటు కట్టబడిన నారింజ చెట్టు దానిమ్మ పండును కాయును. అది నిమ్మకాయను, దబ్బకాయను కాయ వచ్చును. అది నారింజ చెట్టుగా ఉండదు, ఎందుకనగా నారింజ చెట్టు యొక్క జీవము దానిలో లేదు.

శాఖలు ద్రాక్షాతీగెలోనికి చేర్చబడినవి. వారు క్రైస్తవులమని చెప్పుకొనుచున్నారు, కాని ఆ జీవము లేదు. కయప ప్రవచించెను (అతడేమిటో మీరెరుగుదురు) వారిలో ఆ జీవము లేదు. దీనినంతటిని గూర్చి చెప్పుటకు ఒక వారము రోజులు చాలవు. మీరు దీనిని తప్పిపోకుండా చూచునట్లు తేటగా చెప్పవలెను. కొన్నింటిని నేను చెప్పకుండా దాటిపోవుచున్నాను.

REV 3:14

 

163ఇప్పుడు గమించండి!

చూడండి, తన ప్రియమగు పెండ్లి కుమార్తె కొరకు ఆయన చేతులు దీనిని రూపించెను. పరిశుద్దాత్మ యేసు మీదికి దిగి వచ్చెను. యేసు భూమిలో ఒక భాగమై యున్నాడు. ఎందువలన? దేవుని యొక్క జీవము. దేవుని యొక్క కణము ఒక స్త్రీ గర్భములో రూపొందించబడెను. అది ఒక పొలము. (అవునా?) దేవుని జీవము అందులోనికి వచ్చెను, కనుక ఆయన దేవుని యొక్క సృష్టికి ఆదియైయున్నాడు. కల్వరి యొద్ద ఆ దేవుని రక్తము చిందించబడినది. నేల మీద ఒలికించబడినది. ఎందుకొరకు? భూమిని విడిపించుటకొరకు. అది నీతిమంతురాలిగా తీర్చబడినది. అది శుద్దీకరణము పొందినది. ఆయనకు సొత్తయినది. ఇపుడది అగ్ని-బాప్తిస్మము పొందనైయున్నది. యేసు కొరకు ఆయన పెండ్లి కుమార్తె కొరకు శుద్దిచేయబడును. మీరును ఈ భూమి మీద నుండి ఆకర్షించబడిన భాగములుగా నున్నారు. మీ శరీరము మట్టిలో ఒక భాగము. మీ ఆత్మ దేవునిలో భాగము. దైవరూపముగా ఈ భూశరీరమందు మీరు ప్రత్యక్షమైతిరి. శరీరము విమోచించబడవలెను. ఇప్పుడు ఆత్మ విమోచించబడవలెను. ఇప్పుడు ఆత్మ విమోచించబడివున్నది, ఎందుకనగా అది పాపములో యున్నది. కాబట్టి దేవుడు నీతీకరణ, శుద్దీకరణ, పరిశుద్దాత్మ బాప్తిస్మము అను పద్దతుల ద్వారా వచ్చి నీ ఆత్మను విమోచించెను.

164నీవు మట్టిలో భాగమై యున్నావు గనుక దాని మూలమున విడిపించబడియున్నావు. ఇప్పుడు నీవు ఆ పద్దతిలో యున్నావు. అది ముందుకు ఎదుగుచున్నది.

నోవహు బాప్తిస్మము క్రింద నీ శరీరము నీతిమంతురాలిగా తీర్చబడినది. ఆమేన్! భూమి అగ్ని ద్వారా పరిశుభ్రము చేయబడును. (అది నీవున్న చోటు) పరిశుద్దాత్మ బాప్తిస్మము పొందును. క్రీస్తుకు, ఆయన పెండ్లి కుమార్తెకు, అనగా క్రొత్త యెరూషలేమునకు అది నివాస స్థలమగును.

165ఈ పట్టణమును గమనించండి.

భూమి మీద అది యుండును. ఈ మార్పును మీరు తేటగా చూడగలరు. భూమి తప్పక మార్పు పొందవలెను. ఈలాగే యుండదు.

మార్పు పొందకుండా వెయ్యేండ్ల పాలన తరువాత ప్రపంచము ఈలాగే కొనసాగదు. చూచారా? అట్టి స్థలముగా ఉండవలెనన్న అది మార్పు పొందవలెను. ఆయన పరిశుద్దాగ్ని ద్వారా మనము మార్పు పొందినట్లే యుండును. అప్పుడు పరిశుద్దాత్మకు మనలోనే స్థలముండును.

166ఇప్పుడు చూడండి. క్రొత్త భూమి మీద చాలా స్థలముండును. సమృద్దియగు చోటుండును. అగ్ని ద్వారా అది మార్పు పొందుట సత్యము. సముద్రము ఇక ఉండదు.

గమనించండి, ఆ పట్టణము పదిహేను వందల మైళ్ళ చదరముగా ఉన్నది. ఈ కొలతలను జాగ్రత్తగా వినండి. (ఒక నిమిషము నల్లబల్లను తుడిచి వేయుదును).

దేవుని యొక్క లోతయిన ప్రత్యక్షత ఇచ్చట యున్నది. ప్రభుని చిత్తమయితే తక్కిన దానినంతటినీ చెప్పెదను.

REV 21:16

 

167ప్రకటన గ్రంథము తీసి దాని కొలతలను చూడండి — 2,300 ఫర్గాంగులున్నది. పదిహేనువందల మైళ్ళ చచ్చవుకముగా ఉన్నదని మనము కనుగొనుందుము. అదెంత దూరముండునో ఎరుగుదురా? ( ఈ వారంలో నేను దానిని కొలిచాను). అది మైయిన్ నుండి ఫ్లోరిడా వరకు, తూర్పు సముద్ర బోర్డు నుండి ఆరువందల మైళ్ళ అవతలికి, అనగా మిస్సిసిపి పశ్చిమానికి వ్యాపించి యుండును. ఇంకో మాటలో చెప్పవలెనన్న - ఆ పట్టణము అమెరికా దేశములో సగముండును.

చోటు లేదని చెప్పుటకు తావు లేదు.

REV 21:1,12,16,21

 

168సముద్రము ఇక లేదు. అయిదింట నాలుగు వంతులు జలమే యున్నది. అవునా? ఆ ప్రేలుడు సముద్రమును ఎండిపోచేసెను. భూమి సమతలమాయెను. ఓ! గుర్తుంచుకొనండి. పదిహేను వందల మైళ్ళు చచ్చవుకముగా ఉన్నది. ఎంత గొప్ప పట్టణము! సముద్రము ఇక లేదు. ఎత్తు మరియు వైశాల్యము ఒక్కటిగా యున్నవి. ఇటు పదిహేను వందల మైళ్ళు, అటు పదిహేను వందల మైళ్ళు, పొడవు పదిహేను వందల మైళ్ళు యున్నది. ఎత్తు కూడా వాటితో సమానముగా యున్నది. (పదిహేను వందల మైళ్ళు దాని గూర్చి ఆలోచించండి!) స్ఫటికము వంటి బంగారము! ఆ గోడ చుట్టూ గోడ యున్నది.

REV 21:16

 

169సమానముగా యుండవలెనను అవసరత లేదు. గోడలు మరియు పునాది సమానముగా యున్నది. అది క్యూబ్ కాదు స్క్వేర్ కాదు. ఆ విధముగా ఉండవలసిన అవసరము లేదు. మరియొక భౌగోళిక లెక్క యున్నది. దాని ప్రకారము కొలతలు సమానము. అది పిరమడ్. చచ్చౌకముగా (Four Square) ఉన్నది, గోడలు సమానము.

170దానిని గీసెదను.

చూచారా? పొడవు, వెడల్పు, ఎత్తులు చూడండి. మరొక నిశ్చయమైనది చూచుచున్నాము.

ఈ కొలతలన్నియూ సమానముగా యున్నవి. పొడవు, వెడల్పు ఎత్తులు, దానిని నిరూపించు మరో పిరమిడ్ కొలతయున్నది. ఐగుప్తులో హానోకు యొక్క గుర్తుగా పిరమిడ్ యున్నదనుటకు ఇది జవాబును ఇచ్చుచున్నది.

జలప్రళయ నాశనమునకు ముందు హానోకు ఒక గురుతు చూపించెను. నీతీకరణము ఇంకా రానున్న సమయమది. ఈ పిరమిడ్లోని ఏడు మెట్లు రాజ గదికి దారితీయును. ఏడవ మెట్టు గమనించండి. (పిరమిడ్ యొక్క కొలతలు మీరు చదివారా?) రాజును పరిచయము చేయుటకు ఆ ఏడవ మెట్టు పరిమితము మీరు జీవించుచున్న ఘడియను మీరు చూతురు. (పిరమిడ్లో).

171దేవుడు మూడు బైబిలులను తయారు చేసెను. ఒక బుద్ధిహీన పిరమిడ్ బోధ యున్నది, కాని నిజమగు పిరమిడ్ కూడా యున్నది. చూచారా? అన్నియూ మూడులలోనే యుండును. యేసు మూడుసార్లు వచ్చును. తన పెండ్లి కుమార్తెను విడిపించుటకు ఒకసారి ఆయన వచ్చును. తన పెండ్డి కుమార్తెను కొనిపోవుటకు తరువాత వచ్చును. తన పెండ్లి కుమార్తెతో ఉండుటకు చివరిగా ఆయన వచ్చును.

172ఎంత చక్కగా యున్నదో ఇప్పుడు చూడండి. ఈ పిరమిడ్ ఏడు మెట్లున్నవి. ఆ తరువాత రాజు గది యుండును. మనము ఏడవ సంఘ కాలములో యున్నాము. తరువాత రాజు సింహాసనము యొద్దకు వెళ్ళుదుము. పిరమిడ్ మీద తలరాయి లేదు.

173దేవుని మొదటి బైబిలు ఆకాశమందున్నది, అది రాశి చక్రము. అది ప్రారభమై మరియు ప్రతి యుగములో నడచును. రాశి చక్రములో మొదటిది కన్య మొదట ఆయన అలాగే వచ్చెను. రాశి చక్రములో చివరిది సింహము. ఆయన రెండవ రాకడ దానికి ముందున్న కాలములో మనము ఇప్పుడు జీవించుచున్నాము.

మనము జీవించుచున్న ఈ ఘడియను గూర్చి పిరమిడ్ యొక్క కొలతలు చూపించుచున్నవి. (సమయమున్నప్పుడు దైవ సహాయము ద్వారా దానిని చూపించెదను).

గమనించండి, ఈ భౌగోళిక కొలత చూడండి. దాని కొలతలు సమానము. క్యూబు ఉండవలసిన అవసరము లేదు. ఐగుప్తులో హానోకు గురుతును ఇది చూపించుచున్నది.

174భూమికి అగ్ని-బాప్తిస్మము ఇయ్యబడును. అప్పుడు అది పరిశుద్దమగును. అగ్నిపర్వతమును ఈ భూమి మీద బ్రద్దలగును. పిరమిడ్ వలె నున్న పర్వతమును అది బద్దలు చేయును. చూచారా? అది జరుగుటకు కావలసినంత చోటున్నది. ఈ మొత్తం మారును. పూర్తిగా ఉపరితలము మారును. మీరిది గ్రహించారా? పిరమిడ్ వలె ఉన్న పర్వతమును అది త్రోసివేయును.

ISA 65:25

 

175ఇది అక్షరాలా వాక్య నెరవేర్పుగా ఉండును.

యెషయా 65:25 లో (ఇప్పుడే ఇట్లు చదివాము). "నా పరిశుద్ద పర్వతమును వారు కదల్చలేరు. నాశనము చేయలేరు అని యెహోవా సెలవిచ్చుచున్నాడు." ఓ! గుర్తుంచుకొనండి. అది ఎల్లపుడూ పర్వతముగానే యుండును.

గోడలు తిన్నగా పైకి యున్నచో ఆ పట్టణమును బయట నుండి లేదా లోపట నుండి మాత్రమే చూడగలము. సింహాసనము లోపట నుండియే కనబడును. ఇప్పుడు యెషయా 4:5 లోని వాగ్దానమును చూడండి. దానిని మనము చదువుదము.

ISA 4:1-4

 

176మీరు త్వరపడచున్నారా? ఇప్పుడు త్వరపడవద్దు. ఇది మీరు అర్ధము చేసికోవలసిన ముఖ్యమగు అంశము. దీనిని నేను విశదపరచగోరుచున్నాను. మరోసారి దీని గూర్చి అధ్యయనము చేయుదము.

ISA 4:1-5

 

177ఓ, ప్రభువైన యేసును స్తుతించుచున్నాను! వాక్యము తప్పిపోదు. యెషయాలో చూడండి. ఇక్కడ దానిని వ్రాసి యుంచాను. ఒక్క నిముషమ యెషయా 4:5 చూడండి. ప్రభుని రాకడ సమయములో స్త్రీలు ఎంత నీతిలేనివారుగా యుందురో అక్కడ వ్రాయబడినది. దానిని చదువుదాం.

ఆ దినమున ఏడుగురు స్త్రీలు ఒక్క పురుఘని పట్టుకొని - మేము మా అన్నమే తిందుము. మా వస్త్రములే కట్టుకొందుము. నీ పేరు మాత్రము మాకు పెట్టి మా నింద తీసివేయుదుమని చెప్పుదురు. (అది మనము జీవించుచున్న ఈ అంత్యకాలమే, పెండ్లి విడాకులు, వ్యభిచారము మొదలగునవి.)

ఆ దినమున యెహోవా చిగురు మహిమయు భూషణము నగును. ఇశ్రాయేలులో తప్పించుకొనిన వారికి భూమి పంట అతిశయాస్పదముగాను, శుభలక్షణముగాను ఉండును. (ఆ శిక్షనంతా ఎట్లు తప్పించుకొనిరి?).

సియోనులో శేషించిన వానికి యెరూషలేములో నిలువబడిన వానికి అనగా జీవము పొందుటకై యెరూషలేములో దాఖలైన ప్రతి వానికి పరిశుద్దడని పేరు పెట్టుదురు. (చూచారా?)

తీర్పు ఆత్మ వలనను, దహించు ఆత్మ వలనను ప్రభువు సీయోను కుమార్తెలకున్న కల్మషమును కడిగివేయునప్పుడే, యెరూషలేమునకు తగిలిన రక్తమును దాని మధ్య నుండి తీసివేసి దాని శుద్ధి చేయునప్పుడు, (యుదులలో శేషించినవారు మరియు పెండ్లి కుమార్తె అని మరువ వద్దు).

అగ్ని ఎల్లప్పుడు అది దేవుని యొక్క తీర్పు ఆయన తుది తీర్పును తీర్చును. నిన్ను పిలచి, నీతిమంతునిగా తీర్చి విమోచనలోనికి తెచ్చును. ఆ తరువాత ఆయన తీర్పు నీ మీద పడును. పరిశుద్దాత్మ మరియు అగ్ని పాపమును శుద్ధి చేయును. అప్పుడు నీవాయన వాడవగుదువు, భూమికి కూడా ఆయనే అదే చేయును. అగ్ని మరియు ఆత్మతో ఆయన దానిని దహించును. మీరు సిద్దముగా యున్నారా? అయితే వినండి!

సీయోను కొండలోని ప్రతి నివాస స్థలము మీదను, దాని ఉత్సవ సంఘముల మీదను పగలు మేఘ ధూమములను, రాత్రి అగ్ని జ్వాలా ప్రకాశమును యెహోవా కలుగచేయును. మహిమ అంతటి మీద వితానముండును.

178ఆ దినమున ప్రభువు దాని శిఖరముపై పగలు వెలుగుటకు ఒక వెలుగును సృజించును. అది విశ్రాంతి స్థానము గాను, ఆశ్రయపురముగాను ఉండును. బైబిలు చెప్పుచున్న దానినే మనము వినుచున్నాము. గోడలు నిటారుగా యున్నచో మిరు దానిని చూడలేరు. అది వంగి యుండవలెను. ఈ పర్వతము మిద ఈ వెలుగును ఆయన సృజించును. అది ఒక పరిరక్షణగా యుండును. ఓ! మనము ఆ పాట పాడితిమి:

ఓ! ఆ సీయోను పర్వత పట్టణమును

యాత్రికునిగా ఇంకా నేను ప్రేమించుచున్నాను.

ఆ కాలము వచ్చినప్పుడు…

ఆ కొండ మీది పట్టణమును నేను చేరెదను. (చూచారా?)

MATT 17:5•

MARK 9:7•

LUKE 9:35

 

179చూడండి, సీనాయి కొండ శిఖరము మీద దేవుడు దిగెను. అగ్ని స్తంభములో ఇశ్రాయేలు వారితో మాట్లాడెను. ఆయన సీనాయి కొండ శిఖరము మీద దిగెను. రూపాంతరపు కొండ మీద ఆయన ఈలాగు పలికెను. "ఈయన నా ప్రియకుమారుడు. ఈయన మాట వినుడి." "పేతురు, యాకోబు, యోహానుల ఎదుట అగ్ని స్తంభములో ఆయన ఆ కొండ మీద దిగెను. మహిమ ప్రకాశించెను. మోషే ఏలియాలు అక్కడ ప్రత్యక్షమయిరి. రూపాంతరము చెందిన వారికి, మృతులై లేచిన వారికి వారు ప్రతినిధులుగా యున్నారు. మహిమ!

REV 21:12-14,17,19,20

 

180అది క్రొత్త పట్టణము. క్రొత్త భూమి, క్రొత్త సృష్టి, అది కొండ మీది పట్టణము, దాని శిఖరము మీద సింహాసనమున్నది. దాని మీద వారందరూ నివాసమందురు. దాని చుట్టూ యున్న గోడకు పండ్రెండు పునాదులున్నవి. ఇశ్రాయేలు పండ్రెండు గోత్రములకు అది ప్రతినిధిగా యున్నది. దానికి నాలుగు గుమ్మములున్నవి. అరణ్యములో గుడారము అలాగే యున్నది. పండ్రెండు మంది అపోస్తలు లున్నారు. దాని ఎత్తు 144 మూరలు, నూట నలుబది మూరలనగా 216 అడుగులు, ఆ పట్టణము చుట్టూ ప్రాకారమున్నది.

MATT 19:28•

LUKE 22:30

 

181గోడ మీద ఆ పట్టణము ఆనుకొని యుండజాలదు, ఎందుకనగా పదిహేను వందల మైళ్ళ విస్తీర్ణములో అది యున్నది గనుక ఆలాగుండజాలదు. పాత యెరూషలేము గుమ్మములలో నీవు ప్రవేశించినట్లే అది యుండును. గోడ గుండా దానిలోనికి నీవు ప్రవేశించవలెను. ఈ ప్రతి ఒక్క దానిని పండ్రెండు పునాదులున్నవి. ఇశ్రాయేలు పండ్రెండు గోత్రములను ఆ ముత్యములు ప్రతిబింబించుచున్నవి. ఆ పెద్ద ముత్యము గల గుమ్మము మీద ఒక అపోస్తలుని పేరున్నది. "ఇశ్రాయేలు వారి పంన్నెండు గోత్రములకు మీరు తీర్పు తీర్చుచూ పన్నెండు సింహాసనముల మీద కూర్చొందురని యేసు చెప్పలేదా?" వారు పట్టణములోనికి వచ్చినప్పుడు తీర్పు తీర్చుటకు గుమ్మము యొద్ద ఎవరు కూర్చొనిరి? ఆ పట్టనములోనికి భూరాజులు ప్రవేశించుచున్నారు. యేసు వాగ్దానము చేసినట్లుగా అపోస్తలులను న్యాయాధికారుల ఎదుటికి వచ్చుచున్నారు.

ఓ, మై!

182పదిహేను వందల మైళ్ళు ఎత్తున గల సింహాసనమును సర్వలోకము చూడగలదు. లోకమునకు వెలుగును అందరూ చూతురు. లోకమునకు పైన, సంఘమునకు పైన, సీయోను కొండకు పైన, యేసు కూర్చొని యున్నాడు. అది పదిహేను వందల మైళ్ళున్నది. (అమెరికాలో సగము) 1500 వందల మైళ్ళు ఎత్తున గల ఆయనను మీరు పైకెగిరి చూడవలెను.

REV 22:1,2

 

183భూమి మీదవారందరూ విమోచించబడిన వారే.

శుద్ద సువర్ణపు ఇండ్లు అచ్చటుండును. పార్కులు, తోటలు, జీవనదులు అచ్చటుండును. ఆ సింహాసనము యొద్ద నుండి అవి పారుచుండును. ప్రతి ఆవరణములో జీవవృక్షము పూలు పూయుచుండును. సంవత్సరమునకు పన్నెండు సార్లు ఫలమును ఇచ్చుచుండును. ప్రతి నెలకు మారు చుండును. భూరాజులు తమ మహిమను అందులోనికి తెచ్చుచుందురు. దేశముల స్వస్థతకు ఆకులుపయోగపడును. అక్కడ రాజులు సమాధానముగా జీవించుచుందురు. వారు వెళ్ళుచూ ఆకులను తెంపుచుందురు. (దేవుని ఉగ్రత అయిపోయిన పిదప పావురము ఆకు తెంపి ఓడలోనికి వచ్చినట్లే వుండును). రాజులు తమ మహిమను ఈ పట్టణములోని పెండ్లి కుమార్తె గది లోనికి తీసికొని వచ్చెదరు. ఇరుగు పొరుగున ఉన్న రాజుకు ఈ ఆకులు ఇచ్చి మనము సదా సమాధానముగా యుందుము గాక అందరు. దేశములకు స్వస్థత దొరకును. అంతా సుస్థిరమగును.

సోదరులారా, ఒకప్పుడు మనము పరస్పరము రక్తము చిందించుకొన్నాము. కేకలు వేసికొన్నావము. తుపాకులు కాల్చుకొన్నాము. పిల్లలను దహించాము. కానిప్పుడు శాంతి ఏర్పడినది. ఆ స్వస్థత రోగ స్వస్థత కాదు, దేశముల యొక్క స్వస్థత, ఆమేన్!

REV 21:23

 

184పట్టణపు శిఖరము మిద సింహాసనమున్నది. ప్రకటన 21:23, "వారికి దీపమక్కరలేదు, ఎందుకనగా గొర్రెపిల్ల మరియు ప్రభువగు దేవుడే వారికి దీపమై యుండును." చూచారా?

అరణ్యములో ఇశ్రాయేలీయులకు ప్రభువైన దేవుడే అగ్నిస్తంభముగా ఉండెను. ఆ పరిపూర్ణ రాజ్యములో ఆయన సింహాసనము మిదికి దిగి వచ్చెను. ఆ రాజ్యమును యేసు తండ్రికి అప్పగించును. దేవుడే సర్వములో స్వరమగును. ఇక్కడ యేసు తన సింహాసనము మీద మన యోసేపు వలె కూర్చొనెను. సీయోను కొండ పైన ఆ రాజు వెలుగుగా యుండును. ఆయన పరిశుద్ద వెలుగు ఆ మొత్తం పట్టణమును వెలుగుతో ముంచెత్తును. హల్లెలూయా!

REV 21:16,23

 

185పదిహేను వందల మైళ్ళు ఎత్తు, పదిహేను వందల మైళ్ళు చచ్చవుకముగా ఆ దేవుని పరదైసు ఉన్నది. ఆ పట్టణమును ఆయనే నిర్మించెను. ప్రకటన 21 చదవండి. అది సరియో కాదో చూడండి. అక్కడ వారికి దీపమక్కరలేదు. గొర్రెపిల్లయే వారికి వెలుగు. సింహాసనము మీద కూర్చొని యున్న ఆయనను పదిహేను వందల మైళ్ళ దూరములోనున్నవారు చూతురు. పట్టణము యొక్క ఒక ప్రక్క నుండి మరో ప్రక్కకు చూడగలరు. అది పిరమిడ్ ఆకారములో యున్నది.

186అందువలన కనబడును. మిరు కోరినచో నేను ఇక్కడ చిన్న పటమును గీసెదను.

ఇక్కడున్న చిన్న గుంపును మీరు గమనించారా? అది ఎంత దూరమును కప్పునో చూడండి. (చూచారా?) జార్జియా నుండి కాలిఫోర్నియా, సస్కాచివాస్ వరకు, కాన్సాస్ నుండి మయానీలోని పర్వత సానువుల తీరము వరకు అది యుండును. దానిని నేను ఊహించాను. దాదాపు పదిహేను వందల మైళ్ళు దూరము అదే అని అనుకొనుచున్నాను.

ఓ! వారు తూర్పు నుండి పశ్చిమము నుండి వచ్చెదరు,

దూరదేశము నుండి వారు వచ్చెదరు.

మన రాజులో వారు విందు చేసెదరు.

భోజనము చేయుటకు… (మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు గాని వాక్యము వలన జీవించును.)

ఆయన అతిధుల వలెభోజనము చేతురు.

ఈ యాత్రికులు ఎంత ధన్యులు.

(అట్టి వారిని నేనెన్నడూ చూడలేదు అని చెప్పెదను)

ఓ! ఆయన మహిమకరమగు ముఖమును చూచెదరు.

దైవ వెలుగుతో ప్రకాశించెదరు.

ఆయన కృపతో ధన్యకరమగు భాగస్వాములు.

ఆయన కిరీటములో ముత్యముల వలె మెరియుదురు.

ఓ! యేసు త్వరగా వచ్చుచున్నాడు,

అప్పుడు మన శ్రమలన్నియు అంతమగును.

ఓ, మన ప్రభువు,

ఈ క్షణమున వచ్చినచో ఎట్లుండును…"

ZECH 14:4

 

187అది ఆలస్యము కాదు. ప్రతిది చక్కగా యున్నది. భౌగోళికంగా కుదిరినది. ప్రస్తుత లోకము సొదొమ వలె యున్నది. దీని భావమేమిటి? ఆలోచించండి. పదిహేను వందల మైళ్ళు చచ్చవుకము గల ఈ చిన్న మందిరమునకు వచ్పుదురు. ఆ కొలతలు సమానముగా యున్నవి.

చిన్న స్థలమగు పాలస్తీనా గూర్చి దేవుడు ఎందుకంత శ్రుద్దగా ఆలోచించి జాగ్రత్త పడెను? (చూచారా?) కాని అక్కడే ఆలయము ఏర్పాటగును. క్రొత్త యెరూషలేము అక్కడే ఉద్భవించెను. ఒలీవ కొండ రెండుగా చీలును. కుడి ఎడమకు చీలును, (నిశ్చయంగా) ఆయన తన పరిశుద్ద పాదమును పర్వతము మీద ఆ దినమున మోపగానే అది బ్రద్దలగును.

ఆయన సింహాసనము పదిహేను వందల మైళ్ళు ఎత్తున యుండును…

REV 21:14,17,19-21

 

188గుర్తుంచుకొనండి, సాతాను ఒకసారి ఆయనను కొండ శిఖరము మీద శోధించెను. చూచారా? క్రొత్త పట్టణమునకు పండ్రెండు పునాదులున్నవి. దానిని గూర్చి చదవండి, పండ్రెండు గుమ్మములకు పండ్రెండు ముత్యములున్నవి. పండ్రెండు మంది శిఘ్యల పేర్లు అక్కడున్నవి. సింహాసనము మీద తలరాయిగా యేసు నిలబడియున్నాడు. ఆయన పరిశుద్దులు ఆయనను రాజులకు రాజుగా, ప్రభువులకు ప్రభువుగా ఆరోపించి కీరీటము ధరింపచేసియున్నారు. ఆయనే తలరాయి.

189నాతో నా చిన్న నోట్సును తెచ్చుకోలేదు. మీ యొద్ద నున్న డాలరు నోటును మీరు పరిశీలించండి. దాని మీద అమెరికా దేశపు ముద్ర యున్నది. ఒక చివరన పక్షిరాజున్నది. ఈటె పట్టుకొన్న చేతులున్నవి. మరొక చివరన పిరమిడ్ ఒక చూచు కన్ను యున్నది. చూడండి, వారేమి చేయుచున్నారో వారెరుగరు. లాటిన్లో వ్రాయబడిన దానిని చూడండి. "ఇది గొప్ప ముద్ర" వారు తాము చేయుచున్న దానిని ఎరుగరు. తాను ప్రవచించుచున్నానని కయపకు తెలియదు. అక్కడ గొప్ప ముద్ర యున్నది. చూచారా? అ పట్టణము బల్లపరుపుగా లేదు గాని అందరికి కనబడునట్లు ఓరగా యున్నది. (చూడండి) ఈ ప్రభువు యొక్క పరిశుద్ద పర్వతము మీదికి ప్రభువు దిగును. ఆ కారణము చేతనే హానోకు తలరాయిని పెట్టలేదు. చూచారా? అందువల్లనే ఇప్పుడు తలరాయి రావలసియున్నది. ఆ పర్వతము ప్రభువు యొక్క పర్వతము.

REV 21:21-26

 

190ఇక్కడే విమోచించబడిన వారు నివసించెదరు.

అందులో రాజ మార్గములు, పార్కులు, జీవనది ఉన్నవి. ప్రతి ఇల్లు స్వచ్చమగు బంగారముచే తయారు చేయబడెను. వీధులు బంగారముతో తయారయినవి. జీవవృక్షము అచ్చట ఉన్నది. పన్నెండు రకముల ఫలములు కాయును. భురాజులు తమ మహిమను ఆ గుమ్మములలోనికి తీసికొని వచ్చెదరు. రాత్రులందు ఆ గుమ్మములు మూయబడవు, ఎందుకనగా అక్కడ రాత్రి లేదు!

"ఆ పట్టణములో గొర్రెపిల్లయే దీపము;

ఆ పట్టణములో రాత్రి లేదు;

ఆక్కడ నాకో భవంతి యున్నది,

అక్కడ శ్రమ, చింత లేదు,

ఓ! గొర్రెపిల్ల దీపముగా నుండు చోటికి వెళ్ళుచున్నాను."

191ఈ పట్టణము, నగరాలు, గృహములు, నివాసములు ఆ రాబోవు దాని గూర్చి మాట్లాడుచున్నవి. ఈ ప్రకృతి సంబంధమైనవి నీడలు, దూరము నుండి నా చేతి నీడను చూచారనుకొండి నీడలో మీకు పండ్రెండు వేళ్ళున్నట్లు కనబడును, కాని దగ్గరగా వచ్చి చూచినప్పుడు ఆ నీడ మాయమై వాస్తవ రూపము కనబడును. చాలా సార్లు మనుష్యులు ముగ్గురు లేదా నలుగురు దేవుళ్ళున్నట్లు చెప్పెదరు. మీరు ఆ వెనకటి సంస్కరణ కాలమును చూచుచున్నారు. ఇప్పుడు వచ్చి వాస్తవమును చూచండి.

192ఒకే పెండ్లి కుమార్తె యున్నది, డజను శాఖలు కాదు. భూమి మీద నుండి ఒక్కపెండ్లి కుమార్తెను ఎన్నుకొనెను. దీని కొరకు ఆయన ముందే నిర్ణయించెను. ఈ రాజ్యములో తమ స్థానమును వారే గుర్తించుదురు.

REV 22:5

 

193ఆ సింహాసనము మీద ఆయన మహెున్నతునిగా ఉండును. క్రొత్త పట్టణమునకు పునాదులు, పండ్రెండు గుమ్మములు కలవు. యేసు తలరాయిగా నుండును. అపోస్తలులు పండ్రెండు గోత్రములకు తీర్పు తీర్చును. హానోకు యొక్క పిరమిడ్ దినములోని ఏ సమయములోను కూడా నీడను మీద పడనీయదు. ఐగుప్తులో నేను పిరమిడ్లను చూచాను. అదెంతో భౌగోళికంగా తయారు చేయబడినది. ఆ కోణములు ఎంతో గొప్ప లెక్కతో చేయడినవి. సూర్యుడు ఎక్కడున్నా గాని పిరమిడ్ మిద నీడ పడదు. అదెట్లు సాధ్యము? అక్కడెన్నడూ రాత్రి యుండదు. ఆయన ఆ పర్వత శిఖరము మీద మహిమతో ప్రకాశించును. ఆయన మహిమ ప్రకాశము సదా అచ్చట ఉండును. అక్కడ రాత్రి లేదు. యేసే తలరాయి.

JOHN 5:24•

HEB 11:10•

1JN 3:14

 

194విమోచించబడిన వారు ఆ వెలుగులో నడచెదరు. ఇప్పుడు మనము ఇట్లు పాడుదుము. "మేము వెలుగులో నడతుము. ఆ అందమగు వెలుగులో" మనలో ఏదో యుండినట్లు పిలచుచున్నది, "మరణము నుండి జీవములోనికి దాటి రండి." అది మన కొరకు ఎదురు చూచుచున్నది. చూచారా? అది మన ప్రతి రూపము, అలాగే మనము అనుభూతి పొందుచున్నాము.

అబ్రాహాము నిజంగా ఎదురు చూచినది ఈ పట్టణము కొరకే. (మీరు సిద్దముగా యున్నారా?) ప్రవక్తయగు అతడు ఎక్కడో ఆ పట్టణమున్నదని ఎరిగి యుండెను. ఆ విధంగా బైబిలు చెప్పెను. తాను కాపురముండిన పట్టణమును విడిచి అతడెక్కడికి వెళ్ళెనో చూడండి. దేనికి దేవుడు శిల్పియు, నిర్మాణకుడునైయున్నాడో, ఆ పట్టణము కొరకు ప్రవక్తయగు అతడు ఎదురు చూచుచుండెను.

HEB 7:1-3•

HEB 11:10,13

 

195యేసు దానిని సిద్దపరచుటకు వెళ్ళెను. దైవిక హస్తములు, ఆ దైవిక పట్టణమును దైవికంగా నిర్మాణము చేయుచున్నవి. దైవికంగా కొనబడిన జనుల కొరకు, ముందుగా నిర్ణయించబడిన జనుల కొరకు ఆయన దానిని సిద్దపరచ వెళ్ళియున్నాడు…

అబ్రాహాము దాని కొరకు ఎదురు చూచుచుండెను. తాను యాత్రికుడను, పరదేశిని అని చెప్పుకొనెను. దేనికి దేవుడు శిల్పియు, నిర్మాణకుడునైయున్నాడో ఆ పట్టణము కొరకు ప్రవక్తయగు అతడు ఎదురు చూచుచుండెను, ఆ ప్రవక్తకు అది ఎక్కడో ఉన్నదని తెలియును. అది వచ్చుటను యోహాను చూచెను. అది తప్పక భూమి మీదే యుండునని అబ్రాహాము తలంచెను. ఎందువలన? అతడు దానికి రాజగు మెల్కీసెదెకును కలిసికొనెను. అతనికి దశమ భాగమిచ్చెను. ఆయనకు తల్లి లేదు తండ్రి లేడు. ఆయనకు ఆది-అంతము లేవు. అబ్రాహాము ఆయనను కలిసికొనెను. ఆ పట్టణము ఎచ్చట కట్టబడునో, అక్షరాలా ఆ స్థలములోనే వారు భోజనము చేసిరి. ఆ పరిశుద్ద పర్వతము మీద విమోచించబడిన వారు జీవించెదరు.

ఓ! ఆ సమయమునకు తుది లేదు మనము ఆ తరువాత నిత్యత్వములోనికి వెళ్ళుదుము.

REV 2:7•

REV 21:21•

REV 22:1,2

 

196అక్కడ వీధులు స్వచ్ఛమగు బంగారముతో చేయబడినవి. ఇండ్లు, పార్కులు, అన్నీ ఆలాగే తయారయినవి. (దీనిని ప్రకటన 21:18లో మీరు చదవగలరు.) జీవవృక్షము అచ్చటుండును. పండ్రెండు రకములు ఫలములు కాయును. ఒక్కొక్క నెలకు ఒక్కొక్క రకమగు ఫలముండును. జనులు ఈ ఫలములను తిందురు. వారు తమ ఆహారమును ప్రతి నెల మార్చుదురు. జయించు వారే దీనికి అర్హులు. అది మీకు తెలియునా? శాఖలకు అది కాదు. "ఆలాగా, బ్రెన్హాం సోదరుడా?" అని మీరందురు. ప్రకటన 2:7 ఒక్కసారి చూద్దాం: అది సత్యమో కాదో తెలియును. ప్రకటన 2:7:

చెవి గలవాడు ఆత్మ చెప్పుచున్న మాటను వినును గాక! (ఇపుడాయన యూదులతో మాట్లాడుటలేదు గాని సంఘముతో మాట్లాడుచున్నాడు, అన్యులు.) ఆత్మ సంఘములతో చెప్పుచున్న మాటను చెవి గలవాడు వినును గాక! జయించు వానిని దేవుడు పరదైసు మధ్య నున్న జీవ వృక్ష ఫలమును భుజింపనిచ్చెదను.

REV 21:24,27•

REV 22:2

 

197జయించిన వారిని మాత్రమే — మృగమును, వాని ముద్రను జయించు వానిని జీవ వృక్ష ఫలమును తిననిచ్చును. (కాతలిజం, ప్రొటస్టాంటిజం, శాఖత్వము) వీటిని జయించు వానికి గుమ్మముల గుండా వెళ్ళు అవకాశము దొరకును. అపవిత్రమైనదేదియు దాని గుండా ప్రవేశించదు. చూచారా? దాని గూర్చి ఆలోచించండి. ఇంకా కొద్ది ముందుకు వెళ్ళుదుము. జయించు వారికి మాత్రమే జీవ వృక్షము దక్కును.

దేశముల స్వస్థతకు ఆకులు వాడబడును. అక్కడ రాజులు నివసించెదరు. వారు తమ మహిమను తీసికొని వత్తురు. వారు తమ మహిమను తీసికొని వచ్చి దేవుని సింహాసనము ఎదుట ఉంచెదరు. (పదకొండు మంది పెద్దలు తీసికొని వచ్చినట్లుగానే), లేవీకి వారందరు దశమ భాగము చెల్లించిరి. వారు తమ మహిమను ఆ ధన్యకరమగు దేశములోనికి తీసికొని వచ్చెదరు. వారు జీవవృక్షపు ఆకును కోసి కలిసి నడచుదురు. యుద్దము ఇక లేదు; అంతా సమాధానమే. ఆకులు దేశము యొక్క స్వస్థత జ్ఞాపకార్ధముగా యుండును.

REV 22:2

 

198ఏదేను తోటలో ఒక జీవ వృక్ష ఫలముండెను… ఆదాము పతనము కాకుండా యుండినచో దానిని తినియుండెడి వాడు. ఆ జీవ వృక్ష ఫలము తిన్నచో ఎన్నడూ ముసలివాడయ్యెడివాడు కాదు. చూచారా? ఆ దేశములును ఆలాగే యుండును. ఆకులు దేశముల స్వస్థతకు ఉపయోగపడును. గమనించండి, ఇప్పుడు వ్యాధి లేదు. ఆదాముకుండిన హక్కులు వీరికిని యున్నవి. ప్రతి రాజు ఒక ఆకును పావురము వలె తీసికొని పోయిరి.

199చూడండి, జీవజలనది యున్నది. అనేక చిన్న ఊటలు బహుశా దానిని రూపొందించి యుండవచ్చును. (కొద్ది నిమిషములలో ముగించెదను. నా యొద్ద ఇంకా ముప్పయి పేజీల నోట్సు ఉన్నది.) కొండలలో ఉబికి వచ్చుచున్న నీటి ప్రవాహమంత అందమైన దృశ్యము కంటె గొప్ప దానిని నా జీవితంలో ఈ భూమి మీద మరి దేనినీ చూడలేదు. (ఒక రాత్రి దాని మీద బోధించాను) అది జీవనాధారము. నీవు అలసిపోయి దాహముగొన్నప్పుడు ఆ కాలువ యొద్దపడిపోదువు, ఆ సుదూరాన క్రిములు లేవు. భూమిలో వందల అడుగుల లోతున స్వచ్ఛమైన, అసలయిన, జీవనాధారమగు నీరు పొంగి ప్రవహించును. దానిని మనము గొప్పగా చెప్పెదము.

ఇటువంటి సేదదీర్చు జలములు భూమి మీద చాలా యున్నవి. నీవు దాహముతో చనిపోవుచున్నప్పుడు, చల్లని మంచి నీరు త్రాగితే నీ ప్రాణము తెప్పరిల్లును.

REV 21:22,23

 

200కాని ఇది సింహాసనము నుండి వచ్చుట చూడండి. జీవనాధార ఊటలు అక్కడ నుండియే బయలుదేరును. దేవుడు కూర్చొనియున్న సింహాసనము యొద్ద నుండి వచ్చును.

క్రైస్తవులకు, అన్యులకు కూడా ఈ భూమి మీద ఆలయములున్నవి. (ఈ భూమి మీద ఇప్పుడు మనము జీవించుచున్నాము) దాని గూర్చి మీరెన్నడైనా ఆలోచించారా? కాని ఇక్కడ అవేమీ లేవు. ప్రభువగు దేవుడు మరియు గొర్రెపిల్ల మాత్రమే ఆలయముగా ఉన్నారు. గొర్రెపిల్లయే దీపము. సింహమే ఆలయము, ఆ గొర్రెపిల్లయే సింహాసనము. గొర్రెపిల్లయే జీవము. ఆయనే ఆ ఆలయము. ఈ గుడులన్నింటిలో ఆరాధించు ఒక గురి యున్నది, కాని ఈ పట్టణములో ఆయనే ఆ గురి. ఆయన తన జనులలతో యున్నాడు.

ఆయన ఆత్మ దీపము పిరమిడ్ పట్టణమును ప్రకాశముతో నింపును.

MATT 17:5•

MARK 9:7•

LUKE 9:35•

REV 21:3

 

201పేతురు, యోహానులు పర్వతము మీద ఉన్నప్పటి వలె యుండును. ఆ కొండ శిఖరమును వెలుగు కప్పెను. ఒక స్వరము ఇట్లు పలికెను. "ఈయన నా ప్రియ కుమారుడు."

MATT 10:30•

LUKE 12:7•

JOHN 6:39,40,44,54

 

202ప్రకటన 21:3-4 "దేవుని నివాసము మానవులతో కూడా యున్నది." ఈ మూడు పద్దతుల ద్వారా మానవుని దేవుడు విమోచించి మానవునిలో నివసించెను.

ఇప్పుడు, దేవుడు భూమిని విమోచించి, భూమి మీద తన జనులతో కూడా నివాసము చేయగోరుచున్నాడు. ఆయన భూమి మీద నుండి వారిని విమోచించెను. పాపము వలన అది పతనమాయెను. ఆ పడిపోయిన భూమిని విమోచించుటకు ఇప్పుడు యేసును ఆయన పంపెను. అందులో మనము భాగమైయున్నాము. మీ తల వెండ్రుకలలో ఒక్కటియు నశించదు. యేసు ఆ విధంగా చెప్పెను. "అంత్యదినమున నేను దానిని లేపెదను" అని ఆయన చెప్పెను. చూచారా? ఎందువలన? మీరు ఆ భూమిలో భాగమైయున్నారు గనుకనే.

203గమనించండి. నా జట్టు ఊడిపోయినట్లు నా భార్య నాతో చెప్పినప్పుడు వాటిలో ఒక్కటియు నేల రాలలేదని నేను చెప్పాను.

"అయితే అవి ఎక్కడున్నవి?" అనడిగినది.

"వాటిని నేను పొందక ముందు అవి ఎక్కడుండెనో అక్కడే ఇపుడవి యున్నవి" అన్నాను. అవి ఎక్కడున్నా గాని నా కోసం ఎదురుచూచుచున్నవి. ఒక దినమున వాటి యొద్దకు నేను వెళ్ళుదును.

204ఈ ముసలి శరీరము ముడతలు పడుచున్నది. చుట్టుకొని పోతున్నది. మోకాళ్ళ నొప్పి గొంతు బొంగురు వచ్చినవి. మీరు దానిని సముద్రములో సమాధి చేయవచ్చును గాని బూరకు ఆ పేరు తెలియును. మీరు వేచి యుండండి! ఈ దినములలో ఒకనాడు మనము మార్పు చెందెదము. విమోచింపబడిన ఈ లోకములో నేను భాగమై యున్నాను. మీరు లోకములో యున్నారు గాని కాస్మాస్ కు చెందినవారు కారు. మీరు వేరే క్రమమలో ఉన్నారు. ఒక విమోచనా క్రమములో యున్నారు.

205చూడండి. దేవుని నివాసము మానవులతో కూడా యున్నది.

చూడండి, మునుపటి సంగతులు గతించెను. ఇదియు గతించెను. దీని అర్థమేమనగా మానవునితో కూడా నివసించుటకు పరలోకము దిగి వచ్చెను. భూమ్యాకాశములు ముద్దుపెట్టుకొన్నవి. యేసు ఒక పావురముగా భూమి మీదికి వచ్చెను. ఆయన భూమి మీద మట్టిగా, అనగా నరునిగా వచ్చెను. దేవుడు తన సృజనాత్మక శక్తి ద్వారా ఒక చిన్న కణముగా మారి వచ్చెను. ఆ రక్తములో ఉన్న ప్రాణము మరల దేవుని యొద్దకు వెళ్ళిపోయినది. భూమి మీద ఆ రక్తము చిందుట వలన నేల ఆయన సొత్తయినది.

MATT 10:30•

LUKE 12:7•

JOHN 6:39,40,44,54•

REV 3:14

 

206కయీను నుండి వచ్చిన గృహము జీవకణము వలన భూమి చెడిపోయినది.

ఆదామును సృష్టించిన సృజనాత్మక శక్తితో ఆయన మరల వచ్చెను. ఈయన కడపటి ఆదాము. కయీను నీతిమంతుని రక్తమును చిందించెను. చూచారా? హేబేలును అతడు చంపెను, కాని హేబేలు శరీరేచ్చ వలన పుట్టెను. కాని ఈయన శరీరేచ్చ వలన పుట్టలేదు. దేవుని యొక్క సృష్టియై యున్నాడు. దానికి ఆయన ఆదియై యున్నాడు. అది భూమిని అందులో కాల్షియం, పొటాష్, పెట్రోలియం, సూర్యరశ్మి మొదలగు వాటన్నింటినీ విమోచించెను. నీవు వాటితోనే నిర్మాణమయితివి. ఒక్క వెంట్రుకయు రాలదు. "అంత్యదినమున నేను వాటిని లేపెదను." అయితే ఏమిటి?

207దేవుడు భూమి మీద నివాసము చేయుటకు వచ్చుచున్నాడు. దానిలో ఆయన స్వంత శరీరము భాగమై యున్నది. మనము నీతిమంతులముగా తీర్చబడునట్లు ఆయన దానిని లేపెను. దానిని నమ్మి అంగీకరించవలెను. యేసు దేవనరుడాయెను. మనలను విమోచించుటకు ఆయన ముందుగా నిర్ణయించబడిన తన చోటును స్వీకరించెను. ఇవన్నియూ సాధ్యమే.

ఆ పట్టణము యొక్క అందమును గమనించండి.

ISA 65:25•

REV 21:16

 

208ఆ పట్టణము గూర్చి గ్రహింపు కలిగినదా? అది పరిశుద్ద పర్వతము. "నా పరిశుద్ద పర్వతము ఏదియూ ముట్టజాలదు. నాశనము చేయజాలదు" అని యెహోవా చెప్పెను. ఆ పట్టణము ఒక పర్వతము. పొడవు, వెడల్పు ఎత్తు సమానముగానున్నవి. చూచారా? ఇటు పదిహేను వందల మైళ్ళు, అటు పదిహేను వందల మైళ్ళు. ఎటు చూచినా పదిహేను వందల మైళ్ళు. ఎత్తు పదిహేను వందల మైళ్ళు. కాబట్టి అది పిరమిడ్ వలె నున్న ఒక మహాపట్టణము. ఆ పట్టణము పర్వతము మీద ఉన్నది. మహిమ! అక్కడే మీరున్నారు. దేవుని యొక్క పరదైసు అది. లోకమునకు వెలుగు. అది పరిపూర్ణ రాజ్యము. ఏడవ దినము కాదు గాని, నిత్యత్వము. వెయ్యేండ్ల పాలన కాదు గాని క్రొత్త భూమి, చూచారా.

209అది వెయ్యేండ్ల పాలనలో యుండగా శుద్దీకరణ పొందినది. అయినా అది కాల్చబడవలసి యున్నది. చూచారా? రక్తము జనులను విమోచించెను. పెండ్లికుమార్తె ఆ వెయ్యి సంవత్సరములను అనుభవించును. కాని అది మీ వలె అగ్నితో దహించబడవలసియున్నది. ఆ పట్టణ ప్రతినిధులందరూ ఆ విధంగానే దహించబడినారు. కాబట్టి మీరు చనిపోయినా, బ్రతికియున్నా, ఏమిటి చింత? ఆయన నేడు రావచ్చును లేదా వంద సంవత్సరములు, వేయి సంవత్సరములకు రావచ్చును నా మార్పు జరుగు వరకు నేను విశ్రమించి యుందును.

210వృద్దులగు స్త్రీ పురుఘలారా, నిరుత్సాహపడకండి. ఇక్కడ మీరు దేవుని పోలికలో యుండండి. అప్పుడు మీరు నిత్యత్వములో యుందురు. మీరు ఆ ఏడవ దినమును దాటి ఎనిమిదవ దినములోనికి దాటి వెళ్ళేదరు (పరిశుద్దాత్మ బాప్తిస్మము ద్వారా మీరు నిత్యత్వములోనికి వెళ్ళేదరు), మీరు ఏదో ఉద్రేకము, గంతులు వేయుట మీద ఆధారపడుట కాదు. "నేను ఇది చేయుచున్నాను, ఏడవ దినమును ఆచరించుచున్నాను, మాంసము మానేశాను" అని చెప్పితే చాలదు. అవన్నియూ నశించును గాని ఇది నిత్యమూ ఉండును, పండుగల ఒక దాని వెంబడి మరొకటి వచ్చును. పర్ణశాలల పండుగ చివరి పండుగ, ఏడవ పండుగ. ఇప్పుడు మనము ఏడవ సంఘ కాలమను పర్ణశాల పండుగలో ఆరాధన చేయుచున్నాము.

MAL 4:6

 

211వెయ్యేండ్ల పాలనలో మరల మనము ఏడవ దినములో పర్ణశాలల పండుగ జరుపుకొందుము. ఏడవ దినమున మనకు పరిశుద్ద సంఘ కూడిక యుండును. తిరిగి నిత్యత్వములోనికి వెళ్ళుదుము. ఏలాగు? నిత్యుడగు వాడు వచ్చి మనలను విమోచించి తిరిగి తీసికొని వెళ్ళుట ద్వారా, దీనిలో మనము భాగమైయున్నామని గుర్తించునట్లు చేసెను.

నీవు భాగముగా ఉన్నావని ఎట్లు ఎరుగుదువు? ఈ దినపు వాగ్దానము మరియు ఈ ఘడియ వాక్యము బట్టి ఎరుగుదువు. ఏమిటిది? మొదటి దినమునకు తిరిగి తీసికొని రాబడుట. "ఆయన పిల్లల హృదయములను తండ్రుల వైపు త్రిప్పును." నిజమైన పెంతెకోస్తును పునరుద్దరించుచున్నాడు. ఒక ఉద్రేకము కాదు. సాయంకాల వెలుగు ప్రత్యక్షమగును. ఉదయపు వెలుగును చూపిన సూర్యుడే దీనిని చూపును. అది ఈ దినమునకు వాగ్దానము చేయబడినది. ఆమేన్, ఆమేన్!

మనము ఎక్కడ ఉన్నాము స్నేహితులారా? మనము ఎక్కడ ఉన్నాము? మనము కేవలము పక్కకు తోలుగుటకు వేచియున్నాము, కావున ప్రకటన 11 యూదులకు బయలుపరచబడును. అది సరి, ఎత్తబాటు వచ్చుచున్నది.

REV 21:24,27

 

212క్రొత్త భూమి చుట్టూ వ్యాపించి యున్న గోడల వెలుపట గల గుమ్మముల నుండి వచ్చి రాజ్యములు నిత్య సమాధానములో అచ్చట నివసించును. భూరాజులు తమ మహిమను అందులోనికి తీసికొని వచ్చెదరు. అక్కడ ఏ పాపము ఉండదు. జుట్టు కత్తిరించుకొనిన స్త్రీలు ఆ పట్టణములో ప్రవేశించరు. దానికి నేను గ్యారంటీ ఇయ్యగలను. పొట్టి దుస్తులు ధరించుట అక్కడ లేదు, సిగరేట్లు త్రాగుట లేదు, వేశ్యాగమనము లేదు, అబద్దికులు గాని విగ్రహారాధికులు గాని ఆ పట్టణములో ప్రవేశించరు. అందతయూ గతించి పోవును; పాపము లయమగును. దాని పరిశుద్దతను అపవిత్రపరచునదేదీ అందులో ప్రవేశించదు. అదంతయూ సదా నిర్మూలమై పోయినదని ఆయన చెప్పెను.

దాని పొలములను, దాని గుమ్మములను చూడండి:

…ఎలుగుబంటి స్వాతికురాలగును,

… తోడేలు పెంపుడు జంతువగును;

సింహము గొర్రెపిల్ల కలసి పండుకొనును;

అడవిలోని మృగమును

ఒక చిన్న బిడ్డ తోలుకొని వచ్చును;

నేను ఇప్పుడున్నట్లుండక మారుదును.

213ఈ నా శరీరములో మరణము పనిచేయుచున్నది, ముసలి వయస్సు పైబడుచున్నది. నేను మారెదను. మీరు పాటను విన్నారా? "ఎలుగుబంటి సాధువగును. తోడేలు పెంపుడు జంతువగును…" నిన్ను చంపుటకు నీ పైకి ఎగురదు; నీతో కలసి దారిలో నడచును. దానినెవరు స్వాధీనము చేసికోనైయున్నారు? విమోచించబడినవారు.

చూడండి, ఇప్పుడు నేను నా మాదిరులను మాత్రమే బోధించగలను. లీ సోదరుడా.

214ప్రవక్తయగు నోవాహుతో పాటుగా క్రొత్త భూమి మీదికి ఎవరు వచ్చిరి? అతనితో పాటు ఓడలోనికి ఎవరు వెళ్ళిరి? దాని మీద ఎవరు నడచిరి? నోవహు వర్తమానమును విని విశ్వసించిన వారే అందులోనికి వెళ్ళిరి. భూమి నీటి బాప్తిస్మము పొందిన తరువాత వారే దాని మీద నడచిరి.

215ఆయన లోనికి మిరెట్లు వెళ్ళగలరు? ఒకే ఆత్మ? ఆయన వాక్యమై యున్నాడు. మీరాయనలో భాగమై యున్నారు. నీవాయనలో ఏ భాగముగానున్నావు? ఈ ఘడియలో జీవించుచున్న వాక్యముగా ఉన్నావు. గుర్తించుము. వెయ్యేండ్లపాలనలో సీనాయనతో పాటు నడచెదవు.

ఒక క్రొత్త తరము కాదు గాని మార్పు పొందిన వారని మీరు గమనించవలెను. నీవు ఈ విషయములో అభ్యంతరపడవచ్చును. దేవుడు ఏలియాను 2,500 సంవత్సరముల క్రితం పైకి కొనిపోయి మరల యూదులకు ప్రవక్తగా భూమి మీదికి తీసికొనిరాకలిగిన యెడల పెండ్లి కుమార్తె విషయములో ఆయన ఇంకెంతో చేయగలడు.

GEN 9:7

 

216ఓడ నుండి బయటకు వచ్చిన తరువాత నోవహునకు ఏమి చెప్పబడెను? అతడు జలప్రళయము నుండి బయటకు వచ్చెను. ఆదాముతో చెప్పినట్లే అతనితోను చెప్పెను, "అభివృద్ధి చెంది భూమిని నింపుడి" (జల ప్రళయము తరువాత). అది ఒక క్రొత్త భూమి, మొదటి ఆదాము వలె వీరును భూమిని ఫలింపచేసి నింపవలసియున్నారు.

ఇప్పుడు జాగ్రత్తగా వినండి.

GEN 1:28•

GEN 9:7

 

217ఆదాము భూమిని నింపవలసియుండెను. అవునా? (ఆ లోకము నాశనమయినది) మరల క్రొత్త భూమియు నిండవలసియున్నది. మీరు సర్ప సంతానమనగా ఏమిటో గ్రహించారా? భూమిని ఏది నింపెను? మీరు ఆర్థము చేసికొన్నారా?

ఇప్పుడు సాతాను హవ్వ యొద్దకు ఎట్లు వచ్చెనో చూడండి. అందుకే అప్పటి నుండియు మరణము భూమిని ఏలుచున్నది. భూమ్యాకాశములు, మృగములు, వాతావరణము మున్నగువన్నీ ఆకారణమున శపించబడి యున్నవి. సాతాను ముందు దాని యొద్దకు వచ్చినందునే శాపము వచ్చెను. తిరిగి తండ్రికి విడిపించి ఇచ్చుటకు యేసు వచ్చెను. ఈ పని చేయుటకు ఆయన అందులో భాగమాయెను. (ఇందాక చెప్పాను), మట్టిగా మారెను. (యేసే ఆలాగయ్యెను) ఆయన ద్వారా భూమి మీదనున్న ఆయన ప్రతి రూపములన్నియూ విడుదల పొందెను.

MATT 12:24•

MARK 3:22•

LUKE 11:15

 

218ఆయనే పలుకబడిన వాక్యము, విమోచించబడిన మనము ఆయనలో భాగమైయున్నాము. పరిసయ్యులు ఆయన భాగము మేమే అని చెప్పుకొనిరి, కాని నా మొదటి ఉదాహరణను చూడండి. వారు తమ తెలివి ద్వారా ఆలాగయిరి. వాక్యము వారి ఎదుటే ప్రత్యక్షమైనా గాని వారు గుర్తించలేకపోయిరి. "ఈయన దయ్యముపట్టినవాడు" అనిరి. ఈ రోజు మనలను అబద్ద ప్రవక్తలనుచున్నారు. మత నిష్ట గొప్ప వరములు గలవారే. మనలను అతి నీచముగా పేర్లు పెట్టి పిలచుచున్నారు. వారికి అర్ధము కాలేదు, చూచారా.

219దానిని శుద్ధి చేయుటకు నీటి బాప్తిస్మము చాలదు. రక్తము శుద్ధిచేయుట వలన వారు తిరిగి తేబడిరి, కాని అగ్ని బాప్తిస్మము దానిని శుద్ధి చేయును. ఆయన పెండ్లి కుమార్తె కూడా నీతీకరణము, పరిశుద్దాత్మ బాప్తిస్మము అను వాటి ద్వారా శుద్ది పొందినది.

MAL 3:6

 

220ఒక క్రొత్త జాతిని లేపెదనని ఆయన ఎన్నడూ వాగ్దానము చేయలేదని చెప్పాను. పతనమయిన వారినే తిరిగి లేపెదనని ఆయన వాగ్దానము చేసెను. ఆయన వాగ్దానము చేసినట్లు ముందు నిర్ణయించబడినవారే స్వతంత్రించుకొందురు. ఆయన మారని దేవుడని మనకు తెలియును.

221గురుంచుకొనండి, ఎత్తబడిన తరువాత ఏలియాను దేవుడు మరల తీసికొని వచ్చి తన జనుల మధ్య ప్రవక్తగా నిలబెట్టెను. అతి త్వరలోనే ఆయన దానిని చేయును. ఈ 2,500 సంవత్సరములు సజీవముగా ఉంచెను; మరల అతడు కనబడును.

JUDE 1:9

 

222మృతులలో నుండి మోషేను ఆయన లేపెను. అతని సమాధి ఎచ్చటున్నది? ఎవరైనా దానిని కనుగొనిరా? యూదా పత్రిక చడవండి. ప్రధాన దూత సాతనుతో వాదించినది. "ప్రభువు నిన్ను గద్దించును గాక" అని పలికినది. (మేషే శరీరమును గూర్చి తర్కించినది. పేతురు, యాకోబు, యోహానులు రూపాంతరపు కొండ మీద నిలబడిరి. ఆ పర్వతమే నివాస యోగ్యముగా లేపబడును. చూచారా? ఆయన దానిని విమోచించ వచ్చెను.

MATT 17:5•

MARK 9:7•

LUKE 9:35

 

223అక్కడ ఎత్తబడిన సంఘమునకు ప్రాతినిధ్యమున్నది. నిద్రించిన వారికిని అక్కడ ప్రాతినిధ్యమున్నది. అదే పరిశుద్ద పర్వత పట్టణము, అక్కడ పేతురు, యాకోబు, యోహానులు ముగ్గురు సాక్షులుగా ఉండిరి. ఏలియా, మోషే మరియు యేసు పరలోక సాక్షలుగా యుండిరి. చనిపోయిన మోషే లేపబడెను. ఎత్తబడిన ఏలియా సజీవునిగా ఉండెను. వారిద్దరూ ఈ పరిశుద్ద పర్వతము మీద ప్రతినిధులుగా ఉండిరి. యేసు విమోచకునిగా యున్నాడు. "ఈయన నా ప్రియ కుమారుడు" అని పై నుండి ఒక స్వరము పలికినది.

MATT 16:28•

MATT 17:5•

MARK 9:1,7•

LUKE 9:27,35

 

224అంతకు ఒక రోజు ముందు యేసు చెప్పినది గుర్తుచేసికొనండి. "దేవుని రాజ్యము శక్తితో వచ్చు వరకు ఇక్కడ నిలచియున్న వారిలో కొందరు మరణము చూడరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను." ఏమిటది? మృతులై తిరిగి లేచిన వారు, ఎత్తబడిన పరిశుద్దులు ఆయనను మధ్యాకాశములో కలిసికొందురు. దేవుడాయనను కమ్ముకొనును. ఈ నీడలో యేసు నిలబడి యుండగా, ఇట్లు చెప్పబడెను, "ఈయన నా ప్రియ కుమారుడు. ఈయన యందు నేనానందించుచున్నాను." … ఈ క్రొత్త రాజ్య వ్యవస్థ ఈయనలో యుండును.

ఓ సోదరీ, సోదరుడా,

1SAM 28:14,19•

REV 11:3

 

225మరణము నిన్ను మార్చజాలదు. మరణము నీ నివాస స్థలమును మాత్రమే మార్చును. చూచారా?

సమూయేలు చనిపోయి పాతి పెట్టబడి రెండేండ్లయిన తదుపరి ఎడారులలో సోదె చెప్పు స్త్రీ అతనిని పిలచినది. అతడు పరదైసులో యున్నాడు, సౌలు అతనిని గుర్తించెను, ఆమె కూడా గుర్తించినది. అతడే మాత్రము మారలేదు. చనిపోయి రెండేళ్ళయినా సమూయేలు ఏమీ మారలేదు. ఇంకా అతడు ప్రవక్తగానే ఉన్నాడు. అతడిట్లు చెప్పెను, "రేపు యుద్దములో నీవు, నీ కుమారుడు కూలుదురు. రేపు రాత్రి ఈ సమయమునకు నీవు నీతో కూడా యుందువు. ఆలాగే జరిగినది. ప్రకటన 11లో మోషే, ఏలియాలు తిరిగి వచ్చుట గూర్చి చెప్పబడినది. అప్పుడును వారు ప్రవక్తలుగానే యున్నారు. హల్లెలూయా!

226ఆ పట్టణములో గొర్రెపిల్లయే దీపము. సహెూ, మెకెన్నీని నేను ఎరుగుదును. నా జనులారా, మీ అందరినీ నేను ఎరుగుదును. మీరే నా కిరీటములో ముత్యములు, తూర్పు పడమరల నుండి వారా పట్టణములోనికి వచ్చెదరు. అది పదిహేను వందల మైళ్ళు చదరముగా నున్నది. ఆ చతురస్త్ర పట్టణములో ఆమె కూర్చొనును, ఆయన పరిశుద్ద పట్టణము మీద కూర్చొనును. దేవుడు కొండ మీద, యేసు సింహాసనము మీద కూర్చొని యుందురు. పరదైసు గుండా యోసేపు నడచునప్పుడు బూర మ్రోగును. ఆ బంగారు బూర ధ్వని విని జనులు మోకాళ్ళూని ఆయన నారాధించెదరు. వారు విమోచించబడిరని ఎరుగుదురు. ఆమేన్! హల్లెలూయా!

కొన్నిసార్లు పరలోకపు బెంగ నాకు ఎక్కువగును.

ఆ మహిమను నేను చూచెదను.

అదెంతో సంతోషము,

నా రక్షకుని చూచెదను,

ఆ రమ్యమగు బంగారు పట్టణములో,

అ అందమగు పట్టణమునకు నేను వెళ్ళుచున్నాను.

ప్రభువు దానిని సిద్ధపరచెను.

227యెషయా 9:6లో ఇట్లు చెప్పెను, "అక్కడ ఆయన సమాధానమునకు అంతము లేదు. ఆయన భుజముల మీద రాజ్యభారముండును. ఆయనకు ఆలోచన కర్త సమాధానాధిపతి, బలవంతుడగు దేవుడు, నిత్యుడగు తండ్రి అని పేరు పెట్టబడును. ఆయన భుజముల మీద రాజ్యభారముండును. ఆయన సమాధానమునకు అంతము లేదు.'' అక్కడ జంతువులు కూడా ఉండును. ఓ, మై!

ఎలుగుబంటి సాధువుగా నుండును,

తోడేలు పెంపుడు జంతువగును;

సింహము గొర్రెపిల్ల కలసి పండుకొనును,

అడవిలోని మృగమును,

పిల్లవాడు తోలుకొని వచ్చును.

(నేను మారెదను!)

228ఇప్పుడున్న స్థితి నుండి నేను మారెదను.

… ఆ దినము వచ్చును, ఆ పట్టణమునకు నేను వెళ్ళెదను. ఆ అందమగు పట్టణమునకు నేను వెళ్ళుచున్నాను. ఇప్పుడు నా హృదయములో విమోచనా శక్తి నిండుగా యున్నది. ఇది లేకపోయిన యెడల నా జీవితమును నేను విసిరివేసి యుందును. ఇతరులను నేను మోసకరమగు సంగతులు నేర్చి యుందును. కాని నేను ఆయన ఈ దినమునకు చేసిన వాగ్దానమును చూచి యున్నాను. అది బయలుపరచబడి యున్నది. ఈ పదిహేను వందల మైళ్ళు చదరపు సమాజము ఇక్కడ కూర్చొని యున్నది. వారు ఏర్పాటు చేయబడినవారు, శాఖల నుండియు, జాతులలో నుండియు, మతములలోనుండియు పిలువబడిన వారు. ఒక చోట చేర్చబడినవారు. వాక్యము బయలుపరచబడుట నేను చూచాను. నిస్సందేహముగా నాకు తెలియును. ఆ దినమున ప్రపంచములోని ప్రతివారు నా కిరీటములోని ముత్యమల వలె ప్రకాశించెదరు.

ISA 9:6

 

229ఇక్కడ మనము కూడుకొనుట వ్యర్ధము కాదు. ఒక సమయము వచ్చును. ఆ సమయము కొరకు మనము ఎదురు చూచుచున్నాము. చాలా ఆలస్యమైనది. ఇంకా యేసు చాలా దగ్గరగా యున్నాడు. ఆయన మహిమ చాలా అద్భుతమైనది. ఆలోచనకర్తయని ఆయనకు పేరు పెట్టబడును. ఆ పట్టణమును మీరు చూడగలుగుచున్నారా? అక్కడే పెండ్లి కుమారుడు మరియు పెండ్లి కుమార్తె స్థిరపడుదురు.

230ఆయన వాక్యము వినుటకు వందలాది మైళ్ళ కారు నడుపుకొని వచ్చి ఇక్కడ కూర్చొని యున్నారు. దీనిని తలంచినప్పుడు ఆశ్చర్యము కలుగును. ఇది కేవలము నీడ. ఆయనతో పాటు ఆ పట్టణములో యున్నప్పుడు మరెంత బాగుండునో కదా! నేను మీ గది ప్రక్కనే యుందును. మీ పొరుగువానిగా యందును. ఆ చెట్ల ఫలములు తిందుము. ఆ వీధులలో నడచుదుము. ఆ బంగారు వీధులలో నడచుదుము. ఆ ప్రవాహ జలము త్రాగుదుము. భూనిమి దేవదూతలు కమ్మి యుండగా దేవుని పరదైసులో నడచెదము. పాటలు పాడుదుము. ఓ! అదెట్టి దినముగా ఉండబోవుచున్నది!

అది మిక్కిలి యోగ్యమైనది. ఆ దారి కరుకుగా కనబడును. కొన్నిసార్లు కష్టముగా ఉండును. ఆయనను చూచినప్పుడు అది చాలా అల్పముగా కనబడును. వారు చెడ్డ పేరు పెట్టిపిలచుచున్నారు. ఆయనను అందమగు, సుందరమగు దేవుని పట్టణములో చూచినప్పుడు, ఎంతో వింతగా నుండును!

231మన తలలు వంచుదము.

ఆ అందమగు పట్టణమునకు నేను వెళ్ళుచున్నాను,

నా ప్రభువు తన స్వకీయులకు సిద్దము చేసెను;

అన్ని యుగములలో విమోచించబడిన వారును,

ధవళ సింహాసనము ఎదుట "మహిమ" పాడుదురు.

కొన్నిసార్లు పరలోకము మీద నాకు బెంగ పుట్టుచున్నది,

అక్కడ నేను దాని అందమును చూచెదను.

అదెంత ఆనందము!

నా రక్షకుని చూచెదను.

ఆ బంగారు పట్టణములో.

పత్మసు ద్వీపము మీద యోహాను దానిని చూచెను…

232ప్రియ యేసూ, నా నిరీక్షణ మరి దేని మీదను లేదు. ఆ పట్టణమే నా హృదయ వాంఛ, ప్రభువా, నీవే గొప్ప రాజవు, దేవా , దయచేసి ఇక్కడున్న ఏ ఒక్కరిని నశించనీయకుము. ప్రభువా, నేడు మరల మేము మా జీవితములను పరీక్షించుకొనుచున్నాము. ప్రభుని రాక కొరకు ఎదురు చూచుచున్నాము. రోమ్ లోని పందెపు రంగములలో సింహములచే క్రైస్తవులు తినివేయబడిరి. ఆ దూళి ఒక దినమున తిరిగి లేచును. మహిమ కొండ మీద ఏ సమాధులు ఇక ఉండవు. సమాధి పూలదండలు ఇక ఏ తలుపుకు వ్రేలాడవు. ఏక న్నీటి చుక్క రాలదు. ఏ తుఫానులు చెలరేగవు. అక్కడంతా మహిమ యుండును.

233ప్రభువా, మాకు సహాయము చేయుము. గొర్రెపిల్ల వివాహ విందుకు పిలువబడిన వారిచ్చటయున్నారు. వెయ్యేండ్ల పాలనలో వారుందురు. ఆ వెయ్యేండ్ల పాలన హనీమూన్ వంటిది. ఆ తరువాత పట్టణములో ప్రవేశించెదరు. పెండ్లి కుమారుడు తన భార్యను గృహమునకు తీసికొని పోవును. ఆమె ప్రియునిది. ప్రియుడు ఆమె వాడు. ప్రధానము చేసికొని ఆయన ఒక గృహము సిద్దపరచుటకు వెళ్ళియున్నాడు. వాక్యమై యున్న ఆయనకు మేము నమ్మకముగా జీవించెదము గాక! ఇతరులు మమ్మును ఎట్లు వేధించిననూ ప్రభువా, నీ దగ్గరగా మమ్మును చేర్చుకొనుము. కొన్నిసార్లు పరలోక బెంగ నాకు కలుగుచున్నది,

ఆయన మహిమ అక్కడ నేను చూచెదను,

అదెట్టి సంతోషము,

నా రక్షకుని చూచెదను,

ఆ రమ్యమగు బంగారు పట్టణములో.

234వధూవరుల యొక్క భవిష్యత్తు గృహమును చూచాము. పెండ్లి విందుకు ఆయన తిరిగి వచ్చుచున్నాడు. అది మూడున్నర దినములుండును. మరల హనీమూన్కు వెయ్యేండ్ల పాలనలోనికి వచ్చెదము. ఆయన పట్టణమును కనబడునట్లు చేయును. పెండ్లి కుమారుడు, పెండ్లి కుమార్తెను తీసికొని వెళ్ళును. ఆమె ఆశ్చర్యము చెందును. ఆమె తన భవిష్యత్తు గృహము చూచి ఆశ్చర్యములో మునిగిపోవును. ప్రభువా, విశ్వాసము ద్వారా నేడు దానిని చూచుచున్నాము. అది ఈ భూమి మీదనే యుండును. అది నీ వాగ్దానము. ఒక దినమున నీ సంఘము పూర్తిగా విమోచించబడును. నీ ప్రపంచము సంపూర్తిగా విడుదల పొందును. తక్కిన వన్నియూ స్వేచ్చను పొందును. కాని మొదట నీవు, నీ జనులను, వారి లోకసంబంధ శరీరములను విడిపించితివి.

235దేవా, మాకు సహాయము చేయుము. ప్రభువా, ఆ నిశ్చయత లేనివారు ఇక్కడెవరైనా యున్నచో, ఇపుడే వారా నిశ్చయతను పొందెదరు గాక! చాలా దీర్ఘ-ప్రసంగము, చాలా వేడిగా నున్నది, కాని జనులు ఎప్పుడూ ఇక్కడ నిలబడి యుండరు; నేను ఎల్లపుడూ సంఘ కాపరిగా ఉండను. ఒక నిశ్చయతను పొందుదుము గాక. "బ్రెన్హాం సోదరుడా? ఏదయినా మార్గమున్నదా?" అవును, వాక్యములో భాగము కమ్ము, నేటి వాక్యములో భాగముగా ఉండుము. మోషే దినపు వాక్యములో నీవు భాగము కాలేవు. ఆ భాగము నెరవేరినది. అది కాలు భాగము, ఇప్పుడు మనము శిరస్సు యొద్దకు వచ్చాము. ఇది క్రీస్తు, లూధర్ కాలములోని చేతులు కావు, ఇది శిరస్సు కాలము, తలరాయి యగు క్రీస్తు వచ్చి శరీరమును అతుకును.

236నీవు ఇంకా అక్కడుండు సరియగు నిశ్చయతను కలిగి యుండనిచో, నీవెక్కడున్నా గాని నాకు కనబడునట్లు, నీ చేతిని ఎత్తుము. అందరూ తలలు క్రిందికి దించండి. దేవుడు మిమ్మును దీవించును. "బ్రెన్హాం సోదరుడా, ప్రార్థనలో నన్ను జ్ఞాపకము చేసికొనుము, నేను తప్పిపోకుండా అక్కడుండవలెనని కోరుచున్నాను. నేను పరీక్షించుకొనుచున్నాను. నాకు వీలయినదంతా చేయుచున్నాను. ఇప్పుడు నా కొరకు ప్రార్ధి౦చుము" అని చెప్పండి. దేవుడు మిమ్మును దీవించును. ఆ విధంగా ఆలోచించుచూ మీరు ప్రార్ధిచండి. అది మీ హృదయమునకే తెలియును. చూచారా? మీ హృదయములో కలవరముండి యుండును. అది దానంతట అదే ప్రత్యక్షమగుచున్నది.

ఆ సుందర పట్టణమునకు నేను వెళ్ళుచున్నాను,

నా ప్రభువు తన స్వకీయుల కొరకు దానిని సిద్ధపరచెను,

అన్ని యుగములలో విమోచించబడిన వారు,

ధవళ సింహాసనము ఎదుట "మహిమ" పాడుదురు.

కొన్నిసార్లు పరలోకము మీద నాకు బెంగ పుట్టుచున్నది,

అక్కడి మహిమలు నేను చూచెదను,

అదెంత ఆనందముగా యుండును.

నా రక్షకుని నేను చూతును!

ఆ అందమగు బంగారు పట్టణములో.

237పరమ తండ్రి, ఇప్పుడు మమ్మును స్వాధీనపరచుకొనుము, పాపపు తోడెళ్ళ తదితర దుష్టమృగములు మ్రింగివేయునని గ్రహించి ఆ గొప్ప గొర్రెల కాపరి తన మహిమను విడిచిపెట్టి వాటిని విమోచించ వచ్చెను. ఆయన బంగారపు వాకిళ్ళను విడిచిపెట్టి, భూమి మీదికి వచ్చి - మనలో ఒకని వంటి వాడాయెను. దేవుని ప్రేమను మన పట్ల ఆయన వెల్లడి చేసెను. వారిని ఆయన కనుగొనెను. కొందరు శాఖలలో యున్నారు. కొందరు దుష్ట గృహములలో యున్నారు. కొందరు గ్రుడ్డివారిగా సందులలో గొందులలో తిరుగుచున్నారు. తండ్రి, ఎవరిని విమోచించమని ఆయనను కోరెనో వారందరినీ ఆయన విమోచించెను.

ZECH 14:7

 

238ఈ కాలములో మనము మన వాక్య వంతు ప్రకారము జీవించవలెనని ఆయన కోరెను. లూధర్, వెస్లీ, పెంతెకోస్తు వారి కాలములలో వచ్చిన సంస్కరణలను మనము చూచియున్నాము. ఇప్పుడు మనము ఆ పట్టణము యొక్క తలరాయి కొరకు చూచుచున్నాము.

ఓ దేవా, ఈ దినమునకు మాకియ్యబడిన వాగ్దానమును కాలమును మేమెరుగుదుము. ఇది మరల పునరుద్దరిచబడవలసియున్నది. దాని ఫలమును సాయంకాల వెలుగు పండించును. పగలు, రాత్రి కాని ఒక దినము వచ్చును — అయితే కాని సాయంకాలమున వెలుగుండును. ఆ మహిమ గల దేవుని కుమారుడే మానవ శరీరమందు ఈ భూమి మీద ప్రత్యక్షమాయెను. వాగ్దానమును అక్షరాల జీవింపచేసియున్నాడు. పరిసయ్యుల, సద్దూకయ్యుల, హేరోదీయుల కండ్లు గ్రుడ్డి అయినట్లుగానే నేడును మరల అగుచున్నవి. అప్పటి వలెనె వాక్యము ప్రత్యక్షమవుచున్నది. వాక్యము హృదయ రహస్యములను ఎరుగును. వాక్యము నిరర్ధకము కాదు. దానిని గ్రహించునట్లు సహాయము చేయుము. దేవా, ఈ చేతులెత్తిన వారికి సహాయము చేయుము. వారు ఇంకొద్దిగా తమ నడుము కట్టుకొని సమాధాన సువార్తను స్వీకరించి, దేవుని యొక్క పూర్తి కవచమును ధరించెదరు గాక! శిరస్త్రానము ధరించెదరు గాక! విశ్వాసమను డాలు పట్టుకొందురు గాక! ఈ రోజు నుండి మరింత ముందుకు సాగి పోయెదరు గాక! ప్రభువా, కృప చూపుము.

REV 12:17•

REV 20:5

 

239కొంచెము కాలమైన పిదప మేము పిలువబడుదుము. ఎత్తబడుట జరుగును. హనోకు వలె చిన్న గుంపు ఎత్తబడును. దేవుని ఆజ్ఞలను వెంబడించు స్త్రీ సంతానములో శేషించిన వారు (యూదులు), యేసుక్రీస్తు సాక్ష్యమును కలిగిన వారు. (అన్యులు) వారి సాక్ష్యమును బట్టి తరుమబడి తమ జీవితములను ఇచ్చెదరు. ఆ తరువాత ఒక గొప్ప ఉదయము వచ్చును. హనీమూన్ ప్రారంభమగును. అదియే వెయ్యేండ్ల పాలన. వెయ్యేండ్ల పాటు విశ్రాంతి యుండును. వెయ్యేండ్ల పాలనంత ముందు ఒక తీర్పు జరుగును. హాము ఓడలో ఉండుటను ఇది చూపించును. హాము ఇంకా ఆ శేషములోనే యున్నాడు. దానిని వినియు తిరస్కరించిన వారు తీర్పు పొందుదురు. ప్రభువా, మేము వారిలో యుండక పెండ్లి విందులో యుండునట్లు సహాయము చేయుము. నేడే యేసును గుర్తించెదము గాక! లోకములో నుండి బయటకు మేము వచ్చి, ఆయనతో నడచెదము. ఆ పట్టణము లోనికి నడిచి వెళ్ళుదుము. ఆయనతో పాటు నడవండి.

HEB 11:13

 

240ప్రభువా, ముసలివారమగుచున్నాము. ఇంకెన్నో ప్రసంగములు నేను చేయను. నిశ్చయంగా నిన్ను నేను నమ్ముచున్నాను. మా తండ్రియగు అబ్రాహాము వలె మేము, ఆ పట్టణము కొరకు ఎదురుచూచున్నాము. అది వచ్చుచున్నదని నాలో ఏదో చెప్పుచున్నది. ప్రభువా, వెలుగును వ్యాప్తి చేయుటకు నేను సర్వప్రయత్నము చేయుచున్నాను. కొద్దిసేపటి క్రితం ఎంత చక్కగా దానిని నీవు బయలుపరచియున్నావు. పదిహేను వందల మైళ్ళ విస్తీర్ణములో ఆ పట్టణమున్నది. ఇక్కడ మేము ఆయా ప్రాంతముల నుండి వచ్చి కూర్చొన్నాము. ఆ పట్టణము కొరకు ఎదురు చూచుచూ మేమిక్కడ చేరియున్నాము. మేము యాత్రికులము, పరదేశలము అని ఒప్పుకొనుచున్నాము; మేము త్రోసివేయబడిన వారము. లోకస్తులు, అన్యజనులు మమ్మును చూచి నవ్వుచున్నారు, ఎగతాళి చేయుచున్నారు; మతశాఖలు హేళన చేయుచున్నవి, కాని అట్టి వాటి ద్వారా మేము కదల్చబడము. ప్రభువా, కదలని వాక్యములో మమ్మును భాగస్దులనుగా చేయుము. చివరి దినములలో అది నెరవేరును. ప్రభువా, ఆలాగు జరుగును గాక! వారి మధ్య అలాగే యుందుము గాక! యేసు నామములో అడుగుచున్నాము. ఆమేన్.

దానిని మీరు నమ్ముచున్నారా? ఈ విధంగా చేతులెత్తండి!

ఆ అందమగు పట్టణమునకు నేను వెళ్ళుచున్నాను.

నా ప్రభువు తన స్వకీయుల కొరకు సిద్ధపరచెను,

అన్ని యుగములలో విమోచించబడిన వారు.

ధవళ సింహాసనము ఎదుట మహిమ గీతములు పాడెదురు.

కొన్నిసార్లు నాకు పరలోక బెంగ కలుగుచున్నది,

అక్కడి మహిమను నేను చూచెదను.

ఓ! అదెంత ఆనందముగా యుండును,

నా రక్షకుని చూతును,

ఆ బంగారు సుందర పట్టణములో.

241మనమందరము కలిసి ఆ పట్టణములో జీవించుదుము గనుక ప్రక్కనున్న వారితో కరచాలనము చేయుచూ ఇట్లు చెప్పండి. "యాత్రికుడా, దేవుడు నిన్ను దీవించును, నీవెక్కడ నుండి వచ్చావు?" "లూసియానా," "జార్జియా," "మిస్సిసిపీ." నేనునూ యాత్రికుడనే ఆ పట్టణము కొరకు నేను ఎదురుచూచుచున్నాను.

… దాని మహిమను నేను చూచెదను,

అది ఎంత ఆనందము,

నా రక్షకుని చూతును,

ఆ బంగారు సుందర పట్టణములో.

ఓ, ఎలుగుబంటి నేమ్మదగును, తోడేలు సాధువగును.

సింహము, గొర్రెపిల్ల కలిపి పండుకొనును,

ఓ! అవును!

అడవి మృగములను,

బాలుడు తోలికొని వచ్చును;

నేను మారెదను, ఇప్పుడున్న స్థితి నుండి మారెదను.

ఓ! అవును!

ఒక దినమున లోయలో సమాధనముండును.

ఓ, ఆ లోయలో సమాధనముండును.

ఓ! ప్రభువా ప్రార్దించుచున్నాను.

ఇక దుఃఖము లేదు, చింత లేదు, శ్రమను నేను చూడను;

నా కొరకు లోయలో సమాధనముండును.

242ఈ ఉదయమున మన అదృశ్య రాజు ప్రత్యక్షమగును. బిల్ డాచ్ ను తొంబది సంవత్సరములు వానిగా నేను చూడను. నన్ను ఏబదేండ్లు వానిగా మీరు చూడరు. ఆ దినమున నేను మారెదను.

అడవి మృగములను,

బాలుడు తోలికొని వచ్చును;

నేను ఇప్పుడున్న స్ధితి నుండి మారెదను.

243మీరు సంతోషంగా లేరా? ముసలి వెండ్రుకలు పోవును, వంగిన భుజములు పోవును. అందము, అమర్త్యత, ఆయన పోలిక వచ్చును. సూర్యుడు ప్రకాశించును. ఓ! ఎంత అద్భుతము!

ఓ, ప్రభువా, నా కొరకు ప్రార్ధి౦చుచున్నాను.

దుఃఖము, చింత ఇకలేదు.

ఏ బాధను నేను చూడను.

నా కొరకు లోయలో శాంతి యుండును.

HEB 13:8

 

244అందుకే ఇక్కడ మనము కూడి యున్నాము. యాత్రలో ఎందరికి బలము ఆ బంగారు సుందర పట్టణములో కావలెను? దేవుడు మనకు అదిచ్చును. ఎందరు శరీర వ్యాధులతో, గాయపు భుజములతో ఉన్నారు? డజనుకు పైగా ఉన్నారు. అదృశ్య రాజు ఇచ్చటున్నాడని మీరు నముచున్నారా? అదశ్యమగునవి దృశ్యమగు వాటి ద్వారా బయలుపరచబడును. ఆయన నిన్న, నేడు, నిరంతరము ఏకరీతిగా యున్నాడు. నా ద్వారా మాట్లాడినది ఆయన ఆత్మయే. అదృశ్యమగునవి దృశ్యమగు వాటి ద్వారా బయలుపరచబడును. ఆయన నిన్న, నేడు, నిరంతరము ఏకరీతిగా యున్నాడు. నా ద్వారా మాట్లాడినది ఆయన ఆత్మయే. ఆయన ఇక్కడుండినప్పుడు చేసిన కార్యములనే ఇప్పుడును చేయును. ఓ, ఎంత అద్భుతము!

ఆ వాగ్దాన దేశమునకు నేను వెళ్ళుచున్నాను,

ఆ వాగ్దాన దేశమునకు నేను వెళ్ళుచున్నాను;

ఓ! ఎవరు నాతో వచ్చెదరు?

నేను ఆ వాగ్దాన దేశమునకు వెళ్ళుచున్నాను.

ఆ సువిశాల మైదానములలో

నిత్య దినమొకటి ప్రకాశించుచున్నది;

కుమారుడగు దేవుడు నిత్యము అక్కడ ఏలును,

రాత్రి చెల్లాచెదురగును.

ఓ, ఆ వాగ్దాన దేశమునకు నేను వెళ్ళుచున్నాను,

ఆ వాగ్దాన దేశమునకు నేను వెళ్ళుచున్నాను;

ఓ! ఎవరు నాతో వచ్చెదరు?

నేను ఆ వాగ్దాన దేశమునకు వెళ్ళుచున్నాను.

245ప్రభుని దూత నన్ను కలిసికొనిన మొదటి దినమున అయిదు వందల మంది నదిలోనికి నడిచి వెళ్ళిరి. సీనాయి కొండ మీద ఆయన కనబడినట్లే అచ్చట ప్రత్యక్షమై కనబడెను. నేను నది లోనికి నడిచి వెళ్ళాను. ఆ పాటనే వందలాది మంది బాప్తిస్మము కొరకు పాడుచుండిరి. ఆయన అగ్నిస్తంభములో దిగి వచ్చుటకు మీరు ఆ పటములో చూడగలరు. ఆ నది యొద్ద ఆయన ప్రత్యక్షమాయెను. "నా మొదటి రాకను ప్రచురపరచుటకు బాప్తిస్మమిచ్చు యోహానును నేను పంపినట్లు, నా రెండవ రాకను ప్రచురపరచుటకు నిన్ను నేను పంపుచున్నాను" అని చెప్పెను.

ఓ! ఎవరు నాలో వచ్చెదరు?

వాగ్దాన దేశమునకు నేను వెళ్ళచున్నాను.

HEB 4:12

 

246అదే అగ్నిస్తంభము ఇక్కడ మనతో యున్నది. దానిని మీరు గ్రహించారా? ఆయన మనలను ఒక్కొక్కరిని ఒక్కొక్క పని కొరకు నియమించెను. ఈ భవనములో ఆయన ఉన్నాడని నిస్సందేహముగా మీరు నమ్ముమదురా? ఆయన తన్నుతాను మీకు రుజువు చేసికొనునని నమ్ముచున్నాను. దాని వలన మీరు తృప్తి చెందెదరా? అందరి యొద్దకు నేను రాకపోవచ్చును గాని మీరు నమ్ముదురా? (దరిదాపు 2:00 గంటలయినది) లేదా ( 1:00 అయినది) ఆయన మన మీదికి దిగి వచ్చును. మన విశ్వాసము ఎచ్చటున్నది? దానిని మీరు నమ్మవలసి యున్నారు. ఏ మాత్రము సందేహింపవద్దు, అది పని చేయును. వాక్యమైయున్న క్రీస్తు యొక్క దైవ సన్నిదిని నేను గుర్తించియున్నాను - రెండంచుల ఖడ్గము కంటెను వాక్యము శక్తి గలదని బైబిలు చెప్పుచున్నది. అది ఎముకల లోని మూలుగ లోనికి దూరి వెళ్ళుననియు, హృదయాలోచలను, తలంపులను పరిశోధించుననియు చెప్పుచున్నది.

MATT 24:24•

MARK 13:22•

HEB 13:8

 

247చూడండి, ఈ సంగతులను కొన్ని సంవత్సరముల క్రితం నేను ఎరుగను. నేను తెలియకుండానే ఈ సంగతులన్నియూ చెప్పితిని. ఆయన చేసినవి చూడండి. "నీవు ప్రజల చేతులను పట్టుకొని నీకు తెలియకుండానే వారి గూర్చి చెప్చెదవు." "అది కణితి" అని చెప్పగానే వారిలో నున్న దానిని నీవు వివేచించుట జరుగును అని ఆయన చెప్పెను. (అది ఏ వ్యాధి అయినా గాని). మనకు ఎన్నో రకముల అనుకరణలు వచ్చినవి; వాటిని మనమెరుగుదుము. వీలయితే ఏర్పరచబడిన వారిని కూడా మోసము చేయును. అయితే అవి వాక్యానుసారముగా ఉన్నవో లేదో చూచినప్పుడు సత్యాసత్యములు బయటపడును.

యేసు నిన్న, నేడు, నిరంతరము ఏకరీతిగానే యున్నాడు.

248ఎంతమంది రోగులు ఇచటున్నారో చేతులెత్తండి. నాకు తెలియని వారెందరో చేతులెత్తండి. అందరూ దాదాపు తెలియని వారే. మీరు నమ్మిక మాత్రముంచితే చాలును.

నమ్మిక మాత్రముంచుము. నమ్మిక మాత్రముంచితే చాలును;

అన్నియూ సాధ్యమే. నమ్మిక మాత్రముంచుము;

నమ్మిక మాత్రముంచుము. నమ్మిక మాత్రముంచుము;

అన్నియూ సాధ్యమే. నమ్మిక మాత్రముంచుము.

GEN 18:8,10,14•

LUKE 17:28,30

 

249యేసు చెప్పెను, "సొదొమ దినములలో ఉండినట్లుగానే, చివరి దినములలో భూమి మీద మనుష్యకుమారుడు ప్రత్యక్షమగు దినములలోను ఉండును." చివరి దినములలో మనుష్యకుమారుడు ప్రత్యక్షమగును లేదా ప్రత్యక్తపరచుకొనును. ముందు దినములు కాదు; మధ్య దినములు కాదు గాని, చివరి దినములు. (చూడండి?) ఆయన ప్రత్యక్షమగును. ఇప్పుడు మనము చివరి దినములలో ఉన్నాము. అక్షరాలా సొదొమ స్థితియే యున్నది. వర్తమానికులు అలాగే యున్నారు.

అబ్రాహాము గుంపుతో పిలువబడిన చిన్న శేషమునకు ఏమి జరిగినది? వారి మధ్యకు శరీరధారి ఒకాయన వచ్చెను. (మానవ శరీరముతో వచ్చెను), వారితో తినెను, వారితో త్రాగెను, వారు భుజించినవే భుజించెను. ఆయన వారిమధ్య నిలబడి వర్తమానము చెప్పెను. "నేను ఈ గొప్ప కార్యము చేయనైయున్నాను."

GEN 18:3,13

 

250"ఈయనెవరు? నేను ఒక పట్టణము కొరకు ఎదురుచూచుచున్నాను గదా? దాని రాజు ఈయనేనా?" అని అబ్రాహాము పరిశీలించుచుండెను.

"శారా ఎందుకు సందేహించినది?" అని ఆయన అడిగెను. (ఆమె అతని వెనుకనున్న గుడారములో యున్నది.)

"ప్రభువగు దేవా, ఎలోహిం" అని అబ్రాహాము పలికెను — ఎందుకనగా శారా యొక్క తలంపులను ఆయన చెప్పకలిగెను.

చివరి దినములలో తాన ప్రత్యక్షమగునప్పుడు మరల అది జరుగునని యేసు చెప్పెను. తలరాయి శరీరము లోనికి వచ్చుచున్నది. ఆయన స్వకీయులను ఆయన విమోచించును. ఇక్కడాయన మనతో కూడా యున్నాడు.

251ఇప్పుడు, దాదాపు ఒక డజను చేతులు పైకెత్తబడి యున్నవి. మీ ప్రతి ఒక్కరిని దేవుడు స్వస్థపరచగలడని నాకు తెలియును. మీరును నమ్ముచున్నారు. ఒక దానిని ఎరుగకుండా, గుర్తించకుండా, ఏ వ్యక్తియు ఇట్టి వాతావరణములో, ఇట్టి సమయములో కూర్చొనలేడని నేను నమ్ముచున్నాను. మీరు ప్రార్ధించవలెనని కోరుచున్నాను. మీ వ్యాధి ఏమిటో మీ హృదయములోనే చెప్పుకొనండి. చూచారా? ఈ విధంగా ప్రార్ధించండి. "ప్రభువైన యేసూ, దీనిని బయలుపరచుము. నా వ్యాధి ఏమిటో నీకు చెప్పుకొనుచున్నాను. నీ పరిశుద్దాత్మను బ్రెన్హాం సోదరుని యొద్దకు పంపించుము. అతడు ఈ వర్తమానములో చెప్పినది సత్యమేనని నిరూపించుము. నేడు నీ గూర్చి అతడు చెప్పియున్నాడు. అది సత్యమని నాకు తెలియును. ప్రభువా, ఇప్పుడు నాకు దానిని బయలుపరచుము. నాతో మాట్లాడుము."

MARK 9:23•

ACTS 3:4,6

 

252మీరు అక్కడ ఇక్కడ చెల్లాచెదురుగా యున్నారు. దేవుడు దయ చేయునని మీ పూర్ణ హృదయముతో నమ్మి ప్రార్ధించుడి.

నా వైపు చూచి ప్రార్ధించుడని కోరుచున్నాను. "మా వైపు చూడు" మని పేతురు, యోహానులు చెప్పిరి. అతనికి ఏదో కావలెను. దానిని అతడు పొందనై యున్నాడు. మీకును ఒకటి కావలెను. మీరును దానిని పొందునైయున్నారని నేను నమ్ముచున్నాను. "మా వైపు చూడు" అనిరి. "మా యొద్ద వెండి బంగారములు లేవు గాని మాకున్నదే నీకిచ్చుచున్నాము" అనిరి. నా యొద్ద ఏమీ లేవు. అన్నీ క్రీస్తులోనే యున్నవి, కాని నా యొద్ద విశ్వాసమను దేవుని వరమున్నది — అదే మీకిచ్చెదను. యేసుక్రీస్తు నామము పేరట మీ అందరూ స్వస్థత పొందండి. దానిని నమ్ముడి. మీరు నమ్మితే చాలును.

MATT 9:20•

MARK 5:27•

MARK 9:23•

LUKE 8:44

 

253ఒక స్త్రీ కూర్చొని నా వైపు చూచుచున్నది. కొద్ది నిమిషాల క్రితం ఆమె ఏడ్చుచూ ప్రార్ధించుచున్నది. ఆమెకు ఒక తైరాయిడ్ వ్యాధి యున్నది. నిన్ను నేనెరుగను. నీవు నాకు క్రొత్త వ్యక్తివి. అది నిజమే కదా? నీవు ఇక్కడి వ్యక్తి కావు - షికాగో నుండి వచ్చావు. శ్రీమతి. అలెగ్జాండర్, అది నిజమైనచో చేతిని ఎత్తుము. బాగయి షికాగో వెళ్ళుము.

ఆమె దేనిని తాకినది? రక్తస్రావపు రోగి తాకిన దానినే ఆమె తాకినది. నాది కాదు గాని ఆయన వస్త్రపు చెంగును ముట్టెను.

ఈ జనుల మధ్యలో ఒకామె కూర్చొని యున్నది. ఆమె నా మాటలు గ్రహించగలదు. నీవు తలను ప్రక్కకు త్రిప్పి యున్నావు. నిన్ను నేనెరుగను. నీవు నాకు క్రొత్త వ్యక్తివి. నీవు కడుపు వ్యాధితో బాధపడుచున్నావు. నీ ప్రక్కన నీ భర్త కూర్చొని యున్నాడు. నీ చెవిలో ఏదో వ్యాధి యున్నది. నీ పేరు జవ్ - నిన్ను నేనెరుగను. మిరిక్కడ వారు కారు. మీరు మిషిగన్ నుండి వచ్చారు. అది నిజమైతే చేయి ఊపండి. బాగయి తిరిగి మిషిగన్ వెళ్ళండి. మీ విశ్వాసము మిమ్ము బాగు చేయును. నమ్ముట నీ వలన అయితే నమ్ము వానికి సమస్తము సాధ్యమే.

254గొంతు వ్యాధితో ఒకామె ఆ చివరన కూర్చొని యున్నది. జార్జియా నుండి వచ్చెను. తెల్లని వస్రములు ధరించినది. బాగయి తిరిగి జార్జియ వెళ్ళుము. యేసుక్రీస్తు నిన్ను బాగు చేయును. దానిని నీవు నమ్ముచున్నావా?

ఆ కుర్చీల చివర కుడివైపు ఒకామె కూర్చొని నా వైపు చూచుచున్నది. ఆమెకు సైనస్ వ్యాధి ఉన్నది. ఆమె నమ్మినచో, దేవుడు దానిని బాగుచేయును. శ్రీమతి. బ్రవున్ నీ పూర్ణ హృదయముతో నమ్ముము. యేసుక్రీస్తు నిన్ను బాగు చేయును. నీవు నాకు క్రొత్త వ్యక్తివి, కాని ఆయన నిన్నెరుగును. దానిని నీవు నమ్ముదువా? నీ చేతిని ఎత్తుము, అది నిజము.

ఈ మంచము మీద ఒకామె పరుండియున్నది. ఇటు వైపు చూడమని ఆమెతో చెప్పండి. ఆమె బాధపడుచున్నది. నాకు శక్తియున్నచో ఆమెను నేను బాగుచేయుదును, కాని నా వల్ల ఏమి కాదు. ఆమె ఇక్కడి వ్యక్తి కాదు, చాలా దూరము నుండి వచ్చినది. నీవు మిస్సోరి నుండి వచ్చావు. నీకు లోపట వ్యాధి యున్నది. నీవు సందేహించక, నీ పూర్ణ హృదయముతో నమ్మిన యెడల, యేసుక్రీస్తు నిన్ను బాగు చేయగలడు. నీవు బాగయి మిస్సోరి వెళ్ళి సాక్ష్యమీయ వచ్చును. నమ్ముదువా? అయితే అంగీకరించి, నీ మంచము పట్టుకొని ఇంటికి వెళ్ళుము. యేసుక్రీస్తు నిన్ను బాగు చేయును.

MARK 16:17,18

 

255నీవు నమ్మదువా?

నిత్యత్వపు రాజు యొక్క సన్నిధికి అది గుర్తింపు. దానినిప్పుడు మీరు మీ పూర్ణ హృదయములతో నమ్ముచున్నారా? ఈ భవనము చుట్టూ ఆయన నిశ్చయంగా ఒక వలయము ఏర్పాటు చేసియున్నాడు. దానిని మీరు మీ పూర్ణహృదయములతో నమ్మదురా? మీరాయన సన్నిధిలో ఉన్నట్లు నమ్ముచున్నారా? ఈ రాజ్యములో నీవును ఒక ప్రతినిధిగా యున్నావని నమ్మి అంగీకరించుచున్నావా? నీ చేతిని ఎత్తుము.

యేసు చెప్పెను, "నమ్మిన వారి వలన ఈ సూచన క్రియలు కనబడును, వారు రోగుల మీద చేతులుంచినప్పుడు బాగవుదురు." మనము ఒకరి మీద ఒకరము చేతులుంచవలెను. మీరు నాలో భాగమై యున్నారు.

మనందరము ఒకరి మీద ఒకరము చేతులుంచుదము. ఆ మంచము మీద స్త్రీ లేచి బాగయి ఇంటికి వెళ్ళెను. ఆమెన్!

MATT 17:20•

MATT 21:21•

MARK 11:23•

REV 21:23

 

256మీరు నమ్మినట్లయితే, ప్రతి వారు బాగవుదురు.

ఒకరి మీద ఒకరు చేతులుంచుకొనండి. మీరు క్రీస్తులో భాగమై యున్నారు. మీరు ఎవరి మీద చేతులుంచారో వారి కొరకు ప్రార్ధించండి. మీ ఇష్టము వచ్చినట్లు చేయుడి.

ప్రభువైన యేసూ, నీవు ఇక్కడున్నావని గుర్తించి యున్నాము. నీవే మా రాజువు. నిన్నునీవు మా మధ్య గుర్తింపచేసికొనుము. ఈ సన్నిధిని బట్టి మేము నీకు వందనములు చెల్లించుచున్నాము. ప్రభువా నీవే ఇట్లు చెప్పితివి, "ఈ కొండను కదిలి పొమ్మని మీరు సందేహించకుండా చెప్పవలెను. నీవు చెప్పినది జరుగునని నమ్మవలెను. దానిని నీవు పొందెదవు. నీవడిగిన దానిని నీవు పొందెదవు." ఈ ఆజ్ఞకు విధేయత చూపవలెను. దేవుని వాక్యమునకు విధేయత చూపవలెను, అవి తప్పిపోవు. పదిహేను వందల మైళ్ళ చతురస్త్రముగా ఆ పట్టణమున్నది. దానికి మేము ప్రతినిధులము. ఓడిపోయిన అపవాదితో ఇటు చెప్పెదము, "నీ అంతము అగ్నియే. చతురస్త్రపు పట్టణమునకు మేము ప్రతినిధులము. గొర్రెపిల్లయే ఆ పట్టణమునకు వెలుగు, మేము సర్వశక్తుడగు దేవునికి పోలికలైయున్నాము. యేసుక్రీస్తు తన కృపను బట్టి మనలను రక్షించెను." సాతానా, ఇక్కడున్న ప్రతి వ్యాధిగ్రస్తునిలో నుండి యేసుక్రీస్తు నామములో బయటకు రమ్మని ఆజ్ఞాపించుచున్నాను. పరిశుద్ద హస్తములు విమోచించినవి, ఎందుకనగా వారు వాక్యములను నమ్మియున్నారు. వారు దేవుని ఆలోచనలకు ప్రతి రూపములు, వారు ప్రతి వారి మీద చేతులుంచి యున్నారు. వారిని సాతాను ఇక బంధించలేదు. యేసుక్రీస్తు నామములో బయటకు రమ్ము.

257ప్రభువైన యేసు ఇక్కడున్నాడు. ఆయన ఇక్కడున్నాడని ఆయన వాక్యము చెప్పుచున్నది. మీరిక్కడికి వచ్చినందును, మి వాశ్వాసమును బట్టి మీరాయన ప్రతినిధులని తెలియుచున్నది. ప్రతి భౌగోళిక లెక్కబట్టి దానిని మనము చూపించగలము, మీరు దేవుని చేత విమోచించబడిన కుమారులు, కుమార్తెలుగా ఉన్నారని గుర్తించితిరా? ఇది మీ గృహమని గుర్తించగలిగారా? ఇక్కడికే మీరు వెళ్ళుచున్నారు. అందుకే మీరిక్కడికి వచ్చియున్నారు. అందుకే మీరు క్రీస్తు వద్దకు వచ్చియున్నారు. మీరాయన వాక్యమును భుజించుచున్నారు. ఇక్కడ మనము ఇటువంటి సమయమును కలిగియున్నాము. ఆయన యొక్క ప్రతి రూపములుగా యున్నాము. ఆయన యొక్క సన్నిధిలోనికి వచ్చినప్పుడు మనమెట్లందుము? ఓ! అది అద్భుతమగు సమయము. రోగులను బాగు చేయు హక్కు మీ ప్రతి ఒక్కరికి యున్నది. రోగుల మీద మీరు చేతులుంచండి. బాప్తిస్మము పొందు హక్కు మీకున్నది.

GEN 3:4•

REV 22:18,19

 

258యేసుక్రీస్తు నామములో బాప్తిస్మము పొందని వారెవరైనా ఉన్నచో, నీరు సిద్దముగా యున్నది. దేవుని యొక్క ప్రతి వాక్యమునకు మీరు ఆ విధంగా లోబడవలెను. (ఇది సత్యము) ఆది యందు ఒక్క చిన్న మాటను మీరినందు వల్లనే ఈ భూమి మీదకు ఇంత పాపము వచ్చియున్నది. యేసు ఇట్లు చెప్పెను, "దీని నుండి ఒక్క మాట తీసివేసినా, దీనికి ఒక్క మాట చేర్చినా - అట్టి వాని పేరు జీవగ్రంధములో నుండి తీసివేయబడును."

యేసుక్రీస్తు నామములో తప్ప మరే విధంగానూ ఆది-సంఘము వారు బాప్తిస్మము పొందినట్లు బైబిలులో ఎచ్చటను కనబడదు. ఆ విధంగా మీరు బాప్తిస్మము పొందనియెడల, ఇప్పుడే పొందుట మంచిది. పెద్ద తేడా ఏమీ లేదు లెండి అని మీరందురు. హవ్వ అందువల్లనే పతనమాయెను. సాతాను మాటను నమ్మినది. దేవుడు చెప్పినది చేయలేదు.

MATT 16:19

 

259రాజ్యపు తాళపు చెవులను ఆయన పేతురు కిచ్చెను. పెంతెకోస్తునాడు బంధించబడినది. నిత్యమూ బంధించబడును. ఆ కారణము చేతనే పెండ్లికుమార్తె రెండవసారి కనబడుచున్నది. అంత్యదినమున ఒక సంఘము బయటకు పిలువబడును. మొదటి దినమున ఉండినట్లే అది యుండును. ఆ చెట్టు నేలలో నుండి ఎదిగి ఇప్పుడు వధువు వృక్షముగా తయారయినది. దేవుని యొక్క మహోన్నత కళాఖండము పట్టణమునకు మరల కొనిపోబడును. (రెండు ఆదివారముల క్రిందట నేను చెప్పాను)

దేవుడు మిమ్మును దీవించును. ఇప్పుడు నేను నమ్ముచున్నాను.

1PET 5:8

 

260సాతాను ఓడిపోయినది. ఆయనకు తెలియును; వాడు భూమి మీద యున్నాడు; వాడు గర్జించు సింహము వలె తిరుగుచున్నాడు, వాడి పని సమాప్తమగు సమయము త్వరలోనే వచ్చును. వాడికి వాడి సమయము తెలియును, అందుకే వాడు గర్జించు సింహము వలే తిరుగుచున్నాడు. కాని మరువకండి, సమాధానాధిపతి నిలబడి యున్నాడు. ఆ గొప్ప దేవుడు ఇక్కడ యున్నాడు. నిన్ను, నన్ను అందరినీ నిర్మించిన వాడు ఆయనే, భవనమును ఎక్కడ నిర్మించవలెనో నిర్మాణకునికే తెలియును. నిర్మాణకుని కంటె ఎక్కువ ఎవరికి తెలియును? ఆయన తన్నుతాను రుజువు చేసికొనుటకు ఇచ్చటున్నాడు. అది మీ విశ్వాసము మీదనే ఆధారపడియున్నది. నమ్మిక మాత్రముంచండి.

ఆ అందమగు పట్టణమునకు నేను వెళ్ళుచున్నాను,

నా ప్రభువు తన స్వకీయుల కొరకు దానిని సిద్ధపరచెను.

అన్ని యుగములలో విమోచించబడిన వారు,

ధవళ సింహాసనము ఎదుట మహిమ గీతములు పాడెదురు.

కొన్నిసార్లు నాకు పరలోక బెంగ ఏర్పడుచున్నది,

(ఇదంతా ముగిసిన పిదప)

అక్కడి మహిమను నేను చూచెదను.

అదెంత ఆనందము,

నా రక్షకుని చూచెదను,

ఆ బంగారు సుందర పట్టణములో.

261గుర్తుంచుకొనండి, ఈ రాత్రికి చర్చిలో ప్రభురాత్రి భోజనమిచ్చెదను. ఈ పట్టణములో ఉండి మీరు రా గోరినచో మిమ్ములను సంతోషంగా ఆహ్వానించుచున్నాము. ఆయనతో కలసి మనము భోజనము చేయు వరకు ఇది ఒక జ్ఞాపకార్థ సూచన.

మిమ్మును నేను ప్రేమించుచున్నాను. దానినెట్ల వ్యక్తము చేయవలెనో నాకు తెలియదు. మీరు భూమికి ఉప్పుగా నున్నారని తలంచుచున్నాను. లోకములో మీ నడవడిని గూర్చి వినుచున్నాను. అది నాకు మరింత నమ్మకమును ఇచ్చుచున్నది. కాని ఈ చిన్న గుంపు ఒక దినమున విడిపోవునని నేను కలగనుచున్నాను. మనము తిరిగి కలిసికొనుటకు ముందే మనలో ఎవరిమైనా కావచ్చును.

ఆ ప్రకాశమగు నది యొద్ద ఒక ఉదయాన మిమ్మును నేను కలిసికొందును.

దుఃఖమంతా ఎగిరిపోవును.

గుమ్మము తెరువబడి యుండగా

అచ్చట నేను నిలబడియుందును.

జీవితపు దీర్ఘ అలసట దినము ముగియును.

ఆ ఉదయాన ప్రకాశమగు నది యొద్ద మిమ్మును కలిసికొందును.

తరచుగా ఆ నది యొద్ద కూర్చొందును.

పాత స్నేహితులను చూచి పరవశించెదను.

(మిమ్మును చూతును, గుర్తించెదను.)

నా చిరునవ్వును బట్టి ఆ దినమున నన్ను మీరెరుగుదురు.

ఆ ఉదయమున మిమ్మును కలిసికొందును.

చతురస్త్రముగా కట్టబడిన ఆ పట్టణములో.

262మీరాయనను ప్రేమించుచున్నారా? ఇప్పుడు నిలబడి; తిరిగి మనము కలిసికొను వరకు, పాట పాడుదము — యేసు నామములో నీతో కొనిపొమ్ము అను పాట పాడెదము. ముందు శృతి ఇవ్వండి. మీరాయనను ప్రేమించుదురా? ఆయన ఆశ్చర్యకుడు కాడా? ఇది సత్యమని మీరు నమ్ముదురా? దేవుని కృప బట్టి అటు మీరు పయనించుచున్నారా? అక్కడికి చేరువరకు యేసు నామమును మీతో కొనిపోవుడి. ప్రతి ఉరి నుండి నిన్ను అది కాపాడును. నిన్నేశోధనలు చుట్టు ముట్టినప్పుడు ఆ నామమున ప్రార్థనలో ఊదుము. మనము తిరిగి కలిసికొను వరకు అదే చేయవలెను. మంచిది.

యేసు నామమును నీతో కొనిపొమ్ము,

దుఃఖముతో, చింతతో నిండిన ఓ బిడ్డా;

అది నీకు ఆనందము, ఆదరణ ఇచ్చును,

నీవు వెళ్ళు ప్రతి చోటికి దాని కొనిపొమ్ము.

ప్రశస్త్ర నామము. ఓ! ఎంత మాధుర్యము!

భూలోక నిరీక్షణ, పరలోక ఆనందము;

ప్రశస్త్ర నామము. ఓ! ఎంత మాధుర్యము!

భూలోక నిరీక్షణ, పరలోక ఆనందము.

263ఇప్పుడు, నా వర్తమానమును దాటవేసి యున్నాను. ప్రభుని చిత్తమయితే ఒక దినము వచ్చి మరల ఎక్కువ సమయమున్నచో విడిచిపెట్టిన వాటిని తిరిగి చెప్పుకొందము. (చూచారా?) ఎక్కువ సేపుండుట లేదని మీరు ఫిర్యాదు చేయుచున్నారు గదా? అందుకే ఈ రోజు ఇంతసేపున్నాము. చాలా వేడిగా యున్నది. ఆ బయటి స్పీకరును అపివేసినప్పుడు ఒక పొరుగు వ్యక్తి ఇట్లనెను., "వర్తమానమును ఎంతో నేను అనుభవించాను. ఆ చక్కని పాటలను వినకుండా ఎందుకు ఆపు చేశారు?" బయటి వారిని చూడండి. పొరుగువాడా, ఈ ఉదయమున నీవు వినుచున్నవని తలంచుచున్నాను. ఈ జెఫర్సన్ విల్ లో మంచి పొరుగు వారున్నారు. వారి ఇండ్ల ముందు మన కార్లు నిలుపుచున్నాము. వారేమీ అనుట లేదు. ఆలాగే మనము కొనసాగవలెను. ఇప్పుడు వారికి వందనములు చెల్లించుచున్నాము. ఓ! ఆయనెంత అద్భుతమైన వాడు! దేవుడు మీకు తోడైయుండు గాక.

… నామము. ఓ! ఎంత మాధుర్యము!

భూలోక నిరీక్షణ, పరలోక ఆనందము.

తిరిగి మనము కలియు వరకు, (మన తలలు వంచుదము.

సంఘ కాపరి మనలను పంపించును.

దేవుడు మీకు తోడైయుండు గాక.)

…. యేసు పాదముల యొద్ద మనము కలియుదుము.

(ఆ గొప్ప పట్టణములోని సింహాసనము యొద్ద)

తిరిగి మనము కలియు వరకు, (తిరిగి మనము కలియు వరకు)

తిరిగి మనము కలియు వరకు, దేవుడు మీకు తోడైయుండుగాక.

Search Messages

0 / 0 matches
Enter characters above to process real-time text query scopes...