త్రుతీయ నిర్గమము
1.ప్రార్థనకై మనందరము శిరములు వంచుదము. మన శిరములు వంచి యుండగా, ఏదయినా ప్రత్యేక విన్నపమున్నయెడల, దానిని దేవునికి తెలియ చేయగోరినయెడల చేతిని ఎత్తండి. మీ చేతి క్రిందనే మీ విన్నపమును పట్టుకొని యుంచండి.
2.పరలోకపు తండ్రీ, నిత్యత్వమునకు ఈవలివైపున అందరము కలిసికొని ఇక్కడ కూడుకొను అవకాశము అనుగ్రహించినందులకై కృతజ్ఞతలు చెల్లించుచున్నాము. నీ యొద్ద నుండి నూతన బలము పొందుటకై ఈ ఉదయమున మేము ఎదురుచూచుచున్నాము; మా ముందున్న యాత్రను కొనసాగించుటకు మాకు ధైర్యమును ఇమ్ము.హెబ్రీయులవలె మేమును పెందలకడనే కూడుకొనియున్నాము, రాత్రియందు వారి కొరకు మన్నా ఏర్పాటు చేయబడినది, రాబోవు దినమునకు కావలసిన బలమును అది అనుగ్రహించును. ఈ ఉదయమున మేము ఆత్మ సంబంధమగు మన్నా కొరకు చేరియున్నాము, మా యాత్రకు కావలసిన బలమును అది ఇచ్చును.
3.ప్రభువా, పైకెత్తబడిన ఆ హస్తముల వెనుకను ఏమి అవసరత యున్నదో నీవెరుగుదువు. వారితో పాటు నేను కూడా నీ యెదుట ప్రార్థించుచున్నాను, వారికి కావలసిన ప్రతి అవసరమును నీవు తీర్చుము. ప్రభువా, రోగులను, బాధపడుచున్న వారిని స్వస్థపరచుము. నీవు దేవుడవని మేమెరుగుదుము, మరియు సమస్తమూ చేయగలవు, వారికి చేయుదునని నీవు వాగ్ధానము చేసి యున్నావు. ఆ పాటలో యున్నట్లుగా నమ్మిక మాత్రముంచిన చాలును, మహిమానిత్వమగు మాటలను మేము వినియున్నాము; రాజుతో నడచుచూ మరియు మాట్లాడుచూ యుండవలెను.తండ్రియగు దేవా, ఈ ఉదయము బయలు వెళ్ళబోవుచున్న నీ వాక్యమును ఆశీర్వదించుము. మా ప్రభువైన యేసు నామములో దీనిని మేము అడుగుచున్నాము. ఆమేన్.“యెహోవా మందిరమునకు వెళ్ళుదుమని వారు నాతో అన్నప్పుడు, నేను సంతోషించితిని,” అని పలికిన దానిని విన్నాము.
4.హాట్ స్ప్రింగ్స్ నుండి నిన్న వచ్చియున్నాము, అప్పుడు సహో మూర్ ఇట్లనెను, “బ్రెన్‌హాం సోదరుడా, నాతో పాటు టెక్సాస్‌లోని కూటమునకు నీవెందుకు రాకూడదు? అక్కడ రెండు రోజులు విశ్రాంతి తీసికొనవచ్చును గదా?”.“రేపు నాకు రెండు ఆరాధనలున్నవి” అని చెప్పాను.“రెండు ఆరాధనలా?” అన్నాడు. “అవును,” అన్నాను. “ఇంతగా శ్రమపడి ఇక్కడ బోధించుచున్న నీకు, వారములో కొద్దిగా విశ్రాంతి కావలెను. ఒక సంఘకాపరిని తీసికొని వెళ్ళుము, అతడు ఆదివారపు వర్తమానమందించును, ఆ తరువాత వారమంతా అతడు విశ్రాంతిగా నుండును, ఆ ప్రసంగము అరగంట కన్న ఎక్కువ సేపు ఉండదు.” “ఇక్కడ నీవు ఒకేసారి రెండు, మూడు గంటలు మాట్లాడుచున్నావు. ప్రతి రోజూ ఇదే కార్యక్రమము, కొన్నిసార్లు దినములో రెండుసార్లు ప్రార్థన వరుసను ఏర్పరచి ప్రార్థించుటయే గాక వివేచించుదువు. ఇప్పుడేమో ఇంటికి వెళ్ళుచున్నానని చెప్పి రెండు ఆరాధనలలో మాట్లాడెదవా?” అనడిగాడు.“అవును,” అన్నాను“నీవెట్లు చేయకలుగుచున్నావు?” అనడిగాడు.“నాకు సహాయము ప్రభువు నుండియే వచ్చుచున్నది అన్నాను,” చూచారా! “సమయము చాలా గతించినది.” నేను లోనికి వచ్చుచుండగా కొద్దిసేపటి క్రితం ప్రార్థించుచూ ఎవరో ఆ మాట పలికిరి. సమయము గతించుచున్నది, అవసరత ఎక్కువగాయున్నది, మనము జీవించుచున్న ఈ గొప్ప ఘడియలో మన వంతు సహాయమును అందించుటకు ఇక్కడ కూడికొని ప్రయత్నించుచున్నాము.
5.ప్రభుని చిత్తమయితే ఈ రాత్రి నేను మాట్లాడబోవు అంశము ఇది: “నీ జీవితము సువార్తకు తగినట్లుగా యున్నదా?” దానిని నేను టేపు చేయగోరుచున్నాను. ఇప్పుడు, ఈ ఉదయము దీనిని వారు టేపు చేయుచున్నారో లేదో నేనెరుగను; ఆ గదిలో కొందరు నాకు కనబడుచున్నారు — వారే ఆ చేయువారని ఊహించుచున్నాను.దీనిని నెవిల్ సోదరుడు చేయునని నేననుకొన్నాను. అతనినే చేయమని గతరాత్రి అడిగాను, అతని వర్తమానమును అందించమని అడిగాను. అతడు ముగించిన తరువాత వెనుక కొద్ది మాటలు చెప్పెదనని అన్నాను. వారు ఆదివారపు బడిపాఠమును చేసినచో మంచిదే.
6.ప్రభుని చిత్తమయితే, ప్రభువు అనుమతించినచో, వచ్చే ఆదివారం ఇక్కడ యుందుము, చాలా కాలము నుండి ఒక అంశము మీద మాట్లాడవలెనని ఆలోచించుచున్నాను, మరియు అటువంటి వర్తమానములను మొదటగా ఆలయములో నుండియే అందించుదునని వాగ్ధానము చేశాను, అవి టేపు చేయవలసిన వర్తమానములు. ఈ తరము వారు యేసుక్రీస్తును సిలువ వేయుచున్నారని నేరారోపణ చేయు వర్తమానమును, ప్రభుని చిత్తమయితే వచ్చే ఆదివారం ఉదయాన అందించెదము. “నీ జీవితము సువార్తకు తగినట్లుగా యున్నదా?” అను వర్తమానమును ఈ రాత్రి ఏడు లేదా ఏడున్నర గంటలకు అందించెదను.
7.ఇప్పుడు, ఇటువంటి వర్తమానములను అందించునప్పుడు కొన్ని సమయములలో చాలా కరకుగా మాట్లాడవలసివచ్చును, గట్టిగా కోయవలసి వచ్చును. నిజంగా నేను ఈ ఆలయమునుద్ధేశించియే మాట్లాడుచుందును. గుర్తుంచుకొనండి, నా మాటలు ప్రపంచమంతా వెళ్ళుచున్నవి. టేపు చేయు ఏర్పాట్లు ప్రపంచమంతా మనకున్నవి; వారు ఈ వర్తమానములను అడవులలోనికి, ఇంకా పలు ప్రాంతములకు తీసికొని వెళ్ళుదురు. కొన్నిసార్లు కొన్ని విషయములు చెప్పుటకు పరిశుద్ధాత్మ నన్ను నడిపించును. ఎక్కడో ఆస్ట్రేలియాలో ఉన్నవారికో, లేదా మరెక్కడో మారుమూల నున్న వారికో అది తాకును.“అటువంటి పరిస్థితులు ఇచ్చట లేవు గనుక అది చెప్పనక్కరలేదని మీరనుకొనవచ్చును.” అదెందుకు చెప్పానో అర్థం కాకపోవచ్చు, అది బహుశా ఎక్కడున్న వారికో కావచ్చును, చూడండి. నిశ్చయంగా మీరు దీనిని గ్రహించెదరని ఎరుగుదును.ఈ వర్తమానములు ఎవరినీ దృష్టిలో ఉంచుకొని చెప్పినవి కావు — విశ్వవ్యాప్త సంఘము నుద్ధేశించి ఇది చెప్పబడును, ప్రతిచోటకు; ప్రభువు దేనిని చెప్పమని నడిపించునో, దేనిని చేయమని నడిపించునో దానిని చెప్పవలెను మరియు చేయవలెను.
8.హాట్ స్ప్రింగ్స్ యొద్ద అద్భుతమగు సమయమును చూచాము, పాత-కాలపు పెంతెకోస్తు కూటము. మీలో చాలామంది సంతృప్తి చెందియున్నారని నిశ్చయంగా నాకు తెలియును. ఆ కూటము యొద్ద పెంతెకోస్తు జనులుండిరి, మీలో కొందరు అచ్చటకు వచ్చిరి. ఆ గుంపును నేనెరుగను, కాని ఆ వారము నన్ను అచ్చటకు రమ్మనిరి, రెండు లేదా మూడు రోజులుందునని చెప్పాను. కాని ఒక సంగతి నేను చెప్పగోరాను, ఆ కూటములో వారికి నిశ్చయంగా నమ్ము విశ్వాసమున్నది. మీలో అక్కడున్న వారికి తెలియును — ఈ స్త్రీ అక్కడుండెనని నాకు తెలియును, ఆ మూలన కూర్చొనియున్నది — ఆమె ఎవరో నాకు తెలియదు గాని, ఆమె మాత్రం అచ్చట ఉండినది. కొందరు సోదరులును అచ్చట యుండిరి, సహో జాక్సన్ మరియు సహో పామర్ మొదలగు వారచ్చట యుండిరి.
9.విశ్వాసమున్నప్పుడు ప్రజలకు అదే దొరకునని గ్రహించుడి, ఆ స్వస్థతా వరుసను చూచారా? అందరినీ దేవుడు స్వస్థపరచెను, ఒక్కరూ లోనికి రాలేదు, బయటకు వెళ్ళలేదు.కావున మీకు విశ్వాసము ఉన్నప్పుడు..... మరో సంగతి, మీలో కొందరికి వారియొక్క ఉద్రేకము అర్థమయి యుండదు — నాట్యము, చప్పట్లు, మొదలగునవి — వారు ఏ వ్యక్తి వైపు చూచుట లేదు; వారు దేవుని ఎదుట కేకలు వేయుచుండిరి. అంతే! అయితే, ఇంకొక సంగతి నేను చెప్పగోరుచున్నాను, అంత చక్కని స్త్రీలను ఎన్నడూ నేను చూడలేదు — పొడవైన జుట్టు. వారు అరణ్యములలో నుండి, పొదలలో నుండి వచ్చిన జనులు, అయితే రంగులు పూసికొని కృత్రిమ అలంకరణలు చేసికొనిన వారిని ఒక్కరిని కూడా నేను అచ్చట చూడలేదు. (నా భావం గ్రహించారా), ఆధునిక వెర్రి పోకడలు లేవు. వారు బోధించు దానినంతటినీ నేను సమ్మతించక పోవచ్చు, కాని ఈ విషయములలో నిశ్చయంగా సమ్మతించెదను. అది నాకు క్రైస్తవ్యము వలె కనిపించినది.
10.నిన్న మధ్యాహ్నము ప్రభువు ఒక అంశము మాట్లాడుటకు నన్ను నడిపించెను, “ప్రభువా, ఒక్కసారి మాత్రమే,” అను ప్రసంగము. ఒక ఉద్ధేశ్యముతోనే నేను దానిని బోధించానని ఆ సంఘమునకు గాని, జనులకు గాని తెలియదు, ఎందుకనగా ప్రభువు నన్ను ఆలాగు నడిపించెను. ఆ చిన్న గుంపు మరెటు వైపుకో జారిపోవుచున్నది; దాని నుండి మళ్ళించుటకు ప్రభువు నాకు సహాయము చేసెను.కావున, అది చాలా అద్భుతము. ఈలాగు సంగతులు జరుగుచుండును, మీకు ఆత్మీయ నేత్రము లేనియెడల దానిని మీరు గ్రహించలేరు. ఆ సంగతుల వైపు మీరు దృష్టి నిలుపవలెను.
11.నేను లోనికి వచ్చుచుండగా, సహో అంగ్రెన్ పాడుచుండెను, అతడు పాడుటను నేను వినుట ఇది రెండవ సారి. నేను గదిలోనికి నడిచి వచ్చుచుండగా, అతడిట్లు పాడుచుండెను, “రాజుతో నేను నడతును, మాట్లాడుదును.” అది చక్కగా ఉన్నది, అని అనుకున్నాను. రాజుతో నడచుట మరియు మాట్లాడుట, అనగా, నిరంతర సహవాసము. సంఘములో మాత్రమే కాదు గాని, ప్రతి చోట రాజుతో నడువలెను మరియు మాట్లాడవలెను.“
12.మరియు అక్కడ — ఆ గోడ మీద చూడండి మరియు ఒక చిన్న కార్డు అంటించబడియున్నది, అది చిన్న దృశ్యము, ఒక విధమగు చిత్రము. జార్జి టాడ్ అనునతడు నా కొరకు దానిని గీసెను. అతడెందుకు దానిని వేసెనో నాకు తెలియదు, బహుశా అతడు కూడా ఆలోచించి యుండడు; దానిని చిత్రించెను, ఒక పర్వతము, దాని వెనుక ఒక అరణ్యము ఉన్నది, ఒక సెలయేరు ప్రవహించుచున్నది, ఆ సెలయేటికి ఆవల ఒక దుప్పి మరియు లేడి నిలబడియున్నవి; వాటి చెవులు చాచబడియున్నవి, సెలయేటి వైపు చూచుచున్నవి. టాడ్ ఇచ్చటున్నాడో లేదో నాకు తెలియదు, అతనిని నేనెరుగను. కాని సంగతి చెప్పగోరుచున్నాను, ఆ చిత్రము వైపు చూచినప్పుడు ప్రభువు నాతో మాట్లాడెను; దానిని అతడెందుకు చిత్రించెనో అతనికే తెలియక పోవచ్చును.ఒకతను వేటాడబోయిన లేడిని గూర్చి నేను చెప్పిన కథ నాకు మీకు తెలియును. అదే అక్కడున్నది, అది జీవజలము, చూడండి. ప్రేరణ, ఆ రెండునూ ఆవలి యొడ్డున ఉన్నవి — అక్కడ పచ్చని చెట్లు ప్రక్కన, ఒక తల్లి, బిడ్డ కొరకు ఆవలిదరిని ఎదురు చూచుచున్నారు.సోదరుడా, వందనములు, సహో జార్జి టాడ్, ఈ ఉదయము అతడు ఇక్కడ ఉన్నట్లయితే.
13.ఆదివారపు బడిపాఠములోనికి వెళ్ళుదును, మామూలుగా ఎక్కువసేపు చెప్పెదను. నా హృదయములో అది కదలుచున్నది, నేను దానిని ఎరుగను, నిన్నటి నుండి ఈ అంశమును ప్రభువు నాకిచ్చెను. నేను ముసలి వాడనగుచున్నాను, మరియు ఇంకెంత కాలము ఇచ్చటుందునో నేనెరుగను.కాని సంఘములో పెద్ద ప్రశ్నయున్నది, అది మనుష్యులలు బెధములు మరియు భిన్నాభిప్రాయములను ఏర్పరచినది. యాపిలు తినిరని చెప్పినట్లేయున్నది, మరియు నేను వర్తమానము బోధించాను; అది యాపిలు కాదని లేఖనముల ద్వారా నేను గట్టిగా నిరూపించగలను, చూచారా — ఇందువలన ఎంతో గందరగోళము ఏర్పడినది.
14.దాదాపు నెలరోజులలో మేము తిరిగి ఆరిజోనాకు వెళ్ళిపోవలెను. ప్రభుని చిత్తమయితే, వెళ్ళుటకు ముందు ఈ లేఖనమును తీసికొనవలెనని కోరుచున్నాను, దీనిని టేపు చేయరాదు. ఒక వేళ చేసినా, దానిని అమ్మరాదు — దానిని బయటకు పంపరాదు. వివాహము మరియు పరిత్యాగము యొక్క నిజమైన సత్యమును వివరించెదను. అది ఒక ప్రశ్న, ఇవి చివరి ఘడియలు, దేవుని యొక్క మర్మములన్నియూ సమాప్తములగును.నిన్న నేను పగటివేళ కొండలను దాటుకొంటూ వచ్చుచున్నాను, అప్పుడు పరిశుద్ధాత్మ నాతో ఇట్లు చెప్పినది, “దానిని టేపు చేసి దానిని అలా ఉండనిమ్ము.”ఎందుకో నాకు తెలియదు; కాని వివాహము మరియు పరిత్యాగము యొక్క నిజ సత్యము ఒకటున్నది — తాము వ్యభిచారములో యున్నామని ప్రమాణము చేసి చెప్పిన వారు పెండ్లి చేసికొనవచ్చునని కొందరు చెప్పుచున్నారు. ఒకరినొకరు విమర్శించుకొంటూ కలిసి జీవించలేనప్పుడు, మరల పెండ్లి చేసికొనవచ్చునని ఇంకొందరు చెప్పుచున్నారు. భూమి మీద సమాధానము కలిగి జీవించుట మేలు గాని, భూమి మీద నరకము సృష్టించుట మంచిది కాదని మరి కొందరు చెప్పుచున్నారు. ఇవ్వన్నియూ వేర్వేరు ప్రశ్నలు. కొందరు పాత ఒరవడిలో పెండ్లి చేసికొనుచున్నారు. మరి కొందరు పరిశుద్ధ జలమును వారి మీద చల్లుచున్నారు, వారసలు ఎన్నడూ పెండ్లి చేసికోలేదని చెప్పుచున్నారు, వారిని దీవించి మరల సంఘమునకే అప్పగించుదురు. ఇవన్నీ గందర గోళములు. అసలు ఈ గందరగోళమున్నది, కావున సత్యము ఎక్కడో తప్పకయున్నది.నేను నమ్మి దీనిని వినయముతో చెప్పుచున్నాను: ప్రభువు దీనిని నాకు బయలుపరచెనని నమ్ముచున్నాను, మరియు ఇది సత్యము ఇది సంఘముల మధ్యకు వెళ్ళును, చాలా గలిబిలిని సృష్టించును, మరియు అది చీల్చివేయును, అది అలా చేయవలసియున్నది. సంఘ కాపరులు మాత్రమే టేపును తీసికొనవలెనని కోరుచున్నాను, వారు దానిని విని ముందుకు నడిపించబడవలెను. కాని దాని యొక్క అసలు సత్యమును చూపించగోరి టేపు చేయమనుచున్నాను.ఈ మర్మములన్నియూ సంపూర్తిగా తెలియబడవలసిన ఘడియ ఇదేనని, నేను నమ్ముచున్నాను. అన్ని కాలములలోను వీటిని గూర్చి జనులు ఆలోచించిరి. ఏడు ముద్రలను గూర్చి ఏడు సంఘకాలముల గూర్చి ప్రసంగము చేసి తయారు చేసినాము.
15.ఏడు బూరలు మరియు ఏడు పాత్రలు గూర్చి తెలిసికొనవలసిన సమయము వచ్చియున్నది. మనము రెండు వారములు కూటములు ఏర్పరచి ఆ రెంటిని ఒకదగ్గర పెట్టుదము.దానిని టేపు చేయవలెనని కోరుచున్నాను, అంతే కాకుండా, దానిని సరిగా చదివి, తప్పులు సరి చేసి పుస్తక రూపములోనికి తేవలెనని కోరుచున్నాను. ఏడు సంఘకాలముల యొక్క పుస్తకము, ఏడు టేపులను, సాధ్యమయినంత చౌకగా దానిని మనము చేయవలెను, కావున అందరికీ అవి లభ్యము కావలెను.ప్రభుని రాకడ ఆలస్యమయినయెడల, నేను ముందుకు సాగిపోయెదను. ప్రభువు నామము పేరట నేను జరుగునని చెప్పిన సంగతులు జరుగును. ఎన్నడూ తప్పిపోలేదు, మరియు అందులో కొన్ని తరువాత నెరవేరును.
16.ప్రభువు దానిని వెంటనే నెరవేరునట్లు చేయునని నమ్ముచున్నాను. సమయము జనులకు తెలియపరచెదము, ఎందుకనగా చాలా మంది వచ్చి ఆ సంగతులు వినగోరుచున్నారు, మరియు నేను దానిని మెచ్చుకొనుచున్నాను.
17.ఎవరూ నమ్మనియెడల, ఎవరూ విననియెడల, నేను ఇచ్చట నిలబడి చెప్పుట వలన ఏమి ప్రయోజనము? చూడండి. నేను నీళ్ళ మీద ఆహారము వేసిన వాని వలె యుందును, ఎవరూ దానిని నమ్మనియెడల పందుల ముందు ముత్యములు వేసినట్లే అది యుండును. కాని వేలాదిమంది విశ్వసించుచున్నారు, ప్రతి మాటను వారు పట్టుకొనుచున్నారు, సాధ్యమైనంతవరకు అనేకులు వినునట్లు ఏర్పాట్లు చేయుదము. ప్రభువు యొక్క మహిమార్థము ఈ ఆరాధనలను మనము సిద్ధపరచుదము. దేవుడు దానిని మనకనుగ్రహించునని నమ్ముదము. దైవావేశముతో నిండు వరకు నేను దానిని ఆరంభించనని మీతో చెప్పుచున్నాను.మీ యొద్ద ప్రతిదానికిని సమయము కలదు, చూడండి దానిని మీరు దాటిపోరాదు. మీరు పండక ముందే పంటను కోయరు — పక్వము కాకముందే మీరు గోధుమలను కోసినయెడల మీరెంతో నష్టపోయెదరు, చూడండి. కావున సిద్ధమయినప్పుడే కొడవలిని వేయవలెను, దేవుడు అంతే చేయును. కోతకాలము రానైయున్నది.
18.నాకు చెప్పవలెనను ఒత్తిడి ఎక్కువయినప్పుడు కొద్దిసేపు ఆగి దానిని విదిలించుకొందును. నిన్న మొత్తం అది నా మనస్సులో యుండినది, గత రాత్రంతా అది నా మనసులో నుండి తొలగిపోలేదు. దాదాపు 12 గంటలకు నేను పరుంటిని, ఆ ముందు రాత్రి కూడా మూడుగంటలే నేను నిద్రపోయాను. నాకు నిద్ర రాలేదు, “వివాహము మరియు పరిత్యాగము టేపు చేయము,” అని ఎదో చెప్పెను, చూడండి.ప్రభుని చిత్తమయితే, దానిని గూర్చి మరెక్కువగా ఆయన నాకు చూపించును. అది నా హృదయములో నుండి తొలగదు. దానిని నేను టేపు చేయవచ్చును.కాని గుర్తుంచుకొనండి, ఇది కేవలము సేవకులకు మాత్రమే. మీరు వచ్చి వినండి, జనులలోనికి వెళ్ళును. ఒక్కొక్కరు ఒక్కొక్క విధముగా తలంచుచుందురు, వారి స్వంత అభిప్రాయమును వ్యక్తము చేయుదురు. సేవక సోదరులు తమ అధ్యయనములో దీనిని చూడవలెను, మరియు ఆ తరువాతనే వారు బోధించవలెను, ఎందుకనగా దానికి వారే బాధ్యులు — వారే బాధ్యులు.వెళ్లి న్యాయమూర్తి యెదుట టేపు విన్పించుటకు ఇష్టపడుదును — కొందరు పెద్దవారు.
19.వివాహము మరియు పరిత్యాగము గూర్చి ప్రభువు ఏమి చెప్పెనో వినవలెను. ప్రజలు తలంచిన దాని కంటె అది ఎక్కువ పవిత్రముగా యున్నది. అది సర్ప సంతానమునకు అన్వయమగును. అది ఎప్పటికిని ఒకే విధంగాయున్నది, ముందుకు సాగుచున్నవి; అవి మర్మములు.గుర్తుంచుకొనండి, ఏడవ దూత పలుకు దినములలో దేవుని యొక్క మర్మములన్నియూ పూర్తియగును — ఆ తెలియని సంగతులను ప్రభువు బయలుపరచును.ఇప్పుడు, ఇప్పటివరకు…
20.ఇప్పుడు, గుర్తుంచుకొనండి..... ఏడున్నరకు మీరు ప్రారంభించిరి గదా? ఇప్పుడు, నెవిల్ సోదరుడా, ఈ రాత్రి నీకు వర్తమానమున్నచో, బోధించుము, చూచారా. నాకు దాదాపు గంట లేదా నలుబది-ఐదు నిమిషములు చాలును, మిగిలిన దానిని నేను టేపు చేయుదును. సహో నెవిల్ వర్తమానమును వినగోరుచున్నాను. నేను ఆయనను ప్రేమించుచున్నాను. అతడు నా సోదరుడు, మరియు అద్భుతమగు ప్రసంగీకుడు అని అనుకుంటున్నాను — సాటిలేని సేవకుడు. సహో నెవిల్ విషయములో నాకు నచ్చినది ఒకటున్నది, అతడు తాను చెప్పిన దాని ప్రకారము గానే జీవించును. అది ముఖ్యమైన విషయము . నీ జీవిత విధానము ఒకనిని ఎంతో ప్రభావితము చేయును, నీ ప్రసంగము కంటె ఎక్కువగా అది పని చేయును. “మీరు వ్రాయబడిన పత్రికలైయుండి, మనుష్యులందరి చేత చదువబడుచున్నారు.”ఇప్పుడు, ముందుగా
21.మనము పేజీలను త్రిప్పక ముందు ఆయనను అడుగుదము, ఈ ఆదివారపుబడి పాఠమును దేవుడే ప్రారంభించవలసి యున్నాడు. కాబట్టి, ఆయననే ఆ పని చేయుమని అడుగుదము.పరలోకపు తండ్రీ, విశ్వాసము ద్వారా మేము భవిష్యత్ వైపు చూచుచున్నాము, ప్రభువా, భూమి మీదికి రానైయున్న ఒక దాని కొరకు ఇప్పుడు నేను విశ్వాసముతో ఎదురు చూచుచున్నాను. అది నీ జనులనందరినీ ఒక చోటకు చేర్చును.శాఖలకు చెందిన సంఘములు వివాదపడి వేరయిపోవుటను మేము చూచుచున్నాము, కావున ఎంతో అణచివేయుచున్నది మరియు వ్యత్యాసముగా తయారగుచున్నది, అది నిజంగానే జనులను బయటకు త్రోసివేయుచున్నది.ఐగుప్తులో యున్నట్లుగానే యున్నది, యోసేపును ఎరుగని ఒక ఫరో వచ్చెను; జర్మనీ, రష్యా, ఇటలీలలో ఆలాగేయున్నది. యూదులను ద్వేషించిన జోసెఫ్ హిట్లర్, స్టాలిన్, ముస్సోలినీలను జనులు వెంబడించిరి. వారు తమ స్వదేశమునకు పోవలసివచ్చెను.దేవా, నీకు నీ స్వంత మార్గములున్నవి, మా కర్థము కాదు, మరియు వారిని నీవు అణచితివి — జర్మనీ వారి గృహము కాదు, వారి యొద్ద నుండి సమస్తమూ తీసికొని పోబడెను; ఇటలీ, రష్యాలలో కూడా అదే జరిగెను వెళ్ళుటకు చోటు లేదు, వారు తమ స్వదేశమునకు తిరిగి వచ్చిరి, కేవలము వాక్యము నెరవేర్చుటకు అది జరిగెను.దేవుని యొక్క ప్రేమ హస్తము అది. కొన్నిసార్లు అది క్రూరముగా కనబడును, ప్రజలు శ్రమపడు విధానము, కాని ఆయన తన చిన్న పిల్లలను నడిపించు, యెహోవా యొక్క మృదువైన హస్తము. ప్రభువా, నీకు వందనములు చెల్లించుచున్నాము.
22.ఇప్పుడు శాఖ అనునది విశ్వాసులను అణచివేయుచున్న దినమును నేను చూచుచూ, దేవా, నీకు ప్రార్థించుచున్నాను, వారిని బహిష్కరించుచున్నారు, వారి పేర్లు తప్పకుండా వారి పుస్తకములలోనే యుండవలెనని ఆంక్షలు విధించుచున్నారు; లేనియెడల నశించినట్లేననుచున్నారు, ఇతర గుంపులతో సంబంధము లేదని చెప్పుచున్నారు. అది కేవలము యెహోవా యొక్క మృదువైన హస్తము, వారిని జీవ వృక్షము యొద్దకు నడిపించుచున్నది.ప్రతి ఒక్కరి కొరకు దేవా నేను ప్రార్థించుచున్నాను — వారు ఆలాగు చేయుదురు, ఎందుకనగా అది నీ వాక్యము, మరియు అది తప్పిపోదు. మేము జీవవృక్షము యొద్దకు నడిపించబడుదుము గాక! నిత్యజీవమును మేము స్వతంత్రించు కొందుము గాక! దేవుని హస్తమును చూచుచున్నాము. విశ్వాస నేత్రములతో ఈ నీడలకు ఆవలగా చూడగలుచున్నాము. ఈ రోజు మేము నడచుచున్నాము. మా ముందు వాగ్ధాన దేశముండుటను చూచుచున్నాము.ప్రభువా, ఈ ఉదయమున నీ వాక్యమును దీవించుము, ఇక్కడ నేను కొద్దిపాటి లేఖనములు, వ్యాఖ్యలు వ్రాసియుంచాను. ఇప్పుడు పరిశుద్ధాత్మ వచ్చును గాక! నన్నునేను నీకు అప్పగించుకొనుచున్నాను, నా నాలుకను, ఆలోచనను, మనస్సును, సున్నతి చేయుము. సంఘమయితే తన చెవులను, తన అవగాహనను, తన హృదయమును సమర్పించుకొనుచున్నది, అందరమూ నీకు లోబడుచున్నాము, నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడుము. ఎందుకనగా నీ వాక్యమే సత్యము, వాక్యమై యున్న యేసుక్రీస్తు నామములో దీనిని మేము అడుగుచున్నాము. ఆమేన్.
23.ఇప్పుడు మీరు మీ బైబిలులను తీయండి నిర్గమకాండము. నిర్గమకాండములోని ఒక వాక్య భాగమును నేను చదువగోరుచున్నాను. 3వ అధ్యాయము 1 నుండి 12 వరకు, మేము చదువుచుండగా జాగ్రత్తగా వినవలెను. నిర్గమ కాండము 3వ అధ్యాయము 1:12.మోషే మిద్యాను యాజకుడైన యిత్రో అను తన మామ మందను మేపుచు ఆ మందను అరణ్యము అవతలకు తోలుకొని దేవుని పర్వతమైన హోరేబునకు వచ్చెను.ఒక పొద నడిమిని అగ్నిజ్వాలలో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమాయెను. అతడు చూచినప్పుడు అగ్ని వలన ఆ పొద మండుచుండెను గాని పొద కాలిపోలేదు.అప్పుడు మోషే ఆ పొద ఏల కాలిపోలేదో నేను ఆ తట్టు వెళ్ళి ఈ గొప్ప వింతను చూచెదననుకొనెను.దాని చూచుటకు అతడు ఆ తట్టు వచ్చుట యెహోవా చూచి,[దీనిని నేను నొక్కి చెప్పదలిచాను] దాని చూచుటకు అతడు ఆ తట్టు వచ్చుట యెహోవా చూచి, దేవుడు ఆ పొద నడుమనుండి మోషే, మోషే అని అతని పిలచెను. అందుకతడు చిత్తము ప్రభువా అనెను.అందుకాయన దగ్గరకు రావద్దు: నీ పాదముల నుండి నీ చెప్పులు విడువుము, నీవు నిలచి యున్న స్థలము పరిశుద్ధ ప్రదేశము అనెను,మరియు ఆయన నేను నీ తండ్రి దేవుడను, అబ్రాహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను అని చెప్పగా, మోషే తన ముఖము కప్పుకొనెను; దేవుని వైపు చూడ వెరచెను.మరియు యెహోవా ఇట్లనెను, నేను ఐగుప్తులో నున్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచితిని. పనులలో తమను కష్టపెట్టు వారిని బట్టి వారు పెట్టిన మొరను వింటిని. వారి దుఃఖములు నాకు తెలిసే యున్నవి.కాబట్టి ఐగుప్తీయుల చేతిలో నుండి వారిని విడిపించుటకును ఆ దేశములో నుండి విశాలమైన మంచి దేశమునకు అనగా కనానీయులకు, హిత్తీయులకు, అమోరీయులకు, పెరెజ్జీయులకు, హివ్వీయులకు, యెబూసీయులకు నివాస స్థానమై పాలు తేనెలు ప్రవహించు దేశమునకు వారిని నడిపించుటకును దిగి వచ్చి యున్నాను.ఇశ్రాయేలీయుల మొర నిజముగా నాయొద్దకు చేరియున్నది. ఐగుప్తీయులు వారిని పెట్టుచున్న హింస చూచితిని.కాగా రమ్ము! నిన్ను ఫరో యొద్దకు పంపెదను…
24.మీరు గమనించారా? “నేను దిగి వచ్చియున్నాను, కాని నిన్ను పంపెదను.” ఈ 10 వచనము మరల చదివెదను. దేవుడు మానవ రూపములో వెళ్ళుచున్నాడు.కాగా రమ్ము! నిన్ను ఫరో యొద్దకు పంపెదను. ఇశ్రాయేలీయులైన, నా ప్రజలను నీవు ఐగుప్తులో నుండి తోడుకొని పోవలెననెను.అందుకు మోషే నేను ఫరోయొద్దకు వెళ్ళుటకును, ఇశ్రాయేలీయులను ఐగుప్తులో నుండి తొడ్కొని పోవుటకును ఎంతటి వాడినని దేవునితో అనగా.ఆయన నిశ్చయముగా నేను నీకు తోడై యుండెదను. నేను నిన్ను పంపితిననుటకు ఇది నీకు సూచన. నీవు ఆ ప్రజలను ఐగుప్తులో నుండి తోడుకొని వచ్చిన తరువాత మీరు ఈ పర్వతము మీద దేవుని సేవించెదరనెను.దానిని ముందు గమనించలేదు, కాని ఈ ఉదయమున ఎంతో ఆత్మవశుడనయితిని, దానిని అప్పుడే నేను పట్టుకొని యున్నాను. దేవుడు తన దాసుని మరల పంపించుచున్నాడు, అతడు ముందు పారిపోయెను. పర్వతమును ఒక గురుతుగా ఆయన అతనికి ఇచ్చెను. అప్పటి వరకు దానినతడు గమనించలేదు. ఇది నీకు నిత్య సూచనగా యుండును. చూడండి.
25.ఈ ఉదయ కాలమున మనము మాట్లాడుకొననై యున్న అంశము అదే, “దేవుని ప్రజల యొక్క రెండవ నిర్గమము” లేదా “దేవుడు తన జనులను బయటకు పిలచుచున్నాడు.” “నిర్గమము,” అనగా, తీసికొని వచ్చుట, బయటకు పిలువబడుట, తీసికొని రాబడుట. నేను ఈ అంశమునే తీసికొనగోరుచున్నాను. “దేవుడు తన ప్రజలను రెండవ సారి తీసికొని వచ్చుట.”
26.ఇప్పుడు వారు చాలా నిర్గమములను చూచారు, కాని ఇప్పుడు నేను దేవుడు చెప్పిన నిర్గమము గూర్చి మాట్లాడుచున్నాను. వారున్న ప్రస్తుత పరిస్థితిలో నుండి వేరు చేసెను.దేవుడు అబ్రాహాము,ఇస్సాకు, యాకోబులకు వాగ్ధానము చేసెను. తన దైవ వాగ్ధానమును నెరవేర్చుటకు దేవుడు వారిని సిద్ధపరచుచున్నాడు. వందల సంవత్సరములు గడిచిపోయినవి, అయినా దేవుడెన్నడూ తన వాగ్ధానమును మరచిపోడు. తగిన కాలములో, నిర్ణయ సమయములో దేవుడు తన వాగ్ధానమును నెరవేర్చును. కావున దేవుడు బైబిలులో చెప్పిన వాగ్ధానముల మీద నీవు నిశ్చయముగా ఆనుకొనవచ్చును. దానిని ఆయన నెరవేర్చును. మరే విధముగాను ఆలోచించనవసరము లేదు. ఆ ప్రవక్త చెప్పినది తప్పు కావచ్చు గనుక అది ఈనాడు జరుగదేమో అనుకోవద్దు.అప్పుడది దాదాపు అసాధ్యముగా కనిపించెను. ఇప్పటికన్న ఎంతో ఎక్కువ అసాధ్యముగా కనబడెను, కాని దేవుడు దానిని చేసెను, ఎందుకనగా దానిని చేయుదునని దేవుడు వాగ్ధానము చేసెను. దానిని ఎంత తేలికగా ఆయన చేసెనో చూడండి. “నేను దిగివచ్చి యున్నాను; జనుల మొరను వినియున్నాను; నా వాగ్ధానమును మరచిపోలేదు, దానిని చేయుటకు నేను దిగి వచ్చి యున్నాను, నిన్ను అందుకు పంపించుచున్నాను. నీవు చేయుము, నీకు తోడై యుందును; ఖచ్చితముగా నేను నీతోనుందును. ఎన్నడూ తప్పిపోని నా సన్నిధి నీవు వెళ్ళు ప్రతి చోటికిని తోడుగా వచ్చును. భయపడవద్దు. నేను విడిపించుటకు దిగివచ్చి యున్నాను. నా ప్రజలను బయటకు తీసికొని వచ్చుటకు నిన్ను నేను పంపించుచున్నాను. వారిని బయటకు పిలువుము. నీకు నేను తోడై యుందును.” ఆత్మ సంబంధమగు మనస్సు తప్పకుండా దానిని గ్రహించగలదు.
27.ఇప్పుడు, మనమెంతో విశ్రాంతిగా యుండగలము, ఆ నిరీక్షణ వలన మనమెంతో విశ్వాసమును పుంజుకొనగలము. దేవుడు దానిని చేయనై యున్నాడు; దానిని ఆయన వాగ్ధానము చేసెను. ఏలాగు జరుగునో నీకు అక్కర లేదు, పరిస్థితులను చూడవద్దు, ఎవరి మాటలు వినవద్దు, ఏలాగయినా గాని దేవుడు దానిని చేయును, ఎందుకనగా దానిని ఆయన వాగ్ధానము చేసెను. చాలా సుళువుగా దానిని ఆయన చేయును, తెలివిగల మనస్సునకు అది అందకుండా పోవును, దానిని గూర్చి ఎవరునూ కారణమును చెప్పజాలరు. “అదెట్లు జరుగును?” మంచి బలమగు మనస్సుగల వ్యక్తి, ఎక్కువ విద్య గలవ్యక్తి, దానిని అర్థము చేసికొనడని నేను చెప్పుట లేదు. దానినతడు వాడుకొనినంత వరకు అది మంచిదే, కారణమును వెదకరాదు, అయితే అతడు దేవునియందు విశ్వాసముంచవలెను.దేవుడు చెప్పిన దానిని సూక్ష్మ బుద్ధితో అతడు గ్రహించవలెను, దానిని కేవలము నమ్మవలెను. అప్పుడతని తెలివితేటలు అతనికి సహాయము చేయును.గమనించండి, అది జరుగదని ఒక వ్యక్తి ఎంతో వాదించవచ్చును, అందువలన అతడు దేవుని నుండి ఎంతో దూరమగును, నిరంతరము ఆలాగే జరుగును. అతడు స్వంతగా అర్థము చేసికొనుటకు ప్రయత్నించును, చూచారా. బైబిలు చెప్పుచున్న ఒక సంగతిని నీవు అర్థము చేసికొనలేనియెడల దానికి, “ఆమేన్;” అని చెప్పి దానిని అలా ముందుకు సాగనిమ్ము.
28.ఇప్పుడు, ఇచ్చట చాలా లేఖనములున్నవి, వాటి నన్నింటినీ చదువుటకు బదులుగా వాటిని వ్రాసికొనుట మంచిది. వాటిని మీరు చూడగోరుదురు, ఇక్కడ నా యొద్ద చాలా యున్నవి.ఈ నిర్గమము యొక్క భావమును మనము చూచుటకు ముందు, ఆ నిర్గమమును నేటితో పోల్చి చూపగోరుచున్నాను. గమనించండి, అప్పటిది, ఇప్పటిది సమానాంతరముగా యున్నవి. అందులో ఒకటి ప్రకృతి సంబంధమైనది, సహజ సిద్ధముగా ఆయన దానినే చేసెను. దానికి మరల ఇది పోలికగా యున్నది. (ఆత్మ సంబంధమగు మాదిరి) ఆత్మ సంబంధమగు నిర్గమము.
29.దేవుని వాక్యమును చూచుట అద్భుతము — అది దైవావేశము కానిదని ఎవరు చెప్పగలరు? ఇది దాదాపు 2800 సంవత్సరముల నాటిది. దానిని ఆయన వాగ్ధానము చేసి ఆ ప్రకారముగా చేసెను, దానిని ఆయన మాదిరిగా యుంచెను. నిజస్వరూపము గురించి చెప్పుటకు ఆయన ఎలా ఎదో ఒకదానిని ఛాయాగా చేయును. (ఈ రాత్రికి నేను దానిని గూర్చి, ప్రభుని చిత్తమయితే సూర్య, చంద్రుల గూర్చి చెప్పెదను.కాని మొదటగా మనము ఆదికాండమును సమీక్షించవలెను, వారెందుకు ఐగుప్తులోనికి వెళ్ళిరి? దేవుని ప్రజలు ఆ దేశములో ఎందుకున్నారు? వారక్కడ యుందురని దేవుడు ఆదియందే అబ్రాహాము, ఇస్సాకు, యాకోబులకు వాగ్ధానము చేసెను. దేవుడు పాలస్తీనాను వారికిచ్చెను. “ఇది అదే,” అని చెప్పెను.మంచిది, దేవుడేర్పరచి యుంచిన స్థలములో ఆ జనులు ఎందుకు ఉండలేదు? నేటికి కూడా అదే ప్రశ్నగాయున్నది. దేవుడు మనకు ఒక పెంతెకోస్తును ఇచ్చెను. ఆయన మనకు ఒక అపోస్తలుల కార్యముల గ్రంథమును ఇచ్చెను. మనలను నడిపించుటకును, మార్గము చూపించుటకును ఆయన మనకు పరిశుద్ధాత్మను అనుగ్రహించెను. ఆయన మనకు ఒక దేశమును ఇచ్చెను, దానికి బయట మనం ఎందుకున్నాము? సంఘము దానికి బయట ఉన్నదేమి? ఈనాటి గొప్ప క్రైస్తవ సంఘము మరల అపోస్తలుల కార్యముల గ్రంథములోని సంఘము వలె ఎందుకు జీవించుటలేదు? అవే కార్యములు ఎందుకు జరుగుట లేదు? దానికి ఏదో కారణమున్నది.
30.మనం చెల్లాచెదురయినామని మనందరికిని తెలియును, మనం భయంకరమగు స్థితిలో యున్నాము; ఇంతకంటె ఘోరమయిన స్థితిలో క్రైస్తవ్యము ముందెన్నడూ ఉండి యుండలేదు. గొప్ప భయంకరమగు తీర్పు యొక్క అంచున మనం నేడు నిలబడియున్నాము, అది సంఘమునకు కాచుకొనియున్నది. ఈ తీర్పు రాక ముందే దేవుడు తన సంఘమును అప్పటి వలెనె బయటకు పిలచును, మరియొక నిర్గమము రానైయున్నది.అమోరీయుల పాపము పండి పోయినది. ఆయన ఒక ఆత్మీయ నిర్గమమునకు పిలచుచున్నాడు. ఇప్పుడు, ఒక్క నిమిషము ఆ మాదిరిని మనం చూచి కనుగొందము.ఒక సోదరుని యొక్క అసూయ మూలంగానే వారందరూ ఐగుప్తులోనికి వెళ్ళిరి. ఆ సమయములో ఇశ్రాయేలీయులు ఐగుప్తులో యుండుటకు అదే కారణము, దేశముకాని దేశము నందుండిరి. గుర్తుంచుకొనండి, వారు దేశములో నిలచి యున్నంత వరకే వారి పట్ల దేవుని వాగ్ధానముండును.
31.ఇప్పుడు, కొద్ది నిమిషముల క్రితం మనం ప్రార్థనలో ఏమి చెప్పామో మీరు గుర్తుంచుకొనియున్నారా? ఫరో యొక్క హృదయమును దేవుడెందుకు కఠినము చేసెను. ఆ జనులను తిరిగి వాగ్ధాన దేశములో యుంచుటకే అప్పుడాయన వారిని దీవించగలడు, వారి యొద్దకు మెస్సీయాను పంపించగలడు.యూదులకు విరోధముగా హిట్లరును ఆయన లేపి అతని హృదయమును కఠినము చేసెను. అతడు సగం యూదుడే? స్టాలిన్, ముస్సోలినీలను ఆ విధంగానే ఆయన చేసెను.చూడండి, జనులకు దైవావేశము లేదు, వారు జీవించుచున్న కాలములోని సాధనములను దేవుడు తీసికొనును. దేశము యొక్క చట్టములు చాలాసార్లు ఆయన వాగ్ధానములు నెరవేరుటకు ఉపయోగపడును.యూదులను మరల వాగ్ధాన దేశమునకు పంపునట్లుగా దేవుడు వారి హృదయములను కఠినపరచి వారిని నియంతలనుగా చేసెను. అది ఆ విధముగానే జరుగవలసి యుండెను.
32.ఇప్పుడు, ముందుకు వెళ్ళి దానిని మనం కనుగొందుము, ఆదికాండములోని ఆ గాధను మనం ఎరుగుదుము, దానిని మీరు చదువవచ్చును, ఎందుకనగా మనం ఆలస్యంగా ప్రారంభించాము. ఈ ఆదివారపు బడి పాఠము చాలా దీర్ఘమైనది, నేను త్వరగా ప్రయత్నించెదను.గమనించండి, మీకు వీలయినప్పుడు యోసేపు గాధను చదవండి, కడసారి వానిగా లేదా చివరి వానికి ముందు వానిగా అతడు జన్మించెను. ఆత్మ సంబంధమగు మనస్సు దానిని గ్రహించును. అతడు చివరి వాడు కాడు, బెన్యామీను చివరి వాడు; కాని ఈ బహిష్కరణను గమనించండి, యోసేపు మరియు బెన్యామీనులు రక్తము పంచుకొని పుట్టిన వారు, వారిద్దరు మాత్రమే సోదరులు.యోసేపును కలిసికొను వరకు బెన్యామీనుకు గుర్తింపే లేదు. మిగిలిన వారందరి కంటె బెన్యామీనుకు రెండింతలుగా యోసేపు ప్రతి దానిని ఇచ్చెను.సరే, ఇప్పుడు గమనించండి, ముందుకు వెళ్ళి దానిని మనం చూచెదుము,
33.అతడు ఆత్మసంబంధి గనుక తన సోదరుల నుండి అతడు వేరాయెను. అతడు గొప్ప మనిషి, అందరి కంటె దీనుడు, అందరిలోను చివరి వాడు, మరియు వారు కారణము లేకుండానే అతనిని ద్వేషించిరి. వారసలు అతనిని ద్వేషించవలసిన పని లేదు. వారతనిని గౌరవించవలెను. వారెందుకని ద్వేషించిరి? అతడు సోదరుడయినందునా? అది కానే కాదు. అందరి కంటె ఎక్కువగా దేవుడతనితో మాట్లాడుచున్నందున వారతనిని ద్వేషించిరి.ఆత్మసంబంధమగు అవగాహనను ఆయన అతనికి అనుగ్రహించెను. పరిపూర్ణముగా అతడు కలలను అనువదించగలడు, మరియుఖచ్చితంగా జరుగునైయున్న సంగతులను అతడు ముందుగానే చెప్పకలిగెను, ఆలాగే అవి జరిగి యుండెను — ఏమీ అతడు సర్దుబాట్లు చేయలేదు.వారి పనలన్నియూ అతని పనకు సాష్టాంగ నమస్కారము చేయుట వారు చూచి కోపించిరి. వారతనిని ఏదో హేళన చేసిరి, “ఒక దినమున మేము నీకు సాగిలపడుదుమని చెప్పెదవా?” అనిరి.కాని ఆ విధంగానే అది జరిగెను. ఎందుకూ పనికిరాని ఆ అనామకుని ముందు ఆ గొప్ప యోధులు సాష్టాంగపడిరి, వారు దయ చూపమని కాళ్ళ మీద పడిరి. ఇది ఖచ్చితంగా జరిగెను, కనికరించమని వేడుకొనిరి.అయితే అతడు అప్పటికి అధికారములోనికి రాలేదు, అప్పుడతడు పిల్లవానిగా యుండెను.
34.యోసేపు తన అన్నల మధ్య నుండి కొనిపోబడెను, శాఖలు అతనిని త్రోసివేసినవి — దేశములోని అతని సోదరులే అతనిని ద్వేషించిరి.అటువంటి గొప్ప సంఘటన జరిగి యుండినది. ఇశ్రాయేలీయులు తమ దేశములో నివసించినంతకాలము దీవెన యుండును. అది ఒక మంచి సంగతి, కాని వారు ఆత్మను ధిక్కరించిరి.ఈ దినమున మౌలిక వాదులను చూడండి. వారి యొక్క స్థానమును ఎరుగుదురు, ఎందుకనగా బైబిలు పరిజ్ఞానము ఉన్నది, కాని అక్కడ ఆత్మ లేదు. వారు యోసేపును తిరస్కరించిరి, అతనిని త్రోసివేసిరి. వారికేమి అతనితో సంబంధము లేదనిరి, వారిని పరిశుద్ధ బండలని హేళన చేసిరి. మాకేమీ పొత్తు అక్కర లేదనిరి, వారతనిని వెలివేసిరి, మరియు ప్రపంచమునకు అమ్మివేసిరి. వారు తమ సహవాసనమునకు వెలుపట యుండిరి.
35.ఇప్పుడు, ఆ విధముగా చేసి వారు స్థానమును విడిచిపెట్టిరి, ఆ తరువాత ఐగుప్తులోనికి వెళ్ళిరి. ఈ అసూయ సోదరుల యొక్క గాధను ఈనాటి ఆత్మసంబంధమగు పరిస్థితితో పోల్చి చూడవచ్చును, మనందరము దీనిని ఎరుగుదుము.అది కేవలము అసూయ, అసూయ, అసహ్యమైన అపవిత్ర గుణము, చూడండి. అసూయ యందు పవిత్రత లేదు, చూడండి అది అపవిత్ర అసూయ తప్ప మరేమీ కాదు.ఇదే బైబిలును వారు చూచుచున్నారు మరియు ఇదే బైబిలును వ్రాసిన దేవునిని చూచుచున్నారు, ఆయన స్వభావమును ఎరుగుదురు. ఆయన ప్రత్యక్షమగుచున్నాడు, దానిని వారు త్రోసివేయుచున్నారు, దానికి ఏ కారణము లేదు. అది అపవిత్రపు అసూయ. దేవుడు రోగులను స్వస్థపరచుటను, మృతులను లేపుటను వారు చూచుచున్నారు. అపోస్తలుల దినములలో జీవించిన దేవుడు ఆయనే. ఈ ఆత్మీయ ప్రయాణము కొరకే వారు ఈ సువార్తను వ్రాసిరి, ఆ దేవుడే ఈ క్రియలను చేయుచున్నాడు, కాని దీనిని అసూయ చేతనే త్రోసివేయుచున్నారు. మా ప్రజల మధ్యకు అటువంటి దానిని తీసికొని రావద్దని వారు చెప్పి త్రోసివేయుచున్నారు.
36.ఇటువంటి వాని వలన మనకు ఎన్నడూ ఉపయోగుండదని వారు అనగా సోదరులు తలంచిరి, అందుకే వారతనిని వదిలించుకొనగోరిరి. ఈ దినము కూడా అదే జరుగుచున్నది. వారాలాగు తలంచుటకు ఒక కారణమున్నది, వారి సంఘములు తెలివితేటలతో నిండిపోయినవి. చక్కని దుస్తులు ధరించిన మనుష్యులు వారికున్నారు. వారిది పెద్ద సంస్థ. వారి సేవకులు అతి చురుకైన వారు. ఆ వెనుకటి దినములలో యుండినట్లుగా ఈ దినములలో పరిశుద్దాత్మ యున్నచో, మనకేమీ ఉపయోగము లేదని వారు తలంచుచున్నారు.వారు నిండుగా యున్నారు, మరో విధంగా చెప్పాలంటే వారి క్రియలు వారి మాటల కంటె బిగ్గరగా వినబడుచున్నవి. వారి సెమినరీలు, వారి మేధా సంపత్తి, వారి కూడిక, వారి చర్చలు చూడండి; తమ యొక్క మేధా శక్తి ద్వారాను, చమత్కారము ద్వారాను సంఘమును చాలాక్రమములో యుంచగలము గాని పరిశుద్ధాత్మ ద్వారా కాదని వారనుకొనుచున్నారు; కావున అది వారికి ఇక అవసరము లేదు. నేడు మనకు అక్కర లేదని చెప్పుచున్నారు.అది గతించిన దినములకు చెందినదనుచున్నారు. అది నిజమే గదా? రోగులను బాగుచేయుటకు మనకు పరిశుద్ధాత్మ అక్కర లేదని చెప్పుచున్నారు, ఎందుకనగా వైద్యులున్నారు గదా. భాషలలో మాట్లాడుటకు మనకు పరిశుద్ధాత్మ అవసరము లేదనుచున్నారు. మనందరం తెలివిగల వారమనుచున్నారు, ఆలాగు నీవన్నప్పుడు నీ జీవిత లక్ష్యమే నాశనమైనదని నీవు గ్రహించవలసియున్నది.యేసు ఆ దినమున యూదులతో ఈలాగు చెప్పెను, “కట్టు వారందరూ నిషేధించిన రాయి మూలకు తలరాయి అయినదని మీరు చదువలేదా?”
37.నా భావమును మీరిప్పుడు గమనించండి, దానిని మీరు తప్పకుండా గ్రహించగలరని తలంచుచున్నాను. ఇదే కారణము, దాని యొక్క అవసరము ఎన్నడూ తమకు లేదనుకొనిరి. “భాషలు మాట్లాడు ఉపన్యాసకులు మాకు అక్కర లేదు. పరిశుద్ధాత్మ ద్వారా క్రమములో పెట్టిన పాత నిబంధన ప్రవక్తలు మాకు అవసరము లేదు. అంతా మేమెరుగుదుము.”చూడండి, వారు పరిశుద్ధాత్మకు బదులుగా మానవ-కల్పిత క్రమమును వెంబడించుచున్నారు. ఆ కారణము చేతనే ఏర్పరచబడిన వారి పేర్లు గొర్రెపిల్ల జీవగ్రంథములో యుండును; అట్టి వారు వీటి కొరకు ప్రాకులాడరు. వారు ఆత్మసంబంధులు గనుక అటువంటి మనస్సును కలిగియుండరు. దానిని వారు సహించలేరు. వారి తల్లిదండ్రులు ఏ సంస్థలో జీవించినా వారికి దానితో సంబంధము లేదు.
38.వారు ఆ మాటను బిగ్గరగా చెప్పక పోవచ్చును గాని, వారి క్రియలు దానిని రుజువు చేయుచున్నవి. వాక్యము ఇక్కడున్నది, జనుల మధ్య పరిశుద్ధాత్మ దానిని రుజువు చేయుచున్నది, వారినందరినీ అది ఏకము చేయగలదు, ఇంకా ఆయన రోగులను బాగు చేయుచున్నాడు, మరియు మృతులను బ్రదికించుచున్నాడు, క్రొత్త భాషలు ఇచ్చుచున్నాడు, దయ్యములను వెళ్ళగొట్టుచున్నాడు. కావున ఒక మనిషి యొక్క అంతరంగమందున్న దాని మీద ఇది ఆధారపడియున్నది.
39.కుమారి ఆర్గన్ బ్రయిట్ గూర్చి ఒక రోజున ఆలోచించుచున్నాను, గడ్డి పీకుచున్న ఆమెను ఒకనాడు నడచుచూ వెళ్ళి చూచాను — ఆమె గడ్డిని కోయుచున్నది. ఆమె ప్రక్క నుండి నేను వెళ్ళాను, ఆమెకు తెలియలేదు. ఆమెను నేను పనిచేసికోనిచ్చాను, ఏమీ కలుగ జేసికోలేదు, గమనించాను.ఇప్పుడు, పరిశుద్ధాత్మను, దాని యొక్క గొప్ప పనిని మీరు గమనించండి.
40.పరిశుద్ధాత్మ యొక్క అవసరము లేదని సంఘము భావించుచున్నది. నీకు సంఘములు ఆ విధంగానే చెప్పును. మేధావులు నిలబడి అట్టి ప్రసంగములనే చేయుచున్నారు. దాదాపుగా నీవది నమ్మునట్లు చేయుచున్నారు. ఒక్క నిమిషము దీనిని గూర్చి ఆలోచించుదము.సాధ్యమయితే ఏర్పరచబడిన వారిని సహితము మోసపుచ్చునంత దగ్గరగా అది యుండునని యేసు చెప్పలేదా? ఆ మేధావుల ప్రసంగములు చాలా మెత్తగా యుండి ప్రజలను మోసము చేయును. అది సువార్త కాదు, వారు తమ తెలివితేటల చేత వాక్యమును ఎంతో వంకర చేయుచూ పరిశుద్ధాత్మను కాదనుచున్నారు, మానవ మార్గమును చూపించుచున్నారు. దానిని మనం చూచుచున్నాము.
41.వారు యోసేపును గూర్చి కూడా అదే రీతిగా తలంచియున్నారు, మరియు వారతనిని ఏలాగయినా మరుగు చేయగోరిరి. వారిని గూర్చి చెప్పవలెనన్నచో నాకు కొన్ని గంటలు కావలెను. మూడు సంవత్సరములపాటు ఇక్కడ మీరు కూర్చొని పగలు, రాత్రి విన్నా గాని ఆ అంశమును ముగించలేము. పరిశుద్ధాత్మ యొక్క లోతయిన గొప్ప భావములు మనకు ఇంకా అందుచునే యుండును.
42.ఐగుప్తులో యున్నప్పటికిని ఆత్మ సంబంధమగు మనసు దానిని చూచి గ్రహించగలదు, అక్కడ హింస చెలరేగినది. ఆ హింస చెలరేగుటకే యోసేపు తీసికొని పోబడెను. దేవుని యొక్క చక్రములు బహు చక్కగా కదలుటను మీరు చూడండి. పోతీఫరు వచ్చి యోసేపును విసర్జించెను. అబద్ధము మూలముగా యోసేపును చెరసాలలో యుంచిరి, అతని గడ్డము పెరిగిపోయినది, అతని సోదరుల నుండి వెలివేయబడెను, కాని అకస్మాత్తుగా దేవుడు కదలనారంభించెను.
43.ఆ చక్రములు ఎంత చక్కగా కదిలి వచ్చుచున్నవో గమనించండి — దేవుని యొక్క గొప్ప పథకము కదిలి వచ్చుచున్నది. అంతా ఈ నిర్గమమునకు సిద్ధమయినది, దేవుడు తన ప్రజలను మరల స్వదేశమునకు పిలచుచున్నాడు, వారి స్థానములోనికి మరల వచ్చుచున్నారు. ఆయన అప్పుడే వారిని ఆశీర్వదించగలడు. తాను వాగ్ధానము చేసిన స్థలములో వారిని నిలిపి యుంచగలడు. వారు తమ దేశములో ఉండవలసి యున్నారు. గుర్తుంచుకొనండి, వారిప్పుడుండిన దేశములో నుండి బయటకు రావలసియున్నారు. వాగ్ధాన దేశములో అడుగు పెట్టవలెను, వారికి వాగ్ధానము చేయబడిన మెస్సీయా అప్పుడే వచ్చును.
44.సంఘము కూడా అదే చేయవలెను. విసర్జించుచున్న ఆ గుంపులో నుండి బయటకు రావలెను, వాగ్ధానములోనికి రావలెను, అప్పుడే వారియెదుట మెస్సీయా ప్రత్యక్షమగును. దానిని మీరు చూచారా?మెస్సీయా యొక్క ప్రత్యక్షపరచబడిన జీవితము సంఘమును సిద్ధపరచును, వధువును సంసిద్ధము చేయును. ఒక స్త్రీ తాను పెండ్లి చేసికొనిన పురుషునితో సమ్మతించనియెడల ఆ ఇల్లు నిరంతర పోరుతో యుండును. భార్యభర్తలు అనగా వివాహితులు చక్కని సమ్మతితో ఉండినప్పుడు, ఒకే ఆత్మ, ఒకే ప్రాణము కలిగియుండినప్పుడు, వారిద్దరును ఏక శరీరముగా యుందురు. సంఘము దేవునితో అటువంటి అంగీకారమును పొందియున్నప్పుడు, పెండ్లి కుమార్తెలో పెండ్లి కుమారుని యొక్క ప్రత్యక్షత కనబడును, ఎందుకనగా వారు ఒక్కటిగా యుందురు. ఓ! ఇది ఎంత గొప్ప పాఠము.సరే, ఇప్పుడు గుర్తుంచుకొనండి, ఆత్మ సంబంధమగు మనస్సు దీనిని గ్రహించగలదు, దాని మాదిరిని ఇక్కడ మీరు గమనించండి. దాని మీదకొన్ని గంటలు మనం చెప్పుకొనవచ్చును. ఏమీ జరుగునో గమనించండి.
45.ఇన్ని సంవత్సరములు, అనగా ఈ ఒయాసిస్సు వంటి కాలము నుండి ఎందుకు మనం కనిపెట్టి చూచుచున్నాము?మీకు తెలియును, సంఘము అరణ్యములోనికి పారిపోయినదని బైబిలు చెప్పుచున్నది. చాలా కాలము అక్కడే అది పెరిగినది. ఇదంతా ఎందుకు జరిగినది? చూడండి, అది దేవుని యొక్క చక్రము. ఎప్పుడో దేవుడు దీనిని ఎందుకు చేయలేదని మీరందురు. అప్పుడు మనుష్యులు పెన్సిలు పట్టుకొని కూర్చొనిరి — స్త్రీలు కూడా ఆ విధంగానే యున్నారు — న్యాయాధిపతి రూతరు ఫోర్డు తదితరులు ఆ విధంగానే చేయుటకు ప్రయత్నించిరి, పధ్నాలుగున యేసు వచ్చునని వారనిరి, మదర్ పిఫ్టన్ ఆ కాలములో అదే చేసెను — ఈ కాలములలో జరిగిన దానిని చూడండి. వారు లేఖనమును చూపించి ఏదేదో చేయుటకు ప్రయత్నించిరి, దానిని వారు ఆవిధంగా నాశనము చేసిరి.అది మరుగయినది, నిజంగానే అది దాగుకొనెను. యేసు చెప్పిన దానికి వ్యతిరేకముగా లేఖనము ఎట్లు నెరవేరును. ఆ నిమిషము గాని, ఆ ఘడియ గాని ఎవరికిని తెలియదు అని యేసు చెప్పెను. చూడండి, వారు ఒక్క వాక్యపు పీలికను పట్టుకొని ఏదేదో చెప్పగోరిరి.
46.అంతా మీరు తీసికొనవలెను. అందులో గాని దేవుడున్నట్లయితే దేవుడు దానిని సత్యమని బయలుపరచును. దైవికస్వస్థతను చూడండి, అది సత్యము కానియెడల ఆలాగని రుజువగును. దానితో దేవునికి ఏమీ సంబంధము లేదు, కాని దానిని సత్యముగా ఆయన బయలుపరచినప్పుడు అది సత్యమే.క్రీస్తు వలెనె,
47.దేవుడైన యేసు ఇట్లు చెప్పెను, “మీ మధ్య ప్రవక్త గాని, ఆత్మ సంబంధియగు వ్యక్తి గాని ఉన్నయెడల నేను అతనితో మాట్లాడుదును.” అంతే. అతని యొక్క ప్రవచనము తప్పు అయినయెడల అనగా అతడు జరుగునని చెప్పినది జరుగనియెడల అతని మాట వినవద్దు, కాని అందువలన దేవుడు మాట తప్పువాడవడు. ఆయన అనంతుడు, మాట తప్పని వాడు, సర్వశక్తి గలవాడు, ఆయన తప్పు చేయజాలడు. ఒక వ్యక్తి తన స్వంత మనస్సుతో ఏదయినా చెప్పినచో, అప్పుడది ఆ మనిషిని చూపించును — తన స్వంత మాటలు పలికినచో, అది తప్పిపోవును; అతడు దేవుని యొక్క మాటను పలికినయెడల, తప్పక అది నెరవేరును, అది విఫలము కాదు, ఎందుకనగా దేవుడు మాట్లాడెను. అతనికి దేవుని యొద్ద నుండి దైవావేశము వచ్చెను, అది సరిగా నుండవలసియున్నది. ఆ విధముగానే దేవుడు చెప్పును.బైబిలులోని పాత నిబంధనలో ఈ విధముగా చెప్పబడినది, ధర్మశాస్త్రము ప్రకారము గాను, ప్రవక్తల మాట ప్రకారముగాను వారు మాట్లాడనియెడల వారిలో జీవము లేదని మీరు గ్రహించవలెను, అది నిజము. వారిలో జీవము లేదు. వారు ధర్మశాస్త్రనుసారముగా గాని, ప్రవక్తల మాటననుసరించి గాని మాట్లాడవలెను. ప్రవక్తలయిన లేదా మరెవరయినా గాని వాక్యానుసారముగానే యుండవలెను, లేనిచో అది తప్పు.
48.జరుగుచున్న దాని నంతటినీ మనము చూచినప్పుడు ఇది తెలియును. ఉజ్జీవములను గమనించండి మెతడిస్టులు, లూథరనులు, బాప్టిస్టులు, కేంప్ బెల్ వారు ఇంకా వివిధ రకముల వారు వచ్చిరి. వారికి గొప్ప ఉజ్జీవములు వచ్చినవి. నజరీన్‌లు, పిలిగ్రిం హోలీనెస్ వారు, పెంతెకోస్తు వారు గొప్ప ఉజ్జీవములను కలిగియుండిరి; కాని ఇంకా ఆ గొప్ప నిర్గమనం ఇంకా రాలేదు, ఎందువలన?అబ్రాహామును ఆ దేశములో యుంచుదునని దేవుడు అప్పుడే వాగ్ధానము చేసెను, కాని అప్పటికి ఇంకా అమోరీయుల యొక్క పాపము ఇంకా పూర్తి కాలేదు. దేవుడు ఎంతో సహనముతో ఎదురు చూచెను, ఆ జనులు ఏదేదో తలంచుచుండిరి, వారు లేఖనమును చూచిరి గాని మరో రకముగా తలంచిరి — మరేదో వ్యాఖ్యానమును ఇచ్చిరి, “ఇదే కాలము; ఇదే రోజు,” కాని వారు అమోరీయుల యొక్క పాపము ఇంకా పరిపూర్తిగా కాలేదని ఎరిగి యుండలేదు.
49.నాలుగు వందల సంవత్సరములు, వారు యాత్ర చేసిరి, ఆ తరువాత ఐగుప్తులో నుండి బయటకు వచ్చిరి. వారు నిజానికి 440 సంవత్సరములు అక్కడ యుండిరి, ఎందుకనగా వారు ప్రవక్తను విసర్జించిరి. వారు అందువలన మరో నలుబది సంవత్సరములు అరణ్యములో బాధపడవలసి వచ్చెను. ఆ తరువాత దేవుడు వారిని బయటకు తీసికొని వచ్చెను. వారిని విమోచించుటకు వచ్చు ముందుగా మోషే నలుబది సంవత్సరములు అరణ్యములో గడిపెను, చూడండి. నలుబది సంవత్సరములు ఎక్కవ సమయమయ్యెను, ఆలస్యమాయెను, ఎందుకనగా వారు వర్తమానమును విసర్జించిరి.నలుబది సంవత్సరముల కాలము దేవుని దష్టిలో కేవలము ఒకటిన్నర నిమిషములు మాత్రమే. ఎంత తేడాయో చూడండి, వెయ్యి సంవత్సరములు ఒక్క దినమునకు సమానము, చూడండి. అది నిమిషం కూడా కాదు. దానిని మీరు గమనించవలెను.
50.ఇప్పుడు, మనకు ఆలస్యమగుచున్నది. ఎందువలన? దేవుడు దీర్ఘశాంతము చూపుచున్నాడు, కనిపెట్టి చూచుచున్నాడు. లూథరనులతో ఒక ఉజ్జీవము రానీయండి — ఆ తరువాత అది ఒక సంస్థగా మారును. మెతడిస్టులకు ఒక ఉజ్జీవము రానీయండి — ఒక సంస్థగా మారుదురు. జాన్ స్మిత్ యొక్క బాప్టిస్టు చర్చి వారికి ఒక ఉజ్జీవము రానీయండి — అది ఒక సంస్థగా మార్చుటకే దారితీయును. వరముల పునరుద్దరణతో పెంతెకోస్తు వారిని లేవనీయండి — వారు ఒక సంస్థగా మారుదురు; అతిక్రమము పూర్తిగా పరిపక్వమగు వరకు, దేవుడు అలసిపోవు వరకు ఆలాగే జరుగుచుండును.ఆ తరువాత ఒక నిర్గమము వచ్చును.
51.దానిని మనం చూచెదము; అంతట జనులు తమంతట తామే కాల ప్రవాహములో ఇదంతయూ చెడిపోయి శపించబడినట్లుగా చూచెదరు. వారు మరల బబులోను యొక్క వస్త్రమును తీసికొందురు. అదే జనులమధ్య శాపమునకు కారణమగును, మానవుడు తన స్వంత అభిప్రాయములను ఎక్కించుటచేత అంతా శాపగ్రస్తమగును.మనము వాక్యముతోనే నిలచియుండవలెను — దేవుని యొక్క ఆజ్ఞలను మరి దేనితోను మిశ్రమం చేయకూడదు. ఆలాగు చేసినచో ఆ పట్టణమే శాపగ్రస్తమగును. దానిని అంటుకొనవద్దు; దాని జోలికి పోవద్దు.ఆ బంగారమును తీసికొని ఎంతో చక్కగా లోకస్తులవలె హాయిగా జీవించవచ్చుననుకొనెను, చక్కని బబులోను వస్త్రమును తీసికొనెను. ఆకాను చేసిన పని అదే. సమాజములోని ఆకానులను చూడండి, కాని అది శపించబడినది, అది ఎప్పుడునూ శాపగ్రస్తమే. రోమ్‌లోని నైసియా యొద్ద జరిగిన నైసియాను ఆలోచన సభ నాటి నుండియు అది శాపగ్రస్తమయినది, అప్పటి నుండియు అది శాపగ్రస్తమే, కాని అమోరీయుల పాపము పరిపక్వమగు వరకు దేవుడు చూచెను.
52.ఆత్మ సంబంధమగు అవగాహన గల వారందరూ దీనిని గుర్తుంచుకొనండి, “ఆత్మీయా అవగాహన” అను మాటను పదేపదే నేను చెప్పుచున్నాను. ఈ దేశము యొక్క పాపము పండినదని మీరు గ్రహించుచున్నారు. సంస్థలలో నుండి ఎన్నో క్రొత్త సంస్థలు పుట్టుకొచ్చుచున్నవి, ఇప్పుడది ఒక సమాఖ్యలో చేరుచున్నది. పాపము పండిపోయినది.ఇది నిర్గమనపు కాలము. వాగ్ధాన దేశమునకు పిలువబడు కాలము. ఏదో ఇంకొక దేశమునకు వెళ్ళమను పిలుపు కాదు. ఒక గృహము చేరుదుము. అదే వెయ్యేండ్లపాలన. బయటకు పిలువబడు కాలము — ఈ దేశపు పాపము పరిపక్వమయినది.... ఈ రాత్రి మారల దానిని చూచెదము... ప్రభుని చిత్తమయితే.... అది నిండిపోయి యున్నది! ఆమె అపవిత్రమయినది!“నీవు జీవించుచున్న దేశమునే ఇట్లనుచున్నావా, బ్రెన్‌హాం సోదరుడా?” అని మీరందురేమో. అవునండి! నిశ్చయంగా! “ఈ అమెరికా పౌరునిగా నీవట్లు అనరాదు,” అని మీరందరు.అయితే ఏలీయా కూడా ఇశ్రాయేలు దేశము మీదికి తీర్పును రప్పించకూడదు, ఎందుకనగా అతడు కూడా ఇశ్రాయేలీయుడే. మిగిలిన ప్రవక్తలెవరూ ఆ దేశమును శపించకూడదు, ఎందుకనగా వారందరూ ఇశ్రాయేలీయులుగానే యుండిరి.
53.వారు కేవలము మాట్లాడు వారిగానే ఉండిరి, అవి వారి స్వంత ఆలోచనలు కావు, అది యెహోవా వాక్కు. నీవు ఆ ప్రేరణను ఎచ్చట నుండి పొందుచున్నావో దాని మీదనే ఆధారపడి యుండును. అదెటు నుండి వచ్చుచున్నదో దాని మీదనే ఆధారపడి యుండును. అది వాక్యమునకు విరుద్ధమయినచో దానిని దూరముగా ఉంచుము. అది వాక్యమునకు విరుద్ధమని ఎవరయినా రుజువు చేయమని నేను కోరుచున్నాను.ప్రకటన 13లో బైబిలు చెప్పలేదా? (ఈ దేశము ఆ అధ్యాయములోనే కనబడును). ఈ దేశము సంఖ్య పదమూడు, ఇది స్త్రీ దేశము. బైబిలులో ఇది ఒక స్త్రీగా పేర్కొనబడినది. మన నాణెముల మీద స్త్రీ యున్నది. ఇది స్త్రీ దేశము.స్త్రీ యొక్క చెడుతనము ఇచ్చట నుండియే ప్రారంభమగును, ఇక్కడే అది అంతమగును. దేవుని యొక్క వాక్యమును నమ్మకపోవుట ద్వారా ఏదెను తోటలో చెడుతనము ప్రారంభమయినది. దాని పొదుగుదల ఇచ్చటేయున్నది, స్త్రీ బోధకులు ఇచ్చటే మొదలయిరి. హాలీవుడ్లో నుండియే లోకపు అపవిత్రత పుట్టుచున్నది. ప్రపంచములో అది చెడ్డ దేశము. ప్రపంచములోని దేశములన్నింటిలోని విడాకులను కలిపినయెడల ఒక్క అమెరికాలోని విడాకుల సంఖ్యమే ఎక్కువగును,చూడండి.ఎందువలన? ప్రభుని చిత్తమయితే దానికి కారణమును మీరు త్వరలోనికి తెలిసికొందురు. ఈ శపితమగు దానిని గూర్చి మీరు తెలిసికొందురు... ఈ విడాకుల విధానము గూర్చి దాని వెనుక గల గ్రుడ్డితనము గూర్చి మీరు తెలిసికొందురు. సాతాను వారికి అంధత్వము కలుగజేసినది. మనము భయంకరమగు ఘడియలో జీవించుచున్నాము. అంతము దాదాపు వచ్చియున్నదని ఇప్పుడు నేను నమ్ముచున్నాను, వారు కుళ్ళిపోయిరి, పూర్తిగా చెడిపోయిరి.
54.ప్రకటన 13లో ఆమె కనబడును, పదమూడవ సంఖ్య. గుర్తుంచుకొనండి, అది గొర్రెపిల్ల వలె లేచినది, మత స్వాత్రంత్యమున్నది, కాని అది మృగమువంటి ప్రతిమ నుండి అధికారమును పొందియున్నది. వాడు అధికారమును పూర్తిగా చేజిక్కించుకొని మాట్లాడెను, వానికి ముందుండిన మృగము చేసిన క్రియల వంటి చెడ్డక్రియలనే వాడు చేసెను. ఈ దేశము యొక్క ప్రవచనము అది కాదేమో చెప్పండి.అమోరీయుల పాపము సంపూర్ణమగుచున్నది, ఎందుకనగా వారెప్పటి నుండో పని చేయుచున్నారు. మన క్రొత్త పోపు యొక్క ఉద్ధేశ్యము గమనించండి, సోదరులనందరినీ ఏకము చేయవలెనని చూచుచున్నాడు. స్వాభావిక కంటికి అది మంచి పనిగా కనిపించును, కాని దేవుని ధృష్టిలో అది పరిశుద్ధాత్మకు విరోధము. దానితో మనం మిశ్రమం కాలేము. ప్రతి సంఘము ఆ సమాఖ్యలో ఇరుక్కొనును!వీలయినంత తొందరగా మీరు అందులో నుండి బయటకు రండి, లేదా మృగపు ముద్రను మీరు పొందెదరు. మీరేమి చేయుచున్నారో మీకే తెలియదు, అందులో నుండి బయటకు రండి!
55.ఆత్మ సంబంధమగు మనస్సు దీనిని గ్రహించునని నేనెరుగుదును. నాకు ఖచ్చితంగా తెలియును, కాని నేను బయట వారి గూర్చి ఆశ్చర్యపడుచున్నాను. ప్రతి దేశమును ఏలాగూ మనం దర్శించలేము, అయితే పంపగలము. అక్కడున్న మనస్సును, అక్కడున్న విత్తనమును ఏలాగయినా దేవుడు పట్టుకొనును. ఆయనకు ఒక మార్గమున్నది. అది నిజము. వెలుగు దానిని తాకగానే అది జీవమును పొందును. ఆ బావి యొద్ద స్త్రీ వలె అది యుండును, ఆయనే అని ఆమె గ్రహించినది. అది శపించబడినది గనుక అందులో నుండి బయటకు రండి! పడిపోయిన వారెవరయినా తిరిగి లేచిరేమో నాకు చూపించండి.
56.అమోరీయుల యొక్క పాపము ఇంకా పరిపూర్ణము కాలేదు గనుక వారు అక్కడక్కడే తిరుగవలసి వచ్చెను. నిర్గమమునకు ముందు ఎదురు చూడవలసి వచ్చెను. ఎప్పుడయితే అమోరీయుల పాపము పరి సమాప్తమయినదో అక్కడ ఒక సహజమగు నిర్గమమును మనము చూతుము. ఒక స్వాభావిక దేశమునకు వారు నడిపించబడిరి, అందులో ఇంతకు ముందు స్వాభావిక అమోరీయులుండిరి — ఆ భూమి తమదేననిరి.అమోరీయ శాక యొక్క పాపము పరిపక్వమయినది, ఎంతో కాలము నుండి సంఘమంటే మేమేనని చెప్పుకొనుచున్నారు. వారి యొక్క పాపము పరిపక్వము కానైయున్నది. ఒక నిర్గమము రానైయున్నది, దేవుడు ప్రతివారి రంగును చూపించును. సంఘమును, యేసుక్రీస్తు యొక్క వధువు వాగ్ధానము చేసిన దేశములోనికి నడిపించును — నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవని ఆయన చెప్పెను.మీరు అచ్చటికి వెళ్ళి, వారి వలె పోరాటము చేయనక్కర లేదు. అది ముందే సిద్ధము చేయబడినది. ఈ భూమి మీద మనము నివసించుచున్న గుడారము శిథిలమై పోయినప్పుడు మరియొకటి మన కొరకు ఎదురు చూచుచున్నది. “నేను ఎక్కడుందునో మీరును అచ్చటనే యుందురు.” ఆ గొప్ప నిర్గమము చెంతనేయున్నది.
57.ఆ నిర్గమమును దేవుడెట్లు జరిగించెనో గమనించండి. ఎట్టి ఏర్పాట్లు ఆయన చేసెనో చూడండి, దానిని అధ్యయనం చేసి నేటితో పోల్చి చూడండి.సరే చూడండి, ఈ నిర్గమమునకు ముందు యోసేపును ఎరుగని ఫరో ఒకడు లేచెను, చూడండి. ఆ ఫరోకు యోసేపు తెలియదు — యోసేపును ఎరుగడు. ఈ ఆత్మ సంబంధమగు నిర్గమములో యోసేపునకున్న ఆత్మసంబంధమగు వంతును, ప్రాతినిధ్యమును చూడండి. క్రొత్త ఫరో వచ్చెను — ఇప్పుడు మనము స్వతంత్రులము.ఒక కాలము, అర్థము కాలము పాటు స్త్రీ పోషించబడెను. ఒక సమయములో ఆ స్త్రీ విజభించెను.చివరకు ఒక ఫరో లేచెను... ఒక నియంత, మత స్వేచ్ఛ అనగా ఏమిటో అతనికి తెలియదు. వారిని ఏకము చేసెను. దీనిని మీరు తప్పిపోవద్దు. ఫరో రావలసియుండిన ఒక కాలము ముందుండెను. సంస్థలు బహు విచ్చలవిడిగా జీవించినవి, క్రైస్తవ్యపు నిజ ద్రాక్షావల్లిలో అంటు కట్టబడిన కొమ్మగా ఎదిగినది, ఇంకా అసలు ఫలములనే ఫలించుచున్నది.స్త్రీలు అర్థ నగ్నంగా యున్నారు, మగవారు మేధావులై ఆత్మ యొక్క శక్తిని నిరాకరించుచున్నారు మరియు క్రైస్తవసంఘమను పేరు క్రిందనే జీవించుచున్నారు. అది అంటుకట్టబడిన కొమ్మ, కాని ఇప్పుడు వ్యవసాయకుడు వచ్చి ఆ కొమ్మను కత్తిరించును. ఆయన దానిని చేయుదునని ముందే చెప్పెను. ఫలములు లేని వారందరూ కత్తిరించబడుదురు, వారిని అగ్నిలో పడవేసి, దహించును.
58.ఇది చెప్పుటకు చాలా భయంకరముగా యుండును, కొన్నిసార్లు సత్యము చాలా భయంకరముగానే కనిపించును. దేవుడు తన పిల్లలను లోతయిన జలములలో నుండియూ, కూరుకుపోవు ఇసుకలో నుండియూ దేవుడెట్లు తీసికొని వెళ్ళునో ఇందువలన చూడగలము. ఆయన ఆ విధంగానే దానిని చేయును.గుర్తుంచుకొనండి, ఒక కుండను ముందు బ్రద్ధలు కొట్టి, ముక్కలు ముక్కలుగా నలుగగొట్టి పిండి చేసినప్పుడే దానిని మరల మలచి కుండగా చేయుటకు వీలగును. దానిని చెడగొట్టుట చాలా బాధకరముగానే కనిపించవచ్చును, కాని ఆ విధముగా చేయుకుండా కుండను గాని పూలకుండిని గాని లేదా నీవు చేయవలెననుకొను దానిని దేనిని గాని చేయుటకు కుదరదు.
59.యోసేపును తెలియని ఒక ఫరో వచ్చెను, అది అన్నింటికి ప్రారంభము నిర్గమమునకు అదే ఆరంభము. ఒక రాజకీయాధికారము క్రింద అదెప్పుడయితే రూపొందుట ఆరంభమయినదో, దేవుడు తన పనిని సిద్ధపరచెను.అమోరీయుల యొక్క పాపము సంపూర్తి అయ్యెను. అబ్రాహామునకు ఆయన చేసిన వాగ్ధాన కాలము పూర్తి అయ్యెను, విమోచన కాలము ఆసన్నమయినది. యోసేపును ఎరుగని ఒక ఫరో లేచుట దేవుడు అనుమతించెను, రామ్సేసు జన్మించెను. సేటీ తరువాత రామ్సేస్ వచ్చెను, యోసేపు యొక్క ఆశీర్వచనములను గూర్చి రామ్సేసు ఎరుగడు.ఆత్మ సంబంధమగు కోణమనగా ఏమిటో అతనికి తెలియదు, అతడు రాజకీయ మేధావి, సైనిక బలము ద్వారా అతడు ఇతియోపియాను, ఇంకా ఇతర దేశములను వశపరచుకొనెను, అతనిని సైనిక వ్యూహరచన తిరుగులేనిది.
60.ఆత్మసంబంధియైన వ్యక్తి ఇప్పుడు జరుగుచున్న దానిని గమనించగలడు. మత స్వాతంత్య్రమనగా ఏమిటో తెలియని ఫరో లేచెను. మన అధ్యక్షుడు తన పదవిని స్వీకరించు సమయములో మత స్వాతంత్య్రములో తనకు నమ్మకమున్నట్లుగా ప్రమాణములో వ్యక్తము చేయలేదు.
61.దక్షిణాదిన వేర్పాటు చేయవలసిన ప్రశ్న తలెత్తినప్పుడు ఆ రోజున అతడేమనెను? మార్టిన్ లూథర్ కింగ్‌తో నేను మాట్లాడవలెనని కోరుచున్నాను. నాయకుడగు అతడు తన జనులకు నాయకత్వము వహించి మరణ గుంటలోనికి ఎట్లు త్రోసివేయును?ఆ ప్రజలు బానిసలయితే నేను కూడా వారితోనే యుందును. నా కోటును తీసివేసి వారి కొరకు దెబ్బలు తిందును. వారు బానిసలు కారు, వారు పౌరులు; వారు ఈ దేశపు పౌరులు.బడికి వెళ్ళవలసిన ప్రశ్న వచ్చినది. వారికి కఠిన హృదయము ఉండవచ్చును, ఈ సంగతులు తెలియక పోవచ్చును, అటువంటి వారికి ఆత్మ సంబంధమగు సంగతులు మీరు చెప్పలేరు, రాజకీయధికారమును వారిమీద చూపించిరి. దానిని అంగీకరించవలసి వచ్చెను, వారు తిరిగి జన్మించినయెడల ఈ సంగతులను వారు చూడగలరు.
62.కాని ఈ వ్యక్తితో నేను మాట్లాడగోరుచున్నాను — ఆ ప్రశస్తమగు జనులను నడిపించుచున్నాడు. మతమను పేరు క్రింద వారిని మరణ గొయ్యిలోనికి నడిపించెను, వేలాదిమందిని అతడు చంపెను. వారు కేవలము స్వాభావికము వైపు మాత్రమే చూచిరి.ఇతడు నల్లజాతి సోదరుడు — లూసియానలో గొప్ప అల్లరి లేచినప్పుడు నేనక్కడే యున్నాను. నల్ల సేవకుడు ఒకాయన అచ్చటుండెను, అతడు ప్రశస్తమగు ముసలి సోదరుడు. అతడు నిలబడి ఆ సైన్యము వారిని ఇట్లు ప్రశ్నించెను, నేను వారితో మాట్లాడవచ్చునా? వారు నా ప్రజలు.ఈ ముసలి సేవకుడు అక్కడ నిలబడి ఇట్లు ప్రశ్నించెను, “నా రంగును బట్టి ఎన్నడూ నేను సిగ్గుపడలేదని ఈ ఉదయము మీతో చెప్పుచున్నాను. నా సృష్టికర్త నన్ను ఈలాగు సృజించెను.”నిన్ను ఆ విధముగానే ఆయన ఉండమని కోరుచున్నాడు. ప్రతి మానవుని ఆయన ఆ విధముగానే ఉండమని కోరుచున్నాడు. ఆయన తెల్లని పూలను, నీలము పూలను, అన్ని రంగుల పూలను సృజించి యున్నాడు. వాటి రంగులు పొగొట్టుటకు ప్రయత్నించవద్దు. వాటిని సంకరము చేయవద్దు. అది ప్రకతికి విరుద్ధము.
63.అతడు ఇంకా ఇట్లనెను, “ఈ ఉదయము వరకు నేనెన్నడునూ నారంగును గూర్చి సిగ్గుపడలేదు.” నా ప్రజలు ఇప్పుడు లేచి ఏమి చేయుచున్నారో చూచి నిజంగా సిగ్గుపడుచున్నాను. వారు చేయుచున్న దానిని చూచి నాకు అవమానము కలుగుచున్నది.“దేవుడతనిని దీవించు గాక!” అనుకొన్నాను.అతడిట్లు అడిగెను, “మీరు అల్లరికి కారకులయి యున్నారు.” “ఇక్కడున్న పాఠశాలలను చూడండి. మనకు పాఠశాలలులేనియెడల, అది వేరే సంగతి, కాని ఈ లూసియానాలో అత్యుత్తమ పాఠశాలలు ఎవరివి?”అతడు ఇట్లనెను, “ఉదాహరణకు మన పట్టణమైన ష్రీవ్‌పోర్టును తీసికొనండి. అక్కడ ఒక తెల్లవారి పాఠశాలయున్నది. అది ఒక పాతపాఠశాల, వారు మరియొక పాఠశాలను నిర్మించారు. వారికి ఒక్క పరికరము కూడా లేదు, పిల్లలు ఆడుకొనుటకు ఒక సాధనము కూడాలేదు. మన ఆవరణ నిండా ఆట సామాగ్రియున్నది, అంతేగాక, వారు మన పిల్లల కొరకు ఒక పెద్ద ఈత కొలనును చలువ రాళ్ళతో నిర్మించి యున్నారు; మనకు అత్యుత్తమ ఉపాధ్యాయులు ఉన్నారు,” అని చెప్పాడు.“ఇక్కడ అంతా మనకు బాగుండున్నదిగా మీరు అక్కడికి వెళ్ళవలెనని ఎందుకు కోరుచున్నారు? ఏమిటి సంగతి?” అని ప్రశ్నించాడు.ఆ ప్రజలు అతని స్వరమును అణచివేయుటకై గోల చేసిరి. సంగతి చూచారా? — తప్పు ఆవేశము.
64.ఆ జనులు బానిసలు. వారు నా సోదరులు సోదరీలు. వారు గాని బానిస అయితే నేనిట్లు చెప్పెదను, “మనము వెళ్ళి వారితో చేరుదము, మీరు వీధిలోనికి వెళ్ళి దానికి విరోధముగా పోరాడుడి.”వారు బానిసలు కారు. అందరికీ ఉన్నహక్కులే వారికిని ఈ దేశ పౌరులుగా ఉన్నవి. పాతాళము నుండి వచ్చిన ఆవేశము వలన మాత్రమే వారాలాగు ప్రవర్తించిరి, దాని కారణముగా ఒక మిలియను మంది చనిపోయిరి. వారు ఒక విప్లవమును లేవదీయుదురు, అది నిశ్చయము. అది సరికాదు.స్త్రీలకు, పురుషులకు వారి వారి స్వంత హక్కులున్నవి. మనకు నల్లరంగు సోదరులున్నారు, జపాను వారున్నారు, పసుపు రంగువారున్నారు, తెల్లని రంగు, నల్లని రంగు గలవారున్నారు — మన దేవుని ధృష్టిలో రంగు భేదము లేదు. మనమందరము ఆదాము అను ఒక్క నరునిలో నుండియే వచ్చి యున్నాము. దేవుడు మనలను వేరు చేసి, వివిధ రంగులతో నిర్మించినయెడల ఆలాగే నిలచియుందము. నేను పసుపు రంగువ్యక్తిగా జన్మించినచో, జపాను లేదా చైనా జాతీయునిగానే ఉండియుందును. నేను నల్ల రంగు వానిగా జన్మించితే ఆ విధంగానే నిలచి యుందును. దేవుడు నన్ను సృజించిన విధంగానే మిగిలి యుందును.
65.వాస్తవానికి నల్లరంగు జాతి వారికి గల భాగ్యములు ఎన్నో తెల్లరంగు జాతి వారికి లేవు. వారికి చింత లేదు, వారు ఎక్కువగా ఆత్మీయ సంబంధులు. తెల్లవారికి లేని వేలాది గొప్ప సుగుణములు వారికి గలవని నేను చెప్పగలను. దేవుడు ఆ విధముగా వారిని తయారు చేసెను. నల్లవారి గాయక బృ౦దమును అధిగమించగలిగిన వారెక్కడున్నారు? వారి స్వరములను ఎవరు చిత్తు చేయగలరు?వారు ఎక్కడ నుండి పూర్వము వచ్చిరో, ఆ దేశములను నేను చూచాను, వారికి కుడి ఎడమలు తెలియవు. వారిలో ముప్పది లేదా నలువది తెగలున్నవి, వారు పాడిన రాగములను సంగీతకోవిదులు కూడా పట్టుకొనజాలమని కితాబు ఇచ్చిరి.సంవత్సరాల తరబడి వారి గాయక బృ౦దములు శిక్షణ పొందుచున్నవి, వారు దిగువ స్థాయిలోను, ఎగువ స్థాయిలోను ఏమీ కీచు రాకుండా పొడగలరు. వివిధ భాషలలో వారు పరిపూర్ణముగా పాడగలరు, వారి పాటను విని మెచ్చుకొనలేని వారుండరు. వారికి వరమున్నది.
66.కాని మీరు చూడండి, ఇదంతా జరుగవలసియున్నది; రాజకీయ నాయకుని వల్లనే ఇదంతా జరిగినది, మీ కుత్సివ యంత్రములతో మీరే వారిని ఎన్నుకొనిరి. ఒక రోజున గవర్నరు నిలబడి అచ్చట ప్రమాణము చేసెను, ఆ తరువాత కార్యాలయములో ప్రవేశించెను, ప్రజలే ఎన్నుకొనిరి, రాజ్యాంగము ప్రకారము వేర్పాటును గూర్చిన ప్రశ్నకు ఒక పరిష్కార మార్గమున్నది. ఆ విషయములోప్రతి రాష్ట్రము తన స్వంత ఆలోచనను బట్టి నిర్ణయించుకొనవచ్చును.అతడు లెక్క చేయలేదు, రాజ్యాంగమును అతడు చదివెను. అయినా ఇట్లనెను, “ఈ పాఠశాల రంగు భేదమును ప్రోత్సాహించుచున్నది.” అక్కడ వారికి ఒక పాఠశాలయున్నది, వారికి స్వంత కళాశాల ఉన్నాగాని ఇద్దరు నల్ల రంగు పిల్లలు ఆ పాఠశాలలో ప్రవేశమును కోరిరి. అతడు నిలబడి రాజ్యాంగమును చదివెను.
67.మనం మన సంగతి యొద్దకు వచ్చుదము, యోసేపును ఎరుగని ఫరో ఒకడు వచ్చెను, స్వాతంత్రమనగా ఏమిటో తెలియదు. ఆ నల్లవారి వోట్లు పొందుటకు పథకము వేసెను, వారికి స్వాతంత్య్రము ఇచ్చినది, అసలు ముందు రిపబ్లికను పార్టీయేనని అతనికి తెలియదు. అటువంటి దాని కొరకు అతడు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్ముకొనెను, జనులందరినీ తప్పు దారి పట్టించి మరణమునకు నడిపించెను, ప్రతి మానవ-కల్పిత పథకము నాశనము కావలసినదే. ఇది ఖచ్చితంగా నిజము.శ్రీ. కెన్నెడీ ఆ గార్డు దళమును జాతీయము చేసి, వారి తండ్రులు చూచుచుండగానే శిక్షకు పంపించెను, ఎందుకనగా వారు రాజ్యాంగమును ఉల్లంఘించిరి, ఒక్కసారి కాదు చాలాసార్లు, అని చెప్పెను.
68.“వారయితే ఇక మేము పోరాటమునకు సిద్దపడమనిరి, లేదండి.” “ఈ దేశము ప్రజాస్వామ్యము క్రింద జీవించుట లేదు గాని సైనిక నియంతత్వము క్రింద జీవించుచున్నది,” అని చెప్పెను.
69.పాతకాలపు సామెత మీరెరుగుదురు, “దక్షిణాది వారు ఒక్కసారి గాని డెమొక్రాట్ అయినచో ఎప్పుడు ఇక ఆలాగే నిలచియుండును.” ఇప్పుడు నాకు తెలియదు. నిశ్చయంగానే మెళకువతో మనిషి లేవవలసి యున్నాడు. వారు ప్రశస్తమగు జనులు, వారిని ఆ విధముగా చంపకండి.ఒక రాత్రి ఒక సోదరుని వెనుక నుండి తుపాకీతో కాల్చి చంపిరి, అతని భార్య మరియు చిన్న పిల్లలు ఇంట్లోనే యుండిరి. అదెవరయినాగాని చాలా సిగ్గుకరమగు సంగతి. అవును.ఆ కేసుకు నేను న్యాయవాదిగా ఉంటే బాగుండును. తన భార్య మరియు పిల్లలను కలిసికొనుటకు వచ్చుచున్న అతనిని కాల్చి చంపిరి — అతడు దేశ పౌరుడే. తాను ఏది సరిగా యున్నదని తలంచుచున్నాడో దాని పక్షముగా అతడు నిలబడెను, మంచి వ్యక్తి.లైఫ్ పత్రికలో పటమున్నది — ఆ చిన్న బాలుడు తన తండ్రి కొరకు ఏడ్చుచుండెను; ఒక దుర్మార్గుడు ఆ తండ్రిని వెనుక నుండి పొంచి యుండి కాల్చి చంపెను. క్రీస్తును నీవు విసర్జించినప్పుడు ఆలాగే ఉందువు. ఇది నిజము. దేశమంతా ఇప్పుడు ఆ విధంగానేయున్నది, అంతా రాజకీయమయమే. ఎంతో అవమానము, కాని అదే మనకు కావలెను. ఈ ఎన్నికలో దానిని మనం రుజువు చేశాము.
70.నా చిన్న కుమారుడు ఈ ఉదయం నాతో ఇట్లనెను, “డాడీ, మొదటిసారి ఈ దేశములో అడుగుపెట్టిన మన పూర్వీకులు ఏ శాఖకు చెందిన వారు? వారు పెద్ద కోటులు వేసికొన్నారు గనుక పలాని సంఘమునకు చెందిన వారా?”మరియు నేను చెప్పాను, “లేదు, నాన్న, వారు ఇక్కడకు మతపరమైన స్వేచ్చ కొరకు వచ్చిరి. ఆ విధమగు వాటినుండి దూరముగా ఉండుటకు వారు ఇక్కడకు వచ్చారు.”ఇప్పుడు పరిస్థితి ఎంత వరకు వచ్చిందో గమనించారా? ఈ రాజ్యములన్నియూ తప్పక కూలిపోవునని ఇందువలన అర్థమగుచున్నది. (నేను త్వరగా ముగించవలెను)
71.సహోదరుడు మార్టిన్ లూథర్ కింగ్ నిశ్చయంగా మేల్కొనును, అందుకే నేను ప్రార్థించుచున్నాను. అతడు తన జనులను ప్రేమించుచున్నాడు; అందులో సందేహము లేదు. కాని అతని ప్రేరణ ఎచ్చట నుండి వచ్చినదో గ్రహించుకొంటే బాగుండును.మిలియనుల మందిని నీవు చంపి లేదా చనిపోవునట్లు చేసి బడికి వెళ్ళుట వలన ఏమి ప్రయోజనము? ఏ పాఠశాలకు వెళ్ళినా, ఒక్కటే గదా? ఏమి అందులో తేడా లేదు.ఇప్పుడు, ఆకలి కొరకో, లేదా మరేదో కారణము కొరకో అయితే బాగుండును — బానిసలు, అటువంటి కారణము కొరకు ఒకడు తన ప్రాణము పెట్టి హతసాక్షి అయినా మంచిదే, అది యోగ్యమైన కారణము; అది అందరికీ మేలు కలిగించు కారణమగును. కాని పాఠశాలలోప్రవేశించుటకు ఇంత గలిబిలి చేయుట తగదు.ఆ విషయములో పరిశుద్ధాత్మ అతనితో ఏ మాత్రమూ సమ్మతించదని నాకు తెలియును. ప్రజలందరూ ఆవేశముతో నిండిపోయి ఏదో చేసిరి. హిట్లరు జర్మనీలో ఆలాగే చేసెను, జనులను మరణమునకు నడిపించెను, వారు ప్రశస్తమగు జర్మనులు; మిలియనులు, బిలియనుల కొలదిగా జనులు చనిపోయిరి. మృత దేహములను కుప్పలుగా పేర్చిరి. ఇది సత్యము. నేను మాట్లాడుచున్నానని గుర్తుంచుకొనండి. నేను వెళ్ళిపోయిన తరువాత మీరిది చూచెదరు.ఖచ్చితంగా అదే జరుగనైయున్నది. ఆ ప్రశస్తమగు జనులు ఈగల వలె చనిపోయిరి. ఒక విప్లవము బయలుదేరును, తెల్లవారు, నల్లవారు పోరాడుకొంటూనే యుందురు. ఈగల వలెనె చనిపోవుదురు, అంతా అయిపోయిన తరువాత ఏమి మిగులును? శవములు గుట్టలు.
72.యోసేపును ఎరుగని ఫరో ఒకడు వచ్చెను. నేడును ఆలాగేయున్నది. ఒక వ్యక్తి లేచి వైట్‌హౌస్‌లో ప్రమాణము చేసెను — మత స్వాతంత్య్రములో అతనికి నమ్మకమున్నట్లు ఆ ప్రమాణములో వెల్లడించలేదు.ఈ క్రొత్త పోపు ఏమి చెప్పుచున్నాడు? అతని యొద్ద నాలుగు సంగతులున్నవి — ఒకటి ఏమనగా: ప్రొటస్టెంటులను మరియు కాతలిక్కులను ఏకము చేయుట. ఏ మేధావికయినా అది చాలా మంచి పనిగానే కనిపించును, కాని బైబిలు ప్రకారము అది తప్పు పని. వారాలాగు చేయుదురని బైబిలు ముందే చెప్పెను. (ఇంకా కొద్ది ముందుకు వెళ్ళుదము)ఈ సమయములో రామ్సేసు ఐగుప్తులో ఎదుగుచుండెను. అతని అధికారము పెరుగుచుండెను. ప్రకృతి సంబంధియగు రామ్సేసు ఎదుగుచుండెను. ప్రకతి సంబంధియగు ఇతడు, క్రీస్తువిరోధి, ఇప్పుడు రాజకీయము ద్వారా ఎదుగుచుండెను. అతడు వైట్‌హౌస్‌కు అప్పుడే వచ్చి యున్నాడు.మతసంబంధముగా, అతడు జనులనందరినీ ఏకము చేసెను. నిజానికి వారందరూ అందుకు సమ్మతించెదరు. శాఖలకు చెందిన నాయకులు దేశములో యున్న ప్రతి సంఘము ఇప్పటికే ఆ సంఘముల సమాఖ్యలో చేరియున్నారు, ఇప్పటికే వారందులో యున్నారు. రామ్సేసు ఎదుగుచున్నాడు, వారందరూ ఏకమగుచున్నారు, వారందరికీ అదే కావలెను. దాని వలన ఏమగును? ఒక అధికారము తయారగును. మొదటి దానివంటి మృగమే తయారగును.
73.దానితో ఏకము కాని వారందరికిని ఒక హింసరానైయున్నది. అందులో చేరినచో నీకు మృగము ముద్ర పడిపోయినట్లే, ఇంక తరుణము లేదు. “అప్పుడు చూద్దాములే అనుకోవద్దు;” ఇప్పుడే నీవు తీర్మానించుకొనుట మంచిది. రామ్సేసు ఎదుగుచున్నాడు.కాని గుర్తుంచుకొనండి, ఐగుప్తులో రామ్సేసు అధికారముతో ఎదుగుచున్నాడు, అరణ్యములో దేవునికి మోషే యున్నాడు. అతడు కూడా ఎదుగుచున్నాడు. రామ్సేసునకు ఒక రాజకీయ విధానమున్నది. దేవునికి ఒక ఆత్మ సంబంధమగు విధానమున్నది. ఒక ప్రవక్త సిద్ధపడి వచ్చి ప్రజలతో మాట్లాడును.
74.వారిద్దరును ఎదుగుచున్నారు. ఈ రోజులలోనే ఆ ప్రదర్శన జరుగును. ఆ ప్రదర్శన జరుగు కాలము ఎంతో దూరము లేదు.లేఖనమిట్లు చెప్పుచున్నది, “ప్రకతి సంబంధమైనది ఆత్మ సంబంధమైన దానికి సాదశ్యముగా ఉన్నది.” దాని నుండి మీరు దూరంగా వెళ్ళలేరు. అది మీ కన్నుల ఎదుటనేయున్నది. అది సత్యము.ఇప్పుడు సంఘమును చూడండి, బయటకు పిలచుచున్నాడు, అధికారములోనికి వచ్చుచున్నది. పరిశుద్ధాత్మ దిగివచ్చుచున్నది. దేవుని యొక్క మర్మములు బయలుపరచబడి క్రమములో ఉంచబడుచున్నవి, చూడండి. ఇప్పటికే ఆ సంఘము వైట్హౌస్‌లో యున్నది. సంఘము ఒక చోటకు కూడుచున్నది — ఒక శాఖ కాదు. అతిక్రమముల యొక్క దాస్యము, అమోరీయులను మించియున్నది. వారు స్వేచ్ఛగా జీవించు జనులు. ఓ!
75.దేవుడు తనకు ప్రవక్తగా మోషేను ఎన్నుకొనెను, ముందే అతడు ప్రవచించెను, అతనిది సరియని రుజువాయెను, అయినా గాని ఇంకా అతడు అరణ్యపు పాఠశాలలో యుండెను, మిగిలిన ప్రపంచమునకు మరుగైయుండెను. కాని అతడు విద్యనభ్యసించెను, అరణ్యములో శిక్షణను పొందుచుండెను.శత్రువు ఎప్పుడును తన విధానమును, అవిశ్వాసమును మనుష్యుల మీద రుద్దుచునే యుండును, ఎందుకనగా శత్రువు మేధాశక్తికి చిహ్నము. గుర్తుంచుకొనండి... దీనిని మరువవద్దు, రెండే రెండు శక్తులున్నవి. ఒకటి పరిశుద్ధాత్మ యొక్క ఆత్మ సంబంధమగు శక్తి, మరియొకటి, మేధాశక్తి ద్వారా అపవాది పని చేయుట. ఆ విధంగానే వాడు ఏదెను తోటలోనికి ప్రవేశించెను — మేధాశక్తి ద్వారానే, వాక్యమునకు విరోధముగా యున్న మేధాశక్తితో హవ్వను మోసగించెను. అది చాలా తేటగాయున్నది, పిల్లలు కూడా దానిని గ్రహించగలరు, చూచారా. అనాది కాలము నుండి ఆ విధానము మారలేదు.
76.ఇక్కడ ఐగుప్తులో దానిని ఈ ఉదయము చూచుచున్నాము.రామ్సేసులో ఒక మేధాశక్తి పనిచేయుచుండెను, ఒక అధికారమును పొంది అతడు లేచెను, అతనికి స్వాతంత్య్రమనగా ఏమిటో తెలియదు — యోసేపు గూర్చి అతని క్రియలు గూర్చి, ఆదియందు సంఘము చేసిన దాని గూర్చి అతడు ఎరుగడు.ఇప్పుడు దానినే మనం చూచుచున్నాము, సంఘములు మధ్య ఒక మేధాశక్తి అల్లుకొనుచున్నది, కాని మూలముగా ఒక మతాధి పత్యము లేచినది, అది బైబిలు చెప్పుచున్న దానిలెక్క చేయదు. వారికి వారి స్వంత విధానమున్నది, బైబిలు చెప్పునది కాదు; సంఘము చెప్పునదే వారికి కావలెను.ప్రొటస్టెంటు వారు అందులోనికి అల్లుకొనిరి, అది ఆ విధంగా చెప్పుచున్న మాట వాస్తవమే గాని “ఆ రోజులు గతించాయి,” అని వారు చెప్పుచున్నారు. పైకి భక్తి వలె యున్నవి, కాని శక్తిని నిరాకరించుచున్నారు. బైబిలులోని ప్రతి లేఖనము దానినే సూటిగా చూపించుచున్నది.దీనిని నేను ఎందుకు టేపు చేయవలెనని నేను కోరానో మీరెరుగుదురు, జనులకు దీనిని పంపించవలెను. ఆ ఘడియ వచ్చియున్నది! సత్యము తెలియబడవలెను! నిర్గమము చేరువలోనేయున్నది! చూడండి, మేధావులు చెప్పేది పరిపూర్ణముగానే కనిపించుచున్నది, కాని అది సాతాను యొక్క పరిపూర్ణ ప్రేరణ.
77.ఈ మేధావియగు రామ్సేసు ఎదుగుచుండెను, అతడు సింహాసనమధిష్టించెను. గుర్తుంచుకొనండి, మోషే యొక్క సోదరునిగా అతడు పెరిగెను, చూడండి, అతడు మోషేకు సోదరుడు. వారిలో ఒకరు ఆ మేధాశక్తి గల సింహాసనమును ఆక్రమించవలెను. యోసేపును అన్నలు ఎట్లు చూచిరో అట్లేయున్నది. చిన్న యోసేపును వారేమి చేసిరి? — అతనిని వక్యమునుండి వెలివేసి బహిష్కరించిరి. దేవుడు వాక్యమై యున్నాడు. వారు వాక్యమును బహిష్కరించి, ఒక ఆచారమును అంగీకరించిరి, మరియు ఇప్పుడు, ఆ ఆచారము ఎదిగి అధికారమును పొందినది. ఓ దేవా, జనులు దీనిని చూచునట్లు చేయుము!మరే ఇతర స్వరమునైనా నేను వాడగలనా? పరిశుద్ధాత్మ యొక్క ఆవేశము క్రింద ఉండి లేఖనముల ద్వారా దీనిని తేటగా ఇప్పుడు చెప్పుచున్నాను. “అది పోపు ద్వారా వినినచో, లేదా మరో బిషప్పు, లేదా పలాని గొప్ప మత నాయకుని ద్వారా వినినచో, నమ్ముదుము,” అనుచున్నారు.ఎడారిలో నివసించు ఒక చిన్న అనామక వ్యక్తిని దేవుడు తీసికొనెనని, మీరు గ్రహించారా? “అది మొత్తం తప్పు అని కొట్టి పారవేయలేరు గదా?”
78.దేవుడు వ్యక్తిగతముగా సంప్రదించును, గుంపుతో కాదు, వ్యక్తులతో వ్యవహరించును. దేవుడు ఒక్క వ్యక్తితోనే తన పనిని నిర్వహించును. ఆయనకు కావలసినది ఒక్క మనిషియే, అతనితో ఏమయినా చేయగలడు.ప్రతి కాలములోను ఆయనావిధంగానే చేసెను. ఒక్క మనిషి ఆయనకు దొరికితే చాలును. నోవహు దినములలో ఒక మనిషి ఆయనకు దొరికెను; ఏలియా దినములలో ఒక్క మనిషి ఆయనకు దొరికెను; బాప్తిస్మమిచ్చు యోహాను దినములలో ఒక్క మనిషి ఆయనకు దొరికెను. ఆయనకు ఒక్క మనిషి అవసరమై యున్నాడు.న్యాయాధిపతులు ఏలిన దినములలో సంసోను అను ఒక్క వ్యక్తి ఆయనకు దొరికెను. అతనికి గొప్ప శక్తిని ఇచ్చెను, కాని దానిని ఒక స్త్రీ కొరకు అమ్ముకొనెను మరియు గ్రుడ్డివాడయి పోయెను. న్యాయాధిపతియగు దేవుడు అట్టివాడు కాడు, చూడండి.నేడు మీరు చూచుచున్నారు, ఒక్క మనిషిని సంపాదించుకొనవలెనని ఆయన ప్రయత్నించుచున్నాడు. సత్యమును ప్రకటించు ఒక్క హస్తమును ఆయన పట్టుకొనచూచుచున్నాడు; నిర్భయముగా ప్రకటించు వ్యక్తి అవసరము; ఏ మాత్రమూ రాజీపడకూడదు; తప్పు ఆచారములను వెంబడించరాదు. అటువంటి ఒక్క వ్యక్తి ఆయన చేతికి దొరికినయెడల, ఆ వ్యక్తి ద్వారా దేవుడు తన వాక్యమును సజీవముగా చూపించి, తాను జీవించి యున్నానని నిరూపించుకొనగలడు.అటువంటి ఆయనకు దొరికి సిద్ధముగా యున్నాడని నేను నమ్ముచున్నాను, నిశ్చయముగా దీనిని నమ్ముచున్నాను. దానిని నమ్ముటకు బైబిలు చాలునని నేను తలంచుచున్నాను. సత్యమును బోధించగల ఒక మనుష్యుని ఆయన కనుగొనగలడు.
79.ఈ పాఠశాలలన్నింటి గుండా అతడు వెళ్ళిన తరువాత జరిగిన దానిని కనుగొందము. ఇప్పుడు, చూడండి, శత్రువు ఒకటి చేయగోరును — అది మేధాశక్తిగల మనస్సు, ఎందుకనగా శత్రువు మేధావుల ద్వారానే పని చేయును. ఆ మనస్సు గలవారు కూర్చొని కారణము కొరకు వెదకుదురు, వారు ఆలోచన సభ ద్వారా విషయమును చర్చించగోరుదురు. ఒకనాడు నేను ఒక వ్యక్తితో మాట్లాడాను, (అతడు మంచివ్యక్తి. పబ్లిక్ సర్వీస్ కంపెనీ పనిచేయును), అతడు నన్ను, “నీవు ఐరిష్ వానివి కదా?” అని ప్రశ్నించెను.“అవునండీ!” “అందుకు నేను కొద్దిగా సిగ్గుపడుచున్నాను గాని, తప్పదు” అన్నాను.“అయితే నీవసలు కాతలిక్కుగా ఉండవలెనని నీకు తెలియదా?” అనడిగెను.“నేను అసలయిన కాతలిక్కును,” అని చెప్పాను.మొదటి సంఘము కాతలిక్కు సంఘమే అని నీవెరుగుదువా? అది ఈనాడు ఎట్లున్నదో చూచావా? అది పెంతెకోస్తు యొద్ద ప్రారంభమాయెను, కాని ఆ సంస్థ ఈ దినమున ఎట్లున్నదో గ్రహించుము. పెంతెకోస్తు వైపు చూడుము, సంస్థగా మారి పోయినది, మొదటి కాతలిక్కు చర్చి చేసిన క్రియలనే చేసినది — కాని వారు ఈ 2000 సంవత్సరములలో ఎంతో దూరంగా వెళ్ళిపోయారు. ఏబది సంవత్సరములలో ఎంతో మార్పు వచ్చినది.
80.అతడు ఇట్లనెను, “సంఘశాఖల గుంపు వారు (అక్కడే మీరున్నారు), ఒక చోట కూర్చొని విషయమును చర్చించి ఒక అంగీకారమునకు వచ్చియున్నారు. నీకు తెలియదా? ఆ గుంపుల వారందరూ ఏకీభవించిరి. ఆ విషయముపై నీవు బోధించిన దానిని విన్నాను, కాని నేను అందుకు సమ్మతించను.”నేనందుకు ఈలాగడిగాను, “నీవు నీ వాదనను లేక నీ అసమ్మతిని స్వంత బుద్ధి ద్వారా వ్యక్తము చేసినచో, నీవు వాక్యము ద్వారా దానిని నాకు నిరూపించు, బైబిలులో చూపించు.”“దానితో బైబిలుకు ఏమీ సంబంధము లేదు,” అన్నాడు.“నీకది సరిగా తోచవచ్చును గాని, అంతా దానికే సంబంధించియున్నది,” చూడు. అది వాక్యము అన్నాను.అందుకతడు “అన్ని సంఘశాఖలలోని ప్రముఖులు ఒక చోటకూర్చొని ఆలోచించిరి, నీవంటి విద్యలేని పామరుడు కంటే, వారిది సరియగును,” అనెను.నేను చెప్పాను, “మంచిది.....” అందుకు అతడిట్లనెను, “మా సంఘమునకు విరోధముగా నీవు మాట్లాడుటకు ఏమి హక్కున్నది? మొదటి సంఘము, మాదే, దానిని స్థాపించినప్పుడు మేధావులందరూ కూడుకొని చర్చించిరి, అది మొదటి ఆలోచనా సభ. సర్వ సంఘముల సమాఖ్యగా వారక్కడున్న రోమ్‌లోని నైసియా వద్ద కూడుకొనిరి. వారందరూ కలిసి రోమను కాతలిక్కు చర్చిని ఏర్పరచిరి, వేలాది మంది ఆ సభలో యుండిరి. దేవుని చేత ఏర్పరచబడిన జనులు అచ్చట కూడికొని యుండిరి, వారే ఆలోచన చేసిరి. దేవుని యొక్క చిత్తమును తెలిసికొను మనస్సు వారికుండెను. ఇక్కడున్న మీ కంటె వారే ఎక్కువ విధేయులు, ఆ సంఘము సరియైనదని 2000 సంవత్సరములు గతించినా గాని, ఎవరయినా చెప్పి నిరూపించగలరు.”
81.అప్పుడు నేనిట్లు జవాబు చెప్పాను, “ఆయన దానిని ఎన్నడూ రుజువు చేయలేదు.” “ఆ సంఘము గాని దేవుని సంఘమయినయెడల, అది మొదటి సంఘపు ఫలములనే ఫలించి యుండును. ఆ మొదటి సంఘము ఉత్పత్తి చేసిన కార్యములను ఉత్పత్తి చేయును.” బైబిలులో ఒక్క పొల్లు లేదా అక్షరము కూడా గతించదు, “అందులో నుండి ఒక్క మాట తీసివేయరాదు. అందుకు ఒక్కమాట చేర్చరాదు. అట్టి వానికి జీవ గ్రంథములో పాలు లేకుండా పోవును.” అది సార్వత్రిక ఆలోచన సభ కావచ్చు, మరొకటి కావచ్చు, వారి పేరు జీవ గ్రంథములో నుండి తొలగింపబడును, అంతటితో వారి పని సమాప్తమగును.“బిల్లీ! నీవు వట్టి అస్థిరుడవు,” అన్నాడు.నేనిట్లు పలికాను, “ఒకసారి జరిగిన సంగతి, ఇశ్రాయేలీయులలో గొప్ప హోదా గల వారందరూ కూడుకొనిరి, వారు ఈనాటి ప్రొటస్టెంటు మరియు కాతలిక్కు వారివలె విడిపోయియుండిరి — ఇశ్రాయేలు ఇశ్రాయేలీయుగానే ఉండిపోగోరినది. వారికి యెహోషాపాతు అను రాజుండెను, అతడు నీతిమంతుడు. దేవుని ధర్మశాస్త్రమును అనుసరించుటకు ప్రయత్నించినవాడు, కాని వారికి ఆహాబు అను మరొక రాజు కూడా యుండెను, రాజకీయము నేర్చుకొనిన స్త్రీని అతడు పెండ్లి చేసికొనెను, మరియొక దేశముతో స్నేహము చేయగోరెను, అందుకే వారి కుమార్తెలలోని యెజెబెలును పెండ్లి చేసికొనెను — దేవుని జనుల మధ్యకు ఆమెను తీసికొని వచ్చెను, నేడు మనమును అదే చేయుచున్నాము. ఆమె ఏలుబడి చేయసాగినది. ఆమె ఏది చెప్పితే ఆహాబు దానిని చేయుచుండెను — మీరు కూడా అదే చేయుచున్నారు. ఒకనాడు అసలు సమయము వచ్చినది.”
82.వారు రెండు సంఘములను ఏకము చేయగోరిరి, మీరు నేడు అదే చేయుచున్నారు. “వారు ఆ ప్రయత్నములోనే యున్నారు, సంస్థకు చెందిన యెహోషాపాతు ఆహాబుతో అందుకు సమ్మతించెను, అది చాలా బాగున్నదనెను. నీ ప్రజలే నా ప్రజలు అన్నాడు. మనందరమూ క్రైస్తవులము. మనమంతా విశ్వాసులము. అందరం ఏకమవుదము అనెను.”ఇప్పుడు అసలయిన సమయము వచ్చియున్నది, “దీనిని గూర్చి మనం ప్రార్థన చేయవలసిన సమయము ఆసన్నమయినది. మనము యెహోవాను సంప్రదించుదము.” అనగా “సరే”నని ఆహాబనెను.అందుకతడు ఇట్లనెను, “నీకు చెప్పెదను వినుము. యెహోవా యొక్క ప్రవక్తను మనము కనుగొందము. చూడండి, ఆహాబునకు ఒక విధానమున్నది. అది యెహోవాకు చెందినదే అనుకొనెను, నా యొద్ద 400 మంది యున్నారు, వారందరూ విద్యనభ్యసించిన వారు, శిక్షణ పొందిన వారు, మరియు హెబ్రీ ప్రవక్తలుగా పేరొందిన వారు,” అని అతడు పలికెను.(ఈనాటి సేవక బృ౦దములు అదే చేస్తున్నవి) వారిని తీసికొని వచ్చిరి.యుద్ధము యొక్క తుది ఫలితమును గూర్చి వారు ప్రశ్నించిరి. వారందరూ కూడా ఏకముగా కూడిరి మరియు ఈనాటి సర్వసంఘసమాఖ్య వలెనె వారందరూ ఏకమయిరి. వారా ప్రశ్నకు ఇట్లు జవాబు ఇచ్చిరి: “వెళ్ళుడి! యెహోవా మీకు తోడుగా యున్నాడు. ఆ దేశము నిజంగా మనకే చెందును, సిరియనులను లేదా ఫిలిష్తీయులను అక్కడ నుండి వెళ్ళగొట్టుదురు, ఎందుకనగా ఆ భూమి మనకే చెందును,' అనిరి. అది చాలా సహేతుకముగా కనిపించెను.
83.కాని యెహోషాపాతునకు అదిసరిగా తోచలేదు. హృదయములో ఏదో కదలినది, అతడిట్లనెను “నీ యొద్ద 400 మంది శిక్షణ పొందిన సర్వసంఘ సేవకులున్నారు, వారందరూ ఏకాత్మతో యున్నారని ఎరుగుదును.” (వారు ఇనుప కొమ్ములను తయారు చేసికొనిరి, “యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడని వారు చెప్పిరి), కాని మరియొకరిని మనం కనుగొనగలమా?”అందుకతడు ఇట్లనెను, “రాజు ఆలాగు పలుకరాదు.” రాజు ఆ విధముగా మాట్లాడరాదు, ఎందుకనగా వీరు శిక్షణ పొందినవారు. నేనే స్వయంగా వారికి శిక్షణనిచ్చాను.“ ”ఈ మనుష్యులు నా యొద్దనే తర్ఫీదు పొందిరి, కాని ఇంకా ఒకడున్నాడు గాని అతనంటే నాకు అసహ్యము.“ చూచారా?“అతడే మికాయా, ఇమ్లా కుమారుడు,” కాని “అతనంటే నాకసహ్యము. అతడు ఎల్లప్పుడూ నాకు విరోధముగా మాట్లాడును, ఎప్పుడూ వ్యతిరేకముగానే అరచుచుండును. నేను పొరపాటు చేయుచున్నాననియే ఎప్పుడూ అతడనుచుండును, నా రాజ్యమునకు వ్యతిరేకమే చెప్పును అనెను.”అవును, దానిని చూడండి. అది ఎంత గందరగోళములో ఉన్నదో గ్రహించండి.
84.ఈనాడు మీ శాఖను చూడండి, పైకి భక్తి గలిగినట్లుండియూ, దాని శక్తిని నిరాకరించుచున్నారు. మీకు వేలాది మంది లేదా మిలియనులమంది శిక్షణ పొందిన వారు ఉండవచ్చును, కాని ఆత్మసంబంధముగా నీ సంగతి ఎట్లున్నది? ఆ నిలబడి యుండిన సంసోనులో బలము ఎక్కడున్నది? ఒక రోజు నేను చెప్పాను, అతని శరీరము బలిష్టముగానేయున్నది. కండరములు ఉబ్బియున్నవి, కాని అతనిలో జీవము లేదు.ఆత్మ అతనిని విడిచిపెట్టెను; అతడు నిస్సహాయుడు, ఒక చిన్న బాలుడు అతనికి దారి చూపుచుండెను, కళ్ళు పోయిన వాడిగా యుండెను, ఒక స్త్రీ వలన ఇది జరిగెను. నేడు సంఘము కూడా ఆలాగేయున్నది, రాజకీయములు ద్వారాను, బిషప్పుల ద్వారాను,పెద్దల ద్వారాను, ఆయా మిషల ద్వారాను నడిపించబడుచున్నది. మనుష్యుల ఏదేదో చేయవలెనని ప్రయత్నములు కొనసాగించుచున్నారు. నీ పరిస్థితి ఏమిటి?మనము ఈ సమయమునకు వచ్చి యున్నాము.
85.వారు ఇమ్లా కుమారుడగు మీకాయాను తీసికొని రమ్మని పంపించిరి. వెళ్ళి తీసికొని వచ్చిరి, వారి మీదికి దండెత్తినయెడల ఆహాబు చచ్చునని అతడు ప్రవచించెను. వారి ఆర్చి బిషప్పు అతనిని నోటి మీదకొట్టెను. ఆ విషయములో అతడు యధార్థముగా యుండెను. నిన్ను నేను కొట్టినప్పుడు దేవుని యొక్క ఆత్మ ఎటు పోయినది? అని అడిగి, “వీనిని చెరసాలలో బంధించుడి; లోపల చెరసాలలో వేయండి, దుఃఖమునే ఆహారముగాను, పానీయముగాను పెట్టుడి. నేను సమాధానముగా తిరిగి వచ్చిన తరువాత వీని సంగతి చూచెదను అనెను.”తాను దేవుని పట్ల సరిగానే యున్నానని ఇమ్లాకు తెలియును. ఎందువలన? అతని దర్శనము వాక్యముతో సరిపోయినది. అతడు ఒక ప్రవక్త, అతని యొక్క ఆత్మ మరియు అతని యొక్క దర్శనము ప్రవక్తయగు ఏలీయా చెప్పిన దానితో సరిపోయియుండెను. అందుకతడిట్లనెను, “నీవు తిరిగి వచ్చినచో దేవుడసలు నాతో మాట్లాడనే లేదనుకొనుము.”నేను ఆ వ్యక్తిని ఇప్పుడడిగాను, “ఏది సరియైనది? 400 మంది ఏర్పరచబడిన మనుష్యులు కూర్చొని యున్న సర్వసంఘ ఆలోచన సభయా? లేక దేవుని చేత ఎన్నుకొనబడిన ఆ చిన్న వ్యక్తియా?”“తేడాను నీవెట్లు తెలిసికొందువు?” అనడిగాడు.“మరల వెనుకకు వచ్చుదము,” అన్నాను. నమూనా లేకుండా మనం ఇల్లును నిర్మించలేము గదా?వారు ఒక్క నిమిషము ఆగి ఏలీయా చెప్పిన దానిని చూడవలసినది, ఆహాబును అతడు శపించెను, కుక్కలు అతని రక్తము నాకునని చెప్పెను; ఆలాగే జరిగెను. దేవుడు శపించిన దానిని ఇతడేలాగు దీవించగలడు? దేవుడు శపించిన దానిని నీవెట్లు దీవించగలవు?దాని జోలికి పోవద్దు; దాని నుండి దూరముగా పొమ్ము. క్రీస్తులోనికి రావలెను.
86.[టేపు పై ఖాలీ.] .. దానిని సిద్ధపరచుడి, అది నిజమని మేధాశక్తి గల మనస్సు చెప్పును. ఈ ప్రశస్తమగు సోదరుడు దానినే చెప్పెను. అందరం కలిసి ఒక సంఘంవలె బాగుండును గదా అనెను, చెదరిపోయి ఎక్కడో యుండుట కంటే మంచిది కదా అనెను!అది సహేతుకముగానే కనిపించును, ప్రొటస్టెంటులు, కాతలిక్కులు కలిసిపోయి ఒక్క చోట కూడుకొంటే ఎంతో బాగుంటుంది అందురు. కాని సమ్మతింపకుండా ఇద్దరు కూడి ఎట్లు నడువగలరు? ఒక గుంపు వారు దైవిక స్వస్థతను నమ్మరు. మరియొక గుంపు వారు దానిని నమ్ముదుమని అందురు. అది ఈ కాలమునకు చెందినది కాదని మరి కొందరు అందురు. (అందులో కొందరు బైబిలునే నమ్మరు) వారందరూ ఏకమయితే ఎట్లుండునో చూడండి; ఏమి జరుగును? మరియొక గందరగోళము!దేవుడు తన సంఘమును క్రమములో పెట్టు ముందుగా ఏమి జరిగెనో చూడండి. పది దివారాత్రులు వారు కనిపెట్టియుండిరి. వారందరూ ఏకాత్మను, ఏక మనస్సును కలిగియుండిరి, అప్పుడు పరిశుద్ధాత్మ యొక్క నాయకత్వము వచ్చెను. ఏదో ఎక్యుమినికిల్ ఆలోచన సభ కాదు, చూచారా? దీనిని మీరు గ్రహించుచున్నారని నమ్ముచున్నాను.గమనించండి,
87.అతడు అవిశ్వాసి, దేవుని యొక్క వాక్యము విషయములో అపనమ్మకస్థుడు. వాక్యము చెప్పిన దానిని గమనించలేదు, కాని స్వంత హేతువాదమును వెంబడించెను. హవ్వ మొదట చేసినది అదే. తన హేతుబుద్ధి మీద ఆధారపడియున్నది.సాతాను ఇట్లనెను, “ఇటు చూడు! ఇది సహేతుకముగా లేదా? వాక్యమాలాగున చెప్పుచున్నదని నాకు తెలియును. ఒక్క నిమిషం చూడు. మంచి చెడులను వివేచించగల జ్ఞానము సంపాదించుకొనుట గొప్పది కాదా?”“అవును! నిజమే...” అని చెప్పి హవ్వ తీసికొనినది.
88.అదే మార్గము; అదే రీతిగా హేతు బుద్ధిని ఆధారము చేసికొనుచున్నారు.ఇప్పుడు, అవిశ్వాసము ఎప్పుడును కారణము కొరకు వెదకులాడుచుండును, కాని విశ్వాసము దానిని అంటుకొనదు. విశ్వాసమునకు తండ్రియైన మన పితరుడగు అబ్రాహామునకు కారణము ఆలోచించవలసిన ఘడియ వచ్చెను. క్రీస్తుద్వారా మనం ఆయన పిల్లలము, హేతు బుద్ధితో ఆలోచించితే అది సరిగా కనబడదు, ఎందుకనగా ఆమెకు అరవై-అయిదు సంవత్సరములు — యవ్వన దశ నుండియూ — ఆమె తన భర్తతో జీవించినా పిల్లలు పుట్టలేదు. ఇప్పుడామెకు తొంబది సంవత్సరములు మరియు అతనికి వంద సంవత్సరములు. ఇంకేమి పిల్లలు పుట్టుదురు? గొప్ప వైద్యులు మరియు మహాశాస్త్రజ్ఞులు శారాకు పరీక్షలు జరిపియుందురు. ఆమె గర్భము ఉడిగిపోయినది, నలుబది సంవత్సరాల క్రితమే పాలనాడులు ఎండిపోయినవి. ఆమె ప్రసవ వేదన పడజాలదు. ఇది ఒక హేతువు, కాని అబ్రాహాము దానిని నిరాకరించెను. అవిశ్వాసమునుబట్టి అతడు దేవుని వాగ్ధానము విషయములో తొట్రిల్ల లేదు. హేతువు నాలోచించలేదు. దేవుని వాగ్ధానము పట్ల సంశయించలేదు, ఏది ఏమయినగా గాని దేవుడు తాను చెప్పిన దానిని నెరవేర్చగల సమర్థుడని నమ్మెను.
89.ఈ ఉదయమున అబ్రాహాము పిల్లలు ఎచ్చటున్నారు? సేవకులు తిండి, వసతుల కొరకు భయపడుచున్నారు. ఆ బబులోనును విడిచినయెడల వీధిలో పడవలసి వచ్చునని వెనుకాడుచున్నారు; మీ విశ్వాసము ఎక్కడ? దావీదు ఇట్లనెను, “నేను ఒకప్పుడు యువకునిగా యున్నాను, ఇప్పుడు వృద్ధుడనైతిని; కాని నీతిమంతులు విడువబడుట గాని, వారి సంతానము భిక్షమెత్తికొనుట గాని నేను చూడలేదు.” భయపడరాదు. క్రీస్తుపట్ల నమ్మకముగా జీవించుడి.
90.కాని అవిశ్వాసము హేతువును పట్టుకొనును. ఇప్పుడు మీరిది గ్రహించారా? అవిశ్వాసము కారణములను వెదకును — ప్రస్తుతమున్న పరిస్థితులను చూచును. విశ్వాసము ఆలాగున చేయదు; విశ్వాసము వాక్యము వైపు చూచును, అయితే కదలని బండ మీద విశ్వాసము నిలబడును అది దేవుని నిత్య వాక్యము. ఆమేన్! హేతువు వైపు విశ్వాసము చూడదు. అదెంత చక్కని హేతువని మీరు చూపించినా గాని వాక్యమును చూచిన విశ్వాసము దానిని, “కాదు” అనును. అదే విశ్వాసము యొక్క నివాస స్థానము.
91.ఈ ఉదయము లూథరనులను, బాప్టిస్టులను, కాతలిక్కులను ప్రపంచములోని శాఖలలో యున్న వారందరిని అడుగుచున్నాను, వాక్యమునకు విరోధముగా నున్న శాఖలో మీరెట్లు విశ్వాసము౦చగలరు. ఎటువంటి విశ్వాసము మీకున్నది? మీకు హేతువాద బుద్ధియున్నది గాని విశ్వాసము కాదు, “కాగా వినుట వలన విశ్వాసము కలుగును,” సంఘ సమాఖ్య యొక్క మాట వినుట వలనా? ఓల్డ్ లేడీస్ బర్త్‌డ్ ఆల్మనిక్‌లో దానిని మీరు చూడగలరు, కాని దేవుని వాక్యముల మాత్రం ఎన్నడూ దానిని కనుగొనజాలరు.
92.“వినుట వలన విశ్వాసము కలుగును, మరియు దేవుని యొక్క వాక్యమును వినవలెను.” ఆమేన్!ఒక వ్యక్తి దానికి విరోధముగా ఎంతగానో మాట్లాడవచ్చును, అదే దేవుని వాక్యమని చెప్పవచ్చును. భూమ్యాకాశములు గతించును గాని దేవుడు వాక్యమెన్నడునూ గతించదు. విశ్వాసము వాక్యమును కనుగొనును, అదే దాని విశ్రాంతి స్థలము. నిత్యమగు బండయగు క్రీస్తుయేసు మీదికి అది కదిలి వచ్చును, వాక్యము మీదనే అది నిలబడి యుండును మరియు విశ్రాంతిని పొందును.గాలులు చెలరేగినా, తుఫానులు పెల్లుబికినా, అది నిత్యమూ క్షేమముగా యుండును. అది ఎల్లప్పుడూ వాక్యములోనే నిలచియుండును. విశ్వాసము, అనగా అసలయిన విశ్వాసము అక్కడే నిలచి యుండును. వాక్యమే విశ్రాంతి స్థలము. దేవుని యొక్క శత్రువుల మీద దేవునికి తిరుగులేని అధికారమున్నదని దాని వలన రుజువగుచున్నది. అదెంత కీడుగా కనిపించినా గాని, శత్రువులు ఎంతగా చుట్టుకొన్నా గాని, ఓడిపోయినట్లు కనిపించినా గాని, విశ్వాసము మాత్రము ఇంకా ఆలాగే పట్టుకొని యుండును.
93.ఇప్పుడు, రోగులకు చెప్పుచున్నాను, ఓ, దీనిని మీరు పట్టుకొనవలెను. ఆ విశ్వాసమును నీవు పట్టుకొనినప్పుడు నీకు స్వస్థత లభించును. ప్రతి పరిస్థితి, ప్రతి చిహ్నము, ప్రతి గురుతు నీవు ఇక కదలవని, ఇక చనిపోవుట తధ్యమని చూపించవచ్చును.దేవుని యొక్క వాక్యములోనే నివాస స్థానమున్నది. విశ్వాసము, నిజమగు విశ్వాసము దానిని పట్టుకొని యుండును. వేషధారణ కాదు — విశ్వాసము. నిరీక్షణ కాదు — విశ్వాసము దానిని ముందుగానే జరిగిపోయినట్లుగా చూచును. అదే నమ్మిక! విశ్వాసమునకు ఆనుకొను స్థానము అదే. దేవుడెన్నడూ శత్రువునకు జయమియ్యడని దానికి తెలియును. ఆయనెన్నడూ ఆలాగు చేయలేదు. దానిని విశ్వాసము ఎరుగును, కాబట్టి ఏ రకముగా కనిపించినా లెక్క చేయరాదు.ఆ ఓడ తేలునని నోవహుకు తెలియును నిశ్చయంగా! సింహముల నోళ్ళను అది మూయునని దానియేలునకు తెలియును! అగ్నిని ఆయన చల్లార్చగలడని ఆ హెబ్రీ యువకులకు తెలియును.
94.దేవుడు తనను తిరిగి లేపునని యేసునకు తెలియును, ఎందుకనగా వాక్యము ఈలాగున చెప్పెను, “ఆయనాత్మను పాతాళములో విడిచిపెట్టెను, నా పరిశుద్ధుని కుళ్ళు పట్టనియ్యను.” డెబ్బది-రెండు గంటలలో కుళ్ళు పట్టునని ఆయనకు తెలియును, “మూడు దినములలో నేను దానిని తిరిగి లేపెదనని ఆయన చెప్పెను.”దేవుని వాక్యము అను నివాస స్థానములో అది నిత్య విశ్రాంతిని పొందినది. దాని మీదనే నిలబడియున్నది.
95.హేతుబుద్ధి తన శాయశక్తులా ప్రయత్నించును... మంచిది, “ఆ విధానము బాగున్నది.” ఇది చక్కగా యున్నది అగును. నీవు మేధాశక్తి గల మనస్సుతో చూచెదవు గనుక అది నీకు బాగుగా కనిపించవచ్చును. నీవు హేతువును ఆలోచించెదవు, దానిని నిరూపించవచ్చును గాని, విశ్వాసము ద్వారా నిరూపించలేవు. నిరూపించగలిగినదేదయినా గాని, విశ్వాసము కాదు. విశ్వాసమునకు వాక్యము మాత్రమే తెలియును, వాగ్ధానమును నమ్మును. నీవు చూడలేని దానిని అది చూచును, “విశ్వాసమనునది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపమును, అదశ్యమైనవి ఉన్నవనుటకు రుజువునైయున్నది.” నీవు కారణము చెప్పలేవు, అదెట్లు జరుగునో నేను రుజువు చేయలేను. అదెట్లు జరుగనై యున్నదో నాకు తెలియదు, దానిని నేనెరుగను, కాని దానిని నమ్ముచున్నాను. అది ఆలాగని నాకు తెలియును, ఎందుకనగా దేవుడాలాగు చెప్పెను. అదే స్థిరము. ఆ కారణము చేతనే ఇది నిజమని నేను నమ్ముచున్నాను.వాక్యము నిజమని నేనెరుగుదును! వర్తమానము నిజమని నేనెరుగుదును! ఎందుకనగా అది వాక్యములోయున్నది, దానిని రుజువు చేయుటకు దాని మధ్య సజీవుడగు దేవుడు సంచరించుచున్నాడని నాకు తెలియును.మనము ఒక నిర్గమనంలో యున్నాము, నిశ్చయముగా సత్యము.
96.మరణము కూడా విశ్వాసమును కదిలించజాలదు. మరణ ముఖద్వారములో నిలిచియున్న వ్యక్తి కూడా పునరుత్థానము యొక్క విజయపు కేకను వినిపించగలడు.పౌలు ఇట్లనెను, “ఓ మరణమా, నీ ముల్లెక్కడ? సమాధీ, నీ విజయమెచ్చట?” ఎందుకనగా క్రీస్తు తిరిగి లేచెను, క్రీస్తునందున్న వారు ఆయన రాకడ యందు మరల తిరిగి వచ్చెదరు. చూడండి — ఆయన మారనివాడు. అవును, దేవుని యొక్క వాక్యమునే తన నివాస స్థానముగాను, నిత్య విశ్రాంతిగాను విశ్వాసము చేసికొనును. దేవుని యొక్క వాక్యములో అది నిలచి యుండును.మరల గమనించండి.…
97.ఇప్పుడు, ఇంకొద్దిగా ముందుకు మనం వెళ్ళుదం, దాదాపుగా ఇరవై అయిదు నిమిషముల సమయమున్నది. నేను ఈ ఒక్క నిమిషం పాటు ఈ టేపును కొనసాగించవలెనని కోరుచున్నాను.గమనించండి, యోసేపును ఎరుగని క్రొత్త రాజు లేచెను — ఇశ్రాయేలు యొక్క శక్తిని నాశనము చేయుటకు అతడు పన్నిన మొదటి పథకము ఏమిటి? — వారి పిల్లలను నాశనము చేయగోరెను. అది నిజమేనా? వారి పిల్లలను నాశనము చేయుటకు అతడు ప్రయత్నించెను. ఇప్పుడు జాగ్రత్తగా వినండి.అదే అపవాది మరియొక రాజు రూపములో దేవుని యొక్క అద్వితీయ కుమారుని నాశనము చేయ ప్రయత్నించెను. చూడండి, మొదట పిల్లలను వదిలించుకొనగోరెను. వారు పెరగక ముందే సమాప్తము కావలెను.అపవాది నిజంగా చాలా తెలివయిన పక్షి. ప్రారంభము కాకముందే అసలు దానిని ఎట్లు నాశనము చేయవలెనో దానికి తెలియును; అది దానికి తెలియును, చూడండి. దానిని ఎన్నడయినా నీవు ఎదిరించవలెనన్నచో క్రీస్తు మీద ఆధారపడవలెను. నిన్నునీవు తగ్గించుకొనవలెను, ఆయననే నిన్ను నడిపించనిమ్ము. మరే ఇతర విధంగానూ నీవు దానిని ఓడించలేవు.నీ యొక్క మేధాశక్తుల వలన ఎన్నడూ దానిని జయించలేవు. దానిని నీవు నమ్మవలసి యున్నావు, ఆయన మీద నీవు ఆధారపడవలెను. ఆయనే గొర్రెల కాపరి. తోడేళ్లను తరుమవలసిన బాధ్యత గొర్రెలది కాదు, అది గొర్రెల కాపరి సంగతి; కాని గొర్రెలు కాపరితో యున్నప్పుడు మాత్రమే క్షేమముగా యుండును. క్రీస్తునందుండుటయే నాకు రక్షణ. క్రీస్తు వాక్యమై యున్నాడు. అదే మన రక్షణ వలయము.
98.గమనించండి, రాజగు రామ్సేసు రూపములో అపవాది యుండెను. స్వాభావిక మరణము ద్వారా పిల్లలను ముందు హతమార్చవలెనని అతడు తలంచెను, దేవుని కుమారుడు పుట్టిన వెంటనే ఆయన ఐగుప్తును విడిచిపెట్టెను; ఎందుకనగా దేవుడు ఐగుప్తును విడిచిపెట్టెను, అది శపించబడినది, మరెన్నడూ అప్పటి నుండియూ తిరిగి రాలేదు.ఆ తరువాత ఆయన రోమ్‌లో యుండెను. సాతాను తన పీఠమును రోమ్‌నకు మార్చెను. రోమన్ క్రమములో యుండిన సాతాను దేనిని నాశనము చేయుటకు ప్రయత్నించెను? ఆదిలోనే దేవుని కుమారుని చంపగోరెను. అదే అపవాది తంత్రము.ఈ రోజున వాడు అదే చేయుటకు ప్రయత్నించుచున్నాడు, ఆత్మ అనుపేరు క్రింద, మతము అను ముసుగు క్రింద, నామకార్థ క్రైస్తవ్యము క్రింద యుండి అదే పనిని చేయజూచుచున్నాడు. మన బాలికలను తీసికొనివెళ్ళి కాతలిక్కు బాలురతో జత కుదుర్చుచున్నాడు. వారికి కలిగిన సంతానము కాతలిక్కులుగా ఎదుగుదురు, వారే ప్రత్యర్థులుగా మారి ఆవలి వైపునున్న శక్తిని విచ్ఛిన్నము చేయగోరుదురు. అదే మీ యొక్క అపవాది. మీ అపవాది ఏడు కొండల మీద కూర్చొనియున్నది, త్రికోణపు కిరీటమును ధరించుకొనియున్నది. సర్పమువలె బహు కుయుక్తితోను, కుతంత్రముతోను, తెలివితోను, మేధా శక్తితోను నిండియున్నది. దాని పిల్లలే ఈ సర్ప సంతానము — అవే తెలివిగల ఎత్తులను ఉపయోగించుచున్నారు.చూడండి,
99.వారు మరి రెండు సందర్భములలో పిల్లలను హతము చేయగోరిరి. దేనితో వారు పిల్లలను చంపిరి? రెండు మరియు మూడులను గమనించండి, మొదటి రెండు సార్లు స్వాభావిక మరణముతో అతడు పిల్లలను చంపెను. ఈసారి వాడు పిల్లలను ఒక చోటకు చేర్చి, ఆత్మ సంబంధమగు మరణముతో చంపుచున్నాడు — వివాహము, అంతర్ వివాహము.ఇనుము మరియు మట్టి కలిసిన ఈ రాజ్యము గూర్చి దానియేలు దానిని చెప్పెను. వారు రెండు సంతానములను మిశ్రమం చేసెదరు, ఇతరుల యొక్క శక్తిని విచ్ఛిన్నము చేయుదురు. వారిప్పుడు అదే చేయుచున్నారు గదా? ఇప్పుడది ఉనికిలోనికి వచ్చియున్నది — వారికి ఒక అధ్యక్షుడు వచ్చి యున్నాడు; ఆ తరువాత మీరు కార్డినల్‌ను పైకి ఎక్కించుదురు. మొత్తం కాబినెట్ వారే అగుదురు, అప్పుడు మీరు ఏమి చేయగలరు?
100.ఆ తరువాత వారేమి చేయుదురో చూడండి, వారి డబ్బును లాక్కొందురు, అమెరికా దేశము యొక్క అప్పును చెల్లించెదరు, దానిని సంఘము నుండి అప్పుగా తెచ్చెదరు, అప్పుడు నీవు అమ్ముడు పోయినట్లే. నేడు మనం ఏ పరిస్థితుల్లో జీవించుచున్నామో గ్రహించండి. పన్ను వలన సమకూడు ద్రవ్యముతో విదేశపు అప్పులను మనము చెల్లించుచున్నాము. నలుబది సంవత్సరాల పాటు కట్టినా ఆ రుణము తీరదు. మనకిక డబ్బు లేదు, కాని సంఘమునకు ఉన్నది. బంగారముతో అలంకరించబడినదని బైబిలు చెప్పుచున్నది, చూడండి.మీ కుమార్తెలను పెండ్లి చేయుచున్నారు; మీ కుమారులు పెండ్లి చేసికొనుచున్నారు, కాతలిక్కుల వాలే మీ పిల్లలను పెంచుదురు, ఖచ్చితంగా — వారిని అత్మియముగా చంపుదురు. ఆత్మ ఎక్కించి దానితో పాటు దాని పిల్లలను కూడా చంపుదునని బైబిలు చెప్పుచున్నది గదా? ప్రకటన 17లో అది యున్నది. ఆత్మీయ మరణముతో చంపును, చూచారా?అదెప్పుడూ వాక్యమే. నీవెక్కడికి వెళ్ళినా సరే, అది వాక్యమే. ధృశ్యమునకు అది సరిగ్గా సరిపడవలెను, లేనియెడల, అది వాక్యము కాదు, వాక్యము కానే కాదు. అది బైబిలు అంతటికిని సరిపోవలెను, లేనియెడల అది తప్పు.
101.చూడండి, ఈ సమయములో దేవుడు తన పనిని చేయించుకొనుటకు తన దాసునికి శిక్షణ ఇచ్చుచున్నాడు. వారి కంటపడకుండా, వారి పథకములకు అందకుండా, వారి పన్నాగములకు చిక్కకుండా అతనికి శిక్షణ నందించుచుండెను. (దానిని మీరు గమనించారా?) వారి యొక్క మతసంస్థల క్రమమునకు అది ఆవలగా నున్నది. దేవుడు తన ఉద్ధేశ్యము కొరకు అతనికి శిక్షణ ఇచ్చుచున్నాడు. దానిని ఆయన కొనసాగించవలెను.అతడు పెండ్లి చేసికొని భార్య మరియు పిల్లలు గలవాడాయెను, గెర్షోము అను బాలుడున్నాడు. చాలా చక్కని జీవితమును జీవించుచుండెను, అతనిని దీవించుచున్నాడు. కాని అతనిని సిద్ధపరచుట మానలేదు, దేవుడు శిక్షణను ఇచ్చుచుండెను.
102.ఆయన శత్రువు అప్పుడు స్వాభావికముగా ఏదో చేయవలెనని ప్రయత్నించెను, ఇప్పుడు ఆయన శత్రువు ఆత్మ సంబంధముగా ఏదో చేయగోరుచున్నాడు.అప్పుడు వారిని సహజ మరణముతో చంపగోరెను, ఇప్పుడు ఆత్మసంబంధమగు మరణముతో చంపగోరుచున్నాడు, చూచారా. దేవుడు ఒక స్వాభావికమగు నరుని సిద్ధపరచుచుండెను, ఆయన ప్రవక్త ఐగుప్తులోనికి పంపించగోరుచున్నాడు. సాతాను ఒక రామ్సేసును సిద్ధము చేసెను, అతడు ప్రకృతి సంబంధియగు వాడు, చూడండి — ఒక ప్రకృతి సంబంధిని అతడు సిద్ధపరచుచుండెను. ఎందుకొరకు? ఐగుప్తీయులను మరియు హెబ్రీయులను ఏకము చేసి ఫరో దాసులుగా చేయుటకా లేక వారిని చంపుటకా?ఆ కారణము చేతనే విషయములను రుజువు చేయు విద్యా క్రమమును గూర్చి మనస్సుతో హేతువు నేర్పరచుకొనుట చాలా కష్టము. ఇది నిజము. మనస్సు ఎల్లప్పుడూ విద్య యొద్దకే వెళ్ళును. మేధావులు మరియు హేతుబుద్ధి గలవారు దానినసలు చూడనే లేరు.
103.సిసిల్ డి మెల్ యొక్క “పది ఆజ్ఞలు” అను చలన చిత్రమును మీరు చూచారా? మీలో చాలామంది చూచియుందురని తలంచుచున్నాను. ఈ చలన చిత్రములను చూచుటకు వెళ్ళుట నేను నమ్మను, ఎలాంటివన్నీ, కాని దీనిని చూడవలెనని సంఘమునకు చెప్పుచున్నాను.... అంటే చూడవలెననుకొను వారు చూడవచ్చునని చెప్పుచున్నాను. వారు దానిని చూడగోరినయెడల, ఎందుకనగా నేను ఒప్పుకోను..... మొదటగా మన సోదరులలో కొందరు వెళ్ళిరి; వారు వచ్చి నాకు చెప్పిరి, నేను చివరకు వెళ్ళాను, చాలా సంవత్సరముల తరువాత ఇదే నేను చూచాను మరియు దానిని నేను చూచాను. అందుకే మీలో చూడగోరిన వారు వెళ్ళి చూడవచ్చునని సిఫారసు చేయుచున్నాను, పరవాలేదు.అది చాలా చక్కగా, అందముగా యున్నది.
104.సాతాను యొక్క పన్నాగమును చూడండి, అది ఎంత మెల్లగా చొరబడినదో చూడండి. ఆ పిల్లలను చంపుటకు అది పథకము వేసినది, తెలివి గలవారు దానిని గ్రహించి పట్టుకొనిరి నమ్మిరి, ఎందుకనగా కళ్ళకు కనబడినది, అది సహేతుకముగా కనబడినది.దేవుడు ఈ ప్రవక్తను అన్ని సమయములలోను సిద్ధపరచుచుండెను; ఐగుప్తు వారు రాజకీయములలో ఆరితేరిన వారు. ఈ రామ్సేసు దానిని జయించగోరెను. ఒక రోజున చివరకు మేథా శక్తిగలవానికిని, ఆత్మ శక్తి గలవానికిని మధ్య ఒక పోరాటము వచ్చెను. రామ్సేసు తన దైవములన్నింటితో — అక్కడ నిలబడియుండెను మరియు నైల్ దేవుని స్తుతించుచూ నీళ్ళు కుమ్మరించుచుండెను. దేవుడతనిని మొత్తెను, అతడు రక్తము కక్కెను. చూడండి, ఏమి జరిగెనో గ్రహించండి. చాలా గొప్ప సంఘటన.ఓ,
105.ఇప్పుడు చూడండి, మేధావులు ఎల్లప్పుడునూ వాదించుచునే యుందురు. వారు ఆత్మ సంబంధమగు దానిని చూడలేరు, ఎందుకనగా వారు తెలివిగలవారు. ఓ, వారు ఏ సమయములో కూడా చూడలేకపోయిరి, ఇప్పుడును చూడలేరు.ఏలియా దినములలో వారు చూడలేకపోయిరి, ఈ ముసలి ప్రవక్తను చూడగలరా? ఆలాగన్నందుకు దేవుడు మన్నించును గాక! నేను ఏమి చెప్పగోరుచున్నానో దేవునికి తెలియును. ఇది చాలా విడ్డూరముగా కనిపించవచ్చును గాని — పౌలు చెప్పినట్లుగా దేవుని ఆత్మను మీరు చూడగలరు, “నేను ఎన్నడును మీ యొద్దకు చమత్కారపు మాటలతో గాని, జ్ఞానము గలమాటలతో గాని రాలేదు, ఎందుకనగా మీ మనస్సులు జ్ఞానము వైపుకు మొగ్గును; అందుకే పరిశుద్ధాత్మ యొక్క శక్తితో నేను వచ్చియున్నాను. మీ నిరీక్షణ మరియు విశ్వాసము దానియందే ఉండవలెను. మానవ జ్ఞానము నందు కాదు గాని, యేసుక్రీస్తు యొక్క పునరుత్థాన శక్తి యందుండవలెను.”
106.అందుకే నేను ఇంత వివరముగా దీనిని చెప్పుచున్నాను. ఆ గొప్ప దైవప్రవక్తను ముసలివాడని పిలచుచున్నాను, ఎందుకనగా చక్కని వస్త్రములు ధరించిన యాజకుల ముందు అతడు నిలబడినప్పుడు చాలా వికారముగా కనబడియుండును, దైవజనుడనని చెప్పుకొనెను, మేధాశక్తిగల ఆ యాజకుడే అందరికీ పరిశుద్ధునిగా కనబడియుండును.అతడు తలపాగా చుట్టుకొని ధరించి ఎంతో హుందాగా నిలబడి యుండును. అతని గడ్డము మీద నుండి అభిషేకపు తైలము (స్వాభావికమైనది) కారుచూ అది అంగీ అంచులను తాకుచుండును. దహనబలుల అగ్ని మండుటయు, అన్ని ఆచారములు అమలు జరుగుటయు మీరు చూచెదరు.ప్రకృతి సంబంధమగు మనస్సు గలవారు దానినే చూచెదరు. ఈనాడు కూడా వారు అదే చేయుటకు ప్రయత్నించుచున్నారు. కన్ను దేహమునకు ద్వారమువంటిది, కాని మీరు చూడండి, ఆ కన్నులోనే ఆత్మ సంబంధమగు కన్నుయున్నది. ఈ ముసలి మనిషి అక్కడ నిలబడి యుండుట వీరు చూచి యుందురు. వెంట్రుకలు పెరిగిపోయినవి, గొర్రె చర్మమును చుట్టుకొని యుండెను, నడుమునకు దట్టీ కట్టుకొని యుండెను... బహుశా చెప్పులు లేకుండా ఉండి యుండును, చర్మము తప్ప మరేమీ బలిష్ఠముగా అతడు కనబడడు, ఎముకలు బయటపడి యుండును, మరియు గడ్డమంతా తెల్లగా నెరసియుండును. అతని చేతిలో ఒక వంకర కర్ర యుండెను, ఆలాగున అచ్చట నిలబడియుండెను, కాని దేవుని శక్తి అచ్చట సంచరించుటను ఆత్మ సంబంధమగు కన్ను చూడకలుగును, ఎందుకనగా అక్షరాలా అది వాక్యమునకు సరిపోవును.మేధా శక్తి గలవారు చూచునది వేరు; ఆత్మ సంబంధమగు కన్ను చూచునది వేరు.
107.ఈనాడు స్వాభావిక నేత్రము అందమగు సంఘ నిర్మాణములను, పట్టణ మేయరు హాజరగు సహవాసములను ఈ శాఖలను, సంస్థలను చూచును గాని పరిశుద్ధాత్మ యొక్క శక్తిని చూచుటలో విఫలమగును. రోగులు బాగుపడుచున్నారు, మృతులు లేచుచున్నారు, కాని వారు దానిని చూడక హాలీవుడ్‌ను, వీధులలోని ప్రజలను చూచెదరు.ఈనాడు స్త్రీలు ఏమి తలంచుచున్నారో చూడండి, “ఆమె పలాని సంఘమునకు చెందినది, సుజీ జుట్టును కత్తిరించుకొనినది. ఆమె రంగులు పూసికొనినది. పట్టణములోని వారందరూ ఆమెను మెచ్చుకొనుచున్నారు.” నేను పరలోకము గూర్చి తలంచుచుందును. వాక్యమునకు విరుద్ధమైన దానిని నేను వ్యతిరేకించుదును. దేవుడు కూడా సమ్మతించడు. సమ్మతించనియెడల ఆయన తనకు తానే విభేదించుకొనిన వాడగును. ఆయన తన స్వంత వాక్యమును కాదనుకొన్న వాడగును, దానిని తెలిసికొనుడి, ఆయన తన స్వంత వాక్యమును భూమ్యాకాశములు గతించినా గాని అది గతించదు. జుట్టు కత్తిరించుకొనిన స్త్రీ దేవుని ధృష్టిలో శపించబడినదగును, మగవానికి చెందిన వస్త్రమును స్త్రీ ఎన్నడునూ ధరించరాదు.చూడండి, ఆత్మ సంబంధమగు కన్ను దానిని పట్టుకొనును. దీని తరువాత వారు జీవించెదరు. ప్రకతి సంబంధమగు మనస్సు గలవారు ఈనాటి శారీరక విషయములను గూర్చి తలంచుచుందురు.
108.ఇప్పుడు గమనించండి, దీనిని దేవుడు చేయుచున్నాడు, అయినా గాని ప్రజలు దానిని తెలిసికొనుట లేదు. శరీరసంబంధమగు మనస్సు హేతువును ఆధారము చేసికొనును. దేవుడు ఇప్పుడు ఆత్మ సంబంధమగు నిర్గమమునకు పిలచుచున్నాడు. దేవుడు తన ప్రజలను బయటకు పిలచుచున్నాడు. అది ప్రకతి సంబంధమగు నిర్గమము — ఈనాడు ఆయన ఆత్మ సంబంధమగు నిర్గమమునకు పిలచుచున్నాడు. ఎవరిని? ఆయన ఎన్నుకొనిన వారిని మాత్రమే. కేవలము ఆయనేర్పరచుకొనిన వారినే పిలచుచున్నాడు!
109.ఇప్పుడు, ఇశ్రాయేలు సరియైనదని ఐగుప్తు చూడలేకపోయినది. గొర్రెపిల్ల యొక్క రక్తము ఆ స్తంభముల మీద యున్నప్పటికిని, వారి మధ్య ఎన్నో కార్యములు జరుగుచున్నప్పటికిని, దేవుడు అక్కడికి దిగి వచ్చినప్పటికిని, వారు నమ్మలేదు. తన ప్రవక్తలో ఆయన సంచరించెను మరియు వారు మానవుని మాటనే తీసికొనిరి.అతడచ్చట నిలబడి వంకర కర్రమీద ఆనుకొని యుండెను మరియు తూర్పు వైపుకు తిరిగి ఇట్లనెను, “ఈగలు వచ్చి ఐగుప్తును కప్పి వేయును గాక!”అక్కడికి అతడు వెళ్ళినప్పుడు అందరూ “ఏమీ జరుగదు” అనిరి. అప్పుడు ఏమి జరుగలేదు. కాని మరి కొద్ది సేపటిలో ఒక పచ్చని ముసలి ఈగ జుమ్మనుకొంటూ చుట్టూ తిరుగుతూ ఉండియుండును. మరి కొద్ది సేపటికి బహుశా చదరపు గజమునకు రెండు పౌనులు ఈగలు వచ్చి యుండును. ఒక మనిషి పలుకగా సృష్టి ఉనికిలోనికి వచ్చెను.తెలివి గలిగిన రామ్సేసు ఒకడు ఇక్కడ నిలబడి యున్నాడు. జీవము గల దేవుని ఆత్మను అతడు ఎదిరించెను, దైవజనుని నిరాకరించెను. సహజ సంబంధమగు కన్ను రామ్సేసును మాత్రమే చూడగలుగును, కాని ఆత్మసంబంధమగు మనస్సు వాగ్ధానమును చూచును, మరియు దాని యొక్క నెరవేర్పును చూచును.
110.“మంచిది, యెహోషువా మరియు కాలేబులు ఆ అమాలేకీయులను, హివ్వీయులను, యెబూసీయులను చూడనే లేదు, వారసలు లేనట్లే తలంచిరి; వారు పరిమాణములో వీరికంటే రెండు మూడు రెట్లు పెద్దగా యున్నారు, ప్రకతి సంబంధలగు వారు కాదేషు బర్నేయ యొద్ద వారిని చూచి ఏమన్నారో గ్రహించండి. ”వారితో మనం చాలలేము. మన శక్తికి మించిన పని! వారి ప్రక్కన నిలబడితే మిడుతల వలె కనబడితిమి,“ అనిరి. కాని యెహోషువా మరియు కాలేబులు దేవుని యొక్క వాగ్ధానమును చూచిరి, ”వారిని జయించుటకు మనకు శక్తి చాలుననిరి.“ ఎందుకు, దేవుడు వారికి ఆ దేశమును ఇచ్చుదునని చెప్పెను — వారు దానినే చూచుచుండిరి.శరీరసంబంధమగు మనస్సు దానిని గ్రహించజాలదు. ఆత్మసంబంధమగు మనస్సు దానిని పట్టుకొనును.
111.ఒక సంగతి మిమ్మును అడుగుచున్నాను. ఐగుప్తీయులు ఈ కార్యములను ఎందుకు గమనించలేక పోయిరి? ఎందుకనగా వారు ఏర్పరచబడిన వారు కారు.జరుగక ముందే దేవుడు అబ్రాహాముతో చెప్పెను. (నిద్రించుచున్న సంఘమా? దానిని గమనించుము!) అది జరుగక ముందే దేవుడు అబ్రాహాముతో చెప్పెను, “నీ సంతానము 400 సంవత్సరముల పాటు ఐగుప్తులో ప్రయాణించును. తరువాత వారిని బయటకు తీసికొని వచ్చెదను. ఆ కారణము చేతనే వారు దానిని చూచిరి, దానిని చూచుటకు వారు ఏర్పరబడిరి — వారు ఎన్నికలో యున్నారు.దేవుని యొక్క సూచనను చూచుటకు ఇశ్రాయేలు వారు ఎన్నుకొనబడిరి, అవిశ్వాసులు నశించిన ఐగుప్తులో నుండి వారు బయటకు వచ్చిరి! ఈ రోజున దేవుడు తానేర్పరచుకొనిన వారిని, దేవుని వాక్యమునందు విశ్వాసముంచి అబ్రాహాము సంతానమయిన వారిని, అనగా ఆత్మ సంబంధమయిన వారిని ఆయన పిలచుచున్నాడు.ఈనాటి ఆత్మ సంబంధమగు సంతానమును మీరు చూచుట లేదా? ఈ లోకపు తెలివితేటలు గల సంఘము దానిని చూడలేదు, వాక్యమే దానిని చూచును. ఆ పెద్ద సంఘశాఖలలో నుండి అది పిలువబడి యేసుక్రీస్తు యొక్క సన్నిధిలోనికి వచ్చుచున్నది. అది తేటగా యున్నదా? దానిని మీరు గ్రహించారా? మంచిది. మనము మరికొంత ముందుకు వెళ్ళుదము. ఎన్నిక చేయబడిన వారు మాత్రమే చూచెదరు.డాక్టర్లు, డి.ఎల్. పి హెచ్‌లు గలవారు దానిని చూడరు. వారు ఏర్పరబడలేదు.
112.గుర్తుంచుకొనండి, ఇప్పుడు వచ్చుచున్న ఈ ఎన్నిక మరో దేశమునకు వెళ్ళుచున్నదనుకొనరాదు. అది మహిమ యొద్దకు వెళ్లుచున్నది, వారి యొక్క పేర్లు గొర్రెపిల్ల జీవగ్రంథములో వ్రాయబడినవి. ఇశ్రాయేలీయులను బయటకు తీసికొని వచ్చిన ఆ చిన్న ప్రకతి సంబంధమగు గొర్రెపిల్ల కాదు. వారు మరల వెనుకకు జారిపోగలరు, కాని దీని వలన మాత్రం వెనుకకు జారలేరు. ఇది దేవుని గొర్రెపిల్ల యొక్క రక్తము, జగత్తు పునాది వేయబడక ముందే అది వధించబడినది. జగత్తు పునాది వేయబడక ముందు నుండే వారి పేర్లు గొర్రెపిల్ల జీవగ్రంథములో యున్నవి.వారు ఏర్పరబడిన వారు, వారిని వెలుగు తాకగానే వారిలో నుండి ఆ శాఖా సంబంధమగుగోడలు కూలిపోయినవి, “వారి మధ్యనుండి బయటకు రమ్మని,” ఈ చివరి దినములలో పరిశుద్ధాత్మ చెప్పుచున్నది. “వారి యొక్క అపవిత్ర కార్యములను ముట్టుకొనవద్దు. నేను మీకు దేవుడనై యుందును; మీరు, నాకు కుమారులును, కుమార్తెలునై యుందురని, ఆయన సెలవిచ్చున్నాడు.”ఇప్పుడు చూడండి,
113.ఇశ్రాయేలు గమనించుచున్నది. దేవుడు తన ప్రవక్తలతో మాట్లాడునని వారెరుగుదురు — వాక్కు వారి యొద్దకు వచ్చును, దానిని చూచుటకు వారు వచ్చిరి, వారు దానిని చూచిరి. ఇప్పుడు, మనము తెలివినకు సంబంధించిన గురుతును చూచుచున్నాము, వారు తమ సంస్థలనే నమ్ముచున్నారు. వారింకా తమ ఆచారములలోనే యున్నారు.బిలాము వలెనె యున్నారు, ఇశ్రాయేలీయులుండిన కొండశిఖరము మీదికి వారు వచ్చిరి. అక్కడ ఇశ్రాయేలీయులు ఒక ప్రజగా ఉన్నారు గాని దేశముగా లేరు, దోషులై దిక్కుగానక తిరుగుచుండిరి. వారి సోదరుడగు మోయాబు తెలివిగలవాడు, సంస్థకు చెందిన మనిషి, బిషప్పుతో లేదా ప్రవక్తతో కలిపి వారు కొండపై భాగమునకు వచ్చిరి, అక్కడ వారొక బలిపీఠము నిర్మించి అదే రకంగా బలిని అర్పించిరి, కాని అతడు అగ్నిస్తంభమును, ఇశ్రాయేలీయుల మధ్య నున్న కొట్టబడినబండను చూడలేక పోయెను.ఈనాడు కూడా ఆలాగేయున్నది. తెలివిగల మనస్సు అక్కడ నిలబడియున్న ఉత్సవమునే చూచుచున్నది. కొట్టబడిన బండను వారు చూచుటలో విఫలమయిరి. బిషప్పు కూడా పరిశుద్దాత్మ యొక్క శక్తిని, పాళెములోని రాజు కేకను వినలేకపోయెను. దానిని చూచుటలో వారు తప్పిపోయిరి.
114.ఈ రోజున కూడా మరల అదే రీతిగాయున్నది. దేవుడు తానేర్పరచుకొనిన వారిని పిలచుచున్నాడు. వారిప్పుడు ఎన్నుకొనబడిరి. వారెందు కొరకు ఎన్నుకొనబడిరి? పునరుత్థానము కొరకు, వారికి ఎటువంటి సూచనను ఆయన కనుపరచెను? — పునరుత్థాన సూచనను. ఆయనప్పుడు దేనిని చూపించెను? — ఒక విమోచన సూచనను, వారిని దాస్యములో నుండి విడిపించును. అది ఒక శక్తికి సూచన, అది ఆకాశములను మూయ గలదు లేదా మేఘములను నల్లగా చేయగలదు.వారి మధ్య ఆయన యొక్క పునరుత్థాన శక్తిని ఆయన చూపించుచున్నాడు, ఈ సమాధిలో నుండి వారిని లేపెను — ఇప్పుడు మనం సమాధి దేశములో జీవించుచున్నాము, ఆయన వాగ్థానము చేసిన దేశమునకు మనము వెళ్ళుదము — పునరుత్థానము సూచన — ఆత్మ సంబంధమగు ఐగుప్తులో నుండి ఆత్మ సంబంధమగు బబులోను నుండి బయటకు పిలచుచున్నాడు.
115.ఇప్పుడు నేను ఎరిగియుండిన దీనిని నెమ్మదిగా చెప్పుచున్నాను, దానిని మీరు గ్రహించవలెను. ఆదియందు ఆయన దానిని ఏవిధముగా చేసెనో, ఆ విధముగానే దీనిని చేయును, ఏమీ మారలేదు — అవిశ్వాసి యొక్క కన్నులను ఆయన బంధించుచున్నాడు, విశ్వాసి యొక్క కన్నులను ఆయన తెరచుచున్నాడు. గమనించండి, రాజకీయము తెలివితేటల ద్వారా నిర్మాణమగుచున్నది. రాజకీయమును, సంఘమును, రాజకీయములను దేశములను చూడండి — వారి కన్నులకు అది మరుగైయున్నది, ఒక ఆత్మసంబంధమగు కారణము.
116.దేవుడు అరణ్యములో ఉండిన ఒక్క మనిషిని తీసికొనెను, అతనికి శిక్షణ ఇచ్చెను, మరల వెనుకకు తీసికొని వచ్చెను. దానిని ప్రజలకు అందించుటకు అతడు వచ్చెను. చూడండి, నా భావమును గ్రహించారా?ఆయన తన కార్యక్రమమును మార్చజాలడు. ఆయన దేవుడు. ఆయన ఎన్నడూ ఒక గుంపుతో వ్యవహరించడు; ఎన్నడూ ఆలాగున ఆయన చేయలేదు; ఆయన వ్యక్తిగతముగానే వ్యవహరించును, ఆలాగే చేసెను, మరియు ఆలాగే ఆయన చేయును. మలాకీ 4లో కూడా ఆయన వాగ్ధానము చేసెను. ఆలాగే చేయును. ఇది నిజము.ఆయన యొక్క వాగ్ధానమును చూడండి, దానిని చేయుదునని ఆయన వాగ్ధానము చేసెను, మనం ఇక్కడ దానిని చూచుచున్నాము. మనం ఎంతో సంతోషము పొందవలసిన ప్రజలమైయున్నాము — ఆయన తన యొక్క వాగ్థానమును గురుతుగా మనకనుగ్రహించి యున్నాడు. దానిని చేయుదునని ఆయన వాగ్ధానము చేసెను. ఆయన ప్రజల యొక్క విశ్వాసమును పునరుద్ధరించును, ప్రజల యొక్క హృదయములను అసలు పెంతెకోస్తు తండ్రుల విశ్వాసము వైపునకు త్రిప్పును. దానిని చేయుదునని ఆయన వాగ్ధానము చేసెను, ఆయన గురుతులను చూపించుచున్నాడు.“సొదొమ దినములలో యుండినట్లుగానే మనుష్యకుమారుని రాకడయందును ఉండును.” సొదొమ యొద్ద సంఘము ఎటువంటి సూచనను చూచెను? తెలివితేటల సంఘము దేనిని చూచెను? — ఇద్దరు బోధకులు. ఆత్మ సంబంధమగు సంఘము, ఏర్పరచబడిన సంఘము, అబ్రాహాము అతని గుంపు ఏమి చూచిరి? — శరీరములో దేవుడు ప్రత్యక్షమగుటకు చూచిరి. మానవ శరీరమందు ఆయన బయలుపరచబడెను. ఆత్మలోని సంగతిని వివేచించగలిగెను. ఆయన వెనుక నిలచి యుండిన శారా ఏమి చెప్పెనో గ్రహించెను.“లోతు దినములలో ఉండినట్లుగానే, మనుష్య కుమారుని రాకడయందును ఉండును.” అవే క్రియలను పరిశుద్ధాత్మ మన మధ్య ఉండి చేయుట మనం చూచుచున్నాము. మానవ శరీరములో పనిచేయుచున్నది. ఇదే ఆ ఘడియ, చూడండి. స్నేహితులారా, ఇచ్చట మనం ఉన్నాము, అంతే! ఒక నిర్గమము కొనసాగుచున్నది.
117.కాని ఇప్పుడు గమనించండి, అప్పుడు దానిని దేని ద్వారా ఆయన జరిగించెను? మీరిది గమనించి, ఆత్మ సంబంధముగా ఆలోచన చేయండి. ఇప్పుడు పరిశుద్ధాత్మ మన యొక్క పాత భేదాభ్రిపాయపు ముసుగును తీసివేయును గాక! జాగ్రత్తగా చూడండి. దేవుడు ఏ పనినయినా చేయుటకు ఒకసారి ఎన్నుకొనిన మార్గమును మరెన్నడునూ మార్చలేడు.ఏదేను తోటలో మానవుని విమోచించి మరల సహవాసమును ఇయ్యగోరెను. ఆయన ఒక తీర్మానము చేసికొనెను, అది రక్తము. వీరు విద్యను, సంస్థను, శాఖను ఏర్పరచి దాని ద్వారా ఏదో సాధించవలెనని ప్రయత్నించుచున్నారు, కాని అదెన్నడూ పనిచేయదు.మానవుని దేవుడు ఎన్నడయినా గాని ఒకే స్థలములో కలిసికొనును, అది ఏదెను తోటలో చేసినట్లుగా చిందించబడిన రక్తము క్రిందనే. అదెన్నడునూ మారలేదు. యోబు దినములలో కూడా దేవుడు చిందించబడిన రక్తము క్రిందనే కలిసికొనెను. ఇశ్రాయేలీయుల దినములలో కూడా ఆయన చిందించబడిన రక్తము క్రిందనే వారిని కలిసికొనెను, చిందించిన గొర్రెపిల్ల రక్తము క్రిందనే ఆయన ఏదెను తోటలో వారిని కలిసికొనెను.ఈ రోజున కూడా ఆయన కలిసికొను చోటు ఒకే ఒకటున్నది, అది శాఖలలో కాదు — వారే ఒకరికొకరు వాదించుకొనుచూ తగవులాడుకొనుచున్నారు; చర్చి విధానములో కాదు — వారు ఇంకను అదే చేయుచున్నారు; మేధావులలో ఆయన కలిసికొను చోటులేదు — వారందరూ కలగలుపుగా యున్నారు, అయితే గొర్రెపిల్ల రక్తము క్రిందనే ఆయన కలిసికొనును; జీవము నివాసముండు సహవాసములోనే ప్రతి విశ్వాసి కలిసికొనును.
118.నిర్గమనపు రోజులలో దేవుడు ఏర్పాటు చేసియున్నాడు, ఆయన ఒక గుంపును బయటకు పిలచెను మరియు ఆ గుంపులోనుండి.... ఒక సంగతి మీరు గమనించవలెనని కోరుచున్నాను. వాగ్ధాన దేశమునకు ఇద్దరు మాత్రమే వెళ్ళిరి. దేని ద్వారా ఆయన వారిని అక్కడికి తీసికొని వెళ్ళగలిగెను? రాజకీయము ద్వారానా? సంస్థ ద్వారానా? అగ్నిస్తంభము యొక్క మానవాతీత సూచన గల ఒక ప్రవక్తను ఆయన ఎన్నుకొనెను, అప్పుడు ప్రజలు పొరబడరు. ఆ ప్రవక్త పలికినదే సత్యము. దేవుడు అగ్ని స్తంభములో దిగి వచ్చెను మరియు తన్నుతాను బయలుపరచుకొనెను, తన వాక్యమును చూపించును. అది నిజమేనా?ఆయన తన మొదటి నిర్గమములో దానిని తీసికొని వచ్చెను. రెండవ నిర్గమమున్నది... దేవుడెల్లప్పుడూ మూడులో వెళ్ళుచుండును. మూడులో ఆయన పరిపూర్ణుడగును. మీరందరూ నా బోధను గమనించండి, మూడు మరియు ఏడు వచ్చుచుండును. ఏడు అనగా సంపూర్ణత; మూడు ఆయన యొక్క పరిపూర్ణత. మూడు ఈడ్పులున్నవి. ప్రతిదీ అంతే! చూడండి. నీతీకరణ, శుద్ధీకరణ, పరిశుద్ధాత్మ బాప్తిస్మము. తండ్రీ, కుమారుడు, పరిశుద్ధాత్మ. ప్రతి దానిని చూడండి.గమనించండి,
119.మొదటి నిర్గమములో ఆయన ఏమి చేసెనో చూడండి? ఆయన ఒక ప్రవక్తను పంపెను, అగ్నిస్తంభముతో అభిషేకించబడెను, మరియు అతడు ప్రజలను బయటకు పిలచెను. అది ఆయన యొక్క మొదటి నిర్గమము. ఇశ్రాయేలు యొక్క సమయము ముగియగానే అగ్నిస్తంభముతో మరియొక దైవ ప్రవక్తను పంపెను. అది పరలోకము నుండి పావురము ఆకారములో దిగి వచ్చుటను యోహాను చూచెను. ఆయన ఇట్లనెన, “నేను దేవుని యొద్దకు ఎక్కిపోవుచున్నాను, ఎందుకనగా ఆయన యొద్ద నుండియే వచ్చియున్నాను.”ఆయన యొక్క మరణము, సమాధి, పునరుత్థానము తరువాత తార్సువాడగు సౌలు దమస్కునకు పోవు మార్గములో అదే అగ్నిస్తంభమును చూచెను. అతడు హెబ్రీయుడు గనుక వాక్యమును బాగుగా నేర్చుకొనినవాడు. “ప్రభువా, నీవెవరవు?” అనడిగెను.ఆ అగ్నిస్థంభము ప్రభువేనని ఆయనకు తెలియును. అతడు హెబ్రీయుడు. “నీవెవరవు?” అని అడిగెను.“నేను యేసును,” అని ఆయన చెప్పెను.
120.రెండవ నిర్గమము అభిషేకము పొందిన ఒక ప్రవక్తను ఆయన తీసికొని వచ్చెను, అది ఆయన కుమారుడు, దైవ-ప్రవక్త. ఆయన ఒక ప్రవక్తగా యుండునని మోషే చెప్పెను, అగ్ని స్థంభమును కలిగి యుండెను, అద్భుతములను, సూచక క్రియలను చేసెను. ఆ ప్రవక్తయే ఇట్లని చెప్పెను, “నా యందు విశ్వాసముంచువాడు, నేను చేయు క్రియలు చేయును.”చివరి దినములలోని నిర్గమములో ఆయన అదే వాగ్ధానము చేసెను, మరియు ఆయన దానిని మార్చలేడు. శాస్త్రీయ రుజువు ద్వారా, పరిశుద్ధాత్మ యొక్క సాక్షము ద్వారా, ఆత్మ క్రియల ద్వారా, నేడు దానిని మనము చూచుచున్నాము. ఆ గొప్ప అగ్నిస్థంభము మన మధ్య సంచరించుచున్నది. యేసుక్రీస్తు పునరుత్థానము యొక్క అద్భుతములు, సూచక క్రియలు, జనులను శాఖలలో నుండి యేసుక్రీస్తు సన్నిధిలోనికి పిలచుచున్నవి — ఒక దేశములో జీవించుటకు వెళ్ళుచున్నారు.స్నేహితులారా, పొరబడవద్దు. ఇది నా మాటకాదు. నేను కేవలం మీ సోదరుడను. కాని దీనిని మీకు దేవుడు రుజువు చేయుచున్నాడు. అందువలన ఇది సత్యమగుచున్నది. మిగిలిన రెండు నిర్గమములకును అదే అగ్నిస్థంభమును ఆయనవాడుకొనెను. దానిని నేడు మీ మధ్యకు ఆయన తీసికొని వచ్చుచున్నాడు, మరియు సైన్సు ద్వారా నిరూపించుచున్నాడు.మీకు తెలియును, లైఫ్ పత్రిక గత నెలలో దానిని ప్రచురించెను.
121.అది జరుగక ముందే నేను దానిని గూర్చి ఇక్కడ చెప్పాను. అప్పుడున్న వారిలో ఎందరిచ్చట యున్నారు? సంఘములోని వారందరూ అప్పుడున్నారని తలంచుచున్నాను. అప్పుడు వారికది ఏమిటో అర్థము కాలేదు. శాస్త్రజ్ఞులు పరిశోధించుచున్నారు... “మీ యొద్ద ఆ పటము ఉండియుండును ఒక మేఘము ఇరవై-ఆరు మైళ్ళ ఎత్తునయున్నది. పిరమిడ ఆకారములో ఏర్పడినది — ఏడు దూతలు అచ్చట ప్రత్యక్షమైనవి. మీకు దేవుని వాక్యమును తీసికొని వచ్చినవి. దైవావేశము ద్వారా దానిని చెప్పుట జరిగినది. మీరు జీవించుచున్న ఘడియలను గూర్చి చెప్పుట జరిగెను. ఆత్మ సంబంధమగు మనస్సు దానిని గ్రహించును. అది ఒక నిర్గమము. ఈ దినములలోనే ఒక దినమున మనం వెళ్ళిపోనైయున్నాము. దేవునికి వందనములు. గుర్తుంచుకొనండి, ఇంకా పది నిమిషములున్నవి. నేను ఒక్క నిమిషములో ముగించబోవుచున్నాను.
122.వారిని బయటకు పిలచి, ప్రవక్త యొక్క అభిషేకము క్రింద వారిని వాగ్ధాన దేశమునకు నడిపించిన అగ్నిస్థంభమును గమనించండి. వారు అగ్ని స్థంభము వైపు చూచిరి. అభిషిక్తుడగు ప్రవక్త యొక్క ఆధ్వర్యములో వారిని వాగ్ధాన దేశమునకు నడిపించెను. వారు నిరంతరము అతనిని త్రోసివేయుచునే యుండిరి. అది నిజమేనా? నిశ్చయంగా!మీకు బాప్తిస్మపు కార్యక్రమమున్నదని నాకు తెలియును. ఇంకా ఇక్కడ ఆరు పేజీలున్నవి. మరి కొద్ది నిమిషములలో ఆపు చేయుదును.గమనించండి, మనము పిలువబడు వారిగా ఉన్నాము. ఆ యొక్క దూత స్వరము “నా ప్రజలారా బబులోను నుండి బయటకు రమ్ము,” అని పలికెను. దేనిలోనుండి, అనగా — గందరలోములో నుండి.మెతడిస్టు సరియైనదేనా? బాప్టిస్టు సరియైనదేనా? కాతలిక్కు సరియైనదేనా? వానిలో నుండి బయటకు రండి! దేవుడే సరియైన వాడు. మీకెట్లు తెలియును? “ప్రతి మనుష్యుని మాట అబద్ధమే. దేవుడొక్కడే సత్యవంతుడు.” అందులో నుండి బయటకు రండి. మీకేమి తెలియును? అదే అగ్నిస్థంభము, అదే పరిశుద్ధాత్మాభిషేకము వాగ్ధాన దేశమునకు నడిపించుచున్నది. గమనించండి, వారిని బయటకు తీసికొని వచ్చెను, వారిని నడిపించెను. ఒక దేశమై యున్న ఇశ్రాయేలును వాగ్ధాన దేశమునకు నడిపించెను.
123.ఆ దేవుడే, ఆ అగ్ని స్థంభమే, మారలేదు. జార్జి.జె.లాసీ ఆ పటమును పరీక్షించెను. (వ్రేలి ముద్రల పత్రములను అధ్యయనము చేయి ఎఫ్. బి. ఐ, శాఖకు అధిపతి) అతడిచ్చిన నివేదికను చదవండి. అది లెన్సు రెండు సార్లు బహిర్గతమైనందున జరిగినదని కొందరనిరి.వేలాది మంది ప్రజలు దానిని స్వయంగా చూచిరి. మనము నిలబడి దానిని ఇక్కడ చూచాము; దానిని మీరు చూచారు. అవును! అది ధృష్టి భ్రమణమని కొందరన్నారు. శ్రీ. లాసీ ఏమని చెప్పెను? “ఈ కెమేరా యొక్క యాంత్రిక నేత్రము మానసిక శాస్త్రమును ఫోటో తీయదు అనెను.”అది దృష్టి భ్రమణము కాదు; అది అక్కడ ఉండెను — అది మారని అగ్నిస్థంభము. “అది ఒక భ్రమ అన్నారు,” టుసాన్‌కు అది వందలాది మైళ్ళ దూరంలోయున్నది.
124.అది జరుగుటకు ఆరు నెలలకు ముందే పరిశుద్దాత్మ ద్వారా మీకు చెప్పాను. వార్తను అందుకొనుటకు అక్కడికి నేను వెళ్ళుదునని చెప్పాను. పిరమిడ్‌కు బయట ఒక వ్రాతయున్నది... మన సోదరుడు కలలో దానిని చూచెను మరియు నేను దాని భావమును చెప్పాను. అది పూర్తి అనువాదము.నీతీకరణ, శుద్ధీకరణ, పరిశుద్ధాత్మ బాప్తిస్మము యొక్క మర్మములన్నియూ వివరించబడినవి. ఏడు ముద్రలలో మరుగైయుండిన కొసరు మర్మములు కూడా వివరించబడినవి; ఏడు సంఘములు కాదు, ఏడు ముద్రలు మర్మములను బయలుపరచబడినవి. ఆయన దీనిని తేటగా విప్పి దాని లోపట గల తెల్లని రాయిని చూపించెను, దాని మీద ఏ వ్రాతయు లేదు, అది ఒక మర్మము.టుసాన్‌కు వెళ్ళి, దానిని జరుగక ముందే చెప్పుమనెను. టుసాన్‌కు ఉత్తరంగా నిలబడియున్నాను, (అందుకు సాక్షులున్నారు) ఒక ప్రేలుడు సంభవించినది, దాని వలన నేల మొదలుకొని పర్వతము వరకు కంపించెను. అదే సమయములో ఒక వెలుగు గుండ్రని ఆకారములో గాలిలో వ్రేలాడి కనిపించినది. శాస్త్రజ్ఞులు ఇప్పుడు ఫోటోలు తీసిరి, ఇరవై-ఆరుమైళ్ళ ఎత్తు. అంత ఎత్తులో పొగమంచు గాని, మరే విధమగు తేమగాని యుండదు; అదెట్లు జరిగెనో వారి కర్థము కాలేదు, “సాయంకాల సమయములో వెలుగుండును, మహిమ బాటను నిశ్చయంగా మీరు కనుగొందురు.”మీరు ఏర్పరచుకొనబడిన వారైయుండవలెను; ఎండిన నేలలోగాని, రాతి మీద గాని ఆ విత్తనము పడినయెడల ఏమియూ మొలకెత్తదు. కఠినమైపోయిన రాతి హృదయములు తప్పు పట్ట ప్రయత్నించును, కాని అది మెత్తని నేల మీద పడినప్పుడు, విశ్వాసపు నేలలో పడినప్పుడు, అది క్రైస్తవ్యమును మొలకెత్తించును, ఆత్మ ఫలములను ఫలించును.
125.దానిని దేవుడెట్లు జరిగించెనో గమనించండి. అదే అగ్ని స్థంభమును ఆయన బయలుపరచెను. దానిని గూర్చి వెళ్ళి శాస్త్రజ్ఞులకు చెప్పమని కొందరనిరి. దానిని వారు నమ్ముదురని మీరనుకొనుచున్నారా? “పందులయెదుట మీ ముత్యములు చల్లవద్దని యేసు చెప్పెను.” ఆ పని చేయుటకు నాకు నడిపింపు లేదు. వారు నివసించుచున్న ఆ పట్టణములోనే యున్నాను. వారి యొద్దకు వెళ్ళవలెననుకొన్నాను, కాని పరిశుద్ధాత్మ ఇట్లు చెప్పెను, “వారి యొద్దకు వద్దు. అది వారి కొరకు కాదు. వెనకకు వెళ్ళి ఆలయములో (టాబర్నికల్) దీనిని చెప్పుము.”అవును, అది నెరవేరును. వారు దాని నెరవేర్పును చూచినప్పుడు అది ప్రభువు చెప్పినదే అని తెలిసికొందురు. అది జరుగుటకు ముందుగానే, చెప్పుట జరిగెను. చూడండి. బైబిలు మాట వినండి. దేవుని యొక్క స్వరము ఈ దినమున నిన్ను పిలచుచున్నది.
126.ఇప్పుడు, మీరు దీనిని గమనించవలెనని కోరుచున్నాను, అదే అగ్నిస్థంభము మరల ప్రజలను వాగ్థాన దేశమునకు, వెయ్యేండ్లపాలనకు నడిపించుచున్నది. ఈ ఆరవ ముద్ర యొక్క ప్రేరణ ద్వారా మనము కనుగొనియున్నాము. ముందెన్నడూ దీనిని గూర్చి నేర్చుకొనలేదు. వెయ్యేండ్లపాలన కొరకు బూమి శుద్ధీకాబడవలెను. అగ్ని స్థంభము వారిని వెయ్యేండ్లపాలనకు నడిపించుచున్నది.చూడండి, దాస్యములో నుండి నిర్గమములోనికి ఇశ్రాయేలీయులను నడిపించిన అగ్నిస్థంభము, దేవుని నాయకత్వము క్రింద ఉండెను, దేవుడు అగ్నియై యున్నాడు, మరియు అగ్నిస్థంభము మాత్రమే ప్రవక్తను అభిషేకించెను. అగ్నిస్థంభము పరలోక సాక్షిగా నిలబడియున్నది. మోషే బయటకు పిలువబడెనని అది చూపించుచున్నది.దాతాను, ఇంకా ఇతరులను చూడండి, “మేము కూడా ఒక సంస్థను ప్రారంభించెదము. నీవు మరీఎక్కువ భారమును మోయుచున్నావు. మా మధ్య నీవొక్కడివే పరిశుద్ధుడవని చెప్పుకొనుచున్నావు. యెహోవా సమాజమంతయూ పరిశుద్ధమైనదే. దీనిని నీవొక్కడివే ఎట్లు భరించగలవు?”మోషే నేలమీద పడి, ఏడ్వనార౦భి౦చెను. దేవుడిట్లు పలికెను, “నీవు వారి నుండి వేరగుము. నేను భూమిని తెరచి వారిని మ్రింగచేసెదను.” మాదిరి. మోషే ఎలాగు — దేవుడు చెప్పమనిన సంగతినే మోషే వారితో చెప్పుచుండెను — అది సత్యమని దేవుడు నిరూపించుచుండెను.
127.ప్రవక్త్రినియగు మిర్యాము కూడా, అహరోను కూడా మోషే ఐతియోపియ స్త్రీని పెండ్లి చేసికొనుట చూచి నవ్విరి, వారతనిని హేళన చేసిరి; తన దాసునికి విరోధముగా వారు మాట్లాడినందున — దేవునికి కోపము వచ్చెను. ఆయనేమి చేసెను? ఆలయపు ద్వారము నొద్దకు మిర్యామును పిలచెను, ఆమె ప్రవక్త్రినియే, కాని మోషే ప్రవక్త కంటె గొప్పవాడు — ప్రవక్తకన్న అధికుడు.ఆయనిట్లడిగెను, “నీవు దేవునికి భయపడవా? మీ మధ్యప్రవక్త ఎవరయినా యున్నచో, అతనితో యెహోవానగు నేను, దర్శనముల ద్వారాను, కలల ద్వారాను మాట్లాడి బయలుపరచుకొందును,” అయితే చెప్పెను, “మోషేకు కాదు.” చెప్పెను, “దేవునికి నీవు భయపడవా?” ఆ క్షణమందే ఆమె కుష్ఠ రోగియై సగం చచ్చినదాయెను. మీకది తెలుసు.
128.ఆయన చెప్పలేదా, “మీరు ప్రవక్తనుచూడ వెళ్ళితిరా? అవును, గాని ప్రవక్తకన్న గొప్పవాడు ఇచ్చటున్నాడు. అవును ప్రవక్త కంటెను గొప్పవాడు. ఎందువలన ప్రవక్త కంటెను అతడు గొప్పవాడు? అతడు నిబంధన యొక్క దూత — ఆ రెండు యుగములను మలచిన మందసము.ఈ దినమున మన మధ్య గల ఈ పరిశుద్ధాత్మ, ప్రవక్త కంటెను గొప్పదైయున్నది. దానిని రుజువు చేయుటకు దేవుడు తన వాక్యముతో మన మధ్య ప్రత్యక్షమాయెను. ప్రవక్త కంటె గొప్పది — ప్రవక్తలు చేసిన దానికంటె వేయి-రెట్లు మిన్నయైన దానిని అది చేసెను.
129.యుగములన్నింటిలోను ప్రవక్తలందరిలోను మహా ప్రవక్తగా గుర్తింపబడిన ఏలియా, తన ఎనిమిది సంవత్సరముల సేవ జీవితములో నాలుగు సహజాతీతమగు కార్యములను చేసెను. రెండు-రెట్లు ఆత్మ గల ఎలీషా ఎనిమిది కార్యములు చేసెను. ఇప్పుడు మనము వేలకొలది కార్యములను మన స్వనేత్రములతో చూచియున్నాము. అగ్ని స్థంభములో యున్న యెహోవా దూతను చూడుడి. శాస్త్రీయ పరిశోధన దానిని ప్రపంచమునకు వెల్లడి చేసినది. వారు దాని ద్వారానే తీర్పు చేయబడెదరని చూపించెను.గొర్రెపిల్ల ఏమి చేసెను? యెహోవా యొక్క దూత అనగా, క్రీస్తే. దానిని నీవు నమ్ముము. యోహాను 6, వారందరూ ఈ నీరు త్రాగుచుండిరి మరియు గొప్ప సంతోషముతో నిండి యుండిరి. ఆయన ఇట్లనెను, “పరలోకములోని దేవుని యొద్ద నుండి దిగి వచ్చిన జీవాహారమును నేనే. అరణ్యములో యుండిన బండను నేనే.”వారిట్లనిరి, “నీవు పిచ్చివాడివని మాకు అర్థమయినది. నీకు మతి పోయినది; నీకు దయ్యము పట్టినది. నీవు అపవిత్రాత్మవలన ఆవరింపబడిన పిచ్చివాడివి.” ప్రజల మీద ఒక ఆత్మయున్నదని ఎరుగుడి, కొన్నిసార్లు వారు ఎంతో మతభక్తిని ప్రదర్శించెదరు.వారిట్లనిరి, “నీవు అపవాదివి; నీకు దయ్యము పట్టినది. నీవు సమరయుడవు, మరియు నీవు అపవిత్రాత్మ పట్టిన వాడవు.” “నీకు ఏబది సంవత్సరములయినా లేవు గాని, అబ్రాహామును చూచితినని చెప్పుచున్నావు,” అనిరి.
130.(ఆయన ఇంకా కొన్ని అడుగులు వెనుకకు వేసి ఇట్లనెనని నేనూహించుచున్నాను.) ఆయన ఈ విధంగా చెప్పెను, “నేను ఉన్నవాడను అనువాడను అయియున్నాను. అబ్రాహాము కంటె ముందే నేనున్నాను, నేను ఉన్నవాడను.”అది ఒక మండుచున్న అగ్ని, ఆ అగ్ని స్థంభము పొదలో యుండెను. ఆయన చనిపోయిన మూడవ దినమున తిరిగి లేచిన తరువాత, మార్గమందు సౌలు ఆయనను కలిసికొనెను. ఆయన మరల ఆ అగ్నిస్థంభముగా యుండెను. “నేను దేవుని యొద్ద నుండి వచ్చియున్నాను, దేవుని యొద్దకే వెళ్ళిపోవుచున్నాను.” పేతురు చెరసాలలో యుండగా, ఆ అగ్నిస్థంభము దిగి వచ్చెను, తలుపులను తెరచెను మరియు అతనిని వెలుపలకు తీసికొని వచ్చెను. అది నిజము.ఆ అగ్నిస్థంభము వారిని ఎక్కడికి నడిపించెను? ఇప్పుడు గుర్తుంచుకొనండి, మోషే అగ్నిస్థంభము కాడు. అతడు అభిషేకము పొందిన నాయకుడుగా, ఆ అగ్నిస్థంభము క్రింద ఉండెను. అగ్నిస్థంభము అతని వర్తమానమును అద్భుతములతోను, సూచక క్రియలతోను బయలుపరచెను. దేవుడు వాగ్ధానము చేసిన ఆ దేశములోనికి అగ్నిస్థంభము వారిని నడిపించెను. ఒక దినమున వారి మధ్య ఆయనే స్వయంగా శరీరధారియగును. అది నిజమేనా? వారేమి చేసిరి? సణుగుకొనిరి, విసుగు కొనిరి, మామూలు గొర్రెపిల్ల రక్తము క్రింద యుండిరనుటకు వారు చేసిన కార్యములే రుజువులు.కాని ఈ సమయము? దేవునికి మహిమ! మన మధ్య చూచుచున్న స్థంభము అగ్నిస్థంభము, మనలను వెయ్యేండ్లపాలనకు నడిపించును. ఈ నిర్గమము తరువాత ఆయన తన ప్రజల యొద్దకు ఆ గొప్ప వెయ్యేండ్ల పాలనలో తిరిగి వచ్చును. మనమక్కడ ఆయనతో నిత్యమూ జీవించెదము. ఆయన యొద్ద ఎల్లప్పుడూ తండ్రి యొక్క మాట ఉన్నది, అది నిజమని ఎల్లప్పుడూ రుజువు చేయును.
131.మనము ఒక నిర్గమములో యున్నాము, మరియు కొద్దిసేపటిలో ఇది ఆపి మనం వెళ్ళిపోదుము. ఓ, నా స్నేహితులారా, సోదరులారా, ఇక్కడున్నవారలారా, వినువారలారా, మీ సోదరుని గాను, దేవుని రాజ్యము యొక్క పౌరుని గాను చెప్పుచున్నాను, ఈ నిర్గమములో బయటకు రండి!విడిచిపెట్టబడిన వారందరూ మృగము యొక్క ముద్రను పొందెదరు. బబులోను నుండి బయటకు రండి; ఈ గందరగోళము నుండి బయటకు రండి; ఈ మతక్రమములలో నుండి బయటకు వచ్చి, సజీవుడగు దేవునిని సేవించుడి. “ఈ మహా నిబంధన దూతయగు యేసు క్రీస్తు, దేవుని రూపములో యున్నాడు, దేవునితో సమానముగా నుండుట ఆయన దొంగిలించినది కాదు.” ఇప్పుడు, ఆయన అదే రూపములో అగ్నిస్థంభముగా యున్నాడు. ఆయన మొదటి నిర్గమమును తీసికొని వచ్చిన వాడు, మరియు ఆయనే రెండవ నిర్గమమును తీసికొని వచ్చెను, మరియు ఇప్పుడాయన మూడవ నిర్గమమును తీసికొని వచ్చుచూ ఇక్కడ యున్నాడు.
132.మొదటి నిర్గమములో ఆయన ఏమి చేసెను? ఒక స్వాభావిక దేశములో నుండి మరియొక స్వాభావిక దేశములోనికి వారిని తీసికొని వచ్చెను. రెండవ నిర్గమములో ఆయన వారిని ఆత్మ సంబంధమగు స్థితిలో నుండి పరిశుద్ధాత్మ యొక్క ఆత్మీయ బాప్తిస్మములోనికి తీసికొనివచ్చెను. ఇప్పుడాయన వారిని ఆత్మసంబంధమగు పరిశుద్ధాత్మ బాప్తిస్మములో నుండి నిత్యరాజ్యమగు వెయ్యేండ్ల పాలనలోనికి తీసికొని వచ్చుచున్నాడు. అదే అగ్నిస్థంభము, అదే అభిషేకిత క్రమము, అదే దేవుడు ఈ కార్యములను చేయుచున్నాడు. మొదటి దానిని ప్రకటించిన దేవుడే రెండవ దానిని ప్రకటించెను. రెండవ దానిని ప్రకటించిన అదే వాక్కు, మూడవ దానిని ప్రకటించెను, మరియు దానిని ఇప్పుడు మన మధ్య చూచుచున్నాము.బయటకు రండి! ఈ అగాధములో నుండి వెలుపలకు రండి! సజీవుడగు దేవుని యొద్దకు రండి! వాక్యము నొద్దకు రండి! ఆ వాక్యము శరీరధారియై మన మధ్య నివసించుచున్నది. ఆయన మన శరీరములో యున్నాడు. మనమధ్య నివాసము చేయుచున్నాడు. బయటకు వచ్చి సజీవుడగు దేవునిని ఆరాధించుడి. మన శిరములు వంచుదము.[కూడికలో నుండి ఒకరు ప్రవచించుచుండిరి - సంపా]
133.మన శిరములు వంచియుండగానే... మన ఆత్మీయ లోతులలో నుండి మీ అంతరంగములో నున్న సమస్తములో నుండి ఆయనకు మనవి చేసికొనుడి. జ్ఞాపకము చేసికొనుటకు మీరు ఇష్టపడుచున్నారా? ఈ లోక కార్యములను చేయకుండా ఆగుటకు సిద్ధపడి దేవుని కొరకు జీవించగోరుచున్నారా? మీరు దీనిని అర్థము లేకుండా చేయవద్దు; కాని మీ పూర్ణహృదయముతో దీనిని గ్రహించి, దానిని గూర్చి ఒప్పించబడి, విశ్వాసముతో చేయవలెనని మనవి చేయుచున్నాను. యేసు తన సేవ ముగింపులో “ఇప్పుడు మీరు విశ్వసించుచున్నారా?” అని ప్రశ్నించెను.ఈ సంగతులు నిజమని మీరు ఒప్పించబడితిరా? దేవుని చేత బయలుపరచబడెనని గ్రహించారా? మనము అంత్య కాలమందున్నాము. ఇప్పుడు మీరు నిజంగా క్రీస్తు యొద్దకు రాగోరుచున్నారా? వివిధ శాఖలలో నుండి బయటకు రమ్మని, ఈ నిర్గమము పిలచుచున్నది. స్వంత అభిప్రాయములు, లోక సంగతులలో నుండి బయటకు వచ్చి పూర్ణ హదయముతో ఆయనకు లోబడవలెను, ఆశీర్వదించబడిన వాగ్ధాన దేశములోనికి రండి — మనము ప్రార్థించుచుండగా మీరు చేతులెత్తెదరా? నిజంగా మీరు బయటకు రావలెనని నిశ్చయించుకొన్నారా? ప్రతి ఒక్కరూ?
134.పరలోకపు తండ్రీ, చేతులెత్తిన వారు ఇప్పుడు బయటకు వచ్చి యున్నారు, ప్రభువా వారికి సహాయము చేయుము. పరిశుద్ధాత్మ ద్వారా ఈ వాగ్ధాన వాక్యము పలుకబడినది, వారి హృదయములలో పరిశుద్ధాత్మ కదలునట్లు చేయుము. ఈ జనసమూహములో నుండి దాదాపు ఇరవై చేతులు ఎత్తబడి యున్నవి. తండ్రీ, వారు సంతప్తి చెందియున్నారు మరియు సత్యమని వారు ఎరిగి యున్నారు, మరియు వారు బయటకు రాగోరుచున్నారు.ఇశ్రాయేలీయులు బయటకు వచ్చిన దినములను చూచాము. బయలు దేరిన రెండున్నర మిలియనుల ప్రజలలో ఇద్దరు మాత్రమే దేశమును చేరిరి. యేసుక్రీస్తు దినములలో దాదాపు 120 మంది చేరుకొనిరి. యుగ సమాప్తి దినములలో ఇప్పుడు మేము ఉన్నాము, నీవీలాగు పలికితివి, త్రోవ ఇరుకుగా యున్నది, ద్వారము చిన్నదిగా యున్నది, దానిలో ప్రవేశించువారు కొందరే; కాని నాశనమునకు నడిపించు మార్గము విశాలముగా యున్నది, అందులో ప్రవేశించువారు అనేకులు.“ ఆ మాటలు నిరర్థకము కావు; అవి నీ మాటలు.
135.ప్రభువా, ఇప్పుడు వారికొరకు ప్రార్థించుచున్నాను. నీ పరిశుద్ధాత్మ ద్వారా ఈ ఘడియ నుండి వారి హృదయములను సున్నతి చేయవలెనని ప్రార్థించుచున్నాను. లోకపు సంగతులనన్నింటినీ తీసివేయుము. దేవుని యొక్క స్వరమును వారు తేటగా వినునట్లు వారి చెవులకు సున్నతి కలుగజేయుము. వాక్యము ద్వారాను, ఈ దినపు వెలుగు ద్వారాను వారిని నీవు పిలచుచున్నావు.ప్రభువా, వారి కన్నులు తెరువబడినట్లును, ఈ చివరి ఘడియలో వారు దేవుని మహిమను చూచునట్లును కృప చూపుము. “తండ్రి నాకనుగ్రహించిన వారందరూ నా యొద్దకు వచ్చెదరు. అంత్యదినమున వారిని నేను లేపుదును అని నీవు పలికి యున్నావు.”ప్రభువా, ఇంకా దానిని అర్థము చేసికొనని వారు అనేకులు ఉండియుందురు. వారితో నీవు మాట్లాడమని ప్రార్థించుచున్నాను, ప్రభువా, వారు అర్థము చేసికొనునట్లుగా మరియొక అవకాశము వారికి దయచేయుము. నీ వాక్యము ద్వారా నీవు మాట్లాడుటను వారు వినిరి, నిన్నునీవు రుజువుపరచుకొన్నావు మరియు సహజాతీతమగు స్వరముతో నీవు మాతో మాట్లాడియున్నావు, మరి తరువాత దాని భావమును చూచాము. బైబిలు ప్రకారము అది నిజమని నీ గొప్ప కార్యములు నిరూపించి యున్నవి.దేవా, ఇప్పుడు మా పాపములను క్షమించుమని ప్రార్థించుచున్నాను. దేవా, ఈ వాక్యమును నేను ధ్యానించుచున్నాను.
136.దేవా, ఒక వారం క్రిందట దానిని నేను తలంచియున్నాను. ఈ నేల మీద నేను చచ్చిన దానివలె పడియుంటిని. గొప్ప పరిశుద్ధాత్మ తిరిగి జీవమును దయచేసెను. ఆయన చనిపోయిన వానివలె ఎంచబడెను, కాని ఆయన సజీవునిగా తిరిగి లేచెను. ఈ రోజున ఆయన సజీవునిగాయున్నాడు. నేడు జీవించుచున్నాడు.ప్రభువా, నీవు మారని దేవుడవు, కిటికీలో నుండి పడిపోయిన వ్యక్తిని నీవు లేపియున్నావు. ఆ రాత్రి ఎక్కువగా బోధించినందున సమయాతీతమై నిద్ర వచ్చి అతడు పడిపోయెను — నీవు జీవమును తిరిగి ఇయ్యగలిగిన దేవుడవు, పౌలు ద్వారా ఆలాగే క్రియ చేసితివి.తండ్రీ, నీకు వందనములు. అవిశ్వాసి నమ్మకపోవచ్చును, కాని ప్రభువా, మేము నమ్ముచున్నాము. నిన్నునీవు మాకు బయలుపరచుకొన్నావు.
137.నా హృదయ ధ్యానము, నా మనస్సులోని ఆలోచన, నా బలము సమస్తము ఈ వాక్యములోనికి మలచబడును గాక! ప్రభువా, నేను మరియొక వాక్యము నీ జనులతో కలిసి దేవుని యొక్క రాజ్యము కొరకు ముందుకు వెళ్ళునట్లు కృప చూపుము. ప్రభువా, దానిని అనుగ్రహించుము. మా పాపమును క్షమించుము. మా వ్యాధులను బాగు చేయుము. నీ రాజ్యవారసులనుగా మమ్ము చేయుము.ప్రభువా, వీరు వచ్చుచున్నారు, కొలను తెరువబడియున్నది మరియు నీరు సిద్ధముగా యున్నది, కొద్ది నిమిషములలో బాప్తిస్మము ప్రారంభమగును. ఇదే సువార్త బోధించబడినప్పుడు ఏమి జరుగునో మేము బైబిలులో చూచి యున్నాము, “నమ్మిన వారందరూ బాప్తిస్మము పొందిరి.”ప్రభువా, ఇక్కడ చేతిరుమాళ్ళు ఉంచబడి యున్నవి. రోగులను బాగు చేయునట్లుగా వీటిని దీవించుమని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము.
138.మా ఆరాధనలు ఎక్కువ సమయముంటున్నవి, పొడిగించబడుచున్నవి, చాలా ఆలస్యమగుచున్నది — వాక్యమును చల్లుటకు తగిన పరిస్థితులున్న ఈ సమయములోనే వాక్యమును చల్లవలెను, ఎందుకనగా చల్లని శీతాకాలము వచ్చుచున్నది. దానిని మేము చూచుచున్నాము; ఆకులు రాలుచున్నవి, చలి కాలము సమీపమందే యున్నదని మనమెరుగుదుము. మనము ఉపరితలమును సరిచేసి విత్తనము పాతిపెట్టవలెను.పరలోకపు తండ్రీ, ప్రతి హృదయముతో నీవు మాట్లాడుమని ప్రార్థించుచున్నాను. “విశ్వసించిన వారందరూ బాప్తిస్మము పొందిరి,” అని బైబిలు చెప్పుచ్నున్నది. విశ్వసించియూ, నీ ప్రియ కుమారుడగు యేసు నామములో బాప్తిస్మము పొందని వారున్నచో, ఈ ఉదయమున వారు దీనముగాను, మాధుర్యముగాను తమ పాపములను ఒప్పుకొని, లోకము యొక్క సంగతులకు చనిపోయి, పాతిపెట్టబడుటకు వచ్చుదురు గాక. యేసుక్రీస్తు నామమును ధరించుదురు గాక! ఇక మీదట పరిశుద్ధాత్మ ద్వారా భక్తిగా జీవించెదరు గాక! ప్రభువా, ఈ ఉద్ధేశ్యముతోనే వీరిని యేసుక్రీస్తు నామములో నీకు అప్పగించుచున్నాము. ఆమేన్.నెవిల్ సోదరునికి ఈ ఆరాధనను అప్పగించుచున్నాము. బాప్తిస్మపు ఆరాధనకు సిద్ధపడుచుండగా అతడు ఏమి చెప్పనుద్ధేశించెనో దానిని చెప్పునట్లు ఆహ్వానించుచున్నాను. ప్రభుని చిత్తమయితే ఈ రాత్రి 7:30కు మరియొక వర్తమానమును టేపు చేయుదము. అంతవరకు దేవుడు మిమ్ము దీవించును గాక!